ఊసరవెల్లి.. షర్మిలను సీఎం జగన్‌పై ప్రయోగించిన కుటిలనేత | Sakshi
Sakshi News home page

ఊసరవెల్లి.. షర్మిలను సీఎం జగన్‌పై ప్రయోగించిన కుటిలనేత

Published Mon, Apr 8 2024 3:40 AM

Chandrababu contrivance in the name of alliance: andhra pradesh  - Sakshi

వైఎస్‌ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక కూటమిపేరుతో చంద్రబాబు ఎత్తుగడ 

షర్మిలను సీఎం జగన్‌పై ప్రయోగించిన కుటిలనేత 

దానివల్ల ఆశించిన ఫలితం లేక ఇప్పుడు సరికొత్త ప్రచారం 

వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే షర్మిల నాటకాలుఆడుతున్నట్టు ఆరోపణ 

అధికారంకోసం అడ్డదారులు తొక్కడం... అవసరమైతే అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనుకాడకపోవడం... రోజుకో ఎత్తు గడతో నాలుక మడతేసేయడం... బద్ధ శత్రువులతోనైనా ఇట్టే జతకట్టేయడం... మరో అడుగు ముందుకేసి ఏకంగా కుటుంబాల్ని చీల్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి వ్యక్తులనైనా బోల్తాకొట్టించగల సమర్థుడాయన. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అన్ని పార్టీలను ఏకం చేసేందుకు నానా పాట్లు పడ్డారు.

అంతేనా...మరో అడుగు ముందుకేసి ఆయన సోదరినే పావుగా వాడుకున్నాడు. అదీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఏకంగా అన్నా... చెల్లెళ్లిద్దరూ కలసి నాటక మాడుతున్నారంటూ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికారంకోసం ఎంతకైనా తెగించగలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న తీరును జనం సైతం ఛీకొడుతున్నారు. 

సాక్షి, అమరావతి: రాజకీయంలో ఎలాంటి కుట్రలకైనా వెరవకూడదనీ.. అబద్ధాలు అలవోకగా ఆడేయొచ్చని.. ఎలాంటి విషయాన్నైనా తనకు అనుకూలంగా మలచుకోవచ్చని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. సార్వ­త్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని అ్రస్తాలను ఎక్కుపెట్టారు. ఘోర పరాజయం నుంచి తప్పించుకుని, రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి చివరి ప్రయత్నంగా మహానేత వైఎస్‌ కుటుంబాన్ని చీల్చి.. సీఎం జగన్‌పై సోదరి షర్మిలను ప్రయోగించారు. సోదరికే న్యాయం చేయ­లేని వాడు రాష్ట్రానికి ఏం చేయగలరని ఇన్నా­ళ్లూ ఆరోపిస్తూ వచ్చిన చంద్రబాబే.. ఆమెకు జనస్పందన లభించకపోవడం, తాను అనుకున్న ప్రయోజనాలు లభించే అవకాశాలు కన్పించకపోవడంతో మరోసారి మాట మార్చారు.

శనివారం పెదకూరపాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పిందని.. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయ­లేదు, రాష్ట్రానికి ఏం చేస్తారని ఇప్పుడు కొత్తగా ప్రశ్నించారు. అంతేగాదు... పిల్ల కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్‌ నాటకం ఆడుతోందంటూ ఆరోపించారు. ఎన్డీయేకు పడే ఓట్లు చీల్చా­లని నాటకం ఆడుతున్నారని మరో ప్రచారానికి దిగారు. దీనిని బట్టి ఆయన రంగులు మార్చడంలో ఊసరవెల్లికి కూడా మించిపోతారని రాజకీయ విశ్లేషకులు వ్యంగోక్తులు విసురుతున్నారు.  

పావులా మారిన షర్మిల 
తెలంగాణలో 2021 జూలై 8న వైఎస్సార్‌సీపీని షర్మి­ల స్థాపించారు. తన బతుకైనా చావైనా తెలంగాణ­లోనేని ఆమె అప్పట్లో ప్రతిజæ్ఞ చేశారు. కానీ.. గతే­డాది చివర్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా అస్త్రసన్యాసం చేసి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉంద­న్నది జగమెరిగిన సత్యం. ఇందుకోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.­శివకుమార్‌తో బెంగళూరు విమానాశ్రయం సాక్షిగా మంతనాలు జరిపి ఏపీలో కాంగ్రెస్‌ పగ్గాలు షర్మిలకు కట్టబెట్టేందుకు ప్రణాళిక రచించారు. బీజేపీ­లోని తన ఏజెంట్, ప్రస్తుతం అనకాపల్లి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్‌ ద్వారా కాంగ్రెస్‌కు ఇం‘ధనం’ చేకూర్చి.. తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా కథ మొత్తం నడిపించారు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు.. పీసీసీ చీఫ్‌ పదవి దక్కించుకున్నాక ఢిల్లీ, కడప తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సీఎం రమేష్‌ స్పెషల్‌ ఫ్లైట్‌­లలోనే ప్రయాణించారు.ఇప్పటికీ సీఎం రమేష్‌ స్పెషల్‌ ఫ్లైట్‌లో షర్మిల ప్రయాణాలు చేస్తుంటే.. ఆమె భర్త అనిల్‌ టీడీపీ నేతలు బీటెక్‌ రవి, దేవగుడి నారాయణరెడ్డి తదితరులతో సమావేశమవుతున్నారు. షర్మిలను సీఎం జగన్‌పై ఉసిగొలిపి.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను చీల్చడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ.  

ఆ ప్రయోగం విఫలమై ఇప్పుడు కొత్త పాచిక 
చంద్రబాబు, ఎల్లో పత్రికలు సీఎం జగన్‌పై చిమ్ము­తున్న విషాన్నే పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల చేత వల్లెవేయించారు. మరో అడుగు ముందుకేసి కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలిచేలా చక్రం తిప్పారు. షర్మిలకు తోడుగా వివేకా కూతరు సునీతను రంగంలోకి దించారు. వారిద్దరి ద్వారా వివేకా హత్యపై దుష్ప్రచారం చేయించి.. దాన్ని అస్త్రంగా మార్చుకుని లబ్ధి పొందాలన్నది చంద్రబాబు పాచిక. కానీ.. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలే ఆయన హత్యకు దారితీశాయని ఉమ్మడి కడప జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నందున కడప లోక్‌సభ స్థానం పరిధిలో షర్మిల చేస్తున్న బస్సు యాత్రకు ప్రజా­స్పందన కన్పించలేదు. తాను అనుకున్న ప్రయోజనం లభించకపోవడంతో చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. ఇప్పుడు షర్మిలపైనా నిందలు మొదలుపెట్టేశారు. వారిద్దరూ కలసి ఎనీ్టయే ఓట్లు చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కొత్త పల్లవి ఎత్తుకుని తన సహజ నైజాన్ని చాటుకుంటున్నారు.  

అధికారంకోసం జిత్తులమారి ఎత్తులు 
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసి.. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్‌ రాబోయే ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించడం ఖాయ­మని దాదాపు అన్ని సర్వేల్లోనూ స్పష్టమైంది. అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము­లేని చంద్రబాబు జన­సేన, బీజేపీతో జత­కలిశారు. మరో వైపు వివేకా­నందరెడ్డి కూతురు సునీతను చేరదీశారు. వివేకా హత్యపై సునీతతో దుష్ప్రచారం చేయిస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారు. అంతేగాకుండా జగన్‌ సోదరి షర్మిలను వాడుకునేందుకు కొత్త ప్రణాళికను అమలు పర్చారు.

Advertisement
Advertisement