Astronomy
-
నానో శాటిలైట్ సాధనలో తొలిమెట్టు.. పుణేలో గ్రౌండ్ స్టేషన్
మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ (MIT-WPU) సంస్థ నానో-శాటిలైట్ చొరవలో భాగంగా పుణే క్యాంపస్‌లో అత్యాధునిక గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. శాటిలైట్ రిసెప్షన్, రేడియో ఆస్ట్రానమీ రెండింటిలోనూ సామర్ధ్యం కలిగిన ఈ కేంద్రాన్ని మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ కరాద్ ప్రారంభించారు.రేడియో ఆస్ట్రానమీ పరిశోధన పురోగతికి, శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అవసరమైన విలువైన డేటాను ఈ గ్రౌండ్ స్టేషన్ అందిస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ (డౌన్‌లింక్), కాస్మిక్ అబ్జర్వేషన్ సంక్లిష్ట పనులను ఏకకాలంలో నిర్వహించగల సామర్థ్యం ప్రపంచంలోనే అరుదైన ఈ కేంద్రానికి ఉంది.లో ఎర్త్ ఆర్బిట్ (LEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO), హై ఎలిప్టికల్ ఆర్బిట్ (HEO), జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (GEO)లోని ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ అందుకోవడానికి రూపొందించిన ఆరు వేర్వేరు యాంటెన్నాలు ఈ గ్రౌండ్ స్టేషన్లో ఉంటాయి. ప్రత్యేకమైన డిష్ అండ్ హార్న్ యాంటెనాలు అధిక-ఫ్రీక్వెన్సీ సంకేతాలను స్వీకరిస్తాయి. వాటిని శక్తివంతమైన రేడియో ఆస్ట్రానమీ సాధనంగా మారుస్తాయి. అత్యంత సూక్ష్మమైన సంకేతాలు, గెలాక్సీ మ్యాపింగ్, డార్క్ మ్యాటర్, కాస్మోస్ రేడియో చిత్రాలను అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తాయి.గ్రౌండ్ స్టేషన్ వాతావరణ డేటాను సేకరించడానికి ఓపెన్ సోర్స్ ఉపగ్రహాల నుండి సిగ్నల్‌లను అందుకోగలదు, అలాగే క్యూబ్శాట్లు, నానోశాట్లు, మైక్రోసాట్ల నుండి టెలిమెట్రీని అందుకోగలదు.స్కూల్ ఆఫ్ సైన్స్ & ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అసోసియేట్ డీన్ డాక్టర్ అనుప్ కాలే, ప్రొఫెసర్ అనఘా కర్నే, డాక్టర్ డియోబ్రత్ సింగ్, డాక్టర్ సచిన్ కులకర్ణిలతో సహా 35 మంది మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. -
భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
హాంకాంగ్: విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుడు, గామాకిరణాల వెల్లువ వంటి ఖగోళ అంశాలపై విశేష పరిశోధనలకు గుర్తింపుగా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి.. ప్రఖ్యాత ‘షా’ అవార్డ్‌కు ఎంపికయ్యారు. శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోరి్నయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆ్రస్టానమీ, ప్లానెటరీ సైన్స్, డివిజన్ ఆఫ్ ఫిజిక్స్, మేథమేటిక్స్, ఆ్రస్టానమీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలోని పలోమర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత జ్వికీ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీల్లో టెలిస్కోప్‌ల సాయంతో రోదసీలో నిర్దిష్ట ప్రాంతంలోని ఖగోళ అంశాలను పరిశీలించి వాటిపై విశేష పరిశోధనలు చేసినందుకుగాను ఈ అవార్డ్‌ను శ్రీనివాస్‌కు ప్రదానం చేయనున్నారు. 2024 సంవత్సరానికి ఆస్ట్రానమీ విభాగంలో శ్రీనివాస్‌కు అవార్డ్ ఇస్తున్నట్లు షా ప్రైజ్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది. -
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగాఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకాశంలో అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. ఖగోళ శాస్త్ర వెంచర్ డార్క్ స్కై ప్రిజర్వేషన్ పాలసీని రూపొందించడం, ఏడాది పొడవునా ప్రాంతమంతటా అమలు చేయనుంది. దీనిపై ప్రచారం అవగాహన కల్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. వాలంటీర్లను ,డార్క్ స్కై అంబాసిడర్లనుతయారు చేస్తుంది. అంతేకాదుఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తుంది. రాత్రి ఆకాశంలోని అందాలను ఫోటో తీసిన వారికి ఆకర్షణీయమైన రివార్డులు కూడా అందిస్తుంది.అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా 'నక్షత్ర సభ'ను తీసుకొచ్చింది. ఇందులో స్టార్ గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్‌లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్‌లో ప్రారంభమవుతుంది.ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు, లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు వద్ద, సందర్శకులు పగటిపూట సరస్సు అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తారు. రాత్రి వేళలో,స్థానికులు వారి సంప్రదాయాలు , జానపద కథలను పంచుకుంటూ నక్షత్రరాశులను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలోని ప్రముఖ ఆస్ట్రో-టూరిజం కంపెనీ స్టార్స్కేప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్‌గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్లతో పాటు నిపుణులతో సెమినార్లు, వెబ్నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. -
