Technology
-
రోగులకు చేదోడుగా ‘ప్లూటో’ రోబోట్.. ప్రత్యేకతలివే..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) వెల్లూరు సంయుక్తంగా దేశంలోనే మొట్టమొదటి న్యూరో రిహాబిలిటేషన్ రోబోట్-అసిస్టెడ్ థెరపీ సాధనాన్ని తయారు చేశాయి. ప్లూటో (ప్లగ్ అండ్ ట్రైన్ రోబోట్ ఫర్ హ్యాండ్ న్యూరో రిహాబిలిటేషన్) అని పిలవబడే ఈ రోబో న్యూరో, వెన్నుముక సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తయారీదారులు తెలిపారు. ‘ప్లూటో’ను థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ దేశంలో మార్కెట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.సీఎంసీ వెల్లూరు బయో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శివకుమార్ బాలసుబ్రమణియన్, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్), టాటా ఎలిక్సీ లిమిటెడ్ అందించిన సీఎస్ఆర్ గ్రాంట్లు, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి వచ్చిన నిధులు ప్రాజెక్ట్‌కు ఎంతో ఉపయోగపడినట్లు చెప్పారు.తొమ్మిది క్లినిక్‌ల్లో ట్రయిల్స్ పూర్తి‘ప్లూటో న్యూరో రోగులకు అవసరమైన కచ్చితమైన చికిత్సలు, రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు అవసరమైన మెరుగైన చికిత్సలు, ఫలితాలను అంచనా వేస్తుంది. అధిక చికిత్స ఖర్చులు, దేశంలో చాలా మంది స్ట్రోక్ బాధితులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్లూటోను రూపొందించారు. ఇది ఒక కాంపాక్ట్, పోర్టబుల్ టేబుల్ టాప్ పరికరం. చిన్న సూట్ కేస్ ద్వారా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దేశంలోని తొమ్మిది క్లినిక్‌ల్లో ప్లూటోను ట్రయిల్ చేశారు. గత 30 నెలల్లో 1,000 మందికి పైగా రోగులు, 100 మంది వైద్యులు దీన్ని ఉపయోగించారు. ఇంట్లో ఉపయోగిస్తూ రోగుల వ్యాధికి సంబంధించిన కచ్చితమైన థెరపీ అధ్యయనాలు తెలుసుకోడానికి ప్లూటో ఎంతో దోహదం చేస్తుంది’ అని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎవరికి అవసరం అంటే..ఈ టెక్నాలజీకి లైసెన్స్ ఇచ్చిన థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ ప్లూటోను బిజినెస్ పరంగా వినియోగించుకునేందుకు భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఆసుపత్రులు, చిన్న క్లినిక్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, రోగుల ఇళ్లల్లో దీన్ని సులువు వినియోగించవచ్చని తెలిపింది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనవారు, చేతి వైకల్యం ఉన్న వ్యక్తులకు ఇది చాలా అవసరం అని పేర్కొంది. -
ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..
జీతాల పెంపు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇన్ఫోసిస్ (Infosys) కీలక విషయం తెలిపింది. దేశీయ ఐటీ సేవల దిగ్గజం (IT Company) భారత్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు 6-8 శాతం వార్షిక జీతాల పెంపును ఈ ఏడాది జనవరి నుండి ప్రారంభించనుంది. ఇది దాని ప్రణాళికాబద్ధమైన వేతన సవరణలలో మొదటి దశ. రెండవది వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది."భారత్‌లో కాంప్ (వార్షిక వేతనాల పెంపు) 6-8% ఉంటుందని ఆశిస్తున్నాం. విదేశీ కాంప్‌లు మునుపటి కాంప్ సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి" అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల (Q3FY25) వెల్లడి సందర్భంగా మీడియాతో అన్నారు.బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీలో ప్రపంచవ్యప్తంగా 3.23 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది. సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ పరిశ్రమలో విస్తృత అనిశ్చితిని ఇది ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, ఆలస్యమైన క్లయింట్ బడ్జెట్లు, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితి నుండి ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.కాగా వేతన పెంపు ప్రభావం మార్జిన్లపై ఏ మాత్రం పడుతుందన్నది లెక్కించలేదని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం, 2026 మొదటి త్రైమాసికంలో "కొన్ని ఎదురుగాలులు" తప్పవని సంఘ్రాజ్కా పేర్కొన్నారు. మరోవైపు భారత్ వెలుపల ఉండే ఉద్యోగులకు కూడా జీతం పెంపు సింగిల్ డిజిట్‌లోనే మునుపటి వేతన సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి. ఇక అధిక పనితీరు కనబరిచేవారికి ఎలాగూ వేతన పెంపు కాస్త ఎక్కువగానే ఉంటుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ క్యూ3 ఫలితాలను ప్రకటించిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడుతూ వెల్లడించారు.రూ.6,806 కోట్ల లాభంఏదేమైనా ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలను (Q3 Results) సాధించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’ టెకీ పోస్ట్ వైరల్ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
వీడియో: మస్క్ స్పేస్ఎక్స్ ప్రయోగం విఫలం.. పేలిపోయిన రాకెట్
వాషింగ్టన్: ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్(Elon Musk)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ విఫలమైంది. భూవాతావరణంలోకి ప్రవేశించగానే సాంకేతిక లోపాలతో పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్(SpaceX) సంస్థకు బిగ్ షాక్ తగిలింది. టెక్సాస్‌లోని బొకా చికాలో నుంచి స్పేస్ఎక్స్ ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్(StarShip) విఫలమైంది. రాకెట్ భూ వాతావరణంలోకి చేరుకోగానే సాంకేతిక లోపం కారణంగా గాల్లోనే పేలిపోయింది. అనంతరం, రాకెట్‌కు సంబంధించిన శకలాలు.. కరేబియన్ సముద్రంలో పడిపోయాయి. పెద్ద ఎత్తున మంటలను చిమ్ముతూ శకలాలు పేలిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, జనవరి 16న స్పేస్ఎక్స్ ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ కార్యక్రమం కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఏడో టెస్ట్ ఫ్లైట్ కరేబియన్ మీదుగా వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు రాకెట్ పేలిపోయింది. ఇక, రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో స్పేస్ఎక్స్ స్పందించింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా.. రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పుకొచ్చింది.SpaceX Starship breaking up and re-entering over Turks and Caicos this afternoon. pic.twitter.com/LbpJWewoYB— Molly Ploofkins™ (@Mollyploofkins) January 16, 2025ఇదిలా ఉండగా.. ఈ మిషన్ అద్భుతమైన సాంకేతిక పురోగతిని ప్రదర్శించింది. వీటిలో 33 రాప్టర్ ఇంజిన్లతో కూడిన 232 అడుగుల పొడవైన రాకెట్ సూపర్ హెవీ బూస్టర్ యొక్క విజయవంతమైన మిడ్-ఎయిర్ ల్యాండింగ్ కూడా ఉండం విశేషం. 🚨#BREAKING: Debris was seen over the Caribbean after SpaceX's Starship broke apart during a test flight, creating a spectacular show in the sky.📌#Caicos | #IslandsWatch as multiple footage shows debris lights up the skies as SpaceX successfully launched Starship Flight 7… pic.twitter.com/ZWIUr22USV— R A W S A L E R T S (@rawsalerts) January 16, 2025 -
రియల్మీ కొత్త ఫోన్లు.. అదిరిపోయే కలర్ ఛేంజింగ్ ఫీచర్‌తో..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ 14 సిరీస్‌లో రెండు కొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మీ 14 ప్రో (Realme 14 Pro) 5G, రియల్మీ 14 ప్రో ప్లస్ (Realme 14 Pro+) 5G పేరుతో తాజాగా భారత్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు హ్యాండ్సెట్లు మూడు రంగులలో, అదిరిపోయే కలర్ చేంజింగ్ ఫీచర్‌తో లభ్యమవుతున్నాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్3 (Snapdragon 7s Gen 3) చిప్సెట్తో నడుస్తుంది. ఇక రియల్మీ 14 ప్రోలో మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్ ఉంది. ఖరీదైన ప్రో+ మోడల్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX896 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. రియల్మీ 14 ప్రో సిరీస్‌లోని రెండు హ్యాండ్సెట్లు 80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ యూనిట్లను కలిగి ఉన్నాయి.ధరలివే..భారత్‌లో రియల్మీ 14 ప్రో 5G ప్రారంభ ధర 8GB+128GB మోడల్‌కు రూ.24,999, 8GB+256GB వేరియంట్‌కు రూ. 26,999. ఇది జైపూర్ పింక్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఇక రియల్మీ 14 ప్రో ప్లస్ 5G 8GB+128GB వెర్షన్ ధర రూ.29,999, 8GB+256GB ధర రూ. 31,999లుగా కంపెనీ పేర్కొంది. అదే 12GB+256GB స్టోరేజ్ మోడల్ రూ.34,999కి అందుబాటులో ఉంటుంది. ఇది బికనెర్ పర్పుల్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే రంగులలో లభ్యమవుతుంది.ఈ ఫోన్ల కొనుగోలుపై అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రూ.4,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. రియల్మీ 14 ప్రో సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ (Flipkart), రియల్మీ ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా విక్రయాలు మొదలవుతాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ 5G స్పెసిఫికేషన్లు⇒ 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz డిమ్మింగ్, 1500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల 1.5K (1,272×2,800 పిక్సెల్స్) AMOLED డిస్ప్లే.⇒ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 చిప్సెట్⇒ గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా⇒ 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, Glonass, BeiDou, Galileo, QZSS, USB టైప్-సి కనెక్టివిటీ⇒ బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్⇒ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh టైటాన్ బ్యాటరీరియల్మీ 14 ప్రో 5G స్పెసిఫికేషన్స్⇒ వనిల్లా మోడల్లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.77-అంగుళాల AMOLED డిస్ప్లే⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్⇒ GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 రియర్ కెమెరా, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాహై-రెస్ సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్పీకర్లుఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్⇒ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీకలర్ చేంజింగ్ ఫీచర్ఉష్ణోగ్రత మార్పులకు ప్రతిస్పందించే కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ టెక్నాలజీని రియల్మీ 14 ప్రో ప్లస్ 5G, రియల్మీ 14 ప్రో 5G ఫోన్లలో పెరల్ వైట్ వేరియంట్లలో రియల్మీ వినియోగించింది. ఇది ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు ఫోన్ వెనుక కవర్ పెరల్ వైట్ నుండి బ్లూకు మారుతుంది. తిరిగి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అసలు రంగుకు వస్తుంది. -
కొత్త స్కామ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ.. ఎలా కాపాడుకోవాలంటే..
జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ ఇటీవల వెలుగులోకి వస్తోన్న కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ స్కామ్‌తో మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు మోసం జరుగుతున్న విధానాన్ని తెలియజేసేలా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అటువంటి స్కామర్లు బారిన పడకుండా ఉండాలంటే ఎలా రక్షించుకోవాలో కొన్ని చిట్కాలను అందించారు.మోసం చేస్తున్నారిలా..‘అత్యవసరంగా కాల్ చేయాలి.. మీ ఫోన్‌ను వినియోగించవచ్చా.. అనేలా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని అడగవచ్చు. అమాయకంగా కనిపించే వ్యక్తులు, వృద్ధులు, చిన్న పిల్లలు.. ఈ స్కామర్ల టార్కెట్ కావొచ్చు. వారు మీ ఫోన్ తీసుకుని కాల్ చేయడానికి రహస్యంగా పక్కకు వెళితే మాత్రం అనుమానించాలి. ఎందుకంటే స్కామర్ రహస్యంగా తనకు అవరసరమయ్యే యాప్‌లను మీకు తెలియకుండానే డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పటికే ఉన్న యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకింగ్ అలర్ట్‌లతో సహా కాల్స్, మెసేజ్‌లను వారి నంబర్లకు ఫార్వర్డ్ చేయడానికి మీ ఫోన్లో సెట్టింగ్‌లను మార్చవచ్చు. దీని ద్వారా వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను(ఓటీపీలు) అడ్డుకుని అనధికార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు’ అని కామత్ అన్నారు.Imagine this: A stranger approaches you and asks to use your phone to make an emergency call. Most well-meaning people would probably hand over their phone. But this is a new scam.From intercepting your OTPs to draining your bank accounts, scammers can cause serious damage… pic.twitter.com/3OdLdmDWe5— Nithin Kamath (@Nithin0dha) January 15, 2025ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?ఏం చేయాలంటే..‘మీ ఫోన్ ను అపరిచితులకు అప్పగించవద్దు. అందుకు బదులుగా ఆ నంబర్‌ను మీరే డయల్ చేసి స్పీకర్ ఆన్‌లో పెట్టి మాట్లాడాలని సూచించాలి. ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే స్కామర్లు సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా నిరోధించే అవకాశం ఉంది’ అన్నారు. కామత్ షేర్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో 4,50,000 మందికి పైగా వీక్షించారు. చాలా మంది వినియోగదారులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాలకు సంబంధించి వారి సొంత అనుభవాలను పంచుకున్నారు. విభిన్న భాషల్లో ఉన్న జెరోధా వినియోగదారులు, తన ఫాలోవర్ల కోసం ఇలాంటి అవగాహన వీడియోను ఇతర భాషల్లోకి అనువదించాలని కొందరు సూచించారు. -
కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు
మోసపూరిత కాల్స్‌ను అరికట్టడానికి భారత టెలికమ్యూనికేషన్ శాఖ(DoT) చర్యలు తీసుకుంటోంది. కాలర్ ఐడీ ఫీచర్‌ను అన్ని టెలికాం అపరేటర్లు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. మొబైల్ ఫోన్లలో కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఇన్ కమింగ్ కాల్స్‌కు సంబంధించి ఎవరు కాల్ చేశారో పేరు డిస్ ప్లే అయ్యేలా ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. దాంతో స్పామ్, స్కామ్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చని డాట్ అంచనా వేస్తుంది.ఇటీవల టెలికాం ఆపరేటర్లతో జరిగిన సమావేశంలో సీఎన్ఏపీ సర్వీసులో ఆలస్యం జరగకుండా వెంటనే అమలు చేయాల్సిన అవసరాన్ని టెలికాం శాఖ నొక్కి చెప్పింది. టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభించాయి. కానీ సాంకేతిక పరిమితుల కారణంగా 2జీ వినియోగదారులకు దీన్ని అమలు చేయడం సవాలుగా మరినట్లు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఈ సేవలందిస్తున్న ప్రైవేట్ కంపెనీలుకాల్ చేసింది ఎవరనే వివరాలు డిస్ప్లేపై కనిపించడంతో కాల్ రిసీవ్ చేసుకునేవారికి సీఎన్ఏపీ సర్వీసు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా స్పామ్, స్కామ్ కాల్స్‌కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇప్పటికే ట్రూకాలర్ వంటి కొన్ని కంపెనీలు.. తమకు కాల్స్ చేసే వారి పేరును రిసీవర్ ఫోన్(mobile phones) డిస్ప్లేపై వచ్చేలా సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం ఈ కొత్త సర్వీసు తీసుకురావడంతో ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.అంతర్జాతీయ కాల్స్‌కు ఇలా..సీఎన్ఏపీ సర్వీస్‌తో పాటు, వినియోగదారులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా మోసపోకుండా నిరోధించడానికి +91 కాల్స్‌ను అంతర్జాతీయ కాల్స్‌గా మార్క్ చేయాలని టెలికాం శాఖ టెల్కోలకు సూచించింది. ఇటీవల అంతర్జాతీయ స్కామ్ కాల్స్ పెరగడం ఎక్కువవుతుందని, ఈ చర్యల వల్ల ప్రమాదాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.సవాళ్లున్నా అమలుకు సిద్ధంసీఎన్ఏపీ సర్వీసు కోసం ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కాల్స్ ఒక టెలికాం సర్కిల్లో ప్రారంభమమై మరొక సర్కిల్లో ముగుస్తాయి. గ్రౌండ్ రియాలిటీలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సర్వీసును తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని మొబైల్ పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు. ఏదేమైనా టెక్నికల్ సవాళ్లు ముగిసి, వ్యవస్థ స్థిరపడిన తర్వాత ఈ సేవను అమలు చేస్తామని టెల్కోలు తెలిపాయి.ఇదీ చదవండి: పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు -
డాకింగ్ సక్సెస్
సూళ్లూరుపేట/ సాక్షి బెంగళూరు: సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఇస్రో కలను సాకారం చేసేలా స్పేడెక్స్ జంట ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ (డాకింగ్) విజయవంతమైంది. దీంతో ప్రపంచంలో డాకింగ్ సాంకేతికతను సాధించిన నాలుగోదేశంగా భారత్ అవతరించింది. అత్యంత క్లిష్టమైన డాకింగ్‌ను పూర్తిచేసి ఇస్రో మరోసారి తన సత్తా చాటింది. దీంతో నూతన సంవత్సరంలో ఇస్రో విజయాల బోణీ కొట్టింది. ఇంతకాలం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్‌ను సాధించి ఇస్రో తన కీర్తికిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. ఈ మిషన్ లో పాలు పంచుకున్న సిబ్బందికి నా శుభాకాంక్షలు. భారత భవిష్యత్ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఈ డాకింగ్ తొలిమెట్టు’’ అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.𝗦𝗽𝗮𝗗𝗲𝗫 𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗨𝗽𝗱𝗮𝘁𝗲:Following the docking, ISRO has successfully managed both satellites as a combined unit. In the upcoming days, ISRO will proceed with undocking and power transfer evaluations.#SPADEX #ISRO pic.twitter.com/tMmCcF5opG— ISRO InSight (@ISROSight) January 16, 2025గురువారం ఉదయం 9 గంటలకు చేజర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్‌డీఎక్స్02) అనే జంట ఉపగ్రహాలను అనుసంధానించామని, డాకింగ్ తర్వాత వీటిని ఒకే ఉపగ్రహంగా కంట్రోల్ చేస్తు న్నాం. త్వరలో మళ్లీ వీటిని దూరంగా విడగొడతాం. వీటి మధ్య ఇంధన, విద్యుత్ సరఫరా వ్యవస్థల బదిలీని పరీక్షిస్తాం’’ అని ఇస్రో గురువారం ప్రకటించింది. ‘‘ అంతరిక్ష చరిత్రతో భారత్ తన పేరును ‘డాకింగ్’చేసింది. స్పేడెక్స్ మిషన్ ద్వారా చరిత్రాత్మక స్థాయిలో డాకింగ్ విజయవంతమైంది. ఈ చిరస్మరణీయ క్షణానికి సాక్షిగా నిలిచినందుకు గర్విస్తున్నాం’’ అని ఇస్రో ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టింది. ఇస్రో తన డాకింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ‘‘అద్భుత ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఈ మిషSpaDeX Docking Update:🌟Docking SuccessSpacecraft docking successfully completed! A historic moment.Let’s walk through the SpaDeX docking process:Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…— ISRO (@isro) January 16, 2025వైఫల్యాల నుంచి విజయం దాకాగత ఏడాది డిసెంబర్ 30వ తేదీన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ– సీ60) రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్(స్పేడెక్స్) మిషన్‌ను చేపట్టారు. ఇందులోభాగంగా చెరో 220 కేజీల బరువైన చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను ప్రయోగించిన 15 నిమిషాల తర్వాత 475 కిలోమీటర్ల పొడవైన వేర్వేరు వృత్తాకార కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. తర్వాత వాటిని నెమ్మదిగా ఒకే కక్ష్యలోకి తీసుకొచ్చారు. వాటిని అనుసంధానించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ వేగాల్లో సారూప్యత లేకపోవడంతో డాకింగ్ సాధ్యంకాలేదు. చివరిసారిగా జనవరి 12వ తేదీన ఒకే కక్ష్యలో కేవలం 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చారు. తర్వాత దూరాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ మూడు మీటర్ల సమీపానికి తీసుకొచ్చారు. అయితే భూమ్మీది కమాండ్ సెంటర్ నుంచి స్పష్టంగా వీక్షించేందుకు సరిపడా వెలుతురు లేక, అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా డాకింగ్‌ను నిలిపేసి మళ్లీ వాటిని సురక్షిత దూరాలకు పంపేశారు. ఎట్టకేలకు గురువారం ఉదయం 9 గంటలకు అంతరిక్షంలో అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రెండు ఉపగ్రహాలను అత్యంత కచ్చితత్వంతో ఒకదానికొకటి జోడించేందుకు మళ్లీ డాకింగ్‌కు ప్రయత్నించారు. టార్గెట్ ఉపగ్రహం నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్న చేజర్ ఉపగ్రహాన్ని తొలుత అత్యంత జాగ్రత్తగా 3 మీటర్ల సమీపానికి తెచ్చారు. లేజర్ రేంజ్ ఫైండర్, డాకింగ్ సెన్సార్లను ఉపయోగించి ఎట్టకేలకు చేజర్ ఉపగ్రహాన్ని టార్గెట్ ఉపగ్రహంతో డాకింగ్ చేశారు. భవిష్యత్తులో నిర్వహించబోయే చంద్రయాన్–4, గగన్‌యాన్ ప్రయోగాలకు కూడా ఈ డాకింగ్ సాంకేతికత దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన స్పేడెక్స్ ప్రయోగం బృందానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అభినందనలు తెలియజేశారు.Dr. V. Narayanan, Secretary DOS, Chairman Space Commission and Chairman ISRO, congratulated the team ISRO.#SPADEX #ISRO pic.twitter.com/WlPL8GRzNu— ISRO (@isro) January 16, 2025 ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయ డం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ విజయంతో భవిష్యత్‌లో భారత్ చేపట్టే ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమాలకు కీలకమైన ముందడుగు పడింది. ఈ సందర్భంగా ఇస్రోకు అభినందనలు’ అంటూ గురువారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. Congratulations to our scientists at @isro and the entire space fraternity for the successful demonstration of space docking of satellites. It is a significant stepping stone for India’s ambitious space missions in the years to come.— Narendra Modi (@narendramodi) January 16, 2025 -
అందానికి ఏఐ టచ్!
