breaking news
South India
-
ర్యాప్ సింగర్ జీవిత ఇతివృత్తంతో బాటిల్
ఎలైట్ టాకీస్ పతాకంపై కే.భాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం బాటిల్. 'తంగలాన్' ఫేమ్ అన్భుడన్ అర్జున్, 'గాంధీ కణక్కు' చిత్రంలో చిన్న వయసు అర్చనగా నటించిన ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారాయణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇటీవల విడుదలైన దండకారణ్యం చిత్రానికి సహాయ రచయితగానూ, దర్శకుడు శక్తివేల్ వద్ద కోడైరెక్టర్‌గా పని చేశారు. ఈ మూవీలో దర్శకుడు సుబ్రమణియం శివ, శరవణన్ సుబ్బయ్య, గాయత్రి, మునీశ్కాంత్, సురుళి, ఇడ్లీకొట్టు చిత్రంలో చిన్న వయసు ధనుష్‌గా నటించిన దిహాన్, దివ్యశ్రీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆరు పాటలుదర్శకుడు నారాయణన్ మాట్లాడుతూ.. ఒక ర్యాప్ గాయకుడి పూర్తి జీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అన్నారు. ఆ గాయకుడు ఎదుర్కొనే సమస్యలతోపాటు ఒక ముఖ్య విషయాన్ని ఈ చిత్రంలో చెప్పబోతున్నట్లు తెలిపా. సరిగ్గా రెండు గంటల పాటు సాగే ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయన్నారు. ఈ చిత్రానికి జీవా సంగీతం, ప్రముఖ చాయాగ్రహకుడు సెళియన్ శిష్యుడు యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బాటిల్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.చదవండి: ఓటీటీలో హృతిక్ స్టార్మ్ -
కాంతార విజయం.. రిషబ్‌కు మరో నేషనల్ అవార్డ్ రావచ్చు: స్టార్ డైరెక్టర్
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో ఆయన నటన చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా దర్శకత్వం వహిస్తూనే ఇలా గొప్పగా నటించడం మామూలు విషయం కాదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్ శెట్టి మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో ఏకంగా ఈ చిత్రం రూ. 500 కోట్ల క్లబ్లో మొదటి వారంలోనే చేరిపోయింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్ కాంతార చాప్టర్ 1పై ప్రశంసలు కురిపించారు. రిషబ్ శెట్టి మరోసారి జాతీయ అవార్డ్ అందుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇండియా టుడేతో అట్లీ మాట్లాడుతూ.. కాంతార గురించి ఇలా చెప్పారు. 'సినిమా విడుదలైనప్పుడు నేను ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్నాను. మొదటి రోజు సినిమా చూడటానికి సుమారు రెండున్నర గంటల పాటు కారులో వెళ్లాను. ఫైనల్‌గా ఫస్ట్ డే సినిమా చూశాను. థియేటర్ నుంచి వచ్చిన వెంటనే రిషబ్‌కు ఫోన్ చేసాను. అతను నాకు మంచి స్నేహితుడు. అతనంటే నాకు చాలా గౌరవం కూడా.. రిషబ్ శెట్టి చిత్రనిర్మాతలతో పాటు దర్శకులకు కూడా ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పగలను. కాంతార కోసం ఎవరూ చేయలేని పని అతను చేశారు. కాంతారలో నటించడమే కాకుండా దర్శకుడిగా పనిచేయడం అంటే సాధారణమైన విషయం కాదు. మరోకరికి ఇది సాధ్యం కాదని ఒక దర్శకుడిగా నేను చెప్పగలను. ఈ చిత్రంతో రిషబ్ తన నటనకు లేదా దర్శకుడిగా జాతీయ అవార్డ్ అందుకోవాలని ఆశిస్తున్నాను.' అని అట్లీ పేర్కొన్నారు.2022లో విడుదలైన కాంతార చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ను రిషబ్ శెట్టి అందుకున్నారు. అయితే, కాంతార చాప్టర్-1తో మరోసారి రిషబ్ నేషనల్ అవార్డ్ అందుకుంటారని దర్శకుడు అట్లీ పేర్కొన్నారు. 'జవాన్' చిత్రంతో బాలీవుడ్లో అట్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ కూడా జాతీయ అవార్డ్ అందుకున్నారు. -
'బెస్ట్ ఫేక్ న్యూస్' అవార్డ్ ఇవ్వండి.. సైమాకు సుదీప్ కౌంటర్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విలన్‌గా నటించబోతున్నారంటూ SIIMA (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. దీంతో సుదీప్( Sudeep) కూడా తనదైన స్టైల్లో సైమాపై పంచ్‌లు వేశారు. తమిళ హీరో శింబు, వెట్రిమారన్ మూవీలో విలన్ పాత్ర కోసం సుదీప్, ఉపేంద్ర ముందు వరుసలో ఉన్నారంటూ సైమా ఒక పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే సుదీప్ రియాక్ట్ అయ్యారు.సైమా గురించి సుదీప్ ఇలా అన్నారు. మీరు సైమా అవార్డ్స్ పేరుతో సాయంత్ర సమయంలో చేసే వేడుకపై నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, మీ ఈ వార్తల విషయానికొస్తే.. ఒక సూచన ఇవ్వాలనిపించింది. ఇక నుంచి మీ మూలాలను మార్చుకొని గాసిప్స్ వార్తలు ప్రచారం చేసుకోండి. వచ్చే ఏడాది నుంచి బెస్ట్ ఫేక్ న్యూస్ అవార్డ్ పేరుతో సైమాలో చోటు కల్పించండి. అందులోనైనా మీ వార్తకు అవార్డ్ వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. అని సుదీప్ కౌంటర్ ఇచ్చారు. అందుకు సైమా కూడా సరదాగా స్పందించింది. మీరు ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాం అంటూ మరో ట్వీట్ చేసింది. తమకు వచ్చే సమాచారాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకుంటామని చెప్పింది. అయితే మొదట చేసిన పోస్ట్‌ను సైమా వెంటనే తొలగించింది.కన్నడ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా ఉన్న సుదీప్.. తను నటించిన కొత్త చిత్రం 'మార్క్' కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2025 క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి విజయ్ కార్తీకేయ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలై 'మాక్స్' చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి నటించిన 45తో మార్క్ చిత్రానికి గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. ఆపై అదే సమయంలో దర్శన్ నటించిన ది డెవిల్ కూడా విడుదల కానుంది.Well @siima ...Huge respect for wat u do wth ua awards evenings. As for these news are concerned I have a suggestion.Whisper🤫: change ur sources. 🤗Also wanted to know if there is a "Best Fake News Award" coming up next SIIMA!! 😁 https://t.co/ydkA7k1E4W— Kichcha Sudeepa (@KicchaSudeep) October 10, 2025 -
శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. క్రేజీ హీరోతో రెండు సినిమాలు
ఇటీవల అమరన్ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మదరాసి చిత్రంతో కమర్షియల్ సక్సెస్‌ను సాధించిన నటుడు శివకార్తికేయన్. ఈయన తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఈయన నటిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటుడు అధర్వ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు పొందిన శ్రీలీల( Sreeleela) కోలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రం ద్వారా నేరుగా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయం అవుతున్నారు. కాగా రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించబోతున్నారని సమాచారం. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్లో డాన్ వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందిందన్నది గమనార్హం. ఈ చిత్రం నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారట.టీ మూవీలో కూడా నటి శ్రీలీల కథానాయకిగా నటించనున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే లేదు. ఇదే గనుక నిజం అయితే ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ శివకార్తికేయన్‌తో సినిమాలు చేసిన హీరోయిన్గా గుర్తింపు పొందుతుంది. -
నా డైరెక్షన్లోనే ఆ బయోపిక్ ఉంటుంది
‘‘ప్రస్తుతం షూటింగ్ సమయంలో షాట్ ఓకే అయిన తర్వాత నటీనటులు వెళ్లి తాము ఎలా చేశామో అని మానిటర్లో చూస్తుంటారు. ప్రతిసారీ వెళ్లి మానిటర్ చూడటం వల్ల సమయం వృథా అని నా భావన. మానిటర్ చూడటం డైరెక్టర్ పని. ఆయనకి సన్నివేశం బాగా వచ్చిందంటే ఓకే.. లేకుంటే మరో టేక్ చెబుతారు’’ అని శరత్ కుమార్ తెలిపారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.ఈ సినిమాలో కీలకపాత్ర చేసిన శరత్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నెనెప్పుడూ కథలో ముఖ్య భాగమయ్యేపాత్రలు చేయడానికే ఇష్టపడతాను. డైరెక్టర్ కీర్తీశ్వరన్ ‘డ్యూడ్’ కథ చెప్పినప్పుడు ప్రదీప్‌కి మావయ్యపాత్ర అన్నారు. నాపాత్ర కథలో చాలా కీలకం. ఒక కుటుంబంలో ఇలాంటి ఓ ఘటన జరిగితే సమాజం ఎలా స్పందిస్తుంది? అనే కోణంలో ‘డ్యూడ్’ని డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించారు. వినోదం, భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి. నాపాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సెట్స్‌లో ఉన్నప్పుడు సీనియర్ని అనే ఆలోచనతో కాకుండా నేను కేవలం శరత్ కుమార్ అనే ఆలోచనతో ఉంటాను.ఇంట్లో నేను, రాధిక, వరలక్ష్మి సినిమాల గురించి మాట్లాడుతుంటాం. వరలక్ష్మి ఇప్పుడు డైరెక్టర్ అవుతోంది. తన కథని రెండు మూడు రోజుల్లో వింటాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నోపాత్రలు చేశాను. అయితే సుభాష్ చంద్రబోస్‌గారి బయోపిక్ చేయాలని ఉంది. ఈ సినిమాకి నేనే దర్శకత్వం వహిస్తాను. ప్రస్తుతం ‘మిస్టర్ ఎక్స్’ సినిమా చేస్తున్నాను. బాలీవుడ్లో ఓ మూవీ, గౌతమ్ మీనన్‌తో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
జైలులో దర్శన్.. కొత్త సినిమా రొమాంటిక్ సాంగ్ విడుదల
కన్నడ హీరో దర్శన్ జైలులో ఉండగానే ఆయన నటించిన సినిమా విడుదల కానుంది. రేణుకాస్వామి హత్య కేసులో జైలుకెళ్లిన దర్శన్..బెయిల్‌పై బయటకొచ్చినప్పటికీ సుప్రీం కోర్టు ఎంట్రీతో ఆయన మళ్లీ జైలుకెళ్లారు. అయితే, దర్శన్ నటించిన కొత్త సినిమా 'డెవిల్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఒక పాటను తాజాగా విడుదల చేశారు. దీనిని సింగర్స్ కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 12న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో దర్శన్‌కు జోడీగా రచన రాయ్ నటించింది. దర్శకుడు ప్రకాష్ వీర్ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్ టైమ్‌లో ఆయన బెయిల్ నుంచి బయటకు రావచ్చని సమాచారం. -
అందాల బ్యూటీ రాశి ఖన్నా.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
తన పేరులోనే రాశిని పొందుపరచుకున్న నటి రాశిఖన్నా. హీరోయిన్‌గానూ తన రాశి బాగానే ఉంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన భామ తమిళంలో ఇమైకా నొడికల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో అధర్వ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నటి రాశిఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.రాశి ఖన్నా చివరిగా ధనుశ్, నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రంబలం చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయినా ప్రస్తుతం రాశి ఖన్నా వరుసగా చిత్రాలు చేయడం లేదు. ఆమెకు అవకాశాలు రాకపోవడం లేక ఇతర భాషల్లో నటించడంతో సమయం సరిపోవడం లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు అవసరమైతే అందాల ఆరబోతకు సై అంటున్నారు. అదేవిధంగా కోలీవుడ్‌లో మంచి చిత్రాల్లో నటించాలన్న కోరికను ఈ బ్యూటీ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న రాశిఖన్నా తన భావాలను వ్యక్తం చేస్తూ అభిమానులు ఇష్టపడే కథానాయకగా సినిమాల్లో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇంకా తన జీవితంలో పెద్ద కల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు రాశిఖన్నా తెలిపారు -
కమల్ హాసన్‌పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభమై నెలరోజులవుతోంది. మొదటి రెండు వారాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేకుండా పోయింది. గొడవలతో అట్టుడికిన హౌస్ తర్వాత చప్పున చల్లారిపోయింది. కంటెస్టెంట్లకు ఎక్కువ హింట్స్ వెళ్లడం వల్లే అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో? అన్న జంఝాటంలో పడిపోయారు. ఇలాగైతే ఈ సీజన్.. ఆరో సీజన్ కంటే అట్టర్ ఫ్లాప్‌గా మారడం ఖాయం. ఆరుగురు కన్ఫార్మ్!అందుకే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డులను దింపబోతున్నాడు. ఈ ఆదివారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరి), నటులు నిఖిల్ నాయర్, గౌరవ్, ఆయేషా, శ్రీనివాస్ సాయి హౌస్‌లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఆయేషా జీనత్‌పై కాస్త హైప్ ఎక్కువగా ఉంది. ఊర్వశివో రాక్షసివో, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలోనూ మెరిసింది. తమిళ బిగ్‌బాస్‌లో..తమిళంలో అనేక సీరియల్స్ చేసింది. ఉప్పు పులి కారం అనే తమిళ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. తమిళ చిత్రం రాంబోలోనూ నటించింది. అయితే ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం బిగ్‌బాస్ షో! అవును, ఆయేషా తమిళ బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్‌గా నిలిచింది. ఓపక్క అల్లరి చేస్తూ, మరోపక్క తనను విమర్శిస్తే ఉగ్రరూపం చూపిస్తూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసింది. ఆ సమయంలో ఆయేషాపై ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు.రెండుసార్లు పెళ్లి?ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందన్నాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి అవమానించారని, కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని కొంతకాలం నటుడు విష్ణుతో ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత అతడిని వదిలేసి యోగేశ్‌తో రిలేషన్షిప్ మొదలుపెట్టిందని ఆరోపించాడు. తనకిప్పటికే రెండుసార్లు పెళ్లయిందని బాంబు పేల్చాడు. వీటన్నింటి గురించి ఆయేషా క్లారిటీ ఇవ్వలేదు. అయితే యోగేశ్‌తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ఆయేషా.. తర్వాత ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.కమల్ హాసన్‌నే ఎదిరించిన లేడీఇక షోలో ఆయేషాతో వేరే కంటెస్టెంట్లకు మధ్య ఉన్న గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు కమల్ హాసన్. హోస్ట్ బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడుతుంటే ఆయేషా మాత్రం.. నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు అని ఎదురుతిరిగింది. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. బిగ్‌బాస్ షోలో రెండు నెలలవరకు కొనసాగింది. మరి ఈ బ్యూటీ ఇక్కడ కూడా వైల్డ్‌ఫైర్‌లా ఉంటుందా? తన ఆటతో ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి! View this post on Instagram A post shared by AYSHA🦋 (@aysha7__official) చదవండి: ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె -
'కాంతార' రూ.500 కోట్లు.. రెండో స్థానంలో రిషబ్
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) రూ.500 కోట్ల క్లబ్లో చేరింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో ఈ మూవీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే రూ. 509 కోట్లు రాబట్టినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. కేవలం ఒక వారంలోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్లు రాబట్టడంతో అభిమానులో పోస్టులు పెడుతున్నారు. రీసెంట్గా విడుదలైన రజనీకాంత్ కూలీ సినిమా జీవితకాల కలెక్షన్స్‌ను కూడా కాంతార చాప్టర్1 అధిగమించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో రోండో స్థానంలో కాంతార చాప్టర్ 1 ఉంది. అయితే, మొదటి స్థానంలో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు) ఉంది. కానీ, కేజీఎఫ్ రికార్డ్‌ను కాంతార చేరుకోవడం అంత సులువైన విషయం కాదని చెప్పవచ్చు. సుమారు రూ. 800 కోట్ల ఫైనల్ కలెక్షన్స్‌తో ఈ మూవీ సత్తా చాటే ఛాన్స్ ఉంది. అయితే, కన్నడలో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ చిత్రాలు ఇలా ఉన్నాయి. మొదటి స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు), కాంతార చాప్టర్-1 (రూ. 509 కోట్లు), కాంతార (రూ. 450 కోట్లు), కేజీఎఫ్ చాప్టర్-1 (రూ. 250 కోట్లు), విక్రాంత్ రోణా (రూ. 210 కోట్లు) వరుసగా ఉన్నాయి. -
నయనతార, కవిన్ కొత్త సినిమా టైటిల్ ఎలా ఉందంటే..?