ఖగోళ రహస్యాలను చేధించిన ఎడ్విన్ హబుల్.. టెలిస్కోప్‌తో ఎన్నో ఆవిష్కరణలు
ఖగోళ వింతలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? టెలిస్కోప్ ఆవిష్కణలతో ఆకాశ వింతల్ని దగ్గరన్నుంచి చూసి విశ్వం రసహ్యాలను తెలుసుకోవచన్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే చాలా టెలిస్కోప్‌లు ఉన్నాయి. కానీ చరిత్రలో కొన్ని టెలిస్కోపులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఒకటి హబుల్ టెలిస్కోప్. విశ్వ రహస్యాలను మన కళ్లముందు ఉంచడంతో పాటు అంతరిక్షంలో బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. . ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ గౌరవార్థం హబుల్ స్పేస్ టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. ఇవాళ(సోమవారం)ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన ఎడ్విన్ హబుల్ నవంబర్ 20, 1889లో మిస్సౌరీలోని మార్ష్‌ఫీల్డ్‌లో జన్మించాడు. 1910లో అతను చికాగో విశ్వవిద్యాలయం నుంచి చదువు పూర్తిచేశాడు.ఖగోళ శాస్త్రంలో అనేక అధ్యయనాలు చేసి విశేష గుర్తింపు పొందాడు. గెలాక్సీలను అధ్యయనం చేయడంలో హబుల్ ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి. 1923లో నెబ్యులాలో సెఫీడ్ వేరియబుల్స్ అని పిలువబడే ఒక రకమైన నక్షత్రాన్ని కనుగొన్నాడు, నెబ్యులా అనేక వందల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని (పాలపుంత గెలాక్సీ వెలుపల) ఇది మరొక గెలాక్సీ అని హబుల్ నిర్ధారించాడు. విశ్వంలో అనేక గెలాక్సీలు ఉన్నాయని తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. గెలాక్సీల రెడ్‌షిఫ్ట్, దూరం మధ్య స్థిరమైన సంబంధాన్ని కనుగొనడం ద్వారా విశ్వం విస్తరిస్తోంది అని నిరూపించాడు. ఇక హబుల్ పేరుమీద హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్..ఇది అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ప్రధాన ఆప్టికల్ టెలిస్కోప్. 1990లో దీన్ని ప్రయోగించారు. ఎడ్విన్ హబుల్ గౌరవార్థం టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. విశ్వం పరిమాణమెంతో అంచనా కట్టేందుకు మొదలుకొని,నక్షత్రాలు, గ్రహాల పుట్టుక వంటివెన్నో విషయాలను అంచనా వేయడానికి హబుల్ టెలిస్కోపు పరిశోధనలు కీలకపాత్ర వహించాయి. సౌరకుటుంబం అవతల ఉన్న గ్రహాల రూపురేఖలు, వాటిల్లో ఉండే రసాయనాల వివరాలు తెలిసింది కూడా హబుల్ తీసిన ఫొటోల ఆధారంగానే. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వరకూ చూడగల సామర్థ్యమున్న హబుల్ టెలిస్కోపు నక్షత్రాలు ఎంత వేగంగా కదులుతున్నాయో కూడా ఫోటోలు తీసి పంపించింది. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విశ్వం వయసు 1300 నుంచి 1400 కోట్ల సంవత్సరాల వరకూ ఉంటుందని అంచనా కట్టగలిగారు.ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారి నేరుగా ఫొటో తీయగలిగింది కూడా ఈ టెలిస్కోప్ ద్వారానే. -
చంద్రునిపై నీటి జాడ.. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?
ప్రస్తుతం మనం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవం మీదకు చేరబోతోంది. చంద్రుని దక్షిణ ధృవం లో ఎలాంటి కొత్త విషయాలు అన్వేషించ బోతున్నాము? , అక్కడ నీటి లభ్యత ఎలా ఉంటుంది?, దాని లక్షణాలు. అలాగే చంద్రుని పై మట్టి పొరలు వాటి లక్షణాలు, సాంకేతికంగా, మానవాళికి వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వంటి అంశాలను తెలుసుకుంటాం. చారిత్రకంగా చూస్తే , ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు పంపిన చంద్రయాన్ ఉపగ్రహాలన్నీ చంద్రుని ఉత్తర ధృవం మీదకు మాత్రమే చేరగలిగాయి . దక్షిణ ధృవం మీదకు కొన్ని ఉపగ్రహాలు పంపగలిగినా అక్కడ పరిశోధనలేమీ జరగలేదు. ఇప్పుడు మనం పంపిన చంద్రయాన్-3.. దక్షిణ ధృవం మీద దిగుతూ, రోవర్ సహాయంతో 14 రోజుల పాటు జరపబోయే ప్రయోగాల మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మన భారతీయ వేద విజ్ఞానం, పురాణాలూ ఇతిహాసాలు , యజ్ఞ యాగాదులలో కూడా ఖగోళ రహస్యాలను, గ్రహగతులు, లక్షణాల గురించిన విషయాలను ప్రస్తావించారు. ఉదాహరణకు మన భారతీయ సాంప్రదాయంలో జరుపుకునే యజ్ఞ యాగాదులలో , సత్యనారాయణ స్వామి వ్రతంలో నవగ్రహ పూజ జరుపుతాము . ఆ సందర్భంలో చంద్రుని గురించి ఈ క్రింద మంత్రం చెబుతాం (నవ గ్రహ సూక్తం). ప్రస్తుతం మన ఆసక్తి అంతా చంద్రుడు కావున, దాని గురించి ఏమి చెప్పారో పరిశీలిద్దాం నవ గ్రహ సూక్తం లో చంద్రుని గురించిన శ్లోకం యిలా ఉంటుంది • ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ సూర్య గ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్ర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి • అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥ చంద్ర గ్రహస్య దక్షిణతః అధి దేవతాం ఆపః సాంగం సవాహనం సాయుధం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం ఆపః ఆవాహయామి స్థాపయామి పూజయామి • గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ ॥ చంద్ర గ్రహస్య ఉత్తరతః ప్రత్యధి దేవతా గౌరి సాంగం సవాహనం సాయుధం సశక్తి , సపతి, పుత్ర పరివార సమేతం గౌరి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ సోమా॑య॒ నమః॑ ॥ 2 ॥ ఈ క్రింద యిచ్చిన చిత్రాన్ని పరిశీలిస్తే , సూర్యునికి ఆగ్నేయ దిక్కులో చంద్ర గ్రహాన్ని చూడగలము . ప్రతి గ్రహానికి దేవత మూడు ప్రధాన స్థాయిలు ఉన్నాయి. గ్రహ దేవత, అధి దేవత, ప్రత్యధి దేవత. గ్రహం ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అధి దేవత మీకు సహాయం చేస్తుంది. అవేమిటో ఒక్కక్కటి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము. ముందుగా గ్రహ దేవత అయిన చంద్రుని గురించి ఏమి చెప్పారంటే • ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ ఆప్యా॑యస్వ (దయచేయండి ), సమే॑తు (ఒక చోటికి చేర్చు ) , తే (మీరు) , వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ (విశ్వ వ్యాప్తంగా వరాలను దీవెనలను అందించి ప్రయోజనం కలిగించే చంద్రుడు ), భవా॒ వాజ॑స్య సంగ॒థే (మీరే మా బలంగా మారండి ) చంద్రుని అధి దేవత - ఆపః (నీరు), యిది చంద్రునికి దక్షిణ దిక్కులో ఉంటుంది, ఈ నీటి గురించి ఇంకేమి చెప్పారంటే • అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥ అప్సుమే (ఈ నీటిలో ), సోమో॑ (చంద్రుని అంశ ) , అబ్రవీదం (చెప్పబడినది ), అంతర్విశ్వా॑ని (సమస్త - యూనివర్సల్ ) భేషజా (నివారణ ) ఈ ప్రకారం చంద్రునికి దక్షిణ దిక్కులో నీరు వున్నది, ఆ నీటి మీద జరిపే పరిశోధనల మూలంగా చంద్రుడి స్వభావాన్ని, పూర్వోత్తరాలను అర్థం చేసుకోగలం అని స్పష్ట మవుతుంది ఈ నీటి కి ఔషధ లక్షణాలు ఉండటం వలన ఇది వైద్య రంగంలో సర్వ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. తరువాత చంద్రుని ప్రత్యధి దేవత గౌరి, ఉత్తర దిక్కులో వున్న ప్రత్యధి దేవత గౌరి గురించి ఏమి చెప్పారంటే • గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ మిమాయ (సృష్టించు), సలి॒లాని (నీళ్లు , ద్రవాలు), తక్ష॒తి (ఆధారం ) , ఏక॑పదీ (ఒక పాదం )... నవ॑పదీ (9 పాదాలు) , బభూ॒వుషీ (ఆమె అవుతుంది ), స॒హస్రా᳚క్షరా (అనంత నేత్రాలు కలది ), పరమే (సుప్రీం ), వ్యో॑మన్ (ఆకాశం, అంతరిక్షం ) ఈ శ్లోకం గౌరీ దేవత వైవిధ్యమైన రూపాలను వివరిస్తుంది, అలాగే సృష్టి, విశ్వం వివిధ అంశాలలో ఆమె ఉనికిని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. ఇప్పటి వరకు చంద్రుని మీదకు చేరిన వివిధ దేశాల ఉపగ్రహాలను ఈ క్రింది చిత్రంలో చూడగలరు. దాదాపు అన్నీ చంద్రుని ముందు భాగం, పై అర్థ భాగంలోనే ఉన్నాయి. చైనా 2019 లో ప్రయోగించిన చేంజ్-4 మాత్రమే చంద్రుని వెనుక భాగం వైపు దించారు. చంద్రునిపై నీటి ఆనవాళ్లు: చంద్రునిపై నీరు ఉందని సూచించడానికి ఆధారాలు ఉన్నాయి, ఆ నీరు భూమిపై మనకు కనిపించే నీటికి భిన్నంగా ఉండే రూపాల్లో ఉంది. NASA వాళ్ళు 2018 లో విడుదలచేసిన మ్యాప్‌లు చంద్రుని నీడ ఉన్న ప్రాంతాలలో చాలా చల్లగా ఉంటాయి. గడ్డ కట్టడానికి (-157 డిగ్రీల సెల్సియస్) వీలు కల్పిస్తాయి. అలానే 2020 లో NASA విడుదల చేసిన మ్యాప్‌లు , సూర్యరశ్మి ఉన్న ప్రాంతాలలో కూడా నీరు ఉన్నట్లు ధృవీకరించింది. ఇప్పటికి వరకు చంద్రుని పైన లభించిన ప్రకారం Lunar Regolith (లూనార్ రెగోలిత్) లో ఘనమైన శిలలను కప్పి ఉంచే వదులుగా ఉండే పొరల లోపల నీరు చిక్కుకుపోవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచించాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ అణువులు (హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక) కనుగొనబడ్డాయి. ఇలాంటి నీరు భవిష్యతుల్లో మంచి వనరులుగా ఉపయోగమున్నప్పటికీ వీటి వెలికితీత సవాళ్లు తో కూడుకున్న పని. అలాగే ఈ చంద్రుని నీటిని అధ్యయనం చేయడం వలన చంద్రుని నిర్మాణం, సౌర వ్యవస్థ రహస్యాలను, అస్థిరతలను తెలుసుకునే గొప్ప అవకాశం లభిస్తుంది . ఈ రకంగా మన ఋషులు ద్రష్టలు వేదవాఙ్మయం ద్వారా అందించిన ఖగోళ శాస్త్ర రహస్యాలను, ఇప్పటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో క్రోడీకరించి , ప్రపంచ మానవాళి మనుగడకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతారని ఆశిద్దాం. -Dr. Y. Hanumantha Rao, email: hanuyr@gmail.com ఇదీ చదవండి: Chandrayaan 3 Mission Details: చంద్రయాన్–3.. త్రీ ఇన్ వన్ -
రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే..
