breaking news
Family
-
దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ బాబ్ మాకీ కన్నుమూత
దిగ్గజ ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనర్ బాబ్ మాకీ (87) తుదిశ్వాస విడిచారు. ఆయన సోమవారం మరణించారు. కాగా బాబ్ మాకీ మరణ వార్తను ఆయన బృందం ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ధృవీకరించింది. 1939లో లాస్ ఏంజిల్స్ శివారు ప్రాంతంలో జన్మించిన బాబ్ మాకీకి చిన్నతనంలోనే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. బాబ్ మాకీకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే అతడి తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో జాబ్ మాకీ తన తాతయ్య, నానమ్మ వద్ద పెరిగాడు. ఈ సమయంలోనే వాళ్లిద్దరు బాబ్ మాకీని కళల పట్ల ఆసక్తి చూపేలా ప్రోత్సహించారు. తాను ఏ వృత్తిని కోరుకుంటాననేది తనకు ముందే తెలుసని బాబ్ మాకీ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.మాకీకి లభించిన తొలి ప్రధాన అవకాశాల్లో చెప్పుకోవాల్సింది మాత్రం నటి, గాయని మిట్జీ గేనార్కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేయడమే. లాస్ వేగాస్ రెవ్యూకు మిట్జీకి అందమైన కాస్ట్యూమ్స్ తయారు చేయడం ద్వారా బాబ్ మాకీ పేరు తొలిసారి మార్మోగిపోయింది. ఆ తర్వాత అతను ఆమె టెలివిజన్ స్పెషల్స్ కోసం దుస్తులను రూపొందించాడు. మాకీ తన కెరీర్లో తొమ్మిది ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు అందుకోవడంతో పాటు ఆస్కార్ విభాగంలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డుకు మూడుసార్లు నామినేట్ అవ్వడం విశేషం.బాబ్ మాకీ మరణవార్తను అతడి బృందం ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. ‘‘బాబ్ మాకీ ఈ రోజు కన్నుమూశారనే వార్తను చాలా బాధతో తెలియజేస్తున్నాము. ఆయన తన 87 ఏళ్ల జీవితాన్ని సంపూర్ణంగా గడిపారు. ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నారు, ఆయన జీవితమంతా అదే చేయాలని కోరుకున్నారు. ఆయన ప్రతిభ అసాధారణం. ఆయన రూపొందించిన డిజైన్లు ఈ ప్రపంచానికి అందాన్ని పంచుతూ శాశ్వతంగా నిలిచి ఉంటాయి.’’అని పేర్కొంది.ఇదీ చదవండి: కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు -
మీ డాక్టర్ 4-5 ట్యాబ్లెట్లు రాసిస్తున్నారా? WHO ప్రమాణాలు ఎలా ఉన్నాయ్?
ఒకే ప్రిస్క్రిప్షన్‌లో ఎక్కువ మందులు రాయడం ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మరోసారి మొదలైంది. తాజా అధ్యయనం ప్రకారం పాకిస్థాన్‌లో ఆసుపత్రుల్లో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 4.2 మందులు సూచిస్తున్నట్లు తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే సగటు 1.6 నుంచి 1.8 మందులతో పోలిస్తే చాలా ఎక్కువ.ఇస్లామాబాద్‌లోని హెల్త్ సర్వీసెస్ అకాడమీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ‘డిస్కవర్ పబ్లిక్ హెల్త్’ పత్రికలో ప్రచురితమైంది. పేషావర్‌లోని ఒక పెద్ద ఆసుపత్రిలో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 10.56 మందులు సూచించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో ప్రతి 4 మందుల్లో కేవలం ఒక మందును మాత్రమే జనరిక్ పేరుతో సూచించినట్లు తేలింది.భారత్‌లో.. భారత్‌లోనూ పరిస్థితి పూర్తిగా భిన్నంగా లేదని అందుబాటులో ఉన్న అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, భారతదేశంలో ఔట్‌పేషెంట్ ప్రిస్క్రిప్షన్లపై జరిగిన వివిధ అధ్యయనాల్లో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 2.2 నుంచి 3.9 మందులు సూచించినట్లు నమోదైంది. ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే పరిధి కంటే ఎక్కువ.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక్కో ప్రిస్క్రిప్షన్‌లో సగటున 1.6 నుంచి 1.8 మందులు ఉండటం, సాధ్యమైనంత వరకు జనరిక్ పేర్లతో మందులు సూచించడం, అవసరమైనప్పుడే యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు ఉపయోగించడం వంటి అంశాలు ముఖ్యమైనవి.అయితే ప్రతి సందర్భంలో రెండు కంటే ఎక్కువ మందులు రాయడం తప్పు కాదు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి పలు సమస్యలు ఒకేసారి ఉన్నప్పుడు, అలాగే క్షయ, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి కొన్ని వ్యాధుల్లో ఒకటి కంటే ఎక్కువ మందులు అవసరం కావచ్చు.అవసరం లేకుండా ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు, ఒక మందు మరో మందుతో ప్రతిక్రియ చెందే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వైద్యులు ఎక్కువ మందులు సూచించినప్పుడు వాటి అవసరం, వాడాల్సిన కాలం గురించి వారిని అడగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ (52) రెండో వివాహం చేసుకున్నారు. ఐరిష్-ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త, మల్టీ మిలియనీర్ ఆర్థికవేత్త కామెరూన్ ఓరైలీ (62)ని జెమీమా వివాహం చేసుకున్నట్లు ఆమె కుటుంబం ధ్రువీకరించింది. ఈ వివాహం వారాంతంలో జరిగినట్లు సమాచారం.జెమీమా గోల్డ్‌స్మిత్, ఇమ్రాన్ ఖాన్ దాదాపు 9 సంవత్సరాల పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు సులేమాన్, కాసిమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం కోసం, ఆయనకు మద్దతుగా ఈ ఇద్దరూ ప్రచారం చేస్తున్నారు.జెమీమా సోదరుడు బెన్ భార్య జెమీమా జోన్స్ సామాజిక మాధ్యమంలో వివాహ వేడుకకు సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. “జెమీమా, కామెరూన్ వివాహ వేడుకను జరుపుకుంటున్నాం.. ఎంత సంతోషకరమైన రోజు” అంటూ ఆమె పేర్కొన్నారు. జెమీమా, కామెరూన్ ఓరైలీకి సినిమాలు, డాక్యుమెంటరీలపై ఉన్న ఉమ్మడి ఆసక్తి ద్వారా పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.జెమీమాకు ఎన్నో నైపుణ్యాలు జెమీమా గోల్డ్‌స్మిత్ నిర్మాణ సంస్థ ఇన్స్టింక్ట్ ప్రొడక్షన్స్ స్థాపించారు. పలు చిత్రాలు, కార్యక్రమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ‘వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్?’ చిత్రానికి కూడా ఆమె రచన, నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. న్యూ స్టేట్స్‌మన్, వానిటీ ఫెయిర్ వంటి పత్రికల్లో సంపాదకురాలిగా, రచయితగా పనిచేశారు. మానవ హక్కుల అంశాలపై ఆమె బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.ఇటీవల ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటంపై కూడా జెమీమా స్పందించారు. “ఇది ఇక కేవలం పాకిస్థాన్ రాజకీయ వ్యవహారం కాదు. ఇది మానవ హక్కుల అత్యవసర పరిస్థితి” అని ఆమె పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ బ్రిటన్‌తో ఉన్న దీర్ఘకాల సంబంధాలు, ఆయన కుమారులు బ్రిటిష్ పౌరులు అయినప్పటికీ తండ్రి ఆరోగ్యం క్షీణించడాన్ని దూరం నుంచి చూడాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.జెమీమా రెండో వివాహం నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, ఆయన కుమారుల ప్రచారం వంటి అంశాలపై ఆమె భవిష్యత్తులో చేసే వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. -
అత్యంత విలక్షణమైన గణేశ్ ఆలయం..! ఆ రూపంలోనే ..
సాధారణంగా గణేశ్ విగ్రహాలనీ అత్యంత ఆకర్షణీయమైన రూపంలో ఉంటాయి. ప్రతి విగ్రహం దేనికి దానికి విలక్షణమైనది. కానీ ఉత్తరాఖండ్‌లో కొలువైన వినాయకుడు అత్యంత విభిన్నం. ఇక్కడ వినాయకుడి రెండు జీవితాలను దర్శించి తరించే అవకాశం లభిస్తుంది. అంటే ఇక్కడ ఆయన రూపం ఇప్పటి వరకు మనం చూసిన గణేశుడి విగ్రహాల్లోకెల్లా అత్యంత విభిన్నంగా ఉంటుంది. గజనానుడిగా మారక ముందు ఆయన రూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఆకృతి. ప్రపంచంలోనే తలలేని వినాయకుడి ఆలయం ఇది. ఇక్కడ వినాయకుడు తల లేకుండా మొండెంతో పూజలందుకుంటాడు. ఈ వినాయకుడి విగ్రహం కాషాయం రంగులో శక్తిమంతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని ‘శ్రీ ముండ కటియ గణేశ ఆలయం’ అని పిలుస్తారు. పురాణ గాథ..గణేశుడిగా ఆవిర్భవించిన కథ మన అందరికి తెలిసిందే..పార్వతి దేవి గణేశుడిని సృష్టించాలనే ఆలోచన రావడం. శివుని ఆగమనానికై ఎదురు చూస్తూ..పసుపు ముద్దతో ఒక బాలుడి విగ్రహాన్ని రూపొందించి ప్రాణం పోసి కుమారుడిగా స్వీకరించింది. తాను స్నానం ముంగించి వచ్చే వరకు ద్వారం వద్ద కాపలాగా ఉండమని ఆ బాలునికి చెప్పింది. సరిగ్గా ఆ సమయంలో శివుడు ఇంటికి తిరిగి వచ్చి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. తల్లి చెప్పిన మాటను శిరసావహిస్తూ..లోనికి వెళ్లడానికి వీల్లేదని హుంకరించాడు. ఎంత నచ్చచెప్పిన వినకపోగా..ఆయన దారికి అడ్డుగా నిలిచాడు. ఇది శివునికి ఆగ్రహానికి తెప్పించి ఆ బాలుని శిరస్సుని ఖండించేందుకు దారితీసింది. ఇంతలో పార్వతిదేవి వచ్చి శివుడుకి స్వాగతం పలికి..ఆయనకు ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి..ముచ్చటిస్తుండగా..ద్వారం వద్ద ఉన్న బాలుడి ప్రస్థావన వచ్చింది. అంతే అక్కడే తల, మొండెం వేరై పడి ఉన్న బాలుడిని చూసి పార్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. తన కుమారుడికి తిరిగి ప్రాణం పోయకపోతే ఈ విశ్వాన్నే నాశనం చేస్తానని శపథం చేసింది. దాంతో శివుడు కాత్యాయని శాంతించు అంటూ ఊరడించి తక్షణమే ఆ బాలుడిని బతికిస్తానని వాగ్దానం చేశాడు. తన గణాలకు ఉత్తరదిశగా నిద్రిస్తున్న ఏనుగు తలను ఖండించి తీసుకురమ్మని ఆదేశించాడు. అలా శివుడు ఏనుగు మొండెన్ని అతికించి ప్రాణం పోయడంతో గజానుడిగా పేరొందాడు అంతేగాదు తొలి పూజను అందుకునే గౌరవాన్ని, అడ్డంకులను తొలగించే దేవుడిగా వరాలు ప్రసాదించాడు. ఇప్పుడు మనం చెబుతున్న ఈ ఆలయం ప్రదేశంలోనే బాల గణేశుడు శిరస్సుని కోల్పోవడంతో ఈ ఆకృతిలోనే భక్తులకు వినాయకుడు దర్శనమిస్తూ పూజలందుకుంటున్నాడు. చేరుకునే మార్గం.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్ లోయకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది గౌరీకుండ్, కేదార్నాథ మార్గంలో సోన్‌ప్రయాగ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానంలో వస్తున్నట్లయితే, డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయంకు చేరుకుని 226 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే రైలులో వస్తున్నట్లయితే..రిషికేశ్ లేదా డెహ్రాడూన్‌లో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సోన్‌ప్రయాగ్‌కు చేరుకోవచ్చు. ఈ ఆలయానికి చేరుకునే యాత్రికులకు మందాకిని నదిని చూస్తూ నడవడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: 'గోల్డెన్ మోదక్'..ధర ఎంతో తెలుసా!) -
'గోల్డెన్ మోదక్'..ధర ఎంతో తెలుసా!
దేశమంత అంబరాన్నంటేలా వినాయక చవితి వేడుకల సంబరాలతో సందడిగా ఉంది. ఎటూ చూసి కొలువుదీరిన రకరకాల వినాయక రూపాలు, పిల్లలు, పెద్దలు కోలహాలమే కనిపిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న స్వీట్ షాపులు గణేశుడికి ప్రీతీకరమైన ప్రసాదాల అమ్మకాలతో రద్దీగా ఉన్నాయి. అయితే ఓ స్వీట్ షాపు మాత్రం అందర్నీ ఆకర్షించడమే కాదు నెట్టింట వైరల్‌గా మారింది. వినాయకుడు ఎంతో మెచ్చే ‘గోల్డెన్ మోదక్’తో అందర్నీ ఆశ్చర్యపర్చింది ఈ స్వీట్ షాపు. తినదగిని ఈ మోదకాలు ఎంతో ఆకర్షణీయంగా చూపురులను కట్టిపడేస్తున్నాయి. తినదగిన విధంగా బంగారు పొతతో తయారు చేసిన ఈ మోదకాలు నాసికాలో విద్యా వికాస్ సర్కిల్ వద్ద ఉన్న ‘సాగర్ స్వీట్స్’ షాపు వారు తయారు చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని ఈ మోదకాలు అందరీ మనసుల్ని దోచడమే కాదు, కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. నెట్టింట ఈ బంగారు మోదకాలు వైరల్ కావడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. వినాయకుడికి అమిత ప్రీతీపాత్రమైన మోదకాలకు తమ సృజనాత్మకతను జోడించి సరికొత్త ఆకర్షణను ఇచ్చి అమ్మకాలు పెంచుకునే ప్రయత్నం చేయడం విశేషం. ఇంతకీ ఈ బంగారు మోదకాలు కిలో ఎంత ధర పలుకుతున్నాయో వింటే విస్తుపోవడం ఖాయం. ఇవి కిలో అక్షరాల రూ. 27 వేలు పైమాటే. Ganesh Chaturthi Special: 'Golden Modaks' Worth Rs 27,000 Per Kg Draw Buyers In Nashik#GaneshChaturthi pic.twitter.com/VUtO0u9Dvu— NDTV (@ndtv) September 14, 2026(చదవండి: అంబానీ ఇంట ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు..!) -
అంబానీ ఇంట ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు..!
అంబానీల కుటుంబంలో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత ప్రత్యేకం. అంబానీల నివాసంలో కొలువై ఉండే ఆ వినాయకుడు 'యాంటిలియా చా రాజా'గా విశిష్టమైన అలంకరణతో పూజలందుకుంటున్నాడు. ఈ ఏడాది అంతే అట్టహాసంగా అంబానీలు ముంబైలో ఉన్న తమ అంటిలియా ఇంటికి గణపతి బప్పాను ఘనంగా స్వాగతించారు. ఈ వేడుకలను అంబానీ కుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్‌తో మరింత వైబ్‌ని తెప్పిస్తారు. ముఖ్యంగా నీతా అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె నారింజరంగు ఎత్నిక్ దుస్తులతో అక్కడున్న వారందరి దృష్టిని అమితంగా ఆకర్షించారు. అత్యంత నిరాడంబరమైన స్టైలిష్ లుక్‌తో పండుగ శోభను తెచ్చారామె. ఆమె దుస్తులపై ఉన్న క్లిష్టమైన ఎంబ్రాయిడరీలో ఉన్న సాంప్రదాయ వివరాలు మరింత కళను తెచ్చిపెట్టాయి. తన రూపానికి అనుగుణంగా స్టేమెంట్ చెవిపోగులు, గాజులను ధరించారు. పండుగ వాతావరణానికి అనుగుణంగా చక్కగా జడ వేసుకుని తన రూపంతోనే కళకళలాడే వాతావరణాన్ని సృష్టించిందామె. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నీతా అంబానీ ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపించారు. బంగారు ఆభరణాలు, లేయర్డ్ నెక్లెస్, స్టేట్మెంట్ చెవిపోగులతో సందర్భానుసారంగా స్టైలిష్‌గా కనిపించడంలో ఆమెకు సాటి లేరెవెవ్వరూ. ఈ పండుగ శోభలో అంబానీ మహిళలు ధరించే దుస్తులు, జ్యువెలరీ ప్రధాన ఆకర్షణగా నిలవడమే గాక మన భారతీయ హస్త కళా వైభవాన్ని చాటుతాయి. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official)ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా ఆ యువకుడు..!) -
వినాయకుడికి అంత రహస్య పూజలెందుకు?
వినాయక చవితి వచ్చిందంటే మన దేశంలో ఎక్కడ చూసినా గణనాథుడి సందడే కనిపిస్తుంది. వీధివీధినా మండపాలు.. ఇంటింటా బొజ్జ గణపయ్య ప్రతిమలు.. ఘనంగా పూజలు.. నైవేద్యాలు.. నిమజ్జనాలు. కానీ మనకు ఎంతో పరిచయమైన ఈ విఘ్నేశ్వరుడు మరో దేశంలో మాత్రం పూర్తిగా భిన్నమైన రూపంలో పూజలు అందుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా.. ఆ గణేశుడి విగ్రహాన్ని అందరికీ చూపించరు. పూజా విధానాలనూ రహస్యంగానే నిర్వహిస్తారు. ఇంతకీ ఆ దేశం ఏది? ఆ వింత గణేశుడి కథేంటి?జపాన్‌లో గజరాజు రూపంతో ఉన్న దైవాన్ని పూర్తి భిన్నమైన సంప్రదాయం ఉంది. అక్కడ ఆయన్ని కాంగిటెన్.. షోటెన్ అనే పేర్లతో పూజిస్తారు. అంతేకాదు.. అక్కడి ఓ ప్రత్యేక రూపంలో రెండు ఏనుగు ముఖాలున్న దేవతలు ఒకరినొకరు కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించరు. పూజా విధానాలను కూడా రహస్యంగానే నిర్వహిస్తారు. జపాన్ బౌద్ధ సంప్రదాయాల్లో వినాయకుడి కథ ఆసక్తికరమైన మలుపులతో కనిపిస్తుంది.తొలుత దుష్ట శక్తిగా..కొన్ని పురాతన బౌద్ధ గ్రంథాల్లో కాంగిటెన్ అనేది అడ్డంకులు సృష్టించే దుష్ట శక్తిగా పేర్కొని ఉంది. అతడిని ‘గజరాజుగా’, మనుషులకు ఇబ్బందులు కలిగించే శక్తిగా భావించేవారు. అందుకే అతడిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక మంత్రాలు, ఆచారాలు ఉపయోగించేవారు. అయితే తర్వాతి సంప్రదాయాల్లో కథ పూర్తిగా మారుతుంది.వినాయకుడి ఉగ్ర స్వభావాన్ని శాంతింపజేయడానికి కన్నోన్.. స్త్రీ వినాయక రూపంలో ప్రత్యక్షమయ్యాడని ఓ కథనం చెబుతుంది. ఆమెను చూసిన వినాయకుడు ఆకర్షితుడవుతాడు. అయితే ఆమెను తన సహచరిగా అంగీకరించాలంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాలని షరతు పెడుతుంది. వినాయకుడు అంగీకరించడంతో ఆమె అతడిని కౌగిలించుకుంటుంది. ఆ క్షణంతో అతడి ఉగ్ర స్వభావం శాంతించి.. దుష్ట శక్తి నుంచి రక్షక దేవతగా మారినట్లు కథనం.అందుకే కౌగిలింత రూపం!ఈ కథతోనే కాంగిటెన్ ప్రత్యేక రూపానికి సంబంధించిన భావనను అనుసంధానిస్తారు. రెండు ఏనుగు ముఖాలున్న రూపాలు ఒకదానినొకటి కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తాయి. ఇది కేవలం ప్రేమకు సంబంధించిన ప్రతీకగా కాకుండా.. భిన్న శక్తుల ఏకత్వం, ఉగ్రతను శాంతింపజేయడం, సామరస్యం, సంపూర్ణతకు సంకేతంగా వివరిస్తారు. అందుకే ఈ రూపం సాధారణ గణేశుడి విగ్రహాలకు భిన్నంగా ఉంటుంది.ఎందుకంత రహస్య పూజ?కాంగిటెన్ ఆరాధన జపాన్‌లోని ఎసోటెరిక్ బౌద్ధ సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఒకప్పుడు దుష్ట శక్తిగా భావించిన వినాయకుడి ఆరాధనలో ప్రత్యేక మంత్రాలు, దీక్షతో చేసే కర్మకాండలు అభివృద్ధి చెందాయి. అందుకే కాంగిటెన్ విగ్రహాలను చాలాచోట్ల తెర వెనుక లేదంటే ప్రత్యేక పెట్టెల్లో ఉంచుతారు. సాధారణ భక్తులకు వాటిని నేరుగా చూపించరు. కొన్ని అత్యంత ముఖ్యమైన పూజలను దీక్ష పొందిన బౌద్ధ సన్యాసులే నిర్వహిస్తారు. ఈ రహస్యత్వమే కాంగిటెన్ ఆరాధనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. పూజలు, నైవేద్యం కూడా చాలా ప్రత్యేకం..కాంగిటెన్కు సమర్పించే నైవేద్యాల్లో డైకాన్ ముల్లంగికు ప్రత్యేక స్థానం ఉంది. ముల్లంగితో పాటు జపాన్ సంప్రదాయ బియ్యం మద్యం సేక్ను కూడా సమర్పిస్తారు. ఇక అత్యంత ఆసక్తికరమైన నైవేద్యం ‘కాంగిదాన్’. ఇది ఎర్రబీన్స్ పూర్ణంతో నింపి నూనెలో వేయించే తీపి పదార్థం. భారతీయ సంప్రదాయంలోని మోదకాన్ని పోలిన ఈ స్వీట్‌ను కాంగిటెన్కు ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు.డైకాన్ సమర్పణ వెనుక కూడా ఒక ప్రతీకాత్మక అర్థం ఉంది. బౌద్ధ సంప్రదాయంలో మనిషిని వేధించే ప్రతికూల భావాల్లో ఒకటైన ద్వేషాన్ని తొలగించడాన్ని ముల్లంగి సమర్పణ సూచిస్తుందని భావిస్తారు. అందుకే జపాన్‌లోని కాంగిటెన్ ఆలయాల్లో డైకాన్ బొమ్మలు, గుర్తులు కనిపిస్తుంటాయి. కొన్ని ఆలయాల్లో ముల్లంగికి సంబంధించిన ప్రత్యేక ఉత్సవాలూ నిర్వహిస్తారు.ఇక కాంగిటెన్ పూజల్లో అత్యంత రహస్యమైన ఆచారాల్లో ‘ఆయిల్ బాత్ రిట్యువల్’ (Yokuyu-ku) ఒకటి. విగ్రహంపై పవిత్రమైన నువ్వుల నూనెను నిర్దిష్ట విధానంలో పోస్తూ చేసే ఈ పూజను సాధారణంగా దీక్ష పొందిన సన్యాసులే నిర్వహిస్తారు. వినాయకుడి పాత దుష్ట స్వభావాన్ని శుద్ధి చేసి.. అతడిని ధర్మ మార్గంలోకి తీసుకువచ్చిన ప్రక్రియకు ఇది ప్రతీకగా భావిస్తారు.అలా మన దగ్గర విఘ్నాలను తొలగించే గణపయ్య.. జపాన్‌లో మాత్రం ఒకప్పుడు విఘ్నాలు సృష్టించే శక్తిగా పేరొందాడు. కాలక్రమంలో కాంగిటెన్ అనే రహస్య దైవంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఒకే గణేశుడికి దేశానికో రూపం.. సంప్రదాయానికో కథ.. ఇదే వినాయక ఆరాధనలోని విశేషం!.ఇదీ చదవండి: ఎల్లలు లేవని దేవుడు ఈయన! -
బ్రిక్స్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా ఆ యువకుడు..!
భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు దిగ్విజయంగా ముగిసింది. అందుకు సంబంధించిన ఒక ఫోటోను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది షేర్ చేసిన గంట వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఆ ఫోటోల భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు చేతులు కలిపి ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ఆ నాయకుల మధ్య ప్రశాంతంగా నిలబడి ఉన్న ఒక యువకుడు అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాడు. ఎవరీ సిద్ధార్థ్ బాబు..?కేరళలో కొచ్చికి చెందిన 36 ఏళ్ల ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. 2017 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని తూర్పు ఆసియా విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొన్ని నివేదికలలో ఆయన పేరు సిద్ధార్థ్గా కనిపిస్తుంది. ఆయన చాలామందికి తెలియని అత్యంత కీలకలమైన గదిలో ఏళ్ల తరబడి పనిచేసిన దౌత్యవేత్త. మెకానికల్ ఇంజనీర్ అయిన ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 15వ ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు. ఆయన ఫారిన్ సర్వీస్‌ని ఎంచుకున్నారు. అలా ఆయన దేశంలోని అత్యంత సున్నితమైన సంభాషణల నేపథ్యంలో సాగే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారు. అక్కడ కనిపించడం కంటే సన్నద్ధతకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఆ నాయకుల మధ్య ఉండటానికి రీజన్..అతను మాండరిన్ అనువాదకుడు. శిఖరాగ్ర సమావేశంలో షీ జిన్‌పింగ్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను మోదీ అర్థం చేసుకునేలా సహాయం చేయడమే అతని పని. ఇది కనిపించే దానికంటే చాలా కష్టం. ఒక దౌత్య అనువాదకుడు కేవలం భాషనే కాకుండా, ప్రతి పదబంధంలో రాజకీయ ప్రాముఖ్యతను కూడా గ్రహించి, అర్థాన్ని కచ్చితంగా తక్షణమే తెలియజేయాలి. ఎందుకంటే వాణిజ్యం, భద్రత లేదా సరిహద్దుల విషయంలో పలికే ఒక్క తప్పు పదం మొత్తం సంబంధం స్వరూపాన్నే మార్చేయగలదు.ఆ బ్రిక్స్ ఫోటోని బట్టి అతడికి అదే అతిపెద్ద వేదిక అరంగేట్రం అనుకుంటే పొరపాటే..ఎందుకంటే ఈ ఏడాది జరిగిన గణతంత్ర వేడుకల్లో కూడా కనిపించారు. మోదీ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్పులా వాన్ డెర్ లేయన్తో సంభాషించేటప్పుడు సిద్ధార్థ్ అర్థమయ్యేలా వివరించడంలో సహాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక రకంగా ఈ ఘట్టం..భారతదేశం నిర్వహించే దాదాపు ప్రతి ప్రధాన దౌత్య సమావేశంలో కొంతమంది ప్రతిభావంతులైన భాషావేత్తలు అంతర్భాగంగా ఉంటారనే నగ్న సత్యాన్ని ఇది తెలియజేస్తోంది. అలాగే అత్యంత శక్తిమంతమైన వ్యక్తులతో సంభాషించేటప్పుడే వారి మాటాలు సునాయాసంగా అర్థం చేసుకుని సమాచారాన్ని చేరవేసే ఈ భాషావేత్తలదే అత్యంత కీలకమైన పాత్ర అని ప్రస్ఫుటమవుతోంది.(చదవండి: మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ) -
ప్రపంచంలోనే పురాతన చెట్టు..
వయసు తెలుసుకోవడానికి నరికేశారు! ఒక చెట్టు వయసు తెలుసుకోవడానికి ఏం చేస్తారు? దాని కాండం నుంచి చిన్న ముక్క తీసి పరిశీలిస్తారు. కానీ అమెరికాలో జరిగిన ఒక పరిశోధనలో మాత్రం ప్రపంచంలోని అత్యంత పురాతన చెట్లలో ఒకటైన చెట్టును పూర్తిగా నరికేశారు. ఆ తర్వాతే దాని అసలు వయసు బయటపడింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని వీలర్ పీక్ ప్రాంతంలో పెరిగిన ఈ చెట్టుకు స్థానికంగా ప్రోమీథియస్’ అనే పేరు ఉండేది. ఇది గ్రేట్ బేసిన్ బ్రిసిల్‌కోన్ పైన్ జాతికి చెందిన చెట్టు. 1964లో భూగోళ శాస్త్ర పరిశోధకుడు డొనాల్డ్ ఆర్. కర్రీ ఈ ప్రాంతంలో ఐస్ ఏజ్ అంటే మంచు యుగంపై పరిశోధన చేసే సమయంలో ప్రోమీథియస్ను గుర్తించాడు. ఈ చెట్ల కాండంలోని వలయాలు అంటే ట్రీ రింగ్స్ అనేవి గతంలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి, ఆ చెట్టు వయసును అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.అనుమతి ఇచ్చిన అమెరికాకర్రీ మొదట చెట్టు నుంచి చిన్న నమూనా తీసి వయసును అంచనా వేయాలని ప్రయత్నించాడు. అయితే ప్రోమీథియస్ విషయంలో పూర్తి కాండాన్ని పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా అటవీ శాఖ అనుమతితో చివరకు ఆ చెట్టును నరికారు. అయితే దాన్ని ఎందుకు నరికాల్సి వచ్చిందన్న విషయంలో వివిధ కథనాలు ఉన్నాయి. అసలు కారణం ఏమిటో పూర్తిగా స్పష్టంగా తెలియదని నేషనల్ పార్క్ సర్వీస్ చెబుతోంది.చెట్టును నరికిన తర్వాత కాండంలోని వలయాలను లెక్కించగా 4,862 రింగ్స్ కనిపించాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక రింగు ఏర్పడకపోవచ్చని భావించి, ప్రోమీథియస్ వయసును సుమారు 4,900 సంవత్సరాలుగా అంచనా వేశారు. ఆ సమయంలో ఇదే అత్యంత పురాతనమైన చెట్టుగా రికార్డ్ అయింది.ఇప్పుడు ఆ అవసరం లేదు..నేడు ఇలాంటి పురాతన చెట్ల వయసును తెలుసుకోవడానికి వాటిని పూర్తిగా నరకాల్సిన అవసరం లేదు. చెట్టు కాండంలోకి చాలా చిన్న డ్రిల్‌తో వెళ్లి చెక్క నమూనాను తీసే ‘ఇంక్రిమెంట్ బోరర్’ వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఆ నమూనాలోని రింగ్స్‌పై రీసెర్చ్ చేసి చెట్టు వయసును అంచనా వేయవచ్చు. చెట్టుకు తక్కువ నష్టం కలిగించే మరికొన్ని సాంకేతిక పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే.. ప్రోమీథియస్ నరికిన 1964తో పోలిస్తే, నేడు ఇలాంటి పురాతన చెట్లను కాపాడుకుంటూనే వాటి వయసు గురించి తెలుసుకునే అవకాశాలు పెరిగాయి. నేడు ప్రోమీథియస్ లేదు. అయితే చెట్టు నరకగా మిగిలిన కాండం, మొదలు భాగం నేటికీ అక్కడే ఉంది. వయసు తెలుసుకోవడానికి చెట్టును నరకడంపై అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ ఘటన తర్వాత పురాతన చెట్లను సంరక్షించడం, వాటిపై పరిశోధనలు నిర్వహించే విధానంపై కూడా చర్చ మొదలైంది. ప్రోమీథియస్ మాత్రం 1964లో నరికే సమయానికి తెలిసిన అత్యంత పురాతన చెట్టుగా చరిత్రలో నిలిచింది. అయితే 2012లో కాలిఫోర్నియాలో 5,065 ఏళ్ల బ్రిసిల్‌కోన్ పైన్ అనే మరో చెట్టును గుర్తించారు. ఇప్పుడు ఇదే ప్రపంచంలో ది ఓల్డెస్ట్ ట్రీ. ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె -
మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ
మైనస్ 50 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే అతి చల్లని వాతావరణంం చుట్టూ అంతులేని మంచు పర్వతాలు.. జనసంచారం చాలా తక్కువ. రష్యాలోని ఈశాన్య భాగంలో ఉన్న కోలిమా ప్రపంచంలోని అత్యంత కఠినమైన, ఏకాంత ప్రదేశాల్లో ఒకటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది అక్కడి చలి మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న విషాద చరిత్ర. సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ పాలనలో కోలిమా ప్రాంతం ఒక పెద్ద లేబర్ క్యాంప్‌గా మారింది. గులాగ్ అనే వ్యవస్థలో భాగంగా వేలాది కిలోమీటర్ల దూరం నుంచి ఖైదీలను ఇక్కడికి తరలించేవారు. బంగారం, ఇతర ఖనిజాల తవ్వకాలు, రహదారుల నిర్మాణం వంటి అత్యంత కఠినమైన పనుల్లో వారిని ఉపయోగించేవారు.తీవ్రమైన చలి, తగిన ఆహారం లేకపోవడం, వ్యాధులు, కఠినమైన వర్కింగ్ కండిషన్స్, ఇవన్నీ అక్కడి ఖైదీల జీవితాన్ని దారుణంగా మార్చేశాయి. అసలు కొలిమాకు ఎంతమందిని తరలించారు, అక్కడ ఎంత మంది మరణించారు అనే విషయంపై చరిత్రకారుల్లోనే స్పష్టత లేదు. అయితే బాధితుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. నేడు కోలిమాలో చిన్న చిన్న పట్టణాలు, గనులు, విస్తారమైన అడవులు కనిపిస్తాయి. అయితే శీతాకాలంలో తీవ్రమైన చలి, పరిమితమైన రవాణా సదుపాయం, కఠినమైన ప్రకృతి ఈ ప్రాంతాన్ని ఛాలెంజింగ్ లొకేషన్‌గా మార్చాయి. కోలిమా అనేది ఒక ట్రావెల్ డెస్టినేషన్ మాత్రమే కాదు ఒకప్పుడు వేలాది మంది ఖైదీలు అనుభవించిన బాధను గుర్తు చేసే ప్రదేశంగా చరిత్రలో నిలిచిపోతోంది. పూర్తిగా మంచుతో నిండి ఉన్న ఈ నేల సోవియట్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయానికి నేటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచిపోయింది. ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె -
ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
కొన్ని సంఘటనలు అత్యంత విచిత్రంగా అబ్బురపరిచే విధంగా ఉంటాయి. సాధారణంగా తప్పిపోయిన కొన్నేళ్లకు అనుకోని విధంగా కలిసిన ఉదంతాలను చూసుంటాం. కానీ ఇలా ఇన్నేళ్లు ఒకరినొకరు చూసుకోకుండా ఉన్న అరుదైన ఘటనను చూసి ఉండరు. మహా అయితే ఐదు, ఆరేళ్లు దూరం ఉండొచ్చు కానీ ఈ తల్లి కూతుళ్లు ఎన్నేళ్లు ఒకరికొకరు సంబంధం లేకుండా బతికారో తెలిస్తే విస్తుపోతారు. ఈ అరుదైన ఘటన దక్షిణ కన్నడలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..105 ఏళ్ల సీతమ్మకు 11 మంది సంతానం. వారిలో పెద్ద కుమార్తె సుశీల తన అమ్మను కలుసుకోలేకపోతుంది. అది ఏకంగా ఎన్నేళ్లు వరకు అంటే..దాదాపుగా 20 ఏళ్ల పైగానే తల్లిని కలవలేకపోతుంది. ప్రధాన కారణం తన తల్లి సీతమ్మ దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకా సమీపంలోని మక్కీ అనే గ్రామంలో నివశిస్తోంది. అయితే ఆమె ఇంటికి వెళ్లే ప్రదేశం అటవీ మార్గం, పైగా అటు వైపు సరైన రహదారి లేకపోవడం, అందులోనూ కొండ దిగువున ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. ఆ నేపథ్యంలోనే సుశీల తన తల్లిని చాలా ఏళ్లపాటు కలుసుకోలేకపోతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వారి దగ్గర ఒకరికి సంబంధిచి ఒకరికి పాత జ్ఞాపకాలే తప్ప రాకపోకలు లేక అమ్మను చూసుకునే భాగ్యం లేక తల్లిడిల్లిపోయింది సుశీలమ్మ. ఇక్కడ సుశీలమ్మ వయసు కూడా 85 ఏళ్ల కావడంతో వయసు రీత్యా వచ్చే సమస్యల వల్ల ఆ అమ్మ కూతుళ్ల మధ్య రాకపోకలు దశాబ్దంగా నిలిచిపోయాయి. మనవళ్ల చొరవతో.. నెరవేరిన చిరకాల కోరిక!తమ అమ్మమ్మ చిరకాల కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకున్నారు సుశీల మనవళ్లు. వారి చొరవతో సుశీల మక్కికి చేరుకునే అటవీ మార్గం గుండా జీపులో ప్రయాణించింది అయితే జీపు నేరుగా ఇంటి వరకు వెళ్లలేకపోయింది. చేసేది లేక అటవీ మార్గం గుండా సుశీలమ్మను ఓ చిన్నపిల్లను పట్టుకున్నట్లుగా పొదివి పట్టుకుని తీసుకెళ్లారు ఆమె మనవళ్లు. ఆ కష్టమైన ప్రయాణం తదనంతరం ఎట్టకేలకు తల్లిని కలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సుశీల. రెండు దశాబ్దాల తర్వాత తన తల్లి సీతమ్మను కలుసుకున్న ఆనందంతో ఉబ్బితబ్బిబైంది సులశీలమ్మ. తాము ఎన్నాళ్ల నుంచో అమ్మమ్మను తన అమ్మ దగ్గరకు తీసుకెళ్లాలని చాలాసార్లు అనుకున్నాం కానీ, ఆమెకు వయసురీత్యా ఉన్న సమస్యల వల్లే ఇన్నేళ్లూ అది వీలు కాలేదని, చివరకు ఇన్నళ్ల తర్వాత తన అమ్మమ్మ, ముత్తవ్వను కలవగలిగిందని ఆనందంగా చెబుతున్నారు సుశీలమ్మ మనవళ్లు. ఇదీ చదవండి: ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద వివాహం చేసుకున్న భారత సంతతి జంట! -
ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో..
విఘ్నాలను తొలగించే దేవుడిగా, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భారతీయులు కొలిచే గణపతి దేవునికి సరిహద్దులు లేవు. ఆసియాలోని పలు దేశాల్లో గణేశుడిని వివిధ పేర్లతో, భిన్నమైన సంప్రదాయాలతో పూజిస్తుంటారు. జపాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, నేపాల్, మలేషియా, కంబోడియాల్లో గణేశుని ఆరాధనలు కనిపిస్తాయి.జపాన్‌లో ‘కాంగిటెన్’గా గణపయ్యజపాన్లో గణేశుడిని కాంగిటెన్ (Kangiten)గా పూజిస్తారు. జపాన్ సంస్కృతిలో ఆయనను విఘ్నాలను తొలగించి ఆనందం, విజయం అందించే దేవుడిగా భావిస్తారు. ఇక్కడ గణేశుడి ఆరాధనకు బౌద్ధమతంతో సన్నిహిత సంబంధం ఉంది. భారత్‌లో గణపతికి మోదకాలు నైవేద్యంగా సమర్పించడం సాధారణం కాగా.. జపాన్‌లో ఆయనకు ముల్లంగిని సమర్పించే సంప్రదాయం ఉంది. జపాన్‌లోని మత్సుచియామా షోడెన్, హోజాంజిలలో కాంగిటెన్ ఆలయాలున్నాయి.థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్’ప్రధానంగా బౌద్ధ దేశమైన థాయ్‌లాండ్‌లో పలు హిందూ దేవతలను కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అందులో గణేశుడు కూడా ఒకరు. ఇక్కడ ఆయనను ‘ఫ్రా ఫికానెట్’ గా పిలుస్తారు. అదృష్టం, విజయం ప్రసాదించే దేవుడిగా ఆయనను భావిస్తారు. ఆనందాన్ని అందించడంతో పాటు కష్టాలను అధిగమించే శక్తిని గణేశుడు ప్రసాదిస్తాడని స్థానికుల నమ్మకం. దేశవ్యాప్తంగా గణేశుడి విగ్రహాలు, ఆలయాలు, పూజా స్థలాలు ఉన్నాయి. స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వీటిని సందర్శిస్తారు.ఇండోనేషియా.. బాలిలో ప్రత్యేక స్థానంఇండోనేషియాలో ముఖ్యంగా బాలిలో గణేశుడికి విశిష్ట స్థానం ఉంది. అదృష్టం, జ్ఞానం, కొత్త ఆరంభాలకు నెలవైన దేవుడిగా గణేశుడిని పూజిస్తారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తుశకం 7వ, 8వ శతాబ్దాల నాటికే ఇండోనేషియాలో గణేశుడు ముఖ్యమైన దేవతగా గుర్తింపు పొందాడు. అక్కడి కొన్ని హిందూ సమాజాల్లో విష్ణువు, శివుడు, సరస్వతితో పాటు గణేశుడిని కూడా ఆరాధిస్తారు. ఇండోనేషియా ప్రాచీన సంస్కృతి, కళల్లోనూ గణేశుడి ప్రాతినిధ్యం కనిపిస్తుంది.నేపాల్‌లో శుభప్రద దేవుడిగా..నేపాల్‌లో గణేశుడిని గణేశ, గణపతి, వినాయక వంటి పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా హిందూ నేవార్ సమాజంలో ఆయనను అదృష్టాన్ని ప్రసాదించే దేవుడిగా పూజిస్తారు. భారత్‌లో మాదిరిగానే అక్కడ కూడా మతపరమైన కార్యక్రమాలను ప్రారంభించే ముందు గణేశుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. నేపాల్‌లో పలు గణేశ ఆలయాలు ఉన్నాయి. రాజధాని ఖాట్మండులోని మారూ గణేశ్, భక్తపూర్‌లోని సూర్య వినాయక ఆలయాలు వాటిలో ప్రముఖమైనవిగా చెబుతుంటారుమలేషియాలోనూ వినాయక చవితిమలేషియాలో హిందువులు అధికంగా కనిపిస్తారు. అక్కడ కూడా గణేశుడిని కొత్త ఆరంభాలకు ప్రతీకగా, విఘ్నాలను తొలగించే దేవునిగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థిని కూడా నిర్వహిస్తారు. అదృష్టం కోసం పలువురు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటారు. మలేషియాలోని శ్రీ సిద్ధి వినాయగర్ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది.కంబోడియాలో శతాబ్దాల చరిత్రకంబోడియాలో గణేశుడి ఆరాధనకు శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తుశకం 5వ-6వ శతాబ్దాల నుంచే అక్కడ గణేశుడిని పూజించినట్లు చరిత్ర చెబుతోంది. శైవ హిందూ సంప్రదాయం వ్యాప్తి ద్వారా గణేశుడి ఆరాధన అక్కడికి చేరినట్లు చెబుతారు. ఖ్మేర్ సామ్రాజ్య కాలానికి చెందిన కళల్లోనూ గణేశుడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. శిల్పాలు, చెక్కడాల్లో ఆయన రూపాలు దర్శనమిస్తాయి. ప్రజలు గణేశుడిని విముక్తిని ప్రసాదించే, విఘ్నాలను తొలగించే దేవునిగా భావిస్తారు. కంబోడియాలోనూ పలు గణపతి ఆలయాలు కనిపిస్తాయి.ఇదీ చదవండి: 45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ.. -
గణపతి నవరాత్రులు ఎందుకు?
గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలాప్రాంతాల్లో ఉంది. ఇలా గణపతి నవరాత్రులు, ఉత్సవాలు జరుపుకోవడం వెనక స్వాతంత్య్ర సమర యోధులు బాలగంగాధర తిలక్ మహోన్నత ఆశయమే కారణం. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, అగ్ర, నిమ్న అనే వర్ణ భేదాలు లేకుండా హిందువులనందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేయడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ సార్వజనిక అంటే వీధి గణేశ ఉత్సవాలకు నాంది పలికారు. ఫలితంగా శాస్త్రప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు ఏకదిన వ్రత విధానం మాత్రమే ప్రధానంగా ఉన్నప్పటికీ, సమాజంలో ఐకమత్యం, జాతీయ భావం పెంపొందించడానికే ఈ నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం మొదలైంది. నాటినుంచి అది కొనసాగుతోంది, అది సంతోషకరమే. అయితే అనవసర పోటీ తత్వాలు, మితిమీరిన ఆడంబరాలు వీడి అందరూ కలసి మెలసి ఐక్యంగా ఈ పండుగను నిర్వహించుకున్నప్పుడే లోకమాన్యుడి ఆశయం నెరవేరినట్టు. – గోగులపాటి కృష్ణమోహన్, సీనియర్ పాత్రికేయులువ్యవస్థాపకులు, నా టీవీ అండ్ నా ఫౌండేషన్ -
పండగ కళ
గణేశుడి రూపానికి, కార్టూన్లకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే కార్టూనిస్టులకు అత్యంత ఇష్టమైన, సులభంగా విభిన్న రూపాల్లోకి మలచగలిగే రూపం గణపతి. ప్రముఖ కార్టూనిస్టులు సరసి, లేపాక్షి వినాయక చవితితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జ్ఞాపకాలతోపాటు జయదేవ్, రాజు వంటి ఉద్దండుల కార్టూన్లు మచ్చుకు కొన్ని... గణపతి విశేషాలు మరికొన్ని...1970ప్రాంతాలకు ముందు... ఆ తర్వాత అనుకుంటే బుక్‌స్టాల్ ముందు నుంచుంటే ఎన్నో మ్యాగజైన్లు కళ్ళముందు కళకళలాడుతూ కనపడేవి కొనండి కొనండంటూ. పండగలంటూ వచ్చాయంటే పాఠకులకు పండగే. కార్టూనిస్టులైతే నెల ముందు నుంచే బిజీ అయిపోయే వాళ్ళు. ముఖ్యంగా వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు కార్టూనిస్టులకు ఇష్టమైన పండుగలు. అందులో వినాయక చవితి ప్రత్యేకం. గణపతి మీద ఎన్నో కార్టూన్లు గీసే వాళ్ళు. ఆ రోజుల్లో బాపు, జయదేవ్, మల్లిక్, సత్యమూర్తి, కాటూరి, రాగతి పండరి లాంటి ఎంతోమంది ప్రముఖ కార్టూనిస్టులు విరివిగా కార్టూన్లు వేసే వాళ్ళు. ప్రత్యేక సంచికంటే కార్టూన్లకు ఎక్కువప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళు. ఎక్కువ కార్టూన్లు ప్రింటవుతాయన్న ఉద్దేశంతో యువ కార్టూనిస్టులతో సహా అందరు కార్టూనిస్టులు ప్రయత్నించేవాళ్లు. అప్పుడు కార్టూన్లకు మంచి పారితోషికాలు కూడా ఇచ్చేవాళ్ళు. గణపతి మీద కార్టూన్లు అంటే ఎక్కువగా ఉండ్రాళ్ళు, చవితి–చంద్రుడు, గణపతి భూలోకం రావటం, మూషికం... ఇలాంటి సబ్జెక్టుల మీద కార్టూన్ ఎక్కువగా వేసేవాళ్ళు. అప్పుడు కార్టూనిష్టులు ఎక్కువగా ఉండేవాళ్లు, చదివేవాళ్ళు కూడా ఎక్కువమంది ఉండేవాళ్ళు కాబట్టి కార్టూనిష్టులు కూడా చాలా శ్రద్ధగా కార్టూన్లు వేసేవారు. ఇప్పుడు పత్రికలు కూడా ఎక్కువ లేవు, శ్రద్ధగా వేసే కార్టూనిష్టులు కూడా తగ్గిపోయారు. ఏమైనా, ఆ రోజులు తల్చుకుంటే భలే ఆనందంగా ఉంటుంది నాలాంటి కార్టూనిస్టులకు.– లేపాక్షి, సీనియర్ కార్టూనిస్ట్నవ్వుల దేవుడువినాయక చవితి పిల్లలకే కాదు కార్టూనిస్టులకి కూడా పండగే. వినాయకుడు కార్టూనిస్టులకి దేవుడు, స్నేహితుడు, గొప్ప సబ్జెక్టు కూడా. అందుకే ఆయన కార్టూనిస్టుల కులదైవం! ఆయన నవ్వించినట్టు ఏ దేవుడూ నవ్వించలేదు మరి. ఆయన్ని చూసే కార్టూనిస్టులు ప్రపంచాన్ని నవ్వించడం నేర్చుకున్నారేమో! దిన, వార, మాస పత్రికలు విస్తారంగా వచ్చే రోజుల్లో చవితి వచ్చిందంటే చాలు కార్టూనిస్టులు చెలరేగిపోయి కార్టూన్లు వేసేవారు. పండగ ప్రత్యేక సంచికలకి ‘ఫుల్ పేజి కార్టూన్లు’ వేసి ఆరారా నవ్వులు ఆరబోసేవారు. చవితి కార్టూన్లకి అన్ని ఐడియాలు ఎలా పుడతాయి కార్టూనిస్టులకి... అనిపిస్తుంది. పుడతాయి! ఒకటీ రెండూ కాదు ఎన్నయినా పుడతాయి. అదే మరి గణేశుడి మహిమ. పిల్లలు మట్టిలో ఆడితే కోప్పడే పెద్దలు తాము కూడా మట్టిలో చేతులు పెడతారు దేవుడి బొమ్మ చెయ్యడానికి. ఇది విచిత్రం కాదూ. బొమ్మ చేశాక అది కార్టూనిస్టులు వేసే బొమ్మలాగా పొట్టిగా ఉన్నా, పొట్ట పెద్దదైనా, చేతులు పీలగా ఉన్నా, ఎగుడుదిగుడుగా ఉన్నా ఎలా వున్నా అది గణేశుడి బొమ్మే! అలా ఎందుకు చేసావని ఆ దేవుడు చిన్నబుచ్చుకోడు. నవ్వుతాడు. నవ్వుల దేవుడు కదా! ఇదే కాదు. అంత దేవుడూ కూడా తాను కూర్చుని సవారీ చేసేది చిన్న ఎలక మీద. ఇదో విచిత్రం! ఆ బొమ్మ పక్కనే చిన్న మట్టి ఎలక పిల్లని కూడా చేసి పెట్టాలి. లేకపోతే చిన్న ఎలక కాస్తా చిన్నబుచ్చుకుంటుంది. మట్టి ఉండలు చేసి ముగ్గులోనో, బియ్యం పిండిలోనో పొర్లించి వాటినే ‘ఉండ్రాళ్ళు’ అంటాం. రంగు రంగు బట్టలు కట్టి, గొడుగు నెత్తిన పెట్టి, పీటమీద కూర్చోబెడతాం. తరవాత పూజ. ఎక్కడెక్కడో పేర్లు కూడా వినని చెట్ల ఆకులతో పూజ. పిల్లా పెద్దా కుటుంబం అంతా కూర్చుని భక్తితో చేస్తాం ఆ పూజ. ఇదంతా ఓ విచిత్రం, వినోదం కాదూ. ఈ తతంగంలో ఎక్కడికక్కడ ఐడియాలు వెల్లివిరుస్తాయి కార్టూనిస్టులకి. అందుకే వినాయకచవితి కార్టూనిస్టులకి ఓ నవ్వులగని. తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత. నవ్వుకునేవాడికి నవ్వుకున్నంత!!నవ్వించేవాడి చుట్టూ నలుగురూ చేరతారు. అలా నవ్వించే దేవుడే గణేశుడు. ఆ దేవుడి చుట్టూ తిరుగుతూ ‘గణపతి బప్పా మోరియా’ అంటూ మనం ఆనందంతో గెంతులు వేసే ఈ నవ్వుల పండగ ఏడాది పొడుగునా ఉంటే ఎంత బావుంటుంది కదా! – సరసి, సీనియర్ కార్టూనిస్ట్ -
మహా గణపతిం భజే!
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్ననిర్మూలన కోసం అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు ఆ గణేశుడు.సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా వర్ణించారు. మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ ‘గణపతి’. ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడు అని కీర్తించారు.దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథునితో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం‘. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’ గణపతిని పెట్టినట్టు మన పురాణగాథ, దీనిలో అంతరార్థం ఏమిటంటే –– మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి –– అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారంవద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది. మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి – ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు.వినాయకుడికి అవతారాలున్నాయా?వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. అవి 1. వక్రతుండుడు; 2. ఏకదంతుడు; 3 మహోదరుడు; 4. లంబోదరుడు; 5. గజాననుడు; 6. వికటుడు; 7. విఘ్నరాజు; 8. ధూమ్రవర్ణుడు.వినాయకుని ఆసనంలో గల అంతరార్థంచాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ భంగిమలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి. ఒకపక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనం ప్రతీక. అంటే జీవితంలోని ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలగడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు.– డి.వి.ఆర్ -
ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద వివాహం చేసుకున్న భారత సంతతి జంట!
డెస్టినేషన్ వెడ్డింగ్‌లని, ఆకాశంలో పెళ్లి, నీటి అడుగుభాగన పెళ్లి తంతు వంటి వగైర విభిన్న పెళ్లిళ్ల గురించి విన్నాం. సమాధుల వద్ద పెళ్లి తంతు అదీకూడా భారతీయ వైవాహక పద్ధతిలో చేసుకుందో జంట. అయినా శుభకార్యం, అమంగళకరమైన ప్రదేశంలోనా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అత్యంత పర్యాటక ఆకర్షణగా పేరుగాంచిన గిజా పిరమిండ్ల వద్ద చేసుకుంది ఈ జంట. అలా అని అక్కడ వివాహం చేసుకోవడం ఏమంత ఈజీ కాదు. అక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటే.. పెళ్లి మండపం బుక్ చేసుకున్నంత ఈజీ కాదు. అందుకోసం పురావస్తు శాఖ అధికారుల తోపాటు ఈజిప్టు అధికారులను నుంచి కూడా ప్రత్యేకంగా అనుమతి తెచ్చుకోవాలి. ఈ కార్యక్రమం జరిగే రోజుల్లో సందర్శకులకు నిషేధం విధించాల్సి ఉంటుంది. అయితే ఈ జంట ఆ పర్మిషన్లన్నీ తెచ్చుకుని మరి ఆ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రాంతంలోనే గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. వాళ్లే డాక్టర్ మోనికా నాయర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వివేక్ నందా దంపతులు. పిరమిడ్ల వద్ద ఇలా ఒక వ్యక్తిగత వేడుకను నిర్వహించుకున్న ముగ్గురు జంటల్లో ఈ దంపతులు ఒకరుగా నిలిచారు.అలాగే అలాంటి చోట పెళ్లి తంతుని ఏర్పాటు చేసుకున్న తొలి భారతత సంతతి జంటగా ఈ వధువరులిద్దరూ నిలిచారు. అంతేగాదు వారి వేడుకలో ప్రతి అంశం ప్రభుత్వ పర్యవేక్షణలో సమీక్షించబడి, ఆమోదించడం జరుగుతుంది. ప్రతి సాయంత్రం సందర్శకుల కోసం మూసివేసి, ఆ తర్వాత ఈ జంట వేడుక కోసం వేదికను ఏర్పాటు చేస్తుంటారు అక్కడ అధికారులు. ఇలా మొత్తం పది రాత్రులు అక్కడే గడిపారు. వేదికలు, వంటశాలలు, లైటింగ్‌తో సహా తాత్కాలిక మౌలిక సదుపాయాలను రాత్రికి రాత్రే ఏర్పాటు చేసి, వేడుకలు ముగిసిన తర్వాత తొలగించడం చేస్తుంటారు. అలా మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహా వేడుకలో స్ఫింక్స్ (ఈజిప్ట్‌లోని గిజా పిరమిడ్ల సమీపంలో నెలకొన్న ఈ శిల్పం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది) పాదాల వద్ద ఏర్పాటు చేసిన విందు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిరమిడ్ల ప్రవేశంపై కఠినమైన నియంత్రణలు ఉన్న తరుణంలో ఈ జంట వివాహ వేడుక అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి పలు దేశాల నుంచి అతిథులు హాజరయ్యారు.పిరమిడ్ల వద్ద ఈ వేడుకలు జరగడానికి ముందే ఈ జంట కైరోలో సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుకలు జరుపుకున్నారు. అయినా మరి అక్కడ వేడుకలు ఎందుకంటే.. పిరమిడ్లకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యత, ఆ దేశంతో ఉన్న వ్యక్తిగత అనుబంధం తదితర కారణాల రీత్యా దీన్ని ఎంచుకున్నామని చెబుతున్నారు ఆ దంపతులు. కాగా నందా తన కెరీర్ తొలినాళ్లలో ఇక్కడే పనిచేశారట. ఇదీ చదవండి: గులాబీలు పండిస్తూ.. నెలకు రూ. 2.5 లక్షలు..! -
గులాబీలు పండిస్తూ.. నెలకు రూ. 2.5 లక్షలు..!
ఒక్కోసారి ఎప్పుడు సాగుచేసే పంటను సాగు చేసినా..ఊహించని విధంగా విపరీతమైన నష్టాలు చవిచూస్తుంటాం. అధిక దిగుబడి వల్ల గిట్టుబాటు ధర లేకోవడమో లేక ఇతర కారణాల వల్లే విపరీతమైన నష్టాలను చవిచూస్తుంటాం. అలాంటప్పడు సరైన నిర్ణయం తీసుకుని..కాస్త తెలివిగా వ్యవహరిస్తే..కనక వర్షం కురిసేలా లాభాలు కూడా పొందొచ్చు. అదే చేసి చూపించాడు ఈ యువ రైతు. అతడే మహారాష్ట్రకు చెందిన అర్జున్ సబాలే. అతడి కుటుంబం బంతి, చామంతి పువ్వులను సాగు చేసి, వాటి అమ్మకం కోసం ముంబై తీసుకువెళ్లేవారు. అయితే ధరలు పడిపోవడం, పోటీ పెరడగం వంటి కారణాలతో నష్టాలు రావడం మొదలైంది. తమ కుటంబ పొలం లాభదాయకంగా మార్చడానికి ఏం చేయాలో తోచేది కాదు. ఏం చేద్దాం అని సబాలే ఆలోచిస్తున్న తరుణంలో సురక్షిత వ్యవసాయం వైపుకి అడుగులు వేశాడు. సుమారు పావు ఏకరం భూమిలో ఈసారి గులాబీలు పెంచి చూడాలని అనుకున్నాడు. ఏదో చిన్న ప్రయోగంగా మొదలైన పూల పెంపకం కాస్తా ఏడాది పొడవునా ఆదాయన్ని అందించే పూల వ్యాపారంగా అభివృద్ది చెందింది. బీఏస్సీ అగ్రీకల్చర్ చదువుతున్నప్పుడే..వివిధ పంటలను అధ్యయనం చేయడానికి పొలాలను సందర్శించడం ప్రారంభించాడు. అక్కడ పాలీహౌస్ సాగును చూసి రక్షిత పూల సాగువైపుకి అడుగుపెట్టాడు. ఆ సమయంలోనే గులాబీల సాగుని క్షుణ్ణంగా గమనించాడు సబాలే. అలా బెంగుళూరుకి చెందిన ఒక రైతు నుంచి గులాబీ కాండాలను ఒక్కొక్కటి రూ. 12ల చొప్పున కావల్సినన్ని మొక్కలు కొని పావు ఎకరం భూమిలో నాటాడు. అందుకోసం సుమారు రూ. 8000లు వరకు పెట్టుబడి పెట్టాడు. జస్ట్ పదివేల చదరుపు అడుగుల భూమిలో గులాబీలు ప్రారంభించి, క్రమంగా విస్తరించాడు. ఆ తోటలో సుమారు 500 గులాబీలు పైనే పూసేవి, వాటిని ఒక్కోక్కటి కనీసం రూ. 5లకు చొప్పున అమ్మిన రోజుకు దాదాపు రూ. 25000/- దాక సంపాదించేవాడు. ఈ రాబడితో అతడు తోటను విస్తరించడమే గాక జెర్బెరా వంటి డెకరేటెడ్ పూల మొక్కలను కూడా పెంచడం ప్రారంభించాడు. అలా పావు ఎకరం నుంచి ఎకరం భూమిలో ఒక్కో రకం 16,000 మొక్కలతో గులాబీలు, జెర్బెరాలను పండించడం ప్రారంభించాడు. అలా సబాలే తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరోజూ సుమారు వెయ్యి గులాబీలు, రెండు వేల జెర్బారాలు పూస్తున్నాయి. ఒక్కో గులాబీకి రూ. 5లు, ఒక్కో జెర్బెరా కాడకు రూ. 4 లు చొప్పున రోజుకు రూ. 5వేల నుంచి రూ. 8 వేల దాక ఆదాయం వస్తోంది. అంటే నెల వచ్చేటప్పటికీ రూ. 3.5 లక్షల టర్నోవర్‌ని ఆర్జిస్తున్నాడు. అంటే నికర లాభం రూ. 2.5 లక్షలు ఉంటుంది. సబాలే గులాబీలు, జెర్బెరాలను సహజసిద్ధమైన వెంటిలేషన్ ఉన్న పాలీహౌస్లో పెంచుతాడు. గాలి ప్రసరణ కోసం పవర్డ్ కూలింగ్ ఫ్యాన్లకు బదులుగా రూఫ్ వెంట్లు, సైడ్ కర్టెన్లను ఉపయోగిస్తారు. ఆయన పావు ఎకరంలో ప్రారంభించినప్పుడు వీటన్నింటిని ఏర్పాటు చేయడానికి దాదాపు రూ. 3 లక్షలు దాక ఖర్చయింది. అయితే ఈ మొక్కలు ఐదు నుంచి ఏడేండ్ల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటాయి కాబట్టి పెట్టుబడిని చాలా ఏళ్లు పాటు విస్తరించుకోవచ్చు అని అంటున్నాడు సబాలే. అలాగే తన పువ్వులను నేరుగా స్టాల్స్, హోల్‌సెల్ మార్కెట్లకు అమ్ముతుంటాడు. అయితే డిమాండ్‌ని బట్టి పువ్వులను బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబైలకు సరఫరా చేస్తుంటానని చెబుతున్నాడు సబాలే.ఇదీ చదవండి: అది మన డీఎన్ఏలోనే ఉంది ..! మాధవన్ కుమారుడు వేదాంత్ -
అది మన డీఎన్ఏలోనే ఉంది ..! మాధవన్ కుమారుడు వేదాంత్
కోలీవుడ్ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. అతను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఐచి ప్రిఫెక్చర్, జపాన్‌లోని నగోయాలో జరగనున్న ఖండాంతర బహుళ క్రీడా పోటీల కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈనేపథ్యంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో తను ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి, మన భారతీయ అథ్లెట్లకు ప్రతిభ ఎలా ఉంటుంది తదితరాల గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. మన భారతీయుల్లో చాలా ప్రతిభ ఉందని చెబుతున్నాడు. నిజం చెప్పాలంటే జన్యపరంగా మనం చాలా అదృష్టవంతులమని అంటున్నాడు. మన ఆహారపు అలవాట్లను, క్రమశిక్షణను, ప్రేరణను సరిదిద్దుకోగలిగినట్లయితే మనం నిజంగా మంచి క్రీడాకారులుగా రాణించగలమని అన్నాడు. అయితే మనల్ని వెనక్కి లాగేస్తున్న అంశం మన ఆహారపు అలవాట్లేనని చెబుతున్నాడు. భారతీయ శరీరాలకు ఎక్కువ కొవ్వుని నిల్వ చేసుకోగల సామర్థ్యం ఉందని తెలిపాడు. అందువల్లే మనవి సన్నగా ఉండి కొవ్వు ఎక్కువగా ఉండే శరీర రకంగా అభివర్ణించాడు. వేల ఏళ్ల క్రితం వేట జీవనశైలి నుంచి పరిణామ క్రమం చెందుతూ వచ్చిందన్నారు. ఫలితంగా మనశరీరాలు చెప్పుకోదగిన కండ ద్రవ్యరాశిని నిర్మించకుండా అంతర్గత అవయవాల చుట్టూ ఉండే కొవ్వుని నిల్వగా ఉంచుకోవడం నేర్చుకున్నాయని చెప్పారు. ఈ తత్వమే మన ప్రజలను తీవ్ర కరువుని తట్టుకుని బయటపడటానికి సహాయపడిందని చెబుతున్నాడు. కాబట్టి మనం మరింత ప్రోటీన్ తీసుకోవడం మొదలుపెట్టి మన ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ వహిస్తే..మన జన్యవుల నుంచి ఇంకా ఎంతో సాధించగలమని సూచిస్తున్నాడు. రాబోయే ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న తరుణంలో తాను ఒక డైటీషియన్తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపాడు. అది తన ఫామ్ వేగాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడిందని చెబుతున్నాడు ఈ స్విమ్మర్. అలాగే తాను గత కొన్ని నెలలుగా వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంత్ కండిషనింగ్‌పై దృష్టి పెట్టిమరి శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆసియా క్రీడల్లో అతడు 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈత కొట్టబోతున్నట్లు తెలిపాడు. అయితే ఇది అంత సులభం కాదని తెలుసని, అందుకే తన సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటున్నట్లు తెలిపారు. కోట్లాదిమంది కళ్లు ఒక ఆటగాడిపైనే ఉంటాయి, అందువల్ల ప్రపంచ స్థాయిలో పోటీపడటానికి సిద్ధమవుతున్నప్పుడు శక్తిమంతమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలని అంటున్నాడు. తాను గెలవగలననే గట్టి నమ్మకం అతడికి ఉండాలంటున్నాడు. అలాగే మన లక్ష్యం ఎల్లప్పుడూ నక్షత్రాలపై ఉంటేనే చంద్రుడిపై దిగగలమంటూ తన సంభాషణను ముగించాడు వేదాంత్.ఇదీ చదవండి: చిన్నారులు జంక్ ఫుడ్ తినకుండా..ఆ టీచర్ ట్రిక్ మాములుగా లేదు! -
చిన్నారులు జంక్ ఫుడ్ తినకుండా..ఆ టీచర్ ట్రిక్ మాములుగా లేదు!
ఈ జనరేషన్ చిన్నారులు మాములుగా లేరు. జట్ స్పీడ్‌గా అర్థం చేసుకుంటున్నారు. చిన్నప్పుడే స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లనే చకచక వాడేస్తున్న జెన్‌జీ ఇది. అయితే అందుకు తగ్గట్టుగానే ఈకాలంలో మార్కెట్లోకి వస్తున్న ప్రతి జంక్‌ఫుడ్‌కి ఆకర్షితులై ఎంతలా లాగిస్తున్నారో తెలిసిందే. వద్దు నాన్న అవి మంచివి కావు అంటే..ఇక వాళ్లు పెట్టే అల్లరి మాములుగా ఉండదు. ఇక తట్టుకోలేక తల్లిదండ్రలు కొనిచ్చేస్తున్నారు. ఏదో అప్పడప్పుడే అంటూ ఇస్తుంటారు. అయితే అసలు అలాంటి అనారోగ్యకరమైన జంక్‌ఫుడ్‌కి వాళ్లే స్వయంగా నో చెప్పేలా చేస్తోంది ఈ టీచర్. ఆ ఉపాధ్యాయురాలు చేసిన పనికి ఆ స్కూల్ విద్యార్థులు వద్దంటూ ఏడుపు లంఖించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడమే కాదు, జంక్ ఫుడ్ తికుండా ఉండేలా చేసేందుకు ఇంతల భయపెట్టడం సమంజసమేనా అనే ప్రశ్నలు లేవనెత్తినా..చాలామంది ఆ టీచర్ ట్రిక్కే మద్దతు పలకడం విశేషం.ఇంతకీ ఆమె ఏం చేసిదంటే..జంక్ ఫుడ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లలకు తెలియజేసేలా ముందుగా వాళ్లకు కొద్దిగా కూల్‌డ్రింక్‌ల, బిస్కెట్లు ఇస్తుంది. ఆ తర్వాత వాళ్లలో ఒకళ్లను పడుకోబెట్టి అవి తిన్నాక లోపల ఏం జరుగుతోందో తెలియజేలా నకిలీ అల్ట్రాసౌండ్ స్కాన్‌ని చూపిస్తుంది. వాటిని చూసి పిల్లలు భయపడటమే కాదు, తినమని అనడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. ముఖ్యంగా వాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోగ్యకరమై ఆహారం గురించి తరగతి గదిలో వివరించిన ఆ పాఠం వాళ్లు జంక్‌ఫుడ్ ఎంత అనారోగ్యకరమైనదో వివరించేలా క్లియర్‌గా చూపించారామె. ఇది పిల్లల్లో భయం రేకెత్తించిన చెడు ఆహారపు అలవాట్లకు బానికాకుండా చేసే బెస్ట్ ట్రిక్ అనే చెప్పొచ్చు. అయితే ఈ భయం వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎలాంటి పర్యవసనాలు దారితీస్తుంది అని మానసిక నిపుణులు హెచ్చరించినా..నయానో, భయానో అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండేలా చేయడంలో ఎలాంటి తప్పు లేదని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.The intention may be good, but the method matters.A viral school clip shows a teacher using props and a fake ultrasound to scare children away from junk food.Teaching kids healthy eating is important. But fear, misinformation and shock tactics at such a tender age can leave a… pic.twitter.com/SgNgqRBgKj— Neetu Khandelwal (@T_Investor_) September 11, 2026 ఇదీ చదవండి: వారానికి 60 గంటలు పనిచేస్తూ..నెలకు రూ. 63 లక్షలు! -
7 ‘అడుగుల’తో దాంపత్య బలం
విడివిడిగా వ్యాయామం చేసే యువ దంపతులతో పోలిస్తే కలిసి వ్యాయామం చేసే దంపతుల్లో దాంపత్య బంధం బలోపేతం అవుతోందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దంపతులు మాట్లాడుకొనే తీరు, వారి మధ్య తలెత్తే గొడవలు, వాటిని పరిష్కరించుకునే విధానంపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. పరిశోధకులు పరిశీలించిన దంపతుల్లో దాదాపు 60 శాతం మంది తాము క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నామని చెప్పగా... వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే కలిసి వ్యాయామం చేస్తున్నారని తేలింది. కలిసి వ్యాయామం చేసే దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో దంపతులు కలిసి చేసిన వ్యాయామాల్లో నడక అన్నింటికంటే ఎక్కువగా కనిపించింది. దంపతులు కలిసి చురుగ్గా ఉండేందుకు నడక వ్యాయామం చాలా సులువైన, ఉపయుక్తమైన ఎక్సర్సైజ్ అని... ఇలా కలసి నడవడం వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని వెల్లడైంది. ఈ క్రమంలో దంపతులు తమ జీవిత భాగస్వామి తమ మాటలను ఎక్కువగా వింటున్నారని, తమకు అండగా నిలుస్తున్నారన్న భావన కలుగుతోందనీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఫ్యామిలీ రిలేషన్స్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. స్ట్రెంత్ ట్రైనింగ్‌తో అతివల గుండె పదిలంవారంలో కనీసం 2 గంటలపాటు బరువులు ఎత్తడం, తాళ్లను లాగడం వంటి స్ట్రెంత్ ట్రైనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజులతో మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ వ్యాయామాలన్నీ గుండెపోటు వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించగలవని ఈ పరిశోధనలో తేలింది. æఎలాంటి వ్యాయామాలు చేయని మహిళలతో పోలిస్తే వారానికి కనీసం రెండు గంటలపాటు స్ట్రెంతెనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు చేసే మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు 20 శాతం తక్కువగా, గుండెపోటు ముప్పు 44 శాతం తక్కువగా కనిపించిందని పరిశోధకులు గుర్తించారు. అలాగే రెండు గంటలకు మించి వ్యాయామాలు చేసే మహిళల్లో ప్రతి అదనపు గంట వ్యాయామం వల్ల గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు మరో 5 శాతం, గుండెపోటు ముప్పు 14 శాతం మేర తగ్గుతోందని కనుగొన్నారు. అయితే రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు మాత్రమే చేసే వారిలో పక్షవాతం వచ్చే ముప్పు తగ్గినట్లు కనిపించలేదు. రెసిస్టెన్స్ ఎక్సర్సైజులతోపాటు ఏరోబిక్ వ్యాయామాలు కూడా కలిపి చేస్తే మాత్రం మరింత ప్రయోజనం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలను జర్నల్ ఆఫ్ ద అమెరిన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనే జర్నల్ ప్రచురించింది. 6 సూత్రాలతో మానసిక ఆరోగ్యం మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరు అంశాలు ఎంతో కీలకమని ఓ అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి మానసిక ఆరోగ్యానికి 19 ప్రధాన అంశాలను పరిశోధణనాలు గుర్తించగా వాటిలో ఆరు అంశాలకు 90 శాతానికిపైగా నిపుణుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. నేచర్ మెంటల్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 26 దేశాలకు చెందిన 11 విభాగాల్లోని 122 మంది ప్రముఖ నిపుణులతో సర్వేలు నిర్వహించారు. అయితే ఆదాయం, శారీరక ఆరోగ్యం వంటి అంశాలు కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చని అధ్యయనంలో వెల్లడైంది. 1 జీవితానికి అర్థం–పరమార్థం, లక్ష్యం ఉండటం: మన జీవితం విలువైనది. దానికో అర్థం, పరమార్థం ఉన్నాయి. మనం ఏదో ఒక లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్నామనే భావన ఉండటం అవసరం. 2 జీవితంపై సంతృప్తి: జీవితాన్ని మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక రకమైన సంతప్త భావన కలిగి ఉండటం ముఖ్యం. 3 స్వీయ అంగీకారం: తనలోని మంచిని, లోపాలను అర్థం చేసుకొని, తనను తాను తప్పుబట్టుకోకుండా సానుకూలంగా చూసుకోవడం. 4 ఇతరులతో సత్సంబంధాలు: మనకు బాగా దగ్గరి వారితో శ్రద్ధ, ప్రేమ, సహకారం, పరస్పర అవగాహనతో కూడిన అర్థవంతమైన సానుకూల సంబంధాలను కొనసాగించడం.5 స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం: జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకొనే స్వేచ్ఛ ఉండటం, తన భావాలను నిజాయితీగా వ్యక్తపరచగలగడం.6 ఆనందం: రోజువారీ జీవితంలో సానుకూల భావోద్వేగాలను సంతోషంగా, ఆనందంగా, హాయిగా అనుభవించడం. -
ఈ కాలానికి తగ్గ దేవుడు
మొన్న ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర రోడ్డు పక్కన రెండు మూడు కిలోమీటర్ల పొడుగునా గణేష్ విగ్రహాలు కనిపించాయి. గణపతుల గణాలు భూమ్మీదకి దిగినట్టుగా ఉంది. అలా ఆ విగ్రహాల్ని చూస్తూ ముందుకుపోతుండగా అక్కడొకచోట ఒకాయన కనిపించాడు. ‘ఇదేమిటి! ఇక్కడ ఈ గ్రీకు పెద్దమనిషి కనిపిస్తున్నాడు’ అని కళ్ళు నులుముకుని చూసాను. సందేహం లేదు.. అతనే... పుస్తకాల్లో చూసిన ముఖమే. ఎపిక్టెటస్! ‘మనల్ని బాధపెట్టేది జరిగే సంఘటనలు కాదు, ఆ సంఘటనల గురించి మనం ఏమనుకుంటున్నామో అది’ అని చెప్పిన గొప్ప తత్త్వవేత్త. ఒకప్పుడు బానిసగా బతికిన రోజుల్లో, అతడి యజమాని ఒకసారి అతడి మీద కోపంతో అతడి కాలు విరిచేసాడు. అందుకని ఇప్పుడు ఆ కాలున్నవైపు కొద్దిగా వాలి ఉన్నాడు. కానీ మార్కస్ అరీలియస్ లాంటి చక్రవర్తికే దారి చూపించిన వాడు. ‘మీరేమిటిక్కడ?’ అనడిగి, ‘నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది. లేకపోతే ఒకటో శతాబ్దపు రోమ్ ఎక్కడ? ఈ పాత బోయిన్పల్లి ఎక్కడ?’ అన్నాను. ‘నువ్వేకదా నన్ను తలుచుకుంటూ ఉన్నది’ అన్నాడు ఎపిక్టెటస్ నా వైపు చూపు తిప్పకుండానే. ఆయన ఆ గణేష్ మూర్తుల్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు. అప్పుడు తట్టింది, అప్పటికి రెండు మూడు రోజులుగా నేను ఆయన పుస్తకాలే చదువుతున్నానని. ‘అంటే మీరు ఎవరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతారా?’ అనడిగాను.‘అవును. నిన్ననే, పుణేలో ఎవరో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద పాఠాలు చెప్తూ నా మాటలు పదే పదే చెప్తూ ఉంటే అక్కడికి పోక తప్పింది కాదు’ అని అంటూ ‘ఈయనేమిటి? ఇలా ఉన్నాడు... ఏథెన్సులోనూ, రోములోనూ నేనిలాంటి శిల్పాలు ఎప్పుడూ చూడలేదు’ అని అన్నాడు ఆశ్చర్యపోతూ. ‘ఈయన వినాయకుడు, విఘ్నాధిపతి. మావాళ్ళు చెప్పేదేమంటే ఆయన మొదట్లో రైతుల దేవుడని, ప్రకృతి దేవుడని, పర్యావరణానికి దేవుడని. ఆ చెవులు చేటలు, ఆ బొజ్జ సుభిక్షానికి గుర్తు, ఆ ఎలుక రైతుల విరోధి కదా, అందుకని లొంగదీసుకున్నాడంటారు..’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎపిక్టెటస్ నా వైపు తిరిగి నన్ను పరిశీలనగా చూసాడు.‘కాదు కాదు... నువ్వు ఆ అవయవాల్ని వర్ణిస్తున్నావు. అవి అలా ఎందుకున్నాయో వివరిస్తున్నావు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. నిన్న ట్రయినింగ్ క్లాసులో అంతా పిల్లలు... వాళ్ళ మాటలే ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అందులో ఒకమ్మాయి ఆ ఫాకల్టీని అడుగుతోంది... నన్నంతా లావుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటున్నారు, డైటింగ్ చెయ్యాలంటారు, యోగా చెయ్యాలంటారు... నాకు చాలా ఆందోళనగా ఉంది. నేనేం చెయ్యాలో చెప్పండి అని. కానీ, చూడు మిత్రమా.. బాడీ షేమింగ్‌ని పూర్తిగా జయించినవాడు ఇలా ఉంటాడు. ఎంత అన్ అ΄లొజిటిక్గా ఉన్నాడు. అచ్చం మా సోక్రటీసులాగా ఉన్నాడు. లోకం పెట్టుకునే ఏ కొలతలకీ లొంగిపోకుండా తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉన్నాడు. తను తనుగా. అలా ఉండాలంటే ముందు కావలసింది అటువంటి ఆత్మనిశ్చయత, అటువంటి ఆత్మనిర్భరత. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది. అవునూ, ఆ దంతమెందుకు విరిగిపోయింది?’ అనడిగాడు.‘అదా.. వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే ఈయన రాయడానికి కూర్చున్నాడు. మధ్యలో గంటం విరిగి΄ోయింది. కాని రాత ఆపకూడదని నియమం. అందుకని తన దంతం తనే విరుచుకుని దాంతో రాయడం మొదలుపెట్టాడంటారు’ అన్నాను. ‘ఆహా! ఆ వ్యక్తిత్వం నేనూహించినట్టే ఉంది. అలాంటి వాళ్ళు ఒక పనికి పూనుకున్నారనుకో. వెనక్కి తగ్గరు. దేనికైనా సిద్ధపడతారు. తమ ఆత్మలోంచి కొంత ధారపోసి అయినా సరే ముందుకు నడుస్తారు. మనకి చూడటానికి వాళ్ళు గాయపడ్డారనిపిస్తుంది. కాని గాయాన్ని గేయంగా మార్చుకుంటారు. అందం కాదు, ఆర్భాటం కాదు, పదిమందీ ఏమనుకుంటారన్న ఆత్రుత కాదు, అన్నిటికన్నా ముందు తాము ఒప్పుకున్న పని ఆగిపోకుండా ముందుకు నడిచిందా లేదా. అంతే. అదే వాళ్ళకి నిజమైన అలంకారం’ అని అన్నాడు వెలుగు చిమ్ముతున్న చూపుల్తో. ‘అలా అయితే ఆ ఎలక సంగతేమిటి?’ అనడిగాను. ‘ఇందాకా నువ్వు ఈయన్ని రైతుల దేవుడని చెప్పావు. ఒక్క రైతులకే ఎందుకు? ఈయన మనుషులందరికీ దేవుడని ఆ ఒక్క ఎలకని బట్టి చెప్పొచ్చు. ఎలక చూడు. ఎంత రెస్ట్‌లెస్‌గా ఉంటుంది! నిలకడ లేని జీవి. ఊరికే పరుగెట్టుకుంటూపోతుంది. కాని ఆయన దాన్ని వాహనంగా మార్చుకున్నాడు. అంత పెద్ద శరీరం, అంత చిన్న వాహనం. ఎవరేనా తమ యాంగ్జయిటీని అదుపు చేసుకోగలిగితే అలానే ఉంటుంది, చిన్న ఎలక మీద ఏనుగు వూరేగినట్టు. అద్భుతం కదా’ అని అన్నాడు.‘మరి ఆ చెవుల సంగతేమిటి?’ అనడిగాను. ఈలోపు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది. ఒకటే హారన్లు. ఎపిక్టెటస్ ఆ ట్రాఫిక్ కేసి చూసాడు. ‘ఇప్పుడు కాదులే, మరోసారి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటి కాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్. అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను. కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ స్క్రిప్టు నువ్వే రాసుకో. అవసరమైతే నీలో ఒక భాగాన్ని తుంచెయ్యవలసి వస్తే తుంచెయ్యి. ఒక్క భాగమేమిటి? నీకు అప్పగించిన పనికి అవసరమైతే నిన్ను నువ్వే మూల్యంగా చెల్లించుకోడానికి సిద్ధపడు. గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి. నిన్ను నువ్వు జయించుకున్నావా! నీకు తిరుగులేదు’ అని అంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ జన సందోహంలో కలిసి΄ోయాడు, ఆ మహాతత్త్వవేత్త ఎపిక్టెటస్.వాడ్రేవు చిన వీరభద్రుడు చదవండి: ఘనమైన ఆసనం -
ఘనమైన ఆసనం
గణేష్ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతోపాటు ఆసనం, బ్యాక్‌గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే, ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్ ప్లానర్స్ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్ వర్క్ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్‌ను స్టోర్ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్లు, అపార్ట్మెంట్లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్ లేదా కాపర్ ఫినిష్‌తో ఉండే ఆర్టిఫిషియల్ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్ హోమ్ డెకార్‌ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్ లుక్ తీసుకొస్తుంది.సులభంగా అలంకరణ కృష్ణాష్టమి, గణేష్ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్ క్లాత్‌తోపాటు ఖరీదైన స్టోన్స్ కూడా ఉపయోగించి డిజైన్ చేస్తున్నాం. – లక్ష్మి సింగ్లా, డెకార్ క్రియేషన్స్ – నిర్మలారెడ్డిచదవండి: చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య! -
చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య!
వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా గణేశుడి ఉత్సవాల సందడి నెలకొంది. అయితే రాజస్థాన్‌లోని ఓ పురాతన గణేశ ఆలయం తన ప్రత్యేక సంప్రదాయంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా దేవుడికి మొక్కులు, పూజలు, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కానీ ఇక్కడ భక్తులు తమ కోరికలు, సమస్యలు, శుభవార్తలను లేఖల రూపంలో స్వయంగా గణేశుడికి పంపిస్తారు. రోజుకు వెయ్యికి పైగా లేఖలు ఈ ఆలయానికి చేరుతుండటంతో దీనికి దేశవ్యాప్తంగా ‘లెటర్-వాలా గణేశ్ టెంపుల్’ అనే పేరు వచ్చింది.రోజూ వెయ్యికి పైగా లేఖలురాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రణతంబోర్ కోటలో త్రినేత్ర గణేశ్ ఆలయం ఉంది. డిజిటల్ యుగంలో ప్రముఖ ఆలయాలు ఆన్లైన్లో పూజలు, ప్రసాద సేవలు అందిస్తున్నప్పటికీ.. ఈ ఆలయం మాత్రం చేతిరాత లేఖల సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ప్రతిరోజూ 1,000కు పైగా లేఖలు, పోస్టుకార్డులు, ఆహ్వాన పత్రాలు ఆలయానికి వస్తుంటాయి. వాటిలో సమస్యలను వివరిస్తూ రాసిన లేఖలు, వివాహ ఆహ్వానాలు, శిశువు జననం, కొత్త వ్యాపారం ప్రారంభం, కొత్త ఇల్లు కొనుగోలు వంటి శుభ సందర్భాల సమాచారంతో కూడిన లేఖలు ఉంటాయి. కొందరు భక్తులు తమ వ్యక్తిగత సమస్యలను వివరిస్తూ దేవుని సహాయం కోరుతూ లేఖలు పంపుతారు.కోరికలు.. కష్టాలు.. కృతజ్ఞతలుత్రినేత్ర గణేశ్ ఆలయంలో ఈ ప్రత్యేక సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. భక్తులు తమ కోరికలు, సమస్యలు, కృతజ్ఞతలను వివరంగా లేఖల్లో రాస్తారు. ఆ లేఖలను ఆలయానికి చేరుకున్న తర్వాత సేకరించి గణేశుడి ముందు ఉంచుతారు. పూజా సమయంలో పూజారులు భక్తుల ప్రార్థనలను విగ్రహం ముందు చదివి వినిపిస్తారని కూడా చెబుతారు. ముఖ్యంగా కుటుంబాల్లో వివాహం నిశ్చయమైనప్పుడు మొదటి వివాహ ఆహ్వాన పత్రికను త్రినేత్ర గణేశుడికి పంపడం శుభప్రదమైన ఆచారంగా భావిస్తారు.1300లో ఆలయ నిర్మాణంత్రినేత్ర గణేశ్ ఆలయం సుమారు క్రీస్తుశకం 1300 ప్రాంతంలో రాజు హమ్మీర్ దేవ్ పాలనలో నిర్మించినట్లు చెబుతారు. రణతంబోర్ కోటపై అలావుద్దీన్ ఖిల్జీ సుదీర్ఘకాలం ముట్టడి కొనసాగించిన సమయంలో హమ్మీర్ రాజుకు గణేశుడు కలలో కనిపించాడని స్థలపురాణం చెబుతోంది. మరుసటి రోజు కోట గోడపై మూడు కళ్లతో ఉన్న గణేశుడి రూపాన్ని రాజు చూశాడని, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారని కథనం. గణేశుడికి మూడు కళ్లుండటంతోనే ఆయనను ‘త్రినేత్ర గణేశ్’గా పిలుస్తారు.కుటుంబ సమేతంగా గణేశుడి దర్శనంఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. గణేశుడిని ఆయన కుటుంబ సమేతంగా పూజించే అరుదైన ఆలయాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడ గణేశుడితో పాటు ఆయన భార్యలు రిద్ధి, సిద్ధి, కుమారులు శుభ్, లాభ్ కూడా పూజలందుకుంటారు. అందువల్ల భక్తులకు ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన క్షేత్రంగా నిలిచింది.ప్రపంచం నలుమూలల నుంచి లేఖలు పంపొచ్చుభక్తులు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా తమ లేఖలను ఆలయానికి పంపవచ్చు. ఇందుకోసం Shree Trinetra Ganesh Ji Temple, Ranthambore Fort, Sawai Madhopur, Rajasthan – 322001 చిరునామాకు పోస్టు చేయవచ్చు. వివాహ ఆహ్వాన పత్రికలు లేదా కుటుంబంలోని ఇతర శుభకార్యాలకు సంబంధించిన పత్రాలను కూడా భక్తులు పంపుతుంటారు. ఆలయానికి చేరుకున్న తర్వాత వాటిని పూజారి గణేశుడి ముందు సమర్పిస్తారు.దర్శన వేళలు.. ఎలా చేరుకోవాలి?త్రినేత్ర గణేశ్ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ సవాయ్ మాధోపూర్ జంక్షన్. ఆలయం నుంచి ఇది సుమారు 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయానికి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ట్యాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఆలయంలో సాధారణంగా ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. రోజులో ప్రాతఃకాల ఆరతి, శృంగార ఆరతి, భోగ్ ఆరతి, సాయంసంధ్య ఆరతి, శయన ఆరతి వంటి పలు ఆరతులు జరుగుతాయి. గణేశుడికి బుధవారం ప్రత్యేకమైన రోజుగా భావించడంతో ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదీ చదవండి: నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం -
అష్టగణపతుల ఆలవాలం... శ్రీముఖలింగం
శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రంలో మరో అరుదైన విశేషం ఉంది. ఇక్కడ అష్టగణపతులు కొలువై ఉండి, భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వస్తుంటారు. 1. శక్తి గణపతిదీర్ఘకాలిక బాధలు, వ్యాధులు శక్తిగణపతిని పూజిస్తే నయమైపోతాయని భక్తుల నమ్మకం. తూర్పువైపున ఉన్న ఈ ఆలయంలో శక్తిగణపతి పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు. 2. చింతామణి గణపతిజీవితంలోని ఈతిబాధలు, మానసిక చింతలు, దుఃఖాలను పోగొట్టే స్వామిగా ఇక్కడి చింతామణి గణపతి పూజలు అందుకుంటున్నాడు. దక్షిణం వైపు ఉన్న ఈ ఆలయంలో చింతామణి గణపతి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు.3,4. ఢుంఢి గణపతులుపంచాయతన క్షేత్రానికి సంబంధించి ఢుంఢి గణపతుల విగ్రహాలు కాశిలో రెండు, అలాగే శ్రీముఖలింగంలో రెండు ఒకే చోట ఉంటాయి. ఈ ఢుంఢి గణపతులను దర్శనం చేసుకుంటే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఢుంఢి గణపతులు ఉత్తరాభిముఖంగా దక్షిణ దిశలో కొలువు దీరి ఉంటారు.5. సాక్షి గణపతి:భక్తులు ఆలయానికి వచ్చిన తరువాత ముందుగా ఈ స్వామిని దర్శనం చేసుకుంటే ఈయన తన తండ్రి అయిన పరమేశ్వరునికి భక్తుల రాక గురించి సాక్ష్యం చెబుతారట! ‘ఈ భక్తులు నా అనుమతి తీసుకున్నారు. తండ్రీ, వీరికి నీ దర్శన దర్శనభాగ్యం కల్పించ’ని కోరుతాడట! ఈ ఆలయంలో సాక్షి గణపతి ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు.6. నాట్యగణపతినాట్యం సహా లలితకళలు నేర్చుకునేవారు ముందుగా ఇక్కడి నాట్యగణపతిని దర్శనం చేసుకుంటే సకలు కళలలో త్వరితిగతిని ప్రావీణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. పశ్చిమ దిశలో తూర్పు అభిముఖంగా నాట్యగణపతి భక్తులకు దర్శనమిస్తాడు. 7. కార్యసిద్ధి గణపతిమనసులో తలచిన కార్యాలను ఇక్కడి కార్యసిద్ధి గణపతికి నివేదించుకుంటే చాలు, అవి నిర్విఘ్నంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ స్వామి ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు.8. వరసిద్ధి గణపతిభక్తులకు కోరిన వరాలను అనుగ్రహించే స్వామిగా ఇక్కడి వరసిద్ధి గణపతిని భక్తులు పూజిస్తారు. ఈ ఆలయంలో వారాహి అమ్మవారి ముందు ఎడమవైపుగా దక్షిణాభిముఖంగా వరసిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు. - సుంకరి శాంత భాస్కరరావుజలుమూరు, శ్రీకాకుళం జిల్లా -
గాడ్జెట్ల గల్లీలో బప్పా ఎంట్రీ!
