breaking news
Peddapalli
-
బందోబస్తు మధ్య అంత్యక్రియలు
వెల్గటూర్(ధర్మపురి): ప్రేమ వ్యవహారం నేపథ్యంలో గురువారం హత్యకు గురైన చల్లూరి మల్లేశ్ అంత్యక్రియలు శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య గ్రామంలో నిర్వహించారు. అంతకుముందు మృతుడి తల్లిదండ్రులు రాజయ్య, భూదమ్మ మాట్లాడుతూ, కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన యువతితో తమ కుమారుడికి ప్రేమ వ్యవహారం నడుస్తుందని తెలిపారు. ఈ విషయమై గతంలో యువతి బంధువులు తమ కుమారుడిని కొట్టారని, తాము వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించగా, వారు తమ కుమారుడిపై కేసులు పెట్టించారని పేర్కొన్నారు. తర్వాత కొద్ది రోజులు ఆ అమ్మాయితో తమ కుమారుడు మాట్లాడలేదని, కానీ, మళ్లీ ఆమె ఫోన్ చేసినట్లు తెలిపారు. గతంలో హార్వెస్టర్ నడిపించిన తమ కొడుకు ఆ అమ్మాయి మూలంగా హార్వెస్టర్ అమ్ముకోవడంతో పాటు ఆర్థికంగా దోచుకున్నారని ఆరోపించారు. గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు వచ్చి ఏదో పని ఉందని చెప్పి బయటకు తీసుకెళ్లారని, తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమ కుమారుడు చనిపోయాడని పోలీసులు చెప్పారని మృతుడి తల్లిదండ్రులు బోరుమన్నారు. తమ ఒక్కగానొక్క కుమారుడిని యువతి తండ్రి రాజిరెడ్డి మరో ఇద్దరితో కలిసి పొట్టన పెట్టుకున్నారని కన్నీరుపెట్టారు. కాగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చిన పోలీసులు శాంతియుతంగా అంత్యక్రియలు జరిగేలా కృషి చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఉమసాగర్ మాట్లాడుతూ, కిషన్‌రావుపేటకు చెందిన రాజిరెడ్డికి తన కూతురు విషయంలో మృతుడు మల్లేశ్‌కు మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, వెల్గటూర్ స్టేషన్లో మల్లేశ్‌పై పలు కేసులు నమోదయినట్లు తెలిపారు. కేసులు నమోదు చేసినా మల్లేశ్‌లో మార్పు రాకపోవడంతో ఆగ్రహం పెంచుకున్న రాజిరెడ్డి, అతడి తమ్ముడు మల్లారెడ్డి, మల్లారెడ్డి స్నేహితుడు కొత్తపేటకు చెందిన చింతల హరీశ్ గురువారం మధ్యాహ్నం వెల్గటూర్ మండల కేంద్రంలోని కోటిలింగాల రోడ్డు పాత వైన్స్ వెనకాల మల్లేశ్‌ను కత్తులతో పొడిచి హత్య చేసినట్లు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గాలిలేదు.. ఊపిరాడదు
● ఉక్కిరిబిక్కిరవుతున్న కార్మికులు ● నెలరోజుల్లేనే పలువురికి అస్వస్థత ● పట్టించుకోని జీడీకే – 11 గని అధికారులు గోదావరిఖని: ఆ గనిలో నెలరోజుల్లో పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పనిస్థలాల్లో గాలి లేక కుప్పకూలిపోతున్నారు. ఆర్జీ –వన్ ఏరి యా జీడీకే–11 గనిలో వరుస ఘటనలు చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురవుతున్నారు. పూర్తిగా యాంత్రీకరణ చేసినా.. జీడీకే–11 గనిని పూర్తిస్థాయి యాంత్రీకరణ చేశారు. అయితే, కంటిన్యూస్ మైనర్–1, ఎల్‌హెచ్‌డీ ప్రాంతంలో వెంటిలేషన్ సౌకర్యం లేదంటున్నారు. కొద్దిరోజులుగా అక్కడ పనిచేస్తున్న సుమారు పదిమంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్పృహకోల్పోయిన వారిని వెంటనే సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రధానంగా ఎల్‌హెచ్‌డీ ప్రాంతంలో ఎక్కువగా సమస్యలున్నాయని, పనిస్థలాలు దూరంగా ఉండడం, డ్రిల్లింగ్ టూల్స్ అందుబాటులో లేకపోవడం, గాలి అందకపోవడంతో ఊపిరి తీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని కార్మికులు భయపడుతున్నారు. బురదతో సతమతమవుతున్నామంటున్నారు. ఈవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. సమస్య గురించి చెప్తే గని ప్రధాన అధికారి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. వాస్తవానికి పనిస్థలాల్లో గాలి సౌకర్యం పెంచేందుకు జెట్రన్ ఫ్యాన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈఫ్యాన్ ఏర్పాటు చేయడానికి మ్యాన్పవర్తోపాటు సమయం వృథా అవుతుందని, మరికొద్ది రోజుల్లో మూసివేసే ప్యానెల్‌కు ఇదంతా అనవసరమా అని అధికారులు దాటవేస్తున్నారని పేర్కొంటున్నారు. పనిచేయని రూఫ్బోల్టర్ యంత్రం గనిలోని పైకప్పు సపోర్ట్ కోసం హోల్స్ వేసే రూఫ్బోల్టర్ పనిచేయడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో ఇటీవల అక్కడ పనిచేస్తున్న శ్రీకాంత్ అనే యాక్టింగ్ కోల్ఫిల్టర్ మెడపై బొగ్గు పెల్లపడి గాయాలపాలయ్యాడు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కార్మికుల్లో ఆగ్రహం షిఫ్టు ముగింపు సమయంలో ప్రత్యేక ట్రాలీలో గనిపైకి వచ్చే అధికారి ఒక్కరు ఉంటున్నారని, అందులో మరో 50మందిని తీసుకొచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలసిపోయిన కార్మికులను పట్టించుకోకుండా నియంతలాగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈగనిలో శుక్రవారం కూడా ఓ కార్మికునికి స్వల్పగాయాలయ్యాయని తెలిసింది. వెంటిలేషన్ మెరుగ్గానే ఉంది గనిలో కొందరు అస్వస్థతకు గురైన మాట వాస్తవమే. అయితే, వెంటిలేషన్ లేకకాదు. అనారోగ్యంతో కొందరు, ఆహారం లేక మరికొందరు అస్వస్థతకు గురైనట్లు విచారణలో తేలింది. వెంటిలేషన్ సౌకర్యం మరింత పెంచాలని ఆదేశించాం. ప్రమాదాల నియంత్రణకు పకడ్బీందీ చర్యలు తీసుకుంటున్నాం. – లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ–1 -
గుండెపోటుతో వ్యక్తి మృతి
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని నాచుపల్లి గ్రామంలో గల బృందావన్ రిసార్ట్‌లో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన పల్లికొండ చిన్నిరాజం(52) నాలుగేళ్లుగా బృందావన్ రిసార్ట్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం తన బట్టలు ఉతుక్కోవడానికి బాత్రూంకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి భార్య నర్సు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..రాయికల్(జగిత్యాల): మండలంలోని ధర్మాజీపేట గ్రామానికి చెందిన బెక్కం సాయిలు(65) శుక్రవారం రాత్రి తాట్లావాయి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిలు తన పొలం నుంచి ఇంటికి కాలినడక వెళ్తుండగా ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
మల్యాల(చొప్పదండి): మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎ.హర్షిత, బి.హారిక, జరా ఫాతిమా ఎంపికయ్యారు. అండర్–14 విభాగంలో ఎ.హర్షిత ప్రథమ, జి.మేదశ్రీ ద్వితీయ, అండర్–18 విభాగం లాంగ్‌జంప్‌లో జరా ఫాతిమా తృతీయ, 1,000 మీటర్ల పరుగులో బి.హారిక ప్రథమ, షాట్‌పుట్‌లో జరా ఫాతిమా ప్రథమ, ఎస్.అక్షయ రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక అభినందించారు. గంజాయి పట్టివేత ● పోలీసుల అదుపులో ఒకరు, మరో ఇద్దరు పరార్ జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 100 గ్రాముల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. గురువారం రాత్రి మేడపిల్లి సెంటర్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేస్తుండగా స్కూటిపై వెళ్తున్న వ్యక్తిని ఆపి ధ్రువీకరణ పత్రాల కోసం తనిఖీ చేశామన్నారు. ఈక్రమంలో 100 గ్రాముల గంజాయి లభించిందన్నారు. వాహనదారును అదుపులోకి తీసుకోగా, మరోఇద్దరు పరారయ్యారని వివరించారు. పట్టుకున్న వ్యక్తి స్థానిక లక్ష్మీపురం గ్రామానికి చెందిన బొల్లి అజయ్ అని వివరించారు. ఒక స్కూటితో పాటు మరోవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రెండు ద్విచక్రవాహనాల చోరీతంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపు యజమాని ప్రణయ్‌కు చెందిన పల్సర్ బైక్, పద్మనగర్‌కు చెందిన గాజుల మహేశ్‌కు చెందిన సీడీ డీలర్స్ బైక్‌లను గురువారం రాత్రి దొంగిలించినట్లు తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. ద్విచక్రవాహనాలను రాత్రిపూజ ఇంటి ఎదుట పార్కింగ్ చేయగా దుండగులు ముసుగులు ధరించి దొంగతనానికి పాల్పడ్డారని అన్నారు. బైర్ చోరీ చేస్తుండగా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయిందని తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. డ్రైనేజీలో పసికందు మృతదేహం ● ఆందోళనకు గురైన స్థానికులు గోదావరిఖని: డ్రైనేజీలో పసికందు మృతదేహం కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురైయ్యారు. స్థానిక రాజ్యలక్ష్మికాలనీ కమాన్బోర్డు వద్ద డ్రైనేజీలో శుక్రవారం పసికందు మృతదేహం తేలియాడుతూ కనిపించింది. ఈవిషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం గదిలో భద్రపర్చారు. చనిపోయిన తర్వాత నీటిలో పడేశారా? లేక ప్రాణాలతో ఉండగానే పడేయంతో చనిపోయిందా? అనే విషయం తేలాల్సిఉంది. సమీపంలోనే ప్రభుత్వ ఆస్పత్రి ఉండటంతో.. అందులో చనిపోయిన శిశువును తీసుకొచ్చి డ్రైనేజీలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు.. పూడ్చిపెట్టిన శవాన్ని కుక్కలు లాక్కెళ్లడంతో డ్రైనేజీలో పడిఉంటుందని కూడా పేర్కొంటున్నారు. మున్సిపల్ అధికారి ఇచ్చి న ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై రమేశ్ కేసు నమోదుకున్నారు. చికిత్స పొందుతూ మృతి ఎల్లారెడ్డిపేట: రాచర్లబొప్పాపూర్‌కు చెందిన వరుస దేవానందం (62) చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవానందం ఈనెల 15న తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజా మున మృతిచెందాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి పేర్కొన్నారు. -
పంటల బీమా ఉన్నట్టా.. లేనట్టా
● వర్షాభావ పరిస్థితులతో సాగు ప్రశ్నార్థకం ● వాగు పారలే.. చెరువు నిండలే ● సగానికి పైగా మండలాల్లో లోటు వర్షపాతమేకరీంనగర్ అర్బన్: గతేడాది సాధారణానికి మించి వర్షపాతం నమోదవగా ఈసారి కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడం గడ్డు పరిస్థితేనని స్పష్టమవుతోంది. జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాల్లో పంటలు సాగవుతుండగా 10 మండలాల్లో లోటు వర్షపాతమే వెంటాడుతోంది. చిగురుమామిడి, సైదాపూర్, గన్నేరువరం, తిమ్మాపూర్, శంకరపట్నం మండలాలు మినహా గంగాధర, రామడుగు, చొప్పదండి, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో లోటు వర్షపాతమే. వ్యవసాయమే ఆధారం జిల్లాలో అత్యధిక జనాభాకు వ్యవసాయమే ఆధా రం. వర్షాభావ పరిస్థితులతో సాగు ప్రశ్నార్థకంగా మారగా ప్రతికూల పరిస్థితుల క్రమంలో చేయూతగా నిలవాల్సిన ప్రభుత్వం పంటల బీమా విషయంలో స్పష్టతనివ్వకపోవడం ఆందోళనకర పరిణామం. శ్రీఆదిలోనే హంసపాదుశ్రీ అన్నట్లు సాగు తొలినాళ్లలోనే వర్షం దోబూచులాడుతుండగా రైతు పెట్టిన పెట్టుబడి ఇక అంతే. ఈ క్రమంలో తక్షణమే పంటల బీమా అమలు చేసి రైతులను తదనుగుణంగా ప్రోత్సహించాల్సి ఉండగా ఆ దిశగా చర్యల్లేకపోవడం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. మడులలోనే నారు ఇప్పటికే సగానికి పైగా నాట్లు పడాల్సి ఉండగా ఇంకా మడులలోనే నారు ఉండిపోయింది. వర్షాలు లేక, కాలువల్లో నీటిని విడుదల చేయక పొలం మడులు ఎడారులను మరిపిస్తున్నాయి. గతేడాది ఈ సమయానికి నాట్లతో కళకళలాడగా నేడు వెలవెలబోతున్నాయి. జిల్లాలో వానాకాలంలో సాధారణ సాగు 2.74లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు సాగైంది 38వేల ఎకరాలు మాత్రమే. తొలుత రుతుపవనాలు ముందే వచ్చాయా..అన్నట్లు మురిపించగా తదుపరి ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. బోసిపోతున్న చెరువులు, కుంటలు జిల్లాలో చెరువులు, కుంటలు బోసిపోతున్నాయి. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, జమ్మికుంట, హుజూరాబాద్, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు మండలాల్లోని హెచ్చు చెరువులు బీడుగా మారగా ఇల్లందకుంట, చిగురుమామిడి, సైదాపూర్, వీణవంక, శంకరపట్నం మండలాల్లోని చెరువులు అట్టడుగున నీరు చేరింది. మొత్తం 1,376 చెరువులుండగా ఎక్కడా నిండిన దాఖలాలే లేవు. ఎస్సారెస్పీ కింద ఆయకట్టు ఉండగా ఎగువన వర్షాలు కురిస్తేనే వరి పంటకు భరోసా. ఇక జిల్లాలోని ఎల్ఎండీ రిజర్వాయర్, సమీప మధ్యమానేరు జలాశయాలకు ఇన్‌ఫ్లో లేదు. ఇక గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి జలాశయాలు పచ్చికబయళ్లను మరిపిస్తున్నాయి. ఊసేలేని పంటల బీమా వివిధ రకాల పంటలకు ఇప్పటికే పంటల బీమా అమలు కావాల్సి ఉండగా ఆ ఊసే లేదు. వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు పగుళ్లు చూపుతుండగా ఇలాగే కొనసాగితే మళ్లీ పంట వేయాల్సిన దుస్థితి. ఈ క్రమంలో తక్షణమే పంటల బీమా అమలు చేస్తేనే కర్శకునికి కొంత సాంత్వన. గతేడాది, ఈసారి ఇప్పటివరకు కురిసిన వర్షం వివరాలిలా, బ్రాకెట్లో సాధారణ వర్షపాతం (మి.మీటర్లలో) జిల్లాలో.. వానకాలం సాగు అంచనా 3.04లక్షల ఎకరాలు సాగైన విస్తీర్ణం 75,715 ఎకరాలు ఇందులో వరి 38,459 ఎకరాలు పత్తి 35,361 ఎకరాలు కందులు 126 ఎకరాలు మొక్కజొన్న 1,682 ఎకరాలు పెసర 87 ఎకరాలుసంవత్సరం జూన్ జూలై 2024 208.2(124.3) 42.0(73.1) 2025 99.5 (124.3) 51.0(70.5) -
పాఠశాలకే క్రీడామైదానం బోర్డు
వేములవాడరూరల్: క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం వాటికోసం కేటాయించిన నిధులు వృథా అయ్యాయి. ప్రతి గ్రామానికి క్రీడామైదానం, ఓపెన్ జిమ్, పా ర్కులు ఏర్పాటు చేసింది. చాలా గ్రామాల్లో ఇవి బోర్డుల వరకే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు పాఠశాలలకే బోర్డులు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. అక్కడ ఎలాంటి పరికరాలు ఉన్న దాఖలాలు లేవు. ఇక గ్రామానికో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయగా అందులోని పరికరాలు తుప్పుపట్టిపోతున్నా యి. అధికారులు దృష్టిసారించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఏసీపీ తండ్రి మృతి
● ప్రమాద స్థలాన్ని సందర్శించి కంటతడి ● అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదంమంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల వద్ద రహదారిపై శుక్రవారం ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయన్ను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తండ్రి గజ్జి ఐలయ్య(64)గా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. జైపూర్ మండలం రసూల్‌పల్లి గ్రామంలో సింగరేణి రిటైర్డు ఉద్యోగి గజ్జి ఐలయ్య నివాసం ఉంటున్నాడు. ఈయన కుమారుడు గజ్జి కృష్ణ పెద్దపల్లి ఏసీపీగా పని చేస్తున్నారు. ఐలయ్య శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనం మీద హాజీపూర్ వెళ్లి తిరిగి మంచిర్యాలకు వస్తున్నాడు. పాతమంచిర్యాల వద్దకు రాగానే వెనుకాల నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ అతివేగంగా ఐలయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కిందపడిన ఐలయ్య తలపై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోదర్రావు పరిశీలించారు. తండ్రి మృతదేహాన్ని చూసి కృష్ణ బోరున విలపించారు. ఐలయ్యకు భార్య కొమురవ్వ, కూతురు సమ్మక్క, కుమారుడు కృష్ణ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
విలువైన సామగ్రి స్వాధీనం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టులో చోరీకి గురైన విలువైన సామగ్రిని చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నామని ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్ శుక్రవారం తెలిపారు. విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రాజెక్టు హెచ్ఆర్ ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, అధికారులు తమకు ఫిర్యాదు చేశారన్నారు. ఈక్రమంలో తనిఖీలు చేపట్టగా.. మేడిపల్లి సెంటర్ సమీపంలోని ఓ దుకాణంలో సామగ్రి లభించగా, స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.2.80 లక్షల వర కు ఉంటుందని అన్నారు. ఇందులో క్రషర్ హ్యామర్స్ ఉన్నాయని, వీటిని చోరీ చేసిన హరియాణాకు చెందిన వకీల్, ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన అనిల్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒక ట్రాక్టర్, జేసీబీని సైతం స్టేషన్‌కు తరలించామని పేర్కొన్నారు. ఇనుప సామాను లభించిన దుకాణం యజమాని చాంద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. కదలించిన ‘సాక్షి’ కథనం ఎన్టీపీసీ ప్రాజెక్టులో విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీంతో ఎన్టీపీసీ అధికారులు, పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. చోరీని వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’ని పలువురు అభినందించారు. ● ఎస్సై ఉదయ్‌కిరణ్ -
నీ గూడు చెదిరింది...
కొంగల గూళ్లు కూలిపోవడంతోపాటు వాటి పిల్లలు గాయాలతో మృత్యువాత పడ్డాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలివి. గోదావరిఖని అడ్డగుంటపల్లిలో రోడ్డు సమీపంలోని పెద్ద చింతచెట్టును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. దీంతో చెట్టుకొమ్మలపై పొదిగిన కొంగపిల్లలతో సేదదీరుతున్న వందలాది కొంగల గూళ్లు చెదిరిపోయాయి. కొమ్మల కింద పడిన పిల్లలు పెద్దసంఖ్యలో చనిపోగా.. చాలావరకు గాయపడ్డాయి. గాయపడిన కొంగలు కొమ్మలపైనే గురువారం తెల్లవారేదాకా అరవడంపై పర్యావరణ, పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కొంగపిల్లల ఖననం, తీవ్రంగా గాయపడిన వాటికి చికిత్స, గూడు చెదిరిన వాటిని మరోచోటికి తరలించడానికి రామగుండం నగరపాలక సంస్థ, అటవీ, పశువైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సతీశ్, జిల్లా పశువైద్యాధికారి శంకర్‌తోపాటు వైద్యుడు పల్లె ప్రసాద్, సిబ్బంది చంద్రశేఖర్, హ్యాండ్స్ టూ సర్వ్ ఎన్జీవో వ్యవస్థాపకుడు దేవినేని అరవింద్‌స్వామి సేవలు అందించారు. కాగా, బతికిన కొంగలను కరీంనగర్‌లోని పార్క్‌కు తరలించారు. గాయపడిన కొంగల చికిత్సకు సుమారు రూ.8వేల వరకు తన సంస్థ ద్వారా వెచ్చించినట్లు అరవింద్‌స్వామి తెలిపారు. కాగా, చింతచెట్టు నరికివేతతో రామగుండం బల్దియాకు సంబంధం లేదని కమిషనర్ (ఎఫ్ఏసీ) అరుణశ్రీ స్పష్టం చేశారు. -
సింగరేణి పీఆర్వోకు జర్నలిజంలో డాక్టరేట్
గోదావరిఖని: హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారి(పీఆర్ఓ)గా పనిచేస్తున్న శ్రీరాముల శ్రీకాంత్ నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి డాక్టరేట్ స్వీకరించారు. ‘సాంఘిక, రాజకీయ ఉద్యమాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర, తెలంగాణ ఉద్యమంపై కేసు స్టడీ’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక అధ్యయనానికి డాక్టరేట్ లభించింది. తెలంగాణ ఉద్యమంలో యువత అగ్రభాగంలో నిలిచింది. ఉద్యమ ఆకాంక్షను జనబహుళ్యంలోకి తీసుకెళ్లడం, సామాన్యుల భావవ్యక్తీకరణకు సోషల్ మీడియా దోహదపడింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈవిధంగా సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని వివరిస్తూ శ్రీకాంత్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగుల్లో పీహెచ్డీ సాధించిన వారు అతికొద్ది మందే ఉన్నారు. ఈ నేప థ్యంలోనే శ్రీకాంత్‌ను సింగరేణి సీఎండీ బలరాం గురువారం అభినందించారు. ఈడీ(కోల్ మూ మెంట్) ఎస్డీఎం సుభాని, జీఎం(మార్కెటింగ్) టి.శ్రీనివాస్, సింగరేణి భవన్ అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. -
ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడుసార్లు ప్రారంభం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): వినియోగదారులకు తాజా కూరగాయలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పట్టణంలోని తెలంగాణ చౌ రస్తా వాటర్ ట్యాంక్ వద్ద గల స్థలాన్ని రోజూ వారి మార్కెట్ కోసం గతంలో కేటాయించారు. దాదాపు రూ.60లక్షల వ్యయంతో చేపట్టిన మార్కెట్ పనులకు 2017లో అప్పటి రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. వివిధ కారణాలతో పనులు మ ధ్యలోనే ఆగిపోయాయి. దీంతో 2019లో అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆ పనులను మళ్లీ ప్రారంభించారు. కొంతకాలం పాటు నిర్మాణం శరవేగంగా సాగినా.. ఆ తర్వాత మార్కెట్లో షెడ్ల వరకే నిర్మించి అక్కడితోనే వదిలేశారు. మందుబాబులకు అడ్డాగా.. నిర్మానుష్యంగా ఉన్న అసంపూర్తి మార్కెట్ షెడ్లు మద్యంబాబులకు అడ్డాగా మారాయి. సమీప వైన్స్‌షాపుల్లో మందు కోనుగోలు చేస్తున్న కొందరు మార్కెట్ షెడ్లలోకి చేరి చిత్తుగా మద్యం తాగుతున్నారు. అటుగా వెళ్తున్న ప్రజలు, స్థానికులు వారి ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై ‘సాక్షి’లో ‘రోజూవారి మార్కెట్‌కు మోక్షమోప్పుడో?’ శీర్షికన పలుసార్లు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఎట్టకేల కు స్పందించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ.. ఇటీవల డెయిలీ మార్కెట్ షెడ్లు పరిశీలించారు. విషయాన్ని రామగుండం ప్రస్తుత ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన.. మిగిలిన పనులను పూర్తిచేసి మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గతంలో కేటాయించిన నిధులు సరిపోలేదు. దీంతో మరో రూ.20లక్షలు మంజూరుకావడంతో గురువారం మూడోసారి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మార్కెట్ పనులు ప్రారంభించారు. మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తా.. పనులు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే ఠాకూర్ మాట్లాడుతూ, దాదాపు ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నరోజూవారి మార్కెట్‌ను నెలరోజుల్లోనే పూర్తిచేయిస్తామన్నారు. అందులో సకలసౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అతిత్వరలోనే దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులు సరిపోకపోతే అవసరమైతే మరిన్ని మంజూరు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మారెల్లి రాజిరెడ్డి, పట్టణ అద్యక్షుడు గుండేటి రాజేశ్, నాయకులు శంకర్ నాయక్, జక్కుల దామోదర్‌రావు, సాగంటి శంకర్, మార్క రాజు, రాజేశం, తి రుపతిరెడ్డి, రాములు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎనిమిదేళ్లయినా అందుబాటులోకిరాని మార్కెట్ ఇప్పటికై నా వినియోగంలోకి తేవాలంటున్న నగర ప్రజలు సకల సౌకర్యాలతో త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్న ఎమ్మెల్యే ఠాకూర్ -
సంతోషంగా ఉంది
పదేళ్ల తర్వాతైనా డెయిలీ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో నిర్మించాలి. అన్నిరకాల తాజాకూరగాయలు అందుబాటులో ఉంచాలి. మూడుసార్లు పనులు ప్రారంభించినా త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తామనడం సంతోషంగా ఉంది. – వి.సుజాత, స్థానికురాలు సౌకర్యాలు కల్పించాలి ఇప్పటికై నా రోజూవారి మార్కెట్ పనులు సంపూర్ణంగా పూర్తి చేస్తామనడం సంతోషంగా ఉంది. త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా అన్నిసౌకర్యాలు కల్పించాలి. – సీహెచ్ స్వరూప, స్థానికురాలు -
స్థానిక సందడి
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025● సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు ● పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ● అందరిచూపు రిజర్వేషన్ల పైనే.. బ్యాంక్ ఖాతాలపై నజర్! సాక్షి, పెద్దపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు.. తాజాగా ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాల సంఖ్య ఖరారు చేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. పరిషత్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు పల్లెబాటపడుతున్నారు. స్థానిక సమరంలో ఎలాగైనా సత్తా చాటాలని కసరత్తు చేస్తున్నారు. మరోవైపు.. వివిధ రాజకీయ పార్టీలు సైతం స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. 2024 జన వరి 31న సర్పంచ్, జూలై 4న ఎంపీటీసీల పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది ‘పార్లమెంట్’ తర్వాతే అనుకున్నా.. గత పార్లమెంట్ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థ ల ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ, ప్రభుత్వం.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తామని కులగణన చేపట్టడంతో ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. దీంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో స్థానిక సంస్థల ఎ న్నికల్లో 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందు కు రాష్ట్రప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినేనెన్స్ను పంపించింది. గవర్నర్ ఆమోదం తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇప్పటికప్పుడు రిజర్వేషన్ల విషయం తేలక సర్వత్రా ఆందోళనకు గురవుతున్నా.. స్పష్టత వచ్చాక ఎలా వ్యవహరించాలనే దానిపైనా అంచనా రూపొందించుకుంటున్నారు. అధికార యంత్రాంగం కసరత్తు ఇప్పటికే వార్డుల వారీగా ఓటరు జాబితాను అధికార యంత్రాంగం రూపొందించింది. దానిని పునఃపరిశీలించి నివేదించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పూర్తిస్థాయి వివరాల సేకరణపై జిల్లా అధికారులు మరోసారి దృష్టి సారించారు. ఇప్పటికే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, సిబ్బందికి ఒకవిడత శిక్షణ ఇచ్చా రు. రిటైర్మెంట్లు, బదిలీలతో తాజాగా వార్డుల వారీగా ఎన్నికల జాబితా సిద్ధం చేస్తున్నారు. పై‘చేయి’ సాధించేందుకు.. అధికారంలో ఉన్నాం.. అనేక ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. కాబట్టి స్థానిక ఎన్నికల్లో తమదే పైచేయి ఉంటుందన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈనేపథ్యంలోనే ఇటీవల అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా సొమ్ము జమచేయగా, ఇందిరా మహిళాశక్తి సంబురాల పేరిట ప్రజల్లోకి వెళ్తోంది. స్థానిక ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయడం, కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలతో పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. కారును పరుగులు పెట్టించేందుకు.. పల్లెల్లో పట్టు నిలుపుకొనేందుకు బీఆర్ఎస్ కసరత్తు తీవ్రం చేస్తోంది. అధికారంలో లేమనే భావనను కార్యకర్తల్లో నుంచి తొలగించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే బీఆర్ఎస్కు కలిసి వస్తుందన్న ధీమాల్లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. కమలం వికసించేలా.. పార్లమెంట్ ఎన్నికలతో పాటు, ఇటీవల నిర్వహించిన పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల విజయాన్ని స్థానిక ఎన్నికల్లో సైతం కొనసాగించేలా కమలం నే తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, నేతల మ ధ్య గ్రూప్ రాజకీయాలతో గందరగోళం నెలకొంద ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభేదాలతో బీజేపీ ఏ విషయాన్ని స్పష్టం చేయడం లేదు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో సాధించిన ఓట్లును నిలుపుకుంటుందో లేదా అనేది వేచిచూడాల్సిందే. న్యూస్రీల్జిల్లా సమాచారం గ్రామపంచాయతీలు 263 వార్డులు 2,432 ఎంపీటీసీ స్థానాలు 137 జెడ్పీటీసీ స్థానాలు 13 పురుష ఓటర్లు 2,03,358 మహిళా ఓటర్లు 2,09,918 ఇతరులు 13 -
భవిత కేంద్రాల్లో వసతులు కల్పించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: భవిత కేంద్రాల్లోని దివ్యాంగుల కు వసతులు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. పా ఠ శాలల్లో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నేషన్ సిస్టం) ద్వా రా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమో దు చేయాలన్నారు. విద్యార్థుల హాజరు 68 శా తం నమోదు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఎంఈవోలు స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికే వా రిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. భూ సమస్యలను రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలోని ఎస్టీ విద్యార్థులు 3, 5 తరగతుల్లో బెస్ట్ అవైలెబుల్ స్కూల్లో చేరేందుకు ఈనెల 26 లో గా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించా రు. వివరాలకు 96521 18867 ఫోన్‌నంబరులో సంప్రదించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీఈవో మాధవి, డీఎఫ్‌వో శివయ్య, ఏడీ సర్వే ల్యాండ్స్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అంతర్గాంలో సుడిగాలి పర్యటన రామగుండం: అంతర్గాం మండలం మద్ధిర్యాల, పొట్యాల, బ్రాహ్మణపల్లి, గోలివాడ గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం సుడిగాలి పర్యటన చేశారు. మద్ధిర్యాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ పురోగతి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్ర భుత్వ ప్రాథమికోన్నత పాఠశాల తనిఖీ చేశారు. పొట్యాల, బ్రాహ్మణపల్లి, గోలివాడ పాఠశాలల్లో విద్యాబోధన తీరుపై ఆరా తీశారు. పారిశుధ్యం నిర్వహణపై దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుమాధవ్, హౌసింగ్ ఈఈ, డీఈలు రాజేశ్వర్, దస్తగిరి, పీఆర్ డీఈ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
11 ఏళ్లుగా ఇబ్బంది
పాఠశాలలో 11 ఏళ్లుగా వంట వండుతున్న. ఇప్పటివరకు కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తూ ఇబ్బంది పడుతున్న. గ్యాస్ సిలిండర్లు ఇస్తమన్నరు కానీ ఇంకా ఇయ్యలే. వానాకాలంల బాగా తిప్పలు అయితాంది. కట్టెలు కూడా దొరుకుతలేవు. – అవునూరి లక్ష్మి, నిర్వాహకురాలు, భీంరాంపేట గ్యాస్ కొంటున్నం కట్టెలు దొరకడంలేదు. గ్యాస్ సిలిండర్ నేనే కొంటున్న. ఒక్కో సిలిండర్ రెండు నెలలు వస్తాంది. పైసలు మాపైనే పడుతున్నయి. గ్యాస్ కనెక్షన్ ఇస్తే కొంచెం భారం తగ్గుతది. – గుమ్మడి వసంత, నిర్వాహకురాలు, చిల్లపల్లి వివరాలు సేకరిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడెక్కడ వంటగ్యాస్ సిలిండర్లు అవసరమనే వివరాలు సేకరిస్తున్నాం. గతంలోనూ ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రస్తుతం చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యిలపైనే తయారు చేస్తున్నారు. ఒకట్రెండురోజుల్లో డాటా సేకరణ పూర్తవుతుంది. ఆ వెంటనే ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – లక్ష్మి, మండల విద్యాధికారి, మంథని -
● మెటా సూత్రధారులు, నిర్వాహకుల అకౌంట్లపై ఆరా ● చొప్పదండిలో ఎన్ఆర్ఐల నుంచి భారీ వసూళ్లు ● ఇంకా ఫిర్యాదుకు వెనకాడుతున్న బాధితులు ● రాజకీయంగా ఒత్తిళ్లు తెస్తున్న నలుగురు సీఐలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మెటా క్రిప్టో కరెన్సీ పేరిట జరిగిన కుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. మెటా ఫండ్ పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు జనాల నుంచి వసూలు చేసిన ఉదంతంలో సూత్రధారులు, నిందితులు, అనుమానితులపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెంచాయి. మెటా ఫండ్‌లో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసిన సూత్రధారి లోకేశ్ దేశం దాటి థాయ్‌లాండ్ వెళ్లిన ఘటనలో అతన్ని కరీంనగర్‌కు పరిచయం చేసిన మాజీ కార్పొరేటర్, ప్రకాశ్ అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు, రమే శ్, రాజు వివరాలను నిఘాసంస్థలు సేకరించాయి. వీరిలో కొందరిపై క్రిమినల్ హిస్టరీ, చెక్‌బౌన్స్ కేసులు ఉన్నట్లు గుర్తించాయి. వీరి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. మెటా ఫండ్ ప్రారంభానికి ముందు.. తరువాత వీరి బ్యాంకులో లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. వీరితో పాటు మాజీ కార్పొరేటర్‌కు సన్నిహితంగా ఉండే బీజేపీ బడా నేత బ్యాంక్ ఖాతాలపైనా కేంద్ర సంస్థలు నిఘా పెట్టాయి. అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నాయి. చొప్పదండిలో ఎన్ఆర్ఐల విలవిల చొప్పదండి నియోజకవర్గంలో పలువురు చోటా బడా లీడర్లు క్రిప్టో వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ.. అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. అందులో ఓ మాజీ ప్రజాప్రతినిధి చాలా తెలివిగా.. కేవలం ఎన్ఆర్ఐలనే లక్ష్యంగా చేసుకున్నాడు. మూడు నెలల్లో భారీ లాభాలు ఉంటాయని నమ్మబలికి రూ.కోట్లు వసూలు చేశాడు. తీరా ఇప్పుడు మెటాఫండ్ మూతబడటంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. వారంతా ఇండియాకు రాలే రు, ఇక్కడికి వచ్చి కేసులు గట్రా అంటే పాస్‌పోర్టు, వీసాలకు ఇబ్బందిగా మారుతుందని అతన్ని నిగ్గదీయాల్సింది పోయి.. బ్రతిమాలుకుంటుండటం విశేషం. ఈ బలహీనతతోనే నిర్వాహకులు రూ.కోట్లు కొల్లగొట్టినా దర్జాగా తిరగగలుగుతున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న నలుగురు సీఐలు తమ బినామీలతో భారీగా డబ్బులు పెట్టారు. వారంతా ఇప్పుడు లోకేశ్ అతని మిత్రగణంపై రాజకీయంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కొత్తపల్లి పీఎస్, టూటౌన్, రూరల్ పరిధిలో పిటిషన్లు వచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో లోకేశ్ రూ.100 కోట్లతో థాయ్‌లాండ్ పారిపోయాడని బాధితులు వాపోతున్నారు. అప్పుడే స్పందించి ఉంటే లోకేశ్ దేశం దాటకుండా ఉండేవాడని వాపోతున్నారు. ఆయా ఠాణాల్లో ఫిర్యాదులు చేసిన పిటిషనర్లను ఇప్పటికైనా విచారిస్తే.. పెద్ద కుంభకోణం వెలికి తీసిన వారవుతారని సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గోవాకు తీసుకెళ్లి బెదిరింపులు వాస్తవానికి మెటా ఫండ్ నిర్వాహకుడిగా చెబుతున్న లోకేశ్ గతేడాది మాజీ కార్పొరేటర్‌తోపాటు రమేశ్, రాజు, ప్రకాశ్‌ను గోవా తీసుకెళ్లాడు. వీరందరినీ అ క్కడ లోకేశ్ పదుల సంఖ్యలో బౌన్సర్లతో ప్రైవేటు గె స్ట్ హౌస్‌లోకి తరలించాడు. అక్కడ వీరంతా మెటా కార్యకలాపాలు నిలిచిపోయాయి, లాభాలు రావ డం లేదు, డబ్బులైనా వెనక్కి ఇవ్వాలని ఇన్వెస్టర్లు వేధిస్తున్నారని లోకేశ్‌ను నిలదీశారు. దానికి లోకేశ్ తీవ్రంగా స్పందించి.. నష్టాలకు మనమంతా బా ధ్యులమేనని బాండ్ పేపర్లపై సంతకాలు పెడితే.. డబ్బులు ఇస్తానని బెదిరించే యత్నం చేశాడు. ఊ రు కాని ఊరిలో పార్టీ అంటే వెళ్లిన వీరంతా అక్కడ లోకేశ్ బెదిరింపులకు దిగడంతో హతాశయులయ్యా రు. తమను చంపినా తాము సంతకాలు పెట్టమని, పెడితే లీగల్‌గా ఇరుక్కున్న వారిమవుతామని అతనితో వాదించి ఎలాగోలా అక్కడనుంచి బయటపడి కరీంనగర్ చేరుకున్నారు. తీరా ఇక్కడకు వచ్చాక.. తమకున్న పరిచయాలతో కేసులు కాకుండా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అదే సమయంలో బలహీనులను బెదిరిస్తూ.. బలవంతులకు మాత్రం బాండ్ పేపర్లు, చెక్కులు రాసిస్తున్నారు. -
‘పొగ’చూరుతున్నయ్..
