breaking news
Nizamabad
-
కొరట్పల్లిలో బాలిక ఆత్మహత్య
● ప్రేమించిన బాలుడు మోసం చేయడమే కారణమంటూ మృతురాలి కుటుంబీకులు ఆరోపణ ● ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనడిచ్పల్లి : మండలంలోని కొరట్పల్లి తండా వడ్డెర కాలనీకి చెందిన ఓ బాలిక(17) సోమవారం సా యంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇ లా.. వడ్డెక కాలనీకి చెందిన బాలిక, కొరట్పల్లి గ్రామానికి చెందిన బాలుడు కొన్నిరోజులుగా ప్రే మించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలియడంతో ఇటీవల బాలిక అతడిని కలువకుండా వారి కుటుంబీకులు కట్టడి చేశారు. అయినా వారు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో సోమవారం ఇరువురి మధ్య ఏం జరిగిందో కానీ సాయంత్రం ఇంట్లో ఎ వరూలేని సమయంలో బాలిక ఉరేసుకుని ఆత్మహ త్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రేమించిన బాలుడు మోసం చేయడంతోనే బాలిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కొరట్పల్లి గ్రామంలోని బాలుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న డిచ్పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు శాంతించారు. అనంతరం సాయంత్రం బాలిక మృతదేహానికి తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ నుంచి బాబాపూర్‌కు వెళ్లే దారిలో ఓ దుకాణం వద్ద మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మంగళవారం ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన యజమాని రాగి శ్రీనివాస్‌కు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎరుపు రంగు చొక్క, బూడిద రంగు పాయింట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడిని యాచకుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బోధన్: ఎడపల్లి మండలం మంగళ్పహాడ్ గ్రామంలో మంగళవారం చి లిగిరి రమేష్‌కు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు గొర్రెలు మృతి చెందాయి. వీధి కుక్కల దాడుల వల్ల భయాందోళనకు గురవుతున్నామని పెంపకందార్లు పేర్కొంటున్నారు. -
కువైట్‌లో రాంపూర్ వాసి..
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బంటు రవి అలియాస్ ప్రకాష్(50) కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఈ నెల 27న రవి తన గదిలో భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో స్థానికులు ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా రవి గత 12 సంవత్సరాలుగా ఉపాధి కోసం కువైట్‌లో ఉంటున్నట్లు తెలిపారు. మృతదేహం మంగళవారం రాత్రి ఇండియాకు వస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీ, కుమారుడు త్రిజాల్ ఉన్నారు. -
చికిత్స పొందుతూ బాలుడి మృతి
అవయవ దానం చేసిన తల్లిదండ్రులు నందిపేట్(ఆర్మూర్): తనపై దొంగతనం నెపం వేయడంతో బాలుడు ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొడుకు మృతి బాధను దిగమింగుకొని అవయవదానానికి తల్లిదండ్రులు ముందుకువచ్చారు. వివరాలు ఇలా.. నందిపేట మండలం బాద్గుణ గ్రామానికి చెందిన బరుకుంట ముత్తెన్న తన డబ్బులు రూ. 25వేలు పోయాయంటూ అదే గ్రామానికి చెందిన బరికుంట సన్నిత్ (17)పై దొంగతనం నెపం వేశాడు. దీంతో మనస్తాపం చెందిన సన్నిత్ ఈనెల 27న పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. దీంతో ముత్తెన్నపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. తమ కొడుకు మృతిచెందడంతో అవయవదానానికి మృతుడి తల్లిదండ్రులు ముత్తెన్న, పోసాని ముందుకువచ్చారు. విషాద సమయంలోనూ ఆదర్శంగా నిలుస్తూ అవయవాలు అందించిన కుటుంబాన్ని గ్రామస్తులు అభినందించారు. -
ఆర్మూర్ వాసులకు ఆధ్యాత్మిక అనుభూతి
ఆర్మూర్ : మహా విష్ణువు దశావతారాలను ఇసుకతో రూపొందించి ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆర్మూర్ వాసులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో విజయ్ అగర్వాల్, లావణ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పాల ప్రదర్శనను మంగళవారం ఆయన ప్రారంభించారు. నెల రోజుల పాటు ప్రదర్శన కొనసాగనున్నందున విద్యార్థులు తిలకించి దశావతారాలతో పాటు సైకత శిల్పాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సాయి బాబా గౌడ్, షేక్ మున్ను, లింగాగౌడ్, ఖాందేశ్ శ్రీనివాస్, బాల్‌రెడ్డి, గోర్తె దేవేందర్, అతిక్, ఫయాజ్, అజ్జు, చిట్టిరెడ్డి, రాజు, భూపేందర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. జీనియస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు.. సైకత శిల్పాల రూప కల్పనకు జీనియస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పిస్తున్నట్లు అవార్డుల ప్రతినిధులు బింగి నరేందర్ గౌడ్, రాజు తెలిపారు. వారు స్వయంగా వచ్చి సైకత శిల్పాలను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. సైకత శిల్పాల రూపకర్త ఆకునూరి బాలాజీ వరప్రసాద్‌తోపాటు ప్రదర్శన నిర్వాహకులు విజయ్ అగర్వాల్, లావణ్యకు అవార్డులను ప్రదానం చేశారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ధరల భారం
● పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక, కంకర ధరలు ● లబ్ధిదారులపై అదనంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల భారం నందిపేట్(ఆర్మూర్):పెరిగిన సిమెంట్, ఇసుక, ఇటుక, కంకర, స్టీల్ ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ లబ్ధిదారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణా లు గాడిన పడుతున్న తరుణంలోనే సామగ్రి రేట్లు అధికం కావడం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కూలీలు, మేసీ్త్రలు సైతం రేట్లు పెంచారు. పెరిగిన ధరలతో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అదనపు భారం ప డుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లాలో 19,306 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఉండగా లబ్ధిదారులకు రూ. 5 లక్షలు దశల వారిగా ఆర్థిక సాయం విడుదలవుతుంది. మండుతున్న ధరలు ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 525 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. పథకం ప్రారంభ దశలో బస్తా ధర రూ. 280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి బస్తా రూ.50 నుండి 80 వరకు అదనంతో విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ. 1,47,000కు సిమెంట్ వచ్చేది. ప్రస్తుత రేటుతో సుమారు రూ.1.80 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారునికి సిమెంట్ రూపేణా అదనంగా రూ. 33 వేలు భారం పడుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇసుక రవాణాదారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుక రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. వెయ్యి ఇటుకలకు ధర గతంలో రూ. 6 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 9,500గా అమ్ముతున్నారు. అలాగే స్టీల్ ధర సైతం అమాంతం పెరిగింది. బేస్మెంట్ నిర్మాణంతోపాటు పిల్లర్లు స్లాబ్‌కు అవసరమయ్యే 20 ఎంఎం కంకర ధర ట్రాక్టరుకు రూ. 4500 ఉండగా ప్రస్తుతం రూ. 5100 పలుకుతోంది. కూలీలకు ఫుల్ డిమాండ్ గతంలో కూలీల్లో పురుషులకు రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతం రూ. 1300 నుంచి రూ.1500 అడుగుతున్నారు. మహిళలకు రూ. 500 ఉండగా రూ. వెయ్యి డిమాండ్ చేస్తున్నారు. కూలీలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూలీలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. నందిపేటలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు -
ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను తోడేసి..
● అక్రమంగా లారీలలో దూరప్రాంతాలకు తరలింపు ● భీమ్‌గల్ మండలంలో ఆగని దందా ● పట్టించుకోని అధికారులుమోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను తోడేసీ, అక్రమంగా దూరప్రాంతాలను తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. భీమ్‌గల్ మండలంలో ఇసుక అక్రమ దందా మూడు పువ్వులు, ఆ రు కాయలు అన్న చందంగా యథేచ్ఛగా సాగుతుంది. అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల కోసమంటూ తరలిస్తూ తమకు అనువైన స్థలంలో నిలువ చేసుకుంటున్నారు. రాత్రిపూ ట పెద్దపెద్ద లారీలలో దూర ప్రాంతాలకు తరలి స్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులే ఇసుక దందా సాగిస్తుండటంతో అధికార యంత్రాంగం మౌనం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని బెజ్జోరా కప్పల వాగు నుంచి రోజు సాగుతున్న ఇసుక రవాణా విషయంలో కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకూ నాయకులే రంగంలోకి దిగి సోమవారం రాత్రిపూట అక్రమంగా సాగుతున్న రవాణాను అడ్డుకున్నారు. ఇసుకను తరలిస్తున్న వాహనాలను అధికారులకు పట్టించారు. ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల కోసం తరలించాలనే అధికారులు పగటి పూట అనుమతులు ఇస్తున్నారు. పగలు కొన్ని ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను తరలించి ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తూ తమ దందాను సాగిస్తున్నారని అధికార పార్టీ నాయకులపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి అసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కలెక్టర్‌కు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం క ప్పల వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాపై క లెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌ను బీఆర్ఎస్ నాయకులు కలిసి, సమస్యను విన్నవించారు. ఇసుక అక్రమ రవాణాపై నమోదైన కేసుల వివరాలను ప్రజలకు మీడియా ద్వారా వెల్లడించా లని కలెక్టర్‌ను కోరారు. నాయకులు నవీన్, గు న్నల బాల భాగత్, బోదిరే నర్సయ్య, మల్లెల ప్రసాద్, సతీష్ గౌడ్, అశోక్, సునీల్, రథన్, బచ్చల్వార్ శ్రీనివాస్, లాల రామకృష్ణ ఉన్నారు. -
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసమే ఉచిత శిక్షణ
నిజామాబాద్ రూరల్: నిరుద్యోగులకు స్వయం ఉ పాధి కల్పించడం కోసమే బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని ఆటోనగర్‌లో మంగళవారం ఇన్స్ట్యూట్ బైతుల్ మాల్ ఆ ధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన హాజరై, శిక్షణ కోర్సులను ప్రారంభించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. శిక్షణ కేంద్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తనవంతుగా రూ.2లక్షలు అందజేసినట్లు తెలిపారు. నిరుద్యోగ మహిళలు, విద్యార్థులకు ఉపాధికి అనుకూలమైన పలు కోర్సుల్లో (కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్, మె హందీ డిజైన్, అడ్వాన్సడ్ బ్యూటీషియన్) శిక్షణ ఇ వ్వనున్నట్లు తెలిపారు. సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.నిజామాబాద్ రూరల్: హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని బోధన్ రోడ్లోగల నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఈ ఏడాది హజ్‌కు వెళ్లనున్న యాత్రికుల కోసం జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. హజ్ యాత్రలో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రయాణ ఏర్పాట్లు, వసతి, రవాణా తదితర లాజిస్టిక్ అంశాలపై అవగాహన కల్పించారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖుస్రో పాషా, హజ్ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో మంజీరా వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సోమవారం రాత్రి ఎస్సై శివకుమార్ పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నుంచి ఇసుకను తరలిస్తుండటంతో కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. రాజంపేట(భిక్కనూరు): రాజంపేట మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ వద్ద గొడవ పడిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. పెట్రోల్ బంక్ వద్ద కారు మళ్లింపు విషయంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు వివరించారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట గ్రామ శివారులో మంగళవా రం లారీని వెనుక వస్తున్న మరో లారీ ఢీకొన్న ట్లు స్థానికులు తెలిపారు. రెండు లారీలు జహీరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నాయన్నా రు. గండిమాసానిపేట గ్రామ శివారులోని జీవదాన్ పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశా డు. దీంతో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు వారు తెలిపారు. నవీపేట: పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని బా వపై దాడి చేసిన బావమరిదిని రిమాండ్ చేసిన ట్లు ఎస్సై శ్రీకాంత్ మంగళవానం తెలిపారు. లింగాపూర్‌కు చెందిన గంధం శ్రీనివాస్ తన బా వ హన్మండ్లుతో తాగిన మైకంలో గొడవపడ్డా డు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ గొ డ్డలితో హన్మండ్లుపై దాడి చేశాడు. బాధితుడి భార్య రూప ఫిర్యాదు మేరకు నిందితుడిపై హ త్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండుకు పంపినట్లు తెలిపారు. -
డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌గా రామ్మోహన్రావు
సుభాష్‌నగర్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్– రిటైర్డ్ ప ర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌గా నిజామాబాద్ జిల్లా పెన్షనర్స్ యూనియ న్ నాయకుడు రామ్మోహన్రావు ఎన్నికయ్యా రు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలలో ఆయనను ఎన్నుకున్నారు. దీంతో రామ్మోహన్‌రావుకు జిల్లా అధ్యక్షుడు సిర్ప హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి ఈవీఎం నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్ కాలేజీలో జరిగే నేషనల్ సెమినార్ బ్రోచర్స్‌ను మంగళవారం తెయూ రిజిస్ట్రార్ యాదగిరి అవిష్కరించారు. త్వరలో జరుగనున్న ఈ సెమినార్లో డిజిటల్ వేవ్స్ ఇన్ కామర్స్, ఆపర్ుచ్యనిటీస్ అండ్ ఛాలెంజ్ ఆనే ఆంశంపై చర్చించనున్నట్లు తెయూ కామర్స్ హెచ్‌వోడీ సంపత్ కుమార్ తెలిపారు. సుభాష్‌నగర్: తెలంగాణ వైద్యారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఘన్పూర్ వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రాష్ట్ర అధ్యక్షుడు రాబర్ట్ బ్రూస్ తెలిపారు. ఈసందర్భంగా అతడికి నియామక పత్రాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని సంఘ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అందజేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం, సంఘం బలోపేతం కోసం కృషిచేస్తానని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నవీపేట: మండలంలోని కమలాపూర్ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ మాధవిపై వచ్చిన ఆరోపణలపై మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేశారు. రికార్డులు సరిగ్గా లేవని, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు ఇటీవల ఐసీడీఎస్ సీడీపీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, సీడీపీవో జ్యోతి, అంగన్వాడీ సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి, విశాల గ్రామస్తుల ఆధ్వర్యంలో విచారణ జరిపారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. విచారణ అనంతరం అంగన్వాడీ టీచర్ మాధవికి సూపర్వైజర్ మెమో జారీ చేశారు. రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపిక ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మోడల్‌స్కూల్‌కు చెందిన విద్యార్థిని శ్రీజ రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపికై నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ జహంగీర్ మంగళవారం తెలిపారు. జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలో శ్రీజ మూడో బహుమతి పొంది ఎంపికై నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న శ్రీజను ఉపాధ్యాయులు అభినందించారు. -
బల్దియా పోరుకు సన్నాహాలు
● ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ ● జనవరి 10న ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించింది. ముందుగా రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్ల పరిధిలో ఓటరు జాబితా సవణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. నోటిఫికేషన్‌ను అనుసరించి వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి జనవరి 1న పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించాలి. 5న మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరించి, సవరించిన తుది జాబితాను 10న ప్రచురించాల్సి ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ ఆఫీసర్ మృతి
మోర్తాడ్: మెండోరా మండలం పోచంపాడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ ఆఫీసర్ మృతిచెందారు. వివరాలు ఇలా.. పోచంపాడ్‌లో నివాసం ఉంటున్న బొమ్మల ప్రియాంక (43) స్థానిక సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధుల నిమిత్తం తన తమ్ముడి మోటర్‌సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ వేముల మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు మెండోరా ఎస్సై సుహసినీ తెలిపారు. -
ఈ ఏడాది సవాళ్లను అధిగమించాం..
నిజామాబాద్ అర్బన్: పోలీసు సిబ్బంది అంకిత భావం, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ ఏడాదిలో సవాళ్లను విజయవంతంగా అధిగమించామని పోలీసు కమిషనర్ సాయి చైతన్య పే ర్కొన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వార్షి క నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఆయ న మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడకుండా రిటైర్డ్ ఉద్యోగులకు, మార్నింగ్ వాకర్స్‌కు అవగాహ న కల్పించామన్నారు. ‘సే నో టు డ్రగ్స్ –సే ఎస్ టు స్పోర్ట్స్’ నినాదంతో యువతకు క్రీడలు నిర్వహించామన్నారు. జాతీయ రహదారులపై అంతర్ రాష్ట్ర నేరాస్తుల దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి వ చ్చే ‘ పాయింట్ ఆఫ్ ఎంట్రీలపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఏడాది విధి ని ర్వహణలో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పో యారని, వారి కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పు డూ అండగా ఉంటుందన్నారు. కల్తీ విత్తనాల నియంత్రణ, గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించామన్నారు. 20 మందికి 12 కేసుల్లో జీవితఖైదు శిక్ష పడింది. ఆరుగురికి ఆరు కేసుల్లో పది సంవత్సరాల జైలు శిక్ష పడింది. నలుగురికి నా లుగు కేసుల్లో ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ● గతేడాది 857 రోడ్డు ప్రమాదాల్లో 353 మంది మృతి చెందగా, ఈ ఏడాది 780 రోడ్డు ప్రమాదాల్లో 276 మంది మృతిచెందారు. వార్షిక నివేదికలో ‘సాక్షి’ కథనాలు.. వార్షిక నివేదికలో పో లీసు శాఖకు సంబంధించి వివిధ ఘటనలు, కార్యక్రమాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలను ప్రచురించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, రామచంద్రరావు, ఏసీపీలు శ్రీనివాస్, రాజావెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మస్తాన్అలీ, రాజశేఖర్ తదితరులున్నారు. జిల్లాలో జరిగిన నేరాలు 2024 2025 అన్ని రకాల నేరాలు 8983 8624 డ్రంక్‌అండ్‌డ్రైవ్ 8410 17,627 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ 107 83 హత్యలు 43 50 హత్యాయత్నం 62 101 కిడ్నాప్‌లు 126 165 చీటింగ్ 758 700 ఇంటి దొంగతనాలు 404 439 సాధారణ దొంగతనాలు 35 21 మహిళలపై.. అఘాయిత్యాలు 747 783 వరకట్న మరణాలు 3 2 ఆత్మహత్యాయత్నాలు 20 25 అత్యాచారాలు 83 89 కిడ్నాప్‌లు 86 135 వేధింపులు 328 322 పోక్సో కేసులు 120 168 2024 2025 సైబర్‌క్రైమ్ కేసులు 2339 2411 చైన్‌స్నాచింగ్ 40 39 తగ్గిన నేరాలు.. పోలీసు సిబ్బంది అంకిత భావంతో పనిచేశారు ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు వార్షిక నివేదిక విడుదల చేసిన సీపీ సాయిచైతన్య -
బీపీ పెరగొచ్చు.. తగ్గొచ్చు
చలి ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి? – నవీన్, నిజామాబాద్ వృద్ధులు, చిన్న పిల్లలతోపాటు గర్భిణులు, షుగర్, బీపీ, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు బయట కు వెళ్లొద్దు. అత్యవసరమైతే మాస్క్ ధరించి వెళ్లాలి. చలి కారణంగా ఏఏ ఆరోగ్య సమస్యలు రావొచ్చు? – రజినీ, నందిపేట జలుబు, దగ్గు, జ్వరం, న్యుమోనియా, ఆస్తమా, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చలిలో బయటికి వెళ్లేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– మహేశ్, ఆర్మూర్ ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలి. బయటికి వెళ్లినప్పుడు మఫ్లర్, స్వెట్టర్, టోపీ, గ్లోవ్స్ ధరించాలి. చలిలో స్నానం ఎలా చేయాలి? – ప్రణయ్, ఎడపల్లి చల్లని నీటితో స్నానం చేయొద్దు. గోరువెచ్చని నీటితో త్వరగా స్నానం చేయాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఆస్తమా ఉన్నవారు ఉదయం వేళ కాకుండా ఎండ వచ్చిన తరువాత చేస్తే బాగుంటుంది. దగ్గు, జ్వరం వస్తే ఏం చేయాలి? – రమేశ్, నిజామాబాద్ తేలికపాటి లక్షణాలైతే విశ్రాంతి తీసుకోవడంతోపాటు తగినంత వేడి ద్రవాలు తీసుకోవాలి. మూ డు రోజులు దాటినా తగ్గకపోతే తప్పకుండా వై ద్యుడిని సంప్రదించాలి. రాత్రి నిద్రపోయే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – శ్రీనివాస్, వర్ని దుప్పటి సరిపడా వాడాలి. గదిలో గాలి ప్రవాహం ఉండాలి. బొగ్గు, కట్టెల మంటలు గదిలో పెట్టొద్దు. చలికాలంలో ఎటువంటి సమయంలో ఆస్పత్రికి వెళ్లాలి? – రాధ, నందిపేట తీవ్ర ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సో్పృహ కోల్పోవడం, ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. చలి కారణంగా గుండె సమస్యలు పెరుగుతాయా? – రఘు, బిచ్కుంద చలిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. గుండె వ్యాధిగ్రస్తులు మందులు మానొ ద్దు. అకస్మాత్తుగా శ్రమించొద్దు. వారం రోజులుగా జలుబు, జ్వరం ఇబ్బంది పెడుతోంది.. – చిన్నాజీ, నిజామాబాద్ వైద్యుడిని సంప్రదించి మాత్రలు వాడండి, తగ్గకుంటే రక్త పరీక్షలు చేయించుకోవాలి. చలికాలంలో జలుబు, జ్వరం త్వరగా తగ్గే అవకాశం ఉండదు. ఉదయం వాకింగ్‌లో విపరీతమైన తుమ్ములు వస్తున్నాయి.. – అరవింద్, నిజామాబాద్ ఉదయం వాకింగ్‌కు వెళ్లే ముందు మాస్క్, క్యాప్ ధ రించండి. ఉన్ని దుస్తులు ధరించాలి. అలర్జీ ఉంటే తీవ్రమైన తుమ్మలు వచ్చే అవకాశం ఉంది. సరైన మందులు వాడితే తగ్గే అవకాశం ఉంటుంది. బీపీ పెరుగుతోంది.. – రమేశ్, నిజామాబాద్ చలి కారణంగా బీపీ పెరగడం, తగ్గడం జరగొచ్చు. బీపీ ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఒత్తిడికి గురికావొద్దు. తరచూ జ్వరం వస్తుండడంతోపాటు కాళ్లు, చేతులు లాగుతున్నాయి.. – సుమన్, కొరట్పల్లి తరచూ జ్వరం వస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ జ్వరమా లేదా వైరల్ జ్వరమా అనేది తెలుస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గితే కాళ్లు, చేతులు లాగడం వంటి సమస్యలు వస్తాయి. ఆహారంలో ఎటువంటి మార్పులు అవసరం? – సునీత, కమ్మర్పల్లి వేడి ఆహారం, సూప్‌లు, పప్పులు, కూరగాయలు తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. మద్యం, పొగతాగడం మానుకోవాలి. రాత్రి సమయంలో తయారు చేసిన భోజనాన్ని మరుసటి రోజు ఉదయం తినొద్దు. నూనెపదార్థాలు వేడిచేయడం, ఆహారపదర్థాలను వేడి చేయడం మంచిదికాదు. చలి కారణంగా బీపీ పెరగొచ్చు.. తగ్గొచ్చు. మంచు కురిసే సమయంలో బయటికి వెళ్లొద్దు. సూర్యోదయం తరువాతే వాకింగ్ ఉత్తమం. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.. అంటూ ప్రజలకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు సలహాలు, సూచనలు చేశారు. తిరుపతిరావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు సలహాలు తీసుకున్నారు. – నిజామాబాద్ అర్బన్/సుభాష్‌నగర్ వాకింగ్ చేయొచ్చా? – సత్యనారాయణ, నిజామాబాద్ సూర్యోదయం తరువాతే వాకింగ్ చేస్తే మంచిది. లేదా ఇంట్లోనే తేలికపాటి వ్యాయామం చే యాలి. చలితీవ్రంగా ఉన్న సమయంలో వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిది. గుండెజబ్బులు ఉంటే బయటకు వెళ్లకపోవడమే మంచిది. చలి నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యోదయం తరువాతే వాకింగ్ ఉత్తమం మంచు కురిసే సమయంలో మాస్క్ ధరించాలి గుండె వ్యాధులున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో జీజీహెచ్ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు -
గోవింద.. గోవిందా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముక్కోటి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో పోటెత్తాయి. అడుగడుగునా గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఇందూరు నగరంలోని ఉత్తర తిరుపతి ఆలయంలో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భక్తులకు ప్రవచనాలు చెప్పారు. సచ్చిదానంద స్వామి విలేకరులతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసం విషయంలో ఏకాగ్రతతో వ్యవహరించాలన్నారు. స్మార్ట్ ఫో న్లకు అతుక్కుపోవద్దన్నా రు. ఫోన్లతో సైతం ఉప యోగాలు ఉంటాయని, వాటిని అవసరం మేర కు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందూ రులోని ఉత్తర తిరుపతి ఆలయం తిరుపతి ఆల యం మాదిరిగా నిర్మాణం చేశామన్నారు. ఇక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు దత్తాత్రేయ, ఆంజనేయస్వామి, లక్ష్మీ అమ్మవారు, శ్రీచక్రం ఉన్నాయన్నారు. అయోధ్య ఆలయం శైలిలో ఉత్తర తిరుపతి ఆలయ నిర్మాణం ఉందన్నారు. ప్రతి మనిషికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పరిజ్ఞానాన్ని మంచికి వాడాలన్నారు. పిల్లలను ఆధ్యాత్మికం వైపు నడిపేందుకు పెద్దలు కృషి చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం కలుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉత్తర తిరుపతి ఆలయ కమిటీ చైర్మన్ అనఘా సంపత్, గడీల శ్రీరాములు పాల్గొన్నారు. ఉత్తర తిరుపతి ఆలయంలో వేంకటేశ్వర స్వామిని పోలీసు కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. సుభాష్‌నగర్ ఆలయంలో.. సుభాష్‌నగర్‌లోని శ్రీరామాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజూమున ఆలయం సమీప ప్రాంతాల్లో గరుడ వాహనంతో ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. స్వామి ఊరేగింపు పల్లకి మోసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయ కమిటీ చైర్మన్ సరళ మహేందర్‌రెడ్డి, కార్యదర్శి శోభ నవీన్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. 40 ఏళ్లుగా ఆలయంలో ముక్కోటి ఉత్సవాలతో పాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ప్రవచిస్తున్న గణపతి సచ్చిదానందహోరెత్తిన వైష్ణవాలయాలు ముక్కోటి ఏకాదశికి పోటెత్తిన భక్తులు ఉత్తర తిరుపతి ఆలయంలో స్వామి గణపతి సచ్చిదానంద ప్రవచనాలు -
జెండాబాలాజీ ఆలయంలో..
