Bigg Boss
-
నేనేదో అనుకున్నా.. పెళ్లి అంత ఈజీగా జరగలేదు: పునర్నవి
జీవితంలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అని చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. అలాంటి జాబితాలో పెళ్లి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పెళ్లిని తాను సింపుల్‌గా చేసుకోవాలనుకున్నానని, కానీ రెండు కుటుంబాల కలయికతో ఎంతో ప్రత్యేకంగా జరిగిందంటోంది బిగ్‌బాస్ బ్యూటీ, నటి పునర్నవి భూపాలం. మార్చి 21న ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మను పెళ్లాడింది పునర్నవి. తాజాగా ఆ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.నేనేదో అనుకున్నా..వివాహం అంటే సింపుల్‌గా, సైలెంట్‌గా అయిపోవాలి.. అత్యంత ఆత్మీయుల మధ్యలో ఈ తంతు పూర్తయిపోవాలని ఒకప్పుడు అనుకునేదాన్ని. కానీ, ఇక్కడ మా ప్రేమ మా మనసుల్ని మాత్రమే కాదు, రెండు కుటుంబాల్ని కలిపింది. వారి ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రేమానురాగాల మధ్య సాదాసీదాగా కంటే భిన్నంగా, ప్రత్యేకంగా వివాహం జరిగింది.పెళ్లంటే ఏంటి?అయినా కూడా నావరకు ఈ పెళ్లంటే ఏంటి? అని పదేపదే ఆలోచిస్తూనే ఉన్నాను. ఇది కేవలం ఒక ఆర్భాటం కాదు, ప్రపంచమంతా చూసేలా జీవితంలో ఒకసారి చేసుకునే వేడుక మాత్రమే కాదు, ఇది మన అంతర్గతంగా జరిగే ఒక అద్భుత అనుభవం. స్త్రీ, పురుష శక్తుల కలయిక.. శివుడు, శక్తి (అమ్మవారు) మనలోనూ, మన మధ్యలోనూ ఉన్న అనుభూతి. కొన్నిసార్లు బయట శబ్ధాలు నా గొంతుకంటే పెద్దగా అనిపించాయి. తెలియని ప్రశాంతతకానీ, అతడిని చూసిన ప్రతిసారి ఏదో తెలియని ప్రశాంతత. సడన్‌గా ఆ శబ్ధం వినిపించకపోయేది. నేను చేయగలను అనుకున్నాను. అతడిని నా భాగస్వామిగా ఎంచుకుంటున్నాను అని నాకు నేను మరోసారి చెప్పుకున్నప్పుడు మనసు శాంతించింది. ఇద్దరం కలిసి నడుద్దాం.. అలాగే ఒకరికొకరం ఎదగడానికి అవకాశం ఇద్దాం. మన మధ్యలోని అనుబంధాన్ని కొనసాగిద్దాం.. ఇదే నాకు అన్నింటికన్నా ఎంతో ముఖ్యమైనది.పెళ్లి సులభంగా జరగలేదుసమయం వచ్చింది కాబట్టి మా పెళ్లి జరగలేదు, నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టే ఈ వేడుక జరిగింది. నేను ఊహించినంత సులభంగా ఈ పెళ్లి జరగలేదు. కానీ, ఎంతో నిజాయితీగా, అందంగా, అర్థవంతంగా వివాహం జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న పునర్నవి.. ఉయ్యాల జంపాల, పిట్టగోడ, సైకిల్ వంటి పలు చిత్రాల్లో నటించింది.చదవండి: డోర్ తీసి చీర మార్చుకో.. స్టార్ నిర్మాత చెంప చెళ్లుమనిపించా: నటి -
నా బిడ్డను ఎవరూ ముద్దుపెట్టుకోవద్దు.. ఇది నా రూల్: మెరీనా
నటి, బిగ్‌బాస్ ఫేం మెరీనా అబ్రహం గతేడాది తల్లిగా ప్రమోషన్ పొందింది. పెళ్లయిన 8 ఏళ్లకు పేరెంట్స్ కావడంతో మెరీనా- రోహిత్ జంట ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది జనవరిలో పాపకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిపారు. అయితే తన బిడ్డపై ప్రేమను కురిపించడం వరకు ఓకే కానీ అతిగా ముద్దు చేయడం నచ్చడం లేదంటోంది మెరీనా. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ షేర్ చేసింది.ఇదంతా డ్రామా కాదునా పాప కోసం నేను కొన్ని హద్దులు గీసుకున్నాను, దయచేసి వాటిని గౌరవిస్తారనుకుంటున్నాను. తనకు చాక్లెట్లు ఇవ్వొద్దని చెప్పానంటే ఎవరూ ఇవ్వడానికి వీల్లేదు. నా పాపను ముద్దు పెట్టుకోకండి అని చెప్పినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండండి. ఇదంతా డ్రామా కాదు, యాటిట్యూడ్ అంతకన్నా కాదు.. ఇది పిల్లల్ని పెంచే పద్ధతి. ఏదో ఒకసారి అలా చేస్తే ఏమవుతుంది? అందులో అంత ప్రమాదకరం ఏముందని మీరు అనుకోవచ్చు. .నేనొకటే చెప్తున్నా..మీరంతవరకే ఆలోచించారు. కానీ నేను దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. తను అనారోగ్యానికి గురైతే బెంగపడేది నేను.. జాగ్రత్తగా చూసుకునేది నేను. కాబట్టి నేనొకటే చెప్తున్నా.. నా బిడ్డను మీరంతగా ఇష్టపడితే, నా మాటల్ని గౌరవించండి, నాకు సహకరించండి, నేను పెట్టిన రూల్స్‌ను అతిక్రమించకండి. నా బిడ్డ రక్షణే నాకు అన్నింటికన్నా ముఖ్యం అని రాసుకొచ్చింది.ఎందుకు భయం?పెద్దలు చిన్నపిల్లలకు ప్రేమతో ముద్దుపెడతారు. కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్కు దారి తీసే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలు తినే చిరుతిండి వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మెరీనా.. తన కూతురికి అటువంటివి అలవాటు చేయొద్దని కోరుతోంది. మెరీనా- రోహిత్ ఇద్దరూ తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో జంటగా పాల్గొన్నారు.చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే.. -
ప్రియుడిని పెళ్లాడిన పునర్నవి.. ఫోటోలు వైరల్
బిగ్‌బాస్ ఫేమ్, నటి పునర్నవి భూపాలం పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మతో ఏడడుగులు వేసింది. తన పెళ్లిలో ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు పునర్నవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్లోనే తన ప్రియుడిని పరిచయం చేసింది పునర్నవి. హేమంత్ వర్మకు ఎస్ చెప్పానంటూ ఫోటోలు షేర్ చేసింది. సినిమాఫిబ్రవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. నెల తిరిగేలోపు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పునర్నవి.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించింది. ఆ తర్వాత కూడా పిట్టగోడ, మనసుకు నచ్చింది, సైకిల్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండేది.చదవండి: కోర్ట్ జంట బ్యాండ్ మేళం ట్రైలర్ -
సైలెంట్‌గా వస్తారు.. స్పెషల్‌గా ఉండిపోతారు: రవికృష్ణ
చెన్నైలో ఓ సీరియల్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రవికృష్ణ తర్వాత నటుడిగా మారాడు. మొగలి రేకులు సీరియల్‌తో నటుడిగా సెన్సేషన్ అయ్యాడు. అనంతరం బిగ్‌బాస్ షోతో గుర్తింపు పొందాడు. ఈ షో తర్వాత సినిమా ఛాన్సులు ట్రై చేశాడు. పలు చిత్రాల్లో నటించాడు. విరూపాక్ష సినిమాతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. లవ్ మీ: ఇఫ్ యు డేర్, దండోరా.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ప్రేమలో..విజయవాడకు చెందిన ఇతడు ఆమె కథ అనే సీరియల్ చేస్తున్న సమయంలో నటి నవ్య స్వామితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఏ షోకి వెళ్లినా జంటగా కలిసే వెళ్లేవారు. అయితే ప్రేమలో ఉన్నామని మాత్రం ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ నవ్య బర్త్‌డే రోజు మాత్రం తనతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ ఇస్తుంటాడు. మంగళవారం (మార్చి 17న) నవ్య బర్త్‌డే. మనకు తెలియకుండానే స్పెషల్ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన రెండు పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఓయ్ స్వామి.. హ్యాపీ బర్త్‌డే. ఇలాగే క్రేజీగా, అందంగా జ్ఞాపకాలను కూడబెట్టుకుంటూ ఉండాలి. కొందరు మన జీవితాల్లోకి అనుకోకుండా వస్తారు. కానీ, మనకు తెలియకుండానే ఎంతో ప్రత్యేకంగా మారిపోతారు. అలాంటి అరుదైనవారి జాబితాలో నువ్వు కూడా ఒకదానివి! అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని అడుగుతున్నారు. విజయ్-రష్మిక జోడీలాగే మీ జంట కూడా అద్భుతంగా ఉంటుందని, త్వరగా వివాహం చేసుకోమని కోరుతున్నారు. View this post on Instagram A post shared by Ravi krishna (@ravikrishna_official) చదవండి: పీలింగ్స్ చూశారు.. దీనికేమైందని అంత రాద్ధాంతం?: నటి -
నామకరణ ఫంక్షన్.. చెల్లి కోసం వితికా సర్ప్రైజ్
హీరోయిన్, బిగ్‌బాస్ బ్యూటీ వితికా షెరుకు ఎవరైనా నచ్చారంటే వారికోసం ఏమైనా చేస్తుంది. భర్త కోసం ఇల్లు కట్టి గిఫ్ట్ ఇచ్చింది. చెల్లికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా సీమంతం చేసింది. స్నేహితురాలు, మెగా డాటర్ నిహారిక ఉండే ఇంట్లో ఆమెకోసం ఓ గదిని ప్రత్యేకంగా అలంకరించి సర్ప్రైజ్ చేసింది. ఇలా ఎప్పుడూ నా అనుకునేవారికోం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.కృతికాకు పండంటి బాబుఇకపోతే 2025 డిసెంబర్లో వితికా పెద్దమ్మగా ప్రమోషన్ పొందింది. నటి సోదరి కృతికా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆ పిల్లవాడి నామకరణ వేడుక జరిగింది. ఆ విషయాన్ని వితికా సిస్టర్స్ ఆలస్యంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. బాబుకు జైవీర్ కార్తికేయ అని నామకరణం చేసినట్లు కృతిక కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది. వితిక అయితే.. ఊయల ఫంక్షన్ కోసం దగ్గరుండి డెకరేషన్ చేయించింది. నామకరణ వేడుకపూలతో వెంకటేశ్వస్వామిని ఆవిష్కరించింది. అది చూసి కృతిక ఆశ్చర్యపోయింది. తనకోసం ఇంత కష్టపడిందా? అని తెగ సంతోషపడిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నీలాంటి అక్క దొరికినందుకు కృతిక చాలా అదృష్టవంతురాలు అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వరుణ్ సందేశ్- వతిక 'ధర్మస్థల నియోజకవర్గం', 'డియర్ ఆస్ట్రోనాట్' సినిమాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
'అవకాశాలు తర్వాత.. బరువు తగ్గు'.. ఏడ్చుకుంటూ వెళ్లా!
నటి సంభావన సేత్.. భోజ్‌పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్‌బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.రెండో సీజన్లో పార్టిసిపేషన్అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాను. నాలుగో సీజన్లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్‌పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్‌కు పరిచయం చేశాడు. ఫోన్ నెంబర్ కూడా..అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్లా.సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే? -
రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. మూణ్నెళ్లయినా ముట్టలే!
బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల మనసు గెల్చుకుని ఏకంగా ట్రోఫీ అందుకున్నాడు. విన్నర్‌గా రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు. అయితే షో పూర్తయి మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఆ డబ్బు ముట్టలేదట!ఇదెప్పుడూ ఉండేదే..ఈ విషయాన్ని అతడు తాజాగా తన యూట్యూబ్‌లో వెల్లడించాడు. గౌరవ్ ఖన్నా మాట్లాడుతూ.. షోలో ప్రకటించిన ప్రైజ్‌మనీ, కారు.. ఇవన్నీ నా చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోంది. టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆలస్యాలు ఎప్పుడూ ఉండేవే.. రెండు నెలల్లో..కానీ తప్పకుండా నాకు ఇస్తానన్నవి ఇచ్చి తీరతారు. అందుకు కనీసం రెండు నెలలైనా పడుతుంది అని చెప్పుకొచ్చాడు. కాగా గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా షో విజేతగా నిలిచి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఆ వెంటనే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా విజయ దుందుభి మోగించాడు.చదవండి: నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా: అల్లు శిరీష్ -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం
టాప్-3 బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట విషాదం నెలకొంది. ఈ విషయాన్ని పవన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీ నాన్న నీతో లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్ షో సమయంలో కూడా తన తండ్రి ఆరోగ్యం బాగలేదని డీమాన్ పవన్ చెప్పారు. వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇంతలోనే ఆ కుటుంబంలో ఈ విషాదం నెలకొంది. అయితే పవన్ తండ్రి నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.కాగా.. బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ టాప్-3లో నిలిచాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన టాలెంట్‌తో అదరగొట్టేశాడు. రెండుసార్లు కెప్టెన్ కూడా అవ్వడమే కాకుండా తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. -
ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూసేవాళ్లు చాలామంది! ఆ ఛాన్స్ దొరక్క ఇక జీవితంపై ఆశలు వదిలేసుకుని తనువు చాలించాలనుకున్నాడు నాగమణికంఠ. అలాంటి సమయంలో బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. మళ్లీ గుండె నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని షోలో అడుగుపెట్టాడు. ఒక్క పాటతో ఫుల్ ట్రోల్ అయ్యాడు. కానీ, తర్వాత నెమ్మదిగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బీబీ జోడీ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు.రెండేళ్లపాటు..ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ.. మనలో వచ్చే నెగెటివ్ ఆలోచనలను అక్కడే చంపేయాలి. రెండేళ్లపాటు నేనేం సంపాదించలేదు, ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఇక అయిపోయిందిరా భయ్ అనుకున్నాను. ఆ 10 నిమిషాల్లో నాకు ఫోన్‌కాల్ రాకపోయుంటే నా జీవితం ముగిసిపోయేది. సరిగ్గా అదే సమయంలో బిగ్‌బాస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏడ్చేసిన సదాఅప్పుడు కన్నీళ్లు తుడుచుకుని ఇంటర్వ్యూకి వెళ్లాను అని పేర్కొన్నాడు. నీ వెనక ఇలాంటి గతం ఉందని తెలీదు, నాకు చాలా బాధగా అనిపిస్తోందంటూ నటి సదా కన్నీళ్లు పెట్టుకుంది. కాగా నాగమణికంఠ సీరియల్ నటుడు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుంది. కానీ, అతడిని తండ్రిగా స్వీకరించలేకపోయాడు. బిగ్‌బాస్ షోతో గుర్తింపుఇంతలో తల్లి క్యాన్సర్‌తో 2019లో మరణించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అతడు మంచి ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. కూతురు పుట్టడంతో తల్లే తిరిగి వచ్చిందని సంతోషించాడు. కానీ, భార్యాభర్తల మధ్య కలహాలు మొదలవడంతో ఇండియాకు ఒంటరిగా తిరిగొచ్చేశాడు. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌తో గుర్తింపు పొందాడు. -
నేనెంత లక్కీ.. కన్నీళ్లాగడం లేదు: తనూజ ఎమోషనల్
సెలబ్రిటీలు జనాల అభిమానాన్ని, కోపాన్ని అస్సలు తట్టుకోలేరు. వారి ప్రేమాభిమానాలు చూసి ఆనందభాష్పాలు రాలుస్తారు. కోపంతో దారుణంగా విమర్శించినప్పుడు ఎందుకిలా చేస్తున్నారని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. నటి, తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ రన్నరప్ తనూజ పుట్టస్వామి కూడా ఇప్పుడు సంతోషంతో ఏడ్చేసింది.నేనెంత అదృష్టవంతురాలినో..ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. తనను ఎంతగానో ఇష్టపడే ఓ మహిళా అభిమాని తనకోసం డైరీ రాసిందని, దాన్ని చదువుతున్నానని పేర్కంది. నేనెంత అదృష్టవంతురాలినో కదా.. నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. ఈసారి ఎంతో ప్రత్యేకమైన పుస్తకాన్ని చదువుతున్నాను. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నాకోసం స్పెషల్‌గా రాసిన డైరీ చదువుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. నన్ను అర్థం చేసుకున్నారునమ్ముతారో, లేదో.. ఇది చదువుతూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని లోతుగా అర్థం చేసుకునేది మన కుటుంబసభ్యులు మాత్రమే.. కానీ, నా విషయంలో.. ఎంతోమంది జనం నన్ను అర్థం చేసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు.. నా మంచి కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు అని తనూజ ఆనందం వ్యక్తం చేసింది. తనకోసం డైరీ రాసిన వందన అనే అమ్మాయికి ఐ లవ్యూ చెప్పింది.చదవండి: ప్రేమలో కోర్ట్ హీరోహీరోయిన్.. వాళ్ల స్పందన ఇదే! -
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్‌బాస్ కంటెస్టెంట్
సెలబ్రిటీలు ఏం చేసినా, చేయకపోయినా విమర్శలపాలవుతూనే ఉంటారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1 విన్నర్ దివ్య అగర్వాల్ పరిస్థితి కూడా ఇంతే! తరచూ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటుంది. ఆస్తి చూసే అపూర్వ పడగోయంకర్ను పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలపై తాజా ఇంటర్వ్యూలో నటి స్పందించింది.ఏమైనా అనుకోండిదివ్య అగర్వాల్ మాట్లాడుతూ.. నన్ను గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసమే సంబంధం పెట్టుకోవడం) అని పిలవాలనుకుంటే పిలుచుకోండి.. అవసరమైతే డైమండ్ డిగ్గర్ అని కూడా పిలవండి. నాకు మాత్రం నా జీవితంలో సరైన భాగస్వామి దొరికాడు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన బంగారం ఆయనే!అవేం లేవుగాఅయినా జనం కాస్తయినా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమైనా లంబోర్గినిలో తిరుగుతున్నానా? జుహు బీచ్ దగ్గర బంగ్లాలో ఉంటున్నానా? నాకంటూ ఓ ప్రైవేట్ జెట్ ఉందా? ఇవన్నీ లేవే.. నేను ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తాను. మరెందుకు నాపై అంత కోపం, ద్వేషం? ఆడవాళ్లు కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకుంటారని ఎందుకు తప్పుగా అనుకుంటారు?పెళ్లిఆ పెళ్లికి కారణమైన ప్రేమను చూడరా? నేనెప్పుడూ సింపుల్‌గానే ఉండాలనుకుంటాను, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. అంతెందుకు.. నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా కొంటుంటాను అని చెప్పుకొచ్చింది. దివ్య- అపూర్వ 2024 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఓటీటీలో ఫంకీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? -
అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్ చేస్తే తీసేస్తారు: అషూ
టిక్‌టాక్ ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్ స్మాష్, రీల్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోనూ పాల్గొని మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.ఇప్పటివరకు ఎన్నో చేశా..ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విన్నర్ నిఖిల్ మళయక్కల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రెస్మీట్లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్ పర్ఫామెన్స్‌లు, క్యారెక్టర్ రోల్స్, హోస్టింగ్.. ఇలా అన్నీ చేశాను. హీరోయిన్ అంటుంటే..తొలిసారి హీరోయిన్గా చేశాను. షూటింగ్లో అందరూ హీరోయిన్‌గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా..అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా ప్రొడక్షన్ హౌస్ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్‌కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే? -
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు
మాస్క్ మ్యాన్.. బిగ్‌బాస్ కంటే ముందే ఈ పేరు బాగా ఫేమస్ అయింది. బిగ్‌బాస్ 9లో అడుగుపెట్టాలంటే అగ్నిపరీక్ష దాటాలని సామాన్యుల కోసం ఓ షో ఏర్పాటు చేశారు. అందులో మాస్క్ మ్యాన్ పాల్గొన్నాడు. తన పేరు హరిత హరీశ్ అని తెలిపాడు. భార్యపై ఉన్న ప్రేమతో ఇల్లాలి పేరునే తన పేరులో చేర్చుకున్నట్లు తెలిపాడు. అది విని భార్యంటే ప్రేమ, గౌరవం బాగానే ఉందని అందరూ అనుకున్నారు.కోపమొస్తే కొట్టేస్తావా?కానీ, అంతలోనే ఒకసారి భార్యపై చేయి చేసుకున్నానని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కొట్టేస్తావా? ఆడదానిపై చేయెత్తుతావా? అని తిట్టిపోశారు. అలా నెగెటివిటీతోనే బిగ్‌బాస్ 9వ సీజన్లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. తన ముక్కుసూటితనం, మొండితనం, కోపం వల్ల ఎక్కువమందిని ఆకర్షించలేకపోయాడు.కాళ్లు పట్టుకుని క్షమాపణలుఅయితే ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి వస్తున్నాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో భార్య హరితతో కలిసి హరీశ్ పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో మాస్క్ మ్యాన్ మాట్లాడుతూ.. మగాడు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాడని చెప్పి ఆడవారిపై చేయత్తడం చాలా తప్పు అంటూ భార్య కాళ్లు నమస్కరించాడు. అలా అప్పటి వివాదానికి ఇలా ఫుల్స్టాప్ పెట్టాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కపుల్ రియాలిటీ షో మార్చి 15న ప్రారంభం అవుతోంది. ఇది మా టీవీతో పాటు హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. చదవండి: తండ్రి మరణించిన పదేళ్లకు ఆయన కల నెరవేర్చిన కూతురు -
తనూజ బర్త్‌డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
ముద్దమందారం సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. ఇటీవల తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో ఎంతోమంది స్నేహితులను సైతం సంపాదించుకుంది. వారిలో దివ్వెల మాధురి ఒకరు. బిగ్‌బాస్ షోలో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధురి.. మొదట తనూజపై విరుచుకుపడింది.బిగ్‌బాస్ షోలో క్లోజ్కట్ చేస్తే వారం తిరగకముందే అందరికంటే ఎక్కువ తనూజతో క్లోజ్ అయిపోయింది. మాధురి కటౌట్ చూసి భయపడ్డ తనూజ ఆమెను ముద్దుగా మ్యాడీ అని పిలుస్తూ ప్రేమగా పెత్తనం కూడా చెలాయించింది. అప్పటినుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక నేడు (మార్చి 5న) తనూజ 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుపుకుంటున్న మొదటి బర్త్‌డే ఇది! మై స్వీట్ హార్ట్ దీంతో దివ్వెల మాధురి తనకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. తనతో కేక్ కట్ చేయించి, చీరగాజులు పెట్టింది. అలాగే బంగారు చెవికమ్మలను బహుమతిగా ఇచ్చింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్‌డే బంగారా.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకుంటున్న తొలి బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు తనూజ థాంక్యూ మ్యాడీ అని కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Divvala Madhuri (@madhuri_srinivasduvvada) చదవండి: గర్భధారణలో కష్టాలు.. తనే నా మిరాకిల్ బేబీ: ప్రియాంక చోప్రా -
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా? అంతమాత్రానికే ఇలా నాకు నరకం చూపించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు యూట్యూబర్, హిందీ బిగ్‌బాస్ 17 ఫేమ్ అనురాగ్ దోభల్. కులాంతర వివాహం చేసుకున్న కారణంతో తన కుటుంబం తనను వెలేసిందని, ఇక తనకు చావే దిక్కని వాపోయాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.చిన్నప్పటినుంచి కష్టాలు'గత కొన్నినెలలుగా నా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీవితం ఇంత దుర్భరంగా మారుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. 14 ఏళ్ల వయసులోనే నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ తర్వాత నా పేరెంట్స్ వారికి నచ్చిందే చదవాలని నాపై బలవంతం చేశారు. నేనేమో నా కలల్ని నిజం చేసుకోవడం కోసం డబ్బు కూడబెట్టేందుకు కష్టపడ్డాను. ట్యూషన్స్ చెప్పాను. నాకన్నా నా పేరెంట్స్ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను.పెళ్లి ఇష్టం లేదుసోషల్ మీడియా ద్వారా రితిక అనే అమ్మాయిని కలిశాను. తను నా అభిమాని అని పేర్కొంటూ రెండుమూడేళ్లపాటు మెసేజ్‌లు చేసింది. అలా ఒకరోజు ఆమె మెసేజ్‌కు రిప్లై ఇచ్చాను. అలా తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరం రెండేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. వారం రోజుల్లో పెళ్లి అనగా వేడుకకు రామని చెప్పేశారు. ఎంతగానో బతిమాలాను. బంధువులందరి ముందు చేతులెత్తి వేడుకున్నాను. వార్నింగ్కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగాను. అయినా వారి మనసు కరగలేదు. మేము సంతోషంగా లేము, మిమ్మల్నీ సంతోషంగా ఉంచము అని వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని టార్చర్ పెట్టారు. నా దగ్గరున్నదంతా లాక్కున్నారు. పెళ్లయ్యాక ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వలేదు. చచ్చిపోవాలనుకున్నాను. నాకేదైనా అయితే అందుకు నా ఇంట్లోవాళ్లే కారణం.బోరుమని ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ఇప్పుడు రితిక కూడా నన్ను వదిలేసింది. నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాను. ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. బహుశా ఈ వీడియో తర్వాత నేను కనిపించనేమో! ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ప్రశాంతంగా నిద్రపోవాలనుంది. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. కానీ బయటవాళ్లు చెప్పిందే నమ్మారు. నన్ను దూరం పెట్టారు. నేను చనిపోయాక అయినా నా బిడ్డను ఆదరించండి అని బోరుమని ఏడ్చాడు. ఇదే తన చివరి వ్లాగ్ అని అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అనురాగ్ భార్య గతేడాది సెప్టెంబర్‌లో గర్భం దాల్చింది.చదవండి: చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్ -
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
దాదాపు 40 సినిమాలు చేసిన కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధి 2023లో మరణించాడు. అతడి మరణంతో ఎంతగానో కుంగిపోయింది కమెడియన్ రెండో భార్య, నటి రేణు సుధి. అయితే రానురానూ ఆ బాధ నుంచి తేరుకుంటూ తనకిష్టమైన వ్యాపకాలపై శ్రద్ధ పెట్టింది. రీల్స్ చేయడం, సాంగ్స్‌లో యాక్ట్ చేయడం, రకరకాలుగా ఫోటోషూట్స్ చేయడంతో సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోయేది. బిగ్‌బాస్ షోతో గుర్తింపుకొందరైతే వితంతువై ఉండి ఈ పిచ్చి చేష్టలేంటి? సుధికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావ్ అని విమర్శించారు కూడా! అలా ట్రోలింగ్ బారిన పడ్డ సమయంలో మలయాళ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ వచ్చిన క్రేజ్‌తో రెండు, మూడు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తాజాగా రేణు సుధికి భాగస్వామి కావాలనిపిస్తోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. తోడు కావాలిఒంటరితనం భరించలేకపోతున్నాను. నాకు ఒక పార్ట్నర్ కావాలనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకుని, నా బాగోగులతో పాటు పిల్లల్ని చూసుకునే తోడు కావాలనిపిస్తోంది అని రాసుకొచ్చింది. గతంలో కూడా రేణు మళ్లీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు వదిలేసి అతడితో మరో ఇంట్లో స్థిరపడతానంది. అలాగే తన పేరు పక్కన ఉన్న సుధిని చెరిపేస్తానంది.రెండో పెళ్లిమిమిక్రీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న కొల్లం సుధిని మొదటి భార్య వదిలేసింది. అప్పటికే వీరికి కుమారుడు రాహుల్ సంతానం. భార్య వదిలేశాక సింగిల్ పేరెంట్‌గా చాలా ఇబ్బందులు పడ్డాడు సుధి. కొన్నేళ్ల తర్వాత అతడికి రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రితుల్ సంతానం. రేణుకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం! -
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
తమిళ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నాకు, నర్మదకు ఈరోజు (మార్చి 2న) పాప పుట్టింది. ఆనందంగా ఉందితల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమఃశివాయ అంటూ ఓ లేఖ షేర్ చేశాడు. కాగా హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.సినిమా2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న హరీశ్ కల్యాణ్ నూరు కోడి వానవిల్ మూవీ చేస్తున్నాడు. Elated to share the most wonderful news with all my dear family ❤️🤗God willing 🙏 pic.twitter.com/11Icq8OMMz— Harish Kalyan (@iamharishkalyan) March 2, 2026 చదవండి: పెళ్లికి ముందు సహజీవనం.. నాకు అవకాశం ఇచ్చుంటే..: లయ -
ఖరీదైన హీల్స్ ధరించిన హీరోయిన్.. చెప్పుల ధర వేలల్లో కాదు!
'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది నిక్కీ తంబోలి. కాంచన 3, తిప్పరా మీసం వంటి చిత్రాల్లో నటించినా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. దాంతో ఐటం సాంగ్స్‌పై ఫోకస్ చేసింది. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. లేటెస్ట్ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.గోవా ట్రిప్తాజాగా ఆమె ద 50 షోలోని సహకంటెస్టెంట్లతో వెకేషన్‌కు వెళ్లింది. ఈ గోవా ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నిక్కీ బ్లూ కలర్ పొట్టి డ్రెస్‌లో తళుక్కుమని మెరిసింది. అయితే అందరి దృష్టి మాత్రం తను ధరించిన హీల్స్పైనే పడింది. కారణం ఏంటో తెలుసా? ఆ హీల్స్ డాల్స్ అండ్ గబ్బానా అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందిన చెప్పులు.చెప్పుల ధర ఎంతంటే?ఆ హీల్స్ ధర అక్షరాలా లక్ష 46 వేలని తెలుస్తోంది. నిక్కీ తంబోలికి మేకప్ దగ్గరినుంచి అలంకరణ వరకు అన్నీ ఖరీదైనవి వాడటం బాగా అలవాటు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అర్బాజ్ పటేల్ కూడా ధ్రువీకరించాడు. తను వాడే మాయిశ్చరైజర్ ధర రూ.75 వేలు, సీరమ్ రూ.50 వేలు అని తెలిపాడు. View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) చదవండి: అప్పటిదాకా నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి -
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
బిగ్‌బాస్ షో వల్ల పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా అంతే వస్తుంది. వాళ్లు ఏం చేసినా, చేయకపోయినా ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటారు. వారికి సంబంధం లేని విషయాల్లో కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్ల పేరు ఇరికించి విమర్శిస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్, నటి తనూజ విషయంలో ఇదే జరిగింది.తనూజ కోసం నిలబడ్డ పవన్'ముద్ద మందారం' సీరియల్‌తో ఫేమస్ అయిన తనూజకు ఆ సీరియల్ నటీనటులతో మంచి అనుబంధం ఉంది. ముద్ద మందారం సీరియల్ హీరో పవన్ సాయి కూడా తనకు మంచి మిత్రుడు. తనూజ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె కోసం స్టేజీపైకి కూడా వచ్చాడు. అయితే పవన్ విడాకులకు తనూజయే కారణమని కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.ఉసురు తగులుతుందితాజాగా తనూజ తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేయగా ఓ నెటిజన్ పవన్ సాయి విషయాన్ని ప్రస్తావించాడు. పవన్ సాయి భార్య కర్మ నిన్ను వదిలిపెట్టదు, ఆమె ఉసురు నిన్ను వెంటాడుతుంది అని శాపనార్థాలు పెట్టాడు. అందుకు తనూజ గట్టి కౌంటర్ ఇచ్చింది. నీ కర్మ కూడా నిన్ను వెంటాడకముందే నీపై నువ్వు ఫోకస్ చేసుకోవడం మంచిది. నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను చాలా బాగున్నాను. నా కర్మఫలం బాగుంది కాబట్టే నా జీవితంలో అంతా మంచే జరుగుతోంది.కౌంటర్ ఇచ్చిన తనూజఅయినా ఇలా ముఖం కూడా చూపించకుండా ఫేక్ ఐడీలతో ఇలాంటి మెసేజ్‌లు పెట్టడానికి కొంచెం కూడా సిగ్గులేదా? నీకు ఎవరి ఉసురు వెంటాడకుండా చూసుకో.. అని ఇచ్చిపడేసింది. చివర్లో తనను విమర్శించేవాళ్లకు కౌంటరిచ్చింది. డియర్ హేటర్స్.. మీరు నా ప్రశాంతతని పాడు చేయలేరు. నన్ను రెచ్చగొట్టేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఫలించవు. అయినా మీరు ప్రశాంతంగా ఉండండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.చదవండి: విజయ్‌తో విడాకులు... సంగీత ఎవరో తెలుసా? -
ప్రేయసి ముఖం పచ్చబొట్టు! నటుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ నటుడు కరణ్ కుంద్రా గుండె నిండా తేజస్వి ప్రకాశ్ నిండి ఉంది. ఆమె అంటే కరణ్‌కు పంచప్రాణాలు. అందుకే తాజాగా అతడి ఛాతీపై తేజస్వి ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ప్రియురాలిపై అతడు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు.టాటూ నిజమైనదా?ఈ క్రమంలో కరణ్ ఇది శాశ్వత పచ్చబొట్టు కాదని వెల్లడించాడు. తేజస్వి నటించిన సైకో సయ్యా.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ తాత్కాలిక టాటూ వేయించుకున్నానని వివరణ ఇచ్చాడు. తనకు సపోర్ట్‌గా నిలబడేందుకు ఇలా టాటూతో కనిపించానన్నాడు.బిగ్‌బాస్ షోలో మొదలైన లవ్హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లో కరణ్- తేజస్వి ప్రకాశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికే అంటే 2022లోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటినుంచి పెళ్లిని దాటవేస్తూనే ఉన్నారు. మధ్యలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చినా అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా.. మాది ఫెవికాల్ బంధమని కరణ్-తేజస్వి ఎన్నోసార్లు రుజువు చేశారు.చదవండి: ప్రేయసితో బిగ్‌బాస్ షణ్ను ఎంగేజ్మెంట్ -
ప్రేయసితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఒకప్పుడు కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ ద్వారా యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి మరింత పాపులర్ అయ్యాడు. తర్వాత పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన షణ్ను ఈ ఏడాది ప్రారంభంలో ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. అమ్మాయి ముఖం చూపించకుండా, పేరు చెప్పకుండా కేవలం V అనే అక్షరాన్ని మాత్రమే వెల్లడించాడు.ఎంగేజ్మెంట్తాజాగా ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. తనొక ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 25న అంటే ఈరోజు తన నిశ్చితార్థం జరిగిందని ఫోటోలు షేర్ చేశాడు. దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు.. అయిపాయె అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షణ్ముఖ్ - వైష్ణవి ఇద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెరీర్షణ్ముఖ్ సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడో అంతా తలకిందులైంది. ఈ రియాలిటీ షోలో నటి సిరి హన్మంత్‌తో లవ్ ట్రాక్ నడిపాడు. ఇది జనాలకు మింగుడుపడలేదు. ఎందుకంటే అప్పటికే షణ్ను.. దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. ఆల్రెడీ ప్రేమలో ఉండగా మళ్లీ ఈ పిచ్చిపనులేంటి? అని అందరూ విమర్శించారు.తీరా షో నుంచి బయటకు వచ్చాక దీప్తితో బ్రేకప్ కూడా అయింది. ఇంతలో డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. మరోపక్క అమ్మకు క్యాన్సర్.. చాలాకాలం పాటు డిప్రెషన్‌తో కుంగిపోయాడు. కానీ నెమ్మదిగా దాన్నుంచి బయటపడి తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు. అలా ప్రేమకు నమస్కారం అని ఓ సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) చదవండి: రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి -
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ ట్రోఫీ సాధించాలంటే గేమ్స్ గెలవడం కాదు, ప్రేక్షకుల మనసు గెలవాలి. అప్పుడే టైటిల్ కొట్టడం సాధ్యమవుతుంది. అది ఇమ్మాన్యుయేల్‌కు బాగా తెలుసు. అందుకే షోలో అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచి అందర్నీ నవ్విస్తూ, అన్ని ఆటల్లోనూ టఫ్ కాంపిటీషన్ ఇస్తూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.గెలుపు తథ్యం అనుకుంటే..అతడి ఆట, మాట, తీరు అన్నీ చూసిన నాగార్జున ప్రతివారం ఇమ్మూపై ప్రశంసల వర్షం కురిపించేవాడు. గోల్డెన్ స్టార్ బ్యాడ్జ్ ఇచ్చేవాడు. ఇంట్లోకి వచ్చినవాళ్లందరూ కూడా ఇమ్మూని ఆకాశానికి ఎత్తేయడంతో తనకు తిరుగులేదనుకున్నాడు. ట్రోఫీ గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు.ఫైనల్స్‌లో నాలుగో స్థానంకానీ అనూహ్యంగా ఇమ్మూ, తనూజ మధ్య ఉన్న పోటీ.. షో చివరాఖరకు వచ్చేసరికి తనూజ వర్సెస్ కల్యాణ్‌గా మారిపోయింది. పవన్ కూడా ఇమ్మూని వెనక్కు నెట్టి రేసులో ముందుకు వచ్చాడు. దాంతో ఫైనల్స్‌లో ఇమ్మూ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కల్యాణ్ ట్రోఫీ గెలవగా తనూజ రన్నరప్, పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. అసలు గెలవకపోడమే అనంతమైన బాధ అంటే ఏకంగా నాలుగో స్థానంలో ఉండటంతో ఇమ్మాన్యుయేల్ తట్టుకోలేకపోయాడు. విన్నర్‌గా ఎందుకు చూడరు?తాజాగా బీబీ ఉత్సవం ప్రోమోలో తనకు అన్నింటికన్నా పెద్ద బాధ ఏంటో బయటపెట్టాడు. తల్లితో పాటు స్టేజీపైకి వచ్చిన ఇమ్మూ.. కమెడియన్లను విన్నర్‌గా చూడరనే విషయం నాకు తెలుసు. కానీ ఎందుకు చూడరు? మనం గేమ్స్ ఆడితే చూస్తారుగా అనుకున్నాను. నా నమ్మకం నిలబడలేదు. అలా అని ఓడిపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదు. కానీ, అమ్మానాన్న ఇద్దరూ క్యారేజీ కట్టుకుని బైక్‌పై 90 ఊర్లు తిరిగారు. నాకు ఓటేయమని పాంప్లెట్లు పంచారు. హీరో చేతుల మీదుగా సన్మానంఇప్పటికీ నా మైండ్‌లో అదే తిరుగుతోంది అంటూ ఏడ్చేశాడు. అటు ఇమ్మూ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం హీరో నిఖిల్.. స్టేజీపైకి వచ్చి ఇమ్మూ తల్లికి శాలువా కప్పి సన్మానం చేశాడు. అలాగే ఇమ్మాన్యుయేల్‌కు బిగ్‌బాస్ 9 ఆల్‌రౌండర్ అనే ట్రోఫీని అందించాడు. ఏదేమైనా ఎంత కష్టపడ్డా తనకు విజయం దక్కలేదన్న బాధ ఇమ్మూ మనసులో ఇప్పటికీ అలాగే ఉంది!చదవండి: హీరోయిన్ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటే సిగ్గేసింది: బాలీవుడ్ హీరో -
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
సీరియల్ నటుడు, తెలుగు బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అర్జున్- సురేఖ దంపతులు 2025 జనవరి 9న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కూతురికి అర్ఖ అని నామకరణం చేశారు. తన పేరులోని ఆర్.. సురేఖ పేరులోని ఖ అక్షరాలు తీసుకుని అర్ఖ అని వచ్చేలా పేరు పెట్టామని వెల్లడించాడు.తొలిసారి కూతురి ఫోటోఅయితే పాప ఫోటోలు మాత్రం వీరు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. తాజాగా అర్జున్- సురేఖ దంపతులు తమ ఏడో పెళ్లిరోజు సందర్భంగా ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. అందులో వారి కూతురి ముఖాన్ని తొలిసారి చూపించారు. ఇక సురేఖ భర్త గురించి చెప్తూ ఎమోషనలైంది. ఏడేళ్ల క్రితం.. మేము జీవితాంతం కలిసుండాలని, ఒకరి చేయి మరొకరు వడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాం. మాకెంతో స్పెషల్కష్టాలు, సంతోషాలు, పాఠాలు.. ఇలా అన్నింటిలో ఒకరికొరం తోడుగా నిలిచి బలంగా ఎదిగాము. మా ప్రేమకు ప్రతిరూపం, మా జీవితంలో అత్యంత మధురమైన అధ్యాయం మా కూతురు అర్ఖ. ఇద్దరం నుంచి ముగ్గురంగా మారిన మా ప్రయాణం ఎంతో అపురూపమైనది. ఈ ఫోటో మాకెంతో స్పెషల్. ఎందుకంటే మా చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న తొలి ఫోటో ఇదే!జీవితాంతం కలిసిమెలిసుండాలినాకు భాగస్వామిగా ఉన్నందుకు, అండగా నిలబడినందుకు, నా కూతురికి ప్రేమగల తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ అర్జున్. మనం ఇలాగే జీవితాంతం సంతోషంగా, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మధురమైన పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని రాసుకొచ్చింది.బిగ్‌బాస్‌తో గుర్తింపుతెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అతడితోపాటు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు వెనువెంటనే ఎలిమినేట్ అయిపోయారు. కానీ, అర్జున్ మాత్రం కడవరకు నిలబడ్డాడు. టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రాండ్ ఫినాలేలో టాప్ 6లో చోటు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by Surekha Reddy🦋 (@ambati_surekha) చదవండి: -
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్‌కు చెక్ పెట్టిన నటి
హిందీ బిగ్‌బాస్ సీజన్ 1 ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్, భర్త అపూర్వ పడ్‌గోయంకర్ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరు విడిపోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టింది దివ్య. పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.హ్యాపీ యానివర్సరీ మై లవ్నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావ్.. అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నేనేంటో, ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు. నన్ను అది మార్చుకో, ఇది మార్చుకో అని నువ్వెప్పుడూ చెప్పలేదు. నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. హ్యాపీ యానివర్సరీ మై లవ్.. ఇలాంటి పెళ్లిరోజులు మనమెన్నో జరుపుకోవాలి. నా ప్రతి ఆలోచన తనకు తెలుసు, కాబట్టి తనకు నాగురించి ఎటువంటి భయం లేదు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ హ్యాపీ యానివర్సరీ అని కామెంట్లు చేస్తున్నారు.అసలేమైంది?దివ్య ఇటీవలే ద 50 అనే రియాలిటీ షోకి హాజరైంది. అయితే ఈ షోలోని మరో కంటెస్టెంట్ భవ్య సింగ్.. దివ్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె భర్తతో కలిసుండటం లేదని ఆరోపించింది. తను షోకి వచ్చినప్పటికీ భార్య కోసం అపూర్వ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, ఇక్కడే వారి దాంపత్య జీవితం ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శలు గుప్పించింది. దీంతో దివ్య దంపతులు విడిపోతున్నారంటూ రూమర్స్ రాగా వాటిని నటి టీమ్ కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Divyaa Agarwal (@divyaagarwal_official) -
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది పునర్నవి భూపాలం. కొన్ని సినిమాలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. అయితే తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాహుల్‌తో లవ్ ట్రాక్‌తో బాగా ఫేమస్ అయింది. కానీ షో ముగిసిన తర్వాత రాహుల్- పునర్నవి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎవరి కెరీర్లో వారు బిజీ అయ్యారు.పెళ్లికి వేళాయెకొంతకాలం క్రితం రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు. ఇప్పుడు పునర్నవి కూడా పెళ్లికి రెడీ అయింది. ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసింది. హేమంత్ వర్మ ప్రపోజల్‌కు ఎస్ చెప్పానంటూ అతడితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. తాజాగా వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. లగ్న పత్రికఈ రోజు పునర్నవి - హేమంత్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో లగ్నపత్రిక రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలను పునర్నవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నీలిరంగు చీరలో పునర్నవి అందంగా మెరిసిపోతోంది. అయితే తను సింగిల్‌గా దిగిన పిక్స్ మాత్రమే అభిమానులతో పంచుకుంది.చదవండి: 6 సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్.. ఒక్క సంఘటనతో సంచలన నిర్ణయం -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
కన్నడ సీరియల్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ నమ్రత గౌడ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం ఊపందుకుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ కార్తీక్ మహేశ్‌తోనే ఏడడుగులు వేయనుందని గాసిప్. రియాలిటీ షో ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఇది నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. కానీ, తన పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటోంది నమ్రత.రహస్యంగా పెళ్లి చేసుకోనుఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. నా రిలేషన్షిప్, పెళ్లి గురించి ఏవేవో ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాబట్టి దానిపై మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఆ విషయం అందరికీ చెప్తాను. దాన్ని రహస్యంగా ఉంచాల్సిన పని లేదు. నా పెళ్లి చీర కోసం ఏదో కొత్త రంగు సృష్టిస్తున్నారట. ఇది మరీ విడ్డూరంగా ఉంది. మా మధ్య ఉన్నది స్నేహమేఏదేమైనా ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు అని కుండబద్ధలు కొట్టింది. కాగా కన్నడ బిగ్‌బాస్ పదో సీజన్లో నమ్రత, కార్తీక్ పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న చనువు చూసి ప్రేమాయణం నడుపుతున్నారని అభిమానులు ఫీలయ్యారు. అయితే తమ మధ్య ఉన్నది స్నేహమే అని ఈ జోడీ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వీరి చనువు చూస్తుంటే ఫ్రెండ్‌షిప్‌లా లేదని అభిప్రాయపడ్డారు.చదవండి: తల్లి కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగే హీరో -
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ఇద్దరు ఫైర్‌బ్రాండ్స్ ఉన్నారు. వాళ్లే రీతూ చౌదరి, తనూజ పుట్టస్వామి. తనపై మాటలదాడికి దిగినవారికి కౌంటర్స్ ఇవ్వడంలో రీతూ దిట్ట అయితే టాస్క్స్ ఆడటంలో, మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడంలో తనూజ దిట్ట. వీళ్లిద్దరి స్నేహం చూస్తుంటే ప్రేక్షకులకు భలే ముచ్చట వేసేది. ఫ్రెండ్‌తో ఎంజాయ్సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా బిగ్‌బాస్ హౌస్‌లో ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. నిజమైన మిత్రులు అనిపించుకున్నారు. ఇకపోతే షో అయిపోయి కొన్ని నెలలు కావొస్తుండగా తాజాగా తొలిసారి ఈ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. ఫిబ్రవరి 16 రాత్రి షాపింగ్ చేస్తూ, నచ్చిన ఫుడ్ లాగిస్తూ, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను రీతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎన్నిసార్లు అనుకున్నామో!బిగ్‌బాస్ అయిపోయాక ఒకసారి బయటకు వెళ్లి ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ కాలక్షేపం చేయాలని షోలో ఉండగానే అనుకున్నాం. చాలాసార్లు ఇలాంటి ప్లాన్స్ వేసుకున్నాం. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది. మేమిద్దరం కలుసుకున్నాం. నవ్వుకున్నాం, మనసారా మాట్లాడుకున్నాం, ఆనందంగా గడిపాం. ఇది నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) చదవండి: -
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
వినాయకుడు, పంచాక్షరి, దేనికైనా రెడీ, ప్రేమకావాలి, దూసుకెళ్తా వంటి పలు సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సామ్రాట్ రెడ్డి. తర్వాత సడన్‌గా వెండితెరపై కనిపించడం మానేశాడు. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హర్షితను పెళ్లి చేసుకున్నాక వైవాహిక జీవితంలో ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన సామ్రాట్ తన జీవితంలోని అనేక విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.అందుకే బ్రేక్నటుడు సామ్రాట్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకానొక సమయలో హీరోయిన్‌తో పెళ్లిపీటలపై కూర్చోవడం.. తీరా పెళ్లి క్యాన్సిల్ అవడం.. ఇలాంటి పాత్రలే తరచూ వచ్చాయి. దీంతో నాకు బోర్ కొట్టేసి బ్రేక్ తీసుకున్నాను. హర్షితను పెళ్లి చేసుకున్న కొంతకాలానికే నాపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ ఉట్టి ఆరోపణలు మాత్రమే!కావాలనే నా ప్రతిష్ట దిగజార్చిందిపెళ్లి వర్కవుట్ కాలేదంటే దాన్ని చాలారకాలుగా డీల్ చేయొచ్చు. పరస్పర అంగీకారంతో లేదా తనవైపు నుంచి విడాకులు పంపించి విడిపోవచ్చు. కానీ ఆమె తప్పు దారి ఎంచుకుంది. నేను నటుడినన్న కారణంతో నా పరువు తీయాలనుకుంది. ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదే సమయంలో నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరింత కుంగిపోయాను. బిగ్‌బాస్ ఆఫర్ఒక్కసారిగా మా కుటుంబం చిన్నాభిన్నమైంది. మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నేను రెండురోజులు జైలుకు వెళ్లివచ్చాను. నాపై లేనిపోని అభాండాలన్నీ వేశారు. అది నా కెరీర్‌ను కూడా దెబ్బతీసింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అప్పుడు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. వెళ్లకూడదనుకున్నాను. కానీ నాపై పడ్డ నిందలు తొలగించుకోడానికి బిగ్‌బాస్‌కు వెళ్లాను. చాలా బాధలు అనుభవించి రాటు తేలిపోయాను. మరో పెళ్లి చేసుకోనుమొదటి పెళ్లి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవితంలో మరో పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పాను. కానీ, బిగ్‌బాస్ తర్వాత అంజనా శ్రీలిఖితను కలిశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగాను. కానీ, ఆమె ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లను ఒప్పించేందుకు తను చాలాదూరం వెళ్లింది. అలా 2020లో పెళ్లి జరగ్గా 2022లో పాప పుట్టింది. మొదటిది పెద్దలు కుదర్చిన పెళ్లయితే రెండోది ప్రేమ వివాహం. లిఖిత నా జీవితంలోకి వచ్చాక సంతోషంగా ఉన్నాను అని సామ్రాట్ రెడ్డి చెప్పుకొచ్చాడు.చదవండి: 4 రోజుల్లో రిలీజ్.. హే భగవాన్ టైటిల్ ఛేంజ్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి గుడ్‌న్యూస్ చెప్పింది. తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 12న బేబీ జన్మించగా రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ పోస్ట్‌కు ఓ అందమైన ఫోటో జత చేసింది. అందులో శివజ్యోతి కుర్చీలో కూర్చుని నవ్వులు చిందిస్తుండగా ఆమె భర్త గంగూలీ బిడ్డను ఎత్తుకున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 14న) శివజ్యోతి బర్త్‌డే సందర్భంగా బేబీ రాకను వెల్లడించారు.ఇద్దరి గుండెచప్పుడు ముగ్గురిగా..తనకు ఇంత అందమైన బహుమతిచ్చిన శివజ్యోతికి గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్‌డే, చిన్ని. నీ 33వ పుట్టినరోజుకు ఎంతో అందమైన బహుమతిని తీసుకొచ్చావ్. మన ఇద్దరి గుండెచప్పుడు ఇప్పుడు ముగ్గురిగా మారింది. మాకు పుట్టింది పాప? బాబు? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ -
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టినా, మంచి జరిగినా, చెడు జరిగినా అన్ని అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమెకు తొమ్మిది నెలలు నిండాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.థాంక్యూనా చిన్న పాప లేదా బాబుకు ఈ పోస్ట్ అంకితం.. ఈ తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీ ఇంత ఆనందంగా, అందంగా, అద్భుతంగా సాగనిచ్చినందుకు థాంక్యూ.. ఒక్కరోజు లేదా ఒక్కసారి కూడా నువ్వెప్పుడూ నన్ను టెన్షన్ పెట్టలేదు. కొన్నిసార్లు అసౌకర్యానికి లోనయినప్పటికీ అది ఈ జర్నీలో భాగమే.. దాన్ని కూడా నేను ఆస్వాదించాను. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు నేను, నాన్నా నీకెప్పుడూ రుణపడి ఉంటాం. సేఫ్ డెలివరీనువ్వు మంచి బిడ్డగా ఉంటావని తెలుసు. నువ్వు మా జీవితాల్లోకి వస్తుండటమే అతి పెద్ద ఆశీర్వాదం, అలాగే అద్భుతం కూడా! నిన్ను ఎప్పుడెప్పుడు పొత్తిళ్లలోకి తీసుకోవాలా? అని ఎదురుచూస్తున్నాను. ఈ 9 నెలల జర్నీలాగే డెలివరీ కూడా సేఫ్‌గా అవుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అమ్మా, నాన్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తప్పకుండా అంతా మంచే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) చదవండి: నాకు జరిగినట్లుగా నా కూతురికి జరగనివ్వను: రణ్‌బీర్ కపూర్ -
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
కొన్నిసార్లు మన చుట్టూ ఏం జరిగినా చూసీచూడనట్లు పోతాం. కానీ, మానవత్వంతో ఆలోచించి ఒక్క నిమిషం కేటాయిస్తే కొన్ని ప్రమాదాలను నివారించవచ్చంటున్నాడు బిగ్‌బాస్ ఫేమ్, నటుడు శ్రీహాన్. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్ రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్.. మా ఆవారా జిందగీ, వర్జిన్ బాయ్స్ సినిమాల్లో నటించాడు.పూటుగా తాగేసి..తాజాగా అతడు తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. రాత్రిపూట రోడ్డుపై కారులో వెళ్తున్న శ్రీహాన్ మార్గమధ్యలో ఓ వ్యక్తి పూటుగా తాగేసి పడి ఉండటాన్ని గమనించాడు. నాకెందుకులే అని వెళ్లిపోకుండా కారు ఆపేసి మత్తులో ఉన్న అతడిని లేపి రోడ్డు దాటించాడు.రెండు నిమిషాల పనిదీనిగురించి శ్రీహాన్ మాట్లాడుతూ.. పెద్దాయన తాగేసి రోడ్డుపై పడి ఉన్నాడు. ఆయనకే సమస్యలున్నాయో, ఎందుకు తాగాడో మనకు అనవసరం. కానీ, వాహనాలు అన్నీ అతడి పక్కనుంచే వెళ్తున్నాయి. పైగా అతడి చేయి, కాలు రోడ్డుపై ఉంది. ట్రాఫిక్ ఎక్కువున్నప్పుడు కార్లకు, పెద్ద వాహనాలకు రోడ్డుపై ఉన్న అతడు కనిపించడు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఏదైనా జరిగితే..రోడ్డు అవతలివైపు జనాలు నిలబడి చూస్తున్నారంతే! ఒకటీరెండు నిమిషాల సమయం కేటాయిస్తే అతడికి ఎటువంటి హాని జరగకుండా కాపాడవచ్చు. రేపు పొద్దున ఏదైనా జరగరానిది జరిగితే అది రీల్స్‌లో చూసి అయ్యో, పాపం అనుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు. వీడియోలో టైం, డేట్ తప్పుగా ఉంది, దాన్ని పట్టించుకోవద్దని కోరాడు. ఈ వీడియో చూసిన అభిమానులు మంచి పని చేశావంటూ శ్రీహాన్‌ను మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) చదవండి: అల్లు అర్జున్ సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న స్రవంతి -
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
దగ్గరి బంధువే తనను నిండా ముంచాశాడని ఇటీవలే ఓ వీడియో రిలీజ్ చేశాడు బిగ్‌బాస్ కంటెస్టెంట్, మోడల్ ప్రిన్స్ యావర్. అయితే కుటుంబ సభ్యుల బలవంతం వల్ల అతడి కూతుర్ని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నానని చెప్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ప్రిన్స్ యావర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవర్నీ నమ్మడానికి లేదు. నేను నా దగ్గరి బంధువు చేతిలోనే మోసపోయాను. బలవంతంగా నిశ్చితార్థంఅతడు నన్ను ఓ ఫంక్షన్‌కు రమ్మని బలవంతం చేశాడు. అక్కడికి అతడి కూతురు కూడా వచ్చింది. ఆమెకు నేనంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నా నెంబర్ తీసుకుంది. అలా ఇద్దరం తరచూ ఫోన్ మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ! నా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల తనను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. కానీ పెళ్లి మాత్రం జీవితంలో సెటిలయ్యాక చేసుకుంటానన్నాను. అందులో తప్పేముంది?మోసంఆమె తండ్రి.. ల్యాండ్‌లో రూ.30 లక్షలు పెడితే రూ.50 లక్షలు తిరిగిస్తానన్నాడు. అంత సొమ్ము నా దగ్గర లేదు. అయినా తనను నమ్మి నేను కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఇచ్చేశాను. నా దగ్గరున్న రూ.18 లక్షలు, నా స్నేహితుడిని అడిగి మరో రూ.5 లక్షలు.. అంటే మొత్తం రూ.23 లక్షలు ఇచ్చాను. బదులుగా రూ.40 లక్షలిస్తానన్న అతడు తర్వాత మాట మార్చేశాడు. నెలలు గడుస్తున్నా పైసా ఇవ్వలేదు. నా బ్రదర్‌కి రూ.7 లక్షలు ఇచ్చానంటున్నాడు. డిప్రెషన్నాకు ఒక్కమాటైనా చెప్పకుండా వేరేవాళ్లకు ఎలా ఇస్తాడన్నది నా ప్రశ్న. నా డబ్బు నాకు తిరిగివ్వకపోగా తన కూతురిని అడ్డుపెట్టుకుని సింపతీ డ్రామాలు ఆడుతున్నాడు. నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడు. వాళ్ల వల్ల నేను 8 నెలలుగా డిప్రెషన్లో ఉన్నాను. మానసిక ప్రశాంతతను కోల్పోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని ప్రిన్స్ యావర్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పిన కరీనా కపూర్ -
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ద్వారా పాపులర్ అయింది శ్రీజ దమ్ము. పేరుకు తగ్గట్లుగానే షోలో తన దమ్ము చూపించి తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో అడుగుపెట్టింది. కానీ మొదట్లో ఓవర్ యాటిట్యూడ్ చూపించి విమర్శలపాలైంది. అయితే తన ముక్కుసూటితనం, ఆటతీరు వల్ల అభిమానులను సైతం సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్ ఇతరత్రా విషయాలను పంచుకుంది.ట్రోలింగ్శ్రీజ దమ్ము మాట్లాడుతూ.. మా నాన్న జీవీఎంసీ (మహా విశాఖ నగర పాలక సంస్థ) ఉద్యోగి (పారిశుద్ధ్య కార్మికుడు). నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఓసారి చీర దోపుకుని చెత్త బ్యాగులు పట్టుకెళ్లాను. దానికి విపరీతంగా ట్రోల్ చేశారు. తడిచెత్త, పొడిచెత్త అమ్ముకునేలా ఉంది.. సరిగ్గా సరిపోయింది అని విమర్శించారు. అది చూసి నేను నవ్వుకున్నాను. అందుకు సంతోషంకానీ, మా నాన్న చేసే పని అదే కావడంతో ఇంట్లో వాళ్లు బాధపడ్డారు. ఏదేమైనా బిగ్‌బాస్‌కు వెళ్లి నాకంటూ ఓ పేరు సంపాదించుకున్నందుకు హ్యాపీ. కానీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్స్‌తో గేమ్ ఆడించి బయటకు పంపించినందుకు బాధగా అనిపించింది. నాకే ఎందుకిలా జరుగుతుందని ఏడ్చాను. ఇప్పుడు తల్చుకున్నా బాధనిపిస్తుంది.నేను పెళ్లి చేసుకునేవాడు..పార్టీలు, పబ్బులకెళ్తా.. కానీ, మందు మాత్రం తాగను. నాకు కాబోయే భర్త తాగుడుకు బానిసైతే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా.. ఇంకా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మంచి హైట్ ఉండాలి, జుట్టుండాలి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. రేపు నేను ఉద్యోగం చేసినా, చేయకపోయినా, ఖాళీగా ఉన్నా అతడే అన్నీ చూసుకునేలా ఉండాలి. నాకయితే ప్రేమపెళ్లి చేసుకోవాలని ఉంది. నేనంటే పడి చచ్చిపోయేవాడు కావాలి.నా జీవితం నా ఇష్టంనా డ్రెస్సింగ్‌పై వచ్చే ట్రోల్స్ పట్టించుకోను. నేను షార్ట్ వేసుకుంటా.. టీషర్ట్ వేసుకుంటా.. నీకెందుకు? నా జీవితం నా ఇష్టం. నాకు నచ్చినట్లుగా బట్టలు వేసుకుంటాను. ఇకపోతే సొంతింటి కల ఒక్కటే నాకున్న పెద్ద డ్రీమ్. ఇంతవరకు నేనెప్పుడూ సంతోషంగా లేను. ఏదో లైఫ్ ముందుకెళ్తుందా? అంటే వెళ్తుందంతే! ప్రశాంతమైన జీవితం దొరికితే సంతోషంగా ఉంటాను. అలా అని డిప్రెషన్లో లేను. బిగ్‌బాస్ కోసం రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశా.. ఇప్పుడుమ మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను అని శ్రీజ చెప్పుకొచ్చింది.చదవండి: సర్వం మాయ బ్లాక్‌బస్టర్ హిట్.. తండ్రికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు -
దాంపత్యం బానే ఉందా? బిగ్‌బాస్ విన్నర్ భార్య కౌంటర్!
హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ షోలో నటుడు గౌరవ్ ఖన్నా విజేతగా నిలవగా, నటి ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచింది. ఫర్హానా అభిమానులు మాత్రం తమ కంటెస్టెంటే అసలైన విన్నర్ అని, గౌరవ్ కాదని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు గౌరవ్ భార్య, నటి ఆకాంక్ష చమోలాను ట్రోల్ చేస్తున్నారు.డ్యాన్స్ వీడియోలపై ట్రోలింగ్ఆకాంక్ష ఇటీవలే తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా కున్వర్ అమర్, అలీ హసన్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. మరో వీడియోలో అవీజ్ దర్బార్తో కలిసి స్టెప్పులేసింది. ఇది చూసిన జనాలు.. తన వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినట్లున్నాయి, అందుకే ఎప్పుడు చూసినా వేరేవాళ్లతోనే కనిపిస్తుందని విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్‌పై ఇన్ఫ్లుయెన్సర్ జయతి ఘాటుగా స్పందించింది. ప్రజలు తమ పనులన్నీ వదిలేసి ఆకాంక్షపై పడ్డారని మండిపడింది.ఆకాంక్షపై ఇంత ద్వేషం ఎందుకు?గౌరవ్ గెలుపు ఆకాంక్షకు ఎందుకు సమస్యగా మారిందో అర్థం కావడం లేదంది. తను ఏం చేసినా జడ్జ్ చేస్తున్నారని, సహనటులతో డ్యాన్స్ చేస్తుంటే కూడా తప్పుపడుతున్నారంది. అనుపమ సీరియల్లో గౌరవ్ సహనటులతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినప్పటికీ అతడినెవరూ ప్రశ్నించలేదని, కానీ ఆకాంక్ష తన పని తాను చేసుకుపోతుంటే కూడా వేలెత్తి చూపిస్తున్నారని మండిపడింది. వాళ్లు యాక్టర్స్ అని.. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిదని అభిప్రాయపడింది.నిజాయితీగా ఉన్నా..ఈ వీడియోను ఆకాంక్ష తిరిగి షేర్ చేస్తూ తనకు సపోర్ట్ చేసిన యువతిని మెచ్చుకుంది. అలాగే తన వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ ఒకరినొకరు మోసం చేసుకోకుండా నిజాయితీగా ఉండటం అవసరం. అది చాలా సర్వసాధారణమైన విషయం. మంచి భార్యగా ఉంటూనే వృత్తిపరంగా నా పని నేను చేసుకుంటున్నాను అని పేర్కొంది. ఆకాంక్ష నటించిన దిల్ ఢోకా ఔర్ డిజైర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12న షెమారోమి ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతోంది.చదవండి: అలా అన్నందుకు బాధేసింది: అమితాబ్ బచ్చన్ -
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
ఢిల్లీ వీధుల్లో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది చంద్రికా దీక్షిత్. సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఈ అమ్మాయి హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ పాల్గొంది. తాజాగా.. భర్త యుగం గేరాపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కింది. భర్త మోసం చేస్తున్నాడంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో చంద్రిక మాట్లాడుతూ.. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలేనా అని అడుగుతున్నారు. రెండు నెలలుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు? నావల్ల కావట్లే..అన్నింటినీ మౌనంగా భరిస్తున్నాను. నా బాధేంటో మీకు చెప్పనా? అటు పిల్లాడిని, ఇటు ఇంటిని.. అన్నింటినీ మ్యానేజ్ చేసుకుంటున్నాను. అన్ని బాధ్యతలు నేనే నిర్వర్తిస్తున్నాను. అయినా అతడు (భర్త) ఇలా చేస్తుంటే నేనేం చేయాలి? (ఫోన్లో చాటింగ్ స్క్రీన్‌షాట్, భర్తతో క్లోజ్‌గా ఉన్న ఓ అమ్మాయి ఫోటోలు చూపిస్తూ) ఈ అమ్మాయి ఎప్పుడూ నా భర్త చుట్టూనే తిరుగుతోంది. నా భర్త, నా ఇల్లు అని ఏదేదో అంటోంది. ఈ ఫోటోలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి. నా మెదడును పని చేయనివ్వడం లేదు. నావల్ల కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది.గుర్తుపెట్టుకో..దీనిపై ఆమె భర్త యుగం గేరా స్పందించాడు. నీకు అవసరమైంది నువ్వు చూపించావు. నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ, అదేమంత పెద్ద తప్పు కాదు. సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నావ్.. అలాంటివి నాదగ్గర చాలా ఉన్నాయి. నేను అనుకుంటే చాలా చేయగలను. కానీ నేనేమీ చేయను. ఇంకోటి.. నీ రెస్టారెంట్ నావల్లే నడుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకో అని కౌంటరిచ్చాడు. కాగా చంద్రికా.. ఆర్టిస్ట్ యుగం గేరాను పెళ్లి చేసుకుంది. యుగం గేరా.. చంద్రిక కంటే రెండుమూడేళ్లు చిన్నవాడు. ఈ దంపతులకు కుమారుడు రుద్ర సంతానం. View this post on Instagram A post shared by Chandrika Gera (@chandrika.dixit) చదవండి: అందుకే పిల్లల్ని కనలేదు: ప్రముఖ నటి -
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
బిగ్‌బాస్ షో లోపల ఉన్న కంటెస్టెంట్ల కోసం బయట ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఓ పట్టాన అయిపోవు. షో అయిపోయాక కూడా అవతలి కంటెస్టెంట్‌పై విషం చిమ్ముతూనే ఉంటారు. ఏం పని చేసినా కూడా విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఈ అనవసరపు ట్రోలింగ్ వల్ల తాను మానసిక వేదన అనుభవిస్తున్నానంటోంది తెలుగు బిగ్‌బాస్ 7 రన్నరప్ , నటి తనూజ పుట్టస్వామి.ఎవరి జీవితాల్లో వారు బిజీఈ మేరకు తనూజ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చాలాకాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకూ ఓ జీవితం ఉంది. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం.పీఆర్ టీమ్ లేదుప్రతిదానికి పీఆర్(డబ్బులు పెట్టి ఒక టీమ్ నడపడం) అనడం మానేయండి. నాకు పీఆర్ టీమ్ అంటూ ఏదీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారంతే! ఈరోజుకూ నాపై తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది. ప్రతిరోజు అసభ్యంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను ఒకర్ని టార్గెట్ చేశానని, ఒకర్ని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నరకం అనుభవిస్తున్నా..అవతలివారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ, నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ప్రతిరోజు చెండాలమైన మాటలంటున్నారు. నా క్యారెక్టర్‌ను తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా క్యారెక్టర్‌ను వక్రీకరిస్తుంటే మహిళగా భరించలేకపోతున్నాను. నోటికొచ్చిన మాటలనడం మీకు చిన్న విషయమేమో! గుండె నిండా బాధనన్ను మాత్రం ఎంతో బాధిస్తున్నాయి. గుండె లోతులో గాయాలు చేస్తున్నాయి. ఈ బాధనంతా భరిస్తూ ఎక్కడికని వెళ్లను? ఎవరితో పంచుకోను? అందుకే.. మౌనాన్ని ఆశ్రయించాను. నా తప్పు ఉందని కాదు, ధైర్యాన్ని కూడదీసుకునేందుకు నిశ్శబ్ధంగా ఉంటున్నాను. మీలాగే నాకూ ఓ కుటుంబం ఉంది. మీరు నా గురించి వాగే చెత్తవాగుడు, చెత్త కామెంట్స్ నా కుటుంబసభ్యులు కూడా చదువుతారు. అప్పుడు వాళ్లెంత బాధపడతారు? మానసికంగా చిత్రవధఅసభ్య కామెంట్లు పెట్టే ఫేక్ అకౌంట్స్ ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. నేనే కాదు, నాకు సపోర్ట్‌గా నిలబడ్డవారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకర్ని మానసికంగా చిత్రవధ చేస్తే ఏమొస్తుంది? ఒకరిపై విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్నారా? ఇక్కడ నేనెవర్నీ కిందకు లాగాలనుకోవడం లేదు. డ్రామా క్రియేట్ చేయాలని అసలే అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా, గౌరవంగా జీవించాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. మరి ఇకమీదటైనా ఈ ట్రోలింగ్ తగ్గుతుందేమో చూడాలి!తనూజ వర్సెస్ కల్యాణ్బిగ్బాస్ 7 షోలో తనూజ, పవన్ కల్యాణ్ మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నారు. కానీ బయట మాత్రం వారి అభిమానులు రెండుగా విడిపోయారు. మా కంటెస్టెంటే గొప్ప అని ఎప్పుడూ తగువులాడేవారు. ఈ క్రమంలోనే అవతలి కంటెస్టెంట్‌ను విమర్శించేవాళ్లు! చివరకు కల్యాణ్ ట్రోఫీ గెలవడంతో తనూజ వల్లే గెలిచాడని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తనూజకు వ్యతిరేకంగా ఉన్నవారు ఆమెను ట్రోల్ చేశారు.చదవండి: ఈ వారం ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. డోంట్ మిస్ -
ఆడవాళ్లపై ఇలాంటి ట్రోల్సా? చెండాలం: యాంకర్ ఫైర్
ఒకప్పుడు ఆడ, మగ క్లోజ్‌గా కనిపిస్తే చాలు వాళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని రూమర్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు కేవలం కలిసి కనిపించినా సరే.. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, యాంకర్ షెఫాలి బగ్గా డిన్నర్‌కు వెళ్లడంతో వీరు లవ్‌లో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) పోస్టర్ వైరలవుతోంది.యాంకర్ ఫైర్ఇందులో చాహల్ కుర్చీలో కూర్చోగా అతడి పక్కన మాజీ భార్య ధనశ్రీ వర్మ, ఆర్జే మహవశ్, షెఫాలి ఉన్నారు. ఈ ఫోటో మొదట చాహల్ కంట పడింది. అది చూసిన అతడు ఇంకో ఇద్దరు ముగ్గుర్ని మిస్ అయ్యారంటూ సెటైర్లు వేశాడు. తాజాగా ఈ ఏఐ పోస్టర్‌పై షెఫాలి మండిపడింది. ఇదెంత చెండాలం.. ఆడవారిని ఇలా చూపించడం సిగ్గుచేటు. మీ మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడే తెలిసిపోతుంది. మీ పనేదో మీరు చూసుకుంటే బెటర్ అని కౌంటరిచ్చింది.పెళ్లి- విడాకులుఇకపోతే చాహల్.. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మను 2020లో పెళ్లి చేసుకున్నాడు. విభేదాలు రావడంతో 2024లో విడిపోయారు. 2025లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యాంకర్ ఆర్జే మహవశ్‌తో కొంతకాలం రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, సడన్‌గా ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో బ్రేకప్ అయిపయిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. బిగ్‌బాస్‌తో ఫేమస్అనంతరం షెఫాలీతో కనిపించడంతో మళ్లీ ప్రేమలో పడ్డాడని పలువురు భావించారు. కానీ ఇప్పుడు యాంకర్ ఇచ్చిన కౌంటర్‌తో అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది. కాగా షెఫాలి న్యూస్ యాంకర్. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో పార్టిసిపేట్ చేయడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.చదవండి: అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ -
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బంధువును నమ్మి డబ్బులిచ్చి మోసపోయానంటున్నాడు బిగ్‌బాస్ కంటెస్టెంట్, మోడల్ ప్రిన్స్ యావర్. తన డబ్బు ఇవ్వమని అడిగితే.. పెద్ద పెద్దవార్ల పేరు చెప్పి బెదిరిస్తున్నాడంటూ ఓ వీడియో షేర్ చేశాడు. అందులో ప్రిన్స్ యావర్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ బలవంతం చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. నా బంధువుల్లో ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు. స్థలం విషయంలో రూ.30 లక్షలు ముంచేశాడు. అయితే నా ఫ్యామిలీతో మాట్లాడి రూ.23 లక్షలు తిరిగిస్తానని నన్ను ఒప్పించాడు.పైసా ఇవ్వడం లేదు15 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తిరిగివ్వలేదు. అన్ని చోట్లా నన్ను బ్లాక్ చేశాడు. అతడి స్నేహితుడికి ఫోన్ చేస్తే నువ్వేం చేయలేవంటూ రివర్స్‌లో నన్నే బెదిరిస్తున్నారు. పెద్దవాళ్ల పేర్లు చెప్పి భయపెడుతున్నారు. అందులో కేటీఆర్ సర్ పేరు కూడా ఉంది. ఈ వీడియో కేటీఆర్ సర్ దగ్గరికి చేరాలని కోరుకుంటున్నాను. ఆయన వెనకాల ఇంత జరుగుతుందని కేటీఆర్ సర్‌కు తెలియదనే అనుకుంటున్నాను. చచ్చిపోదామనుకున్నాఇకపోతే అతడు చేసిన మోసం వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. భయంకరమైన ఆలోచనలు వచ్చాయి. చచ్చిపోవాలనుకున్నాను. కానీ, నాకు నా అభిమానులున్నారు. వారికోసం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకున్నాను. నాలా ఇంకెవరూ మోసపోకూడదు అని చెప్పుకొచ్చాడు. ప్రిన్స్ యావర్.. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతకుముందు సీరియల్స్ కూడా చేశాడు. పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. View this post on Instagram A post shared by Yawar Ahmed (@princeyawar) చదవండి: మీరే నా బలం.. 30 ఏళ్లర్నీపై కిచ్చా సుదీప్ ఎమోషనల్ -
బిగ్‌బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసినవాళ్లు ఒక్కసారిగా సెలబ్రిటీలు అయిపోతారు. కానీ ఆ ఫేమ్ కొంతకాలమే ఉంటుంది. పైగా దానివల్ల అవకాశాలు వస్తాయా? అంటే అదీ అంతంతమాత్రమే! చాలా తక్కువమందికి మాత్రమే బిగ్‌బాస్ కలిసొస్తుంది. విన్నర్స్‌తో సహా అనేకమందికి షో వల్ల ఎటువంటి ఫాయిదా ఉండదు. అదే బల్లగుద్ది చెప్తోంది నటి ఆర్జే కాజల్.బిగ్‌బాస్ సెలబ్రిటీస్ఈమె తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొంది. బిగ్‌బాస్ నిజస్వరూపం ఇదేనంటూ తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో కాజల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ సెలబ్రిటీస్.. జనాలు వాళ్లను సెలబ్రిటీలనే పిలుస్తారు. కానీ, అసలు బిగ్‌బాస్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొంతమందికి వాళ్ల రెగ్యులర్ వర్క్స్, సినిమాలు, షోస్, అవార్డ్స్ బానే ఉంటాయి. కానీ చాలామంది విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి?ఎక్కడికి వెళ్లినా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే అడుగుతారు. దానికి ఇబ్బందిగానే ఏమీ లేదని బదులిస్తారు. బద్ధకం వల్లనో, టాలెంట్ లేకనో కాదు అవకాశాలు రాక! బిగ్‌బాస్ తర్వాత ఫుల్ బిజీ, ఫుల్ వర్క్ అని అందరూ అనుకుంటారు, కానీ అది మూడు, నాలుగు నెలల వరకు మాత్రమే పరిమితం. దానికి తోడు బిగ్‌బాస్ ట్రామా, డిప్రెషన్! ఇంతకుముందు చేసుకున్న పని మనస్ఫూర్తిగా చేసుకోలేక, కెరీర్లో ఎదుగుదల లేక, ముందుకెళ్లలేక, వెనకడుగు వేయలేక సతమతమవుతూ ఉంటారు. జీవితాంతం ఎదురుచూపులుయాక్టర్స్ పరిస్థితి మరీ దారుణం.. ఆ బిగ్‌బాస్ సీజన్లో నిన్ను చాలామందే చూశారు, కొత్త ముఖాలు కావాలి అంటారు. చాలామంది ప్రధాన పాత్రల కోసం జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతారు. ఇంకొందరు సోషల్ మీడియా, యూట్యూబ్‌తో సరిపెట్టుకుంటారు. రోడ్డుమీదకెళ్తే అందరూ గుర్తుపడతారు, సెల్ఫీలడుగుతారు. ఫేమ్ వల్ల ఏదీ మారదుకానీ పని విషయానికి వచ్చేసరికి మాత్రం ఎంతమంది ఫాలోవర్లున్నారు? ఎంత రీచ్ ఉంది? అని డబ్బు దగ్గర బేరాలడతారు. బతకడం కోసం కొందరు తక్కువ డబ్బు ఇచ్చినా కాదనలేక చేసుకుంటూ పోతారు. కొంతమంది వేరే కెరీర్ ఎంచుకుంటారు. మరికొందరు సైలెంట్‌గా మాయమైపోతారు. బిగ్‌బాస్ వల్ల రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు కానీ ఫేమ్ ఒక్కటే కెరీర్‌ను నిర్మించదు. బిగ్‌బాస్ వల్ల ఏదీ మారిపోదు. అది కేవలం ఫేమస్ రియాలిటీ షో. అంతే! అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj) చదవండి: ఐశ్వర్యరాయ్ తొలి సంపాదన ఎంతో తెలుసా? -
యాక్సిడెంట్‌తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
హాయిగా ఆడుతూ పాడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన సమయంలో కష్టాలు, కన్నీళ్లతో సావాసం చేసింది. నటిగా జర్నీ మొదలుపెట్టినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే చేయి లేకున్నా స్వయంకృషితో ఎదిగింది. కాళ్లలోని ఐరన్ రాడ్స్ తన ముందడుగును ఆపలేకపోయాయి. నా అనేవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కెమెరా ముందు మాత్రం బలవంతంగా నవ్వు పులుముకునేది. తనే కీర్తి భట్. ప్రియుడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న కారణంగా వార్తల్లో ఉన్న కీర్తి గురించే ప్రత్యేక కథనం.యాక్సిడెంట్‌తో జీవితం తలకిందులుకీర్తి భట్ కన్నడ అమ్మాయి. 2017లో జరిగిన ఓ యాక్సిడెంట్లో కుటుంబాన్ని కోల్పోయింది. తల్లిదండ్రులు, అన్నవదిన అందరూ దూరమయ్యారు. తీవ్ర గాయాలపాలైన కీర్తి కొన ప్రాణంతో బయటపడింది. కొంతకాలం కోమాలో ఉండి కోలుకుంది. అయితే యాక్సిడెంట్ వల్ల తను తల్లయే అదృష్టాన్ని కోల్పోయింది. ఎవరూ లేని అనాథగా బతుకు వెల్లదీస్తూనే తన కెరీర్‌ను తనే నిర్మించుకుంది. ఫస్ట్ లవ్అలాంటి సమయంలో ఓ వ్యక్తి తనను ప్రేమ పేరుతో వెంబడించాడు. అతడి ప్రేమ నిజమేననుకుంది, కరిగిపోయింది. ఇకపై తాను అనాథ కాదనుకుని పొంగిపోయింది. అతడి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించింది. కానీ అదంతా కపట ప్రేమ అని కొంతకాలానికే అర్థమైపోయింది. తన డబ్బును వాడుకుంటున్నారని ఆల్యంగా తెలుసుకుంది. తాను నటించే సీరియల్ హీరోతో షోకి వెళ్లినా ప్రియుడు, అతడి తల్లి అనుమానించేవారు. ఆఖరికి కీర్తి దత్తత తీసుకున్న పాప కూడా కన్నకూతురేనేమో అని డీఎన్ఏ టెస్టుకూ సిద్ధపడ్డారు.బిగ్‌బాస్ షోఇక భరించలేకపోయింది. అతడి ప్రేమకు దండం పెట్టేసి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చింది. ఇంతలో తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్ నుంచి ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు దత్తత తీసుకున్న పాప కూడా చనిపోయేసరికి ఆమె గుండె ముక్కలయింది. ఆ బాధను దిగమింగుకుని బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. ఆరో సీజన్లో ఫస్ట్ లేడీ కెప్టెన్‌గా నిలిచింది. ఫినాలేలో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఎంగేజ్మెంట్బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్ రూపంలో తనకు తోడు దొరికింది. తను ఎప్పటికీ తల్లి కాలేదని తెలిసినా.. కీర్తియే తనకు చిన్నపాప అంటూ అతడి కుటుంబం అంతా ప్రేమగా చూసుకుంది. ఈ సంతోషం జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంది. 2023లో కీర్తి- విజయ్ నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో బ్రేకప్ చెప్పుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయామని కీర్తి అంటుంటే.. నా దగ్గర డబ్బుల్లేవని మరొకర్ని చూసుకుంటుందని విజయ్ కార్తీక్ ఆరోపించాడు.బ్రేకప్అతడి ఆరోపణలకు తోడు సోషల్ మీడియాలో తనపై వదంతులు సృష్టిస్తుండటంతో కీర్తి మనస్తాపానికి గురైంది. తనకేదైనా జరిగితే అసత్య ప్రచారం చేస్తున్నవారే బాధ్యులు అని మండిపడింది. ఏదేమైనా ఈ బాధలో నుంచి కీర్తి బయటకు వచ్చి మళ్లీ మామూలు జీవితం గడపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కీర్తి.. మనసిచ్చి చూడు, మధురానగరిలో, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: అదే నన్ను కుంగదీస్తోంది.. నాకేదైనా జరిగితే..: కీర్తి భట్ -
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
కన్నడ నటి, బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి భట్ మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకుంది. దర్శకుడు, హీరో విజయ్ కార్తీక్ తోటతో ప్రేమలో ఉన్న ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇద్దరూ ఎంగేజ్మెంట్ అయ్యాక ఒకేచోట కలిసున్నారు. కానీ పెళ్లి ఊసు మాత్రం పక్కన పెట్టేశారు. ఈ ఏడాదైనా వెడ్డింగ్ గురించి శుభవార్త చెప్తారనుకుంటే విడిపోయామని బ్రేకప్ న్యూస్ చెప్పారు.కీర్తి మోసం చేసిందంటూ..అది విని అభిమానులు షాక్‌కు గురయ్యారు. కీర్తిని తల్లిలా చూసుకుంటానన్న విజయ్ కార్తీక్ ఎందుకింత మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతడు సోషల్ మీడియా వేదికగా కీర్తియే తనను వదిలేసి మరో కొత్త జీవితం ప్రారంభించిందన్నాడు. తన దగ్గర డబ్బు లేదనే వదిలేసి మరో వ్యక్తిని చూసుకుందని చెప్పాడు.కీర్తిపై ట్రోలింగ్దీంతో చాలామంది కీర్తిని విమర్శిస్తున్నారు. తల్లి కాలేదని తెలిసినా పెళ్లికి ముందుకు వచ్చి అంత బాగా చూసుకున్న వ్యక్తిని డబ్బు కోసం వదిలేయడం కరెక్ట్ కాదని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో కీర్తి భట్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఒకరు చెప్పిన మాటల్ని విని అదే కరెక్ట్ అనుకుని నన్ను తప్పు పట్టడం సరి కాదు. మీరు నా గత పోస్ట్ చూస్తే.. అందులో ఎక్కడా అవతలివారి బలహీనతల్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించలేదు.నా వల్ల కావట్లేదునాపై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో లేనిపోని ఊహాగానాలు, కథలు అల్లుతూ ఏవేదో ప్రచారం చేస్తున్నారు. అది నన్ను మరింత బాధపెడుతోంది. నిజంగా నావల్ల కావడం లేదు. ఎవరైతే నాపై నిందలు వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లు అన్నీ రాసిపెట్టుకున్నాను. నా జీవితంలో ఏదైనా జరగరానిది జరిగితే అందుకు వారే బాధ్యులు అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: అత్తారింట్లో ఇంకా ఆ ప్రయోగం చేయలేదు: శోభిత -
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
కేరళలో ఇటీవల విషాదకర ఘటన జరిగింది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకాడంటూ ఓ యువతి చేసిన వీడియో కారణంగా అతడు తనువు చాలించాడు. ఏ తప్పూ చేయకపోయినా తన పరువు తీసిందని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మలయాళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రీదేవి గోపీనాథ్ స్పందించింది.కఠిన శిక్ష విధించాలి'దీపక్ చావుకు కారణమైన అమ్మాయిని అరెస్టు చేసినందుకు సంతోషంగా ఉంది. తనకు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఒక్క ఘటన కారణంగా ఆడజాతి మొత్తాన్ని తిడుతున్నారు. ఆడవారికి, మగవారికి విడివిడిగా బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అట్టముక్కలతో, వైర్లు చుట్టుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందరు మగవాళ్లు చెడ్డవారు కాదు, అలాగే అందరు ఆడవాళ్లు చెడ్డవారు కాదు! ఆడవాళ్లకు రక్షణేది?ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు పదహారేళ్ల అబ్బాయి 14 ఏళ్ల అమ్మాయిని హత్యాచారం చేశాడు. అలా అని దీపక్ చావును నేను తక్కువ చేయడం లేదు. అతడికి జరిగింది మరెవరికీ జరగకూడదు. కానీ ఆడవాళ్లకు కూడా రక్షణ ఎక్కడుంది? తండ్రులు, సవతి తండ్రులు, అంకుల్స్, ఫ్రెండ్స్, సమాజంలోని ఎంతోమంది చేతిలో మహిళలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. ఈ రాక్షసులు చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు.ఐదు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు..దీపక్ కేసులో అరెస్టయిన అమ్మాయిని కూడా అత్యాచారం చేయాలని ఓ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాడు. అది అతడి మానసిక స్థితిని తెలియజేస్తుంది. నేను ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్త నాపై అత్యాచారం చేశాడు. దయచేసి ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడకండి.. ఏదైనా అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆడవాళ్లందరినీ రాక్షసులుగా చిత్రీకరించకండి' అని శ్రీదేవి కోరింది.చదవండి: 2009లో ఇండస్ట్రీలో.. ఇన్నాళ్లకు నటిగా లాంచ్: స్రవంతి -
బిగ్‌బాస్ సోనియా కూతురి బారసాల ఫంక్షన్
బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి సోనియా ఆకుల 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. యష్ వీరగోనిని ప్రేమించి పెళ్లాడింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కాగా సోనియా- యష్ దంపతులు పెళ్లయిన ఏడాదికే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. 2025 డిసెంబర్ 8న వీరి ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది. తనకు శిఖ వీరగోని అని నామకరణం చేశారు.నిద్రలేని రాత్రులుతాజాగా కూతురి బారసాల ఫంక్షన్ ఫోటోలను సోనియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. '28 డిసెంబర్ 2025.. 21 రోజుల ఫంక్షన్ ఎంత అద్భుతంగా గడిచిందో.. నీ చిన్ని పాదాలు, నాకు నిద్రలేని రాత్రులు, వెల్లివిరిసిన ఆనందాలు.. మాటల్లో చెప్పలేంతన సంతోషాన్ని మా కుటుంబంలోకి తీసుకొచ్చావు. ఇప్పుడు జీవితం మరింత ప్రకాశవంతంగా మారింది. ఇల్లు నిండుగా కనిపిస్తోంది' అంటూ పాపను ఎత్తుకున్న ఫోటోలను షేర్ చేసింది. తొలిసారి ఊయలలోసోనియా దంపతులిద్దరూ కలిసి పాపను తొలిసారి ఊయలలో వేశారు. అయితే చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. పాపను చూపించొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా మూడునెలలవరకు చూపించకూడదనే ఆగాం.. వచ్చే నెలలో చూపిస్తాను అని సోనియా బదులిచ్చింది. నార్మల్ డెలివరీయా? సీ సెక్షనా? అని మరో నెటిజన్ అడగ్గా సీ సెక్షన్ జరిగిందని పేర్కొంది. సోనియా.. జార్జ్‌రెడ్డి, కరోనా వైరస్, ఆశ ఎన్కౌంటర్ సినిమాల్లో నటించింది. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో పాల్గొంది. View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) చదవండి: విడాకులు తీసుకున్న బుల్లితెర జంట -
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్‌గా ఫీలయ్యా: శివజ్యోతి
బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి త్వరలోనే తల్లి కాబోతోంది. తను గర్భం దాల్చిన దగ్గరి నుంచి రెండు సార్లు సీమంతం చేసుకోవడం వరకు ప్రతి విషయాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది. డెలివరీకి దగ్గర్లో ఉన్న ఆమె తన ప్రెగ్నెన్సీపై ఉన్న అనేక అనుమానాలకు, అపోహలకు చెక్ పెడుతూ ఓ వీడియో షేర్ చేసింది.లేనివారికే తెలుసు ఆ బాధఅందులో శివజ్యోతి మాట్లాడుతూ.. ముందుగా అందరికీ ఓ మాట చెప్పాలనుకుంటున్నా.. ఎవరికైనా పిల్లలు లేకపోతే పిల్లలెప్పుడు? పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడు? ఉద్యోగం లేనివాళ్లను ఏం చేస్తున్నావ్? వంటి ప్రశ్నలు అడగకండి. ఎందుకంటే అది లేనివారికే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. 2015లో మా పెళ్లి జరిగింది. అంటే పదేళ్లవుతోంది. దయచేసి అడగకండిమొదట్లో కెరీర్‌పై ఫోకస్ చేశాం. ఆ సమయంలో పిల్లలెప్పుడు అని అడిగితే నాకు కావాల్సినప్పుడు కంటాను అని ధైర్యంగా ఆన్సరిచ్చేదాన్ని. మూడేళ్లుగా నేను పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ సమయంలో ఎవరైనా అడిగినప్పుడు మాత్రం చాలా గలీజ్‌గా ఫీలయ్యేదాన్ని. కాబట్టి ఎదుటివాళ్ల పర్సనల్ విషయాలు అడగకండి.బిగ్‌బాస్ నుంచి రాగానే లాక్డౌన్బిగ్బాస్ ముందు వరకు కూడా మా ఇద్దరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.. 2019లో నేను బిగ్‌బాస్ నుంచి రాగానే లాక్డౌన్ వచ్చింది. దాంతో పిల్లల ఆలోచనను రెండేళ్లు పోస్ట్‌పోన్ చేసుకున్నాం. ఆ తర్వాత మేము ఓ ఇల్లు కొని దాన్ని మాకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకుని గృహప్రవేశం చేశాం.. 2023 డిసెంబర్ నుంచి పిల్లలు కావాలనుకున్నాం. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం.మొక్కని దేవుడు లేడురెండున్నరేళ్లు రకరకాల టెస్టులు చేయించుకున్నాను. చెట్లమందులు ప్రయత్నించాను. మొక్కని దేవుడు లేడు. అయితే నేను ఐయూఐ, ఐవీఎఫ్ ఏది ఎంచుకున్నాను? అని అడుగుతున్నారు. అవేవీ కాదు, వెంకటేశ్వర స్వామి వ్రత ఫలితంతో సహజంగానే గర్భం దాల్చాను. ఒకవేళ ఇది జరగకపోతే ఐయూఐ, ఐవీఎఫ్ చేయించుకునేదాన్ని. అందులో అనుమానమే లేదు అని చెప్పుకొచ్చింది. శివజ్యోతి తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొంది.చదవండి: బోర్డర్ 2 ఫస్డ్ డే కలెక్షన్స్ -
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
సంజనా గల్రానీ.. అప్పుడెప్పుడో బుజ్జిగాడు మూవీలో అలరించిన ఈ నటి కొంతకాలంగా సినిమాల్లో యాక్టివ్‌గా కనిపించడం లేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా చేసిన ఈమె ఇటీవల తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో పాల్గొంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఏకంగా టాప్ 5లో చోటు దక్కించుకుంది. అయితే గతంలో సంజనాపై ఓ రూమర్ ఉంది. క్రికెటర్ విరాట్ కోహ్లితో లవ్ ట్రాక్ నడిపిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.ఆ పబ్లిసిటీ వద్దుకెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఈ ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది సంజనా. ఆమె మాట్లాడుతూ.. నేను బెంగళూరు అమ్మాయిని. కన్నడలో టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్‌కు అతిథిగా వెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది తప్ప అంతకుమించి ఏమీ లేదు. అదంతా గతం. విరాట్ కోహ్లి గర్ల్‌ఫ్రెండ్‌గా గుర్తింపు పొందడం, ఆ పబ్లిసిటీ నాకవరసరమే లేదు. కానీ, ఈ లేనిపోని లవ్ రూమర్స్ మా స్నేహాన్ని చెడగొట్టాయి. ఈ రూమర్స్ రాకపోయుంటే ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగేవాళ్లం. ఆ బాధ నాకెప్పుడూ ఉంది అని చెప్పుకొచ్చింది.ఏం జరిగిందంటే?సంజనా గల్రానీ, క్రికెటర్ విరాట్ కోహ్లి 2011 సమయంలో ప్రేమించుకున్నారంటూ అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ ఏడాది ఐపీఎల్లో బెంగళూరుకు సపోర్ట్ చేసింది సంజనా.. ఈ క్రమంలోనే తరచూ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వెళ్లేది. అలా ఓసారి ఆర్సీబీ జెర్సీ ధరించిన ఈ నటి.. విరాట్ కోహ్లితో కలిసి మైదానంలో ముచ్చట్లు పెట్టింది. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇంకేముంది, వీళ్లిద్దరికీ లింక్ పెడుతూ కథనాలు బయటకు వచ్చాయి. కానీ, కొంతకాలానికి వీరిద్దరూ మరెక్కడా కలిసి కనిపించలేదు.చదవండి: సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక మందన్నా -
అటు మోడ్రన్‌గా.. ఇటు అమ్మవారి వేషంలో..
గడిచిన కాలం మళ్లీ రాదంటారు. కుదిరితే గడిచిన కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకుని ఏదో కాస్త సంతోషపడటమే! అందుకు 2016 ట్రెండ్ బాగా ఉపయోగపడుతోంది. సడన్‌గా అందరూ పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016లో జీవితం ఎలా ఉందో గుర్తు చేసుకుంటూ అప్పటి వేడుకలను, జ్ఞాపకాలను ఫోటోల రూపంలో షేర్ చేస్తున్నారు. అలా బిగ్‌బాస్ బ్యూటీ పై ఫోటో షేర్ చేసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?2016 నాటి మెమొరీస్బుల్లితెర నటి ప్రియాంక జైన్.. ఓవైపు మోడ్రన్ డ్రెస్‌లో సెల్ఫీలు, మరోవైపు అమ్మవారి వేషధారణ. ఇంకో ఫోటోలో అయితే రెండు జడలు వేసుకుని పిండి రుబ్బుతోంది. ఈ ఫోటోల్లో ప్రియాంక మరీ చిన్నపిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే.. మౌనరాగం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది ప్రియాంక జైన్. జానకి కలగనలేదు సీరియల్‌తో మరింత పాపులరైంది.ప్రియుడితో..తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొనగా టాప్ 5గా నిలిచింది. మౌనరాగం సీరియల్ సహనటుడు శివకుమార్‌తో ప్రేమలో పడగా.. వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. 2024 ఏప్రిల్‌లో వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ చోట భూమి కొన్నారు. గతేడాది మంచి ముహూర్తం చేసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఈ లెక్కన ఈ ఏడాది కొత్తింట్లోకి వీరు జంటగా గృహప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టింది. రీతూ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా చాలా జరిగాయి. అటు హౌస్‌లో ఫైర్ స్ట్రామ్స్ (వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు) వచ్చి రీతూ బ్యాడ్ అనేవారు. పవన్‌ను వాడుకుంటోంది అన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఎందుకిలా అంటున్నారని నాకు చాలా బాధసింది. మరోపక్క బయట (హీరో ధర్మ మహేశ్‌తో సంబంధం అంటగడుతూ) నన్ను మరింత దారుణంగా చిత్రీకరించారు. అదొక్కటే సంతృప్తిఇవన్నీ చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఎలిమినేట్ అయి నేను బయటకు వచ్చేస్తే బాగుండనుకుంది. నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా తోటి ఆర్టిస్టులెవరూ నాకు సపోర్ట్ చేయలేదు. నాకు ఓటు వేయమని అమ్మ ఫోన్ చేసి అడిగితే కూడా మీడియాలో రీతూ క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తోందని కామెంట్ చేశారంట. నన్ను ఇంత చెడ్డదానిలా చిత్రీకరించినా, నెగెటివ్ క్యాంపెయిన్ చేసినా ప్రేక్షకులు నన్ను నమ్మి ఓట్లేశారు. నన్ను నన్నుగా ప్రేమించారు. ఆ విషయంలో సంతోషంగా అనిపించింది.డబ్బు లేకపోయినా పర్లేదునాకు కాబోయేవాడి విషయానికి వస్తే.. అందం గురించి పట్టించుకోను. అర్థం చేసుకుంటే చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు కానీ ఉన్నదాంట్లో మంచిగా చూసుకోవాలి. నేను హైపర్ యాక్టివ్ కాబట్టి తనకు ఓపిక, సహనం ఎక్కువుండాలి. ప్రతి అమ్మాయిని గౌరవించాలి. పెళ్లయ్యాక ఎవరూ పని మానేయకూడదు. ఇద్దరం కలిసి పని చేసుకోవాలి. అలాగే మా అమ్మ, అన్నను బాగా చూసుకోవాలి అని చెప్పింది.దేవుడిపై నమ్మకంచిన్నప్పుడు నేను సాయిబాబాను ఎక్కువ నమ్మేదాన్ని. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఒక బిజినెస్ కోసం నాన్న ఉన్న డబ్బంతా ఒకతడి చేతిలో పెట్టాడు. అంతా సవ్యంగా జరిగేలా చూడమని బాబాకు మొక్కాను. ఉపవాసాలున్నాను. అయినా ఆ డబ్బు తిరిగి రాలేదు. నాన్న ఏం చేసుకుంటాడో అని భయమేసింది. బాబాకు మొక్కినా ఫలితం లేకపోయేసరికి ఆయనపై నమ్మకం పోయింది. నాన్న చనిపోయాక అసలు భగవంతుడిని నమ్మడమే మానేశాను. అదేంటో కానీ కొంతకాలం క్రితం సడన్‌గా నా నోటి నుంచి ఓం నమఃశివాయ అనే మంత్రాలు వచ్చేవి. దాంతో జీవితంలో మొదటిసారి అరుణాచలం వెళ్లాను. నావల్ల కాదుఅక్కడి వెళ్లాక నా ఆలోచన విధానమే మారిపోయింది. జీవితాన్ని చూసే కోణం మారిపోయింది. నేను, మా అమ్మ, అన్న ఎప్పుడూ కలిసే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను. ఏదైనా చెడు జరిగితే నాకే జరగాలి కానీ, వాళ్లకేదీ జరగకూడదు. ఎందుకంటే నాన్నను కోల్పోవడమే నాకు తీరని లోటు.. మళ్లీ ఉన్నవాళ్లను దూరం చేసుకుని ఒక్కదాన్ని బతకడం నా వల్ల కాదు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం, ఇల్లు కొనడం, సక్సెస్ అవడం, కారులో తిరగడం.. ఇవన్నీ నాన్న కోరికలు. అవన్నీ నెరవేరే సమయంలో నాన్న లేడన్న బాధ ఉంది అని చెప్పుకొచ్చింది. -
భర్త వల్లే సినిమాలకు దూరం? హీరోయిన్ ఏమందంటే?
