breaking news
Automobile
-
టాటా సియెరా డార్క్ ఎడిషన్ లాంచ్
టాటా సియెరా ఎస్‌యూవీకి స్టైలిష్ లుక్ జోడిస్తూ టాటా.కార్స్ ‘డార్క్ ఎడిషన్’ను విడుదల చేసింది. పూర్తిగా బ్లాక్ థీమ్‌తో రూపొందించిన ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా ఉంది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు వచ్చే నెలలో మొదలయ్యే అవకాశం ఉంది.సియెరా డార్క్ ఎడిషన్ ప్యూర్ ఎల్, ప్యూర్ ఎల్ (ఓ), ప్యూర్ ప్లస్ ఎల్, అడ్వెంచర్ ప్లస్ ఎల్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. బయట బ్లాక్ థీమ్‌ను కొనసాగించగా.. ఇంటీరియర్‌లో బ్లాక్–వైలెట్ థీమ్‌ను ఇచ్చారు. పర్పుల్ క్రోమ్ యాక్సెంట్లు సియెరా డార్క్ ప్రత్యేకతను మరింత పెంచుతాయి. -
హోండా QC3 లాంచ్: 142 కిమీ రేంజ్!
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. భారతదేశంలో తన మూడవ ఎలక్ట్రిక్ టూ-వీలర్ అయిన హోండా 'క్యూసీ3'ని లాంచ్ చేసింది. దీని ధర రూ.1.35 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇది టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా సిరీస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.హోండా QC3 ప్రారంభంలో.. ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లంలోని ఎంపిక చేసిన హోండా రెడ్వింగ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. త్వరలోనే దేశంలోని ఇతర నగరాలకు కూడా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. కాగా ఈ స్కూటర్ 142 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.కొత్త హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్ కనెక్టెడ్ ఫీచర్లతో పాటు సీటు కింద 32-లీటర్ల స్టోరేజ్ కంపార్ట్మెంట్ను కలిగి ఉంది. దీనిని ప్రత్యేకంగా రోజువారీ వినియోగానికి, పట్టణ ప్రయాణ అవసరాలను తీర్చడానికి కంపెనీ అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఇది మ్యాట్ ఫోటాన్ గ్రే మెటాలిక్, పెర్ల్ ప్రెషియస్ వైట్, పెర్ల్ షాలో బ్లూ, పెర్ల్ సైరన్ బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.QC3లో కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన 5 అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఈ డిస్ప్లే ముఖ్యమైన వాహన సమాచారాన్ని అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలలో అదనపు సౌకర్యం కోసం టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫంక్షన్లకు కూడా మద్దతు ఇస్తుంది.ఇదీ చదవండి: లాయర్ జాబ్‌కు గుడ్‌బై.. కుక్కలు నడిపిస్తూ రోజుకు రూ.51 వేలు సంపాదన! -
ఈవీల వాడకంలో ఢిల్లీయే బాస్!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) వాడకం, మౌలిక వసతుల కల్పనలో దేశ రాజధాని ఢిల్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ (ఐఈఎంఐ) 2025’ నివేదిక ప్రకారం... ఢిల్లీ అత్యధికంగా 84 స్కోరు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (78), కర్ణాటక (73), చండీగఢ్ (71), గోవా (65) ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి.రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ రవాణాకు సంబంధించిన విధాన రూపకల్పనతో పాటు క్షేత్రస్థాయి అమలు ఫలితాలను అంచనా వేసేందుకు ఈవీ ఇండెక్స్‌ని రూపొందించారు. ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ పురోగతి (50% వెయిటేజీ), ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సన్నద్ధత (30% వెయిటేజీ), ఈవీ పరిశోధన, ఆవిష్కరణలు (20% వెయిటేజీ) అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా రాష్ట్రాలకు స్కోరింగ్ ఇచ్చారు.ఈవీ ఇండెక్స్ నివేదికలో ముఖ్యాంశాలు...పెద్ద రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, కర్ణాటక ముందంజలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల విభాగంలో మణిపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్రపాలిత ప్రాంతాలు, సిటీ స్టేట్లలో ఢిల్లీ, చండీగఢ్, గోవాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. 2024తో పోలిస్తే 2025 నాటికి మధ్యప్రదేశ్ గణనీయమైన వృద్ధిని సాధించి 23వ స్థానం నుంచి ఏకంగా 7వ స్థానానికి ఎగబాకింది. ఛార్జింగ్ వసతుల కల్పనలో కర్ణాటక దేశంలోనే అత్యధికంగా 97 స్కోరు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. డిసెంబర్ 2022 నాటికి దేశంలో 5,151గా ఉన్న పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య జూన్ 2025 నాటికి ఏకంగా 29,000 దాటింది.పర్యావరణం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావందేశీయ రవాణా రంగాన్ని కార్బన్ రహితంగా మార్చేందుకు ఈవీల విప్లవం అత్యంత కీలకమైనదని నివేదిక స్పష్టం చేసింది. రోడ్డు రవాణా రంగం వల్ల దేశంలో ఇంధన ఆధారిత కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 12%, నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు 18% వెలువడుతున్నాయి. ఈవీల వినియోగం పెరగడంతో ఈ ఉద్గారాలు గణనీయంగా తగ్గనున్నాయని నివేదిక తెలిపింది. దేశ జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటా 7.1 శాతం కాగా, తయారీ రంగ ఉత్పత్తుల్లో సగానికి పైగా వాటా ఉంది. ఇది సుమారు 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. ఈవీ మార్పు ఆటో మొబైల్ రంగానికి సుస్థిర భవిష్యత్తును అందిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది.పశ్చిమాసియా సంక్షోభం ఈవీలకు కీలక మలుపు నివేదికను విడుదల చేసిన నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ... అమెరికాలో కొత్త కార్ల విక్రయాల్లో ఈవీల వాటా 10 శాతం, యూరప్‌లో 25 శాతం, చైనాలో 50 శాతానికి పైగా ఉందన్నారు. 1970ల నాటి చమురు సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సామర్థ్యానికి ఎలా కారణమైందో, ఇటీవలి పశ్చిమాసియా సంక్షోభం కూడా ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి పెద్ద మార్పుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. 2018 నాటికి భారత వాహన విక్రయాల్లో ఈవీల వాటా కేవలం 0.5 శాతంగా ఉండగా, 2025–26 నాటికి అది 8.25 శాతానికి చేరిందని, ప్రస్తుతం రోడ్లపై 87 లక్షలకు పైగా ఈవీలు తిరుగుతున్నాయని గౌబా తెలిపారు.ఇదీ చదవండి: వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి! -
ఈవీ బ్యాటరీల్లో సంచలనం.. ఛాయ్ తాగేలోపు ఫుల్ ఛార్జింగ్!
ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. అయినప్పటికీ ఎక్కువ దూరం వెళ్లలేకపోవడం, ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాల వల్ల చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఛార్జింగ్ సమయాన్ని మరింత తగ్గించే దిశగా సంచలన టెక్నాలజీతో ముందుకు వచ్చింది చైనాకు చెందిన ఓ బ్యాటరీ తయారీ సంస్థ.చైనా బ్యాటరీ తయారీ సంస్థ సన్వోడా (Sunwoda EVB) ‘15సీ స్మార్ట్ ఫ్లాష్ ఛార్జింగ్’ (15C Smart Flash Charging) అనే అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, గది ఉష్ణోగ్రత వద్ద కేవలం ఒక నిమిషం ఛార్జింగ్‌తో సుమారు 100 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ పొందవచ్చు. అలాగే బ్యాటరీని 10 శాతం నుంచి 70 శాతానికి 5 నిమిషాల్లో, 10 శాతం నుంచి 97 శాతానికి కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదని సన్వోడా చెబుతోంది. ఈ టెక్నాలజీని సెప్టెంబర్ 16–17న చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ జావోజువాంగ్‌లో జరిగిన బ్యాటరీ పరిశ్రమ సదస్సులో ప్రదర్శించింది.ఈ టెక్నాలజీలో మరో కీలక అంశం ఉష్ణోగ్రత నియంత్రణ. అత్యంత వేగంగా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీలో అధిక వేడి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. దీనిని నియంత్రించేందుకు సన్వోడా తన ఫ్లాష్ ఛార్జింగ్ వ్యవస్థలో అధిక సామర్థ్యం కలిగిన లిక్విడ్-కూల్డ్ ఛార్జింగ్ టెర్మినల్స్, మెగావాట్ స్థాయి ఛార్జింగ్ యూనిట్లు, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు, AI ఆధారిత క్లౌడ్ కంట్రోల్ వంటి సాంకేతికతలను కలిపింది.చలికాలంలోనూ ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమవుతుందని కంపెనీ చెబుతోంది. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా 10 నుంచి 97 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 15 నిమిషాలు చాలని సంస్థ వెల్లడించింది. సాధారణ పరిస్థితుల్లో 700 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్‌లకు ఈ వ్యవస్థను ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఈవీ వాహనదారుల ఇబ్బందులు తీరిపోతాయి. ప్రయాణం మధ్యలో ఎక్కువ సేపు ఛార్జింగ్ కోసం వేచిఉండాల్సిన అవసరం ఉండదు. ఛాయ్ తాగినంత సేపులో ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ దాదాపు పూర్తవుతుంది!ఇదీ చదవండి: కియా కొత్త సీఎన్జీ కార్లు వచ్చేశాయ్.. ధరల్లో భారీ తేడా! -
పెరిగిన సఫారీ ధరలు: కొత్త రేట్లు ఇలా..
దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన మూడు వరుసల సఫారీ ధర పెరిగింది. ఫలితంగా.. ఈ సంవత్సరంలో ఈ SUV ధర పెరగడం ఇది మూడవసారి.మార్కెట్లో అమ్ముడవుతున్న టాటా సఫారీ.. పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. కాగా ఇది త్వరలోనే ఈవీ రూపంలో కూడా లాంచ్ కావడానికి సిద్దమవుతోంది. అయితే ఈ మోడల్ మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.రూ.25 వేలు పెరుగుదల తరువాత టాటా సఫారీ ధర రూ. 13.40-26.91 లక్షల మధ్య ఉంది. ధరలు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతాయి. కాబట్టి కొత్త ధరలు గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లేదా డీలర్షిప్ సందర్శించవచ్చు.టాటా సఫారీలో రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. అవి 1.5-లీటర్ టర్బో పెట్రోల్ (168bhp/280Nm), రెండు 2.0-లీటర్ డీజిల్ (168bhp/350Nm). ఇవి రెండూ ఉత్తమ పనితీరును అందిస్తాయి.ఫీచర్లవిషయానికి వస్తే.. సఫారీలో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, రియర్ సన్‌బ్లైండ్‌లు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, జేబీఎల్ స్పీకర్లతో కూడిన హర్మాన్ కార్డాన్ ఆడియో, ఎలక్ట్రిక్ బాస్ మోడ్, వైర్లెస్ కనెక్టివిటీ ఉన్నాయి. భద్రతా ఫీచర్లలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, లెవెల్ 2 ఏడీఏఎస్, 360° కెమెరా, ఏబీఎస్, నాలుగు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. -
BMW ఫుల్‌ఫామ్ తెలుసా?.. పేరు వెనుక ఉన్న కథ ఇదే!
ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో బీఎండబ్ల్యూ అనేది చాలామందికి తెలిసిన.. ప్రసిద్ధి చెందిన పేరు. లగ్జరీ కార్లు, బైక్‌లు, అత్యాధునిక ఇంజినీరింగ్ వంటి వాటిలో ఈ బ్రాండుకు మంచి గుర్తింపు ఉంది. చాలా మందికి బీఎండబ్ల్యూ లోగో, కార్లు తెలుసు కానీ.. BMW అనే మూడు అక్షరాల అసలు అర్థం ఏమిటి? అనే విషయం మాత్రం చాలామందికి తెలిసి ఉండదు. ఈ పేరు వెనుక జర్మనీకి చెందిన సంస్థ చరిత్ర, ఇంజినీరింగ్ వారసత్వం దాగి ఉంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.BMW ఫుల్ఫామ్బీఎండబ్ల్యూ పూర్తి పేరు Bayerische Motoren Werke. దీనిని ఇంగ్లిష్‌లో బవేరియన్ మోటార్ వర్క్స్ (Bavarian Motor Works) అని అనువదిస్తారు. ఇందులో Bayerische అంటే జర్మనీలోని బవేరియా ప్రాంతానికి చెందినది, Motoren అంటే ఇంజిన్లు లేదా మోటార్లు, Werke అంటే పరిశ్రమ లేదా కర్మాగారం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. బవేరియా ప్రాంతంలో ఇంజిన్లను తయారు చేసే సంస్థ అనే అర్థం వస్తుంది.బీఎండబ్ల్యూ ప్రయాణం ఇలా..బీఎండబ్ల్యూ అంటే లగ్జరీ కార్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ కంపెనీ ప్రయాణం మొదట్లో కార్ల తయారీతో ప్రారంభం కాలేదు. 1916లో జర్మనీలో ప్రారంభమైన బీఎండబ్ల్యూ, తొలినాళ్లలో ప్రధానంగా విమానాల ఇంజిన్ల తయారీపై దృష్టి పెట్టింది. అప్పట్లో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో, నమ్మకమైన ఇంజిన్ల తయారీలో బీఎండబ్ల్యూ కూడా తన వంతు పాత్ర పోషించింది.పేరులోనే కంపెనీ చరిత్ర!బీఎండబ్ల్యూకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కంపెనీ పేరు దాని పుట్టుకను, మొదటి వ్యాపారాన్ని ప్రతిబింబిస్తుంది. సంస్థ జర్మనీలోని బవేరియా ప్రాంతంలో ఏర్పడటం వల్లే Bayerische అనే పదం పేరులోకి వచ్చింది. కాలక్రమేణా బీఎండబ్ల్యూ తన వ్యాపారాన్ని విస్తరించి కార్లు, మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారు చేయడం ప్రారంభించింది. అయినప్పటికీ.. సంస్థకు ప్రారంభం నుంచి ఉన్న “Bayerische Motoren Werke” అనే పేరు అలాగే కొనసాగుతోంది. అందుకే బీఎండబ్ల్యూ పేరు కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదు.. దాని ఇంజినీరింగ్ మూలాలు, జర్మన్ వారసత్వానికి గుర్తుగా కూడా నిలిచింది. -
కియా కొత్త సీఎన్జీ కార్లు వచ్చేశాయ్.. ధరల్లో భారీ తేడా!
కియా ఇండియా తన పాపులర్ ఎమ్పీవీలైన క్యారెన్స్, క్యారెన్స్ క్లావిస్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ వేరియంట్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. క్యారెన్స్ సీఎన్జీ ప్రారంభ ధర రూ.12.12 లక్షలు, క్యారెన్స్ క్లావిస్ సీఎన్జీ ధర రూ.12.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఏడు సీట్ల ఎమ్‌పీవీ విభాగంలో తక్కువ ఇంధన వ్యయాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ వేరియంట్లను ప్రవేశపెట్టింది.మూడు వేరియంట్లు.. ధరలు ఇలా..క్యారెన్స్ సీఎన్జీని ప్రీమియం (ఓ) ట్రిమ్‌లో మాత్రమే అందిస్తోంది. దీని ధర రూ.12.12 లక్షలు. క్యారెన్స్ క్లావిస్ సీఎన్జీని హెచ్‌టీఈ, హెచ్‌టీఈ (ఓ) అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. హెచ్‌టీఈ ధర రూ.12.39 లక్షలు, హెచ్‌టీఈ (ఓ) ధర రూ.13.35 లక్షలు. సంబంధిత పెట్రోల్-మాన్యువల్ వేరియంట్లతో పోలిస్తే సీఎన్జీ మోడళ్ల ధర సుమారు రూ.1 లక్ష అధికంగా ఉంది.ఈ విభాగంలో మారుతి ఎర్టిగా సీఎన్జీ ధర రూ.10.94 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండగా, టయోటా రూమియన్ సీఎన్జీ రూ.11.69 లక్షల నుంచి, మారుతి ఎక్స్ఎల్6 సీఎన్జీ రూ.12.61 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.1.5 లీటర్ ఇంజిన్.. 6-స్పీడ్ మాన్యువల్క్యారెన్స్, క్యారెన్స్ క్లావిస్ సీఎన్జీ రెండింటిలోనూ కియా 1.5 లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్నే ఉపయోగించింది. సీఎన్జీకి అనుగుణంగా ఇంజిన్‌ను రీకాలిబ్రేట్ చేసింది. సీఎన్జీ మోడ్‌లో ఈ ఇంజిన్ పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే 19 బీహెచ్పీ తక్కువ పవర్, 21 ఎన్ఎం తక్కువ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే సీఎన్జీ వేరియంట్లు లభిస్తాయి. పెట్రోల్ మోడళ్లలో లభించే ఐఎంటీ, డీసీటీ ఆప్షన్లు సీఎన్జీ వెర్షన్లలో లేవు.అయితే, ఈ కొత్త సీఎన్జీ వేరియంట్లకు సంబంధించిన అధికారిక మైలేజీ గణాంకాలను కియా ఇంకా వెల్లడించలేదు. పెట్రోల్ సిస్టమ్‌కు అదనంగా 60 లీటర్ల సీఎన్జీ ట్యాంక్‌ను అమర్చింది. 4.2 అంగుళాల కలర్ టీఎఫ్టీ ఎంఐడీలో ఫ్యూయల్-ఛేంజ్ స్విచ్‌తో పాటు సీఎన్జీకి ప్రత్యేకమైన డిస్టెన్స్-టు-ఎంప్టీ సమాచారం ఉంటుంది.తగ్గిన బూట్ స్పేస్సీఎన్జీ ట్యాంక్‌ను రెండు మోడళ్లలోనూ బూట్ ఫ్లోర్ కింద అమర్చారు. దీంతో మూడు వరుసల సీట్లు వినియోగంలో ఉన్నప్పుడు బూట్ సామర్థ్యం 216 లీటర్ల నుంచి 116 లీటర్లకు తగ్గుతుంది. అయితే స్పేర్ వీల్‌ను అండర్బాడీ కిందనే ఉంచారు.సీఎన్జీ ట్యాంక్ కారణంగా పెరిగిన బరువుకు అనుగుణంగా సస్పెన్షన్‌ను రీట్యూన్ చేసినట్లు కియా తెలిపింది. ముందు డిస్క్ బ్రేక్‌లను 16 అంగుళాల యూనిట్లకు అప్‌గ్రేడ్ చేసి, ఆర్16 వీల్స్‌ను కూడా అందించింది. సీఎన్జీపై డ్రైవబిలిటీ మెరుగ్గా ఉండేలా ఇంజిన్ కంట్రోల్‌ను సైతం సర్దుబాటు చేసింది.సీఎన్జీకి సంబంధించిన ఈ మార్పులు మినహా, మిగిలిన ఫీచర్ల విషయంలో సంబంధిత పెట్రోల్ వేరియంట్లతో సమానమైన పరికరాలను అందిస్తోంది. దీంతో మారుతి సుజుకి, టయోటా తర్వాత ఏడు సీట్ల ఎమ్‌పీవీ విభాగంలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్‌ను అందిస్తున్న మరో సంస్థగా కియా నిలిచింది.ఇదీ చదవండి: కియా నుంచి భారీ ఎలక్ట్రిక్ వ్యాన్ వచ్చేస్తోంది.. -
మారుతి స్విఫ్ట్ సీఎన్జీ లాంచ్: రూ.7.92 లక్షలు!
మారుతి సుజుకి ఒకేసారి మూడు కొత్త మోడళ్లతో సీఎన్జీ ఆటోమాటిక్ (CNG+AMT) విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందులో స్విఫ్ట్ సీఎన్జీ ఒకటి. దీని ధర రూ. 7.92 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతోపాటు బాలెనో, డిజైర్ కూడా ఈ విభాగంలో లాంచ్ అయ్యాయి.స్విఫ్ట్ సీఎన్జీ ఆటోమాటిక్ వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ వేరియంట్లలో లభిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 15-అంగుళాల టైర్లు, ఫాలో-మీ-హోమ్ లైట్లు, ఎత్తు సర్దుబాటు చేసుకోగల డ్రైవర్ సీటు, ఆరు స్పీకర్లు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వాషర్‌తో కూడిన రియర్ వైపర్, ఆటోమేటిక్ ఏసీ, రియర్ ఏసీ వెంట్లు, సర్దుబాటు చేసుకోగల రియర్-సీట్ హెడ్‌రెస్ట్‌లు, 60:40 నిష్పత్తిలో మడతపెట్టగల రెండవ వరుస సీట్లు, ఫుల్ ఎల్ఈడీ లైట్ సెటప్, రియర్ యూఎస్బీ పోర్ట్‌ల వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని సీఎన్జీ ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్లు.స్విఫ్ట్ సీఎన్జీ మోడ్‌లో 1.2 లీటర్ మోటార్ ద్వారా 68.74 bhp పవర్, 101.8 Nm టార్క్ పవర్ అందిస్తుంది. అయితే పెట్రోల్ మోడ్ అవుట్‌పుట్ 81.74 bhp/112.4 Nmగా ఉంది. ఈ సెటప్‌కు 5AMT సిస్టమ్ జత చేయబడింది. ఇది 35.34km/kg మైలేజ్ అందిస్తుందని సమాచారం.ఇదీ చదవండి: భారత్‌లోకి పవర్ఫుల్ ఎలక్ట్రిక్ కారు! -
భూటాన్ ప్రభుత్వానికి 54 కార్లు!
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.. థింఫులో భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గేకు 54 మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e) ఎలక్ట్రిక్ కార్లను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.జైశంకర్ రెండు రోజుల భూటాన్ పర్యటన సందర్భంగా.. ఈ వాహనాలను అప్పగించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి, ఇతర సీనియర్ నాయకులతో ఇంధనం, కనెక్టివిటీ.. విస్తృత ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. 54 ఎలక్ట్రిక్ వాహనాలను అప్పగించడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, ఈ-మొబిలిటీ.. సుస్థిర రవాణా రంగాలలో భూటాన్ సాధిస్తున్న పురోగతికి భారతదేశం మద్దతు ఇస్తోందని డాక్టర్ జైశంకర్ సోషల్ మీడియాలో తెలిపారు.మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈఎక్స్ఈవీ 9ఈ అనేది మహీంద్రా కంపెనీకి చెందిన ప్రత్యేకమైన INGLO ఆర్కిటెక్చర్‌పై నిర్మితమయ్యాయి. ఇది ప్రత్యేకంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్ల కోసం రూపొందించిన టెక్నాలజీ. ప్యాక్ టూ వేరియంట్ 59 కిలోవాట్ LFP బ్యాటరీ ప్యాక్‌ను.. వెనుక యాక్సిల్‌పై అమర్చిన ఒకే ఒక పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. ఇది దీనిని రియర్ వీల్ డ్రైవ్ SUVగా చేస్తుంది.ఈ మోటార్ 228 bhp పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. రేంజ్ విషయానికి వస్తే.. 59 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 542 కిమీ రేంజ్ అందిస్తుంది. ఎక్స్ఈవీ 9ఈ 140 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, అనుకూల పరిస్థితులలో బ్యాటరీ సుమారు 20 నిమిషాల్లో 20 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ అవ్వగలదు. AC ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర భారతదేశంలో రూ. 21.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).Delighted to hand over 54 ‘Made in India’ electric vehicles to PM @tsheringtobgay. India is supporting Bhutan’s advances towards e-mobility and sustainability transport. 🇮🇳 🇧🇹 pic.twitter.com/RjgtftUzI2— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 17, 2026 -
భారత్‌లోకి పవర్ఫుల్ ఎలక్ట్రిక్ కారు!
చైనా ఆటోమొబైల్ తయారీ సంస్థ డెంజా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. డీ9 లగ్జరీ ఎంపీవీకి అదనంగా.. ఈ సంస్థ జెడ్9 జీటీ హై-పెర్ఫార్మెన్స్ ఫాస్ట్‌బ్యాక్‌ను కూడా దేశీయ విఫణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం.డెంజా జెడ్9 జీటీ అనేది నాలుగు డోర్ల ఫాస్ట్‌బ్యాక్, ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. భారతదేశంలో డెంజా ఈవీ వేరియంట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 1,140 Bhp పవర్ ఉత్పత్తి చేసే మూడు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా పనిచేస్తుంది. ఈ కారు 2.7 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుందని, గరిష్ట వేగం 270 km/h ఉంటుందని కంపెనీ పేర్కొంది.జెడ్9 జీటీ 122.5 kWh బ్యాటరీ ద్వారా 600 కి.మీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది 1,500 kW అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, ఇది కేవలం 9 నిమిషాల్లో బ్యాటరీని 10-97% వరకు ఛార్జ్ చేయగలదు. భారతదేశంలో లాంచ్ అయిన తరువాత, ఇది టయోటా వెల్‌ఫైర్‌తో పోటీ పడే అవకాశం ఉంది. -
సియెర్రా లెజెండ్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
టాటా మోటార్స్ తన సియెర్రా కారును లెజెండ్ సిరీస్ పేరుతో కొత్త లైనప్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వేరియంట్ డిజైన్ ఎలా ఉంది?, అప్డేటెడ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా?, అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.లెజెండ్ సిరీస్ ఇప్పటికే ఉన్న సియెర్రాతో పాటు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. డిజైన్ విషయంలో చెప్పుకోదగ్గ అప్డేట్ లేనప్పటికీ.. కొన్ని ప్రీమియం ఫీచర్స్ పొందినట్లు తెలుస్తోంది. ఇది ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే, కూర్గ్ క్లౌడ్స్‌తో సహా పలు రంగుల ఎంపికలతో లభిస్తుంది.లెజెండ్ సిరీస్‌లో లెదరెట్ సీట్లు, లెదరెట్ డోర్ ట్రిమ్‌లు, ఆర్మ్‌రెస్ట్‌లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటో ఫోల్డింగ్ ORVMలు, ఫుల్ కవర్లతో కూడిన 17 ఇంచెస్ స్టీల్ వీల్స్, రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ప్రామాణిక ఫీచర్లతో ప్రధాన భద్రతా అంశాలు యథాతథంగా కొనసాగుతాయి.టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎనిమిది స్పీకర్ ఆడియో, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవ్ మోడ్లు, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రియర్ వాష్-వైప్ వంటివి లభిస్తాయి. ఫీచర్స్ అనేవి ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి.లెజెండ్ సిరీస్ కోసం పవర్‌ట్రెయిన్ ఎంపికలు యథాతథంగా కొనసాగుతున్నాయి. వేరియంట్‌ను బట్టి 6 మాన్యువల్, 6 ఆటోమాటిక్, 7DCA ఎంపికలతో పాటు రెవోట్రాన్ 1.5 లీటర్ పెట్రోల్, క్రయోజెట్ 1.5 లీటర్ డీజిల్, హైపెరియన్ 1.5 లీటర్ TGDI ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: పాత రూ.10 నోటు చూశారా.. ఈ విషయం తెలుసా? -
అందుకే.. గ్రాండ్ విటారా ధరలు పెరిగాయ్!
మారుతి సుజుకి ఈ నెల ప్రారంభం నుంచి గ్రాండ్ విటారా ధరలను కనిష్టంగా రూ.5000 పెంచింది. పెంపు తరువాత.. అన్ని వేరియంట్ల ధరల్లో మార్పులు జరిగాయి. ఈ ప్రభావం 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ మోడళ్లతో పాటు సీఎన్జీ వేరియంట్లపై కూడా పడుతుంది. ముడిసరుకుల ధరలు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను సవరించినట్లు వెల్లడించింది.గ్రాండ్ విటారా అనేది మారుతి మిడ్ సైజ్ ఎస్యూవీ. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టయోటా అర్బన్ క్రూయిజర్, టాటా కర్వ్, టాటా సియెర్రా వంటి వాహనాలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది పెట్రోల్, హైబ్రిడ్, CNG పవర్ట్రెయిన్లతో లభిస్తుంది. ఈ కారు 2027లో కొంత అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఏడీఏఎస్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త సిక్స్-స్పీడ్ MT వంటివి రానున్నాయి.ఇదీ చదవండి: పెరిగిన డిజైర్ ధరలు: కొత్త రేట్లు ఇలా.. -
కియా నుంచి భారీ ఎలక్ట్రిక్ వ్యాన్ వచ్చేస్తోంది..
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన వాణిజ్య వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తోంది కియా. తన ప్రతిష్టాత్మక 'ప్లాట్‌ఫారమ్ బియాండ్ వెహికల్'(PBV) శ్రేణిలో భాగంగా రెండవ ఎలక్ట్రిక్ వ్యాన్ ‘PV7’ ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఇదివరకే విడుదలైన చిన్న మోడల్ PV5 తర్వాత, భారీ సైజులో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ వ్యాపార, రవాణా రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.బ్యాటరీ, రేంజ్.. ఛార్జింగ్పవర్ అండ్ మోటార్: ఇందులో ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండి, దాదాపు 268 హెచ్‌పీ (200 kW) పవర్, 420 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.బ్యాటరీ ఆప్షన్లు: ఇది 71.5 కిలోవాట్లు, 96.2 కిలోవాట్లు సామర్థ్యంగల NCM (నికెల్-కోబాల్ట్-మాంగనీస్) బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది.డ్రైవింగ్ రేంజ్: ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే WLTP ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 460 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.ఫాస్ట్ ఛార్జింగ్: వ్యాన్‌ను 800V E-GMP.S ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. 350kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ 10% నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది.డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్స్: వాణిజ్యపరంగా సులభంగా ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ముందు వైపు AC/DC ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు వెనుక వైపు ఆప్షనల్ AC ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు.అదనపు సాంకేతికత: ఇందులో V2L (వెహికల్-టు-లోడ్) టెక్నాలజీ ఉంది. దీని ద్వారా వాహనం బ్యాటరీ నుంచి బయటి ఎలక్ట్రానిక్ వస్తువులు, పవర్ టూల్స్‌కు విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్‌ను కూడా తీసుకరానున్నారు.పరిమాణం, డిజైన్చిన్న మోడల్ PV5 డిజైన్ థీమ్‌తోనే వచ్చినప్పటికీ, PV7 భారీ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. పొడవు 5,350 మిమీ, వెడల్పు 1,995 మిమీ, ఎత్తు 1,990 మిమీ, వీల్‌బేస్ 3,500 మిమీ ఉంటుంది. ముందు భాగంలో సన్నని ఎల్ఈడీ హెడ్లైట్లు, సిల్వర్ యాసెంట్లతో కూడిన బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, C-ఆకారపు ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) దీనికి ఆధునిక లుక్‌ను ఇస్తాయి. ప్రయాణికుల వెర్షన్లో సాంప్రదాయ లిఫ్ట్-అప్ టైల్గేట్ ఉండగా, కార్గో మోడల్లో సామాన్లు వేగంగా నింపేందుకు వీలుగా ట్విన్-స్వింగ్ టైల్గేట్ ఆప్షన్ కూడా కలదు.ప్యాసింజర్ & కార్గో మోడళ్లుప్యాసింజర్ వెర్షన్: అత్యధిక మార్కెట్లలో 7 నుండి 9 సీట్ల కాన్ఫిగరేషన్‌తో రానుంది. అయితే దక్షిణ కొరియాలో 11 సీట్ల వెర్షన్ అందుబాటులోకి రానుంది. అవసరాన్ని బట్టి తీసివేసేందుకు (Removable) వీలైన సీటింగ్ అమరిక ఉంటుంది.కార్గో వెర్షన్: వ్యాపార అవసరాల కోసం రూపొందించిన ఈ మోడల్ 1,200 కిలోల వరకు పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాంపాక్ట్, లాంగ్, హై-రూఫ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. సామాన్ల బరువును బట్టి వాహనం నడిచే విధానాన్ని సర్దుబాటు చేసే ‘హెవీ-లోడ్ డ్రైవింగ్ మోడ్’ కూడా ఇందులో ఇచ్చారు.ఇంటీరియర్, ఇన్ఫోటైన్మెంట్ & సేఫ్టీకనెక్టివిటీ: ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ ఆధారంగా పనిచేసే 14.6 అంగుళాల బిగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంటాయి.ఫీచర్స్: క్యాబిన్లో యాంబియంట్ లైటింగ్, వెనుక ప్రయాణికులకు రూఫ్-మౌంటెడ్ ఎస్సీ వెంట్స్, ప్రతీ సీటు వద్ద100W USB-C ఛార్జింగ్ పోర్టులు ఏర్పాటు చేశారు.సేఫ్టీ: ప్రయాణికుల భద్రత కోసం పైకప్పులో కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌తో సహా మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.విడుదల ఎప్పుడంటే?కియా PV7 ఎలక్ట్రిక్ వ్యాన్‌ను 2027 ద్వితీయార్థంలో ముందుగా దక్షిణ కొరియా, యూరప్ మార్కెట్లలో లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం దీనిని భారతదేశంలో విడుదల చేసే ఆలోచన ఏదీ లేదని సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కియా కొత్త కార్లు.. లాంచ్‌కు ముందే బుకింగ్‌లు -
ఆగస్టులో ‘ఆటో’ జోరు.. ఆల్‌టైమ్ రికార్డు
దేశీయ ఆటోమొబైల్ రంగం ఆగస్టులో రికార్డు స్థాయి విక్రయాలతో అదరగొట్టింది. వాహన తయారీ సంస్థల నుంచి డీలర్లకు సరఫరా అయ్యే ప్యాసింజర్ వాహనాల పంపిణీ (డిస్పాచ్)లు ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన ఏకంగా 36.5 శాతం పెరిగి 4,39,309 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది (2025) ఆగస్టులో ఇవి 3,21,901 యూనిట్లుగా నమోదైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది.ద్విచక్ర వాహన అమ్మకాలు ఆగస్టులో 10.5 శాతం వృద్ధితో 20,34,698 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 18,41,954 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే త్రీ–వీలర్ల డిస్పాచ్‌లు సైతం 22.8 శాతం పుంజుకుని 93,764 యూనిట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది నమోదైన 76,324 యూనిట్లతో పోలిస్తే ఇది మెరుగైన వృద్దిగా ఉంది. ‘‘ఆగస్టు నెలలో ప్యాసింజర్ వాహనాలు, టూవీలర్, త్రీ–వీలర్ విక్రయాలు ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయి (ఆల్‌టైమ్ హై)ని నమోదు చేశాయి. గతేడాది (2025) బేస్ ఎఫెక్ట్ తక్కువగా ఉండటం కూడా ప్రస్తుత ఆగస్టు రికార్డు వృద్ధికి దున్నుగా నిలిచింది. దేశీయ మార్కెట్లో వాహన డిమాండ్ వాతావరణం బలంగా ఉంది. గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం, సులభతర రుణ వసతులు, ప్రత్యామ్నాయ ఇంధన (ఈవీ, సీఎన్జీ) వాహనాలకు ఆదరణ పెరగడం ఆటో రంగానికి కలిసివచ్చింది. రాబోయే పండుగల సీజన్ డిమాండ్ ఈ త్రైమాసికం (క్యూ2) వాహన విక్రయాలను మరింత పెంచుతందనే నమ్మకముంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
పెరిగిన డిజైర్ ధరలు: కొత్త రేట్లు ఇలా..
మారుతి సుజుకి తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను పెంచింది. ఇందులో భాగంగా డిజైర్ ధరను కూడా సవరించింది. వేరియంట్‌ను బట్టి, ఈ కాంపాక్ట్ సెడాన్ ధర ఇప్పుడు రూ. 7,500 వరకు పెరిగింది.రేట్లు పెరిగిన తరువాత.. ఎంట్రీ లెవల్ డిజైర్ ఎల్ఎక్స్ఐ ధర రూ. 6.30 లక్షల వద్ద, టాప్ స్పెక్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 9.41 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్దకు చేరాయి. సీఎన్జీ వేరియంట్ల ధరలు కూడా సవరించారు. దీంతో వీటి ధరలు రూ. 8.18 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.వేరియంట్‌ను బట్టి మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో పాటు, డిజైర్ పెట్రోల్.. సీఎన్జీ పవర్ట్రెయిన్లతో లభిస్తోంది. ఇది భారత మార్కెట్లో హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి కార్లకు అమ్మకాల్లో గట్టి పోటీ ఇస్తోంది. -
టోల్ ప్లాజాల్లో కొత్త విధానం.. వాహనదారులకు భారీ ఊరట!
దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.20,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు అదనపు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సెప్టెంబర్ 11న ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల కోసం ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నారు. వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా టోల్ మొత్తాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో చెల్లించేందుకు ఇది ఉపయోగపడుతోంది. దీని వల్ల టోల్ వసూళ్లలో కూడా గణనీయమైన మార్పు వచ్చిందని గడ్కరీ తెలిపారు. ఫాస్ట్‌ట్యాగ్ అమలు తర్వాత టోల్ ప్లాజాల ఆదాయం సుమారు 10 శాతం పెరిగి, గతంలో ఉన్న రూ.7,000 కోట్ల స్థాయి నుంచి ప్రస్తుతం రూ.82,000 కోట్లకు పైగా చేరిందని వెల్లడించారు.బ్యారియర్-ఫ్రీ టోల్ ప్లాజాలురానున్న రోజుల్లో.. బ్యారియర్-ఫ్రీ టోల్ ప్లాజాలు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా టోల్ వసూలు చేసే ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే మరో 10 శాతం మేర ఆదాయం పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీని ద్వారా అదనంగా రూ.7,000 కోట్ల నుంచి రూ.8,000 కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేశారు.టోల్ ప్లాజాలను నిర్వహించే ఖర్చు కూడా గణనీయంగా తగ్గిందని గడ్కరీ చెప్పారు. గతంలో టోల్ వసూళ్ల నిర్వహణకు దాదాపు 12 శాతం వరకు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం అది కేవలం 2 నుంచి 3 శాతానికి తగ్గిందని తెలిపారు. అంటే.. టెక్నాలజీ ఆధారిత టోల్ వసూళ్ల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గుతోందని పేర్కొన్నారు.వచ్చే ఏడాది మార్చి నాటికిబ్యారియర్-ఫ్రీ టోల్ విధానం విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని 70 శాతానికి పైగా టోల్ ప్లాజాలను బ్యారియర్-ఫ్రీగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది.. మార్చి నాటికి జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను ఈ విధానంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ మార్పులతో వాహనదారులకు కూడా ప్రయోజనం కలగనుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఉండాల్సిన పరిస్థితి తగ్గడంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా.. ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గడం వల్ల వాహనదారులు ఏడాదికి సుమారు రూ.5,250 కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేస్తున్నారని అధ్యయనాలను ఉటంకిస్తూ గడ్కరీ తెలిపారు.ట్రక్కుల్లో ఓవర్ లోడింగ్‌ను గుర్తించే టెక్నాలజీని కూడా అభివృద్ధి చేయాలని మంత్రి టెక్నాలజీ రంగానికి పిలుపునిచ్చారు. భారీగా సరుకులు మోసే ట్రక్కులు నిర్ణీత పరిమితికి మించి బరువుతో ప్రయాణిస్తే రహదారుల భద్రతతో పాటు రోడ్ల నాణ్యతపై కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల ఓవర్‌లోడింగ్‌ను సులభంగా గుర్తించే సాంకేతిక పరిష్కారాలు అవసరమని ఆయన సూచించారు.ఇదీ చదవండి: FASTagలో వన్‌ట్యాగ్.. బ్యాంక్ మార్చినా స్టిక్కర్ మారదు! -
హీరో గ్లామర్.. ఇప్పుడు కొత్త హంగులతో..
హీరో మోటోకార్ప్.. దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న గ్లామర్ బైకుకు కొత్త అప్డేట్స్ తీసుకొచ్చింది. కంపెనీ ఇప్పుడు ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఐబీఎస్) లను కలిపి రూపొందించిన కొత్త బ్రేకింగ్ సిస్టమ్ అందిస్తుంది. దీని ధర రూ. 1.01 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).125 సీసీ సెగ్మెంట్లో సింగిల్-ఛానల్ ఏబీఎస్, ఐబీఎస్ వంటివాటితో వస్తున్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ గ్లామర్ ఎక్స్ 125 అని హీరో పేర్కొంది. ఈ కొత్త బ్రేకింగ్ హార్డ్‌వేర్ గట్టిగా బ్రేక్ వేసినప్పుడు ముందు చక్రాలు లాక్ అవ్వకుండా నివారిస్తుంది, అదే సమయంలో ఐబీఎస్ ముందు, వెనుక బ్రేకులను అనుసంధానించడం ద్వారా బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్లామర్ ఎక్స్ బైకులో పానిక్ బ్రేక్ అలర్ట్, హజార్డ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా కొనసాగుతున్నాయి.హీరో గ్లామర్ ఎక్స్‌లో 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,250 rpm వద్ద 11.4bhp పవర్.. 6,500rpm వద్ద 10.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఎకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది.హీరో గ్లామర్ ఎక్స్ 125లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లతో కూడిన కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇతర ఫీచర్లలో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద మొబైల్ స్టోరేజ్ వంటివి ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ABSతో కూడిన గ్లామర్ ఎక్స్ గన్ మెటల్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే, బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ టీల్ బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. -
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన మరోసారి ఆయన ప్రత్యేక భద్రతా ఏర్పాట్లపై ఆసక్తిని పెంచింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి చేరుకున్న పుతిన్ వెంట భారీ భద్రతా కాన్వాయ్ కూడా వచ్చింది. ఆయన ప్రయాణించే ప్రత్యేక అధ్యక్ష విమానంతో పాటు, అత్యంత భద్రతతో కూడిన ఆరస్ సెనాట్ (Aurus Senat) లిమోసిన్ కూడా విదేశీ పర్యటనలకు తరలించడం రష్యా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థలో కీలక భాగంగా మారింది.ప్రపంచ దేశాల అధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఏర్పాటు చేసిన అధికారిక వాహనాలను ఉపయోగించడం సాధారణం. అయితే పుతిన్ మాత్రం విదేశీ పర్యటనల్లోనూ తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆరస్ సెనాట్ వాహనాన్నే వినియోగిస్తారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో కూడిన ఈ లిమోసిన్‌ను అందుకే ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తుంటారు.పుతిన్ కారు ప్రత్యేకత ఏంటి?పుతిన్ కాన్వాయ్‌లో సాధారణంగా భారీ సంఖ్యలో వాహనాలు ఉంటాయి. విదేశీ పర్యటనల సమయంలో మాత్రం ఆయన ప్రయాణించే ఆరస్ సెనాట్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్, పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం వంటి రక్షణ వ్యవస్థలతో ఈ కారును రూపొందించినట్లు తెలుస్తోంది.ఆరస్ సెనాట్‌ను రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ అభివృద్ధి చేసింది. రష్యన్ స్టేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నామి, సోలర్స్ జేఎస్సీ, యూఏఈకి చెందిన తవాజున్ హోల్డింగ్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రష్యా ప్రభుత్వం దేశీయంగా అత్యాధునిక లగ్జరీ, రక్షణ వాహనాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘కోర్టెజ్’ ప్రాజెక్టులో భాగంగా సెనాట్ రూపొందింది. 2018లో ఈ మోడల్‌ను పరిచయం చేశారు. దీని డిజైన్‌కు సోవియట్ కాలం నాటి ZIS-110 లిమోసిన్ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతారు.ఇంజిన్.. వేగంపుతిన్ ఉపయోగించే ఆరస్ సెనాట్‌లో 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్, హైబ్రిడ్ వ్యవస్థతో కలిపి పనిచేస్తుంది. ఇది సుమారు 598 హార్స్పవర్, 880 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ కారు పనిచేస్తుంది.సెనాట్ పొడవు సుమారు 5,630 మిల్లీమీటర్లు, వెడల్పు 2,000 మిల్లీమీటర్లు, ఎత్తు 1,700 మిల్లీమీటర్లుగా ఉంటుంది. గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ లిమోసిన్.. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు 9 సెకన్లలో చేరగలదని సమాచారం.భద్రతకు పెద్దపీటరష్యా అధ్యక్షుడి కోసం రూపొందించిన ఈ ప్రత్యేక వాహనంలో అత్యున్నత స్థాయి భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ రక్షణతో పాటు పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించినట్లు సమాచారం. యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.భద్రతతో పాటు సౌకర్యాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అధిక నాణ్యత కలిగిన లెదర్, వుడ్ ట్రిమ్, ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థలతో కారు ఇంటీరియర్‌ను రూపొందించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా ఈ వాహనాన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం.మూమూలు ప్రజలూ వాడొచ్చు!ఆరస్ సెనాట్‌కు సాధారణ పౌరుల కోసం ప్రత్యేక వెర్షన్ కూడా ఉంది. అయితే దీని ఉత్పత్తిని పరిమిత సంఖ్యలోనే చేపడుతున్నట్లు సమాచారం. పౌర వెర్షన్ ధర సుమారు 18 మిలియన్ రూబిళ్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2.5 కోట్లు.అయితే పుతిన్ ఉపయోగించే ప్రత్యేక అధ్యక్ష వెర్షన్ ధర, రక్షణ స్థాయి వంటి వివరాలు సాధారణంగా బహిరంగంగా వెల్లడించరు.గత ఏడాది చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌తో కలిసి ఇదే ఆరస్ సెనాట్‌లో ప్రయాణించడం కూడా అప్పట్లో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. దీంతో రష్యా అధ్యక్షుడి ప్రత్యేక లిమోసిన్పై ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆసక్తి పెరిగింది. -
FASTagలో వన్‌ట్యాగ్.. బ్యాంక్ మార్చినా స్టిక్కర్ మారదు!
కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై వాహనానికి ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను తొలగించి కొత్తది తీసుకోవాల్సిన అవసరం లేకుండానే.. బ్యాంకును మార్చుకునే అవకాశం కలగనుంది. దీనికోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వన్‌ట్యాగ్ (OneTag) పేరుతో కొత్త పోర్టుబిలిటీ వ్యవస్థను ప్రారంభించింది. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ఈ వ్యవస్థను ప్రారంభించారు.ఇదివరకు ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసిన బ్యాంకును మార్చుకోవాలంటే ముందుగా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను క్లోజ్ చేసి.. కొత్తగా మరో ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవాల్సి ఉండేది. అయితే వన్‌ట్యాగ్ ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది. వినియోగదారులు తమ వాహనానికి ఇప్పటికే ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ కొనసాగిస్తూ, అదే ట్యాగ్ ఐడీ, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబరరుతో మరో బ్యాంకుకు మారవచ్చు. అంటే కొత్త ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను వాహనంపై అతికించాల్సిన అవసరం ఉండదు.ఈ కొత్త విధానాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రోత్సహించే ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ సదుపాయం ఎన్హెచ్ఏఐకి చెందిన రాజ్‌మార్గ్ యాత్ర మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది.బ్యాంక్ మార్చుకోవాలనుకునే వినియోగదారులు ముందుగా ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని, వెరిఫికేషన్ పూర్తి చేసి, తమ సమ్మతి తెలిపి, కొత్తగా కోరుకున్న బ్యాంక్ ఎంచుకోవాలి. ఆ తర్వాత కొత్త బ్యాంకుతో ఆన్ బోర్డింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.బ్యాంక్ మారిన తర్వాత పాత ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన బాధ్యతలు పూర్తిగా కొత్త బ్యాంకుకు వెంటనే వెళ్లవు. పాత బ్యాంకే కస్టమర్ వెరిఫికేషన్, పాత వాలెట్లోని రీఫండ్స్, పెండింగ్ లావాదేవీలు వంటి అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తరువాత కొత్త బ్యాంక్ నుంచి లావాదేవీలు జరుగుతాయి.ఇదీ చదవండి: టోల్ వసూళ్లకు కొత్త ప్లాన్.. గడ్కరీ కీలక ప్రకటన! -
ఎక్కువమంది కొంటున్న కారు.. రూ.20 వేలు పెరిగిన రేటు!
భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న మైక్రో ఎస్‌యూవీలలో టాటా పంచ్ ఒకటి. ఇది ప్రస్తుతం ఈవీ, సీఎన్జీ, పెట్రోల్ రూపాల్లో అందుబాటులో ఉంది. అయితే.. కంపెనీ ఇప్పుడు పంచ్ ఈవీ ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది.టాటా పంచ్ ఈవీ స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్ ట్రిమ్‌లలో.. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్, స్మార్ట్+ (30kWh) వేరియంట్ల ధరలు రూ.10,000 పెరిగాయి. ఇదే సమయంలో, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ ఎస్ అనే అన్ని 40kWh వేరియంట్ల ధరలు రూ. 20,000 పెరిగాయి. ధరలు పెరుగుదల తరువాత కొత్త రేట్లు రూ. 9.79-12.99 లక్షల మధ్య ఉన్నాయి.టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. ఒకటి 87bhp/154Nm అందించే 30 కిలోవాట్ బ్యాటరీ (355కిమీ), రెండోది 127bhp/154Nm అందించే 40 కిలోవాట్ బ్యాటరీ (468కిమీ). డిజైన్ మార్పులలో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఎయిర్ వెంట్లు, కనెక్టెడ్ లైట్లు, అప్డేటెడ్ క్యాబిన్ ఉన్నాయి. -
టోల్ వసూళ్లకు కొత్త ప్లాన్.. గడ్కరీ కీలక ప్రకటన!
