Lifestyle
-
ఏడేళ్ల చిన్నారి నోట పేరెంటింగ్ పాఠాలు..!
బెస్ట్ పేరెంట్స్, పిలల పెంపకం గురించి సైకాలజీలు, ప్రముఖులు విద్యావేత్తల ప్రసంగాల్లో వింటుంటాం. కానీ వాటిని ఓ ఏడేళ్ల చిన్నారి అలవోకగా ఆశ్చర్యపరిచేలా చెబుతుంటే..ఇది నిజమేనా అనిపిస్తుంది కదా..!. కానీ ఇది నమ్మకతప్పని సత్యం. పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి తల్లిదండ్రుల పెంపకం, చిన్నారులతో పేరెంట్స్ ఎలా వ్యవహరించాలి వంటి వాటి గురించి విస్తుపోయేలా చెప్పేస్తుంది. ఆ ప్రసంగం ఓ చిన్నారి చెబుతున్న చిట్టి మాటల్ల లేవు. ఓ అనుభవశాలి లేదా నిపుణులు చెబుతున్న విలువైన పాఠాలే వలే ఉన్నాయి. చిన్నారుల వద్ద అపార జ్ఞానం ఉంటుందనేందుకు ఈ చిన్నారే ఉదాహరణ అనేలా అద్భతంగా ప్రసంగించింది పేరెంటింగ్ గురించి. మరీ ఆ చిన్నారి ఎవరు..? ఆమె చెబుతున్న అద్భుతమైన పేరెంటింగ్ చిట్కాలేంటో చూద్దామా..!.టెడ్ స్పీకర్ మోలీ రైట్ అనే ఏడేళ్ల చిన్నారి పేరెంటింగ్ గురించి చక చక మాట్లాడేస్తోంది. పిల్లలతో ప్రతి పేరెంట్ సంభాషణ ఎలా ఉంటుందనే ప్రశ్న లెవనెత్తి.. ప్రతి తల్లిదండ్రులు తమ పెంపకం గురించి ఆలోచించుకునేలా ప్రసంగించింది. సైకాలజీ నిపుణుల మాదిరిగా పిల్లలను ఎలా పెంచితే మంచిదో విపులంగా వివరించింది. ఇవన్నీ ఓ ఏడేళ్ల చిన్నారి నోటి నుంచి వస్తున్నాయా..? అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ చిన్నారి స్పీచ్ తల్లిదండ్రులందర్నీ తమ తీరుపై విశ్లేషించుకునేలా చేస్తుంది. అంతేగాదు తమ పిల్లల తెలితేటలను ఎంత తక్కువగా అంచనావేస్తున్నామనే విషయాన్ని గ్రహించేలా చేస్తుంది కూడా. చివరగా ఆమె ప్రసంగంలో పేరెంటింగ్ అనేది జీవితాంత నేర్చుకునే ఓ అద్భుతమైన ప్రక్రియ అని, ఇక్కడ చిన్నారులే వారికి గురువుల్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకునేలా చేస్తారంటూ వయసుకి మించి పెద్ద పెద్ద విషయాలను చెప్పింది ఆ చిన్నారి మోలీ. అంతేగాక చాలామంది తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పులని ఎత్తి చూపడమే కాకుండా పిల్లలతో ఎలా వ్యవహరించాలనే దానిపై దృష్టి సారించేలా చేసింది. అలాగే పిల్లలకు పేరెంటింగ్‌గా అందివ్వాల్సిన భద్రత, సంరక్షణ గురించి నొక్కి చెప్పింది. దీంతోపాటు తల్లిదండ్రులు ఎక్కువ సేపు ఫోన్, ల్యాప్‌టాప్ స్క్రీన్లకే పరిమితం కావొద్దనే విషయాన్ని హైలెట్ చేసింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు వారితో గడిపేందుకు సమయం కచ్చితంగా కేటాయించాలని నొక్కి చెప్పింది. ఆ చిన్నారి టెడ్ స్పీకర్ నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సి అమూల్యమైన పాఠాలేంటో చూద్దామా..!. గర్భం నుంచే కనెక్షన్ ప్రారంభం..తల్లి గర్భం ధరించినప్పటి నుంచే తల్లిదండ్రులుగా ఉండటం ప్రారంభమవుతుందన్న విషయాన్ని గుర్తు చేసింది. కడుపుతో ఉన్నప్పటి నుంచే పొట్టను నిమురుతూ శిశువుతో బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటారని, అక్కడ నుంచి ఇరువురి మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని పరిశోధనలు సైతం జనన పూర్వం నుంచే తల్లి ద్వారా శిశువుకి భద్రతా భావాన్ని ప్రభావితం చేస్తుందని వెల్లడించాయి. సేవా, కమ్యూనికేషన్శిశువుగా ఉన్నప్పుడు చిన్నారులకు చేసే సేవ, వారితో జరిపే కమ్యూనికేషన్‌ని బట్టి తల్లిదండ్రులే తన సంరక్షకులని గుర్తించడం జరుగుతుందని అంటోంది. అలాగే అధ్యయనాల్లోకూడా నవజాత శిశువులకు చేసే సపర్యలు, వారితో మాట్లాడే చర్య ఇవన్నీ భావోద్వేగా మేధస్సుకి కీలకమైన నాడీ సంబంధాలను బలపరుస్తుందని పేర్కొంది కూడా. ఆట రీచార్జ్ అయ్యేలా చేస్తుంది..పిల్లలు ఆట ద్వారా చాలా నేర్చుకుంటారు. కథ చెప్పడం, పాడటం వంటి కార్యకలాపాలతో వారికి సమస్య పరిష్కార సామర్థ్యాలను, భావోద్వేగ నియంత్రణ, సామాజిక నైపుణ్యాలు తదితరాలు మెరుగుపడతాయని అంటోంది చిన్నారి మోలీ. ఆట మాదిరిగా సాధన చేయిస్తే చదువులో కూడా మెరుగ్గా రాణించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.నోరు విప్పనివ్వండి..మనలో చాలామంది పిల్లలు గట్టిగా మాట్లాడకూదనో లేక ఎదురు తిరగకూడదనో గమ్మున మాట్లాడనివ్వరు పెద్దలు. కానీ ఇది వారి ఎదుగుదలన అణిచేస్తుందట. ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం కూడా ఉంటుందట. వారి భావాలను, ఆలోచనలను చెప్పే స్వేచ్ఛని ఇస్తే... బలమైన కమ్యునికేషన్ నైపుణ్యాలు అవడతాయి. బొమ్మలు కంటే విలువైంది వారితో గడపటం..విహార యాత్రలకు తిప్పడం, విలువైన బొమ్మలు కొనడం వంటి వాటికంటే ముఖ్యమైనది వారితో గడపటం. వారి అంతులేని ప్రశ్నలకు ఓపికగా మీరిచ్చే సమాధానాలు వారికి భావోద్వేగ భద్రత, స్వీయ ప్రాముఖ్యతను తెలియజేస్తుందట.మన సర్కిలే వారి భవిష్యత్తుకి సోపానం..మనకు ఉండే స్నేహితులు, బంధువుల కారణంగా వారికి మంచిగా పెరిగే వాతావరణాన్ని అందిస్తుందట. ప్రపంచ దృష్టి కోణంపై వారికొక అవగాహన ఏర్పడతుందట. ఇదే వారికి ఉపాధ్యాయల పట్ల ఎలా వ్యవహరించాలనేది తెలుసుకునేలా చేస్తుందట కూడా. వారి ఆలోచనకు విలువ ఇద్దాం..తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పుల్లో ఒకటి వారి కలలను పిల్లలపై రుద్దడమేనని చెబుతోంది చిన్నారి మోలీ. వారేమి అవ్వాలనుకుంటున్నారు, అభిరుచి తదితరాల గురించి తెలుసుకుని మార్గదర్శకత్వం చేయాలే తప్ప మన ఆశలను వారిపై బలవంతంగా రుద్దకూడదట. అప్పుడే పిల్లలు మంచిగా వృద్ధిలోకి రాగలుగుతారంటోంది మోలీ. పిలల్లు అభివృద్ధి చెందేలా పెంచుతున్నామా లేదా అని విశ్లేషించుకునేలా..? అద్భుతంగా ప్రసంగించింది పిన్న వయస్కురాలైన టెడ్ స్పీకర్ మోలీ.(చదవండి: పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..) -
పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..
ఎంత ఏఐ టెక్నాలజీ, చాటీజీపీటి వంటి సరికొత్త టెక్నాలజీలు వచ్చినా కొన్ని విషయాల్లో సమాజం తీరు విశాలంగా ఉండటం లేదు. సమాన అవకాశాలు, లింగ సమానత్వం అంటారే గానీ వర్కింగ్ మహిళలు అమ్మగా మారాక ఇవ్వాల్సిన వెసులుబాటు అటుంచి కనీస మద్దతు లేకపోవడం బాధకరం. ఇంకా చాలామంది తల్లలు తమ చిన్నారులకు పాలిచ్చేందుకు జంకే పరిస్థితులే ఎదురవ్వుతున్నాయి. ముఖ్యంగా పనిచేసే తల్లలు ఆరునెలల మెటర్నీటి సెలవుల అనంతరం ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిందే. అలా తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లోకి వచ్చే తల్లులు తమ బిడ్డకు పాలిచ్చేందుకు ఎలాంటి పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్రెస్ట్ పంపింగ్ మిషన్ల సాయంతో స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉన్నా.. పని ప్రదేశాల్లో సహ ఉద్యోగుల మద్దుతు గానీ అందుకోసం ప్రత్యేక ప్రదేశం గానీ అందుబాటు లేక విలవిలలాడుతున్నారు అతివలు. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సైతం వెల్లడించింది. అలాంటి పరిస్థితులను కాబయే తల్లులు ఎలా అధిగమించాలి..? దీని గురించి నిపుణుల ఏమంటున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా.ప్రతిష్టాత్మకమైన BAFTA అవార్డుల కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అందమైన డిజైనర్ వేర్‌తో సందడి చేసింది. ఓ పక్కన తల్లిగా తన బ్రెస్ట్ పంపింగ్ షెడ్యూల్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఈవెంట్లో పాల్గొంది. ఆ విషయాన్నే రాధికా ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చింది. పని ప్రేదేశంలో నాలాంటి కొత్త తల్లులు బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బుందులు పడుతుంటారు. అందులోనూ సినీ పరిశ్రమలో అస్సలు మద్దతు ఉండదు. కానీ నాకు సపోర్ట్ లభించడమే గాక హ్యపీగా తన రొమ్ము పాల పంపింగ్ షెడ్యూల్‌కి ఆటంకం లేకుండా ప్రముఖ మోడల్ నటాష తనకెంతో సహాయం చేసిందని చెప్పుకొచ్చింది. ఒక నటిగా రాధికా వంటి వాళ్లకు కూడా పనిప్రదేశాల్లో ఇలాంటి సమయంలో ఇబ్బందుల తప్పవనే విషయం స్పష్టమవుతోంది. ఇక సామాన్య మహిళలైతే అంతకు మించి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఎందరో మహిళలు ఈ విషయమై ఎన్నో సార్లు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకున్నారు కూడా . నిపుణులు ఏమంటున్నారంటే..తల్లిపాలు సరఫరా-డిమాండ్ ప్రాతిపదికన పనిచేస్తుందని చెబుతున్నారు గైనకాలజీ నిపుణులు. కొత్త తల్లులకు పాలివ్వడం లేదా రొమ్ము పంపింగ్ షెడ్యూల్‌కి కట్టుబడి ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే దీని అర్థం పాలను టైం ప్రకారం పంపింగ్ లేదా ఫీడ్ చేస్తే శరీరం ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తుందట, లేదంటే మానవ శరీరం తక్కువ పాలను ఉత్పత్తి చేయాలనే సంకేతాన్ని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా శిశువుకు దీర్ఘకాలం పాలను కొనసాగించే సామార్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తల్లిపాల వల్ల కలిగే లాభాలు..తల్లి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ కేన్సరలు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందట. అదీగాక తల్లిపాలు శిశువు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పోషకాలు, యాంటీబాడీలు, ఎంజైమ్‌లు ఉంటాయి. తల్లిపాలను తాగే పిలలలకు చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలతో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయట. అలాగే తల్లి పాలిచ్చే సమయంలో శిశువుకి చర్మం నుంచి చర్మానికి సంపర్కం, భావోద్వేగ సంబంధం భద్రతను అందిస్తుందట. ఉద్యోగినులు ఆరోగ్యాన్ని, పాల సరఫరాను కాపాడుకోవాలంటే..పని ప్రదేశాల్లో సహజంగా కొత్త తల్లులు ఇలాంటి విషయంలో అసౌకర్యంగా సిగ్గుగా ఫీలవ్వుతుంటారు. ముందు అలాంటి వాటిని పక్కన పెట్టి..విరామ సమయంలో పంపింగ్ సెషన్ ప్లాన్ చేసుకునేలా ఏర్పాటు చేసుకోండి. అలాగే గోప్యత కోసం కార్యాలయంలో సరైన సౌకర్యం లేదా ప్రదేశం గురించి కార్యాలయం యజమానులతో మాట్లాడండి. అసౌకర్యం ఏర్పడకుండా ఎవ్వరినీ లోపలకి రానివ్వకుండా చేసుకోండి. ముఖ్యంగా పాలను సరిగా నిల్వ చేయండి. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండేలా బాగా తినండి, తాగండి. అందుకోసం సహోద్యోగి, లేదా భాగస్వామి మద్దతు తోపాటు ఆఫీస్ హెడ్ సహాయం కూడా తీసుకోండి. ఆఫీస్ నిర్వాహకులతో సామరస్యపూర్వకంగా మాట్లాడి తల్లిపాలు ఇవ్వడానికి అనుకూలమైన ప్రదేశం ఇచ్చేలా లేదా వెసులబాలు కల్పించమని కోరండి.(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
చర్మం మృదువుగా కోమలంగా ఉండాలంటే..!
పొడి చర్మం గలవారు ఏ ఫేస్ ప్యాక్ పడితే అది వేసుకోవడం మంచిది కాదు. అందులోనూ వాళ్ల చర్మం డ్రైగా అయిపోయి, ర్యాషస్ ఈజీగా వచ్చేస్తాయి. అలాంటి వారు చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేసే ఫేస్ ప్యాక్‌లు ఎంచుకోవాల్సి ఉంటుంది. వీళ్లు ఆయిల్‌తో కూడిన ప్యాక్‌లు ఉపయోగిస్తే చర్మం కోమలంగా మెరుస్తూ ఉంటుంది. అందుకోసం హెల్ప్ అయ్యే బెస్ట్ ఫేస్ ప్యాక్‌లు ఏంటో చూద్దామా..!.పూలలోని పుప్పొడి, నల్లనువ్వులు, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. రోజ్‌వాటర్‌తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతిమంతమవుతుంది. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. ఫలితంగా మృతకణాలు తొలగి΄ోయి, చర్మం మృదువుగా మారుతుంది. మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ΄్యాక్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..) -
చిన్నారుల రక్షణ బాధ్యత అందరిదీ!
నేను ఇటీవల ప్రచార మాధ్యమాలలో, సోషల్ మీడియాలో పోక్సో చట్టం అనే పదాన్ని తరచు వింటున్నాను. దీని గురించి వివరించగలరా?– సంకా పవన్ కుమార్, తెనాలిచిన్నారులపై లైంగిక దాడులు జరగడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతోంది. అంతకుముందు చిన్నారులపై లైంగిక దాడులు లేవని కాదు. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టడానికి ఉన్న కఠినమైన పోక్సో చట్టం (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) కూడా ఈ మధ్యకాలంలో చాలా కేసులను బయటకు తీసుకు వచ్చింది. 2024 ఎన్.సి.ఆర్.బి లెక్కల ప్రకారం 2019 నుంచి 31–మే 2024 వరకు దేశవ్యాప్తంగా 2,99,759 పోక్సో కేసులు నమోదు కాగా తెలంగాణలో 2,731 – ఆంధ్రప్రదేశ్‌లో 11,774 కేసులు నమోదయ్యాయి. గత ఐదు సంవత్సరాలలో దాదాపుగా 20 శాతం చిన్నారులపై లైంగిక దాడుల కేసులు పెరిగినట్లుగా చెబుతున్న అంకెలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం వెలుగులోకి వస్తున్న కేసుల కన్నా నమోదు కాని కేసుల సంఖ్య రెండింతల పైమాటే!చట్ట ప్రకారం మైనర్ బాలిక/బాలుర పై ఏ విధమైన లైంగిక హింస లేదా దాడి జరుగుతున్న విషయం తెలిసినవారు కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. లైంగిక దాడి జరిగిందన్న ఖచ్చితమైన సమాచారం మాత్రమే కాదు. లైంగిక దాడి జరిగి ఉండవచ్చు లేదా దాడి జరిగి ఉండే ఆస్కారం ఉంది అన్న సందేహం ఉన్న వారు కూడా ఫిర్యాదు చేయాలి. అలా తెలిసినప్పటికీ ఫిర్యాదు చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే 18 సంవత్సరాలు దాటిన వారెవరైనా సరే సెక్షన్ 19 పోక్సో చట్టం కింద ఆరు నెలల నుండి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ అంశంపై ప్రభుత్వాలు, అలాగే మీడియా కూడా తగిన ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. పేరెంటింగ్ అంటే కేవలం తల్లిదండ్రులకు సంబంధించినది మాత్రమే కాదు. సమాజానిది కూడా!లైంగిక హింస, లైంగిక దాడి, మైనర్ల ఫోటోలు – వీడియోలు అశ్లీల చిత్రాలకి వాడడం, చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు/వీడియోలు కలిగి ఉండడం వంటివి కూడా పోక్సో చట్టం కింద నేరాలే. ఆటిజం వంటి మానసిక ఎదుగుదల లేమి, మతిస్థిమితం లేని పిల్లలపై, అలాగే చిన్నపిల్లలపై అధికారం కలిగిన వ్యక్తులు (తల్లిదండ్రులు, టీచర్లు, కొన్ని ప్రత్యేక వృత్తులలో ఉండే అధికారులు మొదలైన వారు) లైంగిక దాడులకు పాల్పడినట్లయితే అవి ‘అతి తీవ్రమైన’ నేరాలుగా పరిగణించబడతాయి. అందుకుగాను యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, బాలలకు ఎటువంటి లైంగిక ఇబ్బంది కలుగుతుందేమోనన్న సందేహం ఉన్నా తక్షణం పోలీసులకి తెలియజేయడం అందరి బాధ్యత. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMýకు మెయిల్ చేయవచ్చు)(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
చాట్ జీపీటీ బామ్మ..!
చాట్ జీపీటీ బామ్మ బెంగళూరుకు చెందిన 88 ఏళ్ల బామ్మ చాట్‌జీపీటీతో స్నేహం కట్టింది. అన్ని ప్రశ్నలూ దానినే అడుగుతోంది. ‘నా మనవడు పెళ్లి చేసుకోవడం లేదు. కారణం ఏంటంటావ్’ అనే ప్రశ్నకు చాట్‌జీపీటీ చెప్పిన జవాబుకు నెటిజన్లు బోలెడు ముచ్చటపడుతున్నారు. మనవడు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.ఊళ్లలో చాలామంది బామ్మలు టీవీతో కాలక్షేపం చేస్తారు. కాని బెంగళూరు(Bengaluru)కు చెందిన ఈ బామ్మ(Grand mother) ఏకంగా ‘ఏఐ’ చాట్‌బాట్ అయిన ‘చాట్‌జీపీటీ’(ChatGPT)తో స్నేహం కట్టింది. వాయిస్ ద్వారా చాట్‌జీపీటీతో మాట్లాడవచ్చు కనుక బామ్మ తనకున్న సందేహాలన్నిటినీ దానినే అడుగుతూ కాలక్షేపం చేస్తోంది. ఆమె మనవడు శశాంక్ జాకబ్ ఇదంతా వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ వీడియోలో సంభాషణ ఇలా సాగింది.బామ్మ: హాయ్చాట్జీపీటీ: హాయ్బామ్మ: నా వయసు 88. నా బిపి 165/88 ఉంది. ప్రమాదం అంటావా?చాట్‌జీపీటీ: సిస్టాలిక్ కొంచెం ఎక్కువుంది. డయస్టాలిక్ నార్మల్‌గా ఉంది.బామ్మ: నా మనవడు పెళ్లి చేసుకోనంటున్నాడు. కారణం ఏంటి?చాట్‌జీపీటీ: ఓ ఇది మంచి ప్రశ్న. నీ మనవడు పెళ్లి వద్దనడానికి అనేక కారణాలు ఉంటాయి. కెరీర్ గురించి ఆలోచిస్తుండవచ్చు, ఏవైనా లక్ష్యాలు ఉండవచ్చు లేదా గత అనుభవాల వల్ల కూడా కావచ్చు. బామ్మ మనవడి వైపు తిరిగి: ఏరా.. ఏవైనా గత అనుభవాలు ఉన్నాయా?మనవడు: ఉండొచ్చుబామ్మ: సరే అలా అయితే. నీకు క్లారిటీ రావడానికి కొంత టైమ్ ఇస్తాను...ఇంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఇన్‌స్టాలో ఈ వీడియోను వేల మంది లైక్ చేశారు. బామ్మను చాలా మెచ్చుకుంటున్నారు. బామ్మా.... మనం స్నేహం చేద్దామా అని అడుగుతున్నారు. చాలామంది తమ బామ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shashank Jacob (@shashankjacob)(చదవండి: మహిళా ఉద్యోగిని ఆ సాకుతో జాబ్‌లోంచి తీసేశారు..! కట్‌చేస్తే..) -
Priyanka Mohan: నేనొక శారీ లవర్ని
బంజారాహిల్స్: ‘నాకు చీరలంటే ఎంతో ఇష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే నేనొక శారీ లవర్ని’ అని చెప్పారు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో గ్జితి వీవ్స్లో ఏర్పాటు చేసిన నూతన కలెక్షన్లను మంగళవారం ఆవిష్కరించారు. మహిళలకు చీర అందాన్ని ఇవ్వడమే కాకుండా మరింత గౌరవాన్ని ఇస్తుందని ప్రియాంక అన్నారు. తాను నిత్యం రకరకాల కలెక్షన్లు అన్వేషిస్తూ ఉంటానని, నచ్చిన చీరను తెప్పించుకోడం.. కట్టుకొని ముచ్చట తీర్చుకోడం జరుగుతుందన్నారు. మార్కెట్లోకి ట్రెండీ డ్రెస్‌లకు ధీటుగా శారీలు కూడా వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్జితి వీవ్స్ ప్రతినిధులు సౌజన్య, బాబీ మాట్లాడుతూ ప్రతి అవసరానికీ ఓ చీర, ప్రతి సీజన్‌కు ఓ చీర అనే కాన్సెప్‌్టతో దేశంలోని భిన్న రకాల చేతి వృత్తుల చీరలతో పాటు డిజైనరీ చీరలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. – నటి ప్రియాంక -
Delhi Stampede: ఆ ఐదుగురి ఉసురు తీసింది ఈ వైద్య పరిస్థితే..!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోగా, పదిమందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఆ బాధితులలో ఐదుగురు మాత్రం బాధకరమైన పరిస్థితితో మరణించినట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ ఘటన ఫుట్ఓవర్ వంతెనపై నుంచి దిగుతుండగా కొంతమంది ప్రయాణికులు జారిపడి పడిపోవడంతో చోటుచేసుకుందన్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్లు ఆ ఐదుగురు బాధితులు మాత్రం తొక్కిసలాట కారణంగా చనిపోలేదంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్యులు. ప్రయాణీకులతో కిక్కిరిసిన ప్రదేశాల్లో కొందరికి అలాంటి వైద్య పరిస్థితి ఎదురై ప్రాణాంతకంగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ అస్సలు ఆ బాధితులు మరణానికి ప్రధాన కారణం ఏంటి..?. ఆ వైద్య పరిస్థితిని ఏమని పిలుస్తారు..? ఎలా నివారించాలి..?ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిఖిల్ మోడీ ఐదుగురు బాధితుల మరణానికి ప్రధాన కారణాన్ని వివరించారు. వారంతా ట్రామాటిక్ అస్ఫిక్సియా అనే శ్వాసకోశ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు వెల్లడించారు. బాధితుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఈ పరిస్థితికి గురయ్యినట్లు తెలిపారు.అలాగే ఆ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ..గాయపడిన బాధితులను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాలేదని, కానీ ఈ ఐదు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఎల్ఎన్జేపీ ఆస్పత్రి నుంచి ఆర్ఎంఎల్కి తరలించడంతో ఈ విషయం నిర్థారణ అయినట్లు తెలిపారు. అంతేగాదు ఆ నివేదికలో ఆ వైద్య పరిస్థితి గురించి సవివరంగా పేర్కొన్నారని సదరు వైద్యుడు వెల్లడించారు. ఇంతకీ ఏంటీ ట్రామాటిక్ అస్ఫిక్సియా..?ట్రామాటిక్ అస్ఫిక్సియాట్రామాటిక్ అస్ఫిక్సియాను క్రష్ అస్ఫిక్సియా అని కూడా పిలుస్తారు. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై తీవ్ర ఒత్తిడిని కలుగజేసితే సంభవిస్తుంది. ఈ తీవ్రమైన శక్తి డయాఫ్రాగమ్ విస్తరించకుండా నివారిస్తుంది. ఫలితంగా సాధారణ శ్వాస కూడా కష్టమవుతుంది. అదనంగా పీడనం రక్తాన్ని పైశరీరంలోకి తిరిగి నెట్టివేస్తుంది. దీనివలన ముఖం, మెడ, కళ్లల్లో పెటెచియే(కేశనాళికలు పగిలిపోవడం వల్ల ఊదా-ఎరుపు రంగు మారడం) వంటి సంకేతాలు కనిపిస్తాయి. అంటే తల, పై శరీరం వాపుకి గురైనట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే బాధితుడు నిమిషాల్లోనే స్ప్రుహ కోల్పోవచ్చు. తదనంతర అంతర్గత అవయవాలు వైఫల్యం జరిగి నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వ్యక్తులకు పరిస్థితి విషమించక మునుపే సకాలంలో ఆక్సిజన్ థెరపీ వంటి వైద్య చికిత్సలు అందిస్తే తొందరగా ఆ విషమ పరిస్థితి నుంచి బయటపడేలా చేయడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితి ఊపిరాడనంత రద్దీ ప్రదేశాల్లో కొందరికి ఎదురవుతుందని చెబుతున్నారు.అయితే ఇలాంటి శ్వాసకోశ సమస్యను నివారించాలంటే ప్రమాదకరమైన వాతావరణం లేదా రద్దీ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటేనే సాధ్యమని తేల్చి చెప్పారు వైద్యులు. అంతేగాదు అధికారులు సైతం ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉత్ఫన్నం కాకుండా నివారించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తులు చేపట్టారు.(చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..) -
జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..
అవమానాలు చీత్కారాల కారణంగా కొందరూ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన స్ఫూర్తిదాయకమైన కథలను చూశాం. అలా కాకుండా కలవారపాటుకు గురిచేసిన అనారోగ్య సమస్య ఆరోగ్యంపై బాధ్యతగా వ్యవహరించేలా చేసి బరువు తగ్గేందుకు కారణమైంది. ఆ స్ప్రుహే ఆ మహిళను 133 కిలోల నుంచి కనివిని ఎరుగని రీతిలో బరువు తగ్గేందుకు ప్రేరేపించింది. అలా ఆమె ఒక్క ఏడాదికే దాదాపు 40 కిలోల మేరు బరువు కోల్పోయి..గుర్తుపట్టలేనంతగా నాజుగ్గా మారిపోయింది. తనలాంటి బాధపడుతున్న వ్యక్తుల్లో స్ఫూర్తిని నింపేలా తన వెయిట్ లాస్ జర్నీ, డైట్ సీక్రెట్ల గురించి నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటంటే..టొరంటోలో నివసించే గురిష్క్ కౌర్ అనే బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఫిబ్రవరి 2024లో 133 కిలోలు మేర అధిక బరువు ఉండేది. అసాదారణమైన వెయిట్‌లాస్ జర్నీతో ఏకంగా 40 కిలోల మేర బరువు కోల్పోయి అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఈ ఏడాది జనవరి కల్లా 86.5 కిలోలకు చేరుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన వెయిట్ లాస్ జర్నీ గురించి వెల్లడించి ఇతరులు కూడా బరువు తగ్గేలా ప్రోత్సహిస్తోంది. ఆమె ఫిమేల్ ప్యాటర్న్గా పిలిచే ఆండ్రోజెనిక్ అలోపేసియా బారిన పడటంతో ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఆ డెసిషన్ ఆమెను బరువు తగ్గే దిశగా నడిపించింది. బరువుగా ఉన్నప్పుడూ..తాను ఎలా ఒత్తిడి, బలహీనమైన ఆత్మవిశ్వాసంతో బాధపడిందో కూడా వెల్లడించింది. కేవలం శారీరకంగా స్లిమ్‌గా మారడమే కాకుండా స్ట్రాంగ్‌గా తయారవ్వాలని నిర్ణయించుకున్నానని అందువల్లే ఇంతలా బరువు తగ్గినట్లు తెలిపారు కౌర్. అలాగే తన డైట్ సీక్రెట్ ఏంటో కూడా బయటపెట్టింది. బరువు తగ్గేలా చేసిన డైట్ ట్రిక్..ముందుగా పోషకాహారంపై సరైన అవగాహన ఉండాలి. లీన్ ప్రోటీన్ - గుడ్లు, చికెన్, తెల్ల చేప, టోఫు, టెంపే వంటి వాటిని తీసుకునేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నట్స్, గుమ్మడి, పుచ్చకాయ, అవిశె గింజలు, సలాడ్లు, వేయించిన కూరగాయలు తినండిచిలగడదుంపలు, రై బ్రెడ్, మల్టీగ్రెయిన్ రైస్ తీసుకోవాలిదీంతోపాటు ముఖ్యంగా 80/20 రూల్‌ని పాటించాలి80/20 రూల్ అంటే..?: 80 శాతం ఆరోగ్యకరమైనది, 20 శాతం నచ్చిన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలి డైట్‌ని. డైట్ మంత్ర: ఆకలి నియంత్రణలో ఉండేలా డైట్ ప్లాన్ ఉండాలి. ప్రధానంగా సమతుల్యమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేలా ఫుడ్ తీసుకుంటే ఎవ్వరైనా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గగలుగుతారని చెబుతున్నారు గురిష్క్ కౌర్. అన్ని కిలోలు ఉన్న ఆమె అంతలా బరువు తగ్గగలిగిందంటే..ఓ మోస్తారు అటు ఇటుగా ఉన్న మనందంరం మరింత సులభంగా బరువు తగ్గిపోగలం అనడంలో సందేహమే లేదు కదూ..!. View this post on Instagram A post shared by Gurishq Kaur (@gurishqkaur) (చదవండి: నోరూరించే పాప్‌కార్న్ డ్రెస్‌లో నటి ఎమ్మా స్టోన్..!) -
డిజైర్ డిజైన్స్..! మధ్యతరగతి వాళ్లు కూడా కొనేలా డైమండ్స్..
సౌందర్య రంగంలో వజ్రాలకు ఆదరణ, విలువ, గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విలాసవంతమైన జీవనానికి వజ్రాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం వంటివి ఎన్ని ఉన్నా వజ్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే చాలామందికి డైమండ్ రింగ్ కొనుగోలు చేయాలనే ఆశ ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్య తరగతి కుటుంబాల్లో కూడా వజ్రాలపై ఆసక్తి పెరిగింది. వీటన్నింటి దృష్ట్యా ల్యాబ్‌లో తయారు చేస్తున్న కృత్రిమ వజ్రాలు (ల్యాబ్‌గ్రోన్ డైమండ్స్)కు డిమాండ్ పెరిగింది. సహజమైన వజ్రాలు.. ప్రత్యేకంగా ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలు చూసేందుకు ఒకేలా ఉండటం వీటి ప్రత్యేకత. ధర కూడా తక్కువ ఉండటంతో వీటికి విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రకృతి ప్రసాదంగా లభించే వజ్రాలు చాలా అరుదైనవి, తక్కువగా దొరుకుతాయి. ఈ వజ్రాలు భూమి పొరల్లోని అంతర్భాగంలో తయారు కావడానికి సుమారు 1 నుంచి 3 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుందని పరిశోధకులు చెబుతారు. ఇంతటి అరుదైనవి కాబట్టే వజ్రాలకు ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో అచ్చం వజ్రాలను పోలినవి.. ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు అందుబాటులోకి రావడంతో వజ్రాల ప్రియులు అధికంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ వజ్రాలు కేవలం వారాలు, నెలల వ్యవధితో తయారు చేస్తున్నారు. సాధారణంగా ఈ రెండు రకాల వజ్రాలు శాస్త్రీయ రసాయణాల పరంగా ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ నాణ్యత, పదార్థ విశిష్టత దృష్ట్యా చాలా వ్యత్యాసం ఉంటుంది. వజ్రాల నిపుణులు, ఆభరణాల తయారీదారులు మాత్రమే వీటి మధ్య తేడాను గుర్తించగలరు. వీటి కటింగ్, పాలిషింగ్, సెట్టింగ్‌లో చాలా వైవిధ్యంతో పాటు శాస్త్రీయత పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సహజమైన వజ్రాలను కొనలేని వారు ఈ కృత్రిమ వజ్రాలపై మక్కువ చూపిస్తున్నారు. సహజ వజ్రాల్లో పరిమాణం పెరుగుతున్న కొద్దీ.. దాని క్యారెట్లను బట్టి ధర అంతకంతకూ పెరిగిపోతుంది. కానీ ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు తక్కువ ధరకే అదే పరిమాణంలో లభిస్తుండటం విశేషం. సహజ వజ్రాల కంటే ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు సుమారు 30 నుంచి 85 శాతం తక్కువ ధరల్లో లభిస్తుండటం విశేషం.అమాంతం పెరిగిన వ్యాపారం.. ఆర్థిక పరమైన అంశాలే కాకుండా సామాజికంగా సౌందర్య రంగంలోని వజ్రాల ప్రాధాన్యత వల్ల ఫ్యాషన్ రంగంలో కూడా ఈ డైమండ్స్‌కు మంచి ప్రచారం లభించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వజ్రాల వ్యాపారం అమాంతంగా పెరిగిపోయింది. ఈ వజ్రాల ప్రస్థానం 2000 సంవత్సరం నుంచి పుంజుకోగా.. ఐదేళ్ల నుంచి మరింత ఎక్కువగా పెరిగిందని బంజారాహిల్స్‌లోని ఓ వ్యాపారి తెలిపారు. మొదట్లో ఉత్తరాది ప్రాంతాలకు చెందినవారే వజ్రాలు అధికంగా కొనుగోలు చేసేవారు. కొన్ని ఏళ్లుగా హైదరాబాద్, బెంగళూరులో వీటి వ్యాపారం పుంజుకుందని సోమాజిగూడలోని మరో వజ్రాల వ్యాపారి పేర్కొన్నారు. ఇలాంటి కారణాలతో ప్రస్తుతం నగరంలో ల్యాబ్ గ్రోన్ వజ్రాలకు ప్రత్యేక స్టోర్లు ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ డైమండ్ బ్రాండ్లు సైతం వారి స్టోర్లలో ల్యాబ్ గ్రోన్ వజ్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సహజ వజ్రాలు, తయారు చేసిన వజ్రాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి నిపుణుల పరిశోధక పత్రాలు, డైమండ్ వెరిఫికేషన్ ఇన్స్ట్రుమెంట్ విధానాలను వినియోగిస్తున్నారు. వజ్రాన్ని కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత ప్రయోగశాలలో సర్టిఫికేట్కు అనుగుణంగా లేజర్‌తో టెక్నాలజీతో ధృవీకరిస్తారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కే క్రేజ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అమ్మకాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా మా స్టోర్‌లో గతేడాదిలో మరింత ఎక్కువగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో పెద్ద సైజుల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. పెద్ద సైజులో ఉండే సహజమైన వజ్రాలు కొనుగోలు చేయలేని వారు దాదాపు 50 నుంచి 90 శాతం తక్కువ ధరలకు లభించే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు వజ్రాల మధ్య తేడాలను ప్రయోగశాలలోని ప్రత్యేక పరికరాలు ఉంటే తప్ప ఎవరూ గుర్తించలేరు. స్థానికంగా నిశ్చితార్థాలకు ఈ డైమండ్స్ ఎక్కువగా కొంటున్నారు. పార్టీలు, ఫ్యాషన్ వేర్, విభిన్న డిజైన్ల కోసం కూడా ఆసక్తి చూపిస్తున్నారు. – స్వాతి షాగర్లమూడి, రీయా లైఫ్‌స్టైల్–మణికొండ (చదవండి: ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..వంద మందికి పైగా మనవరాళ్లు..) -
Parisha Pe Charcha: విక్రాంత్ మాస్సే, భూమి పడ్నేకర్ అమూల్యమైన సలహాలు..!
బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో సంభాషించే వార్షిక కార్యక్రమం ప్రధాని మోదీ 'పరీక్ష పే చర్చ' చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి కార్యక్రమం ఢిల్లీలోని ఐకానిక్ సుందర్ నర్సరీలో జరుగుతోంది. ఈ ఈవెంట్ ద్వారా విద్యార్థులకు పరీక్షలో ఒత్తిడిని ఎలా జయించాలి, పోషకాహారం ప్రాముఖ్యత తదితర వాటి గురించి ప్రధాని మోదీ తోపాటు పలువురు ప్రముఖులు సూచనలు ఇస్తారు. ఈ ఆదివారం ప్రసారమైన పరీక్షపై చర్చలో బాలీవుడ్ నటులు, విక్రాంత్ మూస్సే, నటి భూమి పడ్నేకర్ తమ అనుభవాలను షేర్ చేసుకోవడమే గాక విద్యార్థులకు అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు. అవేంటో చూద్దామా..!2023లో విడుదలైన 12th ఫెయిల్ చిత్రంతో విక్రాంత్ మాస్సే ఒక్కసారిగా సెలబ్రిటీ స్టార్‌గా మారిపోయారు. ఆ మూవీ విజయంతో విక్రాంత్ మాస్సే పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అప్పటి వరకు టెలివిజన్‌లో చిన్నపాత్రలతో పరిచయమైన వ్యక్తి ఒక్కసారిగా తనలోని విలక్షణమైన నటుడుని పరిచయం చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఆయన ఈ పరీక్ష పే చర్చలో విద్యార్థులను విజువలైజేషన్ పవర్‌పై సాధన చేయమని కోరారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు వంటి వాటిని దృశ్యమాన రూపంలో ఊహించడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరమవుతుందన్నారు. అలాగే మంచి మార్కులు తెచ్చుకున్నామనే గర్వాన్ని తలకెక్కించుకోవద్దు, ఆలోచనలను మాత్రం ఉన్నతంగా ఉంచుకోండి అని సూచించారు. కేవలం పరీక్షల కోసమే కాదు జీవితంలో ఉత్తీర్ణత సాధించడానికి చదవుకోండని చెప్పారు.అంచనాలను అందుకోలేకపోతే మరోసారి ప్రయత్నించి సాధించండి అని ప్రోత్సహించారు. ఇక మాస్సే తన అనుభవాలను షేర్ చేస్తూ..తాను మరీ ఇంటిలిజెంట్ విద్యార్థి కాకపోయినా.. మెరుగ్గానే చదివేవాడనని అన్నారు. తనకు ఆటలంటే మహా ఇష్టమని చెప్పారు. పరీక్షలకు కొన్ని రోజుల ముందే పుస్తకాలు తీసే వాడినని, ఆ టైంలో ఇంట్లో కేబుల్ కూడా డిస్కనెక్ట్ అయ్యేదని అన్నారు. దురదృష్టం ఏంటంటే నేటితరానికి ఆటల కంటే ఎక్కువ కాలక్షేపం మొబైల్ ఫోనే అంటూ విచారం వ్యక్తం చేశారు. అలాగే మన దేశానికి అత్యంత ఇష్టమైన క్రీడ క్రికెట్. దానికోసం ఒకరూ ఉండాలి అని అన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ సంభాషిస్తూ.. వర్తమానం అనేది భగవంతుడు ఇచ్చిన మంచి బహుమతి దాన్ని వదులుకోకూడదు అని చెప్పారు. అలాగే విక్రాంత్ విద్యార్థులను మీ డ్రీమ్ ఏంటన్నది తల్లిదండ్రులతో పంచుకోవాలని చెప్పారు. మొదట్లో అంగీకరించకపోయినా..వెనకడుగు వేయకుండా మీకు అదే ఎందుకు ఇష్టం అనేది చేతల ద్వారా అందులోని మీ స్కిల్‌ని, అభిరుచుని వ్యక్తపరిచమని సూచించారు. అప్పుడు తల్లిదండ్రులే తప్పక ఒప్పుకుంటారని అన్నారు. ఇక పరీక్షలకు ప్రిపేరయ్యేటప్పుడూ యోధుడిలా బాగా తినండి, బాగా విశ్రాంతి తీసుకోండి, మెరుగుపెట్టుకోండి(బాగా చదవడం) వంటి మూడు టెక్నిక్‌లు గుర్తించుకోండని అన్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పడ్నేకర్ తన అనుభవాన్ని షేర్ చేసుకుంటూ..తన తండ్రిని కోల్పోయిన ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ వయసులో దాన్ని అర్థం చేసుకునే పరిణితి తనకు లేదని అన్నారు. అలాంటి క్లిష్టమైన సమయంలో మనలోని బలాన్ని గుర్తించాలి, నేర్చుకోవడానికి మార్గాను అన్వేషించాలని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎప్పుడు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్‌ని కాదని, చదువుకు సంబంధంలేని యాక్టివిటీస్‌లో చురుకుగా ఉండేదాన్ని అన్నారు. ఆ టైంలోనే తాను నటిని కావాలని ఫిక్స్ అయ్యానని, అలాగే తల్లిలదండ్రులు సంతోషంగా గర్వంగా ఉండేలా తన నటన ఉండాలని భావించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆమె పరీక్షల సమయంలో 'విరామం' ప్రాముఖ్యతను చెబుతూ ఆ టైంలో మనకు నచ్చింది ఏదైనా చెయ్యమని చెప్పారు. అలాగే ఆ సమయంలో నాణ్యమైన నిద్ర కూడా ఉండాలని అన్నారు. ఇక పరీక్షల ఒత్తిడిని జయించేలా యోధుడిలా ఉండడి తప్ప చింతించే వ్యక్తిగా ఉండొద్దని చెప్పారామె. యోగా వంటి వాటితో ఏకాగ్రతను పెంపొందించడమే కాకుండా సులభంగా ఒత్తిడిని జయించగలుగుతారని అన్నారు. కాగా ఇంతకుమునుపు సెషన్లో బాక్సర్ మేరీ కోమ్, ఆధ్యాత్మికవేత్త సద్గురు, బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే వంటి ప్రముఖులు కూడా విద్యార్థులతో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.(చదవండి: ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..వంద మందికి పైగా మనవరాళ్లు..) -
ఇంజెంక్షన్ ఫోబియా: నాకిప్పుడు ఐదో నెల మరి ఎలా..?