వాషింగ్టన్: భూమిపై నుంచి అంతరిక్షానికి రాకెట్ ప్రయోగాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ప్రతి సంవత్సరం ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తున్నాయి. అంతరిక్షాన్ని శోధించడానికి పరికరాలను పంపడమూ ఎక్కువైంది. ఈ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. మరి గగనవీధిలోకి పంపించిన ఉపగ్రహాలు, పరికరాలు ఏమవుతున్నాయి. పని కాలం ముగిసిన తర్వాత అవి అక్కడే పేలిపోయి, వ్యర్థాలుగా మారుతున్నాయి. కొన్ని పుడమి మీదకు ప్రచండ వేగంతో దూసుకొస్తుంటాయి. గ్రహ శకలాలూ భూమిపై పడుతుంటాయి. అంతరిక్ష చెత్తగా పిలిచే ఇలాంటి వ్యర్థాల కారణంగా రానున్న రోజుల్లో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాల శకలాలు, సంబంధిత అంతరిక్ష చెత్త భూమిపై పడి మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటనలు సంభవించినట్లు ఇప్పటికైతే దాఖలాలు లేవు. కానీ, వేలాది సంవత్సరాల క్రితం గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లే రాక్షస బల్లులు అంతరించిపోయాయని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అంతరిక్ష చెత్త వల్ల మనుషుల ప్రాణాలు పోవడం అనేది నమ్మశక్యంగా లేనప్పటికీ మరో పదేళ్లలో ఈ ప్రమాదాలు జరిగి అవకాశాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం ఫలితాలు ‘నేచర్ ఆస్ట్రానమీ’ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. దక్షిణ అక్షాంశంలో ప్రమాదం అధికం పనిచేయని ఉపగ్రహాలు సైతం వాటి కక్ష్యలో నిరంతరం తిరుగుతూ ఉంటాయి. వాటిలోని ఇంధనం, బ్యాటరీల్లో పేలుడు ఘటనలతో ముక్కలు చెక్కలవుతాయి. అతి సూక్ష్మ శకలాలుగా విడిపోతాయి. వాటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తిని లోనై మనవైపు దూసుకొస్తాయి. భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొడితే ఊహించలేనంత నష్టం వాటిల్లుతుంది. సహజ అంతరిక్ష చెత్తగా వ్యవహరించే గ్రహశకలాలు అరుదుగా గానీ భూమివైపునకు దూసుకురావు. సమస్యంతా కృత్రిమ అంతరిక్ష చెత్తతోనే. అంటే ఉపగ్రహాలు, రాకెట్లు. వీటి ముప్పును అంచనా వేయడానికి అధునాతన గణిత శాస్త్ర విధానాలను ఉపయోగించారు. ఉత్తర ఆకాంశంతో పోలిస్తే దక్షిణ అక్షాంశంలోనే అంతరిక్ష చెత్త ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. న్యూయార్క్, బీజింగ్, మాస్కోలతో పోలిస్తే జకార్తా, ఢాకా, లాగోస్‌లో మూడు రెట్లు ఎక్కువ ప్రాణాపాయమని అధ్యయనంలో తేలింది. రాకెట్లు, ఉపగ్రహాల నుంచి ఊడిపడే శకలం భూమిపై పది చదరపు మీటర్ల మేర పరిధిలో ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఒకరు లేదా ఇద్దరు మరణించేందుకు 10 శాతం ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష చెత్త భూమిపైకి రాకుండా నిరోధించవచ్చని అంటున్నారు. అది చాలా ఖరీదైన వ్యవహారమని అభిప్రాయపడుతున్నారు. -
ఆస్ట్రానమీలో అదరగొట్టింది
నిడదవోలు: జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ ప్రతిభా పోటీల్లో ఏపీలలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థిని కుంచాల కైవల్యరెడ్డి సత్తా చాటింది. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం అంశాల్లో ఆన్లైన్లో మూడు రౌండ్లలో జరిగిన ప్రతిభా పరీక్షల్లో 82 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పరీక్షల్లో 14 పాయింట్లతో కైవల్యరెడ్డి ద్వితీయ స్థానం సాధించి, సిల్వర్ ఆనర్ సర్టిఫికెట్ పొందింది. -
ఐఐటీ–హైదరాబాద్‌లో భారీ టెలిస్కోప్
సాక్షి, సంగారెడ్డి: ఖగోళ కార్యకలాపాలపై పరిశోధనలకు శ్రీకారం చుట్టేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ కీలక ముందడుగు వేసింది. క్యాంపస్‌లో భారీ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టీ) స్థాపక డైరెక్టర్ డాక్టర్ బీఎన్ సురేశ్ సోమవారం టెలిస్కోప్‌ను ప్రారంభించారు. ఈ టెలిస్కోప్‌లో 165 మి.మీ. ఫోకల్ లెంగ్త్‌తో 355 మి.మీ (ఐఐటీ కాన్పూర్ తర్వాత రెండోది) ఆప్టికల్ వ్యాసం కలిగిన భారీ లెన్స్ ఉంటుందని సోమవారం ఐఐటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై చిన్న క్రేటర్లు, శని గ్రహ వలయాలు, ఉల్కాపాతం వంటి చిత్రాలను నమోదు చేసేందుకు వినియోగించొచ్చని పేర్కొంది. ఖగోళంపై అధ్యయనం చేసేందుకు విద్యార్థులకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడుతుందని హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ మూర్తి పేర్కొన్నారు. స్టార్ గేజింగ్ శిక్షణ కార్యక్రమాలు, ఖగోళ చిత్రాలు తదితరాలపై అవగాహన పెంచుకోవచ్చని చెప్పారు. కాగా, ఐఐటీ హైదరాబాద్ ఆ్రస్టానమీ క్లబ్ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు కూడా ప్రయోజనాలు పొందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో భౌతికశాస్త్ర విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ముయూఖ్‌పహారి పాల్గొన్నారు. -
వందేళ్లలో ఈ ‘అగ్ని వలయం’ లోతైనది!