● సర్కారు బడుల్లో కట్టెల పొయ్యిలపైనే వంటలు ● ప్రతిపాదనలకే పరిమితమైన వంటగ్యాస్ సిలిండర్లు ● వర్షాకాలంలో నిర్వాహకులకు తప్పని తిప్పలు మంథనిరూరల్: జిల్లాలోని సర్కారు బడుల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం కట్టెల పొయ్యిలతో పొగజూరిపోతోంది. ఏళ్లతరబడి ఈ పథకంలో నిర్వాహకులకు కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి. దీంతో వర్షాకాల మంతా ఇబ్బందులు పడుతుండగా, మిగతా కాలాల్లో కట్టెల కోసం నానా తంటాలు పడుతున్నారు. కట్టెల పొయ్యిలపైనే.. మంథని మండలంలోని 56 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఇందుకోసం ప్రతీరోజు పాఠశాలల ఆవరణలోనే భోజనం తయారు చేస్తున్నారు. వంటల తయారీకి కట్టెల పొయ్యిలే వినియోగిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండడంతో వారికి తగిన భోజనం తయారీకి కట్టెల పొయ్యిలపై పెద్దగా ఇబ్బంది లేకున్నా.. హైస్కూళ్లలో అధికంగా ఉండే విద్యార్థుల కోసం ఎక్కువ భోజనం వండి పెట్టడం సమస్యగా మారుతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో తప్పని తిప్పలు.. వర్షాకాలంలో దాదాపు మూడు నెలలపాటు కట్టెల పొయ్యిలపై వంటలు చేయడం నిర్వాహకులకు చుక్కలు చూపుతోంది. వర్షానికి కట్టెలు తడిసి మంట మండకపోవడంతో పొగచూరి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండవస్తేనే కట్టెలు ఆరబెట్టుకునినే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల కట్టెలు లభించక, మార్కెట్లో అధిక ధరలు పలుకుతుండడంతో నిర్వాహకులకు కొనుగోలు చేయడం ఆర్థికంగా భారంగా మారుతోంది. ప్రతిపాదనలకే పరిమతమైన.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించే నిర్వాహకులకు వంట గ్యాస్ సిలిండర్లు మంజూరు చేస్తామని సర్కారు ప్రకటనలు మంథని మండలంలో ఇంకా అమలులోకి రావడంలేదు. ఈక్రమంలో గత ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన ప్రతిపాదనలు రూపొందించి సర్కారుకు పింపించారు. కానీ, ఇప్పటివరకు ఆ ఊసేలేకుండాపోయింది. -
డీఏవోను కలిసిన ప్రతినిధులు
పెద్దపల్లిరూరల్: ఇటీవల జిల్లా వ్యవసాయాధికారిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ను టీఎన్టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, వ్యవసాయ విస్తీర్ణాధికారులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పె ద్దపల్లి, మంథని ఏడీఏలు శ్రీనాథ్, అంజనీమి శ్రా, నాయకులు మహేందర్, శ్రీధర్, శ్రీనివా స్, వినయ్‌కుమార్, పూర్ణచందర్, రాకేశ్, ప్ర శాంత్, వినీత్, రవితేజ, కల్పన ఉన్నారు. పెరిగిన రాజకీయ జోక్యం గోదావరిఖని: బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ హ యాంలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీ తారామయ్య అన్నారు. ఆర్జీవన్ ఏరియా జీడీకే–2వ గనిపై గురువారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. సింగరేణికి రూ.36 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎండీ, డై రెక్టర్(పా) సమావేశాల్లో అంగీకరించిన డి మాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. నాయకులు రంగు శ్రీను, మడ్డి ఎల్లాగౌడ్, క వ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, మాదన మహే శ్, ఎస్.వెంకట్‌రెడ్డి, మిట్ట శంకర్, సయ్యద్ సోహేల్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, పెద్దెల్లి శంకర్, భక్తి శ్రీనివాస్, ఎల్.రమేశ్ పాల్గొన్నారు. బిల్లులు విడుదల చేయాలి పెద్దపల్లిరూరల్: ఉపాధ్యాయల పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా అధ్య క్షుడు సునీల్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాఘవాపూ ర్ తదితర పాఠశాలల్లో గురువారం చేపట్టిన స భ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, న గదు రహిత హెల్త్‌కార్డులు జారీచేయాలని, పీ ఆర్సీ అమలు చేయాలని కోరారు. హెచ్ఎం పో స్టులు భర్తీ చేయాలని, జీజీఎస్ చెల్లించేవరకూ ఆ సొమ్ముకు వడ్డీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. నాయకులు సతీశ్‌బాబు, ఐలయ్య, అనిల్‌ప్రసాద్, రాజేందర్ తదతరులు ఉన్నారు. పంచాయతీ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గం సుల్తానాబాద్‌రూరల్(పెద్దప ల్లి): జిల్లా గ్రామ పంచాయ తీ ఉద్యోగులు, అనుబంధ సంఘాల జేఏసీ కార్యవర్గా న్ని నీరుకుల్ల రంగనాయకస్వామి ఆలయ ఆవరణలో గురువారం ఏకగ్రీవంగా ఎ న్నుకున్నారు. చైర్మన్‌గా జొన్నకోటి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా అశోక్, వైస్ చైర్మన్లుగా సంతోష్, కనుకయ్య, పురుషోత్తం, కోశాధికారి గా భూమయ్య, ముఖ్య సలహాదారులుగా స త్తయ్య, రాజలింగయ్య, సహాయ కార్యదర్శు లుగా సత్యం, సుధాకర్, రమేశ్, మధుసూదన్, ప్రచార కార్యదర్శులుగా కుమార్, రమేశ్, గౌర వ అధ్యక్షుడిగా కొమురయ్యను ఎన్నుకున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌లో ప్రతిభ కోల్‌సిటీ(రామగుండం): స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీ ల్లో రామగుండం బల్దియా 216వ ర్యాంక్ సా ధించింది. గురువారం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25లో పోటీల్లో పాల్గొన్న ము న్సిపాలిటీల ర్యాంకుల వివరాలను ప్రకటించింది. మనరాష్ట్రంలోని 143 మున్సిపాలిటీల్లో రామగుండం 28వ స్థానంలో నిలిచింది. పారిశుధ్యం మెరుగుకు తీసుకుంటున్న చర్యలతోనే మెరుగైన ర్యాంక్‌ను సాధించిందని అధికారులు వెల్లడిస్తున్నారు. మల్కాపూర్‌లోని ఎఫ్ఎస్టీపీ ని ఉపయోగంలోకి తీసుకురావడంతో ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా దక్కింది. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని బల్దియా కమిషనర్ (ఎఫ్ఏసీ) అరుణశ్రీ అభినందించారు. ఇంటినుంచే తపాలా సేవలు పెద్దపల్లిరూరల్: తపాలా శాఖలో 2.0 ద్వారా ఇంటినుంచే సేవలు పొందే వీలుందని పోస్టల్ సూపరింటెండెంట్ నంద తెలిపారు. రెండు హె డ్పోస్టాఫీసులు, 41 సబ్, 332 బ్రాంచి పోస్టా ఫీసుల సిబ్బందికి సేవలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆధునిక సేవలు అందుబాటు లోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారని, అందుకే ఈనెల 21 వరకు సేవలు నిలిపివేస్తున్నామన్నారు. -
కొడుకు చనిపోయాడనే బెంగతో తండ్రి ఆత్మహత్య
ముత్తారం(మంథని): చేతికి అందిన కొడుకు చనిపోయాడనే బెంగతో మారం రాజిరెడ్డి(55) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ సంఘటన మండల కేంద్రంలోని కాసార్లగడ్డలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. మారం రాజిరెడ్డి వ్యవసా య కూలీగా పని చేసుకుంటున్నాడు. వచ్చేఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా డు. అయితే, ఇతడి కొడుకు రమేశ్‌రెడ్డి గతేడాది పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. అప్పట్నుంచి తీవ్రమనోవేదనతో ఉంటున్నాడు. తన కన్నకొడుకు మృతి చెందడం బాధి స్తోందని తన భార్యకు తరచూ చెప్తూ ఏడ్చేవా డు. ఈక్రమంలో కొడుకు లేడనే ఆవేదనతో ఈ నెల 15న రాజిరెడ్డి పురుగుల మందు తాగి ఇంట్లోనే పడుకున్నాడు. కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన భార్య పద్మ నిద్రలేపేందుకు యత్నించగా.. తాను పురుగుల మందు తాగానని చెప్పా డు. సమీప బంధువులకు సమాచారం అందించిన పద్మ వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఎన్టీపీసీ సీఎండీ పదవీకాలం పొడిగింపు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) గుర్దీప్సింగ్ను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మళ్లీ నియమించాలనే విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను క్యా బినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ)ఆమోదించింది. ఆయన ఉ ద్యోగ విరమణ తేదీ తర్వాత ఏడాదిపాటు(01.08.2025 నుంచి 31.07.2026 వరకు) పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ డిప్యూ టీ డైరెక్టర్ విజయ్‌కుమార్ దారక్ ఉత్తర్వులను మంత్రిత్వ శాఖ సెక్రటరీ పంకజ్ అగర్వాల్ విడుదల చేసినట్లు సమాచారం. రాజీమార్గమే మేలు గోదావరిఖనిటౌన్: ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవడమే మేలని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ సూచించారు. స్థానిక న్యాయస్థానంలో బుధవారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తి మాట్లాడారు. -
ఏపీకే ఫైల్ లింక్‌తో రూ.46వేలు మాయం
● పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తెలిసిన వ్యక్తి పంపిన మెసేజ్ కదా.. అని ఏపీకే ఫైల్ లింక్ క్లిక్ చేయగా బ్యాంక్ ఖాతా ఖాళీ కావడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన పెరుమాండ్ల అంజయ్య తెలిపిన వివరాలు. ఈనెల 13న సాయంత్రం తనకు పరిచయం ఉన్న వ్యక్తి మొబైల్ నుంచి తమ సంఘం గ్రూప్‌లో పీఎం కిసాన్ పేరిట ఏపీకే లింక్ రాగా.. ఓపెన్ చేశాడు. 14వ తేదీ రాత్రి 2 నుంచి 3.30 గంటల వరకు ఖాతాలో నుంచి దఫదఫాలుగా రూ.46వేలు కాజేశారు. వెంటనే 1930కి కాల్ చేశాడు. అంతేకాకుండా ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన న్యాలకంటి సతీశ్ ఖాతా నుంచి గతేడాది డిసెంబర్ 9న సైబర్ నేరగాళ్లు రూ.96వేలు కాజేశారు. తిరుపతికి మరో ప్రత్యేక రైలు● నాందేడ్ వయా కరీంనగర్ మీదుగా ● ఆగస్టు 2న ప్రారంభం కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఆగస్టు2 నుంచి 31 వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కరీంనగర్ నుంచి తిరుపతికి ఒక రెగ్యులర్ రైలుతోపాటు మరో ప్రత్యేక రైలు నడుస్తోంది. సోమ, గురు, ఆదివారం ఈ రైళ్లు కరీంనగర్ నుంచి తిరుపతికి నడుస్తుండగా కొత్త రైలు ప్రతి శనివారం నాందేడ్ నుంచి కరీంనగర్ మీదుగా వెళ్తుంది. ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి కరీంనగర్ మీదుగా నాందేడ్‌కు వెళ్తుంది. ప్రతి శనివారం నాందేడ్‌లో సాయంత్రం 4.50గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 11.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదేరోజు రాత్రి 7.45గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి సోమవారం ఉదయం 9.08గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటుంది. ప్రత్యేక రైలును ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ రైల్వేస్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ భానుచందర్ కోరారు. -
విద్యుత్ సమస్యలపై రైతుల ధర్నా
గంభీరావుపేట/గన్నేరువరం: అప్రకటిత కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైతులు బుధవారం ధర్నాకు దిగారు. రైతులు మాట్లాడుతూ వానాకాలం పంటల సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో కరెంటు కోతలు పెరిగాయన్నారు. లోవోల్టేజీతో విద్యుత్‌మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంభీరావుపేటలో సెస్ ఏఈ అనంద్‌కుమార్ రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయండి గద్దె నిర్మించినా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లిలో రైతులు రోడ్డెక్కారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. ట్రాన్స్ఫార్మర్ లేక పొలాలకు నీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రాన్స్ఫార్మర్ అమర్చి పంటలను కాపాడాలని కోరారు. -
కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దేశానికి రోల్‌మోడల్‌గా మారుతోందని, రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏఐసీసీ అదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోనే మెంబర్ షిప్ విషయంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. కార్యకర్తలు మొక్కవోని దీక్షతో పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారని అదే స్ఫూర్తితో లోకల్‌బాడీ ఎన్నికల్లో పనిచేయాలని కోరారు. పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్, పార్టీ పదవుల్లో పెద్దపీట ఉంటుందన్నారు. తెలంగాణ సంపదను దోచుకోని లక్షల కోట్లు లూటీ చేసిన కేసీఆర్‌కు రాష్ట్రంలో స్థానం లేదన్నారు. జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రుద్ర సంతోష్, సత్తు మల్లేశం, రహమతు హుస్సేన్, వైద్యుల అంజన్ కుమార్, వెలిచాల రాజేందర్రావు, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఒడితెల ప్రణవ్, వి.నరేందర్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌ను ప్రధాని చేద్దాందేశంలో బీజేపీ గ్రాఫ్ తగ్గుతోందని, రాబోయే రోజుల్లో మోదీని గద్దె దించి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ పాలన గాడి తప్పిందని, 11ఏళ్లుగా ప్రజలను మభ్యపెట్టడం తప్పా బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూసేందుకు ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బండారాన్ని ఎండగట్టండి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు నిఖార్సయిన కార్యకర్తలకే ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అద్దంకి దయాకర్ -
పడిపోయిన సన్నబియ్యం ధరలు
● పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో సన్నబియ్యం ధరలు గణనీయంగా తగ్గాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటను కలిగించినట్లయ్యింది. గతంలో క్వింటాల్ ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు పలికిన ధర.. ఇప్పుడు రూ.4,500 నుంచి రూ.4,000కు పడిపోయింది. ధరల తగ్గుదలకు కారణాలు.. రాష్ట్రప్రభుత్వం ఇటీవల సన్నవడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. అంతేగాకుండా, రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఫలితంగా ధరలు పడిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకంతో సన్నవడ్ల సాగు విస్తీర్ణం, దిగుబడి పెరుగుతోంది. ఇది మార్కెట్లో సన్న బియ్యం ధరల తగ్గుదలకు దారితీస్తోందంటున్నారు. రేషన్‌కార్డు లేనివారికి ప్రయోజనం జిల్లాలో సుమారు 35వేల కుటుంబాలకు రేషన్‌కార్డులు లేవని అధికారులు చెబుతున్నారు. వీరికి ప్రతినెలా దాదాపు 10 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమంటున్నారు. ఇప్పుడు ధరలు తగ్గడంతో వీరికి ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. -
స్పందిస్తున్న హృదయాలు
● అజయ్‌కి అండగా ఆరోగ్యశాఖ మంత్రి ● మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలింపు వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన సుద్దాల అజయ్ వినాయక విగ్రహాల తయారీకేంద్రంలో గాయపడి అచేతనస్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్‌కు రూ.10లక్షలు ఖర్చవుతుండటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడటంపై ‘సాక్షి’లో బుధవారం ‘నిరుపేదకు పెద్ద కష్టం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ సంఘటనపై సీఎంవో కార్యాలయం, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కార్యాలయం నుంచి ఆరా తీశారు. అజయ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వాకాబు చేశారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అజయ్‌కి మెరుగైన వైద్యం అందించాలని వరంగల్ జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేయడంతో హుటాహుటిన అజయ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. దగ్గరుండి నిమ్స్‌కు తరలించారు. కాగా.. పలువురు దాతలు ఇప్పటి వరకు రూ.1.20 లక్షల సాయం అందించారు. ఎమ్మెస్సార్ సతీమణి సుగుణ మృతికరీంనగర్: దివంగత మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు సతీమణి మేనేని సుగుణ(85) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందారు. వారి అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో గురువారం మధ్యాహ్నం 12గంటలకు జరుగనున్నాయి. ఎమ్మెస్సార్ సతీమణి సుగుణదేవి మరణం బాధకరమని ఎంఐంఎ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తదితరులు ఒక ప్రకటనలో నివాళి అర్పించారు. -
బనకచర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేదిలేదు
● రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు సాక్షి పెద్దపల్లి: బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబురాల సభ నిర్వహించారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, నీటి వాటా విషయంలో రాజీ లేదన్నారు. గోదావరి నదీజలాల్లో తెలంగాణ హక్కుగా రావాల్సిన ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రనీటివాటా విషయంలో కేంద్రప్రభుత్వంతో అన్నిప్రయత్నాలు చేస్తామని తెలిపారు. గోదావరి జలాల విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో స్పష్టం చేసినా ఏదోరకంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనేఉన్నారని మండిపడ్డారు. అతిసమీపంలోని మంథని, పెద్దపల్లి పట్టణం, రామగుండం నగరానికి నీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆయన దుయ్యబట్టారు. కూలిపోయిన డ్యామ్‌ల గురించి బీఆర్ఎస్ నేతలు ఇవాళ గొప్పగా మాట్లాడుతుఉన్నారని, బనకచర్ల విషయంలో ఆనాడులేని ఆరాటం ఇవాళ వచ్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటిశ్వరులను చేయడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ ఉరఫ్ సీతక్క తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ఆర్థికతోడ్పాటు అందిస్తోందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేసే ప్రతీపథాకాన్ని మహిళల పేరు మీదనే అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన గాండ్ల సత్యం (53)అనే సింగరేణి ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. తన కూతురు ముద్దసాని లావణ్యను పెద్దపల్లిలోని కాలేజీలో చేర్పించేందుకు బైక్‌పై వస్తున్నాడు. అప్పన్నపేట శివారులో డివైడర్‌ను అదుపుతప్పి ఢీకొన్నాడు. ఆ తర్వాత డివైడర్ ఆవతల ఉన్న రోడ్డుపైకి పడ్డాడు. ఇంతలోనే అటుగా వేగంగా వస్తున్న లారీ సత్యం పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. వెంట ఉన్న కూతురు డివైడర్‌పై పడగా గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై మల్లేశ్ తన సిబ్బందితో వెళ్లి గాయపడ్డ లావణ్యను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
మహిళలకు ఏంచేశారని సంబురాలు?
● కేసీఆర్‌పై కోపంతోనే గోస పెడుతున్నారా? ● రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు ● మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్ పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఏంచేసిందని పెద్దపల్లిలో పెద్దఎత్తు న సంబురాలు జరుపుకున్నారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నిలదీశారు. ము గ్గురు మంత్రులు వేడుకలకు హాజరయ్యారే తప్ప మహిళలు, రైతుల కోసం ఏం చేశారో చెప్పనే లే దన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంతమంది మహిళలకు రూ.2500 ఇస్తున్నారు, సబ్సిడీగ్యాస్, విద్యు త్ బిల్లుల మాఫీ లాంటి పథకాలను ఎంతమందికి వర్తింపజేసారో శ్వేతపత్రం విడుదల చేయా లని డిమాండ్ చేశారు. జిల్లాకు నాలుగు ఠాణాలు మంజూరు చేసినా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమిల్ల రాకేశ్ విమర్శించా రు. సాగునీటిపై మంత్రులను ప్రశ్నిస్తారనే భ యంతోనే రైతులను ముందస్తుగా అరెస్టు చేశా రని ధ్వజమెత్తారు. డీసీపీ ఆఫీసు సమీపంలోనే కత్తుల దాడుల్లో ఇద్దరిని హతమార్చిన ఘటన జరిగి గంటలు కూడా కాలేదని తెలిపారు. చెరువుల్లోకి కాళేశ్వరం నీటిని మళ్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఉప్పు రాజ్‌కుమార్, శ్రీధర్, చంద్రశేఖర్, వెంకటేశ్, రాజు, ఫహీం, సరేశ్, శివకుమార్, రవి, కుమార్, మనోజ్, శ్రీనివాస్, కిరణ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పరిష్కారం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో తలెత్తే విద్యుత్ సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఆయన విద్యుత్ తదితర సమస్య లు, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొత్తగా వేసే విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు విస్తరణ, మురు గునీటి కాలువల నిర్మాణ సమయంలో అవసరమైతే విద్యుత్ స్తంభాలు మార్చాలని అన్నా రు. అదేవిధంగా భూసంబంధ సమస్యలపై అందిన అర్జీలను ఈ నెలాఖరు వరకు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. భూభారతి –రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని అన్నారు. వి ద్యుత్ ఎస్ఈ గంగాధర్, డీపీవో వీరబుచ్చయ్య, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్, రమేశ్, వెంకన్న, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. 26న ఇందిరాశక్తి వేడుకలు రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలో ఈనెల 26న నిర్వహించే ఇందిరా మహిళాశక్తి సంబురాలకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పెండ్రు హన్మాన్రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతిగౌడ్, ప్రతినిధులు ఉరిమెట్ల రాజలింగం, సింగం కిరణ్‌కుమార్‌గౌడ్, జూల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. 19న అథ్లెటిక్స్ పోటీలు జ్యోతినగర్(రామగుండం): రామగుండం జె డ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈనెల 19న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, గట్టయ్య తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే వారు పూర్తి వివరాల కోసం పీఈటీ అజయ్, 99595 24375 నంబరులతో సంప్రదించాలని వారు సూచించారు. -
రక్షణ దుస్తులు ధరించి పనిచేయాలి
● రామగుండం బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి ● పారిశుధ్య సిబ్బందికి సేఫ్టీపై అవగాహన కోల్‌సిటీ(రామగుండం): పారిశుధ్య సిబ్బంది విధి నిర్వహణలో వ్యక్తిగత రక్షణ దుస్తులు, పరికరాలు తప్పనిసరిగా ఉపయోగించాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి సూచించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతోపాటు ‘నమస్తే డే (నేషనల్ యాక్షన్ పర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ డే)’ను పురస్కరించుకొని పారిశుధ్య సిబ్బందితో నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం అవగాహన కల్పించారు. సఫాయి మిత్రలకు ప్రభుత్వం ఆయుష్మాన్ హెల్త్ కార్డులు అందజేస్తూ మరో రూ.5లక్షలు అదనపు బీమా కవరేజ్ కల్పిస్తున్నదని తెలిపారు. ఈ పథకం వర్తించడానికి డాక్యుమెంట్లతో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. అంతకుముందు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చేపట్టిన వివిధ పనులను ఆయన పర్యవేక్షించారు. ద్వారకా నగర్లో స్లమ్ సమాఖ్య సమావేశంలో పాల్గొని తడి, పొడి చెత్త, రీసైక్లింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సప్తగిరి కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛతపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. రామగుండం హౌసింగ్ బోర్డ్ కాలనీలో పిచ్చిచెట్లు, పొదలు తొలగించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు కుమారస్వామి, కిరణ్, నాగభూషణం, ఆర్ఐ శంకర్రావు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
బోనమెత్తి.. నృత్యం చేసి..
కోల్‌సిటీ(రామగుండం): రజకుల ఆరాధ్య దైవమైన మడేలేశ్వరస్వామి బోనాల జాతర గోదావరిఖనిలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎల్బీనగర్ రజక సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఇంటింటా బోనం తీసుకుని డప్పు చప్పుళ్లు, శివశత్తుల నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అడ్డగుంటపల్లిలోని మడేలేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు కొండపర్తి సంజీవ్, మామిడి పోశం, బొడ్డుపెల్లి రంజిత్, మామిడి రమేశ్, గూడెపు రామచందర్, మామిడి రాజయ్య, పూసాల రాజయ్య, కొత్తపెల్లి శంకర్, పున్నం సారయ్య, మామిడి కుమార్, మామిడి మహేందర్, మామిడి అశోక్, పూసాల శ్రీనివాస్, పూసాల శీను తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఖరారుపెద్దపల్లిరూరల్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో ప్రస్తుతం 13 జెడ్పీటీసీ, 140 ఎంపీటీసీ స్థానాలు ఉన్నా యి. తాజాగా మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గించి 137కే పరిమితం చేశారు. ఇందులో వెంకట్రా వుపల్లి, లింగాపూర్ పంచాయతీలు రామగుండం కార్పొరేషన్లో విలీనం కాగా, పెద్దంపేట(రామగిరి మండలం) గ్రామాన్ని జల్లారం ఎంపీటీసీ స్థానం పరిధిలో విలీనం చేశారు. దీంతో ఎంపీటీసీల స్థానాల సంఖ్య 137కే పరిమితమైందని, జెడ్పీటీసీ స్థానాల్లో మార్పేమీలేదని జెడ్పీ సీఈవో నరేందర్ వివరించారు.ఆటో.. సామర్థ్యానికి మించి.. ‘ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.. అతివేగం వద్దు.. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించరాదు.. సౌండ్సిస్టమ్ అసలే వాడొద్దు.. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్ద’ని సంబంధిత శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇదేసమయంలో విద్యార్థులను తరలించే పాఠశాలల బస్సులు, ఆటోల డ్రైవర్లు, యజమానులకూ వివరిస్తూనే ఉన్నారు. అయినా, నిబంధనలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. సామర్థ్యానికి మించి, నిబంధనలు అతిక్రమిస్తూ ఆటోల్లో చిన్నారులను ఇంటి నుంచి బడికి, బడి నుంచి ఇంటికి తరలిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో అయితే, ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉంటున్నా.. మెయిన్ రోడ్లు, రాష్ట్ర రహదారిపై ఇలాంటి ఆటోలు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే జిల్లా కేంద్రంలో ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన ఈ చిత్రాలు.. అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి న్యూస్‌రీల్ -
ఇసుక లోడింగ్ లొల్లి
● ఆందోళనకు దిగుతున్న లారీ డ్రైవర్లు ● పెద్దఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ● రహదారికి ఇరువైపులా లారీల పార్కింగ్తో ట్రాఫిక్ సమస్య మంథని: ఇసుక క్వారీల్లో లోడింగ్ వివాదాస్పదమవుతోంది. దూర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు వస్తున్న లారీల్లో లోడింగ్ ఆలస్యమవుతోందని, స్థానికులు, డబ్బులు ఇచ్చిన వారి లారీల్లోనే ఇసుక లోడ్ చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 13న మంథని మండలం అడవిసోమన్‌పల్లి ఇసుక క్వారీ వద్ద లోడ్ చేసుకునేందుకు వచ్చిన లారీ డ్రైవర్లు మంథని – కాటారం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. అలాగే నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని బెగ్లూర్ ఇసు క క్వారీ వద్ద ఇదే పరిస్థితి నెలకొందని డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బుధవారం కూడా ముత్తా రం మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీ వద్ద డ్రైవర్లు ధర్నా చేశారు. రోజుల తరబడి పడిగాపు లు కాస్తున్నామని, డబ్బులు ఇచ్చిన వారికే ఇసుక లోడ్ చేస్తున్నారని వారు ఆవేదన చెందారు. సౌకర్యాలు లేక అవస్థలు.. వందల కిలో మీటర్ల దూరం నుంచి ఇసుక తీసు కు వెళ్లేందుకు మానేరు తీరంలోని క్వారీ వద్దకు వస్తున్న లారీ డ్రైవర్లు తమ వాహనంలో లోడ్ చే సుకునేందుకు నాలుగు నుంచి ఐదు రోజల పా టు పడిగాపులు కాస్తున్నారు. అయినా, క్వారీల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో రాత్రి, పగలు చెట్లనీడ నిరీక్షించాల్సి వస్తోందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రోడ్డుకు ఇరువైపులా లారీల బారులు.. ఇసుక లోడింగ్‌కు ఆలస్యమవుతుండడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా లారీలను పార్కి ంగ్ చేస్తున్నారు. కిలో మీటర్ల మేర పెద్దఎత్తున లారీలు రోడ్డుకు ఇరువైపులా ఇలా నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అలాగే రాత్రివేళ లో వచ్చేవాహనాలతో ప్రమాదాలు జరిగే ఆస్కా రం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వివాదాలకు కారణవుతున్న అధికారులపై దృష్టి సారించి ఉన్నతాధికారులు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. మళ్లీ రోడ్డెక్కిన లారీ డ్రైవర్లు ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి – తాడిచర్ల మా నేరు బ్లాక్–2 క్వారీలో తమ లారీల్లో ఇసుక నింపడం లేదని ఆరోపిస్తూ పలువురు డ్రైవర్లు బుధవారం మరోసారి ధర్నా చేశారు. ఇదే సమస్యపై ఇటీవలకే వారు ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం డీడీ చెల్లించి ఇసుక క్వారీ వద్ద వారం రోజులుగా నిరీక్షిస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వానికి రుసుం చెల్లించకుండా వచ్చే ఒక్కోలారీకి రూ.4,700 తీసుకుంటూ ఇసుక నింపుతున్నారని వారు ఆరోపించారు. రోజుల తరబడి నిరీక్షిస్తూ, ఆకలికి అలమటిస్తున్నా తమ మొర ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారుల సహకారంతోనే క్వారీ నిర్వాహకులు, సూపర్వైజర్లు కుమ్మకై ్క ప్రభుత్వ ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. -
చెట్టు కూలి కొంగలు విలవిల
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రధాన రహదారిలోని భారీచింతచెట్టు బుధవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నరికివేయించారు. రహదారి విస్తరణలో భాగంగా దానిని తొలిగించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ చెట్టుపై సేదతీరుతున్న కొంగలు, మరికొన్ని పక్షులు రాత్రి వరకూ కొమ్మలపైనే ఉండిపోయాయి. కొన్ని పక్షులు అదుపుతప్పి చెట్టు కిందపడడంతో మరణించాయి. రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్నచెట్ల తొలగింపు అనివార్యం అయినప్పటికీ నీడనిచ్చే భారీ చెట్లు నెలకూలడంపై పర్యావరణ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సేవతోలనే మంచిగుర్తింపు
పెద్దపల్లిరూరల్: సేవలు అందించిన వారికే ప్రభు త్వ అధికారులుగా మంచి గుర్తింపు ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ అన్నారు. బదిలీపై వెళ్తున్న డీఏవో ఆదిరెడ్డికి రాఘవాపూర్ రైతువేదికలో బుధవారం వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికా రులు, డీలర్లు ఆదిరెడ్డిని ఘనంగా సత్కరించారు. పెద్దపల్లిలో పనిచేసిన కాలం మరువలేనిదని ఆదిరె డ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతులు తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞుడనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విత్తన, ఎరువుల డీలర్ల అసోసియేషన్ నాయకులు, పెద్దపల్లి, మంథని ఏడీఏలతోపాటు ఏవో, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యం
● పెద్దపల్లి ప్రగతిపై ప్రత్యేక దృష్టి ● పామాయిల్ పంటను ప్రోత్సహించాలి ● మంత్రులు తుమ్మల, సీతక్క, శ్రీధర్‌బాబు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి అభివృద్ధికి సంపూర్ణ సహ కారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో బుధవా రం స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు అధ్యక్షత న ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ఇందిరా మ హిళాశక్తి సంబురాల్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బా బు, సీతక్క, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విజ యరమణారావును ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం మీ అదృష్ణమన్నారు. మంచి ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కోతులు, పందులే కాదు దేనితోనూ నష్టం జరగని పంట పామాయిల్ అని, ఈ పంట సాగుచేసే రైతులకు రాయితీ వర్తింపజేస్తున్నామని తుమ్మల తెలిపారు. కేంద్రప్రభుత్వం దిగుబడి ధర తగ్గించేందుకు కుట్ర పన్నితే పెంచేలా ఒత్తిడి తెస్తున్నామన్నారు. కాల్వశ్రీరాంపూర్‌లో ఆయిల్‌పామ్ పరిశ్రమ నిర్మిస్తున్నామన్నారు. కొద్దిరోజుల్లోనే సిద్దిపేట సమీపంలోనూ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని వివరించారు. ‘మార్పు’ చూపిస్తున్నాం పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్నివర్గాల వారిలో మార్పు తెచ్చి చూపించిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే విజ్జన్న అభ్యర్థన మేరకే మహిళల్లో నైపు ణ్యాన్ని పెంచేలా శిక్షణను ఇచ్చేందుకు పెద్దపల్లిలో వీ–హబ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయ న పేర్కొన్నారు. వచ్చేనెలలో ఈ సెంటర్‌ను ప్రారంభిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళాసాధికారతే లక్ష్యం.. మంత్రి సీతక్క మహిళా సాధికారిత లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క అన్నారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు సైతం మహిళల పేరిట మంజూరు చేస్తున్నా మని తెలిపారు. రుణ వాయిలను సకాలంలో చెల్లిస్తుండడంతో మహిళాసంఘాలకే మళ్లీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నారని సీతక్క వివరించారు. తెలంగాణ మహిళల శక్తియుక్తులను ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసించారని ఆమె గుర్తుచేశారు. మహిళల్ని ప్రోత్సహిస్తున్న సర్కార్ మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం అన్నిరంగాల్లో ప్రాధాన్యతనిస్తోందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కోయశ్రీహర్షతో పాటు అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణు, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో కాళిందిని, డిఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే చీరలు నాణ్యంగా ఉండేలా చూడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మంత్రి సీతక్కను అభ్యర్థించారు. బీఆర్ఎస్ పాలకులు పంపిణీ చేసిన చీరలను పంట చేలకు రక్షణగా, ఇంటి పనుల వద్ద వాడుకున్నారని గుర్తుచేశారు. నియోజకవర్గంలోని 4,521 మహిళా సంఘాలకు రూ.4కోట్ల94లక్షల వడ్డీలేని రుణాలను పంపిణీ చేశామని, సీ్త్రనిధి ద్వారా 514 సంఘాలకు రూ.11కోట్ల75లక్షలు అందించామని తెలిపారు. పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, సుల్తానాబాద్ మండల సమాఖ్యలకు బస్సులు అందించామన్నారు. -
‘అయ్యోపాపం.. గణేశ్ ప్రాణం గాలిలో కలిసి పోయిందా?’