నగరంలోని శ్రీ జెండాబాలాజీ దేవస్థానంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పూజలు చేశారు. ఆలయంలో తెల్లవారుజామున స్వామికి గరుడవాహన సేవ, ఊరేగింపు నిర్వహించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారి సేవలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ ఆలయానికి మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేణు, దేవాదాయ శాఖ పరిశీలకులు కమల, చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, ధర్మకర్తలు వేముల దేవిదాస్, పోలకొండ నర్సింగ్‌రావు, సిరిపురం కిరణ్, కొర్వ రాజ్‌కుమార్, విజయ పాల్గొన్నారు. -
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు
నిజామాబాద్ రూరల్ : ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్య మని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నా రు. నగరంలో తాగునీటి సమస్య శాశ్వాత పరిష్కా రం కోసం రూ.6 కోట్ల 50 లక్షల వ్యయంతో ఆధునిక వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేకే గార్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో షబ్బీర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేగంగా పెరుగుతున్న జనాభా, నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తయితే నగరంలోని పలు ప్రాంతాల్లో ఏళ్లుగా ఉన్న నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఆటోనగర్ ప్రాంతంలో 16 లక్షల లీటర్ల సామర్థ్యం గల, సైలనీ నగర్లో 9 లక్షల లీటర్ల, మదీనా ఈద్గా సమీపంలో 9 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్, మైనార్టీ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర జనాభా, విస్తరణను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు రూ.6కోట్ల 50 లక్షలతో ఆధునిక వాటర్ ట్యాంకులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధునిక వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన -
కోనాపూర్ హెచ్ఎంకు గణిత రత్న అవార్డు
కమ్మర్పల్లి: మండలంలోని కోనాపూర్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం చౌడారపు రామ్‌ప్రసాద్ కు గణిత రత్న అవార్డు లభించింది. గణిత బోధనలో విశేష కృషి, టీచింగ్ లెర్నింగ్ మె టీరియల్ తయారీ, ఎస్ఎస్సీ పరీక్షల్లో వి ద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందు కు గాను తెలంగాణ గణిత ఫోరం నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో గణిత రత్న అ వార్డు ప్రదానం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం కార్యవర్గం సుభాష్‌నగర్: జిల్లా వైద్యారోగ్యశాఖలో తె లంగాణ వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం కార్యవర్గాన్ని నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం ఎన్నుకున్నారు. అంతకుముందు జిల్లా అధ్యక్షుడు ఘన్పూర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు, యూనియన్ బలోపేతం, నూతన సంవత్సర క్యాలెండర్, జిల్లా కమిటీ ఎన్నిక, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ కార్యక్రమాలు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో సంచరించే ఉద్యోగులకు ఆన్లైన్ అటెండెన్స్ ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 30 ఏళ్లుగా ఏఎన్ఎంలకు ప దోన్నతులు లభించడం లేదని ప్రస్తావించా రు. అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్ వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షులుగా ఏ యాదమ్మ, ఉపాధ్యక్షులుగా వీ ప్రవీణ్ రెడ్డి, బి బేబీరాణి, ఎం రవి గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం గంగామణి, పి మండోదరి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జి విమలేశ్వరి, సోలోమన్ రాజ్, ఎస్ స్వామి, జి సురేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎస్ శ్యామ ల, జి విజయ, ఈ సుధాకర్, టి రమేష్, డి మధుసూదన్ ఎన్నికయ్యారు. కొనసాగుతున్న రెల్వే డబుల్ ౖలైన్ పనులు ● ట్రాఫిక్‌కు అంతరాయం నవీపేట: డబుల్ రైల్వే లైన్ విస్తరణ పనులు కొనసాగడంతో మండల కేంద్రంలోని ప్రధా న రైల్వేగేటు సమీపంలో మంగళవారం ట్రా ఫిక్‌కు అంతరాయం కలిగింది. మేడ్చల్ –ముద్ఖేడ్ డబుల్ రైల్వే లైన్ పనులలో భాగంగా నవీపేట నుంచి బాసర వరకు మొ దటి దశ పనులు పూర్తి కానున్నాయి. జనవరిలో 13 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌పై రైలు పరుగెత్తనుంది. ఇరువైపులా లైన్ విస్తరణ పనులు పూర్తయ్యాయి. నవీపేట మండల కేంద్రంలో ట్రాక్ వద్ద పనులను మంగళవారం నిర్వహించారు. ట్రాక్ లెవల్, బీటీ భ ర్తీ పనులను నిర్వహించడంతో గేటును కొద్దిసేపు మూసేశారు. వాహనాల రద్దీతో ట్రాఫి క్కు అంతరాయం కలిగింది. పోలీసులు వా హనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
ఇలా త్రిపాఠి
జిల్లా కలెక్టర్‌గా ● వినయ్‌కృష్ణారెడ్డి బదిలీనిజామాబాద్ అర్బన్: జిల్లా కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి నియమితులయ్యారు. మంగళవా రం రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠిని జిల్లాకు కేటాయించారు. ఆమె 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్, ఇదివరకు పనిచేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజ్గిరి , ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. వినయ్‌కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 13న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలల్లోనే అతి తక్కువ కాలంలోనే కలెక్టర్ బదిలీ కావడం విశేషం. ఇటీవల గ్రామ పంచా యతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించా రు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆకస్మిక బదిలీ జరిగింది. -
31 నుంచి బడాపహాడ్ ఉర్సు
వర్ని: బడాపహాడ్ ఉర్సు ఈ నెల 31 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు వక్ఫ్ బోర్డు డిప్యూటీ సూపరింటెండెంట్ జమాల్ తెలిపారు. మొదటిరోజు జలాల్పూర్ గ్రామంలో బడాపహాడ్ దర్గా పూజారుల ఇంటి నుంచి గంధాలను తీసుకొని మేళతాళాలు, నృత్యాల ఊరేగింపుతో బడాపహాడ్‌కు తీసుకువస్తారని పేర్కొన్నారు. మూడు రోజులపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కవ్వాలి, దీపారాధన నిర్వహిస్తామన్నారు. ఉర్సు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉర్సుకు వచ్చే భక్తులకు తాగునీరు, ప్రత్యేక బస్సు, వైద్య శిబిరాలు, రాత్రి బస చేసేందుకు ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బోధన్: బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బోధన్ సీడీపీవో తాళ్ల పద్మ నియామకమయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమా, నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కరిపె రవీందర్, దారం భూమన్న, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ సంఘ బలోపేతం, సభ్యులు సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బోధన్‌టౌన్(బోధన్): అక్రమ చలామణిలో పట్టుబడిన నిషేధిత గుట్కా, పాన్ మసాలా, చైనా మంజా, పేకాట కార్డులను న్యాయమూర్తి సమక్షంలో సోమవారం కోర్టు ఆవరణలో కా ల్చివేశారు. సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ శేష సాయి తల్ప ఆధ్వర్యంలో న్యాయ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.10వేల విలువజేసే నిషేధిత వస్తువులను దగ్ధం చేశారు. ప్రజా ఆరోగ్యానికి హానికలిగించే గుట్కా, పాన్ మసాలా, చైనా మంజాలు, పేకాట కార్డులను విక్రయించొద్దని సూచించారు. నిజామాబాద్‌అర్బన్: పోలీసు శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గేలా కృషి చేస్తామని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై విస్తృత అవగాహన కల్పి స్తామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాల లు, ప్రధాన జంక్షన్ల వద్ద అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. -
ఆర్మూర్‌లో సైకత శిల్పాలు
● దశావతారాలతో ప్రదర్శనకు సిద్ధం ● నేడు ప్రారంభించనున్న అగ్గు మహరాజ్ ● రాష్ట్రంలోనే మొదటిసారిగా సైకత శిల్పాల ప్రదర్శన ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో విష్ణుమూర్తి దశావతారాలతోపాటు వినాయకుడు, అనంత పద్మనాభ స్వామి సైకత (ఇసుక) శిల్పాలు ఆధ్యాత్మిక శోభ ఉ ట్టిపడేలా కనువిందు చేయనున్నాయి. వైకుంఠ ఏ కాదశి సందర్భంగా ఈ నెల 30వ తేదీ మంగళ వారం సైకత శిల్పాల ప్రదర్శన ప్రారంభం కానున్నది. పట్టణానికి చెందిన విజయ్ అగర్వాల్, లావణ్య (లావణ్య టూర్స్ అండ్ ట్రావెల్స్) సంయుక్తంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా సైకత శిల్పాల ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. విజయవాడకు చెందిన సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వర ప్రసాద్‌ను ప్రత్యేకంగా పిలిచి పది రోజులుగా సైకత శిల్పాలను రూపొందిస్తున్నారు. మహాలక్ష్మి కాలనీలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రజలు, విద్యార్థులు సందర్శించేందుకు అందుబాటులో ఉంచారు. విష్ణుమూర్తి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ, రాముడు, కృష్ణుడు, బలరాముడు, కల్కి అవతారాలను కళ్లకు కట్టినట్లుగా ఇసుకతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. అమ్దాపూర్ నర్సింహస్వామి ఆలయ అగ్గు మహరాజ్ మంగళవారం ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దశావతారాల ప్రదర్శనతో పట్టణంలో ఆధ్యాత్మికత ఉట్టి పడుతుందనే నమ్మకంతో నా సోదరుడి సహాయంతో సైకత శిల్పాల ప్రదర్శనను ఏర్పాటు చేశాం. నామ మాత్రపు ఎంట్రీ టికెట్ చెల్లించి వీక్షకులు ఈ ప్రదర్శనను నెల రోజుల పాటు చూసి అలరించవచ్చు. – లావణ్య, శిబిరం నిర్వాహకురాలు, ఆర్మూర్ రాష్ట్రంలో మొదటిసారిగా సైకత శిల్పాలతో దశావతారాల ప్రదర్శన నిర్వహిస్తున్నందన ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సందర్భం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బీచ్‌లలో సోషల్ అవేర్నెస్ కల్పిస్తూ సైకత శిల్పాలు రూపొందించాను. – ఆకునూరి బాలాజీ వరప్రసాద్, సాండ్ ఆర్టిస్ట్, విజయవాడ -
క్రైం కార్నర్
● పాతకక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడినవీపేట: మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో బావపై బావమరిది గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. లింగాపూర్ గ్రామానికి చెందిన గంధం శ్రీనివాస్ సోదరిని ఆశాజ్యోతి కాలనీకి చెందిన చెందిన హన్మాండ్లు కొన్నేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గుండారం గ్రామ శివారులోని మహంకాళి ఆలయంలో హన్మాండ్లు ఆదివారం బంధువులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో హన్మాండ్లుకు ఇతర వ్యక్తులతో స్వల్పంగా ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని బావమరిది గంధం శ్రీనివాస్‌కు ఫోన్లో చెప్పగా ఆయన స్నేహితులను తీసుకొనికి మహంకాళి ఆలయానికి వచ్చారు. కానీ అప్పటికే గొడవ సద్దుమణిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన గంధం శ్రీనివాస్ బావ హన్మాండ్లుకు ఫోన్ చేసి తాగిన మైకంలో దూషించాడు. ఇరువురు గొడవపడగా పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని హన్మాండ్లు తల, వీపుపై గంధం శ్రీనివాస్ గొడ్డలితో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన హన్మాండ్లును ఆస్పత్రికి తరలించామని, బాధితుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దోమకొండ: చేపలవేటకు వెళ్లిన యువకుడు నీటమునిగి మృతిచెందిన ఘటన దోమకొండ మండలం కోనాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెంట స్వామి(40) రోజూ మాదిరిగా గ్రామ శివారులోని ఎగువ మానేరు నీటిలో చేపలవేటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. రాత్రి ఒడ్డు వద్దకు శవం కొట్టుకువచ్చింది. మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
విజేతలకు చాంపియన్‌షిప్ ట్రోపీలు ప్రదానం
సుభాష్‌నగర్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన క్రాస్ కంట్రీ, కిడ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలకు నాగారంలోని రాజారాం స్టేడియంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నరాల రత్నాకర్, రాజాగౌడ్ మెడల్స్, చాంపియన్‌షిప్ ట్రోపీలను అందజేశారు. అండర్–8 విభాగంలో సిద్ధార్థ హైస్కూల్ (నందిపేట్), జీఎఫ్ఎస్ పాఠశాల (వన్నెల్–కే), అండర్ – 10 విభాగంలో విజయ్ హైస్కూల్ (నిజామాబాద్), మల్లారెడ్డి పాఠశాల (వర్ని), అండర్ – 12 విభాగంలో ఎంజేపీ బాయ్స్ (రాంపూర్), టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ బాయ్స్ (పోచంపాడ్), అండర్ –14 విభాగంలో వెక్టర్ పాఠశాల (నిజామాబాద్), ఎంజేపీ బాలికలు (బాల్కొండ) చాంపియన్‌షిప్ ట్రోపీలను అందుకున్నాయి. అనంతరం ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ మాట్లాడుతూ జనవరి 2న రంగారెడ్డి జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు క్రాస్ కంట్రీ జట్టును ఎంపిక చేసి పంపించామన్నారు. జనవరి 18న ఆదిలాబాద్‌లో జరగబోయే కిడ్స్ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలకు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
95531 30597 / 91544 03633
నేడు డాక్టర్ జలగం తిరుపతిరావుతో సాక్షి ఫోన్ ఇన్చలి తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు వివరించనున్నారు. చలి కారణంగా జ్వరాల బారిన పడిన వారు వైద్య సలహాలు, సూచనల కోసం తిరుపతిరావుతో సాక్షి ఫోన్‌ఇన్ లో మాట్లాడవచ్చు.సమయం : ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకుజలగం తిరుపతిరావు ఫోన్ చేయాల్సిన నంబర్: -
అందుబాటులో యూరియా నిల్వలు
● రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు ● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లో పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి భరోసా కల్పించారు. సోమవారం ఆయన మండలాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని సహకార సంఘాలలో యూరియా సహా ఇతర ఎరువులు అందుబాటులో ఉంచామని, పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు అందేవిధంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లాలో 82,055 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అవసరం ఉండగా, 51,091 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు 38,993 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో 12,097 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 32,057 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1580 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1460 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేస్తూ, ఉదయం 6.00 గంటల నుంచే పంపిణీ ప్రారంభం అయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పారదర్శకంగా యూరియా ఎరువుల పంపిణీకి రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తెచ్చిందని, రైతు సోదరులు, డీలర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విషయంలో ఇబ్బంది తలెత్తకుండా వ్యవసాయ, సహకార శాఖలతో పాటు ఇతర శాఖల సిబ్బందిని పంపిణీ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతామని అన్నారు. అదేవిధంగా ప్రతి యూరియా విక్రయ కేంద్రంలో యూరియా బుకింగ్ యాప్‌కు సంబంధించిన క్యూ.ఆర్ కోడ్‌ను స్పష్టంగా ప్రదర్శిస్తారని తెలిపారు. తద్వారా రైతులు సులభంగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే ఒకేసారి యూరియా కొనుగోలు చేయకుండా, శాసీ్త్రయ పద్ధతిలో అవసరానికి సరిపడా మాత్రమే వినియోగించాలని కలెక్టర్ రైతులను కోరారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. -
ప్రజావాణికి ప్రాధాన్యమివ్వాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● 93 ఫిర్యాదుల స్వీకరణ నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 93 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు వివరించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. -
సురక్షితమైన ఆహారంతోనే ఆరోగ్యం
తెయూ(డిచ్పల్లి): సురక్షితమైన ఆహారంతోనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం సురక్షితమై న ఆహారంపై తెయూలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరి మాట్లాడుతూ.. హాస్టల్స్ సిబ్బంది ఎల్లప్పుడూ విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ శుభ్రమైన రుచికరమైన ఆహారం అందించడంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సిబ్బంది విఽ దులు నిర్వహించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు సునీత,నవీత,ట్రైనర్ భావన హాస్టళ్లలో ఆహార త యారీ విధానాలు,పరిశుభ్రత, నిల్వ విధానం, భద్ర తా ప్రమాణాలపై అవగాహన కల్పించారు.వంటగదుల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, ఆ ప్రాన్స్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ని ర్వాహకులు భాష బాబు,వార్డెన్లు గంగాకిషన్, జ్యో త్స్న, కిరణ్ రాథోడ్, కేర్ టేకర్లు క్రాంతికుమార్, ది గంబర్ చౌహాన్, రమేశ్, సుభాన్ రావు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. వర్సిటీలో ఫుడ్ సేఫ్టీపై అవగాహన -
వన్యప్రాణులను వేటాడొద్దు
నందిపేట్(ఆర్మూర్):అడవులు, వన్యప్రాణుల రక్ష ణ అత్యంత కీలకమని, వన్యప్రాణులను వేటాడ డం నేరమని నందిపేట ఫారెస్టు డిప్యూటీ రేంజ్ అఽ దికారి సుధాకర్ సూచించారు. మండలంలోని అ యిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం అట వీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ సమతుల్యత,అటవీ సంరక్షణ అవసరం,వన్యప్రాణుల ప్రా ధాన్యత,చట్టాలఅమలు,ప్రజల బాధ్యతను సుధాకర్ క్షుణ్ణంగా వివరించారు.ప్రకృతిలో పాముల పాత్రను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా స్నేక్ స్నాచర్లు షేక్ మున్నా, అంజాద్ వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ,హెచ్ఎం లాలయ్య, జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, సాయాగౌడ్, శ్రీకాంత్, సీఆర్పీ రాజు పాల్గొన్నారు. ● జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ కమ్మర్పల్లి: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులు, క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలందించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని 108 నిజామాబాద్, నిర్మల్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్ సూచించారు. ఆయన సోమవారం కమ్మర్‌పల్లిలో 108 అంబులెన్స్ వాహనాన్ని, రికార్డులను తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న మందులు, వైద్య పరిక రాలు వాటి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అ నంతరం జనార్దన్ మాట్లాడుతూ గర్భిణులను ప్ర సవ సమయంలో ఆస్పత్రికి అంబులెన్స్‌లోనే తర లించేలా క్షేత్రస్థాయి వైద్య సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాహనాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా కో ఆర్డినేటర్ స్వరాజ్, 108 సిబ్బంది ఈఎంటి జగదీశ్, పైలెట్ శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు. -
నిజామాబాద్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● జక్రాన్‌పల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2021లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా (డిసెంబర్లో) కొత్తగా కొర్రీలు పెట్టింది. స్థలం అనుకూలంగా ఉన్నప్పటికీ రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం కావాలని చెప్పడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజకీయ, విద్యా రంగాల్లో కీలక మలుపులు చోటు చేసుకున్న 2025 సంవత్సరానికి జిల్లా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉండిపోనుంది. జిల్లాకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలలు, ధర్మపురి – కొండగట్టు – వేములవాడ – లింబాద్రిగుట్ట – బాసర పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రహదారి కోసం నిధులు మంజూరయ్యాయి. అయితే జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న జక్రాన్‌పల్లి ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టడం నిరాశకు గురి చేసింది. రాజకీయాలకు వస్తే సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కాగా.. కేసీఆర్ తనయ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన 2025 ఏడాది జిల్లాపై ప్రత్యేక ముద్రవేసి వెళ్లిపోతోంది.. గేయ రచయితకు రాష్ట్రస్థాయి బహుమతి ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన గేయ రచయిత సాయికుమార్ రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో మొదటి బహుమతి సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సంప్రదాయ పాటల్లో భాగంగా రాష్ట్రస్థాయిలో 500 మంది రచయితలు పోటీపడగా, సాయికుమార్ రచించిన పాటకు మొదటి బహుమతికి ఎంపికయ్యింది. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. చైనామాంజా వినియోగిస్తే కఠిన చర్యలు నిజామాబాద్‌అర్బన్: చైనా మాంజా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమ వారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మాంజా కారణంగా వ్యక్తులకు ప్రాణహాని కలిగిస్తే హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మనుషులు, జంతువుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగా చైనామాంజా వాడకం పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. చైనా మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు చైనా మాంజా తీసుకువచ్చినట్లు సమాచారం ఉందని, దాడులు చేసి బాధ్యులను పట్టుకుంటామన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సాఫ్ట్‌బాల్ చాంపియన్‌గా నిజామాబాద్ సుభాష్‌నగర్: మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ 10వ సబ్ జూనియర్ బాలుర చాంపియన్‌షిప్‌గా నిజామాబాద్ జట్టు నిలిచిందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి ప్రభాకర్‌రెడ్డి, మర్కంటి గంగామోహన్ సో మవారం తెలిపారు. ఫైనల్లో మెదక్ జిల్లా జట్టుపై 2–1 పరుగుల తేడాలో విజయం సాధించిందన్నారు. టోర్నీలో బెస్ట్ ఆల్ రౌండర్‌గా రేవంత్ నిలిచి బహుమతి అందుకున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా జట్టుకు కోచ్, మేనేజర్లుగా అనికేత్, తిరుపతి వ్యవహరించారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాపై 2025 సంవత్సరం చెరగని ముద్రవేసి కాలగర్భంలోకి వెళ్లిపోతోంది. ఈ ఏడాది అనేక కీలక పరిణామాలు, మా ర్పులు చోటు చేసుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. రాజకీయాలు అనుకోని మలుపులు తిరిగాయి. 2012లో రోస్టర్ నిబంధనలను తుంగలో తొక్కి తెలంగాణ యూనివర్సిటీలో భర్తీ చేసిన అధ్యాపక పోస్టులను రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయంస్థానం నవంబర్‌లో తీర్పునిచ్చింది. తక్షణమే కొత్త నోటిఫికేషన్ వేయాలని జారీ చేసుకోవచ్చని సూచనలు చేసింది. ఉత్తర తెలంగాణలో ప్రధానమైన ధర్మపురి – కొండగట్టు – వేములవాడ – లింబాద్రిగుట్ట – బాసర పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రహదారి కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌లో నిధులు మంజూరు చేసింది. మొదటి దశలో నిజామాబాద్ – 1 సర్కిల్లోని 15 రోడ్లను అభివృద్ధి చేసేందుకు గాను రూ.412.33 కోట్లు, నిజామాబాద్ – 2 సర్కిల్లో మరో 15 రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.243.69 కోట్లు నిధులు మంజూరు చేస్తూ జీవో ఎంఎస్ 76ను ఈ నెల 13న జారీ చేసింది. రోడ్ల నిర్మాణాన్ని హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) విధానంలో చేపట్టనున్నారు. జిల్లా పరిధిలోని పలు రోడ్లు మరింత అభివృద్ధి కానున్నాయి. వీటిలో 8 ముఖ్యమైన రహదారులు ఉన్నాయి. డిసెంబర్లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 362 గ్రామాల్లో కాంగ్రెస్, 76 గ్రామాల్లో బీఆర్ఎస్, 47 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు, 60 గ్రామాల్లో స్వతంత్రులు సర్పంచులుగా విజయం సాధించారు. డీసీసీబీ, సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేస్తూ డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జిల్లాలో 89 సహకార సంఘాల పాలకవర్గాల సభ్యులు ఇంటికెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. జూలైలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. 211 మంది టీచర్ల సర్దుబాటు పూర్తి చేశారు. పీఎంశ్రీ నిధుల వినియోగంలో అవకతలకు జరిగాయని ఏసీబీ అధికారులు నవంబర్‌లో పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. భూభారతి చట్టం అమలులోకి వచ్చిన తరువాత జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. పరిష్కారం ప్రక్రియ నడుస్తోంది. రెవెన్యూ శాఖలో జీపీవోల నియామకం చేపట్టారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు తిరిగి జిల్లాకు వచ్చారు. వైద్యారోగ్య శాఖలో నవంబర్‌లో అవుట్ సోర్సింగ్విధానంలో ఏఎన్ఎంలను నియమించారు. వర్ని మండలం సిద్ధాపూర్ చుట్టుపక్కల 13 గ్రామాల రైతులకు సాగునీరందించేందుకు చేపట్టిన సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపంతో నిలిచిపోయాయి. 2022లో రూ.72 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా, అటవీశాఖ అనుమతులు నిరాకరించడంతో 20 శాతం పనులు అయిన తరువాత నిలిచిపోయాయి. ఇది పూర్తయితే 10వేల ఎకరాలకు సాగునీరందుతుంది. నిజాంసాగర్ కాలువ ఎగువ భాగంలోని నాన్ కమాండ్ ఏరియా వ్యవసాయ భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో జాకోరా, చందూర్, చింతకుంట వద్ద నిజాంసాగర్ కాలువ నుంచి నీరు అందించాలన్న లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 2022 సంవత్సరంలో రూ.106 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ మూడు లిఫ్టులు పూర్తయితే 9వేల ఎకరాలకు సాగునీరందుతుంది. పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి పెద్ద పదవి బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ జిల్లాలకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ పోరు జక్రాన్‌పల్లి విమానాశ్రయానికి కేంద్రం కొర్రీలు తెయూలో అక్రమ నియామకాలు రద్దు బాక్సింగ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్ జిల్లాపై 2025 సంవత్సరానికి ప్రత్యేక ముద్ర -
ఆదర్శం ఎల్లారెడ్డిపల్లె
ఇందల్వాయి : రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతోపాటు గ్రామస్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న ఆలోచన చేసింది. గ్రామ ముఖద్వారం వద్ద ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి హెల్మెట్లను అందుబాటులో ఉంచింది. గ్రామం నుంచి ద్విచక్ర వాహనాలపై బయటికి వెళ్లే వారు రూ.10 చెల్లించి హెల్మెట్ తీసుకెళ్లి తిరిగి వచ్చిన తరువాత తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ద్విచక్ర వాహనదారుల ప్రాణాల రక్షణ కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ మఠముల సుజాత తెలిపారు. కార్యక్రమాన్ని ఎస్సై సందీప్ సోమవారం ప్రారంభించి గ్రామస్తులను అభినందించారు. వీడీసీ సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. -
వడ్ల డబ్బులు తక్కువొచ్చాయని ఆందోళన
● మహిళా భవనాన్ని ముట్టడించిన రైతులు జక్రాన్‌పల్లి: కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యం డబ్బులు తక్కువగా వచ్చాయని పడకల్ రైతులు సోమవారం మహిళా భవనాన్ని ముట్టడించారు. గ్రామంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. సుమారు 54 లారీల ధాన్యాన్ని రైతులు నుంచి మహిళా సమాఖ్య సభ్యులు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2389 ప్రకారం రావాల్సిన డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. దీంతో మహిళా సమాఖ్య సభ్యులను నిలదీయగా తమకేమీ తెలియదని కొనుగోలు చేసేందుకు జక్రాన్‌పల్లి తండాకు చెందిన వ్యక్తిని నియమించుకున్నట్లు తెలపడంతో రైతుల్లో అనుమానాలు తలెత్తాయి. ఆగ్రహించిన రైతులు మహిళా సమాఖ్య భవనాన్ని ముట్టడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిని పిలిచి విచారించారు. రైస్‌మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాలుకు 8 నుంచి 10 కిలోల చొప్పున కటింగ్ చేశారని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎకరానికి 40 బస్తాలు మాత్రమే తూకం వేయాలని సూచించిందని, అంతకన్నా ఎక్కువ ఉంటే వేరే రైతుల పేరు మీద తూకం వేశామని తెలిపారు. అందుకే డబ్బులు రావడంలో తికమక అయ్యిందని సదరు వ్యక్తి వివరణ ఇచ్చారు. మిల్లర్లతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో డబ్బులు వచ్చేలా చేస్తానని చెప్పారు. పోలీసులు రైతులతో మాట్లాడి నాలుగైదు రోజులు ఓపికపట్టాలని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం గంగాధర్‌ను వివరణ కోరగా ట్రాక్షీట్లను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. -
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
నెలలో రెండో ఘటన నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో చైన్‌స్నాచింగ్ ఘటనలు మళ్లీ పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లా కేంద్రంలో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. తెల్లవారుజామున ముసుగు ధరించుకొని బైక్‌లపై వస్తున్న దుండగులు జనంలేని ప్రాంతాల్లో ఉండే మహిళల బంగారు గొలుసులు లా క్కెళ్తున్నారు. వారం రోజుల క్రితం వినాయక్‌నగర్, కసాబ్‌గల్లీలో అడ్రస్ అడుగుతూ మహిళల మెడలో ని పుస్తెలతాడును లాకెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేస్తుండగా, తాజాగా సోమవారం సుభాష్‌నగర్ ఎస్బీఐ బ్యాంక్ వెనుక ప్రాంతంలో ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఇంటి వద్ద పూలు తెంపుతున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు. క్లూ దొరికింది.. సుభాష్‌నగర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి చైన్ స్నాచర్ల క్లూ దొరికింది. త్వరలోనే పట్టుకుంటాం. మిగతా రెండు కేసుల్లో విచారణ వేగంగా జరుగుతోంది. బంగారం రేటు పెరగడంతోనే చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. మహిళలు అప్రమత్తంగా ఉండాలి. – రాజావెంకటరెడ్డి, ఏసీపీ, నిజామాబాద్సంవత్సరం చోరీలు పోలీసులు ఛేదించినవి 2022 26 13 2023 40 18 2024 37 07 2025 17 13 జిల్లా జరిగిన చైన్‌స్నాచింగ్‌లు -
కళాభవన్‌కు నిధులు మంజూరు చేయాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న కళాభవన్ (కళాభారతి) పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, జీరో అవర్‌లో ధన్పాల్ మాట్లాడారు. రూ.116 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో కళాభారతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, కేవలం రూ.50 కోట్ల మాత్రమే విడుదల కావడంతో పనులు నిలిచిపోయాయని వివరించారు. కాంట్రాక్టర్‌కు బకాయిలు పెండింగ్‌లో ఉండటం, అంచనాలు మారడం కారణంగా రూ.70 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు మిగిలిన నిధులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలి కమ్మర్పల్లి(భీమ్‌గల్): బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల జీరో అవర్‌లో ఆయన.. భీమ్‌గల్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 100 పడలక ఆస్పత్రి మంజూరు కాగా.. 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తికాకపోవడంతో సిబ్బంది వేరే దగ్గర సర్దుకుని పని చేయాల్సి వస్తోందని వివరించారు. పనులు పూర్తి చేస్తే పేదలకు ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా దృష్టికి తీసుకెళ్లారు. -
గల్ఫ్ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా..
● వలస కార్మిక సంఘాల పోరుబాట ● ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు లేఖలను అందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ మోర్తాడ్(బాల్కొండ): వలస కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాటను ఆరంభించాయి. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలను ఆరంభించే అవకాశం ఉండటంతో అప్పట్లోగా తమ డిమాండ్లను ప్రజాప్రతినిధుల దృష్టికి చేరవేయాలనే సంకల్పంతో వలస కార్మిక సంఘాలు లేఖలు రాస్తున్నాయి. రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను స్వయంగా కలిసి లేఖలను అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకవస్తారనే ఆలోచనతో కార్మిక సంఘాల ప్రతినిధులు కార్యాచరణ మొదలు పెట్టారు. కొన్ని అంశాలపై దృష్టిసారించినా... ఇప్పటికే రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికులకు సంబంధించి కొన్ని అంశాలపై దృష్టిసారించింది. అవి పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో వలస కార్మికుల కుటుంబాలకు ప్రయోజనాలు దక్కడం లేదు. దీంతో డిమాండ్ల సాధన కోసం బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని ఇప్పటి నుంచే నడుం కట్టాలని వలస కార్మిక సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. ఆదివారం ప్రారంభించిన లేఖల అందజేత కార్యక్రమంను రోజూ కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈక్రమంలో ఒక్కో ప్రజాప్రతినిధిని స్వయంగా కలిసి డిమాండ్లను వినిపించనున్నారు. -
బంగారు ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య
● నిందితుడి పట్టివేత ● ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితుడు పొల్కంపేట గ్రామానికి చెందిన ముద్రబోయిన కుమార్ బంగారు ఆభరణాల కోసమే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఇంట్లో వృద్ధురాలు సులోచన ఒంటరిగా ఉన్న విషయం గమనించిన కుమార్ ఇంటి వెనుక ఉన్న తలుపును పైకి లేపి ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించి ఆమెను తీవ్రంగా గాయపర్చి హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఆదివారం ఉదయం తన ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలను తీసుకెళ్లడానికి వచ్చిన క్రమంలో అతడిని పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి పుస్తెలతాడు, కమ్మలు, ఉంగరం, బంగారు గాజులు (సుమారు నాలుగు తులాలు) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు గతంలో చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడని తెలిపారు. పని చేయకుండా ఆవారాగా తిరిగేవాడన్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. లింగంపేట ఎస్సై దీపక్‌కుమార్, సీబ్బంది రమేశ్, సంపత్, జవ్వినాయక్, లీక్యానాయక్, మదన్‌లాల్‌లను జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించినట్లు తెలిపారు. -
ఏళ్ల తర్వాత.. ఒక్కచోటికి..
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ● ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు బోధన్‌టౌన్(బోధన్): వారంతా పూర్వ విద్యార్థులు. 50ఏళ్ల క్రితం ఇంటర్ చదివి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చే సి, రిటైర్డ్ అయిన అందరూ మళ్లీ ఇన్నేళ్లకు ఒకేచోట కలిశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973–75లో ఇంటర్ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఆదివారం అదే కళాశాలలో పూర్వ వి ద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించా రు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకొని, చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆటపాటలతో అలరించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఆంజనేయులు, సాయి లు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్‌లో 47 ఏళ్ల తర్వాత.. వేల్పూర్: వేల్పూర్ హైస్కూలులో 1977–78 ఎ స్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. పాఠశాలలో చదు వుకున్న రోజులు గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. ఒకరినొకరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. భీమ్‌గల్‌లో 25 ఏళ్ల తర్వాత.. కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ జెడ్పీహెచ్ఎస్ల 1999–2000 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ వారంతా ఒకేచోట కలుసుకోవడంతో ఆప్యాయంగా పలుకరించుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. వెల్మల్‌లో 21 ఏళ్ల తర్వాత.. నందిపేట్(ఆర్మూర్): మండలంలోని వెల్మల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం 2003–04 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వీరంతా 21 ఏళ్ల తర్వాత కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాడు చదువు చెప్పిన గురువులను సన్మానించారు. నిజాంసాగర్ నవోదయలో.. నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సదరు విద్యాలయం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు చదివిన సుమారు 33 బ్యాచ్‌ల విద్యార్థులు పాల్గొన్నారు. నవోదయలో చదివి ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఉన్నవారితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ప్రయివేట్ కంపెనీలు స్థాపించిన విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. నవోదయ ప్రిన్సిపాల్ సీతారాంబాబు, పూర్వ విధ్యార్థులు పాల్గోన్నారు. భీమ్‌గల్ జెడ్పీహెచ్ఎస్ 1999–2000 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 1973–75 బ్యాచ్ ఇంటర్ విద్యార్థులు -
అద్దె అరకలకు డిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): యాసంగి సీజన్లో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకలకు డిమాండ్ పెరిగింది. ఒక్క రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు తడి పంటల సాగు పనులను రైతులు పూర్తి చేసుకుంటున్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితం, తెల్గాపూర్, శేర్‌ఖాన్‌పల్లి, శనివార్‌పేట గ్రామాల్లో ఆరుతడి పంటలు జోరుగా సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో నాగలి, ఎడ్లు లేకపోవడంతో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకల కోసం రైతులు వెతుకులాడుతున్నారు. మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్గల్ ప్రాంతాల్లో ఉన్న ఎడ్లను అద్దెకు తీసుకు వచ్చి ఆరుతడి పంటలు సాగు చేయడంలో రైతులు నిమగ్నం అవుతున్నారు. నాగటేడ్లకు రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తున్నారు. అంతేకాకుండా నెలకు రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు ఎడ్లకు అద్దె ఇస్తూ పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. గ్రామాల్లో పశువుల సంతతి రోజురోజుకు కనుమరుగవడంతో రైతులకు వ్యవసాయం కష్టంగా మారింది. -
అప్పులు తీసుకునేప్పుడు జాగ్రత్త!
మీకు తెలుసా.. రామారెడ్డి: చట్టబద్ధంగా (లీగల్‌గా) అప్పు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మోసాలు జరగకుండా అనవసరమైన వేధింపులు లేకుండా జాగ్రత్తపడవ చ్చు. మీరు అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే.. ● సాధారణంగా ఆర్బీఐ గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వంటి వాటి నుంచి రుణాలు తీసుకోవచ్చు. ● చిన్న మొత్తంలో రుణాలను ఎన్బీఎఫ్సీ(బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఆర్బీఐ గు ర్తింపు పొందిన ప్రయివేట్ సంస్థలు రిజిస్టర్డ్ మైక్రోఫైనాన్న్స్ సంస్థల ద్వారా పొందవచ్చు. ● లైసెన్స్ ఉన్న వడ్డీ వ్యాపారులు, ప్రయివేట్ వ్యక్తుల దగ్గర తీసుకుంటే, వారికి ప్రభుత్వం ఇచ్చిన ‘మనీ లెండింగ్ లైసెనన్స్’ ఉందో లేదో సరిచూసుకోవాలి. ● అప్పు తీసుకునేటప్పుడు కేవలం మాటల మీద ఆధారపడకుండా పత్రాలను సిద్ధం చేసుకోవాలి ● ప్రామిసరీ నోట్ అప్పు తీసుకున్నట్లు, తిరిగి చెల్లిస్తానని రాసి ఇచ్చే పత్రం. దీనిపై రెవె న్యూ స్టాంపు ఉండాలి. ● లోన్ అగ్రిమెంట్ వడ్డీ రేటు, చెల్లింపు గడువు, ఆలస్యమైతే జరిమానా వంటి వివరాలన్నీ ఇందులో ఉండాలి. ● భద్రత కోసం బ్యాంకులు లేదా సంస్థలు పోస్ట్ డేటెడ్ చెక్కులు అడుగుతాయి. ● వడ్డీ రేటు చట్టం ప్రకారం నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయడం నేరం. బ్యాంకుల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ● వ్యక్తిగత రుణాలకు వడ్డీ సాధారణంగా ఏడాదికి 10.5% నుంచి 24% వరకు ఉండవచ్చు. ● బంగారు రుణాలు ఏడాదికి 8% నుంచి 15% వరకు ఉంటాయి. ● గృహ రుణాలు ఏడాదికి 8.5% నుంచి 11% మధ్యలో ఉంటాయి. ● వ్యాపార రుణాలు ఏడాదికి 12% నుంచి 18% వరకు ఉండవచ్చు. ● ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకునే అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేశాయి. ● లైసెన్స్ ఉన్న వడ్డీ వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదు. ● సాధారణంగా ఇది ఏడాదికి 12% నుంచి 18% మించకూడదని నిబంధనలున్నాయి. ● ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ పేరుతో ఎంత కట్ అవుతుందో ముందే అడగండి. ● మీరు గడువు కంటే ముందే అప్పు తీర్చేయాలనుకుంటే ఏవైనా పెనాల్టీలు ఉంటాయో తెలుసుకోవాలి. ● ఆన్లైన్ లోన్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ప్లేస్టోర్‌లో చాలా ఫే క్ లోన్ యాప్‌లు ఉన్నాయి. ఆర్బీఐ ద్వారా గుర్తింపు పొందిన యాప్‌లలోనే అప్పు తీసుకోవాలి. ● మీ ఫోన్ కాంటాక్ట్స్, గ్యాలరీకి అనుమతి అడిగే యాప్‌లకు దూరంగా ఉండండి. ● ఎప్పుడూ ఖాళీ పేపర్ల మీద లేదా ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేయకండి. ● మీరు చెల్లించే ప్రతి రూపాయికి రసీదు అడగండి. లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే చెల్లింపులు చేయండి. ● అప్పు తీసుకునేటప్పుడు సాక్షుల సంతకాలు ఉండేలా చూసుకోండి. -
అన్నను చంపిన తమ్ముడి అరెస్టు
భిక్కనూరు: మండలంలోని మోటాట్పల్లి గ్రామంలో అన్నను చంపిన తమ్ముడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, ఎస్సై అంజనేయులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారు వారు విలేకరులతో మాట్లాడారు. మోటాట్పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రాజు తన సమీప బంధువువైన మహిళతో వివాహేతర సంబందం పెట్టుకోవడంతో తన తమ్ముడు శివకుమార్‌కు పెళ్లి సంబంధాలు రావడంలేదు. అలాగే ఖరీఫ్ పంటకు సంబంధించిన డబ్బులను రాజు దుబార చేస్తున్నాడు. దీంతో అన్నపై కోపంతోనే హత్య చేసినట్టు తమ్ముడు ఒప్పుకున్నాడు. ఈమేరకు నిందితుడు శివకుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ,ఎస్సైలు వివరించారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని ర్యాపాన్ గంగోత్రి జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ గంగామోహన్ తెలిపారు. ఈ నెల 26 నుంచి 28 వరకు మంచిర్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో గంగోత్రి ప్రతిభ కనబర్చి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జనవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందని పీడీ తెలిపారు. గంగోత్రిని ఇన్చార్జి ఎంఈవో, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. నిజామాబాద్ రూరల్: యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి అన్నారు. నగరంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం సర్పంచులుగా ఎన్నికై న యూత్ కాంగ్రెస్ నాయకులను సన్మానించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్చార్జిలు అల్మాస్ ఖాన్, వినోద్, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నరేందర్ గౌడ్, రాజు గౌడ్, ఆదిత్య, అబ్బోల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్‌నగర్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమ ని, వారి భవిష్యత్ నిర్మాణానికి గురువులే పునా ది అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో ఆదివారం స్టేట్ టీ చర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. సంఘ ప్రతినిధులు శ్రీకాంత్, ధర్మేందర్, బెల్లాల్ శ్రీనివాస్, మహేశ్వర్, యాదగిరి, సాయి తేజ, కృష్ణ విజయ సారధి, రత్నాకర్, సురేష్ కుమార్, గోలి ప్రకాష్, శ్రీనివాస్ కిషన్, గణేష్ భూపతి రాజు, అబ్బాయా, యూసఫ్ పాల్గొన్నారు. -
టీపీసీసీ అధ్యక్షుడికి సన్మానం
మోపాల్: హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం విజ్ఞాన దర్శని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొనగా, జిల్లా ఆదివాసీ గిరిజన చైర్మన్ కేతావత్ యాదగిరి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడిని సన్మానించారు. నాయకులు వెంకట్రాం, రవి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలోని ఉత్తర తిరుపతి దేవస్థానంలో ఈనెల 30న వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 29న అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ స్వాగత సభా కార్యక్రమం ఉంటుందని, సాయంత్రం అన్నదానం ఉంటుందని వివరించారు. 30న ఉదయం 11 గంటలకు శ్రీ చక్రపూజ, సంపూర్ణ భగవద్గీత పారాయణం, 12 గంటలకు అనుగ్రహ భాషణం, సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కళ్యాణం సాయంత్రం 7 గంటలకు సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం, అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. -
చలి తీవ్రత – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
95531 30597 / 91544 03633చలి తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు వివరించనున్నారు. చలి కారణంగా జ్వరాల బారిన పడిన వారు వైద్య సలహాలు, సూచనల కోసం తిరుపతిరావుతో సాక్షి ఫోన్‌ఇన్ లో మాట్లాడవచ్చు.తేది : 30–12–2025 (మంగళవారం) ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకుజలగం తిరుపతిరావు ఫోన్ చేయాల్సిన నంబర్: -
అన్నదాతకు ఆటుపోట్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఈ ఏడాదిలో వ్యవసాయ రంగం ఆటుపోట్లు ఎదుర్కొంది. అకా ల వర్షాలు, భారీ వరదలతో రైతులు భారీగా నష్ట పోయారు. దీంతో రావాల్సినదానికంటే పంట దిగుబడులు తక్కువగా వచ్చాయి. ధాన్యం సేకరణ విష యంలో జిల్లా వరుసగా రెండు సీజన్లలో రాష్ట్రంలో నే మొదటి స్థానంలో నిలిచినప్పటికీ దిగుబడి మా త్రం గతంతో పోలిస్తే కొంతమేర తగ్గింది. వానాకాలం సీజన్లో పంటలకు తెగుళ్లు, చీడపీడలు సైతం అన్నదాతలను దెబ్బతీశాయి. గడిచిన వానాకాలం సీజన్లో 4,36,695 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తే ఎకరానికి 28–30 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఎకరానికి 5–6 క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గింది. ● మొక్కజొన్న 52,093 ఎకరాల్లో సాగు చేయగా ఎకరానికి 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావాల్సి ఉన్నప్పటికీ 25–28 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ● సోయా పంట విషయానికి వస్తే మాత్రం ఈ ఏ డాది రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. జిల్లాలో 33,603 ఎకరాల్లో సోయా సాగుచేయగా దిగుబడి సగానికి తగ్గిపోయింది. ఎకరానికి 5–6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. చాలామంది రైతులు పెట్టిన పెట్టుబడి కూడా కోల్పోయారు. ● జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా 17,880 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 10,258 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.17.88 కోట్ల పరిహారం విడుదల చేసింది. ● జిల్లాలో ఈ ఏడాది 22,922 ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేశారు. మరో నెల రోజుల్లో పంట చేతికి రానుంది. ● వరుసగా రెండు సీజన్లలో (యాసంగి, వానాకాలం) ధాన్యం సేకరణ విషయంలో జిల్లా రాష్ట్రంలో నే మొదటిస్థానంలో నిలిచింది. గత యాసంగి సీజన్లో మొత్తం 7,79,925 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశారు. సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్న నేపథ్యంలో సేకరించిన ధాన్యంలో అత్యధికంగా 7,03,103 మెట్రిక్ టన్నులు సన్నధాన్యమే వచ్చింది. కేవలం 76,821 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం వచ్చింది. యాసంగిలో జిల్లావ్యాప్తంగా 598 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం సేకరించింది. ఇందులో 466 కేంద్రాల ద్వారా సన్నరకం, 132 కేంద్రాల ద్వారా దొడ్డురకం ధాన్యం సేకరించారు. ● తాజాగా ముగిసిన వానాకాలం సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. జిల్లాలో 7,02,009 మెట్రిక్ టన్నులు సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకోగా అధికారులు 6,93,288 మెట్రిక్ టన్నులు సేకరించారు. జిల్లాలో సేకరించిన ధాన్యంలో 6,00,000 మెట్రిక్ టన్నులు సన్నధాన్యం కాగా, మిగిలిన 93,288 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి, మంజీర పరీవాహకంలో భారీగా పంట నష్టం.. తగ్గిన దిగుబడులు బోధన్ డివిజన్లో భారీగా నష్టపోయిన సోయా రైతులు.. సగానికి పడిపోయిన దిగుబడి యాసంగి, వానాకాలంలో వరుసగా ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే టాప్‌గా జిల్లా ఇందూరులో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్‌షా జిల్లా వ్యవసాయరంగం 2025 రౌండప్ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం జూన్ 29వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్‌కు వచ్చి పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానికంగా పసుపు పంటకు సంబంధించి ఆర్అండ్డీ కేంద్రం ఏర్పాటు చేస్తామని అమిత్ షా తెలిపారు. అదే విధంగా భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో బిలియన్ డాలర్ల విలువైన పసుపు ఎగుమతులు చేసేవిధంగా ప్రోత్సహిస్తామన్నారు. -
పసుపు దిగుబడిపై ఆశలు
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులు దాదాపు ఎనిమిది నెలలపాటు సాగు చేసిన పసుపు పంట కోత దశకు చేరుకుంది. మరో వారం, పది రోజుల్లో పంట చేతికి రానుంది. పసుపును తవ్వేందుకు మహారాష్ట్ర నుంచి కూలీలు జిల్లాకు చేరుకుంటుండగా, పలుచోట్ల ఆకు కోతలు మొదలయ్యాయి. అయితే, ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పంటను చీడపీడలు ఆశించాయి. అక్టోబర్ వరకూ వర్షాలు కురవడంతో పంటలో నీరు నిలిచి దుంపకుళ్లు, వేరుకుళ్లు వైరస్ బారినపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకులకు మర్రాకు తెగులు సోకి పంట సక్రమంగా ఎదగలేదని రైతులు చెప్తున్నారు. దీంతో వారికి దిగుబడిపై గుబులు పట్టుకుంది. జిల్లాలో ఈ ఏడాది 23,611 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశారు. మార్కెట్లో మంచి ధర ఉందనే ఆశతో గతేడాది కంటే 700 ఎకరాలు ఎక్కువగా పంటను వేశారు. అయితే, వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా దిగుబడి 60 శాతానికి తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 15–20 క్వింటాళ్లు రావొచ్చని రైతులు అంటున్నారు. ఉద్యాన శాఖ అధికారులు సైతం సర్వే చేసి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కోత దశకు చేరుకుంది.. నాలుగు ఎకరాల్లో పసుపు సాగు చేశాను. ఇప్పుడు కోత దశకు చేరుకుంది. సంక్రాంతికి ముందర పంట తవ్వి కొ మ్ములను బయటకు తీస్తాం. ఈయేడు అధిక వర్షాలతో జిల్లా అంతటా పంట దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తోంది. దిగుబడి ఎంత వస్తుందోనని రైతులు ఆందోళనగా ఉన్నారు. – గోక భోజారెడ్డి, డొంకేశ్వర్ జిల్లాలో 23,611 ఎకరాల్లో పంట సాగు వారం, పది రోజుల్లో ప్రారంభం కానున్న కొమ్ముల తవ్వకం అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గే అవకాశం -
దేశానికి బీజేపీ అన్యాయం చేస్తోంది
నిజామాబాద్ రూరల్: దేశానికి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఎగురవేయడంతోపా టు సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా నగేశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్వా తంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని, 1920 నుంచి కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశాభివృద్ధిలో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందన్నారు. సుమారు 49 ఏళ్లు దేశాన్ని పాలించిన గొప్ప పార్టీ తమదని, కాంగ్రెస్ ప్రధానుల దీర్ఘకాలిక ప్ర ణాళికలతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతోందన్నారు. కాంగ్రెస్ ఆవిర్భవించినప్పుడు ఉనికేలేని బీజేపీ ఈ రోజు తమ వల్లే దేశం అభివృద్ధి చెందుతోందని గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్ర తీసుకువచ్చేందుకే కాంగ్రెస్ అవతరించిందన్నారు. దేశ సమగ్రతకు కాంగ్రెస్ పాటుపడిందని, అనిర్వచనీయ సేవలు అందించిందని పేర్కొన్నారు. వ్యక్తుల ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సూజాత, యూత్ కాంగ్రెస్ విపుల్‌గౌడ్, వేణురాజ్, రత్నాకర్, లింగం, రాజానరేందర్గౌడ్, శ్రీనివాస్, మీసాల సుధాకర్, వినయ్, మొయిన్, కేశ మహేశ్, ఈసా, ఎజాజ్, సుభాష్‌జాదవ్, ఖు ద్దూస్, బలరాం, శివ, సంగెం సాయిలు, శ్రీశైలం, మాజీ మేయర్ సుజాత, పోల ఉష, చంద్రకళ, విజయలక్ష్మి, మీనా, బాల నర్సయ్య, పురుషోత్తం, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఆ పార్టీ తీరును ప్రజలకు వివరిస్తాం కాంగ్రెస్ ప్రధానుల దీర్ఘకాలిక ప్రణాళికలతోనే అభివృద్ధి రాహుల్‌ను ప్రధానిని చేస్తాం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం -
బాధితుల పక్షపాతి మాధవరావు
● నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణ దేవరావు నిజామాబాద్ రూరల్: అణచివేతకు గురైన బాధితు ల పక్షాన నిలబడి పోరాడటమే గొర్రెపాటి మాధవరావు జీవనశైలిగా మారిందని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీకృష్ణ దేవరావు అన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు ప్ర థమ వర్ధంతి సభను రాష్ట్ర, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఎల్లమ్మగుట్టలో ని ర్వహించారు. హెచ్ఆర్ఎఫ్ ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్.జీవన్‌కుమార్ అధ్యక్షత వహించిన సభలో శ్రీకృష్ణదేవరావు ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. హక్కుల సంఘాలతోనే వేలాది మంది బాధితులకు న్యాయం జరిగిందన్నారు. కన్నాభిరామ్, బాలగోపాల్ మాదిరి మాధవరావు చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో చాలా మార్పులు వస్తున్నాయని, న్యాయవాదులు, యువత చట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రధాన కోర్టులలో బాధిత పక్షానికి అనుకూలంగా ఉండాల్సిన తీర్పులు వాటికి భిన్నంగా వస్తున్నాయంటే న్యాయవ్యవస్థలో ప్రమాద గంటికలు మోగుతున్నా యా అని భయపడాల్సి వస్తుందన్నారు. మాధవరావు న్యాయవాద వృత్తిని ఉపాధి వృత్తిలా భావించలేదని, సమాజంలో వ్యత్యాసాలు, అసమానతలు పోవాలని కృషి చేశఆరన్నారు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీ ఆకుల పాపయ్య మా ట్లాడుతూ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చే విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే మాధవరావుకు నిజమైన నివాళి అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయి రెడ్డి, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం గంగులు, గొంట్యాల రమేశ్, మాధవరావు భార్య మీనా సహాని , కూతురు ఆదిత్య మధుమిత్, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భుజంగరావు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
మీ ఊరికి మీరే సీఎం..
డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. అలాంటి ఊరికి సేవ చేసుకునే అవకాశం సర్పంచులకు ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మీ ఊరికి మీరే సీఎం అని, యువతను కలుపుకొంటూ వెళ్లి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సర్పంచులకు సర్వాధికారాలు ఉంటాయని ఏ సీఎంతోనూ అవసరం లే దన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆత్మీయ సన్మాన సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన 98 మంది స్వచ్ఛంగా బీజేపీ వ్యక్తులేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుందని.. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే గ్రామాలకు నిధులు రాలేదన్నారు. ఇప్పుడు రావాల్సిన నిధులు ఆటోమెటిగ్గా కేంద్రం నుంచి వచ్చేస్తాయని తెలిపారు. పారదర్శకంగా, అవినీతి లేకుండా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 12 వేల గ్రామ పంచాయతీలుండగా.. వచ్చేసారి 98 శాతం పంచాయతీల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఈ ఎన్నికలు బీజేపీ విజయాలకు ప్రారంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లుగా గెలువబోతున్నారని ఆశాభావం వ్య క్తం చేశారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సర్పంచ్ తమ గ్రా మాన్ని ఆదర్శమైన పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సర్పంచులుగా గెలిచిన వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా బీజేపీ ఎమ్మెల్యేలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికై న వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, మేడిపాటి ప్రకాశ్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మోరపల్లి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, బీజేవైఎం జి ల్లా అధ్యక్షుడు పానుగంటి సతీశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్, పద్మారెడ్డి, జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను మోసగించిన కేసీఆర్ఉద్యమ నాయకుడని నమ్మి తెలంగాణ రాష్ట్రా న్ని కేసీఆర్ చేతిలో పెడితే ప్రజలను మోసగించి కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని ఎంపీ అర్వింద్ అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు తాను కూడా అభిమానినే తెలిపారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వ మ్ము చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను కేసీఆర్ కుటుంబం నాశనం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా పాలమూరు బిడ్డవు అయితే... కేసీఆర్ కుటుంబాన్ని జైళ్లో వేయాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. ప్యాకేజీలకు అమ్ముడుపోవద్దని సూచించారు. ప్రజా గ్రహానికి గురైతే ఎలా ఉంటుందో ఓ ఎమ్మెల్సీని చూస్తే తెలుస్తోందని అన్నారు. ప్రజలకు ఆగ్రహం కలిగితే ఎంతటి వారైనా రాజకీయంగా భూగర్భంలో కలిసిపోవాల్సిందేనన్నారు. యువతతో కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలి నూతన సర్పంచ్‌లకు ఎంపీ ధర్మపురి అర్వింద్ పిలుపు బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డుమెంబర్లకు ఆత్మీయ సన్మానం -
ఏటీఎం దొంగల కోసం ముమ్మర గాలింపు
● కంటైనర్‌లో పారిపోయినట్లు అనుమానం ● అమ్మకానికి పెట్టిన కారు నంబర్‌ను వినియోగించిన దుండగులునిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున రెండు ఏటీఎంలు కొల్ల్లగొట్టిన దొంగల కోసం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. జాతీయ రహదారి 44 వెంబడి హర్యాణా వైపు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలో దొంగల కారు వెళ్లిన దృశ్యాల ఆధారంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే, దొంగలు వినియోగించిన కారు నంబర్‌తో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఆన్లైన్లో ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టిన కారు నంబర్‌ను దుండగుల కారుకు వినియోగించుకున్నారు. అంతేకాకుండా జాతీయ రహదారి వరకు కారును వినియోగించి అనంతరం కంటైనర్‌లో ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీ జరిగిన సమయం నుంచి ఆదివారం వరకు 44వ జాతీయ రహదారి వెంట ఉన్న టోల్‌ప్లాజాల వద్ద కారు కనిపించలేదు. దీంతో కంటైనర్‌లో కారుతో సహా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా, ఏటీఎంల చోరీకి ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఏటీఎంలలో బ్యాంకు అధికారులు ఒకరోజు ముందుగానే డబ్బులు జమ చేశారు. అనంతరం దోపిడీ జరిగింది. హర్యాణా రాష్ట్రానికి చెందిన నెవత్ గ్యాంగ్ పనేనని పోలీసులు భావిస్తున్నారు. వీరు కేవలం ఏటీఎంలు, బ్యాంకుల దోపిడీ మాత్రమే చేస్తారని తెలిసింది. -
సూపర్ బ్రెయిన్ యోగాతో ఏకాగ్రత
● గుంజిళ్ల మాస్టర్ అందె జీవన్ రావు డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): సూపర్ బ్రెయిన్ యోగా ఆచరణతో విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని గుంజిళ్ల మాస్టర్ అందె జీవన్ రావు తెలిపారు. ఈ నెల 26, 27వ తేదీలలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భక్తి వేదాంత ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘వా స్తవికత నిర్మాణంలో సూపర్ బ్రెయిన్ యో గా పాత్ర’ అనే అంశంపై తన పరిశోధనా ప త్రాన్ని సమర్పించి ప్రసంగించారు. సూపర్ బ్రెయిన్ యోగాతో మెదడులోని కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని, ఏకాగ్రత గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక కమ్మర్పల్లి: మండలంలోని హాసాకొత్తూ ర్ జెడ్పీహెచ్ఎస్లో ఎనిమిదో తరగతి చదువుతున్న రిషిత రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం అరుణశ్రీ తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థా యి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన రిషిత రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు. నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో రిషిత పాల్గొంటున్నట్లు తెలిపారు. ‘గిన్నిస్ బుక్’లో కామారెడ్డి కళాకారులు కామారెడ్డి అర్బన్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 27న 7,209 మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కూచిపూడి కళా వైభవం–2 పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ ప్రదర్శనలో కామారెడ్డి కూచిపూడి కళాక్షేత్రం గురువు, జాతీయ కళాకారుడు వంశీప్రతాప్గౌడ్, ప్రతినిధులు కనకతార, హర్షిత సారథ్యంలో 30 మంది పాల్గొన్నారు. -
వారం రోజుల్లో 129 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
నిజామాబాద్‌అర్బన్: కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు ఇన్చార్జి సీపీ రాజేశ్చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లతోపాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించామన్నారు. మొత్తం 129 కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రూ.8,80,000 జరిమానా విధించినట్లు తెలిపారు. కాగా, ఈ కేసుల్లో పది మందికి వారం రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరి నిజామాబాద్‌అర్బన్: న్యూ ఇయర్ వేడుకల కు పోలీసుల సూచనలు తప్పనిసరి పాటించాలని ఇంచార్జి సీపీ రాజేశ్చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లే కుండా వేడుకలు నిర్వహించొద్దని పేర్కొన్నా రు. ఫాంహౌస్, క్లబ్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో వేడుకలు నిర్వహించేందుకు పోలీసుల అను మతి తీసుకోవాలన్నారు. డీజేలు నిషేధమని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదర్శం.. ఫత్తేపూర్ ● వందశాతం వ్యవసాయ విద్యుత్ బిల్లుల చెల్లింపు పెర్కిట్(ఆర్మూర్): వ్యవసాయ విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచింది. గ్రామా నికి చెందిన రైతులందరూ శనివారం ఒకే రోజులో 646 విద్యుత్ మోటార్లకు సంబంధించిన రూ.2 లక్షల 30 వేల 400 చెల్లించా రు. రైతులు ఒకే రోజులో బిల్లులు చెల్లించేలా కృషి చేసిన లైన్‌మన్ ఎండీ యూసుఫ్‌ను ఏఈ మౌనిక రెడ్డి, ఏడీఈ శ్రీనివాస్ అభినందించారు. ఏఏవో మోహన్, లైన్ ఇన్స్పెక్టర్లు గంగాధర్, సిబ్బంది రాజన్న, నాగరాజు, పవర్ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం డిచ్పల్లి: రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు బంగారు పతకం సాధించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ టోర్నీలో ప్రతిభ కనబర్చిన జిల్లా జట్టు విజయం సాధించడంలో డిచ్పల్లి మండలం సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాల క్రీడాకారిణులు కీలకపాత్ర పోషించారు. శనివారం కళాశాలలో క్రీడాకారులను ప్రిన్సిపల్ నళిని, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ వనిత, స్కూల్ పీఈటీలు జ్యోత్స్న, నర్మద, అకాడమీ కోచ్ మౌనిక, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. -
హత్యలు.. చోరీలు.. ప్రమాదాలు
● సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ● హంతకుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌కు ప్రజల నుంచి మద్దతు ● జిల్లాలో పెరిగిన చోరీలు, సైబర్ నేరాలు ● నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలు ● 2025 ఇయర్ క్రైం రౌండప్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది క్రైం రేట్ పెరిగింది. ప్రధానంగా రియాజ్ అనే బైక్ చోరీ నిందితుడిని అక్టోబర్ 17న పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ను నగరంలోని వినాయక్‌నగర్‌లో నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హంతకుడు రియాజ్‌ను పట్టుకున్న పోలీసులు అక్టోబర్ 21న జీజీహెచ్‌కు తరలించగా, అక్కడ అతను పోలీసుల గన్ లాక్కొని దాడికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు రియాజ్‌ను ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రజల నుంచి పోలీసులకు మద్దతు లభించింది. ● జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తులో ఈ ప్రమాదాలు జరిగాయి. జిల్లాలో 680 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 272 మంది ప్రాణాలు కోల్పోయారు. 510 మందికి గాయాలయ్యాయి. జాతీయ రహదారులపై 260 ప్రమాదాలు జరిగాయి. 330 మంది చనిపోయారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లి వద్ద మూలమలుపు రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలోనే 20వ స్థానంలో నిలిచింది. మూడేళ్లలో ఇక్కడ 19 మంది చనిపోయారు. మరోవైపు జిల్లాలో ఈ ఏడాది 33 గంజాయి కేసులు పట్టుకున్నారు. ● ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి, నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ రామరాజులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ● సంచలనం సృష్టించిన మాక్లూర్‌లో ఆరుగురి హత్య కేసులో సెప్టెంబర్ 2న బాధ్యులైన ఐదుగురికి జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సైబర్ నేరాలు.. ఛేదన జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నవంబర్ నెలలో నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ అచీవ్మెంట్ సాధించారు. విదేశీ లింకులు సైతం ఛేదించారు. వివిధ రాష్ట్రాల్లో పక్కా ఆపరేషన్ నిర్వహించి 81 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట విదేశీ లింకులతో మోసాలు చేస్తున్నవారిలో నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి కీలకపాత్ర ఉండడాన్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించారు. దీనిపై నిజామాబాద్ పోలీసులు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 25 రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. అక్టోబర్ నెలలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ ఆపరేషన్ నిర్వహించి 81 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఆన్లైన్ ట్రేడింగ్, ఫారెక్స్ మోసాలు చేస్తున్న నేరగాళ్లను పట్టుకున్నారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షేక్ బాషా సుల్తాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి వరుసగా ఈ రాకెట్‌ను ఛేదించారు. ఇతనికి భారతదేశంలో మొత్తం 26 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇందులో మూడు కేసులు తెలంగాణలో ఉన్నాయి. ఇతను విదేశీ సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేశాడు. సదరు విదేశీ సైబర్ నేరగాళ్లు భారతదేశ డిజిటల్ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లను పెద్ద మొత్తంలో మోసపూరిత డబ్బు బదిలీల కోసం వాడుకున్నారు. దీన్ని ఛేదించడంలో రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత పకడ్బందీగా వ్యవహరించ డం గమనార్హం. నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫా మ్ ద్వారా రూ.7.75 లక్షలు మోసం చేయడంతో నిజామాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ ద్వారా ఈ లింకులు కనుక్కుంటూ వెళ్లారు. బాధితుడిని వాట్సాప్ ద్వారా ఒక మోసగాడు సంప్రదించడంతో ఈ మోసం చేసే వ్యవహారం మొదలైంది. ‘అన్యాశర్మ’ పేరుతో వాట్సప్‌లోకి వచ్చిన సదరు మోసగాడు బాధితుడిని ఒప్పించి, ఒక నకిలీ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో రూ.7.75 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. ఆ ప్లాట్ఫామ్లో నకిలీ డాష్ బోర్డులు, తప్పుడు లాభాలు చూపించాడు. తర్వాత ఆ డబ్బులను వేరువేరు రాష్ట్రాల్లోని వివిధ మ్యూల్ అకౌంట్లలోకి పంపించారు. అయితే ఈ దర్యాప్తులో విదేశీ హ్యాండ్లర్ల కోసం పనిచేసే అకౌంట్ సప్లయర్ల నెట్వర్క్ సైతం బయటపడింది. వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్.. షేక్ బాషా సుల్తాన్‌కు దుబాయ్‌లో ఉన్న రామేశ్వర్ సహాన్, రాజేష్ షా అనే ఇద్దరు నేపాల్ వ్యక్తులతో నే రుగా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ విదేశీ హ్యాండ్లర్లు ఆన్లైన్ ట్రే డింగ్, గేమింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాల నుంచి వ చ్చిన డబ్బును లాండరింగ్ చేయడానికి భారతీయ బ్యాంక్ అకౌంట్లు సేకరించారు. ఈ గ్రూపు హైదరాబాద్, నోయిడా, ముంబై, నెల్లూరుకు వెళ్లింది. అక్క డ నేపాల్ వాసుల ద్వారా చైనీస్ లింకులు కలిగిన ఆపరేషన్లు చేసేవాళ్లకు బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్పగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దుబాయ్‌లో ఉన్న ఆ ఇద్దరు మాస్టర్ మైండ్ల మీద లుక్అవుట్ సర్క్యులర్లు జారీ చేశారు. తద్వారా ఈ కేసును ఛేదించారు. 402 దొంగతనాలుజిల్లాలో ఈ సంవత్సరం 402 దొంగతనాలు నమోదయ్యాయి. ఇందులో రూ.2,21,13,490 విలువైన సొత్తును రికవరీ చేశారు. 489 వాహనాలు అపహరణకు గురికాగా, 151 వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. 672 పేకాట కేసులు నమోదుకాగా, రూ.72 లక్షలు స్వాధీనం చేసుకొని 2,570 మందిని అరెస్టు చేశారు. ఇతర కేసులు, గృహహింస కేసులు 210, వరకట్నం కేసులు 48, అత్యాచార ఘటన కేసులు 14, ఛీటింగ్ కేసులు 40 నమోదయ్యాయి. ఈ ఏడాది 12,892 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో డిసెంబర్ 27న తెల్లవారుజామున 4వ, 5వ టౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో రూ.50 లక్షల వరకు నగదు దోపిడీ కాగా, ఏటీఎం యంత్రాలు దగ్ధమయ్యాయి.21 చైన్ స్నాచింగ్లుఈ ఏడాది జిల్లాలో 21 చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్లో మహాలక్ష్మినగర్‌లో, కసబ్గల్లీల్లో వేర్వేరు ఘటనల్లో మహిళల మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళల మెడలో ఉన్న గొలుసులను లాక్కెళ్లడం కలకలం రేపింది.జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. ప్రధానంగా సైబర్ మోసాలు పెరుగుతూ వస్తున్నాయి. డ్రంకెన్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఇళ్లలో చోరీలు, బైక్ దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు సైతం అధికమయ్యాయి. 2025 ఏడాది ముగింపు సందర్భంగా ఇయర్ క్రైం రౌండప్. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
ఆర్మూర్: మండలంలోని మంథని గ్రామానికి చెందిన దంపతులు జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రామానికి చెందిన దంపతులైన కత్రాజ్ మోహన్, రాధ తమ కూతురు కీర్తితో కలిసి శనివారం కొండగట్టు దర్శనానికి వెళ్లారు. తిరిగి కారులో వారు స్వగ్రామానికి వస్తుండగా కోరుట్ల సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ ప్రమాద స్థలిలోనే మృత్యువాత పడ్డారు. కూతురు కీర్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు దంపతులు ఒకేసారి మరణించడంతో మంథని గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ● మృతులు ఆర్మూర్ మండలం మంథని వాసులు ● కొండగట్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా కోరుట్లలో చోటుచేసుకున్న ఘటన -
పాత పద్ధతిలోనే యూరియా!