ఒకప్పుడు గ్లామర్‌తో అల్లాడించిన హీరోయిన్ సనా ఖాన్ ఆరేళ్ల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. 2020 అక్టోబర్‌లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది.నేనే కోరుకున్నా..తాజాగా ఈ రూమర్‌పై సనాఖాన్ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా పెళ్లి. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే.. అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్‌తోనే బయటకు రావడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. నా భర్త వల్లే..గతంలో హిజాబ్ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్ చేశాడంతే.. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా.. నేనూ అదే ఎంచుకున్నాను.అందుకే సినిమాలు వదిలేశా..ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపువారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది అని చెప్పుకొచ్చింది.సినిమాహీరోయిన్ సనా ఖాన్.. గగనం, కత్తి, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ 6వ సీజన్లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.చదవండి: 8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతం వల్లేనేమో! -
నా క్యారెక్టర్‌పై నింద.. వాష్‌రూమ్‌లో ఏడ్చేదాన్ని: రీతూ
రీతూ చౌదరి.. విపరీతమైన నెగెటివిటీతో తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో పాల్గొంది. డిమాన్ పవన్‌తో లవ్ ట్రాక్ వల్ల మరింత వ్యతిరేకత మూటగట్టుకుంది. అయితే ఆమె చూపించే ప్రేమ నిజమైనదని రానురానూ ప్రేక్షకులే ఓ అంచనాకు వచ్చారు. ఏ కష్టం వచ్చినా ఫ్రెండ్ కోసం నిలబడే విధానం చూసి ముచ్చటపడ్డారు. బిగ్‌బాస్‌లో ఉండగా రీతూపై ఆరోపణలుఅవతలి వ్యక్తి దిగజారుతూ మాట్లాడినా సహనం కోల్పోకుండా కౌంటరిచ్చిన ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అలా నెగెటివిటీని పాజిటివిటీ మల్చుకుని బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చింది రీతూ చౌదరి. అయితే ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి తనపై సంచలన ఆరోపణలు చేసింది. నెగెటివిటీపై స్పందించిన రీతూధర్మ మహేశ్‌తో క్లోజ్‌గా ఉండేదని, అర్ధరాత్రి ఇంటికి వచ్చేదని, సీసీ కెమెరా వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ ఆరోపించింది. ఈ వివాదం కూడా రీతూపై కొంత నెగెటివిటీకి కారణమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ తనపై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్స్‌గా వచ్చిన ఫైర్ స్ట్రామ్ కంటెస్టెంట్లు డిమాన్ పవన్‌కు నాతో మాట్లాడొద్దని చెప్పేవారు. ఓటేయమని ఫోన్ చేస్తే..రీతూ బ్యాడ్.. నీకర్థం కావట్లేదు, ఆమె నిన్ను వాడుకుంటుంది అన్న టైపులో మాట్లాడేవారు. అదంతా చూసి అమ్మ చాలా బాధపడింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా అందర్నీ చూసి చాలా బాధగా అనిపించేది. ఇతర కంటెస్టెంట్లకు చుట్టాలందరూ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు కదా.. మాకెవరూ చేయరు, అలా మాకెవరూ లేరు కూడా! పాపం మా అమ్మ.. నాకు ఓటు వేయండి అని ఎవరికైనా ఫోన్ చేస్తే కూడా.. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదంటున్నారు, మేము ఓటు వేయం అన్నారు. నన్ను నాశనం చేయాలని చూస్తే..నాపై లేనిపోని నిందలు, ఆరోపణలు చేసినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మమ్మీ.. అవన్నీ లైట్ అని సర్దిచెప్పి వాష్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని. నా ఏడుపుకు కారణమైన వారికి ఏదో ఒకటి అవకుండా లేదు. నన్ను నాశనం చేయాలని చూస్తే కర్మ అనుభవిస్తారు. శివుడు నా ఎదుట ప్రత్యక్షమైతే మా మమ్మీ, అన్నయ్య కంటే ముందు నన్ను తీసుకెళ్లమని చెప్తాను అంటూ రీతూ భావోద్వేగానికి లోనైంది.చదవండి: ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? క్యాన్సర్‌నే జయించింది -
వైల్డ్‌కార్డ్స్‌గా రీతూ-పవన్.. నయని విమర్శలు
బిగ్‌బాస్ షోలో ఎక్కడెక్కడినుంచో కంటెస్టెంట్లు వచ్చి పాల్గొంటారు. హౌస్‌లో ఫ్రెండ్స్ అవుతారు, శత్రువులవుతారు, అమ్మ, అక్క, నాన్న, అన్న అంటూ వరుసలు కూడా కలుపుకుంటారు. ఈ స్నేహాలు, ప్రేమలు, బంధుత్వాలు కొందరు హౌస్‌లోనే ఆపేస్తే మరికొందరు మాత్రం ఆ ఆప్యాయతలను బయట కూడా కొనసాగిస్తారు.బిగ్‌బాస్‌లో పవన్- రీతూ ట్రాక్బిగ్బాస్ జోడీ డిమాన్ పవన్ - రీతూ చౌదరి కూడా ఆ కోవలోకే వస్తారు. తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో పాల్గొన్న వీరిద్దరూ హౌస్‌లో చాలా క్లోజ్ అయ్యారు. వీరి లవ్‌ట్రాక్ జనాలకు ఎంతగానో నచ్చింది. రీతూ ఎలిమినేట్ అయినప్పుడు కూడా ఈ జంట విడిపోయిందని అభిమానులు తెగ బాధపడ్డారు.వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్స్‌గా ..అలాంటివారికోసం పవన్- రీతూ మరోసారి జంటగా కనువిందు చేసేందుకు రెడీ అయ్యారు. వీరిద్దరూ జతగా బీబీ జోడీ సీజన్ 2లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరాగానే రొమాంటిక్ పర్ఫామెన్స్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జంట డ్యాన్స్, కెమిస్ట్రీ చూసి జడ్జిలు చప్పట్లు కొట్టారు. నయనికి రీతూ కౌంటర్కానీ బీబీ జోడీలోని మరో కంటెస్టెంట్ నయని పావని మాత్రం.. కాస్త డ్యాన్స్ తక్కువైనట్లు అనిపించిందంటూ విమర్శించింది. దబదబ స్టెప్పులేసేందుకు ఇది మాస్ సాంగ్ కాదుగా అని రీతూ కౌంటరివ్వగా దబదబ కొట్టమనట్లేదు, కానీ స్టెప్పులేయాలని చెప్తున్నా అని నయని సీరియస్‌గా ఆన్సరిచ్చింది. ఏదేమైనా ఈ జోడీ రాకతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ! View this post on Instagram A post shared by Uppala Pavan Kumar (@demon_pavan) -
కూతురి ఫస్ట్ బర్త్‌డే.. బిగ్‌బాస్ జంట ఎమోషనల్
బుల్లితెర జంట, బిగ్‌బాస్ ఫేమ్ మెరీనా అబ్రహం- రోహిత్ సాహ్ని గతేడాది పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఎనిమిదేళ్ల దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయి జన్మించింది. తనకు టియారా అని నామకరణం చేశారు. తాజాగా తమ కూతురి మొదటి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితం పరిపూర్ణంఈ సందర్భంగా టియారా రాకతో తమ జీవితాల్లో వచ్చిన మార్పులు చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మెరీనా మాట్లాడుతూ.. తొలిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా ప్రపంచమే మారిపోయింది. నన్ను మరింత స్ట్రాంగ్‌గా, అలాగే సాఫ్ట్‌గా, పరిపూర్ణంగా మార్చేశావు. మా జీవితాలను ఎంతో అద్భుతంగా మార్చావు. నా ప్రపంచమే నువ్వయిపోయావు అని పేర్కొంది.లవ్యూ టియారా: రోహిత్'టియారా.. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చాక నిన్ను చూసిన మొదటిరోజు ఇంకా నా కళ్ల ముందే ఉంది. భగవంతుడు ఎంతో అందమైన బహుమతిని నీ రూపంలో ఇచ్చాడు. మమ్మల్ని నీ పేరెంట్స్‌గా ఎంచుకున్నందుకు థాంక్యూ.. వి లవ్యూ టియారా' అని రోహిత్ ఎమోషనలయ్యాడు.సీరియల్, సినిమాఅమెరికా అమ్మాయి సీరియల్‌తో ఆకట్టుకుంది. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. ఓ సినిమా సమయంలో రోహిత్‌తో పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో జంటగా పార్టిసిపేట్ చేసింది. మెరీనా మధ్యలోనే ఎలిమినేట్ అవగా రోహిత్ మాత్రం ఫైనల్స్ వరకు వెళ్లాడు. సీరియల్స్‌కు దూరమైన వీరిద్దరూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. రోహిత్ హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Rohit Sahni (@rohitsahniofficial) చదవండి: భారీగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్స్ -
కూతురికి తొలి భోగి పండగ.. సంజనా ఎమోషనల్
బుజ్జిగాడు సినిమాలో యాక్ట్ చేసిన సంజనా గల్రానీ వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. మధ్యలో డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడంతో తన ఇమేజ్ డ్యామేజ్ అయింది. తనకు ఆ కేసులో క్లీన్చిట్ వచ్చినప్పటికీ తన ఆత్మగౌరవం దెబ్బతిందని బాధపడింది. ఆ మరకు పోగొట్టుకునేందుకు బిగ్‌బాస్ షోను ఎంచుకుంది. తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టింది.బిగ్‌బాస్ షోలో..చిలిపితనం, ముక్కుసూటితనంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుడ్డు దొంగతనంతో సీజన్‌పై బజ్ క్రియేట్ చేసిన ఆమె ఏకంగా ఫైనల్స్‌లో అడుగుపెట్టడం విశేషం. ఈ షో కోసం తన ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసింది. ఆరేండ్ల కుమారుడు అలరిక్‌ను, ఏడాది కూడా నిండని పాపను భర్తకు అప్పజెప్పి బిగ్‌బాస్ షోలో పాల్గొంది. లోలోపల ఎంత కుమిలిపోయినా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేది. సంజనా కూతురికి భోగి పండ్లుతాజాగా ఓ సంక్రాంతి ఈవెంట్లో సంజనా కూతురికి దువ్వాడ మాధురి, శ్రీముఖి, రోహిణి భోగి పండ్లు పోశారు. అందులో సంజనా పాప ఎంతో క్యూట్‌గా నవ్వుతూ కనిపించింది. ఆ చిన్నారి ముందు పుస్తకం, స్టెతస్కోప్, మేకప్ వంటి సామాను పెడితే.. మేకప్ సామానునే పట్టుకుంది. అంటే తల్లి దారిలో నడవనున్నట్లు సిగ్నల్స్ ఇచ్చిందన్నమాట! ఈ సందర్భంగా సంజనా భావోద్వేగానికి లోనైంది. అదే నా సక్సెస్'చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లు అనిపిస్తోంది. ఇప్పటికీ ఇదంతా కలా? నిజమా? అర్థం కావడం లేదు. ఇంత చిన్న పాపను పెట్టుకుని బిగ్‌బాస్‌కు వెళ్లడమేంటి? ప్రతిరోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తూ నిద్రపోయేదాన్ని. టాప్ 5వరకు వెళ్లాను. ఇప్పుడు మీ అందరితో ఇక్కడున్నాను.. ఇదే నా విజయం' అని సంజనా చెప్పుకొచ్చింది.చదవండి: ప్రభాస్‌కు కలిసిరాని ఆర్ అక్షరం -
ఇది ప్రారంభం మాత్రమే.. బిగ్‌బాస్ విన్నర్ గుడ్‌న్యూస్
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ విన్నర్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. తొలిసారి ఒక సామాన్యుడు గెలిచి చరిత్ర సృష్టించాడు. తన గెలుపు తర్వాత దాన్ని అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవడంలో చాలా బిజీ అయిపోయాడు. అయితే ఫేమ్ ఉండగానే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన చేశాడు. తనకు వచ్చిన ఐడియాను అమల్లో పెట్టేశాడు.గుడ్న్యూస్ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ ఆ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ కల్యాణ్ ఏం చేశాడంటే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. తన వ్యక్తిగత విషయాలు, సరదా క్షణాలు, గుణపాఠాలు.. ఇలా ప్రతీది అభిమానులతో పంచుకునేందుకు వీలుగా యూట్యూబ్ మొదలుపెట్టినట్లు వెల్లడించాడు.జీవితాంతం రుణపడి ఉంటా..ప్రేక్షకుల ప్రేమ వల్లే ఇంతదూరం వచ్చానని, ఇప్పుడు యూట్యూబ్ జర్నీకి మీ అందరి సపోర్ట్ కావాలని పోస్ట్ పెట్టాడు. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. తన గేమ్ నచ్చి ఓటు వేసినవారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. కొత్త యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టానని, తన ఛానల్‌కు సపోర్ట్ చేయమని కోరాడు. ఇది చూసిన అభిమానులు అతడి కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Pavan Kalyan Padala (@kalyanpadala881) చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ -
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్'.. వీడియో వైరల్
బిగ్‌బాస్ తెలుగు 9 విన్నర్ కల్యాణ్ పడాల, రన్నర్ తనూజ మరోసారి ఒక వేదికపై కలిశారు. ఈ సీజన్లో వీరిద్దరి ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.. హౌస్‌లో వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ ఇరువురి అభిమానులు మాత్రం బూతులతో రెచ్చిపోయారు. అయితే, ఈ సీజన్ ముగిసిన తర్వాత తనూజ ఎలాంటి ఈవెంట్లో కనిపించలేదు. తొలిసారిగా స్టార్‌మా కోసం 'మా సంక్రాంతి వేడుక' కార్యక్రమంలో పాల్గొంది. వీరద్దరూ కలిసి 'ఛాంపియన్' సినిమాలోని 'గిర గిర గింగిరాగిరే' అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమం జనవరి 14న మధ్యాహ్నం 12కు ప్రసారం కానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రోమోను వదిలారు. దీంతో నెట్టింట వారిద్దరూ వైరల్ అవుతున్నారు. -
బిగ్‌బాస్ సీజన్-9.. ఐదేళ్ల రికార్డ్ బ్రేక్..!
తెలుగు బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. గతేడాది డిసెంబర్లో ముగిసిన ఈ సీజన్లో కామనర్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన పడాల కల్యాణ్ విజేతగా నిలిచాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్‌లోఉన్న పడాల కల్యాణ్ తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 ట్రోఫీతో పాటు క్యాష్‌ప్రైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ రన్నరప్‌గా తనూజ నిలిచింది. ఈ సీజన్ టాప్-5లో డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్, సంజనా గల్రానీ నిలిచారు.తెలుగు సినీ ప్రియులను అలరించిన ఈ రియాలిటీ షో అరుదైన రికార్డ్ సాధించింది. గతేడాది జరిగిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అత్యధిక రేటింగ్ సాధించింది. గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద రికార్డ్ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేను జియో హాట్‌స్టార్‌లో 285 మిలియన్ నిమిషాల పాటు వీక్షించారు. అంతేకాకుండా స్టార్ మా టీవీ రేటింగ్స్‌లో 19.6 సాధించింది. ఈ సందర్భంగా నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ రికార్డ్ సాధించిన ఈ షో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రేమ, మద్దతుతో ఈ సీజన్‌ను చారిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.UNBEATABLE!! UNREACHABLE!! 🔥🔥🔥🔥🔥19.6 TVR on StarMaa, 285 million minutes on Jiostar 💥🔥The #BiggBossTelugu9 Grand Finale stands tall as the BIGGEST in the last 5 years.A season filled with emotions, passion, conflicts, and unforgettable moments. 🔥My heartfelt thanks to… pic.twitter.com/HlR4B56XTy— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 2, 2026 -
బిగ్‌బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
కొందరు బిగ్‌బాస్ సెలబ్రిటీలు బయటకు రాగానే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినా, ఫంక్షన్‌కు వెళ్లినా చుట్టూ బాడీగార్డులను వెంటేసుకుని వెళ్తుంటారు. గతంలో బిగ్‌బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. సోనియా-యష్ పెళ్లికి కూడా బాడీగార్డులను వెంటేసుకునే పోయాడు. నిన్నగాక మొన్న బిగ్‌బాస్ 9 విన్నర్ పవన్ కల్యాణ్ పడాల పదిమంది బాడీగార్డులతో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు. 150 మంది బాడీగార్డులా?అయితే ఓ హిందీ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా 150 మంది బాడీగార్డులను పెట్టుకుందంటూ ఓ వార్త వైరలవుతోంది. తను మరెవరో కాదు, తాన్య మిట్టల్. గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందీ లేడీ కంటెస్టెంట్. పూటకో చీర కడతానని బిగ్‌బాస్ హౌస్‌కు దాదాపు 800 చీరలు తీసుకెళ్లింది. అలాగే 50 కిలోల నగలు కూడా పట్టుకెళ్లింది. లగ్జరీకి పెద్ద పీట వేసే ఈ బ్యూటీ తనకు 150మంది బాడీగార్డులున్నారన్న రూమర్‌పై తాజాగా స్పందించింది.అందులో నిజం లేదుతాన్య మిట్టల్ మాట్లాడుతూ.. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని పుట్టించారు. నా కింద 150 మంది సిబ్బంది పనిచేస్తారని మాత్రమే చెప్పాను. దానికి బిగ్‌బాస్ హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ జైషా ఖాద్రి.. వాళ్లందర్నీ నా బాడీగార్డ్స్ అని సరదాగా అన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. అలా అని బాడీగార్డ్స్ లేరని చెప్పను. నాకంటూ కొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంది.అబద్ధం చెప్పనుఎందుకంటే నాకు బట్టల పరిశ్రమ, ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేను. కానీ, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధాలాడాల్సిన అవసరం నాకసలే లేదు అని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాన్య మిట్టల్.. హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొని మూడో రన్నరప్‌గా నిలిచింది. ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది.చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ -
ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా!
దగ్గరగా ఉన్నప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడే ప్రేమ విలువ తెలుస్తుందంటారు. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ విషయంలోనూ ఇదే నిజమైంది. అతడు కమెడియన్‌గా స్థిరపడటానికి ముందే ఓ అమ్మాయి తనను ప్రేమించింది. ఇమ్మూ కూడా తనతో చాటింగ్ చేస్తూ, ఫోన్లు మాట్లాడుతూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. చచ్చినా, బతికినా తనతోనే కలిసుండాలని నిర్ణయించుకున్నాడు.బిగ్‌బాస్ షోలో రియలైజేషన్కానీ ఇమ్మూ కమెడియన్‌గా ఫేమస్ అవడంతో షూటింగ్స్‌లో ఎక్కువ బిజీ అయ్యాడు. ఆ సమయంలో ప్రియురాలికి సరిగా టైమ్ ఇవ్వకపోగా చిరాకు, అసహనం, కోపం అన్నీ తనపైనే చూపించాడు. తానెంత తప్పు చేశాడన్నది తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌కు వెళ్లాక రియలైజ్ అయ్యాడు.బహుమతిగా బిగ్‌బాస్ ట్రోఫీ..ప్రేయసిని ఎంతో బాధపెట్టానని అర్థం చేసుకుని రోజూ రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకోసం బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచి దాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. కానీ, అది కుదర్లేదు. అయితే షో నుంచి బయటకు వచ్చాక మాత్రం తనను కలిసి ప్రేమ కబుర్లు చెప్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.ఎంతో బాధపెట్టా..వేస్ట్ అమ్మా (ఇమ్మూ తన ప్రియురాలిని ప్రేమగా వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటాడు).. నా జీవితంలోకి వచ్చినందుకు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్యూ.. నిన్ను నేను చాలా బాధపెట్టాను. కానీ, ఈ సంవత్సరం నుంచి మనం ఇంకా స్ట్రాంగ్ ఉండి.. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇప్పటినుంచి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నా..! నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన పెద్ద బహుమతి నువ్వే.త్వరలోనే పరిచయం చేస్తా..నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నాకు ఎల్లప్పుడూ అండగా నిలబడ్డందుకు, అపారమైన ప్రేమను పంచినందుకు థాంక్యూ సో మచ్.. ఐ లవ్యూ సో మచ్ నా బుజ్జి ఫెల్లో.. నువ్వే నా సర్వస్వం.. హ్యాపీ న్యూ ఇయర్.. అని రాసుకొచ్చాడు. అతడి ప్రియురాలి పేరు రుచి అని తెలుస్తోంది. అయితే ఇమ్మూ షేర్ చేసిన ఫోటోలో ఆమె ముఖం దాచుకుంది. ఇది చూసిన అభిమానులు వదినను ఎప్పుడు చూపిస్తావ్? అని అడుగుతున్నారు. అందుకు ఇమ్మాన్యుయేల్.. త్వరలోనే చూపిస్తానని రిప్లై ఇచ్చాడు. View this post on Instagram A post shared by Nanduri Emmanuel (@jabardasth_emmanuel) చదవండి: మురారి క్లైమాక్స్.. పస్తులుండి మరీ ఆరోజు షూటింగ్.. దటీజ్ మహేశ్ -
కల్యాణ్, శ్రీజలకు 'ఇమ్ము' డైరెక్ట్ పంచ్.. వీడియో వైరల్
బిగ్‌బాస్ తెలుగు 9 ముగిసింది. విజేతగా కల్యాణ్ పడాల ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే, తొలిసారి ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ కలిశారు. 'ఆదివారం స్టార్ మా పరివారం' ప్రోగ్రామ్ కోసం వారందరూ సందడి చేశారు. ఈ వేడుకలో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి, పవన్, రీతూ, శ్రీజ, సంజన, సుమన్ శెట్టి, రాము, దివ్య మాత్రమే కనిపించారు. ఈ సీజన్లో విన్నర్ రేసులో ఉన్న తనూజ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో శ్రీజకు ఇమ్ము అదిరిపోయే పంచ్ వేశాడు. అదే సమయంలో రీతూ, పవన్‌లు మరోసారి ఈ షో కోసం తమ మ్యాజిక్ చూపించారు. వేదికపైనే పవన్‌కు రీతూ ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. -
రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్
బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. 'జబర్దస్త్'తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్.... బిగ్ బాస్‌లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమ్మాన్యుల్... అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు!!బిగ్ బాస్‌లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని వివరించాడు. బిగ్ బాస్ జర్నీలో తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా "విజనరీ వౌస్" కి కృతజ్ఞతలు తెలిపాడు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పిన ఇమ్మాన్యూల్... తనకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోశానా లేదని అన్నాడు!! -
నా పేరు, మనీ ఉపయోగించుకుని వదిలేశాడు.. బిగ్‌బాస్ 'ఇనయా' కన్నీళ్లు
కొన్ని కథలను వెండితెరపై చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతారు. ఒక్కోసారి అలాంటి జీవితాలే మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇదే కోవలో నటి, బిగ్‌బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా లైఫ్ ఉంది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్‌బాస్ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఆ తర్వాత ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే, తనతో బ్రేకప్ అయిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ క్రమంలో ప్రియుడు చేసిన మోసాన్ని బయటపెట్టింది.సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి సింగిల్‌గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఇనయా.. గౌతమ్ కొప్పిశెట్టి అనే యువకుడితో ప్రేమలో పడింది. అతను యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని సమాచారం. తనతో కొద్దిరోజులు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పినట్లు పేర్కొంది. అయితే, తనను ప్రియుడు మోసం చేశాడని ఆమె పేర్కొన్నారు. ఫిజికల్‌గా కూడా కలిశాం..'స్నేహంతో మొదలైన మా పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలం పాటు నాతో బాగానే ఉన్నాడు. మా ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలుసు.. అందుకే సోషల్‌మీడియా ద్వారా అందరికీ తనను పరిచయం చేశాను. నాకు ఎవరూ లేరనుకున్న సమయంలో అతను పరిచయం అయ్యాడు. ఆపై ప్రేమలో పడ్డాం. కానీ, అతను కేవలం నా మనీ, పేరును మాత్రమే ఉపయోగించుకోవాలనుకున్నాడు. తనతోనే జీవితం అనకున్నాను కాబట్టి ఫిజికల్‌గా కూడా కలిశాం. అతని కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. తను వ్యాపారం చేస్తానంటే భారీగా డబ్బు సాయం చేశాను. చివరకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న గొల్డ్ గాజులు కూడా తనకోసం అమ్మేశాను. దేవుడా.. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు (కన్నీళ్లు)..ఇప్పటికే ఎన్నో లక్షల రూపాయాలు ఇచ్చాను. నా బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యాక వదిలేశాడు. ప్రస్తుతం రూ. 5 లక్షలకు పైగానే అప్పులో ఉన్నాను. ఎలాంటి పనిచేయకుండా ఇంట్లోనే ఉంటాడు. నేను షూటింగ్ వెళ్తున్నా సరే ఒకటే గొడవలు. నాపై అనుమానం పెంచుకున్నాడు. ప్రతిరోజు నరకంగా నా జీవితం మారింది. కేవలం మనీ కోసం మాత్రమే నన్ను ఉపయోగించుకున్నాడు. నేను ఏం చేసినా సరే తప్పుగానే చూస్తాడు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా ఉండాలి అనిపించింది. విడిపోయాక రెండు నెలలు చాలా బాధపడ్డాను. ఇప్పుడు అలవాటు అయిపోయింది.మదం సినిమాలో అతనితోనే ఇంటిమేట్ సీన్.. ఆరోజే చచ్చిపోయానుమదం సినిమాలో ఇనయా కీలకమైన పాత్రలో నటించింది. జనవరి 1న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులోఆమె చాలా బోల్డ్‌గా కనిపించనుంది. అయితే, ఇదే మూవీలో తనను మోసం చేసిన ప్రియుడు కూడా నటించాడని ఆమె తెలిపింది. తనతో బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇంటిమేట్ సీన్లో ఇద్దరం కలిసి నటించామని ఆమె ఇలా చెప్పింది. మదం సినిమాలో మూడు ఇంటిమేట్ సీన్లు నాతోనే ఉన్నాయి. ఒక సీన్లో నా పర్సనే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని మొదట ఓకే చెప్పాను. తర్వాత మేము బ్రేకప్ అయ్యాం. అయితే, సినిమా కోసం అతనితోనే ఇంటిమేట్ సీన్లో నటించాను. ఆరోజు ఒక మనిషిగా చచ్చపోయాను. ఆరోజు నిద్ర కూడా పట్టలేదు. ఎందుకు బతుకుతున్నానా అనే ప్రశ్న కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. అని ఇనయా చెప్పింది. -
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్‌లో మధుర జ్ఞాపకం: తనూజ
సీరియల్ నటి తనూజ పుట్టస్వామి బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్‌గా నిలిచిన ఆమె తాజాగా తన మంచి మనసు చాటుకుంది. షో అయిపోగానే తన ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన చిన్నపాటి పార్టీలో సందడి చేసిన ఆమె తాజాగా అనాథాశ్రమానికి వెళ్లింది. ఈ మేరకు ఒ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.చిన్నారులతో సరదాగాఅందులో చిన్నారులతో కలిసి ముచ్చటించింది. వారు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టింది. తర్వాత పిల్లలందరికోసం పాట పాడింది. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించింది. అనంతరం వారికి భోజనం వడ్డించింది. ఓ చిన్నారికి గోరుముద్దలు పెడుతూ తనూ వారితో కలిసి భోజనం చేసింది.మధురమైన జ్ఞాపకంవాళ్లందరినీ తన ఫ్యామిలీగా అభివర్ణించింది. 'నా కుటుంబాన్ని చూసి ఎన్నాళ్లయిందో! వాళ్ల ప్రేమలు, చిరునవ్వులు, జ్ఞాపకాలు.. మమ్మల్ని మళ్లీ ఒక్కటి చేశాయి. చాలాకాలం తర్వాత వారితో మళ్లీ కాలక్షేపం చేశాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని తనూజ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) చదవండి: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడ్డ విజయ్ -
గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్
రీసెంట్గా ముగిసిన బిగ్‌బాస్ 9వ సీజన్లో టాప్-5లో నిలిచిన వాళ్లలో ఇమ్మాన్యుయేల్ ఒకడు. కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ చెప్పాడు. బయటకు రాగానే ఆమెని పెళ్లి చేసుకుంటానని కూడా అన్నాడు. ఇప్పుడు అదే నిజం చేసేలా తన గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేశాడు! ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఫొటో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?)ఇమ్మూ పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే ఇతడితో పాటు ఉన్నది ప్రియురాలేనా అనిపిస్తుంది. త్వరలో గుడ్ న్యూస్ చెబుతాడా అనిపిస్తుంది. ఆమె ఎవరు ఏంటనేది, ఫొటో లాంటి బయటపెట్టలేదు కానీ ఇన్ స్టా ఖాతా పేరు మాత్రం రుచి అని ఉంది. ఎవరో ఏంటనేది త్వరలో ఇమ్మాన్యుయేల్ బయటపెడతాడేమో చూడాలి?షోలో ఇమ్మూ చెప్పిన లవ్‌స్టోరీ'స్టాండప్ కమెడియన్‌గా చాలా షోలు చేశా కానీ ఎవరూ గుర్తుపట్టలేదు. ఓరోజు నా ఇన్ స్టాలో పెద్ద మెసేజ్ వచ్చింది. మీ స్టాండప్ కామెడీ నాకు బాగా నచ్చింది. ఓ వ్యక్తి ఇంతమందిని నవ్వించగలడా అనిపించింది అని ఓ అమ్మాయి మెసేజ్ చేసింది. థ్యాంక్యూ చెబితే.. మీకు ఓకే అయితే నెంబర్ ఇస్తారా? అని అడిగింది. నేను ఫోన్ నంబర్ ఇచ్చాను. తర్వాత ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. కొన్నాళ్ల తర్వాత తను డాక్టర్ కోర్స్ చేస్తున్నా అని చెప్పింది. ఏంటీ నేను డాక్టర్ని నవ్వించగలిగానా అనిపించింది. నా ఫేమ్ చూసి ఇష్టపడిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పటికి నాకంతా గుర్తింపు రాలేదు. పోనీ అందం చూసి ప్రేమించింది అనుకోవడానికి కూడా లేదు. నేను ఎలా ఉంటానో నాకు తెలుసు''ఆమెతో మాట్లాడిన తర్వాత.. ఈ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నాకు ఫస్ట్ అనిపించింది. ప్రపోజ్ కూడా కాదు నేరుగా పెళ్లి చేసుకోవాలనిపించింది. అంతా ఫోన్లోనే. నేను కనీసం ఆమె ఫొటో కూడా చూడలేదు. ఎలా ఉంటుందో తెలీదు. తన ముఖం కూడా చూడకుండానే ప్రపోజ్ చేశా. నీకు ఇష్టమైతే చెప్పు.. మా అమ్మవాళ్లకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాను. దీంతో నాకు కాస్త టైమ్ కావాలి అని చెప్పింది. తర్వాత ఆమెని ఇంట్లో వాళ్లకు కూడా పరిచయం చేశాను. ఇదంతా ఓ వారంలోనే జరిగిపోయింది. కలుద్దాం అడిగితే అంత సీన్ లేదు గానీ.. మా ఊరు వెళ్తున్నా కారు ఉంటే తీసుకుని రా, కలిసి వెళ్దాం అని చెప్పింది'(ఇదీ చదవండి: ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్)'నాకు అప్పటికి కారు లేదు. మా ఫ్రెండ్‌ని కారు అడిగి, పెట్రోలుకి డబ్బులు సెట్ చేసుకుని ఆమెని కలిశాను. నాలుగు గంటల పాటు వాళ్ల ఊరివరకు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో.. చచ్చినా బతికినా దీనితోనే బతకాలనుకున్నాను. తనని నేను వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటా. ఏ రోజు తను, నా అందం చూడలేదు. ఆస్తి చూడలేదు. డబ్బు చూడలేదు. ఈ రోజుకి కూడా తనకి నేను ఒక్క రూపాయి పెట్టింది లేదు. కనీసం ఒక్క డ్రస్ కొనివ్వలేదు. ప్రతిసారి బర్త్ డేకి బట్టలు కొంటాం గానీ పెళ్లియ్యాకే కట్టుకుంటాం అని అంది. వాటిని నా బీరువాలోనే దాచుకున్నా. అంత మంచి వ్యక్తి ఆమె. షూటింగ్స్ బిజీలో పడి తనని సరిగా పట్టించుకునేవాడిని కాదు, చిరాకుపడేవాడిని, తిట్టేవాడిని. చాలా బాధపెట్టాను. కానీ ఇక్కడి వచ్చాక రియలైజ్ అయ్యాను. మనిషిని దూరం పెట్టి ఇంత బాధపెట్టానా అనిపిస్తుంది''ఈ నవంబరులో తను పీజీ చేయడం కోసం ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కి వెళ్తున్నానని ఆగిపోయింది. జీవితాన్ని త్యాగం చేసింది. తనకేం కర్మ.. నాకోసం ఎందుకింత చేస్తుందని చాలా బాధగా ఉంది. తనకోసమే ఆడుతున్నా.. గెలవాలనే ఆడుతున్నా. ఈ షో అవ్వగానే పెళ్లి చేసుకుంటాం. ఫారిన్ వద్దూ ఏమి వద్దూ. తనని జీవితాంతం హ్యాపీగా చూసుకుంటాం. తన విలువ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది' అని ఇమ్మూ అప్పుడు చెప్పాడు. ఇప్పుడు పరోక్షంగా తన ప్రేయసిని పరిచయం చేశాడు. చూస్తుంటే కొత్త ఏడాదిలో పెళ్లి శుభవార్త చెప్పడం గ్యారంటీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: కష్టానికి విలువ లేదు.. ఇమ్మూ గురించి కమెడియన్ రోహిణి ఆవేదన) -
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. జుడ్వా, చల్ మేరే భాయ్, హమ్ సాత్ సాత్ హే, హలో బ్రదర్, కహీ ప్యార్ నా హోజాయే.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అయితే 2005లో శక్తి కపూర్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ప్రలోభాలకు గురి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్.. శక్తి కపూర్‌తో కలిసి నటించడం ఆపేశాడు.అవమానభారం2011లో శక్తికపూర్ హిందీ బిగ్‌బాస్ ఐదో సీజన్లో అడుగుపెట్టాడు. ఈ షోకి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రియాలిటీ షో సమయంలో సల్లూ భాయ్.. శక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అతడిని కావాలనే పక్కనపెట్టేశాడు. దీంతో శక్తికి అవమానంతో తలకొట్టేసినట్లయింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయన సల్మాన్‌పై ఎదురుదాడికి దిగాడు. ఆడవాళ్లను కొడతాడని నింద వేశాడు. అలా ఇద్దరి మధ్య అగాథం ఏర్పడింది.ఎవరితోనూ గొడవల్లేవ్దాదాపు 15 ఏళ్ల తర్వాత తమ మధ్య పరిస్థితులు చక్కబడ్డాయంటున్నాడు శక్తికపూర్. ఇప్పుడు తనకెవరితోనూ గొడవలు లేవు అని చెప్తున్నాడు. మద్యపానానికి కూడా దూరంగా ఉంటున్నానన్నాడు. మందు మానేసి ఐదేళ్లవుతోందని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మందుబాబులకన్నా ఆరోగ్యంపై ఫోకస్ చేసేవాళ్లే ఎక్కువున్నారు. గతంలో అయితే చాలామంది స్టార్స్ తాగి మరీ సెట్స్‌కు వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. శక్తి కపూర్ వందలాది సినిమాల్లో నటించగా ఆయన కుమారుడు సిద్దాంత్ నటుడిగా, శ్రద్దా కపూర్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దేవర నటి -
బిగ్‌బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్‌బాస్ ట్రోఫీ గెలుస్తానని తనూజ కాన్ఫిడెంట్‌గా ఉండేది. కానీ అది నిజం కాలేదు. టికెట్ టు ఫినాలే నాదే అని శపథం చేసిన పవన్.. మాట నిలబెట్టుకోలేకపోయాడు. అయితే సంజనా మాత్రం ఆత్మధైర్యంతో అనుకున్నది సాధించింది. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడానికి ముందే టాప్ 5 అని ఫిక్సయిపోయింది. అందుకోసం 100 రోజులకు సరిపడా బట్టలు రెడీ చేసుకుంది.గుడ్డు దొంగతనంతప్పోఒప్పో ఏదైనా ముఖం మీదే మాట్లాడేది. తను మాట్లాడింది తప్పని తెలుసుకున్నప్పుడు బేషరతుగా క్షమాపణలు చెప్పేది. ఒక్క గుడ్డు దొంగతనంతో సీజన్ 9పై బజ్ క్రియేట్ చేసింది. ఎన్నో అవమానాలు, గొడవల తర్వాత వెరీ గుడ్డు కంటెస్టెంట్‌గా ఫైనల్స్‌లో ఐదో స్థానంలో బయటకు వచ్చింది. ఫినాలే అయిపోయినవెంటనే బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదుఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదు. ఫైనల్స్‌కు వరకు ఉంటాననుకున్నారా? అని అడిగాడు. అందుకామె ఉంటాననుకున్నాను.. అందుకే కదా 15 వారాలకు సరిపడా డ్రెస్సులు బెంగళూరు నుంచి ప్యాకింగ్ చేసుకుని వచ్చాను అని బదులిచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. మన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా.. చిన్న ఇంట్లో అయినా.. ఎక్కడైనా సంతోషంగా బతకొచ్చు. కానీ, మర్యాదకు భంగం కలిగితే ఎలా బతకగలం? నన్ను ఇలా గుర్తుపెట్టుకోవాలి2020లో నాపై పడ్డ నింద కారణంగా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవద్దు.. బిగ్‌బాస్ 9లో టాప్ 5కి వెళ్లింది.. ఆవిడ సంజనా.. అని నన్ను గుర్తించాలి. నా పిల్లలు నన్ను అలాగే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పింది. ఇక ప్రోమోలో శివాజీ ఆమెను ఆంటీ అనడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతడికంటే సంజనా వయసులో చిన్నదని, ఆమెను పట్టుకుని ఆంటీ అంటాడేంటని ఆగ్రహిస్తున్నారు. -
బిగ్‌బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
బిగ్‌బాస్ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.అగ్నిపరీక్షఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్ చేసి బిగ్‌బాస్ టీమ్‌కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.అలాంటివారికి నో ఛాన్స్వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. బిగ్‌బాస్‌కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.తొలిసారి ఏడుగురు కామనర్స్మిగతావారి టాలెంట్, ఎక్స్ప్రెషన్స్, నాలెడ్జ్.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్ ఫైనల్ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్, పవన్, మనీష్, హరీశ్. వీరిలో కల్యాణ్ ఏకంగా టైటిల్ విన్నర్ కాగా పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. సామాన్యుడి చేతికి ట్రోఫీసామాన్యుడు బిగ్‌బాస్‌కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్ సీజన్‌పై పెద్దగా బజ్ లేదు. ఇప్పుడు కల్యాణ్ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. బిగ్‌బాస్ ప్లాన్ సక్సెస్ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్‌ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్‌లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్‌బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్ 2026 సెకండాఫ్‌లో ప్రారంభం కానుంది.చదవండి: వినాయకన్కు తీవ్ర గాయం.. కాస్త లేట్ అయ్యుంటే పక్షవాతం! -
'గీతూ రాయల్' దెబ్బకు దిగొచ్చిన సంజన
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ పూర్తి అయినప్పటికీ ఏదో రకంగా ట్రెండింగ్‌లోనే కొనసాగుతుంది. ఎపిసోడ్‌కు సంబంధించిన పలు వీడియోలను కంటెస్టెంట్స్ షేర్ చేసుకుంటూ మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో నటి సంజన గల్రానీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బిగ్‌బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్, రివ్యూవర్స్ ఆదిరెడ్డి, గీతూ రాయల్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. దీంతో గీతూ రాయల్ గట్టిగానే కౌంటర్‌గా ఇచ్చింది. సంజనకు సంబంధించిన ఒక వీడియోను తన స్టోరీస్‌లో పంచకుంది. అయితే, కొద్దిసేపటి తర్వాత సంజన తన తప్పును తెలుసుకుని తన పోస్ట్‌ను తొలగించడంతో.. రీతూ రాయల్ కూడా తను చేసిన పోస్ట్‌ను రిమూవ్ చేసింది.సంజన ఏం చేసింది..?బిగ్‌బాస్ రివ్యూవర్ మహిధర్ చేసిన ఒక వీడియోను మొదట సంజన షేర్ చేసింది. ఆ వీడియోలో సంజన బిగ్‌బాస్ కంటెంట్ క్రియేటర్ అంటూ అతను పేర్కొన్నాడు. ఆపై తనూజ, ఇమ్ము, డీమాన్ పవన్‌ల ఆట గురించి ప్రస్తావించాడు. అయితే, కేవలం రివ్యూవర్ల వల్లనే కల్యాణ్ హైలెట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. దానిని కొందరు ట్రోలర్స్ వైరల్ చేశారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, రీతూ రాయల్ కల్యాణ్ కోసం ఓట్ల బిచ్చగాళ్లు మాదిరిగా క్రియేట్ చేసి ఉన్న ఒక ఫోటోను ఆ వీడియోకు కలిపారు. అదే వీడియోను సంజన షేర్ చేయడంతో గీతూ రాయల్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వెంటనే తనదైన స్టైల్లో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇంకేముంది సంజన తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇంతలోనే ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయిపోయింది.సంజనకు గీతూ రాయల్ కౌంటర్డ్రగ్స్ కేసులో నటి సంజనపై ఆరోపణలు అంటూ వచ్చిన ఒక వీడియో క్లిప్‌ను గీతూ పోస్ట్ చేసింది. ఇదీ నిజమా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సంజన గల్రానీ డ్రగ్స్ కేసు 2020లో కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. రెండు నెలల తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. ఇదే కేసులో సుప్రీం కోర్టు కూడా కొద్దిరోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది.#GeetuRoyal status on #Sanjana #BiggBossTelugu9 pic.twitter.com/kLMBYZfGBe— TeluguBigg (@TeluguBigg) December 24, 2025 -
ప్రమోషన్ పొందిన వితికా షెరు
బిగ్‌బాస్ ఫేం, నటి వితికా షెరు గుడ్‌న్యూస్ చెప్పింది. పెద్దమ్మగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించింది. వితికా చెల్లెలు కృతికా తాజాగా పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. బాబు పుట్టిన శుభవార్తను అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హీరోయిన్గా కెరీర్తెలుగమ్మాయి వితిక హీరోయిన్గా టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టింది. సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరో వరుణ్ సందేశ్‌తో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జంటగా బిగ్‌బాస్ షో మూడో సీజన్‌కు సైతం వెళ్లొచ్చారు. పెళ్లయిన తర్వాత కూడా చెల్లి కృతికకు పెళ్లి చేసే బాధ్యతను తనే తీసుకుంది వితికా.చెల్లి పెళ్లి చేసిన వితికాఅక్కగా దగ్గరుండి 2022లో చెల్లి పెళ్లి చేసింది. కొద్ది నెలల క్రితమే కృతిక గర్భం దాల్చగా ఇటీవల తనే ఘనంగా సీమంతం కూడా చేసింది. ఇది చూసినవాళ్లంతా ఇలాంటి అక్క ప్రతి ఇంట్లో ఉండాలని వితికాపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే కృతిక - కృష్ణ దంపతులకు మంగళవారం (డిసెంబర్ 23న) బాబు పుట్టగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
కల్యాణ్ విజయం వెనుక 'బిగ్‌బాస్' రివ్యూవర్స్.. ?
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. పైనల్ ఎపిసోడ్ ముగిసి విజేతగా ప్రకటించినా సరే కల్యాణ్, తనూజ పేర్లు నెట్టింట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఒక విజేతకు రావాల్సిన మైలేజ్‌ను ఎన్నడూ లేని విధంగా తనూజ కూడా హైజాక్ చేసింది. వాస్తవంగా 10 వారాల పాటు ఎలాంటి ఓటింగ్ పోల్స్ చూసినా సరే తనూజనే విన్నర్‌గా కనిపించేది. కానీ, ఆ తర్వాత సీన్ మారిపోయింది. హఠాత్తుగా ఓటింగులో దూసుకొచ్చాడు కల్యాణ్ పడాల.. తనూజ వెనుకబడిపోయింది. దీంతో CRPF జవాను కల్యాణ్ బిగ్‌బాస్ 9 విజేత అయ్యాడు. అయితే, కల్యాణ్ విజయంలో రివ్యూవర్ల పాత్ర ఎక్కువ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఆపై మరికొందరు టీవీ యాక్టర్స్ కూడా తనూజ గురించి నెగటివ్‌గా చెప్పడంతోనే ట్రోఫీ జారిపోయిందనే వాదన కూడా ఉంది. మరికొందరు మాత్రం అగ్నిపరీక్ష-2 కోసం బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ చేస్తుందని అందుకే ఒక కామనర్‌ను కావాలనే గెలిపించారనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కామెంట్లతో కల్యాణ్‌లో కూడా గెలుపు సంతోషం లేకుండా పోయింది.అర్జునుడిలా కల్యాణ్.. కృష్ణుడి స్థానంలో గీతూబిగ్బాస్ రివ్యూవర్లు ఆదిరెడ్డి, గీతూ రాయల్ సపోర్ట్ కల్యాణ్‌కు పుష్కలంగా దొరికిందని కొందరు నెటిజన్లు డీకోడ్ చేశారు. వారిద్దరితో పాటు మరికొందరు రివ్యూవర్లు కూడా కల్యాణ్‌కు పీఆర్ మాదిరిగా మారిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గీతూ రాయల్ మొదటి నుంచి ప్రతి ఎపిసోడ్‌ను చక్కగా రివ్యూ చెప్పింది. కానీ, ఫైనల్‌కు వచ్చేసరికి కల్యాణ్‌కు ఓటు వేయాలంటూ తనకు అనుకూలంగానే వీడియోలు పోస్ట్ చేసింది. ముమ్మాటికీ గీతూ ఇక్కడ తప్పు చేసిందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక రివ్యూవర్ ఎప్పుడూ కూడా ఒక కంటెస్టెంట్ కోసం స్టాండ్ తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ విధానం రాబోయే సీజన్లలో వారు చెప్పే రివ్యూలకు క్రెడిబులిటీ ఉండదని పేర్కొంటున్నారు. ఈ పాయింట్‌ను గీతూ గ్రహించలేకపోయిందని చెప్పాలి. పైగా కల్యాణ్ గెలిచిన తర్వాత షేర్ చేసిన ఒక పోస్టర్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఒక రథంపై ఆర్జునుడి స్థానంలో కల్యాణ్ ఉంటే.. కృష్ణుడి స్థానంలో గీతూ రాయల్ ఉండేలా క్రియేట్ చేసిన పోస్టర్‌ను ఆమె షేర్ చేసింది. దీంతో ఇంతకంటే నీతితక్కువ పని ఏమైనా ఉంటుందా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.మొదటిసారి గాడి తప్పిన ఆదిరెడ్డిబిగ్బాస్ రివ్యూ చెప్పడంలో ఆదిరెడ్డి దిట్ట... తను చెప్పే స్టైల్‌కు చాలామంది ఫిదా అయిపోతారు. బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు ఉన్నంత రేంజ్లో ఆదిరెడ్డి రివ్యూకు ఉంటుంది. ముఖ్యంగా అతని రివ్యూ తీరు మన పక్కింటి అబ్బాయి చెబుతున్నంత దగ్గరగా ఉంటుంది. ఏ సీజన్లో లేని విధంగా ఈసారి ఆదిరెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కల్యాణ్ గెలుపు కోసమే రివ్యూలు చేశాడంటూ నెటిజన్లు వేల కొద్ది కామెంట్లు చేశారు. వాస్తవంగా అతని రివ్యూలు కూడా కల్యాణ పక్షం వైపే ఉన్నాయని సులువుగా అర్థం అవుతుంది. తనూజ ఏం చేసినా సరే తప్పు అనేలా చెప్పడం.. ఆదే టైమ్‌లో కల్యాణ్ ఏం చేయకున్నా సరే తోపు, తురుం అంటూ ఎలివేషన్ ఇవ్వడంతో బజ్ క్రియేట్ అయిపోయింది. చాలామంది రివ్యూవర్లు కూడా ఆదిరెడ్డిని కాపీ కొట్టి తమ స్టైల్లో రివ్యూ షేర్ చేశారు. అలా అని ఆదిరెడ్డి డబ్బులకు అమ్ముడుపోయాడని చెప్పడం తప్పే.. తను అనుకుంటే ఏదైన కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ చేస్తే ఏడాదికి కోట్లలో సంపాదించగలడు. కానీ, మొదటిసారి తన రివ్యూలు గాడి తప్పాయని విమర్శలు రావడంతో తన క్రెడిబులిటికి ఒక మచ్చలా మిగిలిపోనుంది.కల్యాణ్ గెలుపులో ఐదుగురుబిగ్బాస్ 9 ట్రోఫీ కల్యాణ్ అందుకున్న తర్వాత తన స్నేహితులు శ్రీజ, ప్రియలను కలుసుకున్నాడు. ఆ సమయంలో కల్యాణ్‌తో శ్రీజ ఇలా అంటుంది. 'ఐదుగురు అమ్మాయిలు సపోర్ట్ చేయడం వల్ల కల్యాణ్ గెలిచాడు.' అంటూ ఓపెన్‌గా చెబుతుంది. అయితే ముగ్గురు ఉన్నారని మరో ఇద్దరు అందుబాటులో లేరని తెలుపుతుంది. ఆ ఐదుమంది పేర్లను కూడా నెటిజన్లు రివీల్ చేస్తున్నారు. శ్రీజ, ప్రియ, గీతూ రాయల్, సత్య, రేష్మి అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.#KalyanPadala fans should accept the fact that Kalyan won BB and good name using sympathy card Army card caste card language card region card etc but he is lossing very thing just because this 5 evil and negitive mindsets around him.accept the fact#BiggBossTelugu9 #Thanuja pic.twitter.com/a4czq9IMub— santhosh (@Santhoshh_99) December 23, 2025 View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) -
టాప్ 2లో నా పక్కన ఇమ్మూ... తనూజతో ఆ బాండ్ లేదు!