పెద్దపల్లిరూరల్: ‘అయ్యోపాపం.. అన్నెంపున్నెం ఎరగని గాండ్ల గణేశ్(37) ప్రాణం గాలిలో కలిసి పోయిందా?’ అని రాఘవాపూర్ గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు, గ్రామ స్తుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలో స్క్రాప్ వ్యాపారం చేసే పస్తం జంపయ్య వద్ద గాండ్ల గణే శ్ పదేళ్లకుపైగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జంపయ్య కుటుంబంలోనూ ఆ యన ఒకడిగా ఉంటున్నాడు. మంగళవారం జంపయ్య సోదరి లక్ష్మి, బావ మారయ్య పంచాయితీకి ఇతను కూడా సుగ్లాంపల్లి గ్రామ సమీపంలోకి వెళ్లాడు. గతంలో మాదిరిగానే ఇదికూడా సా ధారణ పంచాయితీగానే ఉంటుందని భావించా డు. అనూహ్యంగా జరిగిన కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.జీతమే ఆధారం..నిరుపేద కుటుంబీకుడైన గాండ్ల గణేశ్ రాఘవాపూర్ గ్రామంలో అందరితో మర్యాదగా ఉంటాడు. యజమాని ఇచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. భార్య రజిత, కూతురు రిత్విక(4) ఉన్నారు. స్క్రాప్ వ్యాపారం సాగించే పస్తం జంపయ్య వద్ద సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తుంటాడు.మాకు దిక్కెవరు?‘అయ్యో.. వివాదంతో ఏసంబంధం లేనితన భర్త ను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు.. ఇక మాకు దిక్కెవర’ని మృతుడు గణేశ్ భార్య రజిత రోదించిన తీరు కలచివేసింది. నాలుగేళ్ల పాపతో ‘నువు లేకుండా ఎలా బతికేద’ని విలపిస్తున్న తీరు స్థానికులను చలింపజేసింది.పరిహారం చెల్లింపు!జీతంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గాండ్ల గణేశ్ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఏ ఆధారం లేకుండా పోయిందని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని గ్రామపెద్దలు, బంధువులు డిమాండ్ చేశారు. ఇరువర్గాల మధ్య జరిపిన చర్చల్లో అంత్యక్రియల కోసం రూ.లక్షతో పాటు కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం.పెగడపల్లిలో విషాదంకాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సుగ్లాంపల్లిలో జరిగి న భార్యాభర్తల పంచాయితీ ఘర్షణలో మోటం మల్లేశం మృతి చెందడంతో పెగడపల్లి గ్రామంలో విషాదం అలముకుంది. మల్లేశం బతుకుదెరువు కోసం సుమారు 15 ఏళ్ల క్రితం పెగడపల్లి గ్రామానికి వలస వచ్చాడు. బోళ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, ముత్తారం మండలాల్లో వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం చేపట్టిన సొంతింటి నిర్మాణం చివరి దశలో ఉంది. గృహప్రవేశం చేయాల్సి ఉంది. ఇంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు హతాశులయ్యారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, మాజీ సర్పంచ్ సుజాత, కాంగ్రెస్ నాయకులు మియాపురం సతీశ్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
ఎరువులు కేటాయించాలి
గోదావరిఖని/ ఫెర్టిలైజర్‌సిటీ: రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎరువులు కేటాయించాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రాజత్మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణకు 2.7లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తామని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి హామీ ఇచ్చిన ట్లు ఎంపీ వంశీకృష్ణ వివరించారు. నేడు నీటి సరఫరా బంద్పెద్దపల్లిరూరల్/కోల్‌సిటీ: జిల్లాలో బుధవారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని గ్రిడ్ ఈఈ పూర్ణచందర్ తెలి పారు. ముర్మూర్ ఇంటెక్‌వాల్, పంప్‌హౌస్‌లో మిషన్‌భగీరథ పంపులు, బఫర్ పైపులైన్ మరమ్మతులతో అంతరాయం ఏర్పడుతుందని వివరించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ పరిధితోపాటు జిల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరా ఉండదని ఆయన వివరించారు. -
అన్ని రంగాల్లో అగ్రగామి రామగుండం
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతా న్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని ఎ మ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గోదావరి తీ రంలోని సమ్మక్క గద్దెల వద్ద మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎప్సీఎల్, మున్సిప ల్ సహకారంతో సమ్మక్క గద్దెల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రూ.4 కోట్లతో గోదావరి తీరంలోని శ్మశానవాటిక లో స్మృతివనం, గ్రావియట్ నిర్మాణాలు, ఇతర సౌ కర్యాలు కల్పిస్తామన్నారు. రూ.కోటితో ఈద్గాలను అభివృద్ధి చేస్తామని, క్రిష్టియన్ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తామన్నారు. అనంతరం బల్దియా కార్యాలయం ఎ దుట జరిగిన సింగరేణి చేపట్టిన వనమహోత్సవంలో ఆయన మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ అ రుణశ్రీ, ఆర్జీ–వన్ జీఎం లలిత్‌కుమార్, జాతర క మిటీ ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, బంగారు చిన్నరాజయ్య, ఎన్టీపీసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, మారెల్లి రాజి రెడ్డి, ఆసిఫ్ పాషా, పి.ఎల్లయ్య పాల్గొన్నారు. బల్దియా అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం కోల్‌సిటీ(రామగుండం): బల్దియా ఇంజినీర్ల పనితీరుపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై అలసత్వం వీడాలని హెచ్చరించారు. రాజకీయం చేయడం మానుకోవాలని హిత వు పలికారు. ఓ అధికారి వ్యవహారంపై కూడా ఎ మ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అధికారిని వెంటనే బదిలీ చేయాలని కమిషనర్‌కు సూచించారు. వనమహోత్సవంలో ప్రధాన రహదారి వెంట మొ క్కలు నాటిన అనంతరం బల్దియా కమిషనర్ అరు ణశ్రీతో కలిసి ఎమ్మెల్యే సమావేశమై పలు సూచనలు చేశారు. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు రాను న్న దృష్ట్యా ఎన్నికల కోడ్ కన్నా ముందే శంకుస్థాపనలు చేయాలని సూచించారు. నగరంలో విలీనమై న లింగాపూర్ వైపు పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహా లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆ తర్వాత సెల్ఫీ పాయింట్లో ఆయన ఫొటో దిగారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ -
మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో బుధవారం మంత్రులు తుమ్మల నాగే శ్వర్రావు, సీతక్క, శ్రీధర్‌బాబు పాల్గొనే బహిరంగసభ ఏర్పాట్లను కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవా రం పరిశీలించారు. సభకు అధిక సంఖ్యలో మహిళ లు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో గంగయ్య, ము న్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తదితరులు ఉన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని, సమాచారహక్కు దరఖాస్తులకు సకాలంలో సమాధానాలివ్వాలని, కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రజావాణి, ప్రజాదర్బార్, ఆర్టీఐ, కోర్టు కేసు తదితర అంశాలపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రొటోకాల్ చెక్‌లిస్ట్ ప్రతీశాఖ పంపాలని అన్నారు. జిల్లా లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేలా చూడాల ని కలెక్టర్ ఆదేశించారు. సిజేరియన్లను కట్టడి చేయాలన్నారు. 102 వాహనాల ద్వారా గర్భిణులకు సేవ లు అందించాలన్నారు. టీబీ ముక్త్భారత్ ద్వారా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అన్నా రు. డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లావ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలోని వృద్ధాశ్రమం, మెంటల్లీ డిజేబుల్ హోమ్, చిల్డ్రన్ హోమ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణపై సమీక్షించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, అధికారులు భావ్‌సింగ్, గిరిశ్బాబు, రమేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఏర్పాట్ల పరిశీలన -
డీఏవోగా శ్రీనివాస్
పెద్దపల్లిరూరల్: జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో)గా శ్రీఽనివాస్ మంగళవారం ఉద్యోగ బా ధ్యతలు స్వీకరించారు. హుస్నాబాద్ ఏడీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు డీడీఏగా పదోన్నతి కల్పించి పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారిగా నియమించారు. ఇక్కడ పనిచేసిన డీఏవో ఆదిరెడ్డిని హన్మకొండ ఏడీఏగా బదిలీ చేశారు. అందరూ సహకరించారు జిల్లా వ్యవసాయ శాఖకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు అధికారులు, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని బదిలీపై వెళ్తు న్న డీఏవో ఆదిరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో ఏ ర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త డీఏవో శ్రీనివాస్, ఏవో వైదేహి, ప్రకాశ్‌రావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.‘భట్టి’ వ్యాఖ్యలపై నిరసన పెద్దపల్లిరూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆ గ్రహం వ్య క్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట దళిత మోర్చా రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశిపేట శివాజీ, నాయకుడు ఈర్ల శంకర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు. 2016లో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్యతో సంబంధం లేకున్నా రాంచందర్‌రావు పేరును డిప్యూటీ సీఎం ప్రస్తావించడం శోచనీయమన్నారు. చిలారపు పర్వతాలు, పెంజర్ల రాకేశ్, వేల్పుల రమేశ్, సంపత్, కారంగుల శ్రీ నివాస్, తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, మేకల శ్రీనివాస్, రాజగోపాల్, శ్రీకాంత్, కిరణ్, సతీశ్, సోడాబాబు పాల్గొన్నారు. ఆకట్టుకున్న మేజిక్ షో కోల్‌సిటీ(రామగుండం): కర్చీప్ను జాతీయ జెండాగా మార్చడం.. తెల్లకాగితాన్ని రూ.500 నోటుగా మార్చడం.. ప్లాస్టిక్బాల్ను మాయం చేయడం.. చెవిలో పెట్టిన దారాన్ని ముక్కులోంచి తీయడం తదితర మేజిక్ ప్రదర్శలు ఆక ట్టుకున్నాయి. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ మంగళవారం చేపట్టిన ప్రదర్శనలు అబ్బురపర్చాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో మేజిక్ ప్రదర్శలు ఇస్తూ ఉపాధి పొందుతున్నట్లు షబ్బీర్ తెలిపారు. దివ్యాంగులకు ఉపాధిపెద్దపల్లిరూరల్: జిల్లాలోని అర్హులైన దివ్యాంగు ల కోసం 21 స్వయం ఉపాధి యూనిట్లు మంజూరయ్యాయని జిల్లా దివ్యాంగ సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాల్ తెలిపారు. వ్య వసాయ అనుబంధ పరిశ్రమలు, సేవా, వ్యా పారం ద్వారా ఆదాయం పొందేలా ప్రోత్సహం అందిస్తున్నామన్నారు. ఆసక్తిగలవారు ఈనెలాఖరులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవా లని, వివరాలకు 94408 52495 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. నియామకంపెద్దపల్లిరూరల్: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా గండు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కానుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేర కు యూనియన్ ఉత్తర్వులు జారీచేసింది. -
పల్లెపెద్ద పెత్తనం
సాక్షి, పెద్దపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో వివాదాలను సులభంగా, తక్కువ ఖర్చుతో త్వరితగతిన పరిష్కరించేందుకు కుల సంఘాల ప్రతినిధులు, పెద్దమనుషుల పంచాయితీలు ఉపయోగపడుతున్నాయి. పెద్దలు చేస్తున్న ఇలాంటి పంచాయితీలు అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయి.. ఇదేసమయంలో గొడవలకూ దారితీస్తున్నాయి. మరికొన్ని సందర్భా ల్లో ప్రాణాలు తీసుకునే స్థాయికీ తీసుకెళ్తున్నాయి. సిఫారసులే కారణమా? సమస్యల పరిష్కారం కోసం ఠాణామెట్లు ఎక్కుతున్న బాధితులకు పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలని పోలీసులు సలహా ఇస్తున్నారని, దీంతోనే అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కులం, లింగం, ఆర్థికస్థితి, వ్యక్తిగత సంబంధాల ఆధారంగా పెద్దమనుషులు పక్షపాతంగా వ్య వహరించడం, మహిళలపై వివక్ష, అధికార దుర్వినియోగం, చట్టంపై అవగాహనలోపంతోనూ చాలా పంచాయితీలు దారితప్పుతున్నాయని అంటున్నా రు. కొన్ని సందర్భాల్లో కులబహిష్కరణలకూ తీర్మానాలు చోటుచేసుకుంటున్నాయి. లోక్ అదాలత్, కో ర్టుల్లో తేల్చుకోవాల్సిన ఆర్థికపరమైన వివాదాలు, కుటుంబాల సమస్యల పరిష్కారాల కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించిన సమస్యలూ గొడవలకు దారితీస్తూ హింసను ప్రేరేపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అడ్డాలుగా గ్రామశివారు ప్రాంతాలు కుటుంబ, భార్యాభర్తల పంచాయితీలు, ఇతర వివాదాల్లో ఇరువర్గాలు సమస్యను పరిష్కరించుకునేందుకు గ్రామాల్లోని మార్కెట్ యార్డులు, పొలం గట్లు, నిర్మానుష్య ప్రదేశాలు, శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి. అక్కడ ఎలాంటి ఘటన జరిగినా వెంటనే పోలీసులు చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈక్రమంలోనే ఇరువర్గాలు మాటామాటా పెంచుకుని విచక్షణ కోల్పోతూ భౌతికదాడులకు దిగుతున్నాయి. వీడీసీల ఆగడాలు కూడా.. జిల్లాలోని వివిధ పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)ల ఆగడాలు మితిమీరుతున్నాయి. కొంతకాలంగా పెద్దరికం పేరిట అక్రమ వ్యాపారులనూ ప్రోత్సాహిస్తున్నాయి. తమ తీర్పులు, తీర్మానాలను ధిక్కరించే వారిపై బహిష్కరణ వేటువేస్తున్నాయి. అన్ని కులాలకు చెందిన ఒక్కో వ్యక్తి ఈ వీడీసీల్లో సభ్యుడిగా ఉంటున్నారు. గ్రామాభివృద్ధి పేరిట ఏర్పడిన ఈ వీడీసీలు తమ లక్ష్యం విస్మరించి తీర్పులు, తీర్మానాలు చేయడంతోపాటు ఆదాయం సమకూర్చడంపై దృష్టి సారిస్తున్నాయి. గ్రామ ఐక్య త, అభివృద్ధే ఎజెండా ముసుగులో ఏర్పాటయ్యే వీడీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ కు అడ్డుచెప్పేవారిని మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా వేధిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నా యి. మానేరు, చెరువుల్లో ఇసుక, మట్టి నిల్వలుఉన్న గ్రామాల్లో అధిపత్యం చేలాయిస్తున్నాయి. వీటికి వేలం నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నాయి. వీడీసీల అనుమతితోనే కొన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపులకు వేలం వేస్తూ విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారని, వీటిని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇదేవిషయంపై పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌ను వివరణ కోరగా.. పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదులు వస్తే బయట పరిష్కరించుకోవాలని బాధితులకు అధికారులు సూచనలివ్వరన్నారు. ఏ వివాదం ఉన్నా చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ప్రాణాలు తీస్తున్న పంచాయితీలు ఠాణాలు, కోర్టుల్లో తేలాల్సినవి పెద్దమనుషుల చెంతకు.. అధికారుల సిఫారసుతోనే ముదురుతున్న వివాదాలు! భార్యాభర్తల గొడవ ఠాణా మెట్లు ఎక్కింది. బయట పరిష్కరించుకుంటామని ఇద్దరూ పెద్దమనుషులను ఆశ్రయించి మంగళవారం సుగ్లాంపల్లిలో పంచాయితీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊ గిపోయిన ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఇదికాస్త కత్తిపోట్లకు దారీతీసింది. ఈ ఘటనలో గణేశ్, మల్లేశం చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తన భార్యను వేధిస్తున్నాడనే కారణంతో అప్పన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని మరోవ్యక్తి ఇటీవల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు పిలిచాడు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పాడు. ఇది నమ్మిన అవతలి వ్యక్తి మార్కెట్‌కు రాగానే.. ఆహ్వానించిన వ్యక్తి.. తన భార్య ఎదుటనే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. -
భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య
సాక్షి,పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన భార్య తరుపు కుటుంబ సభ్యులపై.. భర్త తరుపు కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల వివరాల మేరకు.. సుగ్లాంపల్లి భార్యాభర్తల పెద్ద మనుషుల పంచాయితీలో కత్తిపోట్ల కలకలం సృష్టించాయి. భార్య,భర్తల మధ్య జరుగుతున్న గొడవలకు పులిస్టాప్ పెట్టి వారిద్దరిని కలిపేందుకు ఆ ఊరి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ జరుగుతున్న సమయంలో భర్త తరుపు కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. మారణాయుధాలతో భార్య తరుపు కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేశారు.అప్రమత్తమైన భార్య కుటుంబీకులు సైతం కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేష్,ఓదెలకు చెందిన మోటం మల్లేష్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య వివాదాలలో జోక్యం చేసుకోవడం అనేది ఒక సున్నితమైన సమస్య. సాధారణంగా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారి మధ్య సామరస్యం కుదర్చడానికి ప్రయత్నించడం మంచిది. కానీ వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. -
ఆ దంపతుల ‘మొక్క’వోని దీక్ష
కోల్‌సిటీ(రామగుండం): ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం.. ఆకట్టుకునే పచ్చని మొక్కలు.. తీరొక్కపూలు స్వాగతం పలుకుతున్నాయి. గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ఆడెపు రామకృష్ణ దంపతులు తమ ఇంటిని పచ్చదనంతో నింపేసి పొదరిల్లుగా మార్చుకుని.. పర్యావరణానికి ఊపిరిపోస్తున్నారు. ఓ స్కూల్లో విద్యాబోధన చేస్తున్న గీతాశ్రీ– రామకృష్ణ దంపతులకు మొక్కల పెంపకం అంటే చాలాఇష్టం. గతంలో రామకృష్ణ ఎకో క్లబ్లో చేరి మొక్కల పెంపకంపై శిక్షణ పొందారు. ఆ తర్వాత 24 ఏళ్లుగా తన ఇంటి ఆవరణలోనే వివిధ రకాల పూలు, పండ్లు, స్వచ్ఛమైన గాలి అందించే అనేకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఆకుకూరలూ సాగు చేస్తున్నారు. వంటగదిలోని వ్యర్థాలు, ఎండుఆకులు, కుళ్లిన కూరగాయలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేస్తున్నారు. పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు, టోపీలు, బకెట్లు, పాడైన కూలర్లు, ఇంట్లోనే తయారు చేసిన సిమెంట్ కుండీలే మొక్కలకు నిలయాలుగా మార్చారు. ఏడాదికి రూ.లక్ష ఖర్చు నేను 24 ఏళ్లుగా మొక్కలు పెంచుతున్న. ఇది నాకు హాబీగా మారింది. ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ శుభకార్యం జరిగినా అక్కడికి మొక్కతో వెళ్తాను. కొత్త మొక్కలు కనిపిస్తే ఖర్చుకోసం ఆలోచించకుండా కొంటాను. ఏడాదికి మొక్కల కొనుగోలుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుంటా. ఇంట్లోనే సేంద్రియ ఎరువు, సిమెంట్ తొట్టీలను తయారు చేస్తున్న. మొక్కల పెంపకంతో మాకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. – ఆడెపు రామకృష్ణ, గోదావరిఖని -
ఇంటింటా ఫీవర్ సర్వే చేయాలి
● రెండు నెలలపాటు అప్రమత్తంగా ఉండాలి ● బల్దియా, వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేయాలి ● రామగుండం బల్దియా కమిషనర్ ఆరుణశ్రీ ఆదేశాలు కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం బల్దియాలోని ప్రజారోగ్యం, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి అన్న ప్రసన్న కుమారితో కలిసి మాట్లాడా రు. అధికారులు, సిబ్బంది ఈ రెండు నెలలు అ ప్రమత్తంగా ఉండాలన్నారు. అంటువ్యాధులు ప్ర బలకుండా నగరపాలక సంస్థ, వైద్య, ఆరోగ్య శా ఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాని ఆదేశించారు. ఇంటింటినీ సందర్శించి జ్వర సర్వే చేయాలన్నారు. ఇదేసమయంలో పారిశుధ్య సమస్యలు గుర్తించి ప్రజారోగ్య విభాగం దృష్టికి తీసురావాల ని కమిషనర్ సూచించారు. రెండు విభాగాల సిబ్బంది ఫోన్నంబర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పా టు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, డెంగీ అనుమానిత కేసులు వస్తే బల్దియా సిబ్బందికి సమాచారం అందించాలని, తద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపతామని తెలిపారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భా గంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు తాగునీటిలో క్లోరినేషన్, నిల్వనీటిని నీరు తొలగించడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్, చేయడం, ఆ యిల్ బాల్స్ వదలడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి మాట్లాడుతూ, అంటువ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, పట్టణ ఆరోగ్యకేంద్రాల మెడికల్ ఆఫీస ర్లు మణికేశ్వర్రెడ్డి, సాదిక్ పాషా, అహల్య, పద్మ, రమణి, దీవెన, స్నేహాలత, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కిరణ్, కుమారస్వామి, జూనియ ర్ అసిస్టెంట్ శంకర్స్వామి, మెప్మా టీఎంసీ మౌ నిక, జవాన్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల కోసం ఆందోళన వద్దు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లా వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన పడొద్దని, అవసరమున్న మేరకే కొనుగోలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈమేరకు సోమవారం అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసి నిల్వఉంచితే ఆవిరి అవుతుందన్నారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 9,400 టన్నుల యూరియా అందుబాటులో ఉందని వివరించారు. ఆగస్టులో మరో 10వేల టన్నులు అవసరముంటుందని, ఆ సమయంలో యూరియా వస్తుందని తెలిపారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి వనమహోత్సవం ద్వారా నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ నెలఖారు వరకు మొక్కలు నాటాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఉపాధిహామీ ద్వారా గుంతలు తవ్వించాలని అన్నారు. ఈజీఎస్ కూలీలకు సరాసరి వేతనం రూ.307 ఉండేలా చూడాలన్నారు. ప్రతీ మండలంలో కనీసం 20 ఎకరాలను ఎంపిక చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ చేపట్టాలని పేర్కొ న్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పీఎం ఆవాస్యోజనతో అనుసంధానిస్తోందని, యాప్‌లో సర్వే వివరాలు సకాలంలో పూర్తిచేయాల న్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. హాస్టళ్ల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని, ఫ్రైడే, డ్రైడే పక్కాగా అమలు చేయాలని సూచించారు. డీఆర్డీవో కాళిందిని, హౌసింగ్ పీడీ రాజేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
● రహదారి ఆధునికీకరణకు రూ.20 కోట్లు మంజూరు ● తారురోడ్డు నిర్మాణానికి రూ.11 కోట్లు ● అంతర్గత రహదారులకు రూ.8 కోట్లు
గోదావరిఖని: కార్మికవాడలను అనుసంధానిస్తూ నిర్మించిన కోల్‌కారిడార్ ఆధునికీకరణకు సింగరేణి యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యధికంగా కార్మిక కుటుంబాలు ప్రయాణించే ఈ రోడ్డు ప్రమాద భరితంగా మారిందని గుర్తించింది. గోదావరిఖని నుంచి సెంటినరీకాలనీ మీదుగా పెద్దపల్లి వరకు ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ద్విచక్రవాహనదారులు, పెద్దపల్లి, ఓడేడ్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం బిజీగా.. పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన కోల్‌కారిడార్ నిత్యం బిజీగా ఉంటోంది. వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. షిఫ్టు వేళల్లో డ్యూటీలకు వెళ్లే కార్మికులూ ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ఈక్రమంలో ఇరుకుగా, గుంతలమయంగా మారిన ఈ కోల్కారిడార్పై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పోతనకాలనీ సమీపంలో రోడ్డు మరింత ఇరుకుగా ఉంది. రాత్రివేళ ప్రమాదాలూ జరుగుతున్నాయి. న్యూమారేడుపాక రైల్వే గేట్‌సమీపంలో చౌరస్తా జంక్షన్ సరిగా లేదు. ఈమేరకు ప్రస్తుతం ఉన్న 7 మీటర్ల వెడల్పులోని తారురోడ్డును 10 మీటర్లకు పెంచి ఆధునికీకరించేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. సిద్ధమవుతున్న ప్రతిపాదనలు ఫైవింక్లయిన్ సమీపంలోని గ్యాస్ గోడౌన్ నుంచి ఓల్డ్ సైటాఫీస్ వరకు రోడ్డు వెడల్పు 10 మీటర్లు ఉందని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్ సైటాఫీస్ రోడ్డు నుంచి పోతనకాలనీ మీదుగా ఓసీపీ–1 సైలో బంకర్ వరకు మూడు మీటర్ల వరకు విస్తరించనున్నారు. దీనికోసం యాజమాన్యం ఇటీవల రూ.20 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో వాటర్ పైపులైన్లు, టెలిఫోన్, విద్యుత్ పైపులను మార్చడంతోపాటు పోతనకాలనీ కాంపౌండ్‌ను సుమారు ఐదుమీటర్ల మేర వెనక్కి జరపనున్నారు. కొన్నిచోట్ల భూసేకరణ అవసరం ఉంటుందని సింగరేణి అధికారులు చెబుతున్నారు. తారురోడ్డు నిర్మాణానికి రూ.11కోట్లు కోల్‌కారిడార్ తారు రోడ్డు నిర్మాణం కోసం రూ.11 కోట్లు యాజమాన్యం కేటాయింది. దీనికి వర్క్ అవార్డు పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. గ్యాస్‌గోడౌన్ నుంచి ఓసీపీ–1 సైలో బంకర్ వరకు ఈ నిధులతో రోడ్డును ఆధునికీకరించనున్నారు. ప్రస్తుత రోడ్డు శిథిలమై గుంతలుగా మారింది. రాత్రిపూట ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒకవైపు రోడ్డు బాగుంది. మరోవైపు శిథిమైంది. బాగున్న రోడ్డువైపు ప్రయాణించాలని యత్నిస్తున్న క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్గత రోడ్ల విస్తరణకు రూ.8కోట్లు.. అత్యధిక కార్మిక కుటుంబాలు నివసిస్తున్న యైటింక్లయిన్‌కాలనీ పట్టణంలో అంతర్గత రోడ్లు శిథిలమయ్యాయి. వీటిని అభివృద్ధి చేసేందుకు సింగరేణి యాజమాన్యం రూ.8 కోట్లు కేటాయించింది. కోల్‌కారిడార్ రోడ్డు -
కాన్పులు.. కాసులు
● ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు ● ప్రైవేట్‌లో తగ్గిన నార్మల్ డెలివరీలు ● గర్భిణుల ఆరోగ్యంతో చెలగాటం ● పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సాక్షి పెద్దపల్లి: ‘సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడండి.. అలా చేస్తే తల్లీబిడ్డల ఆరోగ్యానికి మంచిది.. సాధారణ ప్రసవమైతే పుట్టిన గంటలోపే తల్లిపాలు బిడ్డకు పట్టించడానికి వీలుంటుంది.. ఇలా తొలిగంటలో అమ్మపాలు తాగిన శిశువు లు చాలాఆరోగ్యంగా ఉంటారు’ అని డాక్డర్లు తర చూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గర్భిణుల ను కడుపు‘కోత’లు కలవరపెడుతున్నాయి. ప్రభు త్వ ఆస్పత్రుల్లో సీజేరియన్లు తగ్గి నార్మల్ డెలివరీలు పెరుగుతున్నా.. ప్రైవేట్ దవాఖానాల్లో సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా.. సంపాదనే ధ్యేయంగా కొందరు గైనకాలజిస్ట్లు ఆడ్డగోలుగా పెద్దాపరే ష న్లు చేస్తూ మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతు న్నారు. ప్రైవేట్‌లో ప్యాకేజీల పేరిట భారీగా ఫీజు వ సూలు చేస్తూ సిజేరియన్ ప్రసవాలు చేసేస్తున్నారు. ఆదేశాలు ఉన్నా మారని తీరు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీజేరియన్లు తగ్గించాలని ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా ఉమ్మనీరు తక్కువ ఉందని.. బిడ్డ అడ్డం తిరిగిందని.. గుండె వేగంగా కొట్టుకుంటోందని.. గర్భిణి బలహీనంగా ఉందని.. రక్తం తక్కువ ఉందని.. పురిటి నొప్పులు భరించలేదని.. నార్మల్కు వెళ్తే తల్లీబిడ్డ ప్రాణాలకు తాము గ్యారంటీ ఇవ్వలేమని.. ఇలా రకరకాల కారణాలు చెబుతూ గర్భిణుల కుటుంబీకులను వైద్యులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సిజేరియన్లకు ఒప్పుకునేలా వారిపై ఒత్తిడి చేస్తున్నారు. సిజేరియన్లతో దీర్ఘకాలంలో తల్లికి ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరాల్సిన వైద్యులే.. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేయడం శోచనీయం. సీజేరియన్ల తర్వాత తరచూ కడుపునొప్పి, ఇన్ఫెక్షన్, స్థూలకాయం, నెలసరి సక్రమంగా కాకపోవడం తదితర సమస్యలకు కారణమవుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ముహూర్తాల కల్చర్ పుట్టుబోయే బిడ్డకు మంచిరోజు, తిథి, నక్షత్రం, వారం చూసుకొని మరీ సిజేరియన్ చేయిస్తున్నారు కొందరు కుటుంబీకులు. బిడ్డకు జన్మనివ్వడానికి కూడా ముహూర్తాలు చూసుకుంటున్న కల్చర్ ప్రస్తుతం పెరిగిపోతోంది. దీనికోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్బుక్ చేసుకొని ఆపరేషన్లకు అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నారు. పలానా టైమ్‌కి మత్తుమందు ఇవ్వాలి.. పలానా సమయానికి బిడ్డ తల్లికడుపులోంచి బయటకు రావాలి.. అంటూ ముహుర్తాల మూఢనమ్మకంతో కచ్చితమైన తేదీ, సమయం చూసుకొని కొందరు అవసరంలేకున్నా సిజేరియన్లు చేయిస్తున్నారు. ఇవన్నీ గర్భిణుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. దీర్ఘకాలంగా తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. -
కూరగాయల దుకాణాలు బంద్
● రహదారులపై విక్రయాలు ● ఆంక్షలు విధించిన అధికారులు ● షాపుల్లోకి వెళ్లాలని బల్దియా యంత్రాంగం ఆదేశాలు కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని కూ రగాయల మార్కెట్లో రిటెయిల్ వ్యాపారులు సోమవారం దుకాణాలు మూసివేశారు. మార్కె ట్ భవన సముదాయంలోని రోడ్లపై కూరగాయ లు విక్రయించడంపై బల్దియా అధికారులు అ భ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాపారులకు కేటా యించిన దుకాణాల్లోనే విక్రయించాలని వారు ఆదేశించారు. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. షాపులు అనుకూలంగా లేకనే నగరంలోని ప్రధాన రహదారుల పక్కన కూరగాయలు విక్రయిస్తుండడంతో వినియోగదారులు మార్కెట్‌కు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. కాగా, చికెన్, మటన్ షాపులతోపాటు చేపల విక్రయ వ్యాపారులు కూడా వారికి కేటాయించిన షాపుల్లోనే విక్రయాలు జరపాలని అధికారులు ఆదేశించారు. కేటాయించిన షాపుల్లో కాకుండా, మార్కెట్ భవనంలోని రోడ్లను ఆక్రమించుకొని ఏళ్లుగా విక్రయాలు చేయడంపై బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అధికారులు కఠిన ఆదేశాలు జారీచేశారు. ఇందుకు నిరసనగా వ్యాపారులు ఒకరోజు బంద్ పాటించారు. తమ నష్టం వాటిల్లకుండా చూడాలని వ్యాపారులు కోరుతున్నారు. -
బిల్లు మంజూరుకు రూ.90 వేల డిమాండ్
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఏఈ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా గంగారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీడీ డీఎస్పీ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లాలోని ఓదెల మండలం బాయమ్మపల్లె గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో రూ.15 లక్షలు వెచ్చించి ఇటీవల సీసీ రోడ్లు నిర్మించారు. ఇందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని ఆయన ఏఈ జగదీశ్‌ను సంప్రదించారు. అయితే, తనకు రూ.లక్ష లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఏఈ డిమాండ్ చేయగా, రూ.90 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిసూచన మేరకు గంగారంలో రూ.90 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రోడ్డుపైనే నిఘావేసి..: బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గంగారం ప్రధాన చౌరస్తా సమీపంలోని రహదారిపై నిఘా వేశారు. అటుగా వచి్చన కాంట్రాక్టర్ రాజు నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా ఏ ఈ జగదీశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ అధికారి రోడ్డుపైనే బహి రంగంగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క మార్కుతో ఓటమి.. అయినా ఆగని కలల ప్రయాణం
ఒక్క మార్కుతోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికవలేదని కుంగిపోలేదా యువతి.. చదువు, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు.. తండ్రికి సాయంగా మేకలు కాసేందుకు రోజూ అడవిబాట పడుతోంది. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామానికి చెందిన నూనె నర్సయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. చదువుల్లో రాణిస్తూనే కూతురు కల్యాణి తండ్రికి సాయంగా మేకలతో ఊరి పొలిమేరల్లోని గుట్టల్లోకి వెళ్తోంది. ఆర్మీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని, ఈసారి ఉద్యోగం తనదేనని ధీమాగా చెప్పింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ట్రాక్టర్‌పై సీతక్క ప్రయాణం ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఎలిశెట్టిపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించింది. కానీ ఎలిశెట్టిపల్లి గ్రామానికి రోడ్డు మార్గం లేదు. దీంతో పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి.. మంత్రి సీతక్క ట్రాక్టర్‌పై కూర్చొని జంపన్నవాగు దాటి వెళ్లారు. ఈ వాగుపై వంతెన నిర్మించాలని అక్కడి ప్రజలు మంత్రిని వేడుకున్నారు. వంతెన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. -
రూ.18.71 కోట్ల సీఎంఆర్ మాయం
సుల్తానాబాద్‌రూరల్/సుల్తానాబాద్: రైతుల వద్ద కొనుగోలు చేసి సీఎంఆర్(మర ఆడించేందుకు)కు కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైస్‌మిల్లుల పన్నాగాన్ని సివిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని సాయి మహాలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ రైస్‌మిల్లుల యజమానులు తమకు కేటాయించిన ధాన్యాన్ని 5 లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్సాదేశాల మేరకు అధికారులు గురువారం పట్టుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాథ్ రైస్‌మిల్లుల్లోని ధాన్యం ప రిశీలించి విచారణ చేపట్టారు. ఆయన మా ట్లాడుతూ, రెండు రైస్‌మిల్లులకు 2023–2024 సంవత్సరంలో యాసంగి ధాన్యం సీఎంఆర్ కోసం కేటాయించగా సాయి మహాలక్ష్మీ మిల్లులో 61, 65,305 క్వింటాళ్లు, సౌభాగ్యలక్ష్మీ మిల్లులో 10,800 క్వింటాళ్ల ధాన్యంలో వ్యత్యాసం వచ్చిందన్నారు. దీని విలువ(ఎకానమిక్ కాస్ట్) ప్రకారం సుమారు రూ.18.71కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభు త్వం కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న యజమాని మారుతిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. లారీల్లో ధాన్యం ఎక్కడికి తరలించారనే దానిపైనా లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్వో తెలిపారు. ధాన్యం తరలిస్తున్న ఐదు లారీలను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విచారణ చేపట్టిన జిల్లా సివిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు -
ధన్యజీవులు
కోల్‌సిటీ(రామగుండం)/ిసరిసిల్లకల్చరల్: అస్తమిస్తూ వెలుగునిస్తున్నారు. మట్టిలో కలవకుండా మరో ప్రాణాన్ని బతికిస్తున్నారు. ఓ మనిషిగా మరణించి కుటుంబ సభ్యులకు కడుపు కోత పెట్టినా.. మరో వ్యక్తిలో సజీవంగా బతికే ఉంటున్నారు. అవయవదానంతో మరొకరికి పునర్జన్మనివ్వడమే కాకుండా.. వారూ పునర్జన్మను ఎత్తుతున్నారు. వేలల్లో అవయవ దానాలు సదాశయ ఫౌండేషన్ సంస్థ ద్వారా నేత్ర, అవయవ, శరీర, చర్మదానాలతోపాటు, సమాజహితానికి తోడ్పడే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,500 నేత్రదానాలు, 90 వరకు అవయవ, 150 వరకు దేహదానాలు చేయగా, 1,600 వరకు అవయవదానాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. దీంతో సుమారు 50,000 మందికి పైగా మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానాలకు స్వచ్ఛందంగా అంగీకారం తెలుపడం గమనార్హం. అవయవదాతలకు గౌరవం దక్కాలి మరణాంతరం నేత్ర, అవయవ, దేహదానాలు చేస్తున్న దాతలకు గౌరవం కల్పించాలని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు కొంతకాలంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. అవయవదానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలని, అవయవ దానం చేసిన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా అందించాలని కోరుతున్నారు. ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్ అరుదైన త్యాగానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు సతీమణి, తండ్రిని దేహదానానికి ఒప్పించి తమ అభ్యర్థన పత్రాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేశారు. రఘునందన్ స్ఫూర్తిగా మరి కొంత మంది దేహ, అవయవ దానానికి ముందుకు వస్తున్నారు. జిల్లాలో దేహదానానికి సంబంధించిన ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్న తొలి కుటుంబం రఘునందన్‌దే కావడం విశేషం. -
చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్‌గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్‌లోని టవర్‌సర్కిల్‌లో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికి కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడమే అన్నారు. పార్టీలకు అతీతంగా ఈనెల 15న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీసీల మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుప్ప ప్రకాశ్, తమ్మన్నగారి సంగన్నచ సిద్దగోని శ్రీనివాస్, వల్లూరి వీరేశ్, నవీన్, సాగర్, రాజేశ్, మేకల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ, అక్క పార్థివదేహాలు
నేత్ర, అవయవదానంతోపాటు దేహదానంపై కాళోజీ నారాయణరావు మరణించినప్పుడు అవగాహన వచ్చింది. దీంతో 2003లో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి నా శరీరాన్ని దానం చేస్తానని రాసి ఇచ్చాను. మా అమ్మ, అక్క కూడా ముందుకు వచ్చారు. అమ్మ 2014లో మరణించగా కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీకి, అక్క 2023లో మరణిస్తే వరంగల్ మెడికల్ కాలేజీకి వారిద్దరి దేహాలను దానం చేశాం. నా నిర్ణయాన్ని గౌరవించి నా భార్య నిర్మల కూడా దేహదానానికి అంగీకారాన్ని తెలిపింది. – సురేశ్‌బాబు, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి, గోదావరిఖని అవగాహన పెరిగింది నేత్ర, అవయ, దేహదానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముందుంది. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సదాశయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి నా సోదరుడు అశోక్‌కుమార్. 2006లో హార్ట్ ఎటాక్‌తో మరణించగా, ఆయన ఆశయం మేరకు నేత్రదానంతోపాటు, పార్థీవదేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశాం. మాది సంప్రదాయ వైష్ణవ కుటుంబం. మా కుటుంబం సానుకూలంగా ఉన్నా బంధువర్గం నిరాకరించి గొడవకు దిగారు. తమ్ముడి ఆశయం నెరవేర్చడానికి అందరూ అంగీకరించేలా నచ్చజెప్పి చేశాం. – టి.శ్రవణ్‌కుమార్, జాతీయ అధ్యక్షుడు, సదాశయ ఫౌండేషన్ -
టీచర్ చెప్పిన పాఠం స్ఫూర్తి
సింగరేణి స్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పు అవయవదానంతో ఇతరులకు పునర్జన్మ ఇవ్వొచ్చని బయాలజీ టీచ్చర్ చెప్పిన మాటలు, టీచర్ కూడా అవయవదానానికి అంగీకరించడం నాకు స్ఫూర్తిని చ్చాయి. ఇటీవలే నాకు 18 ఏళ్లు నిండాయి. ఈనెల 4న సింగరేణి స్కూల్ టీచర్ శశికళ సమక్షంలో నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారం తెలుపుతూ సదాశయ ఫౌండేషన్‌కు రాసి ఇచ్చాను. మా అమ్మ కూడా నా నిర్ణయాన్ని మెచ్చుకుంది. నాతోపాటు అమ్మ కూడా అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపింది. – శివగణేశ్, డీఎంఎల్టీ స్టూడెంట్, గోదావరిఖని అమ్మ నేత్రాలను.. రామగుండం మేయర్ పదవిలో ఉన్నప్పుడు అవయదానాలపై చాలా అవగాహన సదస్సుల్లో అతిథిగా పాల్గొన్నాను. మరణించిన వారి నేత్రాలు, అవయవాలను దానం చేసినట్లు సదస్సుల్లో కుటుంబ సభ్యులు చెబుతుంటే చాలా ప్రేరణ కలిగింది. అప్పుడే నా మరణాంతరం అవయవదానం చేస్తానని అంగీకారపత్రాలపై సంతకాలు చేసిన. మా అమ్మ మరణిస్తే ఆమె నేత్రాలను దానం చేయించా. నేత్ర, అవయదానాలకు సెలబ్రెటీలు, అన్నివర్గాల యువత ముందుకు రావాలి. – కొంకటి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు -
తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు
వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జైలు శిక్ష, జరిమానాలు తప్పవని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారికి పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ర్యాష్‌గా లారీ నడిపిన వ్యక్తికి 20 రోజుల జైలు, రూ.10వేల జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్‌కుమార్ తీర్పు వెల్లడించారు. అనంతరం డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో దొరికిన వారితో ట్రాఫిక్ ఆర్ఎస్సై రాజు ఆధ్వర్యంలో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్‌కు 20 రోజుల జైలు 24 మందికి జరిమానా -
నలుగురికి మేలు జరగాలని..