నాకు ఇప్పుడు ఐదవ నెల. ఇంజెక్షన్స్ అంటే చాలా భయం. ఇప్పటి వరకు ఏ ఇంజెక్షన్ తీసుకోలేదు. ప్రెగ్నెన్సీ, కాన్పు సమయంలో తీసుకోవాలి కాబట్టి చాలా భయంగా ఉంది ఏదైనా సలహా చెప్పండి? – ప్రణతి, గుంటూరు. నీడిల్ ఫోబియా లేదా ఇంజెక్షన్ ఫోబియా అనేది మామూలే! ఇది ప్రతి పదిమందిలో ఒకరికి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఐదవ నెల, ఏడవ నెలలలో టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. కాన్పు సమయంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా, బ్లీడింగ్ కంట్రోల్‌కి ఇవి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే, భయం లేకుండా ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇంతకు ముందు, సూది గుచ్చినప్పుడు, రక్తాన్ని చూసిన అనుభవం ఉంటే, ఆ భయం అలాగే ఉండిపోతుంది. ఆ భయంతో కళ్లు తిరగటం, బీపీ, పల్స్ పెరగటం లేదా కళ్లుతిరిగి పడిపోవటం వంటివి జరగవచ్చు. ఇలా ఉన్నవారు ముందుగా నర్సింగ్ ష్టాఫ్, డాక్టర్‌కు తెలియజేయాలి. అప్పుడు కౌన్సెలింగ్ చేయటం, మీకు ఉన్న ఆప్షన్స్ చెప్పటం ద్వారా మీ భయాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. అనస్థీషియా డాక్టర్ని పిలిపించి, శరీరంలో ఏ ప్రాంతంలో నుంచి రక్తం తియ్యాలో ఆ ప్రాంతానికి స్పర్శ తెలియకుండా చేయడానికి అరగంట ముందుగా క్రీమ్స్ పూస్తారు. అప్పుడు నొప్పి తెలియకుండా సూది గుచ్చుతారు. అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మాటల్లో పెట్టి రక్త నమూనాలు తీయటం లాంటివి నర్స్ కూడా చేస్తారు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్‌తో స్లో బ్రీతింగ్ అలవాటు అవుతుంది. ఇది రోజుకు మూడుసార్లు ఒక వారం చేయాలి. ఇదే విధంగా రక్త నమూనాలు తీసే సమయంలో కూడా పాటిస్తే భయం ఉండదు. ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ కొన్ని పరీక్షలు చాలా అవసరం. మీకు పుట్టబోయే బిడ్డకు ఏ ఇన్ఫెక్షన్స్, సమస్యలు రాకుండా ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. అందుకే, ముందు నుంచి కౌన్సెలింగ్ సెషన్స్ తీసుకోవటం, డాక్టరును సంప్రదించటం, మీ భయాలను డాక్టర్‌కు ముందుగానే చెప్పటం చేయాలి. సీనియర్ నర్స్ లేదా అనస్థిటిస్ట్తో రక్త నమూనాలను తీయించుకోవటం లేదా ఐవీ లైన్ పెట్టించుకోవటం మంచిది. వీటితోపాటు బ్రీతింగ్ రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను పాటిస్తే, మీ భయం కొద్దికొద్దిగా తగ్గుతుంది.-డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...) -
మసాజ్ రోలర్: వయసు పైబడినట్లు కనిపడనివ్వదు..!
వయసు ప్రభావం చర్మంపై కనిపించకుండా ఉండాలంటే, మర్దనను మించినది లేదు. రకరకాల తైలాలతో శరీరాన్ని మర్దన చేసే పద్ధతులు పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఏ తైలాలను ఉపయోగించినా, ఇతర ద్రావణాలను ఉపయోగించినా, చర్మం లోలోతుల్లోకి చేరితేనే ఫలితం ఉంటుంది. ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకునేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన సాధనమే ఈ డెర్మా మసాజ్ రోలర్. మర్దనకు అవసరమైన తైలాలు లేదా సీరమ్‌లు నింపుకోవడానికి ప్రత్యేకమైన మినీకంటైనర్తో రూపొందిన ఈ పరికరం పైభాగంలో రోలర్ హెడ్‌కు అన్నివైపులా టిటానియం నీడిల్స్ ఉంటాయి. దీనిని చర్మానికి ఆనించి, మర్దన చేసుకునేటప్పుడు రోలర్ గుండ్రంగా తిరుగుతుంది. దాంతో దీనికి ఉన్న నీడిల్స్ చర్మాన్ని లోతుగా ఒత్తి, రక్తనాళాలను ఉత్తేజితం చేస్తాయి. ఈ రోలర్‌తో ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకోవచ్చు. ఇది ఎలాంటి నొప్పిని కలిగించదు. నుదురు, బుగ్గలు, ముక్కు, పెదవులు, గడ్డం, చేతులు, పొట్ట వంటి భాగాల్లో ఈ రోలర్‌తో కావలసిన నూనె లేదా సీరమ్ ఉపయోగించి, మర్దన చేసుకోవచ్చు. ఇది కేశసంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. తలపై కూడా దీనితో మర్దన చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని వినియోగించిన తర్వాత రోలర్‌ను, కంటైనర్‌ను వేరుచేసి, శుభ్రం చేసుకున్న తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచి, ఆరబెట్టుకోవాలి. ఈ రోలర్‌తో ట్రాన్స్పరెంట్ క్యాప్ లభిస్తుంది. వాడకం పూర్తయ్యాక రోలర్‌కు క్యాప్ పెట్టుకున్నట్లయితే, దీనిపై దుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి. (చదవండి: హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...) -
హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...
ఏదైనా వ్యాధి సోకితే మానవుల్లోని వ్యాధి నిరోధక శక్తి / వ్యవస్థ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటాయి. అయితే... ఎయిడ్స్ వ్యాధి ప్రత్యేకత ఏమిటంటే... అది దేహంలోని జబ్బుల్ని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తినే దెబ్బతీస్తుంది. దాంతో చిన్న చిన్న సాంక్రమిక వ్యాధులకే బాధితులు తేలిగ్గా లొంగిపోతారు. హెచ్ఐవి వైరస్ క్రిమికి ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాల కారణంగా సమీప భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ రూపొందే పరిస్థితి లేదు. అయినప్పటికీ 25 రకాల ఏంటి రెట్రో వైరల్ ఔషధాల తోపాటు ఓ ఇంజెక్షన్‌తో ఈ వ్యాధిని నివారించడం సాధ్యమేనని తేలింది. ఇది ఇంచుమించూ టీకాలాగే పనిచేస్తూ జబ్బు బారిన పడకుండా చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం. హెచ్ఐవీకి టీకా రూపొందించడానికి అనేక సాంకేతిక ప్రతిబంధకాలు ఉన్నాయి. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే... ఏదైనా టీకాను అభివృద్ధి చేస్తే... అది ఆ వ్యాధి నుంచి రక్షణ కల్పించేలా ‘వ్యాధి నిరోధక వ్యవస్థ’ను ప్రేరేపితం చేస్తుంది. కానీ ఈ వైరస్ మానవ వ్యాధి నిరోధక వ్యవస్థలోని కీలక కణాలైన సీడీ4 లింఫోసైట్స్ తదితర కణాల జీన్స్‌లో కలిసిపోతుంది. దాంతో ఇన్ఫెక్షన్ శాశ్వతమైపోయి వ్యాధి నిరోధక వ్యవస్థే కుప్పకూలిపోయి, దీర్ఘ కాలంలో ఎయిడ్స్ వస్తుంది. అందుకే ఎయిడ్స్‌కు టీకా అభివృద్ధి చేయడం సాధ్యం కా(లే)దు. అయినప్పటికీ హెచ్ఐవీని నిరోధించేందుకు పరిశోధనలింకా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇంజెక్షన్‌తో విప్లవాత్మక మార్పు... గతేడాది అంటే... 2024 జూలైలో దక్షిణ ఆఫ్రికాకి చెందిన పరిశోధకులు డాక్టర్ లిండా గేయిల్ బెక్కర్ తదితరులు... హెచ్ఐవీని నిరోధించడానికి ప్రీఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్గా ఓ సరికొత్త ఇంజక్షన్ ‘లెనకపావిర్’ సమర్థంగా పనిచేస్తుందని ప్రకటించారు. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన ప్రయోగంలో... తమ భర్తలకు హెచ్ఐవీ పాజిటివ్ ఉండి... తాము మాత్రం నెగెటివ్ అయిన ఓ 3204 మంది మహిళలకు (అంటే... సీరో డిస్కార్డెంట్ విమెన్‌కు) టెనొఫోవిర్, ఎమ్ ట్రైసిటాబైన్ అనే మందులు ఇచ్చారుగానీ వారిలో 35 మందికి హెచ్ఐవీ సోకింది. ఇక మరో ప్రయోగంలో మరో 2134 మంది సీరో డిస్కార్డెంట్ మహిళలకి సరికొత్త ఔషధం అయిన లెనకపావిర్ (927 మిల్లీగ్రాముల) ఇంజక్షన్స్ ని ఆరు నెలలకు ఒకటి చొప్పున, ఏడాదిలో రెండు ఇంజెక్షన్స్ ఇచ్చారు. వీళ్లలో ఒక్కరికి కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ సోకలేదు. దీంతో హైరిస్క్ గ్రూపుల్లో, అంటే... భర్త హెచ్ఐవి పాజిటివ్ అయి, భార్య నెగిటివ్‌గా ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంజక్షన్స్‌తో ఎయిడ్స్‌ను సమర్థంగా నివారించవచ్చని తేలింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లెనకపావిర్ ఇంజక్షన్ తాలూకు ఒక్క మోతాదు ఆరు నెలలపాటు రక్షణ ఇస్తుండడంతో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి ఈ ఇంజెక్షన్‌ను వాక్సిన్ (టీకా) తరహాలోనే ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అసలీ లెనకపావిర్ కాప్సిడ్ ఇన్హిబిటర్ ఎలా పనిచేస్తుదంటే... హెచ్ఐవీ తాలూకు జీన్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్... ఈ అన్నింటినీ కలిపి ‘కోర్’ (న్యూక్లియో కాప్సిడ్) అంటారు. ఈ ‘కోర్’ని కలిపి ఉంచే ఒక సంచి వంటి నిర్మాణమే కాప్సిడ్. ఈ క్యాప్సిడ్ మూలంగానే హెచ్ఐవి తాలూకు ‘కోర్ ’కు ఓ శంఖువు లాంటి ఆకృతి వస్తుంది. ఈ కోర్ తాలూకు ప్రోటీన్‌నే ‘పీ 24 ఏంటిజెన్’గా పిలుస్తారు. ఇన్ఫెక్షన సోకిన తొలివారాల్లో దీన్ని గుర్తించడానికి ప్రత్యేక టెస్ట్‌లు ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లెనాకపావిర్ అనేది ‘కాప్సిడ్ ఇన్హిబిటర్ ’ ఔషధం. అంటే... వైరస్ సంక్రమించే సందర్భంలో కాప్సిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు... న్యూక్లియస్ క్యాప్సిడ్ లోని భాగాలు ‘కోర్’గా మారి, దాని చుట్టూ సంచి వంటి కాప్సిడ్ ఏర్పడకుండా అడ్డుతుంది. అంతేకాదు... హెచ్ఐవీ జన్యువుల్లోని అణువులను అది మానవుల కణాల్లోకి విడుదల కాకుండా అడుకట్ట వేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ ఇంజెక్షన్ హెచ్ఐవీ లోని జన్యువులను మనిషి జీన్స్‌లో కలిసే ప్రక్రియని అడ్డుకుంటుందని చెప్పవచ్చు. లెనాకపావిర్ ప్రత్యేకతలివి... ఇప్పటివరకు ఉన్న యాంటీ రెట్రోవైరల్ మందులు... హెచ్ఐవీ సోకి అది మానవుల్లో వృద్ధి చెందే దశల్లోని ఏదో ఒక దశలో మాత్రమే అడ్డుకొంటాయి. అయితే లెనాక΄ావిర్ మాత్రం హెచ్ఐవీ క్రిమి వృద్ధి చెందడాన్ని మూడు దశలలో అడ్డుకుంటుంది. అంతేకాదు... ఈ మందు ఆర్నెల్ల పాటు పనిచేస్తుంది. అంటే ఏడాదికి రెండు ఇంజెక్షన్లతోనే ఏడాదంతా హెచ్ఐవీ / ఎయిడ్స్ రాకుండా చూస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే... ముందుగా ఓ టీకా, ఆర్నెల్ల తర్వాత ఓ బూస్టర్ డోస్ ఎలా పనిచేస్తాయో, ఈ ఇంజెక్షన్ తాలూకు రెండు మోతాదులు అదే పనిచేస్తాయి. పైగా హెచ్ఐవీ బాధితులకు ఇప్పుడు అనేక మందుల్ని రకరకాల కాంబినేషన్లలో వాడుతుంటారు. మందులు పెరుగుతున్న కొద్దీ హెచ్ఐవి క్రిమి వాటికి రెసిస్టెన్స్ పెంచుకుని, వాటికి లొంగకుండా తయారయ్యే అవకాశాలెక్కువ. అలాంటి వారిలో లెనకపావిర్ను ఏదో ఒక మందుతో కలిపి వాడుతున్నారు. ఈ రకంగా చూసినప్పుడు కూడా లెనకపావిర్ అనే ఈ ఇంజెక్షన్ ఎయిడ్స్ బాధితుల పాలిట ఆశారేఖగా నిలుస్తోంది.అదుపునకు కొన్ని మార్గాలివి...కండోమ్స్, డిస్పోసబుల్ సిరంజీల వాడకం తోపాటు, బ్లడ్ బ్యాంకులలో హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయడం వల్ల హెచ్ఐవీ వ్యాప్తిని కొంతమేరకు అదుపు చేయడం సాధ్యమైంది. అయితే ఈ జబ్బుకు గురయ్యేందుకు అవకాశమున్న అనేక వర్గాలకు ముందుగానే ఇచ్చేలా ‘ప్రీ ఎక్సపోజర్ ప్రొఫైలాక్సిస్’ (ప్రెప్ ) వంటి ప్రక్రియలూ, అలాగే ఈ జబ్బు ఉన్న వారికి సేవలు చేసే సందర్భాలలో ప్రమాదవశాత్తు జబ్బు వచ్చే అవకాశం ఉన్న డాక్టర్లు, నర్సుల వంటివారికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్’ (పెప్)ల వంటి ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. (చదవండి: సార్కోమాను ఎదుర్కోలేమా!) -
సార్కోమాను ఎదుర్కోలేమా!
దేహంలోని సూక్ష్మ కణజాలానికి వచ్చే ఆరు రకాల ప్రధాన కేన్సర్లలో ‘సార్కోమా’ ఒకటి. సార్కోమాను త్వరగా కనుగొంటే మనుగడ రేటు 81 శాతం. అంటే... దీన్ని ఎంత త్వరగా కనుక్కుంటే అంతగా దాన్ని అంతగా అరికట్టవచ్చని తెలుస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో సార్కోమాను చాలా ఆలస్యంగా కొనుగొంటుండటం వల్ల పొరుగునే ఉన్న ధనిక దేశాలతో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు ఎక్కువే. ఈ నేపథ్యంలో సార్కోమా గురించి తెలుసుకుందాం. ఎముక చివరన ఉండే మృదులాస్థి అయిన కార్టిలేజ్కూ, టెండన్స్కూ, కండరాలకూ, ఇక అక్కడి కొవ్వు కణజాలాలలో కనిపించే కేన్సర్లకు ఇచ్చిన ఒక కామన్ పేరు ‘సార్కోమా’. అంటే శరీరంలో ఉండే ఎముకకు గానీ లేదా దాని సపోర్టివ్ కనెక్టివ్ కణజాలానికి వచ్చే చాలా రకాల కేన్సర్లన్నింటికి ఇచ్చిన కామన్ పేరు ఇది. ఇది శరీరంలో ఎక్కుడైనా రావచ్చు... అయితే ప్రధానంగా చేతులు, కాళ్లూ, ఛాతీభాగంలో, పొట్ట భాగంలో ఈ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. సార్కోమాలో మళ్లీ దాదాపు 70 రకాల సబ్టైప్స్ ఉంటాయి. ఈ కేన్సర్ ఉద్భవించే మౌలికమైన కణాలు, వాటి ప్రవర్తన, లక్షణాలు... వీటన్నింటిని బట్టి సార్కోమాను రెండు ప్రధానమైన పెద్ద సబ్టైప్స్గా విభజించారు. వాటిల్లో... మొదటిది ‘సాఫ్ట్ టిష్యూ సార్కోమా’, రెండోది ఎముకలకు సంబంధించిన ‘బోన్ సార్కోమా’. రిస్క్ ఫాక్టర్లు (ఈ ముప్పును తెచ్చిపెట్టే అంశాలు)... ఇటీవలి కొత్త పరిశోధనల ప్రకారం... హానికరమైన పరిశ్రమల్లో లేదా ప్రమాదకరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయ్యేలాంటి చోట్ల పనిచేసేవారిలో ఈ సార్కోమా కేన్సర్లు ఎక్కువగా వస్తున్నట్లు కనుగొన్నారు. ఉదాహరణకు ప్లాస్టిక్ పరిశ్రమల్లో పనిచేసేవారు వినైల్ క్లోరైడ్ లేదా డయాక్సిన్స్ అనే హానికరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కాలేయానికి వచ్చే యాంజియోసార్కోమా వంటి క్యాన్సర్లు కనిపిస్తుంటాయి. అలాగే పురుగు మందులు, కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించే మందుల (హె ర్బిసైడుల) కారణంగా వ్యవసాయ కూలీల్లోనూ, వ్యర్థాలను తొలగించే కార్మికుల్లోనూ సార్కోమా బాధితులు ఎక్కువ. ఇక పిల్లల్లో... వారి ఎదుగుదల అనే అంశమే సార్కోమాలు కనిపించడానికి కారణమవుతుంది. వారు ఎదిగే క్రమంలో జరిగే వేగవంతమైన కణవిభజనల్లో ఎక్కడైనా లోపం జరిగాక... ఆ లోపభూయిష్టమైన కణం నుంచి పెరిగే కణజాలం అపరిమితంగా పెరుగుతూపోతూ సార్కోమాకు దారితీయవచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్యాలతో కూడిన పర్యావరణం, గతంలో ఏవైనా కారణాల వల్ల రేడియోథెరపీ తీసుకోవాల్సిన రావడం వంటివి సార్కోమా ముప్పును మరింతగా పెంచే అంశాలు. అలాగే ‘లి–ఫ్రౌమెనీ సిండ్రోమ్’ వంటి సిండ్రోములు, జెనెటిక్ మ్యూటేషన్లు కూడా సార్కోమాకు కారణమవుతుంటాయి. నిర్ధారణ... సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ టెక్నిక్స్ సార్కోమాలను కనుగొనడంలో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఎక్కడో పుట్టిన మూల కేన్సర్... అటు తర్వాత మరో చోటకు చేరి అక్కడ పెరగడాన్ని (మెటాస్టేటిస్ను) కనుగొనడంలోనూ ఈ ఇమేజింగ్ ఉపకరణాలు సహాయపడతాయి. మృదు కణజాలంలో (సాఫ్ట్ టిష్యూల్లో) వచ్చే కేన్సర్ గడ్డలను ఎమ్మారై వంటి వాటితో కనుగొనడానికీ, రేడియోషన్ దుష్ప్రభావాలను వీలైనంతగా తగ్గించి ఉపయోగించే రేడియో టెక్నిక్స్ అయిన అలారా (ఏజ్ లో ఏజ్ రీజనబ్లీ అచీవబుల్) టెక్నిక్‌తో సురక్షితంగా సార్కోమాలను కనుక్కోడానికీ. ఇక పెట్–సీటీ, రేడియోమిక్స్ వంటి అధునాతన టెక్నిక్స్‌తో అవి హానికరం కాని బినైన్ గడ్డలా లేక హానికరమైన మేలిగ్నెంట్ లీజన్సా అన్న అంశాలను కనుగొనడానికి ఆస్కారం ఉంది. చికిత్సలు / అధునాతన చికిత్సా పద్ధతులు... అధునాతమైన శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా అలాగే రేడియేషన్ థెరెపీ వంటి అంశాల్లో చోటు చేసుకున్న వినూత్న పద్ధతుల ద్వారా సార్కోమాకు చికిత్స అందించడం ఇప్పుడు సాధ్యం. బాధితుల కాళ్లు, చేతులను తొలగించకుండానే చేసే శస్త్రచికిత్సలు (లింబ్ స్పేరింగ్ సర్జరీస్), ఒకవేళ అలా తొలగించాల్సి వస్తే వారికోసమే రూపొందించిన (పేషెంట్ స్పెసిఫిక్ ఇం΄్లాంట్స్)తో... ఆ తొలగించిన చోట ఇంప్లాంట్స్ అమర్చుతూ అవయవాలు కోల్పోకుండా చేసే టెక్నిక్లిప్పుడు అందుబాటులో అత్యంత ఆధునికమైన ప్రోటాన్ థెరపీ, ఐఎమ్ఆర్టీ (ఇంటెన్సిటీ మాడ్యూలేటెడ్ రేడియేషన్ థెరపీ) వంటి అత్యాధునిక రేడియేషన్ పద్ధతులతో చుట్టుపక్కల ఉండే కణజాలానికి హానికలగకుండా లేదా తక్కువ హాని కలిగేలా చేసే రేడియోథెరపీ. రకరకాల మందుల కాంబినేషన్లతో ప్రభావపూర్వకమైన కీమోథెరపీ. ఇవేకాకుండా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీల వంటి వాటితో జెనెటిక్ మ్యూటేషన్ల వల్ల వచ్చిన సార్కోమాలను నయం చేయడానికి ఆస్కారం. కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్న కార్–టీ సెల్ థెరపీల వంటి వాటి సహాయంతో మునుపు అంతగా లొంగని సార్కోమా కేన్సర్లను మరింత ప్రభావపూర్వకంగా చికిత్స అందించే వీలుంది. --డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్, మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: కోళ్ల అందాల పోటీలు..!) -
కొత్త.. రుచుల కోకా కట్టుకున్నదీ పేట..
ఒకప్పుడు తెంగాణలోని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంగా ఉన్న కోకాపేట్ ఇప్పుడు ఐటీ నిపుణుల ప్రవాహంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కార్పొరేట్ కల్చర్‌కు తోడు స్కై స్క్రాపర్స్, అపార్ట్మెంట్లు, విల్లాలు నగరానికి విలాసవంతమైన కేంద్రంగా మారుతోంది. దీంతో ఉన్నతస్థాయి ఫైన్–డైనింగ్ రెస్టారెంట్ల నుంచి కేఫ్స్, స్ట్రీట్ ఫుడ్ వరకూ ఇక్కడ అందుబాటులోకి వచ్చేశాయి. రుచికరమైన భోజనం, స్పీడ్ బ్రేక్ ఫాస్ట్, అల్పాహారం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే అధునాతన కేఫ్ కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి తప్పకుండా సిద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు కొన్ని తినుబండారాలకే పరిమితమైన ఈ ఏరియాలో ఇప్పుడు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ట్రెండీ కేఫ్‌లు మాత్రమే కాదు స్ట్రీట్ఫుడ్లతో డైనమిక్ మిక్స్‌గా రూపాంతరం చెందింది. కోకాపేట్లో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా ఫుడ్ బ్రాండ్స్ ఇక్కడకు విస్తరిస్తున్నాయి, వినూత్న మెనూలను మోసుకొస్తున్నాయి. సంప్రదాయ రుచులు ఆధిపత్యం చెలాయించే నగరంలోని మరికొన్ని సంప్రదాయ ప్రాంతాల వలె కాకుండా, కోకాపేట్లో మల్టీ క్యుజిన్ రెస్టారెంట్లు, ఆర్టిసానల్ బేకరీలు ప్రయోగాత్మక ఫ్యూజన్ కిచెన్లు స్థానిక కాస్మోపాలిటన్ కల్చర్‌ను ప్రతిబింబిస్తాయి. వీకెండ్ బ్రంచ్ స్పాట్లు, రూఫ్‌టాప్ డైనింగ్ అనుభవాలు, లేట్–నైట్ డెజర్ట్ కేఫ్‌లు కూడా ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయి, ఇవి యువ వృత్తి నిపుణుల జీవనశైలికి అద్దం పడుతున్నాయి. ఇవి డైన్–ఇన్ స్పేస్‌లకు మాత్రమే పరిమితం కాలేదు–క్లౌడ్ కిచెన్స్‌తో డెలివరీ–మాత్రమే కలిగిన బ్రాండ్లు కూడా ఇక్కడ తగిన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇవి ఇంటి నుంచి పని చేసేవారికి ప్రయాణంలో ఉన్న వారికి అవసరమైన సేవలు అందిస్తాయి. కోకాపేట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న వైవిధ్యమైన దాని నానాటికీ విస్తరిస్తున్న ఆహార సంస్కృతికి నిదర్శనం. కోకాపేట్ ప్రసిద్ధ బ్రాండ్ల మిశ్రమానికి నిలయంగా ఉంది. కోకాపేట్‌లోని కరాచీ కేఫ్, రోస్టరీ కాఫీ హౌస్, కేఫ్ శాండ్‌విచో, ప్రెజ్మో, కేఫ్ ట్వంటీ వన్, క్రెమా కేఫ్, రిఫ్లెక్షన్స్.. వంటి టాప్ కేఫె బ్రాండ్స్.. (చదవండి: వయసు 14 ఏళ్లే.. కానీ లక్ష మొక్కలు నాటింది..!) -
వయసు 14 ఏళ్లే.. కానీ లక్ష మొక్కలు నాటింది..!
‘ప్రసిద్ధి సింగ్’ను ‘చెట్ల అమ్మాయి’ అని పిలవొచ్చు. ఎందుకంటే ఎక్కడ ప్రసిద్ధి ఉంటే అక్కడ ఒక చెట్టయినా ఊపిరి పోసుకుంటుంది. తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 14 ఏళ్ల ప్రసిద్ధి ఇప్పటికి లక్ష మొక్కలు నాటిందంటే నమ్ముతారా? కాని నిజం. ఇటీవల కేరళలో నిర్వహించిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ తన లక్ష్యం పది లక్షల మొక్కలు నాటడం అని తెలిపి అందరిలో స్ఫూర్తి నింపింది. 2016లో ప్రసిద్ధికి ఆరేళ్లు ఉన్నప్పుడు తుపాను వారి ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. అనేక చెట్లు నేలకూలాయి. ఆ వయసులోనే ప్రసిద్ధి నేలకూలిన మొక్కలను చూసి బాధపడింది. తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడితే ఉత్సాహంగా తనూ పాల్గొంది. రెండేళ్లపాటు తమిళనాడులోని రకరకాల ప్రాంతాలకు వెళ్లి మొక్కలు నాటింది. నాటే కొద్ది ఆ అమ్మాయికి మొక్కల కోసం పని చేయాలనిపించి లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. ఆ వయసులో అది సాధ్యమా అని ఎవరైనా తనని అడిగితే, ‘చిన్న కొవ్వొత్తి ఇంటికంతా వెలుగు ఇవ్వడం లేదా? ఇది కూడా అంతే. సంకల్పం బలంగా ఉంటే తప్పక సాధ్యమవుతుంది’ అని చెప్పేది. ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొని మరికొంతమందిని కలుపుకొని ‘ప్రసిద్ధ ఫారెస్ట్ ఫౌండేషన్’ ప్రారంభించింది. అందులో కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధుల కోసం తోటి పిల్లలకు పెయింటింగ్, యోగా నేర్పేంది. అలా వచ్చిన డబ్బుతో కార్యక్రమాలు నిర్వహించేది. ఈ క్రమంలో ఎన్నో పాఠశాలలకు వెళ్లి, అక్కడి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు అనుమతి కోరింది. ఇంత చిన్నపిల్ల ఏం చేస్తుందా అని వారు ఆశ్చర్యపోయినా, తనకు అవకాశం ఇచ్చేవారు. అలా అనేక పాఠశాలల్లో మొక్కలు నాటింది. మెల్లగా తన గురించి అందరికీ తెలిసింది. తన సంకల్పానికి మరికొందరు తోడయ్యారు. అలా ఇప్పటికి 110 ప్రాంతాల్లో 1.3 లక్షల కంటే ఎక్కువ మొక్కలు నాటింది. పర్యావరణం కోసం, అడవుల సంరక్షణ కోసం ఆమె చేస్తున్న పనికి మెచ్చుకుంటూ 2021లో పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించారు. తమిళనాడు వాతావరణ సదస్సు 3.0లో ఆమెను చైల్డ్ ఛాంపియన్ స్పీకర్‌గా యునిసెఫ్ గుర్తించింది. త్వరలో తమిళనాడులోని 200 పాఠశాలల్లో ’Green Brigade’ కార్యక్రమం మొదలుపెట్టి, విద్యార్థులకు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి, వారిని అందులో భాగస్వాములను చేయనుంది. (చదవండి: స్టైల్గానే కాదు అందంగా నాజుగ్గా కనపడాలంటే..!) -
స్టైల్గానే కాదు అందంగా నాజుగ్గా కనపడాలంటే..!
ఆహార పథ్యాలు, వ్యాయామాలతోనే కాకుండా కొన్ని రకాల చిట్కాలని అనుసరించడం ద్వారా కూడా సన్నగా, నాజూకుగా కనపడవచ్చు. అదెలాగంటే ఫ్యాషన్ అనేది స్టైల్’గా మాత్రమే కాకుండా నాజూగ్గా... అందంగా కనపడేలా కూడా చేస్తుంది. ఇందుకోసం చేయవలసిందల్లా శరీరంలో మీకు సమస్యగా అనిపించే ప్రాంతాలను గుర్తించడమే– అది మీ నడుము భాగమా లేదా మీ తొడలలో లేదా మీ పిరుదులలో సమస్యగా ఉందా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం మీ గదిలో ఏకాంతంగా అద్దం ముందు నిల్చుని ప్రతి శరీర భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని, లోపాలను దాచి పెట్టుకోటానికి ప్రయత్నించాలి. లేదంటే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం తీసుకోవడంలో తప్పు లేదు. శరీరంలోని ఈ భాగాలు శరీరం కన్నా పెద్దగా కనపడకుండా చూసుకోవాలి.మనం తీసుకునే ఆహారం శారీరక ఎదుగుదలకే కాదు, మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు మనసును నిరుత్సాహంగా మార్చితే, కొన్నిరకాల ఆహారాలు మనసును ఉత్తేజపరుస్తాయి. కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఫీల్‌గుడ్ హార్మోన్. అందుకే మన రోజువారీ ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మితిమీరిన చక్కెర స్థాయులు లేని కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మంచిది. తిన్న తర్వాత త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ఆహారానికి బదులుగా కూరగాయలు, బీన్స్, పొట్టు తీయని ధాన్యాలను తీసుకోవాలి.క్యారట్ శరీరంలో రక్తాన్నే కాదు... ఆ రక్తంలో ప్లేట్లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని సర్వేలో తేలింది. క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.ఆయుర్వేదం ప్రకారం భోజనం చివరిలో నెయ్యి, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ సవ్యంగా సాగుతుంది. శరీరంలోని వ్యర్ధాలన్నీ బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా జీవశక్తి పెరుగుతుంది. నెయ్యి, బెల్లం రెండిట్లోనూ పోషక ప్రయోజనాలు ఎక్కువే. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఎముకల ఆరోగ్యాన్ని పెంచి, రోగనిరోధక శక్తిని కూడగడితే, బెల్లంలో మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల భోజనానంతరం నెయ్యి, బెల్లం తినడం వల్ల శరీరానికి కావలసిన ఇతర ΄ోషకాలు పుష్కలంగా అందుతాయి. ΄ోషకాహార లోపం రాకుండా శరీరం సవ్యంగా పనిచేస్తుంది. అయితే, తినమన్నారు కదా అని పెద్ద పెద్ద ముక్కలు తినేయకూడదు. చిన్న ముక్క తింటే చాలు. (చదవండి: సిట్ రైట్: సరిగ్గా కూర్చుందాం ఇలా..!) -
సిట్ రైట్: సరిగ్గా కూర్చుందాం ఇలా..!
ఇటీవల డాక్టర్ల దగ్గరకు వస్తున్న కేసుల్లో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, మెడ నొప్పి, తలనొప్పి ప్రధానంగా కనిపిస్తున్నాయి. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, వెన్ను కింది భాగం (లోవర్ బ్యాక్) నొప్పికేసులను నిశితంగా పరిశీలించిన స్పైన్ స్పెషలిస్ట్‌లు నూటికి ఇరవై శాతం వరకు ఈ రకమైన వెన్నునొప్పులకు బ్యాడ్ సిట్టింగ్ కోశ్చర్లే కారణమని చెబుతున్నారు. నాణ్యత లోపించకుండా క్వాలిటీ వర్క్ ఇవ్వడంలోనూ కూర్చునే భంగిమ పాత్ర కీలకమే. అందుకే సరిగ్గా కూర్చుందాం. ఇలా కూర్చోవాలికుర్చీలో కూర్చున్నప్పుడు భుజాలు, బట్ భాగం కుర్చీ వెనుక భాగాన్ని తాకాలి. బట్ భాగం కుర్చీని తాకని పక్షంలో కుర్చీ మార్చుకోవడం లేదా కుషన్ అమర్చుకోవడం మంచిది. అరగంటకొకసారి కదిలి కూర్చున్న భంగిమకు విశ్రాంతినిచ్చి తిరిగి సరైన తీరులో కూర్చోవాలి. కథల్లో వర్ణించినట్లు విశ్రాంతిగా కుర్చీలో జారగిలపడి కూర్చోవడం అనే భంగిమలో గంటలసేపు ఉండకూడదు, దేహం సాంత్వన పొందే రెండు–మూడు నిమిషాల సేపు మాత్రమే ఉండాలి. అరగంట, గంట పనికి ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేస్తే ఫర్వాలేదు. కానీ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ల్యాప్‌టాప్‌ను కూడా డెస్క్ మీద ఉంచి పని చేయడమే కరెక్ట్. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వాళ్లు అబ్డామినల్ స్ట్రెంగ్త్ కోసం రోజూ అరగంట పాటు ఎక్సర్సైజ్ చేయాలి. ఇందుకోసం పెద్ద బాల్ మీద కానీ కుర్చీలో కానీ కూర్చోవాలి. ఈ భంగిమలో పాదాల మధ్య అడుగు దూరం ఉంచాలి. గాలి వదులుతూ కుడి మోకాలిని ఫొటోలు చూపినట్లు పైకెత్తాలి, అదే సమయంలో ఎడమ చేతిని కూడా పైకెత్తాలి. మెల్లగా మామూలు స్థితికి రావాలి. రెండవసారి అదేవిధంగా ఎడమ మోకాలు, కుడిచేత్తో చేయాలి. ఇలా కనీసం పదిసార్లు చేస్తుంటే... కూర్చున్న భంగిమలు సరిలేని కారణంగా ఎదురయ్యే అవాంఛిత ఒత్తిడుల నుంచి దేహం సాంత్వన పొందుతుంది. కడుపు కండరాలు, అంతర్గత అవయవాలు శక్తిమంతమవుతాయి. -
ఇది సుమచరితం..! రెండు దేశాల సంస్కృతుల సమ్మేళ్లనం
పూల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని పుస్తకాలు రాసినా రాయడానికి ఇంకా ఉంటుంది. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన ఫ్లవర్ ఆర్ట్. ఇకబెనాలో చేస్తున్న సేవకి గాను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’ అందుకున్నారు రేఖారెడ్డి. జపాన్ ఫ్లవర్ ఆర్ట్‌ను భారతీయ చేనేతకళతో సమ్మిళితం చేస్తూ తన ‘లూమ్స్ అండ్ బ్లూమ్స్, పెటల్స్ అండ్ ప్యాలెట్, మిశ్రణం’ రచనలను పరిచయం చేశారు రేఖారెడ్డి. పువ్వులు, రంగులు జీవితంలో భాగం. లైఫ్ కలర్ఫుల్గా ఉంచుకోవడం తోపాటు సుమభరితంగానూ ఉండాలి. భారతీయ సంస్కృతి పూలు ఆస్వాదనకు, ఆడంబరానికి, రసమయమైన, విలాసవంతమైన జీవితానికి ప్రతీకలు. అలాగే దైవానికి చేసే నిత్యపూజలో పూలది ప్రధానపాత్ర. మన పూల అలంకరణ ఈ తీరులోనే ఉంటుంది. జపాన్ వాళ్లు మాత్రం తాము అనుసరించే నిరాడంబర జీవనశైలిలో పూలతో ఆధ్యాత్మికపథం నిర్మిస్తారు. బౌద్ధం నుంచి నేర్చుకున్న వైరాగ్యతను పూల అలంకరణ ద్వారా నిత్యధ్యానం చేస్తారు. మనిషి జీవితాన్ని పువ్వుతో పోలుస్తారు. త్రికోణాకారపు అమరికలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపం ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్. ఒక మొగ్గ, ఒక అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలు. మనిషి జీవన చక్రానికి ప్రతీక. ఫ్లవర్ అరేంజ్మెంట్ కూడా ధ్యానం వంటిదే. ఒకరు దేవుని ముందు కూర్చుని ధ్యానం చేస్తారు. ఒకరు ప్రకృతి ఒడిలో ధ్యానం చేస్తారు. రోజూ కొంత సమయం ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో నిమగ్నమైతే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ధ్యానం తర్వాత కలిగే అలౌకిక ఆనందం వంటిదే ఇది కూడా. ఇరు దేశాల సంస్కృతుల సమ్మేళనం జపాన్ సంస్కృతిలో భాగమైన ఇకబెనాలో భారతీయ సంస్కృతిని మమేకం చేస్తూ పసుపుకుంకుమలతో పరిపూర్ణం చేశారు. ‘బ్లూమ్స్ అండ్ లూమ్స్’ కాన్సెప్ట్ జపాన్ ఇకబెనాను భారతీయ చేనేతతో సమ్మిళితం చేయడం. ‘మిశ్రణం’లో మన ఆహారంలో ఉన్న పోషకాలు – జపాన్ పూల అలంకరణతో అనుసంధానం చేయడం. పెటల్స్ అండ్ ప్యాలెట్స్లో పూలు– రంగుల మధ్య విడదీయలేని బంధాన్ని వర్ణించారు. రెండు దేశాల సంస్కృతుల సమ్మేళనమే ఇవన్నీ. స్టేజ్ టాక్‌లో ఆతిథులను సమ్మోహనపరిచిన ఈ ప్రయోగాలే ఆమెను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’కు ఎంపిక చేశాయి. (చదవండి: -
ముఖంలోని డల్‌నెస్‌ని తరిమేద్దామిలా..!
పర్యావరణ కాలుష్యం కారణంగా పెద్దవాళ్లకైన, యువతకి చర్మం డల్‌గా మారి అందవిహీనంగా కనిపిస్తోంది. దీంతోపాటు ముడతలు, కళ్లకింద నలుపు మరింత అసహ్యంగా మారిపోతుంది స్కిన్. అలాంటి డల్‌నెస్ చర్మాన్ని మిల మిల మెరిసేలా యవ్వనపు కాంతిని సంతరించుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి మరి...కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి అప్లై చేస్తూ, మసాజ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. నిస్తేజంగా మారిన ముఖ చర్మం జీవకళతో తొణికిసలాడుతుంది. టీ స్పూన్ టొమాటో గుజ్జు, శనగపిండి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం, కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్లమీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్లకింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.రెండు టీ స్పూన్ల గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం లేని ముఖ చర్మం కళకళలాడుతుంది. ఉప్పు కంటెంట్ లేని టేబుల్ స్పూన్ బటర్ని బ్లెండ్ చేయాలి. అందులో స్ట్రాబెర్రీ గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: నటి షెహ్నాజ్ గిల్ డైట్ ప్లాన్ ఇదే..! ఆరు నెలల్లో 55 కిలోలు..) -
నటి షెహ్నాజ్ గిల్ డైట్ ప్లాన్ ఇదే..! ఆరు నెలల్లో 55 కిలోలు..
బాలీవుడ్ నటి షెహ్నాజ్ గిల్ మోడల్, గాయని కూడా. ఆమె పలు మ్యూజిక్ వీడియోస్, టెవిజన్ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. షెహ్నాజ్ కౌర్‌గా కూడా పిలిచే ఆమె పంజాబీ, హిందీ టెలివిజన్ చిత్రాలలో నటిస్తుంది. అంతేగాదు ఆమె సోషల్ మీడియా సెన్సెషన్ కూడా. ఇటీవల బాలీవుడ్ టీవీ షో మిర్చి ప్లస్‌లో శిల్పా శెట్టి కుంద్రాతో జరిగిన సంభాషణలో తన డైట్ ప్లాన్ గురించి షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.ఆమె దాదాపు 55 కిలోలు బరువు తగ్గారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ ఆమె ఫిట్నెస్ సీక్రెంటో ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు. అందరి కుతుహలానికి తెరపడేలా ఆమె తన డైట్ సీక్రెట్ ఏంటో బయటపెట్టింది. ఆమె ఏం చెప్పారంటే..డైట్ ప్లాన్..తాను సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరునెలల్లోనే ఇంతలా స్లిమ్‌గా మారిపోయానని చెప్పారు. తన రోజుని పసుపుతో ప్రారంభిస్తానని అంటోంది. పసుపు ఆరోగ్య నిర్వహణకు మంచిదే అయినప్పటికి సరైన మార్గంలో ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు పొందొగలమని అంటోంది. తాను హైడ్రేషన్‌గా ఉండేలా తగినంత నీరు తాగిన తర్వాత పెసరట్టు లేదా మెంతీ పరాఠాలతో కూడిన అల్పహారాన్ని ఎంచుకుంటానని తెలిపారు. చాలావరకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ పరిమాణంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. ఒక్కోసారి అల్పాహారంగా పోహా కూడా తీసుకుంటానని అంటోంది. ఇక తాను కూరగాయల రెసిపీనే ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. అలాగే వాటిలో తప్పనిసరిగా జీలకర్ర, ఆవాలు ఉండాల్సిందేనట. ఎక్కువగా మాత్రం బ్రకోలి, క్యారెట్, బెల్ పిప్పర్ వంటివి తీసుకుంటానని చెప్పింది. భోజనంలో ఎప్పుడు ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా మొలకలు, టోపు స్క్రాంబుల్, నెయ్యి, రోటీతో కూడిన పప్పు, సలాడ్లు ఉంటాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమతుల్యత ఉండేలా చూసుకుంటానని వెల్లడించింది. అలాగే పార్టీ టైంలో డైట్ ప్లాన్ బ్రేక్ చేయకుండా ఎలా ఫుడ్ తీసుకుంటున్నామనే దానిపైనే బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందని నొక్కి చెబుతుంది. ఇదేగాక డిన్నర్ టైంలో మఖానా తీసుకుంటానని అన్నారు. ఇది ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. పైగా ఇది బరువు తగ్గడం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మద్దితిస్తుందని చెబుతోంది షెహ్నాజ్. చాలావరకు తేలిక పాటి విందునే స్వీకరించడం ఉత్తమం అని అంటోంది. దీని వల్ల జీర్ణక్రియ, నిద్ర నాణ్యత తోపాటు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తందని చెప్పుకొచ్చింది. ఇలా ఆరోగ్యకరమైన రీతీలో డైట్ ప్లాన్ తోపాటు స్ట్రిట్‌గా పాటించే గట్స్ ఉంటే ఈజీ బరువు తగ్గగలరని చెబుతోంది.(చదవండి: తలకు మర్దనా చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..! ) -
గ్రేటర్ మేయర్ లవ్‌స్టోరీ అలా మొదలైంది..!
నాకు క్రికెట్ అంటే ఇష్టం.. మా ఆయన సాయిరెడ్డికి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం.. క్రీడా మైదానంలోనే తమ ప్రేమకు పునాది పడిందని హైదరబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తమ ప్రేమ కబుర్లు చెప్పుకొచ్చారు.. వాలంటైన్స్ డే సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రేమ సంగతులు పంచుకున్నారు.. నిత్యం స్పోర్ట్స్ స్టేడియంలో కలుసుకునే మేం మా చదువులు అయ్యాకే పెళ్లి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా మా డిగ్రీ, పీజీ అయ్యే వరకు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. మా నాన్నకు నేను గారాలపట్టీ కావడం వల్ల నా ఇష్టాన్ని ఆయన కాదనలేక పోయారు. మా ఆయన తల్లిదండ్రులు, వారి బంధువులు కూడా అంతా మా ప్రేమను అంగీకరించి ఆశీర్వదించారని చెప్పుకొచ్చారు. నేను క్రికెట్ బాగా ఆడేదాన్ని, బాబీ బాస్కెట్ బాల్ ఆటగాడు.. అలా క్రీడా మైదానాల్లో తరచూ కలుసుకునేవాళ్లం.. మా ప్రేమ విషయాన్ని మా ఇద్దరి ఇళ్లలో చెప్పాం. మా నాన్నకు నా మీద ఉన్న ప్రేమతో నా ప్రేమను కాదనలేకపోయారు. పెళ్లి కాగానే అమెరికా వెళ్లిపోయాం.. 18 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చాం.. నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని చెప్పగానే గో ఏ హెడ్ అంటూ ప్రోత్సహించారు. మాదేమో పొలిటికల్ ఫ్యామిలీ.. మా ఆయనదేమో బిజినెస్ ఫ్యామిలీ.. అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా బాబీ నన్ను ఇబ్బంది పెట్టకపోగా రాజకీయాల్లో వెళ్లేందుకు, నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రోత్సాహంగా నిలబడ్డాడు. ఇప్పటికీ మేం ఎంతో ప్రేమగా ఉంటామంటూ తన భర్తను తాను బాబీ అని.. తననేమో విజ్జి అని ప్రేమగా పిలుచుకుంటామంటూ తమ లవ్ జర్నీ చెప్తూ మురిసిపోయారు. (చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!) -
ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!
కళాభిరుచిని కొనసాగించాలంటే.. కలలు కనాలి. అలాంటి కలలే కన్న మరో జత కనులు తోడైతే.. కల సాకారం అవడం తథ్యం. నచ్చిన అభిరుచిని పంచుకుంటూ పరస్పరం ప్రేమను పెంచుకుంటూ దగ్గరైన హృదయాలు ఆలపించే యుగళగీతం మృదు మధురంగా ఉంటుంది. ఆ మధురిమలు ఆస్వాదిస్తున్న కొన్ని జంటల్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలకరించినప్పుడు.. తమ రెండు హృదయాలను ఒకటి చేసిన కళాత్మక జ్ఞాపకాలను నెమరువేసుకున్నారిలా.. ప్రేమించాలనుకోలేదు.. పెళ్లి చేసుకోవాలనుకున్నా..నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు గాయనిగా, ఆయన(రేణుకాప్రసాద్) ఇంటర్లో ఉండగా మృదంగం కళాకారుడిగా.. మా ఇద్దరికీ ప్రథమ పరిచయం. సంప్రదాయ సంగీతం అంటే ఇద్దరికీ ప్రాణం. చిన్న వయసు నుంచే కలిసి ‘కళ’లు పండించుకున్నాం. ఎన్నో వేదికలపై ఎన్నో కార్యక్రమాలు కలిసి చేయడం వల్ల సహజంగానే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం, అభిమానం.. ఆ తర్వాత నాకు పెళ్లి వయసు వచ్చే సమయానికి నా ఫ్రెండ్స్ అనేక మంది పెళ్లిళ్లు చేసుకుని తమకెంతో ఇష్టమైన కళకు వీడ్కోలు పలకాల్సి రావడం కళ్లారా చూశాను. చాలా వరకూ అత్తింటి ఆంక్షలే అందుకు కారణం అవడం కూడా గమనించాను. ఎంతో శ్రమించి అభిమానించి ప్రాణంగా ప్రేమించిన కళను పెళ్లి కోసం వదిలేసుకోవాల్సి రావడం చూశాక.. తప్పనిసరిగా నాతో పాటు ఇదే రంగంలో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా అనుకున్న వెంటనే నా మదిలో ఆయనే మెదలడం.. బహుశా దాన్నే ప్రేమ అనుకోవచ్చేమో.. ధైర్యంగా నా మనసులో మాట ఆయనకు చెప్పడం.. ఆయన కొంత సమయం తీసుకుని ఓకే చెప్పడం.. నేను ఇంట్లో వాళ్లని కన్విన్స్ చేయడం.. వరుసగా జరిగిపోయాయి. మా పెళ్లితో సహా.. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ కలిసి సాగుతున్న మా కళాత్మక ప్రయాణం.. చక్కని చిక్కని సంగీతంలా కన–వినసొంపుగా సాగిపోతూనే ఉంది. శ్వేత, ప్రముఖ గాయని కలర్ ఫుల్.. కళ కపుల్.. కలిసి చదువుకున్నాం.. కలిసి బొమ్మలేశాం.. కలిసి ఏడడుగులు నడిచాం.. నగరంలోని జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులుగా ఉన్నప్పుడు తొలుత పెయింటింగ్ అంటే మాకున్న ఇష్టాల్ని పంచుకున్నాం. అలా అలా పరస్పరం ప్రేమను పెంచుకున్నాం. మా ప్రేమ ప్రయాణం మీద మాకెంత నమ్మకం వచ్చిందంటే.. వృత్తిలోనో, ఉద్యోగంలోనో స్థిరపడాలి ఆ తర్వాతే పెళ్లి అనే ఆలోచన కూడా చేయకుండా.. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే పెళ్లి చేసేసుకున్నాం. ఆ తర్వాత స్ట్రీట్ ఆర్టిస్ట్స్‌గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైవిధ్యభరితమైన ఆర్ట్ వర్క్స్ గీశాం. తద్వారా సిటీలో పుట్టిన క్యూరియాసిటీ.. మా కపుల్ ఆర్ట్‌కి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరం కలిసి నగరంలోని పలు గోడలమీద బొమ్మలు గీసిన రోజులు మాకు ఇంకా గుర్తున్నాయి. ఫ్రెండ్స్‌గా మొదలుపెట్టి ఫ్రాన్స్ ఆర్ట్ ఫెస్టివల్ దాకా.. ఇంకా అనేకానేక జ్ఞాపకాలతో సాగుతున్న మా కలర్‌ఫుల్ జర్నీకి బాటలు వేసింది మా ప్రేమే.. – విజయ్, స్వాతి ప్రముఖ చిత్రకారులు పాట కలిపిన ప్రేమ బాట గురించి వారి మాటల్లోనే.. పాటల ప్రయాణంలో.. చిగురించిన ప్రేమ.. ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.., ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా.., ఈ రాతలే దోబూచులే.. అంటూ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో అద్భుతమైన ప్రేమ గీతం పాడిన సింగర్ హరిణి ఇవటూరి.. తన జీవితంలో మాత్రం కలవని ఇరు ప్రేమికుల్లా ఉండకూడదు అనుకుందో ఏమో.. తన స్వరానికి తోడుగా మరో స్వరాన్ని ప్రేమతో కలిపేసుకుంది. సలార్‌లో తను పాడిన.. సూరీడే గొడుగు పట్టి, వచ్చాడే భుజం తట్టి.. చిమ్మచీకటిలోనూ నీడలా ఉండేటోడు.. రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు.. అనే పాటను ప్రతిబింబించేలా తన ప్రియసఖుడు భాస్కరుని సాయిచరణ్ ఆమె ప్రేమకు పెళ్లి కానుక అందించారు. ఆయనెవరో కాదు.. ప్రముఖ హిట్ మూవీస్ హనుమాన్, కాటమరాయుడు, సుప్రీమ్ వంటి సినిమాల్లో హిట్ సాంగ్స్‌తో తెలుగు సంగీత ప్రియుల మన్ననలను పొందినవాడే..మా మొదటి పరిచయం 2011–12 సంవత్సర కాలంలో ఓ టీవీ ఛానెల్లో నిర్వహించిన పాటల కార్యక్రమంలో.., కానీ మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది మాత్రం ప్రముఖ సింగర్ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో నిర్వహించిన సంగీత ప్రదర్శనల్లోనే.. ఈ ప్రదర్శనల కోసం చాలా చోట్లకు ప్రయాణం చేశాం.. ఈ సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారాం.. ఒకానొక సమయంలో మా బంధం స్నేహం మాత్రమే కాదు అంతకుమించి అనిపించింది. అలా 2014లో మా స్నేహం కాస్త ప్రేమని తెలుసుకున్నాం. ‘హరిణికి తన పైన ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని.. ‘స్నేహానికి మించిన బంధంమనది అనిపిస్తుంది, ఇకపై నువ్వు నన్ను అన్నయ్య అని పిలువు’ అని సాయి చరణ్ ఆర్డర్ వేయగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్య అని పిలువను అని చెప్పకనే తన ప్రేమను చెప్పిందని తమ ప్రేమ స్మృతులను గుర్తు చేసుకున్నారు’. మేమే కాకుండా మా స్నేహం వల్ల మా ఇద్దరి కుటుంబాలు కూడా కలిసిపోయాయి. కానీ.. అప్పటికీ మేమింకా సెటిల్ కాలేదు. మా కుటుంబాల్లో ప్రేమ పెళ్లి ఒప్పుకుంటారా అనే అనుమానంతో భయపడ్డాం. ఇరు కుటుంబాలపైన ఉన్న నమ్మకంతో నిజాయితీగా మా ప్రేమ విషయం చెప్పడం, మా ప్రేమను గౌరవించి వారు కూడా ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. కానీ మీరు సెటిల్ అయ్యాకే కలిసి జీవితాన్ని ప్రారంభించండి అనే వారి సూచన మేరకు మూడేళ్ల తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మాకొక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు ఈ ప్రేమ గురించి మా గురువు బాలసుబ్రహ్మణ్యంకు తెలపగా., కుటుంబ సభ్యులు ఒప్పుకోకుంటే తను మాట్లాడతానని భరోసా ఇచ్చారు. పెళ్లికి రావడంతో పాటు పెళ్లి కానుకగా మా కోరిక మేరకు మా ఇంటికి భోజనానికి వచ్చి ఆశీర్వదించారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, విశ్వంభర వంటి సినిమాల్లో పాటలు పాడుతున్నాం. ఆస్కార్ విజేత కీరవాణి సంగీత దర్శకత్వంలో రాజమౌళి–మహేష్ బాబు ప్రాజెక్టుకు సైతం పాడుతున్నాం. ప్రేమికులు ఎవరికైనా వేరు వేరు ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి. కేవలం 10 శాతం మాత్రమే ఆ ఇద్దరికీ ఆలోచనలు కలుస్తాయి. ఈ విషయంలో సమన్వయం ఉంటే ప్రేమ జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. – భాస్కరుని సాయి చరణ్, హరిణి నాటి అభిమాని.. నేటి జీవిత భాగస్వామి..తను (డా.బిజినా సురేంద్రనాథ్) కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ విద్యార్థినిగా ఉన్నప్పుడు నేను కూచిపూడి నృత్యకళాకారుడిగా ప్రదర్శనలు ఇస్తుండేవాడిని. ఒకసారి సిలికానాంధ్ర కార్యక్రమంలో మేము ఇద్దరం కలిసి ప్రదర్శన ఇచ్చాం. అప్పుడే తను నా ప్రదర్శనలు చూస్తున్నానని, నా నృత్యానికి అభిమానినని చెప్పింది. నిజం చెప్పాలంటే ఆ ప్రదర్శనలో నాకన్నా తనే బాగా నృత్యం చేసింది. ఆ విషయం తనతో చెప్పాను. అక్కడి నుంచి ఇద్దరం సన్నిహితులమయ్యాం. నృత్యం అంటే ఉన్న ఇష్టం పరస్పరం ఒకరి మీద ఒకరికి కూడా ఏర్పడింది. కొంత కాలం తర్వాత మేం పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నాకు సరైన ఉద్యోగం లేదని ఆమె ఇంట్లో వాళ్లు అభ్యంతరం పెట్టారు. దాంతో నేను సెటిలయ్యాకే వివాహం చేసుకుందామని అనుకుని.. ఇద్దరం కలిసి ప్రణాళికాబద్ధంగా ప్రదర్శనలు ఇస్తూ వచ్చాం. ఏడాదిలోనే నేను మంచి స్థితికి రావడంతో మా పెళ్లికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ.. మా నడక నర్తన సంతోష భరితంగా సాగిపోతున్నాయి. – సురేంద్రనాథ్, కూచిపూడి నృత్యకళాకారుడు. (చదవండి: చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!) -
పారిశుధ్య కార్మికుడి కూతుళ్లు కరాటేలో క్వీన్స్..!
వారి ఇంటిపేరు ఏమిటో చాలామందికి తెలియదు. ‘కరాటే సిస్టర్ప్’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన విశాఖపట్నంకు చెందిన కృష్ణప్రియ, జ్యోతి, సంగీత కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెల్చుకున్నారు. కర్రసాము, చెస్లోనూ రాణిస్తున్నారు...జీవీఎంసీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న రామారావు ముగ్గురు కుమార్తెలు సంగీత, కృష్ణప్రియ, జ్యోతి కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. విశాఖ మహా నగరంలోని పీ అండ్ టీ కాలనీలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ (ఎన్ ఎంసీహెచ్)లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఒక వైపు చదువు, మరోవైపు కరాటేలో ప్రావీణ్యం చూపుతున్నారు.కృష్ణప్రియ (16) డబ్లు్యఆర్ఐ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్–2017 పోటీలలో రజతం, ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2018 పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు, నెట్షాడోకాన్ నేషనల్ ఛాంపియన్ షిప్–2019 ఓపెన్ కరాటే పోటీలలో వెండి, కాంస్య పతకాలు, దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్–2020 పోటీల్లో రజత, కాంస్య పతకాలు, 5వ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో స్వర్ణ, వెండి పతకాలు, 13వ జాతీయ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్ షిప్–2022 పోటీలలో రజత, వెండి పతకాలు, 8వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్–2025 ΄ోటీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు....ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పతకాలు సాధించింది.ఈ నెలలో విశాఖలోని పోర్టు స్టేడియంలో జరిగిన 81వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2025 పోటీలలో ముగ్గురు సోదరీమణులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీలలో జ్యోతి బంగారు పతకం, వెండిపతకాలు, కృష్ణప్రియ ఏకంగా రెండు బంగారు పతకాలు, సంగీత వెండి, కాంస్య పతకాలు సాధించింది. విశాఖలో జరిగిన ఈ పోటీలలో విశాఖకు చెందిన ఈ ముగ్గురు సోదరీమణులు ఒకే వేదిక మీద సత్తా చాటి పతకాలు అందుకొని భేష్ అనిపించుకున్నారు.‘రామారావుకు నేనే కరాటేలో శిక్షణ ఇచ్చాను. 1989 నుంచి కరాటే అకాడమీ నిర్వహిస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా రామారావు ముగ్గురు కుమార్తెలకు కూడా కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. ఈ ముగ్గురు పిల్లలకు కష్టపడే తత్వం ఉంది. మంచి భవిష్యత్ ఉంది’ అంటున్నాడు కరాటే కోచ్ ఎల్లారావు.‘పిల్లలు సరదాగా కరాటే నేర్చుకుంటున్నారు అనుకున్నానుగానీ ఇంత పేరు తెచ్చుకుంటారు అనుకోలేదు. వారి విజయాలకు ఒక తండ్రిగా మురిసిపోతున్నాను. గర్విస్తున్నాను’ అంటున్నాడు రామారావు. కరాటే అంటే నిండైన ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసమే ముగ్గురు సోదరీమణులకు ఆభరణం. వారు కరాటేలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆశిద్దాం.– దుక్కా మురళీకృష్ణారెడ్డి, సాక్షి, సీతమ్మధార, విశాఖపట్నం (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
పెళ్లికి వెనుకాడుతున్న పడతులు!
‘పెళ్లిపై నమ్మకం లేదు.పెళ్లి చేసుకోవడమంటే స్వేచ్ఛను కోల్పోవడమే. అలా బతకడం నాకే మాత్రం ఇష్టం లేదు. ఒక్కసారి వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సొంత ఆలోచనలకు, అభిప్రాయాలకు, ఆకాంక్షలకు, చివరకు అభిరుచులకూ అవకాశం ఉండదు. ఇలా ఎంతోమందిని చూశాను. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను..’ ఇది 35 ఏళ్ల విజయ (పేరు మార్చాం) బలమైన అభిప్రాయం. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) సమీపంలోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఒక మహిళల హాస్టల్లో ఉంటున్నారు.చాలామంది మహిళలు ఇటీవలి కాలంలో వివాహ బంధం, దాంపత్య జీవితంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాతికేళ్ల వయసు దాటినా పెళ్లి (Marriage) ఊసు ఎత్తేందుకు కూడా ఇష్టపడని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయలా స్వతంత్రంగా జీవించాలనుకునే వారితో పాటు వృత్తిపరమైన బాధ్యతల వల్ల కొందరు, మంచి కెరీర్ (Career) కోసం ప్రయత్నించే క్రమంలో ఒత్తిడికి గురవుతూ మరికొందరు వివాహం విషయంలో నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం వెల్లడించింది. తమ జీవితాన్ని తమకు ఇష్టమైన విధంగా గడపడానికి వీలవుతుందనే భావనే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది. భారత్ (India) సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 2030 నాటికి ఒంటరి మహిళల సంఖ్య 45 శాతానికి పెరగవచ్చునని అంచనా వేసింది. వీరిలో 25–44 ఏళ్ల లోపు వయసున్న వారే అత్యధిక సంఖ్యలో ఉంటారని పేర్కొంది. వ్యక్తిగత అభివృద్ధి, తాము ఎంచుకున్న రంగాల్లో పురోగతికే యువతులు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించింది. మరోవైపు కుటుంబ బాధ్యతలూ ఇందుకు కారణమవుతున్నాయి.బాధ్యతలు పంచుకుంటూ.. కెరీర్ కోసంకష్టపడుతూ.. సాధారణంగా అమ్మాయిలు 25 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా కుటుంబ బాధ్యతలను పంచుకుంటున్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. తోబుట్టువుల కెరీర్ కోసం కష్టపడుతున్నారు. అదే సమయంలో జీవితంలో స్వేచ్చను కోరుకుంటున్నారు. అల్వాల్‌కు చెందిన సుజాత (పేరు మార్చాం.) ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ‘పదేళ్ల క్రితమే నాన్న చనిపోయారు. అప్పటి నుంచి తమ్ముడు, చెల్లి, అమ్మను చూసుకోవడం నా వంతైంది. చూస్తూండగానే 40 ఏళ్లు వచ్చేశాయి..’అంటూ నవ్వేశారు ఆమె.సుజాత లాగానే చాలామంది అమ్మాయిలు కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వయసు దాటి పోయిందనే భావనతో వివాహ బంధానికి దూరమవుతున్నారు. కానీ కొంతమంది యువతుల్లో స్వేచ్ఛాయుత జీవితంపై ఆసక్తి పెరుగుతోంది. వారి ఆలోచనలు, అభిప్రాయాలు వైవాహిక జీవితానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన శైలజ.. ‘పెళ్లి కంటే ఆర్ధిక స్వాతంత్య్రం ఎంతో ముఖ్యం. అది లేకుండా పెళ్లి చేసుకోవడం ఆత్మహత్యాసదృశం..’అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పటికే 28 ఏళ్లు దాటాయి. అయినా ఒంటరిగానే ఉండిపోవాలని కోరుకుంటున్నారు. పిల్లలూ భారమేనా..! పెళ్లి చేసుకున్నప్పటికీ మరికొంతమంది మహిళలు పిల్లల్ని కనేందుకు వెనుకాడుతున్నారు. ‘ఈ రోజుల్లో పిల్లల్ని కనడం. పెంచడం ఎంతో ఖరీదైన విషయం. ఆ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది..’ అని ఒక యువతి వ్యాఖ్యానించారు. నేను, నా స్వేచ్ఛ అనే భావన బలపడుతోంది దేశంలో అలాగే హైదరాబాద్‌లోనూ ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. మా అమ్మాయి పెళ్లిచేసుకోవడం లేదంటూ ఇటీవల కొందరు తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చినపుడు.. పెళ్లి ఎందుకు, ఆ అవసరం ఏమిటీ, పిల్లలు ఇతర బాదరాబందీ అంతా ఎందుకంటూ అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. పెళ్లితో తమ స్వేచ్ఛ, కెరీర్ దెబ్బతింటుందని, ఒకవేళ వివాహానికి ఒప్పుకున్నా పిల్లలు వద్దనుకునే వాళ్లనే చేసుకోడానికి సిద్ధమని చెబుతున్నారు. కొంతమంది చదువు, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటూ స్వేచ్ఛా జీవితం గడిపాక.. ఇక కుటుంబం, సంతానం వంటివి వద్దనుకుంటున్నారు. మనం అనే ఉమ్మడి భావన పోయి నేను, నా స్వేచ్ఛ, నా కెరీర్ అనే భావన బలపడుతోంది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇలాంటి వారికి మేం కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – పి.జ్యోతిరాజా, సైకాలజిస్ట్, శ్రీదీప్తి కౌన్సెలింగ్ సెంటర్నచ్చిన వరుడు, మెచ్చిన ఉద్యోగం కోసంఎదురుచూస్తూ.. మరోవైపు నచ్చిన వరుడు లభించకపోవడం కూడా కొంతమంది అమ్మాయిలకు శాపంగా మారుతోంది. ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన యవతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మంచి విద్యార్హతలు, ఉద్యోగం, కెరీర్ అవకాశాలు, వ్యక్తిత్వం, అభిరుచులు తమకు నచ్చినట్లు ఉంటేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. అలాంటి అబ్బాయి లభించే వరకు నిరీక్షిస్తున్నారు. మరోవైపు విదేశీ సంబంధాల కోసం ఎదురుచూసే కుటుంబాల్లోనూ అమ్మాయిలకు పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంతమంది సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి చదువుతున్నారు. లక్ష్యాన్ని సాధించేవరకు పెళ్లికి దూరంగా ఉండాలనే భావనతో ఐదారేళ్లకు పైగా గడిపేస్తున్నారు.అప్పటికే పెళ్లి వయసు దాటిపోతోంది.చదవండి: ఏం చేయాలో అర్థం కావడం లేదు.. పారిపోవాలనిపిస్తోంది!భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు!వచ్చే 10, 15 ఏళ్లలో వివాహ బంధానికి సంబంధించి మరింత ఎక్కువగా సవాళ్లు ఎదురుకావొచ్చు. ప్రస్తుతం 20 నుంచి 25 ఏళ్లు పైబడిన యువతుల్లో కొంతమంది పెళ్లి అంటే విముఖత వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ఈ ఆలోచన విధానం అమ్మాయిల్లో పెరుగుతోంది. వివాహం అనగానే బాధ్యతల్లో చిక్కుకుపోవడం, పిల్లల్ని కని వారి సంరక్షణలో, సంసార బాధ్యతల్లో మునిగిపోవడం అని అనుకుంటున్నారు. తమ స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని భయపడుతున్నారు. ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి ఉద్యోగం చేస్తున్నా.. మళ్లీ కుటుంబపరంగా ఎన్నో బరువు బాధ్యతలు మోయాల్సి రావడం కూడా ఇందుకు కారణమవుతోంది. అమ్మాయిల్లో పెళ్లి, పిల్లల పట్ల విముఖత పెరగడానికి పురుషుల మనస్తత్వాల్లో మార్పు రాకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ -
Valentines Day: అమ్మను ప్రేమిద్దామా..!
ప్రేమించిన ప్రియుడితో ఎప్పుడెప్పుడు తన మనసులోని మాటను చెబుదామని అమ్మాయి...ఎన్నాళ్ల నుంచో దాచుకున్న ప్రేమనంతా ఈ వాలెంటైన్స్ డే రోజున బయటపెట్టాలని అబ్బాయి..ఇలా కుర్రకారు తహతహలాడిపోతుంటుంది. నిన్న మొన్న వచ్చిన ఇలాంటి ప్రేమల కన్నా..ఈ భూమ్మీదకు తీసుకువచ్చి..ప్రాణాలన్నీ మనమీదే పెట్టుకుని బతికే అమ్మ ప్రేమను ఇలాంటి రోజును గుర్తు చేసుకుందాం. ప్రేమకు ప్రతిరూపం అమ్మ..అంటారే అలాంటి అమ్మ ప్రేమకు సాటిలేదు ఏ ప్రేమ. మనం ఎలా ఉన్నా..ఇష్టంగా లాలించే దేవత ఆమె. మనం పుట్టక ముందు నుంచి ప్రేమిస్తూ..మన ఆలన పాలనా కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆ దేవతకు ఈ పవితమైన రోజున..మన గుండెల్లోని ప్రేమనంతా ఈ విధంగా తెలుపుదామా..!.ఈ వాలెంటైన్ డే రోజున అమ్మ కళ్లు నులుముకుంటు నిద్రలేచేసరికి ఎదురుగా ఆమె ముందు నిల్చుని చూడండి. ఎప్పుడూ తానే మనల్ని నిద్రలేపే ఆమె ముందు గనుక మనమే ముందు లేచి ఎదురుగా ఉంటే కొంచెం తత్తరపాటు తోపాటు ఏంటా అని కచ్చితంగా కంగారుపడుతుంది. ఎందుకంటే అమ్మ కదా..? మనం ఏదైనా టెన్షన్లో ఉన్నామా..? లేక బాధగా ఉన్నామా..? అని భయపడుతుంది. కాస్త అనుమానంగా నటిస్తూ..విష్ చేస్తూ నవ్విచండి..ఏదో అయిపోతుందా రా ఈ రోజు అంటూ నవ్వేస్తుంది. మనం ఇష్టపడ్డ అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయడం కాదు. మనల్ని ఇన్నాళ్లు సాకి, ఎన్నో ఒడుదుడుకులు, కష్టాలను దిగమింగిన మన అమ్మకు I Love You Maa అంటూ ప్రపోజ్ చేయండి. ఆమె పైకి కోపం నటించినా..ఈ విషయం అంతా చుట్టుపక్కల వాళ్లతో గొప్పగా చెప్పుకుని తప్పక ఆనందిస్తుంది. అలాగే రోజూ ఎప్పుడు చివరగా మిగిలిపోయింది తినే ఆమెకు..కనీసం ఈరోజునైనా మనం ఆ అవకాశం ఇవ్వకుండా ఏదైనా చేసిపెట్టండి. లేదా కనీసం ఆమె చూడని వెరైటీ స్వీట్ లేదా చాక్లెట్‌తో నోటిని తీపి చెయ్యండి. మనల్ని ఆడించడాని అమ్మ బొమ్మగా మారిన రోజులను గుర్తు తెచ్చుకుంటూ..ఆమె చిత్రంతో పెయింట్ చేసిన గ్లాస్ లేదా టెడ్డీ బొమ్మల గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆమె కోసం కాదు..మన కోసమే. ఎందుకంటే..బిజీ బిజీ లైఫ్‌లతో అమ్మ ప్రేమను మర్చిపోతున్న మనకు ఇలాంటి రోజునైనా అలనాటి స్మృతులను గుర్తు తెచ్చుకునేలా సెలబ్రేట్ చేసుకునేందుకు. ప్రతి అమ్మకి తన బిడ్డకు మించిన గొప్ప బహుమతి ఉండదు. అయినా ఆమె మననుంచి ఆశించదు కూడా. అలాగే కడ వరకు తనకు మంచి బిడ్డగా ఉంటాననే భరోసా ఇవ్వండి. ఆమెకు రెక్కల్లొస్తే ఎగిరిపోయే పక్షులం కాదు..నాకోసం ఆహర్నిశలు శ్రమించిన నిన్ను ఎన్నటికీ మర్చిపోను అనే నమ్మకం కలిగించండి. చిన్నప్పుడు అందంగా రెడీ చేసి..బుగ్గన దిష్టి చుక్కగా కాటుక పెట్టి మురిసిపోయే ఆ అమ్మను ఈ రోజున మనం రెడీ చేద్దాం. ఎలా ఉన్నా.. ఎవరి అమ్మ వారికి అందం, ఇష్టం ఉంటాయి కదా..!. అందుకే ఈరోజున నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అమ్మ నుదిటిని ముద్దాడదాం. అలాగే చిన్నప్పుడు మనం భయపడినా..పరీక్షలప్పుడూ పాసవ్వుతానా? లేదా..? అన్న టెన్షన్ పడుతున్నప్పడు అమ్మ మనల్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని ధైర్యం చెప్పేది కదా..అది గుర్తుతెచ్చుకుని మరీ వయసు మళ్లినా.. నీ చేయి ఎన్నటికీ వదలను అనేట్టుగా ఆమెను ఆలింగనం చేసుకోండి. చివరిగా వీటిలో ఏ ఒక్కటి మనం చేసినా..అమ్మ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆమె మనకిచ్చిన అనంతమైన ప్రేమలో రవ్వంతైనా తిరిగిచ్చే ప్రయత్నం చేద్దామా..!. నిజానికి అమ్మ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. ఆ దేవతకు ప్రేమను ఇవ్వడమే గానీ తీసుకోవడం తెలియదు. ఆమె ప్రేమే మనకు సంజీవని, శ్రీరామ రక్ష. అలాంటి అమ్మకు ఈ రోజున మర్చిపోలోని ఆనందం కలిగేలా ప్రేమిద్దాం. ప్రస్తుత ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రేమను వ్యక్తం చేసే సావకాశం కూడా లేని ఈ పరిస్థితుల్లో ఇలాంటి రోజుని మిస్ చేయకుండా ఉపయోగించుకుందాం. -
తలకు మర్దనా చేస్తున్నారా..?
తలకు మర్దనా చేస్తున్నారా ..?. అయితే ఈ కొద్దిపాటి చిట్కాలు ఫాలోకండి. కేశ సౌందర్యానికే కాదు మన ఆరోగ్యానికి మంచిదట. ఇలా మర్దన చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన మటుమాయం అవుతాయంటున్నారు నిపుణులు. పైగా మనసుకు తేలిగ్గా అనిపించడమే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవట. మరీ అనుసరించాల్సిన చిట్కాలేంటో చూద్దామా..!.తలకు మసాజ్ చేసేటప్పుడు ఒకసారి మొత్తంగా వలయాకారంగా మర్దన చేసిన తర్వాత క్రాస్స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి బొటన వేలు – చూపుడు వేలిని మాత్రమే వాడాలి. రెండు వేళ్లలో ఇమిడేటంత జుట్టును కుదుళ్లకు దగ్గరగా పట్టుకుని ఇంగ్లిష్ అక్షరం ఆకారంలో అటూ ఇటూ లాగి వదలాలి. ఇలా నుదుటి దగ్గర నేరుగా పాపిడి తీసే దగ్గర మొదలు పెట్టి తల వెనుక వరకు వెళ్లి తర్వాత పక్కనే మరొక వరుస... ఇలా తలంతా చేయాలి.ఇక పించింగ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి అన్నివేళ్లనూ వాడాలి. రెండు వేళ్లతో గిచ్చడం కాకుండా అన్నివేళ్లతో పుర్రెను గిచ్చుతున్నట్లు (గోళ్లు తగలకూడదు) ఒత్తిడి కలిగించాలి. చివరగా మరొకసారి తలంతా వలయాకారంగా మర్దన చేయాలి. ఇంతటితో తలకు మసాజ్ పూర్తవుతుంది. మసాజ్ పూర్తయిన తర్వాత పది నిమిషాలకు తలస్నానం చేస్తే ఆహాయి రెండు– మూడు రోజులు ఉంటుంది. ఈ మసాజ్ కేశ సౌందర్యానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. కొన్ని రకాల తలనొప్పులు, ఒత్తిడి కారణంగా వచ్చే చికాకులు మాయమవుతాయి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.క్రమం తప్పకుండా జుట్టుకు ట్రీట్మెంట్ జరుగుతుంటే జుట్టు రాలడం, చిట్లిపోవడం, చుండ్రు మొదలైన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉండదు. వంశపారంపర్యంగా కాక పోషకాహార లోపం వల్ల, సంరక్షణలోపం వల్ల చిన్న వయసులోనే తెల్లబడడాన్ని సమర్థంగా నివారించవచ్చు. టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు బాదంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నాబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు పట్టించి, మెల్లగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. (చదవండి: పారిపోవాలని అనిపిస్తోంది..! ఈ సమస్య నుంచి బయటపడేదెలా..?) -
దక్షిణ భారత వంటకం 'సాంబార్'కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!
దక్షిణ భారత వంటకం సాంబార్ ఎంత ఫేమస్ రెసిపీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భోజనంలోకే కాదు, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ అది ఉండాల్సిందే. అలాంటి ఈ రెసిపీ తయారీని ఎవరు కనుగొన్నారు. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దామా..దేశవ్యాప్తంగా బాలీవుడ్ మూవీ చావా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో అందిరి దృష్టి మహారాష్ట్ర చారిత్రక రాజు శంభాజీ మహారాజ్ పైనే ఉంది. ఆ మూవీలో మరాఠా రాజు శంభాజీ రాజు పాత్రలో హీరో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు. ఇక్కడ చావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఆ శంభాజీ మహారాజు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, విజయాలు ఆధారంగా తీసిన సినిమా ఇది. అయితే ఆ మహారాజు పేరు మీదనే దక్షిణ భారత వంటకం ఉంది. ఆ మరాఠా పాలకుడి పేరు మీదగానే సాంబార్ అనే రెసిపీ వచ్చిందట. దాదాపు 400 ఏళ్ల క్రితం తంజావూరు రాజ వంటగదిలో తయారయ్యిందట. ఆహారప్రియుడైన రాజు శంభాజీకి మహారాష్ట్ర వంటకం అమీ(పుల్లని పప్పు) అంటే చాలా ఇష్టం. దీన్ని కోకుమ్ అనే పుల్లని పండుతో తయారు చేస్తారు. అయితే ఒకరోజు కోకుమ్ అయిపోయింది. వంటగదిలో ఉన్న వంటవాళ్లు ఎలా వండాలతో తెలియక ఆందోళనకు గురవ్వుతారు. అప్పుడే ఆ విషయాన్ని వణికిపోతు మహారాజుకి విన్నవించుకుంటారు. అప్పుడు శంభాజీ స్థానికంగా దొరికే చింతపండుతో ఎందుకు తయారు చేయకూడదు అని అన్నారు. అలా ఆయన సూచన మేరకు కందిపప్పు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో తయరు చేయగా దానికి శంభాజీ మహారాజు పేరుమీదుగా సాంబార్ అని పేరు పెట్టారని కథనం. అయితే దక్షిణ భారతదేశంలో మరొక కథనం ప్రకారం శ్రీ కృష్ణుడు కొడుకు సాంబుడి తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడని. ఆ వ్యాధి తగ్గాలంటే రోజు సూర్యుడిని ఆరాధించాలని మునులు చెప్పడంతో రోజుకో నైవేద్యం చేసే నివేదించేవాడట. ఆ క్రమంలోనే ఇలా కందిపప్పు, కూరగాయలతో చేసిన వంటకం సూర్యుడికి నివేదించగా..ఆయన ప్రీతి చెంది సాంబుడికి వ్యాధిని నయం చేశాడని చెబుతారు. అలా ఆయన పేరు మీదుగా సాంబర్ వంటకం వచ్చిందన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. అయితే మరాఠా మూలం నుంచి వచ్చిందంటే కొందరూ పాక నిపుణులు ఎందుకనో అంగీకరించారు. ఏదీఏమైనా ఈ రుచికరమైన వంటకాన్ని తమిళులు మునగకాయలతో చేసుకోగా మహారాష్ట్ర ప్రజలు ప్రత్యేక మసాలాతో తయారు చేస్తారు. ఇక కేరళ వాళ్లు, క్యారెట్లు, బంగాళదుంపలు వేసి చేస్తారు. ప్రస్తుతం ఈ రెసిపీ మనలో భాగమైపోయింది.(చదవండి: కాఫీ బ్రేక్, మ్యాంగో మూడ్ చాక్లెట్లు గుర్తున్నాయా..? అవెలా వచ్చాయంటే..) -
కాఫీ బ్రేక్, మ్యాంగో మూడ్ చాక్లెట్లు గుర్తున్నాయా..? అవెలా వచ్చాయంటే..