డొంకేశ్వర్(ఆర్మూర్): యూరియా బుకింగ్ యాప్ సరిగ్గా పని చేయకపోవడంతో ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే ఎరువులను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. సొసైటీలు, డీలర్ల వద్దకు వెళ్లి యూరియా బస్తాలు కొనుగోలు చేసుకోవాలని రైతులకు సూచించింది. అయితే, ఇది తాత్కాలికం మాత్రమేనని, యాప్‌లో లోపాలను సరిదిద్దిన తర్వాత మళ్లీ ఆన్లైన్ ద్వారానే యూరియాను కొనుగోలు చేయాల్సి ఉంటుందని వ్యవసాయాధికారులు తెలిపారు. యూరియా పంపిణీలో పటిష్టం, పారదర్శకత కోసం ప్రభుత్వం ‘యూరియా బుకింగ్ యాప్’ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిని ఈ నెల 20 నుంచి అమల్లోకి తేగా రాష్ట్రంలోని నిజామాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ప్రయోగించారు. ఆదిలోనే యాప్ సక్రమంగా పని చేయలేదు. వివరాలు నమోదవ్వక రైతులు ఇబ్బందులు పడ్డారు. బుకింగ్ సిస్టంను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో యాసంగికి ఎరువుల కొనుగోలు చేయడానికి ఆందోళన చెందారు. దీంతో ప్రభుత్వం యాప్‌లో ఎదురైన ఇబ్బందులను సరిదిద్దే పనిలో ఉంది. అప్పటి వరకు రైతులకు పాత పద్ధతిలోనే యూరియా అందించాలని వ్యవసాయాధికారులకు సూచించింది. ఊపందుకున్న యూరియా కొనుగోళ్లు... యాసంగి సీజన్ పంటల సాగు వేగం పుంజుకోవడంతో జిల్లాలో యూరియా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా ఉండగా ఇప్పటి వరకు 1.25 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. వలస కూలీలు రావడంతో నాట్లు వేగంగా జరుగుతున్నాయి. మొక్కజొన్న కూడా అంచనాకు మించి 31,790 ఎకరాల్లో సాగైంది. దీంతో పంటలకు అవసరమైన పూర్తి యూరియాను రైతులు ఇప్పుడే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. యాసంగికి 82,055 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ ఇండెంట్ పంపగా ఇప్పటి వరకు బఫర్ స్టాక్‌తో కలిపి 51,091 మెట్రిక్ టన్నులు జిల్లాకు వచ్చింది. ఇందులో ఇప్పటికే 36 వేల మెట్రిక్ టన్నులు అమ్ముడైంది. విడతల వారీగా మిగతా కోటా కూడా జిల్లాకు తెప్పించడానికి వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది. బుకింగ్ విధానాన్ని అలవాటు చేసుకోవాలి యూరియా బుకింగ్ యాప్‌లో కొన్ని లోపాలు ఏర్పడిన విషయం వాస్తవమే. రైతులు సాగు చేస్తున్న పంటలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పాత పద్ధతిలోనే యూరియా అందించాలని నిర్ణయించాం. ఇది తాత్కాలికం మాత్రమే. కొన్ని రోజుల తర్వాత యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటేనే యూరియా పంపిణీ జరుగుతుంది. అప్పటి వరకు రైతులు యాప్‌ను అలవాటు చేసుకోవాలి. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి బుకింగ్ యాప్‌లో లోపాలను సరిదిద్దుతున్న ప్రభుత్వం సొసైటీలు, డీలర్ల వద్ద కొనుగోలు చేసుకోవాలని రైతులకు సూచన కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆన్లైన్ విధానమే అంటున్న వ్యవసాయ అధికారులు -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కీలక తీర్మానాలు నిజామాబాద్‌అర్బన్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని హితవుపలికారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన శనివారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలను నిలువరించేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1వ తేదీ నుంచి చేపట్టనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేసేలా ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అతి వేగం, తాగి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడంతో కలిగే అనర్థాలను తెలియజేస్తూ విద్యార్థులు, వాహన డ్రైవర్లు, ప్రజలకు అవగాహన పెంపొందేలా హోర్డింగ్‌లు, సినిమా స్లైడ్స్, సోషల్ మీడియా, ఎఫ్ఎం రేడియో, లోకల్ చానెల్స్, డిజిటల్ డిస్ప్లే తదితర సాధనాల ద్వారా విరివిగా ప్రచారం చేయాలన్నారు. బ్లాక్ స్పాట్లలో తక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి, ఎత్తుపల్లాలు, గుంతలు ఉంటే వాటిని చక్కదిద్దాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, ఇకముందు అవలంబించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. సమావేశాలలో అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ దుర్గాప్రమీల, ఎంవీఐ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఎస్ఈ సర్దార్ సింగ్, ఈఈ ప్రవీణ్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, రెడ్‌క్రాస్ ప్రతినిధి బుస్సా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆర్మూర్: పట్టణంలోని జర్నలిస్టు కాలనీలోగల ఆర్కే ఆస్పత్రి సమీపంలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్మూర్ పోలీసులు శనివారం తెలిపారు. కాలనీలోని రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉండటంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే అతను మృతిచెందినట్లు పేర్కొన్నారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతుడి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు ఒంటిపై నల్ల రంగు చొక్కా ధరించాడని, ఎవరైనా ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
వృద్ధురాలి దారుణ హత్య
● ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని కొట్టి చంపిన దుండగులు ● లింగంపేట మండలం పొల్కంపేటలో చోటుచేసుకున్న ఘటన లింగంపేట(ఎల్లారెడ్డి): బంగారం కోసం ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు హతమార్చిన ఘటన లింగంపేట మండలంలో కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. పొల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన(69)కు ఇద్దరు కుమారులు రాజు, శ్రీని వాస్, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సులోచన భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందడంతో ఇద్దరు కుమారు లు ఆమెను వంతుల వారీగా పోషిస్తున్నారు. ఈక్రమంలో సులోచన వారం రోజుల క్రితం పెద్ద కుమారుడు రాజు వద్దకు వెళ్లింది. తల్లిని ఇంటి వద్ద ఉంచి రాజు తన భార్య, పిల్లలతో కలిసి మూడు రోజుల క్రితం తిరుపతికి వెళ్లారు. శు క్రవారం రాత్రి వారు నాగిరెడ్డిపేటకు చేరుకోగా అక్కడే ఉన్న తన పెద్ద అక్క వద్దకు వెళ్లారు. పొల్కంపేటలో వృద్ధురాలు ఇంట్లో ఒక్కరే ఉండగా, దుండగులు రాత్రివేళ ఇంట్లోకి ప్రవేశించి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని, కొట్టి చంపారు. శనివారం ఉదయం వృద్ధురాలి హత్యను గుర్తించిన స్థానికులు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారంగా వృద్ధురాలి ఇంటి పరిసరాల్లోని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
నవీపేట: మండల కేంద్రంలోని ప్రయివేట్ హాస్టల్లో పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. మోపాల్ మండలంలోని బాడ్సికి చెందిన మేడ్చల్ సూర్య(18) నవీపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న అక్షయ మెస్, ప్రయివేట్ హాస్టల్ ఉంటున్నాడు. ఎప్పటిలాగే శనివారం సాయంత్రం కళాశాల నుంచి వచ్చిన అతడు హాస్టల్ గదిలోకి వెళ్లాడు. ఎవ్వరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు కరెంట్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ నిర్వాహకుడు దేవెందర్‌కు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఎస్సై యాదగిరిగౌడ్, ఏఎస్సై గఫర్ ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి గంగాదాస్ దుబాయ్‌లో ఉంటాడని, తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు. -
చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● నందిపేట్ తహసీల్ కార్యాలయం తనిఖీనందిపేట్(ఆర్మూర్): భూ భారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నందిపేట తహసీల్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించి, భూ భారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. మండలంలోని గ్రామాల వారీగా పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఆర్జీలను, సాదాబైనామాల పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. అర్జీలను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించొద్దని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. సమావేశంలో తహసీల్దార్ సంతోష్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నను చంపిన తమ్ముడు
భిక్కనూరు: అన్నను సొంత తమ్ముడే హతమార్చిన ఘటన మండలంలోని మొటాట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని మొటాట్పల్లికి చెందిన ఎర్రొల్ల రాజు(32, శివకుమార్ సొంత అన్నదమ్ముల్లు. రెండేళ్ల క్రితం రాజు తమ దగ్గరి బంధువైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని హైదరాబాద్‌కు తీసుకువెళ్లాడు. అక్కడే వారు సహజీవనం చేస్తుండటంతో ఈ విషయమై కుటుంబంలో తరచు గొడవలు జరుగుతుండేవి. రెండు నెలల క్రితం రాజు ఒక్కడే గ్రామానికి వచ్చి, కూలి పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. రాజు వివాహేతర సంబంధం కారణంగా తమ పరువు పోయిందని, తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని తమ్ముడు శివకుమార్ అన్నతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి కూడా అన్నదమ్ములు గొడవపడ్డారు. ఈక్రమంలో శివకుమార్ శనివారం వేకువజామున లేచి నిద్రిస్తున్న అన్న రాజును గొడ్డలితో నరికి హతమార్చాడు. సమాచారం అందుకున్న సీఐ సంపత్‌కుమార్, ఎసై అంజనేయులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● అన్న వివాహేతర సంబంధంతో కుటుంబంలో గొడవలు ● పరువు పోతుందని భావించి ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
డిచ్పల్లి: మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని చిన్నోళ్ల అక్షయ (9వ తరగతి) ఎస్జీఎఫ్ రా ష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం గంగ సావిత్రి, వ్యాయామ ఉపాధ్యాయుడు రాము శనివా రం తెలిపారు. ఈనెల 29న వికారాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా అక్షయను హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లు కామారెడ్డి అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు కరాటే పోటీల్లో పాల్గొనేందుకు ఆయా జిల్లాకు శనివారం బయల్దేరి వెళ్లారు. గోదావరిఖనిలో ఈనెల 29 వరకు నిర్వహించే స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కరాటే రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది క్రీడాకారులతో అండర్–17 బాలబాలికల జట్టు వెళ్లిందని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కే.హీరాలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులివ్వాలి
నిజామాబాద్‌అర్బన్: జీవో 252ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్టులు శనివారం కలెక్టరేట్ వద్ద డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరుతో జర్నలిస్టులను విడదీయాలని కుట్ర పన్నిందని మండిపడ్డారు. విలేకరులు, డెస్క్ జర్నలిస్టులు కలిసి పనిచేస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. డెస్క్ జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు మద్దతుగా టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే (143) నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జమాల్పూర్ గణేశ్, భూపతి, సుభాష్, పంచరెడ్డి శ్రీకాంత్, రాంచందర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, డెస్క్ జర్నలిస్టుల ఫోరం అడహక్ కమిటీ కన్వీనర్ చిట్నే భీంరావ్, కో–కన్వీనర్లు శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, నరేంద్ర, స్వామి, రాకేష్, సందీప్, సలహాదారులు కేవీ రమణ, భద్రారెడ్డి, ప్రభాకర్, డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
నిజాంసాగర్(జుక్కల్): పిట్లం–నిజాంసాగర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని ఒడ్డేపల్లి గ్రామ శివారులో రోడ్డుపైన గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి కాలినడకన వెళ్తున్నాడు. ఈక్రమంలో అతడినివె గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి భుజంపై సూర్యుడి బొమ్మ ఉందని, అచూకీ తెలిసిన వారు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ సెల్ 8712686172 నంబర్‌ను సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. -
స్వరాన్ని మార్చి.. వినోదాన్ని పంచి..
● ప్రజల మన్ననలు పొందిన పలువురు మిమిక్రీ కళాకారులు ● నేడు అంతర్జాతీయ మిమిక్రీ దినోత్సవంఆర్మూర్: ధ్వని అనుకరణ కళతో స్వరాన్ని మార్చి తమ గొంతుతో ప్రకృతి హొయలు, జంతువులు, పక్షుల అరుపులు, ప్రముఖుల గొంతులను అనుకరిస్తూ మిమిక్రీ కళకే వన్నె తెస్తున్నారు జిల్లాలోని పలువురు కళాకారులు. కాగా ప్రపంచ ప్రఖ్యాత ధ్వని అనుకరణ సామ్రట్ దివంగత నేరేళ్ల వేణుమాధవరావు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. జిల్లాకు చెందిన జాదూ యుగంధర్ రంగనాథ్, బోండ్ల ఆనంద్, సౌడ రవి, వాస రాబర్ట్ లాంటి కళాకారులు మిమిక్రీ కళపై మక్కువను పెంచుకొని తమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. రంగనాథ్ వెంట్రిలాక్విజం కళ ద్వారా ధ్వని అనుకరణ చేస్తూ ప్రదర్శననివ్వడం వీక్షకులను ప్రత్యేకంగా అలరిస్తుంది. హాస్యరసాన్ని పండిస్తూ మాట్లాడే బొమ్మతో ప్రదర్శనను చూడటానికి ప్రతీ ఒక్కరు ఇష్టపడతారు. అలాగే ఆర్మూర్ పట్టణానికి చెందిన బోండ్ల ఆనంద్ అనే యువకుడు 26 సంవత్సరాలుగా మిమిక్రీ రంగంలో రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. చిన్నతనం నుంచే కళలల వైపు ఆకర్షితుడైన ఆనంద్ తన గురువు జాదూ యుగంధర్ రంగనాథ్ వద్ద మిమిక్రీ మెలకువలు నేర్చుకున్నాడు. మిమిక్రీ సీనియర్ కళాకారుడు, మెజీషియన్ అయిన తన గురువుతో కలిసి ఇప్పటి వరకు సుమారు ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆనంద్ తన మిమిక్రీ ద్వారా సినీ నటులు, రాజకీయ నాయకులను, పశు, పక్షాదులు, వాహన సముదాయాలకు సంబంధించిన దాదాపు 62 రకాల గొంతుకలను పలికించగలడు. ప్రతి సంవత్సరం ఆర్మూర్‌లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఆనంద్ మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆనంద్ చాలాసారు ముఖ్య అధికారులు, నాయకుల చేతుల మీదుగా సన్మానాలు అందుకున్నారు. ప్రపంచ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట నెలకొల్పిన అవార్డును సైతం ఆనంద్ అందుకున్నాడు. వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన సౌడ రవి వృత్తి రీత్యా ఆర్మూర్ మండలం చేపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు. చిన్నప్పటి నుంచి ధ్వని అనుకరణపై ఉన్న మక్కువతో మిమిక్రీ కళాకారుడిగా రాణిస్తున్నాడు. విద్యార్థులకు చదువుతో పాటు తన ధ్వని అనుకరణను ప్రదర్శిస్తూ పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నాడు. సినీ నటులు రావుగోపాల్రావు, సుధాకర్, రాజశేఖర్, నాగార్జున, నాగేశ్వర్రావు, సాయికుమార్, రాజకీయ నాకులు చంద్రబాబు నాయుడు, రోశయ్య, హనుమంతరావుల గొంతులను అనుకరించడంలో దిట్ట. ఇలా జిల్లాలోని పలువురు కళాకారులు మిమిక్రీ రంగంలో రాణిస్తూ ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు. సౌడ రవి, మిమిక్రీ కళాకారుడు, ఆర్మూర్ బోండ్ల ఆనంద్, మిమిక్రీ కళాకారుడు, ఆర్మూర్ జాదూ యుగంధర్ రంగనాథ్, మెజీషియన్, మిమిక్రీ కళాకారుడుమిమిక్రీ కళను నమ్ముకొన్న నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటాను. నా తల్లిదండ్రులు, గురువు, మెజీషియన్ రంగనాథ్, భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్‌ల ప్రోత్సాహంతో మిమిక్రీ చేస్తున్నాను. ఈ కళను మరింత మెరుగు పర్చుకొని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటా. –బోండ్ల ఆనంద్, మిమిక్రీ కళాకారుడు, ఆర్మూర్ -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భిక్కనూరు: డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు వహించాలని జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్ అన్నారు. శనివారం భిక్కనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైం, సైబర్ సెక్యూరిటీ అంశాలపై అవగాహన కల్పించారు. విజ్ఞాన శాస్త్రం అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేందుకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టాలెంట్ పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు బెంగుళూరులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాద్యాయులు గడ్డం మల్లేశ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం భవానీ, ఉపాధ్యాయులు, ఉమ, ప్రసన్న,నర్సింహారెడ్డి, శంకర్‌రెడ్డి, తమ్మలిరాజు పాల్గొన్నారు. పోలీసు స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ నస్రుల్లాబాద్ : స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి తనిఖీ చేశారు. మండలంలో క్రైం రేటు తగ్గించాలని 100 నెంబరుకు వ చ్చిన కాల్స్‌పై వెంటనే స్పందించాలన్నారు. ఎస్సై రాఘవేంద్ర, కానిస్టేబుల్లు ఉన్నారు. అనుమానం వస్తే సమాచారం అందించాలి మద్నూర్(జుక్కల్): గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మద్నూర్ ఎస్సై రాజు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడుతు శాంతి భద్రతలను కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
యువకుడిపై గొడ్డలితో దాడి
● ఘాతుకానికి పాల్పడింది సమీప బంధువే ● మద్యం తాగి మాటామాటా పెరిగి ఘర్షణకు దిగిన ఇరువురుగాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లి గ్రామంలో యువకుడిపై అతడి సమీప బంధువే గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. ముదెల్లి గ్రామానికి చెందిన కాగుల మోహన్ శుక్రవారం కట్టమైసమ్మ పండుగ చేసి, అక్కడే భోజనాలు చేశారు. అనంతరం రాత్రి వరుసకు మామాఅల్లుళ్లు అయిన నట్టోల్ల నర్సింలు, చింతకింది రంజిత్, గ్రామానికి చెందిన మరో ఇద్దరు కలిసి నర్సింలు ఇంటివద్ద మద్యం తాగారు. రంజిత్, నర్సింలు సమీప బంధువులు కావడంతో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. దీంతో ఆగ్రహించిన నర్సింలు గొడ్డలితో రంజిత్‌పై దాడి చేయగా మెడపై తీవ్ర గాయమైంది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం బాన్స్వాడ ఆస్పత్రికి తరలించారు. కాగ నర్సింలుతో పాటు సంతో ష్, చాకలి బాలయ్య, కాగుల మోహన్ యాదవ్, కాగుల రాము, కాగుల మారుతిలపై బాధితుడి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. -
పరుగు పందెంలో సత్తాచాటిన అక్కాచెల్లెళ్లు
బోధన్‌టౌన్(బోధన్): జిల్లాకేంద్రంలో ఇటీవల నిర్వహించిన పరుగుపందెం పోటీల్లో బోధన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ చాటారు. పట్టణంలోని విజయసాయి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న తోకల అనన్య, తోకల మోక్ష అక్కాచెల్లెల్లు. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 12 బాలికల విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో వారు పాల్గొన్నారు. 6వ తరగతి చదువుతున్న అనన్య ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వగా, 5వ తరగతి చదువున్న మోక్ష తృతీయ స్థానంలో నిలిచి సత్తా చాటిందని అథ్లెటిక్స్ ఫిట్నెస్ క్లబ్ బోధన్ కోచ్ రహన్ తెలిపా రు. పరుగు పందెంలో అక్కాచెల్లెల్లు విజేతలు గా నిలవడం అభినందనీయం కోచ్ అన్నారు. ఆర్మూర్: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శనివారం భరత్ ఆర్ట్స్ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన కూచిపూడి కళ వైభవం–2, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనవరాలు జయరెడ్డి స్థానం సంపాదించుకుంది. నాట్య గురువు నవ్య నాగబండి శిక్షణలో ఒకే వేదికపై ఒకేసారి 7,209 మంది చిన్నారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఈ బృందంలో ఆర్మూర్ ఎమ్మెల్యే కూతురు ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి కూతురు చిన్నారి జయరెడ్డి ప్రదర్శన ఇచ్చి, రికార్డులో భాగం అయింది. దీంతో తాత ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, చిన్నారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్: జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. -
యూరియాను అందుబాటులో ఉంచాలి
● రైతులకు ఇబ్బందులు ఏర్పడితే అధికారులదే బాధ్యత ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ఖానాపూర్‌లో ఎరువుల గోదాం తనిఖీ నిజామాబాద్ రూరల్: జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోదాంలలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఖానాపూర్లోని ఎరువుల గోదాంను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నందున ఎక్కడ కూడా కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు చేరవేయాలని అధికారులకు సూచించారు. ఎరువుల కేటాయింపులు, పంపిణీ ప్రక్రియను ప్రతి రోజు పర్యవేక్షించాలని, ఎక్కడైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే పరస్పర సమన్వయంతో వెంటనే వాటిని పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటికే సరిపడా స్టాక్ ఉందని, ఇంకనూ యూరియా నిల్వలు ముందస్తుగానే తెప్పిస్తున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. డీఏవో వీరాస్వామి, సహకార శాఖ అధికారి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. -
ఈ కుబేరుడు పెద్ద ఫ్రాడు!
నిజామాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ మహిళ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. రైల్వేహెడ్‌కానిస్టేబుల్ సహకారంతో వారికి కుచ్చుటోపి పెట్టింది. లక్షలాది డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిందితురాలు స్వరూప, ఆమెకు సహకరించిన రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కుబేర్ పై నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్, 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటనల్లో మహిళపై కేసులు నమోదైనట్లు తెలిసింది. శానిటేషన్ సిబ్బంది..నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లోని శానిటేషన్ సిబ్బంది 18 మంది నుంచి స్వరూప రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వసూలు చేసింది. ఆర్అండ్బీ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న మహిళ పోలీస్‌శాఖ క్లూస్‌టీమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు, సీసీఎస్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుళ్ల నుంచి రూ.8 లక్షల వరకు వసూలు చేసింది. ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో పర్సంటేజీలు ఇప్పిస్తానంటూ ముందుగా పెట్టుబడి పెట్టాలని చెబుతూ కానిస్టేబుల్ నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈ వ్యవహారంలో రైల్వేహెడ్‌కానిస్టేబుల్ సహకారం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైల్వేస్టేషన్‌లోని శానిటేషన్ సిబ్బంది నుంచి డబ్బుల వసూళ్లలో రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ముఖ్యపాత్ర పోషించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. స్వరూప హెడ్‌కానిస్టేబుల్‌ను వెంట తీసుకుని వెళ్లేదని, దీంతో తేలికగా డబ్బులు వసూ లు చేసేదని బాధితులు చెబుతున్నారు. శాఖల వా రీగా ఉద్యోగాలు కలి్పస్తామంటూ మహిళ మోసాని కి గురి చేసింది. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, జిల్లా పరిషత్‌లో అటెండర్ పోస్టుల పేరిట రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది నుంచి రూ.2.50 లక్ష లు వసూలు చేసింది. జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ పోస్టులకు, ఇతర శాఖలలో జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. నిందితుల అరెస్టు స్వరూపతోపాటు కుబేర్‌ను అరెస్టు చేసినట్లు మూ డవ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వీరిపై 3వ టౌన్ స్టేషన్లో మూడు కేసులు, 4వ టౌన్లో మూడు కేసులు, నిజామాబాద్ రూరల్‌లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు.నకిలీ గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు నిందితురాలు స్వరూప నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ నియామక పత్రాలను అందజేసింది. ఇందులో జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ సంతకాలు ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. తన కారుకు ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన నెమ్ప్లేట్ వేసుకోవడం గమనార్హం. -
మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ● పేద ముస్లింలకు దుప్పట్లు, స్వెటర్ల పంపిణీనిజామాబాద్ రూరల్: మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని బోధన్ రోడ్డులోగల ఓ ఫంక్షన్హాల్లో బుధవారం రాత్రి పేద ముస్లింలకు, ఇమామ్, మౌజాలకు దుప్పట్లు, స్వెటర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ముస్లింలకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి విద్యా మంత్రిగా విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాల ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించేలా సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. మహమ్మద్ అజ్మతుల్లా, మానాల మోహన్‌రెడ్డి, కర్నె సురేందర్, నర్సయ్య, అనంతరావు బోడిరే స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
పనులు సరే.. రక్షణ చర్యలేవీ?
● మాధవనగర్ వద్ద శరవేగంగా జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణం ● ప్రయాణికుల రక్షణ కోసం కనీస చర్యలు చేపట్టని అధికారులు నిజామాబాద్ రూరల్: మాధవ్‌నగర్ ఆర్వోబీ వద్ద పనులు శరవేగంగా నిర్వహిస్తున్నప్పటికీ, ప్రయాణికుల రక్షణ కోసం కనీస ఏర్పాట్లు చేయలేదు. దీంతో వాహనాల రాకపోకల సమయంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్వోబీ పనుల వద్ద తీసిన లోతైన గుంతలు, వాటి పక్కన ఎలాంటి ప్రమాద సూచికలు లేకపోవడంతో వాహనదారులు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. వాహనదారులు ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆర్వోబీ ప్రాంతంలో విద్యుత్ లైట్లు సైతం ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళల్లో ఆ ప్రాంతంలో అందకారం అలుముకుంటుంది. దీంతో రాత్రివేళల్లో వాహనదారులు ఈ ప్రాంతంలో గుంతలు గుర్తించక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రమాదాలు జరగకుండా భారీకేడ్లను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
పల్లె పాలన మరింత చేరువ
సుభాష్‌నగర్: పల్లె పాలన ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత రద్దయిన గ్రామ పంచాయతీ స్థాయీ సంఘాలు మళ్లీ కార్యరూపం దాల్చనున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం గతంలో మాదిరిగా ప్రతి గ్రామంలో నాలుగు సంఘాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 545 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామాభివృద్ధికి దోహద పడాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామ పంచాయతీకి నలుగురు చొప్పున ఏర్పాటు చేసిన స్థాయీ సంఘాలు గడిచిన పదేళ్ల కాలంలో కనుమరుగయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చేయడం వంటి బాధ్యతలతో గతంలో ఈ సంఘాలు ఏర్పాటయ్యాయి. స్థాయి సంఘాల జోక్యాన్ని, ప్రమేయాన్ని సర్పంచులతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయంగా వ్యతిరేకించడంతో అప్పట్లో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఈ అంశంపై పెద్దగా దృష్టికేంద్రీకరించకపోవడంతో పల్లెల అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించేందుకు పంచాయతీల్లో ఏర్పాటుచేసిన స్థాయిసంఘాలు పత్తా లేకుండా పోయాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో స్థాయీసంఘ సభ్యులకు క్రమేణ గుర్తింపు లేకుండా పోయింది. పంచాయతీల్లో స్థాయీ సంఘాలు ? ఉమ్మడి రాష్ట్రంలోని విధానం అమలుకు చర్యలు! జిల్లాలో 545 గ్రామపంచాయతీలు -
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి నెట్వర్క్: నగరంలో గురువారం క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నగరంలోని సీఎస్ఐ, నిర్మల హృదయ చర్చీలతోపాటు, వివిధ ప్రాంతాల్లోని పలు చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హాజరై, మాట్లాడారు. యేసు క్రీస్తు జీవితం వినయం, త్యాగం, సేవలకు ఉదాహరణ అని తెలిపారు. యేసు బోధించిన ప్రేమ, క్షమ, సేవ విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిబింబించాలన్నారు. ముబారక్‌నగర్‌లోని జీసస్ లవ్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఘనంగా క్రిస్మస్కరుణామయుడు దిగివచ్చిన శుభ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జిల్లాలో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చీకటి బతుకుల్లో వెలుగులు నింపేందుకు ప్రభువు వచ్చాడని ఆరాధిస్తూ చర్చీల్లో ప్రార్థనలు చేశారు. నిజామాబాద్నగరంలోని సీఎస్ఐ చర్చీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ముబారక్‌నగర్ ప్రాంతంలోని జీసెస్ గాస్పల్ చర్చిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్‌లు కట్ చేశారు. – నిజామాబాద్ రూరల్ -
అటల్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం
● జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ● ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి ఆర్మూర్: దేశ సమగ్ర అభివృద్ధికి దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహర్ వాజ్‌పేయి అవలంభించిన విధానాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు బాలు, పోల్కం వేణు, జెస్సు అనిల్, సుంకరి రంగన్న, ఆకుల రాజు, బాయావత్ సాయి, తిరుపతి నాయక్, నర్సారెడ్డి, కుమార్, ప్రసన్న గౌడ్, బాసెట్టి రాజ్‌కుమార్, పులి యుగేందర్, శీను, విజయ్ ఆనంద్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో.. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి విద్యార్థులు, నాయకులు పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. నాయకులు అమృత్ చారి, పృథ్వి, సమీర్, మనోజ్, అక్షయ్, శివ, దుర్గదాస్, దిగంబర్, బంతిలాల్ పాల్గొన్నారు. -
కమ్మర్పల్లి మండలంలో వృద్ధుడు..
కమ్మర్పల్లి: మండలంలోని శ్రీరాజరాజేశ్వరీ నగర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాలు ఇలా.. శ్రీరాజరాజేశ్వరీనగర్కు చెందిన కాల గంగాధర్(62) అనే వ్యక్తి గురువారం రాత్రి గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుండగా, ఉప్లూర్ వైపు నుంచి జగిత్యాల జిల్లా ఇ బ్రహీంపట్నం మండలం వర్షకొండకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన గంగాధర్ అ క్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరా లు సేకరించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ సల్కం దినేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందల్వాయి: మండలంలో ని వెంగల్పాడ్ గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. వివరాలు ఇలా.. వెంగల్ పాడ్ గ్రామానికి చెందిన లావుడియా రాజు (33) అనే వ్యక్తి గురువారం ఉదయం తన ఇంట్లోని ఫ్యాన్ స్విచ్ తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. ఈఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్దవాల్గోట్‌లో.. సిరికొండ: సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దవాల్గోట్ శివారులో ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. పెద్దవాల్గోట్‌కు చెందిన బోదాస్ నర్సయ్య(43) అనే వ్యక్తి గురువారం వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లెక్క చెప్పండి..
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసిన ప్రతి ఒక్కరూ తమ ఎన్నికల ఖర్చు లెక్కలను అప్పగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల తంతు ముగిసిన 45 రోజులలోగా అభ్యర్థులు తమ తమ ఖర్చుల వివరాలను లెడ్జర్లో రాసి ఆయా మండలాల పంచాయతీరాజ్ అధికారులకు అప్పగించాలని నిర్దేశించింది. జిల్లాలో మూడు విడతల్లో 545 సర్పంచ్, 5022 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఏకగీవ్రంగా ఎన్నికై న అభ్యర్థులతోపాటు ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన, ఓడిన వారందరూ ఎన్నికల సంఘం నియామావళి ప్రకారం ఖర్చుల లెక్కలను అప్పగించాల్సి ఉంది. మొత్తం 5567 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. 5 వేలకు మించి జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన వారు రూ.2.50లక్షల వరకు, వార్డు సభ్యులు రూ.50వేల వరకు ఖర్చు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. 5వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.30వేల వరకు ఖర్చు చేయొచ్చు. నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి పోలింగ్ ముగిసే రోజు వరకు ఎన్నికల్లో పోటీ చేసిన వారు అన్ని రకాల ఖర్చులకు లెక్కలు రాసి ఎన్నికల సంఘానికి అప్పగించాల్సి ఉంది. పరిమితికి మించి ఖర్చు చేస్తే ఎన్నికల సంఘం వేటు వేస్తుంది.ఖర్చుల వివరాలు అందించని వారిపైనా వేటు పడనుంది. ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించకపోతే అలాంటి అభ్యర్థుల వివరాలను సంఘానికి అందించాలనే ఆదేశాలు ఉన్నాయని మోర్తాడ్ ఎంపీవో శ్రీధర్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రతి అభ్యర్థి తమ తమ ఖర్చుల వివరాలను అందించి ఎన్నికల సంఘానికి సహకరించాలని ఆయన సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు గడువులోగా వివరాలు అందించాలని ఆదేశాలు ఎన్నికల్లో పోటీ చేసిన వారు 5567 మంది -
మహిళ మృతదేహం లభ్యం
వర్ని: మండలంలోని పొట్టిగుట్ట శివారులోగల నిజాంసాగర్ ప్రధాన కాలువలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం కాలువ నీటి ప్రవాహంలో మహిళ మృతదేహం కొట్టుకురాగా, స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. నవీపేట: మండలంలోని యంచ గోదావరి నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మిర్యాల పవన్‌కుమార్(22) అనే యువకుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈనెల 22న ఆర్మూర్‌కు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లాడు. అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో 23న అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యంచ గోదావరిలో గురువారం ఉదయం పవన్ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ అర్బన్: భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని భర్త రోడ్డెక్కి ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా..ఆర్మూర్‌కు చెందిన ప్రశాంత్‌కు ఈ ఏడాది ఆగస్టులో కోరుట్ల ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. కొన్ని రోజులకే తన భార్య బావ వరుసైన నిజామాబాద్‌కు చెందిన లింబాద్రి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించాడు. దీంతో తాను భార్య వల్ల మోసపోయానని కొంతకాలంగా వాట్సప్ స్టేటస్ పెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులను కూడా ఆశ్రయించాడు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో గురువారం వినాయక్ నగర్‌లోని లింబాద్రి ఇంటి ముందు ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు, పెద్దలు వచ్చి తనకు న్యాయం చేయాలి అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. నా తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి అని ప్రశాంత్ ఫ్లెక్సీలో పేర్కొన్నాడు. భార్య వివాహేతర సంబంధాన్ని గుర్తించి వినూత్న రీతిలో భర్త నిరసనకు దిగడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. -
క్రైం కార్నర్
మందుల కోసం వెళ్లి మృత్యువాత ● ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతి ● లచ్చాపేటలో విషాదఛాయలు మాచారెడ్డి: మందుల కోసం వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై అనంత లోకాలకు చేరారు. ఈ ఘటన గురువారం మాచారెడ్డి మండలం లచ్చాపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపన వివరాలి లా ఉన్నాయి. లచ్చాపేట గ్రామానికి చెందిన జక్కుల సాయి (22), మిరుదొడ్డి అజయ్ (22) ప్రాణ స్నేహితు లు. సాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలయ్యా డు. నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యాడు. మందులు అయిపోవడంతో స్నేహితుడు అజయ్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరు కలిసి బైక్‌పై గజ్యానాయక్ తండా చౌరస్తాకు వెళ్లి మందులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరి బైక్ లచ్చాపేట స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. మృత్యువులోనూ వీడని బంధం మృతులు సాయి, అజయ్ ప్రాణ స్నేహితులు. ఇద్దరూ రోడ్డు ప్రమాదానికి గురై ఒకేసారి మృత్యువాత పడడంతో గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు. చేతికి అందిన కొడుకులు మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు జక్కుల సాయికి తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్యలతోపాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అజయ్‌కు సైతం తల్లిదండ్రులు లక్ష్మి, నరసింహులుతోపాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ కేసు నమోదు చేసుకున్నారు. చందూర్‌లో మహిళ.. వర్ని: చందురు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన హంస్డా (30) ఇటీవల వ్యవసాయ పనుల కోసం చందూరుకు వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటూ వ్యవసాయ కూలీగా పనులు చేస్తుంది. బుధవారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లగా, చందురు శివారులో రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
యువత వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్‌నగర్: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవితాన్ని నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ధన్పాల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానిగా ఉన్న సమయంలో దేశం కోసం అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. అణు పరీక్షల ఒప్పందం, తదితర ఇతర ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి ప్రపంచంలోనే భారత్‌కు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని, గతేడాది ఆయన 100వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినంగా ప్రకటించిందని పేర్కొన్నారు. వాజ్‌పేయి జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శనీయమని, ఆయన వ్యక్తిత్వాన్ని పుస్తకాల్లో చదివి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు మల్లేశ్ యాదవ్, స్వామి యాదవ్, మాస్టర్ శంకర్, సాయిరాం, బంటు రాము, నారాయణ యాదవ్, పల్నాటి కార్తీక్, భూపతి తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
సుభాష్‌నగర్: జిల్లా ఆదివాసీ నాయక్‌పోడు నూతన కార్యవర్గాన్ని గురువారం నగరంలోని జిల్లా సేవా సంఘంలో ఎన్నుకున్నారు.అంతకుముందు సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం గౌరవాధ్యక్షుడు బండారి భోజన్న ఆధ్వర్యంలో ఎన్నికలు చేపట్టారు.జిల్లా అధ్యక్షుడిగా గాండ్ల రాంచందర్,ప్రధాన కార్యదర్శిగా పుట్ట శివశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కావాల్కడి పోశెట్టి,కోశాధికారిగా శానం పవన్‌కుమార్,అధికార ప్రతినిధిగా పుట్ట దుర్గ మల్లేశ్ ఎన్నికయ్యారు.అలాగే నూతనంగా ఎ న్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల తో క లిసి ఆదివాసీ నాయక్‌పోడు జిల్లా ప్రజాప్రతిని ధు ల ఫోరం కూడా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా ఎ ర్రం శ్రీనివాస్,ప్రధానకార్యదర్శిగా దాత్రికి అంజ య్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుంకరి రాజు, కార్యవ ర్గ స భ్యులు ఎన్నికయ్యారు. రెండు కార్యవర్గాలతో ప్ర మాణస్వీకారం చేయించారు.అనంతరం నూతన కా ర్యవర్గాలను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఆదివాసీ నాయక్‌పోడు సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కలను గురువారం హైదరాబాద్‌లో ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఓంశాంతి కేంద్రం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు కలిశారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఇన్చార్జి బీకే జయదిదీ, వనజ దిదీ తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గోవింద్‌పేట్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌వో సత్య నారాయణ గౌడ్, సర్పంచ్ అప్పాల గణేశ్, ఉపసర్పంచ్ దార్ల సుశీన్, కుమార్, వీడీసీ చైర్మన్ కాశిరెడ్డి భోజన్న తదితరులు పాల్గొన్నారు. వర్ని: వర్ని ఎస్సైగా వంశీకృష్ణ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు వర్ని ఎస్సైగా పనిచేసిన మహేశ్‌ను సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. నిజామాబాద్ ట్రాఫిక్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వంశీకృష్ణను వర్నికి ఎస్సైగా బదిలీ చేశారు. నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ప్రయివేట్ భవనంలో కొనసాగుతున్న అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని అధికారులు గురువారం ఆర్అండ్బి గెస్ట్ హౌస్‌లోకి మార్పు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలు కొనసాగరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అద్దె భవనంలో కొనసాగుతున్న ఏసీబీ కార్యాలయాన్ని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు మార్చారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: విశ్వహిందూ పరిషత్ గోరక్ష తెలంగాణ ప్రాంత ప్రముఖ్‌గా ఇందూరు నగరానికి చెందిన ధాత్రిక రమేశ్ నియమితులయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వీహెచ్‌పీ గోరక్ష ప్రాంత సమావేశంలో ఇందూరు విభాగ్ పరిధిలోని ఇందూరు జిల్లా సహకారదర్శిగా ఉన్న ధాత్రిక రమేశ్‌ను తెలంగాణ ప్రాంత గోరక్ష విభాగం ‘టోలి’ సభ్యుడిగా ఎంపిక చేయడంతో పాటు తెలంగాణ ప్రాంత గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఈమేరకు గురువారం ఆయన వీహెచ్‌పీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు గోఆధారిత వ్యవసాయం చేసేలా ప్రోత్సహించే విషయంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వీహెచ్‌పీ విభాగ్ కార్యదర్శి, జిల్లా సభ్యులు ఆయనను సన్మానించారు. వీహెచ్‌పీ ఇందూర్ విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సేవా ప్రముఖ్ రామ్ ప్రసాద్ ఛటర్జీ, నవీన్, ఘన్‌శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి నిధులతో కొత్త పనులు
మోర్తాడ్(బాల్కొండ): వికసిత్ భారత్ గ్యారెంటీ ఫ ర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) వీ జీ–జీ–రామ్‌జీ (ఉపాధిహామీ) నిధులతో సరికొత్త పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామాల నుంచి ప్రతిపాదనలను కో రుతోంది. ఉపాధి నిధులతో మెటీరియల్ కంపోనెంట్ కింద గతంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణం మాత్రమే చేసేవారు. అయితే పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ కొత్త రకం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు సొంత భవనాల నిర్మాణం, ఆహార ధాన్యాల నిల్వ చేసుకునేందుకు వంద మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణం, వివిధ రకాలైన పనులు చేసేవారికి వర్క్షెడ్స్ను నిర్మించాలని నిర్ణయించారు. మహిళా భవనాలు, వర్క్షెడ్ల కోసం రూ.10లక్షల చొప్పున, ఆహార ధాన్యాల నిలువ కోసం చేపట్టే పనులకు రూ.30లక్షలను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా భవనాలకు ఇది వరకు ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రమే తమ కోటా నిధుల నుంచి కేటాయించేవారు. అనేక చోట్ల అనువైన భవనాలు లేకపోవడంతో మహిళలు తమ సమావేశాల కోసం ఇబ్బందు లు పడుతున్నారు. ఆహార ధాన్యాల నిలువ కోసం ప్రతి గ్రామంలో గోదాములను నిర్మిస్తే రైతులు తాము ఆశించిన ధర వచ్చినప్పుడే పంట దిగుబడులు విక్రయించుకోవడం, లేదా అవసరం ఉన్నన్ని రోజులు నిలువ చేసుకోవడానికి వీలవుతుంది. వృత్తి పనులు, ఇతర పనులు చేసేవారికి షెడ్లు లేకపోవడంతో అద్దె గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉపాధి నిధులతో కొత్త తరహా పనులు చేపడితే ప్రజాప్రయోజనం విస్తృతం అవుతుందని ప్రభు త్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మెటీరియల్ కంపోనెంట్ కింద కొత్త పనుల కోసం ప్రతిపాదనలను స్వీక రించనున్నారు. గ్రామ స్థాయిలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు చేసి గ్రామసభలో ఆమోదం పొందాలి. అక్కడి నుంచి మండల స్థాయిలో, ఆ తరువాత జిల్లా స్థాయిలో సాంకేతిక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ కంఠం పరిధిలో ఉన్న భూముల్లోనే నిర్మాణాలను చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. అనువైన స్థలాలు ఉన్నచోట మూడు రకాల పనులను పూర్తి చేయడానికి అవకాశం ఉంది. పాత విధానాలకు స్వస్తి పలికి కొత్త పనులు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని చెప్పొచ్చు.మహిళా సంఘాలకు భవనాలు.. ఆహార ధాన్యాల నిల్వకు అవసరమైన నిర్మాణాలు, వర్క్షెడ్డులు సీసీ రోడ్లు, కల్వర్టుల స్థానంలో.. ప్రతిపాదనలు తీసుకోవాలని ఆదేశాలు పాత పద్ధతికి స్వస్తి పలుకుతున్న యంత్రాంగం -
డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి
సుభాష్‌నగర్: అక్రెడిటేషన్ కార్డుల విషయంలో జర్నలిస్టులను విభజించే కుట్రను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని డెస్క్ జర్నలిస్టులు పేర్కొన్నారు. మీడియా కార్డుల పేరుతో తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమన్నారు. ఈమేరకు గురువారం జిల్లా కేంద్రంలో డెస్క్ జర్నలిస్టులు సమావేశమయ్యారు. నూతన అక్రెడిటేషన్ల జారీ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్– 252పై చర్చించారు. జర్నలిస్టులను విభజించేలా, డెస్క్ జర్నలిస్టులకు అన్యా యం చేసేలా ఉన్న జీవోను వెంటనే రద్దు చేయా లని డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులందరికీ పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 27న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అడ్‌హక్ కమిటీ.. డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా సీహెచ్ భీంరావు, కో కన్వీనర్లుగా కామిరెడ్డి అశోక్‌రెడ్డి, బి. సందీప్,ఏ. నరేంద్ర స్వామి, కె. రాకేష్, జి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు గౌరవ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు. -
దొంగ నోట్ల పంచాయితీ
● ఎన్నికల సమయంలో వర్ని మండలం జలాల్పూర్లో పంపిణీ ● మహారాష్ట్ర నుంచి జడ్చర్ల మీదుగా జిల్లాలోకి.. ● రూ.లక్షకు రూ.3 లక్షలు తీసుకొచ్చిన ఘనులుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వర్ని మండలం జలాల్పూర్లో జాలీ నోట్లు వెలుగు చూడడంతో ఎక్కడివారక్కడ అప్రమత్తమయ్యారు. జలాల్పూర్ నుంచి వచ్చారా? అయితే నగదు వద్దు.. డిజిటల్ పేమెంట్లు మాత్రమే చేయండి.. వర్ని, బోధన్, బాన్సువాడ పట్టణాల్లో వ్యాపారులు ప్రత్యేకంగా ఇలా చెబుతుండడం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు పోలీసులు కేసులు నమోదు చేస్తారనే భయంతో తమ వద్ద ఉన్న రూ.500 నోట్లను గ్రామస్తులు కాల్చివేస్తుండడం విశేషం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జలాల్పూర్ గ్రామంలో ఓటర్లకు దొంగనోట్లు పంపిణీ చేసిన ఘటన విస్తుగొలుపుతోంది. సర్పంచ్ అభ్యర్థి తమకు నకిలీ కరెన్సీ ఇచ్చి మోసం చేశాడని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. జలాల్‌పూర్‌కు చెందిన కల్యాణ్, గోపాల్, శంకర్, రవి అనే నలుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నుంచి ఈ దొంగనోట్లు తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతం నుంచి జడ్చర్లకు నకిలీ నోట్లు రాగా, రూ.1 లక్షకు రూ.3 లక్షల చొప్పున రూ.500 నకిలీ నోట్లను తెచ్చారు. గత మూడు నెలల కాలంలో రెండుసార్లు ఇలా దొంగనోట్లను తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే నోట్ల చలామణి ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది. పెట్రోల్ బంక్‌లో చలామణి చేసేందుకు ప్రయత్నం చేయగా బెడిసికొట్టింది. బంక్‌లో తీసుకోకపోవడంతో మరో మార్గం ఆలోచించారు. అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో ఆ నోట్లను ఖర్చు పెట్టినట్లు తెలిసింది. -
సర్పంచ్‌లకు ఊరట
● నేరుగా నిధులు ఇస్తానన్న సీఎం రేవంత్ ● చిన్న జీపీలకు రూ.5 లక్షలు.. పెద్ద జీపీలకు రూ.10 లక్షలురెంజల్(బోధన్) : ‘‘గ్రామాల అభివృద్ధికి సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచ్‌లకే నిధులు ఇస్తా. పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు మంజూరు చేస్తా. కేంద్ర ప్రభుత్వ నిధులతో వీటికి సంబంధం లేదు’’. అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సర్పంచుల్లో ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉండగా.. చాలా గ్రామాలు జీరో బ్యాలెన్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇచ్చుకోలేని స్థితి ఉంది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం.. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేపట్టడానికి ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్న తరుణంలో సీఎం ప్రకటన వారికి ఊరటనిచ్చింది. ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగానే గ్రామ పంచాయతీలకు సీఎం నిధుల నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వనుండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు అడుగులు పడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. రెండేళ్లుగా స్తబ్ధత.. రెండు సంవత్సరాలుగా జీపీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు నిలిచిపోయాయి. ప్రత్యేకాధికారులు భారంగా నెట్టుకువచ్చారు. చాలా గ్రామాల్లో కార్యదర్శులు సొంత డబ్బును సౌకర్యాల కల్పన కోసం వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో అప్పులు తెచ్చి కార్యదర్శులు పనులు చేపట్టారు. అలాగే మాజీ సర్పంచులు అడ్వాన్స్‌గా గ్రామాల్లో పనులు చేపట్టారు. మాజీలతోపాటు కార్యదర్శులకు రూ.లక్షల్లో బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంబీ రికార్డులు చేయించుకుని గ్రాంటు రాగానే రాబట్టుకునేందుకు మాజీలు జీపీల చుట్టూ తిరుగుతున్నారు. కార్యదర్శులు సైతం అప్పులు తెచ్చిన డబ్బులకు ఎంతకాలం వడ్డీలు కట్టాలని వాపోతున్నారు. నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్‌రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్‌లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో అభివృద్ది పనులకు చిల్లిగవ్వలేదు. గతంలో మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు, కార్యదర్శులు చేసిన అభివృద్ది పనులకు సంబంధించి రూ.42 లక్షల వరకు బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటన ఊరటనిచ్చింది. – తిరుపతి లలిత, సర్పంచ్, రెంజల్ ముఖ్యమంత్రి ఇస్తానన్న రూ.10 లక్షలతో కొంతైనా గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది వేతనాలను చెల్లించిన తర్వాత మిగులు నిధులను ప్రజల కనీస అవసరాలకు వినియోగిస్తాం. పారదర్శకంగా నిధులను అభివృద్ది పనులకు ఉపయోగిస్తాం. – లచ్చవార్ సుహాసిని, సర్పంచ్, సాటాపూర్ -
క్రిస్మస్ శుభాకాంక్షలు : కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన రోజున అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో జిల్లా మరింత ప్రగతిని సాధించాలని అభిలషించారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): yìl^Œl-ç³-ÍÏ Ð]l$…yýlÌS MóS…{§ýl…ÌZ° õÜtsŒæ »êÅ…MŠS {V>Ò$׿ çÜÓ Ä¶æ$… E´ë«¨ Õ„ýS׿ çÜ…çܦ (BÆŠ‡-G-‹ÜD-sîæ-I) B« §ýlÓ-Æý‡Å…ÌZ E_™èl Õ„ýS-׿MýS$ §ýlÆý‡Rê-çÜ$¢Ë$ Bà-Ó-°-çÜ$¢-¯]l²r$Ï çÜ…çܦ OyðlÆð‡-MýStÆŠ‡ Æý‡Ñ-MýS$-Ð]l*ÆŠ‡ º$«§ýl-ÐéÆý‡… JMýS {ç³MýS-r-¯]lÌZ MøÆ>Æý‡$. çÜ…çܦ B«§ýlÓ-Æý‡Å…ÌZ òÜÌŒæ ¸ù¯ŒS Çõ³ÆŠ‡, ïÜïÜsîæÒ Õ„ýS׿, HïÜ Çõ³-Ç…VŠæ, Ððlhrº$ÌŒæ ¯]lÆý‡Þ-È, ´ëç³yŠæ, ç³^èlaâ¶æ$Ï ™èlĶæ*-È, ™ól¯ðlే-sîæ-ి ò³…ç³MýS…,ç³#rt Vöyýl$ VýS$ÌS ò³…ç³MýS… MøÆý‡$Þ-ÌSÌZ Õ„ýS׿ CÐ]lÓ-¯]l$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. Õ„ýS-׿-™ø´ër$ E_™èl ¿Zf¯]l çܧýl$-´ë-Ķæ$…, àçÜtÌŒæ Ð]lçÜ-†, Õ„ýS׿ A¯]l…™èlÆý‡… {«§ýl$Ò-MýSÆý‡×æ ç³{™èl… A…¨Ýë¢Æý‡° õ³ÆöP-¯é²Æý‡$. °gê-Ð]l*-»ê§Šæ, M>Ð]l*-Æð‡yìlz hÌêÏ-ÌSMýS$ ^ðl…¨¯]l 19 ¯]l$…_ 45 çÜ…Ð]l-™èlÞÆ>ÌS Ð]lĶæ$çÜ$ MýSÍ-W¯]l {V> Ò$׿ {´ë…™èl Ķæ¬Ð]l-MýS$Ë$ Ð]l*{™èlÐól$ §ýlÆý‡Rê çÜ$¢ ^ólçÜ$Mø-Ð]lyé-°MìS AÆý‡$áÌS° ™ðlÍ-´ëÆý‡$. BçÜMìS¢ VýSÌS ÐéÆý‡$ B«§éÆŠ‡, Æó‡çÙ¯ŒS M>ÆŠ‡z, 10Ð]l ™èlÆý‡VýS† {«§ýl$Ò-MýSÆý‡×æ ç³{™èl…, I§ýl$ ´ë‹Ü-´ùÆý‡$t OòÜk ¸÷sZË$, »êÅ…MŠS Rê™é hÆ>MŠSÞ M>ï³ ¡çÜ$-Mö° Ð]l_a õ³Æý‡$ ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-MøÐéÌS° õ³ÆöP-¯é²Æý‡$. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ నియామకం ● ఏడుగురు న్యాయవాదుల ఎంపిక నిజామాబాద్‌లీగల్: జిల్లాలో భారత ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదించేందుకు కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్, అడిషనల్ స్టాండింగ్ కౌన్సిళ్లను నియమించింది. జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది చింతకుంట సాయిరెడ్డిని స్టాండింగ్ కౌన్సిల్‌గా, మరో ఆరుగురు న్యాయవాదులు బండారి కృష్ణానంద్, మల్లెపూల జగన్మోహన్ గౌడ్, దయావర్ నాగేశ్వర్, ఆకుల సురేశ్, పడిగెల వెంకటేశ్వర్, టి.నరసింహారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్లను అడిషనల్ స్టాండింగ్ కౌన్సిళ్లుగా ఎంపిక చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరు జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను, కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించనున్నారు. వీరి పదవికాలం మూడు సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటాయి. జిల్లాకు చెందిన న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిళ్లుగా నియామకం అవ్వడంపై హర్షం వ్యక్తంచేస్తూ బార్ అసోసియేషన్‌తోపాటు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. మాక్లూర్:నాలుగు రోజుల క్రితం అంత్యక్రియ లు నిర్వహించి పూడ్చిన శవాన్ని పోలీసులు బ యటికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘట న చర్చనీయాంశమైంది. వివరాలు ఇలా ఉన్నా యి.మాక్లూర్ మండలం బోర్గాం(కే) గ్రామంలో ఈ నెల 19న రాత్రి భోజనం అనంతరం ని ద్రించిన పల్నాటి రమేశ్(35) గుండెపోటు వచ్చి మృతి చెందాడు. మరుసటి రోజు కులస్తు లు, బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే,తన అన్న రమేశ్ మృతిపై అనుమానం ఉందని ఇజ్రాయిల్ దేశంలో ఉన్న తమ్ముడు పల్నాటి కేధార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఉన్నతాధికారుల సమక్షంలో పూడిచిపెట్టిన శవాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం జరిపించారు. నివేదిక ఆధారంగా నిజాలు తెలుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. అత్యాచార ఘటనలో ఒకరి అరెస్టు నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఖలీల్వాడిలో పూజ ఆస్పత్రిలో సోమవారం రాత్రి నర్సుపై అత్యాచార యత్నానికి పాల్పడిన రో హిత్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. రాత్రివేళ విధులు నిర్వహిస్తున్న నర్సుపై అత్యాచారానికి ఒడిగట్టిన రోహిత్‌పై కేసు నమోదైంది. -
పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
● పంచాయతీ ఎన్నికల్లో 90శాతానికి పైగా స్థానాల్లో విజయం ● మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ నిజామాబాద్ రూరల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో 90 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధించామని.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ సత్తాచాటుతామని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్టంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి నిజామాబాద్ జిల్లాను కాంగ్రెస్ పూర్తిగా క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎలా కష్ట పడ్డారో ఈ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ కష్టపడాలన్నారు. నాయకులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతోపాటు చదువులోనూ ముందుండాలి
● బీసీ గురుకులాల ఆర్సీవో సత్యనాథ్‌రెడ్డి మోపాల్(నిజామాబాద్‌రూరల్): విద్యార్థులు క్రీడలతోపాటు చదువులోనూ ముందుంజలో ఉండాలని మహాత్మా జ్యోతీబాపూలే ఉమ్మడి జిల్లా ఆర్సీవో సత్యనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కంజర్ శివారులో ఉన్న ఎంజేపీ బాలుర గురుకుల పాఠశా లలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్ మీట్లో ఉ త్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను బుధవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సత్యనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా షామీర్పేట్ తుర్కపల్లిలో డిసెంబర్ 20 నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వ హించారన్నారు. అందు లో జిల్లా జట్లు అత్యుత్తమ ప్రతిభను కనబర్చాయని, అండర్–19,17 వాలీబాల్ పోటీల్లో మొదటిస్థానంలో నిలిచారని తెలిపారు. మార్చ్ఫాస్ట్లో ప్రథ మ, ఖోఖోలో ద్వితీయ, టెన్నికాయిట్‌లో ద్వితీయ స్థానం,అండర్–19 అథ్లె టిక్స్ వ్యక్తిగత విభాగంలో చాంపియన్‌షిప్ సాధించారన్నారు. కంజర్ గురుకుల ప్రిన్సిపాల్, జిల్లా కో ఆర్డినేటర్ మురళీ, పీడీ రంజిత్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ఆటో ఢీకొని ఒకరి మృతి బోధన్‌రూరల్: సాలూర మండలంలోని హున్సా గ్రామానికి చెందిన ముద్ద రాజ్‌కుమార్ (54) అనే వ్యక్తి ఆటో ఢీకొని మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ముద్ద రాజ్‌కుమార్ పని నిమిత్తం బోధన్‌కు వెళ్తుండగా సాలూర శివారులో ఎదురుగా అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తమ్ముడు సంగ్రామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. రామారెడ్డి: పురుగుల మందు సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. రామారెడ్డికి చెందిన చాతరబోయిన శంకర్(53) ఈ నెల 23న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. సొంత పొలం దగ్గర గడ్డిమందు సేవించి అపస్మారకస్థితిలో కనిపించడంతో కుటుంబసభ్యులు మొదట కామారెడ్డి ఆస్పత్రికి అనంతరం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు. మృతుడి భార్య చిన్న పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు. -
గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి: తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవే శ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ధర్మారం (బి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రేమలత బు ధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 21 జనవరి 2026 దరఖాస్తుకు తుది గడువు అని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనవరి 5లోగా ఫీజు చెల్లించాలి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల పీజీ పరీక్షల ఫీజు జనవరి 5వ తేదీలోగా చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల థియరీ, ప్రాక్టికల్స్ 2026 జనవరిలో జరుగుతాయని తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో జనవరి 7వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పీజీ (ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంకాం) ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఏపీఈ) అన్ని సబ్జెక్టులకు రూ. 500, ఐపీసీహెచ్ (అన్ని సబ్జెక్టులకు రూ. 600) ఎంబీఏ, ఐఎంబీఏ, ఎంసీఏ అన్ని సబ్జెక్టులకు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించాలని సూచించారు. సాఫ్ట్‌బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు ఎంపిక డిచ్పల్లి: మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో జరగబోయే 10వ తెలంగాణ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్ షిప్ 2025 – 26కు తమ పాఠశాల విద్యార్థిని మాదరి ప్రణయ ఎంపికై నట్లు ధర్మారం (బి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రేమలత బుధవారం తెలిపారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రణయను ప్రిన్సిపల్ మాధవీలత, ఫిజికల్ డైరెక్టర్ నీరజ, పీఈటీ స్వప్న, సుమలత, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, జనరల్ సెక్రెటరీ గంగామోహన్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. ఎన్డీఎస్ఎల్కు బల్దియా నోటీసులు బోధన్‌టౌన్(బోధన్): ఆస్తి పన్ను బకాయిలు రూ.11 కోట్ల 55లక్షలు చెల్లించాలని పట్టణంలోని ఎన్డీఎస్ఎల్(నిజాం షుగర్స్) ఫ్యాక్టరీ కి బోధన్ మున్సిపాలిటీ అధికారులు బుధవారం నోటీసులు అందజేశారు. ఫ్యాక్టరీకి సంబంధించి ఆస్తిపన్ను బకాయిలు 2015 నుంచి ఇప్పటి వరకు చెల్లించలేదని, త్వరితగతిన చెల్లించాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కమిషనర్ జాదవ్ కృష్ణ స్పష్టం చేశారు. -
కథ శివిర్‌కు ఉమ్మడి జిల్లా విద్యార్థులు
● 27 నుంచి జనవరి 4 వరకు గుజరాత్లో శిబిరం ● నిజామాబాద్ నుంచి 15, కామారెడ్డి నుంచి 7 మంది ఎంపిక ఖలీల్‌వాడి : విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, సాంస్కృతిక, వ్యక్తిగత అభివృద్ధి తదితర అంశాలపై శిక్ష ణ కల్పించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. శ్రీ వేదిక్ మిషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజు లపాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించను న్నది. అందుకు నిజామాబాద్ జిల్లా నుంచి 15 మంది, కామారెడ్డి జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులను ప్రత్యేక శిబిరానికి ఎంపిక చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లా ఉప్లేట తాలూక ట్రాన్స్ లో ని ర్వహించే శిబిరానికి ఉమ్మడి జిల్లా విద్యార్థులు బ యల్దేరి వెళ్లారు. ఈ శిబిరంలో భారత రాజ్యాంగం, జాతీయ సమైక్యత, సాంస్కృతి, వ్యక్తిగత అభివృద్ధి, జాతీయవాదం, దేశభక్తి, జాతీయ భద్రత సమస్య లు, శక్తి, పర్యావరణం, డిజిటల్ ఇండియా, నీటి సంరక్షణ, మానవ హక్కులు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధ్యాత్మిక, సామాజిక సామరస్యం, విప త్తు నిర్వహణ, రహదారి భద్రత నియమాలు, క్రీడ లు, యోగా తదితర అంశాలపై శిక్షణనిస్తారు. -