నయనతార కథానాయకిగా, కవిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్'.. జి.స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణుఎడవన్ కథ, దర్శకత్వం నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్, ప్రభు, రాధిక, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి ఇతర సినీ ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నయనతార, కవిన్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో హాయ్పై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లు తాజాగా విడుదల చేశారు. పోస్టర్ కొత్తగా ఉండడంతో దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని యూనిట్ సభ్యులు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ప్రేమ, వినోదం కలగలిపిన సహజత్వంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికి 20 రోజులపాటు షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతాన్ని, రాజేష్ శుక్లా చాయాగ్రహణం అందిస్తున్నారు. -
అందుకే బిగ్‌బాస్ ఇంటికి తాళం.. రెండురోజుల్లో మళ్లీ షురూ
కన్నడ బిగ్‌బాస్ సీజన్– 12 (Kannada Bigg Boss 12) ఊపిరి పీల్చుకుంది. గురువారం నుంచి పునఃప్రారంభమైంది. బిడది వద్ద ఓ స్టూడియోలో నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌కు కాలుష్య నియంత్రణ మండలితో సహా వివిధ శాఖల అనుమతులు లేవంటూ మంగళవారం నాడు జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు ఆగమేఘాలపై షోను బంద్ చేసి హౌస్‌కు తాళం వేయడం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేకెత్తించింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమారే మూసివేయించారని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఇది కక్ష సాధింపు చర్యగా అభిప్రాయపడ్డారు. అయితే చివరకు హౌస్ మళ్లీ తెరుచుకుంది. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిసార్టులో ఉంచిన పోటీదారులను గురువారం తెల్లవారుజామున బిగ్‌బాస్ స్టూడియోకు తరలించారు. హౌస్‌కు వెళ్లగానే కార్యక్రమం తిరిగి మొదలైంది.డిప్యూటీ సీఎం చెప్పారు: కలెక్టరుఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనల మేరకే బిగ్‌బాస్‌కు అనుమతించినట్లు జిల్లా కలెక్టర్ యశవంత్ గురకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇద్దరు కలిసి మూతపడిన గేటును తెరిచారు. ఆ తరువాత పోటీదారులు లోపలకు వెళ్లారు. దీంతో శివకుమార్‌కు యాంకర్, హీరో కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు.బెస్కాం నోటీసులుబిగ్బాస్ స్టూడియోలో అన్ని సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించుకోవాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని బిడది బెస్కాం ఎఈఈ మోహిత నోటీసులిచ్చి వెళ్లారు. అనుమతులు లేనందువల్ల స్టూడియోకు ఎందుకు కరెంట్‌ను కట్ చేయాకూడదో చెప్పాలని నోటీసులో కోరారు. పర్యావరణ అనుమతులు లేవన్న కారణంతోనే.. బిగ్‌బాస్ ఇంటికి ఒకరోజు తాళం వేశారు. కాగా, బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా స్టూడియో ముందు కన్నడ సంఘాలు ధర్నా చేశాయి. ఇకపోతే కన్నడ బిగ్‌బాస్ 12వ సీజన్.. సెప్టెంబర్ 28న ప్రారంభమైంది.చదవండి: సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్ -
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని ఎటువంటి తారతమ్యం చూపనని సోనియా అగర్వాల్ (Sonia Agarwal) అన్నారు. ఈమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం విల్. ఫుడ్ స్టెప్స్ ప్రొడక్షన్స్, కొత్తారి మద్రాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ మూవీ తెరకెక్కింది. ఎస్.శివరామన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా.. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. విక్రాంత్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించారు. ఈ మూవీ శుక్రవారం (అక్టోబర్ 10న) రిలీజైంది. ఈ క్రమంలో గురువారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు శివరామన్ మాట్లాడుతూ.. ఇది కోర్టు నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిన్న, పెద్ద అన్న బేధాలు చూడనుసోనియా అగర్వాల్ జడ్జిగా నటించగా, అలోకియా చిన్న వివాదాస్పద పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. సోనియా అగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్‌ను సంగీత దర్శకుడుగా పరిచయం చేసినట్లు చెప్పారు. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ.. శివరామన్ దర్శకత్వంలో తాను ఇంతకుముందు తనిమై అనే చిత్రంలో నటించానని, ఆ తర్వాత ఇప్పుడు విల్ చిత్రంలో నటించినట్లు చెప్పారు. తాను చిత్రాల విషయంలో చిన్న, పెద్ద అన్న తారతమ్యాన్ని చూడనని, ఇంతకుముందు రూ.కోటి వ్యయంతో రూపొందించిన కాదల్ కొండేన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.చదవండి: అప్పట్నుంచే తెలుగు నేర్చుకుంటున్నా!: శ్రీనిధి శెట్టి -
అప్పట్నుంచే తెలుగు నేర్చుకుంటున్నా!: శ్రీనిధి శెట్టి
‘‘నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. వారిని అడిగి తెలుగు పదాలు, వాక్యాలు ఓ లిస్ట్‌గా రాసుకుని, నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్నుంచే తెలుగు మాట్లాడటం అలవాటైంది. సినిమా సెట్స్‌లో తెలుగువాళ్లను తెలుగులోనే మాట్లాడమని చెప్పి, నేను కూడా వారితో తెలుగులోనే మాట్లాడతాను. అయితే తెలుగులో నేను ఇంకాస్త బెటర్ కావాలి.అందుకే ‘తెలుసు కదా’ చిత్రానికి డబ్బింగ్ చెప్పలేకపోయాను. ఇకపై నా ప్రతి సినిమాకు నేనే డబ్బింగ్ చెబుతాను’’ అని హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనిధి శెట్టి చెప్పిన సంగతులు. ⇒ ‘తెలుసు కదా’ మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు అనగానే అందరూ ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీ అనుకుంటారు. కానీ ఇందులో మేం ఓ కొత్త అంశాన్ని చూపించాం. ఆ అంశం ఏమిటి? అనేది థియేటర్స్‌లో చూసినప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. వరుణ్ (సిద్ధు పాత్ర పేరు), రాగ (శ్రీనిధి), అంజలి (రాశీ ఖన్నా) క్యారెక్టర్స్‌కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మా పాత్రల్లో కొంచెం గ్రే షేడ్స్ ఉన్నాయి. దర్శకురాలు నీరజ విజన్ ప్రేక్షకులకు నచ్చుతుంది. ⇒ తెలుగులో నా తొలి సినిమాగా ‘హిట్ 3’ విడుదలైంది. కానీ తెలుగులో నేను సైన్ చేసిన తొలి సినిమా ‘తెలుసు కదా’. ‘కేజీఎఫ్, కోబ్రా, హిట్ 3’ వంటి వరుస యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత చేసిన రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’ నాకు కొత్తగా అనిపించింది. ఇందులో నేను పోషించిన రాగ పాత్రకు, రియల్ లైఫ్‌లో నాకు పెద్దగా పోలికలు లేవు.⇒ ఓ నటిగా అన్ని రకాల జానర్ సినిమాలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా కమిట్ అయ్యాను. -
టైటిల్ ప్లీజ్ గురూ!
ఒక సినిమాకు అందులోని హీరో, దర్శకుడు, హీరోయిన్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటారు. అలాగే ఆ సినిమా ప్రేక్షకులకు చేరువ కావడానికి, మరింత ప్రమోషన్‌కు ఆ సినిమా టైటిల్ చాలా ముఖ్యం. అందుకే టైటిల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది యూనిట్. స్టార్ హీరో సినిమా అయితే ఏ టైటిల్ పెడతారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ కోవకు చెందిన తెలుగు చిత్రాలు పదికి పైనే ఉన్నాయి.ఈ చిత్రాలకు వర్కింగ్ టైటిల్స్ ఉన్నప్పటికీ, హీరో అభిమానులు ఒరిజినల్ ‘టైటిల్ ప్లీజ్ గురూ..!’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఆయా చిత్రబృందాల మేకర్స్ కొన్ని టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. మరి... ఏ హీరో సినిమాకు, ఏ టైటిల్ పరిశీలిస్తున్నారనే విషయంపై మీరూ ఓ లుక్ వేయండి.కింగ్ 100నాగార్జున కెరీర్‌లోని వందో సినిమా షూటింగ్ పనులు ఊపందుకున్నాయని తెలిసింది. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని సమాచారం. నాగార్జున పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా టైటిల్‌ను గురించి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.నాగార్జున కెరీర్‌లోని ఈ వందో సినిమాకు ‘కింగ్ 100’, ‘కింగ్ 100 నాటౌట్’, ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. మరి... ఈ టైటిల్లో ఏ టైటిల్‌ని ఖరారు చేస్తారో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే... నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ సినిమాలో కీర్తీ సురేష్ ఓ చిన్న గెస్ట్ రోల్ చేశారు. అలాగే కథ రీత్యా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట.కీర్తీ సురేష్ ఓ లీడ్ హీరోయిన్గా చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇంకా నాగార్జున, టబుల కాంబినేషన్లో ‘నిన్నే పెళ్లాడతా’ ఎంతటి బ్లాక్‌బ స్టర్ హిట్ సాధించిందో తెలిసిందే. నాగార్జున వందో సినిమాలోనూ టబు భాగమయ్యారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.ఆనంద నిలయం? హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రానుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు చెందిన ఫొటోషూట్ కూడా జరిగింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని తెలిసింది. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ సినిమా ప్రధాన కథాంశం వైజాగ్ నేపథ్యంలో సాగుతుందని, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారని సమాచారం.కాగా, ఈ సినిమా టైటిల్ ఇదంటూ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ చిత్రానికి ‘ఆనంద నిలయం’, ‘వెంకట రమణ’, ‘వెంకటరమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమాల టైటిల్స్ ప్రధానంగా ‘అ ఆ’ అక్షరాలతోనే ప్రారంభం అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ‘ఆనంద నిలయం’ అనే టైటిల్ తెరపైకి రావడం ఆసక్తికరమైన విషయం.మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘మల్లీశ్వరి’ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పని చేశారు. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్‌లో అంచనాలు ఉండటం సహజం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.భర్త మహాశయులకు విజ్ఞప్తి‘భర్త మహాశయులకు విజ్ఞప్తి, రోల్ మోడల్, అనార్కలి’... ఇప్పటివరకు రవితేజ 76వ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న టైటిల్స్ ఇవి. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాను కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో జరుగుతోంది. కొంత టాకీ పార్టుతో పాటు పాటలను కూడా చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.పైగా, ఈ మూవీని వచ్చే సంక్రాంతికే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ను అతి త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని ఊహించవచ్చు. మరి... ప్రచారంలో ఉన్న టైటిల్స్‌లో ఏదో ఒకటి రవితేజ 76వ సినిమాకు ఫిక్స్ అవుతుందా? లేక మరో టైటిల్ ఏదైనా తెరపైకి వస్తుందా? అనేది చూడాలి.వారణాసిహీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. అయితే ‘రాజకుమారుడు’, ‘జెన్ 63’ వంటి టైటిల్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం దాదాపు రూ. 50 కోట్లతో చిత్రయూనిట్ హైదరాబాద్ శివార్లలో ‘వారణాసి’ సినిమా సెట్స్ వేయడం, ఈ సినిమాకు కాశీ బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ‘వారణాసి’ అనే టైటిల్ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. కాగా, నవంబరు నెలలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ సినిమా అప్డేట్ను విడుదల చేస్తామని ఇటీవల రాజమౌళి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబరులో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ టైటిల్ అనౌన్స్‌మెంట్‌నే అని, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కావొచ్చని, ఇందుకోసం నవంబరు రెండో వారంలో ఓ పెద్ద ఈవెంట్‌ను రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.ప్రస్తుతం ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. దీంతో నవంబరులో మళ్లీ ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు రాజమౌళి. నవంబరులో మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఓ పాట చిత్రీకరణ కూడా ఉంటుందని, డిసెంబరులో చిత్రయూనిట్ కెన్యాకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఫౌజి... బ్రహ్మరాక్షసప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ సినిమా సెట్స్‌లో ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ ఓ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇందులో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘ప్రభాస్హను’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.కాగా, ఈ సినిమాకు మేకర్స్ ‘ఫౌజి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయిని తెలిసింది. వచ్చే ఏడాది సెకండాఫ్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మతో హీరో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారని, ఈ సినిమాకు ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.డ్రాగన్హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. కన్నడ దర్శక– నటుడు రిషబ్ శెట్టి, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు చిన్న బ్రేక్ పడింది. ఓ యాడ్ షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడ్డారు. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ విదేశాల్లో జరుగుతుందని, ముందుగా యూకేలో ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా, ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారట. కల్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.బ్లడీ రోమియో!సిల్వర్ స్క్రీన్‌పై నాని ఓ రోమియోగా కనిపించనున్నారట. నాని హీరోగా సుజిత్ డైరెక్షన్లో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం రానుంది. ఇందులో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ దసరా సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది.లవ్, యాక్షన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం కొనసాగుతుందట. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారని తెలిసింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యునానిమస్ ప్రోడక్షన్స్ పతాకాలపై నాని, వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది.కొరియన్ కనకరాజు? సిల్వర్ స్క్రీన్‌పై వరుణ్ తేజ్ దెయ్యాలను ఎలా అదుపు చేస్తారనే విషయం వచ్చే ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్ తేజ్ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ చిత్రం రూ పొందుతోంది. ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ఓ కీ రోల్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే చాన్సెస్ ఉన్నాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా.స్లమ్ డాగ్విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరీ సేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా టబు, దునియా విజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో బెగ్గర్‌గా విజయ్ సేతుపతి, విలన్‌గా టబు నటిస్తున్నారని తెలిసింది. వచ్చే వారం ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.ఈ సెప్టెంబరు 28న పూరి జగన్నాథ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారంగా ప్రకటించాలనుకున్నారు మేకర్స్. కానీ తమిళనాడులో జరిగిన కరూర్ దుర్ఘటన కారణంగా టైటిల్ రిలీజ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాకు ‘స్లమ్ డాగ్, బెగ్గర్, భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్స్‌ను పరిశీలించారట. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా, చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తారు. ఇలా రెండు, మూడు టైటిల్స్‌ను పరిశీలిస్తూ, త్వరలోనే ఓ టైటిల్‌ను ప్రకటించనున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి.‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా... చూస్తావా నా మైనా’... ఈ పాట వినగానే, ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ‘చుక్కలు తెమ్మన్నా... తెంచుకురానా..’ అనే టైటిల్‌తో ఓ ఉమెన్ సెంట్రిక్ సినిమా రానుందని, వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లోని ప్రధాన పాత్ర పోషించేందుకు భాగ్యశ్రీ భోర్సే, శ్రీలీల వంటి వార్ల పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
బ్లాక్ డ్రెస్‌లో శోభిత గ్లామర్..శారీలో అనన్య నాగళ్ల అందాలు!
హీరోయిన్ అనన్య నాగళ్ల గ్లామరస్ పిక్స్..బ్లాక్ డ్రెస్‌లో అక్కినేని శోభిత ధూళిపాల అందాలు..బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను పంచుకున్న మంచు లక్ష్మీ..పెట్స్‌తో చిల్ అవుతోన్న హీరోయిన్ స్నేహ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) -
పది రోజుల్లో క్లోజ్.. రెండు రోజులకే ఇలా.. బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది?
ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ హవా నడుస్తోంది. తెలుగులో మొదలైన ఈ షో ఆ తర్వాత తమిళం, కన్నడలోనూ ప్రారంభమైంది. కన్నడ హీరో సుదీప్ బిగ్‌బాస్ 12వ సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబరు 28న ఆదివారంతో మొదలైన షో పట్టుమని పది రోజులకే మూసేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం స్థానిక పర్యావరణ అధికారులే. జాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పార్క్‌లోని బిగ్‌బాస్ హౌస్ సెట్ వ్యర్థాలన్నీ బయటికి వస్తున్నాయని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే బిగ్‌బాస్ షో నిర్వాహకులకు పర్యావరణ నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత వెంటనే బిగ్‌బాస్ ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డ్ కూడా ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో కన్నడ బిగ్‌బాస్ నిర్వాహకులకు పెద్ద షాకిచ్చారు అక్కడ అధికారులు. బిగ్‌బాస్ హౌస్‌కు తాళం వేసి అందరినీ బయటికి పంపించారు.అయితే ఇది జరిగిన రెండు రోజుల్లోనే మళ్లీ బిగ్‌బాస్ హౌస్ తెరుచుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదేశాలతో బిగ్‌బాస్ షోను తిరిగి ప్రారంభించారు. రెండు రోజుల అనంతరం కంటెస్టెంట్స్ 17 మంది మళ్లీ హౌస్‌లోకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఈ షోను తిరిగి ప్రారంభించేందుకు సహకరించిన డీసీఎం డీకే శివకుమార్‌కు హోస్ట్ కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఇప్పటికే జాలీవుడ్ స్టూడియోస్ మూసివేతను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణకు రానుంది. I sincerely thank Hon. @DKShivakumar sir for the timely support.Also want to thank the concerned authorities for acknowledging that #BBK was not involved or was a part of the recent chaos or disturbances.I truely appreciate the DCM for promptly responding to my call, and thank… https://t.co/94n6vh2Boc— Kichcha Sudeepa (@KicchaSudeep) October 8, 2025 -
కాంతార చాప్టర్-1.. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ వన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్, కాంతార రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ చిత్రం వారం రోజుల్లోనే ఏకంగా హాలీవుడ్ సినిమాలనే అధిగమించింది. ఈ వారంలో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతారా చాప్టర్ -1 నిలిచింది. ఈ క్రమంలో ఏకంగా రెండు హాలీవుడ్ చిత్రాలను అధిగమించింది. టేలర్ స్విఫ్ట్ సినిమా పార్టీ ఆఫ్ ఏ షో గర్ల్, లియోనార్డో డికాప్రియో నటించిన 'వన్ బ్యాటిల్ ఆఫ్ అనదర్' చిత్రాల వసూళ్లను దాటేసింది. కాంతార చాప్టర్-1 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ మొదటి వారంలో దాదాపు 53 మిలియన్ డాలర్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఈ వారాంతంలో 50 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన టేలర్ స్విఫ్ట్ చిత్రం పార్టీ ఆఫ్ ఎ షోగర్ల్ను దాటేసింది. లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాను కూడా కాంతార చాప్టర్-1 బ్రేక్ చేసింది. ఈ సినిమా రెండవ వారంలో ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇటీవలే రీ రిలీజ్ అయిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ కూడా కాంతార కంటే వెనకే ఉంది.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ..379 కోట్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.451 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ (రూ.431 కోట్లు), 3 ఇడియట్స్ (రూ.450 కోట్లు) వంటి సూపర్ హిట్ సినిమాల జీవితకాల కలెక్షన్స్ అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే రెండో వారంలోనే రూ.500 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ రిలీజ్.. దీపావళికి కాదు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించడం విశేషం. ఈ పాన్ ఇండియా చిత్రంపై మోహన్ లాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఫుల్ యాక్షన్ మూవీ దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. మొదట అక్టోబర్ 23 రిలీజ్ చేస్తామని ప్రకటించారు.కానీ ఈ దీపావళికి థియేటర్లలో వృషభ రిలీజ్ కావడం లేదు. తాజాగా కొత్త రిలీజ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల అంటే నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. The ground shakes. The sky burns. Destiny has chosen its warrior. #Vrusshabha arrives on 6th November! #RoarOfVrusshabha #VrusshabhaOn6thNovember#SamarjitLankesh @ursnayan @raginidwivedi24 @Connekktmedia @balajimotionpic #AbishekSVyasStudios @FilmDirector_NK #ShobhaKapoor… pic.twitter.com/emyiIFJ5uR— Mohanlal (@Mohanlal) October 9, 2025 -
వ్యక్తిగత జీవితంలోకి కెమెరా రాకూడదు: రష్మిక మందన్నా
సెలబ్రిటీల వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలపైనే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటిది సినీ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్లు ఏం చేసినా వార్తే అవుతోంది. వారి వ్యక్తిగత జీవితాల గురించి రకరకాల వార్తలు వెలువడుతుంటాయి. ఇదే మంచిది కాదంటున్నారు నటి రష్మికా మందన్నా. ఈ భామ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. నేషనల్ క్రష్‌గా వెలుగొందుతున్న రస్మికా మందన్నా ప్రస్తుతం బాలీవుడ్‌ను దున్నేస్తున్నారనే చెప్పాలి.ఇక తెలుగు,తమిళం భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ని పెళ్లి చేసుకోనున్నట్లు ఆ మద్య చెప్పకనే చెప్పారు. కాగా ఇటీవల విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహ నిశ్చితార్థం చాలా నిడారంబరంగా జరిగినట్లు వార్తలు బలంగానే వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని ఈ ఇద్దరిలో ఎవరూ బహిరంగంగా వెల్లడించలేదు. ఇలాంటి సరిస్థితుల్లో నటి రష్మిక మందన్నా ఇటవల ఒక భేటీలో పేర్కొంటూ లోపల ఏం జరుగుతోందన్నది ప్రపంచానికి తెలియదన్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లోకి కెమెరా రాకూడదని అన్నారు.తాము వ్యక్తిగత విషయాలను ఆన్లైన్ వంటి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించే వాళ్లం కాదన్నారు. అదే విధంగా ప్రజలు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఏం అనుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదనీ, తమ వృత్తిపరమైన జీవితాల గురించే ముఖ్యం అని పేర్కొన్నారు. రష్మిక మందన్నాకు వివాదాలు కొత్తేమీ కాదు. ఈమెను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందనే ప్రచారం వాడివేడిగా సాగింది. అయితే ఇప్పటి వరకూ తాను బ్యాన్ చేయబడలేదని రష్మిక మందన్నా స్పష్టం చేశారు. అదే విధంగా ఇంతకు ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నటి రష్మిక మందన్నా ప్రేమ వివాహ నిశ్చితార్థం వరకూ వెళ్లి ఆ తరువాత విడిపోయారు. ఆపై రష్మిక మందన్నా కన్నడ చిత్రాల్లో నటించలేదు. కాంతార చిత్రం విడుదలయిన సమయంలోనూ రష్మిక మందన్నా వివాదాలకు గురయ్యారు. ఆ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదని పేర్కొనడంతో పెద్ద రచ్చే జరిగింది. అలాంటిది ఇటీవల కాంతారకు ఫ్రీక్వెల్‌గా రూపొందిన కాంతార ఛాప్టర్ 1 చిత్రాన్ని చూసిన తరువాత ఆ చిత్ర బృందానికి మెసేజ్ పెట్టినట్లు, వాళ్లు అందుకు థ్యాంక్స్ చెప్పినట్లు నటి రషి్మకా మందన్నా పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అమ్మడు ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. -
సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు
ఎవరైనా నటుడు లేదా నటి మరణిస్తే.. జ్ఞాపకాలుగా మిగిలేవి వాళ్లు చేసిన సినిమాలు మాత్రమే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి మరణించిన గాయనీగాయకుల గాత్రాన్ని కొత్త పాటల్లో వినిపించేలా చేస్తున్నారు. నటీనటుల్ని కూడా మళ్లీ బతికిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ ఓటీటీ సిరీస్ కోసం కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ని మళ్లీ తెరపై చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్.. చాలా చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమని సంపాదించుకున్నారు. తెలుగులోనూ ఇతడు నటించిన పలు చిత్రాలు డబ్బింగ్గా రిలీజ్ అయ్యాయి. 2021లో కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోయిన తర్వాత జేమ్ అనే సినిమా, గంధగ గుడి అనే డాక్యుమెంటరీ రిలీజయ్యాయి. తర్వాత నుంచి ఇప్పటికీ ఈయన్ని కన్నడ దర్శకనిర్మాతలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.అయితే 'మారిగల్లు' అనే ఓటీటీ సిరీస్ కోసం ఇప్పుడు ఈయన్ని మరోసారి తెరపై చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పునీత్ రాజ్ కుమార్‌ని ఈ సిరీస్‌లో చూపించారు. కాదంబ రాజ్యానికి చెందిన మయూర వర్మ అనే రాజుగా పునీత్ కనిపించనున్నారు. మిగతా పార్ట్ అంతా నటీనటులే కనిపిస్తారు గానీ పునీత్‌కి సంబంధించిన సీన్స్ మాత్రం ఏఐ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఈ సిరీస్ గనక వర్కౌట్ అయి పునీత్ పాత్రకు పేరొస్తే గనక రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రయోగాలు చాలానే చూడొచ్చు. ఈ సిరీస్ నిర్మించింది పునీత్ కుటుంబ సభ్యులే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
నటికి క్షమాపణలు.. ఎట్టకేలకు ముగిసిన వివాదం
పరస్పరం బేషరతుగా క్షమాపణలు చెప్పుకోవడంతో సీమాన్, నటి విజయలక్ష్మిల వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. 'నామ్ తమిళర్ కట్చి' పార్టీ నేత సీమాన్.. తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా నటి విజయలక్ష్మి పోరాటం చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య వివాదం పోలీసు స్టేషన్లు చుట్టూ తిరిగింది. చివరకు హైకోర్ట్ వరకు చేరింది. ఈ కేసును రద్దు చేయాలని సీమాన్ దాఖలు చేసుకున్న విజ్ఞప్తిని మద్రాసు హైకోర్టు తిరస్కరించింది.అయితే ఈ ఇద్దరిమధ్య వివాదాన్ని కొలిక్కి తెచ్చే విధంగా పంచాయితీలు సాగాయి. అదే సమయంలో సుప్రీంకోర్టును సీమాన్ ఆశ్రయించారు. ఈ సమయంలో సీమాన్‌పై తాను ఇచ్చిన కేసును వెనక్కు తీసుకుంటున్నట్టు లిఖిత పూర్వకంగా విజయలక్ష్మి పోలీసులకు సమర్పించారు. పెద్దల పంచాయితీతో వివాదం సద్దుమణిగినా, వ్యవహారం కోర్టులో ఉండటంతో విచారణ ఎదుర్కోక తప్పలేదు.ఎట్టకేలకు సీమాన్, విజయలక్ష్మి పరస్పరం క్షమాపణలు చెప్పుకోవడంతో వివాదం కోర్టులోనూ సమసినట్లయ్యింది. బుధవారం విచారణ సమయంలో ఈ క్షమాపణల ప్రస్తావన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ ముందుకు వచ్చింది. ఇరువురి వాదనల అనంతరం క్షమాపణలను పరస్పరం అంగీకరించిన నేపథ్యంలో కేసును ముగించారు. ఇక మీదట అఫిడవిట్లో పేర్కొన్నట్టుగా నడుచుకోవాలని హితవు పలికారు. -
కాంతార చాప్టర్ 1.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!
రిషబ్ శెట్టి (Rishab Shetty) డైరెక్షన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచే అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే కాంతార మూవీ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ చిత్రం నుంచి బ్రహ్మ కలశ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాట థియేటర్లలో కాంతార ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అబ్బి ఆలపించారు. వరాహరూపం థీమ్‌తో వచ్చిన ఈ సాంగ్ థియేటర్లలో అభిమానులను అలరించింది. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. A symphony of faith, a celebration of devotion 🔱🔥#Brahmakalasha Video Song from #KantaraChapter1 out now 🎵▶️ https://t.co/wzi1h7ek5l#BlockbusterKantara in cinemas now!#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere #Kantara @hombalefilms @KantaraFilm… pic.twitter.com/VKVnnqXmrq— Hombale Films (@hombalefilms) October 8, 2025 -
కాంతార రికార్డ్ బ్రేక్ చేసిన కాంతార.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే అరుదైన మార్క్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.(ఇది చదవండి: 'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్‌బాస్ సంజనా గల్రానీ ఆవేదన!)కాంతార రికార్డ్ బ్రేక్.. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఆరు రోజుల్లోనే కాంతార లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది. కేజీఎఫ్- 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది. కాగా.. 2022లో విడుదలైన 'కాంతార' సినిమా రూ.408 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు రాబట్టింది. శాండల్‌వుడ్‌లో కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1215 కోట్లతో మొదటిస్థానంలో ఉంది. కాంతార చాప్టర్-1 జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే. -
కన్నడలో బ్యాన్.. స్పందించిన రష్మిక!