అగ్నిపరీక్షలో కల్యాణ్ అందరికీ నచ్చాడు. కానీ బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రారంభంలో ఎవరికీ నచ్చలేదు. కారణం.. ఆట పక్కనపెట్టి అమ్మాయిలపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. నాగార్జున కూడా అతడి తీరును ఎండగట్టాడు. ఇక ప్రియ, శ్రీజ ఎలిమినేషన్ తర్వాత కల్యాణ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌లా మారి అన్నీ చూసుకుంది తనూజ. అతడి కోసం గేమ్స్‌లో కలబడింది, నిలబడింది.కల్యాణ్ కోసం నిలబడ్డ తనూజటికెట్ టు ఫినాలేలో ఇమ్మాన్యుయేల్‌ను పక్కనపెట్టి కల్యాణ్‌కే సపోర్ట్ చేసింది. అతడినెవరైనా టార్గెట్ చేస్తే వాళ్లను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి మరీ కల్యాణ్ కోసం టవర్ గేమ్‌లో చేయి నొప్పిని లెక్కచేయకుండా కష్టపడి ఆడింది. చాలా గేమ్స్‌లో అతడికే ప్రాధాన్యత ఇచ్చింది. కేవలం టాస్కులపరంగానే కాకుండా మాటలతోనూ సపోర్ట్ చేసింది. అతడి గెలుపును తన విజయంలా భావించి ఎన్నోసార్లు సంతోషించింది.చివరి ప్రాధాన్యతబిగ్బాస్ ఫినాలే స్టేజీపై కూడా కల్యాణ్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ముందుగా ప్రియ, శ్రీజకు ప్రాధాన్యం ఇచ్చాడు. చివరగా తనూజ గురించి మాట్లాడుతూ.. కల్యాణ్గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించిందే తనూజ అని ఒప్పుకుంటున్నా అని అందరిముందు చెప్పాడు. కానీ, బిగ్‌బాస్ బజ్‌లో, బయట ఇంటర్వ్యూలలో మాత్రం మాట మార్చాడు. టాప్ 2లో ఇమ్మూ..బజ్‌లో మాట్లాడుతూ.. ఫైనల్స్‌లో స్టేజీపై నా పక్కన ఇమ్మూ అన్న ఉంటాడనుకున్నాను. తనకు ఎక్కువ ఓట్లు వస్తాయనుకున్నా.. అయినా ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారన్నది మనకు తెలిదు. తను నాలా ఆలోచిస్తాడు, నాకు, ఇమ్మూ అన్నకు మధ్య బాండింగ్ బాగుంటుంది. మళ్లీ తనూజ, నాకు మధ్య ఆ బాండింగ్ లేదు అన్నాడు. మరో ఇంటర్వ్యూలో.. తనూజ గేమ్ పరంగా సపోర్ట్ ఇవ్వలేదు, ఉట్టి మాటలతోనే సపోర్ట్ చేసిందన్నాడు.బాగానే డ్రామాలు చేస్తున్నావ్..ఇది చూసిన తనూజ అభిమానులు కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తనూజ నీ పక్కన లేకపోతే స్క్రీన్‌స్పేస్ కూడా దక్కేది కాదంటున్నారు. ఫ్రెండ్స్‌ను, నాన్న(భరణి)ని పక్కనపెట్టి మరీ నీకు కెప్టెన్సీ, టికెట్ టు ఫినాలేలో సపోర్ట్ చేస్తే కనీస కృతజ్ఞత లేదంటూ తిట్టిపోస్తున్నారు. క్రెడిట్ తనూజకు ఇవ్వొద్దని శ్రీజ ఏమైనా చెప్పిందా? అందుకే ఇలా మాట మార్చేశావా? అని అడుగుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన కల్యాణ్.. వెంటనే మెట్టు దిగొచ్చాడు. టికెట్ టు ఫినాలేలో తనూజ తనకోసం ఆడిందని చెప్పాడు. అయినప్పటికీ తనూజ ఫ్యాన్స్ శాంతించలేదు. ఒక్కోదగ్గర ఒక్కో మాట మాట్లాడుతూ బాగానే డ్రామాలు చేస్తున్నావ్.. అని మండిపడుతున్నారు. -
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్‌బాస్ సీజన్-9లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, తనూజ మీద తను చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. నామినేషన్స్ ప్రక్రియ కోసం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మనీష్.. తనూజ గురించి చెప్తూ 'ముద్దు మాటలతో చెవిలో మందార పూలు పెడుతున్నారు' కొంతమంది అంటూ డైలాగ్ కొట్టాడు. దీంతో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఫైనల్ ఎపిసోడ్లో తనూజ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ మనీష్ చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని పేర్కొంది. దీంతో తాజాగా మనీష్ క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశాడు.ఎవరైనా క్వీన్‌పై దాడి చేస్తారు.. 'ప్రియమైన తనూజ పుట్టస్వామి మీ ఆట గురించి ఎక్కడ ప్రారంభించాలి, ఏమి చెప్పాలి! 105 రోజులుగా, ఇంత తెలివైన, అద్భుతమైన ఆటను బయటకు తీయడం దాదాపు అసాధ్యం. కానీ, దానిని మీరు సాధించారు. మీరు చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేరు. మీరు ఎల్లప్పుడూ ఈ సీజన్లో నా టాప్- 5 లిస్ట్‌లో ఉన్నారు. నేను కూడా కొన్నిసార్లు మీకు ఓటు వేసాను. నాకు చెస్ అంటే చాలా ఇష్టం. చెస్‌లో క్వీన్ బలమైనదిగా ఉంటుంది. అక్కడ ఆట గెలవడానికి అందరూ ముందుగా క్వీన్‌పై దాడి చేయాలి అనుకుంటారు. క్వీన్ పోతే గేమ్ కుడా పోయినట్లే. నేను తిరిగి హౌస్‌లోకి వచ్చినప్పుడు.. మీతో నా ఆట ఆడవలసి వచ్చింది. ఎందుకంటే మీరు క్వీన్ ఆపై ఈ సీజన్లో బలమైన ఆటగాళ్ళలో ఒకరు. ఇంటి లోపలే కాదు.. బయట కూడా మీరు బలంగానే ఉన్నారు.బహిరంగ క్షమాపణకానీ, మీరు ఫైనల్ వేదికపై నా మాటలకు చెడుగా భావించారని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు మైక్ దొరికితే షోలోనే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పేవాడిని. కానీ, అవకాశం రాలేదు. అయితే, నిన్ను కలిసినప్పుడు నేను మొదట చేసిన పని క్షమాపణలు చెప్పడమే..! కానీ. మరోసారి ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనమందరం చేసినదంతా ఆట కోసమే! క్షమాపణ చెప్పడం ద్వారా ఎవరూ చిన్నవారు లేదా పెద్దవారు కాలేరు. ఆరోగ్యకరమైన రేపటి కోసం హృదయపూర్వక హస్తాన్ని అందిస్తున్నట్లు అవుతుంది! ఇదే సమయంలో మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 9వ రోజు నేను ఇంట్లో చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. మీరు దానిని గ్రహించి నాతో మాట్లాడారు. ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోలేను. BB అభిమానులు చివరి వరకు గుర్తుంచుకునే ఆటను మీరు ఆడారు! ఆపై మీరు చాలా మందిని గెలుచుకున్నారు.' అంటూ తనూజతో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ మనీష్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Maryada Manish (@maryada.manish) -
బిగ్‌బాస్ బజ్: కల్యాణ్ పడాల నెక్స్ట్ టార్గెట్ అదే!
ఒక సామాస్యుడు బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచినట్లు చరిత్రలోనే లేదు. కానీ ఆ చరిత్రను తిరగరాశాడు కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ పడాల. సీఆర్పీఎఫ్ జవాన్‌గా అగ్నిపరీక్షలో అడుగుపెట్టాడు. అక్కడ తన టాలెంట్‌తో జడ్జిలను మెప్పించి తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టాడు.21 మందిని వెనక్కు నెట్టి..హౌస్‌లో టైంపాస్ చేసేసరికి ఎక్కువరోజులు ఉండడులే అని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌తో కల్యాణ్ అలర్ట్ అయి గేమ్‌పై ఫోకస్ పెట్టాడు. గేమ్ కోసం ఏదైనా చేసేవాడు. అలా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొన్న 21 మంది వెనక్కు నెట్టి బిగ్‌బాస్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లిపోయాడు.కేక్ కటింగ్బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే బజ్ ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది. తాజాగా బజ్‌లో శివాజీతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో శివాజీ మాట్లాడుతూ.. తననే తాను చెక్కుకున్న శిల్పి అని పొగిడాడు. తన గేమ్ ఛేంజ్ అవడానికి కారణం దివ్య అని గుర్తు చేశాడు. నీలో స్పిరిట్ రగిలించిందే తను అనడంతో కల్యాణ్ దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశాడు.గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాఎలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నావ్? అన్న శివాజీ ప్రశ్నకు కల్యాణ్ మాట్లాడుతూ.. స్టార్, హీరో అని కాకుండా గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాను. నాలుగు నెలల క్రితం నేనెవరికీ తెలియదు. మా ఊర్లోనే ఎవరికీ తెలీదు. అలాంటిది ఈ అవకాశం ఇచ్చి అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు. -
బిగ్‌బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ హోరాహోరీగా జరిగింది. అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరిగింది. ఇద్దరికీ భారీగా ఓట్లు పడ్డాయి. చాలా తక్కువ పర్సంటేజ్‌తో తనూజ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఓటమి తర్వాత తనూజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది.అందులో ఏం రాసిందంటే..బిగ్‌బాస్ సీజన్‌కు 9కి థాంక్స్.. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కానీ బిగ్‌బాస్ ఇంటి లోపల నేనెన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కిందపడ్డాను. తిరిగి లేచి నిల్చున్నాను. ప్రతిసారి బలంగా నిలబడ్డాను. ప్రతి టాస్కు నిజాయితీగా ఆడాను. నాకెదురైన సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే నేను నాలాగే ఉన్నాను. మీ ప్రేమే నా నిశ్శబ్ధాన్ని శక్తిగా మార్చింది. అదే అతిపెద్దక్సెస్మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్‌బాస్ హౌస్‌ను వీడానేమో కానీ.. దీనిద్వారా మీతో ఏర్పరుచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం కొనసాగిస్తాను. ఇది ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను. గుణపాఠం నేర్చుకున్నా..మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ జర్నీలో నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నాను. మీ ప్రతి ఓటు, మీ సపోర్ట్, నాకోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నాకెంతో విలువైనవి.నిజమైన ఫైటర్మీలో ఒకరిగా హౌస్‌లో అడుగుపెట్టాను. ఇప్పుడు మీ అందరినీ నా మనసులో నింపుకుని బయటకు వచ్చేశాను. బిగ్‌బాస్ 9కి ముగింపు పలుకుతున్నాను అని తనూజ (Thanuja Puattaswamy) రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు నిజమైన ఫైటర్‌వి అని కొనియాడుతున్నారు. నీ జర్నీతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేశావు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) -
లేడీ సెలబ్రిటీలు తస్మాత్ జాగ్రత్త.. మీ గతి కూడా ఇంతే!
అనుకుంటే అయిపోద్ది సామీ అంటుంటారు. అనుకోవడమే కాదు, గెలుపు కోసం అలుపెరగకుండా కష్టపడినా సరే లేడీ కంటెస్టెంట్లు విన్నర్ కాలేకపోతున్నారు. తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు ఇదే తంతు. పోనీ విన్నర్ క్వాలిటీస్ ఉన్న బలమైన కంటెస్టెంట్లు రాలేదా? అంటే అది తప్పుమాటే అవుతుంది.గీతామాధురి, శ్రీముఖి, తనూజ.. వీళ్లంతా బలంగా నిలబడ్డవాళ్లే.. గొంతెత్తి ప్రశ్నించినవాళ్లే! గెలుపు కోసం నిరంతరం శ్రమించినవాళ్లే! కానీ ఏం లాభం? విజయం వాకిటవరకు వచ్చి వెనక్కు వెళ్లిపోతున్నారు, కాదు కాదు ప్రేక్షకులే వాళ్లను కర్కశంగా వెనక్కు పంపించేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే సీజన్స్‌లో అయినా బిగ్‌బాస్ ట్రోఫీని ఒక మహిళ గెలుస్తుందా? అన్న సందేహం తలెత్తక మానదు.సింపతీకే ఓటుతెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్లో కామెడీతో నవ్వించి, టాస్కులతో అదరగొట్టి చలాకీగా, హుషారుగా కనిపించిన హరితేజ సెకండ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాతి సీజన్లో గాత్ర మాధుర్యంతో మెప్పించింది గీతామాధురి. అంతేనా.. చాలా మెచ్యూర్డ్‌గా, బ్యాలెన్స్డ్గా ఆడుతూ కౌశల్‌కు గట్టి పోటీనిచ్చింది. ప్రేక్షకులు ఆమె మాటతీరుకు మురిసిపోయారు.. కానీ ట్రోఫీ ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడలేదు. సింపతీ, సెంటిమెంట్‌తో కొట్టిన కౌశల్‌కు టైటిల్ కట్టబెట్టారు. దీంతో గీతా రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది.పోరాడినా ఫలితం దక్కలేదుమూడో సీజన్లో యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టగానే విన్నర్ నడిచొస్తుందనుకున్నారు. బిగ్‌బాస్ కోసం ఆమె చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. బయట ఎంత చలాకీగా ఉందో.. హౌస్‌లోనూ అంతే చలాకీగా ఉంది. కామెడీ చేస్తూ టాస్కులు ఆడుతూ తనవల్ల అయినంతవరకు పోరాడింది. అయినా జనాలకు ఆమెను గెలిపించబుద్ధి కాలేదు. సింగర్ రాహుల్ ట్రోఫీ గెలవగా శ్రీముఖి రన్నరప్ స్థానానికి పరిమితమైంది.ఇన్నాళ్లకు సరైన కంటెస్టెంట్!ఆ తర్వాత ట్రోఫీని గెలిచేంత బలమైన కంటెస్టెంట్లు ఎవరూ హౌస్‌కి రాలేదు. దాదాపు ఆరు సీజన్ల తర్వాత మళ్లీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అడుగుపెట్టింది. తనే తనూజ పుట్టస్వామి. అందంతో పాటు తెలివి ఆమె సొంతం. తనకు గుర్తింపునిచ్చిన తెలుగు ప్రేక్షకులకు గుండెలో గుడి కట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా వీరి వల్లే ఇక్కడున్నానని పదేపదే నొక్కి చెప్పింది. తెలుగు ప్రేక్షకులను తన సెకండ్ ఫ్యామిలీగా భావించింది.ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా..మొదటి రోజు నుంచే మాస్క్ లేకుండా తను తనలాగే ఉంది. కోపం, చిరాకు, అసహనం, బాధ, కన్నీళ్లు, అలక.. అన్నీ చూపించింది. వేటినీ దాచుకోలేదు. బంధాలకు పెద్దపీట వేసింది. అదే సమయంలో అబ్బాయిలకు ఎక్కువ చనువు ఇవ్వకుండా హద్దుల్లో పెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా పద్ధతైన సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించింది. ఏ ఆటైనా ఆడతానని ముందుకు వచ్చింది. సీజన్ విజయానికి కారకురాలుఓడినా సరే గెలిచేవరకు శ్రమించింది. డబుల్ ఫేస్ లేకుండా అద్దంలా స్వచ్ఛంగా తనేంటో చూపించింది. మాస్టర్‌మైండ్‌తో ఆటను తిప్పింది. తెలుగు బిగ్‌బాస్ 9 విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. తను లేకపోతే ఈ సీజనే లేదు అన్నంతగా ప్రభావితం చేసింది. అయినా తనను విజయం వరించలేదు. ఇది తనూజ అభిమానులకే కాదు, ఎంతోమంది నెటిజన్లకు సైతం నచ్చలేదు. సీజన్ 9ను తన భుజాలపై మోసిన తనూజకు అన్యాయం జరిగిందంటున్నారు. లేడీ సెలబ్రిటీలు జాగ్రత్తఅమ్మాయిలను విజేతగా చూడటం మన జనాలకు నచ్చదా? ఇంకేం చేస్తే వారిని గెలిపిస్తారు? అసలు ఇంతకంటే ఇంకేం చేయగలరు? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇకముందు రాబోయే లేడీ సెలబ్రిటీలను సైతం హెచ్చరిస్తున్నారు. టీఆర్పీ కోసం మిమ్మల్ని వాడుకుంటారే తప్ప ట్రోఫీ మాత్రం ఇవ్వరని.. అది దృష్టిలో పెట్టుకుని షోకి రావాలా? వద్దా? అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్తున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ (ఓటీటీ సీజన్లో బిందుమాధవి గెలిచింది) మినహా తొమ్మిది సీజన్లలో ఒక్క లేడీ విన్నర్ లేకపోవడం నిజంగా విచారకరమే! -
కల్యాణ్ పడాల విజయంలో 'లేడీ క్వీన్'
బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫైనల్లో తనూజ, కల్యాణ్‌లు చరిత్ర తిరగ రాశారు. ఫైనల్ వరకు చేరుకున్న వారిద్దరూ హౌస్‌లో మంచి బాండింగ్‌తో ఉంటూనే రేసులో ఉన్నారు. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ విజేతగా నిలవడం గొప్ప విషయమేనని చెప్పాలి. సీజన్-7లో కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్‌లు కూడా ఇలాంటి బాండింగ్‌నే కొనసాగించారు. పల్లవి ప్రశాంత్ విజయంలో శివాజీ పాత్ర ఎంత కీలకమో తెలిసిందే.. అయితే, కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా అంతే రేంజ్లో ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇదే పాయింట్‌ను కల్యాణ్ కూడా స్టేజీపైనే ఒప్పుకున్నాడు. తన గెలుపులో ఆత్మవిశ్వాసం నింపిన వారిలో ఫస్ట్ ప్రియ, సెకండ్ శ్రీజ ఉంటారని చెబుతూ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లేడీ క్వీన్ తనూజకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పడం విశేషం. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ ఇలా చెప్పాడు. ' ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా ఒకానొక సందర్భంలో కల్యాణ్ గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించింది తనూజానే.. నేను ఒప్పుకుంటా అది.." అంటూ క్లారిటీ ఇచ్చాడు.బిగ్‌బాస్ రివ్యూవర్లు కూడా చాలామంది ఇదే మాట చెప్పడం విశేషం. బిగ్‌బాస్ సీజన్-7లో కూడా ఇలాంటి మ్యాజిక్‌నే జరిగింది. పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ చాలా బలంగా నిలిచారు. తను 2వ రన్నర్‌గా నిలిచినప్పటికీ ఎలాంటి బాధను చూపలేదు. హౌస్‌లో ప్రతిచోట పల్లవి ప్రశాంత్ కోసం స్టాండ్ తీసుకుంటూ తన గెలుపు కోసం రోడ్ క్లియర్ చేశారు. ఫైనల్‌గా అమర్‌దీప్‌కు ట్రోఫీ అందుతుందని అందరూ అనుకుంటే శివాజీ గేమ్ స్ట్రాటజీ వల్ల ప్రశాంత్ సులువుగా విన్నర్ అయిపోయాడు. అయితే, ఈ సీజన్లో కూడా తనూజ వరుసగా పదివారాల పాటు టాప్‌లో ఉంది. 11వ వారం నుంచి ఒక్కసారిగా కల్యాణ్ రేసులోకి వచ్చేశాడు. అందుకు కారణం తనూజానే అని తను కూడా పలుమార్లు చెప్పాడు. తన గెలుపు కోసం తనూజ ఇచ్చిన సలహాలు చాలా వున్నాయని కల్యాణ్ ఒప్పుకోవడం విశేషం.#KalyanPadala acknowledging his Sisters- Priya SrijaMentor- ThanujaThis is who he isHe never forgets to show gratitude ❤️❣️Thanks Kalyan for proving the Haters that we supported right person#BiggBossTelugu9pic.twitter.com/lMkB9P4qO1— Jeeva S (@JeevaS4853) December 21, 2025 -
ఛీ కొట్టినవారితో చప్పట్లు.. కల్యాణ్ విజయానికి కారణాలివే!
తప్పులు చేయని మనిషంటూ ఉండడు. కానీ ఆ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు. బిగ్‌బాస్ షోలోనూ ఇదే వర్తిస్తుంది. అగ్నిపరీక్షలో కల్యాణ్ దూకుడు, అతడిలోని కసి చూసి.. ఇలాంటి కంటెస్టెంట్ కదా బిగ్‌బాస్‌కు కావాల్సింది అనుకునేలా చేశాడు. అతడి ఆట, మాట తీరు చూసి విన్నర్ మెటీరియల్ అని ముందుగానే ఫిక్సయిపోయారు.(Kalyan Padala Bigg Boss Winning Reasons)అంతా తలకిందులుకట్ చేస్తే బిగ్‌బాస్ 9కి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. పిక్నిక్కు వచ్చినట్లు ఓ మూలన కూర్చునేవాడు. ఏదో కరువులో ఉన్నట్లు అమ్మాయిలను ఓరగా చూస్తూ అదే పెద్ద పనిగా పెట్టుకున్నాడు. ఇతడు చేసిన పనులకు మూడోవారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయేవాడే! కానీ నాగార్జున చెప్పిన హింట్లను గ్రహించాడు. ఎప్పుడూ ఆడాళ్ల చేతులు రాస్తూ కూర్చోవడమేనా? అని నాగ్ గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో అలర్ట్ అయ్యాడు.రూటు మార్చాడుఅప్పటికే వరుసగా కామనర్లు ఎలిమినేట్ అవుతుండటంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఆట, మాట, తీరు అన్నీ మార్చుకున్నాడు. అగ్నిపరీక్షలో కనిపించిన కల్యాణ్‌ను తిరిగి చూపించాడు. నాలుగోవారం నుంచి విజృంభించి ఆడాడు. టాస్కులు వస్తే గెలిచేవరకు వేటాడాల్సిందే అన్నంత కసిగా ఆడాడు. అందరితోనూ కలిసిపోయాడు. మనింటి కుర్రాడే అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.జనాలకు కనెక్ట్..తనకు ఇష్టమైనవాళ్లు ఎలిమినేట్ అయినా, బాధపడుతున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వాళ్లకు ఏదైనా బాధ వచ్చిందంటే ఇతడే ఎక్కువ ఏడ్చేవాడు. అలా కల్యాణ్ స్వభావానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఎన్నో అవమానాలు పడ్డ కల్యాణ్ పడ్డచోటే లేచి నిల్చున్నాడు. ఛీ కొట్టినవారితోనే శెభాష్ అనిపించేలా చేసుకున్నాడు. తనూజతో పోటీపడేవాళ్లే లేరా? అన్న సమయంలో అందరికీ ఓ ఆశాదీపంలా కనిపించాడు.కలిసొచ్చిన ప్రచారంకల్యాణ్ కోసం సోషల్ మీడియాలో బోలెడంత సింపతీ ప్రచారం జరిగింది. సోల్జర్ అని, పేదవాడు అని రకరకాలుగా ప్రచారం చేశారు. అది అతడికి బాగా కలిసొచ్చింది. అయితే హౌస్‌లో మాత్రం అతడెప్పుడూ ఆ కార్డులు బయటకు తీసి వాడుకోవాలని చూడలేదు. కానీ బిగ్‌బాస్ మాత్రం కుదిరినప్పుడల్లా అతడు జవాన్ అని గుర్తు చేశాడు. 'జై జవాన్' అన్న నినాదం అతడి విజయంలో కీలక పాత్ర పోషించింది. -
ఇది సార్ తనూజ బ్రాండు! ఎంత సంపాదించిందంటే?
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ముఖం తనూజ పుట్టస్వామి. సీరియల్ నటిగా అందరికీ తను సుపరిచితురాలే! ఆమె హౌస్‌లో అడుగుపెట్టినప్పుడే విన్నర్ కదిలిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అరుపులు, కేకలు, ఏడుపులు చూసి ఈమేంట్రా బాబూ ఇలా ఉందని తల పట్టుకున్నారు. రానురానూ అవన్నీ తన ఎమోషన్స్ అని, తను నటించకుండా తనలాగే ఉందని జనాలు పసిగట్టారు. మనింటి అమ్మాయిఇంట్లో అమ్మలా వండిపెట్టడం, అక్కలా ఆజమాయిషీ చేయడం, చెల్లిలా అల్లరి చేయడం, అన్నింట్లో తానే ఆడతానంటూ ముందుకు రావడం, అలగడం.. ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ సెన్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడూ పద్ధతిగానే కనిపించేది. కొన్నిసార్లు మోడ్రన్ దుస్తులు వేసుకున్నా ఏరోజు కూడా గ్లామర్ షో చేయలేదు. అబ్బాయిలను హద్దుల్లో ఉంచుతుంది.ఫ్రెండ్ కోసం స్టాండ్అతి చనువుకు, లవ్ ట్రాక్‌కు ఛాన్సివ్వలేదు. అదే సమయంలో సెలబ్రిటీ అన్న గర్వం చూపించకుండా అందరితో ఇట్టే కలిసిపోయింది. స్నేహితుడిగా భావించిన కల్యాణ్ క్యారెక్టర్‌ను వక్రీకరించినప్పుడు అండగా నిలబడింది. తానే తప్పూ చేయలేదని అడ్డంగా వాదించింది. ఫ్రెండ్ రీతూని సేవ్ చేసి తనకు అండగా నిల్చుంది. ఇలా తను ఇష్టపడేవారికి తోడుగా ఉంది. తనలో ఉన్న ఓ గొప్ప లక్షణం. ఎంతటి శత్రువునైనా మిత్రువుని చేసుకుంటుంది. శత్రువు కూడా మిత్రువే!వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన మాధురి, ఆయేషా.. తనూజపై నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు. కానీ చివరకు తనూజ చేతిలో మాధురి పూర్తిగా బెండ్ అయిపోయింది. ఆయేషా ఫ్రెండ్ అయిపోయింది. భరణి నాన్నతో బంధం, మధ్యలో దివ్య రాక.. గొడవలు, దూరం.. వీటన్నింటివల్ల నలిగిపోయినా తిరిగి నిలదొక్కుకుంది.గెలిచేవరకు పోరాటంఅవసరమైనప్పుడు తనూజ అందరి సపోర్ట్ తీసుకున్న మాట వాస్తవం. కానీ హౌస్‌లో అందరూ ఏదో ఒక సందర్భంలో మిగతావారి సపోర్ట్ తీసుకున్నారు. అయితే తనూజనే ఎక్కువ హైలైట్ చేశారు.. షో మొదలైనప్పటినుంచి తనూజ చుట్టూనే గేమ్ అంతా సాగిందని బిగ్‌బాసే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆమె ఎన్నోసార్లు మైండ్ గేమ్ ఆడింది. ఇమ్మాన్యుయేల్‌తో సమానంగా ఈ సీజన్‌ను తన భుజాలపై మోసింది. చాలా టాస్కుల్లో చివరి వరకు వచ్చి ఓడిపోయేది. అయినా గెలిచేవరకు పోరాడతా అన్న కసితో ముందడుగు వేసేది. పారితోషికం ఎంత?ఎవరితో గొడవలు జరిగినా సరే.. వాళ్ల గురించి చెడుగా మాట్లాడటం.. వెనకాల గోతులు తవ్వడమనే పనులు ఏరోజూ చేయలేదు. కానీ తనపై సోషల్ మీడియాలో ఎక్కడలేని నెగెటివిటీ.. ఫలితంగా టాప్ 2లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పోరాడి ఓడినా తలెత్తుకుని సగర్వంగా బయటకు వచ్చింది. తనూజ వారానికి రూ.2.50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 వెనకేసింది.చదవండి: తెలుగు బిగ్‌బాస్‌లో చరిత్ర సృష్టించిన కల్యాణ్ -
బిగ్‌బాస్ 9 విన్నర్‌గా కల్యాణ్.. రూ.50 లక్షలు సొంతం!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ ముగిసింది. 105 రోజుల యుద్ధానికి తెర పడింది. నేడు (డిసెంబర్ 21న) జరిగిన గ్రాండ్ ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తనూజపై కామనర్ పవన్ కల్యాణ్ పడాల గెలిచాడు. బిగ్‌బాస్ షోలో అడుగుపెడ్తే చాలనుకున్న స్టేజీ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు. సామాన్యుడు తల్చుకుంటే జరనిదంటూ ఏమీ ఉండదని నిరూపించాడు. అతడి సంకల్ప బలానికి, ప్రేక్షకుల అభిమాన బలం తోడైంది. ఫలితంగా విజేతగా నిల్చాడు. సెలబ్రిటీ తనూజను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తొలిసారి తెలుగు బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు.రెమ్యునరేషన్ ఎంత?సామాన్యులందరికీ ఒకటే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసింది బిగ్‌బాస్ టీమ్. అలా అందరిలాగే కల్యాణ్‌కు సైతం ప్రతి వారానికి రూ.70,000 అందాయి. పదిహేను వారాలకుగానూ రూ.10.50 లక్షలు సంపాదించాడు. ట్రోఫీతోపాటు రూ.50 లక్షలు కూడా కైవసం చేసుకునేవాడే! కానీ, పవన్ రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకోవడంతో మిగిలిన రూ.35 లక్షలు తన సొంతం చేసుకున్నాడు. రాఫ్ టైల్స్ వారు మరో రూ.5 లక్షలు గిఫ్టిచ్చారు. అలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా సంపాదించాడు. డబ్బుతో పాటు మారుతి సుజుకికి చెందిన విక్టోరిస్ కారును సైతం తన సొంతం చేసుకున్నాడు. ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు విలువ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది. -
సూట్‌కేస్ తీసుకున్న పవన్.. మొత్తం ఎంత వెనకేశాడంటే?
బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు, కాదు తనంతట తానే తలెత్తుకుని బయటకు వచ్చాడు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచి షోలో అడుగుపెట్టినప్పుడు అసలు ఇతడికి ఎలా అవకాశమిచ్చారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తన ఎంపిక ఏదో అల్లాటప్పా కాదని పవన్ నిరూపించాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన బెస్ట్ ఇచ్చాడు. సూట్‌కేస్‌తో బయటకురెండుసార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. ఏకంగా టాప్-3లో చోటు దక్కించుకున్నాడు. తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. మీ విల్ పవర్, ఫిట్నెస్ మాత్రమే కాదు, గెలుపు కోసం చివరివరకూ పోరాడే తత్వం మిమ్మల్ని నిజమైన యోధుడిగా మార్చేశాయి. ముందు తొక్కేసి తర్వాత పొగడ్తలుకామనర్గా అడుగుపెట్టిన పవన్ యోధుడిగా మారారు. అమాయకమైన చిరునవ్వు వెనకున్న డీమాన్ ఏంటో అందరికీ చూపించారు. నామినేషన్లలో ఎంతమంది మాటలతో దాడి చేసినా, మీరు మౌనంగా నిలబడ్డారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. ఓ దశలో రీతూతో బంధం కారణంగా డీమాన్ ఆటతీరుపై చాలానే విమర్శలు వచ్చాయి. టాస్కుల బాహుబలికానీ వాటిని తట్టుకుని నిలబడ్డాడు. రీతూ ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోయిన తర్వాత డీమాన్ అసలు గేమ్ బయటపడింది. పంచ్‌లేస్తూ కామెడీ చేయడం, టాస్కుల్లో బాహుబలిలా ఆడటం, గేమ్‌పై ఫుల్ ఫోకస్ లాంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ స్పీడ్ ముందు నుంచి ఉండుంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవాడే అని కూడా మాట్లాడుకున్నారు. ఏదేమైనా సెకండ్ రన్నరప్‌గా బయటకు వచ్చాడు.సంపాదన ఎంతంటే?ఇతడి రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. కామనర్స్ అందరికీ ఒకే పారితోషికం ఇచ్చారు. అలా డీమాన్‌కి కూడా వారానికి రూ.70 వేల పారితోషికం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఓవరాల్‌గా 15 వారాలకుగానూ రూ.10.50 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూ.15 లక్షలు తోడవడంతో మొత్తం రూ.25 లక్షలకు పైగా సంపాదించాడు. మొత్తానికి పవన్‌కు ఈ షోతో డబ్బుకు డబ్బు, పేరుకు తగ్గ గుర్తింపు వచ్చింది. -
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుంటారు.. ఏదీ? రాదే? అందరికంటే ఎక్కువ కష్టపడిన ఇమ్మాన్యుయ్యేల్ను నాగార్జున సీజన్ అంతా ఆకాశానికెత్తారు. గోల్డెన్ స్టార్.. ప్రేక్షకుల సపోర్ట్ నీకే అంటూ మురిపించారు. గెలుపు గురించి ఢోకా లేదు, తడిగుడ్డ వేసుకుని పడుకో అన్నచందంగా బీబీ టీమ్ బిల్డప్ ఇచ్చింది. ట్రోఫీని ముద్దాడటమే ఆలస్యం అని గంపెడాశతో ఉన్న ఇమ్మాన్యుయేల్‌ను చివరకు నట్టేట ముంచారు. తప్పెవరిది?విన్నర్ కాదు కదా రన్నర్వి కూడా కాలేవంటూ నాలుగో స్థానంలో పడేశారు. అతడు పడ్డ కష్టానికి, వచ్చిన నాలుగో ర్యాంక్‌కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ తప్పెవరిది? బిగ్‌బాస్ టీమ్‌దా? ప్రేక్షకులదా? పోనీ ఇమ్మూ కేవలం కామెడీ మాత్రమే పంచాడా? అంటే కానే కాదు. తనకున్న తెలివితేటలు అమోఘం. నాగార్జున ఏం అడుగుతాడు? ఈ వారం జరగనుంది? అని ముందే ఊహించేవాడు. అతడు లెక్క ఎప్పుడూ తప్పవలేదు. తను ఊహించిందే జరిగింది. సంజనాను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తిసంజనా గుడ్డు దొంగతనం చేసినప్పుడు అందరూ కయ్యిమని అరుస్తూ ఆమెను నానామాటలు అంటుంటే ఇమ్మూ (Emmanuel) ఒక్కడే ఆమె గేమ్‌ప్లాన్ అర్థం చేసుకున్నాడు. తాను తిట్లుపడ్డా తప్పులేదు, కానీ ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించాలన్న ఆమె కసిని గమనించి ఫిదా అయ్యాడు. చంటిపాపను, కొడుకును వదిలేసి వచ్చిన ఆమెకు కొడుకయ్యాడు. ప్రేమను పంచాడు. ఆమె తప్పులు చేసినప్పుడు వారించాడు. కెప్టెన్సీ త్యాగంమాటలు తూలినప్పుడు హెచ్చరించాడు. నాగార్జున ముందు కూడా తప్పును తప్పే అని వాదించాడు. కానీ, తనను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేశాడు. కావాలంటే కెప్టెన్సీని మళ్లీ సంపాదిస్తానన్న ధైర్యం, అమ్మ కావాలన్న తపన.. రెండూ అతడిలో కనిపించాయి. ఎమోషనల్, తెలివితేటలు, మంచితనం, స్నేహబంధం వంటివెన్నో ఉన్నా అతడిలో కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. ఆటను చేజేతులా నాశనం చేసుకున్నాడా?మొదట నామినేషన్ అంటే భయం. ఆ భయమే తన ఓటమికి పునాది వేసింది. సీజన్ మొత్తంలో అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన ఇమ్మూ.. తన సత్తా ఏంటో చూపించాడు. టాస్కుల మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న అతడు టికెట్ టు ఫినాలేలో మాత్రం కల్యాణ్‌తో చేతులు కలిపాడు. ఇది అతడికి మరో మైనస్‌గా మారింది. సింగిల్ సింహంలా ఎన్నో గేమ్స్ ఆడి గెలిచిన ఇమ్మూ చివరికొచ్చేసరికి ఇలా మరొకరితో జోడీ కట్టి పక్కవాళ్లను ఓడించాలని చూడటం చాలామందికి నచ్చలేదు. మరోసారి రుజువైంది!కానీ ఇంతమాత్రానికే అతడిని నాలుగో స్థానంలో పెట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఇమ్మాన్యుయేల్ ఓడిపోలేదు.. అందరూ కలిసి అతడిని ఓడించారు. కమెడియన్లు ప్రాణం పెట్టి ఆడినా, కట్టే కాలేవరకు నవ్విస్తామన్నా వాళ్లను కేవలం జోకర్స్లాగే చూశారు. ఇప్పుడు అందరిలో జోకర్‌గానే నిలబెట్టారు. కమెడియన్స్ కప్పు గెలవలేరని మరోసారి రుజువు చేశారు! -
టాప్-5 నుంచి 'సంజన' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి సంజనా గల్రానీ టాప్- 5 నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రన్నర్‌గా ఆమె నిలిచారు. నటుడు శ్రీకాంత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సంజన 105 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. మొదట ఆమె టాప్-5లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే, కోడిగుడ్లు దొంగతనం చేసి నెట్టింట వైరల్ అయిపోయింది. అలా తన ఆట నెటిజన్లకు సులువుగా చేరిపోయింది. ఆ తర్వాత తల్లీకొడుకు బంధంతో ఇమ్మానుయేల్‌తో కనెక్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇమ్ము నామినేషన్‌కు రాకపోవడంతో అతని అభిమానులు కూడా సంజనకు ఓట్లు వేస్తూ కాపాడారు. దీంతో సంజన సులువుగా టాప్-5 వరకు చేరుకుంది.సంజన ఆటలో ఇమ్ము చాలా కీలకం. అయితే, ఆమె చివరి వారాల్లో మాట్లాడిన తీరు, ఆట ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. బిగ్‌బాస్‌లో ఆమె ప్రయాణం ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసిందో సంజన జర్నీ వీడియో చూస్తే అర్థం అవుతుంది. సంజనలోని ఫన్నీ, ఎమోషనల్, గొడవలు వంటి వాటిని బాగా బాగా చూపించారు.సంజన రెమ్యునరేషన్సంజన ఇప్పటికే సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. టాప్-5 ఉన్నవారందరి రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో సంజన గల్రానీ బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఆమెకు రోజుకు 40 వేల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు టాక్. అంటే ఒక వారానికి సుమారుగా రూ. 2.80 లక్షలు ఉంటుంది. అలా 15 వారాలు బిగ్ బాస్‌లో ఉన్నారు. దీంతో సుమారుగా రూ. 42 లక్షల వరకు పారితోషికాన్ని సంజన తీసుకున్నట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్‌కు తన్నుకొచ్చిన దుఃఖం
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌కు మరికొద్ది గంటల్లో శుభం కార్డు పడనుంది. ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఎంతోమంది గెస్టులు బిగ్‌బాస్ స్టేజీపైకి రానున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో మంగ్లీ, పాయల్ రాజ్‌పుత్ వంటి పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్తో అల్లాడించారు. అలాగే ఛాంపియన్, అనగనగా ఓ రాజు సినిమా హీరోహీరోయిన్లు కూడా సందడి చేశారు.బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీకాంత్హీరో శ్రీకాంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఒకర్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి టీషర్ట్‌పై అన్‌సేఫ్ అని రాస్తారో వారు ఎలిమినేట్ అయినట్లు లెక్క! ఇక్కడ అందరికంటే ఎక్కువ కల్యాణ్ భయపడ్డాడు. తాను వెళ్లిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడు. కానీ కొంత షూటింగ్ నిన్ననే అయిపోవడంతో ఫస్ట్ సంజనా ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి. రోబో ఎలిమినేట్!తర్వాత రోబోను పంపించగా ఆ రోబో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది. ప్రోమో చూస్తుంటే మాత్రం ఓపక్క టెన్షన్, మరోపక్క ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఇక ఈ సీజన్ దేశంలోనే టాప్ 1లో ఉందన్నారు నాగార్జున. బిగ్‌బాస్ 9 ట్రోఫీని చూపించేటప్పుడు మగువా మగువా.. పాట బీజీఎమ్ వేశారు. అంటే తనూజ గెలుస్తుందని ఏమైనా హింట్ ఇచ్చారా? అని నెటిజన్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఆ ప్రోమో మీరూ చూసేయండి..& -
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
అసలు సిసలైన విందు అంటే ఎలా ఉంటుంది? అన్నం, భిన్న రుచుల కూరలు, పెరుగు, ఒక స్వీటు, ఒక హాటు.. ఇలా అన్నీ కలిస్తేనే కదా ఒక ఫుల్ ప్యాకేజ్ మీల్లా ఉండేది. బిగ్‌బాస్ షో కూడా అంతే! ఇక్కడ ఏది తక్కువైనా జనాలకు ఎక్కదు. ప్రేక్షకులు కోరుకునేది గొడవలే... అలా అని కేవలం గొడవలు మాత్రమే పడతామంటే అందరికీ బీపీలు పెరిగిపోతాయి. అందరికీ నచ్చేది ఒక్కరేఓన్లీ లవ్ ట్రాక్స్ అంటే యూత్‌కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా ఎక్కదు. అందరికీ నచ్చేది.. అందర్నీ అక్కున చేర్చుకునేది ఒక్క కమెడియన్ మాత్రమే! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందర్నీ నవ్వించగలడు. ఒత్తిడి నుంచి కాసేపైనా బయటకు తీసుకురాగలడు. అందుకే టీవీలో, ఓటీటీలో బోలెడన్ని కామెడీ షోలు వస్తున్నాయి. కానీ వీటి వెనక బోలెడంత హంగామా, ప్రాక్టీస్ ఉంటుంది. బిగ్‌బాస్‌లో కామెడీ అంత ఈజీ కాదు!మరి బిగ్‌బాస్‌లో? అప్పటికప్పుడు సహజంగా నవ్వించాలి. ఎవర్నీ నొప్పించకుండా, అందర్నీ మెప్పించేలా కామెడీ పంచాలి. అవినాష్, రోహిణి, తేజ.. ఇలా పలువురూ తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్. నాలుగో స్థానం..కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్ రోహిణి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను. నువ్వే రియల్ విన్నర్అతడి విషయంలో బిగ్‌బాస్ టీమ్, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. బిగ్‌బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్టైనర్స్కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్‌కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది. బిగ్బాస్కో దండం అన్నట్లుగా చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలను జత చేసింది. -
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్‌మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్‌తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్‌గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.బిగ్‌బాస్ విజేత తనూజ అని, రన్నర్‌గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్‌గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్‌బాస్ టీమ్‌తో ఉండవు.బిగ్‌బాస్ -9 విజేతగా నిలిచిన కల్యాణ్బిగ్బాస్9 విజేతను అధికారికంగా కల్యాణ్ పడాల అంటూ హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో వికీపీడియాలో వచ్చిన అప్డేట్ పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. దీంతో వికీపీడియా కూడా కొంత సమయం తర్వాత దానిని సవరిస్తూ మరో లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో కల్యాణ్ విజేతగా పేర్కొంది. -
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
బిగ్‌బాస్ షో.. వంద రోజుల యుద్ధానికి తెర దించే సమయం ఆసన్నమైంది. ఫైనల్ ఓటింగ్స్ నిన్నటితో ముగిశాయి. ఈసారి కామనర్ గెలుస్తాడా? లేదా తనూజ గెలిచి లేడీ విన్నర్‌గా చరిత్ర సృష్టించనుందా? ఆన్లైన్ పోల్స్ ఏమని చెప్తున్నాయి? ఓటింగ్ ట్రెండ్ ఎటువైపు బలంగా ఉంది ఓసారి చూసేద్దాం..టాప్ 5 ఫైనలిస్టులుతెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మొదలైనప్పుడు విన్నర్ మెటీరియల్‌లా ఒక్కరూ కనిపించడం లేదని జనాలే అనుకున్నారు. అలాంటి సమయంలో తనూజ తన రియల్ ఎమోషన్స్ చూపిస్తూ.. కసిగా గేమ్ ఆడుతూ విన్నర్ రేసులో ముందుకొచ్చింది. కమెడియన్‌గా నవ్విస్తూనే, టాస్కుల్లో దులిపేస్తూ నేనున్నానంటూ ముందుకు దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. కామనర్‌గా వచ్చిన కల్యాణ్ గెలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అది సరిపోదుమొన్నటిదాకా రీతూతో గొడవ వల్ల కనిపించకుండా పోయిన డిమాన్ పవన్ ఫైనల్ వీక్‌లో మాత్రం తన టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. కానీ కప్పు గెలిచేందుకు ఇది సరిపోదు. గేమ్స్ అందరూ ఆడతారు.. కానీ ఆడించడం తెలిసుండాలి... స్కోప్ లేని దగ్గర కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది సంజనా. అలా ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్న ఆమె టాప్ 5లో చివరి స్థానంతోనే సరిపెట్టుకోనుంది.ఓట్లు గుద్దిపడేసిన అభిమానులుటాప్ 5లో ఉన్న ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా హౌస్‌లో కష్టపడ్డారు. వారికోసం బయట అభిమానులు కూడా బీభత్సంగానే కష్టపడ్డారు. మిస్డ్ కాల్స్, హాట్‌స్టార్‌లో ఓటింగ్‌తో దుమ్ము లేపారు. గత సీజన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వారం ప్రారంభం నుంచి శుక్రవారం వరకు కూడా సంజనా చివరి స్థానంలోనే ఉంది. పవన్‌కు పెరిగిన ఓటింగ్మూడు, నాలుగు స్థానాలు మాత్రం మారుతూ వచ్చాయి. పవన్‌లో హుషారు చూసి అతడికి ఓట్లు గుద్దిపడేశారు. దీంతో అప్పటిదాకా మూడో స్థానంలో ఉన్న ఇమ్మూ సడన్‌గా నాలుగో స్థానానికి పడిపోయాడు. కానీ వీకెండ్ వచ్చేసరికి ఇమ్మూ మళ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకినట్లు వినికిడి. అసలు సిసలైన విన్నర్ పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరుగుతోంది. వీళ్లిద్దరికీ హోరాహోరీగా ఓట్లు నమోదయ్యాయి.ఈ ఇద్దరి మధ్యే పోటీఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్పల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో తనూజకు భారీగా ఓట్లు పడగా.. తర్వాత కల్యాణ్‌కు సడన్‌గా ఓటింగ్ రేంజ్ పెరిగిందంటున్నారు. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్, మరొకరు రన్నర్‌గా నిలవనున్నారు. ప్రతి సీజన్లో విన్నర్, రన్నర్ మధ్య గొడవలు జరిగాయి. కానీ, ఈ సీజన్లో మాత్రమే ఇద్దరూ కలిసికట్టుగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉన్నారు. వైరం పెట్టుకోకుండా ముందుకు సాగారు.తనూజపై అక్కసువాళ్లిద్దరూ బాగానే ఉన్నా.. వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు. ఇక ఆడవారికి ఆడవాళ్లే శత్రువు అన్నట్లు తనూజపై చివరి వారంలో కొందరు సెలబ్రిటీలు విషం కక్కారు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా పోల్స్‌లో కల్యాణ్ గెలిచే ఆస్కారం ఉందంటున్నారు. కొన్ని పోల్స్ మాత్రమే తనూజ గెలుపు తథ్యమని చెప్తున్నాయి. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు!ఓటింగ్‌లో కూడా కల్యాణ్ బుల్లెట్ స్పీడ్‌లో దూసుకెళ్లాడని టాక్! మరి ఇదే నిజమై కల్యాణ్ కప్పు గెలుస్తాడా? లేదా తనూజ కోరుకున్నట్లుగా టైటిల్ ఆమె వశమవుతుందా? అనేది రేపటి గ్రాండ్ ఫినాలేలో చూడాలి! ఇది బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. కొన్నిసార్లు లెక్కలు తారుమారు కూడా అవొచ్చు! -
కల్యాణ్ పడాల తలకు కట్టు... అతడికేమైంది?