భారతదేశంలో ప్రారంభమైన ఫాస్ట్‌ట్యాగ్ విధానం రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పును తీసుకు వచ్చింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు వేచి ఉండకుండా.. నగదు చెల్లింపుల అవసరం లేకుండా, టోల్ ఫీజును స్వయంచాలకంగా వసూలు చేయడం ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా సాధ్యమైంది. ఈ విధానం టోల్ వసూళ్లను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా మార్చిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.ఫాస్ట్‌ట్యాగ్‌ను ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఫాస్ట్‌ట్యాగ్ వాహనం ముందు భాగంలో అమర్చుతారు. వాహనం టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడి సెన్సార్లు ఫాస్ట్‌ట్యాగ్‌ను గుర్తించి, వాహనానికి సంబంధించిన టోల్ మొత్తాన్ని అనుసంధానించిన ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. దీంతో వాహనదారులు టోల్ కౌంటర్ వద్ద ప్రత్యేకంగా క్యాష్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.2021లో ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరి చేయడం ద్వారా.. ప్రభుత్వం డిజిటల్ టోల్ చెల్లింపులను మరింత వేగంగా విస్తరించింది. దీని వల్ల నగదు ఆధారిత టోల్ వసూళ్లు తగ్గి, జాతీయ రహదారులపై ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విస్తృతంగా అమలులోకి వచ్చింది. వాహనాల రాకపోకలు సులభతరం కావడంతో పాటు.. టోల్ వసూళ్లలో పారదర్శకత కూడా పెరిగింది.ఇప్పుడు ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు వెహికల్ నంబర్ ప్లేట్ గుర్తింపు కోసం కావలసిన టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఈ విధానం ద్వారా.. టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాలను గుర్తించడం, వాహనాల కదలికలను పర్యవేక్షించడం, టోల్ వసూళ్లలో జరిగే లీకేజీలను తగ్గించడం మరింత సులభం కావచ్చు.ఫాస్ట్‌ట్యాగ్, నంబర్ ప్లేట్ రెండింటినీ కలిపి ఉపయోగించే కొత్త టోల్ వ్యవస్థ ద్వారా ఏటా అదనంగా సుమారు రూ.10,000 కోట్ల టోల్ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీని ద్వారా.. ప్రభుత్వం ప్రస్తుతం వసూలు కాకుండా మిగిలిపోతున్న టోల్ మొత్తాన్ని కూడా సమర్థవంతంగా సేకరించగలదని భావిస్తోందని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో గడ్కరీ వెల్లడించారు.ఇదీ చదవండి: జియో రూ.149 రీఛార్జ్ ప్లాన్.. 90 రోజుల జియోహాట్‌స్టార్! -
కియా కొత్త కార్లు.. లాంచ్‌కు ముందే బుకింగ్‌లు
దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కియా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన మూడు వరుసల ఎమ్‌పీవీ (MPV) శ్రేణిలో కొత్త పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా కియా కారెన్స్ సీఎన్జీ (Carens CNG), కారెన్స్ క్లావిస్ సీఎన్జీ (Carens Clavis CNG), కార్నివాల్ లిమోసిన్ హైబ్రిడ్ (Carnival Limousine Hybrid) మోడళ్లకు ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ మూడు వాహనాలను కియా అధీకృత డీలర్ నెట్వర్క్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే వీటి ధరలు, ఖచ్చితమైన లాంచ్ తేదీలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీతో..కారెన్స్, కారెన్స్ క్లావిస్ సీఎన్జీ వెర్షన్లలో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. వీటికి ఫ్యాక్టరీలోనే అమర్చిన 60-లీటర్ సీఎన్జీ ట్యాంక్ ఉంటుంది. సీఎన్జీ మోడ్‌లో ఇంజిన్ అవుట్‌పుట్ సుమారు 93–95 హెచ్‌పీ, టార్క్ 123 Nmగా ఉంటుంది. క్లావిస్ సీఎన్జీకి అధికారికంగా వెల్లడైన ఇంధన సామర్థ్యం (మైలేజీ) ఒక కేజీకి 25 కిలో మీటర్లు.గతంలో కొన్ని మార్కెట్లలో కనిపించిన డీలర్-ఫిట్టెడ్ సీఎన్జీ కిట్లకు భిన్నంగా, కొత్త మోడళ్లలో సీఎన్జీ వ్యవస్థను కియా ఫ్యాక్టరీ స్థాయిలోనే వాహనానికి అనుగుణంగా రూపొందించింది. సీఎన్జీ కోసం ప్రత్యేక ఇంజిన్ కాలిబ్రేషన్, సవరించిన సస్పెన్షన్ ట్యూనింగ్, అదనపు బరువుకు అనుగుణంగా బ్రేకింగ్ సెటప్ వంటి మార్పులు చేసింది. 16-అంగుళాల వీల్స్, పెట్రోల్-టు-సీఎన్జీ మార్పు కోసం ప్రత్యేక స్విచ్, సీఎన్జీ డిస్టెన్స్-టు-ఎంప్టీ సమాచారాన్ని చూపించే 4.2-అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే కూడా ఉన్నాయి.సీఎన్జీ ట్యాంక్‌ను అమర్చినప్పటికీ ప్రయాణికులకు ఉపయోగపడే స్థలాన్ని సాధ్యమైనంత వరకు ఆదా చేసేందుకు కియా ఇంజినీరింగ్ మార్పులు చేసింది. సీఎన్జీ వెర్షన్లలో బూట్ స్పేస్ 116 లీటర్లుగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.ఏ వేరియంట్లలో వస్తాయి?కారెన్స్ సీఎన్జీ ప్రైవేట్ కొనుగోలుదారుల కోసం ప్రీమియం (O) G1.5 6MT వేరియంట్లో రానుంది. B2B, కమర్షియల్ మొబిలిటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని M-Drive G1.5 6MT వెర్షన్‌ను కూడా కియా అందించనుంది.కారెన్స్ క్లావిస్ సీఎన్జీ HTE, HTE (O) G1.5 6MT వేరియంట్లలో లభించనుంది. కమర్షియల్, ఫ్లీట్ వినియోగదారుల కోసం HTM G1.5 6MT వెర్షన్‌ను కూడా తీసుకురానున్నట్లు సమాచారం.సీఎన్జీ వెర్షన్లు ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఆప్షన్లకు అదనంగా చేరనున్నాయి. ఇప్పటికే కారెన్స్ క్లావిస్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉండటంతో, ఒకే మోడల్ కుటుంబంలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వంటి విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కియా అందిస్తోంది.కార్నివాల్‌కు హైబ్రిడ్ పవర్కియా తన ప్రీమియం ఎంపీవీ ‘కార్నివాల్ లిమోసిన్’లో తొలిసారిగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను తీసుకొస్తోంది. ఇది Limousine+ G1.6T HEV 6AT రూపంలో అందుబాటులోకి రానుంది. 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 180 హెచ్‌పీ, 265 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 73.4 హెచ్‌పీ, 304 Nm టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ జతవుతుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ హైబ్రిడ్ వ్యవస్థ పనిచేస్తుంది.ప్రస్తుతం భారత్‌లో కార్నివాల్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. హైబ్రిడ్ వెర్షన్ ఆ డీజిల్ మోడల్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా అదనపు పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌గా రానుంది. దీంతో పెద్ద, ప్రీమియం ఎంపీవీ కోరుకునేవారికి పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా లభించనుంది.ప్రీమియం ఫీచర్లకు పెద్దపీటకార్నివాల్ హైబ్రిడ్‌లో 18-అంగుళాల క్రిస్టల్ కట్ డ్యూయల్-టోన్ ఏరో అల్లాయ్ వీల్స్, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్, వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. క్యాబిన్లో AQI డిస్ప్లేతో స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జింగ్‌తో రిట్రాక్టబుల్ సీట్‌బ్యాక్ టేబుల్స్, కప్హోల్డర్లు, మోనోటోన్ యాంబియంట్ లైటింగ్, లెథరెట్ డోర్ ట్రిమ్స్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.కారెన్స్, కారెన్స్ క్లావిస్ సీఎన్జీ మోడళ్ల ధరలను సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని తాజా ఆటోమొబైల్ నివేదికలు చెబుతున్నాయి. కార్నివాల్ హైబ్రిడ్ ధర కూడా లాంచ్‌కు దగ్గరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. -
12 నిమిషాల్లో 97 శాతం ఛార్జ్.. BYD కొత్త టెక్నాలజీ!
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ కొత్త ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రకటించింది. కంపెనీ ప్రకారం, -30 డిగ్రీల సెల్సియస్ వంటి తీవ్రమైన చలిలోనూ ఈవీ బ్యాటరీని 20 శాతం నుంచి 97 శాతం వరకు, కేవలం 12 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. సాధారణ ఉష్ణోగ్రతల్లో 10 శాతం నుంచి 97 శాతం వరకు 9 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదని బీవైడీ చెబుతోంది.బీవైడీ తన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా వేగంగా విస్తరిస్తోంది. ఆగస్టు 28, 2026 నాటికి చైనాలో 10,000 ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ నెట్వర్క్ ప్రస్తుతం.. 332 నగరాల్లో అందుబాటులో ఉంది. 2026 చివరి నాటికి ఈ సంఖ్యను 20,000 స్టేషన్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఫ్లాష్ ఛార్జింగ్ సిస్టమ్ గరిష్ఠంగా 1,500 కిలోవాట్ వరకు ఛార్జింగ్ పవర్ అందించగలదని బీవైడీ వెల్లడించింది. అయితే.. వాస్తవ ఛార్జింగ్ వేగం ప్రతి వాహనం బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్, ఉష్ణోగ్రత, ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.ఈవీలలో ఎక్కువ సమయం తీసుకునే ఛార్జింగ్ ప్రక్రియను తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల మధ్య పోటీ పెరుగుతున్న సమయంలో బీవైడీ ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది. ముఖ్యంగా.. చలికాలంలో బ్యాటరీ పనితీరు తగ్గే సమస్యను అధిగమించగలిగితే, అత్యంత చల్లని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత సులభతరం చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం BYD స్వయంగా నిర్వహించిన పరీక్షల ఆధారంగా వెల్లడించిన గణాంకాలే.BYD rewrites the rules of EVs. At -30°C, its flash charging goes from 20% to 97% in 12 minutes, only 3 minutes slower than at room temperature.And the network? China has already built over 10,000 such flash-charging stations across 332 cities. pic.twitter.com/lHqmV5zWhs— Li Zexin 李泽欣 (@XH_Lee23) September 8, 2026 -
వాహనదారులకు హెచ్చరిక.. కలెక్టర్ కీలక సూచనలు
రోడ్లపై కార్లను నడిపే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని దమన్ కలెక్టర్ సౌరభ్ మిశ్రా, వాహన యజమానులకు సూచించారు. ముఖ్యంగా థార్, ఫార్చ్యూనర్ వాహనాల యజమానులు రోడ్లపై భాయ్‌గిరి, దాదాగిరి చూపించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఇందుకోసం ట్రాన్స్పోర్ట్ నగర్లో 'థార్/ఫార్చ్యూనర్ సంకల్ప్ యాత్ర' పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దమన్‌లో రిజిస్టర్ అయిన థార్, ఫార్చ్యూనర్ వాహనాల యజమానులను వారి వాహనాలతో సహా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వందలాది మంది యజమానులు ఒకచోట చేరారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో వరుసగా నిలిపిన థార్, ఫార్చ్యూనర్ వాహనాలను చూడవచ్చు. వాటి ఓనర్స్ వాహనాల ముందు నిలబడి ఉన్నారు. దమన్ కలెక్టర్ సౌరభ్ మిశ్రా వాహన యజమానులతో మాట్లాడి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతగా వాహనాలు నడుపుతామని వారితో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో వాహనాలకు చేస్తున్న కొన్ని అనధికార మార్పులపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా వాహనాల అద్దాలకు నిబంధనలకు విరుద్ధంగా టింటెడ్ గ్లాస్ వేయడం, టైర్లలో అక్రమ మార్పులు చేయడం, డీజేలు, సౌండ్ సిస్టమ్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేయడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి మార్పులను వెంటనే తొలగించి, వాహనాలను ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా నడపాలని యజమానులకు సూచించారు.రోడ్డుపై తమ కారు వెళ్లే సమయంలో ఇతర వాహనదారులు, పాదచారులు భయపడే పరిస్థితి ఉండకూడదని దమన్ కలెక్టర్ స్పష్టం చేశారు. థార్ వంటి వాహనాలపై కొంతమందిలో ఉన్న భాయ్‌గిరి లేదా బెదిరించే ఇమేజ్ను మార్చి, వాటిని బాధ్యతకు చిహ్నంగా మార్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.ఇదే అంశంపై సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా నిర్వహించనున్నట్లు దమన్ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. #TharKaMatlabZimmedari అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేయాలని యజమానులను కోరింది. ఈ ప్రచారాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేయాలని కూడా అధికారులు సూచించారు.Daman Collector made Thar and Fortuner owners take an oath to drive safely on the roads. pic.twitter.com/zCpJy9BqOr— DesiEsco🇮🇳 (@DesiEsco7) September 10, 2026 -
‘ఇథనాల్ పెట్రోల్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు’
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) వినియోగం వల్ల వాహనాలకు ముప్పు వాటిల్లుతోందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఇప్పటివరకు తమ శాఖకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి వివరణాత్మక సమాధానమిచ్చారు.వాహన యజమానుల నుంచి గానీ, ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణుల నుంచి గానీ ఇథనాల్ పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు రాలేదని మంత్రి తెలిపారు. అందువల్ల నియంత్రణ లేదా దిద్దుబాటు చర్యలు చేపట్టే ప్రసక్తి లేదన్నారు. అయితే, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ శక్తి సాంద్రత కొంత తక్కువగా ఉంటుందని, ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) వల్ల వాహనాల పికప్, మైలేజీలో 3 నుంచి 5 శాతం స్వల్ప తగ్గుదల ఉండే అవకాశం ఉందన్నారు. వాహనాలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే పెద్ద సమస్యలు ఉండవని స్పష్టం చేశారు.ఈ పథకం కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం అమలవుతోందన్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు దీన్ని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చిందన్నారు. వాహనాల రక్షణ, సర్టిఫికేషన్ నిబంధనలన్నీ కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త వాహనాలు ఈ20 ఇంధనానికి అనుగుణంగా రూపుదిద్దుకున్నాయని, పాత వాహనదారులు చిన్నపాటి మార్పులు లేదా కొన్ని విడిభాగాలను మార్చుకోవాల్సి రావచ్చునని పేర్కొన్నారు.మూడు ప్రధాన ప్రయోజనాలుఇథనాల్ మిశ్రమం ద్వారా మూడు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. చెరకు రసం, బెల్లం పాకం, వరి, మొక్కజొన్నల ద్వారా ఇథనాల్ ఉత్పత్తి పెరిగి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర, అదనపు ఆదాయం లభిస్తుంది. పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఇంధన దిగుమతులు తగ్గి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.ఇథనాల్ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరుగుతుందనే భయాలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏర్పాటు చేస్తున్న ఆధునిక ప్లాంట్లలో కాలుష్య నియంత్రణ చర్యలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరీంనగర్‌లోని 2-3 ప్లాంట్లతో సహా మొత్తం ఏడు ఇథనాల్ కర్మాగారాలు ఉన్నాయని వెల్లడించారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఆయిల్ కంపెనీలు, పారిశ్రామికవేత్తల మధ్య ఒప్పందాలకు వ్యవసాయ, అబ్కారీ శాఖలు సహకరిస్తున్నాయని తెలిపారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్‌పై వీసా మోసం ఆరోపణలు -
మార్కెట్లోకి ‘జావా 42’ ఆల్ స్టార్స్ ఎడిషన్
ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ ‘జావా’ భారత మార్కెట్లో కొత్త ‘జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్’ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 1,79,942 గా ఉంది. ఇందులో 294.72 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్సీ ఇంజిన్‌ను అందించారు. సరికొత్త గ్రాఫిక్స్, ఆల్‌స్టార్స్ బ్యాడ్జింగ్ ఈ కొత్త ఎడిషన్‌కు ప్రత్యేకం. దేశవ్యాప్తంగా ఉన్న జావా యెజ్డీ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు మొదలయ్యాయి. పండుగ సీజన్ సందర్భంగా సెప్టెంబర్ 14 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. -
వాణిజ్య వాహనాల మార్కెట్‌కు పండగల జోష్
దేశీయ వాణిజ్య వాహనాల (కమర్షియల్ వెహికిల్) మార్కెట్ పండుగల సీజన్‌తో దూసుకుపోతోంది. ట్రక్కు అద్దెలు స్థిరంగా ఉండటం, గూడ్స్ క్యారియర్ రిజిస్ట్రేషన్లు పెరగడం, భారీ ట్రక్కుల విక్రయాలు ఊపందుకోవడం వంటివి పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ధోరణితో కలిసి మార్కెట్‌కు బలమైన ఊతమిస్తున్నాయి.శ్రీరామ్ మొబిలిటీ బులెటిన్ ప్రకారం, ఆగస్టులో 18-టన్నుల ట్రక్కుల అద్దెలు ప్రధాన మార్గాల్లో నెలవారీగా దాదాపు స్థిరంగా ఉన్నా గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఢిల్లీ-కోల్‌కతా మార్గంలో అద్దె 15 శాతం పెరిగి రూ.1.82 లక్షలకు చేరగా బెంగళూరు-ముంబై, కోల్‌కతా-గువాహటి మార్గాల్లో 11 శాతం చొప్పున పెరిగి వరుసగా రూ.1.50 లక్షలు, రూ.1.63 లక్షలుగా నమోదయ్యాయి. ఢిల్లీ-ముంబై మార్గంలో అద్దె 8 శాతం పెరిగి రూ.1.75 లక్షలకు చేరింది.ఓనం పండుగతో మొదలైన ఉత్సాహం రవాణా రంగం మొత్తానికి విస్తరించిందని, ప్రధాన మార్గాల్లో అద్దెలు స్థిరంగా ఉండటంతో సరుకు రవాణా కార్యకలాపాలు బలంగా కొనసాగాయని శ్రీరామ్ ఫైనాన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీవోవో సుదర్శన్ హొల్లా పేర్కొన్నారు. ఈ సానుకూలత వాహన విక్రయాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ఆగస్టులో దేశవ్యాప్తంగా గూడ్స్ క్యారియర్ రిజిస్ట్రేషన్లు 18 శాతం పెరిగి 74,401 యూనిట్లకు చేరాయి. కార్గో త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 43 శాతం ఎగసి 14,614కు చేరుకున్నాయి. అశోక్ లేలాండ్ దేశీయ మీడియం, హెవీ కమర్షియల్ వాహన విక్రయాలు దాదాపు 60 శాతం వృద్ధి చెందాయి.ఇది కేవలం పండుగల తాత్కాలిక ఊపు మాత్రమే కాదని క్రిసిల్ ఇంటెలిజెన్స్ సీనియర్ ప్రాక్టీస్ లీడర్ హేమల్ ఠక్కర్ అభిప్రాయపడ్డారు. పాతబడిన వాహన వ్యవస్థ కారణంగా రీప్లేస్మెంట్ డిమాండ్ FY27లో వృద్ధికి తోడ్పడుతుందని ఆయన అంచనా వేశారు. పాత వాహనాలను తొలగించి ఎక్కువ బరువు మోసే మల్టీ-యాక్సిల్ ట్రక్కులు, ట్రాక్టర్ ట్రైలర్లవైపు ఫ్లీట్ ఆపరేటర్లు మళ్లుతున్నారు.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
కైనెటిక్ కొత్త స్కూటర్.. 132 కిమీ రేంజ్!
కైనెటిక్ తన ఐకానిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పెద్ద బ్యాటరీ.. అదనపు టెక్నాలజీతో (డీఎక్స్ ప్లస్) అప్‌గ్రేడ్ చేసింది. ఈ స్కూటర్ ఇప్పుడు 3.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 132 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.కొత్త డీఎక్స్ ప్లస్ స్కూటర్.. రేంజ్, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. ఇందులో K-కోస్ట్ టెక్ రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. ఇది మెటల్ బాడీని కలిగి ఉండటంతో పాటు, రివర్స్‌తో కూడిన పార్క్ అసిస్ట్, ఈజీ ఛార్జ్, టెలిమాటిక్స్.. IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ వంటి ఆధునిక ఫీచర్లను పొందుతుంది.కైనెటిక్ డీఎక్స్ ప్లస్ స్కూటర్ క్విక్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా 0-80 శాతం ఛార్జింగ్ అవ్వడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. ప్రాక్టికాలిటీకి ప్రధాన ప్రాధాన్యత లభిస్తుంది. ఇందులో సీటు కింద 37 లీటర్ల స్టోరేజ్, 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, రెండు వైపులా 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 220 మిమీ డిస్క్, వెనుక వైపు 130 మిమీ డ్రమ్ ఉన్నాయి.కైనెటిక్ డీఎక్స్ 3 కిలోవాట్ ధర రూ. 1.19 లక్షలు కాగా.. డీఎక్స్ ప్లస్ 3.1 కిలోవాట్ ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్). డీఎక్స్ ప్లస్ బ్లాక్, సిల్వర్, బ్లూ, వైట్, రెడ్ అనే ఐదు రంగులలో లభిస్తుండగా, డీఎక్స్ బ్లాక్, సిల్వర్ ఆప్షన్లను పొందుతుంది. కంపెనీ డీఎక్స్ ప్లస్ పై రూ. 3,000 ప్రయోజనంతో పాటు, రూ. 8,999 విలువైన పొడిగించిన వారంటీ కూడా అందిస్తుంది. -
మూడు నెలల్లో మూడోసారి.. మారుతి కార్ల ధరలు పెంపు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.. 2026 బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసింది కొన్ని రోజులకే, తమ ఇతర మోడల్స్ ధరలను మరోసారి పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ ధరల పెరుగుదల మూడు నెలల్లో మూడోసారి కావడం గమనార్హం.కంపెనీ ప్రకారం.. ముడిసరుకుల ఖర్చులు నిరంతరం పెరుగుతున్న కారణంగా, ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ. 20,000 వరకు పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ధరల పెంపు ఈ నెల నుంచే అమల్లోకి వస్తుంది.మారుతి సుజుకి మాత్రమే కాకుండా.. కార్ల ధరలను పెంచిన కంపెనీల జాబితాలో టాటా మోటార్స్ కూడా ఉంది. 1 సెప్టెంబర్ 2026 నుంచి అమలులోకి వచ్చేలా, తమ పెట్రోల్/డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణికి గరిష్టంగా రూ.25,000 వరకు పెంపును ప్రకటించింది.హ్యుందాయ్ మోటార్ కూడా జనవరి, జూన్లలో చేసిన సవరణల తర్వాత ఈ ఏడాది మూడవసారిగా, సెప్టెంబర్ నుంచి తమ పోర్ట్‌ఫోలియో అంతటా ధరలు 1% వరకు పెరుగుతాయని తెలిపింది. మహీంద్రా & మహీంద్రా ఇప్పటికే జూలై 2026 నుంచి SUV ధరలను సగటున 2.7% పెంచింది. -
ఆర్ధిక సమస్యల్లో దిగ్గజ కంపెనీ.. ప్రమాదంలో వేలాది ఉద్యోగులు!
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న తయారీ ఖర్చులు, కార్ల అమ్మకాలు తగ్గడం, అమెరికా టారిఫ్‌ల ప్రభావం వంటి కారణాలతో కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. వచ్చే రెండేళ్లలో సుమారు 4,000 ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉంది. ఇది JLR మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం.ప్రత్యర్థుల పోటీజాగ్వార్ ల్యాండ్ రోవర్ సమస్యకు మరో ముఖ్యమైన కారణం.. చైనా కార్ల కంపెనీల నుంచి వస్తున్న పోటీ. బీవైడీ, చెరీ వంటి సంస్థలు తక్కువ ధరలకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మంచి ఫీచర్లు, తక్కువ ధరలతో ఈ కంపెనీలు యూరప్‌లో వేగంగా మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. దీంతో జేఎల్ఆర్ వంటి ఖరీదైన ప్రీమియం కార్ల కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది.ఆర్థిక నష్టాల్లో ఉన్న జేఎల్ఆర్ సంస్థకు గవర్నమెంట్ సహాయం అందిస్తుందా? అనే ప్రశ్నకు.. ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీ వ్యాపారాన్ని నేరుగా నడపదని బ్రిటన్ బిజినెస్ సెక్రటరీ రెనాల్డ్స్ పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల నష్టాన్ని సాధ్యమైనంత.. వరకు తగ్గించేందుకు ప్రభుత్వం కంపెనీతో, కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోంది. గతంలో జేఎల్ఆర్ ఎదుర్కొన్న సప్లయ్ చైన్ సమస్యల సమయంలో బ్రిటన్ ప్రభుత్వం సుమారు 1.5 బిలియన్ పౌండ్ల రుణానికి హామీ ఇచ్చింది.ప్రమాదంలో జేఎల్ఆర్జేఎల్ఆర్ బ్రిటన్‌లో సుమారు 33,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. కాబట్టి ఉద్యోగాల కోత బ్రిటన్ తయారీ రంగంపై కూడా ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు ప్రపంచంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ దేశాల్లో ఉన్న బ్రిటన్ ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయింది. జేఎల్ఆర్ అమెరికా మార్కెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం, అక్కడ ఉత్పత్తిని పెంచుకునే అవకాశాలను పరిశీలించడం వల్ల బ్రిటన్ ఒక ప్రధాన కార్ల తయారీ కేంద్రంగా తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన ఉంది.మొత్తం మీద జేఎల్ఆర్ ఉద్యోగాల కోత అనేది.. కేవలం ఒక కంపెనీకి సంబంధించిన సమస్య కాదు. ఇది చైనా కార్ల కంపెనీల పెరుగుతున్న పోటీ, ఈవీ మార్కెట్లో వస్తున్న మార్పులు, పెరుగుతున్న తయారీ ఖర్చులు యూరప్ ఆటో పరిశ్రమపై ఎంత ప్రభావం చూపుతున్నాయో అనే విషయాలను తెలియజేస్తోంది. కాబట్టి ఇలాంటి సమయంలో జేఎల్ఆర్ తన ఖర్చులను తగ్గించుకుని, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే! -
సీఎన్జీ, హైబ్రిడ్, ఈవీలదే రాజ్యం!
భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో చారిత్రక మలుపు చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ కొంటే పెట్రోల్ కారే కొనాలనే తీరుకు భిన్నంగా సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) ముందువరుసలోకి వస్తున్నాయి. ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, ఆగస్టు 2026లో సీఎన్జీ, హైబ్రిడ్, ఈవీలు కలిపి రిటైల్ అమ్మకాల్లో 42 శాతం వాటాను దక్కించుకోగా, పెట్రోల్ వాహనాల వాటా 41 శాతానికి పడిపోయింది. ఒకప్పుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన పెట్రోల్ కార్లకుకు ఇది కొత్త సవాలే.సీఎన్జీ వాహనాలు ఇలా..గత ఏడాది ఇదే నెలలో 46 శాతంగా ఉన్న పెట్రోల్ వాటా ఇప్పుడు రికార్డు కనిష్ఠానికి చేరడం గమనార్హం. మరోవైపు సీఎన్జీ వాహనాలు ఏకంగా 21 శాతం నుంచి 25 శాతానికి ఎగబాకుతూ సరికొత్త రికార్డు నెలకొల్పాయి. మారుతీ సుజుకీ ఈ విభాగంలో 71 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, టాటా మోటార్స్, హ్యుందాయ్ వరుసగా 17, 9 శాతాలతో పోటీపడుతున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కొనుగోలు శక్తి పెరగడం, మొత్తం వాహన అమ్మకాలు 16 శాతం వృద్ధితో సుమారు 4.01 లక్షల యూనిట్లకు చేరడానికి కారణమైంది.ఈవీలదే హవాఇక ఈవీల సంగతికొస్తే, ఏడాది కిందటితో పోలిస్తే అమ్మకాలు 52 శాతం దూసుకెళ్లి 30,700 యూనిట్లకు చేరాయి. దీంతో ఈవీల వ్యాప్తి 5.9 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగింది. అయితే జులైలో నమోదైన 8.1 శాతం రికార్డు కంటే స్వల్పంగా తక్కువే. టాటా మోటార్స్ తన ఈవీ పోర్ట్‌ఫోలియోతో 43 శాతం వాటాతో దూసుకుపోగా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ వాటా మాత్రం 28 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది.ఇంధన ధరల మంటలు, ఈ20 ఇథనాల్ మిశ్రమంపై కొనుగోలుదారుల సంశయమే ఈ మార్పుకు కారణమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కాలం మారింది, కారు రూపమూ మారింది అన్నట్టుగా, భారత రహదారులపై ఇక పెట్రోల్ కాకుండా ప్రత్యామ్నాయ ఇంధనాలదే భవిష్యత్తు అని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరలు! -
తిరిగొచ్చిన ఆక్టేవియా ఆర్ఎస్.. రూ.6 లక్షలు పెరిగిన ధర!
స్కోడా తన ఆక్టేవియా ఆర్ఎస్ కారును మరోమారు.. భారతదేశంలో అమ్మకానికి పెట్టింది. అయితే ఈసారి దీని ధర రూ.56.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రారంభంలో దీని ధర రూ.49.99 లక్షల వద్ద ఉండేది. ఇప్పుడు రెండో బ్యాచ్ రేటు రూ.6.70 లక్షలు ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.స్కోడా మొదటి విడతలో 100 యూనిట్ల ఆక్టేవియాలను మాత్రమే పరిమితం చేసింది. గత సంవత్సరం ఈ కారు భారతదేశంలోకి అడుగుపెట్టక ముందే అమ్ముడైపోయింది. ఇప్పుడు కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఈ బ్యాచ్ మరింత పరిమితమైంది. వచ్చే వారం నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.ఆక్టేవియా ఆర్ఎస్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ నుంచి శక్తిని పొందుతుంది. వోక్స్వ్యాగన్ తన గోల్ఫ్ జీటీఐలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తోంది. అయితే ఆక్టేవియా RS దాని ఇండియా-స్పెక్ కాన్ఫిగరేషన్‌లో 265 bhp మరియు 370 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ శక్తిని కేవలం ముందు చక్రాలకు మాత్రమే పంపుతుంది. ఈ సెడాన్ 6.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, అలాగే గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని స్కోడా పేర్కొంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ 13-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 11-స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారులో మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్లైట్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మసాజ్ ఫంక్షన్లతో కూడిన హీటెడ్ అండ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంది. -
ఆడి కొత్త మోడల్.. ఆవిష్కరించిన హీరో సుమంత్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆడి సెంట్రల్ షోరూమ్‌లో ఆడి ఇండియా కొత్త క్యూ3 మోడల్ కారును ప్రముఖ హీరో సుమంత్ ఆవిష్కరించారు. శనివారం ఆడి సెంట్రల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ.. వీవీసీ గ్రూప్‌తో తనకు ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆడి క్యూ3 మోడల్ అద్భుతంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం వాహనాల్లో క్యూ3 ఒకటిగా నిలవనుందని అన్నారు. సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన న్యూ క్యూ3 కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వీవీసీ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో న్యూ క్యూ3 మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి వాహనాల డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.సరికొత్త ఫీచర్లు, అధునాతన సాంకేతికతతో న్యూ క్యూ3 వినియోగదారుల ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ వాహనానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఆల్ ఇండియా స్థాయిలోనూ భారీగా బుకింగ్స్ వస్తున్నాయని చెప్పారు. ఆడి న్యూ క్యూ3కు వినియోగదారుల నుంచి లభిస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీవీసీ గ్రూప్ డైరెక్టర్లు విశాల్ చౌదరి, వికాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
రూ.6.10 లక్షలకే కొత్త బాలెనో.. ఫుల్ అప్డేట్స్తో లాంచ్!
మారుతి సుజుకి ఎట్టకేలకు బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో.. రూ. 6.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా డిజైన్ మార్పులతో పాటు, ఫీచర్లు, భద్రత, పవర్ట్రెయిన్లలో కూడా ఎక్కువ అప్డేట్లను పొందింది.మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ పాత మోడల్ మాదిరిగా.. అదే సిల్హౌట్ పొందుతుంది. అయితే.. డీఆర్ఎల్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ల కోసం కొద్దిగా సవరించిన డిజైన్‌ను పొందుతుంది. ముందు భాగంలోని గ్రిల్‌కు కొత్త డిజైన్, అలాగే బంపర్‌కు కూడా సరికొత్త డిజైన్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ మాత్రం అలాగే ఉంది, కానీ కొత్త అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.2026 మారుతి సుజుకి బాలెనో క్యాబిన్ బ్లూ అండ్ బ్లాక్ రంగులతో కూడిన డ్యూయల్ టోన్ లేఅవుట్‌తో వస్తుంది. డాష్‌బోర్డ్ లేఅవుట్ పాత మోడల్‌ను పోలి ఉంటుంది. కానీ మధ్యలో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ప్రాథమిక నియంత్రణల కోసం ఫిజికల్ బటన్లు ఉంటాయి. ఈ కారు మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ కోసం అదే డిజైన్‌ను కొనసాగిస్తుంది.కొత్త బాలెనోలో.. మొదటిసారిగా ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా.. ఈ బ్రాండ్ వైర్లెస్ ఛార్జర్, క్లారియన్ సౌండ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి కూడా ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే.. మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ Z-సిరీస్ ఇంజన్‌తో వస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో లభిస్తుంది. అంతేకాకుండా.. ఈ బ్రాండ్ ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన CNG వేరియంట్‌ను కూడా అందిస్తోంది. కాగా ఇది హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించిన స్పెషల్ బైక్ -
ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించిన స్పెషల్ బైక్
క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న.. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్, ఇటీవల లాంచ్ చేసిన జావా 42 ఎఫ్‌జె ఆల్ స్టార్స్ తర్వాత తమ కొత్త శ్రేణిని విస్తరిస్తూ.. 'జావా ఆల్ స్టార్స్ 42 బాబర్'ను ఆవిష్కరించింది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, గ్లోబల్ చెస్ లీగ్ 2026లో ఈ బైకును ఆవిష్కరించారు. దీని ధరలు రూ. 2.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.జావా ఆల్ స్టార్స్ 42 బాబర్.. స్టాండర్డ్ జావా 42 బాబర్‌పైనే ఆధారపడి ఉంటుంది. కానీ కొత్త పెయింట్ ఎంపికలు, చదరంగం గళ్ల గ్రాఫిక్స్, ఆల్ స్టార్స్ చిహ్నాన్ని పొందుతుంది. ఇది బ్లాక్ మిర్రర్, షాడో బ్లాక్, సిల్వర్ నైట్, జాస్పర్ రెడ్, మిస్టిక్ కాపర్ అనే ఆరు రంగులలో లభిస్తుంది.వేరియంట్ వారీ ధరలు➤ఆల్ స్టార్స్ మిస్టిక్ కాపర్: రూ. 2,08,942➤ఆల్ స్టార్స్ జాస్పర్ రెడ్: రూ. 2,15,942➤ఆల్ స్టార్స్ సిల్వర్ నైట్: రూ. 2,15,942➤ఆల్ స్టార్స్ షాడో బ్లాక్: రూ. 2,17,942➤ఆల్ స్టార్స్ బ్లాక్ మిర్రర్: రూ. 2,19,942ఈ స్పెషల్ ఎడిషన్.. స్టాండర్డ్ 42 బాబర్‌లోని 334 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తోనే కొనసాగుతుంది. ఇది 7,500 rpm వద్ద 29 హార్స్ పవర్, 5,500 rpm వద్ద 30.01 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ జత చేయబడి ఉంటాయి.ఈ మోటార్‌సైకిల్‌లో డబుల్-క్రాడిల్ ఫ్రేమ్, 35 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, 7 టైప్స్ ప్రీలోడ్ సర్దుబాటుతో కూడిన గ్యాస్-ఛార్జ్డ్ రియర్ మోనోషాక్‌ను వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందువైపు 280 మిమీ డిస్క్, వెనుకవైపు 240 మిమీ డిస్క్‌తో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు.Strike Two: Jawa All Stars 42 Bobber.The mark has found its next icon. Mr. Anand Mahindra unveiled India’s Most Loved Bobber at Global Chess League in its All Stars expression. Unmistakable silhouette.Unmistakable character. Presenting the Jawa All Stars 42 Bobber.… pic.twitter.com/ExeRaWXWBp— Jawa Motorcycles (@jawamotorcycles) September 4, 2026 -
టాటా.కార్స్ నుంచి కర్వ్ ‘సిరీస్ ఎక్స్’
టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగం తన ‘కర్వ్’ మోడల్లో ‘సిరీస్ ఎక్స్’ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ శ్రేణి ప్రారంభ ధరను రూ.9.99 లక్షలు (ఎక్స్–షోరూమ్)గా నిర్ణయించింది. కూపే తరహా డిజైన్, పనితీరు, సౌకర్యం, ప్రీమియం ఫీచర్లు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ కొత్త రేంజ్‌ను తీసుకొచి్చనట్లు కంపెనీ తెలిపింది. ‘సిరీస్ ఎక్స్’లో ప్యూర్ ఎక్స్ రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో, ప్యూర్ ఎక్స్ ప్లస్ రూ.11.79 లక్షలతో, క్రియేటివ్ ఎక్స్ ప్లస్ రూ.12.91 లక్షలతో అందుబాటులోకి వచ్చాయి. ప్యూర్ ఎక్స్ ప్లస్ ఆధారిత ‘డార్క్’ ఎడిషన్‌ను రూ.11.99 లక్షల ప్రారంభ ధరతో అందిస్తోంది.ప్యూర్ ఎక్స్ వేరియంట్లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్యూర్ ఎక్స్ ప్లస్‌లో అదనంగా ప్రీమియం లెదరెట్ సీట్లు, 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. క్రియేటివ్ ఎక్స్ ప్లస్ వేరియంట్లో పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ కాక్‌పిట్, నావిగేషన్ డిస్ప్లే వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. అకెంప్లిష్డ్ ఎక్స్, అకెంప్లి‹Ù్డ ఎక్స్ ప్లస్ టాప్–ఎండ్ మోడళ్లలో లెవెల్–2 ఏడీఏయస్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6–వే పవర్డ్ డ్రైవర్ సీట్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, 9 స్పీకర్లు, వైర్లెస్ ఛార్జర్, ట్విన్–జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి అధునాతన ఫీచర్లు అందిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.డార్క్ ఎడిషన్‌ను బ్లాక్–అవుట్ రూపాన్ని కోరు కునే వినియోగదారుల కోసం ప్యూర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ ఆధారంగా రూ.11.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సీసీఓ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఎస్యూవీ డిజైన్ ఆలోచనా విధానాన్ని ‘కర్వ్’ మార్చివేసింది. రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో వస్తున్న కర్వ్ సిరీస్ ఎక్స్ మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. ఎలాంటి రాజీ లేకుండా ఆకర్షణీయమైన డిజైన్, పనితీరు, సౌకర్యం, ప్రీమియం ఫీచర్లు, భద్రతను అందించడమే దీని లక్ష్యం’’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతోందా? -
హిమాలయన్ 440 లాంచ్: ధర ఎంతంటే?
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 440 భారతదేశంలో రూ. 2.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ అయింది. స్క్రామ్ 440 తర్వాత, హిమాలయన్ 440 అనేది 440 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన రెండవ బైక్. ఇది మూడు రంగులలో లభిస్తుంది. దీనికోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.హిమాలయన్ 440 బైక్ 443 సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 6,250rpm వద్ద 25.4 bhp పవర్, 4,000rpm వద్ద 34Nm టార్క్ అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ఇది హాఫ్-డ్యూప్లెక్స్ స్ప్లిట్ క్రాడిల్ ఫ్రేమ్‌పై నిర్మించబడి.. టెలిస్కోపిక్ ఫోర్క్ పొందుతుంది.ఫీచర్ల విషయానికి వస్తే.. కొత్త హిమాలయన్ 440లో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్‌తో పాటు, ఫ్యూయెల్ లెవెల్, టైమ్, ట్రిప్, ఓడోమీటర్ రీడ్అవుట్ల కోసం ఒక డిజిటల్ ఇన్సెట్ కూడా ఉంది. అంతేకాకుండా.. టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేటర్ మాడ్యూల్ కూడా ఉంది. -
కియా వారి నయా కారు: రేటెంతో తెలుసా?
కియా మోటార్స్ భారతదేశంలో కొత్త సోరెంటో ఎస్‌యూవీని రూ.27.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్, ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న కియా సోరెంటో 6 సీటర్, 7 సీటర్ రూపంలో అందుబాటులో ఉంది. ఇది 4,815 మిమీ పొడవు, 1,900 మిమీ వెడల్పు, 1,785 మిమీ ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2,815 మిమీ వరకు ఉంటుంది.కియా సోరెంటో నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్‌లు, టైగర్-నోస్ గ్రిల్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగం కూడా ముందు భాగాన్ని పోలి ఉండేలా నిలువుగా అమర్చిన టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది మొత్తం 8 రంగులలో లభిస్తుంది.సరికొత్త కియా సోరెంటో 4 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన 12.3-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ లేదా దానికి సరిపోయే 12.3-అంగుళాల డిజిటల్ డిస్ప్లే పొందుతుంది. కియా కనెక్ట్ 2.0, ఓవర్-ది-ఎయిర్ అప్డేట్లు, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్ప్లే, జనరేటివ్-AI అసిస్టెంట్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కాకుండా.. వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ రో సీట్లు, 10-వే ఎలక్ట్రిక్ డ్రైవర్ సీటు, ముందు ప్రయాణీకుడి సీటు కోసం పవర్ అడ్జస్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, 12-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్ వంటికి ఉన్నాయి.సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 26-ఫీచర్ల భద్రతా ప్యాకేజీ ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్స్ పది ఎయిర్‌బ్యాగ్‌లు, 28 వరకు భద్రతా ఫీచర్లను పొందుతాయి. ఇందులో లెవెల్ 2+ ఏడీఏఎస్, సరౌండ్-వ్యూ, బ్లైండ్-వ్యూ మానిటర్లు, రిమోట్ పార్కింగ్ అసిస్టెన్స్, డిజిటల్ ఇన్సైడ్ రియర్-వ్యూ మిర్రర్, ఫ్రంట్ అండ్ రియర్ డాష్‌క్యామ్, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్ ఉన్నాయి.కియా సోరెంటో అనేది స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, ఆల్-వీల్ డ్రైవ్ పొందిన కియా ఇండియా మొదటి మోడల్. ఇది డీజిల్ ఇంజన్‌ను కూడా అందిస్తుంది. హైబ్రిడ్ వెర్షన్లో 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటార్ లభిస్తుంది. ఇంజన్ 180 హార్స్ పవర్ ఉత్పత్తి చేయగా, ఎలక్ట్రిక్ మోటార్ 65 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ రెండింటి సంయుక్త అవుట్‌పుట్ 238హార్స్ పవర్. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 265 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త విధానం.. కీలక ప్రతిపాదనలు
ట్రాఫిక్ నిబంధనలు పదేపదే ఉల్లంఘించే వాహనదారులకు ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లకు గ్రేడెడ్ పాయింట్ల విధానం తీసుకొచ్చే అంశాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) 66వ వార్షిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఉల్లంఘనలకు పాయింట్లు..ప్రతిపాదిత విధానంలో ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘనకు డ్రైవింగ్ రికార్డులో ప్రతికూల పాయింట్లు నమోదవుతాయి. ఒక నిర్దిష్ట పరిమితికి ఈ పాయింట్లు చేరితే డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏ నేరానికి ఎన్ని పాయింట్లు, ఎంత పరిమితికి ఏ చర్య అనే పూర్తి నిబంధనలను ప్రభుత్వం వెల్లడించలేదు.అంటే వేగంగా వాహనం నడపడం, సిగ్నల్ జంప్ చేయడం, ప్రమాదకర డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు ఒక్కోసారి జరిమానాతో ముగిసిపోకుండా.. డ్రైవర్ మొత్తం రికార్డుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ విధానం ఉద్దేశం.మంచి డ్రైవర్లకు ప్రోత్సాహకాలుఈ విధానం కేవలం శిక్షలకు పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా వాహనం నడిపే వారికి ప్రోత్సాహకాలు అందించేలా ఉండొచ్చని గడ్కరీ తెలిపారు. మంచి డ్రైవింగ్ రికార్డు ఉన్నవారికి బీమా సంస్థల నుంచి ప్రోత్సాహకాలు లేదా ఇతర ప్రయోజనాలు లభించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలు ఎలా ఉంటాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.రోడ్డు భద్రతపై పెరుగుతున్న ఆందోళనడ్రైవర్ ప్రవర్తన దేశంలో రోడ్డు భద్రతకు ప్రధాన సవాలుగా ఉందని గడ్కరీ పేర్కొన్నారు. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా 5,13,563 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో సుమారు 1.83 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున ప్రతి గంటకు దాదాపు 59 ప్రమాదాలు, 21 మరణాలు నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 2025లో రోడ్డు ప్రమాద మరణాల్లో ద్విచక్ర వాహనదారుల వాటా 46.2 శాతంగా ఉంది.ఈ నేపథ్యంలో వాహనాల భద్రతతో పాటు డ్రైవింగ్ ప్రవర్తనపైనా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత్ ఎన్‌క్యాప్ 2.0ను 2027 అక్టోబర్ నుంచి అమలు చేయాలని యోచిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఇందులో వాహనం క్రాష్ పనితీరుతో పాటు ప్రమాద నివారణ, పాదచారుల భద్రత, ప్రమాదం తర్వాత రక్షణ వంటి అంశాలనూ విస్తృతంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.బైక్ ట్యాక్సీలకు గడ్కరీ మద్దతుఇదే సమయంలో ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను బైక్ ట్యాక్సీలుగా నడిపేందుకు రాష్ట్రాలు అనుమతించాలని గడ్కరీ కోరారు. రవాణా రంగం రాష్ట్రాల పరిధిలో ఉండటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సేవలకు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో ఇది అదనపు ఆదాయ మార్గంగా మారవచ్చని, దాదాపు 8 కోట్ల మందికి జీవనోపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం ఈ రంగానికి ఉందని ఆయన అన్నారు.అంతేకాకుండా హైవేలు, మైనింగ్ వంటి అధిక ప్రమాద రంగాల్లో పనిచేసే డ్రైవర్లు, కార్మికుల కోసం ‘సురక్ష’ పైలట్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. తొలిదశలో నాగ్‌పూర్–కాంప్టీ ప్రాంతంలోని NH-44తో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్ మైనింగ్ ప్రాంతంలో సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో 10 వేల మందికి వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ అందించనున్నారు.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత! -
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైంది. దశాబ్దం చివరి నాటికి మొత్తం 1 లక్ష ఉద్యోగాలను తగ్గించేందుకు కంపెనీ యాజమాన్యం, కార్మిక సంఘాలు అంగీకరించాయి. ఇప్పటికే అంగీకరించిన 50 వేల ఉద్యోగాల కోతకు అదనంగా మరో 50 వేల పోస్టులను తగ్గించేందుకు తాజాగా ప్రణాళిక రూపొందించారు. ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద పునర్వ్యవస్థీకరణల్లో ఇది ఒకటిగా నిలవనుంది.వోక్స్వ్యాగన్ గ్రూప్‌లో ఆడి, పోర్షే సహా 10 బ్రాండ్లు ఉన్నాయి. సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని కంపెనీ పేర్కొంది. అమెరికా సుంకాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు మందగించిన డిమాండ్, ముఖ్యంగా చైనాలో స్థానిక కార్ల తయారీ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ వోక్స్‌వ్యాగన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.15 శాతం ఉద్యోగాలకు కోతప్రతిపాదిత 1 లక్ష ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా వోక్స్వ్యాగన్ గ్రూప్ ఉద్యోగుల్లో దాదాపు 15 శాతానికి సమానం. 2009లో దివాలా రక్షణ కోసం దరఖాస్తు చేసిన జనరల్ మోటార్స్ చేపట్టిన 50 వేల ఉద్యోగాల కోతను కూడా ఇది అధిగమిస్తుంది.నాలుగు ప్లాంట్ల భవిష్యత్తుపై అనిశ్చితిహన్నోవర్, ఎమ్డెన్, జ్వికావు, నెకార్సుల్మ్లోని నాలుగు జర్మన్ ప్లాంట్ల దీర్ఘకాలిక భవిష్యత్తుకు హామీ ఇవ్వలేమని యాజమాన్యం, కార్మిక సంఘాలు అంగీకరించాయి. వీటిలో ఏదైనా ప్లాంట్‌ను మూసివేస్తే, జర్మనీలో పూర్తి స్థాయి కర్మాగారాన్ని వోక్స్వ్యాగన్ తొలిసారిగా మూసివేసినట్లవుతుంది.ముఖ్యంగా జ్వికావు ప్లాంట్ మూసివేతపై అక్కడి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆ ప్లాంట్‌పై ఆధారపడే సరఫరాదారులు, ఇతర స్థానిక ఉద్యోగాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో మొత్తం ప్రాంత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుందని కార్మికులు చెబుతున్నారు.పర్యవేక్షక బోర్డు ఆమోదంకంపెనీ పర్యవేక్షక బోర్డు కొత్త పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇది వోక్స్వ్యాగన్ భవిష్యత్తుకు బలమైన సంకేతమని సీఈవో ఆలివర్ బ్లూమ్ పేర్కొన్నారు. అయితే ఉద్యోగుల కోతలపై యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య చర్చలు తీవ్రంగా సాగాయి. ముఖ్యంగా 1 లక్ష ఉద్యోగాల కోతకు సంబంధించిన సమాచారం ముందుగానే మీడియాలో వెలువడటంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.ప్లాంట్ల మూసివేతపై యూనియన్ స్పష్టతవోక్స్వ్యాగన్ పర్యవేక్షక బోర్డులో కార్మిక ప్రతినిధులకు గణనీయమైన ప్రాతినిధ్యం ఉంది. ప్లాంట్ల ఏర్పాటుకు లేదా పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కీలక నిర్ణయాలపై వారికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. తాజాగా ఈ అధికారాల పరిధిని మార్చే అంశంపైనా చర్చ జరిగింది.అయితే ఐజీ మెటల్ యూనియన్, వోక్స్వ్యాగన్ పర్యవేక్షక బోర్డు సభ్యులు మాత్రం ఏ ప్లాంట్‌నూ వదులుకోలేదని, ప్లాంట్ మూసివేతకూ ఎలాంటి ఆమోదం ఇవ్వలేదని స్పష్టం చేశారు. జర్మనీలోని లోయర్ సాక్సోనీ రాష్ట్రంతో కలిసి కార్మిక ప్రతినిధులు రాజీకి వచ్చి, వివాదం మరింత ముదరకుండా అడ్డుకున్నామని వారు తెలిపారు.వోక్స్వ్యాగన్ తాజా నిర్ణయం యూరప్ ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న సవాళ్లకు అద్దం పడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్పు, చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, వాణిజ్య సుంకాల ప్రభావం నేపథ్యంలో ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థలు తమ వ్యూహాలను, ఉత్పత్తి సామర్థ్యాలను, ఉద్యోగుల సంఖ్యను పునఃపరిశీలిస్తున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో కావాలి.. ‘కొత్త రిజర్వేషన్లు’!! -
డ్రైవర్‌లెస్ రోబోటాక్సీ!