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్ రూరల్: అన్నివర్గాల అభ్యున్నతికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 668 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలతో కలిసి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తున్నాయన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఆగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు త్వరగా ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెయూ(డిచ్పల్లి): నగరంలోని ఎల్లమ్మ గుట్టలో ఈనెల 28న నిర్వహించనున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, న్యాయవాది గొర్రె పాటి మాధవరావు ప్రథమ వర్ధంతి స్మారకోపన్యాస సభను విజయవంతం చేయాలని తెలంగాణ యూ నివర్సిటీ లా డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ జెట్లింగ్ యెల్లోసా అన్నారు. తెయూ క్యాంపస్‌లో బుధవారం స్మారక సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎల్లోసా మాట్లాడుతూ.. గొర్రెపాటి మాధవరావు సామాజిక కార్యకర్తగా, పేద ప్రజల కు అందుబాటులో ఉండి అనేక సేవలు అందించా రని తెలిపారు. ప్రథమ వర్ధంతి సభకు ముఖ్య వక్త గా నల్సార్ న్యాయ శాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కృష్ణదేవరాజు వస్తున్నారని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్రవంతి, పీడీఎస్‌యూ ప్రతినిధులు జన్నారపు రాజేశ్వర్, కార్తీక్ పాల్గొన్నారు. -
ఉపాధి హామీ కూలీలకు వరాలు
నందిపేట్(ఆర్మూర్): గ్రామీణ కార్మికులకు ఆర్థిక భద్రత, జీవనోపాధి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు వరాల జల్లులు కురిపించింది. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ–జీ రావ్‌ు జీ)గా మార్చింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. పనిదినాలతో పాటు రోజువారి వేతనాన్ని సైతం కేంద్రం పెంచింది. ఈ పథకం కింద హామీ ఇచ్చే పని దినాల సంఖ్యను ప్రతి సంవత్సరం 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచింది. ప్రతి సంవత్సరం కనీసం 125 పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. గ్రామీణ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రోజువారి కనీస వేతనాన్ని రూ. 240 పెంచింది. పథకం ప్రయోజనాలు ఈ పథకాన్ని గ్రామీణ భారతదేశంలో నైపుణ్యం లేని వారికి జీవనోపాధి భద్రతను పెంచడం లక్ష్యంగా మొదటగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 పేరుతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. తర్వాత మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) గా పేరు మార్చారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం, చెరువుల తవ్వకం, నీటి సంరక్షణ, కాలువలు సృష్టించడం వంటి మౌలిక సదుపాయాల పనులను ఈ పథకం కింద చేపడతారు. గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, నగరాలకు వలసలను తగ్గించడంతో పాటు గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. జిల్లాలో జాబ్ కార్డుల సంఖ్య 2.51 లక్షలు ఉపాధి పని చేసేవారి సంఖ్య 4,58,145 100 నుంచి 125 రోజులకు పెరిగిన పనిదినాలు కనీస వేతనం సైతం పెంపు ‘వీబీ–జీ రావ్‌ు జీ’ గా పేరు మార్చిన కేంద్రం -
సావిత్రిబాయి ఫూలే ఆశయాలను సాధిద్దాం
నిజామాబాద్ రూరల్: దేశంలో మహిళల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధనకు కృషి చేద్దామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్నగరలో ఉన్న మహనీయుల విగ్రహల వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి మహేశ్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. మహిళల చదువుకోసం, సమన్యా యం కోసం సావిత్రిబాయి పోరాటం చేశారన్నారు. బీసీ రిజర్వేషన్ ద్వారా సమన్యాయం అందించా లని తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి రిజర్వేషన్లే బలమైన ఆయుధమని అన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సావిత్రిబాయి ధైర్యం, సంకల్పం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. మన ఆడబిడ్డలు చదువుకుంటున్నా రంటే, ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, తలెత్తుకు ని నడుస్తున్నారంటే దానికి మూలం సావిత్రిబాయి త్యాగమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నుడా చైర్మన్ కేశ వేణు, రైతు కమిషన్ స భ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, సభాధ్యక్షుడు నరాల రత్నాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఆకుల లలిత, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది సామాజిక, ఆర్థికాభివృద్ధికి రిజర్వేషన్లే ఆయుధం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి ఫూలే విగ్రహావిష్కరణ -
● జోరుగా వరి నాట్లు
నందిపేట్(ఆర్మూర్): యాసంగి సీజన్ వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పంట చివరి దశలో సాగునీరందక ఎండిపోయే అవకాశం ఉండడంతో పలువురు రైతులు ముందస్తుగా వరినాట్లు వేస్తున్నారు. జిల్లాలో యాసంగి సీజన్లో 4.31 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ బావులు, బోర్ల సౌకర్యం ఉన్న రైతులు వరినాట్లు ప్రారంభించారు. గుత్ప, అలీసాగర్తోపాటు పలు ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు వస్తాయన్న ఆశతో మిగతా రైతులు నాట్లేసేందుకు వీలుగా పొలాలను సిద్ధం చేస్తున్నారు. నందిపేట మండలంలోని తల్వేద, కంఠం, అయిలాపూర్, బజార్‌కొత్తూర్, చింరాజ్‌పల్లి, లక్కంపల్లి, సీహెచ్ కొండూర్, ఉమ్మెడ గ్రామాలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. గతంతో ఎన్నడూ లేనంతగా ఈ యాసంగి సీజన్లో సన్నాలకు సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. గత వానాకాలం సీజన్లో రైతులు సాగు చేసిన వరిఽ ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లించగా ప్రైవేట్ వ్యాపారులు సైతం పోటీపడి ధాన్యం కొనుగోలు చేశారు. ‘ వచ్చే వారం రోజుల్లో గుత్ప ఎత్తిపోతల నీళ్లు విడుదలయ్యే అవకాశం ఉండటంతో గ్రామాల్లో నాట్లు ఊపందుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం సన్నరకాలకు రూ.500 బోనస్ చెల్లించడంతో రైతులు సన్నాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు’ అని ఆర్మూర్ డివిజనల్ వ్యవసాయాధికారి విజయలక్ష్మి వివరించారు. -
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు విద్యార్థుల ఎంపిక
సిరికొండ: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ నాగేష్ బుధవారం తెలిపారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన అఖిల, రుపిక, అశ్విని, వైదిక, సంస్కృతి, బి అఖిల, పల్లవి, సోఫియా ఎంపికయ్యారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులను ఎంఈవో రాము లు, ఇంచార్జి హెచ్ఎం మనోహర్, ఉపాధ్యాయులు, సర్పంచ్, వీడీసీ సభ్యులు అభినందించారు. కబడ్డీ పోటీలకు పడకల్ విద్యార్థిని.. జక్రాన్‌పల్లి: కరీంనగర్లో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు పడకల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పద్మావతి ఎంపికై నట్లు పీడీ గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ఐదు రోజుల నుంచి పడకల్ గ్రామంలో నిర్వహించిన సీనియర్ కబడ్డీ శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన పద్మావతి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యిందన్నారు. ఈ సందర్భంగా పద్మావతిని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్, పాఠశాల హెచ్ఎం గడ్డం సురేందర్ రెడ్డి తదితరులు అభినందించారు. -
పారదర్శకతకు డిజిటల్ న్యాయం అవసరం
సుభాష్‌నగర్: కేసుల పరిష్కారం, అణగారిన వర్గాలకు సులభంగా న్యాయం అందేందుకు, పారదర్శకత, జవాబుదారీతనం కోసం డిజిటల్ న్యాయం అవసరమని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌లోగల జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో బుధవారం జాతీ య వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ‘డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వా రా త్వరితగతిన, సమర్థంగా కేసుల పరిష్కారం’ అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. అనంత రం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో వినియోగదారుల హెల్ప్‌లైన్, జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ నెంబర్ 1915 లేదా 1800 001915 ద్వారా ఫిర్యాదులు నమోదు చేస్తామని తెలిపారు. కేసుల సమర్థవంతమైన, వేగవంతమైన పరిష్కారాన్ని సాధించడానికి డిజిటల్ న్యాయం ఒక శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. తక్కు వ ఖర్చుతో న్యాయం అందుతుందని, పేపర్‌లెస్ వ్యవస్థ ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్నారు. మార్కెట్లో ఏదైనా సేవలను వినియోగించుకునే సమయంలో వినియోగదారులు అ నుసరించాల్సిన విలువైన సూచనలను ఆయన చేశా రు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జీఎం శ్రీకాంత్‌రె డ్డి, ఆహార భద్రత అధికారి నవిత, లీగల్ మెట్రా లజీ అధికారి సుజావత్ అలీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ వి శీరకాంత్, మాయావర్ రాజేశ్వర్, అనిల్‌కుమార్, ప్రవీ ణ్, వర్మ, మహాదేవుని శ్రీనివాస్, యాటకర్ల దేవేష్, గైని రత్నాకర్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ -
బైక్‌ను ఢీకొన్న బస్సు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలో బుధవారం బస్సు ఢీకొని బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మెల్లకుంట తండాకు చెందిన మూడ్ బిచ్చు, తన భార్య మూడ్ మోతి బైక్‌పై బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మెదక్ బయల్దేరారు. అదే సమయంలో గోపాల్‌పేటలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద మెదక్ వైపు నుంచి ఎల్లారెడ్డి వెళ్తున్న బోధన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న బిచ్చు, అతని భార్య మోతికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
యువ వికాసమేదీ..?
● ఆరు నెలలైనా జాడలేని నిధులు ● స్వయం ఉపాధి కోసం యువతకు తప్పని నిరీక్షణ మోర్తాడ్(బాల్కొండ): స్వయం ఉపాధి కోసం రాజీ వ్ యువ వికాసం పథకం ద్వారా రూ.2లక్షల రు ణం కోసం మోర్తాడ్‌కు చెందిన రాణి దరఖాస్తు చేసుకుంది. రాయితీ రుణం మంజూరైతే కిరాణా దుకాణం, లేడీస్ ఎంపోరియం ఏర్పాటు చేసుకోవచ్చని ఆశించింది. ఇప్పటి వరకు యువ వికాసం రుణం మంజూరు కాలేదు. రాణిలాగే జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది యువత రాయితీ రుణాల కోసం నిరీక్షి స్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువతకు రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2కు ముందుగానే దరఖాస్తులను స్వీకరించారు. రూ.50 వేల లోపు వారికి వంద శాతం రాయితీ రాజీవ్ యువ వికాసం కింద రూ.50వేల లోపు రు ణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వంద శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష వరకు రుణం పొందేవారికి 90 శాతం రా యితీ, రూ.2లక్షల వరకు రుణం తీసుకునేవారికి 80 శాతం రాయితీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్ష ల వరకు రుణం పొందేవారికి 70 శాతం రాయితీని అందించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఎక్కువ మంది రూ.4 లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 2న రాయితీ రుణాలను పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అప్పట్లో వాయిదా పడగా.. ఇప్పటి వరకు షెడ్యూల్‌ను ఖరారు చేయలేదు. కనీసం ఎప్పుడు రాయితీ రుణాలను అందిస్తారో ప్రభుత్వం వెల్లడించకపోవడంతో యువత నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికార యంత్రాంగం రాజీవ్‌యువ వికాసంపై ఏమీ మాట్లాడలేకపోతోంది. ప్రభుత్వం స్పందించి రాయితీ రుణాలకు నిధులను విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో 58వేల దరఖాస్తులురాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిపొందేందుకు జిల్లా వ్యాప్తంగా 58వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దరఖాస్తుదారుల సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఓసీలను మినహాయించి ఆయా సామాజిక వర్గాల వారికి రాయితీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. -
గుట్టలు హాంఫట్
యథేచ్ఛగా తోడేశారు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గుట్టలు గుల్ల చేసి.. వాటి ఆనవాళ్లను సైతం మాయం చేసి భారీ గోతులుగా మారుస్తున్నారు. గుట్టలను హాంఫట్ చేసిన ప్పటికీ గనుల శాఖ అధికారులు తమకేమీ తెలియదన్నట్లు నిద్ర నటిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం శివారులోని ధాత్రి లేఅవుట్ సమీపంలో ఎఫ్‌సీ ఐ గోదాముల గోడను ఆను కుని విచ్చలవిడిగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. సా యంత్రం 6 గంటల లోపు మాత్రమే తవ్వకాలు చేసుకునేందుకు పరిమిత అనుమతులు ఉండగా, నిబంధనలను తుంగలో తొక్కి రాత్రి సమయంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నా రు. అభివృద్ధి పనుల పేరుతో మొరం తరలిస్తూ ఒక్క వేబిల్లు మీద పదుల సంఖ్యలో టిప్పులు రవాణా చేస్తున్నా రు. భారీ టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా తవ్వకాలు చే స్తున్నారు. తమకు అధికార పార్టీ నుంచి కీలక ప్రజా ప్రతినిధుల అండ ఉందని చెబుతూ అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేస్తూ గుట్టల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. ఇక్క డ గుట్టలకు బదులు భారీ క్వారీల మాదిరి పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. రోజుకు 200 నుంచి 300 ట్రిప్పు లు రవాణా చేస్తున్నారు. గోరంత అనుమతి.. కొండలను మింగేలా తవ్వకాలు చేయడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తవ్వకాల్లో కొందరు అధికార పార్టీ నాయకులకు అత్యధిక భాగసామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు భారీగా మామూళ్లు ముడుతుండడంతో చూసీచూడనట్లు, తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తుండడం విశేషం. ఈ విషయాలపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా అక్రమంగా తవ్వకాలు చేస్తున్న ప్రాంతానికి మైనింగ్ అధికారులను పంపించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అడ్డూఅదుపులేని మొరం దందా కారణంగా గుట్టల స్థానంలో గోతులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడో కాదు. జిల్లా కేంద్రం శివార్లలోని నాగారం ప్రాంతంతోపాటు మల్లారం గ్రామం వద్ద కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల అండ ఉందని చెప్పుకుంటూ గుట్టల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. నిజామాబాద్‌నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల కోసమని అనుమతులు తీసుకుని నాగారం ప్రాంతం నుంచి పొద్దునరాత్రి తేడా లేకుండా వందలాది ట్రిపుల మొరాన్ని తరలించారు. గుట్టపైనుంచి మొరం తరలించేందుకు వచ్చిన టిప్పర్లు అభివృద్ధి పనుల పేరుతో నగర శివారులో మొరం తవ్వకాలు మాయమవుతున్న గుట్టలు అధికార పార్టీ నేత హస్తం పరిమిత అనుమతులతో విచ్చలవిడిగా మొరం తవ్వకాలు జిల్లా కేంద్రానికి సమీపంలో గుట్టల స్థానంలో ఏర్పడిన గోతులు ఒక్క వేబిల్లుతో పదుల సంఖ్యలో ట్రిప్పుల రవాణా రాత్రి సమయంలో భారీ టిప్పర్లతో వందలాది ట్రిప్పులు తరలింపు మైనింగ్ అధికారులను పంపి చర్యలు తీసుకుంటాం : కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి -
బియ్యంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి
సుభాష్‌నగర్: ప్రభుత్వం సరఫరా చేసే బియ్యంలో తగిన పరిమాణంలో పోషకాలు ఉండేలా జాగ్రత్త లు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూ చించారు. నగర శివారులోని ఖానాపూర్ ప్రాంతంలో కొనసాగుతున్న కేసీపీ న్యూట్రిషన్ రైస్‌మిల్లును కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ కెన్నెల్ రైస్‌ను ఉత్పత్తి చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫోర్టి ఫైడ్ రైస్‌ను నిబంధనలకు అనుగుణంగా పూర్తి నాణ్యతతో తయారు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు. దీని తయారీ విధానాన్ని గమనించి, మిల్లు నిర్వాహకుడు కాపర్తి శ్రవణ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. -
అంకితభావంతో పని చేయాలి
● గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులు క్రియాశీల పాత్ర పోషించాలి ● ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డిబోధన్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అంకితభావంతో పని చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి సూచించారు. గ్రామాలభివృద్ధిలో క్రీయాశీల పాత్ర పోషించాలని, విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శుల విధులు, బాధ్యతలపై బోధన్ పట్టణంలోని లయ న్స్ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్లో బుధ వా రం నియోజకవర్గ స్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామాభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపించాలని, ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించా లని సూచించారు. ముఖ్యంగా వీధిదీపాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల శుభ్ర త, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నా రు. ఆదాయ వనరుల పెంపునకు కృషి చేయాలని, మా ర్చినెలాఖరు నాటికి ప్రతి పంచాయతీలో వందశా తం పన్ను వసూలు చేయాలని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న పంచా యతీ కార్యదర్శులకు స్థాన చలనం కల్పించాలని, బదిలీలు పాదర్శకంగా చేపట్టాలన్నారు. పనితీ రు సక్రమంగా లేని వారిని ఉపేక్షించొద్దని స్పష్టం చేశా రు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వందశాతం పను వసూ లు చేయాలన్నారు. పన్ను వసూళ్ల ప్రగతిని తాను స్వయంగా సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవన్నారు. సమీక్షాసమావేశానికి గైర్హాజరైన కార్యదర్శులపై ఆరా తీశారు. గైర్హాజరైన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. సబ్ కలెక్టర్ వికాస్‌మహతో, డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్పీవో నాగరాజు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. -
మద్నూర్‌లో స్కూల్ ఆటో బోల్తా
● ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలుమద్నూర్(జుక్కల్): మద్నూర్ మండల కేంద్ర శివారులో స్కూల్ ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 12 మంది విద్యార్థులు గాయాల పాల య్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలోని అవాల్గావ్ గ్రామానికి చెందిన 12 మంది పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆటో లో మద్నూర్‌కు వస్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. గమనించిన వాహనదారులు బో ల్తా పడిన ఆటోను సరిచేసి గాయపడిన విద్యార్థులను మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కపిల్ (8వ తరగతి), హరి (9వ తరగతి) కాళ్లు, చేతులు విరగ్గా, అభిజిత్, సాయి లు, శివ, విష్ణుకాంత్, సాయి గణేశ్‌కు గాయాల య్యా యి. ఆటోలో ఐదుగురు విద్యార్థులు ప్రైవేటు పాఠ శాలకు, ముగ్గురు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆటో డ్రైవర్ గణపతికి ఎలాంటి గాయాలు కాలేదు. కళ్లు తిరగడంతోనే ఆటో అదుపు తప్పిందని డ్రైవర్ వాపోయాడు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, అవాల్గావ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చారు. ఎస్సై రాజు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
నకిలీ నోట్ల కేసులో 8 మంది అరెస్ట్
వర్ని: వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామం కేంద్రంగా బయటపడ్డ దొంగ నోట్ల కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు వర్ని ఎస్ఐ రాజు మంగళవారం వెల్లడించారు. జలాల్పూర్ సర్పంచ్ మమత భర్త బాలుతో పాటు అతని తమ్ముడు నరేడ్ల శంకర్, అఫంధి ఫారం కు చెందిన పాల్త్య కళ్యాణ్, చందూర్ గ్రామానికి చెందిన సటోజీ గోపాల్, రమేష్, మహాదేవ్ , ఇల్తేమ్ రవి, రవికుమార్ రెడ్డి లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 లక్షల 86 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని, రెండు ప్రింటర్లు, ఒక ల్యాబ్ టాప్, 8 ఫోన్లు, ఒక మారుతి బ్రీజా కార్ ను సీజ్ చేశారు. నిందితులను దొంగ నోట్ల తయారీ, పంపిణీకి సంబంధించి కేసులో రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు. అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు ● డీఈవో పార్శి అశోక్ ఖలీల్‌వాడి: నిబంధనలకు విరుద్ధంగా వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లు తీసుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని డీఈవో పార్శి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని పాఠశాలలు 2026–2027 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్స్ చేస్తున్నారని, అందుకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేట్ పాఠశాలల యజమాన్యలు అడ్మిషన్స్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేకపోతే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచాలి ● డీఎంహెచ్‌వో రాజశ్రీ సుభాష్‌నగర్: పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు పెంచాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ పేర్కొన్నారు. 35 ఆరోగ్య ఉపకేంద్రాలు, పల్లెదవాఖానాల సిబ్బందితో ఆమె మంగళవారం సమీక్షించారు. ఆభా రిజిస్ట్రేషన్ 10 శాతం కంటే తక్కువగా ఉండి, అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలను చేయడంలో అలసత్వం వహిస్తున్న సిబ్బందిని మందలించారు. హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ లాంటి పరీక్షలను ప్రణాళికాబద్ధంగా గ్రా మాల వారీగా నమోదు చేయాలన్నారు. ఎన్సీడీ కోఆర్డినేటర్ వెంకటేశం, డీడీఎం నారాయణ, పృథ్వీ, హెచ్‌ఈవో శ్రీనివాస్, డీహెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నిజాంషుగర్స్ కార్మికుల నిరసన బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) మూతపడి పదేళ్లు పూర్తయి న నేపథ్యంలో మంగళవారం ఫ్యాక్టరీ ప్రధా న గేటు ఎదుట కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘ నాయకులు ఉపేందర్, రవిశంకర్ గౌడ్ మాట్లాడు తూ ఫ్యాక్టరీ మూసివేతతో ఉపాధి కోల్పోయి ఎంతో మంది కార్మికులు అనారోగ్యం, ఆర్థిక స మస్యలతో మృతి చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. లేఆఫ్ నాటి బకాయి వేతనాలు చె ల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మిక నాయకులు బాలకృష్ణ, ఎం.శ్రీనివాస్, దాస్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో అత్యాచారయత్నం నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఖలీల్వాడిలో గల పూజ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుపై అత్యాచార యత్నం జరిగింది. సోమవారం రాత్రి ఆస్పత్రిలో ఓ మహిళ రాత్రి విధులు నిర్వర్తిస్తోంది. ఆస్పత్రి నిర్వాహకులు హ న్మండ్లు, అతని స్నేహితుడు రోహిత్ రాత్రికి ఆస్పత్రికి వచ్చారు. రాత్రి 10.30 గంటల స మయంలో రోహిత్ నర్సుపై అత్యాచార య త్నానికి పాల్పడ్డాడు. తప్పించుకున్న యు వతి వేరే గదిలోకి వెళ్లి డయల్ 100 కు ఫోన్‌చేసింది. పోలీసులు రావడంతో రోహిత్ త ప్పించుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి కేసు నమోదు చేసుకున్నారు. రోహిత్‌ను అరెస్టు చేస్తామన్నారు. -
ప్రజాపాలనలో రైతు రాజ్యం
● రైజింగ్ తెలంగాణలో రైతులే కీలక భాగస్వాములు ● రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వ ప్రజాపాలనలో రైతు రాజ్యం నడుస్తోందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగధర్ అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని గడుగు గంగాధర్ మంగళవారం నిజామాబాద్‌లో మాట్లాడారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రెండేళ్ల పాలన లో రైతుల కోసం రూ.లక్ష కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అందుకే తెలంగాణ రైతులు ఈసారి రైతు దినోత్సవాన్ని ఉత్సాహంగా చేసుకున్నారన్నారు. రైతురుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, సన్నధాన్యం బోనస్ లాంటి కార్యక్రమాలతో ముందుకెళుతోందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా దే శంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. సమస్య ఉందని చెబితే రైతు కమిషన్ ద్వా రా తక్షణమే వెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు. భూమి సమస్యల నుంచి మార్కెట్ సమస్యల వరకు పలు అంశాలపై రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలను అందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రాబోయే రెండు దశాబ్దాల్లో తెలంగాణ సాధించాలనుకున్న లక్ష్యాలతో ఒక దార్శనిక పత్రాన్ని విడుదల చేసిందని, ఇందులో వ్యవసాయానికి, రైతుకు పెద్ద పీట వేసిందన్నారు. రేర్ పేరుతో గ్రామీణ తెలంగాణాను సుభిక్ష రాష్ట్రంగా మార్చే లక్ష్యంగా పలు చర్యలను ప్రకటించిందన్నారు. భూసార పరీక్షల నుంచి మార్కెట్లో పంటను అమ్ముకునేవరకు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం రాబోయే 20 ఏళ్లలో అమలు చేయనున్న అనేక కీలక కార్యక్రమాలను ఇందులో పొందుపరిచిందన్నారు. -
వచ్చే ఎన్నికలనూ సమర్థవంతంగా నిర్వహించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలనూ సమర్థవంతంగా ని ర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించా రు. కలెక్టరేట్లో మంగళవారం ఎంపీడీవోలు, ఎంపీవోలు పంచాయతీ ఎన్నికల సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ, ఎన్నికల విధుల నిర్వహణపై ప్రతి దశలోనూ అధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ ఎన్నికలను సజావుగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని కల విధులు సవాళ్లతో కూడుకుని ఉంటాయన్నారు. శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరవుతూ, ప్రతి అంశాన్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకుని అప్రమత్త తో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పని చేయడంతోనే ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఎన్నికలను సజావుగా పూర్తి చే సుకోగాలిగామని అన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్న, పంచాయతీ కార్యాలయ ఏవో రాజబాబు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలిజక్రాన్పల్లి: భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలపై తహసీల్దార్, ఆర్ఐ, ఇతర అధికారులతో సమీక్షించారు. అర్హులైన ప్రతి అర్జీదారుడి దరఖాస్తును పరిశీలిస్తూ, పరిష్కరించేందు కు అవకాశం ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తూ తగిన న్యాయం జరిగేలా మానవీయ కోణంలో పని చేయాలన్నారు. అనంతరం రైతులతో కలెక్టర్ భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సర్పంచ్ మమత, తహసీల్దార్ కిరణ్మయి, స్థానిక అధికారులు ఉన్నారు. -
రక్తమోడిన రహదారులు
ఆటో, మోటార్ సైకిల్ ఢీ ● బైకిస్టుతోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న యువతి మృతి ఆర్మూర్: ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో చోటు చేసుకుంది. మృతులు నిజామాబాద్ నగరానికి చెందిన జెట్టివార్ సాయిప్రసాద్ (23), ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రా మానికి చెందిన వనం సంధ్యారాణి (25) గా పోలీసులు గుర్తించారు. నగరంలోని చంద్రానగర్ కాలనీకి చెందిన సాయిప్రసాద్ ఆర్మూర్ మండలం చేపూ ర్ శివారులోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. నిజామాబాద్ నుంచి సోమవారం అర్ధరాత్రి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఆర్మూర్‌కు బయల్దేరాడు. ఎడపల్లి మండలం జాన్కంపేటకు చెందిన సంధ్యారాణి తన గ్రామానికి చెందిన 12 మందితో కలిసి పెర్కిట్‌లోని ఫంక్షన్హాల్లో క్యాటరింగ్ చేసేందుకు వచ్చింది. ఫంక్షన్ పూర్తయిన తర్వాత కూలీలంతా ఆటోలో ఎడపల్లికి బయల్దేరారు. అంకాపూర్ శివారులోకి రాగానే ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఘటనలో బైక్ నడుపుతున్న సాయిప్రసాద్‌తోపాటు ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్న సంధ్యారాణి అక్కడికక్కడే మరణించింది. ఆటోలో ఉన్న మరో యువతి మరాఠీ హారిక కాలు విరగ్గా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఎండీ నదీమ్ పరారీలో ఉన్నాడు. ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచా రణ చేపట్టారు. మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కూలీ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయి.. మృతురాలు సంధ్యారాణిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు ఇద్దరు కూతుర్లు కాగా, సంధ్యా రాణి పెద్ద కూతురు. వివాహం అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో తల్లిదండ్రుల వద్దే ఉంటూ పని చేసుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించగా, గాంధారి మండలం చద్మల్ తండాలో ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మద్నూర్ శివారులో ఆటోబోల్తాపడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. -
సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులు
● పర్సన్ ఇంచార్జీలను నియమించిన సహకార శాఖ ● ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు సొసైటీల బాధ్యతలుడొంకేశ్వర్(ఆర్మూర్): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో సొసైటీలకు ప్ర త్యేక అధికారులను నియమించారు. సహకార శాఖ లో ఆడిటర్లుగా పనిచేస్తున్న సీనియర్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ రిజిస్టర్లకు పర్సన్ ఇంచార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీవో శ్రీనివాస్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 53, మొ త్తం కలిపి 142 సహకార సంఘాలున్నాయి. ఇవి రైతులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి. పాలకవర్గాలు రద్దు కావడంతో సొసైటీలు సవ్యంగా నడిచేందుకు సహకార సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. అయితే, సిబ్బంది కొ రత కారణంగా ఒకొక్కరికి రెండు నుంచి మూడు సొసైటీల బాధ్యతలు అప్పగించారు. తద్వారా పర్య వేక్షణ చేయడం వీరికి కష్టమనే చెప్పవచ్చు. కొత్త పాలకవర్గాలు వచ్చేంత వరకు సొసైటీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే నడవనున్నాయి. ప్రభు త్వం సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా నా మినేటెడ్ పద్ధతిలో చైర్మన్లను నియమించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి నాటికి కొత్త పాలకవర్గాలు వచ్చే అవకాశాలున్నాయని పలువురు మాజీ చైర్మన్లు చెప్తున్నారు. -
నిజామాబాద్
మాతా శిశు సంరక్షణపై.. జిల్లాలో మాతా శిశు సంరక్షణపై వైద్యులు, సిబ్బంది దృష్టి సారించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025– 8లో uధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం, 93వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. నిజామాబాద్ తర్వాత నల్లగొండ, కామారెడ్డి జిల్లాలు నిలిచాయి.కొనుగోళ్లలో -
స్తంభించిన యూరియా యాప్
● అయోమయంలో రైతులుఇందల్వాయి: రైతులకు యూరియా పంపిణీలో నిబద్ధత, నిల్వల్లో పారదర్శకత, డీలర్ల వివరాల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన యూరియా బుకింగ్ యాప్ సేవలు సోమవా రం నుంచి స్తంభించాయి. రైతులు యాప్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే టెంపరరీ డిసెబుల్డ్ అని చూపిస్తుంది. పాస్‌బుక్ నంబర్ నమోదు చేసినా నాట్ వ్యాలీడ్ అని చూపిస్తుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. కాగా, యూరియాను యాప్‌లో బుకింగ్ చేసుకొని కొనుగోలు చేసే విషయంలో చదువురాని, స్మార్ట్ ఫోన్లు లేని రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. సాధారణ అమ్మకాలు మొదలు.. యూరియా బుకింగ్ యాప్ నిలిచిపోవడంతో వ్యవసాయ అధికారులు, సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద సాధారణ పద్ధతిలో యూరియా అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. -
మొక్కులు తీర్చేందుకు వెళ్తూ..
● ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. ● ఒకరి మృతి.. పలువురికి గాయాలుగాంధారి(ఎల్లారెడ్డి): మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలంలోని కాయితీ తండాకు చెందిన మంజారావు సింగ్ కుటుంబం మొక్కులు చెల్లించుకునేందుకు చద్మల్ తండాలో ఉన్న లక్ష్మమ్మ ఆలయానికి మంగళవారం ఉద యం ట్రాక్టర్లో బయలు దే రింది. నేరల్ గ్రామ శివారు లో ట్రాక్టర్ బోల్తాపడటంతో మంజారావు సింగ్ కుమారుడు మంజా గణేశ్(15) అక్కడికక్కడే మృతి చెందగా, మంజా మధు, మంజా కిషన్‌తోపాటు మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రావుసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
జిల్లా పద్మశాలి యువజన సంఘం కార్యవర్గం
సుభాష్‌నగర్: నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మైసల నారాయణ, ప్రధాన కార్యదర్శి బొడ్డు గంగాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఖలీల్వాడిలోని జిల్లా సంఘం కార్యాలయంలో జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులుగా పల్నాటి కార్తీక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గజం అభిలాష్, జిల్లా కోశాధికారిగా గెంట్యాల అజయ్‌లను నియమించినట్లు తెలిపారు. నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు దాసరి నర్సింలు, జిల్లా అధ్యక్షులు మైసల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు గంగాప్రసాద్, సలహదారులు గెంట్యాల వెంకటేశ్, కార్యవర్గ సభ్యులు బాబురావు, చింతకింది సంతోష్ తదితరులున్నారు. -
అన్ని మతాలను కాంగ్రెస్ గౌరవిస్తుంది
● ప్రతిపేదవాడికి సంక్షేమ పథకాలు ● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిధర్పల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం రూ.20 వేల కోట్లు నిధులు మంజూరు చేసింది అన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఏడు మండలాలకు చెందిన క్రిస్టియన్ల కోసం కమ్యూనిటీ భవనాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరుతున్నాయన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ధర్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, చర్చి ఫాదర్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక సిరికొండ: మండలంలోని కొండాపూర్ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగుల రాజేశ్వర్‌గౌడ్, వార్డు సభ్యుడు మిద్దెల నరేష్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సర్పంచ్ నీరటి మానసశ్రీధర్, పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలో ఎమ్యెల్యేను మంగళవారం మర్యాదపూర్వకంగా కలి శారు. సర్పంచ్‌ను, ఉపసర్పంచ్, పార్టీ నాయకులను ఎమ్మెల్యే సన్మానించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, గౌసోద్దీన్, చంద్రాగౌడ్, ఆకుల జగన్, కిషోర్‌గౌడ్, నల్ల బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. మోపాల్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డిని మోపాల్ సర్పంచ్ ద్యాప రవికుమార్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ మద్దతుతో రవి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి ద్యాప రవికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచి రవి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. మోపాల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అవసరమైన నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు, వార్డుసభ్యులు అంగలి నవీన్‌రెడ్డి, సతీష్, కిరణ్, మిర్యాల నరేష్, తదితరులు ఉన్నారు. -
బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ రూరల్: నగరంలో విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో మంగళవారం ధర్నా నిర్వహించి, బంగ్లాదేశ్ దేశ దిష్టిబొమ్మను దహనం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అఖిలభారత విశ్వహిందూ పరిషత్ పిలుపుమేరకు ప్రతి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయనంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్,జిల్లా సేవా ప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, హిందూవాహిని జిల్లా సంయోజక్ సాయి ప్రసాద్, ధాత్రిక రమేష్,నగర అధ్యక్షులు కోడిమేలా శ్రీనివాస్, నగర కార్యదర్శి బాసొల్లా నీకేష్, నగర సహకార్యదర్శి సతీష్, బజ్రంగ్దళ్ నగర సహా సంయోజక్ అఖిలేష్, మహేష్, తులసిదాస్, హర్షవర్ధన్, కార్తీక్, బంజా రమేష్, శ్యాం, సంపత్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
ప్రకృతి రైతులు.. ఆధునిక వైద్యులు
సుభాష్‌నగర్: ప్రకృతి రైతులు లాభాల కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలు పండిస్తున్నారని.. వారు ఆధునిక వైద్యులని రైతు సంక్షేమ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. మంగళవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సేంద్రియ రైతు చిన్నికృష్ణుడు అధ్యక్షతన నగరంలోని ఎన్డీసీసీబీ వైఎస్ఆర్ భవనంలో ప్రకృతి రైతుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రకృతి సేద్యం చేస్తున్న 9 మంది ఉత్తమ రైతులను ప్రశంసాపత్రం, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. అనంతరం గడుగు గంగాధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. వ్యవసాయ కమిషన్ రైతుల కోసమే పని చేస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయంలో మహిళా రైతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పశు సంపదను పెంపొందించాలని సూచించారు. విచ్చలవిడిగా యూరియా, రసాయనిక ఎరువుల వినియోగంతోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల భూమి పంటల సాగుకు పని రాకుండా భూసారం కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, డీఏవో వీరా స్వామి, ఆత్మా పీడీ తిరుమల ప్రసాద్, ఎన్డీసీసీబీ సీఈవో నాగభూషణం వందే, డీజీఎం లింబాద్రి, ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ జనార్దన్, సుమారు వందమంది ప్రకృతి రైతులు పాల్గొన్నారు. మితిమీరిన యూరియాను వినియోగించొద్దు రైతు సంక్షేమ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఆరోగ్యకరమైన పంటలు పండించాలి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి -
వ్యవసాయాన్ని కాపాడుకుందాం
మోపాల్‌లో రైతులను సన్మానిస్తున్న ఎఫ్‌పీవో ప్రతినిధులువ్యవసాయ క్షేత్రంలో విద్యార్థులురైతు నర్సారెడ్డిని సన్మానిస్తున్న టీచర్లుమోపాల్: ప్రస్తుత రోజుల్లో రైతులను రక్షించుకుని.. వ్యవసాయాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇందూరు డిచ్పల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ అగ్గు చిన్నయ్య పేర్కొన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో మోపాల్‌లో మంగళవారం ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. కదం పెంటయ్య, తిరుపతి సంజీవ్, కెంపు పోతన్న, కెంపు మల్లయ్య, గోపని ఆశన్నను సత్కరించారు. ఈసందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు వాసరి సాయినాథ్, తుంగపల్లి రాజ్‌కుమార్, బండమీది నర్సయ్య, భరత్, సిరిపురం సాయిలు, దండు సరోజ, దండు లత, తదితరులు పాల్గొన్నారు. రైతుకు సన్మానం ఖలీల్‌వాడి: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో బాడ్సికి చెందిన రైతు నల్ల నర్సారెడ్డిని ఉపాధ్యాయులు, విద్యార్థులు మంగళవారం సన్మానించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ సంబంధిత కార్యక్రమాల్లో భాగంగా రైతును ఘనంగా సన్మానించినట్లు జిల్లా సైన్స్ అధికారి కే.గంగా కిషన్ తెలియజేశారు. జిల్లాస్థాయి స్పెల్‌బీ, క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. జీవన్, కాంతారావు, చంద్రశేఖర్, గోవర్ధన్ తదితరులు ఉన్నారు. విద్యార్థుల పొలంబాట సిరికొండ/నిజామాబాద్ రూరల్ : జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరికొండ పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం పొలంబాట పట్టారు. వృత్తి విద్య కోర్సులో భాగంగా పొలాలను, ఆరు తడిపంటల తోటలను సందర్శించారు. విద్యార్థులకు మిశ్రమ పంటల సాగు విధానాలను, పంటల ఎంపిక, దిగుబడులు, ఖర్చు–లాభాల వివరాలను వివరించారు. రైతులు చెరుకుపల్లి రామన్న, కొలిప్యాక సాయవ్వ, గ్యామ శోభన్‌లను విద్యార్థులు సన్మానించారు. ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్‌రెడ్డి, వృత్తి విద్య కోర్సు ఉపాధ్యాయులు జాడి సాయివినయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని సెయింట్ జేవియర్స్ విద్యార్థులు ధర్మారం గ్రామంలో రైతుల పొలాలను సందర్శించారు. ఈసందర్భంగా క్లబ్ చైర్మన్ నర్సింహరావు మాట్లాడారు.కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, రైతులు, పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు. -
హైస్కూల్‌కు బెంచీల వితరణ
మోపాల్: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి 320 డీ హైదరాబాద్ ఆధ్వర్యంలో మండలంలోని సిర్పూర్ ఉన్నత పాఠశాలకు మంగళవారం డ్యూయల్ డెస్క్ బెంచీలను వితరణ చేసినట్లు హెచ్ఎం సత్యనారాయణ తెలిపారు. ఈసందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణించినప్పుడే ఇలాంటి సంస్థలు అందించే చేయూత సఫలమవుతుందని తెలిపారు. విద్యార్థుల కోసం మున్ముందు లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తామన్నారు. పాఠశాలకు రూ.లక్షా 5వేలు వెచ్చించి 30 డ్యూయల్ డెస్క్ బెంచీలు అందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతీ 320డీ కి హెచ్ఎం సత్యనారాయణ, సర్పంచి బొడ్డు గౌతమి గణేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమాన్ని సమన్వయం చేసి నిధులు తెప్పించిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్రావును అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ అడ్వయిజర్ సూర్య రాజ్, సభ్యులు లయన్ సుజాత సూర్యరాజ్, విజయలక్ష్మీ, సుష్మ, శాస్త్రి, ప్రవీణ్, సాయిబాబు, ప్రైమరీ హెచ్ఎం లాటికర్ రాము, ఏఏపీ చైర్పర్సన్ స్రవంతి, వీడీసీ సభ్యులు గంగాధర్, కిషన్, ఉపాధ్యాయులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు. -
కామారెడ్డిలో దొంగల అలజడి
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో మంగళవారం వేకువజామున దొంగల అలజడి కలకలం రేపింది. పట్టణంలోని జయశంకర్ కాలనీలో దాదాపు 3 గంటల ప్రాంతంలో దొంగలు సంచరిస్తూ చోరీలకు యత్నించారు. కుక్కలు మొరగడంతో కొందరు కాలనీవాసులు ఇళ్ల లో నుంచి బయటకు వచ్చారు. వారు బయటకు రావడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారని కాలనీవాసులు తెలిపారు. ముసుగులు ధ రించిన ముగ్గురు కాలనీల్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇదిలా ఉండగా అదే సమయంలో ఎన్జీవోఎస్ కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడినట్లు కాలనీవాసులు తెలిపారు. అక్కడ ఎలాంటి విలువైన వస్తువులు చోరీకి గురి కాలేదని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దొంగల సంచారం పట్టణ వాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. కాలనీల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
సిరికొండ: రాష్ట్ర స్థాయి సాప్ట్‌బాల్ పోటీలకు గడ్కోల్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల పీడీ నవీన్, జీహెచ్ఎం శ్రీకాంత్‌లు మంగళవారం తెలిపారు. జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండలో ఈ నెల 21న జరిగిన సబ్ జూనియర్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన గాండ్ల భానువర్దన్, బుక్యా మౌనికలు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వారు తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున పాల్గొంటారని తెలిపారు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ధర్పల్లి: ప్రాథమిక స్థాయిలో బోధన పరికరాలతో బోధన సులభమవుతుందని మండల రిసోర్స్ పర్సన్లు అంకం నరేష్, వెంకట రాజారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సృజనాత్మకంగా బోధించడానికి అభ్యసనం సులభం కావడానికి, బోధన పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గణితంకు సంబంధించి వివిధ బోధన పరికరాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం శ్రీనివాస్, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
47వ డివిజన్లో నుడా చైర్మన్ పర్యటన
సుభాష్‌నగర్: నగరంలోని 47వ డివిజన్ పూసలగల్లిలో నుడా చైర్మన్ కేశవేణు మంగళవారం పర్యటించారు. డివిజన్లో శానిటేషన్, మురుగుకాలువలు, చెత్తచెదారంపై ఫిర్యాదులు రావడంతో ఆయన డీసీ రవిబాబుతో కలిసి సందర్శించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మురికికాలువలను శుభ్రం చేసి చెత్తచెదారాన్ని తొలగించాలని నుడా చైర్మన్ అధికారులను ఆదేశించారు. మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండ కాలువలను శుభ్రం చేయాలన్నారు. డ్రెయినేజీ నీరు తాగునీటి పైప్లైన్లలో కలస్తున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకరావడంతో సమస్యను పరిష్కారించాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాలనీవాసులు, అధికారులు ఉన్నారు. -
వామపక్షాల నిరసన
నిజామాబాద్ రూరల్: ఉపాధి హామీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, సీపీఎంఎల్ మాస్ లైన్, ఆర్ఎస్పీ లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడారు. కేంద్రం వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారం మోపనుందని వారు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఆచట్ట సవరణను ఉపసంహరించుకొని వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించాలని, రోజుకు రూ.600 ల కూలీ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ిసీపీఐ నాయకులు అన్వర్, ఆర్ఎస్పీ నాయకులు అనిల్, లిబరేషన్ నాయకులు ఖాజా మొయినుద్దీన్, సీపీఎం నాయకులు పెద్ది వెంకట్ రాములు, వెంకటేష్, అనసూయమ్మ, అనిత, గంగాధర్ డెమోక్రసీ నాయకులు శ్రీధర్, భూమన్న, మల్లికార్జున్, మాస్ లైన్ నాయకులు సుధాకర్, నరేందర్, వెంకన్న ఆర్ఎస్పీ నాయకులు రాములు, నరేష్, వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్‌అర్బన్/నిజామాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు పార్టీ నాయకులతో కలిసి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాక్లూర్ మండలం వెంకటాపూర్ సర్పంచ్ ధాత్రి అంజయ్యను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దండు శేఖర్, రాజు సంతోష్, రాజు, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.అలాగే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) చౌరస్తాలో గల పీపీ విగ్రహానికి బ్రాహ్మణ సంఘం సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు ఉన్నారు. -
ప్రజలపై ఏసుప్రభు కృప ఉండాలి
నిజామాబాద్ రూరల్: జిల్లా ప్రజలపై ఏసుప్రభు కృప ఉండాలని సీఎస్ఐ చర్చి రెవరెండ్ సీహెచ్.జార్జ్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ నివాసంలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అంతకు ముందు క్రైస్తవులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్‌హుందాన్, ఆకుల రాజేశ్వర్, రూరల్ సీఐ సురేష్‌కుమార్, వెంకట్‌రెడ్డి, రెవరెండ్ కృపాకర్, రెవరెండ్ అరోన్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. -
గర్ల్స్ కాలేజీకి ఉత్తమ అవార్డు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోని నిజామాబాద్ బాలికల కళాశాల ఉత్తమ కళాశాల అవార్డు సాధించింది. ప్రభుత్వ బాలికల కళాశాలలో వివిధ అంశాలు, ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అవార్డు వచ్చినట్లు ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ తెలిపారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కో బాలికల కాలేజీని ఎంపిక చేసి, అత్యధిక అడ్మిషన్లు, ఉత్తమ ఫలితాల సాధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఎంసెట్, నీట్ శిక్షణ నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాలను పరిశీలించి అవార్డు అందజేసినట్లు చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ బాలికల కాలేజీకి హైబీజ్ టెన్ఎక్స్టీవీ ఎక్స్‌లెన్స్ అవార్డును మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, హైబీజ్ టెన్ ఎక్స్టీవీ ఉమ్మడిగా నిర్వహించిన కార్యక్రమంలో మంగళవారం మాజీ జేడీ లక్ష్మీనారాయణ, విద్యాపీఠం యాజమాన్య ప్రతినిధి ప్రీతిరెడ్డి నుంచి ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిరంతర కృషి, పట్టుదల, నిబద్ధత, విధి నిర్వహణ, కళాశాల అధ్యాపక సిబ్బంది సమష్టి కృషితోనే అవార్డు వచ్చిందన్నారు. -
జాతీయ రహదారిపై లారీ బోల్తా
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మంగళవారం పైపుల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గుజరాత్ నుంచి మద్నూర్ మీదుగా కర్నూల్‌కు స్టీల్ పైపుల లోడుతో వెళ్తున్న లారీ మండల కేంద్రంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద ఎదురుగా ఉన్న లారీని ఓవర్టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ● నేడు రీపోస్టుమార్టం చేయనున్న పోలీసులు మాక్లూర్: మండలంలోని బోర్గాం(కె) గ్రామానికి చెందిన పల్నాటి రమేశ్(35) ఈ నెల 19న గుండెపోటుతో మృతి చెందాడు. తన అన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటు ఇజ్రాయిల్‌లో ఉంటున్న అతని తమ్ముడు పల్నాటి కేథర్ మంగళవారం స్వగ్రామానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపడుతున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రమేశ్ మృతదేహాన్ని పూడ్చిన చోట బుధవారం రీ పోస్టుమార్టం చేయనున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వద్ద ఉన్న పురాతన మైసమ్మ ఆలయం ధ్వంసానికి దుండగులు యత్నించారు. గుడిని పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, హిందూవాహిని, భజరంగ్‌దళ్ నాయకులు గుడి వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయని, పోలీసులు ప్రతీ రోజు పెట్రోలింగ్ చేపట్టాలని కోరారు. ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. నాయకులు పుల్లూరి సతీశ్, నరేశ్, రమేశ్, నరేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సదాశివనగర్: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి తీవ్రగాయాలైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. మండలంలోని తిమ్మోజివాడి గ్రామానికి చెందిన గోల్కొండ హరిబాబు(31) ఈ నెల 20న బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. -
చెస్‌తో మేధస్సుకు పదును
● డీఈవో అశోక్ మోపాల్: విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలుగా కాకుండా చెస్ వంటి క్రీడలతో వారి మేధస్సును పదును చేసుకోవచ్చని డీఈవో అశోక్ సూచించారు. మంగళవారం నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్లో చెస్ నెట్వర్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున చెస్ బోర్డులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు పిల్లలను చెస్ ఆడేందుకు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవోలు గేమ్‌సింగ్, సేవులా, పాఠశాల హెచ్ఎం సీహెచ్ శంకర్, నెట్వర్క్ ప్రతినిధులు సాహితీ, కిరణ్‌కుమార్ గౌడ్, వాసు గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాల తనిఖీ
సిరికొండ: మండలంలోని జంగిలోడి తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ బుక్యా గంగాధర్ మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, వసతులపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నర్సరీని తనిఖీ చేశారు. మొక్కలు ఎన్ని పెంచుతున్నారు.. ఎన్ని మొక్కలు నాటారు అనే విషయాలను తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి శేఖర్ ఉన్నారు. సుభాష్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి, జిల్లా ప్రజల మన్ననలు పొందిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలిసి శాలువతో సన్మానించి, మెమోంటోను అందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, జిల్లా అధ్యక్షులు శిరప్ప హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ, రాధా కిషన్, సాంబశివరావు, పురుషోత్తం రావు, భోజరావు, మధుసూదన్, సాగర్, శంకర్, బాలస్వామి, శేఖర్ తదితరులున్నారు. -
బియ్యం బస్తాల దొంగతనానికి యత్నం
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ శివారులో ఉన్న గోదాం బయట ఉన్న లారీ నుంచి బియ్యం బస్తాలను దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేసినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి అర్ధరాత్రి ఖానాపూర్ శివారులో ఉన్న గోదాం బయట ఉన్న లారీ నుంచి జిల్లా కేంద్రానికి చెందిన రఫిక్, అబుబకర్, ఫిరోజ్‌లు బియ్యం బస్తాలను చోరీకి పాల్పడుతుండగా అక్కడే ఉండి గమనిస్తున్న ఓ వ్యక్తి గట్టిగా అరవడంతో వారు వారిపోయారు. స్థానికుడు శివలింగ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాలానగర్ గ్రామానికి చెందిన సాయిలు(32) మద్యానికి అలవాటు పడ్డాడు. మంగళవారం మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవపడ్డాడు. దీంతో వారి మధ్య గొడవ జరగడంతో క్షణికావేశంలో గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఐటీ సెల్ పోలీసులకు ప్రశంస పత్రాల అందజేత
నిజామాబాద్‌అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐటీసెల్ పోలీస్ సి బ్బంది మంగళవారం అడిషనల్ డీజీ టెక్నికల్ సర్వీసెస్ అధికారి శ్రీనివాస్‌రావు చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. పో లీస్ ఐటీ అప్లికేషన్స్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ఐటీ సెల్ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్, నిజామాబాద్ డివిజన్ ఇన్చార్జి రాహుల్‌కు ప్రశంసపత్రలు అందించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంస పత్రాలను అందజేశారు. అలాగే పోలీస్ స్టేషన్లో ఉ త్తమ సేవలు అందిస్తున్న కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, శ్రీకాంత్‌లకు ప్రశంస పత్రాలు అందించారు. ఖలీల్‌వాడి: నగరంలోని దుబ్బలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్సీ, ఎస్టీ, ఉపాధ్యాయ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు యానం విజయ్‌కుమార్ సమక్షంలో ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎ. పోశన్న, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బంటు భోజన్న, కోశాధి కారిగా బీ నాగరావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోలి లింగయ్య, ఎస్ గంగాధర్, ఎన్ ప్రభాకర్, సుధా గడపాలి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాటి సుధాకర్, జిల్లా బాధ్యులు వై రాజేశ్వర్, పీ రాజేశ్వర్, పీ పెద్దన్న, తాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. నందిపేట్: మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రైతుల వేషధారణలో ఆకట్టుకున్నారు. నందిపేట శివారులోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కరస్పాండెంట్ బండి రామాగౌడ్, మాధురి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సాంకేతిక పద్ధతులతో కేసుల పరిష్కారానికి కృషి
నిజామాబాద్‌అర్బన్: కాలానికి అనుగుణంగా సాంకేతిక పద్ధతులతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని అదనపు డీసీపీ బస్వారెడ్డి అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్‌స్టేషన్ రైటర్స్‌కు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు కేసుల్లో కొత్తదనం తీసుకొచ్చి కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల్లో నాణ్యతను పెంచి ఎఫ్ఐఆర్ నుంచి అంతిమ రిపోర్టు వరకు ఉండాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. స్టేట్మెంట్ రికార్డుపై గోప్యత పాటించాలన్నారు. నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. నేరానికి నేర స్థలానికి జత చేయడం, నూతన టెక్నాలజీని వాడుకునే విషయంలో ఏ పద్ధతులను ఉపయోగించాలో వివరించారు. అంతిమ రిపోర్టును కోర్టుల్లో ఎలా సమర్పించాలో సిబ్బందికి అవగాహన కల్పించారు. స్టేషన్ రైటర్స్ తమ పీఎస్‌లకు వెళ్లిన తర్వాత సిబ్బందికి, సంబంధిత అధికారికి శిక్షణ కాలంలో నేర్చుకున్నవి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, టౌన్ సీఐ శ్రీనివాస్‌రాజ్, శిక్షణ సీటీసీ ఇన్స్పెక్టర్ శివరాం, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
గుంజీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ధర్పల్లి: మానవ జీవితంలో గుంజీలు తీయడంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని గుంజీళ్ల అంతర్జాతీయ శిక్షకులు అందె జీవన్‌రావు అన్నారు. మండలంలోని చల్లగర్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ, మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా గుంజీలు పనిచేస్తాయన్నారు. మన దేశంలో విద్యార్థులచే గుంజీలు తీయించే పద్ధతిని శిక్షగా భావించడంతో పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతుందని పేర్కొన్నారు. యోగా చేయడంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాదె నరేష్, ఇన్చార్జి సురేష్, ఉపాధ్యాయులు జ్యోతి, లక్ష్మి, సాయారెడ్డి, శ్రీదేవి, రవీందర్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
మాతా శిశువుల సంరక్షణపై దృష్టి సారించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డినిజామాబాద్అర్బన్: జిల్లాలో మాతా శిశు సంరక్షణపై వైద్యులు, సిబ్బంది దృష్టి సారించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ చేపట్టాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై ఒక్కో ఘటన వారీగా కలెక్టర్ వివరంగా విచారణ చేపట్టారు. మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేస్తూ వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్లినా వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు, అంగన్వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అంతకుముందు గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ, తగిన అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఎంహెచ్‌వో రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి పరమేశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్వేత, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, సైకియాట్రిస్ట్ విశాల్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్యాధికారులు, వైద్యులు పాల్గొన్నారు. -
కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలు
సుభాష్‌నగర్ : గ్రామ పంచాయతీల పాలకవర్గాలు కొలువుదీరాయి. సుమారు 21 నెలల తర్వాత గ్రా మాల్లో సర్పంచుల పాలన మొదలైంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సోమవారం జిల్లాలోని 544 గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేసి తొలి సమావేశాన్ని నిర్వహించాయి. ప్ర మాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాలకు ప్రభు త్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మ న్లు, పార్టీల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. జిల్లాలో 545 గ్రామపంచాయతీలు, 5022 వార్డుస్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు 2024, ఫిబ్రవరి 1 తో గడువు ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. సుమారు 21 నెలలపాటు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. కేవలం కార్మికుల వేతనాలు మాత్రమే విడుదల చేసింది. పన్నుల వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇన్నాళ్లూ పాలన కొనసాగించారు. వివిధ పనులకు పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించారు. పండుగలా.. గ్రామపంచాయతీల పాలకవర్గాల ప్రమాణ స్వీకా రం అట్టహాసంగా నిర్వహించారు. పదవీ బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో ముందస్తుగానే పంచాయతీ కార్యాలయాలను ముస్తాబు చేశారు. చాలా పంచాయతీలకు రంగులు వేయగా, మరికొన్ని కార్యాలయాలకు మామిడి తోరణాలు, షామియానాలు, టెంట్లు వేసి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నగేశ్ రెడ్డి, దినేష్ పటేల్ కులాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, తదితర ముఖ్యులు కార్యక్రమాలకు హాజరయ్యారు. సొంత గ్రామాల్లో నేతల గైర్హాజరు.. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు సొంత గ్రామాల్లో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. ఒకరిద్దరు నేతలు మినహా మిగతా నేతలు స్వగ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీలు బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడమే గైర్హాజరుకు కారణమని రాజకీయవర్గాలు పేర్కొంటున్నారు. అమృతాపూర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, అంకాపూర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పచ్చల నడుకుడ, సిరికొండ, నర్సాపూర్, కిసాన్‌నగర్‌లో అన్వేష్‌రెడ్డి, తాహెర్‌బిన్ హందాన్, మానాల మోహన్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, ముదక్‌పల్లిలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితర నేతలు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఒక్కరు మినహా.. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం మూడు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. 545 గ్రామపంచాయతీలకుగాను సోమవారం 544 గ్రామాల్లో పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యులతో ఆయా గ్రామాలకు నియమించిన అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. సాలూర మండలంలోని కొప్పర్తిక్యాంపు సర్పంచ్ సతీశ్ తీర్థయాత్రలకు వెళ్లడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదాపడింది. ఉపసర్పంచ్, వార్డుసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగిసిన ప్రత్యేక అధికారుల పాలన 544 జీపీల్లో బాధ్యతలు స్వీకరణ అట్టహాసంగా సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ప్రమాణస్వీకారం హాజరైన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు -
వాస్తవికతను మరిపించేలా..
