Hanamkonda
-
ప్రయాణ పాట్లు..
కంకర పోసి ఏడాదైనా ముందుకు సాగని పనులు కాజీపేట అర్బన్: న్యూశాయంపేట టు భట్టుపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్ని ఏడాది క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. నిత్యం న్యూశాయంపేట రైల్వే గేట్ మీదుగా కోట చెరువుకు ఆనుకుని రహదారి గుండా ద్విచక్రవాహనాలతో పాటు భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. హనుమకొండ నుంచి న్యూశాయంపేట మీదుగా భట్టుపల్లికి, కడిపికొండకు, ఉర్సుగుట్టకు అదే విధంగా వరంగల్‌కు వెళ్లేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. కాగా రోడ్డు నిర్మాణం పూర్తి అయి ప్రయాణం కొనసాగిద్దామంటే కంకర రోడ్డు ప్రయాణంతో వాహనాలతో పాటు నగరవాసులకు తిప్పలు తప్పడం లేదు. ఏడాదిగా ఈ రోడ్డు నిర్మాణానికి మోక్షం ఎప్పుడో అంటూ ఎదురుచూస్తున్నారు. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. న్యూశాయంపేటలోని కోట చెరువు గుండా గల రహదారిపై ప్రయాణం సాగించాలంటే భయం వేస్తోంది. కంకర కారణంగా వాహనాలు అదుపుతప్పుతున్నాయి. మరో వైపు దుమ్ముధూళితో అనారోగ్యం బారిన పడుతున్నాం. తక్షణమే అధికారులు చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి. – పెరుగు సురేశ్, న్యూశాయంపేట -
ప్రభుత్వ విజయాలు వివరించేందుకే కళాయాత్ర
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్: ప్రభుత్వ విజయాలు ప్రజలకు వివరించేందుకే ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను ప్రారంభించినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఈనెల 19 నుంచి డిసెంబర్ 7 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కళాయాత్ర వాహనాలను కలెక్టరేట్ ఆవరణలో బుధవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాచార పౌరసంబంధాల శాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కళాయాత్ర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా టీఎస్సెస్ కళాకారులు తమ ఆటాపాటలు, నాటికలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే కళాయాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతిరోజూ మూడు గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఈనెల 28న, డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి అంతడ్పుల నాగరాజు, అలేఖ్య కళా బృందాలతో జిల్లాలో భారీ కళా ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఆర్వో అయూబ్‌అలీ, కళాకారులు పాల్గొన్నారు. అంకితభావంతో పనిచేయాలి.. మండల ప్రత్యేక అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం, పత్తి కొనుగోళ్లు, ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పురోగతిపై బుధవారం ప్రత్యేక అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో 70 శాతం కుటుంబాల వివరాలను నమోదు చేశారని, నిర్దేశిత గడువులోగా 100 శాతం సర్వే పూర్తయ్యేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. -
నేడు పీటీసీ, సీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్
స్టైఫండరీ ట్రెయినీ పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపుఖిలా వరంగల్: గ్రేటర్ వరంగల్ పరిధిలోని మామునూరు, మడికొండలోని పోలీస్ శిక్షణ కళాశాలల్లో గురువారం ఉదయం పాసింగ్ అవుట్పరేడ్లు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. మామునూరు పోలీసు శిక్షణ కళాశాలలో ట్రెయినీ మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుందని ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ తెలిపారు. బుధవారం పీటీసీ పరేడ్ గ్రౌండ్లో ట్రైనింగ్ అదికారుల పర్యవేక్షణలో శిక్షణార్థులు మాక్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఆనంతరం ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ మాట్లాడారు. కానిస్టేబుళ్లకు కావాల్సిన శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంపొందిస్తూ, ఆధునిక పద్ధతుల్లో 9 నెలలపాటు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి మొత్తం 1,148 మంది మహిళా కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నట్లు వివరించారు. వీరంతా గురువారం ఉదయం 8.30 నుంచి 11.30 గంటలలోపు జరిగే పాసింగ్ అవుట్ పరేడ్ ముగింపుతో జనంలోకి వెళ్లనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, పీఆర్ఓ రామాచారి పాల్గొన్నారు. సీటీసీలో... మడికొండ: మడికొండలోని సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉదయం 8.30 గంటలకు 6వ బ్యాచ్ స్టైఫండరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల (సివిల్) పాసింగ్ అవుట్ (దీక్షాంత్) పరేడ్ నిర్వహిస్తున్నట్లు సీటీసీ ప్రిన్సిపాల్, అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.రవి బుధవారం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హాజరుకానున్నారని పేర్కొన్నారు. -
రేవంత్‌రెడ్డి చీటర్, బ్రోకర్
● సీఎం హోదాలో ఏం మాట్లాడుతున్నావో సోయి ఉందా? ● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైర్ ఆ.. మాటలు సీఎం పదవికే అవమానం ● మోదీ, కిషన్‌రెడ్డిని విమర్శించే అర్హత రేవంత్‌రెడ్డికి లేదు ● బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే తరిమికొడతారు ● ఎమ్మెల్యే పల్లా చదువుకున్న అజ్ఞాని ● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
నీరు పోయింది.. ఒండ్రు మిగిలింది..
నిత్యం నీటితో కళకళలాడే వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువులో చుక్క నీరు లేకుండా పోయింది. శుద్ధి, సుందరీకరణలో భాగంగా ఈ నెల 8వ తేదీన చెరువులోని నీటి తరలింపును ప్రారంభించారు. చెరువులో 140 నుంచి 150 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు నిల్వ ఉండగా.. ఆ నీటిని హసన్‌పర్తి నాగారం చెరువులోకి తరలించారు. బుధవారం నాటికి ఒండ్రు మిగిలింది. ఆ ఒండ్రును కూడా తీసివేయనున్నారు. – ఫొటో : సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
బిల్లులిస్తాం.. పనులు పూర్తి కావాలి
వరంగల్ అర్బన్ : పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లులు వెంటనే చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని, పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాల అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షించారు. విభాగాల వారీగా వివరా లు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,170 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.187 కోట్లు, అడ్మినిస్ట్రేటివ్ భవనానికి రూ.32.50కోట్లు, ఐదు రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ.49.50కోట్ల నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ జనరల్ ఫండ్, సీఎంఏ, పట్టణ ప్రగతి నిధులతో పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న, అసలు మొదలు కాని పనుల వివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. గతంలో నిధుల్లేక నిలిచిపోయిన వాటిని వేగంగా పూర్తి చేయాలని, పనులు ప్రారంభకం కాకపోతే రద్దు చేసి, రీకాల్ చేయాలని సూచించారు. నిబంధనల మేరకు బిల్లుల చెల్లింపులు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు మహేందర్, శ్రీనివాస్, సంతోష్ బాబు, డీఈలు సారంగం, కార్తీక్ రెడ్డి, రవి కిరణ్, రాజ్ కుమార్, అకౌంట్స్ ఆఫీసర్ సరిత, ఏఈలు, డీబీ సిబ్బంది పాల్గొన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి అభివృద్ధి పనులపై సమీక్ష -
బదిలీలకు సబ్ రిజిస్ట్రార్ల ఎదురుచూపులు
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్శాఖలో బదిలీలు ఎప్పుడంటూ సబ్ రిజిస్ట్రార్లు ఎదురుచూస్తున్నారు. జూలై 31వ తేదీన జీరో ట్రాన్స్ఫర్స్ పేరిట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ ఐజీ, ప్రభుత్వం ప్రకటించిన బదిలీల ఉత్తర్వులతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అటెండర్‌స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జోన్లో భాగంగా జోన్–1 బదిలీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి ఉమ్మడి వరంగల్‌కు గ్రేడ్–1, గ్రేడ్– సబ్ రిజిస్ట్రార్లతోపాటు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏకకాలంలో జూలై 31వ తేదీన బదిలీల ప్రకటన, ఆగస్టు 1న జాయినింగ్లతో పూర్తిగా నూతన అధికారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మారిపోయాయి. ఓడీ పేరిట అక్టోబర్‌లో మరో జాబితా సాధారణ, లాంగ్ స్టాండింగ్ బదిలీలకు బదులుగా కొత్తగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో అక్టోబర్ 15న ఓడీ (ఆన్ డ్యూటీ) పేరిట బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో జోన్లను దాటి హైదరాబాద్ వరకు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు 19 మందికి స్థాన చలనం కలిగింది. రెండు నెలల గడువులోనే మరో కార్యాలయానికి బదిలీకావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 20 మందితో మరో జాబితా.. ‘మా జిల్లాకు మేము పోతాం. మాకు చాలా దూరమవుతుంది’ అంటూ సబ్ రిజిస్ట్రార్లు ఇటీవల రెవెన్యూశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. ఇప్పటికే ఓడీ పేరిట 19 మంది గ్రేడ్–1, డ్–2 సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా, ఇదే కోవలో మరో 20 మందితో జాబితా సిద్ధమైనట్లు సమాచారం. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో బదిలీ జాబితా వెలువడే అవకాశం ఉంది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్లు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. లాంగ్ లీవ్‌లో పలువురు.. ఉమ్మడి వరంగల్ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి వరంగల్‌కు బదిలీపై వచ్చిన గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు తాము ఇంత దూరం ప్రయాణం చేయలేమని, ఈ కార్యాలయాల్లో పని చేయలేమంటూ కొందరు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నామని మరికొందరు లాంగ్ లీవ్ పెట్టారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. చిట్స్ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్టోబర్‌లో ఓడీ పేరిట 19 మంది ట్రాన్స్ఫర్ 20 మందితో మరో జాబితా రెడీ సొంత జిల్లాకు పోతామంటూ అభ్యర్థనలు -
నామమాత్రంగా అభివృద్ధి
హన్మకొండ అర్బన్: సాధారణ ఎన్నికలకు ముందు ఉరుకులు పరుగులతో చేపట్టిన అభివృద్ధి పనులు నామమాత్రంగానే మిగిలిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నిట్ సమీపంలోని దర్గా వందఫీట్ల రోడ్డు జంక్షన్ వద్ద ప్రభుత్వం సుమారు రూ.35 లక్షలతో చేపట్టిన అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులు అలంకారప్రాయంగా మారాయి. అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించాలని లక్ష్యంగా స్థానిక నాయకులు, అధికారులు చేసిన హంగామా అంతాఇంతా కాదు. అర్ధరాత్రి సీసీ రోడ్లు వేసి తవ్వకాలు చేపట్టి జంక్షన్లో ఒక ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. రూ.10 లక్షల ఖర్చుతో ఆ ఫౌంటేన్‌లో హైదరాబాద్ తరహాలో రాళ్ల మాదిరిగా ఏర్పాటు చేసి నీళ్లు చిమ్మే విధంగా మోటార్లు, లైట్లు అమర్చారు. అయితే, కొద్ది రోజులకే ఇక్కడ ఏర్పాటు చేసిన నీటి మోటార్లు, లైట్లు దొంగలు ఎత్తుకుపోయారు. ఏమైంది అన్నదానిపై ఇప్పటికీ అధికారులు నిగ్గు తేల్చలేదు సరి కదా.. అక్కడ కొత్తవి కూడా ఏర్పాటు చేయలేదు. ఇదిలా ఉంటే రోడ్డుకు ఇరువైపులా ఆగమేఘాలపై షాపులు ఖాళీ చేయించారు. వీధి వ్యాపారులను తోసేసి సీసీ చేసిన అధికారులు తర్వాత మాత్రం మిగిలిన పనులు చేపట్టలేదు. సీసీ రోడ్డు పక్కన షాపులు.. జంక్షన్ సమీపంలో ఓ మున్సిపల్ అధికారి బంధువుల షాపు ఉన్నందున విస్తరణ నామమాత్రంగా చేశారని, ఒకవేళ లెక్క ప్రకారం విస్తరణ చేస్తే ఆ షాపునకు కూడా ఇబ్బంది అవుతుందని వదిలేశారని విమర్శలు ఉన్నాయి. అంతేకాదు అధికారులు నిర్మించిన సీసీ రోడ్డు పక్కన షాపులు ఒక్కొక్కటిగా వెలిశాయి. దీంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోంది. అయినా అధికారులు ఈ విషయాన్ని గాలికి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. డ్రెయినేజీ లేక.. నిట్ మెయిన్ రోడ్డు నుంచి దర్గా రోడ్డుకు అధికారులు ఐదు ఫీట్ల డ్రెయినేజీ నిర్మించారు. ప్రధాన రోడ్డు నుంచి ప్రారంభంలో సుమారు 15 మీటర్ల వరకు వదిలేశారు. ఇది ఎవరి లాభం కోసం వదిలేశారన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. దీనివల్ల ప్రధాన రోడ్డులో ఉన్న నీరు ఎటు పోయేందుకు దారిలేక ఎప్పటికీ అక్కడే పారుతోంది. సంవత్సరానికోసారి షాపుల ఎదుట ఉన్న సీసీని పగులగొట్టి, అరుగులు కూల్చి జేసీబీలతో మురుగునీరు తరలిస్తున్నారు. దర్గా రోడ్డుకు కనెక్ట్ చేస్తే సమస్య తీరుతుందని పదేపదే చెప్పినా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి డ్రెయినేజీ సమస్య పరిష్కరించాలని, రోడ్డు విస్తరణ చేయాలని, జంక్షన్ సుందరీకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు పూర్తికాని దర్గా వంద ఫీట్ల రోడ్డు విస్తరణ, జంక్షన్ సుందరీకరణ రహదారిపై చిరు వ్యాపారాలు.. తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య ఫౌంటేన్లోని మోటార్లు, లైట్లను అపహరించిన దొంగలు -
‘గ్రేటర్ వరంగల్’కు మరో రూ.187.42 కోట్లు
జీఓ జారీ చేసిన ప్రభుత్వం వరంగల్ అర్బన్ : వరంగల్ నగరానికి నిధుల వరద పారుతోంది. రెండు రోజులుగా వివిధ పథకాల కింద నగరానికి రూ.4,252 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.187.42 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ జీఓ 583 ఉత్తర్వులు జారీ చేశారు. మహానగరానికి ఇంత భారీ మొత్తంలో నిధుల కేటాయింపు, విడుదల కావడం ఇదే మొదటిసారి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా, ఉత్తర తెలంగాణకు కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే నిధులు కేటాయించారు. తాజాగా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీకి రూ.4,170 కోట్లు, ప్రధాన కార్యాలయ ఆవరణలో పరిపాలన భవనం (అడినిస్ట్రేటివ్ టవర్స్)కు రూ.32.50 కోట్లు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ.49.50 కోట్లు కేటాయించింది. అభివృద్ధికి అన్ని వనరులు అనుకూలంగా ఉండడంతో హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అ భివృద్ధి చేస్తామనే హామీలు సాకారమవుతున్నాయి. -
కాళోజీ కళాక్షేత్రం ఆవిష్కృతం
హన్మకొండ అర్బన్: జిల్లా ప్రజలు, కళాకారులు, కళాభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హనుమకొండ ‘కుడా’ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కాళోజీ కళాక్షేత్రానికి చేరుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రజా కవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి రూ.4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్‌గా చేశారు. గ్రేటర్ మాస్టర్ ప్లాన్–2041 మ్యాపును విడుదల చేశారు. అనంతరం కళాక్షేత్రం భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కాళోజీ వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫొటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఈసందర్భంగా కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్యమంత్రికి కాళోజీ జీవితం, అక్కడి వస్తువుల గురించి వివరించారు. అనంతరం ఆడిటోరియంలో కాళోజీ జీవిత విశేషాలతో ప్రముఖ సినీ దర్శకుడు డాక్టర్ ప్రభాకర్ జైనీ నిర్మించిన బయోపిక్‌ను వీక్షించారు. ఈసందర్భంగా ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, ట్రస్ట్ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహం ఆవిష్కరణ -
ఒత్తిడే కారణమా?