న్యూఢిల్లీ: ఆకాశంలో ఆదివారం అద్భుత ఖగోళ సంఘటన కనువిందు చేసింది. భారత్‌వ్యాప్తంగా పలు చోట్ల పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం కనిపించింది. దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమైన గ్రహణం మూడు గంటల వరకు కొనసాగింది. ఈఏడాది ఇది మూడో గ్రహణం కావడం విశేషం. ఇప్పటికే జనవరి, జూన్ మాసాల్లో రెండు చంద్రగ్రహణాలు కనిపించాయి. సరిగ్గా మధ్యాహ్నం 12.05 నిముషాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే మార్గంలోకి రావడంతో.. అగ్నివలయంగా సూర్యుడు దర్శనమిచ్చాడు. గుజరాత్లో సూర్యగ్రహణం ఈ శతాబ్దానికి ఇదే ‘లోతైన’ వలయాకార సూర్యగ్రహణమని జ్యోతిష్కులు, నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ దశాబ్దానికి ఇది చివరి వలయాకార సూర్యగ్రహణమని పేర్కొన్నారు. దాంతోపాటు నేటి సంపూర్ణ, వలయాకార సూర్యగ్రహణం ఖగోళ చరిత్రలో నాలుగో అత్యుత్తమైందని అంటున్నారు. కాగా, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, కోల్‌కత, లక్నో, ముంబై, పట్నా, షిల్లాంగ్, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపించింది. ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్, హిందూ మహాసముద్రాల ప్రాంతాల్లో, యూరప్, ఆస్ట్రేలియాలోనూ గ్రహణం కనిపించింది. (చదవండి: అగ్ని వలయంలో బీజేపీ ఎంపీ యోగా) పంజాబ్‌లో పాక్షిక సూర్యగ్రహణం -
‘సుశాంత్‌కు క్యాంప్‌లు అవసరం లేదు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభ, బంధుప్రీతి వంటి అంశాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఇండస్ట్రీ సుశాంత్‌ను పట్టించుకోలేదని.. అతడిని నిర్లక్ష్యం చేసిందని.. ఆ బాధ తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ఆప్త మిత్రురాలు రోహిణి అయ్యర్ చేసిన సోషల్ మీడయా పోస్టింగ్ తెగ వైరలవుతోంది. సుశాంత్ మరణాన్ని కొందరు తమ ఎజెండాగా మార్చుకుని.. ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సుశాంత్ మరణాన్ని ఇలాంటి పోస్టింగులతో తక్కువ చేయవద్దని కోరారు. తన స్నేహితుడు డబ్బు, కీర్తి గురించి పట్టించుకోలేదని.. స్టార్స్‌తో గడపాలని కోరుకోలేదన్నారు. తనకు ఎలాంటి క్యాంప్‌లు అవసరం లేదని.. తన సొంత రాజ్యం తనకు ఉందని ఆమె తెలిపారు. ‘మీ అభిప్రాయాలతో, మీ గుర్తింపుతో అతడికి పని లేదు. తనతో కాంటాక్ట్‌లో లేకున్నా అతడి గురించి పోస్టింగులు చేసినా ఎప్పడు పట్టించుకోలేదు. నకిలీ స్నేహితులు, ఫోన్ కాల్స్‌ను అతడు అసహ్యించుకునేవాడు. మీ పార్టీలను అతడు తిరస్కరించేవాడు. అతనెప్పుడు బయటివాడే.. మీలో ఒకడు కావాలని అతను ఎప్పుడు ఆశించలేదు. 100 కోట్ల క్లబ్బు గురించి అతడు పట్టించుకోలేదు. ఎలాంటి కేటగిరిల గురించి అతడికి పట్టింపు లేదు. అవార్డ్ ఫంక్షన్లంటే అతడికి విసుగు. తనను ఉత్తమ నటుడిగా ప్రకటించే లోపే బోర్ కొట్టి ఓ ఫంక్షన్ నుంచి బయటకు వెళ్లాడు. సినిమాలు కాకుండా అతడికి చాలా ఆసక్తులు ఉన్నాయి. ఆస్ట్రానమీ, సైన్స్ అంటే తనకు చాలా ఇష్టం. తను చారిటీల్లో, సైన్స్ ప్రాజెక్ట్స్‌లో, కొత్త ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టాడు. దయచేసి అతడిని అర్థం చేసుకోవాడనికి ప్రయత్నించకండి. మీ ఎంజెడా కోసం అతడి ప్రతిభను తగ్గించకండి’ అని కోరారు. (సుశాంత్ మామూ బతికే ఉన్నాడు!) అంతేకాక ‘కోట్ల విలువైన చెక్కులను అతను తిరిగి ఇవ్వడం నేను చూశాను. అతని వరకు పనిలో నాణ్యత చాలా ముఖ్యం. ఫోన్ ఆఫ్ చేసి చేపలు పట్టడానికి, వ్యవసాయం చేయడానికి కూడా వెళ్లేవాడు. అన్ని నియమాలను అతిక్రమించగల తెగువ అతని సొంతం. తనో వజ్రం, ప్లాస్టిక్‌ను మాత్రమే ఉపయోగించే పరిశ్రమ ఆ వజ్రాన్ని గుర్తించలేదు. మీరు కూడా అతడిని గుర్తించలేదు.. ఎందుకంటే మీరూ ప్లాస్టిక్‌నే వాడతారు. కనుక నేను కోరిది ఒక్కటే. ప్రతి ఒక్కరు వాస్తవంగా అతడు ఏంటో గుర్తించుకోవాలని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీ అభిప్రాయాలను అతడు అస్సలు పట్టించుకోడు. నా వరకు అతడి వారసత్వాన్ని కాపాడటం చాలా ముఖ్యం. మరోసారి రికార్డులను సరి చూసుకోండి’ అని రాసుకొచ్చారు రోహిణి అయ్యర్.(సుశాంత్ చావును అవమానిస్తున్నారు: హీరో) -
నెగ్గుతామా.. నాథూలాల్‌జీ?
మరు నిమిషం ఏమవుతుందో ఎవరికీ తెలీకపోయినా, తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం తగ్గదు. భవిష్యత్ చెప్పే వాళ్లంటే ప్రజలకు భలే మోజు. చిలక జోస్యుల దగ్గర నుంచి నోస్ట్రడామస్ వరకు ఇందుకే పాపులర్ అవుతుంటారు. రాజకీయ నాయకుల్లో ఈ ఆసక్తి మరీ అధికం. ఎన్నికల వేళ నాయకులకు కాలునిలవదు. గెలుస్తామా, గెలవమా అనే మీమాంసతో జోతిష్యంపై మరింతగా ఆధారపడుతుంటారు. ఇలాంటి నేతలంతా ప్రస్తుతం రాజస్తాన్‌లోని కరోయ్ నగరానికి బారులు తీరుతున్నారు. రాజస్థాన్‌లోని భిల్వారాకు 20 కి.మీ దూరంలోని చిన్నగ్రామం కరోయ్. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల రాజకీయనాయకులు ఈ ఊరికి క్యూ కడుతున్నారు. ఈ ఊర్లో పండిట్ నాథూలాల్ భైరూలాల్ వ్యాస్ అనే 96 ఏళ్ల జ్యోతిష్కుడి కోసం బారులు తీరుతున్నారు. ఎన్నికల సంరంభం ఆరభం కాగానే పార్టీ టికెట్ వస్తుందా? లేదా? అని, షెడ్యూలు వచ్చాక ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని, ఎన్నికల తర్వాత మంత్రి అవుతామా? లేదా? అని తెలుసుకునేందుకు వ్యాస్ వద్దకు వస్తుంటారు. ఆయన లెక్కే వేరు! వ్యాస్ జోస్యంపై పెద్దవాళ్లకు నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల కాలంలో ఈ నమ్మకం మరింత బలపడేందుకు కారణం... ప్రతిభాపాటిల్ సింగ్. దేశంలోనే అత్యున్నత స్థానాన్ని ఆమె అందుకోబోతున్నట్టు ఎవరు ఊహించడానికి ముందే ఆయన తన భవిష్యవాణిలో వెల్లడించారు. నాధూలాల్ను కలుసుకునేందుకు తన భర్త దేవీసింగ్ పటేల్‌తో కలిసి ప్రతిభాపాటిల్ వెళ్లినపుడు ఆమెకు వ్యాస్ ఈ విషయం తెలియజేశారు. ఈ జోస్యం నిజం కావడంతో తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వ్యాస్‌ను ఆమె ఆహ్వానించారు. నాథూలాల్ ప్రాభవం ప్రతిభాసింగ్తోనే మొదలు కాలేదు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ధీరూభాయ్ అంబాని కూడా గతంలో వ్యాస్‌ను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వివిధ అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఉండేవాళ్లు. ధీరూభాయ్‌తో పాటు గతంలో యూపీ, ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన అమర్‌సింగ్, ప్రసుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు వ్యాస్ శిష్యబృందంలో సభ్యులుగా ఉన్నారు. పలువురు విదేశీ భక్తులు కూడా ఆయనను కలుసుకునేందుకు వస్తుంటారు. ప్రత్యేకత ఏమిటి? సంస్కృత జ్యోతిష విధానం ‘భృగు సంహిత’లో వ్యాస్ నిష్ణాతులు. ఆయన లెక్క తప్పదని ప్రజల్లో నమ్మకం. భృగు సంహిత ఆధారంగా వ్యాస్ జరగబోయే విషయాలపై రాజకీయశిష్యులకు జోస్యం చెబుతుంటారు. ఆయన చెప్పినట్లు జరుగుతుందనే నమ్మకంతో నేతలు వ్యాస్ చెప్పే సూచనలను, సూచించే పూజలను తప్పక పాటిస్తుంటారు. కేవలం గెలపోటములపై సలహాలే కాకుండా, గెలుపునకు ఏమి చేస్తే బావుంటుంది, ఎలాంటి వ్యూహాలు చేపడితే బావుంటుందన్న దానిపై కూడా సలహాలు తీసుకుంటున్నారు. ‘ సమాజం సాంకేతికరంగంలో అభివృద్ధి సాధిస్తున్నా సాంస్కృతిక మూలాలు మరిచిపోకుండా స్మృతీ ఇరానీ వంటి వారు జ్యోతిషాన్ని నమ్ముతున్నారు. నమ్మకమే వారిని గెలిపిస్తోంది’’అంటారు వ్యాస్. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే కూడా తన శిష్యురాలేనని చెప్పారు. స్మృతీతో పాటు వసుంధర భవిష్యత్ గురించి చెప్పిన జోస్యాలు ఫలించాయని వ్యాస్ చెబుతుంటారు. -
2017లో నాలుగు గ్రహణాలు
ఇండోర్: కొత్త సంవత్సరం 2017లో నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయని ఖగోళ పరిశోధకులు పేర్కొంటున్నారు. వీటిలో రెండు చంద్ర గ్రహణాలు కాగా మిగతా రెండు సూర్యగ్రహణాలు అని ఉజ్జయినిలోని శివాజీ పరివోధనా సంస్థ తెలిపింది. అయితే వీటిలో రెండు గ్రహణాలు మాత్రమే భారత్‌లో కనిపిస్తాయని, 2017 ఫిబ్రవరి 11న ఏర్పడే చంద్రగ్రహణాన్ని భారతీయులు చూడగలరని, అదే నెల 26న ఏర్పడే సూర్యగ్రహణాన్ని చూడలేరని ఇనిస్టిట్యూట్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆగస్టు 7న ఏర్పడే పాక్షిక చందగ్రహణం భారత్‌లో కనిపిస్తుందంటూ ఆగస్టు 21న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదని పేర్కొన్నారు. -
మరో మూడు ప్రపంచాలు..!
ఈ విశాల విశ్వంలో భూమి ఒంటరి అని ఒకప్పుడు అనుకునే వారు. ఇరవై ఏళ్ల కిందట ‘51 పెగసీ బీ’ని గుర్తించడంతో ఖగోళశాస్త్రంలో ఓ సంచలనం నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సౌరకుటుంబానికి అవల దాదాపు 1800 గ్రహాలను గుర్తించారు. వజ్రాల రాశులు పోసి ఉన్న గ్రహాలు కొన్నైతే... ఆమ్లవర్షాలతో తడిసి ముద్దయ్యేవి మరికొన్ని. మరి ఇన్ని వందల గ్రహాల్లో భూమిని పోలినవి ఎన్ని? సూర్యుడి నుంచి ఉండే దూరం, గ్రహంపై ఉష్ణోగ్రత తదితర అంశాలనుబట్టి ఆ గ్రహం హ్యాబిటబుల్ జోన్లో ఉందా? అన్నది లెక్కకడతారు. ఈ లెక్కన భూమిని పోలిన గ్రహాలు మూడింటి వింతలేమిటో చూడండి మరి! గ్లీసీ 667 సీసీ... దాదాపు 22 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమి కంటే 4.5 రెట్లు బరువైంది. ఇక్కడ ఒక ఏడాదికి కేవలం 28 రోజులే. సూర్యుడి కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే నక్షత్రం చుట్టూ తిరుగుతూంటుంది. అయితే ఈ నక్షత్రం నుంచి వెలువడే మంటలకు దగ్గరగా గ్రహం వస్తూంటుంది కాబట్టి ఇదంత ఆవాసయోగ్యమైంది కాదని అంచనా. కెప్లెర్ 22బీ... భూమి కంటే దాదాపు 2.4 రెట్లు ఎక్కువ సైజున్న గ్రహం ఇది. 600 కాంతి సంవత్సరాల దూరంలో ఆవాసయోగ్యమైన ప్రాంతంలోనే తన నక్షత్రం చుట్టూ తిరుగుతూంటుంది. సూర్యుడి లాంటి ఈ నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగేందుకు 290 రోజులు పడుతుంది. కెప్లెర్ 452 బీ... భూమితో చాలా దగ్గరి పోలికలున్న గ్రహం ఇది. మూడు నాలుగు నెలల క్రితమే దీని గురించి ప్రపంచానికి తెలిసింది. భూమికి 1400 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ గ్రహం. -
విశ్వ రహస్యాల అన్వేషణకు ‘భేష్’!
చుక్కల లోకం గుట్టు విప్పాలి. గామా కిరణాల లోగుట్టు పసిగట్టాలి. ఖగోళ చరిత్రను మలుపు తిప్పాలి. ఈసీఐఎల్ మేస్ టెలిస్కోపు అదే చేయబోతోంది అందుకే లడఖ్‌కు బయలుదేరింది... విశ్వాంతరాళాల నుంచి దూసుకువచ్చి లిప్తపాటులో మాయమయ్యే కాంతిపుంజాలను ఒడిసిపడితేనే అల్లంత దూరంలోని చుక్కల లోకం గుట్టు తెలుస్తుంది. నక్షత్రాలు, వాటి పేలుళ్ల వెనక ఉన్న మర్మం అంతు పడుతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూనే రూపుమార్చుకునే గామా కిరణాల ఉనికిని గుర్తిస్తేనే ఖగోళం సంగతులు అర్థమవుతాయి. అందుకే.. గామా కిరణాల గుట్టు విప్పేందుకు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) శాస్త్రవేత్తలు మేస్ టెలిస్కోపును తయారు చేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు, ఎత్తై ప్రదేశంలో ఏర్పాటుచేసే అతిపెద్ద టెలిస్కోపు అయిన మేస్ ఇంతకూ ఏం చేస్తుంది? దీని కథాకమామిషు ఏమిటి? గామా కిరణాలపై నిఘా నేత్రం... విశ్వం పుట్టు, పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలంటే రోదసిలో సుదూర తీరాల నుంచి దూసుకువచ్చే శక్తిమంతమైన గామా కిరణాలపై అధ్యయనం ఓ మంచి అవకాశం. మిలమిల మెరిసే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రపేలుడు అవశేషాలు, గెలాక్సీ కేంద్రాలు, మొదలైన వాటి నుంచి వెలువడే గామా కిరణాలపై అధ్యయనం వల్ల వాటి గురించి తెలుసుకునేందుకు వీలవుతుంది. తద్వారా ఖగోళ భౌతికశాస్త్రం, ప్రాథమిక భౌతికశాస్త్రం, గామా కిరణాల ఆవిర్భావం, వాటి వేగం వెనక ఉన్న ప్రక్రియ గురించి మరింత బాగా అవగాహన చేసుకోవచ్చు. అయితే ఈ గామా కిరణాలు అత్యధిక శక్తితో దూసుకొస్తుంటాయి. చాలా శక్తితో కూడిన ఈ ఫొటాన్లను భూమిపై నుంచి నేరుగా గుర్తించడం సాధ్యం కాదు. మామూలుగా అయితే ఇవి నేరుగా భూమికి చేరితే జీవకోటి ఉనికికే ప్రమాదకరం. కానీ ఈ కిరణాలు భూవాతావరణంలోకి ప్రవేశించగానే విద్యుదావేశ కణాలను వెదజల్లుతాయి. ఫలితంగా నీలికాంతితో కూడిన రేడియేషన్ ఫ్లాష్ మాదిరిగా మెరిసి మాయమైపోతుంది. ఇదెంత వేగంగా జరుగుతుందంటే ఒక సెకనులో కొన్ని వందల కోట్ల వంతు సమయంలోనే. దీనినే సెరెంకోవ్ కాంతి లేదా సెరెంకోవ్ రేడియేషన్ అంటారు. ఈ కాంతిని గుర్తించి ఫొటోలు తీయడంతోపాటు ఇతర సమాచారాన్ని అందించడమే మేస్ టెలిస్కోపు పని అన్నమాట. పనితీరు ఇలా... మేస్ టెలిస్కోపులో కాంతిని పసిగట్టేందుకు 356 అద్దాల పలకలు ఉంటాయి. టెలిస్కోపు కేంద్రభాగంలో ప్రతిఫలించే సెరెంకోవ్ ప్రక్రియలు, వాటి లక్షణాలను పసిగట్టేందుకు 1200 కిలోల బరువైన హైరెసోల్యూషన్ ఇమేజింగ్ కెమెరా ఉంటుంది. ఇది సెరెంకోవ్ కాంతిని ప్రతిఫలింపచేసే లైట్ కలెక్టర్లకు అభిముఖంగా ఉంటుంది. వీటన్నిటి సమన్వయంతో గామా రే ఫొటాన్ను శక్తిని, చిత్రాన్ని ఈ టెలిస్కోపు రికార్డు చేస్తుంది. సమాచారాన్ని గంటకు 50 జీబీల వేగంతో ఆప్టికల్ ఫైబర్ ద్వారా కంట్రోల్‌రూంలోని కంప్యూటర్ సిస్టమ్‌కు చేరవేస్తుంది. ఆరు చక్రాలతో ఉండే మేస్ ఆకాశంలో ఏ దిక్కున ఉన్న ఖగోళ వస్తువునైనా పరిశీలించేందుకు అనుగుణంగా తిరగగలదు. ఇప్పటిదాకా అమెరికా, యూరోప్వంటి దేశాలు, సమాఖ్యలే ఇంత భారీ టెలిస్కోపులను నిర్మించాయి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ముంబై) సహకారంతో దీనిని ఈసీఐఎల్ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించింది. సౌర విద్యుత్‌తో పనిచేసే మేస్ ప్రారంభమైతే.. గామా రే అధ్యయనంలో భారత్ కీలక స్థానంలో నిలవనుంది. ప్రత్యేకతలు... ప్రపంచంలో ఎక్కడినుంచైనా దీనిని రిమోట్‌తో నియంత్రించవచ్చు. గంటకు 30 కి.మీ. వేగంతో గాలులు వీచినా స్థిరంగా నిలబడగలదు. పార్కింగ్ పొజిషన్లో ఉంచితే గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. నిర్దేశిత ఖగోళ వస్తువును నిరంతరాయంగా, కచ్చితత్వంతో అనుసరిస్తుంది. దిశను, ఎత్తును కూడా ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది. ‘మేస్’డేటా! పూర్తిపేరు: మేజర్ అట్మాస్ఫెరిక్ సెరెంకోవ్ ఎక్స్పెరిమెంట్ (మేస్) గుర్తింపు: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు ఎత్తై ప్రాంతంలో ఏర్పాటయ్యే అతిపెద్ద టెలిస్కోపు ఎత్తు: సముద్రమట్టానికి 4,500 మీటర్లు వ్యాసం: 21 మీటర్లు బరువు: 180 టన్నులు ఖర్చు: రూ.45 కోట్లు స్థలం: హన్లే, లడఖ్ ప్రారంభం: 2016, జనవరిలో -
స్వభావాన్ని సంస్కరించుకోవడమే సాధనం
జగద్గురు పీఠం భౌగోళిక అధ్యక్షుడు పార్వతీకుమార్ సింహాచలంలో ఘనంగా గురుపూజోత్సవాలు దేశ విదేశాల నుంచి సాధకులు హాజరు సింహాచలం, న్యూస్‌లైన్ : స్వభావంలో నుంచే భావా లు పుడుతుంటాయని, స్వభావాన్ని సంస్కరించుకోవడమే సాధనమని జగ ద్గురు పీఠం భౌగోళిక అధ్యక్షుడు మాస్టర్ కంభంపాటి పార్వతీకుమార్ అన్నారు. సిం హాచలంలో 53వ గురుపూజా మహోత్సవాలు శనివా రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి స్వామి క ల్యాణ మండపంలో మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు హాజరైన సాధకులనుద్దేశించి పార్వతీకుమార్ ప్రసంగించారు. సత్పురుషుల్లో సదావగాహన సహజంగా ఉంటుందన్నారు. సద్గురువుల స్పర్శ ల భించడం, గురువాక్కులను పాటించి జీవించడం సా ధకుల జీవితంలో అరుదైన విషయమన్నారు. ఈ కా ర్యక్రమంలో భాగంగా పలు గ్రంథాలను ఆవిష్కరించారు. మాస్టర్ ఇ.కె. మాస్టర్ జాలాకూల్ పరమ గురువుల గ్రంథాల్లోని జ్ఞానాన్ని వివరించారు. అంతర్జాతీయ జగ ద్గురుపీఠం అధ్యక్షుడు డాక్టర్ కె.ఎస్.శాస్త్రి మాట్లాడుతూ జోతిష్యం, వేద జ్ఞానం, క్రతు రంగాల కు సంబంధించిన జ్ఞానాన్ని, సమన్వయాన్ని పంచిపెట్టడానికి జగద్గురు పీఠం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మాస్టర్ పార్వతీకుమార్ దంపతులు నారాయణ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు జర్మనీ, బె ల్జియం, స్పెయిన్, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన 30 మంది విదేశీ సాధకులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడే దుస్తుల్లో వీరింతా తరలిరావడం విశేషం. -
అంతరిక్షం గురించి అప్డేట్స్..!
అంతరిక్ష పరిశోధనల గురించి, ఇతర గ్రహాల గురించి పరిశోధనలు కొత్త ఆసక్తులను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో... నట్టింట్లో అంతరిక్షాన్ని ఆవిష్కరించవచ్చు. చూపుడు వేలితో నక్షత్రాలను టచ్ చేయవచ్చు. ఖగోళాన్ని ఒళ్లోకి తీసుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన సరికొత్త అప్లికేషన్లతో అనుక్షణం అప్డేట్స్ను అందుకోవచ్చు. అంతరిక్ష పరిశోధన సంస్థల సహకారంతో ఇవి సాకారం అవుతాయి. ఒకవైపు సోషల్నెట్వర్కింగ్ గురించి... దీనివల్ల ఉపయోగాలేమిటి? అనార్థలేమిటి? అని చర్చలు కొనసాగుతుండగానే... సోషల్సైట్లు తమ ప్రాధాన్యతను మరింత పెంచుకొంటున్నాయి. విశ్వం గురించి వివరాలు అందిస్తూ దూసుకెళ్తున్నాయి. టెక్ స్టూడెంట్స్, అంతరిక్ష పరి శోధనల గురించి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం కొన్ని సోషల్నెట్ వర్కింగ్ అకౌంట్లు అనుక్షణం నాలెడ్జ్‌ను అప్డేట్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని... నాసా నుంచి... అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) విశ్వానికి సంబంధించిన అబ్బురాలను ఇన్స్టాగ్రామ్, ఫ్లికర్ల ద్వారా షేర్ చేస్తోంది. తమ టెలిస్కోప్‌లకు చిక్కిన అద్భుతమైన అంతరిక్ష ఛాయాచిత్రాలను, వీడియోలతో కూడిన విశ్లేషణలను వీడియోషేరింగ్, ఫోటో షేరింగ్‌లకు అవకాశమున్న ఈ సోషల్నెట్వర్కింగ్ సైట్ల ద్వారా షేర్ చేస్తోంది నాసా. విశ్వాంతరాలపై ఆసక్తి ఉన్నవారు నాసా సోషల్నెట్వర్కింగ్ అకౌంట్లకు సబ్‌స్క్రైబ్ అయితే, నిరంతరం అప్డేట్స్ వస్తుంటాయి. రోవర్ ను ఫాలో అవ్వండి... అరుణగ్రహంలో జీవి జాడ గురించి, నీటి వనరుల గురించి శోధిస్తున్న ‘క్యూరియాసిటీ’రోవర్‌కు సొంత ట్విటర్ అకౌంట్ ఉంది. రోవర్ పరిశోధనల గురించి అప్డేట్స్ ఇందులో ఉంటాయి. ఈ అకౌంట్‌ను ఫాలో కావడం ద్వారా అరుణగ్రహ పరిశోధన ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసే ఫొటోలు ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తాయి. స్పేస్ ఎక్స్... అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ ఇది. సిటిజన్స్‌ను ఇది స్పేస్టూర్లకు తీసుకెళ్తుంటుంది. అదంతా లక్షల డాలర్లతో ముడిపడిన వ్యవహారం. అందుకు బదులుగా వీడియోల రూపంలో అంతరిక్షం గురించి ఎన్నో అనుభవాలను అందిస్తోంది ఈ సంస్థ. ఫేస్‌బుక్‌లోనూ, యూట్యూబ్‌లోనూ స్పేస్ ఎక్స్ పేజ్‌లు, వీడియో చానళ్లు అందుబాటులో ఉన్నాయి. స్పేస్ క్రాఫ్ట్స్‌తో చేసిన విన్యాసాలు, అంతరిక్ష వివరాలు, ఆసక్తికరమైన ట్రివియా ఈ చానళ్లలో లభిస్తాయి. హబుల్ టెలీస్కోప్ అకౌంట్...అంతరిక్ష పరిశోధనల వివరాల పట్ల ఆసక్తి ఉన్న వారికి చిరపరిచితమైనది ‘హబుల్ టెలిస్కోప్’. విశ్వంలో ఈ టెలిస్కోప్ అన్వేషణలను ట్విటర్‌కు అనుసంధానించారు. హబుల్ టెలిస్కోప్ తీసే ఛాయాచిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఒక ట్విటర్ అకౌంట్‌ను ఏర్పాటుచేశారు. ఆర్బిటల్ సెన్సైస్... ఇది కూడా ఒక ప్రైవేట్ ఖగోళ పరిశోధన సంస్థ. తన పరిశోధన వివరాలను ఫేస్బుక్, ట్విటర్ల ద్వారా అందుబాటులో ఉంచడం ద్వారా విజ్ఞాన వారధిగా ఉంటోంది. నాసా అప్లికేషన్లెన్నో... ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై విశ్వవిజ్ఞానాన్ని పంచడానికి ఎన్నో అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది నాసా. నాసా టెలివిజన్, ది నాసా ఆప్, త్రీడీ సన్, హబుల్ సైట్, నాసా స్పేస్ వెదర్ మీడియా వ్యూవర్, స్పేస్ షటిల్ క్రూ... వంటి అప్లికేషన్లను అందుబాటులో ఉంచింది. ఇవన్నీ ఐఫోన్, ఐప్యాడ్లపై పనిచేస్తాయి.