రమ్య తన పొడి చర్మానికి తగిన సౌందర్య ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో వెతుకుతోంది. ఒక కంపెనీ వెబ్‌సైట్‌లోని టూల్ ఆకట్టుకుంది. రకరకాల యాంగిల్స్‌లో సెల్ఫిలను క్యాప్చర్ చేసి పంపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఆమె ముఖాన్ని విశ్లేషించి తగిన ప్రోడక్టులను సిఫార్సు చేయడం.. వాటిని కొనుగోలు చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ కాస్మెటిక్స్ బాగా పనిచేయడంతో చాన్నాళ్లుగా వెంటాడుతున్న తన సమస్యకు పరిష్కారం లభించింది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ (బీపీసీ) రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలకు ఇది ఓ మచ్చుతునక మాత్రమే!బ్యూటీ, పర్సనల్ కేర్ రంగంలో ఇప్పుడు హైపర్ పర్సనలైజేషన్ గేమ్ చేంజర్‌గా మారుతోంది. చర్మ స్వభావానికి అనుగుణంగా వ్యక్తిగత ప్రొడక్టుల వాడకానికి డిమాండ్ జోరందుకోవడంతో కంపెనీలు ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఇతరత్రా అధునాతన టెక్నాలజీల బాట పడుతున్నాయి. ఏఐతో అందానికి వన్నెలద్దుతున్నాయి. వినియోగదారులకు కూడా ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెగ నచ్చేస్తుండటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. దీంతో బ్యూటీ బ్రాండ్స్‌లో స్టార్టప్‌లు మొదలు.. ఇప్పటికే బాగా పాతుకుపోయిన పెద్ద కంపెనీలు సైతం ఏఐ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఎవరైనా సరే తమ సెల్ఫిలను తీసి పంపితే చాలు.. ఏఐ మోడల్ వాటిని ప్రాసెస్ చేసి, అత్యంత నిశితమైన సమస్యలను సైతం గుర్తిస్తుంది. చర్మం రకం, మొటిమలు, నలుపు మచ్చలు, రంగు మారడం, పొడిబారడం, ఎగుడుదిగుడు చర్మం, ముడతలు, గుంతలను గుర్తించి, రియల్ టైమ్‌లో వ్యక్తిగతంగా సరైన సిఫార్సులు అందిస్తుంది.డేటా ఎనలిటిక్స్ దన్ను... బ్యూటీ స్టార్టప్‌లు గత రెండు మూడేళ్లుగా వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిన డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలుగుతున్నాయి. వేలాది మంది వ్యక్తిగత డేటాలోని అంశాలను విశ్లేషించి యూజర్లను పొడి చర్మం, పిగ్మెంటెడ్ స్కిన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి వివిధ విభాగాలుగా విభజిస్తున్నాయి. ఆపై ఏఐ టెక్నాలజీ పని మొదలుపెడుతుంది. వినియోగదారులు పంపించే తాజా ఫేస్ ఇమేజ్‌లను ఇప్పటికే గుర్తించి, విభజించిన లక్షణాల ఆధారంగా సరిపోల్చడం ద్వారా వారి చర్మ స్వభావాన్ని అంచనా వేస్తుంది. ఈ ప్రక్రియతో బ్యూటీ కంపెనీలు ఒక్క చర్మాన్ని మాత్రమే కాకుండా పెదాలు, శిరోజాలను కూడా విశ్లేషించి, తదనుగుణంగా ఉత్పత్తులను సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ట్రాయా, రావెల్ వంటి హెయిర్ కేర్ స్టార్టప్‌లు క్విక్ ఆన్లైన్ సర్వే నిర్వహించి, మెషీన్ లెరి్నంగ్ ద్వారా ఎవరికి ఎలాంటి పదార్థాలతో కూడిన ప్రొడక్టు అవసరమనేది కొద్ది నిమిషాల్లోనే సిఫార్పు చేస్తుండడం విశేషం!స్మార్ట్ టూల్స్..ఆన్లైన్ బ్యూటీ స్టోర్ పర్పుల్.. సొంతంగా పర్పుల్ స్కిన్ ఎనలైజర్ అనే ఏఐ ఇమేజ్ రికగి్నషన్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల చర్మాన్ని రియల్ టైమ్‌లో విశ్లేషిస్తుంది. ఆపై దీని స్మార్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) టూల్ మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగించి హైపర్ పర్సనలైజ్డ్ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుందని సంస్థ ఇంజినీరింగ్ హెడ్ వివేక్ పరిహార్ చెబుతున్నారు. ఇక లోరియల్ ప్రొడక్టులను విక్రయించే నైకా కూడా అధునాతన ఏఐ ఆధారిత వర్చువల్ టెక్నాలజీ ‘మోడిఫేస్’ను ఉపయోస్తోంది. వినియోగదారులు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) అనుభవం ద్వారా తమకు సరిపడే ప్రొడక్టులను ఎంచుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ దాదాపు 88 శాతం ఖచ్చితత్వంతో ఫేస్ ఆకారం, స్కిన్ టోన్, శిరోజాల రంగుతో సహా అనేక అంశాలను గుర్తించగలదు. అడ్వాన్స్డ్ డిజిటల్ ఫీచర్లు కస్టమర్లతో మరింతగా అనుసంధానమయ్యేందుకు, వారికి మరింత ప్రభావవంతమైన, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు దోహదం చేస్తున్నాయని బ్యూటీ స్టార్టప్ షుగర్ కాస్మెటిక్స్ సీఈఓ వినీతా సింగ్ పేర్కొన్నారు. ‘యూజర్ల కొనుగోలు హిస్టరీ ఆధారంగా సిఫార్సులు చేసేందుకు మెషీన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉపయోగపడుతున్నాయి. ఫేస్ ఫౌండేషన్ కొన్న వారు మస్కారాను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాస్మిన్ గోహిల్ పేర్కొన్నారు.ఫీడ్ బ్యాక్, సందేహాలు, డెలివరీలోనూ...కస్టమర్ల ఫీడ్‌బ్యాక్, సందేహాలు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వంటి అన్ని దశల్లోనూ టెక్నాలజీ అక్కరకొస్తోంది. యూజర్ల సందేహాలను మరింత సమర్థవంతంగా విభజించి, విశ్లేషించేందుకు పెప్ బ్రాండ్స్ క్యాప్చర్ అనే ఏఐ ఆధారిత టూల్‌ను ఉపయోగిస్తోంది. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ బ్యూటీ డిక్షనరీతో కూడిన సెర్చ్ ఇంజిన్‌ను పర్పుల్ అందుబాటులోకి తెచ్చింది. దీనిలోని జీపీటీ ఆధారిత టూల్ వల్ల యూజర్లు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా స్పెల్లింగ్ కరెక్ట్ చేయడం వంటివి చేస్తుంది. ఇక చాలా మందికి ఇంగ్లిష్‌లో తమ సందేహాలు చెప్పడం పెద్ద సమస్య. వారికోసం పర్పుల్ స్థానిక భాషలో సెర్చ్‌ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్లకు వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు సరైన వేర్‌హౌస్, రవాణా సంస్థలను ఎంచుకోవడంలోనూ స్టార్టప్‌లకు ఏఐ, ఎంఎల్ టూల్స్ తోడ్పడుతున్నాయి. 34 బిలియన్ డాలర్లు 2028 నాటికి భారత బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ విలువ అంచనా. 25శాతంఆన్లైన్ ద్వారా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాల వార్షిక వృద్ధి అంచనా (ఆఫ్‌లైన్ స్టోర్లలో 14 శాతమే).– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
త్వరలో స్మార్ట్ ఫోన్ అంతం!! తర్వాత రాబోయేది ఇదే..
విశ్వవ్యాప్త సాంకేతికతను అంగీకరించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. దానిని అంతే వేగంగా ఒడిసిపట్టుకుని అంగీకరిస్తుంటాడు కూడా. అయితే దశాబ్దాలపాటు మనందరి జీవితంలో భాగమైన మొబైల్ ఫోన్.. త్వరలో అంతం కానుందా?. అన్నింటికీ నెక్స్ట్(అడ్వాన్స్డ్) లెవల్ కోరుకునే మనిషికి వాటి స్థానంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది?..మనిషి జీవితంలో మొబైల్ ఫోన్లు(Mobile Phones) రాక ఒక క్రమపద్ధతిలో జరిగింది. కమ్యూనికేషన్లో భాగంగా.. రాతి కాలం నుంచి నేటి ఏఐ ఏజ్ దాకా రకరకాల మార్గాలను మనిషి అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పొగతో సిగ్నల్స్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పావురాల సందేశం, డ్రమ్ములు వాయించడం, బూరలు ఊదడం లాంటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేవాడు. కొన్ని ఏండ్లకు అది రాతపూర్వకం రూపంలోకి మారిపోయింది. ఆపై.. ఆధునిక యుగానికి వచ్చేసరికి టెలిగ్రఫీ, టెలిఫోనీ, రేడియో కమ్యూనికేషన్, టెలివిజన్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్-ఈమెయిల్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా.. ఆపై మోడ్రన్ కమ్యూనికేషన్(Modern Communication)లో భాగంగా ఏఐ బేస్డ్ టూల్స్ ఉపయోగం పెరిగిపోవడం చూస్తున్నాం. అయితే.. ఇన్నేసి మార్పులు వచ్చినా దశాబ్దాల తరబడి మొబైల్ ఫోన్ల డామినేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్ ఒక అవసరంగా మారిపోయిందది. మరి అలాంటిదానికి అసలు ‘అంతం’ ఉంటుందా?అమెరికా వ్యాపారవేత్త, ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు, ప్రస్తుత మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) సెల్‌ఫోన్ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్ఫోన్ల అంతం త్వరలోనే ఉండబోతోందని, వాటి స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో వేరబుల్ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) అనేది మనిషి జీవితంలో భాగం కానుంది. సంప్రదాయ ఫోన్ల కంటే స్మార్ట్ గ్లాసెస్‌ను ఎక్కువగా వినియోగిస్తాడు. వీటిని వాడడం చాలా సులువనే అంచనాకి మనిషి త్వరగానే వస్తాడు. అవుట్‌డేటెడ్ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే. నా దృష్టిలో రాబోయే రోజుల్లో తమ చుట్టుపక్కల వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు స్మార్ట్ గ్లాసెస్(Smart Glasses)లాంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఆ సంఖ్య ఫోన్ల కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి’’ అని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.అలాగే 2030 నాటికి సెల్ఫోన్ల వాడకం బాగా తగ్గిపోతుందని.. దానికి బదులు స్మార్ట్‌గ్లాసెస్ తరహా టెక్నాలజీ వాడుకలో ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వేరబుల్ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని.. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదని, అంచలంచెలుగా అది జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్ యాక్ససరీస్‌కు మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది. తాజా సర్వేల ప్రకారం.. గత ఐదేళ్లుగా స్మార్ట్ వేరబుల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ వేరబుల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్‌గ్లాసెస్ వినియోగమూ పెరిగింది కూడా. రేబాన్ మెటా, ఎక్స్ రియల్ ఏ2, వచుర్ ప్రో ఎక్స్ఆర్, సోలోస్ ఎయిర్‌గో విజన్, అమెజాన్ ఎకో ఫఫ్రేమ్స్, లూసిడ్ తదితర బ్రాండ్లు మార్కెట్లోకి అందుబాటులోకి ఉన్నాయి. యాపిల్ కంపెనీ యాపిల్ విజన్ ప్రో పేరిట మార్కెట్‌కు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. మరికొన్ని కంపెనీలు కూడా ఇంకా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ చేతికి అత్యంత అరుదైన వాచ్!! -
చంద్రునిపైకి ‘ఘోస్ట్’ ప్రయోగం
హాథ్రోన్: అంతరిక్ష ప్రయోగాలకు ఈ మధ్యకాస్త గ్యాప్ వచ్చింది. అయితే 2025 ఆరంభంలోనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్(SpaceX) తన ప్రయోగాలను మొదలుపెట్టింది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా.. ఒకే రాకెట్‌తో ఏకంగా రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా ఒకేసారి రెండు మిషన్లను ప్రారంభించినట్లైంది!. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని నాసా(NASA) కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ బ్లూ ఘోస్ట్-1, ఐస్పేస్‌కు చెందిన హకుటో-ఆర్2లను ల్యాండర్లను మోసుకెళ్లింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ స్పేస్ఎక్స్ వీటిని ప్రయోగించింది. ఈ రెండు వేర్వేరు దేశాలకు మాత్రమే కాదు.. వేర్వేరు టెక్నాలజీలకు చెందినవి కూడా. ఆయా నిర్ణీత రోజుల్లో అవి చంద్రుడి మీదకు దిగనున్నాయి. ఇంతకీ ఇవి స్విచ్ఛాఫ్ అయ్యేలోపు ఎలాంటి పనులు చేస్తాయంటే.. Today’s mission is our third launch to a lunar surface and just the first of several our Falcon fleet will launch for @NASA’s Commercial Lunar Payload Services (CLPS) program this year. These missions help humanity explore the Moon, Mars, and beyond, bringing us one step closer… pic.twitter.com/Go2yUccFb3— SpaceX (@SpaceX) January 15, 2025ఘోస్ట్ ఏం చేస్తుందంటే.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కమర్షియల్ లూనార్ ప్లేలోడ్ సర్వీసెస్(CLPS)లో భాగంగా బ్లూ ఘోస్ట్-1ను రూపొందించారు. చంద్రుడిపై ఉన్న అతిపెద్ద పరివాహక ప్రాంతం మేర్ క్రిసియంలో ఇది దిగి.. పరిశోధనలు చేయనుంది. ఈ ల్యాండర్ చంద్రుడి మీదకు చేరుకోవడానికి 45 రోజలు టైం పడుతుంది. ఇది చంద్రుడిపై స్వతంత్రంగానే ల్యాండ్ అయ్యి.. రెండువారాలపాటు సైంటిఫిక్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. అక్కడి పరిస్థితులను ఫొటోలు తీస్తుంది. అలాగే.. పది అడుగుల లోతులో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తుంది. అలాగే రెగోలిథ్(అక్కడి భూపొర)ను సేకరిస్తుంది. భూమికి చందద్రుడికి మధ్య లేజర్ కిరణాల సాయంతో దూరాన్ని కొలుస్తుంది. ఈ పనులన్నీ చేయడానికి పది సైంటిఫిక్ పరికరాలను మోసుకెళ్లింది. ఇది చంద్రుడిపై నిర్వహిస్తున్న అత్యాధునిక పరిశోధనగా నాసా చెబుతోంది. హకుటో చేసే పని ఇదే.. జపాన్‌కు చెందిన ఐస్పేస్ కంపెనీ హకుటో ఆర్2 అనే రీసైలెన్స్ ల్యాండర్‌ను రూపొందించింది. ఇది చంద్రుడి ఉత్తర గోళార్థంలోని మేర్ ఫ్రిగోరిస్లో అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఈ ల్యాండర్‌కు 4 నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. కింది ఏడాది ఏప్రిల్‌లో ఐస్పేస్ ఇదే తరహా ప్రయోగాన్ని నిర్వహించినప్పటికీ.. సెన్సార్లు పనిచేయకపోవడంతో ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. టెనాషియస్ అనే మైక్రోరోవర్ను హకుటో-ఆర్2 చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగిస్తుంది. అది అక్కడి రెగోలిత్‌ను సేకరిస్తుంది. చంద్రుడి మీద పరిశోధనలకు అంతరిక్ష పరిశోధన సంస్థలే కాదు.. ప్రైవేట్ కంపెనీలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రుడిపై మానవాన్వేషణలో మున్ముందు మరింత అత్యాధునిక ప్రయోగాలు జరిగే అవకాశం లేకపోలేదు. -
పనితీరు సరిగాలేదా.. సర్దుకోవాల్సిందే..