స్వయంప్రతిపత్తి (అటానమస్) విభాగంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా ‘సైబర్‌క్యాబ్’ రోబోటాక్సీ సేవలను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌తో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మానవ ప్రమేయం (డ్రైవర్) లేకపోవడమే కాకుండా, అసలు స్టీరింగ్ వీల్ గానీ, యాక్సిలరేటర్-బ్రేక్ పెడల్స్ గానీ లేని వాహనం సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆటోమొబైల్ చరిత్రలోనే ఓ కీలక మైలురాయి అని కంపెనీ చెప్పింది.ఇద్దరు ప్రయాణించేలా..ఇది కేవలం ఇద్దరు ప్రయాణించేలా డిజైన్ చేసిన పూర్తిస్థాయి డ్రైవర్‌లెస్ టూ-సీటర్ వాహనం. స్టీరింగ్, పెడల్స్ లేకపోవడంతో లోపల ప్రయాణికులకు విశాలమైన స్థలం(బూట్ స్పేస్) లభిస్తుంది. సెంట్రల్ డిస్ప్లే, క్లైమేట్ కంట్రోల్ తప్ప ఎలాంటి మ్యాన్యువల్ కంట్రోల్స్ ఇందులో ఉండవు. స్టార్‌లింక్ వీ5 శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఈ వాహనంలో ప్రయాణికులు 4కే లైవ్ వీడియోలు, గేమింగ్ ఆస్వాదించవచ్చు. దీనిని ‘చక్రాలపై కదిలే కంఫర్టబుల్ లాంజ్’ అని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభివర్ణించారు.Cybercab interior tour with @wholemars. pic.twitter.com/06iKekv8bt— Sawyer Merritt (@SawyerMerritt) September 3, 2026రోబోటాక్సీ యాప్ ద్వారా బుకింగ్ప్రయాణికులు టెస్లా రోబోటాక్సీ యాప్ ద్వారా నేరుగా సైబర్‌క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లో ఇద్దరు ప్రయాణించే సైబర్క్యాబ్తో పాటు, నలుగురు ప్రయాణించే మోడల్ వై ఎస్యూవీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ వాహనం 48 kWh బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై 290-300 మైళ్ల రేంజ్ ఇస్తుంది. ఇప్పటివరకు తమ రోబోటాక్సీలు 10 లక్షల మైళ్లకు పైగా మానవ ప్రమేయం లేకుండా ప్రయాణించినట్లు టెస్లా తెలిపింది. వ్యాపారవేత్తలు సొంతంగా వీటిని కొనుగోలు చేసి నెట్‌వర్క్‌లో తిప్పుకునేలా ఆర్డర్లకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో వాహనం ధర దాదాపు 25,000 డాలర్లు-30,000 డాలర్లు(సుమారు రూ.28 లక్షలు) మధ్య ఉండవచ్చని అంచనా.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్! -
త్వరలో చిన్న ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపయోగించే తేలికపాటి వాణిజ్య వాహనాల విభాగంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తేనున్నట్లు మహీంద్రా ట్రక్స్ అండ్ బసెస్ ప్రెసిడెంట్, ఎస్ఎంఎల్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వినోద్ సహాయ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం లేదా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు. హెచ్‌సీవీ (భారీ వాణిజ్య వాహనాలు) విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను తేవాలంటే చార్జింగ్ మౌలిక సదుపాయాలు, ధరలపరమైన సవాళ్లు ఉంటున్నాయని సహాయ్ చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో సరికొత్త బ్లేజో–ఐటీఆర్కే భారీ వాణిజ్య ట్రక్కుల (హెచ్‌సీవీ) శ్రేణిని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. 25 నుంచి 55 టన్నుల వరకు సామర్థ్యం ఉండే ఈ వాహనాల ధర రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉంటుంది. నిర్వహణ వ్యయాలు భారీగా తగ్గేలా, యజమానుల లాభదాయకత పెరిగేలా వీటిని తీర్చిదిద్దినట్లు సహాయ్ చెప్పారు. -
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు
పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో.. వాహన తయారీదారులు వివిధ సెగ్మెంట్లు, బాడీస్టైల్స్, ధరల శ్రేణులలో కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెలలో లాంచ్ కావడానికి కొత్త కార్లు కూడా సిద్ధమయ్యాయి.కియా సోరెంటోభారత మార్కెట్ కోసం కియా మొదటి హైబ్రిడ్ కారు ఈ వారం చివరి నాటికి మార్కెట్లో అడుగుపెట్టనుంది. కంపెనీ దీని ధరను సెప్టెంబర్ 4న వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఎస్యూవీ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా ఈ మోడల్ స్థానిక డీలర్ కేంద్రాలకు కూడా రావడం ప్రారంభమైనందున, లాంచ్ అయిన వెంటనే డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.కియా సోరెంటో పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్ 2 ఏడీఏఎస్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్, కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్ స్క్రీన్లతో కూడిన డాష్‌బోర్డ్‌పై కర్వ్డ్ డిస్ప్లే, పవర్డ్ టెయిల్‌గేట్, రెండవ వరుస కోసం సన్షేడ్లు, కంఫర్ట్ హెడ్‌రెస్ట్‌లు, ఇంకా వెంటిలేషన్ అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్లతో కూడిన ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. సోరెంటోకు పోటీగా టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ మజెస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టేరాన్, స్కోడా కోడియాక్ వంటి కార్లు ఉంటాయి.మారుతి బాలెనో ఫేస్లిఫ్ట్మారుతి సుజుకి నుంచి రాబోయే తదుపరి పెద్ద మోడల్ బాలెనో ఫేస్‌లిఫ్ట్ . ఇది సెప్టెంబర్ 5న భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అప్డేటెడ్ మోడల్ కొత్త ఇంజన్ పొందనుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. 2026 బాలెనోలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఏడీఏఎస్ సూట్, కొత్త డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, సవరించిన అప్హోల్స్టరీ ఉంటాయి. కాస్మెటిక్ మార్పులలో కొత్త గ్రిల్, సవరించిన ముందు, వెనుక బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు అప్డేట్ చేయబడిన కలర్ ప్యాలెట్ ఉంటాయి.రెనాల్ట్ ట్రైబర్ టర్బోరెనాల్ట్ కంపెనీ చాలా రోజుల తరువాత కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ లాంచ్ చేయనున్న ట్రైబర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. ఈ నెల చివరి నాటికి దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.బీఎండబ్ల్యు ఐ5 LWBఎక్స్1 ఎల్డబ్ల్యుబీ లాంచ్ సందర్భంగా.. కంపెనీ ఐ5 ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ధరలు సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది 81.6kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా 669 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు వెనుక చక్రాలకు ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 268 Bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.పోర్షే కయెన్ ఎలక్ట్రిక్పోర్షే ఈ నెల చివర్లో భారతదేశంలో కయెన్ ఎలక్ట్రిక్‌ను అధికారికంగా పరిచయం చేయనుంది. నిజానికి ఇది గత సంవత్సరం చివర నుంచే భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1.77 కోట్లు (ఎక్స్-షోరూమ్).కయెన్ ఎలక్ట్రిక్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడిన 113kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది రెండు ట్యూనింగ్ స్టేట్స్లో లభిస్తుంది. కయెన్ ఎలక్ట్రిక్, కయెన్ ఎస్ ఎలక్ట్రిక్ అని పిలువబడే మొదటి రెండు వేరియంట్లు 402bhp/835Nm పవర్ విడుదల చేయగా, టాప్-స్పెక్ కయెన్ టర్బో ఎలక్ట్రిక్ 844bhp/1500Nm పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ ఒకే ఛార్జ్‌పై 643 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలని సమాచారం. -
యూకే ప్రధాని మెచ్చిన ఇండియా బైక్.. ధర ఎంతంటే?
యూకే మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. భారతదేశంలో తయారైన మోటార్‌సైకిల్ రైడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు.బోరిస్ జాన్సన్ రైడ్ చేసిన బైక్ బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ (BSA) బాంటమ్ మోటార్‌సైకిల్. ఒక విశాలమైన మైదానంలో ఆ మోటార్‌సైకిల్‌ను నడపడానికి ముందు, బీఎస్ఏ బాంటమ్ను ఆంగ్లో-ఇండియన్ సాంకేతిక సహకారానికి ఒక బలమైన ఉదాహరణగా అభివర్ణించారు.ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. జాన్సన్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో తయారు చేస్తున్న బైక్‌ను.. ఆస్వాదిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బోరిస్ జాన్సన్ పేరులో, బీఎస్ఏలో మొదటి అక్షరాలు కలిసినట్లు ఉన్నాయని అన్నారు.నిజానికి బీఎస్ఏ ఒక బ్రిటిష్ తయారీ సంస్థ. కానీ ప్రస్తుతం మహీంద్రా గ్రూప్ ఈ బ్రాండ్‌ను సొంతం చేసుకుని, జావా అండ్ యెజ్డీ మోటార్‌సైకిళ్లను కూడా తయారుచేసే క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీ ద్వారా నిర్వహిస్తోంది.బీఎస్ఏ బాంటమ్ చరిత్రయూకేలో బీఎస్ఏ బాంటమ్ పేరుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అసలు మోటార్‌సైకిల్ 1948-1971 మధ్య తయారైంది. ఇది 123 సీసీ నుంచి 173 సీసీ వరకు ఇంజన్లతో లభించే తేలికపాటి టూ-స్ట్రోక్ మెషీన్‌గా ప్రసిద్ధి చెందింది.అయితే.. బాంటమ్ బైక్ లేటెస్ట్ రోడ్‌స్టర్ మోడల్. ఇది 29 హార్స్ పవర్, 29 న్యూటన్ మీటర్ టార్క్ అందించే.. 344 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడి.. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, ఏబీఎస్ వంటివి ఉన్నాయి. యూకేలో దీని ధర 3,499 పౌండ్ల (రూ.4.5 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.మేడ్ ఇన్ ఇండియాBSAకు బ్రిటిష్ మూలాలు ఉన్నప్పటికీ, బాంటమ్ భారతదేశంలో తయారై అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతోంది. ఈ మోడల్ యూకే, యూరోపియన్ మార్కెట్లలో అమ్ముడవుతోంది, కానీ ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేదు. ఎందుకంటే.. ఇండియాలో BSA శ్రేణి మరింత పరిమితంగా ఉంది. ఇందులో గోల్డ్ స్టార్, 650 స్క్రాంబ్లర్ ఉన్నాయి. BSA యూకే, టర్కీ, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి మార్కెట్లలో కూడా తన ఉనికిని కలిగి ఉంది.Thank you for the plug Mr. JohnsonWe’re delighted to see you enjoying the bike we’ve resurrected & now build in India…As long as you don’t want us to rechristen BSA as the ‘Boris Small Arms’ company…🙂 pic.twitter.com/5GRLBmyD6K— anand mahindra (@anandmahindra) August 31, 2026 -
గ్లోబల్ ఆటో రేస్‌లో భారత్
దేశీయ ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ రంగాలు ప్రపంచ స్థాయి పోటీతత్వం, సాంకేతిక నాయకత్వం, ఉత్పత్తి స్థాయి విస్తరణతో పాటు అంతర్జాతీయ నాయకత్వంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆటో పరిశ్రమ ప్రముఖులు అన్నారు. భారత్‌ను ప్రపంచ ఆటో తయారీ, మొబిలిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు డిజైన్, ఇంజినీరింగ్, ఆవిష్కరణలు, లోకలైజేషన్, ఎగుమతులపై దృష్టి పెంచాలని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) 66వ వార్షిక సమావేశంలో ప్రముఖులు పిలుపునిచ్చారు.‘‘భారతీయ ఆటో రంగం కేవలం ఒడిదుడుకులను తట్టుకోవడానికే పరిమితం కాకుండా... అంతరాయాలను తట్టుకునే సామర్థ్యాన్ని గ్లోబల్ పోటీతత్వంగా మార్చుకోవడంతో పాటు.. భారత్ నుంచే ప్రపంచ స్థాయి, టెక్నాలజీ ఆధారిత, సుస్థిర ఆటో వాల్యూ చైన్లను నిర్మించుకోవాలి. దేశీయ ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ రంగాలు ఎగుమతులు సహా రికార్డు స్థాయి పనితీరు కనబరుస్తున్నాయి. కేవలం దిగుమతుల ప్రత్యామ్నాయంపైనే దృష్టి పెట్టకుండా, ‘భారత్‌లోనే రూపకల్పన, భారత్‌లోనే అభివృద్ధి, భారత్‌లోనే తయారీ, ఇక్కడి నుంచే ఎగుమతులు’ అనే విధానంతో ముందుకు సాగాలి’’ అని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు.స్వావలంబన అంటే అంతర్జాతీయ సప్లైల నుంచి దూరం కావడం కాదని, వాటిలో భారత్ ఒక కీలక కేంద్రంగా మారాలని చంద్ర పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తదుపరి దశగా భారత్‌లోనే సృష్టించడం, ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేపట్టి దేశంతో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని ఏసీఎంఏ అధ్యక్షుడు విక్రమ్‌పతి సింఘానియా అన్నారు.ప్రపంచ సప్లై చైన్లల్లో భారత్ కీలక కేంద్రంప్రపంచ ఆటో రంగంలో సరఫరా గొలుసులు మారుతున్న పరిస్థితుల్లో.. భారత్ దేశీయ మార్కెట్, తయారీ సామర్థ్యం, ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించుకుని గ్లోబల్ హబ్‌గా ఎదగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఒడిదుడుకులను తట్టుకునే ‘సామర్థ్యాని’కే పరిమితం కాకుండా.. టెక్నాలజీ, నాణ్యత, లోకలైజేషన్, ఎగుమతులు, ఆవిష్కరణలను బలోపేతం చేయడం ద్వారా ప్రపంచ ఆటో విలువ గొలుసుల్లో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి. ఈవీ వృద్ధికి దేశీయ టెక్నాలజీ కీలకంఈవీల విక్రయాల సంఖ్య పెరగడమే భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ విజయానికి కొలమానం కాదని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ. కుమారస్వామి అన్నారు. దేశంలో ఎంత టెక్నాలజీ అభివృద్ధి అవుతోంది, ఆటోమొబైల్ రంగంలో ఎంత విలువ దేశీయంగా జోడించబడుతోంది, ఎన్ని ఎంఎస్ఎంఈలు కొత్త సరఫరా గొలుసుల్లో భాగమవుతున్నాయి, భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలో ఎంత సమర్థంగా పోటీపడుతున్నాయన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. పర్యావరణహిత, సమర్థవంతమైన, కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ సంస్థలు మరింత పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ రంగాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆమోదిత సంస్థలు రూ.45,477 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో 67,000కుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని కుమారస్వామి వెల్లడించారు.కొత్త ఎస్‌యూవీలతో హ్యుందాయ్ విస్తరణదేశీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో కోల్పోయిన రెండో స్థానాన్ని తిరిగి సాధించేందుకు కొత్త మోడళ్లతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ తెలిపారు. పండుగ సీజన్లో కొత్త మిడ్–సైజ్ ఎస్‌యూవీతో పాటు సబ్–ఫోర్ మీటర్ విభాగంలో ప్రత్యేక ఈవీని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ కొత్త మోడళ్లతో రెండో అర్ధభాగంలో పరిశ్రమ కంటే అధికంగా 8–10 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టులో కంపెనీ ఇప్పటికే దాదాపు 13 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. పుణె ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రస్తుత 1.7 లక్షల యూనిట్ల నుంచి 2028 నాటికి 2.5 లక్షలకు, 2030 నాటికి 3 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు గార్గ్ తెలిపారు.విశ్వసనీయ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో భారత్ నమ్మదగిన తయారీ, సరఫరా గొలుసుల కేంద్రంగా ఎదిగేందుకు గణనీయమైన అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టకేయుచి అన్నారు. తయారీలో ఖర్చు మాత్రమే నిర్ణయాత్మక అంశం కాదని, నాణ్యత, విశ్వసనీయత, సరఫరా కొనసాగింపు కూడా అంతే కీలకంగా మారాయని చెప్పారు. లోతైన లోకలైజేషన్, సాంకేతికత, మానవ వనరులు, సమష్టి అభ్యాసం తదితర అంశాలు ప్రధానమైనవిగా పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయాలంటే టైర్–2, టైర్–3 సరఫరాదారుల సామర్థ్యాలను కూడా పెంచాల్సి ఉంటుందని అన్నారు. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతపైనా కంపెనీలు మరింత దృష్టి పెట్టాలని సూచించారు.హైటెక్ రంగాలకు బీఐఎస్ నిబంధనల్లో సడలింపుభారత్లో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే హైటెక్ రంగ కంపెనీలకు అవసరమైన పరికరాలు, కాంపోనెంట్లపై తప్పనిసరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ధ్రువీకరణ నుంచి మినహాయింపు కల్పించేలా ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకురానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సెమీకండక్టర్ తయారీ సంస్థకు సుమారు 13,501 కాంపోనెంట్లు అవసరమవుతాయని, ఇన్ని విడిభాగాలకు బీఐఎస్ అనుమతులు పొందడం సవాలుగా ఉందని జపాన్ సంస్థలు తన ఇటీవల టోక్యో పర్యటన సందర్భంగా తెలిపాయని గోయల్ తెలిపారు. హైటెక్ రంగ కంపెనీలు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమకు అవసరమైన పరికరాలు, కాంపోనెంట్లను సమకూర్చుకునే వెసులుబాటు కల్పిస్తామని గోయల్ తెలిపారు. భారత్‌లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే హైటెక్ సంస్థలకు అవసరమైన పరికరాలు, వస్తువులు, సేవలు సకాలంలో అందుబాటులో ఉండేలా చేయడం, ‘మేక్ ఇన్ ఇండియా’కు మద్దతు ఇవ్వడం ఈ మార్పు లక్ష్యమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం! -
భారీ రేంజ్‌తో ‘సింపుల్’ ఎలక్ట్రిక్ స్కూటర్..
మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ‘సింపుల్ ఎనర్జీ’ మరో కొత్త మోడల్‌తో సందడి చేసింది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సింపుల్ వేవ్ (Simple Wave) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1,09,999 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ స్కూటర్‌కు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 25 నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి.నాలుగు బ్యాటరీ ఆప్షన్లు.. 243 కి.మీ. వరకు రేంజ్సింపుల్ వేవ్‌ను వేవ్ ఎస్, వేవ్, వేవ్+ పేర్లతో మూడు ప్రధాన వేరియంట్లలో, మొత్తం ఆరు కాన్ఫిగరేషన్లలో అందిస్తోంది. ఇందులో 2.2kWh, 2.7kWh, 3.7kWh, 5kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి IDC రేంజ్ 110 కి.మీ. నుంచి 243 కి.మీ. వరకు ఉంటుంది.టాప్ వేరియంట్ సింపుల్ వేవ్+లో 5kWh బ్యాటరీ ప్యాక్, 6.4kW PMSM మోటార్ ఉన్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్‌తో 243 కి.మీ. వరకు IDC రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ. కాగా, 179Nm వీల్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.7kWh బ్యాటరీ వెర్షన్ 171 కి.మీ., 2.7kWh వెర్షన్ 132 కి.మీ., 2.2kWh వెర్షన్ 110 కి.మీ. వరకు రేంజ్‌ను అందిస్తాయి.ఛార్జింగ్..సింపుల్ వేవ్‌లో పోర్టబుల్ ఛార్జర్ సదుపాయం ఉంది. టాప్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని సుమారు 2 గంటల 15 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ, మోటార్ రెండింటికీ IP67 రేటింగ్ ఉండటంతో పాటు 300 మి.మీ. వరకు వాటర్ వాడింగ్ సామర్థ్యం ఉందని సంస్థ తెలిపింది.70 లీటర్ల స్టోరేజ్..వేవ్ ప్రధాన ఆకర్షణల్లో భారీ స్టోరేజ్ ఒకటి. మొత్తం 70 లీటర్ల వరకు స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. ఇందులో 63 లీటర్ల వరకు అండర్-సీట్ స్టోరేజ్, 3 లీటర్ల గ్లోవ్ బాక్స్, మరో 4 లీటర్ల ‘పిల్’ అనే ప్రత్యేక స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఉన్నాయి. రోజువారీ షాపింగ్, హెల్మెట్, బ్యాగులు, ఇతర వస్తువులను సులభంగా పెట్టుకునేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు.కుటుంబ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని 920 మి.మీ. పొడవైన ఫ్లాట్ సీటును కూడా అందించారు. 1,347 మి.మీ. వీల్‌బేస్, 775 మి.మీ. సీటు ఎత్తు, 150 కిలోల పేలోడ్ సామర్థ్యం, 175 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి.ఫీచర్లు అదుర్స్..వేరియంట్‌ను బట్టి 7 అంగుళాల TFT డిస్ప్లే లేదా EBN డిస్ప్లే లభిస్తుంది. అధిక వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, GPS, కాల్-మ్యూజిక్ కంట్రోల్స్, USB ఛార్జింగ్, OTA అప్డేట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి.అదనంగా ట్రాక్షన్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, క్రాల్ మోడ్, వెహికల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రైడ్, ఎకో, ECOX రైడింగ్ మోడ్లు అన్ని వేరియంట్లలో ఉండగా.. అధిక వేరియంట్లలో స్పోర్ట్ మోడ్ కూడా లభిస్తుంది. పూర్తి LED లైటింగ్ స్టాండర్డ్‌గా ఉంటుంది.డిజైన్, సేఫ్టీ..సింపుల్ ఎనర్జీ తన గత స్పోర్టీ మోడళ్లకు భిన్నంగా వేవ్‌కు సింపుల్, కర్వీ డిజైన్‌ను అందించింది. ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకునేలా ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, పెద్ద సీటు, ఎక్కువ స్టోరేజ్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లు, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తుంది.ఆకర్షణీయ రంగుల్లో..సింపుల్ వేవ్ పెర్ల్ వైట్, కోరల్ రెడ్, ట్విలైట్ బ్లాక్, పోలార్ బ్లూ, డాల్ఫిన్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ వంటి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తుంది. ధర, రేంజ్, భారీ స్టోరేజ్‌తో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది ఏథర్ కొనార్క్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.ఇక దేశవ్యాప్తంగా సర్వీస్ సదుపాయాలను విస్తరించేందుకు ‘సింపుల్ సూపర్ ల్యాబ్స్’ను కంపెనీ ఏర్పాటు చేయనుంది. తొలి దశలో బెంగళూరు, చెన్నై, కొచ్చి, గోవా, పుణె, ఢిల్లీ, ఒడిశా, కోల్‌కతాలో ఈ సదుపాయాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. -
భారత్‌లో టెస్లా 20 సూపర్ ఛార్జర్లు ఏర్పాటు
ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో తన మౌలిక వసతులను వేగంగా ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో పాటు విక్రయానంతర సేవలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 ‘సూపర్ ఛార్జర్ల’ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా 'టెస్లా-అప్రూవ్డ్ బాడీ షాప్' (టీఏబీ), సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.అహ్మదాబాద్‌లో కొత్త సదుపాయం ప్రారంభోత్సవం సందర్భంగా టెస్లా ఇండియా కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో తెరిచిన ఈ సెంటర్ భారత్‌లో కంపెనీకి చెందిన 7వ బాడీ షాప్, సర్వీస్ సెంటర్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే గురుగ్రామ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణె, ముంబై నగరాల్లో టెస్లా తమ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తోంది. గుజరాత్ పరిధిలోని వినియోగదారులకు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో బాడీ రిపేర్, కొలిజన్ రిపేర్ సేవలను ఇది అందిస్తుంది.టెస్లా వాహనాలకు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అవసరం చాలా స్వల్పమని అగర్వాల్ పేర్కొన్నారు. సింహభాగం సాంకేతిక సమస్యలను ‘రిమోట్ డయాగ్నోసిస్’ (సాఫ్ట్వేర్ ఆధారిత తనిఖీ) ద్వారానే పరిష్కరించవచ్చని, 24/7 సర్వీస్ అసిస్టెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో మోడల్ Y రెండు వేరియంట్లను అందుబాటులో ఉంచారు. మోడల్ వై ఆర్డబ్ల్యూడీ ధర సుమారుగా రూ.51.89 లక్షలు, మోడల్ వైఎల్ రూ.61.99 లక్షలుగా ఉంది.ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. -
యువతకు ఉద్యోగావకాశాలు.. కుమారస్వామి కీలక వ్యాఖ్యలు!
దేశంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించాలని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి పిలుపునిచ్చారు. దేశంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించడం కష్టతరంగా మారింది అనేది వాస్తవమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాన్ని సాధించడంలో పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు కల్పించడం ఎంతో కీలకమన్నారు.న్యూఢిల్లీలో జరిగిన ‘ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఏఎస్‌డీసీ) వార్షిక సదస్సు 2026’లో కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ‘‘ప్రతిరోజూ నన్ను కలుస్తున్న యువతను చూస్తే ఉద్యోగం పొందడం ఎంత కష్టంగా ఉందో అర్థమవుతోంది. చదువుకున్న పట్టభద్రులకు కూడా ఉపాధి లభించడం లేదు. ఆటోమొబైల్ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు ఉద్యోగాల కల్పన అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నా వ్యక్తిగత విన్నపం’’ అని కుమారస్వామి అన్నారు.కొత్త శకంలోకి ఆటో పరిశ్రమఈవీ మొబిలిటీ, ఆటోమేషన్, కనెక్టెడ్ టెక్నాలజీలు, అధునాతన తయారీ, ‘ఇండస్ట్రీ 4.0’ వంటి పరిణామాలతో భారత ఆటోమొబైల్ రంగం కొత్త శకంలోకి అడుగుపెడుతోందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్ కేవలం పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా కాకుండా ప్రపంచస్థాయి ఆటోమొబైల్ తయారీ, టెక్నాలజీ, మొబిలిటీ సొల్యూషన్స్ కేంద్రంగా ఎదుగుతోందని కుమారస్వామి అన్నారు.ఈవీ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం పీఎం డ్రైవ్, పీఎల్ఐ ఆటో, పీఎల్ఐ ఏసీసీ వంటి పథకాల ద్వారా పటిష్టమైన ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. అయితే, తయారీ సామర్థ్యం పెరిగినంత మాత్రాన సరిపోదన్నారు. హై–వోల్టేజ్ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎల్రక్టానిక్స్, అధునాతన డయాగ్నస్టిక్స్పై ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న కొత్త తరం టెక్నీíÙయన్లు, ఇంజనీర్లు, నిపుణులు అవసరమని తెలిపారు.కొత్త టెక్నాలజీలను నిర్వహించడం, ఆధునిక వ్యవస్థలను మెయింటెయిన్ చేయడం, వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పనిచేయడం, ఆవిష్కరణలు–ఉత్పాదకతకు తోడ్పడేలా యువతను సిద్ధం చేయాలని సూచించారు. ఆటోమొబైల్ రంగానికి ఉన్న మల్టీప్లయర్ ఎఫెక్ట్ కారణంగా ఇంజనీరింగ్, ఎల్రక్టానిక్స్, స్టీల్, ఆటో కాంపోనెంట్లు, లాజిస్టిక్స్, సాఫ్ట్వేర్, సేవల వంటి అనుబంధ రంగాల్లోనూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని కుమారస్వామి పేర్కొన్నారు. -
E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇదే!
మనలో చాలామంది పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు లీటర్ పెట్రోల్‌కు ఎంత డబ్బు చెల్లిస్తున్నామో అని మాత్రమే చూస్తాం. కానీ.. అందులో ఎంత ఇథనాల్ కలిపి ఉంది? అనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు ఇదే విషయంపై చర్చ జరుగుతోంది.పెట్రోల్ బంకుల్లో అమ్ముతున్న ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో.. కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ అంశంపై సంబంధిత అధికారులను సంప్రదించుకోవచ్చని పిటిషనర్‌కు సూచించింది.E20 పెట్రోల్ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు E20 పెట్రోల్. ఇందులో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, దేశంలోనే తయారయ్యే ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలుపుతోంది. అయితే.. కస్టమర్లు తాము కొంటున్న పెట్రోల్‌లో అసలు ఎంత ఇథనాల్ ఉందో తెలుసుకోవాలని కోరుతున్నారు.వాహనదారుల్లో సందేహాలుE20 పెట్రోల్‌పై వాహనదారుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా.. పాత వాహనాల్లో ఈ20 ఇంధనం వాడితే మైలేజ్ ఎలా ఉంటుంది? ఇంజిన్‌పై ప్రభావం ఉంటుందా? ఫ్యూయల్ సిస్టమ్‌కు ఏమైనా సమస్యలు వస్తాయా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే మైలేజ్ అనేది.. కేవలం ఇంధనంపైనే మాత్రమే ఆధారపడి ఉంటుందనుకోవడం పొరపాటు. ఎందుకంటే.. డ్రైవింగ్ చేసే విధానం, ట్రాఫిక్, వెహికల్ మెయింటెనెన్స్, టైర్ ప్రెజర్, ఏసీ వినియోగం వంటి అంశాలు మైలేజిని ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది.పంటలపై ప్రభావంఇథనాల్ తయారీకి పంటలను ఉపయోగించడంపై కూడా చర్చ మొదలైంది. ఆహారం కోసం ఉపయోగించే పంటలను ఇంధనం తయారీకి ఉపయోగిస్తే.. భవిష్యత్తులో ఆహార ధరలపై ప్రభావం పడుతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే.. వ్యవసాయ వ్యర్థాలు, బయోమాస్‌తో 2జీ ఇథనాల్ తయారు చేయడం ద్వారా ఆహార పంటలపై ఒత్తిడి తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యర్థాలను ఉపయోగించి ఇంధనం తయారు చేస్తే ఫుడ్, ఫ్యూయల్ రెండింటి అవసరాలను బ్యాలెన్స్ చేయొచ్చన్నమాట.ఇదీ చదవండి: 23 ఏళ్లకే ఉద్యోగం వదిలేశాడు.. కొండల్లో తిరుగుతూ కోట్ల సంపాదన! -
నెవ్వర్ బిఫోర్ : లగ్జరీ ఈవీలపై శ్రీమంతుల మోజు
సాక్షి, ముంబై: దేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జర్మనీకి చెందిన కార్ల దిగ్గజం BMW టాప్‌లో నిలిచింది. భారతదేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు BMW కార్లలో ఒకటి ఇప్పుడు ఎలక్ట్రిక్ కారే కాగా, రూ. 1.4కోట్లకు పైగా ధర పలికే మెర్సిడెస్ BEVలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ధనవంతులు/ప్రీమియంకార్ల కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపడానికి కారణాలేంటి? లగ్జరీ విభాగంలో ఈవీల జోరు2026 మొదటి ఆరు నెలల్లో దేశంలో అమ్ముడైన ప్రతి నాలుగు BMW కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనమే (మొత్తం 2,359 యూనిట్లు). మొత్తం మార్కెట్‌తో పోలిస్తే సాధారణ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో EVల వాటా 8-9శాతం మాత్రమే ఉండగా, BMW లో ఇది 3 రెట్లు (సుమారు 25-26శాతం) ఎక్కువగా ఉంది.మర్సిడీజ్ బెంజ్ (Mercedes-Benz): రూ. 1.4 కోట్ల కంటే ఎక్కువ ధరపలికే 'టాప్-ఎండ్' విభాగంలో సగటున ప్రతి 3 గంటలకు ఒక ఎలక్ట్రిక్ కారు అమ్ముడైంది. అలాగే రూ. 57 లక్షల ప్రారంభ ధర కలిగిన 'CLA BEV' మోడల్ 2026 సంవత్సరానికి సంబంధించిన స్టాక్ అంతా ఇప్పటికే అమ్ముడైపోయింది. పెట్రోల్/డీజిల్ కార్ల విక్రయాల వృద్ధి నెమ్మదించినప్పటికీ, EVల కారణంగా మర్సిడీజ్ బెంజ్ మొత్తం వృద్ధి 9శాతానికి, BMW వృద్ధి 17శాతానికి పెరిగింది.ఈవీలపై శ్రీమంతుల ఎందుకింత మోజుసాధారణ వాహనదారులను ఇబ్బంది పెట్టే సమస్యలు ధనవంతులకు అడ్డంకిగా మారకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నాయి మార్కెట్ వర్గాలు. ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం, బహుళ కార్ల గ్యారేజీలు, అనుకూలమైన పన్నుల విధానం , మోడళ్లలో పెరుగుతున్న ఎంపికలు వంటివి సంపన్నులలో EVల వినియోగాన్ని వేగవంతం చేస్తున్నాయంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు.సొంత పార్కింగ్ స్థలాలు ఉండటంతో వీరు ఇంట్లోనే రాత్రంతా ఉచితంగా/సులభంగా ఛార్జింగ్ చేసుకునే పాయింట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. బయటి ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా లగ్జరీ పెట్రోల్/డీజిల్ కార్లపై 28శాతం GST + సెజ్ (కలిపి దాదాపు 48శాతం పన్ను) పడుతుంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం 5శాతం GST మాత్రమే ఉంటుంది. దీనివల్ల పెట్రోల్ , EV లగ్జరీ కార్ల మధ్య ధర తేడా చాలా వరకు తగ్గుతుంది.ఎలక్ట్రిక్ మోటార్లు తక్షణ వేగాన్ని (instant torque) ఇస్తాయి, ఇంజిన్ శబ్దం లేకపోవడం వల్ల లగ్జరీ కార్లలో కోరుకునే నిశ్శబ్దకరమైన (quietness) అనుభూతి లభిస్తుంది. 2025 ఆర్థిక సంవత్సం నుంచే Porsche, Volvo, Rolls-Royce, Ferrari, Lexus వంటి లగ్జరీ సంస్థలు రూ. 5 కోట్ల వరకు ఖరీదు చేసే భారతదేశంలో 13 కొత్త EV మోడళ్లనుప్రారంభించాయి. చక్కటి డ్రైవింగ్ అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా లగ్జరీ ఈవీలు కోటీశ్వరులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయాయనడంలో సందేహం లేదు.ఇదీ చదవండి: మైనస్ 50 డిగ్రీల చలి.. లక్షల మంది జీవించే నగరం ఇదే!టెస్లా వెనుకంజఎలక్ట్రిక్ రంగంలో ప్రసిద్ధి చెందినప్పటికీ, టెస్లా తొలి ఏడాదిలో (జూన్ 2026 నాటికి) భారతదేశంలో కేవలం 450 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. టెస్లా వద్ద కేవలం 'Model Y' మోడల్ మాత్రమే ఉండటం, భారతదేశంలో ఇతర లగ్జరీ బ్రాండ్ల లాగా విస్తృతమైన డీలర్/సర్వీస్ నెట్వర్క్ లేకపోవడం దీనికి కారణం.ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’ -
భారత్‌లో తొలి E85 స్కూటర్ లాంచ్: ధర ఎంతో తెలుసా?
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశంలోని మొట్టమొదటి E85 స్కూటర్ ADV160 ధరను ప్రకటించింది. ఈ అడ్వెంచర్ స్టైల్ మ్యాక్సీ స్కూటర్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ దీని కోసం బుకింగ్స్ రూ. 5,000 టోకెన్ మొత్తంతో స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2026 అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ADV160 స్కూటర్ ప్రత్యేకత దాని E85-అనుకూల ఇంజన్. ఇందులోని 157 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్.. 16.3 bhp పవర్, 14.9 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పవర్ CVT ద్వారా వెనుక చక్రానికి డెలివరీ అవుతుంది. ఇందులోని ఇంజిన్ 85 శాతం వరకు ఇథనాల్ మరియు 15 శాతం పెట్రోల్ కలిగిన ఇంధనంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.ADV160 సరికొత్త డిజైన్ పొందుతుంది. షార్ప్ బాడీ వర్క్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎత్తైన, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, బ్లాక్-ప్యాటర్న్ టైర్లు ఉన్నాయి. పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద చక్రాలు ఉండటం వల్ల ఈ స్కూటర్ కఠినమైన రోడ్ల మీద కూడా సజావుగా ముందుకు సాగుతుంది. హోండా ADV160ను "సిటీ అడ్వెంచర్" స్కూటర్‌గా అభివర్ణిస్తుంది.హోండా తన ADV160లో చాలా ప్రీమియం ఫీచర్లను పొందుపరిచింది. ఇందులో ఫుల్ కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు హోండా రోడ్‌సింక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది. దీని ద్వారా రైడర్లు నావిగేషన్, కమ్యూనికేషన్ సంబంధిత ఫంక్షన్లను యాక్సెస్ చేయవచ్చు. ఈ స్కూటర్లో ట్రాక్షన్-కంట్రోల్ సిస్టమ్‌గా పనిచేసే హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో పాటు, సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. ఒక USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉండనున్నట్లు సమాచారం. సీటు కింద ఉన్న 27-లీటర్ల స్టోరేజ్ కంపార్ట్మెంట్ లభిస్తుంది.హోండా కొత్తగా ప్రకటించిన 10 ఉత్పత్తుల 'మేడ్-ఇన్-ఇండియా' పోర్ట్‌ఫోలియోలో ADV160 ఒక భాగం . భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాలకు సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనాల దిశగా కంపెనీ తీసుకుంటున్న అతిపెద్ద అడుగులలో ఇది ఒకటి. ఈ స్కూటర్‌ను స్థానికంగా తయారు చేసి, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. -
రూ.8.63 లక్షల కవాసకి కొత్త బైక్ ఇదే!
కవాసకి భారతదేశంలో MY2027 వెర్సిస్ 650ని రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఇది 'క్యాండీ లైమ్ గ్రీన్' అనే ఒకే రంగులో లభిస్తుంది. డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లు, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, ఎత్తైన హ్యాండిల్బార్లు, స్టెప్డ్ సీట్‌తో కూడిన అదే సెమీ-ఫెయిర్డ్ డిజైన్‌ను కొనసాగిస్తుంది.ఈ అడ్వెంచర్ బైక్‌లో అదే 649 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,500 rpm వద్ద 66 Bhp పవర్, 7,000 rpm వద్ద 61 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.వెర్సిస్ 650లో ముందువైపు USD ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ ఉన్నాయి. ఇవి వరుసగా 150 మిమీ మరియు 145 మిమీ ట్రావెల్‌ను అందిస్తాయి. ఇది 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. కవాసకి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 4.3-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ABS వంటి ఫీచర్లను అందిస్తుంది. -
ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజు, రేటు ఎంతంటే..
ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. బెంగళూరులో నిర్వహించిన కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఏథర్ కొనార్క్ (Konarc)ను ఆవిష్కరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన EL ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన తొలి ప్రొడక్షన్ మోడల్ ఇదే. కుటుంబ అవసరాలు, రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కొనార్క్.. ఏథర్ ప్రస్తుత 450 సిరీస్‌కు భిన్నంగా మాస్ మార్కెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంది.ప్రారంభ ధర రూ.99,999కొనార్క్ను ఏథర్ రెండు లైన్లలో మొత్తం ఆరు వేరియంట్లలో తీసుకురానుంది. ఇందులో S లైన్లో 100, 125, 161, 200 కి.మీ. IDC రేంజ్ వేరియంట్లు, Z లైన్లో 125, 161 కి.మీ. వేరియంట్లు ఉంటాయి. ప్రస్తుతం S లైన్‌లోని మూడు వేరియంట్ల ధరలను ప్రకటించింది.కొనార్క్ ఎస్ 100 (Konarc S 100) ధర : రూ.99,999కొనార్క్ ఎస్ 125 (Konarc S 125) ధర : రూ.1,21,999కొనార్క్ ఎస్ 161 (Konarc S 161) ధర : రూ.1,44,999ఇవి బెంగళూరు ఎక్స్‌షోరూమ్ ధరలు. 200 కి.మీ. వెర్షన్, Z లైన్ వేరియంట్ల ధరలను ఏథర్ తర్వాత ప్రకటించనుంది.161 కి.మీ. వరకు రేంజ్..ప్రస్తుతం విక్రయానికి సిద్ధమైన S 100, S 125, S 161 వేరియంట్లు వరుసగా 100, 125, 161 కి.మీ. IDC రేంజ్ అందిస్తాయి. అయితే కంపెనీ పేర్కొన్న ట్రూ రేంజ్ వరుసగా సుమారు 80, 100, 130 కి.మీ.గా ఉంటుంది. S 100లో 2.1kWh బ్యాటరీ, S 125లో 2.7kWh, S 161లో 3.5kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. గరిష్ఠ పవర్ వరుసగా 4kW, 4.7kWగా, టార్క్ 16Nmగా ఉంది. మూడు వేరియంట్ల గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ.ఫ్యామిలీ స్కూటర్‌గా..కొనార్క్ డిజైన్‌ను స్పోర్టియర్ 450 సిరీస్ కంటే ఎక్కువగా ప్రాక్టికల్‌గా, కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ముందు భాగంలో 14 అంగుళాల చక్రాన్ని అమర్చారు. 1,352 మి.మీ. వీల్‌బేస్ ఏథర్ స్కూటర్లలోనే అత్యంత పొడవైనది. ముందు సస్పెన్షన్ ట్రావెల్ 90 మి.మీ., వెనుక 100 మి.మీ.గా ఉంది. దీంతో గుంతలు, దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండేలా రూపొందించారు. వెనుక కూర్చునేవారి కోసం ప్యాడెడ్ గ్రాబ్ హ్యాండిల్, సౌకర్యవంతమైన సీటింగ్ ఇచ్చారు. ఈ స్కూటర్లో 31 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.కొత్త బ్రేకింగ్ సిస్టమ్భద్రత పరంగా ఏథర్ కొత్త AeBS (Advanced Electronic Braking System)ను పరిచయం చేసింది. ఎలక్ట్రానిక్ నియంత్రణ ద్వారా బ్రేకింగ్ సమయంలో నియంత్రణ, స్థిరత్వాన్ని మెరుగుపరచడం దీని ఉద్దేశం. వేరియంట్‌ను బట్టి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లేదా డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది.ఛార్జింగ్..కొనార్క్లో 450W ఆన్‌బోర్డ్ ఛార్జర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. అదనంగా 900W ఆఫ్‌బోర్డ్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే రెండు ఛార్జింగ్ వ్యవస్థలను కలిపి 1.35kW ఛార్జింగ్ సామర్థ్యం పొందవచ్చని ఏథర్ తెలిపింది. స్టాండర్డ్ ఛార్జర్‌తో S 100 బ్యాటరీని 0–80 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటలు పడుతుంది. S 125కి 4 గంటల 30 నిమిషాలు, S 161కి 5 గంటల 40 నిమిషాలు పడతాయి. కాంబైన్డ్ ఛార్జింగ్‌తో ఈ సమయం వరుసగా 2 గంటలు, 2 గంటల 25 నిమిషాలు, 3 గంటల 10 నిమిషాలకు తగ్గుతుంది.మ్యాజిక్కీ.. ఇతర ఫీచర్లుఏథర్ కొనార్క్లో మ్యాజిక్కీ అనే కీలెస్ ఇగ్నిషన్ వ్యవస్థ ఉంది. రైడర్ స్కూటర్ నుంచి దూరంగా వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే సదుపాయం కూడా ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లలో 7 అంగుళాల డీప్‌వ్యూ డిస్ప్లే, ఎయిర్‌వాక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తి ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సర్వీసింగ్ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొత్త EL ప్లాట్‌ఫామ్‌ను 26 లక్షల కిలోమీటర్లకు పైగా ఫీల్డ్ డేటా ఆధారంగా అభివృద్ధి చేసినట్లు ఏథర్ చెబుతోంది.వారంటీ విషయానికి వస్తే, కొనార్క్కు ప్రామాణికంగా 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ. వాహన, బ్యాటరీ వారంటీ ఉంది. ఏథర్‌స్టాక్ ప్రో ద్వారా దీనిని 5 సంవత్సరాలు/60,000 కి.మీ. వరకు, అదనపు ఆప్షన్‌తో బ్యాటరీ వారంటీని 10 సంవత్సరాలు లేదా 1 లక్ష కి.మీ. వరకు పొడిగించుకోవచ్చు.సెప్టెంబర్ నుంచే డెలివరీలుకొనార్క్ డెలివరీలు దశలవారీగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన S 125, S 161 వేరియంట్ల డెలివరీలు వచ్చే సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యేలా కంపెనీ ప్రణాళిక రూపొందించింది. తొలుత ఎంపిక చేసిన రాష్ట్రాల్లో డెలివరీలు మొదలై, అనంతరం ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. 100 కి.మీ. వేరియంట్, 200 కి.మీ. వెర్షన్, Z లైన్ మోడళ్లను కూడా దశలవారీగా మార్కెట్లోకి తీసుకురానుంది.ఇదీ చదవండి: టీవీఎస్ ఫ్యామిలీ స్కూటర్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే.. -
CNG వాహనదారులకు షాక్.. కిలోకు రూ.3.89 పెంపు!