చిన్నతనంలో ఇష్టంగా తిన్న ఎరుపు రంగుని తెచ్చే పాన్ పంద్, మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్ వంటి చాక్లెట్లు గుర్తున్నాయా..?. ఆ సయమంలో ఒక రూపాయికే నాలుగు లేదా రెండు చాక్లెట్లు వచ్చేవి. అవి తింటుంటే నాలుకంతా రంగు మారిపోతుంటే అబ్బో ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం ఎన్నో ఫ్లేవర్లతో కూడిన ఖరీదైన చాక్లెట్లు మరెన్నో వచ్చినపపటికీ..వాటి రుచి ఆ క్రేజ్ వేరు. చిన్నగా చెరుకు మిల్లులతో మొదలైన చాక్లెట్ల వ్యాపారం కాస్తా హిందూస్తాన్ కనెస్ట్రక్షన్ కంపెనీ, విమానా తయారీల కంపెనీలుగా వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరించాడు మహారాష్ట్రకు చెందిన వాల్చంద్ హిరాచంద్ దోషి. ఆయన ప్రధాని మోదీ చెప్పే స్వాలంభనకు ఆనాడే బీజం వేశాడు. ఆవిష్కరణలకు పర్యాయ పదంగా నిలిచిన అతడి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.!. 1923 బ్రిటిష్ పాలనలో భారత్ ఉన్న సమయంలో సేథ్ వాల్చంద్ హిరాచంద్ దోషి దూరదృష్టితో మహారాష్ట్రలోని రావల్గావ్కు వచ్చారు. ఆయన భారత ఆర్థిక స్వేచ్ఛకు మార్గం రాజకీయ వాక్చాతుర్యం కాదు పారిశ్రామిక స్వావలంబనలోనే ఉందని నమ్మాడు. ఆ నేపథ్యంలోనే భారతదేశానికి వెన్నుముక అయిన వ్యవసాయంపై దృష్టిసారించాడు. అదే ఆయన్ను 1,500 ఎకరాల బంజరు భూమి వైపు ఆకర్షించేలా చేసింది. నిజానికి ఇది రాళ్లతో నిండిపోయి.. వ్యవసాయానికి పనికిరాని భూమి ..కానీ దోషికి ఇందులో బంగారం పండిచొచ్చనిపించింది. అందరికీ అది నిరూపయోగమైన భూమిలా కనిపిస్తే.. ఆయనకు మాత్రం పనికొచ్చే భూమిలా అనిపించింది. ఆ నేపథ్యంలోనే రసాయన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందాన్ని సమీకరించి చెరకు సాగుకు అనువైన సారవంతమైన నేలగా మార్చే ప్రక్రియకు పూనుకున్నాడు. అలా ఆయన తన పట్టుదలతో 1933లో రావల్గావ్ షుగర్ ఫామ్ లిమిటెడ్ స్థాపించారు. ఇదే భారత్‌లోని తొలి చక్కెర మిల్లులో ఒకటి. అక్కడితో ఆగిపోలేదు దోషి పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేశాడు. ఆ నేపథ్యంలోనే మిల్లు చుట్టూ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పాఠశాలలతో పూర్తి సమృద్ధి గల పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఆ ప్రాంతం క్రమేణ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు నిలయంగా మారింది.ఇది చక్కెర మిల్లింగ్ నుంచి వివిధ పరిశ్రమలకు భారీ ఇంజనీరింగ్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది.అలా నిర్మాణ రంగంలోకి వెళ్లి హిందూస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్ వంటి ఐకానిక్ నిర్మాణాలను నిర్మించారు. అతని కారణంగానే 1940లో భారత్ తొలి విమానాయన తయారీ సంస్థ, 1946లో షిప్‌యార్డ్ వంటివి స్థాపించారు. ఆ తర్వాత ఆ రెండు కంపెనీలు వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా జాతీయం చేసింది ప్రభుత్వం. అయితే 1940లలో రావల్గావ్ చక్కెర ఉత్పత్తి నుంచి తయారైన చాక్లెట్లు మాత్రం మిఠాయి వ్యాపారంగానే ఉండిపోయింది. అయితే భారతీయ చాక్లెట్లకు రావల్గావ్ బ్రాండ్‌గా ఉండేది ఆ కాలంలో. ఆయన చక్కెర మిల్లుల కారణంగా తయారయ్యే పాన్పసంద్ పెద్దవాళ్లలా పాన్ని తిన్నట్లుగా నోరంతా ఎరుపు రంగు తెప్పించేది. ఏడాది పొడవునా మ్యాంగో తిన్న అనుభూతిని కలిగించే మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్, చాకో క్రీమ్ తరదితరాలు ఆ కాలంలో అందరికీ నచ్చే చాక్లెట్లు. ఆ విధంగా మహారాష్ట్ర భారతదేవశంలోని అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రంగా నిలుస్తోంది. ఇప్పటికీ రావల్గావ్ షుగర్ ఫామ్ లిమిటెడ్ స్వతంత్రంగానే పనిచేస్తోంది. దీన్ని ఇటీవలే రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) రావల్గావ్ బ్రాండ్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో ట్రేడ్‌మార్క్‌లు, వంటకాలు , మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి. కరోనా సమయంలో తీవ్రమవుతున్న ఖర్చులు, మార్కెట్ పోటీ కారణంగా రావల్గావ్ చాక్లెట్ల వ్యాపారం పలు ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే రావల్గావ్ పేరుమీదు ఉన్న మిగతా ఇండస్ట్రీలను మాత్రం యథావిధిగా నిలుపుకుంది. తీపి పదార్థాల నుంచి నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగ పరంగా భారతదేశాన్ని అభివృద్ధి బాటపట్టేలా చేశారు. ఆయన వారసత్వం నిర్మించిన సంస్థల్లోనే కాదు, దేశ రూపు రేఖలను మార్చడంలోనే అందించారు. పారిశ్రామిక వేత్త అంటే తనను అభివృద్ధి చేసుకుంటూ..దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకుపోయేవాడని చాటి చెప్పారు వాల్చంద్ హిరాచంద్ దోషి.(చదవండి: '8 సిటీస్ 8 బర్డ్ వాక్‌లు': ఇది చిన్నారులకు ప్రత్యేకం..!) -
Maha Kumbh Mela : సింపుల్‌గా, హుందాగా రాధిక-అనంత్ అంబానీ జంట
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నమహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ భక్తజన సంద్రంలో అంబానీ కుటుంబంకూడా చేరింది. ముఖేష్ అంబానీ,కోకిలాబెన్ అంబానీ, ఆకాశ్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతాతో పాటు, అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,చిన్న కోడలు రాధిక మర్చంట్ (ఫిబ్రవరి 11న) త్రివేణి సంగమంలో పవిత్ర ఆచారాలలో పాల్గొని పవిత్ర స్నానం చేశారు. (మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో)మహా కుంభ్‌లో, రాధిక తన లుక్‌తో ఆకట్టుకుంది. నేవీ బ్లూ సిల్క్ లగ్జరీ కుర్తాలో హుందాగా కనిపించింది. గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీతో జయంతి రెడ్డి రూపొందించిన ఈ దుస్తుల విలువ ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. V-నెక్లైన్ ,మోచేయి వరకు పొడవున్న స్లీవ్‌లు నెక్లైన్ బోర్డర్లను జరీ ఎంబ్రాయిడరీతో తీర్చి దిద్దారు. ఈ కుర్తాకు కాంట్రాస్టింగ్ పుదీనా గ్రీన్ ధోతీ ప్యాంటు, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీని ధర లక్ష రూపాయలని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే జ్యయుల్లరీ తక్కువగా ఉంచినప్పటికీ మోడ్రన్‌గా ఉండటం విశేషం. సింపుల్ పోనీటైల్‌తో డైమండ్ స్టడ్ చెవిపోగులు, హారాన్ని ధరించి ఆధ్యాత్మిక లుక్‌లో అలరించింది. (Valentines Day : లవ్ బర్డ్స్కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!)ఇక రాధికకు జతగా అనంత్ అంబానీ అద్భుతమైన ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. వెండి మోటిఫ్‌లు , చక్కటి,చిక్కటి బంగారు ఎంబ్రాయిడరీ చేసిన మెరూన్ వెయిస్ట్‌కోట్, షైనింగ్ రెడ్ ఎరుపు కుర్తాను ధరించాడు. అలాగే బంగారు గొలుసు, నుదుటిన తిలకంతో తన సాంప్రదాయ రూపాన్ని పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలోమహా కుంభమేళా 2025 ఉత్సాహంగా సాగుతోంది. సూర్యుని చుట్టూ బృహస్పతి చుట్టే కక్ష్య పూర్తైన సూచనగా జరుపుకునే ముఖ్యమైన తీర్థయాత్ర పండుగ ఇది. 12-కుంభమేళా చక్రం ముగింపును ఇది సూచిస్తుంది. దీనిని అధికారికంగా 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాగా పిలుస్తారు. ఈ కార్యక్రమం జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు సాగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా గుర్తింపు పొందింది. -
Valentines Day : లవ్ బర్డ్స్కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!
ప్రేమికుల దినోత్సవం లేదా వాలెంటైన్స్ డే (Valentine's Day) ప్రేమికులకు తమ ప్రేమను వ్యక్తీకరించు కోవడానికి, చిరస్మరణీయమైన అనుభవాన్ని పొందడానికి సరైన సమయం. ఫిబ్రవరి వస్తుందంటేనే వాలెంటైన్స్ డే కోసం ఎదురు చూస్తుంటారు ప్రేమికులందరూ. తమ లవర్‌ను సర్ప్రైజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలుచేస్తుంటారు. మరికొందరు పార్ట్నర్కు రొమాంటిక్ అనుభవాన్ని అందించాలని ఉవ్విళ్లూరుతారు. అలాంటి వారికి దుబాయ్ (Dubai) బెస్ట్ డెస్టినేషన్అని చెప్పవచ్చు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న దుబాయ్‌లోని వాలెంటైన్స్ డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఆకర్షణీయమైన స్కైలైన్ భవనాలు బీచ్‌లు, లగ్జరీ స్పా రిట్రీట్స్, విలాసవంతైన రెస్టారెంట్లు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, ప్రైవేట్ యాచ్ క్రూయిజ్ ట్రిప్‌లు చక్కటి భోజనం..ఇలా అనేక రకాల వసతులతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇవి రొమాంటిక్ ఫీలింగ్‌ను అందిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం.షాంగ్రి-లా దుబాయ్ (Shangri-La Dubai)షాంగ్రి-లా దుబాయ్‌లో అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఐకానిక్ హోటల్ విలాసవంతమైన వసతి సౌకర్యాలు, రొమాంటిక్ డిన్నర్లు లాంటి అద్భుతమైన భోజన సదుపాయాలు ఉంటాయి. బుర్జ్ ఖలీఫా , డౌన్‌టౌన్ దుబాయ్ స్కైలైన్ అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌లో లెవల్ 42 “ప్రైవేట్ డైనింగ్ అబౌవ్ ది క్లౌడ్స్”లో ఉన్న జంటలకు స్పెషల్ అనుభవాన్ని అందిస్తుంది.పలాజ్జో వెర్సేస్ దుబాయ్ (Palazzo Versace Dubai)పాపులర్ జద్దాఫ్ వాటర్‌ఫ్రంట్ మధ్యలో ఉన్న, పలాజ్జో వెర్సేస్ దుబాయ్ ప్రేమికులకు వెచ్చని ఆహ్వానం పలుకుతుంది. లవ్‌బర్డ్స్‌ను మంత్రముగ్ధులనుచేస్తూ శాశ్వతమైన ప్రేమను ప్రసరింపజేస్తుంది. కేక్ ట్రాలీ ఉత్కంఠభరితమైన రొమాంటిక్, సూర్యోదయాలు, సిగ్నేచర్ హై టీ అనుభవంతోపాటు, మెస్మరైజింగ్ వాతావరణంలో సొగసైన గియార్డినో సెట్స్, అద్భుతమైన మ్యూజిక్, ,గమ్మత్తైన వాలెంటైన్స్ విందునిస్తుంది.రిక్సోస్ ప్రీమియం సాదియత్ ద్వీపం (Rixos Premium Saadiyat Island)తెల్లని ఇసుక మధ్య ప్రేమికులు సేదదీరడం అంటే సాదియత్ ద్వీపం ప్రత్యేకమైన స్వర్గధామం అన్నట్టే. విలాసవంతమౌన వసతి సౌకర్యాలు, కొలనులతో కూడిన ఏకాంత ప్రైవేట్ విల్లాలు , అంజనా స్పాలు, టర్కిష్ విందును ఆస్వాదించవచ్చు . లేదంటే క్యాండిల్స్ లైట్స్ వెలుగుల్లో బీచ్‌సైడ్ భోజనాన్ని ఆస్వాదించవచ్చు. దీనికి జతగా అమేజింగ్ మ్యూజిక్, సముద్రతీర అందాలు ఉండనేఉంటాయి. జేడబ్ల్యూ మారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్ (JW Marriott Marquis Hotel Dubai)జేడబ్ల్యూమారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్‌లో రొమాంటిక్ అనుభవాన్ని అందించడంలో ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది. దీని మూడు సిగ్నేచర్ రెస్టారెంట్లలో ఒకదానిలో వాలెంటైన్స్ డేను జరుపుకోవచ్చు, ప్రతీదీ ఒక్కో విలక్షణమైన ప్రపంచ పాక అనుభవాన్ని అందిస్తుంది. దుబాయ్ ఉత్కంఠభరితమైన దృశ్యాలను తనవితీరా ఆస్వాదించవచ్చు. ఇది చిరస్మరణీయమైన సాయంత్రం కోసం సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.దుబాయ్ క్రీక్ రిసార్ట్ (Dubai Creek Resort)జంటలకు కలలు కనే అనుభవాలతో దుబాయ్ క్రీక్ రిసార్ట్‌లో ఏకంగా నెలరోజులపాటు వాలెంటైన్ డేను జరుపుకోవచ్చు. అమరా స్పాలో సన్నిహిత స్పా రిట్రీట్లు, బోర్డ్‌వాక్ వద్ద సుందరమైన వాటర్‌ఫ్రంట్ బ్రంచ్‌లు , పార్క్ హయత్ దుబాయ్‌లో శృంగార బసలను ఆస్వాదించండి. పూల్ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నా లేదా క్యాండిల్‌లైట్ డిన్నర్ అయినా ప్రతీ క్షణం ప్రేమ కోసంమే అన్నట్టు ఎంజాయ్ చేయవచ్చు.అద్భుతమైన నగర దృశ్యాల నుండి ప్రశాంతమైన సముద్ర తీరప్రాంత విహారయాత్రల వరకు, దుబాయ్‌లో వాలెంటైన్స్ డేని జరుపుకోవడానికి చక్కటి అవకాశం. కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినా ప్రేమను ప్రకటించాలన్నా, భాగస్వామితో ప్రశాంతంగా సమయాన్ని గడపాలన్నా దుబాయ్ ఈజ్ ది బెస్ట్. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే.ఇదీ చదవండి: మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో -
చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ప్యాక్‌లు..!
ఇంట్లో మనం అనునిత్యం ఉపయోగించేవే చక్కటి సౌందర్య సాధనాలుగా పనికొస్తాయి. వాటితో చక్కటి మెరిసే చర్మాన్ని పొందొచ్చు కూడా. అయితే ఎలాంటి చర్మం కలవారికి ఏది బెటర్ అనేది చాలామంది సరైన అవగాహన ఉండదు. అలాంటివారు సౌందర్య నిపుణులు చెబుతున్న ఈ చిట్కాలు ఫాలో అయితే సరి. మరి అవేంటో చూద్దామా..!..పాది ద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. ద్రాక్షపండ్లను, నిమ్మ రసాన్ని, కోడిగుడ్డు తెల్లసొనను బ్లెండ్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డు చర్మానికి వేయాల్సిన ప్యాక్. నిమ్మరసం నేచురల్ క్లెన్సర్. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానీయకుండా రక్షిస్తుంది. దీనిని పొడి చర్మానికి కాని నార్మల్ స్కిన్‌కు కాని వాడితే మరింత పొడిబారే అవకాశం ఉంది.రకరకాల పండ్లను, సౌందర్య సాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకోవడానికి సమయం, సహనం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రంచేయాలి. ఇది జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది కూడా పొడి చర్మానికి పనికిరాదు.ఒక టీ స్పూన్ తేనెలో అంతే మోతాదులో పాలు కలిపి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.డ్రైస్కిన్ అయితే... ఒక టీ స్పూన్ తేనె, అంతే మోతాదులో నిమ్మరసం, వెజిటబుల్ ఆయిల్‌లను బాగా కలిపి ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయా... ఇలా ఏదైనా సరే... అందుబాటులో ఉన్న ఆయిల్ వాడవచ్చు. (చదవండి: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..! సమస్యను బయటపెట్టిన ప్రియాంక చోప్రా -
పిల్లల కోసం రెక్కలు తొడుక్కుంది
మలేసియాలో పెనాంగ్ నుంచి కౌలాలంపూర్‌కు 350 కిలోమీటర్లు. ట్రైన్ లో నాలుగ్గంటలు. విమానంలో గంట. వివిధ కారణాల రీత్యా పెనాంగ్‌లో నివాసం ఉంటున్న రేచల్ కౌర్(Racheal Kaur) కౌలాలంపూర్‌లోని తన ఉద్యోగానికి రోజూ విమానంలో వెళ్లి వస్తోంది. ‘టీనేజ్ పిల్లలు ఉన్నారు... వారికి తల్లి అవసరం ఎక్కువ’ అంటోంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా తల్లులు తమ పిల్లలకు ఇవ్వాల్సిన సమయం గురించి ఈ భారతీయ తల్లి కథనం గుర్తు చేస్తోంది.పిల్లల పెంపకం, కెరీర్... ఈ రెండు కత్తిమీద సామే వర్కింగ్ ఉమెన్‌కు. పిల్లలకు పూర్తిసమయం ఇస్తున్నామా లేదా అనేది ఒక ఆందోళనైతే వృత్తిలో ముందుకుపోగలమా లేదా అనేది మరో ఆందోళనగా ఉంటుంది. వీటిమధ్య నలగడం కంటే శక్తికి మించి ఎంతమేరకు చేయగలమో అంతమేరకు చేసి తృప్తిపడుతున్న తల్లులూ ఉన్నారు.మలేసియాలో స్థిరపడ్డ మన పంజాబీ రేచల్ కౌర్ కథ అలాంటిదే. ఆమె తన పిల్లల కోసం బహుశా ఏ తల్లీ చేయని పని చేస్తోంది. అదేంటంటే రోజూ విమానంలో పనికి వెళ్లి విమానంలో రావడం! చాలామంది ఇది పిచ్చా... వెర్రా... అని ఆశ్చర్యపోతారుగాని నాకు ఇదే బాగుందని రేచల్ అంటోంది.ఇల్లు ఒకచోట.. పని ఒకచోట!రేచల్ కౌర్ తన భర్త జగ్జిత్ సింగ్ ఇద్దరు పిల్లలతో మలేసియాలోని పెనాంగ్‌లో ఉంటోంది. ఆమె ఉద్యోగం కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో. ఎందుకంటే ఆమె ఎయిర్ ఏసియాలో బిజినెస్ మేనేజర్. ఈ రెండు చోట్ల మధ్య 350 కిలోమీటర్లు ఉంది. బస్సు మార్గం కష్టం. రైలు సులువు. కాని ఉద్యోగానికిపోయి వచ్చేంత వీలుగా రైళ్లు ఉండవు. ‘అందుకే నేను ఉద్యోగం కోసం కౌలాలంపూర్‌లో ఉంటూ వారానికి ఒకసారి వచ్చి వెళ్లేదాన్ని. కౌలాలంపూర్‌లో ఉండటానికి రూమ్‌కు, నా తిండికి బాగానే ఖర్చయ్యేది. దానిబదులు రోజూ వచ్చి వెళితే కేవలం లంచ్ ఖర్చు, చార్జీల ఖర్చు తప్ప మరే ఖర్చూ ఉండదనిపించింది. దాంతో విమానంలో వచ్చి వెళ్లాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది రేచల్ కౌర్.చార్జీల్లో రాయతీరేచల్ కౌర్ ఎయిర్ ఏసియాలో పని చేస్తుంది. ఆ సంస్థ వారు ఆమెకు రాయితీ ఇవ్వడం వల్ల రాకపోకల ఖర్చు బాగా తగ్గింది. ‘మా ఉద్యోగి ఉద్యోగాన్ని, ఇంటిని బేలెన్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తే సహకరించడం మా బాధ్యత. ఇలా పని చేయాలని కోరుకునేవారికి మేము పూర్తి సహకారం అందిస్తాం’ అని ఎయిర్ ఏసియా ప్రతినిధులు రేచల్‌ను ప్రస్తావిస్తూ అన్నారు.ఉదయం 4 గంటలకు లేచిరేచల్ ఇల్లు పెనాంగ్‌లో ఎయిర్‌పోర్ట్‌కు బాగా దగ్గర. ‘నేను ఉదయాన్నే నాలుగు లేదా నాలుగుంపావుకు నిద్ర లేస్తాను. ఐదు గంటలకంతా రెడీ అయ్యి నా కారులో ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతాను. మా ఎయిర్ ఏసియా రోజువారీ విమానం బోర్డింగ్ టైమ్ 5.55 నిమిషాలు. నేను ఎయిర్‌పోర్ట్‌లో కారుపార్క్ చేసి సులభంగా బోర్డ్ చేయగలిగేంత సమయం ఉంటుంది. ఆరున్నరకు బయలుదేరిన విమానం ఏడున్నరకంతా కౌలాలంపూర్ చేరుతుంది. ఇంకో పదిహేను నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌లోని మా ఆఫీస్‌లో ఉంటాను’ అని చెప్పింది రేచల్. ‘ప్రతి రోజూ విమానంలో ఉదయంపూట కాసేపు ప్రార్థన చేసుకుంటాను. అక్కడే బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీ ముగిశాక మళ్లీ విమానం ఎక్కుతాను. ఏడున్నరకంతా ఇంట్లో ఉంటాను’ అంది రేచల్. 2024 ప్రారంభం నుంచి ఇలా రోజూ తిరుగుతున్నాను. వీకెండ్ రెండు రోజులు తప్పించి ఇప్పటికి 200 రోజులకు పైగా విమానంలో రోజూ వచ్చి వెళ్లాను’ అందామె.నా పిల్లల కోసం..‘నా కొడుక్కు 12 సంవత్సరాలు. నా కూతురికి 11 సంవత్సరాలు. వారు ఎదిగే సమయం. నేను వారానికి ఒకసారి కనపడితే వాళ్ల తిండి, హోమ్ వర్కులు, ఎమోషన్స్ ఎలా తెలుస్తాయి. వారికి నేను కావాలి. అందుకే ఈ మార్గం కష్టమైనా సరే ఎంచుకున్నాను. నా ఆఫీస్‌లోని కలీగ్స్ నన్ను అర్థం చేసుకుని సహకరిస్తారు. ఇంట్లో నా భర్త. అందుకే రోజంతా ఎంత కష్టపడినా ఇంటికి చేరి నా పిల్లల ముఖాలు చూసేసరికి నా కష్టమంతాపోతుంది.ఇంతకుమించి ఏం కావాలి’ అంటుంది రేచల్.టీనేజ్ వయసులో కూతురికైనా, కొడుక్కైనా తల్లి తోడ్పాటు ఉండాలి. తండ్రితో చెప్పుకోలేనివి వారు తల్లితో చెప్పుకుంటారు. ఏ కెరీర్లో ఉన్నా తల్లి ఈ సంగతిని మిస్ చేయకూడదని నిపుణులు అంటారు. రేచల్ ఉదంతం తల్లి బాధ్యతను గట్టిగా గుర్తు చేసేలా ఉంది. -
నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..
వీచే చిరుగాలిని వెలివేస్తా.. పారే నదినావిరి చేస్తా.. నేనున్న నేలంతా మాయం చేశా లేనేలేదే అవసరమే.. నువ్వే నాకు ప్రియవరమే.. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా నువ్వుంటే నా జతగా అంటూ రామజోగయ్య శాస్త్రి రచించిన పాటకు ఏఆర్ రెహ్మాన్ (AR Rahman) అందించిన స్వరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ పాట వింటున్నప్పుడు ఎంత ఫీల్ ఉంటుందో.. ప్రేమికుల దినోత్సవానికి ముందు జరుపుకునే వాలంటైన్స్ వారంలో అంతటి ఫీల్ ఉంటుందని తెలుస్తోంది.. హైదరాబాద్ (Hyderabad) నగరంలో హడావుడి చూస్తోంటే.. వ్యాపార వర్గాల మొదలుకుని పర్యాటక రంగం వరకూ వాలంటైన్స్ డే (Valentine's Day) సందర్భంగా అనేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు.. దీనికితోడు యువత హడావుడీ మామూలుగా లేదనేలా సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని విశేషాలు.. ఫిబ్రవరి నెల మొదటి రెండోవారం మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో వాలంటైన్స్ వీక్ (Valentine week) సందడి కనబడుతోంది. గత రెండు మూడు రోజులుగా ఎక్కుడ చూసినా ఇదే సందడి అన్నట్లుంది హడావుడి. అయితే ఈ వాలంటైన్ వీక్ కొత్తదేం కాదు.. ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ప్రేమికుల వారం నగర సంస్కృతిలో మరింత భాగమైన సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వాలంటైన్స్ వీక్ సంబంధించిన పోస్టులు, రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యానిమేటెడ్, విఎఫ్ఎక్స్ వీడియోలు కాకుండా చాలమంది యువతరం స్వయంగా వీడియోలు చేసి నెట్టింట పెట్టడంతో వైరల్‌గా మారుతున్నాయి. దీనికి సంబంధించి వాలంటైన్ వీక్‌లో మొదటి రోజైన రోజ్ డే ప్రభావం అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ఓ ఫ్లవర్ బొకే షాపు యజమాని జలీల్‌తో ముచ్చటించగా.. ఈ నెల 6న చిన్న సైజు గులాబీ పువ్వుల కోసం చాల ఆర్డర్లు వచ్చాయని, అంతేకాకుండా రోజ్ డే అయిన 7వ తేదీన విడి రోజా పూలను అధిక సంఖ్యలో అమ్మానని చెప్పుకొచ్చాడు. సాధారణంగా బొకేలు తప్ప విడిగా ఒక్కొక్క గులాబీ పువ్వులు అంతగా అమ్ముడుపోవు.. ఈ రోజ్ డే ప్రభావమే దీనికి కారణమని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.ప్రేమను పంచుకోవాలి కదా!ఏళ్ల తరబడి వాలంటైన్స్ వీక్ అని చెప్పుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప వాస్తవంగా అంతగా జరుపుకోలేదు. కానీ ప్రస్తుతం ఈ సంస్కృతి మెల్లమెల్లగా పెరుగుతోంది. చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇవ్వడం, హగ్ డే రోజు హగ్ చేసుకోవడం, ప్రపోజ్ డే రోజు కచ్చితంగా తమ ప్రేమను మళ్లీ ఒకసారి వ్యక్తపరచడం.. ఇలా ఈ తరం ‘ప్రేమికుల వారాన్ని’ స్వయంగా ఆస్వాదిస్తున్నారు. విదేశాల్లోనో, స్థానికంగానో ఉండి కలవడానకి వీలుకాని ప్రేమికులు.. డెలివరీ యాప్స్‌లో గులాబీ పూలను, చాక్లెట్లను ఆయా ప్రత్యేక రోజుల్లో తమ భాగస్వాములకు డోర్ డెలివరీ చేస్తుండటం విశేషం. చదవండి: అంతా ప్రేమమయం...ఇందులో భాగంగా వాలంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే, రోజ్ డే, చాక్లెట్ డే రోజున వీటి ఆర్డర్ల సంఖ్య నగరంలో భారీగా పెరిగిందని డెలివరీ సంస్థల యాజమాన్యాలు చెబుతున్న మాట. హగ్ డే, ప్రామిస్ డే వంటివి వర్చువల్ వేదికగా సరిపెట్టుకుంటున్నారు. తమ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఇచ్చిన ఈ గిఫ్టులకు మంచి లవ్ మెలోడీ ట్రాక్‌ని జోడించి వాట్సాప్ స్టేటస్లు, ఇన్‌స్టా పోస్టులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ వాలంటైన్స్ వీక్‌లో ప్రముఖ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలిబ్రిటీలు కూడా ఉండటం విశేషం.ప్రేమికుల దినోత్సవం కోసం ప్యార్ బజార్..వాలంటైన్స్ డేని పురస్కరించుకుని ప్రముఖ ఆన్లైన్ విపణి.. అమెజాన్ ‘ప్యార్ బజార్’ పేరిట సరికొత్త ఫ్యాషన్ ఉత్పత్తులు, ఫోన్ యాక్సెసరీలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ జహీద్ ఖాన్ తెలిపారు. ఓ చక్కని రొమాంటిక్ డేట్ ఎంజాయ్ చేసేందుకు వీలైన ఉత్పత్తుల, గిఫ్ట్ ఆర్టికల్స్ జ్యువెలరీ మొదలుకుని, మనసును హత్తుకునేలా వాలంటైన్స్ డే కోసం ప్యార్ బజార్ విభాగంలో లభిస్తాయని వివరించారు.– సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో -
Priyanka Chopra: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..!
బాలీవుడ్ ప్రసిద్ధ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు ఫ్యాషన్, నటనల పరంగా సాటిలేరవ్వరూ. తన వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరించి, వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి ఆమెకు చిన్న సంఘటనకు కూడా కన్నీళ్లు(cry) ధారాళంగా వచ్చేస్తాయంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పైగా ఆపడం తన తరం కాదంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది. నిజానికి ప్రియాంక భావోద్వేగాలను హ్యాండిల్ చేయగలదు. వాటి విషయంలో భయపడదు కానీ, బాధ కలిగించే సంఘటనలు జరిగితే మాత్రం కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయని చెబుతోంది. అస్సలు ఇలా ఎందుకు జరుగుతుంది. కొందరూ అస్సలు ఏడుపుని బయటకి వ్యక్తం చెయ్యరు. మరికొందరు మాత్రం కళ్ల కిందే నీళ్ల కుండ పెట్టుకున్నట్లుగా వలవల ఏడ్చేస్తుంటారు ఎందుకని..? అంటే..మన శరీరం భావోద్వేగాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగించే సహజసిద్ధమైన మార్గమే ఏడుపు అని చెబుతున్నారు మానసిక నిపుణులు(Psychologist). అయితే కొందరూ అత్యంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటివాళ్లు తమ భావోద్వేగాలని ఆపుకోలేరు. దీంతో సులభంగా కనుల నుంచి నీళ్లు కుండపోత వాన వచ్చినట్లుగా వచ్చేస్తుంటాయి ఇలా ఎందకంటే..సున్నితమైన భావ్వోద్వేగం..అధిక సున్నితమై భావోద్వేగ కలవారు చాలా సులభంగా కన్నీళ్లు పెట్టేస్తుకుంటారట. వారి భావోద్వేగాలు ఇట్టే బయటపడిపోతాయట. దీంతో ఇలాంటి వ్యక్తులు తన భావోద్వేగం తగ్గేంత వరకు ఏడుస్తూనే ఉంటారట. ఒత్తిడి కారణంగా..ఒత్తిడి, ఆందోళన కారణంగా మనసు బరువు ఎక్కువైపోయి ఉంటే ఒక్కసారిగా ఏడుపు రూపంలో అది వ్యక్తమవుతుందట. దీన్ని ప్రెషనర్ కుక్కర్‌తో పోల్చి చెప్పొచ్చని అంటున్నారు. అంతేగాదు మనస్తత్వ శాస్త్రవేత్తలు భావోద్వేగాలతో మనసు నిండిపోయినప్పుడూ దాన్ని శరీరం ఏడుపు రూపంలో ఇలా బయటకు పంపిస్తుందని చెబుతున్నారు. హార్మోన్ల వల్ల...హార్మోన్ల మార్పులు కూడా కన్నీటిని గణనీయంగా ప్రభావితం చేస్తాయట. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్లో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా ఋతుస్రావం, గర్భధారణ లేదా రుతువిరతి సమయంలో, వ్యక్తులు ఏడుపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు తమ రుతు చక్రాల సమయంలో అధిక భావోద్వేగాలను అనుభవిస్తారు.నిద్ర లేమి, మానసిక ఆరోగ్యంనిద్ర లేకపోవడం భావోద్వేగ నియంత్రణను బలహీనపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా వ్యక్తులు చిన్నదానికి కూడా అతిగి రియాక్ట్ అయ్యి కన్నీళ్లు కార్చేస్తారని చెబుతున్నారు. కొందరికి రోజువారీగా ఏడుపు ఏదో రూపంలో వస్తే మాత్రం మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణించి సకాలంలో చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.ఏడుపు ఆరోగ్యకరమైనదేనా?భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఏడుపు అనేది సహజసిద్ధమైన ఆరోగ్యకరమైన మార్గం. భావాలను అణచివేయడం కంటే ఏడవడమే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల గుండెల్లో భారం తగ్గి ప్రశాంతంగా ఉంటారట. అయితే, ఏడుపు అధికంగా లేదా అదుపు చేయలేనిదిగా మారితే మాత్రం అతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యగా పరిగణించాలని అన్నారు. సరైన మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని సూచిస్తున్నారు. (చదవండి: -
బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా అంబానీ తన డ్యాన్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధిక అంబానీ తనదైన శైలిలో ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్‌తో అందర్నీ కట్టి పడేసింది. స్నేహితులు కృష్ణ పరేఖ్, యష్ సింఘాల్ సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ,రాధికా అంబానీతో కలిసి తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. అంతేకాదు అనార్కలి డిస్కో చలి అంటూ ప్రెండ్స్‌తో కలిసి సూపర్ స్టెప్పులేసింది రాధిక. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. రాధికా అంబానీ తన స్నేహితుల బృందంతో కలిసి విలాసవంతమైన సంగీత్ వేడుకలో నృత్యం చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇటీవల ముంబైలో ట్రైడెంట్ ఒబెరాయ్ హోటల్లో జరిగిన విలాసవంతమైన సంగీత్ వేడుకలో 'అనార్కలి డిస్కో చలి'కి తన అద్భుతమైన స్టెప్పులేసింది. 2012 చిత్రం హౌస్‌ఫుల్ 2 మూవీలోని ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వివాహానికి రాధిక అంబానీ స్టైలిష్ లుక్ మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సిల్వర్ కలర్ లెహెంగాలో అందంగా ముస్తాబైంది. డైమండ్ బ్యాంగిల్స్ , చెవిపోగులతో తన లుక్ మరింత గ్రాండ్‌గా ఉండేలా జాగ్రత్తపడింది. దిల్ ధడక్నే దో చిత్రంలోని గల్లన్ గుడియాన్ లాంటి పాటలకు కూడా ఆమె ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ కనిపించింది. మరో వీడియోలో, ఆమె భర్త అనంత్ అంబానీ, వరుడు యష్ సింఘాల్, వారి స్నేహితులతో కలిసి నృత్యం చేస్తూ కనిపించారు. ఇదీ చదవండి: సబీర్ భాటియా లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్‌తో లవ్? కానీ పెళ్లి మాత్రం! View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ చ శైలా మర్చంట్ దంపతుల కుమార్తెరాధికా మర్చంట్. అలాగే అంబానీముఖేష్ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వివాహం తర్వాత తన అంబానీ ఇంటి పేరుతో కలిపి రాధికా అంబానీగా మారిపోయింది. యూరప్‌లో క్రూయిజ్‌తో సహా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకల పాటు గత ఏడాది జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇది "ఇండియాస్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచింది. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిసెంబరులో రిలీజ్ చేసిన " మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024" జాబితాలో అనంత్-రాధికా అంబానీ కపుల్‌ని చేర్చడం విశేషం. -
PM Modi: రైతు మాదిరిగా ఆహారపు అలవాట్లు ఉండాలి..!
పరీక్ష పై చర్చ(పీపీసీ(Pariksha Pe Charcha 2025) ఎనిమిదవ ఎడిషన్ గత సోమవారం(ఫిబ్రవరి 10, 2025న) న్యూఢిల్లీలో జరిగింది. ఆ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి సంభాషించారు. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో మార్గదర్శకత్వం చేయడమే. అయితే ఈ కార్యక్రమంలో మోదీ ఆహారపు అలవాట్లు, ఎలా తినాలి వంటి వాటి గురించి కూడా విద్యార్థులకు చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..ఇక మోదీ ఈ సెషన్లో మంచి ఆరోగ్యం, జ్ఞాపక శక్తికోసం పోషకాహారం ప్రాముఖ్యత గురించి హైలెట్ చేశారు. శరీరానికి చిరుధాన్యాలు, కాలానుగుణ కూరగాయలు వంటివి ఎంత ముఖ్యమో వివరించారు. అంతేగాదు ఆ సెషన్లో మోదీ విద్యార్థులకు తిల లడ్డూ(నువ్వుల లడ్డూ)లను ఇస్తూ..వీటిని శీతాకాలంలో ఎందుకు తినాలో తెలుసా అని ప్రశ్నించారు. దానికి విద్యార్థులు నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయని బదులిచ్చారు. ఆ తర్వాత చిరుధాన్యాల వినియోగం గురించి కూడా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 2023ని 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం'గా ప్రకటించిందని, అలాగే భారత్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రోత్సహించిందో వివరించారు. మన దేశంలో సహజసిద్ధంగా లభించే వాటిలో ఉండే పోషకాల గురించి అవగాహన కల్పించడంపై భారత ప్రభుత్వం ఎలా ఆసక్తి కనబరుస్తుందో కూడా ప్రస్తావించారు. అలాగే వాటికి పలు రకాల వ్యాధులను నివారించే శక్తి ఉండటమేగాక రాకుండా నివారించే శక్తి ఉందని చెప్పారు. ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలంటే..ఆ కార్యక్రమంలో పరీక్షల ప్రిపరేషన్‌కి సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తోపాటు సకాలంలో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చెప్పారు. అంతేగాదు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏమి తినాలి వంటి ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. అయితే విద్యార్థులకు పోషకాహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశంలోని రైతులు(farmers) ఉదయాన్నే నిద్రలేచి భోజనం చేస్తారు, రోజంతా పని చేస్తారు మళ్లా ఇంటికి వచ్చి సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం(dinner) చేస్తారు. నిజంగా ఇది వేళ్లకు భోజనం చేసే మంచి అలవాటుగా పేర్కొన్నారు. ఇది జీర్ణక్రియకు మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేలా చేయడమే గాక దీర్ఘాయువుని అందిస్తుందని అన్నారు. నిపుణలు అభిప్రాయం ప్రకారం..ప్రధాని మోదీ చెప్పినట్లుగా సాయంత్రం ఏడు గంటలకు ముందు తినడం వల్ల ఆయుష్షు సుమారు 35% పెరుగుతుందని సర్వేలో తేలింది. ఇటలీలోని ఎల్'అక్విలా ప్రాంతంలో నిర్వహించిన మరో పరిశోధనలో సెంచరీ దాటిన చాలమంది వ్యక్తుల్లో సైతం వృద్ధాప్య లక్షణాలు తక్కువుగా ఉన్నట్లు చెప్పారు. వారంతా మెక్కలు ఆధారిత ఆహార పదార్థాలు, కేలరీలు తక్కువుగా ఉన్న భోజనమే తీసుకున్నట్లు కూడా పరిశోధన పేర్కొంది. కాబట్టి అందరూ ఎంత పని ఒత్తిడి ఉన్నా వేళకు పోషకాలతో కూడిన ఆహారం తీసుకునే యత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!:.Had a wonderful interaction with young students on different aspects of stress-free exams. Do watch Pariksha Pe Charcha. #PPC2025. https://t.co/WE6Y0GCmm7— Narendra Modi (@narendramodi) February 10, 2025(చదవండి: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు: హర్ష్ గోయెంకా ఫైర్) -
టెక్ బిలియనీర్ లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్‌తో లవ్? కానీ పెళ్లి మాత్రం!
ఆధార్ ఖర్చుపై సంచలన వ్యాఖ్యల్ని చేసిన హాట్‌మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో సబీర్ భాటియా ఆధార్ సహా టెక్నాలజీ అంశాలపై కీలక విషయాలు ప్రస్తావించారు. ఆధార్ కోసం చేసిన (1.3 బిలియన్ల ఖర్చును వృథా అని చెప్పడంతోపాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా అతని లవ్ స్టోరీ, పెళ్లి విడాకులు లాంటి అంశాలు నెట్టింట సందడిగా మారాయి. బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు, చాలామంది స్టార్లతో డేటింగ్ చేయడం మొదలు, చాలా మంది మహిళలు తన పట్ల ఆకర్షితులయ్యేవారని, పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉండేవారని సబీర్ భాటియా చెప్పుకొచ్చాడు. అయితే వీటన్నంటికీ భిన్నంగా తన కుటుంబ స్నేహితురాలు, బైద్యనాథ్ గ్రూప్‌కు చెందిన తాన్యా శర్మతో ప్రేమలో పడినట్టు వెల్లడించాడు. (బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు)సబీర్ భాటియా చెప్పిన వివరాల ప్రకారం తాన్య శర్మ కుటుంబంతో తమ కుటుంబానికి ఎనిమిదేళ్లుగా పరిచయం. ఈ పరిచయంతోనే రెండు కుటుంబాలు తమ స్నేహాన్ని కుటుంబ సంబంధంగా మార్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే నిజానికి సబీర్ తాన్యను ప్రేమిస్తున్నప్పటికీ, ఆమెను కోడలిగా తెచ్చుకోవాలనే కోరిక మాత్రం తల్లిదే. తల్లి కోరిక మేరకు ఆమెతో మాట్లాడిన తరువాత, ఆమె ప్రేమలో పడటం, జీవితాంతం ఆమెతో గడపాలని భావించాడు.దీంతో వీరి పెళ్లి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. సబీర్ భాటియా, తాన్య శర్మ జంట 2007, డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు.ఆ తర్వాత మలేషియాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2008, మార్చి 9న, మలేషియాలోని ప్రసిద్ధ లంకావి ద్వీపంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. దాదాపు 270 మంది ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. ఈ పెళ్లి కోసం సబీర్ మొత్తం లంకావి ద్వీపాన్నే బుక్ చేసుకున్నాడట.పెళ్లైన కొన్నాళ్లకు వీరికి ఒక పాప పుట్టింది. ఈ పాపకు 'అరియాన్నా' అనే పేరు పెట్టారు. తాన్యా గుడ్‌కేర్ ఫార్మాకు డైరెక్టర్ (బైద్యనాథ్ గ్రూప్ సోదరి సంస్థ గుడ్‌కేర్ ఫార్మా)గా ఉన్నారు. తాన్యా ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ నుండి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి కోర్సును కూడా చదివింది.అయితే పెళ్లైన ఐదేళ్లకు వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. 2013లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక కోర్టులో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అరియాన్నా చిన్నది కనుక ఆమె కస్టడీ హక్కులు తల్లి తాన్యా శర్మకు అప్పగించారు. ఐశ్వర్యారాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట!అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట సబీర్. ఈ విషయంలో నటుడు సల్మాన్ ఖాన్‌తో పెద్ద పోటీయే ఉండేదట. 2001లో ఒక పార్టీలో వీరిద్దరి మధ్యా ఘర్షణ జరిగినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ పుకార్లను మీడియా ఊహాగానాలుగా భాటియా తోసిపుచ్చాడు.కాగా సబీర్ భాటియా 1996లో హాట్‌మెయిల్‌ను సృష్టించడం ద్వారా ఇమెయిల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. తన వ్యాపార భాగస్వామి జాక్ స్మిత్‌తో కలిసి, భాటియా తొలి వెబ్ ఆధారిత ఇమెయిల్ సేవలలో ఒకదాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్థాపించిన 18 నెలలకే దీన్ని అమెరికన్ బిలియనీర్ బిల్ గేట్స్‌కు విక్రయించాడు. దీంతో రాత్రికి రాత్రే వేలకోట్లకు అధిపతియ్యాడు. ఈసొమ్ముతో మరిన్ని కంపెనీలను నిర్మించాడు. ఇది టెక్నాలజీ రంగంలో అతిపెద్ద, గేమ్-ఛేంజింగ్ ఒప్పందాలలో ఒకటిగా టెక్ వర్గాలు భావించాయి. ఈ డీల్ ద్వారా సబీర్ రూ. 3300 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. దీన్నే ఇపుడు ఔట్‌లుక్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుతం సబీర్ భాటియా AI-ఆధారిత అభ్యాస వేదిక, షోరీల్కు నాయకత్వం వహిస్తున్నాడు. -
Harsh Goenka: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు..!
బరువు తగ్గించే అద్భుతమైన డ్రింక్స్‌కి సంబంధించి చాల రకలా పానీయాల గురించి విన్నాం. అదీగాక ఇటీవల రోజుకో కొత్తరకం పానీయం గురించి సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది కొవ్వుని కాల్చేస్తుంది. దెబ్బకు బరువు మాయం అంటూ ఊదరగొట్టేలా చెప్పేస్తున్నారు కొందరూ. వాటిలో వాస్తవికత ఎంత అనేదాంట్లో స్పష్టత మాత్రం ఉండదు. అచ్చం అలాంటి వాటికి సంబంధించిన ఏళ్లనాటి రెమిడీనే తేనె నిమ్మకాయ నీరు. అమ్మమ్మల కాలం నుంచి ఇది బరువుని మాయం చేసే అద్భుతమైన డ్రింక్ అని చెబుతుండటం విన్నాం. అయితే ఈ డ్రింక్‌పై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇది బరువు తగ్గడంలో ఏమాత్రం సహాయపడదంటూ మండిపడ్డారు. ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఇది బరువుని అదుపులో ఉంచలేదా..?. మరి నిపుణులు ఏం చెబుతున్నారు తదితరాల గురించి తెలుసుకుందాం..!.వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ నిమ్మకాయ తేనె పానీయం(honey-lemon water) వల్ల బరువు తగ్గరంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. తాను రెండు నెలలపాటు పరగడుపునే తేనె నిమ్మరసంతో కూడిన గోరువెచ్చని నీటిని తాగేవాడినని. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడంతో క్రమతప్పకుండా ఇలా తాగాననని అన్నారు. అయితే అలా ఇప్పటి వరకు రెండు కిలోలు నిమ్మకాయలు, మూడు కిలోలు తేనె తీసుకున్నాను కానీ తన బరువులో ఎట్టి మార్పు కనిపించలేదని వాపోయారు. బహుశా ఈ పదార్థాలన్నీ బరువుని పెంచేవే కాబోలు అంటూ పోస్ట్‌లో వ్యగ్యంగా రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు... అయితే ఇది మార్కెట్ ట్రిక్ అని ఒకరు, ఇది కేవలం శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందే కానీ బరువుని కాదు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. చెప్పాలంటే పారిశ్రామిక వేత్త లేవెనెత్తిన ప్రశ్న సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ కనిక్క మల్హోత్రా(Kanikka Malhotra) మాత్రం పరగడుపునే దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడుతుందని, హైడ్రేషన్‌ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. అధిక కేలరీల పానీయాలకు బదులుగా ఇలా తేనె-నిమ్మకాయ నీటితో భర్తీ చేయడం వల్ల మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గేందుకు దారితీస్తుంది. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉండి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఇది పౌండ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయలోని విటమిన్ సీ, తేనెలోని యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అంతేగాదు ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు మద్దతిస్తుంది. నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తేనె ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ప్రేగు పనితీరుకి మద్దతిస్తుంది. అదీగాక మలబద్ధకాన్ని నివారించి పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అందరూ ఉపయోగించే సాధారణ పద్ధతి, పైగా పరగడుపునే ఇలా తీసుకోవడం అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శక్తి స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. నిజానికి బరువు తగ్గడానికి అద్భుత పరిష్కారం కాన్పటికీ ఇది సమతుల్య ఆహారంలా ఉపయోగపడుతుంది. వ్యాయామ దినచర్య లేనివారికి అద్భతమైన డ్రింక్‌లా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ బరువు తగ్గడం అనేది మొత్తం ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. ఇందులో ఉపయోగించే తేనె రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి అధిక బరువుని నియంత్రిస్తుంది. అలాగే ఉపవాస సమయంలో దీన్ని తీసుకుంటే శరీర బరువు తోపాటు శరీరం బీఎంఐని కూడా తగ్గిస్తుందని మల్హోత్రా నొక్కి చెప్పారు. అలాగే బరువు తగ్గడం అనేది శక్తి సమతుల్యతకు సంబంధించినది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఈ పానీయాలపై ఆధారపడటానికి బదులు తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టండి అప్పుడే ఈ డ్రింక్ బరువు తగ్గించడంలో హెల్ఫ్ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..హైడ్రేటెడ్‌గా ఉండే యత్నం చేస్తే చక్కటి ఫలితం పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!) -
Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!
ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా180 దేశాలు ‘సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవా’న్ని పాటిస్తున్నాయి. ఈ దినోత్సవం ఈ యేటి నినాదం ‘మెరుగైన ఇంట ర్నెట్ కోసం కలిసి రండి’. ఈ దిశలో ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు-2025’ ముసాయిదాను ప్రజా సంప్రదింపుల కోసం భారత ప్రభుత్వం జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు సూచనలు స్వీకరిస్తారు. వ్యక్తిగత సమాచార గోప్యత పౌరుల ప్రాథమిక హక్కుగా ఈ నియమాలు గుర్తిస్తాయి.అభ్యంతరకర సమాచారం, చిత్రాలు, వీడియోలను ఇంటర్నెట్, ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌ల నుండి తొలిగించమని కోరే హక్కును డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023 సెక్షన్ 12 (3) కల్పిస్తుంది.ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌లో గోప్యతా చట్టాల కింద గుర్తించబడిన కీలకమైన హక్కు ఇది. ఉల్లంఘనలపై రూ. 50 కోట్ల జరిమానా విధించే అధికారం ‘డేటా పరిరక్షణ బోర్డుకు’ఉంటుంది. అంతేగాక, బాలల సమాచారాన్ని ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అను మతి తప్పనిసరి. బాలల వ్యక్తిగత గోపనీయతకు, భద్రతకు నష్టం కలిగించేట్లు సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే రూ. 200 కోట్ల జరిమానా విధించే అధికారం కూడా బోర్డుకు ఉంది. అనేక రూపాలలో బాలలు, మహిళలపై జరిగే హింసలో ఇటీవల అదనంగా చేరింది– సాంకేతిక (డిజిటల్) జెండర్ హింస. అభ్యంతరకర నగ్న చిత్రాలతో వేధింపులు (ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్), బాలికలపై నేరాలు కొన్ని సార్లు వారి ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆన్లైన్లో అభ్యంత రకర ఫోటో, వీడియోల తొలగింపు సులభతరం చేయడానికి ఎన్నో చర్యలు తీసు కున్నాయి. ఇందు కోసం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిగా ‘ఇ–సేఫ్టీ కమిష నర్’ అనే వ్యవస్థను చట్టబద్ధంగా నియమించింది. బ్రిటన్ ‘రివెంజ్ పోర్న్ హెల్ప్ లైన్’ రెండు లక్షల పైచిలుకు అభ్యంతర ఫోటోలను తొలగించింది. కొరియా ‘డిజిటల్ సెక్స్ క్రైమ్ విక్టిమ్ సపోర్ట్ సెంటర్’ ఫోటోల తొలగింపు గురించి ఫిర్యాదు రాకముందే గుర్తించి ముందస్తు తొలగింపు దిశగా పరిశోధన చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ ఏర్పాటు చేసింది. ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాల’ రూపకల్పన సాంకేతి కతతో సమాన వేగంతో జరగకపోతే సమాజం నష్టపోతుంది. సురక్షిత ఇంట ర్నెట్ దినోత్సవం స్ఫూర్తితో బాలలు, మహిళల గౌరవానికి, భద్రతకు పెద్దపీట వేయడం ద్వారా మాత్రమే భారతదేశం మరింత న్యాయమైన, వికసిత భవిష్యత్తు వైపు పురోగమిస్తుంది.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు(నేడు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం) -
అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!
ఈ రోజుల్లో మధుమేహం (డయాబెటిస్) చాలా సాధారణం. మామూలుగానే నియంత్రణలేని డయాబెటిస్ ఆరోగ్యపరంగా ఎన్నోఅనర్థాలు తెచ్చిపెడుతుంది. అదే ఒకవేళ గర్భిణిలో ఆ సమస్య ఉండి, వాళ్లకు చక్కెర నియంత్రణలో లేకపోతే అదికాబోయే తల్లికీ, కడుపులోనిబిడ్డకూ చేటు తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. మామూలుగా కొందరు మహిళలకు గర్భధారణకు ముందునుంచే డయాబెటిస్ ఉండి ఉండవచ్చు. మరికొందరికి గర్భం వచ్చాక కనిపించవచ్చు. దీన్నే జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు రక్తంలోచక్కెర నియంత్రణలో లేకపోతే ఇటు తల్లికీ, అటు బిడ్డకూ...అలాగే ఇటు కాన్పు సమయంలో, అటు కాన్పు తర్వాతా... ఇలా ఎవరిలోనైనా, ఏ దశలోనైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఆ సమస్యలేమిటీ, వాటి పరిష్కారాలేమిటి వంటి అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.మహిళకు... తనకు గర్భం రాకముందునుంచే డయాబెటిస్ ఉండి, గర్భం వచ్చాక రక్తంలోని చక్కెర నియంత్రణలో లేకుండా తీవ్రత ఎక్కువైతే దాన్ని ‘ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. మళ్లీ ఇందులోనూ ఆమెకు ‘టైప్–1 డయాబెటిస్’, ‘టైప్–2 డయాబెటిస్’ అనే రెండు రకాల డయాబెటిస్‌లలో ఏదో ఒకటి ఉండే అవకాశముంది.‘టైప్–1 డయాబెటిస్’ చిన్నవయసులోనే వస్తుంది. ఇందులో సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రాంక్రియాస్ గ్రంథిలోని కణాలపై దాడి చేయడం వల్ల, ఆ గ్రంథిలోంచి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ స్రవించడం ఆగిపోవడం వల్ల వచ్చేదే టైప్–1 డయాబెటిస్. దీని ప్రభావం ఇతర అవయవాలపైనా ఉంటుంది. ఇక ‘టైప్–2 డయాబెటిస్’ అనేది పెద్దయ్యాక వచ్చే మధుమేహం. మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో; సాధారణంగా 35 ఏళ్లు పైబడిన వారిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో ఇన్సులిన్ ప్రభావానికిలోనై శరీరంలోని కణాలు స్పందించకపోవడంతో రక్తంలో చక్కెర నియంత్రణ జరగదు. దాంతో ఈ రకమైన డయాబెటిస్ కనిపిస్తుంది. ఇది చాలామందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక జెస్టేషనల్ డయాబెటిస్ అంటే... ఈ కండిషన్ మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే కనిపించి, కాన్పు తర్వాత డయాబెటిస్ కనిపించకుండా పోతుంది. (అయితే ఇలాంటి కొందరిలో ఆ తర్వాత కొంతకాలానికి డయాబెటిస్ కనిపించే అవకాశాలుంటాయి.) డయాబెటిస్‌కు కారణాలుప్రాంక్రియాస్ గ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ హార్మోను... రక్తంలోని చక్కెరను నియంత్రిస్తూ అవసరమైనప్పుడు శక్తి కోసం చక్కెర విడుదలయ్యేలా, అవసరం లేనప్పుడు తగ్గి΄ోయేలా... ఎప్పుడూ ఓ నార్మల్ విలువ మెయింటైన్ అయ్యేలా చూస్తుంది. ఇలా జరగనప్పుడు డయాబెటిస్ కనిపిస్తుంది. ఆ కారణాలేమిటంటే... ∙గర్భిణుల్లో విడుదలయ్యే కార్టిసా ప్రొజెస్టరాన్, ప్రోలాక్టిన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజెన్ లాంటి హార్మోన్లు ఇన్సులిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ∙కొందరు గర్భిణుల్లో బరువు ఎక్కువగా పెరిగేవారు ఆహారాన్ని తీసుకునేటప్పుడు, శరీర తత్వాన్ని బట్టి నెలలు నిండే కొద్దీ ఒక్కోసారి ఇన్సులిన్ పని తీరు క్రమంగా తగ్గుతుండటం వల్ల, రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలో లేక΄ోవడంతో డయాబెటిస్ కనిపిస్తుంది. కాన్పు తర్వాత మళ్లీ హార్మోన్లు సాధారణ స్థాయికి రావడంతో ఇన్సులిన్ పనితీరు మళ్లీ మునుపటిలాగానే ఉండి, చక్కెరను నియంత్రిస్తుండటం వల్ల కాన్పు తర్వాత చాలామంది మహిళల్లో జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గుతుంది. గర్భవతి కాకముందునుంచే డయాబెటిస్ ఉండేవారిలో గర్భంతో ఉన్నప్పుడు చక్కెర మోతాదులు పెరుగుతాయి. కాన్పు తర్వాత ఆ చక్కెర మోతాదులు మళ్లీ గర్భంరాకముందు ఉన్న స్థాయికి పడిపోతాయి. గర్భిణుల్లో డయాబెటిస్ముప్పు ఎవరిలో ఎక్కువంటే... గర్భధారణ 30 ఏళ్లు పైబడిన తర్వాత జరిగిన వారిలో తమ ఎత్తుకంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉన్న చరిత్ర ఉన్నవారిలో. ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారిలో క్రితం కాన్పులో బిడ్డ కడుపులో చనిపోవడం లేదా పుట్టాక చనిపోవడం, బిడ్డ సైజు పెద్దగా ఉన్నవారిలో ముందు పుట్టిన బిడ్డకు అంగవైకల్యాలు ఉన్న సందర్భాల్లో.నిర్ధారణ...ఇక్కడ చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నవారు మొదటిసారి చెకప్‌కు వచ్చినప్పుడే డాక్టర్‌కు తమకు సంబంధించిన ఆరోగ్య చరిత్ర, ఇతరత్రా విషయాలను దాపరికం లేకుండా చెప్పి, రక్తంలో చక్కెర మోతాదు తెలిపే పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత ఆరో నెలలో మళ్లీ షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. మొదట రాండమ్ బ్లడ్ షుగర్ చేయించుకోవాలి. అందులో విలువలు 150 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువ ఉన్నా లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 కంటే ఎక్కువగా ఉన్నా లేదా తిన్న రెండు గంటల తర్వాత షుగర్ విలువలు 140 కంటే ఎక్కువగా ఉన్నా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) చేయించాలి. ఇందులో తిండితో సంబంధం లేకుండా 50 గ్రా. గ్లూకోజ్ తాగిస్తారు. ఒక గంట తర్వాత రక్తంలో షుగర్ మోతాదులు ఎంత ఉన్నాయో పరీక్షిస్తారు. ఒకవేళ ఇది 140 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే వారిలో డయాబెటిస్ అవకాశాలు ఎక్కువ అని అర్థం. వ్యాధి పూర్తి నిర్ధారణ కోసం ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) చేయించాలి. ఇందులో ఏమీ తినకుండా ఒకసారి, మొదట 100 గ్రా. గ్లూకోజ్ తాగించి గంట తర్వాత ఒకసారీ, రెండు గంటల తర్వాత మరోసారీ, మూడు గంటల తర్వాత ఇంకోసారీ... ఇలా నాలుగుసార్లు రక్తపరీక్ష చేస్తారు. ఈ కొలతలు 95, 180, 155, 140 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు. డయాబెటిస్ ఉన్నప్పుడు వచ్చే సమస్యలివి...తల్లిలో...గర్భస్రావాలు : ముందునుంచే డయాబెటిస్ ఉన్నవారిలో, చక్కెర అదుపులో లేనివాళ్లలో అబార్షన్లు అయ్యే అవకాశాలెక్కువ. హైబీపీ : డయాబెటిస్ ఉన్న గర్భిణుల్లో సాధారణ గర్భిణుల కంటే హైబీపీకి అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి నెలలు నిండకముందే కాన్పు చేయాల్సి రావచ్చు. గర్భిణుల్లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల, ఉమ్మనీరు ఎక్కువగా ఊరుతుంది. ఉమ్మనీరు అధికంగా ఉండటం వల్ల పొట్ట పెద్దగా కనిపిస్తూ, తల్లికి ఆయాసంగా ఉండటం, నెలలు నిండకముందే ఉమ్మనీరు ΄ోవడం, నెలలు నిండకముందే కాన్పు అయ్యే ప్రమాదాలు ఉండవచ్చు వీళ్లలో మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, యోనిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలెక్కువ ∙గర్భిణులూ ఎక్కువ బరువుండటం, అలాగే కడుపులో బిడ్డకూడా అధిక బరువు ఉండటం వల్ల ఆపరేషన్ ద్వారా కాన్పు చేయాల్సి రావచ్చు ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నవారిలో కొన్నిసార్లు చక్కెర మరీ అధికం అయి΄ోయి కీటో ఎసిడోసిస్ అనే కండిషన్‌కు వెళ్లవచ్చు కొంతమందిలో డయాబెటిస్ కోసం తీసుకునే మందుల మోతాదు ఎక్కువై, చక్కెర మరీ తగ్గడం వల్ల కళ్లు తిరిగి పడి΄ోవచ్చు ∙రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల్లో రక్తసరఫరా సరిగా జరగక΄ోవడంతో కళ్లు, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. గర్భంలోని శిశువుకి... అవయవ లోపాలు : గర్భధారణలోని మొదటి మూడు నెలల్లో (ఫస్ట్ ట్రైమిస్టర్లో) తల్లిలో చక్కెర ఎక్కువగా ఉండటం, చక్కెర మోతాదులు అదుపులో లేనప్పుడు అవి గర్భంలోని పిండంలోకి ప్రవేశించి, శిశువులో అవయవలో΄ాలు (ముఖ్యంగా వెన్నుపూస, గుండెకు సంబంధించినవి) కలిగించే ముప్పు.బిడ్డ సైజు విషయంలో అనర్థాలు... తల్లిలో ఎక్కువగా ఉండే ఆ గ్లూకోజ్ మోతాదులు మాయ (ప్లాసెంటా) ద్వారా బిడ్డకు చేరుతాయి. దాంతో బిడ్డలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. బిడ్డ రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడం వల్ల బిడ్డ నార్మల్ కంటే పెద్దగా పెరుగుతుంది. దీనివల్ల పుట్టబోయే చిన్నారులు నార్మల్ కంటే పెద్దగా, ఎక్కువ బరువుతో నీరుపట్టినట్లుగా, ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. తల్లికీ ప్రసవం కష్టమయ్యే అవకాశాలెక్కువ. గర్భంలో చనిపోవడం : బిడ్డ మరీ పెద్దగా ఉండటం వల్ల కొన్నిసార్లు ఎనిమిది, తొమ్మిది నెలల్లో బిడ్డకు సరిపడ ఆక్సిజన్ అందక కడుపులోనే చనిపోయే అవకాశం.జాగ్రత్తలు / చికిత్సలుడయాబెటిస్ ఉందని నిర్ధారణ అయిన తర్వాత గర్భిణులు తమ గైనకాలజిస్ట్, ఫిజీషియన్ లేదా డయాబెటాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్ వంటి నిపుణుల పర్యవేక్షణలో వారు చెబుతున్న జాగ్రత్తలు పాటిస్తూ, తగిన చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. తల్లి రక్తంలో చక్కెరను తరచూ గమనించుకుంటూ / పరీక్షిస్తూ ఉండాలి. శిశువు ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. డాక్టర్లు సూచించిన విధంగా సరైన సమయంలో ప్రసవం చేయించాలి. బిడ్డ పుట్టాక... చిన్నారిని కొద్ది రోజులపాటు పిల్లల డాక్టర్ (పీడియాట్రీషన్) పర్యవేక్షణలో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండాలి. పుట్టిన బిడ్డకు గర్భంలో ఉన్న శిశువుకి, తల్లి మాయ (ప్లాసెంటా) నుంచి గ్లూకోజ్ ఎక్కువగా అందుతుంటుంది. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి వచ్చే చక్కెర అకస్మాత్తుగా ఆగిపోవడంతో బిడ్డలో చక్కెర మోతాదులు హఠాత్తుగా పడిపోతాయి. ఫలితంగా బిడ్డ కండరాలలో శక్తి అకస్మాత్తుగా తగ్గిపోవడం, చిన్నారి చల్లబడిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, ఫిట్స్ రావడం, సకాలంలో గమనించకపోతే బిడ్డ మృతిచెందే అవకాశాలెక్కువ. కొన్నిసార్లు నెలలు నిండకుండా అయ్యే కాన్పు వల్ల బిడ్డకి ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందక΄ోవడం, దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇలాంటి పిల్లల్లో క్యాల్షియమ్, మెగ్నిషియం వంటివి తక్కువ మోతాదులో ఉండటం వల్ల కండరాలు బలహీనత రావచ్చు ఇలాంటి పిల్లలకు కామెర్లు వచ్చే అవకాశాలెక్కువ ∙బిడ్డ గుండె గోడలు అవసరమైనదానికంటే ఎక్కువగా పెరగవచ్చు. (కార్డియోమయోపతి) ∙బిడ్డ పెద్దయ్యాక స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశాలెక్కువ. డయాబెటిస్ లేని గర్భవతితో పోలిస్తే... ఈ సమస్య ఉన్న గర్భిణికి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 2–5 శాతం ఎక్కువ.మరికొన్ని వైద్య పరీక్షలుగర్భిణికి వ్యాధి నిర్ధారణ జరిగాక, షుగర్ మోతాదులను బట్టి వారానికోసారి లేదా రెండు వారాలకొకసారి, తినకుండా ఒకసారి, భోజనం చేశాక, రెండు గంటల తర్వాత మరోసారి రక్తపరీక్ష చేయిస్తూ ఉండాలి. ఇందులో మొదటిది 105 ఎండీడీఎల్. కంటే తక్కువగానూ, రెండోది 120 ఎంజీడీఎల్ కంటే తక్కువగానూ ఉందేమో చూసుకుంటూ ఉండాలి. అలా ఉండేలా డాక్టర్లు ప్లాన్ చేస్తారు. మూత్రపరీక్ష : గర్భిణుల్లో సాధారణంగా కిడ్నీ పనితీరులో మార్పు వల్ల మూత్రంలో చక్కెర పోతూ ఉంటుంది. దీన్నిబట్టి డయాబెటిస్ ఉందని నిర్ధారణకు రావడం సరికాదు. ఇది చాలా సాధారణం. ఇంకా ఈ పరీక్షలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా, ప్రోటీన్లు ఏమైనాపోతున్నాయేమో తెలుసుకొని, ఆ సమస్యలకు చికిత్స అందించాల్సి రావచ్చు. హెచ్‌బీఏ1సీ: ఈ పరీక్ష ద్వారా మూడు నెలల సగటు చక్కెర మోతాదులు తెలుస్తాయి. దీంతో గత మూడు నెలల వ్యవధిలో చక్కెర నియంత్రణలో ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారంగర్భిణుల రక్తంలో చక్కెర మోతాదులు కొద్దిగానే ఎక్కువ ఉంటే, డాక్టర్ సూచనలకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకుని షుగర్ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలతో చక్కెర మోతాదులు నియంత్రణలోకి రాక΄ోయినా లేదా షుగర్ మరీ ఎక్కువగా ఉన్నా... మందులు, లేదా ఇన్సులిన్ ద్వారా చికిత్స అందించాలి. డయాబెటిస్ ఉన్నప్పుడు... గర్భిణుల బరువును బట్టి, వారు చేసే పనిని బట్టి, వారి రక్తంలోని షుగర్ మోతాదులను బట్టి ఎన్ని క్యాలరీల ఆహారం, ఎలా తీసుకోవాలనే విషయాలను వారి ఫిజీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ నిర్ణయిస్తారు. వీరు ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి.చక్కెర మోతాదులు తక్కువగానూ, కొవ్వు తక్కువగానూ, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అంటే అన్నం తక్కువగా తింటూ కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంతవరకు చక్కెర, తేనె, బెల్లం, స్వీట్స్, బేకరీ ఫుడ్, అరటిపండు, సపోటా, సీతాఫలం, మామిడిపండు, పనస, నెయ్యి, డ్రైఫ్రూట్స్, నూనె వస్తువులు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. మిగతా పండ్లను కూడా జ్యూస్‌గా కంటే పండ్ల రూపంలోనే కొరికి తింటుండటం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తీసుకున్నా, అందులో చక్కెర కలుపుకోకుండా తాగడం మేలు. వ్యాయామాలు : గర్భిణులు అంతగా శ్రమ కలిగించని, నడక వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండటం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకొని రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. దాంతో చక్కెర కారణంగా కనిపించే దుష్పరిణామాలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉపయోగం ఎప్పుడంటే... ఆహార నియమాలు, వ్యాయామాలతో రక్తంలో చక్కెర మోతాదులు నియంత్రణలోకి రాకపోతే ఇన్సులిన్ ద్వారా చికిత్స ఇవ్వాల్సి రావచ్చు. ఇది ఇంజెక్షన్ ద్వారా చర్మం కిందనుండే కొవ్వు పొరల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల ఇన్సులిన్ నేరుగా రక్తంలో కలిసి వృథా అయి΄ోకుండా, మెల్లమెల్లగా రక్తంలో కలుస్తూ, అందులోని చక్కెర మోతాదులను ఓ క్రమపద్ధతిలో నియంత్రిస్తుంది. ఈ ఇన్సులిన్ ఎంత మోతాదులో, ఎన్నిసార్లు ఇవ్వాలన్నది వైద్యనిపుణులు నిర్ధారణ చేస్తారు. మెట్ఫార్మిన్ మాత్రలు : ఇటీవలి కొన్ని పరిశోధనలలో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ బదులు మెట్ఫార్మిన్ మాత్రలు గర్భిణుల్లో సురక్షితంగా వాడవచ్చని తేలింది.గర్భం దాల్చిన రెండు మూడు నెలల్లో స్కానింగ్ చేయించడం వల్ల గర్భంలో ఒకే శిశువు ఉందా, లేదా రెండు ఉన్నాయా, పిండానికి ఎన్ని వారాల వయసు, గుండె స్పందనలు సరిగా ఉన్నాయా వంటి విషయాలు తెలుస్తాయి ఐదు, ఆరు నెలల మధ్యన టిఫా స్కానింగ్, అవసరముంటే ఫీటల్ టూ–డీ ఎకో పరీక్ష చేయించడం వల్ల బిడ్డలో అవయవలోపాలు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది ఏడో నెల తర్వాత అవసరాన్ని బట్టి నెలనెలా చేయిస్తే, బిడ్డ సైజు మరీ ఎక్కువగా ఉందా, ఉమ్మనీరు మరీ ఎక్కువగా ఉందా... వంటి విషయాలు తెలుస్తాయి ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్ ఉండేవాళ్లు మధ్యమధ్య కంటి రెటీనా పరీక్ష, కిడ్నీ పనితీరు (క్రియాటినిన్) పరీక్ష చేయించుకోవాలి. కాన్పు సమయంకాన్పు ఎప్పుడు, ఎలా చేయాలి అనే అంశాలను... డయాబెటిస్ ఎంత నియంత్రణలో ఉంది, తల్లిలో, బిడ్డలో ఏవైనా అనర్థాలు కనిపిస్తున్నాయా లాంటి అనేక అంశాల ఆధారంగా డాక్టర్లు నిర్ణయిస్తారు. చక్కెర నియంత్రణలోకి రాకపోయినా, గర్భధారణను కొనసాగించడం వల్ల తల్లికీ, బిడ్డకూ ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే కాన్పు చేయాల్సి రావచ్చు సాధారణ కాన్పుకి ప్రయత్నం చేసేటప్పుడు, నొప్పుల వల్ల తల్లిలోని షుగర్ మోతాదులో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించుకుంటూ, అవసరాన్ని బట్టి ఇన్సులిన్ మోతాదును సెలైన్లలో వేసి ఎక్కిస్తూ కాన్పును జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ చేయాల్సి ఉంటుంది. లేకపోతే గర్భంలోని శిశువుకు అపాయం కలిగే అవకాశాలక్కువ. సిజేరియన్ : సాధారణ కాన్పు ప్రయత్నం విఫలమైనా, కడుపులోని బిడ్డ సైజు 3.5 కేజీల నుంచి 4 కేజీల కంటే ఎక్కువ బరువున్నా, డయాబెటిస్ నియంత్రణలో లేకపోయినా, బీపీ బాగా పెరుగుతూ ఉన్నా, మునుపు గర్భధారణలో శిశువు చనిపోయిన సందర్భాలున్నా... తల్లికి సిజేరియన్ చేయాల్సి రావచ్చు. కాన్పు తర్వాతపుట్టిన వెంటనే బిడ్డ పరిస్థితిని బట్టి తల్లి పాలను పట్టించాలి. కడుపులో ఉన్నంత కాలం బిడ్డకు చక్కెర ఎక్కువగా అందుతూ, కాన్పు అయిన వెంటనే షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అది పరీక్ష చేసి, అవసరమైతే బయటి పాలు లేదా సెలైన్ ద్వారా గ్లూకోజ్ ఎక్కించాలి కాన్పు తర్వాత నాలుగు గంటలకు ఒకసారి చొప్పున 48 గంటల పాటు షుగర్ మోతాదులను పరీక్షిస్తూ ఉండాలి. తల్లికి జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు కాన్పు తర్వాత చక్కెర మోతాదులు మామూలు స్థాయికి వస్తాయి. కాబట్టి తల్లికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే తల్లికి ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్ ఉంటే కాన్పుకు ముందు తల్లికి ఉన్న స్థాయికి చక్కెరపాళ్లు వస్తాయి. ఈఅంశాలను బట్టి ఇన్సులిన్‌ను గర్భం రాకముందు ఇస్తున్న మోతాదుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు మధుమేహం (జెస్టీషనల్ డయాబెటిస్) వచ్చిన మహిళలు... ఆ టైమ్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం లేదా బరువు ఎక్కువగా పెరగడం వంటివి జరిగితే... వాళ్లకు 15–20 ఏళ్ల తర్వాత మళ్లీ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. మిగతా మహిళలతో ΄ోలిస్తే వాళ్లలో ఈ ముప్పు ఎక్కువ. గర్భం రాకముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... డయాబెటిస్ ఉన్నవాళ్లు తమకు గర్భం రాకముందే... అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే సమయంలోనే తాము వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు మార్చుకోవాల్సి ఉంటుంది. ముందునుంచే తమ రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాల పరిస్థితి ఎలా ఉందో వైద్యపరీక్షల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఉండాల్సిన దానికంటే తాము ఎక్కువ బరువు ఉంటే... తమ ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.వీలైతే బరువు తగ్గాకే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించడం మంచిది. ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత గర్భధారణకు మూడు నెలల ముందునుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం వల్ల బిడ్డలో స్పైనా బైఫిడా వంటి వెన్నెముక సరిగా పెరగక΄ోవడం లాంటి చాలా రకాల వైకల్యాలను నివారించవచ్చు. డాక్టర్ శ్రీనిత్య పున్నంరాజు సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ (చదవండి: Salman Khan : రెండు గంటలే నిద్రపోతా! నిపుణులు ఏమంటున్నారంటే..!) -
Salman Khan : రెండు గంటలే నిద్రపోతా! నిపుణులు ఏమంటున్నారంటే..!
బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్లో గ్లామర్‌గా ఉంటారు. ఇప్పటికీ అదేవిధంగా బాడీ మెయంటైన్ చేస్తూ తన అభిమానులను ఖుషి చేస్తుంటారు. సల్మాన్ సినిమా అనగానే ప్రేక్షకుల అంచనాలే వేరేలెవెల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే తన అభినయంతో మెప్పించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు సల్మాన్. అంతేగాదు ఆయన నటనకు గానూ ఎన్నో అవార్డు వరించాయి కూడా. ఆయన తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తన జీవనశైలి గురించి మాట్లాడారు. అది వింటే అన్ని గంటలేనా నిద్ర అని విస్తుపోతారు. అయితే నిపుణులు మాత్రం అది మంచిది కాదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరీ సల్మాన్ ఏం చెప్పారు. ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యం సురక్షితం తదితరాల గురించి చూద్దామా..!.సల్మాన్ ఖాన్ ఇటీవల తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తాను సాధారణంగా రెండు గంటలే పడుకుంటానంటూ బాంబు పేల్చారు. ఎప్పుడో నెలకు ఒకసారి మాత్రమే ఏడు నుంచి ఎనమిది గంటలు పడుకుంటానని అన్నారు. అందువల్లే ఒకోసారి సెట్లో చిన్న విరామాలో నిద్రపోతానని అన్నారు. 59 ఏళ్ల సల్మాన్ తనకు వేరే పనిలేకపోతేనే నిద్రపోతానని చెబుతున్నారు. ముఖ్యంగా తాను జైల్లో ఉన్నప్పుడు బాగా నిద్రపోయానని అన్నారు. అలాగే విమానంలో కూడా నిద్రపోతానని అన్నారు. ఇదే మాదిరిగా షారుక్ కూడా ఒకనొక సందర్భంలో తన నిద్ర షెడ్యూల్ గురించి మాట్లాడారు. తాను ఉదయం 5 గంటలకు నిద్రపోయి 9 గంటలకు మేల్కొంటానని అన్నారు. ఇలా నిద్రపోతే మంచిదేనా అంటే..క్రమరహితమైన నిద్ర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తి రాత్రి 7 నుంచి 9 గంలటకు నిద్రపోవాలని నొక్కి చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, చిత్తవైకల్యం, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. దీని కారణంగా డ్రైవింగ్ సామర్థ్యం కూడా బలహీనపడుతుందని చెబుతున్నారు నిపుణులు. మొత్తం నిద్రను ఒకేసారి పూర్తి చేయడం మంచిది. రాత్రిపూటకే ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే పగటిపూట అంతేస్థాయిలో సమతుల్య నిద్రను పూర్తిచేయాలి. నిద్ర స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం వంటివి చేయాలి. స్థిరమైన నిద్ర షెడ్యూల్ మొత్తం మెరుగైన ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు వైద్యులు .(చదవండి: నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్‌గా కాలేజ్‌లో..!) -
నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్‌గా కాలేజ్‌లో..!
గతంలో చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాలామంది నిరూపించారు. అలా కాకుండా ఉన్నతమైన వృత్తిలో స్థిరపడి పదవీవిరమణ చేసే సమయంలో మరిన్ని విద్యా అర్హతలు సంపాదించాలనుకోవడం మాములు విషయం కాదు !. పైగా ఆ వయసులో కఠినతరమైన ఎంట్రెన్స్ ఎగ్జామ్ చదివి పాసవ్వడం అంటే ఆషామాషి కాదు. కానీ ఈ పెద్దాయన చాలా అలవోకగా సక్సస్ అయ్యి.. చదవాలంటేనే భారంగా భావించే విద్యార్థలందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ అతడెవరో వింటే మాత్రం కంగుతినడం గ్యారంటీ. అంతటి బిజీ వృత్తి చేపట్టి కూడా ఆ వయసులో చదువుకోవాలనుకుంటున్నాడా..? అని నోరెళ్లబెడతారు. ఎవరంటే..62 ఏళ్ల వయసులో పీడియాట్రిక్ వైద్యుడు డాక్టర్ నీలి రాంచందర్ నీట్ పీజీ 2024 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడాయన ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోనున్నారు. ఆయనకు సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ..అత్యంత కఠినతరమైన పరీక్షలలో ఒకటైన నీట్ పీజీ 2024 ఎగ్జామ్ ప్రిపేరై పాసవ్వడం చాలామంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ఈ వయసులో కూడా నేర్చుకునేందుకు మక్కువ చూపించడం అనేది విశేషం. సుదీర్ఘ కల సాకారం కోసం..నిజామాబాద్‌కు చెందిన నీలి రాంచందర్ ప్రముఖ శిశు వైద్యుడుగా 30 ఏళ్లకు పైగా సేవలందించారు. తన కెరీర్‌ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త వైద్య అర్హతలను పొందడానికి నీట్ పీజీ 2024 పరీక్షకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయన నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎండీ(ఫార్మకాలజీ) కోర్సులో చేరి విద్యార్థిగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన 2014లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ పీడియాట్రిక్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడితో సహా ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారు. అతను నేషనల్ రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ (2017-2018)తో సహా అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఎండీ కోర్సును అభ్యసించాలనే అతని దీర్ఘకాల కోరిక అతన్ని NEET PG 2024కి హాజరు కావడానికి ప్రేరేపించింది.వైద్యుడిగా ప్రస్థానం..డాక్టర్ రాంచందర్ ప్రారంభంలో 1982లో బీ. ఫార్మా కోర్సును వదిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌లో చేరారు. అతను 1991, 1993ల మధ్య పీడియాట్రిక్స్‌లో సేవ చేయడానికి డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ (DCH) పూర్తి చేశారు. ఆ తర్వాత వెంటనే ప్రాక్టీస్ చేపట్టి వైద్యుడిగా బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎండీ పూర్తి చేయలేకపోయారు. సరిగ్గా 62 ఏళ్లకు తన చివరి కలను సాకారం చేసుకునే అవకాశం చిక్కింది. ఆయన ఏమాత్రం సంశయించకుండా ఈ వయసులో ఉన్నత చదువు చదవాలనుకోవడం ప్రశంసించనదగ్గ విషయం. సాకులు చెప్పే ఎందరో విద్యార్థులకు స్ఫూర్తి ఈ శిశు వైద్యుడు.(చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..) -
ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త
నిన్నామొన్నటి వరకు గజ గజ వణింకించిన చలించింది. ఇపుడిక ఎండలు దంచికొడుతున్నాయి. జనవరి మాసం అలా వెళ్లిందో లేదో ఫిబ్రవరి మాసం ఆరంభంనుంచి క్రమంగా వాతావరణ వేడెక్కడం మందలైంది. ఇపుడిక ఎండలు మండిస్తున్నాయి. ఎండ ప్రభావం, ఉక్కపోత మొదలైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా శివరాత్రితో శివ..శివా అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కానీ శివరాత్రి కంటే ముందే ఎండల ప్రభావం కనిపిస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవిలో ఎండల బాధలు, తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకూడదు. ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. ముదురుతున్న ఎండలు- జాగ్రత్తలుఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి.అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్ఫ్‌లు ధరించాలి.మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి. కొబ్బరి నీళ్లు, నీళ్ల కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగ్గిపోతాయి. ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు. -
దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..
అవమానిస్తే కుంగిపోయి కూర్చొండిపోతాం. మన బతుకు ఇంతే అనే స్థితికి వచ్చేస్తాం. కానీ కొందరే ఆ అవమానానికి సరైన సమాధానం చెబుతారు. మరోసారి అలా దూషించే సాహసమే చెయ్యనీకుండా చేసి..తప్పు గ్రహించుకునేలా చేస్తారు. బాధపెట్టిన నోళ్ల చేతే గౌరవం పొందేలా చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ డిజైనర్ సుధీర్ రాజ్‌భర్. ఏ మాటతో అవమానించి దూషించేవారు. ఆ మాటతోనే గౌరవం పొందడమే గాక..దూషణాలనే ఎలా అలంకారప్రాయంగా మార్చుకోవాలో చూపి అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతడి విజయగాథ వింటే..బతుకు విసిరే సవాళ్లకు చావుదెబ్బ కొట్టేలా సమాధానం చెప్పడం ఎలాగో తెలుస్తుంది. మరీ సుధీర్ స్టోరీ ఏంటో చూద్దామా..!భారతీయ కుల వ్యవస్థలో, 'చమర్' అనే పదాన్ని అణగారిన కులాలను దూషించడానికి ఉపయోగించే వారు. పూర్వం దళితులకు కులవృత్తి తోలుపని. వాళ్లని చర్మకారులు అని కూడా పిలుస్తారు. మన ఇప్పుడు చెప్పుకుంటున్న డిజైనర్ సుధీర్ రాజ్ భర్(Sudheer Rajbhar(36)) కూడా ఆ కులానికి చెందినవాడే. అతడు ఉత్తరప్రదేశ్‌లోని తన సొంతూరుకి వెళ్లినప్పుడల్లా "భర్", "చమర్" వటి కులదూషణ పదాలతో అవమానాలపాలయ్యేవాడు. అయితే అక్కడ అది సర్వసాధారణం. అక్కడి ప్రజలకు అదొక ఊతపదంలా ఆ పదాలు నోళల్లో దొర్లేవి. ఇక ఆ మాటలు పడుతున్న దళితులకు కూడా అవి అలవాటైపోయాయి. అందువల్ల వాళ్లెవ్వరూ దీన్ని వ్యతిరేకించే సాహసం కానీ, అలా పిలవొద్దని తెగేసి చెప్పడం గానీ చేసేవారు కాదు. అలాంటి స్థితిలో పెరిగిన సుధీర్ వాటన్నింటిని ఆకళింపు చేసుకునే బతికాడు. అతడి బాల్యం ముంబై(Mumbai)లోని చౌల్‌లో జరిగింది. అక్కడ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. కొందరూ బాగా స్థిరపడిన కళాకారుల వద్ద పనిచేసే అవకాశం లభించింది కానీ, కేవలం తన కులం కారణంగా తన పనికి ఎలాంటి క్రెడిట్ రాకపోవడం అనేది కాస్త కష్టంగా ఉండేది సుధీర్‌కి. ముందు తనలాంటి వెనుబడిన కులాల నుంచి వచ్చిన ప్రజలు గౌరవంగా ఉండేలా ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో 2015లో బీఫ్‌పై నిషేధం విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అప్పటి నుంచి ఈ బలహీన వర్గాలకు ఉపాధి దొరకక కష్టాలు మొదలయ్యాయి. చాలామంది నిరుద్యోగులుగా మారిపోయారు. అప్పుడే ఈ తోలు కళాకారులకు సహాయపడే ఒక మాధ్యమాన్ని తయారు చేయడానికి సుధీర్ ముందుకు వచ్చారు. ఏ పదంతో తన కమ్యూనిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఆ పేరుతోనే ఒక ప్రాజెక్టు చేపట్టి మార్పు తీసుకురావాలని భావించాడు. అలా సుధీర్ 2017లో ఆ తోలు కళాకారులకు ఉపాధి కల్పించేలా "చమర్" అనే స్టూడియో(Chamar Studio)ని ప్రారంభించారు. ఇక్కడ చమర్ అని పదం ఉపయోగించడానికి వివరణ ఇస్తూ..తన కమ్యూనిటీ వాళ్లను ఏ పదంతో అవమానించే ప్రయత్నం చేసేవారో ఆ పదంతోనే స్టూడియోకి నామకరణం చేసినట్లు తెలిపారు. దీనిలో తోలు ఉత్పత్తులకు బదులుగా రీసైకిల్ చేసిన రబ్బరు(recycled waste rubber)తో భర్తీ చేయడం ద్వారా చేతివృత్తులవారి జీవనోపాధిని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చమర్ స్టూడియో అత్యంత అందంగా రూపొందించిన మినిమలిస్ట్ బ్యాగులు, వాలెట్లు, బెల్టులు, ఇతర ఉత్పత్తులను విక్రయిస్తుంది. అంతేగాదు డిజైనర్ ఉత్పత్తులను సరమైన ధరలోనే తయారు చేస్తుంది. కాబట్టి అత్యంత ఖరీదైన ధర రూ. 39,000 వరకు ఉండగా, అత్యల్ప ధర రూ. 1,500 నుంచి ప్రారంభమవుతుంది. అలా ఈ స్టూడియో ఉత్పత్తులు ప్రముఖ లగ్జరీ బ్రాండ్(Luxury Brand)గా అనతికాలంలోనే పేరుగాంచాయి. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 50% కళాకారులకు, రాజ్‌భర్ ఫౌండేషన్, ది చమర్ ఫౌండేషన్‌కు తిరిగి వెళ్తుంది.సారూప్య బ్రాండ్లతో పోటీని స్థాపించడం కంటే, మార్పు, సాధికారతకు ఒక సాధనంగా కులతత్వ నిందను ఉపయోగించడం ఈ స్టూడియో ఆలోచన అని చెబుతారు సుధీర్. ఈ బ్రాండ్ పేరుతో తయారైన వస్తువుల కారణంగా ప్రజలకు తమను అవమానించే పదం గురించి తెలియడమేగాక, ఆలోచించడం వంటివి చేస్తారు. తద్వారా ఇలాంటి అవమానాలు, దూషణలకు తెరపడుతుందనేది ఆయన ఆశ. భారత ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగం తమ కమ్యూనిటికి చెందిన వారు తయారు చేసే ఉత్పత్తులు. అలాంటప్పడు వారెందుకు ఇంతలా వివక్షకు గురవ్వుతున్నారనే బాధలోంచి పుట్టుకొచ్చిందే ఈ స్టూడియో అని గర్వంగా చెబుతారు సుధీర్. ఆయన తను నేర్చుకున్న కళతో పదిమందికి ఉపయోగపడేలా ముఖ్యంగా తన కమ్యూనిటీకి చెందిన వారు తలెత్తుకుని గౌరవంగా బతికేలా చేస్తున్నాడు. అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు అంటూ సానుభూతి, ధన సాయం కాదు..వాళ్లు కూడా మనలాంటి మనుషులే అని గుర్తింపు, గౌరవం అని అంటారు సుధీర్. కళతో మానసిక ఆరోగ్యం నయం చేయడమే కాదు సమాజం తీరుని, దృకపథాన్ని మార్చి బాగు చెయ్యొచ్చని డిజైనర్ సుధీర్ తన చేతలతో చేసి చూపించాడు. అంతేగాదు అవమానానికి ప్రతిఘటించడం బదులు కాదు, అవతలి వాడు చేసిన తప్పును గ్రహించి, పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా బతికి చూపాలి అని వెలుగెత్తి చెప్పారు. View this post on Instagram A post shared by CHAMAR (@chamarstudio) (చదవండి: జేఈఈ మెయిన్‌లో రికార్డు రేంజ్ మార్కులు! కానీ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు..) -
మట్టితో మమేకం..
గ్రామాలు, పల్లెల జీవన విధానం.. స్వచ్ఛమైన ఆహారం, ప్రకృతితో సావాసం, సంస్కృతితో కలగలిసిన సంప్రదాయం, పలు వృత్తుల కలయిక ఇలా.. మనిషి జీవనానికీ పల్లెలకు ఎప్పుటి నుండో ఏర్పడిన బంధం.. వీటన్నింటికీ ప్రధానమైనది వ్యవసాయం.. అలా వ్యవసాయానికీ..పల్లె జీవన విధానానికీ ముడిపడినదే మట్టి.. అలాంటి మట్టితో మమేకమైన జీవన విధానంపై నగరంలో వినూత్న పద్ధతిలో ‘నైమిసం ఎర్త్ ఫెస్టివల్’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. పల్లెల్లోని సహజ జీవన విధానాలను తెలియజేస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి.. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని విశేషాలు.. సంప్రదాయ వృత్తులు, జీవన విధానాలు అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో గతకాలపు సాంస్కృతిక జీవన వైవిధ్యం.. ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం.. కలగలిసి ఇవన్నీ ఒకే వేదికగా నగరవాసులకు పరిచయం చేస్తూ.. ప్రస్తుత తరం ఆ తరహా జీవనశైలిలో భాగస్వాములు కావలనే లక్ష్యంతో ‘నైమిసం ఎర్త్ ఫెస్టివల్ 2025’ ఏర్పాటు చేశారు. గచి్చ»ౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా దీనికి వేదికైంది. జె. కృష్ణమూర్తి సెంటర్ నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం నగరానికి సహజ జీవన విధానాన్ని, అందులోని మాధుర్యాన్ని, తన్మయత్వాన్ని రుచి చూపించింది. ఈ ఎర్త్ ఫెస్టివెల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలు, వ్యక్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ గతకాలపు జ్ఞాపకాలను, జీవన శైలిని ఇప్పటికీ కొనసాగిస్తున్న సుస్థిర విధానాలను అద్భుతంగా ప్రదర్శించారు. అలరించిన నృత్యాలు.. ఈ సందర్భంగా నిర్వహించిన గుస్సాడి నృత్యం అలరించింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్, సొసైటీ టు సేవ్ రాక్స్, యానిమల్ వారియర్స్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ వంటి సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న ఆలోచనలతో చేపట్టిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవంలో వాన్వాడి ఫారెస్ట్ కలెక్టివ్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అసీమ్ శ్రీవాత్సవ వంటి వక్తలు ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.నేనొక చేనేతకారుడిని.. చిన్నప్పటి నుంచి బట్టలు నేయడం మాత్రమే తెలుసు. ఎంత గొప్ప భవిష్యత్తు ఉందన్నా మరో పనికి వెళ్లే ఆలోచన లేనివాళ్లం. ఎక్కువగా సిల్క్ చీరలు నేస్తాను. ఒక్కో చీర నేయడానికి నాలుగు రోజులు పడుతుంది. ఇలా నెల్లో 7, 8 చీరలు నేస్తాను. వినియోగించే దారం, డిజైన్ బట్టి ధర ఉంటుంది. అన్నీ పోనూ ఓ 12 వేల వరకూ మిగులుతుంది. గిట్టుబాటు ధరలు లేకపోవడం ప్రధాన సమస్య. అయినప్పటికీ మా వృత్తిలోనే మాకు సంతృప్తి. ముగ్గురు ఆడపిల్లు.. వారిని పీజీలో, డిగ్రీలో చేరి్పంచాను. – రామక్రిష్ణ, సంస్తాన్ నారాయణపురంమట్టి ఇళ్ల నిర్మాణంపై..100, 150 ఏళ్లపాటు ఘనంగా మనగలిగిన నాటి మట్టి ఇళ్లను మళ్లీ ఈ తరానికి అందించడమే లక్ష్యంగా నిలాలిన్ సంస్థను నా సహవ్యవస్థాపకురాలు యామినితో కలిసి ప్రారంభించాం. ఈ నివాసాల్లోని వైవిధ్యాన్ని, విశిష్టతను ఈ తరానికి తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ఔత్సాహికులకు జనగామలో మరుతం లెరి్నంగ్ సెంటర్, ఒడిస్సాలో కమ్యూనిటీ సెంటర్, మహబూబ్‌నగర్‌లో మరో మట్టి ఇంటి ప్రాజెక్టు వంటివి చేపట్టాం. ఈ ఇళ్ల నిర్మాణంలో మట్టిలో దృఢత్వానికి ఆవు పేడ, ఫైబర్ రిచ్ వంటివి కలుపుతాం. స్థానికంగా నాటి మట్టి నిర్మాణం తెలిసిన వారి నైపుణ్యాలను వాడుతున్నాం. – ఐశ్వర్య, నిలాలిన్రసాయనాలు లేకుండా.. శాశ్వత వ్యవసాయంగా పిలుచుకునే పర్మాకల్చర్ విధానంలో పంటలు పండిస్తున్నాం. జహీరాబాద్ సమీపంలోని బిడకన్నె గ్రామంలో విభిన్న రకాల పంటలను ఎలాంటి రసాయనాలూ వేయకుండా పండిస్తున్నాం. నరన్న కొప్పుల ఆధ్వర్యంలోని అరణ్య సంస్థ ఈ వ్యవసాయంపై మరింత అవగాహన కల్పిస్తోంది. నాలాగే 500 మంది మహిళా రైతులు ఈ పర్మాకల్చర్ చేస్తున్నారు. తల్లిలాంటి భూమిని రసాయన మందులు వేసి చంపదల్చుకోలేదు. ఆవులు, బర్రెల పేడతో సహజ ఎరువును తయారు చేసుకుని పంటలు పండిస్తున్నాం. పొన్నగంటి, తోటకూర, దొగ్గల్ కూర, తడక దొబ్బుడు వంటి ఆరోగ్యకరమైన ఆకు కూరలు పండిస్తున్నాను. ఎకరంలో దాదాపు 20 రకాల కారగాయలు, ఇతర పంటలను పండించగలను. మందులతో పండిన పంటతో లభాలు ఎక్కువ వస్తాయేమో.. కానీ ఆరోగ్యం కోల్పోయి ఆస్పత్రుల్లో చేరాలి. కరోనా తరువాత ఈ వ్యవసాయం పై మరింత గౌరవం, నమ్మకం పెరిగింది. నా మనుమరాలి పెళ్లి కూడా చేశాను.. ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను. మా పంటను ఇష్టపడే వారే మా వద్ద ప్రత్యేకంగా కొంటున్నారు. – తుల్జమ్మ, పర్మాకల్చర్ రైతుసంస్కృతులపై అవగాహన కోసం..సెంటర్ ఫర్ ఎంబారీ నాలెడ్జ్ పేరుతో ఒక సంస్థగా ఆనాటి జీవన విధానం, వ్యవసాయం, నివాసాలు, సంస్కృతులు, పద్ధతులను ఈ తరానికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా వర్క్‌షాపులు, కథలు, పాటలు, ప్రాజెక్టుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. తరతరాల వారసత్వంగా వచ్చిన అద్భుత సంస్కృతిని కోల్పోతున్నాం. ఆరేళ్లుగా ఈ అంశాలపైనే కృషి చేస్తున్నాం. ఒక్కో అంశంలో నిపుణులైన ఒక్కొక్కరు బృందంగా ఏర్పడి పనిచేస్తున్నాం. ఒక అరుదైన గ్రామీణ సంగీత కళ లేదా వ్యాయిద్యాన్ని చెప్పుకోవచ్చు. మా ప్రయత్నంలో భాగంగా కొందరికి మట్టి ఇళ్లు కట్టించాం, కథలను చెబుతాం, అసక్తి ఉన్నావారిని ప్రత్యక్షంగా ఈ మూలాల్లోకి తీసుకెళ్లి చూపిస్తాం. నగరానికి సమీపంలోని చౌటుప్పల్ వంటి ప్రాంతాల్లోని గ్రామాలు మొదలు భద్రాచలం వంటి దూరప్రాంతాల్లోనూ మా ప్రాజెక్టును కొనసాగిస్తున్నాం. – ధీరజ్, సెంటర్ ఫర్ ఎంబారీ నాలెడ్జ్ఎర్త్ అండ్ ఆర్ట్ స్టూడియో.. ఇంటిని, గార్డెన్‌ను అందంగా అలంకరించే టెర్రకోట బొమ్మలు, మట్టి పాత్రలు, దారం అల్లికలు వంటివి తయారు చేస్తున్నాం. నగరంలోని కార్ఖానాలో ఎర్త్ అండ్ ఆర్ట్ అనే మా స్టూడియోలో స్టోన్ కారి్వంగ్, బ్లాక్ ప్రింటింగ్, రేడియం తదితర వర్క్‌షాపులను నిర్వహిస్తున్నాం. వీటికి అవసరమైన మట్టిని కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తాం. ఆరి్టఫీíÙయల్ హంగుల కన్నా సహాజమైన కళతో రూపొందించిన ఈ ఉత్పత్తులు ఇంటికే కాకుండా జీవితానికీ సౌందర్యాన్నిస్తాయి. – ఫాతిమా ఖుజీమా, ఎర్త్ అండ్ ఆర్ట్ -
ప్రెగ్నెన్సీ టైంలో మార్పులు ఉంటాయా..?
నేను ఇప్పుడు ఐదునెలల గర్భవతిని. రొమ్ముల్లో చాలా నొప్పి ఉంటోంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక రొమ్ముల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఏవి నార్మల్ అనేది తెలియజేయండి?– బిందు, విజయవాడ. బ్రెస్ట్ టిష్యూలో కొవ్వు ఉంటుంది. లోబ్యూల్స్ అంటే పాలను ఉత్పత్తి చేసేవి. డక్ట్స్ అంటే పాలను క్యారీ చేసేవి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఈ లోబ్యూల్స్, డక్ట్స్ పాలను ఉత్పత్తి చేయటానికి సిద్ధమవుతుంటాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో కొన్ని మార్పులు రెండు రొమ్ముల్లోనూ ఉంటాయి. సాధారణ మార్పులు అంటే రెండు రొమ్ముల ఆకారం, పరిమాణం మారుతాయి. నిపుల్స్, ఆరియోలా డార్క్‌గా మారుతాయి. వాటి చుట్టూ ఉన్న చర్మం కూడా డార్క్ అవుతుంది. కనిపించే రొమ్ము సిరల మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. రొమ్ములు సున్నితంగా అవుతాయి. బ్రెస్ట్ అవేర్నేస్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. త్వరగా కేన్సర్‌ని డిటెక్ట్ చేయవచ్చు. ప్రతి మూడు వందల్లో ఒకరికి ప్రెగ్నెన్సీలో కూడా కేన్సర్ రావచ్చు. అందుకే బ్రెస్ట్ మీద చర్మం ముడతలు పడటం, నిపుల్ నుంచి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వచ్చినా, గడ్డలు తగిలినా అల్ట్రాసౌండ్ టెస్ట్స్ ప్రెగ్నెన్సీలో చేస్తాం. ఏ సందేహం ఉన్నా బయాప్సీకి పంపిస్తాం. బ్రెస్ట్ ఫీడింగ్‌లో రొమ్ము కేన్సర్ ప్రమాదం చాలా తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ డెలివరీ అయిన అరగంటలోపు చేయాలని అందుకే ఎంకరేజ్ చేస్తాం. ఎంత ఎక్కువ కాలం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే అంత మంచిది. కేన్సర్ రిస్క్ అంత తక్కువ చేస్తుంది. ఫీడింగ్ ఇచ్చే సమయంలో బ్రెస్ట్ గట్టిగా అవటం, ఫ్యూయర్ రావటం, నొప్పి ఉండటం చూస్తాం. దీనిని ఎంగేజ్మెంట్ అంటాం, పాల డక్ట్స్ బ్లాక్ అయినందున ఇలా అవుతుంది. ప్రెగ్నెంట్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్ట్రా మిల్క్‌ను తొలగించటంలాంటి వాటితో ఎంగేజ్‌మెంట్‌ను ప్రివెంట్ చేయవచ్చు. బ్రెస్ట్ స్పెషలిస్ట్‌ని సంప్రదించటం మంచిది. ప్రసవం అయి, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా రొమ్ముల్లో మార్పులు ఉంటాయి. ఈ మార్పులు చాలా వరకు ఫీడింగ్ ఆపిన తరువాత నార్మల్ బ్రెస్ట్లాగా అవుతాయి.రొటీన్ చెకప్స్ చాలా అవసరం. ప్రతి నెలా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ స్కిన్ టెక్స్చర్ మారుతుందా, ఆర్మ్పిట్లో ఏవైనా లంబ్స్ వచ్చాయా, నిపుల్ డిశ్చార్జ్లోను అకస్మాత్తుగా ఆకార పరిమాణాల్లోను మార్పులు వచ్చినా, నిపుల్ ఇన్వెన్షన్, డిసెక్షన్స్లో మార్పులు అయినా, దురద ఉన్నా వెంటనే డాక్టర్ని కలవాలి. డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?) -
జేఈఈ మెయిన్‌లో రికార్డు రేంజ్ మార్కులు! కానీ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు..
ఐఐటీ జేఈఈ లాంటి కఠినతరమైన పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అలాగే ఉత్తీర్ణత సాధించి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో రికార్డు స్థాయి జీతాలతో అందరినీ విస్తుపరుస్తుంటారు కూడా. అలాంటిది ఈ యువకుడు జేఈఈ మెయిన్‌లో ఎవ్వరూ బ్రేక్ చేయని విధంగా రికార్డు స్థాయిలో మార్కులు తెచ్చుకున్నాడు. మంచి కాలేజ్‌లో సీటు పొందాడు. పైగా ఇంజీనీరింగ్ విద్యను అకడమిక్ సంవత్సరం కంటే ముందే పూర్తి చేశాడు. అయినా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు. మరీ లక్షల ప్యాకేజ్‌ల ఉద్యోగాన్ని వద్దనుకుని ఏం చేస్తున్నాడో తెలిస్తే..విస్తుపోతారు. అంతేగాదు అతడి స్టోరీ వింటే గెలుపంటే ఇది కదా అని అనుకుండా ఉండలేరు.ఉదయపూర్‌లోని మహారాణా భూపాల్‌కి చెందిన వ్యక్తి కల్పిత్ వీర్వాల్. లక్షలాది మంది డ్రీమ్ ఐఐటీ జేఈఈ2017లో ఉత్తీర్ణత సాధించాడు. దాన్ని కల్పిత్ అత్యంత అలవొకగా సాధించేశాడు. ఇక్కడ కల్పితేమి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. పెద్ద బ్యాగ్రౌండ్ ఏమి లేదు కూడా. తల్లి ఓ ప్రైవేటు టీచర్ కాగా, తండ్రి కాంపౌడర్. అలాగే కల్పిత్ జేఈఈ ప్రిపరేషన్ కోసం అందరిలా ఏకంగా 16 గంటలు చదివిన వ్యక్తి కూడా కాదు. అలాగే కోచింగ్ సెంటర్లలోనే ఉండిపోయి ప్రిపేరయ్యేలా పలు సంస్థలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ముందుక వచ్చినా.. వాటిని కూడా ఇష్టపడకుండా తన ఇంటి నుంచి ప్రిపేరయ్యేందుకే మొగ్గు చూపాడు. ఇక జేఈఈ మెయిన్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ బ్రేక్ చేయని రేంజ్లో 360/360 మార్కులు సంపాదించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నాడు. అంతేగాదు అతనికి కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) స్కాలర్, నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ (NTSE) వంటి ఎన్నో ప్రోత్సాహక స్కాలర్షిప్లను సొంతం చేసుకున్నాడు. అయితే అందరిలా IIT బాంబే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో చేరినా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఐఐటీ రెండో సంవత్సరంలోనే ఒక YouTube ఛానెల్‌ను ప్రారంభించాడు. అక్కడ తన అధ్యయన వ్యూహాలను , JEE ప్రిపరేషన్ చిట్కాలను పంచుకున్నాడు. దీనికి అనతికాలంలోనే అనూహ్యస్పందన వచ్చింది. అతడిచ్చే సలహాలు ఆచరణాత్మకంగా ఉండేవి. విద్యార్థులంతా సాధారణ కోచింగ్ సెంటర్లు బోధించే దానికి భిన్నంగా ఉందంటూ ఇంప్రెస్ అయ్యేవారు. అలా అతని యూట్యూబ్ ఛానెల్‌కి లక్షకు పైగా సబ్స్క్రైబర్లు, ఫాలోయింగ్ ఉండేది. తన ఛానెల్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అలా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడే ఆన్లైన్ విద్యా వేదిక అయిన AcadBoostను కల్పిట్ ప్రారంభించాడు. మరసుటి ఏడాదే తన తొలి ఆన్లైన్ కోర్సుని డెవలప్ చేశాడు. అది విజయవంతమైంది. అలా అతను తన ఐఐటీ క్యాంపెస్ ప్లేస్మెంట్లలో వచ్చే ప్యాకేజ్‌లకు మంచి ఆదాయాన్ని ఈ ఆన్లైన్ వేదిక AcadBoostతో ఆర్జించాడు. అలాగే తన ఐఐటీ బాంబే ప్రోగ్రామ్‌లో ఒక సెమిస్టర్ ముందుగానే ముగించాడు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అకాడ్బూస్ట్ టెక్నాలజీస్‌లో పనిచేసేవాడు. దీంతో 2021 నాటికి, లింక్డ్ఇన్ 'టాప్ వాయిసెస్'లో కల్పిత్‌కి స్థానం ఇచ్చింది. అలా 20 మంది అత్యుత్తమ యువ నిపుణుల జాబితాలో కల్పిత్ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేగాకుండా టెడ్ఎక్స్లో తన జేఈఈ మంచిస్కోర్కి సంబంధించిన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు. ఇక్కడ కల్పిత్ కేవలం విద్యా విషయాలకే కట్టుబడి ఉండలేదు. అతను సీనియర్ NCC క్యాడెట్ అయ్యాడు, కఠినమైన తుపాకీ కసరత్తులు, శిబిరాలు శిక్షణ తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్‌ని కూడా సంపాదించాడు. అలాగే JEEకి సిద్ధమవుతున్నప్పుడు కూడా, అతను క్రికెట్, టీవీ, బ్యాడ్మింటన్, సంగీతం కోసం సమయం కేటాయించేవాడు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఎడ్టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా..నిరాకరించాడు. తన కంటూ ఓ అచంచలమైన లక్ష్యంతో విభ్నింగా ఉండాలనుకున్నాడు, అలానే జీవించి ఎందరికో ప్రేరణగా నిలిచాడు. ఇక్కడ విజయం అంటే కేవలం మార్కులు కాదని, దృష్టి, వ్యూహాలకు సంబంధించినదని ప్రూవ్ చేశాడు. ఎన్ని గంటలు చదివామన్నది కాదు..ఎంత బాగా చదువుతున్నాం, ఎంత నాలెడ్జ్‌ని పొందుతున్నాం అన్నదే ముఖ్యం అని చాటిచెప్పాడు.(చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?) -
ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?
కొందరికి బరువు తగ్గడం అత్యంత క్రిటికల్‌గా మారిపోతుంటుంది. ఎంతలా ప్రయత్నించిన చక్కటి ఫలితం మాత్రం దక్కదు. ఆఖరికి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఎందువల్ల బరువు తగ్గలేకపోతున్నామనేది అర్థంకానీ చిక్కుప్రశ్నలా వేధిస్తుంటుది. అందుకు గల ముఖ్యమైన ఆటంకాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ(Anjali Mukerjee) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. కొందరు బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంటారని, వాళ్లంతా చేసే తప్పులు ఇవే అంటూ వివరించారు. అవేంటంటే..పోషకాహారమే తీసుకుంటున్నాం(Eating Healthy) అయినా సరే బరువు తగ్గడం భారంగా మారిపోతోందన్నారు. అలాంటివాళ్లను తాను స్వయంగా చూశానన్నారు. ఇన్‌స్టాలో “ఆరోగ్యంగా తిన్నప్పటికీ బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? అనే క్యాప్షన్‌తో అందుకు గల కారణాలను వివరించారు ముఖర్జీ. కొన్నిసార్లు మీరు ఏం తింటున్నారనేది ప్రధానం కాదు, శరీరం దానికి తగిన విధంగా ప్రాసెస్ చేస్తుందా లేదా అనేది కూడా గమనించాలని అన్నారు. అసలు బరువు తగ్గాలనుకున్నవాళ్లు చేసే తప్పులు ఏంటంటే..పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చేసే తప్పులుబరువు తగ్గించే జర్నీలో డైట్ అనేది ఎంత ముఖ్యమే సమతుల్యంగా తీసుకుంటున్నామో లేదా అన్నిది కూడా అంతే ప్రధానం అని చెబుతున్నారు అంజలి.అలాగే ఆహరం పరిమాణ, కేలరీలను గమనించండి. ఎందుకంటే బాదం, నెయ్యి ఆరోగ్యానికి మంచివే గానీ ఆ రోజు నువ్వు తీసుకునే కేలరీల ఆధారంగా తీసుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం: అంటే మంచిది కదా అని అవకాడో, వాల్నట్లు, జీడిపప్పు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష మరియు డార్క్ చాక్లెట్లను ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల కూడా బరువు తగ్గడం సాధ్యం కాదని అన్నారు. హార్మోన్ ఆరోగ్యాన్ని అంచనా వేయండి: అంటే ఒక్కోసారి థైరాయిడ్ అనేది రక్తపరీక్షల్లో కూడా బయటపడకపోవచ్చు. దీనివల్ల కూడా బరువు తగ్గించే ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుందట. దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇది క్రమంగా బొడ్డు కొవ్వుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ఒత్తిడిని నిర్వహించడం అనేది అత్యంత ప్రధానం. అదే బరువు తగ్గడానికి సహయపడుతుందట. పేగు ఆరోగ్యాన్ని నిర్వహించడం: పైన పేర్కొన్న అంశాలతో పాటు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అంజలి చెప్పారు. అడపాదడపా ఉపవాసం వంటి వాటిని ప్రయత్నించి సరైన విధంగా ఆహారం తీసుకుంటేనే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అలాగే అనుసరించే డైట్‌కి శరీరం స్పందించే విధానాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే మరిన్ని చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారని చెప్పారు ముఖర్జీ.(చదవండి: యంగ్ లుక్ మంచిదే!) -
యంగ్ లుక్ మంచిదే!
మహిళల్లో చాలామంది తమ వాస్తవమైన ఏజ్ కంటే తక్కువ వయసు వారిగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారంటూ ఈ అంశంపై సమాజంలో జోకులూ, సెటైర్లూ ఎక్కువగానే వినిపిస్తుంటాయి. కానీ ఇలా తక్కువ వయసువారిగా కనిపించడం అన్నది ఆరోగ్యపరంగా, ఆత్మవిశ్వాసపరంగా చాలా మేలు చేస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. మహిళలకే కాదు... ఈ విషయం పురుషులకూ వర్తిస్తుంది. నిజానికి తమ వాస్తవమైన ఏజ్ కంటే తక్కువ వయసువారిగా కనిపించేవారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం తోపాటు ఆరోగ్యపరంగా వాళ్లకు హైబీపీ, పక్షవాతం, గుండెజబ్బుల వంటి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధనల్లో తేలింది. తామింకా చిన్నవాళ్లమేననే భావన వల్ల వారు సుదీర్ఘకాలం పాటు జీవించడమూ జరుగుతుందని వెల్లడైంది. వాళ్ల ముఖంపైన ముడుతలు రావడమూ తక్కువేనని తేలింది. ‘‘జర్నల్ ఆఫ్ జెరంటాలజీ’’ అనే వైద్య జర్నల్‌లో నమోదైన పరిశోధనల ఫలితాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. (చదవండి: తల్లి పాలతో మెదడు మెరుగ్గా!) -
తల్లి పాలతో మెదడు మెరుగ్గా!
తమ నెలల వయసులో పూర్తిగా తల్లిపాలపైనే ఆధారపడటంతోపాటు... చాలాకాలం పాటు అలా తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు భాషలు నేర్చుకునే సామర్థ్యం, ప్రతిభ (లాంగ్వేజ్ స్కిల్స్) చాలా ఎక్కువని కొన్ని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు... ఇలా తల్లిపాలపై దీర్ఘకాలం పెరిగే పిల్లల్లో మెదడు వికాసం బాగా జరగడం వల్ల వాళ్లకు సహజమైన తెలివితేటలూ, తార్కికంగా ఆలోచించే శక్తియుక్తులు (లాజికల్ స్కిల్స్) కూడా బాగా పెరుగుతాయంటూ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం దాదాపు 1500 మంది తల్లులను ఎంపిక చేశారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యయనంలో చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలూ, కేవలం కొద్దికాలం పాటు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్‌పై ఉన్న పిల్లల తెలివితేటలనూ, ఐక్యూను పరీక్షించారు. ఈ అధ్యయనంతో తేలిన అంశాలను బట్టి... చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలు వారి మంచి సామర్థ్యాలను కనబరిచారు. సుదీర్ఘకాలం పాటు తల్లిపాలను తాగిన పిల్లలు ఎక్కువ వకాబు్యలరీని కలిగి ఉండటంతోపాటు, భాషపై మంచి పట్టు సాధించినట్లు తేలింది. హార్వర్డ్ పరిశోధకుల పరిశోధన వివరాలు ‘జామా పీడియాట్రిక్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. (చదవండి: నిద్రపోకపోతే బాసూ... మెమరీ లాసూ! -
నిద్రలేమితో నా'ఢీలా'!
నిద్రకూ, మెదడూ అలాగే నాడీ వ్యవస్థకు ఉన్న సంబంధం చాలా సంక్లిష్టం. అయినప్పటికీ చాలా చిన్న చిన్న ఉదాహరణలతోనే ఆ సంక్లిష్ట సంబంధాన్ని నిరూపించవచ్చు. ఉదాహరణకు క్రితం రాత్రి నిద్రలేకపోతే... ఆ మర్నాడంతా దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ) తగ్గుతుంది. అలాగే నాలుగైదు రోజులు సరిగా నిద్రలేకపోతే చిన్న చిన్న విషయాలకే చికాకు కలగవచ్చు. చిర్రెత్తుకురావచ్చు. పిచ్చికోపం వచ్చేస్తుంది. కొన్ని భ్రాంతులకూ లోనయ్యే ప్రమాదం ఉంది. ఇలా నిద్రలేమి కారణంగా మూడ్స్ మారిపోవడాన్ని బట్టి చూస్తే... నిద్రకూ, నాడీ వ్యవస్థకూ సంబంధముంటుందని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వాహనాలు నడిపేవారికి తగినంత నిద్రలేకపోతే డ్రైవింగ్‌పై పూర్తిగా దృష్టి నిలపలేక యాక్సిడెంట్లు అయిన ఉదంతాలు అన్నీ ఇన్నీ కావన్నది అందరికీ తెలిసిన విషయాలే.నిద్ర సమయంలో మెదడులో జరుగుతూ మానవులకు మేలు చేసే కొన్ని పరిణామాలివి... పెద్దవాళ్ల విషయంలో... అల్జిజమర్స్ వ్యాధికి గురికావడం : మెదడులో వెలువడే కొన్ని విషపూరితమైన రసాయనాలను అంటే... ఉదాహరణకు బీటా ఎమైలాయిడ్ ప్యాక్ వంటి పాచిలాంటి పదార్థాలను నిద్రపోయే సమయంలోనే బ్రెయిన్ వదిలించుకుంటుంది. ఈ పాచి వంటి రసాయనాలే అల్జిజమర్ వ్యాధికి కారణమవుతాయి. ఈ వ్యాధి ఎంతటి ప్రమాదకరమైనదంటే గతంలో తాను నివసించిన ప్రాంతాలు, తాను నివాసముంటున్న ఇల్లు, తనకు తెలిసిన అన్ని నైపుణ్యాలు (వాహనం నడపడం వంటివి) ఇలా అన్నింటినీ మరచిపోయే ప్రమాదముంటుంది. అల్జిమర్స్ సోకినవాళ్లు మింగడం ఎలాగో అనేదేకాదు... చివరికి తానెవరో అనే సంగతీ మరచిపోతారు. స్లీప్ ఆప్నియా: గొంతులోంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళం ముడత పడటంతో శ్వాసప్రక్రియలో అందులోంచి గాలి ప్రవహించేటప్పుడు గురక వస్తుంది. చాలామంది గురకను తేలిగ్గా తీసుకుంటారుగానీ ‘స్లీప్ ఆప్నియా’ అని పిలిచే ఇది... చాలా ప్రమాదకరమైన వ్యాధి. గొంతులోని వాయునాళానికి సంబంధించిన ఈ వ్యాధిని... నిజానికి ముక్కు, గొంతుకు సంబంధిత రుగ్మత అనుకుంటారుగానీ... ఈ వ్యాధికీ మెదడుకూ ఎంత సంబంధముంటుందంటే... గురక సమయంలో ముడుచుకుపోయిన వాయునాళం కారణంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు... బాధితుణ్ణి నిద్రలేవాల్సిందిగా మెదడు ఆదేశిస్తుంది. ఈ శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోవడం అనే పరిస్థితి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు. అంటే ఆ టైమ్‌లో శ్వాస అందదు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించడానికి బాధితుణ్ణి నిద్రలేవమని మనను మన మెదడు ఆదేశిస్తుంది. అప్పుడు నిద్రలేచి శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అలా నిద్రాభంగం కాగానే ముడుతలు పడ్డ వాయునాళం కాస్తా మామూలుగా అయిపోవడంతో మళ్లీ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందుతుంటుంది. ఇలా శ్వాస అందని (ఆప్నియా) స్థితి ఒక రాత్రిలోనే కొన్ని వందల సార్లు రావచ్చు. ఫలితంగా వచ్చే నిద్రలోటును ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఇలా గురక వస్తూ ఉంటుంది కాబట్టి మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అలాగే నాణ్యమైన నిద్ర కరవు కావడంతో (అంటే స్లీప్ డెఫిసిట్‌తో) ఆ మర్నాడు బాధితులు మగతగా, డల్‌గా కనిపిస్తుంటారు. దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. దీనివల్ల అర్థం చేసుకునే శక్తి, లాజికల్‌గా నేర్చుకునే శక్తియుక్తులు (కాగ్నెటివ్ ఎబిలిటీస్) తగ్గుతాయి. అంతేకాదు... పలు నాడీ సంబంధమైన రుగ్మతలు (న్యూరలాజికల్ కండిషన్స్)తోపాటు క్రమంగా మెదడు ఆరోగ్యమూ ప్రభావితమయ్యే అవకాశముంది. పక్షవాతం : నిద్రలేమి కారణంగా మెదడుకు కలిగే అసౌకర్యాలూ లో΄ాలతో పక్షవాతం లాంటి తీవ్రమైన వ్యాధులు సైతం వచ్చే అవకాశముంది. త్వరగా వయసు పైబడటం: నిద్రలేమి కారణంగా వయసు పెరగడం (ఏజింగ్) వల్ల కలిగే అనర్థాలు చాలా త్వరగా వచ్చేస్తాయి. కంటినిండా నిద్ర΄ోయే వారిలో ఏజింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అంటే వాళ్లు సుదీర్ఘకాలం ΄ాటు యౌవనంగా ఉంటారు. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. అలా ముడతలు పడకుండా ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ అనే కణజాలం చాలా కాలం పటుత్వంగా ఉండటంతో చర్మంపైనా, కళ్ల కింద నల్లబడటం జరగదు (డార్క్ సర్కిల్స్ రావు). నుదుటిమీద గీతలు పడవు. మంచి నిద్రతోనే మంచి జ్ఞాపకశక్తి : నిద్రలో మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్ వేవ్ రిపుల్స్’ అంటారు. మనుషులు ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణమౌతూ జ్ఞాపకశక్తికి తోడ్పడేవి ఈ తరంగాలే. అమెరికన్, ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు 2009లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఈ జ్ఞాపకాలన్నీ మెదడులోని హి΄్పోక్యాంపస్ నుంచి మరో ప్రాంతం అయిన నియోకార్టెక్స్‌కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలు (లాంగ్ టర్మ్ మెమరీ)గా ఉండిపోతాయి. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్ టర్మ్ మెమరీస్‌గా మారి శాశ్వతమవుతాయి. అందుకు కారణమైన ‘షార్ప్ వేవ్ రిపుల్స్’ అన్నీ గాఢనిద్రలోనే సాధ్యమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... నిద్ర ఉంటేనే మంచి జ్ఞాపకశక్తి సాధ్యమవుతుంది.నిద్రతోనే పిల్లలు ఎత్తు పెరిగే సామర్థ్యం: పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు సహాయం చేసే గ్రోత్ హార్మోన్లు నిద్రలోనే స్రవించేలా మెదడు ఆదేశాలు ఇస్తుంది. అంటే పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా పెరుగుతారు. బాగా ఎత్తుగా ఎదురుతారు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలను పెంచుతుంది. అవి మందంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. చిన్న పిల్లలు కంటి నిండా నిద్రపోతున్నారంటే... పై ప్రయోజనాలన్నీ చేకూరుతున్నాయని అర్థం. మంచి నిద్ర కోసం... ప్రతిరోజూ ఒకే వేళకు నిద్రించడం / నిద్రలేవడం నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకపోవడం గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ, శీతల నీయాలు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం నిద్రకు ముందర టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడానికి దూరంగా ఉండటం పడకగదిలో మరీ ఎక్కువ కాంతిగానీ, చప్పుళ్లు గానీ లేకుండా చూసుకోవడంపడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వెచ్చగా లేకుండా జాగ్రత్తపడటం అన్నిటికంటే ముఖ్యంగా రోజూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడం. దానితోటు మెదడుకు మేతగా సుడోకూ, పజిల్స్ వంటివి సాల్వ్ చేస్తూ మెదడుకూ తగినంత వ్యాయామాన్ని కల్పించడం. ఇలాంటివి చేయడం వల్ల మంచి నిద్ర పట్టడంతోపాటు మెదడుకూ మంచి ఆరోగ్యం సమకూరుతుంది. డా. విక్రమ్ కిశోర్ రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజిషియన్ (చదవండి: అందాన్ని చెడగొట్టే పులిపిరులను సులభంగా తొలగించుకోండిలా..!) -
అందాన్ని చెడగొట్టే పులిపిరులను సులభంగా తొలగించుకోండిలా..!
ముఖం ఎంత అందంగా ఉన్నా, పులిపిరికాయలు వచ్చాయంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొటిమలైతే రెండు మూడు రోజుల్లో నయమవుతాయి గాని, పులిపిరి వస్తే దానంతట అది తగ్గదు. పులిపిరులు ముఖంపై మాత్రమే కాకుండా, శరీరంలో చర్మపు మడతల్లో ఎక్కువగా ఏర్పడతాయి. అందాన్ని చెడగొట్టే పులిపిరుల సమస్యకు ఈ పరికరం చెక్ పెడుతుంది. ఇది ఎలాంటి నొప్పి లేకుండా, ఇతర దుష్ప్రభావాలేవీ లేకుండా పులిపిరులను సురక్షితంగా తొలగిస్తుంది. ఇది ఇంట్లో ఉన్నట్లయితే, పులిపిరులను తొలగించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లనక్కర్లేదు. శస్త్రచికిత్సలు, రసాయనిక చికిత్సలతో పనిలేకుండానే ఈ పరికరం సాయంతో పులిపిరులను సులువుగా తొలగించుకోవచ్చు.ఈ 2 ఇన్ 1 మైక్రో టు లాడ్జ్ ఆటో స్కిన్ ట్యాగ్ రిమూవర్ కిట్‌లో.. 2 మిమీ – 8 మిమీ సైజుల్లోని చాలా రకాల బ్లేడ్స్ ఉంటాయి. వాటిని అవసరాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది. వాటికి అనువైన రెండు రకాల హెడ్స్ డివైస్‌తో పాటు లభిస్తాయి. వాటిని అడ్జస్ట్ చేసుకుని పులిపిరులను సులభంగా తొలగించుకోవచ్చు. పట్టుకోవడానికి, వాడుకోవడానికి ఈ పరికరం చాలా అనువుగా ఉంటుంది ఈ పరికరాన్ని ఉపయోగించి, పులిపిరులను తీసిన తర్వాత చర్మంపై మచ్చ ఉండిపోతుందేమోనన్న భయం అక్కర్లేదు. ఆ మచ్చలు కూడా చాలా వేగంగా తగ్గిపోతాయి. ఇలాంటి పరికరాలు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరికరాలను నిపుణులను సంప్రదించి ఉపయోగించడం మంచిది. (చదవండి: ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?) -
ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?
నాకు ఇప్పుడు ఎనిమిదవ నెల. ముందుగానే ఉమ్మనీరు పోతే కష్టమని విన్నాను. ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి? ఏమైనా ప్రమాదం ఉంటుందా?– మమత, జమ్మలమడుగు.శిశువు చుట్టూ గర్భంలో ఉమ్మనీరు ఉంటుంది. ఉమ్మనీరు కొంతమందిలో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వెజైనా లేదా సర్విక్స్ బలహీనమైనా, ఎనిమిదవ నెలలో ఉమ్మనీరు సంచి పలుచనైయి, చిట్లుతుంది. అప్పుడు నొప్పులు లేకుండానే ఉమ్మనీరు పోవటం వలన లోపల శిశువుకు, తల్లికి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. 24 వారాల నుంచి 37 వారాల లోపల ఉమ్మనీరు పోతే ప్రీమెచ్యూర్ బర్త్ అంటాం. ఇది తెలుసుకోవటం కొందరికి తెలియక పోవచ్చు. అకస్మాత్తుగా నీరు వెజైనా నుంచి పోవటం, కంట్రోల్ చేసుకోలేకపోవటం, ధారగా ఉండటం, యూరిన్ వాసన లేకపోవటం లాంటివి ఉంటే, ఇంట్లోనే తెలుసుకోవచ్చు. లేదా వెంటనే డాక్టర్ని కలిస్తే, వారు స్పెక్యులమ్ పరీక్ష ద్వారా చెక్ చెస్తారు. అమోనిసోర్ అనే టెస్ట్ ద్వారా కూడా డాక్టర్ చెక్ చేస్తారు. ఇది వెజైనల్ స్వాబ్ టెస్ట్ లాగా ఉంటుంది. ఇది 99 శాతం సెన్సిటివ్ టెస్ట్. మీరు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ పరీక్షతో పాటు, మీ పల్స్, బీపీ, టెంపరేచర్ చెక్ చేసి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తారు. ఒకవేళ లీకింగ్ ఉందని తెలిస్తే, అడ్మిట్ చేసి 24–48 గంటలు అబ్జర్వ్ చేస్తారు. ఈ సమయంలో బేబీ వెల్ బీయింగ్ స్కాన్ చేస్తారు. యాంటీబయోటిక్స్ ఇస్తారు. నెలలు నిండలేదు కాబట్టి శిశువుకు లంగ్ మెచ్యూరిటీ కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. నియో నాటాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ చేసి ప్రీమెచ్యుర్ బేబీ రిస్క్స్, కాంప్లికేషన్స్, కేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు నొప్పులు వచ్చి, ప్రసవం అవుతుంటే సురక్షితంగా, ఎలా కాన్పు చెయ్యాలి అని చూస్తారు. ఒకవేళ నొప్పులు రాకపోతే, పైన చెప్పినట్లు యాంటీబయోటిక్స్ ఇచ్చి, అబ్జర్వ్ చేసి డిశ్చార్జ్ అయిన తరువాత ఇంట్లో ఎలా మానిటర్ చేసుకోవాలో వివరిస్తారు. వారానికి రెండుసార్లు ఉమ్మనీరు, బేబీ బ్లడ్ ఫ్లో స్టడీస్ చేస్తారు. ప్రెగ్నెన్సీ 37 వారాల వరకు పొడిగించడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తారు. రెగ్యులర్ చెకప్స్, ఫాలో అప్స్లో ఏ సమస్య లేకుండా డాక్టర్ సలహాలను పాటించాలి. (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
అభినయ శోభన
మూడేళ్ల వయసులోనే నర్తకిగా మారి, నాట్యమయూరిగా ఎదిగింది. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే మనస్తత్వం, వన్నె తగ్గని అందం, చిన్న పిల్లలాంటి చలాకితనం ఇవన్నీ ఒక్కచోటే ఉంటే, కనిపించే రూపమే నటి, ప్రముఖ నర్తకి శోభన . ఇటీవల ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ ప్రకటించింది. ఆమె విశేషాలు మీ కోసం..⇒ శోభన సొంత ఊరు తిరువనంతపురం. ‘ట్రావెన్కోర్ సిస్టర్స్’గా నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచిన లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు.⇒ ‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా కనిపించింది. ⇒ ‘మణిచిత్రతారు’ అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘మిత్ర్, మై ఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ చిత్రంలో నటనకు మరోసారి జాతీయ పురస్కారాన్ని సాధించింది.⇒ చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఎంతో ఇష్టం. 1994లో ‘కళార్పణ’ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను ఏర్పాటు చేసి, భరత నాట్యంలో శిక్షణ ఇస్తోంది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది.⇒ శోభనకు నాట్యం చేసేటప్పుడు ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేస్తే చాలా కోపం. ఒకసారి ప్రదర్శన మధ్యలో ఫోన్లో రికార్డు చేస్తున్న ఒక ప్రేక్షకుడిని వారించింది.⇒ శోభనకు థాయ్, చైనీస్ వంటకాలు బాగా ఇష్టం. మలేసియాకు వెళితే, అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఆస్వాదిస్తుంది. చీజ్ ఆమ్లెట్ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. నా దుస్తులను నేనే డిజైన్ చేసుకుంటాను. ఒంటికి నప్పని దుస్తులను నేనెప్పుడూ ధరించను. బహుశా, నా దుస్తులే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయనుకుంటా. – శోభన -
Tooth Brush టూత్ బ్రష్.. దీని కథ తెలుసా?
రోజూ పొద్దున లేచి, పళ్లు తోమిన తర్వాతే ఏదైనా తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు పళ్లు తోమడానికి బద్దకిస్తారు. తోమకుండానే ఉండి΄ోతారు. దీనివల్ల పళ్లు చెడిపోయి, దుర్వాసన వస్తుంది. కాబట్టి పళ్లు తోమడం తప్పనిసరి. పళ్లు తోమేందుకు బ్రష్ వాడతాం కదా, ఆ బ్రష్ చరిత్రేమిటో తెలుసా?పళ్లు తోమేందుకు బ్రష్ కనిపెట్టకముందే ఆదిమానవులు పళ్లు శుభ్రం చేసుకునేందుకు రకరకాల వస్తువులు వాడేవారు. చెట్టు బెరడు, పక్షి రెక్కలు, జంతువుల ఎముకలతో పళ్లను శుభ్రం చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో పళ్లను తోమేందుకు చెట్ల కొమ్మల్ని వాడేవారు. అందులోనూ వేపపుల్లల్ని ఎక్కువగా వాడేవారు. వాటిని నమలుతూ పళ్లను శుభ్రంగా ఉంచుకునేవారు. ఒక వైపు తోమాక, మరో వైపుతో నాలుక శుభ్రం చేసుకునేవారు. ప్రపంచంలో అనేకచోట్ల చెట్ల కొమ్మల్నే పళ్లు శుభ్రం చేసుకునేందుకు వాడినట్లు ఆధారాలున్నాయి. అయితే పుల్లలు వాడకుంటూ బొగ్గు, ముగ్గు, బూడిద, ఇతర పదార్థాలను ఉపయోగించి చేత్తోనే పళ్లు తోమే అలవాటు కూడా చాలామందికి ఉండేది. ఇదీ చదవండి: టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!ఆ తర్వాత తొలిసారి చైనాలో బ్రష్ కనిపెట్టారు. ఒక చేత్తో బ్రష్ చివర పట్టుకుంటే మరో వైపు ఉన్న బ్రిజిల్స్ పళ్ల మీద మదువుగా రుద్దుతూ శుభ్రం చేసేవి. ఆ బ్రిజిల్స్ని రకరకాల వస్తువులతో తయారుచేసేవారు. అయితే ఇది కొందరికే అందుబాటులో ఉండేది.1780లో యూకేలో మొదటిసారి విలియం అడ్డీస్ అనే వ్యక్తి జైల్లో ఉండగా, పళ్లను శుభ్రం చేసుకునేందుకు సొంతంగా బ్రష్ తయారుచేసుకున్నాడు. ఆయన బయటకు వచ్చాక వాటిని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అలా బ్రష్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆయన మరణించాక ఆయన కొడుకు ఆ పనిని కొనసాగించాడు. ఆ తర్వాత అనేక కంపెనీలు బ్రష్‌ల తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడు రకరకాల రూపాల్లో బ్రష్‌లు వస్తున్నాయి. చూశారా! ఇవాళ మనం వాడే బ్రష్‌ల వెనుక ఇంత చరిత్ర ఉంది. -
ఆర్టిస్టిక్ .. ప్రేమ్..ఫ్రేమ్..
నగర రహదారుల్లోని గోడలు, అండర్ పాస్ వంతెనలు, ఫ్లై ఓవర్లు అద్భుతమైన చిత్రాలకు వేదికగా నిలుస్తున్నాయి. వాహన చోదకులు, పాదచారులు, అటుగా వెళ్లే ప్రయాణికులను ఈ గోడ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. సుమారు రెండు లక్షల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో పలు చిత్రాలకు ప్రాణం పోసిన యువ కళాకారుడు ప్రేమ్ ఇస్రమ్ ఫ్రేమ్స్ నగరానికి కొత్త సొబగులు అద్దుతున్నాయి. ములుగు జిల్లా గిరిజన తాండా నేపథ్యంలో ఈ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి చిత్రాలు నలుగురికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. రంగు రంగుల చిత్రాలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భాగ్యనగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు ఫైన్ ఆర్ట్స్ కళాకారులు గోడలపై తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీని కోసం దాదాపు 149 కోట్ల నిధులతో రోడ్లు, కూడళ్లు, వీధులను ప్రత్యేకంగా, అత్యంత సుందరంగా మారుస్తున్నారు. నగరానికి తలమానికమైన హైటెక్ సిటీ, కొండాపూర్, ఇతర ప్రధాన రహదారులు అందమైన పెయింటింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి జోన్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లు, స్ట్రీట్ ఆర్ట్‌లో ఓ యువకుడి కళాత్మకత కృషి దాగి ఉంది. మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌యూ వేదికగా ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన ప్రేమ్ ఇస్రమ్ (27) కొన్ని ఫ్లై ఓవర్లకు అత్యాధునిక టెక్నాలజీని ప్రతిబింబించే రంగుల చిత్రాలతో హంగులను అద్దాడు.నాలుగు ఫ్లై ఓవర్లు.. హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి మార్గంలోని ఫ్లై ఓవర్‌పై సాఫ్ట్వేర్ టెక్నాలజీ, అధునాతన సాంకేతికత, ఈ తరం అధునాతన ఆలోచనలు ప్రతిబింబించే చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. దీనికి సమీపంలోని అయ్యప్ప సొసైటీ – 100 ఫీట్ రోడ్ అండర్ పాస్‌లో ‘బజార్స్ ఆఫ్ హైదరాబాద్’ థీమ్‌తో వేసిన పెయింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటన్నింటినీ తన బృందం (15 నుంచి 20 మంది)తో పూర్తి చేశానని, వీరందరూ కూడా తనతో చదువుకున్న జూనియర్స్, ఆర్ట్ ఫ్రెండ్స్ అని ప్రేమ్ తెలిపారు. ఒక ఫ్లై ఓవర్పూర్తి చేయడమే కష్టతరమైన నేపథ్యంలో దాదాపు 2 లక్షల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో నాలుగు ఫ్లై ఓవర్లు కళాత్మకంగా సుందరీకరించానని పేర్కొన్నాడు. కొత్తగూడ అండర్‌పాస్‌లో ఇండియన్ ఆర్మీ లైఫ్‌స్టోరీని, అదే ప్రాంతంలోని ఫ్లై ఓవర్‌పై అడ్వెంచర్, ట్రావెలింగ్కు సంబంధించిన పెయింటింగ్స్ వేశానని వివరించారు.హాబీగా మొదలై.. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని నార్లపూర్ అనే మారుమూల గ్రామం మాది. చిన్నప్పుడు ఆర్ట్ పై పెరిగిన మక్కువ ఈ ప్రయాణానికి కారణం. చిన్నతనంలో సమీపంలోని రోడ్లపై చాక్‌పీస్‌తో పెద్ద పెద్ద బొమ్మలు వేసి సంతోషపడే వాడిని. అదే హాబీగా మారి నగరాన్ని అందంగా మార్చే స్థాయికి రావడం ఆనందంగా ఉంది. సాధారణంగా ఆయిల్ పెయింటింగ్ పోట్రేట్స్ వేయడంలో అనుభవజు్ఞడిని.. గతంలో నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా చారిత్రాత్మక అంశాలతో స్ట్రీట్ ఆర్ట్ వేశాను. నగరంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో నా మూలాలైన ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై వేసిన పెయింటింగ్స్‌తో ‘వేరియస్ ఇంప్రెషన్స్’ అనే ప్రత్యేక ప్రదర్శన చేశాను. – ప్రేమ్ ఇస్రమ్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి -
కళంకారి వెలుగు దారి
కలంకారి అనే మాట ఎంతో సుపరిచితం. అయితే ఈ సుప్రసిద్ధ కళ చరిత్ర చాలామందికి అపరిచితం. ఆ ఘనచరిత్రను ఈ తరానికి పరిచయం చేయడానికి, కలంకారీని మరింత వైభవంగా వెలిగించడానికి పూనుకుంది లీలావతి. కలంకారి అద్దకపు పనికి బోలెడంత ఓపిక కావాలి అంటారు. పరిశోధకులకు కూడా అంతే ఓపిక కావాలి. పెద్ద వస్తువు నుంచి చిన్నవాక్యం వరకు ఎన్నో ఎన్నెన్నో పరిశోధనకు ఇరుసుగా పనిచేస్తాయి. ఈ ఎరుకతో కలంకారిపై లోతైన పరిశోధన చేసిన లీలావతి.. ఆ కళపై పీహెచ్డీ పట్టా పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంటోంది..కలంకారి అంటే గుర్తుకు వచ్చేది పెడన. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో కలంకారి వస్త్రాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2,500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ కళపై చరిత్ర అధ్యాపకురాలు గుడివాడకు చెందిన పామర్తి లీలావతి పరిశోధన చేసింది. ఈ పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఇటీవల పీహెచ్డీ పట్టా అందుకుంది. కలంకారిపై తొలిసారిగా పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన మహిళగా ప్రశంసలు అందుకుంటోంది.పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా విధుల్లో చేరిన లీలావతికి సహజంగానే అక్కడి వాతావరణం వల్ల కలంకారి కళపై ఆసక్తి పెరిగింది. కళాశాలకు వెళ్లే సమయంలో కలంకారి వస్త్రాలపై ముద్రణ నుంచి కలంకారి కళాకారుల జీవన శైలి వరకు ఎన్నో విషయాలు గమనించేది. నాగార్జున యూనివర్శిటీలో కలంకారి పరిశ్రమలపైన, ఆయా కుటుంబాల సామాజిక పరిస్థితులపై ఒకసారి పరిశోధన ప్రసంగం చేసింది.ఆ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ‘కలంకారి కళ’పై పీహెచ్డీ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ స్టూడెంట్‌గా ప్రవేశం పొందింది. ‘కలంకారి కళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశవిదేశాల్లో గుర్తింపు ఉన్న కలంకారిపై ఇప్పటి వరకు ఎవరూ పరిశోధన చేయక పోవడంతో నేనే ఎందుకు చేయకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేశాను’ అంటుంది లీలావతి. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న లీలావతి కలంకారిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఆశిద్దాం. ఎన్నో దారులలో...కలంకారిపై పరిశోధనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. కలంకారి పరిశ్రమ చరిత్ర, సంస్కృతి, దేశ విదేశాల్లో ఉన్నప్రాధాన్యం, ఆదరణ, కార్మికుల జీవన స్థితిగతులపై నా పరిశోధనలో సమగ్రంగా తెలుసుకున్నాను. పరిశోధనలో ఉన్న విశేషం ఏమిటంటే ఒక దారి అనేక దారులకు దారి చూపుతుంది. ఇలా కలంకారి గురించి అనేక కోణాలలో అనేక విషయాలు తెలుసుకోగలిగాను.– పామర్తి లీలావతి– నారగాని గంగాధర్ సాక్షి, పెడన -
వ్యాధిని వరంలా మార్చి..కుటుంటాన్ని పోషించింది..!
ఎదురైన సమస్యనే అనుకూలంగా మార్చుకుని ఎదిగేందుకు సోపానంగా చేసుకోవడం గురించి విన్నారా..?. నిజానికి పరిస్థితులే ఆ మార్గాన్ని అందిస్తాయో లేక వాళ్లలోని స్థ్యైర్యం అంతటి ఘనకార్యాలకు పురిగొల్పితుందో తెలియదు గానీ వాళ్లు మాత్రం స్ఫూర్తిగా నిలిచిపోతారు. కళ్ల ముందే కలలన్నీ ఆవిరై అడియాశలుగా మిగిలిన వేళ కూడా కనికనిపించని ఆశ అనే వెలుగుని వెతికిపట్టుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటారు కొందరు. వీళ్లని చూసి.. కష్టానికి కూడా కష్టపెట్టడం ఎలా అనేది క్లిష్టంగా ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ. ఆమె విషాద జీవిత కథ ఎందరికో ప్రేరణ కలిగించడమే గాక చుట్టుముట్టే సమస్యలతో ఎలా పోరాడాలో తెలుపుతుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం అసామాన్య ధీరురాలైన ఆ మహిళ గాథ ఏంటో చూద్దామా..!.ఆ మహిళ పేరు మేరీ ఆన్ బేవన్(Mary Ann Bevan). ఆమె 1874లో లండన్‌లోని న్యూహామ్(Newham, London)లో జన్మించింది. ఆమె నర్సుగా పనిచేసేది . అయితే ఆమె థామస్ బెవాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే వివాహం అయిన 11 ఏళ్లకు అనూహ్యంగా భర్త మరణిస్తాడు. ఒక్కసారిగా ఆ నలుగురి పిల్లల పోషణ ఆమెపై పడిపోతుంది. ఒక పక్క చిన్న వయసులోనే భర్తని కోల్పోవడం మరోవైపు పిల్లల ఆలనాపాలన, పోషణ అన్ని తానే చూసుకోవడం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసేస్తుంటాయి.సరిగ్గా ఇదే సమయంలో ఆమె అక్రోమెగలీ(Acromegaly) అనే వ్యాధి బారినపడుతుంది. దీని కారణంగా ఆమె శరీరంలోని గ్రోత్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయ్యి శారీరక రూపం వికృతంగా మారిపోతుంది. ఆమె శరీరంలో కాళ్లు, చేతులు, ముఖ కవళికలు తదితరాలన్ని అసాధారణంగా పెరిగిపోతాయి. దీంతో బయటకు వెళ్లి పనిచేయలేక తీవ్ర మనో వేదన అనుభవిస్తుంది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే సంపాదించక తప్పనిస్థితి మరోవైపు ఈ అనారోగ్యం రెండూ ఆమెను దారుణంగా బాధిస్తుంటాయి. భర్త పోయిన దుఃఖానికి మించిన వేదనలు ఎదుర్కొంటుంది మేరీ. ఈ అనారోగ్యం కారణంగా కండరాల నొప్పులు మొదలై పనిచేయడమే కష్టంగా మారిపోతుంటుంది. చెప్పాలంటే దురదృష్టం పగబట్టి వెంటాడినట్లుగా ఉంటుంది ఆమె పరిస్థితి. అయినా ఏదో రకంగా తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఎంతలా తాపత్రయపడుతుందో వింటే మనసు ద్రవించిపోతుంది. సరిగ్గా ఆసమయంలో 1920లలో, "హోమిలీయెస్ట్ ఉమెన్" పోటీ పెడతారు. దీన్ని "అగ్లీ ఉమెన్" పోటీ(Ugly Woman contest) అని కూడా పిలుస్తారు. ఇందులో పోటీ చేసి గెలిస్తే తన కుటుంబాన్ని హాయిగా పోషించుకోవచ్చనేది ఆమె ఆశ. నిజానికి అలాంటి పోటీలో ఏ స్త్రీ పోటీ చేయడం అనేది అంత సులభంకాదు. ఎందుకంటే అందుకు ఎంతో మనో నిబ్బరం, ధైర్యం కావాలి. ఇక్కడ మేరీకి తన చుట్టూ ఉన్న కష్టాలే ఆమెకు అంతటి ఆత్మవిశ్వాసాన్ని స్థ్యైర్యాన్ని అందించాయి. ఆమె అనుకన్నట్లుగానే ఈ పోటీలో పాల్గొని గెలుపొందింది కూడా. ఆ తర్వాత ఆమె అరుదైన జీవసంబంధ వ్యక్తులకు సంబంధించిన ఐలాండ్ డ్రీమ్‌ల్యాండ్ సైడ్షోలో "ఫ్రీక్ షో ప్రదర్శనకారిణిగా పనిచేసింది. మరికొన్నాళ్లు సర్కస్‌లో పనిచేసింది. ఇలా కుటుంబాన్ని పోషించడానికి తన అసాధారణమైన వైద్య పరిస్థితినే(Medical Condition) తనకు అనుకూలమైనదిగా చేసుకుని కుటుంబాన్ని పోషించింది. చివరికి ఆమె 59 ఏళ్ల వయసులో మరణించింది. తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసం పనిచేస్తూనే ఉంది. దురదృష్టం కటికి చీకటిలా కమ్ముకున్నప్పుడే దాన్నే జీవితానికి ఆసరాగా మలుచుకుని బతకడం అంటే ఇదే కదా..!. సింపుల్‌గా చెప్పాలంటే దురదృష్టంలోని మొదటి రెండు పదాలను పక్కన పడేసి అదృష్టంగా మార్చుకోవడం అన్నమాట. చెప్పడం సులువు..ఆచరించాలంటే ఎంతో గట్స్ కావలి కదూ..!.(చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?) -
బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?
ప్రస్తుంతం అందరూ ఆరోగ్య స్ప్రుహతో బ్రకోలిని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. అస్సలు కాలీఫ్లవర్ వైపుకి చూడనివాళ్లు సైతం బ్రకోలి ప్రయోజనాలు తెలిసి మిస్ చేయకుండా కొంటున్నారు. అయితే ఆరోగ్యానికి మంచివని కొనేముందు తాజాగా ఉందా లేదా అనేది గమనించాలి. ఏమరపాటుతో కొంటే మాత్రం ఆరోగ్యదాయకమైనవి కూడా అత్యంత ప్రమాదకరమైనవిగా మారిపోతాయి. ఇలాంటివి కొనేటప్పడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన అధికారులు. ఎందుకంటే..?..యూఎస్‌లోని సుమారు 20 రాష్ట్రాల్లోని ప్రజలు కొన్ని దుకాణాల నుంచి ప్యాక్ చేసి ఉన్న బ్రకోలి(Broccoli)ని కొనుగోలు చేశారు. వెంటనే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US Food and Drug Administration (FDA)) అప్రమత్తమై తినొద్దని హెచ్చరించింది. వాటిని వెనక్కి ఇచ్చేయండి లేదా ఉపయోగిచకండి అని విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఎఫ్‌డీఏ అధికారులు ఓ దుకాణంలో యాదృచ్ఛికంగా బ్రకోలిని టెస్ట్ చేయగా దానిలో ప్రాణాంతక లిస్టెరియా మోనోసైటోజీన్ బ్యాక్టీరియాలు(Listeria monocytogenes) ఉన్నట్లు గుర్తించారు. దీంతో డిసెంబర్ 2024 తొలివారంలో ఎవరైతే ఈ బ్రకోలిని కొన్నారో వారు.. డిసెంబర్ 10 కల్లా ఉపయోగిస్తే పర్లేదని అలాకాని పక్షంలో తక్షణమే వినియోగించటం మానేయాలని సూచించింది. ఎందుకంటే ప్యాకింగ్ చేసినప్పుడు నిల్వ తక్కువ ఉండే ఆహార పదార్ధాల్లో ఆటోమేటిగ్గా ఇలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందట. అందువల్ల దయచేసి ఇలాంటి కూరగాయాలను ప్యాకింగ్ కవర్‌పై ఉండే డేట్ ఆధారంగా కొనడం, ఉపయోగించడం వంటివి చేయండి అని చెబుతున్నారు. ఇలాంటి కలుషితమైన బ్రకోలి తింటే ఆరోగ్యవంతుడైన వ్యక్తులలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి స్వల్పకాలిక లక్షణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. అదే గర్భిణీ స్త్రీలలో గర్భస్రావాలు, నెలలు నిండకుండానే ప్రసవించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. ఏంటీ లిస్టెరియా మోనోసైటోజీన్లు:లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనేది వ్యాధికారక బాక్టీరియం. ఇది మానవులకు జంతువులకు సోకుతుంది. అనేక ఇతర బాక్టీరియాలా కాకుండా లిస్టెరియా రిఫ్రిజిరేటెడ్ పరిసరాలలో వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆహర ఉత్పత్తి నిల్వలో ఈబ్యాక్టీరియా ఉత్ఫన్నమవుతుంది. అందువల్ల కొన్ని ఆహార పదార్థాలు అంటే.. మహా అయితే ఐదు రోజులకి మించి నిల్వ చేయలేని కూరగాయల్లో ఇది ఫామ్ అవుతుంది. తాజా కూరగాయాలు ఆరోగ్యానికి మంచివి. అది కూడా రైతులు కోసుకొచ్చిన.. రెండు మూడు రోజులకి మించి నిల్వ లేనివి అయితేనే మంచివనే విషయం గ్రహించాలి. నిజానికి బ్రకోలి సూపర్ ఫుడ్. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని ఇస్తుంది. కానీ అన్నింటికంటే ఇది ఫ్రెష్‌గా ఉందా లేదా అనేది నిర్థారించి తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..) -
శిల్పారామంలో మూడు రోజుల పాటు ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా
మాదాపూర్ : హైదరాబాద్‌లో ఒడిశా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడియాఫుడ్, క్రాఫ్ట్ మేళాను శిల్పారామంలో శుక్రవారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న మేళాను స్వాభిమాన్ ఒడియా ఉమెన్స్ వరల్డ్, శిల్పారామం సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రదర్శనలో ఒడిశా సంప్రదాయ వంటకాలు, హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం యాంఫీథియేటర్‌లో 5.00 గంటలకు ఒడిశా సంప్రదాయ నృత్యాలను కళాకారులు ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకోనున్నారు. మూడు రోజుల ఉత్సవం సందర్శకులకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుందని సంస్థ అధ్యక్షురాలు సుస్మితా మిశ్ర తెలిపారు. ఒడిశాలోని ప్రసిద్ధ సంబల్పురి, బొమ్కై, కోట్‌ప్యాడ్ అల్లికలతో పాటు, క్లిష్టమైన పెయింటింగ్‌లు, ధోక్రా మెటల్‌వర్క్, ప్రముఖ కళాకారులచే అప్లిక్ వర్క్‌లను ప్రదర్శించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒడిశా కళాత్మక వారసత్వానికి ప్రాణం పోసే ఒడిస్సీ నృత్యం, జానపద, గిరిజన నృత్య ప్రదర్శనలు సందర్శకులను అలరించనున్నాయి. ఇదీ చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!ఒడిశా సంప్రదాయ వంటకాలు.. రసగొల్ల, చెనపోడ, కిర్మోహణ, ఒడియా స్ట్రీట్‌ఫుడ్ గప్‌చుప్, దహీబారా, ఆలూదమ్, ఆలూచాప్ తదితరులు వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ -
మైండ్ రీడింగ్ టెక్నిక్.. ఈ మ్యాజిక్ ఏంటో తెలుసా?
మ్యాజికల్ ఇల్యూజన్.. మెంటలిజం మదిని చదివే కళ సాక్షితో ముచ్చటించిన సుహానీ షా.. మెంటలిజం, ఇల్యూజన్ వంటి వినూత్న మ్యాజిక్ మాయాజాలాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. సోషల్ మీడియాలో మెంటలిస్టులకు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇదే తరహాలో ప్రముఖ భారత మెంటలిస్ట్, ఇల్యూజనిస్ట్, ఇంద్రజాలికురాలు సుహానీ షా సోషల్ సెలిబ్రిటీగా మారింది. ఒక మనిషిని చూసి తన మనసులో ఏమనుకుంటున్నారో ఇట్టే చెప్పేయగల ప్రముఖ మెంటలిస్ట్ సుహానీ. ఇలా తన మైండ్ రీడింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలతో హాలీవుడ్, బాలీవుడ్ తారలతో పాటు క్రికెటర్లు, వ్యాపార దిగ్గజాలను మెస్మరైజ్ చేస్తోంది. నగరంలోని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ‘ది మ్యాజిక్ ఆఫ్ మెంటలిజం’ కార్యక్రమంలో ఈ మానసిక మాంత్రికురాలు మరోసారి తన స్కిల్‌తో వావ్ అనిపించింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మెంటలిజం, ఇల్యూజన్ తదితర అంశాల గురించి సుహానీ చెప్పిన కహానీలు ఆమె మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో మెంటలిజం మనుషులను, వారి ఆలోచనలను పసిగట్టగల మైండ్ రీడింగ్ టెక్నిక్. దీనికి మాతృక మాత్రం మ్యాజిక్కే. మ్యాజిక్‌లో సబ్ జానర్ ఈ మెంటలిజం. మ్యాజిక్‌లో దాగున్న విభిన్న రూపాల్లో ఇల్యూజన్, బ్లైడ్ ఫోల్డ్, స్ట్రీట్ మ్యాజిక్, పాలో మ్యాజిక్, ఎస్కూలోపోలాజీ, పిక్ పాకెటింగ్ తదితరాలు ఉన్నాయి. ఒకరి ఆలోచనలను చదవగలగడం, గతాన్ని, భవిష్యత్తును సైకలాజికల్‌గా ఊహించగలగడం. దీనికి కొన్ని రకాల కోర్సులు ఉన్నాయి. నిపుణులు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. 20 ఏళ్ల ప్రయాణంలో.. నేను ఏడేళ్ల వయసు నుంచి ఈ రంగంలో ఉన్నాను. దాదాపు 20 ఏళ్ల ప్రయాణంలో మొదట ఇల్యూజనిస్ట్గా చేశాను. ట్రెడిషనల్ ఇండియన్ మ్యాజిక్ నా మూలం. నేను గొప్ప గొప్ప చదువులు చదువుకోలేదు.. 14 ఏళ్ల వరకూ నాకు అంతగా చదవడం, రాయడం రాదు. కానీ 15వ ఏట ‘సైకాలజీ అండ్ హ్యూమన్ బిహేవియర్’ అనే పుస్తకాన్ని రాశాను. స్వీయ అనుభవాలతో రాసిన ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకూ 35 నుంచి 40 దేశాల వరకూ తిరిగి మెంటలిస్టుగా షోలు చేశాను. భారత్‌లో ప్రముఖ మహిళా మెంటలిస్ట్‌గా సహానీ షా ప్రయాణం మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. 200 మంది ఫిక్కీ లేడీస్‌ను సుహానీ మాయ చేసి మంత్రముగ్ధుల్ని చేసింది. ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ -
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు అతడిని నగర జీవితం నుంచి గ్రామం బాట పట్టేలా చేశాయి. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతకాలనుకున్నాడు. చివరికి అదే అతడికి కనివిని ఎరుగని రీతిలో లక్షలు ఆర్జించేలా చేసి..మంచి జీవనాధారంగా మారింది. ఒకరకంగా ఆ ఆరోగ్య సమస్యలే ఆర్థిక పరంగా స్ట్రాంగ్‌గా ఉండేలా చేయడమే గాక మంచి ఆరోగ్యంతో జీవించేందుకు దోహదపడ్డాయి. ఇంతకీ అతడెవరంటే..అతడే హర్యానాకి చెందిన జితేందర్ మాన్(Jitender Mann). ఆయన చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో 20 ఏళ్లు టీసీఎస్ ఉద్యోగిగా పనిచేశారు. అయితే ఆ నగరాల్లో కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో నలభైకే రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి రోగాల బారినపడ్డారు. జస్ట్ 40 ఏళ్లకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాను రాను ఎలా ఉంటుందన్న భయం ఆయన్ని నగర జీవితం నుంచి దూరంగా వచ్చేయాలనే నిర్ణయానికి పురిగొలిపింది. అలా ఆయన హర్యానాలోని సొంత గ్రామానికి వచ్చేశారు. అక్కడే తన భార్య సరళతో కలిసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా రెండు ఎకరాల్లో సేంద్రియ మోరింగ ఫామ్(organic moringa farm)ని ప్రారంభించారు. అలాగే ఆకుల్లో పోషకవిలువలు ఉన్నాయని నిర్థారించుకునేలా సాంకేతికత(technology)ని కూడా సమకూర్చుకున్నారు. అలా అధిక నాణ్యత కలిగిన మోరింగ పౌడర్ని ఉత్పత్తి చేయగలిగారు ఈ జంట(Couple). వారి ఉత్పత్తులకు త్వరితగతిన ప్రజాదరణ పొంది..ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు,ముంబై వంటి నగరాలకు వ్యాపించింది. ఈ పౌడర్‌కి ఉన్న డిమాండ్ కారణంగా నెలకు రూ. 3.5 లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది ఆ దంపతులకు. అలా ఇప్పుడు నాలుగు ఎకరాలకు వరకు దాన్ని విస్తరించారు. అత్యున్నత నాణ్యతను కాపాడుకోవడమే ధ్యేయంగా ఫోకస్ పెట్టారిద్దరు. అందుకోసం ఆకులను కాండాలతో సహా కోసి రెండుసార్లు కడిగి ఏడు నుంచి తొమ్మిది కాండాలను కలిపి కడతామని అన్నారు. తద్వారా ఆకుని సులభంగా ఎండబెట్టడం సాధ్యమవుతుందని జితేందర్ చెబుతున్నారు. ఆకులను పెద్ద ఫ్యాన్ల కింద నియంత్రిత గ్రీన్హౌస్ సెటప్‌లో ఎండబెట్టడం జరుగుతుంది. అందువల్ల 12 గంటలలోనే ఆకులను కాండాల నుంచి తీసివేసి ముతక పొడిగాచేసి జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. అంతేగాదు ఈ దంపతులు తాము నేలను దున్నమని చెబుతున్నారు. తాము కలుపు మొక్కలు, ఇతర ఆకులనే రక్షణ కవచంగా చేసుకుంటారట. అలాగే హానికరమైన రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులను ఉపయోగించమని చెబుతున్నారు. ఇలా జితేందర్ వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడంతోనే ఆయన లైఫ్ మారిపోయింది. ఇదివరకటిలా ఆరోగ్య సమస్యలు లేవు. మంచి ఆరోగ్యంతో ఉన్నాని ఆనందంగా చెబుతున్నాడు. అలాగే ప్యాకేజింగ్ కోసం పొడిని పంపే ముందే తాము కొన్ని జాడీలను తమ కోసం పక్కన పెట్టుకుంటామని చెప్పారు. ఈ మొరింగ పౌడర్ వినియోగం తమకు మందుల అవసరాన్ని భర్తీ చేసేస్తుందని అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ధీమాగా చెబుతున్నారు. అలాగే జితేంద్ర దంపతులు తాము గ్రామానికి వెళ్లాలనుకోవడం చాలామంచిదైందని అంటున్నారు. "ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడం తోపాటు ఆరోగ్యంగా ఉంటున్నాం. పైగా కాలుష్యానికి దూరంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాం అని సంతోషంగా చెబుతోంది ఈ జంట. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: లెడ్‌లైట్ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..!) -
ఆటల్లో ఆణిముత్యం..ఐఏఎస్ ఆమె టార్గెట్..!
ఆటల్లో ఆణిముత్యం ఆటకు ప్రతిభ మాత్రమే కాదు సాధన కూడా ముఖ్యమే. తన ప్రతిభకు నిరంతర సాధన జోడించి జంప్ రోప్ నుంచి జోడో వరకు ఎన్నో ఆటల్లో అద్భుత విజయాలు సాధిస్తోంది వనిపెంట శ్రావణి. తాజాగా నేపాల్‌లో నిర్వహించిన ఇండో–నేపాల్ జంప్ రోప్ చాంపియన్ షిప్ 2025 టోర్నమెంట్లో రెండు బంగారుపతకాలు సాధించి సత్తా చాటింది...శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన వనిపెంట శ్రావణి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కలిగిరిలో చిన్న కూరగాయల దుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. రెండో కుమార్తె శ్రావణి చదువుల్లో ముందుంటూనే క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది.ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు ఆటలపై శ్రావణికి ఉన్న ఆసక్తిని అప్పటి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్, ప్రస్తుత నెల్లూరు జిల్లా జంప్ రోప్ సెక్రటరీ జి.మురళి గుర్తించారు. ఎంతో ప్రోత్సహించారు. మురళి సూచనలు, సలహాలతో శ్రావణి జంప్ రోప్ క్రీడతో పాటు షూటింగ్ బాల్, టార్గెట్ బాల్, జూడోలో ప్రావీణ్యం సాధించింది.శ్రావణి ఏ టోర్నమెంట్లో పాల్గొన్నా పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రతిభ చూపేది. ఇప్పటి వరకు జంప్ రోప్లో జిల్లా స్థాయిలో 10, జాతీయ స్థాయిలో 5 గోల్డ్, ఒక సిల్వర్, అంతర్జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించింది. 2023లో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ టోర్నమెంట్లో రన్నర్‌గా నిలిచింది. నేపాల్‌లో నిర్వహించిన ఇండో–నేపాల్ జంప్ రోప్ చాంపియన్ షిప్ 2025 టోర్నమెంట్లో రెండు బంగారు పతకాలు సాధించి సత్తాచాటింది. ఐపీఎస్ కావడమే లక్ష్యంప్రాక్టీస్ చేయడం నుంచి పోటీల్లో పాల్గొనడం వరకు ఆటల్లో ఉండే ఉత్సాహమే వేరు. ఆటలు ఉత్సాహాన్నే కాదు శక్తిని ఇస్తాయి. జీవితంలో లక్ష్యాన్ని ఏర్పర్చుకునేలా చేస్తాయి. ఆటల్లో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు గెలుచుకోవాలనుకుంటున్నాను. బాగా చదివి ఐపీఎస్ సాధించాలని ఉంది. మంచి పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకుంటాను. అమ్మ,నాన్న అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుండడంతో బాగా చదవడం తోపాటు క్రీడల్లో రాణించగలుగుతున్నాను. – రావుల రాజగోపాల్‌రెడ్డి, సాక్షి, కలిగిరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (చదవండి: లెడ్‌లైట్ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..! ) -
LED Light Therapy: అన్ని రోగాలకు దివ్యౌషధం..!
ముడతలు, సోరియాసిన్, మచ్చలు, ఎండతాకిడికి దెబ్బతిన్న చర్మానికి మంచి చికిత్సగా ‘లెడ్‌లైట్ థెరపీ’ ఉత్తమమని చెబుతున్నారు ఆధునిక పరిశోధకులు. కొందరైతే ‘లెడ్‌లైట్ థెరపీ’ అనేది అన్ని రకాల రోగాలకు దివ్యౌషధం అని ప్రచారం చేస్తున్నారు. లెడ్‌లైట్ థెరపీని లో–పవర్డ్ లేజర్ థెరపీ, కోల్డ్ లేజర్ థెరపీ, ఎల్ఈడీ లైట్ థెరపీ అని కూడా పిలుస్తారు.నొప్పి, మంట, కణజాల నష్టాన్ని తగ్గించడంలో, నోటిపూతలు, మచ్చలు, కాలిన గాయాలను నయం చేయడానికి, కొన్ని రకాల అల్సర్లను నయం చేయడానికి లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.పార్కిన్సన్, అల్జీమర్స్, మల్టిపుల్ స్లిరోసిస్, ఆర్థరైటిస్, ఆటిజం ఉన్న రోగులకు కూడా లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఈ చికిత్స సులువైనది. నొప్పి ఉండదు.లెడ్‌లైట్ థెరపీలో కూర్చున్న లేదా పడుకున్న పేషెంట్‌ను పదిహేను నిమిషాల పాటు లెడ్లైట్కు ఎక్స్పోజ్ చేస్తారు.‘సరిగ్గా వినియోగించినప్పుడు లెడ్‌లైట్ చికిత్స చాలా సురక్షితం’ అంటున్నారు నిపుణులు.‘అన్నిరకాల సమస్యలకు లెడ్లైడ్ థెరపీ పనిచేయకపోవచ్చు’ అంటున్నారు వైద్య అవసరాల కోసం లైట్, లేజర్ల ఉపయోగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్, వోరల్ బయాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ప్రవీణ్ అరణి.ఆందోళన నుంచి ఉపశమనం, కండరాల పనితీరును మెరుగుపరచడం, ఆటల వల్ల అయిన గాయాల నుంచి కోలుకోవడం, చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు...మొదలైన వాటికి సంబంధించి లెడ్‌లైట్ థెరపీని ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల ఎంత మేలు జరుగుతుందనే విషయంలో లోతైన అధ్యయనాల కొరత కనిపిస్తుంది. (చదవండి: ఆ... భరణం అచ్చం అలాగే!) -
ఆ... భరణం అచ్చం అలాగే!
సినిమా తారలు ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నప్పుడు వారు ధరించిన వస్త్రాలు, ఆభరణాలను అంతా ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. అత్యంత ఖరీదైన ఆ డ్రెస్సులు, ఆభరణాలు వారిని మరింత ప్రత్యేకంగా చూపుతుంటాయి. యునిక్‌గా కనిపించే వాటిని అచ్చం అలాగే తయారు చేయించుకోవడమే కాదు మార్కెట్లోనూ ఆ రెప్లికా డిజైన్స్ లభిస్తుంటాయి. ఆభరణాలలో కనిపించే ఈ ట్రెండ్స్ వివాహ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురువారం తన సోదరుడు సిద్ధార్థ్ మెహందీ వేడుకలో పది కోట్ల రూపాయలకు పైగా విలువైన బల్లారి నెక్లెస్‌ను ధరించి, అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆ మధ్య నీతా అంబానీ తన కుమారుడి పెళ్లిలో కోట్ల ఖరీదైన పచ్చల హారాన్ని ధరించింది.వేడుకలలో స్టార్ సెలబ్రిటీలు ధరించే జ్యువెలరీ ధర కోట్లలో ఉంటుంది. అంత ఖరీదు మనం పెట్టలేం, అలాంటి డిజైన్ని పొందలేం అని ఈ రోజుల్లో వెనకంజ వేయనక్కర్లేదు. కొన్ని రోజులలోనే అలాంటి డిజైన్లు మార్కెట్లో కనిపిస్తుంటాయి. సెలబ్రిటీలు ధరించిన ఆభరణాల రెప్లికా డిజైన్స్ రూ.1500 నుంచి పది వేల రూపాయల వరకు లభిస్తున్నాయి. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) మెరుపు తగ్గకుండా! ఇమిటేషన్, వన్‌గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్.. ఆభరణాలను కొత్తగా ఉంచడానికి వాటిని శుభ్రంగా ఉంచాలి. ఆభరణాన్ని వాడిన ప్రతిసారి మృదువైన, పొడి కాటన్ వస్త్రంతో తుడవాలి. దీనివల్ల మురికి, చెమట తొలగిపోతాయి ఆభరణాల నాణ్యతను కాపాడుకోవడానికి సరైన విధంగా భద్రపరచుకోవాలి. తక్కువ ఖరీదు అనో, టైమ్ లేదనో.. అన్నింటినీ ఒకే బాక్స్‌లో పెట్టేస్తుంటారు. బీడ్స్, స్టోన్స్‌పై గీతలు పడకుండా, పాడవకుండా ఉండాలంటే ప్రతి ఆభరణాన్ని ప్రత్యేక కంపార్ట్మెంట్లలో ఉంచాలి ఏ కాస్త తేమ ఉన్నా ఆభరణాల రంగు మారుతుంది. ఆభరణాలను ఉంచే పెట్టెలో అదనపు తేమను గ్రహించడానికి మీరు సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగించవచ్చు పెర్ఫ్యూమ్లు, లోషన్లు ఉపయోగించిన తర్వాతనే ఆభరణాలను అలంకరించుకోవాలి. లేదంటే వాటిలోని రసాయనాలు ఆభరణాలను మసకబారిస్తాయి ∙ఆర్టిఫిషియల్ ఆభరణాలలో ఒకేరకాన్ని తరచూ ధరించకూడదు. దీనివల్ల ఆ ఆభరణం త్వరగా రంగుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి ఆభరణాలలో ఏదైనా నష్టం గమనించినట్లయితే, వెంటనే మరమ్మతు చేయించాలి. వదులుగా ఉన్న రాళ్ళు లేదా విరిగిన వాటిని సకాలంలో గమనించినట్లయితే సులభంగా మరమ్మతు చేయవచ్చు. ఈ ఆభరణాలను బాగు చేసే షాపులు కూడా ఉంటాయి. వాటి ద్వారా నగను మరో రూపంగా కూడా మార్చుకోవచ్చు.బీడ్స్ .. చోకర్స్ఇప్పుడు వివాహ వేడుకలలో ట్రెండ్‌లో ఉన్నవి బీడ్స్, చోకర్స్. అన్నిరకాల బీడ్స్ లేయర్లుగా ఉన్నవి బాగా ఇష్టపడుతున్నారు. శారీ, డ్రెస్ కలర్‌కు మ్యాచింగ్ బీడ్స్ హారాలు, చోకర్స్ బాగా నప్పుతుంటాయి. వీటికి గోల్డెన్ బాల్స్, స్టోన్స్ లాకెట్స్ జత చేయడంతో గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. వేడుకలలో ఆకర్షణీయంగా కనిపించాలి, ఫొటో, వీడియోలలో అందంగా కనిపించాలనుకునేవారు వీటినే ఎక్కువ ఇష్టపడుతున్నారు. బంగారం ధరలు బాగా పెరిగిపోవడం, ప్రతీ వేడుకకు కొత్త హారం కావాలనుకోవడం వల్ల కూడా ఇలాంటివాటికి బాగా డిమాండ్ ఉంటోంది.ఫోటో సెండ్ చేస్తే... ఆభరణం తయారీ..ఎంత గ్రాండ్ డిజైన్ అయినా, సెలబ్రిటీలు వేసుకున్న ఆభరణాలైనా.. నచ్చిన డిజైన్ ఫోన్లో ఫోట్ సేవ్ చేసుకొని, మాకు ఇస్తే ఆర్డర్ మీద ఆ డిజైన్ని తయారుచేసి ఇస్తుంటాం. వివాహ వేడుకలలో హైలైట్‌గా నిలిచే రెప్లికా డిజైన్స్, బీడ్ జ్యువెలరీని మూడు దశాబ్దాలుగా తయారుచేస్తున్నాం. స్టోన్స్, బీడ్స్, వడ్డాణం, చేతి పట్టీలూ.. పూర్తి సెట్ వారి పెళ్లి శారీ కలర్ కాంబినేషన్ బట్టి తయారుచేయించుకుంటున్నారు. సంప్రదాయ వేడుకలలో ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెలరీ ఎంపికే ముందు వరసలో ఉంటుంది. – ఎల్.పద్మ, ఇమిటేషన్ జ్యువెలరీ మేకర్, హైదరాబాద్ (చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!) -
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్‌లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్‌లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఉంది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. -
నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్
ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) కు చైర్మన్ ముఖేష్ అంబానీ. మరోవైపు ఆయన భార్య నీతా అంబానీ ((Nita Ambani) కూడా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) స్థాపకురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. అంతేకాదు ఐఓసీ సభ్యురాలిగా ఉన్నారు నీతా అంబానీ. బిలియనీర్ అంబానీ తన భార్యకు ఇచ్చిన విలువైన బహుమతి ఒకటి ఇపుడు నెట్టింట సందడిగా మారింది. అదేంటో చూద్దామా. వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా రాణిస్తున్న తన భార్య ప్రయాణ ఇబ్బంది లేకుండా ముఖేష్ అంబానీ ఆమెకు ఒక ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇచ్చాట. 2007లో నీతా అంబానీ పుట్టినరోజున అంబానీ ఈ అందమైన గిప్ట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రయాణాల కోసం కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్‌బస్ 319ను ప్రైవేట్ జెట్ బహుమతిగా ఇచ్చి నీతాను సర్ప్రైజ్ చేశారట. సహా అల్ట్రా-లగ్జరీ ఇంటీరియర్లతో అదిరిపోయే దీని విలువ రూ.230 కోట్లు. అత్యంత అందమైన ఈ ప్రైవేట్ జెట్ ఫైవ్ స్టార్ హోటల్ కంటే తక్కువేమీ కాదు.కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్‌బస్ 319 ప్రత్యేకతలుచూడ్డానికి విలాసవంతంగా, అందంగా ఉండే ప్రైవేట్ జెట్‌లోని సౌకర్యాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందీ ప్రైవేట్ జెజ్లో. ఒకేసారి 10-12 మందికి పైగా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఈ అసాధారణ బహుమతి అన్ని సౌకర్యాలతో కూడిన సజావుగా, విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా రూపొందించారు. సుదీర్ఘ ప్రయాణాల సమయంలో సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ జెట్ విమానంలో హై-డెఫినిషన్ స్క్రీన్లు, సరౌండ్ సౌండ్, పెద్ద మీడియా లైబ్రరీ ఉన్నాయి. ప్రీమియం ఫిట్టింగ్‌లు, మార్బుల్ యాక్సెంట్లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బాత్రూమ్లు ఉన్నాయి. ఈ జెట్ విమానంలో ఎర్గోనామిక్ సీటింగ్ పెద్ద కాన్ఫరెన్స్ టేబుల్, విశాలమైన లాంజ్ ఏరియాదీని సొంతం.ప్రైవేట్ జెట్‌లో ధీరేంద్ర శాస్త్రిఅనంత్ అంబానీ వివాహ సమయంలో ఈ ప్రైవేట్ జెట్ విశేషమైన దృష్టిని ఆకర్షించింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి ఒక ఇంటర్వ్యూలో అనంత్ తన ప్రయాణానికి ప్రైవేట్ జెట్‌ను అందించి, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వ్యక్తిగతంగా ఆహ్వానించారని వెల్లడించారు.అయితే బిజీగా షెడ్యూల్ కారణంగా తొలిత సంకోచించిన శాస్త్రి అంబానీ ఆహ్వానాన్ని అందుకుని పెళ్లి తంతులుపాల్గొన్నారు. అంతేకాదు అంబాన కుటుంబం ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్దులైపోయారు కూడా. కాగా అంబానీకి దీంతోపాటు బోయింగ్ 737 మాక్స్ 9 కూడా ఉంది. అధునాతన సాంకేతికత, LEAP-18 ఇంజిన్లతో కూడిన ఈ విమానం భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్లలో ఒకటి. -
Valentine's Day: మూడు ఇన్టు ఏడు..గుండెల్లో ఏముందో..!
ఫిబ్రవరి మాసం మొదలు కాగానే ‘‘గుండెల్లొ ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే’’ అంటూ ప్రేమగీతాలైపోతారు ప్రేమికులు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ దాకా ప్రేమే ప్రపంచంగా మారిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి మాసం ప్రేమికుల మాసంగా మారిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదురోజ్ డేతో ప్రారంభమై , ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం వరకు లవ్‌బర్డ్స్ సందడి మామూలుగా ఉండదు. ప్రేమికుల వారంలో ఒక్కోరోజు ఒక్కో పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. రోజ్ డే (ఫిబ్రవరి 7), ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8), చాక్లెట్ డే (ఫిబ్రవరి 9), టెడ్డీ డే (ఫిబ్రవరి 10), ప్రామిస్ డే (ఫిబ్రవరి 11), హగ్ డే (ఫిబ్రవరి 12),, కిస్ డే (ఫిబ్రవరి 13), చివరిగా ఫిబ్రవరి14న వాలెంటైన్స్ డేతో సంబరాలు అంబరానికి చేరతాయి.అయితే అసలు ప్రేమ అంటే ఏంటి? ఎలా పుడుతుంది? ఎపుడైనా ఆలోచించారా? రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ ట్రయాంగిల్ థియరీ గురించి తెలుసా. త్రిభుజాకార సిద్ధాంతం (Triangular Theory) ప్రేమలోని మూడు భాగాలను ప్రతిపాదిస్తుంది. సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధతల కలయికలతో ఏడు రకాల ప్రేమలు పుడతాయని ఇదిచెబుతోంది. మనస్తత్వవేత్త రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ ప్రకారం ప్రేమలు ఏడు రకాలులైకింగ్, ఇన్ఫాట్యుయేషన్, ఎంప్టీ లవ్, రొమాంటిక్ లవ్, కంపానియట్ లవ్, ఫటస్ లవ్, కంజుమేటివ్ లవ్ 1999లో లెమియక్స్ , హేల్ అనే అండర్ గ్రాడ్యుయేట పరిశోధకులు తన అధ్యయనంతో స్టెర్న్‌బర్గ్ త్రిభుజాకార ప్రేమ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చారు. మరుసటి సంవత్సరం, 2000లో వీరే ఇలాంటి మరో అధ్యయనాన్ని నిర్వహించారు, ఈసారి వివాహితులతో నిర్వహించిన స్టడీలో ఈ మూడు అంశాలు వారి మధ్య బంధాన్ని బలపర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రాయింగిల్ థీయరీ పైనే 2009లో పరిశోధకుడు డెవెరిచ్ స్టెర్న్‌బర్గ్ సిద్ధాంతం ప్రకారం కౌమారదశలో ఉన్నవారు సంపూర్ణ ప్రేమలో ఉండగలరా లేదా అని తెలుసుకోవడానికి ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూడు అంటే సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధతలలో లోపాల కారణంగా కౌమారదశలో ఉన్నవారు పూర్తిగా ప్రేమలో ఉండలేరని తేల్చారు. న్యూరోసైన్స్ ప్రకారం మనుషుల్లో ప్రేమ భావన పెంపొందడంలో మెదడులోని రివార్డ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లవ్ అనే ఫీలింగ్ కలిగినప్పుడు మెదడులో ఏం జరుగుతుందనే దానిపై హార్వర్డ్ మెడికల్ కళాశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాల ఫలితమే ప్రేమ అని తేల్చి చెప్పారు. అలాగే న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజ్‌కి చెందిన బినాక అస్విడో రొమాంటిక్ లవ్‌పై పరిశోధనలో భాగంగా ప్రేమ మెదడులో ఎక్కడ ఉంటుందో తెలుసు కోవడానికి ప్రయత్నించారు. ఫలితంగా మెదడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ), న్యూక్లియస్ అకమ్బన్స్, వెంట్రల్ పల్లిడియం, రఫే న్యూక్లియస్ ప్రాంతాలు ఉత్తేజితమయ్యాయని ఎఫ్.మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ద్వారా తెలుసుకున్నారట.ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ మరో ఆసక్తికరమైన విషయంమెదడులోని వివిధ భాగాల స్పందనను బట్టి ఈ ప్రేమ ఆరు రకాలుగా ఉంటుంది మరో అధ్యయనంలో తేలింది. ప్రేమకు సంబంధించిన ఐదు భాషలపై చాలా పరిశోధనలు జరిగాయి. కానీ ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రేమలో ఆరు రకాలు ఉన్నాయని, ప్రతి ఒక్కటి మెదడులోని వేర్వేరు భాగాలనుయాక్టివేట్ చేస్తుందని గుర్తించారు. మానవ అనుభవం అంటే లైంగిక ఆరాధన నుండి తల్లిదండ్రుల లేదా పెంపుడు జంతువుల ప్రేమ లేదా ప్రకృతి ప్రేమ వరకు అనేక రకాల సందర్భాలను వివరించడానికి “ప్రేమ” అనే పదాన్ని ఉపయోగిస్తారు.రొమాంటిక్ ప్రేమపేరెంటల్ ప్రేమస్నేహితుడిపై ప్రేమఅపరిచితుడి పట్ల ప్రేమపెంపుడు జంతువు పట్ల ప్రేమప్రకృతి పట్ల ప్రేమలవ్వో..గివ్వో.. ఐ వానా ఫాలో.. ఫాలోప్రేమకు ఎవరెన్ని నిర్వచనాలు చెప్పినా. అది వైయుక్తికం. ఎవరికి వారు అనుభవించి తీరాల్సిన మధురభావన. ప్రేమ అనంతమైనది. ప్రేమ మనిషికి,మనసుకు ఉల్లాసానిస్తుంది. లవ్వో గివ్వో.... రివ్వు రివ్వున సాగిపోవాలి.... ఒకరి హృదిలో ఇంకొకరు గువ్వలా ఒదిగిపోవాలి. ఎన్ని కష్టాలైనా, పరీక్షలైనా తట్టుకొని నిలబడాలి. ‘‘నాకు.. నువ్వు..నీకు నేనూ..’’ ఇదే తారక మంత్రం. నిస్వార్థంతో నిబద్ధతతో విశ్వాసంగా నిలబడితే అది పరిపూర్ణమైన ప్రేమ. -
Ram Kapoor: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా .!
వెయిట్‌లాస్ జర్నీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. కొందరు బరవు తగ్గినట్లు తగ్గి మళ్లీ యథావిధి బరువుకి వచ్చేస్తుంటారు. అందరి శరీరతత్వం ఒకలా ఉండదు. ఒకరికి సాధ్యమైనట్లు మరొకరి బాడీకి సాధ్యం కాకపోవచ్చు. అలానే ప్రయత్నం మానకుండా బరువు తగ్గాలని బలంగా అనుకున్నవారే విజయవంతమవుతారు. అలాంటి కోవకు చెందినవారే బాలీవుడ్ నటుడు రామ్ కపూర్. ఆయన 140 కిలోల బరువతో ఊబకాయంతో నానా ఇబ్బందులు పడ్డారు. తగ్గే ప్రయత్నం చేసిన ప్రతిసారి..తగ్గినట్లుగా అనిపించేలోపే మళ్లీ యథావిధిగా అదే బరువుకి వచ్చేసేవారు. అయినా విసుగు చెందకుండా విజయవంతంగా బరువు తగ్గి స్లమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మరీ ఆయన ఫిట్నెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..!నటుడు రామ్ కపూర్(Ram Kapoor) తన అధిక బరువు గురించి తనభార్య గౌతమి(Gautami) ఎన్నడూ ఏమి అనలేదు గానీ తన ఆరోగ్యం గురించి కలత చెందేదని అన్నారు. ఎందుకంటే.. అధిక బరువు కారణంగా ఒబెసిటీ, టైప్2 డయాబెటిస్(type 2 diabetes) వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవాడినని చెప్పారు. వాటికి చెక్ పెట్టాలంటే బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చాలా ఆస్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. గత 15 ఏళ్లుగా అధిక బరువుతో నిరాటంకంగా పనిచేశాను. కానీ కనీసం ఇప్పుడైనా ఆరోగ్యం కోసం తన ఒంటిపై దృష్టి పెట్టాలని గట్టిగా అనుకున్నట్లు తెలిపారు. అందుకోసం తాను రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని అన్నారు. తాను రెండు సార్లు 30 కిలోలు వరకు తగ్గి మళ్లీ నార్మల్ బరువుకి తిరిగి వచ్చేసిట్లు చెప్పారు. అయితే ఎప్పుడు డైట్‌తో బరువు తగ్గుతారని అనుకోవడం సరైనది కాదని అంటున్నారు.ఇక్కడ కేవలం మన సంకల్ప శక్తి(willpower.), సానుకూల మనస్తత్వం వల్లే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. తాను రోజుకు రెండు పూటలా భోజనం చేసేవాడినని అన్నారు. ఒకటి ఉదయం 10.30 గంటలకు, మరొకటి సాయంత్రం 6.30 గంటలకని చెప్పారు. మధ్యలో నీళ్లు, కాఫీ లేదా టీ తాగేవాడినని అన్నారు. అయితే సాయంత్రం మాత్రం 6.30 గంటల కల్లా భోజనం చేసేస్తానని చెప్పారు. అస్సలు అల్పాహారం తినని అన్నారు. సూర్యాస్తమయం తర్వాత అస్సలు తినని చెప్పారు. దీన్ని కరెక్ట్‌గా చేసేలా మన మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండేలా చూడాలని చెప్పారు. డైట్లు, ఆహారపు అలవాట్ల కంటే..మనసుని నియంత్రించగలిగే శక్తే బరువు తగ్గడానికి అత్యంత కీలకమైనదని అన్నారు. వాటివల్ల తాను 55 కిలోల మేర బరువు తగ్గడమే కాకుండా ఆ బరువునే మెయింటైన్ చేయగలిగానని అన్నారు. నిపుణుల ఏమంటున్నారంటే..నిపుణులు సానుకూల మనస్తత్వంతోనే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపడుకోవడానికి అంకితభావంతో కూడిన మనస్తత్వం అవసరమని చెప్పారు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తగ్గించి ట్రాన్స్ఫ్యాట్లను నివారించాలన్నారు. ఇక్కడ వ్యాయామాన్ని శిక్షగా కాకుండా ఇష్టంతో చేయాలని చెప్పారు. ఒక్కోసారి చీట్ మీల్స్ ఉండొచ్చు. అయినా దాన్ని బర్న్ చేసేలా శారీరక శ్రమ చేయడం ముఖ్యం అని చెబుతున్నారు. మనసు మన మాట వినేలా ఎంత బలంగా చేసుకోగలిగితే అంతలా డైట్‌ని నియమబద్ధంగా ఫాలో అవ్వడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీంతోపాటు సరిగా నిద్రపోవడం, తగినంత నీరు తాగడం తదితర జీవనశైలి చర్యలు ఉంటే అనుకున్న రీతిలో బరువు తగ్గగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
పిగ్మెంటేషన్ సమస్య తగ్గాలంటే..!
రకరకాల కారణాల వల్ల ముఖంపై పిగ్మెంటేషన్ వస్తుంటుంది చాలామందికి. చూడటానికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి క్రీములు, ఇతర మందులు వాడే బదులు ఒక బంగాళదుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న చోట ఈ మాస్క్‌ని వేసుకుని అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల తేనెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి అవసరమున్న చోట ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తగ్గి ముఖం మిలమిలలాడుతుంది. పిగ్మంటేషన్‌ని పోగొట్టే డ్రింక్‌లు ..కీర, దానిమ్మ, కరివేపాకు ఆకులు, నిమ్మరసంతో ఈ ఇంటి డ్రింకు ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింకు లాభాలు ఎన్నో. కీరకాయల్లో యాంటాక్సిడెంట్లు, సిలికా అత్యధికంగా ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ డ్రింకులో ఉపయోగించే దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటాక్సిడెంట్లతో పాటు చర్మాన్ని మెరిపించే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి పిగ్మెంటేషన్ మచ్చలను పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి.ఈ డ్రింకులో వేసే కరివేపాకుల్లో కూడా యాంటాక్సిడెంట్లతో పాటు విటమిన్ సి బాగా ఉంది. అలా కరివేపాకులు కూడా పిగ్మెటేషన్ ను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక నిమ్మరసంలో విటమిన్ సి ఎంత ఎక్కువగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. నిమ్మరసం చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాదు స్కిన్ టోన్ కూడా సమంగా ఉండేలా తోడ్పడుతుంది.తయారీ విధానం: చిన్న కీరకాయ ఒకటి, అరకప్పు దానిమ్మ గింజలు, పది పన్నెండు కరివేపాకులు, అరచెక్క నిమ్మరసం రెడీ పెట్టుకోవాలి. వీటన్నింటినీ బ్లెండర్ లో వేసి బాగా కొట్టాలి. ఆ డ్రింకును గ్లాసులో పోసుకుని తాగాలి అంతే. ఈ డ్రింకు వల్ల పిగ్మెంటేషన్ తగ్గడంతో పాటు ఇందులోని యాంటాక్సిడెంట్ల వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ న్యూట్రలైజ్ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను ఈ డ్రింకు తగ్గిస్తుంది. అంతేకాదు సెల్యులార్ పునరుద్ధరణ కూడా చేస్తుంది. -
‘అల’పెరుగని గుండెల్
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్‌లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్‌లోని వెరావల్‌కు వెళుతుండేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.ఆరోజు....శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్‌ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కథ మలుపు తిరిగింది...కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్‌జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్‌లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.– గనగళ్ల రామారావుఆందోళనలో బతికానా భర్త పాకిస్తాన్‌కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది. – నూకమ్మ– కందుల శివశంకరరావు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
బరువు తగ్గడానికి 12-12 రూల్ ..!
బరువు తగ్గడానికి అడపదడపా ఉపవాసం ఒక ప్రసిద్ధమైన పద్ధతిగా మారింది. దీంతో అయితేనే ఈజీగా బరువు తగ్గుతామని చాలామంది ఈ పద్ధతి వైపుకే మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ చెందిన ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేథి ఈ అడదడప ఉపవాసం ది బెస్ట్ అని కితాబిచ్చారు. ఇది బరువు నిర్వహణ తోపాటు మొత్త ఆరోగ్యానికే మంచి ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కొవ్వుని కరిగించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. దీన్ని గనుక ఈ సింపుల్ టెక్నిక్‌లలో చేస్తే తక్షణమే ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అదెలాగో చేసేద్దామా..!.డాక్టర్ సేథి బరువు తగ్గడం కోసం మూడు కీలక చిట్కాలను ఫాలోమని చెప్పారు. అవేంటంటే..నిర్మాణాత్మక ఉపవాస షెడ్యూల్, మంచి డిటాక్స్ పానీయాలు, సమతుల్య ఆహారం తదితరాలు. ఈ మూడింటిని ఎలా చేయాలో డాక్టర్ సేథి చాలా వివరంగా చెప్పారు. 12:12 ఉపవాస షెడ్యూల్:డాక్టర్ సేథి 12:12 అడపాదడపా ఉపవాస షెడ్యూల్‌నే నిర్మాణాత్మక ఉపవాసమని అన్నారు. ఇది అత్యంత తేలికగా నిర్వహించదగిన ప్రక్రియని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా 12 గంటలు ఉపవాసం ఉంటారు, మిగతా 12 గంటలు తినడం వంటివి చేస్తారు. ఈ విధానం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల నిద్రలేమి తాలుక సమస్యలు దూరం అవుతాయని అన్నారు. ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నివారస్తుందని చెప్పారు. అలాగే ఇంత విరామం కారణంగా జీర్ణక్రియ పునరుద్ధరించడానికి తగినంత సమయం ఉంటుంది. ఉపవాస సమయంలో తీసుకోవాల్సినవి..ఈ పన్నెండు గంటల ఉపవాస సమయంలో కొవ్వుని కరిగించే జ్యూస్‌లు వంటివి తీసుకోవాలి. అంతేతప్ప కూల్‌డ్రింక్‌లు, ఫ్యాట్‌తో కూడిన జ్యూస్‌ల జోలికి వెళ్లకూడదని చెప్పారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ నీరు, ఫెన్నెల్ లేదా తులసి నీరు, చమోమిలే టీ లేదా అల్లం టీ వంటివి తీసుకోవడం మంచిదని చెప్పారు సేథి. ఇవి ఆకలిని అరికట్టడంలో సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. వివిధ మార్గాల్లో శరీరానికి మద్దుతుని ఇస్తాయి.మిగతా 12 గంటలు తినే భోజనం ఎలా ఉండాలంటే..ఈ సమయంలో సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొవ్వు తగ్గేందుకు ప్రోత్సహించేలా అధిక ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టిపెట్టాలి. పనీర్, టోపు, చిక్పీస్, చికెన్, టర్కీ, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడం తోపాటు అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ప్రోటీన్, ఫైబర్ కలయిక కొవ్వుని తగ్గించడానికి మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరానికి ఇంధనంగా మంచి పోషకాలను అందిస్తుంది. చివరగా బరువు తగ్గడంలో ఈ అడపాదడపా ఉపవాసం ప్రభావంతంగా ఉంటుందని క్లినికల్‌గా నిరూపితమైందని నొక్కి చెప్పారు. అయితే ఇక్కడ సరైన విధంగా చేయడంపైనే ఫలితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం(చదవండి: కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!) -
లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే!
హీరోయిన్ సోనాక్షి సిన్హా మొత్తానికి తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించింది. సంజయ్ లీలా భన్సాలీ పీరియాడికల్ డ్రామా హీరామండి: ది డైమండ్ బజార్లో చివరిసారిగా కనిపించిన సోనాక్షి సిన్హా, సముద్రం వైపున ఉన్నతన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను రూ.22.50 కోట్లకు విక్రయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ (81 Aureate) 16వ అంతస్తులో 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందీ అపార్ట్మెంట్. దీన్ని 2022, మార్చి దాదాపు రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే తాజా విక్రయం ద్వారా దాదాపు 61 శాతం లాభాన్ని ఆర్జించిందిఆధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన 4-BHK అపార్ట్‌మెంట్‌ను reD ఆర్కిటెక్ట్స్‌కు చెందిన రాజీవ్ , ఏక్తా పరేఖ్ 1.5-BHKగా సొగసైన రీతిలో తీర్చిదిద్దారు. ఎంతో స్పెషల్‌గా, అందంగా ఈ ఇంటిలో వాక్-ఇన్ వార్డ్రోబ్, ప్రత్యేక జిమ్, అందమైన కళాకృతులు, అరేబియా సముద్రాన్ని వీక్షించేలా విశాలమైన బాల్కనీ ఉన్నాయి. చదవండి: లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!ముఖ్యంగా గత ఏడాది (2024, జూన్ 23న ) సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్న ఇల్లు కూడా ఇదే. ఇటీవల సోనాక్షి, జహీర్ పెళ్లి వేడుకలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ఇంటిని రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టడం వార్తల్లో నిలిచింది.కాగా బాలీవుడ్ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. తరువాత బాగా బరువు తగ్గించుకుని, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన యాక్షన్-డ్రామా దబాంగ్ (2010)మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఉత్తమ డెబ్యూనటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. వరుస ఆఫర్లతో చాలా బిజీగా మారింది. ముఖ్యంగా దక్షిణాదిన రజినీకాంత్ నటించిన లింగ సినిమాతో తమిళం సినిమాకి పరిచయం అయినది. సహనటుడు జహీర్ ఇక్బాల్‌తో సుదీర్ఘ కాలం ప్రేమలో ఉన్న సోనాక్షీ ఎట్టకేలకు గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్తతో మూడు హనీమూన్లు, ఆరు టూర్లు అన్నట్టుగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. -
ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!
చేతివ్రాత అనేది కనుమరుగైపోతుంది. ఇప్పుడంతా ప్రింట్ఔట్లే..జస్ట్ టైప్ చేయడమే..రాసే పనేలేదు. అయినప్పటికీ కొందరూ తమ చేతివ్రాతను పదిలంగా ఉంచుకుంటున్నారు. అంతేగాదు చేతివ్రాత బట్టి మనిషి నేచర్‌ని కూడా చెబుతుంటారు మానసిక నిపుణులు. అందుకే పిల్లల్ని తరుచుగా చేతివ్రాత బాగుండేలా చూసుకోమని పదేపదే చెబుతుంటారు. అలాంటి గొప్ప నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకుంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి చేతివ్రాత ఎంత అందంగా ఉంటుందంటే..చూసినవాళ్లేవరైనా ఆ చేతివ్రాతకి ఫిదా అయిపోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. అత్యంత అసాధారణమైన చేతివ్రాత ఆమెది. అసలు రాసిందా, టైప్ చేసిందా అన్నది కనిపెట్టలేనంతగా ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా..!.మంచి చేతివ్రాత విద్యార్థి పురోగతికి ఎంతగానే సహాయపడుతుందని ఉపాధ్యాయులు చెబుతుంటారు. అందుకే విద్యార్థులను చేతివ్రాత బాగుండేలా చూసుకోమని చెబుతూ..సాధన చేయమంటారు. మనమంతా అలానే కష్టపడి చేతివ్రాత మెరుగ్గా ఉండేలా చేసుకున్నవాళ్లమే. కానీ చేతివ్రాత(Handwriting) ల్లో అత్యంత అందమైనవి..అందరికీ నచ్చేలా రాసే నైపుణ్యం ఉంటుందని విన్నారా..?. అలాంటి అసాధారణమైన ప్రతిభని సొంతం చేసుకుంది నేపాల్(Nepal)కి చెందిన 16 ఏళ్ల ప్రకృతి మల్లా(Prakriti Malla). ఆమె తన చేతివ్రాతతోనే వార్తల్లో నిలిచి సెలబ్రిటీగా మారిపోయింది. ఎందుకంటే చేతివ్రాత అందంగా ఉండటం వేరు, అందరూ మెచ్చుకునేంత అందంగా ఉండటం అనేది అసాధ్యం. చెప్పాలంటే ఈమె చేతివ్రాత చూస్తే..చేత్తో రాసిందా? లేక కంప్యూటర్లో టైప్ చేశారా..? అనేది చెప్పడం అసాధ్యం. అంతలా ఆకట్టుకుంటుందా ఆమె చేతివ్రాత. ఆమె హ్యాండ్ రైటింగ్ గణనీయమైన ప్రజాధరణ పొందింది. ప్రకృతి ఎనిమిదో తరగతిలో ఉండగా రాసిన అసైన్మెంట్ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. కంప్యూటర్లు వచ్చినప్పటి నుంచి, ప్రజలు చేతితో రాయడం దాదాపుగా మానేశారు. ఒకప్పుడు చేతిరాతకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే అందమైన చేతివ్రాతను కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రకృతి చేతివ్రాత అందరిని కట్టిపడేస్తోంది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేతివ్రాత నిపుణులు కూడా ప్రకృతి మల్లా చేతివ్రాతను చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఆమె 51 యూనియన్ స్ఫూర్తి సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates (UAE)) పౌరుల నాయకత్వానికి అభినందన లేఖ రాసింది. ఆ లేఖను ప్రకృతినే స్వయంగా రాయబార కార్యాలయానికి అందజేసింది. అందుకుగానే నేపాల్ సాయుధ దళాలు(Nepalese armed forces) ఆ అమ్మాయిని సత్కరించాయి కూడా.(చదవండి: 'ఎగ్స్ కేజ్రీవాల్' రెసిపీ..: ఢిల్లీ మాజీ సీఎంకి ఏంటి సంబంధం..!) -
'ఎగ్స్ కేజ్రీవాల్' రెసిపీ..: ఢిల్లీ మాజీ సీఎంకి ఏంటి సంబంధం..!
కొన్ని రెసిపీల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి పేర్లు భలే తమాషాగా ఉంటాయి. అసలు వాటికా పేరు ఎలా వచ్చిందో వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ రెసిపీకి కూడా అలానే పేరు వచ్చింది. కాకపోతే మన దేశ రాజధాని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పేరు మీద ఉండటం చూస్తే..ఆయనే పేరు మీద రెసీపీ పేరేంటీ అని అనుకోకండి. నిజానికి ఆయనకి ఈ రెసిపీతో సంబంధం లేకపోయినా..ఆ రెసీపీ స్టోరీ మాత్రం వెరీ ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది ఎందుకంటే..?.ఆ వంటకం పేరు ఎగ్స్ కేజ్రీవాల్(Eggs Kejriwal) అనే ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్. భారతీయ వంటకాల్లో ఎగ్స్‌తో చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ వంటకం మాత్రం చాలా గమ్మతైనది. ఈ వంటకం ఆవిష్కరణ కూడా అత్యంత విచిత్రమైనది. ఈ వంటకం మూలం ముంబై(Mumbai). ఈ వంటకానికి కేజ్రీవాల్ పేరు ఎలా వచ్చిందంటే..1960లలో ముంబైలోని నాగరిక విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్ దేవీ ప్రసాద్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్త కారణంగా వచ్చిందట. ఆయనది పూర్తిగా శాకాహారులైన మార్వాడీ కుటుంబం. కాబట్టి ఇంట్లో గుడ్డు తినే ఛాన్స్ లేకపోయింది. అయితే ఆయనకు గుడ్లంటే మహా ప్రీతి. వాటిని ఆరగించేందుకు విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్(Willingdon Sports Club) వెళ్లిపోయేవాడట. అక్కడ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా గుడ్లు ఎలా తినాలన్నా ఆలోచన నుంచే..ఈ రెసీపీని కనిపెట్టారట పాకనిపుణులు. ఆయన బ్రెడ్‌ని చీజ్‌లో వేయించి దానిపై రెండు గుడ్లు వేయించుకుని ఆపై ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడితో గార్నిష్ చేయించుకుని మరీ తెప్పిచుకునేవాడట. చూసే వాళ్లకు ఏదో చీజ్ బ్రెడ్ తిన్నట్లు కనిపిస్తుంది అంతే..!. ఆయన ఆవిధంగా అక్కడకు వెళ్లిన ప్రతిసారి అలా ఆర్డర్ చేయించుకుని తినడంతో మిగతా కస్టమర్లలో ఆయన ఏం ఆర్డర్ చేస్తున్నాడనే కుతుహాలం పెరిగింది. ఆ తర్వాత అందరికీ అలా తినడమే నచ్చి ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆ రెసిపీకి ఎగ్స్ కేజ్రీవాల్ అనే పేరు స్థిరపడిపోయింది. అంతేగాదు ఈ రెసిపీకున్న క్రేజ్ చూస్తే నోరెళ్లబెడతారు. ఎందుకంటే న్యూయార్క్, లండన్ రెస్టారెంట్లలో ప్రసిద్ద బ్రేక్‌ఫాస్ట్ ఇది. అలాగే న్యూయార్క్ టాప్ 10 వంటకాల జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈ రెసిపీ. తమషాగా ఉన్న ఈ రెసిపీ స్టోరీ..ఓ మనిషి అభిరుచి నుంచే కొత్త రుచులతో కూడిన వంటకాలు తయారవ్వుతాయన్న సత్యాన్ని తెలియజేసింది కదూ..!. మరీ ఈ రెసిపీ తయారీ విధానం సవివరంగా చూద్దామా..!.కావాల్సిన పదార్థాలు తురిమిన చీజ్: 80 గ్రాములుబ్రెడ్: రెండు స్లైసులుస్ప్రింగ్ ఆనియన్స్ : 2పచ్చి మిరపకాయ: 1నూనె: 1 టీస్పూన్పెద్ద గుడ్లు: 2నల్ల మిరియాలు: రుచికి సరిపడతురిమిన చీజ్‌లో చక్కగా గోల్డెన్ కలర్లో బ్రెడ్లు కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మందపాటి గిన్నెలో రెండు గుడ్లను పగలకొట్టి వేసుకోవాలి. వాటిని చిదపకుండా అలానే బ్రెడ్‌పై వేసి కొద్దిసేపు కాల్చాలి. ఆ తర్వాత దానిపై ఆనియన్స్ తురిమిన చీజ్, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ చల్లి సర్వ్ చేయడమే. హెల్తీగానూ కడుపు నిండిన అనుభూతి కలిగించే మంచి బ్రేక్‌ఫాస్ట్ ఇది.(చదవండి: పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్‌లో బ్రాండ్ కావాలి..!) -
పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్‌లో బ్రాండ్ కావాలి..!
పుష్ప మూవీ హీరో అల్లు అర్జున్‌కి ఇంటి పేరు ఏంటి, తండ్రి ఎవరు అనే రెండు డైలాగులు ఫైర్ అయ్యేలా చేసే బలహీనతలు. ఆ బలహీనతపైనే విలన్ దెబ్బకొడుతుంటే..నో పుష్పగాడు అంటే ప్లవర్ కాదు అదో బ్రాండ్ అని ప్రూవ్ చేస్తాడు. ఈ మూవీలోని డైలాగ్‌లా ప్రతి వ్యక్తి బ్రాండ్లా ఉండాలి. అంటే వర్క్ పరంగా లేదా దేనిలోనైనా మన ముద్ర ఉండేలా చూసుకోవాలి. ఏదో ఇతరులకి హెల్ప్ చేసి మంచివాళ్లు అనిపించుకునే నేమ్ అవసరం లేదు. మనల్ని చూడగానే ఈ వర్క్‌లో అతడికి మించి తోపులేరు అనే బ్రాండ్ సెట్ చేసుకోవాలట. అప్పుడే మనకు ఎందులోనూ తిరుగుండదని చెబుతోంది ఒక పాకిస్తాన్ మహిళ. ఆమెకు ఉద్యోగం రాకపోవడమే కెరీర్‌పై సరైన దృక్పథం ఏర్పడేలా చేసిందట. ఆ ఇంటర్యూలో సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన ఉనికినే కాదు ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా ఇదే అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది..ఇంతకీ ఆమె ఏం చెబుతుందంటే..పాకిస్తాన్‌కి చెందిన హిబా హనీఫ్ అనే మహాళ తాను ఫేస్ చేసిన ఇంటర్వ్యూ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఫెయిల్యూర్ అయినా.. ఆ కంపెనీ సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పారు. తాను సోషల్‌మీడియా మేనేజ్మెంట్ పోస్ట్ ఇంటర్వ్యూ కోసం అని ఒక కంపెనికి వెళ్లినట్లు తెలిపింది. "అక్కడ తనతోపాటు ముగ్గురు ఫైనల్ రౌండ్‌కి రాగా, ముగ్గుర్ని విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సోషల్ మీడియా మేనేజర్‌గా తమకున్న వ్యూహాలు, నైపుణ్యాల గురించి క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి ధీటుగా చెపపేలా తమ వద్ద స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది వారి టెస్ట్..అని చెప్పుకొచ్చారు" హనీఫ్. అయితే తాను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు కానీ ఆ కంపెనీ సీఈవో అడిగిన ప్రశ్న తాను ఎలా ఉంటే కెరీర్ బాగుంటుందన్నది తెలియజేసిందని చెబుతోంది. నైపుణ్యాల, మరింత ఇంటిలిజెన్స్ అంటూ కోచింగ్ సెంటర్లకి పరిగెడుతుంటాం కానీ కావాల్సింది అది కాదు నువ్వు ఈ పనిలో బ్రాండ్ అనేలా మన ముద్ర ఉండాలి. అదే ఏ సంస్థకైనా కావాల్సిన స్కిల్ అని చెప్పడంతో.. ఇన్నాళ్లు తన గుర్తింపు ఏంటన్నది ఆలోచించలేకపోయానా..! అనేది గుర్తించానంటూ నాటి ఇంటర్యూని గుర్తుచేసుకున్నారామె. "సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇదే గుర్తింపు అనుకుంటున్నారు కానీ అది కాదు ఐడెంటిటీ. ఏదో కష్టపడి పనిచేసుకుంటూ వెళ్లిపోవడం కాదు. ఈ పనిలో నీదంటూ బ్రాండ్ కావాలి. అబ్బా ఫలానా పనిలో ఆమె లేదా అతడు ది బెస్ట్ అనిపించుకోవాలి. అదే అసలైన నైపుణ్యం. పైగా కెరీర్ డెవలప్మెంట్కి కావాల్సిన పెట్టుబడి అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు హనీఫ్. ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడంతో తానిన్నాళ్లు స్వంత గుర్తింపునే నిర్లక్ష్యం చేశానన్నా విషయాన్ని గ్రహించనని చెప్పారు. తాను ఈ ఫెయిల్యూర్ని మెల్కొలుపుగా భావించి ఆ దిశగా కృషి చేసి ది బెస్ట్ సోషల్ మీడియా మేనేజర్‌గా గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరీ మీరు కూడా మీ వ్యక్తిగత బ్రాండ్ ఏంటన్నది ఆలోచిస్తున్నారా..! అంటూ ముగించారామె. మరీ మనం కూడా మనకంటూ ఓ ఫైర్ బ్రాండ్ ఉండేలా ట్రై చేద్దామా..!.(చదవండి: నిమ్మరసంతో గురకకు చెక్‌పెట్టండి..!) -
నిమ్మరసంతో గురకకు చెక్‌పెట్టండి..!
భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ప్రజలు సరైన నిద్రపోవడం లేదని ఓ సర్వేలో తేలింది. అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 59 శాతం మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు. మొబైల్ వాడకమే అందుకు కారణం. నిమ్మరసం రోజూ తాగటం వలన మ్యూకస్ ఉత్పత్తి అదుపులో ఉండి గురకలను తగ్గిస్తుంది. ఒక చెంచా తాజా నిమ్మరసాన్ని రోజు ఉదయాన తాగటం వల్ల ఈ గురకల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా, చక్కెర కలపని నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు, జలుబులకు దూరంగా ఉంచుతుంది.స్నానం చేసేటప్పుడు శరీరానికి సోప్ అప్లై చేశాక లూఫాతో రుద్దుతుంటాం. అయితే చాలాసార్లు స్నానం తర్వాత లూఫాను శుభ్రం చేయకుండా వదిలేస్తాం. మరుసటి రోజు మళ్లీ అదే లూఫాతో ఒంటిని రుద్దుతాం. ఇలా చేయడం వల్ల ఆ లూఫాలో పేరుకు పోయిన బాక్టీరియా శరీరాన్ని చేరి అలర్జీ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి లూఫాను శుభ్రం చేశాకే వాడాలి. (చదవండి: కోటీశ్వరుడిగా అవ్వడమే శాపమైంది..! మానసిక అనారోగ్యంతో..) -
ఒరిజినల్ ప్రామిసరీ నోటు ఉంటే మంచిది ..!
నా భర్త ఆరేళ్ల క్రితం తన కజిన్‌కి 7 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. నెలవారీ వడ్డీ చెల్లించేలా ప్రామిసరీ నోటు కూడా రాయించుకున్నాము. ఆయన కొంతకాలం వడ్డీ ఇచ్చారు కానీ తర్వాత కట్టడం ఆపేశారు. దాంతో మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో కేసు నడుస్తుండగానే నా భర్త చనిపోయారు. మా వద్ద అప్పు తీసుకున్న వారి తండ్రికి భూములు ఉన్నాయి. మావారు కాలం చేసిన తర్వాత మాకు రావలసిన బాకీ గురించి అడిగాను. అందుకు వారు అంగీకరించకపోగా ‘‘కోర్టులో తేల్చుకుంటాము’’ అంటున్నారు. ప్రామిసరీ నోటు నా పేరు మీదే ఉంది కానీ ప్రస్తుతం నా వద్ద ఒరిజినల్ లేదు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రామిసరీ నోటు ఒరిజినల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ప్రామిసరీ నోటుపై ఉన్న సాక్షులు కూడా ఇప్పుడు డబ్బులు తీసుకున్న వారి వైపే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు సలహా ఇవ్వగలరు. – లత, సత్యసాయి జిల్లాప్రామిసరీ నోటు మీ పేరు మీదే ఉంది అంటున్నారు కాబట్టి కోర్టులో కేసు మీరు నడిపించవచ్చు. మీకు మీ డబ్బులు తిరిగి పొందే హక్కు – వీలూ రెండూ ఉన్నాయి. ఒరిజినల్ ప్రామిసరీ నోటు చాలా ముఖ్యమైన ఆధారం. అయితే అది లేనంత మాత్రాన మీ కేసు తేలకుండా పోదు. వేరే ఆధారాల మీద మీరు కేసు నడిపించాలి. ప్రామిసరీ నోటును ద్వితీయ సాక్ష్యం (సెకండరీ ఎవిడెన్స్)గా తీసుకునే వీలు ఉందా లేదా అనే అంశాన్ని మీ కేసు పూర్వాపరాలు సమీక్షించిన మీ లాయర్ మాత్రమే చెప్పగలరు. మీరు డబ్బులు ఇచ్చారనడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వంటి ఏదో ఒక సాక్ష్యం ఉన్నా సరిపోతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారు. అంతమొత్తంగా డబ్బులు మీకు చెందినవే అనే అంశాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్కమ్ టాక్స్ డిక్లరేషన్ చేశారా లేదా ప్రభుత్వానికి మీ వద్ద ఉన్న నగదు గురించి డిక్లేర్ చేశారా లేదా అనే అంశాలపై అవతలవారు కేసు నడిచే క్రమంలో అడగవచ్చు. దానికి సమాధానాలు ఇచ్చేందుకు మీరు సిద్ధపడి ఉండాలి. మీరు ఒకవేళ ప్రభుత్వానికి సదరు లావాదేవీ గురించి డిక్లేర్ చేసి ఉన్నట్లయితే ఎలాంటి భయం అవసరం లేదు. ఇదంతా ఎందుకనుకుంటే మధ్యవర్తి ద్వారా మరోసారి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగిగా మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎటువంటి అమ్మకాలు/ కొనుగోలు చేసినా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి డిక్లేర్ చేయవలసి ఉంటుంది. అధికమొత్తంలో నగదు సేవింగ్స్ రూపంలో ఉన్నప్పటికీ కూడా చెప్పాల్సి ఉంటుంది. మీకు వేరే ఆదాయం ఉంటే అది కూడా డిక్లేర్ చేయడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్థిక లావాదేవీలు అధిక మొత్తంలో చేసినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMకు మెయిల్ చేయవచ్చు. )