Bollywood
-
ఆడిషన్ ఇవ్వను.. అవకాశాలు అడుక్కోనంటున్న హీరోయిన్
టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు... ప్రతీ హీరోయిన్‌కు తనదంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసినవారికి తిరుగుండదు. అలా తెలియని వాళ్లు మాత్రం... ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ... చేరుకోవాల్సిన స్థాయిల్ని చేరుకోలేక దొరికిన స్థాయితో సంతృప్తి చెందుతుంటారు. అలాంటి రెండో కోవలోకి వస్తుంది బాలీవుడ్ నిన్నటి తరం నటి శిల్పా శెట్టి కుంద్రా (Shilpa Shetty). తెలుగులో తళుక్కుమన్న హీరోయిన్బాజీగర్ లాంటి బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చినా శిల్పాశెట్టికి బాలీవుడ్లో స్టార్డమ్ దక్కలేదు. ఉత్తరాది హీరోయిన్లలో తక్కువ మందికే సాధ్యమైన విధంగా టాలీవుడ్ సహా దక్షిణాదిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసినా ఇక్కడా పెద్దగా పేరు రాలేదు. వెంకటేష్‌తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో అజాద్, వీడెవడండీ బాబు వంటి పలు తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి తళుక్కుమంది. ఇప్పటికీ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్న ఈ యోగా క్వీన్... సినిమాల కంటే యోగా వీడియో ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని చెప్పొచ్చు. బిగ్‌బాస్ గెలిచిన ఫస్ట్ బ్యూటీఅలాగే సినిమాలకు మరోవైపు... ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషల్లో చిన్నితెరపై స్థిరపడిపోయిన బిగ్ బాస్‌కు పెద్దన్న లాంటి అంతర్జాతీయ బిగ్ బ్రదర్ సీజన్‌ను తొలిసారి గెలుచుకున్న ఏకైక భారతీయ నటి శిల్పాశెట్టి మాత్రమే కావడం గమనార్హం. తాజాగా లండన్ వెళ్లి రిలాక్స్ అయి తిరిగి వచ్చింది. భారతదేశంలో తన కుటుంబంతో కలిసి లోహ్రీ, మకర సంక్రాంతిని జరుపుకుంది. ప్రస్తుతం కన్నడ భాషలో కెడి ది డెవిల్ చిత్రంతో అరంగేట్రం చేస్తోందీ 49 ఏళ్ల నటి.ఆడిషన్స్ ఇవ్వనుబిజీ బిజీగా గడిపే రోజుల్లో చాలా అవసరమైన విరామంగా తన రిలాక్స్డ్ ట్రిప్‌ని అభివర్ణించింది. బాలీవుడ్ సరే... బిగ్ బ్రదర్ ద్వారా అంతర్జాతీయంగా పేరు వచ్చినప్పటికీ తనకెందుకు హాలీవుడ్ అవకాశాలు రావడం లేదు? ఈ సందర్భంగా ఇదే ప్రశ్నను ఒక ఇంటర్వ్యూలో ఆమె ముందుంచితే... తాను అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చే పరిస్థితిలో లేనని తేల్చి చెప్పింది. తాను కష్టపడి పనిచేసినందుకు తనకు దక్కినదానితో సంతృప్తిగా ఉన్నానని చెప్పింది. ఓపిక లేదుహాలీవుడ్ కోసమో మరో చోటో ఆఫర్ల కోసం ఆడిషన్ కు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తన మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో బాజీగర్ (1993) వంటి కమర్షియల్ హిట్లు లైఫ్ ఇన్... ఎ మెట్రో (2007) అప్నే (2007) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో కనిపించానని... ఇలా 30 ఏళ్ల పని తర్వాత, కొత్తగా ప్రారంభించే ఓపిక తనకు లేదని పేర్కొంది. నా టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే తన గత చిత్రాలను చూడమని మాత్రమే తాను చెప్పగలనని అంటోంది. కుటుంబానికే ప్రథమ స్థానంతాను సరిగ్గా సరిపోతుంటే, ఆడిషన్ చేయవలసిన అవసరం లేదంది. ఏదేమైనా... తన జీవితంలో ఇక తన కుటుంబానికి మొదటి స్థానం అని శిల్పా నొక్కి చెప్పింది. పని కోసమో మరింత పేరు ప్రతిష్టల కోసమో ఆరాటపడుతూ ఎక్కువ కాలం తన పిల్లలకు దూరంగా ఉండడం తన వల్ల కాదని తేల్చి చెప్పింది. తన ప్రాధాన్యతల గురించి శిల్పాశెట్టి చాలా స్పష్టంగా ఉందనేది నిస్సందేహం..చదవండి: ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్ -
సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై(Saif Ali Khan) దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంతసమయం క్రితం అరెస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు(Bandra Police) రంగంలోకి దిగారు. సుమారు 36 గంటల్లో అతన్ని బాంద్రా ప్రాంతంలోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందుతుడిని పోలీసులు విచారిస్తున్నారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద అతనిపై పోలీసులు కేసు పెట్టారు. సైఫ్‌పై దాడి ఘటనలో మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్ ఆరెస్ట్)దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే, తాజాగా నిందితుడు పట్టుబడటంతో మరిన్ని వివరాలు వెళ్లడి అయ్యే ఛాన్స్ ఉంది. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలోనే సైఫ్‌పై కత్తితో విచక్షణారహితంగా నిందితుడు పొడిచాడు. -
ముంబైలో బాలీవుడ్ ప్రముఖులపై ఇన్ని దాడులు జరిగాయా!
బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై జరగిన దాడితో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంతటి ఘోరం జరగడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. గ్యాంగ్‌స్టర్స్‌తో ఒకప్పుడు నిండిపోయిన ముంబైలో కొన్నేళ్ల తర్వాత ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే, గతంలో కూడా ఇలాంటి దాడులో బాలీవుడ్ నటీనటులపై జరిగాయి.పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్ చమ్కీలాపై తూటాల వర్షంభారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా.. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.క్యాసెట్ కింగ్‌పై కాల్పులు‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్‌ను 1997 ఆగస్టు 12న దుండగులు కాల్చి చంపారు. ఆ సమయంలో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సబర్బన్ అంధేరీలోని శివాలయాన్ని ప్రతిరోజూ రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) దర్శించుకునేవారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.బుల్లెట్ల గాయాలతోనే ఆసుపత్రికి వెళ్లిన స్టార్ హీరో తండ్రి2000వ సంవత్సరం రోషన్ కుటుంబానికి చేదు గుర్తులనే మిగిల్చింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం కహో నా.. ప్యార్ హై అతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే కొద్ది రోజులకే వారికి పెద్ద ప్రమాదమే ఎదురైంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్‌పై ముంబైలోని అతని కార్యాలయం వెలుపల అండర్ వరల్డ్‌తో సంబంధం ఉన్న కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతనికి రెండు బుల్లెట్లు తగిలినప్పటికీ ఎంతో వీరోచితంగా తన కారులోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాడు. అలా ప్రాణాలతో ఆయన బటయపడ్డాడు.షారూఖ్ ఖాన్‌కు పలుమార్లు హెచ్చరికలుబాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. 1990ల్లో షారుక్‌ను అండర్‌వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్‌స్టర్ అబూసలేం అనేకసార్లు షారుఖ్‌కు వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ, ఖాన్ మాత్రం చాలా ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడారు. సల్మాన్ ఖాన్‌కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే వారి నుంచి షారుఖ్ ఖాన్‌కు కూడా గతంలో వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్‌ఫోన్‌కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు.ప్రీతీజింటా ధైర్యం2001 సమయంలో అండర్వరల్డ్కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతీజింటా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో తను నటించిన 'చోరీచోరీ చుప్కే చుప్కే' సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఆమె ఎదుర్కొంది. ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన నిర్మాత నజీమ్ రిజ్వీతో పాటు ఫైనాన్షియర్ భరత్ షా అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ నుంచి వచ్చిన డబ్బుతో సినిమా తీసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు విచారణ సమయంలో రూ.50లక్షల కోసం తనను డిమాండు చేస్తూ బెదిరింపులు వచ్చాయని కోర్టులో ఆమె చెప్పారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, మహేష్ మంజ్రేకర్ వంటి వారితో సహా ఇతర బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, ప్రీతీ మాత్రమే కోర్టుకు తెలిపింది. అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకెళ్లారు. -
నిలకడగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనాకపూర్ ఖాన్‌తో కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దుండగుడి దాడిలో గాయపడి రక్తమోడుతున్న సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పనిమనుషులు వెంటనే ఆటోలో సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బలమైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. సైఫ్‌పై దాడిపట్ల బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు సైఫ్‌పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. వీపున తగిలించుకున్న ఓ బ్యాగ్‌తో అతడు పారిపోతున్న దృశ్యాలు ఆరో అంతస్తులో తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల డేటాను పోలీసులు వడపోశారు. దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పనిమనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలేం జరిగింది? దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్రనుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫ్‌ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు సైఫ్ ఫ్లాట్‌లో ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ కుమారుడి గదిలో నాలుగు గంటలపాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి, అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనానికి ప్రయతి్నంచాడని తెలిపారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. ఆరు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చెయ్యి, మెడ కుడి భాగంలో రెండు లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు. నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ(శరద్ పవార్ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్‌పై దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతిభద్రతల పరిరక్షణపై ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబైలో ఎవరికీ రక్షణ లేదని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. -
సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. సీసీటీవీల్లో నిందితుడి దృశ్యాలు
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై ఇవాళ తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.ముంబై పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించగా.. ఆయన సిబ్బంది గట్టిగా అరవడంతో మేల్కొన్న సైఫ్.. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. -
సైఫ్ ఇంటికి ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబయలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే దర్యాప్తులో భాగంగా ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సైఫ్ ఇంటిని పరిశీలించారు. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఇప్పటికే ఈ దాడిలో ఇద్దదు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సైఫ్ ఇంటిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ (Daya Nayak) కూడా ఉన్నారు. బాంద్రాలోని సైఫ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కాగా.. ముంబయి అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా దయా నాయక్‌కు పేరుంది.అసలు ఎవరీ దయా నాయక్..కర్ణాటకలోని ఉడిపి దయా నాయక్ స్వస్థలం. 1979లో ఆయన ఫ్యామిలీ ముంబయి షిఫ్ట్ అయింది. అక్కడే అంధేరిలోని కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1995లో పోలీస్ పరీక్షల్లో విజయం సాధించారు. మొదటిసారి ముంబయిలోని జుహు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధుల్లో చేరారు.దయా నాయక్ ఉద్యోగంలో చేరేసరికి అండర్‌వరల్డ్ పేరుతో ముంబయిలో హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే చోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. డిపార్ట్మెంట్లోనూ ఆయన పేరు ఓ రేంజ్లో వినిపించింది. అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌కు పనిచేస్తున్న దాదాపు 80 మందిని దయా నాయక్ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం.सैफ अली खान पर हमले पर मुंबई पुलिस अधिकारी दया नायक ने कहा...#SaifAliKhan #KareenaKapoorKhan #SaraAliKhan #IbrahimAliKhan #MumbaiPolice #mumbaiattack #DayaNayak pic.twitter.com/RVCEl7qzxJ— CNBC-AWAAZ (@CNBC_Awaaz) January 16, 2025 -
