breaking news
Nagarkurnool
-
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
మన్ననూర్: అడవులు, వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎఫ్డీఓ రామ్మూర్తి అన్నారు. 71వ ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం మన్ననూర్ ఎఫ్డీఓ కార్యాలయం నుంచి దుర్వాసుల చెరువు చెక్‌పోస్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారితో పాటు అటవీ పరిసర ప్రాంతంలో ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు వేయరాదని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించి.. వారిలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో మన్ననూర్, అమ్రాబాద్, మద్దిమడుగు రేంజర్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యం తగదు
కందనూలు: విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామన్నారు.పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘ నాయకులు ఉన్నారు. -
రాయితీ విత్తనాల కోసం రైతుల ఆందోళన
లింగాల: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం ద్వారా అర్హులందరికీ వందశాతం రాయితీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం లింగాల పీఏసీఎస్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అంబట్పల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ.. ఎన్ఎంఈఓ పథకం కింద కేంద్రం మండలానికి 1200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను కేటాయించిందని.. రైతులు రూ. 2వేల చొప్పున చెల్లించి సభ్యత్వం తీసుకుంటే 2 క్వింటాళ్ల చొప్పున పంపిణీ చేస్తామని పీఏసీఎస్ వారు చెప్పడం జరిగిందన్నారు. తీరా సభ్యత్వాలు తీసుకున్న రైతులకు క్వింటా లేదా క్వింటాన్నర మాత్రమే విత్తనాలు అందిస్తామని అంటున్నారని వాపోయారు. పీఏసీఎస్ పరిధిలో 600 మందికి మించి సభ్యత్వాలు ఇచ్చి.. వందశాతం రాయితీతో అందించే వేరుశనగ విత్తనాలను తగ్గించి ఇవ్వడమేమిటని వారు ప్రశ్నించారు. అదే విధంగా మండలానికి రెండు రకాల విత్తనాలను సరఫరా చేయగా.. అందులో ఒక రకం విత్తనాల కాలపరిమితి పూర్తయిందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. నిబంధనల మేరకు అర్హులైన రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఈఓ పాండు స్పందిస్తూ.. వాస్తవంగా 600 మంది రైతులకు 2 క్వింటాళ్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉందని, కాని సభ్యత్వాలు తీసుకున్న వారు ఎక్కువ కావడంతో అధికారుల సూచన మేరకు కోటాను తగ్గించడం జరిగిందని తెలిపారు. -
అంతా ఇష్టారాజ్యం!
కనిపించని ‘టెండర్ల’ జోరు ● మద్యం దుకాణాల కోసంఇప్పటి వరకు 27 దరఖాస్తులు ● వనపర్తి, గద్వాల జిల్లాలో ప్రారంభం కానీ వైనం మహబూబ్‌నగర్ క్రైం: సాధారణంగా మద్యం దుకాణాలు అంటే విపరీతమైన డిమాండ్‌తో పాటు వ్యాపారుల మధ్య పోటీ ఉంటుంది. కానీ ఈసారి మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 227 మద్యం దుకాణాలకు టెండర్ల జోరు పెరగడం లేదు. కొత్త దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై పది రోజులు దాటినా.. వ్యాపారులు ఇంకా టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. మరి టెండర్ ఫీజు పెంచడం కారణమా? లేక చివరి వారం రోజుల కోసం ఎదురుచూస్తున్నారో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 18 వరకు టెండర్లు వేయడానికి అవకాశం ఉంది. మంచి ముహూర్తం చూసుకొని టెండర్లు వేయాలని కొందరు వ్యాపారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఒకటి, నాగర్‌కర్నూల్ జిల్లాలో 11 టెండర్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో 21, మహబూబ్‌నగర్‌లో 5, నారాయణపేటలో ఒక దరఖాస్తుతో కలిపి మొత్తం 27 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు టెండర్ల ఖాతా ప్రారంభం కాలేదు. పట్టణాల్లో నిర్మాణ స్థలానికి అనుగుణంగా బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు మంజూరు చేస్తారు. కొందరు జీ ప్లస్–1 నిర్మాణానికి అనుమతి తీసుకొని జీ ప్లస్–2 నుంచి 5 వరకు నిర్మిస్తున్నారు. 100 గజాలలోపు స్థలం ఉంటే జీ ప్లస్–1, 200 గజాల పైగా స్థలం ఉంటే జీ ప్లస్–2, 500 గజాల స్థలం ఉంటే జీ ప్లస్–4 వరకు అనుమతులు మంజూరు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తుదారులు టీఎస్ బీపాస్ ద్వారా ఇళ్లు, దుకాణాల అనుమతులను ఒక విధంగా పొంది.. మరో విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధానంగా రోడ్లకు 5 ఫీట్ల దూరం, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి 3 ఫీట్ల దూరం ఉండేలా నిర్మించాల్సి ఉన్నా అనేక చోట్ల విస్మరిస్తున్నారు. అగ్గిపెట్టె మాదిరిగా కడుతున్న భవనాల వద్ద ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పార్కింగ్ స్థలాలు వదలకపోవడం.. రహదారులపై ర్యాంపులు నిర్మించడం.. రోడ్లను కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉంటే, వాణిజ్య భవనాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన సెల్లార్లను కమర్షియల్ షటర్లుగా వినియోగిస్తున్నారు. అచ్చంపేట: మున్సిపాలిటీలు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతున్నాయి. కొందరు రోడ్లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చూసీ చూడనట్టు వ్యవరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లను అనుసరించి చేపట్టే నిర్మాణాలు సెట్‌బ్యాక్ లేకుండా, ఏ విధమైన అనుమతులు లేకుండానే భవనాలు వెలుస్తున్నా పట్టించుకోక పోవడంతో పాటు ఎవరైనా పిర్యాదు చేస్తే కంటితుడుపుగా నోటీసులు ఇచ్చి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా చేపడుతున్న భవనాల నిర్మాణంతో మున్సిపాలిటీల ఆదాయానికి గండి పడుతోంది. ప్రజల ఫిర్యాదుల మేరకు మున్సిపల్ అధికారులు నామమాత్రపు చర్యలు మాత్రమే చేపడుతున్నారు. అచ్చంపేట మల్లంకుంట బంఫర్ జోన్లో నిర్మించిన దుకాణాలను సగం మాత్రమే కూల్చివేసి చేతులు దులుపుకొన్నారు. కొల్లాపూర్‌లో అనుమతి లేకుండా నిర్మించిన ఓ భవనాన్ని కూల్చివేయగా.. కల్వకుర్తిలో సెల్లార్‌ను మూసివేశారు. అదే విధంగా జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో బంఫర్ జోన్లో నిర్మించిన భవనాలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు. పలుకుబడి ఉన్న వారిపై చర్యలు తీసుకోకపోగా.. అమాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డకట్ట వేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటుచేసింది. జిల్లాలో నాలుగు బృందాలను ఏర్పాటుచేయగా.. అక్రమ నిర్మాణాలను పట్టించుకున్న దాఖలు లేవు. రాజకీయ ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధుల ఫైరవీలతో వీటి లక్ష్యం నీరుగారుతోంది. ఆయా మున్సిపాలిటీల్లో అనుమతులు లేని నిర్మాణాలపై అధికార, ప్రతిప్రక్ష పార్టీల నాయకులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగంగా చర్చింకుంటున్నారు. అచ్చంపేటలో వెలసిన అక్రమ నిర్మాణాలు మచ్చుకు కొన్ని.. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కట్డడాలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు ఫిర్యాదులు వస్తేనే స్పందన.. ఆపై నోటీసులతోనే సరి అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో జీ ప్లస్–1కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. జీ ప్లస్–2, 3, 4, 5 సెల్లార్లకు ఎలాంటి అనుమతులు లేవు. మేజర్ పంచాయతీల సమయంలో కొన్ని నిర్మాణాలు జరిగాయి. అనుమతులు లేని కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం. వీటిపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. – మనోజ, టౌన్ ప్లానింగ్ అధికారి, అచ్చంపేట అక్రమ నిర్మాణాలు మున్సిపల్ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎక్కడైనా నిర్మాణం జరుగుతుంటే అక్కడికి వెళ్లి ముందుగా నోటీసులు ఇచ్చి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అచ్చంపేటలో ఇప్పటి వరకు 40 నుంచి 60 నోటీసులు జారీ చేసి.. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. సీజింగ్ ఆర్డర్ ఇచ్చిన వాటిని కూడా సీజ్ చేయలేదు. కొన్నిచోట్ల రాజకీయ నాయకుల జోక్యంతో కూడా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అటువైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు కిందిస్థాయి సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారు. గోడల నిర్మాణం చేపట్టిన వెంటనే తెల్లరంగు వేయాలని అక్రమ నిర్మాణదారులకు అధికారులే సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది. నిర్మాణం పూర్తయిన వెంటనే ఇంటి నంబర్ కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారని తెలిసింది. -
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు
అచ్చంపేట: ప్రజాపాలనలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలు ప్రతి గడపకు చేరాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజాభవన్‌లో వంగూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, గ్రామ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకం కావాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి.. పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్‌గౌడ్, నాయకులు అల్వాల్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు క్యామ మల్లయ్య, సురేందర్ రెడ్డి జంగయ్య, తిరుమలయ్య, హరీశ్‌రెడ్డి ఉన్నారు. నేడు ఫుట్‌బాల్ జట్టు ఎంపిక జడ్చర్ల టౌన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్–19 బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలను మంగళవారం జడ్చర్లలోని మినిస్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డా.శారదాబాయి తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మెమో, ఆధార్, బోనఫైడ్ జిరాక్స్‌లతో రావాలని సూచించారు. ఉదయం 9 గంటలకు మిని స్టేడియంలో రిపోర్టు చేయాలని, ఇతర వివరాలకు 9985375737 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. రేపు ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల కబడ్డీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు నాలుగు ఎలిజిబిలిటి ఫారాలతో ఉదయం 9 గంటలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌కు రిపోర్టు చేయాలని ఆమె సూచించారు. -
బాధితులకు అండగా నిలవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: భరోసా కేంద్రాన్ని సంప్రదించే బాధితులకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించాలని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని భరోసా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రంలో అందిస్తున్న సేవలపై ఆరా తీయడంతో పాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల తరఫున సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు త్వరగా న్యాయం అందేలా చూడాలని సూచించారు. ఆయన వెంట భరోసా కేంద్రం ఎస్ఐ వీణారెడ్డి పాల్గొన్నారు. ● మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు గురైనా, మహిళలు పనిచేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా, బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు అండగా నిలిచి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేధింపులకు గురయ్యే వారు 87126 57676 నంబర్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గత సెప్టెంబర్‌లో మొత్తం 8 ఫిర్యాదులు అందగా.. ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఒక పెట్టికేసు నమోదు చేశామని, ఆరుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు టీసేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. -
స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా అమలుపై ఆశావహుల్లో టెన్షన్
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడినా రిజర్వేషన్ల అమలుపైనే సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సైతం ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించింది. అయితే బీసీ కోటా రిజర్వేషన్ల అమలుపై ఈ నెల 8న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. కొనసాగుతాయా.. మారుతాయా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్ స్థానాలు పెరిగాయి. జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం కూడా బీసీ మహిళకు రిజర్వు కాగా.. జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో 8 చొప్పున బీసీ వర్గాలకు రిజర్వు అయ్యాయి. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు స్థానాలు గణనీయంగా పెరిగాయి. అయితే రిజర్వేషన్ల కోటా అంశంపై ఈ నెల 8న హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా.. ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లు అమలు అవుతాయా, లేదా అన్న సందిగ్ధం కొనసాగుతోంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఇప్పటికే పార్టీ టికెట్ దక్కించుకునే పనిలో నిమగ్నమైన ఆశావహులు కోర్టు తీర్పు తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రకటన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 9 నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 11 వరకు నామినేషన్ల సమర్పణకు తుది గడువు ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటికే ఆయా స్థానాల్లో పోటీలో ఉన్న ఆశావహుల జాబితా అధిష్టానం వద్దకు చేరింది. అయితే రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్ ఉండటం, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రధాన పార్టీల్లోనూ నెలకొంది. కోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు కొనసాగుతాయా.. లేక మారుతాయా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 8 తర్వాతే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థిత్వాలపై నిర్ణయం తీసుకోనున్నాయి. -
ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు
తిమ్మాజిపేట: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని డీఈఓ రమేశ్ కుమార్ అన్నారు. సోమవారం తిమ్మాజిపేట కేజీబీవీలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వంటగదిలో వండేందుకు సిద్ధంగా ఉన్న కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను డీఈఓ పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి..పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదే విధంగా పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధులతో చేపడుతున్న పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులను డీఈఓ పరిశీలించారు. -
కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పర్ణికారెడ్డి, రాజేశ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని ప్రజలకు నిజాలు తెలియజేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు. -
ప్రతిపాదనలతోనే సరి!
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ విద్య అభ్యసించేందుకు ఎంతో మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు. 5నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని కళాశాలలకు సకాలంలో చేరుకునేందుకు ఉదయాన్నే ఇళ్ల నుంచి బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు అల్పాహారం చేయడం కూడా గగనంగా ఉంటుంది. ఇక మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక.. బయట తినే ఆర్థిక స్థోమత లేక ఆకలి చూపులతో తరగతులు వినాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రతిపాదనలు స్వీకరించింది. అయితే విద్యా సంవత్సరం చివరిలో ఈ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ ఏడాది నుంచి కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ సారి కూడా మధ్నాహ్న భోజనం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. హాజరు శాతం పెరిగే అవకాశం.. జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. ప్రథమ సంవత్సరంలో 6,483 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,823 మంది విద్యార్థులు ఇంటర్ విద్య అభ్యసిస్తున్నారు. ఆయా కళాశాలలకు ఎక్కువ శాతం సమీప గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులే అధికం. వారంతా రోజు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో డ్రాపౌట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఇంటర్ ఉత్తీర్ణత శాతంపై పడుతుంది. ఇదిలా ఉంటే, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన తర్వాతే హాజరు శాతం పెరిగింది. ఇదే ఫార్ములాను కళాశాలల్లో ప్రయోగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతే కాకుండా పరీక్షల సమయంలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటారు. దీంతో గ్రామీణ విద్యార్థులు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కళాశాలల్లో మధ్యాహ్న బోజనం అమలుచేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మేలు చేకూరనుంది. గతేడాది ప్రతిపాదనలు పంపిన ఇంటర్ విద్యాశాఖ నేటికీ ప్రభుత్వం నుంచి రాని స్పష్టత జిల్లాలోని 16 కళాశాలల్లో 13,872 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒక్కో విద్యార్థికి ఎంత కేటాయిస్తారు.. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయాలు తెలియదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వాటిని అమలుచేస్తాం. – వెంకటరమణ, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ 2018లో అప్పటి ప్రభుత్వం అక్షయ ఫౌండేషన్ ద్వారా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని భావించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2021లోనూ మరో మారు ఈ ప్రయత్నం చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. గతేడాది నుంచి ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదనలు సేకరించినా.. కార్యరూపం దాల్చలేదు. కాగా, ఒక్కో విద్యార్థికి రూ.20 నుంచి రూ.25 ఖర్చవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు గతేడాది జిల్లాలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు.. ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చవుతుందనే విషయంపై ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
మార్కెట్ల నిర్మాణమెప్పుడో?
జిల్లాలో ఏళ్ల తరబడి కాలయాపన కొల్లాపూర్: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వారాంతపు సంతలు నేటికీ రోడ్లపైనే సాగుతున్నాయి. మున్సిపాలిటీల్లో కల్పించే మౌలిక సదుపాయాల్లో భాగమైన ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్లకు ప్రజలు నోచుకోవడం లేదు. మార్కెట్ల నిర్మాణాల కోసం గతంలోనే మున్సిపల్, మార్కెటింగ్ శాఖల ద్వారా నిధులు మంజూరయ్యాయి. నిర్మాణాల కోసం స్థలాలను సైతం గుర్తించారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోగా.. కొల్లాపూర్, అచ్చంపేట మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కొన్నేళ్లుగా మార్కెట్ల నిర్మాణం ప్రకటనలకే పరిమితమవుతోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లోనూ మోడ్రన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు లేవు. జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో గతంలో రైతుబజార్ నిర్మించగా.. కొంతకాలం మాత్రమే పూర్తిస్థాయిలో కూరగాయల విక్రయాలు సాగాయి. ఆ తర్వాత దీన్ని నాన్‌వెజ్ మార్కెట్‌గా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగా వ్యవసాయ మార్కెట్‌యార్డులో మూడెకరాల స్థలంలో మోడ్రన్ మార్కెట్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. మార్కెట్ నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ రూ. 7కోట్లు కేటాయించింది. చాలాకాలంగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ● కొల్లాపూర్‌లో మోడ్రన్ మార్కెట్ నిర్మాణం కోసం 2018లో టీఎఫ్యూఐడీసీ ద్వారా రూ. 2కోట్లు కేటాయించారు. అప్పట్లో మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వెనకభాగంలో ఉన్న స్థలాన్ని గుర్తించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. తర్వాతి కాలంలో ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడే మార్కెట్ నిర్మాణానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భూమిపూజ చేయాలని భావించారు. అది కూడా ఆచరణకు నోచుకోలేదు. ఎన్నికల తర్వాత కూడా మున్సిపల్ అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు. ● అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు మొదట స్థలాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇరిగేషన్ కార్యాలయ ప్రాంగణంలోకి దాన్ని మార్చారు. రూ. 2.5కోట్లు మార్కెట్ నిర్మాణానికి మంజూరు కాగా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ● కల్వకుర్తి మున్సిపాలిటీలో పనులు ప్రారంభమై అసంపూర్తిగా మిగిలాయి. హైదరాబాద్‌కు వెళ్లే దారిలో గల మార్కెట్‌యార్డు స్థలంలో రూ. 4.50 కోట్ల వ్యయంతో నిర్మాణాలు ప్రారంభించారు. పనులు అసంపూర్తిగా ఉన్నాయి. రోడ్లపైనే సాగుతున్న సంతలు.. నియోజకవర్గ కేంద్రాల్లో రైతు మార్కెట్లు లేకపోవడంతో సంతలు ప్రధాన రోడ్లపైనే సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్‌లో ప్రతి శుక్రవారం జెడ్పీ హైస్కూల్ మైదానంలో సంత సాగుతుండగా.. మిగతా రోజుల్లో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు కొనసాగుతున్నాయి. కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణాల్లో ప్రతి ఆదివారం సంతలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలతో పాటు ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చిరు వ్యాపారులు, రైతులు రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. రోడ్లపై సంతలు సాగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొల్లాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్ నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని గుర్తిస్తాం. గతంలో ప్రభుత్వ ఆస్పత్రి సమీపం లేదా ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో మార్కెట్ నిర్మాణం చేపట్టాలని అధికారులు భావించారు. అయితే ఆ స్థలాలు మార్కెట్ నిర్మాణానికి అనువుగా ఉంటుందా లేదా అనే అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఈ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చర్చించారు. అనువైన స్థలాన్ని గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. ఈ దిశగా చర్యలు చేపడుతున్నాం. – చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ కమిషనర్, కొల్లాపూర్ నాలుగు మున్సిపాలిటీల్లో నిర్మాణాలకు నోచుకోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు గతంలోనే నిధులు మంజూరుచేసిన మున్సిపల్, మార్కెటింగ్ శాఖలు స్థలాల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి జిల్లాలో నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో కూరగాయల సాగు పెరిగింది. అయితే రైతులు పండించిన పంట విక్రయానికి మార్కెట్లు అందుబాటులో లేకపోవడంతో.. చేసేది లేక అరకొర మొత్తానికి దళారులకు అమ్ముతున్నారు. కొందరు రోజువారీగా సంతలు జరిగే ప్రాంతాలకు తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో మార్కెట్లు నిర్మిస్తే రైతులు పండించే కూరగాయలను స్థానికంగానే అమ్ముకునేందుకు వీలు కలుగుతుంది. -
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
అచ్చంపేట/అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం అచ్చంపేట అంబేడ్కర్ ప్రజా భవన్లో ఉప్పునుంతల, అమ్రాబాద్ మండలాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే వారికే అవకాశాలు దక్కుతాయన్నారు. పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని, రిజర్వేషన్లపై అపోహాలు నమ్మొద్దన్నారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల కోసం ప్రతి మండలం నుంచి 9నుంచి 12మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక ఎన్నికలపై రాజకీయ పరిజ్ఞానం లేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. సమావేశంలో ఉప్పునుంతల మండల అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, నాయకులు తిప్పర్తి నర్సింహారెడ్డి, వేముల నర్సింహారావు, అనంత ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
‘విజయ’దశమి
● జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన సంబరాలు ● భక్తిశ్రద్ధలతో శమీ పూజలు కందనూలు: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించే దసరా సంబరాలను గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రసిద్ధ ఆలయాను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి జమ్మిచెట్టు వద్దకు ఊరేగింపుగా చేరుకొని శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఆకును ఒకరినొకరు పంచుకొని ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో దసరా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే దంపతులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, సంగీతం, సంప్రదాయ కళలు ప్రజలను అలరించాయి. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన లైటింగ్ అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్‌బండ్ వద్దకు మహిళలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున చేరుకొని బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. -
అమ్మవారి విగ్రహ నిమజ్జనం
దోమలపెంట: దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని శ్రీశైలం ఆనకట్ట దిగువున కృష్ణానదిలో గురువారం కేంద్రం ఇంజినీర్లు, ఉద్యోగులు నిమజ్జనం చేశారు. అంతకుముందు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి కృష్ణానది వరకు ఊరేగింపు నిర్వహించారు. హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలి మన్ననూర్: దశాబ్దాలుగా ముత్తాతలు, తాతల కాలం నుంచి ఇప్పటికీ సాగు చేసుకుంటున్న వ్యవసాయ పొలాలకు ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని చెంచు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి నాగయ్య పాలకులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మన్ననూర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 50, 60 ఏళ్ల కాలంగా తమ పూర్వీకులు (చెంచులు) కండ్లకుంట, రాసుమళ్లబావి వద్ద వ్యవసాయ భూమిలేని నిరుపేద చెంచులు సాగు చేసుకుంటునప్పటికీ ఆ భూములకు హక్కు పత్రాలు దక్కలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొంతకాలంగా అర్హులైన లబ్ధిదారులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తున్నప్పటికీ, చట్టాలు అంటే తెలియని కొందరు ఆదివాసీ చెంచులు హక్కుపత్రాలు ఇచ్చే దిశగా ఎన్నడూ ప్రయత్నం చేయలేదన్నారు. చెంచుల సాగు భూములను అటవీ సరిహద్దు ప్రాంతం అంటూ తప్పుడు సర్వేలతో అటవీశాఖ అధికారులు చెంచులపై దౌర్జన్యాలకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇప్పటికై నా అమాయకులైన ఆదివాసీ చెంచులపై సానుకూలంగా స్పందించి నిజమైన అర్హులకు హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. -
వినూత్న సేవా కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం
● పేదలు, అనాథలు పుణ్యక్షేత్రాల దర్శనానికి అవకాశం ● దాతలు ముందుకు వస్తే బస్సుల కేటాయింపు ● విభిన్న మార్గాల్లో సంస్థకూ సమకూరనున్న ఆదాయం నారాయణపేట రూరల్: ప్రతి మనిషికి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేది ఓ కల.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతోమంది పరితపిస్తుంటారు. ముఖ్యంగా తమ ఇష్టదైవాలను దర్శించుకుని దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అయితే పేదరికం ఎంతోమందికి ఈ కల నెరవేరకుండా అడ్డుపడుతుంది. ఫలితంగా జీవితకాలంలో సైతం తమ ఇష్టదైవాలను దర్శించుకోలేక ఎంతోమంది నిరుపేదలు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో యాత్ర దానం పేరిట దాతల సహకారంతో అనాథలు, పేదలు పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఆర్టీసీకి సైతం ఇది ఒక ఆదాయ వనరుగా మారనుంది. పథకం అమలు ఇలా.. ఎంతోమంది తమ పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనే వారు డబ్బులను వృథా చేయకుండా పేదలకు యాత్ర దానం కల్పించి ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా ఆర్టీసీకి విరాళాలు అందిస్తే అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రకు తీసుకువెళ్తారు. ● దాతలు ప్రత్యేకంగా ఏ పుణ్యక్షేత్రానికి, పర్యాటక ప్రాంతానికి యాత్ర దానం చేయాలనుకున్నారో ముందుగా సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదించాలి. అధికారులు యాత్రకు సంబంధించిన దూరాన్ని లెక్కించి కిలోమీటర్ల ఆధారంగా డబ్బులు, ఇతర వివరాలు తెలియజేస్తారు. ● యాత్రకు సంబంధించిన ప్యాకేజీ డబ్బులను దాతలు ఒక్కరే భరించవచ్చు. లేదా మిత్రుల భాగస్వామ్యంతోనైనా చెల్లించవచ్చు. అందించిన డబ్బుల ఆధారంగా అధికారులు అవసరమైన బస్సు ఏర్పాటు చేస్తారు. దాత వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోనూ నమోదు చేయాలి. దాతలు యాత్రకు వెళ్లే వారి పేర్లను సైతం సూచించవచ్చు. లేదా ఆర్టీసీనే నిరుపేదలు, వృద్ధులు, విద్యార్థులను ఎంపిక చేసి తీసుకువెళ్తుంది. డిపో డీఎం సెల్ నంబర్ మహబూబ్‌నగర్ సుజాత 99592 26286 షాద్‌నగర్ ఉష 99592 26287 నాగర్‌కర్నూల్ యాదయ్య 99592 26288 వనపర్తి దేవేందర్‌గౌడ్ 99592 26289 గద్వాల సునీత 99592 26290 అచ్చంపేట ప్రసాద్ 99592 26291 కల్వకుర్తి సుహాసిని 99592 26292 నారాయణపేట లావణ్య 99592 26293 కొల్లాపూర్ ఉమాశంకర్‌గౌడ్ 90004 05878 బస్సుల స్థాయికి చార్జీలు ఇలా.. కి.మీ., ఎక్స్‌ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ (రూపాయలలో..) 201– 300 38,782 32,587 29,752 301– 400 38,782 38,782 35,002 401– 500 44,977 44,977 40,252 బస్సులో సీట్లు 50 40 34 -
అడుగడుగునా కబ్జాలే
●మల్లంకుంటలో ఎఫ్టీఎల్,బఫర్ జోన్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు మల్లంకుంటను పరిరక్షిస్తాం.. ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి ఎన్ఓసీ ఇవ్వలేదు. మేము ఇచ్చిన నివేదిక ఆధారంగానే అక్రమ కట్టడాలను గుర్తించి మున్సిపల్ అధికారులు గతంలో కొన్ని దుకాణాలు కూల్చివేశారు. మున్సిపల్ శాఖ సహకారంతో మల్లంకుంటను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అవసరమైతే రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ గుర్తించి.. శిఖం భూమిని సర్వే చేయిస్తాం. – బాలస్వామి, డీఈ ఇరిగేషన్ శాఖ, అచ్చంపేట అచ్చంపేట: చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు మాత్రమే కాదు.. శిఖం భూములు, నాలాలూ (కాల్వలు) సైతం కబ్జా చేసి అమ్మేశారు. దీంతో ఇప్పటికే పలు చెరువులు, వాగులు ఆనవాళ్లు కోల్పోయి అందులో భవనాలు వెలిశాయి. దీంతో వరద నీరు చెరువుల్లోకి వచ్చే మార్గం లేక కుంటలుగా మారడం, ఇళ్లలోకి చేరడం జరుగుతుంది. మరోవైపు గొలుసు కట్టు చెరువులకు కూడా నీరు వెళ్లే మార్గం లేక చిన్నపాటి వర్షం వచ్చినా వరద పోటెత్తుతోంది. జిల్లాలో ఒకప్పుడు అపారమైన నీటి వనరులతో జీవకళ ఉట్టిపడిన చెరువులు నేడు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వందలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఈ కబ్జాల వ్యవహారంలో తప్పెవరిది అంటే ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా పాలకులు, అధికారులు, పేదలు, పెద్దలు అందరికీ భాగముంది. రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే చెరువుల స్థలాలో అక్రమ లే అవుట్లు చేసినా.. అనుమతి లేని నిర్మాణాలు చేపట్టినా పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో రికార్డుల్లో ఉన్న చెరువులు క్షేత్రస్థాయిలో కనుమరుగయ్యాయి. కుచించుకుపోయిన మల్లంకుంట.. అచ్చంపేట పట్టణం మధ్యలో 28 ఎకరాల్లో మల్లంకుంట విస్తరించి ఉన్నట్లు పాత లెక్కలు చెబుతుండగా పంచాయతీరాజ్ నుంచి ఇరిగేషన్ శాఖకు బదిలీ చేసిన లెక్కల ప్రకారం 16.20 ఎకరాలు మాత్రమే ఉంది. ఇందులో 6.20 ఎకరాల శిఖం భూమి, సర్వే నం.152లో 14.6 ఎకరాల్లో 11 ఎకరాల భూమి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉండగా రెవెన్యూ అధికారులు మాత్రం దీనిని నాన్ అగ్రికల్చర్ భూమిగా మార్చారు. ప్రస్తుతం మల్లకుంట చుట్టపక్కల వ్యాపార సమూదాయాలు, నివాస భవనాలు వెలిశాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు లోతట్టు ఇళ్లు జలమయమయ్యాయి. ఈ కుంట కబ్జా కోరల్లో చిక్కుకున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. ఆనవాళ్లు లేని గజవానికుంట అచ్చంపేట మున్సిపాలిటీలో ప్రధానంగా రెండు గొలుసు కట్టు చెరువులైన గజవానికుంట, కొర్లకుంట చెరువు మాయం కావడంతో కాలనీలు జలమయమవుతున్నాయి. సాగునీటి అవసరాలు తీర్చిన ఈ రెండు చెరువులు పట్టణీకరణ నేపథ్యంలో ఆక్రమణకు గురై ఉనికి కోల్పోయాయి. అచ్చంపేట– ఉప్పునుంతల రోడ్డులోని గజవానికుంట ధ్వంసంపై అప్పట్లో పోలీసు కేసు నమోదు చేసి కొంతమందిని జైలుకు పంపించారు. ఇప్పుడు ఈ చెరువులో పెద్దపెద్ద కాలనీలు వెలసి వందలాది కుటుంబాలు నివాసం ఉటున్నాయి. శిఖం భూమి.. అన్యాక్రాంతం కొర్లకుంట శిఖం భూమి ప్లాట్లు చేసి అమ్మేశారు. పట్టణంలోని గజవానికుంట కింద గొలుసు కట్టు కింద ఉన్న కొర్లకుంట సర్వే నం.351లో రెండున్నర ఎకరాల శిఖం భూమి ఉండగా సుమారు ఎకరం భూమి అన్యాక్రాంతమైంది. శిఖం భూమి ఇతర అవపరాలకు కేటాయించడానికి కూడా వీలు లేదు. ఇలాంటి స్థలం పరిరక్షించాల్సిన బాద్యత రెవెన్యూశాఖపై ఉన్న పట్టింపు లేని ధోరణితో వ్యవహరిస్తున్నారు. మాయమైన ఎర్రకుంట.. ఎర్రకుంటను రియల్టర్ ఏకంగా కూల్చివేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపంతో కబ్జాదారులు రెచ్చిపోయారు. జన్మభూమి కార్యక్రమంలో పనికి ఆహార పథకం కింద తుమ్మలకుంటకు వెళ్లే నీటి ప్రవాహానికి అడ్డుగా నీటి నిల్వ కోసం అప్పట్లో ఈ కుంట ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనిని రియల్టర్లు ఆనవాళ్లు లేకుండా చేశారు. అచ్చంపేటలో చెరువులను చెరబట్టిన అక్రమార్కులు గొలుసుకట్టు చెరువులు, కుంటలు ధ్వంసం నాలాలు సైతం కబ్జా కోరల్లోనే.. -
పులకించిన కొండారెడ్డిపల్లి
–10లో uస్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ బదావత్ సంతోష్‌తోపాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించలేదు. ఏర్పాట్లను మొత్తం గ్రామస్తులే చూసుకున్నారు. కేవలం భద్రతా ఏర్పాట్లను మాత్రమే పోలీసు అధికారులు పర్యవేక్షించారు. వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెలీకాప్టర్‌లో సీఎం కొండారెడ్డిపల్లికి చేరుకోగా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రచార రథంపై వెళ్తుండగా బతుకమ్మ, కోలాటాలతో గ్రామస్తులు అభివాదం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. ● సాయంత్రం 5.30 గంటలకు సోదరులు తిరుపతిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి కోటమైసమ్మను దర్శించుకొని, భాజాభజంత్రీలతో భారీ ర్యాలీగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన కొడంగల్‌కు బయలుదేరి వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
దాతలు ముందుకు రావాలి..
తెలంగాణ ఆర్టీసీ నూతనంగా శ్రీకారం చుట్టిన యాత్ర దానం నిరుపేదలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. సేవాభావంతో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యక్తులు ఎవరైనా సహకరించి విరాళాలు ఇస్తే అనాథలు, వికలాంగులు, వృద్ధులు, నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇళ్లలో జరుపుకొనే వేడుకలకు సమాంతరంగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు దానం ఇవ్వడానికి ముందుకు రావాలి. – సంతోష్‌కుమార్, ఆర్ఎం, మహబూబ్‌నగర్ ● -
అయ్యో.. అయ్యయ్యో!
‘స్థానిక’ రిజర్వేషన్లలో పంచాయితీ ● ఎస్టీలు లేని చోట ఎస్టీకి.. ఎస్సీలు లేని చోట ఎస్సీకి.. ● పలు గ్రామాల్లో కిరికిరి.. కొన్ని చోట్ల అనివార్యంగా పదవులు ● నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆ 4 గ్రామాల్లో ‘ప్రత్యేక’ పరిస్థితి ● ఎస్టీలు లేకున్నా సర్పంచ్ స్థానాలు ఆ వర్గానికే రిజర్వ్డ్ ● 2019లో జరగని ఎన్నికలు.. ఈ సారీ స్వయం పాలనకు దూరమేనా..? ఎస్సీలు లేని చోట ఎస్సీలకు.. ఎస్టీలు లేని చోట ఎస్టీలకు.. ఇలా ‘స్థానిక’ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు పదవులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గానికి చెందిన ఓటర్లే లేకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని పల్లెల్లో ఒకరు, ఒకట్రెండు కుటుంబాలు ఉన్న సామాజిక వర్గాలకు అనివార్యంగా పదవులు దక్కనున్నాయి. ఇదేక్రమంలో ఎన్నో ఆశలతో బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వివిధ పార్టీల్లోని ముఖ్య నేతల అనుచరులకు భంగపాటే ఎదురైంది. తారుమారైన రిజర్వేషన్లు దేవరకద్రతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నాయకుల ఆశలపై నీళ్లు చల్లగా.. వారిలో నైరాశ్యం అలుముకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ
చిత్తు చిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. రామ రామ ఉయ్యాలో.. అంటూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొని మాట్లాడారు. గౌరమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఇంటిలో సంతోషం, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి భార్య సరితతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే భార్య స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. – నాగర్‌కర్నూల్ / కందనూలు -
మద్యం టెండర్ల ‘ఖాతా’ ప్రారంభం
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా మంగళవారం నాగర్‌కర్నూల్ ఈఎస్ పరిధిలో మూడు టెండర్లు దాఖలయ్యాయి. నాగర్‌కర్నూల్‌లో సర్కిల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాలకు, కల్వకుర్తిలో ఒక దుకాణానికి టెండర్లు వచ్చాయి. అయితే ఈనెల 26 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు మూడు మాత్రమే వచ్చాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో ఇంకా ఖాతా ఒపెన్ కాలేదు. ఈనెల 18 వరకు టెండర్ల స్వీకరణకు గడువు ఉన్న క్రమంలో మద్యం వ్యాపారులు ఆలస్యం చేస్తున్నారు. చివరి వారం రోజుల్లో టెండర్ల వేగం పుంజుకుంటుంది. రెండేళ్ల కాలపరిమితిలో వచ్చే మద్యం వ్యాపారులకు స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నాయి. దీంతో గతం కంటే ఈసారి టెండర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ● నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడు టెండర్లు దాఖలు ● మిగిలిన జిల్లాల్లో నమోదు కాని టెండర్లు -
దసరాకు ముస్తాబవుతున్న కొండారెడ్డిపల్లి
వంగూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా దసరా రోజు సొంత గ్రామమైన వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి రానున్నారు. గతేడాది ముఖ్యమంత్రిగా మొదటిసారి స్వగ్రామానికి వచ్చిన రేవంత్‌రెడ్డి గ్రామ పంచాయతీ భవనం, సోలార్ విద్యుత్ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలోనే గత నెల 28న రాష్ట్ర మంత్రులు కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. దసరా పండుగ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్‌లో స్వగ్రామానికి చేరుకోనున్నారు. దేవాలయంలో పూజల అనంతరం సాయంత్రం జమ్మికి వెళ్తారని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పెద్దఎత్తున పోలీసు యంత్రాంగం మోహరించారు. హెలీప్యాడ్ నుంచి దేవాలయం వరకు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామం మొత్తం ఫ్లెక్సీలు, పూల డెకరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో కొత్త రోడ్లు, కొత్త భవనాలు నిర్మాణం కావడంతో గ్రామం రూపురేఖలు మారాయి. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రాకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాక నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు -
శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు కీలకం
నాగర్‌కర్నూల్ క్రైం: దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరికీ హాని కలిగించకుండా, ఆయుధాలను దుర్వినియోగపరచకుండా దుష్ట సంహారం కోసం వాడేదే ఆయుధం అని, అలాంటి ఆయుధాలు, పరికరాలు, సమస్త యంత్రాలలో అంతర్లీనంగా దుర్గాదేవి చైతన్యశక్తి స్వరూపిణిగా కొలువుంటుందని, అందుకోసమే దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ నిర్వహిస్తామని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం దుర్గాష్టమిని పురస్కరించుకొని జిల్లా సాయుధ బలగాల కార్యాలయంలో ఎస్పీ ఆయుధ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు ఎంతో ముఖ్యమన్నారు. పోలీసులు తీవ్రవాదుల నుంచి తమను తాము రక్షించుకొని దేశ ప్రజలను రక్షించడం కోసం ఆయుధాలను వాడతారన్నారు. ఆయుధాలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని, యూనిఫాం సర్వీసుల్లో మన శరీరంపై ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఒక ఆయుధంగా సందర్భాన్ని బట్టి పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చదవాలనుకునే ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా రూ.20 లక్షలు స్కాలర్షిప్ అందించే అవకాశం ఉందన్నారు. డిగ్రీలో 60 శాతం మార్కులు, టోఫిల్ ఉత్తీర్ణత, పాస్‌పోర్టు, వీసా, విదేశీ విశ్వవిద్యాలయం ప్రవేశపత్రం ఉండి వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు http://tgepass.cgg.gov.in వెబ్సైట్లో నవంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ మన్ననూర్: టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోహిత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఐటీడీఏ సమక్షంలో చెంచు యువతకు టీజీఎస్ ఆర్టీసీ హకీంపేటలో 41 మంది చెంచు యువతకు లైట్ మోటార్ వెహికిల్ (33) (ఎల్ఎంవీ), హెవీ మోటార్ వెహికిల్ (8) (హెచ్ఎంవీ) డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారన్నారు. చెంచు యువకుల్లో ఆసక్తి గలవారు TSLPRB వెబ్‌సెట్ (www. tgprb.in)లో ఈ నెల 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకు గాను పూర్తి వివరాలు www.tgprb.in వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. నూతన బస్‌స్టేషన్ నిర్మాణానికి ఉత్తర్వులు కందనూలు: జిల్లాకేంద్రంలో నూతన బస్‌స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి కృషితో రూ.10.80 కోట్లతో అత్యాధునిక హంగులతో మరో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం మంగళవారం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గాను ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: క్షయ రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. మంగళవారం జనరల్ ఆస్పత్రిలో నూతన క్షయవ్యాధి పరీక్ష నిర్ధారణ సీబీనాట్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బీఐ ఆర్థిక సౌజన్యంతో భవిష్య భారత్ ట్రస్ట్ సీబీ నాట్ యంత్రాన్ని అందించారని, సీబీ నాట్ యంత్రం ద్వారా అనుమానిత రోగి కళ్లె పరీక్షలు నిర్వహిస్తారని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెండు వారాల నుంచి దగ్గు, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, జ్వరం రావడం తదితర లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వెంటనే కళ్ల పరీక్ష చేయించుకోవాలన్నారు. జిల్లాలో గ్రామాన క్షయవ్యాధి పరీక్ష శిబిరాలు నిర్వహిసున్నారని, ఇందులో ఎక్స్‌రే, కళ్లె పరీక్షలు చేస్తారన్నారు. అనంతరం జనరల్ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంతోపాటు పీపీ యూనిట్ తనిఖీ చేసి వ్యాక్సిన్ నిల్వలు పరిశీలించారు. కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి సీఎస్ ఆర్ఎంఓ రవిశంకర్, భవిష్య భారత్ జిల్లా మేనేజర్ సజ్జత్ అలీ, ల్యాబ్ టెక్నీషియన్ కల్యాణ్ కృష్ణారావు, సత్యారెడ్డి, ఎస్టీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిద్దాం
నాగర్‌కర్నూల్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిద్దామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల నిర్వహణపై అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. రాజకీయ పార్టీల ప్రచారం, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చు తదితర అంశాలపై ఎన్నికల నియమావళిని అనుసరించి ఉండేలా రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించామన్నారు. అలాగే జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరగడానికి మీడియా ప్రతినిధుల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ● అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని తూ.చ తప్పకుండా పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఎన్నికల నిబంధనల అమలు నేపథ్యంలో రాజకీయ పార్టీల గోడలపై రాతలు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని చెప్పారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని 10 వేలు అంతకంటే ఎక్కువ జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచిగా పోటీ చేసే అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు అభ్యర్థికి రూ.50 వేలుగా నిర్ణయించిందని, 10 వేల కంటే తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచి అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు అభ్యర్థికి రూ.30 వేలుగా నిర్ణయించారన్నారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
● నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ● కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్‌కర్నూల్: జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని.. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా ఎన్నికల అథారిటీగా వ్యవహరిస్తున్న కలెక్టర్ సంతోష్.. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో కొత్త ప్రాజెక్టుల మంజూరు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏవీ చేపట్టరాదన్నారు. ప్రభుత్వ నిధుల వినియోగం, అధికారిక వేదికలపై రాజకీయ ప్రసంగాలు జరగకూడదని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అందించే సేవలు మాత్రం ఆగకూడదని తెలిపారు. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి కలెక్టర్ వరకు, కాంట్రాక్టు సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ ఎన్నికల ఠికమిషన్ ఆదేశాల ప్రకారం పనిచేయాలని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయ నాయకుల కార్యక్రమాల్లో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పారదర్శకత, నిష్పక్షకతతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో ప్రచార పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడ రాతలను తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలో స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో మొదటి విడత 109 ఎంపీటీసీ, 9 జెడ్పీటీసీ స్థానాలకు (బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, తాడూరు, తెలకపల్లి, కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూర్ మండలాల్లో) ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రెండో విడత 105 ఎంపీటీసీ, 11 జెడ్పీటీసీ స్థానాలకు (అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదర, ఉప్పునుంతల, చారకొండ, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో) ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. అదే విధంగా గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లోని 151 జీపీల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రెండో విడతలో అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో 158 జీపీలు, మూడో విడతలో కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూర్, తాడూర్, తెలకపల్లి మండలాల్లో 151 జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మేరకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల సిబ్బందికి మొదటి విడత శిక్షణ తరగతులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. వీసీలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిప్యూటీ కలెక్టర్లు కె.హర్షవర్ధన్, టి.అశోక్, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ● ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ఏ విధమైన నిర్లక్ష్యం ప్రదర్శించరాదని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 51 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
హిందూ ధర్మాన్ని పరిరక్షిద్దాం
కొల్లాపూర్: హిందూ ధర్మ పరిరక్షణకు సంఘ్ శ్రేణులు కృషిచేయాలని ఆర్ఎస్ఎస్ పాలమూరు విభాగ్ సంఘచాలక్ ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. కొల్లాపూర్‌లో కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించగా.. శిక్షణ పొందిన 356 మంది కరసేవకులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలో విజయదశమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ.. ధర్మ పరిరక్షణ, హిందువుల జాగృతం, దేశభక్తి వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. నిస్వార్థమైన దేశభక్తి, త్యాగనిరతి సంఘ్ కార్యకర్తల లక్షణమన్నారు. కులరహిత, ప్లాస్టిక్ రహిత, సామాజిక సమరసత నిర్మాణం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు పట్టణంలోని మాధవస్వామి ఆలయ ఆవరణలో ఆర్ఎస్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో కరసేవకులు కవాతు నిర్వహించారు. కార్యక్రమాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్‌రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార్యవాహ ఆగపు నాగయ్య, శ్రీనివాస్ యాదవ్, కేతూరి బుడ్డన్న, శశికాంత్, బృంగి కృష్ణప్రసాద్, రమేశ్, శేఖర్‌గౌడ్, కేతూరి నారాయణ, సాయికృష్ణగౌడ్, పురేందర్, విజయ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అబద్ధాలతో పబ్బం గడుపుతున్న బీఆర్ఎస్
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని.. అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ ధ్వజమెత్తారు. సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చంపేటలో జనగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించిన కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో మునిగిపోయిన నావ లాంటిది బీఆర్ఎస్ అని.. తామున్నామని పబ్బం గడపడానికే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. స్థానికేతరులను సభకు తీసుకొచ్చి సక్సెస్ చేశామని చంకలు చరుచుకుంటున్నారని అన్నారు. నల్లమల టైగర్ సీఎం రేవంత్‌రెడ్డి అని స్వయంగా కల్వకుంట్ల కవితనే ఓ ఇంటర్వ్యూలో అన్నారని గుర్తుచేశారు. తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని.. ఇక్కడ స్థానికేతరులందరూ కనుమరుగయ్యారని అన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే కేవలం 56 శాతమే ప్రాజెక్టులు పూర్తి చేశారన్నారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చింది కేసీఆరే అని ఆరోపించారు. అచ్చంపేట ప్రాజెక్టుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పూర్తిచేసి తీరుతామన్నారు. పదేళ్ల బాకీ కార్డులతో తామూ ప్రజల ముందుకెళ్తామన్నారు. ప్రజాపాలన సజావుగా సాగుతుంటే.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో కేవలం 9వేల ఎకరాలకు సాగునీరు అందించి.. 90వేల ఎకరాలు అని అనడం సరైంది కాదన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ వస్తే లెక్కలు చూపిస్తామన్నారు. అబద్ధమని తేలితే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, నాయకులు మల్లేష్, గోపాల్‌రెడ్డి, గిరివర్ధన్‌గౌడ్, సీఎం రెడ్డి, నర్సింహారావు, రామనాథం, రాజగోపాల్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం
– వివరాలు 9లో.. కందనూలు: జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మూలనక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీజ్ఞాన సరస్వతీమాత ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 మంది చిన్నారులతో అక్షరాభ్యాసం, 9మంది చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకారపు విశ్వనాథం, కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు నవీన్ కుమార్, పవన్ కుమార్, నితీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మూడు దశల్లో ‘పంచాయతీ’
గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడతలో అక్టోబర్ 17 నుంచి 31 వరకు 16 మండలాల పరిధిలోని 410 జీపీలతోపాటు 3,514 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు 28 మండలాల్లోని 611 జీపీలతోపాటు 5,546 వార్డులకు.. చివరి దశలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు 33 మండలాల పరిధిలోని 657 జీపీలతోపాటు 6,008 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తొలి విడతలో పోలింగ్ నిర్వహించడం లేదు. రెండు, మూడో విడతల్లోనే ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడుతారు. కాగా.. పంచాయతీ ఎన్నికలకు గాను 2,363 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. -
కేఎల్ఐ కాల్వలకు గండి
వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలకు గండ్ల పరంపర కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున పోతేపల్లి సమీపంలో నీటి ప్రవాహం పెరగడంతో కాల్వ గట్టు తెగిపోయింది. అలాగే సాయంత్రం మండల కేంద్రం సమీపంలో మరో గండి పడటతో సుమారు 10 ఎకరాల వరి పంట నీట మునిగింది. కాల్వలు తెగి సాగునీరు వ్యవసాయ పొలాలను ముంచెత్తుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు నీటమునిగి తమకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కేఎల్ఐ డీఈఈ దేవన్న సిబ్బందితో వెళ్లి పోతేపల్లి సమీపంలో మట్టి సంచులతో కాల్వ గండిని పూడ్చివేశారు. నీట మునుగుతున్న వరిపంట -
టీచర్లకు టెట్ టెన్షన్
ప్రభుత్వానిదే బాధ్యత సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి కోసం మినహాయింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలి. ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – సత్యనారాయణరెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పునరాలోచన చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. ఉపాధ్యాయుల నియామకాలు జరిగినప్పుడు లేని నిబంధన ఇప్పుడు పెట్టడం సమంజసం కాదు. తపస్ సంఘం కేంద్ర మంత్రులను కలిసి మినహాయింపు ఇప్పించాలని వినతిపత్రం అందజేశాం. – రాజిరెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వాలు చొరవ చూపాలి రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సా ధించాలన్న సుప్రీం నిర్ణ యం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనిపై ప్రభుత్వాలు చొ రవ తీసుకొని ఉపాధ్యా యులకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలి. – కృష్ణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కందనూలు: విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సమూల మార్పులు చేశారు. విద్యార్హలతోపాటు వృత్తి సామర్థ్యాలను మరింతగా పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రవేశపెట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కలవరపెడుతుంది. విధుల్లో కొనసాగాలన్నా.. పదోన్నతి పొందాలన్నా.. టెట్ ఉత్తీర్ణతకు రెండేళ్లు గడువు విధించడం ఆందోళనకు గురిచేస్తోంది. 2012 డీఎస్సీ ద్వారా ఎంపికై న వారు టెట్ అర్హత కలిగి ఉన్నారు. అంతకు ముందు బీఈడీ, టీటీసీతో పరీక్ష రాసి ఉద్యోగంలో చేరిన వారికి టెట్ లేకపోవడం ఇందుకు కారణమవుతోంది. ఇది ఉద్యోగ విరమణకు దగ్గరున్న.. పదోన్నతులు పొందాలనుకునే టీచర్లను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సగానికిపైగా వారే.. జిల్లాలో మొత్తం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 752 ఉన్నాయి. ఇందులో 3,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వీరిలో జీహెచ్ఎంలు 102, ఎస్జీటీలు 1,399, స్కూల్ అసిస్టెంట్లు 1,720 మంది ఉన్నారు. టెట్ రాయకుండా వృత్తిలో కొనసాగుతున్న వారే సగానికి పైగా ఉన్నారని తెలుస్తోంది. టెట్ అర్హత తప్పనిసరి కావడం, రాయని పక్షంలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ, నిర్బంధ తొలగింపు టీచర్లను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎస్జీటీలు వృత్తి ఇంక్రిమెంట్లు రావాలన్నా, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలన్నా డిపార్టుమెంట్ పరీక్ష రాస్తారు. అలా కాకుండా 2012కు ముందు చేరిన వారందరికీ టెట్ అర్హత నిబంధన ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. కలవరపెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు రెండేళ్లలో అర్హత సాధించకుంటే ఇంటికే.. సీనియర్ ఉపాధ్యాయుల్లో ఆందోళన తీర్పుపై పునరాలోచించాలని సంఘాల డిమాండ్ మినహాయింపు ఇవ్వండి.. సీనియర్ ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ రాయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. బయోసైన్స్ ఉపాధ్యాయులు గణితం, తెలుగు పండితులు సోషల్ స్టడీస్.. ఇలా ఉపాధ్యాయులకు సంబంధం లేని సబ్జెక్టులను టెట్‌లో పెట్టి పాస్ కావాల్సిందే అనే ఆలోచన సరైంది కాదని ఉపాధ్యాయులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం అలా నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం కంటే ముందే ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ప్రధానోపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంది. ఈ నిబంధన వ్యాయామ ఉపాధ్యాయులకు లేకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. -
ఫుట్‌బాల్ చాంపియన్‌గా వనపర్తి
● రన్నరప్‌గా నిలిచిన కరీంనగర్ ● సెమీస్‌లో పోరాడి ఓడిన మహబూబ్‌నగర్ ● ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి – మహబూబ్‌నగర్ క్రీడలు విప్లవ ఉద్యమాలకు దిక్సూచి భగత్‌సింగ్ నాగర్‌కర్నూల్ రూరల్: దేశంలోని యువతకు భగత్‌సింగ్ ఒక దిక్సూచి అని, భగత్‌సింగ్ స్ఫూర్తితో విద్య కాషాయీకరణ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తీరును యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. స్వాతంత్ర ఆకాంక్షను నిలువెల్లా నింపుకొని ఆంగ్లేయులపై ఎగిసిపడి యువతను స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములు చేసిన వీరుడు భగత్‌సింగ్ అని కొనియాడారు. సమాజ మార్పు కోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్, నరేష్, ఆంజనేయులు, శివకృష్ణ, శివశంకర్, రామస్వామి, మన్విత్, అఖిల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
● ఏటీసీ సెంటర్ల ఏర్పాటుతో యువతకు ఉద్యోగావకాశాలు ● ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు ● ప్రతి జిల్లాకు పాలశీతలీకరణకేంద్రాలు మంజూరు ● రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి వెల్లడి ● కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య క్రమంలో విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ.134 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 8 మెడికల్ కళాశాలలు, 74 ట్రామా సెంటర్లు, 102 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని, క్యాన్సర్ నివారణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కోసం ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలో 65 సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర యువతకు నైపుణ్యమైన విద్యనందించి ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దేందుకు ఒక్కో ఏటీసీ సెంటర్‌కు రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామంపై మమకారంతో అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గ్రామం మొత్తం సోలార్ విద్యుత్‌ను వాడే విషయంలో కొండారెడ్డిపల్లి దేశంలో రెండవది అన్నారు. గ్రామంలోని 514 ఇళ్లకు గాను 480 ఇళ్లకు సోలార్ సౌకర్యం కల్పించడం జరిగిందని, ప్రతి ఇంటి నుంచి 360 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందన్నారు. సెప్టెంబర్ నెలలో గ్రామం నుంచి దాదాపు లక్ష యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించడంతో గ్రామానికి రూ.5 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ రంగంతోపాటు పాడిపరిశ్రమపై దృష్టి సారించాలన్నారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ.2.50 కోట్లతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం వల్ల రోజుకు 30 వేల లీటర్ల పాలను నిలువ చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ఇంతపెద్ద బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ కొండారెడ్డిపల్లిలో మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్ పాల్గొన్నారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
ఎర్రవల్లి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.20 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వదిలారు. దీంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద తీవ్రత పెరగడం పుష్కరఘాట్లు నీట మునిగాయి. శివాలయం అతిసమీపంలో వరద ప్రవహిస్తుంది. నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణానది పరివాహక ప్రాంతంలో, గ్రామాల్లో నివసించే ప్రజలు వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. ఆదివారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. పుష్కరఘాట్ల వద్దకు, నీటిలోకి భక్తులు ఎవరూ వెళ్లవద్దని, పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అన్నారు. గొర్రెలు, పశువుల కాపరులు మేత కోసం నది సమీపంలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకు వెళ్లవద్దని, ముసురు వర్షాల వల్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలకు ఏమైనా అత్యవసరమైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి సహాయం పొందాలని ఆయన సూచించారు. ఆయన వెంట సీఐ రవిబాబు, ఎస్ఐ రవినాయక్ ఉన్నారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద ఉధృతంగా వస్తున్న కృష్ణమ్మ -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
నాగర్‌కర్నూల్ క్రైం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్య అతిథి గా హాజరైన జిల్లా జడ్జి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూజలు చేస్తారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా చేసుకుంటున్నామని పేర్కొన్నారు. వివిధ కాలానుగుణ పువ్వులతో బతుకమ్మ పేర్చుతారని, వాటిలో ఎక్కువ భాగం ఔషధ విలువలతో ఆలయ గోపురం ఆకారంలో ఉంటాయన్నా రు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా, సీనియర్ సివిల్ జడ్జి వెంకట్రాం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతారావు, బార్ సెక్రటరీ ఎం మధుసూదన్‌రావు పాల్గొన్నారు. -
బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే..
డిఫాల్ట్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిపుల్లేవ్ ● జిల్లాలో మొత్తం 145 రైస్‌మిల్లులు ● ప్రస్తుతం 45 మిల్లులకే ప్రతిపాదనలు ● మిల్లింగ్ కెపాసిటీలో పది శాతం తప్పనిసరి నాగర్‌కర్నూల్: జిల్లాలో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రతి ఏటా ఆయా రైస్ మిల్లులకు కేటాయిస్తుంటారు. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి సీఎమ్మార్ కింద బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అయితే రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరగుతున్నాయని, పలు రైస్ మిల్లర్లు సీఎమ్మార్ ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవకతవకలకు పాల్పడిన మిల్లులకు ధాన్యం కేటయించొద్దని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ అయిన మిల్లు కు ధాన్యం కేటాయించడం నిలిపివేయడంతో పా టు మిగతా మిల్లులకు సైతం బ్యాంక్ గ్యారంటీ ఉంటేనే ధాన్యాన్ని కేటాయించేలా ఆదేశాలు జారీ చేశా రు. జిల్లాలో మొత్తం 145 రైస్‌మిల్లులు ఉండగా.. వానాకాలం సీజన్లో 45మిల్లులకు ధాన్యాన్ని కుటాయించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వీటి సంఖ్య గతేడాది 46 ఉండగా.. కల్వకుర్తికి చెందిన ఒక మిల్లును డిఫాల్ట్ లిస్టులో చేర్చారు. 7 కేసులు నమోదు జిల్లాలో 2022 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎమ్మార్ బియ్యం ఇవ్వకపోవడంతో పాటు ఆ బియ్యం మిల్లుల్లో కూడా లేకపోవడంతో అధికారులు ఇప్పటి వరకు 7 కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు కేసులు 2024లో నమోదు చేయగా.. ఈ ఏడాది ఐదు క్రిమినల్ కేసులు పెట్టారు. కల్వకుర్తికి సంబంధించి ఇప్పటి వరకు 7మిల్లులపై, నాగర్‌ర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు పరిధిలోని ఒక రైస్ మిల్లుపై చర్యలకు ఉపక్రమించారు. ఈ మిల్లులకు సంబంధించిన ఇండస్ట్రీస్ పేరుపై ఉన్న భూములను, ఆస్తులను ఎవరి పేరుపై మార్చకుండా ఫ్రీజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా మరి కొన్ని రోజులు గడువు ఉండడంతో యాసంగాలో తీసుకున్న ధాన్యానికి సంబంధించి 70 శాతం సీఎమ్మార్ ఇచ్చిన రైస్ మిల్లులకు, గత వానాకాలానికి సంబంధించి వంద శాతం సీఎమ్మార్ ఇచ్చిన రైస్‌మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని కేటాయించేలా అధికారులు నిబంధనలు విధించారు. దీంతోపాటు ఇకపై మిల్లులకు ధాన్యాన్ని కేటాయించేందుకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి చేయడంతో అక్రమాలు పాల్పడే ఆస్కారం తగ్గనుంది. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తున్న అధికారులు (ఫైల్) బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే మిల్లర్లకు ధాన్యం కేటాయించాలంటే మిల్లింగ్ కెపాసిటీలో పది శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే. దీంతోపాటు గతంలో వారికి కేటాయించిన ధాన్యానికి సంబంధించి వానాకాలం సీజన్‌కు సంబంధింయి వంద శాతం, యాసంగి సీజన్‌కు సంబంధించి సీఎమ్మార్ 70 శాతం ఇవ్వాలి. లేకుంటే కేటాయింపులు ఉండవు. ప్రతీ యేటా సీఎంఆర్ చెల్లించని మిల్లును డిఫాల్ట్ లిస్టులో చేర్చుతూ వస్తున్నాం. వీటితో పాటు సదరు మిల్లులపై చర్యలు కూడా తీసుకుంటున్నాం. – రాజేందర్, సివిల్ సప్లై డీఎం -
సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
కల్వకుర్తి టౌన్: వైద్య సిబ్బంది రోగులకు అందించే సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, వారికి అన్ని వసతులు కల్పించాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా సభ్యులు డా.సుభోద్, రామలక్ష్మి అన్నారు. శనివారం పట్టణంలోని సీహెచ్‌సీని 10 సభ్యులతో కూడిన కేంద్ర బృందం పరిశీలించింది. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్ట్స్ ప్రకారం సేవలు అందుతున్నాయా లేదా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని ఆస్పత్రి అంతా తిరిగి చూశారు. అన్ని విభాగాలను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడి వివరాలను సభ్యులు సేకరించి, నోట్ చేసుకున్నారు. 108, 102 అంబులెన్స్ సేవల గురించి ఆరా తీశారు. ఎప్పుడూ సమయానికి రాని కొందరు వైద్యులు కేంద్ర బృందం వచ్చిన సమయంలో మాత్రం ఇన్‌టైంలో రావటం ఆశ్చర్యానికి గురిచేస్తుందని సిబ్బంది మాట్లాడుకోవటం గమనార్హం. -
స్థానిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
నాగర్‌కర్నూల్: అధికారులు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో రానున్న స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్వోలు, ఏఆర్ఓలకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలతో, అధికారుల నియామకంతో పాటు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సుల వినియోగం తదితర వాటిపై శిక్షణ అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందని సూచించారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశించారు. పంచాయతీ రాజ్ చట్టం 2018, ఎన్నికల సంఘం హ్యాండ్‌బుక్‌లోని మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఆమోదం లేదా తిరస్కరణ వంటి దశలు అత్యంత కీలకమని, ఈ ప్రక్రియలో ఆర్వోలు జాగ్రత్త వహించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే 786 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ, మాస్టర్ ట్రెయినర్ గోపాల్‌నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకోవాలి
కల్వకుర్తి టౌన్/మన్ననూర్: ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే సాంకేతికను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌లో ఉన్నతంగా రాణించేందుకు వీలుంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్‌నగర్ రోడ్డులో ఉన్న ఐటీఐ కళాశాల ప్రాంగణంలో, మన్ననూర్లోని ఆర్ఐటీఐ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్)ను వారు వేరువేరుగా ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం లేక చాలామంది ఉద్యోగాల్లో వెనకబడుతున్నారని, వారిలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి ఏటీసీలను తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, కల్వకుర్తి ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జయమ్మ, మన్ననూర్ ఐటీఐ ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి, టీజీ ఐఐసీ డీఈ జ్యోతి, నాయకులు పోషం గణేష్, బుచ్చయ్య, హరినారాయణ, రహీం తదితరులు పాల్గొన్నారు. -
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి
● ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నాగర్‌కర్నూల్ క్రైం: తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయ న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ నాన్ ముల్కీ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ధీశాలి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కోసం నాలుగు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉండి పోరాడారన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ జగన్, ఏఓ కృష్ణయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును ఆపుతావా?
సాక్షి, నాగర్‌కర్నూల్: కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్ర చేస్తోందని, నల్లమల పులిగా చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఆల్మట్టి పనులు ఆపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ రోడ్‌షో నిర్వహించిన అనంతరం జరిగిన జనగర్జన బహిరంగసభలో మాట్లాడారు. ఆల్మట్టి నిర్మాణంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచే పోరాటం సాగిందన్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం రూ.70వేల కోట్లతో ఆల్మట్టి ఎత్తును 5 మీటర్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇదే జరిగితే కృష్ణానది నుంచి పాలమూరుకు ఒక్క చుక్కనీరు కూడా రాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి పనులు ఆపాలని కోరారు. నల్లమల పులిగా గర్జిస్తారా? లేక పిల్లిలా ఇంట్లో కూర్చుంటారా? సీఎం రేవంత్ తేల్చుకోవాలన్నారు. అప్పుడే ఆయన నల్లమల పులో లేక నక్కో తేలుతుందని చెప్పారు. రాహుల్‌గాంధీ తనను సీఎం పదవి నుంచి ఎప్పుడు తీసేస్తాడోనన్న భయంతో రేవంత్ గడుపుతున్నారన్నారు. కేసీఆర్‌కు పేరొస్తదనే పాలమూరు ముట్టుకోవడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి కాగా, మిగిలిన 10 శాతం పనులను సీఎం రేవంత్ రెండేళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఈ ప్రాజెక్టును ముట్టుకోవడం లేదన్నారు. చరిత్రలో ఏ సీఎం ఇంత హీనంగా మాట్లాడలేదు గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ వంటి నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఏనాడూ సీఎం రేవంత్ తరహాలో హీనంగా మాట్లాడలేదని కేటీఆర్ చెప్పారు. గుడ్లతో గోటీలాడుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంటానంటూ గలీజు మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రం దివాలా తీసిందని, కేన్సర్ పేషెంట్లా ఉందంటూ, తనను కోసినా రూపాయి రాదంటూ మాట్లాడటం ఆయన చిల్లర బుద్ధికి నిదర్శనమన్నారు.స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అచ్చంపేటలో ఎమ్మెల్యే ఓడినా కేసీఆర్ గెలుస్తారని ఇక్కడి ప్రజలు అనుకున్నారని, రాష్ట్రమంతా ఇలాగే అనుకునే మోసపోయారని కేటీఆర్ చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. గత ఏడాది మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు చేసి నోట్ల కట్టలు దొరికాయని వార్తలు వచ్చాయని, ఇప్పుడు ఈడీ, మంత్రి ఎవరూ నోరు విప్పడం లేదని చెప్పారు. దీనిని బట్టే కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తెలుస్తోందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. సభలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డితోపాటు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి
సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది.దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. TG REDCO ద్వారా రూ 10.53 కోట్లతో 514 ఇండ్లతో , పాటు 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది.ప్రతి ఇంటికి 3 KW స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 KW సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు. మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 1,500 KW ఉన్నది. మట్టి గోడలతో ఉన్న 34 ఇండ్ల కుటుంబాలు కూడా సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే, ఇండ్ల పైన సౌర విద్యుత్ పరికరాలు బిగించనున్నట్లు TG REDCO ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మేనేజర్ కె. మనోహర్ రెడ్డి తెలిపారు.కొండారెడ్డిపల్లి గ్రామం సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 10.53 కోట్లు . అందులో రూ.7.96 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు కేటాయించారు. సౌర విద్యుత్ కు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.3.56 కోట్లు , M/s Premier Energies కంపెనీ నుండి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల నుండి రూ 4.092 కోట్లు భరించారు. మరో రూ 2.59 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేశారు.ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.(ప్రతి KW కు 120 యూనిట్స్ అవుతుంది) ఇండ్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను , ఇంటి వినియోగానికి పోగా,మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేశారు. గ్రిడ్ కు పంపే విద్యుత్ యూనిట్ కు రూ 5.25 చొప్పున చెల్లించుటకు లబ్దిదారులతో విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకున్నది. సెప్టెంబర్ నెలలో విద్యుత్ గ్రిడ్ కు గ్రామం మొత్తం నుండి సుమారు ఒక లక్ష యూనిట్స్ విద్యుత్ ఎగుమతి అయింది. తద్వారా రూ 5 లక్షలు ఆదాయాన్ని గ్రామస్తులు ఒక నెలలోనే ఆర్జించారు. -
అంకితభావంతో సేవలు..
గతంలో నిర్వహించిన విధులను తిరిగి నిర్వహించే అదృష్టం రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు అవసరమైన సేవలను అంకిత భావంతో అందిస్తాం. ప్రజలు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాలకు వ్యయప్రయాసలతో వచ్చే పరిస్థితి ఉండదు. మాకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్జతలు. – ఎడ్ల శంకర్, జీపీఓ, జూపల్లి, చారకొండ మండలం గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తిరిగి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. తిరిగి మా విధులను మేము నిర్వహించుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ,అధికారులకు రుణపడి ఉంటాం. శాయశక్తులా ప్రజలకు సేవలను పారదర్శకంగా అందిస్తాం. – ఎండీ సాదిక్, జీపీఓ, జట్నారపల్లి, ఊరకొండ మండలం -
ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ కృష్ణయ్య, సీఐ శంకర్, ఆర్ఐ జగన్, సీసీ బాలరాజు, ఆర్ఎస్ఐ గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ ‘రెవెన్యూ’కు పునర్వైభవం
● గతంలో పనిచేసిన వీఆర్ఓ, వీఆర్ఏలకు అవకాశం ● సొంత మండలం, నియోజకవర్గంలో విధులకు బ్రేక్ ● బలోపేతం దిశగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ అచ్చంపేట: జిల్లాలో గ్రామ పాలన పునర్ వైభవం సంతరించుకుంటోంది. గ్రామ పరిపాలన అధికారుల (జీపీఓ) నియామకంతో గ్రామస్థాయిలో రెవెన్యూ పాలన పునరుజ్జీవం పోసుకుంటోంది. జిల్లాకు 189 మంది జీపీఓలను ప్రభుత్వం కేటాయించగా.. ఇటీవల కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అమరేందర్ నియామక పత్రాలను అందజేశారు. మండలాల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామాలను కేటాయించారు. జీపీఓల సొంత మండలం, నియోజకవర్గం కాకుండా ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఐదేళ్ల నిరీక్షణకు తెర.. క్షేత్రస్థాయిలో రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని 2020 ఆగస్టు 1న గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. 2023 ఆగస్టు 10న వీఆర్ఏ వ్యవస్థను కూడా రద్దుచేసింది. సదరు వీఆర్ఓ, వీఆర్ఏలను జిల్లాలోనే వివిధ శాఖల్లో సర్దుబాటు చేసి పోస్టింగ్ కల్పించారు. మరికొందరిని ఇతర జిల్లాలకు కేటాయించారు. దీంతో గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కనుమరుగైంది. ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఐదేళ్లుగా గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడ స్తంభించాయని భావించిన ప్రస్తుత ప్రభుత్వం.. తిరిగి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జీపీఓల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా మళ్లీ గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా విధులు నిర్వర్తించిన వారికి అర్హత పరీక్ష నిర్వహించి జీపీఓలుగా ఎంపిక చేశారు. గ్రామస్థాయిలో కీలకం.. జీపీఓలు గ్రామస్థాయిలో కీలకంగా మారనున్నారు. భూ భారతి, రైతాంగ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు అండగా నిలవడం తదితర విధులు కేటాయించారు. ఎన్నికల సమయంలో బీఎల్ఓలుగా కూడా వ్యవహరించనున్నారు. జిల్లాలో 189 క్లస్టర్లు.. జిల్లాలో 20 మండలాల్లో నాలుగు రెవెన్యూ డివిజన్లు, 460 గ్రామపంచాయతీల పరిధిలోని 350 రెవెన్యూ గ్రామాలను 189 క్లస్టర్లుగా నిర్ణయించారు. మొదటిసారి 127 మంది వీఆర్ఓ, వీఆర్ఏలు ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 112 మంది పరీక్ష రాయగా.. 67 మంది అర్హత సాధించారు. రెండో సారి 66 మంది ఆప్షన్లు ఇవ్వగా.. 55 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 45మంది అర్హత సాధించారు. ఆసక్తి ఉండి పరీక్ష రాసి అర్హత సాధించిన 112 మందిని జీపీఓలుగా నియమించారు. వీరితో పాటు రెవెన్యూశాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 77 మంది అప్పటి వీఆర్ఏలను డిప్యూటేషన్‌పై అడిషనల్ జీపీఓలుగా ఎంపిక చేశారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. రెవెన్యూ కార్యాలయం -
సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన
అచ్చంపేట రూరల్: తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని డెయిలీ వైజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ వసతిగృహాల్లో విధులు నిర్వర్తిస్తున్న డెయిలీ వైజ్ వర్కర్లు చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం అచ్చంపేటలో వర్షంలోనూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైబల్ వెల్ఫేర్ వసతిగృహాల్లో రోజువారీ వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 15 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికులకు ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించడంతో పాటు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో భరత్, రాజు, పద్మ పాల్గొన్నారు. -
నాలుగెకరాలు నీటమునిగింది..
గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వరద నీరంతా వరి పొలాన్ని ముంచెత్తింది. నాలుగెకరాల పంట నీటిలో మునిగిపోయింది. పత్తి, మొక్కజొన్న పంటలు సైతం దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నష్టపోయిన పంటలకు సకాలంలో పరిహారం అందించాలి. – చెన్నయ్య, రైతు, చేగుంట, తిమ్మాజిపేట మండలం జిల్లాలోని మండలాల వారీగా వరి, పత్తి, మొక్కజొన్న పంటల నష్టం వివరాలు తీసుకున్నాం. ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయిలో పంటనష్టం విస్తీర్ణం, రైతుల వివరాలు సేకరించాం. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నష్టపరిహారం అందిస్తాం. – యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
నాగర్‌కర్నూల్: వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో రోజురోజుకు వరిసాగు విస్తీర్ణం పెరుగుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు దిగుబడిని అంచనా వేసి.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది వానాకాలంలో వరిపంట అగ్గితెగులు బారినపడి పెద్దగా దిగుబడి రాలేదు. ఈ ఏడాది అధిక వర్షాలతో చాలా చోట్ల వరి పొలాలు నీటమునగడంతో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉండటంతో అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 1.62లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లాలో వానాకాలం రికార్డు స్థాయిలో వరిపంట సాగైంది. మొత్తం 1,62,095 ఎకరాల్లో వరిసాగు కాగా.. 4,53,866 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 2,54,168 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. లక్ష్యానికి అనుగుణంగా.. జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు 2.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 103, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 129, మెప్మా ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గతేడాది వానాకాలంలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. రైతుల నుంచి 1.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. అయితే ప్రతి ఏటా కొనుగోలు కేంద్రాల్లో గన్నీబ్యాగుల కొరత పెద్ద సమస్యగా మారింది. అధికారులు అవసరమైన గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని పెట్టాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రస్తుతం గతంలో ధాన్యాన్ని తరలించిన మిల్లుల వద్ద నుంచి గన్నీబ్యాగులు తెప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 236 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు 2.54లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం గన్నీబ్యాగుల కొరత లేకుండా చర్యలు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 63.54లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అధికారులు అంచనా వేయగా.. ప్రస్తుతం 18.93లక్షల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా 49.61 లక్షల గన్నీబ్యాగులు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. వానాకాలం రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. పంట చేతికొచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. – బాల్‌రాజు, సివిల్సప్లై డీఎం -
స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిద్దాం
నాగర్‌కర్నూల్: జిల్లాలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్నివిధాలా సన్నద్ధం కావాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్, సహాయ అధికారులు, సిబ్బందికి తొలి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతో నిర్వహిస్తున్నందున అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. నామినేషన్ల ప్రక్రియను సమయపాలనతో నిర్వహించాలని ఆయన సూచించారు. నామినేషన్ స్వీకరణ గదిలో తప్పనిసరిగా గోడ గడియారం ఉండాలన్నారు. నిబంధనలు పాటిస్తే పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతాయని కలెక్టర్ వివరించారు. ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు వరకు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే అధికారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అమరేందర్, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, డీపీఓ శ్రీరాములు, అడిషనల్ డీఆర్డీఓ రాజేశ్వరి పాల్గొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా పాటించాలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు కలెక్టర్ బదావత్ సంతోష్ జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద రైతుల పక్షాన పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో చాకలి ఐలమ్మ ప్రధాన పాత్ర పోషించారన్నారు. తెలంగాణ పౌరుషం, పోరాటం, త్యాగం భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన మహనీయురాలు అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా ఇన్చార్జి బీసీ వెల్ఫేర్ అధికారి యాదగిరి, డీఈఓ రమేశ్‌కుమార్, డీవైఎస్ఓ సీతారాం నాయక్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్ సింగ్ పాల్గొన్నారు. -
ముంచుతున్న ముసురు
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం ●సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో రెండు రోజులుగా ముసురు వాన కురుస్తోంది. శుక్రవారం సైతం నిరాటంకంగా వర్షం కురిసింది. అత్యధికంగా కొల్లాపూర్ మండలంలో 56.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, కోడేరు, తిమ్మాజిపేట మండలాల్లో 34 మి.మీ. మించి వర్షం కురిసింది. అధిక వర్షాలకు పంట పొలాలు నీటమునడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నిరాటంకంగా కురుస్తున్న వర్షాలతో పంటలు రంగు మారి దెబ్బతింటున్నాయని.. ఈ సారి దిగుబడి తగ్గుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. పంటలను రక్షించుకునేందుకు కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే 311 ఎకరాల్లో పంటనష్టం.. జిల్లాలోని నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, కల్వకుర్తి, కోడేరు, లింగాల, తెలకపల్లి మండలాల్లో పంటనష్టం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 311 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఇంతకన్నా ఎక్కువ స్థాయిలో నష్టం జరిగిందని.. అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు చెబుతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. కల్వకుర్తి 10.8 పలుచోట్ల నీటమునిగిన పంటలు దిగుబడిపై తీవ్ర ప్రభావం ఆందోళనలో రైతులు పంటనష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని వేడుకోలు -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
● కలెక్టర్ బదావత్ సంతోష్ ● కలెక్టరేట్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు కలెక్టరేట్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలునాగర్కర్నూల్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులు, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళా ఉద్యోగులు, ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రకృతిని, మహిళా శక్తిని గౌరవిస్తుందన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే పండుగ భక్తిశ్రద్ధలతో పాటు సామూహిక ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బతుకమ్మలో ఉపయోగించే గూనుగు పూలు, తంగెడు, బంతి, గులాబీ, తులసి వంటి పువ్వులు మహిళల భక్తిని మాత్రమే కాదని.. ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేస్తాయని అన్నారు. ప్రతి మహిళ బతుకమ్మ సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ నెల 30న జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను స్థానిక మినీ ట్యాంక్‌బండ్‌పై అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. జిల్లాలోని మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి.అమరేందర్, అడిషనల్ డీఆర్డీఓ రాజేశ్వరి, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి డా.రజిని, డీఈఓ రమేశ్‌కుమార్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్ బదావత్ సంతోష్ -
కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం
లింగాల/చారకొండ/బల్మూర్: పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. గురువారం లింగాల శివారులో రూ. 3కోట్లతో గిరిజన బాలుర వసతిగృహం నిర్మాణ పనులను ప్రారంభించారు. చారకొండ మండలం సీర్సనగండ్ల, బల్మూర్ మండలం కొండనాగుల, లింగాల మండలం అంబట్పల్లి గ్రామాల్లో మినీ గ్రంథాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లింగాలలో ఇప్పటికే రూ. 2.30కోట్లతో ఇంటిగ్రేటెడ్ వసతిగృహం నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని సూచించారు. గ్రామాల్లో డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుతో కామన్ ఎంట్రెన్స్ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. సీర్సనగండ్ల దేవాలయ భూమిలో అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లు కోల్పోయిన 35 మందికి త్వరలోనే సర్వే నంబర్ 290లో ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం సీర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎంపీ, ఎమ్మె ల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, డీటీడీఓ ఫిరంగి, ఆర్డీఓ మాధవి, ఆలయ చైర్మన్ రాహశర్మ, ఈఓ ఆంజనేయులు, నాయకులు రంగినేని శ్రీనివాసరావు, నాగేశ్వర్రావు, వెంకట్‌గౌడ్, బాల్‌రాంగౌడ్, నర్సింహారెడ్డి, మల్రెడ్డి వెంకట్‌రెడ్డి, కాశన్నయాదవ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక టెండర్ల జాతర
●మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు చేసింది. ఈ ఏడాది నవంబర్ 30తో ప్రస్తుత ఎకై ్సజ్ మద్యం పాలసీ ముగియనున్న క్రమంలో డిసెంబర్ 1నుంచి కొత్త మద్యం దుకాణాలు అమల్లోకి రానున్నాయి. కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి కులాల వారీగా దుకాణాల కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు కొనసాగుతుండే ఈసారి అలంపూర్, రాజోళి, చెన్నారం దగ్గర ఉన్న మద్యం దుకాణాలు తొలగించి.. ఈసారి 227 దుకాణాలకు టెండర్లు స్వీకరించనున్నారు. మూడు దుకాణాల్లో సరైన మద్యం అమ్మకాలు లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి ఈసారి రూ.3 లక్షలకు పెంచారు. ఒక్కో వ్యాపారి ఎన్ని మద్యం దుకాణాలకు అయినా టెండర్ వేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా జిల్లాకేంద్రాల్లో ఉండే కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు టెండర్లు స్వీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2021లో మొత్తం 230 దుకాణాలకు 4,713 టెండర్లు వస్తే 2023లో 230 దుకాణాలకు 8,595 టెండర్లు వచ్చాయి. ఈ సారి పదివేలకు పైగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ● వచ్చే నవంబర్ 30తో ప్రస్తుత మద్యం దుకాణాల గడువు ముగిస్తున్న నేపథ్యంలో కొత్త దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం టెండర్ల స్వీకరణకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 నుంచి మళ్లీ కొత్త దుకాణాలు ప్రారంభం కానుంది. ఈ నెల 26 నుంచి (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో దుకాణానికి టెండర్ ఫీజు రూ.3 లక్షలు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు నాలుగు స్లాబ్‌ల కిందట ఉన్నాయి. రూ.50 లక్షలు, రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షల కింద దుకాణాలు ఉన్నాయి. జిల్లా 2019 2021 2023 మహబూబ్‌నగర్/ నారాయణపేట 1,384 1,525 3,571 నాగర్‌కర్నూల్ 1,064 1,507 2,524 జోగుళాంబ గద్వాల 418 987 1,171 వనపర్తి 516 694 1,329 దుకాణాల కేటాయింపు ఇలా.. జిల్లా గౌడ్ ఎస్సీ ఎస్టీ ఓపెన్ మొత్తం మహబూబ్‌నగర్/ నారాయణపేట 14 10 3 63 90 నాగర్‌కర్నూల్ 9 9 4 45 67 జోగుళాంబ గద్వాల 5 6 0 23 34 వనపర్తి 4 5 1 26 36 నాగర్‌కర్నూల్ జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కో దుకాణానికి ప్రభుత్వం నిర్ణయించిన రూ. 3లక్షల ఫీజును బ్యాంకు డ్రాఫ్ట్, చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వు అయిన షాపులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత అధికారుల నుంచి కుల ధ్రువపత్రం, షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న షాపులకు దరఖాస్తు చేసుకునే వారు స్థానిక షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికెట్ సమర్పించాలి. జిల్లాలోని 67 మద్యం దుకాణాలను అక్టోబర్ 23న లాటరీ పద్ధతిన కేటాయిస్తాం. – గాయత్రి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నేటినుంచి వచ్చేనెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు టెండర్ల ఆహ్వానం -
100 టీఎంసీల చొప్పున 3 చోట్ల రిజర్వాయర్లు నిర్మించాలి..
ప్రతి ఏటా వానాకాలం సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు సుమారు 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంచితే అక్కడ అదనంగా మరో 100 టీఎంసీల నీళ్లు నింపుకుంటారు. మిగిలిన 2,900 టీఎంసీల నీళ్లయితే మనకు వస్తాయి కదా. ఇక్కడ ఎత్తు తగ్గించడం అనే డిమాండ్ కంటే.. పాలమూరు జిల్లాలో భారీ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఉమ్మడి జిల్లాలో జూరాల మినహా మిగతావన్నీ ఎత్తిపోతలే. జూరాల కూడా అంతంతమాత్రమే. ఇప్పటికై నా భీమా, కృష్ణా నదులు కలిసే ప్రాంతంలో, జూరాలకు కుడివైపున ర్యాలంపాడ్తో పాటు ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అక్కడ, కేఎల్ఐ వద్ద, లక్ష్మీదేవిపల్లి వద్ద.. ఈ మూడు చోట్ల 100 టీఎంసీల చొప్పున నీరు నిల్వ చేసేలా భారీస్థాయిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించాలి. అప్పుడే ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలుగుతాయి. – రాఘవాచారి, ఉమ్మడి జిల్లా కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక ● -
అనుమానితుల కదలికలపై నిఘా : ఎస్పీ
అచ్చంపేట రూరల్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి భరోసా కల్పించడంతో పాటు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశించారు. గురువారం అచ్చంపేట డీఎస్పీ, సీఐ కార్యాలయాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. నేరాల అదుపునకు గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. డయల్ 100 కాల్స్‌కి వెంటనే స్పందించి.. ఘటనా స్థలానికి చేరుకోవాలన్నారు. శ్రీశైలం–హైదరాబాద్ హైవేలో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్లు తమ గ్రామాలను తరచూ సందర్శించాలని సూచించారు. అంతకుముందు పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్పీ వెంట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్ఐలు విజయభాస్కర్, ఇందిర, పవన్‌కుమార్, వెంకట్‌రెడ్డి ఉన్నారు. -
సమాజ సేవలో పోలీస్
అనాథల కోసం కై ండ్‌నెస్ వాల్ ఏర్పాటు ● జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో ఏర్పాటుకు కసరత్తు ● ప్రజల నుంచి విశేష స్పందన సమాజంలో ప్రతి వ్యక్తి పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలి. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కై ండ్‌నెస్ వాల్ కార్యక్రమం ద్వారా చాలా మందికి సేవలు అందిస్తున్నాం. ప్రజలు తమకు అవసరం లేని వస్తువులను స్వచ్ఛందంగా అందించాలి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కై ండ్ నెస్వాల్కు మంచి స్పందన వస్తుంది. మరిన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. – గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎస్పీ నాగర్‌కర్నూల్ క్రైం: సమాజ సేవలో జిల్లా పోలీసులు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తేనే ప్రజలు భయపడేవారు. కానీ నేడు ఫ్రెండ్లీ పోలీస్ పేరిట పోలీసులు ప్రజలకు చేరువ అవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు బాధితుల సమస్యలు పరిష్కరిస్తుండటంతో పోలీసులకు సమాజంలో ఆదరణ పెరుగుతోంది. ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వినూత్న ఆలోచనలకు జిల్లా ప్రజలు నీరాజనం పడుతున్నారు. అనాథలతో పాటు పేద, మధ్య తరగతి ప్రజలకు తమ వంతు సహకారం అందించేందుకు జిల్లా కేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో కై ండ్‌నెస్ వాల్ ఏర్పాటు చేసి బట్టలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. విశేష స్పందన అనాథల కోసం ఏర్పాటు చేసిన కై ండ్‌నెస్ వాల్‌కు విశేష స్పందన లభిస్తుంది. చాలా మంది తమ వద్ద నిరుపయోగంగా ఉన్న పాత బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సామగ్రిని తీసుకొచ్చి అక్కడ అందిస్తున్నారు. అదేవిధంగా తమకు కావాల్సిన వస్తువులను తీసుకెళ్తున్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో కై ండ్‌నెస్ వాల్ ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నట్లు పోలీసువర్గాలు వెల్లడిస్తున్నారు. ఎన్నో సేవాకార్యక్రమాలు ఎస్పీగా గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నారు. వరదల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా డ్రగ్స్‌పై కళాజాత బృందంతో అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ నిర్మూలన కోసం వీడియో పాటలను రూపొందించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. -
మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ చెల్లించాలి
నాగర్‌కర్నూల్: మిల్లర్లు ప్రభుత్వానికి అందించే సీఎమ్మార్ రైస్‌ను వంద శాతం అందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ పి.అమరేందర్ రైస్ మిల్లర్లతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వానాకాలం 2024–25, రబీ 2024–25 సీజన్లలో రైస్ మిల్లర్ల ద్వారా సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అందజేయడంపై, అలాగే వానాకాలం పంట 2025–26 సీజన్ ఏర్పాట్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మిల్లర్ తమ మిల్లింగ్ సామర్థ్యానికి అనుగుణంగా బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తే ధాన్యం అందిస్తామని స్పష్టం చేశారు. మిల్లర్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా.. వాటిని పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, డీఎం సివిల్ సప్లై రాజేందర్ తదితరులు హాజరయ్యారు. రెవెన్యూ వ్యవహారాలు సమర్థవంతంగా.. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను సమవర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామంలో కొత్తగా నియమించిన గ్రామ పాలన అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్లు తమ విధులపై పూర్తి అవగాహనతో ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్ అమరేందర్‌తో కలిసి నూతనంగా నియమించిన జీపీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీఓలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ పి.అమరేందర్ గ్రామ పాలన అధికారులు, లైసెన్స్ సర్వేయర్లకు విధుల నిర్వహణ, రెవెన్యూ పరమైన అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా సర్వేయర్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ -
విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. బుధవారం అచ్చంపేటలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజాభవన్‌లో మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసిందన్నారు. 4ఎకరాల్లో పశువుల సంత, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, మినీ ట్యాంకుబండ్‌పై రిసార్ట్, రోడ్లు, ఉప్పునుంతల, లింగాల రోడ్లను కలుపుతూ బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.8కోట్లతో రాజీవ్–ఎన్టీఆర్ స్టేడియం, రూ.3 కోట్లతో పట్టణంలోని సీతారాలగుట్ట వద్ద 7 ఎకరాల విస్తీర్ణంలో వైఎస్సార్ పార్కు, రూ.3కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీ, రూ.కోటితో మున్సిపల్ భవనంపై రెండో ఫ్లోర్లో మెప్మా హాల్ వంటి అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. లింగాలలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్‌కు రూ.3కోట్లు, ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు రూ.2.30 కోట్లు, మండల పరిషత్ భవనం ఆవరణలో రూ.కోటితో స్టడీహాల్, గ్రంథాలయం భవనం, సాయినగర్ జిల్లాపరిషత్ పాఠశాలకు రూ.60లక్షలు, తిప్పారెడ్డి పాఠశాలకు రూ.50లక్షలు, అమ్రాబాద్ డిగ్రీ కళాశాలకు రూ.20 లక్షలు, జూనియర్ కళాశాలకు రూ.20 లక్షలు, మద్దిమడుగు పాఠశాలకు రూ.30 లక్షలు, లింగాల కేజీబీవీకి రూ.30 లక్షలు, మిగతా కేజీబీవీల మరమ్మతుకు రూ.4 కోట్లు మంజూరయ్యాయన్నారు. రెండేళ్ల కాలంలో 15 33/11 కేవీ సబ్స్టేషన్లు, ఒక 133/33 కేవీ, అమ్రాబాద్‌లో 220 కేవీ సబ్‌స్టేషన్ మంజూరైందని తెలిపారు. తుమ్మలకుంటలో నీట మునిగిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను సీతారాలగుట్టకు మార్చామని, మాజీ మంత్రి మహేంద్రనాథ్ పేరు మీద రవీంద్రభారతి, మాజీ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ పేరు మీద ఇండోర్ స్టేడియం, మాజీ ఎంపీ మల్లు అనంతరాములు పేరు మీద చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. వంకేశ్వరం, నడింపల్లి, ఐనోలు, సిరసనగండ్ల, కొండనాగుల, అంబట్పల్లి, ఎల్లమ్మ రంగాపూర్‌లో గ్రంథాలయాలు మంజూరైనట్లు పేర్కొన్నారు. 40 కొత్త గ్రామపంచాయతీ భవనాలు, 40 అంగన్వాడీ భవనాలు మంజూరయ్యాయని వెల్లడించారు. మద్దిమడుగు కృష్ణానదిపై వంతెన ఏర్పాటు, జాతీయ రహదారి మంజూరుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తామని చెప్పారు. -
పాలమూరు చుట్టే రాజకీయం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సెగ రాజేసింది.. తెలంగాణ మలి దశ పోరులో రణనినాదమై నిలిచింది పాలమూరే. తలాపున కృష్ణమ్మ ఉన్నా.. సాగు, తాగునీరు లేక వలసలతో తండ్లాడిన ఇక్కడి ప్రజల దీనగాధ, వెనుకబాటుతనమే ప్రతి ఒక్కరి గళమైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనా, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ‘పాలమూరు’దే కీలక భూమిక. అలాంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో ఈ ఎత్తిపోతలకు అడుగులు పడగా.. అప్పుడు, ఇప్పుడూ దీని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలకు పాలమూరు ప్రచారాస్త్రంగా మారగా.. రైతాంగానికి మాత్రం సాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పీఆర్ఎల్ఐ కేంద్రంగా పాలి‘ట్రిక్స్’ పాలక, ప్రతిపక్షాల పోటాపోటీ విమర్శలు 90 శాతం పనుల పూర్తి.. మిగిలిన 10% పూర్తి చేయాలి.. ఇదే డిమాండ్‌తో పోరుబాటకు బీఆర్ఎస్ సన్నాహాలు దీటుగా స్పందించేలా కాంగ్రెస్ కార్యాచరణ ‘స్థానిక’ ఎన్నికల వేళ రాజుకున్న వేడి -
పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
తెలకపల్లి: పోలీసులు ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ అన్నారు. బుధవారం తెలకపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. కానిస్టేబుళ్లు వారికి కేటాయించిన గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి, ఎప్పటికప్పుడు ఎస్ఐకి వివరాలు అందించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.అదనపు ఎస్పీగా వెంకటేశ్వర్లునాగర్కర్నూల్ క్రైం: జిల్లా అదనపు ఎస్పీగా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన రాచకొండ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తూ అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.26న ఉద్యోగమేళాకందనూలు: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో 26న ఉద్యోగమేళా నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధి కారి రాఘవేందర్‌సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 50 ఉద్యోగాల భర్తీకి మేళా కొనసాగుతుందన్నారు. పదో తరగతి ఆర్హత కలిగి 25 నుంచి 32 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 95051 86201, 96669 74704 నంబర్లను సంప్రదించాలని కోరారు.రక్తదానం ప్రాణదానంతెలకపల్లి: రక్తదానం ప్రాణదానంతో సమానమని డీఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ అన్నారు. స్వస్తినారి స్వశక్తి పరివాన్ అభియాన్‌లో భాగంగా బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ, రెడ్‌క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో సీఎల్ విదాసంస్థలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొత్తం 36 యూనిట్ల రక్తం సేకరించారు. అనంతరం సీఎల్ఆర్ విద్యా సంస్థలో నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించారు. శిబిరంలో 460 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ కోసం 65 మందిని గుర్తించారు. సీఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ రాజమహేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, రెడ్‌క్రాస్ కన్వీనర్ కుమార్, ప్రిన్సిపాల్ సందీప్‌కుమార్ పాల్గొన్నారు.పౌష్టికాహార కిట్ల పంపిణీబిజినేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్థులకు బుధవారం డీఎంహెచ్ఓ డా.కె.రవికుమార్ పోషకాహార కిట్లను అందజేశారు. పీహెచ్సీ వైద్యాధికారి డా. శివకుమార్, భవిష్య భారత్ ట్రస్టు స్టేట్ మేనేజర్ బాల హనుమంతు, జిల్లా మేనేజర్ అలీ, డా.పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలవి పసలేని ఆరోపణలు
కల్వకుర్తి టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని, వారు చేసే ఆరోపణల్లో ఎలాంటి పసలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను చూసి వారు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రతిపక్షాలు తీరు మార్చుకోకుంటే స్థానిక ఎన్నికల్లో భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నాయకులకు ఈ ప్రాంతం అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని హితువు పలికారు. ఉన్నత చదువులు చదువుకొని, రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన వారు అసభ్య పదజాలం వాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధి కోసం నేరు ఎమ్మెల్యేలనే కలవాలని, మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే తాడూర్ మండలంలో ప్రజల వద్ద డబ్బులు తీసుకున్న మధ్యవర్తిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారని ఎమ్మెల్యేలు గుర్తుచేశారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల పేరుతో నూతన విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యుడు డా.చారకొండ వెంకటేష్ అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నగర అభివృద్ధి పేరుతో రూ.15 కోట్లు మున్సిపల్ శాఖ నుంచి విడుదలైనట్లుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. పట్టణంలోని పాలమూరు చౌరస్తా అభివృద్ధి, ఆడిటోరియం, నూతన షాపింగ్ కాంప్లెక్స్ శివాజీ చౌక్ వద్ద నిర్మించేందుకు రూ.2 కోట్లు, డిజిటల్ లైబ్రరీ కోసం రూ.1.5 కోట్లు, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి మిగిలిన నిధులను వినియోగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా కల్వకుర్తి మండలంలో మరో మూడు నూతన సబ్స్టేషన్ల నిర్మాణం కోసం రూ.3.5 కోట్లు విద్యుత్ శాఖ ద్వారా మంజూరయినట్లుగా తెలియజేశారు. సమావేశంలో టీశాట్ సీఈఓ వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి సీఎం ఎంతో చేస్తున్నారు సంక్షేమ పథకాల లబ్ధిదారులు దళారులను ఆశ్రయించొద్దు ఎమ్మెల్యేలు కసిరెడ్డి, రాజేష్‌రెడ్డి -
డిజిటల్ గ్రంథాలయాలతో విజ్ఞానం పెంపు
నాగర్‌కర్నూల్: గ్రామీణ స్థాయిలో విద్యార్థులు, ప్రజలకు విజ్ఞానం పెంపొందించేందుకు, చైతన్యం కల్పించేందుకు ఎంపీ మల్లు రవి ప్రత్యేక చొరవతో జిల్లాలో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఎస్ఆర్ నిధులు రూ.1.20 కోట్లతో మొత్తం 50 డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాట్లు చేస్తామని, ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో 8, కొల్లాపూర్‌లో 7, అచ్చంపేటలో 7, నాగర్‌కర్నూల్‌లో 7 చొప్పున 29 డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో డిజిటల్ గ్రంథాలయాల నూతన భవనాల నిర్మాణాలు, గ్రంథాలయాల ఏర్పాట్లకు కావాల్సిన స్థల సేకరణపై జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రంథాలయాల అభివృద్ధికి స్థలాల సేకరణ, నిర్మాణాలు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు పర్యవేక్షణ చేసి పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులు సరికొత్త సాంకేతిక సదుపాయాలతో విద్యనభ్యశిస్తారని, ప్రజలు సమాజంలో చైతన్యం, విజ్ఞానం పెంపొందించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, సీఎస్ఆర్ నిధులు సమకూర్చే బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నిధులు విడుదల చేశాం
2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాంపుల నిర్వహణ ప్రారంభమైంది. మొత్తం పీయూ పరిధిలో 100 యూనిట్లు ఉండగా వాటిలో మొదటి దశలో ఎంపిక చేసి 51 యూనిట్లకు రూ.17.75 లక్షలను విడుదల చేశాం. మరో 49 యూనిట్లకు వచ్చే నెల నిధులు కేటాయిస్తాం. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సామాజిక అవగాహన పెరడంతో పాటు ప్రజలకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ప్రవీణ, పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అవగాహన పెంపు విద్యార్థులకు యూజీ, పీజీ స్థాయిలో ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహిచడం వల్ల వారికి సామాజిక అంశాలపట్ల అవగాహన పెరుగుతుంది. క్యాంపులో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులు అక్కడే ఉండి ఉదయం వేలల్లో పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలు, రాత్రి వేళల్లో పలు అంశాలపై నాటికలు, కథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. – గాలెన్న, ఎన్ఎస్ఎస్ ప్రోగాం అధికారి విద్యార్థులకు ప్రయోజనం ఎన్ఎన్ఎస్లో భాగంగా ఇప్పటికి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. వాటిలో భాగంగా ప్రజలకు స్వచ్ఛబారత్, నషా ముక్త్భారత్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. వీటి ద్వారా అనేక అంశాలను ఒక విద్యార్థిగా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్ బవిష్యత్తులో ఎంతో ఉపయోగడపతుంది. – సరిత, ఎన్ఎస్ఎస్ వలంటీర్ -
సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి
‘ఎన్ఎస్ఎస్’తో విద్యార్థి దశ నుంచే సమాజసేవ అలవాటు ● 2025–26 క్యాంపుల నిర్వహణకు నిధులు విడుదల ● స్వచ్ఛత, పరిశుభ్రత, మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన ● జనాభా సంఖ్య, పిల్లలు, వ్యాధులు తదితర అంశాలపై సర్వే ● పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు ●ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2025–26 విద్యాసంవత్సరానికిగాను ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఇటీవల నిధులు విడుదల చేశారు. ఈమేరకు ఇప్పటికే పలు చోట్ల క్యాంపులు ప్రారంభమయ్యా యి. పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు ఉండగా.. 45 మంది విద్యార్థులు (వలంటీర్ల)తో ఒక్కో యూనిట్‌ను ఏర్పాటు చేశారు. క్యాంపునకు అయ్యే ఖర్చుల కోసం ఒక్కో క్యాంపునకు రూ.35 వేల చొప్పున మంజూరు చేశారు. మొత్తం పీయూ పరిధిలో 100 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా అందులో మొదటి విడతగా 51 యూనిట్లకు అధికారులు రూ. 17.75 లక్షలను విడుదల చేశారు. ఇక్కడ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు అధికారులు ఎన్ఎన్ఎస్ ద్వారా సర్టిఫికెట్లను అందిస్తారు. వాటితో అడ్మిషన్లు తదితర విషయాల్లో ఎన్ఎన్ఎస్ సర్టిఫికెట్ కీలకంగా మారనుంది. వారం రోజులు సామాజిక కార్యక్రమాలు క్యాంపులో వారం రోజుల పటు ఎంపిక చేసుకున్న గ్రామం, ప్రాంతంలో విద్యార్థులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. వారికి అధికారులు భోజనం, వసతి కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధులు శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను తొలగించడం, చెత్తా చెదారాన్ని ఊడ్చడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం, ఉదయం వేళల్లో స్థానిక ప్రజలకు మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పిస్తారు. చివరి రెండు రోజులు గ్రామంలో ఉండే ప్రజల వివరాలు, వారికి ప్రభుత్వం నుంచి అందే పథకాలు, తాగునీరు, అందుతున్న వైద్య సేవలు, అధికంగా ప్రబలుతున్న రోగాలు తదితర అంశాలపై సర్వే నిర్వహించి సంబంధిత నివేదికను గ్రామ, పీయూ అధికారులకు అందిస్తారు. నివేదికలో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ఆస్కారం ఉంది. పలు చోట్ల ప్రజలకు అవసరమైన మెడికల్ క్యాంపులను సైతం నిర్వహించి ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తారు. ఉమ్మడి జిల్లా వివరాలిలా.. -
వచ్చే సీజన్ నాటికి..
లింక్ కెనాల్ కోసం దాదాపు 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందుకోసం గ్రామాల వారీగా రైతులతో గతంలోనే మాట్లాడాం. ఇటీవల భూసేకరణ అంశాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రస్తావించి.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు 5 కి.మీ., మేరకు కాల్వ తవ్వకం పూర్తయింది. చాలాచోట్ల అక్విడెక్టు పనులు కూడా పూర్తి చేశారు. భూ సేకరణపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. వచ్చే సీజన్ నాటికి కెనాల్ పనులు పూర్తికావొచ్చని భావిస్తున్నాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ ● -
హిందూ సమాజం ఏకం కావాలి
కందనూలు: దేశం, ధర్మం, సమాజం కోసం హిందూ సమాజం ఏకం కావాలని ఆర్ఎస్ఎస్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్, వక్త కూర జయదేవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శతాబ్ధి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి విజయదశమి నాటికి వందేళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో సామరస్యంతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. శత్రుదేశాలు ఎన్నో విధాలుగా భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసినా ఐకమత్యంతో కూడిన భారతదేశం ఏనాడు కూడా శత్రుదేశాలకు తలొగ్గకుండా ముందుకు సాగడం భారతీయుల గొప్పతనం అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన నర్సిని దత్తాత్రేయులు మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని, ఎక్కడ ఎలాంటి విపత్తులు సంభవించినా, శత్రుమూకలు భారత్‌ను ఇబ్బందులకు గురిచేయడానికి ప్రయత్నించినా సంఘ కార్యకర్తలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ్ చాలక్ వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నగర కార్య నిర్వాహక్ వేముల సురేష్, బస్తీ ప్రముఖ్ గోపాలకృష్ణ, ఉత్సవ ప్రముఖ్ మిడిదొడ్డి నాగరాజు, స్వయం సేవకులు పాల్గొన్నారు. -
భూ సేకరణే అడ్డంకి
రెండేళ్లుగా ముందుకు సాగని సింగోటం– గోపల్‌దిన్నె లింక్ కెనాల్ మంత్రి జూపల్లి సమీక్ష.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు కెనాల్ తవ్వకంపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగానే గత నెలలో కెనాల్ పనులను పునఃప్రారంభించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం కలెక్టర్ల వద్ద రూ.25 కోట్ల మేర నిధులు ఉండడంతో రైతులకు న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలని సూచించారు. దీనిపై గ్రామాల వారీగా రైతులతో మాట్లాడేందుకు మంత్రి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వెల్లడించారు. ప్రయోజనం ఇలా.. సింగోటం– గోపల్‌దిన్నె లింకు కెనాల్‌తో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఐదు మండలాల రైతాంగానికి మేలు జరగనుంది. వీపనగండ్ల, చిన్నంబావి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లోని చివరి ఆయకట్టు పొలాలతోపాటు పాన్‌గల్ మండలంలో కొంతమేరకు సాగునీరు అందుతుంది. లింక్ కెనాల్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైతే జూరాల లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న 24,500 ఎకరాలు, రాజీవ్ భీమా కాల్వల కింద ఉన్న 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వస్తుంది. అలాగే వేసవిలో గోపల్‌దిన్నె రిజర్వాయర్ కింద ఉండే పలు గ్రామాలకు తాగునీటి సమస్య కూడా తీరుతుంది. కొల్లాపూర్: ఉమ్మడి జిల్లాలోనే వెనకబడిన కొల్లాపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందించానే లక్ష్యంతో చేపట్టిన సింగోటం– గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పనులు ఏళ్లతరబడిగా సాగుతూనే ఉన్నాయి. భూ సేకరణ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన ఈ పనులను పూర్తి చేసేందుకు ఇటీవలే మంత్రి జూపల్లి కృష్ణారావు పునఃప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులను గమనిస్తే ఈసారైనా పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయా.. లేదా.. అనే సంశయం నెలకొంది. ఈ కెనాల్ పూర్తయితే ఐదు మండలాల పరిధిలోని 34 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సమస్యలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం.. జూరాల ఎడమ కాల్వ, భీమా కెనాల్ కింద చివరి ఆయకట్టు భూములు కొల్లాపూర్ నియోజకవర్గంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రైతులకు రబీ సీజన్లో రెగ్యులర్‌గా సాగునీటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే సింగోటం– గోపల్‌దిన్నె లింకు కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించే విధంగా ప్రణాళిక రూపొందించారు. 2018లో ఈ కెనాల్ నిర్మాణానికి నిధుల కేటాయింపు చేసినా.. చాలాకాలం తర్వాత 2022లో రూ.147.7 కోట్లు మంజూరు చేసింది. 2023లో ఊపందుకున్న పనులు.. తర్వాతి కాలంలో నిధుల విడుదలలో జాప్యం, భూ సేకరణ సమస్య కారణంగా నిలిచిపోయాయి. 22.5 కి.మీ., గాను ఇప్పటి వరకు 5 కి.మీ., మేరకే తవ్వకాలు పరిహారం పెంచితేనేభూములిస్తామని రైతుల డిమాండ్ ఇటీవల మంత్రి జూపల్లి పునఃప్రారంభించినా మందకోడిగానే.. కాల్వ పూర్తయితే 34 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు -
ఇందిరమ్మలో వసూళ్ల పర్వం
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొందరు మధ్యవర్తులు చేరి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, నిర్మాణం, బిల్లుల మంజూరులో తమకు డబ్బులు ఇవ్వాలని చెబుతూ లబ్ధిదారుల నుంచి వసూళ్లు చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 10,530 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. వీటిలో 6,653 ఇళ్లకు అధికారులు మార్కింగ్ పూర్తిచేశారు. జిల్లాలో 3,738 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో ఉండగా, 559 ఇళ్లు పైకప్పు వరకు నిర్మాణంలో ఉన్నాయి. మరో 142 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా పథకాన్ని అందిస్తుండగా.. కొంతమంది మధ్యవర్తులుగా చేరి గుట్టుచప్పుడు కాకుండా అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇక్కట్లే జిల్లాలో పలుచోట్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక, మట్టి పేరిట కొందరు అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో ఇసుక, మట్టి పేరుతో కొందరు అక్రమంగా దందా నడిపిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. దుందుభీ వాగు నుంచి అనధికారికంగా తీసిన ఇసుకను డంపులుగా నిల్వ చేసుకుని ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా ఇసుక సరఫరా సక్రమంగా లేకపోవడంతో లబ్ధిదారులు గత్యంతరం లేక ప్రైవే టు వ్యక్తుల నుంచే ఇసుక కొనుగోలు చేస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు దండుకుంటున్న మధ్యవర్తులు బిల్లులు రాక, ఖర్చులు భరించలేక.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇళ్లు మంజూరైన నిరుపేద కుటుంబాలు తమ వద్ద డబ్బులు లేకపోయినా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి నిర్మాణాలు మొదలుపెట్టారు. అయితే ఆధార్, బ్యాంక్, సెల్‌ఫోన్ నంబర్ లింకేజీ, కేవైసీ తదితర సమస్యలతో చాలామందికి మొదటి విడత డబ్బులు కూడా పడటం లేదు. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఐరన్ సామగ్రి ధరలు చుక్కలు చూపుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇస్తున్న దానికన్నా మించి ఖర్చవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. దీనికితోడు బిల్లులు ఆలస్యం అవుతుండటంతో పనులు ఆగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. పను లు పూర్తయిన మేరకు బిల్లుల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని కోరుతున్నారు. సిర్సవాడలో కమిటీ సభ్యుడి అక్రమ వసూళ్లు ఓ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు ‘ఉచిత’ ఇసుక, మట్టి పేరిట సైతం దోపిడి లబ్ధిదారులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు డబ్బులు ఇవ్వొద్దు.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణం కోసం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తుంది. ఇందులో మధ్యవర్తులకు ప్రమేయం ఉండదు. ఎవరైనా డబ్బులు తీసుకుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయి. – సంగప్ప, ఏడీ, హౌసింగ్ శాఖ -
నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి చేస్తాం
నాగర్‌కర్నూల్: జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణను ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. కాగా.. జిల్లా నుంచి వీసీలో కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ భూములు కోల్పోయిన రైతు లకు వెంటనే పరిహారం అందించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి భూసేకరణలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. సమావేశంలో జాతీయ రహదారుల ఈఈ సురేందర్, ఆర్డీఓలు సురేష్, భన్సీలాల్, జనార్దన్‌రెడ్డి, డీఈ రమేష్‌బాబు పాల్గొన్నారు. -
‘పాలమూరు’ నీళ్లను డిండికి తరలిస్తే ఊరుకోం
కోడేరు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నల్లగొండ జిల్లా డిండికి నీళ్లను తరలిస్తే అడ్డుకుంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగం శశిధర్‌రెడ్డి అన్నారు. మండలంలోని తీగలపల్లిలో జరుగతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 5– 6 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు గాను 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారన్నారు. కేవలం 2 లక్షల ఎకరాల కోసం పాలమూరు జిల్లాను ఎడారి చేయడానికి కుట్ర చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇప్పటికే కేఎల్ఐ, పాలమూరు ఎత్తిపోతలు, మిషన్ భగీరథ పథకంలో దాదాపు 40 శాతం మంది రైతులు భూములు నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు నుంచి నీటిని తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు అర్థం రవి, బాలగౌడ్, శంకర్, భీముడు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
అచ్చంపేట రూరల్: సమస్యల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. సోమవారం అచ్చంపేటలోని టీఎన్జీఓ భవనంలో రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి అధ్యక్షతన డివిజన్ స్థాయి నల్లమల నగర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నల్లమల పాదయాత్రలో మేనిఫెస్టోలో ప్రకటించిన పాతపెన్షన్‌ను ప్రభుత్వం పునరుద్ధరించాలన్నారు. ఇప్పటికే సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నామని, ఇక సర్వీస్ పెన్షన్ కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలన్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శిగా గోపాల్, జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్‌గౌడ్, అచ్చంపేట డివిజన్ నూతన గౌరవాధ్యక్షుడిగా మారేడి కుమార్, అధ్యక్షుడిగా తేజనాయక్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సూర్య, ఉపాధ్యక్షుడిగా చెన్నకేశవులు, అచ్చంపేట మండల అధ్యక్షుడిగా హనుమానాయక్, లింగాల మండల అధ్యక్ష, కార్యదర్శులుగా రాంలాల్‌నాయక్, వెంకటేశ్వర్లు, ఉప్పునుంతల అధ్యక్షుడిగా భూపతికుమార్, బల్మూర్ అధ్యక్షుడిగా లోకేష్‌ను ఎన్నుకున్నారు. -
నడినెత్తిపై ముప్పు
● జిల్లావ్యాప్తంగా తొలగింపునకు కసరత్తు ● ముందస్తుగా కేబుల్ ఆపరేటర్లకు హెచ్చరికలు ● ప్రమాదాల నివారణ కోసం విద్యుత్ శాఖ చర్యలు ● ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న తీగల తొలగింపు అచ్చంపేట రూరల్: జిల్లాలోని నాలుగు డివిజన్ పరిధిలోని పట్టణాల్లో విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేస్తున్న కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ల వైర్లు ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ స్తంభాలపై కేవలం నాలుగు వరుసలతో మాత్రమే కరెంటు తీగలు ఉంటే.. ఆ స్తంభాలపై 20 నుంచి 30 వరుసలతో కూడిన కేబుల్ వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలతోపాటు ఆయా ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు, వ్యాపారులు తరచూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దుమారానికి విద్యుత్ తీగలు తగిలినప్పుడు మెరుపులు వచ్చి అవి కేబుళ్ల మీద పడి మంటలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రధాన రహదారుల మీదే జరుగుతుండటంతో వాహనదారులు, పాదచారులు నిత్యం భయాందోళనలకు గురవుతున్నారు. సమన్వయం కరువు.. జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ సంస్థల పరిధిలోనే ఉంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఎవరికి వారుగా తమకు కంపెనీకి చెందిన 10 నుంచి 20 తీగలను విద్యుత్ స్తంభాలకు వేలాడదీస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇష్టారాజ్యంగా కేబుళ్లు ఏర్పాటు చేసుకున్నారు. అనుమతి తప్పనిసరి.. విద్యుత్ శాఖకు చెందిన స్తంభాలపై కేబుళ్లు ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ నుంచి అనుమతి కూడా తీసుకోవడం లేదు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కేబుళ్లు విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరమ్మతుకు తిప్పలు.. విద్యుత్ సిబ్బంది స్తంభాలను ఎక్కి మరమ్మతు చేయాల్సి వచ్చినప్పుడు కుప్పలు తెప్పలుగా ఉంటున్న కేబుల్ తీగలు అడ్డంకిగా మారుతున్నాయి. భారీ క్రేన్లను తెప్పించి కేబుళ్లు తగలకుండా పనులు చేయాల్సి వస్తోందని, అయినా ఆ సమయంలో అవి తమ క్రేన్లకు అడ్డుగా వస్తున్నాయని విద్యుత్ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. దీనికితోడు భారీ వాహనాలు వెళ్లినప్పుడు కిందకు వేలాడుతున్న కేబుళ్లు తెగి.. విద్యుత్ వైర్లకు తాకి.. మెరుపులు కూడా వస్తున్నాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే వారు కేబుళ్లు తగిలి ప్రమాదాల బారిన పడుతున్నారు. నిబంధనలకు పాతర.. విద్యుత్ స్తంభాలకు ఇంటర్నెట్, టీవీ కేబుల్ తీగలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. తీగలను ఇష్టానుసారంగా వదిలివేయడంతో ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉందో తెలియడం లేదు. చాలాచోట్ల తీగలు నేలపై పడి ఉండటం, నడుచుకుంటూ వెళ్తుంటే తలకు తాకేలా వదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం 18 అడుగుల ఎత్తుకు పైగా వీటిని ఏర్పాటు చేయాలి. కానీ, స్తంభాలకు ఇబ్బడిముబ్బడిగా ముడిపెట్టి తక్కువ ఎత్తులో తీగలు ఉంచడంతో కిందికి వేలాడుతున్నాయి. ఇవి తెగి విద్యుత్ తీగలపై పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఎక్కడా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కేబుల్ ఆపరేటర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చాం. 15 మీటర్ల ఎత్తులో కేబుళ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో ప్రమాదకరంగా ఉన్న కేబుళ్ల తొలగించాం. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. – నర్సింహారెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్ఈ ఇంటర్నెట్, కేబుల్ తీగలు వేయడానికి స్తంభాలను ఉపయోగించినప్పుడు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి. ఒక్కో స్తంభానికి గ్రామీణ ప్రాంతంలో రూ.15, పట్టణాల్లో రూ.20 చెల్లించాలి. కానీ, ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కేబుల్ తీగలకు కావాల్సిన విద్యుత్‌ను అక్రమంగానే వినియోగిస్తున్నారు. అక్రమంగా విద్యుత్ వినియోగంతో టీవీలకు వచ్చే కేబుల్ వైర్లకు ఒక్కోసారి విద్యుత్ సరఫరా జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ చూసినా విద్యుత్ స్తంభాల నుంచి కేబుల్, ఇంటర్నెట్ వైర్లు వేలాడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు జిల్లాలో జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు
● బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల ● కీలకంగా మారనున్న కేటాయింపు ప్రక్రియ ● కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓలకు బాధ్యతల అప్పగింత దసరా పండగ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తదే భవిష్యత్ అంటూ వారికి భరోసా కల్పిస్తోంది. ముందుగానే హామీ ఇచ్చినట్టుగా బీసీ రిజర్వేషన్ల అమలుతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ఇప్పటికే విస్తృతంగా పార్టీ సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికీ తమ కేడర్ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. బీజేపీ సైతం రాష్ట్రస్థాయిలో సమావేశాలు నిర్వహించగా.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియపై కీలకమైన బాధ్యతలను కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓ స్థాయి అధికారులకు అప్పగించింది. రిజర్వేషన్ల ప్రక్రియపై మార్గదర్శకాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 77 జెడ్పీటీసీ, 802 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 1,705 గ్రామ పంచాయతీలు, 15,322 వార్డు స్థానాలు ఉన్నాయి. బీసీ కులగణన ఆధారంగా.. ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన బీసీ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేను అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నారు. ఫలితంగా గత ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలతోపాటు అదనంగా మరికొన్ని స్థానాలు పెరగనున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఈ క్రమంలో జనరల్ కేటగిరి స్థానాలు తగ్గే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే రిజర్వేషన్ స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. షెడ్యూల్డ్, ఏజెన్సీ ఏరియాలో ఎంపీటీసీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎస్టీ జనాభాలో 50 శాతం తగ్గకుండా చూస్తారు. అలాగే ఎస్టీ నోటిఫైడ్ గ్రామాల్లో సర్పంచులు, వార్డుమెంబర్ పదవులను పూర్తిగా వారికే కేటాయించనున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల నిర్వహణపై ఆశలు నెలకొన్నాయి. గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లను కేటాయించే బాధ్యతలను ప్రభుత్వం సంబంధిత అధికారులకు అప్పగించింది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కేవలం రెండు రోజుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, జెడ్పీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఖరారు చేయనున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్ కేటాయించనున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను ఆర్డీఓ ఖరారు చేయనుండగా.. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఆయా మండలాల ఎంపీడీఓలు కేటాయించనున్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా పూర్తయ్యింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. ఓటరు జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ పూర్తి కాగా.. బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్ ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ సైతం ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు స్థానాలు ఇలా.. జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ నాగర్‌కర్నూల్ 20 214 మహబూబ్‌నగర్ 16 175 వనపర్తి 15 136 జోగుళాంబ గద్వాల 13 141 నారాయణపేట 13 136 -
జగన్మాతకు జేజేలు
● వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ● జిల్లాకేంద్రంలో ఆకట్టుకున్న విగ్రహ శోభాయాత్ర ● మొదటిరోజు నిజరూపంలో దర్శనమిచ్చిన వాసవీమాత కందనూలు: జగన్మాతకు జేజేలు.. పాహిమాం పరమేశ్వరీ.. దుర్గమ్మా.. కరుణించమ్మా అంటూ భక్తుల నినాదాలతో జిల్లావ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలు, కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో జగన్మాతను కొలువుదీర్చి వివిధ రూపాల్లో అలంకరించారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలో 55వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవీ కన్యకాపరమేశ్వరి ఉత్సవ విగ్రహ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. కోలాటాలు, చెక్క భజనలు, సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపు సాగింది. ఆలయ అర్చకులు జోషి పాండురంగ శర్మ ధ్వజారోహణం, గణపతి, గోపూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. మొదటిరోజు అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
వడ్డీ పేరుతో వంచన
చెయ్యి దాటిపోయాకే ఫిర్యాదులు.. అధిక వడ్డీపై ఆశతో పెట్టుబడులు పెడుతున్న బాధితులు తాము మోసపోయామని గ్రహించేందుకే అధిక సమయం పడుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా కొందరు వెనకాడుతుండటంతో చాలా ఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఆలస్యంగా తేరుకుని ఫిర్యాదు చేసినా పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి.. నిందితులను పట్టుకున్నా సొమ్మును మాత్రం రికవరీ చేయలేకపోతున్నారు. సాక్షి, నాగర్‌కర్నూల్: తమతో కలసి పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని.. రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మబలుకుతూ నిండా ముంచుతున్న ఘటనలు జిల్లాలో పెరుగుతున్నాయి. మధ్యతరగతి, ఉద్యోగులు, వ్యాపార వర్గాలే లక్ష్యంగా కేటుగాళ్లు అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. అధిక వడ్డీ వస్తుందని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారు చివరకు మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. బాధితులు పోలీ సులను ఆశ్రయించినా.. ని త్యం స్టేషన్ చుట్టూ తిరగడమే కానీ డబ్బులు మాత్రం తిరిగి రావడం లేదు. కష్టపడి సంపాదించిన సొమ్ము కోల్పోయిన బాధితులు దిక్కు తోచని స్థితిలో నిత్యం మదనపడుతున్నారు. ఫైనాన్స్ కంపెనీ పేరుతో టోకరా.. జిల్లాకేంద్రంలో ఓంశ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీ పేరుతో వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌కు చెందిన సాయిబాబు దందా మొదలుపెట్టాడు. అధిక వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మించి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించాడు. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నిర్వాసితులను లక్ష్యంగా చేసుకున్నాడు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చిన డబ్బులను డిపాజిట్లుగా సేకరించాడు. సుమారు 1200 మంది నుంచి రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. మోసపోయామని గుర్తించిన బాధితులు.. రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటివరకు డబ్బులు రికవరీ కాలేదు. జీవనాధారమైన భూములను ప్రాజెక్టులో కోల్పోగా.. వచ్చిన అరకొర డబ్బులను పెట్టుబడిగా పెట్టి మోసపోయిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. పూర్తిస్థాయిలో విచారణ.. అనధికార, బోగస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతున్న వారి కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. గ్రో ల్యాండ్ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడిన అండమాన్‌కు చెందిన నలుగురిని పట్టుకుని రిమాండ్‌కు తరలించాం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోంది. అధిక వడ్డీ ఇస్తామంటే నమ్మి మోసపోవద్దు. జరుగుతున్న మోసాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. – శ్రీనివాస్, డీఎస్పీ, నాగర్‌కర్నూల్ అధిక వడ్డీ ఇస్తామంటూ మోసాలు ఇటీవల ఓ కంపెనీ పేరుతో రూ. 7కోట్ల వరకు టోకరా అండమాన్ నికోబార్‌కు చెందిన నలుగురిని అరెస్ట్‌చేసిన పోలీసులు ఇప్పటికే ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ పేరుతో రూ. 50కోట్లకు పైగా మోసం జిల్లాలో పెద్దఎత్తున నష్టపోతున్న బాధితులు -
కుండపోత వర్షం
బల్మూర్/తాడూరు/తిమ్మాజిపేట/అమ్రాబాద్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. బల్మూర్ మండలంలో అత్యధికంగా 66.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి చెరువులు నిండి అలుగులు పారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లో సాగుచేసిన పత్తి, వరిపంట నీటమునిగింది. చెట్లకొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో బల్మూర్, గోదల్ తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాజ్‌వేలు, లో లెవల్ వంతెనల వద్ద వరద ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా తాడూరు మండలంలో 20.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంటన్నర పాటు భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇళ్ల మధ్యన వర్షపునీరు వచ్చి చేరడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి సమీపంలోని గుండం జలపాతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. కొండలపై నుంచి జాలువారుతున్న నీటిలో పర్యాటకులు సందడి చేశారు. -
ఉత్సాహంగా సెపక్తక్రా పోటీలు
వనపర్తి: వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 11వ అంతర్ జిల్లా సీనియర్ మెన్స్ అండ్ ఉమెన్స్ సెపక్తక్రా రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ క్రీడా పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల వారీగా ఒక్కో జిల్లా నుంచి మెన్స్, ఉమెన్స్ రెండు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రతిభకనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా రాణించాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.800 కోట్లు క్రీడలకు కేటాయించిందన్నారు. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లేందుకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సెపక్తక్రా క్రీడలకు సంబంధించి బాల్స్ కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందని ఇందుకు సంబంధించి అట్టి క్రీడకు సంబంధించిన అసోసియేషన్ వారు తమకు నివేదిక ఇస్తే మలేషియా నుంచి బంతుల్ని తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి మెడల్స్ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో మైదానాలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇక జిల్లాకు రూ.57 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయడం జరిగిందని, వచ్చే ఏడాదికి వనపర్తిలో ఇండోర్ స్టేడియం అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. యువత లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించేవరకు కష్టపడాలని, గత ఏడాది తెలంగాణ నుంచి పారా ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన దీప్తి జీవాంజిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పాల్గొన్న 20 జట్లు -
సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ
● జిల్లాలోని 21 పాఠశాలల్లో తరగతులు ప్రారంభం ● 80 మందికి పైగా విద్యార్థుల చేరిక ● మౌలిక వసతుల కోసం రూ. 31.50లక్షలు కేటాయింపు ● ప్రతి పాఠశాలకు ఒక ఇన్స్ట్రక్టర్, ఆయా నియామకం కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు లేకపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆర్థికభారం అయినప్పటికీ ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించింది. జిల్లాలోని 21 పాఠశాలల్లో 15 రోజుల క్రితం ప్రీ ప్రైమరీ తరగతులను ఆరంభించగా.. 86 మందికి పైగా విద్యార్థులు చేరారు. దీంతో సర్కారు బడులు మరింత బలోపేతం కానున్నాయి. ఎల్కేజీ, యూకేజీ చదివిన పిల్లలకు వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో చేరేందుకు అర్హత ఉంటుంది. తద్వారా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కో స్కూల్‌కు రూ. 1.50లక్షలు.. పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ అభ్యసించే చిన్నారులకు ప్రత్యేక తరగతి గది ఉండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, ఆటపాటల కోసం సామగ్రి, సౌకర్యవంతమైన కాంతి, గాలి ప్రవాహం అవసరం. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఫర్నిచర్ కోసం రూ. 50వేలు, అవుట్డోర్, ఇండోర్ ప్లే మెటీరియల్‌కు రూ. 50వేలు, పెయింటింగ్‌కు రూ. 50వేల చొప్పున ప్రతి పాఠశాలకు రూ. 1.50లక్షలు మంజూరు చేసింది. ఇలా జిల్లాలోని 21 పాఠశాలలకు రూ. 31.50లక్షలు కేటాయించారు. త్వరలోనే టెండర్లు పిలిచి.. ఆయా పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. బోధన కోసం.. ప్రీ ప్రైమరీ తరగతుల బోధన కోసం ప్రతి పాఠశాలకు ఒక ఇన్స్ట్రక్టర్, ఆయాను నియమించనున్నారు. వీరిని తాత్కాలిక పద్ధతిలోనే ఎంపిక చేస్తారు. వీరు పది నెలలపాటు మాత్రమే విధులు నిర్వహిస్తారు. ఇన్స్ట్రక్టర్, ఆయాల నియామకానికి సంబంధించి డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. త్వరలోనే వీరిని నియమించే అవకాశం ఉంది. మండలం పాఠశాల అమ్రాబాద్ ఎంపీపీఎస్, చింతలోనిపల్లి కల్వకుర్తి ఎంపీయూపీఎస్, ముకురాల కోడేరు ఎంిపీపీఎస్, కొండ్రావ్‌పల్లి కోడేరు ఎంపీపీఎస్, కోడేరు కోడేరు ఎంపీపీఎస్, బాడుగదిన్నె కొల్లాపూర్ ఎంపీపీఎస్, నర్సింహాపురం కొల్లాపూర్ ఎంపీపీఎస్, నార్లాపురం లింగాల ఎంపీపీఎస్, సూరాపూర్ లింగాల ఎంపీపీఎస్, కొత్తకుంటపల్లి లింగాల ఎంపీపీఎస్, మగ్దూంపూర్ నాగర్‌కర్నూల్ ఎంపీయూపీఎస్, దేశిటిక్యాల పెద్దకొత్తపల్లి ఎంపీపీఎస్, కొత్త యాపట్ల పెంట్లవెల్లి ఎంపీపీఎస్, పెంట్లవెల్లి పెంట్లవెల్లి ఎంపీపీఎస్, సింగవరం తాడూరు ఎంపీపీఎస్, ఐతోల్ తిమ్మాజిపేట ఎంపీయూపీఎస్, రాళ్లచెరువుతండా ఊర్కొండ ఎంపీయూపీఎస్, జకినాలపల్లి ఊర్కొండ ఎంపీయూపీఎస్, జగ్‌బోయిన్‌పల్లి వంగూరు ఎంపీయూపీఎస్, తిప్పారెడ్డిపల్లి వంగూరు ఎంపీపీఎస్, నర్సంపల్లి వెల్దండ ఎంపీపీఎస్, కొట్ర జిల్లాలో ఎంపికై న పాఠశాలలు ఇవే.. మార్గదర్శకాలు ఇలా.. 2026–27 విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో చేరే అవకాశం ఉన్న చిన్నారులు 2025–26లో ప్రీ ప్రైమరీలో చేరాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా వయసు, నిర్ధారణ పత్రాలు అవసరం. వివరాలు యూడైస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. -
భూ సేకరణ వేగంగా పూర్తి చేస్తాం
నాగర్‌కర్నూల్: జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి 167కే నిర్మాణ పనులకు భూ సేకరణను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని డాక్టర్ డీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లాల కలెక్టర్లు, జాతీయ రహదారుల, రెవెన్యూ అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణాల పురోగతి, భూ సేకరణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి వీసీకి హాజరైన కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ఎన్‌హెచ్ 167 కే కోసం 79.3 కిలోమీటర్ల మేర జిల్లాలో కల్వకుర్తి, కొల్లాపూర్, సోమశిల వరకు 106.7 హెక్టార్ల విస్తీర్ణం భూమి అవసరం కాగా ఇప్పటివరకు 77.5 హెక్టార్ల భూ సేకరణ పూర్తయిందని, మిగిలిన 29.2 హెక్టార్ల భూ సేకరణ పనులను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేసి జాతీయ రహదారుల నిర్మాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామని కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ మండలంలోని మూడు గ్రామాల పరిధిలో భూ సేకరణ పనులు పూర్తి చేస్తామని, కల్వకుర్తి మండలంలో ఉన్న కోర్టు కేసులను పరిగణనలోకి తీసుకొని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, ఆర్డీఓలు సురేష్, బన్సీలాల్, జనార్దన్‌రెడ్డి, నేషనల్ హైవే డీఈ రమేష్‌బాబు, కలెక్టరేట్ భూ సేకరణ విభాగం సూపరింటెండెంట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్, -
‘బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’
అచ్చంపేట/మన్ననూర్: అనారోగ్యంతో బాధపడుతూ మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రిలో మృతిచెందిన చెంచు మహిళ గురువమ్మ మృతదేహాన్ని మార్చూరీ వ్యాన్ డ్రైవర్ పరాహబాద్ చౌరస్తా వద్ద అడవిలో వదిలి వెళ్లడం బాధాకరం అని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లింగాల మండలంలోని ఈర్లపెంటకు చెందిన మండ్లీ గురువమ్మ అనారోగ్యంతో మహబూబ్‌గర్ ప్రభుత్వ అస్పత్రిలో చేరిందన్నారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందగా.. మృతదేహాన్ని ఈర్లపెంటకు తరలించే క్రమంలో మార్చూరీ వ్యాన్ డ్రైవర్ అడవిలో వదిలివెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ అధికారులు చెంచుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నల్లమల అటవీ ప్రాంతంలో జీవనం సాగించే ఆదివాసీల రక్షణ కోసం ఐటీడీఏ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఘటనపై రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా మంత్రి జూపల్లి కష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారని తెలిపారు. త్వరలోనే మంత్రి సీతక్క నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు పెంటలను సందర్శించిస్తారని వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామన్నారు. పెంటల్లో నివసిస్తున్న ఆదివాసీలకు వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆలస్యం చేయకుండా అచ్చంపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించి పూర్తిస్థాయిలో వైద్య సేవలు పొందాలని సూచించారు. -
దసరాకు ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఈ ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ రీజియన్‌లో 641 ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు తిరగనున్నాయి. రీజియన్‌లోని పది డిపోల నుంచి ఈ అదనపు బస్సులు శనివారం ప్రారంభం కాగా.. వచ్చే నెల 2వ తేదీ వరకు నడపనున్నారు. దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మహబూబ్‌నగర్ రీజియన్‌లోని డిపోల నుంచి అదనపు సర్వీసులు నడపనున్నారు. రీజియన్ వ్యాప్తంగా.. దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ రీజియన్ వ్యాప్తంగా 641 అదనపు సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్ రూట్లో ఎక్కువ అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు. ఈ రూట్లోనే ఆర్టీసీకి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కర్నూలు రూట్లోనూ అదనపు బస్సులు నడవనున్నాయి. మహబూబ్‌నగర్ డిపో నుంచి అధికంగా 93 అదనపు బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, వారి సౌకర్యార్థం అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, షెల్టర్లు, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఆదివారం నుంచి పాఠశాలలకు సెలవులు ఉండడంతో శనివారం బస్టాండ్లలో రద్దీ కొంతమేర కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. పెరగనున్న ఆదాయం.. దసరా పండుగ సందర్భంగా సాధారణ రోజుల కంటే మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌కు కొద్దిమేర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పండుగ ప్రారంభ మూడు రోజులు, ముగింపు అనంతరం రెండు రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. గద్వాల 86 వనపర్తి 86 మహబూబ్‌నగర్ 93 షాద్‌నగర్ 67నారాయణపేట 86 అచ్చంపేట 60 నాగర్‌కర్నూల్ 53 కల్వకుర్తి 60 కొల్లాపూర్ 50 రీజియన్ వ్యాప్తంగా 641 అదనపు సర్వీసులు వచ్చేనెల 2 వరకు నడపనున్న ఆర్టీసీ హైదరాబాద్ రూట్లో ఎక్కువ స్థాయిలో రాకపోకలు ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. అదనపు సర్వీసులు -
దరఖాస్తుల స్వీకరణతోనే సరి!
అచ్చంపేట: వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ప్రభుత్వం కానీ వ్యవసాయశాఖ అధికారులు కానీ వాటిని పరిశీలించిన పాపాన పోలేదు. దీంతో పథకం అమలు జాప్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా వివిధ యంత్ర పరికరాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. పునరుద్ధరించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో నిలిపివేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి పునరుద్ధస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. రైతులకు 2024 మార్చి చివరి నాటికే యంత్ర పరికరాలు పంపిణీ చేయనున్నట్లు తొలుత పేర్కొన్నారు. ఈ పథకం కింద 2024–25 సంవత్సరంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 1,341 యూనిట్ల కోసం రూ.3.31 కోట్లు కేటాయించింది. మార్చి 31 నాటికి పరికరాలను గ్రౌండింగ్ చేయాలని, మార్చి 21న ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సమయం ఉండటంతో అధికారులు సైతం ప్రచారం కల్పించలేకపోయారు. మార్చి 31 తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మంజూరైన నిధులను పైసా కూడా ఖర్చు చేయలేదు. నిధులు విడుదల చేస్తూ జీఓ యాంత్రీకరణ పథకానికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 1,680 యూనిట్లకు గాను రూ.1.38కోట్ల నిధులు మంజూరు చేస్తూ జూలై చివరిలో జీఓ విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి 15 వరకు దరఖాస్తుల స్వీకరించాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ, జనరల్ కేటగిరికీకి చెందిన రైతులకు 40శాతం సబ్సిడీపై పరికరాలు అందించేలా జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఆగస్టు16 నుంచి 20 వరకు దరఖాస్తులను పరిశీలించి 21 నుంచి 27 వరకు ఎంపికై న రైతుల నుంచి సబ్సిడీ పోను పెట్టుబడి రూపంలో డీడీలను తీసుకోవాలని భావించింది. అనంతరం ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 5 వరకు సబ్సిడీ పరికరాలను మంజూరు ఉత్తర్వులను అందజేసి అక్టోబరు చివరి వారంలో లబ్ధిదారులకు పరికరాలను అందజేసేలా జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసుకున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు. యాంత్రీకరణ పథకం అమలుపై దృష్టి సారించని ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి జిల్లాకు రూ.1.38 కోట్టు మంజూరు ఇప్పటి వరకు ట్రెజరీలో జమకాని నిధులు వచ్చిన అర్టీలనూ పరిశీలించని యంత్రాంగం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు – యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
హోంగార్డులు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: హోంగార్డులు ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న 117 మందికి ఉలన్జెర్సీలు, రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వరదల సమయంలో హోంగార్డులు నిబద్ధతతో పనిచేశారని, వారి సేవలు మరువలేనివని కొనియాడారు. హోంగార్డులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో హోంగార్డు ఇన్చార్జి ఆర్ఐ రాఘవరావు, హోంగార్డులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
జిల్లావ్యాప్తంగా 16 సీసీఐ కేంద్రాల ఏర్పాటుఆధార్ అనుసంధానం తప్పనిసరి జిల్లాలో అక్టోబర్ మొదటి వారంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. పత్తి కొనుగోళ్లు, చెల్లింపులు, ఇతరత్రా విషయాల్లో పారదర్శకత కోసం రైతుల బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం ఉండాలనే నిబంధన పెట్టారు. పత్తి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సయంలో ఆధార్‌కార్డులతో పాటు పాస్బుక్కు కూడా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. రైతులు తమ వివరాలను కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. ఇందులో రైతుల వివరాలతో పాటు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారనే సమాచారాన్ని మొత్తం నమోదు చేయాల్సి ఉంటుంది. నాగర్‌కర్నూల్: ప్రభుత్వం తరుఫున పత్తి కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లోనే పత్తి ధర అధికంగా ఉండడం, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో గతేడాది పెద్దగా రైతులు కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపలేదు. చాలా చోట్ల తేమ శాతం సాకుగా చూపి మోసం చేసిన ఘటనలు కూడా అక్కడక్కడ జరగడం రైతులను కొంత నష్టపరిచింది. ●అక్టోబర్ మొదటి వారంలో.. జిల్లాలో 16 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకొచ్చే ప్రతి రైతు బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం అయి ఉండాలి. అక్టోబర్ మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభిస్తాం. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. రైతులు దళారులను నమ్మకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి. – సిరంజిత్ సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి అక్టోబర్ మొదటి వారంలోప్రారంభించే అవకాశం కొనసాగుతున్న టెండర్ ప్రక్రియ 33 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా మద్దతు ధర రూ.8,110 -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. నిరక్షరాస్యతే బాల్య వివాహాలకు ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్ల బాల్యవివాహాలను అరికట్టవచ్చన్నారు. సోషల్ మీడియాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, కొన్ని యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను కేవలం మంచి విషయాలు తెలుసుకునేందుకే వినియోగించాలని, కాలపేక్షం కోసం మొబైల్ ఫోన్లు వాడితే జీవితం నాశనం అవుతుందని తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా మాట్లాడుతూ ప్రతి విద్యార్ది లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందుకు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జీ వెంకటరామ్, అడిషనల్ కలెక్టర్ అమర్నాథ్, డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి, సీడబ్ల్యూసీ చైర్మన్ లక్ష్మణరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమాకాంత్, సెక్రటరీ మధుసూదన్ రావు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి
నాగర్‌కర్నూల్: జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 33 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించాలని సూచించారు. పత్తి మార్కెటింగ్ సీజన్ 2025–26లో జిల్లా సగటు దిగుబడి అంచనాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తహసీల్దార్లు జవాబుదారీగా పని చేయాలి తహసీల్దార్లు ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండడంతో పాటు సమయపాలన పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.అమరేందర్‌తో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ఆర్డీఓలతో పాటు 20 మండలాల తహసీల్దార్లతో భూ భారతి, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అసైన్డ్ భూములు, భూదాన్ భూముల పరిరక్షణ, పలు రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల వారీగా రెవెన్యూ అంశాలను తహసీల్దార్లు నిర్లక్ష్యం వహించకుండా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరస్కరించిన ప్రతి దర ఖాస్తుకు సరైన కారణాలు తెలియజేయాలని, వివరాలతో ప్రొసీడింగ్‌ను దరఖాస్తుదారుడికి అందించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు కావాల్సి న భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. హైకోర్టు, సివిల్ కోర్టు, లోకాయుక్తకు సంబంధించిన కేసులను కూడా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు జనార్దన్‌రెడ్డి, బన్సీలాల్, సురేష్, మాధవి, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు రవికుమార్, వెంకట్, శోభ పాల్గొన్నారు. -
క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు
● జిల్లాలో కలకలం రేపుతున్న వరుస ఘటనలు ● మానవత్వం మరిచి కిరాతకంగా హతమారుస్తున్న వైనం ● బాధిత, నిందితుడి కుటుంబాలు చిన్నాభిన్నం స్వచ్ఛందంగా మార్పు రావాలి క్షణికావేశంలో జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలపై ప్రజల్లో స్వచ్ఛందంగా మార్పు రావాలి. తరుచూ నేరాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్న వారిపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. ఆత్మహత్యలకు పాల్పడటం, హత్యలకు పాల్పడటం వల్ల కుటుంబాలు చిన్నాభి న్నం అవుతాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతరం గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తాం. – గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్, ఎస్పీ, నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ క్రైం: క్షణికావేశంలో నియంత్రణ కోల్పోయి కొందరు చేస్తున్న హత్యలు, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో బాధిత, నిందితుడి కుటుంబ సభ్యులు సైతం పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస హత్యలతో పాటు ఆత్మహత్యలు భయాందోళన కలిగిస్తున్నాయి. మానవ సంబంధాలను మరిచి కిరాతకంగా హత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే బంధాల విలువతో పాటు చెడువ్యనసాల వల్ల కలిగే అనర్థాలు, జీవితంలో అన్నింటికి ఆత్మహత్యలే పరిష్కారం కాదనే విషయాలపై అవగాహన కల్పిస్తే కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబకలహాలతో తన ముగ్గురు చిన్నారులను కిరాతకంగా హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. వరుస ఘటనలతో భయాందోళనలు జిల్లాలో ఇటీవల జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు క్షణికావేశంలో జరుగుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు అనుమానంతో కొందరు, ఆస్తికోసం మరికొందరు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో అత్యంత కిరాతకంగా హత్యలకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ● ఆగస్టు 28న బల్మూరు మండలంలోని మైలారంలో ఓ వ్యక్తిని హత్య చేసి మామిడి తోటలో పూడ్చడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి శవాన్ని వెలికితీశారు. ● ఈ నెల 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి కుటుంబ కలహాలతో తన ముగ్గురు చిన్నారులను ఉప్పునుంతల, కల్వకుర్తి మండలాల్లో కిరాతకంగా చంపి తాను వెల్దండ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ● ఈ నెల 4న కల్వకుర్తి పట్టణంలో ఓ వ్యక్తి తన తండ్రిని కారులో కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడి తల, మొండం వేరుచేసి దుందుభీ నదిలో పారవేశాడు. ● ఈ నెల 11న జిల్లాకేంద్రంలోని ఓ యువకుడు కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● ఈ నెల12న జిల్లా కేంద్రంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● ఈ నెల 12న నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్లలో తల్లిని కన్నకొడుకు గొంతు నులిమి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఏడాది హత్యలు ఆత్మహత్యలు 2023 33 191 2024 39 182 2025లో ఇప్పటివరకు18 91 మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ప్రస్తుతం చాలా మంది మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలతో పాటు హత్యకు పాల్పడుతున్నారు. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు వైద్యులు సంప్రదించి సరైన వైద్యం పొందినపుడే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు వారి ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. భార్యాభర్తలు, కుటుంబంలో ఏర్పడే కలహాలను సామరస్యంగా పరిష్కరించుకుంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు. మానసిక ఒత్తిడిలో ఉన్న వారు జనరల్ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలి. –డా. అంబుజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైక్రియాటిస్టు, జనరల్ ఆస్పత్రి మూడేళ్ల కాలంలో.. -
న్యాయవాదులకు రక్షణ కల్పించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: న్యాయవాదులకు రక్షణ కల్పించాలని నాగర్‌కర్నూల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు డిమాండ్ చేశారు. ఈనెల 17న అర్ధరాత్రి బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లో న్యాయవాది ఇంటిపై నిప్పుపెట్టి హత్యాయత్నానికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ మధుసూదన్‌రావు, న్యాయవాదులు రాం లక్ష్మణ్, శ్యాంప్రసాద్ రావు పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం ● 28న అచ్చంపేటలో కేటీఆర్ పర్యటనఅచ్చంపేట రూరల్: తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అచ్చంపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా, అచ్చంపేట అభివృద్ధికి ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించడం లేదని మండిపడ్డారు. అచ్చంపేట ప్రాంతంలోని ఉమామహేశ్వర, చెన్నకేశవ రిజర్వాయర్‌పై దృష్టి సారించడం లేదన్నారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతులిచ్చినా ఇప్పటికీ ఎందుకు పనులు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే రాష్ట్రానికి సాగునీరు తక్కువగా వస్తాయన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైనా కాల్వ పనులు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. అంతకుముందు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా అందించలేని దుస్థితిలో ఉందని అసహనం వ్యక్తం చేశారురు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టాల్సిన పరిస్థితిని మళ్లీ తెచ్చారని ఎద్దేవా చేశారు. ఈ నెల 28న అచ్చంపేటలో నిర్వహించే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభను పార్టీ శేణ్రులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం సభాస్థలిని పరిశీలించి, ఏర్పాట్లు చూశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, నాయకులు నర్సింహాగౌడ్, తులసీరాం, అంతటి శివ, రమేష్‌రావు, కుత్బోద్దీన్ పాల్గొన్నారు. -
జీపీఓలు రైతులకు అందుబాటులో ఉండాలి
పెద్దకొత్తపల్లి: గ్రామాల్లో ప్రభుత్వం నూతనంగా నియమించిన జీపీఓలు రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తూ గుర్తింపు పొందాలని రెవెన్యూ అడిషన్ కలెక్టర్ అమరేందర్ సూచించారు. పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ బన్సీలాల్ ఆధ్వర్యంలో శుక్రవారం కొల్లాపూర్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల జీపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణపై ఆర్డీఓ బన్సీలాల్ వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, డీటీ రమేష్‌నాయక్, జీపీఓలు, శిక్షణ పొందిన సర్వేయర్లు పాల్గొన్నారు. మంత్రికి ఎమ్మెల్యే వినతి నాగర్‌కర్నూల్: నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి విన్నవించారు. హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు. రహదారుల నిర్మాణానికి రూ.20 కోట్లు, గిరిజన భవన నిర్మాణానికి రూ.3 కోట్లు, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన మంత్రి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: జిల్లాలోని కొత్త, పాత స్వచ్ఛంద సంస్థల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు సెల్: 9705606304 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
డబ్బులు సరిపోవడం లేదు
ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోగా మాకు ఇల్లు మంజూరైంది. అయితే ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఇక్కడ రేట్లు పెరగడంతో ఇల్లు కట్టుకోలేక పోతున్నాం. ఇసుక, సిమెంట్, సీకుల ధరలు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు పెంచాలి. – హోటల్ పార్వతమ్మ, ఇర్కిచేడు, కేటీదొడ్డి మండలం, గద్వాల జిల్లా భారంగా మారింది.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణానికి అయ్యే ఖర్చులో కొంతభాగం ప్రభుత్వం అందించడం చాలా సంతోషంగా ఉంది. బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే రూ.లక్ష బిల్లు వచ్చింది. కానీ ఇసుక, సిమెంట్, ఇటుక, కంకర, స్టీల్ ధరలు బాగా పెరగడంతో నిర్మాణం భారంగా మారింది. ఇసుక ఉచితంగా, స్టీల్, సిమెంట్, కంకర, ఇటుక తక్కువ ధరకు అందిస్తే బాగుంటుంది. – చింతకాల గౌతమి, కడుకుంట్ల (వనపర్తి) నాలుగు నెలలైనాబిల్లు రాలేదు.. ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి బేస్మెంట్ వరకు నిర్మించుకున్నాం. అధికారులు ఫొటో, వివరాలు తీసుకొని మూడు నెలలు అయింది. ఇప్పటివరకు బేస్మెంట్ బిల్లు రూ.లక్ష రాలేదు. చేతిలో చిల్లి గవ్వలేక ఇంటి నిర్మాణాన్ని ఆపేశాం. – ఆలేటి ఎల్లమ్మ, గట్టురాయిపాకుల, నాగర్‌కర్నూల్ జిల్లా ఆధార్‌కార్డుల్లో తప్పులతో ఇబ్బంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాం. జిల్లాలో ఇప్పటివరకు 4,103 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.42.84 కోట్లు జమ చేశాం. ఆధార్‌కార్డుల్లో తప్పులతో పలువురికి సమస్యలు తలెత్తగా.. పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జీఎస్టీ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో ఇప్పటివరకు దూరంగా ఉన్న లబ్ధిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. – వైద్యం భాస్కర్, గృహనిర్మాణ శాఖ పీడీ, మహబూబ్‌నగర్ ● -
మహిళ మృతదేహాన్ని అడవి వదిలేసిన మార్చురీ వ్యాన్ డ్రైవర్..
సాక్షి, నాగర్‌కర్నూల్/ మన్ననూర్: అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతిచెందిన చెంచు మహిళ మృతదేహాన్ని మార్చురీ వ్యాన్ డ్రైవర్ దారి మధ్యలోనే అడవిలో వదిలిపెట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఈర్లపెంటకు చెందిన చెంచు మహిళ మండ్లి గురువమ్మ (30) పది రోజుల కిందట అనారోగ్యంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించింది. మహిళ మృతదేహాన్ని నల్లమల అటవీ ప్రాంతంలోని ఈర్లపెంటకు తరలించేందుకు అధికారులు మార్చురీ వ్యాన్‌ను ఏర్పాటు చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారి పక్కన ఫర్హాబాద్ ఫారెస్ట్ గేటు వద్దకు రాగానే అడవి లోపలికి వెళ్లేందుకు దారి సరిగా లేదంటూ డ్రైవర్ మృతదేహాన్ని వ్యాన్ నుంచి దించి కిందపెట్టేశాడు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వరకు గురువమ్మ మృతదేహంతో పాటు ఫారెస్ట్ గేటు వద్దనే పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ అధికారులు ఆటో ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఈర్లపెంటకు తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్చురీ వ్యాన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్టు మన్ననూర్ ఐటీడీఏ ఇన్చార్జి పీఓ రోహిత్‌రెడ్డి తెలిపారు. -
భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
వెల్దండ/తాడూరు: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశించారు. గురువారం వెల్దండ, తాడూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఆయా మండలాల్లో నెలకొన్న భూ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం మేరకు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వివిధ భూ సమస్యలపై 17వేలకు పైగా దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వాటిలో 3వేలు సాదాబైనామా, 5వేలు అసైన్డ్ భూముల కోసం, 9వేలు సాధారణ భూ సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు వివరించారు. ఇప్పటి వరకు దాదాపు 1,000 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో భూ సమస్యలను పరిశీలించి.. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం వీఆర్ఓల స్థానంలో 189మంది జీపీఓలతో పాటు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించిందని తెలిపారు. కార్యక్రమాల్లో తహసీల్దార్లు కార్తీక్‌కుమార్, జయంతి, డిప్యూటీ తహసీల్దార్లు కిరణ్‌కుమార్, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
● ఇనాం భూమి ఓఆర్సీ కోసంరూ.40 వేలు లంచం డిమాండ్ ● ఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్నుఅదుపులోకి తీసుకున్న అధికారులు కొత్తకోట రూరల్: రోజూ ఏదో ఒకచోట ఏసీబీ అధికారులకు ప్రభుత్వ అధికారులు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నిర్వేన్‌కు చెందిన ఓ రైతు తన ఇనాం భూమి ఓఆర్సీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ విచారణకు ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని ఆదేశించారు. వీరిద్దరు భూమి చూడటానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. లంచం డిమాండ్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. వీరిని శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు లంచం అడిగితే హెల్ప్‌లైన్ నంబర్ 1064కు లేదా ఏసీబీ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. దాడిలో ఏసీబీ సీఐలు లింగస్వామి, ఎస్కే జిలాని, కిషన్‌నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
అచ్చంపేట అభివృద్ధికి నిధులు ఇవ్వండి
అచ్చంపేట: నియోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కడు వంశీకృష్ణ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఆయన సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో పెండింగ్ పనులతో పాటు అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు, ఉల్పర–కల్వకుర్తి వరకు డబుల్ రోడ్డు, అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం, మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత శాఖ అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. డీసీసీబీ సీఈఓ నియామకం నిలిపివేత సాక్షి, నాగర్‌కర్నూల్/ మహబూబ్‌నగర్ (వ్యవసాయం): మహబూబ్‌నగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సీఈఓ నియామకాన్ని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. సీఈఓ నియామకానికి అవసరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఆయన నియామకాన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ డీసీసీబీ సీఈఓగా డి.పురుషోత్తమరావును ఈ ఏడాది జూలై 14న నియమించాలని కోరుతూ కమిటీ పంపిన ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి స్పందిస్తూ సీఈఓ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను మాత్రమే ఆర్బీఐ తిరస్కరించిందని, నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు. ఎస్పీ పేరిట.. ఫేస్బుక్లో నకిలీ ఐడీ నాగర్‌కర్నూల్ క్రైం: నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేరిట ఫేస్బుక్లో నకిలీ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ మేరకు గురువారం గుర్తించిన ఎస్పీ ఈ నకిలీ ఐడీ నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని కోరారు. అలాగే ఎస్పీ ఆదేశాలతో ఫేస్బుక్లో ఏర్పాటు చేసిన నకిలీ ఐడీపై జిల్లా సైబర్ క్రైం విచారణ చేపట్టింది. అవకతవకలపై విచారణ జరపాలి కోడేరు: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. గురువారం మండలకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి.. ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ శ్రావణ్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి కిరణ్ పాల్గొన్నారు. కురుమూర్తి దేవస్థానానికి రూ.2.02కోట్ల ఆదాయం చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతరను పురస్కరించుకొని అధికారులు నిర్వహించిన వేలం పాటలు గురువారం ముగిశాయి. ఆలయం వద్ద కొబ్బరికాయలు, లడ్డూ ప్రసాదం విక్రయించడానికి, కొబ్బరి చిప్పలు, తలనీలాల సేకరణ, లైటింగ్, డెకరేషన్ ఏర్పాట్లు, పూలు, పూజ సామగ్రి విక్రయం, జాతరలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి నిర్వహించిన వేలంలో రూ.2,02,75,000 ఆదాయం ఆలయానికి సమకూరిందని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. -
పాత నేరస్తుల కదలికలపై నిఘా
అచ్చంపేట రూరల్: పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. గురువారం అచ్చంపేట పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి.. బాధితులకు భరోసానివ్వాలని తెలిపారు. వృత్తిపరమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీఎస్పీ వెంట సీఐ ఏశమళ్ల నాగరాజు, ఎస్ఐ విజయ్‌భాస్కర్ ఉన్నారు. -
కృష్ణాతీరానికి సొబగులు
కృష్ణానది పరివాహకంలో పర్యాటక అభివృద్ధికి నిధులు ●సోమశిల, అమరగిరిలో పర్యాటక అభివృద్ధి పనులు కన్సల్టెన్సీలకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కొల్లాపూర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అమరగిరిలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి. కృష్ణానది తీరం వెంట ఉండే పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్ సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. – టి.నర్సింహ, జిల్లా పర్యాటకశాఖ అధికారి కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కృష్ణానది తీరంలో పర్యాటకానికి మహర్దశ పట్టింది. ఇప్పటికే సోమశిల పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుండగా.. కృష్ణానది తీరం వెంట ఉండే ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాయి. నిధుల కేటాయింపులు.. వెల్నెస్ అండ్ స్పిరిచ్యువల్ రిట్రీట్ ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం అమరగిరిలో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవలే ప్రభుత్వం రూ.45.84 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అమరగిరి సమీపంలోని మల్లయ్య సెల, నడింతిప్ప ప్రాంతాల్లో కృష్ణానది మధ్యలో గల దీవిలో పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఇక్కడ యోగా డెక్, పెవిలియన్, స్పా ఏరియా, కాటేజీలు, సిబ్బంది వసతి గృహాలు, స్విమ్మింగ్‌పూల్, ఇండోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్, వ్యూయింగ్ డెక్, స్టోర్ రూంలు, బోట్లు నిలిపేందుకు జెట్టీలు, వివిధ రకాల చెట్లతో గార్డెనింగ్ వంటి పనులు సుందరంగా చేపట్టనున్నారు. అదేవిధంగా సోమశిలలో వీఐపీ ఘాట్‌కు పర్యాటకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రూ.1.60 కోట్లతో ఘాట్ విస్తరణ, బోటింగ్ వసతులు మెరుగుపర్చే పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ఇటీవలే రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. హెలీ టూరిజంతో ప్రాముఖ్యత.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు హెలీ టూరిజం ప్రారంభిస్తామని ఇటీవల రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. నల్లమల అడవి, కృష్ణానది అందాలు తిలకిస్తూ సాగే హెలీ టూరిజంపై పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నదిలో లాంచీ ప్రయాణం ఏర్పాటు చేయగా..హెలీ టూరిజం ఏర్పాటుతో జాతీయస్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రహదారుల నిర్మాణం.. కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వీటిలో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట, జటప్రోల్, సింగోటం వంటి ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా వస్తున్నారు. అమరగిరిలో పెద్దఎత్తున పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లే రహదారిని బాగుచేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2.80 కోట్లతో అమరగిరికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేశారు. రోడ్డు వెంట ఉన్న కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. బీటీ నిర్మించాల్సి ఉంది. అలాగే పెంట్లవెల్లి నుంచి మంచాలకట్టకు వెళ్లే రోడ్డును కూడా బాగుచేసేందుకు రూ.1.40 కోట్లు కేటాయించారు. రహదారులు, పర్యాటక అభివృద్ధి పనులు పూర్తయితే కొల్లాపూర్ పర్యాటకంగా మరింతంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అమరగిరి, సోమశిలలో వసతుల కల్పనకు చర్యలు నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్న కన్సల్టెన్సీలు పర్యాటక గ్రామాలకు వెళ్లే రహదారుల నిర్మాణాలకు శ్రీకారం పర్యాటకంగా సోమశిల, అమరగిరి ప్రాంతాలకు వస్తున్న గుర్తింపు మిగతా ప్రాంతాలకు రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. సింగోటం లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం, పక్కనే ఉన్న రిజర్వాయర్, జటప్రోల్ సమీపంలోని కత్వ, కొల్లాపూర్ పట్టణంలోని రాజా బంగ్లా, ఎల్లూరు సమీపంలోని కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టు, మిషన్ భగీరథ స్కీం, మల్లేశ్వరం రివర్ వ్యూ వంటి ప్రాంతాలు పర్యాటకులకు విజ్ఞానం, వినోదం అందిస్తాయి. వీటిని కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు పలు కన్సల్టెన్సీలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పర్యాటక శాఖ అధికారులను సంప్రదించారు. ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు చేపట్టే వారికే ఈ పనులు అప్పగించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా కన్సల్టెన్సీల ప్రతినిధులు అమరగిరి ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
నాగర్‌కర్నూల్ క్రైం: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కోరారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు లోనుకాకుండా భవిష్యత్‌పై దృష్టిసారించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగంతో చదువుపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందన్నారు. అదే విధంగా నేరాలకు పాల్పడే అవకాశం పెరుగుతుందని హెచ్చరించారు. ఒకప్పుడు డ్రగ్స్ ప్రభావం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండేదని.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. గ్రామీణ సంస్కృతీ సంప్రదాయాలు కూడా డ్రగ్స్ వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా నిర్మించడంలో విద్యార్థులే సైనికు ల్లా ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రవాణా, వాడకం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ఏదేని ఘటనల గురించి నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాజాన్ని మార్చగల శక్తి విద్యార్థులకే ఉంటుందని.. డ్రగ్స్ అనే అనర్థాన్ని తిప్పికొట్టడంలో ముఖ్యపాత్ర పోషించాలన్నారు. దేశ భవిష్యత్, ఆరోగ్యం, సుస్థిర ఆలోచనలతో ఎదగాలన్నారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. డ్రగ్స్‌తో కలిగే అనర్థాలపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఇద్దరు విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్, అకాడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ అంజయ్య, కళాశాల యాంటీ డ్రగ్ కోఆర్డినేటర్ వనిత తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు దిక్సూచి.. టీఎల్ఎం
కందనూలు: టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ విద్యార్థులకు దిక్సూచి లాంటిదని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో జిల్లాస్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. టీఎల్‌ఎంతో విద్యార్థులకు సులభంగా బోధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మెరుగుపర్చుకొని కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని సూచించారు. అయితే రెడీమెడ్గా కాకుండా ఉపాధ్యాయులు సొంతంగా తయారుచేసిన టీఎల్ఎంలను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. జిల్లాస్థాయి మేళాలో 20 మండలాల నుంచి 200 టీఎల్ఎంలను ప్రదర్శించగా.. నాలుగు విభాగాల నుంచి 8 ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు డీఈఓ తెలిపారు. ఇంగ్లిష్ విభాగంలో బిజినేపల్లి మండలం కారుకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని భాగ్యలక్ష్మి, అచ్చంపేట మండ లం లక్ష్మాపూర్ యూపీఎస్ ఉపాధ్యాయిని ఎం.శ్రీలక్ష్మి, తెలుగు విభాగంలో కొల్లాపూర్ మండలం వరి దెల స్కూల్ టీచర్ చంద్రకళ, లింగాల మండలం అప్పాయిపల్లి యూపీఎస్ ఉపాధ్యాయుడు పి.అనిల్, గణితం విభాగంలో అమ్రాబాద్ పీఎస్ ఉపా ధ్యాయుడు కె.ఎల్లయ్య, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి పీఎస్ ఉపాధ్యాయుడు ఎస్.బ్రహ్మాచారి, ఎన్విరాన్మెంట్ సైన్స్ విభాగంలో పదర మండలం ఇప్పలపల్లి యూపీఎస్ టీచర్ జె.మోతీభాయ్, బిజినేపల్లి మండలం గౌరారం పీఎస్ ఉపాధ్యాయుడు జె.వేణు రూపొందించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు కిరణ్‌కుమార్, నూరుద్దీన్, శోభారాణి, వెంకటేశ్వరశెట్టి, కార్యాలయ పర్యవేక్షకుడు నాగేందర్ పాల్గొన్నారు. -
నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: హోటళ్లు, దాబాల్లో నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో ఉన్న దాబాల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దాబాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. హోటళ్లు, దాబాలతో పాటు బేకరీల్లో నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆహార పదార్థాలను తయారుచేసేందుకు నాణ్యతతో కూడిన వస్తువులు వినియోగించాలన్నారు. నెల్లికొండ చౌరస్తా వద్ద ఉన్న దాబాల్లో అపరిశుభ్రవాతావరణం ఉండటంతో నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. -
ఏఎస్పీగా వెంకటేశ్వర్లు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా అదనపు ఎస్పీగా వెంకటేశ్వర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో రిజర్వులో ఉండగా.. జిల్లాకు కేటాయించారు. ఇక్కడ అదనపు ఎస్పీగా పనిచేసిన రామేశ్వర్ గతనెలలో బదిలీ అయ్యారు. రవాణారంగ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి నాగర్‌కర్నూల్ రూరల్: మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో రవాణారంగ కార్మికులకు ప్రభుత్వం రూ. 12వేల చొప్పున జీవనభృతి చెల్లించాలని ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పొదిలి రామయ్య డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రవాణారంగ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఆటో రవాణారంగ కార్మికుల జీవితాలను నాశనం చేసిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటోలు నడవడం లేదని.. ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. జీవనోపాధి లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. ప్రభుత్వం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు. ఆటో కార్మికులకు జీవనభృతి చెల్లించి ఆదుకోవాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, పొదిల రాజు, విజయ్, అంజి, మహేశ్, నర్సింహ, బాబా ఇమ్రాన్, బాషా, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
కందనూలు: ప్రతి ఒక్కరూ పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని.. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి అన్నారు. పోషణ్ మాసోత్సవంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని వాత్సల్య మందిరంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని సూచించారు. పౌష్టికాహారం పంపిణీలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. అదే విధంగా పౌష్టికాహారంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ప్రజాపాలన దిశగా..
నియంతృత్వం నుంచి చారిత్రక ఘటనకు గుర్తుగా ప్రభుత్వ కార్యక్రమం● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదలకు ఆత్మగౌరవం ● వ్యవసాయం, విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి ● పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తాం ● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సాక్షి, నాగర్‌కర్నూల్: దశాబ్ధాల తరబడి ఉద్యమాలు, పోరాటాల చరిత్ర తెలంగాణకు ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు. నాటి నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది.. ప్రజాస్వామ్య పాలన అవతరించిన చారిత్రక ఘటనకు గుర్తుగా నేటి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలనలో ప్రజలు భూస్వాముల వద్ద బానిసలుగా బతకాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి మాత్రం విముక్తి కలుగలేదన్నారు. ఆపరేషన్ కాటర్ పిల్లర్, ఆపరేషన్ పోలో పేరుతో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై పోరాటం చేసిన ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని తమ ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు.కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, చిత్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించామని.. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒకేసారి నాలుగు ప్రాజెక్టులకు రూ. 7వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 311.644 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని వివరించారు. కేఎల్‌ఐకి అనుసంధానంగా పులిజాల నుంచి చంద్రసాగర్ చెరువు వరకు 15 కి.మీ. బ్రాంచ్ కెనాల్ నిర్మాణం కోసం రూ. 107.20 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజ్–1 కింద తెలకపల్లి, ఉప్పునుంతల, లింగాల, బల్మూర్, అచ్చంపేట మండలాల్లో 57,200 ఎకరాలకు నీరందించేందుకు రూ. 1,534 కోట్ల అంచనాలతో పరిపాలనా అనుమతులు పొందినట్టు వివరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. కాగా, ప్రజాపాలన వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో ఈ సేవలను కొనసాగించడానికి యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి రోగుల జేబులకు చిల్లుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రుల వద్ద బ్యానర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది. పాలమూరు పట్టణంలో చాలా ఆస్పత్రులకు రోగులు రాగా సేవలు బంద్ చేసినట్లు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. అన్ని ఆస్పత్రుల ముఖద్వారాల దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఉన్నట్లు నోటీస్ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేస్తున్న ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కో ఆస్పత్రికి రూ.కోట్లలో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం భారంగా మారినట్లు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. చివరగా గతేడాది మార్చి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆస్పత్రులకు బడ్జెట్ విడుదల కావడం లేదు. దీంతో ఈ విభాగం కింద కేసులను అడ్మిట్ చేసుకోవడంతోపాటు ఓపీ సేవలు అందించడం సవాల్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసిన సర్జరీలు, అంచనా వివరాలు జిల్లా చేసిన బకాయిలు సర్జరీలు (రూ.లలో..) గద్వాల 527 1,02,78,990 మహబూబ్‌నగర్ 19,032 46,95,71,170 నాగర్‌కర్నూల్ 133 34,03,362 నారాయణపేట 275 1,02,52,882 వనపర్తి 603 1,94,18,046 బకాయిలు రూ.కోట్లకు చేరడంతో ప్రైవేటు ఆస్పత్రుల విముఖత సేవలు నిలిపివేతతో పేదలకు ఆర్థిక ఇబ్బందులే.. మొదటి రోజు ఆస్పత్రులకు వచ్చి తిరిగి వెళ్లిన రోగులు? -
సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
నాగర్‌కర్నూల్ రూరల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎర్రజెండా నీడలో సాగిందన్నారు. నిజాం నిరంకుశ పాల నకు వ్యతిరేకంగా పోరాడుతూ తెలంగాణ ప్రాంతా న్ని ఎర్రజెండా మయం చేసిన కామ్రేడ్ భీమి రెడ్డి, నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ, మల్లు స్వరా జ్యం, అరుట్ల కమలాదేవి, దొడ్డి కొమురయ్య వంటి ఎందరో నేతలు అమరులయ్యారని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని గుర్తించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు, కందికొండ గీత, పొదిల రామయ్య, అశోక్, యాద య్య, వెంకటేశ్, కాశన్న, సత్యనారాయణ, రవి, మల్లికార్జున్, రాఘవేందర్, కృష్ణయ్య, వెంకటయ్య, బాలస్వామి పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర కృషి : ఎస్పీ నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు పోలీసు సిబ్బంది 24 గంటలపాటు సంసిద్ధంగా ఉంటున్నట్లు తెలిపారు. సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరంగా ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళలు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి నాగర్‌కర్నూల్ క్రైం: మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సురక్షితంగా ఉంటుందని.. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఆరోగ్య సంరక్షణ కోసం ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా మార్చుకోవాలని సూచించారు. పూర్వం జొన్న, సజ్జ, రాగులు వంటి ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండే వారని గుర్తుచేశారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తారని.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తోందన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహించే వైద్యశిబిరాల్లో మహిళలకు ఈఎన్టీ, నేత్ర, రక్తపోటు, మధుమేహం, దంత పరీక్షలతో పాటు నోటి, రొమ్ము ఇతర క్యాన్సర్, రక్తహీనత, టెలిమానస్ సేవలు, సికిల్ సెల్ ఎనీమియా తదితర వైద్యపరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ పాల్గొన్నారు. నిండుకుండలా రామన్‌పాడు జలాశయం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కు లు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు. -
సామాజిక న్యాయం దిశగా అడుగులు..
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాపాలన కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలకు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టామన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నెరవేరుస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించి ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన 2.58 లక్షల దరఖాస్తులకు గాను 56వేల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇప్పటికే 11,622 ఇళ్లను కేటాయించి.. 6,599 ఇళ్లకు మార్కింగ్ పూర్తిచేసినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుభరోసా, రుణమాఫీ, రైతుబీమా పథకాలతో పాటు సన్నరకం వరిధాన్యానికి బోనస్ చెల్లిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 14,757 మంది రైతులకు రూ. 39.51 కోట్ల బోనస్ చెల్లించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలో విద్యార్థులు లేక మూతబడిన 23 పాఠశాలలను తిరిగి ప్రారంభించామని చెప్పారు. 21 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించామన్నారు. ● జిల్లాలోని 22 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తరగతులు బోధిస్తున్నట్టు వివరించారు. విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సైతం ముఖ గుర్తింపు హాజరు వర్తింపజేశామని.. దీంతో ఉపాధ్యాయుల హాజరు శాతం, సమయపాలన మెరుగుపడిందన్నారు. సమగ్ర మహిళా ఆరోగ్య పథకం కింద మహిళలకు 8 రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 17,883 మంది మహిళలకు రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిపారు. రహదారుల విస్తరణకు హైబ్రిడ్ ఆన్యూటీ మోడల్ కింద రూ. 166కోట్ల నిధులతో 16.60 కి.మీ. మేర పనులు మంజూరు చేశామన్నారు.తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో రోజుకు 72,716 లీటర్ల పాలను సేకరిస్తున్నామని చెప్పారు. పాల సేకరణలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. గోవులు, గేదెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయిల్‌పాం తోటల సాగును ప్రోత్సహిస్తూ.. రైతుల ఆదాయం పెంచేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 200 మంది రైతులతో 753 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు నాటించామన్నారు. -
‘టీఎల్ఎం‘ మేళాకు వేళాయె..
● దృశ్య, శ్రవణ అనుభూతితో దీర్ఘకాల జ్ఞాపకం ● విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పెంపుదల ● పాల్గొననున్న 20 మండలాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మండల స్థాయిలో టీఎల్ఎం మేళాను పూర్తిచేశాం. జిల్లాస్థాయిలో నిర్వహించే టీఎల్ఎం మేళాకు ప్రతి మండలం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలి. దీన్ని ద్వారా విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే అవకాశం ఉంటుంది. వినూత్న బోధనలతో విద్యార్థులను అకట్టుకోవచ్చు. – రమేశ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి కందనూలు: ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న చిన్నారుల్లో అక్షర బీజాలు నాటి.. వారిని చదువులో ముందుకు నడిపించేందుకు విద్యాశాఖ వినూత్న పద్ధతులు పాటిస్తోంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించే దిశగా ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తోంది. అందులో భాగంగా మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో టీఎల్ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాలు నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వినూత్న బోధనా పద్ధతులు పాటించడం.. పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించడం టీఎల్ఎం దోహదపడుతుంది. 1 నుంచి 5వ తరగతి వరకు.. జిల్లావ్యాప్తంగా గత నెలలో 1నుంచి 5వ తరగతి వరకు మండలస్థాయిలో టీఎల్ఎం మేళా నిర్వహించారు. మొత్తం 20 మండలాల్లో ఎంపికై న ఉత్తమ టీఎల్ఎంలను గురువారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ప్లవర్ హైస్కూల్లో నిర్వహించే జిల్లాస్థాయి మేళాలో ప్రదర్శించనున్నారు. ఇందులో భాషా పాఠాలు, అక్షరమాల, పద బంధాలు, కథాచిత్రాలు, గణితం, సంఖ్యా మోడళ్లు, ఆకారాలు, కొలతలు, గణన పద్ధతులు, పర్యావరణం, జంతువులు, పక్షులు, రుతువులు, చారిత్రక స్మారకాలు, సంప్రదాయాలు, సైన్స్ ప్రయోగాలు తదిత ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఉపాధ్యాయులు రూపొందించిన టీఎల్ఎంలలో జోడించి ప్రదర్శించనున్నారు. వీటి ద్వారా విద్యార్థులకు నేర్చుకోవాలని ఆసక్తి పెరగడంతో పాటు దృశ్య అనుభూతి కలుగుతుంది. టీఎల్ఎం తయారీతో ఉపాధ్యాయుల అంతర్గత ప్రతిభ కూడా బయటకు వస్తుందని విద్యాశాఖ అభిప్రాయపడుతోంది. సులువుగా అర్థమయ్యేలా.. బోధన ప్రక్రియను సులభతరం చేసి.. విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఉపయోగపడే ప్రతి వస్తువు, వనరు, పరికరం బోధన అభ్యసన సామగ్రిగా చెప్పవచ్చు. ఈ తరహా బోధనలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగే బోధన అభ్యసన ప్రక్రియ మెరుగుపడుతుంది. వీటి ద్వారా ఉపాధ్యాయుడు బోధనను అత్యంత ప్రభావవంతంగా నిర్వహించవచ్చు. విద్యార్థులు కూడా చురుగ్గా నేర్చుకుంటారు. అభ్యసన ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. విద్యార్థుల్లో ఆలోచన, విమర్శనాత్మక శక్తి పెరుగుతుంది. దృశ్య, శ్రవణ సాధనాలను టీఎల్ఎం బోధనలో ఉపయోగిస్తారు. మెరుగైన ఫలితాలే లక్ష్యం.. ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతంపైగా పేద విద్యార్థులే చదువుతుంటారు. వీరి తల్లిదండ్రులకు విద్యాభ్యాసం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో కనీస సామర్థ్యాలు పెంపొందించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ విధానంలో తొలుత 45 నిమిషాల పాటు ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తాడు. ఆ తర్వాత పాఠ్యాంశానికి సంబంధించిన సామగ్రిని ప్రదర్శించి.. విద్యార్థులతో అభ్యసనం చేయిస్తారు. దీంతో విద్యార్థులు వేగవంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు: 497 ప్రాథమికోన్నత: 124విద్యార్థులు: 26,203 ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను మండల స్థాయిలో ఎంఈఓ పర్యవేక్షణలో ప్రదర్శించారు. ఎన్సీఆర్టీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి మండల స్థాయిలోని పది ఉత్తమ టీఎల్ఎంలను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. వీటిలో తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానం అంశాల్లో రెండేసి.. అన్నింటిలో ఉత్తమంగా ఉన్న మరో రెండేసి చొప్పున ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మండల స్థాయిలో ముగ్గురు స్థానిక విద్యా నిపుణులతో కూడిన జ్యూరీని నియమించారు. జిల్లాస్థాయిలో డీఈఓ ఆధ్వర్యంలో ఆరుగురు నిపుణుల జ్యూరీ కమిటీ అగ్రభాగాన నిలిచిన ఎనిమిది ఉత్తమ టీఎల్ఎంలను రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. -
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
అచ్చంపేట రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా అచ్చంపేటకు వచ్చిన గువ్వల బాలరాజుకు స్థానిక బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మహిళ లు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రజాకార్ల పాలనను కాంగ్రెస్ ప్రభు త్వం తలపిస్తుందని అన్నారు. గతంలో తనను ఓడించడానికి బీఆర్ఎస్ నాయకులే కుట్రలు చేశార ని గువ్వల ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాగా, పట్టణంలో బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కార్యకర్తలకు ముందస్తు హెచ్చరికలు చేయడంపై అసహనం వెలిబు చ్చారు. మరోవైపు అంబేడ్కర్ విగ్రహం చుట్టూ బీజేపీ జెండాలు కట్టారని అంబేడ్కర్ సంఘం, దళిత సంఘం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదుతో మున్సిపల్ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో బీజేపీ జెండాలు, తోరణాలను తొలగించారు. అయితే ఓర్వలేకనే కుట్ర పూరితంగా కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. లింగాల చౌరస్తా లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, నరేందర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మంగ్యానాయక్, బాలాజీ, రామోజీ, సీతారాంరెడ్డి, మహేందర్, శంకర్ పాల్గొన్నారు. -
ఉద్యమానికి ఊపిరి..
ఆత్మకూర్ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్‌నగర్ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్ కిష్టన్న, హరిజన్ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్‌రెడ్డి, వడ్డేమాన్ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్ వేసి జైలులో నిర్బంధించారు. -
అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం
అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్ 12న నిజాంనవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతి రేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. స్మరించుకోని పాలకులు.. నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం. -
డిజిటల్ లైబ్రరీనివినియోగించుకోవాలి
నాగర్‌కర్నూల్: పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత డిజిటల్ లైబ్రరీని వినియోగించుకోవాలని ఎంపీ మల్లు రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్‌తో కలిసి ఎంపీ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. సీఎస్ఆర్ నిధుల నుంచి యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ప్రత్యేకంగా రూ.3.67 లక్షలతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ పోటీ పరీక్షలు, వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్‌ను ఆన్లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం జిల్లాలో ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, సీఎస్ఆర్ నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల నమోదును వంద శాతం పూర్తి చేయాలని ఎంపీ మల్లు రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ నిధుల అభివృద్ధి పనుల పురోగతి, సీఎస్ఆర్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రహదారులు, భవనాలు, పాఠశాలలు, వసతిగృహాలు వంటి అన్ని పనులను వేగంగా పెంచాలన్నారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతిగృహాల్లో ఖాళీ పోస్టుల వివరాలు సేకరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం ఉన్నారు. -
సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు
చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం.. రజాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తల్లడిల్లిన అప్పంపల్లి అమరవీరులకు గుర్తింపేది? -
నాయకత్వం వహించాడు..
మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు. – అంజన్న, ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి పోరాటంలో ఎంతో పాత్ర.. తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్, తెలుగు ఆశన్న, దాసర్పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు. – సాయిలు, రిటైర్డ్ టీచర్, అప్పంపల్లి -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మల్దకల్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మండలంలోని మల్లెందొడ్డిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మల్లెందొడ్డికి చెందిన వెంకటేష్ (30) హోటల్ కొనసాగిస్తూ జీవనం సాగించేవాడు. భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవల కారణంగా ఈ నెల 11న భార్య పద్మ వేడి నూనెను వెంకటేష్‌పై పోయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు గద్వాలకు తరలించి, మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ నందీకర్ తెలిపారు. మృతుడికి భార్య పద్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి లింగాల: వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొత్తకుంటపల్లికి చెందిన ఇరగోటి మల్లమ్మ(42) చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఎస్ఐ వెంకటేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. లింగాల నుంచి స్వగ్రామమైన కొత్తకుంటపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త మల్లయ్య, నలుగురు సంతానం ఉన్నారు. మృతురాలి కుమారుడు విష్ణుకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పగలు బొంతలు కుట్టే పని.. రాత్రికి చోరీలు
వనపర్తి: ఖాకీ సినిమా తరహాలో ఉదయం జీవనోపాధి కోసం పనిచేసుకుంటున్నట్లుగా జనావాసాల మధ్య సంచరిస్తూ.. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని రాత్రి సమయంలో దోపిడికి పాల్పడుతున్న బొంతలు కుట్టే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం రూరల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి ముందస్తు పథకం ప్రకారం ఒక వ్యాన్‌లో బొంతలు కుట్టే వృత్తి పేరుతో గ్రామాల్లో తిరుగుతారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో తమ వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో ఇంటి తాళం, బీరువాలను పగలగొట్టి బంగారు, వెండి వస్తువులతో పాటు నగదు ఎత్తుకెళ్తారు. ఇటీవల ఇలాంటి చోరీ వనపర్తి మండలంలోని పెద్దగూడెంతండాలో చోటుచేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ముఠాను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ నెల 14న సాయంత్రం పెద్దగూడెం క్రాస్ రోడ్డు వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలు చేపట్టారు. మినీ వ్యాన్‌లో ఇనుప రాడ్డలతో అనుమానస్పదంగా ప్రయాణిస్తున్న వారిని విచారించగా.. పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కొండ హరికృష్ణ, గజ్జుల కృష్ణయ్య, గజ్జుల వినోద్, గజ్జుల భాగ్యలక్ష్మితో పాటు వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానికి చెందిన గుజ్జుల రాజశేఖర్, గుజ్జుల లక్ష్మిని రిమాండ్‌కు తరలించారు. వీరిపై పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల్లో చోరీ కేసులు నమోదై ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ. 25 వేల నగదు, 25 గ్రాముల బంగారం, 43 తులాల వెండి, ఓమిని కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన వనపర్తి సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు జలంధర్‌రెడ్డి, వేణుగోపాల్, కానిస్టేబుళ్లు రఫీ, అంజనేయులును డీఎస్పీ అభినందించారు. -
పీయూ స్నాతకోత్సవానికి కమిటీలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వచ్చే నెల 16న పీయూ 4వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం వీసీ శ్రీనివాస్ అధ్యక్షతన పలు కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా రిజిస్ట్రార్ రమేష్‌బాబును, మెటీరియల్ కంటెంట్ డెవలప్మెంట్ చైర్మన్‌గా ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, గోల్డ్‌మెడల్స్ కమిటీ చైర్మన్‌గా కంట్రోలర్ ప్రవీణ, ఫెలిసిటేషన్ కమిటీ చైర్మన్‌గా అధ్యాపకులు కిషోర్, హాస్పిటాలిటీ కమిటీ చైర్మన్‌గా వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, స్టేజ్, ఆడిటోరియం కమిటీ చైర్మన్‌గా ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ నాగం కుమారస్వామిని నియమించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ స్నాతకోత్సవం నిర్వహణలో కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయాలని, కార్యక్రమాన్ని విజయంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. -
ఎట్టకేలకు.. బోనులోకి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పాలమూరు పట్టణ ప్రజలను రెండున్నర నెలలుగా భయాందోళనకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. జిల్లాకేంద్రానికి అతి సమీపంలోని తిర్మల్‌దేవునిగుట్ట, వీరన్నగట్టు, డంపింగ్ యార్డుల్లో తిరగాడుతున్న చిరుతను బంధించేందుకు చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి. వీరన్నపేట సమీపంలో తిర్మల్‌దేవునిగుట్ట వద్ద ఏర్పాటు చేసిన బోనులోని మేకపిల్లను తినేందుకు వచ్చిన చిరుత సోమవారం బోనుకు దొరికిపోయింది. దీంతో పట్టణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకేంద్రం శివారులోని గుట్టల్లో తిరుగుతున్న చిరుతను బంధించేందుకు కొంతకాలంగా అటవీ, పోలీసు, మున్సిపల్ శాఖల సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ చేసినా తప్పించుకు తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ.. ట్రాప్, సీసీ, లైవ్ కెమెరాలతో చిరుత సంచారాన్ని నిరంతర పర్యవేక్షణ చేసి ఎట్టకేలకు బోనుకు చిక్కేలా చేశారు. కాగా.. బోనులో పడిన చిరుత బయటికి వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో తల ముందుభాగంలో స్వల్పగాయాలయ్యాయి. చిరుతను ట్రాక్టర్లో జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలించి.. అక్కడ వెటర్నరీ వైద్యు లతో చికిత్స అందించారు. అనంతరం కలెక్టర్ విజ యేందిర, డీఎఫ్ఓ సత్యనారాయణ సమక్షంలో డీసీ ఎం వాహనంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలజికల్ పార్క్‌కు తరలించారు. అక్కడ వెటర్నరీ వైద్య నిపుణులు చిరుతకు వైద్య పరీక్షలు నిర్వహించి.. 18 నెలల వయసుతోపాటు ఆడపులిగా నిర్ధారించినట్లు డీఎఫ్ఓ తెలిపారు. అప్రమత్తంగానే ఉండాలి.. జిల్లాలో అడవులు పెరిగిన నేపథ్యంలో చిరుతల సంఖ్య పెరిగింది. ప్రజలు వాటి పట్ల అప్రమత్తంగానే ఉండాలి. వీరన్నపేట సమీపంలోని తిర్మల్‌దేవునిగుట్ట వద్ద బోనులో చిక్కిన చిరుతను హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు తరలించాం. – సత్యనారాయణ, డీఎఫ్ఓ 5 బోన్లు ఏర్పాటు.. టీడీగుట్ట, శ్మశాన వాటిక ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అటవీ, పోలీసు అధికారులు, సిబ్బంది రెండున్నర నెలలుగా నిరంతరాయంగా శ్రమించారు. ఎప్పటికప్పుడు చిరుత కదలికలను పసిగట్టేందుకు ఆయా ప్రాంతాల్లో 20 ట్రాప్ కెమెరాలు, 5 లైవ్ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు 2 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. ఎలాగైనా చిరుతను బంధించేందుకు 5 బోన్లు ఏర్పాటు చేశారు. రెండున్నర నెలలుగా ముప్పుతిప్పలు పెట్టిన చిరుత తాజాగా తిర్మల్‌దేవునిగుట్ట వద్ద పట్టుబడిన వైనం హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కుకు తరలింపు ఊపిరి పీల్చుకున్న పాలమూరు పట్టణవాసులు -
గుప్తనిధుల కోసం గుడిగోపురం ధ్వంసం
బల్మూర్: గుప్తనిధి కోసం గుర్తు తెలియని దుండగులు గుడిగోపురం ధ్వంసం చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మండలంలోని బాణాల సమీపంలోని పురాతన కాకతీయుల నాటి శివాలయంపై గోపురాన్ని దుండగులు ధ్వంసం చేసి గుప్తనిధి కోసం ప్రయత్నించారు. గమనించిన గ్రామస్తులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివాలయంపై ఉన్న గర్భగుడి గోపురాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో కొంతభాగం కిందపడిన అనవాలు అక్కడ ఉన్నాయి. శివాలయం గ్రామానికి దూరంగా ఉండడంతో దుండగులు ఇందుకు బరితెగించినట్లు తెలుస్తుంది. గతంలో కూడా శివాలయం లోపలి భాగంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని, పోలీసులు దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనపై ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి..
● ఆటోను తగులపెట్టిన వ్యక్తి ● భార్యాపిల్లలపై పెట్రోల్ పోసేయత్నం.. ● అడ్డుకున్న ఇతర వాహనదారులు ఐదేళ్లుగా తిరుగుతున్నాడు మాల శంకర్‌కు వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేయడం కోసం ఐదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఇటీవల ధరణిలో రావడంతో అప్పటి నుంచి పాసు పుస్తకంతో పాటు ఓఆర్సీ సర్టిఫికెట్ కోసం దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బులు ఖర్చు చేసుకున్నాడు. ఇటీవల ధరణిలో నమోదు కావడంతో ఓఆర్సీ, పట్టాదారుపాస్ పుస్తకం మ్యాన్వల్గా ఇవ్వడానికి దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని విసిగిపోయాడు. ఈ ఘటనపై దేవరకద్ర ఆర్ఐని ‘సాక్షి’ వివరణ కోరగా మాల శంకర్ 45రోజుల కిందట భూ భారతిలో దరఖాస్తు చేసుకున్నాడని, దీనిపై విచారణచేసి ఫైల్ తహసీల్దార్‌కు ఇచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ సంతకాలు చేసి ఫైల్ ఆర్డీఓ కార్యాలయానికి పార్వర్డ్ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఫైల్ అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మహబూబ్‌నగర్ ఆర్డీఓకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మహబూబ్‌నగర్ క్రైం: తనకు వారసత్వంగా వచ్చిన భూమికి విరాసత్ చేయకుండా గత కొన్ని రోజుల నుంచి రెవెన్యూ అధికారులు వేధింపులకు గురి చేయడంతో విసిగిపోయిన ఓ ఆటో డ్రైవర్ మొదట ఆటోపై పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఆ తర్వాత భార్యాపిల్లలపై పెట్రోల్ పోయడానికి యత్నించే క్రమంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు పెట్రోల్ బాటిల్‌ను తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన మాల శంకర్‌కు తన తండ్రి నుంచి 1ఎకరం 3 గుంటల భూమి వారసత్వంగా వచ్చింది. ఈ భూమిని విరాసత్ చేయడానికి 5 ఏళ్ల కిందట నుంచి దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అయినా అధికారులు నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఏడాది మార్చిలో భూమికి సంబంధించిన ఓఆర్సీ హక్కులు సైతం శంకర్‌కు వచ్చాయి. దీనిని ఆన్లైన్ నమోదు చేసి మ్యాన్వల్గా ఓఆర్సీ సర్టిఫికెట్, పట్టదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని మూడు నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయాడు. చివరకు సోమవారం సాయంత్రం తనకు సంబంధించిన ఆటోను పాలమూరు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాత కొంత పెట్రోల్‌ను భార్య, ముగ్గురు అమ్మాయిలపై పోయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు అడ్డుకున్నారు. మొదట ఆటోలో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు దించి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆటోపై పోసి ఆ తర్వాత నిప్పు అంటించడంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి టూటౌన్ పోలీసులు, మహబూబ్‌నగర్ రెవెన్యూ అధికారులు చేరుకుని వివరాలు సేకరించారు. మహబూబ్‌నగర్ అర్భన్ డీటీ దేవేందర్ ఆధ్వర్యంలో రిపోర్ట్ తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు అందించారు. -
పాముకాటుతో రైతు మృతి
వంగూరు: మండలంలోని సర్వారెడ్డిపల్లి తండాకు చెందిన రైతు నేనావత్ శ్రీను(36) సోమవారం పాముకాటుకు గురై మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. శ్రీను మండలంలోని ఉల్లంపల్లి శివారులో పది ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. సోమవారం వ్యవసాయ పనుల కోసం తండా నుంచి కొంతమంది కూలీలను తీసుకొని పొలానికి వెళ్లాడు. కూలీలు ఒకవైపు వరి మడుల్లో పనిచేస్తుండగా శ్రీను మరో మడిలో పనిచేస్తూ పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కూలీలు గమనించి, పాటు కాటు వేసిందని గుర్తించి చికిత్స కోసం ఆటోలో వంగూరుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో కల్వకుర్తికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కమారులు ఉన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారిపై ఉండవెల్లి శివారులో అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టాయి. దీంతో రోడ్డుపై అవయవాలు చెల్లాచెదురైన మృతుదేహాన్ని హైవే సిబ్బంది గుర్తించి పోలీసులకు సోమవారం సమాచారం అందించారు. సమాచారం తెలియడంతో నేరుగా ఎస్ఐ శేఖర్ మృతదేహం వద్దకు వెళ్లి పరిశీలించారు. హైవే సిబ్బందికి దొరికిన అవయవాలను పోలీసులు అలంపూర్ మార్చురీకి తరలించారు. మృతి చెందిన మహిళ చీర పసుపు పచ్చరంగు, ఎరుపు రంగు జాకెట్, ఒక నలుపు రంగు సంచి, తాళం చెవి, ఒక ఆంత్రం ఉందన్నారు. గుర్తించిన వారు ఉండవెల్లి పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్ఐ శేఖర్ సూచించారు. మహిళ మృతి లింగాల: కుటుంబ కలహాలతో ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్తచెర్వుతండాకు చెందిన ఆరెకంటి లక్ష్మి(42) ఈ నెల 12న కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లి పోయింది. కుటుంబ సభ్యులు ఆమెను ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. కొత్తచెర్వుతండా నుంచి అంబట్పల్లి మార్గంలో ఓ నీటి గుంటలో పశువుల కాపర్లకు ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన మహిళగా ఆమెను గుర్తించారు. ఆమెకు భర్త కురుమయ్య, ముగ్గురు సంతానం ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వివాహిత అదృశ్యం నవాబుపేట: మహిళ అదృశ్యమైన ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. మండలంలోని కొండాపూర్‌కు చెందిన వడ్డె మహేశ్వరి(30) ఇంట్లో నుంచి ఆదివారం రాత్రి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఈ విషయంలో భర్త వడ్డె శేఖర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, మహిళ తనతోపాట ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రించామని.. తాను నిద్రలోకి వెళ్లిన అనంతరం మధ్యరాత్రి మెళకువ వచ్చి చూస్తే ఆమె కనిపించలేదని పోలీసులకు వివరించాడు. సోమవారం బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ విషయంలో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వాస్మోల్ తాగి మహిళ బలవన్మరణం గోపాల్పేట: అప్పుల బాధ భరించలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. పొలికెపాడుకు చెందన కేతేపల్లి నిరంజన్ కూరురు మనీషా(26)కు ఏడేళ్ల కిందట శ్రీపురం గ్రామానికి చెందిన కుర్మయ్యతో వివాహమైంది. ఏడాది తర్వాత విడాకులు తీసుకుంది. అనంతరం తండ్రితోపాటు హైదరాబాద్‌లో ఉంటూ కిరాణా షాపు నడిపించుకుని బతుకుతుండేది. రెండేళ్ల కిందట కిరాణాషాపు షార్ట్ సర్క్యూట్లో దగ్ధమై సుమారు రూ.8లక్షల వరకు నష్టపోయింది. తెలిసినవారితో అప్పులు చేసి కిరాణాషాపు తిరిగి ప్రారంభించింది. సరిగ్గా నడవకపోవడంతో మనస్తాపానికి గురైంది. పొలికెపాడు చేరుకొని ఆదివారం వాస్మోల్ తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వనపర్తి ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. తండ్రి నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. -
ఈపీఎఫ్ అవకతవకలపై విచారణ
జడ్చర్ల టౌన్: స్థానిక పురపాలికలో 2012–2104 ఆర్థిక సంవత్సరాల్లో కార్మికుల వేతనాల్లో విధించిన ఈపీఎఫ్ కోతల డబ్బులను వారి ఖాతాలో జమ చేయలేదు. దీంతో కార్మికులు వివిధ కారణాలతో మృతిచెందితే వారి కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. ఈ విషయంపై మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ అనేక దఫాలు ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2025, మే 30న యూనియన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు, విన్నపాలకు స్పందించి సోమవారం విచారణ నిమిత్తం హైదరాబాద్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారి కేతన్ పుర కార్యాలయానికి వచ్చారు. శానిటరీ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ మనోజ్‌తో సమావేశమయ్యారు. 2012–2014లో పనిచేసిన కార్మికుల వివరాలతో పాటు ఇప్పటి వరకు మృతిచెందిన వారి జాబితా ఇవ్వాలని సూచించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2012–2014 మధ్య జరిగిన ఈపీఎఫ్ లోపాల గురించి వెంకటేశ్ ఆయనకు వివరించారు. ఇప్పటి వరకు 46 మంది కార్మికులు మృతిచెందగా ఏ ఒక్కరికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తెలిపారు. కార్మికుల వేతనాల్లో డబ్బులు కట్ చేసి పీఎఫ్ ఖాతాలో జమ చేయనందునే ఈ పరిస్థితి తలెత్తిందని తెలియజేశారు. విచారణ అధికారి కేతన్ మాట్లాడుతూ.. పీఎఫ్ నిధికి మున్సిపల్ కార్యాలయం నుంచి జమచేసిన రూ.40 లక్షలను కార్మికుల జాబితా ప్రకారం వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులకు వర్తించే హక్కుల గురించి అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి వికసిత్ రోజ్‌గార్ యోజన ద్వారా నెలకు రూ.15 వేలు ఎలా పొందాలో తెలియజేశారు. విచారణ అధికారిని కలిసిన వారిలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు ఇందిరమ్మ, కార్మికులు ఉన్నారు. అధికారికి సమస్యలు విన్నవించిన పుర కార్మికులు -
హే కృష్ణా.. ఇకనైనా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని రైతుల రోదన అరణ్య రోదనగా మిగులుతోంది. వేల సంఖ్యలో కృష్ణ్ణ జింకలు పంటలను నాశనం చేస్తుండడం ఏటేటా నిత్యకృత్యంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో బాధిత రైతుల్లో ఆందోళన నెలకొంది. కృష్ణ జింకలను పట్టుకుని అడవులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా.. రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. అధికారుల్లో కొరవడిన ప్రణాళిక, పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి వెరసీ రైతులకు తిప్పలు తప్పడం లేదు. సుమారు 12 వేల జింకలు.. కృష్ణానది పరివాహకమైన మాగనూరు, కృష్ణా, నర్వ, మరికల్, మక్తల్ మండలాల పరిధిలో ప్రధానంగా వరి, పత్తి, కంది సాగవుతోంది. సుమారు 10, 12 ఏళ్ల క్రితం ఆయా ప్రాంతాల్లో వందలలోపే ఉన్న కృష్ణ జింకల సంతతి క్రమక్రమంగా పెరిగింది. ప్రస్తుతం 10 వేల నుంచి 12 వేల వరకు కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ అంచనా. అవి ఆహారం కోసం మూకుమ్మడిగా పంట చేలల్లోకి వస్తుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, కాయలు, తీగలు.. కృష్ణ జింకలు పంట పొలాల్లో తిరగాడే క్రమంలో చేలల్లో మొదట్లో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో నాలుగైదు పర్యాయాలు విత్తనాలు వేయడం ఆయా రైతులకు ఏటా పరిపాటిగా మారింది. ఇంతే కాకుండా.. పత్తి కాయలు, కంది కాయలను సైతం జింకలు ఆహారంగా తీసుకుంటుండడంతో పంటలు సరిగ్గా చేతికి రావడం లేదు. వరి పంటలో గుంపులు గుంపులుగా జింకలు తిరుగుతుండడంతో వేసిన గొలుసులు తెగిపోయి నష్టం వాటిల్లుతోంది. దిగుబడి తగ్గుతుండడంతో ఆ రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. పంటలు కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే.. ప్రతి ఏటా నష్టం వాటిల్లుతుండడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఎట్టకేలకు ముందడుగు.. కృష్ణ జింకల రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా ముడుమాల్ వద్ద 74.10 ఎకరాల భూమి హద్దులను రెవెన్యూ అధికారులు గుర్తించి మార్కింగ్ చేశారు. ఇటీవల ఆ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆర్డర్లు సైతం జారీ అయ్యాయి. దీంతో అటవీ శాఖ ఎట్టకేలకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు పనుల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. చెరువు పరిధిలోకి రాని సుమారు 44 ఎకరాల్లో శాశ్వత, చెరువు పరిధిలోకి వచ్చే 30 ఎకరాల్లో తాత్కాలికంగా పనులు చేపట్టేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఎలాంటి జాప్యం లేకుండా చూసి.. జింకల సమస్య తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. కృష్ణానది పరీవాహకంలో అన్నదాతల అగచాట్లు విజ్ఞప్తులు.. ప్రతిపాదనలు.. ఆదేశాలకే పరిమితం రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం నష్టంతోపాటు నిత్య కాపలాతో రైతులకు తప్పని తిప్పలు మా కుటుంబానికి దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతిఏటా పత్తి వేస్తున్నాం. జింకల వల్ల విత్తనాలను మళ్లీ మళ్లీ నాటడం ఆనవాయితీగా మారింది. కాయలు పడుతున్నప్పుడు గుంపులుగా దాడి చేసి తింటున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి చేనులోకే వస్తున్నాయి. జింకలను పట్టి పరిరక్షణ కేంద్రాలకు తరలించాలి. – అంపయ్య, గుడేబల్లూరు, కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా కృష్ణాతీరంలో కృష్ణ జింకల బెడద నుంచి పంటలను కాపాడాలని రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జింకలను పట్టి నల్లమల, కవ్వాల్ అడవులకు తరలించాలని ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే నిర్ణయించి.. రూ.2.70 కోట్ల నిధులు సైతం కేటాయించింది. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ముందుగా రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కృష్ణా మండలం ముడుమాల్ వద్ద అందుబాటులో ఉన్న భూమిని అధికారులు పరిశీలించారు. సర్వే నం.192లోని 18.29 ఎకరాలు, సర్వే నం.194లోని 55.21 ఎకరాలు మొత్తం కలిపి 74.10 ఎకరాల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కానీ, ఇందులో తొలుత ఎనిమిది ఎకరాలు, ఆ తర్వాత సుమారు 30 ఎకరాల్లో చెరువు ఉండడం, రెవెన్యూ శాఖ తిరకాస్తు వంటి సమస్యలతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
● రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు వైద్యశిబిరాలు ● మహిళలు సద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్‌కర్నూల్: మహిళా ఆరోగ్యంతోనే శక్తివంతమైన కుటుంబం సాధ్యమవుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన వివిధ శాఖల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య మహిళా.. శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య నిపుణులచే ప్రత్యేకంగా వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరాల్లో రక్త పరీక్షలతో పాటు నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్, రక్తహీనత, క్షయవ్యాధి, సికిల్ సెల్ అనీమియా తదితర అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మహిళా శిశు సంక్షేమశాఖ, డీఆర్డీఓ, విద్యాశాఖ, ట్రైబల్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ సంక్షేమ శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ● ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 91 అర్జీలు అందాయని.. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ● జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్ఐఆర్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇళ్ల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పల్లె దవాఖానాను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలను తెలుసుకున్నారు. దవాఖానాలో అందుబాటులో ఉన్న ఔషధాలు, వాటి కాలపరిమితిని పరిశీలించారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషకాహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. -
అక్టోబర్ 15 వరకు..
ముడుమాల్ వద్ద రిహాబిలిటేషన్ సెంటర్‌కు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి.. వచ్చేనెల 15 వరకు పనులు మొదలుపెడుతాం. దీంతోపాటు ఎక్కడైతే కృష్ణ జింకలు ఎక్కువ ఉన్నాయో.. అక్కడ మినీ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్‌కు.. ఆ తర్వాత క్రమంగా నల్లమల లేదా కవ్వాల్ అడవులకు తరలిస్తాం. నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో మినీ రిహాబిలిటేషన్ సెంటర్ కోసం పది ఎకరాల్లో భూమి గుర్తించాం. ఇక్కడ పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ సెంటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – అరవింద్‌రెడ్డి, డీఎఫ్ఓ, నారాయణపేట నేను 20 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కాయలు కాసే దశ. ప్రతిరోజూ కాపలా ఉంటున్నా. ఇప్పుడే కాదు.. విత్తనాలు పెట్టిన నాటి నుంచి పత్తి చేతికొచ్చే వరకూ జింకలు రాకుండా ప్రతిరోజూ నాకు ఇదే పని. జింకలను ఇక్కడి నుంచి అటవీ ప్రాంతానికి తరలిస్తేనే మా సమస్య తీరుతుంది. అధికారులు ఇప్పటికై నా పటిష్ట చర్యలు తీసుకోవాలి. – బస్లింగప్ప, చేగుంట, కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా -
ఐసీడీఎస్‌ను నీరుగార్చేందుకు కుట్ర
కొల్లాపూర్: ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, అంగన్వాడీ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతమ్మ, మాసమ్మ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్ కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఎం శ్రీవిద్య ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులను కూడా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని నిర్ణయించడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానాలతో అంగన్వాడీ కేంద్రాలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. పీఎం శ్రీవిద్య అమలు బాధ్యత అంగన్వాడీ వర్కర్లకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పక్షాన నిలవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, ఏరియర్స్, రిటైర్మెంట్ బెని ఫిట్స్ చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల తరహాలోనే జీతాలు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 25న చలో సెక్రటేరియట్ చేపడతామన్నారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయ ఓఎస్డీ కృష్ణయ్యకు వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నా యకులు పర్వతాలు, శివవర్మ, రామయ్య, రాము, రాజు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అఽతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో చిన్నారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించనున్నారు. ఘనంగా ఇంజినీర్స్ డే దోమలపెంట: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని సోమవారం శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం సీఈ కేవీవీ సత్యనారాయణ, ఎస్ఈలు రవీంద్రకుమార్, ఆదినారాయణ, డీఈలు, ఏడీఈలు, ఏఈలు విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యదర్శి బి.మదన్‌మోహన్‌రెడ్డి (ఏడీఈ), చంద్రశేఖర్ (డీఈ), ఏఈల అసో సియేషన్ కార్యదర్శులు వై.నరేశ్, నరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి వెల్దండ: ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం వెల్దండలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం ఇతరత్రా కారణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలకు ప్రభుత్వం సీఎం సహాయనిధి అందించి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్లు శేఖర్, నాగులునాయక్, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, బీఆర్ఎస్ నాయకులు నిరంజన్, నర్సింహ, మధుసూదన్‌రెడ్డి, జోగయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. ‘నక్కలగండి’ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెంచాల్సిందే.. అచ్చంపేట రూరల్: నక్కలగండి ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్న తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెంచడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. అచ్చంపేట మండలం మార్లపాడుతండా, కేశ్యాతండాల్లో సోమవారం అదనపు కలెక్టర్ అమరేందర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించగా.. ముంపు బాధితులు తమ సమస్యలను వెలిబుచ్చారు. ఇంటి ఖాళీ స్థలాలకు గజం రూ. 3వేల చొప్పున చెల్లించడంతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, పట్టణాల సమీపంలో ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. అదే విధంగా ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధిపరిచి ముంపు బాధిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో ఆర్డీ ఓ మాధవి, తహసీల్దార్ సైదులు, ఆర్ఐ బాల్‌రాం, నాయకులు భాస్కర్, రవి ఉన్నారు. కేఎల్ఐ కాల్వ నిర్మాణానికి సహకరించాలి వెల్దండ: కేఎల్ఐ సబ్ కెనాల్ నిర్మాణానికి రైతులు సహకరించాలని భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్తీక్‌రావు, ఇరిగేషన్‌శాఖ అధికారి వెంకట్‌రెడ్డి కోరారు. సోమవారం మండలంలోని అజిలాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో కేఎల్ఐ సబ్ కెనాల్ నిర్మాణంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేఎల్ఐ డీ–8 కాల్వ ద్వారా మాడ్గుల మండలం పోలేపల్లి మీదుగా నాగిళ్ల వరకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. సబ్ కెనాల్ నిర్మాణంతో మాడ్గుల మండలంలోని చంద్రాయన్పల్లి, కలకొండ, వెల్దండ మండలం అంకమోనికుంట, అజిలాపూర్ గ్రామ రైతులకు సాగునీరు అందుతుందని వివరించారు. అజిలాపూర్‌కు చెందిన 30మంది రైతుల పొలాల్లో సబ్ కెనాల్ నిర్మాణం జరుగుతుందని.. రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు. కాల్వ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. -
యూరియా కోసం రైతుల బారులు
పెద్దకొత్తపల్లి: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సోమవారం పెద్దకొత్తపల్లి సింగిల్‌విండో కార్యాలయం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. వివిధ గ్రామాల నుంచి దాదాపు 600 మంది రైతులు యూరియా కోసం రాగా.. కేవలం 120 మందికి మాత్రమే రెండు బస్తాల చొప్పున యూరియా లభించింది. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. వారానికి ఒక లారీ చొప్పున యూరియాను సరఫరా చేస్తుండటంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వరిపంట పొట్ట దశలో ఉండటం.. యూరియా సకాలంలో లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వానాకాలం పంటలకు సరిపడా యూరి యా అందించాలని కోరుతున్నారు. -
అతివలకు అభయం
● వేధింపులకు గురయ్యే వారికి సత్వర సాయం ● ఈ ఏడాది 220 కేసులు పరిష్కారం ● జిల్లాలో వాహనం సైతం అందుబాటులోకి.. ●సఖి కేంద్రంలో బాధిత మహిళలకు కౌన్సెలింగ్, న్యాయ, వైద్య సహాయం, తాత్కాలికంగా ఆశ్రయం కల్పించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. మహిళలపై హింస, లైంగిక దాడులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. బాధిత మహిళలు ఒక్క ఫోన్‌కాల్ చేసినా సకాలంలో స్పందిస్తున్నాం. – సునీత, సఖి సెంటర్ కోఆర్డినేటర్ జిల్లాకేంద్రంలోని సఖి కేంద్రం సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో మహిళలపై హింస, వేధింపుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మహిళలు వేధన, హింసకు గురవుతున్నారు. ఈ క్రమంలో బాధిత మహిళలకు జిల్లా సఖి కేంద్రం అండగా నిలుస్తోంది. గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు సత్వర సహాయాన్ని అందిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు సఖి కేంద్రానికి 243 ఫిర్యాదులు రాగా.. ఇందులో 220 కేసులను పరిష్కరించారు. వన్‌స్టాప్ సెంటర్‌గా ‘సఖి’ సేవలు.. గృహహింస, లైంగిక, వరకట్న వేధింపులు చోటు చేసుకున్నప్పుడు బాధిత మహిళలు సురక్షితంగా ఉండి.. సాంత్వన పొందేందుకు సఖి సెంటర్ కీలకంగా పనిచేస్తోంది. వన్ స్టాప్ సర్వీస్ (ఓఎస్సీ)గా ఏర్పాటై 24 గంటల పాటు పనిచేసే సఖి కేంద్రంలో బాధిత మహిళలకు అవసరమైన సత్వర సహాయాన్ని అందిస్తున్నారు. బాధితులకు కౌన్సె లింగ్, వైద్య సహాయం, న్యాయ సలహాలు అందించడంతో పాటు తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. గాయపడిన మహిళలకు సత్వర చికిత్స అందించడం, మెడికో లీగల్ సర్టిఫికెట్ పొందడం, పోలీస్, న్యాయ సహాయాన్ని పొందడంలో సహాయం చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో మొబైల్ వ్యాన్ సైతం అందుబాటులోకి రావడంతో సఖి కేంద్రం సభ్యులు బాధితుల వద్దకే వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. రక్షణ అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో సఖి కేంద్రానికి తరలిస్తున్నారు. గృహహింస కేసులు: 157లైంగిక వేధింపులు: 2 మిస్సింగ్: 26 పరిష్కరించినవి: 220 -
ఆసియాలోనే మొదటిది..
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే మొదటి ప్రాజెక్టుకు కాగా.. ప్రపంచంలో రెండోది. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో సైఫన్ 520 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కి.మీ., ఎడమ కాల్వ 20 కి.మీ.,లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కట్ట ఇప్పటి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31న రెండోసారి కట్టకు గండిపడింది. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో ఏడున్నర దశాబ్దాల క్రితం అమెరికాలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు సరళాసాగర్. మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని దీన్ని నిర్మించారు. దేశ స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ఏదైనా ప్రత్యేకతతో దీన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతంత్య్రం అనంతరం అప్పటి మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెప్టెంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రారంభించారు. వర్షం నీరు ఊకచెట్టువాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవడం, ఈ వాగు సమీపంలోని గ్రామాలను తరుచూ వరద ముంపునకు గురికావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం ఆధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అమెరికా వెళ్లి టెక్నాలజీని తీసుకువచ్చిన ప్రాజెక్టు రూపకర్త ఎస్ఈ పీఎస్ రామకృష్ణరాజు (ఫైల్) -
సీతారాముల మాస కల్యాణోత్సవం
చారకొండ: పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం సీర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి దేవాలయంలో స్వామి వారి మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో కల్యాణ మండపం అలంకరించి, ఆలయ అర్చకులు మంత్రోచ్ఛరణల నడుమ మాస కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని జూపల్లి గ్రామానికి చెందిన రంగినెని విజయమనోహర్ రావు దంపతులు, హైదరాబాద్‌కు చెందిన దుర్శనపల్లి ప్రీతం కావ్వ దంపతులు స్వామివార్ల కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు ఉన్నారు. జిల్లాలో మోస్తరు వర్షం కల్వకుర్తి టౌన్: జిల్లాలో ఆదివారం పలుచోట్ల చిరుజల్లులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. చిరుజల్లులతో కురిసిన వర్షానికి ప్రజలు బయటకు వెళ్లి పనులు చేసుకోకుండా మారింది. జిల్లాలో అత్యధికంగా కల్వకుర్తిలో 31.3 మి.మీ., వర్షం కురవగా.. అత్యల్పంగా బల్మూర్ మండలంలోని కొండనాగులలో 25.8 మి.మీ., వర్షపాతం నమోదైంది. ఊర్కొండలో 30.9, ఉప్పునుంతలలో 30.7, వంగూరులో 30.5, తెలకపల్లిలో 30.2, తిమ్మాజిపేటలో 30.0, వెల్దండలో 29.8, అచ్చంపేటలో 29.8, తాడూరులో 29.7, లింగాలలో 29.6, బల్మూరులో 29.1, చారకొండలో 29.1, కోడేరులో 29.1, పెద్దకొత్తపల్లిలో 29.0, కొల్లాపూర్‌లో 28.9, పెంట్లవెల్లిలో 28.7, బిజినేపల్లిలో 28.6, అమ్రాబాద్‌లో 28.3, పదరలో 27.7, నాగర్‌కర్నూల్‌లో 27.3 మి.మీ., వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు ఇలాగే చిరుజల్లులతోపాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. గత కొన్నిరోజులుగా కురుస్తున్న ముసురు, భారీ వర్షాలతో ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే పత్తి పంటలో రోజుల తరబడిగా నీరు నిలిచి తెగుళ్లు ఆశిస్తుండగా ఇతర పంటల పరిస్థితి సైతం అలాగే మారింది. -
దోస్త్.. లాస్ట్ చాన్స్
● డిగ్రీలో చేరేందుకు స్పాట్ అడ్మిషన్ పక్రియ ● నేడు, రేపు చివరి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్కల్వకుర్తి టౌన్: డిగ్రీ కోర్సులలో చేరేందుకు పలు విడతలుగా నోటిఫికేషన్ జారీచేసిన ఉన్నత విద్యామండలి మరోమారు ఆయా కోర్సులలో చేరికకు చివరి అవకాశం కల్పించింది. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను సోమవారం, మంగళవారం ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) చివరి అవకాశంగా ఇచ్చిన స్పాట్ అడ్మిషన్‌ను ఉపయోగించుకోవాలని, ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోని వారు వెంటనే స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆసక్తి గల కోర్సులలో చేరాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నోటీస్ బోర్డులలో ఉంచగా.. ఏయే కోర్సులలో ఖాళీలు ఉన్నాయో దోస్త్ పోర్టల్‌లో వివరాలను పొందుపరిచారు. నేరుగా రిపోర్టు.. దోస్త్ చివరి అవకాశంలో భాగంగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్త్ పోర్టల్‌లో రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో కట్టిన రుసుంతో వచ్చి న రశీదును వారు ఎంచుకున్న కళాశాలలో చూయించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా భర్తీ కాని సీట్లకు ఈ నెల 18, 19వ తేదీలలో వన్‌టైం స్పాట్ అడ్మిషన్ రౌండ్లో అడ్మిషన్ పొందవచ్చు. ఇదే తేదీలలో నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇది వరకే కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ ప్ర క్రియలో పాల్గొనే అవకాశం ఉండదని ఉన్నత విద్యామండలి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు తేవాలి స్పాట్ అడ్మిషన్లో భాగంగా అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు వారి వెంట ఎస్సెస్సీ మెమో, ఇంటర్, టీసీ, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, రెసిడెన్సీ, ఏదైనా బ్రిడ్జి కోర్సు చదివి ఉంటే, దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫారంతోపాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్, మెరిట్ ఆధారంగా వివిధ కోర్సులలో సీట్లను భర్తీ చేయనున్నారు. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. విద్యార్థులే ఆయా కళాశాలలో ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోండి.. దోస్త్ వివిధ విడతలలో అడ్మిషన్ పొందని విద్యార్థుల కోసం సోమ, మంగళవారాల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి చేపట్టనుంది. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు పొందేందుకు ఇదే చివరి అవకాశం. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. – శ్రీపాద శార్వాణి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల, కల్వకుర్తి -
కోయిల్‌సాగర్ @ రూ.84 లక్షలు
పాలమూరు జిల్లా వరప్రదాయిని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 71 ఏళ్లు పూర్తయింది. 1947లో తెలంగాణ ప్రాంతానికి ఇంకా స్వాతంత్య్ర రాక ముందు ఆనాటి నైజాం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. 1.20 టీఎంసీల సామర్థ్యంతో 26.6 అడుగుల ఎత్తు అలుగు ఉండే విధంగా ప్రాజెక్టుకు అప్పటి ఇంజినీర్లు రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారంభించి 1954లో పూర్తిచేశారు. కేవలం రూ.84 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నుంచి మొదటిసారి 9 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 1984లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.91 లక్ష వ్యయంతో 6 అడుగుల మేర కట్టను బలోపేతం చేసి ఎత్తును పెంచి అలుగుపై 13 గేట్లు నిర్మించారు. ఆనాటి ఎమ్మెల్యే వీరారెడ్డి కృషి ఫలితంగానే గేట్ల నిర్మాణం జరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. 2.27 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆయకట్టు కుడి కాలువ కింద 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రూ.359 కోట్ల అంచనాతో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి 2006లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచుతూ జూరాల నుంచి కృష్ణా జలాలను కోయిల్‌సాగర్‌కు తరలించేలా రూపకల్పన చేశారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి పరుగులు పెడుతున్న నీరు (ఫైల్)ఉమ్మడి పాలమూరు విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఏకై క ప్రాజెక్టు కోయిల్‌సాగర్. గతంలో చిన్ననీటి తరహా ప్రాజెక్టుగా ఉండగా ఎత్తిపోతల పథకం ప్రారంభం తర్వాత భారీ నీటి పారుదల శాఖ కిందకు మార్చారు. సాగునీటితోపాటు పాలమూరు పట్టణానికి తాగునీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నారాయణపేట జిల్లా, కొడంగల్ ప్రాంతానికి తాగునీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలు ఉండగా.. నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్, ధన్వాడ మండలాలకు సాగునీరు అందిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు కాల్వ ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపుతున్నారు. నైజాం ప్రభుత్వ హయాంలో 1947– 54 మధ్య నిర్మించిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదు. కోయిలకొండ కోట సమీపంలో ఉండడం వల్ల ప్రాజెక్టుకు కోయిల్‌సాగర్ అని పేరు పెట్టారు. రెండు గుట్టల మధ్య ప్రాజెక్టును పటిష్టంగా సున్నం, గచ్చు ఉపయోగించి నిర్మించారు. కట్టకు రెండు వైపులా రాతి గోడ నిర్మించి.. బయటి నుంచి మట్టితో నింపారు. ఇక అలుగును సైతం సున్నం గచ్చు ఉపయోగించి నిర్మించారు. ఆనాడు ఉపయోగించిన పరికరాలు నేటికీ ప్రాజెక్టు సమీపంలోనే పడి ఉన్నాయి. ఇక ప్రాజెక్టు నమూనాను ముందుగా తయారు చేసి నిర్మాణం తర్వాత ప్రారంభించారు. ఆనాడు చేసిన నమూనా నేటికి ప్రాజెక్టు సమీపంలోనే కనిపిస్తుంది. ప్రాజెక్టును 10 జూలై 1954లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేఎం ఖార్జు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల చిన్నబొల్లారం, పెద్ద బొల్లారంతోపాటు మరో రెండు చిన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే బాధితులకు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోవడంతో కొత్తగా బొల్లారం పేరుతో గ్రామం ఏర్పడింది. కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణం పనులు (ఫైల్) కట్టను నిర్మిస్తున్న ఆనాటి కూలీలు (ఫైల్) -
లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
నారాయణపేట: పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం నారాయణపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో జీఓ 69 తీసుకొచ్చేందుకు కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా భూనిర్వాసితుల ఆకాంక్ష మేరకు రూ.20 లక్షలకు పరిహారం పెంచినట్లు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజార్వాయర్‌తో పాటు జాయమ్మ చెరువుతో రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మూలన పడిందన్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు డా.చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే కావడం.. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్ష మేరకు పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. అనంతరం భూ పరిహారం పెంచి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలో భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి వాకిటి శ్రీహరి విరమింపజేశారు. అనంతరం సీవీఆర్ భవన్‌కు చేరుకొని మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డికి స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నారు. రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
అద్భుతం.. ఆ కట్టడాలు
నాగర్కర్నూల్సరళమైన కోయిల్‌సాగర్ ● ‘ఇంజినీర్’ నైపుణ్యతకు నిదర్శనంగా నిలుస్తున్న రెండు ప్రాజెక్టులు ● ఆసియా ఖండంలోనే మొదటిగా పేరుగాంచిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ● అప్పట్లోనే సాంకేతికతను పరిచయం చేసిన వనపర్తి సంస్థానాధీశులు ● అతి తక్కువ వ్యయంతో కోయిల్‌సాగర్ నిర్మాణం ● ఉమ్మడి పాలమూరుకు తలమానికంగా నిలిచిన జలాశయాలు సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
‘ఇన్స్పైర్’ కావట్లే..
కందనూలు: చిన్నారుల ఆలోచనలకు సరికొత్త రూపు ఇవ్వడానికి.. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాల వైపు మళ్లించి.. వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో శాస్త్ర, సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతి ఏడాది ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తోంది. అయితే దీనికి జిల్లాలో ఆశించిన మేర స్పందన రావడం లేదు. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ సోమవారంతో ముగియనుండగా కేవలం 640 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 895 దరఖాస్తులు రావడం గమనార్హం. కాగా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారంలోగా ప్రాజెక్టులను ఆన్లైన్లో నామినేట్ చేయడానికి అవకాశం ఉంది. కనీసం 5 దరఖాస్తులు జిల్లావ్యాప్తంగా 125 ప్రాథమికోన్నత, 131 ఉన్నత, 156 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అయితే అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. వన్‌టైం రిజిస్ట్రేషన్‌లో భాగంగా విద్యాలయాల వివరాలు పొందుపర్చాలి. ప్రతిభను వెలికి తీసేందుకే.. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి ఇన్స్పైర్ మనక్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలు ఆహ్వానిస్తారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 10 లక్షల ఆలోచనలు ఆహ్వానించి అందులో పది వేల ఆలోచనలను రాష్ట్రస్థాయికి, వెయ్యి ఆలోచనలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. తుది విడతలో 60 ఆలోచనలను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. ఆయా దశల్లో కొనసాగే ఈ ప్రక్రియలో వేలాది మంది విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుంది. పలు అంశాలపై ప్రాజెక్టులు.. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, సమాజాభివృద్ధి, గణితం, సైన్స్ తదితర అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించాలి. జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికై న నమూనాను ప్రదర్శించడానికి రూ.10 వేలను ప్రోత్సాహకంగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. జిల్లాస్థాయిలో ఎంపికై తే వాటిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులను మరింత మెరుగైన విధంగా తయారు చేయడానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మరో రూ.25 వేలు ఇస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతిభచూపిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్లో అభినందనలు, ఆతిథ్యంతోపాటు పేరొందిన శాస్త్రవేత్తలను కలిసే అవకాశం కల్పిస్తారు. విద్యార్థులను ప్రోత్సహించాలి.. ఎక్కువ మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలి. కానీ, వారి నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 640 మాత్రమే నమోదయ్యాయి. ప్రతిరోజు హెచ్ఎంలు, సైన్స్ ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం. – రాజశేఖర్‌రావు, జిల్లా సైన్స్ అధికారి ప్రైవేట్ పాఠశాలల అనాసక్తి.. ప్రస్తుత కాలంలో ర్యాంకులతో పోటీ పడుతున్న ప్రైవేటు పాఠశాలలు ఇలాంటి సృజనాత్మక విషయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వారికి ర్యాంకులే పరమావధిగా విద్యాబోధన కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో కొంత మెరుగ్గా ఉన్నా.. ప్రైవేటు పాఠశాలల నుంచి మాత్రం విద్యార్థులకు ప్రోత్సాహం కనిపించడం లేదు. విద్యాశాఖ అధికారులు ఎన్నిసార్లు వారికి తెలియజేసినా ముందుకు రాకపోవడం గమనార్హం. జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నది 640 మందే.. జూలై 1న ప్రారంభం.. నేటితో ముగియనున్న గడువు ప్రతి పాఠశాల నుంచి 5 చొప్పున రావాలని సూచన క్షేత్రస్థాయిలో కనిపించని ఆశించిన ఫలితాలు ర్యాంకులే పరమావధిగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు -
లోక్‌అదాలత్‌లో 23,967 కేసులు పరిష్కారం
నాగర్‌కర్నూల్ క్రైం: చిన్నచిన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. జాతీయ లోక్‌అదాలత్‌లో సివిల్, ఎలక్ట్రిసిటీ, బ్యాంక్, పెట్టి కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా ఇరువర్గాలకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 23,967 కేసులు పరిష్కారం కాగా.. కాంపౌండింగ్ ఫీజు కింద రూ. 61,89,914 వసూలైందని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా మాట్లాడుతూ.. కక్షిదారులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్‌అదాలత్ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం లోక్‌అదాలత్‌లో రాజీ అయిన కక్షిదారులకు జిల్లా జడ్జి చేతులమీదుగా అవార్డు కాపీలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్‌జడ్జి వెంకట్రామ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి శృతిదూత, ఫస్ట్‌క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనిధి, డీఎస్పీలు శ్రీనివాసులు, సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమాకాంత్‌రావు, కార్యదర్శి మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నష్టపరిహారం చెల్లించండి
కోడేరు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కోడేరు మండలం తీగలపల్లిలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. శనివారం భూ నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి మాట్లాడారు. నష్టపరిహారం కోసం రైతులు 13 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా పాలకులు ఏమి పట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. తీగలపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో 70మంది రైతులు 43 ఎకరాల భూమిని కోల్పోయారని.. ప్రభుత్వం కొందరికి మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం తగదన్నారు. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధు, శివకుమార్, పద్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యావిధానం ప్రమాదకరం కందనూలు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం–2020 అత్యంత ప్రమాదకరమని.. ఈ విధానం పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య అన్నారు. శనివారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ మాజీ అఖిలభారత అధ్యక్షుడు సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభతో పాటు ‘నూతన జాతీ య విద్యా విధానం‘ అంశంపై సెమినార్ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తిని పెంచడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించి విద్యను వాణిజ్యీకరణ చేస్తుందని ఆరోపించారు. ఇది పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్య అందుబాటులో లేకుండా చేస్తుందన్నారు. మరోవైపు ఫీజుల పెరుగుదలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం వల్ల అసమానతలు మరింత పెరుగుతాయన్నారు. కొఠారి కమిషన్ సూచన మేరకు జీడీపీలో 6శాతం, కేంద్ర బడ్జెట్లో 10శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివ వర్మ, జిల్లా అధ్యక్షుడు పి.శివశంకర్, కార్యదర్శి నాగపూర్ మధు, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
జిల్లాలో జోరువాన
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో శనివారం జోరువాన కురిసింది. కొల్లాపూర్, బల్మూర్ తదితర మండలాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిమునిగాయి. జిల్లాకేంద్రంలో అత్యధికంగా 22 మి.మీ. వర్షపాతం నమోదైంది. వంగూరు మండలంలో 16.5 మి.మీ. వర్షం కురిసింది. పదరలో 6.5, తెలకపల్లిలో 6.3, అమ్రాబాద్‌లో 5.5, అచ్చంపేటలో 5.3, లింగాలలో 5 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 22 మి.మీ. వర్షపాతం -
పరిషత్ ఓటర్లు @ 6,47,342
● 214 ఎంపీటీసీ స్థానాలకు 1,224 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ప్రణాళిక అచ్చంపేట: జిల్లా, మండల పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. ప్రాదేశిక ఎన్నికల కసరత్తులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల ఆయా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లా పరిషత్‌తోపాటు ఎంపీడీఓ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించారు. జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 6,47,342 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 3,23,016 మంది పురు షులు, 3,24,315 మంది మహిళలు, 11 మంది ఇతరులు ఉన్నారు. 460 గ్రా మ పంచాయతీల పరిధిలో 214 ఎంపీటీసీ స్థానా లు ఏర్పాటు కాగా 1,224 పోలింగ్ కేంద్రాల వారీ గా ఖరారయ్యాయి. హైకోర్టు తీర్పును అనుసరించి ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సమస్య నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా అధికారులు మాత్రం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. -
తీరని యూరియా కష్టాలు
జిల్లాకేంద్రంలో మళ్లీ రోడ్డెక్కిన అన్నదాతలు ● సింగిల్‌విండో ఎదుటప్రధాన రహదారిపై ధర్నా ● రోజుల తరబడి నిరీక్షించినా బస్తా యూరియా అందడం లేదని ఆందోళన ● పంటలకు సరిపడా ఎరువులు అందించాలని వేడుకోలు 15 రోజులుగా వస్తున్నా.. నేను ఈ సారి 3 ఎకరాల్లో పత్తి, వరి పంటలు సాగుచేశాను. ఇప్పటివరకు పంటలకు యూరియా వేయకపోవడంతో సరిగ్గా ఎదగలేదు. ఎక్కడికి వెళ్లినా యూరియా దొరకడం లేదు. జిల్లాకేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయానికి 15రోజులుగా వస్తున్నాను. ఎప్పుడు వచ్చినా యూరియా దొరకడం లేదు. – ఆంజనేయులు, రైతు, కుమ్మెర, నాగర్‌కర్నూల్ మండలం ఉదయం నుంచే క్యూలో.. మాకు ఉన్న 4 ఎకరాల్లో వరిపంట సాగుచేస్తున్నాం. యూరియా కోసం 10రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. ఉదయం 6 గంటలకే వచ్చి లైన్లో నిలుచున్నా యూరియా అందడం లేదు. ఎన్ని రోజులు ఎదురుచూసినా ఇదే పరిస్థితి. రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా సరఫరా చేయాలి. – ఎల్లమ్మ, మహిళా రైతు, శ్రీపురం సర్దుబాటు చేస్తున్నాం.. జిల్లాలో అవసరమైన యూరియాను ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ఎక్కడా స్టాక్ పక్కదారి పట్టకుండా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాం. గోదాం, ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నాం. ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకంపై సైతం అవగాహన కల్పిస్తున్నాం. – యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సాక్షి, నాగర్‌కర్నూల్: వానాకాలం పంటలు వేసుకుని నెల రోజులు దాటినా జిల్లా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలు, గోదాముల వద్ద నిరీక్షిస్తున్నారు. భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి నిత్యం పడిగాపులు కాసినా యూరియా లభించని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం సైతం యూరియా లభించక జిల్లాకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఎదుట ప్రధాన రహదారిపై రైతన్నలు ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని రైతులను శాంతింపజేశారు. జిల్లాలోని పలు మండలాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నెలరోజులు దాటినా.. జిల్లాలో నెలరోజుల క్రితమే వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు ప్రారంభమైంది. పంటలకు యూరియా వేద్దామనుకున్న రైతులకు ప్రారంభం నుంచే యూరియా కొరత నెలకొంది. సీజన్ ప్రారంభంలో డిమాండ్ ఎక్కువగా ఉండి.. తర్వాత తగ్గుముఖం పడుతుందనుకుంటే నెల రోజులు దాటినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అదునుకు యూరియా వేయకపోవడంతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సరిగ్గా ఎదగడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రోజుల తరబడి ఎదురుచూస్తున్నా యూరియా లభించక రోడ్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వెల్దండ, అచ్చంపేట, లింగాల మండలాల్లో తీవ్రమైన యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 569 మె.ట. -
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం
గద్వాల: ‘తన తలను రైలు కింద పైట్టెనా చనిపోతా కానీ, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్ చౌరస్తాలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పారు.. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. సొంత అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని రాబోయే ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం కేటీఆర్ గద్వాల పర్యటన సందర్భంగా ముందుగా జిల్లాకేంద్రంలోని ప్రధాన మార్గంలో ర్యాలీ తీసి.. తేరు మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని చెబుతున్న ఎమ్మెల్యే బండ్ల ఈ రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో.. నియోజకవర్గానికి ఒక్క రూపాయి వచ్చిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆరు గ్యారంటీ పథకాలు ఎగ్గొట్టినందుకు పార్టీ మారాడా? రైతుబంధు రూ.15 వేలు ఇవ్వనందుకు పార్టీ మారాడా? ఆసరా పింఛన్ ఇవ్వనందుకు పార్టీ మారాడా? షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద ఆడపడుచులకు తులం బంగారం ఇవ్వనందుకు పార్టీ మారాడా? ఎందుకు పార్టీ మారాడో ఎమ్మెల్యే బండ్ల ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇంకా సిగ్గులేని విషయం ఏమంటే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి సంకలో కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని మండిపడ్డారు. 2014లో గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడినప్పటికీ మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకులాలు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, 1,275 డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రభుత్వ ఆస్పత్రి ఇలా అన్ని రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పంటలు సాగు చేసుకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడొద్దని ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుబంధు వారి ఖాతాలో జమచేశామని, పేదింటి ఆడబిడ్డలు ఇబ్బందులు పడొద్దని షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు, దళితబంధు వంటి పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు. ‘‘ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాం. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరుకే వలస వచ్చేలా కృషి చేశాం. గతంలో గద్వాల ప్రాంతానికి వచ్చిన క్రమంలో రోడ్డు పక్కనున్న పొలంలో పనులు చేస్తున్న కూలీలను పలుకరించి మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే కర్ణాటకలోని రాయచూరు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి వచ్చినట్లు చెప్పారు.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ దినపత్రికలో ‘నాడు బీళ్లు.. నేడు సిరులు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని బహిరంగ సభలో ప్రదర్శించారు. అలాగే సీడ్ పత్తి రైతులకు అండగా ఉంటామని సీడ్ కంపెనీలు పెట్టే ఇబ్బందులు తొలగిపోయేలా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పారు. కష్టకాలంలో పార్టీకి అండగా.. గద్వాలలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాసు హనుమంతు అండగా నిలబడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పార్టీలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. అలంపూర్ నియోజకవర్గం రాజోళిలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించినందుకు 15 మంది రైతులను జైలుకు పంపారని ఆరోపించారు. నిర్మల్‌లో రద్దు చేసిన విధంగా ఇక్కడ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని, ఆ ఫ్యాక్టరీ లైసెన్సు రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తూ రెతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్య, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బాసు హనుమంతు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం సొంత అభివృద్ధి కోసమే ‘బండ్ల’ పార్టీ మారాడు ఉప ఎన్నికల్లో ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించండి గట్టు ఎత్తిపోతలను పండబెట్టారని మండిపాటు గద్వాల జిల్లాతో సహా మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకులాలు, ఆస్పత్రుల ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టు మండలంలో 35 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని గట్టు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి 40 శాతం పనులు పూర్తిచేశామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎత్తిపోతలను పండబెట్టిందని దుయ్యబట్టారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు. ఉప ఎన్నికల కంటే ముందుగా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తా యని గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉన్నాయని ఇందులో కనీసం 30 వార్డులు గెలిపించాలని విన్నవించారు. -
పొదుపు మహిళలకు చీరలు
● ఒక్కొక్కరికి రెండు చొప్పున పంపిణీ ● వారం రోజుల్లో జిల్లాకు చేరుకోనున్న చీరలు ● జిల్లాలో 1,78,741 మంది సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నాం.. ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరో వారం రోజుల్లో జిల్లాకు చీరలు చేరుకోనున్నాయి. వీటిని జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డు గోదాంలో భద్రపరిచి.. అక్కడి నుంచి మండలాలు, గ్రామాలకు తరలించి సభ్యులకు అందజేస్తాం. – ఓబులేషు, డీఆర్డీఓ నాగర్‌కర్నూల్/అచ్చంపేట: స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇందిరా మహిళాశక్తి పథకం కింద ప్రతి సభ్యురాలికి దసరా కానుకగా రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలను పంపిణీకి సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వం రేషన్ కార్డుల్లో సభ్యులైన ప్రతి మహిళకు ఒక చీర చొప్పున పంపిణీ చేయగా.. గతేడాది చీరల పంపిణీకి బ్రేక్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రెండేసి చొప్పున చీరలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహాలు సాగుతున్నాయి. ఇప్పటికే స్వయం సహాయక సంఘాలు ఎన్ని ఉన్నాయి.. ఎంత మంది సభ్యులు ఉన్నారనే వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. అందుకు అనుగుణంగా జిల్లాకు చీరలు సరఫరా చేయనున్నారు. వివిధ రకాల డిజైన్లు.. గతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు రూ.500 పైగా ఖర్చు కాగా.. మగువల మనసు దోచేలా పలు రకాల డిజైన్లు జోడించారు. మరో వారం రోజుల్లో జిల్లాకు చీరలు చేరుకోనున్నాయి. ఈ నెల 23నుంచి చీరల పంపిణీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాకు సరఫరా చేసే చీరలను జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఉన్న గోదాంలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయా మండలాలు, గ్రామాలకు తరలించనున్నారు. జిల్లాలో 17,874 సంఘాలు.. జిల్లాలో 17,874 మహిళా సంఘాలు ఉండగా.. 1,78,741 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే అవకాశం కల్పించారు. కాగా, గతంతో పోలిస్తే ఈసారి చీరలు నాణ్యతగా ఉన్నట్లు తెలుస్తోంది. చీరల పంపిణీకి ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గ్రామస్థాయిలో ఐకేపీ, మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బందికి చీరల పంపిణీ బాధ్యతలను అప్పగించనున్నారు. -
జర్నలిస్టులపై కేసులు అన్యాయం
ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా పత్రికలు రాసే కథనాలను విమర్శలుగా తీసుకుని వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేయాలి కానీ, జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేయడం సరికాదు. ‘సాక్షి’ పత్రికపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాల పనితీరుపై కథనాలు రాసే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ రాసిన కథనాల్లో ఏదైనా తప్పులు ఉంటే వాటిని ఆధారాలతో సహా నిరూపించుకోవాలి. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా విమర్శను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి తప్ప విమర్శ చేసే వారిని హింసకు గురిచేస్తాం.. టార్గెట్ చేస్తాం.. అంటే కుదరదు. ఒక రచయిత, జర్నలిస్టుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం అన్యాయం. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ అధికారం ఉందనే అహంతో పత్రికల స్వేచ్ఛను హరించడం కరెక్ట్ కాదు. అధికారం ఐదేళ్లు మాత్రమే.. చివరగా సమాజానికి జర్నలిజం అనేది శాశ్వతం. రాజకీయాల ముసుగులో అధికారంలో ఉన్నామనే అహంతో ‘సాక్షి’ దినపత్రికపై కేసులు మోపడం కక్షసాధింపులకు దిగడం సరికాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సమాజ శ్రేయస్కరం కాదు. ఒకవేళ పత్రికా ప్రకటనలలో తప్పుగా ఉంటే వాటికి వివరణ కోరాలి తప్ప ఫోర్త్ ఎస్టేట్‌పై ఉక్కుపాదం మోపడం దారుణమైన చర్య. – కొత్త కల్యాణ్‌రావు, ఎన్ఆర్ఐ, కేఎంఆర్ ట్రస్టు చైర్మన్, చిన్నంబావి ప్రభుత్వం ఎవరైనా ప్రజా, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నాయకులు ప్రెస్మీట్లు పెట్టడం భావ ప్రకటన రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని ప్రభుత్వం కాలరాయడం హాస్యాస్పదం. ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సమంజసం కాదు. ఇప్పటికై నా ఏపీ సీఎం చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడితే వారికే మంచిది. – జనార్దన్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట -
రాజీయే రాజమార్గం
● నేడు జాతీయ లోక్‌అదాలత్ ● అప్పీల్ లేకుండా కేసుల పరిష్కారం ● కక్షిదారులకు సత్వర న్యాయంకల్వకుర్తి టౌన్: కోర్టు పరిధిలోని చిన్నచిన్న తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను సత్వరమే పరిష్కరించుకోవడానికి లోక్‌అదాలత్ చక్కటి వేదికగా చెప్పవచ్చు. కక్షిదారుల ఆమోదంతో రాజీ కుదుర్చుకోవడమే గాక, ఇరువర్గాలకు న్యాయం జరిగేలా న్యాయస్థానాలు పరిష్కార మార్గాలు చూపుతాయి. ఇక్కడ కుదిరిన రాజీ కేసులను అప్పీల్ చేసుకోవడానికి వీలు లేకుండా సమస్యను పరిష్కరిస్తాయి. జిల్లాలోని న్యాయస్థానాల్లో శనివారం 4వ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. లోక్‌అదాలత్‌లో మోటార్ వెహికిల్ యాక్టు, ఆబ్కారీ, రుణాలు, కుటుంబ తగాదాలు, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు సంబంధి త అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత జూన్‌లో నిర్వహించిన 3వ జాతీయ లోక్‌అదాలత్‌లో 17,495 కేసులను పరిష్కరించగా.. రూ. 58,37,519 జరిమానా వసూలైంది. కాగా, లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారంతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోక్‌అదాలత్‌కు వచ్చే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు.జాతీయ లోక్‌అదాలత్‌లో పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని కక్షిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాం. చిన్నచిన్న కేసుల్లో రాజీ కుదుర్చుకోవడానికి లోక్‌అదాలత్ ఉపయోగంగా ఉంటుంది. కక్షిదారులు, నిందితులుగా ఉన్నవారు వారి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సంప్రదిస్తే.. వారికి అక్కడి పోలీసులు సహాయం అందిస్తారు. – వెంకట్‌రెడ్డి, డీఎస్పీ, కల్వకుర్తి -
వేతన వెతలు..
జిల్లాలో డెయిలీ వేజ్ వర్కర్లకు 6 నెలలుగా అందని జీతాలు ●సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు రావడం లేదు. డెయి లీ వేజ్ వర్కర్లుగా పనిచేస్తున్న వీరికి ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఏళ్లుగా తక్కువ వేతనాలతోనే పనిచేస్తుండగా.. ఇప్పుడు వేతనాలు నిలిచిపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు నెలనెలా వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి కార్మికులు నిరవదిక సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలోని గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో హాస్టళ్ల నిర్వహణపై ఆందోళన నెలకొంది. గతంలో కలెక్టర్ గెజిట్ ద్వారా డెయిలీ వేజ్ లేబర్‌కు వేతనాలు చెల్లించేవారు. ఈ క్రమంలో కార్మికులకు ప్రతినెలా రూ. 13,500 చొప్పున వేతనం లభించిందని కార్మికులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ 64 అమలు చేయడంతో వేతనం తగ్గిందని అంటున్నారు. ఎక్కడైనా ఏళ్లు గడిచిన కొద్ది జీతం పెరగాల్సి ఉండగా.. ఈ జీఓ ఫలితంగా తమ జీతం రూ. 11,700కే పరిమితమైందని ఆవేదన చెందుతున్నారు. ఈ వేతనం సైతం ఆరు నెలలుగా నిలిచిపోవడంతో వారిలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. డైలీ వేజ్ వర్కర్ల వేతనాలను ఒక్కో జిల్లాల్లో ఒక్కో తీరుగా అమలు చేస్తుండటంతో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని ఖమ్మం తదితర జిల్లాల్లో కార్మికులకు ప్రతినెలా రూ. 26వేల వరకు అందుతోందని.. జిల్లాలో మాత్రం కేవలం రూ. 11,700 అందుతోందని కార్మికులు వాపోతున్నారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు అందించాలని, తమకు టైం స్కేల్ వర్తింపజేయాలని, ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టళ్ల కార్మికుల పరిస్థితి దైన్యం నెలనెలా వేతనాలు అందించాలని డిమాండ్ గిరిజన ఆశ్రమ హాస్టళ్ల ఎదుట నిరవదిక సమ్మెకు దిగిన కార్మికులు జిల్లాలోని 29 గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో సుమారు 150మంది కార్మికులు డెయిలీ వేజ్ లేబర్‌గా పనిచేస్తున్నారు. హాస్టళ్లలో పారిశుద్ధ్యం, వంట పని, విద్యార్థులకు వడ్డించడం తదితర పనులన్నీ వీరే నిర్వహిస్తున్నారు. రోజు ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటీవల భోజనం మెనూలో చేసిన మార్పుల ఫలితంగానూ తమపై పనిభారం పెరిగిందని అంటున్నారు. అయితే సుమారు 15 ఏళ్లుగా కార్మికులుగా పనిచేస్తున్నా.. నెలకు రూ. 11,700 మించి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపోని వేతనాలతో తాము ఇబ్బందులు పడుతుండగా.. ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ సైతం కష్టంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. -
లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పక్షపాతం
కొల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పక్షపాతం చూపుతున్నారని.. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ, జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొల్లాపూర్‌లో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులను ఎంపిక చేసి.. నిజమైన పేదలకు అన్యాయం చేశారన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని ఓవైపు ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతుంటే.. స్థానికంగా మాత్రం అందుకు విరుద్ధంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించాలని వారు కోరారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కేవరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. సీపీఐ నాయకులు ఇందిరమ్మ, కుర్మయ్య, కిరణ్‌కుమార్, తుమ్మల శివుడు, యూసూఫ్, జంగం శివుడు, చందు, శంకర్, శివకృష్ణ, శేఖర్, దామోదర్, రమేశ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
షేర్వాల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇళ్లు
● గృహనిర్మాణశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్‌కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో షేర్వాల్ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలో షేర్వాల్ టెక్నాలజీ ఆధారంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ముందుగా 20వ వార్డు ఈదమ్మగుడి సమీపంలో లబ్ధిదారుడు రవిశంకర్ ఇంటిని సందర్శించి.. పనుల పురోగతిని తెలుసుకున్నారు. 15 రోజుల్లోగా ఇంటి నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారుడికి అప్పగించాలని ఆయన సూచించారు. అనంతరం 13వ వార్డులో బొంద మల్లమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఇటుకలు అవసరం లేకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్ వర్క్, కాంక్రీట్ గోడలతో కేవలం 20 రోజుల్లోనే ప్రభుత్వం అందించే రూ. 5లక్షలతో పక్కా ఇల్లు నిర్మించవచ్చని వివరించారు. జిల్లాలోని పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో మోడల్ హౌస్‌ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీకి మొత్తం 442 ఇళ్లు మంజూరు కాగా.. 248 నిర్మాణంలో ఉన్నాయన్నారు. మిగిలిన ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించి.. వేగవంతంగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. షేర్వాల్ టెక్నాలజీతో కొనసాగుతున్న ఇళ్ల పనుల పూర్తిపై మున్సిపల్, గృహనిర్మాణశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. -
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించాలి
అచ్చంపేట రూరల్: విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని విద్యుత్‌శాఖ ఎస్ఈ కేవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న టీవీ కేబుల్, ఇంటర్నెట్ ఫైబర్ వైర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. ఏదైనా స్తంభం నుంచి కేబుల్ లాగాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించారు. స్తంభాలపై 15మీటర్ల ఎత్తులో కేబుళ్లను అమర్చుకోవాలని.. ఒక్కో స్తంభానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సపోర్టింగ్ వైర్లు కేబుల్ గరిష్ట బరువు మీటర్‌కు 200 గ్రాములకు మించరాదన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా జంక్షన్ బాక్సులకు కరెంట్ వాడుతున్నారని.. ఇకపై నెలవారీ బిల్లులు వసూలు చేస్తామన్నారు. ప్రమాదకరంగా మారిన వైర్లను సరిచేసుకోవడానికి కొంత గడువు ఇస్తామని.. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన పరిశీలించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అచ్చంపేట నుంచి మన్నెవారిపల్లిలోని ఎస్ఎల్బీసీకి సరఫరా అయ్యే విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఎస్ఈ వెంట ఎస్ఏఓ పార్థసారధి, ఏఈ ఆంజనేయులు, సిబ్బంది మహేశ్, లక్ష్మణ్, లాలయ్య తదితరులు ఉన్నారు. -
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి..
ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా విలువలను కాపాడటంలో స్ఫూర్తిగా ఉండాలి. ప్రజల అభిప్రాయాలను తెలిపే పత్రికలను ప్రభుత్వాలు గౌరవించాలి. ఆంధ్రప్రదేశ్‌లో పాత్రికేయులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. – బవాండ్ల వెంకటేశ్, టీఎన్జీవో ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ‘సాక్షి’ పత్రిక ఎడిటర్, పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులను భయపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజల గొంతుకగా నిలిచే పత్రికలపై దాడులను ప్రజలు సహించరు. ప్రతిపక్ష నాయకుల ప్రెస్మీట్లను ప్రచురించినా కేసులు పెట్టడం అన్యాయం. – పొదిల్ల రామయ్య, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, నాగర్‌కర్నూల్ పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. భావ ప్రకటన హక్కులో భాగమైన పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు కాపాడాలి. పత్రికల్లో వచ్చిన వార్తలను ఏకీభవించకపోతే రిజాయిండర్, ఖండన ఇవ్వాలి. కానీ, జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు. ఏకంగా పత్రికా ఎడిటర్‌పైనే కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్‌లో విచారించడం కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తుంది. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉంది. – బోనాసి రామచందర్, న్యాయవాది, నాగర్‌కర్నూల్ -
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య
కందనూలు: ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నట్లు డీఐఈఓ వెంకటరమణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ఏర్పాటుచేసిన స్వాగతోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉందన్నారు. ఇందుకు అధ్యాపకులు చేసిన కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాణి, అధ్యాపకులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు తెలకపల్లి: వైద్యసిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. శుక్రవారం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అంతకుముందు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఇన్చార్జి డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు ఏఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు.. ప్రభుత్వ అనుమతులు తదితర వాటిని పరిశీలించారు. అయితే ఆస్పత్రి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సంబంధిత పత్రాలను డీఎంహెచ్ఓ కార్యాలయానికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాసు ఉన్నారు.