ఆటోలు, క్యాబ్‌లు, అలాగే తక్కువ ఖర్చుతో వ్యక్తిగత వాహనాలు నడిపే వారికి మరోసారి భారం పెరగనుంది. ఎందుకంటే.. ఆగస్టు 29 నుంచి సీఎన్జీ ధర కిలోకు రూ.3.89 పెరగనుంది. శుక్రవారం రాత్రి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సీఎన్జీ ధర కిలోకు రూ.86.98కు చేరనుంది. కొత్త ధరలు ఆగస్టు 29 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ ధరలు పెరగడమే అని ఐజీఎల్ స్పష్టం చేసింది. గ్యాస్ కొనుగోలు ఖర్చు పెరుగుతుండటంతో.. దాని ప్రభావం సంస్థపై పడుతోందని.. ఈ అదనపు ఖర్చును కొంతవరకు భర్తీ చేసుకునేందుకు కిలోకు రూ.3.89 మేర ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది.సీఎన్జీ ధర పెరగడంతో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ సర్వీస్ నిర్వాహకులు, రోజువారీ ప్రయాణాలకు సీఎన్జీ వాహనాలను ఉపయోగించే వారికి ఖర్చు పెరగనుంది. ఇంధన ధరల పెంపు రవాణా ఖర్చులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే సీఎన్జీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా.. నిరంతరంగా సరఫరా కొనసాగుతుందని ఐజీఎల్ స్పష్టం చేసింది.News Alert! CNG price in Delhi and adjoining cities to rise by Rs 3.89 per kg from 6 am, August 29th: IGLNews Alert! CNG to cost Rs 86.98 per kg from Saturday as against Rs 83.09 now: IGL pic.twitter.com/ziFlwysbXL— Press Trust of India (@PTI_News) August 28, 2026 -
టీవీఎస్ ఫ్యామిలీ స్కూటర్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ ఫ్యామిలీ స్కూటర్ జూపిటర్ 110లో కొత్త డ్యూయల్-టోన్ స్పెక్ట్రల్ రేంజ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.89,825 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. కొత్త రంగులు, ప్రీమియం డిజైన్‌తో పాటు కొన్ని అదనపు ఫీచర్లను ఇందులో అందించారు. అయితే ఇంజిన్, మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్స్జూపిటర్ 110 స్పెక్ట్రల్ రేంజ్ స్పెక్ట్రల్ బ్లూ, స్పెక్ట్రల్ కాపర్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. టీవీఎస్ ప్రత్యేకంగా ఉపయోగించిన ‘స్పెక్ట్రల్ కలర్ టెక్నాలజీ’ కారణంగా వెలుతురు, చూసే కోణాన్ని బట్టి రంగుల్లో మార్పు కనిపించేలా పెయింట్ ఫినిష్ను రూపొందించారు.స్పెక్ట్రల్ బ్లూ వేరియంట్లో తెలుపుతో పాటు బ్లూ, పర్పుల్ టోన్లు ఉండగా.. స్పెక్ట్రల్ కాపర్‌లో తెలుపుతో పాటు కాపర్, పర్పుల్ షేడ్స్ కనిపిస్తాయి. వీటికి అనుగుణంగా ఇన్నర్ ప్యానెల్స్, కొత్త సీట్ ఫినిష్, పాక్షిక క్రోమ్ మిర్రర్లను అందించారు.సీక్వెన్షియల్ ఇండికేటర్లు.. టైప్-సీ ఛార్జింగ్కొత్త జూపిటర్ 110లో ప్రధాన ఆకర్షణ సీక్వెన్షియల్ టర్న్ సిగ్నల్ ల్యాంప్స్. 110సీసీ స్కూటర్ విభాగంలో ఇది సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ అని టీవీఎస్ చెబుతోంది. దీంతో స్కూటర్‌కు మరింత ప్రీమియం లుక్ రావడంతో పాటు టర్న్ సిగ్నలింగ్ సమయంలో ప్రత్యేక లైటింగ్ ఎఫెక్ట్ లభిస్తుంది.అదే విధంగా యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కొత్త వేరియంట్లో చేర్చారు. SmartXonnect కనెక్టెడ్ టెక్నాలజీ కొనసాగుతుంది. దీని ద్వారా నావిగేషన్ అసిస్టెన్స్, కాల్, SMS అలర్ట్స్ వంటి ఫంక్షన్లు పొందవచ్చు.పిలియన్‌కు బ్యాక్‌రెస్ట్.. 33 లీటర్ల స్టోరేజ్కంఫర్ట్ పరంగా కూడా కొన్ని మార్పులు చేశారు. ప్రీమియం లాంగ్ సీట్‌కు ఇంటిగ్రేటెడ్ పిలియన్ బ్యాక్‌రెస్ట్‌ను స్టాండర్డ్‌గా అందించారు. జూపిటర్కు ఇప్పటికే ఉన్న 33 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ సదుపాయం కొనసాగుతుంది. ఇందులో రెండు హెల్మెట్లను పెట్టుకోవచ్చని కంపెనీ చెబుతోంది.ముందు భాగంలోనే ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఉండటం వల్ల పెట్రోల్ నింపుకోవడం కూడా సులభంగా ఉంటుంది.ఇంజిన్‌లో మార్పుల్లేవుకొత్త స్పెక్ట్రల్ రేంజ్లో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 113.3 సీసీ, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 5.9 kW (సుమారు 7.9 bhp) పవర్, 9.8 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. ఇంజిన్‌తో పాటు టీవీఎస్ iGO Assist టెక్నాలజీని కూడా కొనసాగించారు. ఇందులో సైలెంట్ స్టార్ట్, స్టార్ట్-స్టాప్ వంటి ఫంక్షన్లు ఉన్నాయి.ఇదీ చదవండి: టాటా కార్లు.. భారీ తగ్గింపు ఆఫర్లు -
వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ 1
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ 2030 నాటికి రూ.20 లక్షల కోట్ల స్థాయికి ఎదుగుతుందనే అంచనాలు ఉన్నాయని కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే దాదాపు 5 కోట్ల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ–ఐటీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.ప్రస్తుతం దేశీయంగా రిజిస్టర్ అయిన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 57 లక్షల పైగా ఉందని, వీటి మార్కెట్ వాటా 7 శాతంగా ఉందని పేర్కొన్నారు. రెండు దేశీ దిగ్గజాలు బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ తాము ఉత్పత్తి చేసే వాహనాల్లో 50 శాతం పైగా వాహనాలను ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. భారత్‌లో ఏటా ఒక లక్ష ఎలక్ట్రిక్ బస్సులకు డిమాండ్ ఉన్నప్పటికీ, కేవలం 50,000–60,000 బస్సులను మాత్రమే తయారు చేయగలుగుతున్నామని వివరించారు. భారత్‌లో వాహనాల తయారీ వ్యయం తక్కువగా ఉంటుందని, నాణ్యత అత్యుత్తమంగా ఉంటుందని గడ్కరీ చెప్పారు. అందుకే టాప్ ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. అయిదేళ్లలో నంబర్ వన్ లక్ష్యం..వచ్చే ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమొబైల్ పరిశ్రమగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. ‘సుశిక్షితులైన సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో మన ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తు చాలా బాగా ఉండబోతోంది. వచ్చే ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ 1 ఆటోమొబైల్ పరిశ్రమగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇది కొంత కష్టం కావచ్చు కానీ అసాధ్యం కాదు’ అని ఆయన తెలిపారు. ‘నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడది రూ. 22 లక్షల కోట్లకు చేరుకుంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ రూ. 78 లక్షల కోట్లుగా ఉండగా చైనా (రూ. 47 లక్షల కోట్లు), భారత్ (రూ. 22 లక్షల కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడంపై భారత్ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, వీటి వల్ల కాలుష్య సమస్య కూడా తలెత్తుతోందని గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గకపోతే అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడటం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ వ్యయాలను 8 శాతం స్థాయికి తగ్గించాలని కేంద్రం నిర్దేశించుకున్నట్లు వివరించారు. దేశీయంగా ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎకనమిక్ కారిడార్లను నిర్మించడమనేది దేశీయంగా లాజిస్టిక్స్ వ్యయాలను 16 శాతం స్థాయి నుంచి 10 శాతానికి తగ్గించేందుకు దోహదపడినట్లు ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం బెంగళూరు రూపొందించిన నివేదికలో వెల్లడైనట్లు చెప్పారు.ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? -
చైనాలో దుమ్మురేపుతున్న కారు.. భారత్‌లోకి వస్తే సంచలనమే!
షియోమి, సోనీల తర్వాత.. హువావే కంపెనీ తీసుకొచ్చిన 'మాక్స్ట్రో ఎస్800' (Maextro S800) కారు ఆటోమోటివ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీనిని సంస్థ తన ఆటో తయారీ భాగస్వాములతో కలిసి రూపొందించింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే అమ్మకానికి ఉంది. దీని ధర పది లక్షల యువాన్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.19 కోట్లు.హువావే కంపెనీ చైనాలోని లగ్జరీ కార్ల మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి దిగ్గజ బ్రాండ్లకు పోటీ ఇవ్వడమే లక్ష్యంగా మాక్స్ట్రో ఎస్800 కారును తీసుకొచ్చింది. రోల్స్-రాయిస్ డిజైన్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి విలాసవంతమైన అంశాలను కలిగిన మాక్స్ట్రో ఎస్800 అత్యాధునిక టెక్నాలజీని పొందింది. అంతే కాకుండా ఇది 838 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.మాక్స్ట్రో ఎస్800 డిజైన్‌ను చూస్తే ఖరీదైన లగ్జరీ కార్లను గుర్తుకు తెస్తుంది. ముందు భాగంలో క్లోజ్డ్ ప్యానెల్‌తో పాటు ఇరువైపులా సన్నని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్‌పై సిల్వర్ కలర్ మెష్, పెద్ద మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫినిషింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కూపే తరహా రూఫ్‌లైన్ వంటివి కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. విండ్‌షీల్డ్ పైభాగంలో LiDAR సెన్సార్ కూడా కనిపిస్తుంది. అందుకే ఈ కారు రోల్స్ రాయిస్ తరహా లుక్, మెర్సిడెస్ మేబ్యాచ్ స్థాయి లగ్జరీ కలయికతో వచ్చిందని స్పష్టమవుతోంది.కారు లోపలికి వెళ్లిన తర్వాత లగ్జరీ అనుభూతి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రోల్స్ రాయిస్ కారులో కనిపించే స్టార్రీ స్కై తరహా క్రిస్టల్ షిమ్మర్ సీలింగ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. క్యాబిన్లో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్‌ను అందించారు. అంతేకాకుండా.. రాడార్, LiDAR, కెమెరాలతో కలిపి 32కు పైగా ఏడీఏఎస్ సెన్సర్లు ఉన్నాయి. ఇవి హువావే అభివృద్ధి చేసిన అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీకి సహాయపడతాయి.లగ్జరీతో పాటు పనితీరులోనూ మాక్స్ట్రో ఎస్800 తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ కారు గరిష్ఠంగా 838 bhp పవర్ ఉత్పత్తి చేయగలదని కంపెనీ పేర్కొంది. ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును నిర్మించారు. ఇందులో పలు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.హర్ష్ గోయెంకా ట్వీట్హువావే, జేఏసీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన Maextro S800, చైనాలో అత్యధికంగా అమ్ముడవుతున్న అల్ట్రా-లగ్జరీ సెడాన్. ఇది బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ వంటి అగ్రశ్రేణి మోడళ్లతో పోటీ పడుతోందని హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. కారుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇది డబ్బుకు తగిన విలువను అందిస్తుందని, ఒకవేళ భారతదేశానికి ఈ కారు వస్తే.. లగ్జరీ మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించుకుంటుందని అన్నారు.Maextro S800, developed by Huawei and JAC, is the top-selling ultra-luxury sedan in China, competing with the top end models of BMW, Audi and Mercedes. Good value for money and will sweep the luxury market if it ever comes here. pic.twitter.com/LsywfZ07RG— Harsh Goenka (@hvgoenka) August 25, 2026 -
అందుకే.. ‘టాటా.కార్స్’ పేరుతో కొత్త బ్రాండ్!
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తన ప్యాసింజర్ వాహనాల పోర్ట్‌ఫోలియోకు కొత్త బ్రాండ్ గుర్తింపుగా ‘టాటా.కార్స్’ను గురువారం ఆవిష్కరించింది.యువ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇకపై హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ప్రీమియం ఎస్‌యూవీలు, ఈవీలను ఒకే బ్రాండ్ కిందకు తీసుకురానున్నారు. ‘నథింగ్స్ టూ ఫార్’ నినాదంతో రూపొందిన ఈ బ్రాండ్ వినియోగదారులకు కొత్త అవకాశాలను చేరువ చేస్తుందని టీఎంపీవీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు. -
‘వైజెడ్ఎఫ్–ఆర్2’ వచ్చేసింది.. రూ.10 వేలతో బుకింగ్!
ద్విచక్ర వాహన తయారీ సంస్థ యామహా మోటార్ తన సూపర్‌స్పోర్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ గురువారం నూతన ‘వైజెడ్ఎఫ్–ఆర్2’ బైక్‌ను విడుదల చేసింది. చెన్నై యూనిట్లో ఉత్పత్తి అవుతున్న ఈ లైట్‌వెయిట్ స్పోర్ట్స్‌బైక్ ధరను రూ.2.30 లక్షలుగా (ఎక్స్–షోరూమ్) కంపెనీ నిర్ణయించింది.పదివేల రూపాయల టోకెన్ అమౌంట్‌తో ఈ బైక్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన 200సీసీ లిక్విడ్–కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 26.5 బీహెచ్పీ పవర్, 19.1 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేటీఎమ్ ఆర్సీ 200, సుజుకీ గిక్సర్ ఎస్ఎఫ్ 250, రాబోయే హోండా సీబీఆర్300ఆర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? ఏం అవుతుందంటే..
వాహనదారులకు బీమా అనేది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో రక్షణ కవచం. అయితే వివిధ కారణాల వల్ల చాలా వరకు వెహికిల్ ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేయించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. బిజీ లైఫ్‌స్టైల్ లేదా నిర్లక్ష్యం వల్ల రెన్యూవల్ గడువు ముగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.గడువు దాటితే ఎదురయ్యే సమస్యలుపాలసీ గడువు ముగిసిన మరుసటి క్షణం నుంచే బీమా రక్షణ నిలిచిపోతుంది. ఆ తర్వాత వాహనానికి ప్రమాదం జరిగినా, దొంగతనానికి గురైనా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించదు.మోటార్ వాహనాల చట్టం ప్రకారం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. లేకపోతే తొలిసారి రూ.2,000, పునరావృతమైతే రూ.4,000 వరకు జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష పడే అవకాశముంది.ఇన్సూరెన్స్ లేనప్పుడు మీ వాహనం వల్ల మూడో వ్యక్తికి నష్టం వాటిల్లితే కోర్టు నిర్ణయించే లక్షల రూపాయిల నష్టపరిహారాన్ని మీ సొంత జేబు నుంచే చెల్లించాల్సి ఉంటుంది.క్లెయిమ్ చేయనందుకు ప్రీమియంలో లభించే 20% నుంచి 50% నో క్లెయిమ్ బోసన్ డిస్కౌంట్, గడువు దాటిన 90 రోజులలోపు రెన్యూ చేయకపోతే పూర్తిగా రద్దవుతుంది.లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించాలంటే ఇన్సూరెన్స్ సంస్థలు భౌతిక లేదా డిజిటల్ వాహన తనిఖీని నిబంధనగా పెడతాయి.తక్షణమే ఏం చేయాలి?ఇన్సూరెన్స్ లేనప్పుడు డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం. ఇన్సూరెన్స్ పోర్టల్స్ లేదా యాప్‌ల ద్వారా ఆన్లైన్ ప్రాసెస్ ప్రారంభించండి. ప్రస్తుతం చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇన్స్పెక్షన్ సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రీమియంలో స్వల్ప పొదుపు కోసం చూడకుండా గడువుకు ముందే రెన్యూవల్ చేసుకోవడం లేదా ఆటో-రెన్యూవల్ ఎంచుకోవడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.. -
ఎంజీ హెక్టార్ తొమాహాక్ లాంచ్: ధర ఎంతంటే?
ఆటోమొబైల్ సంస్థ ‘జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారత మార్కెట్లోకి నూతన మల్టీ-ఎనర్జీ వెహికల్ ‘హెక్టార్ తొమాహాక్’ ను అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన ‘అడ్వాన్స్డ్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ (ఏడీఏపీటీ)’ పై రూపొందిన తొలి మోడల్ ఇదేనని తెలిపింది. అలాగే, భారత్‌లో న్యూ ఎనర్జీ వెహికల్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన తొలి ఉత్పత్తిగా కూడా పేర్కొంది. ఎక్స్ షోరూం వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వెర్షన్ ప్రారంభ ధర రూ.19.49 లక్షలుగా ఉంది. ప్లగ్–ఇన్ హైబ్రిడ్ (పీహెచ్ఈవీ) వెర్షన్ ధర రూ. 25.70 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.కారు ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ మాట్లాడుతూ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. ‘‘దేశంలో తమ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు కంపెనీ, దాని భాగస్వామ్య వెండర్లు కలిసి రూ.6,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నాము’’ అని తెలిపారు. ఇందులో కంపెనీ వాటా రూ.3,500 కోట్లు కాగా, వెండర్లు దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత విస్తరణ ప్రణాళికకు అవసరమైన నిధులు కంపెనీ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.హలోల్ ప్లాంట్ విస్తరణకు భారీ ప్రణాళిక మొత్తం రూ.6 వేల కోట్ల పెట్టుబడిలో కొంత భాగాన్ని గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హలోల్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.10 లక్షల యూనిట్లుగా ఉందని, వచ్చే ఏడాది మార్చి నాటికి దీనిని 1.60 లక్షల యూనిట్లకు, 2028 జనవరి నాటికి 2.20 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు వివరించారు. రాబోయే 3–4 ఏళ్లలో కొత్త ప్రాంతంలో మరో ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న హలోల్ ప్లాంట్‌లోనే వార్షిక సామర్థ్యాన్ని 4 లక్షల యూనిట్ల వరకు పెంచుకునే అవకాశం ఉందన్నారు.భారీ వృద్ధి లక్ష్యాలు కంపెనీ ఏటా 35–40 శాతం వార్షిక వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుందని పార్థ్ జిందాల్ చెప్పారు. మార్కెట్లో డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటమే ప్రధాన సవాలు అన్నారు. గతేడాది 71,000 కార్లను విక్రయించగా, ఈ ఏడాది 1,00,000 కార్ల విక్రయాల మార్కును దాటతామనే ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లో బ్యాటరీ సెల్స్ తయారీపై కంపెనీ ఆసక్తి చూపుతున్నప్పటికీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) టెక్నాలజీ చైనా వెలుపల పరిమితంగా అందుబాటులో ఉందన్నారు. అయితే బ్యాటరీ స్టోరేజ్ కోసం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీకి, ఎంజీ వాహనాల కోసం సెల్–టు–ప్యాక్ సదుపాయాలను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు.వాటా కొనుగోలుపై చర్చలు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాలో అదనపు వాటా కొనుగోలుపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, ఎస్ఏఐసీ మోటార్ మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ అంశంపై ఇప్పటివరకు ఎ లాంటి నిర్ణయం తీసుకోలేదని పార్థ్ జిందాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీలో ఎస్ఏఐసీ మోటార్‌కు 49%, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు 35% వాటా ఉండగా, మిగిలిన వాటాను ఇతర భారతీయ పెట్టుబడిదారులు, డీలర్లు, ఉద్యోగులు కలి గి ఉన్నారు. భారత్‌ను తమ తదుపరి కీలక వృద్ధి మార్కెట్‌గా ఎస్ఏఐసీ మోటార్ చూస్తోందన్నారు. -
సుజుకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే?
యునైటెడ్ కింగ్డమ్తో సహా అంతర్జాతీయ మార్కెట్ల కోసం రూపొందించిన, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ అయిన ఈ-స్కైని సుజుకి ఆవిష్కరించింది. ఇది నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన, పట్టణ వాతావరణాలకు అనువైన కాంపాక్ట్ పరిమాణాన్ని కొనసాగిస్తూనే, బాక్స్ ఆకారంలో రూపుదిద్దుకుంది.యునైటెడ్ కింగ్డమ్లో, సుజుకి ఈ-స్కై ధరలు 20,000 పౌండ్ల (రూ. 26.08 లక్షలు) కంటే తక్కువ నుంచి ప్రారంభమవుతాయి. ఇది గత సంవత్సరం టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన కాన్సెప్ట్‌కు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రొడక్షన్ మోడల్ కోసం కొన్ని ముఖ్యమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది.సుజుకి ఈ-స్కై ఎలక్ట్రిక్ కారులో సుమారు 63 bhp పవర్ ఉత్పత్తి చేసే ఒకే ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మోడల్ సుమారు 310 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని సమాచారం.సుజుకి ఈ-స్కై 3,395 మిమీ పొడవు, 1,475 మిమీ వెడల్పు, 1,625 మిమీ ఎత్తు, వీల్‌బేస్ 2,460 మిమీ వరకు ఉంటుంది. చల్లని వాతావరణంలో క్యాబిన్‌ను వేడి చేయడానికి శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి మరియు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించిన డైరెక్ట్ హీట్-పంప్ సిస్టమ్ మరియు ఎయిర్-హీటెడ్ ఎలక్ట్రిక్ హీటర్‌ను సుజుకి ఈ మోడల్లో అమర్చింది.సుజుకి ఈ-స్కైలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఈవీకి ప్రత్యేకమైన రూట్ ప్లానింగ్‌తో కూడిన కనెక్టెడ్ నావిగేషన్ ఉన్నాయి. ఈ నావిగేషన్ సిస్టమ్, మార్గాలను,ఛార్జింగ్ ప్రదేశాలను సూచించేటప్పుడు బ్యాటరీ ఛార్జ్ స్థాయిలను మరియు ట్రాఫిక్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది.సుజుకి ఈ-స్కై ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో లాక్ అవుతుందా?, లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ సుజుకి భారత మార్కెట్లోకి తీసుకువస్తే, అది టాటా టియాగో ఈవీ మరియు ఎంజీ కామెట్ ఈవీ వంటి సరసమైన ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. -
కొత్త లుక్‌తో 2026 పల్సర్ బైక్స్ లాంచ్: ధరలు, ఫీచర్లు ఇవే..
బజాజ్ ఆటో భారతదేశంలో 2026 పల్సర్ 125, పల్సర్ 150 మోటార్‌సైకిల్స్ లాంచ్ చేసింది. ఈ రెండు బైక్‌లు అప్డేటెడ్ డిజైన్, వెడల్పైన ఫ్యూయల్ ట్యాంకులతో వస్తున్నాయి.2001లో తొలిసారిగా లాంచ్ అయినప్పటి నుంచి పల్సర్ సిరీస్ భారతీయ రైడర్లకు అత్యంత ఇష్టమైన బైకులలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలు గడిచేకొద్దీ.. ఈ శ్రేణిలో ఫుల్లీ ఫెయిర్డ్ అండ్ నేకెడ్ స్ట్రీట్ బైక్‌లు కూడా చేరాయి. బజాజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా పల్సర్ మోటార్‌సైకిళ్లను విక్రయించి, దేశంలో అత్యంత విశ్వసనీయమైన మోటార్‌సైకిల్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.2026 బజాజ్ పల్సర్ 125 & పల్సర్ 1502026 పల్సర్ 125 రెండు కాస్మెటిక్ వేరియంట్లలో, విభిన్న సీటింగ్ ఆప్షన్లతో వస్తుంది. ప్రీమియం కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ వేరియంట్ ధర రూ. 94,518, కాగా సింగిల్ సీట్ ఆప్షన్ ధర రూ. 92,341. ఈ మోటార్‌సైకిల్ బ్లాక్ గోల్డ్, బ్లాక్ సియాన్ బ్లూ, బ్లాక్ డార్క్ గ్రే, బ్లాక్ రేస్ రెడ్, మరియు రేసింగ్ రెడ్ టాన్ బీజ్ రంగులలో లభిస్తుంది. కేవలం సింగిల్ సీట్లో మాత్రమే వచ్చే ఎంట్రీ-లెవల్ నియాన్ ట్రిమ్ ధర రూ. 90,494 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). బ్లాక్ గోల్డ్ షేడ్ మినహా, ఇది కార్బన్ ఫైబర్ మోడల్ మాదిరిగానే అదే రంగులను కలిగి ఉంటుంది.ఇక 2026 పల్సర్ 150 విషయానికి వస్తే.. ఇది బ్రేకింగ్ కాన్ఫిగరేషన్ల ఆధారంగా మూడు వేరియంట్లలో వస్తుంది. సింగిల్ డిస్క్ (SD) వేరియంట్ ధర రూ. 1.11 లక్షలు, సింగిల్ డిస్క్ అప్‌గ్రేడ్ ధర రూ. 1.14 లక్షలు, ట్విన్ డిస్క్ అప్‌గ్రేడ్ ధర రూ. 1.17 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). అన్ని మోడళ్లు బ్లాక్ గోల్డ్, ఎబోనీ బ్లాక్ చెర్రీ రెడ్, ఎబోనీ బ్లాక్ ఇంక్ బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తాయి.2026 బజాజ్ పల్సర్ 125 విశేషాలు2026 పల్సర్ 125 కొత్త 124.38 సీసీ ఇంజన్‌ను పొందుతుంది, ఇది ఇప్పుడు 11.93 bhp పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-అంగుళాల TFT స్క్రీన్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, పూర్తి ఎల్ఈడీ లైటింగ్, హజార్డ్ లైట్లు, USB-టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లతో సహా అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది.మంచి రైడింగ్ కోసం.. ఈ మోటార్‌సైకిల్‌కు క్లిప్ ఆన్ హ్యాండిల్బార్లు, వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ కూడా లభిస్తాయి. దీనిలోని ప్రత్యేక ఫీచర్లలో ఒకటి 'క్రావల్ టెక్', ఇది ఈ సెగ్మెంట్లో మొదటిది. ఇది రైడర్లు థ్రాటిల్‌ను తాకకుండానే బైక్‌ను నెమ్మదిగా కదిలించడానికి అనుమతిస్తుంది, ఇది రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో లేదా ఇరుకైన ప్రదేశాలలో ఉపయోగపడుతుంది.2026 బజాజ్ పల్సర్ 150 విశేషాలు2026 పల్సర్ 150, దాని మునుపటి మోడల్లో ఉన్న అదే 149.5 సీసీ ఇంజన్ ద్వారా 13.8 bhp పవర్ అందిస్తుంది. అయితే.. ఇప్పుడు ఇది మల్టిపుల్ రైడ్ మోడ్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు మరియు మరింత స్పోర్టీ లుక్ కోసం బెల్లీ పాన్ వంటి అనేక కొత్త అదనపు ఫీచర్లతో వస్తుంది.కొత్త పల్సర్ 125 మాదిరిగానే, 150లో కూడా 5-అంగుళాల TFT డిస్ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, పూర్తి ఎల్ఈడీ లైటింగ్, హజార్డ్ లైట్లు, USB-టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ మరియు గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. కొత్త క్రావల్ టెక్ ఫీచర్ కూడా ఉంది. -
టాటా కార్ల ధరల పెంపు!
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) తన కార్ల ధరలను రూ. 25,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. సవరించిన రేట్లు 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.కంపెనీ ప్రకారం.. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు మరియు కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య ద్రవ్యోల్బణం కారణంగా ధరల పెంపు జరిగింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE), ఎలక్ట్రిక్ వాహనాలు (EV) రెండింటికీ కొత్త ధరలు వర్తిస్తాయి. ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది.వేరియంట్ల వారీగా ఖచ్చితమైన ధరల వివరాలు వెల్లడి కాలేదు. డీలర్షిప్ విధానాలు, బుకింగ్ తేదీలను బట్టి, సెప్టెంబర్ 1వ తేదీకి ముందు టాటా కారు లేదా SUVని బుక్ చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లు ప్రస్తుత ధరలనే పొందగలిగే అవకాశం ఉంది.కాగా.. హ్యుందాయ్ కూడా వచ్చే నెల నుంచి తన మోడల్ శ్రేణి అంతటిపైనా ధరల పెంపును ప్రకటించగా, మారుతి సుజుకి 2026 ఆగస్టు ప్రారంభంలోనే తన మోడళ్ల ధరలను పెంచింది. -
ప్రముఖ కార్ల కంపెనీ సంచలన నిర్ణయం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఏకంగా 30 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం.డోర్ హ్యాండిల్ భద్రతకు సంబంధించిన సమస్య కారణంగా.. అమెరికా కార్ల తయారీ సంస్థ మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ సహా చైనాలో తయారైన, దిగుమతి చేసుకున్న సుమారు 29.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తోందని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ తెలిపింది.చైనా మీడియా ప్రకారం.. ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్దదైన ఈ రీకాల్. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు, అనేక చైనీస్ ఈవీ మోడళ్లలో సాధారణంగా కనిపించే లోపలికి ఉన్న కార్ డోర్ హ్యాండిల్స్‌ను వచ్చే ఏడాది నుంచి నిషేధిస్తామని చైనా అధికారులు ఫిబ్రవరిలో ప్రకటించిన తర్వాత ఈ భారీ రీకాల్ ప్రకటన వెల్లడైంది.దేశంలో అనేక చోట్ల జరిగిన ఈవీల ప్రమాదాల నేపథ్యంలో.. చైనా ఇటీవల ఫ్లష్ కార్ డోర్ హ్యాండిల్స్‌పై నిఘాను ముమ్మరం చేసింది. ఈ ప్రమాదాలలో కార్లలోని ఎలక్ట్రానిక్ డోర్లు విఫలమై, ప్రజలు లోపల చిక్కుకుపోయారు.చైనా నియంత్రణ సంస్థ వెబ్‌సైట్‌లోని ఒక ప్రకటనలో.. భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని ప్రస్తావించింది. ఎలక్ట్రిక్ వ్యవస్థ వైఫల్యానికి కారణమయ్యే తీవ్రమైన ప్రమాదం వంటి తీవ్రమైన పరిస్థితులలో.. కారు హ్యాండిల్స్, కారు వినియోగదారులు తప్పించుకోవడానికి తలుపులు త్వరగా ఓపెన్ కాకుండా అడ్డుకోవచ్చని, లేదా కారు బయట ఉన్న సహాయక సిబ్బంది లోపలికి ప్రవేశించకుండా నిరోధించవచ్చని ఆ ప్రకటన పేర్కొంది. పరిశ్రమలోని కొంతమంది నిపుణులు వాహన తయారీదారులు డిజైన్ కంటే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ అధిపతి కుయ్ డోంగ్షు, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధిలో ఈ రీకాల్‌ను 'ఒక అనివార్యమైన అడుగు' అని అభివర్ణించారు. వాహన తయారీదారులు మరింత విశ్వసనీయమైన, భద్రతకు ప్రాధాన్యతనిచ్చే విధానం వైపు పయనిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ప్రమాదాలను తగ్గించడానికి టెస్లా వాహనాలకు సాఫ్ట్వేర్ అప్డేట్లను నిర్వహిస్తుంది. ఇదే సమయంలో బీజింగ్‌కు చెందిన చైనా టెక్నాలజీ దిగ్గజం షియోమీ, 3,90,000కు పైగా వాహనాలను రీకాల్ చేస్తోంది. హాంగ్జౌకు చెందిన లీప్‌మోటార్ 3,70,000కు పైగా కార్లను రీకాల్ చేస్తోంది. గీలీ, ఎక్స్‌పెంగ్ సహా ఇతర చైనా కార్ల తయారీ సంస్థలు కూడా కొన్ని వాహనాలను రీకాల్ చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ రీకాల్ ప్రకటించడానికి కారణం కారు డోర్ హ్యాండిల్స్‌కు సంబంధించిన సమస్యలే అని తెలుస్తోంది. -
టాటా కార్లు.. భారీ తగ్గింపు ఆఫర్లు
కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ ఆగస్టు నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో పాటు ఎలక్ట్రిక్ కార్లపైనా నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనం, లాయల్టీ బెనిఫిట్, ‘ఫ్రీడమ్ సెలబ్రేషన్’ ఆఫర్లను కలిపి అందిస్తోంది. ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ మోడళ్లపై గరిష్ఠ ప్రయోజనం రూ.3.35 లక్షల వరకు ఉంది. వేరియంట్, మోడల్ ఇయర్, పాత కారు ఎక్స్ఛేంజ్, లాయల్టీ అర్హత వంటి అంశాలపై తుది ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.టియాగో, టిగోర్‌పై ఆఫర్లుకొత్తగా వచ్చిన టియాగో ఫేస్‌లిఫ్ట్‌పై అధికారిక తగ్గింపులు లేవు. అయితే, మిగిలిన ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో స్టాక్‌పై ఎంపిక చేసిన వేరియంట్లకు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, ఫ్రీడమ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్ఠ ప్రయోజనం సుమారు రూ.35,000 వరకు ఉంటుంది. టిగోర్‌పై కూడా రూ.30,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.టియాగో ఈవీపై రూ.1.45 లక్షల వరకుప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో ఈవీపై మాత్రం గణనీయమైన ప్రయోజనాలు కొనసాగుతున్నాయి. ఎంపిక చేసిన లాంగ్ రేంజ్ XT వేరియంట్‌పై నగదు, ఫ్రీడమ్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలను కలిపి గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. ఇతర టియాగో ఈవీ వేరియంట్లపై కూడా రూ.65,000 నుంచి రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి.ఆల్ట్రోజ్‌పై రూ.45,000 వరకుఆల్ట్రోజ్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలను కలిపి రూ.45,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. డీజిల్ వేరియంట్లపై గరిష్ఠ ప్రయోజనం రూ.40,000 వరకు ఉంది.పంచ్ ఈవీపై రూ.1.45 లక్షల వరకుసాధారణ పంచ్‌పై ఈ నెలలో పెద్దగా అధికారిక తగ్గింపులు లేవు. అయితే, పంచ్ ఈవీపై ఎంపిక చేసిన వేరియంట్లకు భారీ ప్రయోజనాలు ఉన్నాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లపై నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ కలిపి గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు, స్మార్ట్ వేరియంట్లపై రూ.95,000 వరకు బెనిఫిట్ ఉంది.నెక్సాన్‌పై రూ.55,000 వరకునెక్సాన్ పెట్రోల్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.45,000 వరకు, సీఎన్జీ మోడళ్లపై రూ.55,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. డీజిల్ వేరియంట్లపై మాత్రం ప్రధానంగా ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలే ఉండటంతో గరిష్ఠ బెనిఫిట్ రూ.20,000 వరకు ఉంది. నెక్సాన్ ఈవీపై గరిష్ఠ ప్రయోజనం రూ.45,000 వరకు ఉంది. ఇందులో నగదు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉంటాయి.కర్వ్‌పై భారీ డీల్.. ఈవీపై మరింత ఎక్కువటాటా కర్వ్ ఐసీఈపై ఈ నెలలో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.45,000 స్క్రాపేజ్ ప్రయోజనం, అర్హత ఉన్నవారికి రూ.50,000 లాయల్టీ బెనిఫిట్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే గరిష్ఠంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది.అయితే అసలు హైలైట్ కర్వ్ ఈవీ. ఎంపిక చేసిన వేరియంట్లపై నగదు తగ్గింపు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండటంతోపాటు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీంతో గరిష్ఠ ప్రయోజనం రూ.3.35 లక్షల వరకు చేరుతోంది. అందువల్ల ఆగస్టులో టాటా కార్లలో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న మోడల్‌గా కర్వ్ ఈవీ నిలిచింది.హారియర్, సఫారీపై రూ.45,000 వరకుహారియర్, సఫారీ డీజిల్ మోడళ్లపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉన్నాయి. అర్హతలను బట్టి గరిష్ఠ ప్రయోజనం రూ.45,000 వరకు ఉంటుంది.హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకుహారియర్ ఈవీపై మాత్రం మరింత భారీ ఆఫర్ ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.75,000 నుంచి రూ.1 లక్ష వరకు ఫ్రీడమ్ సెలబ్రేషన్ ఆఫర్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.75,000 స్క్రాపేజ్ ప్రయోజనం లభిస్తాయి. ఇప్పటికే టాటా ఈవీ లేదా ఐసీఈ వాహనం కలిగి ఉన్న అర్హతగల కస్టమర్లకు లాయల్టీ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. మొత్తం ప్రయోజనం గరిష్ఠంగా రూ.2.75 లక్షల వరకు చేరవచ్చు.సియెర్రాపై పరిమిత ఆఫర్లుకొత్తగా మార్కెట్లోకి వచ్చిన సియెర్రాపై డిస్కౌంట్లు పరిమితంగానే ఉన్నాయి. ఎంపిక చేసిన సియెర్రా డీజిల్ వేరియంట్లపై స్క్రాపేజ్, లాయల్టీ లేదా ఇతర అర్హత ఆధారిత ప్రయోజనాలతో సుమారు రూ.30,000 వరకు బెనిఫిట్ లభిస్తోంది. సియెర్రా ఈవీపై ప్రస్తుతం అధికారిక వినియోగదారుల తగ్గింపు ప్రకటించలేదు.ఈ ఆఫర్లు ఆగస్టు 31, 2026 వరకు లేదా సంబంధిత స్టాక్ ఉన్నంతవరకు వర్తించే అవకాశం ఉంది. నగరం, డీలర్, వేరియంట్, మోడల్ ఇయర్, స్టాక్ లభ్యత, కస్టమర్ అర్హతను బట్టి తుది మొత్తం మారవచ్చు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు సమీప టాటా మోటార్స్ డీలర్షిప్ వద్ద తాజా ఆఫర్, డిస్కౌంట్ బ్రేకప్, ఎక్స్‌షోరూమ్ ధరను నిర్ధారించుకోవడం మంచిది.ఇదీ చదవండి: హ్యుందాయ్ కార్ల ధరల పెంపు -
హ్యుందాయ్ కార్ల ధరల పెంపు
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను 1 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. నూతన ధరలు వచ్చే నెల (సెప్టెంబర్) నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు మారనుందని స్పష్టం చేసింది. పెరిగిన ఇన్పుట్, కమోడిటీ వ్యయాలు, తీవ్రమవుతున్న నిర్వహణ ఖర్చులు, అంతర్జాతీయ స్థూల ఆర్థిక అనిశ్చితుల భారాన్ని తట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.పెరిగిన వ్యయాలను వీలైనంత వరకు తామే భరించామని, అయితే భారం నిరంతరం పెరుగుతుండటంతో వినియోగదారులకు ధరల రూపంలో స్వల్పంగా బదలాయించాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత భారత మార్కెట్లో హ్యుందాయ్.. హ్యాచ్‌బ్యాక్ ‘గ్రాండ్ ఐ10 నియోస్’ నుంచి ఈవీ ఎస్యూవీ ‘ఐఓఎన్‌ఐక్యూ 5’ వరకు వివిధ మోడళ్లను విక్రయిస్తోంది.ఇదీ చదవండి: మరోసారి పెరగనున్న టాటా కార్ల ధరలు? -
టాప్‌గేర్‌లో పాత కార్ల రుణాలు
గడిచిన అయిదేళ్లలో కొత్త ఆటో రుణాల కంటే పాత (సెకండ్ హ్యాండ్) కార్ల ఫైనాన్సింగ్ విభాగం వేగంగా వృద్ధి చెందింది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకుని పాత కార్లు కొనుగోలు చేసేందుకు భారతీయులు అమితాసక్తి చూపుతుండటమే దీనికి కారణమని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ‘క్రిఫ్ హై మార్క్’ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జూన్ 2021లో రూ.40,000 కోట్లుగా ఉన్న పాత కార్ల రుణ పోర్ట్‌ఫోలియో.. నికరంగా 26.2 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేస్తూ జూన్ 2026 నాటికి రూ.1.3 లక్షల కోట్లకు చేరింది. ఇదే అయిదేళ్ల కాలంలో కొత్త కార్ల (ఆటో) రుణ పోర్ట్‌ఫోలియో రూ.4.4 లక్షల కోట్ల నుంచి 17.6 శాతం సీఏజీఆర్‌తో రూ.9.9 లక్షల కోట్లకు పెరిగింది. పెరుగుతున్న చెల్లింపు ఒత్తిళ్లుకొత్త వాహనాలతో పోలిస్తే పాత కార్ల రుణాలు తీసుకున్న వారిలో ఈఎంఐ చెల్లింపుల్లో ఆలస్యం ఎక్కువవుతోందని క్రిఫ్ నివేదిక స్పష్టం చేస్తోంది. నిరీ్ణత గడువు దాటి 31 నుంచి 90 రోజుల వరకు ఈఎంఐలు చెల్లించని రుణాలు పాత కార్ల పోర్ట్‌ఫోలియోలో 3.1 శాతానికి చేరగా, కొత్త ఆటో రుణాల్లో ఇవి 2.1 శాతంగానే ఉన్నాయి. అదేవిధంగా, 91 నుంచి 180 రోజుల గడువు దాటిన మొండి బాకీలు (ఎన్పీఏలు) కూడా పాత కార్ల విభాగంలో 1 శాతంగా నమోదవ్వగా, కొత్త ఆటో రుణాల్లో ఇది కేవలం 0.6 శాతంగానే ఉంది. ఈ గణాంకాలు సెకండ్ హ్యాండ్ కార్ల విభాగంలో క్రెడిట్ రిస్క్ అధికంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి. అన్సెక్యూర్డ్ రుణాల భారంరెండు కంటే ఎక్కువ రుణాలు ఉన్న కస్టమర్ల సంఖ్య రెండు విభాగాల్లోనూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నప్పటికీ.. పాత కార్ల రుణాలు తీసుకున్న వారిలో వ్యక్తిగత రుణాలు, కన్జూమర్ డ్యూరబుల్ రుణాలు, క్రెడిట్ కార్డులు వంటి ‘అన్సెక్యూర్డ్’ రుణాలు ఉన్న వారి వాటా అధికంగా ఉంది. పాత కార్ల రుణ గ్రహీతల్లో 9.2 శాతం మంది ఇలాంటి రుణాలు కలిగి ఉండగా.. కొత్త ఆటో రుణ కస్టమర్లలో ఈ వాటా 6.4 శాతంగా ఉంది. మొత్తంగా, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల (సీవీ) ఫైనాన్స్‌తో కూడిన ‘వీల్స్ ఫైనాన్స్’ విభాగంలో ఆస్తి నాణ్యత స్థిరపడుతోందని నివేదిక పేర్కొంది. ఈ విభాగంలో భాగమైన కమర్షియల్ వెహికల్ రుణాలు గత అయిదేళ్లలో 20.1% సీఏజీఆర్‌తో రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.7.4 లక్షల కోట్లకు పెరిగి రెండో అత్యంత వేగవంతమైన విభాగంగా నిలిచాయి.ఇదీ చదవండి: యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో మార్పులు -
ఒకే మోడల్.. దేశం దాటిన 2 లక్షల కార్లు!
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంక్స్.. 38 నెలల లోపే 2 లక్షల ఎగుమతులను దాటిందని మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. జూన్ 2023లో ఎగుమతులను ప్రారంభమైనప్పటి నుంచి.. జపాన్‌తో సహా దాదాపు 90 దేశాలకు ఈ కాంపాక్ట్ ఎస్యూవీ చేరుకుంది.25 నెలల లోపే ఫ్రాంక్స్ తన మొదటి లక్ష ఎగుమతులను సాధించింది. ఆ తర్వాత సుమారు 13 నెలల్లో రెండవ లక్షను ఎగుమతి చేసింది. దీన్నిబట్టి చూస్తే.. మేడ్-ఇన్-ఇండియా మోడల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందనే విషయం స్పష్టమవుతుంది.గుజరాత్‌లోని మారుతి సుజుకి హన్సల్పూర్ ప్లాంట్‌లో తయారైన ఫ్రాంక్స్, కంపెనీ ఎగుమతుల పనితీరులో కీలక పాత్ర పోషిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి.. ఇది భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే ప్యాసింజర్ వాహనంగా నిలిచింది.మారుతి సుజుకి దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి అయిన మూడు ప్యాసింజర్ వాహనాలు తమ పోర్ట్‌ఫోలియోకు చెందినవేనని ఆ కంపెనీ చెబుతోంది.మారుతి సుజుకి ఫ్రాంక్స్మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 6.85 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్ముడవుతోంది. దీనిని కంపెనీ భారతదేశంలోని నెక్సా అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తోంది. ఇది 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో మాన్యువల్, ఆటోమాటిక్ ఉన్నాయి. -
స్కోడా డీజిల్ ఈజ్ బ్యాక్!
స్కోడా ఇండియా అయిదేళ్ల విరామం తర్వాత భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోని డీజిల్ విభాగంలోకి మళ్లీ అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తన ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్ ‘ఆల్–న్యూ సూపర్బ్’ డీజిల్ వెర్షన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ‘‘స్కోడా ఫ్లాగ్షిప్ లగ్జరీ సెడాన్ ‘సూపర్బ్ టీడీఐ’ డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో రావడం వల్ల దీని ఆకర్షణ మరింత పెరుగుతుంది. భారతీయ వినియోగదారులకు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం’’ అని స్కోడా ఆటో తెలిపింది. దేశంలో బీఎస్–6 ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే స్కోడా ఇండియా తన డీజిల్ మోడళ్ల విక్రయాలను నిలిపివేసింది.భారత్ కోసం ప్రత్యేక ప్లాట్‌ఫాంపై ‘స్లావియా’సరికొత్త ఆకర్షణీయమైన ఫీచర్లతో ‘స్లావియా’ కారును కూడా కంపెనీ ఆవిష్కరించింది. భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా ఎంక్యూబీ–ఏ0–ఇన్ ప్లాట్‌ఫామ్‌పై ‘స్లావియా’ను రూపొందించినట్లు తెలిపింది. ఇది దేశంలోని అత్యంత విజయవంతమైన సెడాన్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొంది. కొత్త స్లావియా మెరుగైన స్టైలింగ్, సరికొత్త సాంకేతికత, సెగ్మెంట్లో తొలిసారిగా అందిస్తున్న ఫీచర్లు, అధిక సౌకర్యాలను అందిస్తుందని తెలిపింది. అలాగే డ్రైవింగ్ అనుభూతి, ప్రాక్టికాలిటీ, భద్రత వంటి అంశాలను కొనసాగించినట్లు పేర్కొంది. ఇదే సందర్భంగా స్పోర్టియర్ వెర్షన్ ‘ఆక్టేవియా ఆర్ఎస్’ మోడల్‌ను కూడా భారత్‌లోకి తిరిగి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.‘‘ స్కోడా కీలకమైన గ్లోబల్ వృద్ధి మార్కెట్లలో భారత్ అత్యంత కీలకమైంది. స్లావియా మా విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. స్పష్టమైన వ్యూహం, బలమైన స్థానిక ఉనికితో భారత్‌లో మా వృద్ధి ప్రయాణానికి తదుపరి అధ్యాయం లిఖిస్తున్నాము’’ అని స్కోడా ఆటో సీఈవో క్లాస్ జెల్మర్ తెలిపారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
పాత బండ్లకు E10 కావాల్సిందే!
పాత వాహనాలను వినియోగించే కోట్లాది మంది ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఇథనాల్ (ఈ10) కలిగిన పెట్రోల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారి సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన ఈ20 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయ వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా గతేడాది ఈ20ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1 నుంచి బంకుల్లో విక్రయించే పెట్రోల్‌కు ఇదే ప్రామాణికంగా మారింది.వెల్లువెత్తిన ఫిర్యాదులుఈ20 పెట్రోల్ వాడకం వల్ల బీఎస్–6కు ముందు మోడల్ వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు ఆటో విడిభాగాలు దెబ్బతినడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చుతూ వస్తోంది. పలు రకాల ఇంధనాలను ఏకకాలంలో సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి నిర్వహించడం సాధ్యం కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదులను పూర్తిగా తోసిపుచ్చడం సరికాదని అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రాసిన అభిప్రాయ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ అభిప్రాయాలు తమ వ్యక్తిగతమైనవని స్పష్టం చేశారు. మైలేజీపై 6–7 శాతం ప్రభావంసాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి తక్కువగా ఉండటంతో ఈ20 వాడకం వల్ల లీటరుకు వాహనం ప్రయాణించే దూరం కొంత తగ్గుతుందని నాగేశ్వరన్, పూజారి అంగీకరించారు. అయితే దీని ప్రభావం 6–7 శాతం మేరకే ఉంటుందని అంచనా వేశారు. ఈ20కు అనుకూలంగా రూపొందించిన వాహనాల్లో ఇంజిన్ అరుగుదల పెరుగుతుందనడానికి భారత్, అమెరికాలో నిర్వహించిన పరీక్షల్లో ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.ఈ20 వద్దే పరిమితం చేయాలిఇథనాల్ విధానం వల్ల చెరకు రైతులకు బకాయిల చెల్లింపులు వేగవంతం కావడం, గ్రామీణ ఆదాయా లు పెరగడం వంటి సానుకూల ఫలితాలు ల భించాయని నాగేశ్వరన్, పూజారి పేర్కొన్నారు. అ యితే ఇథనాల్ మిశ్రమాన్ని మరింత పెంచే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆహార భద్రత, ఇంధన అవసరాల మధ్య సమతుల్యతపై సమగ్రంగా అంచనా వేసే వరకు ఇథనాల్ బ్లెండింగ్‌ను ఈ20 వద్దే పరిమితం చేయాలని అభిప్రాయపడ్డారు. ఇథనాల్ కొనుగోలు ధరలు, నీటి వినియోగ నిబంధనలు, ఈ10 పెట్రోల్ లభ్య త వంటి విధానాలను అవసరానికి అనుగుణంగా మార్చుకునే అంశాలపై ముందుగా దృష్టి పెట్టా లని సూచించారు. ‘‘ఇది కేవలం ఇంజిన్ల సమస్య కాదు. మనం ఏ పంటలను సాగు చేయాలి.. భవిష్యత్తులో ఏ నిర్ణయాలను వెనక్కి తీసుకోలేం అనేదే అసలు ప్రశ్న’’ అని వారు పేర్కొన్నారు.ఆహార భద్రతకు ముప్పుఇథనాల్ మిశ్రమాన్ని ఈ20కి మించి పెంచితే ఆహార పంటలు, ఇంధన అవసరాల మధ్య పోటీ పెరిగే ప్రమాదం ఉందని సీఈఏ అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ తయారీకి ఉపయోగించే ముడిసరుకులో మొక్కజొన్న వాటా సుమారు 50 శాతం కాగా, ఇతర ధాన్యాలతో కలిపి ఇది 67 శాతానికి చేరిందని తెలిపారు. మొక్కజొన్న సాగు పెరగడం వల్ల సోయాబీన్, వేరుశనగ, ఆవాలు వంటి నూనెగింజల సాగు భూమితో పోటీ పెరిగి, వంటనూనెల దిగుమతులపై ఆధారపడటం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే ఇథనాల్ ఉత్పత్తిలో వర్షపు నీటితో పాటు నదులు, కాలువలు, భూగర్భ జలాల నుంచి వినియోగించే ‘బ్లూ వాటర్’ పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.పాత ద్విచక్ర ఇవాహనాలకు ఇథనాల్ సెగదేశంలో బీఎస్–4కు ముందు తయారైన, కార్బొరేటర్లతో నడిచే పాత ద్విచక్ర వాహనాలు సుమారు 8 కోట్ల వరకు ఉన్నాయని నాగేశ్వరన్, పూజారి తెలిపారు. ఈ వాహనాల్లోని కారŠుబ్యరేటర్లు ఈ20 పెట్రోల్‌లో ఉండే అదనపు ఆక్సిజన్‌కు అనుగుణంగా ఇంధన సరఫరాను సర్దుబాటు చేయలేవని పేర్కొన్నారు. దీంతో ఇంజిన్ అధిక వేడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఇథనాల్‌ను తట్టుకునేలా రూపొందించని పాత రబ్బర్ సీల్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో పాత వాహనాల్లో అవసరమైన మార్పులు పూర్తయ్యే వరకు ఈ20తో పాటు ఈ10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇథనాల్‌కు అనుకూలమైన విడిభాగాలను అమర్చేందుకు పెద్దగా ఖర్చు కాకపోయినా, దేశవ్యాప్తంగా కోట్లాది వాహనాల్లో ఈ మార్పులు పూర్తి చేయడానికి ఏళ్లు పట్టవచ్చని పేర్కొన్నారు. ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్.. కేవలం 85 మాత్రమే!
ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్ 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. జీప్ ఇండియా 'కంపాస్ 85వ యానివెర్సరీ ఎడిషన్'ను లాంచ్ చేసింది. భారతదేశంలో కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్రత్యేక ఎడిషన్‌లో.. అదనపు భద్రత, ఫీచర్లతో పాటు ప్రత్యేకమైన బాహ్య, అంతర్గత స్టైలింగ్ అంశాలు కూడా ఉన్నాయి.కంపాస్ 85వ యానివెర్సరీ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కొత్త అప్డేట్స్ చూడవచ్చు. ఇందులో గ్లాస్ బ్లాక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, వార్షికోత్సవ థీమ్‌తో కూడిన డీటైలింగ్ కూడా ఉన్నాయి. క్యాబిన్ పూర్తిగా నలుపు రంగు థీమ్‌తో పాటు మాయన్ గోల్డ్ యాక్సెంట్లు, కాంట్రాస్ట్ డీటైలింగ్‌ను కలిగి ఉంటుంది.జీప్ తన 85వ యానివెర్సరీ ఎడిషన్ కోసం ఏఎక్స్ఎస్ పర్సనలైజేషన్ ప్యాకేజీల ద్వారా అనేక రకాల యాక్సెసరీలను కూడా అందిస్తోంది. ఇందులో యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్ ఇల్యూమినేషన్, ఫ్రంట్ అండ్ వెనుక డాష్క్యామ్లతో కూడిన డిజిటల్ ఇన్సైడ్ రియర్-వ్యూ మిర్రర్ ఉన్నాయి. అయితే ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు లేదు.జీప్ కంపాస్ 85వ వార్షికోత్సవ ఎడిషన్‌ను భారతదేశం అంతటా కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసి విక్రయించనున్నారు. అధీకృత జీప్ డీలర్‌షిప్‌లు మరియు జీప్ ఇండియా వెబ్సైట్ ద్వారా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ధర రూ. 26.70 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. -
పెట్రోల్ పాలసీలో ట్విస్ట్! పాత వాహనాలకు E10 పరిష్కారమా?
దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 ఇంధనం వాడుతున్నారు. అయితే.. పాత వాహనాల విషయంలో మాత్రం తక్కువ ఇథనాల్ ఉన్న ఈ10 పెట్రోల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు.ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఒక అభిప్రాయ వ్యాసంలో.. నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారితో కలిసి ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరి ప్రకారం.. E20పై చర్చ కేవలం వాహనాల ఇంజిన్‌కు సమస్య వస్తుందా?, రాదా? అనే దానికే మాత్రమే పరిమితం కాకూడదు. ఇథనాల్ కోసం పంటలు, భూమి, నీటిని ఎక్కువగా ఉపయోగిస్తే భవిష్యత్తులో ఆహారం, ఇంధనం మధ్య పోటీ ఎలా ఉంటుందో.. కూడా తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది.పాత వాహనాలకు E10 ఎందుకు?భారతదేశంలో బీఎస్4 (BS4) ప్రమాణాలకు ముందు.. తయారైన ద్విచక్ర వాహనాల సంఖ్య సుమారు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంది. వీటిలో చాలావరకు కార్బ్యురేటర్‌తో పనిచేసే వాహనాలే. పాత కార్బ్యురేటర్ వాహనాలు అధిక ఇథనాల్ కలిగిన ఇంధనానికి అనుగుణంగా గాలి, ఇంధన మిశ్రమాన్ని సరిగ్గా సర్దుబాటు చేయలేకపోవచ్చు. అలాగే.. పాత వాహనాల్లోని కొన్ని రబ్బర్ సీల్స్ కూడా ఇథనాల్‌ను ఎక్కువకాలం తట్టుకోకపోవచ్చు. దీంతో కాలక్రమేణా కొన్ని భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.అయితే.. ఈ వాహనాలను E20కి అనుగుణంగా మార్చడం అసాధ్యం కాదు. అవసరమైన భాగాలను మార్చడం వల్ల ఇది సాధ్యమవుతుంది. కానీ.. దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న వాహనాలన్నింటినీ ఇలా మార్చడానికి చాలా సమయం, ఖర్చు అవుతుంది. అందుకే అప్పటివరకు పాత వాహనాలకు E10ను కూడా అందుబాటులో ఉంచడం ఒక మంచి పరిష్కారం.ప్రభుత్వం ద్రుష్టి ఈ20పైనే!కేంద్ర ప్రభుత్వం మాత్రం E20నే ప్రామాణిక పెట్రోల్‌గా కొనసాగించాలనే వైఖరిలో ఉంది. ఈ10, ఈ20, సాధారణ పెట్రోల్ ఇలా వేర్వేరు ఇంధనాలను ఒకేసారి అందుబాటులో ఉంచితే నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలకు అదనపు ఖర్చులు, ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.ఇదే సమయంలో ఈ10 కోసం తయారు చేసిన వాహనాల్లో.. ఈ20 వాడితే ఇంధన సామర్థ్యం సుమారు 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. అయితే.. ఈ20 వల్ల ఇంజిన్లకు పెద్దఎత్తున నష్టం జరుగుతోందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని చెబుతోంది.E20 తర్వాత..ప్రస్తుతం ఈ20లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో E27, E30 వంటి అధిక ఇథనాల్ బ్లెండింగ్ వస్తుందా? అనేది ఇప్పుడొక ప్రశ్న.నిజానికి ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ.. దాని కోసం అవసరమైన పంటల పరిమాణం కూడా పెరగాలి. ఒక దశలో ఇంధనం కోసం పంటలను ఉపయోగించడం వల్ల ఆహారం కోసం పండించే పంటలు తగ్గిపోవచ్చు. కాబట్టి ఇథనాల్ శాతం ఇంకెత పెంచగలం? అనే దానికంటే.. ఇథనాల్ కోసం ఇంకెంత పంటను మళ్లించగలం? అనే విషయాన్ని గురించి కూడా ఆలోచించాలని నాగేశ్వరన్ అన్నారు.మొక్కజొన్నకు డిమాండ్ఇథనాల్ తయారీలో మొక్కజొన్న పాత్ర కీలకం. ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఇథనాల్‌లో దాదాపు సగం వరకు మొక్కజొన్న నుంచి వస్తోందని నాగేశ్వరన్ పేర్కొన్నారు.మొక్కజొన్నకు ఇథనాల్ పరిశ్రమ నుంచి డిమాండ్ పెరగడంతో.. రైతులు కొంత లాభపడుతున్నారు. కానీ.. ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. మొక్కజొన్న పండించే భూమిలో సోయాబీన్, వేరుశెనగ, ఆవాలు వంటి పంటలను కూడా సాగు చేయవచ్చు. కానీ మొక్కజొన్నకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. ఇతర పంటలకు కేటాయించే భూమి తగ్గుతుంది. ఇది అలాగే కొనసాగితే.. చివరకు ఆహార ఉత్పత్తి, నూనెగింజల సాగుపైనా ప్రభావం చూపవచ్చు. తద్వారా ఆహార కొరత వచ్చే అవకాశం ఉంటుంది.ఇథనాల్ వల్ల ప్రయోజనాలు👉చెరకు రైతులకు లాభాలు👉గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదాయ మార్గం👉ఇథనాల్‌కు స్థిరమైన మార్కెట్ కల్పించడం👉చక్కెర మిగులు నిల్వలను తగ్గించడం👉దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంనీటి సమస్యఇథనాల్ విషయంలో మరో ముఖ్యమైన సమస్య నీటి వినియోగం. ముఖ్యంగా చెరకు సాగుకు ఎక్కువ నీరు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నీటి వనరులపై ఒత్తిడి ఉంది. అందుకే ఇథనాల్ కోసం ఎంత చెరకు సాగు చేస్తున్నాం.. అనే దానితో పాటు, దాని కోసం ఎంత నీరు ఉపయోగిస్తున్నామో కూడా చూడాలి.వర్షం ద్వారా సహజంగా పంటలకు అందే నీటితో పాటు నదులు, కాలువలు, బోర్లు, భూగర్భ జలాల నుంచి తీసుకునే నీటిపై కూడా దృష్టి పెట్టాలని నాగేశ్వరన్ సూచిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం ఎంత ఉందనే లెక్క మాత్రమే కాకుండా, ఆ ఇథనాల్ తయారు చేయడానికి ఎంత నీరు ఖర్చవుతోంది అనేదీ ముఖ్యం.లాభాలతో పాటు.. నష్టాలను లెక్కించాలిఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇథనాల్ వల్ల వచ్చే ప్రయోజనాలను మాత్రమే చూసి ముందుకు వెళ్లకూడదు. దాని కోసం మనం ఏం కోల్పోతున్నామో కూడా లెక్కించాలి. ఒకసారి రైతులు ఇథనాల్ కోసం ఒక పంటను పెద్దఎత్తున పండించడం మొదలుపెడితే.. దాని ఆధారంగా భూమి, నీటి వినియోగం మారితే.. ఆ నిర్ణయాన్ని తర్వాత వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు. కాబట్టి త్వరగా మార్చుకోగలిగే నిర్ణయాలు ముందుగా తీసుకోవచ్చు. కానీ భూమి, నీరు, పంటల సాగు వంటి వాటిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే నిర్ణయాలను మాత్రం పూర్తిగా అలోచించి, విశ్లేషించిన తర్వాతే తీసుకోవాలని నాగేశ్వరన్ సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వాట్సాప్‌లో KYC చేస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త! -
మహీంద్రా కొత్త కార్లు: ధరలు ఇలా..
మహీంద్రా అండ్ మహీంద్రా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. రెండు కొత్త బీఈ 6 ఎలక్ట్రిక్ వెర్షన్లను ఆవిష్కరించింది. ఒకటి స్పోర్టెక్ వేరియంట్ కాగా.. మరొకటి ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్ ఉన్నాయి.మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్స్పోర్టెక్ అనేది బీఈ 6 లైనప్‌లోని కొత్త ఫ్లాగ్షిప్ వేరియంట్. దీని ధర రూ. 19.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). BaaS స్కీమ్ కింద రూ. 11.45 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.బీఈ 6 స్పోర్టెక్ వేరియంట్ చూడటానికి సాధారణ మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇందులో ప్రత్యేకమైన స్పోర్టెక్ బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, టూ-టోన్ అల్లాయ్ వీల్స్‌తో ఇది ఆకట్టుకుంటుంది. కాగా ఇది గ్రాఫైట్ స్టార్మ్ ఎక్స్టీరియర్ రంగులో అందుబాటులో ఉంది.స్పోర్టెక్ నలుపు, లేత గోధుమ రంగు ఇంటీరియర్‌ను పొందుతుంది. మధ్యలో స్పైన్ లేని కొత్త డాష్‌బోర్డ్‌తో వస్తుంది. ఈ లేఅవుట్ మూడు 12.3-అంగుళాల డిస్ప్లేలను అమర్చడానికి స్థలాన్ని కల్పిస్తుంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, USB టైప్-సి పోర్ట్‌లకు యాక్సెస్‌ను కూడా మెరుగుపరుస్తుంది.ఇది 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. దీని రేంజ్ 682 కి.మీ. వరకు ఉంటుంది. దీనికి వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంది, ఇది 282 Bhp పవర్, 380 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్మహీంద్రా రూ. 24.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఇది కొన్ని ప్రత్యేకమైన కాస్మెటిక్ అంశాలను పొందినప్పటికీ.. స్టాండర్డ్ BE 6 లాగానే కనిపిస్తుంది. అయితే ఇందులో ఫార్ములా ఈ బ్యాడ్జ్‌లు చూడవచ్చు.ఫార్ములా E ఫ్రీడమ్ ఎడిషన్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ కాక్పిట్లను విభజించే సెంట్రల్ స్పైన్తో కూడిన పాత డాష్‌బోర్డ్ లేఅవుట్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ 12.3-అంగుళాల డిస్ప్లేలు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, యాంబియంట్ లైటింగ్, 540-డిగ్రీ కెమెరా, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. -
2026 కాంటినెంటల్ జీటీ 650 లాంచ్: ధర ఏంటంటే?
రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయ మార్కెట్లో అప్డేటెడ్ కాంటినెంటల్ జీటీ 650ని లాంచ్ చేసింది. దీని ధరలు రూ.3.58 లక్షల నుంచి ప్రారంభమై రూ. 3.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.కంపెనీ 2026 కాంటినెంటల్ జీటీ 650 బైక్ మెకానికల్ ప్యాకేజీలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే.. స్టైలింగ్, ఫీచర్లలో చిన్న మార్పులను చూడవచ్చు. ఈ అప్డేటెడ్ బైక్ నాలుగు రంగులలో లభిస్తుంది.అప్డేటెడ్ కాంటినెంటల్ జీటీ 650 అదే 648 సీసీ, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ద్వారానే పనిచేస్తుంది. ఇది 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పనితీరులో ఎలాంటి మార్పు లేదు. -
మార్కెట్లోకి మహీంద్రా కొత్త ట్రక్కు
మహీంద్రా గ్రూప్ హెవీ డ్యూటీ ట్రక్కుల విభాగంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా ‘బ్లేజో ఐ–టీఆర్కే’ ట్రక్కును మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని కేవలం ట్రక్కుగానే కాకుండా, వ్యాపార లాభాలను పెంచే ‘బిజినెస్ సొల్యూషన్’గా తీర్చిదిద్దారు. అత్యుత్తమ ఇంధన సామర్థ్యం (మైలేజ్), శక్తివంతమైన పవర్‌ట్రెయిన్, పరిశ్రమలోనే ఉత్తమమైన ‘అప్‌టైమ్ గ్యారెంటీ’తో ఈ ట్రక్కు అందుబాటులోకి వస్తోంది. ఇది ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించి, ఉత్పాదకత, యజమానుల సంపాదనను పెంచుతుంది.ఇందులో మహీంద్రాకు చెందిన నెక్ట్స్ జనరేషన్ కనెక్టెడ్ ప్లాట్‌ఫామ్ ‘ఐఎంఏఎక్స్ఎక్స్ 2.0’ సదుపాయం ద్వారా ముందస్తు డయాగ్నోస్టిక్స్, డ్రైవర్ ప్రవర్తన పర్యవేక్షణ సులభమవుతాయి. అలాగే బ్రేక్‌డౌన్ సాయం, వ్యాన్ రియల్–టైమ్ ట్రాకింగ్, వేగవంతమైన డిజిటల్ ఆమోదాలు, స్పేర్ పార్ట్స్ ఆర్డరింగ్, సర్వీస్ హిస్టరీ, రిమైండర్ల వంటి డిజిటల్ సేవలను నిర్వహించుకునేందుకు ‘నౌ 24 గీ7’ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. ‘బ్లేజో ఐ–టీఆర్కే’ ట్రక్కు విడుదల ద్వారా హెవీ ట్రక్ విభాగంలో గతంలో తమకున్న అయిదు శాతం మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది.సరైన సమయంలోనే ఎలక్ట్రిక్ ట్రక్కులు సుదూర రవాణాకు అవసరమైన చార్జింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాకే.. సరైన సమయంలో హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేస్తామని మహీంద్రా గ్రూప్ ఉన్నతాధికారి వినోద్ సహాయ్ తెలిపారు. ప్రతి 200–250 కి.మీలకు చార్జింగ్ పాయింట్లు అవసరమన్నారు. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ దేశంలో వాణిజ్య వాహనాల డిమాండ్ బాగుందన్నారు. పరిశ్రమ 10–12% వృద్ధి నమోదు చేస్తే, మహీంద్రా గ్రూప్ ఏకంగా 13% వృద్ధి సాధించిందని వివరించారు. -
మరోసారి పెరగనున్న టాటా కార్ల ధరలు?
టాటా కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ మేరకు టాటా మోటార్స్ నుంచి సంకేతాలు వచ్చాయి. ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో, 2027 ఆర్థిక సంవత్సరంలో అవసరాన్ని బట్టి విడతల వారీగా, క్రమాంకితంగా ధరలు పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) యాజమాన్యం వెల్లడించింది. అయితే, మొత్తం భారాన్ని వినియోగదారులపై ఒకేసారి మోపకుండా.. ధరల సవరణతో పాటు ఖర్చుల తగ్గింపు చర్యలను కొనసాగించనున్నట్లు తెలిపింది.టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సీఎఫ్‌వో ధీమన్ గుప్తా 2027 ఆర్థికేడాది క్యూ1 ఫలితాల సందర్భంగా మాట్లాడుతూ, ఏడాది పొడవునా మరిన్ని “క్రమాంకిత ధరల పెంపులు” చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే తదుపరి పెంపు ఎంత శాతం ఉండొచ్చు, ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ప్రధాన ఉద్దేశం మార్జిన్లను కాపాడుకోవడంతో పాటు కార్లకు ఉన్న కస్టమర్ విలువ ప్రతిపాదనను దెబ్బతీయకుండా చూడటమేనని యాజమాన్యం స్పష్టం చేసింది.ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంపు2026లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ (ICE) కార్లపై 0.5% పెంపు అమలు చేసింది. ఆ తర్వాత జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, ఈవీలు సహా మొత్తం ప్యాసింజర్ వెహికల్ పోర్ట్‌ఫోలియో ధరలను 1.5% వరకు పెంచింది. జూలై పెంపు 2027 ఆర్థికేడాది క్యూ1 ఆర్థిక ఫలితాల్లో పూర్తిగా ప్రతిబింబించలేదని కంపెనీ తెలిపింది. అందువల్ల రెండో త్రైమాసికంలో ఆ పెంపు నుంచి కొంత ప్రయోజనం మార్జిన్లకు లభించే అవకాశం ఉంది.కమోడిటీ ఖర్చులు మరింత పెరిగే అవకాశంమరోవైపు, ముడి సరుకుల ధరలు కంపెనీకి ప్రధాన సవాలుగా మారుతున్నాయి. Q1లో కమోడిటీ సంబంధిత వ్యయ ఒత్తిడి గణనీయంగా ఉండగా, Q2లోనూ అదనపు ఖర్చు భారం ఉంటుందని యాజమాన్యం అంచనా వేసింది. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం వంటి ఇన్పుట్ ధరల కదలికలు ఆటో కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపుతున్నాయి.అమ్మకాల్లో మాత్రం జోరుధరల పెంపు నిర్ణయం వస్తున్న సమయంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ వ్యాపారంలో డిమాండ్ మాత్రం బలంగానే ఉంది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం 1,82,574 కార్లు, SUVలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలోని 1,24,809 యూనిట్లతో పోలిస్తే 46% వృద్ధి. దేశీయ అమ్మకాలు 45% పెరిగి 1,80,166 యూనిట్లకు చేరాయి. -
142 కిమీ రేంజ్ అందించే స్కూటర్ లాంచ్!
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ అయిన యాంపియర్, 30కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన 'మాగ్నస్ జి మ్యాక్స్' అప్డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షలు కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త సిన్నమోన్ కాపర్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది.ఫీచర్ల విషయానికి వస్తే.. మాగ్నస్ జి మ్యాక్స్‌లో ఇప్పుడు హిల్ హోల్డ్, క్రూజ్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రద్దీగా ఉండే పార్కింగ్ ప్రదేశాలలో యజమానులు స్కూటర్‌ను గుర్తించడంలో సహాయపడే ఫైండ్ మై స్కూటర్ అండ్ పింగ్ మై స్కూటర్ వంటి భద్రతా ఫీచర్లు కూడా దీనికి లభిస్తాయి.యాంపియర్ కనెక్ట్ యాప్‌తో మెరుగైన కనెక్టివిటీ కోసం ఈ స్కూటర్లో అప్డేట్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. నావిగేషన్, ఇతర వాహన సమాచారాన్ని కొత్త 5 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూడవచ్చు. ఇతర కనెక్టెడ్ ఫీచర్లలో రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, లైవ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, తెఫ్ట్ అండ్ టో అలర్ట్‌లు, రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్, సర్వీస్ బుకింగ్, ఛార్జింగ్ హిస్టరీ, బ్యాటరీ హెల్త్ ఇన్సైట్స్ ఉన్నాయి.మాగ్నస్ జి మ్యాక్స్‌కు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లు కూడా లభిస్తాయి. ఇవి సాఫ్ట్వేర్ అప్డేట్లను రిమోట్‌గా ఇన్స్టాల్ చేయడానికి.. స్కూటర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని సాఫ్ట్వేర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి.మాగ్నస్ జి మ్యాక్స్ 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 2.4 kW మోటార్‌ను కలిగి ఉంది. సర్టిఫైడ్ రేంజ్ 142 కిమీ. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కి.మీ.లు. బ్యాటరీకి 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ.ల వారంటీ వర్తిస్తుంది. -
సబ్సిడీల కోతతో ‘ఈ-బస్’ ఆపరేటర్లకు ఆర్థిక సెగ
దేశంలో కాలుష్య రహిత ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ బస్సుల (ఈ-బస్) విస్తరణ ప్రక్రియ కీలక మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు ఫేమ్ పథకం కింద అందించిన ప్రత్యక్ష కొనుగోలు సబ్సిడీలు క్రమంగా తగ్గుతుండటంతో ఈ-బస్ ఆపరేటర్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొత్త పథకాలైన ‘పీఎం ఈ-డ్రైవ్’, ‘పీఎం-ఈబస్ సేవా’ల్లో ప్రభుత్వం నేరుగా సబ్సిడీలు ఇవ్వడానికి బదులు నిధుల సురక్షిత విధానాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆపరేటర్లకు మూలధన సేకరణ సవాలుగా మారింది.ఆర్థిక భారం.. నిర్వహణ సవాళ్లుఒక సాధారణ డీజిల్ లేదా సీఎన్జీ బస్సు వ్యయంతో పోలిస్తే 12 మీటర్ల ఈ-బస్ ధర రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుంది (దాదాపు 2.5-3 రెట్లు ఎక్కువ). ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష సబ్సిడీ తగ్గిపోవడంతో రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే, బ్యాంకులు ఇచ్చే రుణ కాలపరిమితి కేవలం 5-7 ఏళ్లు మాత్రమే ఉండటం, 7-8 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ వ్యయంతో బ్యాటరీ మార్పిడి చేయాల్సి రావడం ఆపరేటర్ల లాభదాయకతను దెబ్బతీస్తోంది.పేమెంట్ సెక్యూరిటీ మెకానిజంరాష్ట్ర రవాణా సంస్థల నుంచి బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించి పెట్టుబడిదారుల్లో నమ్మకం నింపేందుకు ప్రభుత్వం రూ.3,435 కోట్ల వ్యయంతో పీఎస్‌ఎంను అందుబాటులోకి తెచ్చింది. ఇది దాదాపు 27,555 బస్సులకు క్రెడిట్ గ్యారెంటీని ఇస్తున్నప్పటికీ ప్రాథమిక మూలధన కొరతను తీర్చడంలో ఇది పాక్షిక ప్రయోజనాన్నే ఇస్తోంది.పరిష్కారాలు.. నిపుణుల అభిప్రాయంరేటింగ్ సంస్థ ఇక్రా నివేదికల ప్రకారం.. దీర్ఘకాలిక నిర్వహణ వ్యయం పరంగా డీజిల్ బస్సుకు కిలోమీటరుకు రూ.51 ఖర్చయితే ఈ-బస్సుకు రూ.39 మాత్రమే అవుతుంది. ఈ ఆర్థిక ప్రయోజనం దృష్ట్యా 2030 నాటికి దేశీయ బస్సు మార్కెట్లో ఈ-బస్సుల వాటాను 30 శాతానికి చేర్చాలన్న లక్ష్యం నెరవేరాలంటే కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ-బస్ ఫైనాన్సింగ్‌ను ప్రాధాన్యతా రంగ రుణాల పరిధిలోకి తీసుకురావాలి.బ్యాంకులు రుణాల తిరిగి చెల్లింపు కాలపరిమితిని 10-12 ఏళ్లకు పెంచాలి.ప్రైవేట్ రవాణా రంగానికి కూడా మౌలిక వసతుల కల్పనలో దీర్ఘకాలిక రుణ సదుపాయాలు కల్పించాలి. -
మారుతి కార్లపై భారీ ఆఫర్లు.. బంపర్ డిస్కౌంట్లు
మారుతి సుజుకి నెక్సా కార్ల కొనుగోలుదారులకు ఆగస్టు 2026లో ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ అప్‌గ్రేడ్, సంస్థాగత ప్రయోజనాలు వంటి వాటిని కలిపి కొన్ని మోడళ్లపై భారీగా ప్రయోజనాలు అందిస్తోంది. ఈ నెలలో అత్యధికంగా మారుతి సుజుకి ఇన్విక్టోపై రూ.1.55 లక్షల వరకు ప్రయోజనం అందిస్తోంది. అయితే అన్ని ఆఫర్లు ప్రతి కస్టమర్‌కు ఒకేలా వర్తించవు. నగరం, డీలర్, వాహనం వేరియంట్, స్టాక్, ఎక్స్ఛేంజ్ వాహనం వయసు వంటి అంశాలపై తుది ఆఫర్ ఆధారపడి ఉంటుంది.ఇన్విక్టోపై రూ.1.55 లక్షల వరకు..నెక్సా శ్రేణిలో అత్యధిక ప్రయోజనం ఇన్విక్టోపై లభిస్తోంది. ఈ ప్రీమియం ఎమ్పీవీపై రూ.55,000 కన్జ్యూమర్ ఆఫర్‌తో పాటు అర్హతను బట్టి రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.50,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.30,000 లాయల్టీ అప్‌గ్రేడ్, రూ.20,000 ఇన్స్టిట్యూషనల్ డిస్కౌంట్ ఉన్నాయి. మొత్తం ప్రయోజనం రూ.1.55 లక్షల వరకు చేరుతుంది. ఇన్విక్టో ఎక్స్‌షోరూమ్ ధర రూ.24.97 లక్షల నుంచి రూ.28.61 లక్షల వరకు ఉంది. ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్కు ప్రత్యర్థిగా నిలుస్తోంది.గ్రాండ్ విటారాపై భారీ బెనిఫిట్స్ఆగస్టు ఆఫర్లలో గ్రాండ్ విటారా కూడా కీలకంగా ఉంది. సిగ్మా పెట్రోల్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.1.30 లక్షల వరకు ప్రయోజనం, డెల్టా పెట్రోల్ వేరియంట్లపై రూ.1.20 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. జీటా, ఆల్ఫా, ఏడబ్ల్యూడీ వేరియంట్లకు రూ.1.20 లక్షల వరకు బెనిఫిట్స్‌తో పాటు ఐదేళ్ల ఎక్స్టెండెడ్ వారంటీని అందిస్తున్నారు.స్ట్రాంగ్ హైబ్రిడ్ గ్రాండ్ విటారాకు రూ.1.25 లక్షల వరకు ఇతర ప్రయోజనాలతో పాటు ఐదేళ్ల ఎక్స్టెండెడ్ వారంటీ, ఢిల్లీలో రోడ్ ట్యాక్స్ మినహాయింపు ద్వారా గరిష్ఠంగా మరో రూ.1.85 లక్షల వరకు ప్రయోజనం లభించవచ్చు.సీఎన్జీ గ్రాండ్ విటారా విషయానికి వస్తే డెల్టా సీఎన్జీపై రూ.1.05 లక్షల వరకు, జీటా సీఎన్జీపై రూ.95,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. గ్రాండ్ విటారా ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టయోటా హైరైడర్ వంటి మోడళ్లతో పోటీపడుతోంది.XL6పై రూ.50,000 వరకు..ప్రీమియం ఆరు సీట్ల ఎమ్‌పీవీ XL6 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.50,000 వరకు ప్రయోజనం అందిస్తోంది. ఇందులో రూ.20,000 కన్జ్యూమర్ ఆఫర్, అర్హతను బట్టి రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.15,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.11.57 లక్షల నుంచి రూ.14.37 లక్షల వరకు ఉంది.జిమ్నీపై రూ.35,000 క్యాష్ డిస్కౌంట్ఆఫ్రోడ్ ఎస్యూవీ జిమ్నీపై అన్ని వేరియంట్లకు రూ.35,000 కన్జ్యూమర్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ నెల స్కీమ్‌లో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ లేదా సంస్థాగత బోనస్‌లు లేవు. జిమ్నీ ధర రూ.12.39 లక్షల నుంచి రూ.14.37 లక్షల వరకు ఉంది. ఇది మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా వంటి మోడళ్లకు పోటీగా కొనసాగుతోంది.బాలెనోపై రూ.30,000 వరకు..నెక్సా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో పెట్రోల్ మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లపై రూ.30,000 వరకు ప్రయోజనం లభిస్తోంది. ఇందులో రూ.5,000 కన్జ్యూమర్ ఆఫర్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.10,000 స్క్రాపేజ్ ప్రయోజనం ఉన్నాయి. సీఎన్జీ వేరియంట్లపై రూ.25,000 వరకు బెనిఫిట్ అందిస్తున్నారు. బాలెనో ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.17 లక్షల వరకు ఉంది.ఫ్రాంక్స్‌పై రూ.20,000 వరకు..కాంపాక్ట్ ఎస్యూవీ తరహా క్రాసోవర్ ఫ్రాంక్స్‌పై రూ.20,000 వరకు ప్రయోజనం ఉంది. టర్బో-పెట్రోల్ వేరియంట్లకు రూ.5,000 కన్జ్యూమర్ ఆఫర్‌తో పాటు రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లభిస్తుంది. ఇతర పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.15,000 వరకు ప్రయోజనం ఉంది. ఫ్రాంక్స్ ధర రూ.6.85 లక్షల నుంచి రూ.11.84 లక్షల వరకు ఉంది.కొనుగోలుదారులు గమనించాల్సింది..ఆగస్టు 2026 నెక్సా ఆఫర్లు ఆగస్టు 4 నుంచి అమల్లో ఉన్నట్లు తాజా డీలర్-స్కీమ్ ఆధారిత సమాచారం చెబుతోంది. అయితే ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ, కార్పొరేట్ ప్రయోజనాలను అన్ని సందర్భాల్లో కలిపి పొందే అవకాశం ఉండకపోవచ్చు. అంతేకాదు, డీలర్ స్టాక్, నగరం, వేరియంట్, కస్టమర్ అర్హత ఆధారంగా తుది డీల్ మారవచ్చు. కాబట్టి కారు బుక్ చేసే ముందు సమీప నెక్సా డీలర్ వద్ద ఆఫర్ బ్రేకప్, ఎక్స్‌షోరూమ్ ధర, ఇన్సూరెన్స్, ఆర్టీఓ, యాక్సెసరీస్ తదితరాల పూర్తి కోట్ తీసుకోవడం మంచిది. -
తళుక్కుమనే ‘హ్యుందాయ్ ఎక్స్టర్ నైట్’.. ధర ఎంతంటే?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త 2026 ఎక్స్టర్ నైట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్లాక్-థీమ్ డిజైన్, స్పోర్టీ రెడ్ యాక్సెంట్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ మైక్రో ఎస్యూవీ ధర రూ.8.14 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది. 2024లో తొలిసారి వచ్చిన ఎక్స్టర్ నైట్ ఎడిషన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చారు. కాగా, ఎక్స్టర్ ఇప్పటికే దేశంలో 2 లక్షలకు పైగా కస్టమర్లను చేరుకుంది.కొత్త ఎక్స్టర్ నైట్‌లో ప్రధాన ఆకర్షణ దాని నలుపు రంగు స్టైలింగ్. ముందు, వెనుక భాగాల్లో మ్యాట్ బ్లాక్ ఎక్స్టర్, హ్యుందాయ్ లోగోలు, డార్క్ గ్రే బంపర్లు, సైడ్ సిల్ గార్నిష్‌లు ఉన్నాయి. 15 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్‌కు ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు జత చేశారు. ప్రత్యేకమైన ‘Knight’ ఎంబ్లమ్ కూడా ఉంటుంది. ఈ మార్పులతో సాధారణ ఎక్స్టర్తో పోలిస్తే వాహనానికి మరింత బోల్డ్, స్పోర్టీ లుక్ వచ్చింది.క్యాబిన్‌లోనూ ఇదే డార్క్ థీమ్‌ను కొనసాగించారు. బ్రాస్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ప్రత్యేకమైన బ్లాక్ సెమీ-ఫ్యాబ్రిక్ సీట్లు, అంబర్ ఫుట్‌వెల్ లైటింగ్, బ్లాక్ డి-కట్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి. మొత్తంగా బయట నలుపు, లోపల నలుపు రంగుల కలయికకు స్పోర్టీ టచ్ ఇచ్చారు.ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ 83 పీఎస్ పవర్, 113.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్జీ వెర్షన్లో 69 పీఎస్ పవర్, 95.2 ఎన్ఎం టార్క్ లభిస్తుంది. సీఎన్జీ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.భద్రత విషయంలో 2026 ఎక్స్టర్కు 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ (HAC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. కొత్త ఎక్స్టర్లో డ్యాష్‌క్యామ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి టెక్నాలజీ ఫీచర్లను కూడా హ్యుందాయ్ అందిస్తోంది.ధర విషయానికి వస్తే.. 2026 హ్యుందాయ్ ఎక్స్టర్ నైట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.14 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఎక్స్టర్ నైట్ శ్రేణి ప్రధానంగా HX6లోని పెట్రోల్, సీఎన్జీ ఎంపికలతో పాటు HX10 పెట్రోల్-ఏఎంటీ వేరియంట్లో అందుబాటులో ఉంది. సాధారణ వేరియంట్‌పై నైట్ ఎడిషన్‌కు బ్లాక్ ఎక్స్టీరియర్, ప్రత్యేక ఇంటీరియర్ కోసం అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది.మార్చి 2026లో హ్యుందాయ్ ఎక్స్టర్ను అప్డేట్ చేసినప్పుడు దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.79 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్స్టర్ ధరలు వేరియంట్‌ను బట్టి మారుతున్నాయి. -
క్యాబ్, ఆటో డ్రైవర్లకు కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే లైసెన్స్‌పై వేటు!
మహారాష్ట్రలో ఆటో-రిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్‌లను నడిపే వాణిజ్య ప్రయాణికుల వాహన డ్రైవర్లకు మరాఠీ భాషపై ఆచరణాత్మక పరిజ్ఞానం తప్పనిసరి కానుంది. ఇందుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్స్ రూల్స్‌లో మార్పులు చేసింది. ఈ నిబంధనలను ఆగస్టు 16, 2026 నుంచి కఠినంగా అమలు చేయనున్నట్లు రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఇప్పటికే ప్రకటించారు.కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులతో ప్రాథమికంగా మాట్లాడేందుకు, వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు సరిపడే స్థాయిలో డ్రైవర్‌కు మరాఠీపై పరిజ్ఞానం ఉండాలి. ఈ నిబంధన కేవలం డ్రైవర్లకే కాకుండా సంబంధిత పర్మిట్ హోల్డర్లకు కూడా వర్తిస్తుంది. మోటార్ వెహికల్స్ రూల్స్‌లోని 4, 22, 78, 85 నిబంధనలకు చేసిన సవరణల ద్వారా భాషా పరిజ్ఞానాన్ని లైసెన్స్, పర్మిట్‌కు సంబంధించిన నిబంధనల్లోకి తీసుకొచ్చారు.పాటించకపోతే ఏమవుతుంది?మరాఠీలో కనీస స్థాయి సంభాషణ కూడా చేయలేని డ్రైవర్‌కు ముందుగా నెల రోజుల గడువు ఇచ్చే విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ గడువులోనూ అవసరమైన భాషా పరిజ్ఞానం సాధించకపోతే డ్రైవింగ్ అనుమతిని మూడు నెలల వరకు సస్పెండ్ చేయవచ్చు. ఆ తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే లైసెన్స్ లేదా సంబంధిత బ్యాడ్జ్‌ను రద్దు చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే వేలాది మందికి శిక్షణఈ నిబంధన అమలుకు ముందు ప్రభుత్వం డ్రైవర్లకు మరాఠీ నేర్పేందుకు శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టింది. హిందూహృదయసమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మరాఠీ శిక్వాణీ అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మూడు నెలల ఫంక్షనల్ మరాఠీ శిక్షణ పూర్తి చేసినట్లు ఆగస్టు 7న వెల్లడైంది.అంతకుముందు మే 1 నుంచే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, డ్రైవర్లకు భాష నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆగస్టు 15 వరకు 100 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలంలో రాష్ట్రంలోని ఆర్టీవోలు, డిప్యూటీ ఆర్టీవోల పరిధిలో తనిఖీలు, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆడి కొత్త ప్లాన్.. వచ్చే మూడేళ్లలో..
వచ్చే మూడేళ్లలో తమ మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు వాహనాల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు 8 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, రాబోయే పండుగల సీజన్లో సరికొత్త ఆడి క్యూ3తో మొదలుపెట్టి 2027 నాటికి మొత్తం మూడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.2027లో నెక్ట్స్ జనరేషన్ ఆడి ఏ5, ఫ్లాగ్షిప్ ఆడి క్యూ9ని అందుబాటులోకి తేనున్నట్లు ధిల్లాన్ పేర్కొన్నారు. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లపై ప్రధానంగా దృష్టి పెడుతూ వచ్చే ఏడాది ఆఖరు నాటికి రిటైల్ నెట్వర్క్ని 25 శాతం పైగా విస్తరించనున్నట్లు వివరించారు. షోరూమ్‌ల సంఖ్యను 40కి పెంచుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుత డీలర్íÙప్‌లను తమ ప్రోగ్రెసివ్ షోరూమ్ కాన్సెప్టునకు కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. -
మాన్యువల్ కార్లకు ఎందుకింత డిమాండ్?
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా.. కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నా.. భారతీయ డ్రైవర్లకు ఇప్పటికీ ‘మాన్యువల్’ గేర్‌బాక్స్‌లపై నమ్మకం కొనసాగుతోంది. సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కార్ల మార్కెట్లో క్లచ్ పెడల్‌తో నడిచే వాహనాలదే ఆధిపత్యం కొనసాగుతోంది. ‘గేర్స్ ఆఫ్ గ్రోత్–2025’ నివేదిక ప్రకారం.. 2025లో విక్రయమైన యూజ్డ్ కార్లలో 72 శాతం మాన్యువల్ గేర్‌బాక్స్ వాహనాలే ఉన్నాయి. అయితే, ఆటోమేటిక్ కార్ల వాటా 28 శాతంగా ఉంది. అంటే ఆటోమేటిక్ కంటే మాన్యువల్ కార్లను ఎంచుకునే వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. వయసు, లింగం, ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. మాన్యువల్ కార్ల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ఆటోమేటిక్ వాహనాల వైపు ఆసక్తి క్రమంగా పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.యువతలో 'ఆటోమేటిక్'పై ఆసక్తియువ కొనుగోలుదారులు, ముఖ్యంగా 35 ఏళ్లలోపు వారు మార్కెట్ సగటుతో పోలిస్తే ఆటోమేటిక్ కార్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, డ్రైవింగ్‌లో సౌలభ్యం, మారుతున్న జీవనశైలి కారణంగా కొత్త తరం కొనుగోలుదారులు ఆటోమేటిక్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో రోజువారీ ప్రయాణాల్లో క్లచ్ వినియోగం తగ్గించడం ఆటోమేటిక్ కార్లకు అనుకూలంగా మారుతోంది.భవిష్యత్తులో యువత ఆదాయ స్థాయి పెరిగే కొద్దీ ఆటోమేటిక్ కార్ల మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే 45 ఏళ్లు పైబడిన కొనుగోలుదారులు మాత్రం మాన్యువల్ కార్లపైనే ఎక్కువ విశ్వాసం చూపుతున్నారు. తక్కువ నిర్వహణ వ్యయం, సులభమైన మరమ్మతులు, ఎక్కువ రీసేల్ అవకాశాలు ఇందుకు కారణాలుగా నివేదిక పేర్కొంది.ఏది కొనాలి?మాన్యువల్ లేదా ఆటోమేటిక్.. ఏది సరైన ఎంపిక అనేది కొనుగోలుదారుల వినియోగ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా నగరాల్లో, ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ఆటోమేటిక్ కార్లు సౌకర్యవంతమైన ఎంపికగా నిలుస్తాయి. పదేపదే క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకపోవడం, డ్రైవింగ్ సులభంగా ఉండటం వీటి ప్రధాన ప్రయోజనాలు. మరోవైపు ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించే వారు, తక్కువ నిర్వహణ వ్యయాన్ని కోరుకునే వారికి మాన్యువల్ కార్లు ఇప్పటికీ మెరుగైన ఎంపికగా ఉన్నాయి.అయితే.. సెకండ్ హ్యాండ్ ఆటోమేటిక్ కారు కొనుగోలు చేసే వారు గేర్‌బాక్స్ పనితీరు, సర్వీస్ రికార్డు, తనిఖీ నివేదికలు, వారంటీ అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో సమస్యలు వస్తే మరమ్మతు వ్యయం మాన్యువల్ కార్లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది.మాన్యువల్ కార్లకు ఎందుకు డిమాండ్?సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో మాన్యువల్ కార్ల ఆధిపత్యానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఇందులో తొలి కారణం ధర. మాన్యువల్ కార్ల కొనుగోలు ధరతో పాటు నిర్వహణ ఖర్చు (సర్వీసింగ్ వ్యయం) కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ‘విలువ’కు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులు వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రెండోది అలవాటైన డ్రైవింగ్. దేశంలో ఎక్కువ మంది డ్రైవింగ్‌ను మాన్యువల్ కార్లతోనే ప్రారంభించారు.కాబట్టి సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేసేవారు తమకు పరిచయమైన గేర్ వ్యవస్థనే ఎంచుకుంటున్నారు. మూడోది ఉత్తమ రీసేల్ విలువ. మాన్యువల్ కార్లకు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు కాబట్టి సులభంగా విక్రయించవచ్చు. మరోవైపు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పోలిస్తే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను పరిశీలించడం కష్టంగా ఉంటుంది. టార్క్ కన్వర్టర్, ఏఎంటీ, సీవీటీ, డ్యూయల్ క్లచ్ వంటి ఆటోమేటిక్ వ్యవస్థల్లో సమస్యలు వస్తే మరమ్మతు ఖర్చు ఎక్కువగా ఉంటుంది.నగరాల్లో ఆటోమేటిక్స్.. పట్టణాల్లో మాన్యువల్స్ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మెట్రో నగరాల్లో ఆటోమేటిక్ కార్ల వాటా ఎక్కువగా ఉంది. అధిక ట్రాఫిక్, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నగర వినియోగదారులు ఆటోమేటిక్ మోడళ్లను ఎంచుకుంటున్నారు. మెట్రో మార్కెట్లలో మారుతీ బాలెనో, హోండా సిటీ మోడళ్ల ఆటోమేటిక్ వేరియంట్లకు డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు నాన్-మెట్రో మార్కెట్లలో తక్కువ ధర, తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన మోడళ్లకు డిమాండ్ కొనసాగుతోంది. మారుతీ స్విఫ్ట్ డిజైర్, వ్యాగన్ఆర్, ఆల్టో, గ్రాండ్ ఐ10 వంటి కార్లు ఈ మార్కెట్లలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్‌న్యూస్!
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఇచ్చే సబ్సిడీని 2028 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించింది.నిజానికి ఈ సబ్సిడీ గడువు 2026 ఆర్థిక సంవత్సరంతో ముగియాల్సి ఉండగా, మరో రెండేళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించనుంది.పెరిగిన బడ్జెట్ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే?.. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం కేటాయించిన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. ఇదివరకు దీనికోసం రూ.1,772 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. ఇప్పుడు దీనిని రూ.2,767 కోట్లకు పెంచింది. అంతే కాకుండా.. సబ్సిడీ పొందే వాహనాల సంఖ్యను 24 లక్షల నుంచి 45.7 లక్షలకు పెంచారు.ఎలక్ట్రిక్ టూ-వీలర్‌కు బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్‌కు రూ. 2,500 సబ్సిడీ లభిస్తుంది. గరిష్ఠంగా రూ.5,000 వరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ సబ్సిడీని క్లెయిమ్ చేసుకునే చివరి తేదీ 2027 డిసెంబర్ 31గా నిర్ణయించారు.పెరుగుతున్న ఈవీ సేల్స్దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 2021-22లో సుమారు 2.53 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడవగా, 2025-26 నాటికి ఈ సంఖ్య 14.6 లక్షలకు చేరింది. మరోవైపు పెట్రోల్ టూ-వీలర్ల అమ్మకాలు కొంత తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం వల్ల పెట్రోల్ ఖర్చు తగ్గడంతో పాటు, దేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా టూ-వీలర్లు దేశంలో పెద్ద మొత్తంలో పెట్రోల్ వినియోగిస్తున్నందున, ఈ మార్పు ప్రభావం గణనీయంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వల్ల కాలుష్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. మరోవైపు సబ్సిడీని 2028 వరకు కొనసాగించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు కూడా భవిష్యత్తుపై మరింత స్పష్టత వస్తుంది. దీంతో కంపెనీలు పెట్టుబడులు పెంచి ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులతో పాటు దేశంలో ఈవీ మార్కెట్‌కు కూడా ఊతమిచ్చే అవకాశం ఉంది. -
రూ.13.99 లక్షల బైక్.. ఇండియాలో లాంచ్!
డుకాటి తన సరికొత్త మాన్స్టర్ వీ2ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు(ఎక్స్-షోరూమ్).ఈ కొత్త బైక్, దాని మునుపటి మోడల్ కంటే కొంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ ఇంజిన్, తేలికైన ఛాసిస్, మరింత ఆకర్షణీయమైన డిజైన్‌ను అందిస్తుంది.డుకాటీ ఇప్పుడు సరికొత్త 890 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ ద్వారా 9,000 rpm వద్ద 111 హార్స్ పవర్, 7,250 rpm వద్ద 91.1 Nm టార్క్ అందిస్తుంది. ఇన్‌టేక్ వేరియబుల్ టైమింగ్ (IVT) సిస్టమ్ ఇందులో ఉంటుంది. ఈ సిస్టమ్ ఇంజన్ పరిధిని విస్తృతం చేయడంతో పాటు, పవర్ డెలివరీని సున్నితంగా చేసి, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది.2026 డుకాటీ మోడల్ చెప్పుకోదగ్గ స్థాయిలో అప్డేటెడ్ డిజైన్ పొందలేదు. కానీ బాడీవర్క్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్‌ను కొంత మార్చారు. బాడీ ప్యానెళ్లను సూక్ష్మంగా సవరించారు. రైడర్‌కు మరింత దృఢమైన రైడింగ్ పొజిషన్‌ను అందించే లక్ష్యంతో డుకాటి హ్యాండిల్బార్లను కూడా కొద్దిగా ముందుకు జరిపింది. -
టాటా కార్లపై భారీ ఆఫర్స్!
రాబోయే ఓనం పండుగ సందర్భంగా.. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ కార్లపైనా ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లకు వర్తిస్తాయి. హ్యారియర్ ఈవీపై గరిష్టంగా రూ.2.25 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.టాటా మోటార్స్‌కు ముఖ్యమైన మార్కెట్‌గా ఉన్న కేరళలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఓనం ఆఫర్స్ ప్రకటించింది. మోడల్‌ను బట్టి, ఈ ఆఫర్లలో నగదు ప్రయోజనాలు, లాయల్టీ ప్రయోజనాలు, బీమా సంబంధిత ఆఫర్ల కలయిక ఉంటుంది.టాటా ఆల్ట్రోజ్‌పై రూ. 54,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. నెక్సాన్‌పై రూ. 72,500 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, కర్వ్ కారుపై రూ. 77,500 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా.. ఇటీవల విడుదలైన సియెర్రాపై రూ. 30,000 లాయల్టీ ప్రయోజనం లభిస్తుండగా, హారియర్.. సఫారీలు ఒక్కొక్కదానికి రూ. 47,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి.నెక్సాన్.ఈవీ (Nexon.ev) పై రూ. 60,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, కర్వ్.ఈవీ (Curvv.ev) పై రూ. 55,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ అందిస్తున్న ఓనం ఆఫర్లు వేరియంట్, డీలర్షిప్ నిబంధనలను బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ అందించే ఆఫర్స్ గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి సమీపంలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సందర్శించడం మంచిది. -
మహీంద్రా గ్రూప్‌నకు ఇక ఈమెదే ‘స్ట్రాటజీ’!
మహీంద్రా గ్రూప్ కీలక నాయకత్వ నియామకం చేపట్టింది. కమిన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న శ్వేతా ఆర్యను గ్రూప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ (Group Chief Strategy Officer)గా నియమించింది. ఆమె వచ్చే సెప్టెంబర్ 15 నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సీనియర్ మేనేజ్‌మెంట్‌లోనూ ఆమె భాగం కానున్నారు.కొత్త హోదాలో శ్వేతా ఆర్య మహీంద్రా గ్రూప్ స్ట్రాటజీ ఆఫీస్‌కు నాయకత్వం వహిస్తారు. గ్రూప్‌లోని వివిధ వ్యాపారాల్లో వృద్ధి అవకాశాలను గుర్తించడం, ఉన్న వ్యాపారాల్లో విలువను పెంచడం, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించడం వంటి అంశాలపై ఆమె దృష్టి సారించనున్నారు. ఆమె గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యురాలిగా ఉంటూ, గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షాకు రిపోర్ట్ చేస్తారు.23 ఏళ్లకు పైగా అనుభవంశ్వేతా ఆర్యకు ఆటోమోటివ్, ట్రావెల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం వంటి విభిన్న రంగాల్లో 23 ఏళ్లకు పైగా వ్యాపార, వ్యూహాత్మక నాయకత్వ అనుభవం ఉంది. కమిన్స్‌లో చేరకముందు ఆమె థామస్ కుక్ ఇండియాలో స్ట్రాటజీ, విలీనాలు-కొనుగోళ్ల (M&A) విభాగాలను నడిపించారు. అంతకుముందు కీర్నీ, ఇన్ఫోసిస్ సంస్థల్లోనూ వివిధ బాధ్యతలు నిర్వహించారు.కమిన్స్ ఇండియాలో ఆమె 2024 సెప్టెంబర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు సంస్థలో స్ట్రాటజీ లీడర్‌గా, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లీడర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కమిన్స్ ఇండియా పవర్ సిస్టమ్స్ బిజినెస్‌కు నాయకత్వం వహిస్తూ, పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ వ్యాపారాల్లో వృద్ధి, మార్కెట్ విస్తరణపై పనిచేస్తున్నారు. -
కేటీఎం బైకుల ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే!
కేటీఎం ఇండియా.. తన 160 డ్యూక్, ఆర్సీ 160 ధరలను పెంచింది. ఇందులో ఆర్సీ 160 ధర గరిష్టంగా రూ.15,000 పెరిగింది. అయితే.. వేరియంట్‌ను బట్టి, 160 డ్యూక్ ధర రూ.12,000 నుంచి రూ.13,000 మధ్య పెరిగింది.జీఎస్టీ రేట్లలో మార్పుల నేపథ్యంలో.. సెప్టెంబర్‌లో కేటీఎం ధరలను తగ్గించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత, కేటీఎం తన బైకుల ధరలను పెంచింది. అయితే.. 350సీసీ వరకు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన ద్విచక్ర వాహనాలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో, కంపెనీ చిన్న మోటార్‌సైకిళ్ల ధరలు తగ్గాయి.కేటీఎం 160 డ్యూక్160 డ్యూక్ స్టాండర్డ్ వెర్షన్ ధర గతంలో రూ.1.71 లక్షలు ఉండగా, ఇప్పుడు అది రూ.1.84 లక్షలకు చేరింది. దీంతో దీని ధర రూ.13,000 పెరిగింది. అధిక స్పెసిఫికేషన్లు గల TFT వేరియంట్ ధర రూ.1.79 లక్షల నుంచి రూ. 1.91 లక్షలకు పెరిగింది. అంటే దీని ధర రూ. 12,000 పెరిగిందన్నమాట.కేటీఎం ఆర్సీ 160ఆర్సీ 160 ధర రూ.15,000 పెరిగింది. ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో రూ.1.85 లక్షలకు విడుదలైన ఈ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ ధర ఇప్పుడు రూ. 2 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ బైక్ 164.2 సీసీ ఇంజన్‌ను కలిగి.. 18.7 bhp పవర్, 15.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
రూ.1.50 లక్షలు పెరిగిన మెజెస్టర్ ధర!
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. మెజెస్టర్ ధరలను సవరించింది. మే నెలలో లాంచ్ అయిన ఈ కారు ధరలను కంపెనీ పెంచడం ఇదే మొదటిసారి. ఈ పెంపు సావీ 2డబ్ల్యుడీ వేరియంట్లకు (ఆరు-సీటర్, ఏడు-సీటర్ కాన్ఫిగరేషన్లకు) వర్తిస్తుంది.ధరలు ఇప్పుడు రూ.1.50 లక్షల వరకు పెరిగాయి. దీంతో ఎక్స్-షోరూమ్ ధర రూ. 42.49 లక్షలకు (గతంలో ఈ కారు ధర రూ. 40.99 లక్షలు) చేరింది. అయితే, టాప్ స్పెక్ సావీ 4డబ్ల్యుడీ వేరియంట్ ధర మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దీని రేటు రూ. 44.99 లక్షల ఎక్స్-షోరూమ్ వద్దే ఉంది.కంపెనీ మెజెస్టర్ ధరలను పెంచింది. కానీ కారులో ఎలాంటి అప్డేట్స్ చేయలేదు. కాబట్టి అదే పనోరమిక్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు, 12-స్పీకర్ల JBL సరౌండ్ సౌండ్ సిస్టమ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ వైర్లెస్ ఛార్జర్లు, 220-వోల్ట్ పవర్ అవుట్లెట్, ముందు సీట్లకు వెంటిలేటెడ్ అండ్ మసాజ్ ఫంక్షన్, లెవెల్ 2 ADAS, మరియు 360-డిగ్రీల HD కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 212 బీహెచ్పీ పవర్, 478.5 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. 4WD వేరియంట్లో MG యొక్క ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, 10 ఆఫ్-రోడ్ మోడ్లు లభిస్తాయి.ఎంజీ మెజెస్టర్ దేశీయ మార్కెట్లో.. జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్, టయోటా ఫార్చ్యూనర్, వోక్స్వ్యాగన్ టేరాన్ వంటి వాటికి మాత్రమే కాకుండా.. కియా సోరెంటోలకు కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
తగ్గిన పెట్రోల్ కార్ల అమ్మకాలు.. కారణం ఇదే!
భారతదేశంలో కార్లను కొనుగోలు చేస్తున్న వారిలో ఇంధన ఎంపికలు మారుతున్నాయి. ఫాడా విడుదల చేసిన జూలై 2026 రిటైల్ డేటా ప్రకారం.. పెట్రోల్/ఇథనాల్ కార్ల వాటా 41.68 శాతానికి తగ్గింది. జూన్‌లో ఇది 43.15 శాతంగా ఉండగా.. గతేడాది జూలైలో 47.62 శాతంగా ఉంది. మరోవైపు డీజిల్ కార్ల వాటా జూన్‌లో 16.32 శాతం నుంచి జూలైలో 17.73 శాతానికి పెరిగింది.గతేడాదితో పోలిస్తే డీజిల్ కార్ల వాటా కూడా స్వల్పంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ20 పెట్రోల్‌పై వినియోగదారుల్లో ఉన్న సందేహాలు కూడా ఈ మార్పుకు ఒక కారణమని ఫాడా చెబుతోంది.పెట్రోల్/ఇథనాల్‌పై ఆసక్తి తగ్గుతున్న తరుణంలో.. సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. జూలైలో సీఎన్జీ వాహనాల వాటా 24.67 శాతం, హైబ్రిడ్ కార్ల వాటా 8.02 శాతం, ఈవీల వాటా 7.90 శాతంగా ఉంది. ఈ మూడు కలిపితే 40.59 శాతం మార్కెట్ వాటా వస్తుంది. అంటే పెట్రోల్/ఇథనాల్ వాహనాల కంటే కేవలం 1.09 శాతం పాయింట్లు మాత్రమే తక్కువ. దీన్నిబట్టి చూస్తే వాహన కొనుగోలుదారులు పెట్రోల్ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా జూలైలో రికార్డు స్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా 3,27,901 ఈవీలు అమ్ముడైనట్లు నివేదిక వెల్లడించింది. ఇది మొత్తం ఆటో మార్కెట్లో 12.7 శాతం వాటా అన్నమాట. మొత్తం మీద డీజిల్ కార్ల వాటా పెరగడం కంటే.. పెట్రోల్/ఇథనాల్ నుంచి సీఎన్జీ, హైబ్రిడ్, ఈవీల వైపు వినియోగదారుల ఆసక్తి పెరగడమే ప్రధాన మార్పుగా కనిపిస్తోంది. రాబోయే పండుగల సీజన్లో ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. -
ఈ-స్కూటర్లతో జాగ్రత్త.. బైక్‌లు, సైకిళ్ల కంటే ప్రమాదకరం!
ఎలక్ట్రిక్ స్కూటర్లు (ఈ-స్కూటర్లు) నడపడం మోటార్‌సైకిళ్లు లేదా సైకిళ్లు నడపడం కంటే ప్రమాదకరమని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ-స్కూటర్ (చిన్న చక్రాలవి) ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలు, రక్తనాళాలు దెబ్బతినడం, అంతర్గత అవయవాలకు గాయాలు అయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాలను ‘ది గార్డియన్’ నివేదించింది.చెల్సియా అండ్ వెస్ట్‌మినిస్టర్ హాస్పిటల్‌కు చెందిన హ్యాండ్, ట్రామా, ఆర్థోపెడిక్ సర్జన్ డేవిడ్ బోడాన్స్కీ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. 2020 నుంచి 2022 మధ్య ఇంగ్లాండ్, వేల్స్‌లోని 18 నగరాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని జాతీయ ప్రధాన ట్రామా రిజిస్ట్రీ నుంచి పరిశోధకులు విశ్లేషించారు.తలకు గాయాల ముప్పు మూడు రెట్లుమోటార్సైకిల్ రైడర్లతో పోలిస్తే ఈ-స్కూటర్ రైడర్లకు మెదడు గాయం లేదా రక్తనాళాలు దెబ్బతినే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే అంతర్గత అవయవాలకు గాయాలయ్యే అవకాశం సుమారు 1.5 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే ఎముకలు విరిగే ప్రమాదం మాత్రం సైక్లిస్టులు, మోటార్‌సైకిల్ రైడర్లతో పోలిస్తే తక్కువగా నమోదైంది.చిన్న చక్రాలే ప్రధాన కారణమా?ఈ-స్కూటర్ల డిజైన్ కూడా ప్రమాద తీవ్రతకు ఓ కారణమని బోడాన్స్కీ అభిప్రాయపడ్డారు. చిన్న పరిమాణంలో ఉండే చక్రాలు గుంతలు, రోడ్డు గుంతలు లేదా ఇతర అడ్డంకుల్లో సులభంగా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దీంతో రైడర్లు అదుపు తప్పి హ్యాండిల్బార్లపై నుంచి ముందుకు ఎగిరి తలపై పడే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు. మరోవైపు ప్రమాద సమయంలో ఈ-స్కూటర్ రైడర్లలో 6 శాతం కంటే తక్కువ మంది మాత్రమే హెల్మెట్ ధరించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. దీంతో తలకు సంబంధించిన గాయాలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.మహిళలు, యువతకూ అధిక ముప్పుఈ-స్కూటర్ ప్రమాదాల్లో లింగపరమైన తేడాలు కూడా కనిపించాయి. పురుషులతో పోలిస్తే మహిళలు సుమారు మూడో వంతు ఎక్కువగా ప్రమాదాలకు గురైనట్లు, అలాగే తీవ్రమైన గాయాలు నమోదయ్యే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ-స్కూటర్ల హ్యాండిల్బార్లు సాధారణంగా పురుషుల శరీరాకృతికి అనుగుణమైన ఎత్తులో ఉండటం కూడా మహిళలకు ఎక్కువగా గాయాలు కావడానికి ఓ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మొత్తం ఈ-స్కూటర్ గాయాల్లో 16 శాతం మంది పిల్లలే ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలంటున్న నిపుణులుయూకేలోని చాలా ప్రాంతాల్లో పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైకిల్ లేన్లపై ప్రైవేట్ ఈ-స్కూటర్లను నడపడం చట్టబద్ధం కాదు. అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న వారి నుంచి పోలీసులు వేలాది ఈ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ-స్కూటర్ వినియోగదారుల భద్రత కోసం తప్పనిసరి భద్రతా శిక్షణ, హెల్మెట్ వినియోగం, మెరుగైన డిజైన్‌తో కూడిన స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువ రైడర్లకు భద్రత కల్పించేలా ఈ-స్కూటర్ల రూపకల్పన, వినియోగ నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. -
E20 పెట్రోల్‌పై ఆందోళనలు.. పరీక్షల్లో తేలింది ఇదే!
భారత్‌లో ఈ20 పెట్రోల్‌పై గత కొంతకాలంగా.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ కలపడం వల్ల ఇంధన నాణ్యతపై ప్రభావం పడుతుందా?.. క్లోరైడ్, తేమ లేదా నీరు కలిసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ నమూనాలను పరీక్షించాయి.దేశంలోని రిఫైనరీల నుంచి సేకరించిన 100కు పైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించగా.. వాటిలో క్లోరైడ్ స్థాయి 1 ppm లేదా అంతకంటే తక్కువగా నమోదైంది. 80 డిస్టిలరీల నుంచి సేకరించిన ఇథనాల్ నమూనాల్లో క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగా ఉంది. డిపోలు, టెర్మినల్స్ నుంచి సేకరించిన 80కి పైగా ఈ20 నమూనాల్లో కూడా క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగానే ఉన్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.ఇదే సమయంలో.. దేశవ్యాప్తంగా సుమారు 90,000 పెట్రోల్ బంకుల్లోని భూగర్భ ట్యాంకులను కూడా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ట్యాంకుల్లోకి నీరు చేరినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని సంస్థలు పేర్కొన్నాయి. దీంతో ఈ20 పెట్రోల్ నాణ్యతపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగానే ఈ20 పెట్రోల్‌ను ఉపయోగించవచ్చని చమురు సంస్థలు చెబుతున్నాయి.చమురు సంస్థలు ఎన్ని చెబుతున్నా.. ఈ20పై వినియోగదారుల నుంచి విమర్శలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పాత వాహనాల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ తగ్గడం లేదా వాహనం పనితీరులో మార్పులు రావచ్చని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా పాత వాహనాలలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నట్లు వాహన వినియోగదారులు పేర్కొంటున్నారు. -
భారత్‌లో.. లక్షలమంది కొంటున్న కారు ఇదే!
భారతదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికీ.. మారుతి సుజుకి డిజైర్ (సెడాన్) మాత్రం అమ్మకాలలో దూసుకుపోతోంది. FY27లో ఏప్రిల్ నుంచి జూలై వరకు డిజైర్ 89,816 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకుముందు FY26లో 2,29,130 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. సెడాన్ కార్ల మార్కెట్ వాటా భారీగా పడిపోయినప్పటికీ డిజైర్ అమ్మకాలు గణనీయంగా ఉండటం విశేషం.డిజైర్‌కు ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణాలు.. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, విశాలమైన క్యాబిన్, మంచి రీసేల్ వాల్యూ. మారుతి సుజుకి బ్రాండ్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం, దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సర్వీస్ నెట్వర్క్ కూడా దీనికి కలిసొస్తున్నాయి. అందుకే చాలా కుటుంబాలు డిజైర్ ఒక మంచి ఎంపికగా భావిస్తారు.భద్రత విషయంలో.. కూడా కొత్త డిజైర్ మంచి ఫలితాలు సాధించింది. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో అడల్ట్, చైల్డ్ ప్రొటక్షన్ రెండింటిలోనూ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. కాగా ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, సీఎన్జీ ఎంపికలలో కూడా లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 24.79 కిమీ/లీ మైలేజ్, సీఎన్జీ మోడల్ 33.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. డిజైర్ ధరలు సుమారు రూ.6.26 లక్షల నుంచి రూ.9.36 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది -
కియా కార్లపై ఆగస్టు ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు
కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కియా ఇండియా ఆగస్టు నెలలో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కంపెనీ తన పలు మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనం, కార్పొరేట్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ వంటి పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలు అన్ని మోడళ్లు, వేరియంట్లకు ఒకేలా ఉండవు. డీలర్, నగరం, స్టాక్ లభ్యతను బట్టి కూడా మారే అవకాశం ఉంది.కియా కార్నివాల్ఆగస్టులో అత్యధిక ప్రయోజనం ఈ ప్రీమియం ఎంపీవీపై లభిస్తోంది. MY2026 మోడళ్లపై రూ.1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.50,000 వరకు కార్పొరేట్ ఆఫర్, స్క్రాపేజ్ ప్రయోజనాలు కలిపి గరిష్ఠంగా రూ.1.5 లక్ష నుంచి రూ.1.70 లక్ష వరకు ప్రయోజనం లభిస్తుందని వివిధ తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అన్ని ప్రయోజనాలు ప్రతి కొనుగోలుదారుడికి వర్తించవు.కారెన్స్ క్లావిస్MY2026 పెట్రోల్ వెర్షన్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం కలిపి రూ.95,000 వరకు లభించవచ్చు. పాత MY2025 టర్బో-పెట్రోల్ స్టాక్‌పై ప్రయోజనం మరింత ఎక్కువగా ఉండొచ్చు.కారెన్స్ క్లావిస్ ఈవీMY2026 ఎలక్ట్రిక్ MPVపై ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ద్వారా రూ.20,000, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.15,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం కలిపి రూ.75,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.కియా సైరోస్MY2026 టర్బో-పెట్రోల్ వెర్షన్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.20,000 ఎక్స్ఛేంజ్, రూ.20,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ ఉన్నాయి. అంటే గరిష్ఠంగా రూ.65,000 వరకు ప్రయోజనం లభించవచ్చు. డీజిల్ వెర్షన్‌పై ప్రయోజనం రూ.55,000 వరకు ఉంటుంది.కియా సోనెట్ MY2026 సోనెట్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.60,000 వరకు ప్రయోజనం ఉంది. ముఖ్యంగా 1.2 HTK(O) వేరియంట్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్, రూ.15,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తాయి.కియా సెల్టోస్ కొత్త తరం సెల్టోస్‌పై గరిష్ఠంగా రూ.40,000 వరకు ప్రయోజనం ఉంది. ఇందులో రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 స్క్రాపేజ్ ప్రయోజనం ఉన్నాయి. పాత MY2025 స్టాక్‌పై మాత్రం ప్రధానంగా స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రమే లభిస్తోంది.కియా కారెన్స్ MY2026 కారెన్స్‌పై ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ద్వారా రూ.20,000, కార్పొరేట్ బెనిఫిట్‌గా రూ.15,000 వరకు కలిపి రూ.35,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.పాత స్టాక్‌పై భారీ ప్రయోజనాలుఆగస్టు ఆఫర్లలో MY2025 స్టాక్‌కు ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తోంది. ముఖ్యంగా కారెన్స్ క్లావిస్ టర్బో-పెట్రోల్ MY2025 మోడళ్లపై రూ.1.40 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుండగా, ఇందులో భారీ క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. సైరోస్ MY2025 స్టాక్‌పై రూ.70,000 వరకు ప్రయోజనం లభించవచ్చు. అందువల్ల పాత స్టాక్ కొనుగోలు చేసే వారు తయారీ నెల, మోడల్ ఇయర్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయడం మంచిది.ఇదీ చదవండి: 165 Km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. -
ఈవీలను తెగబడి కొంటున్నారు!
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. జులైలో మరోసారి రికార్డు సృష్టించాయి. ఏకంగా 3,27,901 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైతో పోలిస్తే ఇది 66 వృద్ధి. ప్రస్తుతం రిటైల్ విక్రయాల్లో ప్రతి ఎనిమిది వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం ఉంటోందని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లోనే 63 శాతం వృద్ధితో 3,06,220 యూనిట్ల విక్రయాలతో రికార్డు నమోదైంది. దీనితో మొత్తం ఈవీల వినియోగం తొలిసారిగా 12 శాతాన్ని దాటింది.జులైలో ద్విచక్ర ఈవీల అమ్మకాలు గతేడాది జూలైలో నమోదైన 1,08,516 యూనిట్ల నుంచి 88 శాతం ఎగిసి 2,04,362 యూనిట్లకు పెరిగాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 32 శాతం వృద్ధితో 17,981 యూనిట్ల నుంచి 87,055 యూనిట్లకు చేరాయి. ఇక వాణిజ్య వాహనాల అమ్మకాలు 169 శాతం ఎగిసి 1,324 యూనిట్ల నుంచి 3,556 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహనాలను ప్రయోగాత్మకంగా పరిశీలించడం నుంచి కొనుగో లు చేసే వైపుగా వినియోగదారులు మళ్లుతున్నారని ఫాడా వైస్ ప్రెసిడెంట్ సాయి గిరిధర్ తెలిపారు. అత్యధిక డిమాండ్ ఉన్న మోడల్స్ సరఫరా కొరత ప్రతిబంధకంగా ఉంటోందని, లేకపోతే అమ్మకాలు మరింతగా పెరుగుతాయని చెప్పారు. పండుగ సీజన్‌కి ముందుగా సరఫరాను పెంచే దిశగా తయారీ సంస్థలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ20 పెట్రోల్ నాణ్యమైనదే: ఆయిల్ కంపెనీలుఈ20 పెట్రోల్‌లో అధిక తేమ, క్లోరైడ్ ఉంటున్నాయన్న ఆరోపణలు నిరాధారమైనవని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిర్వహించిన పరీక్షల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని పేర్కొన్నాయి. మొత్తం సరఫరా వ్యవస్థవ్యాప్తంగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు లోబడే ఈ20 పెట్రోల్ ఉందని తెలిపాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశాయి. రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెరి్మనల్స్, రిటైల్ ఔట్‌లెట్స్‌లో పర్యవేక్షణను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోందని వివరించాయి. నీరు చొరబడటం, సాంద్రతకు సంబంధించి ప్రతి బంకులోనూ రోజుకు 8–12 సార్లు పరీక్షలు చేస్తూ, నాణ్యతపై పర్యవేక్షణను కఠినతరం చేసినట్లు ఓఎంసీలు తెలిపాయి.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
వర్టస్ యానివర్సరీ ఎడిషన్ లాంచ్.. 150 యూనిట్లు మాత్రమే!
ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో.. వర్టస్ యానివర్సరీ ఎడిషన్‌ను రూ. 19.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత వర్టస్ స్పెషల్ ఎడిషన్, టాప్ స్పెక్ జీటీ ప్లస్ స్పోర్ట్ ట్రిమ్ ఆధారంగా నిర్మితమైంది.వర్టస్ యానివర్సరీ ఎడిషన్ అవకాడో పెర్ల్ రంగులో లభిస్తుంది. రూఫ్ నలుపు రంగులో ఉంటుంది. బ్లాక్ అల్లాయ్ వీల్స్, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ బూట్ లిప్ స్పాయిలర్ కూడా ఉన్నాయి. ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో కేవలం 150 యూనిట్లు మాత్రమే లభిస్తుంది. డిజైన్ ప్యాకేజీలో ఫ్రంట్ బంపర్‌పై గ్లాస్ బ్లాక్ ట్రిమ్, ముదురు రంగు హెడ్‌ల్యాంప్, టెయిల్ల్యాంప్ హౌసింగ్‌లు, గ్లాస్ బ్లాక్ డాష్‌బోర్డ్ ఇన్సర్ట్లతో కూడిన బ్లాక్ కలర్ క్యాబిన్ ఉంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. లెదరెట్ అపోల్స్ట్రే, రెడ్ కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సన్‌రూఫ్, 10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, 8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి.ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ కూడా ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 1.5 లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ (150 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్) ఎంపికలో లభిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. 19.62 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. -
165 Km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి మరో కొత్త సంస్థ అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ (E3 Electric.Ai) తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ3 ట్రయాన్ (E3 TRION)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కుటుంబ అవసరాలు, రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్‌కు పరిచయ ధరను రూ.1 లక్ష (బెంగళూరు ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. తొలుత బెంగళూరులో బుకింగ్స్ ప్రారంభించి, అనంతరం ఇతర నగరాలకు విస్తరించనుంది.మూడు వేరియంట్లు.. ధరలుఈ3 ట్రయాన్ను C1, C1X, C2 అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. బేస్ C1 ధర రూ.1 లక్ష కాగా, C1X ధర రూ.1,09,999, టాప్ వేరియంట్ C2 ధర రూ.1,19,999గా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. కంపెనీ తొలుత బెంగళూరు మార్కెట్‌పై దృష్టి పెట్టి, దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉంది.165 కి.మీ వరకు రేంజ్ఈ3 ట్రయాన్‌లో వేరియంట్‌ను బట్టి బ్యాటరీ, పనితీరు మారుతాయి. C1లో 2.3kWh రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది IDC సర్టిఫైడ్ రేంజ్ 108 కి.మీ, గరిష్ఠ వేగం గంటకు 67 కి.మీగా ఉంటుంది.C1Xలో 3kWh స్థిర బ్యాటరీని అందించారు. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ వరకు IDC రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీంతో మొత్తం ట్రియాన్ లైనప్‌లో ఇదే రేంజ్ ఫోకస్డ్ మోడల్‌గా నిలుస్తుంది.ఇక C2 కూడా 3kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 128 కి.మీ IDC రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 82 కి.మీ. స్పోర్ట్ మోడ్‌లో 0-40 కి.మీ వేగాన్ని సుమారు 6 సెకన్లలో అందుకోగలదని కంపెనీ పేర్కొంది. C1, C1Xలో ఎకో, పవర్ మోడ్లు ఉండగా.. C2లో అదనంగా స్పోర్ట్ మోడ్‌ను అందించారు.స్కూటర్లో AI ప్రత్యేక ఆకర్షణఈ3 ట్రయాన్‌లో సాధారణ కనెక్టెడ్ ఫీచర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను ప్రధానంగా తీసుకొచ్చారు. ఏఐ ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ, ముందస్తు రిపోర్టులు, రిమోట్ బ్యాటరీ మానిటరింగ్, లైవ్ వెహికల్ డేటా, కనెక్టెడ్ నావిగేషన్, ఛార్జర్ లొకేషన్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.స్కూటర్లో 5 అంగుళాల డిస్ప్లేను అందించారు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా నావిగేషన్ వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. డాష్‌క్యామ్ ఫంక్షనాలిటీ, SOS అసిస్టెన్స్, జియో-ఫెన్సింగ్, ఛార్జింగ్ ఇన్సైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాహనంలోని బ్యాటరీ, మోటార్, ఇతర వ్యవస్థల డేటాను విశ్లేషించి సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించడమే ఏఐ వ్యవస్థ లక్ష్యమని కంపెనీ చెబుతోంది.14 అంగుళాల చక్రాలు.. 52 లీటర్ల స్టోరేజ్డిజైన్ పరంగా ట్రియాన్‌ను కుటుంబ వినియోగానికి అనుగుణంగా రూపొందించారు. ఇందులో 14 అంగుళాల పెద్ద చక్రాలు ఉండటంతో నగర రోడ్లతో పాటు గ్రామీణ రహదారులపై కూడా మెరుగైన స్థిరత్వం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. IP67 రేటింగ్, డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్, వెనుక LED లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బూట్, ఫ్లోర్‌బోర్డ్, గ్లోవ్‌బాక్స్ ప్రాంతాలను కలిపి 52 లీటర్ల వరకు స్టోరేజ్ సామర్థ్యం అందించారు. -
టాటా నెక్సాన్ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న నెక్సాన్.. 'కామో ఎడిషన్' రూపంలో లాంచ్ అయింది. దీని ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి కంపెనీ పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది.భారతదేశంలో నెక్సాన్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని, 11 లక్షలకు పైగా అమ్మకాలను సాధించిన సందర్భంగా.. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. అయితే ఇందులో ఎలాంటి మెకానికల్ మార్పులు లేదు, కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్లు & కొన్ని అదనపు పరికరాలను జోడించారు.నెక్సాన్ కామో ఎడిషన్ మున్నార్ మిస్ట్, కూర్గ్ క్లౌడ్ అనే రెండు కొత్త రంగుల్లో లభిస్తుంది. ఈ రంగులు కాకుండా కామో బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి. క్యాబిన్లో కూడా ముందు సీట్ల హెడ్రెస్ట్లపై కామో థీమ్ ఉంటుంది. క్యాబిన్ లోపల 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన కొత్త 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందించారు.మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. ఈ కారులోని నాలుగు సరౌండ్-వ్యూ కెమెరాలను ఉపయోగించి పనిచేసే ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్. ఇది నిరంతరంగా రికార్డ్ చేయగలదు, ప్రమాదం జరిగినప్పుడు ఫుటేజీని ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది, వీడియోలను ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌పై చూడటానికి లేదా స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.వేరియంట్‌ను బట్టి.. పరికరాల జాబితాలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా, జేబీఎల్ స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి. ఏడు ఫంక్షన్లతో కూడిన ఏడీఏఎస్ మాత్రమే కాకుండా.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం కూడా ఉన్నాయి.నెక్సాన్ కామో ఎడిషన్.. స్టాండర్డ్ మోడల్లో ఉన్న అవే ఇంజన్ ఆప్షన్లతో కొనసాగుతుంది. కొనుగోలుదారులు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ టర్బో సీఎన్జీ యూనిట్ వంటి వాటిలో ఎంచుకోవచ్చు. వేరియంట్‌ను బట్టి, ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో మాన్యువల్, ఆటోమాటిక్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.ఇదీ చదవండి: E20 పెట్రోల్ సేఫేనా?.. 87 వేల పెట్రోల్ బంకుల్లో తనిఖీలు! -
టీవీఎస్ స్కూటర్ల ధరల పెంపు.. అత్యధికం ఆ స్కూటర్‌పైనే..
టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్ లైనప్‌లో పలు మోడళ్ల ధరలను పెంచింది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు పెట్రోల్ స్కూటర్ల ధరలను కూడా సవరించింది. కొన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ.11,000 వరకు ధర పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన ఆర్బిటర్ శ్రేణి కూడా ఖరీదైంది. మరోవైపు జూపిటర్ 110, జూపిటర్ 125, ఎన్‌టార్క్ 125 మోడళ్ల ధరలను కూడా కంపెనీ పెంచింది.ఐక్యూబ్ ధరలు ఇలా..టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లలో 3.5kWh మోడల్‌పై అత్యధిక పెంపు నమోదైంది. దీని ధర రూ.1.33 లక్షల నుంచి రూ.1.42 లక్షలకు పెరిగింది. అంటే రూ.9,000 పెరిగింది. బేస్ 2.2kWh ఐక్యూబ్ ధర రూ.1.11 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు చేరింది. ఐక్యూబ్ ఎస్ (4.7kWh) ధర రూ.1.55 లక్షల నుంచి రూ.1.61 లక్షలకు పెరిగింది. ఇక టాప్-స్పెక్ ఐక్యూబ్ ఎస్టీ (5.3kWh) ధర రూ.1.72 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు చేరింది. అయితే 3.1kWh ఐక్యూబ్ ధర రూ.1.33 లక్షల వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.ఆర్బిటర్పై అత్యధికంటీవీఎస్ కొత్త ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ల ధరలు అత్యధికంగా పెరిగాయి. ఆర్బిటర్ వి1 ధర రూ.88,250 నుంచి రూ.99,250కు చేరింది. అంటే రూ.11,00 పెరిగింది. ఆర్బిటర్ వి2 ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.14 లక్షలకు పెరిగింది. ఈ వేరియంట్‌పై రూ.9000 పెంపు నమోదైంది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు.జూపిటర్ 110, 125 ధరల పెంపుపెట్రోల్ స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ 110 ధరలు కూడా పెరిగాయి. వేరియంట్‌ను బట్టి రూ.575 నుంచి రూ.1,950 వరకు పెంపు నమోదైంది. దీంతో ఈ స్కూటర్ ధరల శ్రేణి రూ.73,975 నుంచి రూ.88,850కు చేరింది.జూపిటర్ 125 మోడల్ ధరలు కూడా రూ.875 నుంచి రూ.2,410 వరకు పెరిగాయి. ప్రస్తుతం ఈ స్కూటర్ ధరలు రూ.81,110 నుంచి రూ.89,935 వరకు ఉన్నాయి.ఎన్‌టార్క్ 125 ధరలూ పెరిగాయిస్పోర్టీ లుక్‌తో యువతలో మంచి ఆదరణ ఉన్న ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్ ధర రూ.82,500 నుంచి రూ.83,350కు పెరిగింది. అంటే రూ.850 పెరిగింది. ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ ధర కూడా రూ.87,950 నుంచి రూ.88,800కు చేరింది.వేరియంట్‌ను బట్టి పెంపు మారుతున్నందున కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు బుకింగ్‌కు ముందు తాజా ధరలను డీలర్ వద్ద నిర్ధారించుకోవడం మంచిది. -
రహదారి భద్రతలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు ఒకవైపు కాగా, ప్రమాద బాధితులకు చట్టబద్ధంగా దక్కాల్సిన నష్టపరిహారం అందకుండా పోతుండటం తీవ్ర ఆందోళనకరమైన అంశం. దీనికి ప్రధాన కారణం దేశంలోని రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు 56 శాతం వాహనాలకు చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా (ఇన్సూరెన్స్) లేకపోవడమే. పార్లమెంటరీ కమిటీ, అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో నమోదైన 30.48 కోట్ల వాహనాల్లో ఏకంగా 16.54 కోట్ల వాహనాలు (ప్రధానంగా ద్విచక్ర వాహనాలు) ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండానే యథేచ్ఛగా రోడ్డెక్కుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.‘నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్’ పైలట్ ప్రాజెక్ట్జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 146 అమలుపై కీలక తీర్పు ఇచ్చింది. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం (పెట్రోల్/డీజిల్) విక్రయించకుండా నిరోధించేలా ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను రూపొందించాలని బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.సాంకేతికతతో ఆటోమేటిక్ ఈ-చలాన్లుఇంధన విక్రయాల నిలిపివేతకే పరిమితం కాకుండా సాంకేతికతను జోడించాలని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను 'వాహన్' పోర్టల్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్‌తో అనుసంధానించాలని ఆదేశించింది. దీనిద్వారా బీమా లేని వాహనాలు రహదారిపైకి రాగానే ఆటోమేటిక్‌గా గుర్తించి వాహనదారుల మొబైల్ ఫోన్లకు ఈ-చలాన్లు వెళ్తాయి. తనిఖీల కోసం ట్రాఫిక్ పోలీసులకు డిజిటల్ హ్యాండ్‌హెల్డ్ పరికరాలు/యాప్‌లు అందుబాటులోకి తేనున్నారు.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు -
మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..
భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో-ఎన్‌కు 2026 అప్డేట్ను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.13.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్-ఎండ్ Z8L డీజిల్ ఆటోమేటిక్ 4WD వేరియంట్ ధర రూ.25.49 లక్షలకు చేరింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త స్కార్పియో-ఎన్లో ప్రధానంగా ఇంటీరియర్, టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్లను అప్‌గ్రేడ్ చేయగా.. బయటి డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు.డిజైన్, ఇంజిన్ అలాగే..స్కార్పియో-ఎన్‌కు ఉన్న బాక్సీ, ఎత్తైన, రగ్డ్ డిజైన్‌ను మహీంద్రా కొనసాగించింది. ముందు భాగంలోని గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సీ-ఆకారంలోని డీఆర్ఎల్లు, బంపర్, టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రధాన డిజైన్ అంశాలు దాదాపు యథాతథంగా ఉన్నాయి. అయితే, టాప్ వేరియంట్లలో కొత్త 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు.ఇక 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్లే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 203hp పవర్, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 175hp పవర్, 400Nm టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లకూ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్లలో మహింద్రా 4XPLOR 4WD సిస్టమ్ కొనసాగుతోంది.అసలు అప్‌గ్రేడ్ ఇంటీరియర్‌లోనే..స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పులు క్యాబిన్లో కనిపిస్తాయి. పాత 8-అంగుళాల యూనిట్ స్థానంలో 12.3-అంగుళాల ఫ్రీ-ఫ్లోటింగ్ HD ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వచ్చింది. దీనికి ఆరు ఫిజికల్ షార్ట్‌కట్ బటన్లు ఇచ్చారు. అలాగే, గతంలో ఉన్న సెమీ-డిజిటల్ క్లస్టర్ స్థానంలో 10.25-అంగుళాల పూర్తిస్థాయి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు.ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అడ్రినాక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలెక్సా బిల్ట్-ఇన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు వరుసలో 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే USB టైప్-C పోర్ట్ కూడా చేరింది.పనోరమిక్ సన్‌రూఫ్, 540-డిగ్రీ కెమెరాకొత్త స్కార్పియో-ఎన్లో తొలిసారిగా పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ 540-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా. ఇందులో బ్లైండ్-వ్యూ మానిటర్ కూడా ఉంటుంది. పార్కింగ్ సమయంలో వాహనం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మరింత స్పష్టంగా గమనించేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఇవే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12-స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-డిమ్మింగ్ IRVM, పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌ను ఇష్టపడే వారికి ‘అడ్వెంచర్ స్టాటిస్టిక్స్’ (Adventure Statistics) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో ఇంజిన్ పనితీరు, రోల్, పిచ్, కంపాస్, ఆల్టీమీటర్, జీ-ఫోర్స్ వంటి వివరాలను డ్రైవర్ చూడవచ్చు.లెవల్-2 అడాస్ సేఫ్టీభద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆల్-వీల్ డిస్క్ బ్రేకులు, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్, ISOFIX వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ Z8L వేరియంట్లో లెవల్-2 ADAS లభిస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై-బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.కొత్త స్కార్పియో-ఎన్ ధరలు2026 మహీంద్రా స్కార్పియో-ఎన్ను Z2, Z4, Z6, Z8S, Z8, Z8T, Z8L వేరియంట్లలో అందిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్లలో 4WD కూడా లభిస్తుంది. వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..వేరియంట్పెట్రోల్ MTపెట్రోల్ ATడీజిల్ MTడీజిల్ ATడీజిల్ 4WD MTడీజిల్ 4WD ATZ2రూ.13.69 లక్షలు–రూ.14.19 లక్షలు–––Z4రూ.15.57 లక్షలురూ.17.16 లక్షలురూ.16.12 లక్షలురూ.17.68 లక్షలురూ.18.03 లక్షలు–Z6––రూ.17.17 లక్షలురూ.18.82 లక్షలు––Z8Sరూ.17.79 లక్షలురూ.19.26 లక్షలురూ.18.79 లక్షలురూ.19.89 లక్షలు––Z8––రూ.19.86 లక్షలురూ.21.41 లక్షలు––Z8Tరూ.20.38 లక్షలురూ.21.75 లక్షలురూ.20.65 లక్షలురూ.22.25 లక్షలురూ.22.86 లక్షలురూ.24.39 లక్షలుZ8L 7-సీటర్రూ.21.31 లక్షలురూ.22.87 లక్షలురూ.21.99 లక్షలురూ.23.49 లక్షలురూ.24.25 లక్షలురూ.25.49 లక్షలుZ8L 6-సీటర్రూ.21.69 లక్షలురూ.23.05 లక్షలురూ.22.47 లక్షలురూ.23.80 లక్షలు––పాత మోడల్‌తో పోలిస్తే ఎంట్రీ లెవల్ Z2 పెట్రోల్ మాన్యువల్ ధర రూ.20,000 పెరిగింది. టాప్-ఎండ్ Z8L డీజిల్ 4WD ఆటోమేటిక్ ధర రూ.54,000 అధికమైంది. -
E20 పెట్రోల్‌తో ఇంజిన్లు పాడవుతున్నాయా?
దేశంలో E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలపిన పెట్రోల్) పెట్రోల్ వినియోగం, ఇంధన నాణ్యతపై ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వార్తలపై ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్’ (సియామ్) స్పష్టత నిచ్చింది. సాంకేతిక చర్చలలోని కొన్ని అంశాలను పాక్షికంగా చర్చించిన తర్వాత చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ మునుపటి లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.భారత ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నాంకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన E20 ఇంధన రంగానికి ఆటోమొబైల్ పరిశ్రమ పూర్తిగా మద్దతు ఇస్తుందని సియామ్ స్పష్టం చేసింది. దేశ ఇంధన స్వయంసమృద్ధి, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఇథనాల్ బ్లెండింగ్ అత్యంత కీలకమైనదని తెలిపింది. వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యమని పేర్కొంది.కఠినమైన నాణ్యతా ప్రమాణాలుకేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇథనాల్ సరఫరా ప్రక్రియలో క్లోరైడ్, సల్ఫర్ స్థాయిలను గరిష్టంగా 3 పీపీఎం పరిమితికి లోబడి ఉంచాలని ముందు జాగ్రత్త మార్గదర్శకాలను జారీ చేసిందని సియామ్ గుర్తుచేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజూ 150కి పైగా పారామితుల్లో ఇంధనాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాయని తెలిపింది.నిరంతర తనిఖీలుదేశవ్యాప్తంగా ఉన్న 87,000కు పైగా పెట్రోల్ బంకుల్లో ఇంధనంలో నీరు చేరకుండా రోజుకు 8 నుంచి 12 సార్లు తనిఖీలు నిర్వహిస్తున్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పరీక్షించిన వేల కొద్దీ శాంపిళ్లలో వ్యత్యాసాలు అత్యంత అరుదుగా మాత్రమే నమోదయ్యాయని వివరించింది. ఆటోమొబైల్ తయారీదారులు, ఆయిల్ కంపెనీలు, సాంకేతిక నిపుణుల మధ్య ఇంధన నాణ్యతపై చర్చలు నిరంతరం సాగే ప్రక్రియ అని, మీడియాలో వచ్చిన కథనాలను ప్రాతిపదికగా తీసుకుని వాహనదారులు, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సియామ్ స్పష్టం చేసింది.మునుపటి లేఖలో ఇలా..‘E20 పెట్రోల్‌లో క్లోరైడ్, తేమ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంధన నాణ్యత దెబ్బతింటోంది. ఫలితంగా వాహనాల ఇంజిన్ భాగాలు త్వరగా తుప్పు పట్టి పాడవుతున్నాయి. ఫ్యూయల్ పంపులు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఈజీఆర్ వాల్వ్‌లు, ఎగ్జాస్ట్ వ్యవస్థలోని ఇతర కీలక భాగాలు త్వరగా పాడైపోతున్నాయి. వాటి రీప్లేస్మెంట్లు భారీగా పెరిగాయి’ అని సియామ్ మునుపటి లేఖ ద్వారా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం -
E20 పెట్రోల్ సేఫేనా?.. 87 వేల పెట్రోల్ బంకుల్లో తనిఖీలు!
ఇథనాల్ కలిపిన పెట్రోల్ నాణ్యత, కల్తీ అయ్యే అవకాశంపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇంధనంలో కల్తీ లేదా నాణ్యత లోపాలు ఉన్నాయన్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశవ్యాప్తంగా కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ప్రజలకు అందించే పెట్రోల్ నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి దశలో పరీక్షలు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. సాధారణ తనిఖీలతో పాటు.. ఎలాంటి కల్తీ జరగకుండా అదనపు పరీక్షలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించింది.దేశవ్యాప్తంగా ఉన్న 87 వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో.. రోజుకు 8 నుంచి 12 సార్లు నీటి కలయిక ఉందా.. లేదా?, అనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. పెట్రోల్‌లో కలుషితాలు ఉన్నాయా?, లేదా? అని తెలుసుకోవడానికి 2 వేలకు పైగా ఇంధన నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేవలం రెండు చోట్ల మాత్రమే క్లోరైడ్ కలుషిత సమస్యలు బయటపడగా, వెంటనే ఆ పెట్రోల్ బంకుల్లో విక్రయాలను నిలిపివేసినట్లు కూడా కేంద్రం వెల్లడించింది.తనిఖీలు ఇలా..ఈ20 పెట్రోల్ నాణ్యత అనేది వాహనం ట్యాంక్‌కు చేరిన తర్వాత మాత్రమే పరిశీలించేది కాదని కేంద్రం తెలిపింది. ఇథనాల్ తయారీ దశ నుంచే నాణ్యత తనిఖీలు ప్రారంభమవుతాయని పేర్కొంది.ముందు ఇథనాల్ నాణ్యతను పరిశీలిస్తారు. డిస్టిలరీల నుంచి వచ్చే ప్రతి బ్యాచ్ ఎథనాల్ BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దాని స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండటం తప్పనిసరి. ఇథనాల్‌ను ఆయిల్ కంపెనీల డిపోలకు పంపే సమయంలో నాణ్యత ధ్రువీకరణ పత్రం కూడా అందజేస్తారు.నాణ్యత ప్రమాణాలు పాటించని ఇథనాల్‌ను.. సరఫరా వ్యవస్థలోకి అనుమతించడం లేదని ప్రభుత్వం తెలిపింది. 2024 జూలై నుంచి 2026 జూన్ మధ్య కాలంలో 302 ట్యాంకర్లలో వచ్చిన దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్‌ను ప్రమాణాలు సరిపోకపోవడంతో తిరస్కరించారు. ఇందులో స్వచ్ఛత, నీటి శాతం, సాంద్రత వంటి అంశాల్లో లోపాలను గుర్తించారు.ఇథనాల్ నిల్వ, రవాణా సమయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర పదార్థాలతో కలవకుండా.. ప్రత్యేక నిల్వ కేంద్రాల్లో ఉంచుతున్నారు. డిపోలకు చేరిన ప్రతి ట్యాంకర్ నుంచి పైభాగం, కింది భాగం నుంచి నమూనాలు తీసుకుని పరీక్షించిన తర్వాతే ఆమోదిస్తున్నారు.Certain media reports have cited issues of fuel adulteration or contamination. It is hereby clarified that fuel quality is monitored on a regular basis by Oil Marketing Companies. In addition to the advanced and elaborate testing protocols already in place, further checks have… pic.twitter.com/o0fnrnXrCM— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) August 4, 2026 -
డ్రైవింగ్ సమయంలో.. ఏ నావిగేషన్ యాప్ బెస్ట్?
ఒకప్పుడు ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించాలంటే.. దారిలో కనిపించినవాళ్లను అడిగి తెలుసుకుని వెళ్లేవారు. కానీ పరిస్థితులు మారాయి. టెక్నాలజీ పెరిగింది. దీంతో న్యావిగేషన్ పుట్టుకొచ్చింది. ఒకప్పుడు దారి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించే మ్యాప్స్ యాప్స్.. ఇప్పుడు ట్రాఫిక్‌ను తప్పించుకోవడం, సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కథనంలో డ్రైవింగ్ సమయంలో ఏ యాప్ ఎక్కువ ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని కార్లలోనూ.. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటివి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటికి యాపిల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్, వేజ్ (Waze) వంటి యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.యాపిల్ మ్యాప్స్యాపిల్ పరికరాలను ఉపయోగించేవారికి యాపిల్ మ్యాప్స్ మంచి ఎంపిక. ఇవి మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యాప్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో డిజైన్, స్పష్టమైన రూట్ వివరాలు మొదలైనవి ఉన్నాయి.ఐఫోన్, యాపిల్ వాచ్ వంటి డివైజ్లతో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రయాణ సమయంను ఇతరులతో షేర్ చేయడం, కారును పార్క్ చేసిన ప్రదేశాన్ని గుర్తుంచుకోవడం, వివిధ యాపిల్ పరికరాల్లో రూట్లను సింక్ చేయడం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అయితే రూట్లను ఎక్కువగా కస్టమైజ్ చేయడం, ఆఫ్‌లైన్ మ్యాప్‌లను ఉపయోగించడం వంటి విషయాల్లో దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.వేజ్ (Waze)ట్రాఫిక్ సమస్యలను ముందుగానే తెలుసుకోవాలనుకునే వారికి వేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు, రోడ్ బ్లాక్‌లు, పోలీస్ చెకింగ్ వంటి సమాచారాన్ని ఇది అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులోని సమాచారం ఎక్కువగా యూజర్ల నుంచి వస్తుంది. అంటే.. ఒక ప్రాంతంలో ఎదురయ్యే సమస్యలను అక్కడి డ్రైవర్లు వెంటనే తెలియజేస్తారు. దీంతో మిగతా వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే వెజ్ వినియోగం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమాచారం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. వినియోగదారులు దీనిని గుర్తుంచుకోవాలి.గూగుల్ మ్యాప్స్గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా ఉపయోగించే నావిగేషన్ యాప్‌లలో ఇది ప్రధానమైనది. ఈ యాప్ దారి చూపడానికి మాత్రమే కాకుండా.. ప్రయాణానికి అవసరమైన అనేక ఫీచర్లను అందిస్తుంది.ఆఫ్‌లైన్ మ్యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడం, టోల్ రోడ్లను తప్పించడం, తక్కువ ఇంధనం ఖర్చయ్యే మార్గాలను సూచించడం, లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా నెట్వర్క్ సరిగా లేని ప్రాంతాల్లో ప్రయాణించే వారికి కూడా గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.ఏ యాప్‌ను ఎంచుకోవాలి?మీరు పూర్తిగా యాపిల్ ఎకోసిస్టమ్‌లో ఉన్నప్పుడు యాపిల్ మ్యాప్స్ మంచి ఎంపిక. రోజువారీ ట్రాఫిక్ పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటే వేజ్ ఉపయోగపడుతుంది. ఎక్కువ ఫీచర్లు, నమ్మకమైన రూటింగ్, ఆఫ్‌లైన్ సదుపాయాలు కావాలంటే గూగుల్ మ్యాప్స్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అందరికీ సరిపోయే ఒకే ఒక్క బెస్ట్ నావిగేషన్ యాప్ ఉండదు. కాబట్టి ప్రయాణ అవసరాలు, డ్రైవింగ్ చేసే ప్రాంతం, కావాల్సిన సదుపాయాల ఆధారంగా సరైన యాప్‌ను ఎంచుకుంటే ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. -
జూలైలో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడిల్ క్లాస్ వాహనదారుల ఆదరణే పరమావధిగా మారుతీ సుజుకీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జులై 2026 నెలవారీ కార్ల విక్రయాల గణాంకాల ప్రకారం.. ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ మోడల్ మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క నెలలోనే కంపెనీ ఏకంగా 18,200 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM), వివిధ ఆటోమొబైల్ సంస్థల అధికారిక నివేదికల ప్రకారం గత జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లుమారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ (WagonR): 18,200 యూనిట్లు అమ్ముడుపోయి మొదటి స్థానంలో నిలిచింది. దీని మైలేజ్, తక్కువ బడ్జెట్, విశాలమైన క్యాబిన్ స్పేస్ ఇందుకు ప్రధాన కారణాలు. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.5.54 లక్షలు - రూ.7.38 లక్షలుహ్యుందాయ్ క్రెటా (Hyundai Creta): 17,500 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎస్యూవీ (SUV) విభాగంలో ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.11.00 లక్షలు - రూ.20.15 లక్షలుమారుతీ సుజుకీ బ్రెజా (Brezza): 16,800 యూనిట్లు అమ్ముడై మూడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా దీని సీఎన్జీ (CNG) వేరియంట్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ లభించింది. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.8.34 లక్షలు - రూ.14.14 లక్షలుటాటా పంచ్ (Tata Punch): 16,100 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటం దీనికి ప్లస్ పాయింట్‌గా మారింది. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.6.13 లక్షలు - రూ.10.20 లక్షలుమారుతీ సుజుకీ స్విఫ్ట్ (Swift): కొత్త మార్పులతో వచ్చిన ఈ కారు 15,600 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.6.49 లక్షలు - రూ.9.60 లక్షలువ్యాగన్ఆర్ ఇప్పటికీ హాట్ ఫేవరెట్ ఎందుకంటే.. గత కొన్నాళ్లుగా మార్కెట్లో ఎస్యూవీ (SUV)ల హవా నడుస్తున్నప్పటికీ, వ్యాగన్ఆర్ తన స్థానాన్ని పదిలపరుచుకోవడం విశేషం. ముఖ్యంగా పట్టణ రోడ్లలో సులువైన డ్రైవింగ్, మెరుగైన ఇంధన సామర్థ్యం (CNG ఆప్షన్ సహా), రీసేల్ వ్యాల్యూ, అందుబాటు ధరలు ఈ కారును సామాన్యుడి ఫేవరెట్ చాయిస్‌గా మార్చాయి.మారుతీ సుజుకీ తిరుగులేని ఆధిపత్యంమోడళ్ల వారీగానే కాకుండా, మొత్తం కార్ల కంపెనీల పరంగా చూస్తే మారుతీ సుజుకీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. జులై 2026లో ఒక్క దేశీయ మార్కెట్లోనే దాదాపు 2 లక్షల యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. -
పెరిగిన కార్ల అమ్మకాలు.. హ్యుందాయ్‌కు ఆల్‌టైమ్ రికార్డు!