కోరుట్లటౌన్: ‘మనం చచ్చినా, బతికినా నలుగురికి మేలు జరగాలి. అదే చిన్ననాటి నుంచి ఆశయం. టీచర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి పది మందికి సాయం చేయాలనే తపనతో కొనసాగిన. రిటైర్డ్ అయ్యాక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న. ఆఖరికి చనిపోయినా నలుగురికి ఉపయోగపడాలి’. అని అంటున్నాడు కోరుట్లకు చెందిన రిటైర్డ్ టీచర్ వోటారికారి చిన్నరాజన్న. మరణానంతరం అవయవదానం చేయాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించి అంగీకారపత్రం తీసుకున్నారు. అవయవదాతలు పునర్జన్మ ఇచ్చినవారవుతారని పేర్కొన్నారు. – చిన్నరాజన్న -
ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీ పాఠాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట, రేపాక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మద్రాస్ ఐఐటీతో భాగస్వామ్యం అయ్యాయని ఆయా పాఠశాలల హెచ్ఎంలు పావని, ప్రేమలత, రేవతీదేవి శుక్రవారం తెలిపారు. ఈమేరకు మద్రాస్ ఐఐటీ ఈమెయిల్ ద్వారా తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పాఠశాల, ఉన్నతవిద్య మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా ఐఐటీ మద్రాస్ సెంటర్ ఫర్ అవుట్ రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్(కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తమ పాఠశాలలోని విద్యార్థులకు ఆన్లైన్లో మద్రాస్ ఐఐటీ ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ వంటి పది రకాల కోర్సులు 8 వారాల వ్యవధితో నామమాత్రపు రుసుంతో అందించనున్నట్లు వివరించారు. 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు ఈ కోర్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇల్లంతకుంటలో మూడు హైస్కూళ్లు ఎంపిక -
మట్టిలో కలిసిపోకుండా..
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తుమ్మ రామకృష్ణ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా అతడి కిడ్నీలు, కాలేయం దానం చేశారు. మృతుడి భార్య నిర్మల, కూతురు ప్రవళిక, కుమారుడు పృథ్వీరాజ్, కుటుంబసభ్యుల సమక్షంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. ఓదెల గ్రామానికి చెందిన అయిలు మల్లేశ్ ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందగా, అతడి కళ్లను భార్య రాధిక, కుటుంబసభ్యులు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. అలాగే ఓదెల మండలం అబ్బిడిపల్లె గ్రామస్తులంతా అవయవదానానికి ముందుకొచ్చి జిల్లా కలెక్టర్‌కు అంగీకారపత్రం అందజేశారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు రైతుల మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు రైతులు వివిధ కారణాలతో దుర్మరణం చెందారు. ఒకరు గుండెపోటుకు గురైతే.. మరొకరు వ్యవసాయ బావిలో పడగా.. ఇంకొకరు నీటిగుంతలోపడి ప్రాణాలు విడిచారు.బతుకుపోరులో ఆగిన గుండె తంగళ్లపల్లి(సిరిసిల్ల): పశువులను మేతకు తీసుకెళ్లిన రైతు గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘ టన తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో శుక్రవారం చో టుచేసుకుంది. రైతు అనవేని దేవయ్య(55) ఈనెల 6న పశువులను మేపేందు కు గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. ఈక్రమంలోనే గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దేవయ్యను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా స్టంట్ వేశారు. కానీ దేవయ్య కోమాలోకి వెళ్లడంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయబావిలో పడి.. శంకరపట్నం(మానకొండూర్): లింగాపూర్ గ్రామానికి చెందిన అంతం బాపురెడ్డి(55) బంధువులు వ్యవసాయబావి పూడిక తీస్తుండగా వెళ్లి పక్కనే ఉన్న మరోబావి లో అదుపు తప్పి పడిపోయా డు. క్రేన్ పనులు, సమీపంలో వరి నాటు వేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో బాపురెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. నీటిగుంతలోపడి.. ఓదెల(పెద్దపల్లి): గుంపుల గ్రామానికి చెందిన రైతు దాసరి మురళి(50) ప్రమాదవశాత్తు గుంతలోపడి మృతిచెందాడు. పంట పొలానికి నీరు పెట్టేందుకు శుక్రవారం మురళి సైకిల్‌పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కనున్న నీటిగుంతలో పడి ఊపిరాడక చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. -
40 సెకండ్లు.. 118 మూలకాలు
● పీరియాడిక్ టేబుల్ కంఠస్థం ● బాలుడి అద్భుత ప్రదర్శన ● మెమోరీ చాంపియన్ అవార్డు సాధన కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌కు చెందిన కనపర్తి మనవేంద్ర రసాయన శాస్త్రంలోని 118 మూలకాల పేర్లు, వాటి అటామిక్, మాస్ నంబర్లను 40 సెకన్లలోనే కంఠస్థంగా చెప్పి శ్రీఅమేజింగ్ మైండ్ ప్రెజంటేషన్ ఇన్ కెమిస్ట్రీశ్రీ రికార్డు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన యూఎస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కావడం విశేషం. నగరంలోని ఫిలింభవన్‌లో శుక్రవారం కనుపర్తి మనవేంద్రను సన్మానించి సర్టిఫికెట్ అందజేశారు. జిల్లా కేంద్రంలోని చేంజ్ మెమొరీ అకాడమీ శిక్షణలో ఉన్న మనవేంద్ర.. వివేకానంద స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. డాక్టర్ వేణుకుమార్ నేతృత్వంలో మెమొరీ ఫైలింగ్ టెక్నిక్స్ ద్వారా శిక్షణ పొందాడు. గతంలోనే ఈ బుడతడు జాతీయస్థాయి మెమొరీ చాంపియన్‌షిప్ సాధించాడని ట్రైనర్ వేణుకుమార్ గుర్తుచేశారు. ఈ ఘనతకు గుర్తింపుగా శ్రీసూపర్ మెమొరీ చాంప్శ్రీ అవార్డు పొందిన మనవేంద్రను తల్లిదండ్రులు శతి – మురళి అభినందించారు. విద్యార్థి ప్రతిభను వెలికితీస్తున్న డాక్టర్ వేణుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ట్రైనర్లు తిరుపతి, హరీశ్ కుమార్, అశోక్ సామ్రాట్, నోముల రాజకుమార్, ఈశ్వర్, కిశోర్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ అంగన్వాడీ టీచర్ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల)/సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లతండాలో ప్రమాదవశాత్తు గాయపడిన అంగన్వాడీ టీచర్ మాజోజు స్వరూప(52) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మద్దిమల్ల గ్రామానికి చెందిన మాజోజు స్వరూప తండాలోని అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. నిత్యం అక్కడికి వెళ్లి వస్తుంటుంది. ఈనెల 8న విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా బైక్‌పై ఎక్కించుకున్న వ్యక్తి మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో బండి పై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. మృతురాలి కుమారుడు విష్ణుసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. అంగన్వాడీ టీచర్ మృతి విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ దహన సంస్కారాల కోసం రూ.20వేల చెక్కును అందజేశారు. అఽఘాయిత్యాలు నిలువరించాలి ఐసీడీఎస్ కార్యకర్తలపై అఽఘాయిత్యాలను ప్రభుత్వం నిలువరించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత కోరారు. మద్దిమల్లతండా అంగన్వాడీ టీచర్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, కాంగ్రెస్ కార్యకర్త కల్లూరి చందన, అంగన్వాడీ టీచర్లు శాంత, సరోజన, మంజుల, అన్నపూర్ణ, వనజ, శోభ తదితరులు పాల్గొన్నారు. కన్నీరుపెట్టుకున్న అంగన్వాడీలు నిందితుడిని శిక్షించాలని డిమాండ్ -
తండ్రి స్ఫూర్తితో..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన దాసారపు మో హన్ గత డిసెంబర్లో అనా రోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు అతడి నే త్రాలు, దేహాన్ని ‘సిమ్స్’కు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో బాధిత కుటుంబానికి అభినందన పత్రం అందజేశారు. ఈసందర్భంగా మోహన్ చిన్న కూతురు అశ్విని తన మరణానంతరం దేహదానం చేసేందుకు అంగీకారం తెలుపగా, పలువురు ఆమెను అభినందించారు. ఈసందర్భంగా అశ్విని మాట్లాడుతూ, తన తండ్రి చెప్పిన విధంగా మనిషి మరణించిన తర్వాత అవయవాలు మట్టిలో కలిసిపోకుండా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దేహదానం చేసేందుకు ముందుకొచ్చానని పేర్కొన్నారు. -
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం ● బల్దియా అధికారులతో సమీక్ష ● క్షేత్రస్థాయిలో పర్యటనకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో పారిశుధ్య లోపం తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీతో కలిసి శుక్రవారం ఆయన మార్కెట్ ఏరియా, కల్యాణ్‌నగర్‌లో విద్యుత్ లైన్, ఊర్వశి థియేటర్ సమీప నాలా, సిరి ఫంక్షన్‌హాల్ సమీపంలో యూజీడీ పనులతోపాటు నాలాల్లో పూడికతీత, మార్కండేయ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. అంతకుముందు శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారుతో వివిధ పనులపై సమీక్షించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డి ప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ శివానంద్, ఈఈ రామన్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలి జ్యోతినగర్(రామగుండం): రోడ్డు పనుల్లో నాణ్య త ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఎన్టీపీసీ రాజీవ్ రహదారి నుంచి నర్రాశాలపల్లె వరకు 24 అడుగుల వెడల్పుతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. రూ.రెండు కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్‌ను ఆనుకుని ఉన్న గోడ సమీపం నుంచి రోడ్డు నిర్మించాలని ఆయన సూచించారు. అధికారులు శివానంద్, రామన్, కాంట్రాక్టర్ మాచిరి మహేందర్‌గౌడ్, కాంగ్రెస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, డీసీసీ కార్యదర్శి మొహమ్మద్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కవోని దీక్షతోనే..
● మొక్కలను సంరక్షిస్తేనే పచ్చదనం ● ఈ ఏడాది లక్ష్యం 30 లక్షలు ● ఇప్పటివరకు నాటినవి 6.43 కోట్లు పెద్దపల్లిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఏటా చేపట్టే మొక్కల పెంపకం ప్రహసనంగా కాకుండా ప్రతీదానిని సంరక్షిస్తేనే పచ్చదనం కనిపిస్తుంది. సుమారు పదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ సర్కారు హరితహారం పేరిట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో హరితహారం కార్యక్రమానికి అప్పటి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అయితే, ఆయన అప్పుడు నాటిన మొక్క ఇప్పుడు కనిపించకుండా పోయింది. కాంగ్రెస్ పాలనలో వనమహోత్సవం.. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. వన మహోత్సవం పేరిట మొక్కలు నాటి సంరక్షించేలా బృహత్ కార్యక్రమం చేపట్టింది. జాతీయస్థాయిలో 76వ వన మహోత్సవం కాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10వ వనమహోత్సవ కార్యక్రమం ఇది. ఈ ఏడాది జిల్లాలో 30లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఎంచుకుని ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు ముందుకు సాగుతున్నారు. అయితే నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలంటూ కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఆయన సూచిస్తున్నారు. 14.80 శాతం విస్తీర్ణంలోనే అడవులు జిల్లాలో 13 మండలాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 2,15,695 హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణం కలిగివున్న జిల్లాలో అటవీ విస్తీర్ణం 31,922 హెక్టార్లుగా ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఇది 14.80 శాతంగా నమోదై ఉందని పేర్కొంటున్నారు. పెద్దపల్లి, మంథని ఫారెస్టు సెక్షన్లు కలగిఉండగా 40 బీట్లు ఏర్పాటు చేశారు. 2016 నుంచి 2024 వరకు 7కోట్ల 21 లక్షల 39వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న అధికారులు.. 6 కోట్ల 43 లక్షల 30వేల మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి. వాటిలో 50 నుంచి 60శాతం మేర మొక్కలను సంరక్షించినట్లు అంచనా వేస్తున్నారు. వనమహోత్సవం ఆవిర్భావమిలా.. 1950లో అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి కేఎం మున్షీ వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఏటా జూలై మొదటివారంలో నిర్వహిస్తున్నారు. విరివిగా మొక్కలను నాటి పెంచడం ద్వారా పచ్చదనం పెంచాలనే ఆలోచనతో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు అటవీ సంపదను పెంపొందించాలన్నదే లక్ష్యం. ఈ ఏడాది సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 7న రంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చే శారు. అదేరోజు స్థానిక ఎమ్మెల్యే విజయరమణా రావు పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని ఎలిగేడు ప్రా థమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వనమహోత్సవ వివరాలు.. సంవత్సరం లక్ష్యం నాటినవి (లక్షల్లో) (లక్షల్లో)2016 70.80 89.92 2017 100.30 91.62 2018 110.00 147.30 2019 195.50 84.79 2020 79.77 74.73 2021 43.71 47.17 2022 43.71 46.18 2023 31.64 33.40 2024 27.08 28.18 2025 30.46 – పర్యావరణాన్ని కాపాడేందుకే వనమహోత్సవం ద్వారా నాటిన ప్రతీ మొక్కను కాపాడేలా చర్యలు చేపడుతున్నాం. శాఖల వారీగా మొక్కలను నాటించడంతోపాటు ప్రజలను భాగస్వాములుగా చేసి మ రిన్ని నాటేలా ప్రోత్సహిస్తున్నాం. మొక్కల పెంపకంతో పచ్చదనం పెంపొందడంతోపా టు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. – శివయ్య, జిల్లా అటవీ అధికారి -
మహిళలు సభ్యులుగా చేరాలి
ఎలిగేడు(పెద్దపల్లి): స్వశక్తి సంఘాల్లో చేరకుండా మిగిలిపోయిన ప్రతీ పేద మహిళను గుర్తించి సంఘంలో సభ్యురాలిగా చేర్పించాలని డీఆ ర్డీవో కాళిందిని సూచించారు. కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలను టీ సెర్ప్, స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డీఆర్డీవో కాళిందిని హాజర య్యారు. మహిళా శక్తి సంఘాల్లో కొత్తగా చేరిన సభ్యులకు బొట్టుపెట్టి పూలబొకేతో ఆహ్వానించారు. సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఈనెల 18వ తేదీవరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించాలని కోరారు. తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులతోపాటు ఏపీఎం సుధాకర్ సీసీలు గీస ఆనంద్, మల్లేశం, జ్యోతి, గ్రామసంఘం అధ్యక్షులు, వీవోఏలు, స్వశక్తి సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంతర పంటలు వేయాలి ముత్తారం(మంథని): ఆయిల్‌పామ్‌లో అంతర్ పంటలు పండిస్తూ అదనపు ఆదాయం పొందా లని హార్టికల్చరల్ ఆఫ్ డైరెక్టర్ జిల్లా ప్రత్యేకాధికారి శేఖర్ రైతులకు సూచించారు. అడవిశ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడులోని ఆయిల్‌పా మ్ తోటలను శుక్రవారం ఆయన పరిశీలించా రు. టమాట, వంకాయ, బెండ, సొరకాయ, బీ రకాయ సాగు చేస్తే అదనపు ఆదాయం స మకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారులు జ్యోతి, ఆయిల్‌పామ్ ఫీల్డ్ ఆఫీసర్ అజయ్, అనిల్, రైతులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ టూర్‌కు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు మంథనిరూరల్: ఎగ్లాస్పూర్ జెడ్పీహెచ్ఎస్ వి ద్యార్ధులు శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూ ర్ పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా ఈ పర్యటన చేపట్టా రు. ఆరు నుంచి పదోతరగతి చదువుతున్న వి ద్యార్ధులు ఉపాధ్యాయులతో కలిసి వెళ్లారు. ప వర్ జనరేషన్, వాటర్ స్ట్రీమింగ్ తదితర అంశా ల గురించి సిబ్బంది వివరించారు. హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు సంతోష్, దొమ్మటి రవి, మంథని రాజశేఖర్, ములకల రాజశేఖర్, మంజుల, అనిత, ధనుంజయ్ పాల్గొన్నారు. మోడల్ రీడింగ్ పద్ధతిన బోధన జ్యోతినగర్(రామగుండం): మోడల్ రీడింగ్ విధానంలో విద్యాబోధన చేయాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి షేక్ సూచించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో రెండు రోజులుగా ప్రభుత్వ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్)పై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా పిల్లలకు చదవడం, నేర్పించడానికి వివిధ పద్ధతులను వివరిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్పీలు రఘబాబు, శ్రీనివాస్, రాజేశ్, రాజిరెడ్డితోపాటు ఎంఈవో చంద్రయ్య, ప్రధానోపాధ్యాయులు జయరాజు, శారద, భూమయ్య, సీఆర్పీ రామ్‌కుమార్, గౌస్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి సుల్తానాబాద్‌రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డీఈవో మాధవి సూచించారు. గర్రెపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు చేపట్టిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ శిబిరాన్ని డీఈవో శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. తెలుగు, ఆంగ్లం చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు నేర్పించాలని అన్నారు. ఎన్ఏఎస్–2024 సర్వే నివేదికలో మనజిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలిచిందని తెలిపారు. ఎంఈవో రాజయ్య, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు దివాకర్, రత్నాకర్‌రెడ్డి, కవిత పాల్గొన్నారు.సంబురాల్లో డీఆర్డీవో కాళిందిని, సిబ్బంది -
కాళోజీ స్ఫూర్తితో..
కోల్‌సిటీ(రామగుండం): స్వాతంత్య్ర సమరయోధులు, గొప్ప కవి కాళోజీ నారాయణరావు తన మరణానంతరం శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు. వారే నాకు స్ఫూర్తి. నాతోపాటు నా భార్య కూడా మా మరణాంతరం మెడికల్ కాలేజీలకు మా శరీరాలను దానం చేస్తామని ప్రకటించాం. కాల్చడమో, పూడ్చడమో చేయకుండా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం పార్థివ దేహాలను దానం చేయడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి. గత నెల 15న మా ఇద్దరి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇంట్లో పెద్ద సభ ఏర్పాటు చేసి, అందరికీ నేత్ర, అవయవ, దేహదానంపై అవగాహన కల్పించాం. – ఎల్.రాజయ్య, రిటైర్డ్ ఎంఈవో, గోదావరిఖని అమ్మ కళ్లను దానం చేశాం ధర్మపురి: మాది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నాగారం. అమ్మ చెలుముల చిన్నలక్ష్మి గుండె సమస్యతో బాధపడుతూ 2016లో మృతి చెందింది. ఆమె కళ్లను సజీవంగా ఉంచడం కోసం మృతిచెందిన కొద్ది నిమిషాల్లోనే లయన్స్‌క్లబ్ వారికి దానం చేసినం. దేశంలో కళ్లు లేనివారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఉపయోగపడతాయి. అన్ని దానాల కంటే అవయవ దానం గొప్పది. – చిలుముల లక్ష్మణ్ -
మొక్కలు నాటి సంరక్షించాలి
పెద్దపల్లిరూరల్: ప్రతీపౌరుడు మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో శుక్రవారం వన మహోత్సవంలో భాగంగా వారు మొక్కలు నా టారు. అనంతరం మాట్లాడారు. ఎటూ చూసి నా పచ్చదనం కనిపించేలా నాటుతున్న 550 మొక్కలను సంరక్షించాలని వారు సూచించారు. కొత్తకాలనీల్లో రోడ్లకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అఽధికారి శివయ్య, ఆర్టీవో రంగారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఎంసీ చైర్పర్సన్లు స్వరూప, ప్రకాశ్‌రావు, తహసీల్దార్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ స్ఫూర్తితో కోటీశ్వరులను చేస్తాం సుల్తానాబాద్‌రూరల్: దివంగిత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరా క్రాంతి ప థం ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కదంబపూర్, తొగర్రాయిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. అనంతరం మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నారని, ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ బ్యాంక్‌లు, ఆర్టీసీ అద్దె బస్సులతో ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏర్పాటు చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి తిన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్, నాయకులు జానీ, అబ్బయ్యగౌడ్, దామోదర్‌రావు, శ్రీనివాస్, కిరణ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా కేంద్రంలో ఘనంగా వన వమహోత్సవం -
ధన్యజీవులు!
● అపురూప త్యాగం దేహదానం ● వైద్య విద్యార్థులకు పాఠ్య పుస్తకం ● అవయవదానంతో పునర్జన్మ ● నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న అవగాహనమనం మరణించినా.. బతకవచ్చు. మన కళ్లు ఈలోకాన్ని చూస్తాయి. మన గుండె లబ్‌డబ్ అంటూ కొట్టుకుంటోంది. మన ఊపిరితిత్తులు శ్వాసను అందిస్తాయి. కిడ్నీలు శుద్ధి చేస్తూనే ఉంటాయి.. ఇదంతా శరీరంలోని అవయవ దానంతోనే సాధ్యమవుతుంది. కేవలం అవగాహన లేక అనేక మరణాలు మట్టిపాలు, నిప్పుపాలు చేస్తున్నారు. ఇంకొకరికి దానం చేస్తే, వారి ఆయుష్షు పెంచవచ్చు. బ్రెయిన్‌డెడ్‌తో అవయవ దానం చేస్తే కనీసం ఎనిమిది మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు. నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు పంచవచ్చు. మళ్లీ మన కళ్లు ఈ లోకాన్ని చూడొచ్చు. దేహదానం చేస్తే.. మెడికో స్టూడెంట్స్‌కు పాఠ్యపుస్తకం కావచ్చు. వారి పరిశోధనకు దోహదపడవచ్చు. ఈ దానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అవగాహన పెరుగుతోంది. దానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.‘భగవంతుడి కోసం కళ్లు పెకిలించి ఇచ్చిన భక్త కన్నప్ప... గురు దక్షిణ కోసం బొటనవేలిని కోసి ఇచ్చిన ఏకలవ్యుడు... దానంగా తొడకోసిచ్చిన శిబిచక్రవర్తి వీరంతా గొప్పవాళ్లయితే... ప్రస్తుత సమాజంతో లక్షలు, కోట్లున్నా కొనలేని.. కొనడానికి విలువకట్టలేని తమ నేత్రాలు, అవయవాలు, పార్థీవ దేహాలను దానం చేయడానికి ముందుకు వస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కొందరు వ్యక్తులు ధన్యజీవులు’.. పరోపకారమే ఇదమ్ శరీరమ్.. అని సంపూర్తిగా నమ్మి తాము పుట్టిందే పరులకు ఉపకారం చేయడానికనుకొని మనసా.. వాచా.. కర్మ.. అని ఆచరించేవారు జీవించినంత కాలం ఇతరులకు సేవచేయాలని కోరుకోవడం సాధారణమైన విషయం. జీవం పోయిన తర్వాత కూడా ఇతరులకు ఉపయోగపడడమే గొప్ప విషయం.స్ఫూర్తి -
విఽధి నిర్వహణలో అప్రమత్తత అవసరం
● డీఎంఎస్ నాగేశ్వరరావు రామగిరి(మంథని): ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ రీజియన్–2 డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(మైనింగ్) నాగేశ్వరరావు సూచించారు. సెంటినరికాలనీ సీఎన్‌సీవోఏ క్లబ్లో ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణ అధ్యక్షతన ఆర్జీ–3, ఏపీఏ 19వ ఏరియాస్థాయి త్రైపాక్షిక భద్రత సమీక్ష శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. భద్రతపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు. పనిప్రదేశాలను తరచూ తనిఖీ చేస్తూ ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి సారించాలని సూచించారు. తాగునీరు, కనీస సదుపాయలు కల్పించాలని చెప్పారు. ఓసీపీ–2 పీవో వెంకటరమణ వివిధ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డీఎంస్ రాజ్‌కుమార్, జీఎంలు సుధాకర్‌రావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, మధుసూదన్, శ్రీనివాస్‌రెడ్డి, మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానిక్ డీడీఎంఎస్‌లు ప్రేమ్‌కుమార్, రాజీవ్ ఓంప్రకాశ్వర్మ, దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఓదెలలో కోర్టు ప్రారంభం
ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రంలో ఏర్పాటు చేసి న జూనియర్ సివిల్ కోర్టును ఈనెల 13న(ఆదివారం) ప్రారంభించనున్నారు. హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ కోర్టును ప్రారంభిస్తారు. కోర్టు అందుబాటులోకి వస్తే.. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల పరిధిలోని సివిల్, క్రిమినల్ కేసులు సుమారు 1,500 వరకు త్వరితగతిన పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోని ఓ అద్దె భవనంలో కోర్టు ఏర్పాటు చేశారు. ఓదెల కోర్టు ఇన్చార్జి జడ్జిగా సుల్తానాబాద్‌కు చెంది న జూనియర్ సివిల్ జడ్జి గణేశ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కోర్టు ప్రారంభోత్సవం ఏ ర్పాట్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత శుక్రవారం సమీక్షించారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరవుతారు. -
సమ్మెతో సింగరేణికి నష్టం
● సంస్థకు రూ.30 కోట్లు, కార్మికులకు రూ.13 కోట్ల నష్టం ● సంస్థవ్యాప్తంగా హాజరు 15 శాతమే ● కార్మిక సంఘాల్లో నూతనోత్సాహంగోదావరిఖని(రామగుండం): దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా సింగరేణిలో ఒక్కరోజు టోకెన్ సమ్మె ఈనెల 9న విజయవంతమైంది. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బీజేపీ అనుబంధ బీఎంఎస్ మాత్రం దూరంగా ఉంది. సమ్మె విజయవంతానికి అన్ని కార్మిక సంఘాలు గనులపై విస్తృత ప్రచారం చేశాయి. కార్మికులకు సంబంధించి ప్రధాన డిమాండ్ లేబర్‌కోడ్ కూడా పొందుపర్చడంతో సమ్మె పిలుపునకు మంచి స్పందన లభించింది. సింగరేణి కార్మికులు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనగా విజయవంతమైంది. ఈ క్రమంలో ఒక్కరోజు టోకెన్ సమ్మె సంస్థకు భారీ నష్టాన్ని మిగిల్చింది. సంస్థవ్యాప్తంగా ఒక్కరోజు 1.75లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా, 80వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. దీంతో సంస్థకు సుమారు రూ.30కోట్ల నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. అలాగే సంస్థవ్యాప్తంగా 40వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, 6వేల మంది అత్యవసర సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు. సంస్థ వ్యాప్తంగా 25వేల మంది కాంట్రాక్టు కార్మికులకు సమ్మెలో పాల్గొన్నారు. మూడు ఏరియాల్లో ఉత్పత్తి నిల్ సమ్మె ప్రభావం సంస్థపై చూపింది. 11 ఏరియాల కు గాను 8 ఏరియాల్లో 46 శాతం మేర బొగ్గు ఉత్పత్తి కాగా, మందమర్రి, బెల్లంపల్లి, ఏపీఏ ఏరియాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మిగతా ఏరియాలోని గనులు కొద్దిమేర ఉత్పత్తి సాధించాయి. రూ.30 కోట్ల నష్టం సింగరేణిలో సమ్మె మూలంగా సుమారు రూ. 30కోట్ల మేర ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అలాగే కార్మికులు వేతనాల రూపంలో రూ.13 కోట్ల మేర నష్టపోయారు. సమ్మెతో కార్మికులు, యాజమాన్యం ఇద్దరు నష్టపోయినా కార్మికులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలపై కేంద్రం దిగివచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సంఘాల్లో నూతనోత్సాహం సంస్థ వ్యాప్తంగా చేపట్టిన ఒక్కరోజు సమ్మె సక్సెస్ కావడంతో కార్మిక సంఘాల నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. సంస్థలో గుర్తింపు యూనియన్‌గా గెలుపొందిన ఏఐటీయూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్టీయూసీ, గతంలో గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు సీఐటీయూసీ, హెచ్ఎంఎస్, విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్టీయూసీ, ఏఐఎఫ్టీయూ తదితర సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. అన్ని గనులు, డిపార్ట్మెంట్లు, కాంట్రాక్టు కార్మికుల్లో విస్తృత ప్రచారం చేయడంతో కార్మికులు సమ్మెకు మొగ్గు చూపారు. సమ్మె విజయవంతంతో రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయకుండా దేశవ్యాప్త నిరవధిక సమ్మైకె నా వెనకాడబోమని చెబుతున్నాయి. సంస్థలో 09–07–25 రోజు టార్గెట్.. (వేల టన్నుల్లో..) ఏరియా టార్గెట్ సాధించింది కొత్తగూడెం 36,793 20,033ఇల్లెందు 8,192 3,009మణుగూరు 28,093 16,525బెల్లంపల్లి 7,407 -మందమర్రి 7,519 -శ్రీరాంపూర్ 18,122 2,837ఆర్జీ–1 11,885 6,740ఆర్జీ–2 25,204 20,013ఆర్జీ–3 16,296 5,696ఏఈఏ 5,011 -భూపాల్పల్లి 10,796 6,091మొత్తం 1,75,318 80,944 -
సమష్టి కృషితో లక్ష్యాలు సాధించాలి
రామగిరి: సమష్టి కృషితో నిర్వేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలని సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్) గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం ఆర్జీ–3 , ఏపీఏ గనిలో పర్యటించారు. జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీఎంలు నరేంద్ర సుధాకర్‌రావు, కొలిపాక నాగేశ్వరరావు, వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలను డైరెక్టర్‌కు జీఎంలు వివరించారు. గనిలోకి దిగిన డైరెక్టర్ అతిపెద్ద భూగర్భ గని అయిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ఏరియాలో గురువారం డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు పర్యటించారు. ముందుగా ఏపీఏ గని ఆవరణలో మొక్కనాటారు. అనంతరం మ్యాన్ రైడింగ్ ద్వారా భూగర్భ గనిలోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న యంత్రాల పనితీరును పరిశీలించారు. అధికారులు కె.యాదయ్య, ఎం.రామ్మోహన్, బండి సత్యనారాయణ, జే.రాజశేఖర్, సీహెచ్.వెంకటరమణ, ప్రవీణ్ వి ఫాంటింగ్, బి.సుదర్శనం, గుర్రం శ్రీహరి, మేఘన, టి.రఘురాం, సునీల్కుమర్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆవరణలో డిస్పెన్సరీ ప్రారంభం
పెద్దపల్లిరూరల్: జిల్లా న్యాయస్థాన ఆవరణలో వైద్యసేవలు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన డిస్పెన్సరీని గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, డీఎంహెచ్‌వో అన్నప్రసన్న కుమారి, బార్అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. గవర్నమెంట్ ప్లీడర్ మార కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు భవన నిర్మాణ స్థలం పరిశీలన ఓదెల(పెద్దపల్లి): ఓదెలలో కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని గురువారం సుల్తానాబాద్ జడ్జి గణేశ్ పరిశీలించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల ప్రజల సౌకర్యార్థం కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలం స్థితిగతులను తెలుసుకున్నారు. తహసీల్దార్ కె.ధీరజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని డివిజన్లలో సర్వే చేయండికోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో వీధి వ్యాపారుల సౌకర్యార్థం వెంటనే వెండింగ్ జోన్లు గుర్తించాలని కమిషనర్ (ఎఫ్ఎసీ) జె.అరుణశ్రీ అన్నారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన టౌన్వెండింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. నగరపాలక సంస్థలో నూతన గ్రామాలు విలీనమైన నేపథ్యంలో మెప్మా, పట్టణ ప్రణాళికా విభాగం, ట్రాఫిక్ పోలీస్‌శాఖ సంయుక్తంగా సర్వే చేయాలన్నారు. ఈ సర్వేలో డివిజన్ల వారీగా రెడ్, గ్రీన్, అంబర్ వెండింగ్ జోన్లు గుర్తించాలన్నారు. వీధి వ్యాపారుల జాబితాలో అనర్హులను తొలగించి అర్హులను చేర్చాలన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన వీధి వ్యాపారులు పడకుండా, బ్యాంకుల సహకారంతో పీఎం స్వనిధి రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ట్రాఫిక్ సీఐ బి.రాజేశ్వర్‌రావు, టౌన్‌ప్లానింగ్ విభాగం ఏసీపీ శ్రీహరి, టీపీవో నవీన్, ఆర్వో ఆంజనేయులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సీహెచ్ వెంకటేశ్, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీలో అక్రమాలకు పాల్పడితే చర్యలుఎలిగేడు(పెద్దపల్లి): ఉపాధి హామీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏపీడీ సత్యనారాయణ అన్నారు. 01–04–2024 నుంచి 31–3–2025 వరకు జరిగిన ఉపాధి పనులపై గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2024–25లో పంటపొలాలకు రోడ్లు, చెరువుల పూడికతీత, తదితర రూ.3,38,35,606 విలువైన పనులు చేయగా అందులో కూలీలకు రూ.2,07,23,288, స్కిల్డ్ కింద రూ.93,000, మెటీరియల్‌కు రూ.1,30,19,318 చెల్లించారు. ఈసందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ, పని అడిగిన ప్రతీ ఒక్కరికి జాబ్‌కార్డు అందించాలని, ఉపాధి సిబ్బంది అవకతవకలకు పాల్పడకుండా, పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పనుల్లో చిన్నచిన్న పొరపాట్లను గుర్తించిన అధికారులు రూ.13,024 రికవరీకి ఆదేశించారు. అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కొమురయ్య, ఎంపీడీవో భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణాన్ని కాపాడాలి
రామగుండం: ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించినప్పుడే పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన వారవుతారని జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య అన్నారు. గురువారం వన మహోత్సవంలో భాగంగా అంతర్గాం జిల్లా పరిషత్ హైస్కూల్, కేజీవీబీ విద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి మాట్లాడారు. ఏటా ముమ్మరంగా మొక్కలు నాటినా వాటి సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మొక్కల ఎదుగుదల లోపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దకాలం క్రితం పోల్చితే ప్రస్తుతం అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ టి.సతీశ్‌కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కొమురయ్య, దేవదాస్, జిల్లా స్రైక్ ఫోర్స్ అధికారి సయ్యద్ రహ్మతుల్లా, సెక్షన్ ఆఫీసర్ మంగీలాల్, మిర్జా ఇర్షద్, మేఘరాజ్, స్రవంతి, ఎంపీడీవో వేణుమాధవ్, ఏపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కరైతే మంచి లైఫ్ ఇవ్వొచ్చు
కోల్‌సిటీ(రామగుండం): కుటుంబంలో పిల్లలను ఎక్కువగా కనడం ద్వారా ఇంటి పెద్ద చేస్తున్న ఉద్యోగానికి వేతనాలు సరిపోకపోతే ఆర్థిక ఇబ్బందులతో వారికి మంచి జీవితాన్ని కల్పించకపోవచ్చు. ఒక్కరు, లేదా ఇద్దరు పిల్లలుంటే వారికి మంచి లైఫ్‌ను ఇవ్వొచ్చు. ఇదే విషయాన్ని నేను, భార్య ఫర్వీన్ కూడా నమ్మినం. మాకు పాప అయినా, బాబు అయినా ఒక్కరైతే చాలనుకున్నాం. అదృష్టం కొద్ది మాకు పాప పుట్టింది. మా పాపను డాక్టర్ చదివించాం. ఇప్పుడు హైదరాబాద్ కిమ్స్‌లో డాక్టర్‌గా సేవలందిస్తోంది. చాలా కుటుంబాలు ఎక్కువ పిల్లలను కని ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నాయి. – ఎండీ ఆసీఫ్, సింగరేణి ఓసీపీ–2 అడిషనల్ మేనేజర్, గోదావరిఖని -
సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం మండలంలోని సుద్దాల, రేగడిమద్దికుంట, అల్లిపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతుల కోసం కోట్ల రూపాయాలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, నాయకులు జాని, అబ్బయ్యగౌడ్, దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే విజయరమణారావు -
ఠాణా ఎదుట బీఆర్ఎస్ ఆందోళన
రామగిరి(మంథని): తమ నాయకుడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని గురువారం రాత్రి బీఆర్ఎస్ నాయకులు రామగిరి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు.. మండలంలోని నాగెపల్లి గ్రామానికి చెందిన యువకుడికి కనగర్తి గ్రామానికి చెందిన యువతితో నెలరోజుల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు గతంలోనే పెద్దపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా ప్రేమజంట పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. తర్వాత యువతిని వారి తల్లిదండ్రులు తీసుకెళ్లగా మళ్లీ తల్లిదండ్రులతో ఉండలేక యువకుడి చెంతకు చేరింది. ఈక్రమంలో యువతి కనిపించడం లేదని పెద్దపల్లి రూరల్ పోలీసుస్టేషన్లో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత పోలీసులు యువతి వాంగ్మూలం కోసం నాగెపల్లి గ్రామానికి వెళ్లగా యువకుడి తరఫున గ్రామానికి చెందిన కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వాగ్వాదానికి దిగారని అతడిని రామగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, మండల బీఆర్ఎస్ నాయకులు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఒక దశలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం జరుగగా పోలీసులు లాఠీచార్జి చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సుమారు 3 గంటలపాటు స్టేషన్ ఎదుట హైడ్రామా కొనసాగగా సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
ముత్తారం(మంథని): మండలంలోని పలు గ్రా మాల్లో గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించారు. మచ్చుపేట, లక్కారం, పారుపల్లి, అ డవిశ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. బోధ న, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ప్రైవేట్ కు దీటుగా విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న చెంచుల ఇళ్లు, అడవిశ్రీరాంపూర్ టీఫైబర్ ఇంటర్నేట్ ద్వారా నడుస్తున్న డిజిటల్ క్లాసు ను పరిశీలించారు. మచ్చుపేటలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలిస్తూ అర్హులకు మంజూరు చేస్తామన్నారు. అనంతరం గ్రామంలోని పల్లె దవాఖా నాను సందర్శించి స్థానికంగా ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ముత్తారంలోని ఐకేపీ రుద్రమ మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో చిల్లి తయారినీ పరిశీలించారు. డీఆర్డీఏ పీడీ కాళిందిని, ఎంపీడీవో సురేశ్, ఏపీఏం పద్మ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
ప్రభంజనం
● ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా ● జనానాలు పెరగుతుండగా తగ్గుతున్న మరణాలు ● భయపెడుతున్న పట్టణీకరణ సమస్య ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవంసాక్షి,పెద్దపల్లి: దేశ ప్రగతికి, పతనానికి ప్రధాన కారణమైన జనాభా ఇప్పుడు ప్రపంచాన్నే భయపెడుతున్న అతిపెద్ద సమస్య. జనాభా తగ్గుదలపై ప్రభుత్వాలు ఆందోళన చెందుతుండగా, మారిన జీవనశైలితో పిల్లలను కనేందుకు ఆసక్తిచూపని దంపతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేయగా, నేడు వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో జనాభా పెరుగుదల కనిపిస్తుండగా, మరణాలు సంఖ్య గణనీయంగా తగ్గాయి. పెరిగిన జనాభా విద్య, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసపోతుండడంతో పల్లె చిన్నబోతుంది. పంట పొలాలు కనుమరుగై ఆకాశ హార్ామ్యలు వెలుస్తున్నాయి. కరీంగనర్, రామగుండం కార్పొరేషన్‌తో సహా జిల్లాకేంద్రాలుగా మారిన మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారుతుండటం పట్టణాలకు వలసపోతున్న జనాభాకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నియంత్రణతో అడ్డుకట్ట జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. అయినా 1952 నుంచి 1975 ఎమెర్జెన్సీ కాలం వరకు విపరీతంగా పెరిగింది. ఎమెర్జెన్సీ తర్వాత 1976లో ప్రకటించిన జాతీయ జనాభా విధానం అనుగుణంగా వివాహ వయస్సు పెంచడం, ఆర్థిక ప్రోత్సాహకాలు, మహిళ అక్షరాస్యత పెంపుతో జనాభా తగ్గుదల నమోదైంది. అయితే ఇటీవల కరోనా సమయం అనంతరం జనాభా స్థిరీకరణపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. పట్ణణీకరణే ప్రధాన సమస్య జిల్లాల విస్తరణ, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఉఫాది, సౌకర్యవంతమైన జీవనం కోరుతూ ప్రజలు నగరం బాట పడుతున్నారు. కొత్త జిల్లాలుగా ఏర్పాడిన పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల కేంద్రాల్లోనూ పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. ప్రభుత్వ వైద్యం, విద్యా సదుపాయాలను మెరుగుపరుస్తుండడం, కొత్త కట్టడాల నిర్మాణం పెరుగుతుండడంతో వివిధ వర్గాలకు ఉపాధి లభిస్తోంది. దీంతో ఆయా కేంద్రాల్లో జనాభా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో జనాభా ఒత్తిడి పెరుగుతుంది. ఆయా జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం సవాలుగా మారుతుంది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వసతుల కల్పనపై ప్రత్యేక చొరవ చూపిస్తేనే సమస్యలు తీరనున్నాయి. -
ప్రాణం తీసిన భూ తగాదా
● వరుసకు అన్నపై తమ్ముడి దాడి ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిధర్మపురి: భూతగాదాలో గొడవ పడి వరుసకు అన్న అయిన రవిపై తమ్ముడు కత్తితో దాడి చేయడంతో మృతిచెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని దోనూర్‌కు చెందిన గొళ్లెన రవి, నాగరాజు అన్నదమ్ముల కొడుకులు. వారి మధ్య కొంతకాలంగా ఇంటిస్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల రవికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా నిర్మాణం చేపడుతున్నాడు. గురువారం ఇంటి స్థలం విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా నాగరాజు రవిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయె..
