FactCheck: హే జీసస్‌.. రోత రాతల పాపాలను క్షమించుడి!

FACT CHECK: Eenadu Ramoji Rao Fake News On Welfare of Christians - Sakshi

క్రైస్తవుల సంక్షేమంపై రామోజీ నీచపు రాతలు 

రాయితీల కోత పేరుతో మడత వ్యాఖ్యలు 

నవరత్నాలతో నవోదయం పచ్చ కళ్లకు కని్పంచవా 

బాబు జమానాలో అరకొర పథకాలతో సరి 

సీఎం జగన్‌ హయాంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ తోడ్పాటు  

సాక్షి, అమరావతి: రామోజీ పచ్చ పైత్యం రోజు రోజుకీ పరాకాష్టకు చేరుతోంది. క్రైస్తవుల సంక్షేమంపై జగన్‌ వివక్ష అంటూ విషం చిమ్మే నీచానికి రామోజీ దిగజారిపోయారు. రాయితీలపై అడ్డగోలుగా కోత అంటూ మడత వ్యాఖ్యలు చేస్తూ ఈనాడులో అబద్ధాలు అచ్చేయడాన్ని ‘హే జీసస్‌.. రామోజీ రోత రాతలు చూడు ప్రభు’ అని క్రైస్తవ సమాజం వ్యాఖ్యానిస్తోంది. పాపపు రాతల తీరును క్షమించమని ప్రార్థిస్తున్నాయి. చంద్రబాబు ఐదేళ్లపాలనలో క్రైస్తవులకు అరకొర రాయితీలు, పథకాలతో సరిపెట్టినా పచ్చ కళ్లకు అంతా సవ్యంగా కన్పించింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రైస్తవులకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా తోడ్పాటు అందిస్తుంటే రామోజీకి మింగుడు పడటంలేదు. 

ఆరోపణ: టీడీపీ హయాంలో స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం, చర్చిలకు వెన్నుదన్ను.
వాస్తవం: స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ అంటూ కేవలం రెండు కార్యక్రమాలు అమలు చేసిన టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో క్రిస్టియన్‌ మైనార్టీల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఆ రెండు కార్యక్రమాలే ఏదో గొప్పగా చేసేసినట్టు ఈనాడు పచ్చ కలర్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

ఆరోపణ: వైఎస్సార్‌సీపీ పాలనలో క్రైస్తవులకు కుచ్చుటోపీ, యువతకు శిక్షణ లేదు, వెన్ను విరిచారు.
వాస్తవం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రిస్టియన్‌(మైనారిటీ) ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. సుమారు 6.82 లక్షల క్రైస్తవ మైనారిటీల సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందంజలో ఉంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర, లా నేస్తం, వైఎస్‌ఆర్‌ చేయూత, వంటి ఎన్నో కొత్త కార్యక్రమాలు వారి ఉన్నతికి దోహదం చేశాయి. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పాస్టర్లకు వన్‌–టైమ్‌ ప్రత్యేక ఆర్థిక సహాయం, జెరూసలేంకు తీర్థయాత్ర, చర్చిల ద్వారా, చర్చి నడిపే సంస్థలకు సహాయం అందించడం వంటి ప్రత్యేక తోడ్పాటుతో క్రిస్టియన్‌ మైనార్టీల్లో ఆత్మస్థైర్యం నింపింది. 

ఆరోపణ: ఆర్థిక సాయమూ అంతంతే
వాస్తవం:
చంద్రబాబు ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.29 కోట్లు, శిక్షణ కోసం రూ.­3.55 కోట్లు ఖర్చు చేస్తే అదే గొప్ప అంటూ ఈనా­డు డబ్బాలు కొట్టింది. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మార్చి వరకు క్రిస్టియన్‌ మైనార్టీ ఆర్థిక సంస్థ ద్వారా ఏకంగా రూ.­416.58కోట్లు అందించింది. దీనిలో ఒక్క చే­యూ­త పథకం(స్వయం ఉపాధి) ద్వారా 27,150 మందికి రూ.50.90కోట్లు అందించింది. దీంతో­పాటు 90శాతం సబ్సీడీపై 90 మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూ­నిట్లు(నిత్యావసర సరుకుల సరఫరా వాహనా­లు) రూ.55 లక్షలు ఆర్థిక సాయం అందించింది. 

ఆరోపణ: అప్పుడలా ఇప్పుడిలా అంటూ తప్పుడు లెక్కలు
వాస్తవం: టీడీపీ ప్రభుత్వం(2014–19)లో చర్చిల­కు సాయం, రాయితీలపై రుణాలు, నైపుణ్య శిక్షణ వంటివి అరకొరగా జరిగితే గొప్పగా జరిగినట్టు ఈనాడు  మసిపూసి మారేడు కాయ చేసింది. వైఎస్సార్‌సీపీ 2019–24 మధ్య క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా అందించిన ఆర్థిక తోడ్పాటును ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించింది. 

► పాస్టర్లకు గౌరవ వేతనం కింద కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో రూ.5వేలు చొప్పున వన్‌–టైమ్‌ గ్రాంట్‌గా 29,841 మందికి రూ.1490లక్షలు అందించింది. దీంతోపాటు నెలకు రూ.5వేలు చొప్పున 8427 మంది పాస్టర్లకు గౌరవ వేతనంగా రూ.7109.9లక్షలు అందించింది.    
► ఇవి కాక లా నేస్తం కింద జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు చొప్పున 2020–21లో రూ.30 లక్షలు, 2021–22లో రూ.50 లక్షలు కేటాయించింది.

► కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, ఇతర మౌలిక వసతుల కోసం రూ.5 లక్షలు చొప్పున, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 నుంచి 5 లక్షలు చొప్పున నిధులు ఇచ్చింది. ఇప్పటివరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు అందించింది.  
► జెరూసలేం, ఇతర బైబిల్‌ ప్రదేశాలకు తీర్థ యాత్ర పథకం కింద, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి లబ్ధిదారునికి రూ.60వేలు, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు కేటాయించింది.  

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top