ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగాఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకాశంలో అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. ఖగోళ శాస్త్ర వెంచర్ డార్క్ స్కై ప్రిజర్వేషన్ పాలసీని రూపొందించడం, ఏడాది పొడవునా ప్రాంతమంతటా అమలు చేయనుంది. దీనిపై ప్రచారం అవగాహన కల్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. వాలంటీర్లను ,డార్క్ స్కై అంబాసిడర్‌లనుతయారు చేస్తుంది. అంతేకాదుఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తుంది. రాత్రి ఆకాశంలోని అందాలను ఫోటో తీసిన వారికి ఆకర్షణీయమైన రివార్డులు కూడా అందిస్తుంది.
అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా 'నక్షత్ర సభ'ను తీసుకొచ్చింది. ఇందులో స్టార్ గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్‌లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్‌లో ప్రారంభమవుతుంది.
ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు, లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు వద్ద, సందర్శకులు పగటిపూట సరస్సు అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తారు. రాత్రి వేళలో,స్థానికులు వారి సంప్రదాయాలు , జానపద కథలను పంచుకుంటూ నక్షత్రరాశులను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డ్ భారతదేశంలోని ప్రముఖ ఆస్ట్రో-టూరిజం కంపెనీ స్టార్‌స్కేప్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్‌ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్‌గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్‌లతో పాటు నిపుణులతో సెమినార్‌లు, వెబ్‌నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment