breaking news
Mancherial
-
దాడి కేసులో యువకుల అరెస్టు
జైపూర్: దాడి కేసులో మండలంలోని కుందారం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై శ్రీధర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కుందారం గ్రామానికి చెందిన దాసరి నరేశ్, మారెం అజయ్, బోగే ప్రశాంత్‌లు చెడు వ్యసనాలకు బానిసై గ్రామంలో అల్లర్లు సృష్టిస్తున్నారు. గత నెలలో జక్కం అంజన్నకు చెందిన ఆటోను ఇంటి నుంచి దొంగిలించారు. ఆటో అదుపుతప్పి బోల్తాపడగా మళ్లీ తీసుకొచ్చి ఇంటి వద్ద పెట్టి పారిపోయారు. ఇదే విషయాన్ని అంజన్న ప్రశ్నించగా ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నెల 4న అర్ధరాత్రి అంజన్న ఇంటికి వచ్చి మూడు సీసీ కెమెరాలను పగులగొట్టి అతడిపై దాడి చేసి పారిపోయారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి చెన్నూర్ కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. -
పులుల గణనపై అటవీ సిబ్బందికి శిక్షణ
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ కేంద్రంలో పులుల గణన సర్వేపై బుధవారం అటవీ సిబ్బందికి ఎఫ్‌డీవో రామ్మోహన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. డివిజన్లోని సిబ్బందికి ఎఫ్డీవోతోపాటుగా ఫారెస్ట్ ఫీల్డ్ బయోలజిస్టు ఎల్లం శాఖాహార, మాంసాహార జంతువులను లెక్కించడంపై సూచనలు చేశారు. మూడు రోజులు మాంసాహార జంతువుల గణన ట్రయల్ రన్, మరో మూడు రోజులు ట్రాజెక్ట్ లైన్లో శాఖాహార జంతువుల సర్వే చేయాలని తెలి పారు. జంతువుల అడుగులు, మలం, వెంట్రుకలు, చెట్లపై పడిన గోర్ల ఆనవాళ్లు, నేరుగా చూడడం ద్వారా వన్యప్రాణులను లెక్కించాలని సూచించారు. ఈ సమావేశంలో రేంజ్ అధికారులు శ్రీధరచారి, సుష్మారావు, మమత, సిబ్బంది పాల్గొన్నారు. -
నగరంలో మురికి నీరు సరఫరా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని పలు కాలనీల్లో ప్రజలకు మురికి నీరు సరఫరా అవుతోంది. రంగు మారిన, మురికిగా ఉన్న నీరు వస్తుండడంతో తాగునీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రతీ రోజు వర్షం కురుస్తుండడం, కాలనీల్లో వరద పారుతుండడం, తాగునీటి పైపుల్లోకి బురద చేర డం వల్ల కలుషితమవుతోంది. పైపులైన్ లీకేజీలను సరి చేస్తున్నా ఏదో ఒక కాలనీలో మురికి నీరే సరఫరా అవుతోంది. పాతమంచిర్యాల, మజీద్‌వాడ, హమాలీవాడలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజు లుగా తాగునీరు బురద రంగులో వస్తోంది. కలు షిత నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడే ప్రమా దం ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముల్కల్ల గోదావరి నది వద్ద ఫిల్టర్ బెడ్ నుంచి మంచిర్యాలకు తాగునీరు సరఫరా చేస్తున్నా రు. నగరంలో దాదాపు 16వేలకు పైగా నల్లా కనెక్ష న్లు ఉండగా నీటి సరఫరాకు ఏర్పాటు చేసిన పైపులై న్లు అక్కడక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయి. బురద నీరు చేరి నల్లాల ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోంది. ఫిల్టర్బెడ్లలో శుద్ధి చేసినా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని ముల్కల్ల వద్ద ఉన్న ఫిల్ట ర్బెడ్, మిషన్ భగీరథ పంప్‌హౌజ్‌లో శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. నస్పూరు ప్రాంత ప్రజలకు సింగరేణి ఫిల్టర్‌బెడ్, గోదావరి నదిలో నిర్మించిన పంప్‌హౌజ్ నుంచి సరఫరా చేపడుతున్నారు. ఫిల్టర్బెడ్ల వద్ద నీటిని పూర్తిగా శుద్ధి చేసి తాగునీటి ట్యాంకులకు సరఫరా చేసే క్రమంలోనే లీకేజీలతో కలుషితంగా మారుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకుల నుంచి నల్లాల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే క్రమంలో లీకేజీ పైపుల్లోకి బురద చేరి రంగు మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. వర్షం కారణంగా లీకేజీలు సరి చేయడం, పైపులైన్ల వద్ద పనులు చేపట్టడం ఇబ్బందిగా మారుతోంది. ఈ విషయమై కార్పొరేషన్ ఇంజినీర్ రాజేందర్‌ను సంప్రదించగా.. కొన్ని కాలనీల్లో పైపులైన్ లీకేజీ వల్ల నీరు రంగు మారి వస్తున్నట్లు ఫిర్యాదులు అందిన వెంటనే సరి చేసి శుద్ధమైన తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. -
ఆర్టీసీకి పండుగ
మంచిర్యాలఅర్బన్: బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరి పండుగ చేసుకుంది. దసరా ముందు, తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడిపించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి జిల్లా నుంచి రాజధానికి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. ఉద్యోగం, చదువు రీత్యా హైదరాబాద్‌కు వెళ్లిన వారు సొంతూళ్లకు వచ్చి వెళ్లడానికి బస్సుల రాకపోకలకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది దసరా సందర్భంగా రోజువారీ బస్సులతోపాటు అదనపు బస్సులు తిప్పడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగడంతోపాటు సంస్థకు ఖజానా సమకూరింది. ఉమ్మడి జిల్లా నుంచి ఆయా డిపోల ద్వారా హైదరాబాద్‌కు దసరా ముందు, తర్వాత సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6వరకు 998 అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. 5,10,072 కిలోమీటర్లు నడపడం ద్వారా 1,39,388 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దీంతో రూ.3,01,08,462 ఆదాయం సమకూరింది. దసరా ముందు.. తర్వాత దసరా పండుగకు ముందు ఉమ్మడి జిల్లా(రీజియన్) నుంచి ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల నుంచి 399 ప్రత్యేక బస్సులు నడిపించారు. ఏడు సూపర్ లగ్జరీ(మంచిర్యాల డిపో)లు, 43 సూపర్‌లగ్జరీలు, 23 డీలక్స్, 241 ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బస్సులు నడిపారు. 2,05,348 కిలోమీటర్ల మేర బస్సులు నడపడం ద్వారా 56,467 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. రూ.1,16,02,891 ఆదాయం చేకూరింది. పండుగ తర్వాత ఈ నెల 3నుంచి 6వరకు రీజియన్ వారీగా 599 బస్సులు నడిపారు. ఇందులో 15రాజధాని, 192 సూపర్‌లగ్జరీ, 38 డీలక్స్, 354 ఎక్స్‌ప్రెస్ బస్సులు తిప్పారు. అదనపు బస్సులతో 3,04,724 కిలోమీటర్లు నడిపి 82,921 మంది గమ్యస్థానాలకు చేర్చారు. రూ.1,85,05,571 ఆదాయం వచ్చింది.అధికంగా మంచిర్యాల డిపో నుంచే.. పండుగ నేపథ్యంలో ఆయా డిపోల నుంచి మొత్తంగా 998 బస్సులు నడిపించగా.. ఇందులో అధికంగా మంచిర్యాల డిపో నుంచే 198 బస్సులు ఉన్నాయి. 11,701 మంది మహాలక్ష్మి పథకం ప్రయాణికులు కాగా, 11954మంది టికెట్లు కొనుగోలు చేశారు. 98,867 కిలోమీటర్లు మేర బస్సులు తిప్పి 23,655 మంది ప్రయాణికులను చేరవేయడం ద్వారా రూ.62,70,066 ఆదాయం వచ్చింది. దసరా ముందు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ ఒకటి వరకు 120 బస్సులు 59536 కిలోమీటర్లు నడపడం ద్వారా 14,575 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఇందులో మహాలక్ష్మి పథకం 8192 మంది, 6,950 మంది టికెట్ల కొనుగోలు చేసి ప్రయాణం చేశారు. రూ.35,92,471 సమకూరింది. దసరా తర్వాత ఈ నెల 3 నుంచి 6వరకు 8,513 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.26,77,595 ఆర్జించింది. దసరా ముందు, తర్వాత వచ్చిన ఆదాయంలో ఆదిలాబాద్ రీజియన్ వారీగా పరిశీలిస్తే మంచిర్యాల డిపో ముందుంది. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
నస్పూర్: గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. పట్టణ పరిధిలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బాకీ కార్డును అమలుపర్చాలని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని తెలి పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన వారికే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులను ఆయా పరిధిలోని గ్రామాల వారీగా సమీక్షించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హైరిస్క్ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి
మంచిర్యాలటౌన్: మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో హైరిస్క్ పిల్లలకు వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పిల్లల ఆరోగ్య స్థితిని ప్రతీరోజు తల్లిదండ్రులకు వివరించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. బుధవారం ఆమె ఎంసీహెచ్‌ను సందర్శించి పిల్లలకు అందిస్తున్న వైద్య సేవలు, వ్యాక్సిన్ కేంద్రం పరిశీలించారు. వ్యాక్సిన్ నిల్వలు సిద్ధం చేసుకోవాలని, ప్రతీ బుధ, శనివారాల్లో అన్ని ఆరోగ్య ఉపకేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీహెచ్ఎన్ పద్మ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. పైలేరియా రక్తపరీక్షల కిట్ల వినియోగంపైఅవగాహన మంచిర్యాలటౌన్: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం పైలేరియా నియంత్రణకు ఈ నెల 13నుంచి జిల్లావ్యాప్తంగా చేపట్టనున్న సర్వేలో రక్తపరీక్ష కిట్ల వినియోగంపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత, జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునిల్‌కుమార్ జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లకు కిట్ల వినియోగంపై వివరించారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత వ్యాధుల కన్సల్టెంట్ సైదులు, నాగయ్య, డీపీవో ప్రశాంతి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
అలరించిన సైన్స్ డ్రామా పోటీలు
మంచిర్యాలఅర్బన్: జిల్లా సైన్స్ సెంటర్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు అలరించాయి. ఈ సందర్భంగా డీఈవో యాదయ్య మాట్లాడుతూ సైన్స్ డ్రామాలు శాస్త్ర సాంకేతికతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎంతో దోహదపడుతాయని అన్నారు. వివిధ పాఠశాలల నుంచి 80 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్మెల్ హైస్కూల్ విద్యార్థులు ప్రథమ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్యంపల్లి విద్యార్థులు ద్వితీయ, జన్నారం స్లేట్ స్కూల్ విద్యార్థులు మూడో స్థా నంలో నిలిచారు. నాటక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. హరిత సాంకేతిక గ్రీన్ టెక్నాలజీ అంశంపై నాటక ప్రదర్శనతో మొదటి స్థానంలో నిలిచిన కార్మెల్ విద్యార్థులు హైదరాబాద్‌లో ఈ నెల 17, 18న నిర్వహించే సైన్స్ డ్రామా పోటీల్లో పాల్గొననున్నారు. న్యాయనిర్ణేతలుగా జనార్థన్, రాజన్న, అర్చన వ్యవహరించారు. జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, సెక్టోరల్ అధికారి చౌదరి, నస్పూర్ ఎంఈవో పద్మజా, వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు పాల్గొన్నారు. -
ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి
బెల్లంపల్లిరూరల్/భీమిని/మందమర్రిరూరల్: ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన బెల్లంపల్లి, కన్నెపల్లి, భీమిని, మందమర్రిలో మండల పరిషత్ కార్యాలయాలను సందర్శించి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు, గోడ గడియారాలు, వీడియోగ్రఫి విధిగా ఉండాలని సూచించారు. అభ్యర్థుల అఫిడవిట్లు, ధ్రువపత్రాలు, ఇతర ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్, ఎంపీవో శ్రీనివాస్, కన్నెపల్లి, భీమిని ఎంపీడీవోలు గంగామోహన్, శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్లు బికర్ణదాస్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మందమర్రిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను కలెక్టర్ సందర్శించారు. సమయపాలన పాటించాలి విధుల్లో సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. కన్నెపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు సిబ్బంది హాజరు కాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు రిజిష్టర్లు పరిశీలించారు. ఎంపీడీవోకు ఫోన్ చేసి ఆలస్యంపై ఆరా తీశారు. -
దరఖాస్తులు అధికంగా వచ్చేలా కృషి చేయాలి
మంచిర్యాలక్రైం: మద్యం టెండర్ల దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చేలా కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ రఘురామ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నందగోపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ టెండర్ల దాఖలుకు వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు. జిల్లాలో 73 మద్యం దుకాణాలకు గాను బుధవారం వరకు 14 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 18 వరకు గడువు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐలు గురువయ్య, ఇంద్రప్రసాద్, హరి, సమ్మయ్య, ఎస్సైలు పాల్గొన్నారు. -
దినచర్యలో భాగం కావాలి..
వయసుతో నిమిత్తం లేకుండా అందరూ స్విమ్మింగ్‌ను దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలి. తద్వారా మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు తగ్గుతాయి. శరీరంలోని అనవసర క్యాలరీలు కూడా తగ్గి రోజంతా తేలికగా ఉంటుంది. నరాల సంబంధిత వ్యాధులు దరిచేరవు. శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి. మంచి ిఫిట్‌నెస్ సాధించగలుగుతాం. నిర్మల్‌లో నీటి వనరులు పుష్కలంగా ఉన్న బంగల్పేట్ చెరువు, ఖజానా చెరువు ఈతకు అనుకూలంగా ఉన్నాయి.– డాక్టర్ లక్ష్మీనరసింహ రెడ్డి, స్విమ్మర్, న్యూరో ఫిజీషియన్, నిర్మల్ -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం అండర్ 19 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు జరిగాయి. కాసిపేట బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. పోటీల్లో కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి పి.స్వామి ప్రతిభ చూపి పోటీలకు ఎంపికై నట్లు గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ తెలిపారు. నెట్‌బాల్ పోటీలకు.. కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌స్కూల్‌కు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు అర్జున్, వికాస్‌లు రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఖలీల్ బుధవారం తెలిపారు. నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 11 వరకు మహబూబాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి నెట్‌బాల్, జూనియర్ విబాగం పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పీఈటీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. జన్నారం: జన్నారం మండలం స్లేట్ హైస్కూల్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం తెలిపారు. విద్యార్థులు భానుచరణ్, అరవింద్, తేజశ్విన్లు మంచిర్యాల జిల్లా నుంచి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. డైరెక్టర్ రజితరెడ్డి అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
దండేపల్లి: మండలంలోని మేదరిపేట వద్ద బుధవారం బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నాగసముద్రం గ్రామానికి చెందిన సిద్దార్థ అనే యువకుడి కుడికాలు విరిగింది. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన చోట రోడ్డుపై గుంతలు ఉండడంతో తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుదాఘాతంతో ఒకరికి..తానూరు: మండలంలోని సింగన్‌గాం గ్రామంలో బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అశోక్ పటేల్ గ్రామంలో పిండిగిర్ని నడిపిస్తూ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్లో విద్యుత్ సమస్య రావడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేపట్టే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు తానూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భైంసాలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం నిజామాబాద్‌కు తరలించారు. ఈ విషయమై లైన్మెన్ రాజన్నను వివరణ కోరగా ఎల్సీ తీసుకోకుండా మరమ్మతులు చేపట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రహరీ కూలి 15 మేకలు మృతిచెన్నూర్: చెన్నూర్ రజకవాడలో ప్రమాదవశాత్తు ప్రహరీ కూలిన ఘటనలో 15 మేకలు మృతి చెందాయి. కాలనీవాసులు తెలిపిన వివరాలు.. రజక కులానికి చెందిన సమ్మయ్య కుల వృత్తిని వదిలి మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. సమ్మయ్యకు 20 మేకలు ఉండగా పట్టణానికి చెందిన మరికొంత మంది మేకలను కాస్తున్నాడు. ఇందుకు ఒక పాత ఇంటి ఆవరణను అద్దెకు తీసుకున్నాడు. వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు మట్టిగోడలు తడిసి ఉండడంతో బుధవారం ప్రహరీ కూలి 15 మేకలు మృతి చెందగా ఆరు మేకలకు గాయాలయ్యాయి. సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటన స్థలాన్ని రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ అజీజ్ సందర్శించి పంచనామా చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. -
అలుగు విక్రయించేందుకు యత్నం
ఆదిలాబాద్‌టౌన్: అడవిలో అరుదుగా కనిపించే అలుగును అక్రమంగా విక్రయించేందుకు యత్నించిన నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఇన్చార్జి అటవీ అధికారి, ఉట్నూర్ ఎఫ్‌డీవో రేవంత్ చంద్ర తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అటవీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడు తూ గాదిగూడ మండలం అర్జుని గ్రామ పరిధిలోని పంట పొలంలో గల వలలో అరుదైన అలుగు చిక్కుకుంది. గమనించిన కొందరు వ్యక్తులు దాన్ని విక్రయించేందుకు యత్నించారు. దీనిపై సమాచా రం అందడంతో అటవీ శాఖ సిబ్బంది మంగళవా రం అక్కడికి చేరుకుని కినక శంకర్, పెందూర్ జు గ్నాథ్, పెందూర్ మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి అ లుగును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన ట్లు వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామన్నారు. ఆదిలాబాద్ ఎఫ్ఆర్వోలు గులాబ్ సింగ్, టాస్క్‌ఫోర్స్ ఎఫ్ఆర్వో జి.శ్రీనివాస్, యాంటీ కోచింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో ముఖ్తార్ అహ్మద్, ఎఫ్ఎస్వో గోపాల్, సిబ్బంది సుభాష్, సజన్, రాజేందర్, విజయ్ పాల్గొన్నారు. -
స్విమ్మింగ్‌తో ఆరోగ్యం
గతంలో అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే నాకు కొంత కాలం క్రితం మెడ, వెన్నుపూసను కలిపే సర్వైకల్ భాగంలో మేజర్ సర్జరీ జరిగింది. స్వతహాగా ఈత అంటేనే అమితమైన అభిరుచి కలిగిన నేను ప్రతీరోజు ఉదయం 5 గంటలకు బంగల్‌పేట చెరువుకు చేరుకొని స్విమ్మింగ్ చేస్తాను. ఆపరేషన్ అనంతరం స్వల్పకాలంలోనే పూర్తిగా కోలుకున్నాను. విశాలమైన ప్రకృతిసిద్ధ చెరువులో వందల మీటర్ల పరిధిలో ఈత కొట్టడం ద్వారా శరీరం తేలికగా మారుతుంది.– డీవీ.రమణ, రిటైర్డ్ సూపరింటెండెంట్, నిర్మల్ -
నవోదయ దరఖాస్తులకు గడువు పొడిగింపు
కాగజ్‌నగర్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈనెల 21 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 –27 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతికి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి చదువుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు ఎడిట్ చేసుకోవచ్చని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పులిదాడిలో గేదె మృతి? కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలంలోని అనుకోడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో రైతు బైరీ గోపికి చెందిన గేదె బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గేదె మృతికి పులి దాడే కారణమా లేదా ఇతర జంతువులు దాడి చేశాయా అన్న విషయం తెలియరాలేదు. ఈ విషయంపై అటవీశాఖ అధికారి శశిధర్బాబును ఫోన్లో సంప్రదించగా వివరాలు దాటవేశారు. మర్లపల్లి అడవుల్లో చిరుత సంచారం బోథ్: మండలంలోని మర్లపల్లి శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం మర్లపల్లి గ్రామ సమీపంలో చిరుత ఆవుపైన దాడి చేసింది. ఆవుపై చిరుత దాడి చేసిన సీసీ ఫుటేజీ అటవీ అధికారులకు చిక్కింది. వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు అడవుల్లోకి వెళ్లకూడదని ఎఫ్ఆర్వో ప్రణయ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. గంజాయి విక్రయదారుడి అరెస్ట్ ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని సాత్నాల క్వార్టర్స్ ఆవరణలో గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీ ల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్‌గూడకు చెందిన మహ్మద్ అవేజ్ వద్ద 15 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు పేర్కొన్నారు. -
అవిశ్రాంత స్విమ్మర్లు!