ఇంటికి గణపయ్య వచ్చారంటే పండగ కళ రావాల్సిందే! ఇప్పుడు ఆ కళను కాస్త స్మార్ట్‌గా పెంచే చిట్టి గాడ్జెట్లు ఇవిగో... దరలో చిన్నవి, పండుగ పనిలో మాత్రం పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి.బప్పా మండపంలో బీట్ అదిరిపోవాల్సిందే! పిల్లల వినాయక మండపం అంటే పూజలతో పాటు ఆటలు, పాటలు, సందడి కూడా ఉండాల్సిందే! మరి ఆ చిన్నారుల సందడికి పెద్ద సౌండ్ సిస్టమ్ ఎందుకు? తక్కువ ఖర్చులో ఈ చిన్న బ్లూటూత్ స్పీకర్ చాలు! 10 వాట్ల సౌండ్‌తో భక్తి పాటలు, గణేశ్ పాటలు, పిల్లల ఫేవరెట్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. మ్యూజిక్కు తగ్గట్టు రంగురంగుల డిస్కో లైట్లు మెరుస్తూ ఉంటే... చిన్న మండపమే మినీ డ్యాన్స్ ఫ్లోర్లా మారిపోతుంది! ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. చిన్న సైజులో ఉండటంతో పిల్లలు నిర్వహించే చిన్న వినాయక మండపాలకు ఇది బాగా సరిపోతుంది. పైగా పెద్ద స్పీకర్లు, ఖరీదైన సౌండ్ సిస్టమ్‌లకు అయ్యే ఖర్చు కూడా ఉండదు. ధర కేవలం రూ.500 మాత్రమే!గణపయ్యకు... మేకప్ రెడీ!గణపయ్యను తీసుకొచ్చాక... ఆయన మండపం అలంకరణే అతిపెద్ద టాస్క్! పూలు, లైట్లు, అలంకరణ సామాన్లు అంటూ మార్కెట్ చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా... గణపయ్య వెనుక ఈ మండపం పెట్టేస్తే పూజా స్థలానికే ఓ పండగ లుక్ వచ్చేస్తుంది. కాగితంతో తయారైన ఈ పర్యావరణహిత అలంకరణను 9 నుంచి 16 అంగుళాల విగ్రహాలకు సరిపడేలా రూపొందించారు. కొద్ది నిమిషాల్లోనే కుటుంబంతో కలిసి దీన్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి... పిల్లలకు ఫన్, పెద్దలకు డెకరేషన్ బాధ్యత రెండూ ఒకేసారి! వాడిన తర్వాత మడిచి దాచుకోవచ్చు, పైగా వినాయక చవితి తర్వాతి పండుగల్లో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ధర సుమారు రూ. 800.మంత్రాల మినీ మాస్టర్!గణపయ్యపై విపరీతమైన ప్రేమ ఉంది. కానీ మంత్రాలు రావా? పూజ చేయడం కూడా రాదా? పర్లేదు... ఇకపై పూజ చేయటానికి పూజారి కోసం వెతకాల్సిన పనిలేకుండా. ఈ చిన్న మంత్ర బాక్స్ పనిచేస్తుంది. ఇందులో 35 రకాల ముందే నిక్షిప్తమైన మంత్రాలు ఉండటంతో పూజ, ధ్యానం, జపం... ఏ సందర్భానికైనా వినొచ్చు. పెద్ద స్పీకర్ సెటప్ అవసరం లేదు. చిన్న సైజులోనే పూజ గదిలో చక్కగా సరిపోతుంది. బ్యాటరీ లేదా చార్జింగ్ టెన్షన్ లేకుండా నేరుగా విద్యుత్ సాకెట్‌కు అమర్చుకుని ఉపయోగించవచ్చు. కొన్ని క్షణాల్లోనే మనసు భక్తిమయంగా మారిపోయేలా, కావాల్సిన మంత్రాన్ని , శబ్దాన్ని మనకు నచ్చిన స్థాయిలో సర్దుకోవచ్చు. ధర రూ.300. -
గణపతికి నచ్చే వంటకాలు
పాల పాయసంకావలసినవి: బియ్యం – 1 గ్లాస్ (కడిగినవి), పాలు : 1 లీటరు, పంచదార / బెల్లం: 1 కప్పు (రుచికి సరిపడా), నెయ్యి, డ్రైఫ్రూట్స్ తగినన్నితయారి: ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్, ఇతర డ్రైఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు కాగిన తర్వాత మంట తగ్గించి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి మెత్తగా ఉడికించాలి. బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా కలియబెట్టాలి. పాయసం చిక్కగా, కమ్మగా తయారైన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, డ్రైఫ్రూట్స్‌ను వేసి కలపాలి. పాల పాయసం సిద్ధం! రవ్వ పూర్ణాలు కావలసినవి: బొంబాయి రవ్వ – 2 కప్పులు, ఏలకలపొడి – 1 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్ – 1/4 కప్పులు, పంచదార – రెండున్నర కప్పులు, నెయ్యి – 1/2 కప్పు, మైదాపిండి – ఒకటిన్నర కప్పు, బియ్యంపిండి – 1/4 కప్పు తయారి: బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార ఏలకలపొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి. చిట్టి ముత్యాల లడ్డు కావలసినవి: శనగపిండి – 2 కప్పులు, ఏలకలపొడి – 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార – 2 1/2 కప్పులు, ఆరెంజ్ కలర్ – చిటికెడు, రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంత తయారి: శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్æ కలర్, ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో బూందీ తయారు చేసుకోండి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న పాకంలో బూందీ. యాలకల పొడి కలిపి లడ్డుగా చుట్టుకోండి. తీపి ఉండ్రాళ్ళు కావలసినవి: బియ్యంపిండి : 1 కప్పు, నీళ్ళు : 1 కప్పు, నెయ్యి : 2 గరిటెలు వంట సోడా : చిటికెడు, ఉప్పు : చిటికెడు ఉండ్రాళ్ళలో నింపడానికి : పచ్చి కొబ్బరి కోరు : 1 కప్పు, కొబ్బరి పొడి : 1/2 కప్పు, వేయించిన గసాలు : 1 గరిటెడు, ఏలకుల పొడి : 1/2 చెంచాతయారి: కొబ్బరి, బెల్లం, ఏలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్‌లో వేడి చెయ్యాలి. ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చెయ్యాలి. ఉప్పు, నెయ్యి వేసి మరిగిన తరువాత బియ్యం పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపు తుండాలి. తక్కువ మంటపైన పిండిని ఉడికించి గట్టిపడిన తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి. పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి తగు మాత్రం తీసుకుని చేతిలో వెడల్పుగా చేసుకుని మధ్యలో కొబ్బరి పాకాన్ని ఉంచి మూసివేసి, గుండ్రంగా చుట్టాలి. లేదా మీకిష్టమైన ఆకతుల్లో చేసి వీటిని తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్లో ఆవిరిపైన ఉడికించాలి. వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతితో తింటే చాలా రుచిగా ఉంటాయి. రవ్వలడ్డు కావలసినవి: బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పు – తగినన్ని, కిస్మిస్ – తగినన్ని, ఏలకులపొడి – అర టీ స్పూను, నీళ్ళు – 2 టీ స్పూన్లు. తయారి: రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. పాకంలో రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి కలుపుకుని లడ్డు చుట్టుకోవాలి. తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ. -
దూర్వాంకుర మహిమ
కౌండిన్య మహర్షి గణేశుని పరమభక్తుడు. ఆయన తన ఆశ్రమంలోని గణేశ ప్రతిమకు దూర్వాంకురాలతో నిత్యం పూజించేవాడు. ఆయన భార్య ఆశ్రయ ఒకనాడు ‘స్వామీ! మీరు దూర్వాంకురాలతో గణేశుని ఎల్లప్పుడూ పూజిస్తుంటారు కదా, దూర్వాంకురాలు అంత మహిమాన్వితమైనవా?’ అని అడిగింది. కౌండిన్యుడు ఆమెకు దూర్వాంకుర మహిమ గురించి అనేక పురాణగాథలు చెప్పాడు. కౌండిన్యుడు చెప్పిన గాథలను ఆలకించినప్పటికీ ఆశ్రయకు దూర్వాంకుర మహిమ పట్ల మనసులో సంశయాలు తొలగిపోలేదు. కౌండిన్యుడు తన భార్య మనోగతాన్ని గ్రహించాడు. ఆమె సంశయాలు తొలగిపోవాలంటే, దూర్వాంకుర మహిమ ఎంతటితో ఆమెకు స్వయంగా తెలిసిరావాలి అని భావించాడు.కౌండిన్యుడు ఆమె చేతికి ఒక దూర్వాంకురాన్ని ఇచ్చి, ‘దేవీ! నువ్వు ఈ దూర్వాంకురాన్ని తీసుకుని ఇంద్రుడి వద్దకు వెళ్లు. దీనికి సరిసమానమైన స్వర్ణాన్ని నేను అడిగినట్లు అతడికి చెప్పుడు. ఈ దూర్వాంకురం కంటే ఏమాత్రం ఎక్కువ గాని, తక్కువ గాని స్వర్ణాన్ని స్వీకరించకు’ అని చెప్పాడు.భర్త ఆదేశంతో ఆశ్రయ దేవేంద్రుడి వద్దకు వెళ్లి, భర్త తనకు ఇచ్చిన దూర్వాంకురాన్ని అతడికి ఇచ్చి, ‘దేవేంద్రా! ఈ దూర్వాంకురానికి సరిసమానమైన స్వర్ణాన్ని తీసుకురమ్మని నా భర్త నీ వద్దకు పంపాడు. దీని కంటే నాకు లేశమైనా ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.‘సాధ్వీమణీ! ఈమాత్రం దానికి నువ్వు ఇక్కడి వరకు రావాలా? నీ భర్త ఆదేశమై సందేశాన్ని పంపితే, సాక్షాత్తూ స్వర్గాన్ని పంపమన్నా పంపుతాను కదా’ అని, ఒక దేవదూతను పిలిచి, ‘ఈ సాధ్వీమణిని కుబేరుని వద్దకు తీసుకుపోయి, ఈమెకు ఈ దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని ఇవ్వమని నా ఆజ్ఞగా చెప్పు’ అని పంపాడు.దేవదూత ఆశ్రయను తీసుకుని కుబేరుడి వద్దకు వెళ్లి, దేవేంద్రుడి సందేశాన్ని చెప్పాడు. ‘దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని కోరడానికి ఇంతదూరం వచ్చిన కౌండిన్య పత్నికి ఏమైనా మతిభ్రమణం కలిగిందా? ఈమెను నా వద్దకు పంపిన దేవేంద్రుడు ఏమైనా మాయలో పడ్డాడా?’ అని అనుకుని, కొద్దిసేపు ఆలోచించాడు కుబేరుడు.కేవలం దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణాన్ని మాత్రమే ఇచ్చి పంపిస్తే, ధనాధిపతి అయిన తన పరువు ఏం కావాలని భావించి, ఆశ్రయ ముందు అనేక మణుగుల బంగారం ఉంచాడు. ఆమెకు కాస్త ఆశ పుట్టినా, భర్త పట్ల భయం వల్ల ‘నా భర్త ఆదేశం మేరకు దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణమే చాలు. అంతకు ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.కుబేరుడు ఒక చిన్న త్రాసు తెప్పించి, ఒకవైపు దూర్వాంకురాన్ని ఉంచి మరోవైపు బంగారాన్ని వేయడం మొదలుపెట్టాడు. ఎంత బంగారం వేసినా, చాలడం లేదు. కుబేరుడు ఒక పెద్ద త్రాసు తెప్పించి బంగారం వేసినా, ఫలితం లేకపోయింది. ఈసారి మరింత భారీ తక్కెడను తెచ్చి, అందులో తన యావత్ సంపదను వేసినా, అదంతా దూర్వాంకురానికి సమానం కాలేదు. సర్వాలంకార భూషిత అయిన తన భార్యను తక్కెడలో కూర్చోబెట్టాడు, చివరకు తాను కూడా స్వయంగా కూర్చున్నాడు. అయినా దూర్వాంకురం ఉంచిన వైపు తక్కెడ పాత్ర వీసమంతైనా పైకి లేవలేదు. దిక్కుతోచని కుబేరుడు తన సాటి దిక్పాలకులకు, త్రిమూర్తులకు కబురు పెట్టాడు. వారందరూ తమ తమ సమస్త సంపదలను తీసుకువచ్చినా, ఫలితం కనిపించలేదు. వారందరికీ ఇదేదో పెనుమాయగా అనిపించింది.ఇదేదో కౌండిన్యుడినే అడిగి తెలుసుకోవాలని భావించి, దేవతలందరూ కలసి కౌండిన్యుడి వద్దకు వెళ్లారు. ‘మహానుభావా! పూర్వపుణ్యం వల్ల నీ దర్శనభాగ్యం లభించింది. నీ ధర్మపత్ని మా అహంకారాన్ని సర్వం హరించింది. మాకు దూర్వాంకుర మహిమ తెలియదు. త్రిలోకాలు కూడా దీని మహిమకు సాటిరావు. నువ్వు భక్తిగా గణేశుడి మస్తకాన్ని అలంకరించిన ఈ దూర్వాంకుర మహిమను ఎవరు తెలుసుకోగలరు? సమస్త యజ్ఞ, దాన, తపో, వ్రత, స్వాధ్యాయములలో ఏదీ దూర్వాంకుర సమర్పణకు సరిసాటి కాదు. శ్రీగణేశుని అనునిత్యం ఆరాధించే నీ మహిమను మాత్రం ఎవరు తెలుసుకోగలరు?’ అని కౌండిన్యుడిని కొనియాడారు. అనంతరం వినాయకుడిని వేనోళ్ల స్తుతించి, తమ తమ లోకాలకు తిరిగి వెళ్లిపోయారు.ఈ సంఘటనతో ఆశ్రయకు తన భర్త గణనాథుని అర్చనకు ఉపయోగించే దూర్వాంకుర మహిమ పూర్తిగా అవగతమైంది. ‘స్వామీ! మీ మాటలను శంకించాను, మన్నించండి.’ అని పలికింది. ఆమె కూడా భర్తతో కలసి దూర్వాంకురాలతో శ్రీగణేశుని భక్తితో అర్చించడం ప్రారంభించింది. ప్రతిరోజూ ఆ దంపతులు ప్రాతఃకాలంలో దూర్వాంకురాలతో గణపతిని అర్చించసాగారు. కొన్నాళ్లకు గణేశుడు వారికి మోక్షాన్ని అనుగ్రహించాడు.∙సాంఖ్యాయన -
శ్రీనాథ విరచిత వినాయక దండకం
జయ జయ జగదేక రక్షామణీ!దేవ చూడామణీ శ్రేణి శోణ ప్రభాజాల బాలా తప స్మేర పాదారవిందా!ముకుందప్రియా! యిందుధారీ!కటస్యంది దానాంబుధారా ధునీ ధోరణీ గాహ కౌతూహలాయత్త మత్త ద్విరేఫాంగనా గాన సంగీత రంగీకృతస్వాంత!దంతావ ళాస్యా! నమస్యా! త్రిలోకైక వశ్యా! యవశ్యాయ శైలాత్మజా ధర్మసంతాన!సంతాన కల్పద్రు పుష్పావతంసా! యసారోరు సంసార మాయాంధకారా హృతిప్రక్రియా భాస్కరా!కోటిభాస్వన్నిరాఘాట దేహ ప్రభాభాస్వరా! దేవ! హేరంబ! లంబోదరా! యేక దంతా! మహాకాయ! సంతప్త కార్తస్వరాభా!విశాలాక్ష మౌంజీధరా! నాగ యజ్ఞోపవీతా సమన్విత కృష్ణాజినా!యాఖువాహా! కుఠారాయుధా! విఘ్నరాజా! గణాధ్యక్ష!కారుణ్య లీలా కటాక్షంబునన్ మమ్ము వీక్షించి రక్షింపుమీ!క్షీర వారాళి నీ మందరక్ష్మాధర స్వామి కవ్వంబుగా, నీ భుజంగాధినాథుండు సూత్రంబుగా, గచ్ఛపాధీశుడాధార పీఠంబుగా, సర్వదివ్వౌషధీ వల్లులన్ వైచి, నానా పదార్థంబుల న్వెన్నలం బంచుకో గోరి యున్నార, మిక్కార్య మే విఘ్నముం బొందకుండంగ, నే విక్రియం జెంద కిష్టార్థ సంసిద్ధులం గైకొనుం గాక నీ యాజ్ఞ సర్వేశ సర్వాత్మకా!నిర్వికల్పా! నిరీహా! నిరాంతక! నిశ్శంక! యోంకార మూర్తీ! నమస్తే! నమస్తే! నమఃఇవీ చదవండి: వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు -
వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు
(శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాదికార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉపయోగించే పూజాద్రవ్యాలతో పాటుగా, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకోసారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం.పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడాకుల తోరణాలు, దేవునికి తగిన పీఠము.నైవేద్యం: ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి రకానికి 21 చొప్పున.పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు, ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడంæ శుభఫలదాయకం.గణేశుని పూజ (పూజకు ఏర్పాట్లు)ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమఃశ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తువిఘ్నేశ్వరుని వ్రతకల్పముశ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘అగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేక దన్తం భక్తానాం ఏకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాఃశ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకఃలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననఃవక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజఃషోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపిఃవిద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనంఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాఃయేతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామంఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జపఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య .............. ప్రదేశే .............. – ............. నదీ మధ్యప్రదేశే (మీ ప్రస్తుత నివాస ప్రాంతం ఏ జీవనదుల మధ్య వున్నదో ఆ నదుల పేర్లు చెప్పుకోండి) స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఇందువాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధన కనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితఃమూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాఃకుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃగంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ!నర్మదే సింధు కావేరీ జలేస్మిం సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను)గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాంఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పతఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)స్వామికి పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను).ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహాశ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)వరసిద్ధి వినాయక పూజా ప్రారంభంస్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం: స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణ ప్రతిష్ఠ: (స్వామి వారికి ప్రాణం పోయుట)ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః‘ పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత‘ మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘పాద్యమ్: స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘అర్ఘ్యమ్: స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సరస్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధం: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.అక్షతలు: (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సిందూరం: శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘మాల్యం: శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అధాంగ పూజ: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి)⇒ ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)⇒ ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక)⇒ ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు)⇒ ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు)⇒ ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు)⇒ ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)⇒ ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి)⇒ ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి)⇒ ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)⇒ ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు)⇒ ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)⇒ ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ)⇒ ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు)⇒ ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం)⇒ ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు)⇒ ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)⇒ ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)⇒ ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు)⇒ ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)⇒ ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్ది)ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు)ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!అఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిశ్రీ గణపతి అష్టోత్తర శతనామావళిఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్తదేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్‌దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమఃశ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.బిల్వం : శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి.ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు)దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి)ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘(పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి)ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘శ్రీ గణేష ప్రార్థనతొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‘తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా!తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ ∙∙ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్నిటలాక్షు నగ్రసుతునకుపటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా!ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాష్ట్ర్య యాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)గణాధిప నమస్తేస్తుఉమాపుత్రా విఘ్ననాశన‘వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ఏకదంతైక వదన తథా మూషికవాహన‘కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘తన్నోదంతిః ప్రచోదయాత్‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే‘పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవఃత్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామిప్రార్థన(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి)నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమఃప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘సాష్టాంగ నమస్కారమ్ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితంమయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతిసుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశంమయా‘ దాసోయమితి మాంమత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి).(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.విఘ్నేశ్వరుని కథా ప్రారంభం(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా, అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపిస్తుండగా, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను.ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నంది నెక్కి కైలాసమునకు వేగంగా బయలుదేరెను.వినాయకోత్పత్తికైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని చెప్పెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను. అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టి, అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. విఘ్నేశాధిపత్యముఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి యీ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను. ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వుము’’ అని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు.ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమికి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలసివున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలు కూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయి అతడు మృతుండయ్యెను. పార్వతి శోకించుచు చంద్రుని జూచి,‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది.ఋషీపత్నులకు నీలాపనిందలుఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడెను. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గృహములకేగి, భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.శమంతకోపాఖ్యానముయదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్న దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను.కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.)అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను.ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు.సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను, ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహా భక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచుండెను.‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.– కథ సమాప్తం –పునఃపూజ ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)విఘ్నేశ్వరుని మంగళహారతులుశ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం!నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దానిమ్మపువ్వు గరిక మాచీపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘వాయనదానముశ్లో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా!(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్.(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం)ఇదీ చదవండి: శ్రీనాథ విరచిత వినాయక దండకం -
విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు
మొట్టమొదటి పూజలందుకోవలసిన దైవం.. వినాయకుడేవిఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడుఆది దంపతులకు మానసపుత్రుడు.. ఓంకార స్వరూపుడు...జ్ఞానానికి, వివేకానికి ప్రతీక.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు..కార్యసిద్ధిని ప్రసాదించే సిద్ధివినాయకుడు..భక్తుల కోరికలను ఆలకించే మన గణపయ్య!ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలంటే విఘ్ననాయకుడైన శ్రీగణేశుని అనుగ్రహం కావాల్సిందే. అందుకే దైవారాధనలో, పూజా కార్యక్రమాల్లో, సర్వశుభకార్యాల ప్రారంభంలో తొలి పూజలందుకునే దైవం వినాయకుడే.విఘ్నేశ్వరుని ఆరాధన కేవలం విఘ్నాలను తొలగించమని కోరడం మాత్రమే కాదు. మనలోని అజ్ఞానం, అహంకారం, అసహనం, తొందరపాటు వంటి అంతర్గత విఘ్నాలను తొలగించి, మంచి ఆలోచన, వివేకం, ఏకాగ్రత, ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించడం కూడా.పసుపు గణపతి – పవిత్రతకు ప్రతీకపార్వతీమాత చేతుల మీదుగా పసుపు ముద్దతో అవతరించి, మన ఇళ్లలో ‘‘పసుపు గణపతి’’గా తొలి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్ననివారకుడే కాక, విద్య, బుద్ధి, జ్ఞానాలను ప్రసాదించే జ్ఞానప్రదాతగా కూడా ఆరాధించబడుతున్నాడు.అందుకే, ‘కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ... ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!’ అంటూ మనం గణేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం.వినాయక చవితి – భక్తి, ఆనందాల పర్వదినంభాద్రపద శుద్ధ చవితి అనగానే ప్రతి ఇంటా వినాయక చవితి పండుగ సందడి కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది. పండుగల ద్వారా మనం కేవలం ఆచారాలను మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కూడా తరువాత తరాలకు అందిస్తాం. అందుకే పిల్లలను పూజలో భాగస్వాములను చేసి, గణపతి తత్వాన్ని వారికి పరిచయం చేయడం, వినాయకుని కథ చదివించడం లేదా చదివి వినిపించడం ఎంతో ముఖ్యం.వినాయక వ్రతం – మనలోని మంచి గుణాలకు నాంది సకల విఘ్నాలకు అధిపతియైన విఘ్నేశ్వరుడిని భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన కుటుంబసమేతంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాది పొడవునా విజయవంతంగా సాగాలని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని స్వామిని ప్రార్థిస్తాం.అయితే భక్తితో కొలుస్తూ మనం కోరేది కేవలం కోరికల నెరవేర్పు మాత్రమే కాదు, మంచి ఆలోచన ఇవ్వమని.. వివేకంతో నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వమని.. ఎదురయ్యే విఘ్నాలను ధైర్యంగా అధిగమించే శక్తి ఇవ్వమని.. కుటుంబంలో సుఖశాంతులు కలిగించమని.. సమాజంలో ఐకమత్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని.. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.ఇదే వినాయకవ్రతంలో అంతర్లీనంగా ఉన్న పరమార్థం.విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. బుద్ధిని ప్రసాదించే బుద్ధిప్రదాత..విజయాన్ని అందించే సిద్ధివినాయకుడు.. మంగళాలను చేకూర్చే మంగళమూర్తి..శ్రీ గణనాథుని కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... శ్రీ గణేశాయ నమః! శ్రీ సిద్ధివినాయకాయ నమః! శ్రీ విఘ్నేశ్వరాయ నమఃఇదీ చదవండి: వినాయక పూజకు సన్నద్ధత -
వినాయక పూజకు సన్నద్ధత
వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటికీ భక్తిశ్రద్ధలతో నిండే పర్వదినం. పూజకు ముందుగా ఇంటిని శుభ్రపరుచుకోవడం, పూజా వేదికను సిద్ధం చేసుకోవడం, పూజకు అవసరమైన ద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్యాలు సమకూర్చుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి, పరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించి పూజకు సిద్ధమవుతాం. ఇంటి ప్రధాన గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పుష్పాలతో అలంకరించి, పూజా మండపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతాం. మండపం పైభాగంలో పాలవెల్లి ద్రాక్షలు చేసి మండపం లోపల స్వస్తిక్, పద్మం వంటి శుభచిహ్నాలను లిఖించి, హరిద్రా గణపతి (పసుపు గణపతి), మట్టి వినాయక ప్రతిమలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి, దీపారాధనతో స్వామివారిని ఆహ్వానిస్తాం. పూజ ప్రారంభానికి ముందే అవసరమైన పూజాద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్య సామగ్రితో పాటు పిండివంటలు, ప్రసాదాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల పూజను ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా నిర్వహించుకోవచ్చు. పూజకు చేసే సన్నద్ధత శరీరానికే కాదు.. మనసుకూ.... పరిశుభ్రమైన ఇంటితో పాటు పవిత్రమైన మనసుతో గణనాథుని ఆరాధించినప్పుడే పూజ పరిపూర్ణమవుతుంది. భక్తిశ్రద్ధలతో గణనాథుని కొలిచి, ఆయన అనుగ్రహంతో ప్రతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రారంభిద్దాం..ఇదీ చదవండి: విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు -
గణనాథుడికి...ఘనమైన ఆసనం
గణేష్ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతో పాటు ఆసనం, బ్యాక్‌గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే, ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్ ప్లానర్స్ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్ వర్క్ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్‌ను స్టోర్ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్లు, అపార్ట్మెంట్లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్ లేదా కాపర్ ఫినిష్‌తో ఉండే ఆర్టిఫిషియల్ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్ హోమ్ డెకార్‌ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్ లుక్ తీసుకొస్తుంది. సులభంగా అలంకరణకృష్ణాష్టమి, గణేష్ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్ క్లాత్‌తో పాటు ఖరీదైన స్టోన్స్ కూడా ఉపయోగించి డిజైన్ చేస్తున్నాం. – లక్ష్మి సింగ్లా, డెకార్ క్రియేషన్స్ – నిర్మలారెడ్డి -
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
‘‘మా ‘అత్తమ్మ’, మా ‘నాన్న’... మా ఇంటికి పిల్లర్స్’’ అంటున్నారు రష్మికా మందన్నా. మామగారిని నాన్న అని పిలుస్తారామె. ‘దేవరకొండ’ ఇంటి కోడలిగా రష్మిక తొలి వినాయక చవితి పండగని జరుపుకోనున్నారు. మరి... పండగ ప్లాన్ ఏంటి? అంటే... ‘‘మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలను కుంటున్నాను’’ అన్నారు రష్మిక. ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన పలు వేడుకల్లో రష్మిక పాల్గొన్నారు. ఇప్పుడు ‘దేవరకొండ రష్మిక’గా పండగ చేసుకోవడం ఓ స్పెషల్ ఫీలింగ్ అన్నారామె. వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ‘దేవరకొండ రష్మిక’ చెప్పిన విశేషాలు...→ మీ ఇంట్లో పండగ ప్లాన్‌లో ఎవరి భాగం ఎక్కువ?అంతా మా అత్తమ్మే. ఇంట్లో ప్రతిదీ తనే ప్లాన్ చేస్తారు. నేను ఆమె చేసేవన్నీ జస్ట్ అలా ఎంజాయ్ చేస్తాను. నేననే కాదు... ఇంట్లో మేం అందరం బాధ్యత అంతా పూర్తిగా అత్తమ్మకే వదిలేస్తాం. అయితే డైట్ విషయంలో మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటాం. బహుశా పండగ రోజు కూడా డైట్ నియమాలను పాటిస్తామేమో. మేం డైట్ పాటించినా, పాటించకపోయినా, ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా... ఇంట్లో ఏమేం చేయాలో అన్నీ మా అత్తమ్మే చూసుకుంటారు. → మీరు, మీ భర్త... మీ ఇద్దరిలో ఎవరికి భక్తి ఎక్కువ? ఇద్దరికీ... నేను ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు వర్క్ మీద వెళ్లేటప్పుడు పూజ చేసుకుని వెళతాను. విజయ్ కూడా చేస్తుంటారు. మేం ఇద్దరం గుడికి కూడా బాగా వెళుతుంటాం. భక్తి తాలూకు ఆ అనుభూతిని ఇద్దరం ఆస్వాదిస్తాం. → పండగకు ఇంటిని అలంకరించే విషయం కూడా మీ అత్తమ్మ చెప్పినట్లేనా? అంతే... ఇంట్లో ఎలాంటి సందడి నెలకొన్నా మా అత్తమ్మకే థ్యాంక్స్ చె΄్పాలి. మా అత్తమ్మ మా ఇంటికి ‘సూర్య రశ్మి’లాంటివారు. ఇంటిని అలంకరించడం, పిండి వంటలు చేయడం నుంచి పూజ చేయడం వరకూ అన్నీ ఆమే చేస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు మేం ఎంజాయ్ చేస్తాం. → మరి... పండగ వేడుకల్లో మీ మామయ్యగారు, మరిది (ఆనంద్ దేవరకొండ) భాగస్వామ్యమో? విజ్జు (విజయ్ దేవరకొండ), నాన్న, నా, ఆనంద్... మా అందరి భాగస్వామ్యం ఈక్వల్‌గా ఉంటుంది.. అయితే ఇంటి సారథి మాత్రం కచ్చితంగా అత్తమ్మే. మేం నలుగురం ఆమె మాట వింటాం... చెప్పినది చెప్పినట్లు నిజాయితీగా చేస్తాం. ఎందుకంటే మేం మా పనుల్లో మునిగిపోతాం... ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటాం. సో... ఇంట్లో మమ్మల్ని నిలకడగా ఉంచేది మా అత్తమ్మే. అసలు ఆవిడ పనులను ఎంత బాగా చేస్తారంటే... మెచ్చుకోవాలనిపిస్తుంటుంది. అంత బాధ్యతగా ఇంటిని పట్టించుకుంటారు కాబట్టే అత్తమ్మ ఏం చెబితే అది నమ్మి చేసేస్తాం. → ఇప్పుడు దేవరకొండ ఇంటి కోడలిగా పండగలో పాలుపంచుకోబోతున్నారు... ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు ఆ ఇంటి పూజల్లో పాల్గొన్నారా? పండగలప్పుడు, పూజలప్పుడు మా అత్తమ్మ దగ్గరవాళ్లందర్నీ పిలుస్తారు. ఈ ఇంటి ఆనవాయితీ అది. అలా నన్ను కూడా పిలిచేవారు. నన్ను సొంత మనిషిలా అనుకునేవారు. సో... ‘రష్మిక’లా ఈ ఇంటి వేడుకల్లో నేను చాలాసార్లు పాల్గొన్నాను. → ‘మిస్ రష్మిక’గా వెళ్లినప్పుడు ఇప్పుడు ‘మిసెస్ విజయ్’గా ఆ ఇంట్లో ఉంటున్న మీకు కనిపించిన తేడా? నిజాయితీగా చె΄్పాలంటే... ఏ తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. ఒప్పుడు ఓ ఫ్రెండ్‌లా నన్ను ఇంటికి పిలిచేవారు. ఇప్పుడు విజ్జు భార్యగా ఆ ఇంట్లో ఉన్నాను. వ్యక్తులుగా మాలో ఏ మార్పూ లేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే... ఆ కుటుంబ సభ్యురాలిగా ఉండటం అనే అనుభూతి వేరు. ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో దక్కే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం.→ ఎప్పుడైనా వినాయకుడి బొమ్మను గీశారా?నాకు బొమ్మలు గీయడం అస్సలు రాదు, కానీ రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. వినాయకుడి బొమ్మ గీసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాక్కూడా గీయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఆ రూపానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్. అందుకే అసలు ప్రయత్నం కూడా చేయకూడదనుకున్నాను. కానీ రెండు సంవత్సరాల క్రితం ఎవరో నన్ను మట్టితో వినాయకుణ్ణి తయారు చేయమని అడిగితే కాదన లేక ప్రయత్నం చేశాను. నాకు చేతనైనంతలో బాగానే చేశాను.→ పెళ్లి వేడుకల్లో మీరు కట్టుకున్న చీరలన్నీ బాగున్నాయి... మరి... పండగ రోజు ఏం ప్లాన్ చేస్తున్నారు? కచ్చితంగా చీర కట్టుకుంటాను. ఈ పండగ జరుపుకోవడానికి వర్క్ నుంచి నాకు కొన్ని గంటలైనా బ్రేక్ దొరికితే బాగుండు అను కుంటున్నాను. ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ మెటీరియల్ శారీ కట్టుకోవాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా ఉన్నాయి... అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది కట్టుకుంటాను.→ ఇటీవల విజయ్ ‘సీడ్ గణేశా’కి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మట్టి వినాయకుడితో దిగిన ఫొటో బయటకు వచ్చింది... అవును... మా ఇంట్లో మేం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. రాబోయే తరాలకు సుర క్షితమైన పర్యావరణం ఉండాలి కదా. అందుకు మా వంతు కృషి చేస్తాం. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ వినాయకుడిని ఇంటికి తీసుకు వస్తున్నాం. మేమే కాదు... అందరం ఎకో ఫ్రెండ్లీగా పండగ చేసుకుందాం.– డి.జి. భవాని -
ఏనుగు బొజ్జ.. చిన్న ఎలుక.. ఇందులో ఇంత పెద్ద తత్త్వమా?
మొన్న ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర రోడ్డు పక్కన రెండు మూడు కిలోమీటర్ల ΄÷డుగునా గణేష్ విగ్రహాలు కనిపించాయి. గణపతుల గణాలు భూమ్మీదకి దిగినట్టుగా ఉంది. అలా ఆ విగ్రహాల్ని చూస్తూ ముందుకు పోతుండగా అక్కడొకచోట ఒకాయన కనిపించాడు. ‘ఇదేమిటి! ఇక్కడ ఈ గ్రీకు పెద్దమనిషి కనిపిస్తున్నాడు’ అని కళ్ళు నులుముకుని చూసాను. సందేహం లేదు.. అతనే... పుస్తకాల్లో చూసిన ముఖమే.ఎపిక్టెటస్!‘మనల్ని బాధపెట్టేది జరిగే సంఘటనలు కాదు, ఆ సంఘటనల గురించి మనం ఏమనుకుంటున్నామో అది’ అని చెప్పిన గొప్ప తత్త్వవేత్త. ఒకప్పుడు బానిసగా బతికిన రోజుల్లో, అతడి యజమాని ఒకసారి అతడి మీద కోపంతో అతడి కాలు విరిచేసాడు. అందుకని ఇప్పుడు ఆ కాలున్నవైపు కొద్దిగా వాలి ఉన్నాడు. కానీ మార్కస్ అరీలియస్ లాంటి చక్రవర్తికే దారి చూపించిన వాడు. ‘మీరేమిటిక్కడ?’ అనడిగి, ‘నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది. లేకపోతే ఒకటో శతాబ్దపు రోమ్ ఎక్కడ? ఈ ΄ాత బోయిన్పల్లి ఎక్కడ?’ అన్నాను.‘నువ్వేకదా నన్ను తలుచుకుంటూ ఉన్నది’ అన్నాడు ఎపిక్టెటస్ నా వైపు చూపు తిప్పకుండానే. ఆయన ఆ గణేష్ మూర్తుల్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు.అప్పుడు తట్టింది, అప్పటికి రెండు మూడు రోజులుగా నేను ఆయన పుస్తకాలే చదువుతున్నానని. ‘అంటే మీరు ఎవరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతారా?’ అనడిగాను.‘అవును. నిన్ననే, పుణేలో ఎవరో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ΄ాఠాలు చెప్తూ నా మాటలు పదే పదే చెప్తూ ఉంటే అక్కడికి పోక తప్పింది కాదు’ అని అంటూ ‘ఈయనేమిటి? ఇలా ఉన్నాడు... ఏథెన్సులోనూ, రోములోనూ నేనిలాంటి శిల్పాలు ఎప్పుడూ చూడలేదు’ అని అన్నాడు ఆశ్చర్యపోతూ.‘ఈయన వినాయకుడు, విఘ్నాధిపతి. మావాళ్ళు చెప్పేదేమంటే ఆయన మొదట్లో రైతుల దేవుడని, ప్రకృతి దేవుడని, పర్యావరణానికి దేవుడని. ఆ చెవులు చేటలు, ఆ బొజ్జ సుభిక్షానికి గుర్తు, ఆ ఎలుక రైతుల విరోధి కదా, అందుకని లొంగదీసుకున్నాడంటారు..’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎపిక్టెటస్ నా వైపు తిరిగి నన్ను పరిశీలనగా చూసాడు.‘కాదు కాదు... నువ్వు ఆ అవయవాల్ని వర్ణిస్తున్నావు. అవి అలా ఎందుకున్నాయో వివరిస్తున్నావు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. నిన్న ట్రయినింగ్ క్లాసులో అంతా పిల్లలు... వాళ్ళ మాటలే ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అందులో ఒకమ్మాయి ఆ ఫాకల్టీని అడుగుతోంది... నన్నంతా లావుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటున్నారు, డైటింగ్ చెయ్యాలంటారు, యోగా చెయ్యాలంటారు... నాకు చాలా ఆందోళనగా ఉంది. నేనేం చెయ్యాలో చెప్పండి అని.కానీ, చూడు మిత్రమా.. బాడీ షేమింగ్‌ని పూర్తిగా జయించినవాడు ఇలా ఉంటాడు. ఎంత అన్ అ΄÷లొజిటిక్గా ఉన్నాడు. అచ్చం మా సోక్రటీసులాగా ఉన్నాడు. లోకం పెట్టుకునే ఏ కొలతలకీ లొంగిపోకుండా తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉన్నాడు. తను తనుగా. అలా ఉండాలంటే ముందు కావలసింది అటువంటి ఆత్మనిశ్చయత, అటువంటి ఆత్మనిర్భరత. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది. అవునూ, ఆ దంతమెందుకు విరిగి పోయింది?’ అనడిగాడు.‘అదా.. వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే ఈయన రాయడానికి కూర్చున్నాడు. మధ్యలో గంటం విరిగిపోయింది. కాని రాత ఆపకూడదని నియమం. అందుకని తన దంతం తనే విరుచుకుని దాంతో రాయడం మొదలుపెట్టాడంటారు’ అన్నాను.‘ఆహా! ఆ వ్యక్తిత్వం నేనూహించినట్టే ఉంది. అలాంటి వాళ్ళు ఒక పనికి పూనుకున్నారనుకో. వెనక్కి తగ్గరు. దేనికైనా సిద్ధపడతారు. తమ ఆత్మలోంచి కొంత ధారపోసి అయినా సరే ముందుకు నడుస్తారు. మనకి చూడటానికి వాళ్ళు గాయపడ్డారనిపిస్తుంది. కాని గాయాన్ని గేయంగా మార్చుకుంటారు. అందం కాదు, ఆర్భాటం కాదు, పదిమందీ ఏమనుకుంటారన్న ఆత్రుత కాదు, అన్నిటికన్నా ముందు తాము ఒప్పుకున్న పని ఆగిపోకుండా ముందుకు నడిచిందా లేదా. అంతే. అదే వాళ్ళకి నిజమైన అలంకారం’ అని అన్నాడు వెలుగు చిమ్ముతున్న చూపుల్తో.‘అలా అయితే ఆ ఎలక సంగతేమిటి?’ అనడిగాను. ‘ఇందాకా నువ్వు ఈయన్ని రైతుల దేవుడని చె΄్పావు. ఒక్క రైతులకే ఎందుకు? ఈయన మనుషులందరికీ దేవుడని ఆ ఒక్క ఎలకని బట్టి చె΄÷్పచ్చు. ఎలక చూడు. ఎంత రెస్ట్‌లెస్‌గా ఉంటుంది! నిలకడ లేని జీవి. ఊరికే పరుగెట్టుకుంటూ పోతుంది. కాని ఆయన దాన్ని వాహనంగా మార్చుకున్నాడు. అంత పెద్ద శరీరం, అంత చిన్న వాహనం. ఎవరేనా తమ యాంగ్జయిటీని అదుపు చేసుకోగలిగితే అలానే ఉంటుంది, చిన్న ఎలక మీద ఏనుగు వూరేగినట్టు. అద్భుతం కదా’ అని అన్నాడు.‘మరి ఆ చెవుల సంగతేమిటి?’ అనడిగాను. ఈలోపు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది. ఒకటే హారన్లు. ఎపిక్టెటస్ ఆ ట్రాఫిక్ కేసి చూసాడు. ‘ఇప్పుడు కాదులే, మరోసారి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటి కాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్. అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను.కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ స్క్రిప్టు నువ్వే రాసుకో. అవసరమైతే నీలో ఒక భాగాన్ని తుంచెయ్యవలసి వస్తే తుంచెయ్యి. ఒక్క భాగమేమిటి? నీకు అప్పగించిన పనికి అవసరమైతే నిన్ను నువ్వే మూల్యంగా చెల్లించుకోడానికి సిద్ధపడు. గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి. నిన్ను నువ్వు జయించుకున్నావా! నీకు తిరుగులేదు’ అని అంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ జన సందోహంలో కలిసిపోయాడు, ఆ మహాతత్త్వవేత్త ఎపిక్టెటస్.– వాడ్రేవు చినవీరభద్రుడుఇదీ చదవండి: 1980ల నాటి వినాయక చవితి ఓ జ్ఞాపకం కదా! -
1980ల నాటి వినాయక చవితి ఓ జ్ఞాపకం కదా!
‘కుడుమిస్తే పండగ’ అని సామెత. పిల్లలకు కుడుములు తెచ్చే వినాయక చవితి వస్తే ఇక పండగే. ‘ఓ బొజ్జ గణపయ్య... నీ బంటు నేనయ్యా... ఉండ్రాళ్లు చవిచూడవయ్యా’ అని పాటలు పాడతాం కానీ ఆ కుడుములు గణేశుడు తినడు పాపం... మాకే ఇచ్చేస్తాడు. బొజ్జ గణపయ్యకు పిల్లలంటే ఇష్టం కదా మరి.బాలగణేశుడు తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ తిరిగి అదే లోక ప్రదక్షిణగా గణనాయకుడైపోయాడు. ఆయన కేవలం తల్లిదండ్రుల చుట్టే తిరిగాడు. మేమైతే తల్లిదండ్రులు చెప్పిన స్కూళ్ళు, పుస్తకాలు, ట్యూషన్ల చుట్టూ తిరుగుతూ వినాయక చవితిరోజు మాకు బాగా మార్కులు రావాలని పుస్తకాలన్నీ తెచ్చి వినాయకుని విగ్రహం దగ్గర పెట్టేవాళ్లం. నూరు ఇవ్వకపోయినా గట్టున పడేసేవాడు.అప్పట్లో డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని? రూపాయి రూపాయికి అందరూ వెతుక్కోవడమే. మరి దేవుణ్ణి పెట్టాలంటే డబ్బు ఏదీ? అందుకే చందాలు మొదలయ్యాయి. ఇంటింటికీ తిరిగి రూపాయి, అర్ధ చందాలు వసూలు చేసి దేవుడి విగ్రహం పెట్టేవాళ్లు. ఇప్పటిలా వీధి వీధినా ఒకటి లేదనుకోండి. ఊరికి ఒకటి. అదీ మూడు రోజులే.ఇక ఇళ్లల్లో వినాయక చవితికి మట్టి ప్రతిమలే. ఇవి ఎలా చేస్తారో చూద్దామని పండగరోజు ఉదయాన్నే బజారుకు నాన్నతో పాటు వెళ్లేవాళ్లం. వినాయకుని విగ్రహాలు అమ్మేవాళ్లు ఆ ముందురోజు రాత్రే ఊళ్లోకి దిగి బంకమన్ను, నీళ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ల దగ్గర అచ్చులు పెట్టుకుని ఉండేవాళ్లు. బంకమన్ను కలిపి, నూనె రాసిన అచ్చులో అదిమి, అచ్చును పేపర్ మీద తిరగేస్తే వినాయకుని బొమ్మ రెడీ. అదే పేపర్లో దానిని చుట్టి ఇంటికి తెచ్చుకునేవాళ్లం. మా చిన్నప్పుడు వినాయకునికి గొడుగు తప్పనిసరి. అవి విడిగా అమ్మేవారు. రంగు కాగితాల గొడుగు కొనుక్కొని వచ్చి వినాయకుణ్ణి ప్రతిష్టించాక గొడుగు వెనుక గుచ్చేవాళ్లం.చవితిరోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయని పెద్దవాళ్లు చంద్రుణ్ణి చూడొద్దని ముందే వార్నింగ్ ఇచ్చేవాళ్లు. శమంతకమణి కథలో శ్రీకృష్ణుడిపై మణి దొంగతనం నింద పడటానికి కారణం చవితి చంద్రుణ్ణి చూడటమే అని చెబుతారు. అందుకే చాలా భయం వేసేది. చంద్రుణ్ణి చూడకుండానే పెన్ను కొట్టేశామనో, నోట్సు చింపేశామనో మన మీద నిందలు పడుతూనే ఉంటాయి. చూస్తే ఇంకేమైనా ఉందా?వినాయక చవితి రోజు ఉదయం పూట బజార్లన్నీ ఏవో గడ్డి మైదానాల్లా ఉంటాయి. పత్రి అమ్మేవారు వరుసగా కూచుని కిటకిటలాడుతూ ఉంటారు. అన్నిరకాల పత్రి ఒకరి దగ్గర ఉండదు. కొందరు మారేడు, గరిక అమ్మితే కొందరు ఉమ్మెత్త, మాచీపత్రం అమ్ముతారు. కొందరి దగ్గర జిల్లేడు దొరికితే, కొందరి దగ్గర వావిలి దొరుకుతుంది. ఇక కొన్నిరకాల పత్రి మనమే ఊరి బయటకు వెళ్లి, ΄÷లాల వెంట తిరిగి తెచ్చుకోవాలి. మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ చేయాలని శాస్త్రం. అన్నీ ఔషధ గుణాలున్న ఆకులే.అమ్మ ఉదయాన్నే లేచి వినాయకుడికి పెట్టాల్సిన ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం తయారు చేస్తే నాన్న దూలానికి ‘పాలవెల్లి’ కట్టి దానికి మొక్కజొన్న ΄÷త్తులు, వెలగపండ్లు, సీతాఫలాలు వేలాడదీసేవారు. తొమ్మిదీ తొమ్మిదిన్నరకు పూజ మొదలయ్యేది. పూజ కొంచెం ఎక్కువసేపు జరిగినట్టు అనిపించినా, కుదురు లేనట్టుగా కూచున్నా అయ్యే వరకూ లేవడం అసాధ్యం. లేస్తే తిట్లే. పూజ అయ్యాక వినాయకుడి ముందు గుంజిళ్లు తీసి, చెంపలు వేసుకొని, చదువు బాగా రావాలని మొక్కుకునేవాళ్లం.ఆ సాయంత్రం ఊళ్లో పిల్లలందరికీ ఒకటే ఆటలు. పల్లేరుకాయలతో కొట్టుకునే ఆట ఉండేది. భలే దెబ్బ తగిలేది. తర్వాత మానేశారు అలా కొట్టుకోవడం. తర్వాత మంటపం దగ్గర కూచుంటే స్పీకర్లలో ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాటలు తెగ వినిపించేవి. ప్రసాదం దక్కేది. వీలుంటే పాటకచ్చేరీ కూడా ఉండేది.మూడు రోజులు వినాయకుణ్ణి ఇంట్లో ఉంచుకున్నాక ఇక నిమజ్జనం చేసేవాళ్లం. ఈనాటిలా పెద్దపెద్ద లారీలు, క్రేన్లు అప్పట్లో లేవు. వీధిలోని కుర్రాళ్లంతా కలిసి వీధిలోని మట్టి విగ్రహాలన్నీ ఒక చిన్న బండి మీదో లేదా చేతుల మీదుగానో మోసుకుంటూ ‘గణపతి బొ΄్పా మోరియా’ అంటూ కాలువకో, చెరువుకో లేదా సముద్ర తీరానికో ఊరేగింపుగా తీసుకెళ్లేవాళ్లం. తీరానికి వెళ్ళాక మట్టి వినాయకుడు నీటిలో కరిగిపోతుంటే, ‘వచ్చే ఏడాది త్వరగా రా తండ్రీ’ అని చేతులు ముడిచి దండం పెట్టేవాళ్లం.ఆ రోజుల్లో వినాయక చవితి నిరాడంబరంగా, హోరు లేకుండా ఉండేది. ఆకుపచ్చగా ఉండేది. సహజంగా ఉండేది. పండగ అంతరార్థం తెలుసుకుంటే పర్యావరణంతో పాటుగానే పండుగ చేసుకోమని గణేశుడు చెప్తున్నట్టే ఉంటుంది. ప్రకృతిగణాలకు నాయకుడైన గణేశుడు ప్రకృతిని కాపాడి వానలు, పంటలు ఇవ్వాలని కోరుకుందాం. – కెఇదీ చదవండి: వినాయక చవితి.. పత్రి -
పట్టుచీరపై వాసవీ మాత చరిత్ర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై మరో అద్భుతాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. చేనేత మగ్గంపై 45 రోజులు శ్రమించి.. వాసవీమాత చరిత్రతో ఉన్న పట్టుచీరను తనదైన సృజనాత్మకతతో రూపొందించారు. చేనేత మగ్గంపై పట్టుదారం పోగులు, గోల్డ్ జరీని వినియోగించి ఏడు మీటర్ల పొడవు, 45 ఇంచుల వెడల్పు, 1200 గ్రాముల బరువైన చీర నేశారు.గుంటూరుకు చెందిన రత్నకుమారి–కోటేశ్వరరావు ప్రత్యేకంగా ఇచ్చిన ఆర్డర్ మేరకు వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దివ్య చరిత్రను పట్టుచీరపై ఆవిష్కరించారు. ఈ చీరలో 102 మంది రుషుల పేర్లు, 102 గోత్రనామాలు, వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి చరిత్రను తెలిపే 25 చారిత్రక చిత్రాలను పట్టుపోగులతో నేశారు.కాగా చేనేత మగ్గంపై నిత్యప్రయోగాలు చేసే హరిప్రసాద్ గతంలో 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత మగ్గంపై నేశారు. మగ్గంపై వేగం, నైపుణ్యం, కచ్చితత్వం, సృజనాత్మకతను సమన్వయం చేస్తూ సాధించిన ఆ ఘనత చేనేత రంగంలో ప్రత్యేకంగా నిలిచింది. సాధారణంగా ఒక చీరను నేయడం ఒక కళ.ఇదీ చదవండి: ఈ ఇంటిని మూటకట్టి పట్టుకొచ్చారు! అయితే చరిత్రను చిత్రాలుగా, గోత్రాలను అక్షరాలుగా, రుషుల పేర్లను చేనేత డిజైన్లుగా, ఆధ్యాత్మిక భావనలను పట్టుదారంతో మగ్గంపై మలచడం అత్యంత అరుదైన కళగా భావిస్తున్నారు. ఆధ్యాత్మికకత ఉట్టిపడే పట్టుచీరను మగ్గంపై మలచడం విశేషమని స్థానికులు పేర్కొన్నారు. -
ఈ ఇంటిని మూటకట్టి పట్టుకొచ్చారు!
ఇల్లు కట్టుకోవాలంటే సాధారణంగా స్థలం చూసుకుని, ఆర్కిటెక్ట్‌ను పిలిచి, నచ్చిన డిజైన్‌లో నిర్మించుకుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ బిలియనీర్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. తొలుత ఇండోనేషియాలోని బాలి దీవిలో ఓ ఇల్లు కట్టించారు. తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి, వేల కిలోమీటర్ల దూరంలోని హవాయికి తెచ్చుకుని అక్కడ పునర్నిర్మించుకున్నారు. ఇన్ని వ్యయప్రయాసలకోర్చి ముచ్చటగా కట్టించుకున్న ఆ ఇంటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడంతో ఇది మరోసారి వార్తల్లోకి వచ్చింది.ఇదంతా ఎప్పుడు, ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మూడున్నర దశాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. అమెరికాకు చెందిన జాన్ పాల్ డిజోరియా (John Paul DeJoria) పెద్ద బిజినెస్‌మేన్. 1990లో ఓసారి బాలి వెళ్లారు. అక్కడి సంప్రదాయ వాస్తుశైలిని చూసి మనసు పారేసుకున్నారు. అలాంటి ఇల్లు తనకూ ఉండాలని భావించారు. వెంటనే వందల మంది స్థానిక నిపుణులు, పనివాళ్లను రంగంలోకి దించారు. బోర్నియో అడవుల నుంచి తెచ్చిన పచ్చి కలప, టేకుతో దేవాలయాన్ని పోలిన నిర్మాణ శైలిలో ఇల్లు కట్టించారు. పైకప్పు కోసం ఏకంగా పది లక్షలకు పైగా చెక్క పలకలను అమర్చారు. డ్రాగన్ ముఖాల శిల్పాలు అలంకారానికే కాకుండా వర్షం పడినప్పుడు నీటిని కిందకు మళ్లించే స్పౌట్లుగా తీర్చిదిద్దారు. ఆ ఇంటిని చూసి సంతృప్తి చెందిన డిజారియో.. ఇల్లు మొత్తం జాగ్రత్తగా విప్పేయమన్నారు. దీంతో ఆ ఇంటిని నిర్మించినవారే ఒక్కో చెక్కముక్కా తీసి నంబరింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే 2 కిలోమీటర్లు వెనక్కి సముద్రం!వాటిని గోనెసంచుల్లో మూటలు కట్టి ఓడలో పసిఫిక్ మహాసముద్రం మీదుగా హవాయిలోని బిగ్ ఐలాండ్‌కు తరలించారు. అక్కడ కిహోలో బే వద్ద ఉన్న ప్రైవేటు తీర ప్రాంతంలోని మూడెకరాల స్థలంలో యథాతథంగా పునర్ నిర్మించారు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఆరేళ్లు పట్టింది. ఆ రోజుల్లో దాదాపు రూ.17 కోట్లు ఖర్చయింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా.. తక్కువ తేమ ఉన్న హవాయి వాతావరణం కారణంగా ఇల్లు కొంచెం కుచించుకుపోయింది. అయినా, ఆ వాస్తుశైలి కారణంగా అది అక్కడ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.తాజాగా ఈ ఇంటిని 3.25 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.270 కోట్లు) అమ్మకానికి పెట్టారు. దీని యజమాని డిజోరియా టెక్సాస్‌లో స్థిరపడటంతో ఈ ఇంటిని వినియోగించడంలేదు. దీంతో అమ్మేయడమే బెటరని ఈ నిర్ణయానికి వచ్చారు. ఎక్కడో పుట్టి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి హవాయి చేరిన ఆ ఇల్లు.. ఇప్పుడు కొత్త యజమాని కోసం ఎదురుచూస్తోంది.– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
వినాయక చవితి.. పత్రి
‘చిన్నమ్మా! ఇటు చూడు.. వినాయకుడి పూజ కోసం మామిడి ఆకులు, జమ్మి ఆకులు, గరికపోచలు అన్నీ తెచ్చాను. కానీ స్వామివారికి ఇన్ని రకాల ఆకులు ఎందుకు పెడతాం?’ అని అడిగాడు పదేళ్ల కన్నయ్య. చేతిలో బుజ్జి మట్టి వినాయకుడిని పట్టుకుని పూజా గదిలోకి వస్తూ.ఎనిమిదేళ్ల చిన్నమ్మ ఆ ఆకులను గమనిస్తూ ‘అవును కన్నయ్యా.. పండ్లు, పూలు పెడితే సరిపోతుంది కదా, ఈ పత్రి ఎందుకు?’ అని తల గోక్కుంది.అంతలోనే వేణు అన్న చేతిలో పూజా సాగ్రితో అక్కడికి వచ్చాడు. ‘పిల్లలూ! వినాయక చవితి రోజు మనం చేసే ఈ ‘పత్రి పూజ’ వెనుక ఒక సైన్స్ రహస్యం ఉందమ్మ‘ అన్నాడు నవ్వుతూ.‘సైన్సా? ఆకుల్లో సైన్స్ ఏముంటుంది వేణు అన్నా?‘ అని కన్నయ్య, చిన్నమ్మ ఒకేసారి ఆశ్చర్యంగా అడిగారు.ఇదీ చదవండి: ‘ఫెన్సింగ్’ ఆట ఎలా ఆడతారో తెలుసా?‘వినాయక చవితి వచ్చేది వర్షాకాలంలో. ఈ టైమ్‌లో గాలిలో తేమ వల్ల మనకు తెలియకుండానే జబ్బులు, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అందుకే మన పెద్దవాళ్లు ఈ పండుగ రోజున ఏకంగా 21 రకాల ప్రత్యేకమైన ఔషధ ఆకులతో పూజ చేయాలని రూల్ పెట్టారు. మనం పూజకు వాడే మాచిపత్రం, జమ్మి, ఉత్తరేణి, మారేడు, ఉసిరి, గరికపోచలు.. ఇవన్నీ కేవలం ఆకులు కావు, గొప్ప ఆయుర్వేద మందులు! పూజ చేసేటప్పుడు, ఆ తర్వాత ఈ ఆకులన్నీ ఇంట్లో ఉండటం వల్ల వాటి నుంచి వచ్చే సువాసన గాల్లోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది. మనకు స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఆ తర్వాత ఈ పత్రినంతటినీ తీసుకెళ్లి నీళ్లలో నిమజ్జనం చేసినప్పుడు, ఆ నీరు కూడా శుద్ధి అవుతుంది. అంటే వినాయకుడు మనకు చదువులతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడన్నమాట’ అన్నాడు వేణు అన్న.‘వావ్! అంటే మన పత్రి ఒక సూపర్ డాక్టర్ అన్నమాట’ అని కన్నయ్య చప్పట్లు కొట్టాడు.చిన్నమ్మ సంతోషంగా ఆ 21 రకాల ఆకులను ఎంతో గౌరవంగా బుజ్జి గణపయ్య పాదాల దగ్గర పెట్టి పూజ చేసింది. వినాయక చవితి అంటే కేవలం లడ్డూలు తినడమే కాదు ప్రకృతిని ప్రేమించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని కన్నయ్య, చిన్నమ్మలకు ఆ రోజు అర్థమైంది! -
‘ఫెన్సింగ్’ ఆట ఎలా ఆడతారో తెలుసా?
పిల్లలూ! పాత కాలం సినిమాల్లో రాజులు కత్తులతో యుద్ధాలు చేయడం చూశారు కదా! ఆధునిక కాలంలో ఇది ఒలింపిక్స్‌లో ఒక అద్భుతమైన ఆటగా మారిపోయింది. దీనినే ‘ఫెన్సింగ్’ (Fencing) లేదా మన భాషలో ‘కత్తియుద్ధం’ అంటారు. ఇక్కడ మన దేశానికి చెందిన జోయ్స్ అషితా స్టాలిన్రాజ్(Joys Ashitha Stalinraj) పంజాబ్‌లోని పాటియాలాలో శిక్షణ తీసుకుంటూ ఇలా కత్తి తిప్పుతోంది. జపాన్‌లో జరగబోయే ’ఏషియన్ గేమ్స్–2026’లో భారతదేశం తరఫున మెడల్ గెలవడమే ఆమె లక్ష్యం.ఇంతకీ ఆ కత్తిని ఏమంటారు? ఆట ఆడే విధానాన్ని బట్టి కత్తులను మూడు రకాలుగా పిలుస్తారు. అవి... ‘ఫాయిల్’ (Foil), ‘ఎపే’ (epee), ‘సేబర్’ (Sabre). ఇవి చాలా తేలికగా, వంగుతూ ఉంటాయి. వీటి చివర మొన ఉండదు కాబట్టి అస్సలు గాయాలు అవ్వవు. కత్తి తాకితే సెన్సర్స్‌ను బట్టి నోట్ అయ్యి పాయింట్స్ వస్తాయి. ఫెన్సింగ్‌లో ‘డాలు’ (Shield) వాడరు. ప్రత్యర్థి కత్తిని మన కత్తితోనే అడ్డుకోవాలి.ఈ క్రీడలో ప్రపంచంలో అత్యధికంగా మెడల్స్ సాధించి టాప్‌లో ఉన్న దేశం ఏదో తెలుసా? ఇటలీ. ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉంది. మన దేశం నుండి కూడా మహిళలు ఇలాంటి అరుదైన ఆటల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం నిజంగా మనకందరికీ ఎంతో గర్వకారణం!ఇదీ చదవండి: 'పతకం తెస్తా.. నాన్నకు బహుమతిగా ఇస్తా' -
నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం
‘హనుమాన్ అంశ్’.. హిందీ సినిమా విడుదలైన తరువాత చాలామంది నీమ్ కరోలీ బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. నీమ్ కరోలి బాబా.. మహరాజ్ జీగా కూడా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు. ఆయన లోతైన ఆధ్యాత్మిక బోధనలను ఎంతో ప్రశాంతతను అందిస్తాయని పలువురు చెబుతుంటారు. కష్టాలను ఎదుర్కొనే సమయంలో.. జీవితంలోని సత్యాలను అంగీకరించడంపై ఆయన బోధనలు ప్రధానంగా దృష్టి సారించాయి. నిజాయతీగా జీవించడం, క్షమించడం ఎంతో ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు. భౌతిక వస్తువులన్నీ శాశ్వతం కాదని, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనదని మహరాజ్ జీ వివరించారు. ఈ బోధనలు అంతర్గత ప్రశాంతతను అందించడంతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యానికి దోహదపడతాయి.నీమ్ కరోలీ బాబా తన మాటలు, చేతలతో కోట్లాది మంది హృదయాలను ప్రభావితం చేశారు. ‘మిరాకిల్ బాబా’గా కూడా పేరొందిన ఈయన.. హనుమంతుడి భక్తుడు. జీవితంలోని అత్యంత కఠినమైన సవాళ్లను అధిగమించేందుకు సహాయపడే నాలుగు శక్తివంతమైన నీమ్ కరోలీ బాబా బోధనలు ఇవే..1. ‘మీరు బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఏదైనా అంత్యక్రియలను చూసినప్పుడు.. జీవిత సత్యాలను వాస్తవంగా నేర్చుకుంటారు’ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఎదురవుతుంటాయి. ఇది విశ్వంలోని సహజ నియమం. కొన్నిసార్లు వర్షం పడుతుంది.. మరికొన్నిసార్లు ఎండ కాస్తుంది. కష్టాలను ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకునే నైపుణ్యాన్ని అలవర్చుకోవడం ఇక్కడ కీలకమైనది. కఠిన పరిస్థితులను జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సత్యాలను నేర్చుకునే కాలంగా పరిగణించాలని నీమ్ కరోలీ బాబా చెప్పారు. ఆధునిక మనస్తత్వశాస్త్రంలో ఈ వైఖరినే ‘మానసిక స్థైర్యం’గా పిలుస్తారు.2. ‘సంపూర్ణ నిజాయితీ, సత్యం అత్యవసరం. మీరు చెప్పిన దాని ప్రకారమే జీవించాలి’ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగేందుకు మనం పెంపొందించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో నిజాయతీ ఒకటి. దాచాల్సిన విషయం ఏదైనా ఉన్నప్పుడు మనుషులు భయపడతారు. మీతో మీరు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు నిజం చెప్పడం ప్రారంభించినప్పుడు.. వెలుగు వచ్చిన వెంటనే చీకటి మాయమైనట్లుగా భయం కూడా మీ నుంచి దూరమవుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచంలో సత్యమే గొప్ప శక్తి. ఈ వెలుగును ఎప్పటికీ వదులుకోవద్దు.3. ‘క్షమించడమే గొప్ప ఆయుధం. ఎందుకంటే ఆ ఆయుధం కలిగిన వ్యక్తి చలించనివాడిగా ఉంటాడు. అతను వెంటనే కోపాన్ని వదులుకోగలుగుతాడు’ద్వేషం, పగ, అసూయ మొదలైనవి మన ప్రశాంతతను, అంతర్గత సామరస్యాన్ని నిశ్శబ్ద వ్యాధిలా దెబ్బతీసే ప్రతికూల భావాలు. వీటిని వదిలేయడం అనేది మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మరో గొప్ప శక్తి. వదిలేయడాన్ని అలవర్చుకునే కళను నేర్చుకునేందుకు ధ్యానం ఒక గొప్ప సాధనగా ఉపయుక్తమవుతుంది.నిటారుగా వెన్నెముకను ఉంచి సౌకర్యంగా కూర్చొని, మీలో ఉద్భవిస్తున్న ఆలోచనలు, భావోద్వేగాలను గమనించండి. అవి వచ్చి వెళ్లిపోతున్నాయనే సత్యాన్ని గుర్తించండి. వాటికి ప్రతిస్పందించవద్దు. ఈ సాధనను ప్రతిరోజూ కొనసాగిస్తే.. మీ అంతరంగంలో ప్రశాంతత నెలకొంటున్న అనుభూతిని గుర్తిస్తారు.4. ‘దేవుని ప్రేమ తప్ప ప్రతిదీ అశాశ్వతమే’ఈ భౌతిక ప్రపంచంతో మనల్ని మనం అంటిపెట్టుకోవడం ఎప్పటికీ దుఃఖానికే దారితీస్తుంది. ఎందుకంటే ఏది ఉద్భవిస్తుందో అది అంతరించిపోతుంది. ఏదీ శాశ్వతంగా ఉండదు. అయితే మన ఆత్మల్లో ఉన్న దైవిక తత్వం శాశ్వతమైనది. అది నిత్యమైనది, మార్పులేనిది. ఈ సత్యంపై ధ్యానం చేయండి.భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూచించిన విధంగా కర్మయోగాన్ని ఆచరించండి. మీ విధులను నిర్వర్తించండి.. ఫలితాల విషయంలో మీకు మీరు అతిగా ఆపాదించుకోవద్దు. మీ కర్మలను దేవుని పాదాల వద్ద అర్పించండి. జనన మరణాల శాశ్వత చక్రం నుంచి విముక్తి పొందేందుకు, ముక్తి లేదా మోక్షాన్ని సాధించేందుకు ఇదే ఏకైక మార్గం.ఇదీ చదవండి: వీఐపీ కల్చర్‌కు దూరంగా.. రైలెక్కిన గవర్నర్ -
మూడ్ బాలేదా?.. మనసు విరిగిందా?.. ఏఐ జోలికి పోకూడదా?
ఏదైనా సందేహం వస్తే ఏఐని అడుగుతున్నారు.. ఎడాపెడా ఫోటోలు, వీడియోలు జనరేట్ చేసుకుంటున్నారు.. చివరికి మూడ్ బాగోలేకపోయినా తమ మనసులోని మాటలను ఏఐ చాట్‌బాట్ ముందు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు క్రమంగా పెరుగుతోంది. అయితే.. మనసు బరువుగా ఉన్నప్పుడు అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడటం కూడా అంత సింపుల్ విషయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషితో మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఆలోచిస్తాం. మన సమస్య చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో.. మనల్ని బలహీనంగా భావిస్తారో.. మన బాధను అర్థం చేసుకుంటారో లేదోనన్న సందేహం ఉంటుంది. ఏఐ విషయంలో మాత్రం అలాంటి సంకోచం ఉండదు. ఎప్పుడు మెసేజ్ చేసినా వెంటనే స్పందిస్తుంది. పైగా తీర్పు చెప్పడం లేదన్న భావన కలుగుతుంది. అందుకే బాధ, ఒంటరితనం, ఆందోళన వంటి విషయాలను కూడా ఏఐతో పంచుకోవడం కొందరికి సులభంగా మారుతోంది.యువతలో పెరుగుతున్న వినియోగంతాజాగా.. 12–21 ఏళ్ల వయసున్న వాళ్లపై నిర్వహించిన సర్వేలో ఈ ధోరణి ఎంతవరకు పెరిగిందో వెల్లడైంది. జామా పెడియాట్రిక్స్ (JAMA Pediatrics)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 2025లో 19.2 శాతం మంది మానసిక ఆరోగ్య సలహాల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగించారు. వీరిలో దాదాపు 43 శాతం మంది కనీసం నెలకోసారి ఏఐని ఆశ్రయించగా.. 5.8 శాతం మంది రోజూ లేదా దాదాపు ప్రతిరోజూ ఉపయోగించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏఐతో మానసిక ఆరోగ్యంపై మాట్లాడుతున్న విషయాన్ని దాదాపు మూడింట రెండొంతుల మంది మరెవరికీ చెప్పలేదు.సమస్య ఎక్కడ వస్తుంది?సాధారణంగా మూడ్ బాగోలేకపోయినప్పుడు ఏఐతో మాట్లాడటం వల్ల తప్పనిసరిగా హాని జరుగుతుందని చెప్పలేం. మానసిక ఆరోగ్యంపై సాధారణ సమాచారం తెలుసుకోవడం, రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొనే కొన్ని మార్గాలు తెలుసుకోవడం వంటి వాటికి ఏఐ ఉపయోగపడొచ్చు. కానీ పరిస్థితి తీవ్రమైనప్పుడు మాత్రం సమస్య మొదలవుతుంది.తీవ్రమైన నిస్సహాయత, నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు వంటి మానసిక సంక్షోభాల్లో ఏఐ ఇచ్చే స్పందనకు పరిమితులు ఉంటాయి. ఏఐ సానుభూతితో స్పందిస్తున్నట్లు అనిపించినా.. అది మనిషి భావోద్వేగ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేదు. అత్యవసర పరిస్థితిని గుర్తించి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం, అవసరమైన చికిత్స లేదంటే సహాయాన్ని వెంటనే అందించడం దాని వల్ల సాధ్యం కాదు.సానుభూతి మాత్రమే సరిపోదు!నిపుణుల ఆందోళనకు మరో కారణం ఉంది. ఇప్పటికే ప్రతికూల ఆలోచనల్లో చిక్కుకున్న వ్యక్తికి ఏఐ స్పందన ఎప్పుడూ సరైన దిశలోనే తీసుకెళ్తుందని హామీ లేదు. కొన్ని సందర్భాల్లో అది నిస్సహాయతను మరింత బలపరచడం, అదే విషయంపై పదేపదే ఆలోచించేలా చేయడం లేదా నిజ జీవితంలో సహాయం కోరడాన్ని ఆలస్యం చేయడం వంటి సమస్యలకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఏఐ వాడండి.. కానీ మనుషుల్ని మర్చిపోవద్దుమానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్యకు ఏఐ సమాధానం కాదు. స్నేహితుడు, కుటుంబ సభ్యుడు, కౌన్సిలర్ లేదంటే మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడటానికి అది ప్రత్యామ్నాయం కాదు. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు లేదా తీవ్రమైన మానసిక సంక్షోభం ఎదురైనప్పుడు ఏఐతోనే సంభాషణ కొనసాగించకుండా.. వెంటనే నమ్మకమైన వ్యక్తిని సంప్రదించడం, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.బోర్ కొడితే ఏఐతో మాట్లాడొచ్చు.. సందేహం వస్తే ఏఐని అడగొచ్చు. ఫొటోలు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనసు కుంగిపోయినప్పుడు మాత్రం ఏఐ ఒక్కటే మనకు తోడుగా మారకూడదు. కొన్ని సందర్భాల్లో ఒక మనిషి పలికే మాట.. ఏఐ ఇచ్చే వంద సమాధానాల కంటే విలువైనదై ఉండొచ్చు.ఇదీ చదవండి: బ్రష్ చేశాక కూడా దుర్వాసన వస్తోందా? అయితే.. -
మజిల్ పెయిన్‌కి అనంతాసనం
అనంతాసనం శరీర సమతుల్యత, కాళ్ల ఫ్లెక్సిబిలిటీకి సహాయపడే యోగాసనం. చేసే విధానం..ముందుగా యోగా మ్యాట్‌పై అమృతాసనంలో పడుకోవాలి. ∙నెమ్మదిగా ఎడమ వైపుకు తిరిగి, అనంత పద్మస్వామి మాదిరిలా ఎడమ చేతిని మడిచి, అరచేతిపై లేదా మోచేతి సహాయంతో తలను స΄ోర్ట్‌గా తీసుకోవాలి.రెండు కాళ్లను ఒకదా నిపై ఒకటి సూటిగా ఉంచాలి. ఇప్పుడు కుడి కాలును మోకాలు వంచకుండా నెమ్మదిగా పైకి ఎత్తాలి. కుడి చేతితో కుడి కాలి పెద్దవేలిని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. నెమ్మదిగా కాలును కిందకు తీసుకువచ్చి, తర్వాత మరో వైపుకు తిరిగి ఇదే విధంగా చేయాలి.ప్రారంభంలో 10–20 సెకన్లు మాత్రమే చేసి క్రమంగా సమయాన్ని పెంచవచ్చు.ప్రయోజనాలు.. కాళ్ల కండరాలను బలపరచడానికి సహాయపడుతుంది. ∙తొడలు, హిప్స్, మసిల్స్‌కు స్ట్రెంత్ ఇస్తుంది. ∙శరీర బ్యాలె¯Œ ్స, ఫ్లెక్సిబిలిటీ, హ్యామ్‌స్ట్రింగ్స్, తొడ కండరాలకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. జాగ్రత్తలు.. నడుము, మెడ లేదా భుజాలకు తీవ్రమైన నొప్పి ఉంటే జాగ్రత్తగా చేయాలి. ∙హిప్ గాయాలు ఉన్నవారికి ట్రైనర్ సూచన తప్పనిసరి.గర్భిణులు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అర్హత కలిగిన యోగా ట్రైనర్/వైద్య నిపుణుల సలహాతో చేయడం మంచిది. ముఖ్యంగా: యోగాలో ఆసనం ఎంత కష్టంగా చేస్తున్నామన్నది కాదు.. శరీరానికి నొప్పి లేకుండా, అవగాహనతో చేయడమే ముఖ్యం. అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
బ్రష్ చేసినా నోటి దుర్వాసనా?
నోటి దుర్వాసనకు.. చాలామంది సరిగ్గా బ్రష్ చేయకపోవడమే కారణమని అనుకుంటుంటారు. కానీ క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తున్నా సమస్య ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బ్రష్ చేసుకోవడంతో పాటు నాలుకను కూడా టంగ్ క్లీనర్‌తో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా నాలుకపై పేరుకుపోయిన ఆహార కణాలు, బ్యాక్టీరియా కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. టూత్‌బ్రష్ చేరుకోలేని ప్రదేశాల్లో ఆహార పదార్థాలు, ప్లాక్ పేరుకుపోవచ్చు. అందుకే రోజుకు కనీసం ఒక్కసారైనా ఇంటర్డెంటల్ బ్రష్‌తో పళ్లను శుభ్రం చేసుకోవాలి. నోటిలో లాలాజలం సహజంగా నోటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో నీరు తగ్గడం, కొన్ని మందుల వల్ల నోరు పోడిబారితే దుర్వాసన పెరగవచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయ, కారంగా ఉండే ఆహారం, కొన్ని పానీయాలు తాత్కాలికంగా నోటి వాసనను మార్చవచ్చు. కానీ తిన్న చాలా సేపటి తర్వాత కూడా దుర్వాసన కొనసాగితే.. జాగ్రత్తలు తీసుకోవాలి. -
పందుల బీచ్!
పిల్లలూ! బీచ్‌లకు వెళ్తే అక్కడ ఏం కనిపిస్తాయి? అందమైన ఇసుక తిన్నెలు, రంగురంగుల గవ్వలు, ఈత కొట్టే జనాలు కదా! కానీ గ్రీస్ దేశంలోని ‘అటోకోస్’ అనే ఒక చిన్న దీవికి వెళ్తే అక్కడ మీకు సరికొత్త టూరిస్టులు కనిపిస్తారు. వారే.. నల్లటి అడవి పందులు (Mediterranean Black Pigs). ఈ అటోకోస్ అనే ప్రైవేట్ దీవిలో మనుషులెవరూ నివసించరు. కానీ, ఇక్కడ బోలెడన్ని నల్లటి పందులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఈ పందులు మనుషులను చూసి అస్సలు భయపడవు, పైగా వాళ్లను ఏమీ అనవు. టూరిస్టులు సముద్రంలో ఈత కొడుతుంటే, ఈ బుజ్జిపందులు కూడా వాళ్లతో పాటు నీళ్లలోకి దిగి హ్యాపీగా ఈత కొట్టేస్తుంటాయి. బీచ్‌లో టూరిస్టుల పక్కనే దర్జాగా నిలబడి ఫొటోలకు ఫోజులు కూడా ఇస్తుంటాయి. దాంతో టూరిస్టులు ఇక్కడకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఈ పందులు సెలబ్రిటీలుగా మారి΄ోయాయి. -
గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి?
వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశమంతా గణనాథుని నామస్మరణతో మార్మోగిపోతుంది. అయితే మహారాష్ట్రలో ఈ పండుగకు మరో ప్రత్యేకత ఉంది. గణపయ్యను ఒక్కచోట దర్శించుకోవడం కాదు.. ఎనిమిది పవిత్ర క్షేత్రాల్లో ఎనిమిది విశిష్ట రూపాల్లో కొలువైన విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడమే ‘అష్టవినాయక యాత్ర’. స్వయంభూ గణేశులుగా భక్తులు విశ్వసించే ఈ ఎనిమిది ఆలయాలు.. ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎనిమిది క్షేత్రాలు మహారాష్ట్రలోని పుణె, రాయ్‌గఢ్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో ఉన్నాయి. గణేశ చతుర్థి సందర్భంగా ఈ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అసలు ఈ సంప్రదాయ అష్టవినాయక యాత్ర ఎక్కడ మొదలై.. ఎక్కడ ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.వినాయక చవితి వేళ మహారాష్ట్రలోని గణేశ ఆలయాలు భక్తులతో సందడిగా మారుతాయి. ముఖ్యంగా అష్టవినాయక యాత్రకు ఈ సమయంలో మరింత ప్రాధాన్యత ఉంది. సంప్రదాయంగా ఈ యాత్ర మొరగావ్ నుంచి ప్రారంభమై తిరిగి అక్కడే ముగుస్తుంది.1. మొరగావ్ మయూరేశ్వరుడుఅష్టవినాయక యాత్రలో మొరగావ్లోని శ్రీ మయూరేశ్వర ఆలయం తొలి, చివరి దర్శన స్థలంగా ఉంటుంది. ఇక్కడ గణేశుడిని మయూరేశ్వరుడు లేదా మృగమూర్తి రూపంలో పూజిస్తారు. ఈ రూపానికి వాహనం నెమలి అని చెబుతారు. మహారాష్ట్ర టూరిజం సమాచారం ప్రకారం.. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. అందుకే సంప్రదాయ యాత్రలో మొరగావ్ ప్రత్యేక ప్రారంభ, ముగింపు క్షేత్రంగా నిలుస్తుంది.2. సిద్ధటెక్ సిద్ధివినాయకుడుఅష్టవినాయక యాత్రలో తదుపరి ముఖ్యమైన క్షేత్రం సిద్ధటెక్లోని సిద్ధివినాయక ఆలయం. ఇక్కడ గణేశుడిని ‘సిద్ధివినాయకుడు’గా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయం పౌరాణిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందింది. అష్టవినాయక యాత్రలో భాగంగా ఈ క్షేత్రాన్ని దర్శించడం సంప్రదాయంలో ముఖ్యమైన అంశంగా భావిస్తారు.3. పాలి బల్లాళేశ్వరుడురాయ్గఢ్ జిల్లాలోని పాలి గ్రామంలో ఉన్న బల్లాళేశ్వర ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అష్టవినాయక ఆలయాల్లో గణేశుడి పేరుతో కాకుండా ఆయన భక్తుడైన బల్లాళుడి పేరుతో ఉన్న ఏకైక ఆలయం ఇదే. గణేశుడిపై బల్లాళుడికి ఉన్న భక్తితో ఈ ఆలయ కథ ముడిపడి ఉంది. అందువల్ల అష్టవినాయక క్షేత్రాల్లో బల్లాళేశ్వర ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది.4. మహడ్ వరదవినాయకుడురాయ్గఢ్ జిల్లాలోని మహడ్‌లో వరదవినాయక ఆలయం ఉంది. అష్టవినాయక యాత్రలో ఇది మరో ముఖ్యమైన మజిలీ. ఇక్కడ గణేశుడిని వరదవినాయక రూపంలో పూజిస్తారు. ఆనందం, సౌభాగ్యం, సమృద్ధి, మనశ్శాంతి కోసం భక్తులు ప్రధానంగా స్వామివారిని ప్రార్థిస్తారు. అష్టవినాయక సంప్రదాయంలోని ప్రముఖ గణేశ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి.5. థేవూర్ చింతామణిపుణె సమీపంలోని థేవూర్లో చింతామణి ఆలయం ఉంది. అష్టవినాయక యాత్రలో ఇది కూడా కీలకమైన క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంతో పాటు అధికమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర టూరిజం ప్రకారం.. మూళా, ముఠా, భీమా నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. దీంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది.6. లేణ్యాద్రి గిరిజాత్మజుడులేణ్యాద్రిలోని గిరిజాత్మజ ఆలయం ప్రత్యేక ఆరాధనా రూపానికి ప్రసిద్ధి చెందింది. అష్టవినాయక ఆలయాల్లో గణేశుడిని బాలరూపంలో పూజించే ఏకైక క్షేత్రంగా దీనికి గుర్తింపు ఉంది. పార్వతిదేవి తపస్సు అనంతరం గణేశుడు ఇక్కడ గిరిజాత్మజుడిగా ప్రత్యక్షమయ్యాడనే నమ్మకం ఉంది. ఈ కారణంగా అష్టవినాయక యాత్రలో గిరిజాత్మజ క్షేత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.7. ఓజర్ విఘ్నేశ్వరుడుఓజర్లోని విఘ్నేశ్వర గణపతి ఆలయం కూడా అష్టవినాయక యాత్రలోని ముఖ్యమైన క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం నిర్మాణశైలి, బంగారు విగ్రహాల కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణేశుడిని ‘విఘ్నేశ్వరుడు’గా, అంటే అడ్డంకులను తొలగించే స్వామిగా పూజిస్తారు. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.8. రంజన్‌గావ్ మహాగణపతిఅష్టవినాయక యాత్రలో ఎనిమిదో ప్రధాన ఆలయం రంజన్‌గావ్‌లోని మహాగణపతి ఆలయం. ఇది పుణెకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన కథ శివుడు, త్రిపురాసురుడి కథతో ముడిపడి ఉంది. ఇలా ఎనిమిది గణేశ క్షేత్రాల దర్శనంతో అష్టవినాయక యాత్ర పూర్తవుతుంది. గణేశ చతుర్థి సందర్భంగా ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. యాత్రకు వెళ్లాలని భావించేవారు దర్శన సమయాలు, స్థానిక రవాణా సదుపాయాలు, పండుగ సమయంలో అమల్లో ఉండే ప్రయాణ సంబంధిత సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని వెళ్లడం ఉత్తమం.ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి? -
ది టెంపుల్ గర్ల్
అమెజాన్, జె.పి. మోర్గాన్ వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీలలో అద్భుతమైన కార్పొరేట్ కెరీర్.. చేతినిండా జీతం, సమాజంలో ఉన్నతమైన హోదా. ఎవరికైనా ఇంతకన్నా కావాల్సిందేముంటుంది. కానీ ఆమెకు ఇవేవీ సంతృప్తినివ్వలేదు. కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన ఆలయాల చరిత్రను, ఆ కథలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. అయితే సమాజం, తన తోటి వారు హేళన చేసినా లెక్కచేయకుండా ముందుకు సాగారు. తక్కువ టైమ్‌లోనే ‘ది టెంపుల్ గర్ల్’గా పేరు తెచ్చుకున్నారు. అంతకుమించి లక్షలాది మంది మనసుదోచుకున్నారు. ఆమే నమ్రతా మోహన్.కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నమ్రతా మోహన్‌కు కార్పొరేట్ రంగంలో దాదాపు పద్నాలుగేళ్ల అనుభవం ఉంది. సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్, వాల్ట్ డిస్నీ వంటి అగ్రశ్రేణి మల్టీ నేషనల్ కంపెనీలలో నమ్రత కీలక బాధ్యతలు నిర్వహించారు. అమెజాన్ సంస్థలో అత్యున్నత హోదాలో పనిచేశారు. అలా కెరీర్ పరంగా నమ్రత ఎంతో విజయవంతమైనప్పటికీ, తన మనసులో ఎక్కడో ఏదో వెలితి ఉండేది. దాంతో ఎంతోమంది కలలుగనే కొలువునుంచి బైటికి వచ్చారు. దేవాలయాలను సందర్శించినపుడు తనకు కలిగిన సంతృప్తి, పరిపూర్ణత ఆమెకు ఆనందాన్నిచ్చాయి. అలా పెళ్లయిన తర్వాత తన భర్తతో కలిసి చేసిన పవిత్ర చార్ ధామ్ యాత్ర నమ్రత జీవితాన్ని మలుపు తిప్పింది. 12 ఏళ్లుగా తన భర్త సహకారంతో భారతదేశంలోని వందలాది పురాతన ఆలయాలను సందర్శించారు. అయితే, ఆ ఆలయాల వెనుక ఉన్న అసలైన చరిత్ర, శిల్పకళా చాతుర్యం, ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయత సాధారణ ప్రజలకు చేరడం లేదని ఆమె గ్రహించారు. దానివల్ల నేటి తరానికి ఆలయాలకు మధ్య దూరం పెరుగుతోందని భావించి.. ఆ గ్యాప్‌ని తగ్గించడమే ధ్యేయంగా గతేడాది మే నెలలో ఆమె చేస్తున్న అమెజాన్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పూర్తిగా ఆలయాల చరిత్రను, కథలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు. -
తారే జమీన్ పర్ ...స్టార్ చెస్ పర్...
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పిలుచుకునే స్టార్ ఆమిర్ ఖాన్. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల కలెక్షన్లు కూడా అందుకునేలా సినిమాలు తీసే వ్యూహాలు పన్నడంలో మాత్రమే కాదు చదరంగంలో ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులు వేయడంలోనూ దిట్టే. ఆయనకు చిన్నప్పటి నుంచీ చెస్ పట్ల అమితాసక్తి. ఇప్పటికీ తరచు ఆన్ లైన్ లో లేదా బహిరంగ ప్రదేశాల్లో చెస్ ఆటలో మునిగి తేలడం సహచరులకు కనిపిస్తుంటుంది. కారులో ప్రయాణిస్తూ, ల్యాప్‌టాప్‌లో చెస్ ఆడుతూ అలా ఆడుతూనే కారు దిగడం ద్వారా ఆయన కెమెరాలకు చిక్కి ఇటీవలే వార్తల్లో నిలిచారు కూడా. కారు దిగుతూ కూడా తన ల్యాప్‌టాప్‌లో ఎత్తులు పైఎత్తులు వేస్తూ చెస్ ఆడుతున్న ఆమిర్ వీడియో వైరల్‌గా మారి అభిమానుల్ని అలరించింది.అమ్మమ్మే ఆది గురువు...ఈ లగాన్ స్టార్‌కు చిన్నతనంలోనే చదరంగంలో ఆయన అమ్మమ్మ ఆదిగురువుగా మారి చెస్ నేర్పించారు, అప్పటి నుంచీ అది ఆయన జీవిత కాలపు అభిరుచిగా మారింది. ఆయన తరచు తనను తాను ఒక ఔత్సాహిక (అమెచ్యూర్) ఆటగాడిగా చెప్పుకుంటారు.. అయితే ఆ ఆట పట్ల అంకితభావంతోపాటు తగిన నైపుణ్యం కూడా ఆయనకు ఉందని సన్నిహితులు, ఆయనతో చెస్ ఆడినవారు చెబుతుంటారు. గ్రాండ్ మాస్టర్‌తో... బాలీవుడ్ స్టార్...లక్షలాది అభిమానులను కలిగి ఉన్న ఈ బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్, తాను మాత్రం చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు వీరాభిమానిగా చెప్పుకుంటారు. అంతేకాదు వీరిద్దరూ గత కొన్నేళ్లుగా కలుస్తూ, సరదాగా చెస్ మ్యాచ్‌లు కూడా ఆడుతుంటారు. ఆమిర్ ఒక చదరంగం ఆటకు అసలు సిసలైన అభిమాని అని, సిసలైన ఆటగాడిలాగా ఆటలో రక్షణ వ్యూహాల గురించి కూడా తనతో చర్చిస్తుంటారని ఆనంద్ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. భిన్నరంగాల ప్రముఖులతో బాలీవుడ్ స్టార్స్‌కు రకరకాల అనుబంధాలు ఉండొచ్చు గానీ చెస్ ఆడటమే ఆమిర్ అనుబంధంగా చెప్పొచ్చు. ప్రముఖులతో చెస్ ఆడడం తనకు ఇష్టమని ఆమిర్ అంటారు. బాలీవుడ్ అందాల నటి కత్రినాకైఫ్‌తో అనేకసార్లు చెస్‌లో పోటీ పడిన అమీర్... ఆమె చాలా బాగా ఆడతారని ప్రశంసిస్తారు. అలాగే హాస్యనటుడు సమయ్ రైనాతో ఆడిన ఒక సరదా మ్యాచ్ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తారు. అంతేకాకుండా, ఆయన తన షూటింగ్ సిబ్బంది, సెట్లో అందుబాటులో ఉన్న యువతీ యువకులతో సైతం కళ్లకు గంతలు కట్టుకుని మరీ చెస్ ఆడటం విశేషం.డ్రమ్... మరో సరదా...తన సినిమా ‘పీప్లీ లైవ్’ సంగీత ఆవిష్కరణ కార్యక్రమంలో డ్రమ్మర్‌గా కనిపించిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన చిన్ననాటి కల నిజమైందని పేర్కొన్నారు. ఆ సందర్భంగా ‘ఇండియన్ ఓషన్’ బ్యాండ్‌కు చెందిన డ్రమ్మర్ అమిత్ కిలామ్, తమ పాటలను ప్రదర్శిస్తున్నప్పుడు ‘‘నాకు డ్రమ్స్ వాయించడం బోర్ కొట్టింది, మా కోసం ఆమిర్ ఖాన్ వచ్చి డ్రమ్స్ వాయించాలి’’ అని అనౌన్స్ చేశాడు. ఏమాత్రం ఆలోచించలేదు ఆమిర్. వెంటనే వేదికపైకి వెళ్ళి డ్రమ్స్ వాయించాడు. కరణ్ జోహార్, అశుతోష్ గోవారికర్, రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా, ప్రసూన్ జోషి, రాజ్‌కుమార్ హిరాణి, రాణి ముఖర్జీ, అతుల్ కులకర్ణి, రోనీ స్క్రూవాలా వంటి బాలీవుడ్ ప్రముఖులు, అతిథులను ఆమిర్ కచేరీ అమితంగా అలరించింది. – సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
బంగారు పతకం తెస్తా.. నాన్నకు బహుమతిగా ఇస్తా...
పట్టుదల ఉండాలే కాని సాధించలేనిదంటూ ఏదీ లేదని మరోసారి రుజువైంది. భారతీయ అథ్లెటిక్స్‌లో ఒక ఆటోరిక్షా డ్రైవర్ కూతురు సత్తా చాటింది. ఢిల్లీలో గురువారం జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ ఫైనల్స్ సీరిస్‌లో నిర్వహించిన లాంగ్ జంప్ పోటీలో కేరళకి చెందిన యాన్సీ సోజన్ (Ancy Sojan) తొలిస్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఆసియా క్రీడలకు ముందు ఇదే నాకు చివరి కాంపిటీషన్. జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే నా లక్ష్యం. నన్ను ఎవరూ ప్రోత్సహించలేదు. చాలామంది నువ్వు ఏమీ సాధించలేవన్నట్టు మాట్లాడేవారు. మా నాన్న ఒక ఆటోడ్రైవర్. ఆయన కూడా మన పేరు మీద ఏ రికార్డ్ లేదమ్మా అన్నాడు. అందుకే నేను గెలిచి తీరతాను... మా నాన్నకి గోల్డ్ మెడల్ని బహుమతిగా ఇస్తా’ అంటున్న యాన్సీ మనసు బంగారం కదా.ఏడవ తరగతి నుంచే...కేరళలలోని త్రిశూర్ జిల్లాలో ఉన్న తీర ప్రాంతం నట్టిక గ్రామమే యాన్సీ స్వస్థలం. ఆమె 2001, మార్చి1 జన్మించింది. యాన్సీ తండ్రి సోజన్ ఒక ఆటో రిక్షా డ్రైవర్, ఆమె తల్లి జాన్సీ కూడా అథ్లెట్. ఆమెకి క్రీడా నేపథ్యం ఉంది. ఏడో తరగతి నుంచే యాన్సీకి క్రీడల్లో శిక్షణ ఇప్పించారు. మొదట 100 మీ. 200మీ. స్ప్రింట్ చేసేది. కానీ తరచూ గాయాలవుతుండడం, అవసరమైన చికిత్స, పోషకాహారానికి ఆర్థికంగా స్థోమత లేకపోవడం వల్ల లాంగ్ జంప్‌పై దృష్టి పెట్టింది. 2019లో తొలిసారి జాతీయ స్థాయిలో యాన్సీ లాంగ్ జంప్ రికార్డ్ సాధించింది. 2022 ఆసియా క్రీడల్లో రజతం గెలిచి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత 2025లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది. 2026 మేలో ఫెడరేషన్ కప్‌లో 6.75 మీటర్ల దూరం దూకి వ్యక్తిగత అత్యుత్తమ దూరాన్ని నమోదు చేసింది. త్వరలోనే జపాన్‌లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధపడుతోంది. -
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? ఈ అలవాటు ప్రమాదమే!
ఉదయం నిద్ర లేవగానే తెలియకుండానే ఫోన్ వైపు చెయ్యి చాచడం ఈ రోజుల్లో అందరికీ ఒక అలవాటుగా మారిపోయింది. కేవలం అలారమ్ ఆపడం కోసమే ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పటికీ! ఆ తర్వాత తెలియకుండానే సోషల్ మీడియా స్క్రోలింగ్‌లో మునిగిపోతున్నాం. దీనివల్ల అసలు రోజేప్రారంభం కాకముందే, మనస్సు రకరకాల ఆలోచనలతో నిండిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఫోన్‌కే మొదటిప్రాధాన్యత ఇవ్వడం వల్ల, మన రోజు ఒక నెగెటివ్ ఆలోచనలు, బలహీనమైన మానసిక స్థితితోప్రారంభమవుతోందట.మంచం దిగకముందే ఫోన్ చూడటం వల్ల మన మానసిక శక్తి తగ్గిపోతుందట. అంతేకాదు, ఆ రోజంతా మనం ఏ పని సరిగ్గా చేయలేమని పరిశోధకులు చెబుతున్నారు. మనం నిద్రలేవగానే ఒక్కసారిగా వచ్చే సందేశాలు, ఈ మెయిల్లు, సోషల్ మీడియా అప్డేట్లను చూడటం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.ఫోన్ చూసే ముందు నీళ్లు తాగడం, బాడీ స్ట్రెచింగ్, ఆ రోజు పనులను ప్రణాళిక బద్ధంగా చేసుకోవడం వంటి వాటి కోసం ప్రతిరోజూ ఉదయం కేవలం 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఫోన్‌కి బదులు అలారం ఉపయోగిస్తే క్రమంగా మొబైల్ మీద ఆధారపడే అలవాటు తగ్గుతుందని చెబుతున్నారు.ఇవీ చదవండి: ‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’ -
‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’
‘‘నీకో విషయం చెప్పాలి.. కానీ ఎవరికీ చెప్పకూడదు!’’ ఇలాంటి మాట వినగానే చాలామందికి ఆసక్తి పెరిగిపోతుంది. స్నేహితుల మధ్యైనా, ఆఫీసులోనైనా, కుటుంబంలోనైనా.. మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడటం రోజువారీ మాటల్లో ఒక భాగమైపోయింది. అయితే దానిని వెంటనే ‘గాసిప్’ అంటూ చెడ్డ అలవాటుగా ముద్ర వేస్తాం. కానీ శాస్త్రవేత్తలు మాత్రం గాసిప్‌ను అంత సులభంగా చెడ్డదిగా చూడటం లేదు. గాసిప్ అనేది మనుషుల సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన ΄ాత్ర పోషించే సాధనం కూడా కావచ్చని అంటున్నారు.గాసిప్ అంటే సాధారణంగా మనం మన దగ్గర లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం అని అనుకుంటాం.. కానీ ఇతరుల వ్యక్తిగత విషయాలు, నిర్ధారణ లేని వార్తలు, ఇతరుల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా వ్యాప్తి చేసే సంభాషణలను కూడా గాసిప్ అంటారు.ఎందుకంత కుతూహలం!చాడీలు, రూమర్లు అనేవి కొత్తగా వచ్చిన అలవాటేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఇతరుల గురించి తెలుసుకోవడం, ఎవరు నమ్మదగినవారు? ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎవరి మాట నమ్మాలి? వంటి విషయాలు తెలుసుకోవడం సహజంగానే సాగుతుంటుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకరి గురించి సమాచారాన్ని పంచుకుని, ఇతరులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం ఒక రకమైన ఉపయోగం కావచ్చు. అదే సమయంలో, ఎలాంటి ప్రయోజనం లేకుండా ఒకరిని బ్లేమ్ చేసేందుకు అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం హానికరమైన గాసిప్‌గా మారుతుంది.ఆఫీసుల్లోనూ గాసిప్స్‘ఆఫీసులో గాసిప్ చేయకూడదు’ అని ఎన్ని నియమాలు పెట్టినా.. ఉద్యోగుల మధ్య అనధికారిక చర్చలు ఉండటం సహజం. ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? వంటి సమాచారాన్ని ఉద్యోగులు పరస్పరం పంచుకుంటుంటారు. ఇలాంటి సమాచారం కొన్నిసార్లు సహకారాన్ని పెంచవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లోనూ పడేయవచ్చు. అనుమానాలు సృష్టించడం, నమ్మకాన్ని కోల్పోయేలా చేయడం, సంబంధాలను దెబ్బతీయడం మాత్రమే ఉద్దేశమైతే.. అది హానికరమైనదే.గాసిప్ అనేది జీవితంలో ఒక భాగమే అయినప్పటికీ.. పరిశోధనలు సూచించేది ఏమిటంటే.. గాసిప్ ఉందా లేదా అన్నది కంటే, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. మంచి గాసిప్ సమాచారం ఇవ్వొచ్చు.. స్నేహాన్ని బలపరచొచ్చు.. అవసరమైనప్పుడు ఇతరులను జాగ్రత్తపరచొచ్చు. కానీ అవే గాసిప్స్ ఒక్కోసారి సంబంధాలను దెబ్బతీయొచ్చు.. నమ్మకాన్ని కోల్పోయేలా చేయొచ్చు.. నష్టం కలిగించవచ్చు.– నిర్వహణ: రమా జంబులఇవి కూడా చదవండి: ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం -
ఆరోగ్యకరమైన నేలే మనిషి ఆరోగ్యానికి మూలం
నీరు, గాలి, వాతావరణ నాణ్యత క్షీణించడానికి నిస్సారమైన మట్టి దారితీస్తుంది. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల మొక్కలు, జంతు వులు, మానవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. నేల స్వయంగా ఒక జీవ వ్యవస్థ. అలాగే ఇతర జీవరాశులకు ఆధారభూతమైనది కూడా. నేల, మొక్కలు, జంతువులు, మానవులు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివడి విడదీయలేని ‘ఏకైక ఆరోగ్యం’ (వన్ హెల్త్)గా ఉంటాయి.‘ఆరోగ్యమైన నేల– ఆరోగ్యమైన మొక్క– ఆరోగ్యమైన జంతువు– ఆరోగ్యమైన మనిషి’ అనే భావనే వన్ హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యా వరణం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ నాలుగు ఆరో గ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ‘ఏకైక ఆరోగ్యం’ భావనను, భారతదేశంలో జరిగిన జీ–20 సమావేశాలలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక టీ స్పూన్ ఆరోగ్యకరమైన నేలలో కోట్ల నుండి వందల కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి.వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగి), యాక్టినోమైసెట్స్, ప్రోటో జోవా, నులిపురుగులు (నీమటోడ్లు), వానపాములు వంటి జీవులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మజీవులు, నేల జీవులు కలిసి సేంద్రియ పదార్థాలను కుళ్లించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేలలో ఉండే ఖనిజాలు (జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటివి) మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడి ధాన్యాలు, కూర గాయలు, పండ్లు ఇతర ఆహార పంటలలో నిల్వ అవుతాయి. ఈ పంటలను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి అందుతాయి. ‘నేలలో పోష కాలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం పోషకవంతంగా ఉంటుంది; ఆహారం పోషకవంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.’నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులుసేంద్రియ పదార్థాల వినియోగం నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, బయోచార్ వంటి సేంద్రియ పదార్థాలు నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి, మొక్కలకు అవసరమైన పోషకాలను క్రమంగా అందుబాటులోకి తీసుకు వస్తాయి. పంటల మార్పిడి మరో పద్ధతి. ఒకే భూమిలో ఒకే పంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో సాగు చేయాలి. పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము, కంది, అలసంద వంటివాటి వేర్లపై ఉండే రైజోబియం అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి, మొక్కలు ఉపయోగించుకునే రూపంలో నేలలో స్థిరీకరిస్తాయి. మరీ ముఖ్యంగా పంట అవశే షాలను కాల్చకూడదు. కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పోష కాలు నష్టపోతాయి. పంట అవశేషాలను మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి, కలుపు మొక్కల పెరుగు దల తగ్గుతుంది. అవసరానికి మించి తరచుగా దుక్కి దున్నడం వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతింటుంది. నేలలో నిల్వ ఉన్న సేంద్రియ కార్బన్ వేగంగా విచ్ఛిన్నమైపోతుంది. అతి దుక్కిని నివారించాలి.‘ఏకైక ఆరోగ్యం’ భావన విజయవంతం కావడంలో రైతు పాత్ర కీలకం. రైతు అనుసరించే వ్యవసాయ పద్ధతులే నేల, మొక్కలు, పశువులు, పర్యావరణం, చివరకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రైతు పొలం దిగుబడికే కాదు, సమాజ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు భవిష్యత్ తరాలకు చేసే గొప్ప పెట్టుబడి.– డా. కె. తేజస్వరరావు, డా, ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, డా. బి. సహదేవ రెడ్డి, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు -
పాండురాజుకు ఆ శాపం ఎందుకు వచ్చింది?
పాండురాజుకు మృగవధ వలన శాపం తగిలింది. ‘ఎవరికీ అపకారం చేయక, ప్రకృతి సహజమైన సుఖాన్ని పొందుతున్న సమయంలో, విచక్షణా రహితంగా మమ్ములను బాణహతికి గురిచేసావు. కాబట్టి నీవు కూడా నీ చివరి క్షణాలలో మావంటి బాధనే అనుభవించి మరణిస్తావు!’ అని శపించింది ఆ మృగమిథునం.మృగమిథునం పాండురాజుకు ఇచ్చిన ఈ శాపంతో మహాభారత కథ రెండవ అతిపెద్ద మలుపు తిరిగింది. శంతనుడి రెండవ భార్య అయిన సత్యవతికి పుట్టిన ఇద్దరు కొడుకులు– చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు– పుత్రహీనులుగా మరణించగా, వారి భార్యలైన అంబిక, అంబాలికలకు, దేవరన్యాయం పద్ధతిన వ్యాసమహర్షి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు సంతానంగా కలగడం అన్నది మహాభారత కథలోఅంతకు ముందు చోటుచేసుకున్న మొదటి ముఖ్యమైన మలుపు.అయితే ఆ ముగ్గరిలో రాజు కాగలిగి, రాజ్యాధికారం చేపట్టగలిగిన లక్షణాలున్న పాండురాజుకు, మృగమిథున శాపం తగిలి, తన భార్యలైన కుంతి, మాద్రిల ద్వారా తన సంతానాన్ని నేరుగా కురువంశానికి అందించలేకపోవడం అన్న విచిత్ర స్థితి దాపురించి, తన అంశతో సంతానాన్ని ఇవ్వగలగడం అన్నది విధివశాన లేకుండాపోయింది.క. ఎట్టి విశిష్ట కులంబునబుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్గట్టిన కర్మఫలంబులునెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్?‘పూర్వం చేసిన దుష్కర్మల ఫలం వెంటాడుతుంది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, వివేకవంతుడైనప్పటికీ, అతడిని కొన్ని క్షణాలు విచక్షణను పోగొట్టుకునేలా చేసి, పాపకార్యం మళ్ళీ చేసేలా అది చేస్తుంది. అలా సంక్రమించిన పాపకార్య ఫలం ఒక జన్మలో కాకుంటే, ఆ తరువాత మరొక జన్మలో భోగింపక– అనగా అనుభవించకుండా తప్పించుకోవడం ఎంతటి వానికైనా సాధ్యంకాదు’ అని పై సందర్భానికి అనుగుణంగా నన్నయ భట్టారకుడు ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వంలో సర్వకాలీనమైన ఆధ్యాత్మిక సత్యాన్ని సూక్తీకరించి చెప్పాడు.– భట్టు వెంకటరావు -
బస్సు ప్రయాణాల యాత్రా కుటుంబం
వాట్సాప్‌లో ఒకరు మెసేజ్ పెడతారు. ‘ఈ శనివారం చెక్కేద్దామా?’ ఎక్కడికి వెళ్లాలో చెప్తారు. ఖర్చు అంతా కలిపితే ఆరేడు వందలు. 300 మంది సభ్యులున్న వాట్సాప్ గ్రూపు ‘యాత్రా కుటుంబం’లో కనీసం 120 మంది ‘రెడీ’ అంటారు. రెండు బస్సులు మాట్లాడతారు. ఇంకేముంది... అక్క.. అమ్మ... పిన్నీ అంటూ అదొక కుటుంబంగా మారిపోయి ప్రయాణం కడతారు. కేరళ ఆర్టీసీ బడ్జెట్ యాత్రలు కేరళలో అపరిచితులను కుటుంబాలుగా మారుస్తున్నాయి. ఈ సరికొత్త ‘ట్రావెల్ ఫ్యామిలీ’ ట్రెండ్ గురించి...‘మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాల’ అనంటాడు రావు గోపాలరావు ఏదో సినిమాలో. చూడబోతే ఈ డైలాగుకు న్యాయం చేసే వాళ్లు కేరళలో మెండుగా ఉన్నట్టున్నారు. ఇంట్లో ముక్కిపోవడం కంటే తక్కువ ఖర్చులో పర్యటనలు చేస్తూ ప్రకృతిని చూసి పులకిస్తూ.... ఎవరికీ ఎవరూ పట్టని ఈ రోజుల్లో ఈ వంకన కొత్త బంధువులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. తిరువనంతపురంలో రెండేళ్ల క్రితం మొదలైన ఒక యాత్ర 300 మందిని ‘యాత్రా కుటుంబం’గా మార్చేసింది.సన్నివేశం: ఒక ఆదివారం ఉదయం. కేరళలోని వాయనాడ్ వెళ్లే ప్రభుత్వ బస్సు సీట్ నెంబర్ 12లో కూర్చుని ఉన్న మేరీకుట్టికి బెరుగ్గా ఉంది. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడటంతో, ఇంట్లోని నాలుగు గోడల మధ్యే ఆమె ప్రపంచం ఆగిపోయింది. కాని ఆ రోజు మొదటిసారి ఒంటరిగా బస్సెక్కింది. చుట్టూ ఉన్నవాళ్లంతా ముక్కుమొహం తెలియనివారు. ఏం మాట్లాడాలో తెలియదు. కానీ, ప్రయాణం మొదలయ్యాక పక్క సీటామె ‘కొంచెం ఉ΄్మా తింటావా అక్కా’ అని తన బాక్సు తెరిచింది. ఆ ఒక్క మాటతో ముఖం తెలియని అపరిచితుల మధ్య మాటల వంతెన పడింది.... అన్నీ ఇలాంటి బంధాలే ఈ ‘యాత్రా కుటుంబం’లో.ఇలా మొదలైంది: టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చే కేరళ ప్రభుత్వం స్థానికులు కూడా పర్యటనలు చేసేలా ఆర్టీసీ కింద ‘బడ్జెట్ టూరిజం సెల్’ను ఏర్పాటు చేసింది. తక్కువ ఖర్చులో బస్సు మాట్లాడుకుని తిరిగే ఏర్పాటు అది. బడ్జెట్ టూరిజం సెల్ నుంచి ఒక కోఆర్డినేటర్ తోడు వచ్చి యాత్రను సులువు చేస్తాడు. రెండేళ్ల క్రితం తిరువనంతపురం బస్టాండ్ నుంచి రెండు బస్సులు అలా అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలోని బోనాకాడ్ కొండ ప్రాంతానికి బయలుదేరాయి. దానిలో ఉన్నదంతా 60లు దాటిన స్త్రీలు. రిటైర్డ్ ఉద్యోగులు. తక్కువ ఖర్చుతో చేసిన ఆ యాత్ర సాయంత్రం వరకూ వారికి ఎంతో ఆనందం పంచింది. కోఆర్డినేటర్‌గా వచ్చిన బస్సు కండక్టర్ సజిత్ తిరుగు ప్రయాణంలో ‘మీరంతా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఇలా ప్రయాణాలు చేయొచ్చు’ అని సలహా ఇచ్చాడు. అలా పుట్టిందే ‘యాత్ర కుటుంబం’. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ కుటుంబంలో 300 మంది సభ్యులయ్యారు. ప్రతి వీకెండ్ ప్రయాణాలు చేస్తున్నారు. మొన్న తిరువనంతపురంలోని మేయంకడవు నది ఒడ్డున వీరంతా ఓనం పండుగ జరుపుకున్నారు. 60 మంది మహిళలు, వృద్ధులు కలిసి పడవ ప్రయాణం చేస్తూ, పాటలు పాడుకుంటూ, క్యాంప్‌ఫైర్ వేసుకుని నవ్వులతో రాత్రి గడిపారు. మొన్నటివరకు ఒంటరితనంతో బాధపడిన మేరీకుట్టి ఇప్పుడు ఆ గ్రూప్‌లో అందరికంటే హుషారుగా డాన్స్ చేస్తోంది.పురలిమల కొండల్లో వెన్నెల రాత్రులు! ఈ గ్రూప్ చేసే ప్రయాణాలు రొటీన్ టూరిస్ట్ ప్లేస్లలాగా అస్సలు ఉండవు. ‘యాత్ర కుటుంబం’ సభ్యుల్లో లోకల్ గైడ్స్ ఉండటంతో ఎవరికీ తెలియని అత్యంత సుందరమైన ఆఫ్–బీట్ లొకేషన్లను ఎంచుకుంటారు. దట్టమైన అడవుల మధ్య ఉండే ‘బొనాకాడు’ బేస్ క్యాంప్ కొండలు, తెల్లటి పాలధారల్లా జారే ‘కుంభవురుట్టి’ జలపాతాలు, అచ్చన్ కోవిల్ నదీ తీరాలు వీరి సొంతం. మొన్నటి ఓనం వేడుకల్లో నదీ తీరాన క్యాంప్‌ఫైర్ వేసుకుని వీరంతా కూర్చున్నప్పుడు.. పురలిమల కొండల వెనుక నుండి నిండు చందమామ పైకి వస్తుంటే అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. ఆ క్షణంలో వారి కళ్లలో కనిపించిన ఆనందం వందల కోట్ల ఆస్తి ఉన్నా దొరకనిది! అమాయక గిరిజన పల్లెల్లో, చారిత్రాత్మక పునలూరు తూగు వంతెనల మీద వీరు వేసే అడుగులు చూస్తుంటే... ‘మనం కూడా ఇలాంటి గ్రూప్ కడితే బాగుంటుంది కదా’ అనే ఆశ పుడుతుంది.వయసుతో పనేముంది? ఈ గ్రూప్‌లో ఉన్నవారంతా రిటైర్డ్ ఉద్యోగులు, ఒంటరిగా ఉండే గృహిణులే. మామూలుగా అయితే అయినవాళ్లు వీళ్లని ‘ఇంట్లో విశ్రాంతి తీసుకోండి’ అని కదలకుండా చూస్తారు. కానీ, వీరు మాత్రం ‘మా సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది’ అంటూ రోడ్డు ఎక్కారు. అన్నట్టు ఈ సెప్టెంబర్ 12న పెప్పరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని ఒక గిరిజన గ్రామానికి, అలాగే సెప్టెంబర్ 25న చొక్రముడి కొండలపై వికసించే ‘నీలకురింజి’ పూల అందాలను చూడటానికీ వీరంతా బస్సెక్కి ప్రయాణం చేయబోతున్నారు.వీరు ఆగేలా లేరు. ఏమంటే ప్రయాణమే ఒక జీవితం, అందులో దొరికే స్నేహాలే అమృతం! -
ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం
అక్షర జ్ఞానం లేని వారి నుంచి పెద్ద చదువులు చదువుకున్న వారి వరకు... మనలో చాలామందికి అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స గురించి అవగాహన అంతంత మాత్రమే! పూర్తిగా వైద్యులపైనే ఆధారపడే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక వైద్యజ్ఞానం ఎప్పటికీ అవసరమే’ అని నాటినుంచి నేటి వరకు ఎన్నో తరాలకు గుర్తు చేస్తోంది ‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ పుస్తకం.‘వైద్యుడు లేని చోట’ (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ) పేరుతో తెలుగు పాఠకులను కూడా పలకరించింది. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ఆ పుస్తకం గురించి మరోసారి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ప్రథమ చికిత్స గురించి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ, కిట్స్ ఇస్తున్న ‘ఎమర్ రెడీ’ స్వచ్ఛంద సంస్థ గురించి ఒకసారి...‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మాన్యువల్. మెక్సికోలో తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా డేవిడ్ వెర్నర్ 1970లో స్పానిష్ భాషలో రాసిన పుస్తకం... డోండే నో హే డాక్టర్. ఈ పుస్తకం వందకు పైగా భాషల్లోనికి అనువాదం అయింది. జీవశాస్త్రవేత్త అయిన వెర్నర్, మెక్సికోలోని గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల ఆరోగ్యం గురించి చాలా కాలం పనిచేశారు. ఎన్నో దేశాలలో ‘మార్పు కోసం ఆరోగ్య విద్య’ అనే అంశంపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కాలిఫోర్నియాలో ‘హెల్త్ రైట్స్’ సంస్థ కో–ఫౌండర్‌గా, బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్‌లో అసోసియెట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు వెర్నర్.ఎన్నో చిట్కాలు!‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ పుస్తకం అతిసారం నుంచి మలేరియా వరకు ఎన్నో విషయాలను ప్రస్తావించింది. పరిశుభ్రత ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన ఆహారం, ఇంటి చిట్కాలు, ఇంటి చిట్కాలు పనిచేస్తాయో లేదో తెలుసుకునే మార్గాలు, టీకాల ప్రాధాన్యత, అనారోగ్యానికి కారణమయ్యే నమ్మకాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నమ్మకాలు, మేలు చేసే ఔషధ మొక్కలు, తరచుగా గందరగోళానికి గురిచేసే అనారోగ్య సమస్యలు, అంటువ్యాధి కాని వ్యాధులు, థర్మామీటర్‌ను ఎలా ఉపయోగించాలి? అనారోగ్యంతో ఉన్నవారిని ఎలా చూసుకోవాలి, ప్రమాదకరమైన అనారోగ్య లక్షణాలు, వైద్యసహాయం ఎప్పుడు, ఎలా పొందాలి, మందులు లేకుండా చికిత్స చేసుకోవడం, నీటితో చికిత్స, మందుల వాడకానికి మార్గదర్శకాలు... ఇలా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.స్పష్టంగా, సంక్షిప్తంగా, సులభంగా...స్పష్టమైన, సంక్షిప్త సమాచారం ఈ పుస్తకం బలం. కామిక్ పుస్తకంలా చదవడానికి సులభంగా ఉంటుంది. ప్రాథమిక వైద్యానికి సంబంధించి మీ నైపుణ్యం తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పటికీ మీ పరిమితులకు లోబడి పనిచేస్తే మంచి ఫలితాలు అందుతాయి. ఏం చేయలి, ఏం చేయకూడదు, అనేదానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకండి. ఏమీ చేయకపోతే ప్రమాదం ఉందని అనిపించినప్పుడు మాత్రం మీకు గట్టిగా నమ్మకం ఉన్న పద్ధతిని అనుసరించడానికి వెనకాడకండి’ అంటుంది ఈ పుస్తకం.ఎమర్జెన్సీలో ఎమర్ రెడీమూడు సంవత్సరాల క్రితం... ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతున్న ఒక వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ప్రచేతస్ యెరి అనే యువకుడు సహాయం కోసం కేకలు వేశాడు. 30 నిమిషాలకుగానీ అంబులెన్స్ రాలేదు. ఈ సంఘటన అతడిని ఒక వాస్తవాన్ని అర్థం చేసుకునేలా చేసింది. చాలామందికి అత్యవసర పరిస్థితులలో ఏంచేయాలో, ఏం చే యకూడదో తెలియదు. చాటా టెన్షన్ పడుతుంటారు. స్పృహ కోల్పోయిన వారికి చికిత్స చేయడం, సీపీఆర్, ఊపిరాడనప్పుడు సహాయం చేయడంలాంటి ప్రాథమిక చికిత్స పరిజ్ఞానం చాలామందిలో ఉండడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక చికిత్స పరిజ్ఞానాన్ని అందించే ‘ఎమర్ రెడీ’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టాడు ప్రచేతస్. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది.శిక్షణ తరగతులలో...‘పేద పిల్లలు అత్యవసర పరిస్థితులలో భయాందోళనలకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండేలా చేయడమే ఎమర్‌రెడీ లక్ష్యం’ అంటున్నాడు ప్రచేతస్. ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఎమర్‌రెడీ. కథలు చెప్పడం నుంచి వీడియోలు ప్రదర్శించడం వరకు ఆసక్తికరమైన పద్దతులలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఎమర్‌రెడీ ఇంటరాక్టివ్ లెర్నింగ్ విధానానికి మంచి స్పందన వచ్చింది. గాయాలు, ఎముకలు విరగడం, స్పృహ కోల్పోవడం, పాము, తేలు కాటు... మొదలైన సందర్భాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి శిక్షణ తరగతులలో వివరిస్తారు. భాషా అవరోధాలను అధిగమించడానికి ప్రాంతీయ భాషలలో శిక్షణ ఇస్తున్నారు.పాఠ్యాంశాలలో ప్రథమ చికిత్సబ్యాక్΄్యాక్లలో ఇమిడిపోయేంత చిన్నగా ఉండే, పదునైన వస్తువులు లేని, సురక్షితమైన కాంపాక్ట్ ప్రథమ చికిత్స కిట్లను పిల్లలకు ఇస్తారు. వీటిని పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ కిట్లు ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడాయని ఉపాధ్యాయులు తెలియజేశారు. చిన్న అడుగులతో మొదలైన ‘ఎమర్‌రెడీ’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. ఐక్యరాజ్య సమితి ‘యూత్ యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రచేతస్ పాఠశాలల పాఠ్యాంశాలలో ప్రథమచికిత్సను తప్పనిసరి పాఠంగా చేర్చాలనే సూచించాడు.భవిష్యత్ ప్రణాళికస్పృహ కోల్పోవడం, ఊపిరాడక పోవడం...ఇలాంటి పరిస్థితిలో సరైన సమయంలో ప్రాథమిక చికిత్స అందకపోవడం వల్ల ప్రాణహాని జరుగుతుంది. ‘అత్యవసర పరిస్థితులలో పిల్లలే ఆపద్భాందవులు. వైద్యుల సహాయం అందేలోపు బాధితులకు ప్రాణహాని తలెత్తకుండా చూడగలరు’ అంటుంది ఎమర్‌రెడీ.‘ఎమర్ రెడీ’కి స్పష్టమైన భవిష్యత్ ప్రణాళిక ఉంది. దీని ప్రకారం... దేశవ్యాప్తంగా పాఠశాలలో ‘ఎమర్‌రెడీ’ కార్యక్రమాలను విస్తరించడం ఆన్లైన్లో సెల్ఫ్–గైడెడ్ వీడియో ట్రైనింగ్ మాడ్యూల్స్ ప్రారంభించడం సెల్ఫ్–సస్టెయినింగ్ వాలంటీర్ నెట్‌వర్క్‌ను నిర్మించడం వంటివి ఇందులోని అంశాలు. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్ ఫ్లూ జ్వరాలు
ఇటీవల తెలుగురాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) జ్వరం స్వైరవిహారం చేస్తోంది. పెద్దఎత్తున ప్రజలు దీని బారిన పడుతున్నారు. అయితే ఇవేమీ కొత్త జ్వరాలు కావు. దాదాపు ప్రతి ఏడాదీ వస్తూ ఉండే సీజనల్ జ్వరాలుగానే చెప్పవచ్చు. కాకపోతే ఇవి వైరస్ వల్ల వచ్చే జ్వరాలు కావడంతో ప్రతి ఏడాదీ... ఇన్ఫ్లుయెంజా వైరస్ తన జన్యుస్వరూపం మార్చుకుంటూ వచ్చిన... ప్రజలను బాధిస్తూ ఉంటుంది. మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే... ఇన్ఫ్లుయెంజా అనేది వైరస్‌తో వచ్చే జ్వరం కావడం వల్ల దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. దీనికి యాంటీవైరల్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వైరస్ సోకిన 48 గంటలలోపు ఇవ్వకపోతే ఆ వైరస్ నశించదు. అటు తర్వాత వైరస్ తీవ్రత దానంతట అదే నెమ్మదిస్తుంది. కాకపోతే ఈలోపు మనిషిని తీవ్రమైన నీరసానికి, నిస్సత్తువకూ గురిచేసి బాధిస్తాయి. ముప్పు ఎవరెవరిలోనంటే... ఆస్తమా, ఎంఫసిమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు.డయాబెటిస్ బాధితులు వృద్ధులు, చిన్నపిల్లల వంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు, గర్భిణులూ, గుండెజబ్బు బాధితుల వంటి వారిలో ఫ్లూ జ్వరం ప్రమాదకరం కావచ్చు. లక్షణాలు ఇలా... హెచ్1ఎన్1లో కనిపించే తొలి లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా వైరల్ జ్వరం లాగానే ఉంటాయి. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం (హై ఫీవర్... ఇది ఒక్కోసారి 103 ఫారెన్‌హీట్ వరకూ పెరగవచ్చు) ,పొడి దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు ఎర్రబారడం, తీవ్రమైన ఒళ్లునొప్పులు ,బాగా నీరసంగా అనిపించడం, కొందరిలో కడుపునొప్పి కూడా రావచ్చు. వ్యాధినిరోధక శక్తి బలంగా ఉన్నవారిలో రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు వాటంతట అవే తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో నీరసం, నిస్సత్తువ, ఒళ్లునొప్పుల వంటివి రెండు వారాల వరకు తగ్గకపోవచ్చు. జ్వరం అనంతర దుష్ప్రభావాలుచాలామందిలో లక్షణాలు తగ్గిపోయినప్పటికీ కొందరిలో మాత్రం వైరస్ ఊపిరితిత్తుల వరకు చేరి వైరల్ న్యూమోనియాకూ, ఇంకొందరిలో వైరల్ న్యూమనైటిస్కూ, ఇది మరికొందరిలో మరింత తీవ్రమైతే ఏఆర్డీఎస్ (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రేస్ సిండ్రోమ్) అనే తీవ్రమైన శ్వాస సమస్యలకూ దారితీయవచ్చు. అరుదుగా ఇంకా మరికొందరిలో గుండె కండరం కాస్తంత దెబ్బతిని గుండె కండరాల వాపు (మయోకార్డిటిస్) సమస్య రావచ్చు. ఇక ఈ ఫ్లూ ప్రభావం కారణంగా వ్యాధినిరోధక శక్తి కొద్దిగా తగ్గడం వల్ల మరికొందరిలో ఫ్లూ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు కనిపిస్తుందంటే... మన దేశంలో హెచ్1ఎన్1 కేసులు సాధారణంగా రెండు సీజన్లలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. మొదటిదశల్లో వర్షాకాలంలో అంటే... జూలై నుంచి అక్టోబర్ వరకు (ప్రస్తుతం ఈ స్పెల్ నడుస్తోంది) ఇక రెండో దశ చలికాలంలో అంటే... ప్రధానంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఆ టైమ్‌లో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. సాధారణంగా సీజనల్ ఫీవర్లా వచ్చే ఈ ఫ్లూ పెద్దగా ప్రమాదకరం కాదుగానీ... మొదటి 48 గంటల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి. దాదాపు తేలిగ్గానే తగ్గిపోయే ఈ ఫ్లూ జ్వరం మాత్రం కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. అందుకే మొదటి 48 గంటల సమయం కూడా కీలకమని గుర్తించాలి. ఫ్లూ వ్యాప్తి ఇలా... ఈ ఫ్లూ జ్వరం తాలూకు వైరస్ గాలి ద్వారానే ఒకరి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంటుంది. ప్రధానంగా వ్యాధి సోకిన బాధితుడు మాట్లాడుతున్నప్పుడు, దగ్గుతున్నప్పడు లేదా తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.పరోక్ష పద్ధతుల్లోనైతే... బాధితుడి తుంపర్లు డోర్ నాబ్స్ మీద లేదా వారు వాడిన ఫోన్ మీదగానీ లేదా వారు ముట్టుకున్న మెట్ల రెయిలింగ్స్ మీద పడ్డ తర్వాత, వేరొకరు వాటిని ముట్టుకున్నప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ తరహా వ్యాప్తిని ‘ఫోమైట్’వ్యాప్తిగా చెబుతారు. వైరస్ సోకగానే లక్షణాలు బయటకు కనిపించకపోయినప్పటికీ... అప్పట్నుంచే వైరస్ అతడి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అలాగే జ్వరం మొదలయ్యాక దాదాపు వారం రోజుల వరకు వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది.నివారణ మార్గాలు ఇలా.. కోవిడ్ సమయంలో పాటించిన జాగ్రత్తల వంటివి అంటే మాస్క్ పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్స్ వాడటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ఇంటి కిటికీలు తెరిచి గాలి సరిగా తిరిగేలా చేయడం ద్వారా మూసిన గదుల్లో వైరస్ వ్యాప్తి అవకాశాన్ని తగ్గించాలి. నీళ్లు, గోరు వెచ్చని సూప్, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు / ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు, డయాబెటిస్ బాధితుల వంటి వారు మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు ఫ్లూ నివారణ కోసం ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి.జలుబుతో ఇవీ పోలికలు... ఈ ఫ్లూ జ్వరానికి సాధారణ జలుబుతోనూ కొన్ని పోలికలు కనిపిస్తుంటాయి. సాధారణ జలుబులోలాగే ఒళ్లునొప్పులూ కనిపించవచ్చు. అయితే మొదట్లో పొడి దగ్గు వస్తూ ఉన్నప్పటికీ క్రమంగా తర్వాత్తర్వాత కళ్లె పడటం, ముక్కునుంచి స్రావాలు రావడమూ కనిపిస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. వీటితో పాటు మెడికల్ ఎమర్జెన్సీని సూచించే లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రధానంగా శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతీ లోపలికి లాగినట్లు అనిపించడం వంటి లక్షణాలుంటాయి. పెదవులు లేదా చర్మం నీలంగా మారడం, అయోమయం, తీవ్రమైన నీరసం/నిస్సత్తువ ఉంటాయి. జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం, పల్స్ ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్ మోతాదులు వేగంగా తగ్గుతూ పోవడం ఆక్సిజన్ తగ్గిన లక్షణాలు, రక్తపోటు (బీపీ) అకస్మాత్తుగా పడిపోవడం కళ్లె / తెమడలో రక్తపు చారిక కనిపించడం వంటివి కనిపిస్తాయి.చికిత్స తీసుకోవడం తప్పనిసరి.. సాధారణంగా బాధితులు తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలి. ఇది వైరల్ ఫీవర్ కావడంతో దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. అందుకే ఈ సమస్యకు ‘ఒసెల్టామివిర్’(టామీ ఫ్లూ) అనే యాంటీ వైరల్ మందును ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మొదటి 48 గంటలలోపు ఇవ్వడం వల్ల మంచి ప్రభావం ఉంటుంది. లక్షణాలు బలంగా కనిపిస్తూ సమస్యలు తీవ్రమైనప్పుడు ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురుచూస్తూ చికిత్స ఆలస్యం చేయకూడదనే వైద్య మార్గదర్శకాలు ఉన్నందున తమ అనుభవంతో ఫ్లూను అనుమానించినప్పుడు డాక్టరు యాంటీ వైరల్ మందు ‘ఒసెల్టామివిర్’ను ఇస్తారు.ఇదీ చదవండి: శానిటైజర్ మితిమీరి వాడడం.. చర్మానికి హానికరంఅయితే కొన్నిసార్లు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. ఈ ఫ్లూ ప్రభావంతో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకి వాటి లక్షణాలూ కనిపిస్తున్నప్పుడు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గడానికి పారాసిటమాల్ ఇస్తారు. దగ్గు తగ్గడానికి కాఫ్ సిరప్‌లను సూచిస్తారు. కొందరిలో ఫ్లూ తీవ్రంగా మారి, ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై, రక్తంలో ఆక్సిజన్ తగ్గి, ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితీ రావచ్చు. బాధితుల్లో ఆక్సిజన్ సాచ్యురేషన్ తగ్గినప్పుడు ఐసీయూలో చేర్చి ఆక్సిజన్ ఇవ్వాల్సిరావచ్చు. అందుకే పల్స్ ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్ మోతాదు 94 శాతం కంటే తక్కువగా ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించాలి. – సాక్షి హెల్త్ డెస్క్ -
వారానికి 60 గంటలు పనిచేస్తూ..నెలకు రూ. 63 లక్షలు!
ఇంతవరకు చాలామంది ఒత్తిడితో కూడిన కార్పొరేట్ ఫీల్డ్ వద్దని ప్రశాంతమైన ఉద్యోగమో లేక అభిరుచినే వ్యాపారంగానో మలిచి సక్సెస్ అందుకున్నవాళ్లను చూశాం. కానీ ఈమె నచ్చిన ఉద్యోగం లేదా అభిరుచి కోసం మంచి జాబ్‌ని వదులుకోకూడదని, ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ..అధిక ఆధాయ మార్గంగా మార్చుకోవచ్చని చెబుతోంది. పైగా సంప్రదాయ వృత్తి విజయాన్ని బేఖాతారు చేస్తూ..తనకున్న నైపుణ్యాలన్నింటితో ఆదాయం ఆర్జిస్తూ ఒత్తిడే తనముందు చిత్తు అని చూపిస్తోంది ఈ పవర్ఫుల్ లేడీ. ఆ అమ్మాయే అదితి మిశ్రా. కార్పొరేట్ ఉద్యోగమా, వ్యాపారమా అనే కన్ఫ్యూజన్ వద్దు. ‘నైపుణ్యాలు అందిపుచ్చుకో..సంపాదనగా మార్చుకో’ అనే నినాదంతో దూసుకుపోతోంది లండన్‌లో నివశిస్తున్న అధితి. ఆమె ఒకటి రెండు కాదు, ఎన్ని విధాలుగా ఆదాయలు ఆర్జిస్తోందో వింటే షాకవ్వుతారు. తన పూర్తికాలపు కార్పొరేట్ జాబ్ తోపాటు నిర్మించుకున్న నైపుణ్యాల నుంచి పలువిధాలా ఆధాయమార్గాలను సృష్టించిందామె. ఆమె ముందుగా 2017లో భారతదేశం నుంచి యూరప్‌కు వెళ్లి అక్కడ వృత్తిని నిర్మించుకున్నారు. యూరోపియన్ ఫిన్‌టెక్ రంగంలోకి ప్రవేశించడానికి ముందు లింక్డ్ఇన్ నియమాకాలు, కెరీర్ సంబంధిత ఉత్పత్తులపై పనిచేస్తూ ఐదేళ్లు గడిపింది. ప్రస్తుతం ఆమె లండన్‌లోని ఒక ఫిన్‌టెక్ కంపెనీలో సీనియర్ హోదాలో పనిచేస్తూ ..పార్ట్‌టైం కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఫుల్-టైమ్ కార్పొరేట్ కమ్ పార్ట్ టైం కంటెంట్ క్రియేటర్. కంటెంట్ క్రియేటర్‌గా లింక్డ్ఇన్, సబ్స్టాక్లలో ఏకంగా 3 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. కెరీర్లో విజయం అంటే సంప్రదాయ నిచ్చెన కాదు..ఆధునికతకు అనుగుణమైన హైటెక్ మార్పు అని అంటోంది అదితి. ఆమె తన కార్పొరేట్ ఉద్యోగంలో వారానికి 60 గంటలు పైగా పనిచేస్తూ..ఇవి కూడా చేస్తోందామె. తనకి ఉన్న నైపుణ్యాలే ఆమె సంపాదన మార్గాలని చెప్పొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్, కన్సల్టింగ్, పెయిడ్ న్యూస్లెటర్లు, పబ్లిక్ స్పీకింగ్, వర్క్‌షాప్‌లు, యూజీసీ కంటెంట్ అండ్ బ్రాండ్ సహకారాలు తదతరాలతో ఆదాయం గడిస్తోంది. ఉన్నాయి. ఆమె ఆ ఒక్కోక్కదానితో సంపాదించే ఆదాయ వివరాలు.. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కేవలం రూ. 1548/- కన్సల్టింగ్ ద్వారా సుమారు రూ. 6,45,323/-బ్రాండ్ డీల్స్ ద్వారా రూ. 32,39,767.04/-ప్రజా ప్రసంగాల ద్వారా రూ. 12,26,113/-యూజీసీ పనుల ద్వారా రూ. 12,90,646/-అలా మొత్తం నెల తిరిగేటప్పటికీ ఆర్జించే ఆదాయం రూ. 63 లక్షలు పైనే వస్తుందామెకు. ఇక్కడ అదితి చెబుతోంది ఒక్కటే ఉద్యగోం కోసం నేర్చుకున్న నైపుణ్యాలు మనకు ఉద్యోగం వెలుపల ఆదాయంగా మారతాయని అవి మనం గమనించమని చెబుతోంది. అంటే..కమ్యూనికేషన్ నైపుణ్యాలు పబ్లిక్ స్పీకింగ్గా మారవచ్చు. వృత్తిపరమైన జ్ఞానం కన్సల్టింగ్‌గా మారవచ్చు. రచన ఒక న్యూస్లెటర్గా మారవచ్చు. సోషల్ మీడియా పరిజ్ఞానం యూజీసీ (UGC) లేదా బ్రాండ్ భాగస్వామ్యాలుగా మారవచ్చు. వాటిని మనం గమనించకుండా మొదటి నుంచి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని అంటోంది. అంతేగాదు కంటెంట్ క్రియేటర్ మారాలంటే చేస్తున్న ఉద్యోగం వదిలేయాల్సిన పనిలేదు. ఆ రెండింటిని ఎంచుకుంటూ సాగొచ్చని అంటోంది. ఇక్కడ అదితి ఉన్నత కార్పొరేట్ పదవి తోపాటు, వ్యక్తిగత బ్రాండ్‌గా మారింది. ఇక్కడ సోషల్‌మీడియా సాయంతో తన వృత్తిగత జర్నీని వివరిస్తూ ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్ ఇచ్చుకుంటూనే..మరోవైపు ఫాలోవర్ల సాయంతో, అడ్వర్టైస్మెంట్ దక్కించుకుని ఆదాయ మార్గాలను సృష్టించుకుంటూ పోయింది. తన ఉద్యోగం ఎదుగుదలకు సంపాదించుకున్న నైపుణ్యాలనే సంపాదన మార్గాలుగా మార్చి..అసాధారణమైన రీతీలో డబ్బు గడిస్తోంది. ఇక్కడ అభిరుచిని, ఆనందాన్ని వెతుక్కుంటూనే అధిక ఆదాయన్ని కూడా ఆర్జించొచ్చు అనే చెప్పే స్ఫూర్తిదాయక కథ ఆమెది. అదితి అసాధారణ ఆధాయ మార్గాల సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. View this post on Instagram A post shared by Aditi Mishra (@byaditimishra) (చదవండి: యూట్యూబ్ సాయంతో శాండ్విచ్ తయారీ..ఇవాళ ఏకంగా..!) -
58 ఏళ్ల వయసులో మంగోలియా అధ్యక్షుడి బరువులు ఎత్తే ఫీట్..! వీడియో వైరల్
మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్సుఖ్ తన అద్భుత వర్కౌట్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అది కూడా ఎలాంటి జిమ్ దుస్తులు లేకుండా ఫార్మల్ దుస్తుల్లోనే బరువులు ఎత్తే ఫీట్ చేయడం విశేషం. గతంలో ఆర్మీ అధికారిగా పనిచేసిన ఈయన సైనిక విభాగం సందర్శనలో భాగంగా ఈ ఫీట్‌ని చేశారు. అక్కడ ఆయన ఏకంగా వంద కిలోల బరువుని సూట్ జాకెట్ తొలగించి ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 20సార్లు బెంచ్ ప్రెస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట అమితంగా వైరల్ అవ్వడంతో నెటిజన్లంత అధ్యక్షుడి బలం, ఫిట్నెస్కి ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వైరల్ వీడియో ఖరెల్సుఖ్ ఫార్మల్ సూట్ ధరించి బరువులు ఎత్తే బెంచ్ పక్కన నిలబడం చూడొచ్చు. కాసేపటి తర్వాత తన చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే జాకెట్ తీసివేసి బెంచ్‌పై పడుకున్నారు. ఆ తర్వాత సుమారు వంద కిలో బెంచ్ ప్రెస్ చేయడం ప్రారంభిస్తారు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా సుమారు 20 రిపిటేషన్లు అత్యంత సునాయాసంగా చేసేశారు'. ఆ ఫీట్ పూర్తికాగానే అక్కడ ఉన్న అధికారులు, సైనికులతో కరచాలనం చేయడం స్ఫష్టంగా కనిపస్తుంది వీడియోలో. కాగా ఈ మంగోలియా నాయకుడు 2021 నుంచి దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు ప్రధానమంత్రితో సహా పలు కీలక రాజకీయ పదవులను అలంకరించారు. అలాగే ఆయనకు బాడీబిల్డింగ్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉంది. తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిచడానికి ముందు మంగోలియన్ పీపుల్స్ ఆర్మీలో కూడా పనిచేశారు. అంతేగాదు ఆయనకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆయన పాల్స్ అనే రాక్‌బ్యాండ్‌లో గిటారు వాయిస్తారనేది అధికారిక వర్గాల సమాచారం. ఐదుపదులు దాటిన తర్వాత ఇలాంటివి చేయొచ్చా..58 ఏళ్ల వయసులో బరువుల ఎత్తడం అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు. అయితే ప్రమాదకరమైన బరువులు మాత్రం ఎత్తడం మంచిది కాదనే చెబుతున్నారు. ఇలాంటివి చేయాలనుకున్నప్పుడూ.. నిపుణులు పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో ఎత్తడం మంచిదని సూచిస్తున్నారు. అదీగాక వయసు పెరిగే కొద్దీ సహజంగా శరీరంలో కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత తగ్గుతాయి. అందువల్ల 50 ఏళ్లు దాటిన వారికి వెయిట్ ట్రైనింగ్ అత్యంత అవసరం అని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుThe President of Mongolia: Ukhnaagiin Khürelsükh, 100 kg, bench presses 20 reps - this is just too badass! pic.twitter.com/TPzqcp9nL0— Mr BundelKhandi (@BundelKhandee) September 10, 2026 (చదవండి: నో స్కూల్, నో సిలబస్, నో స్క్రీన్! ఉత్తరాఖండ్ దంపతుల సరికొత్త పేరెంటింగ్ పాఠాలు) -
నో స్కూల్, నో సిలబస్, నో స్క్రీన్! ఉత్తరాఖండ్ దంపతుల సరికొత్త పేరెంటింగ్ పాఠాలు
ఇటీవల కాలంలో చాలామంది సంపాదన, పిల్లలను సెటిల్ చేయడం వంటి ఉరుకుల పరుగుల జీవితం వద్దంటూ ప్రకృతితో ఉండటానికి ఇష్టపడుతున్నారు. కొందరు ఆ క్రమంలో ప్రయాణాలు చేస్తుంటే ఇంకొందరు మాత్రం గజిబిజి వాతావరణం మాకే కాదు మా పిల్లలకు వద్దు అంటూ మన పూర్వీకుల జీవిన విధానంలో బతికి చూపిస్తూ..మర్చిపోతున్న లేదా విస్మరిస్తున్న అద్భుత పేరెంటింగ్ పాఠాలను గుర్తు చేస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ఈ దంపతులుఆ దంపతులే ఉత్తరాఖండ్‌కు చెందిన ఆదిత్య, గరిమలు. ఈ జంట ఉత్తరాఖండ్‌లో మారుమూల గ్రామం బస్గావ్లో నివశిస్తూ..అన్ని రకాల ఒత్తిళ్లు, కాలుష్యంకు దూరంగా ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తున్నారు. చెప్పాలంటే వారు కోరుకున్న కలల జీవితంలో ఆనందంగా గడుపుతున్నారు. తమ బిడ్డకు కూడా నో స్కూల్, నో స్క్రీన్, నో సిలబస్ వంటి ఎలాంటి ఒత్తిడులు దరిచేరనీకుండా ప్రకృతితో మమేకమయ్యేలా పెంచుతున్నారు. ఆ చిన్నారి ప్రతీదీ సహజసిద్ధంగా నేర్చుకునేలా పెంచుతున్నారు. అంతకుముందు ఈ దంపతులు జీవన విధానం ఎలా ఉండేదంటే..సిమ్లాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆదిత్య, కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదగడమే విజయానికి కీలకం అని నమ్మేవారు. ఆ నేపథ్యంలోనే ఆదిత్య ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఢిల్లీకి వెళ్లాడు, అక్కడ గరిమను కలిశాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, గరిమకు మంచి ఉద్యోగం లభించింది, శిక్షణ కోసం ప్రపంచమంతా పర్యటించే అవకాశం కూడా దొరికింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు, తీవ్రమైన ఒత్తిడి బారినపడింది. ఇక 2015లో ఆదిత్య ఉద్యోగ రీత్యా ఈ జంట వివాహం చేసుకుని సింగపూర్‌కు వెళ్లిపోయారు. అక్కడ గరిమ తన ఉద్యోగాన్ని వదిలేసి, బాలల మనస్తత్వ శాస్త్రం(చైల్డ్ సైకాలజీ) చదవడంపై దృష్టి సారించింది. ఆ సబ్జెక్టులో మరింత లోతుగా పరిశోధన చేయడంతో కార్పొరేట్ లైఫ్ జీవితాలను ఎలా నాశనం చేస్తుందో గ్రహించారు. దాంతో ఇద్దరు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 33 ఏళ్లకే ఆదిత్య ఉద్యోగాన్ని వదిలేసి గర్భవతిగా ఉన్న గరిమను తీసుకుని ఉత్తరాఖండ్‌కి వచ్చేశాడు. ప్రకృతి మూలికలకు స్వస్థపరిచే శక్తి, ప్రకృతి ఆధారిత పాఠశాల విద్య వారి జీవితాలను ఎంతలా తీర్చిదిద్దుతాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అంతేగాదు వారి కూమారుడు వేదాస్ ఇప్పటి వరకు ఏ పాఠశాలకు వెళ్లలేదు, అతని ప్రాథమిక విద్య అంతా ప్రకృతి నుంచే స్వయంగా నేర్చుకున్నాదే. సూర్యోదయంతో మేల్కోవడం నుంచి పక్షుల కిలకిలరావాలు, వర్షపు వాసన వంటివి స్వయంగా అనుభవిస్తాడు, తనే తెలుసుకుంటాడని చెబుతున్నారు ఆదిత్య గరిమ దంపతులు. అంతేగాదు ఆ చిన్నారే స్వయంగా మొక్కలు నాటుతాడు, కంపోస్ట్ కూడా తయారు చేస్తాడని అన్నారు. అతను మట్టితో చిత్రాలు గీస్తాడు, నేర్చుకుంటాడని చెప్పుకొచ్చారు. అలాగని తామేమి పరీక్షలకు వ్యతిరేకం కాదని, వాళ్లని గుడ్డిగా ఒత్తిడికి గురిచేయడాన్ని నిరాకరిస్తామని అన్నారు. తమ బిడ్డ వేగంతో నేర్చుకుంటూ ఉత్సుకతతో ఉండటమే గాక ప్రకృతి తన రోజువారి జీవితంతో బలమైన అనుబంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. చెప్పాలంటే..చిన్నారులు ప్రతి విషయాన్ని విశ్వంతో స్వయంగా అనుభవిస్తూ నేర్చుకున్న జ్ఞానం, అద్భుతాలు, ఆవిష్కరణాలకు దారితీస్తుందని తమ జీవన విధానంతో చెప్పకనే చెబుతున్నారు. నెటిజన్లు కూడా ఆ దంపతుల ధైర్యానికి మెచ్చుకుంటూ..చక్కటి ముందడుగు వేశారంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: యూట్యూబ్ సాయంతో శాండ్విచ్ తయారీ..ఇవాళ ఏకంగా..!) -
చిటిమిటి పండుతో బోలెడన్ని లాభాలు..!
అల్లోపతి వైద్యం అందుబాటులో లేనప్పుడు వృక్ష వైద్యమే శరణ్యమనే రోజుల్లో చిటిమిటి పండ్ల చెట్లకు అపారమైన ఆదరణ ఉండేది. ఈ చెట్టుకు ప్రాంతాల వారీగా పైన తెలిపిన పేర్లున్నాయి. ఈ పండు చెట్టు అన్ని భాగాలు ఉపయోగపడతాయి. గార్డినియా జినస్లో దాదాపు 250 పుష్పించే జాతులులు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఉనికి... చిటిమిటి స్వస్థలం భారత ఉప ఖండం ముఖ్యంగా ఉష్ణ మండలపు ఆకులు రాల్చే అడవులలో విరివిగా పెరుగుతుంది. ఆఫ్రికా, ఆసియా, మడగాస్కర్, పసిఫిక్ ద్వీపాలు, ఆస్ట్రేలియాలో ఈ చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు అంత పెద్దగా పెరగదు. నేలను బట్టి దాదాపు 3–5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. కాబట్టి పెరటిలో పెంచుకోవటానికి అనుగుణంగా ఉంటుంది. చిటిమిటి చెట్లు తెలుగు రాష్ట్రాలలోని అడవులు ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, కడప, కర్నూల్, విశాఖపట్టణం, తెలంగాణలోని నాగరకర్నూల్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల అడవుల్లో ముఖ్యంగా నల్లమల అడవుల్లో విరివిగా ఉన్నాయి. కర్ణాటకలో (అన్ని జిల్లాల్లో), ఒరిస్సా (గంజాం, మయూర్ బంగ్, అంగూల్, కాలహండి, సంబాల్పూర్ జిల్లాల్లో), తమిళనాడు (ఇంచుమించు అన్ని జిల్లాల్లో) ఉన్నాయి. కేరళ (ఇడుక్కు జిల్లాలో) ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కానీ తక్కువ.చిటిమిటి ప్రయోజనాలు చిటిమిటి చెట్టు అన్ని భాగాలూ ఉపయోగపడతాయి. కాబట్టి నిరంతర పరిశోధన ప్రాంతాల వారీగా చేస్తే ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే దేశం నలుమూలల అడవుల్లో దీని ఉనికి ఉన్నది. కలప వంట చెరకుగా వాడొచ్చు. వాసాలు (పోల్స్) గా పందిళ్ళకు వాడవచ్చు. దీని బెరడు, జిగురు ఆయుర్వేదంలో అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పండ్లను ఆయుర్వేద వైద్యంలో వాడతారు. పండు రుచిగా ఉంటుంది, నేరుగా తినవచ్చు. పండ్ల గుజ్జులో యాంటిమైక్రోబియల్, యాంటి రాడికల్, కీటకనాశిని గుణాలు ఉన్నాయి. ఆకుల కషాయంలో కూడా కీటక నాశిని, యాంటీ మైక్రోబియల్ విలువలు ఉన్నాయి. ఆయుర్వేద మందులు ముఖ్యంగ రక్త విరేచనాలకు, విరేచనాలకు ఈ చెట్టు భాగాలను ఉపయోగిస్తారు. మందులు బాగా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరానికి దీనితో చేసిన మందు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. కడుపులో మంటకు కూడా దీనితో చేసిన మందులు వాడితే నయమతుంది. అజీర్తిని కూడా దూరం చేస్తుంది. ఆకులు, పండ్లను ఆరనిచ్చి, పొడి చేసి దాన్ని వాడితే విత్తనం ద్వారా సోకే ఫంగస్‌ను అరికట్టవచ్చని నిరూపితమైంది. కీటకాల మీద మంచి ప్రభావం చూపించటం వల్ల దీన్ని కీటకనాశినిగా కూడా వాడవచ్చు (ఇజ్చిnఛీట్చ – ఝ్చజ్ఛిటజి, 2013).ఔషధ గుణాలుచిటిమిటి చెట్టు భాగాలతో చేసిన మందు యాంటిసెప్టిక్ గుణం కలిగి ఉంటుంది. అదేవిధంగా కఫం, వాత దోషాలను దూరం చేస్తుంది. ఇది మంచి పెయిన్ కిల్లర్. పుండ్లను నయం చేయటంలో దోహదకారిగా పని చేస్తుంది. చర్మ రోగాలను నయం చేస్తుంది. నట్టలను పారదోలుతుంది. దగ్గు నుంచి ఉపశమన పరుస్తుంది, ఆస్తమాను దూరం చేస్తుంది. ఇది గుండె, లివరు, ప్లీహాన్ని ఉత్తేజపరిచి చక్కటి దారిలో ఉంచుతుంది. జ్వరాలను తగ్గించి శరీర ఉష్ణోగ్రతలను లయబద్ధంగా ఉంచుతుంది. ఈ చెట్టు నుంచి జిగురు వస్తుంది. దాన్ని వైద్యం, ఇతర మందుల్లో పనికి వస్తుంది. జిగురుతో చేసిన చూర్ణాన్ని తేనెలో కలుపుకొని పండ్లు తోముకుంటే పంటి, చిగుళ్ళ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. చూర్ణం పుండ్లపైన రాస్తే పైన చీము పట్టకుండా చేసి పుండ్లు త్వరగా మానటానికి దోహదం చేస్తుంది. ఈ పండ్లను మధుమేహం ఉన్న వారు కూడా తినవచ్చు. చిటిమిటి పండ్లు అందరూ తినదగినవి, రుచికరమైనవి. ఆటుపోట్లను తట్టుకున్న జాతులుచిటిమిటి చెట్లు అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పటికి నల్లమల అడవుల్లో ఉన్న చిటమిటికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడి వాతావరణంలో మార్పులు ఇక్కడ పెరుగుతున్న వృక్షజాలాన్ని ఎన్నో ఆటుపోట్లకు గురిచేశాయి. తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకొన్న ఈ జాతి చెట్లను కాపాడుకోవటం అత్యవసరం. వీటిలో మెరుగైన పోషక, ఔషధ విలువలు ఉన్నందున వీటి పండ్లను అందుబాటులోకి తెచ్చే విధంగా పరిశోధనలు చేపట్టాలి. ఈ అరుదైన అటవీ పండ్ల జాతుల సంపదను పెంచగలిగితే లాభసాటిగా ఉంటుంది. చిటిమిటి పెరటి చెట్టుగా మారితే ఆ ఇంట్లో వారి ఒంట్లో పోషక లోపాలు తీరినట్లే భావించవచ్చు. డాక్టర్ మొరుపోజు పద్మయ్య,విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: పురుగులను అరికట్టే జిగురు అట్టలు) -
పురుగులను అరికట్టే జిగురు అట్టలు
సేంద్రియ మిద్దె తోటలు/ పెరటి తోటలు/ ఇంటిపంటల్లో మొక్కలను ఆశించే వివిధ రకాల రసం పీల్చే పురుగులను నివారించటానికి పసుపు, బ్లూ (నీలం) రంగు జిగురు అట్టలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి రసాయన రహితమైనవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. 1. ప్రకాశవంతమైన రంగులను చూసి పురుగులు ఆకర్షించబడి, అట్టలకు ఉన్న జిగురుకు అతుక్కుని చనిపోతాయి.2. తెల్లదోమ వంటి పురుగులు వైరస్ తెగుళ్లను వ్యాపింపజేస్తాయి. వీటిని ఈ అట్టల ద్వారా నివారించడం వల్ల మొక్కలకు వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు.3. తోటలో ఏ రకమైన పురుగులు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇవి తోడ్పడతాయి.4. క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుంది. 5. పసుపు రంగు జిగురు అట్టలు: ఇవి ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ (అఫిడ్స్), లీఫ్ మైనర్స్, వివిధ రకాల ఈగలను ఆకర్షిస్తాయి. టమాట, వంగ, బెండ లాంటి కూరగాయలు , పండ్ల తోటలు, మిరప పంటల్లో ఇవి బాగా పనిచేస్తాయి.6. బ్లూ/నీలం రంగు జిగురు అట్టలు ముఖ్యంగా తామర పురుగులు (థ్రిప్స్), నల్ల తామర (బ్లాక్ థ్రిప్స్) పురుగులను ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. మిరప వంటి పంటల్లో తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి ఇవి చాలా కీలకం.7. మొక్కల ఎత్తును బట్టి అట్టలను కర్రలకు కట్టి భూమికి లేదా కుండీకి కొంత ఎత్తులో అమర్చాలి. మిద్దె తోటల్లో అవసరాన్ని బట్టి 4–5 అట్టలు సరిపోతాయి. 8. మిద్దె లేదా పెరటి తోటల్లో పండు ఈగ సమస్యను నివారించడానికి ఫెరోమోన్ ట్రాప్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి మగ పండు ఈగలను ఆకర్షించి చంపడం ద్వారా సంతానోత్పత్తిని తగ్గిస్తాయి.9. పండు ఈగలు పసుపు రంగుకు ఆకర్షితమవుతాయి. పసుపు రంగు అట్టలపై జిగురు పూసి తోటలో అక్కడక్కడ ఉంచడం వల్ల అవి వాటికి అతుక్కుపోతాయి.10. పాత ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని, దానికి చిన్న రంధ్రాలు చేయాలి. అందులో పండిన అరటిపండు ముక్కలు, కొంచెం బెల్లం నీళ్లు లేదా వెనిగర్ వేసి తోటలో వేలాడదీయడం ద్వారా ఈగలను ఆకర్షించవచ్చు. 11. పండ్లు బాగా పక్వానికి రాకముందే కోయాలి. పండ్లు మరీ పండిపోతే పండు ఈగలను త్వరగా ఆకర్షిస్తాయి.12. చెట్టు కింద రాలిపోయిన లేదా కుళ్ళిన పండ్లను వెంటనే తీసివేయాలి. ఇవి పండు ఈగలు గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశాలు. 13. సన్నని మెష్ ఉన్న నెట్లను మొక్కలకు కప్పడం ద్వారా ఈగలు పండ్ల దగ్గరకు వెళ్లకుండా నిరోధించవచ్చు.14. కాయలు చిన్నవిగా ఉన్నప్పుడే వాటికి కాగితపు సంచులు లేదా సన్నని బట్ట సంచులను కట్టడం ద్వారా రక్షణ కల్పించవచ్చు. 15. లీటరు నీటిలో 5 ఎం.ఎల్. వేప నూనె, కొద్దిగా కుంకుడు రసం కలిపి మొక్కలపై క్రమం తప్పకుండా పిచికారీ చేయడం వల్ల పండు ఈగలు రాకుండా ఉంటాయి.16. వెల్లుల్లి, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి ఆ ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా ఈగలను నివారించవచ్చు.కొల్లి కృష్ణ కుమారి,అడ్మిన్, గుంటూరు జిల్లా మిద్దె తోటల బృందంమొబైల్: 94906 02366 (చదవండి: చాపగుత్తి: చూడటానికి చిన్న చెట్టే.. ఉపయోగాలు తెలిస్తే షాకే!) -
యూట్యూబ్ సాయంతో శాండ్విచ్ తయారీ..ఇవాళ ఏకంగా..!
వ్యాపారంలో ఎదురు దెబ్బలు తగలగానే మనకు ఇది సూట్ కాదని వదిలేస్తాం. కొందరు వైఫల్యం, ఎదురుదెబ్బల్ని..గొప్ప సక్సెస్‌ని అందించే పాఠాలుగా తీసుకుంటారు. అలా సానూకూల దృక్పథంతో ముందుకు సాగి ఆహార వ్యాపారంలో లక్షల్లో డబ్బుని ఆర్జిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు ఈ యువకుడు.అతడే అభిషేక్ సాహు. ఈ యువకుడు వైఫల్యాన్ని వ్యాపార ప్రస్థానానికి ముగింపు కాదని నమ్మాడు. చివరికి అతడి నమ్మకమే నిజమైంది. నిజానికి సాహు 15 ఏళ్ల క్రితం భోపాల్ వెళ్లి ఇంటర్నెట్ కేఫ్‌ని ప్రారంభించాడు. అయితే ఆ వ్యాపారం ఏడాదిలోపే మూతపడింది. అయితే సాహు వ్యాపారం తన వల్ల కాదని అగిపోకోకుండా మరో వ్యాపార ప్రయత్నం ప్రారంభించాడు. మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలన్న కృత నిశ్చయంతో ఈ సారి రూ. 30 వే పెట్టుబడితో చిన్న శాండ్విచ్ బండిని ప్రారంభించాడు. నిజానికి ఆహార వ్యాపారంలో అనుభవము లేదు ..ఆ వంటకం తయారీ కూడా రాదు. అయితే సాహు యూట్యూబ్ సాయంతో శాండ్ విచ్ తయారీల గురించి తెలుసుకుని మరి ఈ వ్యాపారం ప్రారంభించాడు. హరిహర్ శాండ్విచ్ అనే పేరుతో బిజినెస్ ప్రారంభించాడు. క్రమంగా పుంజుకుంటూ లాభాల బాట పట్టడం మొదలైంది. ఇవాళ ఆ వ్యాపారం వారాపు రోజుల్లో దాదాపు 600 శాండ్విచ్లు అమ్ముతుండగా, వారాంతాల్లో ఏకంగా వెయ్యికి పైగా శాండ్విచ్లు అమ్ముడవ్వడం విశేషం. ఈ వ్యాపారం నెలకు సుమారు రూ. 25 లక్షలు టర్నోవర్ ఆర్జిస్తోంది. విఫలమైన ఇంటర్నెట్ కేఫ్ నుంచి ఏకంగా రూ. 25 లక్షలు ఆర్జించే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నడిపే రేంజ్‌కి అంటే ఇది నిజంగా స్ఫూర్తిదాయకమైన విజయం కదూ. అయోధ్య బైపాస్ రోడ్డులోని మినాల్ రెసిడెన్సీ వద్ద ఉన్న ఈ పిజ్జా బండి వద్దకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంటారు. సందర్శకులు కనీసం 30 నుంచి 50 నిమిషాలు వెచ్చించి మరి వాటి రుచి కోసం వెయిట్ చేస్తుంటారంటే..ఎంతగా సాహు వ్యాపారం పేరుగాంచిందో తెలుస్తోంది కదూ. అంతేగాదు అతని సోదరుడు దీపక్ సాహు కూడా ఈ వ్యాపారంలో సాయం అందిస్తుంటాడట. ఈ ప్రేరణాత్మక స్టోరీని ప్రథమ్ అనే యూజర్ సోషల్ మీడియా వేదకగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. This is Abhishek Sahu.15 years ago, he moved to Bhopal and started an internet café. It shut down within a year.He then took a ₹30,000 loan and started a small sandwich cart after learning recipes on YouTube.Today, Hari Har Sandwich sells:⁰• 600+ sandwiches on weekdays… pic.twitter.com/mwjGaaChuU— Pratham (@CapitalLens_) September 1, 2026 (చదవండి: అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!) -
మంచి కాఫీ లాంటి సక్సెస్ స్టోరీ..
పదహారేళ్ల వయసులో సకమ్మకు పెళ్లి జరిగింది. పెళ్లయిన కొద్దికాలానికే ఆమె భర్త మరణించారు. ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టడానికి మహిళలు సంకోచించే కాలంలో, ఉద్యోగం చేయాలనే ఆలోచన ఊహకు కూడా రాని కాలంలో ఒంటరి ప్రయాణం మొదలు పెట్టారు సకమ్మ. ‘నేను ఒంటరి కాదు. నా వెనక వేలాది సకమ్మలు ఉన్నారు’ అనుకొని వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. కాఫీతోటల యజమానురాలిగా, ప్రసిద్ధ ‘సకమ్మ కాఫీ వర్క్స్’ బ్రాండ్ సృష్టికర్తగా, సామాజిక సేవకురాలిగా చరిత్ర పుటల్లో నిలిచారు..బెంగళూరు సంస్కృతిలో కాఫీ విడదీయరాని భాగం. బెంగళూరు వాసుల కాఫీ ప్రేమకు పునాది వేసిన వారిలో ఒకరు... దొడ్డమనే సకమ్మ. ఆ పేరు చెబితే ఆమె ఎవరికీ తెలియదు కానీ ‘కాఫీ పొడి సకమ్మ’ అంటే వెంటనే గుర్తుపడతారు. సకమ్మ కాఫీతోటల యజమానురాలు మాత్రమే కాదు పరోపకారి కూడా. వ్యాపరరంగంలో మహిళలకు అవకాశాలు పరిమితంగా ఉన్న కాలంలో విజయవంతమైన కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించారు.వెనకడుగు వేయకుండా! కర్నాటక తుమకూరు జిల్లాలోని బిదరే గ్రామంలో 1880లో జన్మించారు సకమ్మ. చిన్న వయసులోనే చదువు ప్రాముఖ్యతను గుర్తించారు. మైసూరు సంస్థానంలో విద్యావంతులైన కొద్దిమంది యువతులలో ఆమె ఒకరు. పదహారేళ్ల వయసులో కూర్గు ప్రాంతానికి చెందిన కాఫీ తోటల యజమాని చిక్కబసప్ప శెట్టితో సకమ్మ వివాహం జరిగింది. అయితే, వివాహమైన కొద్దికాలానికే భర్త మరణించడంతో కుటుంబానికి చెందిన కాఫీ తోటలను నిర్వహించే భారీ బాధ్యత సకమ్మపై పడింది. ఆ కాలంలో మహిళలపై సామాజిక ఆంక్షలు ఉన్నప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. తన ఊరు నుంచి బెంగళూరు వెళ్లారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగులు వేశారు.సకమ్మ కాఫీ వర్క్స్... సూపర్ హిట్! బసవగుడిలోని బుల్‌టెంపుల్ సమీపంలో ‘కాఫీ క్యూరింగ్ అండ్ పౌడరింగ్ యూనిట్’ను స్థాపించారు సకమ్మ. ఆ సమయంలో కాఫీ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఎన్నో యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. కాఫీ గింజలను వేయించడానికి, పౌడర్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి ఆనాటి ఆధునికత సాంకేతికత పరికరాలపై ఆధారపడ్డారు.కాఫీ ప్రాసెసింగ్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేయాలనే సకమ్మ లక్ష్యం ఆమె వ్యాపార ప్రస్థానంలో మైలురాయిగా మారింది. సకమ్మ కాఫీ పొడి ‘సకమ్మ కాఫీ వర్క్స్ బ్రాండ్’తో మార్కెట్లోకి వచ్చింది. రుచి, నాణ్యత కారణంగా ‘సకమ్మ కాఫీ వర్క్స్’ ఇంటింటా సుపరిచితమైంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో అమ్మకపు కేంద్రాలను ప్రారంభించి, కాఫీ పొడిని వినియోగదారులకు మరింత అందుబాటులోకి తెచ్చారు. మాస్తి వెంకటేశ అయ్యంగార్, డి.వి.గుండప్పలాంటి ప్రఖ్యాత కన్నడ సాహితివేత్తల రచనలో సకమ్మ బ్రాండ్ కనిపించేది.లోకసేవ పరాయణే... ఆమె సాధించిన విజయాలు కాఫీ వ్యారానికే పరిమితం కాలేదు. సామాజిక సేవా రంగంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. మహిళా సంక్షేమం, విద్య, సామాజిక అభివృద్ధికి కృషి చేశారు. బసవగుడిలో ఒక వసతిగృహాన్ని, ప్రయాణికుల కోసం విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. సకమ్మ సాధించిన వ్యాపార విజయాలు, సామాజిక సేవకు గుర్తింపుగా మైసూర్ దర్బార్ ఆమెకు ‘లోకసేవ పరయణే’ అనే బిరుదును ప్రదానం చేసింది. మైసూర్ ప్రతినిధి సభలో సభ్యురాలిగా కూడా సకమ్మ పనిచేశారు. కూర్గ్‌లోని సోమవార్పేటలో ఉన్న సకమ్మ బంగ్లా, బెంగళూరులోని సకమ్మ గార్డెన్ ఆమె విజయగాథను మౌనంగా చెబుతుంటాయి. ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తుంటాయి. (చదవండి: క్యాట్‌లో మంచి స్కోర్ చేసినా..సైన్యంలోకి! కానీ చివరికి..) -
నో చెప్పడమూ అవసరమే!
మంచితనం, మర్యాద, బాధ్యతగా ఉండటం తప్పేమీ కాదు. కానీ ఇతరులను సంతోషపెట్టడం కోసం ప్రతిసారీ తమ అవసరాలను, అభిప్రాయాలను, భావాలను పక్కన పెట్టడం అలవాటుగా మారడం.. అందరికీ నచ్చాలనే కోరికల వల్ల ఏర్పడే ఒక ప్రవర్తనా ధోరణినే ‘గుడ్ గర్ల్ సిండ్రోమ్’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు.‘సాధారణంగా చాలా మంది అమ్మాయిలు ఈ విధమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాలలో పెరిగిన అమ్మాయిల్లో ఈ సిండ్రోమ్ కనిపిస్తుంది. అలాగని, ఇది వైద్యపరమైన వ్యాధి కాదు. మన చుట్టూ ఉన్న సామాజిక అంశాలు, పెంపకం, ఎదుటివారు చెప్పింది వినకపోతే తమని తిరస్కరిస్తారేమో అనే భయంతో బతుకును భారంగా మార్చుకుంటున్నారు వారు ఉన్నారు. ఈ కండిషన్ పెళ్లయ్యి, వైవాహిక జీవితం మొదలుపెట్టాక కూడా కొనసాగుతుంటుంది’ అని వివరిస్తున్నారు సైకాలజిస్ట్ డా.జ్యోతిరాజ. ‘నో’ చెప్పలేకపోవడం‘నాకు కుదరదు’ అని చెప్పాల్సిన సందర్భంలో కూడా ‘సరే, చేస్తాను’ అంటూ పనులను ఒప్పుకుంటారు. ఇష్టం లేకపోయినా ఇతరుల కోసం పనులు చేయడం, అలసిపోయినా సహాయం చేయడం, అన్యాయం జరిగినా గొడవ వద్దని మౌనం వహించడం.. ఇలా ప్రతిసారీ ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ పోతే, ఒక దశలో ‘నాకు నిజంగా ఏం కావాలి?’ అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడం కూడా కష్టమవుతుంది. ఈ సమస్యకు కుటుంబ వాతావరణం, సామాజిక అంచనాలు, గత అనుభవాలు .. వంటి అనేక అంశాలు ఇందుకు దోహదం చేస్తాయి.అందరూ మెచ్చుకోవాలనే కోరికకుటుంబంలో బంధుమిత్రులలో ఆమె చాలా మంచిది’, ‘ఎవరినీ బాధపెట్టదు’, ‘ఏ పని చెప్పినా చేస్తుంది’ ... ఇలాంటి మాటలు ఆనందాన్నిస్తాయి. కానీ క్రమంగా ఇతరుల ప్రశంసలకు తలొగ్గి, బతుకు భారంగా అనిపించినప్పుడు సమస్య మొదలవుతుంది. పనులు సరిగా చేయలేకపోతే ఎవరైనా తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తే వెంటనే బాధపడిపోతారు. తాను తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పేస్తుంటారు. అందరూ తన గురించి మంచిగానే అనుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ ధోరణులన్నీ గుడ్ గర్ల్ సిండ్రోమ్ లక్షణాలే.అసంతృప్తి జీవనంఎప్పుడూ ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల మానసికంగా అలసిపోవచ్చు. తన భావాలను వ్యక్తపరచడం కష్టమవుతుంది. కోపం, అసంతృప్తి లోపలే పేరుకుపోవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరుల అభి్ర΄ాయాలపై ఎక్కువ ఆధారపడవచ్చు. సంబంధాల్లో తన హద్దులను కా΄ాడుకోవడం కష్టమవుతుంది. కొన్నిసార్లు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించే వ్యక్తి లోపల మాత్రం ‘నా కోసం ఎప్పుడు జీవిస్తాను?’ అనే యుద్ధం చేస్తుండవచ్చు.మార్పు అవసరం..→ ముందుగా తమని తాము ప్రశ్నించుకోవాలి. ‘నేను ఈ పనిని నిజంగా చేయాలనుకుంటున్నానా, లేక ఎదుటివారు బాధపడకూడదని చేస్తున్నానా’ ఈ ప్రశ్న చాలా విషయాలను స్పష్టంగా చూపిస్తుంది. తర్వాత చిన్న విషయాల్లో ‘నో’ చెప్పడం మొదలుపెట్టవచ్చు. → ప్రతిసారీ మనం తీసుకున్న నిర్ణయానికి ఎదుటివారు ఒప్పుకోవాలని, వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని గ్రహించాలి.→ మంచి అమ్మాయిగా కనిపించాలంటే తమని తామే కోల్పోవడం కాదని తెలుసుకోవాలి.ఇతరులను గౌరవించాలి. ప్రేమించాలి. అవసరమైనప్పుడు సహాయం చేయాలి. అదే సమయంలో మీ అభి్ర΄ాయాన్ని ముందుగా మీరు గౌరవించుకోవాలి. మీ సమయం విలువైనదిగా భావించాలి. నచ్చకపోతే ‘వద్దు’ అని చెప్పడం అంటే మీ జీవితాన్ని ఎంచుకునే హక్కు మీకూ ఉందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అందరికీ నచ్చే అమ్మాయిగా ఉండటం కంటే, తనకు తాను నచ్చే వ్యక్తిగా మారడం చాలా ముఖ్యం. మనల్ని మనం కోల్పోకూడదు..చెప్పినవి వినకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. కోపం వస్తుందేమో.. అనే ఆలోచనలు వెంటాడుతుంటాయి. కానీ ‘నో’ చెప్పడం అంటే ఎదుటివారిని తిరస్కరించడం కాదు. మనకు ఉన్న పరిమితిని స్పష్టంగా చెప్పడం. అన్నింటినీ అంగీకరించి మోయలేనంత భారంతో రోజులను గడపనక్కర్లేదు. ఇతరుల పట్ల శ్రద్ధ చూపడం మంచిదే. కుటుంబాన్ని చూసుకోవడం, స్నేహితులకు సహాయం చేయడం, అవసరమైనప్పుడు తోడుగా నిలబడటం గొప్ప విషయం. కానీ ఇతరుల కోసం మన ఆనందాన్ని పూర్తిగా త్యాగం చేయడం మంచితనం కాదు. విశ్రాంతి కావాలనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. నచ్చని విషయాన్ని నచ్చలేదని చెప్పాలి. మన జీవితానికి మనమే నిర్ణయాలు తీసుకోవడం స్వార్థం కాదని గ్రహించాలి.– డా.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
దైవాన్ని ప్రేమించాలంటే.. ముందు మనిషిని ప్రేమించాలా?