● 13న పెద్దపట్నం.. 14న అగ్నిగుండాలుఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు ఈనెల13న జరుగుతాయి. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపస్థాపన, వీరభద్రారాధన రాత్రి భద్రకాళి అవాహన, రాత్రి 10 నుంచి పెద్దపట్నం కార్యక్రమం ప్రారంభమవుతోంది. 14న వేకువజామున 5గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన దాటుట, దక్షయాగ కథాశ్రవణం నిర్వహిస్తారు. ముస్తాబైన ఆలయం భక్తులకు కొంగు బంగారం ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు, అగ్నిగండం దాటుట కార్యక్రమాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లికార్జునస్వామి, ఖండేలరాయుడు, నందీశ్వరులు, సీతారామచంద్రస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఉత్తరతెలంగాణ జిల్లాలతో పాటు పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు. కరీంనగర్, గోదావరిఖని, మంథని డిపోల నుంచి ఓదెలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అలాగే సికింద్రాబాద్, కా జీ పేట్, భద్రాచలం నుంచి ఓదెల మీదుగా వచ్చే ఇంటర్సిటీ, భాగ్యనగర్, రామగిరి, సింగరేణి, సిర్పూర్కాగజ్నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సౌకర్యం కూడా ఉంది. ఏర్పాట్లు చేశాం ఓదెల మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశాం. పెద్దపట్నం, అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – బి.సదయ్య, ఈవో, ఓదెల -
ఆరుగురు పిల్లలతో ఆనందంగా..
కోల్‌సిటీ(రామగుండం): మాది పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామం. 1987లో నాకు పరుగు పందెం ద్వారా సింగరేణిలో ఉద్యోగం రావడంతో, భార్య లక్ష్మితో గోదావరిఖని ఫైవింక్లయిన్ ఏరియాకు వలసొచ్చినం. అప్పటికే మాకు నలుగురు కొడుకులు రాజు, సదానందం, మల్లేశ్, ప్రదీన్తోపాటు కూతురు విజయ ఉన్నారు. గోదావరిఖనికి వచ్చాక చిన్న కొడుకు శ్రీనివాస్ పుట్టాడు. ఆరుగురు పిల్లలను చదివించి ఏ కష్టం రాకుండా పెద్దవాళ్లను చేశాం. 2020లో రిటైర్డ్ అయ్యాను. చిన్న కొడుకు తప్ప, అందరికీ పెళ్లిల్లు చేశాం. కోడళ్లు, అల్లుడు, మనమలు, మనమరాళ్లతో సందడిగా ఉంటుంది. ఇల్లు సరిపోకపోవడంతో దగ్గర్లోనే పిల్లలందరూ వేర్వేరుగా ఉంటున్నారు. కానీ, ఏ పండుగైనా, వేడుకలైనా కలిసి చేసుకుంటాం. కలిసి వంటలు చేసుకొని సంబరంగా కష్టసుఖాలను పంచుకుంటూ ఆనందంగా గడుతున్నాం. – దుడపాక నర్సయ్య, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరిఖని -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: తప్పిన ప్రమాదం
మెట్పల్లి: పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు వెళ్తూ.. మెట్పల్లి బస్‌స్టేషన్‌లో ఆగింది. ప్రయాణీకులతో జగిత్యాల వైపు బయలుదేరిన బస్సు.. ఔట్ గేట్ నుంచి జాతీయ రహదారి పైకి వెళ్లగానే ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయి ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు, సిబ్బందికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దెబ్బతిన్న వాహనాన్ని బస్‌స్టేషన్‌కు తరలించి నిర్మల్ డిపోకు సమాచారమందించారు. అక్కడి అధికారులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో బస్సును పంపించారు. -
కానిస్టేబుల్‌పై మహిళ ఫిర్యాదు
జగిత్యాలక్రైం: తనను కానిస్టేబుల్ బండపల్లి ప్రసాద్ ప్రేమ వివాహం చేసుకుని మోసం చేయడంతోపాటు మరో యువతితో ఇటీవల కనిపించకుండా పోయాడంటూ సారంగాపూర్ మండలం బీర్పూర్ గ్రామానికి చెందిన కస్తూరి భావన జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. భావన జగిత్యాలలో హాస్టల్లో ఉన్న సమయంలో ఒకసారి డయల్ 100కు కాల్ చేసింది. ఆ సమయంలో పరిచయమైన కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన బండపల్లి ప్రసాద్ అనే కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు తనతో కాపురం చేసి.. కొన్నాళ్లుగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం మల్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో కనిపించకుండాపోయాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. -
పట్టుకోసం పర్యటనలు
● శాఖలపై సమీక్షిస్తున్న డైరెక్టర్(పా) ● మూడు రోజులు పారిశ్రామిక ప్రాంతంలోనే గౌతం పొట్రూ గోదావరిఖని: సుమారు దశాబ్దం తర్వాత సింగరేణి లో కీలక డైరెక్టర్(పా) పోస్టుకు ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. పదేళ్లుగా మైనింగ్ డైరెక్టర్లకు(పా)బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ నె ట్టుకుంటూ రావడంతో డైరెక్టర్లపై బాధ్యతలు పెరిగి కార్మికుల సమస్యలు సకాలంలో పరిష్కరించలేదనే విమర్శలు మూటగట్టుకుంది. డైరెక్టర్లు తమ విధు ల్లో బిజీగా ఉంటుండగా కీలకమైన డైరెక్టర్(పా) కూడా మైనింగ్ డైరెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఫైళ్లు సకాలంలో ముందుకు కదల లేదని కార్మిక సంఘాలు సైతం అసంతృప్తితో ఉన్నాయి. అదనపు బాధ్యతలతో నెట్టుకు వస్తున్న డైరెక్టర్ పర్సనల్, అడ్మిస్ట్రేటివ్, వింగ్(పా)కు గౌతం పొట్రూ ఐఏఎస్ అధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 15న బాధ్యతలు స్వీకరణ గౌతం పొట్రూ గతనెల 15న సింగరేణి డైరెక్టర్(పా)గా బాధ్యతలు స్వీకరించారు. తన శాఖలపై పట్టుకోసం అన్ని ఏరియాల్లో పర్యటిస్తున్నారు. రామగుండం, బెల్లంపల్లి రీజియన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులు, పర్సనల్ విభాగం పనితీరు, సంక్షేమం, పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. ఏరియాల వారీగా పర్సనల్ అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. సోమ వారం గోదావరిఖని సింగరేణి ఇల్లెందు గెస్ట్‌హౌస్ చేరుకున్న ఆయన.. రెండు రోజులపాటు ఇక్కడే ఉండి పలు ఏరియాల్లో పర్యటించారు. పర్సనల్ అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం ఏరియాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. రామగుండం, బెల్లంపల్లి రీజియన్లలోనే అతిపెద్ద సింగరేణి ఏరియా మాస్పత్రిని తనిఖీ చేశా రు. వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. కార్మిక కుటుంబాలకు మరిన్ని మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా మంగళవారం బెల్లంపల్లి రీజియన్‌లో పర్యటించారు. బుధవారం కూడా ఇక్కడే ఉండి ఏఎల్పీ, భూపాలపల్లి ఏరియాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. నాణ్యమైన వైద్యం అందించాలి కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతం పొట్రూ ఆదేశించారు. మంగళవారం ఆర్జీ–1 ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. జనరల్ సర్జన్, ఈఎన్టీ నిపుణులను త్వరలో నియమిస్తామని ఆయన తెలిపారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఏసీఎంవో అంబికా, పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, సివిల్ డీజీఎం వరప్రసాద్, వర్క్‌షాప్ డీజీఎం జితేందర్‌సింగ్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి ఉన్నారు. -
సమ్మెకు కార్మిక సంఘాలు సై
జ్యోతినగర్(రామగుండం): సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు కోరారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు రోడ్డులో మంగళవారం సమ్మె పోస్టర్లు పంపిణీ చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. కార్మికులకు న్యాయం చేయడం లేదన్నారు. కార్మిక చట్టాలను కుదించే యత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో బుధవారం చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో నాయకులు నాంసాని శంకర్, చిలుక శంకర్, భూమయ్య, జమీల్, గీట్ల లక్ష్మారెడ్డి, రాధారపు రాజమల్లయ్య, ఏలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహోన్నత వ్యక్తి వైఎస్సార్
సుల్తానాబాద్‌రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత వ్యక్తి అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కొనియాడా రు. నారాయణపూర్‌లో మంగళవారం వైఎస్ రా జశేఖరరెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ ప థకాలు ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, నాయకులు సతీశ్, దామోదర్, రమేశ్, జానీ, అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయం ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కందునూరిపల్లె, నారాయణపూర్, కొదురుపాక, దేవునిపల్లి, చిన్నకల్వల గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లకు ము గ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఎంపీడీవో దివ్వదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే విజయరమణారావు -
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025
నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి. అక్కడక్కడా చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ముసురుతో నీళ్లు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. అవి దాడిచేయడంతో జిల్లావాసులు జ్వరాల బారినపడుతున్నారు. వీరంతా వైద్యం కోసం వివిధ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితోపాటు గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలోనూ జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓపీ కోసం కొందరు, డాక్టర్ల గదుల వద్ద మరికొందరు.. మందుల కోసం ఇంకొందరు ఆయా గదుల వద్ద ఇలా బారులు తీరి ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు. – కోల్‌సిటీ/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి జ్వరాల సీజన్ షురూన్యూస్రీల్ -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కమాన్‌పూర్(మంథని): ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని డీపీఎం వెంకటరమణ మహిళా సంఘాలకు సూచించారు. స్థానిక ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఆదివరాహ మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి సంబురాలు జరుపుకున్నారు. డీపీఎం మాట్లాడుతూ స్వశక్తి మహిళా సంఘాలకు ప్రభుత్వం లోన్ బీమా, ప్రమాద బీమా, ఇందిరా మహిళా బస్సు, మహిళా క్యాంటీన్, పెట్రోల్ బంక్, సోలార్ యూనిట్స్, వడ్డీలేని రుణాలు, అమ్మ ఆదర్శ పాఠశాల వంటి వాటిల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆయన అన్నారు. మహిళ శక్తి మండల అధ్యక్షురాలు నంది శీరిష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎం శైలజశాంతి, వీవోలు, సీసీలు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉండాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఠాణా భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, మావోయిస్టులు, వారికుటుంబ వివరాలు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. విధి నిర్వహణలో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఠాణా ఆవరణలో మొక్క లు నాటారు. డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, సీఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఎస్సై వెంకటేశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మొక్క నాటుతున్న సీపీ అంబర్ కిశోర్ ఝా -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ధర్మారం(ధర్మపురి): దొంగతుర్తి జెడ్పీ హై స్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ శ్రీనివాస్ తెలిపారు. ఆర్.అనూష, వైష్ణవి ఇటీవల గోదావరిఖనిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టులో ఈ విద్యార్థులు పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రెడ్డి, పీఈటీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలి ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వ జూనియర్ క ళాశాల విద్యార్థులను వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలకుడు రమణారావు సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. విద్యార్థులను ఆకర్షించేలా పాఠాలు బోధించాలని ఆయన సూచించారు. ఈనెల 15 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రిన్సిపాల్ అనంత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డ్రాపౌట్లను తగ్గించాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): ఇంటర్మీడియట్లో డ్రాపౌట్ల సంఖ్య తగ్గించాలని ప్రభుత్వ జూని యర్ కళాశాలల ఉమ్మడి జిల్లా పరిశీలకుడు రమణారావు సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఫస్టియర్‌లో ప్రవేశాలు, లెక్చరర్లపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని అధ్యాపకులకు సూచించారు. జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన, ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలి జ్యోతినగర్(రామగుండం): సీపీఎస్ విధానా న్ని రద్దు చేసి పాత పింఛన్ స్కీం అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డులో మంగళవారం టీఎన్జీవోల సంఘం మండల కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన మాట్లాడుతూ, సంఘం బలోపేతానికి ఉద్యోగులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. అనంతరం నూతన టీఎన్జీవో అధ్యక్షు డు డి.జగన్, కార్యదర్శి పి.కృష్ణ, కోశాధికారి రవితేజతోపాటు ఇతర కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, సందీప్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. సమ్మెతో యూరియా ఉత్పత్తికి విఘాతం ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): దేశవ్యాప్తంగా బుధవారం చేపట్టే సమ్మెలో ఆర్ఎఫ్సీఎల్ కార్మికులు పాల్గొంటే యూరియా ఉత్పత్తికి విఘాతం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. కర్మాగారంలో ఉత్పత్తి చేసే యూరియాలో 50శాతం మన రాష్ట్రానికే కేటాయిస్తున్నారని, అయితే, ఒకరోజు సమ్మెతో సుమారు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. విధులకు హాజరు కావాలి గోదావరిఖని: కార్మిక సంఘాల పిలుపు మేర కు కార్మికులు బుధవారం సమ్మెకు వెళ్లకుండా విధులకు హాజరు కావాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతం పొట్రూ, డైరెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏరియాల జీఎంలు, వివిధ విభాగాల అధికారులతో వారు మాట్లాడారు. కార్మికుల అంశం సింగరేణి పరిధిలో లేదన్నారు. ప్రతీ రోజు ఉత్పత్తి సాధించి, నిరంతర విద్యుత్ కో సం పాటుపడాలన్నారు. సమ్మెతో కంపెనీకి రూ.76 కోట్ల నష్టం వాటిల్లుతుందని, వేతనాల రూపంలో కార్మికులు 13.07కోట్లు నష్టపోతారన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఎస్వో టూ జీఎం ఆంజనేయప్రసాద్ పాల్గొన్నారు. -
సాలె గూడు!
దురాశల‘మెటా’లో నిలువుదోపిడీకి గురైన ఒకే సామాజిక వర్గం ● కొందరు ఫిర్యాదు చేసినా నమోదవని కేసులు ● బాధితుల్లో పోలీసులు, రెవెన్యూ, టీచర్లే అధికం ● గుండె, పక్షవాతం, బీపీ బారిన పడుతున్న వైనం ● ప్రజల నుంచి రూ.100 కోట్లకు పైగానే వసూలు ● ఘటనపై కరీంనగర్ సీపీ, నిఘా వర్గాల ఆరాసాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: కరీంనగర్లో ‘సాక్షి’ వెలికితీసిన మరో క్రిప్టోకరెన్సీ ప్రకంపనలు సృష్టిస్తోంది. మెటా పేరిట కరీంనగర్ కేంద్రంగా సాగిన వసూళ్ల దందాపై డీజీపీ కార్యాలయం ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, ఇంటెలిజెన్స్ విభాగాలు వేర్వేరుగా ఆరా తీయడం ప్రారంభించారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న మాజీ కార్పొరేటర్, అతని అనుచరుల పూర్తి వివరాలు సేకరించారు. మెటా బాధితులు కరీంనగర్ కమిషనరేట్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి పరిధిలో ఎక్కడైనా పోలీసులకు ఫిర్యాదులు చేశారా? ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? పిటిషన్ల రూపంలో ఫిర్యాదులు ఎక్కడెక్కడున్నాయి? ఎందుకు కేసులు నమోదు కాలేదు? అన్న విషయాలపై కూపీ లాగుతున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది కేవలం రూ.100 కోట్లదందా కాదని, అంతకు రెండు, మూడింతలు ఉంటుందని పలువురు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అందులోనూ కరీంనగర్లో రూ.10 కోట్లు కాదని, అంతకు రెండింతలు వసూలు చేశారని చెబుతున్నారు. నల్లడబ్బు.. కిక్కురుమనని ఉద్యోగులు ఈ వ్యవహారంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు (పోలీసులు, రెవెన్యూ, సర్కారు టీచర్లు) భారీగా పెట్టుబడులు పెట్టారు. రాష్ట్రంలో రియల్‌రంగం కుంటుపడటంతో క్రిప్టోలో పెట్టుబడులు ప్రారంభించారు. ఇదే సమయంలో మెటాపేరుతో యాప్ పుట్టుకురావడం, దానిలో అత్యధికంగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు భారీగా పెట్టుబడి పెట్టడంతో అనతికాలంలోనే రూ.వందలకోట్ల వసూళ్లు రాబట్టగలిగారు. జగిత్యాల జిల్లాలో సర్కారు టీచర్లే దాదాపు రూ.30 కోట్లకుపైగా వసూళ్లు చేశారని సమాచారం. మూడు నెలల తర్వాత చెల్లింపుల విషయంలో యాప్ మొరాయించడంతో మాజీ కార్పొరేటర్ ముందస్తుగానే తనను తాను రక్షించుకునే ఎత్తువేశాడు. గతంలో ఓ మాజీ మంత్రికి అనుచరుడిగా ఉన్న సదరు వ్యక్తి.. మాజీ మంత్రి పార్టీ మారడంతో కొంతకాలం వేచిచూశాడు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అధికార పార్టీలో చేరాడు. కొంతకాలంగా పలువురు మంత్రులకు దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ యాప్‌లో పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ టీచర్లు అత్యధిక సంఖ్యలో బంధువులు, బినామీలతో పెట్టబడులు పెట్టించారు. అందులో సింహభాగం నల్లడబ్బు కావడం, వీరిపైనా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉండటంతో వారు బయటికి రాకుండా ఓ దళిత నేతను మధ్యలో పెట్టి వ్యవహారాన్ని సెటిల్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ‘కట్లపాము’లా రక్తం పీల్చేవాడు.. ఈ ఏడాది ఆరంభంలో జీబీఆర్ క్రిప్టోకరెన్సీ రూ.95 కోట్లు కొల్లగొట్టిన రమేశ్‌గౌడ్‌ను సీఐడీ పోలీసులు దుబాయ్ పారిపోయే ప్రయత్నంలో ఉండగా పట్టుకున్నారు. కరీంనగర్ సీఐడీకి చెందిన ఓ డీఎస్పీ నిందితుడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ‘సాక్షి’ దినపత్రిక ఆధారాలతో సహా బయటపెట్టడంతో ఉన్నతాధికారులు అతన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధితులు ఇంకా నిందితులపై నమ్మకంతో తమ డబ్బులు వస్తాయన్న దింపుడుకళ్లెం ఆశలతో దీనంగా ఎదురుచూస్తున్నారు. రూ.వందల కోట్లు వసూళ్లు చేసిన ఇప్పటికే లోకేశ్ దేశంవీడి థాయ్‌లాండ్ వెళ్లగా.. మాజీ కార్పొరేటర్ మాత్రం మళ్లీ పోటీకి సిద్ధమవుతుండటం, ఇతర చోటా నేతలు ఇంకా యథేచ్ఛగా తిరుగుతుండటం గమనార్హం. జనాలపాలిట ‘నోట్ల కట్టల పాము’లా పేరొందిన సదరు మాజీ కార్పొరేటర్ డబ్బు కోసం ప్రజల రక్తం తాగాడన్న పేరుంది. ఎక్కడ ఇల్లు కట్టినా.. అక్కడ వాలిపోయి.. రూ.లక్షలకు లక్షలు వసూలు చేశాడన్న ఆరోపణలకు లెక్కలేదు. అప్పట్లో అధికార పార్టీ కావడం, ఓ మంత్రికి ప్రధాన అనుచరుడు కావడంతో అతని ఆగడాలు సాగాయి. ఇప్పుడు ఈ కేసు నుంచి రక్షణ పొందేందుకు ముందుచూపుతోనే అధికార పార్టీలో చేరాడు. అదే పార్టీ నుంచి కరీంనగర్ బల్దియాలో తిరిగి పోటీచేసేందుకు టికెట్ కోసం ప్రయత్నిస్తుండటం గమనార్హం.నలిగిపోతున్న బాధితులు.. ఈ యాప్‌లో ఆదాయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మాట అటుంచితే.. కులపెద్దల మాటలు నమ్మి.. భూములు, ప్లాట్లు, బంగారం విక్రయించి, పర్సనల్ లోన్లు తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టారు. వారు చేర్పించిన వారంతా డబ్బులు ఏవంటూ నిలదీస్తుండటంతో సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారు. తీవ్ర ఒత్తిడితో వీరిలో ముగ్గురికి పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. మరోవ్యక్తికి గుండెపోటు వచ్చింది. చాలామందికి బీపీలు పెరిగాయి. ఓ మహిళ అత్యాశతో రూ.22 లక్షలు బ్యాంకులో పర్సనల్‌లోన్ తీసుకుని యాప్‌లో చేరింది. ఆమె భర్త డబ్బులు ఏవంటూ రోజూ ఆమెను హింసిస్తున్నాడు. ఇలా అత్యాశకు పోయి.. ‘మెటా’ సాలెగూడులో చిక్కిన పేద, మధ్య తరగతి వారిది ఒక్కొక్కరిదీ ఒక్కోదయనీయ గాథ. కులంపేరు చెప్పగానే.. అత్యాశ మత్తులో నిలువునా మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి డీజీపీ కార్యాలయం పిలిచినా, ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. ఇప్పటికే ప్రధానసూత్రధారి లోకేశ్ ఇండియా వీడి థాయ్‌లాండ్ చేరుకున్నాడని బాధితులు చెబుతున్నారు. కరీంనగర్లో యథేచ్ఛగా తిరుగుతున్న మాజీ కార్పొరేటర్‌పై కరీంనగర్‌లోని రెండు ఠాణాల్లో ఇటీవల బాధితులు ఫిర్యాదులు చేశారు. అయినా, ఇవి ఇంకా పిటిషన్ల దశలోనే ఉండటం గమనార్హం. -
సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరిఖని: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రకటించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం (ఈనెల 9న) జరిగే దేశవ్యాప్త ఒక్కరోజు టోకెన్ సమ్మె ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో పంటపొలాలకు సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను ఎత్తిపోసి పంటపొలాలకు సాగునీరు అందించాలన్నారు. లేదంటే నీటి కోసం మరో ఉద్యమం చెస్తామని హెచ్చరించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి పంపింగ్ మెదలుపెట్టి సుందిళ్ల అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వచేయాలన్నారు. సమావేశంలో నాయకులు గోపు అయులయ్యయాదవ్, నడిపెల్లి మురళీధర్‌రావు, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, నీరటి శ్రీనివాస్, పిల్లి రమేశ్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, జిట్టవేన ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి సాయంతో కొడుకు చోరీ
మంథని: మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో తండ్రీకొడుకులను అరెస్ట్ చేసినట్లు సీఐ రాజు తెలిపారు. సోమవారం మంథని పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గత 18న బిట్టుపల్లికి చెందిన కందుకూరి లక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ధర్మారం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు రాయినేని అనిల్, రాయినేని మల్లయ్య.. లక్ష్మి ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఘటనా స్థలంలో అంబర్ ప్యాకెట్‌ను గుర్తించారు. ఈ క్రమంలో మలయ్య, అనిల్‌పై అనుమానంతో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. అలాగే మంథని మండలం పుట్టపాకలో ట్రాక్టర్, సుందిళ్ల పంపుహౌస్‌లో ఇనుపరాడ్స్, మంథని పెట్రోల్‌బంకు వద్ద బైక్, వాసవీనగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం, ముత్తారం మండలంలో వడ్ల చోరీ, రామగిరి మండలంలో రెండు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో పల్లెల్లో స్పెషల్‌డ్రైవ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మంథని, రామగిరి, ముత్తారం ఎస్సైలు పాల్గొన్నారు. -
పదిగంటల జీవో సంగతి తేల్చాలి
జ్యోతినగర్(రామగుండం): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ పది గంటల జీవో విడుదల సంగతిని తెలియజేయాలని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద మాట్లాడారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించకుండా పది గంటల జీవో ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానంపై జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీవో కాపీలను దహ నం చేశారు. నాయకులు రెడపాక లక్ష్మణ్, పుల్లూరి నాగభూషణం, రాజమల్లయ్య, చింతల సత్యం, దగ్గుల సత్యం, కడారి సునీల్, సీహెచ్.ఉపేందర్, తోకల రమేశ్, కె.విశ్వనాథ్, ముద్దసాని దామోదర్‌రెడ్డి, జయసింహ తదితరులు పాల్గొన్నారు. -
మా బతుకులను రోడ్డు పాలు చేయద్దు
మంథని/రామగిరి: ‘మా భముల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుతో మా బతుకులను రోడ్డుపాలు చేయొద్దు’ అని మేడిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంథని ఆర్డీవో సురేశ్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో అభివృద్ధి పేరుతో సింగరేణి సంస్థ సుమారు 400 ఎకరాలు, కృషివిజ్ఞాన కేంద్రం పేరుతో 170 ఎకరాలు సేకరించిందన్నారు. మంథని నియోజకవర్గం అబివృద్ధి చేయడానికి కేవలం రత్నాపూర్ మాత్రమే కనిపిస్తుందా..? మిగితా గ్రామాలు, మండలాలు కనిపించడం లేదా? అని వారు ప్రశ్నించారు. స్థానిక నాయకులు స్వార్థ ప్రయోజనల కోసం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కొండు లక్ష్మణ్, కృష్ణమూర్తి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. -
ఊరూరా మొహర్రం
పెద్దపల్లి జిల్లాలో మొహర్రం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన పీర్ల ఊరేగింపులో మంథని, రామగుండంలో మాజీ ఎమ్మెల్యేలు పుట్టమధూకర్, కోరుకంటి చందర్ పాల్గొన్నారు. మొహర్రం కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక అని వారు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గోపు అయిలయ్య యాదవ్, నారాయణదాసు మారుతి, అర్షనపల్లి శ్రీనివాస్, నిమ్మరాజుల సాగర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, సలావుద్దీన్, సాహెబ్ హుస్సేన్, ఇరికిల్ల సంపత్, మంథని మాజీ ఉపసర్పంచ్ పుప్పాల బాగ్యలక్ష్మితిరుపతి, బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు బుద్దార్థి రాణి తదితరులు పాల్గొన్నారు. – మంథని/రామగుండం/సుల్తానాబాద్/కమాన్‌పూర్/ఎలిగేడు/ఓదెల/యైటింక్లయిన్‌కాలనీ/జూలపల్లి -
రేపు సింగరేణిలో టోకెన్ సమ్మె
● సమ్మెతో సంస్థకు నష్టమంటున్న యాజమాన్యం ● కాదు.. హక్కులు సాధ్యమంటున్న కార్మిక సంఘాలు ● గనులపై కార్మిక సంఘాల విస్తృత ప్రచారం ● సమ్మెకు దూరంగా బీఎంఎస్ గోదావరిఖని: సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వ రంగ సంస్థలపై కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న ఒక్కరోజు టోకెన్ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాల జేఏసీ, విప్లవకార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం చేయాలంటూ విస్తృత ప్రచారం చేస్తున్నాయి. గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తూ సమ్మె ఆవశ్యకతను కార్మికులకు వివరిస్తున్నాయి. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ, జాతీయ సంఘాలు సీఐటీయూ, హెచ్ఎంఎస్, గతంలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్, విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ తదితర సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి. బీజేపీకి అనుబంధంగా ఉన్న బీఎంఎస్ మాత్రం సమ్మెకు దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. బొగ్గు గనుల్లో 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్లను కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిద్వారా కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బొగ్గు గనుల్లో వెలికితీత పనులు పర్మినెంట్ కార్మికులతో చేయించాలని, ప్రైవేటు కార్మికుల ప్రమేయం ఉండొద్దని, ఉంటే పర్మినెంట్ కార్మిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు మే 20నే టోకెన్ సమ్మె చేపట్టాలని నిర్ణయించినా పాకిస్తాన్‌తో యుద్ధం మూలంగా వాయిదా వేశాయి. తిరిగి ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చి.. విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కోల్‌బ్లాక్‌ల వేలంలో సత్తుపల్లి ఓసీపీ ప్రైవేట్ సంస్థకు అప్పగించగా ఓసీపీ ఓబీ మట్టిపోయడానికి స్థలం లేదంటోంది. తాడిచర్ల–2, వెంకటాపూర్ గనులు సింగరేణికే అప్పగించి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలని కోరుతున్నాయి. సమ్మెతో సింగరేణికి నష్టం.. టోకెన్ సమ్మెతో సింగరేణికి నష్టం వాటిల్లుతుందని, కార్మికులు వేతనాలు నష్టపోతారని యాజమాన్యం అంటోంది. సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని, సమ్మె డిమాండ్లలో అత్యధికం సంస్థకు సంబంధించినవి కావని, వాటిని తీర్చేటివి కూడా కాదని చెబుతోంది. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతలో వెనకబడి ఉన్నామని, జూలై, ఆగస్టులో వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరా యం కలుగుతుందని పేర్కొంటోంది. ఒక్కరోజు స మ్మె చేస్తే రూ.76కోట్ల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుందని చెబుతోంది. కార్మికులు వేతనం రూపంలో రూ.13.07కోట్లు నష్టపోతారని, 1.92 లక్షల ట న్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందని అంటోంది. -
సెలవు ప్రకటించాలి
ఏటా జూలై రెండో మంగళవారం శీత్లా పండుగ జరుపుకుంటాం. అమ్మవారలకు సంప్రదాయ వేశధారణలో మొక్కులు చెల్లించుకుంటాం. శీత్లాభవాని వేడుకలకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరుతున్నాం. – గుగులోత్ కళావతి, మాజీ జెడ్పీటీసీ, వీర్నపల్లి రాష్ట్ర పండుగగా గుర్తించాలి శీత్లాభవాని పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి బడ్జెట్ కేటాయించాలి. గోర్ బంజారాల పండుగలను గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం గుర్తించాలి. – గూగులోత్ రవిలాల్నాయక్, మద్దిమల్ల ఒకే రోజు జరుపుకోవాలని.. జిల్లాలోని అన్ని మండలాల్లో గల తండాల్లో ఒకే రోజు శీత్లా భవాని వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించాం. గతంలో రెండు వారాల పాటు పండుగను జరుపుకునేవారు. ఈసారి ఈనెల 8న అన్ని తండాల్లో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని సూచించాం. – గుగులోతు సురేశ్‌నాయక్, బంజారాసేవా సంఘం జిల్లా అధ్యక్షులు -
అడవంతా పండుగ..