రిలీజ్‌కు సిద్ధమైన వివాదాస్పద మూవీ.. సినీ ప్రియులకు బంపరాఫర్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన పొలిటికల్ మూవీ ఎమర్జన్సీ. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ సినిమా విడుదల రోజు టికెట్లను రూ.99 లకే అందుబాటులో ఉంచనున్నట్లు కంగనా రనౌత్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్టర్‌ను షేర్ చేసింది. రిలీజ్ రోజే ఈ ఆఫర్ ప్రకటించడం విశేషం. ఇటీవల సోనూ సూద్ సైతం ఫతే సినిమాకు ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించాడు. ఈ విషయంలో సోనూ సూద్‌నే కంగనా రనౌత్ ఫాలో అయినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.17th jan, #emergency day 🇮🇳 pic.twitter.com/71dWpvnGGk— Kangana Ranaut (@KanganaTeam) January 16, 2025వివాదాలతో ఆలస్యం..ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు నడుస్తున్నాయి. ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ కొందరు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. సెన్సార్ బోర్డు చెప్పిన ఆదేశాలు పాటించడంతో ఎమర్జెన్సీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఎమర్జన్సీ వీక్షించిన నితిన్ గడ్కరీ..ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎమర్జన్సీ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ప్రత్యేక షోను ఏర్పాటు చేయగా.. కంగనా రనౌత్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ మూవీని చూశారు. -
Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటనలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసేందుకు వచ్చిన వ్యక్తి నిన్న రాత్రే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రంతా ఇంట్లోనే దాక్కున్న దొంగ తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించాడు. సైఫ్ అలీ ఖాన్ పిల్లల బెడ్రూమ్ దగ్గరే దుండగుడు పనిమనిషితో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది.ఆరుసార్లు పొడిచి..ఆ అలికిడి గమనించిన నటుడు దుండగుడిని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. ఈ సమయంలో దొంగ సైఫ్ అలీఖాన్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు రెడీగా లేకపోవడంతో రక్తమోడుతున్న తండ్రిని ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan) ఆటోలో తీసుకెళ్లాడు. ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి!వెన్నెముకకు సర్జరీఅతడిని పరీక్షించిన వైద్యులు సైఫ్ వెన్నెముకలో కత్తి మొన విరిగినట్లు గుర్తించారు. వెన్నెముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి మొనను సర్జరీ ద్వారా తొలగించారు. మెడపై అయిన లోతైన గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.సీసీటీవీ ప్రకారం..సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. ఘటన జరగడానికి రెండు గంటల ముందు వరకు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి దొంగ నిన్న రాత్రే ఇంట్లోకి చొరబడ్డాడని చెప్తున్నారు. దీంతో సైఫ్ శత్రువులు ప్లాన్ ప్రకారం అతడిపై దాడి చేయించారా? లేదా తెలిసినవాళ్లే ఈ పని చేయించారా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సైఫ్ అలీ ఖాన్ ఇటీవల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరిస్తున్నాడు. తెలుగులో దేవర సినిమాలో విలన్‌గా నటించాడు.సైఫ్ వ్యక్తిగత విషయానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్ 1991లో అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి సారా, ఇబ్రహీం అని ఇద్దరు సంతానం. సైఫ్- అమృత 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్.. కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.చదవండి: బ్లాక్‌బస్టర్ పొంగల్.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే? -
‘‘మోస్ట్ అవైటెడ్ మూవీ’’లో ప్రభాస్ సినిమాలకి టాప్ ప్లేస్
ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల నుంచి ప్రేక్షకాదరణను అనుసరించి టాప్ హిట్స్, టాప్ ఫ్లాప్స్ అంటూ జాబితాలు ప్రకటించడం మామూలే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను తాజాగా ప్రకటించింది. సినిమాలు, టీవీ షోలు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి పేజ్‌కి ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకులున్నారు. తమ వీక్షకుల ద్వారా ఈ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వాటిలో నెం.1గా నిలిచింది సికందర్.ఐఎండిబి విడుదల చేసిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌ను పరిశీలిస్తే...1. సికందర్, 2. టాక్సిక్,3. కూలీ,4. హౌస్ ఫుల్ 5. బాఘీ, 6.రాజా సాబ్, 7. వార్ 2 8. ఎల్2: ఎంపురాన్ 9. దేవా 10. చావా 11. కన్నప్ప 12. రెట్రో 13. థగ్ లైఫ్ 14. జాట్ 15. స్కై ఫోర్స్ 16. సితారే జమీన్ పర్ 17. థామా 18. కాంతారా ఏ లెజెండ్: చాప్టర్ 1 , 19. ఆల్ఫా 20. తండెల్ఈ జాబితాలోని 20 టైటిల్స్ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్ ఫుల్ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించగా, రష్మిక మందన్న3 సినిమాలు సికందర్ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17)లలో, మోహన్ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు.నెంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది...మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్‌లో నెం.1 గా నిలిచినందుకు సికందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2025 ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో సికందర్ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతని ఎనర్జీ, అంకితభావం సికందర్ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా తీర్చిదిద్దాయి. అందుకు సహకరించిన నిర్మాత సాజిద్ నదియాడ్ వాలాకు ధన్యవాదాలు. సికిందర్ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దాం. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను’’ అంటూ చెప్పారు. -
మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఎక్కువ లాభపడింది తెలుగు సినిమానే! బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, హనుమాన్, కల్కి 2898 ఏడీ సినిమాలు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ అదరగొట్టాయి. కన్నడ మూవీ కేజీఎఫ్ కూడా ఆలిండియా స్థాయిలో అదరగొట్టింది.వెనకబడ్డ మలయాళ మూవీస్అయితే మలయాళ చిత్రాలు (Malayalam Movies) మాత్రం ఆ స్థాయి రేంజ్‌ను అందుకోలేకపోతున్నాయి. అన్ని చోట్లా పెద్ద పెద్ద స్టార్స్‌ను హీరోగా పెట్టి సినిమాల్ని ముందుకు తీసుకువెళ్తే మలయాళంలో మాత్రం కంటెంటే కింగ్ అని, దాని వల్లే కాస్త వెనకబడ్డామంటున్నాడు హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan). హిందీలో మార్కెట్ లేకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడుతూ.. మా దగ్గర బడ్జెట్ అనేది ప్రధాన సమస్య. ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే ఆలోచిస్తారు. ఇంతకుముందెవరైనా ఎక్కువ పెట్టుబడితో హిట్ కొట్టారా? అని ఉదాహరణలు వెతుకుతారు.స్క్రిప్ట్, హీరో.. ఇంకా!సినిమా కమర్షియల్‌గా హిట్ కావాలంటే అందులో యాక్షన్ ఉండాల్సిందే! ఎందుకంటే యాక్షన్ సినిమాల్ని చాలా మంది ప్రేక్షకులు ఇష్టపడతారు. అలాంటి యాక్షన్ కథా చిత్రాన్ని తీయాలంటే ముందుగా ఒక స్టార్ హీరో కావాలి. అందరూ మెచ్చేటువంటి బలమైన స్క్రిప్ట్ కావాలి. సినిమాను భారీ ఎత్తున నిర్మించే అద్భుతమైన నిర్మాత కావాలి. ఇలా చాలా అంశాలు అనుకూలిస్తేనే అది సాధ్యమవుతుంది అని ఉన్ని ముకుందన్ చెప్పాడు.గతేడాది రూ.700 కోట్ల నష్టం2024లో పలు మలయాళ సినిమాలు సక్సెస్‌ను చూశాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం మలయాళ ఇండస్ట్రీకి నష్టాలే ఎక్కువగా వచ్చాయి. ఈ మేరకు ఓ నివేదికను కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. 2024లో 199 మలయాళ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కేవలం 26 మాత్రమే హిట్టయ్యాయి. ఓవరాల్‌గా అన్ని సినిమాలు తెరకెక్కించేందుకు అయిన ఖర్చు రూ.1000 కోట్లు అయితే అందులో రూ.300 కోట్లు మాత్రమే కలెక్షన్ల రూపంలో వెనక్కు వచ్చాయి. ఈ లెక్కన మలయాళ ఇండస్ట్రీ రూ.700 కోట్లు పోగొట్టుకుంది. హిట్ సినిమాల జాబితాలో మంజుమ్మల్ బాయ్స్, ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), ఆవేశం, ప్రేమలు, ఏఆర్ఎమ్, కిష్కింద కాండం, గురువాయూర్ అంబలనడయిల్, వర్షంగళక్కు శేషం సినిమాలున్నాయి.కేరళవాసి.. ఆ సినిమాతో క్లిక్ఉన్ని ముకుందన్ విషయానికి వస్తే.. కేరళలో పుట్టి పెరిగిన ఇతడు సీడన్ (2011) అనే తమిళ సినిమాతో కెరీర్ ఆరంభించాడు. అదే ఏడాది బాంబే మార్చి 12 మూవీతో తన మాతృక భాష మలయాళంలో ఎంట్రీ ఇచ్చాడు. మల్లు సింగ్ మూవీతో సెన్సేషన్ అయిన ఉన్ని.. విక్రమాదిత్య, కేఎల్ 10 పట్టు, స్టైల్, ఒరు మురై వంతు పార్థాయ, అచయన్స్, మాలికాపురం చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు.తెలుగులోనూ..తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఇటీవలే మార్కోతో హిట్ అందుకున్న అతడు గెట్ సెట్ బేబీ అనే సినిమా చేస్తున్నాడు. 2022లో మెప్పడియాన్ మూవీతో ఉత్తమ నిర్మాతగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నాడు. ఈయన చివరగా మార్కో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వయొలెన్స్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మూవీకి హిట్ టాక్ రావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.చదవండి: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్ -
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరగడం కలకలం రేపుతోంది. ముంబైలోని ఆయన ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి సైఫ్‌ను కత్తితో పలుమార్లు పొడిచి పారిపోయాడు. ఈ దాడిలో ఆయనకు ఆరుచోట్ల గాయాలయ్యాయి. అందులో రెండు చోట్ల లోతైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆనయ్ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక పక్కనే తీవ్రగాయం కావడంతో వైద్యులు నటుడికి సర్జరీ చేస్తున్నారు. దొంగతనం చేసే క్రమంలోనే..ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడు దొంగతనానికి వచ్చాడా? లేదా పక్కా మర్డర్ ప్లాన్‌తోనే సైఫ్‌పై దాడి చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనపై కరీనా కపూర్ (Kareena Kapoor) టీమ్ ఓ లేఖ విడుదల చేసింది. సైఫ్- కరీనా ఇంట్లో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునే క్రమంలో సైఫ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లోని మిగతా సభ్యులు క్షేమంగానే ఉన్నారు. పోలీసుల విచారణ జరుగుతోంది అని లేఖలో పేర్కొన్నారు.షాక్‌కు గురయ్యాఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సైఫ్ సర్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. చిరంజీవి (Chiranjeevi) సైతం సైఫ్ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి నన్నెంతగానో కలిచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశాడు.హీరో నుంచి విలన్‌గా..సైఫ్ అలీఖాన్ ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. కానీ ఇటీవల మాత్రం ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే మెప్పిస్తున్నాడు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించిన దేవర చిత్రంలో విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో యాక్ట్ చేశాడు. వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. Shocked and saddened to hear about the attack on Saif sir.Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి! -
ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెబుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. చోరీ కోసం వచ్చి దాడి!ముంబై పోలీసుల కథనం ప్రకారం.. సైఫ్ అలీకాన్ ఇంట్లో గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించిన విషయంలో ఆయన సిబ్బంది గుర్తించింది. శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్.. సిబ్బందితో కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. సైఫ్ ఒంట్లో తీవ్రంగా గాయాలయ్యాయని.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చోరీనా.. కుట్రనా?సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడు..పరారీలో ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘దాడి జరిగిందనే సమాచారం తెలిసిన వెంటనే మేము సైఫ్ అలీఖాన్ నివాసానికి వెళ్లాం. అప్పటికే దుండగుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్‌కి లీలావతి ఆస్పత్రికి తరలించారు. తన ఒంటిపై కత్తి పోట్లు పడ్డాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం’ అని ముంబై పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు దొంగతనం కోసమే వచ్చాడా లేదా దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ దిగ్భ్రాంతిసైఫ్ అలీఖాన్ దాడిపై హీరో ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిందనే విషయం తెలిసి షాక్‌కు గురయ్యయానని, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రంలో సైఫ్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దేవర 2 చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. Shocked and saddened to hear about the attack on Saif sir.Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025 విలన్‌గా రాణిస్తున్న సైఫ్ అలీఖాన్ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సైఫ్ అలీఖాన్..ఇటీవల నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పిస్తున్నారు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల దేవర చిత్రంలో విలన్‌గా నటించాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో భైరవ పాత్రను సైఫ్ పోషించాడు. సినిమా రిలీజ్ తర్వాత సైఫ్ పాత్రకి మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. 1991లో, సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. సైఫ్, అమృతలకు ఇద్దరు పిల్లలు - సారా, ఇబ్రహీం. 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్ కరీనాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వాంతులు చేసుకున్న హీరోయిన్!