ఇండియా కార్ల మార్కెట్‌కు 2026 జూలై నెల మంచి ఊపునిచ్చింది. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు దాదాపు అన్నీ కూడా.. గత ఏడాది జూలైతో పోలిస్తే మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి. ముఖ్యంగా హ్యుందాయ్ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించగా, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రాకంపెనీ ఎస్యూవీ విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కియా, టయోటా, ఎంజీ మోటార్, నిస్సాన్ కూడా బలమైన విక్రయాలను పొందాయి.టాటా మోటార్స్.. జూలైలో మొత్తం 63,760 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 40 వేల యూనిట్లతో పోలిస్తే ఇది 59 శాతం ఎక్కువ. ఇందులో దేశీయ మార్కెట్లోనే 62,611 వాహనాలు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా.. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మరోసారి తన సత్తా చాటింది. జూలైలో 15,217 ఈవీలను విక్రయించి గత ఏడాది కంటే.. 114 శాతం వృద్ధిని నమోదు చేసింది.మహీంద్రా కంపెనీ.. జూలైలో దేశీయ మార్కెట్లో 60,048 ఎస్‌యూవీలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అన్ని రకాల వాహనాలను కలిపి చూస్తే మహీంద్రా మొత్తం 1,03,860 యూనిట్లను విక్రయించి 26 శాతం వృద్ధిని సాధించింది. విదేశీ మార్కెట్లకు చేసిన ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి.హ్యుందాయ్ మోటార్ ఇండియా.. దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం 75,360 వాహనాలను విక్రయించింది. ఇది హ్యుందాయ్ భారత చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలుగా నిలిచింది. దేశీయంగా 54,210 కార్లు అమ్ముడవగా, ఎగుమతులు కూడా ఎనిమిదేళ్లలో అత్యధిక స్థాయికి చేరాయి. కంపెనీకి అత్యధిక అమ్మకాలు తెచ్చిపెట్టిన మోడల్‌గా క్రెటా నిలవగా, ఐ20 కూడా ఈ ఏడాదిలో అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది.కియా ఇండియా కూడా.. జూలైలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం 28,200 యూనిట్లను విక్రయించి గత ఏడాదితో పోలిస్తే 27.4 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కొత్త తరం సెల్టోస్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. సోనెట్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ, సైరోస్ ఈవీ వంటి మోడళ్లు కూడా అమ్మకాలకు ఊతమిచ్చాయి.టయోటా కిర్లోస్కర్ మోటార్ జులైలో మొత్తం 32,516 వాహనాలను విక్రయించి వృద్ధిలో నిలకడను చూపించింది. దేశీయ మార్కెట్లో 30,516 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే.. కంపెనీ దేశీయ అమ్మకాలు 5 శాతం పెరిగాయి. అలాగే ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో టయోటా మొత్తం విక్రయాలు 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి.జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. వరుసగా రెండో నెల అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. జూలైలో 8,158 వాహనాలను విక్రయించిన కంపెనీ, తన మొత్తం అమ్మకాలలో 80 శాతానికి పైగా ఎలక్ట్రిక్ వాహనాలేనని వెల్లడించింది. దీంతో భారత ఈవీ మార్కెట్లో ఎంజీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.ఇక నిస్సాన్ జూలైలో.. దేశీయ మార్కెట్లో 4,518 వాహనాలను విక్రయించి ఏకంగా 218 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇటీవల విడుదలైన కొత్త టెక్టాన్ ఎస్‌యూవీకి వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో కంపెనీ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.ఇదీ చదవండి: కొత్త రకం డీజిల్ వచ్చేసింది.. దీని స్పెషాలిటీ ఏంటంటే? -
పొట్టి రైడర్లకు బెస్ట్ బైక్స్ ఇవే!
సాధారణంగా ఒక మోటార్‌సైకిల్ కొనుగోలు చేసే సమయంలో ఇంజిన్ పవర్, మైలేజ్, డిజైన్ మాత్రమే కాదు.. సీట్ హైట్ కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే.. తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు బైక్‌ను కంట్రోల్ చేయడంలో సీట్ హైట్ కీలక పాత్ర పోషిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆపినప్పుడు రెండు కాళ్లు నేలను తాకడం, బైక్‌ను బ్యాలెన్స్ చేయడం సులభంగా ఉండాలంటే.. తక్కువ సీట్ హైట్ ఉన్న బైక్‌లు చాలా ఉపయోగపడతాయి.సీట్ హైట్ ఒక్కటే మాత్రమే సౌకర్యవంతమైన రైడింగ్ ఇస్తుందని చెప్పలేము. సీట్ వెడల్పు, బైక్ బరువు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ.. పొట్టి రైడర్లు ముందుగా పరిశీలించాల్సిన ముఖ్యమైన స్పెసిఫికేషన్ సీట్ హైట్. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.77 వేల నుంచి రూ.1.85 లక్షల ధరల మధ్య 800 మిమీ కంటే తక్కువ సీట్ హైట్ కలిగిన కొన్ని మంచి బైక్స్ అందుబాటులో ఉన్నాయి.బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160తక్కువ సీట్ హైట్ కలిగిన బైక్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160. దీని సీట్ హైట్ కేవలం 737 మిమీ మాత్రమే. క్రూయిజర్ డిజైన్‌తో వచ్చే ఈ బైక్‌లో ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్స్ ఉంటాయి. దీంతో రైడర్ కాళ్లు సహజమైన పొజిషన్లో ఉంటాయి. తక్కువ ఎత్తు ఉన్నవారికి పెద్ద ఇంజిన్ కలిగిన బైక్‌లలో ఇది సులభంగా కంట్రోల్ చేయగల ఆప్షన్‌గా నిలుస్తుంది.టీవీఎస్ రైడర్ 125780మిమీ సీట్ హైట్ కలిగిన టీవీఎస్ రైడర్ 125 ప్రధానంగా రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించిన కమ్యూటర్ బైక్. సన్నగా ఉండే సీట్, తక్కువ బరువు కారణంగా ట్రాఫిక్‌లో హ్యాండిల్ చేయడం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువగా బైక్ నడిపే పొట్టి రైడర్లకు ఇది మంచి ఎంపిక.హీరో స్ప్లెండర్ ప్లస్భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి హీరో స్ప్లెండర్ ప్లస్. ఇది కూడా తక్కువ సీట్ హైట్ కలిగి ఉంటుంది. దీని సీట్ హైట్ 785 మిమీ మాత్రమే. తక్కువ బరువు, సన్నని బాడీ డిజైన్ కారణంగా పార్కింగ్ లేదా నెమ్మదిగా నడిపే సమయంలో కూడా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.బజాజ్ పల్సర్ 150785 మిమీ సీట్ హైట్ కలిగిన బజాజ్ పల్సర్ 150 కూడా మన జాబితాలో ఒకటి. స్ప్లెండర్‌తో పోలిస్తే.. ఈ బైక్ ట్యాంక్ కొంచెం వెడల్పుగా ఉంటుంది. కాబట్టి 5 అడుగుల 4 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కొనుగోలు చేసే ముందు ఒకసారి బైక్‌పై కూర్చొని చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సీట్ హైట్ తక్కువగా ఉన్నా, ట్యాంక్ వెడల్పు వల్ల కొందరికి కాళ్లు నేలకు పెట్టడం కాస్త భిన్నంగా అనిపించవచ్చు.జావా 42రెట్రో డిజైన్‌తో ఆకట్టుకునే జావా 42 బైక్ సీట్ హైట్ 788 మిమీ. దీని రౌండెడ్ సీట్ డిజైన్ కారణంగా రైడర్ కాళ్లు దగ్గరగా ఉంచుకోవచ్చు. అందువల్ల సీట్ హైట్ కంటే కూడా రైడింగ్ అనుభూతి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది ఈ జాబితాలో కొంచెం ఖరీదైన బైక్ అయినప్పటికీ, ప్రత్యేకమైన డిజైన్ కోరుకునే వారికి మంచి ఎంపిక.రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350ఈ జాబితాలో కొంత ఎక్కువ హైట్ ఉన్న సీట్ కలిగిన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. దీని సీట్ హైట్ 790 మిమీ. చిన్న వీల్‌బేస్, కాంపాక్ట్ డిజైన్ కారణంగా బైక్ పెద్దగా అనిపించదు. ఇందులో 349 సీసీ ఇంజిన్ ఉన్నప్పటికీ.. నగర రోడ్లపై సులభంగా నడపగలిగేలా రూపొందించారు. -
కొత్త రకం డీజిల్ వచ్చేసింది.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
భారత సైన్యం ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే.. దేశంలో అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ (XWG) డీజిల్‌ను సైన్యం వినియోగంలోకి తీసుకురావడం మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ సరికొత్త డీజిల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.నిజానికి.. సాధారణ డీజిల్ తీవ్ర చలిలో గడ్డకట్టే అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ మాత్రం మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. అందుకే భారత సైన్యాధిపతి దీనిని సైన్యానికి గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు.XWG డీజిల్ గురించి..XWG అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్. పేరుకు తగ్గట్టుగా.. ఇది అత్యంత చల్లని వాతావరణ పరిస్థితులను తగ్గుకుంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ XWGను ప్రత్యేకంగా తయారు చేశారు. సాధారణ డీజిల్ తీవ్రమైన చలిలో చిక్కబడి ఫ్యూయల్ లైన్లను, ఫిల్టర్లను మూసివేసే అవకాశం ఉంటుంది. దీంతో వాహనాలను స్టార్ట్ చేయడం కష్టమవుతుంది. కానీ XWG డీజిల్ అలాంటి సమస్యలను అధిగమించేలా రూపొందించారు. మైనస్ 42 డిగ్రీల వరకు కూడా ఇది గడ్డకట్టకుండా పనిచేస్తుంది.ఈ డీజిల్ అవసరం ఏమిటి?భారత సైన్యం లడఖ్, సియాచిన్ వంటి అత్యంత ఎత్తైన మంచు ప్రాంతాల్లో నిరంతరం విధులు నిర్వహిస్తుంటుంది. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల కంటే తక్కువకు చేరిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో సాధారణ డీజిల్ గడ్డకట్టడంతో ట్యాంకులు, ట్రక్కులు, ఇతర సైనిక వాహనాలు పనిచేయడం కష్టమయ్యేది. దీని వల్ల సైనికులు రాత్రంతా వాహనాలను తరచూ స్టార్ట్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో డీజిల్ గడ్డకట్టకుండా ఉండేందుకు ఇంధన ట్యాంకుల కింద 'బుఖారీ' అనే సంప్రదాయ హీటర్‌ను కూడా ఉపయోగించేవారు. ఇది అదనపు శ్రమతో పాటు భద్రతాపరమైన ప్రమాదాలకు కూడా దారితీసేది.#GeneralDhirajSeth, #COAS, today launched Xtreme Weather Grade (XWG) Diesel, an indigenous innovation developed jointly by the Indian Army and Oil Marketing Companies. Designed for reliable performance in extreme cold, the specialised fuel remains effective at temperatures as low… pic.twitter.com/tV2rJlPMUu— ADG PI - INDIAN ARMY (@adgpi) July 31, 2026XWG డీజిల్ ఉపయోగాలుఈ కొత్త డీజిల్ ద్వారా తీవ్రమైన చలిలో కూడా వాహనాలు సులభంగా స్టార్ట్ అవుతాయి. దీంతో సైనిక వాహనాలు ఎప్పుడైనా విధులకు సిద్ధంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుంది. సైనికులపై అదనపు ఒత్తిడి తగ్గుతుంది. అలాగే డీజిల్ గడ్డకట్టకుండా ఉండేందుకు ప్రమాదకరమైన పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు.ఈ డీజిల్ ఉపయోగించడానికి ప్రత్యేకంగా కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారత సైన్యం వినియోగిస్తున్న వాహనాల్లోనే ఎలాంటి ఇంజిన్ మార్పులు చేయకుండా దీనిని ఉపయోగించవచ్చు. ఇది BS-VI ఉద్గార ప్రమాణాలు మరియు IS 1460:2025 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారైంది.సాధారణ ప్రజలు ఉపయోగించవచ్చ?ప్రస్తుతం ఈ డీజిల్‌ను ప్రధానంగా సైన్యం కోసం రూపొందించినప్పటికీ, భవిష్యత్తులో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి తీవ్ర చలిగాలులు వీచే ప్రాంతాల్లో వాహనాలు ఉపయోగించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారవచ్చు.ఈ ప్రత్యేక డీజిల్‌ను భారత సైన్యం, ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు కలిసి కేవలం ఏడాది వ్యవధిలో అభివృద్ధి చేశాయి. ఇది 'మేక్ ఇన్ ఇండియా' దిశగా మరో విజయంగా ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో కూడా సైన్యం అవసరాలకు అనుగుణంగా ఇలాంటి మరిన్ని ప్రత్యేక ఇంధనాలు, సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. -
128 కిమీ రేంజ్ అందించే.. విడా కొత్త స్కూటర్!
హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా.. దేశీయ విఫణిలో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన గో ఎఫ్బీ పేరుతో వీడా విఎక్స్2 సరికొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.1.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది కంపెనీకి చెందిన అధికారిక డీలర్‌షిప్‌లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు ఆగస్టు 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ కొత్త వేరియంట్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 128 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది DC ఫాస్ట్ ఛార్జర్‌తో, 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి 65 నిమిషాలు పడుతుంది. వీఎక్స్2 గో ఎఫ్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌కు 6kW మోటార్ జత చేయబడి ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు.హీరో విడా వీఎక్స్2 గో ఎఫ్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.3 అంగుళాల LCD కన్సోల్ పొందుతుంది. దీనికి టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సౌకర్యం ఉంది. సీటు కింద ఉండే స్టోరేజ్ సామర్థ్యం 27.2 లీటర్లు. కాబట్టి ఇది అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. -
హోండా కార్స్ ఇండియాకు కొత్త బాస్!
హోండా కార్స్ ఇండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. కంపెనీ కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా 'తోషియుకి యానగిసావా'ను(Toshiyuki Yanagisawa) నియమించింది. ఈయన 2026 అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం కంపెనీకి నాయకత్వం వహిస్తున్న తకాషి నకాజిమా (Takashi Nakajima) తన పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత.. యానగిసావా ఏషియన్ హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్‌లో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.తోషియుకి యనగిసావా ప్రస్తుతం హోండా ఇండియా స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఆఫీస్‌ను నడిపించడంతో పాటు, హోండా డిజిటల్ ఇన్నోవేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (HDII) సీఈఓగా కూడా ఉన్నారు. కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా HDII కార్యకలాపాలను ఆయన కొనసాగించనున్నారు.భారత మార్కెట్లో హోండా తన వ్యాపారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో.. కొత్త సీఈఓను నియమించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ను కీలక మార్కెట్‌గా భావిస్తున్న హోండా.. భవిష్యత్ వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే.. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న కొత్త కారును 2028లో విడుదల చేయాలని కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది.ప్రస్తుతం హోండా దేశీయ మార్కెట్లో అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి ప్రముఖ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ వాహనాలను దేశంలోనే తయారు చేస్తున్నారు. ఇటీవల హోండా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు జెడ్ఆర్-వీ (ZR-V) అనే హైబ్రిడ్ ఎస్‌యూవీని కూడా విడుదల చేసింది. ఈ మోడల్‌ను కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గంలో దిగుమతి చేసుకుంటుంది. -
టీవీఎస్ రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్ లాంచ్!
టీవీఎస్ మోటార్ కంపెనీ రైడర్ 125 డాక్టర్ డూమ్ ఎడిషన్‌ను రూ.95,320 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు లాంచ్ చేసింది. ఇప్పటికే ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, డెడ్‌పూల్, వోల్వరైన్ థీమ్‌లతో కూడిన మోటార్‌సైకిళ్లను కలిగి ఉన్న రైడర్ సూపర్ స్క్వాడ్ శ్రేణిని ఈ సరికొత్త మోడల్ మరింత విస్తరిస్తుంది. అంటే కొత్త థీమ్ కావాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని సంస్థ దీనిని విడుదల చేసింది.డాక్టర్ డూమ్ ఎడిషన్ స్పెక్ట్రల్ గ్రీన్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఇది వివిధ లైటింగ్ పరిస్థితులలో ఆకుపచ్చ నుంచి గోధుమ రంగులోకి మారే కలర్ షిఫ్టింగ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే.. ఇతర సూపర్ స్క్వాడ్ రైడర్ మోడళ్ల మాదిరిగానే, దీని ఫ్యూయల్ ట్యాంక్ అండ్ సైడ్ ప్యానెళ్లపై కూడా డాక్టర్ డూమ్ గ్రాఫిక్స్ ఉంటాయి.డిజైన్ పరంగా కొత్తగా అనిపించినప్పటికీ.. మెకానికల్‌గా ఏమీ మారలేదు. ఈ మోటార్‌సైకిల్ 124.8cc, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తూనే ఉంది. ఇది 11 bhp పవర్, 11.75 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది.ఫీచర్ల జాబితాలో కూడా ఎలాంటి మార్పు లేదు. అయితే రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్‌లో.. కనెక్టెడ్ ఫంక్షన్లతో కూడిన టీవీఎస్ కనెక్టెడ్ రివర్స్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. టాప్ స్పెక్ సూపర్ స్క్వాడ్ వేరియంట్లలో సింగిల్ ఛానల్ ABSతో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. ఈ లేటెస్ట్ బైక్.. రానున్న రోజుల్లో అధీకృత టీవీఎస్ డీలర్‌షిప్‌లన్నింటిలో అందుబాటులోకి వస్తుంది. -
అదరగొట్టిన మహీంద్రా.. కంగుతిన్న హ్యుందాయ్
దేశీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) బంపర్ ఫలితాలతో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో (2026–27, క్యూ1) కంపెనీ రూ. 5,455 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.4,083 కోట్లతో పోలిస్తే లాభం 34 శాతం జంప్ చేసింది. మొత్తం ఆదాయం కూడా 28 శాతం వృద్ధితో రూ. 45,529 కోట్ల నుంచి రూ. 58,188 కోట్లకు చేరింది.‘స్థూల ఆర్థిక ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ, మా వైవిధ్యమైన పోర్ట్ట్ఫోలియో, చురుకైన చర్యలతో సవాళ్లను అధిగమించి, పటిష్టమైన ఫలితాలను సాధించగలిగాం. ప్రస్తుత డైనమిక్ వ్యాపార పరిస్థితుల్లో కూడా ఆటో, వ్యవసాయ సంబంధిత విభాగాలు తమ లీడర్షిప్ పొజిషన్లను బలోపేతం చేసుకుంటున్నాయి’ అని ఎంఅండ్ఎం గ్రూప్ సీఈఓ, ఎండీ అనీశ్ షా పేర్కొన్నారు. క్యూ1లో కంపెనీ 23% వృద్ధితో రూ.3,04,000 వాహనాలను విక్రయించింది. ఇందులో 1,75,000 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) అమ్ముడవ్వడం విశేషం. ఎస్యూవీ మార్కెట్ వాటా సీక్వెన్షియల్‌గా అర శాతం పెరిగిందని, ఎక్స్ఈవీ 9ఎస్ అమ్మకాల సంఖ్య పరంగా భారత్‌లో టాప్ సెల్లింగ్ ఈవీగా నిలిచిందని ఎంఅండ్ఎం సీఈఓ (ఆటో, ఫామ్ సెక్టార్) రాజేష్ జెజూరికర్ చెప్పారు. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 13 శాతం ఎగిశాయి. టెక్ మహీంద్రా మార్జిన్ల జోరు కొనసాగింది. ఎబిటా 330 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. మహీంద్రా లాజిస్టిక్స్ ఆదాయం పటిష్టంగా 23 శాతం వృద్ధి సాధించింది. హ్యుందాయ్‌కి పశ్చిమాసియా సెగపశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఎగుమతులు క్షీణించడం, ఒక సప్లయర్ ప్లాంటులో అగ్నిప్రమాదంతో ఉత్పత్తి దెబ్బతినడం తదితర అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్స్ ఇండియా (హెచ్ఎంఐఎల్)పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనితో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన లాభం రూ. 889 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన రూ. 1,369 కోట్లతో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ.ఇక ఆదాయం రూ. 16,413 కోట్ల నుంచి రూ. 16,335 కోట్లకు తగ్గింది. అటు వ్యయాలు రూ. 14,780 కోట్ల నుంచి రూ. 15,407 కోట్లకు పెరిగాయి. పలు ప్రతికూల పరిస్థితుల వల్ల అమ్మకాలు, లాభదాయకతపై ప్రభావం పడిందని కంపెనీ సీఈవో తరుణ్ గర్గ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట చేయనున్నామని గర్గ్ చెప్పారు. -
రోడ్లపైకి 4 వేల పైగా ఎలక్ట్రిక్ బస్సులు..
దేశీయంగా 4,000 ఎలక్ట్రిక్ బస్సులను రహదార్లపైకి తెచ్చిన తొలి భారతీయ సంస్థగా ఘనత సాధించినట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ వెల్లడించింది. హిమాచల్ రోడ్డు రవాణా కార్పొరేషన్‌కి 4,000వ బస్సును లాంఛనంగా అందజేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వివరించింది. ఇది కంపెనీకే కాకుండా భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి కూడా కీలక సందర్భమని కంపెనీ ఎండీ మహేష్ బాబు చెప్పారు.విశ్వసనీయమైన పనితీరు, తక్కువ నిర్వహణ వ్యయాలు, పర్యావరణానికి గణనీయంగా ప్రయోజనాలను అందించేలా తమ బస్సులు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ బస్సులు మొత్తం మీద 730 మిలియన్ గ్రీన్ కిలోమీటర్ల మేర ప్రయాణం చేశాయని, 6.5 లక్షల టన్నులపైగా కర్బన ఉద్గారాలను నివారించాయని కంపెనీ పేర్కొంది. -
ఎలక్ట్రిక్ టూ-వీలర్ల జోరుతో ఈవీలు.. రయ్ రయ్!
ముంబై: భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగం విస్తృత వృద్ధి దశలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా (పెనెట్రేషన్) 10 నుంచి 12 శాతానికి పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) అంచనా వేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఈ వృద్ధికి ప్రధాన దన్నుగా నిలుస్తాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 8.5 శాతంగా నమోదైంది. ఇండ్–రా నివేదిక ప్రకారం విభాగాల వారీగా ఈవీ వాటా అంచనాలు ఇలా ఉన్నాయి. తక్కువ నిర్వహణ వ్యయం, ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సౌలభ్యం, దిగ్గజ ఆటో కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుండటంతో ద్విచక్ర వాహన విభాగంలో ఈవీల వాటా గతేడాది 6.6 శాతం నుంచి ఈ ఏడాది 8–10 శాతానికి పెరగొచ్చని అంచనా. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల విభాగంలో ఈవీల ఆధిపత్యం కొనసాగనుంది. గతేడాది (2025–26) మొత్తం త్రిచక్ర వాహన విక్రయాల్లో ఈవీల వాటా 59 శాతంగా ఉంది. కమర్షియల్ ఆపరేటర్లకు అనుకూలమైన నిర్వహణ వ్యయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 62–65 శాతానికి చేరొచ్చు. కొత్త మోడళ్ల విడుదలతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా గతేడాది 4.4 శాతం నుంచి ఈ ఏడాది 6–8 శాతానికి పెరగొచ్చు. మెట్రో నగరాలు, అధిక ఆదాయ వర్గాల్లో వీటి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. అయితే అధిక ప్రారంభ కొనుగోలు ధర, చార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత, ఒక్కసారి చార్జింగ్‌తో ప్రయాణించగల దూరం (రేంజ్) వంటి అంశాలు ఈ విభాగంలో వేగవంతమైన విస్తరణకు సవాళ్లుగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) వాటా కూడా గతేడాది 4.37 శాతం నుంచి ఈ ఏడాది 6–8 శాతానికి చేరొచ్చు. బలమైన ఆర్డర్ బుక్, ప్రభుత్వ కొనుగోలు కార్యక్రమాలు ఇందుకు దోహదపడనున్నాయి. అయితే రాష్ట్ర రవాణా సంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఈ–బస్సుల విస్తరణ ఆధారపడి ఉంటుందని పేర్కొంది.బ్యాటరీల దిగుమతులు తగ్గాలి వాహన వినియోగ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం, విస్తృత శ్రేణిలో కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, వినియోగదారుల ఆదరణ పెరగడంతో దేశీయ ఈవీ మార్కెట్‌కు బలమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే తదుపరి దశ వృద్ధి దేశీయ వాల్యూ చైన్ బలోపేతంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీలు, అనుబంధ సాంకేతికతల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ఈ స్థానంలో దేశీయ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనితోపాటు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించాల్సి ఉంది’’ అని ఇండియా రేటింగ్స్ కార్పొరేట్స్ డైరెక్టర్ శృతి సబూ పేర్కొన్నారు. -
సరికొత్త టయోటా హైలక్స్: ధర ఎంతంటే?
టయోటా భారతదేశంలో తొమ్మిదవ తరం హైలక్స్‌ను లాంచ్ చేసింది. ఈ పికప్ ట్రక్ జీఎక్స్ 4x2 ఏటీ, జీఎక్స్ 4x4 ఏటీ, వీఎక్స్ 4x4 ఏటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 31.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.టయోటా హైలక్స్ సరికొత్త మోడల్ IMV ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది. దీని మునుపటి మోడల్‌కు ఆధారమైన అదే బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఇది. భారతదేశంలో డబుల్ క్యాబ్ బాడీ స్టైల్లో లభిస్తుంది. ఈ పికప్ ట్రక్ ముందు భాగంలో హనీకోంబ్ గ్రిల్, బ్లాక్ ట్రిమ్‌తో సన్నని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కార్గో బెడ్ 500 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.హైలక్స్ పికప్ ట్రక్ కొత్త డాష్‌బోర్డ్‌తో వస్తుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. 3-స్పోక్ స్టీరింగ్ వీల్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి మాత్రమే కాకుండా.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, టెర్రైన్ మోడ్లు, ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 201 Bhp పవర్, 500 Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.8-లీటర్, 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. కాగా ఇది సల్ఫర్ మెటాలిక్, ప్లాటినం పెర్ల్ వైట్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్, యాష్, ఎమోషనల్ రెడ్, సూపర్ వైట్ వంటి ఆరు రంగుల్లో లభిస్తుంది.ఇదీ చదవండి: సీఎన్జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే! -
కొత్త కారు: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్
లగ్జరీ కార్ల విభాగంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మిని (MINI) భారత మార్కెట్లో మరో ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్ డస్ట్ ఎడిషన్ (MINI Cooper Convertible Stardust Edition) పేరుతో విడుదలైన ఈ ఓపెన్‌టాప్ కారు ధరను రూ.62.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత్‌కు దిగుమతి చేసే సీబీయూ మోడల్‌గా ఇది అందుబాటులో ఉంటుంది. మినీ ఇండియా వెబ్సైట్ ద్వారా ప్రత్యేకంగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించగా, డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది.ఆకట్టుకునే ఎక్స్టీరియర్స్టార్ డస్ట్ ఎడిషన్ సాధారణ కూపర్ కన్వర్టిబుల్తో పోలిస్తే మరింత ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తుంది. ఇందులో స్పార్క్లింగ్ కాపర్ గ్రే మెటాలిక్ పెయింట్‌ను ఉపయోగించారు. దీనికి కాంట్రాస్ట్‌గా సిల్వర్ మిర్రర్ క్యాప్స్, 18 అంగుళాల జేసీడబ్ల్యూ ర్యాలీ స్పోక్ అల్లాయ్ వీల్స్ అందించారు. బ్లాక్ కలర్ ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మినీ యువర్స్ సాఫ్ట్ టాప్కు ప్రత్యేకమైన వోనెన్ యూనియన్ జాక్ గ్రాఫిక్ ఉండటం ఈ ఎడిషన్‌కు మరింత బ్రిటిష్ టచ్‌ను ఇస్తుంది.కన్వర్టిబుల్ సాఫ్ట్ టాప్‌ను డ్రైవింగ్‌లోనే ఆపరేట్ చేయవచ్చు. మినీ అధికారిక వివరాల ప్రకారం, ఎలక్ట్రిక్ Z-ఫోల్టిండ్ రూఫ్‌ను గంటకు 30 కిలోమీటర్ల వేగం వరకు తెరవడం లేదా మూసివేయడం సాధ్యమవుతుంది. అలాగే 40 సెంటీమీటర్ల వరకు తెరుచుకునే సన్‌రూఫ్ మోడ్ కూడా ఉంటుంది.ప్రీమియం క్యాబిన్క్యాబిన్లో మినీ ప్రత్యేకమైన డిజిటల్ అనుభూతిని అందిస్తోంది. మినీ ఆపరేటింగ్ సిస్టమ్ 9తో పనిచేసే వృత్తాకార హై-రిజల్యూషన్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రీసైకిల్ చేసిన మెటీరియల్స్‌తో రూపొందించిన వెస్సిన్ స్పోర్ట్స్ సీట్లు, హెడ్-అప్ డిస్ప్లే, హర్మన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రీమియం అనుభూతిని పెంచుతాయి. కొత్త తరం మినీ కన్వర్టిబుల్‌లో వెస్సిన్ అప్హోల్స్టరీ, డిజిటల్ ఇంటీరియర్ వంటి అంశాలను బీఎండబ్ల్యూ గ్రూప్ కూడా ధ్రువీకరించింది.మినీ కూపర్ కన్వర్టిబుల్ నలుగురు ప్రయాణికులకు అనువుగా ఉంటుంది. రూఫ్‌ను మడిచినప్పుడు బూట్ సామర్థ్యం తగ్గినా, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే స్థలం లభిస్తుంది. మినీ అధికారిక సమాచారంలోనూ నాలుగు సీట్ల కాన్ఫిగరేషన్‌ను ధ్రువీకరించింది.204 హెచ్‌పీ పవర్.. 6.9 సెకన్లలో 100 కిమీ వేగంపనితీరు విషయంలోనూ ఈ కన్వర్టిబుల్ ఏమాత్రం తగ్గదు. ఇందులో 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల మినీ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 204 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ను 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ స్టెప్‌ట్రోనిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.ఈ కారు గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.9 సెకన్లలో అందుకుంటుంది. మినీ ఇండియా ప్రస్తుత అధికారిక స్పెసిఫికేషన్లలో ఇదే 6.9 సెకన్ల యాక్సిలరేషన్‌ను పేర్కొంటోంది. -
‘ఎస్ఎంఎల్’కు మహీంద్రా ట్రక్ల వ్యాపారం
ముంబై: ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) తమ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ట్రక్కులు, బస్సుల విభాగాన్ని (ఎంటీబీడీ) అనుబంధ సంస్థ ఎస్ఎంఎల్ మహీంద్రాకి బదలాయించనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 525 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 7న ఒప్పందాలు (బీటీఏ) కుదుర్చుకోనుండగా, వచ్చే ఏడాది జనవరి నాటికి డీల్ పూర్తి కావచ్చని వివరించింది. పటిష్టమైన బ్రాండ్స్‌తో, విలీన సంస్థ, మార్కెట్లో శక్తివంతమైన పోటీదారుగా ఎదుగుతుందని ఎస్ఎంఎల్ మహీంద్రా చైర్మన్ వినోద్ సహాయ్ చెప్పారు. భవిష్యత్ వృద్ధి అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టడం కాకుండా ప్రస్తుత వేల్యుయేషన్‌పై ఎస్ఎంఎల్ షేర్హోల్డర్లకు స్పష్టత ఉండేందుకు స్లంప్ సేల్ ప్రాతిపదికన ఈ డీల్ ఉంటుందని ఎంఅండ్ఎం సీఎఫ్‌వో అమర్‌జ్యోతి బారువా చెప్పారు. తేలికపాటి, మధ్య రకం వాణిజ్య వాహనాల రంగానికి చెందిన ఎస్ఎంఎల్ ఇసుజులో మహీంద్రా గతేడాది మెజారిటీ వాటాలను కొనుగోలు చేసి, పేరును ఎస్ఎంఎల్ మహీంద్రాగా మార్చింది. విలీన సంస్థ ఇలా.. ఎస్ఎంఎల్ మహీంద్రా, ఎంటీబీడీ విలీనతో ఏర్పడే సంస్థవిస్తృత స్థాయి ఉత్పత్తుల శ్రేణితో దేశీయంగా నాలుగో అతి పెద్ద వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజంగా ఎదగనుంది. 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి ఆదాయాలను రూ. 12,500 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల ఆదాయం కలిపి సుమారు రూ. 6,000 కోట్లుగా ఉంటుంది. ఇరు సంస్థలు చేతులు కలపడం వల్ల మార్కెట్ వాటాలో నాలుగో స్థానానికి చేరవచ్చు. ఉమ్మడి వ్యాపారానికి 200 డీలర్íÙప్లు, 650 టచ్పాయింట్లు ఉంటాయి. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో ఎస్ఎంఎల్ కొత్తగా 25 కొత్త డీలర్‌షిప్‌లు, 60 టచ్పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు సహాయ్ చెప్పా రు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఉత్పత్తుల శ్రేణి విస్తరణ, సామర్థ్యాలను పెంచుకోవడంలాంటి అంశాలపై విలీన సంస్థ దృష్టి పెడుతుంది.బుధవారం బీఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 1.51 శాతం క్షీణించి రూ. 3,223 వద్ద ముగియగా, ఎస్ఎంఎల్ మహీంద్రా 20 శాతం ఎగిసి రూ. 4,565.50 వద్ద క్లోజయ్యింది. -
E20 వివాదం.. నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ద్వారా తాను, తన కుటుంబం లాభపడుతున్నారంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు గడ్కరీకి సివిల్ కేసు దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.మెటాకు చెందిన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మీద మాత్రమే కాకుండా.. ఎక్స్, గూగుల్ వంటి సోషల్ మీడియా సంస్థలతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు, పేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ వీడియోలు, మార్పింగ్ చేసిన ఫొటోలు, ఎడిట్ చేసిన వీడియోలు ప్రచారం అవుతున్నాయి. వీటిలో ఈ20 ఇథనాల్ కార్యక్రమం వల్ల తనకు, తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నట్లు చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమని గడ్కరీ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా.. ఈ20 విధానం తన శాఖ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని తెలిపారు. ఈ విధానాన్ని రూపొందించడం, అమలు చేయడం లేదా నిర్వహించడంలో తనకు ఎలాంటి పాత్ర లేదని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు పోస్టులను తొలగించాలని, వాటిని సృష్టించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోర్టును కోరారు. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే.. బాంబే హైకోర్టు ప్రస్తుతం గడ్కరీకి కేసు దాఖలు చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టుల తొలగింపు వంటి తాత్కాలిక ఉపశమనాలపై తదుపరి దశలో విచారణ జరగనుంది. -
సీఎన్జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!
పశ్చిమ ఆసియా సంఘర్షణ తర్వాత.. ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో చాలామంది వాహన వినియోగదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దీంతో ఈ వాహనాలకు డిమాండ్ బలంగా కొనసాగుతుందని మారుతి సుజుకి ఇండియా అంచనా వేస్తోంది.మారుతి సుజుకి FY27లో సుమారు 9 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 7 లక్షలకు పైగా యూనిట్లతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరుగుదలను సూచిస్తుంది.ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి సుమారు 2.2 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించిందని, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 58 శాతం పెరుగుదలను సూచిస్తుందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బానర్జీ వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనిపిస్తోంది.పశ్చిమ ఆసియా యుద్ధం తర్వాత ఇంధన ధరలు పెరగడం కూడా డిమాండ్ పెరుగుదలకు ఒక కారణమని, దీనివల్ల కొనుగోలుదారులు తక్కువ నిర్వహణ ఖర్చులున్న వాహనాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మారుతి సుజుకి ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లైట్ వెయిట్ కమర్షియల్ వాహనాలతో సహా 15 సీఎన్జీ మోడళ్లను అందిస్తోంది. గత నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలలో సీఎన్జీ వాహనాల వాటా 42 శాతంగా ఉంది. -
గంటకు 21 మంది మృతి.. రోడ్డు భద్రతపై ఆందోళన!
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, వేలాది మంది గాయాలతో జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరోసారి గుర్తు చేస్తున్నాయి.కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025లో దేశవ్యాప్తంగా 5,13,563 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంటే.. సగటున ప్రతి గంటకు 59 ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో 1,83,382 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి గంటకు 21 మంది, రోజుకు సగటున 502 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే.. తమిళనాడులో అత్యధికంగా 71,387 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ఒక్క ఏడాదిలోనే 27,550 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీన్నిబట్టి చూస్తే.. రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది.ఇక గత కొన్నేళ్లతో పోలిస్తే.. పరిస్థితి మరింత దిగజారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023లో దేశంలో 4.8 లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవగా, 2024లో ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పుడు 2025లో ఐదు లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం '4E' (Education, Engineering, Enforcement, Emergency Care) వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, రహదారులు.. వాహనాల నాణ్యతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.అయితే.. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలంటే ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా చాలా అవసరం. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం, హెల్మెట్ లేదా సీటుబెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్యాలే చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
రివర్ ఇండీ సరికొత్త రికార్డ్.. మూడేళ్లలో..
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివర్ మొబిలిటీ, కర్ణాటకలోని హోస్కోట్లో ఉన్న తమ ఉత్పత్తి కేంద్రం నుండి 50,000వ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ 2023 ఆగస్టు 25న ఇండీ తయారీని ప్రారంభించింది, అంటే ఈ మైలురాయిని చేరుకోవడానికి మూడు సంవత్సరాల కంటే తక్కువ సమయం పట్టిందన్నమాట.ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రివర్ మొబిలిటీకి చెందిన ఏకైక ఉత్పత్తి. అయినప్పటికీ సంస్థ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 2025లో జెన్ 3 వెర్షన్ పరిచయంతో ఈ స్కూటర్ లేటెస్ట్ అప్డేట్ను పొందింది.జెన్ 3 అప్డేట్తో.. రివర్ కొత్త టైర్లు, అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, మెరుగైన స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా హిల్-హోల్డ్ అసిస్ట్‌ను కూడా జోడించారు. అయితే వినియోగదారుల అభిప్రాయం మేరకు సంస్థ స్కూటర్ రైడింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరిచినట్లు సమాచారం.ఇండీ ప్రధానమైన ఆకర్షణలలో ఒకటి దాని ప్రాక్టికాలిటీ. ఇది సీటు కింద 43 లీటర్ల స్టోరేజ్‌ను, దానికి తోడు 12-లీటర్ల గ్లోవ్ బాక్స్‌ను అందిస్తుంది. దీంతో ఇది భారతదేశంలో అమ్మకానికి ఉన్న ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తుంది.ఇండీకి 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 9 bhp పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. ఇది 163 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. కాగా ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. కంపెనీ ప్రకారం, 750W ఛార్జర్‌ను ఉపయోగించి, బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. బ్రేకింగ్ విధులను రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ నిర్వహిస్తాయి. -
మెరిడియన్ స్పెషల్ ఎడిషన్.. కేవలం 85 మాత్రమే!
జీప్ ఇండియా.. మెరిడియన్ 85వ యానివెర్సరీ ఎడిషన్‌ను రూ.36.05 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. దీనికి కంపెనీ కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.ఈ స్పెషల్ ఎడిషన్, టాప్ స్పెక్ ఓవర్‌ల్యాండ్ వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. యానివర్సరీ ఎడిషన్‌లో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ముందు డోర్లు, టెయిల్‌గేట్, వీల్ సెంటర్ క్యాప్స్‌పై 85వ వార్షికోత్సవ డీకాల్స్‌తో పాటు, గ్లాస్ బ్లాక్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఇది తెలుపు, మెటాలిక్ గ్రీన్, ఎరుపు, గ్రిజియో మాగ్నీషియో, నలుపు రంగులలో లభిస్తుంది. క్యాబిన్ మొత్తం నలుపు రంగు థీమ్‌తో ఉంటుంది. డాష్‌బోర్డ్ అంతటా మాయన్ గోల్డ్ ట్రిమ్, కాంట్రాస్ట్ డిటైలింగ్‌తో పాటు యాంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది. అయితే మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఇది 168 bhp పవర్, 350 Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో కొనసాగుతుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. -
TVS iQube vs Orbiter: ఏది బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు!
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అయితే టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్, ఆర్బిటర్ ఈవీలలో ఏదైనా కొనాలనుకుంటే.. వీటి ధరలు, రేంజ్ వంటి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ధరలుటీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.73 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆర్బిటర్ ధర రూ.91,550 నుంచి రూ.1.15 లక్షల మధ్య ఉంది. ధర మధ్య వ్యత్యాసం రూ.20 వేల నుంచి రూ.30వేలు మాత్రమే. కానీ కొంత తక్కువ ధరలో కావాలంటే ఆర్బిటార్ మంచి ఎంపిక.పెర్ఫామెన్స్ టీవీఎస్ ఐక్యూబ్ కేవలం 4.2 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 75 నుంచి 82 కి.మీ/గం వరకు ఉంటుంది, అందువల్ల ఇది హైవే, సుదూర ప్రయాణాలకు మంచి ఎంపికగా నిలుస్తుంది.టీవీఎస్ ఆర్బిటర్ రోజువారీ నగర వినియోగం కోసం ఉపయోగపడుతుంది. ఇది సుమారుగా 6.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ 68 కి.మీ/గం. నగర ట్రాఫిక్‌లో చాలా మందికి ఈ వేగం సరిపోతుంది.రేంజ్టీవీఎస్ ఐక్యూబ్ వివిధ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. కాబట్టి దీని రేంజ్ సుమారుగా 74 కి.మీ నుంచి 212 కి.మీ వరకు ఉంటుంది. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద బ్యాటరీ వేరియంట్ సుమారుగా 158 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని సమాచారం. స్టోరేజ్ విషయంలో ఆర్బిటర్ 34 లీటర్ల స్పేస్ అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ 32 లీటర్లను అందిస్తుంది.ఫీచర్స్ప్రీమియం అనుభూతిని కోరుకునే వినియోగదారులకు టీవీఎస్ ఐక్యూబ్ మంచి ఎంపిక అవుతుంది. ఇది పెద్ద డిస్ప్లే, అత్యుత్తమ ఫినిషింగ్, శక్తివంతమైన మోటార్, వేగవంతమైన యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. కుటుంబ వినియోగం, సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి ఎంపిక. అయితే ఆర్బిటర్ కొన్ని తక్కువ ఫీచర్స్ పొందుతుంది.కొంత ఎక్కువ బడ్జెట్ వెచ్చించి.. మెరుగైన పనితీరు, ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ సరైన ఎంపిక. కానీ తక్కువ ధరలో మంచి మైలేజ్, తగినంత రేంజ్, ప్రాక్టికాలిటీని కోరుకుంటే ఆర్బిటర్ ఎందుకోవడం ఉత్తమం. -
రూ.47.99 లక్షల హోండా కొత్త కారు లాంచ్!
హోండా కంపెనీ తన ZR-V e:HEVని భారతదేశంలో రూ.47.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే ఈ కారు కోసం మే నెల నుంచి ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పుడు డెలివరీలు మొదలయ్యాయి. సంస్థ దీనిని జపాన్ నుంచి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి చేస్తుంది.కంపెనీ లాంచ్ చేసిన ZR-V e:HEV మొదటి రెండు బ్యాచ్‌లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయినట్లు సమాచారం. సంస్థ ఇండియన్ మార్కెట్ కోసం రూ.160 యూనిట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. ధర ఎక్కువైనా హోండా కారుకు మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.హోండా ZR-V 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు జత చేయబడ్డాయి. ఇది 5,000-6,000 rpm వద్ద 181 Bhp పవర్, 0-2,000 rpm వద్ద 315 Nm టార్క్ అందిస్తుంది. పవర్ అనేది e-CVT ద్వారా ముందు చక్రాలకు వెళుతుంది. బ్యాటరీ రీజెనరేషన్ కోసం ఇందులో ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి.ఈ హైబ్రిడ్ మోడల్ కేవలం 8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, దీని గరిష్ట వేగం 172 కిలోమీటర్లు అని హోండా పేర్కొంది. మైలేజ్ మాత్రం లీటరుకు 22.79 కిలోమీటర్లు అని కూడా కంపెనీ తెలిపింది. ఇది ట్వైలైట్ మిస్ట్ బ్లాక్ పెర్ల్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ అనే రంగులలో లభిస్తుంది. -
సరికొత్త బ్రెజ్జా లాంచ్: రూ.7.40 లక్షలు!
మారుతి సుజుకి తన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 7.40 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ అప్డేటెడ్ వెర్షన్ కొత్త ఇంజన్ ఆప్షన్‌తో పాటు చిన్నపాటి కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లతో వస్తుంది.2026 ఎడిషన్ బ్రెజ్జాలో అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్ పాడ్లతో కూడిన కొత్త బంపర్లు, కొత్త 16 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అయితే ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్లైట్లను యథాతథంగా కొనసాగించారు.ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త బ్రెజ్జా బ్లాక్ అండ్ బేజ్ రంగుల కలయికతో పాటు గ్లాస్ బ్లాక్ ట్రిమ్‌ను పొందుతుంది. మధ్యలో పెద్ద 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దాని కింద విక్టోరిస్ నుంచి తీసుకున్న ఎయిర్ కండిషనింగ్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ కాంపాక్ట్ SUVలో యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.భద్రతా ఫీచర్లలో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ వార్నింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవి ఉన్నాయి. ఇది స్ప్లెండిడ్ సిల్వర్, సిజ్లింగ్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే, బ్లూయిష్ బ్లాక్ రంగులతో పాటు, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వివేషియస్ ఆరెంజ్, లస్ట్రస్ బీజ్ అనే రెండు కొత్త రంగులలో కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: ఒక కారు.. 15 లక్షల సేల్స్!2026 బ్రెజ్జా కొత్త 1.0-లీటర్, డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 108 Bhp పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. CNG వెర్షన్ కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. -
ఒక కారు.. 15 లక్షల సేల్స్!
భారతదేశంలో హ్యుందాయ్ ఐ20 అమ్మకాలు కొత్త మైలురాయిని అధిగమించాయి. 2008లో ప్రారంభమైన ఈ కారు ఇప్పటి వరకు 15 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. దీన్నిబట్టి చూస్తే దీనికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం మార్కెట్లో మూడవ తరం ఐ20 అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది స్టాండర్డ్ మోడల్‌తో పాటు, బ్లాక్-థీమ్ స్టైలింగ్‌తో నైట్ ఎడిషన్, స్పోర్టీ ఎన్ లైన్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది.ఐ20 లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డాష్‌క్యామ్, 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో సహా అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.ఐ20 కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాగా ఐ20 ఎన్ లైన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది. కాబట్టి ఇవి మంచి పనితీరును అందిస్తాయి. -
ట్రాక్టర్ విక్రయాలకు స్పీడ్ బ్రేకర్స్..!
ముంబై: దేశీయ ట్రాక్టర్ల పరిశ్రమ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో మందగింవచ్చని రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ భావిస్తోంది. అధిక బేస్ ఎఫెక్ట్, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకావచ్చన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ ఎఫ్వై 27లో ట్రాక్టర్ల విక్రయాల వృద్ధి 1–4 శాతానికి పరిమితం కావచ్చని తెలిపింది. కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై26) ట్రాక్టర్ పరిశ్రమ వార్షికంగా ఏకంగా 23.5 శాతం అద్భుత వృద్ధిని నమోదు చేసింది.రుతుపవనాలు కీలకం భారత వాతావరణ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ నెలాఖరు వరకు అందిన గణాంకాల ప్రకారం దక్షిణ, మధ్య, తీరప్రాంత భారతదేశంలో వర్షపాతం లోటు కనిపిస్తోంది. వర్షాభావ లేమి పరిస్థితులు సుదీర్ఘంగా కొనసాగితే అది ఖరీఫ్ సాగు, పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇక్రా స్పష్టం చేసింది. దీనివల్ల రైతు ఆదాయాలు తగ్గి, కొత్త ట్రాక్టర్ల కొనుగోళ్లు లేదా రీప్లేస్మెంట్ (పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకోవడం) డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది.జూన్ అమ్మకాలు మాత్రం జోరుగానే జూన్‌లో ట్రాక్టర్ల హోల్‌సేల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 11.9 శాతం, రిటైల్ విక్రయాలు 25.3 శాతం పెరిగినట్లు ఇక్రా వెల్లడించింది. గత ఏడాది తక్కువ బేస్ ఎఫెక్ట్, రైతుల నగదు ప్రవాహం మెరుగుపడటం, గత సెపె్టంబర్లో జీఎస్టీ తగ్గింపు వల్ల ట్రాక్టర్ల కొనుగోలు మరింత అందుబాటులోకి రావడం ఇందుకు కారణాలని పేర్కొంది. అయితే గతేడాది అధిక వృద్ధి కారణంగా ఏర్పడిన అధిక బేస్, ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం, బలహీన రుతుపవనాల అంచనాల నేపథ్యంలో మిగిలిన ఆర్థిక సంవత్సరంలో విక్రయాల వృద్ధి మందగించవచ్చని ఇక్రా అభిప్రాయపడింది.తయారీ కంపెనీలకు ఊరట ట్రాక్టర్ తయారీ సంస్థల (ఓఈఎంలు) నిర్వహణ మార్జిన్లు స్థిరంగా కొనసాగే అవకాశముందని తెలిపింది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల (ఆపరేటింగ్ లెవరేజ్), ముడిసరుకుల స్థిరమైన ధరలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. లాభదాయకత, తక్కువ రుణభారం, తగినంత ద్రవ్య లభ్యత కారణంగా తయారీ సంస్థల క్రెడిట్ ప్రొఫైల్ కూడా బలంగానే కొనసాగే అవకాశముందని ఇక్రా అంచనా వేసింది. -
ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ ఉండదు
ప్రభుత్వ రంగ ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ బంకులు.. ప్రీమియం పెట్రోల్‌ని ఇథనాల్ కలపకుండానే విక్రయించడాన్ని కొనసాగిస్తాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు. మొత్తం పెట్రోల్ విక్రయాల్లో ప్రీమియం వాటా 0.5 శాతమే ఉందని ఆయన చెప్పారు. అలాగే పెట్రోల్‌లో ఇథనాల్‌ని 20 శాతానికి మించి కలపడంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని వివరించారు.ఈ0, ఈ10 పెట్రోల్‌ని తిరిగి ప్రవేశపెట్టే యోచనేదీ లేదని తెలిపారు. ఇథనాల్ కలపని పెట్రోల్‌ని ఈ0గా, 10 శాతం కలిపితే ఈ10గా, 20 శాతం కలిపితే ఈ20గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బంకుల్లోను ఈ20 పెట్రోల్‌ని విక్రయించాలని ఆదేశాలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటివరకు దీని ప్రతికూల ప్రభావాలపై రూఢీగా ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఆయన తెలిపారు. పరిశోధనల్లో, ఫీల్డ్ ట్రయల్స్‌లో కూడా ఇంజిన్ మన్నిక, పనితీరు, వాహన జీవితకాలంపై ఈ20 వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందంటూ నిర్ధారణేమీ కాలేదని వివరించారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
526 కిమీ రేంజ్ అందించే కొత్త కారు లాంచ్!
కియా కంపెనీ భారతదేశంలో సైరోస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది . ఇది 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.49 లక్షలు, రూ. 16.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. అయితే దీనిని బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో రూ.7.99 లక్షల ప్రారంభ ధరలో కొనుగోలు చేయవచ్చు.సైరోస్ ఈవీ, కే1 ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో ప్రత్యేకమైన కియా డిజిటల్ టైగర్ ఫేస్, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, టెయిల్లైట్లతో కూడిన ఐస్ క్యూబ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ కారు 17-అంగుళాల డ్యూయల్-టోన్ ఏరో అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. సైరోస్ ఈవీ 30-అంగుళాల పనోరమిక్ డిస్ప్లేతో వస్తుంది, ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ ఇంటర్ఫేస్ ఉంటాయి. ఈ ఈవీ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 4వే పవర్ డ్రైవర్ సీట్, స్లైడింగ్, రిక్లైనింగ్ వెనుక సీటు, డాష్‌క్యామ్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లను అందిస్తుంది.సైరోస్ ఈవీలోని 42 kWh, 51.4 kWh బ్యాటరీలు.. వరుసగా 443 కి.మీ, 526 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి. కాగా కంపెనీ 15 సంవత్సరాలు / అపరిమిత కిలోమీటర్ల జీవితకాల బ్యాటరీ వారంటీ అందిస్తుంది. ఇదే సమయంలో కియా 3 సంవత్సరాల తర్వాత 80% వరకు రీసేల్ విలువను అందించే అష్యూర్డ్ బైబ్యాక్ పథకాన్ని కూడా ప్రకటించింది. -
కొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో ఏఎంజీ ఈ 53 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను లాంచ్ చేసింది. ఇది పెర్ఫార్మెన్స్, రేసింగ్ అనే రెండు ఎడిషన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.45 కోట్లు, రూ. 1.48 కోట్లు (ఎక్స్-షోరూమ్).కొత్త AMG E 53 హైబ్రిడ్ కారు అప్డేటెడ్ ఈ-క్లాస్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో ప్రత్యేకమైన బంపర్లు, ప్రకాశవంతమైన గ్రిల్, వెడల్పాటి ఫెండర్లు, డిఫ్యూజర్, లిప్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఈ కారులో అడాప్టివ్ సస్పెన్షన్, రియర్ యాక్సిల్ స్టీరింగ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, పెద్ద బ్రేకులు, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ కూడా ఉన్నాయి.లోపలి భాగంలో.. ఈ53 కి 3 స్పోక్ స్టీరింగ్ వీల్‌తో కూడిన మెర్సిడెస్ MBUX సూపర్‌స్క్రీన్, ఏఎంజీ స్పోర్ట్స్ సీట్లు, డాల్బీ అట్మోస్‌తో కూడిన 17 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ లభిస్తాయి. ఈ కారు పోలార్ వైట్, వెర్డే సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్, నాటికల్ బ్లూ, వెల్వెట్ బ్రౌన్, గ్రాఫైట్ గ్రే మెటాలిక్ అనే మలుపులు కలర్ ఎంపికలలో లభిస్తుంది.కొత్త మెర్సిడెస్-AMG E 53 హైబ్రిడ్ 4Matic+ 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ 6-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ లభిస్తుంది. కాబట్టి ఇది 577 Bhp పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇందులో బ్యాటరీ 100 కిమీ దూరం ప్రయాణించగలదని సమాచారం. -
రూ.11 వేలతో బుకింగ్.. సిద్ధమైన కొత్త బ్రెజ్జా!
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి బ్రెజ్జా.. ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ అప్డేటెడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని డీలర్‌షిప్‌లకు పంపించడం కూడా స్టార్ట్ చేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారు డెలివరీలు లాంచ్ తరువాత చాలా వేగంగా జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.ఇప్పటికే లీక్ అయిన చిత్రాల ప్రకారం.. మారుతి బ్రెజ్జా అప్డేటెడ్ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ, కొన్ని కొత్త మార్పులు చూడవచ్చు. కొత్త గ్రిల్, బంపర్‌ను చూడవచ్చు. అంతే కాకుండా.. హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. కొత్త అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. అయితే.. వెనుక భాగంలో బంపర్, టెయిల్-ల్యాంప్ అంతర్గత భాగాలలో కూడా స్వల్ప మార్పులు ఉండవచ్చు. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లలో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ లాంచ్ తరువాత అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.లోపలి భాగంలో.. బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో మరిన్ని గుర్తించదగిన మార్పులు చోటు చేసుకున్నాయి. సెంటర్ కన్సోల్ లేఅవుట్‌ను అప్డేట్ చేయడంతో.. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, సన్‌గ్లాస్ హోల్డర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టోరేజ్‌తో కూడిన కొత్తగా డిజైన్ చేసిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన రీచ్ అండ్ రేక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి పరికరాలు ఉంటాయని అంచనా.అలెక్సా ఇంటిగ్రేషన్‌తో కూడిన పెద్ద 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అత్యంత ముఖ్యమైన అప్గ్రేడ్లలో ఒకటిగా ఉండబోతోంది. సీట్ వెంటిలేషన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.కొత్త బ్రెజ్జా మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రానుంది. వీటిలో 103 hp పవర్, 139 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ K15C పెట్రోల్ ఇంజన్, 110 hp పవర, 170 Nm టార్క్ అందించే 1.0 లీటర్ టర్బో పెట్రోల్, ఒక CNG వేరియంట్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్‌ను 6 స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటితోనూ అందించే అవకాశం ఉంది. CNG వెర్షన్ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను మాత్రమే ఉపయోగిస్తుంది. -
హైవే లోకల్ పాస్‌లు.. ఇక పూర్తిగా ఆన్లైన్లో!
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మరో కీలక డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్‌మార్గ్‌యాత్ర (RajmargYatra) మొబైల్ యాప్‌లో ‘డిజిటల్ లోకల్ పాస్’ సర్వీసును ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన ప్రయాణికులు ఇకపై టోల్ ప్లాజాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే నెలవారీ లోకల్ టోల్ పాస్‌ను పొందవచ్చు.ప్రస్తుతం ఈ సర్వీస్‌ను ఢిల్లీ అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-IIలోని ముండ్కా–బక్కర్వాలా టోల్ ప్లాజా వద్ద ప్రారంభించగా, రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా అర్హత కలిగిన ఇతర టోల్ ప్లాజాలకు దశలవారీగా విస్తరించనున్నట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.ఎవరు అర్హులు?టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఈ లోకల్ పాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి పాస్ మంజూరైతే, సంబంధిత టోల్ ప్లాజా ద్వారా ఒక నెల పాటు అపరిమిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఇందుకోసం టోల్ ప్లాజాకు వెళ్లి పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు మొత్తం ప్రక్రియ మొబైల్ యాప్‌లోనే కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.దరఖాస్తు ఎలా పరిశీలిస్తారు?వినియోగదారు సమ్మతి ఇచ్చిన తర్వాత రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానమై ధృవీకరణ చేపడుతుంది. డిజిలాకర్ ద్వారా చిరునామా వివరాలు, వాహన్ డేటాబేస్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్, అనుసంధానమైన ఫాస్ట్యాగ్ సమాచారం, అలాగే జీఐఎస్ ఆధారిత లొకేషన్ వెరిఫికేషన్ ద్వారా దరఖాస్తుదారు నిజంగా అర్హత ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారో లేదో నిర్ధారిస్తుంది. దీంతో కాగితపు పత్రాల అవసరం తగ్గడంతో పాటు ఆమోద ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది.‘మార్గ్‌మిత్ర’ హెల్ప్ సెంటర్ కూడా ప్రారంభంలోకల్ పాస్‌తో పాటు ‘మార్గ్‌మిత్ర’ (MargMitra) హెల్ప్ సెంటర్‌ను కూడా ఎన్హెచ్ఏఐ యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది 22 భారతీయ భాషల్లో టెక్స్ట్ లేదా వాయిస్ ద్వారా సహాయం అందించే డిజిటల్ సపోర్ట్ ప్లాట్‌ఫామ్. ఫాస్ట్యాగ్ రీఛార్జ్, కేవైసీ, రీఫండ్ స్థితి, లోకల్/వార్షిక పాస్‌లు, బ్లాక్‌లిస్ట్ స్టేటస్, ఈ-నోటీసులు, అప్పీలు, అలాగే జాతీయ రహదారులపై నిలిచిపోయిన వాహనాలు లేదా ఇతర భద్రతా సమస్యలను నివేదించే సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. -
పెట్రోల్‌లో ఇథనాల్ పెంపు?.. కేంద్రం క్లారిటీ!
ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం విషయంలో గత కొంతకాలంగా పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్ పనితీరు దెబ్బతింటుందా? అనే అనుమానాలు చాలా మంది వాహనదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలను స్పష్టం చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం కంటే ఎక్కువ పెంచే ఆలోచనపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెంచాలంటే తొందరపడి నిర్ణయం తీసుకోబోమని, ముందుగా శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ తెలిపారు. అంతే కాకుండా.. ఆటోమొబైల్ కంపెనీలు, చమురు సంస్థలు, పరిశోధనా సంస్థలతో చర్చించిన తర్వాతే భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.ఇకపోతే.. అసలు ఇథనాల్‌ను పెట్రోల్‌లో ఎందుకు కలుపుతున్నారు అనే విషయానికి వస్తే, దీనికి ప్రధాన కారణం కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల.. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది కాబట్టి.భారత్ ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని చేరుకుంది. 2013-14లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం క్రమంగా పెరుగుతూ 2025-26 నాటికి 20 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో పెరుగుతుందా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు! -
ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ధరలను మరోమారు పెంచడానికి సిద్ధమైంది. 2026 ఆగస్టు నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మారుతి సుజుకి దాని లైనప్‌లోని అన్ని మోడళ్ల ధరలను రూ. 30,000 వరకు పెంచనుంది. అయితే ఏ మోడల్ ధరను ఎంత వరకు పెంచనుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా కంపెనీ మూడు నెలలు ముందు కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు పెంచడం వల్ల అమ్మకాలు పెరుగుతాయా?, తగ్గుతాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమర్పించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో.. పెరిగిన ద్రవ్యోల్బణ భారాలు, ప్రతికూల వ్యయ వాతావరణం కారణంగా ధరలను సవరించాల్సి వచ్చిందని మారుతి సుజుకి పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే ఆగస్టు నుంచి కొత్త కారు కొనాలంటే.. ఇంకొంత ఖర్చు చేయక తప్పదని స్పష్టమవుతోంది. -
సీఎన్జీ.. సూపర్ క్రేజ్!
దేశీ కార్ల మార్కెట్లో ఇంధన ప్రాధాన్యతల ట్రెండ్ మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల సెగకు తోడు కాలుష్య నిబంధనల్లో నెలకొన్న అనిశ్చితితో కారు ప్రియులు ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే కార్లకు సై అంటున్నారు. అధిక మైలేజీ.. తక్కువ మెయింటెనెన్స్.. పెట్రోల్ ఆప్షన్ కూడా ఉండటంతో సీఎన్జీ కార్లు మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. గతంలో అరకొరగా ఉన్న బంకులు ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తుండటం కూడా దీనికి మరో ప్రధాన కారణం. మొత్తంమీద డీజిల్‌ను ఓవర్టేక్ చేసి సీఎన్జీ కార్లు అమ్మకాల్లో టాప్–2 ప్లేస్‌లో దూసుకెళ్తున్నాయి.మన రోడ్లపై ఇప్పటికీ పెట్రోల్ కార్లదే హవా. అయితే, గత రెండు మూడేళ్లుగా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మరింత ఫోకస్ చేస్తున్నారు. దీంతో కార్ల విక్రయాల్లో సీఎన్జీ వరుసగా రెండో ఏడాది కూడా దేశంలో రెండో అత్యంత ప్రాధాన్య ఇంధనంగా నిలిచింది. 2025–26లో అమ్ముడైన మొత్తం కార్లలో సీఎన్జీ వాటా దాదాపు 22 శాతానికి ఎగబాకింది. అంటే 10 లక్షలకు పైగా సీఎన్జీ కార్లు రోడ్డెక్కాయన్నమాట! 2024–25లో సీఎన్జీ కార్ల వాటా 19.6 శాతంగా ఉంది. మూడేళ్ల క్రితం 12–13 శాతం వాటా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రెట్టింపైంది. మరోపక్క, గతేడాదే డీజిల్ కార్లను దాటేసిన సీఎన్జీ కార్ల జోరు అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. 2025–26లో డీజిల్ కార్ల వాటా 18.23 శాతం నుంచి 2026–27లో 18.08 శాతానికి తగ్గింది. పెట్రోల్ కార్లదీ ఇదే బాట. తొలిసారిగా 2025–26లో వాటి వాటా 50 శాతం దిగువకు పడిపోవడం గమనార్హం. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), హైబ్రిడ్ కార్ల విక్రయాలు కూడా రయ్ అంటున్నాయి. గతేడాది ఈవీల వాటా 2.61% నుంచి 4.25 శాతానికి ఎగబాకడం దీనికి నిదర్శనం. జూన్‌లోనూ జూమ్... ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు ఈ ఏడాది జూన్‌లో కూడా దుమ్మురేపాయి. రిటైల్ సేల్స్‌లో తొలిసారి వీటి వాటా 40 శాతాన్ని అధిగమించింది. 2025 జూన్‌లో ఇది 33.3 శాతమే. అలాగే ఈ ఏడాది మేలో 38 శాతంగా ఉంది. మరోపక్క, పెట్రోల్, డీజిల్ కార్ల వాటా 60 శాతం దిగువకు పడిపోయింది. ఇక సీఎన్జీ కార్లు తగ్గేదేలే అంటూ టాప్‌గేర్‌లో అమ్ముడయ్యాయి. జూన్ అమ్మకాల్లో సీఎన్జీ వాటా 24.3 శాతానికి ఎగసింది. హైబ్రిడ్ 8.3%, ఈవీలు 7.8% వాటా (31,823 కార్లతో ఆల్‌టైమ్ గరిష్టం) దక్కించుకున్నాయి.ఎందుకీ డిమాండ్..→ కారు కొనుగోలుదారులు సీఎన్జీకి జై కొట్టడానికి అధిక మైలేజీ, తక్కువ నిర్వహణ వ్యయమే ప్రధాన కారణం. పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్జీ కార్లకు ఒక్కో కిలోమీటర్ జర్నీకి అయ్యే ఖర్చు 40–50 శాతం తక్కువ. → నేరుగా కంపెనీలు విడుదల చేస్తున్న సీఎస్జీ వేరియంట్ల రేటు పెట్రోల్ కంటే రూ.80,000–1,00,000 ఎక్కువగా ఉంటోంది. అంటే, ఏటా సుమారు 15,000–20,000 కిలోమీటర్లు తిరిగేవారికి ఈ అదనపు వ్యయం 18 నెలల్లోనే రికవరీ అయిపోతుంది. అవసరమైతే పెట్రోలు ఆప్షన్ ఉండనే ఉంటుంది. ఈ వెసులుబాటు, ఇంధన ఆదానే ఇప్పుడు మాస్ మార్కెట్లో సీఎస్జీ కార్లకు కిర్రాక్ క్రేజ్ తెచ్చిపెడుతోంది. → సీఎన్జీ బంకులు శరవేగంగా విస్తరిస్తుండం కూడా ఈ కార్ల వైపు కస్టమర్లు మరింతగా మొగ్గుచూపుతున్నారు. ఏడాది క్రితం సిటీ గ్యాస్ డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ 300 నగరాలు, పట్టణాల్లో ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 600కు చేరింది. → ఇదంతా ఒకెత్తయితే.. పశ్చిమాసియా సంక్షోభం దెబ్బతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం కూడా ఎక్కువ మంది సీఎన్జీని నమ్ముకుంటున్నారు. ఆటోమొబైల్ డీలర్ల సంఘాల ఫెడరేషన్ (ఫాడా) సర్వే ప్రకారం ఇంధన ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో సీఎన్జీ, ఈవీలే బెటర్ అని 56.9% మంది కస్టమర్లు భావిస్తున్నారట! → కాలుష్య నిబంధనలను కఠినతరం చేస్తుండటం వల్ల కూడా డీజిల్ కార్ల నుంచి సీఎన్జీ, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లేలా చేస్తోంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో డీజిల్ వాహనాల కాలపరిమితిని పదేళ్లకు తగ్గించడం, మరిన్ని నగరాలూ ఇదే బాటలో నడుస్తాయన్న ఆందోళనలు, పాలసీ అనిశ్చితి డీజిల్ కార్ల డిమాండ్‌కు కోత పెడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ వల్ల కాలుష్యం చాలా తక్కువ. → గతంలో ఎంట్రీ స్థాయి మోడళ్లలోనే అందుబాటులో ఉన్న సీఎన్జీ వేరియంట్లను ఆటోమొబైల్ దిగ్గజాలు ఇప్పుడు అన్ని మోడళ్లకూ విస్తరించాయి. మారుతీ సుజుకీ దాదాపు తన మొత్తం కార్ల రేంజ్లో ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్జీ ఆప్షన్లను అందిస్తోంది. ఇక టాటా మోటార్స్ సైతం జోరు పెంచింది. నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్తో పాటు టాప్ ఎండ్ మోడళ్లలో సైతం సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. జూన్‌లో 2–3 శాతం మేర ధరలు పెరిగినా, సీఎన్జీ కార్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదన్నది డీలర్ల మాట.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
గౌరవ్ గుప్తా డిజైన్‌తో.. స్పెషల్ కార్లు!
ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా సహకారంతో రూపొందించిన సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్, ఎమ్9 లగ్జరీ ఎంపీవీ 'కౌచర్ ఎడిషన్ల'ను ఎంజీ మోటార్ కంపెనీ ఆవిష్కరించింది. ఇవి మార్కెట్లో పరిమిత సంఖ్యలో (50 యూనిట్లు) మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి సంస్థ వీటికోసం ప్రీ-రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభించింది. ధరలు ఆగస్టు 3న వెల్లడించనున్నారు.ఈ స్పెషల్ ఎడిషన్స్ స్టాండర్డ్ సైబర్‌స్టర్, ఎమ్9 ఆధారంగా రూపొందించారు. కానీ కాస్మొటిక్ డిజైన్ మాత్రమే గౌరవ్ గుప్తా చేసారు. ఈ థీమ్‌ను రెండు వాహనాలలోనూ ఎంబ్రాయిడరీ, టోనల్ ఫినిషింగ్‌లు చూడవచ్చు.డిజైన్ పరంగా మార్పులు కనిపించినప్పటికీ.. ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కాబట్టి సైబర్‌స్టర్ డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సెటప్‌ను అలాగే నిలుపుకుంటుంది. తద్వారా 528 bhp పవర్, 725 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. 77 kWh బ్యాటరీ ప్యాక్‌తో నడిచే ఈ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ 580 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని. ఇక ఎంజీ ఎమ్9 విషయానికి వస్తే.. ఇందులో కూడా ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కాబట్టి అదే 90 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 548 కిమీ రేంజ్ అందిస్తుంది. పనితీరులో కూడా ఎలాంటి మార్పు లేదు. -
కియా కొత్త కారు.. రూ.526 కిమీ రేంజ్!
కియా ఇండియా భారత మార్కెట్ కోసం సైరోస్ ఈవీ(Syros EV)ని ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం రూ.25,000 టోకెన్ మొత్తంతో ప్రీబుకింగ్‌లను ప్రారంభించింది. డెలివరీలు ప్రారంభమయ్యే సమయానికి ధరలను ప్రకటించనున్నారు. సైరోస్ ఈవీ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.సైరోస్ ఈవీ ప్రత్యేకత ఏమిటంటే దాని రేంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులోని 51.4 కిలోవాట్ బ్యాటరీ 526 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. 42kWh బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. ఇది 8.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.సైరోస్ ఈవీ.. సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ స్టైల్ పొందుతుంది. డిజిటల్ టైగర్ ఫేస్, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ లైటింగ్ సిగ్నేచర్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లోపల 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి.వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, హర్మాన్ కార్డాన్ 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 16-లీటర్ల ఫ్రంట్ ట్రంక్, 100 వాట్స్ USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి.సేఫ్టీ విషయానికి వస్తే.. సైరోస్ ఈవీ కారు లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో వస్తుంది. వీటిలో ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో కూడిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఉన్నాయి.వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, పార్కింగ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి. ఇది ఏడు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: హైడ్రోజన్ రైలుపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రైల్వే! -
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నటుడు నరేష్ ఆందోళన
దేశంలో పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ఈ ఇంధనం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు వస్తుండగా తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాను దేశద్రోహిని కాదని స్పష్టం చేస్తూనే.. ఈ ఇథనాల్ పెట్రోల్ విధానం సామాన్య బైక్ వినియోగదారుల నుంచి లగ్జరీ కార్ల యజమానుల వరకు అందరికీ ఇబ్బందిగా మారిందని ఆయన విమర్శించారు.లక్షల రూపాయల నష్టం..తన స్నేహితుడు (బీజేపీ సానుభూతిపరుడు) ఇటీవల కొనుగోలు చేసిన టయోటా క్యామ్రీ కారులో ఇథనాల్ పెట్రోల్ ద్వారా ఇంజిన్ వాల్వ్‌లు దెబ్బతిన్నాయని, వాటిని మార్చడానికి రూ.3.5 లక్షలు ఖర్చయిందని నరేష్ పేర్కొన్నారు. ‘ఇదే పరిస్థితి నా కొత్త పోర్షే పనమెరా కారుకు వస్తే దాదాపు రూ.12 లక్షల వరకు నష్టం వస్తుంది. అందుకే నేను తప్పనిసరి పరిస్థితుల్లో లీటరు రూ.165 ధర పలికే ‘హై ఆక్టేన్ 100’ పెట్రోల్ వాడుతున్నాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు లగ్జరీ ఇంధనాలు వాడగలరని, కానీ నిత్యం బతుకుదెరువు కోసం చూసే సామాన్య బైక్ వినియోగదారుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.I am not anti national but this ethanol Petrol is giving heart attacks from bike users to high-end car users . My friend( a sympathiser of BJP) who bought Toyota Camry recently had to change valves of the engine. Which cost him 3.5 lks . If the same happens to my new Porsche… pic.twitter.com/4ciFCJxRv4— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) July 19, 2026‘ఒక మాజీ బీజేపీ నాయకుడిగా నాకు తెలుసు.. పార్టీకి బలమైన థింక్ ట్యాంక్, ప్లాన్ A, B, C లు ఉంటాయి. కానీ కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి పర్యావరణాన్ని రక్షించాలనే ఈ నిర్ణయం చాలా హడావుడిగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఇది బీజేపీకి ఒక రెడ్ సిగ్నల్ లాంటిది’ అని నరేష్ విజయకృష్ణ తెలిపారు. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు ఇథనాల్‌ను దశలవారీగా ప్రవేశపెట్టి విజయం సాధించాయని, భారతదేశంలో ఇంత హడావుడి ఎందుకని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
సరికొత్త హయబుసా.. ఇప్పుడు కొత్త రంగులో..
సుజుకి తన ఫ్లాగ్షిప్ స్పోర్ట్ టూరర్ అయిన 2027 హయబుసాను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు కొత్త రంగులలో అందుబాటులో ఉంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.2027 సుజుకి హయబుసా కొత్త పెయింట్ స్కీమ్(గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ రిఫ్లెక్టివ్ బ్లూ)లు మినహా, ఎలాంటి యాంత్రిక మార్పులకు లోనుకాలేదు. కాబట్టి మునుపటిలాగే అదే ఇంజిన్, ఛాసిస్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని కొనసాగిస్తోంది. పెర్ల్ బ్రిలియంట్ వైట్ అండ్ మెటాలిక్ ఊర్ట్ గ్రే రంగులలో, కాంట్రాస్టింగ్ రెడ్ హైలైట్స్‌తో కూడిన ఒక స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది.హయబుసాలోని అదే 1,340 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్ లైన్ ఫోర్ ఇంజన్.. 190 bhp పవర్, 150 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ జతచేయబడి ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్‌లో సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (SIRS) కూడా ఉంది, ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, మల్టిపుల్ రైడర్ అసిస్టెంట్స్ కూడా ఉన్నాయి.భారతదేశంలో సుజుకి హయబుసా ధర రూ.18.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కాగా ఇప్పుడు కంపెనీ తీసుకొచ్చిన కొత్త కలర్ హయబుసా ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెడుతుందా?, లేదా? అనేది తెలియాల్సి ఉంది. బహుశా భవిష్యత్తులో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
పిల్లల కోసం టెస్లా బైక్.. రూ.20 వేలు మాత్రమే!
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టెస్లా (Tesla) ఇప్పుడు పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన బ్యాలెన్స్ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.నిజానికి టెస్లా కంపెనీ.. పెద్దవాళ్లకు ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేస్తుందని చాలామంది ఎదురుచూశారు. కానీ సంస్థ మాత్రం చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఈవీ సైకిల్ విడుదల చేసింది. ఈ బ్యాలెన్స్ బైక్‌ను 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించారు.టెస్లా బ్యాలెన్స్ బైక్‌లో పెడల్స్, చైన్ లేదా ఎలక్ట్రిక్ మోటార్ వంటివి ఉండవు. కేవలం పిల్లలు తమ కాళ్లతో బైక్‌ను ముందుకు కదిలిస్తూ బ్యాలెన్స్, హ్యాండిల్ తిప్పడం నేర్చుకునేలా తయారు చేశారు. ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇందులో మెగ్నీషియం అల్లాయ్ ఫ్రేమ్ ఉపయోగించడం వల్ల పిల్లలు సులభంగా నడపగలరు. బైక్‌పై టెస్లా లోగో, ముందు భాగంలో కంపెనీ గుర్తు కూడా ఉన్నాయి.ఈ బైక్ ధర 225 డాలర్లు (సుమారు రూ.20 వేలు). సాధారణ పిల్లల బ్యాలెన్స్ బైక్‌లతో పోలిస్తే దీని ధర కొంత ఎక్కువే. అయితే ప్రీమియం బ్రాండ్ల బైక్‌లతో పోలిస్తే.. టెస్లా ధర కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ సీటు ఎత్తును పిల్లల పెరుగుదలకు అనుగుణంగా ఐదు రకాలుగా మార్చుకునే సౌకర్యం ఉంది. గరిష్టంగా 35 కిలోల బరువు ఉన్న పిల్లలు దీనిని ఉపయోగించవచ్చు. బైక్‌ను అసెంబుల్ చేసుకోవడానికి అవసరమైన టూల్స్ కూడా ప్యాకేజీలో అందిస్తారు.Balance Bike for Kids now available on Tesla Shop– Lightweight magnesium frame & adjustable seat– Five height levels– Suitable for children 2-5 years oldhttps://t.co/IIPjY1Ad9N pic.twitter.com/nr375ZRchr— Tesla North America (@tesla_na) July 16, 2026 -
లెక్సస్ కొత్త కారు.. ధర ఎంతంటే?
ఈఎస్350హెచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ విడుదలతో లెక్సస్ ఈఎస్ రేంజ్ మరింత విస్తరించింది. ఈ లేటెస్ట్ కారు ఎక్స్‌క్విజిట్, లగ్జరీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 66.10 లక్షలు, రూ. 71.80 లక్షలు (ఎక్స్ షోరూమ్).లెక్సస్ ఈఎస్350హెచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే పరిమాణంలో పెద్దది. పొడవైన వీల్‌బేస్, పెరిగిన వెడల్పు అన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎల్ ఆకారపు లైటింగ్ ఎలిమెంట్స్, సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ డోర్ లాచ్ వంటివన్నీ ఆకట్టుకుంటాయి. ఇది వైట్ నోవా, సోనిక్ టైటానియం, సోనిక్ క్రోమ్, గ్రాఫైట్ బ్లాక్, సోనిక్ కాపర్ రంగులలో అందుబాటులో ఉంటుంది.కొత్త ES350h లోపలి భాగంలో 14.0-అంగుళాల హై-డెఫినిషన్ టచ్స్క్రీన్లో సరికొత్త లెక్సస్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంతే కాకుండా మరింత సౌకర్యం, వినియోగించడానికి సులభంగా ఉండటం కోసం ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇంజిన్ స్టార్ట్, డోర్ లాక్‌లు, విండో క్లోజర్, స్లైడ్ రూఫ్ వంటి ముఖ్యమైన ఫంక్షన్లను రిమోట్‌గా నిర్వహించగల సమగ్రమైన కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి.ఈఎస్350హెచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ 2.5-లీటర్ ఇన్లైన్ 4-సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. పీసీయూతో కూడిన కొత్త ఈ యాక్సిల్, లిథియం అయాన్ బ్యాటరీ కూడా లభిస్తుంది. కాగా కంపెనీ 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA), హైబ్రిడ్ బ్యాటరీపై 8 సంవత్సరాలు/200,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తుంది. -
ఇకపై అలాగైతేనే డ్రైవింగ్ లైసెన్స్..
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను రవాణా శాఖ కఠినతరం చేసింది. రోడ్డు భద్రతా నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న అభ్యర్థి ఇక నుంచి తప్పనిసరిగా ఆన్లైన్లో రోడ్డు భద్రతపై మూడు గంటల పాటు వీడియో పాఠాలను చూసి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. వీడియో పాఠాలకు హాజరైన వారిని మాత్రమే డ్రైవింగ్ లైసెన్సుల కోసం నిర్వహించే ట్రాక్ టెస్టులకు అనుమతిస్తారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా కూకట్పల్లి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ఫలితాలను అనుసరించి నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు. ముఖ కవళికల నమోదు ఉంటేనే.. సాధారణంగా లెరి్నంగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇందుకోసం నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, తదితర డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే లైసెన్స్ లభిస్తుంది. ఇక నుంచి ఈ రెండు పరీక్షలతో పాటు 3 గంటల వీడియో పాఠాలను చూసి రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకొని డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. రవాణాశాఖ ఆధ్వర్యంలోని టీజీ ఆన్లైన్లో ఈ పాఠాలకు సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఈ పాఠాలను వీక్షించే సమయంలో అభ్యర్థుల ముఖకవళికల నమోదు (ఫేస్ రికగ్నిషన్) తప్పనిసరి. అలాగే స్కూల్ జోన్లలో వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హారన్ మోగించాలి. ఆసుపత్రులు ఉన్న చోట హారన్ మోగించొద్దు. డిఫెన్సివ్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి. రోజుకు 2,500 డ్రైవింగ్ టెస్టులు... ప్రస్తుతం నగరంలోని అన్ని టెస్ట్ ట్రాక్‌లలో నిత్యం 2,500 మందికిపైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కాగా.. కొన్ని చోట్ల ఎలాంటి పరీక్షలు లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ తాజాగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రతా పాఠాలు సత్ఫలితాలిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. -
ఫెరారీ కొత్త కారు.. ధర ఎంతంటే?
ఫెరారీ భారతదేశంలో అమల్ఫీ స్పైడర్‌ను రూ.4.6 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఇది ఫెరారీ ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. సాఫ్ట్ టాప్‌తో వచ్చే ఈ కారు కూపేను పోలి ఉంటుంది.క్లాసీ స్టైలింగ్ పొందిన ఈ కారు.. ఆకట్టుకునే హుడ్, వెడల్పుగా ఉండే ఫెండర్లను కలిగి ఉంది. దీనికి బ్లాక్ స్ట్రిప్‌తో అనుసంధానమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, నాలుగు ఎల్ఈడీ టెయిల్లైట్లు, నాలుగు ఎగ్జాస్ట్ టిప్‌లు ఉన్నాయి. లోపల 15.6 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ వైపు మూడవ స్క్రీన్‌తో కూడిన డ్యూయల్-కాక్‌పిట్ లేఅవుట్ ఉంది. ఇది స్పోర్టీ 3-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది, దీనిని హాప్టిక్ టచ్ బటన్లకు బదులుగా ఫిజికల్ కంట్రోల్స్‌తో అప్డేట్ చేశారు.బోనెట్ కింద 3.9-లీటర్ల ట్విన్-టర్బో V8 ఇంజన్ ఉంది, ఇది 640 Bhp పవర్, 760 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పవర్ డెలివరీ వెనుక చక్రాలకు అందుతుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ఫెరారీ పేర్కొంది. -
కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం.. E20 పెట్రోల్‌పై ఆందోళన!
భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా.., దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం. ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం) వినియోగం విస్తరిస్తోంది.ఈ20 పెట్రోల్ కారణంగా.. పాత పెట్రోల్ వాహనాల్లో ఇంజిన్ సమస్యలు, మైలేజ్ తగ్గడం, మరమ్మతుల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయని కొంతమంది వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలకు నష్టం జరిగితే.. పరిహారం కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చాలామంది వాహన యజమానులు చెబుతున్నారు.లోకల్ సర్వే నిర్వహించిన ఒక నివేదిక ప్రకారం.. ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలకు తీవ్రమైన నష్టం జరిగిందని భావించే వారిలో ఎక్కువ మంది పరిహారం కోసం ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సర్వేలో దేశంలోని 316 జిల్లాలకు చెందిన 22 వేలకుపైగా పెట్రోల్ వాహన యజమానులు పాల్గొన్నారు.సర్వే ప్రకారం.. 31 శాతం మంది 'వినియోగదారుల కమిషన్'ను ఆశ్రయిస్తామని తెలిపారు. 14 శాతం మంది అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. అంటే మొత్తం 45 శాతం మంది న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అదే సమయంలో 18 శాతం మంది వాహన తయారీ సంస్థతో పాటు ఇంధన కంపెనీ నుంచి పరిహారం కోరుతామని తెలిపారు. 9 శాతం మంది కేవలం వాహన తయారీదారు నుంచి పరిహారం కోరనున్నట్లు పేర్కొన్నారు.నిజానికి భారత్ ఈ20 పెట్రోల్ వైపు మారుతున్న సమయంలో, ముఖ్యంగా పాత పెట్రోల్ వాహనాల యజమానుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. 2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాలను కలిగిన వారిలో 55 శాతం మంది 2025 ప్రారంభం నుంచి వాహనంలో అసాధారణమైన అరుగుదల, ఎక్కువ మరమ్మతుల అవసరం కనిపించిందని తెలిపారని సర్వే ద్వారా తెలిసింది. గతంలో నిర్వహించిన మరో సర్వేలో 66 శాతం మంది వాహనదారులు 10 శాతానికి పైగా మైలేజ్ తగ్గిందని పేర్కొన్నట్లు సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా -
ఒకే ప్లాంట్.. 30 లక్షల వెహికల్స్!
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన చకన్ ప్లాంట్ నుంచి 30 లక్షల (3 మిలియన్) వాహనాన్ని విడుదల చేసింది. కంపెనీ ఈ మైలురాయి యూనిట్‌గా బీఈ 6 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.ప్రస్తుతం మహీంద్రా చకన్ ప్లాంట్‌లో తయారు చేస్తున్న మొత్తం 19 వాహనాల్లో బీఈ6 ఎలక్ట్రిక్ ఒకటి. ఇక్కడ ప్యాసింజర్ వాహనాలు మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాల ఉత్పత్తి కూడా జరుగుతోంది.చకన్ ప్లాంట్‌లో మహీంద్రా సంస్థ ప్రారంభ ఉత్పత్తి కొంత నెమ్మదిగా సాగినప్పటికీ.. ఆ తరువాత గణనీయంగా పెరిగిందని కంపెనీ బిజినెస్ ప్రెసిడెంట్, ఆర్. వేలుసామి పేర్కొన్నారు. ఇది వినియోగదారులలో పెరుగుతున్న నమ్మకాన్ని, మా సిబ్బంది, భాగస్వాములు, సరఫరాదారుల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు.మహీంద్రా 2009 డిసెంబర్లో చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. 2018 సెప్టెంబర్‌లో 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటింది. 20 లక్షల మైలురాయి 2024 మార్చిలో చేరుకోగా.. సుమారు 27 నెలల తర్వాత, 2026 జూలైలో మూడు మిలియన్ల యూనిట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది.మహీంద్రా బీఈ6ఇక బీఈ6 విషయానికి వస్తే.. ఇది INGLO ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన మహీంద్రా మొదటి రెండు 'బోర్న్ ఎలక్ట్రిక్' SUVలలో ఒకటి. ఇది ఎక్స్ఈవీ 9ఈ కారుతో పాటు 2024 చివరలో భారతదేశంలో విడుదలైంది. దీని డెలివరీలు 2025లో ప్రారంభమయ్యాయి. BE 6 ఐదు ట్రిమ్ స్థాయిలలో, 59 kWh, 79 kWh బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ధరలు రూ. 18.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.Three million vehicles. Countless stories set in motion. Today, Chakan rolled out Mahindra's 3 millionth vehical. Proud to be part of millions of journeys and here's to a million more. #Mahindra #MahindraAutomotive #MahindraSUVs #MahindraElectricOriginSUVs pic.twitter.com/Z128vyQ9wB— Mahindra Automotive (@Mahindra_Auto) July 16, 2026 -
2026 క్లాసిక్ 350 లాంచ్: ధర ఎంతంటే?
రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ విఫణిలో అప్డేటెడ్ క్లాసిక్ 350ని లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,87,434 (ఎక్స్-షోరూమ్). ఇది స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2026 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎడిషన్ రెండు ప్రధాన అప్గ్రేడ్లతో వస్తుంది. ఈ బైక్‌లో ఇప్పుడు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను అమర్చారు. అదనపు సౌలభ్యం కోసం బైక్ తయారీదారు USB టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ప్రవేశపెట్టారు. సస్పెన్షన్ సెటప్‌లో ఎలాంటి మార్పు లేదు. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో కూడిన డిస్క్ బ్రేకులు ఉన్నాయి.కొత్త క్లాసిక్ 350లో 349 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 20.2 Bhp పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరుని అందిస్తుంది. -
టాప్ గేర్‌లో వాహన విక్రయాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా లభించిన బలమైన డిమాండ్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) లో దేశీయ వాహన విక్రయాలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఏప్రిల్–జూన్ మధ్య కంపెనీల నుంచి డీలర్లకు 12,73,811 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల (పీవీ) పంపిణీ జరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో జరిగిన 10,11,884 యూనిట్ల పంపిణీతో పోలిస్తే ఇది 25.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా 2024–25 తొలి త్రైమాసికంలో నమోదైన 10.3 లక్షల యూనిట్ల గరిష్ట రికార్డును ఈ తొలి త్రైమాసిక విక్రయాలు అధిగమించాయి. దేశీయ వాహన తయారీదారుల సమాఖ్య ‘సియామ్’ బుధవారం ఈ వివరాలను వెల్లడించింది. అన్ని విభాగాల్లో ఆల్‌టైమ్ రికార్డులుత్రిచక్ర వాహనాల విభాగం క్యూ1 కాలానికి చరిత్రలోనే అత్యధిక పంపిణీని నమోదు చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది ఇదే కాలంలోని 1,65,211 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 29.7 శాతం వృద్ధితో 2,14,339 యూనిట్లకు చేరింది.వాణిజ్య వాహనాల విభాగం కూడా తొలి త్రైమాసికంలో తన చరిత్రలోనే అత్యధిక విక్రయాలను సాధించింది. గత ఏడాది క్యూ1తో పోలిస్తే 18.3 శాతం వృద్ధిని కనబరుస్తూ రికార్డు స్థాయిలో 2.65 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి.మరోవైపు ద్విచక్ర వాహనాల పంపిణీ కూడా క్యూ1లో 20.3 శాతం పెరిగి 56,28,675 యూనిట్లకు చేరింది. గత ఏడాది క్యూ1 కాలంలో ఈ విక్రయాలు 46,77,990 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘కేంద్రం జీఎస్టీ రేట్లను సవరించడం, సులభతర వాహన ఫైనాన్సింగ్ రుణాలు, గతేడాది నమోదైన స్వల్ప విక్రయాల ప్రభావం (లో బేస్ ఎఫెక్ట్) తో పాటు మార్కెట్లోకి కొత్త మోడళ్లు రావడం ఈ బలమైన వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం వినియోగదారుల సెంటిమెంట్, డిమాండ్ స్థిరంగానే ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగం, గ్రామీణ డిమాండ్‌పై నేరుగా ప్రభావం చూపే రుతుపవనాల గమనాన్ని, అలాగే భౌగోళిక రాజకీయ పరిణామాలను ఆటో పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తోంది’ అని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు.రెండో త్రైమాసికంపై సియామ్ అవుట్లుక్పండుగల సీజన్ సమీపిస్తుండటంతో వాహనాలకు ఇదే విధమైన స్థిరమైన డిమాండ్ మున్ముందూ కొనసాగవచ్చని సియామ్ అంచనా వేసింది. జీఎస్టీ 2.0 తో పాటు తక్కువ రేట్లకే లభిస్తున్న ఫైనాన్సింగ్ సదుపాయం వాహన ధరలను అందుబాటులో ఉంచుతూ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి. అయితే, కమోడిటీ (ముడి సరుకుల) ధరలు పెరగడం ఆటోమొబైల్ రంగానికి కొంత ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో గ్యాస్, ఇంధనం, ముడి సరుకుల సరఫరా మెరుగుపడినా.. ఇటీవలి కాలంలో అక్కడ చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిణామాలు పరిశ్రమకు కీలకం కానున్నాయని సియామ్ అభిప్రాయపడింది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
ఒక్క చార్జ్‌తో 526 కి.మీ. జర్నీ
న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ ‘కియా ఇండియా’ మధ్య తరగతి, ప్రీమియం ఈవీ కస్టమర్లను లక్ష్యంగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘కియా సైరోస్ ఈవీ’ని ఆవిష్కరించింది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. 51.4 కేడబ్ల్యూహెచ్ ఎక్స్టెండెడ్ రేంజ్ బ్యాటరీ మోడల్.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 526 కిలోమీటర్ల (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజీని ఇస్తుంది. 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. 100 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లోనే 10% నుంచి 80%కి ఛార్జ్ చేసుకోవచ్చు. దేశంలోనే మొదటిసారిగా లైఫ్‌టైమ్ హై–వోల్టేజ్ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రా మ్, బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ (బాస్) ఫైనాన్సింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కియా వెబ్సైట్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న కియా డీలర్‌షిప్‌లలో ప్రీబుక్ చేసుకోవచ్చు. -
ఈ20 వివాదం.. నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్!
కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ (ఇంధనంలో ఇథనాల్ మిశ్రమం) విధానంపై వస్తున్న ‘ఆసక్తుల ఘర్షణ’ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) ఆరోపణలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ఈ విధానం వల్ల తన కుటుంబానికి వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఇవన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, తన ప్రతిష్టను, దేశ ప్రగతిని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ కొన్ని అంశాలు వెల్లడించారు.వాస్తవాలు ఇవే.. నా వాటా నామమాత్రం!కాంగ్రెస్ పార్టీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎటువంటి ఆధారాలు లేవని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఇథనాల్ విధానం ప్రవేశపెట్టడానికంటే ఎంతో ముందే తమ కుటుంబానికి షుగర్ వ్యాపారం ఉందని గుర్తుచేశారు. ‘దేశవ్యాప్తంగా దాదాపు 550 యూనిట్ల ద్వారా ఏటా 1,500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో మా కుటుంబానికి, నా కుమారుల కంపెనీలకు ఉన్న వాటా కేవలం 0.07 శాతం మాత్రమే. ఇంత స్వల్ప భాగస్వామ్యం ఉన్న వ్యక్తి దేశవ్యాప్త విధానాన్ని తన స్వప్రయోజనాల కోసం ఎలా ప్రభావితం చేయగలరు?’ అని గడ్కరీ అన్నారు.తన కుమారుల వ్యాపారంలో ఇథనాల్ అనేది కేవలం 10 శాతం మాత్రమేనని, ఆ సంస్థలపై ప్రస్తుతం రూ.1,600 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ కొనుగోళ్లు లేదా ధరల నిర్ణయ ప్రక్రియతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇది ఒక్కరి నిర్ణయం కాదు.. రైతుల కోసమే!ఇంధన సంబంధిత నిర్ణయాలన్నీ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయని, తన మంత్రిత్వ శాఖ కేవలం వాహనాల ఇంజిన్ ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తుందని గడ్కరీ వివరించారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం కేవలం ఒకరి నిర్ణయంతో కాకుండా కేంద్ర కేబినెట్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, శాస్త్రీయ సంస్థల విస్తృత సంప్రదింపుల తర్వాతే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ విధానం వాజపేయ్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభమైందని, ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం కూడా దీనిని సమర్థించిందని గుర్తు చేశారు.రైతుల ఆదాయాన్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, దేశానికి భారం అవుతున్న ముడి చమురు దిగుమతులను నియంత్రించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తాను కేవలం చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, వెదురు, వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా ఇథనాల్, మిథనాల్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.ఇంజిన్లు దెబ్బతింటాయనేది తప్పుడు ప్రచారంఈ 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) వాడకం వల్ల వాహనాల మైలేజీ తగ్గిపోతుందని, ఇంజిన్లు పాడవుతాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని గడ్కరీ తేల్చిచెప్పారు. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్ వంటి దేశాల్లో దశాబ్దాలుగా దీన్ని విజయవంతంగా వాడుతున్నారని పేర్కొన్నారు. వాహనదారులెవరైనా దీనివల్ల నష్టపోతే నేరుగా కంపెనీలకు లేదా తనకు ఫిర్యాదు చేయవచ్చని సవాల్ విసిరారు.ఇదీ చదవండి: కోట్లు ఉన్నా కొరత భావనేనా?