ఈ మధ్య రష్మిక(Rashmika Mandanna ) పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఒకపక్క కెరీర్..మరోపక్క పర్సనల్ విషయాల్లో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ఇటీవల విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు రష్మిక నటించిన తాజా చిత్రం ‘థామా’(Thama)ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అఅయితే రష్మిక సొంత రాష్ట్రం అయిన కర్ణాటకలో మాత్రం విడుదల కాదని.. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బహిష్కరించిందనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై రష్మిక స్పందించింది. ఇప్పటివరకు తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని వెల్లడించింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు.ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకోలేను కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రష్మిక మాత్రం ఈ చిత్రంపై స్పందించలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. థామా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..‘ఏ సినిమా రిలీజ్ అయినా..నేను రెండు, మూడు రోజుల్లోనే చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశాను. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశా. వాళ్లు నాకు ధన్యవాదాలు కూడా తెలిపారు. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత విషయాలన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకునే వ్యక్తిని కాదు. . అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను’ అని రష్మిక అన్నారు. -
స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్
రీసెంట్గా 'లోక' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్, అలానే 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి.. బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. రవి మోహన్ (జయం రవి) హీరోగా చేస్తున్న లేటెస్ట్ తమిళ సినిమా 'జీనీ'. దీని నుంచి అబ్దీ అబ్దీ అంటూ సాగే వీడియో సాంగ్‌ని తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో కల్యాణి-కృతి స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.(ఇదీ చదవండి: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలో హీరో రవి మోహన్ కూడా ఉన్నప్పటికీ కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో తెగ హైలెట్ అయిపోతున్నారు. గతంలో ఇలాంటి పాట ఎక్కడో చూశామే అన్నట్లు అనిపిస్తుంది కానీ చూస్తున్నంతసేపు డ్యాన్ మాత్రం భలే చేశారు కదా అనిపిస్తుంది. 'జీనీ' అర్జునన్ చిత్రానికి అర్జునన్ దర్శకుడు కాగా.. ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్) -
'డ్రాగన్' తెచ్చిన లక్.. కాయదు లోహర్కి మరో ఛాన్స్!
హీరోయిన్లకు మొదట ఒకే ఒక్క ఛాన్స్ వస్తుంది. అదృష్టం కలిసొచ్చి ఆ మూవీ హిట్ అయితే తర్వాత అవకాశాలు వెల్లువలా వస్తాయి. కాయదు లోహార్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2021లో కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ 'అల్లూరి' అనే మూవీ చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతేడాది తమిళంలో వచ్చిన 'డ్రాగన్'.. ఈమె కెరీర్‌ని మలుపు తిప్పేసింది. దీంతో ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)తమిళంలో ఇదయం మురళి అనే సినిమా చేయగా.. ఇది విడుదలకు సిద్ధమైంది. తెలుగులోనూ విశ్వక్ సేన్ 'ఫంకీ'లో ఈమెనే హీరోయిన్. ఇప్పుడు తమిళంలో విశాల్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు సుందర్.సి-విశాల్ కాంబోలో ఈ ఏడాది 'మదగజరాజా' వచ్చింది. హిట్ అయింది. దీంతో ఇప్పుడు రిపీట్ కాబోతున్న కాంబోలోకి కాయదు వచ్చి చేరినట్లు తెలుస్తోంది.సుందర్.సి చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుంది. అలానే ఒకరికి మించి హీరోయిన్లు ఉంటారు. గ్లామర్ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. త్వరలో విశాల్ హీరోగా తీయబోయే సినిమాలో ఇద్దరు బ్యూటీస్‌కి చోటు ఉంది. అందులో ఒక హీరోయిన్గా కాయదు లోహర్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. నేను ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి) -
యూరప్‌లో ఫ్యామిలీ డ్రామా
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్‌లోని ఈ 46వ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ఇతరపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల యూరప్‌లో మొదలు పెట్టారట. సూర్యతోపాటుగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్ టాక్.ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్. -
శింబు @ అరసన్
హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాకు ‘అరసన్ ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కలైపులి ఎస్. థాను నిర్మించనున్న ఈ మూవీ టైటిల్‌ను మంగళవారం ప్రకటించారు. ‘అరసన్ ’ కథ నార్త్ చెన్నై నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా అని టాక్. ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.శింబు కెరీర్‌లోని ఈ 49వ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత, సాయిపల్లవి, రుక్మిణీ వసంత్‌లను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తార ని కోలీవుడ్ టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
తమిళంలో ఇచ్చేది అంతే.. తెలుగులో ఎందుకింత డిమాండ్..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవలే ఇడ్లీ కడాయి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీని తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాతే కాంతార థియేటర్లలోకి రావడంతో ఇడ్లీ కొట్టును ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.అయినప్పటికీ కోలీవుడ్ హీరో ధనుశ్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా తెలుగులోనూ ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ టాలీవుడ్ డైరెక్టర్, నిర్మాతతో కలిసి ధనుశ్‌తో ఓమూవీ చేసేందుకు సంప్రదించారట. ఆయనను కలిసి కథ కూడా వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథ విన్న ధనుశ్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ప్రస్తుతం టాలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. తమిళంలో ధనుశ్కు ఇచ్చేది కేవలం రూ.35 కోట్లలోపే రెమ్యునరేషన్ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది తెలుగులో రూ.50 కోట్లు డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ధనుశ్‌ను ఎవరు కలిశారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. -
కాంతార చాప్టర్-1.. 90 శాతం అక్కడే పూర్తి చేశాం: రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్-1. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కర్ణాటకలోని ప్రాచీన కళ భూతకోల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తకర విషయం బయటకొచ్చింది. ఈ మూవీ షూటింగ్ రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలోనే తెరకెక్కించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 90 శాతం ఎడిటింగ్ తన ఊర్లోనే పూర్తి చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా.. కర్ణాటకలోని ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, జానపద కథ నిర్మాణం కోసం రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోనే ఎక్కువగా ఈ మూవీని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి మాట్లాడుతూ..'ఈ సినిమా దాదాపు 90 శాతం పోస్ట్, ప్రొడక్షన్ పనులన్నీ మా సొంత గ్రామంలోనే జరిగాయి. మేము కేవలం మిగిలిన పదిశాతం పనికోసమే బెంగళూరు, కొచ్చికి వచ్చాం. ఈ సినిమా కోసం ఏకంగా సంగీత దర్శకుడిని కూడా గ్రామానికి తీసుకువచ్చి అక్కడే మొత్తం రికార్డింగ్ పూర్తి చేశాం. సినిమా ఎడిటింగ్‌లో దాదాపు 90 శాతం మా గ్రామంలోనే జరిగింది. మా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున షూటింగ్ వద్దకు రావడంతో ఒకరకంగా ఫిల్మ్ టౌన్‌గా మారిపోయింది. ప్రతి రోజు కనీసం 100 వాహనాలు షూటింగ్‌కు వచ్చేవి. దాదాపు ప్రతి రోజు వెయ్యిమందిని సెట్లో ఉంచాం. కాంతార కోసమే నేను, నా భార్య, పిల్లలతో కలిసి నా స్వగ్రామానికి వెళ్లా' అని అన్నారు.కాగా.. కాంతార: చాప్టర్ 1 కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
కాంతారలో ఇలా కనిపించిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
కాంతార ఛాప్టర్–1 చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి రుక్మిణి వసంత్ కీలక పాత్రను పోషించారు. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు సంపత్‌రామ్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఈయన తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా రాణిస్తున్నారు. సలార్, కన్నప్ప, డాకు మహరాజ్, విక్రమ్, నారప్ప, తంగలాన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయమే. తమిళ్లో సుమారు 80కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. రిషబ్‌శెట్టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే సంపత్తో పరిచయం కావడం ఆ నాటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఒక సినిమాలో నటించారు.తాజాగా కన్నడంలో రూపొంది తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఆంగ్లం భాషల్లో అనువాదమై విడుదలైన కాంతార ఛాప్టర్–1 చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా నటించారు. దీనిపై ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా తక్కువ సన్నివేశాల్లో నటించినా చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఈ చిత్రంలో వైవిధ్యభరిత గెటప్‌లో కనిపిస్తాననీ, ఆ గెటప్ కోసం గంటన్నర పాటు మేకప్‌కు సమయం పట్టేదని, అదే విధంగా మేకప్ తీయడానికి గంటకు పైగా సమయం పట్టేదని చెప్పారు. అయినప్పటికీ మంచి విజయం సాధించిన చిత్రంలో నటించే అవకాశం రావడం భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన నటుడు, దర్శకుడు రిషబ్శెట్టికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నటుడు సంపత్‌రామ్ పేర్కొన్నారు. -
సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం బల్టీ . ఇప్పటికే తమిళ, మలయాళం భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 10న టాలీవుడ్లో రిలీజ్ అవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది.ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ.. 'తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. క్రిటిక్స్ కూడా చక్కటి రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారు. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు షేన్ నిగమ్ ఇందులో హీరోగా అద్భుతమైన నటన కనబరిచారు. ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ నటన ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు' అని అన్నారు.దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ..'తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్ అండ్ ఔట్ రా రస్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా ఉంటుంది. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్ చిక్కుకోవడం, ఆపై వచ్చే ఘర్షణలు, భావోద్వేగాల సమాహారంగా బల్టీ సినిమా ఉండనుంది' అని అన్నారు. -
రామాయణలో సీత రోల్.. నేను ఆ పని చేయలేదు: కేజీఎఫ్ హీరోయిన్
'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. యశ్ సరసన నటించిన ముద్దుగుమ్మ తన గ్లామర్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంది. కేజీఎఫ్ తర్వాత నాని హీరోగా వచ్చిన హిట్ -3 మూవీలో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్లో 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్‌ను రిజెక్ట్ చేశానన్న వార్తలపై శ్రీనిధి శెట్టి స్పందించింది. ఆడిషన్‌కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్‌కు ఎవరైతే సెట్ అవుతారో నిర్మాతలు డిసైడ్ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్‌కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్‌కు నేను ఆడిషన్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపింది.సీత పాత్రకు ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేయలేదని.. అంతకుమించి ఏం జరగలేదని శ్రీనిధి బ్యూటీ చెప్పింది. నేను ఎంపిక కాకపోయినా.. సౌత్ నుంచి సాయి పల్లవిని తీసుకోవడం నాకు ఆనందంగా అనిపించిందన్నారు. అంతే కానీ ఈ పాత్రను తాను రిజెక్ట్ చేయలేదని కేజీఎఫ్ భామ చెప్పుకొచ్చింది.శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చిత్రం 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్గా చేసింది. -
కేజీఎఫ్‌ను దాటేసిన కాంతార చాప్టర్-1.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ 'కాంతార: చాప్టర్ 1'. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.దేశవ్యాప్తంగా చూస్తే కాంతార చాప్టర్-1 నాలుగు రోజుల్లోనే రూ. 232.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రిలీజైన నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. తొలి రోజు రూ. 89 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తోంది. ఇలాగే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తే కాంతార: చాప్టర్ 1 రూ. 300 కోట్ల మార్క్ త్వరలోనే అధిగమించనుంది.కాగా.. ఇప్పటికే ఈ సినిమా కన్నడలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో యశ్ నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1ను అధిగమించింది. కాంతార, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత స్థానంలో ఈ చిత్రం నిలిచింది. కాంతార రూ. 408 కోట్లు సాధించగా.. కేజీఎఫ్-2 రూ. 1,215 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?
'ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది'.. అందరి విషయంలోనూ అని చెప్పలేం గానీ ఈ సామెత చాలాసార్లు నిజమవుతూ ఉంటుంది. దానికి లేటెస్ట్ ఉదాహరణ 'కాంతార 1'తో మరో పాన్ ఇండియా హిట్ కొట్టిన రిషభ్ శెట్టి. ఎందుకంటే హీరోగా ఇప్పుడు ఇతడు సక్సెస్ అయిండొచ్చు. కానీ ఏ ఫేమ్ లేని టైంలోనే ఇతడిని నమ్మిన ప్రగతి శెట్టి.. తోడునీడలా నిలిచింది. ఇప్పుడు ఫెర్ఫెక్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ వీళ్ల ప్రేమకథ ఏంటి? 'కాంతార 1'లో రిషభ్‌తో పాటు ప్రగతి కూడా నటించిందనే విషయం మీలో ఎందరు కనిపెట్టారు?కన్నడ ఇండస్ట్రీలో 'ఆర్ఆర్ఆర్' (RRR) గురించి తెలియని వాళ్లు ఉండరు. వీళ్లే రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి, రాజ్ బి శెట్టి. వీరిలో రక్షిత్, రాజ్ బి శెట్టి.. లోకల్ వరకు మాత్రమే గుర్తింపు తెచ్చుకోగా రిషభ్ శెట్టి మాత్రం 'కాంతార' చిత్రాలతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వాటర్ కాన్ బిజినెస్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రిషభ్ శెట్టి.. ప్రొడక్షన్ బాయ్, క్యారెక్టర్ ఆర్టిస్టు, డైరెక్టర్.. ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడివరకు వచ్చాడు. అయితే 2016లో 'కిరిక్ పార్టీ' మూవీతో హిట్ కొట్టిన తర్వాత రిషభ్ గురించి కన్నడ ఇండస్ట్రీలో తెలిసింది.(ఇదీ చదవండి: 'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?)అయితే 'కిరిక్ పార్టీ' సినిమా రావడానికి చాన్నాళ్ల ముందు నుంచే రిషభ్, ప్రగతి ప్రేమించుకున్నారు. ఓ మూవీ ఈవెంట్లో తొలుత వీళ్లిద్దరూ కలసుకోగా.. తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్లకు ప్రేమ విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. అయితే ప్రగతి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. రిషభ్ ఇంకా జీవితంలో సక్సెస్ కాలేదని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్నాళ్లపాటు కష్టపడి పెద్దల్ని ఒప్పించిన తర్వాత 2017లో రిషభ్-ప్రగతి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు రణ్విత్, రాధ్య అని కొడుకు, కూతురు ఉన్నారు.అసలు విషయానికొస్తే.. రిషభ్ శెట్టి హీరోగా చేసిన బెల్ బాటమ్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసిన ప్రగతి, 2022లో వచ్చిన 'కాంతార'కి కూడా పనిచేసింది. లేటెస్ట్ సెన్సేషన్ 'కాంతార 1'కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసి ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రారంభంలో రాజు పక్కన ఓ పిల్లాడిని ఎత్తుకునే ఓ మహిళ నిలబడి ఉంటుంది. ఆమె ప్రగతినే. అలా ఫస్టాప్‌లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న రథం సీన్లోనూ ప్రగతి శెట్టి తన కొడుకుతో కనిపిస్తుంది. కాకపోతే ఒకటి రెండు సెకన్ల పాటు కనిపించే ఆ సీన్‌ని చాలామంది నోటీస్ కూడా చేసి ఉండరు. అలా తన భార్య, పిల్లలతో కూడా రిషభ్ శెట్టి యాక్టింగ్ చేయించేశాడు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?
కాంతార చాప్టర్-1 సినిమా చూసిన వారందరూ నటుడు రాకేశ్ పూజారి (34) (Rakesh Poojary) గురించి ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే, ఆయన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరణించారు. దీంతో చిత్ర యూనిట్ కూడా ఆ సమయంలో సంతాపం తెలిపింది.ఈ ఏడాది మే 13న రాకేశ్ పూజారి గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో తన సన్నిహితులు నిర్వహించిన ఓ మెహందీ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అక్కడ డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో చేర్పించేలోపే ఆయన మరణించారు. కన్నడలో ప్రముఖ టెవిలిజన్ షో ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్ 3 విన్నర్‌గా ఆయన నిలిచాడు. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌కు చాలా సినిమా ఛాన్సులు దక్కాయి. కన్నడ, తుళు భాషల్లోని పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే, ‘కాంతార చాప్టర్-1’లో తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాతే ఆయన మరణించారు. ఇప్పుడు ఈ సినిమా చూసిన వారికి రాకేశ్ పూజారి పాత్ర గుర్తిండిపోయేలా ఉండటంతో అతని గురించి ఆరా తీస్తున్నారు. అయితే, రాకేశ్ పూజారి పాత్రకు తెలుగు వాయిస్ డబ్బింగ్ కమెడియన్ బబ్లూ చెప్పారు.కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదలైంది. కేవలం నాలుగురోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు సంపాదించుకుంది. స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి హీరోగా నటించగా.. రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలలో కనిపించారు. View this post on Instagram A post shared by Comedian Babloo (@babloo_cheee) -
అందుకే ఎక్కువ సినిమాలు చేయడం లేదు: హీరోయిన్
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath). ఈమె తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్' (The Game: You Never Play Alone Web Series). సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ రూపొందించారు. దసరా పండుగ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై స్ట్రీమ్ అవుతోంది. వెబ్ సిరీస్‌ఈ సందర్భంగా శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో తాను, సంతోష్ ప్రతాప్ గేమ్ డెవలపర్స్‌గా నటించామని చెప్పారు. గేమ్ డెవలపర్స్ అయిన తమను సామాజిక మాధ్యమాలు ఎలా బాధింపునకు గురిచేశాయి? తమ చుట్టూ ఉన్న వారిని ఎలా సమస్యల వలయంలో చిక్కుకునేటట్లు చేశాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ ది గేమ్ అని చెప్పారు. 7 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ సిరీస్ కోసం యూనిట్ అంతా ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. నాకు అదే ముఖ్యంతాను అధికంగా పద్ధతిగల పాత్రల్లో నటించడానికి కారణం.. తనను ప్రేక్షకులు అలాంటి పాత్రల్లో చూడాలని కోరుకోవడమే అన్నారు. అయితే తనకు లవ్, రొమాన్స్‌తో పాటు సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్ కథాచిత్రాల్లోనూ యాక్ట్ చేయాలని ఆశగా ఉందన్నారు. ఎక్కువ సినిమాలు చేయడం లేదని కొందరు అడుగుతున్నారని.. తనకు ఎక్కువ చిత్రాలు నటించడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచిగా నటించి అభిమానులను అలరించడమే ముఖ్యమని పేర్కొన్నారు.చదవండి: రజినీకాంత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది!
జిల్లా, వేలైక్కారన్, మెర్సల్ తదితర చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన జాయ్ క్రిజిల్డా (Joy Crizildaa) ప్రముఖ చెఫ్, నటుడు మాధంపట్టి రంగరాజ్‌తో పరిచయం పెంచుకుంది. మాధంపట్టి రంగరాజ్‌కు అప్పటికే వివాహితుడు కాగా, జాయ్ క్రిజిల్డాను రెండో పెళ్లి చేసుకున్నాడు. జాయ్ క్రిస్టిల్డా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తాను గర్భవతి అని ప్రకటించింది. కానీ ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.మోసం చేశాడన్న కాస్ట్యూమ్ డిజైనర్మాధంపట్టి రంగరాజ్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ జాయ్ క్రిజిల్డా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన కడుపులో పెరిగే బిడ్డకు రంగరాజ్ బాధ్యత వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత వారం జాయ్‌ను దాదాపు 6 గంటలపాటు విచారించారు. త్వరలోనే మాధంపట్టి రంగరాజ్‌ను కూడా విచారించనున్నారు. ఈ స్థితిలో జాయ్ క్రిజిల్డా శనివారం తన సోషల్ మీడియా పేజీలో ఒక సంచలనాత్మక పోస్ట్ చేసింది.సిగ్గులేని మనిషి“ఒక వ్యక్తి ఎలాంటి అపరాధ భావన లేకుండా తిరుగుతాడు. అతను గర్వంగా తల పైకెత్తి నడుస్తాడు. నువ్వు మంచివాడివిగా నిన్ను నువ్వు నిరూపించుకుంటూనే ఉన్నావు. నీలాంటి సిగ్గులేని మనిషిని ఇంతవరకు చూడలేదు. నువ్వు పరిగెత్తినా, దాక్కున్నా, పుట్టబోయే బిడ్డ శాపం నీడలా నిన్ను అనుసరిస్తుంది. అది నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లదు’ అని రాసుకొచ్చింది. మరో పోస్ట్‌లో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్, నువ్వేం తండ్రివి అని తిట్టిపోసింది. View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) చదవండి: రజినీకాంత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
రజినీకాంత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా!
ప్రదీప్ రంగనాథన్, నటి మమిత బైజు జంటగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (Dude Movie). సుధా కొంగర వద్ద ఏడెనిమిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పని చేసిన కీర్తిశ్వరన్ ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగారి అనే పాటను రిలీజ్ చేశారు.అలా కథ చెప్పాఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలకు ఈ కథను చెప్పే అవకాశం కలిగిందన్నారు. వాళ్లకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. రజనీకాంత్ 30 ఏళ్ల వయసును దృష్టిలో పెట్టుకొని డ్యూడ్ కథ రాసినట్లు తెలిపారు. ఈ పాత్రలో నటుడు ప్రదీప్ రంగనాథన్ ఒదిగిపోయారన్నారు. ఇది లవ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మాస్ యాంగిల్స్ కూడా ఉంటాయన్నారు. ఒక దర్శకుడిగా తన తొలి చిత్రం దీపావళికి విడుదల కావడం అనేది.. తన కల నిజం అవుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రేమలుకు ముందే..ప్రేమలు చిత్రం విడుదలకు ముందే నటి మమిత బైజు నటించిన సూపర్ శరణ్య చిత్రాన్ని చూసి ఆమెను తమ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె ఈ చిత్రంలోకి రాగానే రజనీకాంత్, శ్రీదేవి జంటగా నటించినట్లు అనిపిస్తోందన్నారు. నటుడు శరత్ కుమార్, రోహిణి, పరిదాపంగాల్ ఫేమ్ డేవిడ్ తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు.చదవండి: విలన్ రోల్స్ చేస్తున్న హీరోయిన్స్ -
హై హై ప్రతి నాయికా
డ్యూయెట్స్ పాడుతూ, కాసిన్ని జోక్స్ వేస్తూ, ఎమోషనల్ సీన్స్‌లో కన్నీళ్లు పెట్టుకుంటూ... కథానాయికల పాత్రలు దాదాపు ఇలానే ఉంటాయి. అందుకే విభిన్న తరహా పాత్రలు దక్కితే ‘సై’ అనేస్తారు. అదే నెగటివ్ క్యారెక్టర్ అయితే... నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ సమంత, తమన్నా వంటివారు విలన్ రోల్స్ చేసి, సక్సెస్ అయ్యారు.శ్రద్ధా శ్రీనాథ్, అనన్యా నాగళ్ల, సంయుక్త, రచితా రామ్, రుక్మిణీ వసంత్... ఇలా యువ తారలు సైతం విలన్ రోల్స్ చేసేందుకు ఆలోచించడం లేదు. ప్రతి నాయిక పాత్రల్లో నటనపరంగా విజృంభించి, ‘హై హై ప్రతినాయికా’ అని ప్రేక్షకులు అనేలా తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లేడీ విలన్‌గా చేస్తున్న కొందరు హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.స్లమ్ డాగ్లో... వెంకటేశ్ ‘కూలీ నెం.1’, నాగార్జున ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా, అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..’ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ‘స్లమ్ డాగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు టబు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు విలన్‌గా కనిపిస్తారని సమాచారం. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే... గతంలో ‘మక్బూల్’, ‘అంధా ధూన్’ వంటి హిందీ చిత్రాల్లో టబు నెగటివ్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే.ధన పిశాచి... టాలీవుడ్‌కి విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘జటాధర’లో సోనాక్షీ సిన్హా విలన్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఆమె ధన పిశాచిగా కనిపించనున్నారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శిల్పా శిరోద్కర్ పాత్రలోనూ నెగటివ్ షేడ్స్ ఉంటాయట. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్‌లు ‘జటాధర’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో గల అనంత పద్మనాభస్వామి దేవాలయం నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. దెయ్యంగా పూజ? దర్శక–నిర్మాత–నటుడు–కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ ‘కాంచన’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘కాంచన 4’. ఈ చిత్రంలో రాఘవా లారెన్స్‌తో పాటు పూజా హెగ్డే, నోరా ఫతేహీ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో దెయ్యం పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తారట. పూజ లేదా నోరా ఫతేహీ... ఇలా ఎవరో ఒకరి పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. దాదాపు సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘కాంచన 4’ సినిమా వచ్చే వేసవిలో విడుదల కావొచ్చు. వారియర్ విలన్...కాలేజీ అమ్మాయి, ప్రేయసి, భార్య... ఇలా హీరోయిన్గా విభిన్న రకాల పాత్రల్లో నటించి, మెప్పించారు రష్మికా మందన్నా. ఇప్పుడు తనలోని నెగటివ్ యాంగిల్‌ని తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారట రష్మిక. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ ఖరారయ్యారు.ఇంకా రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, ఆలియా. ఎఫ్... వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న వారియర్ విలన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే రష్మిక విలన్‌గా కనిపించనున్న తొలి చిత్రం ఇదే కావొచ్చు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఇంకా మరికొందరు కథానాయికలు ‘ప్రతి నాయిక’లుగా కనిపించనున్నారు. -
ఉప్పెన బ్యూటీ స్టన్నింగ్ లుక్.. బ్లాక్ డ్రెస్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ!
సెప్టెంబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న శ్రద్ధా శ్రీనాథ్..డిఫరెంట్ శారీ లుక్‌లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి..టాలీవుడ్ నటి అనసూయ స్టన్నింగ్ లుక్..బ్లాక్ డ్రెస్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్..బ్లాక్ బ్యూటీలా ఓజీ భామ శ్రియా రెడ్డి.. View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
కాంతార ఛాప్టర్-1.. పంజర్లి లుక్‌లో సందడి చేసిన అభిమాని!
2022లో వచ్చిన కాంతార మూవీ పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార ఛాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. కాంతారా మూవీతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.తాజాగా కాంతారా మూవీ థియేటర్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళనాడులో దిండిగల్‌లో ఈ సంఘటన జరిగింది. రిషబ్ శెట్టి అభిమాని కాంతార చిత్రంలో పంజర్లి దేవత అవతారంలో సందడి చేశారు. పంజర్లి లుక్‌లో థియేటర్లో డ్యాన్స్ చేస్తూ ఆడియన్స్‌ను అలరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. After the screening of Kantara Chapter 1 at a cinema in Dindigul, a fan dressed as a Daiva stunned the audience there.Goosebumps Thank you Divine star @shetty_rishab @hombalefilms for making such a Divine movie #KantaraChapter1 pic.twitter.com/sPd3bNmNHN— ಸನಾತನ (@sanatan_kannada) October 5, 2025 -
గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార ఛాప్టర్-1. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.89 కోట్ల గ్రాస్ సాధించిన కాంతార ఛాప్టర్-1.. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 162.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో రూ.235 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ సు ఫ్రమ్ సో (రూ. 92 కోట్ల నికర) జీవితకాల కలెక్షన్స్‌ను అధిగమించింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్(రూ. 110 కోట్లు), రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (రూ. 131 కోట్లు) లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది. అదే సమయంలో రూ. 150 కోట్ల మార్కును దాటేసిన నాల్గవ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1 విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన జైలర్ (Jailer Movie) బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. 2023లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్‌గా జైలర్ 2 తెరకెక్కుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 12న విడుదల కానుంది. ఇకపోతే ఈ మధ్యే రజనీ నటించిన కూలీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే! రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ సినిమా విషయంలో మాత్రం అభిమానుల్లో కాస్త అసంతృప్తి అలాగే ఉంది.హిమాలయాల్లో ప్రత్యక్షందీంతో జైలర్ 2 విషయంలో చిత్రయూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మధ్యే కేరళ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా జైలర్ 2కి షూటింగ్‌కు బ్రేక్ ఇస్తూ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. బిజీ షూటింగ్స్‌కు బైబై చెప్తూ వారంరోజుల సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిషికేశ్ ఆశ్రమంలో రజనీ సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. బద్రీనాథ్, బాబా గుహ వంటి పవిత్ర స్థలాలను సైతం సందర్శించినట్లు తెలుస్తోంది.జైలర్ 2రజనీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువన్న విషయం తెలిసిందే! ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లొస్తుంటారు. జైలర్ రిలీజ్‌కు ముందు కూడా అక్కడికి వెళ్లొచ్చారు. జైలర్ 2 విషయానికి వస్తే.. ఇందులో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఫస్ట్ పార్ట్‌కు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికీ పని చేస్తున్నారు. ఎస్జే సూర్య కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.చదవండి: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి -
అమ్మ మరణం తర్వాత సినిమాలు వద్దనుకున్నా: బిగ్‌బాస్ బ్యూటీ
కమలహాసన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయింది అక్షర రెడ్డి (Akshara Reddy). తాజాగా రైట్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ సందర్భంగా తను ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2021లో తమిళ బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్నాను. అప్పుడు 87 రోజులు బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నాను. అది నాకు ఎన్నో రకాల అనుభవాలనిచ్చింది. ఆ హీరోయిన్స్ అంటే ఇష్టంకమల్తో కలిసి నటించాలన్నది నా కల. బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లో ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పారు. నీ జీవిత స్క్రిప్టును నువ్వే రాసుకుంటున్నావు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నదీ నువ్వే నిర్ణయించుకోవాలి. అని ఆయన చెప్పిన విషయం నా మనసులో నాటుకు పోయింది. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్, శ్రీదేవిలకు వీరాభిమానిని. అలాగే శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. సినిమాలు వద్దనుకున్నా..ప్రస్తుతం తమిళ్లో నేను రైట్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాను. మా అమ్మ మరణం తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రైట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. నేను ఇంతకుముందే బిల్ గేట్స్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా చేశాను. కాలేజీ అయిపోగానే జార్జియాకు వెళ్లి సైకాలజీ చదివాను. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను అని అక్షర రెడ్డి చెప్పుకొచ్చింది.చదవండి: 80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట! -
80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట!
స్టార్ హీరోలందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ చేసుకున్నారు. 80's రీయూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలందరూ ఒకేచోటకు చేరి సంతోషంగా గడుపుతారన్న విషయం తెలిసిందే! ఈ ఏడాది అక్టోబర్ 4న చెన్నైలో ఘనంగా గెట్ టు గెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి కోలీవుడ్ స్టార్ జంట రాజ్‌కుమార్ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు.31 మంది స్టార్స్టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi Konidela), వెంకటేశ్, నరేశ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్, అలాగే బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు. జాకీ ష్రాఫ్, మీనా, శరత్‌కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు 31 మంది నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేశారు. అందరూ చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సులోనే మెరిశారు. మొదటిసారి కలిసినట్లే ఉంది: చిరు80s స్టార్స్ రీయూనియన్‌కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 80's స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.అప్పుడు మొదలైంది80's స్టార్స్ రీయూనియన్ 2009లో ప్రారంభమైంది. లిస్సీ, సుహాసిని తొలిసారి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్ పార్టీ నిర్వహించారు. 2022లో చివరిసారి గెట్ టు గెదర్ జరిగింది. అప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేశారు. 2023లో రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నైలో వరదల కారణంగా పార్టీ వాయిదా వేశారు. ఇన్నాళ్లకు మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పార్టీలో సరదా ఆటలు, పాటలు, డ్యాన్సులు ఉండనే ఉంటాయి. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: ట్రెండింగ్‌లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ -
ట్రెండింగ్‌లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ
తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు తీయడం, భారీ వసూళ్లు రాబట్టడంలో మలయాళ ఇండస్ట్రీ దిట్ట! ఈ ఏడాది మాలీవుడ్‌లో అనేక సినిమాలు హిట్‌గా నిలిచాయి. అందులో ఒకటి సుమతి వలవు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..రియల్ స్టోరీసుమతి వలవు (Sumathi Valavu Movie Review) అంటే తెలుగులో సుమతి మలుపు. ఇది సినిమాలోనే కాదు నిజంగా ఉంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని మైలమ్మూడుకు సమీపంలో ఈ మలుపు ఉంది. 1950ల ప్రాంతంలో సుమతి అనే అమ్మాయిని అక్కడ చంపేశారని, తను దెయ్యమై అక్కడే తిరుగుతోందన్న కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తీశారు.కథఅడవిని ఆనుకుని కల్లేలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే అడవి గుండా వెళ్లాలి. అక్కడే సుమతి వలవు అనే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే సుమతి అనే దెయ్యం తిరుగుతూ ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ అక్కడకు వెళ్లరు. కానీ ఓ రోజు రాత్రి ఆ ఊర్లోని శేఖరన్ పెద్ద కూతురు ప్రేమించినవాడితో పారిపోతుంది. హీరో అప్పూ (అర్జున్ అశోకన్)యే ఏదో చేసుంటాడని శేఖరన్ కుటుంబం అతడిపై పగపెంచుకుంటుంది. ఈ క్రమంలో శేఖరన్ రెండో కూతురు భామ (మాళవిక మనోజ్)తో ప్రేమలో పడతాడు అప్పు. మరి వీరి ప్రేమకథను ఒప్పుకుంటారా? శేఖరన్ పెద్ద కూతురు పారిపోయిందా? లేదా దెయ్యం చంపేసిందా? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!విశ్లేషణహీరో అప్పుకు చీకటంటే పిరికి. ఓరోజు రాత్రి ఊర్లోని నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటారు. అందరూ భయపడుతుంటే హీరో గ్యాంగ్ మాత్రం బండి సిద్ధం చేసుకుని తీసుకెళ్తారు. మలుపు దాకా వెళ్లాక బండి దానంతటదే ఆగిపోతుంది. ఈ ఇంటర్వెల్లో జరిగే సీన్లు బాగుంటాయి. కానీ సెకండాఫ్‌లో కాస్త పస తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాను చాలా సహజంగా తెరకెక్కించారు. మూవీలో ఓ పక్క ప్రేమకథ.. మరోపక్క హారర్ రెండూ ఉంటాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా నవ్విస్తూ, అలరిస్తూ కథ అలా ముందుకు సాగుతుంది. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. అన్నట్లు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. The Curve That Everyone’s Talking About — 100 M+ Streaming Minutes Strong 🚀 #ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada #GopikaAnil@GokulamMovies @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/0CjoYEX6EL— ZEE5 Malayalam (@zee5malayalam) October 3, 2025 -
'నేషనల్ క్రష్' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్
కాంతార చాప్టర్-1 విడుదల తర్వాత రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) పేరు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఆమె అందంగా ఉండటమే కాకుండా తన నటన, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా శాండల్‌వుడ్‌లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసింది. కాంతార సినిమా చూసిన వాళ్లు అందరూ ఆమెనే నేషనల్ క్రష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వతా రష్మిక మందన్నకు దక్కిన గుర్తింపే రుక్మిణీకి దక్కుతుంది. ఆపై వీరిద్దరూ కూడా కన్నడ నుంచే రావడం విశేషం. తనను నేషనల్ క్రష్ అని పిలువడంపై రుక్మిణీ వసంత్ రియాక్ట్ అయింది.ఇటీవల శివకార్తికేయన్ సరసన ‘మదరాసీ’లో మెప్పించిన రుక్మిణీ.. ‘కాంతార చాప్టర్-1’తో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం తన చేతిలో యశ్ టాక్సిక్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.. ఇందులో ఆమె పాత్ర కూడా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.నేషనల్ క్రష్ గురించినేషనల్ క్రష్ ట్యాగ్‌లైన్ గురించి రుక్మిణీ ఇలా చెప్పింది. 'కొద్దిరోజుల నుంచి చాలా మంది నేషనల్ క్రష్ అంటూన్నారు. ఈ విషయం నా వరకు కూడా వచ్చింది. ఇలాంటివి వినడానికి మాత్రమే చాలా బాగుంటాయి. సంతోషాన్ని కూడా ఇస్తాయి. కానీ, ఇలాంటి ప్రశంసల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఇలాంటివి ఏమైనా సరే తాత్కాలికంగానే ఉంటాయి. కాలంతో పాటు ఎందరో వస్తుంటారు.. అవి కూడా మారిపోతుంటాయని నేను నమ్ముతాను. కానీ, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటే చాలనుకుంటాను. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో చాలామంది నన్ను ప్రియ పాత్రతో పిలుస్తుంటారు. ఇలా ప్రేక్షకులకు చేరువయ్యితే చాలనుకుంటాను. చాలా సింప్లిసిటీతో కూడిన ఆ పాత్రను కూడా సినీప్రియులు ఆదరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.'అని ఆమె అన్నారు. -
సినీ హీరోలను తలపై పెట్టుకొని ఊరేగకండి: సత్యరాజ్
తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేరుచేసి చూడలేం. ఈ రెండింటి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది. ప్రఖ్యాత దివంగత రాజకీయ నాయకులు కామరాజర్, అన్నాదురై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వరకు సినిమాలతో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్లే. ఇప్పుడు కూడా చాలా మంది నటీనటుల దృష్టి రాజకీయాలపైనే ఉందని చెప్పవచ్చు. తాజాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం ప్రకంపనలు పుట్టిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన ప్రచారంలో జరిగిన దురదృష్టకర సంఘటన అనేక చర్చలకు దారి తీస్తోంది. సినీ రంగంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తోంది. ఉదాహరణకు సత్యరాజ్(Satyaraj ), విజయ్ను విమర్శించే విధంగా తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో నటులను తలపై పెట్టుకొని ఊరేగకండి.., వాళ్లకు చాలా తెలుసని మీరు భావించకండి, నటించడం మాత్రమే తెలుసు. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు నటులను ఐన్ స్టిన్ రేంజ్లో భావిస్తుండడమే. మమ్మల్ని నెత్తినెక్కించుకోకండి. మేము జస్ట్ పాటిస్తాం అంతే. మేము పెరియార్, అంబేడ్కర్ కాదని గుర్తుంచుకోవాలంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్‌పై దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటులకు ఏమీ తెలియదు. ఒట్టి మట్టే అంటే ఎలా.. మీరూ నటుడే కదా.. మీరెందుకు సందేశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎంజీఆర్ ఉన్నప్పుడు మీకు ఇలా అనే ధైర్యం ఉండేదా ? కమలహాసన్‌కు ఎంపీ పదవి ఇచ్చారని, మీరు డీఎంకేను అడగాల్సింది. పార్టీ కోసం శ్రమించిన వాళ్లు ఎందరో ఉండగా వారి కూతుళ్లకు పదవి ఇవ్వకుండా సత్యరాజ్ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని మీరు డీఎంకే పార్టీని అడగాలి. నటన అనేది ఒక వృత్తే. అందులోనూ ప్రపంచ జ్ఞానం కలవారు ఎందరో ఉన్నారు. వారిని అరకొర తెలిసిన వాళ్లు అని కించపరచరాదు అని దర్శకుడు పేరరసు సత్యరాజ్‌పై ఫైర్ అయ్యారు. -
అక్టోబర్‌లో రిలీజయ్యే సినిమాలివే..
చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘కె.ర్యాంప్’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్’గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళదాం.బాహుబలి: ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్ జాతర’ కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మనసు హత్తుకునే తెలుసు కదా! ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, వినోదాల ర్యాంప్ ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్‌తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవ్వులు పంచే మిత్ర మండలి ‘బలగం, కోర్ట్’ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్.తండ్రీ కొడుకుల అనుబంధం ‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్ రావణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్. తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. దీపావళికి డ్యూడ్ ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. న్యూ ఏజ్ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్‌ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సమాజానికి సందేశం సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్పోలీస్ కానిస్టేబుల్ పాత్రపోషించారు.సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని హైదరాబాద్ మాజీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
పైరసీ వెబ్సైట్లు ఎక్కువ చూసేది వాళ్లే!
ఇటీవల హైదరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టు రట్టు చేశారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పైరసీపై చర్చ మొదలైంది. భారత వినోద పరిశ్రమకు పైరసీ ‘బొమ్మ’ చూపిస్తోంది. విడుదలైన రోజే పైరసీ వెబ్సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. అంతేకాదు పైరసీ భూతం చట్టానికే సవాల్ విసురుతోంది. పైరసీ సమస్య (Piracy Problem) ఒక్క సినిమా పరిశ్రమకే కాదు.. టీవీ, మ్యూజిక్, సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలకూ విస్తరించింది.ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది పైరసీ వెబ్సైట్ల విజిట్స్ 21,630 కోట్లు నమోదయ్యాయి. 2024లో మొత్తం పైరసీ ట్రాఫిక్‌లో మనదేశ వాటా 8.12%. అంటే మన దేశం నుంచి 1,756 కోట్ల విజిట్స్ నమోదయ్యాయన్నమాట. పబ్లిక్, ప్రైవేట్ టొరెంట్స్, వెబ్ ఆధారంగా ఫిల్మ్, టీవీ, మ్యూజిక్ స్ట్రీమింగ్; సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలలో ప్రపంచ పైరసీ ట్రెండ్స్‌ను పర్యవేక్షిస్తున్న డేటా కంపెనీ ‘మ్యూసో’.. ‘పైరసీ ట్రెండ్స్ అండ్ ఇన్ సైట్ రిపోర్ట్ 2024’ అనే నివేదిక రూపొందించింది. దీని ప్రకారం పైరసీ వెబ్సైట్ల వీక్షకుల సంఖ్యలో 12% వాటాతో అమెరికా (America) తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానం మనదేమొదటి స్థానం మనదే మ్యూసో 2023 నివేదిక ప్రకారం ప్రపంచ చలనచిత్ర పైరసీలో మనదే పైచేయి. మొత్తం పైరసీలో 30.58% వాటా మన దేశానిదే. యూఎస్ 6.26%, టర్కీ 5.75% వాటాతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పైరసీ కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకుని చూసేవారితో (49.6 శాతం) పోలిస్తే.. అప్పటికప్పుడే చూసే (స్ట్రీమింగ్) వాళ్లు కాస్త ఎక్కువ ఉండటం (50.4 శాతం) గమనార్హం. వినోదం ఇప్పటికీ ఖరీదుగా ఉండడం, అందుబాటు విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకోలేకపోవడం వల్లే పైరసీ కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 2023తో పోలిస్తే గత ఏడాది ఈ–బుక్స్, ఆడియో బుక్స్, పేపర్స్, మ్యాగజైన్స్ వంటి పబ్లిషింగ్ రంగంలో పైరసీ 4.3% పెరిగింది.జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లుఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ‘ద రాబ్ రిపోర్ట్ 2024’ ప్రకారం.. 2023లో భారత వినోద పరిశ్రమ పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లకు రూ.8,700 కోట్లు, థియేటర్లకు రూ.13,700 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా ప్రభుత్వానికి జరిగిన జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లు.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఓపక్క రష్మిక ఎంగేజ్మెంట్.. మాజీ ప్రియుడి పోస్ట్ వైరల్
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రేమలో పడి చాలాకాలమే అయింది. విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉన్న ఈ బ్యూటీ ఈ విషయాన్ని చాలాసార్లు పరోక్షంగా బయటపెట్టింది. దసరా సందర్భంగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని అప్పుడే సగం పెళ్లి అయిపోయిందనిపించారు. కానీ, ఇది రష్మికకు రెండో ఎంగేజ్మెంట్ కావడం గమనార్హం!ఫస్ట్ సినిమాకే లవ్రష్మిక కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' (2016)తో సినీ ఇండస్ట్రీలో తొలి అడుగు వేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటించాడు. ఫస్ట్ సినిమాకే హీరోతో ప్రేమలో పడింది రష్మిక. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. 2017 జూలై 3న వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఊహించని షాకిచ్చారు. పెళ్లిపీటలు ఎక్కకముందే తమ బంధం ముక్కలైందని ప్రకటించారు. ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అలా అని వీరి మధ్య ఎటువంటి శత్రుత్వమూ లేదు. ఇప్పటికీ ఫోన్లో మెసేజ్ చేసుకుంటామని, సినిమాలు విడుదలైనప్పుడు ఒకరికొకరం విషెస్ తెలియజేసుకుంటామని రక్షిత్ శెట్టి 2023లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.రష్మిక- రక్షిత్ ఎంగేజ్మెంట్ ఫోటోవిజయ్తో లవ్..రక్షిత్‌తో విడిపోయాక రష్మిక సినిమాలతో బిజీ అయింది. 2018లో గీత గోవిందం సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో జత కట్టింది. ఈ మూవీ సమయంలోనే విజయ్- రష్మిక ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమేనని హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. కానీ తర్వాత ఆ రూమర్సే నిజమయ్యాయి. రష్మిక కలలు చాలా పెద్దవి అని రక్షిత్ చెప్పినట్లుగా... ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా హిందీలోనూ సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ ట్యాగ్ అందుకుంది. పుష్పతో పాన్ ఇండియా సెన్సేషన్ అయింది.ఉత్తమ నటుడిగా అవార్డుఅటు రక్షిత్ కూడా.. 777 చార్లీ (777 Charlie Movie), సప్తసాగరాలు దాటి సైడ్ A, సప్తసాగరాలు దాటి సైడ్ B సినిమాలతో ఘన విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఘనత అందుకున్నాడు. 2021లో సెన్సార్ అయిన సినిమాలకుగానూ కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. అందులో 777 చార్లి సినిమాకు నాలుగు పురస్కారాలు వరించాయి. ఉత్తమ రెండో చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి, ఉత్తమ ఎడిటర్‌గా ప్రతీక్ శెట్టి, ఉత్తమ గేయరచయితగా నాగార్జున శర్మకు అవార్డులు ప్రకటించారు. హీరో ట్వీట్దీంతో రక్షిత్ సంతోషంలో తేలియాడుతున్నాడు. '777 చార్లీ సినిమాకు 4 అవార్డులు.. మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. జ్యూరీకి, ప్రేక్షకులకు, చిత్రయూనిట్‌కు ధన్యవాదాలు. దర్శకుడు కిరణ్ రాజ్ విజన్.. ప్రతీక్ అద్భుతమైన ఎడిటింగ్, నాగార్జున చేతినుంచి జారిపడ్డ అందమైన మాటలు అందరి హృదయాలను తాకాయి' అంటూ ఈ ముగ్గురికి స్పెషల్ థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. Feeling grateful and humbled! 777 Charlie wins 4 State Awards.. 2nd Best Film, Best Actor, Best Editing & Best Lyricist. Heartfelt thanks to the jury, our amazing audience, and this incredible team.. @Kiranraj61 for his vision, Pratheek for the flawless editing, and…— Rakshit Shetty (@rakshitshetty) October 4, 2025 చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా -
కూలీ ఫేమ్ రచిత రామ్ 'కల్ట్' పోస్టర్ విడుదల
కన్నడ హీరోయిన్ రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్గా కూలీ సినిమాలో లేడీ విలన్‌గా నటించిన ఈ బ్యూటీ తాజాగా ‘కల్ట్’ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు. ఈ మూవీకి ‘బ్లడీ లవ్’ అనే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించనున్నారు. ఇందులో రచిత రామ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆమెకు జోడీగా జైద్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమా కథలో రచిత రామ్ ఒక లవ్ ఫెయిల్యూర్ యువతిగా కనిపించనున్నారు. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మలుపులు తిరుగుతుంది అనే అంశం చుట్టూ కథ సాగుతుంది.రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కల్ట్ పోస్టర్లో ఆమె లేడీ డాన్ లుక్‌లో కనిపించారు. బాత్రూమ్లో టాయిలెట్ సీటింగ్‌పై కూర్చొని, సిగరెట్ తాగుతూ.. ఆమె మాస్ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పక్కన గిటార్ కాలిపోతుండగా, వెనకాల ఒక వ్యక్తి బాధతో చూస్తున్న ఫొటో కూడా ఉంది. ‘‘నీ జ్ఞాపకాలను ఫ్లష్ చేసి తుడిచి పెట్టలేను’’ అనే డైలాగ్‌తో పోస్టర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ద్వారా రచిత రామ్ మరోసారి తన నటనలో విభిన్నతను చూపించబోతున్నారు. ఇలాంటి పాత్రలతో రచిత రామ్ తన కెరీర్లో కొత్త మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న తెలుగులో కూడా విడుదల కానుంది. View this post on Instagram A post shared by R R (@rachita_instaofficial) -
అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార
హీరోయిన్ నయనతార (Nayanthara) దేవతగా నటించిన చిత్రం మూకుత్తి అమ్మన్(ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లి పేరిట విడుదలైంది). వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రం 2020లో విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మూకుత్తి అమ్మన్–2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రంలో నయనతార అమ్మవారిగా నటిస్తున్నారు. ఐసరి గణేష్ తన వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. పార్ట్–1 కంటే మరింత భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్–2 షూటింగ్ గత మార్చి నెలలో ప్రారంభమైంది. నయనతార, కమర్షియల్ దర్శకుడు సుందర్.సి కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. విజయదశమి పండుగ సందర్భంగా గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అమ్మవారి గెటప్‌లో ఉన్న నయనతార పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్‌ను తెలుగులో మహాశక్తి పేరిట విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Vels Film International (@velsfilmintl) చదవండి: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 'బేబీ' సింగర్ -
లగ్జరీ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్.. ఎన్ని లక్షలంటే?