సృష్టికర్త దృష్టిలో మనుషులందరూ ఒకే కుటుంబం. జాతి, వర్ణం, భాష, దేశం, సంపద అనే భేదాలు మనుషులు నిర్మించుకున్న కృత్రిమ గోడలే తప్ప గొప్పతనానికి కొలమానాలు కావు. నిజమైన శ్రేష్ఠత కేవలం సత్ప్రవర్తన, దైవభీతి, పరోపకారంలోనే ఉంది. దివ్య బోధనల్లో ద్వేషానికి తావులేదు, ప్రేమ ఉంది; అహంకారానికి ఆస్కారం లేదు, వినయం ఉంది. ఈ ఉదాత్తమైన సూత్రాలే ధార్మిక మానవతా దృక్పథానికి మూలస్తంభాలు.ఈ మానవీయ దృక్పథానికి శిఖరాగ్రం ఏమిటంటే, ఒక నిరపరాధి ప్రాణాన్ని కాపాడటం సమస్త మానవాళిని రక్షించడంతో సమానమని చాటిచెప్పడమే. ధర్మం మనుషుల మధ్య గోడలు కట్టదు, హృదయాలను కలుపుతుంది. దేవుని ప్రేమను కోరుకునే హృదయమేదైనా మొదట సృష్టిని ప్రేమించడం నేర్చుకోవాలి. మానవత్వం లేని మతం ఊపిరి లేని శరీరమైతే, నైతిక మూల్యాలతో వికసించిన మానవత్వమే ఈ భూమిపై దైవకరుణకు సజీవ సాక్ష్యం.ఈ సత్యం ఆచరణలోకి వచ్చినప్పుడే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం చేకూరుతుంది. అందుకే ధర్మం అంటే కేవలం ఆచారాలు, ప్రార్థనలకే పరిమితం కాదు; అది మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే జీవన విధానం. నిజమైన ధార్మికత మనిషిని కేవలం ఆరాధనలకే పరిమితం చేయదు; ఆకలితో ఉన్న వారిని, అనాథలను, బలహీనులను ఆడుకునేలా తీర్చిదిద్దుతుంది. స్వార్థానికి అతీతంగా, చివరకు తమకు వ్యతిరేకమైనా సరే న్యాయం వైపే నిలబడే సత్యసంధతను నూరిపోస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
ఒక సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది
సినిమా అంటేనే ఒక లాటరీ! అందులో జాక్‌పాట్ కొట్టినవాళ్లు రాత్రికి రాత్రే చరిత్ర పుటల్లోకి ఎక్కిపోతారు. నిన్నమొన్నటి వరకు అనుప్రియ నాగర్ అంటే ఎవరో ప్రపంచానికి తెలియదు. కానీ ఇవాళ బాక్సాఫీస్ వద్ద 150 కోట్లతో వసూళ్ల సునామీ సృష్టించిన సంచలన ప్రొడ్యూసర్. కేవలం 2 కోట్లతో తీసిన ‘హనుమాన్ అంశ్’ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. అసలు ఎవరీ అనుప్రియ నాగర్? లండన్‌లో చదువుకుంటూ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది? ఇదిగో ఆ క్రేజీ సక్సెస్ స్టోరీ...మామూలు ఘటనలే ఒక్కోసారి మిరకిల్స్గా మారతాయి. లేదా మిరకిల్స్ జరుగుతూ ఉండగా అవి మామూలు ఘటనలనే భ్రమను కలిగిస్తాయి. ‘నీమ్ కరోలి బాబా’ గా ఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక గురువు ‘మహరాజ్జీ’పై తీసిన సినిమాతో ఇన్వాల్వ్ అయిన వారంతా తమకు ఎదురైన ఘటనలను మిరకిల్స్గానే చూస్తున్నారు. ఆ సినిమాను తీయాలని దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికి సాధ్యమైంది. నీమ్ కరోలిబాబా పాత్ర కోసం ఒక ముఖ్యమైన నటుణ్ణి అనుకుంటే అతను జబ్బుపడి తప్పుకున్నాడు. సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శోభిత్ శ్రీవాస్తవకు ఆ వేషం దక్కింది. ఇప్పుడతను దేశమంతా తెలిశాడు. ఇక నిన్న మొన్నటివరకూ లండన్ బాత్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థిని అనుప్రియ నాగర్ అనుకోకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అయి సూపర్‌హిట్ తన ఖాతాలో వేసుకుంది. ‘బాబానే నన్ను ఈ పనికి ఎంచుకున్నాడు’ అని ఆమె కృతజ్ఞతతో పులకించిపోతోంది. కొన్ని సినిమాలు ప్రజల వద్దకు గొప్ప ఆదరణతో చేరడం అన్నింటికంటే పెద్ద మిరాకిల్. ఆ మిరాకిల్‌లో ఒక భాగమైంది అనుప్రియ నాగర్.నీమ్ కరోలి బాబాఎప్పుడూ ఒంటి మీద కంబళితో కనిపించే నీమ్ కరోలిబాబా హనుమంతుడి పరమ భక్తుడిగా జీవించి 1973లో లోకాన్ని వీడారు. ఆయన జీవితకాలంలో, తర్వాత ఆయన సన్నిధి వద్ద భక్తులు ఎన్నో దివ్య అనుభవాలు పొందిన కథనాలు ఉన్నాయి. ఆయన ఆశ్రమానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ‘ప్రేమించు’, ‘సేవ చెయ్’ అని ఉపదేశించిన బాబా జీవితాన్ని సినిమాగా తీస్తున్నప్పుడు బాబా చేసిన పనులను కేవలం ‘చమత్కారాలు’గా కాకుండా, భగవంతుని ‘లీలలు’గా చూపించడం ప్రేక్షకులను విపరీతంగా కట్టి పడేసింది. డిజాస్టర్ టాక్ ‘హనుమాన్ అంశ్’ విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమాను ఇండస్ట్రీ ‘డిజాస్టర్’ అని డిక్లేర్ చేసింది. ‘మొదటిరోజు 355 షోలతో ప్రారంభమైన మా సినిమా ఎనిమిదో రోజుకు 29 షోలకు పడిపోయింది. పెద్ద సినిమాల్లా ప్రమోషన్స్ చేయడానికి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. థియేటర్ల నుంచి తీసేస్తారనుకున్న టైమ్‌లో సినిమా చూసిన ప్రేక్షకులే పెద్ద విప్లవాన్ని తెచ్చారు. మూడోవారం నుంచి ఊహించని విధంగా పబ్లిక్ టాక్‌తో కలెక్షన్లు పెరిగి 156 కోట్లకు చేరాయి. ప్రేక్షకులే ఈ సినిమాకు పీఆర్ టీమ్‌గా మారి గెలిపించారు. ప్రేక్షకులు స్వయంగా వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తూ థియేటర్లకు క్యూ కట్టారు. కలెక్షన్లు ఒక్కసారిగా 22 శాతం పెరిగి, చూస్తుండగానే 150 కోట్ల మార్కును దాటేసింది’ అంది అనుప్రియ. స్టీవ్ జాబ్స్ ఇచ్చిన ఐడియాఅనుప్రియ నాగర్ తన చదువులో భాగంగా టెక్ కంపెనీల గురించి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆపిల్ సంస్థ స్టీవ్ జాబ్స్‌కు, ఫేస్బుక్ జుకర్‌బర్గ్‌కు నీమ్ కరోలిబాబా ఆశీర్వాదం ఉందని తెలుసుకుంది. స్టీవ్‌జాబ్స్, జుకర్‌బర్గ్ తమ కెరీర్లు మొదలెట్టడానికి ముందు నైనిటాల్‌కు సమీపంలో ఉన్న నీమ్ కరోలిబాబా ఆశ్రమస్థలం ‘కైంచిధామ్’కు వెళ్లి వచ్చినవారే. ‘అరె... నా దేశంలోని ఒక ఆధ్యాత్మిక గురువు గురించి విదేశీయుల ద్వారా నేను తెలుసుకోవాలా? నా దేశస్తులకు ఈ ఆధ్యాత్మిక గురువు గురించి నేను చెప్పాలి. ముఖ్యంగా జెన్ జికి చెప్పాలి’ అనుకుంది అనుప్రియ. అప్పటినుంచి బాబా గురించి తెలుసుకుంటూ ఆయనపై పుస్తకం రాయాలని ఇండియా చేరుకుంది. అప్పటికే దర్శకుడు విశాల్ చతుర్వేది ‘హనుమాన్ అంశ్’ పేరుతో బాబా మీద సినిమాను దాదాపు పూర్తిచేసి నిధుల కొరతతో ఉన్నాడని తెలుసుకుని తనే నిర్మాతగా మారింది.సమాజానికి ఇవ్వడమే...ఇన్ని కోట్ల రూపాయలు ఏం చేసుకుంటారు అని అడిగితే ‘నేను 21 ఏళ్ల అమ్మాయిని. ఇంత డబ్బు నేనేం చేసుకుంటాను? సమాజానికి తిరిగి ఇచ్చేస్తాను. పిల్లల విద్య, వైద్యం కోసం ఒక ప్రత్యేక ఫౌండేషన్ పెడుతున్నాను’ అని ప్రకటించింది అనుప్రియ. భవిష్యత్తులో కూడా కేవలం భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలపైనే సినిమాలు తీస్తానని బాస చేసింది. ఒక సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె సమాజ హితవుకు అవసరమైన మార్పు కోసం పని చేయడమే మిగిలింది. -
టికెట్ లేకున్నా విమానం గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!
విమానాశ్రయానికి మీ వాళ్లను సాగనంపడానికి వెళ్తున్నారా? టికెట్ లేకపోయినా ఇక విమానం గేట్ వరకు వెళ్లొచ్చా? 25 ఏళ్లుగా ఉన్న కఠిన భద్రతా నిబంధనల్లో అమెరికా ఇప్పుడు ఎందుకు మార్పులు చేస్తోంది? ఇప్పుడు చూద్దాం!2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు పూర్తిగా మారిపోయాయి. టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే భద్రతా తనిఖీల తర్వాత గేట్ల వద్దకు అనుమతించడం, ద్రవ పదార్థాలపై ఆంక్షలు విధించడం వంటి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు 9/11 ఘటనకు 25 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో.. ఈ నిబంధనల్లో కొన్నింటిని మళ్లీ మార్చే ప్రయత్నం జరుగుతోంది.అమెరికా రవాణా భద్రతా సంస్థ (టీఎస్ఏ) త్వరలో టికెట్ లేని వ్యక్తులను కూడా భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుని విమానాశ్రయంలోని గేట్ వరకు వెళ్లేందుకు అనుమతించనుంది. దీంతో కుటుంబ సభ్యులను విమానం ఎక్కించేందుకు వెళ్లేవారు వారిని గేట్ వరకు సాగనంపవచ్చు. అలాగే విమాన ప్రయాణంలో మధ్యలో కొంతసేపు ఆగే సమయంలో స్నేహితులను కలవడం, విమానాశ్రయంలోని రెస్టారెంట్లు, దుకాణాలకు వెళ్లడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి.అయితే ఈ సదుపాయం అందరికీ వెంటనే అందుబాటులోకి రాదు. టీఎస్ఏ ప్రీచెక్ లేదా నౌ ట్రావెలర్ నంబర్ ఉన్నవారికి తొలుత ఈ అవకాశం కల్పించనున్నారు. టికెట్ లేకుండా గేట్ వరకు వెళ్లాలనుకునే ప్రీచెక్ సభ్యులు తమ సందర్శనకు ఒకటి నుంచి మూడు రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలోని 13 విమానాశ్రయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీఎస్ఏ తెలిపింది.మరో ఆసక్తికరమైన మార్పును కూడా అమెరికా పరిశీలిస్తోంది. అది ఏంటంటే? టీఎస్ఏ ప్రీచెక్ ప్రయాణికులకు నీటితో నింపిన బాటిళ్లను కూడా తీసుకెళ్లేందుకు అనుమతించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది. 2006లో బ్రిటన్‌లో జరిగిన ఉగ్రదాడుల కుట్ర తర్వాత విమానాల్లో ద్రవ పదార్థాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే, కొందరు వ్యక్తులు శీతల పానీయాల బాటిళ్లలో ద్రవ రసాయనాలను దాచుకుని విమానాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అప్పట్లో గుర్తించారు.ఇప్పుడు భద్రతా తనిఖీల్లో ఉపయోగించే సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని విమానయాన భద్రతా నిపుణుడు జెఫ్ ప్రైస్ చెబుతున్నారు. పాత ఎక్స్‌రే యంత్రాల స్థానంలో వస్తున్న కొత్త CT స్కానర్లు ద్రవ రూపంలోని పేలుడు పదార్థాలను కూడా మెరుగ్గా గుర్తించగలవని ఆయన తెలిపారు. అందువల్ల భద్రతా ప్రమాణాలను తగ్గించడం వల్ల కాకుండా.. కొత్త సాంకేతికతపై నమ్మకంతో కొన్ని పాత ఆంక్షలను సడలించే అవకాశం ఏర్పడుతోందని వివరించారు.ఇటీవల అమెరికా విమానాశ్రయాల్లో మరో మార్పు కూడా జరిగింది. భద్రతా తనిఖీల సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా షూలు తొలగించాల్సిన నిబంధనను గత ఏడాది నుంచి తొలగించారు. ఈ మార్పులపై అమెరికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 9/11కు ముందు ఉన్న సాధారణ విమాన ప్రయాణ రోజులను గుర్తు చేసుకుంటున్న కొందరు ఈ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం భద్రతా నిబంధనలు సడలించడం వల్ల ప్రమాదం పెరుగుతుందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలకమైన భద్రతా చర్యలను కొనసాగిస్తూ, ఆధునిక సాంకేతికతను సమర్థంగా ఉపయోగిస్తే ప్రయాణికుల భద్రతకు రాజీ పడాల్సిన అవసరం ఉండదు.ఇవి కూడా చదవండి: క్యాట్‌లో మంచి స్కోర్.. ఐనా సైన్యంలోకి! కానీ చివరికి.. -
భారీ పుర్రె.. చిన్న వేట! టాస్మేనియన్ టైగర్ కథేంటి? విన్నారంటే షాకే!
ఒకప్పుడు ఆస్ట్రేలియాలో సంచరించిన టాస్మేనియన్ టైగర్ ఇప్పుడు భూమిపై లేదు. దాదాపు 90 ఏళ్ల క్రితమే ఈ జంతువు పూర్తిగా అంతరించిపోయింది. అయితే తాజాగా దాని పుర్రె, దవడను పరిశీలించిన పరిశోధకులు.. ఈ జంతువు గురించి ఇప్పటివరకు ఉన్న కొన్ని అంచనాలు తప్పని గుర్తించారు. ముఖ్యంగా ఇది చూడటానికి కుక్క లేదా తోడేలులా ఉన్నప్పటికీ, వాటిలా జీవించేది కాదని పరిశోధకులు చెబుతున్నారు.టాస్మేనియన్ టైగర్‌ను మరో పేరుతో ‘థైలాసిన్’ అని పిలుస్తారు. దీనికి శరీరంపై పులిలా చారలు ఉండటంతో టాస్మేనియన్ టైగర్ అనే పేరు వచ్చింది. అయితే ఇది నిజమైన పులి కాదు. ఇది కంగారూ, కోయాలా వంటి సంచిలో పిల్లలను పెంచే మార్సుపియల్ జంతువు. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో ఇవి సుమారు 2,000 ఏళ్ల క్రితమే కనుమరుగైనప్పటికీ, టాస్మేనియా ప్రాంతంలో మాత్రం మరికొంతకాలం జీవించాయి.ఈ జంతువును అప్పట్లో రైతులకు నష్టం చేసే ప్రమాదకరమైన వేటగాడిగా భావించేవారు. ముఖ్యంగా గొర్రెలను చంపుతున్నాయని పెద్ద సంఖ్యలో థైలాసిన్లను వేటాడారు. దీంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చివరకు 1936లో టాస్మేనియాలోని హోబార్ట్ జూలో ఉన్న చివరి థైలాసిన్ కూడా చనిపోయింది. అప్పటి నుంచి ఈ జాతి పూర్తిగా అంతరించిపోయినట్లుగా పరిగణిస్తున్నారు.అయితే తాజా పరిశోధనలో వాటి పుర్రెను పరిశీలించిన శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన విషయం తెలిసింది. టాస్మేనియన్ టైగర్ పుర్రె శరీర పరిమాణంతో పోలిస్తే చాలా పెద్దగా ఉండేదట. కానీ దాని ముక్కు పొడవుగా, సన్నగా ఉండేది. ఈ నిర్మాణం పెద్ద జంతువులతో పోరాడి వాటిని పడగొట్టేందుకు కాకుండా.. చిన్న జంతువులను వేగంగా పట్టుకుని కొరికేందుకు ఉపయోగపడేదని పరిశోధకులు చెబుతున్నారు.గతంలో టాస్మేనియన్ టైగర్ బరువు దాదాపు 30 కిలోల వరకు ఉండేదని భావించారు. కానీ కొత్త అంచనాల ప్రకారం వాటి సగటు బరువు సుమారు 17 కిలోలు మాత్రమే. అంటే ఇవి మనం ఊహించేంత పెద్ద జంతువులు కావు. కుందేలు లేదా అంతకంటే కొంచెం పెద్ద పరిమాణంలో ఉండే జంతువులను వేటాడేందుకు వీటి దవడ, పళ్లు బాగా సరిపోయేవని పరిశోధకులు చెబుతున్నారు. వేగంగా నోరు తెరిచి ఒక్కసారిగా కొరికే సామర్థ్యం వీటికి ఉండేదని వారు గుర్తించారు.టాస్మేనియన్ టైగర్ చరిత్ర కూడా చాలా పురాతనమైనదే. దాని పూర్వీకులు ఇతర క్షీరదాల నుంచి కోట్ల సంవత్సరాల క్రితమే విడిపోయినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే బయటకు కుక్కలా కనిపించినా.. దాని శరీర నిర్మాణం, జీవించే విధానం పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఒకేలా కనిపించే రెండు జంతువులు పరిణామ క్రమంలో ఎంత భిన్నమైనవిగా మారగలవో ఈ జంతువు మంచి ఉదాహరణ అని పరిశోధకులు చెబుతున్నారు.ఇక అంతరించిపోయిన టాస్మేనియన్ టైగర్‌ను మళ్లీ భూమిపైకి తీసుకురావచ్చా అనే అంశంపైనా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. పురాతన డీఎన్ఏ, జన్యు సాంకేతికత, ఆధునిక పునరుత్పత్తి విధానాలను ఉపయోగించి ఈ జాతిని తిరిగి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా.. టాస్మేనియన్ టైగర్‌పై జరుగుతున్న పరిశోధనలు మాత్రం అంతరించిపోయిన జంతువుల జీవితం, పరిణామం గురించి ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.ఇవీ చదవండి: ‘డాల్ఫిన్ గార్డ్’..! ఆరేళ్ల చిన్నారి ఘనత.. -
ఆ టీచర్ ధైర్యానికి హ్యట్సాఫ్ చెప్పాల్సిందే..! ప్రాణాలు సైతం లెక్కచేయకుండా..
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఒక టీచర్ చూపిస్తున్న అంకితభావం అందరినీ ఆకట్టుకుంటోంది. పదుల సంఖ్యలో కూడా లేని విద్యార్థుల చదువు కోసం ప్రతిరోజూ దట్టమైన అడవిలో ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కవల్తేక్ ధంగర్వాడా అనేది కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి ఒక చిన్న గ్రామం. కేవలం మూడు ఇళ్లు, తొమ్మిది మంది నివాసితులు. వ్యవసాయం, పశుపోషణ వారి జీవనాధారం. ఈ ఊరిలో ఉన్న బడికి వెళ్లాలంటే చాలా కష్టం. దట్టమైన అడవిని, క్రూరమైన జంతువులను, కొండకోనలను దాటుకుని వెళ్లాలి. కానీ జీవన్ మిథారీ అనే ఉపాధ్యాయుడు మాత్రం ఆ గ్రామంలో ఉండే ఐదారుగురు పిల్లల చదువుకోసం పదమూడేళ్లుగా అడవిలో ప్రయాణిస్తున్నాడు. మిథారీ నివసించే కాలే గ్రామం నుంచి కవల్తేక్ ధంగర్వాడా 28 కిలోమీటర్లు. అడవిలోకి వెళ్లే ముందు మిథారీ తన వాహనాన్ని అక్కడే ఆపివేసి 5 కిలోమీటర్ల నడక దారిలో వెళ్తాడు. వర్షం పడితే ఈ మార్గమంతా పూర్తి జారుడుగా ఉంటుంది. అందుకే మిథారీ డబుల్ రెయిన్ కోట్, హెల్మెట్ వంటి రక్షణ పరికరాలతో ప్రయాణిస్తాడు. అంతేకాకుండా ఈ మార్గంలో చిరుత పులులు, ఎలుగుబంట్లు, విష సర్పాలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. అయినా అతను వెనక్కి తగ్గడు. అడవిలో నడుస్తున్నప్పుడు పాటలు పాడుతూ లేదా శబ్దాలు చేస్తూ వెళ్తుంటాడు. పట్టణాల్లోని పిల్లలతో సమానంగా ఈ పేద పిల్లలు కూడా చదువుకోవాలన్నదే తన కోరిక అని ఈ ఉపాధ్యాయుడు చెబుతుంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతిరోజూ అడవి బాట పడుతున్న ఈ ఉపాధ్యాయుడు ఎంతో మంది టీచర్లకు ఆదర్శం.(చదవండి: క్యాట్‌లో మంచి స్కోర్ చేసినా..సైన్యంలోకి! కానీ చివరికి..) -
క్యాట్‌లో మంచి స్కోర్.. ఐనా సైన్యంలోకి! కానీ చివరికి..
క్యాట్‌లో మంచి మార్కులు సంపాదించి చక్కటి కార్పొరేట్ కొలువుల్లో మంచి ప్యాకేజ్‌తో జాబ్ కొట్టాలనేది చాలామంది యువత డ్రీమ్. అయితే ఈ వ్యక్తి కష్టతరమైన క్యాట్ పరీక్షలో అవలీలగా మంచి మార్కులు తెచ్చుకున్నా..వద్దని మరి దేశ సేవ మిన్నా అటూ సైన్యంలో చేరాడు. కానీ అతడు ఒకటి తలిస్తే విధి మరోలా తలిచి ఎన్ని పరీక్షలు పెట్టిందంటే..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయినా వెనక్కి తగ్గకుండా వెళ్లినా..ఈసారి మరింత కఠినంగా పరీక్ష పెట్టింది. ఎంతలా అంటే .. కథన రంగంలో కాదు నీ శరీరంతో యుద్ధ చేయి అని సవాలు విసురుతున్నట్లుగా దాడి చేస్తోంది ఆ అరుదైన వ్యాధి. ఆ వ్యక్తే మాజీ ఆర్మీ అధికారి కల్నల్ అనురాగ్ ఉపాధ్యాయ్. క్యాట్ పరీక్షలో మంచి ప్రతిభ కనబర్చినప్పటికీ కార్పొరేట్ కెరీర్ వద్దంటూ ఆర్మీని ఎంచుకున్నారు. అందులో ఆయన అత్యంత కఠినతరమైన ఆయన పారా స్పెషల్ ఫోర్సెస్‌లోకి వెళ్లారు. ఇది భారతదేశపు అత్యున్న స్పెషల్ ఫోర్సెస్. అలా ఆయన 3 PARA (SF)తో తన ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత, సరికొత్తగా ఏర్పాటు చేసిన 12 PARA (SF) రెజిమెంట్‌ను బృందంలో కీలక సభ్యునిగా వ్యవహరించారు. అయితే ఆయన కలలు కన్న ప్రపంచంలోకి సాగనివ్వకుండా విధి ఆయన జీవితాన్ని ఎలాంటి కుదుపులకు గురిచేసిందంటే..చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు..ఐనా..2008లో గుండెపోటుకు గురైనప్పటికీ దేశ సేవను కొనసాగించాలనే అచంచలమైన లక్ష్యంతో తిరిగి విధుల్లోకి చేరారు. ఆయన ఇచ్చిన ఎంట్రీని తోటి మాజీ సైనికులు దృఢ సంకల్పం, శక్తిమంతమైన అంకితభావానికి కేరాఫ్‌గా అభివర్ణించారు. ఇంతలా రోగంతోనే యుద్ధం చేసిన ఈ వీరుడిని మరోసారి అనారోగ్యం దాడి చేసింది. ఈ సారి 2025 ఆగస్టులో తీవ్రమైన పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ఆ స్ట్రోక్ వల్ల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి నరాలకు సంబంధించిన లాక్డ్-ఇన్ సిండ్రోమ్ బారినపడ్డారు. దీని వల్ల తీవ్ర పక్షవాతానికి గురై మొత్తం అవయవాలన్ని చచ్చుబడిపోతాయి. కేవలం కంటి కదలికలతో ఆల్ఫాబేట్ స్కానింగ్‌తో మాత్రమే మాట్లాడగలరు. ఆయనకు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతున్నా.. ఆయన కదలలేరు, మాట్లాడలేరు. అంతేగాదు ఇతర అనారోగ్య సమస్యల రీత్యా మోకాళ్ల కింద నుంచి రెండు కాళ్లను కూడా తొలగించారు వైద్యులుఈసారి విధి అరుదైన వ్యాధి రూపంలో ఆయన్ను ఓడించేలా దాడి చేస్తున్నా..అనురాగ్ కనబరుస్తున్న మొక్కవోని ధైర్యం ప్రతి ఒక్కర్ని కదిలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడి కుటుంబం ఈ అరుదైన వ్యాధిపై పరిశోధనలు చేసే శాస్రవేత్తలు, నిపుణులు దయచేసి అతడికి సాయం చేయాలని కోరుతున్నారు. దేశ సేవ కోసం ఇంతలా కష్టపడ్డ అతడి కోసం ఏదైనా చేసి రక్షించండి అని వేడుకుంటున్నారు. అంతేగాదు అతడి చివరి శ్వాస వరకు దేశ సేవలో ఉండాలనేది అతడి ఆశయం అంటూ ఆర్మీ అధికారులను, నిపుణులను సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నిజానికి అసలు అనారోగ్య సమస్య వస్తేనే..రిస్క్ తీసుకుని పనిచేసే ఉద్యోగాల దరిదాపుల్లోకి రావడానికి ఇష్టపడం. కానీ అజేయమైన తెగువతో దేశ సేవ తన కర్తవ్యం, డ్యూటే దైవంగా సాగిన అతడి అంకితభావానికి, అనారోగ్యంతో పోరాడిన అతడి మొక్కవోని ధైర్యానికి జయహో అనాల్సిందే కదూ..!.(చదవండి: ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్‌గా!) -
ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్‌గా!
సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్ అలాంటి ఉద్యోగాన్ని వద్దనుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. తీరా ఆ నిర్ణయం భవిష్యత్తులో బాధను కలిగించకుండా ఉంటుందా అనే సందేహాం సదా వెంటాడుతుంటుంది. అయినా సరే ఇంతటి భయానక నిర్ణయం తీసుకుంది ఈ మహిళ. అది కూడా దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నిగ్ధా బోస్ సురక్షితమైన స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్నుకుంది. ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా మంచి జీతం ఆర్జించే ఉద్యోగాన్ని వదులకుందామె. అసలు ఈ నిర్ణయాన్ని చాలామంది తప్పుబట్టారు, వెర్రి నిర్ణయంగా అభివర్ణించారు. అయితే ఆ ఉద్యోగంలో తను పనిచేస్తున్నట్లుగా అనిపించలేదని, నిరంతరం ఒత్తిడి, మానసిక అలసట, సొంత శరీరంలో అనుసంధానం కావడానికి సమయమే లేనట్లుగా అనిపించిందని చెబుతుంది. ఏదో ఉక్కిరిబిక్కిరిగా అనిపించి ఆ ఉద్యోగం వదిలేసినట్లు పేర్కొంది స్నిగ్ధా. ఆ తర్వాత మీరట్‌లో యోగాకి సంబంధిచిన 'తులా వెల్నెస్ స్టూడియోని నడుపుతున్నట్లు తెలిపింది. తనకు ఆర్థిక భద్రత కంటే వ్యక్తిగత శ్రేయస్సే ముఖ్యమనిపించిందని అంటోంది. ఇలా తనలా ఉద్యోగం మానేసేంత సౌలభ్యం అందరికీ ఉండకపోవచ్చు. అలాగే తనలా చేయాల్సిన పనిలేదు కూడా. ఒత్తిడితో ఉద్యోగం చేస్తూ కూడా ఆరోగ్యాన్ని చూసుకోచ్చు. ఒక పక్క ఉద్యోగం, అలాగే శారీరక బలం పెంపొందిచుకునేలా చురుగ్గా ఉండే ప్రయత్నం చేయొచ్చని అంటోంది. చెప్పాలంటే జీవితాన్ని మార్చకుండానే ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయొచ్చని, కానీ తనకు ఆ అవకాశం ఉంది కాబట్టి మానసిక ఆరోగ్యమే ప్రధానంగా భావించి, ఇలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నా అని సోషల్ మీడియా వేదికగా తన స్టోరీని పంచుకుంది స్నిగ్ధా. అంతేగాదు నెటిజన్లు కూడా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న స్నిగ్ధ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ..తమ అనుభవాల్ని పంచుకున్నారు. మరొక యూజర్ తాను కూడా ఎస్బీఐలో ఉద్యోగం మానేసి తనకు నచ్చి గోల్ప్ క్రీడపై ఫోకస్ పెట్టి అంతర్జాతీయ క్రీడాకారిణిగా దూసుకుపోతున్నా అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Snigdha | Certified Yoga & Pranayam Instructor (@tulaa_wellness) (చదవండి: అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!) -
‘డాల్ఫిన్ గార్డ్’..! ఆరేళ్ల చిన్నారి ఘనత..
సముద్రంలో మనుషుల కార్యకలాపాలు పెరుగుతున్నకొద్దీ అందులోని జీవుల మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. ముఖ్యంగా పడవలు తిరిగే ప్రాంతాల్లో డాల్ఫిన్లు ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైనా పరిష్కారం చూపించగలమా? అనే ప్రశ్న ఓ ఆరవ తరగతి బాలికను ఆలోచింపజేసింది. అలా ఆమె ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే డాల్ఫిన్ గార్డ్ ప్రాజెక్ట్. అదే పరిశోధన ఆమెను బుల్లిశాస్త్రవేత్తగానూ, స్టేట్ విన్నర్ గానూ నిలిచేలా చేసింది.అమెరికాలోని వర్జీనియా బీచ్, ఓల్డ్ డొనేషన్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఇషాన్వి సఖార్పే రూపొందించిన ‘డాల్ఫిన్ గార్డ్’ అనే ప్రాజెక్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు 2026 వర్జీనియా రాష్ట్ర ప్రతిభా పురస్కారం, ప్రత్యేక గుర్తింపు లభించాయి. డాల్ఫిన్లు ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత రక్షించడం కంటే.. అసలు ప్రమాదమే జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిదన్నది అసలు డాల్ఫిన్ గార్డ్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.. పడవల ప్రొఫెల్లర్లు, చేపల వలలు వంటి వాటి వల్ల డాల్ఫిన్లకు తీవ్రమైన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సముద్రంలో మానవ కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య కూడా పెరుగుతోంది. అందుకే ప్రమాదాన్ని గుర్తించి, అది తీవ్రమయ్యేలోపే తగ్గించే మార్గం గురించి ఇషాన్వి తన ప్రాజెక్ట్‌లో పరిశోధించింది. అదే డాల్ఫిన్ గార్డ్ ప్రత్యేకత. అయితే ఇషాన్వి ప్రాజెక్ట్ సాధారణ స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోలేదు. అమెరికాలోని మిడిల్ స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘3ఎం’ యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్‌లో ఆమె ఇదే కాన్సెప్ట్‌తో పాల్గొంది. ఈ పోటీలో విద్యార్థులు తమ శాస్త్రీయ ఆలోచన లేదా ఆవిష్కరణను చిన్న వీడియో ద్వారా పరిచయం చేయాలి. కొత్త ఆలోచన, శాస్త్రీయ పరిజ్ఞానం, సమస్య పరిష్కార సామర్థ్యం, కమ్యూనికేషన్, ప్రదర్శన వంటి అంశాల ఆధారంగా ప్రాజెక్టులను పరిశీలిస్తారు. అయితే ఇషాన్వి రూపొందించిన ఈ ‘డాల్ఫిన్ గార్డ్’ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరకు ఆమె వర్జీనియా స్టేట్ మెరిట్ విన్నర్‌గా నిలిచింది. ఇషాన్వికి సైన్స్‌పై మాత్రమే ఆసక్తి ఉందనుకుంటే పొరపాటే. గణితంలోనూ ఆమెకు మంచి ప్రతిభ ఉంది. ఎన్నో మెడల్స్‌ని సైతం గెలుచుకుంది.చాలామంది పిల్లలు సైన్స్‌ను పాఠ్యపుస్తకాల్లో నేర్చుకుంటారు. కానీ ఇషాన్వి మాత్రం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించింది. అందులోని సమస్యను గుర్తించి.. దానికి శాస్త్రీయ పరిష్కారం వెతికే ప్రయత్నం చేసింది. అదే ఆమెను నేడు బుల్లి శాస్త్రవేత్తగా నిలబెట్టింది. -
అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!
పొలంలోకి దిగి వ్యవసాయ పనులు చేయడాన్ని చూసి ఆమెను ఎగతాళి చేశారు. కానీ ఆ మాటలకు సమాధానం చెప్పడానికి ఆమె మాటలను ఎంచుకోలేదు.. పనినే ఎంచుకుంది. అలా అర ఎకరంతో మొదలు పెట్టి 40 ఎకరాల వ్యవసాయ సామ్రాజ్యాన్ని నిర్మించింది పంజాబ్‌లోని మోగా ప్రాంతానికి చెందిన మణ్‌దీప్ కౌర్ ఖైరా. వ్యవసాయంలోకి అడుగుపెట్టినపుడు ఆమెకున్నది కేవలం అరెకరం పొలం మాత్రమే. కానీ ఆమెకు అది అడ్డంకిగా అనిపించలేదు. భూమిని లీజుకు తీసుకుని కూడా వ్యవసాయం చేయవచ్చునని ఆలోచించింది. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చివరకు 40 ఎకరాల్లో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించే స్థాయికి చేరుకుంది. ఇందులో ఎక్కువ భూమి లీజుకు తీసుకున్నదే. అలా పొలంలో పనిచేయడం నుంచి పదిమందితో పెద్ద ఎత్తున వ్యవసాయం చేయించే స్థాయికి చేరుకుంది మణ్‌దీప్. అయితే 40 ఎకరాల స్థాయిలో వ్యవసాయం చేయాలంటే కేవలం భూమి ఉంటే సరిపోదు. యంత్రాలు, పరికరాలు, పెట్టుబడి, నిర్వహణ సామర్థ్యం కూడా అవసరం. ఇందుకోసం మణ్‌దీప్ కౌర్ మూడు ట్రాక్టర్లు, ఏడు ట్రాలీలు, ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సొంతంగా కొనుగోలు చేసింది. అలా ఈ మహిళా రైతు ఏడాదికి వ్యవసాయం ద్వారా 80 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సమాజంలో ఎక్కువ భూమి ఉన్నవారినే పెద్ద రైతులుగా భావించే పరిస్థితి ఉంది. కానీ మణ్‌దీప్ కౌర్ కథ ఈ ఆలోచనకు భిన్నమైనది. సొంత భూమి లేదని ఆగిపోకుండా.. తనకున్న ఆలోచనతో ముందుకు సాగి అందరి మన్ననలు పొందుతోంది. (చదవండి: ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్ బ్రాండ్ వ్యాపారం!) -
ఇప్పటికీ ఆశ్చర్యమే..! తన ప్రెగ్నెన్సీపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్లో తన ప్రగ్నెన్సీ గురించి ప్రకటించారు సమంత రాజ్ నిడిమోరులు. తాము మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. ప్రసూతి శెలవులు అనంతరం మరిన్ని హిట్లతో మళ్లీ మీ ముందుకు వస్తానని తన అభిమానులకు హామీ ఇచ్చింది నటి సమంత. ఆ తర్వాత నుంచి తన ప్రగ్నెన్సీకి సంబంధించి ప్రతీ అప్డేట్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ చిల్ అవుతోంది సమంత. ఈ జర్నీలో ప్రతి నెల ఓ అద్భుతం..అలాగే ఈ ప్రెగ్నెన్సీ తనకు ఎప్పటీ ఆశ్చర్యమే ఎందుకంటే..అంటూ తన మాతృత్వపు మధురిమకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంది. తను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు రీత్యా పిల్లలు కలిగే అవకాశం లేదనుకున్నాని, అందుకు తామిద్దరం సిద్ధపడిపోయామని చెప్పుకొచ్చింది. అసలు ఏం జరిగినా ఇద్దరం కలిసి ముందుకు సాగుదాం అని అనుకున్నాం. అలా నిర్ణయించుకున్న తరుణంలో ప్రెగ్నెంట్ అని నిర్థారణ కావడం తనని చాలా ఆశ్చర్యంలో ముంచెత్తిందని సంబరంగా చెబుతోంది సమంత. సరిగ్గా తాను ప్రెగ్నెంట్ అని తెలిసింది మా ఇంటి బంగారం మూవీ షూటింగ్‌ల ‘త త తతస్సాదియ్యా పాట’ షూట చేస్తున్నప్పుడే తెలిసిందని, దాంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని నాటి పరిస్థితిని వివరించింది. తనకి 2022లో ఆటోఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్ ఉన్నట్లు నిర్థారణ అయినప్పుడు అవేళ తాను పడ్డా నరకం ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. అసలు ఆ టైంలో జీవితమే అయిపోయిందనిపించింది, పైగా లేని ఆత్మవిశ్వాసాన్ని కొని తెచ్చుకున్నట్లుగా నటిస్తున్నట్లుగా అనిపించిందంటూ నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. అంతేగాదు ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులకు ఎలా స్పందిస్తాననేది కూడా తన నియంత్రణలో లేనట్లుగా, చాలా బలహీనంగా అయిపోయినట్లు అనిపించిందంటూ కన్నీటిపర్యంతమైంది. కానీ ఆ వ్యాధి నుంచి బయటపడేలా వర్కౌట్లు చేస్తూ..మెరుగ్గా మారి, తిరిగి తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలిగానని చెప్పుకొచ్చింది. ఒక రకంగా ఈ వ్యాధి తనకు జీవితంలో దృఢచిత్తం, ఆశ, విశ్వాసం వంటి విలువల గురించి గొప్ప పాఠాన్ని నేర్పిందని పేర్కొంది. ఆ తర్వాతే తన నటన, జీవితం మరింత వాస్తవికంగా మారినట్లు అనిపించిందంటూ భావోద్వేగంగా మాట్లాడింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: జీర్ణించుకోలేకపోయా అందుకే..!నికితా పోర్వాల్ భావోద్వేగభరిత లేఖ) -
విడాకులు ఇవ్వకుంటే రెండో భార్యకు నో పింఛన్
ప్రభుత్వ ఉద్యోగి తన మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకుంటే, అతని మరణానంతరం ఆ రెండో భార్యకు ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛను) పొందే హక్కు లేదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ ఉద్యోగి ఆర్. సమన్ మరణించిన తర్వాత, ఆయన రెండో భార్య తమిళరసి ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే మొదటి భార్య నళినికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వనందున ప్రభుత్వం ఈ అభ్యర్థనను తిరస్కరించింది.అయితే, కోర్టుకు వెళ్లిన సందర్భంలో సింగిల్ జడ్జి బెంచ్ తమిళరసికి అనుకూలంగా తీర్పు ఇవ్వగా, తమిళనాడు ప్రభుత్వం దీనిపై అప్పీల్ చేసింది. హైకోర్టు తీర్పు: ప్రభుత్వ అప్పీలు పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎస్.ఎమ్. సుబ్రహ్మణ్యం, జస్టిస్ కృష్ణస్వామి గోవిందరాజన్ ధర్మాసనం దంపతులు విడిపోవడానికి చేసుకున్న ఒప్పందం చట్టబద్ధమైన విడాకులు కాదని స్పష్టం చేసింది. అందువలన సమన్ – తమిళరసిల వివాహం చెల్లదని, ఆమెకు ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత లేదని పేర్కొంటూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసింది. పైగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయిన తమిళరసి ఇప్పటికే స్వయంగా సొంత పెన్షన్ పొందుతున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. 177 ఫిర్యాదులు కాగా, మరో కేసులో ప్రైవేట్ పాఠశాలలకు శాశ్వత గుర్తింపు అనుమతులు ఇప్పిస్తామని నమ్మించి రూ. 100 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన కేసులో ఇప్పటివరకు 177 ఫిర్యాదులు వచ్చాయని మద్రాస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ) పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తమిళనాడు తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు అరసకుమార్ను ఇప్పటికే అరెస్ట్ చేసి గుండా చట్టం కింద జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ వి. లక్ష్మీ నారాయణన్ ముందుకు ఈ పిటిషన్ రాగా, విచారణ ఇంకా కొనసాగుతోందని, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పోలీసులు కోరారు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి విచారణనుగురువారానికి వాయిదా వేశారు. చదవండి: ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు -
సంతానం.. క్షేమం కోసం పోలాల అమావాస్య పూజ
సంతానం లేనివారు సంతానం కలిగే వరకు పరితపిస్తూనే ఉంటే, సంతానం ఉన్నవారు తమ పిల్లలకు ఎటువంటి అంటువ్యాధులు, రోగాలు రాకుండా ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేసే వ్రతమే పొలాల అమావాస్య వ్రతం. శ్రావణ బహుళ అమావాస్య నాడు చేసే ఈ వ్రతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఉద్దేశంతో... ఒక్కోవిధంగా చేస్తారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో పశువులను పూజిస్తే మరికొన్ని తాలలో కంద మొక్కను పూజించి, కలగలపు పులుసు చేసుకుని తింటారు.రేపు పోలాల అమావాస్య సందర్భంగా ఆ వ్రత విధానం ...పూజకు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, పండ్లు. దీపారాధన కుందులు, నూనె/నెయ్యి, వత్తులు, అగరు బత్తీలు, కర్పూరం సిద్ధం చేసుకోవాలి. మరీ ముఖ్యమైనవి: కంద మొక్క (లేదా కంద పిలక), తోరాలు (పసుపు రాసి, పసుపు కొమ్ములు కట్టిన దారాలు). నైవేద్యం: పూర్ణం బూరెలు, 9 రకాల కూరగాయలతో చేసిన కలగాయ కూర/పులుసు. పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, పీటపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్నిపరచాలి. దానిపై కంద మొక్కను ఉంచి మంగళగౌరీ దేవి లేదా పోలేరమ్మ తల్లిగా భావించాలి.గణపతి ప్రార్థన: ఏ పూజ అయినా విఘ్నాలు లేకుండా సాగడానికి ముందుగా వినాయకుడిని మనసు లో స్మరించుకోవాలి.‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ‘దీపారాధన: దీపాలను వెలిగించి, దానికి పసుపు, కుంకుమలు పెట్టాలి. ‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా’ అంటూ మూడుసార్లు నీటిని తీసుకోవాలి. ప్రధాన పూజ – తోర పూజ కంద మొక్కకు పసుపు, కుంకుమలు పెట్టి, పూలతో అలంకరించాలి. అమ్మవారిని షోడశోపచారాలతో (ధ్యానం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలు) పూజించాలి. తోర పూజ: పసుపు కొమ్ములు కట్టిన తోరాలను (దారాలను) అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించాలి. తోరం కట్టుకునేటప్పుడు ‘పోలాయ నమస్తుభ్యం సర్వ సౌభాగ్యదాయిని... పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం బధ్నామి తవ తోరకమ్’ అని భక్తి శ్రద్ధలతో చదువుతూ తోరం కట్టుకోవాలి. ‘నైవేద్యం: తయారు చేసుకున్న పూర్ణం బూరెలు, కలగాయ (ఇరుగు పొరుగు ఇళ్లనుంచి సేకరించిన లేదా స్వయంగా సమకూర్చుకున్న రకరకాల కూరగాయలతో చేసిన పులుసు)ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పోలాల అమావాస్య వ్రత కథ. (ఈ కథను కూడా ఒక్కో ్ర΄ాంతంలో ఒక్కో విధంగా చెప్పుకుంటారు. అధిక ప్రాచుర్యం పొందిన కథలలో ఇదొకటి) పూజ పూర్తయిన తర్వాత చేతిలో అక్షతలు, పూలు పట్టుకుని ఈ కింది కథను భక్తితో చదువుకోవాలి లేదా వినాలి. వ్రతకథ: పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. వారందరికీ వివాహాలై, పిల్లలు కలిగారు. అయితే అందరికంటే చిన్నవాడి భార్యకు పుట్టిన పిల్లలందరూ పుట్టిన వెంటనే చనిపోతుండేవారు. ప్రతి ఏటా శ్రావణ లేదా భాద్రపద అమావాస్య రోజున పెద్దకోడళ్లు అందరూ కలిసి ఎంతో వైభవంగా పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించేవారు. కానీ చిన్నకోడలికి పిల్లలు చనిపోతుండటం వల్ల, ఆమెను సూతకం (మైల) కారణంతో పూజకు రానిచ్చేవారు కాదు. ఒక సంవత్సరం అమావాస్య నాడే చిన్నకోడలికి మళ్లీ బాబు పుట్టాడు, కానీ ఆ బాబు కూడా వెంటనే చనిపోయాడు. ఆ దుఃఖాన్ని భరించలేక, పూజకు ఆటంకం కలుగుతుందనే భయంతో ఆమె ఆ చనిపోయిన బిడ్డను ఎవరికీ చెప్పకుండా గదిలో ఒక చాట కింద దాచిపెట్టింది. తోడికోడళ్లు పూజ ముగించుకుని, కందమొక్కకు కట్టిన తోరాలను చిన్నకోడలికి ఇవ్వడానికి వచ్చారు. ఆమె తోరాన్ని తీసుకుని, మనసులో ఎంతో బాధపడుతూ గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లిని మనసారా ప్రార్థించింది. అనంతరం చిన్నకోడలు చనిపోయిన తన బిడ్డను ఎత్తుకుని ఎవరికీ తెలియకుండా ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్లి, దేవత పాదాల చెంత బిడ్డను ఉంచి బోరున విలపించింది. ఆమె నిష్కల్మషమైన భక్తికి, మాతృత్వపు వేదనకు కరిగిపోయిన పోలేరమ్మ తల్లి ప్రత్యక్షమైంది. తన అమృత హస్తంతో ఆ చనిపోయిన బాలుడిని తాకగానే, ఆ బిడ్డ ప్రాణాలతో లేచి బోసినవ్వులు నవ్వాడు. అంతేకాకుండా, గతంలో చనిపోయిన ఆమె మిగతా పిల్లలందరినీ కూడా అమ్మవారు బతికించి ఆమెకు అప్పగించింది. తన పిల్లలందరితో కలిసి చిన్నకోడలు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె భక్తిని చూసి ఊరివారంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి సంతాన రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని నిష్టగా చేయడం ప్రారంభించారు. ఉద్యాపన లేదా ముగింపుకథ పూర్తయిన తర్వాత చేతిలోని అక్షతలను తలపై వేసుకోవాలి. పూజించిన తోరాలను తీసుకుని తల్లి తన పిల్లల కుడి చేతికి కట్టాలి. ఆ తర్వాత ముత్తయిదువులకు వాయనాలు (తాంబూలం, బూరెలు) ఇచ్చి, పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనితో వ్రతం సంపూర్ణమవుతుంది. ఆ తర్వాత యథాశక్తి దాన ధర్మాలు చేయాలి. పూజించిన కంద మొక్కను ఏం చేయాలి?ఈ వ్రతంలో పూజించిన కంద మొక్కను ΄ోలాల అమావాస్య మరుసటి రోజు ఇంటి ఆవరణలో కానీ, పూల కుండీల్లో కానీ నాటాలి. ప్రతిరోజూ నీళ్లు ΄ోస్తూ మొక్కను సంరక్షించాలి. కొద్ది రోజులకు ఈ మొక్క పక్కనే మరికొన్ని పిలకలు వస్తాయి. అలా రావడం శుభసూచకం. కంద మొక్కకు పిలకలు వస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అప్పటికే సంతానం ఉన్నవారికి వారి సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుందని ప్రతీతి. – పి.సాయికృష్ణ ప్రణతి(చదవండి: అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!) -
అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్‌కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్’ అని పేరు పెట్టనున్నారు.AI, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్ కెల్లర్ తెలిపారు.ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రొఫెసర్‌షిప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇంక్యుబేషన్, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళంవికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వికాస్ సిన్హా నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్‌కామ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ డేటా సైన్స్‌ను ఏర్పాటు చేశారు.“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్ డ్రీమ్‌లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్ సిన్హా తెలిపారు.AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!) -
జీర్ణించుకోలేకపోయా అందుకే..!నికితా పోర్వాల్ భావోద్వేగభరిత లేఖ
ఇటీవల ముగిసిన మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నికితా పోరాల్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరితమైన లేఖ రాశారు. కిరీటాన్ని అందుకోలేకపోయినా..ఆ విస్ వరల్డ్ తనకు అందించి అనుభవం, ఆ ప్రయాణంలో తనకు లభించిన ప్రేమ, నేర్చుకున్న పాఠాలను గురించి లేఖలో పంచుకుంది. తన మిస్‌వరల్డ్ జర్నీకి సంబంధించిన ఫోటోల తోపాటు ఈపోస్ట్ని కూడా జోడించి షేర్ చేసింది. ఆ లేఖలో నికితా ఇలా రాసుకొచ్చింది. "మిస్ వరల్డ్ ఫైనల్ తర్వాత కిరీటం లేకుండా ఇంటికి రావడం అత్యంత కష్టమైన విషయం, అయినా అక్కడ పొందిన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అక్కడ తనకు లభించిన ప్రేమ, మద్దతు..ఇలా ప్రతీదాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరంతా నేను కిరీటాన్ని గెలుచుకోవాలని కొండంత ఆశతో ఎదురుచూశారు. అలా ఇంతకుమందెన్నడూ చూడని ఎన్నో కుటుంబాల ప్రేమను సంపాదించుకున్నాను. అందాల పోటీల ప్రపంచంలో అత్యంత విచిత్రమైన మరియు అందమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మీకు మద్దతు ఇచ్చే అకౌంట్ల వెనుక ఉన్న ముఖాలు మనకు తెలియవు. తెల్లవారుజామున 2 గంటలకు ఆ ఎడిట్ ఎవరు చేస్తున్నారో, ఆ సుదీర్ఘ సందేశం ఎవరు రాస్తున్నారో, కామెంట్ సెక్షన్లో నాకోసం ఎవరు పోరాడుతున్నారో, అప్డేట్ కోసం పేజీని ఎవరు రిఫ్రెష్ చేస్తున్నారో కూడా తెలియదు... కానీ ఎలాగోలా వారి ప్రేమ మనకు తెలుస్తుంది అంటూ అభిమానులను ఉద్దేశించి రాసింది.". ఆ తర్వాత తన ఓటమి గురించి ఇలా పేర్కొంది. " ‘ఇండియా' అని పిలిచే అదృష్టం దక్కించుకున్నా. అసలు ఆ వారాల పాటు, నా పేరు దాదాపు కనుమరుగైపోయింది, మర్చిపోయా. ఎవరైనా 'ఇండియా!' అని పిలవగానే ఏదో తెలియని పులకింత, ఒక అటెన్షన్ వచ్చేసేవి. నిజానికి నేను కిరీటాన్ని దక్కించుకోవాలని అనుకున్నా..బలంగా కోరుకున్నా..అందుకోసం ఎంతో కష్టపడ్డా. కానీ ఓటమిని ఎదుర్కొన్నా..అయినప్పటికీ ఈ జర్నీలో ఎన్నో జ్ఞాపకాలు, స్నేహాలు, ప్రేమలు సంపాదించుకుని సరికొత్త నికితాగా ఇంటికి తిరిగి వచ్చా. కొన్ని విజయాలు వరించలేకపోయినా..హృదయంలో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతాయి. ప్రేమతో మీ నికితా అంటూ తన పోస్ట్‌ని ముగించింది నికితా పోర్వాల్. View this post on Instagram A post shared by Nikita Porwal (@nikitaporwal_) (చదవండి: అమ్మాయి నిజంగా బంగారం! ఆ డ్రెస్ అక్షరాల రూ. 4 కోట్లుపైనే..) -
1980ల ట్రెండ్ వెనుక ఏముంది? ఎందుకు వైరల్ అవుతోంది?
న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం 1980ల నాటి ఫొటోల ట్రెండ్ వైరల్‌గా మారింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సాధారణ సెల్ఫీలను.. పెద్ద హెయిర్‌స్టైల్, పాతకాలపు దుస్తులు, ఫిల్మ్ గ్రెయిన్‌తో కూడిన రెట్రో ఫొటోలుగా మార్చుకుంటున్నారు. దశాబ్దాల క్రితం తాము ఎలా కనిపించి ఉండేవారమో ఊహించుకుంటూ, రూపొందించిన ఈ చిత్రాలను పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.చూడటానికి ఇది సరదా సోషల్ మీడియా ఛాలెంజ్‌లా కనిపిస్తోంది. ఇప్పటి యువత నాటి సాంకేతికత, భౌతిక మాధ్యమాలు, రెట్రో రూపకల్పన వైపు మొగ్గుచూపుతున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఇటీవల పేర్కొంది. పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో మరింత స్పష్టంగా, స్పృశించగలిగే అనుభూతిని కోరుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. మనస్తత్వవేత్త క్లే రౌట్లెడ్జ్ యువత తాము చూడని కాలాలపైనా ఎందుకు ఆకర్షితులవుతారో అధ్యయనం చేస్తున్నారు. ‘బిగ్ థింక్’లో ఇటీవల ప్రచురితమైన కథనంలో ఆయన దీనిని ‘హిస్టారికల్ నాస్టాల్జియా’గా పేర్కొన్నారు. నాస్టాల్జియా మన జీవితానికి అర్థం, సామాజిక అనుబంధం, సృజనాత్మకత, ఆశావాదాన్ని పెంపొందించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయని అన్నారు. ఆయన బృందం నిర్వహించిన సర్వేల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది తాము పుట్టకముందు కాలంపై ఆసక్తి కలిగి ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.అయితే 1980ల ట్రెండ్ నిజంగా ఆ కాలంలో జీవించాలనే కోరికను సూచించకపోవచ్చు. అప్పటి జీవనశైలి, ఫొటోలు, పాత సంగీతం, కుటుంబ ఆల్బమ్‌లు లేదా ఫోన్ లేకుండా కలిసి గడిపిన సమయం వంటి అనుభూతులనే కొందరు కోరుకుంటుండవచ్చు. ఈ ట్రెండ్‌లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్మార్ట్ఫోన్లు, జనరేటివ్ ఏఐకి ముందున్న కాలాన్ని పునఃసృష్టించేందుకు నేటి అత్యాధునిక సాంకేతికతనే ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘యాడ్ యువర్స్’ లాంటి ఫీచర్ల ద్వారా వినియోగదారులు తమ రెట్రో చిత్రాలను రూపొందించుకుని, ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది కూడా చదవండి: రూ.14 కోట్లతో 33 ఏళ్లలో 233 దేశాలు చుట్టొచ్చాడు! -
రూ.14 కోట్లతో 33 ఏళ్లలో 233 దేశాలు చుట్టొచ్చాడు!
బీజింగ్: ప్రపంచాన్ని చుట్టిరావాలన్న లక్ష్యంతో ఓ చైనా వ్యాపారవేత్త 33 ఏళ్లపాటు ప్రయాణించి 233 దేశాలు సందర్శించారు. ఇందుకోసం సుమారు 15 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.14 కోట్లు) ఖర్చు చేశారు. 53 ఏళ్ల చెన్ జిన్‌వెయ్ ఇటీవల పెరూలో పర్యటించి తన సుదీర్ఘ ప్రపంచ యాత్రను పూర్తి చేసుకుని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఝుజి స్వస్థలానికి చేరుకున్నారు. యంత్రాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న చెన్ 1993లో సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ పర్యటనలతో అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించారు.అప్పట్లో ఇంటర్నెట్ అందుబాటులో పెద్దగా లేకపోవడంతో ప్రపంచంలోని మరో వైపు జీవనం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. వ్యాపారం, కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టకుండా ప్రయాణాలు కొనసాగించారు. ఒక నెల ఇంటి వద్ద ఉండి, మరో నెల పర్యటించేవారు. ధ్రువ ప్రాంతాల వంటి క్లిష్టమైన ప్రదేశాలను కూడా ఎంచుకున్నారు.2015 నవంబరులో అంటార్కిటికా చేరేందుకు చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. 2016 జనవరిలో మరోసారి ప్రయత్నించి అంటార్కిటికా చేరుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ద్వీప భూభాగం టోకెలావ్ను మాత్రం తన ప్రయాణాల్లో అత్యంత క్లిష్టమైన గమ్యస్థానంగా చెన్ పేర్కొన్నారు. 2019లో విస్తృత ఏర్పాట్లు చేసి న్యూజిలాండ్ చేరుకున్నప్పటికీ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా టోకెలావ్ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మళ్లీ ప్రయత్నించి అక్కడి మారుమూల అటాల్స్పై అడుగుపెట్టారు.ఆఫ్రికాలో ఉన్నప్పుడు మలేరియా బారినపడగా, గ్రీస్‌లో భూకంపాన్ని కూడా ఎదుర్కొన్నారు. సమస్య ఎదురైతే ముందుగా ప్రశాంతంగా ఉండి పరిష్కారం గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. పర్యాటక ప్రాంతాలను మాత్రమే చూసి వెళ్లకుండా స్థానిక సంస్కృతిలోనూ మమేకమయ్యేందుకు చెన్ ప్రయత్నించారు. 198 దేశాలకు చెందిన కరెన్సీలను సేకరించి వాటిని జు జియాకే మెమోరియల్ హాల్‌కు విరాళంగా ఇచ్చారు.ప్రయాణం, వ్యాపారం రెండింటిలోనూ ఒడుదొడుకులను ఎదుర్కొని ముందుకు సాగాల్సిందేనని ఆయన అన్నారు. ప్రయాణాలను వాయిదా వేస్తున్నవారికి ‘సమయం ఎవరి కోసం ఆగదు’ అని సందేశమిచ్చారు. 33 ఏళ్ల పాటు సాగించిన ప్రపంచ యాత్ర పూర్తవడంతో ఇక పిల్లలు, తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని చెన్ భావిస్తున్నారు. వివిధ పర్యాటక రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి, వారి జీవిత కథలను ముద్రించాలని చెన్ జిన్‌వెయ్ యోచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి? -
రియల్ టు రీల్
కల్పిత కథలు కాదు... నిజజీవిత కథలు వెండితెరపై ఆదరణ పొందుతున్న కాలం ఇది. ఈ వరుసలో ఇప్పుడు ‘దైరా’ చేరింది. ఈ కథకు మూలం... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరి«ధిలో ఏడేళ్ల క్రితం చోటు చేసుకున్న ‘దిశ’పై హత్యాచారం, నిందితుల ఎన్ కౌంటర్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ‘దైరా’ పేరుతో సినిమాగా తెరకెక్కింది. కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీసు అధికారులుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది...హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ టోల్‌ప్లాజా వద్ద 2019 నవంబర్ 27 రాత్రి... వెటర్నరీ వైద్యురాలు (26) స్కూటర్‌ను పార్క్ చేసి మరో చోటుకి వెళ్లారు. అది గమనించిన నలుగురు దుండగులు పథకం ప్రకారం ఆమె స్కూటర్ టైర్ పంక్చర్ చేశారు. తిరిగి వచ్చిన ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మించి, సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. మృత దేహాన్ని లారీలో చటాన్ పల్లి సమీపంలోని అండర్‌పాస్ వద్దకు తీసుకెళ్లి తగులబెట్టారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.24 గంటల్లో నిందితుల అరెస్ట్... మృతదేహం మర్నాడు (2019 నవంబర్ 28) వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 29న నిందితులైన హమ్మద్ ఆరిఫ్ (లారీ డ్రైవర్), జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులను (క్లీనర్) అరెస్టు చేశారు. ఈ నిందితులను షాద్‌నగర్ పోలీసుస్టేషన్ కు తీసుకొచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని, నిందితులను తమకు అప్పగించాలని, వెంటనే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టాల్సి వచ్చింది.చటాన్ పల్లి ఎన్ కౌంటర్... తెలంగాణ ప్రభుత్వం దిశ కేసు విచారణకు 2019 డిసెంబర్ 4న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. దిశ అదృశ్యంపై కేసు నమోదు, దర్యాప్తులో పోలీసుల స్పందనలో జాప్యం జరిగిందనే ఆరోపణలతో ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది. డిసెంబర్ 6 తెల్లవారుజామున నలుగురు నిందితులను క్రైమ్ సీన్ రీ–కన్ స్ట్రక్షన్ కోసం చటాన్ పల్లి తీసుకువచ్చారు. అక్కడ జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురూ చనిపోయారు. నిందితులు తమ వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని, అలా పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామన్నది పోలీసుల కథనం.కమీషన్ నుంచి కోర్టుకు... నిందితుల్లో మైనర్ ఉన్నారని, నిజమైన ఎన్ కౌంటర్ కాదని వివాదం చెలరేగింది. దీంతో 2019 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని కమిషన్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా సోందూర్ బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు. 2022లో కమిషన్ 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కీలక అంశాలు‘దైరా’లో కరీనా డీసీపీ అజూనీ కోహ్లీగా, పృథ్వీరాజ్ డీసీపీ రమణ్ కుమార్‌గా నటించారు. ఓ కేసు విషయంలో వీరిద్దరి ఆలోచనలు, దర్యాప్తు విధానాలు విభేదిస్తాయి. అజూనీ కేసును లోతుగా దర్యాప్తు చేస్తుంది అజూనీ. రమణ్ చేసిన ఎన్ కౌంటర్లపై ప్రశ్నలు తలెత్తుతాయి. మైనర్ నిందితులపై చట్టం ఎలా వ్యవహరించాలి? తీవ్రమైన నేరాలకు పాల్పడిన మైనర్లకు కూడా అదే రక్షణ వర్తించాలా? ఈ కీలక అంశాలు ‘దైరా’లో ప్రస్తావనకు వస్తాయి.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్ -
పోస్ట్ చేశారంటే... మీ లొకేషన్ ట్రాక్ ఖాయం!
సోషల్ మీడియా అనేది మన జీవితాల్లో ముఖ్యమైన భాగం అయింది. ‘రీల్స్’ నుంచి విహారయాత్రలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకోవడం వరకు ఎన్నో చేస్తుంటాం. గమనించాల్సిన విషయమేమిటంటే... ఏఐ సాధనాలను ఉపయోగించి పోస్ట్‌ల ద్వారా మీ లొకేషన్‌ను గుర్తించవచ్చునని గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెకఫీ స్టడీ తెలియజేస్తోంది...స్టడీలో భాగంగా...ఒక ఫొటోను జత చేసి, ఆ ప్రదేశాన్ని గుర్తించమని ప్రాంప్ట్ ఇచ్చారు. ఎలాంటి మెటాడేటా, ఇఎక్స్ఐఎఫ్ డేటా, ఫైల్ పేర్లను ఉపయోగించలేదు. చిత్రాలలోని సంకేతాలు, వాస్తుశిల్పం, వీధి గుర్తులు, దుకాణాలు, ఫుడ్‌స్టాల్స్... మొదలైన వివరాలతో ఏఐ సాధనాలు లొకేషన్‌ను గుర్తించాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, విలక్షణమైన ప్రదేశాలను ఏఐ సులభంగా గుర్తించింది. సాధారణ బీచ్‌లు, గ్రామీణ రహదారులు, హోటల్ గదులను గుర్తించడం మాత్రం ఏఐకి కష్టమైంది.మోసాలు జరుగుతాయా?ఇంతకుముందు బహిరంగంగా పోస్ట్ చేయని ఫొటోలతో సహా పర్సనల్ ట్రావెల్ ఫొటోలను చాట్ జీపీటీ, క్లాడ్, కోపైలట్లాంటి వాటిలో అప్లోడ్ చేసి...‘ఈ ఫొటోలు ఎక్కడ తీశారు?’ అని అడిగారు. ఏఐ గుర్తించిన వాటిలో న్యూయార్క్ రాష్ట్రంలోని హేస్టింగ్–ఆన్–హడ్సన్ అనే గ్రామం కూడా ఉన్నది. జీపీఎస్ డేటా, లొకేషన్ ట్యాగ్, క్యాప్షన్ లేకపోయినా సరే, ఆ ఫొటోలను ఎక్కడ తీశారనేది ఏఐ సాధనాలు గుర్తించగలవని మెకఫీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పదిలో తొమ్మిదిసార్లు ఏఐ సాధనాలు లొకేషన్‌ను సరిగ్గా ట్రాక్ చేశాయి. ఈ అధ్యయనంలో గూగుల్... జెమ్మ 227బీ, అలీబాబా 3వియల్ 3వోబీ అనే మోడల్స్‌ను ఉపయోగించారు. ఈ రెండు మోడల్స్ ఒపెన్–వెయిట్స్ రకానికి చెందినవి. ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఉచితంగా ఉపయోగించవచ్చు. ...ఇలా లొకేషన్లను ట్రాక్ చేయడం ద్వారా మోసాలు జరుగుతాయా? ‘అవును’ అని చెబుతోంది మెకఫీ స్టడీ.ఇలా జరగవచ్చు...జెనెరిక్ పిషింగ్ నుంచి పర్సనలైజ్ ఫ్రాడ్ వరకు ఏదైనా జరగవచ్చు. ఉదాహరణకు ఒక మోసగాడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్‌లాంటి ప్లాట్‌ఫామ్‌ల నుండి ఫొటోలను తీసుకొని వాటిని ఏఐ మోడల్స్‌లో ప్రాసెస్ చేసి లొకేషన్ ట్రాక్ చేసి, ఆ ప్రదేశాన్ని ప్రస్తావిస్తూ మెసేజ్‌లు పంపవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో అసాధారణ లావాదేవిలు జరుగుతున్నట్లు, మీరు ఉన్న ప్రాంతంలోనే ఎవరో ఒకరు లాగిన్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరికలు రావచ్చు.‘మీరు షేర్ చేసిన ఫొటోలో ఏదైనా ప్రముఖ ప్రదేశం లేదా ల్యాండ్‌మార్క్ కనిపించకపోతే ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించడంలో ఏఐ మోడల్స్ సమర్థంగా పనిచేయకపోవచ్చు’ అంటున్నారు నిపుణులు. -
గంధము పూయరుగా!
భగవంతునికి చేసే షోడశోపచారాలలో తొమ్మిదవ ఉపచారం చందన సమర్పణం. ఓ దేవదేవా! మంచి సువాసన కలిగిన, మనోహరమైన ఈ శ్రీగంధాన్ని ప్రీతితో స్వీకరించమంటూ భగవంతునికి చందనం సమర్పిస్తాం.సృష్టిలో ఉన్న వృక్ష జాతులలో గంధపు చెట్టుది ప్రత్యేక స్థానం. పూజలు, వ్రతాలు, నోములు, పేరంటాలు, పెండ్లిండ్లలో చందనం అందించడం తప్పనిసరి. పేరంటాలలో ముత్తైదువులకు గంధాన్ని కంఠ భాగంలో అలంకరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కంఠ భాగంలో విశుద్ధి చక్రం ఉంటుంది. అక్కడ రెండు వేళ్ళతో చందనం రాయడం వల్ల విశుద్ధి చక్రం ఉత్తేజితమౌతుంది. నుదుటి భాగంలో గంధం రాయడం వల్ల మెదడు చల్లబడుతుంది. కోపావేశం ఉపశమిస్తుంది. శాంతి లభిస్తుంది.గంధం పూయడం వలన మనస్సుకు ఏకాగ్రత కుదురుతుంది. లలాట ప్రదేశంలో గంధం, కస్తూరి వంటి వాటితో బొట్టు పెట్టుకొంటే కనుబొమల మధ్యన ఉన్న జ్ఞాననాడులకు స్ఫూర్తి కలుగుతుంది. సంకల్ప శక్తి దృఢమవుతుంది. ఆయుర్వేద శాస్త్ర రీత్యా స్త్రీలు గంధం పూసుకోవడం వల్ల ఋతుక్రమం చక్కబడి ఆరోగ్యకరమైన అండోత్పత్తి జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అనారోగ్యం, అంటువ్యాధులు, చర్మరోగాలు నివారించబడతాయి. గర్భవతులకు గంధం పూయడం వారి కడుపులోని బిడ్డకు ఆరోగ్యకరం. శుభకార్యాలలో అతిథులనుచందన తాంబూలాలతో గౌరవించడం మన ఆచారం.దేవతలకు కూడా...సింహాద్రి అప్పన్నకు ఏడాది పొడవునా చందనం అలంకరిస్తూ ఆయన రౌద్రాన్ని శాంతింపజేస్తూంటారు. అక్షయ తదియనాడు ప్రతి ఏటా ఆయనకు చందనోత్సవం జరుపుతారు. అమ్మవారికి కూడా చందనమంటే ఎంతో ప్రీతి. అందుకే ఆమెను చందన ద్రవ దిగ్ధాంగీ’(శరీరానికంతటికీ చందన ద్రవం అలదుకొన్నది) అని వర్షిస్తారు.ఇక శ్రీకృష్ణ పరమాత్మ అయితే సదా చందన చర్చిత నీల కళేబరుడు. ఆంజనేయునికీ సింధూరం, గంధం ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు. తిరుమల వంటి దివ్యక్షేత్రాలలో శ్రీగంధ కైంకర్యం నిత్యం జరిగే పూజా విధిలో భాగం. అందుకోసం అక్కడ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పరచబడింది. గంధ పరిమళం వ్యాపించి ఉన్న ్రపాంతంలో సానుకూల శక్తి, దైవిక అనుభూతి ఉంటుందన్న విశ్వాసం, ఆ పవిత్ర వాతావరణంలో జరిగే కార్యక్రమాలు విజయవంతం అవుతాయనే నమ్మకమూ భక్తులలో దృఢంగా ఉన్నాయి.జ్వర తీవ్రత తగ్గడానికి తల కణతలకు గంధం రాయడం ఒక వైద్యం. చందనలేపనం ముఖ కాంతిని పెంచుతుంది. గంధం మంచి సౌందర్య సాధనం కూడా! ΄ûడర్లు, సబ్బులు, అగరుబత్తి, అత్తరు వంటి వాటి తయారీలో గంధం వాడతారు కదా!పరమశివుని అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి. మొత్తానికి ఆరోగ్యం, ఆహ్లాదం, అందం, ఆనందం, ఆధ్యాత్మికత కలబోసిన సంప్రదాయంగా చందన లేపనాన్ని చెప్పవచ్చు.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
ఏ బాధ అయినా ఐ యామ్ విత్ యూ..
వెయ్యి జీవితాలు మన కోసం వేచి చూడడం లేదు. జస్ట్... ఒకే ఒక్క జీవితం! అందుకే... ఆత్మహత్య అనే భావన మన మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. ‘జీవనోత్సాహం’ అనే ఉప్పెన ముందు ‘నిరాశ–నిస్పృహ’ అనేవి పూచిక పుల్లలు!‘స్నేహ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాలని చెన్నైకి చెందిన డా.లక్ష్మీ విజయ్‌కుమార్ ఆలోచన చేసినప్పుడు చుట్టూ ఉన్నవారు సందేహించారు. వారు ఆమెతో మూడు విషయాలు చెప్పారు. వాలంటీర్లతో మాత్రమే ఒక సంస్థను నడపడం సాధ్యం కాదు. రకరకాల సంకోచాలతో సహాయం అడగడానికి ఎవరూ ముందుకు రారు. ప్రజలతో మాట్లాడడం ద్వారా మాత్రమే ఆత్మహత్యలను నివారించలేము. వారందరి అంచనాలు సరికాదని నాలుగు దశాబ్దాల ‘స్నేహ’ ప్రస్థానంతో నిరూపించారు లక్ష్మీ విజయ్ కుమార్. ఈ స్వచ్ఛంద సంస్థను పూర్తిగా వాలంటీర్లే నడుపుతున్నారు.ఎన్నో జాగ్రత్తలు తీసుకొని...‘స్నేహ కోసం వాలంటీర్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. రెండు వందల నుంచి మూడు వందల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారు. మూడు ఇంటర్వ్యూలతో ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం తొమ్మిది నుంచి పదిమంది మాత్రమే వాలంటీర్లుగా ఎంపిక అవుతారు. మా వాలంటీర్లు శిక్షణ పొందిన కౌన్సిలర్లుగా ఉండాలనుకుంటాం. ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండడం, ఎవరినీ తప్పు పట్టకపోవడం, ఇతరుల బాధను అర్థం చేసుకొని తమ బాధగా భావించడం, తమ అభి్రపాయాలను ఇతరులపై రుద్దకపోవడమే మేము ప్రతి దరఖాస్తుదారు నుంచి ఆశించేవి’ అంటారు లక్ష్మి.ఆమె పోరాట ఫలితమే...ఆత్మహత్యలు జరగకుండా నివారించడమేకాదు.. ఆపదలో ఉన్న వారికి సహాయపడడం, ఆత్మహత్య నివారణలపై అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తోంది స్నేహ స్వచ్ఛంద సంస్థ. వియన్నాలో 1985లో జరిగిన అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం సదస్సులో పాల్గొన్న లక్ష్మి ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అక్కడ ఎంతోమంది మానసిక వైద్యులు, ఆత్మహత్యల నివారణ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. భారతదేశంలో ఆత్మహత్యలను నేరంగా పరిగణించడాన్ని లక్ష్మీ విజయ్‌కుమార్ వ్యతిరేకించారు.2017 వరకు ఆత్మహత్యయత్నం నుండి బయటపడిన వారిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 కింద కేసు నమోదు చేసేవారు. ఇది శాస్త్రీయ ఆధారం లేని వలసవాద చట్టం అని పేర్కొంటూ దీనిని మార్చడానికి ఉద్యమించారు. భారత లా కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ లక్ష్మణన్‌తో మాట్లాడి, ఇది బ్రిటిష్ కాలం నాటి పురాతన చట్టం అని, చాలా దేశాలు దీనిని తొలగించాయని చెప్పారు. లక్ష్మీ విజయ్‌కుమార్ పొరాటం ఫలించింది. 2017లో మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని ఆమోదించారు. ఇది ఆత్మహత్యయత్నాన్ని నేరంగా కాకుండా, తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంకేతంగా పరిగణించడంతోపాటు పునరావాస అవకాశాలను కూడా అందిస్తోంది.పరిశోధన బాటలో...మానసిక ఆరోగ్యానికి అనుకూలమైన చట్టాలు, విధానాల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించడమే కాదు మానసిక ఆరోగ్య పరిశోధనలో గణనీయ కృషి చేశారు లక్ష్మీ. మానసిక ఆరోగ్య పరిశోధనకు సంబంధించి డేటా కొరత వల్ల తానే స్వయంగా పరిశోధన బాట పట్టారు. మానసిక ఆరోగ్య పరిశోధన రంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా రాయల్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్స్ గౌరవ ఫెలోషిప్, ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అందుకున్నారు. ఈ రెండు విశిష్ట పురస్కారాలను అందుకున్న తొలి భారతీయ సైకియాట్రిస్ట్‌గా తన ప్రత్యేకత చాటుకున్నారు.మార్పు కోసం...ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిని గుర్తించే ఏకైక ఏఐ సంస్థ ‘సమురాయ్’ మాత్రమే కాదు. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ అయిన మెటా... ఎవరైనా ఆత్మహత్య చేసుకునే దిశలో ఆలోచిస్తున్నారని సూచించే పోస్ట్‌లు లేదా బ్రౌజింగ్ హిస్టరీని ఫ్లాగ్ చేయడానికి తమదైన సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఎవరైనా ఆత్మహత్యకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేసినా, సెర్చ్ చేసినా వారి ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి సూయిసైడ్ అండ్ క్రైసిస్ లైఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్ రంగంలోకి దిగుతుంది. అవసరమని భావిస్తే ఎమర్జెన్సీ రెస్పాండర్స్‌కు కాల్ చేస్తుంది.ఆత్మహత్యలను ఏఐ అడ్డుకోగలదా?ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయడానికి అమెరికాలోని ఏఐ కంపెనీ సమురాయ్ ల్యాబ్స్ రంగంలోకి దిగింది. ఆత్మహత్య చేసుకోవాలనే భావన కనిపించే సోషల్ మీడియా పోస్ట్‌లను విశ్లేషించడానికి ఏఐ సాధనాలను ఈ కంపెనీ ఉపయోగిస్తోంది. ‘డైరెక్ట్ మెసేజ్’లాంటి వ్యూహాలతో ముందుకు వెళుతోంది.‘ఆత్మహత్యల నివారణ కోసం సోషల్ మీడియాను ఉపయోగించడంలో ఒకరకమైన వైరుధ్యం ఉంది. ఆత్మహత్యలకు సోషల్ మీడియానే కారణం అని నిందించేవారు ఎక్కువగానే ఉన్నారు. అయితే అదే సోషల్ మీడియా నుంచి లక్షలాది పోస్ట్‌లను విశ్లేషించి, నిరాశానిస్పృహల చీకటిలో ఉన్నవారిని, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారిని గుర్తించి వారిని సరిౖయెన మార్గంలో తీసుకురావడం మంచిదే కదా!’ అంటున్నారు సమురాయ్ కో–ఫౌండర్ పాట్రిసియా.డా.లక్ష్మీ విజయ్‌కుమార్ -
హ్యాండ్ శానిటైజర్లు వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హ్యాండ్ శానిటైజర్లు ముఖ్యంగా ఆల్కహాల్ (ఎథనాల్ లేదా ఐసోప్రొపనాల్) ఆధారంగా పనిచేస్తాయి. కరోనా మహమ్మారి తర్వాత వీటి వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, వీటిని రోజూ పదే పదే వాడటం వల్ల ఆరోగ్యానికి కొన్ని నష్టాలు ఉన్నాయని చర్మవ్యాధి నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.చర్మం దెబ్బతినడం: శానిటైజర్లలో ఉండే ఆల్కహాల్ చర్మంలోని సహజమైన నూనెలను (నాచురల్ ఆయిల్స్), తేమను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారడం, పగలడం, మంట పుట్టడంతోపాటు ’కాంటాక్ట్ డెర్మటైటిస్’చర్మ సమస్యకు దారి తీస్తుంది. చర్మంలో పగుళ్లు ఏర్పడితే దేహంలోకి బ్యాక్టీరియా సులభంగా ప్రవేశిస్తుంది. ఇతర అనారోగ్యాలకు మార్గం చూపించినట్లవుతుంది. మంచి బ్యాక్టీరియా నశించడాన్ని డిస్రప్షన్ ఆఫ్ స్కిన్ మైక్రోబియోమ్ అంటారు. చర్మం మీద సహజంగా దేహానికి రక్షణనిచ్చే మంచి బ్యాక్టీరియా (మైక్రోబియోమ్) ఉంటుంది. శానిటైజర్ల వల్ల ఈ సూక్ష్మజీవులు నశిస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గి, చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం పెరుగుతుంది. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్: కొన్ని రకాల శానిటైజర్లలో ‘ట్రిక్లోసన్’ వంటి రసాయనాలను వాడతారు. వీటిని నిరంతరం వాడటం వల్ల సూక్ష్మజీవులు ఆ రసాయనాలకు అలవాటు పడిపోయి, భవిష్యత్తులో ఏ మందుకూ లొంగని శక్తిని (సూపర్‌బగ్స్) సంతరించుకుంటాయని కొన్ని పరిశోధనలు తేల్చాయి. హార్మోన్ల అసమతుల్యత: శానిటైజర్లలో వాడే కృత్రిమ సువాసనలు, కొన్ని రసాయనాలు ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదాన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చర్మం మీది రసాయనాలు కడుపులోకి: పిల్లలు శానిటైజర్లు వాడిన వెంటనే చేతులు నోట్లో పెట్టుకోవడం వల్ల రసాయనాలు కడుపులోకి చేరతాయి. చర్మానికి పీల్చుకునే గుణం ఉండడం ద్వారా ఆల్కహాల్ ఇతర రసాయనాలు చర్మం ద్వారా దేహంలోకి ప్రవేశించి రక్తంలో కలుస్తాయి.పొంచి ఉన్న ప్రమాదాలు! వంట చేసేటప్పుడు, మంటకు దగ్గరగా ఉన్నప్పుడు శానిటైజర్ వాడడం ప్రమాదకరం. శానిటైజర్లలో ఆల్కహాల్ అధికంగా ఉంటుంది కాబట్టి, ఇది అత్యంత వేగంగా మంటను అంటుకుంటుంది. వంటగదిలో స్టవ్ వెలిగించే ముందు, అగ్గిపెట్టె వాడే ముందు చేతులకు శానిటైజర్ రాసు కుని ఉంటే అది పూర్తిగా ఆరిపోయే వరకు వేచి ఉండాలి. ఇదీ చదవండి: రేడియేషన్ థెరఫీ అంటే ఏమిటి? శానిటైజర్ కళ్ళకు, ముక్కుకు, నోటికి తగలరాదు. శానిటైజర్ రాసుకున్న వెంటనే ఆ చేతులతో ముఖాన్ని, కళ్లను తాకకూడదు. కళ్లలోకి, నోటిలోకి శానిటైజర్ వెళితే తీవ్రమైన మంట, చికాకుతోపాటు అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి.సబ్బు ఎల్లప్పుడూ శుభ్రం! చేతులను శుభ్రం చేసుకోవడానికి ఎల్లప్పుడూ శానిటైజర్లపైనే ఆధారపడకుండా, వీలైనప్పుడల్లా సబ్బు, నీటితో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవడం ఉత్తమం. చేతులు మరీ మురికిగా ఉన్నప్పుడు లేదా సబ్బునీటితో కడుక్కోవడానికి వీల్లేనప్పుడు మాత్రమే శానిటైజర్ వాడాలి. శానిటైజర్ వాడిన తర్వాత చర్మం పొడిబారకుండా మంచి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరినూనె, నువ్వుల నూనె వంటివి రాసుకోవడం మంచిది. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
అమ్మాయి నిజంగా బంగారం! ఆ డ్రెస్ అక్షరాల రూ. 4 కోట్లుపైనే..
పసిడికే మాటొస్తే ‘ఏడు రంగులిచ్చే ఇంద్రధనుస్సు నీ మేని రంగు చూస్తే ఏమంటుందో’ అని కచ్చితంగా అని తీరేలా ఉంది కదూ ఈ అమ్మడి తీరు..నిజమే బంగారం తాపడం చేసుకుంటేనే గొప్ప అనుకునే ఈ రోజుల్లో నిలువెత్తు బంగారంతో చేసిన వస్త్రం కట్టిన వనితని ఆ మాత్రమైన పొగడక పోతే కనకానికి కనికరం లేనట్టే కదా..? ఈమె ఎవరో కాదు అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా. ఆమె ధరించిన డ్రెస్ ధర అక్షరాల నాలుగు కోట్లు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబుజాన్, సందీప్ ఖోస్లా ఫ్యాషన్ ప్రయాణానికి 40 వసంతాలునిండిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ తార మెరిసిందిలా... నవ్య స్కూలింగ్ అంతా లండన్‌లోనే! తర్వాత అమెరికాలో ఫోర్దామ్ యూనివర్సిటీలో డిజిటల్ టెక్నాలజీ అండ్ యూఎక్స్డిజైన్లో బీఏ, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ కూడా కంప్లీట్ చేసింది. ఇండియాలోనే అతిపెద్ద ఫిలిం ఫ్రెటర్నటీ నుంచి వచ్చినా నవ్యకి సినిమాలంటే ఆసక్తి లేదు. తన తండ్రి నిఖిల్ నందా వ్యాపారం, ట్రాక్టర్లు, స్టాక్ మార్కెట్లపైనే తన ఆసక్తి అంతా. మహిళా సాధికారత కోసం ‘ప్రాజెక్ట్ నవేలి’ని మొదలెట్టింది. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఏర్పాటైన ‘హెల్త్ టెక్’ కంపెనీకి కో ఫౌండర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే తన తల్లి శ్వేత, అమ్మమ్మ జయా బచ్చన్‌తో కలిసి ‘వాట్ ద హెల్ నవ్య’ అనే పాడ్ కాస్ట్‌ను కూడా నిర్వహిస్తోంది. అలా స్టార్స్ కుటుంబం లో పుట్టినా తనకంటూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఒక్కొక్క విజయాన్ని అందిపుచ్చుకుంటోంది. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) (చదవండి: ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్ బ్రాండ్ వ్యాపారం!) -
ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్ బ్రాండ్ వ్యాపారం!
మాతృత్వం ఆ మహిళను ఆహార వ్యాపారం ప్రారంభించడానికి పునాది వేసింది. ముఖ్యంగా తన పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలనే అన్వేషణ ఇందుకు అంకురార్పణ. అలా వ్యాపార వేత్తగా మారి సక్సెస్ అందుకుందా అంటే..ఆ మహిళే ఉత్తరప్రదేశ్‌కి చెందిన జ్యోతి శ్రీ వాస్తవ భారత సైన్యం కోసం ఒకప్పుడు రాకెట్లు రూపొందించేది. కెమికల్ ఇంజనీర్ అయిన జ్యోతి నానో టెక్నాలజీ, రాకెట్ ప్రొపెల్లెంట్ల విభాగంలో మంచి నైపుణ్యం సాధించారామె. అలా ఆమె ఆర్మీ కోసం రాకెట్లు డిజైన్ చేసే విభాగంలో పనిచేసింది. అయితే ఆ వర్క్‌లో ఉండే తీవ్రమైన ఒత్తిడికి తట్టుకోలేగా ఆ ఉద్యోగానికి కొన్నాళ్లపాటు విరామం తీసుకునేలా రిజైన్ చేసింది. ఒక ఏడాది తర్వాత ఆమె గర్భవతి కావడం ఒక పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ చిన్నారికి ఘన ఆహారం కోసం అన్వేషిస్తున్నప్పుడే తెలిసింది మార్కెట్లో లభించేవన్నీ పోషకవంతమైనవి కావని. చిన్నప్పటి నుంచి సరైన ఆహారం అందిస్తేనే కదా వాళ్ల పెరుగుదల బాగుంటుందన్న ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. ఆ క్రమంలో పడిన తపన మళ్లీ ఆమెను తన ఉద్యోగం వైపుకి వెళ్లకుండా ఫుడ్ వ్యాపారంలోకి దిగేలా చేసింది. మైదా లేనివి, శుద్ధి చేసిన చక్కెరలు ఉపయోగించిన ఆరోగ్యకరమైన ఆహారాలు ఇచ్చేలా యూనిసెఫ్ నుంచి శిక్షణ తీసుకుని మరి సర్టిఫికేషన్ పొందింది. అది ఆమెకు శిశువుల పెరుగుదల అభివృద్ధిలో వివిధ సూక్ష్మ, స్థూల పోషకాలు, ఖనిజాలు, విటమిన్ల పాత్రలను అర్థం చేసుకోవడానికి సహాయపడిందని అంటోంది. అలాగే పిల్లల ఆరోగ్యంలో వనమూలికల పాత్రను అర్థం చేసుకునేందుకు ఆయుర్వేదాన్ని అధ్యయనం చేసింది. ఆ తర్వాత వ్యాపారం పెట్టేందకు నిధులు కొరతతో ఇబ్బందులు ఎదురైనా..ఏదోలా కష్టపడి లిటిల్ చెర్రీ మామ్ అనే వ్యాపారాన్ని తన సొంతూరు మీరట్‌లో ప్రారంభించింది. దాన్ని ఓ బ్రాండ్లా మార్చి.. పోషకవంతమైన ఆహారం అందించేలా దోస మిక్స్‌లు, చిరుధాన్యల పిండి, పంచదార, బెల్లం లేని లడ్డూలు వంటి మంచి ఉత్పత్తులను అందించింది. అంతేగాదు పిల్లల కోసం సన్నని క్రాకర్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను కూడా అందుబాటులోకి తీసకొచ్చింది. ముఖ్యంగా ఆరునెలల తదనంతరం ఎలాంటి ఫుడ్ పెట్టాలని భయపడే చిన్నారుల తల్లులకు ఈ ప్రొడక్ట్స్‌ని ధైర్యంగా పెట్టొచ్చు అనేలా ప్రజల నమ్మకం సంపాదించుకుంది జ్యోతి. ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఈ బ్రాండ్‌కి దేశవ్యాప్తంగా 70 వేల మంది వినియోగదారులున్నారని ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ ఆర్జిస్తుండటం విశేషం. అంతేగాదు జ్యోతి 'షార్క్ ట్యాంక్ ఇండియా' సీజన్ 5లో పాల్గొని తన వ్యాపార సక్సెస్ గురించి కూడా పంచుకుంది.(చదవండి: కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదని సైన్యంలోకి సివిల్ ఇంజనీర్!) -
అర్థాంతరంగా నిలిచిపోయిన క్లీన్ కేరళ కార్యకలాపాలు
పంబ , సన్నిధానంలో పనులు ప్రారంభించిన ఒక్క రోజే క్లీన్ కేరళ కంపెనీ తన వ్యర్థాల తొలగింపు కార్యకలాపాలను అర్థాంతరంగా నిలిపేసింది. దాంతో శబరిమల వ్యర్థాల నిర్వహణ కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదం ఎదురైంది. దాదాపు ఒక ఏడాది పాటు జరిగిన చర్చల అనంతరం, శబరిమల నుంచి వెలువడే వ్యర్థాలన్నింటినీ వేరు చేసి తొలగించాలని ఒక అవగాహనకు వచ్చారు. ఈ ప్రణాళికలో భాగంగా, వేరు చేసిన వ్యర్థాల మొదటి విడతను సిద్ధం చేశారు. జీవవిచ్ఛిన్నం కానీ వ్యర్థాల సేకరణ అధికారిక ప్రారంభోత్సవాన్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే , ఆ కార్యక్రమం సజావుగా జరగలేదు. కొంతమంది అధికారులు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా , జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాల సేకరణ మరియు విభజన నుండి క్లీన్ కేరళ కంపెనీని మినహాయించారు.టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో , ప్రస్తుతానికి సన్నిధానం నుండి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే సంచులలో ప్యాక్ చేసి పంబకు తరలించాలని నిర్ణయించారు. సన్నిధానం, పంబలోని వివిధ ప్రాంతాల నుండి చెత్త , ప్లాస్టిక్ బాటిల్స్ , గాజు సీసాలు , స్క్రాప్ సామాగ్రి మరియు నిర్మాణ శిధిలాలతో సహా పేరుకుపోయిన వ్యర్థాలను వేరు చేసి తొలగించాలన్నది అసలు ప్రణాళిక. ప్రతిపాదిత ఏర్పాటు ప్రకారం , పునర్వినియోగించదగిన పదార్థాల కోసం దేవస్థానం బోర్డు ఒక స్థిరమైన మొత్తాన్ని అందుకుంటుంది, అయితే మిగిలిన వ్యర్థాలను శుద్ధి చేసి, పారవేసినందుకు రుసుములు వసూలు చేస్తారు కూడా. ఈ విషయమై ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదరలేదు. అయితే శబరిమల యాత్రా కాలం సమీపిస్తుండటంతో , ఒప్పందం ఇంకా కుదరకపోయినప్పటికీ పనులు ప్రారంభించాలని క్లీన్ కేరళ కంపెనీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నేపథ్యంలోనే కంపెనీకి చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు ఒక వాహనంతో శబరిమలకు చేరుకుని వ్యర్థాల తొలగింపు పనులను ప్రారంభించారు. తీరా ప్రారంభించాక ప్రతిపాదిత వ్యర్థాల నిర్వహణ ఏర్పాటుపై అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆ పనులను తక్షణమే నిలిపివేశారు. కాగా, క్లీన్ కేరళ కంపెనీ లిమిటెడ్ (CKCL) కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోలేదని చెబుతున్నారు అధికారులు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో కార్మిక వివాదాలు, అలాగే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లతో ఏర్పడిన సమన్వయ లోపాల వల్ల తాత్కాలికంగా కొన్ని చోట్ల పనులు నిలిచిపోయినట్లు సమాచారం. అలాగే కొన్ని కార్మిక సంఘాలు నోక్కుకూలి' (పని చేయకుండానే డిమాండ్ చేసే అక్రమ కూలి) కోసం పట్టుబట్టడం కూడా ఒక కారణమనేది అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: -
‘జెమ్‌మ్యాక్సింగ్’ ట్రెండ్! జస్ట్ బ్లింగ్ జోడిస్తే ఆ లుక్కే అదుర్స్
ఒకప్పుడు అందంగా కనిపించాలంటే ఖరీదైన వస్తువులు కొనాలి అనుకునేవారు. ఇప్పుడు మాత్రం చేతిలో ఉన్న సాధారణ వస్తువును .. కాస్త క్రియేటివిటీ జోడించి అందంగా మార్చుకోవడమే ఫ్యాషన్‌గా మారింది. అదే జెమ్‌మ్యాక్సింగ్. అంటే వస్తువులు, దుస్తులు, నగలు, యాక్సెసరీస్ వంటి వాటికి రంగు, మెరుపు, రత్నాలు, క్రిస్టల్స్ జోడించి వాటిని మరింత ఆకర్షణీయంగా మార్చే కళకే జెమ్ మ్యాక్సింగ్ అని పేరు. ఫోన్ కవర్‌కు రంగురంగుల రాళ్లు.. కాఫీ కప్పుకు చిన్న క్రిస్టల్స్.. లిప్‌స్టిక్ బాటిల్‌కు మెరిసే స్టోన్స్ .. గోళ్లపై రకరకాల జెమ్స్.. ఇలా కనిపించిన ప్రతిదానికీ ‘బ్లింగ్’ జోడిస్తే ఆ లుక్కే వేరు. సాధారణ వస్తువే అందంగా.. అద్భుతంగా కనిపిస్తుంది. కొన్నేళ్లులగా వస్తున్న మినిమలిజానికి బైబై చెప్తూ.. ‘జెమ్‌మ్యాక్సింగ్’, ‘విమ్సీమ్యాక్సింగ్’, ‘రైన్‌స్టోన్ మ్యాక్సింగ్’ పేర్లతో పిలుస్తున్న ఈ నయా ట్రెండ్ నేటి యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఖరీదైనవే కానక్కర్లేదు!ఈ ట్రెండ్‌కు ఒక పరిమితి లేదు. పర్ఫ్యూమ్ బాటిల్, మేకప్ ప్యాకేజింగ్, హెయిర్ క్లిప్స్, హ్యాండ్‌బ్యాగ్స్, షూస్, నెయిల్స్, ఫోన్ కవర్, కాఫీ కప్పు, వాటర్ బాటిల్, లిప్‌స్టిక్, కేకులు.. ఒక్కటేమిటి, ఏదైనా కాన్వాస్‌గా మారి΄ోతుంది.. అలాగని దీనికి ఖరీదైన జెమ్స్‌తో పనిలేదు. చిన్న రైన్‌స్టోన్స్, ΄్లాస్టిక్ జెమ్స్, ముత్యాలు, చార్మ్స్, స్టిక్కర్లు వంటి వాటితోనూ అందమైన లుక్‌ను సృష్టి్టంచవచ్చు. జ్యువెలరీలో అయితే పెద్ద రంగురంగుల రాళ్లు, లేయర్డ్ నెక్లెస్‌లు, స్టేట్మెంట్ రింగులు, భారీ చెవిపోగులతో ‘ఎంత ఎక్కువైతే అంత మంచిది’ అన్నట్టుగా మాగ్జిమలిస్ట్ లుక్ కనిపిస్తోంది. పాత జ్ఞాపకాలకు కొత్త మెరుపుఈ ట్రెండ్ వెనుక ఓ నోస్టాల్జియా కూడా బలంగా ఉంది. 1990ల చివరి, 2000 ప్రారంభంలో బెడ్ జిల్డ్ ఫోన్లు, మెరిసే జీన్స్, రైన్‌స్టోన్ టాప్‌లు, గ్లిట్టర్ మేకప్, అలంకరించిన యాక్సెసరీస్ యువతలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పటి ఆ మెరుపు ఇప్పుడు కొత్త తరం చేతుల్లోకి వచ్చింది. అయితే అప్పటిలా ఒకే రకమైన బ్లింగ్ కాకుండా.. ఇప్పుడు వ్యక్తిగత అభిరుచికి తగినట్టుగా మార్చుకుంటున్నారు.మినిమలిజానికి బైబై!నిన్నామొన్నటి వరకు మినిమలిజం వంటి ధోరణే లగ్జరీకి మారుపేరుగా మారింది. అంటే తక్కువ రంగులు, సింపుల్ నగలు, సాదాసీదా డిజైన్లు.. ఇవే ఖరీదైన స్టైల్‌కు గుర్తులుగా మారాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతోంది. ప్రతి వస్తువునూ అందంగా ఆలంకరించుకోవాలనే ఆలోచన పెరుగుతోంది. అంతేకాదు ఈ ట్రెండ్ వస్తువులకే కాదు బ్యూటీకి కూడా చేరింది. ముఖంపై చిన్న క్రిస్టల్స్, బాడీ జెమ్స్, జెమ్ నెయిల్స్ వంటి లుక్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.ఒకప్పుడు ‘తక్కువే’ లగ్జరీ అనేది ఫ్యాషన్ మంత్రంగా ఉండేది. ఇప్పుడు మాత్రం ‘ఎక్కువే’ లగ్జరీ అన్నట్టుగా మారుతోంది. ఈ మెరుపులు మాగ్జిమలిజం తిరిగి వస్తోందనడానికి మరో సంకేతంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వినూత్న ఆభరణాలు, అలంకార వస్తువుల కోసం నెట్లో సెర్చింగ్ గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళలకే కాదు..సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు సైతం ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ప్రచారం కల్పిస్తుండటంతో.. యూత్ ఎక్కువగా దీనిని అనుసరిస్తోంది. ఈ జెమ్‌మ్యాక్సింగ్ మహిళల ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం కాదు. మగవారి దుస్తుల్లోనూ రై స్టోన్ షర్ట్స్, జాకెట్లు, షూస్, టోపీలు వంటి వాటిల్లోనూ దొరుకుతున్నాయి. -
గిల్ట్ వదిలేయ్.. గెలుపు ఓన్చేసుకో!