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో కొన్నేళ్లుగా ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరిపై చర్యలు తీసుకోలేక ఒత్తిడికి గురైన సూపరింటెండెంట్ డాక్టర్ మురళి తన పదవికి రాజీనా మా చేశారని ఆస్పత్రిలో పలువురు చర్చించుకుంటున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్య కారణాలతో రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు. సహకరించని సిబ్బంది, అసిస్టెంట్ డెరెక్టర్, ఆర్‌ఎంఓల మధ్య ఏర్పడిన సమస్వయ లోపం సూపరింటెండెంట్‌కు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇటీవల నిర్వహించిన డైట్ టెండర్ల ప్రక్రియలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ పదవి వద్దు.. అని కొన్ని రోజుల క్రితం ఆయన సెలవుపై వెళ్లారు. సోమవారం సాయంత్రం కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్‌రెడ్డికి తన రాజీనామా లేఖను అందించారు. రాజీనామా పత్రాన్ని డీఎంఈకి పంపించామని, డీఎంఈ నిర్ణయంపై రాజీనామా ఆమోదం ఆధారపడి ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అసలేం జరిగింది? ఎంజీఎం సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్ జూలై చివరి వారంలో బదిలీపై ములుగు వెళ్లారు. సీనియార్టీ ప్రకారం కొత్త సూపరింటెండెంట్‌ను నియమించే వరకు ఇన్చార్జ్గా కొనసాగాలని అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ మురళికి బాధ్యతలు అప్పగించారు. ఆస్పత్రిలో మెరుగైన సేవల కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఎంజీఎం ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆర్ఎంఓ–1 పోస్టు కొద్ది నెలలుగా ఖాళీగా ఉండడం, పెద్ద ఎత్తున సమస్యలు పేరుకుపోవడం, ఆస్పత్రిలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలతో మనస్తాపానికి గురైన డాక్టర్ మురళి పదవికి రాజీనామా చేయడం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కలకలం రేపింది. కాగా, ప్రస్తుతం ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా ఆర్థోపెడిక్ వైద్యుడు కొనసాగుతున్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ మురళి రాజీనామాపై ఆస్పత్రిలో చర్చ అనారోగ్యమే కారణమని లేఖలో పేర్కొన్న అధికారి సహకరించని సిబ్బంది.. వరుస ఘటనలతో మనస్తాపం ఏడీ, ఆర్‌ఎంఓల మధ్య లోపించిన సమన్వయం జిల్లా వైద్యశాఖ వర్గాల్లో కలకలం -
ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..
బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024– 8లోuహనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనం, నమస్కరిస్తున్న సీఎం రేవంత్రెడ్డినేడు ‘పింగిళి’లో పీజీ స్పాట్ అడ్మిషన్లుహన్మకొండ అర్బన్: పింగిళి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నేడు (బుధవారం) స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రమౌళి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ (తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ) ఎంకాం (జనరల్, కంప్యూటర్ అప్టికేషన్స్), ఎంఎస్సీ (జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బాటనీ, మైక్రోబయోలజీ) కోర్సులలో అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు సీపీజీఈటీ –2024లో అర్హత సాధించి ఉండాలని, లేదా డిగ్రీలో 50 శాతం మార్కుల ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత కోర్సు ఫీజుతోపాటు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు రెండు సెట్లు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని కోరారు. ఆర్టీసీ రీజియన్ కార్యాలయం సందర్శనహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సందర్శించారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు హనుమకొండకు వచ్చిన ఆయన కార్యాలయాన్ని పరిశీలించారు. రీజియన్ పరిస్థితిని ఆర్ఎం డి.విజయ భానును అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లు ఎంత దూరం వచ్చాయని అడిగారు. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయా, ఎప్పటిలోగా పనులు పూర్తవుతా యని అడిగి తెలుసుకున్నారు. వెహికిల్ ట్రాకింగ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు, అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి, సిబ్బంది పాల్గొన్నారు. రూ.10 కోట్ల ప్రాజెక్టులకు నిట్‌తో ఎంఓయూకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌తో భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూ.10 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహించేందుకు మంగళవారం ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్ వరంగల్, ఈ అండ్ ఐసీటీ అకాడమీ సౌజన్యంలో నిట్ మణిపూర్, కాకినాడ జేఎన్టీయూ, కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎం, హైదరాబాద్ జేఎన్టీయూలు, భువనేశ్వర్ ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా యూనివర్సిటీలు ఎంఓయూపై సంతకం చేసినట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. ఎంఓయూ ద్వారా నిర్వహించనున్న ప్రాజెక్ట్.. 14,700 మంది అధ్యాపకులకు శిక్షణ అందించేందుకు దోహదపడనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 24నుంచి 30వ తేదీ వరకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరగనున్న 68వ ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు హనుమకొండ డీఎస్ఏ క్రీడాకారులు ఎంపికయ్యారు. అండర్–19 విభాగంలో ఎంపికై న బోడిక ఆర్యచంద్రారావు, బోడిక ఆర్య చక్రాదర్రావులను మంగళవారం డీవైఎస్ఓ గుగులోత్ అశోక్‌కుమార్ అభినందించారు. క్రీడాకారుల వెంట స్విమ్మింగ్ కోచ్ రాయబారపు నవీన్‌కుమార్ ఉన్నారు. ప్రాంగణ నియామకాలకు రాతపరీక్ష కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ప్రాంగణ నియామకాలకు ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని సర్వోడ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈ రాత పరీక్ష నిర్వహించగా 267 మంది హాజరయ్యారు. ప్రతిభ చూపిన వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.4 లక్షల వేతనం చెల్లించనున్నారు. కేయూ ఎడ్యుకేషన్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ రమణ, డాక్టర్ భిక్షా, ప్లేస్మెంట్ ఆఫీసర్లు ఎ.సిద్ధార్థ, పి.సంతోశ్, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా వీసీ ప్రతాప్‌రెడ్డిని కలిశారు. సాక్షి, వరంగల్: ఓరుగల్లు వేదికగా మంగళవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు మహిళాలోకం కదిలి వచ్చింది. ఉమ్మడి జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల నుంచి మహిళలు నగరానికి తరలివచ్చారు. ఎక్కడ చూసినా వారే కనిపించారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆడబిడ్డలపై వరాల జల్లు కురిపించారు. ‘రానున్న పదేళ్లలో మహిళలకు వడ్డీలేని రుణాలిస్తాం. సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తాం. ఒకప్పుడు టాటా, బిర్లాలుంటే.. ఇప్పుడు అంబానీ, అదానీలను మించిన పారిశ్రామికవేత్తలుగా మహిళలను మారుస్తాం’ అని స్పష్టం చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా.. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హనుమకొండ ‘కుడా’ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తొలుత కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం (ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం) లో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్‌తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయాయి. ఓరుగల్లు పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే చారిత్రక వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. అభివృద్ధికి సుమారు రూ.ఆరువేల కోట్లు కేటాయించాం. వరంగల్ అభివృద్ధి చెందితే.. సగం తెలంగాణ అభివృద్ధి చెందినట్లే. నగరాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు’ అని సీఎం చెప్పిన మాటలకు మంచి స్పందన వచ్చింది. ‘ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది మన ఆడబిడ్డనే. ఆనాడు భద్రకాళి అమ్మవారు, సమ్మక్క–సారలమ్మ తల్లుల సాక్షిగా చెప్పా.. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతామని ‘మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వేదిక మీదుగా మాట ఇస్తున్నా.. మిగిలిన అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత మాది’ అనడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, సారయ్య, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, కమిషనర్ అశ్వినితానాజీ వాకడే పాల్గొన్నారు. స్టెప్పులే స్టెప్పులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్లతో పాటు పలు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో మహిళలు సభకు తరలివచ్చారు. దాదాపు లక్ష మందికిపైగా జనాలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపించింది. సీఎం రేవంత్‌రెడ్డి రాగానే.. ‘మూడు రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు మన రేవంతన్న’ అనే పాటకు మహిళలు స్టెప్పులు వేశారు. సభలో అర్జున అవార్డు గ్రహీతలు ఇషాసింగ్, నిఖత్ జరీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేపు డెడికేటెడ్ బీసీ కమిషన్ రాకవరంగల్: హనుమకొండ కలెక్టరేట్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు, సభ్యులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు అవసరమైన రిజర్వేషన్లను దామాషా ప్రకారం కల్పించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజలు, సలహాలు, అభ్యర్థనలు, ఆక్షేపణలను కమిషన్‌కు సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలతో సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. సీఎం పర్యటన సాగిందిలా... మధ్యాహ్నం 2.39 గంటలకు: హైదరాబాద్ నుంచి హనుమకొండకు ప్రత్యేక హెలికాప్టర్లో రాక.. ముందుగా నగరం మొత్తం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. 2.50 : కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ప్రజాకవి కాళోజీ కాంస్య విగ్రహావిష్కరణ 2.54: హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన రూ.4,601.15 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన 2.57 : కాళోజీ కళాక్షేత్రం భవన ప్రారంభోత్సవం 2.59 : కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ ఫొటో గ్యాలరీ సందర్శన 3.18 : ఆడిటోరియాన్ని సందర్శించి.. ప్రజాకవి కాళోజీపై రూపొందించిన బయోపిక్వీక్షణ 3.30 : కాళోజీ కళాక్షేత్రం నుంచి బస్సులో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి పయనం 3.41 : ప్రజాపాలన విజయోత్సవ సభా ప్రాంగణానికి రాక, ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ సందర్శన సాయంత్రం 4.16: మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికపైకి రాక, ఆ తర్వాత ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళి 5.22: సీఎం ప్రసంగం మొదలు.. 34 నిమిషాలు కొనసాగిన స్పీచ్ 5.58 : 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన 6.00 : సభాస్థలి నుంచి సీఎం హైదరాబాద్‌కు పయనం న్యూస్రీల్సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి దూరంసభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరు కావడం.. మరోసారి కాంగ్రెస్‌పార్టీలో చర్చకు దారి తీసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ పాదయాత్ర సందర్భంగా మొదలైన వీరిమధ్య మనస్పర్థలు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇంకా సద్దుమణగలేదన్న విషయం ఈ అతిపెద్ద సభతో మరోసారి బహిర్గతమైనట్లయ్యింది. దొంతి మాధవరెడ్డి గతంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పాల్గొన్న కొన్ని కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా సీనియారిటీ పరంగా సముచిత స్థానమిచ్చి గౌరవించకపోవడం వల్లనే సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే దొంతి దూరంగా ఉంటున్నారని ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కుర్చీ దొరకక.. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణికి సీటు దొరక్కపోవడంతో ఇబ్బందిపడ్డారు. వేదికపైకి.. అక్కడున్న సిబ్బంది వెనకాల కుర్చీ తీసుకొచ్చి వేయడంతో ఆమె కూర్చున్నారు. 1,158 మందికి వైద్యసేవలుఎంజీఎం: ప్రజాపాలన విజయోత్సవ సభా ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 1,158 మందికి వైద్య సేవలందించినట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. అలాగే ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేసినట్లు తె లిపారు. మైదానంలో మూడు 108 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉంచి వైద్య సేవలందించినట్లు పేర్కొన్నారు. అదనపు డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, పీఓడీటీటీ కె.లలితాదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ అహ్మద్, హిమబిందు, ఆరోగ్య శ్రీ మేనేజర్ విక్రమ్, 130 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ‘ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం’ నుంచి సీఎం వరాలు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తామన్న రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృది్ధ చెందినట్లే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి సభికులనుంచి అనూహ్య స్పందన అంతకుముందు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం, పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన స్టాళ్ల పరిశీలన హన్మకొండ చౌరస్తా: ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని సభా ప్రాంగణం ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పెంబర్తి హస్తకళలు, చెక్క ఎద్దుల బండ్లు, చేర్యాల నకాషీ, పెయింటింగ్స్, మాస్క్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, చేనేత వస్త్రాలు, నారాయణపేట చీరలు తదితర స్టాళ్లను పరిశీలించారు. స్టాళ్ల నిర్వాహకులను వ్యాపారం ఎలా ఉంది.. ఏయే వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు.. టర్నోవర్ ఎంత? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలన్నీ ఇలాగే ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ దర్శనం.. గొప్ప అనుభూతి అని డైరీలో రాశారు. కాగా, పలు స్టాళ్ల నిర్వాహక మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన చిత్రపటాన్ని అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. వరంగల్‌లో నార్కొటిక్ పీఎస్.. ప్రారంభించిన సీఎం – వివరాలు 8లోu -
భద్రకాళిలో కార్తీక దీపోత్సవం
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో నగరంలోని భద్రకాళి దేవాలయంలో సోమవారం కార్తీక దీపోత్సవం జరిగింది. ఈఓ శేషుభారతి దేవాలయ ఆవరణలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మహిళాభక్తులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. కార్తీక సోమవారం పూజలు వేయిస్తంభాల దేవాలయంలో కార్తీకమాసోత్సవాల్లో భాగంగా మూడో సోమవారం పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తిష్టగణపతికి అభిషేకాలు, రుద్రేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. రాత్రి 8 గంటలకు మహా హారతి శోభాయమానంగా జరిగింది. భక్తులు కార్తీకదీపాలు వెలిగించి సందడి చేశారు. -
ఇవి ఓకే.. మరి మిగతావి?
పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ సిటీ రోడ్డు పనులుకాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ఐదు నెలల్లో కీలక పథకాలకు నిధులు ● భూగర్భ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్‌పోర్టుల్లో కదలిక ● ఇన్నర్ రింగ్‌రోడ్డుకు నిధుల పెంపు.. మాస్టర్‌ప్లాన్–2041కు ఆమోదం ● ఔటర్ రింగ్‌రోడ్డు, ‘స్మార్ట్’ సిటీ, సూపర్ స్పెషాలిటీపై మౌనం ● సెంట్రల్ జైలు ఊసే లేదు.. జీడబ్ల్యూఎంసీకి నిధుల కొరత ● సీఎం మొదటి సమీక్ష తర్వాతే ఫలితాలు.. ప్రత్యేక దృష్టి పెట్టాలని వేడుకోలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనంవీటి పరిష్కారంపై దృష్టి పెట్టండి..సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జూన్ 29న వరంగల్‌లో పర్యటించిన రేవంత్‌రెడ్డి... ‘గ్రేటర్’ అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్లో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఇతర కీలక కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రాత్రి వరకు నిర్వహించిన ఈ సమీక్షలో ప్రధానంగా 8 అంశాలు చర్చకు వచ్చాయి. ఈమేరకు హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధికి ఆ 8 అంశాలపై ప్రాథమిక అంచనాలు రూపొందించి ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారు. వరంగల్ వేదికగా ‘ప్రజాపాలన విజయోత్సవం’ నిర్వహిస్తున్న తరుణంలో నాలుగైదు రోజులుగా ప్రభుత్వం జీఓల జారీ, నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మామునూరు ఎయిర్‌పోర్టు, భూగర్భ డ్రెయినేజీలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం.. కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసి ప్రారంభిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిధులు వెచ్చించి, వరంగల్ నగరపాలక సంస్థ భవన నిర్మాణం కోసం నిధులు కేటా యించింది. మాస్టర్‌ప్లాన్–2041పై ఆమోద ముద్ర వేసింది. కానీ, ఔటర్ రింగ్‌రోడ్డు, స్మార్ట్ సిటీ కోసం నిధుల విడుదల పెండింగ్‌లోనే ఉంది. ప్రతిష్టాత్మక సూపర్ స్పెషాలిటీ నిర్మాణం వేగం పుంజుకోవడం లేదు. నిధులు, సిబ్బంది కొరత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను వేధిస్తోంది. అభివృద్ధి పనులకు రూ.4,684.37 కోట్లు.. ముఖ్యమంత్రి కోసం జిల్లా ఎన్నో ఆశలతో ఎదురుచూస్తోంది. అందుకు తగ్గట్టుగానే సమీక్ష జరిపిన 5 నెలల్లోనే కోట్ల రూపాయలు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. అండర్ డ్రెయినేజీ వ్యవస్థకు, రూ.4,170 కోట్లు, మామునూరు ఎయిర్‌పోర్టుకు రూ.203 కోట్లు, పాలిటెక్నిక్ కళాశాలకు రూ.28 కోట్లు, ఇంటర్నల్ రింగ్ రోడ్‌కు రూ.80కోట్లు, ఫ్లడ్ డ్రెయినేజీ సిస్టానికి రూ.160.3 కోట్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు భూనిర్వాసితులు 863 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రూ.43.15 కోట్లు.. ఇలా మొత్తం రూ.4,684.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు ప్రతిపాదనలు వెళ్లాయి. వివిధ కారణాలు వల్ల పనులు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం రూ.4170 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులకు సంబంధించి ఆయన మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కీలకమైన మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం రూ.203 కోట్లు కేటాయించడం, మాస్టర్‌ప్లాన్–2041 ఆమోదం సాహసోపేతమైన నిర్ణయంగా భావిస్తున్నారు. కొన్నింటిపై నిధుల వరద.. మరికొన్నింటిపై శీతకన్ను స్మార్ట్‌సిటీ పథకం కింద వివిధ ప్రాజెక్టుల కోసం రూ.2,278కోట్లతో డీపీఆర్‌లు రూపొందించారు. ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతిపెద్ద టెక్స్టైల్ పార్కుకు నిర్మాణం కోసం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట శివారులో 22 అక్టోబర్ 2017న భూమి పూజ చేశారు. 1,350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి పైగా ఉపాధి అవకాశాలు లభించేవి. ఏడేళ్లుగా టెక్స్ టైల్ పార్కు నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వంతో 22 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నా సగం కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించాయి. 18 మార్చి 2023న కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర కింద వరంగల్ టెక్స్టైల్ పార్కును ఎంపిక చేసింది. కానీ పురోగతి కనిపించడం లేదు. సుమారు రూ.1,100 కోట్లతో చేపట్టిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగం పుంజుకోవడం లేదు. కారణాలు చూపకుండా సమారు రూ.600 కోట్ల మేరకు అంచనాలు పెరగడంపై వేసిన విజిలెన్స్ కమిటీ విచారణ జరుపుతోంది. నగరం చూట్టూ నాలుగు వైపులా 74 కిలోమీ టర్ల రింగ్ రోడ్డు ఉంటుంది. కరుణాపురం నుంచి ఐనవోలు క్రాస్ రోడ్డు సింగారం వరకు 17 కిలోమీటర్లు ఉంటుంది. అందుకోసం గత ప్రభుత్వంలో రూ.669.59కోట్ల అంచనా వ్య యంతో పనులకు శంకుస్థాపన చేశారు. భూ సేకరణ కోసం రూ. 157.95 కోట్లు కేటాయించగా, రహదారి నిర్మాణం కోసం 551.64 కోట్లను మంజూరు చేసింది. అయితే విడుదల చేయక పనులు కాలేదు. రెండో ప్యాకేజీ కింద ఖమ్మం రోడ్డులోని(సింగారం) నుంచి ఆరేపల్లి క్రాస్ రోడ్డు వరకు 39 కిలోమీటర్లు ఎన్‌హెచ్ రూ. 776.54కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో 191.82 కోట్లు భూసేకరణ కోసం వ్యయం చేస్తుండగా, మిగిలిన రహదారి పనుల కోసం రూ. 584.72కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. కానీ ఆ పనులు పూర్తి కాలేదు. బల్దియా, ‘కుడా’ను సిబ్బంది కొరత వేధిస్తోంది. ట్రైసిటీలో 2013 మార్చిలో 42 శివారు గ్రామాలు విలీనమాయ్యయి. నగరం 110 చదరపుకిలోమీటర్ల నుంచి 408 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. జనాభా రెట్టింపవుతోంది. గ్రేటర్ హోదా దక్కింది. 2016 లెక్కల ప్రకారం బల్దియాలో శాశ్వత అధికారులు,ఉద్యోగుల సంఖ్య 1,531 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 741 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. కీలకమైన ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యం, పన్నుల విభాగం, అర్బన్ మలేరియా విభాగాల్లో క్షేత్ర స్థాయి, వివిధ హోదాల్లో అధికారులు పూర్తి స్థాయిలో లేక ఉన్న వారిపై అదనపు భారంతో సతమతమవుతున్నారు. -
సీఎం టూర్ షెడ్యూల్
మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా ‘కుడా’ మైదానానికి చేరుకుంటారు ● 2.30 : కాళోజీ కళాక్షేత్రం ప్రారంభిస్తారు ● 3.10 : ఆర్ట్స్ కాలేజీ మైదానానికి బయలుదేరుతారు ● 3.20: ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు ● 3.50: జ్యోతి ప్రజ్వలన, రాష్ట్రీయ గీతాలాపన ● 3.55: సీఎస్ శాంతికుమారి చే స్వాగతోపన్యాసం ● 4.00: మంత్రుల ప్రసంగం ● 4.20: 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్‌కు శంకుస్థాపనలు, ఇందిరా మహిళా శక్తి ద్వారా వివిధ కార్యక్రమాలప్రారంభోత్సవం, లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, డిస్కం, ఆర్టీసీల ఎంఓయూల అందజేత ● 4.30: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగం ● 4.40: సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ● సాయంత్రం 5.00 గంటలకు హనుమకొండ కలెక్టర్ కృతజ్ఞత ప్రసంగం -
నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
వరంగల్ క్రైం: సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా మంగళవారం వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాల్లో ట్రాఫిక్ మళ్లింపుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. హైదరాబాద్, ఖమ్మం, హుజూరాబాద్, ములుగు ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి బహిరంగ సభ ముగిసే వరకు కొనసాగుతాయని, ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున అవసరం ఉంటే తప్ప వాహనాల్ని బయటకు తీయొద్దని, భారీ వాహనాలకు ప్రవేశం లేదని తెలిపారు. మళ్లింపు ఇలా.. హుజురాబాద్ నుంచి హైదరాబాద్, ఖమ్మం వెళ్లే వాహనాలు చింతగట్టు ఓఆర్ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం, ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మం వెళ్లాలి. ● పరకాల, ములుగు మార్గాల నుంచి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఓఆర్ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మంకు వెళ్లాల్సి ఉంటుంది. ● వర్ధన్నపేట వైపు నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, పరకాల, భూపాలపల్లి వెళ్లే వాహనాలు పున్నేలు క్రాస్ నుంచి డైవర్షన్ తీసుకుని ఐనవోలు, కరుణాపురం ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలి. సభాస్థలికి వెళ్లేందుకు.. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభకు వచ్చే వాహనాలు ఈ మార్గాల మీదుగా రావాల్సి ఉంటుంది. ● హుజూరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు చింతగట్టు వద్ద ఓఆర్ఆర్ పైకి ఎ క్కి ఉనికిచర్ల క్రాస్ రోడ్, వడ్డేపల్లి చర్చి, రిజిస్ట్రేషన్ కార్యాలయం, తెలంగాణ జంక్షన్ వడ్డేపల్లి రోడ్ నుంచి సర్క్యూట్ గెస్ట్ హౌస్ వద్ద ప్రజలను దింపి ఖాళీ వాహనాలను ఓల్డ్ బస్ డిపో వద్ద పార్క్ చేయాలి. ● హనుమకొండ, ములుగు, భూపాలపల్లి నుంచి వచ్చే వాహనాలు పెద్దమ్మగడ్డ డైవర్షన్ నుంచి కేయూసీ జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా గోపాలపూర్ జంక్షన్, తిరుమల జంక్షన్ ఎకై ్సజ్ కాలనీ ఐలాండ్ వద్ద దించి ఖాళీ వాహనాలను ఎకై ్సజ్ కాలనీ–1లో పార్కింగ్ చేయాలి. ● నర్సంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు చింతల్ బ్రిడ్జ్, హంటర్ రోడ్ మీదుగా నీలిమా జంక్షన్, తెలంగాణ జంక్షన్ వద్ద దింపి వాహనాలను సూచించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి. ● మామునూరు నుంచి వచ్చే వాహనాలు ఆర్టీఓ జంక్షన్, ఉర్సు గుట్ట మీదుగా హంటర్ రోడ్ నీలిమా జంక్షన్, తెలంగాణ జంక్షన్ వద్ద దించి ఖాళీ వాహనాలను విష్ణుప్రియ గార్డెన్స్‌లో నిలపాలి. ● స్టేషన్‌ఘన్‌పూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఉనికిచర్ల ఎక్స్ రోడ్, వడ్డేపల్లి చర్చి, ప్రశాంతినగర్ పార్క్ తెలంగాణ జంక్షన్ మీదుగా జనాలను దించి ఖాళీ వాహనాలను తెలంగాణ జంక్షన్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. -
మౌలిక సదుపాయాలకు రూ.180 కోట్ల నిధులు
వరంగల్ అర్బన్: ఉమ్మడి జిల్లాలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.180.80 కోట్ల నిధులు మంజూరు చేస్తూ సోమవారం సాయంత్రం జీఓ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ నగరంలో ఐదు రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ.49.50 కోట్లు విడుదల చేసింది. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ కేంద్రం నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.65 కోట్లు, మహబూబాబాద్ జిల్లా గూడూరు నుంచి కేసముద్రం వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘాన్పూర్ ఇంటిగ్రేటెడ్ డివిజన్ భవన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరైంది. టెన్త్ పరీక్షల ఫీజు గడువు 28విద్యారణ్యపురి: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న టెన్త్ వార్షిక పరీక్షల ఫీజు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించవచ్చని హనుమకొండ డీఈఓ డి.వాసంతి సోమవారం తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 10వరకు, రూ.200తో డిసెంబర్ 19వ తేదీవరకు, రూ 500తో డిసెంబర్ 30వ తేదీ వరకు సంబంధిత ఉన్నతపాఠశాలల హెచ్ఎంలకు చెల్లించాల్సింటుందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాల్సి ఉంటుందని, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ పరీక్ష ఫీజుతోపాటు రూ.60 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఎస్సీ,ఎ స్టీ బీసీ విద్యార్థులు పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.24వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలలోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే ఫీజునుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ముగిసిన గ్రూప్ –3 పరీక్షలువిద్యారణ్యపురి: గ్రూప్–3 పరీక్షలు సోమవారం ముగిశాయి. హనుమకొండ జిల్లాలోని హనుమకొండ, హసన్‌పర్తి, కాజీపేట మండలాల్లో రెండో రోజు సోమవారం జరిగిన పరీక్షకు 32,864మంది అభ్యర్థులకుగాను 17,292మంది (52.62శాతం) హాజరుకాగా, 15,572 మంది గైర్హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో మూడో పేపర్ పరీక్షకు 5,452 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై షార్ట్ టర్మ్ ప్రోగ్రాంకాజీపేట అర్బన్ : వరంగల్ నిట్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిట్ వరంగల్, మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సౌజన్యంతో ‘ఆర్టిిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ హెల్త్‌కేర్ అప్లికేషన్స్’ అంశంపై షార్ట్‌టర్మ్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, కేఎంసీ ప్రిన్సిపాల్ కె.రామ్‌కుమార్‌రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ మాజీ డీన్ కృష్ణమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి షార్ట్‌టర్మ్ ప్రోగ్రాంను ప్రారంభించి, సావనీర్‌ను విడుదల చేశారు. నిట్ ప్రొఫెసర్ కిషోర్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా శక్తి మేళా ప్రారంభంహన్మకొండ చౌరస్తా: హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మంగళవారం నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి సభను పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన మహిళా శక్తి మేళాను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. సెర్ఫ్, మెప్మా ద్వారా మహిళలు స్వశక్తితో రూపొందించిన 40 రకాల వస్తువులతో కూడిన 20 స్టాళ్లను మేళాలో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులకు మహిళలు డప్పు చప్పుళ్లతో, కోలాట విన్యాసాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు నాలుగు మండలాల స్కూళ్లకు సెలవువిద్యారణ్యపురి: కాజీపేట, హనుమకొండ, ధర్మసాగర్, హసన్‌పర్తి పరిధిలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలకు డీఈఓ ఆదేశాల మేరకు మంగళవారం సెలవు (లోకల్ హాలీడే) ప్రకటించారు. సీఎం రేవంత్ హనుమకొండ పర్యటనతో భారీగా ట్రాఫిక్ ఉంటుందన్న కారణంతో సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ నాలుగు మండలాల పరిధిలోని స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు సోమవారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు పెట్టారు. -
నేటి గ్రేటర్ గ్రీవెన్స్ రద్దు
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న ఆమె.. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి గ్రీవెన్స్ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వరంగల్, హనుమకొండ ప్రజావాణి కూడా.. వరంగల్/హనుమకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లలో నేడు(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలను పరిపాలనా పరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈవిషయాన్ని జిల్లా ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు. ఆర్చ్ నిర్మాణానికి రూ.1.5 లక్షల విరాళంఐనవోలు: మల్లికార్జునస్వామి దేవస్థానం వారు చేపట్టనున్న ఆర్చ్ నిర్మాణానికి మల్లికార్జునస్వామి భక్తులు రూ.1.5 లక్షల చెక్కును మల్లన్న ఆలయంలో ఆదివారం అందజేశారు. కొట్టం రాజు, కొట్టం మోహన్, పెండ్లి ప్రశాంత్, పెండ్లి ప్రవీణ్, పెండ్లి నవీన్, పెండ్లి తిరుపతి, కడుదూరి సంతోశ్, పెంతల అశోక్, ఆకుతోట రాజు మల్లికార్జునస్వామి టీంగా ఏర్పడి వ్యాపారం నిర్వహించారు. తాము అనుకున్నట్లుగా వ్యాపారం సాగితే మల్లన్న ఆలయానికి రూ.1.5 లక్షలు విరాళం అందజేస్తామని గతంలో మొక్కుకున్నారు. ఈక్రమంలో ఆదివారం మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రూ.1.5 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు. కాగా.. ఎండోమెంట్ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ప్రశ్నించే గొంతుక నర్సిరెడ్డివిద్యారణ్యపురి: ప్రశ్నించే గొంతుక అలుగుబెల్లి నర్సిరెడ్డి.. శాసనమండలి వేదికగా ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో కృషిచేశారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు బద్దం వెంకటరెడ్డి అన్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విద్యారంగంపై ప్రస్తావించిన అంశాలు, ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు, పరిష్కారాలు తదితర అంశాలతో కూడిన పుస్తకాన్ని వెంకటరెడ్డి ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐ దున్నరేళ్లుగా టీచర్ ఎమ్మెల్సీగా వివిధ సమస్యల పరిష్కారానికి కృషిచేసిన నర్సిరెడ్డిని మ రోసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించా లని కోరారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎ ఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్‌రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ పెండెం రాజు, ఉపాధ్యక్షుడు ఆజ్మీరా రాజారాం, కార్యదర్శులు లింగారావు, కె.సదానందం, మెరుగు ప్రసన్నానంద్ తదితరులు పాల్గొన్నారు. నిట్‌తో అగస్థ్య హైడ్రోజన్ ఎంఓయూ..కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో హైదరాబాద్ అగస్థ్య హైడ్రోజన్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు ఆదివారం నిట్‌లో నిర్వహించిన 18వ నేషనల్ ఫ్రంటీయర్ ఆఫ్ ఇంజ నీరింగ్ సదస్సులో అవగాహన కుదిరింది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, అగస్ధ్య హైడ్రోజెన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శశిరెడ్డి ఎంఓ యూను పరస్పరం అందజేసుకున్నారు. డాక్టర్ రామా చంద్రమౌళికి జీవన సాఫల్య పురస్కారంహన్మకొండ కల్చరల్: వరంగల్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ రా మా చంద్రమౌళి జీవన సా ఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమేరకు ఈనె ల 22, 24 తేదీల్లో ఖతర్ దేశంలోని దోహాలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తొమ్మిదో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని రామా చంద్రమౌళికి పురస్కారాన్ని అందజేయనున్నారు. -
నకిలీ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ
ఎంజీఎం: హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రైవేట్ ఆప్పత్రుల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీజీఎంసీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అర్హత లేని పలువురు వైద్యులుగా చెలామణీ అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు నిర్వహించారు. హనుమకొండలోని దీన్‌దయాళ్ నగర్లో నకిలీ వైద్యుడు బండి సదానందం, ధన్వంతరి ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడు మిట్టపల్లి సాంబమూర్తి, కాజీపేటలోని దేవి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు కె.ప్రభాకర్ క్లినిక్‌ను తనిఖీ చేసి సదరు నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ చట్టం 34,54 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈసందర్భంగా వరంగల్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ మియా మాట్లాడుతూ.. మెడికల్ షాప్ యజమానులెవరూ ఫార్మసిస్టులు లేకుండా, క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యుల్(హెచ్) మందులు విక్రయించవద్దని సూచించారు. ఎవరైనా నకిలీ వైద్యులకు అనుబంధంగా మెడికల్ షాప్ అనుమతికి సర్టిఫికెట్ ఇచ్చినా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లపై తగు చర్యలు తీసుకోనున్నట్లు, వారి సర్టిఫికెట్ రద్దు చేయాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీతో పాటు ఫార్మసీ కౌన్సిల్‌కి సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేశ్‌కుమార్, కరీంనగర్ జిల్లా హెచ్ఆర్డీఏ సెక్రెటరీ డాక్టర్ రితేశ్, తదితరులు పాల్గొన్నారు. -
‘కామన్ విద్య’ అమలు చేయాలి
● టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ కాళోజీ సెంటర్: రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆది వారం జరిగిన వరంగల్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని, ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలన్నారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా యూ.అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఈదుల వీరస్వామి, ఉపాధ్యక్షులుగా స్వామి, డి.మల్లయ్య, ముజాహిద్ అలీ, కార్యదర్శులుగా బెల్లంకొండ పూర్ణ చందర్, పి.సురేశ్, మనుపాటి వెంకట్, బి.ప్రసాద్, ఆడిట్ కమిటీ కన్వీనర్లుగా కె.బుచ్చాచా రి, రాజన్న, జీఓ కమిటీ బాధ్యులుగా బి.జగన్మోహన్, పి.మల్లికార్జున్, అకడమిక్ సెల్ బాధ్యులుగా ఎంఏకే.తన్వీర్, కె.ఉమేశ్ ఎంపికైనట్లు ఎన్నికల పరిశీలకులు ఎస్.కవిత, కడారి భోగేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో బాధ్యులు జి.వెంకటేశ్వర్లు, మనోహర్, వి.విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
53 శాతం మంది హాజరు
విద్యారణ్యపురి/వరంగల్: గ్రూప్–3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. హనుమకొండ, కాజీపేట, హసన్‌పర్తి మండలాల పరిధిలో 83 సెంటర్లు ఏర్పాటు చేయగా.. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరిగిన మొదటి పేపర్ పరీక్షకు 32,864 మంది అభ్యర్థులు 17,572(53.47శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 3 నుంచి 5.30 గంటలవరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 17,437(53.06శాతం) మంది హాజరయ్యారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించారు. హనుమకొండలోని శ్రీనివాస గురుకుల్ ఉన్నత పాఠశాల సెంటర్‌ను కలెక్టర్ ప్రావీణ్య సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఇదిలా ఉండగా.. ఈనెల 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే పేపర్–3 పరీక్షతో గ్రూప్–3 పరీక్షలు ముగియనున్నాయి. వరంగల్‌లో.. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ఆదివారం జరిగిన గ్రూప్–3 పరీక్షలకు 10,913 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. ఉదయం మొదటి పేపర్ పరీక్షకు 5,513 మంది, మధ్యాహ్నం రెండో పేపర్ పరీక్షకు 5,489 మంది హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఆమె వాగ్దేవి కళాశాల, తాళ్ల పద్మావతి కళాశాల, సిల్వర్ క్రౌన్ ఉన్నత పాఠశాల కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ బత్తిని చంద్రమోహన్, సహాయ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేశ్‌బాబు, జిల్లా బయోమెట్రిక్ ఆఫీసర్ డాక్టర్ శ్యాం తదితరులు ఉన్నారు. గ్రూప్–3 పరీక్షలు ప్రారంభం సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్లు -
బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టింది..
హన్మకొండ చౌరస్తా: బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టింది.. వారు తక్షణమే సైకియాట్రిస్ట్‌కు చూపించుకోవడం మంచిదని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన హైదరాబాద్‌ను అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టిన మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగుల పడి పోతారు.. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేటీఆర్ పనేనని అన్నారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని లక్షమంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రులు పరిశీలించి సభాస్థలి వద్ద వారు మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన అధికారులను విదేషాల్లో దాచారని, కేటీఆర్ విషయంలో నిజాలు తేల్చిన తర్వాతనే చర్యలుంటాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని, అందుకే అధికారులపై దాడులు చేస్తూ.. తాము చేస్తున్న మంచి పనులు, హైడ్రాకు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసిన సకల జనుల సర్వే ఏమైందని ప్రశ్నించిన మంత్రులు.. లిమ్కా బుక్ రికార్డు కోసమే నాడు ఆ ప్రభుత్వం సర్వే చేసిందని ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందించడానికే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తిడుతున్నారు.. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ను తెలంగాణ రెండో రాజధాని చేయడానికి అడుగులు పడుతున్నాయి.. ఇక్కడ రాహుల్‌గాంధీ సభ సక్సెస్ అయింది.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రుల వెంట హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు ఉన్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆర్ట్స్ కాలేజీ సభా స్థలి పరిశీలన -
స్మార్ట్ ట్రబుల్
వరంగల్ అర్బన్: కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు. మాకేంటి అన్నట్లుగా ప్రజాప్రతినిధులు. టెండర్ అగ్రిమెంట్, గడువులతోనైతే సంబంధమే లేదు. నోటీసులు చిత్తు కాగితాలే.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ. ఫలితంగా వరంగల్ తూర్పులోని 9 చోట్ల స్మార్ట్ సిటీ రోడ్డు పనులు అసంపూర్తిగా,ఆగమ్యగోచరంగా మారాయి. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే గడువు ఐదేళ్లు దాటినా, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ పనులు పూర్తి చేసేందుకు 9 నెలల గడువు పొడిగించగా సగం కాలం గడిచింది. వదిలేసిన అసంపూర్తి పనులు గడువులోగా పూర్తి చేస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆకర్షణీయమేది? స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. సప్లమెంటరీలో వరంగల్‌కు ఆకర్షణీయ నగరంగా చోటు దక్కింది. అనేక ప్రాజెక్టుల్లో భాగంగా నగరంలో ప్రధాన రహదారులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రెండో విడతలో 2020లో 11 రోడ్లు రూ. 52.49 కోట్లతో ప్రతిపాదించారు. కాగా.. పది కాలాల పాటు మన్నాల్సిన పనులు ఇష్టారాజ్యంగా మారాయి. సగానికి పైగా సీసీ రోడ్లు, మరో సగం తారు రోడ్లు నిర్మించారు. ఇక రోడ్డుకు ఇరువైపులా హనుమకొండలో నిర్మించిన స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల తరహాలో డక్ట్లు నిర్మించాల్సి ఉంది. భూగర్భ డ్రెయినేజీకి పైపులైన్లు ఏర్పా టు చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా మీదుగా పోచమ్మమైదాన్ వరకు రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించాల్సి ఉంది. కొంత మేరకు నిర్మించి మధ్యలోనే కూల్చివేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే అప్పుడున్న ఎమ్మెల్యేలు, మేయర్, కమిషనర్, ఇంజినీర్లతో జరిగిన ఒప్పందం మేరకు పనులు చేపట్టినట్లు సదరు ఏజెన్సీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. భూగర్భ డ్రెయినేజీ పైపులైన్ల అనుసంధానం అక్కడక్కడా పూర్తి చేయలేదు. పైపులైన్లపై పలు చోట్ల చాంబర్ల మూతలు బిగించలేదు. పుట్‌పాత్‌ల కోసం రోడ్డుకు ఇరువైపులా.. మార్కింగ్ ఇచ్చి సీసీ బ్రిక్స్ నిర్మించారు. కానీ.. ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టలేదు. అస్తవ్యస్తంగా వదిలేసిన ఫుట్‌పాత్‌లపై వ్యాపారులు చాలా చోట్ల కొందరు మెట్లు నిర్మించుకోగా.. మరికొందరు సీసీతో పూడ్చివేశారు. డెకరేటివ్ లైటింగ్ కోసం పోల్స్ ములుగు రోడ్డు నుంచి అక్కడక్కడా పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, ఎస్ఎన్ఎం క్లబ్ వరకు ఏర్పాటు చేశారు. పలు చోట్ల లైట్లను బిగించారు కానీ.. వెలగడం లేదు. మిగతా రోడ్లలో డెకరేటివ్ పోల్స్ వేసి, లైట్లు ఏర్పాటు చేయలేదు. పెడిస్ట్రేషన్ క్రాసింగ్‌లు తదితర పనులు చాలా మేరకు పెండింగ్‌లో ఉన్నాయి. అంతా మా ఇష్టం.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను పరిశీలించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఓ ప్రైవేట్ సంస్థను నియమించింది. ప్రాజెక్టుల మానిటరింగ్ కమిటీ (పీఎంసీ) ఇంజనీర్లు, నిపుణులు సైతం పనులు పరిశీలించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. సీసీ రోడ్ల పనులు జరిగిన కొన్ని నెలలకే కంకర తేలి, గుంతలు పడ్డాయి. ఇవేంటని ప్రశ్నిస్తే పూడ్చివేశారు. అసంపూర్తి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైప్లైన్లు వేసి, చాంబర్ల లింకులను కలపకపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షం కురిసిందంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీగా గుంతలు కలిగి ఉన్న చాంబర్ల వద్ద కనీసం రక్షణ చర్యలు, ప్రమాద హెచ్చరికలు లేకపోపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించకపోవడంతో వాహనదారులు రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. అంతేకాకుండా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఒకతను తన పవర్‌ను ఉపయోగించి.. తన బంధుగణానికే ఈ పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. అతడి ఎమ్మెల్యే పదవి పోయినప్పటికీ బల్దియా ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ రద్దు చేశాం.. వరంగల్‌లో 9 స్మార్ట్‌సిటీ రోడ్ల పనులు గడువులోగా పూర్తి చేయాలని పలుమార్లు ఏజెన్సీకి నోటీసులు జారీ చేశాం. స్పందించకపోవడంతో బోర్డుకు నివేదిస్తే రద్దు చేశారు. తిరిగి టెండర్ నిర్వహించేందుకు ఈఎన్సీకి లేఖ రాశాం. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలో పూర్తి చేయిస్తాం. – ప్రవీణ్ చంద్ర, బల్దియా ఎస్ఈ అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్ ఫుట్‌పాత్‌లు లేక నడకదారుల్లో నరకయాతన ప్రజా ప్రయోజనాలు పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులుఅసంపూర్తి పనులు ఎక్కడెక్కడంటే.. వరంగల్ ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం సెంటర్ వరకు రోడ్డు, డ్రెయినేజీ, ఫుట్‌పాత్, డెకరేటివ్ లైటింగ్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సెంట్రల్ డివైడర్ నిర్మించాల్సి ఉంది. ఎంజీఎం సెంటర్ నుంచి పోచమ్మమైదాన్ కాశిబుగ్గ, వెంకట్రామా థియేటర్ వరకు.. వెంకట్రామ థియేటర్ నుంచి వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ అక్కడి నుంచి హెడ్ పోస్టాఫీస్ వరకు.. వరంగల్ రాంకీ ఎన్క్లేవ్ నుంచి ఎస్ఎన్ క్లబ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు. వరంగల్ చౌరస్తా నుంచి హెడ్ పోస్టాఫీస్ వరకు. హెడ్ పోస్టాఫీస్ నుంచి హంటర్ రోడ్డు వరకు. చౌరస్తా నుంచి మేదరి వాడ హంటర్ రోడ్డు వరకు. ఆర్ఎన్టీ రోడ్డు, వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ వరకు సుమారు 8.68 కిలో మీటర్ల మేరకు పనులు పూర్తి చేయాలి. -
నేడు ఇందిరా మహిళా శక్తి మేళా ప్రారంభం
వరంగల్: హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాను సోమవారం ఉద యం మంత్రి కొండా సురేఖ ప్రారంభించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో వరంగల్, హనుమకొండతో పాటు పలు ప్రాంతాల చేనేత వస్త్రాలు, వివిధ సౌందర్య సాధనాలు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. మహిళా స్వశక్తి సంఘాల సభ్యులచే తయారయ్యే విభిన్న ఉత్పత్తుల గురించి తెలుసుకునే ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈమేళా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఎంజీఎంలో దళారులు
ఎంజీఎం: మంత్రులు వచ్చి పరిశీలించి దిశానిర్దేశం చేసినా.. కలెక్టర్ వరుస తనిఖీలు చేసినా.. వైద్య శాఖ ఉన్నతాధికారులు చివాట్లు పెట్టినా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పాలన గాడిన పడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన రోగికి సకాలంలో వైద్యమందించి జీవం పోస్తామనే నమ్మకాన్ని కల్పించడంలో పరిపాలనాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అఽధికారుల పర్యవేక్షణాలోపంతో ఆస్పత్రి అత్యవసర విభాగ సేవలు అధ్వానంగా తయారు కావడం ఒక ఎత్తు అయితే.. ఆస్పత్రిలో సేవల లోపాలను ఎత్తి చూపుతూ రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా రెఫరల్ వైద్యం నడుస్తు న్న క్రమంలో ఇటీవల ఏకంగా ఓ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ వార్డుకు వచ్చి శాంపిళ్లు తీసుకెళ్లడాన్ని బట్టి గమనిస్తే ఆస్పత్రి పరిపాలనాధికారుల పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. డయాగ్నోస్టిక్స్లపై నిఘా కరువు.. ఎంజీఎం చుట్టూ ఉన్న డయాగ్నోస్టిక్ కేంద్రాలపై వైద్యారోగ్యశాఖ అధికారుల నిఘా పూర్తిగా కరువైంది. ఆస్పత్రికి వచ్చే పేద రోగులే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్న మూడు, నాలుగు డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఆస్పత్రిలో వారి ఏజెంట్లను పెట్టుకుని సిబ్బందితో చేతులు కలిపి ఇక్కడి శాంపిల్స్‌ను ప్రైవేట్‌కు తరలిస్తున్నారు. ఈ తతంగం గత కొన్ని నెలలుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులు ఇలాంటి కేంద్రాలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పేద రోగులు వేడుకుంటున్నారు. అధికారుల పర్యటనలతోనూ మారని తీరు..‘ఎంజీఎం ఆస్పత్రిలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు పర్యటించినా లాభం లేదు. మాకు రక్త పరీక్షలు బయటికి రాస్తున్నారు.. వందల నుంచి వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి’ అని రోగులు లబోదిబోమనడం పరిపాటిగా మారింది. పదుల సంఖ్యలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు సైతం సరిపోరంటూ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ల్యాబ్‌టెక్నీషియన్లను నియమించుకుంటున్నారు. దీనికితోడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రక్త పరీక్షలకు సంబంధించిన కెమికల్స్ సరఫరా చేస్తున్నా.. రక్త పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు ఎందుకు పంపిస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి చుట్టూ నెలకొల్పిన కొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యసిబ్బందితో మిలాఖత్ అయి రోగులకు మాయమాటలు చెప్పి రక్తపరీక్షల శాంపిళ్లను పంపిస్తున్నార న్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో గాడి తప్పిన పాలన ప్రాంగణంలో ప్రైవేట్ ఆస్పత్రుల ఏజెంట్లు ఏకంగా వార్డులనుంచే శాంపిళ్లు సేకరిస్తున్న ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు పర్యవేక్షణలో అధికారులు విఫలం..