బిగ్‌బాస్ హౌస్‌లో ఫైనలిస్టులు ఐదుగురు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు వారిని పలకరించేందుకు దాదాపు ఐదారుగురు సెలబ్రిటీలు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శివాజీ, లయ, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ మొదటగా వచ్చారు. బుల్లితెర యాంకర్స్తర్వాత రాజాసాబ్ కోసం నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బుల్లితెరను ఏలుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు, క్వీన్ శ్రీముఖి అడుగుపెట్టారు. ఈ మేరకు వరుస ప్రోమోలు వదులుతున్నాడు బిగ్‌బాస్. బీబీ జోడీ రెండో సీజన్ మొదలు కాబోతోంది.. ఈ సీజన్ నుంచి కూడా జంటలు రావాలని కోరుకుంటున్నా అని ప్రదీప్ అనగానే కల్యాణ్.. వస్తాం అన్నా అంటూ సంతోషంగా ఆన్సరిచ్చాడు. ఎలాగో ఈ షోలో పవన్-రీతూ జంటగా కనిపించడం ఫిక్స్! కల్యాణ్ తలకు కట్టుమరి తనూజ- కల్యాణ్ కూడా జోడీగా వస్తారా? లేదా? అనేది చూడాలి! ఇక శ్రీముఖి వచ్చినప్పుడు ఇమ్మూ చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. పుష్ప స్కిట్లో భాగంగా కల్యాణ్.. తనూజను గిల్లేశాడు. ఈ ప్రోమోలో కల్యాణ్ తలకు కట్టుతో కనిపించాడు. అయితే అతడికి పెద్ద గాయం ఏమీ అవలేదు. నిధి వచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించింది. అప్పుడు కల్యాణ్ తలకు చిన్న దెబ్బ తగలడంతో కట్టు కట్టారు. కాబట్టి అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదు. -
'బ్లాక్ అండ్ వైట్ బోర్'.. మరో లగ్జరీ కారు కొన్న లవ్ బర్డ్స్
బిగ్‌బాస్ 7 ఫేమ్ శుభ శ్రీ రాయగురు కాబోయే భర్తతో కలిసి షికార్లు తిరుగుతోంది. ఈ ఏడాది జూన్‌లో మనోభావాలు పాప.. నిర్మాత, నటుడు అజయ్ మైసూర్‌ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. వీరిద్దరూ మేజెస్టీ సాంగ్‌లో జంటగా నటించారు. ఆ పాటతోనే ప్రేమలో పడి జంటగా కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం ఇంకా చెప్పనేలేదు.లగ్జరీ కారు కొనుగోలుఅయితే కొన్ని వారాల క్రితమే ప్రియుడి కోసం ఆస్ట్రేలియా చెక్కేసిందీ బ్యూటీ. అక్కడ కాబోయే భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ కొత్త కారు కొన్నారు. ఇప్పటికే అజయ్ దగ్గర 20కి పైగా కార్లున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా మరో లగ్జరీ కారు చేరింది. అదే మెర్సిడిస్ బెంజ్ AMG45S స్పెషల్ ఎడిషన్. ఇకనైనా మారండిఈ మోడల్ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా అందులో ఒకదాన్ని అజయ్ జంట సొంతం చేసుకుంది. అదే విషయాన్ని అజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ.. ఇకనైనా బోర్ కొట్టే బ్లాక్ అండ్ వైట్ కార్లకు స్వస్తి పలికి కలర్‌ఫుల్ కార్లను కొనుగోలు చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. వీళ్లు కొన్న కారు గ్రీన్ కలర్లో ఉంది. దీని ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు. కాగా అజయ్.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10th క్లాస్ డైరీస్, హ్యాంగ్‌మ్యాన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రైవేట్ సాంగ్స్, పలు షార్ట్ ఫిలింస్‌లో నటించాడు. View this post on Instagram A post shared by Ajay Mysore (@ajay_mysore__) -
బిగ్‌బాస్ 9కి ప్రాణం పోసింది.. సంజనా రియల్ గేమర్!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌పై ఎటువంటి బజ్ లేనప్పుడు షోకి ప్రాణం పోసింది సంజన గల్రానీ. గప్‌చుప్‌గా గుడ్డు దొంగతనం చేసి అందదరూ గొడవపడేలా చేసింది. ఒక్కక్కరి నిజస్వరూపాలు బయటపడేలా చేసింది. తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఫినాలేలో అడుగుపెట్టింది. అన్నింటికీ ధైర్యంగా నిలబడే సంజనా.. గార్డెన్ ఏరియాలో కొడుకు ఫోటోను చూడగానే ఏడ్చేసింది. కన్నీళ్లు పెట్టుకున్న సంజనాఅరగంటలో వస్తానని అబద్ధం చెప్పి బిగ్‌బాస్ హౌస్‌లో 100 రోజులు ఉన్నానని సారీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు మరో జీవితాన్నిచ్చిన బిగ్‌బాస్‌ను గాడ్ ఫాదర్‌గా అభివర్ణించింది. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. దాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మీ ధైర్యమే..సీజన్ 9 మొదటి కెప్టెన్‌గా నిలిచి ఆరంభం నుంచి ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి వారం నుంచి 15వ వారం వరకు ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి అనేలా ఆడారు. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు(ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. ఇంట్లో అందరికీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. మీ ప్రతి ఎమోషన్ ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకు చూపాలన్న మీ నిర్ణయం, ధైర్యం వారిని మీకు మరింత చేరువ చేసింది. ఎవరికీ అర్థం కాని గేమర్అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? ఎవరి గుర్తింపు వారి చేతుల్లోనే ఉందని బలంగా నమ్మారు. టాస్కులో పోటీపడ్డా, సంచాలక్‌గా ఉన్నా, వంటగదిలో ఉన్నా, బెడ్ రూమ్‌లో కబుర్లు చెప్తున్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. సంజనా సైలైన్సర్గా, సంజూ బాబాగా, మమ్మీగా ఎవరికీ అర్థం కాని గేమర్గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించారు. మొండిధైర్యం మీ సొంతంఆటలో మిగతావారు మీకన్నా బలంగా ఉన్నా, వారికి మిగతావారి మద్దతు ఉన్నా మీరెప్పుడూ అధైర్యపడలేదు. ఎవరి మీద ఆధారపడి ఆడటానికి ఈ ఇంట్లోకి రాలేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్నిక్కడి వరకు తీసుకొచ్చింది. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. అదే మీ కన్నీళ్లకు కారణంమీ దూకుడు మనస్తత్వం, మీ కత్తుల్లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అప్పుడు మీ మనసుకు దగ్గరైనవారితో అభిప్రాయభేదాలు వచ్చాయి. అది మీ మనసును ఎంతో బాధపెట్టింది. మీ కన్నీటికి కారణమైంది. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒకరోజు మీ బాబు, ఐదు నెలల పాప చూసి ఎంతో గర్వపడతారు అని పొగిడాడు. తర్వాత జర్నీ వీడియో చూపించగా సంజనా ఉప్పొంగిపోయింది. అందులో తన అల్లరి, ప్రాంక్స్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లిరావడం.. గొడవలు.. ఇలా అన్నీ చూపించారు. -
సల్మాన్ ఒక్క ఎపిసోడ్‌కు అందుకునేది.. నాగ్‌కు మొత్తం సీజన్‌కు అందుతుంది..
నాటకీయ నామినేషన్ల నుంచి ఊహించని ఎలిమినేషన్ల వరకు, బిగ్ బాస్ అనే రియాల్టీ షో వీక్షకుల్లో ఎల్లప్పుడూ కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఆదరణను కాపాడుకుంటూ వస్తోంది. ఈ షో విజయానికి దాని కాన్సెప్ట్‌తో పాటు దాని హోస్ట్‌లు కూడా ప్రధాన కారణమే అనేది నిస్సందేహం. ఆధిపత్యం చెలాయించే ప్రవర్తనతో సల్మాన్ ఖాన్ కావచ్చు, సహజసిద్ధమైన కూల్ అట్రాక్షన్‌తో నాగార్జున కావచ్చు, పెద్దరికపు ఆప్యాయత కనబరిచే మోహన్‌లాల్ కావచ్చు...దేశంలో పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షోకు తమదైన ప్రత్యేకతను తీసుకువచ్చారనేది వాస్తవం. అయితే ఆ పెద్ద ఇల్లును అంత బాధ్యతగా నిర్వహిస్తున్న, ఈ సెలబ్రిటీ హోస్ట్ లు తాజా సీజన్లో అందుకున్న పారితోషికం వివరాలు చూద్దామా?సహజంగానే అత్యంత భారీ స్థాయిలో వీక్షకులు ఉంటారు కాబట్టి బిగ్ బాస్ హిందీ వెర్షన్ హోస్ట్‌గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అందరిలోనూ ముందున్నారు. సుమారు 15 వారాంతాల్లో హోస్ట్‌గా ఆయన వ్యవహరిస్తారు. మొత్తం 13 సీజన్ల పైగా ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సల్మాన్ ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేశారని వార్తలు వచ్చినప్పటికీ సల్మాన్ దాన్ని కొట్టిపారేశారు. అందుతున్న నివేదికల ప్రకారం, సల్మాన్ ప్రారంభంలో వారానికి సుమారు రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నారు, ఆ తర్వాత దానిని ఎపిసోడ్‌కు రూ. 25 కోట్లకు పెంచారు. తాజా సీజన్ బిగ్ బాస్ 16 కోసం ప్రతి ఎపిసోడ్‌కు రూ. 43 కోట్లకు చేరినట్లు సమాచారం. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ తమిళ బిగ్‌బాస్ రియాలిటీ టీవీ షో 7వ సీజన్‌కు తీసుకున్న పారితోషికం రూ. 130 కోట్లు అని సమాచారం. అయితే, గత రెండు సీజన్లకు హోస్ట్‌గా విజయ్ సేతుపతి కొనసాగుతున్నారు. తను కూడా సుమారుగా రూ. 50 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.హిందీ వెర్షన్ విజయం తర్వాత, బిగ్ బాస్ కన్నడ వెర్షన్ 2013లో ప్రారంభమైంది. కన్నడ షో మొత్తం 11 సీజన్లకు కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ సంజీవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత 2015లో కలర్స్ ఛానెల్‌తో అతను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఐదేళ్లకు గాను ప్రారంభంలో రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అభిమానులు అతని పారితోషికాన్ని సల్మాన్‌తో పోల్చడం ప్రారంభించారు. ఇటీవలి సీజన్‌కు అతని పారితోషికం బాగా పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.దక్షిణాన కేరళలో, మోహన్‌లాల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ... దాని నాటకీయ ఎలిమినేషన్లు షాకింగ్ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దీని విజయంలో మోహన్‌లాల్ హోస్టింగ్ నైపుణ్యం ప్రధాన ఆకర్షణగా ఉంది, ఈ మలయాళ వెర్షన్ 2018లో ప్రారంభమై వేగంగా ప్రజాదరణ పొందింది. సీనియర్ నటుడు మోహన్‌లాల్ మొదటి సీజన్‌కు రూ. 12 కోట్లు, ఆయన తాజా సీజన్‌కు సుమారు రూ. 24 కోట్లు అందుకున్నారని అంచనా.తెలుగు వారి అభిమాన హీరో అక్కినేని నాగార్జున వరుసగా బిగ్‌బాస్ ఆరవ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. నివేదికల ప్రకారం, ఆయన తొలిదశలోప్రతి ఎపిసోడ్‌కు రూ. 12 లక్షలు చొప్పున మొత్తం సీజన్‌కు రూ. 12 కోట్లను అందుకున్నారు.అయితే తాజా సీజన్‌కు ముందు ఆయనకు రూ. 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే, తాజా సీజన్ కోసం ఆయన తన ఫీజును అమాంతం 30 కోట్ల రూపాయలకు పెంచినట్లు సమాచారం. ఫరెవర్ కూల్‌గా, అదే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తూ హౌస్‌లోని వారిని సమన్వయం చేయడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ నాగ్ విజయవంతం అవడంతో... ఈ షో పాప్యులారిటీకి ఆయన కీలకంగా మారారు. -
విన్నర్ రేంజ్ ఎలివేషన్...మీసం మెలేసిన కల్యాణ్
బిగ్‌బాస్ షోలో హౌస్మేట్స్ ఫైనల్ వీక్‌ను సరదాగా గడిపేస్తున్నారు. కాఫీ పంపిస్తే డిమాన్ పవన్‌కు చీర కట్టి అందంగా రెడీ చేసి డ్యాన్స్ వేయిస్తాం అన్నారు. అన్నట్లుగానే పవన్‌ను అమ్మాయిగా ముస్తాబు చేసి ఓ ఆటాడుకున్నారు. తర్వాత కల్యాణ్ జర్నీ వీడియో ప్లే చేశారు. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..ఆడవేషం కట్టిన పవన్ఆడవేషంలో ఉన్న పవన్ డ్యాన్స్‌తో ఎపిసోడ్ ఉత్సాహంగా మొదలైంది. వీళ్ల జోష్ చూసిన బిగ్‌బాస్ కాఫీ పౌడర్‌తో పాటు ఏకంగా మటన్ పంపించాడు. తర్వాత కల్యాణ్ గార్డెన్ ఏరియాలో తన కటౌట్ చూసుకుని మురిసిపోయాడు. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ.. కానీ, జీరోగా ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్నిపరీక్షను దాటి సొంతం చేసుకున్నారు.ఓనర్‌గా మొదలై...ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్నిచ్చారు. ఓనర్‌గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం.. మొదట్లో సులువుగా అనిపించినా పోనుపోను ఎన్నో కఠినమైన పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితేకానీ, మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తే కానీ.. ముందుకు కదల్లేని పరిస్థితిలో ఒకరి స్నేహం మీకు బాసటగా నిలిచింది.కుంగదీసినా తేరుకున్నారుమీ తప్పొప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. ధైర్యాన్ని నింపింది. వారికోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. మీతో ప్రయాణం మొదలుపెట్టినవారందరూ ఒక్కొక్కరిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు. తప్పులను సరిచేసుకున్నారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు. గుండె బలంతో..బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించినది గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్‌గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలోని యోధుడిని నిద్ర లేపింది. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ చివరి కెప్టెన్‌గా నిలిచారు.ఎంతోమందికి దిక్సూచిలా..అంతేక కాక ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచి ఒక కామనర్ తల్చుకుంటే ఏం చేయగలడో ప్రపంచానికి తెలిసేలా చేశారు. లక్ష్మణ్ రావు- లక్ష్మీల కొడుకు కల్యాణ్ అనే మాట ఇప్పటివరకు! కానీ వీళ్లు కల్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలర్ ఎగరేసే గర్వాన్ని అందించారు. గొప్ప కలలు కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్‌కు దిక్సూచిలా నిలిచి, స్ఫూర్తినిచ్చిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో చూపించాడు. అది చూసిన కల్యాణ్ ఆనందంతో మీసం మెలేశాడు. అయితే తనూజ జర్నీ వీడియోలో హైప్ ఇచ్చే మూమెంట్ ఒక్కటి కూడా లేదు.. కానీ కల్యాణ్ వీడియో మొత్తం హైప్‌తో నిండిపోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
నా భార్య 4 రోజులు తినకుండా ఏడ్చింది: సుమన్
బిగ్‌బాస్ హౌస్‌లో సుమన్‌ను ఇష్టపడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల దగ్గర నుంచి హౌస్మేట్స్ వరకు అందరికీ అతడంటే ఇష్టమే! తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నవ్విస్తాడు. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే అతడి వైఖరికి అందరూ ఫిదా అవుతారు. కాకపోతే ఆటలో పెద్దగా సత్తా చూపించకపోయేసరికి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఫ్యామిలీ వీక్‌లో సుమన్ కోసం అతడి భార్య ఇంట్లోకి వచ్చింది. వచ్చీరావడమే తనూజకు దూరంగా ఉండమని చెప్పింది. మాట మార్చేసిన సుమన్ఇది ఎపిసోడ్‌లోనూ టెలికాస్ట్ అయింది. కానీ, ఇప్పుడేమో తన భార్య అలా అనలేదని మాట మార్చేశాడు సుమన్. తనూజకు దూరంగా ఉండమని మీ భార్య ఎందుకు చెప్పింది? అని ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు సుమన్ స్పందిస్తూ.. దూరంగా ఉండమని చెప్పలేదు. తనూజవాళ్లు బాగా ఆడుతున్నారు. మీరింకా బాగా ఆడండి అని చెప్పిందంతే! అంతే తప్ప జాగ్రత్త అని చెప్పలేదు. 4 రోజులు ఏడుస్తూనే..మీరు బాగా ఆడుతున్నారు, ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి వాళ్లలా ఆడమని నా భార్య సలహా ఇచ్చింది. అది బయటకు తప్పుగా వెళ్లింది. దానివల్ల ఆమె నాలుగురోజులపాటు తినకుండా ఏడుస్తూ కూర్చుంది. నేను తప్పుగా ఏం చెప్పాను? అని చాలా బాధపడింది అన్నాడు. ఈ కామెంట్స్ విన్న జనాలు.. ఎపిసోడ్లో అందరం చూశాం.. ఎందుకు కవర్ చేయాలని చూస్తున్నావ్? ఆమెది ఏ తప్పూ లేకపోతే ఎందుకు ఏడవడం? అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: పిల్లాడికి అబద్ధం చెప్పి బిగ్‌బాస్‌కు.. ఏడ్చేసిన సంజనా -
గేమ్ నీ చేతుల్లోకి తీసుకున్నావ్.. డ్రామా క్వీన్!
పెళ్లి చేసుకునే వయసొచ్చినా సరే అమ్మానాన్నను వదిలేసి ఉండాలంటేనే ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. కానీ సంజనా మాత్రం గుండె రాయి చేసుకుని పిల్లాడిని, చంటిబిడ్డను వదిలేసి వచ్చింది. తన గుండె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాల్సిందే! ఏ రోజు కూడా పిల్లల పేర్లు ఎత్తి సింపతీ కోసం ప్రయత్నించలేదు. ఈ విషయంలో ఆమెను కచ్చితంగా ప్రశంసించాల్సిందే! నేడు ఆమె జర్నీ వీడియో చూపించనున్నాడు బిగ్‌బాస్. అరగంటలో వస్తానని..ఈ మేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో సంజనా.. తన కొడుకు ఫోటో చూసి ఏడ్చేసింది. మమ్మీ ఇంట్లో లేనందుకు సారీ.. అరగంటలో వస్తానని చెప్పి 100 రోజులైనా ఇంటికి రాలేదు.. సారీ అని కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన ప్రయాణంలో.. మీలో ఉన్నంత డ్రామా ఉంది. సీజన్ 9 మొదటి కెప్టెన్‌గా గెలిచి ప్రారంభం నుంచే ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు.తనకంటూ ఓ మార్క్ఇంట్లో ఏది జరిగినా అది మీవల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు (ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? టాస్కుల్లో మీరు పోటీపడినా.. సంచాలకులుగా ఉన్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు.మొండిధైర్యంఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని చూసి ఏదో ఒకరోజు మీ బాబు ఎంతో గర్వపడతాడు అని చెప్పాడు. సీజన్‌పై ఆసక్తి క్రియేట్ చేసిందే సంజనా మరి! తనకు ఆ మాత్రం ఎలివేషన్ ఇవ్వాల్సిందే! -
ఒక కామనర్ తలుచుకుంటే.. కల్యాణ్‌పై 'బిగ్‌బాస్' ప్రశంసలు
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరనేది ఈ ఆదివారం ఎపిసోడ్‌తో తేలనుంది. అయితే, టాప్-5 కంటెస్టెంట్స్‌కు సంబంధించిన జర్నీ వీడియోలను బిగ్‌బాస్ చూపుతున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ, పవన్‌ల బిగ్‌బాస్ ప్రయాణాన్ని చూపించారు. అయితే, శుక్రవారం ఎపిసోడ్స్‌లో కల్యాణ్ పడాల, సంజనల జర్నీ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.బిగ్‌బాస్‌లో ఒక సామాన్యుడిలా కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే పాయింట్‌తో బిగ్‌బాస్ ఎలివేషన్ ఇచ్చారు. ఆటలో తనకు ఎదురైన కష్టాలను మరోసారి గుర్తుచేశాడు. గెలవాలనే కసితో ఒక్కోవారం పోరాడుతూ కెప్టెన్‌గా రెండుసార్లు నిలిచాడు.. ఆపై ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. తన బుద్ధి బలానికి కండ బలం తోడు కావడంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే గెలుపు వైపు అడుగులు వేశాడు. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో బిగ్‌బాస్ షోతో కల్యాణ్ ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాడంటూ.. బిగ్‌బాస్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. -
'పోతారు.. మొత్తం పోతారు' ఇక పవన్‌ను ఆపడం కష్టమే!
డిమాన్ పవన్‌ను అగ్నిపరీక్షలో చూసినవారంతా ఇతడు బిగ్‌బాస్‌కు సెలక్ట్ కాకపోయినా ఏం పర్లేదనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్లో అడుగుపెట్టాడు. అసలు ఇతడేం చేస్తాడనుకునేవారికి తన కండబలం, బుద్ధిబలం కలగలిపిన వీరుడినని నిరూపించాడు. వరుసగా రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. అయితే రీతూతో లవ్ ట్రాక్ వల్ల కాస్త నెగెటివ్ అయ్యాడు. ఓటింగ్‌లో దుమ్ము రేపుతున్న పవన్ఎప్పుడూ గొడవపడటం, కలిసిపోవడం.. ఇదంతా చూసేవారికి చాలా చిరాకు పుట్టించింది. కానీ రీతూ ఎలిమినేట్ అయిన వెంటనే తనలో మరో యాంగిల్ చూపించాడు. పంచ్‌లు వేస్తూ కామెడీ చేస్తున్నాడు. టాస్కుల్లో బాహుబలిలా ఆడుతున్నాడు. ఫైనల్లో నాలుగో స్థానంలో ఉంటాడనుకున్న పవన్ ఇప్పుడేకంగా ఓటింగ్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ ఫైర్ ముందు నుంచి ఉండుంటే ఏకంగా విన్నర్ అయ్యేవాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బిగ్‌బాస్ అతడి గురించి ఏమన్నాడో చూద్దాం..నిజమైన యోధుడివి"మీ విల్‌పవర్, ఫిట్నెస్.. మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో.. అలాగే ఒక బలమైన పోరాటానికి ఎంత అవసరమనేది మీ ప్రయాణామే నిరూపిస్తోంది. ఎవరితో తలపడ్డా, ఏ పోటీలో నిలబడ్డా.. గెలుపు గురించి మాత్రమే తపించే తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. కామనర్‌గా అడుగుపెట్టిన ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు వెనక ఉన్న డిమాన్ చేసే విధ్వంసం ఏంటో వాళ్లు దగ్గరుండి చూశారు. నామినేషన్లో మీపై ఎంతమంది మాటలతో దాడి చేసినా మీరు మౌనంగానే నిల్చున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు. చెమటోడ్చి గెలిచారుఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకున్నవాడు తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడని మీకు తెలుసు. పవన్ మీరెవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. మాటల కన్నా చేతలు బలమైనవని నమ్మిన మీరు మీ చేతుల్లోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయం వైపు నడవడానికే ఉపయోగించి సఫలమయ్యారు. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. ప్రతి ఒక్కటి మీరు మీ చెమటోడ్చి చివరి వరకు పోరాడి గెలిచినదే! మనసు మాత్రం..మీకోసం ఎవరూ నిలబడకపోయినా మీకోసం మీరు వన్ మ్యాన్ ఆర్మీలా నిలబడ్డారు. అయితే మీ మనసు మాత్రం మీకోసం తపించే మరొకరి (రీతూ) వెంట చక్కర్లు కొట్టింది. ఈ ఇంట్లో మీ గెలుపును పంచుకోవడానికి, ఓటమి నుంచి బయటకు రావడానికి ఆ బంధం తోడ్పడింది. మీలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకే గాక, మీక్కూడా పరిచయం చేసింది. కానీ, టాస్కుల్లో అయినా, తన మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒక్కటే అనే మాట మీ ప్రయాణాన్ని బరువుగా మార్చింది. మిమ్మల్ని అమాంతం మోకాళ్లపై కూర్చోబెట్టింది.పట్టువదలని పవన్ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాక్కూడా తెలుసు. కానీ, తన కోరిక కూడా మీ గెలుపే అనే విషయం మీలోని యోధుడిని తట్టిలేపింది. కర్తవ్యం వైపు నడిపించింది. సంచాలకుల తప్పు వల్ల కెప్టెన్సీ కోల్పోయినా రెట్టింపు ఉత్సాహంతో దాన్ని తిరిగి సంపాదించిన పట్టువదలని పవన్ సత్తాను మరోసారి అందరికీ గుర్తు చేశారు. పోతారు.. మొత్తం పోతారుస్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ కామనర్‌గా మదలై టఫెస్ట్ కాంపిటీటర్‌గా తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోదుడిగా టాప్ 5లో ఒకరిగా నిలిచారు" అని చెప్పాడు. అయితే మీ మనసంతా రీతూనే అని చెప్తుంటే పవన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. జర్నీ వీడియో అంతా కూడా రీతూతో కలిసున్న క్షణాలే ఉన్నాయి. తను ఎదుర్కొన్న అవమానాలు, ఆడిన ఆటలు, అమ్మ వచ్చిన జ్ఞాపకాలను చూసి ఎమోషనలయ్యాడు. చివర్లో 'పోతారు.. మొత్తం పోతారు' అనే నాని డైలాగ్‌తో పవన్ రేంజ్ పెంచేశాడు బిగ్‌బాస్.చదవండి: సీజన్ అంతా మీ చుట్టూనే.. తనూజపై బిగ్‌బాస్ ప్రశంసలు -
సీజన్ అంతా తనూజ చుట్టూనే.. బిగ్‌బాసే ఒప్పుకున్నాడు!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. టాప్ 5లో చోటు కోసం అలుపెరగని పోరాటం చేసిన హౌస్మేట్స్ దిల్ ఖుష్ చేసేందుకు జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఏవీ అయిపోయింది. తనూజ, పవన్ జర్నీ వీడియోలను ప్లే చేస్తూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ విశేషాలను గురువారం (డిసెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...నటనపై ప్రశంసలుముందుగా తనూజ టాలెంట్‌ను వర్ణించాడు బిగ్‌బాస్. తెరపై మీ నటన, మీరు పలికించిన భావాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. మిమ్మల్ని వారింట్లో కూతురిగా మార్చారు. గొప్ప నటిగా పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ, బిగ్‌బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు.. మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని టాప్ 5లో నిల్చుని మీరెంత చిచ్చరపిడుగో నిరూపించారు.గేమ్ అంతా మీ చుట్టూనే..నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం.. అందరితో కలిసి అల్లరిచేసే విధానం మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయినవారు లేదా కలబడ్డవారు. భావోద్వేగాల గని మీరు. మనుషుల్ని మీవైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. నిందలతో నొచ్చుకున్న మనసుఈ రణరంగంలో ఎంతమంది బలమైన, తెలివైన యోధులున్నా ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. వంటగది నుంచే ఇంటిని గెలిచినతీరు ఆటలో ఎంత బలమైనవారో స్పష్టం చేస్తుంది. రీల్, రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. కేవలం బంధాల పునాదులపై ఆటాడుతారని, అందరి మద్దతు కోసం పాకులాడతారని నిందించినప్పుడు మీ మనసెంతగానో నొచ్చుకుంది. అది మీ వ్యక్తిత్వంబంధాలకు అతీతులెవరూ లేరని మీకనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనసును రాయి చేసుకుని అవసరమైనప్పుడు అది పక్కనపెట్టి ఆట ముందుకు తీసుకెళ్లారు. చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం.. కదనరంగంలో విరుచుకుపడే శివంగిలాంటి ధీరత్వం.. కత్తికి రెండువైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. జర్నీ వీడియోమిగతా వారి ఆట టాస్కులో మాత్రమే బయటకు వస్తే మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో, ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబసభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనూజను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఎన్నో భావాలతో, బంధాలతో నిండిన మీ ప్రయాణం ఓసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో ప్లే చేశారు.షాకైన తనూజఅందులో భరణితో నాన్న బంధాన్ని చూపించారు. అలాగే కల్యాణ్‌తో స్నేహాన్ని లవ్‌ట్రాక్ అన్న లెవల్లో చూపించారు. ఇదంతా చూశాక తనూజ సంతోషం పట్టలేకపోయింది. ఇదంతా ఒక కలలా ఉంది. ఎక్కడో పుట్టిపెరిగిన నన్ను ఇక్కడ నిలబడేలా చేసిన నా ఆడియన్స్‌కు థాంక్యూ అంటూ స్టేజీని ముద్దాడింది. కల్యాణ్‌తో.. వీడియో మొత్తం మనిద్దరిదే ఉందిరా, షాకైపోయానంది. అది తాను ముందే ఊహించానన్నాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత పవన్ జర్నీ వీడియో ప్లే చేశారు. -
#Demonpavan: పోరాడి గెల్చావ్.. అసలైన యోధుడివి
బిగ్‌బాస్ ఫైనల్ వీక్ అంతా పిక్నిక్ హాలీడేలా సాగిపోతుంది. ఫైనలిస్టుల జర్నీ వీడియోలతో కాస్త ఎమోషనల్గానూ ఉంటుంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్లో ఇమ్మాన్యుయేల్ జర్నీ చూపించారు. నేడు తనూజ, పవన్ జర్నీ చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా పవన్ కోసం ఓ ప్రోమో వదిలారు.యోధుడిగా నిలబడ్డావ్'మీరు ఎవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం.. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. చెమటోడ్చి, చివరి వరకు పోరాడి గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటీటర్‌గా, తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా టాప్ 5లో నిలబడ్డారు' అని పొగిడాడు. సీజన్ అంతా తిట్టు పడ్డ పవన్.. ఎట్టకేలకు బిగ్‌బాస్ నోటితో పొగడ్తలు అందుకుని శెభాష్ అనిపించాడు. అతడి ఫుల్ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
చిచ్చర పిడుగు తనూజ.. భారీ ఎలివేషన్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ తెలుగు 9 సోషల్‌మీడియాలో ట్రెండిగ్ టాపిక్.. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యుయేల్, పవన్, సంజనలు ఉన్నారు. ఈ క్రమంలో వారి జర్నీ వీడియోలను బిగ్‌బాస్ చూపిస్తున్నారు. ముందుగా ఇమ్మన్యుయేల్ ప్రయాణాన్ని చూపించిన బిగ్‌బాస్.. గురువారం ఎపిసోడ్లో తనూజ గురించి జర్నీ ఉంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్ టీమ్ వదిలింది.బిగ్‌బాస్‌లో తన జర్నీ చూసుకున్న తనూజ చాలా ఎమోషనల్ అయిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో తనూజ కన్నీళ్లు పెట్టుకున్నా, నవ్వినా సరే నటిస్తుంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే, అలాంటి విమర్శలు చేసినవారికి సమాధానంగా బిగ్‌బాస్ ప్రోమో ఉంది. బిగ్‌బాస్ ఇల్లు నటనకు ఎలాంటి ఆస్కారం లేని చోటు అంటూ క్లారిటీ ఇచ్చారు. కత్తికి రెండువైపులా పదునైన వ్యక్తిత్వంతో హౌస్‌లో కొనసాగారంటూ పేర్కొన్నారు.. క్లిష్టపరిస్థితిలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొని చిచ్చరపిడుగులా టాప్-5లో చేరారని భారీ ఎలివేషన్ ఇచ్చారు. -
ఇమ్మూని ఆకాశానికెత్తిన బిగ్‌బాస్.. ఇది కదా జర్నీ అంటే!
కొన్ని ఫుడ్ ట్రీట్స్, ఇంటినుంచి సర్ప్రైజ్లు అందుకునేందుకు బిగ్‌బాస్ సరదా గేమ్స్ పెడుతూ వస్తున్నాడు. ఇందులో గెలిచిన పవన్‌కు ఇంటినుంచి వీడియో సందేశం రాగా తనూజకు ఫ్యామిలీ ఫోటో అందింది. మరి ఈసారి ఆ సర్ప్రైజ్ ఎవరు గెల్చుకున్నారో బుధవారం (డిసెంబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాకు వీడియో మెసేజ్బాల్స్ విసిరే గేమ్‌లో కల్యాణ్ గెలిచి ఒక స్టార్తోపాటు స్వీట్ పొందాడు. ప్లేయర్ ఆఫ్ దిడేగా సంజనాను ఎంపిక చేయడంతో తన చెల్లెలు, హీరోయిన్ నిక్కీ గల్రానీ వీడియో మెసేజ్ ప్లే చేశారు. ఇక ఇమ్మాన్యుయ్యేల్ జ్యోతిష్యుడిగా మారి హౌస్మేట్స్ జాతకాలు చెప్పడంతో అందరూ పడీపడీ నవ్వారు. తర్వాత ఫైనలిస్టుల కోసం గ్రాండ్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశారు. ముందుగా ఇమ్మాన్యుయేల్ వంతు వచ్చింది. గార్డెన్ ఏరియాలో తను ఆడిన టాస్కులు, వాటి ఫోటోలు చూసి ఎమోషనలయ్యాడు. అసలైన ఎంటర్టైనర్ఇక బిగ్‌బాస్ మాట్లాడుతూ.. బాధ, నిరాశ, ఓటమి.. ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు. కానీ, అది సాధ్యం కాదు. వాటి నుంచి తేరుకునేందుకు మనుషులు కోరుకునేది ఆనందం. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్. చిన్నప్పటినుంచి కష్టాలను అనుభవించినవారికే చిరునవ్వు బలమేంటో బాగా తెలుసు. అదే బలంగా మీరు ముందుకు సాగారు. నీ ఆటతో మిగతావారి ఆటస్థాయి పెంచారు. ఇమ్మూపై బిగ్‌బాస్ ప్రశంసలుఇంటిసభ్యులు మీకు దగ్గరైనవారి మీద మాటలదాడికి దిగినప్పుడు మీరు మాటమార్చలేదు, అలా అని వారి తోడు వీడలేదు. మీ ఆటలో, భావాల్లో నిజాయితీగా ఉన్నారు. మంచివైపే నిల్చున్నారు. మీకు దగ్గరైనవాళ్లు చేసింది తప్పనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఇంట్లో ఎన్ని జరిగినా ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనేది ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు.అమ్మ కల నెరవేరిందిప్రేక్షకుల మనసు గెలిచేందుకు, గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు, గొప్ప చదువులూ, ఆడంబరాలు అక్కర్లేదు. వ్యక్తిత్వం ఒక్కటే అవసరం. ఇది మరోసారి మీ ప్రయాణంతో రుజువైంది. కమెడియన్‌గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలన్న మీ అమ్మ కల నిజమైంది అని బిగ్‌బాస్ చెప్పడంతో ఆనందభాష్పాలు కార్చాడు. తర్వాత తన జర్నీ చూసుకుని ఓపక్క సంతోషిస్తూనే.. మరోపక్క గుక్క పెట్టి ఏడ్చాడు. కట్టకాలే వరకు అందర్నీ నవ్విస్తూనే ఉంటానని మాటిచ్చాడు. -
నవ్వులపాలైన చోటే పవన్‌కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ ఇస్తున్న సర్ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది. ఏ గేమ్ ఇచ్చినా ఈజీగా గెలిచేస్తున్నాడు.. అందరితో సరదాగా కలిసిపోయి జోకులేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 16) నాటి ఎపిసోడ్‌లోనూ అదే జరిగింది. ఆ విశేషాలు ఓసారి చూసేద్దాం..అదరగొట్టేసిన పవన్బిగ్బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో పవన్‌ను పక్కకు తప్పించి మిగతా అందరూ గేమ్ ఆడారు. ఈ ఆటలో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఎక్కువ గేమ్స్ గెలిచిన పవన్‌ను హౌస్మేట్స్ ప్లేయర్ ఆఫ్ ది డేగా ప్రకటించారు. దీంతో అతడి అన్న వీడియో మెసేజ్ వచ్చింది. అగ్నిపరీక్షలో నిన్ను చూసి ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని పవన్ ఉప్పొంగిపోయాడు.తనూజ గెలుపుమరుసటి రోజు పిక్ ద బోన్ అనే గేమ్ ఇచ్చాడు. ఇందులోనూ మళ్లీ పవనే గెలిచాడు. దీంతో అతడికి మళ్లీ ఓ స్టార్ వచ్చింది. అంతేకాకుండా.. మటన్ ఫ్రాంకీ పంపడంతో పవన్ ఆవురావురుమని ఆరగించాడు. అనంతరం బిగ్‌బాస్ టవర్ గేమ్ పెట్టాడు. ఈ ఆటలో ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరిలో తనూజ గెలిచి ఓ స్టార్ అందుకుంది. అలాగే తనకోసం బిగ్‌బాస్ పంపిన డ్రైఫ్రూట్ రబిడీని ఆరగించింది.తనూజకు చెల్లి పెళ్లి ఫోటోఅనంతరం ధమాకా కిక్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. గతంలో ఈ టాస్క్‌లోనే ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయకుండా కింద పడిపోయాడు పవన్. అప్పుడందరూ పగలబడి నవ్వారు. కానీ, ఈసారి మాత్రం అందరికంటే ఎక్కువ హైట్‌లో (ఏడున్నర అడుగులు) తన చెప్పును కాలితో అతికించి శెభాష్ అనిపించుకున్నాడు. ఒక స్టార్, తందూరీ చికెన్ గెలుపొందాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డేగా తనూజను ప్రకటించారు. దీంతో ఆమెకు ఇంటినుంచి చెల్లి పెళ్లి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో తనూజను కూడా ఎడిట్ చేసి పెట్టారు. అది చూడగానే తనూజ కుటుంబాన్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. -
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
బిగ్‌బాస్ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్‌లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్‌తో పాటు తనూజ-కల్యాణ్‌ల ట్రాక్ కూడా కొనసాగింది. అయితే, తనూజ పట్ల కల్యాణ్ నిజంగానే కాస్త ఆసక్తి చూపుతున్నట్లు సులువుగా అర్థం అవుతుంది. కానీ, తనూజ మాత్రం తనతో ఫ్రెండ్‌గానే బంధాన్ని కొనసాగిస్తుంది. అయితే, సోమవారం జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లు లేవు కాబట్టి బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చాడు. తమ జర్నీ గురించి చెప్పాలంటూ ప్రతి ఒక్కరినీ బిగ్‌బాస్ అడిగాడు. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ చెప్పిన మాటలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి.ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ అనేది తనూజ, కల్యాణ్‌ల మధ్యే ఉంది. టైటిల్ రేసులో ఉన్న వారిద్దరూ కూడా చాలా స్నేహంగా ఉన్నారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే, తన జర్నీ గురించి హౌస్‌మేట్స్‌తో కల్యాణ్ ఇలా చెప్పుకొచ్చాడు. తనకు 8 ఏళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి అంటూ తెలిపాడు. వెండితెరపై తన పేరు కూడా కనిపించాలనే ఆశ ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు. బిగ్‌బాస్ జర్నీ తనకు గుర్తుండిపోయే సన్నివేశాలను చాలానే ఇచ్చింది అన్నాడు.తనూజపై కల్యాణ్ ప్రేమతనూజ, కల్యాణ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని పలు యూట్యూబ్, సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్యాణ్ బయటపడ్డాడు. తన జర్నీ గురించి చెప్పే క్రమంలో.. తనూజ వైపు కల్యాణ్ చూస్తూ ఇలా అన్నాడు 'జీవితాంతం ఈమె (తనూజ) ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాను.. కాదు, ఫ్రెండ్షిప్ను మించి అంటూ స్ట్రెయిటుగా చెప్పేశాడు. తనూజతో ఉన్న ఈ బాండ్ ఇలాగే ఉంటుంది. ఉండాలని అనుకుంటున్నాను. ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించే గుణం తనూజలో ఉంది. అందుకే మోర్ దేన్ ఫ్రెండ్షిప్ తనూజతో ఉండాలని అనుకుంటున్నాను.' అని కల్యాణ్ అన్నాడు. అయితే, ఆమె నుంచి కూడా సానుకూల చూపులు కనిపించాయి. కాస్త సిగ్గుతో ఆమె తలదించుకుంది.ఇప్పుడు ఇద్దరూ సెలబ్రిటీలేకామనర్గా కల్యాణ్ బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. కానీ, తనూజ అప్పటికే సెలబ్రిటీ. సిరీయల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే, ప్రస్తుతం ఇద్దరూ సెలబ్రిటీలే. ఎవరూ తక్కువ కాదు. కొందరైతే మరో విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కల్యాణ్ మదర్ హౌజులోకి వచ్చి వెళ్తున్నప్పుడు తనూజ ఓ చీరెను గుర్తుగా ఇచ్చింది. దీని గురించి కల్యాణ్ కూడా తనూజను పలు ప్రశ్నలు అడిగాడు కూడా.. కానీ, ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో వారిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే తనూజ కోసం కప్ త్యాగం చేస్తావా అని బిగ్‌బాస్ అడిగితే.. వెంటనే కల్యాణ్ ఓప్పేసుకుంటాడేమో అనేలా తన పరిస్థితి ఉంది. -
నా కుటుంబం కన్నా తెలుగు ప్రేక్షకుల ప్రేమే ఎక్కువ!: తనూజ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ చివరి వారం సరదాగా, భావోద్వేగంగా సాగిపోతుంది. చిన్న చిన్న టాస్కులిస్తుంటాడు బిగ్‌బాస్. అలాగే వారి జర్నీ వీడియోలు వేసి ఏడిపించేస్తాడు. తాజాగా బిగ్‌బాస్ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు.ఒక్కవారంలో అంతా అయిపోయిందా?అందులో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. బయట ఎన్ని కామెడీ షోలు చేయలేదు? సింపుల్‌గా నవ్వించేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చిన మొదటివారమే మర్యాద మనీష్‌తో కామెడీ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట ఒక్కవారంలో కూలిపోయిందా? అని నిద్రపట్టలేదు. ఆ సమయంలో మా మమ్మీ (సంజనా) పరిచయమైంది. ఊరికనే ఏడ్చేస్తానని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు.ఏడ్చేసిన డిమాన్ పవన్డిమాన్ పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వచ్చేముందు కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నాను. అమ్మానాన్నను సరిగా చూసుకోలేకపోతున్నాను. అన్న, నాన్నపై ఆధారపడుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ప్రేమను పంచారు. ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను అంది.టాప్ 5 ఎమోషనల్కల్యాణ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అంటే కావాలనిపించే కష్టం. భోజనం, నిద్ర, మనుషులు ఏదీ కరెక్ట్‌గా ఉండదు. అయినా ఇది మనకు కావాలనిపిస్తుంది అన్నాడు. అలా అందరూ బిగ్‌బాస్ జర్నీని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. -
టాప్ 5 ఛాన్స్ మిస్.. భరణి ఎలిమినేషన్‌కు కారణాలివే!
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మొదట్లో కామనర్స్‌ను అసహ్యించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కామనర్స్ టాప్ 5లో ఉన్నారు. భరణి మెచ్యూరిటీ, ఆటను మెచ్చుకున్నారు. కానీ మధ్యలో ట్రాక్ తప్పడంతో ఆయన్ను ఆరువారాలకే ఎలిమినేట్ చేశారు. కామనర్ శ్రీజ, భరణిలో ఒకర్ని మళ్లీ తీసుకొస్తే.. జనం శ్రీజ ఓవరాక్షన్ తట్టుకోలేక భరణికి ఓటేశారు. అలా ఎనిమిదో వారం హౌస్‌లోకి వచ్చిన భరణి ఫైనల్స్‌కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. పద్నాలుగో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అందుకు గల కారణాలేంటో చూద్దాం...నలిగిపోయిన భరణిభరణి మొదట ఎలిమినేట్ అయిందే బంధాల వల్ల! అటు తనూజ, ఇటు దివ్య మధ్య నలిగిపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున వార్నింగ్ ఇచ్చినా పరిస్థితి మారలేదు. బంధాల వల్ల తనను తాను కోల్పోయినవాడిలా మిగిలిపోయాడు. ఎలిమినేషన్ తర్వాత తప్పొప్పులు తెలుసుకున్నాడు. స్ట్రాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. బంధాలు అడ్డు కాకూడదని భావించాడు. తనూజ, దివ్యను కాస్త దూరం పెట్టాడు.ఫ్యామిలీ వీక్‌తో మార్పుకానీ దివ్య ఫెవికాల్లా అతడికి అతుక్కుపోయింది. ఓపక్క సపర్యలు చేస్తుంది, మరోపక్క వెళ్లిపోమని నామినేషన్ చేస్తుంది. కానీ అతడిని ఆజమాయిషీ చేయడమే ఎవరికీ నచ్చలేదు. కొన్నివారాలపాటు భరణి దాన్ని మౌనంగానే భరించినా అది అతడి చేతకానితనంగా మారిపోయింది. అతడి అభిమానులకు అది నచ్చలేదు. ఫ్యామిలీ వీక్‌లో ఇంటిసభ్యులందరూ కూడా.. నీపై పెత్తనం చెలాయిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావని కడిగిపారేశారు. దీంతో అప్పటినుంచి దివ్యను దూరం పెట్టాడు. కొన్నిసార్లు సంబంధం లేకపోయినా కోప్పడ్డాడు.విమర్శలుభరణి ధోరణి చూసిన వారికి అతడు సహజంగా ఉండట్లేదన్న అనుమానం మొదలైంది. మొదట్లో రేలంగి మామయ్యలా ఉన్న భరణి.. సెకండ్ ఎంట్రీలో మాత్రం ఫైర్ చూపించాడు. ఆ ఫైర్ మాటల్లో ఉంది కానీ గేమ్‌లో మాత్రం పెద్దగా చూపించలేకపోయాడు. అతడిని రికమండేషన్‌తో ఫైనల్‌కు తీసుకెళ్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా పలు కారణాల రీత్యా ఆయన్ను ఫినాలేకు ఒక వారం ముందు పంపించేశారు.చదవండి: కప్పు నువ్వే గెలవాలి: భరణి -
నేనంత దుర్మార్గుడిని కాదు, నువ్వే కప్పు గెలవాలి: భరణి
బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సుమన్, భరణి డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఒకే వారం వెళ్లిపోయారు. ఇప్పుడు హౌస్‌లో టాప్ 5 మిగిలారు. వీరిలో ఒకర్ని విజేతగా ప్రకటించే బాధ్యతను ప్రేక్షకుల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. ఈ మేకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయం కాస్త పక్కనపెడితే ఆదివారం (డిసెంబర్ 14) ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలైట్స్‌లో చూసేద్దాం..ప్రైజ్‌మనీతో ఏం చేస్తారు?బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రైజ్‌మనీని రూ.50 లక్షలుగా ప్రకటించారు. ఈ ప్రైజ్‌మనీ మీ సొంతమైతే ఏం చేస్తారని నాగ్ అడిగాడు. భరణి వృద్ధాశ్రమానికి సాయం చేస్తానన్నాడు. ఇమ్మాన్యుయేల్.. తన ఇంటి అప్పు తీర్చేయడంతో పాటు ప్రియురాలిని బాగా చదివిస్తానన్నాడు. అలాగే తన అక్క పిల్లల చదువు, బాగోగులు అన్నీ చూసుకుంటానన్నాడు. డిమాన్ పవన్.. తండ్రికి క్యాన్సర్ ఉందని, ఆ ట్రీట్మెంట్ కోసం డబ్బు వాడతానన్నాడు. అలాగే అమ్మానాన్న కోసం ఓ ఇల్లు కడతానన్నాడు.విరాళంగా ఇస్తా..ప్రైజ్‌మనీని హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావ్? అని అడగ్గా.. కల్యాణ్‌కు రూ.25 లక్షలు ఇస్తానన్నాడు. ఇద్దరం కామనర్స్ కాబట్టి తనతో పంచుకుంటానన్నాడు. తర్వాత సంజనా.. మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సంఘానికి కొంత విరాళం ఇస్తాను. కాళ్లు లేని పిల్లల కోసం కృత్రిమ కాళ్లు కొనిస్తాను, నా పిల్లల కోసం రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అంది. తనూజ పేద పిల్లల చదువుకు సాయం చేస్తానంది.బంగారం కొనిస్తాకల్యాణ్.. అనాథాశ్రమంలో ఒకరిద్దరిని దత్తత తీసుకుని వాళ్ల బాగోగులు చూసుకుంటాను. మా అమ్మకు వీలైనంత ఎక్కువ బంగారం కొనిస్తాను అని చెప్పాడు. తర్వాత తనూజను సెకండ్ ఫైనలిస్ట్‌గా, పవన్‌ను మూడో ఫైనలిస్ట్‌గా, ఇమ్మాన్యుయేల్‌ను నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రకటించారు. చివరగా భరణి, సంజన మిగిలారు. వీరిలో భరణి ఎలిమినేట్.. సంజనా ఐదో ఫైనలిస్ట్ అని ప్రకటించగానే ఇమ్మూ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. నాన్న దగ్గర ఆశీర్వాదంభరణి వెళ్లిపోయేముందు తనూజ అతడి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. గతంలో ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ హౌస్‌లోకి వచ్చిన భరణి.. ఈసారి బాగానే ఆడాడు. కానీ, ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అది సరిపోలేదు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. స్టేజీపైకి వచ్చిన భరణి.. టాప్ 5లో ఉన్న ఐదుగురు ఫైటర్స్ అని ప్రశంసించాడు. కళ్యాణ్‌కు సైనికా, వందనం అంటూ సెల్యూట్ చేశాడు. కప్పు గెలవాలిసుమన్, కల్యాణ్‌ను ఏ రోజూ నామినేట్ చేయలేదు. కప్పు గెలిచే అర్హత నీకుంది అని బూస్ట్ ఇచ్చాడు. తనూజ.. నిన్ను కొన్నిసార్లు బాధపెట్టి ఉండవచ్చు. కానీ, నీకివ్వాల్సిన ప్రాధాన్యత నీకిచ్చాను. నాన్నా అని దగ్గరకు వస్తే దూరం తోసేంత దుర్మార్గుడిని కాదు. నువ్వు, దివ్య, సుమన్.. నాకు బెస్ట్ బెడ్డీస్ అన్నాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పిన భరణి.. తనూజ మాత్రం కప్పు గెలవాలని కోరాడు. -
అత్యధిక రెమ్యునరేషన్‌తో 'బిగ్‌బాస్' నుంచి భరణి ఎలిమినేట్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో చివరి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో టాప్-5 ఎవరనేది తేలిపోయింది. తనూజ, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన గల్రానీలు కప్ రేసులో ఉన్నారు. డిసెంబర్ 21న బిగ్‌బాస్ ట్రోఫీని అందుకునేది ఎవరనేది తేలనుంది. అయితే, శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా.. ఆదివారం నాడు భరణి హౌస్ నుంచి వచ్చేశారు. అయితే, రీఎంట్రీ ఇచ్చిన భరణి రెమ్యునరేషన్ పరంగా భారీగానే అందుకున్నాడు.ఈ సీజన్లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఈ సీజన్లో ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్‌బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఆరో వారమే ఎలిమినేట్ అయ్యారు. దీంతో 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే రెమ్యునరేషన్‌గా వచ్చినట్లు సమాచారం. కానీ, భరణి 8వ వారంలో హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ మరో ఆరు వారాల పాటు కొనసాగారు. దీంతో అదే లెక్కన మరో రూ. 21 లక్షలు భరణి అందుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. రూ. 42లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు టాక్. ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా భరణి రికార్డ్ క్రియేట్ చేశారు. -
ఇది సుమన్‌కు మాత్రమే సాధ్యం.. మళ్లీ జరగదు, జరగబోదు!