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లాభవాని అమ్మవారి వేడుకలకు తండాలు ముస్తాబయ్యాయి. అడవి బిడ్డల ప్రత్యేక పండుగగా శీత్లా భవానిని వేడుకుంటారు. వర్షాకాలం ఆరంభమై పెద్దపూసల కార్తీలో గిరిజన తండాలో శీత్లా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. జూలై తొలి, రెండో మంగళవారాల్లో సంప్రదాయ బద్ధంగా పండుగ జరుపుకుంటారు. తండాల పోలిమేర్ల వద్ద శీత్లా భవానిని ప్రతిష్టించి యువతులు బోనాలు ఎత్తుకుని అక్కడికి చేరుకుంటారు. కోళ్లు, మేకలు, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పశువులన్నింటినీ ఒక చోట చేర్చి బలి ఇచ్చిన మేక పేగు మీదుగా వాటిని దాటిస్తారు. బావి నుంచి తెచ్చిన నీటిని వాటిపై చల్లుతారు. ఆ కారణంగానే దీనికి దాటుడు పండుగగా పేరొచ్చింది. గిరిజన యువతుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 126 తండాల్లో ఒకే రోజు మంగళవారం పండుగ నిర్వహించాలని జిల్లా బంజారా సేవా సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. నైవేద్యాలతో అటవీ ప్రాంతాలకు.. శీత్లా భవాని వేడుకలను పురస్కరించుకుని ఉదయమే గిరిజనులు నైవేద్యాలతో ఊరేగింపుగా అటవీ ప్రాంతానికి తరలివెళ్తారు. అక్కడ తమ దేవతలైన శీత్లా భవాని, తుల్జా భవాని, మసూరి భవాని, అంబ భవాని, దుర్గా భవాని, మాతలకు మొక్కులు చెల్లించుకుంటారు. పిల్లపాపలు, పశు సంపద బాగుండాలని, పంటలు సంమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురువాలని పూజలు చేస్తారు. అనంతరం గిరిజన మహిళల నృత్యాలు ఉంటాయి. శీత్లా భవాని తల్లిని ప్రధాన దేవతగా కొలుస్తారు. పెళ్లికాని యువతులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంచి వరుడు దొరకాలని వేడుకుంటారు. మూడురోజుల పాటు జరుపుకునే ఈ పండుగ కోసం సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా స్థిరపడినవారు స్వగ్రామాలకు చేరుకుంటారు. నేడు శీత్లా భవాని వేడుకలకు తండాలు ముస్తాబు నైవేద్యాలతో అటవీ ప్రాంతాలకు తరలనున్న గిరిజనులు కోరికలు నెరవేరుతాయి శీత్లాభవాని అమ్మవారిని కొ లిస్తే కోరికలు నెరవేరుతా యి. పశుసంపద, పంటలు, ఆయురారోగ్యాలతో ఉండాలని పండగ రోజు అమ్మవా రిని కొలుస్తాం. పిండి నైవేద్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మొక్కులు చెల్లించుకుంటాం. ఏటా ఇదే మాసంలో పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. – అజ్మీరా రజిత, మాజీ సర్పంచ్, బుగ్గారాజేశ్వర తండా -
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జిగా అద్దంకి దయాకర్
కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్చార్జిలను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మెదక్ ఉమ్మడి జిల్లాకు, రాష్ట్రసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జిగా నియమించారు. జిల్లాకు వర్షసూచన పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈనెల 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, దీంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి ప్ర మాదాలు జరగకుండా ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి రామగిరి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీల్లో ఎప్పటికప్పడు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జెడ్పీ సీఈవో నరేందర్ ఆదేశించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీవో శైలజారాణి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తదితర అంశాల గురించి వివరించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కు సన్నద్ధంగా ఉండాలని జెడ్పీసీఈవో పేర్కొన్నారు. సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, జూని యర్ అసిస్టెంట్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. వర్గపోరుకు ‘గుజ్జుల’ తీరే కారణంపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి నియోజకవర్గానికి పాతికేళ్ల కాలం క్రితం వలస వచ్చిన గుజ్జుల రామకృష్ణారెడ్డిని కేవలం 12 రోజుల స్వల్ప కాలంలోనే పెద్దపల్లి ప్రజలు అక్కున చేర్చుకొని ఎమ్మెల్యేగిరి అప్పగిస్తే.. రూ.వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకొని పార్టీని ఇతర పార్టీలకు తాకట్టు పెట్టి లబ్ధి పొందుతున్నాడని బీజేపీ నాయకులు చిలారపు పర్వతాలు, కావేటి రాజగోపాల్, ఈర్ల శంకర్, సంపత్‌రావు ఆరోపించారు. పెద్దపల్లిలో సోమవారం మాట్లాడారు. పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేశ్, మండల అధ్యక్షుడు వేల్పుల రమేశ్ పార్టీ అధిష్టానం అనుమతితో కమిటీలను ప్రకటిస్తే.. జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తమ వారితో అర్థరహిత, నిరాధార ఆరోపణలు చేసి కార్యకర్తలు, నాయకుల్లో అయోమయం సృష్టించేందుకు యత్నించడమేమిటని మండిపడ్డారు. ఇపుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కర్రె సంజీవరెడ్డికి కనీసం సభ్యత్వం కూడా లేదన్నారు. నాయకులు తంగెడ రాజేశ్వర్‌రావు, మేకల శ్రీనివాస్, చిలువేరు సంపత్, కారంగుల శ్రీనివాస్ తదతరులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులుపెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, పిల్లలను సర్కారు బడులకే పంపించాలని మహిళా కమిషన్ స భ్యురాలు కఠారి రేవతిరావు అన్నారు. కొత్తపల్లి ప్రభుత్వ, ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించి వసతులపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం వంటలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని సూచించారు. గ్రామంలోని ఎస్సీకాలనీ, తెనుగువాడ నుంచి విద్యార్థులు పాఠశాలకు రావడం ఇబ్బందిగా మారిందని పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ సబ్బు రాజకుమారి తదితరులు రేవతిరావు దృష్టికి తెచ్చారు. రైల్వే గేటు మూసివేతతో కష్టాలు పెరిగాయని, అండర్ బ్రిడ్జి ద్వారా వచ్చేందుకు దూరం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు తదితరులున్నారు. -
గాయపడిన వ్యక్తి మృతి
కొడిమ్యాల: లారీ, బైక్ ఢీ కొన్న ఘటనలో గాయపడిన మండలంలోని సండ్రాలపల్లికి చెందిన బుచ్చిబాబు (28) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథన ప్రకారం.. బుచ్చిబాబు తనకు వరుసకు కొడుకై న మారుతితో కలిసి గంగాధర మండలం వైపు వెళ్తున్నారు. కొడిమ్యాల మండలం తుర్కాషినగర్ వద్దకు వెళ్లగానే కరీంనగర్ రహదారిపై లారీ వీరి బైక్‌ను ఢీకొంది. ఈఘటనలో బుచ్చిబాబు, మారుతి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేదు. చికిత్స పొందుతూ బుచ్చిబాబు మృతి చెందాడు. మారుతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ..కరీంనగర్ క్రైం: గుర్తుతెలియని వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. అనారోగ్య కారణంగా గత వారం రోజుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా రెండు రోజుల క్రితం మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే టూటౌన్ పోలీసులను ఆశ్రయించాలని అన్నారు. రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ సూపర్వైజర్... రామగుండం: రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి విలేజ్ రామగుండం రోడ్డుపై రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సంధ్యారాణి తెలిపిన వివరాలు.. విలేజ్ రామగుండంకు చెందిన అంబాల రాజశేఖర్(50) ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు యూనిట్–7లో షిప్ట్ ఆపరేషన్ విభాగంలో కాంట్రాక్ట్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బొలెరో ఢీకొని..ధర్మారం: మండలకేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన మెడవేని చిన్నయ్య (70) మృతిచెందాడు. మండలకేంద్రానికి చెందిన చిన్నయ్య తన టీవీఎస్ వాహనంపై ధర్మారం నుంచి పెట్రోల్ బంకుకు వెళ్తున్నాడు. కరీంనగర్ వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన చిన్నయ్య అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసుల అదుపులో లొంగిపోయినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చల్లూరు గ్రామంలో ఒకరు.. వీణవంక: మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన కొలిపాక రాజయ్య(60) సోమవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. గ్రామ శివారులో వాకింగ్ చేస్తుండగా మామిడాలపల్లి నుంచి రాజిరెడ్డి అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ వస్తూ రాజయ్యను వెనక నుంచి ఢీ కొట్టాడు. తీవ్రగాయాలైన రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. -
ప్రమాణాలు పాటించకనే కాళేశ్వరం కుంగుబాటు
శంకరపట్నం(మానకొండూర్): కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడంతోనే కుంగిపోయిందని, బాధ్యులపై ప్రభుత్వం కేసు నమోదు చేయాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. సోమవారం ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారని ఆరోపించారు. అవినీతి పాల్పడిన నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరంకుశపాలనను అంతం చేయడానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించి అంబేడ్కర్ సుజల స్రవంతి అని నామకరణం చేయాలన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కోదండరాంకు జిల్లా కన్వీనర్ మోరె గణేశ్ నాగలిని బహూకరించారు. రాష్ట్ర ప్రధన కార్యదర్శులు ముక్కెర రాజు, అరికెల్ల స్రవంతి, ధర్మార్జున్, మండల అధ్యక్షుడు రమేశ్, శ్రీనివాస్, సతీశ్, భానుకిరణ్, సాయిరాం, అరుణ్, రాజేశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే విజయరమణారావు ఎలిగేడు(పెద్దపల్లి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం మండలంలోని ముప్పిరితోటలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసి 22 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. సీఆర్ఆర్(ఎన్సీపీ) నిధులు రూ.10లక్షలతో ఎస్సీకాలనీలో సీసీరోడ్డు, ఎస్డీఎఫ్ నిధులు రూ.5లక్షలతో సీసీ సైడ్‌డ్రైన్ పనులు ప్రా రంభించారు. అలాగే పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో మొ క్కలు నాటారు. విండో చైర్మన్ గోపు విజయభా స్కర్‌రెడ్డి, నాబార్డు డీడీఎం జయప్రకాశ్, సహకార బ్యాంకు కరీంనగర్ సీఈవో సత్యనారాయణరావు, డీసీవో శ్రీమాల, తహసీల్దార్ యాక న్న, ఎంపీడీవో భాస్కర్‌రావు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల వేగం పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆర్అండ్బీ, టీజీఈడబ్ల్యూయూఐడీసీ పనులపై సమీక్ష నిర్వహించారు. డీఎంఎఫ్టీ ఇతర నిధులతో చేపట్టిన వంతెనలు, రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల భవనాలు, ఇతర అభివృద్ధి పనులు ఆరాతీశారు. సమావేశంలో ఈఈ బావ్‌సింగ్ తదితరులున్నారు. 15లోగా దరఖాస్తు చేసుకోవాలి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నియామకానికి ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకో వాలని కలెక్టర్ సూచించారు. జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ, మానిటరింగ్ కమిటీలో ఐదుగురు సభ్యుల నియామకం కొరకు ఎస్సీ, ఎస్టీకి చెందినవారు, ముగ్గురు నాన్అఫిషియల్ సభ్యులు స్వచ్ఛంద సంస్థలవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని,ఆసక్తిగల వారు షెడ్యూల్డ్‌కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద సోలార్‌ప్లాంటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని నెలనెలా ఆదాయం పొందాలని కలెక్టర్ శ్రీహర్ష అ న్నారు. కలెక్టరేట్లో సోమవారం సంబంధిత అ ధికారులతో సమీక్షించారు. రైతులు, సహకారసంఘాలు వారి భూముల్లో 500కిలోవాట్ల నుంచి 2మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏ ర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను అ మ్మడం ద్వారా నెలవారీ ఆదాయం పొందొచ్చన్నా రు. జిల్లాలో 4 సహకారసంఘాలు ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయని వివరించారు. ఇంటి యజమానుల కోసం ‘సూర్యఘర్’ సూర్యఘర్ ముప్తిబిజిలీ యోజన కింద ఇళ్ల పైకప్పు పై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒకే కాలనీలో లబ్ధిదారులు ఏర్పాటుకు ముందుకొస్తే అదనంగా రూ.10వేల రాయితీని అందిస్తామన్నారు. ఈనెలాఖరు వరకు ఆసక్తిగల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. ఆర్డీవో గంగయ్య, డీసీవో శ్రీమాల తదితరులున్నారు. -
ఆ రోజు బాధేసింది.. ఈరోజు ఆనందంగా ఉంది
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రంలో ఇన్నాళ్లు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా భావించానని, చాలామంది తమను హకీంపేటకు మార్చాలని దరఖాస్తులు వచ్చాయని కానీ 200 ఎకరాల్లో ఉన్న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ కంటే కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్ చాలా బాగుందని సంబురపడ్డారు క్రీడా మంత్రి వాకటి శ్రీహరి. సోమవారం కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డిలతో కలిసి పర్యటించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌కు శాట్స్ ఎండీ, చైర్మన్లతో కలిసి ఒక రోజు ఉదయాన్నే వెళ్లానని కానీ నేను అనుకున్నట్లుగా అక్కడ వసతులు లేవని తినకుండానే తిరిగొచ్చామన్నారు. కరీంనగర్‌కు వచ్చే ముందు హకీంపేటలోనే ఏమీ లేవు ఇక కరీంనగర్ ఎలా ఉంటుందో అనుకొని వచ్చానని కానీ ఇక్కడి వసతులు, వాతావరణం, సౌకర్యాలు చూసి మనసు ఉల్లాసమైందన్నారు. నాకు ఆరోజు బాధేసిందని..కానీ ఈ రోజు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగ ఆయాన కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌ను చూసి మురిసిపోయారు. ప్రపంచం గర్వపడేలా క్రీడల్లో రాణించాలని చిన్నారులకు సూచించారు. క్రీడా వసతులపై శాట్స్ ఎండీ ఆరా కరీంనగర్లో క్రీడా శాఖ మంత్రి పర్యటన సందర్బగా రాష్ట్ర క్రీడా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి కూడా వచ్చారు. మంత్రి ఇతర కార్యక్రమాలకు వెళ్లగా ఆమె ప్రాంతీయ క్రీడా పాఠశాలను పరిశీలించి క్రీడా వసతులపై ఆరా తీశారు. కాసేపు శాట్స్, క్రీడా శాఖ, ఒలింపిక్, క్రీడాపాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. క్రీడా పాఠశాలలో రెజ్లింగ్, జూడో, అథ్లెటిక్స్ తదితర క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో శాట్ డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, డీవైస్వో శ్రీనివాస్ గౌడ్, డీఈవో శ్రీరామ్ మొండయ్య, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలపై మంత్రి వాకటి శ్రీహరి -
సమ్మెతోనే కార్మిక హక్కులు సాధ్యం..
సమ్మెతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. లేబర్కోడ్లను రద్దు చేసి గతంలో మాదిరిగా కార్మిక చట్టాలను కొనసాగించాలి. కార్మికులంతా స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి మద్దతివ్వాలి. కేంద్రం తీరుతో సింగరేణి పెద్దమొత్తంలో నష్టపోయింది. – సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక చట్టాలను గతంలో ఉన్న వాటినే కొనసాగించాలి. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. అమలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. బొగ్గు గనుల ప్రైవేటీకరణ మానుకోవాలి. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. – తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు బొగ్గు బ్లాకులు కేటాయించాలి సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి. లేబర్ కోడ్లు అమలు చేయడం వల్ల కార్మి కులకు తీరని నష్టం కలుగుతుంది. బొగ్గుబ్లాక్‌లు ప్రైవేట్‌పరం చేయడాన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కొత్తబ్లాక్లు సింగరేణికే అప్పగించాలి. – రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు -
విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
కరీంనగర్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారని, ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నా వి ద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నా రు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షులు అంగిడి దేవేందర్, జీవన్, తాత్విక్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
సుల్తానాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధ కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి కోరారు. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనను గజమాలతో సన్మానించారు. మెజార్టీ సీట్లు గెలవడం కోసం సమష్టిగా పోరాడాలని సంజీవరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రూపు తగాదాలు లేకుండా ఐక్యంగా ముందుకు వెళ్తే విజయం తధ్యమన్నారు. అంతకు ముందు ఆయన పలు ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమాలలో పార్టీ జిల్లా కార్యదర్శి మహేందర్ యాదవ్, నాయకులు కామాని రాజేంద్రప్రసాద్, కందుల శ్రీనివాస్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కూకట్ల నాగరాజు, కొల్లూరి సతీశ్ కుమార్, అన్వేశ్, ఎల్లెంకి రాజన్న, గుడ్ల వెంకటేశ్, పవన్, సతీశ్, పల్లె తిరుపతి, సదయ్య, శేఖర్, కుమార్, సతీశ్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్నకు మొక్కులు
వేములవాడ: రాజన్నను సోమవారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముసురును సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో రాధాబాయి, ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్, అశోక్, జయకుమారి, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. 25 రోజుల్లో రూ.2 కోట్ల ఆదాయం రాజన్నకు 25 రోజుల్లో హుండీల ద్వారా రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో రాధాబాయి తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య సోమవారం హుండీలలోని కట్నాలు, కానులను ఆలయ అధికారులు, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు లెక్కించారు. రూ.1,99,84,960 నగదు, మిశ్రమ బంగారం 188 గ్రాములు, మిశ్రమ వెండి 14.300 కిలోలు సమకూరినట్లు ఈవో తెలిపారు. ఆలయ ఎస్పీఎఫ్ ఏఎస్సై మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
సమ్మెతో కేంద్రం మెడలు వంచాలి
● ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య గోదావరిఖని: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు నిచ్చారు. సోమవారం ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్కోడ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా సవరించిందన్నారు. ఒక్కరోజు సమ్మెతో కేంద్రం దిగిరాకపోతే కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు సదానందం, మెండె శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, మడ్డి ఎల్లాగౌడ్, అరెల్లి పోశం, ఎంఏ గౌస్, నాయిని శంకర్, యాస శ్రీనివాస్, నరేష్, సంపత్, జాన్ కెనడి, సతీశ్, రాజమౌళి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభావిత గ్రామాలకు పండ్ల మొక్కలు
గోదావరిఖని(రామగుండం): పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పాటుపడుతోందని, ప్రభావిత గ్రామాలకు పండ్ల మొక్కలు అందిస్తామని సంస్థ సీఎండీ ఎన్.బలరాం అన్నారు. ఆదివారం ఆర్జీ–1 ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్ ఫిల్టర్‌బెడ్ వద్ద ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో మొక్కలు నాటారు. కోల్ కంపెనీలాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.8వేల కోట్లు ట్యాక్స్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా నర్సరీల్లో 50లక్షల మొక్కలు ఉన్నాయని, వాటిని సంస్థ ప్రభావిత గ్రామాల్లో నాటుతామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 30మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ఒడిశాలోని నైనీలో 10మిలియన్, వీకే ఓసీపీలో 6మిలియన్, జేకే ఓసీసీలో 3మిలియన్ టన్నులు తీస్తామన్నారు. అధికారులు, కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని వెల్లడించారు. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ పాటిస్తూ సంస్థ రోల్‌మోడల్‌గా ఉండాలన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత, సీఎంఓఏఐ అధ్యక్షుడు బి.మల్లేశ్, యూనియన్ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వెయ్యి మొక్కలు నాటగా అందులో సీఎండీ 500 మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. మేడిపల్లి ఓసీపీ సందర్శనమూతపడిన మేడిపల్లి ఓసీపీ ప్రాంతాలను సీఎండీ బలరాం సందర్శించారు. సుమారు 6.26 హెక్టార్ల విస్తీర్ణంలో 7 జలాశయాల నిర్మాణం చేపట్టారని, చేపల పెంపకం, తాగునీటి అవసరాలకు మినీ చెరువులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయప్రసాద్ తదితరులు పేర్కొన్నారు.● సింగరేణి సీఎండీ బలరాం -
లఘుచిత్రాలతో సమాజంలో మార్పు
కోల్‌సిటీ/గోదావరిఖనిటౌన్: సమాజంలో మార్పునకు లఘుచిత్రాలు దోహదపడుతాయని గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ అన్నారు. ఆదివారం గాంధీచౌక్ చౌరస్తాలో తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రాపల్లి కుమార్‌పటేల్ రచన, దర్శకత్వం, నిర్మాణంలో చిత్రీకరిస్తున్న ‘రక్షణ’ లఘుచిత్రం మొదటి షూటింగ్ సన్నివేశాన్ని ఏసీపీ క్లాప్ కొట్టి ప్రారంభించారు. విప్లవం, రౌడీయిజం, చదువు అనే మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని చిత్రీకరిస్తున్న రక్షణ లఘచిత్రం పలువురిలో మార్పు వచ్చేలా ఉండాలని ఆశించారు. సీనియర్ కళాకారుడు దామర శంకర్, దయానంద్‌గాంధీ, మ్యాజిక్ రాజా, చంద్రపాల్, కొమ్ము కుమార్‌యాదవ్, మేకల శ్రీకాంత్, పీఎన్ పటేల్, ఉపేందర్, విజయ్‌కుమార్, వంగ శ్రీనివాస్‌గౌడ్, నాగభూషణంగౌడ్, డాక్టర్ శంకర్లింగం, కళావతి, మధు పాల్గొన్నారు. జునోటిక్, రేబీస్ వ్యాధులతో ముప్పుపెద్దపల్లిరూరల్: జంతువుల నుంచి మానవులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదముందని జిల్లా పశువైద్యాధికారి శంకర్ అన్నారు. పెద్దపల్లిలోని పశువైద్యశాలలో ఆదివారం ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా జంతువుల పెంపకం దారులకు అవగాహన కల్పించారు. ఏటా జూలై 6న ప్రపంచ జునోసిస్ దినోత్సవా న్ని నిర్వహిస్తున్నారని వివరించారు. వాతావరణ మార్పులతో జునోటిక్ వ్యాధులు ప్రబలే అవకాశముందన్నారు. జంతువుల నుంచి మానవులకు వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి, వాటిని ఎలా నివారించుకోవాలి అనే అంశాలపై పెంపకందారుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం వన్‌హెల్త్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వివరించారు. రేబీస్ వ్యాధి నియంత్రణకు టీకా వేస్తున్నామన్నారు. పశువైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీల నిర్మాణానికి నిధులు మంజూరుమంథని: మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 12 గ్రామపంచాయతీ నూతన భవనాల నిర్మాణానికి రూ.2.40 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి శ్రీధర్‌బాబు క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు కేటాయించారు. మండలంలోని అడవిసోమన్‌పల్లి, ఖానాపూర్, మల్లేపల్లి, ఆరెంద, ఉప్పట్ల, గోపాల్పూర్, తోటగోపయ్యపల్లి, ముత్తారం మండలం జిల్లల్లపల్లి పంచాయతీకి నిధులు మంజూరయ్యాయి. రామగిరి మండలం నాగెపల్లి, జల్లారం, ముస్త్యాల, కమాన్‌పూర్ మండలం సిద్దపల్లిలో నూతన భవనాలు నిర్మించనున్నారు. పెద్దమ్మతల్లికి మాజీ ఎమ్మెల్యే మొక్కులుగోదావరిఖనిటౌన్/యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం నియోజకవర్గ ప్రజలపై పెద్దమ్మతల్లి ఆశీస్సులు ఉండాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం స్థానిక పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు నారాయణదాసు మారుతి, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీలో పలువురిని పరామర్శించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మేడి సదయ్య దంపతులు ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడగా, వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలాగే చేతి గాయాలతో బాధపడుతున్న రాంచందర్, దాసరి శ్రీనివాస్‌ను పరామర్శించారు. మాజీ కార్పొరేటర్ స్టాలిన్‌గౌడ్, బాలరాజు, అంజలీదేవి తదితరులు ఉన్నారు. -
కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ముందుకు
● మంత్రి వివేక్గోదావరిఖని(రామగుండం): కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని రాష్ట్ర కార్మిక ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదివారం గోదావరిఖనికి వచ్చిన సందర్భంగా మంత్రికి ఘన స్వాగతం పలికి, స్థానిక ఓ ఫంక్షన్హాల్లో సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామిదే అన్నారు. కాకా బాటలోనే ఎంపీ వంశీకృష్ణ కార్మికుల సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పారని పేర్కొన్నారు. కార్మికుల సొంతింటి కల నెరవేరేలా కృషి చేస్తామని, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రామగుండంలో జరిగే ఇసుకదందాను బంద్ చేస్తామని చెప్పారు. ఏటా రూ.3వేల కోట్ల ఆదాయం ఇసుకపై వస్తుండగా, అందులో ప్రస్తుతం రూ.400కోట్లు మాత్రమే వస్తోందని, మిగతాది ఎటుపోతోందని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి సీరియన్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు, ఐఎన్టీటీయూ జాతీయ నాయకుడు బాబర్‌సలీంపాషా, మాల మహానాడు సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బలహీనవర్గాల సేవలో నిమగ్నమవుతా
● ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మారం(ధర్మపురి): మంత్రి పదవి దేవుడిచ్చిన వరంలాంటిదని, బడుగు, బలహీనవర్గాల సేవలో నిమగ్నమవుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఆదివారం ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర గురుకులాల మెస్ కాంట్రాక్టు అసోసియేషన్, ఆర్ఎంపీ వైద్యుల అసోసియేషన్ మండల అధ్యక్షుడు మునీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే గురుకులాల పెండింగ్ బిల్లులను ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రులతో మాట్లాడి మంజూరు చేయించానని చెప్పారు. వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందని, దీంతో రాష్ట్రంలోని లక్షా 35వేల మంది విద్యార్థులకు సరిపడా డైట్ అందుతోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి డైట్ చార్జీలు పెంచలేదని, గురుకులం మెస్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. గురుకుల విద్యాలయాల్లో నిర్వహించే టెండర్ విధానంపై సంబంధిత కార్యదర్శితో చర్చిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర గురుకులాల మెస్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కమిటీలను మీరెలా ఖరారు చేస్తారు?’
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండల, పెద్దపల్లి పట్టణ కమిటీలను ఎలా ప్రకటిస్తారని ప్రభారీలు జంగ చక్రధర్‌రెడ్డి, నారాయణస్వామి ప్రశ్నించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో నాయకులు పల్లె సదానందం, పర్శ సమ్మయ్య, జ్యోతిబసు, మౌటం నర్సింగం, రాజేంద్రప్రసాద్, బెజ్జంకి దిలీప్‌తో కలిసి మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ తీరు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆరోపించారు. కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డిలు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ సహకారంతో పార్టీని బలో పేతం చేస్తుంటే వారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్టీ మండల, పట్టణ కమిటీలను పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. ఇక మీదట అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తే ఊరుకోబోమన్నారు. -
సాగుపై సందిగ్ధం
● అన్నారం బ్యాక్‌వాటర్‌తో భూముల ముంపు ● క్రాప్ హాలీడేపై స్పష్టత ఇవ్వని సర్కార్ ● మూడు సీజన్లకు పరిహారం చెల్లించని వైనం ● అయోమయంలో అన్నదాతలుమంథనిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బరాజ్ బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురయ్యే భూముల్లో వర్షాకాల సీజన్లో పంట సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధం రైతుల్లో నెలకొంది. మంథని మండలం మల్లారం, ఆరెంద గ్రామాలకు చెందిన సుమారు 250 మంది రైతులు 350 ఎకరాల్లో పంటల సాగుపై అయోమయంలో పడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముంపునకు గురయ్యే భూములకు క్రాప్ హాలీడే ప్రకటించి పరిహారం చెల్లించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాక్‌వాటర్ రాకపోవడంతో క్రాప్ హాలీ డేపై స్పష్టత లేక రైతులు పంటల సాగుకు ముందుకు రావడం లేదు. ఎకరాకు రూ.24వేల చొప్పున 2020–23 వరకు అన్నారం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురయ్యే భూములకు ఎకరాకు రూ.24వేల చొప్పున గత ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కాగా మూడు సీజన్లకు సంబంధించి పరిహారం చెల్లించలేదని రైతులు చెబుతున్నారు. క్రాప్హాలీ డేపై స్పష్టత కరువు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని బరాజీల గేట్లు ఎత్తివేశారు. ఇప్పటి వరకు నీరు నిల్వ చేయకపోవడంతో గతేడాది బ్యాక్‌వాటర్ రాలేదు. అయితే మల్లారం, ఆరెంద గ్రామాల్లోని ముంపు భూములకు క్రాప్ హాలీడేపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు పంటల సాగుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.నాలుగెకరాలు ముంపులోనే.. నాకు నాలుగెకరాల భూమి ఉంది. మొత్తం అన్నారం బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురవుతది. ఈసారి బరాజ్‌లు నిండకపోవడంతో నీళ్లు రాలేదు. కానీ, భారీ వర్షాలు పడితే నీళ్లు నిలిచి మా భూములన్నీ మునిగిపోతాయి. కరకట్టలతో నీళ్లు మానేరులోకి వెళ్లక మళ్లీ మాకు నష్టమే జరిగేలా ఉంది. – సుంకరి మహేశ్, రైతు, మల్లారంరైతు భరోసా పైసలు పడలె నాకున్న మూడెకరాలు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోతాంది. గతంలో క్రాప్‌హాలీడే, రైతుబంధు పైసలు పడేవి. మూడు సీజన్లలో ఏ పైసలు రాలేదు. భూమిల పంట తీసుకోక, పైసలు రాక ఎట్లా బతుకుడు. – ఆకుల రాజేశ్, రైతు, మల్లారంనివేదికలు పంపినం అన్నారం బ్యాక్‌వాటర్ ముంపు భూముల క్రాప్ హాలీడేకు సంబంధించి మూడు సీజన్ల పరిహారం నివేదికలు ప్రభుత్వానికి పంపాం. బడ్జెట్ కేటాయించగానే పరిహారం చెల్లింపులు జరుగుతాయి. దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదు. – అంజనీ మిశ్రా, ఏడీఏ మంథని ‘ఈమె పేరు దామరపెల్లి సువర్ణ. భర్త మల్లారెడ్డి పెరాలసిస్‌తో మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సువర్ణ పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది. అయితే ఈమెకు ఆరెంద తానిపంపు శివారులో ఎకరంన్నర భూమి ఉంది. ఆ భూమి అన్నారం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురికాగా గత ప్రభుత్వం పరిహారం చెల్లిస్తూ వచ్చింది. మూడు సీజన్లుగా పరిహారం చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. పరిహారం, రైతుభరోసా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతూ ఈ ఏడాది సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంది. ఇలా ఈమె ఒక్కరే కాదు ఆరెంద, మల్లారం గ్రామాలకు చెందిన సుమారు 250 మంది రైతుల్లో నెలకొన్న అయోమయం’. -
అమ్మకాలు జరగడం లేదు
ప్లాట్ల క్రయ, విక్రయాలు లేక రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవారిపై ఆర్థిక ప్రభావం చూపుతోంది. ప్లాట్ల వ్యాపారం జరిగే సమయంలో పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడం కూడా తమకు నష్టం కలిగించింది. తర్వాత పునఃప్రారంభించినా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం, ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేక రియల్ వ్యాపారం తగ్గింది. మళ్లీ పుంజుకుంటుందనే ఆశతో ఉన్నాం. – పెగడ రమేశ్‌యాదవ్, రియల్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆదాయంపై ప్రభావం పెద్దపల్లి ప్రాంతంలో భూ లావాదేవీలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తమ కార్యాలయానికి ఏటా సమకూరే ఆదాయం దాదాపు రూ.6కోట్ల మేర తగ్గింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ విధానంలో వచ్చిన మార్పులతో సమయం ఎంతో ఆదా అవుతోంది. – అశోక్, సబ్‌రిజిస్ట్రార్, పెద్దపల్లి -
నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో రోడ్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా అధికారయంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్‌తో కలిసి సమీక్షించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. ఉల్లంఘించే వారిని గుర్తించి చర్యలు చేపట్టేందుకు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెంచాలన్నారు. సీఎంఆర్ఎఫ్లో ‘ఫేక్’ దరఖాస్తులు జిల్లానుంచి ఉన్నతాధికారులకు అందిన సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల్లో ఫేక్ దరఖాస్తులు ఉన్నట్టు హైదరాబాద్ అధికారులు అనుమానించారని కలెక్టర్ పేర్కొన్నారు. సదరు దరఖాస్తులను వెరిఫై చేయాలంటూ ఆదేశాలందాయని వివరించారు. ఇందుకు పోలీసు శాఖ అధికారుల సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. పాఠశాలల్లో ఆత్మీయతాభావం పెంచాలి జిల్లాలోని పాఠశాలల్లో ఆత్మీయతాభావం పెంపొందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల్లో సమానత్వం పెంపొందించాలన్నారు. ఆర్డీవో గంగయ్య, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఆర్టీవో రంగారావు, డీఈవో మాధవి తదితరులున్నారు. -
నరికినా బతికేస్తా
చావు వరకు వెళ్లి ప్రాణం పోసుకుంటోంది ఈ చెట్టు. దీన్ని నరికిన వ్యక్తి చూస్తే.. ఎందుకు నరికానా అని కన్నీళ్లు పెట్టుకునేలా.. ఆ నరికిన చేతులే తిరిగి దండం పెట్టేలా.. మొక్కవోని ధైర్యంతో కొత్త చిగురుతో పురుడు పోసుకుంటుంది. పచ్చని ప్రకృతి ఒడిలో కొత్తగా చిగురిస్తున్న ఆశల ఆనందం వెనుక కానరాని ఆటుపోట్లు ఆ చిగురుకే తెలియాలి. ఏ మాత్రం అవకాశమున్నా బతికేస్తా అంటూ ప్రాణకోటి జీవరాశులకు అద్దం పడుతోంది. బంధాలు మరిచి ఒకరినొకరు చంపుకుంటున్న మనుషులే.. తనను చంపినా నేను చావనంటూ మనిషి జీవితానికి అర్థాన్ని చెబుతోంది. ఓ రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద మొండెం వరకు నరికి వదిలేసిన ఈ చెట్టు మళ్లీ చిగురిస్తూ వచ్చిపోయేవారికి జీవిత సారాంశాన్ని నేర్పిస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామ శివారులో ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది ఈ చిత్రం. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
● హోటళ్లలో తనిఖీలు చేపడుతాం ● ‘సాక్షి’ ఫోన్‌ఇన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) జె.అరుణశ్రీ కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) జె.అరుణశ్రీ తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి చక్కటి స్పందన వచ్చింది. ‘పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంటుందని, రోడ్లపై మురుగునీరు పారకుండా డ్రైయినేజీలు నిర్మించాలని, పిచ్చిమొక్కల తొలగింపు, దోమల నివారణ తదితర సమస్యలను..’ జిల్లాలోని పలువురు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.సమస్య: పెద్దపల్లి పాతబజార్‌లో కల్వర్టు నిర్మించి రోడ్డు నిర్మించకుండా వదిలేశారు. 9 నెలలుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మున్సిపాలిటీకి ఫీజులు చెల్లించకుండా అనాథరైజ్డ్ లే అవుట్లు వెలుస్తున్నాయి. బల్దియా ఆదాయాన్ని నష్టపోతోంది. చర్యలు తీసుకోండి. – ఎం.రమేశ్‌గౌడ్, పెద్దపల్లిఅదనపు కలెక్టర్: మీరు చెప్పిన సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్‌తో చర్చిస్తాం. అనాథరైజ్డ్ లేఅవుట్లపై నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. సమస్య: పెద్దపల్లిలోని బాపూజీనగర్‌లో రోడ్డు బాగాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా గుంతలుపడ్డాయి. రోడ్డు నిర్మించే వరకు కనీసం మట్టి పోయించండి. – అలీం, పెద్దపల్లి అదనపు కలెక్టర్: మున్సిపల్ కమిషనర్‌కు చెప్పి మట్టిపోయించేలా చర్యలు తీసుకుంటాం. రోడ్డు నిర్మాణంపై కూడా అధికారులతో చర్చిస్తాం. సమస్య: లక్ష్మీపురంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్డు కూడా బాగాలేదు. శ్మశానవాటికలో కనీసం బోర్ కూడా లేదు. – రాజబాబు, లక్ష్మీపురం, ఆర్ఎఫ్సీఎల్అదనపు కలెక్టర్: యూజీడీ, రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం. శ్మశానవాటికలో బోర్వెల్ ఏర్పాటు చేయిస్తాం. సమస్య: గోదావరిఖని సంజయ్‌నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదు. పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – బొడ్డు రాజేశం, గోదావరిఖనిఅదనపు కలెక్టర్: సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ముందుగా పిచ్చి మొక్కలు, చెట్లను తొలగిస్తాం. సమస్య: గోదావరిఖని అశోకనగర్లో ఎస్ఆర్ఆర్ బ్యాక్‌సైడ్‌లో రోడ్డుకు అప్రూవల్ వచ్చినా నిర్మా ణం చేపట్టలేదు. పిచ్చిమొక్కలను తొలగించాలి. – నిజామొద్దీన్, గోదావరిఖని అదనపు కలెక్టర్: పిచ్చిమొక్కల తొలగించేలా చ ర్యలు తీసుకుంటాం. రోడ్డును పరిశీలించా లని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశిస్తాం. సమస్య: గోదావరిఖని ఎల్బీనగర్లోని సీనియర్ సిటిజన్ హాల్ వెనక సెప్టిక్‌ట్యాంక్ క్లీన్ చేయడానికి మార్గం లేదు. సమీపంలోని యూజీ డీకి కనెక్షన్ ఇవ్వండి. జవహర్‌నగర్‌లోని న వోదయ స్కూల్ సమీపంలో కల్వర్టు వద్ద రోడ్డు నిర్మించాలి.– ఉదయ్‌రాజ్, గోదావరిఖని అదనపు కలెక్టర్: సమస్య పరిశీలనకు ఇంజినీరింగ్ విభాగం అధికారులను పంపిస్తాం. సమస్య: రామగుండంలోని ఆటోనగర్‌లో యూ జీడీ నుంచి మురుగునీరు లీకవుతోంది. రోడ్ల నిర్మాణం చేపట్టడం లేదు. లైట్లు కూడా వెలగడం లేదు. మూడేళ్లుగా అనేక సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. – దొమ్మటి శేఖర్, ఆటోనగర్, రామగుండం అదనపు కలెక్టర్: వెంటనే చర్యలు తీసుకుంటాం. రామగుండం కార్పొరేషన్ అధికారులను ఆటోనగర్‌కు పంపిస్తాం. సమస్య: పెద్దపల్లిలోని రంగంపల్లిలో పాఠశాలకు వెళ్లే రోడ్డులో పిచ్చిమొక్కలు, చెట్లు పెరిగి రాకపోకలకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. యూజీడీ సమస్య కూడా ఉంది. – అజ్మద్, రంగంపల్లి, పెద్దపల్లిఅదనపు కలెక్టర్: రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం.సమస్య: గోదావరిఖని ఎల్బీనగర్లోని మాతంగికాంప్లెక్స్ వద్ద కుక్కలబెడద తీవ్రంగా ఉంది. సమీపంలోనే విద్యాసంస్థలున్నాయి. రోడ్డుపై వెళ్తున్న విద్యార్థులతోపాటు వాహనదారులపై దాడి చేస్తున్నాయి. గాంధీనగర్‌లో కూడా కుక్కల బెడద ఎక్కువగా ఉంది. – దూడపాక మల్లేశ్, రవి, గోదావరిఖనిఅదనపు కలెక్టర్: కుక్కల బెడద లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం. సమస్య: పెద్దపల్లిలోని చాలా హోటళ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. తినుబండరాల నాణ్యత, శుభ్రత పాటించడం లేదు. ఆహారంలో బొద్దింకలు వస్తున్నాయి. హోటళ్లపై చర్యలు తీసుకోవాలి. కమాన్ దగ్గర టాయిలెట్స్ నిర్మించాలి. – తిరుపతిగౌడ్, సదానందం, పెద్దపల్లిఅదనపు కలెక్టర్: ఇటీవల మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మరోసారి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తాం. టాయిలెట్స్ నిర్మాణంపై కమిషనర్‌కు చెబుతాం.సమస్య: ఆర్ఎఫ్సీఎల్ సమీపంలోని చైతన్యపురి కాలనీలో మా ఇంటి ముందు యూజీడీ నిర్మాణం కోసం తవ్వి వదిలేశా రు. మా ఇంట్లో వెళ్లడానికి కర్రలు వేసుకొని నడుస్తాం. మా నాన్న అదుపుతప్పి పడిపోయాడు. చర్యలు తీసుకోండి. – రవి, గోదావరిఖని.అదనపు కలెక్టర్: సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. సమస్య: ఎన్టీపీసీలోని ఇందిరమ్మకాలనీ హనుమాన్‌గుడి సమీపంలో రోడ్డు నీటితో నిండిపోయి ప్రమాదకరంగా ఉంది. ఈ రోడ్డుపై నేను కూడా జారిపడ్డాను. వెంటనే సమస్య పరిష్కరించాలి. – బండి పల్లవి, ఎన్టీపీసీఅదనపు కలెక్టర్: చర్యలు తీసుకుంటాం. రామగుండం మున్సిపల్ అధికారులను పంపిస్తాం. -
కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి
పెద్దపల్లిరూరల్: విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని మహాత్మజ్యోతిబా పూలే విద్యాలయం విద్యార్థులకు మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్‌నేరాలపై అవగాహన కల్పించారు. తాను కూడా గురుకులంలోనే చదివి ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఇంటర్నెట్ చేతిలో ఉంటే ప్రపంచమంతా ముందున్నట్టే అనిపిస్తోందని, అయితే అందులో మంచి, చెడు తెలుసుకుని మంచిని స్వీకరిస్తేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాలికలే ఫలితాల్లో ముందువరసలో ఉన్నారన్నారు. ఎస్సై లక్ష్మణ్‌రావు, కాలేజీ ఆర్సీవో అంజలి, ప్రిన్సిపాల్ మణిదీప్తి, నశాముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, సిబ్బంది పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
జూలపల్లి(పెద్దపల్లి): సీజనల్ వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో, సీజనల్ వ్యాధుల నియంత్రణ ప్రోగ్రాం అధికారి శ్రీరాములు సూచించారు. శుక్రవారం మండలంలోని పెద్దాపూర్‌లో డ్రై డే,ఫ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం జూలపల్లి పీహెచ్‌సీని సందర్శించారు. వైద్యాధికారి సంపత్‌రెడి తదితరులు ఉన్నారు. వివేకానందుని ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలిజ్యోతినగర్(రామగుండం): అంతర్జాతీయ వేదికలపై భారతీయ తత్వాన్ని చాటిన మహోన్నత ఆధ్యాత్మికవేత్త స్వామివివేకానంద అని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. శుక్రవారం జాతీయ యువజన అవార్డు గ్రహీత ఈదునూరి శంకర్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్ జ్యోతిభవన్‌లో జరిగిన వివేకానంద వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించారు. దొంతుల శ్రీనివాస్, ఈదునూరి తదితరులు పాల్గొన్నారు. కరపత్రం ఆవిష్కరణగోదావరిఖనిటౌన్(రామగుండం): ఆషాఢమా సం సందర్భంగా గోదావరిఖని నుంచి పలు పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక టూర్స్ ప్యాకేజీ కరపత్రాలను రామగుండం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సంతోష్‌రెడ్డి, డిపో మేనేజర్ నాగభూషణం శుక్రవారం ఆవిష్కరించారు. అరుణాచలం, శ్రీశైలం, జోగులాంబ, కాణిపాకం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, చిలుకూరు బాలాజీ ఆలయాలకు 4 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులను నడుపుతున్నట్టు డీఎం తెలిపారు. మా భూములిస్తే బతికేదెట్లా?రామగిరి(మంథని): ‘జీవనాధారమైన మా భూముల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయొద్దు’ అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని రత్నాపూర్ గ్రామంలోని మేడిపల్లి శివారులో సుమారు 209 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, శుక్రవారం సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకునే జీవిస్తున్న తాము భూములు కోల్పోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభ ఏర్పాటు చేయకుండా భూములను తీసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రైతులు, గ్రామస్తులు కొండు లక్ష్మణ్, భద్రపు కృష్ణమూర్తి తదితరలున్నారు. జలపాతం వైపు రావొద్దుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం సబ్బితం సమీపంలోని గౌరీగుండాల జలపాతం వైపు రావొద్దంటూ పెద్దపల్లి రూరల్ పోలీసులు శుక్రవారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సబ్బితం ప్రధానరోడ్డు నుంచి జలపాతం వైపు వెళ్లే రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. జలపాతం వద్ద జాలువారే అందాలను వీక్షిస్తూ గతంలో ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయారని, ఆ కారణంగానే ఎవరినీ అనుమతించడం లేదని ఎస్సై మల్లేశ్ తెలిపారు. ముగిసిన మహిళా రెస్క్యూ సభ్యుల శిక్షణ గోదావరిఖని(రామగుండం): రెండు వారాలపాటు ఆర్జీ–2 ఏరియా మెయిన్ రెస్క్యూ స్టేషన్లో కొనసాగిన మహిళా రెస్క్యూ సభ్యుల శిక్షణ శుక్రవారంతో ముగిసింది. మహిళా సభ్యులకు సర్టిఫికెట్లు, డ్రెస్కోడ్లు అందించారు. రెస్క్యూ జీఎం కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా రెస్క్యూ సభ్యులకు సంస్థ చరిత్రలో మొదటిసారిగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. విధినిర్వహణలో శిక్షణ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, ఇన్స్ట్రక్టర్లు తిరుపతి, మూర్తి, టైనర్లు కిషన్‌రావు, రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
రామగుండం
60 డివిజన్ల● మాయమైన పాత డివిజన్ల ముఖచిత్రం ● డివిజన్ల వారీగా ఇంటి నంబర్లతో కాలనీలు ● హద్దులపై వీడిన అయోమయంకోల్సిటీ(రామగుండం): నగరపాలక సంస్థలో కొత్తగా ఏర్పడిన 60 డివిజన్లతో రామగుండం బల్దియా రూపురేఖలు మారిపోయాయి. విలీనమైన లింగాపూర్, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లిగేట్, అక్బర్‌నగర్ గ్రామాలను కలిపి 60 డివిజన్లుగా పునర్విభజన చేస్తూ హద్దులతో కూడిన తుది జాబితాను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఉన్న పాత 50 డివిజన్ల ముఖచిత్రం మాయమైంది. ఇటీవల సీడీఎంఏ నుంచి జారీ అయిన 60 డివిజన్ల పునర్విభజన తుది జాబితాలో కేవలం హద్దులు మాత్రమే ఉండడంతో, ఏ డివిజన్లోని ఏయే కాలనీలు వస్తాయో..? ఏ ఇంటి నంబర్ నుంచి ఏయే ఇంటి నంబర్ల వరకు వస్తున్నాయో అర్థంకాక మాజీ కార్పొరేటర్లతోపాటు ఆశావహులు తికమకపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 30 మంది వార్డు ఆఫీసర్లకు 60 డివిజన్లను కేటాయిస్తూ అధికారులు కొత్త డివిజన్ల పూర్తి జాబితాను అందజేశారు. దీంతో ఈ జాబి తాతో డివిజన్లపై ఇప్పటి ఉన్న అయోమయం వీడింది. ఉత్తరం నుంచి తూర్పు, దక్షిణం, పడమర, తిరి గి ఉత్తరానికి సంబంధించిన డివిజన్ల హద్దుల ప్రకా రం ఇంటి నంబర్లు, కాలనీలను పొందుపరిచారు. కొత్త డివిజన్లలో కాలనీలు ఇలా.. ● ఒకటో డివిజన్లో ఇందిరమ్మకాలనీ, పీకేరామయ్యకాలనీ, మేడిపల్లి విలేజ్ పరిధి వరకు. రెండో డివిజన్లో న్యూపోరట్‌పల్లి, జంగాలపల్లి, శాలపల్లి, కృష్ణానగర్. 3వ డివిజన్లో నర్రశాలపల్లి, మల్కాపురం, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, శ్రీనగర్‌కాలనీ, ప్రశాంత్‌నగర్. 4వ డివిజన్లో పవర్‌హౌస్‌కాలనీ, ఐదో డివిజన్లో గంగానగర్ మిలీనియం క్వార్టర్స్. ఆరో డివిజన్లో జనగామ. 7వ డివిజన్లో జీఎం కాలనీలో టీ–2 క్వార్టర్లలో కొంత భాగం, ఐబీ కాలనీలో (1–385) కొంత భాగం. 8వ డివిజన్లో సీఎస్పీ కాలనీ, బాపూజీనగర్, ప్రియాంకానగర్. 9వ డివిజన్లో సూర్యానగర్, విద్యానగర్, లెనిన్‌నగర్. ● 10వ డివిజన్లో రాంనగర్లో కొంత భాగం, మల్లికార్జున్‌నగర్, సీతానగర్. 11వ డివిజన్లో ● రాంనగర్లో కొంత భాగం, భరత్‌నగర్, సంజయ్‌నగర్, ఫైవింక్లయిన్ చౌరస్తా, పరుశరాంనగర్. 12వ డివిజన్లో విఠల్‌నగర్ కొంత భాగం. 13వ డివిజన్లో ● విఠల్‌నగర్ కొంత భాగం. 14వ డివిజన్లో లంబాడీతండా, సింగరేణి స్కూల్ వెనకసైడ్, తారకరామనగర్, భాస్కర్‌రావు నగర్. 15వ డివిజన్లో షాపింగ్ కాంప్లెక్స్, పోలీస్ క్వార్టర్లు, కేకే నగర్, కుమారస్వామినగర్, వెంకటరావుపల్లి. 16వ డివిజన్లో షిర్కే బస్‌స్టాప్ ఏరియా, ఇటాలియ్ విగ్రహం నుంచి అబ్దుల్‌కలాం స్టేడియం క్వార్టర్లు. 17వ డివిజన్లో సింగరేణి క్వార్టర్లు, షిర్కే బస్టాప్ ఏరియా, అబ్దుల్‌కలాం స్టేడియం వెనుక క్వార్టర్లు, సంతోష్‌నగర్. 18వ డివిజన్లో 8వ కాలనీలోని హనుమాన్‌నగర్ సీఈఆర్ క్లబ్ ఎదురు, హనుమాన్ టెంపుల్ వెనుక క్వార్టర్లు. 19వ డివిజన్లో అల్లూరు, సంతోష్‌నగర్. ● 20వ డివిజన్లో న్యూమారేడుపాక, రెడ్డికాలనీ, పోతనకాలనీ, గోపాల్‌నగర్. 21వ డివిజన్లో లక్ష్మీపురం, వీర్లపల్లి, ఎఫ్‌సీఐ ఎల్కపల్లి గేట్(జీపీ). 22వ డివిజన్లో గౌతమినగర్, చైతణ్యపురికాలనీ, ఎఫ్‌సీఐ క్వార్టర్లు, ఎల్కపల్లిగేట్. 23వ డివిజన్లో గౌతమినగర్, ఎక్స్ సర్వీస్మెన్కాలనీ, ప్రగతినగర్, మాతంగికాలనీ, శాంతినగర్, కాజిపల్లి. 24వ డివిజన్లో ఎన్టీపీసీ టీటీఎస్, ఎఫ్‌సీఐ ఎక్స్‌రోడ్, ఎన్టీపీసీ పీటీఎస్. 25వ డివిజన్లో మల్యాలపల్లి, జీరో పాయింట్, పోస్ట్ ఆఫీస్ బ్యాక్‌సైడ్, రైల్వే అండర్‌పాస్. 26వ డివిజన్లో అక్బర్‌నగర్, ఎస్టీ కాలనీ, రైల్వేక్వార్టర్లు. 27వ డివిజన్లో విద్యుత్‌నగర్, సబ్‌స్టేషన్ ఏరియా, అంబేడ్కర్‌నగర్, ముబారక్‌నగర్. 28వ డివిజన్లో విలేజ్ రామగుండం, పాములపేట, రామాలయం టెంపుల్ ఎదురుగా, పాతబజార్. 29వ డివిజన్లో లింగాపూర్, ఈఎస్ఐ ఆస్పత్రి ఏరియా, హౌజింగ్‌బోర్డుకాలనీ. ● 30వ డివిజన్లో అయోధ్యనగర్, రామాలయం ఏరియా. 31వ డివిజన్లో క్రషర్‌నగర్, సుభాష్‌నగర్, ఆటోనగర్, భీమునిపట్నం కొంతభాగం. 32వ డివిజన్లో మేడిపల్లిసెంటర్, భీమునిపట్నంలో కొంత భాగం. 33వ డివిజన్లో అన్నపూర్ణకాలనీ, అంబేడ్కర్‌నగర్, మేరకాలనీ. 34వ డివిజన్లో కృష్ణానగర్. 35వ డివిజన్లో సప్తగిరికాలనీ, ఐబీకాలనీ కొంత భాగం, రాజ్యలక్ష్మికాలనీ. 36వ డివిజన్లో బస్టాండ్కాలనీ, జైభీంనగర్, గాంధీనగర్. 37వ డివిజన్లో హనుమాన్‌నగర్‌లో కొంతభాగం, గాంధీనగర్‌లో కొంతభాగం. 38వ డివిజన్లో హనుమాన్‌నగర్ కొంతభాగం, అంబేడ్కర్‌నగర్, సీతానగర్. 39వ డివిజన్లో శివాజీనగర్, లక్ష్మీనగర్, అశోక్‌నగర్. ● 40వ డివిజన్లో ఎల్బీనగర్, మేదరిబస్తీ, కళ్యాణ్‌నగర్. 41వ డివిజన్లో ఎల్బీనగర్ కొంతభాగం. 42వ డివిజన్లో జవహర్‌నగర్, తిలక్‌నగర్ కొంతభాగం. 43వ డివిజన్లో ● ఫైవింక్లయిన్ ఏరియా, జవహర్‌నగర్. 44వ డివిజన్లో 7బీకాలనీ, ఎన్సీ క్వార్టర్లు, సిక్ హాస్పిటల్, క్రషర్ ఏరియా. 45వ డివిజన్లో చంద్రశేఖర్‌నగర్. 46వ డివిజన్లో రాజీవ్‌నగర్ కొంతభాగం, సంజయ్‌గాంధీనగర్, ఇందిరానగర్. 47వ డివిజన్లో శివనగర్, కృష్ణాటెంపుల్, వెంకటేశ్వరకాలనీ, దుర్గానగర్, లూర్దునగర్, శాంతినగర్ కొంతభాగం. 48వ డివిజన్లో కేసీఆర్‌కాలనీ, చంద్రబాబుకాలనీ, ఆర్టీసీకాలనీ, సాయినగర్, ప్రగతికాలనీ, పద్మావతికాలనీ. 49వ డివిజన్లో ఎల్లందు గెస్ట్‌హౌజ్, మార్కండేయకాలనీ, శారదానగర్ (సింగరేణి క్వార్టర్లు), బృందావన్‌కాలనీ, సిద్ధి వినాయకనగర్, కేశవకాలనీ, పద్మావతి కాలనీ(అపార్మ్మెంట్స్). ● 50వ డివిజన్లో అశోకనగర్, గాంధీనగర్ కొంత భాగం. 51వ డివిజన్లో లక్ష్మీనగర్, అశోకనగర్. 52వ డివిజన్లో కళ్యాణ్‌నగర్, అడ్డగుంటపల్లి కొంతభాగం. 53వ డివిజన్లో ఎల్బీనగర్ కొంతభాగం, తిరుమల్‌నగర్. 54వ డివిజన్లో రమేశ్‌నగర్, జవహర్‌నగర్. 55వ డివిజన్లో తిలక్‌నగర్, తిలక్నగర్డౌన్. 56వ డివిజన్లో తిలక్‌నగర్ కొంతభాగం, రమేశ్‌నగర్, ద్వారకనగర్ కొంత భాగం. 57వ డివిజన్లో ద్వారకానగర్ కొంతభాగం, ఎన్టీఆర్నగర్, కాకతీయనగర్. 58వ డివిజన్లో అడ్డంగుంటపల్లి. 59వ డివిజన్లో మార్కండేయకాలనీ, అశోకనగర్. 60వ డివిజన్లో మారుతినగర్, అడ్డగుంటపల్లి, లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్. -
అందుబాటులో యూరియా
జూలపల్లి(పెద్దపల్లి): వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల నిల్వలు, ఆగ్రోస్, ప్రైవేటు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయాధికారి ప్రత్యూషతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 106 టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని, మరో 1,394 టన్నులు ఈ సీజనుకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మండలంలోని రైతులకు 57 మెట్రిక్ టన్నుల యూరియా, 103 టన్నుల కాంప్లెక్స్, 11 టన్నుల పోటాష్, 13 టన్నుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆందుబాటులో ఉందని చెప్పారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సొసైటీ సీఈవో సురేశ్ తదితరులు ఉన్నారు. -
ఓటరు జాబితాలో పొరపాట్లు ఉండొద్దు
పెద్దపల్లిరూరల్/జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్: ఓటరు జాబితాలో పొరపాట్లకు అవకాశం లేకుండా రూపొందించాలని ఆర్డీవో గంగయ్య అన్నారు. గురువారం పెద్దపల్లి, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్‌లో బీఎల్వోలకు నిర్వహించిన బూత్‌స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఫాం 6,7,8 విచారణ, నివేదిక సమర్పించే విధానాలపై బీఎల్వో యాప్ వాడకం, ఓటరు జాబితా శుద్ధీకరణపై అవగాహన కల్పించారు. తహసీల్దార్లు రాజయ్య, జె.స్వర్ణ, జగదీశ్వర్‌రావు, డీటీ విజేందర్, సిబ్బంది, ట్రైనర్లు పాల్గొన్నారు. పెద్దపల్లికి అడిషనల్ మున్సిఫ్ కోర్టు మంజూరుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలో అడిషనల్ మున్సిఫ్ కోర్టును మంజూరు చేస్తూ న్యాయశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతంలో న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండకుండా సత్వర సేవలందుతాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా కోర్టు, పోక్సో, సబ్‌కోర్టు, మున్సిఫ్కోర్టులు పెద్దపల్లి ప్రాంత ప్రజలకు న్యాయసేవలందిస్తున్నాయని వివరించారు. త్వరలోనే కోర్టు సముదాయాల భవన పనులు కూడా ప్రారంభం అవుతాయని తెలిపారు. అడిషనల్ మున్సిఫ్‌కోర్టు మంజూరుపై ఏజీపీ ఉప్పు రాజు, బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సౌండ్పొల్యూషన్ చేసేవారిపై కఠిన చర్యలుగోదావరిఖని(రామగుండం): ఇష్టారీతిన సైలెన్సర్లు బిగించుకుని సౌండ్ పొల్యూషన్ చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం స్థానిక మున్సిపల్ టీజంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనానికి నంబర్ ప్లేట్లు సరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లను తీసివేయాలన్నారు. ఫోర్‌వీలర్ వాహనదారులు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని, వాహనానికి సంబంధించిన పత్రాలను కలిగిఉండాలన్నారు. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, అనిల్, సత్యనారాయణ, ఎస్సైలు హరిశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. బయోమెట్రిక్‌తోనే వైద్యులకు వేతనాలుమంథని: బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాలు అందిస్తామని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల జిల్లా పర్యవేక్షణ అధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ శ్రీధర్ తెలిపారు. గురువారం మంథని సామాజిక వైద్యశాల, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడి ఆస్పత్రి నుంచి ఇతర ఆస్పత్రులకు రెఫరల్ ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై సమాచారం సేకరించామని అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్యులు అందుబాటులో ఉండేలా బయోమెట్రిక్ విధానం అమలులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, తాను పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణుల సౌకర్యార్థం అల్ట్రాసౌండ్ స్కాన్, నవజాత శిశువులకు ఫొటో థెరపీ, వార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి నుంచి రెడియోలజీ సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మంథని ఆస్పత్రి పనిచేస్తుందని, తాను నిత్యం ఆస్పత్రిని సందర్శిస్తామని తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
విద్యాప్రమాణాలు పెంపొందించాలి
పాలకుర్తి(రామగుండం): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మండలంలోని కొత్తపల్లి, రామారావుపల్లి, పుట్నూర్, జయ్యారం, కన్నాల గ్రామాల్లోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం, కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం, పుట్నూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే మార్చి నాటికి ప్రతీ ప్రాథమికస్థాయి విద్యార్థి చదవడం, రాయడం, గణిత చతుర్విద ప్రక్రియలను చేసేలా తయారు చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే జయ్యారం ఉన్నత పాఠశాలలో గ్రౌండ్ లెవలింగ్, స్టేజీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. రామారావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం 400– 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించాలని, బిల్లులు సక్రమంగా అందేలా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్నూర్ పీహెచ్సీలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని ఈజీఎస్ భవనంలో పలు విభాగల మండలస్థాయి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. మండలవ్యాప్తంగా ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని, పుట్నూర్లోని డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాల స్థితిగతులపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌పాం సాగు జరిగేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని, వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకాల పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎంపీడీవో రామ్మోహనచారి, ఎంపీవో సుదర్శన్, ఏవో ప్రమోద్‌కుమార్, ఎంఈవో విమల, హౌజింగ్ డీఈ దస్తగిరి, పంచాయతీరాజ్ ఏఈ రుషికేష్, వైద్యాధికారి సాయిసూర్య, కేజీబీవి ప్రత్యేక అధికారి స్వరూప తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
బొట్టుపెట్టి చెబుతున్నా.. రోడ్డుపై చెత్త వేయొద్దు
కోల్‌సిటీ(రామగుండం): ‘మీకు బొట్టిపెట్టి చెబుతున్నాం.. ఇంట్లోని చెత్తను రోడ్డుపై, కాలువల్లో పోయకండీ.. పరిసరాలను అపరిశుభ్రంగా మార్చకండీ..’ అంటూ రామగుండం బల్దియాలో పారిశుధ్యంపై అధికారులు, సిబ్బంది వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. గురువారం పాత 11వ డివిజన్లో ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసి ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలని వార్డు ఆఫీసర్ మంగ, పారిశుధ్య విభాగం సహాయ పర్యవేక్షకుడు ఆడెపు శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి విజ్ఞప్తి చేశారు. అలాగే చెత్త పోసిన ప్రాంతాల్లో మరోసారి పోయవద్దని కోరుతూ ముగ్గులు వేశారు. -
కమిషనరేట్‌ను జాతీయస్థాయిలో నిలపాలి
● రామగుండం సీపీ అంబర్‌కిషోర్ ఝా గోదావరిఖని(రామగుండం): క్రీడల్లో సత్తా చాటి రామగుండం పోలీస్ కమిషనరేట్‌ను జాతీయస్థాయిలో నిలపాలని సీపీ అంబర్‌కిషోర్‌ఝా పేర్కొన్నారు. గురువారం పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌లో కాళేశ్వరం జోన్‌స్థాయి పోలీస్డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆర్మ్డ్రిజర్వ్ విభాగాలైన డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం పనితీరును పరిశీలించారు. పోలీసు జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నేర స్థలంలో బాంబులు, గంజాయిని గుర్తించడంపై పోటీలు నిర్వహించారు. బాంబు డిస్పోజల్ టీంల సెర్చ్, డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ ద్వారా భూమిలోపల పాతిపెట్టిన మందుగుండు సామగ్రి తదితర పోటీలు ఆకట్టుకున్నాయి. పోలీసు అధికారులు, సిబ్బందిలో ప్రతిభను వెలికితీసేందుకు పోలీసు డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందఅన్నారు. విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం చాలా కీలకమన్నారు. డ్యూటీమీట్‌లో 91మంది అధికారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారిని వరంగల్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, గోదావరిఖని ఏసీపీ రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీసీఎస్ సీఐ బాబురావు, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందిరమ్మపై ధరాభారం!
● ఒక్కసారిగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు ● ఇందిరమ్మ పథకం మొదలవగానే పెంచిన వ్యాపారులు ● సగటున ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ● ప్రభుత్వం విడుదల చేసేది రూ.5 లక్షలు ● ఇంటి నిర్మాణానికి కావాల్సింది కనీసం రూ.10 లక్షలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇంటిపై ధరాఘాతం అశనిపాతంలా మారింది. సామాన్యుడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకంపై ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన దరిమిలా.. ప్రభుత్వం వేలాది మంది లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయగానే.. ఇంటి నిర్మాణ సామగ్రికి అమాంతం డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా నిర్మాణ సామగ్రి ధరలు పెంచేశారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇపుడున్న నిబంధనల ప్రకారం.. 600 నుంచి 800 చదరపు అడుగుల మేర నిర్మించుకునే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసేందుకు సిద్ధపడటాన్ని దళారులు అదనుగా తీసుకున్నారు. ఫలితంగా ప్రతీ ఇంటి నిర్మాణం మీద అదనపు భారం పడనుంది. ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ఇందిరమ్మ ఇంటికి నిర్మాణ సామగ్రి కీలకం. కట్రౌ తు ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1200, కంకర ట్రిప్పుకు రూ.1000, స్టీలు టన్నుకు రూ.2వేలు, ఇసుక ట్రిప్పుకు రూ.1000, మొరం ట్రిప్పుకు రూ.200 చొప్పున ధరలు పెంచేశారు. ఈ నిర్మాణ సామగ్రి లేకుండా ఏ ఇల్లూ పూర్తికాదు. సగటున చూసుకుంటే ప్రతీ ఇంటిపైనా తక్కువలో తక్కువ రూ.55 వేల నుంచి రూ.60 వేల పైచిలుకు ధరాభారం పడుతోంది. సిమెంట్ ధరలు కూడా పెరుగుతాయని అని ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అయితే, దీన్ని వ్యాపారులు, అటు వినియోగదారులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పట్లో సిమెంటు ధరలు పెరిగే సూచనలేమీ కనిపించడం లేదు. అయితే, స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిపైనే వ్యాపారులు, దళారులు, మధ్యవర్తులు ధరలు పెంచి ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. కానీ, వాస్తవ పరిస్థితుల కారణంగా ఆ ఖర్చు రూ.10 లక్షల వరకు వెళ్తోంది. జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైనవి లబ్దిదారుల బేస్మెంట్ స్లాబ్‌లెవల్ దరఖాస్తుల సంఖ్య సంఖ్య స్థాయి కరీంనగర్ 204504 8219 8219 742 129 జగిత్యాల 1,99,965 7601 7601 209 30 పెద్దపల్లి 1,63,000 9421 6018 542 42 రాజన్నసిరిసిల్ల 1,26,124 7826 7826 317 90 మొత్తం 6,93,593 33,067 29,664 1810 291సామగ్రి గతం ప్రస్తుతం పెరిగింది కట్రౌతు(ట్రిప్పు) రూ. 2700 రూ. 3900 రూ.1200 కంకర(ట్రిప్పు) రూ. 2500 రూ. 3500 రూ. 1000 ఐరన్(టన్ను) రూ. 55000 రూ. 57000 రూ. 2000 ఇసుక(ట్రిప్పు) రూ. 2500 రూ. 3500 రూ. 1000 మొరం(ట్రిప్పు) రూ. 1000 రూ. 1200 రూ. 200 -
రింగ్‌రోడ్‌తో ప్రజాధనం వృథా
మంథని: ప్రజాధనాన్ని వృథా చేయడానికే రూ.300 కోట్లు వెచ్చించి రింగ్‌రోడ్ నిర్మాణం చేపడుతున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్‌పల్లి సమీపంలో రెండురోజుల క్రితం రింగ్‌రోడ్ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసిన స్థలంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కూచిరాజ్‌పల్లి సమీపంలో రియల్ ఎస్టేట్‌ను ప్రోత్సహించేందుకే రింగ్‌రోడ్‌ను తీసుకువచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 38 కి.మీ మేర గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని, అడవిశ్రీరాంపూర్, బేగంపేట, పుట్టపాక, పోతారంలో ఇంటర్‌చేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రింగ్‌రోడ్‌తో ప్రయోజనం ఏంటో ఆలోచన చేయాలన్నారు. హైవే నిర్మాణం జరిగితే పెద్దపల్లి నుంచి వచ్చేవారు హైవే ద్వారా గోదావరినది అవతలికి వెళ్లే అవకాశాలు ఉ న్నాయని, రింగ్‌రోడ్డు మాత్రం శివ్వారం వరకు మా త్రమే ఉంటుందని, మళ్లీ చెన్నూర్లాంటి ప్రాంతా లకు వెళ్లాలంటే 20–30 కి.మీ ప్రయాణం చేయాల్సి వస్తుందని వివరించారు. తాము అభివృద్ధికి వ్య తిరేకం కాదని, ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేయాలని పేర్కొన్నారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, మాచిడి రాజుగౌడ్ తదితరులు ఉన్నారు. -
నీరు కలుషితం.. జనం సతమతం
‘ఇది రామగుండం బల్దియా గోదావరిఖని అశోక్‌నగర్‌లోని ఓ వీధి. ఇక్కడ తరుచూ తాగునీటి పైప్‌లైన్ లీకవుతోంది. 45 రోజుల క్రితమే సీసీ రోడ్డు వేయగా పైప్‌లైన్ పగిలింది. గత్యంతరం లేక బల్దియా అధికారులు వేసిన కొత్త రోడ్డును తవ్వించి పైప్‌లైన్‌కు మరమ్మతు చేయించారు. కానీ, ఇదే పైప్‌లైన్‌కు మరో చోట పగుళ్లుచూపడంతో తాగునీరంతా కలుషితమవుతోంది. మరోసారి లీకేజీకి మరమ్మతులు చేపట్టారు. పాత పైపును తొలగించి కొంత భాగం కొత్త పైప్‌లను ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. మిగిలిన పాతపైప్లైన్కు మరోచోట లీకేజీ ఏర్పడింది. దీంతో మూడురోజులుగా అధికారులు మరమ్మతు చేయిస్తున్నారు. తరుచూ లీకేజీలతో తాగునీరంతా కలుషితం అవుతుండడంతో, స్థానిక కుటుంబాలు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం, ఇలా లీకేజీలతో తాగునీరంతా కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒక్క అశోక్‌నగర్‌లోనే కాదు.. చాలా డివిజన్లలో తాగునీటి పైప్లైన్ల లీకేజీలతో జనం పరేషాన్ అవుతున్నారు’. ‘ఈ ఫొటో మార్కండేయకాలనీలోని రెయిన్బో స్కూల్ పక్కనున్న కల్వర్టు ప్రాంతం. నగరపాలక సంస్థకు చెందిన తాగునీటి పైప్‌లైన్‌కు ఏర్పాటు చేసిన వాల్వ్ నుంచి తాగునీరు భారీగా లీకవుతోంది. దీనికి తోడు భారీ వర్షాలు కురిసినప్పుడల్లా కల్వర్టు వరకు వరద, మురుగునీరు నాలా నుంచి ప్రవహిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో వాల్వ్ లీకేజీతో తాగునీరు కూడా కలుషితమయ్యే అవకాశాలున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బల్దియా అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు’. వాటర్ ప్లాంట్‌లో కొంటున్నాం పైప్లైన్ల లీకేజీతో తాగునీరు కలుషితమవుతోంది. మా వాడలో నెల రోజులుగా తరుచూ పైప్లైన్లు పగులుతున్నాయి. పాత పైపులను తొలగించి, కొత్త పైప్లైన్లు వేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అసలే వానకాలం, కలుషితమైన నీళ్లను ఎలా తాగేది..?. వాటర్ ప్లాంట్ల నుంచి రోజూ తాగునీటి కొనుక్కోవాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. – తోట రవి, అశోక్‌నగర్, గోదావరిఖని● మున్సిపాలిటీల్లో పైప్లైన్ల మరమ్మతుపై నిర్లక్ష్యం పొంచిఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు -
ఇటుక బట్టీలకు చెరువుమట్టి
● 9,185 టిప్పర్లలో రవాణా ● రూ.2.47 కోట్ల ఆదాయం ● కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని చెరువుల ద్వారా ఇటుక బట్టీలకు 9,185 టిప్పర్లలో మట్టి తరలించడంతో రూ.2,47,99,500 ఆదాయం సమకూరిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మట్టి తరలింపు ద్వారా సమకూరిన ఈ ఆదాయంలో రూ.2.44కోట్లు వెచ్చించి మంథని, ఓదెల, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలా ల్లో సీసీ రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం ఆయన పలు అంశాలపై సమీక్షించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో పారిశుధ్యం మెరుగుపడాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం, నీటి సరఫరాపై దృష్టి సారిస్తూనే వనమహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. ఈనెలాఖరు వరకు సుల్తానాబాద్‌లో డంప్‌యార్డు సమస్యకు పరిష్కారం చూపాలని, కాంట్రాక్టర్ పని చేయకుంటే పారిశుధ్య పనులను వేరొకరికి అప్పగించాలని కలెక్టర్ సూచించారు. తర్వాత మంథని మండలంలోని హెచ్ఎంలతో సమావేశమైన కలెక్టర్.. మండలంలో 59 పాఠశాలలున్నాయని, రోజూ ఫేషియల్ రికగ్నేషన్ హాజరు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. డీఈవో మాధవి తదితరులు ఉన్నారు. గుణాత్మక విద్య అందించాలి ఎలిగేడు(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని కలెక్టర్ కో య శ్రీహర్ష సూచించారు. సుల్తాన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మాజీ సర్పంచ్, దివంగత తానిపర్తి కాంతారావు జ్ఞాపకార్థం ఆయన కుమారులు సత్యనారాయణరావు, రవీందర్రావు, దామోదర్‌రావు, మహేందర్‌రావు, రంగారావు, వెంగళరావు రూ.5లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటో, రూ.2.16లక్షల విలువైన డైనింగ్ టెబుళ్లు అందించగా కలెక్టర్ శ్రీహర్ష పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యా బోధనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తహసీల్దార్ యాకయ్య, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంఈవో నరేంద్రచారి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘బహుళ’ ప్రమాదాలు
గోదావరిఖని శ్రీనగర్‌కాలనీలోని సింగరేణి ఉద్యోగి ఇంట్లో గతనెల 29న వంటగ్యాస్ లీకై ంది. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. వస్తుసామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే పొగ వ్యాపించడంతో ఇంటి యజమాని స్వల్ప అస్వస్థకు గురయ్యాడు.గోదావరిఖని: జిల్లాలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా వెలుస్తున్నాయి. ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లు అనేకం నిర్మిస్తున్నారు. లిఫ్ట్‌లు, స్పెషల్ డిజైన్లలో నిర్మిస్తున్న అందమైన అంతస్తులు సరికొత్త శోభ తెచ్చిపెడుతున్నాయి. ఇదేసమయంలో భద్రతా చర్యలు విస్మరించడంతో తరచూ అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, ఇతరత్రా ప్రమాదాలు చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తక్కువ ఎత్తులో నిర్మిస్తూ.. నిబంధనల ప్రకారం నివాస యోగ్యమైన అపార్ట్మెంట్లు 15 మీటర్లు, వాణిజ్య భవనాల ఎత్తు 18 మీటర్లు ఎత్తు ఉంటే ఫైర్‌సేఫ్టీ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ, ఇంతకన్నా తక్కువ ఎత్తులో నిర్మిస్తున్న భవనాలకు అనుమతి అవసరం లేకపోవడంతో కొందరు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారు. కానీ, ప్రమాదాలు చోటుచేసుకుంటే హైరానా పడడం తప్ప చేసేదేమీ ఉండడంలేదు. వంట గ్యాస్ లీక్.. షార్ట్ సర్క్యూట్.. బహుళ అంతస్తుల్లో ప్రధానంగా వంటగ్యాస్ లీక్, షార్ట్షర్క్యూట్తోనే అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. దీంతోనే అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోగా జరిగే నష్టం జరిగిపోతోంది. అనుమతితో సంబంధం లేకుండా రక్షణ చర్యలు పాటించడం, భద్రతా చర్యలు తీసుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుంటే ప్రమాదాల నివారణ సాధ్యమని అంటున్నారు. నివాసాల్లో అగ్ని ప్రమాదాల నివారణ ఇలా.. ● పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు, మండే పదార్థాలు అందుబాటులో ఉంచవద్దు ● సిగిరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా పారేయరాదు ● ఐఎస్ఐ ఎలక్ట్రికల్ పరికరాలనే ఉపయోగించాలి ● పాడైన విద్యుత్ తీగలు తాకొద్దు. ఓవర్ లోడ్ వేయవద్దు. నాణ్యమైన ప్లగ్ మాత్రమే వాడాలి. ● మంచంపై పడుకుని బీడీలు, సిగరెట్లు తాగొద్దు. ● ఎక్కువరోజులు బయటకు వెళ్లాల్సి వస్తే విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి ● నీటి నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలి ● వంటింటి కింద, పైభాగంలో గాలి, వెలుతురు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి ● పిల్లలను వంటగదుల్లో వదలరాదు ● ఐఎస్ఐ మార్కు గల కొత్త గ్యాస్‌పైపు వాడాలి ● వంటలు పూర్తయ్యాక వెంటనే రెగ్యులేటర్ వాల్వ్ ఆఫ్‌చేయాలి ● గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ వాల్వ్ ఆపేయాలి. ఆ వెంటనే విద్యుత్ స్విచ్‌లు ఆన్, ఆఫ్ చేయవద్దు ● తాటాకు, గడ్డితో తయారు చేసిన పైకప్పును స్కూళ్లు, ఆస్పత్రుల్లో వాడవద్దు ● ఫ్లేమ్ప్రూఫ్ మోటార్ స్పార్క్ స్విచ్లనే ఉపయోగించాలి ● స్కూళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్‌లో ఫైర్‌ఫైటింగ్ ఎగ్జిష్టర్లను అందుబాటులో ఉంచాలి ● ఫైర్ ఎవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతీ మూడునెలలకోసారి ప్రాక్టీసు చేయాలి ● వంటగదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి ఉంచరాదు ● వంట చేస్తున్నప్పుడు నూలు వస్త్రాలు, ఆఫ్రిన్ ధరించాలి. వ్యక్తిగత జాగ్రత్తలు.. ● దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తవద్దు. నేలపై దొర్లండి లేదా దుప్పటి చుట్టుకోవాలి ● కాలిన శరీరపై చల్లని నీరు పోయరాదు ● పొగతో నిండిన గదుల్లో మోచేతులు. మోకాళ్లపై పాకరాదు. ముక్కు, నోటికి అడ్డుగా తడిగుడ్డ పెట్టుకోవాలి. గ్రామాల్లో.. ● ఎండిన గడ్డినే వాముగా వేయాలి ● నివాసాలకు 60 అడుగుల దూరంలో వాములు వేయాలి ● పెద్దగడ్డివాములకు బదులుగా చిన్నవి వేయాలి ● గుడిసెలకు మధ్య కనీసం 30 అడుగుల దూరం పాటించండి ● విద్యుత్ ప్రమాదాలపై నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి. నిబంధనలకు తిలోదకాలు అపార్ట్మెంట్లలో భద్రత చర్యలు గాలికిఅగ్నిమాపక కేంద్రాల ఫోన్ నంబర్లు పెద్దపల్లి 87126 99202 గోదావరిఖని 87126 99206 మంథని 87126 99204 జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో కుంటలు, జలపాతాల వద్దకు స్నానాలకు వెళ్లవద్దు. వరదల సందర్భంగా అజాగ్రత్తగా ఉండొద్దు. ఇంట్లో దేవునికి దీపం వెలిగించి ఊరికి వెళ్తే ఎలుకలతో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంది. నూనెను తాగిదీపం వత్తిని ఎలుకలు తీసుకెళ్తాయి. ఈవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కింద బట్టలు ఉంటే పైన అగర్బత్తులు వెలిగించరాదు. ఏ ప్రమాదం జరిగినా అగ్నిమాపక సిబ్బందిని వెంటనే సంప్రదించాలి. – అనిల్‌కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి -
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
● ఎంపీ వంశీకృష్ణ రామగిరి(మంథని): అమ్మవారి దయతో అందరూ సుభిక్షంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకాంక్షించారు. అడ్రియాల గని ఆవరణలో బుధవారం చేపట్టిన పోచమ్మ బోనాల ఉత్సవం సందర్భంగా ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మకు సమర్పించే బోనం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. సేవలతోనే మంచిగుర్తింపు పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తప్పదని, అయితే అంకితభావంతో పనిచేస్తే మంచిగుర్తింపు లభిస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన శోభారాణి వీడ్కోలు సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా విద్యాధికారి మాధవి, ఎంపీ వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు. భావిభారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా శోభారాణి– ఈర్ల కొమురయ్య దంపతులను సత్కరించారు. ఎంఈవో సురేందర్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జీవన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డులకు రెయిన్కోట్లు
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డులకు సీపీ అంబర్ కిశోర్ ఝా బుధవారం రెయిన్కోట్లు పంపిణీ చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా రెయిన్‌కోట్స్ అందజేసినట్లు సీపీ పేర్కొన్నారు. వర్షాకాలంలో ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి విధులు, బందోబస్తులో రెయిన్ కోట్లు సహాయపడుతాయని అన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ డీసీపీ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డు ఆర్ఐ వామనమూర్తి పాల్గొన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఆదాయంపై దృష్టి కోల్‌సిటీ(రామగుండం): ట్రేడ్ లైసెన్స్‌పై ఆదాయంపై బల్దియా అధికారులు ఫోకస్ పెట్టారు. నిర్వహణకు సాధారణ నిధులతోపాటు ఆస్తిప న్ను తర్వాత ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి సారిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 3,036 వరకు అసెస్మెంట్లు ఉండగా, వీటిపై రూ.55.89లక్షల డిమాండ్ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెస్మెంట్ల సంఖ్య 3,782 వరకు పెరిగింది. డిమాండ్ కూడా రూ.71.93లక్షలకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరాంతానికి ట్రేడ్‌లైసెన్స్ డిమాండ్ మొత్తంలో 72.16 శాతం వసూలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలోపే 50 శాతానికిపైగా వసూలు కావడం విశేషం. ప్రస్తుతం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా డీ అండ్ వో ట్రేడ్ లైసెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏకకాలంలో కొత్తలైసెన్స్లూ జారీచేస్తున్నారు. ప్రతీవ్యాపార సంస్థను డీ అండ్ వో ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకొచ్చి మెరుగైన ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నారు. చురుగ్గా పనిచేయాలి కోల్‌సిటీ(రామగుండం): మెప్మా సిబ్బంది చు రుగ్గా పనిచేయాలని రామగండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. తన కార్యాలయంలో బుధవారం మెప్మా సిబ్బంది తో వివిధ అంశాలపై సమీక్షించారు. 100 రోజు ల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని నెరవేర్చాల ని, వీధి వ్యాపారుల కామన్ ఇంటరెస్ట్ గ్రూప్ లు, నూతన స్వయం సహాయక సంఘాలు, స్ల మ్ లెవెల్ ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలన్నా రు. రుణాలను రికవరీలోనూ చొరవ తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పూర్తిచేసుకోవడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందేలా చూడాలన్నారు. ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మించడానికి అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తించి సమాచారం ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం గోదావరిఖని: సీజనల్ వ్యాధులపై కార్మిక కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని సింగరేణి ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ పద్మ కోరారు. బుధవారం ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–5 ఓసీపీపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతీఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు రాకుండా జాగ్రత్త పడాలని, కలుషిత ఆహారం తీసుకోవద్దని, కలుషిత నీటిని తాగవద్దని ఆమె సూచించారు. నీటిని మరిగించి చల్లారాక వడిపోసి తాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ అనిల్‌గబాలే, రక్షణాధికారి రాములు, ఇంజినీర్ వేణుగోపాల్, సీనియర్ సర్వే ఆఫీసర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అరుణాచలానికి ఆర్టీసీ బస్సు మంథని: ఆషాఢ శుక్ల పౌర్ణమి(గురుపౌర్ణమి) సందర్భంగ అరుణాచల గిరి ప్రదక్షిణకు మంథని డిపో నుంచి ఈనెల 8న సూపర్ లగ్జరీ బ స్సు బయలు దేరుతుందని డీఎం శ్రావణ్‌కుమార్ తెలిపారు. పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ నుంచి వెళ్లే బస్సు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత ఈనెల 9న రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు. ప్రదక్షిణ అ నంతరం సాయంత్రం అరుణాచలంలో బస్సు బయలుదేరి ఈనెల 11న గద్వాల జోగులాంబ టెంపుల్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం గద్వాలలో బయలుదేరి హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి నుంచి మంథనికి చేరుకుంటుందన్నారు. మంథని నుంచి పెద్దలకు రూ.5,040, పిల్లలకు రూ.3,790, పెద్దపల్లి నుంచి పెద్దలకు రూ.4,940, పిల్లలకు రూ.3,720 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం 99592 25923, 94913 24172 నంబర్లలో సంప్రదించాలని డీఎం కోరారు. -
పేదల సంక్షేమమే లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): పేదల సంక్షేమమే ప్ర జాప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. జంగాలపల్లె శివారులోని డబుల్బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర పనులకు బల్దియా కమిసనర్ అరుణశ్రీతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మహంకాళి స్వామి, రహీం, ఈదునూరి రవి తదితరులు పాల్గొన్నారు. కాగా, నర్రాశాలపల్లె, మల్కాపూర్ ప్రాంతాల్లో ఇటీవల మృతి చెందిన చిలుముల గట్టయ్య, శ్రీరాముల రవి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ పరామర్శించారు. కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు కోసం కృషి ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపుకోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అ న్నారు. ఖాజీపల్లిలో నిర్వహించిన ముఖ్య నాయకు లు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడా రు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయా లని సూచించారు. నియోజకవర్గ ఎన్నికల పరిశీల కులు అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాస్ ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాశ్, అనిల్‌కూమార్, మహేశ్, ముస్తఫా, ఎల్లయ్య, రహీం, శంకర్ నాయక్ పాల్గొన్నారు. -
దోమ కుడుతోంది!
● దోమల మోత – ప్రజల వెత ● కానరాని నియంత్రణ చర్యలు ● మూలనపడిన ఫాగింగ్ యంత్రాలు ● మొక్కుబడిగా పారిశుధ్య పనులు ● జ్వరాల బారిన జిల్లావాసులు ● జిల్లాలోని బల్దియాల్లో దుస్థితి సాక్షి, పెద్దపల్లి: వివిధ వ్యాధులు, జ్వరాలకు దోమలు కారణమువుతున్నాయి. వాటి బారినపడకుండా పుట్టకనే అడ్డుకోవాలి. ఆ తర్వాత అవి కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు పట్టణాలు, పల్లెల్లోనేకాదు.. రామగుండం నగరంలోనూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. వాతావరణంలో మార్పులకుతోడు పారిశుధ్య నిర్వహణలో లోపం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలతో లోతట్టు కాలనీల్లోని నివాసాల నడుమ రోజుల తరబడి నీరు నిలిచి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. దోమ కాటుతో ఆస్పత్రుల పాలవుతున్నారు. జ్వర పీడితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అటకెక్కిన ఫాగింగ్ ప్రక్రియ దోమల నివారణకు మూడు పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి. నీటి నిల్వల్లో దోమల నిరోధక మందు చల్లాలి. లార్వా వృద్ధి చెందకుండా రెండోసారి మందు పిచికారీ, మూడోసారి ఫాగింగ్ చేయాలి. ఖాళీ స్థలాలు, రహదారులపై మురుగు నిల్వ ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఫాగింగ్‌తోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, కాలువల్లో మందు పిచీకారీ చేయడం క్రమం తప్పకుండా జరగాలి. వర్షాకాలం మొదలైన వెంటనే డ్రైనేజీల్లో గంబూషి యా చేపలు విడుదల చేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్క డా కనిపించడంలేదు. దోమల నివారణకు మున్సిపాలిటీలు ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. ప్రయోజనం చేకూరడం లేదు. దోమల నివారణ ఇలా.. ఇళ్ల పరిసరాలు, వ్యక్తిగత, కుటుంబపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా నీటినిల్వ ప్రదేశాలు గుర్తించారు. నీటిని తొలగించాలి. పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిన బకెట్లు, నీటి తొట్టెలు ఇళ్ల పరిసరాల్లో లేకుండా చూడాలి. ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటితొట్టెలపై మూతలు ఉంచాలి. వాటిని తరచూ శుభ్రం చేయాలి. ఇంటి పైకప్పు, టెర్రస్పైనా నీటి నిల్వలు ఉంచొద్దు. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలి. ఒకసారి వినియోగించి పారేసిన ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులు డ్రైనేజీల్లో వేయరాదు. సెప్టిక్ ట్యాంకుల గాలిగొట్టాలకు నైలాన్ జాలి, ఇంటి కిటికీలు, గుమ్మాలకు జాలి, ఇనుప తెరలు అమర్చుకోవాలి. దోమతెరలు తప్పనిసరి వినియోగించాలి.దోమల కాటు వ్యాధులు ఇవే.. దోమరకం వ్యాధి అనాఫిలిస్ మలేరియా క్యూలెక్స్ బోదకాలు, మెదడువాపు ఏడీస్ డెంగీ, చికున్‌గున్యా మాక్యోనియా బోదకాలు ఇవి హ్యాండ్ ఫాగింగ్ మిషన్లు. సుమారు రూ.5లక్షలు వెచ్చించి రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కొనుగోలు చేశారు. దోమల నివారణ కోసం వీటిని వినియోగిస్తారు. ఈ ఏడాది మార్చి 11న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ లాంఛ నంగా ప్రారంభించారు. అంతే.. అప్పట్నుంచి వినియోగించడంలేదు. ఇప్పటికే ఉన్న పాతవాటిని కూడా ఇలాగే మూలన పడేశారు. ఆటోట్రాలీలో ఏర్పాటు చేసిన రెండు పెద్దఫాగింగ్ మిషన్లలో ఒక్కదానితోనే.. అదికూడా మొక్కుబడిగా నగరంలో ఫాగింగ్ చేస్తున్నారు. దోమల నివారణ జరక్కపోగా.. అవి మరింత వృద్ధి చెంది ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లోనూ ఇదే దుస్థితి కొనసాగుతోంది.ఫాగింగ్ చేయాలి గోదావరిఖనిలో దోమలు వృద్ధి చెందా యి. విపరీతంగా కుడుతున్నాయి. అధికారులు దోమల నివారణకు గతంలో వేగంగా చర్యలు తీసుకునేళ్లు. ఇప్పుడు ఫాగింగ్ కూడా చేయడం లేదు. – బోళ్ల చంద్రశేఖర్, గోదావరిఖని గంబూషియా చేపలు వదలాలి ఇండ్ల నడుమ ఉన్న ఖాళీప్లాట్లు, గుంతల్లో వర్షపునీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్లాట్లను శుభ్రం చేసి నీటిగుంతల్లో గంబూషియా చేపలు వదిలి దోమల వృద్ధిని అరికట్టాలి. – పిట్ట వినయ్, పెద్దపల్లి -
కంపుకొడుతున్నాయి..
● ఓపెన్ ప్లాట్లు.. తప్పని పాట్లు ● అపరిశుభ్రతకు నిలయాలుగా ఖాళీ స్థలాలు ● జనావాసాల్లోనే వర్షపునీరు, డ్రైనేజీ నిల్వలు ● చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో వెలువడుతున్న దుర్గంధం ● పట్టించుకోని బల్దియా అధికార యంత్రాంగం సాక్షి పెద్దపల్లి: రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటోంది. దీంతో మున్సిపాలిటీల్లో ఇళ్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో కొందరు, భవిష్యత్‌లో భూమి విలువ పెరుగుతుందన్న ఆశతో మరికొందరు విరివిగా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఖాళీస్థలాలు బాగానే ఉండిపోతున్నాయి. కానీ, వాటి నిర్వహణపై యజమానులు పట్టనట్లు వ్యవహరించడంతో పిచ్చిమొక్కలతో నిండి, మురుగునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వీటిని శుభ్రం చేయాలని స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఖాళీస్థలాల్లో నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారాయి. పిచ్చిమెక్కలు, చెట్లు, చెత్తాచెదారంతో అధ్వానంగా తయారయ్యాయి. దుర్గంధం వెలువడడంతో స్థానికులు వ్యాధుల బారినపడుతున్నారు. నోటీసులకే పరిమితం నిబంధనల ప్రకారం ఓపెన్ ప్లాట్లలో పిచ్చిమొక్కలు, మురుగు, వర్షపునీరు చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థల యజమానులదే. కానీ, వారు పట్టించుకోవడంలేదు. చెత్త, మురుగునీరు చేరి ఓపెన్ ప్లాట్లు మురికికూపాలుగా మారుతున్నాయి. గత పట్టణ ప్రగతిలో వీటిని గుర్తించినా చర్యలు తీసుకున్న దాఖలాలులేవు. కేవలం నోటీసులతోనే సరిపెట్టారు. కొందరు స్పందించినా.. చాలామంది తమకేం పట్టనట్లు వ్యహరిస్తున్నారు. అసలు ఖాళీప్లాట్లు ఎన్ని ఉన్నాయో కూడా యంత్రాంగం వద్ద సమాచారం లేదు. ఆదేశాలు బేఖాతరు! ఖాళీ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాల ని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. అయితే, కొత్తగా రి జిస్ట్రేషన్ చేసుకున్న వాటికే ఈ పన్ను వసూలు చే స్తున్నారు. వందల సంఖ్యలోని పాత ప్లాట్ల యజమానుల సమాచారం తెలియక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోంది. అయితే, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగమే ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాల్సి ఉంది. భవన నిర్మాణం, ఇతర అనుమతుల కోసం దరఖాస్తు చే సుకునే సమయంలో అధికారులు ప్లాట్లను చదును చేసేందుకు అయిన ఖర్చును వసూలు చేయాల్సి ఉంది. ఈవిషయంలో ఎన్ని ఓపెన్ ప్లాట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి? ఎంతమంది యజమానులకు నోటీసులు ఇచ్చారు? ఎన్ని ప్లాట్లను శుభ్రం చేయించారు? ఎంత జరిమానా విధించారు? అనే సమాచారం కోసం అధికారులను వివరణ కోరగా.. కొందరికే నోటీసులు జారీచేశామన్నారు. మరికొందరి చిరునామా తెలియదని సమాధానమిస్తున్నారు. -
చర్యలు తీసుకోవాలి
ఓపెన్ ప్లాట్లలోని పిచ్చిమొక్కలతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. వర్షాకాలానికి ముందే ప్లాట్ల యజమానులను గుర్తించి నోటీసులు ఇవ్వాలి. వారు స్పందించకుంటే జరిమానా విధించాలి. కానీ, ఇలాంటి నిబంధనలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మార్కండేయకాలనీలో పిచ్చిమొక్కలు వెంటనే తొలగించాలి. – నామని మల్లేశ్, గోదావరిఖని మురికికూపాలతో వ్యాధులు పెద్దపల్లిలో కొత్త ఇండ్ల నిర్మాణం పెరిగింది. కాలనీల్లో డ్రైనేజీలు కట్టడంలేదు. వ్యర్థపు నీరు, చెత్తాచెదారం ఇండ్ల నడుమ ఖాళీ జాగాల్లో చేరుతోంది. సమీప ప్రజలకు వ్యాధులను అంటగడుతున్నాయి. అధికారులు చొరవచూపి ప్లాట్ యజమానులతో ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలి. పారిశుధ్యం మెరుగుపర్చాలి. – ఉప్పు కిరణ్, పెద్దపల్లి -
నీటిగుంతలు.. అసంపూర్తి డివైడర్లు
● రహదారిపైనే సిమెంట్ వ్యర్థాలు ● కానరాని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ● రోడ్లపైనే పశువులు – తరచూ ప్రమాదాలు ● అస్తవ్యస్తంగా మేడిపల్లి – భరత్‌నగర్ మార్గం జ్యోతినగర్(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ అభివృద్ధి పథంలో పయనిస్తున్నా.. అందులో భాగమైన ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్డు సమస్యలకు నిలయంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్లోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం మేడిపల్లి సెంటర్. ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోవడంలేదు. గతేడాది గ్రీన్‌బెల్ట్ నిర్మాణం పేరిట సర్వీసు రోడ్డు సమీపంలోని కమర్షియల్ దుకాణాలను తొలగించారు. ఖాళీ స్థలాల్లో ఇప్పటివరకు పచ్చదనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటీవల రోడ్డు విస్తరణ కోసం మరికొన్ని నిర్మాణాలు తొలగించారు. ఇంకా కొన్నింటికి మార్కింగ్ చేసి కూల్చివేశారు. వాటితాలూకు వ్యర్థాలను రోడ్డుపైనే వదిలివేశారు. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ లైటింగ్ పనుల్లోనూ జాప్యం.. మేడిపల్లి సెంటర్ నుంచి భరత్‌నగర్ బోర్డు వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు మధ్యలో గుంతలు తవ్వి అలాగే వదిలివేశారు. పాత స్తంభాలను రోడ్డు మధ్యలోనే వదిలేశారు. ఫలితంగా రాత్రివేళ వాహనదారులు వాటిని ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. గుంతల వద్ద సూచికలు లేక స్థానికులు అందులోపడి గాయాలపాలవుతున్నారు. డివైడర్లు లేక రోడ్డు దాటేందుకు స్థానికులు సాహసించడంలేదు. బురదమయంగా రోడ్డు.. మేడిపల్లి సెంటర్ నుంచి భరత్‌నగర్ బోర్డు వరకు రోడ్డు విస్తరణ కోసం అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించి వ్యర్థాలను అలాగే వదిలివేశారు. సిమెంట్ వ్యర్థాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డుపై బురదగుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. పశువుల సంచారంతో ఆందోళన మేడిపల్లి రోడ్డు మధ్యలోనే పశువులు సంచరిస్తున్నాయి. రాత్రివేళ అక్కడే సేదదీరుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పశువులు కొట్లాడుకోవడంతో తమకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు. రోడ్డుపై పశువుల సంచారాన్ని నియంత్రిస్తామని అధికారులు చెప్పినా ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. -
మద్యపానంపై నిషేధాజ్ఞలు
గోదావరిఖని: బహిరంగ ప్ర దేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. అనుమతిలేని డ్రోన్, డీజే సౌండ్స్పైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. మహిళలు, పౌరుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కమిషరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో ఈనెలాఖరు వరకు నిషేధాజ్ఞలు కొనసాగిస్తామన్నారు. ఎన్టీపీసీ జీఎంకు పదోన్నతి జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఆ పరేషన్, మెయింటనెన్స్ జనరల్ మేనేజర్ అలో క్ త్రిపాఠి చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. మంగళవారం స్థానిక పరిపాలన భ వనంలో అలోక్ త్రిపాఠిని ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, జనరల్ సెక్రటరీ ఆరెపల్లి రాజేశ్వర్, గోపాలరావు, కొలని వెంకటరెడ్డి, రమేశ్, రాజేశం సన్మానించారు. ఆర్ఎఫ్సీఎల్ ఇన్చార్జిగా ఖుల్బే ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం) : రామగుండం ఎరువుల కర్మాగారం సీజీఎం, ప్రాజెక్ట్ హెచ్‌వోడీ ఉదయ్ రాజహంస జూన్ 30న ఉద్యోగ విరమ ణ పొందారు. దీంతో ఆర్ఎఫ్సీఎల్ ఇన్చార్జిగా రాజీవ్ ఖుల్బేను నియమిస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫెర్టిలై జర్స్ లిమిటెడ్ కర్మాగారంలో 1988లో మేనేజ్మెంట్ ట్రైనీగా ప్రస్థానం ప్రారంభించారు. ఖు ల్బేకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఎన్టీపీసీలో ఏఐ ఆధారిత సేవలు జ్యోతినగర్(రామగుండం): ప్రాజెక్టులోని జీ ఎంలు, ఏజీఎంల స్థాయి అధికారులు ఏఐ ఆ ధారిత సేవలను అందిపుచ్చుకుని విధులు ని ర్వర్తించాలని రామగుండం ఎన్టీపీసీ – తెలంగా ణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కు మార్ సామంత సూచించారు. ఎన్టీపీసీ మిలీని యం హాల్లో ఏఐపై మంగళవారం చేపట్టిన స దస్సులో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఏఐ ఆధారంగా విధుల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, ఇందుకోసం తమ విజ్ఞానం నవీకరించుకోవాలన్నారు. ఏఐ వక్త కిరుబా శంకర్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, డిజిటల్ వ్యూహా ల్లో ఏఐ పరివర్తన– ప్రభావం గురించి వివరించారు. ఏజీఎం(హెచ్ఆర్) బిజయ్‌కుమార్ సిగ్ద ర్, ఏజీఎం మనోజ్ ఝా, కార్పొరేట్ కమ్యూని కేషన్ ఎగ్జిక్యూటివ్ రూపాలి రంజన్ ఉన్నారు. సమ్మె విజయవంతం చేయాలి గోదావరిఖని: కార్మికుల హక్కుల పరిరక్షణ కో సం ఈనెల 9న దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామ య్య, అక్రమ్, టి.రాజారెడ్డి, మిర్యాల రాజిరె డ్డి, కె.విశ్వనాథ్ కోరారు. ఆర్జీ–2 ఏరియా ఓ సీపీ–3పై మంగళవారం ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో వారు మాట్లాడారు. బీజేపీ ప్రభు త్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. నాయకులు వైవీ రావు, జిగురు రవీందర్, ప్రకాశ్, అన్నారావు, రాజర త్నం, రాంచందర్, శ్యాంసన్, రవికుమార్, మ హేందర్, రవీందర్, సాగర్, కుమారస్వా మి, సత్యనారాయణరెడ్డి, సంపత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇకనుంచి బయోమెట్రిక్ హాజరు పెద్దపల్లిరూరల్: జిల్లా, మండల పరిషత్ కా ర్యాలయాల్లో ఫేషియల్ రికగ్నేషన్ హాజరు (బ యోమెట్రిక్ అటెండెన్సు) విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు జెడ్పీ సీఈవో నరేందర్ తెలిపారు. సమయపాలన, విధుల్లో పారదర్శకత కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికా రులు ఆదేశాలిచ్చారని ఆయన వివరించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి ఆదేశించారు. తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించా రు. ఆరోగ్య, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయ తీ కార్యాలయాల వద్ద ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని, స్కూళ్లలో ఓఆర్ఎస్ తయారీపై అవగాహన కల్పించాలని అన్నారు. -
బర్తన్ బ్యాంకులు ఏర్పాటు చేయండి
కోల్‌సిటీ/జ్యోతినగర్: ప్లాస్టిక్ వస్తువుల వినియోగా న్ని నియంత్రించడానికి స్టీల్ వస్తువులను అందుబాటులో ఉంచే బర్తన్ బ్యాంకుల ఏర్పాటుకు స్వశక్తి సంఘాల మహిళలు ముందుకు రావాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి కోరా రు. వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం బర్తన్ బ్యాంకును ఆయన సంద ర్శించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువులను వినియోగించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసే బర్తన్ బ్యాంకులతో స్వశక్తి మహిళలకు ఉపాధి కూ డా లభిస్తుందన్నారు. అనంతరం గోదావరిఖని బ స్టాండ్ వద్ద చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్లపై ఆరా తీశా రు. గాంధీనగర్ వంకబెండు సమీపంలో కూరగా యలు, వీధివ్యాపారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పీఎం స్వనిధి గురించి అవగాహన కల్పించారు. ఓల్డ్ అశోక టాకీస్ ప్రాంతంలో గోడలపై చి త్రీకరిస్తున్న సందేశాత్మక చిత్రాలను పరిశీలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, ప్రియదర్శిని ఉన్నారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి -
అర్హులందరికీ రేషన్‌కార్డులు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గత ప్రభుత్వం ప దేళ్లపాలనతో ఒక్కరేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ అందిస్తోందని పెద్దపల్లి ఎ మ్మెల్యే విజయరమణారావు అన్నారు. సర్సయ్యపల్లిలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, సీసీ రోడ్లు ప్రారంభించారు. ఇందిర మ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. కాంగ్రెస్ నాయకుడు జూపల్లి తిరుమల్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ అభి వృద్ధికి 18 గంటల పాటు పనిచేస్తున్నాని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏ ఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ సందీప్‌రావు, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో దివ్య దర్శన్రావు, నాయకులు సతీశ్, రాములు, జానీ, రాజ్‌కుమార్, వెంకటరమణ పాల్గొన్నారు. -
డివైడర్లు నిర్మించాలి
మేడిపల్లి రోడ్డు నుంచి అన్నపూర్ణకాలనీ వరకు రోడ్డు మధ్య కొంతవరకే డివైడర్లు ఉన్నాయి. మిగతా రోడ్డుకు లేవు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు రోడ్డుపై ఉండటంతో చీకట్లో ఢీకొట్టి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. – తోట రవి, అన్నపూర్ణకాలనీ, ఎన్టీపీసీ సెంట్రల్ లైటింగ్ అవసరం మేడిపల్లి సెంటర్ – భరత్‌నగర్ బోర్డు మధ్య సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు వెంటనే పూర్తిచేయాలి. విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు తవ్విన గుంతలతో రాత్రి వేళ కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు మధ్య డివైడర్లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. – గీట్ల లక్ష్మారెడ్డి, సీఐటీయూ నాయకుడు రహదారి పరిశీలిస్తాం మేడిపల్లి రోడ్డు ప్రాంతంలోని సమస్యలు పరిశీలిస్తాం. రోడ్డుపై పశువులను వదల కూడదు. యజమానులు పద్ధతులు మార్చుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకుంటాం. త్వరలోనే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం బల్దియా -
యువతకు నైపుణ్య శిక్షణ
● టాస్క్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘టాస్క్’ సెంటర్లో అందిస్తున్న నైపుణ్యశిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కో య శ్రీహర్ష సూచించారు. టాస్క్ సెంటర్లో టాలీ విత్ జీఎస్టీ కోర్సు పూర్తిచేసిన యువతకు ఆయన మంగళవారం సర్టిఫికెట్లు అందించారు. టాస్క్‌తో వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ప్లేస్మెంట్ అవకాశాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు. మిషన్‌భగీరథ పనుల్లో జాప్యమెందుకు? పెండింగ్ మిషన్‌భగీరథ(ఇంట్రా) పనుల్లో జాప్య మెందుకు జరుగుతోందని కలెక్టర్ ప్రశ్నించారు. ఫిబ్రవరిలో మంజూరు చేసిన పనులు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఇళ్లకు పైప్‌లైన్ వేసి తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నీటి నాణ్యత పరీక్షలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించాలని, డ్రైనేజీల సమీపంలో తాగునీటి పైపులైన్ లీకేజీలు అరికట్టాలని, ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూళ్లకు తాగునీరు సరఫరా చేయాలని పేర్కొన్నారు. డీపీవో వీరబుచ్చయ్య, మిషన్‌భగీరథ అధికారులు ఉన్నారు. మంథని ఆస్పత్రిలో ప్రసవాలసంఖ్య పెంచాలి మంథని ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు మెరుగుపడాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఆస్పత్రిలో 14మంది వైద్యసిబ్బంది ఉన్నా అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులొస్తున్నాయన్నారు. మంథని ఎంసీహెచ్‌లో ప్రసవాలు కనీసం 25 జరిగేలా చూ డాలని అన్నారు. సబ్‌సెంటర్ల వారీగా గర్భిణులను గుర్తించి ఎంసీహెచ్‌కు వచ్చేలా ప్రోత్సహించాలన్నా రు. సకాలంలో విధులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి, డీసీహెచ్‌వో శ్రీధర్ తదితరులు ఉన్నారు. -
డాక్టర్లను గౌరవించాలి
● ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ గోదావరిఖని: ఆపదలోని పేషెంట్లకు పునర్జన్మ ఇస్తున్న వైద్యులను గౌరవించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. డాక్టర్లను శా లువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మా ట్లాడారు. ప్రజలకు ప్రాణం పోస్తున్న వైద్యులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వైద్యవృత్తి అనేది నిరంతర సేవా మార్గమని, మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత డాక్టర్లది అని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బంగి అనిల్‌కుమార్, వైద్యుల సంఘం నాయకులు క్యాస శ్రీనివాస్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు ప్రారంభం ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): గౌతమినగర్ రైల్వే ట్రాక్ – ఎన్టీపీసీ సర్కిల్ వరకు రూ.2కోట్ల20 లక్షల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులను ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ప్రారంభించారు. ఈ మార్గంలో అనేక ప్రమాదాలు జరగడంతో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు బల్దియా అధికారులు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈసాలతక్కళ్లపల్లిలో రూ.15కోట్లతో అభివృద్ధి పనులు పాలకుర్తి(రామగుండం): ఈసాలతక్కళ్లపల్లిలో రూ.15కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆయన ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్, నాయకులు మల్లెత్తుల శ్రీనివాస్, తుంగ నర్సయ్య, ఓడ్నాల రాజు, సాయితిరుమల్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి
తాము పనిచేస్తున్న సర్కార్ స్కూళ్లపై నమ్మకం పెంపొందించడం.. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా టీచర్లు తమ పిల్లలను తమతోపాటే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ కొలువు చేస్తూ ప్రైవేట్ స్కూళ్లకు పంపడం సరికాదని.. సర్కార్ స్కూళ్లలో చేర్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని.. ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతోందంటూ టీచర్లు చాటిచెబుతున్నారు. పిల్లలను తాము పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు. ● ప్రభుత్వ పాఠశాలకు పంతుళ్ల పిల్లలు ● నమ్మకం కల్పిస్తున్న టీచర్లు ● స్ఫూర్తి పొందుతున్న తల్లిదండ్రులు ● సర్కార్ స్కూళ్లలో పెరుగుతున్న ప్రవేశాలు తమతోనే పిల్లలు రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన పుర్రె రమేశ్, కవిత దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. రమేశ్ రాయికల్ హైస్కూల్లో పీడీగా, కవిత రాయికల్ మండలం ఇటిక్యాలలోని ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరి కూతురు ఆరాధ్యను వారు పనిచేస్తున్న స్కూల్లో చేర్పించారు. మొదట్లో కవిత పనిచేసిన భూపతిపూర్‌లో 1 నుంచి 3వ తరగతి, ప్రస్తుతం ఇటిక్యాలలో 4వ తరగతిలో చేర్పించారు. పిల్లలనూ సర్కార్ బడికే.. ఇల్లంతకుంట: మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి యామ రాజు తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ బడిలోనే చేర్పించారు. రాజు కూతుళ్లు యామ ధీరజ, తనూజ మండలంలోని రహీంఖాన్‌పేట ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద కూతురు ఇంటర్లో 987 మార్కులు సాధించి ప్రస్తుతం కోటిలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చేరింది. చిన్నకూతురు తనూజ మోడల్స్కూల్లో పదో తరగతి చదువుతోంది.కోనరావుపేట: కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన తీపిరి సంజీవ్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు. తన కుమారుడు జయసూర్యని కూడా అదే పాఠశాలలో రెండో తరగతి చదివిస్తున్నారు. ప్రతి రోజూ తండ్రీకొడుకులు బైక్‌పై స్కూల్‌కు వెళ్లి వస్తున్నారు. కథలాపూర్(వేములవాడ): మండలంలోని దుంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న లింగంపేట సతీశ్ తన కొడుకు వరుణ్‌తేజ్ అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. తల్లీకొడుకులు ఒకే బడికి.. కోరుట్ల: ఈ తల్లులు ప్రభుత్వ టీచర్లు. తమ పిల్లలను సైతం వారు పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌లో ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న సీహెచ్ శ్రీలక్ష్మీ తన కుమారుడు శ్రీయాన్‌ను అదే స్కూల్లో 4వ తరగతిలో చదివిపిస్తున్నారు. నిత్యం తనతోపాటు స్కూల్‌కు తీసుకెళ్తున్నారు. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యాభ్యాసం సాగుతోందని, అప్పుడే విద్యార్థుల్లో సృజనాత్మకశక్తి పెరుగుతుందన్నారు. కోరుట్లరూరల్: కోరుట్ల మండలం మాదాపూర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఎలిగేటి రాజమణి తన కుమారుడిని అదే పాఠశాలలో చదివిస్తోంది. కోరుట్లకు చెందిన రాజమణి తన కొడుకు హిమాన్ష్‌ను తాను పనిచేస్తున్న స్కూల్లోనే 3వ తరగతిలో చేర్పించింది. నిత్యం బైక్‌పై కొడుకును తీసుకొని స్కూల్‌కు వెళ్లి వస్తోంది. రెండేళ్ల క్రితం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో పనిచేసే సమయంలోనూ తన కొడుకును తీసుకెళ్లేవారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ బోధన అందుతుండడంతోనే తీసుకెళ్తున్నట్లు రాజమణి తెలిపారు. జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జావెద్ తన పిల్లలను అదే బడిలో చదివిపిస్తున్నారు. తన పెద్ద కొడుకు నవీదుల్ రెహమాన్‌ను అదే స్కూల్లో 7వ తరగతి, చిన్న కొడుకు టిప్పు ఉల్ రహమాన్‌ను దుర్గయ్యపల్లి స్కూల్లో 4వ తరగతిలో చేర్పించాడు. ధర్మపురి: ధర్మపురి మండలం రాయపట్నం స్కూల్లో పనిచేస్తున్న బండారు రాజు తన కొడుకు రోహన్‌ను అదే బడిలో 3వ తరగతిలో చేర్పించారు. గతంలో వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేటలో పనిచేసిన సమయంలో తన వెంటే కొడుకును తీసుకెళ్లారు. బోధనపై నమ్మకంతో.. వేములవాడ: కథలాపూర్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కిష్టయ్య తన కూతురు మధురిమను వేములవాడలోని బాలికల హైస్కూల్లో చేర్పించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందనే చేర్పించినట్లు కిష్టయ్య పేర్కొన్నారు. జమ్మికుంట: ప్రభుత్వ పాఠశాలలో బోధనపై నమ్మకం కల్పించేందుకు తన కుమారుడిని చేర్పించినట్లు టీచర్ బానోత్ సత్యజోస్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలోని స్కూల్లో సత్యజోస్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జమ్మికుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం బదిలీపై పర్లపల్లి పాఠశాలకు వచ్చారు. తన కొడుకు బానోతు సుశాంత్‌ను జమ్మికుంట హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. విద్య వ్యాపారం కాదని.. సారంగాపూర్: ప్రస్తుతం విద్యను వ్యాపారం చేసేశారని.. కాదని చెప్పేందుకే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తున్నట్లు గొడుగు మధుసూదన్ తెలిపారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లికి చెందిన మధుసూదన్ కండ్లపల్లిలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పెద్ద కుమార్తె నిత్య 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌లో చేరింది. చిన్న కూతురు శ్రీనిధి నర్సింహులపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కండ్లపల్లిలో విధులు నిర్వహిస్తూనే నర్సింహులపల్లిలోని స్కూల్‌కు వెళ్లి అదనంగా ఒక పీరియడ్ బోధిస్తున్నారు. -
సిమ్స్‌లో వసతులపై ఆరా
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ(సిమ్స్)తోపాటు జీజీహెచ్ టీచింగ్ ఆస్పత్రిని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియమించిన రాష్ట్ర కమిటీ సోమవారం సందర్శించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(అకడమిక్) శివరాంప్రసాద్, టీఎస్ఎండీసీ ఈఈ విశ్వప్రసాద్ తదితరులు మెడికోల హాస్టల్, టీచింగ్ ఆస్పత్రిలో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మెడికల్ కాలేజీతోపాటు జీజీహెచ్ టీచింగ్ ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పన, ఫ్యాకల్టీ వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తయారు చేయడానికి ప్రత్యేక కమిటీని రూపొందించిందన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, ఆర్ఎంవో రాజు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.