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ తన ఉద్యోగుల్లో దాదాపు ఐదు శాతం మందికి లేఆఫ్స్ ఇచ్చే ప్రణాళికలను ప్రకటించింది. ఉద్యోగులందరికీ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ పంపిన అంతర్గత మెమోలో ఈ విషయాన్ని వెల్లడించారు. పనితీరు నిర్వహణపై పరిమితిని పెంచాలని, తక్కువ పనితీరు కనబరిచేవారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు జూకర్ బర్గ్ మెమోలో పేర్కొన్నారు.‘కంపెనీ సాధారణంగా ఏడాది కాలంలో తక్కువ పనితీరు కనబరిచేవారిని ట్రాక్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తున్నాం. ఇప్పటికే 2024లో పనితీరు సరిగాలేని దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాం. ఈసారి మరో 5 శాతం మందిని ఉద్యోగులను తొలగించనున్నాం. ఇది భవిష్యత్తులో 10 శాతానికి చేరుతుంది’ అని మెమోలో పేర్కొన్నారు.ప్యాకేజీ ఇస్తామని హామీసెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఈ కోతల వల్ల దాదాపు 3,600 ఉద్యోగులు ప్రభావితం చెందుతారని అంచనా వేసింది. పనితీరు సరిగాలేని వారిని తొలగించే స్థానంలో ఈ ఏడాది చివర్లో ఆయా ఖాళీలను భర్తీ చేయాలని కంపెనీ యోచిస్తోంది. బాధిత ఉద్యోగులకు ఉదారంగా సెవెరెన్స్ ప్యాకేజీ(లేఆఫ్స్ కారణంగా ఇచ్చే ప్యాకేజీ)లు అందిస్తామని జూకర్ బర్గ్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: సులభంగా రూ.కోటి సంపాదన!మిశ్రమ స్పందనకార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, సంస్థ భవిష్యత్తు ప్రాజెక్ట్‌లపై కృత్రిమ మేధ, స్మార్ట్ గ్లాసెస్, సోషల్ మీడియా వంటి కీలక విభాగాలపై దృష్టి పెట్టడానికి మెటా చురుకుగా పని చేస్తోంది. కంపెనీ లేఆఫ్స్ ప్రకటనపై ఉద్యోగులు, పరిశ్రమ పరిశీలకుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కంపెనీ సమర్థతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం అవసరమని కొందరు భావిస్తుండగా, మరికొందరు ఉద్యోగుల నైతిక స్థైర్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. -
మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?
రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది.2025లో జియో లిస్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో కంపెనీ తన వృద్ధిని పెంచడానికి అధిక టారిఫ్‌లకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ తన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిమెంట్ (ROCE)ను మెరుగుపరచడానికి టారిఫ్‌లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున టారిఫ్ పెంపునకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: రూపాయి క్షీణత మంచిదేటారిఫ్ పెంపు వల్ల సగటు వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) కనీసం 25% పెరుగుతుందని, ఇది మెరుగైన మార్జిన్ విస్తరణ, నగదు ప్రవాహ ఉత్పత్తికి దారితీస్తుందని భావిస్తున్నారు. భారతీ ఎయిర్ టెల్, జియోలకు మార్జిన్లు 170-200 బేసిస్ పాయింట్లు పెరగడంతో టెలికాం రంగం ఆదాయ వృద్ధి ఏడాదికి 15 శాతం పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేసింది. -
ఎలాన్ మస్క్ చేతికి టిక్‌టాక్..?
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్‌మస్క్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్లో నికర లాభం 5.5 శాతం బలపడి రూ. 4,591 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,350 కోట్లు ఆర్జించింది. పూర్తి ఏడాదికి ఆదాయ ఆర్జన అంచనా(గైడెన్స్)ను తాజాగా 4.5–5 శాతానికి సవరించింది. ఇంతక్రితం 3.5–5 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. డిమాండ్ వాతావరణంతోపాటు విచక్షణా వ్యయాలు పెరుగుతున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. దీంతో గైడెన్స్‌ను మెరుగుపరచినట్లు తెలియజేశారు. తాము అందిస్తున్న డిజిటల్, ఏఐ సేవలపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. మొత్తం ఆదాయం సైతం 5 శాతం పుంజుకుని రూ. 28,446 కోట్లకు చేరింది. త్రైమాసికవారీగా ఆదాయం 8.4 శాతం, నికర లాభం 3.6 శాతం చొప్పున వృద్ధి చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ.6 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ఆర్డర్లు ఓకే క్యూ3లో హెచ్‌సీఎల్ టెక్ 2.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. క్యూ3లో 2,134 మంది ఉద్యోగులను జత చేసుకోగా.. మొత్తం సిబ్బంది సంఖ్య 2,20,755కు చేరింది. జనవరి–మార్చి(క్యూ4)లో 1,000 మందికి కొత్తగా ఉపాధి కల్పించనున్నట్లు హెచ్ఆర్ అధికారి ఆర్ సుందరరాజన్ తెలియజేశారు. వచ్చే ఏడాది(2025–26) ఉద్యోగులను తీసుకోవడంకంటే స్పెషలైజేషన్‌పై అధిక దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. యూఎస్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పందిస్తూ అక్కడి తమ ఉద్యోగుల్లో 80 శాతం స్థానికులేనని విజయకుమార్ వెల్లడించారు. దీంతో హెచ్1బీ వీసాలపై అతితక్కువగానే ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇవి ఏడాదికి 500–1,000వరకూ మాత్రమే ఉంటాయని తెలియజేశారు. వెరసి తమ బిజినెస్‌పై ఇలాంటి అంశాలు ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం నష్టంతో రూ. 1,985 వద్ద ముగిసింది. -
మహా కుంభమేళాకు సైబర్ భద్రత
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో మహా కుంభమేళా వెబ్సైట్లు, యాప్‌లపై సైబర్ దాడి జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి భద్రత కల్పించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్(IIT Kanpur) ముందుకొచ్చింది. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)ను గంగా, యమునా, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ఉత్తర్‌ప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్నారు. జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26తో ఈ కార్యక్రమం ముగుస్తుంది.నిపుణుల బృందం పర్యవేక్షణఐఐటీ కాన్పూర్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) అలహాబాద్‌కు చెందిన ఎక్స్‌పర్ట్‌తో కలిసి యూపీ పోలీసు సిబ్బందికి సాయం చేసేందుకు సిద్ధమైంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బృందం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణ, నిరంతరం ఆడిట్ నిర్వహిస్తుంది.వర్చువల్ పెట్రోలింగ్, ఫైర్‌వాల్ తనిఖీలుసైబర్ దాడులు, రాన్సమ్వేర్, పోర్ట్ స్కానింగ్(Scanning) వంటి వాటిని నివారించడానికి ఈ బృందం వర్చువల్ పెట్రోలింగ్, ఫైర్‌వాల్ తనిఖీలు నిర్వహించనుంది. ఈవెంట్ వెబ్సైట్లు, అప్లికేషన్ల నిరంతరం పర్యవేక్షించనుంది. మహాకుంభ్ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లు కొన్నిసార్లు వల్నరబిలిటీ ఆడిట్(హానికర కంటెంట్‌ను జొప్పించడం)కు గురయ్యే ప్రమాదం ఉంది. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (NIIPC), కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ద్వారా స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ (ఎస్టిక్యూసీ)తో సహా వివిధ నిపుణుల ఏజెన్సీలు నిత్యం ఆడిట్లను నిర్వహిస్తాయి. భద్రతా బలహీనతలను గుర్తించడానికి, పరిష్కరించడానికి ఈ ఆడిట్లు సహాయపడతాయి.ఇదీ చదవండి: నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణంయూపీ పోలీసుల సహకారంతో..నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన యూపీ పోలీసులతో సైబర్ సెక్యూరిటీని సమన్వయం చేస్తున్నారు. నిరంతర అప్రమత్తంగా ఉంటూ, ఏదైనా బెదిరింపులు వంటివి వస్తే సత్వర చర్యలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. -
‘నల్ల పెట్టె’ మౌనరాగం!
బ్లాక్ బాక్స్... చూసేందుకు నల్ల రంగులో ఉండదు. ‘డెత్ కోడ్’ను రహస్యంగా తనలో దాచుకుంటుంది. ఈ బాక్స్ ఒకటి కూడా కాదు. నిజానికి రెండు పెట్టెలు! విమానం కూలిపోతే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే చాలు... ప్రమాద కారణాలు తెలిసినట్టే. ఆ తప్పులు, లోపాలు పునరావృతమవకుండా జాగ్రత్తపడితే భవిష్యత్ ప్రమాదాలను నివారించవచ్చు. విమానయానాన్ని అందరికీ సురక్షితం చేయవచ్చు.గాలిలో ప్రయాణం గాలిలో దీపం. రన్ వే మీది నుంచి పైకి ఎగిరిన విమానం మళ్లీ క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కారణాలు తెలియాలంటే, కచ్చితమైన ఆధారాలు కనుగొనాలంటే తొలుత దాని బ్లాక్ బాక్స్ పరిశోధకుల చేతికి చిక్కాలి. అందుకే దర్యాప్తు సంస్థలు ముందుగా దాని అన్వేషణ కోసం రంగంలోకి దిగుతాయి. బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు భాగాలు. అవి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్). వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. బ్లాక్ బాక్స్ పేరుకు తగ్గట్టుగా ఇవి నల్ల రంగులో ఉండవు! ప్రమాద స్థలిలో సులభంగా గుర్తుపట్టగలిగేలా ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి.విమానం కూలిపోయినప్పుడు ఆ నష్ట ప్రభావం దాని తోకభాగంపై స్వల్పంగా పడుతుంది. అందుకే కీలక డేటా నిక్షిప్తమైన బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా దాన్ని విమానం తోక భాగంలో అమర్చుతారు. సెకన్ల వ్యవధిలో ఎఫ్డీఆర్ దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది? ఇంజిన్ పనితీరు ఎలా ఉంది? ప్రయాణ మార్గం, దిశ వంటి వివరాలను అది నమోదు చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి పైలట్లు పంపిన, స్వీకరించిన సమాచారమేంటి? పైలట్ల సంభాషణలు, విమానంలోని కాక్‌పిట్ శబ్దాలు వంటి వివరాలను సీవీఆర్ రికార్డు చేస్తుంది.విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలేమిటి? దుర్ఘటన చివరి నిమిషాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనే వివరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. ఫ్లైట్ రికార్డర్ల డేటాను విశ్లేషించి ప్రమాద హేతువులపై పరిశోధకులు ఓ అంచనాకు వస్తారు. మరి దర్యాప్తులో ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె’… తాను మాట్లాడబోనంటూ అప్పుడప్పుడు మొండికేస్తుంది. కావాల్సిన డేటా ఇవ్వకుండా మొరాయించి ఇన్వెస్టిగేటర్లను ముప్పుతిప్పలు పెడుతుంది. క్లిష్ట సమయాల్లో రహస్యాలు బయటికి చెప్పకుండా మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’ విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానం కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి. దాంతో ఆ దుర్ఘటన దర్యాప్తు ప్రస్తుతం క్లిష్టంగా మారింది. దక్షిణ కొరియా విమానంలోని బ్లాక్ బాక్స్ ఎందుకు విఫలమైంది? బ్లాక్ బాక్సులు ఇలా విఫలమైన సందర్భాలు గతంలో ఉన్నాయా? అందుకు దారితీసే కారణాలేంటి? ఈ సమస్యను అధిగమించేదేలా? వివరాలు మీకోసం... వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులో భాగమైన రెండు ఫ్లైట్ రికార్డర్ల బరువు సుమారు 4.5 కిలోల దాకా ఉంటుంది. గురుత్వశక్తి కంటే 3,400 రెట్ల అధిక శక్తితో విమానం కూలుడు సంభవించినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కొంతసేపు భరించగలదు. విమానం సముద్రంలో కూలినా తానెక్కడున్నదీ తెలిపేలా హై పిచ్ శబ్దాలతో బ్లాక్ బాక్స్ 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. నీటిలో 20 వేల అడుగుల లోతులోనూ 30 రోజులు పనిచేయగలదు. దానిలోని కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా టెక్నీషియన్లు జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసుకుని కాపీ చేస్తారు. అనంతరం డేటాను డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫలమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ (Software) లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సులు పనిచేయవు.ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు వాటిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ-యాక్టివేట్ చేసినప్పుడు అవి పనిచేయడం మానివేస్తాయి. డేటా ఓవర్ లోడ్ (Overload) అయినప్పుడు కూడా అవి మొరాయిస్తాయి. కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిర్ణీత కాలం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఫలితంగా వాటి నుంచి ఎలాంటి సమాచారం లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్ (airlines) బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో దాని తలుపు ఊడినప్పుడు (డోర్ ప్లగ్ బ్లో-అవుట్) సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. అత్యుష్ణ లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు, నీటిలో ఎక్కువ కాలం నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. తేమ చేరుకుని సున్నిత భాగాల్లోని ఎక్విప్మెంట్ దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లోని పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సులు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం!ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యంపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. ఆవశ్యకత ఎంతో ఉన్నా ఖర్చు, పరిమితుల దృష్ట్యా వాటి సామర్థ్యం పెంపు అంశంలో కొంత జాప్యం సంభవిస్తోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలోని సాధారణ సిస్టమ్స్ నుంచి కాకుండా వేరే వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. విమానంలోని రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానం అంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి అందులోని 217 మంది మరణించారు. ఈ విమానంలో ఆన్‌బోర్డ్ (onboard) ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి.విమానం లోపల సాధారణ అవసరాలకు సరఫరా అయ్యే కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు మరో 10 నిమిషాలపాటు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లు ఉండాలని సదరు ప్రమాదం దరిమిలా అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సులకు బ్యాకప్ బ్యాటరీలున్నా వాటి జీవితకాలం తక్కువ. ఆ బ్యాటరీలు కొన్ని సందర్భాల్లో పనిచేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’ విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమవడంతో ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక అవి పనిచేయడం మానివేసి ఉంటాయని భావిస్తున్నారు.ఇక సీవీఆర్ విషయానికొస్తే అది సాధారణంగా ఒక విడతలో గరిష్ఠంగా రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ రెండు గంటల్లో రికార్డయిన డేటానే అది రిపీట్ చేస్తుంది. ఈ రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న డిమాండ్. ఇది ప్రస్తుతం కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 రియో డి జెనీరో (బ్రెజిల్) నుంచి ప్యారిస్ వెళుతూ నడి అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి విమానంలోని 228 మంది చనిపోయారు. ఇక మలేసియా ఎయిర్‌లైన్స్ (airlines) ఎంహెచ్ 370 ఫ్లైట్ వ్యధ... ఇప్పటికీ అంతు లేని కథ! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ ప్రయాణిస్తూ అకస్మాత్తుగా రాడార్ తెర మీది నుంచి ఆ విమానం అదృశ్యమైంది.అందులోని 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం అలా ఎందుకు అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలో అదొక పెద్ద మిస్టరీ. ఆ విమానం ఏమైపోయిందో కనుక్కోవడానికి బోలెడు వ్యయమైంది. ఆ అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ విమానం దక్షిణ హిందూమహాసముద్రంలో కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాని జాడ కనుగొనేందుకు అన్వేషణ పునః ప్రారంభించాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’ విమానం దుర్ఘటన దరిమిలా... మహాసముద్రాలను దాటి దూర ప్రయాణాలు చేసే ట్రాన్స్-ఓషనిక్ ఫ్లైట్స్ విషయంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల వాయిస్ డేటా రికార్డింగ్ ఉండాల్సిందేనని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది.మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం అదృశ్యంతో ఆ సిఫార్సుకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ దిశగా అమెరికా కూడా ముందడుగు వేసింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల రికార్డింగును తమ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రీ-ఆథరైజేషన్ చట్టంలో చేర్చింది అమెరికా. అయితే కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలవుతోంది. ఇప్పుడు తిరుగుతున్న చాలా విమానాల జీవిత కాలం 40-50 ఏళ్లు. పాత విమానాల్లో సీవీఆర్ రికార్డింగ్ వ్యవధి పెంపు సాధ్యపడటం లేదు.కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు!తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సులకు రూపకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజి, బ్యాకప్ బ్యాటరీల జీవిత కాలం పెంపు వంటివి ఇందులోని ప్రధానాంశాలు. విమానాల కూలుళ్ల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రాబోతున్నాయి. విమానాలు సముద్రాల్లో కూలిపోయే మెరైన్ ప్రమాదాల్లో రికవరీ బృందాలు తక్కువ శ్రమతో సత్వరం బ్లాక్ బాక్సును గుర్తించేలా మెరుగుపరచిన ‘అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. దీంతోపాటు అతి ముఖ్యమైన రియల్ టైమ్ డేటాను గ్రౌండ్ స్టేషన్లకు ప్రసారం చేసే కొత్త డిజైన్లతో బ్లాక్ బాక్సులు రూపుదిద్దుకుంటున్నాయి. విమానానికి సంబంధించిన కీలక సమాచారం ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ఒకవేళ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ భౌతికంగా నాశనమైనా పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. - జమ్ముల శ్రీకాంత్ -
ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు
దేశంలో తయారవుతున్న ఐఫోన్(iPhone) ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.భారతదేశంలో యాపిల్(Apple) ప్రధాన తయారీదారులుగా ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?యాపిల్ 2024లో దేశీయంగా 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.08 లక్షల కోట్లు) ఎగుమతుల మార్కును సాధించింది. భవిష్యత్తులో వీటి విలువ ఏటా 30 బిలియన్ డాలర్లకు చేర్చాలనేలా లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఐఫోన్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌లో భారతదేశం ఉత్పాదక(Productivity) వాటా ప్రస్తుతం 14%గా ఉందని, దాన్ని భవిష్యత్తులో 26%కి పైగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ఫోన్ పోయిందా? ఇలా చేస్తే.. కనిపెట్టేయొచ్చు
ప్రస్తుతం చాలామంది యాపిల్ ఐఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ.. ఆసక్తి కారణంగానో లేదా ఇతర కారణాల వల్ల ఆండ్రాయిన్ ఫోన్ యూజర్స్ కూడా ఐఫోన్లకు మారిపోతున్నారు. అయితే అంత ఖరీదైన ఫోన్లు పొతే? ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీ ఐఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా.. ఏ మాత్రం గాబరా పడకుండా? కొన్ని చర్యలు తీసుకుంటే మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది.'ఫైండ్ మై' యాప్ ఉపయోగించండిమొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 'ఫైండ్ మై' యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఐఫోన్లో ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతే కాకుండా మీ మొబైల్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ.. దగ్గరగా ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేయవచ్చు.లాస్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోండిమీ ఫోన్ బయట పోయిందని లేదా దొంగతనానికి గురైంది మీరు విశ్వసిస్తే, లాస్ట్ మోడ్ ఉపయోగించుకోవాలి. దీనికోసం మీరు 'ఫైండ్ మై' యాప్‌ను ఓపెన్ చేసి లేదా iCloud.comలో సైన్ ఇన్ చేసిన తరువాత.. 'మార్క్ యాజ్ లాస్ట్' లేదా 'లాస్ట్ మోడ్' ఎంచుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత ఏదైనా ఒక సందేశాన్ని లేదా కాంటాక్ట్ వివరాలను పంపించవచ్చు. అప్పుడు మీ ఫోన్ దొరికిన వారు మళ్ళీ మీకు తీసుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది.మీ డేటాను సంరక్షించుకోవాలిమొబైల్ ఫోన్లో మీ వ్యక్తిగత డేటా ఏదైనా ఉంటే.. దానిని సంరక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఫోన్ డేటాను రిమోట్‌గా తొలగించడానికి 'ఫైండ్ మై' యాప్ లేదా iCloudని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది ట్రాకింగ్‌ను నిలిపివేస్తుంది, డేటా రికవరీ కూడా సాధ్యం కాదు. మీ అకౌంట్స్ యాక్సిస్ ఇతరుల చేతుల్లోకి పోకుండా ఉండటానికి appleid.apple.comలో మీ Apple ID పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు.సిమ్ బ్లాక్ చేయాలిమీ ఫోన్ పోయిందని తెలుసుకున్న తరువాత.. మీ సిమ్ కార్డును బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. దీనికోసం మీ సిమ్ కార్డుకు సంబంధించిన సంస్థను సంప్రదించాలి. మీ ఫోన్ పోయిందని సంస్థకు తెలియాజేస్తూ.. సిమ్ కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. అంతే కాకుండా డివైజ్‌ను కూడా బ్లాక్‌లిస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే.. ఎవరైనా ఫోన్ దొంగలించి ఉంటే, దానిని ఇతరులకు విక్రయించలేరు.పోలీసులకు తెలియజేయండిమీ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే.. వెంటనే పోలీసులకు తెలియజేయండి. మొబైల్ ఫోన్ IMEI నెంబర్ సాయంతో పోలీసులు పోయిన ఫోన్‌ను కనుగొనే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండిముందుగానే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలిమీరు ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే.. ఫైండ్ మై ఫోన్‌ను ఎనేబుల్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. స్ట్రాంగ్ పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్ సెట్ చేసుకోవాలి. డేటాను కూడా ఎప్పటికప్పుడు ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌కు బ్యాకప్ చేయాలి. వీటితో పాటు AirTags వంటి ట్రాకింగ్ యాక్ససరీస్ ఉపయోగించడం కూడా ఉత్తమం. -
కాగ్నిజెంట్ సరికొత్త ఎత్తుగడ.. ప్రత్యర్థులకు దడ!
ప్రముఖ బహుళజాతి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) భారత్‌లోని తమ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును (retirement age) 58 నుండి 60 సంవత్సరాలకు పెంచింది. విస్తృత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.పేరోల్‌లో ఎలాంటి మార్పు లేకుండా ఆన్-సైట్లో బదిలీ అయిన వారితో సహా దేశంలోని కాగ్నిజెంట్ ఉద్యోగులందరికీ ఈ మార్పు వర్తిస్తుంది. అనుభవజ్ఞులను నిలుపుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మెమోలో వివరించింది.దేశంలోని చాలా ఐటీ కంపెనీల్లో (IT Company) ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. అయితే రిటైర్మెంట్ వయసును పెంచుతూ కాగ్నిజెంట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పోటీతత్వ ప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. అనుభవజ్ఞులైన నిపుణులను సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీకి ఆస్కారం ఏర్పడుతుంది.చిన్న నగరాలపై దృష్టిభారత్లో జరిగిన ఒక కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. కంపెనీ ప్రపంచ కార్యకలాపాలలో భారత్ పాత్ర ఉంటుందన్నది వివరించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుండి ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2025 అవార్డును అందుకున్న రవి, గ్లోబల్ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.“కాగ్నిజెంట్ చాలా పెద్ద కంపెనీ. భారత్‌లో మాకు 250,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతకుముందు, మేము పెద్ద నగరాల నుండి ఆపరేట్ చేశాము. ఇప్పుడు మేము చిన్న నగరాల నుండి ఆపరేట్ చేస్తున్నాము. మా ప్రయత్నం చిన్న నగరాలకు తీసుకెళ్లడం, కాబట్టి మేము ఇండోర్‌లో ప్రారంభించాము” అని పేర్కొన్నారు.పదవీ విరమణ వయస్సును పెంచడంతోపాటు భారత్-ఆధారిత ప్రతిభ వ్యూహాన్ని రెట్టింపు చేయడం ద్వారా గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారత్‌కు సహకారం అందిస్తూనే ప్రపంచ ఐటీ సేవల మార్కెట్లో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని కాగ్నిజెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. -
‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’
దేశంలో టాప్ 2 ఐటీ కంపెనీలో ఉద్యోగం.. ఇంట్లో సంపాదించే వ్యక్తి తనొక్కడే.. చేతిలో మరో జాబ్ ఆఫర్ లేదు.. అయినా ఇన్ఫోసిస్‌లో (Infosys) చేస్తున్న ఉద్యోగాన్ని మానేశాడు పుణేకు చెందిన ఒక ఇంజనీర్ (Pune techie). ఇంత కఠిన నిర్ణయం తాను ఎందుకు తీసుకున్నాడు.. ఇన్ఫోసిస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. జాబ్ వదులుకునేందుకు దారితీసిన కారణాలు ఏమిటి.. అన్నది ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకోగా ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.మరో ఆఫర్ చేతిలో లేకుండానే ఇన్ఫోసిస్‌లో తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడో లింక్డ్ఇన్ పోస్ట్‌లో పంచుకున్నారు పుణేకు చెందిన భూపేంద్ర విశ్వకర్మ. తాను రాజీనామా చేయడానికి ఆరు కారణాలను పేర్కొన్నారు. నారాయణ మూర్తి స్థాపించిన టెక్ దిగ్గజంలోని వ్యవస్థాగత లోపాలను, అనేక మంది ఉద్యోగులు నిశ్శబ్దంగా భరించే సవాళ్లను వెలుగులోకి తెచ్చారు."నేను ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కొన్నాను. చివరికి చేతిలో ఎటువంటి ఆఫర్ లేకపోయినా నిష్క్రమించాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కార్పొరేట్ వర్క్‌ప్లేస్‌లలో చాలా ఎదుర్కొంటున్న ఈ సవాళ్ల గురించి నేను బహిరంగంగా మాట్లాడాలనుకుంటున్నాను" అని భూపేంద్ర తన పోస్ట్‌లో పేర్కొన్నారు.జాబ్ మానేయడానికి భూపేంద్ర పేర్కొన్న కారణాలు» ఆర్థిక వృద్ధి లేదు: జీతం పెంపు లేకుండా సిస్టమ్ ఇంజనీర్ నుండి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్‌గా ప్రమోషన్ వచ్చింది. మూడేళ్లు కష్టపడి నిలకడగా పనిచేసినా భూపేంద్రకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం కనిపించలేదు.» అన్యాయమైన పనిభారం: భూపేంద్ర బృందాన్ని 50 నుండి 30 మంది సభ్యులకు కుదించబడినప్పుడు అదనపు పనిభారం మిగిలిన ఉద్యోగులపై పడింది. అయినా పరిహారం, గుర్తింపు లేవు. కేవలం పని ఒత్తిడి మాత్రం పెరిగింది.» అస్పష్టంగా కెరీర్ పురోగతి: నష్టం తెచ్చే పనిని అప్పగించారు. ఇందులో భూపేంద్ర ఎదుగుదలకు అవకాశం కనిపించలేదు. పరిమిత జీతాల పెంపుదల, అస్పష్టమైన కెరీర్ పురోగతి వృత్తిపరమైన డెడ్వెయిట్గా భావించేలా చేసింది.» టాక్సిక్ క్లయింట్ వాతావరణం: తక్షణ ప్రతిస్పందనల కోసం అవాస్తవిక క్లయింట్ అంచనాలు అధిక ఒత్తిడి వాతావరణాన్ని సృష్టించాయి. చిన్నపాటి సమస్యలపైనా పదేపదే ఒత్తిడి పెరగడం వల్ల ఉద్యోగి శ్రేయస్సును దెబ్బతీసే విషపూరితమైన పని సంస్కృతికి దారితీసింది.» గుర్తింపు లేకపోవడం: సహోద్యోగులు, సీనియర్ల నుండి ప్రశంసలు పొందినప్పటికీ, ఇది ప్రమోషన్లు, జీతం పెంపు, లేదా కెరీర్ పురోగతి రూపంలోకి మారలేదు. భూపేంద్ర తన కష్టానికి ప్రతిఫలం కాకుండా దోపిడీకి గురవుతున్నట్లు భావించారు.» ఆన్సైట్ అవకాశాల్లో ప్రాంతీయ పక్షపాతం: ఆన్సైట్ అవకాశాలు మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లేడే భాష ఆధారంగా ఇస్తున్నారు. నిర్దిష్ట భాషలు మాట్లాడే ఉద్యోగులు తనలాంటి హిందీ మాట్లాడే ఉద్యోగులను పక్కన పెట్టారని ఆరోపించారు.ఇదీ చదవండి: ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. కలవరపెడుతున్న కంపెనీ ప్లాన్కంపెనీల్లో పని సంస్కృతి, పని ఒత్తిడి పెంచే కార్పొరేట్ అధిపతుల వ్యాఖ్యల నడుమ విస్తృత చర్చలు సాగుతున్న తరుణంలో తాజాగా భూపేంద్ర పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆన్లైన్లో మరింత చర్చకు దారితీసింది. ఈ పోస్ట్‌పై చాలా మంది యూజర్లు ప్రతిస్పందిస్తున్నారు. భూపేంద్రను సమర్థిస్తూ కొందరు, విభేదిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు. -
స్పెక్ట్రమ్‌ను సమానంగా కేటాయించాలని డిమాండ్
బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (BIF) ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని టెక్ సంస్థలు(Tech firms) 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను సమానంగా కేటాయించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్పెక్ట్రమ్(Spectrum) 5జీ సేవలు, వై-ఫై రెండింటికీ ఈ బ్యాండ్ కీలకం కావడంతో దీని కేటాయింపుపై చర్చ తీవ్రమైంది.టెలికాం ఆపరేటర్లకు ప్రత్యేకంగా 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్ (6425-7125 మెగాహెర్ట్జ్)లో ఎగువ భాగాన్ని కేటాయించేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై మెటా, అమెజాన్, గూగుల్‌తో సహా ఇతర టెక్ కంపెనీల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ విధానం వల్ల తమ వినియోగదారులకు పేలవమైన కనెక్టివిటీ ఉంటుందని ఆయా సంస్థలు వాదిస్తున్నాయి.టెక్ సంస్థల వాదనలుఇండోర్ కనెక్టివిటీ: ప్రస్తుతం 80% కంటే ఎక్కువ డేటా వినియోగం ఇండోర్(ఇంటి లోపల)లో ఉండే కస్టమర్ల ద్వారానే జరుగుతుంది. టెలికాం ఆపరేటర్లకు ఎక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల అధిక ఫ్రీక్వెన్సీ కారణంగా తమ సేవలు సమర్థంగా ఉండవని టెక్ కంపెనీలు చెబుతున్నాయి.ప్రపంచ దేశాల మాదిరగానే..: వై-ఫై, ఇన్నోవేషన్ కోసం అమెరికా సహా 84 దేశాలు 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 500 మెగాహెర్ట్జ్ లైసెన్స్ పొందాయి. వై-ఫై, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి ఇండియాలోనూ ప్రపంచ దేశాల మాదిరిగానే వ్యవహరించాలని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి.నేషనల్ డిజిటల్ ఎకానమీ: కేవలం టెలికాం ఆపరేటర్లకే అధిక బ్యాండ్(Band) కేటాయించడం సరికాదని అంటున్నాయి. విశ్వసనీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే జాతీయ లక్ష్యానికి ఇది విరుద్ధమని టెక్ సంస్థలు భావిస్తున్నాయి.టెలికాం ఆపరేటర్ల వాదనలుస్పెక్ట్రమ్ కొరత: అంతరాయం లేని 5జీ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ కొరత ఉంది. దాన్ని పరిష్కరించడానికి 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అవసరమని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.మౌలిక సదుపాయాలకు ఖర్చులు: వై-ఫై కోసం తక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతాయి. సర్వీస్ క్వాలిటీ నిలిపేందుకు తక్కువ దూరాల్లో ఎక్కువ టవర్లు అవసరమవుతాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ అంచనాలకు డేటా ఆధారిత విధానంప్రభుత్వ వైఖరి..టెలికాం శాఖ తన నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ కార్యదర్శుల కమిటీ వివరాల ప్రకారం బ్యాండ్‌లో ఎక్కువ విభాగాన్ని 5జీ, 6జీ వంటి అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (IMT) సేవల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విభాగంలో మరింత సమర్థంగా సేవలందేలా ఉపగ్రహ కార్యకలాపాలను అధిక కెయు-బ్యాండ్ (12 గిగాహెర్ట్జ్)కు మార్చాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం
మెటా గ్రూప్ తన ఆన్లైన్ సర్వీసులైన ఫేస్బుక్, థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఫ్యాక్ట్ చెకింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కంపెనీకి చుక్కెదురవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్‌ను ఎలా డెలిట్ చేయాలని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు అనలిటిక్స్ ద్వారా తెలిస్తుంది. ప్రస్తుతం ఆయా అకౌంట్లను ఎలా నిలిపేయాలని అధిక సంఖ్యలో గూగుల్‌లో సెర్చ్ చేస్తుండడంతో ప్రస్తుతం అవి ట్రెడింగ్లో ఉన్నాయి. ఇందుకు ఇటీవల మెటా తీసుకున్న నిర్ణయమే కారణమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెటా యాప్స్‌లో థర్డ్‌పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్‌ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.కఠిన నిర్ణయాలు తప్పవురాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’తప్పుడు సమాచారం తగ్గుతుందా..?మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్‌పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. -
మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండి
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే సిమ్ కార్డును కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా చెల్లుబాటు అయ్యే చిరునామా, గుర్తింపు రుజువు అవసరం. దీనికి ఆధార్ కార్డును ఉపయోగిస్తారు. ఈ ఆధారాలను ఉపయోగించి కొందరు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు.ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సిమ్ కార్డు ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.ఆర్ధిక నేరాలను తగ్గించడానికి.. ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా చూడటానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ (DoT) టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు లేదా ఫోన్ నెంబర్లు లింక్ అయ్యాయో తెలుసుకోవచ్చు.ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డ్‌లు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా?సంచార్ సతి అధికారిక వెబ్సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.వెబ్‌సైట్‌ను కిందికి స్క్రోల్ చేస్తే.. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్లను చూడటానికి ఆప్షన్ ఎంచుకోవాలి.మొబైల్ కనెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత.. మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.దానికి కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత మీ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.ఓటీపీ ఎంటర్ చేసిం తరువాత మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్ప్లే మీద కనిపిస్తాయి.అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తుంటారు. ఇలాంటి నెంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో విజయవాడకు చెందిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేశారు.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!సిమ్ కార్డులను ఉపయోగించిన తరువాత, ఎక్కడపడితే అక్కడ పడేయడం మంచిది కాదు. వాటిని కొంతమంది మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది. అంతే కాకుండా మీ ఆధార్ కార్డు లేదా ఇతర డాక్యుమెంట్స్ ఉపయోగించే తెలియనివారికి ఎట్టిపరిస్థితుల్లో సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఇవ్వొద్దు. వారు ఏదైనా నేరాలకు పాల్పడితే.. దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. -
ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆలోచన ఉద్యోగులను కలవరపెడుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని (lay off) యోచిస్తోంది. ఈ ఉద్యోగాల కోతలు కంపెనీలోని ముఖ్యమైన భద్రతా విభాగంతో సహా అన్ని భాగాలలో జరుగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ దాని పోటీదారుల మాదిరిగానే ఉద్యోగుల పనితీరు నిర్వహణపై బలమైన వైఖరిని తీసుకుంటోంది. మేనేజర్లు గత కొన్ని నెలలుగా ఇదే పనిమీద ఉన్నారు. ఉద్యోగుల పనితీరును వివిధ స్థాయిల్లో లెక్కిస్తున్నారు. ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారని, అయితే బాధిత ఉద్యోగుల సంఖ్యను పంచుకోవడానికి నిరాకరించారని నివేదిక పేర్కొంది."మైక్రోసాఫ్ట్‌లో అధిక-పనితీరు ప్రతిభపై దృష్టి పెడతాము" అని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. "ఉద్యోగులు నేర్చుకోవడానికి, ఎదగడానికి సహాయం చేయడంలో మేము ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం. అదే సమయంలో ప్రతిభ చూపనివారి పట్ల తగిన చర్యలు తీసుకుంటాము" అని ప్రతినిధి వివరించినట్లుగా చొప్పుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ 2023 నుండి అనేక రౌండ్ల తొలగింపులను చేపడుతూ వస్తోంది. 2024 మేలో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్ (Xbox) విభాగం ప్రసిద్ధ ఆర్కేన్ ఆస్టిన్‌తో సహా అనేక గేమింగ్ స్టూడియోలను మూసివేసింది. పునర్నిర్మాణ ప్రయత్నంగా సంబంధిత సిబ్బందిని తొలగించింది. అదే సంవత్సరం జూన్‌లో మళ్లీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. జూలైలో మరో రౌండ్ తొలగింపులు చేపట్టింది.ఇలా పనితీరు కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను మైక్రోసాఫ్ట్ అప్పుడప్పుడూ భర్తీ చేస్తూ వస్తోంది. దీంతో ఇది టెక్ దిగ్గజం మొత్తం హెడ్‌కౌంట్‌లో స్వల్ప మార్పులకు దారితీసింది. నివేదిక ప్రకారం.. ఇది జూన్ చివరి నాటికి 228,000గా ఉంది.ఏఐలో పెట్టుబడులుభారత్లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను విస్తరించడం కోసం మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌లో మానవ వనరులకున్న సామర్థ్యం దృష్ట్యా, 2030 కల్లా కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తాజాగా చెప్పారు.ఏ దేశంలోనైనా విస్తరణ నిమిత్తం మైక్రోసాఫ్ట్ పెడుతున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఎంత కాలావధిలో ఈ మొత్తం పెడతారన్నది ఆయన వెల్లడించలేదు. భారత్‌లో ఏఐ ప్రగతి చాలా బాగుందని కితాబునిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించిన నాదెళ్ల, 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఇస్తామని.. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. -
‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(PLI) పథకం కింద తమకు రావాల్సిన, పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను విడుదల చేయాలని ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్(Foxconn), డిక్సన్ టెక్నాలజీస్ ప్రభుత్వాన్ని కోరాయి. ఈ రెండు కంపెనీలు మొత్తం రూ.700 కోట్ల సబ్సిడీలను కోరుతుండగా, ఫాక్స్‌కాన్ రూ.600 కోట్లు, డిక్సన్‌కు రూ.100 కోట్లు రావాల్సి ఉంది.భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పీఎల్ఐ పథకం సబ్సిడీలో భాగంగా ప్రభుత్వం రూ.41,000 కోట్లు (4.8 బిలియన్ డాలర్లు) కేటాయించింది. అయితే, కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఈ మొత్తంలో కొంత భాగం చెల్లించలేదు. ఫాక్స్‌కాన్, డిక్సన్(Dixon) తమ ఉత్పత్తి పరిమితులను అధిగమించాయని, అందువల్ల కేటాయించని నిధుల్లో తాము వాటా పొందేందుకు అర్హులమని చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఎల్ఐసీ బీమా సఖి.. 30 రోజుల్లో 50,000 రిజిస్ట్రేషన్లుదేశంలో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తూ కంపెనీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. ఇది దాని రూ.20,000 కోట్ల ఉత్పత్తుల తయారీ పరిమితిని అధిగమించింది. అదేవిధంగా, డిక్సన్ టెక్నాలజీస్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.8,000 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేసింది. ఈ రెండు కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వ పోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇరు కంపెనీల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రోత్సాహకాలు రెండు సంస్థలకు కీలకంగా మారనున్నాయి. ఈ నిధులు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, వాటి తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.