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఈ ట్యాగ్‌లైన్‌తోనే సీజన్ మొదలైంది. ఈ ట్యాగ్‌తోనే సీజన్ ముగింపు కాబోతోంది. కామనర్ కల్యాణ్, సెలబ్రిటీ తనూజలలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ కాబోతున్నారు. సీజన్ ముగింపుకు చేరుకోవడంతో హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ప్రకటించారు. అందులో భాగంగా సుమన్‌ను ఎలిమినేట్ చేశారు.. నేటి ఎపిసోడ్లో భరణిని పంపించేయనున్నారు.ఒక్క కారణం..సుమన్ ఇన్ని వారాలు కొనసాగడమనేది కొంత ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే అతడు బలంగా గేమ్ ఆడింది లేదు, కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు చేస్తూ సింపతీకి ప్రయత్నించిందీ లేదు, కంటెంట్ కోసం ఓవరాక్టింగ్ చేసిందీ లేదు. అయినా 14 వారాలు హౌస్‌లో ఉన్నాడు. అందుకు గల ఏకైక కారణం అమాయకత్వం.నవ్విస్తాడనుకుంటే..సినిమాల్లో కమెడియన్‌గా నవ్వించిన సుమన్ శెట్టి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా సైలెంట్‌గా ఉండిపోయాడు. సాధారణంగా అలా ముఖం పక్కకు తప్పుకుని కూర్చుంటే జనాలు వాళ్లను వీలైనంత త్వరగా హౌస్ నుంచి పంపించేస్తారు. కానీ, సుమన్‌ను ఎన్నో ఏళ్లుగా అభిమానించినవాళ్లకు అతడిని పంపించేసేందుకు మనసొప్పలేదు. అతడి ముఖంలో, ఆటలో, ప్రవర్తనలో అమాయకత్వాన్ని చూశారు.ఒక్క స్టెప్పేస్తే చాలువీలైనంత వరకు ఎవర్నీ నొప్పించకుండా మాట్లాడేవాడు. మాట్లాడింది తక్కువసార్లే అయినా.. అందులోనూ నీతి, నిజాయితీ వైపు నిలబడ్డ తీరుకు ఫిదా అయ్యారు. ఆయన ఒక్క స్టెప్పేస్తే చాలు.. జనం హాయిగా నవ్వుకునేవారు. తన బలం తనకు తెలియదన్నట్లు టికెట్ టు ఫినాలే రేసులో సుమన్ బాగా ఆడాడు. కానీ, అది సరిపోదు.. అంతా వదిలేసి చివర్లో కసితో ఆడితే ఏం లాభం.. అందుకే ఎలిమినేట్ అయ్యాడు.అందుకే 14 వారాలుకేవలం అమాయకత్వంతో 14 వారాలు హౌస్‌లో ఉండటం సుమన్ శెట్టి (Suman Shetty) కి మాత్రమే సాధ్యమైంది. ఆయన స్థానంలో ఎవరున్నా బిగ్‌బాస్ షోకి మీరు సెట్టవరు అని ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా పంపించేసేవారు. సుమన్‌ను మాత్రం ఆరాధించారు, అభిమానించారు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, జరగబోదు కూడా అన్నది సోషల్ మీడియాలో నెటిజన్ల వాదన! -
'బిగ్‌బాస్ తెలుగు 9' ప్రైజ్ మనీ ప్రకటించిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 9 ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కానున్నారని నాగర్జాన ప్రకటించారు. భరణి ఎలిమినేట్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. అప్పుడు రేసులో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో విజేతకు అందే ప్రైజ్ మనీని నాగార్జున రివీల్ చేశారు.బిగ్‌బాస్ గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విజేతకు రూ. 50 లక్షలు అందుతాయని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే, అందులో నుంచి ఎక్కువగా ట్యాక్స్ రూపంలో కట్ అవుతుందని అందరికీ తెలిసిందే. గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే హౌస్‌లో ఎవరికి ఎంత ఇస్తావని భరణిని నాగార్జున అడిగారు. తాను గెలుచుకున్న డబ్బు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఆ లిస్ట్‌లో ఇమ్మాన్యుయేల్, పవన్‌లు ఉంటారని భరణి అన్నారు. తాను గెలిస్తే రీతూ కోసం రూ. 5 లక్షలతో గిఫ్ట్ కొంటానని పవన్ చెప్పారు. -
బిగ్‌బాస్ 'సుమన్ శెట్టి' ఎలిమినేట్.. ఆల్‌టైమ్ రికార్డ్‌గా రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వారమే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ, అంచనాలకు మించి ఏకంగా 14 వారాల పాటు ప్రేక్షకులను మెప్పించాడు. 97వ ఎపిసోడ్లో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్‌లో కేవలం 6 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. నేడు ఆదివారం ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. అప్పుడు టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యూయేల్, పవన్, సంజన మాత్రమే ఉంటారు. అయితే, తాజాగా ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత ప్రేక్షకులు అతని రెమ్యునరేషన్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. సుమన్ శెట్టి వారానికి రూ. 2.6 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. 14 వారాలు హౌస్‌లో ఆయన కొనసాగడంతో సుమారుగా రూ.36 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టాప్ రెమ్యూనరేషన్ అందుకున్నవారిలో సుమన్ శెట్టి నిలిచారని చెప్పవచ్చు. గతంలో యాంకర్ రవి కూడా ఇదే రేంజ్లో రెమ్యునరేషన్ అందుకున్న విషయం తెలిసిందే. -
మనసులు గెలిచిన తనూజ.. విన్నర్ అవడం ఖాయం!
ప్రతి సీజన్లో ఒకే ఒక్క టికెట్ టు ఫినాలే ఉంటుంది. కానీ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో మాత్రం రెండో టికెట్ టు ఫినాలే ప్రవేశపెట్టడం.. దానికోసమే ఈ వారమంతా టాస్కులు ఆడించడం జరిగింది. తీరా ఫైనలిస్ట్ అయ్యే అవకాశం చేతిదాకా వస్తే తనకు అక్కర్లేదని తిరస్కరించింది తనూజ. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 12వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..బుర్ర ఉపయోగించిన భరణిలీడర్ బోర్డులో చివర్లో ఉన్న భరణి.. తన సగం పాయింట్స్ ఒకరికి ఇచ్చేయాలన్నాడు బిగ్‌బాస్. సంజనాకు పాయింట్స్ ఇచ్చేస్తే తనకు ఫినాలేకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని భావించి బుర్ర ఉపయోగించిన భరణి.. తనూజకు ఇచ్చాడు. కానీ, ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు నా కూతురివి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇమ్మూ గెలుపుతర్వాత మిగిలిన ముగ్గురు సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్.. కీ టూ సక్సెస్ అనే గేమ్ ఆడారు. ఇందులో ముగ్గురూ కష్టపడ్డారు. సంజనా మాటలు జారడంతో ఇమ్మూ ఎమోషనలయ్యాడు. ఈ గేమ్‌లో ఇమ్మూ గెలవగా, సంజనా రెండో స్థానంలో, తనూజ మూడో స్థానంలో నిలిచింది. తర్వాత గేమ్‌లో అందరూ కలిసి సంజనాను ఆడకుండా సైడ్ చేశారు. చివరి గేమ్‌లో తనూజ విజయంఅలా ఇమ్మూ, తనూజకు బాల్ గేమ్ ఇచ్చారు. ఈ గేమ్‌లో ఇమ్మూ కాలు బెణకడంతో మెడికల్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. నొప్పితో ఆడి మరీ ఇమ్మూ ఈ గేమ్ గెలిచాడు. అనంతరం తనూజ, సంజనా, ఇమ్మూకి చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచినవారికి ఏకంగా 300 పాయింట్లు వస్తాయని బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో తనూజకు దెబ్బ తగిలిగినప్పటికీ పట్టించుకోకుండా ఆడి గెలిచింది. తనూజతో డీల్చివరి గేమ్‌లో ఎక్కువ పాయింట్స్ రావడంతో తనూజ ఏకంగా విజేతగా నిలిచింది. అన్ని గేమ్స్ గెలుచుకుంటూ వచ్చి చివర్లో ఓడిపోయానని ఇమ్మూ కంటతడి పెట్టుకున్నాడు. ఫైనల్‌గా లీడర్‌బోర్డులో 750 పాయింట్స్‌తో తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇమ్మూ 520, సంజనా 320 పాయింట్లతో తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. అనంతరం తనూజను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు.టికెట్ టు ఫినాలే అక్కర్లేదన్న తనూజమీ దగ్గరున్న రూ.3 లక్షలతో ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అవొచ్చన్నాడు. ఆ డబ్బంతా విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి కట్ చేస్తానన్నాడు. ఈ ఆఫర్‌ను తనూజ రిజెక్ట్ చేసింది. ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. అలా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇది తనూజ విన్నింగ్ ఛాన్స్‌ను మరింత రెట్టింపు చేసే ఎపిసోడ్ అనే చెప్పవచ్చు. -
గేమ్‌లో సడన్‌గా కిందపడ్డ ఇమ్మూ.. మెడికల్ రూమ్‌కు!
టాస్కులు గెలవాలంటే కండబలం ఉండాలంటారు. కానీ, అదేం అవసరం లేదని, ఆత్మవిశ్వాసం ఉంటే చాలని నిరూపించాడు ఇమ్మాన్యుయేల్. తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడాడు. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్ అతడే గెలిచాడు. అందుకే ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు.నేనూ మనిషినే..కానీ శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సంజనాతో గొడవపడ్డాడు. గేమ్‌లో మీరు ఫస్ట్ వచ్చి నాది లాగారు... ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారు అని ఆవేదన చెందాడు. అటు గేమ్‌లో ఓడిపోయినందుకో ఏమో కానీ సంజనా బాధ తట్టుకోలేక ఏడ్చేసింది. నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోట్రేట్ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా? అని ఎమోషనలయ్యాడు.నొప్పితో విలవిలతర్వాత లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది. అలా ఫైనల్‌గా ఇమ్మూ, తనూజ బాల్స్ గేమ్ ఆడారు. అయితే ఈ ఆటలో ఇమ్మూ కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక గేమ్ కాసేపు ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్‌లోనే తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది. కాకపోతే తను ప్రేక్షకు ఓట్లతోనే కొనసాగాలనుకుంటున్నానంటూ ఇమ్యూనిటీని తిరస్కరించింది. -
మీ ఏడుపు ఫేక్.. ప్రేక్షకుల కామెంట్స్‌తో తనూజ షాక్!
లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సుమన్ ఆటలో అవుట్ అయ్యాడు. అతడి దగ్గరున్న రూ.1 లక్షలో సగం, తన స్కోర్‌లో సగం ఎవరికైనా పంచొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. ఆయనకు వెంటనే భరణి పేరు తట్టింది.. కానీ, భరణి మాత్రం సంజనాకు ఇవ్వమని సలహా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (డిసెంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..భరణిని సైడ్ చేశారుఅలా సుమన్ ఇచ్చిన పాయింట్ల దెబ్బకు సంజనా లీడర్ బోర్డులో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక తర్వాత గేమ్‌లో మెజారిటీ ఇంటిసభ్యులు కలిసి భరణిని పక్కనపెట్టి గేమ్ ఆడారు. అలా జోకర్ గేమ్‌లో ఇమ్మూ, సంజనా గెలవగా మిగతావాళ్లు ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయారు. లీడర్ బోర్డులో చివర్లో ఉన్న పవన్.. తన దగ్గరున్న రూ.1,50,000 అలాగే 150 పాయింట్లలో సగం ఒకరికి ఇచ్చి ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు బిగ్‌బాస్. మళ్లీ భరణి టార్గెట్అతడు తన పాయింట్స్ అన్నీ తనూజకు ఇవ్వడంతో ఆమె లీడర్ బోర్డులో టాప్‌లో నిలిచింది. ఇక నెక్స్ట్ గేమ్‌లో ఒకర్ని తీసేయాలని బిగ్‌బాస్ చెప్పగానే మెజారిటీ ఇంటిసభ్యులు మళ్లీ భరణిని తీసేశారు. మిగిలిన సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్ బ్యాలెన్స్ గేమ్ ఆడారు. ఈ ఆటలో ఇమ్మూ గెలవగా తనూజ, సంజనా తర్వాతి స్థానాల్లో వచ్చారు.ఓట్ అప్పీల్అయితే లీడర్ బోర్డులో మాత్రం తనూజ ఫస్ట్ ర్యాంక్‌లో ఉండగా.. ఇమ్మూ సెకండ్, సంజనా మూడో స్థానంలో ఉన్నారు. దీంతో బిగ్‌బాస్ ఓట్ అప్పీల్ కోసం తనూజతో పాటు ఇంకెవరు ముందుకు రావాలనే నిర్ణయాన్ని తనూజ చేతిలో పెట్టాడు. అలా తనూజ.. సంజనాను ఎంచుకుంది. వీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ప్రేక్షకులను కలుసుకున్నారు. ప్రేక్షకులు తనూజకే ఓటేయడంతో ఆమె ఓట్ అప్పీల్ చేసుకుంది. తెలిసో తెలియక తప్పు చేసుంటే క్షమించమని కోరింది. మీ ఏడుపు ఫేక్తర్వాత జనాలడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీ ఏడుపు నిజమనిపించదు, ఫేక్ అని ఓ వ్యక్తి అనగా.. నేను కావాలని ఎమోషనల్ అవను, అది దానంతటదే వస్తుంది, ఇక్కడ ఏదీ ఫేక్‌గా ఉండదు అని చెప్పింది. భరణి నాన్న.. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక భరణి సర్ ఎందుకయ్యారు? అన్న ప్రశ్నకు తనూజ.. మా మధ్య అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. సింపతీకాకపోతే మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఆ నాన్న అనే పిలుపు చూసేవారికి సింపతీగా కనిపిస్తోంది. ఆయనకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే నాన్న అనే పిలుపును పక్కనపెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్‌ను ముఖం మీదే ఫ్రెండ్ కాదని ఎలా అంటావని నిలదీశాడో వ్యక్తి. దానికి తనూజ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. వాడికి సపోర్ట్ చేయలేదా? అని రివర్స్‌లో అంటే.. మీరెక్కడ చేశారు మేడమ్? మీరే అందరి సపోర్ట్ తీసుకుంటారు అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు తనూజ ముఖం వాడిపోయింది. -
తనూజకు కల్యాణ్ ఫుల్ సపోర్ట్.. అయినా టాప్‌లో భరణి
బిగ్‌బాస్ 9 సీజన్ దాదాపు చివరకొచ్చేసింది. మరో పదిరోజులు మాత్రమే మిగిలున్నాయి. నేపథ్యంలో ఉండాల్సినంతా డ్రామా కనిపించట్లేదు. పైపెచ్చు టాప్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఉండాల్సింది పోయి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇదే కాస్త చిత్రంగా అనిపిస్తుంది. తాజా ఎపిసోడ్లో అయితే తనూజకు కల్యాణ్ ఫుల్ సరెండర్ అయిపోయాడు. ఇంతకీ బుధవారం ఏమేం జరిగింది?కల్యాణ్ తొలి ఫైనలిస్ట్ అయిపోయాడు. దీంతో రెండో ఫైనలిస్ట్ రేసులో తదుపరి గేమ్ ఆడకుండా ఒకరిని తప్పించాలని బిగ్‌బాస్ చెప్పడంతో హౌస్ మెజారిటీ ప్రకారం సంజన తప్పుకొంది. తర్వాత మిగిలున్న ఐదుగురికి 'పట్టుకో పట్టుకో' అనే పోటీ పెట్టారు. ఇందులో భాగంగా సంచాలక్స్ కల్యాణ్, సంజన వేసే బంతుల్ని.. జంబో ప్యాంట్స్ వేసుకున్న పోటీదారులు పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తనూజకు కల్యాణ్ ఫుల్‌గా సపోర్ట్ చేశాడు. 10లో 7 బంతులు ఆమెకే వేయడం విశేషం. మరోవైపు సుమన్ పక్కనే నిలబడ్డ భరణి.. అతడి బంతుల్ని పట్టేసుకున్నాడు. అన్నా అది నా బల్ అని సుమన్ అంటున్నా గానీ భరణి సైలెంట్‌గానే ఉండిపోయాడు. ఈ పోటీలో తనూజ తొలి స్థానం దక్కించుకోగా భరణి, పవన్, ఇమ్మూ, సుమన్ మిగతా స్థానాల్లో నిలిచారు.గేమ్ తర్వాత తనూజ-కల్యాణ్ గురించి భరణి-సంజన మాట్లాడుకున్నారు. మరి అంత దారుణంగా.. కూర్చో అంటే కూర్చుంటున్నాడు నిలబడు అంటే నిలబడుతున్నాడు.. నేను రిలేషన్‌ని తప్పుబట్టను.. వాళ్లిద్దరూ ఎందుకో పాపం.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం కానీ తనూజ మరీ ఓవర్ కమాండ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు అని భరణి అన్నాడు. బాల్ టాస్క్ తర్వాత లీడర్ బోర్డ్‌లో ఇమ్మానుయేల్, డీమాన్ పవన్ టాప్-2లో ఉన్నారు. దీంతో ఈసారి ఇద్దరిని తర్వాత గేమ్ నుంచి తప్పించాలని బిగ్‌బాస్ పుల్ల పెట్టాడు. అలా కాసేపు హౌస్మేట్స్ తర్జన భర్జన తర్వాత వీళ్లిద్దరినీ తప్పించారు.తర్వాత 'పట్టు వదలకు' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా పజిల్ పూర్తి చేసి, రోల్ అవుతున్న తాడుని పట్టుకోవాల్సి ఉంటుంది. తొలి స్థానంలో నిలిచిన వాళ్లకు 100 పాయింట్లు వస్తాయని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో తనూజ, సంజన.. త్వరగానే పజిల్ పూర్తి చేశారు గానీ తాడుని ఎక్కువసేపు పట్టుకోలేక కింద పడేశారు. ఇక్కడే తెలివి చూపించిన భరణి.. ఆలస్యంగా పజిల్ పూర్తి చేసి తాడు చివరలో ఉండగా వెళ్లి, కాసేపు దాన్ని పట్టుకుని టాస్క్ పూర్తి చేశాడు. 100 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. సుమన్ అయితే ఈ టాస్క్ పూర్తి చేయలేకపోయాడు.పట్టు వదలకు టాస్క్ పూర్తి చేసిన భరణి(230).. ఒకేసారి 100 పాయింట్లు రావడంతో లీడర్ బోర్డ్‌లో టాప్‌లోకి వచ్చేశాడు. తర్వాత తనూజ (220), ఇమ్మాన్యుయేల్ (170), డీమన్ పవన్ (150), సంజన (140), సుమన్ (100) వరసగా నిలిచారు. ఇక టాప్-2లో నిలిచిన భరణి, తనూజలో ఒకరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోమని చెప్పగా.. హౌస్‌లోకి వచ్చిన ఆడియెన్స్, తనూజ పేరు చెప్పారు. దీంతో ఈమె ఓటు అప్పీలు చేసుకుంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. -
'బిగ్‌బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు
బిగ్‌బాస్ గేమ్ అంటేనే అందులోని కంటెస్టెంట్స్‌కు చాలా స్ట్రాటజీలు ఉంటాయి. కొందరైతే ముందుగానే బిగ్‌బాస్ టీమ్‌తో డీల్ సెట్ చేసుకుంటారు. తను ఎన్నివారాలు ఉండాలో దానికి తగినట్టు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు. కానీ, కొందరు మాత్రం తమ పీఆర్ టీమ్స్‌తో ప్రేక్షకులను ముందుగా రెచ్చగొడతారు. ఆపై కులం, మతం, ప్రాంతం పేరుతో తమ కంటెస్టెంట్స్ కోసం నెట్టింట ట్రోలింగ్‌కు దిగుతారు. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్లో కూడా అదే జరగుతోంది. టాప్ 2పై ట్రోలింగ్కన్నడ అమ్మాయి అంటూ తనూజపై తీవ్రమైన ట్రోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు కల్యాణ్ మా కులపోడు అంటూ కొందరు భుజాన ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి పీఆర్ టీమ్ దానిని వైరల్ చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌పై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో కుల, ప్రాంతీయ జాడ్యం బిగ్‌బాస్‌ను కూడా తాకింది. కల్యాణ్ మా కులపోడు అంటూ ఇప్పటికే తన సామాజిక వర్గం పెద్దలు రంగంలోకి దిగారు. వేరేవాాళ్లను తొక్కితేనే..అతనిపై కామన్ మ్యాన్, ఆర్మీ మ్యాన్, తెలుగు వాడు అంటూ పీఆర్ టీమ్స్ వైరల్ చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అదే ఫార్ములా పాటిస్తున్నారు.కమ్యూనిటీ పేరెత్తితే ఏమైంది?బిగ్‌బాస్ టైటిల్ రేసులో కల్యాణ్, తనూజ ఉన్నారు. ఆమె కన్నడ అమ్మాయి కావడంతో తన భాష, ప్రాంతం గురించి చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక గేమ్ అనే సోయి కూడా చాలామందికి లేదు. ఇక్కడ ప్రాంత, కుల, భాషాభేదాలు అవసరం లేదు. ఆటను ఆటగా చూడాలనే ఆలోచన ఎవరికీ లేదు. గతంలో మెహబూబ్ కూడా కమ్యూనిటీ వోటింగు చర్చకు తెరలేపాడు. లాస్ట్‌కు తనే ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.ఐపీఎల్లో ఇలాంటివేం లేదేఇక్కడ కన్నడ, తెలుగు అనే ప్రాంతీయతతో పనేంటి..? ఐపీఎల్ మాదిరి బిగ్‌బాస్ కూడా ఒక గేమ్‌లా అనుకోవడమే బెటర్. ఐపీఎల్లో నగరాల పేర్లతో టీమ్స్ ఉన్నాయి. అనేక దేశాల నుంచి క్రికెటర్లు ఆయా జట్టులో ఉన్నారు. అక్కడ మనం ప్రాంతం, దేశం, కులం, భాష అనే తేడా లేకుండా చూస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇలాంటి అభిప్రాయం రాదేమో..గత సీజన్ల నుంచి ఇదే ట్రోలింగ్ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొక పాయింట్ ఉంది. కన్నడ, కన్నడ అంటూ తనూజ గేమ్‌ను టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా యష్మి, శోభా శెట్టి, ప్రేరణ, నిఖిల్, పృథ్వి వంటి వారు కూడా ఇదే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. వీళ్లందరూ కూడా చక్కగా తెలుగు మట్లాడుతారు. వాళ్లు అవకాశాలు అందిపుచ్చుకుని నటించేది, ఆధారపడి జీవిస్తుంది తెలుగు గడ్డపైనే.. వారికి ఆధారం కూడా తెలుగు సీరియళ్లే.. వాళ్లందరూ ఇదే విషయం పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. గేమ్ పక్కట్టి..కానీ, సోషల్‌మీడియాలో ఆవేశం, దూకుడు, పిచ్చి కూతలతో పీఆర్ టీమ్స్ వారిని ట్రోలింగ్ చేస్తున్నాయి. గత సీజన్లో శోభాశెట్టి, ప్రియాంక, అమర్‌దీప్‌లను స్టార్‌మా బ్యాచ్ అని ముద్రవేసి శివాజీ టార్గెట్ చేశారు. బయట తన పీఆర్ టీమ్ ఆటతో పనిలేకుండా ఆ గ్రూప్‌పై ఇలాంటి ఎదురుదాడితోనే విరుచుకుపడింది. పీఆర్ టీమ్‌లకు గేమ్‌తో పనిలేదు. ఇదేం బాగోలేదుకేవలం ఆడవాళ్లను అవమానించేందుకే ఉన్నామనేలా సెకనుకొక కామెంట్‌తో రెచ్చిపోతున్నారు. తమ కంటెస్టెంట్లో పాజిటివ్‌ను వెతుక్కుని హైలైట్ చేసుకోవడానికి బదులు అవతలివారిని నెగెటివ్ చేయడంపైనే స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. కానీ, ఇలా కుల, ప్రాంతీయ బేధాలు తీసుకురావడం ఏమాత్రం సబబు కాదని బిగ్‌బాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు. View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) Mana Telaga Caste vadu kabatti Kalyan ki votes veyyandi ani beg chesukuntunnaru Caste Card use chesi ...🤮🤮Matladuthundhi Telaga Community President anta 👇👇#BiggBossTelugu9 #KalyanPadala pic.twitter.com/RIwmqK9pga— Arachakame (@Arachakame) December 7, 2025 -
కల్యాణ్ డ్యూటీ చేసేది మాతోనే.. తనను తొలగించలేదు!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే ఉంది. అయితే తనూజ కన్నడ అమ్మాయి అని ట్రోల్ చేస్తుంటే పవన్ కల్యాణ్ పడాల అసలు ఆర్మీ జవానే కాదని విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్.. ఇండియన్ ఆర్మీలో లేడని సీఆర్పీఎఫ్ (కేంద్ర రిజర్వు పోలీస్ దళం) అని ఓ సుందర్ అనే జవాన్ ఓ వీడియో చేశారు. కల్యాణ్ ఫ్రెండ్ క్లారిటీఅంతేకాకుండా కల్యాణ్ బయటకు వచ్చి 90 రోజులు అయిపోయింది కాబట్టి అతడిని విధుల నుంచి కూడా తొలగించి ఉంటారని పేర్కొన్నారు. ఈ వివాదంపై పవన్ కల్యాణ్ ఫ్రెండ్, సీఆర్పీఎఫ్ పోలీస్ మణికంఠ స్పందించాడు. కల్యాణ్ పడాలను ఎవరూ విధుల్లో నుంచి తీసేయలేదు. పర్మిషన్ తీసుకునే బిగ్‌బాస్‌కు వచ్చాడు. పెట్టిన లీవులన్నీ అయిపోయినా సరే ఏదైనా అత్యవసరం ఉందంటే దాన్ని పొడిగిస్తారు. కల్యాణ్‌ను తొలగించలేదుమాతో పాటు డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి మాకు తెలుసు.. తనను తీసేయలేదు. తనను తీసేయాలంటే అతడి సంతకం కచ్చితంగా ఉండాలి. కల్యాణ్ వెళ్లిపోవాలన్నా సరే.. సోల్జర్ను తొలగించడం అంత ఈజీ అయితే కాదు. దానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. పవన్ కల్యాణ్.. మొదట్లో తాను ఒక సోల్జర్ అని చెప్పుకున్నాడు. కానీ ఈ జర్నీలో తనెప్పుడూ సోల్జర్ అని చెప్పి, ఓట్లేయమని అడుక్కోలేదు. నాగార్జున అడిగితేనే..బిగ్‌బాస్ షోలో తన గేమ్, ప్రవర్తన చూసి ఓట్లేయండి. అతడెప్పుడూ సోల్జర్ అని చెప్పి సింపతీ కార్డు ఉపయోగించలేదు. నాగార్జున సార్.. కల్యాణ్, ఒకసారి సెల్యూట్ కొట్టి చూపించు అని అడిగాడు. అప్పుడు మాత్రమే కల్యాణ్ సెల్యూట్ కొట్టి చూపించాడు. అంతే తప్ప అందులో ఏం లేదు. తనను బ్యాడ్ చేయకండి. తను చాలా బాగా ఆడుతున్నాడు అని పేర్కొన్నారు. ఈ వీడియోను పవన్ కల్యాణ్ టీమ్ అతడి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.యూటర్న్అలాగే కల్యాణ్ (Pawan Kalyan Padala)ను విమర్శించిన ఎస్జే సుందర్ అనే జవాన్ సైతం యూటర్న్ తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీ అయినా, సీఆర్పీఎఫ్ అయినా, ఏ డిఫెన్స్ ఫోర్స్ అయినా.. చేసేది దేశసేవే. వన్స్ ఎ సోల్జర్.. ఆల్వేస్ సోల్జర్. వీలైతే గెలిపించండి అని వీడియో చేశారు. మొత్తానికి ఈ రెండు వీడియోలతో కల్యాణ్‌పై వివాదానికి ఫుల్స్టాప్ పడి, నెగెటివిటీ తగ్గుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. కాగా సీఆ్పీఎఫ్.. దేశ అంత్గత భద్రతను కాపాడుతుంది. శాంతి భద్రతల విధుల్లో, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో సీఆర్పీఎఫ్ను వినియోగిస్తారు. View this post on Instagram A post shared by Pavan Kalyan Padala (@kalyanpadala881) View this post on Instagram A post shared by Sundara Rao Jadde (@sj_______sundar) -
ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి
ఇమ్యూనిటీ + ఓట్ అప్పీల్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. లీడర్ బోర్డులో మొదటి స్థానంలో నిలబడి ప్రభంజనం సృష్టించిన ఇమ్మాన్యుయేల్ అందరికంటే మొదటగా ఓట్ అప్పీల్ గెలిచాడు. ఇప్పుడు మరో ఓట్ అప్పీల్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.బాల్ గేమ్అందులో సంజనా, కల్యాణ్ సంచాలకులుగా ఉండగా మిగతావారు గేమ్స్ ఆడారు. సంచాలకులు విసిరే బాల్స్‌ను తమ జంబో బ్యాగుల్లో పడేలా చూసుకోవాలి. ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు సమాచారం. ఈ గేమ్ అయిపోయాక భరణి.. సుమన్‌తో మాట్లాడుతూ.. ఎంత దారుణం.. తనూజ కూర్చో అంటే (కల్యాణ్) కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిల్చుంటున్నాడు. భరణిపై సెటైర్స్తనూజ ఎక్కువ కమాండ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అని ఫీలయ్యాడు. ఈ ప్రోమో కింద కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. దివ్య మిమ్మల్ని కమాండ్ చేసినప్పుడు ఏమైపోయారు? అని భరణిపై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో తనూజ ఓట్ అప్పీల్ గెలిచినట్లు భోగట్టా! చదవండి: ఇమ్మాన్యుయేల్ ప్రభంజనం.. టాప్5లో ఉంచమని రిక్వెస్ట్ -
బిగ్‌బాస్ హౌస్‌లో ఆడియన్స్.. టాప్ 5కి చేర్చండి అన్న ఇమ్మూ
ఇది ఫెయిర్ కాదు బిగ్‌బాస్ పేరిట హౌస్‌లో ఇమ్యూనిటీ చాలెంజ్ నడుస్తోంది. ఇప్పటికే ఓ గేమ్ పూర్తవగా లేటెస్ట్ ఎపిసోడ్లో మరో రెండు గేమ్స్ పెట్టారు. అలాగే బిగ్‌బాస్ ప్రియులు హౌస్‌లోకి వెళ్లి మాట్లాడారు. ఆ విశేషాలేంటో మంగళవారం (డిసెంబర్ 9వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాకు సీక్రెట్ టాస్క్మూడుసార్లు జైలు నుంచి బయటకు రావాలని సంజనాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో ఆమె తెలివిగా ఆరోగ్యం బాలేదంటూ మూడుసార్లు జైలు ఓపెన్ చేయించింది. అలా ఆమె జైలు జీవితం రద్దవడంతో పాటు ఏ గేమ్ ఆడకుండానే 20 పాయింట్లు గెలుచుకుంది. ఇక ఇమ్యూనిటీ రేసులో భాగంగా రెండో గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో ఇమ్మూ గెలవగా డిమాన్ పవన్ రెండో స్థానంలో నిలిచాడు. సుమన్, తనూజ, సంజనా, భరణి తర్వాతి నాలుగు స్థానాల్లో నిలిచారు.గేమ్ నుంచి తప్పించే ఛాన్స్మూడో గేమ్‌లో ఒకరు ఆడకుండా సైడ్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్. ఇమ్మూ.. సంజనాను పక్కకి పిలిచి అదిరిపోయే సలహా ఇచ్చాడు. వాళ్లు ముగ్గురూ (భరణి, తనూజ, సుమన్) కచ్చితంగా మా ఇద్దరి (పవన్, ఇమ్మ)లో ఒకరి పేరు చెప్తారు. కాబట్టి నువ్వు ఆ ముగ్గురిలో ఒకరి పేరు చెప్తే, నేను, పవన్, కల్యాణ్ కూడా అదే చెప్తాం. దీనివల్ల లీడర్ బోర్డులో చివర్లో ఉన్న నువ్వు ముందుకొస్తావ్ అని ఐడియా ఇచ్చాడు. కానీ, సంజనా వింటేగా.. నేను నీ పేరు కాదు, పవన్ పేరు చెప్తున్నా అంది.ప్లేటు తిప్పేసిన సంజనానువ్వు పవన్ పేరు చెప్తే.. వాళ్లంతా నా పేరు చెప్తారు, అలా నేను బలవ్వాల్సి వస్తుంది అని మొత్తుకున్నా ఆమె వినిపించుకోలేదు. దీంతో భరణి, సుమన్, తనూజ.. ఇమ్మూ అనుకున్నారు. కానీ సంజనా ఒక్కరే డిమాన్ పవన్ పేరు చెప్పింది. పవన్, కల్యాణ్.. సంజనా పేరు చెప్పారు. దీంతో ఇమ్మూ.. తనను కాపాడుకోవడం కోసం సంజనా పేరు చెప్పక తప్పదన్నాడు. అలాగైతే తాను డేంజర్లో పడతానని అర్థమైన సంజనా.. వెంటనే తన నిర్ణయం మార్చుకుంది. తనూజ వర్సెస్ సంజనాపవన్కు బదులుగా ఇమ్మూని తీసేస్తానంది. అందుకు తనూజ ఒప్పుకోలేదు. అలాగైతే నేనూ నా నిర్ణయం మార్చుకుంటా.. అంటూ సంజనా పేరు చెప్పింది. ఇక్కడ వీళ్లిద్దరికీ గొడవ జరిగింది. చివరకు ఇమ్మాన్యుయేల్.. సంజనా పేరు చెప్పాడు. అలా సంజనాకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె నెక్స్ట్ గేమ్ ఆడటానికి వీల్లేదని బిగ్‌బాస్ ప్రకటించాడు. ప్రస్తుతానికి లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్న ఇమ్మూ, పవన్.. గార్డెన్ ఏరియాలోకి వచ్చారు.ఇమ్మూ ఓట్ అప్పీల్వీరి కోసం కొందరు ప్రేక్షకులు బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చారు. మెజారిటీ జనం ఇమ్మూ (Emmanuel) ఓట్ అప్పీల్ గెల్చుకోవాలని కోరారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు నాకు ఓటేస్తూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మూడుసార్లు కెప్టెన్ అయ్యాను. ఇంట్లోని పరిస్థితులను తట్టుకుని అందర్నీ నవ్విస్తున్నాను. వీలైనన్ని గేమ్స్ గెల్చుకుంటూ వచ్చాను. ఓట్ అప్పీల్ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క. దయచేసి నాకు ఓటేయండి. ఒక్క ఎంటర్టైనర్ అయినా కప్పు గెలవాలని ఆడుకుంటూ వచ్చాను. నాకు ఓటేసి టాప్ 5లో ఉంచుతారని అనుకుంటున్నాను అని ఓట్ అప్పీల్ అడిగాడు. తర్వాత ప్రేక్షకులతో కాసేపు చిట్‌చాట్ చేశాడు. కప్పు గెలవగానే ఫస్ట్ అమ్మ చేతికి ఇస్తానని, తర్వాత ప్రేయసి చేతిలో పెడతానని చెప్పాడు.చదవండి: షూటింగ్‌కు ఫారెస్ట్ పోదాం చలోచలో -
పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు
ఏంటో.. బిగ్‌బాస్ షోలో ఒక్క సీజన్లో ఒక్కో కార్డు వాడుతున్నారు. ఏడో సీన్లో రైతు బిడ్డ.. జై కిసాన్ అంటూ పల్లవి ప్రశాంత్‌ను పైకి లేపారు. ఈ సీజన్లో పవన్ కల్యాణ్‌ను ఆర్మీ జవాను.. జై జవాన్ అంటూ బోలెడంత హైప్ ఇస్తున్నారు. ఆఖరికి నాగార్జున సైతం రెండుసార్లు కల్యాణ్‌కు ఆర్మీ సెల్యూట్ చేశాడు. అతడు కూడా హోస్ట్‌కు రివర్స్‌లో సెల్యూట్ చేశాడు.డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారుఅయితే కల్యాణ్ ఆర్మీ జవానే కాదంటున్నాడో సైనికుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్జే సుందర్ అనే జవాన్ మాట్లాడుతూ.. 89 రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడు. వారిని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. కల్యాణ్ బిగ్‌బాస్‌కు వచ్చి 90 రోజులవుతోంది. అంటే అతడిని డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారు. ఈరోజుతో అతడు సోల్జర్ ఐడెంటిటీని కోల్పోయాడు. ఇప్పుడతడు కామన్ మ్యాన్ మాత్రమే!సెల్యూట్ కొట్టరు మరో ముఖ్య విషయం.. అతడు ఇండియన్ ఆర్మీ కాదు, సీఆర్పీఎఫ్ అని పేర్కొన్నారు. దీనిపై కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆయన లీవ్ పెట్టుకునే వచ్చాడు, మీరు కావాలనే నెగెటివ్ చేస్తున్నారని ఆగ్రహించారు. దీనికి సుందర్ స్పందిస్తూ.. నిజమైన ఆర్మీ జవాన్ ఎప్పుడూ బిగ్‌బాస్ లాంటి షోలో సెల్యూట్ కొట్టరు అని క్లారిటీ ఇచ్చారు. పెళ్లికే లీవ్ ఇవ్వరుమరో వీడియోలో ఆయన మాట్లాడుతూ.. సైనికుడికి లీవ్ దొరకడం చాలా కష్టం. తన పెళ్లి కోసం లీవ్ అడిగితే కూడా.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమంత అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు అని చెప్తుంటారు. మరో విషయం.. కల్యాణ్ ముందే రిజైన్ చేసి ఉండాలి, లేదంటే ఇప్పుడైనా తనన డిస్మిస్ చేసుండాలి. ఎవరికి పడితే వారికి సెల్యూటా?ఆయన మూడు సంవత్సరాలు సేవలందించానని చెప్పాడు. కానీ, అది నిజం కాదు.. తొమ్మిది నెలలు ట్రైనింగ్, ఆరు నెలలపాటు డ్యూటీ చేసి వచ్చేశాడు. సోల్జర్ భారతీయ జెండాకు లేదా కమాండర్‌కు మాత్రమే సెల్యూట్ కొడతాడు. ఎవరికి పడితే వారికి కాదు అన్నారు. మరి కల్యాణ్ బయటకు వచ్చాక ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడో చూడాలి! View this post on Instagram A post shared by jadde sundara Rao (@sj_______sundar) చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్.. రజనీకాంత్ చెప్పిన విశేషాలు -
నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా..
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ కల్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా అందర్నీ ఈ వారం నామినేషన్లో వేశాడు బిగ్‌బాస్. వీరిలో ఎవరు ఎక్కువ గేమ్స్ గెలిచి లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉంటారో వారికి ఇమ్యూనిటీ గెలిచే ఛాన్స్ ఉంది. నిజంగా ఇమ్యూనిటీ గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ వీక్‌లో అడుగుపెట్టినట్లే లెక్క! మరి ఆ గేమ్స్ ఎలా జరిగాయో సోమవారం (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..మనీ బాక్స్సడన్గా బిగ్‌బాస్‌కు ఏమనిపించిందో ఏమో కానీ, ఇంతవరకు కెప్టెన్ అవలేదు కదా.. అంటూ భరణిని కెప్టెన్ చేశాడు. కాకపోతే ఇమ్యూనిటీ లభించదని నొక్కిచెప్పాడు. తర్వాత గార్డెన్ ఏరియాలో బాక్సులు పెట్టారు. అందులో జీరో నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు అంకెలు రాసిపెట్టారు. ఇప్పటివరకు కంటెస్టెంట్ల జర్నీని బట్టి వారికి బాక్సులు ఇవ్వాల్సి ఉందన్నాడు. ఈ పాయింట్స్ విజేత ప్రైజ్‌మనీపై ఎఫెక్ట్ చూపిస్తాయన్నాడు.సంజనాకు అన్యాయం?అలా డిమాన్.. సుమన్‌కు లక్ష ఇద్దామనుకోగా అందుకు అందరూ ఓకే చెప్పారు. తర్వాత భరణి.. తనూజకు రూ.2 లక్షలు ఇచ్చాడు. అనంతరం కల్యాణ్ ఇమ్మూకి రూ.2.5 లక్షలు రాసి ఉన్న బాక్స్ ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు రూ.1.50 లక్షల బాక్స్ ఇస్తే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. అనంతరం సుమన్.. డిమాన్‌కు రూ.1.50 లక్షలిచ్చాడు. చివరగా భరణి, సంజన మిగిలారు. జైలుకు సంజనాసంజనాకు రూ.50 వేలు రావాలని ఇమ్మూ, పవన్ సపోర్ట్ చేస్తే మిగిలినవారు భరణికి సపోర్ట్ చేశారు. మెజారిటీ అతడివైపే ఉండటంతో భరణికి రూ.50 వేలు దక్కగా.. సంజనాకు జీరో లభించింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను జైల్లో వేశాడు. తనకు జీరో రావడాన్ని సంజనా తట్టుకోలేకపోయింది. తల్లిలా ఆలోచించి ఎమోషనల్ ఫూల్ అవుతున్నా.. ప్రతివారం నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటూ ఏడ్చేసింది.గెలిచేసిన ఇమ్మూతర్వాత ఈవారం ఇమ్యూనిటీ కోసం కొన్ని ఛాలెంజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలిపాడు బిగ్‌బాస్. లీడర్ బోర్డులో టాప్‌లో ఉండేవారు నామినేషన్స్ నుంచి సేవ్ అవడంతోపాటు ప్రేక్షకులను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం సంపాదిస్తారు. మొదటి గేమ్‌లో సంజనా పాల్గొనేందుకు వీల్లేదన్నాడు. అలా బిగ్‌బాస్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ 'స్వింగ్ జరా'లో ఇమ్మూ గెలవగా.. భరణి, పవన్, తనూజ, సుమన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మరి తర్వాతి టాస్కుల్లో ఎవరు గెలిచారు? ఎవరు టాప్‌లో ఉన్నారో చూడాలి! -
తల్లయిన బిగ్‌బాస్ సోనియా.. పోస్ట్ వైరల్
ప్రస్తుత బిగ్‌బాస్ షో చివరకొచ్చేసింది. మరో రెండు వారాల్లో పూర్తి కానుంది. ఇకపోతే గత సీజన్లో పాల్గొని ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న కంటెస్టెంట్ సోనియా ఆకుల. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. బిగ్‌బాస్ షోలో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. తల్లయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.గత సీజన్లో పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీతో సోనియా వ్యవహరించింది. అయితే చివరివరకు ఉంటుందనుకుంటే మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. బయటకొచ్చిన వెంటనే ఎంటర్ప్రెన్యూర్ యష్‌తో నిశ్చితార్థం చేసుకుంది. గతేడాది ఇదే టైంకి పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్)పెళ్లయిన కొన్ని నెలల తర్వాత సోనియా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఈ రోజు ఈమెకు ఆడపిల్ల పుట్టింది. పాపకు శిఖా అని పేరు కూడా పెట్టినట్లు సోనియా భర్త యష్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు సోనియాకు విషెస్ చెబుతున్నారు.అయితే యష్‌కి గతంలోనే పెళ్లయింది. విరాట్ అని ఓ బాబు కూడా ఉన్నాడు. కాకపోతే చాన్నాళ్ల క్రితమే భార్యకు విడాకులిచ్చేశాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. టాలీవుడ్లో 'జార్జ్ రెడ్డి', 'కరోనా వైరస్', 'ఆశా ఎన్కౌంటర్' చిత్రాల్లో నటించింది.(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్) View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) -
కొత్త కెప్టెన్‌గా భరణి.. ఆమె జైలుకు!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రెండు వారాల్లో ఈ సీజన్‌కు శుభం కార్డు పడనుంది. రీతూ ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మిగిలారు. సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజనా, తనూజ, కల్యాణ్, పవన్.. వీరందరూ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు. కానీ భరణి మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. కూతురి కోరిక నెరవేరినట్లేఫ్యామిలీ వీక్‌లో వచ్చిన కూతురు కూడా కెప్టెన్ అవు డాడీ అని అడిగింది. ఆమె కోరిక తీర్చలేకపోయినందుకు చాలా ఫీలయ్యాడు భరణి. కానీ ఎట్టకేలకు ఆమె కోరిక నెరవేర్చినట్లు కనిపిస్తోంది. తాజా ప్రోమోలో భరణి చేతికి కెప్టెన్ బ్యాండ్ ఉంది. అంటే ఈ పద్నాలుగో వారం భరణి కెప్టెన్ అయ్యాడన్నమాట! జైలుకు సంజనాఅలాగే బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్‌లో సంజనా (Sanjana Galrani)కు జీరో ఉన్న బాక్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను జైల్లో వేశారని భోగట్టా! అదేంటో కానీ మొట్టమొదటిసారి ఇమ్మాన్యుయేల్.. సంజనా కోసం స్టాండ్ తీసుకున్నాడు. అయితే హౌస్ అందరూ దాన్ని వ్యతిరేకించడంతో ఆమె చేతికి జీరో బాక్స్ వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: -
రీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! అదే ప్లస్సు, మైనస్!