క్యాబ్ ఎక్కి డ్యూటీకి వెళుతుంటే సంతోషం లేదు.ఆఫీస్‌లో బాస్ సీట్లో కూచున్నా ఏదో నిరాశ. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంటే అపరాధభావం. మంచిగా బతికే స్థితికి వచ్చినా మంచిగా బతకలేని ఆందోళన.‘΄పాపం... వాళ్లలాగే ఉన్నారే’ ‘అయ్యో.. వీళ్లనలా దాటేసి వచ్చానే’...అని మదనపడుతూ గెలుపును ఎంజాయ్ చేయలేక΄ోతున్నారు. సైకాలజీలో దీనినే ‘సక్సెస్ యాంగ్జయిటీ’ లేదా ‘ది గ్లో అప్ గిల్ట్’ అంటున్నారు. గెలుపు దారిలోని మహిళలు ఏం చేయాలి?కె.బాలచందర్ ‘అంతులేని కథ’ కాలాన్ని మనం ఇంకా దాటలేదు.‘అంతులేని కథ’లో ఇంటి అమ్మాయి ఇంటిని మోయాలన్న రూల్. ఆడపిల్ల ఎదిగొస్తే తమ్ముళ్లు, చెల్లాయిలు, ఖాళీగా ఉన్న తండ్రి, నోములు నోచే తల్లి... వీరందరి కోసం కర్పూరంలా కరిగిపోవాలి. అప్పుడు అలా ఉంటే ఇప్పుడు ఇంటి అమ్మాయి ఎదిగొస్తే ఆమెకు ఏదో తెలియని ఆందోళన. ‘కుటుంబ స్థాయి కంటే పెద్ద స్థానాన్ని తీసుకున్నాను. మా వాళ్లకు దూరమవుతానా... నేను ఎలా ఒదిగి ఉండాలి... నేను నాలా ఉండొచ్చా’ అని చేయని తప్పుకు గిల్ట్. పల్లెటూళ్ల నుంచి సిటీకు వచ్చి, హాస్టల్ గదుల్లో ఉంటూ, ఎన్నో అవమానాలను తట్టుకుని కెరీర్లో టాప్పొజిసన్కు చేరుకున్నాక ఇదీ స్థితి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి, నచ్చిన కార్ కొన్నా హైపర్ క్రిటిసిజమ్, ఆత్మీయులు ఎడం పెట్టడం లాంటివి ఎక్కడ ఎదురవుతాయోనని ఫీలవుతుంటారు. దీనినే స్ధూలంగా ‘గ్లో అప్ గిల్ట్’ అనీ లేదా ‘సక్సెస్ యాంగ్జయిటీ’ అనీ అంటున్నారు.రెండు కేస్ స్టడీలులావణ్య (వైజాగ్ టు హైదరాబాద్): లావణ్యది మధ్యతరగతి కుటుంబం. వైజాగ్‌లో చదువుకుని హైదరాబాద్ టాప్ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. నెలకు రెండు లక్షల జీతం. ఊరికి వెళ్లినప్పుడు బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఏదో తప్పు చేసినట్టు అణిగి ఉంటుంది. తన బ్రాండెడ్ బట్టలు, ఫోన్ చూసి వాళ్లు ఎక్కడ ఇన్ఫీరియర్గా ఫీలవుతారో అని భయపడుతుంది. ఫ్రెండ్స్ మధ్య తన సక్సెస్ ముచ్చట్లు అస్సలు ఎత్తదు. ఎదిగినందుకు సంతోషపడాలో, అందరికీ దూరమవుతున్నందుకు ఏడవాలో అర్థం కావడం లేదామెకు.సరిత (వరంగల్ టు బెంగళూరు): సరిత బెంగళూరులో స్టార్టప్ పెట్టి సక్సెస్ అయింది. సొంతంగా ఫ్లాట్ కొంది. కానీ వరంగల్‌లోనే ఉంటూ ఇంకా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తన అన్నయ్య, వదినలను చూసినప్పుడు సరిత మనసు విలవిలలాడుతుంది. ‘నేనొక్కదాన్నే ఇంత సుఖపడుతున్నాను’ అనే ఒక వింత గిల్ట్ ఫీలింగ్ ఆమెను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు.ఇలా ఎందుకు?మన దగ్గర అమ్మాయిల పెంపకం అంటే.. ‘ఆడపిల్ల అందరినీ కలుపుకునిపోవాలి, మన దగ్గర ఎంత ఉన్నా ఎదుటివారి దగ్గర తగ్గి ఉండాలి... ఇంటిలోని ప్రతి ఒక్కరినీ కనిపెట్టుకుని ఉండాలి’... అని చిన్నప్పటి నుంచే మైండ్‌లో బలంగా నాటేస్తారు. అబ్బాయి సక్సెస్ అయితే వాడికేమీ దిగులుండదు. వాడు పుట్టిందే సక్సెస్ అయ్యేందుకు. కుటుంబం, సమాజం వాణ్ణి గర్వంగా చూస్తుంది. అదే అమ్మాయి సక్సెస్ అయితే ‘అందరూ తలా ఒక చేయివేసి నిన్ను ఈ స్థితికి తెచ్చాం. మా త్యాగాలు, ప్రోత్సాహం నీ వెంట ఉన్నాయి’ అన్నట్టుగా ఉంటుంది ధోరణి. దాంతో గెలిచిన అమ్మాయి ‘నా ఎదుగుదల వల్ల నా కుటుంబంలో ఈగోలు దెబ్బతింటున్నాయా? సమాజం నన్ను అహంకారి అనుకుంటుందా?’ అని లోలోపల రంధి పడాలి.ఎలా ముందు కెళ్లాలి?గెలిచిన, గెలుపొందే బాటలో ఉన్న అమ్మాయిలు మొదట ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు పొందిన గెలుపు మీకు లాటరీలో రాలేదు. దీని వెనుక మీ నిద్రలేని రాత్రులు, కన్నీళ్లు, కష్టం, టాలెంట్ ఉన్నాయి. కాబట్టి మీ సక్సెస్ గురించి ఎవరికీ ‘సారీ’ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎదగడం అంటే ఇతరులను తొక్కేయడం కాదు. మీరు ఎత్తుకు ఎదిగితేనే, మీ చుట్టూ ఉన్న మరో నలుగురు అమ్మాయిలకు దారి చూపించగలరు. మీ లైఫ్‌స్టైల్, కష్టార్జితాన్ని ఎంజాయ్ చేయడానికి వెనకాడాల్సిన పని లేదు. పాత బంధాలతో కనెక్ట్ కావడానికి డబ్బు, హోదా అవసరం లేదు... ఒక చిన్న ఆత్మీయమైన పలకరింపు చాలు.కుటుంబం ఎలా సపోర్ట్ చేయాలి?ఒక అమ్మాయి గెలిచినప్పుడు కుటుంబం ఆమెకు కిరీటం పెట్టక్కర్లేదు. కానీ ఆమె మనసుపై గిల్ట్ భారాన్ని మోపకుండా ఉంటే చాలు. ఇంట్లో మగవారితో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు ఆమెను చూసి ఈర్ష్య పడకుండా, గర్వంగా ఓన్ చేసుకోవడం భర్తకు, తండ్రికి అలవాటు కావాలి. ఆమె తన డబ్బుతో కొనే వస్తువులను, ఆమె కెరీర్ డెసిషన్స్‌ని కించపరచకూడదు. ‘నువ్వు బాగా ఎదిగావు.. మేము నీ పక్కన ఉన్నాం’ అనే ఒక్క మాట కుటుంబం నుంచి వస్తే ఆ అమ్మాయి మనసులో ఉన్న గిల్ట్ అంతా కరిగి΄పోతుంది. గెలుపు అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు వేరు కాదు. ఎవరికైనా సరే గెలుపు అనేది అహంకారం కాదు.. ఒక బాధ్యత, న్యాయమైన హక్కు. మన ఇంటి అమ్మాయి రెక్కలొచ్చి ఎగిరితే గూటికి దూరమయ్యానని ఏడవకూడదు, గూటిలోని మిగతా పక్షులకు ఉన్నత ఎత్తులకు ఎలా తీసుకెళ్లాలో చూడాలి. మన గెలుపు దారిలో వారూ ఉంటారు అని కేరీ చేయగలిగితే చాలు. మన దారిలో మనం వెళుతూ వారికి మనం ఉన్నాం అని చెప్తే చాలు. కాబట్టి విజేతలూ.... మీ సక్సెస్ కిరీటాన్ని మీ తలపై గర్వంగా ధరించండి. గిల్ట్ వదిలేయండి.. గెలుపును వంద శాతం ఓన్ చేసుకోండి. ‘నాట్ సారీ’ మైండ్... సక్సెస్ఫుల్ మహిళలు ప్రతిరోజూ తమకు తాము చెప్పుకోవాల్సిన మూడు పాజిటివ్ లైసెన్స్: గెలుపు నా హక్కు. దీనికోసం నేను సమాజానికి గానీ, ఎవరికీ గానీ ‘సారీ’ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆర్థికంగా, వ్యక్తిగతంగా మరింత ఎత్తుకు ఎదిగితేనే నా చుట్టూ ఉన్న మరో నలుగురికి దారి చూపించగలను నా నిద్రలేని రాత్రులు, నా కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. దీనిని నేను వంద శాతం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తాను. -
కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదని సైన్యంలోకి సివిల్ ఇంజనీర్!
విద్యా పరంగానూ, వృత్తి పరంగా మంచి సక్సెస్‌ని అందుకున్నప్పటికీ..అనూహ్యమైన యూటర్న్ తీసుకుని విభిన్నమైన కెరీర్‌ని ఎంచుకుని ఆశ్చర్యపరుస్తుంటారు. ముఖ్యంగా దేశ సేవ చేసే సైనిక రంగంలోకి అడుగపెట్టి తమ దేశభక్తిని చాటుకుంటుంటారు. అలా మంచి కార్పొరేట్ లైఫ్‌ని వద్దనుకుని ఈ రంగంలోకి వచ్చి శెభాష్ అనిపించుకుంటోంది అథిరా సురేష్.కేరళకు చెందిన అథిరా సురేష్(Athira Suresh) ప్రతిష్టాత్మకమైన ఐఐటీ-జేఈఈలో ఉత్తీర్ణత సాధించి..ఎన్ఐటీ కాలికట్లో సివిల్ ఇంజనీర్ పూర్తిచేసింది. ఆ తర్వాత ఎక్సాన్మొబిల్లో ప్రాజెక్ట్ కంట్రోల్స్ ఇంజనీర్‌గా చేరింది. అక్కడితో ఆగిపోలేదామె. తన గమ్యం వేరే అంటూ..మరోదారిని ఎంచుకుంది. ఆ తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షకు హాజరై తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణ సాధించింది. ఆ తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ ఉమెన్ కోర్సు కింద ఓటీఏ గయాలో చేరింది.సైన్యంలో చేరడానికి కారణం..అందుకు ఆమె కుటుంబ నేపథ్యమే కారణం. ఎందుకంటే..ఆమె తండ్రి, నాయక్ సురేష్, పదవీ విరమణ తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో చేరడానికి ముందు కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో పనిచేశారు. తన తండ్రి సైనిక సేవ తనకు స్ఫూర్తినిచ్చిందని అతిరా చెప్పింది. ఆమె తల్లి సుమ ఒక ఉపాధ్యాయురాలు. ఇక్కడ మంచి ఆదాయం ఆర్జించే ఉద్యోగం సంపాదించినప్పటికీ అవేమి వద్దని సైనిక సైవ చేయాలనే ఉద్దేశ్యంతో తన బలాన్ని పరీక్షించుకుంటూ ఇందులోకి వచ్చిందని ఆర్మీ ట్రైనింగ్ ప్రశంసిస్తోంది. అలా ఆమె సెప్టెంబర్ 5న ఓటీఏ గయాలో జరిగిన 29వ పాసింగ్ అవుట్ పరేడ్‌తో లెఫ్టినెంట్‌గా నియమితురాలైంది. గయా పరేడ్‌లో మొత్తం 35 మంది మహిళలతో సహా 253 మంది ఆఫీసర్ క్యాడెట్లు భారత సైన్యంలోకి నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వియత్నాం పీపుల్స్ ఆర్మీ జనరల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ లే వాన్ హుయోంగ్ ఈ కవాతును సమీక్షించారు. అథిరాకు, ఈ కవాతు ఆమె వృత్తి జీవితంలోని ఒక అధ్యాయానికి ఎండ్ కార్డు, మరొకదానికి ప్రారంభంగాను నిలవడం విశేషం. ఇక్కడ సాధారణంగా సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్లు బహుళ జాతి కంపనీలో ఉద్యోగం చేయాలని కలలు కంటే అథిరా అవేమి వద్దని శారీరక శ్రమతో కూడిన సైనిక రంగంలో వృత్తిని ఎంచుకోవడంతో ఆమె కథ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. View this post on Instagram A post shared by NIT Calicut Official (@nitcofficial) (చదవండి: Success Story: వెయిటర్ నుంచి.. 8 వేల కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ సీఈఓగా!!) -
వెయిటర్ నుంచి.. 8 వేల కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ సీఈఓగా!!
ఎక్కడో పుట్టి మరో దేశంలో వెయిటర్ స్థాయి నుంచి సముద్ర టూరిజాన్నే శాసించే స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. పైగా ఆ దేశ సంస్కృతిని మెచ్చి వారిలా జీవించడం మరింత విశేషం. అయినప్పటికీ తను ఎక్కడ నుంచి వచ్చాను అన్న మూలాన్ని మర్చిపోకుండా ఆదర్శంగా జీవిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు ఈ వ్యక్తి. అతడే ప్రముఖ లగ్జరీ క్రూయిజ్ అధినేత జుర్గెన్ బైలోమ్(Jurgen Bailom). కంటెంట్ క్రియేటర్ నవన్ జైస్వాల్ అతడితో జరిపిన సంభాషణలో తన ప్రస్థానం గురించి వివరించాడు. అందకు సంబంధించిన విషయం నెట్టింట షేర్ చేయడంతో బైలోమ్ కథ వైరల్‌గా మారింది. ఆ సంభాషణలో బైలోమ్ భారతదేశంలో తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నారు. జుర్గెన్ బైలోమ్ తాను ఒక ఓడలో వెయిటర్‌గా జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. శక్తిమంతంగా పనిచేస్తూ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అయినా ఈ రేంజ్‌కి ఎలా చేరుకోగలిగారు అని జైస్వాల్ ప్రశ్నించగా..చేయగలనన్న దృక్పథంతో చకచక నేర్చుకోవడం, మార్కెట్‌ని, ప్రజలను, సంస్కృతిని అర్థం చేసుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. అలాగే ఆర్థికంగా విజయం సాధించడం గురించి కూడా మాట్లాడారు. "అవసరం లేకపోతే ఖర్చు చేయవద్దు." అనే విషయాన్ని బలంగా నమ్ముతానని చెప్పారు. అప్పుడు డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, అలాగే ఏం చేయాలనే దానిపై అవగాహన ఉంటే.. డబ్బే మీ వెంట పడుతుంది." అని బైలోమ్ నొక్కి చెబుతున్నారు. ఆస్ట్రియాలో జన్మించిన ఆయన హాస్పిటాలిటీ పరిశ్రమలోకి ఒక వెయిటర్‌గా భారత్‌లో అడుగుపెట్టానంటూ తన 40 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. అలా కార్డెలియో అనే ప్రముఖ లగ్జరీ క్రూయిజ్ సంస్థని పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ కంపెనీకి ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా. ఇది భారత సముద్ర పర్యాటక రంగంలో తన ఆధిపత్యాన్ని స్థాపించుకుందని చెప్పారు. తన బ్రాండ్ భారత క్రూయిజ్ వ్యాపారంలో 99% మార్కెట్ వాటాను కలిగి ఉందని తెలిపారు. అలాగే తన వ్యాపారం రూ. 8 వేలు కోట్లు టర్నోవర్ ఆర్జిస్తుందని చెప్పారు.ప్రస్తుతం తాను ఒకే నౌకను నడుపుతున్నప్పటికీ..ఇది ఏడాదికి సుమారు 600 నుంచి 700 కోట్ల టర్నోవర్ చేస్తుందని అన్నారు. తాను భారతదేశానికి చెందనప్పటికీ..ఇక్కడ ప్రపంచ స్థాయి క్రూయిజ్ లైన్ నిర్మించగలిగే విస్తారమైన తీరప్రాంతాన్ని గుర్తించానని అన్నారు. ఇక్కడ క్రూయిజ్ వ్యాపారం చేయడం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదంటున్నారాయన. ఇది ప్రపంచంలోని మూడో అతిపెద్ద తీరం అని అన్నారు. తాను 2018లో భారత్‌కి వచ్చినట్లు తెలిపారు. అలాగే ఇక్కడ సంస్కృతి నచ్చిందన్నారు. ముంబైలో ప్రతి ఒక్కరు కష్టపడతారని, ఉపాధి కోసం నిత్యం ఏదో ఒక పనిచేస్తుంటారని కొనియాడారు. భారతీయుల సంప్రదాయాలు, సెంటిమెంట్లపై అవగాహన ఉందని, తను కూడా వాటిని అనుసరిస్తానని చెప్పారు. తన ఆఫీసులో కూడా క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తామని, ఫర్నీచర్ వంటి తదితరాలు వాస్తుపరంగా ఉండాల్సిన దిశలో ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఆర్థికంగా బాగానే ఉన్నామా అని పర్యవేక్షిస్తుంటానని, ఒకవేళ ఆధ్యాత్మిక పరంగా ఏవైన మార్పులు, చేర్పులు ఉంటే చేస్తానని కూడా చెప్పారు బైలోమ్. View this post on Instagram A post shared by Navan Jaiswal (@navan.jaiswal) (చదవండి: ప్రిన్సిపాల్ ఉద్యోగాన్ని వదిలి మరి మిల్లెట్ వ్యాపారం! ఇవాళ ఏకంగా..) -
మోక్షం కోసం చివరి మజిలీ.. ముక్తి భవన్
హోటల్ లేదా రెస్టారెంట్ అంటే సాధారణంగా ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే ప్రదేశంగా భావిస్తాం. కానీ వారణాసిలోని ముక్తి భవన్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. జీవిత చరమాంకంలో ఉన్నామని భావించే కొందరు వృద్ధులు ఇక్కడికి వచ్చి, తమ చివరి రోజులను గడపాలని కోరుకుంటారు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకమే ఈ ప్రత్యేక ప్రదేశం ఏర్పాటుకు ప్రధాన కారణం. అయితే ఇక్కడికి వచ్చిన వారికి ఒక కీలక నిబంధన ఉంది.. 15 రోజులకు మించి ఇక్కడ ఉండేందుకు అనుమతి లేదు.కాశీ నడిబొడ్డున.. ముక్తి భవన్ముక్తి భవన్‌ను కాశీ లాభ్ ముక్తి భవన్ అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి గోదౌలియా ప్రాంతంలోని గిర్జా ఘర్ చౌరాహా సమీపంలోని మిశిర్ పోఖ్రా ప్రాంతంలో ఇది ఉంది. గీతా మందిర్ రోడ్డుపై, పాత నగర ప్రాంతానికి, ప్రసిద్ధ ఘాట్లకు సమీపంలో ఈ భవనం ఉంది. కాశీలోని ఆలయాలు, పురాతన వీధులు, గంగానదికి దగ్గరగా ఉండటం వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. హిందువులు వారణాసిని భారతదేశంలోని అత్యంత పవిత్ర నగరాల్లో ఒకటిగా భావిస్తారు.‘కాశ్యాం మరణం ముక్తి’.. అదే నమ్మకంకాశీకి సంబంధించిన పురాతన నమ్మకాల్లో ‘కాశ్యాం మరణం ముక్తి’ అనే భావన ఒకటి. అంటే కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. హిందూ ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం కర్మ ప్రభావంతో జీవి జనన, మరణ చక్రం కొనసాగుతుంటుంది. కాశీలో మరణం ఆ చక్రం నుంచి విముక్తికి మార్గం చూపుతుందని విశ్వసిస్తారు. కాశీలో మరణించే వారికి స్వయంగా శివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి ఆత్మకు మోక్షాన్ని ప్రసాదిస్తాడనే మరో నమ్మకం కూడా ఉంది. అందుకే కొందరు వృద్ధులు తమ జీవితపు చరమాంకంలో వారణాసికి రావడాన్ని మరణం వైపు ప్రయాణంగా కాకుండా, ఆధ్యాత్మిక ముక్తి కోసం చేసే ప్రయాణంగా భావిస్తారు.1958లో ప్రారంభం.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిందిముక్తి భవన్‌ను 1958లో డాల్మియా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. మరణం సమీపించిందని భావించే వారు కాశీలో తమ చివరి రోజులను గడిపేందుకు దీనిని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో దీని ప్రత్యేక ఉద్దేశం వారణాసిని దాటి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది. జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు ఇక్కడి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 2016లో విడుదలైన హిందీ చిత్రం ‘హోటల్ సాల్వేషన్ (ముక్తి భవన్)’ ద్వారా ఈ ప్రదేశం మరింత విస్తృతంగా అందరికీ పరిచయమైంది. మరణం కోసం కుమారుడితో కలిసి వారణాసికి వచ్చే ఓ వృద్ధుడి కథాంశం ఆధారంగా ఆ సినిమా రూపొందింది.15 రోజులే ఎందుకు?.. ఇదే అసలు నిబంధనముక్తి భవన్లో ఉన్న ప్రత్యేక నిబంధన ఏమిటంటే.. ఇక్కడ పరిమిత కాలం మాత్రమే బస చేసేందుకు అవకాశం ఉండటం. సాధారణంగా ఇక్కడికి వచ్చే వారికి 15 రోజుల వరకు ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ సమయంలో మరణం సంభవించకపోతే, కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. బయటివారికి ఈ నిబంధన ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, సంస్థ ఉద్దేశానికి అనుగుణంగానే దీనిని అమలు చేస్తారు. ముక్తి భవన్ వృద్ధులకు దీర్ఘకాలిక వసతి కల్పించే కేంద్రం కాదు. జీవిత చివరి దశలో ఉన్నామని భావించే వారికి చివరి రోజులను గడిపే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం.ప్రార్థనలు, భజనల మధ్య సహజ మరణంముక్తి భవన్ సాధారణ అతిథి గృహంలా ఉండదు. ఇక్కడి వాతావరణం ప్రార్థనలు, భక్తి గీతాలు, మతపరమైన పారాయణలు, ఆచారాలతో కూడి ఉంటుంది. కుటుంబ సభ్యులు తమ ఆప్తులతో కలిసి ఉంటారు. అయితే ఇక్కడ మరణాన్ని వేగవంతం చేసే ఎలాంటి ప్రయత్నాలు జరగవు. సహజంగానే మరణించే వరకు వేచి ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడినా లేదా 15 రోజుల గడువు దాటినా అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ముక్తి భవన్‌కు వచ్చే వారికి ఈ ప్రయాణం మరణం నుంచి తప్పించుకోవడం కోసం కాదు.. తమ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం జీవిత చరమాంకాన్ని స్వీకరించేందుకు చేసే ప్రయాణంగా భావిస్తారు. వృద్ధాప్యం, మరణాన్ని వీలైనంత ఆలస్యం చేసేందుకు ప్రపంచం ప్రయత్నిస్తున్న సమయంలో, వారణాసి వీధుల్లోని ఈ చిన్న భవనం జీవితం, మరణం, మోక్షం గురించి మరో భిన్నమైన దృక్కోణాన్ని చూపిస్తుంది.ఇది కూడా చదవండి: నీమ్ కరోలి బాబా ఎవరు.. స్టీవ్ జాబ్స్‌ను ఎలా ప్రభావితం చేశారు? -
వాక్పతి: వ్యాసుని మహాభారత రచనలో గణపతి మహిమ!
‘తొండము నేకదంతము’... ప్రార్థనా పద్యంలో ‘విద్యల కెల్ల నొజ్జయై’ అని వాక్కుల కధిపతిగా, విద్యా బుద్ధుల ప్రదాతగా వినాయకుని కీర్తించటం ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెపుతుండగా గణపతి రాశాడని చెబుతారు.అంటే గణపతి వ్యాసుని ఎదురుగా కూర్చుని రాస్తూవుంటే... వ్యాసుడు ఆశువుగా చెబుతున్నాడని పైకి తోచే అర్థం. కాని, వ్యాసుడు ఏకాక్షర గణపతిని ఉపాసించి సర్వ విద్యల సారం గ్రహించి, సమస్త ఛందస్సులలోని భాషా చాతుర్యమంతా అవగతం చేసుకుని మహాభారతాన్ని రచించాడని ఇందులోని అంతరార్థం అని గణేశ పురాణం చెబుతుంది. వ్యాసుడు మహా భారతం, మహా భాగవతాలనే కాక అష్టాదశ పురాణాలను, అష్టాదశ ఉప పురాణాలను కూడా రచించాడు. ఆ ఉప పురాణాలలో ఒకటి గణేశ పురాణం.రచన ధారళంగా సాగాలన్నా, భాషాదోషాలు లేకుండా, ఎక్కడా కుంటుపడకుండా భాష ప్రవహించాలన్నా, మంచి ఆలోచనలు రావాలన్నా గణపతి పూజ అవశ్యం అని పెద్దల మాట. అలనాటి వ్యాసుని నుంచి నేటి పండిత శ్రేష్ఠుల వరకు అందరికీ గణపతి ఆరాధ్య దైవం, వాక్పతి. విద్యాదాత.దేవతలు కూడా విధిగా పూజించవలసిన దైవం గణపతి. దేవతలు క్షీర సాగర మథనాన్ని గణపతి పూజ చేయకుండా ప్రారంభించటం వల్లనే మధ్యలో విఘ్నం కలిగిందనీ, అప్పుడు స్వయంగా మహా విష్ణువే దేవతలచేత గణపతి పూజ చేయించటం వల్ల ఆ కార్యం నిర్విఘ్నంగా జరిగిందనీ గణేశ పురాణం తెలియజేస్తోంది.– డా. చెంగల్వ రామలక్ష్మిఇవి కూడా చదవండి: హిమధీర -
ప్రవాస భారతీయులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదు!
నేను భారత సంతతి అమెరికా పౌరుడిని. నాకు ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డు ఉంది. మేము ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక ఆస్తిని విక్రయించాలనుకుంటున్నాము. అయితే, ఈ అమ్మకాన్ని పూర్తి చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని రిజిస్ట్రార్ కార్యాలయంలో మేము సంప్రదించిన ఒక ఏజెంట్ చె΄్పాడు. రిజిస్ట్రార్ కూడా అది తప్పనిసరి అని చె΄్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత రిజిస్ట్రార్ లేదా ఇతర అధికారులకు సమర్పించేందుకు వర్తించే చట్టపరమైన నిబంధనలను స్పష్టంగా తెలియజేయగలరని కోరుతున్నాను. – సుహాస్, అమెరికా (చిత్తూరు)భారత పౌరులు కానప్పుడు ఆధార్ కార్డు మీకెలా వస్తుంది? ఆధార్ చట్టంలోని ’resident’ నిర్వచనం ప్రకారం, గత 12 నెలల్లో కనీసం 182 రోజులు భారతదేశంలో నివసించిన వ్యక్తి నివాసకులు/ ’resident’గా పరిగణించబడతారు. కేవలం OCI కార్డు గ్రహీతగా ఉండటం వల్ల ఆధార్ కార్డు పొందడం తప్పనిసరి కాదు, మీ కేసులో వీలు కూడా లేదు.ఫెమా నిబంధనల ప్రకారం OCI కార్డు గ్రహీత భారతదేశంలో (ప్రత్యేక పరిస్థితులలో తప్ప) వ్యవసాయ భూమి, తోటలు లేదా ఫాం హౌస్ మినహా ఇతర స్థిరాస్తుల కొనుగోలు; విక్రయాలు చేయవచ్చు. ఈ లావాదేవీకి ఆధార్‌ను తప్పనిసరి పత్రంగా RBI/FEMA నిబంధనలు ఎక్కడా నిర్దేశించలేదు.భారతదేశంలో ఆస్తిని విక్రయించడానికి ఎన్నారైలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఎన్నారైకి ఏదైనా భారతీయ బ్యాంకులో NRO ఖాతా ఉండటం ముఖ్యం.అధికారికంగా అవసరమైన–సూచించిన పత్రాలతోపాటు (1) ఆస్తి పత్రాలు – ఆస్తిపై అప్పులు లేవు అని ధ్రువీకరించే Encumbrance Certificarte (EC); (2) గుర్తింపు ధ్రువీకరణ కోసం పాస్‌పోర్టు – పాన్ కార్డు వంటివి ఉంటే సరిపోతుంది. అయినప్పటికీ, రిజిస్ట్రార్ ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సిందే అని పట్టుబడితే, ఆధార్ కార్డు సమర్పించనందుకు రిజిస్ట్రేషన్ పత్రాన్ని తిరస్కరిస్తూ, అందుకు గల కారణాలను – ఏ చట్టం, నిబంధన, జీఓ Government Order) లేదా ఏ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఆధార్ కోరుతున్నారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరండి. రిజిస్ట్రార్ లిఖితపూర్వకంగా తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం, ఆ ఉత్తర్వులపై జిల్లా రిజిస్ట్రార్ లేదా Inspector General of Registration (IG Registration) ముందు అప్పీల్/పిర్యాదు చేసుకొని, ఆధార్ లేకుండానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా సంబంధిత సబ్–రిజిస్ట్రార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరవచ్చు. హై కోర్టుకి కూడా వెళ్ళవచ్చు.- శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.conకు మెయిల్ చేయవచ్చు. ఇవీ చదవండి: హిమధీర -
హిమధీర
చూశాం కదా... నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం! ‘ఆకస్మికం’ అని అంటున్నాంగానీ ఎన్నో సంవత్సరాలుగా మానవాళి చేస్తున్న తప్పుల ఫలితమే ఈ వినాశనం. ‘హిమాచల్ హైతో హమ్ హై’ ‘హిమాలయాలు ఉంటేనే మనం ఉంటాం’ అనేది ప్రసిద్ధ నినాదం. ఈ నేపథ్యంలో హిమాలయాలను కాపాడుకోవడానికి వివిధ రూపాల్లో మహిళలు చేస్తున్న కృషి గురించి...భారత హిమాలయ ప్రాంతం పర్యావరణం నుంచి సంస్కృతి వరకు మన జీవన విధానంలో భాగమైంది. వాతావరణ అనిశ్చితి ఎదురయ్యే ఈ ప్రాంతంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కాపాడుకోవడంలో, విత్తన సంరక్షణలో జీవవైవిధ్య సంరక్షకులుగా మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ నుండి చంబా వరకు సిక్కింలోని లెప్తా నుండి అరుణాచల్‌ప్రదేశ్‌లోని అపటాని పీఠభూమి వరకు హిమాలయాలను కాపాడుకోవడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.కొండల్లో చెత్తకుప్పలు! ప్రతి సంవత్సరం యాత్రికులు, పర్వతారోహకులు హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన పర్వతమార్గాలకు వెళుతుంటారు. పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్, ఆహార ΄÷ట్లాలు, బట్టలు... మొదలైన వాటితో పర్వత్రపాంతాలు చెత్తకుప్పలుగా కనిపిస్తుంటాయి. ఈ చెత్తకుప్పల భారం హిమాలయాలపై అంతకంతకూ పెరుగుతూ పోతుంది. తీర్థయాత్రలు, ట్రెక్కింగ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుండడంతో చెత్త అంతకంతకూ పేరుకుపోతోంది.నిశ్శబ్దంగా ... ‘తీర్థయాత్ర లు, సాహస యాత్రలకు హిమాల యాలు నిశ్శబ్దంగా మ్యూలం చెల్లిస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాలలో చిన్న ప్లాస్టిక్ కవర్ కూడా దశాబ్దాల పాటు ఉండిపోతుంది’ అంటున్నారు హిమాలయన్ ట్రైబ్ ఫౌండేషన్ ఫౌండర్ ఆర్పీ నేగి. ‘ ప్లాస్టిక్ ఫ్రీ హిమాలయాస్’ నినాదంతో హిమాలయన్ ట్రైబ్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు.పర్వత ప్రతిధ్వని... హిమాలయన్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్(హెచ్ఆర్పీ)లో చురుగ్గా పనిచేస్తోంది త్రిషా భట్టాఛార్జీ. జీవావరణ శాస్త్రంలో పట్టభద్రురాలైన త్రిష, కోయంబత్తూర్‌లోని జౌ ఔట్రీచ్ ఆర్గనైజేషన్‌లో హిమాలయన్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ కోసం రీసెర్చర్‌గా పనిచేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా కేంద్రంగా పనిచేస్తున్న త్రిషా ఇలా అంటుంది...‘హిమాలయాలు అనే మాట వినబడగానే కవి, తత్వవేత్త రూమీ మాట గుర్తుకు వస్తుంది నాకు... హిమాలయాలను చూడడం నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం. వసంతకాలపు రంగులు, పక్షుల కిలకిలారావాలు, స్వచ్ఛమైన గాలిని పీల్చే వన్య్రపాణులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. హిమాలయాలను కాపాడుకోవడానికి హెచ్ఆర్పీ చురుగ్గా పనిచేస్తోంది’ప్రచారంతో... హెచ్ఆర్పీ ప్రాజెక్ట్‌లో చంబాలోని స్థానికులను భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర పోషించింది పూజ. పైలట్ ప్రాజెక్ట్ కోసం తన భూమిని హెచ్‌ఆర్పీకి ఇచ్చింది. వాతావరణ సంక్షోభాన్ని నివారించడంలో చెట్లు అత్యంత విలువైన పాత్ర పోషిస్తాయి అంటూ ప్రచారం నిర్వహించింది. మహిళలు తమ భూములలో వెయ్యికి పైగా మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.మంచు చిరుతలకు అండగా మహిళలు... హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి లోయలో మంచు చిరుత లు సంచరిస్తుంటాయి. వేటగాళ్ల బారిన పడి వాటి మనుగడ కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. సున్నితమైన పర్వత పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో మంచు చిరుతల ప్రాధాన్యతను గుర్తించిన స్థానిక మహిళలు అటవీశాఖ అధికారులతో కలిసి మంచు చిరుతను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. స్థానికంగా మంచు చిరుతను ‘షెన్’ అని పిలుస్తారు. అందుకే తమ గ్రూపుకు ‘షెన్మో’ అని పేరు పెట్టుకున్నారు. కెమెరా ట్రాప్లను అమర్చడం, పర్యవేక్షించడంలో శిక్షణ పొందారు. కాలాతీత పర్వతాలు‘ది సెంట్ ఆఫ్ హిమాలయాస్’ పేరుతో మోనా వర్మ రాసిన పుస్తకంలో హిమాలయ పర్వతశ్రేణులకు సంబంధించిన జానపద కథలు, ఇతిహాస కథలు ఉన్నాయి. హిమాలయాలు విస్తరించి ఉన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక కథ ఇందులో ఉంది. హిమాలయ ప్రాంతంలో నివసించే గిరిజనుల ఆచార, వ్యవహారాలను ఈ కథలు తెలియజేస్తాయి. ‘హిమాలయాలు నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉన్నాయి. యుగాలుగా నిలిచి ఉన్న ఈ కాలాతీత పర్వతాలపై నా ఆరాధనకు ఈ పుస్తకం అద్దం పడుతుంది’ అంటున్నారు మోనా వర్మ. -
పంబ-సన్నిధానం రోప్ వే ప్రాజెక్టులు వేగవంతం..
పంపాను శబరిమల సన్నిధానంతో అనుసంధానించే పూర్తి రోప్‌వేని సకాలంలో పూర్తి చేసేలా చర్యలుతీసుకోవాలని కేరళ రాష్ట్ర దేవస్వం పెన్షనర్ల సమాఖ్య పునలూర్ గ్రూప్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.శబరిమలను సందర్శించే లక్షలాది మంది యాత్రికులకు ఈ రోప్‌వే గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని, ఈ ప్రాజెక్టును మరింత ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.గత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం కులతుపుళ గ్రామంలో 4.5336 హెక్టార్ల భూమిని కేటాయించింది. అయితే, యుడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. అలాగే ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత వరకు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, శబరిమల అభివృద్ధి కార్యకలాపాలపై తన నియంత్రణను బలోపేతం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం కొత్త శబరిమల అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయనుంది. దీనివల్ల అభివృద్ధి సంబంధిత విషయాలలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) పరిపాలనా పాత్ర తగ్గుతుందని భావిస్తున్నారు.ఈ అధికార సంస్థ తొలి సమావేశం సెప్టెంబర్ 11న జరగనుంది.శబరిమల మాస్టర్ ప్లాన్ కింద ప్రాజెక్టులను కాలపరిమితిలోగా అమలు జరిగేలా చూడటమే ఈ కొత్త ప్రాధికార సంస్థ ప్రధాన లక్ష్యం. ఇది సన్నిధానంచుట్టుపక్కల ప్రాంతాలలో యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, అభివృద్ధి ప్రాజెక్టులను సమన్వయం చేయడం, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించడం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. అంతేగాదు ఈ సంస్థ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖతో సహా శబరిమల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ విభాగాల పనితీరును ఈ అథారిటీ సమన్వయం చేస్తుందని చెబుతున్నారు అధికారులు.(చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
ప్రిన్సిపాల్ ఉద్యోగాన్ని వదిలి మరి మిల్లెట్ వ్యాపారం! ఇవాళ ఏకంగా..
స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అందులో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా సేవలందించిన ఆమె సొంతంగా వ్యాపారం చేయాలనే సాహసం చేసింది. విద్యార్థులకు పదే పదే చెప్పిన మాటల్నే ఆచారించి చూపాలని తీసుకున్న ఆ అనూహ్య నిర్ణయం..చివరికి విజయం దక్కించుకునేలా చేసిందా అంటే..ఆ ప్రొఫెసరే తమిళనాడుకు చెందిన సుభ్రద. కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆమె కొద్దికాలంలోనే ఎమరాల్డ్ హైట్స్ అనే మహిళా కాలేజ్‌కి వైస్ ప్రిన్స్‌పాల్ అయ్యింది. అయితే ఆమె ఎప్పుడు తన స్టూడెంట్స్‌కి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి తప్ప..ఒకరి కింద పనిచేసే స్థాయిలో ఉండొద్దని సదా చెబుతుండేది. అసలు ఆ మాటలనే తానే ఆచరించి విద్యార్థులకు ఎందుకు చూపకూడదంటూ సొంతంగా వ్యాపారం చేయాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజలకు నాణ్యమైన పోషకవంతమైన ఆహారం అందించే వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే తాను గతంలో హార్మోన్ల సమస్యతో బాధపడి రెండుసార్లు గర్భస్రావం అయ్యి బాధపడిన అనుభవమే అందుకు కారణమట. ఇలాంటి సమస్యలకు మూలం పోషకాహార లోపం అని వైద్యులు చెప్పడంతోనే..ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నట్లు తెలిపిందామె. అందులోనూ చిరుధాన్యాలు గ్లూటెన్ రహితమైనవి, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలు అందుకే ఈ వ్యాపారం చేసేందుకు మొగ్గు చూపిందామె.ఆ నేపథ్యంలోనే చిరుధాన్యాల ప్రాసెసింగ్‌పై పరిశోధన చేయడానికి మైసూర్‌లోని 'సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' (CFTRI)కి వెళ్లి మరి శిక్షణ తీసుకుంది. అయితే ఆ ట్రైనింగ్‌లో పిండిలో నిల్వచేసే పదార్థాలు కలపకపోతే నిల్వ కాలం తగ్గిపోతుంది. అలాగే కోల్డ్ చైన్ కోసం భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని చెప్పారు. అయినా సరే ఆమె పట్టు వదలకుండా ప్రిజర్వేటివ్ రహతంగా పోషకవంతమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టి మరి భూమిని లీజుకు తీసుకుంది. ఉత్పత్తులను వేరు చేయడం, గ్రేడింగ్ చేయడం, నానబెట్టడం, రుబ్బడం, ప్యాకేజింగ్ చేయడం వంటి వాటికి అనుగుణంగా యంత్రాలను మార్చుకుంది. కానీ మొదట్లో కనీసం 50 ప్యాకెట్లను కూడా అమ్మలేకపోయింది. తెల్లగా లేని దోసె లేదా ఇండ్లీ పిండి కొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో..200 ప్యాకెట్లను ప్రజలకు ఉచితంగా ఇచ్చి తినేలా ప్రోత్సహించాల్సి వచ్చింది. దాంతో తన ఉత్పత్తులకు ఒక్కసారిగా ఆదరణ లభించి అమ్మకాలు ఊపందుకున్నాయి. అలాతన పీవీఆర్ బ్రాండ్‌తో పిండి, నూడుల్స్, హెల్త్ మిక్స్‌లు, పొంగల్ వంటి వాటితో సహా 83 రెడీ టు కుక్ మిల్లెట్ ఉత్పత్తులను అందించే స్థాయికి చేరుకుంది. అంతేగాదు దేశవ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఆస్పత్రులు, కార్యాలయాలు, ఆన్‌లైప్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ బ్రాండ్‌కి ఆదరణ పెరిగి అమ్మకాలు జోరందుకున్నాయి. పైగా ఈ బ్రాండ్‌ని కోయంబత్తూర్‌లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంక్యుబేట్ చేసింది. అలాగే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద రూ. 23 లక్షల గ్రాంట్‌ను కూడా అందించింది. అలా సుభ్రద కంపెనీ ప్రతి ఏడాది సుమారు రూ. 3 కోట్లో ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. ఇక్కడ వ్యాపారంలోకి దిగడమే కాదు..అందులో ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందులను అధిగమిస్తేనే గెలుపుని అందుకోగలమని చెబుతోంది ఈ మాజీ ప్రిన్స్‌పాల్ సుభద్ర కథ.(చదవండి: ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!) -
క్యాన్సర్‌పై ఢీకి.. ‘రెడీ’యేషన్
రేడియేషన్ చికిత్సలకు ఉన్న చరిత్ర దాదాపు 130 ఏళ్లు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా రేడియో యాక్టివ్ మెటీరియల్‌ను కనుగొన్నది 1986లో హెన్రీ బెకరెల్ అనే శాస్త్రవేత్త. అంటే... ఈ ఏడాదికి 2026 ఏడాదికి ఖచ్చితంగా 130 ఏళ్లు నిండుతాయి. ఇక నోబెల్ బహుమతి గ్రహీత మేరీక్యూరీ – పోలోనియం, రేడియమ్ వంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కనుగొన్నాక ఈ చికిత్స ప్రాధాన్యం మరింత పెరిగింది. దాదాపు ఈ దశాబ్దకాలంలో రేడియో యాక్టివ్ మెటీరియల్‌తో క్యాన్సర్‌కు చికిత్సలు చేయడంలో అనేక రకాల పురోగతి చోటు చేసుకుంది. 1970లకు ముందున్న కాలంలో ఎక్స్–రేల రూపంలో వైద్యరంగానికి సేవలందించిన రేడియేషన్ 1970ల తర్వాత సీటీ, ఎమ్మారై లుగా... ఆ తర్వాత 1980లలో పెట్ స్కాన్ వంటి రూపాలలో వైద్యచికిత్సలకు తోడ్పడుతూ వచ్చింది. అటు తర్వాత ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, బ్రాకీథెరపీ, స్టీరియో టాక్టిక్ రేడియేషన్, రేడియో ఐసోటోప్ థెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ (ఐజీఆర్టీ) వంటి ఎన్నో కొత్త పద్ధతుల్లో ఈ రేడియేషన్ వైవిధ్య భరితమైన చికిత్సలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధునిక రేడియేషన్చికిత్సల్లోని అనేక అంశాలను పరిశీలిద్దాం.క్యాన్సర్ రంగంలో అత్యంత పురోగతి తర్వాత ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ వంటి అత్యాధునికమైన చికిత్స ప్రక్రియలు రాకముందే దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన చికిత్స ప్రక్రియలు శస్త్రచికిత్సలూ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలు. ఇందులో రేడియేషన్ థెరపీలో అనేక రకాల అడ్వాన్స్మెంట్లు చోటు చేసుకున్నాయి. ఆ పురోగతులూ, వాటి ఫలితాలేమిటో చూద్దాం.రేడియేషన్ థెరపీ అంటే ఏమిటి?శక్తిమంతమైన ఎక్స్–రే వంటి రేడియేషన్స్‌ను ఖచ్చితంగా క్యాన్సర్ కణాలపై నిశితంగా ప్రసరించేలా చూసి, ఆ కణాన్ని పూర్తిగా తుదముట్టించే చికిత్స ప్రక్రియను ‘రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ఈ కిరణాలు కణాల్లోని డీఎన్ఏ లేదా కణాల్లోని మౌలికాంశాలను దెబ్బతీసి వాటిని నిర్వీర్యం చేస్తాయి. దాంతో ఆ క్యాన్సర్ కణాలు చనిపోవడం వల్ల క్యాన్సర్ కూడా తొలగిపోతుంది.తొలి నాళ్లలో రేడియేషన్ అనేది అది క్యాన్సర్ కణమా లేదా ఆరోగ్యకరమైన కణమా అన్న విచక్షణ లేకుండా తాను ప్రసరించిన చోట ఉన్న కణాలను నాశనం చేయగలిగే సామర్థ్యం ఉండటంతో చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాలను సంరక్షిస్తూ, వాటికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రంగంలో వచ్చిన ఆధునిక పురోగతితో కేవలం క్యాన్సర్ కణాలపైనే గురిపెట్టగలిగేంత నిశితంగా రేడియేషన్ ఇవ్వడం సాధ్యమవుతోంది.రేడియేషన్ థెరపీలో కొన్ని ముఖ్యమైన రకాలివి... క్యాన్సర్ కణాలు / క్యాన్సర్ గడ్డ (ట్యూమర్) అనేది గుండె, మెదడు, వెన్నుపాము వంటి అత్యంత సున్నితమైన అవయవాలకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు రేడియేషన్‌ను మరింత జాగ్రత్తగా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఉదాహరణకు మెదడులోని అనేక ప్రాంతాలు దేహంలోని అనేక అవయవాలను నియంత్రిస్తుంటాయి. శస్త్రచికిత్స చేసే సమయంలో మెదడులోని ఏదైనా కీలకమైన అవయవాన్ని నియంత్రించే భాగం దెబ్బతింటే... ఆ అవయవం అచేతనమయ్యే అవకాశముంటుంది. రేడియేషన్ ప్రసరించినప్పుడు కూడా అలాంటి అవకాశం ఉన్నప్పటికీ... అత్యంత నిశితంగా కేవలం క్యాన్సర్ కణాన్నే గురిపెట్టి దెబ్బతీసే సాంకేతికతా ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రధానంగా చెప్పాలంటే రేడియేషన్‌లో బయటి నుంచి ఇచ్చే ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ), లోపలి నుంచి ఇచ్చే ఇంటర్నల్ రేడియేషన్ థెరపీతో పాటు సిస్టమిక్ రేడియేçషన్ థెరపీ (ఎస్ఆర్టీ) అనే మరో రకమైన రేడియేషన్ ప్రక్రియలను చెప్పవచ్చు. ఈ రేడియేషన్ థెరపీలో అందుబాటులో ఉన్న వివిధ ప్రక్రియల్లో ఈ కింద పేర్కొన్నవి కొన్ని... ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ)త్రీడీ కన్ఫార్మల్ రేడియేషన థెరపీ – (3 డీసీఆర్టీ): ఇందులో ముందుగా సీటీ వంటి స్కాన్ల సహాయంతో క్యాన్సర్ కణితి (ట్యూమర్) ఎంత పెద్దది, దాని ఆకృతి ఎలా ఉంది, అది దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది అని తెలుసుకుంటారు. ఆ కణితి ఆకృతికి తగ్గట్టుగా కేవలం దానికే తాకేలా రేడియేషన్ కిరణాలను పంపిస్తారు. మనకు కావాల్సిన మేరకే కాంతి ప్రసరించే ఒక పెన్టార్చ్ లాంటి దాన్ని ఊహిస్తే... ఈ పద్ధతిలో కేవలం మనకు కావాల్సిన చిన్న ప్రాంతంపైనే కాంతి పడినట్టే రేడియేషన్ కూడా పడుతుందని అనుకోవచ్చు. దాంతో రేడియేషన్ అన్నది క్యాన్సర్ గడ్డపైనే పడుతూ... పక్కనున్న ఆరోగ్యకరమైన కణజాలానికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా చూస్తారు. మెదడు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ వంటి అనేక క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు.ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ (ఐజీఆర్టీ) ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలో క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా జాగ్రత్తగా చూస్తూ ఇస్తారు. దేహంలో ఊపిరితిత్తులూ, డయాఫ్రమ్ లాంటివి నిత్యం కదులుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అలాంటి కదిలే అవయవాలకు రేడియేషన్ ఇవ్వడానికి ఈ ‘ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ’ ఉపయోగడుతుంది. ఉదాహరణకు ఊపిరితీసుకునే సమయంలో ఊపిరితిత్తులు ఉబ్బుతూ, ముడుచుకుంటూ... కదలికలతో ఉంటాయి. ఇలా కదిలే సమయంలో రేడియేషన్ అన్నది క్యాన్సర్ లేని మరో ఆరోగ్యకరమైన ప్రాంతాన్ని తాకకుండా... అవయవం కదులుతున్నప్పటికీ... ఆ కదలికలకు అనుగుణంగా తన ప్రసరణను తానే నియంత్రించుకుంటూ కేవలం క్యాన్సర్ ఉన్న ప్రదేశానికే రేడియేషన్ తాకేలా చూస్తుంది.ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ (ఐఎమ్ఆర్టీ) ఇందులో వివిధ దిశల నుంచి అంటే రకరకాల కోణాలనుంచి రేడియేషన్ కిరణాలను క్యాన్సర్ కణితిపైకి పంపుతారు. ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో క్యాన్సర్ ఉన్నచోట తీవ్రమైన రేడియేషన్ తాకేలా, క్యాన్సర్ లేని చోట వీలైనంత తక్కువ రేడియేషన్ ప్రసరించేలా చూసే ఈ పద్ధతినే ‘ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ముఖ్యంగా క్యాన్సర్ గడ్డ మరో కీలకమైన ఆరోగ్యకరమైన అవయవానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు... ఆ ఆరోగ్యకరమైన అవయవానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా చూసేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ (వీఎమ్‌ఏటీ) అత్యంత ఖచ్చితమైన రీతిలో రేడియేషన్ ఇచ్చే ఈ ప్రక్రియలో రేడియేషన్ ఇచ్చే మెషిన్ క్యాన్సర్ బాధితుడి చుట్టూ తిరుగుతూ వివిధ కోణాల నుంచి రేడియేషన్‌ను ప్రసరింపజేస్తుంది. దాంతో క్యాన్సర్ ఉన్న భాగానికి వీలైనంత ఎక్కువగానూ, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన అవయవాలకు వీలైనంత తక్కువ రేడియేషన్ తాకేలా చూస్తారు. ప్రోస్టేట్, కాలేయం, ప్రాంక్రియాస్ వంటి అనేక రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.శరీరం లోపల నుంచే రేడియేషన్ ఇచ్చే పద్ధతులుఇప్పటివరకూ చెప్పిన పద్ధతులు కాకుండా... రేడియేషన్ వెలువడే పదార్థాన్ని శరీరంలోనే ఉంచి కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ గడ్డ దేహంలో ఉన్న ప్రాంతానికి చేరి అక్కడ నుంచి రేడియేషన్‌ను ప్రసరింపజేస్తుంది. ఇలా రేడియేషన్ ఇవ్వడాన్ని ‘ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ’ అంటారు. ఇందులోని కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు.బ్రాకీథెరపీ : ఈ ప్రక్రియలో రేడియోధార్మిక పదార్థాలను అతి చిన్న మోతాదులో దేహంలోని క్యాన్సర్ ఉన్న ప్రాంతానికి పంపి క్యాన్సర్ గడ్డకు అతి దగ్గరగా ఉండేలా చూస్తారు. ఈ అత్యంత చిన్న మోతాదులో ఉండే రేడియో యాక్టివ్ పదార్థాలు సాధారణంగా చిన్న ‘సీడ్స్’ (విత్తనాల్లాంటి చిన్న పదార్థాలు) రూపంలో ఉంటాయి. అవి అవి క్యాన్సర్గడ్డకు అతి దగ్గరగా ఉండటంతో ఆ రేడియేషన్ ప్రధానంగా క్యాన్సర్ ఉన్న ప్రాంతంలో ప్రభావవంతంగా ప్రసరిస్తూ, గడ్డను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు ప్రోస్టేట్, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), ఎండోమెట్రియంతో పాటు కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్లలో దీనిని ఉపయోగిస్తారు.ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ (ఐఓఆర్టీ) ఇది కొంచెం ప్రత్యేకమైన పద్ధతి. క్యాన్సర్గడ్డకు శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలోనే రేడియేషన్ కూడా ఇస్తారు. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని బయటకు కనిపించేలా చేశాక... ఆ ప్రాంతానికి ఎక్కువ మోతాదులో రేడియేషన్ ఇస్తారు. అదే సమయంలో పక్కనున్న ఆరోగ్యకరమైన అవయవాలను రక్షించడానికి ప్రత్యేక రక్షణాత్మకమైన ప్రక్రియలను అనుసరిస్తారు. జీర్ణవ్యవస్థలోని కొన్ని క్యాన్సర్లతోపాటు శస్త్రచికిత్స చేయడం కష్టమైన కొన్ని ఇతర రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియ ఉపయోగకరంగా ఉంటుంది.స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ (ఎస్ఆర్ఎస్) పేరుకు ఇందులో రేడియోసర్జరీ అని ఉన్నప్పటికీ ఇది శస్త్రచికిత్స కానే కాదు. ఇందులో కత్తితో కోయడం ఉండదు. కాకపోతే ఇందులో చిన్న చిన్న రేడియేషన్ కిరణాలను ఒకేచోట కేంద్రీకృతంగా పడేలా ప్రయోగిస్తారు. దాంతో చాలా ఎక్కువ మోతాదులో తీక్షణంగా పడేలా చేయడంతో క్యాన్సర్ ప్రాంతంపై అత్యంత ఖచ్చితంగా / నిశితంగా కేంద్రీకరించేలా కిరణాలు ప్రసరిస్తాయి. కీలకమైన మెదడు, తల, మెడ ప్రాంతాల్లోని కొన్ని కణుతులకు ఇది ఉపయోగపడుతుంది. మెదడులోని గడ్డలు (బ్రెయిన్ ట్యూమర్స్), పిట్యుటరీ ట్యూమర్స్, మెనింజియోమాస్, అకాస్టిక్ న్యూరోమాస్ వంటి కణుతుల్లో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.బయటే ఉండే మెషిన్ నుంచి రేడియేషన్ ఇవ్వగల మరికొన్ని ఆధునిక ప్రక్రియలివి... ప్రోటాన్ థెరపీ : ఇందులోని సాంకేతికత సాధారణ రేడియేషన్ ప్రక్రియ కంటే కాస్తంత వేరుగా ఉంటుంది. ఇందులో ఎక్స్–రేస్ కాకుండాప్రోటాన్లతో రేడియేషన్ ఇస్తూ... ఈ ప్రోటీన్ బీమ్‌ను క్యాన్సర్ గడ్డ తాలూకు ఆకృతికీ, అది లోపల ఎంత లోతు ఉందో అంతే లోతు వరకు ప్రసరించేలా చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ కంటే లోతులో ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి రేడియేషన్ ప్రసరించకుండా జాగ్రత్త తీసుకోడానికి వీలవుతుంది. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, అన్నవాహిక, మెదడు వంటి క్యాన్సర్లలో దీన్ని ఉపయోగిస్తారు.అయితే ప్రోటాన్ థెరపీ అన్నది ప్రతి క్యాన్సర్ బాధితులకూ తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్పడానికి కుదరదు. ఏ క్యాన్సర్ గడ్డకు ఏ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందన్న అంశాన్ని డాక్టర్లు క్యాన్సర్ గడ్డ తాలూకు రకం, ఆ గడ్డ పరిమాణం, దాని ఆకృతి వంటి అనేక అంశాలపై ఆధారంగా నిర్ణయిస్తారు.ఎమ్మారై లీనియర్ యాక్సిలరేటర్ : ఇది మరింత ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ప్రక్రియ. ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలోనే ఎమ్మారై ద్వారా కణితిని నిరంతరం గమనిస్తూ ఉంటారు. అంటే... ఇందులో... ఎమ్మారై సహాయంతో గడ్డను చూస్తూ ఉంటూనే అవసరాన్నిబట్టి రేడియేషన్ ఇస్తున్న తీరును మార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మృదువైన కణజాలంలో (సాఫ్ట్ టిష్యూ)లలో ఉండే క్యాన్సర్లకు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది.స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ (ఎస్‌బీఆర్‌టీ) : ఇది కూడా చాలా ఖచ్చితమైన రీతిలో / చాలా నిశితంగా రేడియేషన్ ఇవ్వగల ప్రక్రియ. దాంతో ఇందులో రేడియేషన్‌ను చాలా ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డపైనే కేంద్రీకృతమయ్యేలా చేయవచ్చు. శస్త్రచికిత్స చేయడం కుదరని పేషెంట్లకూ లేదా శస్త్రచికిత్సకు అనువుగా ఉండని బాధితులకు ఇదో మంచి ప్రత్యామ్నాయం. ఊపిరితిత్తులు, కాలేయం, ప్రాంక్రియాస్ క్యాన్సర్లతోపాటు ఎముకలకు వ్యాపించిన మరికొన్ని క్యాన్సర్లలో దీన్ని ఉపయోగించవచ్చు.హైపర్ ఆర్క్‌తో అనేక క్యాన్సర్ కణుతులకు చికిత్స: స్టీరియోటాక్టిక్ రేడియేషన్ విధానాల్లో హైపర్ ఆర్క్ రేడియోథెరపీ వంటి అత్యాధునికమైన ప్రక్రియలో ఇప్పుడు మంచి ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇందులో... మెదడులోని పలు కణుతులను లక్ష్యంగా చేసుకుని రేడియేషన్ కిరణాలను అత్యంత కచ్చితత్వంతో ప్రసరింపజేయడం సాధ్యమవుతుంది. మొత్తం మెదడుకు కాకుండా... ఒక్కో కణితిని లక్ష్యంగా చేసుకుని అవసరమైన మోతాదులో రేడియేషన్ ఇవ్వడమే ఇందులోని ప్రధాన ఉద్దేశం. ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి స్కాన్ల ఆధారంగా ఈ చికిత్స ప్రణాళికను రూపొందించాక... ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో వివిధ దిశల నుంచి రేడియేషన కిరణాలు కణితిపై కేంద్రీకృతమయ్యేలా చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. చదవండి: ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!కణితిపై అవసరమైన రేడియేషన్ మోతాదు ప్రసరించాక... ఇక దాని బయట ఉండే చోట్ల రేడియేషన్ కిరణాల వేగం తగ్గేలా ఇందులో చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. ఫలితంగా మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలంపై రేడియేషన్ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. ఇవీ రేడియేషన్ థెరపీలోని కొన్నిప్రాథమికమైన అంశాలలో కొన్ని ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల తమ కుటుంబంలోని క్యాన్సర్ పేషెంట్ల విషయంలో వారి బంధుమిత్రులకూ, పేషెంట్ తాలూకు అటెండెంట్లకూ ఉండే చాలా అపోహాలూ, సందేహాలూ తొలగిపోయే అవకాశాలెక్కువ.రేడియేషన్‌పై ఆధాపడాల్సిన అవసరమేమిటి? క్యాన్సర్ కణం తన ఉనికి, మనుగడ కోసం ఎంతకైనా తెగిస్తుంటుంది. పైగా ఆ కణం చాలా చిన్నదిగా ఉంటుంది. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించేటప్పుడు కేవలం ఒక చిన్న కణం మిగిలిపోయినా... అది మళ్లీ పెరిగిపోయే ముప్పు ఉండనే ఉంటుంది. అందుకే రేడియేషన్ ద్వారా కొంత ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతిన్నప్పటికీ, ఏ చిన్నకణమూ మిగిలిపోకుండా సమూలంగా నిర్మూలించడానికి రేడియేషన్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో... శస్త్రచికిత్సకు ముందుగా కూడా రేడియేషన్ / కీమో ఉపయోగించి ఆ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి అనువుగా ఉండేంత చిన్నదయ్యేలా చేశాకే సర్జరీ చేస్తుంటారు. ఇలా కూడా రేడియేషన్ ఉపయోగపడుతుంది.ఎవరికీ ఏ రేడియేషన్, ఎంత ఇవ్వాలో నిర్ణయించడమెలా... క్యాన్సర్ బాధితుల్లో రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సిన వారిలో ఇది చాలా కీలకమైన అంశం. క్యాన్సర్ బాధితులందరికీ ఒకే రకమైన రేడియేషన్ థెరపీ ఇవ్వడం కుదరదు. అనేక అంశాల ఆధారంగా ఏ తరహా క్యాన్సర్ గడ్డకూ లేదా ఏ బాధితుడికి ఏ తరహా రేడియేషన్ ఇవ్వాలనేది అనేక అంశాల ఆధారంగా డాక్టర్లు (రేడియేషన్ ఆంకాలజిస్టులు) నిర్ణయిస్తారు. వారు చూసే అంశాలివి... అది ఏరకమైన క్యాన్సర్ గడ్డ దాని పరిమాణం ఎంత (ఎంత పెద్దది) దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది చుట్టుపక్కల ఉన్న అవయవాలేమిటి గడ్డ ఎంతవరకు వ్యాపించి ఉంది బయాప్సీ రిపోర్టులో ఏముంది సీటీ, ఎమ్మారై, పెట్ స్కాన్లలో ఉన్న సమాచారమేమిటి క్యాన్సర్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి... వంటి అనేక అంశాలను పరిశీలించి ఇవ్వాల్సిన రేడియేషన్‌ను నిర్ణయిస్తారు. డాక్టర్ వినితా రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ నిర్వహణ: యాసీన్ -
ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!
కొందరు దుర్మార్గుల వికృత ప్రేమకు ఎందరో అమ్మాయిలు జీవితాలు బలైన ఉదంతాలు చూశాం. కొందరు వాటిని తట్టుకుని తమ సత్తా ఏంటో చూపించి స్ఫూర్తిగా నిలవడమే కాదు, యావత్తు దేశం తమలాంటి వాళ్లవైపు తిరిగి చూసేలా చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ కాజల్ ప్రజాపతి. ప్రేమ పేరుతో వెంటపడే ఓ వ్యక్తి దుశ్చర్యకు రూపాన్ని పోగోట్టుకుని, వికలాంగురాలిగా మారిన అమ్మాయి కథ.అహ్మదాబాద్‌లోని మెహసానాలోని రామోసానా గ్రామానికి చెందిన అమ్మాయే కాజల్ ప్రజాపతి. రిక్షా డ్రైవర్ కుమార్తె. బికాం మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు 2016లో ఓ దుర్మార్గుడి యాసిడ్ దాడికి బలైంది. ఆ వ్యక్తి ప్రేమను కాదన్నందుకు..ఫలితంగా ఘెరమైన నరకయాతనను చవిచూసింది. ఆ యాసిడ్ దాడిలో ఒక కన్ను పూర్తిగా కోల్పోగా, మరో కన్ను పాక్షికంగా చూపుని కోల్పోయింది. బయటకు తలెత్తుకోని తిరగలేని విధంగా జీవితాన్ని కోల్పోయింది. తన ముఖాన్ని తానే చూసుకోలేక, బయటకు వెళ్లలేక ఎంతో బాధను, వేదనను చవిచూసింది. హాయిగా చదువుకోవాల్సిన ఆ టీనేజ్ వయసు మొత్తం సర్జరీలకే జీవితం అంకితమైపోయింది. అలా ఆమె అప్పటికే 20కి పైగా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా సరే తనెందుకు బిక్కుబిక్కుమంటూ బతకాలి, తానేం ఏ నేరం చేశా, అన్న ఆలోచన కాజల్‌ని ఒక పట్టాన నిలువనిచ్చేది కాదు. ఈ సమాజంలో అందరిలా ధైర్యంగా బయట తిరగాలి, తన కాళ్లమీద తాను నిలబడేలా గౌరవంగా బతకాలి అన్న కోరికతో పోటీ పరీక్షల వైపు దృష్టిసారించింది. అస్సలు తనకు కావాల్సింది జాలి చూపులు కాదు..తను మీలాంటి మనిషి అని గుర్తించే మనసే కావలంటూ ధైర్యంగా ముందుకు సాగింది. నిజానికి కాజల్ డ్రీమ్ పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ అవ్వడం కానీ కంటి చూపు కారణంగా ఆ అవకాశం దూరమైంది. దాంతో రెవెన్యూ శాఖ ఉద్యోగాలపై ఫోకస్ పెట్టి ఆయా పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. అలా ఆమె ఈ ఏడాది ఒకటి కాదు ఏకంగా రెండు ప్రభుత్వోద్యోగాలు దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. మొదటిది గ్రామీణ పరిపాలనా కార్యదర్శి ఉద్యోగం కాగా, మరోకటి రెవెన్యూ విభాగంలో కీలకమైన డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం. అయితే కాజల్ రెండోదే ఎంచుకుంది. డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగమే ప్రతిష్టాత్మకమైనదని అదే ఎంచుకున్నట్లు ఆమె పేర్కొంది. ఈ నెల సెప్టెంబర్ 17న డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకానుంది. అంటే యాసిడ్ దాడి జరిగిన పదేళ్లకు తిరిగి తన గుర్తింపుని దక్కించుకునేలా ప్రభుత్వోద్యోగాలను సాధించింది. అంతేగాదు ఆమె నెల జీతం రూ. రూ. 49,600 దాక ఉంటుంది. కాగా, ఈ స్థాయికి చేరుకునేందుకు తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నా అని ఆనందంగా చెబుతోంది కాజల్. అలాగే తాను ఈ పరీక్షలకు సన్నద్ధమవ్వడం అంటే.. అందరికీ ఉన్నన్ని కాకపోయినా కనీస వెసులుబాటు కూడా ఏమి లేదని అంటోంది. తన ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రిపరేషన్‌కి ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని, కేవలం ప్రభుత్వ లైబ్రరీపై ఆధారపడి చదువుకున్నట్లు తెలిపింది. కానీ ఆ లైబ్రరీ కోసం బయటకు వెళ్తే..తన రూపు చూసి జాలిపడే చూపులను ఎదుర్కొనాల్సిన ఉంటుంది. అయినప్పటికీ ధైర్యం చేశా, కానీ ఏ రోజు తన ముఖాన్ని దాచుకోలేదని అంటోంది కాజల్. ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడు కూడా అందరితో కలవాలంటే ముందు ఈ పరిస్థితిని తాను అధిగమించాల్సి ఉంటుంది కాబట్టే ఇలా చేసినట్లు తెలిపింది. అంతేగాదు ఇక తాను ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయించుకోనని, తాను ఎలా ఉన్నానో అలాగే అంగీకరించాలని ఆశిస్తోంది. ఈ గెలుపు ప్రయాణంలో ముందుగా తనకు అతిపెద్ద బలం తన అన్నయ్యేనని అంటుంది. తను నా చెల్లి అని గర్వంగా చెప్పడమే కాదు, తానెంతో ధైర్యవంతురాలిని అని చెప్పే మాటలే ధైర్యంగా ముందుకు సాగేలా చేశాయని అంటోంది. అలాగే నిర్భయంగా బయటకు రాగాలిగానంటే అందుకు తన స్నేహితురాలే కారణమని అంటోంది. ఆమె పదే పదే నువ్వు బయటకు రావాలి, ఈ సమాజంంలో నీ స్థానాన్ని తిరిగి పొందాలని చెబుతుండేది, అవి నాకు కొండంత ధైర్యాన్ని ఆశను అందించాయని చెబుతోంది. అలాగే తనకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులకు ధన్యవాదాలు చెబుతోంది. ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని చాలామటుకు చికిత్సలో రాయితీ అందించారని చెప్పుకొచ్చింది. ఇవాళ ఇలా గెలుపుతో నిలదొక్కుకున్నానంటే..అందుకు వాళ్లందరూ అందించిన సహాయసహకారాలే కారణమని సగర్వంగా చెబుతోంది కాజల్.(చదవండి: కుల మతాలకు అతీతంగా సరికొత్త చరిత్ర సృష్టించిన న్యాయవాది..! -
భాగ్యనగరంలో ‘మూల్ – ది ఆరిజిన్'
ఆర్ట్ కనెక్ట్, గోండ్వానా ఆర్ట్ ప్రాజెక్ట్ సహకారంతో, మధ్య భారతదేశంలోని దేశీయ కళా సంప్రదాయాల మూలాల్లోకి తొంగిచూసే 'మూల్ – ది ఆరిజిన్' అనే ప్రదర్శనను అందిస్తోంది. ఇది కళలు ఎలా రూపాంతరం చెందుతూ..సరికొత్తగా ఎలా వ్యక్తీకరణను పొందుతున్నాయో ఈ ప్రదర్శన చూపిస్తుంది. ఈ ప్రధర్శన ఈ నెల 10 నుంచి సెప్టెంబర్ 13 వరకు హైదరాబాద్, ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోస్ సమీపంలోని స్పిరిట్ కనెక్ట్‌లో జరగనుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం మన మూలాల్లో తిరిగి వెళ్లడం, అలాగని గతంలోకి వెళ్లమని కాదట. ఈ ప్రదర్శనలో కళఖాండాలు తమ మూలాలతో ఎలా గాఢంగా పాతుకుపోయి ఉంటాయో నేటి ప్రపంచానికి తెలియజేస్తాయని అంటున్నారు నిర్వహకులు. సుపరిచితమైన చిహ్నాలు, నమునాలు ఎలా కళాకారుల నుంచి మార్పులు సంతరించుకున్నాయో తెలియజేస్తుందట ఈ ప్రదర్శన. ఇక్కడ సంప్రదాయన్ని స్థిరంగా నిలిచిపోయే వస్తువుగా ప్రదర్శించకుండా సజీవ భాషగా, మన వారసత్వంగా కళాకారులు ముందుకు తీసుకెళ్తారనేది చెప్పడానికే ఈ ప్రదర్శన అని ఈ ఆర్ట్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు చెబుతున్నారు.(చదవండి: ఏఐ టూత్ బ్రెష్..దెబ్బకు నోటి సమస్యలకు చెక్!) -
రాధికా మర్చంట్ వైట్ గోల్డ్ వాచ్ అంత ఖరీదా..! ఏకంగా 1700 వజ్రాలు, పచ్చలు..
అంబానీ ఫ్యామిలీ అంటేనే అన్నీ కళ్లు చెదిరే లగ్జరీయస్తో కూడిన బడా విలువ చేసే నగలు, గాడ్జెట్లనే ఉపయోగిస్తారనేది తెలిసిందే. కానీ వాళ్లు ధరించే జ్యువెలరీ, కాస్ట్యూమ్ ఇలా ప్రతి ఒక్కటి విలక్షణమైనవి, పైగా భారతీయతను చాటే హస్తకళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈసారి ఆ కుటుంబానికి చెందిన చిన్న కోడలు రాధికా మర్చంట్ మరోసారి తన లగ్జరీయస్ ఫ్యాషన్‌తో అందర్నీ ఆకట్టుకుంది. చాలా సింపుల్ డ్రెస్ లుక్‌తో ఆకట్టుకునే ఆమె ప్రతి జ్యువెలరీ, వాచ్‌లు అత్యంత విలక్షణంగా ఉంటాయి. ఈసారి ఆభరణంలాంటి వైట్ గోల్డ్ వాచ్‌తో అందర్నీ ఆకట్టుకుందామె. ముంబైలో జరిగిన అబు జానీ సందీప్ ఖోస్లో 40వ వార్షికోత్సవ వేడుకలో అబానీ కుటుంబం మొత్తం హాజరైంది. ఈ వేడుకులో రాధికా ఇలా తన విభిన్నమైన ఫ్యాషన్ లుక్‌తో ఆకర్షించింది. దుస్తుల పరంగానే కాకుండా జ్యువెలరీ పరంగా కూడా విలక్షణతో కూడిన ప్రత్యేకతను చాటింది. ముఖ్యంగా చేతికి ధరించిన వైట్ గోల్డ్ వాచ్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అదొక గాడ్జెట్‌లా కాకుండా ఒక జ్యువెలరీలా మెరిసి..అందరి చూపులను ఆకర్షించింది. మరి ఆ వాచ్ విశేషాల గురించి సవివరంగా చూద్దామా. ఈ వాచ్‌ని 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో రూపొందదించారట. ఇది సుమారు 24mm వెడల్పు, 27.8mm పొడవు ఉంటుంది. దీని డయల్ పూర్తిగా వజ్రాలు, పచ్చలతో పొదగబడి ఉంది. అలాగే ఫ్యూయిల్ శైలి ముల్లులు, 12, 6 గంటల వద్ద ఉన్న రోమన్ అంకెలు ప్రధాన ఆకర్ణగా కనిపిస్తాయి. ఈ వాచ్‌లో ప్రధాన ఆకర్షణ మాత్రం మిరుమిట్లుగొలిపే అసంఖ్యాక వజ్రాలు, పచ్చలే. దీనిలో సుమారు 33.64 క్యారెట్ల బరువున్న 1700కు పైగా వజ్రాలు, 33.64 క్యారెట్ల బరువున్న 289 పచ్చలు పొందుపర్చారు. దీని బరువు మొత్తం 38 క్యారెట్లకు పైగా ఉంటుందట. మరి ఇంత విలాసవంతంగా తీర్చిదిద్దిన తెల్ల బంగారం వాచ్ ధర ఎంతో తెలిస్తే మాత్రం మతిపోవడం ఖాయం. ఇది అక్షరాలు రూ. 1.51 కోట్లు పైనే పలుకుతుందట. మరో ప్రత్యేకత ఏంటంటే సంప్రదాయ వాచ్‌ల మాదిరిగా కాకుండా ఒక ఆభరణంలా ధరించేలా రూపొందించడం విశేషం. ఆ వాచ్‌కి అనుగుణంగా స్ట్రక్చర్డ్ జాకెట్, ప్రింటెడ్ స్కర్ట్‌తో ఆధునిక డిజైనర్‌వేర్ ధరించింది. పచ్చల నెక్లెస్, స్టేమెంట్ చెవిపోగులు, వేలికి వజ్రపు ఉంగరంతో తన ఆహార్యాన్ని పూర్తి చేసి అత్యంత హుందాగా, స్టైలిష్‌గా తళుక్కుమంది రాధికా. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) (చదవండి: Nita Ambani: అద్భుతమైన క్రిమ్సన్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
ఆ హైజాక్ ఘటన..మా అమ్మ ఫ్లైట్ జర్నీలకు బ్రేక్ వేయలేదు!
ఒక్కోసారి కొన్ని ప్రయాణాలు భయానక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎంతలా అంటే ఓ పట్టాన తేరుకోలేం. ఇంకోసారి అలాంటి జర్నీలు చేసే సాహసం కూడా చేయం. కానీ ఈ మహిళ టీనేజ్ వయసులో భయానక హైజాకింగ్ ఘటన ఎదుర్కొంది. క్షణం, క్షణం ఉత్కంఠ రేపే ఆ ఘటనలు బతికున్నంత వరకు మర్చిపోని విషాదం అది. అయినా..అది తన జర్నీలకు బ్రేక్ వేయలేదంటూ తన కథను సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. నెటిజన్లు ఆమె స్టోరీని అద్భుతమైన స్ఫూర్తిదాయక కథ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ రోహన్ శర్మ తన తల్లి అద్భుతమైన కథను ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకున్నారు. పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్ ఘటన జరిగి 40 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. తన తల్లికి 15 ఏళ్ల వయసున్నప్పుడు సెలవుల తర్వాత ఢిల్లీ నుంచి ఒంటరిగా అమెరికాకు వెళ్తుండగా ఈ దురుదృష్టకర ఘటనను ఎదుర్కొందని తెలిపాడు. ఇన్నేళ్లయినా..ఆ భయనాక క్షణాలు తనను ఇంకా వెంటాడుతూనే ఉన్నా..విమానా ప్రయాణాలు ఆపలేదని ధీమాగా చెబుతున్నాడు. ఆ విషాద ఘటన తన అమ్మకు ప్రపంచాన్ని చూడాలనే కలను దూరం చేయలేకపోయిందని అంటున్నాడు. కరేబియన్‌లో స్కూబా డైవింగ్ చేయడం, స్విస్ ఆల్ప్స్లో స్కీయింగ్ చేయడం, పోర్చుగల్ జలాల్లో ఈత కొట్టడం వరకు ప్రతి సాహసాన్ని ఆస్వాదిస్తోంది. పైగా కోలుకోవడం అంటే మర్చిపోవడం కాదని జీవించడం అని నిరూపించిందని గర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు తను ఆ గాయం తనని నిర్దేశించకూడదని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది అందువల్లే ఈ సాహసకృత్యాలను చేయగలిగింది, మంచి అనుభవాల్ని సంపాదించుకుందని చెబుతున్నాడు. ఇక ఆమె తల్లి కూడా ఆనాటి విషాద దృశ్యాలు తన మనసులో గాఢంగా ముద్రపడిపోయాయని, అవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయన్నారామె. తనలా నాటి పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లు కోలుకున్నారా లేదా అని ఆలోచిస్తుంటానని చెబుతోందామె. అయితే తాను టీనేజ్ వయసులో ఎదుర్కొన్న ఆ గాయాన్ని తనను శాసించకూడదని అనుకున్నా కాబట్టి ఇవన్నీ చేయగలిగానని అంటోందామె. అలాగే ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. తనెలా బయటపడిందో పంచుకుంది. ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్‌కు గురైంది. ప్రయాణికులు సుమారు 16 గంటల పాటు బందీలుగా ఉంచారు. హైజాకర్లు కాల్పులు జరపడానికి ముందు ప్రయాణికులను విమానం మధ్యలోకి తీసుకువెళ్లారని, ఇంతలో మరో ప్రయాణికురాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవడంతో దానిగుండా తాను బయటపడినట్లు తెలిపింది. అయితే లోపల కాల్పుల శబ్దానికి బిగుసుకుపోయి విమానం రెక్కపై ఉండిపోయానని, ఇంతలో సన్‌షైన్ అనే ఫ్లైట్ అటెండెంట్ విమానం రెక్కపై నుంచి నెమ్మదిగా కిందకు దించిందంటూ నాటి విషాదాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది’. అయితే తాను శారీరకంగా ఎలాంటి గాయాలవ్వకుండా సురక్షితం బయటపడ్డప్పటికీ..ఆ ఘటనలో సుమారు 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. అది నిజంగా ఎవ్వరి జీవితాన్ని అయినా ప్రభావితం చేసే భయానకమైన బాధకర ఘటనగా అభివర్ణించిందామె. అయితే తాను దాన్నుంచి బయటపడి ధైర్యంగా ముందుకు సాగాలనుకున్నా..కాబట్టి విమాన ప్రయాణాలకు బ్రేక్ పడలేదని నవ్వుతూ చెబుతుంది. అంతేగాదు ఇలాంటి అనుభవం పొందిన వాళ్లు ఎవ్వరైనా తెలుసుకోవాల్సింది ఏంటో తన అనుభవంతో గొప్ప పాఠాన్ని నేర్పిందామె. నెటిజన్లు కూడా హ్యాట్సాఫ్ మేడం..అద్భుతమైన కథ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rohan Sharma (@rohabits) (చదవండి: ఏఐ టూత్ బ్రెష్..దెబ్బకు నోటి సమస్యలకు చెక్!) -
ఏఐ టూత్ బ్రెష్..దెబ్బకు నోటి సమస్యలకు చెక్!
ఎటు చూసినా ఏఐ సాంకేతికత హవానే. ప్రతిదానిలో ఏఐ ఫీచర్లతో మోత మోగించేస్తూ..పనులన్నీ చిటికెలో అయిపోయేలా వస్తున్నాయి అన్ని గాడ్జెట్లు. తాజాగా రోజువారీ దినచర్యలో నిత్యకృత్యమైన బ్రెషింగ్లో కూడా ఈ ఫీచర్ వచ్చేసింది. దంతాల క్లీనింగ్ కోసం డెంటిస్ట్ దగ్గరకు వెళ్లక్కర్లేకుండా చక్కగా పళ్లు తళతళ మెరిసేలా స్వయంగా క్లీన్ చేసుకునే ఏఐ టూల్ బ్రెష్ వచ్చేసింది. దీని పనితీరు చూస్తే మైండ్‌బ్లాక్ అయిపోవడం ఖాయం. ఇంతలా క్లీన్ చేస్తుందా అని కచ్చితంగా నోరెళ్లబెడతారు. అందుకు సంబంధించిన వీడియోని ఓ జంట నెట్టింట పంచుకుంది. మరి ఆ ఏఐ టూత్ బ్రెష్ విశేషాలేంటో సవివరంగా చూద్దామా మరి..!.కంటెంట్ క్రియేటర్లైన ఓ జంట "దిఆలివ్ట్రీఫ్యామిలీ" అనే పేరుతో ఓ వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో అంతర్నిర్మిత కెమెరా, టార్చ్‌తో కూడిన ఏఐ ఫాసింగ్ క్లీనింగ్‌తో కూడిన టూత్ బ్రెష్ పని తీరు గురించి పంచుకున్నాడు. డైసన్ అనే కంపెనీ ఏఐ సాంకేతికతో కూడిన ఈ ఆధునిక బ్రష్‌ని రూపొందించింది. వాళ్లు ఆ బ్రెష్‌ని ఎలా ఉపయోగించుకోవాలో ఎలా ఛార్జ్ చేయాలి వంటి వాటితో సహా..ఉపయోగించే విధానం కూడా పంచుకున్నారు. టూత్ పేస్ట్‌ని బ్రెష్‌పై పెట్టి నోటిలో పెట్టగానే ప్రతిదీ వీడియో తీస్తూ..పళ్ల సందుల్లో ఇరుక్కుపోయిన ఆహారాన్ని క్లీన్ చేస్తుంది. ఎక్కడ చిన్న మెతుకు ఇరుక్కుపోయినా వదలదు. అది కూడా తక్కువ టైంలోనే సమర్థవంతంగ పంటి సమస్యల బారిన పడకుండా అద్భుతంగా క్లీన్ చేయడం స్పష్టంగా వీడియోలో చూడొచ్చు. అలాగే ఈ బ్రష్‌ని డిజైన్ చేసిన సంస్థ సైతం ఇది దంతాల మధ్య ఉన్న ఖాళీలను లక్ష్యంగా చేసుకుని పాచిని తొలగించే ఏకైక బ్రెష్గా అభివర్ణించింది. ఇది జెట్ వాషింగ్, లిక్విడ్ వాషింగ్, మౌత్ వాష్ వంటి క్లీనింగ్ పద్ధతులను అందిస్తుంది. సాధారణంగా ఫాసింగ్ అనేది కాస్త సమయం ఎక్కువ తీసుకునే పద్ధతి. అందరూ దీన్నిచేయలేరు కూడా. అదే సాంకేతికతో కూడిన అత్యాధునిక ఈ టూత్‌బ్రెష్‌తో జస్ట్ ఓ మూడు నిమిషాల్లో పళ్లన్నీ శుభ్రపడాయి. పాచి, పసుపు గార వంటి ఇబ్బంది లేకుండా తళతళ మెరిసిపోయేలా చేస్తుంది. దీని ఫీచర్స్ చూస్తుంటే..నోటి ఆరోగ్యానికి బెస్ట్ టూత్ బ్రెస్ట్గా తెలుస్తోంది. అదీగాక నోటి సంరక్షణ పద్ధతులపై జరుగుతున్న పరిశోధనల్లో నోటిలో మలినాలు ఎలా పేరుకుపోతాయో, అలాగే పళ్ల మధ్య ఉండే ఖాళీల్లో మలినాలు ఎలా చేరుకుంటాయో వెల్లడించింది. వీటిని క్లీన్ చేయడం చాలా మంది ప్రజలు మర్చిపోతున్నట్లు సర్వేలో తేలింది కూడా. అలాంటి తరుణంలో ఈ సరికొత్త ఫీచర్లున్న టూత్ బెస్ట్ అందరికీ ఆమోదయోగ్యకరమైనదని అంగీకరించవచ్చు. పైగా దీని ధర కూడా కేవలం రూ. 47 వేలు. అందరు కొనలేకపోయినా..సామాన్యుడు కూడా కొనేలా త్వరలో తక్కవ ధరలో లభించేవి కూడా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం లేకపోలేదనే చెప్పొచ్చు. View this post on Instagram A post shared by W Ken | Lynsay | Chung Family (@theolivetreefamily)(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!) -
శ్రీగంధం: ప్రూనింగ్‌తో పూర్తి నష్టం!