సుభాష్‌నగర్: వరదలు, విపత్తులు సంభవించిన సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం జిల్లాలో చేపట్టిన మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా కొనసాగింది. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో మూ డు చోట్ల ఏకకాలంలో నిర్వహించిన కార్యక్రమాలు విపత్తుల సమయాల్లో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా వాస్తవికతను మరిపించేలా చేశాయి. డ్రోన్లు, వాటర్ బోట్లు, అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన సహాయక చర్యలు విపత్తుల నిర్వహణపై సన్నద్ధతను చాటిచెబుతూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందింపజేశాయి. జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు వద్ద వరద జలాల్లో చిక్కుకుపోయిన వారిని, నీటి ప్రవాహంలో కొట్టుకుతుపోతున్న వారిని కాపాడి, తక్షణ వైద్య సేవలు, సహాయక చర్యలు చేపట్టే కార్యక్రమాలు విపత్తుల సందర్భంగా నెలకొనే హడావుడిని తలపించాయి. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయస్వామి ఇతర అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని వరద జలాలు చుట్టుముట్టిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని పేషెంట్లను హుటాహుటిన పైఅంతస్తులకు చేర్చి, వారి ప్రాణాలను ఎలా కాపాడాలి అనే దానిపై మాక్ ఎక్సర్సైజ్ ద్వారా చూపించారు. నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో మాక్‌డ్రిల్ జరిగింది. కాగా, వాస్తవికతను మరిపించేలా కొనసాగిన సహాయక చర్యలను చూసి రాష్ట్ర పరిశీలకుడు సురేశ్ కుమార్ సంతృప్తి వెలిబుచ్చారు. జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అభినందించారు. జీజీహెచ్, రఘునాథ చెరువు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ పర్యవేక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన ప్రత్యేక పరిశీలకుడు -
ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
● రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించా రు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల వి భాగం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మా ట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను జనవరి 13లోగా పూర్తి చేయాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియతోపాటు ఓటర్ల జాబితాలో పాత ఫొటోలు, పేర్లు, జెండర్ తదితర పొరపాట్లు ఉంటే ఫారం 8 ద్వారా సవరించాలని సూచించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రూరల్ ని యోజకవర్గాలలో పూర్తి చేశామని, అర్బన్ సెగ్మెంట్ లో వేగవంతంగా చేపట్టి గడువులోపు పూర్తి చేస్తామ ని వివరించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కు మార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కా ర్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. -
నిధులు రావాలి.. అభివృద్ధి సాగాలి
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీల్లో స ర్పంచ్‌ల పాలన మొదలైంది. అయితే, అభివృద్ధి ప నుల నిర్వహణకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే అభివృద్ధి పనులకు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్నాళ్లూ పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం ఆర్థిక సంఘం నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. 2024 ఫిబ్రవరి 2 గత పాలకవర్గ పదవీకాలం ముగియగా, రాష్ట్ర ప్రభు త్వం వెంటనే ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీలకు ప్రతి నెలా రూ.10,30,24,879 చొప్పున ఆర్థిక సంఘం ద్వారా జమ కావాల్సిన నిధులు నిలిచిపోయాయి. సుమా రు 22 నెలలకు సంబంధించి రూ.226,65,47,338 బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. నేరుగా పంచాయతీలకే నిధులు... ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం మొదట్లో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సరిగా పంచాయతీలకు చేరవేయడం లే దనే కారణంతో కేంద్రం జీపీలతో ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరిపించింది. నిధులను ఖాతాలకు వి డుదల చేయడంతోపాటు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంది. అయితే, ఖాతాలు తెరిచిన తర్వాత పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోవడం గమనార్హం. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళితే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. బకాయిలతోపాటు కొత్తగా విడుదల కావాల్సిన నిధులు పంచాయతీ ఖాతాల్లోకి చేరితే మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని నూతన ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. గ్రామ పంచాయతీలకు పేరుకుపోయిన 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు నిలిచిన రూ.226.65 కోట్ల నిధులు పాలకవర్గాలు లేవనే కారణంతో బ్రేక్ వేసిన కేంద్రం -
పీఎంశ్రీ నిధుల గోల్‌మాల్‌పై విచారణ
● అందుబాటులో లేని టీచర్ ● రిజిస్టర్లో సంతకాలు చేసిన వైనంఖలీల్వాడి: నగరంలోని కోటగల్లీ శంకర్‌భవన్ హైస్కూల్లో పీఎంశ్రీ నిధుల గోల్‌మాల్‌పై సోమ వారం సౌత్ మండల విద్యాశాఖ అధికారి సాయిరెడ్డి విచారణ చేపట్టారు. పీఎంశ్రీ ద్వారా పాఠశా లకు సుమారు రూ.10 లక్షల వరకు నిధులు వచ్చా యి. ఈ నిధులతో పాఠశాలలో వివిధ పనులతోపాటు విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే, నిధుల్లో నుంచి విహారయాత్ర కోసం రూ.3.27 లక్షలు మంజూరయ్యాయి. ఇన్చార్జి హెడ్మాస్టర్ మల్లేశం, ఫిజిక్స్ టీచర్ వెనిగాల సురేశ్ ఆధర్యంలో రెండు విడుతల్లో భువనగిరి ఫోర్ట్, యాదగిరి గుట్టతోపాటు హైదరాబాద్‌లో ని నెహ్రూజూలజికల్ పార్క్, సాలార్జంగ్ మ్యూజియానికి విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్లారు. వీటికి రూ. 2.92 లక్షలు ఖర్చు చేశారు. దీంతోపాటు రూ.50 వేలు స్కూల్ డేకు కేటాయించారు. నిధులు మార్చిలో మంజూరైతే ఏప్రిల్‌లో విద్యార్థులను తీసుకువెళ్లాల్సి ఉండగా టీచర్లు విహారయాత్ర పేరిట నిధులను గోల్మాల్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై రెండు నెలల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదులు వెళ్లాయి. విజ్ఞాన విహారయాత్రకు మంజూరై నిధు లు, ఎప్పుడు వెళ్లారు, టూర్ కోసం డీఈవో, ఎంఈవో అనుమతి తీసుకున్నారా? ఎలా వెళ్లారు? తదితర వివరాలను అందించాలని శంకర్‌భవన్ ఇన్చా ర్జి హెచ్ఎంకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎంఈవో సాయిరెడ్డి సో మవారం విచారణ చేపట్టగా ఇన్చార్జి హెడ్మాస్టర్ మల్లేశం అందుబాటులో ఉండగా ఫిజిక్స్ టీచర్ వెనిగాల సురేశ్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. హాజరు రిజిస్టర్లో సంతకాలు సోమవారం ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం ఎంఈవో సాయిరెడ్డి పాఠశాలకు చేరుకో గా ఫిజిక్స్ టీచర్ వెనిగాల సురేశ్ అందుబాటులో లేరు. హాజరుపట్టికను పరిశీలించగా ఉదయం, మధ్యాహ్నానికి సంబంధించిన రెండు సంతకాలను ఒకేసారి చేసి బయటికి వెళ్లినట్లు సమాచారం. అత్యవసర పనిపై వెళితే ఉదయం పూట మాత్రమే సంతకం చేయాల్సి ఉండగా రెండు సంతకాలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరోసారి విచారిస్తాం.. పీఎంశ్రీ నిధులపై విచారణ చేయగా ఫిజిక్స్ టీచర్ వెనిగాల సురేశ్ అందుబాటులో లేరు. దీంతో మరో తేదీని నిర్ణయించి విచారిస్తాం. సోమవారం హాజరు రిజిస్టర్లో ఉదయం, మధ్యాహ్నం సంతకాలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. పూర్తిస్థాయి విచారణ చేస్తాం. టీచర్ సురేశ్ అంత్యక్రియలకు వెళ్లినట్లు సమాచారం ఉంది. – సాయిరెడ్డి, సౌత్ ఎంఈవో -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారు నగలు, రూ. 30వేల నగదు అపహరణ నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని అయిలాపూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన బత్తుల పోశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లాడు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వారి ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. పోశెట్టి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా సామాను చిందరవందరగా పడేసి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లోని 5 తులాల బంగారు నగలు, రూ.30వేల నగదును చోరీ చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు. డిచ్‌పల్లిలో పట్టపగలే.. డిచ్పల్లి: మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదు రుగా ఉన్న ఎస్బీఐ మినీ బ్యాంకులో సోమవారం పట్టపగలే చోరీ జరగడం స్థానికంగా కలకలం రే పింది. బాధితులు, డిచ్ పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్ తెలిపిన వివరాలు ఇలా.. డిచ్పల్లి బస్టాండ్ ఎదురుగా రాజు అనే వ్యక్తి ఎస్బీఐ మినీ బ్యాంకు నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్నాహ్యం షాపు గ్లాస్ డోర్‌కు తాళం వేసి భోజనం చేయడానికి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికీ ఓ కస్టమర్ అతడికి ఫోన్ చేసి షాపు తెరిచి ఉందని ఎక్కడ ఉన్నావని అడిగాడు. దీంతో తాను తాళం వేసి వస్తే డోర్ ఎలా తెరిచి ఉంటుందని ఆందోళన చెందిన వెంటనే బైక్‌పై షాపు వద్దకు వచ్చాడు. లోనికి వెళ్లి చూడగా టేబుల్ డ్రాలో ఉన్న రూ.60వేలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా నెత్తిన టోపి ధరించిన గుర్తు తెలియని దుండగుడు పెద్ద స్క్రూడ్రైవర్‌తో గ్లాస్ డోర్‌ను తెరిచి లోనికి వచ్చాడు. అదే స్క్రూడ్రైవర్‌తో టేబుల్ డ్రాను తెరిచి, అందులోని రూ.60వేలను అపహరించాడు. సమీపంలోని దుకాణం ముందర బైక్‌పై ఒక యువకుడు వేచి ఉండగా, మరొక యువకుడు లోనికి వచ్చి ఈ చోరీకి పాల్పడి వెంటనే అదే బైక్‌పై పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎల్లమ్మ ఆలయంలో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో గల ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. సాంంకేతిక ఆధారాల సహాయంతో అనుమానితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చోరీకి ఉపయోగించిన గడ్డపార, దొంగిలించబడ్డ గల్లాపెట్టె, ఆటో, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడినది గాంధారి వాసి అయినా ర్యాకం సాయిలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వాసి జూలపాల రాములుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు. -
అర్చకుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ రూరల్: తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అర్చకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ధూప, దీప, నైవేధ్య అర్చక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ మాట్లాడుతూ.. అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెల 5లోపు వేతనం అందించాలని అన్నారు. అర్చకులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలన్నారు. ప్రతి జిల్లాలో అర్చక భవన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెల అర్చకుల వేతనం, ధూప, దీప నైవేద్యంలకు రూ.35వేలు (వేతనం రూ.25వేలు, ధూప, దీప నైవేధ్య రూ.10వేలు) వరకు పెంచాలన్నారు. ప్రముఖ దేవాలయాల్లో డీడీఎన్ అర్చక కుటుంబాలకు ఉచిత శీష్రు దర్శనం కల్పించాలన్నారు. అనంతరం దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ విజయరామారావుకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రాజప్ప స్వామి, అంజన్న స్వామి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ శర్మ, కిరణ్ శర్మ, క్యాషియర్ రాజేందర్, పరమేష్, రాష్ట్ర సభ్యులు చర్మసప్ప, నావనంది శివ, శివప్ప, అరవింద్, రాజేశ్వర, సెక్రటరీ రాజేశ్వర్, దత్తాత్రేయలు, కృష్ణమాచార్యులు, సంగమేశ్వర్, మల్లికార్జున్ స్వామి, అనిల్ కుమార్, సునీల్, కాంత్ అప్ప, భాస్కర్, జగదీష్, సిద్దేశ్వర్, అర్చకులు పాల్గొన్నారు. -
అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు
● అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ ● ప్రజావాణికి 68 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అర్జీలను పెండింగ్‌లో పెట్టవద్దని, సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి మొత్తంగా 68 వినతులు వచ్చాయి. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
టైప్ రైటింగ్ పరీక్షలో ప్రతిభ
ఆర్మూర్: ఇటీవల నిర్వహించిన టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ పరీక్షలో ఆర్మూర్ పట్టణానికి చెందిన పవార్కృప నక్షత్ర రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించినట్టు ఆర్మూర్‌లోని సంత్ జ్ఞానేశ్వర్ టైప్ రైటింగ్ ఇన్స్ట్యూట్ ప్రిన్సిపాల్ దొండి రవి వర్మ సోమవారం తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థులను హైదరాబాద్‌లో తెలంగాణ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్యూట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రావు సన్మానించినట్లు పేర్కొన్నారు. టైప్ రైటింగ్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్యూట్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఎరువుల కొరత లేకుండా చూడాలి
బోధన్‌రూరల్: ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే యాసంగి సీజన్‌కు సంబంధించి కూడా రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. బోధన్ మండలం మావందిఖుర్దు గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోదాంను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం తనిఖీ చేశారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రైవేట్ డీలర్లు కూడా నిబంధనలను పాటిస్తూ, ఎరువుల విక్రయాలు జరిపేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా ఎరువుల పంపిణీ జరగాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. -
నిజాంషుగర్స్ లేఆఫ్‌కు పదేళ్లు
బోధన్: సరిగ్గా పదేళ్ల క్రితం నిజాంషుగర్స్ యాజ మాన్యం లేఫ్ ప్రకటించింది. 2015 డిసెంబర్ 23న బోధన్, ముత్యంపేట (జగిత్యాల), ముంబోజిపల్లి (మెదక్) ఫ్యాక్టరీలను మూసివేసింది. అయితే, రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రాగానే మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేర కు 2024 జనవరి 12న ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ, పలువురు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా పునరుద్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, మంత్రి దామోదర రాజనర్సింహ కో–చైర్మన్‌గా, బోధన్, మెదక్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్, జీవన్‌రెడ్డిలతోపాటు అప్పటి రాష్ట్ర ఆ ర్థిక ప్రత్యేక కార్యదర్శి, పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ, సహకార శాఖ, రాష్ట్ర షుగర్ అండ్ కేన్ కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 2024 ఫి బ్రవరి 24న బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి రైతులతో సమావేశమైంది. ఫ్యాక్టరీల పునరుద్ధరణ కు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీకి సంబంధించిన బ్యాంక్ రు ణ బకాయిలు సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వం పలు విడతల్లో చెల్లించింది. మరోవైపు రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి చెరుకు సాగు ప్రాధాన్యతపై రైతులతో సమావేశాలు నిర్వహించారు. మహారాష్ట్రలో సహకార సంఘాల ఆధ్వర్యంలో లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీల వద్దకు రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ప్రభుత్వం చేతిలోనే ఫ్యాక్టరీ భవిష్యత్తు.. ఫ్యాక్టరీని తెరిపించేందుకు సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు నిపుణుల కమిటీ వేసి, తుది నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేప డుతుందని పునరుద్ధరణ కమిటీ పేర్కొంది. అయి తే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు కొలిక్కిరాలే దు. కమిటీ వేసి రెండేళ్లు పూర్తికావొస్తున్నా పునరుద్ధరణ చర్యలు మొదలుకాలేదు. మరోవైపు చెరుకు పంట సాగు వైపు రైతులు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై చెరుకు రైతులు, కార్మికులు, ఈ ప్రాంత ప్రజ లు ఇన్నాళ్లుగా ఆశల పల్లకీలో ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్ప ష్టమైన విధాన ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాక్టరీ భ విష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మిగిలిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ మూతపడి ఉపాధి కోల్పోయిన కార్మికులు కనీసం బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. మూతపడిన ఫ్యాక్టరీల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఎటూ తేలని ఫ్యాక్టరీ భవిష్యత్తు ఆవిరవుతున్న ఆశలు -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
క్రైం కార్నర్పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన ఓ రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాయు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. గుత్ప గ్రామానికి చెందిన బాషెట్టి భూమేశ్వర్(54) అనే రైతు సోమవారం గగ్గుపల్లి గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అక్కడ బోరు బావి మోటార్‌ను స్టార్ట్ చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యడు. తీవ్ర అస్వస్థతకు గురైన భూమేష్వర్ను స్థానికులు గుర్తించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. వేల్పూర్ మండలంలో.. వేల్పూర్: వేల్పూర్ మండలం అమీనాపూర్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు మృతిచెందాడు. వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. లక్కోర గ్రామానికి చెందిన అబ్బాని భూమన్న(52) గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడు తన టీవీఎస్ మోపెడ్‌పై సోమవారం భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామంలో ఉన్న కూతురు వద్దకు బయలుదేరాడు. అమీనాపూర్ సమీపంలో మూలమలుపువద్ద వేల్పూర్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న ఆటో అతివేగంగా వచ్చి భూమన్నను ఢీకొట్టింది. ఈ ఘటనలో భూమన్న తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ని మండలంలో.. వర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో చేపల వేటకని వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. వర్ని ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్ గ్రామానికి చెందిన నాగని ప్రవీణ్ (29) సోమవారం ఉదయం ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చెరువులోకి దిగిన ప్రవీణ్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. రామారెడ్డి (ఎల్లారెడ్డి): ఇటీవల ఆత్మహత్యకు యత్నించి న ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. రా మారెడ్డి మండలం పోసానిపే ట గ్రామానికి చెందిన కనుగందుల నవీన్ (23) వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. రైలు సమీపించగానే భయంతో ప క్కకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆలస్యం కా వడంతో రైలు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. ఆలూర్ మండలంలో కరెంట్ షాక్‌తో రైతు ప్రాణాలు కోల్పోయాడు. వేల్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు, వర్ని మండలంలో చేపలవేటకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. -
సర్పంచ్‌గా బాధ్యతలు.. తొలిరోజే హామీల అమలు
మోర్తాడ్: సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం సొంతంగా మేనిఫెస్టోను ప్రకటించిన అభ్యర్థులు వాటిని అమలు చేయడానికి పదవీ బాధ్యతల స్వీకరణ రోజునే నడుం కట్టారు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్‌లో సర్పంచ్‌గా పోటీ చేసిన ధని సుభాష్ ఆడపిల్ల పుడితే రూ.5,116 సాయం అందిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అతడు గెలిచి, సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ముద్దం గోవర్ధన్‌కు ఇటీవల ఆడపిల్ల జన్మించగా సర్పంచ్ సుభాష్ ఇచ్చిన హామీ మేరకు అతడికి రూ.5116 నగదు అందజేశారు. తొలిరోజునే మేనిఫెస్టో అమలు చేసినందుకు సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు. రెంజల్(బోధన్): రెంజల్ మండలం కళ్యాపూర్ సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి భానుచందర్ ఆడపిల్ల పుట్టిన ప్రతీ కుటుంబానికి అన్నయ్య కానుక కింద రూ.5116 అందిస్తానని మాటిచ్చారు. సోమవారం పదవీ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం కాశం సతీష్, అయిటి అనీల్ దంపతులకు ఒక్కోక్కరికి రూ.5116 నగదును అందించి మాట నిలబెట్టుకున్నారు. అలాగే మండలంలోని నీలా గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే యువతకు వ్యాయామశాలను ఏర్పాటు చేస్తానని క్యాతం యోగేశ్ మాటిచ్చారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామంలో హనుమాన్ వ్యాయామశాలను ప్రారంభించారు. రూ. 4.20 లక్షల సొంత ఖర్చులతో వ్యాయామశాలకు అవసరమైన పరికారాలను ఏర్పాటు చేశారు. -
నిజామాబాద్
భార్యను హతమార్చిన భర్తమతిస్థిమితం లేని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన రెంజల్ మండలం బోర్గాంలో చోటు చేసుకుంది. సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025– 8లో uనేడు ప్రజావాణి నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమా న్ని ఈ నెల 22వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నా రు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రిత్వికకు బంగారు పతకం ● జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ నవీపేట: ఆలిండియా యూనివర్సిటీ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో నవీపేట మండలం బినోలాకు చెందిన మిట్టపల్లి రిత్విక ప్రతిభచాటింది. ఆదివారం జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఉన్న కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ యూనివర్సిటీ తరఫున రిత్విక ఈ పోటీలలో పాల్గొంది. 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో ఘనత సాధించింది. బంగారు పతకం సాధించిన రిత్వికను కళింగ యూనివర్సిటీ డైరెక్టర్ అచ్యుత సమంత, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్ర శేఖర్‌రెడ్డి, ఉమేశ్, మహిపాల్‌రెడ్డి, జిల్లా ప్రతినిధులు గడీల రాములు, శ్రీనివాస్, శ్యాంసుందర్‌రెడ్డి, రాగిణి తదితరులు అభినందించినట్లు తండ్రి ప్రకాశ్‌రావ్ తెలిపారు. ఫిబ్రవరి 22న గురుకుల ప్రవేశ పరీక్ష మోపాల్(నిజామాబాద్‌రూరల్): తెలంగాణ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష–2026ను ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించనున్నట్లు డీసీవో జి విజయలలిత ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగ తి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని గురుకులాల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులకు 2026 జనవరి 21 చివరి తేదీ అని తెలిపారు. గురుకులాల్లో ఐఐటీ, నీట్, సీయూ, ఈటీ వంటి జాతీయస్థాయి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, మెరిట్, రిజర్వేషన్ నిబంధన ప్ర కారం ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. వరి వైపే మొగ్గుఇందల్వాయి: వరి సాగు చేయడమే వ్యవసాయం అ నే పరిస్థితి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం సాగు విస్తీర్ణంలో 85శాతం వరి సాగవుతోంది. జిల్లా లో సుమారు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. 4 లక్షల 30వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా విస్తారంగా వర్షాలు కురవడంతోపాటు సులభమైన సాగు విధానం, ప్రభుత్వ మద్దతు ధరకు తోడు బోనస్ డబ్బులు అందుతుండడం వరి సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతున్నాయి. తాత్కాలిక లాభాలు.. దీర్ఘకాలిక నష్టాలు పంట మార్పిడి విధానాన్ని అవలంబించకుండా కే వలం వరిని మాత్రమే సాగు చేస్తుండడంతో తాత్కాలిక లాభాల కన్నా దీర్ఘకాలిక నష్టాలే ఎక్కువని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏళ్ల తరబడి ఒకే రకం పంట సాగు చేస్తే చీడపీడల ఉధృతి పెరగడంతోపాటు విచ్చలవిడిగా మోతాదుకు మించి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడుతుండటంతో భూమి నిస్సారంగా మారుతుంది. పంటల సాగులో సమతుల్యత దెబ్బతిని ఇతర ఆహార, వాణిజ్య పంటల ధరలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వరి దిగుబడులు తగ్గడం, కూరగాయల ధరలు పెరగడమే ఈ పరిస్థితికి నిదర్శనం. ప్రకృతి.. ప్రభుత్వాలపై పెనుభారంఅధిక విస్తీర్ణంలో వరి సాగుతో పెద్ద మొత్తంలో ప్ర మాదకర మిథేన్ వాయువు వాతావరణంలోకి కలుస్తుంది. ఇది కార్బన్ డై ఆకై ్సడ్ కన్నా 28 నుంచి 34 రెట్లు అధికంగా గ్లోబల్ వార్మింగ్‌కి కారణమవుతుంది. దీనికి తోడు విలువైన భూగర్భ జలాలు వేగంగా తరిగిపోతున్నాయి. ఉచితంగా విద్యుత్, రాయితీపై ఎరువులు తదితర కారణాలతో ప్రభుత్వాలపై రూ.వేల కోట్ల అదనపు భారం పడుతోంది. అధిక వరి సాగు కారణంగా జిల్లాలో 2019లో లక్షా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం జరిగితే 2025లో అది లక్షా నలభై వేల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ధాన్యం కొనుగోళ్ల కోటా 54 లక్షల టన్నుల నుంచి 80 లక్షల టన్నులకు పెంచాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం. రైతులను చైతన్యపర్చాలి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సా హకాలు ఇచ్చి జిల్లాలో అవ కాశం ఉన్న ప్రతి చోట ఆరుతడి పంటలు పండించేలా ప్రభుత్వం రైతులను చైతన్యపర్చాలి. అధిక వరి సాగు కారణంగా ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఉద్యాన, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పిస్తూ పంటల సమతుల్యత దెబ్బ తినకుండా జాగ్రత్తపడాలి. – పీ తిరుపతిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి వరి సాగును తగ్గించేందుకు ప్రభుత్వం ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి. సూక్ష్మ బిందు సేద్యం పరికరాల రాయితీకి నిధులు కేటాయించాలి. ఆరు తడి పంటలకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే సకాలంలో కొనుగోలు చేయాలి. కూరగాయలు పండించే రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి. – గడ్డం సతీశ్‌రెడ్డి, బండ దొన్కల్ మోర్తాడ్(బాల్కొండ): యాసంగి సీజన్లోనూ రైతు లు సన్నరకం వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తామని ప్రకటించడంతో దొ డ్డు రకాల స్థానంలో సన్నాలకే ప్రాధాన్యమిస్తున్నా రు. అయితే, గత యాసంగి సీజన్లో విక్రయించిన సన్నరకాలకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదు. కేవ లం వర్షాకాలం సీజన్ పంటకే బోనస్‌ను వర్తింపజేశారు. ఈసారి యాసంగిలో కొనుగోలు చేసే సన్నరకాలకు బోనస్ చెల్లిస్తారా లేదా అనే విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సన్న రకాలైన సూపర్ సీడ్, సూపర్ అమాన్, జై శ్రీరాం, కునారం రకాలను సాగు చేసేందుకు విత్తనాలను కొనుగోలు చేశారు. కొన్ని సీడ్ కంపెనీలు రైతులతో సన్నాలు, దొడ్డు రకాలను సాగు చేయిస్తున్నాయి. సీడ్ రకం సాగు చేస్తే రైతులకు మద్దతు ధర ఎక్కువగానే చెల్లిస్తున్నాయి. సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తే అదనంగా మరో రూ.500 ప్రతి క్వింటాలుకు చెల్లిస్తామని ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నాయి. ప్రభుత్వం బోనస్ చెల్లించకపోతే కంపెనీలు ఒప్పందం ప్రకారం ధర చెల్లిస్తున్నాయి. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నా రు. అందులో 5 నుంచి 10 శాతం మాత్రమే దొడ్డు రకాలు, మిగిలిన మొత్తం సన్నరకాలు పండిస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. యాసంగిలోనూ సన్నరకాలే.. సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్న రైతులు బోనస్ చెల్లిస్తారనే నమ్మకంతో.. సన్నాల వైపే రైతు చూపు.. బోనస్ సంబరంతో రైతులు యాసంగిలోనూ సన్నరకాలను సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకునే సన్నరకం వరి విత్తనాన్ని కంపెనీలు అందుబాటులోకి తీసుకరావడంతో సన్నాల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. – వీరాస్వామి, జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి మొత్తం సాగు విస్తీర్ణంలో 85 శాతం వరి.. ఎక్కడా కనిపించని పంట మార్పిడి ఒకే పంట సాగుతో దీర్ఘకాలిక నష్టాలు ఎక్కువ -
నేటితో ప్రత్యేక పాలనకు తెర
● బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్‌లు ● సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేకాధికారుల పాలన మోర్తాడ్(బాల్కొండ): సుదీర్ఘకాలం సాగిన ప్రత్యేకాధికారుల పాలనకు సోమవారంతో తెరపడనుంది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు, వా ర్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి సుమారు 22 నెలల 20 రోజులపాటు ప్ర త్యేకాధికారుల నేతృత్వంలో పంచాయతీల ఆలనా పాలన సాగింది. జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మూడు విడతల్లో పంచా యతీ ఎన్నికలను నిర్వహించినా అన్ని గ్రామాలలో ఒకేరోజు పదవీ బాధ్యతలను అప్పగించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇన్నాళ్లూ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించిన వారి నుంచి నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నా రు. నేటి నుంచి ఐదేళ్లపాటు కొత్తగా ఎంపికై న స ర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవిలో కొనసాగనున్నారు. ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్‌పై సందేహాలు.. పంచాయతీరాజ్ నిబంధనలను గత ప్రభుత్వం స డలించగా, వాటిని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పె ట్టింది. దీంతో కొత్తగా ఎంపికై న ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెల కొంది. ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్ ఉంటుందనే ఆశ తో ఆ పదవిని దక్కించుకోవడానికి చాలా మంది పోటీపడి పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రభు త్వం నిబంధనలను మార్చితే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయంలో కొత్త మార్గదర్శకాలు వస్తేనే మార్పులకు అవకాశం ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. -
లోక్ అదాలత్‌లో 63,790 కేసుల పరిష్కారం
నిజామాబాద్ లీగల్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 63,790 కే సులు పరిష్కారమయ్యాయి. 38 మోటార్ వెహికిల్ పిటిషన్లను పరిష్కరించి రోడ్డు ప్రమాద బాధితుల కు రూ.3 కోట్ల 60 వేల పరిహారాన్ని అందించారు. 42 సివిల్ కేసులు, 8,579 క్రిమినల్ కేసులు, 55,169 ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించారు. కేసుల పరిష్కారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరో స్థానంలో నిలిచింది. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని మార్గమని జిల్లా ఇన్ చార్జి జడ్జి డి. దుర్గాప్రసాద్ అన్నారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌తో ఇరుపక్షాలకు సరై న న్యాయం లభిస్తుందన్నారు. బార్ అధ్యక్షుడు సా యిరెడ్డి, జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సాయిసుధా, డీసీపీ బస్వారెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి గోపీకృష్ణ, మేజిస్ట్రేట్లు కుష్బు ఉపాధ్యాయ, శ్రీనివాస్‌రావు, హరికుమార్, చైతన్య, కీర్తిరాజ్, బార్ కార్యదర్శి మాణిక్ రాజు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్లపై పోలీసులు 50 శాతం రాయితీ ఇవ్వకపోవడంతో వాహనదారులు నిరాశతో వెనుదిరిగారు. -
బంగారు దుకాణాల్లో భారీ చోరీ
● 16 కిలోల వెండి, 34 తులాల బంగారం.. ● రూ.లక్ష నగదు అపహరణ ● బోధన్ పట్టణంలో ఘటనబోధన్: పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న రెండు బంగారు దుకాణాల్లో దుండగు లు భారీ చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం అర్ధరాత్రి వేళ సీసీ కెమెరాలను పక్కకు మళ్లించి రెండు దుకాణాల షట్టర్ల తాళాలు పగులగొట్టారు. ప్రగతి బంగారు, వెండి దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు నాలుగు తులాల బంగారం, 6 కిలోల వెండి, రూ.20 వేల నగదు, శివ బంగారు దుకాణంలో నుంచి 30 తు లాల బంగారం, 10 కిలోల వెండి, రూ.80 వేల నగదు దోచుకెళ్లారు. దుకాణాల యజమానులు ఆదివారం ఉద యం పోలీసులకు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీములతో పోలీసులు విచారణ చేపట్టారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు ధరించిన నలుగురు దుండగుల కదలికలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బాధితుల ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గాంధీ పేరును రూపుమాపే కుట్ర
నిజామాబాద్ రూరల్: ఉపాధిహామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగింపును కాంగ్రెస్ శ్రేణులు ఖండించాయి. ఏఐసీసీ పిలు పు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపాయి. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో గాంధీచౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నగేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ దేశానికి అందించిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరని, 2029లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగా నే ఉపాధి పథకానికి మహాత్ముని పేరును మళ్లీ పెడతామన్నారు. గాంధీ పేరును దేశంలో రూ పుమాపేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే ఉపాధి హామీ పథకం పేరు మార్పు అని మండిపడ్డారు. ఇప్పటికే రా జ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉర్దూ అకాడమీ చైర్మర్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు మన్మోహన్సింగ్ తీసుకువచ్చిన ఉపాధిహామీ పథకం ద్వారా ఎంతో మందికి పని లభించిందన్నారు. ఉపాధి హామీ పథకం లాగానే మహాత్మాగాంధీ ఫొటో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేసి చూపించాలని అన్నారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్, నాయకులు గోపి, వేణురాజ్, యాదగిరి, లింగం, శ్రీనివాస్, నర్సారెడ్డి, ము త్యంరెడ్డి, బలరాజ్, రాములు, భూమేశ్, రేవతి, మోయిన్, ఎజాజ్, పూల ఉష, చంద్రకళ, విజయలక్ష్మి, ప్రీతం, రాజేంద్రప్రసా ద్, అష్రఫ్, మలైకా, శుభం, మహేందర్, రమేశ్, రాజ్‌గగన్, బాలనర్సయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పథకం నుంచి పేరు తొలగింపు తగదు ఆయన దేశానికి అందించిన సేవలను ప్రజలు మరువరు 2029లో అధికారంలోకి రాగానే ‘ఉపాధి’ పథకానికి మహాత్ముని పేరు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన.. గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం