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో హీరోయిన్ని ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితం చేస్తున్నారు. హీరోతో ఒకటి రెండు రొమాంటిక్ సీన్స్, మూడు నాలుగు పాటల్లో డ్యాన్స్.. అంతవరకే హీరోయిన్ పాత్రను తెరపై చూపిస్తున్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్ పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండేది. రొమాన్స్‌తో కాకుండా నటనతో మెప్పించేవాళ్లు. అలాంటి వాళ్లలో బాలీవుడ్ నటి రవీనా లాండన్ ఒకరు. 1991లో పత్తర్ కే ఫూల్ సినిమాతో వెండి తెరకు పరిచమైన ఈ బ్యూటీ..తనదైన నటనతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు లిప్‌లాక్ సీన్ చేయలేదు. అంతేకాదు రొమాంటి సన్నివేశాలకు కూడా దూరంగా ఉండేది. కానీ అనుకోకుండా ఓ హీరో లిప్‌లాక్ ఇచ్చాడట. అతని చేసిన పనికి వాంతులు చేసుకోవడమే కాకుండా.. 100 సార్లు ముఖం కూడా కడుక్కుందట.అనుకోకుండా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ లిప్‌లాక్ సంఘటన గురించి రవీనా చెప్పేకొచ్చింది. షూటింగ్లో భాగంగా ఓ హీరో పెదాలు..తన పెదాలను తాకాయట. దీంతో వెంటనే రవీనా వాష్‌రూమ్‌కి వెళ్లి వాంతులు చేసుకుందట. ‘నాకు బాగా గుర్తుంది. ఓ సినిమా షూటింగ్లో హీరో అనుకోకుండా నాకు లిప్‌లాక్ ఇచ్చాడు. హీరో నన్ను రఫ్‌గా హ్యాండిల్ చేయాల్సిన సీన్ అది. ఆ సీన్ షూటింగ్ సమయంలో హీరో పెదాలు నా పెదాలను టచ్ చేశాయి. అక్కడ కిస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. అది నేను తట్టుకోలేకపోయాను. వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి వాంతులు చేసుకున్నాడు. అలాగే దాదాపు 100 సార్లు నా ముఖాన్ని కడుక్కున్నాను. అనుకోకుండా జరిగినా..నేను దాన్ని తీసుకోలేకపోయాను. ఆ విషయంలో హీరో తప్పేం లేదు. నిజంగానే అనుకోకుండా అలా జరిగిపోయింది. వెంటనే హీరో నాకు సారీ కూడా చెప్పాడు’అని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది.కూతురుకి మినహాయింపురవీనా టాండన్ తన కెరీర్ మొత్తంలో ఒక్క లిప్‌లాక్ సీన్ చేయలేదు. రొమాంటిక్, ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని కెరీర్ ప్రారంభంలోనే కండీషన్ పెట్టుకుందట. అలాంటి పాత్రలు వస్తే.. సున్నితంగా తిరస్కరించేదట. తను పెట్టుకున్న కండీషన్ వల్ల చాలా పెద్ద సినిమాలను మిస్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో రవీనా టాండన్ చెప్పింది. అయితే తన కూతురు విషయం మాత్రం ఎలాంటి కండీషన్స్ పెట్టాలనుకోవట్లేదని రవీనా చెబుతోంది. రవీనా ముద్దుల తనయ రాషా తడానీ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది. ఓ క్రేజీ ప్రాజెక్టుకు సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే రొమాంటిక్ సీన్ల విషయంలో ఎలాంటి కండీషన్ పెట్టట్లేదట. పాత్ర డిమాండ్ చేస్తే అలాంటి సీన్లు కూడా చేసేందుకు తనకు అభ్యంతరం లేదని రవీనా అంటోంది. రవీనా సినిమా విషయాలకొస్తే.. ఆ మధ్య కేజీఎఫ్2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ సీనియర్ హీరోయిన్..ప్రస్తుతం డైనస్టీ అనే వెబ్ షో చేస్తోంది. View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
రొడ్డకొట్టుడు సినిమాలవి:పుష్ప2, టాలీవుడ్‌పై హృతిక్ తండ్రి విసుర్లు!
పుష్ప2 అనూహ్య విజయం తర్వత బాలీవుడ్ ప్రముఖులు టాలీవుడ్, దక్షిణాది సినిమాలపై ఒక్కసారిగా ఒకరొకరుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. దీనికి కారణం... గత కొంత కాలంగా అనూహ్య స్థాయిలో టాలీవుడ్, దక్షిణాది చిత్రపరిశ్రమ ఊపిరి సలపనివ్వని రీతిలో భారతీయ బాక్సాఫీస్ ను బద్ధలు కొట్టడం అత్యధిక శాతం మంది బాలీవుడ్ ప్రముఖులకు మింగుడు పడని విషయంగా మారడం..కొన్నేళ్లకు ముందు.. ఉత్తరాది చిత్ర పరిశ్రమ... సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కనీస స్థాయిలో కూడా గుర్తింపు లేదు.... సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి సైతం ఉత్తరాదిలో మనకు విలువ లేదని బహిరంగంగా వాపోయిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కాస్త ఆలస్యంగానైనా బాహుబలితో మొదలైన ఊచకోత...సాహో, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి(Kalki 2898AD) ... ఇలా వరుస పెట్టి తెలుగు సినిమాలు అస్త్రశస్త్రాలతో కొనసాగిస్తూ వచ్చాయి. అయినా సరే, జవాన్, దంగల్ వంటి కొన్ని సినిమాలను చూపిస్తూ బాలీవుడ్ జబ్బలు చరుచుకుంది. కానీ పుష్ప2(Pushpa 2) తో ఆ మిణుకు మిణుకు మంటున్న వెలుగు కూడా ఆరిపోయింది. కలెక్షన్ల సునామీ సృష్టించిన సుకుమార్ అండ్ టీం... బాలీవుడ్ లోని అన్ని రికార్డుల్నీ ఉతికి ఆరేశారు. అత్యధిక కలెక్షన్లు సాదించిన హిందీ చిత్రం అనే రికార్డ్‌తో పాటు రేపో మాపో బాలీవుడ్‌కి తనకంటూ మిగిలిన ఏకైక దంగల్ రికార్డ్‌ను కూడా మట్టికరిపించే దిశగా దూసుకుపోతున్నారు.దీంతోప్రస్తుతం టాలీవుడ్ విజయాల ముట్టడిలో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరవుతోంది. మిగిలిన తెలుగు సినిమాల విజయాల సంగతెలా ఉన్నా... పుష్ప 2 విజయం హిందీ చిత్రపరిశ్రమను ఉలిక్కిపడేలా చేసి బాలీవుడ్ హీరోల అస్తిత్వాన్నే ప్రశ్నించేలా కుదుపు కుదిపింది అనేది నిజం. ‘‘మా హీరోలకు సిక్స్‌ప్యాక్స్ చూపించడం తప్ప నటించడం చేతకాదు. పుష్ప 2 లాంటి సినిమాలు తీయడం మా వల్ల కాదు’’ అంటూ బాలీవుడ్ నటి కంగన రనౌత్ వ్యాఖ్యానించడం, అల్లు అర్జున్ తనకు అభిమాన నటుడు అంటూ సాక్షాత్తూ అమితాబ్ బచ్చన్ కితాబివ్వడం... వంటివి బాలీవుడ్‌కి జీర్ణించుకోలేని విషయాలుగా మారాయి. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు నాగవంశీ ..ప్రస్తుతం బాలీవుడ్ నిద్రలేని రాత్రులు గడుపుతోందంటూ మూలిగే నక్కమీద తాటిపండు అది కూడా బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సమక్షంలోనే వేసేశారు.ఈ నేపధ్యంలో ఒకరొకరుగా బాలీవుడ్ చిత్ర ప్రముఖులు టాలీవుడ్‌పై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే సీనియర్ నటుడు, నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి... రాకేష్ రోషన్(Rakesh Roshan) పుష్ప2 సహా దక్షిణ భారత చిత్రాల విజయం గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, ‘‘దక్షిణాది సినిమాలు చాలా గ్రౌన్దేడ్ (మూలాలకు కట్టుబడిన సాదాసీదా)గా ఉన్నాయి, అవి పాతదైన పంధాలో వెళుతూ.. పాట యాక్షన్డైలాగ్భావోద్వేగాలు... ఇలా ఏళ్లనాటి ఫార్ములా సంబంధితంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. అవి పురోగమించడం లేదు. ఏ పాత మార్గాన్ని విచ్ఛిన్నం చేయనందున వారు విజయవంతమవుతున్నారు’’ అంటూ తీసిపారేశారు. సింపుల్‌గా చెప్పాలంటే దక్షిణాది వాళ్లు రొడ్డకొట్టుడు కధలతోనే విజయాలు సాధిస్తున్నామని, బాలీవుడ్ మాత్రం కొత్త పంధాలో వెళుతున్నామనేది ఆయన హేళన. దీనికి ఉదాహరణ గా ... తాను కహో నా...ప్యార్ హై సినిమా చేసిన తర్వాత రొమాంటిక్ సినిమాలు తీయాలని అనుకోలేదనీ.ఆ తర్వాత తాను కోయి... మిల్ గయా చేశాననీ ఆయన గుర్తు చేశారు. ఇలా తాము సవాళ్లకు ఎదురొడ్డి సినిమాలు కొత్త పంధాలో వెళుతున్నామన్నారు.అయితే టాలీవుడ్ తదితర సౌత్ ఇండియా వాళ్లు ఇలాంటి సవాళ్లు తీసుకోరని వారు సేఫ్ గేమ్ ఆడతారని అంటున్న ఆయన... బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప2, కల్కి, సాహో... వంటి ఒకదానికొకటి సంబందం లేని వైవిధ్యభరిత కధా నేపధ్యం ఉన్న సినిమాలతో టాలీవుడ్ సాగిస్తున్న జైత్రయాత్రను చూడట్టేదనుకోవాలా? ఇది గమనిస్తున్న వాళ్లు హృతిక్ రోషన్ తండ్రి మాట్లాడుతున్న మాటల్లోని డొల్లతనాన్ని ఇట్టే పసిగట్టేయగలరు అనే ఇంగితం కూడా రాకేష్‌కు లేకపోవడం దురదృష్టకరం. -
కంగనా మూవీకి షాక్.. ఆ దేశంలో బ్యాన్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన చిత్రం ఎమర్జన్సీ. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చినా ఈ చిత్రం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తానే దర్శకత్వం వహించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. హసీనా ప్రభుత్వం పడిపోయాక.. భారత్- బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమర్జన్సీ మూవీని అక్కడ బ్యాన్ చేయనున్నారని లేటేస్ట్ టాక్.ఈ ఈ చిత్రంలో ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించారు. జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పడే కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 17న బాక్సాఫీసు ముందుకు రానుంది.ఎమర్జన్సీ వీక్షించిన కేంద్రమంత్రి..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఎమర్జన్సీ మూవీని వీక్షించారు. ఆయన కోసం కంగనా రనౌత్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. (ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.ఆది నుంచి వివాదాలే..ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.సెన్సార్ బోర్డుకు ఫిర్యాదులు..ఈ సినిమా ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ పలువురు సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీంతో సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పట్లో సెన్సార్ బోర్డు తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ కంగన మండిపడ్డారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం కొత్త ఏడాదిలో థియేటర్లలో సందడి చేయనుంది. -
సంక్రాంతికి కొత్త కారు కొన్న బ్యూటీ.. భర్తతో జాలీగా..
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ (Madhuri Dixit)- డాక్టర్ శ్రీరామ్ నేనే సంక్రాంతి పండక్కి కొత్త కారు కొనుగోలు చేశారు. ఫెరారి 296 జీటీఎస్ మోడల్‌ను తమ గ్యారేజీకి తెచ్చుకున్నారు. దీని విలువ రూ.6 కోట్ల పైనే ఉంటుందని అంచనా. మాధురి దీక్షిత్ దంపతులు ఈ ఫెరారీ కారులో షికారుకు వెళ్లారు. ఎరుపు రంగు ఫెరారీ కారును భర్త నడుపుతుంటే మాధురి పక్కన కూర్చుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమామాధురి దీక్షిత్ చివరగా భూల్ భులయ్యా 3 సినిమా (Bhool Bhulaiyaa 3 Movie)లో కనిపించింది. ఈ మూవీలో విద్యా బాలన్, తృప్తి డిమ్రి, రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్, సంజయ్ మిశ్రా, అశ్విని కల్సేకర్, రాజేశ్ శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన భూల్ భులయ్యా మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దీంతో 2022లో దీనికి సీక్వెల్ తెరకెక్కింది. కార్తీక్ ఆర్యన్, కియరా అద్వానీ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కూడా సక్సెస్ అందుకుంది. దీంతో గతేడాది మూడో పార్ట్ రిలీజ్ చేశారు. ఇది కూడా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే! -
50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే!
హీరోయిన్ అమీషా పటేల్‌కు (Ameesha Patel).. ఈ ఏడాది జూన్ నెల వస్తే 50 ఏళ్లు వస్తాయి. హాఫ్ సెంచరీకి చేరువైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది. కెరీర్ మొదట్లో దర్శక నిర్మాత విక్రమ్ భట్ (Vikram Bhatt)తో డేటింగ్ చేసింది. ఐదేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన వీరు తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.ఈ ప్రేమ కూడా మధ్యలోనే..2008లో బిజినెస్మెన్ కనవ్ పూరితో లవ్‌లో పడింది. అతడు తనకెంతో స్పెషల్ అని.. తమ మధ్య మూడో వ్యక్తికి చోటు లేదని మీడియాకు చెప్పింది. తర్వాత వీరిద్దరికీ పెళ్లయినట్లు వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని ఆమె కొట్టిపారేసింది. చివరకు ఈ ప్రేమ కూడా ఎంతోకాలం నిలవలేదు. 2010లో అతడికి బ్రేకప్ చెప్పేసింది. తాను సింగిల్ అని.. ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్నా అంటూ అప్పట్లో ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.తనకంటే 20 ఏళ్లు చిన్నవాడితో లవ్?ఇలా ఏ ప్రేమా పెళ్లిదాకా రాలేదు. ఇటీవల అమీషా పటేల్ ఓ 30 ఏళ్ల యువకుడితో దుబాయ్‌లో విహరించింది. ఆ సమయంలో అతగాడితో క్లోజ్‌గా ఉన్న ఫోటోను అమీషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'నా డార్లింగ్ నిర్వాన్ బిర్లాతో.. లవ్లీ సాయంత్రం' ఆ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. వ్యాపార కుటుంబంలో జన్మించిన 'నీరవ్ బిర్లా' (Nirvaan Birla).. అమీషా పటేల్ కంటే సుమారు 20 ఏళ్ల చిన్నవాడు. వయసులో ఇంత చిన్నవాడితో డేటింగ్ చేయడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోయారు.(చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు!)అలాంటిదేం లేదుతాజాగా ఈ రూమర్లపై నీరవ్ బిర్లా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. అమీషా, నేను ప్రేమించుకోవట్లేదు. తను మా ఫ్యామిలీ ఫ్రెండ్. మా నాన్న, అమీషా చిన్నప్పటినుంచి స్నేహితులు. నేను దుబాయ్‌లో మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నాను. ఆ సాంగ్‌లో అమీషా కనిపించనుంది. అప్పుడు దిగిన ఫోటో చూసి మీ అందరూ ఏదేదో అనుకుంటున్నారు అని క్లారిటీ ఇచ్చాడు.ఎవరీ అమీషా పటేల్?ముంబైలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ కహో నా.. ప్యార్ హై (2000) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. అదే ఏడాది బద్రి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మరుసటి ఏడాది గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రంతో స్టార్ స్టేటస్ అందుకుంది. దీంతో వరుసగా హిందీలో అవకాశాలు క్యూ కట్టాయి. యే జిందగీ కా సఫర్, క్రాంతి, హమ్రాజ్, ఆప్ ముజే అచ్చే లగ్నే లగ్నే, తథాస్తు, మంగళ్ పాండే, వాదా, భూల్ భులయ్యా, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, రేస్ 2.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది.తెలుగులోనూ..తెలుగులో మహేశ్‌బాబు సరసన నాని (Naani Movie), బాలకృష్ణతో నరసింహుడు (Narasimhudu Movie), పరమవీరచక్ర (Parama Veera Chakra) మూవీస్‌లో నటించింది. 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్ హిట్ మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. గదర్ 2తో 2023లో రీఎంట్రీ ఇచ్చింది.చదవండి: డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? -
కూతురి పేరును రివీల్ చేసిన ప్రముఖ నటి.. అర్థం అదేనట!
ప్రముఖ బాలీవుడ్ నటి మసాబా గుప్తా (Masaba Gupta) గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2024 అక్టోబర్‌లో కుమార్తెకు(daughter) స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాజాగా తన ముద్దుల కూతురి పేరును రివీల్ చేసింది. మతారా అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించింది మసాబా. తన చేతికి ధరించిన గాజును కూతురి పేరు కనిపించేలా డిజైనా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా ముద్దుల కూతురు మాతారకు అప్పుడే 3 నెలలు. తన పేరు 9 మంది హిందూ దేవతల స్త్రీ శక్తులను కలిగి ఉంది. తన కూతురికి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అంతేకాదు మా కళ్లకు నక్షత్రం లాంటిది." అంటూ పోస్ట్ చేసింది.2023లో పెళ్లి..కాగా.. మసాబా గుప్తా (Masaba Gupta), సత్యదీప్ మిశ్రా (Satyadeep Mishra) జనవరి 27, 2023న వివాహం చేసుకున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. అక్టోబర్ 10, 2024న కూతురికి జన్మనిచ్చింది.ఎవరీ మసాబా గుప్తా..?కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా అనే సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి అన్నారు. ఒక్క రోజులోనే నగరం కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్లో కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. -
బాలీవుడ్ పట్టించుకోలేదు.. మరి టాలీవుడ్?
యాడ్ షూట్‌తో మొదలై హాలీవుడ్ స్థాయికి చేరిన తార బనితా సంధూ. ప్లాట్‌ఫామ్ ఏదైనా పర్ఫామెన్స్ ప్రాధాన్యంగా వరుస సినీ, సిరీస్‌లతో దూసుకెళ్తున్న ఆమె గురించి కొన్ని విషయాలు.. బనితాది బ్రిటన్‌లో స్థిరపడిన సిక్కు కుటుంబం. పుట్టింది, పెరిగింది వేల్స్లో. లండన్, కింగ్స్ కాలేజ్‌లో ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది.తొలిసారి ‘అక్టోబర్’ హిందీ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. అది ఆమెకెలాంటి గుర్తింపునివ్వలేదు. తర్వాత చేసిన ‘సర్దార్ ఉధమ్’ కూడా అంతే.బాలీవుడ్ ఇవ్వలేని గుర్తింపు తమిళ సినిమా ‘ఆదిత్య వర్మ’ ఇచ్చింది. దాంతో ఏకంగా ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘పండోరా’లో నటించే అవకాశాన్ని అందుకుంది. తర్వాత ‘ఎటర్నల్ బ్యూటీ’ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించింది.‘బిడ్జర్టన్’తో వెబ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. అది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగు తెరకూ పరిచయం కానుంది.. ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ2’తో.విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడతా! – బనితా సంధూచదవండి: నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు -
'ఆ దేవుడి దయతో బతికిపోయాం'.. విషాదంపై హీరోయిన్ ట్వీట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా విచారం వ్యక్తం చేసింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని అన్నారు. మా పొరుగువారంతా ఇలా బాధపడతారని అనుకోలేదంటూ ట్వీట్ చేశారు ప్రీతి జింటా. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.ప్రీతి జింటా తన ట్వీట్లో రాస్తూ.' లాస్ ఎంజిల్స్‌లో మా చుట్టూ ఉన్న వారిని మంటలు నాశనం చేసే రోజు వస్తుందని నేను ఊహించలేదు. నేను బతికుండగా ఇలాంటి విషాదం చూస్తానని అనుకోలేదు. నా స్నేహితులు, కుటుంబాలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయ బరువెక్కింది. అక్కడి విధ్వంసం చూస్తుంటే ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి విషాదం సమయంలో మేమ సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ మంటల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గాలి త్వరలోనే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నా. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేస్తున్న అగ్నిమాపక శాఖ, అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సురక్షితంగా ఉండండి' అని పోస్ట్ చేశారు.కాగా.. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఇళ్లు మంటల్లో బూడిదయ్యాయి. ఈ మంటలు దాదాపు వెయ్యి ఎకరాలకు వ్యాపించాయి. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు లక్షకు పైగా నిరాశ్రయులయ్యారు. ఈ విషాద ఘటనలో దాదాపు 13 మంది మరణించగా.. 12,000 కంటే ఎక్కువ ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.కాగా.. నటి ప్రీతి జింటా అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో తన భర్త జీన్ గూడెనఫ్‌తో కలిసి అక్కడే నివసిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్‌తో రిలేషన్లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. తాజాగా అమెరికాలో వీరు నివసిస్తున్న లాస్ ఎంజిల్స్లోనే కార్చిచ్చు ఘటన జరగడంతో ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేస్తోంది.కాగా.. ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. I never thought I would live to see a day where fires would ravage neighbourhoods around us in La, friends & families either evacuated or put on high alert, ash descending from smoggy skies like snow & fear & uncertainty about what will happen if the wind does not calm down with…— Preity G Zinta (@realpreityzinta) January 11, 2025 -
త్రిప్తీ దిమ్రీ ఔట్... శ్రీశార్వరీ ఇన్