అమ్మాయి నవ్వు ఎవరైనా బాగుందంటారు. కానీ రీతూ నవ్వు చూడగానే అమ్మో, ఇదేం నవ్వు అని జడుసుకుంటారు. మొదట్లో భయపడ్డా రానురానూ అలవాటైపోయి.. తను అరవడం, ఏడవడం కన్నా నవ్వితేనే బాగుందన్నారు. ఎలాగైనా టాప్ 5లో ఉండాలనుకుంది రీతూ.. కానీ బిగ్‌బాస్ తనను అక్కడివరకు రానివ్వకుండానే అడ్డుకట్ట వేశాడు. 13వ వారంలో ఎలిమినేట్ చేసి పంపాడు. రీతూ ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం..మొదట కల్యాణ్.. తర్వాతరీతూ టామ్ బాయ్‌లా ఉంటుంది. ఆడమగ అన్న తేడా లేకుండా అందరితోనూ కలివిడిగా మాట్లాడుతుంది. మొదట్లో కళ్యాణ్‌తో క్లోజ్‌గా ఉంది. తర్వాత పవన్‌కు దగ్గరైంది. ఈమె ప్రవర్తన చూసి జనాలు కూడా తిట్టుకున్నారు. ఆడటానికి వచ్చిందా? లవ్ట్రాకులు పెట్టుకునేందుకు వచ్చిందా? ఇలాంటివాళ్లను పంపించేయడమే మేలు అని అభిప్రాయపడ్డారు. కానీ రీతూ అదంతా కావాలని చేసిందైతే కాదని నెమ్మదిగా జనాలు రియలైజ్ అయ్యారు.కృత్రిమంగా మొదలైనప్పటికీ..బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ పెట్టుకుంటే అటెన్షన్, ఫేమ్ వస్తుందని ఆలోచించింది రీతూ (Rithu Chowdary) కాదు, డిమాన్ పవన్. ఈ విషయాన్ని పవన్ కాలేజ్‌మేట్, కంటెస్టెంట్ శ్రీజ కూడా వెల్లడించింది. అలా మొదట్లో వీరి ట్రాక్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నా రానురానూ వాళ్లిద్దరికీ తెలియకుండానే మరింత క్లోజ్ అయ్యారు. ఒకరికోసం ఒకరు నిలబడ్డ ప్రతిసారి హౌస్మేట్స్ టార్గెట్ చేసి మాటలనేవారు. అప్పుడు కూడా పవన్ కంటే రీతూయే ఎక్కువ స్టాండ్ తీసుకునేది.ఇలాగే ఉంటా!ఫైర్స్ట్రామ్గా వచ్చిన మాధురి అయితే మీది అన్‌హెల్తీ రిలేషన్షిప్ అని ముద్రేసింది. సంజనా అయితే.. అలా ఇద్దరూ అతుక్కుపోవడం చూడటానికి బాగోలేదు అంది. అయినా సరే రీతూ వెనక్కు తగ్గలేదు. తన స్నేహం చూసేవాళ్లకు తప్పుగా అనిపిస్తే తానేం చేయలేననంది. ఇక్కడ జనాలకు ఆ అమ్మాయి నచ్చేసింది. ఎవరైనా క్యారెక్టర్‌ను తప్పుపడుతున్నారనగానే కచ్చితంగా తమ తీరును ఎంతోకొంత మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ రీతూ అలాంటిదేం చేయలేదు. నేనింతే అంటూ మనసుకు నచ్చిందే చేసింది. పవన్ కోసం నిలబడింది. అలా తన లవ్ ట్రాక్.. తనకు కొంత ప్లస్ అయితే మరికొంత మైనస్ అయింది.తనపై తనకు నమ్మకం తక్కువటికెట్ టు ఫినాలేలో బాగానే ఆడింది కానీ మొదటి నుంచి గేమ్‌లో పెద్దగా ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. మొదటి నుంచి తనను తాను నమ్మకుండా అవతలివారిపైనే ఎక్కువ ఆధారపడింది. ఆత్మవిశ్వాసం పక్కనపెట్టి అందరినీ బతిమాలుకోవడం చూసేవారికి నచ్చలేదు. ఇకపోతే టికెట్ టు ఫినాలేలో సుమన్ కూడా బాగా ఆడాడు. దీంతో అతడి ఓటింగ్ పెరగడం రీతూకి మైనస్ అయింది. నిజానికి సుమన్ ఎలిమినేట్ అవుతాడని అందరూ ఫిక్సయ్యారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా అతడి ప్రభంజనానికి రీతూ బలైపోయింది!చదవండి: టాప్ 5 లో లేను, ఓడిపోయానంటూ ఏడ్చేసిన రీతూ చౌదరి -
ఓడిపోయానంటూ ఏడ్చిన రీతూ.. టాప్ 5 వీళ్లేనంటూ..
బిగ్‌బాస్‌కు వచ్చినవాళ్లు అంతో ఇంతో నెగెటివిటీ మూటగట్టుకుని వెళ్లిపోతుంటారు. కానీ రీతూ మాత్రం నెగెటివిటీతో వచ్చి పాజిటివ్‌గా బయటకు వెళ్లింది. డిమాన్‌తో తన అనుబంధంపై జనాల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఎవరేం అనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ నిజాయితీగా ఉందని ఫీలయ్యారు. అలా ఆమెకు కనెక్ట్ అయ్యారు. ఫైనల్స్‌లో ఉంటుందనుకుంటే ఊహించని విధంగా డిసెంబర్ 7న ఎలిమినేట్ అయింది. మరి ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం..టాప్ 5లో ఉండట్లే, ఓడిపోయా..రీతూ ఎలిమినేట్ అనగానే తనూజ షాకైపోగా.. డిమాన్ పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ, రీతూ ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. టాప్ 5లో ఉండట్లేదు, ఓడిపోయానని చిన్నపిల్లలా ఏడ్చింది. పవన్‌ను అందరూ జాగ్రత్తగా చూసుకోండి, రెండు వారాలు వాడితో ఉండండి, మాట్లాడండి అంది. కల్యాణ్, నువ్వు ఎక్కువగా మాట్లాడట్లేదని పవన్ ఫీలవుతున్నాడు.. మాట్లాడు అని సూచించింది. వెళ్లిపోయేముందు రీతూ చెవిలో పవన్ కప్పు గెలిచి వస్తా.. అని గుసగుసలాడాడు. దీంతో ఆమె బాగా ఆడు అని మోటివేట చేసింది.రీతూ టాప్ 5 ఇదే..తర్వాత స్టేజీపైకి వెళ్లిన రీతూ (Rithu Chowdary).. తన అభిప్రాయం ప్రకారం హౌస్‌మేట్స్‌ను టాప్ 7లో పెట్టింది. పవన్‌ను ఫస్ట్ ప్లేస్‌లో, తనూజ, ఇమ్మాన్యుయేల్‌ను రెండు, మూడు స్థానాల్లో, కల్యాణ్‌ను నాలుగో స్థానంలో పెట్టింది. ఏదైనా హర్ట్ చేసుంటే సారీ అంటూ సంజనను ఐదో స్థానంలో పెట్టింది. ఆరో స్థానంలో సుమన్, ఏడో స్థానంలో భరణిని పెట్టింది.చదవండి: రీతూ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే? -
బిగ్‌బాస్ నుంచి 'రీతూ' ఎలిమినేట్.. విన్నర్ రేంజ్లో రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లోకి వెళ్తున్నప్పటికీ ఆమె చాలా నెగిటివిటీతోనే వెళ్లారు. అయితే, 13 వారాల పాటు తన గేమ్‌ను చూసిన వారందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆమెపై ఇప్పటి వరకు ఉన్న నెగిటివిటీ చాలావరకు తగ్గిందని చెప్పవచ్చు. ఈ వారం నామినేషన్స్‌లో తనూజ, భరణి, డిమోన్ పవన్, సంజన, రీతూ చౌదరి, సుమన్‌శెట్టి ఉండగా ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన రీతూ ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. డిసెంబర్ 21న ఫైనల్ జరగనుంది.రీతూ రెమ్యునరేషన్రీతూ బిగ్‌బాస్‌లోకి వెళ్లక ముందు తనపై ట్రోలింగ్, నెగిటివిటీ వల్ల ఆమె కేవలం రెండు వారాలు మాత్రమే ఉంటారని నెటిజన్లు భావించారు. కానీ, తనలోని గేమ్ ఛాలెంజ్ ఏకంగా 13 వారాలపాటు హౌస్‌లో ఉండేలా చేసింది. అయితే, మంచి రెమ్యునరేషన్‌తోనే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చారు. వారానికి రూ. 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ. 32 లక్షల మేరకు రెమ్యునరేషన్‌గా పొందినట్లు సమాచారం. ఒక విన్నర్ అందుకునే ప్రైజ్ మనీకి దగ్గరగా రీతూ రెమ్యునరేషన్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రీతూ కన్నీళ్లురీతూ ఎలిమినేషన్ తర్వాత డిమాన్ పవన్‌తో పాటు హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. పవన్‌ను హగ్ చేసుకుని రీతూ కన్నీళ్లు పెట్టుకుంది బయటకు వచ్చిన రీతూ నాగార్జునతో పాటుగా తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. టాప్-5 ఉండాలని కోరుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఇలా రావడంతో చాలా బాధపడ్డానన్నారు.నెగిటివిటీని దాటుకుని ఎలిమినేట్బిగ్బాస్ సీజన్-9లో రీతూ ప్రయాణం చూస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి తనపై ఫుల్ నెగిటివిటీ ఉంది. నెటిజన్లు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ అంశానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా తనేంటో ప్రేక్షకులకు చూపించాలని వెళ్లారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టాస్కుల విషయంలో రీతూ దుమ్మురేపింది. ఆమె పడుతున్న కష్టం, అల్లరి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం జనాలకి అర్థమైంది. ఉన్న లేడీ కంటెస్టెంట్లో రీతూ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకున్నారు. ఫైనల్‌గా తనపై ఉన్న నెగిటివిటీని కాస్త తగ్గించుకునే ఎలిమినేట్ అయ్యారు. -
టార్గెట్ 'తనూజ'.. బిగ్‌బాస్ ఇదేం 'ట్రై యాంగిల్'
బిగ్‌బాస్ తెలుగు 9 చివరిదశకు చేరుకుంది. నేడు జరగనున్న ఎలిమినేషన్ తర్వాత టాప్-5లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరు అనేది తేలనుంది. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తనూజను కావాలనే బిగ్‌బాస్ టీమ్ టార్గెట్ చేస్తుందని స్టార్ మా విడుదల చేస్తున్న ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, బిగ్‌బాస్ టీమ్ వాటిని కూడా హైడ్ చేయడం లేదా తొలగించడం చేస్తున్నట్లు స్క్రీన్ షాట్స్ కూడా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.ట్రై యాంగిల్ (త్రిభుజాకారం)తో రచ్చబిగ్బాస్ గేమ్‌లో భాగంగా ట్రై యాంగిల్ ఆకారంలో ఉన్న వస్తువును ఒకే వరుసలో ఉంచాలని, అవన్నీ ఒకే సైజ్‌లో ఉండాలని రూల్ పెట్టారు. అయితే, రీతూ ఎంచుకున్న వస్తువు ట్రై యాంగిల్లో లేదని మొదట తనూజ పాయింట్ పెడుతుంది. దీంతో అదే గేమ్‌లో రీతూతో తలపడి ఓడిపోయిన భరణి ఫైర్ అయిపోతాడు. కానీ, తనూజ ఎక్కడా కూడా నోరు జారలేదు. తన సందేహం మాత్రమే చెప్పింది. అదే బిగ్‌బాస్‌కు నచ్చినట్లు లేదు.బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లుట్రై యాంగిల్ (త్రిభుజాకారం) పాయింట్ గురించి ఈ శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కూడా మాట్లాడారు. అయితే, తనూజను టార్గెట్ చేస్తూ బిగ్‌బాస్ టీమ్ రంగంలోకి దిగిందని ఆరోపణలు వస్తున్నాయి. తనూజ తప్పులేకున్నా సరే నాగార్జున చేత అనేక మాటలు అనిపించి బిగ్‌బాస్ టీమ్ రెచ్చిపోయిందని అంటున్నారు. గ్రూప్ గేమ్ ఆడిన ఇమ్ము, కల్యాణ్‌ల గురించి నాగ్ ప్రశ్నించలేదు. రింగ్ దాచేసిన రీతూను ఒక్కమాట కూడా అనలేదు. కానీ, తనూజ తప్పులు లేకున్నా సరే ఆమెను బిగ్‌బాస్ టార్గెట్ చేశారని పోస్టులు చేశారు. దీంతో తనూజ పేరు ఏకంగా ట్రెడింగ్‌లోకి వచ్చేసింది. ట్రై యాంగిల్‌ను తప్పుగా రెడీ చేశారని నాగార్జునే చెప్పారు. అలాంటప్పుడు తనూజను తిట్టడం ఎందుకు అంటూ నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు కూడా భగ్గుమంటున్నారు. బిగ్‌బాస్ రివ్యూవర్లు కూడా తనూజను కావాలనే టార్గెట్ చేస్తున్నారని చెప్పడం విశేషం. ఒక టాస్క్‌లో కల్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటే .. చాలా ఎమోషనల్ అయ్యావ్ ఎందుకు అని నాగార్జున ప్రశ్నిస్తారు. మరి తనూజ కన్నీళ్లు పెట్టుకుంటే అదేదో చాలాతప్పు అన్నట్లుగా నాగార్జున అనడం ఎందుకు అంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తనూజ చేసిన చిన్నచిన్న తప్పులను వెతికి మరి బిగ్‌బాస్ టీమ్ టార్గెట్ చేస్తుందని అంటున్నారు. చివరకు ప్రోమోలలో కూడా తనూజను తప్పుగా చూపిస్తారని, ఎపిసోడ్స్‌లో చూస్తే ఏమీ ఉండదని అంటున్నారు. ఇదంతా కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్ గేమ్ ఆడుతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. Even reviewer fraternity who worked day&night to pull down #ThanujaPuttaswamy is now talking about how she is being targeted by #BiggBossTelugu9 team to help their blue eyed boy #KalyanPadala Audience are watching & they will stand for Thanuja pic.twitter.com/t8myeDDwEC— VMR (@VMR199507) December 6, 2025Biggboss reviewer on How biggboss targeting Thanuja 🤷🙏#BiggBossTelugu9 #BiggBoss9Telugu #Thanuja #demonpavan #KalyanPadala #Reethu #bharani #SumanShetty #sanjana #Emmanuel pic.twitter.com/caO9luSpU7— Common Man (@commonmanfromTG) December 7, 2025https://x.com/phantom242628/status/1994974214286389755?s=20adi reddy about targeted negative promos on Thanuja by bb team finally he addressed it #thanuja #ThanujaPuttaswamy #BiggBossTelugu9 pic.twitter.com/vE0AjCeL0l— phantom (@phantom242628) November 30, 2025We are also seeing how much more bullying you will do. Tanuja is an example of how difficult it is for a woman to rise up in our India.#BiggBossTelugu9 #Thanuja🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹pic.twitter.com/LGr0XnARS0— karthi (@karthi129867) December 6, 2025 -
పెళ్లి చేసుకున్న తనూజ చెల్లి.. ఫోటో వైరల్
ఇంట్లో పెళ్లంటే ఆ హడావుడి మామూలుగా ఉండవు. అందులోనూ ప్రాణంగా ప్రేమించే చెల్లి పెళ్లంటే ఆ సందడి వేరే లెవల్లో ఉంటుంది. కానీ, ఈ పండగ వాతావరణాన్ని తనూజ మిస్ అయింది. తెలుగు బిగ్‌బాస్ 9లో అడుగుపెట్టిన తనూజ ఎంతోకాలం ఉండననుకుంది. ఇంట్లోవాళ్లు కూడా వెంటనే వచ్చేస్తుందిలే అని పంపించారు. తీరా తన గేమ్‌తో విన్నింగ్ రేస్‌లో ఉంది. 13 వారాలుగా టాప్ ఓటింగ్‌తో దుమ్ము లేపుతోంది.పెళ్లికూతురుకి ఆశీర్వాదంఅయితే కుటుంబాన్ని మాత్రం చాలానే మిస్ అవుతోంది. తను కెప్టెన్ అయినవారమే ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చారు. అలా తనూజ కోసం ఆమె చెల్లి పూజ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. తనను చూడగానే తనూజకు కన్నీళ్లాగలేదు. వరుసకు చెల్లే అయినా తల్లిలా తనూజకు ఏడవద్దని సలహా ఇచ్చింది. 'ఓపక్క పెళ్లి పనులు.. మరోపక్క నువ్వు ఇక్కడ షోలో ఏడుస్తుంటే అక్కడ అమ్మ, అక్క ఏడుస్తున్నారు. నా పెళ్లి విషయం మర్చిపోయింది.వాళ్లని హ్యాండిల్ చేయలేకపోతున్నా.. నా పెళ్లికి కొద్దిరోజులే సమయం ఉంది. అన్నీ హ్యాండిల్ చేయాలి. ప్లీజ్, నువ్వు ఏడవకు' అని బతిమాలింది. 'నువ్వు ఒక్కసారి ఏడిస్తే అమ్మ రెండురోజులు ఏడుస్తుంది. నా పెళ్లి విషయం కూడా మర్చిపోయింది. ప్రతిరోజు బిగ్‌బాస్, రీల్స్ చూస్తుంది.. నువ్వేం చేస్తావో తెలీదు, విన్ అవ్వాలి. నేను ఏది కొన్నా ఫస్ట్ ఫోటో నీకు పెట్టేదాన్ని.. అది మిస్ అవుతున్నా.. అని భావోద్వేగానికి లోనైంది.శుభలేఖలో తనూజ పేరుతర్వాత గార్డెన్ ఏరియాలో చెల్లెల్ని తన చేతులతో పెళ్లికూతుర్ని చేసి ఆశీర్వదించింది. శుభలేఖలో తన పేరు చూసుకుని తనూజ మురిసిపోయింది. తన పెళ్లికి బిగ్‌బాస్ టైటిల్ గిఫ్ట్‌గా కావాలని చెప్పింది. అందుకోసం తనూజ కూడా బాగానే కష్టపడుతోంది. నవంబర్ 23 నాటి ఎపిసోడ్లో తన చెల్లి పెళ్లి జరిగిందన్న తనూజ.. నాగార్జునతో కొత్తజంటకు ఆశీర్వాదాలు ఇప్పించింది.పూజ పెళ్లి వీడియోఅలా నవంబర్ చివరి వారంలో తనూజ చెల్లి పూజ పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు పూజకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత పెద్ద శుభకార్యంలో అక్క లేకపోవడం ఎంతైనా తీరని లోటే అని అభిప్రాయపడుతున్నారు.చదవండి: మనస్సాక్షి లేదా? ప్రజల బాధను అవమానిస్తారా? నటి ఫైర్ -
తనూజకు క్లాస్ పీకిన నాగ్.. వాళ్లు ట్రోఫీకి అనర్హులు!
టికెట్ టు ఫినాలేలో కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను నాగార్జున ఎత్తిచూపాడు. ఇమ్మాన్యుయేల్ తాడు వదిలేయడం వీడియో వేసి చూపించాడు. అలాగే భరణి ట్రయాంగిల్ గోల గురించి చర్చించాడు. అనవసరమైన గొడవ మొదలుపెట్టిందే తనూజ అని క్లాస్ పీకాడు. అలాగే పవన్ ఓడిపోయిన ప్లాంకుల టాస్కు గురించి మాట్లాడుతూ.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రవర్తించావు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టికెట్ టు ఫినాలే గెలుస్తానని చెప్పి ఓడిపోయావ్ అని సెటైర్లు వేశాడు. మరి తర్వాతేం జరిగిందో శనివారం (డిసెంబర్ 6వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సుమన్ అనర్హుడుబిగ్బాస్ ట్రోఫీకి తామెందుకు అర్హులో హౌస్మేట్స్ చెప్పాలన్నాడు. మొదటగా సుమన్.. గేమ్ బాగా ఆడుతున్నాను, ఆ మేరకు ఎఫర్ట్స్ పెడుతున్నాను అన్నాడు. ఆయనకు కప్పు గెలిచే అర్హత లేదని సంజనా, ఇమ్మాన్యుయేల్, రీతూ, పవన్ అభిప్రాయపడ్డారు. తనూజ, భరణి, కల్యాణ్ మాత్రం ఆయనకు గెలిచే అర్హత ఉందన్నారు. ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. జనాలను ఎంటర్టైన్ చేయాలన్నదే నా ఏకైక లక్ష్యం. ఏ సీజన్లోనూ కమెడియన్ గెలవలేదు. ఈ సీజన్లో నేను గెలవాలనుకుంటున్నా అని చెప్పాడు. ఆయన మాటలతో హౌస్మేట్స్ అందరూ ఏకీభవించారు. వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదుతర్వాత భరణి.. నాకు దెబ్బలు తగిలినా సరే ఎక్కడా తగ్గకుండా ఆడాను. కంటెంట్ కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న పవన్‌ను ఓడించాను. కచ్చితంగా కప్పుకు అర్హుడినే అన్నాడు. రీతూ, పవన్ మినహా మిగతా అందరూ ఆయన మాటలతో ఏకీభవించారు. సంజనా.. నేను మాస్క్ వేసుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాను. చూసిందే మాట్లాడాను. నిజాయితీగా ఉన్నాను అని చెప్పగా సుమన్, భరణి, పవన్ ఆమెకు కప్పు గెలిచే అర్హత లేదని భావించారు.కల్యాణ్‌కు ఫుల్ సపోర్ట్పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నా ఇల్లు అనుకున్నాను. ఏ పని చెప్పినా అన్నీ చేశాను. ఎక్కడా మాట తప్పలేదు. బంధాల వల్ల గేమ్ తగ్గిపోతుందని తెలిసినా నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను. అన్ని టాస్కుల్లోనూ బాగానే ఆడాను అని చెప్పుకొచ్చాడు. అతడికి రీతూ, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ మాత్రమే సపోర్ట్ చేశారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. డిసిప్లేన్, డిటర్మినేషన్, డెడికేషన్.. ఈ మూడింటితోపాటు కమిట్మెంట్తో ఆడాను.లేడీ విన్నర్అందరితో బాగున్నా.. జెన్యూన్‌గా ఆడా.. ఎవరికీ అన్యాయం చేయలేదు అని చెప్పగా అందరూ ఇతడు అర్హుడనే తలూపారు. తనూజ మాట్లాడుతూ.. నాకు కుటుంబం, వర్క్ ప్లేస్ తప్ప మిగతాది తెలియదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నానంటే ఇప్పటికీ ఓ కలలా ఉంది. ఎక్కడా ఫేక్‌గా ఉండకుండా జెన్యూన్‌గా ఉన్నాను. నావల్ల అయినంతవరకు ఆడాను. లేడీ విన్నర్ అవ్వాలని, అది నేనే అవాలనుకుంటున్నా అని చెప్పింది. అందరూ ఆమె చెప్పింది కరెక్టేనన్నారు.ముగ్గురికే కప్పు గెలిచే అర్హతరీతూ మాట్లాడుతూ.. ప్రతి గేమ్‌లో ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నాకు ఏదనిపిస్తే అది చేశాను. గెలిచినా, ఓడినా.. ఎలా అయినా ఫైనల్స్‌లో ఉండాలన్న కసితోనే ఆడాను. ఏదో ఒకటి చేసి ముందుకెళ్లాలన్న తపనతోనే ఉన్నాను అని పేర్కొంది. సుమన్, భరణి తప్ప మిగతా అందరూ ఆమెకు అర్హత ఉందని ఓటేశారు. మొత్తానికి ఈ ఓటింగ్‌లో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ మాత్రమే అర్హులంటూ వారికి పూర్తిస్థాయిలో ఓట్లు పడ్డాయి.చదవండి: బిగ్‌బాస్ 9 షాకింగ్ ఎలిమినేషన్.. రీతూ అవుట్ -
బిగ్‌బాస్ 9లో షాకింగ్ ఎలిమినేషన్.. రీతూ ఇంటికి!
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ దాదాపుగా చివరకొచ్చేసింది. ప్రస్తుతం 13వ వారం నడుస్తోంది. అంటే మరో రెండు వారాల్లో షో పూర్తి కానుంది. సరే ఎప్పటిలానే వీకెండ్ వచ్చింది కాబట్టి ఎలిమినేషన్ ఎవరు అవుతారా అని అందరూ ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఈసారి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీళ్లలో నుంచి షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఆమెనే రీతూ చౌదరి.ఈ వారం నామినేషన్స్‌లో తనూజ, భరణి, సంజన, సుమన్ శెట్టి, పవన్, రీతూ చౌదరి ఉన్నారు. గత రెండు మూడు వారాల బట్టి చూసుకుంటే ఓటింగ్ తక్కువగా పడుతున్న సంజన లేదంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోవాలి. కానీ గత వీకెండ్ ఎపిసోడ్లో జరిగిన హంగామా వల్ల లెక్కలన్నీ మారిపోయినట్లు కనిపిస్తోంది. రీతూ-పవన్ మధ్య బంధం గురించి సంజన కొన్ని కామెంట్స్ చేసింది. హోస్ట్ నాగార్జున.. ఎలాగైనా సరే సంజనతో క్షమాపణ చెప్పించాలని చూశాడు. కానీ వల్ల కాలేదు.(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?) గత వీకెండ్లో సంజన చెప్పిన పాయింట్స్‌కి ఆడియెన్స్ ఫిదా అయిపోయారేమో గానీ ఈ వారం ఆమెకు ఓటింగ్ పరంగా టాప్‌కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి బిగ్‌బాస్‌కి అవకాశం లేకుండా అయిపోయింది. ఈ విషయంలో రీతూపై కాస్త నెగిటివిటీ ఏర్పడినట్లు అనిపిస్తుంది. దీంతో ఈసారి ఈమెకు కాస్త ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అలా ఈమెని హౌస్ నుంచి బయటకు పంపేసినట్లు సమాచారం.అయితే రీతూ చౌదరి.. టాప్-5 వరకు వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఓటింగ్ పరంగా కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ గేమ్స్ విషయంలో మాత్రం మిగతా వాళ్లకు మంచి పోటీ ఇచ్చేది. ఫినాలే కంటెండర్‌షిప్ పోటీల్లోనూ చివరివరకు వచ్చింది గానీ విజయం సాధించలేకపోయింది. అలానే పవన్‌తో ఈమె రాసుకుపూసుకు తిరగడం కూడా జనాలకు మొహం మొత్తేసినట్లు ఉంది. ఇలా పలు కారణాల వల్ల బిగ్‌బాస్, రీతూని సాగనంపేసినట్లున్నాడు! (ఇదీ చదవండి: ఏసియన్ పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న నటి ప్రగతి) -
కల్యాణ్‌కు నాగ్ సెల్యూట్.. ఇమ్మూ చీటింగ్ బట్టబయలు!
వీకెండ్లో ముందు ఫైర్ చూపించి, తర్వాత సరదాగా ఉంటాడు కింగ్ నాగార్జున. కానీ, ఈసారి ఫైర్‌ను పక్కనపెట్టేసి అందరితో కబుర్లు చెప్తూ కూల్‌గా కనిపించాడు. ముందుగా పవన్‌ను లేపి అతడి డ్రెస్ బాగుందన్నాడు. అందుకు కారణం లేకపోలేదు. ఇమ్మాన్యుయేల్.. ఆ డ్రెస్‌లో పవన్ మ్యాజిక్ షోలు చేసేవాడిలా ఉన్నాడని కామెడీ చేశాడు. షర్ట్‌లో నుంచి పావురాలు, పాములు తీస్తాడని సెటైర్లు వేశాడు. కల్యాణ్‌కు సెల్యూట్ఆ సంగతిని నాగ్ గుర్తు చేస్తూ కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను అభినందించాడు. అతడు చివరి కెప్టెన్ అయినప్పుడు ఎలాగైతే సెల్యూట్ చేశాడో, ఇప్పుడు కూడా అలాగే మరోసారి సెల్యూట్ చేసి మరీ ప్రశంసించాడు. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో ఇమ్మాన్యుయేల్ చేసిన తప్పును వీడియో వేసి చూపించాడు నాగ్.తప్పును ఎత్తి చూపుతూనే పొగడ్తలుసంజనాతో ఇమ్మూ పోటీపడ్డ టాస్క్ అది. అందులో ఇమ్మాన్యుయేల్ తాడును మధ్యలో ఒకసారి వదిలేశాడు. గేమ్ రూల్స్ ప్రకారం తాడు వదిలేస్తే ఔట్.. కానీ దాన్ని సంచాలక్ రీతూ గమనించకపోయేసరికి అతడే గెలవడం.. అలా తర్వాతి టాస్కులు కూడా గెలిచి చివరి వరకు రావడం జరిగింది. అలా తాడును వదిలేయడాన్ని తప్పుపట్టిన నాగ్.. లెక్కల్లో మాత్రం ఇరగ్గొట్టేశావ్.. అని మెచ్చుకున్నాడు. చదవండి: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది: రాజ్ పిన్ని -
రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ
బుల్లితెర నటి సారా ఖాన్ రెండో పెళ్లి చేసుకుంది. నటుడు క్రిష్ పాఠక్‌ను రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. రామాయణ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహిరి కుమారుడే క్రిష్ పాఠక్. డిసెంబర్ 5న ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు, బుల్లితెర తారల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. రెండో పెళ్లిఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ కొత్త జంట తమ సంగీత్‌లో కూలీ సినిమాలోని మోనికా సాంగ్‌కు స్టెప్పులేశారు. అలాగే హిందీ పాటలకు సైతం కాలు కదిపారు. కాగా సారా ఖాన్.. సాప్న బాబుల్ కా బిడాయి సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. బుల్లితెరపై, వెండితెరపై..పలు సీరియల్స్‌తో పాటు జర నాచ్కే దిఖా, నాచ్ బలియే 4 వంటి డ్యాన్స్ రియాలిటీ షోలలోనూ పాల్గొంది. డార్క్ రెయిన్బో, సైనైడ్, హమారీ అధూరీ కహాని వంటి చిత్రాల్లోనూ నటించింది. ఓటీటీలో లాక్ అప్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో సారా (Sara Khan) పాల్గొంది. అదే షోలో నటుడు అలీ మర్చంట్ కూడా పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.మొదటి పెళ్లిబయటకు వచ్చాక 2010లో పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. తర్వాత అలీ మర్చంట్ 2016లో అనమ్ మర్చంట్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేకపోయింది. 2021లో దంపతులిద్దరూ విడిపోయారు. దర్వాత తన స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Saaraa Khan (@ssarakhan) చదవండి: సమంత ఆ ఒక్క పని చేస్తే చాలు: హీరోయిన్ చిన్నత్త -
పవన్ కల్యాణ్.. బిగ్‌బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా?
సామాన్యుడు బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, సీజన్ ట్రోఫీ కూడా గెలుస్తాడు అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో హుషారుగా చెప్తున్న మాట! కానీ అది సాధ్యమవుతుందా? టికెట్ టు ఫినాలే గెలిస్తే విజయానికి అడుగు దూరంలో ఆగిపోతారా? లేదా గెలిచి ప్రభంజనం సృష్టిస్తారా? ఇంతకుముందు సీజన్స్ ఏమని చెప్తున్నాయి? అనేవి ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం...ఎప్పుడు మొదలైంది?జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫస్ట్ తెలుగు బిగ్‌బాస్ సీజన్లో టికెట్ టు ఫినాలే అనే ప్రస్తావనే రాలేదు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్ నుంచే ఇదంతా మొదలైంది. ఆ సీజన్లో సామ్రాట్ టికెట్ టు ఫినాలే గెలిచి అందరికంటే ముందు టాప్ 5లో అడుగుపెట్టాడు. గెలవడం పక్కనపెడితే ఫైనల్స్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.టికెట్ టు ఫినాలే నాదే.. ట్రోఫీ నాదే!మూడో సీజన్ నుంచి బిగ్‌బాస్ బాధ్యతను నాగార్జున తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సీజన్లోనే రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలిచాడు. ఫైనల్స్‌లో శ్రీముఖిని ఓడించి విజేతగా నిలిచాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయి ట్రోఫీ కొట్టిన ఒకే ఒక్కడుగా తెలుగు బిగ్‌బాస్ చరిత్రకెక్కాడు. ఇంతవరకు దాన్నెవరూ టచ్ కూడా చేయలేకపోయారు. నాలుగో సీజన్లో అఖిల్ గెలిచినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఐదో సీజన్లో అందరికంటే ముందు ఫైనల్స్‌లో అడుగుపెట్టిన శ్రీరామచంద్ర.. సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. గెలుపును కాదనుకుని సూట్కేస్ఆరో సీజన్లో మాత్రం ఓ అద్భుతం జరిగింది. శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. కానీ, నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షలకు టెంప్ట్ అయిపోయి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అలా రేవంత్ విజేతగా నిలిచాడు. ఇక్కడే నాగార్జున ఓ ట్విస్ట్ బయటపెట్టాడు. ప్రేక్షకులు ఎక్కువ ఓట్లేసి గెలిపించింది శ్రీహాన్‌నే అని వెల్లడించాడు. దీంతో ట్రోఫీ గెలిచిన రేవంత్ ముఖం వెలవెలబోగా.. అటు ప్రేక్షకుల అభిమానం, ఇటు డబ్బు రెండూ సొంతమయ్యేసరికి శ్రీహాన్ ముఖం కళకళలాడింది.చివరి స్థానాల్లోనే...ఇక ఏడో సీజన్లో టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్న అంబటి అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. కానీ, వైల్డ్‌కార్డ్‌గా రావడం వల్ల తనపై పాజిటివిటీ కన్నా నెగెటివిటీయే ఎక్కువ వచ్చింది. అలా టాప్ 6లో చివరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఎనిమిదో సీజన్లో కమెడియన్ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటికీ టాప్ 5లో చివరి స్థానంలోనే ఉండిపోయాడు.ఈసారం ఏం జరగనుంది?ఈ సారి కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇతడికి భారీ ఓటింగ్ ఉంది. ఈ కారణంగా అతడు గెలిచి చరిత్ర సృష్టించనూవచ్చు. లేదంటే రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోనూవచ్చు. ఇవేవీ కాకుండా సూట్‌కేస్ తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి కల్యాణ్ ఏం చేస్తాడో చూడాలి!చదవండి: టికెట్ టు ఫినాలే గెలిచిన కల్యాణ్ పడాల -
ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్.. ట్రోఫీకి దూరం.. తనూజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
బిగ్‌బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. వరుస గేమ్స్‌లలో తన సత్తా చూపి ప్రేక్షకులను ఫిదా చేశాడు. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఎప్పటికీ కల్యాణ్ పేరు నిలిచిపోతుంది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మూడోవారం డేంజర్ జోన్లోకి వెళ్లి ఎలిమినేట్ అవుతాడనుకున్నారు. అమ్మాయిల పిచ్చోడు అంటూ వచ్చిన నిందలు భరించాడు. అదే అమ్మాయి కల్యాణ్ గెలుపులో మూలస్థంభంగా నిలబడింది. కల్యాణ్ కేవలం సెలబ్రిటీల చుట్టు మాత్రమే తిరుగుతున్నాడని హేళన చేశారు. ఇలా ఎన్నో భరించిన కామన్ మ్యాన్ కల్యాణ్ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. ఏకంగా ఫస్ట్ పైనలిస్ట్‌గా నిలిచి అదే సెలబ్రిటీల చేత శభాష్ అంటూ చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ, టికెట్ టూ ఫినాలే కల్యాణ్‌కు దక్కడం పెద్ద మైనస్ కానుంది. ఈ విజయం ఫైనల్ కప్‌కు దూరం చేసే ఛాన్స్ బలంగా ఉంది.భరణి, రీతూల మాటల యుద్ధంబిగ్బాస్ సీజన్-9లో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచేందుకు కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, భరణి గట్టిగానే ఫైట్ చేశారు. అయితే, రీతూ చేతిలో భరణి ఓడిపోయాడు. దీంతో ఆయన టాస్క్ నుంచి విరమించాల్సి వచ్చింది. గేమ్ పూర్తి అయిన తర్వాత సంచాలక్ సంజన తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆధారాలతో సహా తనూజ చూపుతుంది. దీంతో భరణికి కోపం వచ్చి సంజన పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరుస్తాడు. ఆపై రీతూతో పెద్దగొడవే జరిగింది. నేను గెలిచిన ప్రతిసారి ఇలా ఎదో ఒకటి చేస్తారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో భరణి వాదన కరెక్ట్‌గానే ఉంది. సంజన ఇచ్చిన తీర్పు కూడా కరెక్ట్‌గానే ఉంది. కానీ, టాస్క్‌లో భాగంగా ఇచ్చిన ట్రయాంగిల్ (త్రిభూజాకారం) వస్తువును కావాలనే బిగ్‌బాస్ టీమ్ అలా డిజైన్ చేసిందా... పొరపాటున తప్పిదం జరిగిందా తెలియాలంటే నాగార్జున చెప్పాల్సిందే. అయితే, ఈ టాస్క్‌లకు ఎలాంటి సంబంధం లేని కల్యాణ్‌ని భరణి లాగి గొడవపడ్డాడు. దీంతో కల్యాణ్‌తో కూడా గొడవ జరుగుతుంది.విన్నర్‌కు కల్యాణ్ దూరంకల్యాణ్కు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచే అర్హత వంద శాతం ఉంది... అదే సమయంలో తనూజ నుంచి కూడా గట్టిపోటీ ఉంది. తనకు మహిళల బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కల్యాణ్ విన్నర్ అవడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ తీసుకుని బిగ్‌బాస్ విన్నర్ ట్రోఫీ వదిలేశాడేమో అనిపిస్తుంది. రీతూ, కల్యాణ్‌ల మధ్య జరిగిన చివరి టాస్క్ కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్ ఇచ్చాడనిపిస్తుంది. అతనొక ఆర్మీ సైనికుడు కావాలనే పూర్తి ఫిజికల్ టాస్క్ పెట్టినట్లు తెలుస్తోంది. అమ్మాయి ప్రత్యర్థిగా ఉంటే ఇలాంటి టాస్క్ అవసరం లేదు. ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన కల్యాన్ మరో రెండు వారాలు ఓటింగ్‌లో కనిపించడు. ఈ వారం కెప్టెన్ కావడంతో ఇప్పటికే ఓటింగ్‌లో లేడు. దీంతో టైటిల్ కోసం ఓటింగ్ రేసులో మాత్రమే కల్యాణ్ కనిపిస్తాడు. తనూజ దాదాపు ప్రతి వారం రేసులో ఉంటుంది. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంది. కల్యాణ్ కెప్టెన్ కావాలని ఆమె బలంగా కోరుకుంది. ఆపై అతనికి సపోర్ట్ కూడా చేసింది. ఇలా తనూజకే చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దీంతో దాదాపు బిగ్‌బాస్ విన్నర్ తనూజ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో రాహుల్ మినహా టికెట్ టూ ఫినాలే అందుకున్న ఎవరు కూడా బిగ్‌బాస్ ట్రోఫీ గెలవలేదన్నది గమనార్హం. -
కల్యాణ్ కోసం తనూజ.. తొక్క, తోటకూర అంటూ 'రీతూ' ఫైర్
బిగ్‌బాస్ సీజన్-9 ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం ముగ్గురు బరిలో ఉన్నారు. శుక్రవారం ఎపిసోడ్లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది తేలిపోతుంది. అయితే, ఈ ముగ్గురికి కట్టు! నిలబెట్టు అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. బ్రిక్స్‌తో వారు ఒక టవర్‌ను పేర్చి.. పడిపోకుండా దానిని కాపాడుకోవాలి. ఇదే సమయంలో బాల్స్‌తో ఇతర కంటెస్టెంట్స్ దాడి చేస్తుంటారు. సీజన్-7లో అమరదీప్ ఇదే టాస్క్‌తో బాగా వైరల్ అయ్యాడు. హౌస్మేట్స్ అందరూ అమర్‌ని టార్గెట్ చేయడంతో రేయ్ వద్దురా ప్లీజ్ అంటూ వేడుకుంటాడు. ఇప్పుడు రీతూ విషయంలో కూడా అదే జరిగింది. కానీ, ఇక్కడ తనూజ, సుమన్ మాత్రమే రీతూ టవర్‌ను టార్గెట్ చేశారు.'కట్టు నిలబెట్టు' టాస్క్‌కు సంచాలక్‌గా సంజనా ఉంటుంది. రీతూ కోసం డీమాన్ పవన్ ఒక్కడే నిలబడ్డాడు. అయితే, తను సైడ్ నుంచి కల్యాణ్ టవర్‌ను కూల్చేందుకు బాల్స్ విసురుతూ ఉంటాడు. దీంతో తనూజ ఫైర్ అవుతుంది. కల్యాణ్‌ను ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్లని తాను టార్గెట్ చేస్తానంటూ రీతూ టవర్‌పై బాల్స్ విసురుతుంది. దీంతో రీతూ కూడా తనూజపై భగ్గుమంటుంది. తొక్క, తోటకూర అంటూ తనూజపై రీతూ విరుచుకుపడుతుంది. అయితే, డీమాన్ దూకుడుగా బాల్స్ విసురుతున్న క్రమంలో లైన్ దాటుతాడు. దీంతో అతను డిస్‌క్వాలిఫైడ్ అవుతాడు. ఇంకేముంది రీతూ టవర్‌ను సులభంగా కూల్చేశారు. -
ప్రియుడిని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' పునర్నవి
బిగ్‌బాస్ తెలుగు 3వ సీజన్ పేరు చెప్పగానే చాలామందికి రాహుల్ సిప్లిగంజ్ పండించిన ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీనే గుర్తొస్తుంది. అదే సీజన్లో పాల్గొన్న పునర్నవి భూపాలంతో ఓ రేంజ్ కెమిస్ట్రీ పండించాడు. దీంతో నిజంగానే వీళ్లు ప్రేమికులేమో అని అందరూ అనుకున్నారు. షో నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా పలు షోల్లో జంటగా కనిపించారు. కానీ అదంతా షో కోసమే.ఇకపోతే కొన్నిరోజుల క్రితమే రాహుల్ సిప్లిగంజ్.. హరిణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పునర్నవి కూడా త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసింది. తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది. కశ్మీర్లో అతడు తనకు ప్రపోజ్ చేయగా 'యస్' చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పునర్నవి ప్రియుడి పేరు హేమంత్ వర్మ. ఇతడో ఫొటోగ్రాఫర్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!)తెనాలికి చెందిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. రాజ్ తరుణ్ 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఒక చిన్న విరామం, సైకిల్ తదితర చిత్రాల్లో నటించింది. అలానే 'కమిట్ మెంటల్' అనే ఓటీటీ సిరీస్‌లోనూ లీడ్ రోల్ చేసింది. అయితే వీటిలో దేనితోనూ రాని గుర్తింపు 'బిగ్‌బాస్' షోతో సంపాదించింది. కానీ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయో లేదో తెలియదు గానీ పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. సైకాలజీ, జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.చివరకు 2020లో సినిమాల్లో కనిపించిన పునర్నవి.. తర్వాత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది. ఇప్పుడు సడన్‌గా తన ప్రియుడిని పరిచయం చేసింది. ఫొటోలు చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెప్పేస్తారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'కోర్ట్' బ్యూటీ కొత్త సినిమా.. ఈసారీ ప్రేమకథే) -
అంతా చీటింగే అన్న భరణి.. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్
నామినేషన్స్‌లో కూడా నవ్వుతూ ఉన్న భరణి.. టాస్కుల్లో మాత్రం ఫైర్ చూపించాడు. ఇప్పుడేకంగా కయ్యానికి కాలు దువ్వాడు. నిన్నటి టాస్క్ కాస్త గందరగోళంగా నడిచిన సంగతి తెలిసిందే కదా! దానికి కొనసాగింపుగా తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో భరణి.. సరిగా త్రిభుజాకారం లేని వస్తువుని ట్రయాంగిల్ అని ఎలా అంటారు? అని మండిపడ్డాడు. ఇప్పటికే కల్యాణ్, ఇమ్మూ కలిసి గ్రూప్గేమ్ ఆడుతున్నారని పసిగట్టిన భరణి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకునేందుకు సిద్ధపడలేదు.భరణి ఫ్రస్టేషన్సంజనా సంచాలకురాలిగా తప్పు చేసిందని వాదించాడు. మరోవైపు రీతూ.. ఎవరైనా ఒకరు గెలిస్తే దాన్ని రచ్చ చేయాలి, చెండాలం చేయాలి. ఒకరు హ్యాపీగా ఉండకూడదు! అని అసహనం వ్యక్తం చేసింది. సీజన్లో ఎక్కడెక్కడ చీటింగ్ జరిగాయి? ఎక్కడెక్కడ షూ చూపిస్తే మనుషుల్ని గుర్తుపట్టారు.. మొత్తం వీడియోలతో సహా బయటకు వచ్చాయి. అయినా సరే, ఇప్పటికీ నోరు మూసుకునే కూర్చున్నా అంటూ తన ఫ్రస్టేషన్ అంతా వెళ్లగక్కాడు. చీటింగ్‌తో కల్యాణ్ కెప్టెన్ఇంతకీ ఆ షూ గొడవేంటంటే.. కళ్లకు గంతలు కట్టి లైట్లు ఆఫ్ చేసే కెప్టెన్సీ టాస్క్‌లో కల్యాణ్ (Pawan Kalyan Padala) లైట్ ఆఫ్ చేసిందని భరణి అని పవన్.. అతడివైపు షూ చూపిస్తూ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఆ వారం కల్యాణ్ కెప్టెన్ అయ్యాడు. దాన్నే తర్వాత తనూజకు కన్ఫెషన్ రూమ్‌లో వీడియో వేసి మరీ చూపించారు. భరణి బయటకు వెళ్లొచ్చాక ఆ ఎపిసోడ్ చూశాడు కాబట్టి తనకూ తెలిసిపోయింది. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్మరి కల్యాణ్‌కి ఎలా తెలిసిందంటే.. శ్రీజ రీఎంట్రీ ఇచ్చి కల్యాణ్‌కు కావాల్సినన్ని ఇన్పుట్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఈ తతంగాన్ని బయటపెట్టింది. కానీ ఇదే విషయాన్ని డిమాన్ పవన్‌తో మాత్రం చర్చించలేదు. అందుకే ప్రోమోలో కూడా వీళ్లు దేని గురించి అంటున్నారో తెలియక పవన్ సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు. భరణి, కల్యాణ్ మాత్రం కొట్టుకునేంతలా పైపైకి వెళ్లారు. ఈ గొడవను పక్కనపెడితే ఈ సీజన్లో కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినట్లు తెలుస్తోంది. -
భరణికి అన్యాయం! కనిపెట్టేసిన తనూజ
టికెట్ టు ఫినాలే రేస్‌లో ఒక్కొక్కరూ అవుట్ అవుతూ రాగా చివరకు భరణి, సుమన్, పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ మిగిలారు. మరి వీరిలో ఎవరు గేమ్స్‌లో పాల్గొన్నారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేది గురువారం (డిసెంబర్ 4వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..కల్యాణ్ విన్నర్మొదటగా కలర్ గేమ్ ఛాలెంజ్‌లో భరణి, రీతూ, కల్యాణ్ ఆడారు. ఈ ఆటలో రీతూ గెలిచింది. అయితే రీతూ పూసిన పసుపు కలర్ ఎక్కువగా ఉన్నప్పటికీ తనూజ.. రెడ్ కలర్ ఎక్కువగా ఉదంటూ కల్యాణ్‌ను విన్నర్‌గా ప్రకటించింది. అతడు తన ప్రత్యర్థిగా సుమన్‌ను ఎంచుకున్నాడు. వీరికి వస్తువులు పగలగొట్టే గేమ్ ఇచ్చారు. త్రాసులో ఎవరి వస్తువులు ఎక్కువ బరువుంటే వారే గెలిచినట్లు! టార్గెట్ భరణిఈ ఆటలో కల్యాణ్ గెలవడంతో సుమన్ రేసు నుంచి అవుట్ అయ్యాడు. ఇమ్మూ, రీతూ, కల్యాణ్.. కలిసి భరణిని టార్గెట్ చేశారు. ఇమ్మూ, కల్యాణ్.. రీతూను గెలిపించి.. ఆమె భరణితో పోటీపడేలా ప్లాన్ చేశారు. వీళ్ల ప్లాన్ తిప్పికొట్టేందుకు బిగ్‌బాస్ బ్యాలెన్స్ గేమ్ ఇచ్చాడు. అయినా బిగ్‌బాస్‌నే బురిడీ కొట్టించారిద్దరూ. ఈ గేమ్‌లో కల్యాణ్, ఇమ్మూ, రీతూ స్టిక్స్ పట్టుకుంటే దానిపై హౌస్మేట్స్ కాయిన్స్ పెట్టాల్సి ఉంటుంది.ఫస్ట్ ఫైనలిస్ట్ అతడేనా?ఇమ్మూ, కల్యాణ్ ముందుగా అనుకున్నట్లుగానే ఓడిపోవడంతో రీతూ గెలిచింది. రీతూ.. భరణిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. వీరికి ట్రయాంగిల్- స్క్వేర్ అంటూ ఓ గేమ్ పెట్టారు. సంజనా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రీతూ గెలిచింది. అయితే తనూజ మాత్రం.. రీతూ పెట్టిన ఓ ట్రయాంగిల్ సరిగా లేదని చెప్తుండగా ఎపిసోడ్ ముగిసింది. అదే నిజమైతే భరణికి అన్యాయం జరిగినట్లే! ఇక ఈ టికెట్ టు ఫినాలే కల్యాణ్ గెలిచినట్లు తెలుస్తోంది. -
టికెట్ టు ఫినాలే: ముగ్గురి మధ్యే పోటీ!
టికెట్ టు ఫినాలే ఎవరికి అవసరం? ఆడగలిగే సత్తా ఉండి ఓట్ బ్యాంక్ లేనివారికి ఉపయోగకరం. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో టికెట్ టు ఫినాలే.. సుమన్, భరణి, సంజనా, రీతూ, పవన్.. వీరిలో ఎవరికి వచ్చినా ప్రయోజనం ఉండేది. వీరికి కాదని తనూజ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్‌కు వస్తే పెద్ద యూజ్ ఏం ఉండదు. ఎందుకంటే వీళ్లకు భారీ ఓటింగ్ ఉంది. టికెట్ టు ఫినాలేవీళ్లు టికెట్ టు ఫినాలే కొట్టినా, కొట్టకపోయినా.. ప్రతివారం నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయి మరీ ఫైనల్లో చోటు దక్కించుకోగలరు. పైగా ఈ ముగ్గురూ టాప్ 3 అని ఈపాటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసు నుంచి సంజనా, తనూజ, పవన్ సైడైపోయారు. తాజా ప్రోమో ప్రకారం సుమన్ కూడా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురి మధ్యే పోటీఅలాగే భరణి కూడా ఔట్ అయ్యారట. ఈ లెక్కన రీతూ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్ ఈ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడుతున్నారు. వీరిలో కల్యాణ్, ఇమ్మూ ఇది గెలిచినా, గెలవకపోయినా వారు టాప్ 3లో ఉండటం ఖాయం. కానీ రీతూ గెలిచిందంటే మిగతా హౌస్మేట్స్ (సంజన, భరణి, సుమన్, పవన్)కి టాప్ 5లో ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. మరి ఈ టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారు? టాప్ 5లో ఎవరు మొదట అడుగుపెట్టబోతున్నారో చూడాలి! -
ఛాలెంజ్ చేసిన పవన్‌ను ఓడించిన భరణి
టికెట్ టు ఫినాలే కోసం హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. తనూజ.. సుమన్‌ను ప్రత్యర్థిగా ఎంచుకోవడంతో మొన్నటి ఎపిసోడ్ ముగిసింది. మరి తర్వాతేం జరిగింది? ఎవరు గెలిచారు? మళ్లీ ఎలాంటి గేమ్స్ పెట్టారనేది బుధవారం (డిసెంబర్ 3వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...సుమన్ చేతిలో ఓటమితనూజ, సుమన్‌కు బిగ్‌బాస్ వాటర్ ట్యాంక్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో కల్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్.. తనూజకు సపోర్ట్ చేశారు. భరణి, పవన్.. సుమన్‌కు మద్దతిచ్చారు. ట్యాంకు సగానికి పైగా నిండినా సరే సుమన్ కదలకుండా శిలావిగ్రహంలా నిల్చుని గెలిచాడు. టికెట్ టు ఫినాలే రేసు నుంచి అవుట్ అయిపోవడంతో తనూజ ఏడ్చేసింది.గెలిచిన పవన్తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ బాక్స్ అనే ఛాలెంజ్‌ను కల్యాణ్, పవన్, సుమన్ ఆడారు. ఈ గేమ్‌లో పవన్ గెలిచి భరణిని ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు. అలా వీరిద్దరికీ వారధి కట్టు- విజయం పట్టు అనే బ్రిడ్జి టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో పవన్‌పై భరణి గెలిచేశాడు. దీంతో పవన్ టికెట్ టు ఫినాలే రేసులో లేకుండా పోయాడు. మాట నిలబెట్టుకోలేని పవన్ఈసారి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేది నేనే అని ఛాలెంజ్ చేసిన పవన్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయేసరికి బాధపడ్డాడు. ప్రస్తుతానికి రీతూ, భరణి, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సుమన్ టికెట్ టు ఫినాలే రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో చూడాలి! -
సుమన్ చేతిలో ఓటమి.. తనూజకు ఏడుపే దిక్కు!
టికెట్ టు ఫినాలే ఎలాగైనా కొట్టాల్సిందే అన్న కసితో ఆడుతున్నారు హౌస్మేట్స్. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ గేమ్స్ గెలిచి అందరికంటే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా తనూజ సుమన్‌తో పోటీపడింది. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇది బ్యాలెన్స్ గేమ్. తనూజకు సపోర్ట్ చేయని భరణిహౌస్మేట్స్ ఎవరిని రేసులో నుంచి తొలగించాలనుకుంటారో వారి ట్యాప్ తిప్పి ట్యాంకులో నీళ్లు నింపాల్సి ఉంటుంది. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ.. తనూజకు సపోర్ట్ చేయగా భరణి, పవన్.. సుమన్‌కు మద్దతిచ్చారు. ఈ గేమ్‌లో తనూజపై సుమన్ పైచేయి సాధించాడు. దీంతో తనూజ టికెట్ టు ఫినాలే రేసులో లేకుండా పోయింది. రేసు నుంచి అవుట్‌ఈ ఓటమిని తట్టుకోలేక తనూజ ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇక మరో గేమ్‌లో డిమాన్ పవన్ గెలవగా.. భరణితో తలపడినట్లు తెలుస్తోంది. ఈ ఆటలో భరణి గెలిచి పవన్‌ను రేసు నుంచి తప్పించాడని తెలుస్తోంది. ఇలా మలుపులు తిరుగుతూ పోతున్న ఈ ఆటలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ (Bigg Boss Telugu 9) అవుతారో చూడాలి! చదవండి: రీతూ పరువు తీసిన బిగ్‌బాస్ -
రీతూ పరువు పాయే.. దుమ్ము దులిపేసిన ఇమ్మూ, తనూజ
ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలిస్తున్నానన్నాడు బిగ్‌బాస్. రణరంగంలో ఎవరెక్కువ గడులు (బాక్స్‌లు) గెల్చుకుంటే వారే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో కొన్ని గేమ్స్ జరిగాయి. అందులో ఎవరు గెలిచారో మంగళవారం (డిసెంబర్ 2వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ ఒకటే గొడవకంటెస్టెంట్లందరూ చదరంగంలాంటి బాక్స్‌లో ఒక్కో కలర్ ఎంచుకున్నారు. చివరకు ఆ బాక్స్‌లో ఎవరి కలర్ ఎక్కువ ఆక్రమించుకుంటుందో ఆ కంటెస్టెంట్లే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పారు. ఫస్ట్ గేమ్‌లో కల్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్ ఆడతారని తనూజ ప్రకటించింది. అందుకు రీతూ ఒప్పుకోలేదు. ఫస్ట్ గేమ్ నేనే ఆడతానని వాదించింది. దీంతో పవన్ తప్పని పరిస్థితిలో వెనకడుగు వేశాడు.పరువు పాయేఅలా ఇమ్మూ, కల్యాణ్, రీతూ.. మొదటి గేమ్ కనుక్కోండి చూద్దాం ఆడారు. మెదడుకు పదును పెట్టే ఈ గేమ్‌లో రీతూ ఒక్క పాయింట్ కూడా గెలవలేకపోయింది.. ఆడతా.. ఆడతానంటూ దూకుడు చూపించి మరీ బొక్కబోర్లా పడింది. ఆమె పరిస్థితి చూసిన బిగ్‌బాస్ తనకసలు లెక్కలు వచ్చా? రావా? అని టెస్ట్ చేసేందుకు రెండో ఎక్కం చెప్పమన్నాడు. దీనికి ఆలోచించుకుంటూనే సెకండ్ టేబుల్ కరెక్ట్‌గా చెప్పింది. ఈ గేమ్‌లో అంతో ఇంతో కల్యాణ్ నాలుగు పాయింట్లు గెలిచాడు. ఇమ్మూ ఆరు పాయింట్లతో ఈ రౌండ్ విజేతగా నిలిచాడు. సంజనా ఔట్తర్వాత ఇమ్మాన్యుయేల్, సంజనా (Sanjana Galrani)తో బాల్స్ గేమ్ ఆడి గెలిచాడు. ఆటలో ఓడిపోయినందుకు సంజనా బోరుమని ఏడ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే రేసు నుంచి సంజనా వైదొలిగింది. తర్వాత పూల గేమ్‌లో భరణి, తనూజ, డిమాన్ పవన్ తలపడ్డారు. ఫిజికల్ అవుతున్నావ్, ఫిజికల్ అవుతున్నావ్ అని తనూజ పదేపదే అనేసరికి పవన్ కాస్త సైలెంట్ అయిపోయాడు. అలా తెలివిగా ఈ ఆటలో తనూజ గెలిచింది. తర్వాతి తన గేమ్ కోసం సుమన్ శెట్టిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారో చూడాలి! -
నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?
బిగ్‌బాస్ 9 హౌస్‌లో విజయవంతంగా 12 వారాలు పూర్తయ్యాయి. ఆదివారం ఎపిసోడ్లో దివ్య ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోవడం చాలామంది ఊహించిందే. మరకొరు కూడా ఎలిమినేట్ అవుతారేమో అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఇకపోతే 13వ వారానికిగానూ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ చిత్రవిచిత్రంగా జరిగింది. అటు సుమన్ శెట్టి, ఇటు తనూజ.. డీమన్కి చిన్నపాటి షాక్‌లు ఇచ్చారు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏమేం జరిగింది? నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక హారర్ సినిమా)ప్రతి సభ్యులు ఇద్దరి సభ్యులకు చెందిన బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. తొలుత ఇమ్మాన్యూయేల్.. రీతూ, పవన్ పేర్లు చెప్పాడు. భరణి వచ్చి.. తన మెడిసన్స్‌తో ప్రాంక్ చేయడం నచ్చలేదని సంజనని, గతవారం సరిగా కనిపించలేదు అని పవన్‌ని నామినేట్ చేశాడు. రీతూ.. సుమన్, సంజనాని నామినేట్ చేసింది. తనూజ అయితే పవన్ పేరు చెప్పింది. కానీ ఈ డ్రామా కాస్త విచిత్రంగా నడిచింది.తనూజ.. తొలుత ఇమ్మూని నామినేట్ చేస్తున్నట్లు చాలాసేపు మాట్లాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి నన్ను నామినేషన్లోకి లాగాడు. ఏదో మాట అన్నంత మాత్రాన ఫ్రెండ్‌ని విసిరి పారేశాం అని కాదు. ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్ వే. ఏదన్నా ఉంటే ముఖం మీద చెప్పు అని అడిగింది. దీనికి ఇమ్మూ తనవైపు నుంచి సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరూ తమ మధ్య దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు సడన్‌గా డీమన్ పవన్ పేరు చెప్పి తనూజ షాకిచ్చింది. ఇప్పటివరకు నామినేషన్ పాయింట్ చెప్పి మారిస్తే జోక్‌లా అనిపించిందని పవన్ ఆశ్చర్యపోయాడు. అలానే సంజనని కూడా నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)సుమన్ శెట్టి చేసిన నామినేషన్స్ అయితే వేరే లెవల్ కామెడీ అని చెప్పొచ్చు. నువ్వు హౌస్‌లో గట్టి గట్టిగా అరుస్తావ్, నాకు అది డిస్ట్రబెన్స్గా ఉందని చెప్పి రీతూని నామినేట్ చేశాడు. దీంతో రీతూ షాకయింది. మిగిలిన వాళ్లకు కూడా ఇబ్బందయితే వాళ్లు చెప్పుండేవాళ్లు కదా అని రీతూ అడిగితే.. వాళ్లకు భయమేమో చెప్పలేదు, నాకు భయం లేదు చెప్తున్నా అని వివరణ ఇచ్చాడు. తర్వాత డీమన్ పవన్ పేరు చెబుతూ.. నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కూడా, మాకంటే నువ్వే స్ట్రాంగ్ గనుక ఇంటికెళ్లిపోయి రెస్ట్ తీసుకో అని కారణం చెప్పాడు. దీనికి ఏమనలో తెలీక పవన్ నవ్వుకున్నాడు.ఇక సంజన.. పవన్, రీతూని నామినేట్ చేసింది. డీమన్ పవన్.. తొలుత ఇమ్మూ పేరు చెప్పి కాస్త నవ్వించి తర్వాత సంజన, తనూజ పేర్లు చెప్పాడు. చివరగా కెప్టెన్ కల్యాణ్.. భరణిని నామినేట్ చేశాడు. అలా ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. వారిలో సంజన, రీతూ, భరణి, పవన్, తనూజ, సుమన్ ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్) -
బిగ్‌బాస్ 9.. ట్రెండింగ్‌లో కల్యాణ్ పడాల
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ చివరకొచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలున్నాయి. దీంతో ఫైనల్‌కి ఎవరొస్తారు? ఎవరు విజేతగా నిలుస్తారు? అనే ఆసక్తి.. షో చూస్తున్న వారిలో నెలకొంది. మరోవైపు హౌస్‌కి చివరి కెప్టెన్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. దీంతో ఎక్స్(ట్విటర్)లో తెగ ట్రెండ్ అయిపోతున్నాడు. గతం వారం రోజుల్లో లక్షలాది ట్వీట్స్ ఇతడి గురించి రావడం వస్తుండటం విశేషం.స్వతహాగా ఆర్మీ జవాన్ అయిన కల్యాణ్.. బిగ్‌బాస్ షో అంటే ఇష్టంతో, ఈ సీజన్ కోసం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తనలాంటి చాలామంది సామాన్యులని దాటుకుని షోలో అడుగుపెట్టాడు. ప్రారంభంలో ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు. కానీ వారం వారానికి తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతానికైతే ఫినాలే రేసులో ఉన్నాడు. తనూజతో నువ్వా నేనా అన్నట్లు కల్యాణ్ గేమ్ సాగుతోంది.ఈ వారం కల్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. కాబట్టి నామినేషన్స్‌లో లేడు. వచ్చే వారంలో నామినేషన్స్ ఉన్నాసరే కల్యాణ్ బయటకు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. మరి కల్యాణ్.. ఈ సీజన్ విజేతగా నిలుస్తాడా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. -
ఆ రెండు తప్పుల వల్లే దివ్య ఎలిమినేట్!
తనూజ, దివ్య మధ్య యుద్ధం.. అదంతా చూడటానికి ప్రేక్షకులు సిద్ధం అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు బిగ్‌బాస్. కేవలం ఆ యుద్ధం కోసమే అర్ధాంతరంగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు. కానీ చివరకు ఏమైంది? ఈ ప్లాన్ పసిగట్టిన తనూజ గొడవకు ఫుల్స్టాప్ పెడదాం.. కలిసిపోదాం అనేసింది. ఇద్దరూ హగ్గిచ్చుకుని బిగ్‌బాస్ చెవిలో మందార పువ్వు పెట్టారు. దీంతో 11వ వారం తప్పించుకున్నా 12వ వారం తప్పక ఎలిమినేట్ అయింది దివ్య. ఆమె ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం..వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీతెలుగు బిగ్‌బాస్ 9 ప్రారంభమైన కొత్తలో కామన్‌మ్యాన్ కేటగిరీలో వచ్చినవాళ్లు చేసిన ఓవరాక్షన్‌కు జనాలకు బీపీ వచ్చింది. వీళ్లనెవరైనా ఆపండ్రా.. అంటూ టీవీల ముందు జనం మొత్తుకున్నారు. ఎట్టకేలకు బిగ్‌బాస్ ఆ మొర ఆలకించి మళ్లీ అదే అగ్నిపరీక్ష నుంచి ముగ్గుర్ని హౌస్‌లోకి పంపాడు. ఈ ముగ్గురిలో అందరూ వద్దనుకున్న దివ్యనే హౌస్‌లో వైల్డ్‌కార్డ్‌గా ప్రవేశపెట్టాడు.ముక్కుసూటితనానికి ఫిదాఆమె పదునైన మాటలకు, ఆటకు అందరూ ఫిదా అయ్యారు. తనూజలాంటివాళ్లే దివ్వెల మాధురికి గజగజ వణికిపోతుంటే దివ్య ఎదురెళ్లి నిలబడింది. తప్పును తప్పు అని గట్టిగా వాదించింది. ఇన్ని మంచి లక్షణాలున్న దివ్యకు రానురాను పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఆమె హౌస్‌లో చేసిన రెండే రెండు తప్పుల వల్లే తను బయటకు వచ్చేసింది. ఒకటి తనూజను టార్గెట్ చేయడం, రెండు భరణితో బంధుత్వం కలుపుకోవడం!పతనం మొదలైందిభారీ ఓటింగ్ ఉన్న తనూజను అవసరం ఉన్నా, లేకపోయినా టార్గెట్ చేయడం అనేది తనకు వ్యతిరేకంగా మారింది. అందులోనూ భరణి, తనూజ అప్పటివరకు నాన్నకూతురిగా కలిసిమెలిసి ఉన్నారు. ఎప్పుడైతే దివ్య ఎంటరయిందో ఈ బంధం మధ్య దూరం పెరిగింది. ఈ విషయంలో దివ్యపై తనూజ ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు. భరణి నెం.1 అంటూ టాప్‌లో నిలబెట్టిన దివ్య.. అతడి ఎలిమినేషన్‌కు పరోక్షంగా కారణమైంది. భరణిపై పెత్తనంతీరా సెకండ్ ఛాన్స్‌తో హౌస్‌లోకి వచ్చిన భరణిపై ఆమె పెత్తనం చెలాయించడం ప్రేక్షకులకే కాదు, ఆఖరికి భరణి కుటుంబసభ్యులకు కూడా నచ్చలేదు. అది అందరూ చెప్తున్నా ఆమె చెవికెక్కించుకోలేదు. భరణి తనూజతో సన్నిహితంగా ఉంటే జీర్ణించుకోలేకపోవడం, ఆమెకు ప్రాధాన్యతనిస్తే తట్టుకోలేకపోవడం వంటివి ఆమెకే మైనస్ అయ్యాయి. పొగరుగాతెలుగురాని కంటెస్టెంట్ గౌరవ్‌ని చీపురుపుల్లలా తీసిపడేయడం, నానామాటలు అనడంతో తన గ్రాఫ్ మరింత పడిపోయింది. ఆట మీద కన్నా మనుషుల మీదే ఎక్కువ ఫోకస్ చేయడం వల్లే ఫినాలేలో ఉండాల్సిన దివ్య () ఇప్పుడింట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చదవండి: భరణి తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య? ఏడ్చిన దివ్య -
భరణి ఉగ్రరూపం.. నామినేషన్స్‌లో ఆరుగురు
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ప్రస్తుతం ఎనిమిది మంది మిగిలారు. సీజన్ ముగింపుకు వస్తున్నా సరే కొట్లాటలు మాత్రం తగ్గలేదు. అందుకు 13వ వారం నామినేషన్స్ ప్రోమోయే నిదర్శనం. ఇద్దరి తలపై బాటిల్ పగలగొట్టి హౌస్మేట్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఇమ్మాన్యుయేల్.. రీతూ, పవన్‌ను నామినేట్ చేశాడు. సంజనాకు హెచ్చరికభరణి.. సంజనను నామినేట్ చేశాడు. నా మెడిసిన్స్ దాచేసి నాపైనే కామెడీ చేస్తావనుకోలేదు, ట్యాబ్లెట్సె్ దాయడం మీకు సరదాగా ఉందా? అని అడిగితే అందుకామె అవునని తేలికగా బదులిచ్చింది. ఈ ప్రాంకులు చేయడం ఆపండి అని హెచ్చరించాడు. అయితే ఇదే భరణి.. మొన్న ఎపిసోడ్లో మాత్రం.. ట్యాబ్లెట్స్ దాచేసినందుకు సంజనాతో మరేం పర్లేదన్నట్లుగా సంభాషించాడు. ఇప్పుడేమో ఉగ్రరూపం చూపించడం గమనార్హం. ఇదే నా ఛాలెంజ్భరణి.. పవన్ (Demon Pavan)ను నామినేట్ చేస్తూ.. నిన్ను వెనక్కులాగుతున్నదాన్ని పక్కనపెట్టు.. మానసికంగా వీక్ అయితే ఫిజికల్‌గా కూడా ఫోకస్‌గా ఆడలేం అని సూచించాడు. దీంతో పవన్.. ఈ వారం టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే.. మీ అందరికీ ఇదే నా ఛాలెంజ్ అని సవాలు విసిరాడు. మరి ఆ మాటపై ఎంతవరకు నిలబడతాడో చూడాలి! ఇకపోతే ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ కల్యాణ్ మినహా మిగతా ఆరుగురు ఈ వారం నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: భరణి తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య? ఏడ్చిన దివ్య -
తనూజను ఎత్తుకుని తిరిగితే నీకేంటి సమస్య? ఏడ్చేసిన దివ్య
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ నుంచి దివ్య ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన వెంటనే సరాసరి బజ్ ఇంటర్వ్యూకి హాజరైంది. అక్కడ శివాజీ ఏయే ప్రశ్నలడిగాడు? తను ఎలా సమాధానాలిచ్చిందో ప్రోమో వదిలారు. అది ఓసారి చూసేద్దాం..వాళ్ల చుట్టూయే ప్రశ్నలుదివ్య గురించి మాట్లాడాలంటే కచ్చితంగా రెండు పేర్లు ముందుకు వస్తాయి. అవే భరణి, తనూజ. బజ్ ఇంటర్వ్యూ మొత్తం కూడా ఈ రెండు పేర్ల చుట్టూనే తిరిగింది. దివ్య నిఖితలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు భరణి అవసరం ఏమొచ్చింది? ఆయన తనూజతో ఎలా ఉంటే నీకేంటి సమస్య అని శివాజీ నిలదీశాడు. నాకేం ప్రాబ్లం లేదని దివ్య చెప్తుంటే.. నీ పొసెసివ్‌నెస్ మాకు స్పష్టంగా కనిపిస్తోదన్నాడు శివాజీ. తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య?వాళ్లను విడగొట్టి నేనేం సాధిస్తాను? పోనీ.. నేను రాగానే విడిపోయారంటే వాళ్ల రిలేషన్ అంత వీకా? అని దివ్య తిరిగి ప్రశ్నించింది. భరణి.. తనూజను ఎత్తుకుని తింపుతాడు, ఆయింట్మెంట్ రాస్తాడు.. నీకేంటి ప్రాబ్లమ్? అని అడిగాడు. ఒకసారి బయటకు వెళ్లి వచ్చాక ఆయన నిన్ను అంతగా ఎంకరేజ్ చేయలేదు.. గమనించావా? అంటూ ఆమెను దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకు దివ్య కూడా అవునని తలూపింది.వెక్కెక్కి ఏడ్చిన దివ్యనిన్ను భరణి (Bharani Shankar)కి దూరంగా ఉండమని చెప్పమని మీ తల్లి మాధురిని వేడుకుందన్న విషయం చెప్పాడు. అది విని దివ్య మౌనంగా కూర్చుండిపోయింది. ఇక భరణిని తల్చుకుని దివ్య ఎమోషనలైంది. భరణి నా అన్నయ్య.. మళ్లీ హౌస్‌లోకి వచ్చారు. ఆయనతో ఉండాలి, ఆయన్ని బాగా చూసుకోవాలి అనే అనుకున్నాను. బయటకు వచ్చాక ఆయన నాతో ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆయన మంచి కోరుకునే శ్రేయోభిలాషిగానే ఉంటానని ఏడ్చేసింది. చదవండి: దివ్యను నామినేట్ చేసి ఇప్పుడేమో ఏడ్చేసిన భరణి -
దివ్య ఎలిమినేట్.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన భరణి
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో 12 వారం ఎలిమినేషన్ జరిగింది. దివ్య ఎలిమినేట్ అయింది. మరి వెళ్లేముందు హౌస్‌లో ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 30వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అనర్హురాలిగా సంజనాబిగ్బాస్ హౌస్‌లో ఉండేందుకు ఎవరికి అర్హత లేదో.. వారి ఫోటోను చెట్టు నుంచి తీసేయాలన్నాడు నాగ్. మొదటగా భరణి మాట్లాడుతూ.. హౌస్ హార్మోని దెబ్బ తింటోందంటూ సంజనా ఫోటో తీసేశాడు. రీతూ మాట్లాడుతూ.. ఎదుటివాళ్లు చెప్పేది అర్థం చేసుకోదంటూ దివ్యను అనర్హురాలిగా అభిప్రాయపడింది. దివ్య.. రీతూ ఫోటో తీసేసింది. పవన్, సుమన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ.. సంజనాకు అర్హత లేదన్నారు.దేశముదురుగా ఇమ్మూఎక్కువమంది సంజనాకే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. తర్వాత ఇమ్మాన్యుయేల్.. ఆడ గొంతుతో అమ్మా అని పిలిచి పిలిచి.. పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ పాట విని నాగ్ సైతం చప్పట్లు కొట్టాడు. హౌస్మేట్స్ కోసం బిగ్‌బాస్ కొన్ని పోస్టర్స్ వదిలాడు. ఇమ్మూని దేశముదురుగా.. తనూజని జగదేక వీరుడు అతిలోక సుందరిగా, పవన్- రీతూ గీతాగోవిందం, కల్యాణ్ రేసుగుర్రం, భరణి.. హాయ్ నాన్న, సంజనా.. చంద్రముఖి, సుమన్.. బాబు బంగారం, దివ్య.. భాగమతిగా పోస్టర్లు వేశారు.దివ్య ఎలిమినేట్నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా.. చివరకు సుమన్, దివ్య మిగిలారు. వీరిలో దివ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఆమె ఎలిమినేట్ అవగానే భరణి (Bharani Shankar) చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన దివ్య.. నేనైతే 100% ఇచ్చాను. రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల నా గేమ్ దెబ్బ తింది అని పేర్కొంది. తర్వాత హౌస్మేట్స్ గేమ్‌పై రివ్యూ ఇచ్చింది.తనూజతో గొడవే లేదుపవన్.. నీకోసం నువ్వు ఆడు, త్యాగం చేయకు అని సలహా ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్.. ఆల్‌రౌండర్, ఆలోచనలు తగ్గించుకుంటే నిన్ను ఆపే వాళ్లే లేరంది. సంజనా.. మనిషి మంచావిడ, కానీ మాటతో అంతా పోగొట్టుకుంటుందని, స్ట్రాంగ్‌గా ఉండమంది, తనూజ.. మేమిద్దరం కొట్టుకుంటాం, జుట్టు పట్టుకుని లాక్కుంటాం అని అందరూ అనుకుంటారు. కానీ మా మధ్య అలాంటిదేం లేదు. నువ్వింకా ఆడి ముందుకెళ్లు.. ఇంకా చెప్పడానికి ఏం లేదని పేర్కొంది.గెలవాలని కోరుకుంటాకల్యాణ్కు ఇండస్ట్రీ అంటే పిచ్చి, కచ్చితంగా నువ్వు హీరో అయిపోవాలి అంది. రీతూ.. బబ్లీ గర్ల్, చాలా చిన్న పిల్ల, ఎక్కువ ఎమోషనల్ అవకని సూచించింది. భరణి మా అన్నయ్య, తను గెలవాలని కోరుకుంటా.. గేమ్ బాగా ఆడండి, బయటకు వచ్చాక కూడా నేను మీ చెల్లినే అంటూ భావోద్వేగానికి లోనైంది. సుమన్.. ఎమోషనల్ అవకండి, గేమ్ గట్టిగా ఆడండి అని చెప్పుకొచ్చింది. చివరగా భరణి.. దివ్యను ఉద్దేశిస్తూ బిగ్‌బాస్ హౌస్ ఒక యోధురాలిని మిస్ అవుతుందన్నాడు.చదవండి: బిగ్‌బాస్ 9: దివ్య ఎలిమినేట్, ఎంత సంపాదించిందంటే? -
బిగ్‌బాస్ నుంచి దివ్య ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
బిగ్ బాస్ సీజన్ 9 నుంచి 12వ వారంలో దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. సెప్టెంబర్ 25న నాల్గవ వారంలో వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. సుమారు 65రోజుల పాటు హౌస్‌లో దివ్య కొనసాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువరోజుల గేమ్‌లో కొనసాగిన కంటెస్టెంట్‌గా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, బిగ్‌బాస్ నుంచి దివ్య భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 12న వైల్డ్ కార్డ్‌గా దివ్య నిఖిత బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది. అయితే, ఆమెకు వారానికి రూ.1.7 లక్షల మేరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 9వారాలకు గానూ రూ. 15 లక్షల మేరకు సంపాదించినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తన ఇన్‌స్టా పేజీలో సినిమా రివ్యూలు కూడా చెబుతూ ఉంటుంది. అలా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఏదేమైనా చాలా స్ట్రాంగ్‌గానే బిగ్‌బాస్‌లో దివ్య తన మార్క్ చూపింది.ఈ వారం అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం తనూజ, కల్యాణ్ ఎక్కువగా ఓట్లు తెచ్చుకున్నారు. వారిద్దరిలో ఒకరు టైటిల్ గెలవడం దాదాపు ఖాయం అయిపోయింది. అయితే, దివ్య, సుమన్ అతి తక్కువ ఓట్లతో లాస్ట్ వరకు ఎలిమినేషన్లో నిలిచారు. ఫైనల్‌గా దివ్యకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేషన్ కావడం జరిగింది. View this post on Instagram A post shared by Divya Velamuri (@vegfrieddmomo) -
వెళ్లిపోతానన్న సంజనా.. బలవంతంగా సారీ చెప్పించిన నాగ్
కాదేదీ గొడవకు అనర్హం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు హౌస్మేట్స్. ప్రమోషనల్ టాస్కులో కూడా తనూజ గొడవపడటం చూసేవాళ్లకు సైతం చిరాకు పుట్టించింది. ఇక రీతూ క్యారెక్టర్‌ను తప్పుపట్టిన సంజనాకు నాగ్ క్లాస్ పీకాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శనివారం (నవంబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాపై సీరియస్పవన్, రీతూ.. అంటుకుని కూర్చుంటారు, అది నచ్చలేదని నామినేట్ చేశాను అని సంజనా మళ్లీ అదే వాదించింది. మీరు చేసేపనులకు కళ్లు మూసుకోవాల్సి వస్తుందన్నావ్.. అంతలా ఏం చేశారు? ఎందుకు పర్సనల్ టార్గెట్ చేశావ్? ఎందుకంత నింద వేశావ్? అని నాగార్జున సీరియస్ అయ్యాడు. హౌస్‌లో ఎవరికీ అసౌకర్యంగా లేనిది నీకు మాత్రమే ఎందుకు అనిపించింది? అంత ఇబ్బందిగా ఉంటే వెళ్లిపో అని గేట్లు తెరిచాడు.కన్నీళ్లతో అభ్యర్థించిన సంజనాదీంతో సంజనా (Sanjana Galrani) నేను వెళ్లను, ఉంటాను సర్ అని కన్నీటితో అడిగింది. ఇంతలో నాగ్.. గతంలో సంజనా ఎలిమినేట్ అవకుండా కాపాడిన నలుగురు.. ఇమ్మాన్యుయేల్, భరణి, రీతూ, తనూజను లేచి నిల్చోమన్నాడు. సంజనా హౌస్‌లో ఉండాలా? వద్దా? అనేది నిర్ణయించాలన్నాడు. ఇప్పటికే వాళ్ల త్యాగం, దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నానన్న పేరుంది.పంపించేయండిమరోసారి వీరి కనికరంతో హౌస్‌లో ఉండలేను అనుకున్న సంజనా నాగార్జుతో.. వెళ్లిపోతాను, పంపించేయండి అని కోరింది. కానీ అప్పటికే నిర్ణయం ఆ నలుగురి చేతిలోకి వెళ్లిపోయిందన్నాడు నాగ్. ఆ నలుగురు.. సంజనా క్షమాపణలు చెప్తే హౌస్‌లో ఉండొచ్చన్నారు. అయినా సారీ చెప్పేందుకు తను ముందుకు రాలేదు. వెళ్లిపోవడానికే సిద్ధపడింది. బలవంతంగా సారీ..దీంతో నాగార్జున ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. కచ్చితంగా సారీ చెప్పాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఆమెకు ఇష్టం లేకపోయినా రీతూకి, ప్రేక్షకులకు సారీ చెప్పింది. నామినేషన్స్‌లో డిమాన్ పవన్.. కల్యాణ్ పీక పట్టుకోలేదని, అతడిని ఆపేందుకు ప్రయత్నించాడని క్లారిటీ ఇచ్చాడు నాగ్. అలాగే బూతు పదాలు మాట్లాడొద్దని కల్యాణ్‌ను హెచ్చరించాడు.చదవండి: బిగ్‌బాస్ 9: దివ్య ఎలిమినేట్ -
బిగ్‌బాస్ 9.. ఈసారి ఆమెతో పాటు మరొకరు ఎలిమినేషన్!?
బిగ్‌బాస్ 9 సీజన్ తుది అంకాని వచ్చేసినట్లు కనిపిస్తుంది. ఈ ఆదివారంతో 12 వారాలు పూర్తయిపోతాయి. అంటే మరో మూడు వారాలు మాత్రమే మిగిలుంటాయి. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది ఉన్నారు. అయితే ఫినాలేలో టాప్-5 ఉంటారా? టాప్-6 ఉంచుతారా? అనేది కొన్నిరోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఇకపోతే గతవారం మిస్ అయిన లేడీ కంటెస్టెంట్ ఈసారి ఎలిమినేట్ అయిందని, మరొకరిని కూడా హౌస్ నుంచి పంపించబోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?ఈ వారం కెప్టెన్ రీతూ తప్పితే మిగిలిన వాళ్లంతా నామినేషన్లో ఉన్నారు. లెక్క ప్రకారం గతవారం దివ్య ఎలిమినేట్ అయిందని న్యూస్ తొలుత వచ్చింది. చివరి ప్లేసులో ఉండటంతో అంతా పక్కా అనుకున్నారు. కానీ ఇమ్మాన్యుయేల్ తన దగ్గరున్న పవర్ ఉపయోగించి ఎలిమినేషన్ లేకుండా చేశాడు. దీంతో దివ్య బతికిపోయినట్లుంది. ఈసారి మాత్రమే ఆమె తప్పించుకోలేకపోయిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)ఈ వారం నామినేషన్లకు సంబంధించి శుక్రవారం వరకు ఓటింగ్ జరగ్గా.. కల్యాణ్ తొలి స్థానంలో నిలిచాడని, తర్వాత స్థానంలో తనూజ ఉండగా.. అనంతరం వరసగా ఇమ్మాన్యుయేల్, పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజన, దివ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దివ్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం బయటకొచ్చింది. గత వారం మిస్ అయినప్పటికీ ఈసారి ఈమె బయటకొచ్చేయడం గ్యారంటీ అని టాక్.ఇంకా మూడు వారాలే మిగిలున్న దృష్ట్యా.. ఈసారి మరొకరిని కూడా ఎలిమినేట్ చేయొచ్చని అంటున్నారు. అలా చూసుకుంటే సంజనని బయటకు పంపే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. అయితే సుమన్ శెట్టి కూడా ప్రస్తుతం డేంజర్ జోన్లోనే ఉన్నాడని, ఒకవేళ అతడు ఎలిమినేట్ అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. గత కొన్ని వారాల నుంచి చూసుకుంటే సుమన్ శెట్టి గ్రాఫ్ చాలావరకు తగ్గిపోయింది. గేమ్స్ పరంగా కావొచ్చు, మిగతా విషయాల్లో కావొచ్చు.. తొలివారాలతో పోలిస్తే సుమన్ బాగా వెనకబడిపోయినట్లు టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ వారం దివ్యతో పాటు ఎలిమినేట్ అయ్యే హౌస్‌మేట్ ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.(ఇదీ చదవండి: దీపికా పదుకొణె చెల్లి పెళ్లి.. ఈమె కూడా సినీ ఫ్యామిలీలోకే!) -
బిగ్‌బాస్‌కే ఆర్డరేసిన తనూజ.. భరణిఫైర్..
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని సరదా టాస్కులు, ప్రమోషనల్ టాస్కులుంటాయి. అవి ఎవరు గెలిచినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదో ఫ్లోలో సరదాగా ఆడుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ కూడా గొడవపడొచ్చని తాజా ప్రోమోతో రుజువైంది. ప్రోమోలో చూపించినదాని ప్రకారం.. భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్ ఒక టీమ్ అయితే రీతూ, తనూజ, కల్యాణ్ మరో టీమ్‌గా విడిపోయారు. బిగ్‌బాస్‌కే ఆర్డర్భరణి టీమ్‌లో ఉన్న దివ్య ఈ గేమ్‌కు సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ ఆటలో భరణి టీమ్ గెలవగా తనూజ టీమ్ ఓడిపోయింది. అది తనూజ జీర్ణించుకోలేకపోయింది. ఈ సీజన్ మొత్తం దివ్యనే సంచాలకురాలిగా పెట్టండి అని బిగ్‌బాస్‌కే ఆర్డరేసింది. అది చూసి చిరాకుపడ్డ భరణి.. రూల్స్ నీకు ఒక్కదానికే తెలిసినట్లు మాట్లాడతావేంటి? అని అసహనం వ్యక్తం చేశాడు.తనూజపై భరణి ఫైర్అప్పటికీ తనూజ (Thanuja Puttaswamy) తగ్గకపోయేసరికి.. నేను ఊరికే లొడలొడా వాగను.. అవసరమైనప్పుడు కచ్చితంగా మాట్లాడతా అన్నాడు. వాగుడు, పిచ్చి మాటలు అని మీరనకండి.. అంటూ భరణితో అడ్డంగా వాదించింది తనూజ. ఇది చూసిన జనాలు.. ఇక్కడ కూడా గొడవేంట్రా బాబూ అని కామెంట్లు చేస్తున్నారు. -
నొప్పితో విలవిల్లాడిన పవన్.. రీతూ, కల్యాణ్ కన్నీళ్లు
చివరి కెప్టెన్సీని హౌస్మేట్స్ చేతిలోనే పెట్టాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం ఇతర ఇంటిసభ్యులు గేమ్ ఆడాలన్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకుంటూ వెళ్లగా చివరికి పవన్, కల్యాణ్ మిగిలారు. ఈ ఇద్దరూ ఆడిన ఆటలో కల్యాణ్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఆ ప్రక్రియ ఎలా జరిగిందో శుక్రవారం (నవంబర్ 28వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..హౌస్మేట్స్ చేతిలో పవర్తనూజ, సుమన్, భరణిలలో ముందుగా డాగర్ అందుకున్నవారు కంటెండర్స్‌లో ఒకరిని సపోర్ట్ చేయవచ్చు. వీళ్లు ఎవరికైతే డాగర్ ఇస్తారో... ఆ వ్యక్తి మరో కంటెండర్‌ను రేసు నుంచి తీసేస్తారు. అలా సంజనా, దివ్య, ఇమ్మాన్యుయేల్, రీతూ వరుసగా అవుట్ అయ్యారు. చివరకు పవన్, కల్యాణ్ మాత్రం మిగిలారు.పవన్ వర్సెస్ కల్యాణ్వీరికి కంకర ఇచ్చి రోడ్డు వేసే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో పవన్, కల్యాణ్ ఇద్దరూ చాలా బాగా ఆడారు. కల్యాణ్‌కు అందరూ సపోర్ట్ చేస్తుంటే.. పవన్‌కు రీతూ ఒక్కతే సపోర్ట్ చేసింది. అయితే పవన్ వెన్ను నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ నొప్పికి ఏడుపొక్కటే తక్కువ అంటూనే కష్టపడ్డాడు. ఏడ్చేసిన పవన్అతడి నొప్పి చూసి రీతూ (Rithu Chowdary), కల్యాణ్ ఏడ్చేశారు. గేమ్ అయిపోగానే అతడు మెడికల్ రూమ్‌కు వెళ్లివచ్చాడు. నొప్పి వల్ల ఆడలేకపోయా.. మా మమ్మీడాడీ కూడా బాధపడి ఉంటారు అని పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ, అంతలోనే.. పోనీలే, మనోడు కెప్టెన్ అయ్యాడు అని సంతోషించాడు. బిగ్‌బాస్ 9లో చివరి కెప్టెన్‌గా కల్యాణ్ జెండా ఎగరేశాడు. -
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. 'రీతూ' వల్ల సేఫ్
బిగ్‌బాస్ సీజన్-9లో ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కల్యాణ్-పవన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. అదే సమయంలో రీతూపై సంజన చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ అయ్యాయి. ఈ వారం నామినేషన్లో కల్యాణ్ అయితే పూర్తిగా కంట్రోల్ తప్పి రీతూపై రెచ్చిపోయాడు. తను అమ్మాయి అనే సంగతి కూడా మర్చిపోయి మీదకి దూసుకెళ్లాడు. దీంతో కల్యాణ్‌ను ఆపేందుకు డీమాన్ పవన్ మధ్యలో రావడంతో పరిస్థితి మరింత పెద్దదైంది.కల్యాణ్, డీమాన్ పవన్‌ల మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో కల్యాణ్ పీకని డీమాన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు. ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ మాత్రం వీకెండ్లో నాగార్జున ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కల్యాణ్ పీకని డీమాన్ పట్టుకున్న ఘటన గురించి సంజన పదేపదే హౌస్‌లో తీసుకొస్తుంది. దీంతో పవన్‌కు ఎక్కువ బ్యాడ్ నేమ్ రావచ్చని మరుసటిరోజు రీతూ జోక్యం చేసుకుంది.గొడవ కల్యాణ్‌తో జరిగింది కాబట్టి అతనితోనే రీతూ మాట్లాడింది. 'అసలు డీమాన్ ఏం చేశాడు నీ దగ్గరకు వచ్చి అంటూ కల్యాణ్‌ను రీతూ ప్రశ్నించింది. దీంతో కల్యాణ్ కూడా ఇలా సమాధానం చెప్పాడు. 'గొడవ జరిగిన సమయంలో వాడు నా పీక పట్టుకున్నాడని చెబుతున్నారు.' అని తెలిపాడు. దానికి రీతూ కూడా ఇలా చెప్పింది. వాడి ఎమోషన్ గురించి నీతో పాటు హౌస్‌లో ఉన్న వారందరికీ తెలుసు. జరిగిన గొడవలో నీ మీద వాడికి (డీమాన్) కోపం లేదు. నిన్ను ఆపేందుకే మాత్రమే వాడు వచ్చాడు. అనుకోకుండా జరిగిన విషయాన్ని సంజన చెడుగా చూపుతూ మాట్లాడుతుంది. ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలియడం లేదు. వాడిని ఇలా ఎన్నిసార్లు తొక్కేస్తారు రా..' అంటూ రీతూ బాధపడుతుంది. అయితే, కల్యాణ్ కూడా డీమాన్‌కు అండగా మాట్లాడాడు. వీకెండ్లో నాగార్జున గారు ఏదైనా అడిగితే పెద్ద గొడవ ఏం జరగలేదని చెబుతానంటూ వెళ్లిపోయాడు. View this post on Instagram A post shared by Uppala Pavan Kumar (@demon_pavan) -
బిగ్‌బాస్9: ఈసారి లేడీ విన్నర్? లేదా కల్యాణ్ గెలుస్తాడా?
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో ఫస్ట్ నుంచి బోలెడంత పాపులారిటీ ఉన్న వ్యక్తి తనూజ. అందుకే అందరికంటే ముందుగా ఈమె విన్నింగ్ రేసులోకి వచ్చింది. మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మరి నిజంగా వార్ వన్‌సైడ్ అయిందా? తనూజయే గెలుస్తుందా స్పెషల్ స్టోరీలో చూసేద్దాం.తనూజ చుట్టూ బిగ్‌బాస్ 9ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కానెక్టయిన వ్యక్తి తనూజ (Thanuja Puttaswamy). గేమ్స్ తనవరకు వస్తే బాగానే ఆడుతుంది. తన తప్పు ఉందని ఎవరైనా అంటే గట్టిగా వాదిస్తుంది. షో మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే గేమ్ అంతా తనచుట్టూనే ఎక్కువగా తిరిగింది. కాకపోతే తనపై తనకు నమ్మకం తక్కువ. బలమైన ఓటింగ్అన్నింటికీ సపోర్టింగ్ గేమ్ కావాలనుకుంటుంది. అలాగైతే ఈజీగా గెలిచేస్తానని తన అభిప్రాయం. కానీ వీకెండ్లో మాత్రం తనకెవరూ సపోర్ట్ చేయడంలేదని అవలీలగా అబద్ధం చెప్తుంది. ఇలా రెండు నాలుకల మాటలు తనకు వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయినప్పటికీ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో (ఓటీటీ సీజన్ మినహా) తొలి లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. తనకు అభిమానులతో పాటు సీరియల్ ప్రేక్షకుల ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది.నెక్స్ట్ పవన్ కల్యాణ్ పడాలమొదట్లో కల్యాణ్ (Pawan Kalyan Padala) ఎందుకున్నాడు? అని జనాలే విమర్శించారు. అమ్మాయిలను అదోలా చూస్తూ ఛాన్స్ దొరికితే వారి చేయి పట్టుకుంటూ కాస్త తేడాగా ప్రవర్తించాడు. కానీ, నాగ్ ఎప్పుడైతే చేతులు పిసకడం ఆపేయ్ అని ముఖం పట్టుకుని అన్నాడో అప్పుడే తన పంథా మార్చుకున్నాడు. కల్యాణ్ అంటే ఏంటో చూపించాడు. గేమ్సై్ బాగా ఆడాడు. కాకపోతే నామినేషన్స్ తీసుకునేవాడు కాడు. ఇది టాప్ 5కి సరిపోతుంది. గెలుపుకు కాదు. ఇక్కడ అతడి ఫ్యాన్స్ జవాన్ అన్న కార్డు ఉపయోగించారు. మరో పల్లవి ప్రశాంత్జై జవాన్ అంటూ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. ఏడో సీజన్లో రైతు బిడ్డ అనే ఏకైక సింపతీ కార్డుతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. ఇప్పుడదే విధంగా సైనికుడు అనే కార్డుతో కల్యాణ్ టైటిల్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అతడి పీఆర్ స్ట్రాటజీలు ఆ రేంజ్లో ఉన్నాయి. జై జవాన్ జై కిసాన్ అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ నినాదాలు మొదలుపెట్టారు.మంచోడే కానీ ఎక్కువ హైప్కల్యాణ్కు యాక్టింగ్ అంటే ఇష్టం.. ఇక్కడ అవకాశాలు వస్తే సైనిక వృత్తిని వదిలేస్తా అని అతడు ఓపెన్‌గా చెప్పినాస సరే ఓ సైనికా.. అంటూ పాటలు, మీమ్స్‌తో కావాల్సినదానికంటే ఎక్కువ హైప్ తీసుకొస్తున్నారు. దీంతో ఓటింగ్‌లోనూ తనూజతో పోటీపడే స్థాయికి చేరుకున్నాడు. పైగా బిగ్‌బాస్ టీమ్ కూడా ఈ మధ్య కల్యాణ్‌ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఇదంతా చూస్తుంటే బిగ్‌బాస్ అతడిని గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.మిగిలింది ఇమ్మాన్యుయేల్ఇమ్మాన్యుయేల్ (Emmanuel) ఆల్‌రౌండర్. గేమ్స్ వచ్చాయంటే ప్రాణం పెట్టి ఆడతాడు. మిగతా సమయాల్లో కడుపుబ్బా నవ్విస్తాడు. కానీ, గెలవాలంటే ఇది సరిపోదు. భయపడకుండా ఆడాలి. అది ఇమ్మూకి లేదు. నామినేషన్స్ అంటే భయం. ఎవరైనా నామినేట్ చేస్తే నిలువెల్లా వణికిపోతాడు. దాదాపు 10 వారాలపాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం మైనస్ అయింది. కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడటం కూడా జనాల్లో కాస్త నెగెటివిటీ తీసుకొచ్చింది. అయినప్పటికీ అతడికి కూడా మంచి ఓట్లే పడుతున్నాయి. సూట్‌కేస్ తీసుకోవడం మేలుకానీ, గెలవాలంటే ఇది సరిపోదు. ఓట్ల సంఖ్య మరింత పుంజుకోవాలి. ఒకవేళ ఫైనల్లో తన స్థానం టాప్ 3 అని తెలిస్తే మాత్రం అతడు లక్షలు ఉన్న సూట్‌కేస్ తీసుకోవడమే ఉత్తమం. తన కష్టానికి ప్రతిఫలంగా ఆ డబ్బయినా పనికొస్తుంది. మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ 9కు శుభం కార్డు పడనుంది. మరి ఈ లోపు ఓటింగ్‌ను తారుమారు చేసేలా ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి!చదవండి: బిగ్‌బాస్9 : చివరి కెప్టెన్‌గా కల్యాణ్? పవన్ ఓడించి మరీ..