సాధారణంగా 50 వయసు దాటిందంటేనే బీపీ, షుగర్ వంటి కాలానుక్రమ వ్యాధులు వచ్చేసి ఓ చిన్నపాటి నిరుత్సాహం ఆవహిస్తుంది. కానీ బంగల్పేట్ చెరువులో దాదాపు 15 నుంచి 20 మంది సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఉల్లాసంగా, ఉత్సాహంగా, హుషారుగా చెరువంతా కలియదిరుగుతూ కిలోమీటర్ల మేర పరిధిలో ఈత కొడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. చెరువు ఆవల ఒడ్డుకు అటు నుంచి ఇవతలి ఒడ్డుకు అవలీలగా చేరుకుంటున్నారు. ఈత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతీరోజు వీరంతా నిర్ణీత సమయానికి బంగల్పేట్ చెరువుకు చేరుకుని స్విమ్మింగ్ ఆస్వాదిస్తున్నారు. పట్టణంలోని రాజేందర్, మల్లేశ్, సాయిసూర్య, శంకర్, నర్సయ్య, శ్రీనివాస్, కిషన్, సుధాకర్, శ్రీనివాసాచారి, లింగం, నారాయణ తదితరులు స్విమ్మింగ్‌పై ఇప్పటి యువతకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆసనాలు, సూర్య నమస్కారాలు చేస్తూ ఆరోగ్యంపై చైతన్యం పెంపొందిస్తున్నారు. ఈతతో శారీరకంగా, మానసికంగానూ బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతీరోజు ఈత తమ దినచర్యలో భాగమైపోయిందని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వారంతా ఏడు పదుల వయసుకు కాస్త అటుఇటుగా ఉన్న వారే. సాధారణంగా ఇలాంటి వారికి ఆరోగ్యం కోసం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నడక మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఈ సీనియర్ సిటిజన్లు మాత్రం ఉదయం తెల్లవారుజామునే ప్రకృతి సిద్ధమైన చెరువులో ఈత కొడుతూ హుషారైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ చెరువు విస్తీర్ణంలోనూ అత్యంత విశాలమైనది. అన్ని కాలాల్లో సమృద్ధిగా నీరు ఉంటుంది. ఇక్కడ ఉదయం వేళ 70 ఏళ్లకు చేరువగా ఉన్న వారు హుషారుగా ఈత కొడుతున్న దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. – నిర్మల్‌ఖిల్లా -
రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలి
రెబ్బెన: సెపక్ తక్రా ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించాలని సెపక్తక్రా జిల్లా కన్వీనర్ కుమ్మరి మల్లేశ్ అన్నారు. బుధవారం మండలంలోని గోలేటిటౌన్‌షిప్‌లో సెపక్ తక్రా ఉమ్మడి జిల్లా అండర్ 14, అండర్ 19 జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన వారు ఈనెల 10 నుంచి 12 వరకు గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు భాస్కర్, ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, జనరల్ కెప్టెన్ కిరణ్, సీనియర్ క్రీడాకారులు నరేశ్, పీడీ తిరుపతి, రాకేశ్, గోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న జిల్లా జట్లు.. అండర్ 14 సబ్ జూనియర్స్ జిల్లా బాలుర జట్టుకు జి. శివకుమార్, బి. కన్నయ్య, జి. శివచరణ్, సీహెచ్ హరీశ్, ఎస్.సాయిచరణ్, అదనపు క్రీడాకారుడిగా బి. అభిలాష్‌లు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో టి. హాసిని, ఎస్.అక్షర, కే.దర్శిని, కే.శ్రీవల్లి, వి.అఖిల, అదనపు క్రీడాకారిణిగా బి. కౌసల్యను ఎంపిక చేశారు. అండర్ 19 విభాగంలో.. సెపక్ తక్రా ఉమ్మడి జిల్లా అండర్ 19 బాలుర జట్టులో కే. రామ్‌చరణ్, సీహెచ్.శ్రీకాంత్, కార్తీక్, అజిత్, విక్రమ్, అదనపు క్రీడాకారుడిగా దీపక్‌లను ఎంపిక చేయగా, బాలిక జట్టులో కే. అభినయ రమ్యశ్రీ, జే.రక్షిత, ఏ.సానియా, ఆర్.సలోనీ, ఎం.యాసశ్రీ, అదనపు క్రీడాకారిణిగా ఏ. కీర్తీ, సీహెచ్. రూపాలిలు చోటు దక్కించుకున్నారు. -
చెరువులను పరిరక్షించాలి
గత కొన్ని దశాబ్దాలుగా బంగల్పేట్ చెరువులో స్విమ్మింగ్ చేస్తున్నాం. ఉదయం పూట గంటపాటు శ్రమించడం వల్ల శరీరం తేలికగా మారుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ప్రస్తుతం చెరువు పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ వేయడం, వాటిని కాల్చడం వల్ల వచ్చే పొగతో చెరువు కాలుష్యంగా మారుతుంది. మున్సిపల్ అధికారులు సత్వరమే చెరువు పరిరక్షణ కోసం తగిన చర్యలు చేపట్టాలి. గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా కట్టుదిట్టం చేయాలి. – అర్కారి రాజేందర్, గాంఽధీనగర్, నిర్మల్ -
ఆటలో మేటి.. రాజలింగు
● 75 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ పోటీల్లో రాణింపు ● నేటికీ రెండు పూటలా షటిల్ బ్యాడ్మింటన్ సాధన మందమర్రిరూరల్: కృషి, పట్టుదల ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా ఇష్టమైన ఆటలో రాణించొచ్చని నిరూపిస్తున్నారు మందమర్రికి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ ఆటగాడు పల్లెం రాజలింగు. సింగరేణి ఉద్యోగంలో ఉన్నప్పుడు 15సార్లు కోలిండియాలో సింగరేణికి పతకాల వర్షం కురిపించిన ఆయన ఉద్యోగ విరమణ పొంది 17 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ 75 ఏళ్ల వయస్సులోనూ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్థానం.. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన పల్లెం రాజలింగు సింగరేణి ఉద్యోగిగా 15సార్లు కోలిండియా స్థాయి పోటీల్లో పాల్గొని ఆరుసార్లు సింగిల్స్, డబుల్స్ విభా గం పోటీల్లో విన్నర్‌గా నిలిచాడు. 2008లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన ఆటకు మాత్రం విరమణ ఇవ్వలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంతో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ప్రత్యేకంగా రాజలింగును అభినందించారు. ఇండియా తరఫున స్వీడన్, పోలాండ్, థాయిలాండ్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలకు కూడా ఎంపికయ్యాడు. సెప్టెంబర్‌లో ధాయిలాండ్‌లో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ స్థాయి (అండర్– 75) సింగిల్స్, డబుల్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. కాగా విశేషంగా రాణిస్తున్న తనకు సింగరేణి యాజమాన్యం కోచ్‌గా అవకాశం ఇవ్వాలని రాజలింగు కోరుతున్నాడు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
నెన్నెల: ఈ నెల 6న మండలంలోని గుండ్లసోమారంలో పెట్రోల్ మీదపడి నిప్పంటుకోవడంతో గాయాలపాలైన జాడి లలిత (40) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. మహిళ భర్త జాడి రాజన్న సోమవారం ఉదయం ఇంట్లో బ్యాటరీ స్ప్రే డబ్బాకు మరమ్మతులు చేస్తుండగా అందులో ఉన్న పెట్రోల్ పొయ్యి వద్ద ఉన్న లలితపై పడడంతో నిప్పంటుకుంది. కాపాడబోయిన రాజన్న కూడా గాయాలపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన లలితను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజన్న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి సోదరుడు దుర్గం రాజారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. డీజే నిర్వాహకులపై కేసుఆదిలాబాద్టౌన్: నిబంధనలకు విరుద్ధంగా డీజేలను ఏర్పాటు చేసి శబ్ధ కాలుష్యంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన నిర్వాహకులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రిమ్స్ ఎదుట భుక్తాపూర్‌కు చెందిన గాజగూడ శ్రీనిద్, నీలానగర్కు చెందిన లఖన్, గోపాల్, తిలక్‌నగర్‌కు చెందిన బక్కి రవీందర్, సతీష్‌తో పాటు మరికొంత మంది డీజేలను నిర్వహించారని తెలిపారు. పోలీసులు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా పరిమితికి మించి డీజే సౌండ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించే డీజే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా డీజేలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. రోడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఒకరిపై కేసుఆదిలాబాద్టౌన్: మున్సిపాలిటీ అనుమతి లేకుండా రోడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేస్తం ఫౌండేషన్‌కు చెందిన వంశీపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని ఇదివరకే సూచించినప్పటికీ కొందరు నిబంధనలను పాటించడం లేదన్నారు. నిబంధనలను అతిక్రమించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండడంతో ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ అనుమతి ఉంటేనే వీటిని ఏర్పాటు చే యాలని సూచించారు. హెచ్చరిక బోర్డులు ఉన్నచో ట ఎలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దన్నారు. గవాయ్‌పై దాడి హేయమైన చర్యమంచిర్యాలక్రైం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి హేయమైన చర్యగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ములకల్ల రాజేంద్రప్రసాద్ అభివర్ణించారు. దాడి ఘటనపై జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడికి ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు కాదాశి రవీందర్, ఉపాధ్యక్షుడు నాగుల కిరణ్‌బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, బూడిద మల్లేష్, కృష్ణ చైతన్య, బాంసేపు నాయకులు శంకర్, శెట్టి పాల్గొన్నారు. -
ఇరిగేషన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలటౌన్: ఇరిగేషన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని టీఎన్జీవోస్ సభ్యులు మంగళవారం జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను కోరారు. స్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ త్వరలోనే పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ సత్యరాజ్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విష్ణు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కుమార్, జి.వెంకటరమణ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు శివప్రసాద్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, రోశయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఇరువర్గాలపై కేసు నమోదు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్డులో దారి విషయంలో ఈనెల 5న జరిగిన గొడవలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నరేందర్, రాజ్‌కుమార్‌ల మధ్య జరిగిన గొడవలో ఇరువర్గాలకు చెందిన అరున్, దినేష్, హారీష్, పరమేశ్, శ్రీకాంత్, చింతల కృష్ణ, ఆవునూరి రమేశ్, వినయ్, అవినాశ్, చందు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. -
మెరుగైన విద్యుత్ సేవలు అందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ వినియోగం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్త విద్యుత్ ఉపకేంద్రాలు, విద్యుత్లైన్లు అవసరముంటే ప్రతిపాదనలు పంపాలన్నారు. అటవీ ప్రాంతాల్లో నూతన విద్యుత్ కేంద్రాల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర నిర్మాణాల విషయంలో అటవీ అనుమతులు వీలైనంత త్వరగా పొందాలన్నారు. నిర్మాణాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసి నివేదికలు పంపాలని సూచించారు. స్థల సేకరణ వేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని, రైతాంగానికి, గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు, రైతాంగానికి అనవసర కోతలు లేకుండా, నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. విద్యుత్ మరమ్మత్తులు, విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించాలన్నారు. సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్వర్ణ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత
దిగువకు వెళ్తున్న వరదనీరు మండలంలోని ఆయా గ్రామాలతో పాటు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో మంగళవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి అధికారులు స్వర్ణ ప్రాజెక్టు నాలుగు గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వి డుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా అర్ధరాత్రి ఒక్కసారిగా ఇన్‌ఫ్లో 15,200ల క్యూసెక్కులు పెరగడంతో అధికారులు ఒక్కొక్కటి చొప్పున నాలుగు వరదగేట్లను పైకెత్తి దిగువకు అంతేమొత్తంలో నీటిని విడుదల చేశారు. – సారంగపూర్ -
‘ప్రాణహిత’ను పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు
కౌటాల: మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఇరిగేషన్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. గతంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదిత స్థలం, ప్రస్తుత ప్రతిపాదిత స్థలంపై అధికారులు మ్యాప్‌తో ఆయనకు వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత వివరాలపై అధికారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వైన్‌గంగ, వార్ధా నదుల సంగమంతో తుమ్మిడిహెట్టి వద్ద ఏర్పడే ప్రాణహిత సంగమంను ఆయన బైనాక్యులర్‌తో వీక్షించారు. బ్యారేజీ నిర్మాణం చేపట్టే ప్రదేశాన్ని చూశారు. ప్రాణహిత నది నీటి లభ్యత, ప్రాజెక్టు విధివిధానాలపై సమగ్ర వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సత్యరాజచంద్ర, ఎస్ఈ రవికుమార్, ఈఈ ప్రభాకర్, తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, డీఈ వెంకటరమణ, భానుమూర్తి, భద్రయ్య, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. -
‘9న సమావేశం విజయవంతం చేయాలి’
పాతమంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో ఈ నెల 9న నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లాల కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, నాయకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో మంగళవారం నిర్వహించిన ఉ మ్మడి జిల్లా అండర్–19 కబడ్డీ పోటీల్లో 120 మంది క్రీడాకారులు పాల్గొనగా అత్యుత్తమ ప్రతిభ కనబ ర్చిన 15 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు కా ర్యదర్శి బాబూరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి 12 వరకు మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేటలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను డీఐఈవో అంజయ్య అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బుచ్చయ్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, యాకూబ్, హిందూ ఉత్సవ సమితి అ ధ్యక్షుడు రాజ్‌కిరణ్, ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
స్టాఫ్ సెలక్షన్ ఫలితాల్లో ప్రతిభ
● వరుసగా రెండు ఉద్యోగాలకు ఎంపిక నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన జే.భరత్ కుమార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఫలితాల్లో సత్తాచాటి కేంద్ర ప్రభుత్వ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ శాఖలో జూ నియర్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. జందే లక్ష్మి–స్వామి దంపతుల కుమారుడైన భరత్ కు మార్ హైదరాబాద్‌లో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి కొన్నేళ్లుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. గత ఆగస్టులో ఆర్కియాలజీ శాఖలో కన్జర్వేషన్ అసిస్టెంట్‌గా ఎంపికై కర్ణాటక రాష్ట్రంలోని హంపి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా సోమవారం విడుదలైన స్టాఫ్ సెలక్షన్ ఫలితాల్లో ఆలిండియా ఓబీసీ విభాగంలో 37వ ర్యాంకు సాధించాడు. మరో సైబర్ మోసంఆదిలాబాద్టౌన్: రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. తెలిసినప్పటికీ కొంతమంది వారి వలలో చిక్కుతున్నారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఖాతా సమాచారం ఇవ్వవద్దని చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. తీరా డబ్బులు పోగొట్టుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు. ఇలాంటిదే జిల్లా కేంద్రంలోని పాత హౌజింగ్ బోర్డులో సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి గాలి ప్రవీణ్ కుమార్ గతనెల 26న తన స్నేహితుడికి ఫోన్‌పే ద్వారా రూ.3,900 నగదు పంపించాల్సి ఉండగా పొరపాటున మరోవ్యక్తికి ఆ డబ్బులు వెళ్లాయి. ఆ డబ్బులు తిరిగి రాబట్టుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అందులో 7303238726 నంబర్‌కు ఫోన్ చేశాడు. రీఫండ్ చేస్తామని నమ్మించి నాలుగుసార్లు అతని ఖాతాలో నుంచి మొత్తం రూ.62,191 నగదు కాజేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. సీఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకుభీర్: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు కుభీర్‌కు చెందిన ముచ్చిన్ల గణేశ్ (23) కొంతకాలంగా ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా భైంసా ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజమాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి తల్లి, అక్క ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వాల్మీకి జీవితం స్ఫూర్తిదాయకం
బాసర: బాసర ఆర్జీయూకేటీ కళాశాలలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తపస్సుతో మహనీయుడుగా మారి ప్రపంచానికే జ్ఞాన జ్యోతిని చూపించిన కారుణ్యమూర్తి వాల్మీకి అన్నారు. ఆయన జీవితం ఈ సృష్టి ఉన్నంత కాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విట్టల్, డాక్టర్ మహేష్, డాక్టర్ నాగాంజనేయులు, డాక్టర్ దేవరాజు, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాగసాయి, బద్రి హరికృష్ణ, చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కొలాం వీరుడు సూరుకు నివాళి
కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన అమరుడు కుమురం భీంకు పోరాటంలో సహాయ సహకారాలు అందించిన కొలాం వీరుడు కుమురం సూరు 28వ వర్ధంతిని మంగళవారం జోడేఘాట్‌లో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. వారసులు పాండు, రాజు, ధర్మూ, భీంరావు జెండాలు ఎగురవేసి పూజలు చేశారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప సూరు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పూజల్లో పాల్గొన్నారు. -
వన్యప్రాణుల నిలయం.. కవ్వాల్
జన్నారం: కవ్వాల్ అభయారణ్యాన్ని 1965లో వన్యప్రాణుల విభాగం (వైల్డ్‌లైఫ్)గా ఏర్పాటు చేశారు. వాటి రక్షణకోసం 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. పులుల సంఖ్య పెంచడానికి 2012లో నేషనల్ టైగర్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అభయారణ్యాన్ని పులుల రక్షిత ప్రదేశం (టైగర్‌జోన్)గా ఏర్పాటు చేసింది. కవ్వాల్ టైగర్‌జోన్ 893 చదరపు కిలోమీటర్లలో కోర్ ఏరి యా, 1,123 చదరపు కిలోమీటర్లలో బఫర్ ఏరియాగా గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టైగర్‌జోన్ విస్తరించి ఉంది. ఇందులో వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవించేందుకు అటవీశాఖ అధికా రులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ టైగర్జో న్ ఏర్పాటు నుంచి వన్యప్రాణులకు రక్షణ కవచంగా మారింది. కఠిన చట్టాలను అమలు చేయడంతో క్రమేపీ వన్యప్రాణుల వేట తగ్గుముఖం పట్టింది. గడ్డిక్షేత్రాలతో పెరిగిన సంఖ్య జన్నారం అటవీ డివిజన్లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఐదేళ్లుగా అడవుల్లోకి పశువులు వెళ్లకుండా కట్టడి చేశారు. ఆహారం, ఆవాసం, నీరు కల్పించడం ద్వారా వన్యప్రాణుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో జన్నారం డివిజన్లోని 40 బీట్లలో అవి ఇష్టపడే పలురకాల గడ్డిని పెంచడం, నీటి కుంటల నిర్మాణం, అలజడి లేకుండా ఆవాసం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన శాఖాహార జంతువుల సర్వే ద్వారా వన్యప్రాణుల సంఖ్య రెట్టింపు అయినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల సంఖ్య వివరాలను అధికారులు విడుదల చేయాల్సి ఉంది. కఠినమైన చట్టాలు వన్యప్రాణులను వేటాడినా వాహనంతో ఢీకొట్టి చంపినా 1972 ఆక్ట్ ప్రకారం 6 నెలల నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. షె డ్యూల్ 1 కిందికి వచ్చే పులి, చిరుత, ఎలుగుబంటిలాంటి జంతువులను వేటాడితే ఎనిమిదేళ్ల జైలుశిక్ష, షెడ్యూల్ 2 కిందికి వచ్చే జంతువులను వేటాడితే 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. వారోత్సవాలు వన్యప్రాణుల రక్షణ, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏటా అక్టోబర్ 2 నుంచి 8 వరకు వన్యప్రాణుల వారోత్సవాలు నిర్వహిస్తున్నా రు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. జంతువులను వేటాడితే పడే శిక్షల గురించి వివరిస్తున్నారు. రెండేళ్లుగా కేసులు తగ్గుముఖం పట్టినా ఇటీవలి కాలంలో మళ్లీ పెరిగినట్లు తెలుస్తోంది. వివిధ రకాల వన్యప్రాణులకు పుట్టినిల్లు కవ్వాల్ అభయారణ్యం. ఈ అడవిలో చుక్కల దుప్పులు, నీలుగాయిలు, దుప్పులు, సాంబర్లు, కొండగొర్రెలు, జింకలు, నక్కలు, కుందేళ్లు, ముళ్లపందులు, పందులు లాంటి వన్యప్రాణులతో పాటు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, అడవి కుక్కలు లాంటి వన్యమృగాలు కూడా జీవిస్తున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 8 వరకు వన్యప్రాణుల వారోత్సవాలు నిర్వహిస్తుండగా నేటితో ముగియనున్నాయి.అవగాహన కల్పిస్తున్నాం అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వన్యప్రాణుల చట్టాలు, శిక్షల గురించి సిబ్బంది అటవీ సమీప గ్రామాల్లో వివరిస్తున్నారు. విద్యార్థి దశనుంచే వన్యప్రాణుల చట్టాలు, రక్షణ గురించి తెలిసేందుకు పోటీలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. వన్యప్రాణులు, అడవులను రక్షించుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుంది. భవిష్యత్ తరాలకు ఈ వనసంపదను మిగిల్చిన వారమవుతాం. – రామ్మోహన్, ఎఫ్‌డీవో -
బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి
మంచిర్యాలక్రైం: బాణాసంచా దుకాణాల్లో ని బంధనలు పాటించాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లాలోని లైసెన్స్డ్ టపాసుల నిర్వాహకులతో పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాలులో ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టపాసులు కొనడానికి మహిళలు, చిన్నపిల్లలు పెద్దమొత్తంలో వస్తుంటార ని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పా టించాలని సూచించారు. మంచిర్యాల డిగ్రీ కళాశాల, నస్పూర్ గ్రౌండ్లో దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్‌రావు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, ఇంచార్జి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సత్యనారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు. -
పైలేరియా నివారణే లక్ష్యంగా ముందుకెళ్లాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో పైలేరియా(బోదకాలు) కేసులు పెరుగుతున్నాయని, నివారణే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ ముందుకెళ్లాలని కేంద్ర కీటక జనిత వ్యాధుల రీజినల్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం టాస్ కార్యక్రమంపై శిక్షణ, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలతో 20 బృందాలు ఏర్పాటు చేసి ఈ నెల 13 నుంచి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో 20 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికి పైలేరియా పరీక్ష చేసి బాధితులకు మందులు అందజేస్తామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 892 పైలేరియా కేసులు ఉన్నాయని, అందుకే జిల్లాను ఎండమిక్ ఏరియాగా గుర్తించి, టాస్‌ను ఏర్పాటు చేసి, సర్వేను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత, డాక్టర్ సునిల్‌కుమార్, జోనల్ మలేరియా అధికారి సైదులు, కీటక జనిత వ్యాధుల రాష్ట్ర కన్సల్టెంట్ నాగయ్య, డాక్టర్ సుధాకర్‌నాయక్, డాక్టర్ ప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, డీపీవో ప్రశాంతి, డీపీహెచ్ఎన్ నాందేవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌తో కలిసి రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 16జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి విడతకు ఈ నెల 9 నుంచి 11వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 12న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా, 13న అప్పీళ్ల స్వీకరణ, 14న పరిష్కారం, 15న ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన, 23న పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటాయని వివరించారు. నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం మంచిర్యాల అగ్రికల్చర్: మహనీయుల ఆశయాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి, కుమురంభీం వర్ధంతి వేడుకల్లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మొహమ్మద్ విలాయత్ అలీ, అధికారులతో కలిసి పాల్గొన్నారు. వాల్మీకి, కుమురంభీం చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు ఎదురు నిలిచి పోరాడిన వీర యోధుడు, ఆదివాసీ ల ముద్దుబిడ్డ కుమురం భీం అని అన్నారు. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. -
లక్ష్యానికి దూరం..!
హరిత బడి..మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు పెంపొందించి విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్య భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయాల రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్) పేరిట ప్రత్యేక పురస్కారాలు అందించనుంది. మూత్రశాలల వినియోగం, నీటి వసతి, మొక్కలు నాటి సంరక్షణ తదితర అంశాలు అమలు చేస్తున్న పాఠశాలలకు రేటింగ్ ఇచ్చి పురస్కారాలు అందజేయనున్నారు. ఇప్పటికే ఎస్‌హెచ్‌వీఆర్ కార్యక్రమంపై ఆయా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి 30వరకు పాఠశాలల వారీగా ఎస్‌హెచ్‌వీఆర్ యాప్, వెబ్సైట్లో యూడైస్ కోడ్‌తో లాగిన్ అయి నమోదు చేయాల్సి ఉన్నా ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యానికి దూరంగా నిలుస్తోంది. ఈ నెల 5వరకు రాష్ట్రంలో కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాలు బడుల రేటింగ్ నమోదు వంద శాతం పూర్తి చేసి ముందు వరుసలో నిలిచాయి. జిల్లాలో 76.27శాతమే పూర్తయింది. మిగతా వాటి నమోదుకు ఈ నెల 15వరకు అంటే మరో వారం రోజులే గడువు వుంది. రూ.లక్ష వరకు నగదు పురస్కారాలుఅప్లోడ్ చేసిన చిత్రాలను కమిటీ బృందం తనిఖీ చేస్తుంది. త్రీ స్టార్ వచ్చిన పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ కేటగిరీల ఆరు పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఫోర్ స్టార్ వచ్చిన వాటిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. దేశంలో అత్యుత్తమంగా ఉన్న 200 పాఠశాలలకు స్వచ్ఛ ఏవమ్ హరిత పురస్కారం అందజేస్తారు. రూ.లక్ష నగదుతోపాటు ఉపాధ్యాయులను విహార యాత్రకు తీసుకెళ్తారు. దరఖాస్తు గడువు పెంపు స్వచ్చ ఏవమ్ హరిత స్కూల్ రేటింగ్ కార్యక్రమంపై ఆయా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాం. సెప్టెంబర్ 4నుంచి 30వరకు నమోదు కార్యక్రమం ఉండగా మరోసారి 15వరకు గడువు పెంచారు. గడువు కంటే ముందుగానే అన్ని బడుల రేటింగ్ నమోదు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపడుతాం. – డీఈవో యాదయ్య చొరవ చూపితేనే..జిల్లాలో 1045 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,27,834 మంది విద్యార్థులు ఉన్నారు. 2014నుంచి 2020 వరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, తదితర అంశాల్లో స్వచ్ఛత పురస్కారాలు అందించిన ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత తిరిగి స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్‌తో బడులకు ప్రత్యేక పురస్కారాలు అందించనుంది. పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ రేటింగ్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత తదితర పాఠశాల నిర్వహణపై ఆన్లైన్లో ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 5 వరకు జిల్లాలో 1045 పాఠశాలకు గాను 914 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 797(76.27శాతం) మాత్రమే వివరాలు, చిత్రాల అప్లోడ్ చేశాయి. నీటి సంరక్షణ, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మొక్కలు, తోటల పెంపకం, సౌరశక్తి వినియోగం తదితర అంశాలకు మార్కులు కేటాయిస్తారు. బడుల రేటింగ్‌కు ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని నమోదు చేయాల్సి ఉంది. -
పంటలు వరదపాలు
చెన్నూర్: ఎడతెరిపి లేని వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. గత రెండు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో 2,350 ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో నెల రోజుల్లో పత్తి పంట దిగుబడి చేతికి వచ్చేది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరోసారి పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. పత్తి కాయ, పూత రాలిపోతోంది. పత్తి చేన్లు నీట మునగడంతో కాయ మురిగి రాలిపోతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చేదని ఆందోళన చెందుతున్నారు. గత నాలుగేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ పంటలను ముంచేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బ్యాక్‌వాటర్ చెన్నూర్, జైపూర్, కోటపల్లి మండలాల్లో పంటలు నీటమునిగాయి. గత నెలలో కురిసిన వర్షాలకు 50శాతం పంటలకు నష్టం వాటిల్లగా..అక్టోబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 20శాతానికి పైగా పంటలు నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివేదిక సమర్పించాం.. గత నెలలో వర్షాలకు 2,223 మంది రైతులకు చెందిన 2,350 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాం. గత వారం రోజులగా కుస్తున్న వర్షాలకు పత్తి పంటకు నష్టం జరిగింది. వరద ముంపు చెన్నూర్ డివిజన్లో జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాలకే ఎక్కువగా ఉంటుంది. పోయిన నెలలో దెబ్బతిన్న పంటలే ఈసారి కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. – బానోత్ ప్రసాద్, ఏడీఏ చెన్నూర్ -
ఎంసీహెచ్‌లో 24 గంటల్లో 24 ప్రసవాలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో మంగళవారం అరుదైన రికార్డు నెలకొల్పారు. ఈ నెల 6న ఉదయం 9 గంటల నుంచి 7న ఉదయం 9 గంటల వరకు 24 ప్రసవాలు చేశారు. ఆన్‌డ్యూటీ డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ హారిక ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది ఆరు సాధారణ ప్రసవాలు, 18 సిజేరియన్లు చేశారు. మొత్తంగా 24 గంటల్లో 24 ప్రసవాలు చేసి ఘనతను సాధించారు. చిన్నారులు, తల్లులు క్షేమంగా ఉన్నారని వైద్యులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. వైద్య బృందంలో ప్రొఫెసర్ హిమబిందు, అసోసియేట్ ప్రొఫెసర్ మాధవి, వైద్యులు అలివేణి, కీర్తి, ప్రశాంతి, ప్రియదర్శిని, సింధూజ, మిడ్‌వైఫ్స్ అలివేలు పుష్ప, సంధ్య, సౌందర్య, సువర్ణ ఉన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిని సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఆర్ఎంవోలు భీష్మ, శ్రీధర్ అభినందించారు. -
పులకించిన పోరుగడ్డ
కెరమెరి(ఆసిఫాబాద్): జల్.. జంగల్.. జమీన్ కోసం పోరుసలిపి అసువులు బాసిన ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం స్మరణతో పోరుగడ్డ పులకించింది. రణభూమి జోడేఘాట్‌లో వీరుడి 85వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై భీం విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికపైకి ఎవరూ వెళ్లలేదు. దర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారుగా వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. భీం స్ఫూర్తితో ముందుకు సాగుదాం: కలెక్టర్ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కుమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగుదామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు. భీం వర్ధంతికి ఉచిత బస్సు సౌకర్యం, భోజ నం తదితర వసతులు కల్పించామని చెప్పారు. అ నంతరం భీం మనుమడు కుమురం సోనేరావు కు టుంబానికి కలెక్టర్ నూతన వస్త్రాలు అందించారు. భీంకు సంప్రదాయపూజలుకుమురంభీంకు ఆయన వారసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. భీం సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. మందుగా ఆచార, వ్యవహారాలతో పాత జెండాలు తీసేసి కొత్త జెండాలు ఆవిష్కరించారు. అంతా వరుసక్రమంలో నిల్చుని జెండాలకు మొక్కారు. ధూప, దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. కోడి, మేకలతో జాతకం చూశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుపాటగూడ, జోడేఘాట్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుస్సాడీ నృత్యాలు కనువిందు చేశాయి. ఐసీడీఎస్, రెవెన్యూ, ఐటీడీఏ, సఖీ, వైద్యారోగ్యశాఖ, కొలాం అభివృద్ధి, ఇప్పుపూలు, విస్తరాకుల తయారీ తదితర స్టాళ్లు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. నివాళులర్పించినవారిలో..‘స్థానిక’ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దర్బార్ రద్దు చేయగా భీం ఆరాధికులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. మంత్రులు, కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్‌పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, భీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, నాయకులు విశ్వప్రసాద్, శ్యాంనాయక్ తదితరులు భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినవారిలో ఉన్నారు.భీం సమాధిపై పూలు చల్లుతున్న మంత్రులు కృష్ణారావు, లక్ష్మణ్కుమార్భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాభీం ఆశయాలు నెరవేర్చుతాం: మంత్రులుకుమురం భీం ఆశయాలు నెరవేర్చుతామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివాసీలను సంఘటితం చేసి వారి హక్కుల సాధనకు పోరాడిన వీరుడు కుమురంభీం అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉందని పేర్కొన్నారు. 1935 నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారి బలగాలను ఎదురించారని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి రూ.740 కోట్లతో రోడ్లు, గిరిజన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. విద్య, ఆశ్రమ పాఠశాలలను మరింత తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వేదికపై మాట్లాడలేకపోతున్నామని చెప్పారు. -
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి
మంచిర్యాలక్రైం: మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని అన్నారు. రామాయణం సత్యం, నీతి, ధర్మం, కర్తవ్యాన్ని బోధించిన అమృత గ్రంథమణి అన్నారు. డీసీపీ ఏ.భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీని వాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు. -
‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి’
బెల్లంపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి బీజేపీ శ్రేణులు సిద్ధ కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు నిర్వహిస్తూనే నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఆశావహుల జాబితా సేకరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొయ్యల ఏమాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు దుర్గం అశోక్, వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు రాచర్ల సంతోష్‌కుమార్, మహేందర్‌గౌడ్, సీనియర్ నాయకులు మున్నారాజా సిసోడియా, పులగం తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
‘వందుర్‌గూడలో ఎన్నికల బహిష్కరణకు తీర్మానం’
దండేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరణకు మండలంలోని వదురుగూడ గ్రామస్తులు తీర్మానించారు. పంచాయతీ ఎన్నికల బహిష్కరణపై ఆదివా రం అర్ధరాత్రి గ్రామస్తులతో గ్రామ పటేల్ కోవ దౌలత్‌రావు మొకాశి సమావేశం అయ్యారు. నెల్కివెంకటాపూర్ గ్రామ పంచాయతీ నుంచి వందురుగూడను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారని, దీనిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు, నిరసనలు చేపట్టామని తెలిపారు. పంచాయతీ ఏర్పాటు విషయమై పునఃపరిశీలన చేయాలని కోర్టు ఆదేశించినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని, వందుర్గూడను నెల్కివెంకటాపూర్‌లో కొనసాగించాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని తీర్మాన పత్రాలను కలెక్టర్, జెడ్పీసీఈవోకు సోమవారం అందజేసినట్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కోవ ధర్మరావు, కోవ మారుతి, ఆడ చందు, కుంరం సోనేరావు, బాపురావు, కుడ్మెత వినోద్, పంద్రం హేమంతు, సేడ్మకి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
మంచిర్యాలఅగ్రికల్చర్: పత్తి రైతులు దళారులును నమ్మి మోసపోవద్దని, సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, మంచిర్యాల, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారులు షహబుద్దీన్, అశ్వక్ అహ్మద్‌తో కలిసి కపాస్ కిసాన్ యాప్ వినియోగం, రైతుల వివరాల నమోదు, పత్తి విక్రయం అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పత్తి విక్రయానికి యాప్‌లో వివరాలు నమోదు చేసునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఆధార్ కార్డులో వేలిముద్ర, కంటి స్కాన్, మొబైల్ నంబర్ అనుసంధానం చేసుకోవా లని తెలిపారు. ఆధార్‌కు అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలోనే నగదు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. పత్తికి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.8,110 నుంచి రూ.8,010 నిర్ణయించినట్లు తెలి పారు. అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నట్లు కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన స్కావెంజర్ గాలోత్ కుషాల్ జూదానికి అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో తనవద్ద పనిచేసే ఓర్సు అనిల్‌తో కలిసి దొంగతనాలకు పాల్పడ్డాడు. కుషాల్ ఉదయం సమయంలో స్కావెంజర్‌గా తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి అనిల్‌తో కలిసి చోరీకి పాల్పడేవారు. ఈనెల 1న న్యూ కాలనీకి చెందిన ఎస్పీఎం ఉద్యోగి కిషోర్ కుమార్లోయ ఇంట్లోకి చొరబడి 213 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, ఇదే రోజు ఓల్డ్ కాలనీకి చెందిన ఎస్పీఎం కాంట్రాక్టర్ పిసపాటి హేమచంద్రరావు ఇంట్లో రూ.20వేల నగదు, ఎస్పీఎం ఉద్యోగి భూసాని నరేంద్రవర్మ ఇంట్లో రూ.13 వేల నగదు, గత నెల 29న ఓల్డ్ కాలనీకి చెందిన ఎస్పీఎం ఉద్యోగి సింగాని లక్ష్మణ్ ఇంట్లో రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు తులం వెండి, రూ.10వేల నగదు, మే 9న న్యూ కాలనీకి చెందిన ఎస్పీఎం ఉద్యోగి పొలుసాని భూపాల్ రావు ఇంట్లో రూ.23 వేల నగదు దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు పట్టణ సీఐ ప్రేంకుమార్, రూరల్ సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. 50 సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బంది రాజు, నాగరాజు, సంపత్, నౌషద్, పురుషోత్తంను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు ప్రేంకుమార్, కుమారస్వామి, ఎస్సై సుధాకర్ పాల్గొన్నారు. -
నాడు హక్కుల కోసం.. నేడు సౌకర్యాల కోసం
కెరమెరి(ఆసిఫాబాద్): హట్టి నుంచి జోడేఘాట్ వరకు 21 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఆప్రాంతం సుందర స్వప్నానికి నిదర్శనం. కుమురంభీం పోరాటం చేసిన 12 గ్రామాల్లో నేటికీ సమస్యలు తాండవిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో 322 కుటుంబాలు, 1592 మంది జనాభా నివాసం ఉంటున్నారు. 12 గ్రామాలకు 18 చేతిపంపులు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలు 2, ప్రాథమిక పాఠశాల 1, అంగన్వాడీ కేంద్రాలు 3, పాట్నాపూర్‌లో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నాయి. ఆయా గ్రామాలకు కేవలం 8 ఇందిరమ్మ గృహాలే మంజూరయ్యాయి. సాగునీరు, ప్రభుత్వ గృహాలు, పట్టాపాసు పుస్తకాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రుణాలు, రోడ్డు సౌకర్యాలులేక ఆయా గ్రామాలు బావురుమంటున్నాయి, మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నప్పటికీ నాణ్యత లోపించిందని కొన్ని గ్రామాల్లో బావులు, చెలిమెనీరు తాగుతున్నారు. పోరు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు జోడేఘాట్: నాలుగు చేతిపంపుల్లో ఒక్కటే పనిచేస్తోంది. రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు రాలేదు. ఎనిమిదేళ్ల క్రితం ఐటీడీఏ అధికారులు సోలార్ సిస్టం బిగించినా నిరుపయోగంగానే ఉంది. జోడేఘాట్ కొలాంగూడ: గ్రామంలో ఒకే చేతిపంపు ఉన్నా పనిచేయకపోవడంతో బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. పాఠశాల లేక జోడేఘాట్‌కు వెళ్తున్నారు. అంగన్వాడి కేంద్రం లేదు. టోకెన్మోవాడ్: గ్రామంలో ఒక్కరికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బాబేఝరి కొలాంగూడ: గ్రామంలో చేతిపంపులు లేక ఇబ్బందిపడుతున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు కిలోమీటరు దూరంలో ఉన్న బావినీటిని మోసుకురావాల్సిన పరిస్థితి. బాబేఝరి గోండ్‌గూడ: గ్రామంలో మూడు చేతిపంపులు ఉన్నా వేసవిలో నీరు ఇంకిపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న చెలిమె నీటిని తాగుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఇళ్లలోకి నీరు చేరుతుంది. బాబేఝరి మహరాజ్‌గూడ: ఒకే చేతిపంపు ఉన్నా అదికూడా పని చేయడంలేదు. దీంతో గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న బావినీటిని తాగుతున్నారు. శివగూడ: గ్రామంలో చేతిపంపు ఉన్నా పనిచేయకపోవడంతో చెలిమెనీరు తాగుతున్నారు. అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో చిన్నారులు బాబేఝరికి వెళ్తున్నారు. చిన్నపట్నాపూర్: విద్యుత్ ఉంటేనే బోరు పని చేస్తుంది. పెద్దపట్నాపూర్: పాఠశాల, అంగన్వాడీ కేంద్రం లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. పాటగూడ: కానుగ మొక్కల విత్తనాలతో విద్యుత్ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్శించిన గ్రామం. ఒక్కరికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. లైన్‌పటార్: చేతిపంపు ఉన్నప్పటికీ వేసవిలో రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకురా వాల్సిన పరిస్థితి. టోకెన్మోవాడ్ నుంచి రోడ్డు సౌకర్యం లేక రాళ్లు రప్పలపై ప్రయాణం చేయాల్సి వస్తోంది. పిట్టగూడ: పాఠశాల భవనం ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు లేక ఖాళీగా ఉంటోంది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నీరు, అడవి, భూమిపై హక్కులకోసం నిజాం ప్రభుత్వంతో పోరాడిన కుమురంభీం ఆశయాలు నేటికీ నెరవేరలేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీ గిరిజనుల జీవితాల్లో మాత్రం మార్పురాలేదు. నాయకుల మాటల్లోనే అభివృద్ధి అనే మాట నానుతుంది కానీ వారి జీవితాల్లో మాత్రం లేదన్నది నగ్నసత్యం. గూడేలు, తండాల్లో మౌలిక సదుపాయాల కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. నేడు కుమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా కథనం. పోరాటయోధుడు భీంఆసిఫాబాద్: ఆదివాసీల ఆరాధ్యదైవం కుమురంభీం ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపెల్లిలో కుమ్రం చిన్ను, సోంబాయి దంపతులకు 1901లో జన్మించారు. నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడాడు. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం ప్రభుత్వంపై పోరు కొనసాగించాడు. మేకల కోసం చెట్టుకొమ్మను కొట్టిన తన స్నేహితుడు పైకు చేతి వేళ్లను జంగ్లాత్ సేరేదార్ నరికించడాన్ని కళ్లారా చూసిన భీం కన్నీరు కార్చాడు. ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు ఆయనను తీవ్రంగా కలచివేశాయి. ఈ క్రమంలో తండ్రి చిన్ను విషజ్వరంతో మృతి చెందడంతో సోదరులు సోము, బొజ్జుతో పాటు చిన్నాయనలతో కలిసి సంకెపెల్లి వీడి కెరమెరి మండలంలోని సుర్దాపూర్ గూడేనికి చేరుకున్నాడు. అక్కడ ఆదివాసీలు అడవిని నరికి సేద్యం చేయగా పంట చేతికొచ్చే సమయానికి సిద్దిక్ అనే ముస్లిం జాగిర్దార్ వచ్చి సుర్దాపూర్ భూముల తమవేనని హుంకరించాడు. అతనిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భీం అక్కడి నుండి పారిపోయి బల్లార్షా మీదుగా మహారాష్ట్రలోని చాందా చేరుకున్నాడు. అక్కడ వినోభా అనే ఉద్యమకారుడు ఆశ్రయం ఇవ్వగా అక్కడ కొంతకాలం పనిచేసి అస్సాం వెళ్లిపోయాడు. అక్కడ కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ ఐదేళ్లపాటు అక్కడే ఉన్నాడు. ఆతర్వాత కెరమెరి మండలంలోని జోడేఘాట్ చేరుకున్నాడు. గెరిల్లా పోరాటం అస్సాం నుంచి తిరిగొచ్చిన కుమురంభీం జోడేఘాట్ కేంద్రంగా నిజాం సర్కార్‌తో గెరిల్లా పోరాటం చేశాడు. అతనికి కుడి భుజంగా సూరు, సహచరుడిగా వెడ్మరాము ఉన్నారు. దట్టమైన అడవుల్లో శత్రువుకూడా అడుగుపెట్టేందుకు సాహసించని కొండకోనల ప్రాంతం జోడేఘాట్ కేంద్రంగా ఉద్యమం చేశాడు. వెదురుతో విల్లంబులు, బాణాలు తయారు చేసి, ఉచ్చులు పెట్టడంపై యువకులకు శిక్షణ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కో బర్మారా నాటుతుపాకి సమకూర్చాడు. గ్రామాలన్నీ తిరుగుతూ అటవీశాఖ అధికారుల అరాచకాలపై ప్రజలను చైతన్య పరిచాడు. నాగలి, పొరక, మేకులు, కంచెలపై నిజాం ప్రభుత్వం విధించే పన్నులు కట్టవద్దని నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించా డు. ఈ క్రమంలో అప్పుల పేరుతో పంటలను దోచుకునేందుకు వచ్చే వ్యాపారులు, పన్ను వసూళ్లకు వచ్చే రెవెన్యూ అధికారులపై భీం, అతని అనుచరులు దాడులు కొనసాగించారు. దీంతో బాబేఝరి కేంద్రంగా 12 పోరుగ్రామాలకు వెళ్లేందుకు పోలీసుల వెన్నులో వణుకు పుట్టిందంటే అతిశయోక్తికాదు. బాబేఝరి కేంద్రంగా గిరిజనులు అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిజాం సర్కారు వారిపై కేసులు పెట్టింది. వాటి నుంచి విముక్తి కోసం నిజాం నవాబును కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిన భీంకు నవాబు దర్శనం లభించక అవమానభారంతో తిరుగుముఖం పట్టాడు. అతను వచ్చేసరికి జంగ్లాత్ వాళ్లు 12 గ్రామాలను తగులబెట్టరు. దీంతో కలత చెందిన భీమ్ అటవీశాఖ అధికారులపై తిరగబడి తరిమికొట్టాడు. జల్.. జంగల్.. జమీన్ సాధించాలంటే ఇంటికో పోరాట యోధుడు కావాలని పిలుపునిచ్చాడు. గిరిజన యువకులందరినీ చేరదీసి సాయుధ దళం ఏర్పాటు చేశాడు. అనుచరుడి వెన్నుపోటు చివరి ప్రయత్నంగా నిజాం ప్రభుత్వం చర్చలకు సబ్‌కలెక్టర్‌ను జోడేఘాట్ పంపింది. 12 గ్రామాలకు పట్టాలిస్తామని, అప్పులన్నీ మాఫీ చేస్తామని సబ్ కలెక్టర్ ప్రతిపాదించాడు. కానీ భీం 12 పోరుగ్రామాల మీద రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. విషయం నిజాం నవాబుకు తెలియడంతో ఆగ్రహానికి గురై భీంను అంతమొందించాలని ఆదేశించాడు. ఈ క్రమంలో 1940లో దాదాపు ఏడు మాసాల పాటు భీం అనుచరులు, నిజాం సేనల మధ్య యుద్ధం జరిగింది. అనుచరులు ఒక్కొక్కరు నేలకొరిగినా భీం వెన్ను చూపలేదు. దట్టమైన అడవిలో అతని ఆచూకీ కనుగొనడం ఎవరితరం కాలేదు. ఎట్టకేలకు భీం అనుచరుడు మడావి కొద్దు ఇచ్చిన సమాచారం మేరకు అక్టోబర్ 10న అశ్వియుజ పౌర్ణమి రోజున ఐదు గంటల పాటు సాగిన భీకర పోరులో భీం నేలకొరిగాడు. నాలుగు దశాబ్దాలుగా ఏటా జోడేఘాట్‌లో భీం వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసీ, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో దర్బార్ ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం జోడేఘాట్‌లో అధికారికంగా కుమురంభీం 85వ వర్ధంతి కార్యక్రమం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నిర్వహించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. -
నిప్పంటించుకొని మహిళ ఆత్మహత్యాయత్నం
నెన్నెల: దంపతుల మధ్య జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుండ్లసోమారం గ్రామానికి చెందిన జాడి రాజన్న, లలిత దంపతులకు కూతురు అంజలి, కుమారుడు తేజ ఉన్నారు. సోమవారం ఉదయం అంజలి సారీ ఫంక్షన్ విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన లలిత ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. నుదురు, మెడ, రెండు చేతులు, చాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మంటలను అర్పే క్రమంలో రాజన్నకు చేయి, వీపుపై గాయాలయ్యాయి. దంపతులిద్దరిని 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఎస్సై ప్రసాద్‌ను సంప్రదించగా ఘటనపై ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
నీటివనరుల పరిరక్షణ అందరి బాధ్యత
మంచిర్యాలఅగ్రికల్చర్: నీటి వనరుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని జాతీయ జల మిషన్ డైరెక్టర్ అర్చనవర్మ అన్నారు. సోమవారం జాతీయ స్థాయి 51వ వెబినార్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో భగీదారి కార్యక్రమంలో నీటి వనరుల ఆవశ్యకత, పరిరక్షణ బాధ్యతలపై చేపట్టిన చర్యల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల సంచాయి, జన భగీదారి కార్యక్రమం జల సంరక్షణలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం వల్ల విజయవంతంగా నిర్వహించారని, ఇందుకు రూ.2కోట్ల అవార్డుకు అర్హులయ్యారని తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 43,545 ఇంకుడు గుంతలు, 5,372 సామాజిక ఇంకుడుగుంతలు జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఏర్పాటు చేశామని, తద్వారా భూగర్భ జల పరిమితి పెరిగిందని తెలిపారు. ప్రతీ ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి నాటి సంరక్షించేలా చర్యలు తీసుకున్నామని, గత మూడేళ్లలో 45 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
లక్సెట్టిపేట: గోదావరిఖని బార్ అసోసియేషన్ న్యాయవాది రమేశ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కో ర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. న్యాయవా దులపై తరచూ దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, ఉపాధ్యక్షుడు నళినికాంత్, సంయుక్త కార్యదర్శి సత్యగౌడ్, న్యాయవాదులు ప్రకాశం, సదాశివ, సురేందర్, శ్రీధర్, గోవిందరావు, కిరణ్‌కుమార్, రవీందర్, షఫీక్, పద్మ పాల్గొన్నారు. -
గేదెను ఢీకొని యువకుడు మృతి
నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని 61వ జాతీయ రహదారిపై గేదెను ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... లోకేశ్వరం మండలం హవర్గాకు చెందిన సిందే అరవింద్ పటేల్ (30) సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై నిర్మల్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో 61వ జాతీయ రహదారిపై అడ్డుగా ఉన్న గేదెను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అరవింద్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. కాగా హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడేమోనని స్థానికులు చర్చించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..తానూరు: మండలంలోని బెల్‌తరోడా చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. మహారాష్ట్రలోని ఉమ్రి గ్రామానికి చెందిన బోంద్రే సాయినాథ్ (26) తానూరులో ఉన్న బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా బెల్‌తరోడా చెక్‌పోస్ట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకనుంచి మరో బైక్‌పై వస్తున్న బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. డీఎస్పీ మృతికి సంతాపం ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విష్ణుమూర్తి ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేశారని, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు.ఆయన మృతి పోలీసు శాఖకు తీరని లోటన్నారు. యువకుడు ఆత్మహత్యఆదిలాబాద్టౌన్: యువతి తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ చిట్యాల శ్రీకాంత్ (20) కొంతకాలంగా ఓ యువతిని ప్రే మిస్తున్నాడు. విషయాన్ని యువతికి తెలియజేయడంతో నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు తన అన్నకు వీడియోకాల్ చేసి ఉరేసుకుంటున్నట్లు తెలిపాడు. అతను స్థానికులకు సమాచారం అందించడంతో కొన ఊపిరితో ఉ న్న శ్రీకాంత్‌ను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటి కే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతు ని తండ్రి గజానన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్ఆదిలాబాద్రూరల్: మండలంలో ఇటీవల ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం అంకాపూర్ గ్రామ శివారులోని వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఓ ట్రాక్టర్ నీటి ప్రవాహంలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీసేందుకు మరో ట్రాక్టర్ ద్వారా ప్రయత్నించగా అది నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
బాక్సింగ్ ఎంపిక పోటీలు
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం అండర్–17బాలబాలికల జిల్లాస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలను పా ఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్ ప్రా రంభించగా వివిధ పాఠశాలల నుంచి 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు. తొమ్మిది మంది ఎంపికయ్యారని, ఈనెల 8న నిర్మల్‌లో నిర్వహించేజోనల్ పోటీలలో పాల్గొంటారని ఎస్జీ ఎఫ్ సెక్రటరీ యాకుబ్ తెలిపారు. పోటీల పర్యవేక్షకుడు రేణి రాజయ్య, వివిధ పాఠశాలలకు చెందిన పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలుబాసర: బాసర ఆర్జీయూకేటీ కళాశాలలో డిసెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల వైస్ చాన్స్‌లర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మకత పెంపొందించేందుకు ఇలాంటి సమ్మేళనాలు ఉపయోగపడతాయన్నారు. 1977లో పద్మశ్రీ డా.కిరణ్ సేత్ ఢిల్లీ ఐఐటీలో ప్రారంభించిన స్పిక్ మెకే దేశవ్యాప్తంగా యువతను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. సంగీతం, నృత్యం, జానపద కళలు, హస్తకళలు, చిత్రకళలతో పాటు భారతీయ తాత్త్విక విలువలను చేరవేయడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి కళాకారులు రానున్నట్లు తెలిపారు. ‘నవోదయ’లో ప్రవేశానికి నేటితో ముగియనున్న గడువుకాగజ్నగర్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల్లో ప్రవేశానికి మంగళవారంతో గడువు ముగుస్తుందని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా 678 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఎనిమిదో తరగతి, పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకరి రిమాండ్మామడ: ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన ఒకరిని సోమవారం అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ గోవర్దన్‌రెడ్డి, ఎస్సై అశోక్ తెలిపారు. మండలంలోని కిషన్రావుపేట్ గ్రామానికి చెందిన బానావత్ వెంకట్రావ్ జల్సాలకు అలవాటుపడి ఇటీవల పరిమండల్‌లో ధర్మన్నకు చెందిన స్టార్ స్పోర్ట్స్ బైక్‌తో పాటు ఆర్మూర్‌లో ఫ్యాషన్‌ప్రో దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. -
దంచికొట్టిన వాన
మంచిర్యాలఅగ్రికల్చర్/బెల్లంపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు 16.1మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. దిగుబడి దశలో ఉన్న పత్తి, కంది, మొక్కజొన్న పంటల్లో వరద నీరు చేరింది. బెల్లంపల్లిలోని శాంతిఖని నీటి కాలువలు, రాంనగర్, శాంతిఖని వాగులు నిండుగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శాంతిఖని బస్తీలో అంతర్గత ప్రధాన రహదారి పై నుంచి వరద నీరు పోటెత్తగా 20కి పైగా ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బెల్లంపల్లి మండలంలో 57.3 మిల్లీమీటర్లు, కోటపల్లిలో 43.6, తాండూర్‌లో 39.8, నెన్నెలలో 36.3, భీమినిలో 24, కన్నెపెల్లిలో 22.8, మంచిర్యాలలో 21, వేమనపల్లిలో 21, నస్పూర్‌లో 13.3, కాసిపేట లో 10.5, మందమర్రిలో 8.8, లక్సెట్టిపేటలో 6.5, దండేపల్లిలో 6, హాజీపూర్ 4.5, జన్నారంలో 2.8, జైపూర్‌లో 2.5, భీమారంలో 2.3, చె న్నూర్లో 2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. -
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. గ్రామంలో ఒక్కరికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అందరికీ పక్కా గృహాలు మంజూరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మిషన్ భగీరథ నీరు ప్రతీరోజు సరఫరా చేయాలి. – ఆత్రం పావుగా, పాటగూడ బీటీరోడ్డు నిర్మించాలి టోకెన్ మోవాడ్ నుంచి లైన్ పటార్ వరకు బీటీ రోడ్డు నిర్మించాలి. తక్షణమే అటవీ అధికారులు అసంపూర్తి రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. ఐటీడీఏ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. నడక కష్టమవుతోంది. – ఆత్రం భీంరావు, లైన్‌పటార్ -
‘మధ్యాహ్న భోజనం’ బిల్లులేవి..!
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో కొన్ని చోట్ల నిర్వాహకులు వంటలు నిలిపి వేస్తుండడంతో ఉపాధ్యాయులు గరిట పట్టాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన నిర్వహణను సంయుక్తంగా అమలు చేస్తుండగా.. రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పేరుకుపోతున్న బకాయిలు వెరసి మధ్యాహ్న భోజనం నిర్వహణపై ప్రభావం పడుతోంది. సన్న బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తుండగా.. కూరగాయలు, కోడిగుడ్లు ఏజెన్సీల నిర్వాహకులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మెనూ ప్రకారం పాఠశాల పని దినాల్లో ఆరు రోజుల్లో మూడు రోజులు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు అప్పు చేసి కొనుగోలు చేస్తుండగా.. బిల్లులు సకాలంలో రాక ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని 747 పాఠశాలల్లో 37,241 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు 1,249మంది ఉన్నారు. వంట ఏజెన్సీ మహిళలకు 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు రూ.6.19, 6నుంచి 8వ రతగతి వరకు రూ.9.29, 9వ, 10వ తరగతికి రూ.11.17 చెల్లిస్తుంటారు. కూరగాయలు, పప్పులు, నూనెలు వంట ఏజెన్సీలు సమకూర్చుకుంటాయి. నెలనెలా బిల్లులు, గౌరవ వేతనం సక్రమంగా చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నెలకు 1నుంచి 5వ తరగతి వరకు రూ.18,68,657, 6నుంచి 8వరకు రూ.6,22,883 కుకిింగ్ కాస్ట్ చెల్లిస్తుంటారు. కుక్‌కమ్ హెల్పర్‌కు రూ.1000 చొప్పున రూ.13,27,997, 9నుంచి 10వ తరగతి వరకు జనరల్ విద్యార్థులకు రూ.10,98,448, ఎస్సీలకు రూ.7,16,941, ఎస్టీలకు రూ.1,02,769 కుకింగ్ కాస్ట్ చెల్లిస్తున్నారు. చెల్లింపుల్లో జాప్యం.. కోడిగుడ్ల బిల్లు, కుకింగ్ కాస్ట్, గౌరవ వేతనం చెల్లింపునకు విడతల వారీగా బడ్జెట్ రావడంతో వంట ఏజెన్సీలకు ఏ బిల్లు వచ్చిందో తెలియక తికమక పడుతున్నారు. ఒకటి నుంచి 8వ తరగతికి సంబంధించిన కుకింగ్ కాస్ట్ బిల్లులు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు దాదాపు రూ.38లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వంట కార్మికులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి చెల్లిస్తుంది. గౌరవ వేతన బకాయిలు రూ.24.21లక్షలు, 9వ తరగతికి కుకింగ్ కాస్టు బిల్లులు ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ.42.91లక్షలు విడుదల కావాల్సి ఉంది. కోడిగుడ్ల బిల్లులు(1నుంచి 8వ తరగతి వరకు ఏప్రిల్ నుంచి) రూ.43.97లక్షలు చెల్లించకపోవడంతో వంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాహకుల ఆందోళనదండేపల్లి: ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు రావడం లేదని మండలంలోని ఉన్నత పాఠశాలల భోజన నిర్వాహకులు సోమవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎఈవో రాజుకు వినతిపత్రం అందజేశారు. భోజన, కోడిగుడ్ల బిల్లులు, గౌరవ వేతనాలు రావడం లేదని, వంట చేసేందుకు అప్పుల పాలవుతున్నామని వాపోయారు. ఈ నెల 4నుంచి పాఠశాలల్లో వంట చేయడం మానేశామని తెలిపారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉన్నత పాఠశాలల భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. గ్రీన్చానల్కు కసరత్తుమధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రతీ నెల 10లోగా గ్రీన్‌చానల్ ద్వారా బిల్లులు చెల్లింపునకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వంట బిల్లులను ప్రధానోపాధ్యాయులు మండల విద్యావనరుల కేంద్రానికి పంపిస్తున్నారు. ఎంఈవో పరిశీలించి జిల్లా విద్యాశాఖకు.. అక్కడ మధ్యాహ్న భోజన ఇంచార్జి పరిశీలించి ఉన్నతాధికారులకు పంపిస్తే బిల్లులు మంజూరవుతాయి. దీంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఇక నూతన విధానంతో ట్రెజరీ నుంచి నిర్వాహకుల ఖాతాల్లో బిల్లులు జమ కానున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్ నుంచి గ్రీన్ చానల్‌తో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ సాగనుంది. -
మాలేపూర్‌లో ఎన్నిక ఏకగ్రీవమేనా..?
నార్నూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే కుటుంబంలో సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. గతంలో సైతం ఎస్టీ రిజర్వేషన్ రావడంతో ఆ కుటుంబం నుంచే సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మాలేపూర్ పంచాయతీ పరిధిలో మొత్తం 514 ఓటర్లు ఉన్నారు. ఈ సర్పంచ్ స్థానానికి ఎస్టీ మహిళగా రిజర్వేషన్ ఖరారు చేశారు. అయితే పంచాయతీ పరిధిలో ఎస్సీలు అధికంగా ఉన్నారు. గ్రామంలో మొత్తం 8 వార్డులకు గాను రెండు ఎస్టీ మహిళ, రెండు ఎస్టీ జనరల్‌గా రిజర్వేషన్ ఖరారయ్యాయి. అయితే గ్రామంలో ఒకే ఒక గిరిజన కుటుంబం నివాసం ఉంటుంది. ఆ కుటుంబంలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు మొత్తం ఆరుగురు ఓటు హక్కు కలిగి ఉన్నారు. దీంతో వారిలో ఒకరు మహిళ సర్పంచుగా, నాలుగు వార్డులకు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వార్డుమెంబర్లుగా ఏకగ్రీవం కానున్నారు. ఉప సర్పంచ్ పదవీ సైతం వీరికే వరించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎస్టీ జనరల్ ఖరారవగా పవార్ ఇందల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అలాగే మరో మూడు వార్డుమెంబర్ స్థానాలు సైతం ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో ఆ ఇంటి నుంచే ముగ్గురు (ఇద్దరు పురుషులు, ఒక మహిళ) ఏకగ్రీవంగా ఎన్నికవడం గమానార్హం. ఈ ఏడాది కూడా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ కలిసి రావడంతో ఈ సారి ఈ ఇంటి నుంచి ఐదుగురు ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. -
అటవీప్రాంతంలో మృతదేహం లభ్యం
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సారంగపల్లి అటవీప్రాంతంలో సోమవారం వృద్ధుని మృతదేహం లభ్యమైనట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్‌రెడ్డి తెలిపారు. రామకృష్ణాపూర్‌లోని అబ్రహంనగర్కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు వేల్పుల ఎల్లయ్య (70) ఈ నెల 2న మేకలు మేపడానికి సారంగపల్లి అటవీప్రాంతానికి వెళ్లాడు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో 3న మృతుని కుమారుడు రమేశ్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సోమవారం మృతదేహాన్ని గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. రామకృష్ణాపూర్, మందమర్రి ఎస్సైలు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా వేల్పుల ఎల్లయ్య మృతదేహంగా గుర్తించినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కుటుంబ తగాదాలతో యువకుడి బలవన్మరణం
వేమనపల్లి: కుటుంబ తగాదా లతో ఉరేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నీల్వాయి ఎస్సై కోటేశ్వర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాజా రం గ్రామంలోని కుర్మగూడెంకు చెందిన దైవాల బీరేష్ (22) తాత మల్లయ్య గతేడాది మృతి చెందగా శనివారం 9 నెలల మాసికం కార్యక్రమం నిర్వహించారు. భోజనాల అనంతరం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన బీరేష్ సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని ఎల్లమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి మొండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృతిముధోల్: ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన సయ్యద్ కాశీం అలీ (54) పంటచేను చెరువుపక్కనే ఉంది. ఆదివారం ఉదయమే పొలానికి వెళ్లిన అలీ స్నానం చేసేందుకు చెరువులో దిగడంతో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒకరిపై పీడీయాక్టుఇచ్చోడ: మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన అల్తాపాపై ఆదివారం పీడీయాక్టు కేసు నమోదు చేసినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. నిందితుడు గతంలో అటవీ అధికారులు, పోలీసులపై దాడి చేయడంతో ఈ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో 11 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుడు కొంతకాలంగా పలు కేసుల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని చర్లపెల్లి జైలుకు తరలించినట్లు తెలిపారు. -
‘గీత’ గీయకున్నా.. రాత మారింది
మంచిర్యాలక్రైం: మంచిర్యాల కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కల్తీ కల్లు దందాతోపాటు సభ్యత్వం పేరిట రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. చెట్టు ఎక్కక పోయినా.. గీత గీయక పోయినా అనర్హులకు సభ్యత్వం కల్పిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇదంతా సంఘంలోని ఓ బడా నాయకుని కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 883మంది కల్లు గీత కార్మికులున్నారు. ఒక్క మంచిర్యాల సొసైటీలో 39మంది ఉండగా ఇందులో 30మందికి పెన్షన్ అందుతోంది. ఇందులో సగానికి పైగా అనర్హులుండడం గమనార్హం. స్థానికంగా లేని 44మందికి సభ్యత్వం నిబంధనల ప్రకారం తాటిచెట్టు ఎక్కితేనే సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలి. 30 మందితో ప్రారంభమైన మంచిర్యాల సొసైటీ ప్రస్తుతం వందమందికి చేరింది. కానీ, అధికారుల రికార్డుల ప్రకారం 39మంది సభ్యత్వం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబు తున్నారు. ఈ ఏడాది కొత్తగా స్థానికంగా లేని 44 మందికి సభ్యత్వం ఇచ్చినట్లు సొసైటీ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో వైద్యవృత్తిలో కొనసాగుతున్న వారికి, మైనర్లకు, అర్హత లేనివారికి సభ్యత్వం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనర్హులెందరో! సొసైటీలో సభ్యత్వం ఉంటే గీత కార్మికుడిగా గుర్తింపు ఉన్నట్లే. 50 ఏళ్లు నిండిన గీత కార్మికుడికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2015 నుంచి రూ.2,016 పెన్షన్ ఇస్తోంది. మంచిర్యాల సొసైటీలో 30మంది పెన్షన్ పొందుతుండగా ఇందులో సగానికి పైగా అనర్హులే ఉన్నట్లు తెలిసింది. ఈ లెక్కన ఒక్కొక్కరు 11 ఏళ్ల నుంచి ఇప్పటివరకు రూ.2,65,320 పెన్షన్ పేరిట ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 883 మంది గీత కార్మికులు పెన్షన్ తీసుకుంటుండగా, ఇందులో ఎంతమది అనర్హులున్నారో విచారణ చేపడితే వెలుగులోకి వస్తుంది. ఈ విషయమై జిల్లా ఎకై ్సజ్ అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించకపోడం గమనార్హం. -
భీం ఆశయం నెరవేరేదెన్నడో!
కడు దయనీయం కెరమెరి(ఆసిఫాబాద్): నాటి నుంచి నేటి వరకు ఆదివాసీల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. భూమి, నీరు, అడవిపై ఇంకా హక్కులు రాలేదు. గిరిజన చట్టాలు గిరిజనేతరులకు చుట్టాలవుతున్నాయి. అప్పటి నిజాం సర్కారు ఆదివాసీ భూముల రక్షణకోసం భూ బదలాయింపు చట్టం 1/70 తీసుకువచ్చింది. కానీ అధికార యంత్రాంగం ఆదివాసీల భూముల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనుల భూములను గిరిజనేతరులు గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించుకుంటున్నారు. భూ బదలాయింపు నిషేధం ఉన్న షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరుల వలసలు పెరిగి భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది. దీంతో గిరిజనులు మళ్లీ అడవిలో చెట్లను నరుక్కుని బతకాల్సిన పరిస్థితులు దాపురించాయి. అందులో కూడా గిరిజనులను బతకనీయకుండా అటవీశాఖ అధికారులు తరిమేస్తున్నారు. ఉపయోగంలోకి రాని ఐదో షెడ్యూల్ భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం అడవి, భూమి, నీటిపై గిరిజనులకు పూర్తి హక్కులు ఉన్నప్పటికీ నూతన చట్టాలు వాటికి తూట్లు పొడుస్తున్నాయి. 2005లో బిల్లు ప్రవేశపెట్టి హక్కులను కల్పిస్తామని గత ప్రభుత్వాలు చెప్పినా అవి అమలు కాలేదు. ఐటీడీఏ నిధులతో నిర్మించిన కుంటలు, చెరువుల్లో పెంచుతున్న చేపలు, రొయ్యలపై ఆదివాసీలకే హక్కులున్నాయని చట్టాలు చెబుతున్నా వారి గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. కొంత కాలంగా వలసలుగా వచ్చినవారు ఎస్టీలుగా చలామని అవుతూ నిజమైన గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. కనుమరుగవుతున్న జీవోలు ఆదివాీసీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన జీవోలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు వందశాతం గిరిజనులకే చెందాలని పొందుపర్చబడ్డ జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏజెన్సీలోని గిరిజనులకు 50 శాతం మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఇటీవల ఉపాధ్యాయ ఉద్యోగాల్లో ఏజెన్సీ, నాన్ఏజెన్సీకి సంబంధం లేకుండా గిరిజనేతరులను భర్తీ చేసింది. ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో భూమి, నీరు, అడవిపై ఆదివాసీలకు హక్కులకోసం నిజాం ప్రభుత్వంతో జరిపిన పోరాటంలో అసువులు బాసిన గిరిజనుల ముద్దుబిడ్డ కుమురంభీం. ఆయన మరణించి 85 ఏళ్లు కావస్తున్నా ఆశయం మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. నేటికీ గిరిజనులు తాగు, సాగునీరు, రోడ్డు సౌకర్యం, సాగు చేస్తున్న భూములకు పట్టాలులేక అలమటిస్తున్న పల్లెలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కుమురంభీం 85వ వర్ధంతి సందర్భంగా కథనం.రిజర్వేషన్లతో ఏజెన్సీలో గుబులు 5వ షెడ్యూల్ గిరిజన చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజనేతరులకు రిజర్వేషన్లలో అవకాశం ఉండదు. కానీ ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతంలోనూ గిరిజనేతరులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించారు. ఈ క్రమంలో 5వ షెడ్యూల్ అమలులో ఉండగా ఇదెలా సాధ్యమని, భవిష్యత్‌లో ఉద్యమ కార్యచరణ చేపట్టనున్నట్లు ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. -
ఎన్నికల్లో సత్తా చాటాలి
జన్నారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీశ్‌రాథోడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పార్టీ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు గెలిచేవారినే ఎంపిక చేయాలని సూచించారు. కేంద్ర ప్రభు త్వ పథకాలు, ప్రధాని మోదీ పాలన గురించి ప్రజలకు వివరించాలని కోరారు. కాంగ్రెస్, బీ ఆర్ఎస్కు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ హయాంలో బిల్లుల రాక పలువురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలున్నాయని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా దొంగనాటకాలు ఆడుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షు డు బద్రినాయక్, నాయకులు చంద్ర, రమేశ్, తిరుపతినాయక్, గోపాల్ తదితరులున్నారు. -
బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
లక్సెట్టిపేట: బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని క్లబ్ రోడ్‌కు చెందిన రాథోడ్ మణికంఠ (20) మంచిర్యాలలోని కళాశాలలో ఐటీఐ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పది రోజులుగా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. ఈ నెల 4న సాయంత్రం బైక్ కొనివ్వాలని పట్టుబట్టడంతో కొన్నిరోజుల తర్వాత కొనిస్తామని తల్లిదండ్రులు సర్దిచెప్పారు. అయినా వినకుండా ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి దారా సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
కళాకారులకు పెన్షన్ ఇవ్వాలి
దండేపల్లి: 60 ఏళ్లు దాటిన నాటక, భజన కళా కారులకు ప్రభుత్వం నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని నాటక, భజన కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటాచారి డిమాండ్ చేశా రు. మండలంలోని రెబ్బనపల్లిలో మండలంలోని వివిధ గ్రామాల కళాకారులతో ఆదివారం సమావేశమై మాట్లాడారు. సినిమాల రాకతో కళాకారులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంజేశారు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో భజన కళాకారులకు నిత్య భజనలకు అనుమతినిచ్చి కనీస వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కళాకారులంతా ఐక్యతతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం రెబ్బనపల్లి, ముత్యంపేట, కొర్విచెల్మ, చింతపల్లి, కన్నెపల్లి, గూడెం, రంగంపల్లె, నంబాల, గ్రామాల కమిటీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేశ్‌చారి, ముత్యం మల్లేశ్, పింగళి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తాండూర్‌లో జోరు వర్షంతాండూర్: మండలంలో ఆదివారం జోరు వాన కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై దాదాపు రెండు గంటల పాటు వర్షం కురవడంతో కాలువలు పొంగి ప్రవహించాయి. భారీ వర్షం కురవడంతో పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అడ్డగోలుగా చెట్ల నరికివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు హాజీపూర్ మండలంలో పచ్చని చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. గతంలో రాపల్లిలో, ఇటీవల నర్సింగాపూర్‌లో ఆదివారం గుడిపేట, నంనూర్‌లో రహదారి పక్కనున్న చెట్ల కొమ్మలు అడ్డగో లుగా నరికివేశారు. ఇందుకోసం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నర్సింగాపూర్‌కు వెళ్లే రహదారిలో గతంలో హరితహారంలో భాగంగా నాటిన చెట్లు ఏపుగా పెరగడంతో వాటిని కొంతమంది యంత్రంతో ఒక్క పూటలోనే గుర్తు పట్టకుండా నరికేస్తున్నా రు. కొద్దికాలంగా ఈ చెట్లు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్నాయనే సాకుతో విద్యుత్‌శాఖ పేరు చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాలతో కొట్టి వేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఓ నాయకుడు ఈ చెట్ల కొమ్మలు, చెట్లను అడ్డగోలుగా నరికిస్తూ స్థానికంగా ఉన్న ఓ బ్రెడ్ కంపెనీకి అమ్ముకుంటూ రూ.లక్షలు గడిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా చెట్ల నరికివేతను అడ్డుకోవాలని కోరుతున్నారు. -
పురుగుల మందు తాగి ఒకరు ...
లక్ష్మణచాంద: మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కనకాపూర్ గ్రామానికి చెందిన తుదిగని వినోద్ (35) కొంతకాలంగా మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 3న మద్యం మత్తులో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుని భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వాగులో కొట్టుకుపోయిన ఎడ్లబండి
కాసిపేట: మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం పాతబస్తీ శివారులో ఉన్న వాగులో ఎడ్లబండి కొట్టుకు పోయిన ఘటనలో ఆవు, ఎద్దు మృతి చెందగా రైతు, మరో ఎద్దు ప్రాణాలతో బయట పడ్డారు. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని లంబాడితండాకు చెందిన బానోత్ బలరాం పెద్దనపల్లి శివారులో పొలం పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం పొలం వద్ద ఉన్న ఎడ్లు, ఎడ్లబండిని తీసుకు వచ్చేందుకు కాలినడకన వెళ్లాడు. వెళ్తున్న క్రమంలో వాగు దాటగా మోకాలి లోతులో ఉండటంతో పొలం వద్దకు వెళ్లి ఎడ్లబండి సహా మరో ఆవును బండికి కట్టుకొని బయలు దేరాడు. వెళ్లేటప్పుడు వాగు లోతు తక్కువగా ఉండటంతో అదే నమ్మకంతో చీకట్లో వాగు దాటుతుండగా వరద ఉధృతి పెరిగి ఎడ్లబండి కొట్టుకు పోయింది. ఈక్రమంలో తనకు ఒక చెట్టుకొమ్మ దొరకడంతో పట్టుకుని ఎద్దును ఎడ్లబండి నుంచి వేరు చేసి కాపాడాడు. దీంతో ఎద్దు, మరో ఆవు ఎడ్ల బండితో సహా కొట్టుకు పోయి మృతి చెందాయి. మృతి చెందిన ఎద్దు, ఆవు విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని వాపోయాడు. -
పద్మశాలీలు రాజకీయంగా రాణించాలి
దండేపల్లి: పద్మశాలీలు రాజకీయంగా రాణించాలని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గాదాసు బాపు సూచించారు. స్థానిక పద్మశాలీ భవనంలో నూతనంగా ఎన్నుకోబడిన దండేపల్లి మండల పద్మశాలీ సంఘం కమిటీతో ఆదివారం ప్రమాణ స్వీకారం చే యించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉన్న చోట ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలని సూచించారు. రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని తెలిపారు. పద్మశాలీ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు వంగ శంకరయ్య, ఎనగందుల సత్యం, రాష్ట్ర మహిళ కార్యదర్శి మంగ, నాయకులు నాగరాజు, వీరస్వామి, కుటుంబరావు, చిన దుబ్బయ్య, శంకరయ్య, కిషన్, చిలుకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో రాంటెక్ వాసి..
ముధోల్: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంటెక్ వాసి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాంటెక్ గ్రామానికి చెందిన కొమురపెల్లి జనార్దన్ (55) మహారాష్ట్రలోని పూణేలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లాడు. శనివారం తిరుగుప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్‌లో వస్తుండగా పూణే శివారులో మార్గ మధ్యలో హోటల్ వద్ద వాహనాన్ని ఆపారు. అయితే కాలకృత్యాలు తీర్చుకునేందుకు జనార్దన్ రోడ్డు దాటుతుండగా మహారాష్ట్రకు చెందిన వాహనం వెనక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి ఆదివారం స్వగ్రామం రాంటెక్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
దస్తురాబాద్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1999–2000 విద్యాసంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు మళ్లీ 25 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకేచోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995–1996 విద్యాసంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం పీచరలోని ఓ ఫంక్షన్లో హాల్లో కలుసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు గాజులు వేసుకుని శుభాకాంక్షలు తెలుపుకోగా పురుషులు శాలువాలు కప్పుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని సీసీసీ కార్నర్లో గల స్వాతి హైస్కూల్లో 2006–07 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రిన్సిపాల్ నారాయణరాజు, అధ్యాపకులు మంజుల, మూర్తి, భాను, సత్యం, రవి, రాజ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గుడిహత్నూర్: అనుమానాస్పదస్థితిలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా గుమ్గావ్కు చెందిన భగ్నూరే రాహుల్ (35)కు మండలంలోని కొల్హారీ గ్రామానికి చెందిన లక్ష్మీబాయితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. రాహుల్ తన భార్యతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయని గుమ్గావ్లో ఉన్న తండ్రి బాలాజీతో ఫోన్లో చెప్పేవాడు. శనివారం రాత్రి తండ్రికి ఫోన్‌చేసి తన భార్యతో గొడవ జరిగిందని చెప్పి వెంటనే కట్ చేశాడు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన వ్యక్తి ఫోన్‌చేసి మీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందించాడు. కోడలు లక్ష్మీబాయి, ఆమె తల్లి షిండే లలితపై అనుమానం ఉందని మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
జలం.. కలుషితం
బెల్లంపల్లి: చెరువుల్లోని జలం కలుషితమవుతోంది. సింగరేణి పవర్ హౌస్ అవసరాల కోసం సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితం బెల్లంపల్లిలో గొలుసు కట్టుగా మూడు చెరువులు నిర్మించారు. గురిజాలకు వెళ్లే మార్గంలో గ్రామ దేవత పోశమ్మ గుడి ఉంది. దీనిని ఆనుకుని నిర్మించిన జలాశయాలకు పోశమ్మ చెరువులుగా పేరు స్థిరపడి పోయింది. రెండు దశాబ్దాల క్రితం బెల్లంపల్లిలోని సింగరేణి పవర్ హౌస్ ను కొందరు సింగరేణి అధికారులు అనాలోచిత విధానాలతో మూసివేశారు. దాని సామగ్రిని ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి స్క్రాప్ కింద కారుచౌకఽగా విక్రయించారు. దీంతో అప్పటి నుంచి పోశ మ్మ చెరువుల నీళ్లు సింగరేణికి వినియోగించలేని ప రిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి దుస్తులు శు భ్రం చేయడానికి, అంత్యక్రియలు నిర్వహించాక స్నానాలు చేయడానికి మాత్రమే పురప్రజలు విని యోగిస్తున్నారు. ఎంత తీవ్రమైన వేసవిలోనైనా చె రువుల్లోని జలాలు అడుగంటడంలేదు. మూగజీవా ల దాహార్తిని తీర్చుతున్నాయి. గంగపుత్రులు ఈ చెరువులో కొంతకాలంగా చేపల పెంపకం చేపడుతున్నారు. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న పోశమ్మ చెరువుల నీళ్లు క్రమంగా కలుషితమవుతున్నాయి. పురప్రజలకు దుర్గంధం పంచుతున్నాయి. కలుషితానికి కారణాలివే.. గణేశ్ నవరాత్రులు ముగిశాక విగ్రహాలను పోశమ్మ రెండో చెరువులో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలావరకు రసాయనిక పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. ఇలా ఎన్నో ఏళ్లుగా చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఒక్కసారి కూడా చెరువు పూడిక తీసిన దాఖలాలు లేవు. దీంతో చెరువు నుంచి వచ్చే దుర్గంధం భరించలేక పుర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పోశమ్మ పెద్ద చెరువు కట్ట చివరలో బతుకమ్మ ఘాట్ నిర్మించారు. ఈ ఘాట్ వద్ద సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలు నిమజ్జనం చేస్తున్నారు. సహజసిద్ధంగా పూసిన పూలతో పాటు రంగులద్దిన పూలనూ బతుకమ్మలు పేరుస్తుండటంతో అవి నీటిలో కొంతకాలం పాటు మురిగి జల కా లుష్యాన్ని పెంపొందిస్తున్నాయి. గత నెలలో నిమజ్జనం చేసిన బతుకమ్మలు ప్రస్తుతం ఘాట్‌వద్ద కు ప్పలుగా పేరుకుపోయాయి. ఇలా కొన్నాళ్ల నుంచి ని మజ్జనం చేస్తున్న బతుకమ్మలన్నీ అడుగు భాగంలో ఉండి పోవడంతో నీరు కలుషితమవుతోంది. పోశమ్మ చెరువు నీళ్లు ఒకప్పుడు పురప్రజల తాగునీటి అవసరాలు తీర్చగా ప్రస్తుతం కలుషితమై ఎందుకూ పనికిరాకుండా తయారయ్యాయి.పట్టించుకునేవారేరి?వినాయకుడి విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనాలతో పోశమ్మ చెరువుల నీళ్లు నిర్మలత్వాన్ని కోల్పోతున్నాయి. రంగుమారి దర్శనమిస్తున్నాయి. అసలు స్నానం చేయడానికి కూడా పనికి రావని పురప్రజలు చెబుతున్నారు. అంతగా నీళ్లు కలుషితమై పోతున్నా ఎవరూ చెరువుల ముఖం చూసిన దాఖలాలు లేవు. ఏడాదికి రెండుసార్లు నిమజ్జనాల సందర్భాల్లో మినహా ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోవడంలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా జీవాలు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి కాలుష్యం ఏర్పడకుండా తగినచర్యలు చేపట్టాలని పురప్రజలు కోరుతున్నారు. -
● పందులు, దోమలకు ఆవాసాలు ● ఇబ్బందుల్లో సమీప నివాసాలవారు ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ఓపెన్ ప్లాట్లు.. జనం పాట్లునస్పూర్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగల ఓపెన్ ప్లాట్లు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, మురుగునీటితో నిండి దోమలు, ఈగలు, పందులకు ఆవాసాలుగా మారాయి. ప్లాట్లు మురికి కూపాలను తలపిస్తున్నాయి. నస్పూర్‌లో ఐడీవోసీ భవన సముదాయం ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రం చుట్టు పక్కల భూములకు డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలామంది వారి భవిష్యత్ అవసరాల కోసం ప్లాట్లు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. భవి ష్యత్‌లో ఇళ్లు నిర్మించుకోవాలనేది వారి ఆలోచన. కొనుగోలు చేసిన ప్లాట్లకు ఎలాంటి రక్షణ గోడలు నిర్మించకుండా వదిలివేస్తున్నారు. దీంతో చుట్టుపక్కలవారు ఈ ఖాళీ ప్లాట్లను చెత్తకుండీలుగా విని యోగిస్తున్నారు. తమ ఇళ్లల్లోని చెత్తను ఖాళీ ప్లాట్ల లో పడవేస్తున్నారు. పట్టణంలో చాలాచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోనే ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేశారు. సదరు ప్లా ట్లలో ఇళ్లు నిర్మించుకున్న వారికి సరైన డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరంతా ఓపెన్ ప్లాట్లలోకి చేరుతోంది. దీంతో కాలనీల్లో పలువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్లాట్ల చుట్టూ ఎలాంటి రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడంతో వాటిలో పిచ్చిమొక్కలు పెరిగి తొలగించడం కష్టతరమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని చాలా కాలనీల్లో దాదాపు ఇదే దుస్థితి నెలకొంది. ఖాళీ ప్లాట్లలో మురుగునీరు, పిచ్చిమొక్కలు ఉండడంతో దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయి. ప్లా ట్లను పందులు తమ ఆవాసాలుగా మార్చుకున్నా యి. వీటి ద్వారా పలువురు రోగాల బారిన పడుతున్నారు. ఎలాంటి రక్షణ గోడలు నిర్మించని ప్లాట్ల యజమానులను గుర్తించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసి జరిమానా విధించాలని పలువురు పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రక్షణ గోడలు నిర్మించని ప్లాట్ల యజమా నులపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాటితో ఇబ్బంది పడుతున్న పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంగ్లిష్ నేర్చుకోవడం సులభతరం
1 నుంచి ఐదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ప్రత్యేక ఇంగ్లిష్ నేర్చుకునే సాధనం (కిట్). స్పిన్ వీల్, థిమాటిక్ బోర్డ్ గేమ్ కలిపి విద్యార్థులు ఆట వాతావరణంలో క్రియాశీలంగా పాల్గొని భాషా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. స్పిన్ వీల్లో ప్రతి సెగ్మెంట్ రెండు అంశాలను చూపిస్తుంది. ఒకటి విద్యార్థులు పూర్తి చేయాల్సిన సవాల్, రెండోవది బోర్టులో ముందుకు కదలాల్సిన దశల సంఖ్య, సవాళ్లు వేరే వేరే రకాలుగా ఉంటాయి. సంప్రదాయ పాఠ్య పద్ధతిని మించి ఒక హ్యాండ్స్ అన్ డైనిమిక్ సరదా, నైపుణ్యధారిత పాఠశాల అనుభవాన్ని విద్యార్థులకు అందిస్తోంది. – ఎం.కిరణ్‌కుమార్, మంచిర్యాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
తెలుగుపై పట్టు సాధించేలా..
విద్యార్థులు సరళంగా తెలుగు భాష నేర్చుకోవడం, అక్షరదోషాలు లేకుండా రాయడం, పలకడం కోసం నేను టీఎల్ఎం తయారు చేశాను. టెలిఫోన్ ద్వారా పదాలు గుర్తించడం, పలకడం, క్యారంబోర్డు ద్వారా కొత్త అక్షరాల గుర్తింపు, టీకప్పుల ద్వారా అక్షర మాల, ఇతర వ్యర్థాలతో తయారు చేసిన వస్తువులతో గుర్తుంచుకునేలా సరళ పదాలు, దిత్వ అక్షరాలు, సంయుక్త అక్షరాలు, ఒత్తులు, దీర్గాలు, తదితర పొందుపర్చాను. పిల్లలు సంతోషంగా ఆటలాడుతూ వీటిని నేర్చుకుంటున్నారు. తరగతి గదిలో వీటి ద్వారా విద్యాబోధన చేస్తున్నాను. – కవిత, ఎంపీపీఎస్ మావల–2 -
టీచర్ల కొరత ఉన్నప్పుడు..
నేను తయారు చేసిన టీఎల్ఎం ఒకరు.. ఇద్దరు టీచర్లు పనిచేసే చోట ఎంతగానో ఉపయోగపడపతుంది. పరిసరాల విజ్ఞానానికి సంబంధించి పుస్తకాన్ని చూడకుండానే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒకేచోట కూర్చోబెట్టి బోధన చేయవచ్చు. జ్ఞానేంద్రియాలు, కుటుంబం, వాహనాలు, మనబడి వస్తువులు, మొక్కలు, కూరగాయలు, జంతువులు, పక్షులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు సులభంగా తెలుసుకోవచ్చు. పది అంశాలకు సంబంధించి తయారు చేయడంతో రాష్ట్రస్థాయికి ప్రాజెక్ట్ ఎంపికై ంది. – సునీత, ఎంపీపీఎస్ రాంపూర్ -
జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతి
నార్నూర్: గాదిగూడ మండలం ధాబా(కే) గ్రామంలో జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మెస్రం యెసు, దుర్గుబాయి దంపతుల కుమారుడు మహేశ్ (16) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏపీఆర్జేసీలో ఇంటర్ చదువుతున్నాడు. దసరా సెలవుల్లో పదిరోజుల క్రితం ఇంటికి వచ్చినప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లిన జ్వరం తగ్గలేదు. శనివారం ఇంట్లోనే జ్వరంతో బాధపడుతూ మృతిచెందాడు. బాధిత కుటుంబానికి కళాశాల తరపున సహాయం చేయాలని ఆదివాసీ గోండ్వాన సమితి తరపున మెస్రం శేఖర్‌బాబు కోరారు. చికిత్సపొందుతూ ఒకరి మృతిఆదిలాబాద్టౌన్: పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన ఎర్రం హన్మాండ్లు (54) హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణంలోని జీఎస్ ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హన్మాండ్లు గతకొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆయన భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఈనెల 3న ఒంటిపై పెట్రోల్ పోసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా శనివారం చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ తెలిపారు. వివాహిత అదృశ్యంఆదిలాబాద్టౌన్: పట్టణంలోని బంగారుగూడకు చెందిన వివాహిత షేక్ నిలోఫర్ అదృశ్యమైనట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం 13 ఏళ్ల కుమారుడు షేక్ అయాన్‌తో బ్యాంక్ పని నిమిత్తం పట్టణంలోని శివాజీచౌక్‌కు వెళ్లింది. చెప్పు తెగిపోవడంతో వినాయక్ చౌక్ వద్ద ఉంటానని కుమారుడికి తెలిపింది. అక్కడికి వెళ్లగా తల్లి కనిపించకపోవడంతో తండ్రి షేక్ అలీకి చెప్పాడు. పలు ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ దొరకలేదు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ తెలిపారు. -
కథల ద్వారా బోధన..
ఇంగ్లిష్ భాషను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడం, చదవడానికి వీలుగా టీఎల్ఎం తయారు చేశాను. పలు పాఠాలను నా వాయిస్ ద్వారా రికార్డు చేశాను. ఒక డివైస్‌తో విద్యార్థులకు వినిపించేలా తయారు చేశాను. ఈ కథలకు సంబంధించిన బొమ్మలు, కథానుసారంగా ప్రదర్శన ఉండడంతో సులువుగా అర్థం చేసుకుంటారు. ఒకటికి పదిసార్లు వినడంతో కఠిన పదాలు మదిలో గుర్తుండిపోతాయి. నారేటీవ్ బేస్డ్ ఇంగ్లిష్ అనే అంశంపై ప్రదర్శించాను. – ఎ.శ్రీనివాస్, ఎంపీపీఎస్ గోండుగూడ, ఉట్నూర్ -
అంబులెన్స్‌లో ప్రసవం
జన్నారం: మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన లత అనే గర్భిణి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో ప్రసవించింది. శనివారం ఉదయం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. ఈక్రమంలో పురుడుపోయగా ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఒక పాప ఏడవకపోవడంతో ఎన్ఎన్ఆర్ చేయగా ఏడ్చినట్లు ఈఎంటీ జాడి రమేశ్ తెలిపారు. తల్లీబిడ్డలను జగిత్యాల ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
బొమ్మల ద్వారా నేర్చుకుందాం
పుస్తకం అవసరం లేకుండా ఆకర్షణీయ బొమ్మలతో పదాలు నేర్చుకోవడం.. పిల్లల దృష్టిని పాఠ్యాంశం వైపు మరల్చి ఆటపాటలతో బోధించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పుస్తకంతో కుస్తీ పట్టకుండా బొమ్మలతో పదాలు అక్షరాలు రూపొందించాను. వర్ణమాల, దీర్ఘాలు, వత్తులు, గుణింతాలు నేర్చుకోవడం సులభతరంగా ఉంటుంది. ఆటపాటలతో బోధించటం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. – స్వర్ణలత, ఎంపీయూపీఎస్, అక్కెపల్లి, చెన్నూర్ మండలం -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత వారం జిల్లా పోలీసు సైబర్ కార్యాలయానికి 15 ఫిర్యాదులు అందాయని, సోషల్ మీడియాలో ఆఫర్ల పేరిట తక్కువ రేటుకు దుస్తులు అందజేస్తామని జరిగే మోసాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సై బర్ నేరాలు జరిగిన వెంటనే 1930కు, సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతీ వారం జిల్లా సైబర్‌క్రైమ్ బృందంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్ ఏర్పాటు చేసి సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజ లకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నమోదైన కేసుల వివరాలు.. రూ.5 నోటుకు 5 పైసల నాణేనికి రూ.99 లక్షలు ఇస్తామని నమ్మబలికి తలమడుగు మండలంలోని ఓ వ్యక్తి వద్ద నుంచి దాదాపు రూ.8వేలు దోచుకున్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో దసరా ఆఫర్ పేరిట తక్కువ రేటుకే ఎక్కువ దుస్తులు ఇస్తున్నామని మావల మండలానికి చెందిన బాధితురాలి వద్ద నుంచి రూ.6200 తిరస్కరించారు. తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇస్తామంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడిని మోసం చేయగా, బాధితుడు విడతల వారీగా సైబర్ నేరగాళ్లకు దాదాపు రూ.14వేలు చెల్లించాడు. ఇచ్చోడ నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలని ఆన్లైన్లో వెతకగా నకిలీ కస్టమర్‌కేర్ వ్యక్తులు బాధితుడిని సంప్రదించి రూ.26వేలు తస్కరించారు. కేరళ లాటరీ రూ.5 లక్షలు వచ్చిందని, ఈ డబ్బులు ఇవ్వాలంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని ఆదిలాబాద్‌రూరల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి దాదాపు రూ.23,500 దోచుకున్నారు. -
పదాలు సులువుగా నేర్చుకునేలా..
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ వోకాబులరీ కిట్ రూపొందించాను. పిల్లలకు చిత్రం (గ్రాఫిక్) చూపెట్టి పదం, వ్యాకం పరిచయం (పదాల అభివృద్ధి) చేయడం. ఇంగ్లిష్ గ్రామర్ అంటే పిల్లల్లో భయం తొలగించడం.. సులువుగా నేర్చుకునేలా కిట్ తయారు చేశాను. పదాలు నేర్చుకోవడం ప్రతీ విద్యార్థి విద్యాభివృద్ధిలో ముఖ్యమైన భాగం. పదాలను గుర్తించి వాక్యాన్ని సులువుగా నిర్మిస్తారు. ఆంగ్ల అక్షరపదాలు అలవోకగా పలికేలా భాషా సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. – శశికుమార్, సుర్జాపూర్, కన్నెపల్లి మండలం -
సులభంగా బోధిస్తున్నాను
వాడి పాడేసిన వస్తువులు, ఆకులు, సీతాఫలం గింజలు, అట్ట ముక్కలు, డ్రాయింగ్ షీట్స్, ఇ సుక రాళ్లు, డబ్బామూతలు, గడ్డితో బోధనోపకరణాలు తయారీ చేసి విద్యార్థులకు బోధన చేస్తున్నాను. తెలుగు అక్షరాలు, వర్ణమాల, సరళ పదాలు క్లాత్‌పై రాసి వాటిని కుట్టి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నాను. జిల్లాస్థాయిలో టీఎల్ఎం మేళాలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాను. – రమేశ్‌బాబు, హెచ్ఎం, ప్రాథమిక పాఠశాల కడ్తాల్, సోన్ మండలం -
రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. శనివా రం వన్‌టౌన్‌లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఖిల్లాకు చెందిన షేక్ ఫైసల్, చిల్కూరిలక్ష్మినగర్కు చెందిన అబ్దుల్ సత్తార్లు బొక్కల్‌గూడలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పోలీసులకు అందిన సమాచారంతో దాడి చేసి వారి నుంచి 3.2 క్వింటాళ్ల బియ్యంతోపాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. డివైడర్‌ను ఢీకొన్న కారు అంబేడ్కర్ ఫ్లెక్సీని అవమానించిన ఒకరిపై కేసుభైంసాటౌన్: అంబేడ్కర్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీని అవమానించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ జి.గోపినాథ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని గోపాల్‌నగర్‌కు చెందిన దేవిదాస్‌కు చెందిన యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి దుర్గామాత విగ్రహ నిమజ్జన ర్యాలీ సందర్భంగా అదేకాలనీకి చెందిన బుద్దరతన్.. అంబేడ్కర్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీతో వీరి బృందంలో చేరి నృత్యం చేశాడు. దీంతో ఆగ్రహించిన దేవిదాస్ అతని చేతిలో ఫ్లెక్సీని లాక్కుని చించివేశాడు. శనివారం విషయం తెలుసుకున్న దళిత యువకులు అధిక సంఖ్యలో దేవిదాస్ ఇంటికి చేరుకుని అతన్ని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్దకు తీసుకువచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షమాపణలు చెప్పించారు. అనంతరం బుద్దరతన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పాఠశాలలో వరుస చోరీలపై ఫిర్యాదుఆసిఫాబాద్రూరల్: జిల్లాకేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వరుస చోరీలపై హెచ్ఎం ఉదయ్‌బాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో గతనెల 16 నుంచి ఈనెల 3వ తేదీ వరకు మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. హెచ్ఎం రూం, ల్యాబ్‌లో వస్తువులను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మోసగించిన ముగ్గురిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: మల్టీ మార్కెట్ పేరిట నకిలీ ఔషధాలు అంటగడుతూ మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. శనివారం టూటౌన్లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. సింగాపూర్, పంజాబ్, తదితర ప్రాంతాల నుంచి ఆరోగ్యానికి సంబంధించిన ఔషదాలు తీసుకొచ్చామని చెబుతున్నారని, ప్యాకెట్లను జిల్లాలో విక్రయిస్తున్నారు. అన్నిరకాల రోగాలు నయమవుతాయని ప్రజలను నమ్మ బలుకుతున్నారు. ఆదిలాబాద్‌లో నకిలీ ఔషధ ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తే ఇది వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో ఉంటున్న నార్నూర్‌కు చెందిన మహేందర్, తాంసి మండలం బండల్నాగా పూర్‌కు చెందిన రాకేశ్ విక్రయిస్తున్నారని, ఈ ఇద్దరు ఆసిఫాబాద్ జిల్లా కు చెందిన ముకుంద్‌రావు వద్ద కొనుగోలు చేశారు. 6 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, ఒక్కో ప్యాకెట్‌ను రూ.5,800 వరకు, మరికొంత మందికి ఇష్టమున్న ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
దాడి కేసులో ఏడుగురి అరెస్టు
కాసిపేట: ఒకరిపై దాడి చేసిన కేసులో ఏడుగురిని శనివారం అరెస్టు చేసినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మండలంలోని కొండాపూర్ సబ్‌స్టేషన్ సమీపంలో వైన్ షాప్ వద్ద ఈనెల 3న అచ్యుతరావ్ గూడెంకు చెందిన గూడెం రాంచందర్ ఉన్నాడు. దేవాపూర్‌కు చెందిన బోర్లకుంట ప్రణయ్, రాంటెంకి చంద్రయ్య, చునార్కర్ రాజేష్, కోమటిచేనుకు చెందిన జాడి కిరణ్, దుర్గం శేఖర్, బోర్లకుంట ప్రవీణ్, జాడి సాగర్ అకారణంగా దాడి చేశారు. రాంచందర్‌ను దుర్బాషలాడుతూ చేతులు కాళ్లతో తన్ని బీరు బాటిల్‌తో కొట్టి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. గతంలో నేరచరిత్ర ఉన్న బోర్లకుంట ప్రణయ్‌పై రౌడీషీట్ తెరవనున్నట్లు ఎస్సై తెలిపారు. -
రైతుబీమా పరిహారమేది..!
మంచిర్యాలఅగ్రికల్చర్: రైతు బీమా పథకం పరిహారం అందకపోవడంతో రైతు కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోతోంది. 2024 ఆగస్టు 15నుంచి ఈ ఏడాది ఆగస్టు 15మధ్య మృతిచెందిన 31 కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నగదు అందలేదు. రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకం ప్రవేశపెట్టింది. 18నుంచి 59ఏళ్ల రైతులను అర్హులుగా పేర్కొంది. రైతు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా రూ.5లక్షల చొప్పున పరిహారం అందించేలా ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అర్హులైన రైతుల ఆధార్‌కార్డు, నామినీ వివరాలు, పట్టాపాస్‌పుస్తకాల జిరాక్స్ కాపీలను జత చేసి దరఖాస్తులను మండల వ్యవసాయ, విస్తరణ అధికారులు సేకరించారు. ఆ వివరాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతు పేరిట రూ.355.94 చొప్పున బీమా ప్రీమియం చెల్లించింది. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే రూ.5లక్షలు పరిహారం అందుతుంది. గత ఏడాది జిల్లాలో 1,46,981 మంది పట్టాపాస్ బుక్ ఉన్న రైతులు నమోదు చేసుకోగా ఇందులో 99,393 మందిని అర్హులుగా గుర్తించారు. రైతుల పేరిట బీమా సంస్థ జారీ చేసిన ఐడీ నంబరుతో కూడిన బాండ్లు వ్యవసాయ శాఖ రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు బాండ్లు అందలేదని వాపోతున్నారు. పథకం ప్రారంభంలో అర్హులైన రైతులకు అందజేయగా.. 2019 నుంచి ఇవ్వడం లేదు. ఈ కారణంగా అందులో ఏ తప్పులు ఉన్నాయో తెలియడం లేదు. క్లెయిమ్‌కు వెళ్తున్న సమయంలో తప్పులు ఉంటే అఫిడవిట్‌ను వ్యవసాయ అధికారులకు సమర్పించి పొందేవారు. కానీ ఇప్పుడు అఫిడవిట్ లేదని, బీమా పత్రం ఆధారంగానే చెల్లింపులు చేస్తున్నారు. గత ఏడాది 421మంది మృతిచెందగా 390మంది రైతు కుటుంబాలకు రూ.19.50 కోట్లు పరిహారం అందింది. ఇంకా 31మంది రైతు కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. రైతు మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ, పట్టాపాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబరు తదితర వివరాలు సమర్పించి నెలలు గడుస్తున్నా పరిహారం అందడం లేదంటూ ప్రజావాణిలో కలెక్టర్‌కు, వ్యవసాయ, బ్యాంకు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన.. భీమారం మండలం అరెపల్లి గ్రామానికి చెందిన దుర్గం వెంకటస్వామితో నా కూతురికి వివాహం జరిగింది. ఐదేళ్ల క్రితం అనా రోగ్యంతో కూతురు చనిపోయింది. అల్లుడు ఫిబ్రవరి 17 చనిపోయాడు. తల్లిదండ్రులను కోల్పోవడంతో బాబు నా వద్దనే ఉండి చదువుకుంటున్నాడు. అల్లుడి పేరిట 2.5 ఎకరాల భూమి ఉంది. రైతుబీమాకు అర్హుడైనా ఇంతవరకు పరిహారం రాలేదు. వ్యవసాయ కై కిలికి పోనిది పూట గడవదు. రైతుబీమా పరిహారం కోసం సార్లు అడిగిన అన్ని కాగితాలు ఇచ్చిన.. ఇన్ని నెలలు నుంచి ఇటు వ్యవసాయ అధికారులు, అటు బ్యాంకు వద్దకు తిరుగుతున్నా. పరిహారం అందించి ఆదుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన. – మనవడితో కిష్టమ్మ, ఎర్రగుంటపల్లి, చెన్నూర్ -
‘పట్టు’విడువరూ..!
కోటపల్లి: దసలి పట్టుగూళ్ల పెంపకం ఆదివాసీలు, అటవీ అధికారుల మధ్య వివాదానికి తెరతీసింది. పట్టు పరిశ్రమలో రాష్ట్రంలోనే చెన్నూర్ నియోజకవర్గం మేటిగా నిలుస్తుండగా.. ఎన్నడూ లేనిది ఈసారి అధికారుల ఆంక్షల అడ్డగింత ఆదివాసీ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. కోటపల్లి మండలం రాజారం, కావర్‌కొత్తపల్లి, అర్జునగుట్ట, ఎదులబంధం గ్రామాలకు చెందిన 750 కుటుంబాలు పట్టుపురుగుల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఆరు దశాబ్దాలుగా అటవీ ప్రాంతంలోని నల్లమద్ది చెట్లపై పట్టుపురుగుల పెంపకం చేపడుతున్నారు. ఎదులబంధం, సిర్సా 332, 333 కంపార్ట్మెంట్, 360, 358 సిర్సా కంపార్ట్మెంట్, పార్పల్లి 352, 348, 336 కంపార్ట్మెంట్, లింగన్నపేట, కావర్ కొత్తపల్లి గ్రామాల్లోని కంపార్ట్మెంట్లలో ఆదివాసీలు పట్టుపురుగులు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు సుమారు 20వేల పట్టుపురుగులను సాగు చేస్తారు. సుమారు మూడు రోజుల వరకు గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడంతో వాటిని తీసుకెళ్లి నల్లమద్ది చెట్లపై వేస్తారు. పురుగు మీద నుంచి ఒక పొర లాంటిది తీసుకుని ఆకులు తింటూ మళ్లీ ఒక పొర తీస్తాయి. ఇలా నాలుగు పొరలు తీసిన తర్వాత 15రోజులు ఆకులను తినుకుంటూ ఉంటుంది. 45వ రోజు పురుగు ఆత్మరక్షణ కోసం సున్నం లాంటి పదార్థంతో చుట్టూ పొరలా ఏర్పర్చుకుంటుంది. ఇలా ఏర్పర్చుకున్న కాయలను ఆదివాసీలు చెన్నూర్ మార్కెట్‌కు తీసుకొస్తారు. ప్రత్యేక పద్ధతుల్లో వేడి చేసి పట్టును వేరు చేస్తే ఛత్తీస్‌గఢ్, కర్ణాటక వంటి ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేస్తారు. దీంతో సీజన్లో ఆదివాసీలకు సుమారు రూ.70 వేల నుంచి రూ.80వేల వరకు ఆదాయం లభిస్తుంది. ఆందోళన బాటలో ఆదివాసీలు చెన్నూర్ నియోజకవర్గంలో పట్టుపురుగుల సాగు ను ఆదివాసీ రైతులు 1960 నుంచి సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 1984లో సెరికల్చర్ కా ర్యాలయంలో నెలకొల్పారు. ఇటీవల అటవీ అధికా రులు అడ్డుకుంటుండడంతో ఆదివాసీలు ఆందోళన బాట పట్టారు. తాము అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం లేదని, నల్లమద్ది చెట్లపైనే పట్టుపురుగు ల పెంపకం చేపడుతున్నామని, అడవికి ఎలాంటి హాని తలపెట్టడంలేదని, ఇన్ని రోజులుగా ఉపాధి పొందుతున్న తమను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోటపల్లి మండలంలోని అటవీ ప్రాంతాన్ని ప్రాణహిత అభయారణ్యంగా గుర్తించారంటూ అటవీ అధికారులు అడ్డు చెబుతున్నారు. -
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
బెల్లంపల్లి: ఎన్నికల నిర్వహణకు క్షేత్రస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శనివారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఈవో ) పాఠశాల, కళాశాల, బజారు ఏరియాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను డీసీపీ ఎగ్గడి భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం మండల స్థాయిలో తహసీల్దార్లను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ఎన్ని కల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్, రూరల్ సీఐ హనోక్, తదితరులు పాల్గొన్నారు. సమాచారం, ఫిర్యాదులకు హెల్ప్‌లైన్ మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సమాచారం, ఫిర్యాదులకోసం సమీకృత కలెక్టరేట్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్, ఇతర ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, ఇతర దరఖాస్తుల కోసం హెల్ప్‌లైన్ 08736–250251 ఏర్పాటు చేశామని, 24/7 సహాయ కేంద్రం సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే సమాచారం అందించాలన్నారు. -
‘పాలఘోరీ’పై ప్రత్యేక నిఘా
జన్నారం: అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పాలఘోరీ ఘటన మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకు ఆశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి సమస్య ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా ఆదివాసీ గిరిజనులు గుడిసెలు వేసుకునే అవకాశం ఉండడంతో అట వీశాఖ అధికారులు అదే ప్రాంతంలో తిష్ట వేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. గుడిసెలు తొలగింపు జన్నారం అటవీ డివిజన్, ఇందన్పల్లి రేంజ్ కవ్వాల్ అటవీ సెక్షన్, సోనాపూర్ తండా బీట్ పాలఘోరీ ప్రాంతంలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, జైనూర్, లింగాపూర్ మండలాలకు చెందిన సుమారు వందమంది ఆదివాసీ గిరిజనులు ఆగస్టు 4న ఈ ప్రాంతంలో తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. అట వీ, పోలీసు, రెవెన్యూ అధికారులు వారికి పలుమా ర్లు కౌన్సిలింగ్ ఇచ్చి ఆప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించారు. కానీ వారు వెళ్లకపోగా సెప్టెంబర్ 18న రాత్రి సుమారు 350 టేకుచెట్లను నరికారు. అడ్డుగా వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో 26 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సహాయంతో అడవిలో వేసుకున్న గుడిసెలను తొలగించారు. కందకాల తవ్వకం పాలఘోరీ ప్రాంతంలో విలువైన టేకు చెట్లు నరికివేతకు గురి కావడాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఆ ప్రాంత పరిసరాల్లో చుట్టూ కందకాలను తవ్వించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను సిబ్బందికి అప్పగించారు. అయితే టైగర్‌జోన్ సర్కిల్, జిల్లా అటవీశాఖ, జన్నారం డివిజన్ శాఖ నుంచి పాలఘోరీపై నిఘా ఉన్నట్లు తెలుస్తుంది. -
బీసీలు రాజ్యాధికారం సాధించాలి
పాతమంచిర్యాల: బీసీలు సంఘటితంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని బీసీ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుచిత్ర ఫంక్షన్ హాల్లో బీసీల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడు తూ బీసీ సంఘాలు వేరైనా నినాదం ఒక్కటేనన్నారు. సంఘటితమే బీసీలను రాజ్యాధికారం వైపు నడిపిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మన ఓట్లు మనమే వేసుకోవాలన్నారు. అగ్ర వర్ణ విభజన రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలను బీసీలు గమనించాలన్నారు. రాజ్యాధికార సాధనకు బీసీలు ప్రణాళికతో ముందుకెళ్లాలని పలువురు వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, బీసీ సంఘం రాష్ట్ర నాయకురాలు సంధ్యారాణి, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ వరపు జగన్, బీసీ నాయకులు అరుణ్ కుమార్, తులా మధుసూదన్‌రావు, కర్రె లచ్చన్న, గజెళ్లి వెంకటయ్య, సదానందం, వడ్డేపల్లి మనోహర్ పాల్గొన్నారు. -
● లక్షల్లో నిధుల ఖర్చు... ● కొన్నింటిలో లోపలికి సైతం వెళ్లలేని పరిస్థితి ● పట్టణ ప్రజలకు అందని ఆహ్లాదం
మంచిర్యాలటౌన్: పట్టణ ప్రజలకు ఆహ్లాదం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని పార్కులను అభివృద్ధి చేసేందుకు పెద్దమొత్తంలో పట్టణ ప్రగతి నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులు చేపట్టినా ప్రజలకు మాత్రం ఆహ్లాదం అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో కొన్నిచోట్ల పనులను ‘మమ’ అనిపించారు. పార్కులను అభివృద్ధి చేశామని చెబుతున్నా ప్రజలు మాత్రం అందులోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పాతమంచిర్యాల, రాంనగర్, హైటెక్‌సిటీ ప్లేగ్రౌండ్ పార్కులు మినహా మిగతా పార్కుల్లో ఎక్కడా ఆహ్లాదం కనిపించడం లేదు. పాతమంచిర్యాల పార్కుకు రూ.90 లక్షల నిధులు కేటాయించగా చిన్నారులు, పెద్దలకు ఆహ్లాదం పంచేలా అందులో అభివృద్ధి పనులు చేపట్టారు. వాకింగ్ ట్రాక్‌తో పాటు ఓపెన్‌జిమ్ ఏర్పాటు చేశారు. పార్కు చుట్టూ నిర్మించిన ప్రహరీకి సున్నం వేయించారు. కానీ రూ.90 లక్షలకు అనుగుణంగా పార్కులో ఆహ్లాదం కరువైంది. హైటెక్‌సిటీ కాలనీని చిల్డ్రన్స్‌పార్కులో రూ.50 లక్షలతో వాకింగ్ ట్రాక్, చిన్నారులు ఆడుకునే మూడు రకాల పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ పార్కులోనూ పిచ్చిమొక్కలు పెరిగి అందులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాత గర్మిళ్ల పార్కు, రాజీవ్‌నగర్‌లోని పార్కులకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టినా అందులోనూ ఆహ్లాదం మాత్రం కనిపించడం లేదు. చిన్నపిల్లల పార్కుపై నిర్లక్ష్యం జిల్లా కేంద్రంలోని జాఫర్‌నగర్ రాముని చెరువు కట్టను ఆనుకుని పిల్లల పార్కును ఏర్పాటు చేశారు. అందులో రూ.10 లక్షలతో గతంలో చిన్నారులు ఆడుకునే పరికరాలను ఏర్పాటు చేశారు. పార్కు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆ పరికరాలు తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం పిచ్చి మొక్కలు పెరిగాయి. పూర్తిస్థాయిలో పరికరాలు ఏర్పాటు చేసి చిన్నారులు ఆహ్లాదంగా గడిపేందుకు పట్టణ ప్రగతి నిధులు రూ.80 లక్షలు కేటాయించినా ఇంకా పనులు ప్రారంభించలేదు. జిల్లా కేంద్రంలోని ఏకై క పిల్లల పార్కు ఇదే. ఈ పనులను పూర్తి చేస్తే సెలవుల్లో పిల్ల లు సరదాగా గడిపేందుకు ఈ పార్కు ఉపయోగపడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దసరా సెలవుల్లో చిన్నారులు ఆడుకునేందుకు రాంనగర్ పార్కు మినహాయించి, ఏ ఇతర పార్కు వారికి ఉపయోగపడలేదు. ఒక్కో పార్కుకు లక్షల రూపాయల నిధులు కేటాయించినా ఆహ్లాదం అందకపోవడంతో చిన్నారులు ఇళ్లకు, మైదానాలకే పరిమితం అయ్యారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పార్కుల్లో అభివృద్ధి పనులు చేపట్టి ఆహ్లాదం అందేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఘనంగా దసరా వేడుకలు
మంచిర్యాలఅర్బన్: విజయదశమి పర్వదిన సంబరాలు మంచిర్యాలలో అంబరన్నాంటాయి. గురువారం ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం విశ్వనాథ ఆలయం నుంచి ఉత్సవ దేవతామూర్తులతో గోదావరి రోడ్డులోని గౌతమేశ్వర ఆలయం వరకు రథోత్సవం నిర్వహించారు. విశ్వనాథ ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వరస్వామి, పార్వతీపరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలతో పట్టణ పురవీధుల మీదుగా గౌతమేశ్వర ఆల యం వరకు రథోత్సవం సాగింది. అక్కడ ఆలయ ఆవరణలోని జంబి వృక్షానికి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చుకుంటూ అలయ్ బలయ్ తీసుకున్నారు. స్థానిక రాంనగర్లో రావణవధ కార్యక్రమం నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో ఆలయ ఈవో రవి, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
● రూ.60కోట్లపైనే సాగిన అన్ని రకాల వ్యాపారం ● గుడిపేట లిక్కర్ డిపో నుంచి భారీగా మద్యం సరఫరా ● మూడు రోజుల్లో రూ.26.38కోట్ల లిక్కర్ అమ్మకాలు ● అదే జోరులో సాగిన మాంసం విక్రయాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/మంచిర్యాలక్రైం: దసరా జోష్ జోరుగా సాగింది. ఈ ఏడాది దసరా రోజు గాంధీ జయంతి ఉండడం, గురువారమూ కావడంతో మూడు రోజుల పండుగగా మారింది. బుధ, గురు, శుక్రవారాల్లోనూ సందడి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు రూ.60కోట్లకు పైగా ఖర్చు చేసి సంబరంగా పండుగ చేసుకున్నారు. మద్యం, మాంసం, నూతన వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, మిఠాయిలు తదితర కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేశారు. అంచనాకు మించి మద్యం అమ్మకాలు ఈసారి దసరా పండుగ గాంధీ జయంతి రోజు రావడంతో ఆశించిన స్థాయిలో మద్యం అమ్మకాలు ఉండవని ఎకై ్సజ్ అధికారులు అంచనా వేశారు. కానీ ఆ అంచనాను దాటి మద్యం అమ్మకాలు సాగినట్లు ఓ అధికారి చెప్పడం గమనార్హం. మందుబాబులు ముందస్తుగానే మద్యం కొనుగోలు చేశారు. జిల్లాలో గత దసరాకు మూడు రోజుల్లో దాదాపు రూ.20.84 కోట్ల వరకు వ్యాపారం సాగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28, 29, 30న మంచిర్యాల జిల్లా గుడిపేట లిక్కర్ డిపో నుంచి మొత్తంగా రూ.26.38 కోట్ల వరకు మద్యం సరఫరా జరిగిందంటే ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయో తెలుస్తోంది. డిపో పరిధిలో పెద్దపల్లి జిల్లా రామగుండం, మంథని, భూపాలపల్లి జిల్లా కాటారం, జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతాల్లో 135 మద్యం దుకాణాలు, 28 బార్లు ఉండగా నిత్యం ఇక్కడి నుంచి మద్యం నిల్వలు సరఫరా అవుతాయి. మూడు రోజుల్లో 23,679 లిక్కర్ కేసులు, 30,855 బీర్ కేసులు అమ్మగా.. వీటి విలువ రూ.26.38 కోట్లు ఉంటుందని డిపో అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా పరిధిలో 73 మద్యం దుకాణాలు, 18 బార్లు ఉండగా.. గత ఏడాది రూ.8.04కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈసారి దసరాకు రూ.14.16కోట్ల మ ద్యం అమ్మకాలు జరిగాయి. దసరాకు ఒక్క రోజు ముందు ఈ నెల ఒకటిన ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా రూ.10కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. మాంసం అమ్మకాలు మాంసం అమ్మకాలూ జోరుగానే సాగాయి. గ్రామాలు, పట్టణాల్లో కలిపి వేల సంఖ్యలో యాటలు(మేకలు, మేకపోతులు, గొర్రె పోతులు) తెగినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలో దాదాపు రూ.15 కోట్ల వరకు వ్యాపారం సాగినట్లు తెలుస్తోంది. దసరా గాంధీ జయంతి రోజు కావడంతో బుధ, గురు, శుక్రవారాల్లో మటన్, చికెన్ అమ్మకాలు పోటాపోటీగా సాగాయి. కిలో చికెన్ రూ.200, స్కిన్లెస్ రూ.220, మటన్ కిలో రూ.700 నుంచి రూ.1,000 ఉండగా ఒక్కో మేక, గొర్రె, మేకపోతులకు రూ.7 వేల నుంచి రూ.16 వేల వరకు ధరలు పలికాయి.నూతన వస్త్రాలు.. వాహనాలు..బట్టల దుకాణాలు, షాపింగ్ మాల్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్సెస్, వాహన కొనుగోళ్లు తదితర వ్యాపారాలు కూడా జోరుగా సాగినట్లు తెలుస్తోంది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా రూ.15 కోట్లకు పైగానే వస్త్ర వ్యాపారం జరుగగా ఎలక్ట్రానిక్, హోం అప్లయెన్స్స్ దుకా ణాలు, మిఠాయిలు, కూల్‌డ్రింక్స్ వ్యాపారం, ద్విచక్ర వాహన, కార్ల కొనుగోళ్లు బాగానే జరగాయి. ఇక మొబైల్ దుకాణాలు రూ.లక్షల్లో వ్యాపారం చేశాయి. దసరా సందడితో అన్ని రకాల వ్యాపారాలన్నీ రూ.20 కోట్ల వరకు జరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏదేమైనా దసరా సంబురాలకు తగ్గేదేలే అన్న చందంగా జోష్ కనిపించింది. -
రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి
భైంసాటౌన్: పట్టణానికి చెందిన హోమియోపతి వైద్యుడు కుమార్ యాదవ్ (43) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. పురాణాబజార్కు చెందిన డాక్టర్ కుమార్ యాదవ్ గురువారం బైక్‌పై నిర్మల్ వైపు వెళ్లి తిరిగి సాయంత్రం భైంసా వైపు వస్తుండగా, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే మార్గంలో భైంసా–నిర్మల్ హైవేపై ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఏదైనా వాహనం ఢీకొందా.. లేదా అదుపు తప్పి కిందపడ్డాడా? అనే విషయం తెలియరాలేదు. అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. కుమార్ యాదవ్ స్థానికంగా హిందూ ఉత్సవ సమితి సభ్యుడిగా ఉంటూ స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. దీంతో ఆయన మృతిపై పట్టణానికి చెందిన వైద్యులు, పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ప్రమాదంలో గాయపడి వృద్ధురాలు..
జైపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికి త్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై శ్రీధర్ తెలి పారు. ఆయన కథనం ప్రకా రం.. మండలంలోని ఎల్కంటి గ్రామానికి చెందిన యువకుడు తుంగపిండి శివరాం గత నెల 24న రాత్రి తన బైక్‌తో అదే గ్రామానికి చెందిన జనగామ లింగమ్మ(70) ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ లింగమ్మను మంచిర్యాలలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు అక్కడికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజాము మృతి చెందింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అశ్వరథంపై అమ్మవారి ఊరేగింపు
శరన్నవరాత్రి ఉత్సవాలుబాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. గురువారం సాయంత్రం 4గంటల సమయంలో ఆలయ అర్చకులు సరస్వతీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అశ్వరథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూర్చోబెట్టి భక్తుల దర్శనార్థం గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అశ్వరథం గ్రామంలోకి రావడంతో మహిళలు మంగళహారతులతో అమ్మవారికి ఘనస్వాగతం పలికారు. భక్తి గీతాలు, కోలాటాల మధ్య అమ్మవారి అశ్వరథం ఊరేగింపు కొనసాగింది. శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి అశ్వరథం ఊరేగింపు కోసం స్వచ్ఛందంగా గ్రామానికి చెందిన ప్యా ట్ల సుఖేశ్రావు కుటుంబ సభ్యులు ముందుకు వ చ్చారు. ఈ సందర్భంగా వారిని దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి అంజనాదేవి, ఏఈ వో సుదర్శన్‌గౌడ్ శాలువాతో సన్మానించారు. బాసరకు శృంగేరి పీఠాధిపతి కర్ణాటక రాష్ట్రంలోని మహాస్థానం దక్షిణమనయ శ్రీశారదాపీఠం శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీయ సన్నిధానం పీఠాధిపతి బాసరకు రానున్నారు. శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్ర పర్యటన ఈ నెల 17 నుంచి 19వరకు కొనసాగనుంది. నేపాల్, న్యూఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా యాత్ర చేపడుతూ బాసరలో సరస్వతీ అమ్మవారికి రెండురోజులపాటు ప్రత్యేక పూజలు చేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. -
కార్మికులు, యాజమాన్యానికి వారధిగా యూనియన్
కాసిపేట: కార్మికులు, ప్రజలు, యాజమాన్యానికి వారధిగా యూనియన్ పని చేస్తుందని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్‌రావు తెలిపారు. కంపెనీ తరఫున సమీప గ్రామాల ప్రజలకు సేవలందించేందుకు అంబులెన్స్‌ను గురువారం ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా బోనస్ రూ.4వేలు పెంచినట్లు తెలిపారు. ఒకేసారి 26క్వార్టర్లు అర్హులకు ఇప్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్‌రెడ్డి, మెరుగు శంకర్, నాయకులు జనార్థన్, అబ్ధుల్ సత్తర్, కొమ్ముల బాపు తదితరులు పాల్గొన్నారు. -
ఖర్చుకు తొందరొద్దు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహులు హడావుడి చేస్తున్నారు. ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలూ దృష్టి సారించాయి. ఈసారి బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు ఈ నెల 8న విచారణకు రానుంది. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఎలా వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. కానీ.. కొందరు ఎన్నికలు జరుగుతాయనే ధీమాతో ఉండగా.. మరికొందరు జరిగే అవకాశం లేదని వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోటీ చేయాలనుకునే కొందరు నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల నాయకత్వం ఎన్నికలు జరిగితే అందుకు సిద్ధంగా ఉండాలని, పోటీలో వె నుకబడకూడదనే కారణంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. మండల, జిల్లా స్థాయి నాయకులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ముందే స్థానంపై కర్చీఫ్ వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులతో టచ్‌లో ఉంటూ తమకే సీటు దక్కేలా ప్రయత్నాలతో హడావుడి చేస్తున్నారు. తొందరపడితే అంతే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్లపై ఓ వైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే.. అభ్యర్థులకు పోటీపై స్పష్టత రాకముందే కొందరు దసరా పండుగకు డబ్బులు ఖర్చు చేసుకున్నారు. ఎలాగైనా పోటీ చేస్తామని చెప్పుకుంటూ దావత్‌లు ఇచ్చారు. మద్యం బాటిళ్లు తమ అనుకూలమైన వారికి పంపిణీ చేసుకున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాకముందే డబ్బులు ఖర్చు చేసుకోవద్దంటూ అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాకముందే పోటీ చేస్తామనే నమ్మకంతో పైసలు ఖర్చు చేసుకుంటున్నారు. ఒకవేళ ఆశించిన చోట పోటీ కుదరకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోర్టు తీర్పుతో రిజర్వేషన్ల మార్పుతోపాటు షెడ్యూల్ మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎన్నికల కోసం తొందరపడి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని రాజకీయ అనుభవజ్ఞులు చెబుతున్నారు.స్పష్టత వస్తేనే..స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లపై న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయోననే సర్వత్రా ఎదురు చూస్తున్నారు. గతంలో కంటే బీసీ వర్గాలకే ఈసారి అధికంగా అవకాశాలు వచ్చాయి. బీసీ నాయకులకు జనాభా ప్రాతిపదికన పోటీకి అవకాశం కల్పించారు. ఒకవేళ కోర్టులో 42శాతం రిజర్వేషన్ల కల్పన విధానం నిలబడకపోతే బీసీ అభ్యర్థులపై ప్రభావం పడనుంది. అంతేకాక మహిళా కోటా, జనరల్ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరో నాలుగు రోజులపాటు వేచి చూసి ముందుకు వెళ్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘కడెం’ ఆధునికీకరణకు ఉద్యమం
దండేపల్లి: చెన్నూరు వరకు సాగునీరు అందించాలని మండలంలోని నెల్కివెంకటాపూర్‌కు చెందిన గాదె శ్రీనివాస్ కొంతమంది రైతులతో కలిసి దసరా పండుగను పురస్కరించుకుని గురువారం కడెం ప్రాజెక్ట్ ఆధునికీకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కడెం ప్రాజెక్ట్ నీటిని చెన్నూరు వరకు అందించేందుకు 1987లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హాజీపూర్ మండలం పెద్దంపేట వద్ద మందాకిని కాలువ నిర్మాణానికి భూమిపూజ చేశారని, అది ఇప్పటికీ పూర్తికాలేదన్నారు. కడెం నీటిని చెన్నూర్ వరకు అందించాలంటే మొదటగా కడెం ప్రాజెక్ట్‌ను ఆధునికీకరించాలన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నీరు హాజీపూర్ మండలం వరకే అందించడం గగనంగా మారిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు కడెం ప్రాజెక్ట్ ఆధునికీకరణపై దృష్టిసారించి అప్పటి ప్రధాని, ముఖ్యమంత్రుల హామీ లను అమలు చేయాలని కోరారు. కడెం ప్రాజెక్టును ఆధునికీకరించే వరకు ఆయకట్టు రైతులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. -
సోలార్ విద్యుత్ తీగ తగిలి రైతు..
నేరడిగొండ: పంట రక్షణకు అమర్చిన సోలార్ ఫెన్సింగ్ తీగకు తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని తేజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపిన వివరాల ప్ర కారం.. ఏలేటి నారాయణరెడ్డి (59) కోతుల బెడద నుంచి పంట రక్షణకు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం ఉదయం కోతులు వచ్చాయని తెలియగా వాటిని తరమడానికి చేనుకు వెళ్లాడు. ఈ క్రమంలో సోలార్ ఫెన్సింగ్ తీగకు తగిలి కింద పడ్డాడు. పక్కనే వ్యవసాయ క్షేత్రంలో ఉన్న రైతులు గమనించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రైవేట్ వాహనంలో బోథ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు నవనీత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
దాడి ఘటనలో నిందితులపై కేసు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియా వద్ద గురువారం ఇద్దరు యువకుల పై విచక్షణా రహితంగా కొందరు దాడి చేసి గాయపర్చారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సర్కిల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రాజశేఖర్‌తో కలిసి ఆయన వివరాలు వెల్ల డించారు. పాలచెట్టు ఏరియాలో ఉన్న పచ్చిక రవితేజ, బండ రాకేశ్‌కు స్థానిక విద్యానగర్‌కు చెందిన కొందరు యువకులకు ఆటో యూ టర్న్ తీసుకునే విషయంలో ఘర్షణ ఏర్పడింది. ఆటోలో వచ్చినవారు విచక్షణారహితంగా ఇద్దరు యువకులపై తాగిన మైకంలో చేతులు, కర్రలు, రాళ్లతో దాడి చేయగా రవితేజ తలకు గాయమైందని సీఐ తెలిపారు. రవితేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన జిల్లపల్లి ఆకాశ్, కోట మహే శ్, రెండ్ల శ్రీకాంత్, వానబోయిన నవీన్‌కుమార్, పులి సతీశ్, మరొకరు జిల్లపల్లి ఆకాశ్ స్నేహితుడిపై కేసు మోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఆకాశ్ స్నేహితుడు ప రారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే పీడీ యాక్ట్ న మోదు చేయడానికై నా వెనుకాడమని హెచ్చరించారు. -
కొత్త గనుల ఏర్పాటుకు కృషి
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. స్థానిక సింగరేణి హైస్కూల్ మైదానంలో సింగరేణి, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సప్తవ్యసనాల దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం రాధాకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్యతో కలిసి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త గనుల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడి త్వరగా వేలంపాట నిర్వహించే విధంగా చూడాలని కోరినట్లు తెలిపారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనం, కార్మికుల సొంతింటి కల నెరవేర్చే విధంగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు, సింగరేణి కార్మిక కుటుంబాలు పాల్గొన్నారు.అమ్మ దీవెనలతో ప్రజలు ఆనందంగా ఉండాలిచెన్నూర్: దుర్గాదేవి అమ్మవారి దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. దసరా పండుగ సందర్బంగా గురువారం చెన్నూర్‌లోని దుర్గాదేవి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో సుమారు రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో చెన్నూర్, కోటపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. -
భూఆక్రమణ అడ్డగింత
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఖాళీ స్థలం ఆక్రమణ యత్నాన్ని స్థానిక యువకులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో సింగరేణి అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పట్టణ నడిబొడ్డున ఉన్న రూ.కోట్లు విలువై చేసే సింగరేణి లీజు భూమిలో ఓ సామాజిక వర్గానికి చెందిన శ్రేణులు బుధవారం రాత్రి గుట్టుగా చదును చేసి పిచ్చిమొక్కలు తొలగించారు. ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి ఫంక్షన్‌హాల్, కులదైవం గుడిని సింగరేణి లీజు స్థలంలో నిర్మించుకోగా కొత్తగా ప్రహరీ ఆనుకుని అర ఎకరానికి పైగా ఉన్న భూమిని ఆక్రమించడం కలకలం రేపింది. మూసివేతకు గురైన సౌత్‌క్రాస్‌కట్ గని ఉపరితలంలో ఇంకా మూడెకరాలకు పైగా సింగరేణి లీజు భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన కొందరు అర్ధరాత్రి ట్రాక్టర్‌తో పిచ్చిమొక్కలు తొలగించి గుడి ముందున్న ప్రహరీ కొంత తొలగించి కొత్తగా గేటు ఏర్పాటు చేశారు. సిమెంటు గద్దె నిర్మించి విగ్రహాలు నెలకొల్పి ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం సదరు సామాజిక వర్గానికి చెందిన మహిళలు, వక్తలు ప్రత్యేక పూజలు చేశారు. ఆ విషయమై 31వ వార్డు యువకులు, మహిళలు సింగరేణి అధికారులకు సమాచారం అందించారు. సామాజిక మాధ్యమాల్లో భూ ఆక్రమణ ఫొటోలు పోస్టు చేయడంతో చర్చనీయాంశమైంది. మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఆదేశాలతో సింగరేణి ఎస్టేట్, సింగరేణి అటవీ శాఖ, ఎస్అండ్పీసీ అధికారులు, సిబ్బంది వచ్చి భూ ఆక్రమణ చర్యలను అడ్డుకున్నారు. చదును చేసిన ఖాళీ స్థలంలో ఆక్రమణలను బ్లేడ్ ట్రాక్టర్‌తో తొలగించారు. ఆక్రమణకు గురికాకుండా మొక్కలు నాటారు. సదరు భూమి సింగరేణి కంపెనీదని, కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని రెండు చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మరెవరైనా భూ కబ్జా చేస్తే పేదలతో నివాస గృహాలు ఏర్పాటు చేయిస్తామని 31వ వార్డు ప్రజలు సింగరేణి అధికారులకు తెగేసి చెప్పారు. వార్డు యువకులకు కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా నిలిచారు. -
రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య
తలమడుగు: మండలంలోని ఉండం గ్రామానికి చెందిన హర్షముత్తుల వెంకటి (40) గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటికి గతంలో ప్రమాదంలో కాలు విరగగా ఏ పనీ చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్ర మంలో మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల క్రితం బైక్‌పై గ్రామానికి చెందిన పోశెట్టిని ఢీకొ ట్టాడు. ఈ ప్రమాదంలో పోశెట్టి కాలు విరగడంతో పోలీస్‌స్టేషన్‌లో వెంకటిపై కేసు నమోదైంది. దీంతో జీవితంపై విరక్తితో శుక్రవారం గ్రామశివారులో ఆదిలాబాద్ వైపు వస్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ తెలిపారు. -
అందరికీ విజయాలు చేకూర్చాలి
మంచిర్యాలక్రైం: విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం విజయదశమి సందర్భంగా కమిషనరేట్ ఆవరణలోని దుర్గమాత సన్నిధిలో పోలీస్ అధికారులతో కలిసి ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ ప్రకాశ్ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బీసీలకు 42శాతం రిజర్వేషన్‌తోనే ఎన్నికలు జరగాలి
మంచిర్యాలటౌన్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీలకు 42శాతం రిజర్వేషన్‌తోనే ఎన్నికల నిర్వహణ జరగాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌తో కలిసి మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిస్తోందని, కాంగ్రెస్ పార్టీ దగ్గరి వ్యక్తులు కోర్టులో కేసులు వేసి ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి వేల కోట్ల నిధులు మంజూరు చేస్తోందని, స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొయ్యల ఏమాజి, గాజుల ముఖేశ్‌గౌడ్, ముత్తె సత్తయ్య, కమలాకర్‌రావు, పట్టి వెంకటకృష్ణ, జోగుల శ్రీదేవి, అక్కల రమేశ్, వంగపల్లి వెంకటేశ్వర్రావు, ఎనగందుల కృష్ణమూర్తి, పులగం తిరుపతి, మంత్రి రామయ్య, బెడద సురేశ్, నాగేశ్వర్రావు, శైలేందర్‌సింగ్ పాల్గొన్నారు. -
అతివలకు అండగా షీటీం
ఆదిలాబాద్‌టౌన్: షీటీం 24గంటలు సేవలందిస్తోందని ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణకు పని చేస్తోందని పేర్కొన్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో రాత్రి వేళ మహిళలను వేధించిన ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని 16 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దసరా సందర్భంగా రాత్రి వేళ దస్నాపూర్ ప్రాంతంలో మహిళలను వేధించిన జిల్లా కేంద్రానికి చెందిన షిండే రాహుల్, యోగేశ్, పద్మశాలీ విఠల్, షిండే నితిన్, అడలోలు నరేశ్, రోహిత్, బొంపల్లి ప్రసాద్, షేక్ పర్వేజ్, ధూత్రి పరమేశ్వర్‌పై మావల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఇటీవల ఆది లాబాద్ నుంచి మహారాష్ట్రలోని కేళాపూర్ వెళ్లే పాదయాత్ర సమయంలో మహిళను వేధించిన మడావి దత్తుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు, పని స్థలాల్లో మహిళలకు 20 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో 24 ఈ పెట్టీ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నెల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 119 హాట్స్పాట్లను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆరు కౌన్సిలింగ్‌ల ద్వారా కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఆపద ఎదురైతే ఆదిలాబాద్ షీటీం బృందాలకు 8712659953 నంబర్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈనెలలో మహిళల నుంచి దాదాపు 31ఫోన్‌కాల్స్ ద్వారా ఫిర్యాదులు రాగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. -
జన్నారం ఇంచార్జి రేంజ్ అధికారిగా మమత
జన్నారం: జన్నా రం అటవీ డివిజన్లో ల్యాండ్ అండ్ రి కార్డు సర్వే డీఆర్వోగా విధులు నిర్వర్తి స్తున్న మమత జన్నారం ఇంచార్జి రేంజ్ అధికారిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ని రోజులు తాళ్లపేట్ రేంజ్ అధికారి సుష్మారావుకు ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారు. డివిజన్లో జరుగుతున్న పరిణామా ల దృష్ట్యా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ మమతకు బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం రేంజ్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. తనకు ఉన్నతాధికారులు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. -
వాగుకు చేపలకు వేటకు వెళ్లి ఒకరు..
తానూరు: చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దామాజీ సాయినాథ్ (40) ఈ నెల 1న చేపలు పట్టేందుకు సింగన్‌గాం సమీపంలోని వాగుకు వెళ్లి రెండు రోజులైనా తిరిగి రాలేదు. బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. ఆ మార్గంలో వెళ్తున్న కొంతమంది నీటిలో తేలిన మృతదేహాన్ని పరిశీలించి పోలీసుల కు సమాచారం ఇవ్వగా ఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. తానూరువాసులు దామాజీ సా యినాథ్గా గుర్తించారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
చెన్నూర్‌రూరల్: విద్యుత్ తీగలు అమర్చి అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ డివిజన్ అధికారి కె.సర్వేశ్వర్ హెచ్చరించారు. మండలంలోని ఒత్కులపల్లి, కొత్తపల్లి గ్రామాల సమీపాల్లోని అటవీ ప్రాంతంలో కొంద రు గుర్తు తెలియని వ్యక్తులు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చారని బుధవారం రాత్రి అందిన పక్కా సమాచారం మేరకు అటవీ సిబ్బందితో కలిసి వెళ్లి విద్యుత్ తీగలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ తీగలు ఎవరు అమర్చారో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామన్నా రు. అటవీ జంతువులను వేటాడినా, వాటి అవాసాలకు ముప్పు తలపెట్టినా, ఉరులు, ఉచ్చులు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేమనపల్లి: వన్యప్రాణుల వేట కోసం అటవీ సరిహద్దుల వెంట విద్యుత్ ఉచ్చులు అమర్చటం ప్రమాదకరమని నీల్వాయి అటవీ రేంజ్ అధికారి హఫీజొద్దీన్ అన్నారు. బుధవారం అటవీ రేంజ్ పరిధిలోకి వచ్చే కల్మలపేట, చామనపల్లి, బద్దంపల్లి ఇతర గ్రామాల్లో వన్యప్రాణుల వేట వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో ప్రమోద్‌కుమార్ ఎఫ్‌బీవోలు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
భీమారం: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు వార్డులు, రిజిష్టర్లు, మందుల నిల్వలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యరంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రజాసంక్షేమం కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించే విధంగా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలోని మందులు, స్టాఫ్ వివరాలను స్టాఫ్‌నర్స్ కృష్ణవేణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే కస్తూర్భా బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. -
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసర: బాసరలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు పదో రోజు మహా సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమి చ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులుతీరా రు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆలయ వైదిక బృందం నవ చండీ హోమం, పూర్ణహుతి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు మహాభిషేకము, అలంకరణ పూజలు చేశారు. సాయంత్రం చతుషష్టి పూజలు నిర్వహించారు. -
కవ్వాల్ అందాలు చూసొద్దాం!
జన్నారం: పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, చెంగుచెంగున ఎగురుతూ పరిగెత్తే వన్యప్రాణులు, స్వచ్ఛమైన ప్రాణవాయువు.. వీటికి చిరునామా కవ్వాల్ అడవులు. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్లో సఫారీ ప్రయాణంతో పర్యాటకులు నేరుగా అటవీ అందాలను, వన్యప్రాణులను చూసి ఆహ్లాదం పొందుతున్నారు. అటవీశాఖ ప్రతీ సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు సఫారీ ప్రయాణానికి అనుమతి నిలిపివేస్తుంది. తిరిగి అక్టోబర్ 1 నుంచి సఫారీ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది గత వారం రోజుల వరకు వర్షాలు ఎక్కువగా కురువడంతో సఫారీకి మరికొంత సమయం పడుతుందని అంతా భావించారు. కానీ మూడు రోజులుగా వర్షాలు పడకపోవడంతో బుధవారం నుంచి సఫారీ ప్రయాణానికి అటవీశాఖ అధికారులు అనుమతినిచ్చారు. అడవిలో రెండు గంటలు.. జన్నారం అటవీ రేంజ్‌లోని పలు ప్రాంతాలలో సఫారీ ప్రయాణానికి అనుమతి ఉంది. ఈ సఫారీ ప్రయాణం రెండు గంటలు ఉంటుంది. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు, ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడుసార్లు సఫారీ ప్రయాణం ఉంటుంది. ఈ రెండు గంటలు గేట్ నంబర్ 1 నుంచి గొండుగూడ బేస్ క్యాంపు, బైసన్‌కుంట, మైసమ్మ కుంట ప్రాంతాల వరకు తీసుకెళ్తారు. బైసన్‌కుంటలో సేద తీరడానికి, టిఫిన్ చేయడానికి సౌకర్యం కల్పించారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువగా కనిపిస్తాయి. పెరిగిన సఫారీ ధరలు పర్యాటకులను అడవుల్లోకి తీసుకెళ్లడానికి అటవీశాఖ అధికారులు ఐదు సఫారీలను, పర్యాటక శాఖ అధికారులు రెండు సఫారీలను ఏర్పాటు చేశారు. ఈసారి సఫారీ ధరలు గతం కంటే పెరిగాయి. సోమవారం నుంచి గురువారం వరకు ఆరుగురికి రూ. 3500, అదనపు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీకెండ్ రోజుల్లో (శుక్ర, శని, ఆదివారాల్లో) సఫారీ ఆరుగురికి రూ.4000, అదనపు సభ్యుడికి రూ. 500 చొప్పున చెల్లించాలి. కాగా ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తగ్గిన హరిత గదుల ధరలు దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు బస చేయడానికి జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్ గదుల ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ధరలు తగ్గాయి. గతంలో సోమవారం నుంచి గురువారం వరకు ఏసీ గదులు రూ.2016, నాన్ ఏసీ గదులు రూ.1232, డార్మెంటరీ గది రూ.2500లుగా ఉండేవి. వీకెండ్ (శుక్ర, శని, ఆదివారాల్లో) ఏసీ గది రూ.2240, నాన్ ఏసీ రూ.1344, డార్మెంటరీ రూ. 3000 ఉండేవి. జీఎస్టీ తగ్గడంతో ఈ సంవత్సరం ప్రస్తుతం సోమవారం నుంచి గురువారం వరకు నాన్ ఏసీ రూ.1155, ఏసీ రూ.1890, డార్మెంటరీ రూ.2500, వీకెండ్లో నాన్ ఏసీ రూ.1260, ఏసీ గదులు రూ. 2100, డార్మెంటరీ రూ.3000గా ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ముందుగా టీఎస్‌టీడీసీ అనే వెబ్సైట్ ద్వారా గదులను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
దసరా వేడుకలకు సిద్ధం
మంచిర్యాలఅర్బన్/బెల్లంపల్లి/చెన్నూర్: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలకు జిల్లా సిద్ధమైంది. గురువారం దసరా పండుగను పురస్కరించుకుకుని బుధవారం మంచిర్యాల గోదావరి నది ఒడ్డున గౌతమేశ్వర ఆలయం వద్ద శమీ చెట్టు వద్ద చదును చేశారు. రాంనగర్లో రావణాసుర వధ కార్యక్రమం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నూతన వాహనాలు, ఇతర సామగ్రి కొనుగోలుతోపాటు ఆయుధ, వాహన పూజలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పనిముట్లు, యంత్రాలు, వ్యవసాయ పరికరాలకు పూజలు చేస్తారు. మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి, పార్వతీపరమేశ్వరుల ఉత్సవ దేవతామూర్తులతో స్థానిక గోదావరి నదీ తీరాన గౌతమేశ్వర ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. జంబీ చెట్టు వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో పూజలు చేస్తారు. అనంతరం శోభాయాత్ర పురపాలక సంఘం కార్యాలయం మీదుగా విశ్వనాథ ఆలయం వరకు నిర్వహిసారు. 59ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్‌స్టేడియంలో సభావేదిక, రావణాసుర వధ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. చెన్నూర్‌లో దసరా పండుగకు ప్రత్యేకత ఉంది. పుణ్యనదిగా పేరొందిన పంచక్రోశ ఉత్తర వాహిని సమీపంలోని గోవరమ్మ ఆలయం వద్ద సుమారు రెండు శతాబ్దాలకు పైగా శమీ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలను అనాదిగా పట్వారీ శ్రీనివాస్‌రావు కుటుంబ వారుసులే నిర్వహిస్తూ వస్తున్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నోడల్, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చామని అన్నారు. మండల స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి నామినేషన్లు, ఫిర్యాదులు, సందేహాల సంబంధిత అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మొదలై ఓట్లు లెక్కింపు, ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ ఇతర ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, దరఖాస్తులకు హెల్ప్‌లైన్ నంబరు 08736– 250501 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై సమాచారం అందించవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
పంచాయతీ ఎన్నికల విడతలు మారాయి..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల మూడు విడతల్లో నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అక్టోబర్ 31న మొదటి విడత, నవంబర్ 4న రెండో విడత, నవంబర్ 8న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్, జెడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ మూడు విడతల్లోని మండలాలను కొంత మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడతల్లోనే ఎన్నికలు జరుగనుండగా.. ఎన్నికలు జరిగే మండలాలు మారాయి. మూడో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉన్న మండలాలు మొదటి విడతలోకి రాగా.. రెండో విడతలోని మండలాలు మూడో విడతలోకి, మొదటి విడతలో ఉన్న మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. -
‘దసలి పట్టు రైతులపై దాడులు ఆపాలి’
కోటపల్లి: దసలి పట్టు సాగు చేస్తున్న గిరిజన రైతులపై ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలని, సాగుకు అనుమతి ఇవ్వాలని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని కొత్తపల్లి రాజారం గ్రామంలో అటవీ ప్రాంతంలో దసలి పట్టు పురుగుల పెంపకం చేస్తున్న గిరిజన రైతులపై బుధవారం ఫారెస్టు అధికారులు దాడులు చేయడమే కాకుండా పట్టు పురుగులు నాశనం చేశారని ఆందోళన చేపట్టారు. వీరికి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి మద్దతు తెలిపారు. తెలంగాణలో అన్ని చోట్ల అడ్డు చెప్పకుండా కోటపల్లి మండలంలో అడ్డు చెప్పడం విడ్డూరమని అన్నారు. అనంతరం చెన్నూర్ ఎఫ్‌డీవో కార్యాలయ సిబ్బందికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీతారాంరెడ్డి, గిరిజన రైతులు పాల్గొన్నారు. -
నవంబర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ
మంచిర్యాలటౌన్: ప్రతియేటా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు ద్వారా బతుకమ్మ పండుగకు మంచిర్యాల నియోజకవర్గంలోని ఆడపడుచులకు అందించే బతుకమ్మ చీరలను నవంబర్ 27న పంపిణీ చేయనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అనారోగ్యానికి గురి కావడంతో పండుగ సమయంలో మహిళలకు బతుకమ్మ చీరలు అందించలేక పోయామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపీ రాహుల్‌గాంధీ చేపట్టిన ఓటు చోర్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలో 1.50 వేల ఓటర్ల సంతకాల సేకరణ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
‘మందు’స్తు ఏర్పాట్లు
మంచిర్యాలక్రైం: రాష్ట్రంలో అతిపెద్ద పండుగ దసరా.. మాంసం, మద్యంతో విందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చాయి. గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం ఉంటుంది. దీంతో ఆయా దుకాణాలు మూసి ఉంచాలని ఇప్పటికే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలను బుధవారం రాత్రి 10గంటల వరకే మూసి వేయిస్తారు. దీంతో మద్యంప్రియులు దసరాకు ఒక్క రోజు ముందే మద్యం కొనుగోలు చేసేందుకు వైన్స్ దుకాణాల ఎదుట బారులు తీరారు. జిల్లాలో 73మద్యం దుకాణాలు ఉండగా గత నెల 28 నుంచి అక్టోబర్ ఒకటి వరకు రూ.20.16కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. గురువారం మద్యం దుకాణాలు మూసి వేయనుండడంతో గ్రామాలు, పట్టణాల్లోని బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయాలకు వ్యాపారులు, నిర్వాహకులు కొందరు ముందస్తుగానే పెద్దమొత్తంలో కొనుగోలు చేశారు. గాంధీ జయంతి రోజున జీవహింస చేయడం నేరం, మద్యం విక్రయాలు నిషేధం ఉండడంతో దసరాకు ఒక్క రోజు ముందే మద్యం, మాంసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. బుధవారం రాత్రికే మేకలను వధించి మాంసాన్ని సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ శుక్రవారం దసరా చేసుకుందామని భావించినా మద్యం, మాంసం దొరకడం కష్టమని ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. మరికొందరు బుధవారమే దసరా పండుగ విందు చేసుకున్నారు. బెల్ట్‌షాపులపై నిఘా గాంధీ జయంతి సందర్భంగా పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు సమన్వయంతో మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాలు, ప ట్టణాల్లోని బెల్ట్‌షాపులపై ప్రత్యేక నిఘా ఉంచారు. మద్యం దుకాణాలు మూసివేత నేపథ్యంలో వీటిల్లో అధికంగా విక్రయాలు జరిగే అవకాశం ఉండడంతో నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు. మద్యం, మాంసం విక్రయాలను ఆయా శాఖల అధికారులు ఎంతవరకు కట్టడి చేస్తారో వేచి చూడాల్సిందే. మద్యం విక్రయించిన వారిపై కేసులు నమోదు చే స్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. -
ప్రత్యేక బలగాలతో బందోబస్తు
మంచిర్యాలక్రైం: దసరా రోజు ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రత్యేక బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. దసరా పండుగ సందర్భంగా శాంతిభద్రతలపై బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తారని, మంచిర్యాల నగరంలో ఏడు ప్రత్యేక బృందాలు డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాయని తెలిపారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా మద్యనిషేధం అమలులో ఉంటుందని, ఎవరైనా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెల్ట్‌షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. మద్యంమత్తు, పాతకక్షల కారణంగా గొడవలు జరుగుతుంటాయని, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. -
టిప్పర్, హైడ్రా వాహనం ఢీ
నస్పూర్: పట్టణ పరిధిలోని కలెక్టరేట్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై టిప్పర్ వాహనాన్ని హైడ్రా వాహనం ఢీకొట్టింది. మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ వైపు వస్తు న్న హైడ్రా వాహనం కలెక్టరేట్ చౌరస్తా వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో శ్రీరాంపూర్ నుంచి మంచిర్యాల వైపునకు వెళ్తున్న టిప్పర్ లారీని ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఢీకొట్టింది. హైడ్రా వాహనం ముందు భాగం టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌పై పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. స్థానిక ఎస్సై ఉపేందర్‌రావు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
బాలుడి మృతిపై కుటుంబీకుల ఆందోళన
ఖానాపూర్: వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు, బంధువులు ఖానాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన అనిత–రాజు దంపతుల నెలన్నర కుమారుడు అయన్స్కు జ్వరం రావడంతో ఈ నెల 21నుంచి 26వరకు ఖానాపూర్లోను మెడికేర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. చికిత్స సమయంలో బాలుడి చేతికి సైలెన్ పెట్టిన క్యానిల ప్రాంతంలో వాపు వచ్చి ఇన్ఫెక్షన్ అయింది. ఈ విషయమై వైద్యులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సమస్య తీవ్రమైంది. దీంతో 26న వైద్యుడి సూచన మేరకు నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలి స్తుండగా మార్గమధ్యలో సోమవారం రాత్రి 11గంటల ప్రాంతంలో బాలుడు మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబీకులు, బంధువులు మంగళవారం మెడికేర్ ఆస్పత్రికి సిబ్బందిని నిలదీసి ఫర్నిచర్, రిషెప్షన్ కౌంటర్ ధ్వంసానికి యత్నించగా పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందు కున్న ఖానాపూర్, పెంబి, కడెం ఎస్సైలు రాహుల్ గైక్వాడ్, హన్మాండ్లు, సాయికిరణ్, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారిని సముదాయించగా ఆందోళన సద్దుమణిగింది. -
పంట చేలలో గంజాయి సాగు
సాత్నాల: గుట్టు చప్పుడు కాకుండా పంట చేన్లలో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రవణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం జైనథ్ పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని మార్గుడా గ్రామానికి చెందిన హీరా కుమ్ర కిషన్, హీరా కుమ్ర వసంత్ తమ పంట చేన్లలో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారం రావడంతో, ఎస్సై గౌతమ్ పవర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పత్తి, కందితో పాటే కిషన్, వసంత్ గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. కిషన్ చేనులో 30, వసంత్ చేనులో నాలుగు గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నా రు. వీటి విలువ రూ.34 లక్షలు ఉంటుందని తెలిపా రు. అక్రమంగా గంజాయి సాగు చేసే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై ఎస్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. -
నేరడిగొండలో రెండిళ్లలో చోరీ
● 3 తులాల బంగారం, రూ.70వేల నగదు అపహరణ నేరడిగొండ: మండల కేంద్రంలో మథుర కాలనీలోగల రెండిళ్లలో మంగళవారం తెల్లవారుజా మున దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ జావిద్ కుటుంబ స భ్యులు 15రోజుల క్రితం మహారాష్ట్రలోని వారి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండగా వారి ఇంట్లో దొంగలు చొరబడి మూ డు తులాల బంగారం, రూ.40వేల నగదు దో చుకెళ్లారు. మహ్మద్ సోఫీ కుటుంబ సభ్యులు, వారి బంధువుల ఇంటికి వెళ్లగా వారి ఇంట్లోనూ చోరీకి పాల్పడి రూ.30వేల నగదు అపహరించినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
నగరంలో పోలీసుల తనిఖీలు
మంచిర్యాలక్రైం: స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎన్నికల ని బంధనల మేరకు మంగళవారం నగరంలోని ప్రధాన కూడళ్లలో మంచిర్యాల డీసీపీ భాస్క ర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా నగదు, నగలు, మద్యం త రలించొద్దని సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద కోటపల్లి: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు సరిహద్దు ప్రాంతాలను అప్రమత్తం చేశా రు. మండలంలోని పార్పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా మద్యం, డబ్బు, ఇతరత్రా తరలింపుపై నిఘా ఉంచామని తెలిపారు. -
బాసరలో నాలుగిళ్లలో చోరీకి యత్నం
బాసర: మండల కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో సుమారు నాలుగిళ్లలో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించి విఫలమయ్యారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యం చేసుకున్నారు. గతవారం బస్టాండ్ వద్ద గల ప్రియ మిల్క్ బేకరీతో పాటు మూడిళ్లలో చోరీ జరిగింది. వారం వ్యవధిలో దుండగులు నాలుగిళ్లలో చోరీకి యత్నించగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాసరలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటేశ్వరకాలనీ వాసులను అప్రమత్తం చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని బాసర ఎస్సై శ్రీనివాస్ కోరారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల ను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఇళ్ల ముందు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. బాసరలో అర్ధరాత్రి ‘లేడీ’ హల్చల్ ముధోల్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో సోమవారం మిట్ట మధ్యాహ్నం సుమారు రూ.5లక్షల నగదు, ఐదు తులాల బంగారం చోరీ కాగా, ఈ ఘటన మరువక ముందే బాసరలో ఓ మహిళ అలజడి సృష్టించింది. ఒక వ్యక్తితో కలిసి ఆమె ఓ ఇంటి గోడ దూకి చోరీకి యత్నించగా సీసీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఘనంగా దుర్గాదేవి చండిపూజ
మంచిర్యాలఅర్బన్: స్థానిక విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో సర్వజననీ దుర్గాదేవి నిర్వాహక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి వద్ద మంగళవారం చండిపూజ ఘనంగా నిర్వహించారు. అంతకుముందు తొమ్మిది కలశాల పూజ, 108 తామ ర పూలు, 108 దీపాలు వెలిగించారు. దుర్గాష్టమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల బెంగాలీలు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. అమ్మవారిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ మంత్రి బోడ జనార్థన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, హైకోర్టు ఏజీపీ సైదం లక్ష్మీనారాయణ దర్శించుకున్నా రు. ఈ కార్యక్రమంలో సర్వజననీ దుర్గాదేవి నిర్వాహక మండలి అధ్యక్షుడు బోడ ధర్మేందర్, ఉమ్మడి జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్వీ రమణ, కమి టీ సభ్యురాలు రీనారాణి దాస్, అత్తి సరోజ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్‌రూరల్: అటవీ ఉత్పత్తులు, పోడు సాగు పై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఆర్థికంగా, రా జకీయంగా వెనుకబడిన పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమానికి పీవీటీజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొలాం సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పలువురు మాట్లాడారు. అనేక ఆదివాసీ కొలాం గిరిజన గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పీవీటీ జీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ఎ లాంటి నిబంధనలు లేకుండా సీట్లు కేటాయించా లని కోరారు. పోరాట యోధుడు కుమ్రం సూరు జయంతి వేడుకల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కొలాం సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కొడప సొనేరావు, ప్రధాన కార్యదర్శిగా సిడాం రాజు, ఉపాధ్యక్షునిగా కుమ్ర రాజు, గౌ రవాధ్యక్షుడిగా టేకం లక్ష్మణ్, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలిగా కుమ్ర లక్ష్మీబాయి ఎన్నికయ్యా రు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను శా లువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్‌రావ్, నాయకులు కొడప రాము, టేకం గణేశ్, మడావి జంగు ఉన్నారు. -
పోలింగ్ కేంద్రం మార్చాలి
కోటపల్లి: మండలంలోని సిర్సా గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏటా ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం మార్చాలని, లేనిపక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులు మంగళవా రం తహసీల్దార్ రాఘవేందర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో పోలింగ్ కేంద్రం కారణంగా డబ్బు, మద్యం బెదిరింపులతో కొంతమంది ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లోనూ దాడులు, కేసులు నమోదైన సంఘటనలు జరిగాయని గుర్తు చేశారు. గ్రామస్తుల ఏకగ్రీవ నిర్ణయాలన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే ఎన్నికల్లో గ్రామస్తులు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దింటి పున్నం, హరీశ్‌రెడ్డి, సంపత్, మహేశ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలోనే క్యాన్సర్‌కు చికిత్స
మంచిర్యాలటౌన్: క్యాన్సర్ వైద్యానికి ఇకపై హైదరాబాద్ వంటి నగరాలకు పరుగెత్తకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలోనే క్యాన్సర్‌కు చికిత్సను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచిర్యాలలో ఫలించాయి. దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన మహిళకు ఊపిరితి త్తుల క్యాన్సర్‌కు సంబంధించిన కీమోథెరపిని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)కి అనుబంధంగా కొనసాగుతున్న మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ సెంటర్లో మంగళవారం విజయవంతం చేశారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో రెండుసార్లు కీమోథెరపి నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్యాన్సర్ కేర్ సెంటర్‌కు పంపించారు. మూడోసారి కీమోథెరపిని జిల్లా కేంద్రంలో విజయవంతంగా మొదటిసారి చేపట్టడంతో ఇకపై జిల్లా కేంద్రంలోనే క్యాన్సర్‌కు చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రరెడ్డి తెలిపారు. జీజీహెచ్‌కు చెందిన డాక్టర్ ఆశ్లేష, ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్లు ఎంఎన్జెలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఇక్కడ కీమోథెరపిని మొదటిసారి కావడంతో ఎంఎన్‌జే ఆసుపత్రికి చెందిన కీమోథెరపి నర్సింగ్ ఆఫీసర్ దుశ్యంత్‌కుమార్ ప్రత్యేకంగా మంచిర్యాలకు వచ్చారు. గతంలో ప్రతీ సైకిల్‌కి క్యాన్సర్ రోగులు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై జిల్లాలోనే సేవలను కొనసాగించేలా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఆశ్లేష, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
నగలు.. రెండు నెలలు ఆగాల్సిందే..!
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచి–2లో జరిగిన కుంభకోణాన్ని చేధించిన పోలీసులు నగలు బ్యాంకుకు అప్పగింతకు కసరత్తు చేస్తున్నారు. గత పక్షం రోజులుగా ఎస్బీఐ గోల్డ్‌లోన్ బాధితుల వివరాలను సీఐ దేవేందర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు సేకరించారు. కోర్టు ద్వారా బ్యాంకుకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిసింది. దసరా పండుగ దర్వాత బ్యాంకుకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాంకులో 20.250 కిలోల బంగారు నగలు, రూ.1.10కోట్లు నగదు అపహరణకు గురికావడం, పోలీసులు ఆభరణాలను గత నెల 12న పూర్తి స్థాయిలో రికవరీ చేయడం తెలిసిందే. వాటిని బ్యాంకులో భద్రపర్చారు. నిబంధనల ప్రకారం ఆభరణాలను కోర్టు ద్వారా బ్యాంకుకు అప్పగించాల్సి ఉంది. నగలను కోర్టుకు అప్పగించే ప్రక్రియ పూర్తి చేశారు. దసరా పండుగ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకు ఉన్నతాధికారుల సమక్షంలో బ్యాంకు కస్టడీకి అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధితుల ఎదురుచూపులుబ్యాంకులో నగలు తాకట్టు పెట్టి రుణం పొందిన రుణగ్రహీతలు నగలు ఎప్పుడు ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఆభరణాలు భద్రంగా ఉన్నప్పటికీ చేతికి వచ్చే వరకు భయం భయంగానే ఉందని బాధితుడు తిరుపతి తెలిపారు. పోలీసులు రికవరీ చేశామని ప్రకటించినప్పటికీ నగలు ఎప్పుడు ఇస్తారోనని బ్యాంకు అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కొందరు నిత్యం బ్యాంకు వద్దకు వచ్చి వెళ్తున్నారు.వేరు చేయడానికి సమయందసరా పండుగ తర్వాత బ్యాంకుకు నగలు అందినా బాధితులకు ఇచ్చేందుకు మరో రెండు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు 402మంది ఉండడంతో రికార్డుల ప్రకారం ఎవరు ఎన్ని గ్రాముల బంగారం తాకట్టు పెట్టారు, ఏయే నగలు ఉన్నాయని వేరు చేయాల్సి ఉంటుంది. 20.250 కిలోల బంగారు నగలను బాధితుల వారీగా వేరే చేసేందుకు సమయం పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. -
అడవిలో అరుదైన నక్షత్ర తాబేలు
వేమనపల్లి: మండలంలోని నీల్వాయి అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై నీల్వాయి రేంజ్ అధికా రి హఫీజొద్దీన్, డిప్యూటి రేంజ్ అధికారి ప్రమోద్‌కుమార్‌కు అరుదైన నక్షత్ర తాబేలు (ఇండియన్ స్టార్ టార్టయిస్) లభ్యమైంది. ఇది బంగారు, బ్రౌన్ వ ర్ణంలో ఉంది. సమశీతోష్ణ వాతావరణం ఉండే మన అడవులతోపాటు పాకిస్థాన్, శ్రీలంక అడవుల్లో వీటి సంతతి ఉంటుందని అధికారులు తెలిపారు. గడ్డి, పూలు, చెట్ల అకులు తింటూ ఒంటరిగా జీవించే అ లవాటు కలిగి ఉంటుందని పేర్కొన్నారు. సుమారు 60–80 ఏళ్లు జీవించి ఉంటుందని తెలిపారు. మగ తాబేలు కంటే ఆడ తాబేలు పెద్ద పరిమాణంలో ఉంటుందన్నారు. అటవీ చట్టం ప్రకారం దీన్ని వేటాడటం, ఇళ్లలో పెంచుకునేందుకు తీసుకెళ్లటం నేరమని తెలిపారు. జాతీయంగా ఈ తాబేలు అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉందని వివరించారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత దానిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల్లో నోడల్ అధికారులు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులు, ఎంపీడీవోలతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో తహసీల్దార్ ఆధ్వర్యంలో నియమావళి అమలు చేపట్టాలని, రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సభలు, సమావేశాలకు అనుమతి జారీ చేస్తారని, సమాచారాన్ని ఖర్చుల పర్యవేక్షణ బృందానికి అందిస్తే పరిశీలన చేస్తారని తెలిపారు. నియమావళి పాటించాలిమంచిర్యాలఅగ్రికల్చర్: ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు నోటిఫికేషన్, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతీ అంశంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశాల్లో డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీపీవో వెంకటేశ్వర్రావు, జెడ్పీ సీఈవో గణపతి, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ఖాన్, శిక్షణ నోడల్ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీలు 72 గంటల్లో తొలగించాలిజిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, 48 గంటల్లో పబ్లిక్ ప్రాంతాలు, 72 గంటల్లో పూర్తిగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సంబంధిత అంశాలు తొలగించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల అధికారులు విధులు నిర్వర్తించాలని తెలిపారు. -
‘బాసర’ సేవా టికెట్లపై వివరాలేవి?
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు టికెట్ కౌంటర్లో సోమవారం రూ.100 దర్శనం టికెట్లు నాలుగు కొనుగోలు చేశాడు. అయితే టికెట్లపై భక్తుల పేరు, ఊరు, తేదీ తదితర వివరాలు నమోదు చేయలేదు. దీంతో ఒకసారి విక్రయించిన టికెట్‌ను మళ్లీ అ మ్మేందుకే ఇలా వివరాలు రాయడం లేదని పలువు రు భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలో రూ.వెయ్యి ప్రత్యేక అక్షరాభ్యాస టికెట్‌పై భక్తుడి వివరాలు రాయకుండా దానిని మళ్లీమళ్లీ విక్రయింగా గుర్తించిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇలాంటి చర్యలు పునరావృత కాకుండా చూడాలని కోరుతున్నారు. -
రిజర్వేషన్ల పంచాయితీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. పలు గ్రామాల్లో పోటీలో నిలబడేందుకు అభ్యర్థులే లేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుపై పునః పరిశీలన చేయాలని విన్నవిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మార్చే అవకాశం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. ఎందుకీ పరిస్థితి?2011 నాటి జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణన సర్వేను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల ర్యాకింగ్ ఇచ్చారు. బీసీ వర్గాల రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ సిఫారసులు పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 2019 తర్వాత ఇప్పుడు జరుగుతున్న రెండో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మండలం యూనిట్‌గా, జెడ్పీటీసీ జిల్లా యూనిట్‌గా ర్యాంకింగ్‌లు ఇచ్చే క్రమంలో ఆయా వర్గాల్లో జనాభా లేనప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక మహిళలకు 50శాతం, వంద శాతం ఎస్టీలు ఉన్న చోట్ల వారికే నోటిఫై చేయడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీల ర్యాకింగ్ ఇచ్చే క్రమంలో ఒక్క ఓటరు లేని వర్గాలకు కూడా ఆయా చోట్ల రిజర్వేషన్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో ఏదైనా కారణంతో ఎన్నిక జరగకపోతే ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుభవించని కారణంగా మరోసారి వారికే అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులే పోటీకి అర్హులు. దీంతో ఏ గ్రామంలోనైనా గిరిజనులు ఉన్నా లేకున్నా వారికే అవకాశాలు వస్తున్నాయి. గతంలో జనాభా లెక్కల సమయంలోనూ కొన్ని చోట్ల ఆయా వర్గాల వివరాల నమోదులో తప్పిదాలు జరగడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. మళ్లీ జనాభా లెక్కలు జరిగి, ఆయా వర్గాల వివరాలు స్పష్టత వచ్చే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. ఉప సర్పంచ్‌లకే పగ్గాలుసర్పంచ్ పదవులు ఆయా వర్గాలకు రిజర్వు కావడంతో వార్డు స్థానాలకు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక జరగని చోట్ల రిజర్వేషన్ వర్తించని ఉప సర్పంచ్‌లే సర్పంచ్ హోదాలో పాలన కొనసాగించే అవకాశం ఉంది.జనాభా లేకున్నా అవకాశాలు -
పండుగ పూట పస్తులేనా?
శ్రీరాంపూర్: ‘ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యం.. ఒకే గమ్యం’ అనే సింగరేణి నినాదం గోడలపైనే గాని ఆచరణలో కనిపించడంలేదు. వేతనాలు, లాభాల బోనస్ అందక ఎస్సార్పీ ఓసీపీ ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా పండుగరోజు వారు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. ఓబీ పనులు నిర్వహించే సీఆర్ఆర్ కాంట్రాక్టర్ మూడు నెలలుగా 600 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. సెప్టెంబర్ 29న లాభాల బోనస్ డబ్బులు ఇస్తారనుకుంటే అవీ అందలేదు. ఈ దుస్థితికి కాంట్రాక్టర్, కంపెనీ అధికారులు బాధ్యత వహించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నెలరోజులుగా ఆందోళన సదరు కాంట్రాక్ట్ సంస్థ నాలుగేళ్ల కాలానికి ఓబీ పనుల టెండర్ దక్కించుకుంది. ఇంకా సుమారు 15నెలలు పని చేయాల్సి ఉంది. ఆగస్టు 26నుంచి పనులు నిలిపివేసింది. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. మూడు నెలల వేతనం రావాల్సి ఉండగా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పది రోజులుగా ఆందోళన, ధర్నాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కంపెనీ బాధ్యత లేదా? కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించకుంటే కంపెనీకి బాధ్యత ఉందా.. లేదా? అన్న చర్చ జరుగుతోంది. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ సెక్షన్ 20, సబ్ సెక్షన్ 4 ప్రకారం ప్రిన్సిపల్ ఎంప్లాయర్‌గా ఎవరైతే సింగరేణి అధికారులు ఉంటారో వారే ఈ వేతనాలు చెల్లించి తర్వాత కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసుకోవాలి. దీన్ని కంపెనీ అధికారులు పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం లాభాల బోనస్ ఇస్తేనైనా కొంత ఊరట ఉంటుందనుకుంటే అదీ చెల్లించడం లేదని వారు వాపోతున్నారు. కాంట్రాక్టర్ స్పందించడం లేదు సీఆర్ఆర్ కాంట్రాక్టర్ స్పందించడం లేదు. అతని బిల్లుల నుంచి డబ్బులు కట్ చేసి కార్మికులకు జీతాలు ఇద్దామనుకుంటే పనీ.. జరగలేదు. బిల్లులు పెండింగ్‌లో లేవు. కంపెనీకే అతను డీజిల్ ఫెనాల్టీలు చెల్లించాలి. ఎలాగైనా కనీసం లాభాల బోనస్ చెల్లించాలని చూస్తున్నాం. నేరుగా మేమే చెల్లించాలా, సదరు కాంట్రాక్టర్ ద్వారా చెల్లించాలా? అనే దానిపై అధికారులతో చర్చిస్తున్నాం. – ఎం శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్ -
మహిళా సంఘాలకు అద్దె బస్సుల బాధ్యత
పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థిక స్వాలంబనకు కృషి చేస్తోంది. తాజాగా మహిళలు మరింత ప్రగతి సా ధించడానికి అద్దె బస్సులు మంజూరు చేస్తోంది. ఈ బస్సులను ఆర్టీసీ డిపోల్లో అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సమాఖ్యల నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతీ మండల సమాఖ్యకు ఒక బస్ చొప్పున 16 మండలాల సమాఖ్యలకు 16 బస్‌లు మంజూరు చేయాల ని ప్రతిపాదించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.36 లక్షలను ప్రభుత్వం రుణంగా మండల సమాఖ్యలకు మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటాగా మండల సమాఖ్య సీఐఎఫ్ నిధులను వెచ్చిస్తారు. ఆర్టీసీ ద్వారా వచ్చే అద్దెను మండల సమాఖ్యల ఖాతాల్లో జమ చేస్తారు. అందులో నుంచి ప్రభుత్వం ఇచ్చిన రూ.36 లక్షల రుణాన్ని ఏడేళ్లలో 84 ఈఎంఐలుగా మండల సమాఖ్యలు ప్రభుత్వానికి సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు సోలా ర్ ప్లాంట్లు, పెట్రోల్‌బంక్‌లు మంజూరు చేయగా తాజాగా అద్దె బస్సులు కూడా మంజూరు చేసి స్వయం సహాయక సంఘాల సభ్యులను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తెలిపారు. ప్రతిపాదనలు పంపించాం జిల్లాలోని మండల సమాఖ్యలకు అద్దెబస్సుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన తర్వాత బస్సులు కొనుగోలు చేస్తాం. మండల సమాఖ్యల పేరున హైపోథికేషన్తో జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో అద్దెకు ఇస్తాం. – ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
చిత్తగూడలో సమస్యల పరిశీలన
నార్నూర్: గ్రామ సమస్యలు పరిష్కరించకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని మండలంలోని చిత్తగూడ గ్రామస్తులు సోమవారం ఉమ్రీ వాగు వద్ద నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ‘సమస్యలు పరిష్కరించాలి’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. చిత్తగూడ సమస్యలపై ఆరా తీశారు. వెంటనే గ్రామానికి వెళ్లి ప్రజలతో మాట్లాడి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పీఆర్ డీఈఈ లింగన్న మంగళవారం చిత్తగూడ గ్రామాన్ని సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై ఉన్న చిన్న కల్వర్టుతో పాటు తెగి పోయిన రోడ్డు, వానాకాలం వస్తే రాకపోకలకు అ డ్డుగా ఉన్న వాగుపై వంతెన నిర్మాణాన్ని పరిశీలించారు. 2016–17లో రూ.25లక్షలతో వంతెన నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో పనులు మధ్యలో రద్దు అయినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాగుపై వంతెన నిర్మాణానికి రూ.50లక్షలు, రోడ్డు నిర్మాణానికి రూ.30లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. -
మార్గ సూచి.. ప్రయోజనకారి
నిర్మల్‌ఖిల్లా: జిల్లాల్లోని పాఠశాలల్లో అకడమిక్ క్యా లెండర్ పంపిణీకి పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. విద్యాసంవత్సరానికి అనుగుణంగా రూ పొందించిన ఈ క్యాలెండర్ ద్వారా బోధన, పరీక్షలు, సెలవులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వార్షిక కార్యక్రమాల షెడ్యూల్ పొందుపర్చింది. విద్యాశా ఖ ప్రతీ సంవత్సరం విధివిధానాల ప్రకారం క్యా లెండర్ విడుదల చేస్తూ వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కలెక్టరేట్, డీఈవో తదితర కార్యాలయాలు, ఆయా పాఠశాలల్లో క్యాలెండర్లను ప్రదర్శించేలా చ ర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీ న్ నికోలస్ ఈ నెల 27న ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాల పటిష్ట అమలుకు.. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో అకడమిక్ క్యాలెండర్ పేరిట మార్గ సూచిని విడుదల చేస్తున్నా పాఠశాలల్లో దీనిని అమలు చేయడంలో మాత్రం లోపాలు తలెత్తుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ గు ర్తించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు మిన హా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యాశాఖ వి డుదల చేస్తున్న అకడమిక్ క్యాలెండర్ నిర్వహణపై సరైన అవగాహన ఉండడం లేదని భావించింది. దీంతో అకడమిక్ క్యాలెండర్‌ను పోస్టర్ రూపంలో అన్ని పాఠశాలల్లో ప్రదర్శించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. క్యాలెండర్లో ఉండే సమాచారం ఉమ్మడి జిల్లాలో 3,343 పాఠశాలలున్నాయి. 232 పాఠశాల సముదాయాలున్నాయి. వీటన్నింటిలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అకడమిక్ క్యాలెండర్లను పంపిణీ చేసి ప్రదర్శించేలా అన్ని ఏ ర్పాట్లు చేస్తోంది. ఏ నెలలో ఏయే పరీక్షలు నిర్వహించాలి.. సిలబస్ పూర్తిచేసే సమయం, పాఠశాల సముదాయ సమావేశాలు, ప్రదర్శన పోటీలు, క్రీడలు, గ్రంథాలయాల నిర్వహణ తదితర వివరాలన్ని టినీ ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ప్రధా న కార్యకలాపాలను అంశాలవారీగా రూపొందించి ఉండడంతో తదనగుణంగా అకడమిక్ క్యాలెండర్ ను ప్రయోజనాత్మకంగా అమలుచేసే ఆస్కారం ఉంటుంది. పారదర్శకత లోపించకుండా ఉంటుంది. విద్యా విషయక ప్రయోజనాలెన్నో.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన అకడమిక్ క్యాలెండర్ల పంపిణీ ద్వారా విద్యాపరమైన ప్రయోజనాలు పూర్తిస్థాయి ప్రయోజనకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు భా విస్తున్నారు. క్యాలెండర్ల ప్రదర్శన ద్వారా విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి కొనసాగే బడిబాట ని ర్వహణ తేదీలు మొదలుకుని సెలవు దినాలు, నెలవారీ పరీక్షలు, పూర్తి చేయాల్సిన సిలబస్, ప్రాధాన్యత కలిగిన దినోత్సవాలు, తల్లిదండ్రుల సమావేశాలు, వివిధ రకాల పండుగ సెలవులు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ఇవన్నీ నెలవారీగా అమలు చేయడం, తద్వారా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా సరళతరం అవుతుందని జిల్లా విద్యాధికారి భోజన్న, విద్యా పర్యవేక్షణాధికారులు అభిప్రాయం వ్యక్తంజేస్తున్నారు. జిల్లా పాఠశాలలు క్లస్టర్లు ఎమ్మార్సీలు నిర్మల్ 730 48 19 మంచిర్యాల 744 51 18 ఆదిలాబాద్ 1,148 71 18 ఆసిఫాబాద్ 721 62 15 -
భూ అక్రమార్కులపై చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: భూ అక్రమార్కులపై కఠినచర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పేదల భూములు కబ్జాకు యత్నించిన అట్రాసిటీ కేసు నిందితుడు ఉష్కం రఘుపతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఇదివరకు అతడు పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. మావల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మావలకు చెందిన దళితుల భూముల స్వాధీనం, బెదిరింపు కేసులో నిందితుడైన అతడిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మావలకు చెందిన బాధితులు ఏరే గంగన్న, ఏరే లక్ష్మి అసైన్డ్ భూములను రఘుపతికి తాకట్టు పెట్టి రూ.18లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. భూములు సాగు చేసుకునేందుకు అప్పు తీర్చేందుకు వచ్చినప్పుడు నిందితుడు కొంతమందితో కలిసి అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌తో తొక్కిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై ఇప్పటికే మావల పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉందని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడం, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నట్లు వివరించారు. అమెరికాలో ‘సద్దుల’ బతుకమ్మ సంబురాలుమామడ: బతుకమ్మ పండుగ ఎల్లలు దాటింది. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన తెలుగువారు ఏళ్లు గడిచినా తమ ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోలేదు. లక్ష్మణచాంద మండల కేంద్రానికి చెందిన దాసారం తరుణ్–మానస దంపతులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా అమెరికాలోని నార్త్ కరోలినాలో విధులు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబరాల కోసం గా ర్నర్గల్లీ సంఘం ఏర్పాటు చేసి ఏటా బతుక మ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తె లిపారు. మంగళవారం ఆ ప్రాంత మేయర్ బడ్డి గుప్టన్ ముఖ్య అతిథిగా హాజరై పండుగ విశిష్టత గురించి తెలుసుకున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి సన్మానంమంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన వారిని అదనపు డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ పొందిన వారంతా తమ శేష జీవితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు. ఉద్యోగ విరమణ పొందిన ఆర్.శ్రీహరి (ఆర్ఎస్సై), బీ భాస్కర్ (ఏఎస్సై), కే రమేశ్ (ఏఎస్సై), సీహెచ్ లక్ష్మ య్య (హెడ్ కానిస్టేబుల్) ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీ అమలుకు అవకాశం
ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్లను ఆయా పాఠశాలల్లో ప్రదర్శించడం ద్వారా పారదర్శకత మరింత పెరుగుతుంది. ఉపాధ్యాయులు నెలవారీగా నిర్వహించే కార్యక్రమాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కలుగుతుంది. – బీవీ రమణారావు, పీఆర్టీయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సముచిత నిర్ణయమే.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్ల పంపిణీ నిర్ణయం సముచితమైంది. ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరుతుంది.– ఎస్.భూమన్న యాదవ్, ఎస్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు -
ఏరియాలో 56శాతం బొగ్గు ఉత్పత్తి
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సెప్టెంబర్‌లో 56 శాతం బొగ్గు ఉత్పత్తి చేశామని ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. కేకే–5 గనిలో 17,181 టన్నులు, కాసిపేట గనిలో 12,708 టన్నులు, కాసిపేట–2 గనిలో 11,968 టన్నులు, శాంతిఖనిలో 5,424 టన్నులు, కేకే–ఓసీలో 67,838 టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. అధిక వర్షాల వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు సంస్థ నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యంలో 60శాతం బొగ్గు ఉత్పత్తి చేశామని, గైర్హాజరు కార్మికులు విధులకు హాజరై బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్వో టు జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యామ్‌సుందర్, డీజీఎం వీఎస్ఆర్కే ప్రసాద్, సీనియర్ పీవో బొంగోని శంకర్, ఎస్ఈ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పవర్ ప్లాంటులో ప్రమాదం
జైపూర్: పండుగపూట పవర్ ప్లాంటులో విషాదం నెలకొంది. రాత్రి విధులకు హాజరైన సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ గార్డుకు అదే చివరి డ్యూటీ అయింది. ఊహించని విధంగా గేటురూపంలో మృత్యువు కబ ళించింది. గేటు మూసి వేస్తున్న క్రమంలో ఊడిపో యి మీద పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కొచ్చెర్లకు చెంది న నరహరిశెట్టి అర్జున సారధి(56) జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో సీఐఎస్ ఎఫ్ సెక్యూరిటీ విభాగంలో ఏఎస్సైగా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి డ్యూటీ కి వచ్చిన ఆయన ఎస్టీపీపీ అడ్మిన్ భవనం ప్రధాన గేటు వద్ద రాత్రి విధులు ని ర్వర్తిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4గంట ల ప్రాంతంలో వీల్స్ గేటు మూసి వేస్తున్న క్రమంలో ఊడిపోయి ప్రమాదవశాత్తు అతడిపై పడింది. కిందనలిగిపోయిన అర్జున సాఽరధిని తోటి సిబ్బంది గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుటికే ఆయన మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో మృతదేహాన్ని సీఐఎస్ఎఫ్ డీఐజీ, ఐపీఎస్ డాక్టర్ ఎంజీ.రాఘవేంద్రకుమార్, ఎస్టీపీపీ సీఐఎస్ఎఫ్ కమాండెంట్ చంఛల్సర్కార్ పరిశీలించారు. మృతుడికి భార్య గంగాభవాని, కుమారుడు రాజసింహాదత్తు, కూతురు తేజసాయిశ్రీ ఉన్నారు. కేసు నమోదు దర్యాప్తున్న చేస్తున్నామని ఎస్సై శ్రీధర్ తెలిపారు. -
ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి
నస్పూర్: సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. స్థానిక ఎస్సై ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్ షిర్కే కాలనీకి చెందిన పూదరి సతీష్(40) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య నుంచి విడాకులు కావడంతో ఒంటరిగా ఉంటున్నాడు. సతీష్ ఇంటి పొరుగు వారైన పన్యాల బంగారితో పార్కింగ్ విషయంలో గత నాలుగు నెలల క్రితం వివాదాలు తలెత్తాయి. ఈ నెల 28న సాయంత్రం మరోసారి పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. బంగారి భార్య లక్ష్మి, చిన్న కూతురు సతీష్ ఇంట్లోకి చొరబడి అతడిని కొట్టారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సతీష్‌ను సుత్తితో కడుపులో కొట్టాడు. సోమవారం సతీష్ అక్క పోగుల స్వప్న ఇంటికి వెళ్లి చూసే సరికి గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి అక్క పోగుల స్వప్న ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని శ్రీశ్రీ నగర్‌కు చెందిన రాసపల్లి దివ్య ఇటీవల సింగరేణి కోల్‌మైన్స్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. మంచిర్యాల డివిజన్ శ్రీరాంపూర్ ఏరియాలో జీఎం ఆఫీస్ పర్సనల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దివ్య 58 కిలోల విభాగంలో 250 కిలోల బరువు ఎత్తి పతకం అందుకుంది. డిసెంబర్లో నాగ్‌పూర్‌లో జరిగే కోలిండియా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొననుంది. దివ్యను తాజా మాజీ కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ, బీ స్ట్రాంగ్ జిమ్ నిర్వాహకులు గోదారి శ్రీనాథ్, జిమ్ సభ్యులు రవి, లక్ష్మీప్రసాద్ సన్మానించారు. -
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు విద్యార్థి
కాసిపేట: మండలంలోని సోమగూడెంకు చెందిన పి.మణిదీప్ జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు డీఐఈవో అంజయ్య, ఎస్జీఎఫ్ సెక్రెటరీ బాబురావు తెలిపారు. ఈ నెల 25, 26, 27వ తేదీల్లో జనగాంలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి అండర్–19 ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పేర్కొన్నారు. మందమర్రి మోడల్ స్కూల్ సెకండియర్ విద్యార్థి మణిదీప్ అక్టోబర్ 2నుంచి 12వరకు శ్రీనగర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. విద్యార్థిని డీఐఈవో, ఎస్జీఎఫ్ సెక్రెటరీ, ఒలింపిక్ అసోసియేషన్ ఫుట్‌బాల్ సెక్రెటరీ పిన్నింటి రఘునాథరెడ్డి, కోచ్ బాదే శేఖర్ అభినందించారు. -
అమ్మ సన్నిధిలో భక్తజనం
భైంసా/బాసర: బాసరలోని చదువుల తల్లి సరస్వతీని అత్యంత ప్రీతిపాత్రమైన మూలానక్షత్ర శుభఘడియల్లో దర్శించుకునేందుకు రాష్టం నలు మూలల నుంచి భక్తులు సోమవారం వేలసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి వేకువజామునుంచే బారులు తీరారు. దివ్యమూహూర్తాన తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ప్రత్యేక అలంకరణ...మూలానక్షత్రం పూజల కోసం బాసర ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగ ణం పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించా రు. ప్రత్యేక అలంకరణల మధ్య అమ్మవారిని స్మరి స్తూ భక్తులు దర్శనం చేసుకున్నారు. ప్రసాదల కౌంటర్ వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో కనిపించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులు కొంతమేర ఇక్కట్లకు గురయ్యారు. వ్యాసగుహ, మ హంకాళి ఆలయం వద్ద భక్తుల సందడి కనిపించింది. ఆలయంలో మధుకర దీక్షలు స్వీకరించిన మాలధారులంతా స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఉప్పొంగిన గోదావరిసోమవారం సైతం బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. గంగమ్మ తల్లి సూర్యేశ్వర ఆలయాన్ని తాకుతూ వరద నీరు ప్రవహించింది. నెల రోజులుగా బాసర వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. మూల నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు రక్షణగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ భక్తులను కట్టడి చేశారు. ఆదాయం రూ.25,65,100 బాసర: బాసర సరస్వతీ ఆలయానికి సోమవారం భారీగా ఆదాయం సమకూరింది. భక్తుల మొక్కులు, చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు ద్వారా ఆదాయం వచ్చింది. రూ.వెయ్యి అక్షరాభ్యాస పూజలు 1,065 జరిపించగా.. రూ.16,05,000, రూ.150 అక్షరాభ్యాసాలు 526 ద్వారా రూ.78,900, రూ.100 మండప ప్రవేశం 1930 ద్వారా రూ.1,93,000, రూ.50 మండప ప్రవేశం 310 ద్వారా రూ.15,500, రూ.100 అభిషేకం లడ్డు ప్రసాదం 2565 ద్వారా రూ.2,56,500, లడ్డు పులిహోర ప్రసాదాలతో రూ.4,16,200 సమకూరింది. మొత్తంగా రూ.25,65,100 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.పలువురి దర్శనం...సరస్వతీ అమ్మవారిని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ అభిలాష అభినవ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్తో పాటు పలువురు దర్శించుకున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలనక్షత్రం కలిసిరావడంతో సుదూర ప్రాంతాల భక్తులు ఒకరోజు ముందుగానే వచ్చారు. -
‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ’కు ఎంపికై న ఆరాధ్య
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ఆరాధ్య స్టార్ కిడ్ విభాగంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ పురస్కారానికి ఎంపికై ంది. హైదరాబాద్‌కు చెందిన రౌండ్ టేబుల్ సంస్థ చేపట్టిన ఎంపిక పోటీల్లో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అల్లాడి సురేష్–శాంతి దంపతుల కుమార్తె ఆరాధ్య లక్ష్మి అవార్డుకు ఎంపికై ంది. పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా బాలలు పాల్గొనగా తుది పోటీలకు ఆరుగురు ఎంపికయ్యారు. వారిలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ ఓటింగ్ ద్వారా చిన్నారి ఆరాధ్యలక్ష్మి ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా పురస్కారం అందుకుంది. -
రేషన్ డీలర్ల నిరసన
మంచిర్యాలఅగ్రికల్చర్: గత ఆరు నెలల రేషన్ కమీషన్ వెంటనే విడుదల చేయాలని రేషన్ డీలర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఆరు నెలలుగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నా కమీషన్ చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. దసరా, దీపావళి పండుగలకు పస్తులు ఉండే దుస్థితి నెలకొందని తెలిపారు. కేంద్రం కమీషన్ విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం పెడింగ్‌లో ఉంచుతోందని పేర్కొన్నారు. పెండింగ్ కమీషన్‌తోపాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రూ.5000 వేల గౌరవ వేతనం, క్వింటాల్‌కు రూ.300 కమీషన్ చెల్లించాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సత్తయ్య, సత్యనారాయణరెడ్డి, ఎస్.కృష్ణ, మహేందర్, రవికుమార్, ప్రఽశాంత్, సునిల్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు దండేపల్లి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో 11 మంది తెలంగా ణ కవులపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కన్వీ నర్ గోపగాని రవీందర్ తెలిపారు. పా ఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతీ పాఠశాల నుంచి ఒక అబ్బా యి, అమ్మాయి రా సిన రెండు వ్యాసాలను జిల్లాస్థాయి పోటీలకు పంపించాలని, జిల్లాస్థాయిలో ప్రత్యక్ష పోటీకి ఎంపికై న 50 వ్యాసాల్లో 5 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతి అందజేస్తామని, అక్టోబర్ 6లోగా వ్యాసాలు పంపించాలని పేర్కొన్నారు. -
నీటమునిగిన పంటలు
కోటపల్లి/చెన్నూర్‌రూరల్: ఇటీవల కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోటపల్లి మండలం రాంపూర్, కొల్లూర్, దేవులవాడ, లక్ష్మిపూర్ శివారులో గోదావరి వరదతో పత్తి, మిర్చి, వరి పంటలు పూర్తి నీటమునిగాయి. ఎగువన కురిసిన వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చెన్నూర్ మండలం సుందరసాల గ్రామ సమీపంలోని అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో పత్తి పంటలు నీట మునిగాయి. ఈ ఏడాదిలో పంటలు మునిగిపోవడం రెండోసారి కాగా.. అధికారులు కనీసం సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం ఆదుకోవాలని కోరుతున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
కుంటాల: మండలకేంద్రంలో తాళం వే సిన ఇంట్లో గుర్తుతెలి యని దొంగలు చోరీ కి పాల్పడ్డారు. స్థాని కుల కథనం ప్రకా రం.. కుంటాలకు చెందిన సక్రపు సురేష్ దంపతులు శుక్రవారం సాయంత్రం పని నిమిత్తం నిర్మల్ వెళ్లారు. పక్కింటివారు శనివారం సాయంత్రం తలుపులు తెరిచి ఉండడంతో వారికి సమాచారం అందించారు. బీరువాలో రూ.10వేల నగదుతోపాటు 4 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. రూ.40 వేల విలువ గల వెండిని వదిలేసి వెళ్లారు. పక్క గదిలోనే టీజీబీ బ్యాంకులో పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ అద్దెకు ఉంటున్నాడు. ఆ గది తాళం పగులగొట్టి వస్తువులను చిందరవందర పడేశారు. నిర్మల్ నుంచి క్లూస్ టీం సిబ్బంది వచ్చి సేకరించారు. ఎస్సై అశోక్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు సురేష్ ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం
నస్పూర్: ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన పట్టణ పరిధిలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్(టీఎన్జీఓ)కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో 317 బాధితులకు ఉపయోగపడేలా జీవో 190ను సాధించిన ఘనత టీజీఈజేసీదే అని అన్నారు. ఉద్యోగుల సమస్యల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో చర్చలు జరిపి పరిష్కరించుకుంటామన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటుతో హెచ్ఆర్ఏ పెంపొందించేందుకు కృషి చేయాలని స్థానిక నాయకులు ఆయన్ను కోరారు. కార్యక్రమంలో టీఎన్జీఓ మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సంద అశోక్, జిల్లా అధ్యక్షులు శ్రీహరి, మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు, జిల్లా కార్యదర్శి రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, నాయకులు సతీశ్‌కుమార్, రాణి, శ్రీనివాస్, రామ్‌కుమార్ పాల్గొన్నారు. మొక్కలు నాటిన టీఎన్జీఓస్ కేంద్ర అధ్యక్షుడు మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల టీఎన్జీఓస్ కాలనీలో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆదివారం మొక్కలు నాటా రు. ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ అశోక్, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, మాజీ అధ్యక్షుడు సురేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, కేంద్రం సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపు, జిల్లా, మంచిర్యాల యూనిట్ల టీఎన్జీఓస్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. -
‘ఎల్లంపల్లి’ 43 గేట్ల ఎత్తివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో ఎంత ఉందో అంతే స్థాయిలో అవుట్ ఫ్లో ఉంది. ప్రాజెక్ట్‌లోని 43 గేట్ల ఎత్తివేసి దాదాపు 5 టీఎంసీలకు పైగా వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఆదివారం రాత్రి వరకు ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్‌కు 145.50 మీటర్లు ఉండగా 20.175 టీఎంసీలకు గాను 13.825 టీఎంసీలతో ఉంది. ఇన్‌ఫ్లో కింద ఎగువ ప్రాంతాల నుంచి 2 లక్షలు, ఎస్సారెస్పీ నుంచి 4.50 లక్షలు, కడెం నుంచి 5 వేలు మొత్తం 6.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో కింద హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ పథకానికి 303 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. 43 గేట్లు తెరవడంతో 6.60 లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి వదిలి పెడుతున్నారు.