బాలీవుడ్లో ‘ఆషికీ’ మూవీ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘ఆషికీ, ఆషికీ 2’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలను టీ సిరీస్, వినేష్ ఫిల్మ్స్ నిర్మించాయి. హిట్ ఫ్రాంచైజీ కావడంతో ‘ఆషికీ 3’ని కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే ‘ఆషికీ 3’ని 2022లో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ ఏడాది సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీలను హీరో హీరోయిన్లుగా, దర్శకుడిగా అనురాగ్ బసును అనుకుంటున్నారట మేకర్స్.కానీ ఇప్పుడు టీ సిరీస్–వినేష్ ఫిల్మ్స్ ప్రతినిధుల మధ్యలో ‘ఆషికీ 3’ గురించి విభేదాలు తలెత్తాయని టాక్. దీంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరికొంత సమయం పడుతుందని బాలీవుడ్లో ప్రచారమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్గా త్రిప్తీ దిమ్రీ కూడా తప్పుకున్నారని సమాచారం. ఈ ప్లేస్‌ను బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరీ భర్తీ చేశారని భోగట్టా. మరి... ‘ఆషికీ 3’లో శార్వరీ భాగం అయ్యారా? ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్‌కు వెళ్తుందా? అనే విష యాలపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి ఉండాల్సిందే. -
హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది. బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకురవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)నెలకు రూ.10 లక్షలు ఈజీగా..దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.కొన్నిసార్లు లెక్క మారుతుందికానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్‌కు, ఈవెంట్స్‌కు, ప్రమోషన్స్‌కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.చదవండి: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
ప్రముఖ కమెడియన్‌కు బ్రెయిన్ స్ట్రోక్
ప్రముఖ కమెడియన్ టీకు తల్సానియా (Tiku Talsania)కు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దిల్ హై కీ మంతా నహీ (1991), కబీ హా కబీ నా (1993), ఇష్క్ (1997) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.గుండెపోటు కాదు!మొదటగా టీకూకు గుండెపోటు వచ్చిందని రూమర్లు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని, తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని నటుడి భార్య దీప్తి తల్సానియా పేర్కొంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఓ సినిమా స్క్రీనింగ్‌కు వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాం అని దీప్తి తెలిపింది.ఎవరీ టీకు?టీకు తల్సానియా.. ప్యార్ కె దో పాల్ (1986) సినిమాతో బాలీవుడ్లో నట ప్రస్థానం ప్రారంభించారు. కమెడియన్‌గా దిల్ హై కే మంతా నహీ, ఉమర్ 55కీ దిల్ బచ్పన్, బోల్ రాధా బోల్, అండాజ్ ఆప్న ఆప్న, మిస్టర్ బెహరా వంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత కామెడీకి కాస్త బ్రేక్ ఇచ్చి వక్త్ హమారా హై మూవీలో సీరియస్ లుక్‌లో మెప్పించాడు. దేవదాస్ మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.కూతురు కూడా నటిగా..వీర్, కూలీ నెం.1, రాజా హిందుస్తానీ, రాజు చాచా, హంగామా, బడే మియా చోటే మియా, జుడ్వా.. ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. చివరగా విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాలో కనిపించారు. టీకు కూతురు శిఖ తల్సానియా కూడా నటిగా రాణిస్తోంది. సత్యప్రేమ్ కీ కథ, వీరే దీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
నాటి రామాయణం నేటి పాత్రలతో.....
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సింగమ్ ఎగైన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన ఇతిహాసాలలో గొప్ప విలువలతో కూడుకున్న కథ రామాయణం. నాటి రామాయణాన్ని నేటి నేటివిటీతో ప్రస్తుత ప్రముఖ నటీనటులతో మళ్లీ మన ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ఇదే ప్రయత్నాన్ని గతంలో చాలా మందే చేసినా యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘సింగమ్’ సిరీస్ చిత్రానికి ఈ తరహా ప్రయోగం చేయడం మొదటిసారి. అందులోనూ బాలీవుడ్లో భారీ తారాగణంతో ఇలాంటి అంశంతో కూడిన కథ తీయడమనేది నిజంగా సాహసమనే చెప్పాలి. ముందుగా ‘సింగమ్’ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఈ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం ‘సింగమ్ ఎగైన్’. సిరీస్‌లో ఈ భాగం ప్రేక్షకుల ముందు రావడా నికి దాదాపు పదేళ్లు పట్టింది. 2011లో ‘సింగమ్’ మొదటి చిత్రం రాగా 2014లో రెండో భాగంగా ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైంది. ఆ తరువాత మూడో భాగం 2024లో ‘సింగమ్ ఎగైన్’గా వచ్చింది.అన్ని సిరీస్‌లలో కథానాయకుడిగా ప్రముఖ స్టార్ అజయ్ దేవగన్ నటించారు. ఇకపోతే ప్రస్తుత ‘సింగమ్ అగైన్’ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు కరీనా కపూర్, దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ తదితర ప్రముఖ నటులు నటించారు. రామాయణ కథనే ఇతివృత్తంగా అల్లుకున్న కథ ఇది. రామాయణంలోని పాత్రలను రిలేట్ చేస్తూ ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ స్క్రీన్‌ప్లే కొనసాగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమాలో రామాయణ కథను టీవీ షో రూపంలో చూపిస్తూ కథను నడిపిస్తారు. అప్పటి రామాయణ కథ చరిత్రతో మనకు పరిచయం.అందుకే అది రమణీయ కావ్యం. కానీ ఇప్పటి ‘సింగమ్ ఎగైన్’ రణరంగమే ప్రధాన సూత్రంగా నడిచిన కథ. ఆఖరుగా ఒక్క మాట... రామాయణ కథను నేటి తరానికి మళ్లీ చెప్పడమనేది మంచిదే కానీ, ఎన్నో భావావేశాలున్న రామాయణ మూల కథలోంచి ఒక్క శౌర్య, వీర రసం మాత్రం తీసుకుని సినిమా రూ΄పొందించడం ఏమాత్రం సమంజసమో సినిమా తీసిన దర్శక–నిర్మాతలు, చూస్తున్న మనలాంటి ప్రేక్షకులు ఆలోచించాల్సిందే. ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మీరు కూడా చూసి ఆలోచించడం మొదలు పెట్టండి. – ఇంటూరు హరికృష్ణ