దీర్ఘకాలంలో రూ. కోట్ల ఆదాయాన్నిస్తుందనే ఆశతో తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు శ్రీగంధం సాగును ఎంచుకుంటున్నారు. చెట్టు త్వరగా నిటారుగా ఎదుగుతుందని, నాణ్యమైన కలప వస్తుందనే అపోహలతో చాలామంది రైతులు శ్రీగంధం చెట్లకు ప్రూనింగ్ (కొమ్మల కత్తిరింపు) చేస్తున్నారు. కానీ, ఈ ప్రూనింగే శ్రీగంధం తోటలకు శాపంగా మారి, రైతులను నిలువునా ముంచుతోందని బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐసీఎఫ్ఆర్ఈ– ఐడబ్ల్యూఎస్‌టీ)’ మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సుందరరాజ్ హెచ్చరిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అనేక శ్రీగంధం తోటలను పరిశీలించినప్పుడు ప్రూనింగ్ వల్ల రైతులకు కలుగుతున్న నష్టాన్ని చూసి కలత చెందానని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు. పండ్ల తోటలు, పూల తోటల్లో తక్కువ సమయంలో ఎక్కువ ఆకులు, కాయలు రావడానికి ప్రూనింగ్ ఉపయోగపడుతుంది. కానీ కలపనిచ్చే శ్రీగంధం లాంటి చెట్లకు ప్రూనింగ్ చెయ్యటం తీవ్ర నష్టదాయకం. చెట్టు కాండం పైభాగంలో ఉండే బెరడు ప్రకృతిసిద్ధమైన మొదటి రక్షణ కవచం. ప్రూనింగ్ ద్వారా కొమ్మలను నరికినప్పుడు కాండంపై లోతైన గాయాలు ఏర్పడతాయి. ఈ గాయాల ద్వారా చెక్కను కుళ్ళింపజేసే ప్రమాదకర శిలీంధ్రాలు, చెక్కను తొలిచే పురుగులు సులువుగా కాండం లోపలికి ప్రవేశిస్తాయి. బెరడు దెబ్బతిన్న తర్వాత ఆ శిలీంధ్రాలు, కీటకాల దాడిని అడ్డుకోవటం ఏ పురుగుమందులు చల్లినా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కేరళ అటవీ పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం.. శ్రీగంధం వంటి కలప చెట్లలో ఆకులు లేదా పక్క కొమ్మలు కోల్పోవటం వల్ల కలప పెరుగుదల ఏకంగా 44% వరకు తగ్గిపోతుంది. ప్రూనింగ్ గాయాలతో లోపలి చెక్క క్రమంగా కుళ్ళిపోయి కాండం మొత్తం డొల్లగా, బోలుగా మారిపోతుంది. ఫలితంగా, 15–20 ఏళ్లు బతకాల్సిన శ్రీగంధం చెట్లు కేవలం 7–10 ఏళ్ల లేత వయసులోనే ఎండిపోయి చనిపోతున్నాయని డాక్టర్ సుందరరాజ్ స్వయంగా గుర్తించారు. ఎలాంటి రంధ్రాలు, డొల్లతనం లేకుండా ఉంటే చెట్టుకు కనీసం 9 కిలోల బరువుండే మేలైన నాణ్యమైన శ్రీగంధం కలప రావాలి. ప్రూనింగ్ వల్ల ఒక్క కిలో కూడా మొదటి రకం గుజ్జు రావట్లేదు. దీంతో భారీ లాభాలు ఆశించిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. శ్రీగంధం తోటల రైతులు ఎలాంటి ప్రూనింగ్ చేయకూడదు. చెట్లను సహజంగా ఎదగనివ్వాలి. కాండంపై ఎలాంటి గాయాలు చేయకూడదు. నిరాధార ప్రచారాలను నమ్మి కొమ్మలను కత్తిరించి తోటలను నాశనం చేసుకోవద్దని డాక్టర్ సుందరరాజ్ (97404 33959) విజ్ఞప్తి చేస్తున్నారు. -
సూపర్ ఎల్‌నినో వేళ... పశుసంపద సంరక్షణ ఇలా!
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూ.ఎం.ఓ.) తాజా హెచ్చరికల ప్రకారం ఎల్ నినో ప్రభావం బలంగా ఏర్పడి కొనసాగుతోంది. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే తీవ్రమైన ఎండలు, వర్షాభావం వ్యవసాయంతో పాటు పశుసంపద ఉత్పత్తికి పెను సవాలుగా మారుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తాగునీటి ఎద్దడి, పచ్చిమేత కొరత, దాణా ధరల పెరుగుదల వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతిని పాలు, మాంసం, గుడ్ల ఉత్పాదకత పడిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సుమారు 42.33 లక్షల ఆవులు, 42.26 లక్షల గేదెలు, 1.91 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు, దాదాపు 8 కోట్ల కోళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎండ తీవ్రతకు పశువుల శరీర ఉష్ణోగ్రత, శ్వాస రేటు, నీటి అవసరం పెరిగి, మేత తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి.ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంటుందంటే?పాడి పశువులు: విదేశీ, సంకరజాతి ఆవులు 24–27 డిగ్రీల సెల్సియస్, దేశీ ఆవులు 33 డిగ్రీలు, గేదెలు 36 డిగ్రీల ఉష్ణోగ్రత మించితే వేడి ఒత్తిడికి గురవుతాయి. శరీరాన్ని చల్లబరచుకోవటానికే చాలా శక్తి ఖర్చయి పోతుంది. మేత తినటం తగ్గడంతో పాల దిగుబడితో పాటు పాలలో వెన్న, ప్రొటీన్ శాతం తగ్గి రైతులకు గిట్టుబాటు ధర రాదు. గొర్రెలు, మేకలు, పందులు: పచ్చిక బయళ్ల కొరతతో జీవాల బరువు పెరగటం మందగించి, మార్కెట్ బరువు సాధించటానికి ఎక్కువ సమయం పడుతుంది. అధిక వేడి తట్టుకోలేని పందుల్లో ఎదుగుదల, పునరుత్పత్తి క్షీణిస్తుంది. పౌల్ట్రీ – ఆక్వా: దేశ గుడ్ల ఉత్పత్తిలో 13% వాటా ఉన్న తెలంగాణలో కోళ్ల మేత మార్పిడి నిష్పత్తి (ఊఇఖ) పెరిగి, గుడ్ల ఉత్పత్తి, నాణ్యత, పొదిగే సామర్థ్యం తగ్గుతాయి. చేపల చెరువుల్లో నీటిమట్టాలు పడిపోయి నాణ్యత దెబ్బతింటుంది. పునరుత్పత్తి – వ్యాధులు: వేడి తీవ్రత వల్ల పశువుల్లో ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించవు. చూడి నిలిచే సామర్థ్యం తగ్గి, ఈతల మధ్య కాలం పెరుగుతుంది. మగ పశువుల్లో వీర్యం నాణ్యత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గి పొదుగు వాపు, గాలికుంటు, పీపీఆర్, కొక్కెర వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఉత్తమ యాజమాన్యం ఎలాగంటే..?పాకల నిర్వహణ: పాకల చుట్టూ గోనె సంచులు కట్టి రోజుకు 2–3 సార్లు తడపాలి. పైకప్పుపై కూలింగ్ పెయింట్ వేయడం ద్వారా 95% ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. పైకప్పుపై గడ్డి లేదా కొబ్బరి/తాటి ఆకులు పరవాలి. షెడ్లలో స్ప్రింక్లర్లు, ఫ్యాన్లు, చుట్టూ 20% షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలి. మేత – పోషణ యాజమాన్యం: సాధారణంగానే దాణా, మేత కొరత ఉన్నందున ముందస్తుగా ‘సైలేజ్’ (పాతర గడ్డి) రూపంలో నిల్వ చేసుకోవాలి. గ్రామీణ గడ్డి బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. పశుగ్రాసాన్ని చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి వృథాను అరికట్టాలి. పీచు మేతలను తగ్గించి, ఉదయం–సాయంత్రం వేళల్లోనే మేపాలి. జీవాలను ఉదయం 6–11 గంటల మధ్య, సాయంత్రం 4–6 గంటల మధ్యలోనే మేతకు పంపాలి. గడ్డి రకాలు – సూక్ష్మ పోషకాలు: కరువును తట్టుకునే తెలంగాణ ఫాడర్ బజ్రా (టీఎస్ఎఫ్బీ 15–4, 15–8, మోతి బజ్రా), తెలంగాణ జొన్న (సీఎస్వీ–41), హెడ్జ్ లూసర్న్ (టీఎస్హెచ్ఎల్–1) వంటి రకాలను సాగు చేయాలి. పాల ఉత్పత్తి తగ్గకుండా పశువైద్య విశ్వవిద్యాలయం రూపొందించిన ఖనిజ లవణ మిశ్రమం (టెల్మిన్)ను రోజుకు 50–100 గ్రాములు, కేజీ దాణాకు 0.5–1 గ్రాము బిటైన్ కలిపి ఇవ్వాలి. టన్ను కోళ్ల దాణాలో 100 గ్రా. విటమిన్–సి, 50 గ్రా. విటమిన్–ఇ వాడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.డాక్టర్ ఎన్. రాజన్న సీనియర్ ప్రొఫెసర్ పశు ఉత్పత్తి యాజమాన్య విభాగం,పీవీనరసింహారావు పశు విశ్వవిద్యాలయం,రాజేంద్రనగర్నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
డయాబెటిస్‌కు హెచ్‌బీఏ1సీ ఎలాగో...సీవోపీడీకి ఈ పరీక్షా అలా!
డయాబెటిస్‌కు ‘హెచ్‌బీఏ1సీ’ ఉన్నట్టే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) అనే లంగ్స్ వ్యాధికి ఓ పరీక్ష ఉంటే ఎంత బాగుంటుంది! దాదాపు రూ. 7,000 ఖర్చయ్యే చోట రూ. 100 కే పరీక్ష అందుబాటులోకి వస్తే పేదలకు ఎంత ఉపయోగంగా ఉంటుంది!! ఈ పరీక్ష రూపకల్పన కోసం ఓ పధ్నాలుగేళ్ల చిన్నారి తన ఏఐ పరిజ్ఞానంతో సాంకేతిక సహకారం అందిస్తే ఎంత అబ్బురంగా ఉంటుంది! అలాంటి ఓ కలను సాకారం చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనూరాధ నేతృత్వంలో ‘మేధాంకుర’ సభ్యులు శ్రమించి... ఆ పరీక్షను విజయవంతం చేశారు. దాంతో ఆ సాంకేతికతకు ప్రతిష్ఠాత్మకమైన ‘బీఎంజే డిజటల్ ఇన్నోవేషన్ అవార్డు – సౌత్ ఏషియా–2026’ లభ్యమైంది. ఈ సందర్భంగా తమ సాంకేతికత అందుబాటులోకి వస్తే వ్యాధిగ్రస్తులకూ, పేదలకూ ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనే అంశాలను ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ అనూరాధ చెబుతున్నారు. ఆ వివరాలన్నీ ఆమె మాటల్లోనే...→ చక్కెరపాకంలో గులాబ్‌జామూన్‌లా...మా పరీక్ష గురించి చెప్పే ముందు హెచ్‌బీఏ1సీ గురించి కాస్త వివరిస్తాను. మరీ వైద్యపరమైన అంశాలతో కాకుండా... మామూలు వ్యక్తులకూ అర్థమయ్యే భాషలో చె΄్పాలంటే... మన రక్తకణాలను కాసేపు గులాబ్‌జామూన్ లనుకుందాం. మన రక్తంలోకి చక్కెర బాగా ఇంకిపోయిన పాకం అనుకుంటే... మూడు నెలల పాటు మన రక్తకణాలు ఆ పాకంలో బాగా నానిపోయాయని భావించవచ్చు. మర్నాడు రక్తపరీక్ష ఉండగా... పేషెంట్ ఆ ముందు రాత్రి ఏమీ తినకుండా పరీక్షకు వెళ్తే రక్తంలో చక్కెర మోతాదులు తక్కువగా కనిపించవచ్చు. కానీ మూణ్ణెల్ల పాటు రక్తకణాలు బాగా నానిపోయి ఉన్నాయనుకోండి. ఆ విలువలను మాయ చేయడం కష్టం కదా. డయాబెటిస్‌కు అందుబాటులో ఉన్న ఈ పరీక్ష తరహాలోనే ఊపిరితిత్తుల వ్యాధి అయిన ‘క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్’ (సీవోపీడీ)కి కూడా ఉంటే పేషెంట్స్‌కు ఉపయోగకరంగా ఉంటుందని రూపొందించిందే ఈ పరీక్ష.→ శ్వాసకు అడ్డంకి కల్పించే సీవోపీడీ... ‘క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిజీస్’ (సీవోపీడీ) అనేది లంగ్స్‌కు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. వాయు కాలుష్యం, పొగతాగే అలవాటు, మహిళలు వంట పొగకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుండటం, దుమ్ము, రసాయనాల ప్రభావంతో ఈ సమస్య తలెత్తుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దీర్ఘకాలిక దగ్గు, కఫం, ఆయాసం, ఛాతీలో బిగుతు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సుదీర్ఘకాలంలో ఊపిరితిత్తులు తమ ఎలాస్టిసిటీని కోల్పోతూ ఉండటం వల్ల ఊపిరితీసుకోవడం కష్టంగా మారుతుంది. → వ్యాధి తీవ్రత తెలుసుకోవడమిలా...ప్రస్తుతం సీఓపీడీ పేషెంట్స్ లంగ్స్ పనితీరును ప్రధానంగా ‘స్పైరోమెట్రీ’ పరీక్షతో అంచనా వేస్తున్నారు. అయితే సీవోపీడీకి సంబంధించి పేషెంట్ ఆసుపత్రికి వచ్చిన రోజున అతడి పరిస్థితి ఎలా ఉందన్నదే ఈ పరీక్షతో తెలుస్తుంది. ఈ పరీక్షను రెండు నెలల వ్యవధిలో చేశామనుకోండి. అప్పుడు ఆ రెండు నెలల మధ్యనున్న కాలంలో వ్యాధి తీవ్రతల్లో వచ్చిన మార్పులను గుర్తించడం కష్టమవుతుంది. దాంతో కొందరిలో వ్యాధి ముదురుతున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించే ముప్పుండగా, మరికొందరికి అవసరానికి మించి చికిత్స అందించే అవకాశమూ ఉంది. ఓ ప్యాథాలజిస్ట్ గా నేను సీవోపీడీ వ్యాధి గురించి పరిశోధించగా... నా భర్త, మెడికల్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ సురేశ్ ఈ మార్కర్లపై పరిశోధన చేశారు. పధ్నాలుగేళ్ల చిన్నారి చక్రిక మా పరిశోధనకు సాంకేతిక, ఏఐ పరిజ్ఞానాన్ని సమకూర్చారు. → కేవలం వంద రూపాయలకే... ఈ వ్యాధికి గురవుతున్నవారిలో 90 శాతానికిపైగా అల్ప, మధ్య ఆదాయ వర్గాలకు చెందినవారే. ఇప్పటికి అందుబాటు లో ఉన్న పరిజ్ఞానంతో రూ. 7,000 వరకు ఖర్చవుతుంది. కానీ మా పరీక్ష అందుబాటులోకి వస్తే రూ.100 ఖర్చుతోనే ఈ పరీక్ష చేయవచ్చు. మా ప్రక్రియ వల్ల గ్రామీణ,ఆరోగ్య కేంద్రాల్లోనూ కూడా నిర్వహిస్తూ... మామూలు పీహెచ్పీలోనూ సీవోపీడీ బాధితులకు వైద్యసేవలు అందించవచ్చు.ఈ పరిశోధనకు బీఎంజే డిజిటల్ ఇన్నోవేషన్ అవార్డు!హైదరాబాద్‌లోని ‘మేధాంకుర’ సంస్థకు ప్రతిష్ఠాత్మకమైన ‘బీఎంజే డిజిటల్ ఇన్నోవేషన్’ అవార్డు లభ్యమైంది. బీఎంజే అనేది మెడికల్ జర్నల్స్‌లో అత్యంత పురాతనమైన జర్నల్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈనెల 5 (శనివారం) నాడు న్యూఢిల్లీలో నిర్వహించిన బీఎంజే అవార్డ్స్–సౌత్ ఏషియా కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో పేషెంట్స్‌కు అందించే వైద్యసేవలను మరింతగా మెరుగుపరిచిన ప్రాజెక్టులకు దక్షిణాసియా స్థాయిలో ఈ పురస్కారం అందిస్తారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేధాంకుర ఆసుపత్రి వైద్యసేవలు, పరిశోధన–అభివృద్ధి, రోగ నిర్ధారణ, ఫార్మసీ, కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వేదికల విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ, వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా మేధాంకుర సంస్థ పనిచేస్తోంది. – యాసీన్ -
అపూర్వ భారతీయం
శిల్పాలు, చిత్రాలు, ఇన్స్టాలేషన్... కళాకృతి ఏదైనా కావచ్చు. అందులో భారతి ఖేర్ ముద్ర కనిపిస్తుంది. ‘వస్తువులలో అంతర్లీనంగా దాగి ఉన్న కళను ఖేర్ వెలుగులోకి తెస్తారు’ అంటారు ఆర్ట్ క్రిటిక్స్. ఆ వస్తువులు పురాణాలతో ముడిపడి ఉండవచ్చు. చారిత్రక సంఘటనలతో ముడిపడి ఉండొచ్చు. తాజా విషయానికి వస్తే... ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026: 100 బిగ్గెస్ట్ సెలబ్రిటీస్’ జాబితాలో భారతి ఖేర్ చోటు సాధించారు...భారతి ఖేర్ కళాకృతులలో బొట్టు అనేది ప్రత్యేకంగా కనబడుతుంది. 1995లో మొదటిసారిగా అది ఆమె కళాకృతిలో కనిపించింది. ఇక అప్పటినుండి ఖేర్ సృజించిన కళాకృతులలో బొట్టు ప్రత్యేక సౌందర్య చిహ్నంగా మారింది. ‘బొట్టు నాకు మూడవ కన్నులాంటిది. వాస్తవ ప్రపంచానికి, ఆధ్యాత్మిక, భావనాత్మక ప్రపంచాలకు మధ్య అది బంధాన్ని ఏర్పరుస్తుంది’ అని చెబుతుంటారు ఖేర్.ఆ మ్యూజియం... ఆశాదీపంఖేర్ సృష్టించిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 2006 శిల్పం ‘ది స్కిన్ స్పీక్స్ ఏ లాంగ్వేజ్ నాట్ ఆన్ ఇట్స్ ఓన్’లో బొట్టు ప్రత్యేకంగా కనిపిస్తుంది. సోథెబీస్ వేలంలో ఈ శిల్పం రికార్డ్ స్థాయిలో రూ.6.9 కోట్లకు అమ్ముడుపోయింది. ‘మ్యూజియమ్స్ జ్ఞాపకాల నిలయాలు. అవి మౌనప్రదేశాలు కాదు. సౌందర్యం, చరిత్ర, రాజకీయాల గురించి మాట్లాడతాయి. భారతదేశంలో ఎనిమిది వందల మ్యూజియమ్స్ ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకు సరిగ్గా పనిచేయడం లేదు. పట్నాలో బిహార్ మ్యూజియంలాంటి అద్భుతమైన మ్యూజియంలు ఉన్నాయి. అలాంటివి ఆశాదీపాన్ని వెలిగిస్తాయి’ అంటున్నారు ఖేర్. ప్రారంభంఖేర్ రూపొందించిన కళాకృతులు న్యూయార్క్‌లోని పబ్లిక్ ఆర్డ్ ఫండ్, యార్క్‌షైర్ స్కల్ప ్చర్ పార్క్, కోపెన్‌హాగన్‌లోని థోర్వాల్డ్‌సెన్స్ మ్యూజియం, లండన్‌లోని హేవర్డ్ గ్యాలరీ, వి అండ్ ఏ, నేషనల్ మ్యూజియం ఆఫ్ కెనడా, గుగ్గెన్‌హీమ్ అబుదాబీలలో ప్రదర్శించబడ్డాయి.‘కాదేది కళకు అనర్హం’ అన్నట్లుగా ఖేర్ ఏ వస్తువుతోనైనా కళాకృతులు సృష్టించగలరు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కేరీర్లో అద్భుత కళారూపాలను ఆవిష్కరించారు. ‘నిన్ను నువ్వు తెలుసుకోవడమే సకల జ్ఞానానికి ప్రారంభం’ అనే ప్రఖ్యాత తత్వవేత్త ఆరిస్టాటిల్ మాట ఆధారంగా రూపొందించిన కళారూపానికి మంచి స్పందన వచ్చింది.ఎప్పుడూ చెప్పే విషయంలండన్లోని న్యూ కాజిల్ పాలిటెక్నిక్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఫౌండేషన్ కోర్సులో చేరి, ఫైన్ ఆర్ట్, పెయింటింగ్‌లో బి.ఏ. చేసిన భారతి ఖేర్ 1993లో ఇండియాకు వచ్చారు.‘సునామీ సమయంలో జంతువులు ఎత్తైన ప్రదేశాలకు పారిపోయాయని, పక్షులు మనుషులకు హెచ్చరికలు చేశాయని, కాని మనుషులు వాటిని వినలేకపోయారని లేదా పట్టించుకోలేదని అంటారు. మనుషులకు ఉన్న అహంకారం ఏమిటంటే తమకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ కళ మాత్రం మనకు ఏం తెలియదని ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది’ అంటారు భారతి ఖేర్.కొత్త మార్గంఖేర్కు బాగా ఇష్టమైన పుస్తకం హనీఫ్ ఖురేషి రాసిన ది బుద్ధ ఆఫ్ సబర్బియా.‘నేను యూకేలోని శివారు ప్రాంతాల్లో పెరిగాను. ఈ పుస్తకానికి ముందు ఫిక్షనల్ పుస్తకాలేవీ చదవలేదు. జాతి వివక్ష, వర్గ విభేదాల గురించి వ్యంగ్యం, హాస్య ధోరణిలో చెప్పిన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని నేను ఒక్కసారిగా చదివేశాను. ఇది నా జీవితమే. నా జీవితంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో కలిసి బ్యూటీఫుల్ లాండ్రెట్ అనే సినిమా చేశాను. అది నాకు ఒక కొత్త మార్గాన్ని చూపించింది’ అంటారు భారతి ఖేర్. ఆ అనుబంధమే... కళ!మాటల్లో చెప్పడానికి కష్టమైదానిని నేను కళారూపంలోకి తీసుకురావాలనుకుంటాను. దానికి సరిపోయే ప్రత్యేకమైన వస్తువు కోసం వెదుకుతాను. మనసు లోతుల్లో నుంచి పుట్టే భావోద్వేగానికి లేదా చిత్రానికి అద్భుతమైన రూపం ఇవ్వాలంటే ఎంచుకునే వస్తువు కొత్తగా ఉండాలి. మనం కంటితో చూసేదానికి, మనసుతో చూసేదానికి మధ్య అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధమే కళాకృతుల పుట్టుకకు కారణం అవుతుంది. కళ అనేది సిద్ధాంతాల సమ్మేళనం కాదు. పరిసరాలను కంటితో కాకుండా మనసుతో చూడడం. నా దృష్టిలో కళ అంటే కేవలం ఆలోచన మాత్రమే కాదు. ఒక వస్తువును అందమైన స్థితిలోకి తీసుకురావడం కూడా. ఒక కళాకృతి రూపుదిద్దుకునే క్రమంలో మ్యాజిక్ (అద్భుతం) జరుగుతుంది. ఆల్కెమీ(రూపాంతర ప్రక్రియ) జరుగుతుంది.– భారతి ఖేర్ -
సహ్యాద్రి గుండెల్లో ఛత్రపతి అడుగులు
సహ్యాద్రి కొండల మధ్య ప్రయాణిస్తుంటే కొన్ని ప్రదేశాల్లో చరిత్రలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న ప్రతీసారి చరిత్రలోని ఒక పేజీ మన ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. మహారాష్ట్రలో ఈ ఐదు కోటలు ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తాయి.ఒక చారిత్రాత్మక యాత్రమహారాష్ట్ర అంటే ముంబై, పుణె వంటి నగరాలు మాత్రమే కాదుం సహ్యాద్రి పర్వత శ్రేణులు కూడా గుర్తొస్తాయి. ఎన్నో శతాబ్దాల చరిత్రను మోస్తున్న కోటలు ఈ నేల కీర్తిని నిలువెత్తునా చాటుతున్నాయి. వాటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో బలమైన అనుబంధం ఉన్న రాయగఢ్, శివనేరి, ప్రతాపగఢ్, సింహగఢ్, తోరణ కోటలు ఒక సజీవ సాక్ష్యంలా కనిపిస్తాయి.ఈ ప్రయాణంలో ప్రతి కోట ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఒకచోట బాల్యం, మరోచోట పట్టాభిషేకం, ఇంకోచోట యుద్ధగాథ... ఇలా సహ్యాద్రి ప్రకతి మధ్య ఛత్రపతి శివాజీ చరిత్ర మెల్లగా మన కళ్ల ముందు ఆవిష్కతమవుతుంది.శివనేరిఛత్రపతి శివాజీ జీవితాన్ని తెలుసుకునేందుకు చాలా మంది ఆయన కాలంలో నిర్మించిన కోటలను సందర్శిస్తారు. ఈ యాత్ర శివనేరితో మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంటారు.ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన ప్రదేశంలో ఉన్నాం అనే ఫీలింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుంది.కొండల మధ్య ఉన్న కోట ప్రాంగణంలో నడుస్తుంటే, బాల్యం నుంచే మొదలైన ఒక మహా చరిత్ర గుర్తుకొస్తుంది.కోట గోడల మధ్య కనిపించే ప్రాచీన నిర్మాణాలు, కొండపై నుంచి దూరదూరం వరకు కనిపించే సీనరీస్ ఇవన్నీ కలిసి శివనేరికి ఒక ప్రత్యేక ఎక్స్‌పీరియెన్స్ మిగిలిపోయేలా చేస్తాయి.తోరణ... తొలి అడుగు సహ్యాద్రిలో మరో ముఖ్యమైన పేరు తోరణ. శివాజీ మహారాజ్ స్వాధీనం చేసుకున్న తొలి కోటగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోటను ‘ప్రచండగఢ్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొండలపై వీచే గాలి, దూరంగా కనిపించే పచ్చని కొండలు, కోట అవశేషాలు కలిసి ఒక స్లో ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తాయి. ఒకవైపు ప్రకతి, మరోవైపు చరిత్ర... రెండూ కలిసిన అందమైన ప్రదేశమే తోరణ.ప్రతాపగఢ్...ప్రతాపగఢ్ పేరు వినగానే 1659లో అఫ్జల్ ఖాన్‌తో జరిగిన యుద్ధం గుర్తుకొస్తుంది. కోట దగ్గరకు చేరుకున్న తర్వాత చరిత్ర అనేది పుస్తకంలో చదివే విషయంగా మాత్రమే కాకుండా, ఈ కొండల మధ్య జరిగిన సంఘటనలా అనిపిస్తుంది. కోట చుట్టూ విస్తరించిన సహ్యాద్రి కొండల వరుసలు, మధ్యలో కనిపించే పచ్చని లోయలు, ప్రాచీన నిర్మాణాలు కలిసి నాటి గంభీరమైన పరిస్థితిని మరోసారి గుర్తు చేస్తాయి. ఇక్కడ కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడటం కూడా ఒక అనుభవమే.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు కోటల్లో ఒక్కో కోటకు ఒక్కో కథ ఉంటుంది. శివనెరిలో బాల్యం, తోరణలో తొలి విజయం, ప్రతాపగఢ్‌లో మహా యుద్ధం, సింహగఢ్‌లో తానాజీ మలుసరేల వీరగాథ, రాయగఢ్‌లో మరాఠా సామ్రాజ్య రాజధాని జ్ఞాపకాలు కనిపిస్తాయి.1674లో రాయగఢ్‌లోనే శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. దీంతో ఈ కోట మరాఠా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.సింహగఢ్ను గతంలో కొంధాణా అని పిలిచేవారు. 1670లో జరిగిన యుద్ధం, తానాజీ మలుసరే వీరత్వం ఈ కోట చరిత్రలో ఒక ప్రత్యేక ఘటనలుగా మిగిలిపోయాయి.ఎక్కడ ఉండాలిపుణె, మహాడ్, సతారా, జున్నర్ వంటి ప్రాంతాల్లో స్టే చేస్తూ ట్రావెల్‌ను స్లోగా ఎంజాయ్ చేయవచ్చు. నగరాల్లోని హోటళ్ల నుంచి సాధారణ వసతి గహాల వరకు వివిధ రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.కోట ప్రాంతాలకు సమీపంలో ఉండే చిన్న చిన్న క్యాంపుల్లో రాత్రి వేళ సహ్యాద్రి నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం ఈ ట్రిప్‌లో మరో హైలైట్.ఏం తినాలి ?మహారాష్ట్ర రుచులనను ఆస్వాదించడం కూడా యాత్రలో భాగంగా భావించాలి. మరీ ముఖ్యంగా పుణె, సతారా ్ర΄ాంతాల్లో ΄ోహా, మిసల్ పావ్, భాక్రీ, పిఠ్లా వంటి స్థానిక రుచులు ఆస్వాదించవచ్చు. మనం చుడ్వా అని పిలచుకునే చివ్దా, వడాపావ్, బ్రెడ్ పకోడా వంటిమి మీకు ప్రతీ చోట లభిస్తాయి. అలాగే కోట ప్రాంతాల్లో లభించే నార్మల్ మరాఠీ థాలి ట్రై చేయవచ్చు.ఆసక్తికరమైన విషయాలుశివనేరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది.తోరణను ప్రచండగఢ్ అనే పేరుతో కూడా పిలుస్తారు.1659లో అఫ్జల్ ఖాన్‌తో జరిగిన యుద్ధంతో ప్రతాపగఢ్ చరిత్రలో నిలిచిపోయింది.సింహగఢ్ పాత పేరు కొంధాణా. తానాజీ మలుసరే వీరగాథను నేటికీ చాలా మంది గుర్తు చేస్తుంటారు.1674లో రాయగఢ్‌లో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది.ఏం చూడాలిశివనేరి కోట ప్రాంగణంలో చరిత్రను గుర్తుచేసుకుంటూ వాక్ చేయడం, తోరణలో సహ్యాద్రి అందాలను చూడటం, ప్రతాపగఢ్‌లో యుద్ధగాథలను తెలుసుకోవడం, సింహగఢ్‌లో తానాజీ మలుసరే వీరగాథను గుర్తుచేసుకోవడం, రాయగఢ్‌లో పట్టాభిషేకం జరిగినప్రాంతం వైబ్‌ను ఫీల్ అవ్వడం.. ఈ ఐదు అనుభవాలు కలిసి ట్రిప్‌ను ఒక కంప్లీట్ మెమోరీగా మార్చేస్తాయి.ఎలా వెళ్లాలిహైదరాబాద్ నుంచి సహ్యాద్రి ్ర΄ాంతానికి వెళ్లాలి అనుకుంటే ముందు పుణే చేరుకుంటే బెటర్. దీని కోసం రైలు లేదా ఫ్లైట్‌లో మీకు వీలైన దాన్ని ఎంచుకోవచ్చు. నిజానికి ఈ జర్నీని చాలా మంది రైల్లోనే ఎంజాయ్ చేస్తారు. పుణె చుట్టుపక్కల ఉన్న కోటలను ముందుగా చూసి, ఆ తర్వాత రాయగఢ్, ప్రతాపగఢ్, శివనేరి, తోరణ వైపు బయల్దేరవచ్చు.నగర ప్రాంతాలను దాటి సహ్యాద్రి కొండల మధ్యకు ప్రవేశించే కొద్దీ సిటీ స్ట్రెస్ జోన్ నుంచి బయటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. విజయవాడ నుంచి వచ్చే వారు హైదరాబాద్ మీదుగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి ఐదు రోజుల ఈ చారిత్రక యాత్ర బడ్జెట్ అనేది ప్రయాణికుల లైఫ్‌స్టైల్‌ను బట్టి మారుతుంది. యావరేజ్‌గా కనీసం రూ.15,000–20,000 వరకు ప్రతీ వ్యక్తికి ఖర్చు అవుతుంది. ఇక ప్రీమియం ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాలి. అయితే ఈ ఖర్చులు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, యాక్టివిటీస్‌ను బట్టి మారుతాయి.ఇక హోటల్ లేదా లాడ్జి ఖర్చు విషయానికి వస్తే స్టే కోసం పర్ నైట్ వచ్చేసి రూ.1,000 నుంచి రూ.2,500 వరకు బడ్జెట్ అవ్వొచ్చు. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.500–1,000 వరకు కేటాయించవచ్చు. ఇలాంటి ట్రిప్‌లో తక్కువ ధరకు దొరికే రూమ్స్ కన్నా అన్ని సదుపాయాలు, సెక్యూరిటీ ఉన్న హోటల్స్‌నే ఎంచుకోవడం ఉత్తమం.గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ వివరాలను సొంతంగా రీసెర్చ్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. ఎం జి కిశోర్ ప్రయాణికుడు(చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!) -
75 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా మమ్ముట్టి..!ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం..
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు. ఆయన ఏడుపదుల వయసులోనూ యువ హీరోలకు తీసిపోని గ్లామరస్తో మంచి దృఢంగా ఉంటారు. అంతలా యంగ్‌గా హెల్దీగా ఉండటం కోసం మమ్ముట్టి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి ఆహార నియమాలను పాటిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా.!.మమ్ముట్టి ఫిట్నెస్ ఇప్పటికీ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంటుంది. కండరబలం, చురుకుదనం, ఆరోగ్యకరమైన శరీరం సౌష్టవం తదితరాలను మెయింటైన్ చేస్తూ యంగ్ లుక్‌లో కనిపిస్తుంటారు. ఆయన క్రమశిక్షణయుతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందినవారు. తమిళ హీరో సూర్య సైతం ఆహారం విషయంలో మమ్ముట్టి నాకు స్పూర్తి అని చెబుతుంటారు. ఆయన ఇచ్చిన సలహాను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఎప్పుడూ నీకు నచ్చింది తినమనే చెబుతుంటారని..కానీ నచ్చినంతగా కాకుండా మితంగా తీసుకోమని సూచిస్తుంటారు. అది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతుందని ఆయన చెబుతుంటారని సూర్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు. అందులో నిజమెంత అంటే..ఇష్టమైన ఆహారంపై నియంత్రణ ముఖ్యంమమ్ముట్టి చెబుతున్నట్లుగా నచ్చిన ఫుడ్ హాయిగా తినాలి, కానీ తీసుకునే పరిమాణంపై నియంత్రణ మస్ట్ అనేది సరైదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎంత తింటున్నారో అనేదానిపై నియంత్రణ మనకు సరైన కేలరీల మోతాదు తీసుకునేందుకు హెల్ప్ అవుతుందట. ఇక్కడ కేవలం తక్కువ తినడం మాత్రమే కాదు ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్లు, ఖనిజాలు ఉండే పోషకవంతమైన ఆహార తీసుకోవడం అత్యంత కీలకం అని చెబుతున్నారు నిపుణుల. ఆరోగ్యకరంగా ఉండేలా..అలాగే మమ్ముట్టి వేయించిన ఆహారాలు, చక్కెర పదార్థాలు, అధిక నూనెకు దూరంగా ఉంటూ..ఆరోగ్యకరమైన ఆహార పద్ధతినే పాటిస్తారట. ఈ ఆహారాలను తగ్గించడం వల్ల కేలరీలు పరిమితంగా ఉంటాయి. అలాగే కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు, నట్స్, గుడ్లు, చేపలు వంటి ప్రోటీన్ వనరులు అధికంగా ఉండేవి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫుడ్ప్లాన్..ఏదీ తీసుకున్న నియంత్రిత పరిమాణంలో తీసుకునేలా ప్రాధాన్యత ఇస్తారట. అల్పాహారంలో ఓట్స్ గంజి, గుడ్డులో తెల్లసొన, బొప్పాయి, నానబెట్టిన బాదం పప్పులు ఉంటాయట. మధ్యాహ్న భోజనానికి తక్కువ మసాలాలతో తయారు చేసిన చేపల కూరను అన్నానికి బదులుగా ఓట్స్ పుట్టుతో కలిపి తీసుకుంటానని చెప్పారు. ఇక రాత్రి భోజనంగా గోధుమ లేదా ఓట్స్ దోసెల తోపాటు చికెన్ లేదా చేపల కూర తీసుకుంటానని చెప్పారు. భోజనం చివర్లో మష్రూమ్ సూప్ తీసుకుంటారట. ఇలా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను మిళితం చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, అలాగే బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.వ్యాయామం, తగిన విశ్రాంతి..అలాగే క్రమంతప్పకుండా వర్కౌట్లు చేస్తుంటారు. వయసు పెరిగే కొద్ది రెసిస్టెన్స్ వ్యాయామం ప్రత్యేకంగా చేయాలని చెబుతున్నారు వైద్యులు. ఎందుకుంటే కండరాలు క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి..కార్డియో వ్యాయామాలు వంటివి చేయాలని చెబుతున్నారు. ఇక నిద్రపై కూడా మంచి శ్రద్ధపెడతానని చెప్పారు. శారీరక ఒత్తిడి నుంచి కోలుకునేందుకు సరైన నిద్ర నాణ్యత ఉండాలని అంటున్నారు. రోజువారీ పనితీరుకు నిద్ర ఎంతో కీలకం అని అంటున్నారు నిపుణులు. ఈ విధంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని నిలకడగా పాటిస్తే..ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలగడమే కాకుండా ఎప్పటికీ యంగ్ లుక్‌లోనే చురుకుగా కనిపించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం..! కట్‌చేస్తే ఏకంగా రూ. 1.44 కోట్లు..) -
రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం ..! కట్‌చేస్తే ..
చాలామందికి కార్పొరేట్ జీవితంలో లక్షల్లో జీతం ఆర్జించాలన్నది డ్రీమ్. అందుకోసం ఎంతలానో కష్టపడుతుంటారు. కానీ కొందరు అంత లగ్జరీ లైఫ్‌ని సునాయాసంగా కాదనుకుని వ్యవసాయం వైపుగా అడుగులు వేసి రైతులనకు అండగా నిలుస్తుంటారు. ఆ క్రమంలో కొందరు భారీ లాభాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. అలాంటి కోవకు చెందినవాడే చత్తీశ్‌గఢ్‌కు చెందిన మోహిత్ నిఝూవన్ కూడా. అతడు ఏ పది, ఇరవై లక్షల జీతం కూడా ఏ రేంజ్ కార్పొరేట్ జీతాన్ని కాదనుకున్నాడో వింటే నోటమాటరాదు. మరి ఆ వ్యక్తి అంత లగ్జరీ లైఫ్ వదులుకుని అంతకుమించిన సక్సెస్‌ని ఎలా అందుకున్నాడో తెలుసుకుందామా..!.చత్తీశ్‌గఢ్‌కు చెందిన మోహిత్ నిఝూవన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. హాయిగా బిందాస్లా సాగిపోతున్నా లైఫ్‌కి సడెన్ బ్రేక్‌లు వేసి..అగ్రికల్చర్ రంగం వైపుకి అడుగులు వేశాడు. అది కూడా ఎలాంటి వ్యవసాయం ఎంచుకుంటే బెస్ట్ అని కూలంకషంగా తెలుసుకునేందుకు 2020లో తన ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. నియంత్రిత వాతావరణంలో పెంచగలిగే పోషకాలు అధికంగా ఉండే మొక్కతోట కూరలైన మైక్రోగ్రీన్ అనే ఇండో ఫార్మింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. అనుకున్నదే తడుపుగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు గానీ..పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే..తక్కువ మొత్తంలో పెట్టి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు మోహిత్. అందుకే కేవలం రూ. 30 వేలతో చండీగఢ్‌లోని తన ఇంటి రెండో అంతస్థులో వంద చదరపు అడుగుల స్థలంలో మైక్రోగ్రీన్స్‌ని పెంచడం ప్రారంభించాడు. తొలినాళ్లలో సాగు, ఉత్పత్తి, వినియోగదారులు కొనుగోలు చేసేలా వ్యాపార నమునాని నిర్మించడం వంటి వాటి గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఒక చిన్న ప్రయోగంగా మొదలుపెట్టి క్రమంగా ఎవర్గ్రీన్ మైక్రోగ్రీన్గా ఎదగడం ప్రారంభించింది. అలా చిన్న ర్యాక్ కాస్తా మూడు ర్యాక్‌లు, ట్రేలుగా వర్టికల్ ఇండోర్ఫామ్ని స్థాపించాడు. ప్రారంభంలో 21 సేంద్రీయా రకాలపై దృష్టిసారించి రసాయనాలు వినియోగించకుండా సాగు చేస్తే గణనీయమైన ఫలితం వచ్చింది. దాంతో నెమ్మదిగా తన ఫామ్‌ని 500 చదరపు అడుగులకు విస్తరించేలా సొంతంగా ఫామ్‌ని ఏర్పాటు చేశాడు. అది కాస్తా విస్తరించి ఏకంగా 12 వేల ట్రైలు ఉత్పత్తి చేయగల సామర్థ్యానికి చేరుకుంది. అలా ప్రస్తుతం అతను నెలకు 12 లక్షల ఆదాయం చొప్పున ఏడాదికి ఏకంగా 1.44 కోట్లకు పైనే ఆర్జిస్తున్నాడు. కేవలం చిన్న వ్యాపార ప్రయోగంగా మొదలు పెట్టి..కోట్ల ఆదాయానికి చేరుకున్నాడు. అంతేగాదు ఇంటి మిద్దె నుంచి మొదలై..సొంతంగా ఫామ్‌ని నిర్మించుకునే రేంజ్‌కి వెళ్లాడు. అలాగే ఈ మైక్రోగ్రీన్స్ వ్యాపారంలోకి రావాలనుకునే రైతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఇక్కడ సాగు తోపాటు వాణిజ్యపరమైన అంశాలపై పట్టు సాధించడంతో విజయం సాధించగలిగాడు. అందుకని రైతులకు కూడా ఈ అంశాల్లో తర్ఫీదు పొందేలా సాయం చేస్తుంటాడు. కాగా మోహిత్ తన మైక్రోగ్రీన్ వ్యాపార సక్సెస్ జర్నీని నెట్టింట షేర్ చేసుకోవడంతో గొప్ప ప్రయాణం మిత్రమా..నిజంగా స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.Meet Mohit Nijhawan, a https://t.co/BC6fLkcQNf Computer Science graduate. This guy left his 90 LPA corporate career to grow tiny greens. Today, he has built https://t.co/7yvufGmkSg, a ₹1.44 crore business with approximately ₹60 lakhs in profit annually.He walked away from a… pic.twitter.com/HI4OPKOm7l— Vikas Alwys (@VikasAlwys) September 5, 2026 (చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!) -
మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!
మేనకోడలు అంటే ఏ మేనమామకు ఇష్టం ఉండదు. అందుకేనేమో అడిగి అడగంగానే కొనిస్తాడు కాబట్టే కవులు మామయ్యను చందమామతో పోల్చి మరి చెబుతుంటారు. అలానే ఇక్కడొక మామయ్య తన ముద్దులు మేనకోడలు చిరుకోరికను నెరవేర్చేందుకు ఎంత రిస్క్ చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చు పెట్టి మరి ఏం కొనిచ్చాడో తెలిస్తే విస్తుపోతారు. ఈ వింత ఘటన అబుదాబిలో చోటు చేసుకుంది. షేక్ అల్ మన్సూరి అనే చిన్నారి తన మేనమామతో కలిసి అబుదాబి ఇంటర్నేషనల్ హంటింగగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్ (ADIHEX) 2026కు హాజరైంది. ఆ కార్యక్రమంలో డేగల ఔత్సాహికులు, పెంపెకందారుల కోసం అత్యంత ఖరీదైన వేలం నిర్వహిస్తుంది. అయితే ఈ వేలంలో అత్యంత రికార్డు స్థాయిలో ఓ అరుదైన డేగను కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. నిజానికి బూడిదరంగు, నలుపు వంటి డేగలను చూస్తాం గానీ తెలుపు రంగు డేగలు అత్యంత అరుదు. అలాంటి అత్యంత అరుదైన తెల్లటి ఫాల్కన్ జాతి డేగ వేలంలో ఏకంగా రూ. 3.85 కోట్లకు అమ్ముడైపోయింది. దీన్ని తన మేనకోడలు కోసం వెచ్చించాడట. ఆమెకు డేగలంటే అమితమైన ఇష్టమని, అందులోనూ ఈ తెలుపు రంగు డేగ అంటేచాలా ఇష్టమని అందుకే ఇంత డబ్బు వెచ్చించినట్లు తెలిపాడు. ఈ అరుదైన డేగ అమెరికాలోని మార్క్ మెగ్లిచ్ ఫాల్కన్ ఫార్మ్‌కు చెందినది. దాని ఆకర్షణీయమైన స్వచ్ఛమైన తెల్లని ఈకలు, విలక్షణమైన శారీరక లక్షణాలు కారణంగా ఇది ఎల్లప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే డేగగా చెప్పొచ్చు. ఇది సుమారు కిలోగ్రాము బరువు, పొడవు, వెడల్పుల్లో దాదాపు 16.5 అంగుళాల కొలతతో ఉంటుంది. ఇక ఆ చిన్నారి మన్సూరిని ఈ డేగలపై ఆసక్తి ఎలా పెరిగిందని అడిగితే..అందుకు తన మామయ్యే కారణమని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by علي الجابري🇦🇪 (@ali.aljabri2) (చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!) -
పెళ్లి బాజాలకు స్వల్ప విరామం
వివాహాది శుభకార్యాలకు సోమవారం నుంచి స్వల్ప విరామం ఏర్పడనుంది. వివాహ ముహూర్తాల సీజన్‌కు ఆదివారంతో తెరపడింది. భాద్రపదం శూన్య మాసం కానుండటంతో ఈ నెల 7 నుంచి అక్టోబర్ 10 వరకు 34 రోజుల పాటు విరామం కలగనుంది. దీంతో పెళ్లిళ్లతో కళకళలాడుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కల్యాణ మండపాల్లో పెళ్లి బాజాలు మూగబోనున్నాయి. మళ్లీ మూడు నెలల పాటు.. అక్టోబర్ 11 నుంచి మళ్లీ శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ నెలాఖరు వరకు శుభ ముహూర్తాలు ఉండటంతో మళ్లీ సందడి నెలకొననుంది.ప్రత్యేక ప్రాధాన్యం భాద్రపద మాసానికి పంచాంగ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో వినాయక చవితి, అనంత చతుర్దశి, పితృకార్యాలకు సంబంధించిన మహాలయ పక్షం వంటి పర్వదినాలు రావడంతో దేవతారాధన, వ్రతాలు, పితృకర్మలకు ప్రాధాన్యం ఇస్తారు. సంప్రదాయ ముహూర్త శాస్త్రం ప్రకారం ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవు. ఆశ్వయుజమాసం నుంచి ప్రారంభమయ్యే ముహూర్తాల్లో శుభ కార్యాలు జరుపుకోవచ్చు. – గోవిందవఝుల వెంకటరమణమూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెహిందీ పెడుతూ ఎంత ఆదాయం గడిస్తుందో నెట్టింట వీడియో రూపంలో షేర్ చేసింది. భారత్‌లో మెహిందీ పెట్టే స్కిల్‌ని ఎలా చూస్తారు..అదే అమెరికాలో అయితే ఎలా ఉంటుందో పోలుస్తూ చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు పార్ట్‌టైంగా చేస్తున్న ఈ సరదా స్కిల్‌తో తాను ఎంత మేర ఆర్జిస్తుందో కూడా పంచుకుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించి మెహిందీ స్కిల్‌పై చర్చలు రేకెత్తించింది. అమెరికాలో పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియాం కజైన్ ఈ పోస్ట్ పంచుకుంది. తన ఉద్యోగానికి, అభిరుచికి మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తూ..ప్రొఫెషనల్ మెహిందీ ఆర్టిస్ట్‌గా ఎలా కొనసాగుతుందో చెప్పుకొచ్చింది. కోడింగ్ ద్వారా నెలవారీ ఖర్చులు తీరుతుండగా, మెహిందీ పనితో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంది. తన డిజైన్ పనికి గంటకు సుమారు రూ. 9 వేల నుంచి పదివేల దాకా ఛార్జ్ చేస్తుందట. అంతేగాదు నిర్ణీత గంటల రుసుము తోపాలు ఒక్కోసారి 20 శాతం వరకు టిప్ రూపంలో అదనపు మొత్తాన్ని కూడా ఆర్జిస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాదు పెళ్లిళ్ల సీజన్లో అయితే మెహిందీ పెట్టే పూర్తి స్థాయి బుకింగ్‌ని బట్టి ఒక్క రోజుకి దాదాపు రూ. 1 లక్ష దాక సంపాదించొచ్చని తెలిపింది. తనకు అమెరికా వచ్చిన తర్వాతే కళాకారులకు ఎంత విలువ ఉంటుందో అర్తమైందని అంటోంది. భారత్‌లో మెహిందీ ఆర్టిస్ట్ వృత్తిని అంత గొప్ప పనిగా చూడరు, అంతగా గౌరవించరని వాపోయింది. కానీ ఇక్కడ తనను కళాకారిణిగా గౌరవిస్తారని అంటోంది. అంతేగాదు తనకు ఏదో ఒక చిన్న పనిచేస్తున్నట్లు అనిపించదని చెబుతోంది. అయినా ఏపని చిన్నిది, పెద్దది అని ఉండదు, పని అంటే పనే అని నొక్కి చెబుతోంది. ఇక అలాగే అమెరికాలో జీవన వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయని ఒప్పుకుందామె. నెటిజన్లు కూడా ఆమె మాటలకు మద్దతిస్తూ..ఔను ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్ప మరే ఏ ఇతర ఉద్యోగాన్నీ అంతగ గౌరవించరంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyancka Jaiin (Creating Wings Co.) (@priyancka.jaiin) (చదవండి: అద్భుతమైన క్రిమ్సన్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
అద్భుతమైన క్రిమ్సన్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
ఫ్యాషన్ ప్రపంచంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ నీతా అంబానీ సదా అందమైన చీరలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా ముంబైలో జరిగిన అబు జానీ సందీప్ ఖోస్లో 40వ వార్షికోత్సవ వేడుక కోసం తనదైన ఫ్యాషన్ శైలితో అద్భుతంగా కనిపించారు. ఈసారి ఆమె సుందరమైన క్రిమ్సన్ చీరలో ఎర్రటి మందారంలో అద్భుతంగా కనిపించారు. ఇది క్లిష్టమైన హస్తకళ, క్లాసిక్ స్టైలింగ్‌కు కేరాఫ్. ఈ ఆరుగజాల ముందురు ఎరుపు రంగు క్రిమ్సన్ చీర..అదే సీక్వెన్స్‌లో పల్లు వెంబడి ఉన్న డిజైన్ ఆ చీరకు ఒక అద్భుతమైన లుక్‌ని అందించాయి. ఆ కార్యక్రమంలో ప్రకాశవంతమైన ఎరుపు రంగు రాజసం లుక్ తోపాటు పండుగ శోభను ఇచ్చింది. ఈ చీరకు అనుగుణంగా అదే రంగు ఎంబ్రాయిడరీ మ్యాచింగ్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్‌ని చేయడంతో మరింత నిండుదనంతో కనిపించింది. ఈ అద్భుతమైన చేతులు దుస్తులకు మరో కళాత్మకతను జోడించాయి. అలాగే ఆడంబరమైన ఆభరణాలతో హడావిడి చేయకుండా వజ్రాల పెండెంట్‌తో కూడిన సున్నితమైన ఎర్రదారపు నెక్లెస్‌ను, దానికి సరిపోయే వజ్రాలు, రత్నాలతో కూడిన చెవిపోగులతో సింపుల్‌గా కనిపించింది. చేతికి ధరించిన సూక్ష్మమైన ఎరుపు రంగు రింగు, గాఢమైన రంగు గల చీర దాని కళాత్మక వివరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా చేస్తాయి. అలాగే తన జుట్టుని భుజంపైకి జాలువారేలా ఒత్తైన అలల రూపంలో వదెలెగా వదిలేసేలా తీర్చిదిద్దింది. అలాగే మేకప్‌లో కళ్లు పెద్దవిగా కనిపించేలా కాజల్, నిగనిగలాడే పింక్ పెదవులు, ఎర్రటి బొట్టుతో మెరుగులు దిద్దింది. కాగా, అబు జానీ, సందీప్ ఖోస్లా ద్వయం ముంబై ఫ్లాగ్ షిప్ ముబారక్ బాగ్‌లో ఫ్యాషన్ రంగంలో దాదాపు 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సాయంత్రం తారలతో సందడిగా మారిపోయింది. ఈ కార్యక్రమానికి ఇషా అంబానీ, రాధికా మర్చంట్, నవ్య నందా, సోనమ్ కపూర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అబుజానీ, సందీప్ ఖోస్లా 1986లో తన సృజనాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది భారత్‌లో అత్యంత గుర్తింపు పొందిన ఫ్యాషన్ కౌచర్లో ఒకటిగా నిలిచింది. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: మెడ మెరిసేలా ఇలా చేయండి..! దెబ్బకు నలుపు మాయం) -
ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం
హిమాలయాల ఒడిలో, మేఘాలకు పైన కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం తుంగ్నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో, సముద్ర మట్టానికి 3,680 మీటర్లు (12,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, శివుడికి అంకితమైన అత్యంత ఎత్తైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది పంచ కేదారాలలో మూడవది, అంటే తృతీయ కేదార్.పౌరాణిక కథ మహాభారత కథతో ఈ ఆలయానికి విడదీయరాని సంబంధం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ సోదరులను చంపిన పాప పరిహారం కోసం శివుడిని వెతుకుతూ హిమాలయాలకు వచ్చారట. శివుడు వారికి కనిపించకుండా ఎద్దు రూపంలో దాక్కున్నాడని, అప్పుడు ఆయన శరీర భాగాలు ఐదు చోట్ల వెలిశాయనేది పౌరాణిక విశ్వాసం. అందులో చేతులు (బాహువులు) వెలసిన ప్రదేశమే తుంగనాథ్. ఆలయ పునాదిని అర్జునుడు వేశాడని కూడా పురాణ కథనాల్లో చెబుతారు. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా భావిస్తారు.చోప్టా నుంచి మొదలయ్యే ప్రయాణంతుంగనాథ్ ఆలయం కొలువై ఉన్న ప్రదేశం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి ’మినీ స్విట్జర్లాండ్’ అని పిలిచే చో΄్టా నుండి ట్రెక్ చేయాలి. కేవలం 3 కిలోమీటర్ల దూరమే అయినా, నిటారుగా ఉండే ఈ దారిలో రోడోడెండ్రాన్ పూల అడవులు, మంచు కప్పిన హిమాలయ శిఖరాలు కనువిందు చేస్తాయి.ఆలయానికి మరో 1.5 కిలోమీటర్ల దూరంలో చంద్రశిల శిఖరం ఉంది. అక్కడి నుండి నందాదేవి, త్రిశూల్, చౌఖంబా శిఖరాలుం ఇలా 360 డిగ్రీలలో ఎటు తిరిగినా హిమాలయాల దర్శనం అనేది జీవితంలో మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది.ఎప్పుడు వెళ్లాలి?చలికాలంలో అంటే సాధారణంగా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు కారణంగా ఆలయం మూసివేయబడుతుంది. అప్పుడు ఉత్సవమూర్తిని మక్కుమఠ్కు తరలిస్తారు. దర్శనానికి సాధారణంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆలయం తెరవడం, మూసివేయడం తేదీలు ప్రతి సంవత్సరం మారవచ్చు.తుంగనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ప్రకతి, ఆధ్యాత్మికత, సాహసం కలిసిన ఒక పవిత్ర యాత్ర. శివుడి నామస్మరణతో ఆ కొండల్లో వేసే ప్రతి అడుగు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. చదవండి: ధృతరాష్ట్ర కౌగిలి -
కులం, మతం లేని న్యాయవాది..! ఏకంగా తొమ్మిదేళ్లు..
ఏదైనా జాబ్‌కి అప్లై చేయాలన్న, ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాలన్న కుల ధృవీకరణ పత్రం మస్ట్. కనీసం పెళ్లికైనా అది ఉండాల్సింది. కులం, మత ధృవీకరణ పత్రం ఉన్నట్లే..అవేమి లేకుండా నాస్తికుల్లా ఉండేవాళ్లకి కుల, మత రహిత అధికారిక ధృవీకరణ పత్రం ఉండదు. ఇంత వరకు అలాంటి పత్రాలు ఏ ప్రభుత్వ ఆఫీసులు జారీ చేయలేదు, ఉండవు కూడా. దాన్ని ఒక మహిళ కష్టపడి పోరాడి, తన గోడు వినిపించి మరి మొట్టమొదటిసారిగా కుల మత రహిత ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా పొందింది. కేవలం ఆమె ఎలా జీవించిందో దానికి అనుగుణంగా డాక్యుమెంట్ మాత్రమే కావాలని కోరి మరి సాధించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలించింది ఆమె. ఆ మహిళే తమిళనాడుకు చెందిన ఎం.ఏ స్నేహ. స్నేహకు చిన్నప్పటి నుంచి రెండే రెండు సమాధానాలు ఎదురయ్యేవి. అవేంటంటే..తన కులం, మతం గురించి. తన పేరెంట్స్ ఆ గుర్తింపు ఇవ్వలేదు. ఆమె జనన ధృవీకరణ పత్రంలో గానీ, పాఠశాల రికార్డులలో గానీ వాటి ప్రస్తావన లేనేలేదు. ఆమె చిన్నప్పటి నుంచి అలానే పెరిగింది. ఆమె ప్రస్తుతం తమిళనాడులోని తిరుపత్తూరులో న్యాయవాదిగా పనిచేస్తోంది. అయితే ప్రభుత్వపరమైన పత్రాల వ్యవహారాలు వచ్చినప్పుడూ ఆ వివరాలేమి నింపకుండా ఖాళీగా వదిలేయాల్సి వచ్చేది. కానీ అలా ఫిల్ చేయకుండా వదలడంతో అప్లికేషన్ సబ్మిట్ చేయడం కుదిరేది కాదు. అప్పుడే తను ఎలా జీవించిందో అలా అధికారికంగా ధృవీకరించే పత్రం తప్పనిరి అయ్యింది. తనకు కులంగానీ, మతం గానీ లేదు అని చెప్పేలా అధికారికి పత్రం కావాలంటూ అధికారులు చుట్టూ తిరిగింది. అలా తొమ్మిదేళ్లు పోరాడి ఫిబ్రవరి 5, 2019న, తిరుపత్తూరు తహసీల్దార్ టి.ఎస్. సత్యమూర్తి, స్నేహకు కులం మతలం లేవని పేర్కొంటూ ఒక ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. దాంతో అలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్నేహ. ఆమె నేపథ్యం..ఆమె తల్లిదండ్రులు పివి ఆనందకృష్ణన్, మణిమొళి న్యాయవాదులు. వారి ఇంటికి కమ్యూనిస్ట్ మిత్రులు తరుచుగా వచ్చేవారు. అలా స్నేహ, ఆమె సోదరీమణులు పెరిగే క్రమంలో కమ్యూనిజం, హేతువాదం, నాస్తికత్వానికి సంబంధించిన పుస్తకాలను చదివారు. మతం, దేవుడిని గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించడం పిల్లలకు నేర్పించారు. అందువల్ల వాళ్ల స్నేహితులు మీది ఏ కులం అని ప్రశ్నించినప్పుడూ స్నేహ, ఆమె సోదరిమణులు కులం లేదు, మతం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేసేవారు. ఆఖరికి వాళ్ల పేర్లతో తమ జీవన విధానం ఏంటో చూపించేవారు. ఇక్కడ స్నేహ ఇద్దరు సోదరిమణులు పేర్లు ముంతాజ్ సూర్య, జెన్నిఫర్ కాగా, స్నేహ ఆమె భర్త తమిళ ప్రొఫెసర్ కె పార్థిబరాజ దంపతులుకు ముగ్గురు కుమార్తెలు. వాళ్ల పేర్లు విభిన్న మత సంప్రదాయాలు కలిసేలా.. ఆదిరై నస్రీన్, ఆదిల ఐరీన్, ఆరిఫా జెస్సీ అని పెట్టారు. అయితే ఆమెకు న్యాయ పరీక్షల పోటీకి, నోటరీ వంటి వాటిల్లో కుల దృవీకరణ పత్రం ఓ పెద్ద సమస్యగా మారడంతో..అందుకోసం కులంగానీ, మతం గానీ లేని పత్రం కావాలన్నా ఆలోచన మొదలైంది దాని కోసం 2010లో పొందే ప్రయత్నంలో భాగంగా పోరాటం చేసింది. అలా 2019 వరకు పోరాడి ఆ గుర్తింపుని దక్కించుకునేలా కుల మత రహిత ధృవీకరణ పత్రం పొందింది. ఇక్కడ స్నేహ తనను నాస్తికురాలిగా ప్రకటించమని ప్రభుత్వాన్ని కోరలేదు, అలాగే ప్రత్యేక ప్రయోజనాన్ని కూడా అడగలేదు. తాను గడుపుతున్న జీవితమే అధికారక రికార్డులకు సరిపోలాలని ఆమె కోరుకుంది. ఇక స్నేహ కుటుంబం తరతరాలు ఎలాంటి కుల, మత గుర్తింపు లేకుండా జీవించినట్లు తెలిపింది. ఇక ఈ సర్టిఫికెట్ ఆ వాస్తవాన్నే ధృవీకరించే ఒక చట్టపరమైన పత్రమని చెబుతోంది స్నేహ. ఇక ఆమె భర్త పార్థిబరాజు స్వయంగా మతపరమైన కుటుంబంలో పెరిగాడు, కానీ ఆ తర్వాత పెరియార్ బి. ఆర్ అంబేద్కర్ తత్వశాస్త్రలపై ఆసక్తిని పెంచుకుని నాస్తికుడిగా మారారు. మరో విచిత్రం ఏంటంటే..ఆమెకు ఈ సర్టిఫికేట్ ఒకటి వచ్చిందని బహిర్గతం కావడంతో..ఆ పత్రం ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఆమెను సంప్రదించారు. ఆ విషయమై ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయని చెబుతోంది స్నేహ. ఇక తన నిర్ణయం రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తానని అంటోంది. అలాగే ఇతర హక్కులను హరించడం కాదని కూడా నొక్కి చెప్పిందామె.(చదవండి: మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్న కిరణ్ రెడ్డి) -
ధృతరాష్ట్ర కౌగిలి
ఎంతో ఆప్యాయతను, ప్రేమనూ నటిస్తూ, తియ్యగా పలకరిస్తూ లోలోపల తీవ్రహాని తలపెట్టే సందర్భాలను, ప్రమాదకర పరిస్థితులను ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు పట్టాభిషేకం నిర్వహించుకోవడానికి ముందు తమ పెదనాన్న ధృతరాష్ట్రుని కలవడానికి వెళ్లారు. తన నూరుగురు కుమారులను పాండవులలో రెండోవాడైన భీముడు చంపాడన్న కోపాన్ని లోలోపలే ఉంచుకొని కక్షతో రగిలిపోతున్న ధృతరాష్ట్రుడు పైకి మాత్రం ప్రేమను నటిస్తూ అందరినీ కౌగిలించుకొని ప్రత్యేకంగా భీముడిని తన ఉక్కుకౌగిలిలో బంధించి చంపి వేయాలని భావిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణ పరమాత్మ ఉక్కుతో భీముని విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. తనను కలవడానికి వచ్చిన పాండవులను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకొంటాడు. అయితే ధృతరాష్ట్రుడు ప్రత్యేకంగా భీముడేడి అని అడుగుతున్న సమయంలో శ్రీ కృష్ణ పరమాత్మ భీముడి ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్రుని వద్దకు తీసుకెళ్లగా దానినే భీముడుగా భావిస్తూ ధృతరాష్ట్రుడు తన ఉక్కుకౌగిలిలో బంధించగా ఆ విగ్రహం తుక్కు తుక్కు అయిపోయింది.ధృతరాష్ట్రునికి ఎందుకంత బలం?పుట్టుకతో అంధుడైనా, వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల ధృతరాష్ట్రునికి సుమారు పదివేల ఏనుగుల బలం సిద్ధించింది. తనకున్న బలంతో తన నూరుగురు కొడుకులను చంపిన భీముడిని కౌగిలించుకుని చంపాలన్నది ధృతరాష్ట్రుని ప్రణాళిక. దీనిని గమనించిన శ్రీకృష్ణుడు ఇనుముతో తయారుచేసిన విగ్రహాన్ని ఉంచగా ఆ విగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు కౌగిలించుకొని తన బలాన్నంతా ఉపయోగించి ఇనుప విగ్రహాన్ని నుగ్గు నుగ్గు చేశాడు. దీంతో శ్రీ కృష్ణుని వల్ల భీముడికి ప్రాణాపాయం తప్పింది. అప్పటినుండి ధృతరాష్ట్ర కౌగిలి అనే నానుడి వచ్చింది.– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
నిర్మల హృదయమే గర్భగుడి
ఒక చిన్న పల్లెటూరి చివరన, ఒక పాత పూరి గుడిసెలో రామయ్య అనే వృద్ధ మట్టి శిల్పి ఉండేవాడు. వయసు పైబడినా ఆయన చేతుల్లో ఏదో ఇంద్రజాలం ఉండేది. ఆయన చేసే మట్టి విగ్రహాలు ప్రాణం ఉన్నట్టుగా ఉండేవి. కానీ రామయ్యకు అహంకారం అంటే ఏమిటో తెలియదు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ భగవంతుడి స్వరూపం గా భావించి, ఎంతో వినయంగా నమస్కరించేవాడు. ఆ ఊరిలోనే భుజంగరావు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. దర్పం, అహంకారం ఆయనకు ఆభరణాలు. తన ఇంట్లో కొత్తగా కట్టించిన పెద్ద పూజామందిరంలో ప్రతిష్టించడానికి ఒక అద్భుతమైన వినాయకుడి విగ్రహం కావాలని రామయ్య దగ్గరకు వచ్చాడు.రామయ్య శిల్పం చెక్కుతుండగా చూసి భుజంగరావు ‘రామయ్యా! నా హోదాకు తగ్గట్టు గా ఈ విగ్రహం ఉండాలి. రంగులు, అలంకరణలు అత్యంత ఖరీదైనవిగా ఉండాలి. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ నా విగ్రహం చూసి ఊరంతా నోరెళ్లబెట్టాలి!’ అన్నాడు. రామయ్య చేతులు జోడించి, వినయంగా తలవంచి... ‘అలాగే బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అన్నాడు. మరుసటి రోజు, రామయ్య విగ్రహాన్ని తయారు చేస్తుండగా... రాజీ అనే ఎనిమిదేళ్ల పేద బాలిక అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కేవలం ఒక రూపాయి నాణెం ఉంది. ఎంతో ఆశగా రామయ్య వైపు చూస్తూ...‘తాతా! మా అమ్మకు ఒంట్లో అస్సలు బాగోలేదు. మా ఇంట్లో పూజ చేసుకుని, అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుకోవడానికి ఒక చిన్న వినాయకుడి బొమ్మ ఇస్తావా.’ అని అడిగింది. అప్పుడే అక్కడకు వచ్చిన భుజంగరావు అది చూసి ఈసడించుకుంటూ... ‘ఏయ్ పిల్లా! పక్కకు పో. నా పెద్ద విగ్రహం పని పాడు చేయకు. అయినా ఈ నాణేనికి మట్టి కూడా రాదు’ అని గద్దించాడు. కానీ రామయ్య మనస్సు కరిగింది. ఆ అమ్మాయి అమాయకత్వంలో, నిష్కపటమైన ప్రేమలో ఆయనకు సాక్షాత్ ఆ దేవుడే కనిపించాడు. రామయ్య ఎంతో భక్తితో తను చేసిన ఒక చిన్న ముద్దుల వినాయకుడి విగ్రహాన్ని ఆ బాలిక చేతిలో పెట్టాడు. ఆ చిన్నారి కళ్లలో కనిపించిన ఆనందం రామయ్య హృదయాన్ని నింపేసింది.కొన్ని రోజులకు భుజంగరావు పురమాయించిన పెద్ద విగ్రహం తయారైంది. అది నిజంగానే ఎంతో భవ్యంగా, రంగురంగుల ఆభరణాలతో మెరిసిపోతోంది. భుజంగరావు కూలీలతో కలిసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కానీ విచిత్రం! నలుగురు బలాఢ్యులైన మనుషులు ఆ విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించినా కనీసం అంగుళం కూడా కదపలేకపోయారు.భుజంగరావు కోపంతో ఊగిపోతూ... ‘రామయ్యా! ఏంటిది? ఇందులో ఏమైనా ఇనుము, రాళ్ళు పెట్టి చేశావా? ఎందుకు ఇంత బరువుగా ఉంది?’ అని గద్దించాడు.రామయ్య ఏమాత్రం కలత చెందకుండా, ఎంతో వినమ్రంగా చేతులు జోడించి ‘అహంకారం’, ‘హోదా’ అనే బరువులు కూడా ఇందులో చేరాయి స్వామీ! అహంకారం ఎప్పుడూ మోయలేనంత బరువుగానే ఉంటుంది. ఆ బరువును దేవుడు కూడా ఇష్టపడడు’’ అన్నాడు. ఆ మాటలు భుజంగరావు గుండెల్లో తూటాల్లా పేలాయి. అదే సమయంలో పక్కనే ఉన్న చిన్న గుడిసెలో రాజీ అనే చిన్నారి... రామయ్య ఇచ్చిన చిన్న విగ్రహాన్ని ఎంతో సులువుగా చేతుల్లో పట్టుకుని, భక్తితో పూజ చేయడం ఆయన కంట పడింది. ఆయనలోని గర్వం కరిగిపోయింది. కళ్లల్లో నీళ్లతో, ‘నన్ను క్షమించు రామయ్యా! ఈ రోజు నుంచి నా అహంకారాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను’ నమస్కరించి అన్నాడు. ఆశ్చర్యకరంగా... మరుక్షణమే ఆ విగ్రహం ఎంతో తేలిక గా మారిపోయింది. భుజంగరావుకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. దైవత్వం అనేది బాహ్య ఆడంబరాలలో, డబ్బులో లేదు. అది అంతరంగంలోని వినయం, నిష్కపటత్వం, భక్తిలోనే ఉంటుందని గ్రహించాడు.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
పశ్చాత్తాపం... ప్రాయశ్చిత్తం
ఏదైనా పాపం గానీ, నేరం గానీ తెలియకుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం. తెలిసో తెలియకనో మనం ఇతరులకు బాధ కలిగిస్తుంటాం. ఆ తర్వాత అది తప్పు అని తెలుసుకోగలగటం, అందుకు మనసులో బాధతో దహించుకుపోవటాన్నే పశ్చాత్తాపం అంటారు. ఇదే మానవత్వపు ఔన్నత్యం!మళ్ళీ ఆ తప్పు తనవల్ల జరగకుండా జాగ్రత్త పడటం, తనవల్ల వేదనకు గురైన బాధితులకు తగిన మేలు చేయడమే ప్రాయశ్చిత్తం, అదే మానవ ధర్మం. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు పాప పరిహారం లేదు’ అని ఎవరో అన్నారని ‘నేను పశ్చాత్తాప పడుతున్నాను’ అని ఒక మాట చెప్పేసి ‘నేను పశ్చాత్తాప పడ్డాను కాబట్టి నేను చేసిన నేరానికి శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు’ అని తప్పించుకోవటానికి అవకాశం లేదు. ఆదిశంకరాచార్యులవారు కూడా అలా అడ్డదారులలో సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల ఫలితాల నుండి విముక్తం అవటం సాధ్యం కాదు అనీ జ్ఞానబుద్ధితో మాత్రమే ప్రాయశ్చిత్తం లభిస్తుందని అన్నారు. ‘తెలిసి చేసిన తప్పును ఏ దేవుడూ క్షమించడు’ అని తరతరాలుగా పెద్దలు చెబుతున్న మాట కూడా ఆమోద యోగ్యమే. ‘ఎవ్వరికీ అపకారం చేయని ఆ ఆవు చావుకి కారణమయ్యాను. ఇక నేను కూడా బతకను’ అని.. ఆత్మాహుతి చేసుకునేందుకు పరుగులు తీసే మనసున్న మనిషికి మాత్రమే .... కేవలం పశ్చాత్తాపం తో పరిహారం అయినట్లు భావించాలి. పశ్చాత్తాపపు బాధతో దహించుకుపోతున్న మనస్సుతో అతను జీవితం మొత్తం గడుపుతాడు. ఆ వ్యథనే అతడు శిక్షగా భావిస్తాడు.పై వివరణ కేవలం ఒక ఘటన, ఉదాహరణ మాత్రమే. పశ్చాత్తాపం అంటే పై విధంగా ఉండాలి.దేశం ఏదైనా, మతం ఏదైనా సమాజంలో మానవుని జీవితంలో తప్పు జరగటం అనివార్యం, అయితే అటువంటి తెలిసీ తెలియని తప్పులకు కూడా పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం వంటివాటిని పెద్దలు ఎప్పుడో చెప్పారు. వ్యక్తిగతంగా పశ్చాత్తాపపడటం క్షమాపణ చెప్పటం నైతికత. ప్రవర్తనను సంస్కరించుకొనటం, ఆపై పరిహారం అందించటం ద్వారా ప్రాయశ్చిత్తం. చట్టపరమైన.. న్యాయం నష్టపరిహారం అందేలా ప్రయత్నం చేయటం, శిక్షద్వారా పశ్చాత్తాపం పొందేలా చేయటం ప్రాయశ్చిత్తం జరిపించడం ఆచరణీయాలుగా ఉన్నాయి.క్రైస్తవ్యంలో.. మెటానోయియా అనబడుతూ పశ్చాత్తాపం, దైవశాస్త్ర ప్రాయశ్చిత్తం ఉన్నాయియూదు మతంలో.. తెషువా అనబడే ప్రాయశ్చిత్తం ఉన్నాయి. ఇస్లాంలో.. తౌబా అనబడే ఆచారం.. పశ్చాత్తాప భావనను, ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తుంది. లౌకికవాదంలో... పశ్చాత్తాపం అంటే వ్యక్తం చేయటంతో పాటు, క్షమించ బడటానికి సమాజంలో విశ్వాసం పొందడానికి తగిన పారదర్శకతతో కూడిన పరిహార చర్యలను ప్రాయశ్చిత్తంగా భావిస్తుంది.ప్రభావవంతమైన నైతిక పునరుద్ధరణకు పునరావృతం కాకుండా నిరోధించడానికి నిజమైన పశ్చాత్తాపంతో పాటు స్పష్టమైన తత్సమానమైన ప్రాయశ్చిత్తం అవసరం అంటుంది. ధర్మశాస్త్రం, పురాణాలూ, నిఘంటువులు, మతాలూ, చట్టాలూ ఏమిచెబుతున్నా... ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. తప్పు. అలాంటి తప్పులకు పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుందిఅపరాధ భావంతో తెలియక చేసిన ఆ పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగపాపం తొలగిపోతుంది. పశ్చాత్తాపంలో భాగంగా పాటించవలసిన కట్టుబాటులో బాధితుల్ని శరణు వేడటం, మెప్పించటం వంటి నిబంధనలు ఉంటాయి.చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచలవుతుందని పురాణాలు చెపుతున్నాయి. దానినే..‘మనః ప్రాయశ్చిత్త’మని అంటారు. ఇట్టి మనః ప్రాయశ్చిత్తం బాధితులకు భౌతికంగా, మానసికంగా కూడా సహాయకారియై పరస్పరం ఇరువర్గాలకు మనశ్శాంతిని ఇస్తుందని జ్ఞానులు నమ్ముతారు.– డా.గాదిరాజు మధుసూదన రాజు -
ఈ సండే సరదాగా ఈ హెల్దీ స్వీట్స్ చేసేయండిలా
గోపాలకాలాకావలసినవి: అటుకులు: కప్పు, పెరుగు: అర కప్పు, తాజా వెన్న: 2 టేబుల్ స్పూన్లు, దోసకాయ ముక్కలు: 1/4 కప్పు, దానిమ్మ గింజలు: 1/4 కప్పు, పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), అల్లం తురుము: 1/2 టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా, బెల్లం: అర టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, తాళింపు కోసం– నెయ్యి: టీస్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, ఇంగువ: చిటికెడు. తయారీ: అటుకులను శుభ్రంగా కడిగి.. నీళ్లు పోయేలా పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో మెత్తబడిన అటుకులు, పెరుగు, వెన్న, దోసకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేయండి. చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి, జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర చిటపటలాడాక చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయండి. ఈ తాళింపును అటుకుల మిశ్రమంలో పోసి, కొత్తిమీర చల్లి మెల్లగా బాగా కలపండి.ధనియా పంజీరికావలసినవి: ధనియాల పొడి: కప్పు, నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు, బెల్లం పొడి: అర కప్పు, మఖానా: అర కప్పు, జీడిపప్పు, బాదం: 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు, గుమ్మడి లేదా పుచ్చగింజలు: టేబుల్ స్పూన్, ఏలకుల పొడి: అర టీస్పూన్.తయారీ: మఖానాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించి, చల్లారాక కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి. అదే కడాయిలో ఇంకో అర చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన నెయ్యి వేసి, ధనియాల పొడిని సన్నని మంటపై సువాసన వచ్చే వరకు వేయించండి. తరువాత చల్లారిన ధనియాల పొడిలో చక్కెర పొడి, ఏలకుల పొడి, మఖానా పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి. అంతే ధనియా పంజీరి రెడీ!సింధీ స్వీట్ రైస్కావలసినవి: బాస్మతీ బియ్యం: కప్పు, తురిమిన బెల్లం: 3/4 కప్పు, నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు, సోంపు: టీస్పూన్, ఏలకులు: 4, లవంగాలు: 2, దాల్చిన చెక్క: చిన్నముక్క, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష: గుప్పెడు, కుంకుమపువ్వు: చిటికెడు, నీళ్ళు: 2 కప్పులు.తయారీ: ఒక పాత్రలో నీటిని తీసుకుని బెల్లం వేసి చిన్నమంటపై కరిగించాలి. ఒక పాన్‌లో నెయ్యి తీసుకుని డ్రై ఫ్రూట్స్‌ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో మసాలా దినుసుల్ని కూడా వేసి అరనిమిషం వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి, నెయ్యిలో జాగ్రత్తగా 2 నిమిషాలు వేయించండి. ఇందులోనే కుంకుమపువ్వు వేసి, ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం నీళ్ళు కూడా పోసి బాగా కలపండి. మూత పెట్టి మీడియం మంటపై 10–12 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఆవిరి పూర్తిగా పోయాక, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లి మెల్లగా కలపండి. అంతే నోరూరించే సింధీ స్వీట్ రైస్ రెడీ(చదవండి: మెడ మెరిసేలా ఇలా చేయండి..! దెబ్బకు నలుపు మాయం) -
చూస్తే వావ్... వాడితే ఇంకా వావ్!
ఇంట్లో పెట్టుకున్న డెకర్ పీస్ అంటే రోజంతా మూలన కూర్చుని అందంగా కనిపించడం మాత్రమే కాదు! అందుకే, ఇప్పుడు ఇల్లు అందంగా కనిపించేలా చేస్తూనే... రోజువారీ పనుల్లోనూ చక్కగా చేయూతనిచ్చే ఈ డ్యూయల్ డ్యూటీ గాడ్జెట్లు మీకోసం!గోడ మీద గొడుగు!తాళాలు ఎక్కడ? కత్తెర ఎక్కడ? టవల్ ఎక్కడ? అని ఇంట్లో రోజూ జరిగే ‘పోయిన వస్తువుల వేట’కు ఇక సెలవు చెప్పొచ్చు! ఎందుకంటే, ఈ చిన్న గొడుగు ఆకారపు హుక్ గోడకు అతుక్కుని, ఇంట్లో చెల్లాచెదురుగా తిరిగే చిన్నచిన్న వస్తువులన్నింటికీ ఓ చిరునామా ఇస్తుంది! చూడ్డానికి ముద్దుగా ఉండే ఈ గొడుగు హుక్‌లో తాళాలు, టవల్స్, చిన్న ఉపకరణాలు వంటి వాటిని వేలాడదీయొచ్చు. అవసరాన్ని బట్టి దీన్ని తిప్పి చిన్న వస్తువులు పెట్టుకునే హోల్డర్లా కూడా వాడుకోవచ్చు. గోడకు అతికించే విధానంలో ఉండటంతో డ్రిల్, మేకులు అంటూ గోడకు కొత్త గాయాలు చేయాల్సిన పనిలేదు! బాత్రూమ్లో ఒకటి... కిచెన్‌లో ఒకటి... ఆఫీసు టేబుల్ దగ్గర ఇంకొకటి పెట్టుకుంటే చాలు... ‘ఎక్కడ పెట్టాను?’ అనే ప్రశ్నకు ఈ గొడుగులే సమాధానం చెబుతాయి! ఆరు హుక్‌ల ప్యాక్ ధర రూ.250 మాత్రమే!పిల్లి పంజాకు మురికి పరార్!అద్దం ముందు నిలబడి ఫొటో తీసుకోవాలంటే, మన ముఖం కంటే ముందే అద్దంపై ఉన్న నీటి చారలే కనిపిస్తున్నాయా? సింక్ దగ్గర సబ్బు మరకలు చూస్తూ ‘రేపు క్లీన్ చేద్దాంలే’ అని వాయిదా వేస్తున్నారా? అయితే ఈసారి క్లీనింగ్ పనికి ఓ క్యూట్ పిల్లిని పెట్టుకోండి! అదీ... పంజాలతో పని చేసే పిల్లి! పిల్లి పంజా ఆకారంలో ఉండే ఈ చిన్న స్పాంజ్‌తో అద్దాలు, గ్లాస్ ఉపరితలాలు, టైల్స్, సింక్‌లను తుడిచేయొచ్చు. నీటి చారలు, వేలిముద్రలు, సబ్బు మరకలు వంటి మచ్చలను సులభంగా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చిన్నగా, తేలికగా ఉండటంతో అవసరమైనప్పుడు చేతిలోకి తీసుకుని పని పూర్తి చేయొచ్చు. ధర రూ.300 మాత్రమే!గదిలోనే చిన్న స్పా!ఇంట్లో కూర్చుంటేనే కాస్త రిలాక్స్ అవ్వాలని అనిపిస్తుందా? అయితే... గదిలో పరిమళం, చుట్టూ మెల్లని వెలుగు, చెవుల్లో నచ్చిన పాటలు ఉంటే ఎలా ఉంటుంది? అందుకోసం ఒక్కో పనికి ఒక్కో పరికరం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కటే మూడు పనులు చేసేస్తుంది! ఇది ఒకేసారి హ్యూమిడిఫైయర్, అరోమా డిఫ్యూజర్, బ్లూటూత్ స్పీకర్లా పనిచేస్తుంది. 350 మిల్లీలీటర్ల ట్యాంక్‌తో సుమారు 8 గంటల వరకు మిస్ట్ అందిస్తుంది. ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటే గదంతా ఆహ్లాదకరమైన పరిమళం వ్యాపిస్తుంది. బ్లూటూత్‌తో ఫోన్‌ను కనెక్ట్ చేసి నచ్చిన పాటలు వినొచ్చు. ఎల్ఈడీ లైటింగ్‌తో గదికి మూడ్ లైటింగ్ కూడా వచ్చేస్తుంది. ఇక సెట్టింగ్స్ మార్చడానికి ప్రతిసారీ లేవాల్సిన పనిలేదు... యాప్ ద్వారా మిస్ట్, టైమర్, లైటింగ్ వంటివి నియంత్రించుకోవచ్చు. నీరు అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే సదుపాయం కూడా ఉంది. గదినే చిన్న స్పాగా మార్చేసే దీని ధర రూ. 2000. (చదవండి: -
మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్న కిరణ్ రెడ్డి
జార్జియాలోని డగ్లస్‌కు చెందిన 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థిని కిరణ్ రెడ్డి మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. అమెరికా జాతీయ పోటీల్లో ఈ ఘనత సృష్టించిన తొలి భారత సంతతి అమెరికన్‌గా చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని మయామిలో ఉన్న అడ్రియెన్ ఆర్ష్ట్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఆగస్టు 26న జరిగిన 44వ వార్షిక పోటీల్లో కిరన్ రెడ్డి మొత్తం 50 మంది పోటీదారులతో పోటీపడి ఈ కిరీటం దక్కించుకుంది. ఈపోటీల్లో ఆర్కాన్సాస్‌కు చెందిన రాక్వెల్ ఓలియా మొదటి రన్నరప్‌గా నిలవగా, న్యూయార్క్‌కు చెందిన ఎలిసా అకిన్, ఇండియానాకు చెందిన కీర్‌స్టెన్ అల్వరాడో, టెక్సాస్‌కు చెందిన క్లో బెల్లా డీట్జ్ టాప్ ఫైవ్‌లో నిలిచారు. ఈ ఈవెంట్‌కి మాజీ మిస్ రోడ్ ఐలాండ్ యూఎస్ఏ కెల్సీ స్వాన్సన్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. గత నెలలోనే మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ టైటిల్‌ను గెలుచుకున తొలి అమెరికన్‌గా నిలిచిందామె. అంతేగాదు జార్జియా రాష్ట్రంకి ఈ పోటీ చరిత్రలో తొలి విజయాన్ని అందించిన ఘనత కూడా కిరణ్‌దే. ఈ మేరకు కిరణ్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ని స్వీకరించడంపై స్పందిస్తూ..ఇది తన అదృష్టంగా పేర్కొంది. తనకు చిన్నప్పటి నుంచి ఆదర్శంగా నిలవడం ఇష్టమని ఈ గెలుపుతో అది నిజమైందని అంటోంది.ఎవరామె..కిరణ్ విద్యా నేపథ్యం వచ్చేసి డగ్లస్లోని కాఫీ హైస్కూల్లో వాలెడిక్టోరియన్‌గా పట్టభద్రురాలయ్యారు. హైస్కూల్ విద్య పూర్తి చేసిన తర్వాత, రెడ్డి జార్జియా విశ్వవిద్యాలయంలో చేరారు, అక్కడ ఆమె ప్రీ-మెడికల్ ట్రాక్‌లో జీవశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. ఆమె 15 ఏళ్ల వయసులో అందాల పోటీలోకి ప్రవేశించింది. 2024లో జరిగిన మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ పోటీలో ఆమె మొదటి రన్నరప్‌గా నిలిచింది, ఆ తర్వాత ఈ ఏడాది జూలైలో మిస్ జార్జియా టీన్ యూఎస్ఏగా గెలుపొందడంతోనే ఈ జాతీయ టైటిల్‌కు ఆమె ప్రయాణం సుగమమైంది. ఇక ఆమె త్వరలోనే మిస్ టీన్ యూఎస్ఏగా బాధ్యతలు తీసుకోనుంది. అలాగే అక్టోబర్ 2026లో కంబోడియాలోని ఫ్నామ్ పెన్లో జరిగే మిస్ టీన్ యూనివర్స్ పోటీలో కిరణ్ రెడ్డి యునైటెడ్ స్టేట్స్కు ప్రాతినిధ్యం వహించనుంది కూడా. వీటి తోపాటు తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రీ-మెడ్ చదువుని కూడా కొనసాగించాలని చూస్తోంది.(చదవండి: స్టిక్కీ నోట్‌తో గిన్నిస్ రికార్డు) -
మూత్ర పరీక్షలు నార్మల్‌గానే ఉన్నా..ఎందుకు ఆ సమస్య?
నా వయసు ముప్పై ఒకటి. యూరిన్‌కి వెళ్లేటప్పుడు చాలా మంటగా, దురదగా ఉంటుంది. ఆ ప్రాంతంలో చర్మం రంగు మారినట్లు కనిపిస్తోంది. మూత్ర పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాలు సాధారణంగానే వచ్చాయి. ఇది సాధారణమేనా?– స్వప్న, కర్నూలు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, యోని బయట భాగంలో చర్మానికి సంబంధించిన చికాకు లేదా వాపు ఉండే అవకాశం ఉంది. యోని చుట్టూ ఉండే చర్మం, పెదవుల వంటి భాగాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్, అలర్జీ లేదా చర్మ సమస్యల వల్ల మార్పులు రావచ్చు. ఈ ప్రాంతంలో వాపు లేదా చికాకు ఏర్పడినప్పుడు మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించవచ్చు. మూత్ర పరీక్షలు సాధారణంగా వచ్చినా, సమస్య యోని బయట భాగంలోని చర్మానికి సంబంధించినదై ఉండవచ్చు. అందువల్ల స్త్రీల వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. వైద్యులు అవసరమైతే అంతర్గత పరీక్ష చేసి సమస్యను గుర్తిస్తారు. మీరు ఇటీవల ఏవైనా యాంటీబయోటిక్ మందులు లేదా ఇతర ఔషధాలు వాడారా, గతంలో అలర్జీలు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నాయా అనే వివరాలను కూడా అడుగుతారు. వేడిమి, తేమ, ఎక్కువగా చెమట పట్టడం వల్ల కూడా ఆ ప్రాంతంలో దురద, మంట పెరగవచ్చు. మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించవచ్చు. కొన్నిసార్లు యోనిలో లేదా బయట ఉపయోగించే క్రీములు, లోషన్లు కూడా అలర్జీకి కారణం కావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా ఏ మందు లేదా క్రీమునూ ఉపయోగించకండి. అవసరాన్ని బట్టి యోని నుంచి నమూనా తీసి పరీక్ష చేస్తారు. ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి రక్త పరీక్షలు, చక్కెర స్థాయిలు, థైరాయిడ్ పరీక్షలు కూడా చేయవచ్చు. కొన్ని ప్రత్యేక చర్మ వ్యాధుల్లో కూడా ఇలాంటి దురద, మంట, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని పరీక్షల తర్వాత సమస్యను బట్టి క్రీములు, లోషన్లు లేదా ఇతర మందులను సూచిస్తారు. కొన్నిసార్లు చికిత్సను కొన్ని వారాలు లేదా ఎక్కువ కాలం కొనసాగించాల్సి రావచ్చు. శిలీంద్రాల వల్ల ఇన్ఫెక్షన్ ఉంటే, దానికి తగిన మాత్రలు, పూతమందులు లేదా యోనిలో ఉపయోగించే ఔషధాలను సూచిస్తారు.చికిత్సతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరియోని బయట భాగాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.ఆ ప్రాంతాన్ని తేమ లేకుండా పొడిగా ఉంచుకోవాలి.సువాసన సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, డియోడరెంట్లు వాడకండి.బిగుతుగా ఉండే దుస్తులు ధరించకుండా, వదులుగా ఉండే పత్తి దుస్తులు వాడండి.రోజంతా ప్యాడ్లు లేదా లోదుస్తుల్లో ఉపయోగించే పలుచటి రక్షణ పొరలను అనవసరంగా వాడకండి.దుస్తులు ఉతికేటప్పుడు గాఢ సువాసన కలిగిన ద్రావకాలు ఉపయోగించకండి.వైద్యుల సలహా లేకుండా క్రీములు లేదా ఇతర మందులు వాడకండి.ఇలాంటి సమస్యలు కొన్నిసార్లు పూర్తిగా తగ్గడానికి సమయం పడుతుంది. అందువల్ల చికిత్స మధ్యలో ఆపకుండా, వైద్యులు సూచించిన విధంగా క్రమం తప్పకుండా పరీక్షలకు వెళ్లాలి. సమస్య తగ్గుతోందా లేదా, చికిత్సలో మార్పులు అవసరమా అనే విషయాన్ని వైద్యులు పరిశీలించి తదుపరి చికిత్సను నిర్ణయిస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్(చదవండి: మతిమరుపు నివారణ ఇలా..!) -
చేతులతో ఎందుకు తినాలంటే..? ఆర్థికవేత్త అద్భుతమైన వివరణ ఇదే..
భారతీయులు ఆహారాన్ని ఎందుకు చేతులతో తింటారంటూ చాలాసార్లు విదేశీయలు ప్రశ్నిస్తూ..మన సంస్కృతిని అవమానిస్తుంటారు. పైగా మన విధానాన్ని నాగరికత లేని వ్యక్తిగా అభివర్ణిస్తూ తిట్టిపోస్తుంటారు. ఇలాంటివి మనం చాలాసార్లు చూశాం కూడా. దీనికి ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ చాలా అద్భుతమైన సమాధానమిచ్చారు. మరోసారి ఆ ప్రశ్న లేవనెత్తే ఛాన్సే లేకుండా గట్టి కౌంటరిచ్చారు. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఫ్లోరిడాకు చెందిన అకా అనే వ్యక్తి ఒక దక్షిణాది వివాహం లేదా సాంప్రదాయ పెళ్లి భోజనాలకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. అందులో ఒక జంట చేతులతో భోజనం చేయడం కనిపిస్తోంది. ఆ వీడియో చూపిస్తూ..నిజంగా అడుగుతున్నా..వారంతా ఎందుకు చేతులతో తింటున్నారు అని ప్రశ్నించాడు. ఇది నవంబర్ 2025లో వైరల్ అయిన పోస్ట్. ఇది మన భారత ప్రముఖ ఆర్థివేత్త సంజీవ్ సన్యాల్ దృష్టికి వచ్చింది. ఆయన ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ..ఇలా సమాధానమిచ్చారు. ఇదొక సింపుల్ టెస్ట్ అని. మీరు తాకి పదార్థాన్ని తినే ధైర్యం లేకపోతే స్పూన్లు, కత్తులు వంటి ఇనుప ఆయుధాలను ఉపయోగించండి పర్లేదు. కానీ అలా తింటే గనుక ఆ ఆహారాన్ని తినొచ్చా లేదా అని మీ నోరు నిర్ణయించడం కష్టం అవుతుంది అని అద్భుతంగా రిప్లై ఇచ్చారు. ఆయన చేతి స్పర్శ తినే పదార్థం మధ్య ముడిపడి ఉన్న రుచిని, తినాలనే అనుభూతిని హైలెట్ చేస్తూ చెప్పారు. నిజంగానే మనం టచ్ చేయగానే బాగుంది తినొచ్చు అనిపించి..సులభంగా తినగలం. పైగా చేయి తాకడంతోనే రుచి కూడా అధికమవుతుది. అదే కత్తులు, స్పూన్లు వాడితే నోట్లో పెట్టుకునేంత వరకు రుచిని చెప్పలేరని స్పర్శతో ఆహారానికి ఉన్న సంబంధాన్ని హైలెట్ చేసింది. కాగా, నెటిజన్లు ఆర్థికవేత్త సన్యాత్ అద్భుతమైన రిప్లైకి ఫిదా అవుతూ ..చాలా చక్కటి పాయింట్‌ని చెప్పారు సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్‌లు పెట్టారు. It is a simple test..... if you cannot bear to touch it, and need metal instruments, then it is probably a bad idea to put it in your mouth. https://t.co/omWQcETPDi— Sanjeev Sanyal (@sanjeevsanyal) September 5, 2026 (చదవండి: సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!) -
బొప్పాయి మన దేశంలో పుట్టలేదా? ఘనాంకాలు ఏం చెప్తున్నాయంటే?
మన దేశంలో ఏడాది పొడవునా దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. నిజానికి బొప్పాయి మన దేశానికి స్థానిక ఫలం కాదు. బొప్పాయి ఉత్పాదనలో ఇప్పుడు మన భారత దేశమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. బొప్పాయి విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...చాలా పండ్ల జాతుల మాదిరిగానే పోర్చుగీసు నావికుల ద్వారా పదహారో శతాబ్దంలో మన దేశానికి చేరుకుంది. బొప్పాయిని భారతీయులు అమితంగా ఇష్టపడటంతో దీని సాగును బాగా పెంచారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బొప్పాయిని పండిస్తున్నారు.ఇవి కూడా చదవండి: గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా? -
గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా?
ఒక అడవికి రాజు సింహం. సింహం అంటేనే గజగజలాడే భయం. కానీ, ఇప్పుడు ఆ మృగరాజు ఒక చీకటి గుహలో దీనంగా పడి ఉంది. కొద్దిరోజుల కిందటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక క్రూరమైన పులితో చేసిన పోరాటంలో సింహం తీవ్రంగా గాయపడింది. ఆ గాయాలు మానినా, ఆనాటి భయంకరమైన దృశ్యాలు సింహం మనసును వదలడం లేదు.రాజవైద్యుడైన ఎలుగుబంటి ఎన్ని ఔషధాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. సింహం నిరాశతో, ‘నా పరాక్రమం ముగిసింది మిత్రమా! ఈ గాయాలే నా మరణానికి దారి తీస్తాయి. నేను మళ్ళీ గర్జించలేను.’ అంటూ నిట్టూర్చింది.అదే సమయంలో, పొరుగు అడవి నుంచి తన మిత్రుడైన ఏనుగును కలవడానికి ఒక కోతి వచ్చింది. ఏనుగు తన రాజు ఆరోగ్య పరిస్థితిని వివరించగా, అంతా విన్న కోతి గంభీరంగా ఇలా అంది: ‘మిత్రమా! మృగరాజుకు ఇప్పుడు కావాల్సింది మూలికల వైద్యం కాదు, మానసిక వైద్యం!’ఏనుగు ఆశ్చర్యపోయి, ‘వైద్యం గురించి నీకు ఇవన్నీ ఎలా తెలుసు?’ అని అడిగింది. అప్పుడు కోతి తన గతాన్ని వివరిస్తూ, ‘నేను ఒకప్పుడు గొప్ప వైద్యురాలిని. కానీ, ఒక చిన్న పొరపాటు వల్ల ఒక జీవి ప్రాణం పోయింది. ఆ అపరాధ భావంతో అప్పటి నుండి వైద్యం చేయడమే మానేశాను. ఎవరికీ ఈ విషయం చెప్పలేదు.’ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది.ఏనుగు వెంటనే కోతి భుజంపై తొండం వేసి, ‘మిత్రమా! గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మన పొరపాట్ల నుంచే మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు సింహాన్ని కాపాడటం నీ బాధ్యత. నీలో నిద్రాణమైన వైద్యుడిని నిద్రలేపు!’ అని ప్రోత్సహించింది.ఏనుగు మాటలతో కోతిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కోతి, ఏనుగు కలిసి సింహం గుహకు వెళ్లాయి. అవి రాజవైద్యుడు ఎలుగుబంటికి విషయం చెప్పాయి. ఎలుగుబంటి సంబరపడి, మృగరాజుకు వైద్యం చేయటానికి కోతిని అనుమతించింది. కోతి సింహాన్ని పూర్తిగా పరీక్షించి ఒక నిర్ణయానికి వచ్చింది. తనకు కావలసిన మూలికలు సేకరించడానికి గుహ బయటకు వెళ్ళింది.ఆ సమయంలో ఏనుగు ఇలా అంది: ‘మృగరాజా! గతం గతః. మీ పరాక్రమాన్ని మళ్ళీ చాటే సమయం వచ్చింది. ఈమె సామాన్యమైన కోతి కాదు, గొప్ప వైద్యురాలు.’మూలికలు సేకరించి తిరిగి గుహలోకి వచ్చిన కోతి, సింహం కళ్ళలోకి సూటిగా చూస్తూ, ‘రాజా! మీ వ్యాధి మీ దేహంలో లేదు, మీ ఆలోచనల్లో ఉంది. నాడు మీరు పులిని తరిమికొట్టినప్పుడు తగిలిన ఈ గాయాలు మీ వీరత్వానికి సజీవ సాక్ష్యాలు! అవి మిమ్మల్ని భయపెట్టకూడదు, మీ గుండెను మరింత బలంగా మార్చాలి.’ అని నొక్కి చెప్పింది. అనంతరం మూలికలతో ఒక లేహ్యం తయారుచేసి సింహానికి తాగించింది.ఆశ్చర్య కరంగా, మరుసటి రోజు ఉదయానికే మృగరాజు తన నిస్సత్తువను వదిలి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అడవి మొత్తం దద్దరిల్లేలా గర్జించాడు! నిజానికి కోతి ఇచ్చిన ఆ ‘మందు’ కేవలం తీపి పండ్ల రసం మాత్రమే. సింహం రోగం నయం కావడానికి కారణం ఆ రసం కాదు; కోతి తన మనసులో నింపిన ధైర్యం, గతాన్ని మర్చిపోవాలనే సంకల్పం మాత్రమే!సింహం తన తప్పు తెలుసుకుంది. ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందని గ్రహించింది. తనను మళ్ళీ కర్తవ్యోన్ముఖుడిని చేసిన కోతిని ఘనంగా సత్కరించి, తన ఆస్థాన వైద్యురాలిగా నియమించుకుంది. అలాగే కోతిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఏనుగును తన రాజ సలహాదారునిగా నియమించుకుంది. రాజవైద్యుడు ఎలుగుబంటి కూడా వారి సమయస్ఫూర్తిని చూసి మురిసిపోయాడు.హితవచనం..అసంవిభాగీ దుష్టాత్మా కృతఘ్నో నిరపత్రపఃతాదృగ్నరాధిపో లోకే వర్జనీయో నరాధిపఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వనివాడు, దుష్టబుద్ధి, కృతజ్ఞత లేనివాడు, సిగ్గులేనివాడు అయిన రాజును పరిత్యజించాలి.- ముద్దు హేమలతఇవీ చదవండి: బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా? -
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
నైజీరియాలోని ఓండో రాష్ట్రంలో ఉన్న ఓవో నగరం శోభాయమానంగా వెలిగిపోతోంది. 600 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ‘ఇగోగో’ మహోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆగస్టు చివరిలో ప్రారంభమై, సెప్టెంబరు మాసమంతా ఈ పండుగ సాగుతుంది. ఇది నైజీరియన్ల స్థానిక జ్ఞాపకాలతో, రాచరికంతో, సామాజిక గుర్తింపుతో ముడిపడి ఉన్న వేడుక. ఎంతో ఉత్సాహంగా సాగే ఈ వేడుకలను తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇప్పటికే ఓవో నగరానికి క్యూకట్టారు.నైజీరియాలో వర్షాకాలం ముగిసే వేళ జరిగే సాంస్కృతిక పండుగల కాలంలోనే ఈ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ ఇగోగో వేడుక మూలాలు పురాణ కాలపు రాణి ఒరోన్సే చరిత్రతో ముడిపడి ఉన్నాయి. దేవలోకం నుంచి దివికి దిగివచ్చిన ఒరోన్సే, ఓవో రాజును వివాహమాడి, రాజసౌధంలో కొన్ని నియమాలను విధించింది. తనకు ఇష్టంలేని బెండకాయలను వండరాదని, తన సమక్షంలో తలపాగాలు ధరించరాదని, తన దారిలో నీరు చల్లకూడదని కోరింది.ప్రజలు కొన్నేళ్లపాటు ఆ నిబంధనలను గౌరవించినప్పటికీ, కాలక్రమంలో వాటిని ఉల్లంఘించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాణి ఒరోన్సే, అడవుల్లోకి వెళ్లి అదృశ్యమైపోయింది. కానీ వెళ్లేముందు తన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఇగోగో ఉత్సవాన్ని నిర్వహించాలని, అలా చేస్తే రాజ్యానికి శుభం కలుగుతుందని వరమిచ్చింది. నాటి నుంచి ఇగోగో పండుగ ఆచారంగా మారింది. వేడుకకు కొన్ని వారాల ముందునుంచే నగరం నూతన శోభను సంతరించుకుంటుంది. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.మహిళలు ఊదా, తెలుపు, పసుపు రంగుల ప్రత్యేక వస్త్రాలను నేస్తారు. సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పిల్లల నుంచి పెద్దవారి వరకు సన్నద్ధమవుతారు. విదేశాల్లో స్థిరపడినవారు తమ మాతృభూమికి చేరుకుంటారు. మహిళలు పగడపు పూసల ఆభరణాలు ధరించి, ఒరోన్సే రాణి గుణగణాలను, ఆమె త్యాగాన్ని కీర్తిస్తూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయ గీతాలను ఆలపిస్తారు. ఈ వేడుకల్లో ఆనాడు రాణి ఒరోన్సే విధించిన నిబంధనలను ప్రజలంతా కచ్చితంగా పాటిస్తారు. నేడు ఇగోగో పండుగ కేవలం సంప్రదాయానికే పరిమితం కాకుండా, పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రత్యేక ఆకర్షణ ఒలోవో రాజుఇగోగో ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ ఓవో సామ్రాజ్య అధిపతి అయిన ‘ఒలోవో’ రాజు ప్రత్యేకమైన అలంకరణ. సాధారణ రోజుల్లో కిరీటాలు, మిరుమిట్లుగొలిపే వస్త్రాలు ధరించే రాజు, ఈ పండుగ రోజుల్లో విభిన్నంగా కనిపిస్తాడు. తలపాగా లేకుండా, పగడాల పూసల టోపీని, పగడాల హారాలను ధరిస్తాడు. అంతేకాక, రాణి ఒరోన్సే స్త్రీత్వాన్ని, ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటడానికి చీర వంటి ప్రత్యేక వస్త్రాన్ని ధరిస్తాడు. రాజ పురోహితులు, సర్దారులతో కలిసి వీథుల్లో నృత్యం చేస్తూ సాగుతాడు.- రమా జంబులఇవి కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్! -
బ్రేకింగ్ న్యూస్!
బ్రేకింగ్ న్యూస్... పత్రికల్లోను, టీవీ స్క్రీన్లపైన ఆ వార్త చూడగానే రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘నగరంలో సంచలనం సృష్టించిన కిల్లర్స్ గ్యాంగ్ ఘాతుకం! నేరస్తుల గుండెల్లో సింహస్వప్నం అయిన ఇన్స్పెక్టర్ అభిమన్యు శత్రువుల దొంగచాటు కాల్పుల్లో మృతి! ఆయన మృతదేహంతో పరారైన కిల్లర్స్ గ్యాంగ్!’ఈ వార్త తెలిసిన వెంటనే అభిమన్యు అభిమానులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. అభిమన్యు మృతితో నగరంలో తీవ్ర ఉద్రిక్తత, ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. ఈ కేసు తీవ్రతను గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు.ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా హుటాహుటిన డిటెక్టివ్ సిద్ధార్థ నగరానికి చేరుకున్నాడు. స్థానిక ఇన్ స్పెక్టర్ ప్రద్యుమ్నతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.‘కిల్లర్స్ గ్యాంగ్‌ని ప్రపంచంలో ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని అంతం చేస్తాను’ అని ప్రద్యుమ్న సవాల్ చేశాడు. పోలీసులు కిల్లర్స్ గ్యాంగ్ ఆనవాళ్ల కోసం నగరాన్ని అణువణువు జల్లెడ పట్టడం ప్రారంభించారు. అదే సమయంలో బీహార్ గ్యాంగ్, హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ తరహాలో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు సృష్టించడానికి ప్లాన్ చేసింది. అభిమన్యు మరణ వార్తతో పోలీసులు తలమునకలై ఉన్న సమయంలోనే, నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో మారణహోమం సృష్టించాలనేది వారి కుట్ర.అదే సమయంలో రామ్పూర్లోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఇన్ స్పెక్టర్ అభిమన్యు చనిపోలేదని, కొనప్రాణాలతో ఉన్నాడనే విషయం తెలిసింది. అభిమన్యుని అడ్డుపెట్టుకుంటే తమ ప్లాన్ విజయవంతం అవుతుందని భావించిన బీహార్ గ్యాంగ్, కిల్లర్స్ గ్యాంగ్‌పై అనుకోని దాడిచేసి, అపస్మారక స్థితిలో ఉన్న అభిమన్యుని గోల్కొండ ప్రాంతానికి తరలించింది. బాంబులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించే సమయం ఆసన్నమైన తరుణంలో, డిటెక్టివ్ సిద్ధార్థ, ఇన్ స్పెక్టర్ ప్రద్యుమ్నలు నిఘా ద్వారా బీహార్ గ్యాంగ్ డెన్ ను గుర్తించి మెరుపు దాడి చేశారు. పోలీసుల రాకతో కంగారుపడిన ఉగ్రమూక, కొనప్రాణాలతో ఉన్న అభిమన్యుని బందీగా చేసుకుని, ‘ఇప్పుడే ఇతన్ని కడతేరుస్తాం’ అని హెచ్చరించింది.డిటెక్టివ్ సిద్ధార్థ చిరునవ్వుతో, ‘ఇన్ స్పెక్టర్ అభిమన్యుని ఎవరూ చంపలేరు. సమాజంలో నేరాలు, దేశద్రోహం జరుగుతున్నంత కాలం అభిమన్యు బ్రతికే ఉంటాడు!’ అన్నాడు.వెంటనే బీహార్ గ్యాంగ్ చీఫ్ ముక్తార్ మంచం మీద రక్తంతో ఉన్న అభిమన్యు తలకు రివాల్వర్ గురి పెట్టాడు. ‘కమాన్ షూట్’ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రద్యుమ్న.ముక్తార్ వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుంది.‘ఇంకా ఆలస్యం ఎందుకు ముక్తార్?’ అంటూ అభిమన్యు కళ్ళు తెరిచాడు. కన్నుమూసి తెరిచేలోగా అభిమన్యు కుడిచేతిలో ఉన్న పిడిబాకు ముక్తార్ కుడి అరచేతిలోకి దిగింది.∙∙ ‘ముక్తార్ నీ ఆట కట్టింది. నువ్వు నగరంలో విధ్వంసం సృష్టించడానికి బీహార్ నుంచి బయల్దేరావన్న సమాచారం రాగానే, నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా జరిగే ప్రమాదాన్ని ఊహించి, నీ ఆలోచనలను డైవర్ట్ చేసి, నీ ద్వారానే ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేశాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘నిజానికి ఇక్కడ కిల్లర్స్ గ్యాంగ్ అంటూ వేరేగా ఏదీ లేదు. పోలీసులే ఆ గ్యాంగ్‌గా నటించారు. నగరంలో బాంబులతో విధ్వంసం సృష్టించాలనుకునే మీలాంటి దేశద్రోహుల ఆట కట్టించడానికి అభిమన్యు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది’ చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.అదే సమయంలో పోలీసులు ఆ స్థావరాన్ని చుట్టుముట్టారు. బీహార్ నుంచి హైదరాబాద్‌లోకి అడుగు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లో బీహార్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.∙∙ సీఎం ఛాంబర్..‘థాంక్యూ మిస్టర్ అభిమన్యు! నీ ప్రాణాలను పణంగా పెట్టి, చనిపోయినట్టు నాటకమాడి రాష్ట్రంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడారు. రెండు రాష్ట్రాల ప్రజల్లో మీరంటే ఎంత అభిమానమో తెలిసింది. వాళ్ళ అభిమానాన్ని ఆపడం మా తరం కాలేదు. మీరు కనిపించాకే శాంతించారు’ మనస్పూర్తిగా అభినందించాడు ముఖ్యమంత్రి.‘ఈ అభిమన్యు ప్రాణాలు నావి కావు, నా ప్రజలవి’... అని చెప్పి, డిటెక్టివ్ సిద్ధార్థ వైపు, ప్రద్యుమ్న వైపు చూసి థాంక్యూ మై డియర్ ఫ్రెండ్స్’ అన్నాడు.‘మీ లాంటి పోలీస్ అధికారిని ఎవ్వరైనా ప్రేమించకుండా ఉండలేరు. మీ దిష్టి ఇలా పోయింది.’ ఢిల్లీకి బయలుదేరుతూ చెప్పాడు డిటెక్టివ్ సిద్ధార్థ.- శ్రీసుధామయిఇవీ చదవండి: తలుపు: ‘మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం’.. నెలకే ఏమైంది? -
ఇది నాణెమా.. వెండి కొండా? చూస్తే షాక్ అవుతారు!
రెండు అడుగుల వ్యాసం.. దాదాపు 79 కిలోల బరువు.. చూస్తే ఇది నాణెమని నమ్మడం కష్టమే! అచ్చం వెండి కొండలా కనిపిస్తున్న ఈ భారీ నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అసలు ఈ నాణెం ప్రత్యేకత ఏంటి? దీని విలువ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం!ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వెండినాణెం. అమెరికా 250వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టెక్సస్‌కు చెందిన ‘టెక్సస్ ప్రీషియస్ మెటల్స్ ఎల్ఎల్సీ’ కంపెనీ ఈ నాణేన్ని ‘సన్‌షైన్ మింటింగ్’ కంపెనీతో కలసి రూపొందించింది. దీని తయారీ కోసం స్వచ్ఛమైన వెండిని ఉపయోగించింది. రెండు అడుగుల వ్యాసం గల ఈ నాణెం బరువు 78.881 కిలోలు. సన్‌షైన్ మింటింగ్ కంపెనీకి చెందిన హస్త కళాకారులు దీనిని తయారు చేశారు.ఒకవైపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కాగడా ధరించిన చేతిని, నక్షత్రాలను; మరోవైపు గద్దను అమెరికా వైభవానికి ప్రతీకలుగా తీర్చిదిద్దారు. ఈ నాణెం ముఖవిలువ 250 డాలర్లు. దీనిని కస్టమ్ డిస్ప్లే బాక్స్‌లో పెట్టి, ప్రదర్శనకు అనువుగా భద్రపరచారు. ఇప్పటి వరకు ఇంత భారీనాణెం ఎక్కడా లేకపోవడంతో గిన్నిస్ బుక్ ఈ నాణేన్ని ప్రపంచంలోనే అతిపెద్ద నాణెంగా గుర్తించింది. టెక్సస్‌లోని ఆస్టిన్ నగరంలో దీనిని ప్రజల కోసం ప్రదర్శనకు పెట్టారు.ఇవి కూడా చదవండి: సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు! -
మెడ మెరిసేలా ఇలా చేయండి..! దెబ్బకు నలుపు మాయం
కళ్ల రక్షణ కోసం పర్యావరణానికి హానిచేయని హైడ్రోజెల్ మాస్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ మాస్క్ కంటికి అవసరమైన తేమను, పోషణను అందిస్తుంది. ఇది కాగితపు మాస్క్ కంటే భిన్నంగా, అత్యంత వేగంగా చర్మానికి తేమను అందిస్తుంది. జెల్ రూపంలో ఉండటం వల్ల ఇవి అధిక పరిమాణంలో తేమను, పోషక సీరమ్‌ను నిల్వ చేసుకుంటాయి. చర్మంపై ఉంచినప్పుడు ఈ జెల్ చల్లటి హాయిని ఇస్తూ, తేమను క్రమంగా విడుదల చేస్తుంది. ఈ మాస్క్‌ని ఉపయోగించడం పూర్తయిన తరువాత వేడినీటిలో వేస్తే పది సెకన్ల కంటే తక్కువ సమయంలోనే కరిగిపోతుంది. ఈ హైడ్రోజెల్ మాస్క్ ఉపయోగించడం కూడా సులభంగా ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే ఈ విధానం పర్యావరణ ప్రియులను, సౌందర్య ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.రాణిగారి జుట్టు రహస్యంఆస్ట్రియా రాణి ఎలిజబెత్ జుట్టు పాదాల వరకు ఉండేది. ఆమె తన జుట్టు సంరక్షణకోసం ఒక ప్రత్యేక మిశ్రమాన్ని వాడేవారు. గుడ్డు సొన, కొద్దిగా బ్రాందీ కలిపిన మిశ్రమాన్ని ప్రతి రెండు వారాలకొకసారి జుట్టుకు పట్టించేవారు. గుడ్డులోని ప్రొటీన్లు జుట్టుకు బలాన్ని ఇస్తే, బ్రాందీ తలలో ఉన్న నూనెలను శుభ్రం చేసి మెరుపును ఇస్తుందని ఆమె నమ్మేవారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత అందమైన, పొడవైన, ఒత్తైన జుట్టు కలిగిన రాణిగా ఆమె ప్రసిద్ధి చెందారు.మెడ మెరిసేలా!ముఖం మెరిసిపోతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మెడ వద్ద చర్మం నల్లగా మారుతుంటుంది. హార్మోన్ల అసమతుల్యత, మురికి పేరుకుపోవడం వల్ల వచ్చే ఈ నలుపును చిన్నచిన్న చిట్కాలతో ఇంట్లోనే సులభంగా తగ్గించుకోవచ్చు. పసుపు, శనగపిండి, పెరుగు– ఈ మూడింటిని కలిపి పేస్ట్‌లా చేసి మెడపై రాసి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. బంగాళాదుంపలో చర్మాన్ని ప్రకాశవంతం చేసే సహజ సిద్ధమైన సమ్మేళనాలు ఉంటాయి. బంగాళాదుంప రసాన్ని రోజూ మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే నలుపు త్వరగా మాయమవుతుంది. కలబంద జెల్‌ను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మెడకు మర్దన చేసి, ఉదయాన్నే కడిగితే చర్మం మృదువుగా మారడమే కాకుండా రంగు కూడా మెరుగుపడుతుంది. దోసకాయ రసంతో నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.(చదవండి: తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!) -
తలుపు: ‘మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం’.. నెలకే ఏమైంది?
పగడాలు కుటుంబం తూర్పు గోదావరి జిల్లా నుంచి హైద్రాబాద్‌కి వలస వచ్చింది. వారిది కొంకుదురు అనే చిన్న పల్లెటూరు. పగడాలు, ఆమె భర్త వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు.పగడాలు తమ్ముడు కొంకుదురు వచ్చినప్పుడల్లా ‘హైద్రాబాద్‌కి వెళ్తే బాగుపడని వారు లేరు. ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటాం’ అని ఆమెతో పదేపదే చెప్పడంతో, పగడాలు ఓ రోజు తన భర్తతో చెప్పింది.‘‘వెళ్ళి చూద్దాం. నచ్చకపోతే మళ్ళీ కోతల సమయానికి వచ్చేద్దాం.’’‘‘సరే, ఇక్కడ ఎటూ మనకి సంవత్సరం పొడుగూతా పని దొరకటం లేదు కదా.’’ అతను ఒప్పుకున్నాడు.అతని బావమరిది ఓ బిల్డర్ దగ్గర పని చేస్తున్నాడు. తన సూపర్వైజర్తో మాట్లాడి అక్కా బావలకి పని ఇప్పించాడు. ప్రతి శనివారం ఆ వారానికి చేసిన పనికి డబ్బు ముట్టడం ఆ దంపతులు ఇద్దరికీ నచ్చింది.వాళ్ళు ఓ స్లమ్‌లోని చిన్న గుడిసె అద్దెకి తీసుకుని దిగారు. రెండు సంవత్సరాల తర్వాత ఆ దంపతులకి సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన వచ్చింది. స్వంత స్థలం కొనేంత డబ్బు వారికి లేదు. మిగిలిన కూలీలు చేసే పనే వాళ్ళూ చేశారు. ఓ రౌడీకి నెల నెలా అద్దె చెల్లిస్తున్నంత కాలం ఓ పోరంబోకు స్థలంలో యాభై చదరపు గజాల మేర ఏదైనా కట్టుకోవచ్చు. రైలు పట్టాల పక్కనే కొత్తగా విస్తరించిన పట్టణంలో, అపార్ట్మెంట్స్ బాగా అభివృద్ధి చెందే చోటది. అది పనికి కూడా దగ్గర్లోనే ఉంటుంది.పగడాలు, ఆమె భర్త కాగితాలు లేని, నోటి మాట మీద నడిచే ఓ యాభైమంది గల చిట్టీలో చేరి, అవసరమైన సొమ్ముని తీసుకున్నారు.తనకున్న నైపుణ్యంతో పగడాలు భర్త, అతని బావమరిది ఆ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. సిమెంట్ ఖర్చు కాబట్టి బంక మట్టిని ఉపయోగించి గోడలని లేపారు. పైన నల్లటి టార్పాలి¯Œ ని కప్పుగా వేశారు. ఆ ఇంటికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. తలుపుకి డబ్బు చాలక తెర కట్టారు. ఓ శుభముహూర్తంలో గృహప్రవేశం చేశారు.స్వంత ఇల్లు అనేది వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. క్రమంగా వాళ్ళు ఆ ఇంటిని అభివృద్ధి చేసుకోసాగారు. ముందుగా పగడాలు భర్త లోపలి మట్టి నేల మీద గచ్చు చేశాడు. తర్వాత వర్షాకాలంలో గోడలని కాపాడటానికి బయటివైపు సిమెంట్ చేశాడు. ఆ తర్వాత పైన టార్పాలిన్ స్థానంలో సెకండ్ హేండ్ ఇనుప రేకులను కొని కప్పాడు. వాటికున్న చిల్లుల్లోంచి వర్షం కారకుండా వాటిని సీసంతో మూసేశాడు.ఆ తర్వాత గోడల లోపలి వైపు సిమెంట్ చేశాడు. వారు కూలీకి వెళ్ళి చేసే ఈ పనులన్నీ తమ స్వంతానికి చేస్తూండటంతో ఆ పనులు మునుపు ఇవ్వని ఆనందాన్ని ఇవ్వసాగాయి.పగడాలు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి తన భర్తని ఇంటికి తలుపు పెట్టించమని అడుగుతూనే ఉంది. తెర తీసుకుని ఎవరైనా, ఎప్పుడైనా లోపలికి రావచ్చు. రాత్రి తాము నిద్రలో ఉండగా దొంగ చొరబడొచ్చు. కాని ప్రతిసారి తలుపు కన్నా చేయాల్సిన ఇతర పనులే ముఖ్యం అవడం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది.ఇంట్లోని మట్టి నేలలో జెర్రులు తిరుగుతూండటంతో ఆ నేలని గచ్చు చేయించాల్సి వచ్చింది. వర్షాకాలంలో ఇటుకల మధ్య ఉన్న మట్టి కారి గోడలు కూలకుండా సిమెంట్ చేయాల్సి వచ్చింది. అరబస్తా సిమెంట్ మిగలడంతో అది వృథా కాకుండా దాంతో ఇంట్లో వంటకి ఓ చిన్న గట్టుని కట్టాడు. వర్షానికి కప్పు మీంచి గోడల మీదకి కారే నీటిని ఆపటానికి పైకప్పు వేయించాల్సి వచ్చింది. ఇలా వాళ్ళా ఇంట్లోకి ప్రవేశించాక తలుపు కన్నా మిగిలినవే ముఖ్యమైనవి అయ్యాయి.అవన్నీ పూర్తయ్యాక పగడాలు భర్త ముందు గోడకి గుమ్మం తెచ్చి పెట్టాడు. తర్వాతి సంవత్సరం తలుపుని అమర్చాడు.‘‘నాలుగేళ్లకి ఇది కుదిరింది. ఇంక దొంగలు ఎవరూ చొరబడరు. మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం.’’ పగడాలు ఆ రాత్రి తలుపు లోపల టవర్ బోల్ట్ పెట్టి సంతృప్తిగా చెప్పింది.తలుపు అమర్చిన నెల రోజులకి పగడాలు భర్త పనిలో జరిగిన ప్రమాదంలో మరణించాడు. అతని మరణం అందరికీ షాక్.∙∙ ఆ రాత్రి స్పర్శకి పగడాలుకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే ఓ మగాడు తనని తడుముతూ కనిపించాడు. ఆమె ఒక్క ఉదుటున బయటికి దూకి, తలుపు బయట గొళ్ళెం పెట్టి దొంగ అని అరవసాగింది. క్షణాల్లో ఆడ, మగ చాలామంది పక్క గుడిసెల్లోంచి లేచి వచ్చారు.ఆ దొంగ ఆమె పక్కింటివాడు. ఆమె భర్త వయసున్న అతను చిత్తూరు జిల్లా నుంచి వలస వచ్చాడు. అంతా అతనికి దేహశుద్ధి చేసి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలని తీర్పు చెప్పారు.మర్నాడు పగడాలు తన మరదలితో చెప్పింది.‘‘ఇంతకాలం నేను తలుపే రక్షణ ఇస్తుంది అనుకున్నాను. కాదు. తెర ఉండగా ఎన్నడూ వాడు రాలేదు. అప్పుడు నా భద్రతకి మా ఆయన అనే బలమైన తలుపు ఉందని నాకు తెలీలేదు. ఆడదానికి నిజమైన తలుపు మగాడే.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇవి కూడా చదవండి: ఈ వారం కథ: 'ఆత్మబలం' -
సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!
శారీరకం మానసికంగా ఉండే వైకల్యం ఎల్లప్పుడూ మన గమనాన్ని ఆపలేవు. అవి బలమైన సంకల్పం ముందు ఓడిపోతాయి. అందుకు ఉదాహరణ అనురాగ్ రావత్. ఒకప్పుడూ అతను ఎలా బతుకుతాడు, అతడి జీవితం ఎలా ఉంటుంది అని సందేహం వ్యక్తం చేసిన వాళ్లే ఆశ్చర్యపోయాలా స్ఫూర్తిదాయకంగా జీవిస్తున్నాడు.సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తున్న రావత్ భారతదేశంలో రెండోసారి ఎత్తైన ప్రదేశంలో పరుగును పూర్తి చేసి, తన ఫిట్నెస్ ప్రయాణంలో మరో అద్భుతమై మైలురాయిని అందుకున్నాడు. అతని ఘనతను ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా ఉంది. “సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూనే, 12,500 అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి, భారతదేశంలో ఒక వ్యక్తి దేశానికి ప్రపంచవ్యాప్త కీర్తిని తీసుకురావడం ఇది రెండోసారి” అని యూజర్ పేర్కొన్నాడు పోస్ట్‌లో. రావత్ మారథాన్లు, ఫిట్నెస్ ఛాలెంజ్‌లు, సాధారణ వ్యాయామాల్లో పాల్గొంటూ తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకునేవాడు. అది కాస్తా కాలక్రమేణా అతని పోస్ట్‌లకు రెండు లక్షలకు పైగా ఫాలోవర్లతో కూడిన ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకోవడానికి దారితీసింది. కాగా, రావత్‌కు రెండేళ్ల వయసులో సెరిబ్రల్‌పాల్సీ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆయన తన తండ్రి స్ఫూర్తితో సైన్యంలో చేరాలని కలలు కంటూ పెరిగాడు కానీ ఎనిమిదో తరగతితోనే చదువు మానేయక తప్పలేదు. చదువు మానేయడం రావత్‌కు చాలా కష్టంగా అనిపించినా తప్పలేదు. దాంతో అంతా అతడి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని అనుకున్నారు. చివరికి తనకంటూ ఒక మార్గాన్ని నిర్మించుకుని అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. అంతేగాదు రావత్ వీడియోలు చిత్రీకరించడం, ఎడిట్ చేయడం స్వయంగా నేర్చుకుని, పరుగు, జిమ్ వర్కౌట్లు, ఫిట్నెస్ ఛాలెంజ్‌లు, తోసహా తన దైనందిన జీవితానికి సంబంధించి ప్రతీ కంటెంట్‌ను పంచుకునేవాడు. అప్పటి నుంచే అతని జర్నీ యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అతన కంటెంట్ తన సామార్థ్యాలపై దృష్టిని సారిస్తోంది. పైగా ఆ వ్యాధి తన సామార్థాలను ఆపలేదు, పరిమితులను విధించలేదు అని చెబుతున్నట్లుగా ముందుగా సాగుతున్నాడు రావత్. నెటిజన్లు కూడా నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు మాకు స్ఫూర్తివి. వదిలేయడం అనేది రక్తంలోనే లేదు అనడానికి నువ్వే నిదర్శనం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by _अनुराग_रावत_🇮🇳 (@_the_distinctive_) (చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ) -
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
పెట్రోలు కొరతతో అల్లాడుతున్న క్యూబా.. ఇప్పుడు సరికొత్త దారిని ఎంచుకుంది! బస్సులు, ట్యాక్సీలు కనిపించాల్సిన రోడ్లపై.. సోలార్ ఆటోలు దూసుకెళ్తున్నాయి! చైనాలో తయారైన ఈ వాహనాలు క్యూబా రవాణా ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి!అమెరికా–ఇరాన్ యుద్ధం ఒకవైపు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా దేశాలు పెట్రోలు కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతూ వస్తోంది. అయితే, పెట్రోలు సమస్యను అధిగమించడానికి, ప్రజల రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయడానికి క్యూబా ఇటీవల సోలార్ ఆటోలను రంగంలోకి దించింది. చైనాలో తయారైన సోలార్ ఆటోలను దిగుమతి చేసి, స్థానిక ఆటో డ్రైవర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర ఒక్కొక్కటి రెండువేల నుంచి నాలుగువేల డాలర్ల వరకు ఉంటోంది. వీటిని ప్రజల రవాణాతో పాటు సరుకుల రవాణా కోసం కూడా వాడుతున్నారు. క్యూబా నగరాలు, పట్టణాల్లో ఒకప్పుడు బస్సులు, ట్యాక్సీలు తిరిగిన వీథుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ ఆటోలే దూసుకుపోతూ కనిపిస్తున్నాయి.ఇవీ చదవండి: ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా? -
ఆమె రచనల వెనుక దాగిన ఆ విషాద చరిత్ర ఏంటి?
కవితాత్మక వచన రచయిత్రిగా రాణించి, వచన కవనాల మధ్య సరిహద్దులు చెరిపేసిన సాహసి హాన్ కాంగ్. ఆమె 2024లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నారు. హాన్ కాంగ్ విజయానికి బలమైన నేపథ్యమే వుంది. అది ఆమె ఇంట్లో నెలకొన్న సాహిత్య వాతావరణం. హాన్ కాంగ్ తండ్రి, హాన్ స్యూంగ్ వాన్ ప్రముఖ కొరియన్ రచయిత– ఆమె అన్న హాన్ డాంగ్ రిమ్, తమ్ముడు హాన్ కాంగ్ యిన్ కూడా రచయితలే.కొరియా ద్వీపకల్పంలో ప్రవహించే హాన్ నది పేరే ఆమె వంశ నామం. ఆమె తొమ్మిదో యేట, హాన్ కుటుంబం సియోల్ సమీపంలోని సుయూ–రీ పట్టణప్రాంతానికి తరలిపోయింది. ఆమె తండ్రి ఉపాధ్యాయ వృత్తికి ఉద్వాసన చెప్పి పూర్తికాలం రచయితగా బతకాలని నిర్ణయించుకోవడమే దానికి కారణం. ఆ నిర్ణయం కాబోయే రచయిత్రి హాన్ కాంగ్ జీవితాన్ని చిన్న మలుపు తిప్పింది. 1982లో, ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంఘటన మరొకటి జరిగింది. తమ యింట్లో పడివున్న ఓ ఆల్బం హాన్ కాంగ్ కంటపడ్డమే ఆ మలుపు! 1980 మే నెలలో– హాన్ కుటుంబం సియోల్ సమీపంలోని ఓ శివారు పట్టణానికి తరలిపోవడానికి కొద్ది నెలల ముందు– దక్షిణ కొరియాలో గ్వాంగ్ జూ తిరుగుబాటు చెలరేగింది. అక్కడి సైనిక పాలకులు దాన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా అణిచేశారో ఆ ఆల్బం ద్వారా హాన్ కాంగ్ తెలుసుకోగలిగింది. సదరు ఆల్బంలోని ఫొటోలు తీసినవాడు యెర్గెన్ హింట్జ్–పియెర్ అనే పాత్రికేయుడు, ఫొటోగ్రాఫర్.ఇరవై మూడేళ్ళ వయసులో, కొరియన్ భాషాసాహిత్యాల్లో పట్టా పుచ్చుకుని, యోన్సెయ్ విశ్వవిద్యాలయం నుంచి బయటపడిన హాన్, కొంతకాలం పత్రికల్లో పనిచేసింది. అదే సంవత్సరం ఆమె ‘అచ్చులోన తన పేరును ముచ్చటగా’ చూసుకున్నారు! ‘సాహిత్యం–సమాజం’ అనే త్రైమాసిక పత్రికలో ఆమె రాసిన అయిదు కవితలు అచ్చయ్యాయి. మరుసటి సంవత్సరం ‘సియోల్ షిన్మున్’ అనే వార్తాపత్రిక నిర్వహించిన కథానికల పోటీలో హాన్ కథానిక ‘ఎర్ర లంగరు’ బహుమతి పొందింది.ఆ పై సంవత్సరం, అంటే 1995లో, హాన్ తొలి కథా సంకలనం ‘యోసూ– ఓ ప్రేమకథ’ విడుదలైంది. అందులోని ప్రతి ఒక్క వాక్యం –కాలెరిజ్ చెప్పినట్లు– ‘అత్యుత్తమ క్రమంలో పేర్చిన, ఉత్తమమైన పదాల’తో అలరారి, అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె తన జర్నలిస్టు ఉద్యోగాన్ని వదిలిపెట్టి, పూర్తికాలం రచనలకే కేటాయించే నాటికి, హాన్ వయసు అక్షరాలా పాతిక సంవత్సరాలు!2007లో, హాన్ జీవితం ఇంకో మలుపు తిరిగింది. ‘తీయగా చల్లగా పాడుకునే పాట’ శీర్షికతో ఆమె మరో కథాసంకలనం వెలువరించారు. హాన్ జియోంగ్–రిమ్ అనే సంగీతజ్ఞుడూ, సంగీత దర్శకుడు ఆ కథలన్నీ హాన్ సొంతగొంతులో పాడి వినిపించి తీరాలని పట్టుబట్టారట! ఆయన మాట కొట్టిపారేయలేక రచయిత్రి అలానే చేశారట! ఆ తర్వాత, ఆమె ప్రధానంగా నవలలపై దృష్టి కేంద్రీకరించారు. ఇంతవరకూ ఆమె ఏడు నవలలు వెలువరించారు. వాటిల్లో ‘శాకాహారి’ సుప్రసిద్ధం. ఈ మూడు భాగాల గొలుసుకట్టు రచనకు చిన్న నేపథ్యముంది.కొరియన్ కవయిత్రి యీ–సాంగ్ కవితలోని ‘మనుషులు మొక్కలైతే ఎంత బాగుంటుంది?’ అనే పాదంలోని అంతరార్థం ఏమిటనే అన్వేషణ హాన్‌లో విద్యార్థి దశలోనే మొదలైంది. యీ–సాంగ్ ఆ కవితను ఎప్పుడు రాశారు? దాని చారిత్రక నేపథ్యమేమిటి? అన్న ప్రశ్నలకు జవాబు వెతికే క్రమంలో కవయిత్రి హృదయం ఈ రచయిత్రికి బోధపడింది. అలా ‘శాకాహారి’ అనే నవలా త్రయానికి ఇతివృత్తం రూపొందింది. ఆ త్రయంలో రెండు–మూడు భాగాలుగా ‘మంగోలియన్ ముద్ర’, ‘అగ్నివృక్షం’ వెలువడ్డాయి.ఇరవయ్యో శతాబ్ది అంతం కాబోతోందనగా, హాన్–కాంగ్ విజయ ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. హాన్ నవలిక ‘బుద్ధ శిశువు’ 1995లో కొరియన్ నవలా పురస్కారం గెల్చుకుంది. ఇరవై ఒకటో శతాబ్ది తొలిపాదం ముగియబోతోందనగా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడంతో ఈ యాత్ర పతాకస్థాయికి చేరినట్లయింది. ‘శాకాహారి’ నవలా త్రయంలో ‘మంగోలియన్ ముద్ర’ 2005లో ‘యీ– సాంగ్ సాహిత్యపురస్కారం’ గెల్చుకుంది.పదకొండేళ్ళ తర్వాత ‘శాకాహారి’ నవలకు డెబోరా స్మిత్ చేసిన ఆంగ్లానువాదం అంతర్జాతీయ బుకర్ పురస్కారం గెల్చుకుంది. అదే సంవత్సరం– 2016లోనే– ‘ద న్యూ యార్క్ టైమ్స్ బుక్ రెవ్యూ’ ఎంపిక చేసిన పది ఉత్తమ రచనల జాబితాలో ఈ నవలకు స్థానం దక్కడం విశేషమే మరి! అదే సంవత్సరం హాన్ వెలువరించిన ‘మనుషుల చేతలు’ నవలకు అడల్ఫీ ఎడిజియోనీ చేసిన ఇటాలియన్ అనువాదం, ‘ప్రీమియో మలపార్టీ’ పురస్కారం గెల్చుకుంది.2021లో వెలువడిన హాన్ అయిదో నవల ‘మనం విడిపోం’ రెండేళ్ళ తర్వాత ఫ్రెంచ్ భాషలోకి అనువాదమై ‘ప్రీ మెడిసిస్’ పురస్కారం గెల్చుకుంది. ప్రతిభకు తగినంత పేరు పొందని రచయితలకిచ్చే పురస్కారమిది! హాన్ సాధించిన ఈ విజయంతో పాశ్చాత్య సాహిత్య ప్రపంచం పెద్దలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆ ఉలికిపాటుకు పర్యవసానమే, 2024లో హాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడం!- మందలపర్తి కిషోర్ఇవి కూడా చదవండి: నాన్నకు చేయాల్సిన కర్మలు వద్దన్నాడు.. చివరికి ఏం జరిగిందంటే? -
ఈ వారం కథ: 'ఆత్మబలం'
‘నేను ఇప్పట్లో ఇండియా రాలేను. ఫుల్ బిజీగా ఉన్నాను. మీరే చూసుకోండన్నయ్యా!’ ఇక అంతకన్నా చెప్పాల్సిందేమీ లేదన్నట్లు ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘అది కాదురా రాఘవా! నాన్న సంవత్సరీకానికయినా రాకపోతే ఎలారా? ఒకసారి ఆలోచించు.!’ ‘లేదన్నయ్యా! అర్థం చేసుకో! కావాలంటే వీడియో కాల్లో అటెండ్ అవుతానులే!’ అంటూ ఫోన్ కట్ చేశాడు రాఘవ.మాధవరావు, సుమతి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రామారావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. చిన్న కొడుకు రాఘవ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకుని, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్లిళ్లయి ఎవరికి వారు జీవిస్తున్నారు. తల్లి సుమతి పెద్ద కొడుకు రామారావు వద్దనే ఉంటుంది.మాధవరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొంది, అంతా సెటిల్ అయ్యారు అనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో సంవత్సరం క్రితం కాలం చేశాడు.యాభై సంవత్సరాల పాటు ఏమాత్రం అరమరికలు లేకుండా, అన్యోన్యంగా జీవించిన తమ బంధం భౌతికంగా వీడటంతో ఆనాటి నుంచి కుమిలి కుమిలి రోదిస్తూనే ఉంది సుమతి. అంత్యక్రియలు, కర్మకాండలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తే తన భర్త ఆత్మ శాంతిస్తుందని, ఆ విధంగానే శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని కొడుకులను కోరింది సుమతి. పెద్ద కొడుకు రామారావు ఆచార వ్యవహారాలను అనుసరిస్తుంటాడు. కానీ చిన్న కొడుకు రాఘవ మాత్రం ఆస్తికులకు నాస్తికులకు మధ్యలో ఉండి, కొన్నింటిని అనుసరిస్తూ, కొన్నింటిని త్యజిస్తూ ఉండే స్వభావం. అదీగాక తన తండ్రి తనకేమీ చేయలేదనే కోపంతో ఉంటుంటాడు. అన్నను చూసుకున్నట్లుగా తనను చూసుకోలేదని బాధపడుతుంటాడు. మాధవరావు చనిపోయిన రోజు అన్న రామారావు బలవంతం మీద అమెరికా నుంచి వచ్చి చివరి చూపు చూసి, అంత్యక్రియల్లో పాల్గొని, వెంటనే వెళ్లిపోయాడు.అంత్యక్రియల తర్వాత మాధవరావు కుటుంబ స్నేహితుడు నారాయణ శాస్త్రిగారితో మిగతా కర్మకాండల విషయమై చర్చించిన విషయాలు ఒక్కొక్కటిగా రామారావు మదిని తొలుస్తున్నాయి.ప్రతి నెలా మాసికం పెడుతూ, శాస్త్రోక్తంగా సంవత్సరీకం వరకు జరపాలని అమ్మ కోరడంతో పాటు, శాస్త్రిగారు కూడా శాస్త్రం ప్రకారం నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించాడు. దీనికి అసహనానికి గురైన రాఘవ, ‘శాస్త్రిగారూ! మళ్లీ ఇండియా నేను రాలేను. నన్ను ఇబ్బంది పెట్టకండి’ అనడంతోశాస్త్రిగారికి కోపం వచ్చి, ‘చిన్నపిల్లోడిలా మాట్లాడకు రాఘవా! నాన్న ఎంత నిష్టాగరిష్ఠుడో అందరికీ తెలుసు. నాన్న ఆత్మ శాంతించాలంటే సంవత్సరం వరకు అన్ని తిథులూ పెట్టాల్సిందే. ఆ విధంగా చేయకపోతే మీ కుటుంబానికే అరిష్టం.’ అని హెచ్చరించారు.‘భయపెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ఇక్కడ ఉన్నవాళ్లు చేస్తే చేసుకోండి.. నాకవసరం లేదు.’ అని రాఘవ కరాఖండిగా చెప్పాడు.‘కర్మాధికారంతో పెద్దవాడు కర్మ చేస్తున్నప్పటికీ, ఒకే చోట అన్నదమ్ములిద్దరూ ఈ క్రతువును చేయాల్సిందే. అంతేకాదు ఏటి సూతకం కూడా ఉంటుంది. సంవత్సరం పాటు మరే శుభకార్యాలు చేపట్టకూడదు. పితరుల ఆత్మశాంతికి, కుటుంబ సభ్యుల అభివృద్ధికి తర్పణాలు విడవాల్సిందే రాఘవా!’ హెచ్చరించాడు శాస్త్రిగారు.‘శాస్త్రిగారూ! ప్రతినెలా మాసికం, మధ్యలో వచ్చే తిథులు, ఇవన్నీ కాకుండా సంవత్సరానికి ఒకసారే పెట్టుకోవచ్చు కదా! మాకంతా టైం వేస్ట్. వ్యయ ప్రయాసలతో కూడినది. కాస్త ఆలోచించండి మా వైపు కూడా!’ రాఘవ తనకు అనుకూలమైన సమాధానాన్ని తెప్పించుకునేందుకు ప్రయత్నించాడు.‘పురాణాల ప్రకారం అంత్యక్రియలు, కర్మ కాండలు మరణానంతరం జీవికి శాంతి చేకూర్చడమే కాక, కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ధార్మిక సంప్రదాయాన్ని చాటుతాయి. సంవత్సరం వరకు కూడా ఆత్మ కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూనే ఉంటుంది. విధిగా అన్ని తిథులలో శ్రాద్ధాలు పెట్టాల్సిందే. సంవత్సర దీక్ష తప్పదు.’ అని శాస్త్రిగారు మరింత వక్కాణించడంతో, గుటకలు మింగిన రాఘవ..‘సరేలెండి! ఏం చేస్తాం!? నేను లేకపోయినా ప్రతినెలా అన్నయ్య ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. నేను సంవత్సరీకానికి వస్తాను. వీలైతే ప్రతి నెలా నేనక్కడ పెట్టుకుంటాలేండి.’ అసహనంగా చెప్పాడు రాఘవ.‘లేదు రాఘవ! అన్నదమ్ములిద్దరూ ఒకే చోట కలిసి చేయాల్సిందే. ఇది శాస్త్రమే కాదు. కలిసి మెలిసి ఉండే కుటుంబ ఐక్యత సూత్రం, మాసిక ధర్మాన్ని చాటుతుంది. నాన్నగారి ఆత్మశాంతికి ఆ మాత్రం సమయం కేటాయించలేవా..?‘ నిలదీస్తున్నట్లు ప్రశ్నించడంతో, చేసేది చేయొచ్చు ఈయనతో వాదనెందుకని మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవ.కొత్తగా పెళ్లయిన తన తమ్ముడిని ఇబ్బంది పెట్టటం ఎందుకనుకుని..‘సరే రాఘవ! కనీసం నాన్నగారి సంవత్సరీకానికైనా తప్పనిసరిగా నువ్వు, వనజ వచ్చేయండి.’ అన్నాడు. ముసిరిన జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాడు రామారావు. సంవత్సరీకానికైనా తమ్ముడొస్తే బాగుండు అనుకుంటూ, వచ్చే నెలలో వున్న నాన్న సంవత్సరీకం ఏర్పాట్ల ఆలోచనలో నిమగ్నమయ్యాడు.∙∙ ‘ఏవండీ! మామగారి సంవత్సరీకం వచ్చేనెల ఉంది కదా! ఇండియా వెళ్దామండి.’‘నీకేమైనా పిచ్చా? ఇక్కడ బోలెడన్ని పనులున్నాయి. అదేదో వాళ్లే చేసుకుంటారు. ఏదో ఒక సాకు చెప్పొచ్చులే.’ విసుగ్గా అన్నాడు రాఘవ.‘అదేంటండి అలా అంటారు? తండ్రికి శ్రాద్ధ కర్మలు పెట్టకపోతే, మనకు మంచిది కాదండి. ప్లీజ్ కొన్ని పాటించాలి. అయినా తండ్రి ఋణం తీర్చుకోవడం, ఆయన ఆత్మశాంతికి ఈ మాత్రం చేయడానికి వెనుకాడటం ఏమాత్రం బాగోలేదు.’ వనజ గట్టిగానే అంది.‘వనజా...నీకేం తెలియదు ఊరుకో! నాకేం చేశాడని మా నాయన? అందరిలాగే చదువుకున్నాను. సొంతంగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను. అన్నయ్యను చూసినట్లు నన్నేమైనా చూశాడా? ఆ రోజు ఏదో ఒకటి చెప్పి, అక్కడి కార్యక్రమం వీడియో కాల్లో చూసి ఓ నమస్కారం పెట్టేద్దాం సరిపోతుంది. ఎటువంటి సంస్కారాలు చేయనవసరం లేదు. ఇక నన్ను విసిగించకు.’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు రాఘవ.‘జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏంచేస్తే ఋణం తీరుతుంది? జీవించినంత కాలం సేవ చేయాలి. చనిపోయిన తర్వాత శ్రాద్ధకర్మలు పెట్టి వారి ఆత్మను శాంతింపచేయాలి.’ అంటూ రాఘవను కన్విన్స్ చేయబోయింది వనజ.‘ఏమోలే! పనికిరాని టాపిక్. ఎట్టి పరిస్థితుల్లో నాన్న తిథికి తిరిగి ఇండియాకు వెళ్ళేది లేనేలేదు.ఉన్నాడుగా అన్న... ఆయన చూసుకుంటాడులే. ఇక దాని గురించి వదిలేయ్! అవునూ! నాన్న అంత్యక్రియలకు వెళ్లినప్పుడు హైదరాబాదులో ఒక విల్లా చూశాను కదా! దానికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ వారం రోజుల్లో చెల్లిస్తాను.’ ‘అదేమిటండీ! మీకు మొన్ననే ఉద్యోగం కూడా పోయింది కదా, మళ్లీ ఇంకో ఉద్యోగం వచ్చేవరకు ఆగుదాం. పైగా మామగారు పోయి సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం లోపు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కదా! ఇప్పుడు డబ్బు కట్టడం అంత శ్రేయస్కరం కాదు, ఆలోచించండి.’ భర్తకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది వనజ.‘ఛత్! చాదస్తం మాటలు మాట్లాడకు. ఇవన్నీ ట్రాష్. మానసిక బలహీనతతో ఆడుకునే శాస్త్రాలు. వీటిని నమ్మను. సిద్ధాంతాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢత్వాలతో ప్రాక్టికల్ లైఫ్‌కు అడ్డం చెప్పకు. ఇప్పటివరకు నేను దాచుకున్న డబ్బుతో వచ్చేవారం అడ్వాన్స్ చెల్లిస్తాను.’ అంటూ ఒంటి కాలిపై లేచాడు రాఘవ. ఇక ఆ విషయం కొనసాగిస్తే భర్త సీరియస్ అవుతున్నాడని గ్రహించింది వనజ.‘సర్లేండి... రేపు ఆదివారం ఎక్కడికో వెళ్దామని చెప్పారు.’ టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేసింది వనజ.‘యస్. బాగా గుర్తు చేశావు. మనం రేపు పిక్నిక్కి వెళ్దామనుకున్నాము. కాస్త మనసన్నా రిలాక్స్డ్గా ఉంటుంది, వెళదాం.’ ఉద్యోగం, సంవత్సరీకం ఈ రంధి నుంచి కాస్తంత ఉపశమనం కావాలనుకున్నాడు రాఘవ.∙∙ ఆరోజు ఆదివారం సమీపంలోని వాటర్ ఫాల్ సైట్ సీయింగ్‌కు వచ్చారు రాఘవ, వనజలు. వాటర్ ఫాల్స్ సమీపంలో ఓ నది ప్రవహిస్తోంది. అందులో పర్యాటకులు బోటింగ్ షికారు చేస్తున్నారు.‘ఏవండీ..! మనం కూడా బోటింగ్ చేద్దామండి.‘ గోముగా అడిగింది వనజ.‘వామ్మో! నాకు నీళ్లంటే భయం. ఆడపిల్లవైనా మీ నాన్న నీకు ఈత నేర్పాడు. మీ మామగారున్నారే– అదే– మా నాయన– మా ఊరి చెరువులో కొన్ని రోజులే సగం వరకే ఈత నేర్పారు. పూర్తిగా నేర్చుకోకముందే నుమోనియా రావడంతో, ఇక నేర్పలేకపోయాడు. దాంతో నాకు ఈత రాకుండా పోయింది. అందులో కూడా ఆయన వల్లే ఫెయిలయ్యాను.’ అని గతాన్ని గుర్తు చేసుకుంటూ...‘వెళితే నువ్వు వెళ్ళు. నేను ఇక్క డే ఉంటాలే’ అన్నాడు.‘అదేంటండి చోద్యం కాకపోతే! షికారు ఎవరైనా ఒక్కరే చేస్తారా? జంటగా వెళితేనే సరదా ఉంటుంది. అయినా ప్రతి ఒక్కరికి బెల్టు పెడతారు. భద్రంగానే ఉంటుంది. మగవారయుండి అంత భయపడితే ఎలా? పదండి పోదాం.’ అనగానే తన ఇగో పనిచేసి, బోటింగ్‌కు సిద్ధమయ్యాడు రాఘవ.బోట్లో నదిలో కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట ప్రవాహం ఉద్ధృతమై, బోటులో చివర కూర్చున్న రాఘవ బెల్టు ఊడి అదుపు తప్పి నీళ్లలో పడిపోయాడు. పడీ పడగానే నీటిలో మునుగుతూ హాహాకారాలు చేస్తున్నాడు. భర్త ప్రమాదాన్ని గమనించిన వనజ వెంటనే నీటిలో దూకింది. కానీ ఇద్దరికీ పోను పోను చాలా దూరం పెరగడంతో, ఆమె రాఘవను అందుకోలేకపోతుంది. రాఘవ నీటిలో మునుగుతూ తేలుతూ, నీళ్లు మింగుతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.కాకతాళీయంగా పైకి ఒక్కసారి ఆకాశం వైపు చూపు పడిన రాఘవకు నాన్న ఆకారం కనిపించినట్లయింది. ఆనాడు తమ ఊరి చెరువులో నాన్న ఈత నేర్పిన దృశ్యం గుర్తుకొచ్చింది. టైరు మధ్యలో తనను కట్టి ఈత ప్రాక్టీస్ చేయించిన దృశ్యం కళ్ళ ముందు కదలాడింది.పైనుంచి నాన్న...‘కమాన్ రాఘవా! కమాన్! అలాగే చేతులు, కాళ్లు ఆడించి పైకి తేలు... మునగకు... శరీరాన్ని తేలికగా చేసుకో... కాళ్లు చేతులు వేగంగా ఆడించు కమాన్... కమాన్... అలాగే... ఇంకా ముందుకు... ఇంకా ముందుకు... అంటున్నట్లుగా, ఉత్సాహపరుస్తూ, తనకు మరోసారి ఈత నేర్పుతున్నట్లుగా అనిపించి తన శక్తినంత కూడ తీసుకొని ఈత కొడుతూనే ఉన్నాడు రాఘవ. ‘నీకు ఈత బాగా వచ్చు... బాగా ఈదుతున్నావు. వెరీ గుడ్... అలాగే వచ్చేయ్..! అలాగే...’ అంటూ వెన్ను తడుతున్నట్లుగా నాన్న ఆత్మదర్శనంతో రాఘవ మరింత బలాన్ని కూడతీసుకొని చేతులు కాళ్లు వేగంగా కదిలిస్తూ, నీటిపై తెలియాడటం మొదలెట్టాడు. ఇంతలో ఎవరో ఒకరు బలంగా ఒక్క తోపు తోసినట్లు అనిపించడంతో, ఒక్కసారిగా ఒడ్డు సమీపంలోని చిన్న చెట్టును అందుకోగలిగాడు. ఆ చెట్టు ఆసరాతో నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు రాఘవ. ఒడ్డుకు చేరిన రాఘవ అంత చల్లదనంలో కూడా చెమటలు కక్కుతూ, ప్రాణ భయంతో వణుకుతూ ఆయాసపడుతూ కూర్చున్నాడు. ఇంతలో వెనకనుంచి వచ్చి భర్తను పట్టుకున్న వనజకు దుఃఖం కట్టలు తెంచుకుంది.లోపల నుంచి పీలగా వస్తున్నట్లుగా, జీర గొంతుతో, రోప్పుతూ...‘వనజా... వనజా..! నాన్న కనిపించాడు. ఆత్మదర్శనమైంది.’ అంటూ తల పైకెత్తి చూపించాడు.‘నన్ను రక్షించింది... పునర్జన్మ నిచ్చింది నాన్నే వనజా..! ఆనాడు సగం నేర్పిన ఈత, ఈనాడు పైనుంచి పూర్తిగా నేర్పాడు. అంతేకాకుండా అదృశ్య శక్తిగా, నేను కొట్టుకుపోకుండా బలంగా ఒడ్డుకు నెట్టడంతో నేను బతికాను వనజా..!’ అంటూ వల వల ఏడుస్తున్న భర్త వైపు లాలనగా చూసింది వనజ.అంత బాధలోనూ ఆమె మోములో ఓ చిరుదరహాసం మెరిసింది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, ‘మీ సంకల్పం గొప్పది మామగారు..! ఎవరితో ఏ పని చేయించాలో ఆ పని చేయించే ఆత్మబలం మీది. మీ కుమారుడిని కాపాడటానికి ఆత్మ శక్తిగా సగం మీరు పనిచేస్తే, వేగంగా డైవ్ చేసుకుంటూ నా భర్తను రక్షించుకునే మిగతా సగం బాధ్యతను నేను పూర్తి చేశాను. నేను చేసిన ఆ సగం మీ అదృశ్య శక్తిగా విశ్వసిస్తున్న నా భర్తకు, మీపై కలకాలం అదే గౌరవం, నమ్మకం ఉండే విధంగా, ఈ విషయాన్ని మనసులోనే దాచుకుంటాను మామగారు.’ అంటూ వనజ చేతులెత్తి నమస్కరించింది.∙∙ ‘అన్నయ్యా..! నాన్న తిథికి నేనూ వనజ ఇద్దరం వచ్చేస్తున్నాం! అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయండి..! టికెట్లు కూడా తీసుకున్నాం.’ రామారావుకి ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘వనజా..వనజా.’ అంటూ గట్టిగా పిలిచాడు రాఘవ.‘ఏంటండీ..! ప్రతిదానికి హడావుడే... మీకు ఏదొచ్చినా తట్టుకోలేము. ఏంటో చెప్పండి.’ అంటూ వంటింట్లో నుంచి వచ్చింది వనజ.‘ఏం లేదు వనజా! గత నెల నాకు లేఆఫ్‌లో ఉద్యోగం పోయిందిగా... ఈ రోజు మెయిల్ వచ్చింది వేరే కంపెనీలో మరింత ప్యాకేజ్‌తో పైస్థాయి ఉద్యోగం వచ్చింది.’ అంటూ సంతోషంతో వనజను కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేశాడు రాఘవ.‘ఓహ్! సూపర్... మంచి వార్త చెప్పారు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. హైదరాబాదులో విల్లాకు అడ్వాన్స్ చెల్లించవద్దని మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అదేదో డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంలో ఉందట.’ వనజ చెప్పడంతో మరింత ఆనందంతో మరోసారి నాన్నను మనసులో తలచుకున్నాడు రాఘవ.‘యస్... వనజా..! సంవత్సరంలోపు శుభకార్యం మన చేత చేయించకుండా అడ్డుపడి, మనకు మేలు చేసింది మీ మామగారే. శాస్త్రాన్ని నమ్మకపోవడంతో చేయాల్సిన కర్మలు సరిగా చేయలేదేమో, అందుకే ఆ రోజున నాకు ఉద్యోగం పోయింది. నాన్న ఆత్మ దర్శనం కావడంతో, నాన్నపై విశ్వాసం పెరగడంతో, మళ్లీ పాత దానికన్నా పెద్ద ఉద్యోగం వచ్చింది. నిజంగా ఇది నాన్న ఇచ్చిన వరప్రసాదమే కదా వనజ!’ అంటూ ఆత్మ సంతృప్తితో ఆనందాన్ని వ్యక్తం చేశాడు రాఘవ. మంచి పరివర్తనతో తన భర్తలో వచ్చిన మార్పుకు వనజ లోలోన సంతోషించి, మామగారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మాధవరావు సంవత్సరీకానికి రాఘవ, వనజలు ఇండియా బయలుదేరారు.∙∙ ఇల్లు చేరీ చేరగానే అమ్మను పట్టుకొని, కుమిలి కుమిలి ఏడ్చాడు రాఘవ. ‘నాన్నను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా! నాకు నాన్న ఆత్మ దర్శనమైంది.’ అంటూ జరిగిందంతా చెప్పాడు. నేను మళ్ళీ బతికి నీ ముందున్నాను అంటే, నాన్న ఇచ్చిన పునర్జన్మేనమ్మా!’ అంటున్న రాఘవను పొదివి పట్టుకుని ఓదార్చింది సుమతి.‘నీకు ఇంకో విషయం చెప్పనా రాఘవా! నాన్న విషయంలో ఇంకోటి కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు. నాన్న నీకు చెరువులో ఈత నేర్పుతున్న కాలంలో, నాన్నకు న్యుమోనియా వచ్చింది. దాంతో పూర్తిగా ఈత నేర్పలేకపోయాడు.కాలం గడుస్తున్నా కొద్దీ, వ్యాధి ముదిరి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితుల్లోనే నీ అమెరికా ప్రయాణం రావడంతో చికిత్సకు వెచ్చించాల్సిన డబ్బును నీ అమెరికా ప్రయాణానికి, చదువుకు పెట్టాడు. సరైన సమయంలో చికిత్స లేకపోవడంతో, వ్యాధి ముదిరి ప్రాణాంతకమైంది. ఒక రకంగా తన ప్రాణాన్ని నీ చదువు, ఉన్నతికి పణంగా పెట్టాడు.అంతే కాదు రాఘవా..! నువ్వు అనుకున్నట్లు అన్నయ్యను ఎక్కువగా ఏమీ చూడలేదు. ఇంకా.. అన్నయ్యే నీకోసం త్యాగం చేశాడు తెలుసా..? మీ ఇద్దరికీ సమానంగా వచ్చిన వాటాలో, అన్నయ్యకు వచ్చిన ఎకరం పొలంలో సగం అమ్మి నీ చదువుల ఖర్చుకు పెట్టాడు. నీకు నాన్న, అన్నయ్యల పట్ల అపోహలు ఉండటంతో, ఇప్పటివరకు ఈ విషయాలు చెప్పలేకపోయాను. నీ అంతట నీవే పరివర్తన చెందావు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు చెప్పగలిగాను.’ అమ్మ చెబుతున్న విషయాలు వింటున్న రాఘవ ఒక్కసారిగా నిలువెల్లా ద్రవించిపోయాడు. అంతలో అప్పుడే అటుగా వస్తున్న రామారావును పరుగు పరుగున వెళ్లి గాఢంగా హత్తుకున్నాడు.‘నన్ను మన్నించు అన్నయ్యా...! నన్ను క్షమించు నాన్నా..!’ అంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతూ గుక్కపట్టి ఏడుస్తుంటే, అమ్మ, అన్నయ్యలు మరింత ప్రేమ పూర్వకంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు.‘ఇదే రాఘవా..! మన ఆత్మ బలం’ అని రామారావు తమ్ముడిని ఆప్యాయంగా నిమిరాడు.మాధవరావు సంవత్సరీకానికి కావలసిన ఏర్పాట్లను చర్చించటానికి అక్కడికి వచ్చిన నారాయణ శాస్త్రిని చూసిన రాఘవ కన్నీటిని ఆపుకోలేకుండానే‘శాస్త్రిగారూ...! నా మూర్ఖత్వానికి మన్నించండి.’ అంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. జరిగిందంతా తెలుసుకున్న నారాయణ శాస్త్రి ‘మాధవా..నీ ఆత్మ సంకల్పం గొప్పది.’ అనుకుంటూ మనసులోనే అభినందించాడు.‘కర్మాణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచనా... కర్తవ్యాన్ని చేయడమే నీ బాధ్యత, ఫలములపై ఎప్పుడూ హక్కు లేదు. ఇది నిష్కామ కర్మ సిద్ధాంతం రాఘవా!’ అంటూ వేదాంత ధోరణిలో వివరించాడు నారాయణ శాస్త్రి. ‘అంతేకాదు..! శాస్త్రం, శాస్త్రీయత, విశ్వాసం, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, విలువలు, కుటుంబ బంధాల మేళవింపే జీవిత సారం..! అదే మన ఆత్మబలం..!’ అని సత్ జీవన విధాన బోధ చేసిన నారాయణ శాస్త్రికి వినమ్రంగా నమస్కరించారు అందరూ.- మంత్రిప్రగడ శ్రీనివాసరావుఇవీ చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ -
మతిమరుపు నివారణ ఇలా..!
రక్తపోటు పూర్తిగా అదుపులో ఉండి, మధుమేహం (డయాబెటిస్) లేకుండా, పొగతాగకుండా ఉండేవారు... పై రెండు సమస్యలతోపాటు పొగతాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మతిమరపు (డిమెన్షియా) సమస్య లేకుండా దాదాపు 13 ఏళ్లు ఎక్కువకాలం జీవించినట్లు పరిశోధకులు గుర్తించారు. సగటున చూసిననప్పుడు పై మూడు అంశాలూ లేనివారు 30.1 ఏళ్ల పాటు డిమెన్షియా లేకుండా ఉంటే... డిమెన్షియాకు కారణమయ్యే ఆ మూడు రిస్క్ఫ్యాక్టర్లూ ఉన్నవారు 17.5 ఏళ్ల పాటే డిమెన్షియాను నివారించగలిగారు. ‘న్యూరాలజీ ఓపెన్ యాక్సెస్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన అమెరికాకు చెందిన ఓ అధ్యయనంలో సగటున 56 ఏళ్ల వయసున్న 12,409 మంది అడల్ట్స్‌ను సుమారు 28 ఏళ్ల పాటు పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధన కాలంలో వాళ్లలో 3,008 మందికి డిమెన్షియా వచ్చింది. డిమెన్షియా ముప్పు తెచ్చిపెట్టే పై మూడు అంశాలు ఉన్నప్పటికీ... సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో డిమెన్షియా తక్కువ. మతిమరపు లేకుండా మహిళలు ఎక్కువకాలం జీవించినట్లు కూడా ఈ అధ్యయనం తెలిపింది.‘‘హైబీపీ, డయాబెటిస్, పొగతాగే అలవాటు ఉన్నవాళ్లలో డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు... ఇతర కారణాలతో చిన్న వయసులోనే చనిపోయే అవకాశమూ ఎక్కువే. అంతేకాదు... ఈ అలవాట్లు ఉన్నవాళ్లలో ఆయు ప్రమాణమే కాదు... దాంతోపాటు జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలు పదిలంగా ఉండే సమయమూ తగ్గుతాయం’టూ ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు తెలిపారు.మరో అధ్యయనంలో సైతం ఇలాంటి ఫలితాలే... సరిగ్గా ఇదే అంశంపై స్వీడన్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఈ అధ్యయన ఫలితాలు ‘ది జర్నల్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దాదాపు 500 మంది ఆరోగ్యవంతులైన పెద్దలు పాల్గొన్న ఈ అధ్యయనంలో నాలుగేళ్ల పాటు వారిని పరిశీలించారు. ఈ అధ్యయనం చెబుతున్నదాని ప్రకారం... పొగతాగడం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వంటి అంశాలకూ మెదడులోని చిన్న రక్తనాళాలు, వైట్ మ్యాటర్ దెబ్బతినడంతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇలాంటి మార్పులు చివరకు రక్తనాళాలకు సంబంధించిన డిమెన్షియా (వాస్క్యులర్ డిమెన్షియా)కు దారితీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో అమైలాయిడ్ బీటా అనే ప్రోటీన్ ఎక్కువగా పేరుకుపోయే అవకాశం కూడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రోటీన్‌కు కూడా అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉంటుంది. వయసు, జెండర్, జన్యుపరమైన అంశాలను మనం మార్చలేం. అయితే పొగతాగే అలవాటును మానేయడం లేదా ఆ అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండటం, హైబీపీనీ, డయాబెటిస్‌నూ అదుపులో పెట్టుకోవడం వంటి అంశాలు పూర్తిగా మన చేతుల్లో ఉన్నవే. కాబట్టి కనీసం మధ్య వయసు నుంచైనా రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, పొగతాగడం మానేయడం, ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, శారీరకంగా చురుగ్గా ఉండటం వంటివి అలవాటు చేసుకుంటే... వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవెంతో కొంత తోడ్పడవచ్చన్నది నిపుణులు చెబుతున్న మాట.మతిమరపు లేకుండా అంటే... డిమెన్షియాను రానివ్వకుండా చాలాకాలం నిరోధించాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే చాలు. పైగా అవి చాలా సులభం కూడా. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, పొగతాగకపోవడం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం వంటి చాలా సులభమైన జీవనశైలి అలవాట్లతో దీర్ఘకాలం పాటు డిమెన్షియా బారిన పడకుండా ఉండటంట తోపాటు చాలాకాలం పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చంటూ రెండు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ జీవనశైలి అలవాట్లేమిటో చూద్దాం... (చదవండి: తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!) -
గడ్డం ఉంటే గమ్మత్తే! అస్సలు తగ్గేదేలే!!
షేవింగ్ మర్చిపోవడం వల్ల పెరిగిన గడ్డం... ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్‌లో ఫుల్‌టైమ్ హీరో! అందుకే, గడ్డాన్ని అడవిలా అడ్డదిడ్డంగా కాకుండా, అదిరిపోయేలా ఎలా పెంచాలి? ఎలాంటి ముఖానికి ఏ స్టయిల్ సెట్ అవుతుంది? ఎలా మ్యానేజ్ చేయాలి? వంటి విషయాలన్నీ సెప్టెంబర్ 7 ‘వరల్డ్ బియర్డ్ డే’ సందర్భంగా, కొన్ని సూపర్ బియర్డ్ ఫ్యాషన్ టిప్స్ మీకోసం!ముఖానికి తగ్గ గడ్డం!అభిమాన హీరోకి ఫుల్ బియర్డ్ బాగుందని మీరూ అలాగే పెంచేస్తే, మీ అద్దమే మిమ్మల్ని చూసి నవ్వే అవకాశం ఉంది. గుండ్రటి ముఖం ఉంటే కాస్త పొడవుగా కనిపించేలా గడ్డాన్ని షేప్ చేయండి. పొడవాటి ముఖం ఉంటే సైడ్స్‌లో కాస్త ఫుల్‌గా ఉంచవచ్చు. స్క్వేర్ ఫేస్‌కు షార్ట్ బాక్స్ బియర్డ్ లేదా స్టబుల్ బాగా సెట్ అవుతుంది.మీసం కూడా గడ్డం టీమ్‌లోనే!గడ్డాన్ని బాగా సెట్ చేసి... మీసాన్ని మాత్రం దేవుడి దయకు వదిలేయొద్దు! మీసం కూడా బియర్డ్ క్లాస్మేటే! షార్ట్ బియర్డ్‌కు నీట్ మీసం, ఫుల్ బియర్డ్‌కు కాస్త ఫుల్‌గా ఉండే మీసం బాగుంటుంది. గుర్తుంచుకోండి.. మీ మీసం నోట్లోకి వచ్చి టీ తాగేటప్పుడు టేస్ట్ చూస్తోందంటే, ట్రిమ్మింగ్ టైమ్ వచ్చిందన్న మాట!చిన్నదే కానీ చురుకుదనం ఎక్కువ!పూర్తి గడ్డం పెంచాలని లేదనుకుంటే, స్టబుల్ స్టయిల్ బెస్ట్. రెండు మూడు రోజుల గడ్డంలా కనిపించే ఈ లుక్ చాలా క్యాజువల్‌గా ఉంటుంది. అయితే దీనికీ కేర్ అవసరం! మెడ చుట్టూ, చెంపల దగ్గర అలా పెరగనిస్తే స్టయిలిష్ స్టబుల్ కాస్తా పాపం షేవింగ్‌కి డబ్బులు లేవు అనిపించుకోవచ్చు! అందుకే, ఎడ్జెస్ను ఎప్పుడూ నీట్‌గా ఉంచండి.ఫుల్ బియర్డ్... ఫుల్ బాధ్యత!గడ్డం పెంచడం అంటే, ముఖం మీద వెంట్రుకలకు ఫ్రీడమ్ ఇవ్వడం కాదు! దాన్ని మెయింటైన్ చేయడమే అసలు పరీక్ష! క్రమం తప్పకుండా ట్రిమ్ చేయండి. గడ్డం వెంట్రుకలు అటూ ఇటూ ఎగరకుండా దువ్వండి. అవసరమైతే బియర్డ్ ఆయిల్ లేదా బామ్ వాడి నీట్‌గా సెట్ చేసుకోండి.కాంబో ముఖ్యం!తల మీద ఒక సినిమా, గడ్డం మీద ఇంకో సినిమా వద్దు! హెయిర్‌కట్‌ను కూడా బియర్డ్ స్టయిల్‌కి తగ్గట్టుగా ఎంచుకోవడం మంచిది. షార్ట్ హెయిర్‌తో షార్ట్, మీడియం బియర్డ్, కొంచెం లాంగ్ హెయిర్‌తో ఫుల్ బియర్డ్ వంటి కాంబినేషన్లు బాగుంటాయి.నెక్లైన్ మర్చిపోతే... గేమ్ ఓవర్!చాలామంది గడ్డం ముందు భాగాన్ని మాత్రమే ట్రిమ్ చేసి, మెడ కింద పెరిగే వెంట్రుకలను అలాగే వదిలేస్తారు. అప్పుడు ఎంత మంచి బియర్డ్ స్టయిల్ అయినా నీట్‌గా కనిపించదు. కాబట్టి నెక్లైన్ ను క్రమం తప్పకుండా షేప్‌లో ఉంచండి.కలర్స్ ప్లే!గడ్డంలో కాస్త బ్రౌన్ , గ్రే లేదా సాల్ట్ అండ్ పెప్పర్ షేడ్స్ కనిపిస్తున్నాయా? వాటిని వెంటనే దాచేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రే బియర్డ్‌ను చక్కగా ట్రిమ్ చేసి, హెయిర్‌తో మ్యాచ్ చేస్తే చాలా క్లాసీ లుక్ వస్తుంది.బట్టలకు బియర్డ్‌తో సంబంధం ఉంది!బియర్డ్ ఉన్నవాళ్లు సింపుల్ టీషర్ట్, డెనిమ్, షర్ట్, కుర్తా... ఏదైనా క్యారీ చేయొచ్చు. నీట్‌గా ట్రిమ్ చేసిన బియర్డ్‌తో ఫార్మల్ షర్ట్ క్లాసీగా కనిపిస్తుంది. ఫుల్ బియర్డ్‌తో డెనిమ్ జాకెట్ లేదా కుర్తా కాస్త బోల్డ్ లుక్ ఇస్తుంది.కడగండి... పెంచొద్దు!ఇది చాలా ముఖ్యం! గడ్డం అంటే కేవలం పెంచుకోవడం కాదు, శుభ్రంగా ఉంచుకోవడం కూడా! తిన్నది, తాగింది, దుమ్ము అన్నీ గడ్డంలో డెస్ట్ బిన్ కలెక్షన్ లా అవ్వకముందే క్లీన్ చేసుకోండి!ఇవి కూడా చదవండి: తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు! -
మనిషి శరీరం లేకుండానే మెదడు ఎదగగలదా?
ఒక చిన్న మిరియం గింజంత పరిమాణం. కానీ అందులో స్పందించే శక్తి, ఎదిగే జీవం!! ల్యాబ్‌లో మానవ కణాలతో సృష్టించిన ఆ మిరియపు గింజంత మెదడు భాగాలు (ఆర్గనాయిడ్స్) కొన్ని నెలలో, ఏడాదో కాదు... తొలిసారిగా ఏడేళ్ల పాటు విరామం లేకుండా జీవించి ఉండి, శాస్త్రవేత్తలనే విస్మయానికి గురిచేస్తున్నాయి. మెదడు రహస్యాలను ఛేదించే ఈ అపూర్వ ప్రయోగం, వైద్య రంగాన్ని మలుపు తిప్పే ఒక అద్భుత ఘట్టం! అందుకే ఇప్పుడిది శాస్త్ర పరిశోధనా రంగంలో అత్యంత ఆశాజనకమైన ముందడుగుగా నిలిచింది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, మన తలలోని నిజమైన మెదడు.. కాలంతో పాటు ఎలా వికసిస్తుందో, ల్యాబ్‌లోని ఈ చిన్న మెదడు కణాలు కూడా సరిగ్గా అలాగే వయసుతోపాటు (కాలంతో పాటు) ఎదుగుతూ వచ్చాయి! అంతేకాదు, ఇవి తమ పెరిగిన ‘సమయ గమనాన్ని’ తమలో నమోదు చేసుకోవటం కూడా పరిశోధకులు గుర్తించారు. అంటే, మనలాగా చిన్ననాటి పుట్టినరోజు వేడుకల జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునే తెలివితేటలు వీటికి ఉన్నాయని కాదు. ఇవి పెరిగే క్రమంలో ఏయే మార్పులు దాటుకుంటూ వచ్చాయో, ఆ సమాచారం మొత్తం వాటి కణాల లోపల ఒక గుర్తులా ముద్రపడి ఉంది! అందుకే సైంటిస్టుల పాలిట ఈ బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ పరిశోధన ఒక కల్పవృక్షం అయింది.బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అంటే?బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అనేవి ల్యాబ్‌లో మానవ స్టెమ్ సెల్స్ (మూల కణాలు) ఉపయోగించి తయారు చేసిన అతి చిన్న, 3–డి రూపంలో ఉండే మెదడు కణజాల నమూనాలు. అయితే ఇవి మన తలలో ఉండే నిజమైన మెదడుకు చిన్న రూపాలు మాత్రం కావు. ఇవి మెదడు ఎదుగుదలకు సంబంధించిన కొన్ని లక్షణాలను మాత్రమే పోలి ఉంటాయి తప్ప, నిజమైన మెదడులో ఉండే సంక్లిష్టమైన నిర్మాణాలు లేదా నరాల అనుసంధానాలు వీటికి ఉండవు. కాకపోతే వీటి ద్వారా న్యూరాన్లు, వాటికి సహాయపడే ఇతర మెదడు కణాలను పెంచవచ్చు.అలాగే మనుషుల ప్రారంభ మెదడు ఎదుగుదల ఎలా ఉంటుందో కూడా వీటి ద్వారా పరిశీలించవచ్చు. అసలు మెదడు ఎలా పెరుగుతుంది; నాడీ వ్యవస్థ, మెదడు ఎదుగుదలకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఎలాంటి లోపాలు జరుగుతాయి అనేది అధ్యయనం చేయడానికి పరిశోధకులకు ఈ ప్రయోగాలు ఉపయోపడతాయి. మరొక అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక రోగి సొంత కణాల నుండి కూడా ఈ ఆర్గనాయిడ్స్‌ను తయారు చేయవచ్చు. దీనివల్ల నిర్దిష్టమైన జన్యు మార్పులు మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పరిశోధకులు సులభంగా తెలుసుకోవచ్చు.పరిశోధన కాలక్రమం2019: డాక్టర్ పౌలా అర్లోటా నేతృత్వంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ మూల కణాల నుండి 3–డి ఆర్గనాయిడ్లను (మిరియపు గింజ పరిమాణంలో ఉండే చిన్న మెదడు కణజాలాలు) తయారు చేయడం ప్రారంభించారు. కణాలు ఎక్కువ కాలం జీవించడానికి వీలుగా వాటికి ప్రత్యేకమైన పోషక ద్రావణాన్ని అందించారు.తొలి మూడు నెలలు: ఈ ల్యాబ్ మెదళ్లు మానవ పిండం మొదటి మూడు నెలల మెదడు ఎదుగుదలకు సమానమైన జన్యు సంకేతాలను, ప్రారంభ నాడీ కణాలను ప్రదర్శించడం ప్రారంభించాయి!6–12 నెలల మధ్య: మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి, ఇవి విద్యుత్ సంకేతాలను ప్రసారం చేయడం, సైనాప్స్ (రెండు నాడీ కణాల మధ్య ఉండే సమాచార మార్పిడి కేంద్రం) ను ఏర్పాటు చేసుకోవడం, గ్లియల్ మద్దతు కణాలను (నాడీ కణాలకు నిరంతరం సహకరిస్తూ వాటిని సంరక్షించే సహాయక కణాలు) అభివృద్ధి చేయడం ప్రారంభించాయి.1–2 సంవత్సరాలు: రెండు సంవత్సరాలకు పైగా ఇవి సమన్వయంతో కూడిన విద్యుత్ సంకేతాలను కొనసాగించాయి. నాడీ తంత్రువులపై రక్షణ పొర అయిన ‘మైలిన్’ ఏర్పడటం ప్రారంభమైంది. ఇది పుట్టిన తర్వాత శిశువు మెదడులో జరిగే మార్పులకు సమానంగా ఉంది.3–5 సంవత్సరాలు: సింగిల్–సెల్ ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్, డీఎన్ఏ మిథైలేషన్ పరీక్షల ద్వారా, ఈ కణాలు పిండం దశ నుండి చిన్నపిల్లల మెదడు కణాల జన్యు లక్షణాలకు మారటం కనిపించింది.5 సంవత్సరాల తర్వాత: శాస్త్రవేత్తలు పాత ఆర్గనాయిడ్ కణాలను, కొత్త కణాలతో కలిపినప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఈ పాత కణాలు ప్రారంభ దశలను దాట వేసి, నేరుగా తదుపరి దశ నాడీ కణాలను తయారు చేశాయి! అంటే తమకు ఎంత వయస్సు ఉందో గుర్తుపెట్టుకునే ‘ఎపిజెనెటిక్ క్లాక్’ కణాలు వృద్ధి చెందినట్లు పరిశోధకులు గమనించారు.2026 ఆగస్టులో 7 ఏళ్ల రికార్డు వెల్లడి: హార్వర్డ్ బృందం తమ పరిశోధన ఫలితాలను ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురించింది. మానవ మెదడు కణాలు శరీరం వెలుపల కూడా 7 ఏళ్ల పాటు జీవించడమే కాకుండా, కాలాన్ని కూడా గుర్తుంచుకోగలవని అధికారికంగా నిరూపణ అయింది.- ప్రొఫెసర్ పౌలా ఆర్లోటా, హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్పెద్ద లోటు భర్తీ అయిందిబ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అనేవి మన నిజమైన మెదడు కంటే చాలా సరళమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీటికి బయటి ప్రపంచం నుండి ఎలాంటి స్పర్శ కానీ, జ్ఞానేంద్రియ సమాచారం కానీ అందవు. అందుకే వీటికి స్పృహ, ఆలోచించే శక్తి, ఆత్మజ్ఞానం లేదా మెదడుకు ఉండే ఏ ఇతర ఉన్నత స్థాయి శక్తులు ఉండవు. అయినప్పటికీ, ఇవి మన నిజమైన మెదడు తీరును పోలి ఉంటాయి కాబట్టి మెదడు ఎదుగుదలను, వ్యాధులను అర్థం చేసుకోవడానికీ పరిశోధకులకు ఇవి ఒక అద్భుతమైన ‘బయోలాజికల్ మోడల్’గా ఉపయోగపడతాయి. అయితే ఇంతవరకు ఇందులో ఒక పెద్ద సమస్య ఉండేది. ఈ ఆర్గనాయిడ్స్ ల్యాబ్‌లో ఎదిగే క్రమంలో కొన్ని నెలలు మాత్రమే బతికేవి. దీనివల్ల పరిశోధనల్లో ఏర్పడిన పెద్ద లోటును, ఇప్పుడు ఏడేళ్ల పాటు బతికిన ఈ కృత్రిమ మెదడు కణాలు భర్తీ చేసే ఆవకాశాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.ఆర్గనాయిడ్లలో ఆలోచనలు!శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా కృత్రిమ మెదడు కణాలకు కావాల్సిన సరైన పరిస్థితులను అందించి, వాటిని ఏడేళ్ల సుదీర్ఘ కాలం పాటు సజీవంగా ఉంచగలిగారు. ఆ తర్వాత కణాల జీవసంబంధ వయస్సును అంచనా వేసే మూడు కొత్త ‘జెనెటిక్ క్లాక్స్’ ఆధారంగా వీటిని పరీక్షించారు. ఆశ్చర్యకరంగా, నిజమైన మెదడులోని కణాలు కాలక్రమేణా ఎలాగైతే రూపాంతరం చెందుతాయో, ఈ ఆర్గనాయిడ్ కణాలు కూడా సరిగ్గా అలాగే వయసు పైబడుతూ, ఆ ఎదుగుదలకు సంబంధించిన ‘కణాల జ్ఞాపకాలను’ తమలో భద్రపరుచుకున్నాయని తేలింది! ‘హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్’ ప్రొఫెసర్ పౌలా ఆర్లోటా చెబుతున్న దానిని బట్టి – ‘‘మనుషులతో సంబంధం లేకుండా, వారి శరీరాల బయట కూడా మానవ మెదడు ఇంత సుదీర్ఘకాలం పాటు పెరుగుతూ ఉండటం నిజంగా ఒక సంచలనం! భవిష్యత్తులో ఈ పరిశోధన ఆటిజం, స్కీజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక, నరాల సమస్యలు అసలు ఎలా మొదలవుతాయి, కాలక్రమేణా ఎలా తీవ్రం అవుతాయి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది’’.విస్తృతంగా మస్తిష్క ప్రయోగాలునిజానికి ఇప్పటికే అల్జీమర్స్, పార్కిన్సన్స్, వెన్నుపాము గాయాలకు చికిత్సలు కనిపెట్టడానికి ఈ ఆర్గనాయిడ్లపై విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో భాగమే ‘యాక్సోనిస్ థెరప్యూటిక్స్’ అనే బయోటెక్నాలజీ సంస్థ చేసిన ఒకానొక ప్రయోగం! నాడీ వ్యవస్థలోని కణాలకు ప్రయోజనకరమైన జన్యు చికిత్సను అందించడానికి వీరు ఒక వైరస్‌ను ప్రత్యేకంగా రీప్రోగ్రామ్ చేశారు. ఈ చికిత్స ఎంతవరకు పనిచేస్తుందో పరీక్షించడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పెంచిన బ్రెయిన్ ఆర్గనాయిడ్స్‌ను ఉపయోగించారు. ఎందుకంటే అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ (తక్కువ గురుత్వాకర్షణ) వాతావరణంలో ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. అయితే ఈ కృత్రిమ మెదడు భాగాలు అసలు ఎంత కాలం బతుకుతాయి అనేది ప్రస్తుతం సైంటిస్టులకు కూడా ఒక మిస్టరీనే. వీటికి జబ్బులు పడటానికి గానీ, ఇన్ఫెక్షన్లు రావడానికి గానీ నిజమైన శరీరం ఏదీ ఉండదు కాబట్టి.. సైద్ధాంతికంగా చూస్తే ఇవి ఒక సాధారణ మనిషి కంటే కూడా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని ప్రొఫెసర్ ఆర్లోటా అంటున్నారు. ప్రస్తుతానికైతే వీటి ఆయుష్షు ఎంతో శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు.దిగ్భాంతిగొల్పిన ‘కైమీరా’! కణాల వయసు పెరిగే తీరును ఇంకా లోతుగా పరిశోధించడానికి, ప్రొఫెసర్ ఆర్లోటా ఒక ‘పిచ్చి ప్రయోగం’ చేశారు! ఏడాది వయసున్న కృత్రిమ మెదడు కణాలను తీసుకుని, కేవలం రెండు వారాల వయసున్న కృత్రిమ మెదడు కణాలతో కలిపి ఒక కొత్త ‘కైమీరా’ను తయారు చేశారు. రెండు వేర్వేరు జీవులకు లేదా రకాలకు చెందిన కణాలను కలిపి తయారు చేసిన ఒక కొత్త జీవి లేదా కణజాలమే ‘కైమీరా’.ఇందులో చిన్న వయసు కణాలు సాధారణంగానే స్పందించినప్పటికీ, పెద్ద వయసు కణాలు మాత్రం ఒక పెద్ద వింతను ప్రదర్శించాయి. అవి తమ ఎదుగుదల క్రమంలో చాలా ముందుకు దూసుకెళ్లిపోయాయి! అసలు సాధారణంగా రూపుదిద్దుకోవడానికి నాలుగు నెలల సమయం పట్టే నాడులను ఈ పెద్ద కణాలు తక్షణం తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రయోగం మెదడు ఎదుగుదల విషయంలో ‘సమయాన్నే మార్చేసిందని’, ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ ఆర్లోటా అభివర్ణించారు. మున్ముందు జరగబోయే ప్రయోగాల కోసం మెదడు కణాల ఎదుగుదలను వేగవంతం చేయడానికి ఈ వినూత్న కైమీరా పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశిస్తున్నారు. దీనివల్ల వయసు పైబడినప్పుడు వచ్చే మెదడు సంబంధిత సమస్యలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఏకంగా 20 ఏళ్ల పాటు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు!- సాక్షి స్పెషల్ డెస్క్ఇవీ చదవండి: ‘ఇదే నా ఇల్లు.. ఈయనే నా రాజు!’ పురావస్తు శాస్త్రవేత్తలకే షాక్! -
తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!
అలర్జీలతో బాధపడుతున్నప్పుడు దానికి కారణాలేమిటంటూ ఒక్కోసారి తలబద్ధలు కొట్టుకుంటూ ఉంటాంగానీ... ఒక్కోసారి అవి మన తల దగ్గరా లేదా మన కాళ్ల కిందా కూడా ఉండవచ్చు. అంటే... ఒక్కోసారి మన తలగడలోనే డస్ట్‌మైట్స్ నివసిస్తూ ఉండవచ్చు. లేదా మన కాళ్ల కింద ఉండే కార్పెట్లలోనైనా ఉండవచ్చు. దాదాపు 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 వరకు డస్ట్‌మైట్స్ ఉండవచ్చని ఒక అంచనా. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) డస్ట్ మైట్స్ ఉండవచ్చు. ఒక పరుపులో కనీసం కోటి డస్ట్‌మైట్స్ ఉంటాయని కూడా ఒక అంచనా. దుమ్ము కారణంగా అలర్జీ కలుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి దుమ్ములోని ఈ డస్ట్‌మైట్స్ వల్లనే అలర్జీ వస్తుంది. అవి విసర్జించే విసర్జకాల కారణంగా ఈ అలర్జీలు కలుగుతుంటాయి. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఒక్కోసారి ఆ అలర్జీలు కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు. అందుకే... ఈ అలర్జీలను నివారించడానికి తాము ఉపయోగించే తలగడ తాలూకు పిల్లో కవర్లను తరచూ ఉతికి శుభ్రపరిచి వాడాలి. అలాగే వాక్యూమ్ క్లీనర్ల సహాయంతో మన కార్పెట్లను కూడా క్రమంతప్పకుండా శుభ్రపరుస్తూ ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది. (చదవండి: ఎంపీ సుప్రియా సూలే ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! 50 ఏళ్ల వయసులోనూ..) -
‘ఇదే నా ఇల్లు.. ఈయనే నా రాజు!’ పురావస్తు శాస్త్రవేత్తలకే షాక్!
అది 1907... లండన్‌లోని ఓ సువిశాలమైన భవనం... డోరతి లూయిస్ ఈడీ అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ మెట్లపై నుంచి జారి కిందపడిపోయింది. తలకు గట్టి దెబ్బ తగలడంతో ఎలాంటి చలనం లేదు. వెంటనే వైద్యుడు వచ్చి పరిశీలించారు. ‘పాప శ్వాస ఆడటంలేదు. గుండె కొట్టుకోవడంలేదు. ఆమె చనిపోయింది’ అని చెప్పడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.కొద్దిసేపటికే అద్భుతం జరిగింది. చనిపోయిందనుకున్న ఆ చిన్నారి కళ్లు తెరిచి, ‘అమ్మా...’ అని పిలిచేసరికి శోకసంద్రంలో ఉన్న ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఎందుకంటే, బతికిన ఆ పాప డోరతీ ఈడీ కాదు ప్రమాదం తర్వాత డోరతి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంగ్లిష్ కుటుంబంలో పుట్టిన ఆ చిన్నారి, స్పష్టమైన బ్రిటిష్ యాక్సెంట్ మరచిపోయి, వింతైన ప్రాచీన ఈజిప్షియన్ శైలిలో మాట్లాడటం మొదలుపెట్టింది.నిద్రలో లేచి కూర్చుని ‘నన్ను మా ఇంటికి తీసుకెళ్లండి... ఇది నా ఇల్లు కాదు’ అని ఏడ్చేది. తలకు దెబ్బ తగలడం వల్ల పాప మానసిక స్థితి సరిగ్గా లేదని తల్లిదండ్రులు భావించేవారు. కానీ రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఒకరోజు డోరతిని ఆమె తల్లిదండ్రులు బ్రిటిష్ మ్యూజియానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న పురాతన ఈజిప్ట్ విగ్రహాలు, ఫారోల శిల్పాలను చూడగానే డోరతి కళ్లు మెరిసిపోయాయి. ఒక్కసారిగా ఆ విగ్రహాల వైపు పరుగెత్తుకెళ్లి, వాటి పాదాలను ముద్దాడి, గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.ఒక ఫారో ప్రతిమను చూపిస్తూ, ‘ఇదిగో... ఇది నా ఇల్లు. ఈయన నా రాజు సెటి–1’ అని బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అయోమయం చెందారు.ఆ తర్వాత ఆమెకు ప్రాచీన ఈజిప్ట్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరిగింది. ఈజిప్టు చరిత్ర, హైరోగ్లిఫిక్స్, దేవాలయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది.కొంచెం పెద్దయ్యాక తన గతజన్మ గురించిన జ్ఞాపకాలను స్పష్టంగా వివరించడం ప్రారంభించింది. తన పేరు బెంట్రెషిట్ అని, మూడేళ్ల వయసులో తల్లి చనిపోగా, తండ్రి తనను వదిలేయడంతో అబిడో‹స్లోని సెటి–1 ఆలయ పూజారి తనను పెంచినట్టు చెప్పింది.అక్కడ పూజారిణిగా ఉన్న తాను కఠినమైన బ్రహ్మచర్యం పాటించాలని, కానీ ఈజిప్ట్ రాజు సెటి–1 ఆ ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు తమ ఇరువురి మధ్య ప్రేమ చిగురించి గర్భవతిని అయ్యానని చెప్పింది. విషయం బయటకు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భావించి, ఆత్మహత్య చేసుకున్నానని పేర్కొంది. తనకు రాత్రివేళల్లో ‘హోర్–రా’ అనే ఆత్మ కనిపించేదని ఆమె చెప్పింది. ఆ ఆత్మ తన గతజన్మ కథను నెమ్మదిగా చెప్పేదని, దాన్ని తాను హైరోగ్లిఫిక్ లిపిలో రాసుకున్నానని పేర్కొంది.డోరతి మాటలను ప్రపంచం మొదట్లో పట్టించుకోలేదు. ఆమెను ఓ పిచ్చి వ్యక్తిలానే చూశారు. అయితే, ఆమె పెద్దయ్యాక ఇంగ్లండ్ వదిలి ఈజిప్ట్ చేరుకుంది. అక్కడ ఈజిప్షియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటిక్విటీస్‌లో పనిచేసే పరిశోధకులతో తన గతజన్మ వివరాలను పంచుకుంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఆమె చెప్పేది నిజమో కాదో తేల్చడానికి సిద్ధమయ్యారు. ‘అబిడోస్ సెటి–1 ఆలయం’ వద్ద ఆమెకు కఠినమైన పరీక్ష పెట్టారు.చీకటి పడిన తర్వాత, ఎలాంటి వెలుతురు లేని సమయంలో డోరతిని ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. గతంలో అక్కడ ఉన్న కుడ్య చిత్రాల లొకేషన్లు, భూగర్భంలో దాగి ఉన్న తోటల అమరికను గుర్తించమన్నారు. ఆ చీకటిలోనే ప్రాచీన కుడ్య చిత్రాలతోపాటు రాజభవన తోటల సరిహద్దులు ఎక్కడున్నాయో చెప్పడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఆమె సూచించిన ప్రదేశాలను పరిశీలిస్తే, అక్కడి పురాతన నిర్మాణాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం వారిని ఆశ్చర్యపరచింది.ఈ విషయం అలా బయటకు రావడంతో ఈజిప్షియన్లు ఆమెను గౌరవంతో ‘ఓమ్ సెటి’ అని పిలవడం ప్రారంభించారు. అనంతరం ఈజిప్షియన్ వ్యక్తిని వివాహం చేసుకున్న డోరతికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి సెటీ అని పేరు పెట్టారు. జీవితాంతం గతజన్మ తాలూకు జ్ఞాపకాలతోనే బతికిన డోరతి 1981లో కన్నుమూసింది.ఆమె నిజంగానే బెంట్రెషిటా? లేక ప్రాచీన ఈజిప్ట్‌పై ఉన్న చిన్ననాటి మక్కువ ఒక అసాధారణమైన మానసిక ప్రపంచాన్ని సృష్టించిందా? డోరతి చెప్పిన విషయాల్లో చరిత్ర ఎంత? జ్ఞాపకం ఎంత? ఊహ ఎంత? ఈ ప్రశ్నలకు శాస్త్రం ఇప్పటికీ తుది సమాధానం ఇవ్వలేదు. కానీ, లండన్ లో పుట్టిన ఓ చిన్నారి.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబిడోస్ అనే పురాతన నగరంతో ఏర్పరచుకున్న అనుబంధం సాధారణ కథ కాదు.డోరతీ ఈడీ చనిపోయింది. కానీ ‘ఓమ్ సెటీ’గా ఆమె వదిలిన మిస్టరీ మాత్రం ఇంకా బతికే ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇవి కూడా చదవండి: ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా? -
104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ
జీవిత చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడికి కోర్టు స్వేచ్ఛ ప్రసాదించింది. శిక్షా కాలాన్ని రద్దు చేసింది. 30 ఏళ్ల జైలు జీవితానికి ‘సుప్రీం’ తీర్పుతో తెరపడింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాలో పాతకక్షల నేపథ్యంలో ఓ హత్య జరిగింది. రసిక్‌చంద్ర మండల్ అనే వ్యక్తిపై హత్యానేరం కింద అభియోగాలు నమోదయ్యాయి. అప్పుడు అతని వయస్సు 68 ఏళ్లు. ట్రయల్ కోర్టు 74 ఏళ్ల వయసులో యావజ్జీవ శిక్ష విధించింది. 104 ఏళ్ల వయసులో మధ్యంతర బెయిల్ మంజూరైంది. వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉన్న అతడ్ని తిరిగి జైలుకు పంపకూడదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం అతని వయస్సు105 ఏళ్లు.1998 నవంబరు8న మాల్దా జిల్లాకు చెందిన సురేష్ మండల్ తన ఇంట్లో భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో రసిక్‌చంద్ర మండల్‌తో పాటు మరికొందరు అక్రమంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి సురేష్‌పై కాల్పులు జరిపిఅక్కడి నుంచి పరారయ్యారని వారిపై అభి యోగం నమోదైంది. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను అతడి భార్య, చుట్టుపక్కల వారు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మాల్దా సర్దార్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత సురేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై మాణిక్ఛక్ పోలీస్‌స్టేషన్‌లో నిందితులపై ఐపీసీ సెక్షన్ 302/34, ఆయుధాల చట్టం సెక్షన్ 25/27 కింద కేసులు నమోదయ్యాయి. ట్రయల్ కోర్టులో విచారణమాల్దా అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. నిందితులు తాము నిర్దోషులమని వాదించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలకు, మృతుడి భార్య వాంగ్మూలానికి మధ్య అనేక వైరుధ్యాలున్నాయని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రసిక్‌చంద్ర, మరో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ 1994లో తీర్పు ఇచ్చింది. రెండో నిందితుడికి ఆర్మ్స్ యాక్ట్ కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అదనంగా విధించింది. మిగిలిన నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాల్లో చుక్కెదురు ట్రయల్ కోర్టు తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. మృతుడి బంధువుల సాక్ష్యం చెల్లదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని రెండో నిందితుడు పేర్కొన్నాడు. పలు సాక్ష్యాలను కోర్టు ముందుంచాడు. ఇరుపక్షాల వాదనలు, మెడికల్ రికార్డులు పరిశీలించిన హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అంశాలేవీ కనిపించలేదని పేర్కొంటూ అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. దీంతో మండల్ 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సరైన ఆధారాలు లేవని ఈ అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 99 ఏళ్ల వయసులో మధ్యంతర బెయిల్ మండల్ 30 ఏళ్లు జైలులోనే ఉన్నాడు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా ముందస్తు విడుదల కోరుతూ 99 ఏళ్ల వయసులో 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మండల్ శారీరక, ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి అతడ్ని విడుదల చేయాలని ఆదేశించింది. అప్పటికి అతని వయసు 104 ఏళ్లు. 2026లో సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. అతని వయసును పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్వేచ్ఛను ప్రసాదించింది.. ‘వృద్ధాప్యం, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును ముగిస్తు్తన్నాం. మిగిలిన శిక్షాకాలాన్ని మాఫీ చేస్తున్నాం’ అని సీజే బెంచ్ తీర్పు ఇచ్చింది. జీవిత ఖైదు శిక్షాకాలం పూర్తి కాకపోయినా అతడ్ని మళ్లీ కస్టడీలోకి తీసుకోరని ధర్మాసనం పేర్కొంది. 2024లో మండల్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వును తుది ఉత్తర్వుగా వెల్లడించింది. ఈ కేసులో మండల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించలేదు; దోషిగా నిర్ధారించిన తీర్పునూ మార్చలేదు. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో జీవిత ఖైదును కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. శిక్ష నుంచి విముక్తి కల్పించింది. మానవీయ ముగింపును ఇచ్చింది.దిలీప్ మాదిరెడ్డి(చదవండి: చిన్నారులు ఏఐ నేర్చుకునేలా శృతి ధరివాల్ గేమ్ స్ట్రాటజీ..!) -
సంకష్టహర చతుర్థి వ్రతం.. తన జీవితాన్నే మార్చేసింది!
పూర్వం హైహయ వంశానికి చెందిన కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు అమిత బలసంపన్నుడు, ధర్మపరాయణుడు. అతడి భార్య సుగంధి. సంపదలకు లోటు లేకున్నా, వారికి సంతానమే లేదు. సంతాన ప్రాప్తికి వారు చేయని వ్రత, దాన, యజ్ఞ యాగాలు లేవు. ఎన్ని చేసినా, పురాకృత పాపఫలితంగా వారికి సంతానం కలగలేదు.సంతాన రాహిత్యంతో రాజదంపతులు నిరాశలో కూరుకుపోయారు. రాజ్యాన్ని, సంపదను అమాత్యులకు విడిచి, తపోనిష్ఠతో కాలం గడపడానికి అడవులకు బయలుదేరారు. అడవులలో వారు కఠిన నియమాలను పాటిస్తూ, తపోనిష్ఠలో కాలం గడపసాగారు. కేవలం చెట్ల నుంచి రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుండటంతో కృశించిపోయారు. వారు ధ్యానంలో ఉన్నప్పుడు వారి శరీరాలను క్రిమి కీటకాదులు తినేయసాగాయి. కొన్నాళ్లకు రాజదంపతులు శల్యావశిష్టులుగా మిగిలారు.ఒకనాడు గగనమార్గాన పోతున్న త్రిలోక సంచారి నారద మహర్షి కృతవీర్య దంపతుల పరిస్థితిని గమనించాడు. ఆయన వెంటనే పితృలోకానికి చేరుకుని, అక్కడ కృతవీర్యుడి తండ్రి వద్దకు వెళ్లి, ‘మర్త్యలోకంలో నీ కొడుకు, కోడలు సంతానం కోసం అలమటిస్తూ, తపశ్చర్యలో నిమగ్నులై, శల్యావశిష్టులుగా మిగిలారు. వారి పరిస్థితి నేడో రేపో అన్నట్లుగా ఉంది.’ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు.దారిలో నారదుడికి ఒక దారుణ దృశ్యం కనబడింది. భృంశ మహర్షి తల్లిదండ్రులు, బంధువులు కుంభీపాక నరకంలో అధోముఖులై వేలాడుతూ, యమభటుల దండనలకు తాళలేక హాహాకారాలు చేస్తున్నారు. ఈ దృశ్యం చూసి, నారదుడు విచలితుడయ్యాడు. వెంటనే, భృంశుడి వద్దకు వెళ్లాడు. ‘మహర్షీ! నువ్వు సాక్షాత్తు సర్వజ్ఞుడవు. సాక్షాత్తు గణేశ సమానుడవు. కపిలాది మహర్షులు నీ దర్శనం కోరి వస్తుంటారు. అలాంటి నీ తల్లిదండ్రులు, బంధువులు నరకంలో యమబాధలు అనుభవిస్తుండటం బాధ కలిగిస్తోంది. నీ పూర్వుల నరక విమోచనం కోసం చేయదగిన పరిహారం ఏదైనా ఉంటే, నువ్వు ఉపేక్షించక దానిని వెంటనే ఆచరించు’ అని పలికాడు.నారదుడి ద్వారా తన పితరుల బాధలు తెలుసుకున్న భృంశుడు చింతాక్రాంతుడై, కొద్దిసేపు ఆలోచించాడు. తాను ఏళ్లతరబడి ఆచరిస్తూ వచ్చిన సంకష్టహర చతుర్థి వ్రతఫలంలో ఒకరోజు వ్రతఫలాన్ని ససంకల్పితంగా తన పితరులకు ధారపోశాడు. అతడు తన వ్రతఫలాన్ని ధారపోసిన వెంటనే భృంశుడి పితరులందరూ నరక కూపం నుంచి విముక్తి పొందారు. దేవతలు తీసుకువచ్చిన దివ్యవిమానంలో వారందరూ స్వర్గానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, నారదుడి ద్వారా తన కుమారుడి పరిస్థితి తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి బ్రహ్మలోకానికి వెళ్లి, ‘బ్రహ్మదేవా! నా కుమారుడు కృతవీర్యుడు సంతానం లేకపోవడం వల్ల తపోనిష్ఠలో శల్యావశిష్టుడిగా మిగిలాడు. నా కుమారుడి సంతానలేమికి కారణమేమిటి? అతడి పురాకృత పాపకర్మ నశించడానికి తగిన తరుణోపాయమేది? నువ్వే చెప్పాలి’ అని అడిగాడు.‘నీకు నీ తనయుడి పూర్వజన్మ విశేషాలు చెబుతాను, విను. నీ రాజ్యంలోనే సామ అనే దుష్టుడు ఉండేవాడు. అతడు నిష్కారణంగా పన్నెండుమంది బ్రాహ్మణులను వధించి, వారి మృతదేహాలను ఒక కొండగుహలో పారవేశాడు. ఒకనాడు అతడికి పొద్దుగూకే వరకు ఎక్కడా తిండి, నీళ్లు దొరకలేదు. అలసి సొలసి పొద్దు గూకిన తర్వాత ఇంటికి చేరుకున్న మరుక్షణమే, తన కొడుకును ‘గణేశా! గణేశా!’ అని పిలిచాడు. కొడుకుతో కలసి భోజనం చేశాడు. సామకు తెలియకున్నా, ఆరోజు మాఘ కృష్ణ చతుర్థి. మరికొన్నాళ్లకు అదే తిథినాడు సామ కాలధర్మం చెందాడు. సంకష్టహర చతుర్థినాడు తెలియక చేసిన పుణ్యఫలితంగా మరణానంతరం స్వర్గానికి చేరుకున్నాడు. ఆ పుణ్యశేషం వల్లనే నీకు కొడుకుగా పుట్టాడు. పురాకృత పాపకర్మ మిగిలి ఉండటం వల్ల అతడికి సంతానం కలగలేదు’ అని బ్రహ్మదేవుడు చెప్పాడు.‘విరించీ! పాపాకర్మ పరిహారానికి తరుణోపాయమేమిటో నువ్వే చెప్పు’ అడిగాడు కృతవీర్యుడి తండ్రి.‘సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమానుసారం ఆచరిస్తే, అతడికి పాప విముక్తి కలుగుతుంది’ అని చెప్పి, వ్రత విధానాన్ని వివరించాడు బ్రహ్మదేవుడు.బ్రహ్మదేవుడి ద్వారా సంకష్టహర వ్రత విధానాన్ని తెలుసుకున్న అతడు తన కొడుకు వద్దకు చేరుకుని, ‘కృతవీర్యా! పురాకృత పాపకర్మ ఫలితంగానే నీకు సంతానం కలగలేదు. సంకష్టహర చతుర్థివ్రతం ఆచరించినట్లయితే, నీకు పాపవిమోచనం కలిగి, సంతానం కలుగుతుంది’ అని చెప్పి, బ్రహ్మదేవుడు చెప్పిన వ్రత విధానాన్ని బోధించాడు.కృతవీర్యుడు పత్నీసహితంగా నియమానుసారంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. అతడి పాపకర్మ నశించింది. కొన్నాళ్లకు కృతవీర్యుడి భార్య సుగంధి గర్భం దాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. అయితే, అతడికి చేతులు లేవు. పెరిగి పెద్దయ్యాక అతడు తీవ్ర తపస్సుతో దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని, సహస్రబాహువులు పొందాడు. సహస్రబాహు అర్జునుడిగా, కార్తవీర్యార్జునుడిగా పేరు పొందాడు.- సాంఖ్యాయనఇవి చదవండి: ఒకనాటి ఆదివారం -
ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా?
వైరస్లు, బ్యాక్టీరియాల వంటి ఇతరేతర రోగకారక జీవకణాలు ప్రకృతిలో అసంఖ్యాకంగా ఉన్నవే మనకు తెలుసు. ఏఐ సాయంతో వీటిని కృత్రిమంగా కూడా సృష్టించడం సాధ్యమేనని ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రకృతిలో లేని పదహారు వైరస్‌లను కొత్తగా సృష్టించారు. ఏఐతో కృత్రిమ వైరస్లు, ఇతరేతర జీవకణాలను సృష్టించే పరిజ్ఞానం వల్ల జరగబోయే మేలేమిటి? వాటిల్లబోయే కీడేమిటి? శాస్త్ర సాంకేతిక రంగాల్లో చర్చకు దారితీస్తున్న ఈ అంశం గురించి తెలుసుకుందాం...నిజానికి నిండు కణం కూడా కాదు – జీవకణాల్లో ఉండే ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏతో కూడిన అతిసూక్ష్మ కణశకలం. ప్రొటీన్ కవచంతో ఉండే ఈ కణశకలమే వైరస్. ఇది ఏదైనా జీవకణంలోకి చొరబడితే, అసంఖ్యాకంగా వృద్ధి చెందుతుంది. అలవికాని అలజడి సృష్టిస్తుంది. జీవకణాల మనుగడకు ముప్పు తెస్తుంది. జీవుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. జీవకణాలతో రూపొందిన మనుషుల శరీరాలలోకి రకరకాల వైరస్లు చొరబడుతుంటాయి. వీటిలో కొన్ని వైరస్లు ప్రాణాంతక వ్యాధులను కూడా కలిగిస్తాయి. వైరస్ ధాటి ఎలా ఉంటుందో ‘కోవిడ్–19’ ద్వారా ఇప్పటి ప్రపంచానికి బాగా బోధపడింది.ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసినవి ప్రకృతిలో పుట్టిన వైరస్లు మాత్రమే! ఇటీవల శాస్త్రవేత్తలు ఏఐతో పదహారు సరికొత్త వైరస్లు సృష్టించారు. ఇవి ఇంతవరకు ప్రకృతిలో ఎక్కడా లేనివి. ప్రస్తుతానికి ఏఐ సాంకేతికతతో సృష్టించిన వైరస్లు సానుకూల ఫలితాల కోసమే రూపొందించినవి. ఇదే సాంకేతికతతో ప్రమాదకరమైన వైరస్‌లను సృష్టించే అవకాశం కూడా ఉండటమే ఆందోళనకు కారణమవుతోంది. ప్రపంచంలో కలకలం రేపుతున్న ఈ ‘కృత్రిమ కణ’కలం గురించి ఈ ప్రత్యేక కథనం...ప్రకృతిలో ఉన్న వైరస్లతోనే మానవాళి ఇప్పటికీ సతమతవుతుంటే, తాజాగా ఏఐతో తయారైన కృత్రిమ వైరస్లు పుట్టుకొచ్చాయి. ఏఐ సాయంతో వైరస్లు, ప్రొటీన్ కణాలను రీడిజైన్ చేసే ఈ కొత్త ప్రక్రియకు శాస్త్రవేత్తలు ‘సింథటిక్ బయాలజీ’ అనే పేరు పెట్టారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఏఐ సాంకేతికతో పదహారు కొత్త వైరస్‌లను తయారు చేశారు. ఈ వైరస్లు ఇదివరకు ప్రకృతిలో ఎక్కడా లేనివి. స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఏఐకి వైరస్ల డీఎన్ఏ నమూనాలను ఇచ్చి, వాటి ఆధారంగా కొత్తగా పదహారు వైరస్ జీనోమ్లను రూపొందించారు. ఇవి బ్యాక్టీరియా కణాల్లోకి చొరబడి వాటిని నాశనం చేయగలవు. లాబొరేటరీల్లో జరిపిన పరీక్షల్లో ఈ పదహారు వైరస్లు ఇ–కోలి బ్యాక్టీరియా కణాలను విజయవంతంగా అరికట్టగలిగాయి.స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, కంప్యూటేషనల్ బయాలజిస్ట్ డాక్టర్ బ్రియాన్ హై ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఏఐకి వైరస్ల డీఎన్ఏ నమూనాలను ఇచ్చి, వాటిలో తాము కోరుకున్న మార్పులను సూచించి, ఇదివరకు ప్రకృతిలో ఎక్కడాలేని పదహారు సరికొత్త వైరస్‌లను సృష్టించింది. కొత్త వైరస్ల సృష్టి కోసం ఏఐ రూపొందించిన జీనోమ్ నమూనాలకు ‘ఇవో–1’, ‘ఇవో–2’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ వైరస్‌లను ప్రధానంగా మానవాళికి హాని చేసే ‘ఇ–కోలి’ తరహా బ్యాక్టీరియాలను తుదముట్టించే లక్ష్యంతో రూపొందించారు. ఈ ప్రయత్నంలో భాగంగా డాక్టర్ బ్రియాన్ హై నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం నిజానికి వందలాది కృత్రిమ వైరస్ నమూనాలను ఏఐ సాయంతో పరీక్షించింది. వీటిలో పదహారు వైరస్లు మాత్రమే శాస్త్రవేత్తలు ఆశించినట్లుగా బ్యాక్టీరియా కణాలను నిర్మూలించగలిగాయి.శాస్త్రవేత్తల జాగ్రత్తలుఏఐ సాయంతో కృత్రిమ వైరస్‌లను సృష్టించడంలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏఐకి వైరస్ జన్యు సమాచారం ఇవ్వడంలో గరిష్ఠస్థాయి అప్రమత్తత పాటించారు. ఏఐకి కేవలం బ్యాక్టీరియాను నిర్మూలించగలిగే ‘బ్యాక్టీరియోఫేజ్’ వైరస్ల జన్యు సమాచారం మాత్రమే ఇచ్చారు. ఇందులోంచి మనుషులకు, జంతువులకు, మొక్కలకు సోకే వైరస్ జన్యు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో ఉనికిలో ఉన్న వైరస్‌లకే జన్యు ఉత్పరివర్తనలు జరపడం మాత్రమే చేస్తూ వచ్చారు.ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా జన్యు విశ్లేషణల కోసం, జన్యు మార్పిడి సూచనలు తెలుసుకోవడం మాత్రమే దానిని వాడుతూ వచ్చారు. ఇప్పుడు తొలిసారిగా ఏఐతోనే వైరస్ జీనోమ్‌లకు రూపకల్పన చేసి, కొత్త వైరస్‌లను సృష్టించారు. ఏఐ అందించిన జీనోమ్ నమూనాల ఆధారంగా ప్రయోగశాలలో సృష్టించిన ఈ వైరస్లు పూర్తిస్థాయి కృత్రిమ వైరస్లు. జీవశాస్త్ర ప్రయోగాల్లో దీనినొక గొప్ప మైలురాయిగా కొందరు శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఏఐ సాయంతో రూపొందించే కృత్రిమ వైరస్ల ద్వారా సాధించగల సానుకూల ఫలితాల గురించి వారు చాలా విశేషాలే చెబుతున్నారు. అయినా, ఏఐ కృత్రిమ వైరస్‌లను సృష్టించగలగడం పట్ల శాస్త్ర సాంకేతిక వర్గాల్లోనే కాకుండా, అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో కూడా కొన్ని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.- డాక్టర్ బ్రియాన్ హైఇవీ సానుకూలతలుఏఐ సాయంతో కృత్రిమ వైరస్‌లను సృష్టించడం ఇదివరకటి ప్రక్రియల కంటే చాలా సులువైనది. దీని వల్ల చాలావరకు సమయం కలిసొస్తుంది. ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇదివరకు లాబొరేటరీల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో రకరకాల ప్రయత్నాలు సాగిస్తే తప్ప వైరస్లలో ఆశించిన జన్యు ఉత్పరివర్తనలు తీసుకురావడం సాధ్యమయ్యేది కాదు. ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడిన ప్రక్రియ. ఇప్పుడు ఏఐకి ఈ పని అప్పగించడం వల్ల వేగంగా ఫలితాలు వస్తున్నాయి. ఏఐ తనకు అందించిన జీవ సమాచారాన్ని శరవేగంగా ఆకళింపు చేసుకుని, కొత్త జన్యు నమూనాలకు రూపకల్పన చేయగలుగుతోంది.బ్యాక్టీరియాను నాశనం చేయగల వైరస్‌లను ఏఐ సాయంతో సృష్టించడం ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తేవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారి వాదన ప్రకారం ఇప్పటికే కొన్ని ప్రమాదకరమైన వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా కణాలు యాంటీ బయోటిక్స్‌ను తట్టుకునే శక్తిని సంతరించుకున్నాయి. వీటిని అరికట్టడానికి మరింత శక్తిమంతమైన యాంటీ బయోటిక్స్‌ను తయారు చేసే బదులుగా ఏఐ సాయంతో తయారు చేసిన వైరస్‌లనే ఆయుధాలుగా ఉపయోగిస్తే సత్ఫలితాలను సాధించవచ్చని చెబుతున్నారు.శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఏఐ సాయంతో కృత్రిమ వైరస్ల సృష్టి వల్ల కలిగే ఉపయోగాలు ఇవీ:1. వ్యాక్సిన్లుఏఐ సాంకేతికతతో రూపొందించిన కృత్రిమ వైరస్‌లతో మెరుగైన వ్యాక్సిన్లను తయారు చేయడం సులువుగా మారుతుంది. కృత్రిమ వైరస్‌లతో తయారు చేసిన వ్యాక్సిన్ల ద్వారా ప్రమాదకరమైన వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను శాశ్వతంగా అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రమాదకర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్న వైరస్లలో జరగబోయే ఉత్పరివర్తనలను ముందుగానే ఏఐతో అంచనా వేసి, వాటిని అరికట్టే వ్యాక్సిన్లను తయారు చేయడానికి కూడా వీలవుతుంది.2. జన్యు చికిత్సజన్యు వ్యాధులను నయం చేయగల జన్యుచికిత్స పద్ధతులు మరింత తేలికవుతాయి. జన్యులోపాల వల్ల తలెత్తే వ్యాధులను నయం చేయడానికి జన్యువులను సరిచేసే పదార్థాలను జన్యుకణాల్లోకి పంపాల్సి ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఏఐ సాంకేతికతతో తయారు చేసే హానికరం కాని ‘ఆర్టిఫిషియల్ వైరల్ వెక్టర్స్’ను జన్యుకణాల్లోకి పంపడం ద్వారా జన్యులోపాలను సవరించడం సులువుగా మారుతుంది. ఈ ‘ఆర్టిఫిషియల్ వైరల్ వెక్టర్స్’ ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని కలిగించకుండా, లోపాలు ఉన్న జన్యుకణాలకే నేరుగా జన్యు పదార్థాలను చేరవేస్తాయి.3. క్యాన్సర్ చికిత్సఏఐ సాయంతో రూపొందించే కృత్రిమ వైరస్‌లతో క్యాన్సర్ చికిత్స మరింత మెరుగుపడుతుంది. ఏఐ సాయంతో క్యాన్సర్ కణాలను నిర్మూలించగలిగే ‘ఆంకోలైటిక్ వైరస్’లను రూపొందించవచ్చు. ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇవి ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా, క్యాన్సర్ కణాలనే నిర్మూలిస్తాయి. క్యాన్సర్ చికిత్సలో ఇప్పటికే వాడుకలో ఉన్న రేడియో థెరపీ, కీమో థెరపీ వంటి పద్ధతులు తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుండటం తెలిసిందే! ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’ అందుబాటులోకి వస్తే, క్యాన్సర్ రోగులకు ఈ చికిత్స వరంగా మారుతుంది.4. ఫేజ్ థెరపీకృత్రిమ వైరస్లు ‘యాంటీబయెటిక్ రెసిస్టెన్స్’కు విరుగుడు కాగలవు. వీటి ద్వారా చేసే చికిత్సను ‘ఫేజ్ థెరపీ’ అంటున్నారు. ‘ఫేజ్ థెరపీ’లో ఉపయోగించే కృత్రిమ వైరస్లు అత్యంత శక్తిమంతమైన యాంటీ బయోటిక్‌లకు లొంగని జగమొండి బ్యాక్టీరియా కణాలను సైతం నిర్మూలించగలవు.ఇంకొన్ని ఇబ్బందులుఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా, ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్‌లతో కొన్ని ఇబ్బందులు తప్పవు. ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండే వైరస్లు మన శరీరంలోకి చేరితే, వాటిని ఎదుర్కోవడానికి మన శరీరంలో ఎంతో కొంత నిరోధకత ఉంటుంది. మన శరీరంలోని యాంటీబాడీలు వైరస్‌లతో శక్తిమేరకు పోరాటం సాగిస్తాయి. కృత్రిమ వైరస్లు శరీరంలోకి చేరి వ్యాధులను కలిగిస్తే, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించలేదు.మన శరీరంలోని యాంటీబాడీలు వాటితో పోరాడే ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. పైగా, వాటిని అరికట్టే మందులు, వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉండవు. కృత్రిమ వైరస్‌లను కట్టడి చేసే మందులు, వ్యాక్సిన్లు రూపొందించడానికి చాలా కాలమే పట్టవచ్చు. ఏఐ సాంకేతికత శరవేగంగా విస్తరిస్తోంది గాని, దానిని నియంత్రించే చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలు ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ సాంకేతికతను వాడుకుని సృష్టించే కృత్రిమ వైరస్ నమూనాలను డిజిటల్ డేటా ఆధారంగా గుర్తించడం దుస్సాధ్యం.ఇక భయాలెందుకు?ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్‌లతో ఇన్ని సానుకూలతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే, వీటిపై భయాలెందుకు? అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. కృత్రిమ వైరస్‌లపై శాస్త్రవేత్తల సమూహం నుంచే భయాలు వ్యక్తమవుతున్నాయి. వారి భయాలు ఎందుకంటే, ప్రపంచంలో దాదాపు డజను దేశాలు ‘బయో వెపన్స్’ను సమకూర్చుకుని ఉన్నాయి. ఈ దేశాలు ఆ సంగతిని బాహాటంగా ప్రకటించకపోయినా, అంతర్జాతీయ గూఢచర్య సంస్థల సమాచారం ప్రకారం ఇవి పకడ్బందీగా కట్టుదిట్టమైన లాబొరేటరీల్లో జన్యు ఉత్పరివర్తనల ద్వారా ప్రమాదకరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి వాటిని రూపొందించి, ఇప్పటికే నిల్వ చేసుకుని ఉన్నాయి. ఇలాంటి మరికొన్ని బయో వెపన్స్‌ను రూపొందించేందుకు రహస్య ప్రయోగాలను ముమ్మరంగా సాగిస్తున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు తలెత్తే సందర్భాల్లో ‘బయో వెపన్స్’ను వినియోగించరాదనే ఐక్యరాజ్య సమితి ఒడంబడికను 185 దేశాలు ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో మిగిలిన డజను దేశాలు ఈ ఒడంబడికపై ఇంతవరకు కనీసం సంతకాలు కూడా చేయలేదు. అంతర్జాతీయ గూఢచర్య సంస్థల సమాచారం ప్రకారం చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, సిరియా సహా డజను దేశాల వద్ద ఇప్పటికే ‘బయో వెపన్స్’ ఉన్నాయి.ఈ దేశాలు మరింత ప్రమాదకరమైన ‘బయో వెపన్స్’ తయారీ కోసం రహస్య ప్రయోగాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఒడంబడికను ఖాతరు చేయని ఇలాంటి దేశాలకు కృత్రిమ వైరస్‌లను సృష్టించగలిగే ఏఐ సాంకేతికత చేతికందితే, అవి మరిన్ని బయో వెపన్స్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాలతో యుద్ధాలు తలెత్తితే అవి విచక్షణారహితంగా బయోవెపన్స్ను బయటకు విడిచిపెట్టి, మహమ్మారి వ్యాధులను వ్యాప్తి చేసి, భారీ జనహననానికి తెగబడవచ్చు. ఐక్యరాజ్య సమితిని ఖాతరు చేయని ధూర్త దేశాలు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు కూడా ఇదే పద్ధతిలో ‘బయో వెపన్స్’ తయారీకి సిద్ధపడవచ్చు.ఉగ్రవాద సంస్థల చేతికి ఈ పరిజ్ఞానం చేరితే, వాటి వల్ల ఎలాంటి విపత్తులు ఏర్పడవచ్చో ఊహించడం కూడా కష్టమే! ధూర్త దేశాలు, ఉగ్రవాద సంస్థలు ఇష్టానుసారం ఏఐ సాంకేతికతతో ప్రమాదకరమైన వైరస్‌లను రూపొందించే ప్రక్రియలో లాబొరేటరీల్లోంచి పొరపాటున లీకైతే, అవి వాతావరణంలో కలిసిపోయి, మహమ్మారి వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్ల వల్ల ఎన్ని సానుకూలతలు ఉన్నాయో, వాటి వల్ల ప్రమాదావకాశాలు అంతకు మించే ఉన్నాయి.నియంత్రణకు శాస్త్రవేత్తల సూచనలుకృత్రిమ వైరస్ల వల్ల ప్రపంచానికి ముప్పు తలెత్తకుండా ఉండాలంటే, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, బయో సెక్యూరిటీ నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. అవేమిటంటే, ఏఐతో వైరస్‌లను రూపొందించే సాంకేతికత దుర్వినియోగం కాకుండా ఉండటానికి, బయో టెర్రరిజం వ్యాపించకుండా చూడటానికి జీన్ డేటాను ప్రాసెస్ చేసే ఏఐ నమూనాలకు కఠిన నియమావళిని అమలులోకి తేవాలి. డీఎన్ఏ విశ్లేషణలు జరిపే కంపెనీలను ఎవరెవరు ఆర్డర్లు ఇస్తున్నారు, వారు ఎలాంటి జన్యు నమూనాలను ప్రింట్ చేయిస్తున్నారు అనే దానిపై కచ్చితమైన తనిఖీలు ఉండాలి.అన్నింటి కంటే ముఖ్యంగా ప్రాణాంతకమైన వైరస్లు, పాథోజెన్ల డేటాను ఏఐ నమూనాల నుంచి తొలగించాలి. ఆర్టిఫిషియల్ బయో–డిజైనింగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ ఒప్పందం దిశగా ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలి. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన చట్టాలను వీలైనంత త్వరగా అమలులోకి తేవాలి. ఇకపై ఏఐ ద్వారా సృష్టించే కృత్రిమ వైరస్లు, బ్యాక్టీరియాల ఆర్ఎన్ఏ, డీఎన్ఏ నమూనాలు స్క్రీనింగ్‌ను తప్పించుకునే అవకాశాలు లేకుండా నిబంధనలను కట్టుదిట్టం చేయాలని బయో సెక్యూరిటీ నిపుణులు ప్రభుత్వాలను కోరుతున్నారు.ఇదే అంశమై ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్ అధినేత డేరియో అమోడి, గూగుల్ డీప్‌మైండ్ అధినేత డెమిస్ హసబీస్, మైక్రోసాఫ్ట్ ఏఐ అధినేత ముస్తఫా సులేమాన్, మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ ఆలెగ్జాండర్ వాంగ్ తదితర ఏఐ నిపుణులు అమెరికా కాంగ్రెస్‌కు ఇటీవల లేఖ రాశారు. ఏఐ సాయంతో కృత్రిమ వైరస్ల వంటి వాటి తయారీపై శాస్త్రవేత్తల ఆందోళనలను ప్రభుత్వాలు పట్టించుకుని, సత్వర చర్యలకు నడుం బిగించాలి. ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తే, తర్వాత తలెత్తబోయే అనర్థాలకు ప్రపంచ దేశాలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.- పన్యాల జగన్నాథదాసుఇవి కూడా చదవండి: ఏమిటీ టెక్ నెక్! -
అమ్మ చీరలే నా స్టైల్.. నివేతా థామస్ ఆసక్తికర విషయాలు
పాత్ర ఏదైనా, అందులో పూర్తిగా ఒదిగిపోవడమే ఆమెకు తెలుసు! సినిమాలకు అతీతంగా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని ఆస్వాదించే నటి నివేతా థామస్. ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీకోసం...చిన్నప్పుడే కెమెరా ముందుకు!చిన్నప్పుడే టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చింది. ‘మై డియర్ భూతం’తో ఎన్నో ఏళ్లు టీవీలో పనిచేశాను. కాని, సినిమాల్లోకి వచ్చాకే నటిగా నన్ను నేను కొత్తగా తెలుసుకున్నాను.బిల్డింగ్స్ కూడా డిజైన్ చేస్తా!నేను ఆర్కిటెక్చర్ చదివింది సినిమాలకు బ్యాకప్‌గా కాదు. నిజంగానే ఆర్కిటెక్ట్‌గా పనిచేయగలిగేలా చదివాను. కాలేజీ, షూటింగ్స్... రెండింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. మా అమ్మానాన్న నటనతో పాటు చదువుకూ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజులు తలచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది.పాత్ర కోసమే బరువు పెరిగాను? ఒక పాత్ర కోసం నా రూపాన్ని మార్చుకోవడానికి ఎప్పుడూ వెనకాడను. ‘35– చిన్న కథ కాదు’లో సరస్వతి పాత్ర కోసం బరువు పెరిగాను. ఆ పాత్రకు అది అవసరమనిపించింది. ఇప్పుడు కొత్త పాత్రల కోసం మళ్లీ ఫిట్‌గా మారుతున్నాను. అది లుక్ మార్చుకోవడం కాదు, పాత్రలోకి వెళ్లే ప్రయాణం.భాషలు నా బలం!కొత్త భాష నేర్చుకోవడం ఆసక్తి ఎక్కువ. ఒక్కో భాషలోని యాస, పదాల వెనకున్న భావాన్ని తెలుసుకోవడం నటిగా చాలా ముఖ్యం. ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు ఫ్రెంచ్ కూడా మాట్లాడగలను. వీలైనంత వరకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. అదే నా బలం. ప్రేక్షకులతో నా స్వరం ద్వారా కనెక్ట్ అవ్వడం ప్రత్యేకంగా అనిపిస్తుంది.కెమెరా వెనుక!ఖాళీ సమయం దొరికితే ఫొటోగ్రఫీ చేస్తుంటాను. ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలను చూడడం, అక్కడి చిన్న చిన్న క్షణాలను కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం కూడా నా ఫేవరెట్ టైమ్‌పాస్.శుక్రవారం అంటే నాకు పండగే!అందరికీ ఆదివారం సెలవు. కానీ శుక్రవారం నాకు చాలా స్పెషల్! సినిమా విడుదలైతే థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్ చూడాలనే టెన్షన్ , ఎగై్జట్‌మెంట్ రెండూ ఉంటాయి. షూటింగ్ లేకపోతే మాత్రం ఫోన్ పక్కనపెట్టి, ప్రపంచాన్ని కాస్త మర్చిపోయి ప్రశాంతంగా ఆలస్యంగా నిద్రలేవొచ్చు. అందుకే... రిలీజ్ ఉన్నా, రిలాక్స్ అయినా... శుక్రవారం అంటే నాకు పండగే!డైట్ నా వల్ల కాదు!నేను డైట్ ఫాలో అయ్యే రకం కాదు. ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బిర్యానీ కనిపిస్తే, దాన్ని వదిలేసి సలాడ్ తినడం నా వల్ల కాదు. ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నీ వ్యాయామాలైనా చేస్తా కాని, ఇష్టమైన ఆహారాన్ని తినడాన్ని మర్చిపోవడం మాత్రం చేయలేను.అమ్మ చీరల్లోనే అసలైన స్టయిల్!ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల కంటే అమ్మ దగ్గరున్న పాత చీరలు నాకు చాలా ప్రత్యేకం. వాటిలో ఒక జ్ఞాపకం ఉంటుంది; ఒక కథ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అమ్మ పాత చీరలను వేసుకుంటూ ఉంటాను. -
ఏమిటీ టెక్ నెక్!
ఈ రోజుల్లో కంప్యూటర్‌పై పని లేకపోవడాన్ని లేదా గంటల తరబడి మొబైల్ లేని జీవితాన్ని ఊహించడం కష్టం. టెకీలు సరే సరి. ఇంట్లో ఉండే మహిళలూ, పెద్దగా టెక్నాలజీతో టచ్ లేనివారు సైతం అదేపనిగా రీల్స్ చూడటమో లేదా యూట్యూబ్‌లో వీడియోలు చూడటమో చేస్తున్నారు. దాంతో పాటు ఇటీవలి జీవనశైలి కారణంగా శారీరక శ్రమ తగ్గిపోవడం దాంతో ఎప్పుడూ ఒకే చోట కూర్చుని ఉండటం లేదా వృత్తి ఉద్యోగాల్లో సైతం కదలకుండా ఒకేచోట కూర్చుని పనిచేయడం బరువు పెరగడం (ఊబకాయం రావడం) వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అంతేకాదు... అలాంటి స్థిరంగా ఒకే చోట ఉండిపోవడంతో (సెడెంటరీ లైఫ్‌స్టైల్) వల్ల ఎముకలూ, కీళ్ల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా యువత అదేపనిగా మెడవంచి, దాన్ని కాస్తంత ముందుకు సాచి మొబైల్ చూస్తుండటం వల్ల వస్తున్న ఆరోగ్య సమస్య పేరే... ‘టెక్ నెక్’. అసలు ‘టెక్ నెక్’ అంటే ఏమిటి, ఎముకలూ, కీళ్లూ (ముఖ్యంగా మెడ ఎముకలైన వెన్నుపూసలపై) దాని ప్రభావాలేమిటి; నివారణకు ఏం చేయాలనే అంశాలను తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం...ఇటీవల మొబైల్ కారణంగా మెడ నుంచి మోకాళ్ల వరకు ఉన్న ఎముకలపై ప్రభావం పడుతోంది. ఎప్పుడో బాగా వయసు పెరిగాక రావాల్సిన ఎముకల అరుగుదల, మెడ ఎముకల్లో డిస్క్ సమస్యల వంటివి ఇప్పుడు చాలా యుక్తవయసువారిలోనూ, ఇప్పుడిప్పుడే కౌమార వయసు వీడుతున్నవారిలోనూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద కీళ్ల సమస్యలకు దారితీయవచ్చనీ, అందునా మరీ ముఖ్యంగా మొబైల్‌ను ఎక్కువసేపు తల వంచి చూడటం వల్ల మెడపై నిరంతర ఒత్తిడి పడుతోందనీ,. దీనినే సాధారణంగా ‘టెక్ నెక్’ సమస్యగా ఆర్థోపెడిక్ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘టెక్ నెక్’ సమస్య ఏమిటో చూద్దాం.ఏమిటీ ‘టెక్ నెక్’ సమస్య...?మెడను ఎక్కువసేపు ముందుకు వంచి అదేపనిగా అదే భంగిమలో చాలాసేపు ఉంచడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంటుంది. దాంతో మెడ నొప్పి, భుజాలు బిగుతు ఉన్నట్లు అనిపించడం, తల ముందుకు వంగి అసహజ భంగిమలో చాలాసేపు ఉండిపోవడంతో తలనొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇలా ఈ లక్షణాలతో వ్యక్తమయ్యే సమస్యనే డాక్టర్లు ‘టెక్ నెక్’గా చెబుతున్నారు.మరి కంప్యూటర్ / మొబైల్స్ మానేయాల్సిందేనా?ఈరోజు కంప్యూటర్ మీద పనిచేయడమనేది జీవన విధానంలో ఒక భాగం మాత్రమే కాదు. అదే జీవనోపాధికి ప్రధాన మార్గం కూడా. అంతేకాదు... మొబైల్ వాడకం కూడా జీవితం నుంచి విడదీయలేని అంశమై పోయింది. ప్రతిపనికీ ఓటీపీలూ, బ్యాంకు నుంచి మనకు వచ్చే సమాచారాలు, డబ్బు ట్రాన్స్ఫర్లు వంటి అనేక పనులకోసం మొబైల్ వాడకం అన్నది జీవితంలో ఒక అవిభాజ్యమైన అంశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించకుండా ఉండటమన్నది అసాధ్యం. అందుకే మొబైల్ లేదా కంప్యూటర్ వాడకాన్ని పూర్తిగా మానేయడం అవసరం లేదు. కాకపోతే వాటిని సరైన భంగిమలో ఉపయోగించడం, తరచూ విరామాలు తీసుకోవడం, మెడను ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉంచకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.నివారణ ఇలా... టెక్ నెక్‌తో మెడ దగ్గరి ఎముకల్లో నొప్పి లేదా మెడ కండరాల దగ్గర ఇబ్బంది వంటివి ఉన్నవారు అదేపనిగా మెడను ముందుకు సాచి ఉంచడానికి బదులుగా తలను నిటారుగా ఉంచి మాత్రమే కంప్యూటర్‌గానీ, మొబైల్గానీ చూడటం అలవాటు చేసుకోవాలి. మెడను ఎంతగా వంచితే అంతగా మెడ ఎముకలపైనా, మెడ కండరాలపైనా ఒత్తిడి పెరిగి మున్ముందు అది సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుందని గుర్తించాలి. ఇక దీనితో పాటు అదేపనిగా కూర్చుని ఉండటంతో బరువు పెరిగి, అది మోకాళ్లపై ఒత్తిడిని పెంచి మోకాళ్ల నొప్పులు వస్తున్నవారు, మోకాళ్ల వాపు, కీళ్లలో బిగుతు, కూర్చున్నవాళ్లు వెంటనే లేకలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించడం అవసరం. అయితే ఈ సమస్యలకు తక్షణం మందులు వాడటం, శస్త్రచికిత్స చేయించడం అవసరం ఉండకపోవచ్చు. అదేపనిగా కూర్చుని ఉండటానికి బదులుగా పనిలో తరచూ బ్రేక్ ఇస్తూ అటు ఇటు కదలడం, పొద్దున్నే వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, జీవనశైలిలో మార్పులు చేసుకుని బరువు తగ్గించుకోవడంతో పాటు అవసరమైతే ఫిజియోథెరపీ వంటి ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తారు. ఒకవేళ కొందరిలో ఇప్పటికే కీళ్లనొప్పులు లేదా కీళ్ల సమస్య ఉన్నవారికి వైద్య నిపుణులు వారికి సరిపోయే వ్యాయామాన్ని సూచిస్తారు. దీనికి తోడు ఆరోగ్యకరమై సమతులాహారం, అందులో తగినంత ప్రోటీన్, కాల్షియం, విటమిన్ల వంటివి తీసుకోవాలంటూ ఆ మేరకు దేహానికి అన్ని పోషకాలు అందే ఆహారంపై కూడా దృష్టిపెట్టేలా సలహాలు అందిస్తారు.నేటి వృత్తుల్లో వచ్చిన మార్పులతో ఇవీ అనర్థాలు...కదలకుండా ఒకేచోట కూర్చుని అదేపనిగా తల ముందుకు ఒంచి కంప్యూటర్ చూడటంతో పాటు అదేపనిగా కూర్చుని చేసే వృత్తుల కారణంగా చాలామందిలో బరువు పెరిగి ఊబకాయం వస్తోంది. దాంతో ఆ బరువు కారణంగా కొద్దిగా నడవడం గానీ, మెట్లు ఎక్కడం గానీ లేదా ఎక్కువ సేపు నిలబడటం, మామూలు రోజువారీ పనులుచేయడంలో వాళ్ల మోకాళ్లపైన భారమూ, ఒత్తిడీ పెరుగుతున్నాయి. దాంతో గతంలో చాలాకాలం తర్వాత వచ్చే మోకాళ్ల కీళ్ల అరుగుదల వంటి ముప్పు ఇప్పుడు చాలా త్వరితంగానే వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ఇక దేహం బరువు పెరగడం వంటి అంశాలు హైబీపీ, డయాబెటిస్‌కూ దారితీస్తాయన్న విషయం చాలామందికి తెలిసిందే. వీటితో పాటు కనిపిస్తున్న కాస్తంత పాత సమస్యకే సరికొత్త పేరు ‘టెక్ నెక్’! కూడా.చికిత్స... తొలిదశల్లో కొన్ని మందులతో ఉపశమనం కలిగేలా డాక్టర్లు తాత్కాలికమైన చికిత్సలు అందిస్తారు. ఒకవేళ దేహం బరువు ప్రమాదకరంగా మారినవాళ్లకూ, మెడ ఎముకలూ, మోకాళ్లు బాగా అరిగిపోయిన వాళ్లకు తగిన చికిత్సలతో పాటు బాగా అవసరమైన వాళ్లకు చివరి ప్రత్యామ్నాయంగా (గ్రేడ్ – 4 దశలో) మాత్రమే శస్త్రచికిత్సలను డాక్టర్లు సూచిస్తారు. -
పరుగు అందుకున్న జీవితం
బిడ్డ పుస్తకాలకి డబ్బుల్లేవ్... చేస్తున్న పనికి వచ్చే జీతం చాలదు.. ఇద్దరు కూతుర్లున్నారు.. ఆస్తుల్లేవ్ కాని బాగా బతకాలన్న ఆశ ఉంది. అప్పుడొచ్చిందో అవకాశం.. పరుగెడితే పైసలొస్తాయని ఎవరో అంటే... ఒంట్లో ఓపిక లేకపోయినా, శక్తి మొత్తాన్ని కూడగట్టుకుని, జారిన జోళ్లని చేత పట్టుకుని లంఘించిందో మహిళ.. ఆమే రమాబాయి రణ్వీర్.చెప్పులు చేతపట్టుకుని పరుగులు తీసిన రమాబాయిని వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే అది కాస్తా వైరల్‌గా మారింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆమె ప్రయత్నానికి ముచ్చటపడి షూ కొనిస్తానని వెల్లడించారు. నటుడు మాధవన్ రమాబాయ్ పట్టుదలను ప్రశంసించారు. బీడ్ జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్ ఆమెను సత్కరించి ఆర్థిక సహాయం అందించారు. మరోవైపు దేశవ్యాప్తంగా రమాబాయికి ప్రశంసలు వెల్లువెత్తడంతో పాటు లక్షన్నర వరకు నగదు సాయం కూడా అందింది. ప్రభుత్వం ఆమె కుమార్తెల చదువుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం రమాబాయి పెద్ద కూతురు పూజ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తోంది. చిన్న కూతురు బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధపడుతోంది.ఎవరీ రమాబాయి?మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగైకి చెందిన రమాబాయి రణవీర్‌కు 47 ఏళ్లు. భర్త మరణించిన తర్వాత ఇద్దరి కుమార్తెల బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న రమాబాయి వారి చదువుకోసం ఇళ్లలో వంట చేస్తూ జీవించేది. ఆమె కుమార్తె చదువు కోసం పుస్తకాలు కొనాల్సి వచ్చింది కాని రమా దగ్గర డబ్బుల్లేవు. అంబాజోగైలోని భారతీయ శిక్షణ ప్రసారక సంస్థకు చెందిన ఖోలేశ్వర్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ‘అమృత్ దౌడ్’ పేరుతో పరుగు పందెం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ పోటీలో పాల్గొని, అందులో గెలుపొందితే పరుగెడితే డబ్బులొస్తాయని తెలిసి రమాబాయి కూడా ఆ పందెంలో పాల్గొనాలని నిర్ణయించుకుంది.చెప్పులు చేత పట్టుకుని...సాధారణంగా రన్నింగ్ రేస్ అంటే ట్రాక్స్ వేసుకుని షూ వేసుకుని స్టైల్‌గా గాగుల్స్ పెట్టుకుని సిద్ధమవుతారు. కాని అవేవి రమాబాయికి తెలీదు. మామూలు చీర కట్టుకుని, ఆకు చెప్పులు వేసుకుని పందేనికి సిద్ధపడింది. రేసు మొదలైంది. రమాబాయి చెప్పులు జారిపోయాయి. కంగారు మొదలైంది. వెంటనే చెప్పులు చేతపట్టుకుని ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని పరుగులు తీసింది. వర్షంతో తడిసిన రోడ్డుపై చిన్నచిన్న రాళ్లు, పెంకులు లాంటివి గుచ్చుకుంటున్నా ఆమె బెదరలేదు.. పరుగు ఆపలేదు. ఎలాగైనా సరే, బిడ్డకు పుస్తకాలు కొనాలన్న పట్టుదల, బిడ్డ చదువు ఆగిపోకూడదన్న అమ్మతనం గెలిచాయి. అందరు రన్నరప్‌లను దాటుకుంటూ ఆమె విన్నర్‌గా నిలిచింది మూడు వేల రూపాయల బహుమతిని అందుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె పెద్ద కుమార్తె పూజా కూడా ఈ పరుగు పందెంలో పాల్గొంది. మూడు వేల కోసం మొదలైన పరుగుతో రమాబాయి కూతుళ్ల జీవితాలకు కొండంత భరోసా వచ్చింది. -
ఒకనాటి ఆదివారం
హైదరాబాద్‌లో ఆదివారం కూడా ఒక ఆదివారమా? దాని ఆయుష్షు ఆరేడు గంటలకు మించి ఉండదు. బద్దకంగా లేచామా... స్విగ్గిలో ఆర్డర్ పెట్టామా... తిని చేయి కడిగి ఫోన్ చూసుకునేలోపు సోమవారం వచ్చేస్తుంది. ఆదివారం సాయంత్రం నుంచే సోమవారం వచ్చేస్తుంది. సాయంత్రపు చీకటి నుంచే మరుసటి రోజు గుబులు, దిగులు చుట్టుముడుతుంది. ఆదివారం మజా అంటే అదా?అసలు ఒకప్పటి ఆదివారాలు ఎలా ఉండేవి? 1980ల కాలపు ఆదివారం... చిన్నప్పటి ఆదివారం... కేలండర్లో ఎర్ర రంగుతో ఊరించే ఆదివారం... అప్పట్లో ఒక్కో ఆదివారం 36 గంటల సేపైనా ఉండేది. వారానికి సరిపడా ఊపిరి పోసేది. పిల్లా జెల్లా ఊరు వాడా అందరూ ఆదివారం కోసం ఎదురుచూసే వారు. ఆదివారం వస్తే ఊరు బంద్. వినోదం విడుదల. ఆదివారం వస్తే టీ కొట్లు, దోసెల బండ్లు కిటకిటలాడేవి. తీరుబడిగా పేపర్ చదువుతూ ఆ వారమంతా ఊళ్లో జరిగిన విశేషాలపై వ్యాఖ్యానాలు వినిపించేవి. మధ్యాహ్నం మటనో చికెనో వొండాలి కాబట్టి అమ్మకు టిఫిన్ బరువు వేయకుండా దోసెలు తెచ్చుకుంటే ఆ చట్నీకి స్వర్గం చచ్చుకుంటూ కనిపించేది. ఫలానా చోట వేట కోసి కువ్వలు పోస్తే కూరకు పోయేవాడొకడు. సైకిల్‌కి కోడిని కట్టేసి ఇంటికి పట్టుకుపోతూ ఒకడు. పేకాట ΄్లాన్లో ఉండే మగాళ్ల బాడీ లాంగ్వేజ్‌ను ఏ ఎక్స్పర్టూ కూడా కనిపెట్టలేడు. అల్లం వెల్లుల్లి మానవజాతి కోసం త్యాగం చేసే రోజు అది. పచ్చి కొబ్బరి నూరే శబ్దానికి మించి ఇళయరాజా ట్యూన్ ఉంటుందా? ఆ రోజు ఉదయం నుంచే రేడియోను ధారాళంగా పెట్టొచ్చు. సరే... టీవీలో భారతం రావడానికి టైమ్ ఉండనే ఉంది.ఆదివారం రోజు పిల్లలందరూ ఎవరూ చెప్పకనే యోగాసనాలు వేసి హెల్త్‌ను బెటర్ చేసుకునేవారు. గోలీ ఆసనం, బొంగరం ఆసనం, కర్రాబిళ్ల ఆసనం, సైకిల్ తొక్కే ఆసనం, ఊరి నాలుగు దిక్కుల్లో ఉన్న నలుగురు బంధువుల దగ్గరకు నడకాసనం వేస్తూ వెళ్లి సాయంత్రం ఫస్ట్‌షోకు సరిపడా చిల్లర సమకూర్చుకునే ఆసనం.... పనులకు విరామం ఇచ్చి ఇళ్లల్లో ఉండే మగవాళ్లు సుష్టుగా భోం చేసి కునుకుకు ఉపక్రమిస్తే ఆడవాళ్లు బ్యాటరీ రేడియోతో పెరట్లో చేరి మధ్యాహ్నం మూడు గంటల నాటకాన్ని పేలు చూసుకుంటూ, గోరింటాకు పెట్టుకుంటూ, జ్యోతిచిత్రలో జయసుధ కట్టుకున్న చీరను పరీక్షిస్తూ వినేవారు. సాయంత్రం ఐదుగంటలకు సైకిలేసుకొని బాబాయి వచ్చేవాడు. లేకపోతే రిక్షాలో మేనత్తా మేనమామ వచ్చేవారు. కాదంటే నడుచుకుంటూ పిన్ని వచ్చేసేది. మరి ఆదివారం వచ్చేది బంధువులు కలవడానికేగా. ఊళ్లు చిన్నవి. మనసులు పెద్దవి. దూరాలు కురచవి. మనుషులకు మాటలే మత్తు పదార్థాలుగా ఉండేవి. అందరి కాపురాల ప్రసారం ప్రతి ఒక్కరి రిపోర్టింగ్‌లో అందరికీ తెలిసేది. కొట్లు మూసేసిన ఊరిలో సాయంత్రాలు పని లేకుండా నడవడం ఒక వింత. సినిమా హాళ్ల దగ్గర తప్ప ఇంకెక్కడా మనుషులుండరు. బాల్కనీ టికెట్లు ముందే తెచ్చుకున్న కుటుంబాలు స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని బింకంగా నడుచుకుంటూ పోతుంటే వాళ్లు సినిమాకు వెళుతున్నారని అందరికీ తెలిసిపోయేది. ‘ఎలా ఉంటే అలా’ అవతారాలతో దొరికిన సినిమాకు దూసుకెళ్లే శాల్తీల దూకుడూ స్పెషలే. ఇవన్నీ పట్టని వారికి సాయంత్రం టీవీలో పాత సినిమా చుక్కలు చుక్కలుగా వచ్చినా చక్కగా అర్థమయ్యేది. ఆదివారం వస్తే పిల్లలు ఆడే ఆ ఎర్ర మట్టి వీధులు, మనుషుల రాకకై తెరిచి పెట్టే ఆకుపచ్చ తలుపులు, ఆ అరుగు కబుర్లు, ఆ యాంటెన్నా కోసం అరిచిన అరుపులు... వాటిలో తిప్పలు ఉన్నా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవాళ్టి ఆదివారాలు ఏ జ్ఞాపకాలు మిగల్చని శుష్కమైన ఆదివారాలు. జీవితంలో వెలుగులు పెరిగాయి, వసతులు పెరిగాయి, జీతాలు వేలల్లో నుంచి లక్షల్లోకి పెరిగాయి. కానీ ఈ ఆదివారం భలే గడిచింది అనే మాట తక్కువగా వినిపిస్తోంది. గత కాలము మేలు వచ్చు కాలము కంటే అంటే ఇదేనా? ఓ ఆదివారమా... నువ్వు తెచ్చే విశ్రాంతికీ వినోదానికీ కూడా రాజీనామా చేసే బతుకును బతుకుతున్నామా?అవును. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది. -
దూరంగా చూసేవాళ్లకు నేను హార్డ్..
‘‘ఏ రంగంలోనైనా మహిళలు ఎక్కువగా విమర్శలకు గురవుతూనే ఉంటారని అయితే వాటిని ఆత్మవిశ్వాసంతోనే ఎదుర్కోవాలని ప్రముఖ బాలీవుడ్ గాయని నిఖితా గాంధీ సూచించారు. ప్రతీ మహిళా తన భధ్రత పట్ల తాను బాధ్యత వహించాలని, అందుకు తగ్టట్టుగా హద్దులు నిర్ణయించుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో నిర్వహించిన రాయల్‌స్టాగ్ బూమ్ బాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...గాత్రంలో నాదైన ప్రత్యేకత ...ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు, విశ్లేషించలేదు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన గాన శైలి ఉంటుందని అనుకుంటాను. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ పెరిగాను. కమర్షియల్ మ్యూజిక్ ఎక్కువగా వినేదాన్ని కాదు. మా తాతగారి కలెక్షన్ లోని ఆల్బమ్‌లు, పాత రికార్డులు చాలా వినేదాన్ని. చిన్నతనంలో మనపై పడే ఆ ప్రభావాలే మనం సంగీతాన్ని ఎలా అర్థం చేసుకుంటామో, ఎలా అందిస్తామో.. నిర్ణయిస్తాయి.‘రాబ్తా’ కెరీర్లో కీలక మలుపుప్రతి పాటకూ తనదైన మైలురాయి ఉంటుంది. కానీ నా కెరీర్‌కు నిజంగా ఊపు తెచ్చింది మాత్రం ‘రాబ్తా’.. నా గాత్రాన్ని బాలీవుడ్‌కు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పరిచయం చేసింది.కొత్త భాషలో పాడే ముందు?ఆయా భాషలు మాట్లాడే వ్యక్తులను గమనించడం, వారి ఉచ్చారణ, యాస, భాషలోని రిథమ్‌ను పరిశీలించడం చేస్తాను. ఇది కూడా దాదాపు నటనలాంటిదే. ఒక పాత్రలోకి వెళ్లినట్టుగా ఆ భాషలోకి మనం వెళ్లాలి. నేను పాడిన మొదటి పాట తమిళంలో. అప్పట్లో ఆ భాష నాకు దాదాపు అర్థం కాలేదు. తెలుగులో మూడు, నాలుగు పాటలు పాడాను.సోషల్ మీడియా...ప్రభావం...సోషల్ మీడియా ఎంతోమందిని గుర్తించడానికి, వెలుగులోకి తీసుకురావడానికి కచ్చితంగా సహాయపడింది. కానీ అందరికీ అది ఉపయోగపడుతుందని నేను అనుకోను. ప్రతిభతో పాటు తమను తాము ప్రజల ముందుకు తీసుకురావడంలో కూడా నైపుణ్యం ఉన్నవారికి ఇది బాగా సహకరిస్తుంది. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ తగిన గుర్తింపు పొందని వారు ఇంకా చాలామంది ఉన్నారు.ఏఐ తో సంగీతానికి ముప్పు ఉందా?ఇది మంచిదో చెడ్డదో నాకు తెలియదు. సంగీతం, మ్యూజిక్ ప్రొడక్షన్ లో ఇప్పటికే ఏఐని చూస్తున్నాం. ఇప్పుడు అది అకస్మాత్తుగా చర్చనీయాంశంగా మారింది అంతే. గతంలో ప్రతిదీ లైవ్‌గా, టేప్‌పై రికార్డ్ చేసేవాళ్లం. ఇప్పుడు స్టూడియోలో ప్రతిదీ డిజిటల్‌గా చేస్తున్నాం. ఇప్పుడు చేయాల్సిన ఉత్తమమైన పని ఏమిటంటే పరిస్థితికి అనుగుణంగా మారుతూ ముందుకు సాగడం.గాయనీ గాయకుల ‘నేపధ్యం’లోనే ఉండిపోవడంపై...ఇది ఒక ఆసక్తికరమైన పరిస్థితి. నేపధ్యగాయకులుగా ఒకవైపు ఫేమస్, మరోవైపు ఫేమస్ కానట్టే. అయితే చాలామంది గాయకులు దీనితో పూర్తిగా సంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే వారు తమ గుర్తింపు కోసం లేదా ప్రముఖంగా కనిపించడం కోసం ప్రయత్నించరు. నేను మాత్రం ఈ విషయంలో మధ్యలో ఉన్నాననుకుంటున్నా. ఎందుకంటే నేను విజువల్ ప్రెజెన్స్ ఉన్న పెర్ఫార్మర్‌ను. అందుకే నన్ను నేను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తాను. సాంగ్రైటర్గా సొంత ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను విడుదల చేయడం దానికో మంచి మార్గం. అప్పుడు కేవలం గాయనిగా కాకుండా ఒక ఆర్టిస్ట్‌గా నేను ఎవరో ప్రేక్షకులకు చూపించగలను.గర్విష్టి అనే పేరు రావడం వెనుక?నేను చాలా గర్విష్ఠిగా, కఠినంగా ఉంటానని చాలామంది అనుకుంటారు. కానీ నన్ను కలిసిన తర్వాత ‘ఓహ్.. మీరు చాలా స్వీట్‌గా!’ అని అంటారు. చాలా మంది మహిళల విషయంలో ఇదొక అపోహ . ఎవరైనా ఇండస్ట్రీలోని మరో మహిళను ‘ఆమె చాలా కఠిన వ్యక్తి’ అని పిలిస్తే నేను ఆమెకు మద్దతుగా నిలుస్తాను. సాధారణంగా మహిళలే ఎక్కువగా విమర్శలకు గురవుతారు. చాలా సందర్భాల్లో వారు కేవలం ప్రొఫెషనల్‌గా ఉంటూ తమ పనిని సీరియస్‌గా తీసుకుంటుంటారు. మహిళగా మనం భద్రత కోసం కొన్ని హద్దులు ఏర్పరచుకోవాలి, శారీరక స్పర్శను కూడా నియంత్రించుకోవాలి. కానీ వాటిని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. దానికి మనం చేయగలిగిందేమీ లేదు.ఔత్సాహిక యువతులకు సలహా...సోషల్ మీడియా నిస్సందేహంగా గొప్ప వేదిక. అవకాశాల కేంద్రంగా ఉన్న ముంబై లాంటి నగరాలకు చాలా దూరంగా ఒక చిన్న పట్టణంలో కూర్చొని కూడా మన ప్రతిభను లోకానికి చూపించవచ్చు. చాలామంది ఆర్టిస్టులు తమ ఇళ్లలోనే ఉంటూ వైరల్ అయ్యారు, అక్కడి నుంచే గుర్తింపు పొందారు. అయితే సుదీర్ఘకాలిక కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.తీరాల్సిన కల?ప్లేబ్యాక్ సింగర్‌గా నాకు ఉన్న గుర్తింపు, ఆదరణ, ఫాలోయింగ్‌ను ఒక పాప్‌స్టార్‌గా, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా కూడా పొందాలన్నదే నా కల.–సత్యబాబు -
భూమిపై మరో సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
చైనా అభివృద్ధి చేసిన ‘ఈస్ట్’ (ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్) రియాక్టర్ ప్రపంచ శక్తి (ఎనర్జీ) రంగాన్ని సరికొత్త మలుపు తిప్పే దిశగా పురోగమిస్తోంది. సూర్యుడిలో నిరంతరం శక్తిని ఉత్పత్తి చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ (అణు సంలీనం) ప్రక్రియను భూమిపై సురక్షితంగా పునఃసృష్టించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.రెండు తేలికపాటి పరమాణు కేంద్రకాలు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఒకదానికొకటి వేగంగా ఢీకొని, కలిసిపోయి ఒకే బరువైన పరమాణు కేంద్రకంగా మారడాన్ని అణు సంలీనం అంటారు. భూమిపై సూర్యుడిలోని గురు త్వాకర్షణ శక్తిని సృష్టించడం సాధ్యం కాదు. అందుకే టోకమాక్ అనే శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలు కలిగిన డోనట్ ఆకారపు పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇందులో హైడ్రోజన్ ఐసోటోప్‌లైన డ్యూటీరియం, ట్రిటియంలను వందల మిలియన్ల డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి ప్లాస్మా రూపంలో బంధించి ఈ సంలీన ప్రక్రియను జరుపుతారు.చైనా సైంటిస్టులు 12 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 101 సెకన్ల పాటు, అలాగే మరికొన్ని ప్రయోగాల్లో 1,000 సెకన్ల కంటే ఎక్కువ సమయం స్థిరంగా నిర్వహించి ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. ఈ ప్రాజెక్ట్ చైనాలోని అనూయ్ ప్రావిన్స్‌లో ఉన్న ‘హెఫీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్’ ఆధ్వర్యంలో నడుస్తోంది.ప్రస్తుతం వాడుతున్న అణు విచ్ఛిత్తి వల్ల ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ వ్యర్థాలు వస్తాయి. ఈ ఫ్యూజన్ సాంకేతికత వల్ల జీరో కార్బన్ ఉద్గారాలు, సురక్షితమైన శక్తి లభిస్తుంది. సముద్రపు నీటిలో లభించే డ్యూటీరియం, ట్రిటియం వంటి హైడ్రోజన్ ఐసోటోప్‌లను ఇంధనంగా వాడుతారు. నిజమైన సూర్యుడి కేంద్రకంలో ఉష్ణోగ్రత సుమారు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. చైనా సృష్టించిన ఈ పరికరం ఏకంగా 16 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకి రికార్డు సృష్టించింది.ప్లాస్మాను ఎక్కువసేపు స్థిరంగా ఉంచడం, ఉత్పత్తి అయ్యే శక్తిని సమర్థ వంతంగా విద్యుత్‌గా మార్చడం వంటి సాంకేతిక సవాళ్లు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. చైనా మాత్రమే కాకుండా అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా అణు సంలీన సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాయి. చైనా ప్రయోగాలు కేవలం ఈస్ట్తోనే ఆగడం లేదు. తదుపరి తరం ప్రాజెక్ట్ ‘బెస్ట్’ (బర్నింగ్ ప్లాస్మా ఎక్స్పెరిమెంటల్ సూపర్ కండక్టింగ్ టోకమాక్)ను నిర్మిస్తున్నారు. 2030 నాటికి వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను సిద్ధం చేయాలనేది దీని లక్ష్యం.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
ఉపాధ్యాయుడికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు!
తరతరాలుగా గురువును పూజనీయ స్థానంలో ఉంచి... తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకు ఇచ్చిన సంస్కృతి మనది! అట్టి ఉపాధ్యాయ వృత్తి ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. విద్య అనేది ప్రాథమికంగా ఒక మానవ ప్రయత్నం. అది సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది.నమ్మకం మీద, అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. అది మనం ఆటోమేట్ చేయగల లావాదేవీల వ్యాపారం కాదు. బోధనోపకరణాలు, సమయం, నమ్మకాన్ని సరైన పద్ధతిలో, ప్రయోజనాత్మకంగా, గౌరవప్రదంగా, ఉపాధ్యాయులకు మద్దతు ఇచ్చే సరైన అకడమిక్ వాతావరణంలో, వారి అభివృద్ధికి సరైన అవకాశాలతో వినియోగించడంతోనే నాణ్యమైన విద్యకు పునాది ఏర్పడుతుంది.అభివృద్ధి చెందుతున్న బోధనా వృత్తిపై జరుగుతున్న చర్చలు... విద్య అనేది ఉపాధ్యాయ–విద్యార్థి కీలక సంబంధంలోనే దృఢంగా పాతుకుపోయి ఉందని స్పష్టం చేశాయి. ఉపాధ్యాయుల నియా మకం, వారిని వృత్తి నిబద్ధులుగా రూపుదిద్దడంలో ప్రపంచవ్యాప్త సవాళ్లు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు సరిపోని జీతాలు, అహేతుకమైన అధిక పనిభారం.ఎడ్ టెక్ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక మార్పులు వేగంగా వస్తున్న తరుణంలో బోధనలో కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగం గురించి చర్చ జరుగుతోంది. నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయులే కేంద్రబిందువు అని అందరూ అంగీకరిస్తున్నప్పటికీ, తమ తరగతి గదు లలో కృత్రిమ మేధను ఎలా, ఏ మేరకు అనుసంధానించాలనే విష యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవకాశాలను అంది పుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తుండగా; ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మరింత జాగ్రత్తతో నియంత్రణలు ఉండాలని వాదిస్తున్నారు.సాంకేతిక మార్పు ఉపాధ్యాయులకు అవకాశాలను కల్పించ గలిగినప్పటికీ, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వృత్తిపై ఇది మరింత భారాన్ని పెంచే ప్రమాదం ఉంది. బోధనలో ఏఐ అనుసంధానం జరగడానికి ఉపాధ్యాయుల నుండి అదనపు కృషి, బోధన, అభ్యసన ప్రక్రియలలో నిరంతర సర్దుబాట్లు అవసరం. అందువల్ల, ఈ మార్పులన్నింటి మధ్య, విద్యా నిపుణుల శ్రేయస్సు– పనిభారాన్ని కూడా సరిగ్గా పరిగణనలోకి తీసుకునేలా చూడాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మాత్రం పూర్తిగా స్పష్టం: కృత్రిమ మేధ ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు.పుస్తకాల స్థానంలో కంప్యూటర్లను తీసుకొచ్చి దాదాపు 15 ఏళ్ల పాటు డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించి అమలు చేసిన స్వీడన్ దేశం డిజిటల్ ఫస్ట్ విధానం వల్ల విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని గుర్తించింది. ఎడ్ టెక్ అనేది విఫల ప్రయోగం అనీ, అందువల్ల విద్యార్థులకు మరిన్ని భౌతిక పాఠ్యపుస్తకాలు అవసరమనీ చెప్పిన స్వీడన్ అనుభవాలు గమనించాలి.దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఉపాధ్యాయ లోకానికి దక్కిన అతిపెద్ద విజయాల్లో ఉద్యోగ భద్రత మొదటిది. కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ప్రవేశపెడుతున్న కొత్త విద్యా విధానాల నేపథ్యంలో కాంట్రాక్టు, పార్ట్ టైమ్, ఔట్ సోర్సింగ్లాంటి పద్ధతుల్లో ఉపాధ్యాయుల నియామకాలు జరిగి ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైంది. ఇటువంటి అధ్యాపకులకు కనీస టైమ్ స్కేల్ వర్తింపజేయాలి. శాశ్వత ఉద్యోగభద్రత వలన వృత్తిపట్ల అంకితభావం తగ్గుతుందనే శుష్క వాదనలను చేయడం సముచితం కాదు.– కె. వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకులుఇవి కూడా చదవండి: మా పిల్లలనూ కాపాడండి!