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇప్పటికే రికార్డుకెక్కింది. ఇప్పటివరకు రూ.294 కోట్లు అందుకున్న ఈ మూవీ త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరనుంది. అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా నిమిష్ రవి (Nimish Ravi) సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు.చేతి గడియారంతాజాగా నిమిష రవికి కల్యాణి ప్రియదర్శన్ ఖరీదైన బహుమతినిచ్చింది. రూ.9.8 లక్షల విలువైన చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చింది. ఈ వాచ్‌ను ధరించిన రవి.. ఈమేరకు ఓ ఫోటో షేర్ చేశాడు. ప్రియమైన కల్యాణి, ఈ కానుక ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్.. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుందనడానికి లోక సినిమాయే నిదర్శనం. వాచ్ చూసుకున్నప్పుడల్లా ఈ లైన్ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నిజమైన హార్డ్ వర్క్‌కు ఇదొక బహుమానం అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Nimish Ravi (@nimishravi) చదవండి: బాపు.. ఈ బతుకొద్దే, నా భార్య నరకం చూపిస్తోంది: నటుడి సెల్ఫీ వీడియో -
కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత
దసరా పండగ సందర్భంగా తన జీవితంలోని ఓ స్పెషల్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త ప్రయాణం అంటూ తన ఇంటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అలాగే పూజగది ఫోటోను కూడా షేర్ చేసింది. ఇంటి బయట గోడపై తన నిక్‌నేమ్ SAM అనే లోగో అందంగా అమర్చి ఉంది. అయితే ఈ ఇల్లు హైదరాబాద్‌లో ఉందా? ముంబైలోనిదా? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా కొత్తిల్లు కొన్న సామ్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాసమంత సినిమాల విషయానికి వస్తే.. ఏమాయ చేసావె మూవీతో తెలుగులో తన జర్నీ మొదలుపెట్టింది. బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మజిలి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల్లుడు శీను, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 1లో ఉ అంటావా మావా.. అనే ఐటం సాంగ్‌లో తళుక్కుమని మెరిసింది. ఇటీవల శుభం సినిమాలో అతిథి పాత్రలో నటించడంతో పాటు ఈ మూవీని తనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.చదవండి: ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్‌తోనే! -
థియేటర్లలో కాంతార ఛాప్టర్-1.. ఓటీటీల్లో ఏయే సినిమాలంటే?
అసలే దసరా సెలవులు.. చూస్తుండగానే అయిపోతున్నాయి. మరో వీకెండ్ కూడా వచ్చేస్తోంది. ఈ పండుగకు అలరించేందుకు కాంతార చాప్టర్-1, ఇడ్లీ కొట్టు సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇవీ తప్ప పెద్దగా సినిమాలేవీ దసరాకు రిలీజ్ కాలేదు. కాంతార మూవీపై భారీ అంచనాలు ఉండడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు.ఇక ఓటీటీల విషయానికొస్తే అదే పరిస్థితి నెలకొంది. ఈ శుక్రవారం పెద్దగా మూవీస్ ఏవీ స్ట్రీమింగ్ కావట్లేదు. మైనే ప్యార్ రియా అనే మలయాళ సినిమా, హాలీవుడ్ చిత్రాలు, మరికొన్ని వెబ్ సిరీస్‌లు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో పెద్దగా బజ్ చిత్రాలేవీ కనిపించడం లేదు. అయితే దసరా సెలవులు కావడంతో కాస్తా డిఫరెంట్ సిరీస్, సినిమాలు ట్రై చేసే వాళ్లు ఓ లుక్కేయ్యొచ్చు. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి.నెట్‌ఫ్లిక్స్..స్టీవ్(హాలీవుడ్ మూవీ)- అక్టోబరు 03మాన్స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03జెనీ మేక్ ఏ విష్(కొరియన్ సిరీస్)- అక్టోబరు 03ఓల్డ్ డాగ్.. న్యూ ట్రిక్స్(స్పానిష్ కామెడీ సిరీస్)- అక్టోబరు 03ది న్యూ ఫోర్స్(స్వీడీష్ మూవీ)- అక్టోబరు 03జీ5డాకున్ కా ముండా-3(పంజాబీ మూవీ)- అక్టోబర్ 03జియో హాట్స్టార్బిగ్బాస్ తమిళ్(రియాలిటీ షో)- అక్టోబర్ 05లయన్స్ గేట్ ప్లేమైనే ప్యార్ కియా(మలయాళ సినిమా)- అక్టోబరు 03 ఆపిల్ ప్లస్ టీవీ లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03హులువేర్ వాల్వ్స్- అక్టోబర్ 03 -
రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1.. ఏ ఓటీటీకి రానుందంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార చాఫ్టర్-1(Kantara Chapter1). ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజైన తర్వాత ఏ ఓటీటీకి రానుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.తాజాగా కాంతార ఛాప్టర్-1 ఓటీటీకి సంబంధించిన సినీ ప్రియులు సైతం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కుదుర్చుకున్న డీల్ ప్రకారం.. ఈ సినిమా ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ చూసి ఓటీటీ డేట్ రివీల్ చేయనున్నారు. అప్పటి వరకు కాంతార ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు. -
నాకు డిజార్డర్ ఉంది.. నాలుగు గంటలు కూడా కష్టమే: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. సినిమాలతో పాటు రేసింగ్‌లో దూసుకెళ్తోన్న స్టార్ హీరో.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఓ డిజార్డర్ ఉందని తెలిపారు. తనకు అస్సలు నిద్ర పట్టదని అజిత్ కుమార్ తెలిపారు. స్లీపింగ్ డిజార్డర్ వల్ల రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని వెల్లడించారు. ఇది అధిగమించేందుకు ప్రయాణం చేసేటప్పుడు నిద్రించేందుకు ట్రై చేస్తానని అజిత్ అన్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో అద్భుతాలు చేయడానికి సోషల్ మీడియా గొప్ప సాధనంగా మారిందన్నారు. సామాజిక మాధ్యమాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. రేసింగ్‌లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమని విషయమన్నారు. అయితే కార్లను ప్రత్యేకంగా.. డ్రైవర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారని వెల్లడించారు. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు ముప్పు చాలా చాలా తక్కువని చెప్పారు. -
ఫేస్బుక్లో చాటింగ్.. పేరెంట్స్ వద్దన్నా పెళ్లి.. ‘కాంతార’ హీరో లవ్‌స్టోరీ
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty) మన తెలుగువారికి కాంతార సినిమా ద్వారా దగ్గరవడం మాత్రమే కాదు మన జూనియర్ ఎన్టీయార్‌కు సోదర సమానుడుగా మారడం ద్వారా కూడా మరింతగా మనకు చేరవయ్యాడు. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్లో భాగంగా మన దగ్గర కూడా మన జూనియర్ ఎన్టీయార్ సాక్షిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆ ఈవెంట్లో ఎన్టీయార్, రిషబ్ ల తర్వాత హైలెట్‌గా నిలిచింది రిషబ్ జీవిత భాగస్వామి ప్రగతి శెట్టి. హీరోయిన్ స్థాయి అందంతో మెరిసిపోయిన ఆమె అంతే అణకువతో కూడిన ప్రసంగం ద్వారా కూడా ఆకట్టుకుంది.ప్రస్తుతం కాంతారా కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ప్రగతి శెట్టి(Pragathi Shetty) రిషబ్ శెట్టి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక సినిమా కార్యక్రమంలో క్యాజువల్‌గా కలిసిన వీరిద్దరూ ఆ తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్‌గా మారారు. రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు. వీరి స్నేహాన్ని ప్రేమగా మార్చింది ఫేస్బుక్ అనే చెప్పాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సినిమాలను ఇష్టపడే సగటు ప్రేక్షకురాలిగా రిషబ్‌కు చేరువైన ప్రగతి ఆ తర్వాత అతనితో ప్రేమలో పడింది. అయితే వీరిద్దరి ప్రేమకధ ప్రారంభమైనప్పుడు రిషబ్ సినిమాల్లో కెరీర్ పరంగా నిలదొక్కుకోలేదు. .దాంతో రిషబ్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రగతి తల్లిదండ్రుల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది అయితే, ప్రగతి పట్టు వీడకపోవడంతో... అతి కష్టం మీద వారు ఒప్పుకున్నారు. అలా ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు వారికిద్దరు అన్నట్టుగా ప్రస్తుతం ఒక బాబు, పాపలతో వీరిది చక్కని అందమైన సంసారం..సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టివ్‌గా ఉంటుంది తరచుగా తన కుటుంబ జీవితం నుంచి స్నిప్పెట్లను అభిమానులతో పంచుకుంటుంది. రిషబ్ 41 పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫొటోలు, గత ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త, పిల్లలకు ఉన్న అనుబంధం గురించి పెట్టిన పోస్ట్‌లు నెటిజన్స్ నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ఐటీ ఉద్యోగినిగా ఉన్న ప్రగతి రిషబ్‌తో పెళ్లి తర్వాత ఫ్యాషన్ పై తన టీనేజి అభిరుచికి సానబెట్టింది. అలా ఆమె సినిమారంగంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారేందుకు అదే బాటలు వేసింది. ఇప్పటికీ ఫ్యాషన్ తనకు హాబీ మాత్రమే అని చెబుతున్న ప్రగతి... కాస్ట్యూమ్ డిజైనర్ ప్రొఫెషన్లో అనూహ్యంగా రాణిస్తోంది. ప్రేమ నుంచీ పెళ్లి దాకా ఆ తర్వాత కూడా కష్టసుఖాలు అన్నింటినీ సమానంగా పంచుకుంటూ పరస్పరం విజయాలకు కారణమవుతూ సాగుతున్నదీ జంట. సినీ రంగంలో ఉన్న చాలా మందికి స్ఫూర్తిని అందించే దాంపత్యం వీరిద్దరిదీ అనడం నిస్సందేహం. -
విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్-సైంధవి
ప్రముఖ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar), సింగర్ సైంధవికి విడాకులు మంజూరయ్యాయి. ఈమేరకు చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. జీవీ ప్రకాశ్ తన స్కూల్ ఫ్రెండ్ సైంధవిని 2013లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2020వ సంవత్సరంలో కూతురు అన్వి జన్మించింది. 11 ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ప్రకాశ్ దంపతులు గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకులు మంజూరుఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగారు. మలేషియాలో జరిగిన జీవీ ప్రకాశ్ సంగీత కచేరీలో సైంధవి పాట పాడారు. ఓపక్క స్నేహాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు విడాకుల కోసం వీరిద్దరూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కూతురు అన్విని సైంధవి వద్దే ఉంచేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని జీవీ ప్రకాశ్ కోర్టుకు తెలిపాడు. దీంతో న్యాయస్థానం మంగళవారం నాడు ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.చదవండి: ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి.. ఆ ఇద్దరు అరెస్ట్ -
రెండో బ్యానర్ స్టార్ట్ చేయనున్న హీరో సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈయన తన భార్య జ్యోతికతో కలిసి 2డీ ఎంటర్టెయిన్మెంట్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే! తాజాగా సూర్య మరో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.నగరం స్టూడియోస్ పేరుతో కొత్త బ్యానర్ లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థలో మొదటి చిత్రంగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుందని తెలిసింది. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తెరపైకి రానుంది.చదవండి: జ్ఞాపకాలను మోయడం ఆపేశాను -
కెమెరా కాలింగ్
మలయాళ స్టార్ మమ్ముట్టి కొంత గ్యాప్ తర్వాత తిరిగి సినిమా సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో ముమ్ముట్టి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ మమ్ముట్టి ఆరోగ్య సమస్య స్వల్పమైనదేనని, ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని దర్శకుడు మహేశ్ నారాయణన్ పేర్కొన్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారులుగా ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో నటిస్తున్న మలయాళ చిత్రం ‘పేట్రియాట్’.ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మమ్ముట్టి అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేడు హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ‘‘జీవితంలో నాకు ఎంతో ఇష్టమైన పనిని (సినిమా షూటింగ్‌ని ఉద్దేశించి) తిరిగి ప్రారంభిస్తున్నాను. నా ఆబ్సెన్స్లో నా గురించి తెలుసుకోవాలనుకున్న అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి మాటలు సరిపోవు.ది కెమెరా ఈజ్ కాలింగ్’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు మమ్ముట్టి. అలాగే ఈ విషయంపై మహేశ్ నారాయణన్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు తిరిగి సినిమా సెట్స్‌లోకి వస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది. రాబోయే షూటింగ్ షెడ్యూల్లో మమ్ముట్టి, మోహన్‌లాల్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇన్ని రోజులు మమ్ముట్టిగారు సెట్స్‌కు రాకపోవడం వల్ల నష్టం వాటిల్లకుండా ఆయన లేని సీన్స్ చిత్రీకరించాం’’ అని పేర్కొన్నారు. -
బీచ్‌లో సాయిపల్లవి సిస్టర్.. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్!
బీచ్‌లో సాయి పల్లవి సిస్టర్ చిల్.. బ్లూ డ్రెస్‌లో మరింత హాట్‌గా బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్. సిస్టర్ మెహందీ వేడుకల్లో మెరిసిన బుల్లితెర నటి శివంగి జోషి.. డిఫరెంట్ స్టైల్లో అతియా శెట్టి లుక్..యూఎస్‌లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ కార్తీక నాయర్.. View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Karthika Nair (@karthika_nair9) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
విష్ణు విశాల్ క్రైమ్ థ్రిల్లర్.. ఆసక్తిగా తెలుగు టీజర్
కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఆర్యన్. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించనున్నారు. టీజర్ చూస్తుంటే కథ మొత్తం హత్యలు, ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. -
మరో ఓటీటీకి నయనతార వివాదాస్పద సినిమా.. వారికి మాత్రమే!
కోలీవుడ్ భామ నయనతార నటించిన వివాదాస్పద చిత్రం 'అన్నపూరణి-ది గాడెస్ ఆఫ్ ఫుడ్'. 2023లో వచ్చిన ఈ సినిమాకు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి థియేటర్ల వద్ద మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో నయన్ బ్రహ్మణి అమ్మాయి పాత్రలో కనిపించింది. అదే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో ఓ బ్రహ్మణ అమ్మాయిని నాన్ వెజ్ వంటలు చేసే చెఫ్‌గా చూపించడం ఆ వర్గం మనోభావాలు దెబ్బతీసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించగా.. నయనతార క్షమాపణలు చెప్పింది.తాజాగా ఈ చిత్రం మరో భాషలో అందుబాటులోకి వస్తోంది. అక్టోబర్ 1 నుంచి జియో హాట్ స్టార్‌లో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఇన్ని రోజుల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అన్నపూరణి సినిమాను జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్లపై ఆర్. రవీంద్రన్ మరియు జతిన్ సేథి నిర్మించారు. ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సింప్లీ సౌత్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కేవలం ఓవర్సీస్ ఆడియన్స్‌కు మాత్రం అందుబాటులో ఉంది. -
జూనియర్ ఎన్టీఆర్ దేవర-2.. కొరటాల శివ బిగ్ ప్లాన్!
జూనియర ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.దేవర సూపర్ హిట్ కావడంతో పార్ట్-2 కూడా ఉంటుందని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్లాన్ రెడీ చేస్తున్నారు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవర-2కు సంబంధించిన నెట్టింట ఓ బజ్ నడుస్తోంది. పార్ట్-2 కోసం ఓ పవర్ఫుల్ రోల్‌ను కొరటాల క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్లో తమిళ స్టార్ శింబును అనుకుంటున్నట్లు లేటేస్ట్ టాక్.అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కథలో బలమైన ప్రభావం చూపించేలా దేవర-2 స్క్రిప్ట్‌లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. శింబు అయితే ఈ పవర్ఫుల్ రోల్‌కు సెట్ అవుతాడని కొరటాల అతని వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఈ విషయంపై ప్రస్తుతం అతనితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా దేవర-2 రోల్ కోసం శింబు పేరు తెరపైకి రావడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.Buzz - For #Devara2, Koratala Siva has made significant changes to the script to create a stronger impact....🤞🏼 He has crafted a powerful character in this film...👀 The producer has planned to cast a new actor in this role, and discussions are underway suggesting that Tamil… pic.twitter.com/5kx8QAlQUY— Movie Tamil (@_MovieTamil) September 30, 2025 -
అల్లర్ల భూమిగా మార్చేశారు.. విజయ్‌పై సినీ నటి కామెంట్స్
కరూర్ ఘటన తర్వాత సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై తీవ్రమైన వ్యతిరేఖత కనిపిస్తుంది. తమిళనాడులో తన ఉణికి కూడా ప్రమాదంలో పడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఇప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కనీసం ఒక వీడియో రూపంలో కూడా స్పందించ లేదు. కేవలం సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే షేర్ చేశారు. దీంతో నెటిజన్లు నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది.ఇప్పటికే విజయ్‌ని అరెస్ట్ చేయాలంటూ సినీ నటి ఓవియా సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ పంచుకుంది. అయితే, తాజాగా ఆమె మరోసారి ఇలా రియాక్ట్ అయింది. కరూర్ సంఘటన తర్వాత, రజనీకాంత్ సర్, అజిత్ సర్, సూర్య సర్ అభిమానుల మీద నాకు గౌరవం పెరిగింది. వారిలో చాలామంది సరైన మార్గంలో వెళ్తున్నారు. కానీ, విజయ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. టీవీకే ప్రచార ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చాలా ప్రమాదకరమైన ట్వీట్లు చేస్తూ.. హింసను సృష్టిస్తున్నాడు. అతను తమిళనాడును అల్లర్ల భూమిగా మారుస్తున్నాడు.' అంటూ ఆమె పేర్కొన్నారువిజయ్ అభిమానులపై కూడా తమిళనాడులో విమర్శలు వస్తున్నాయి. విజయ్‌కు వ్యతిరేఖంగా ఎవరైనా మాట్లాడితే వారు బూతులతో ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. సోషల్‌మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్లు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే ఓవియాను టార్గెట్ చేస్తూ విజయ్ ఫ్యాన్స్ భారీగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. After #Karur incident, my respect for Rajini sir, Ajith sir, and Suriya sir has grown as their fans walk on the right path.But Vijay is misleading youngsters, making people like Adhav Arjuna post harmful tweets and create violence.He is turning Tamil Nadu into a land of riots. pic.twitter.com/XccxjsfAYG— Oviya (@oviya__offll) September 30, 2025 -
పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. హీరో ఎవరంటే?
గతేడాది డిసెంబరు నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జంటగా కనిపిస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఇకపోతే నాగచైతన్య.. ఓ హారర్ మూవీలో నటిస్తుండగా శోభిత మాత్రం మొన్నటివరకు కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్ల గ్యాప్ ఇస్తుందా అనుకున్నార. కానీ అలాంటిదేం లేదని ఓ మూవీ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: హర్ట్ అయిపోయిన దీపిక పదుకొణె.. ఆ డైరెక్టర్‌తో కటీఫ్)శోభిత ప్రెగ్నెన్సీతో ఉందని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. అయితే అవి పుకార్లు మాత్రమేనని ఇప్పుడు ఓ తమిళ సినిమాలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది. పా.రంజిత్ తీస్తున్న 'వెట్టువం' అనే చిత్రంలో శోభితని తీసుకున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. గతంలో తమిళంలో మణిరత్నం తీసిన 'పొన్నియిన్ సెల్వన్'లో నటించింది. కాకపోతే అది హీరోయిన్ పాత్ర కాదు. ఇప్పుడు మాత్రమే ఈమెనే లీడ్.దినేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆర్య మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శోభిత హీరోయిన్. పా.రంజిత్ సినిమాలన్నీ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తోనే ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత శోభిత.. తెలుగులో ఏమైనా మూవీస్ చేస్తుందని చాలామంది అనుకున్నారు కానీ తమిళంలో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. గతంలో తెలుగులో గూఢచారి, మేజర్ మూవీస్ చేసింది.(ఇదీ చదవండి: ఆహా ఓహో అన్నా...చివరకి లేదుగా సాహో రేంజీ...) -
విజయ్‌కు సపోర్ట్‌గా మన్సూర్ సంచలన కామెంట్స్
తమిళనాడు కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందని సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) పేర్కొన్నారు. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరగడంతో 41 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో విజయ్ తన క్రెడిబులిటీ కోల్పోయాడంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి కారణం విజయ్ అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు అండగా మన్సూర్ అలీ ఖాన్ పలు వ్యాఖ్యలు చేశారు.కరూర్ ఘటన ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిన భారీ కుట్ర అంటూ మన్సూర్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు. రాబోవు ఆరు నెలల్లో ఈ ఘటనకు కారణమైన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. విజయ్‌ని అరెస్ట్ చేసినా సరే అతను బయపడడంటూ మన్సూర్ చెప్పుకొచ్చాడు. ఇదంతా ఆయన్ను రాజకీయంగా సమాధి చేసేందుకు వేసిన ప్లాన్ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.'తమిళనాడులోని కరూర్ సంఘటన హృదయ విదారకం. నా స్వస్థలం కరూర్. ఈ ఘటన తర్వాత నాకు గత రెండురోజులుగా నిద్ర కూడా పట్టడం లేదు. నేను ఎలా నిద్రపోగలను..? ఆ తొక్కిసలాటలో మరణించిన వారందరూ ఎలాంటి బాధను అనుభవించారో తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. మన దేశంలో ఇలా జరగడం చాలా సిగ్గుచేటు. కరూర్ సంఘటనను తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆయుధంగా ఉపయోగించనున్నారు. మీకు విజయ్ ఎదుగుదల నచ్చకుంటే నేరుగా ఆయన్ను ఎదుర్కొండి. విజయ్ నినాదం తప్పు అయితే మీరు కూడా సమావేశాలు నిర్వహించి ఎండగట్టండి. అలా చేయడం చేతకాక ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటారా..? ఇది నీతిలేని రాజకీయమని అనిపించడం లేదా..? మీ రాష్ట్ర ప్రజలనే ఇలా చంపుకుంటారా.. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మీది కాదా.. తమిళనాడులో గెలుపు ఎవరిది అనేది రాబోయే ఆరు నెలల్లో ప్రజలు నిర్ణయిస్తారు. కొంతమంది తిమింగలంలా మింగేసేందుకు రెడీగా ఉన్నారు. విజయ్ ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయంలో నేను విజయ్‌కు మద్దతు ఇస్తున్నాను. నా తమ్ముడు విజయ్‌ని నేనే పెంచాను. అరుణ జగతీశన్ నేతృత్వంలో జరిగే దర్యాప్తుతో ఏమీ ఒరిగేది లేదు. వారు సరైన పోలీసు రక్షణ కల్పించలేదు. ఏ పార్టీ అయినా ఇన్ని షరతులు విధించిందా..? అంత కఠినత ఉందా..? విజయ్‌ని ఇబ్బంది పెట్టే వారికి ఆరు నెలల్లో శిక్ష పడుతుంది. 41 మంది మరణానికి విజయ్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదని మీరు అంటున్నారు. కానీ, అతన్ని అక్కడే ఉండనివ్వకుండా పంపించేశారు. కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర. విజయ్ గొప్ప వ్యక్తి. ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాడు. తరువాత ఏమి చేయాలో అతనికి తెలుసు' అని నటుడు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. -
అపజయం వెనుకే విజయం
నార్త్‌లో దాండియా కల్చర్ బాగుంటుంది. చిన్నప్పుడు మేం ముంబైలో ఉండేవాళ్లం. దసరా టైమ్‌లో మా కమ్యూనిటీలో దాండియా ఆడేవాళ్లు. అలా మా అపార్ట్మెంట్వాళ్లతో కలిసి లైట్‌గా దాండియా చేసిన గుర్తు ఉంది. కానీ పెద్దయ్యాక దాండియా ఆడలేదు. అయితే చేయాలని ఉంది.పండగ అంటే ఫ్యామిలీ రీ యూనియన్ అని నా ఫీలింగ్. నా చిన్నప్పుడు మా బంధువులందరం కలిసి పండగ జరుపుకునేవాళ్లం. అందరూ కలిసి పండగ వంటలు చేయడం చాలా బాగుండేది. అయితే పై చదువులు, కెరీర్... వీటివల్ల రాను రాను ఆ సందడి తగ్గిపోయింది. ఇప్పుడైతే వర్క్‌లో బిజీ అయ్యాను కదా... షూటింగ్స్, ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి పండగ సమయంలో ఇంటి దగ్గర ఉండటం తగ్గిపోయింది. ఆ పాతరోజులను తలచుకుంటూ ఉంటాను.‘‘అపజయం ఎదురైనప్పుడు జీవితం ఆగిపోయింది అనుకుంటే మనం ఆగిపోతాం... ఆ అపజయాన్ని విజయానికి మెట్టుగా మార్చుకుంటే ముందుకు సాగిపోతాం’’ అంటున్నారు శ్రీనిధి శెట్టి. అందాల పాటీల్లో ‘మిస్ సుప్ర నేషనల్ ఇండియా’ కిరీటం దక్కించుకోవడం నుంచి, ‘మిస్ స్మైల్’... వరకు పలు టైటిల్స్ శ్రీనిధి సొంతం. తొలి చిత్రం ‘కేజీఎఫ్’తో హీరోయిన్గా విజయవంతంగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీనిధి శెట్టి ఇప్పుడు ఫుల్ బిజీ. ‘‘ప్రతి స్త్రీ అమ్మవారిలా ఓ శక్తి స్వరూపిణి’’ అంటూ ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.⇒ మా మంగళూరులో చాలా టెంపుల్స్ ఉన్నాయి. నవరాత్రి సమయంలో గుడిలో జరిగే పూజలు చాలా వైభవంగా ఉంటాయి. ఈ దసరా టైమ్‌లో వీలైనప్పుడల్లా గుడికి వెళుతుంటాను. మైసూర్లో నవరాత్రి పూజలను ఘనంగా చేస్తారు. మైసూర్ ప్యాలెస్‌ని బాగా డెకరేట్ చేస్తారు. జాతర జరుగుతుంది. స్టాల్స్ పెడతారు. ‘మైసూర్ దసరా’ చాలా పాపులర్. ఈ పండగ సమయంలో సిటీ మొత్తం జనాలతో కిటకిటలాడిపోతుంది.⇒ ‘ఫాస్టింగ్’ అనేది సైంటిఫికల్లీ, ట్రెడిషనల్లీ మంచిది అని నా అభి్రపాయం. అయితే నవరాత్రి టైమ్‌లో ఉపవాసం ఉండను. కానీ నాన్ వెజ్‌కి దూరంగా ఉంటాను. నెలలో రెండుసార్లు ఏకాదశి వస్తుంది కదా... అప్పుడు ఉపవాసం ఉంటాను. ఏకాదశి వస్తోందంటే చాలు... ‘నువ్వు ఫాస్టింగ్ ఉండాలి’ అని నా బాడీ నాకు గుర్తు చేస్తుంది. నా మైండ్ అలా ట్యూన్ అయిపోయింది. ⇒ చెడుపై మంచి గెలవడం అనేది దసరా థీమ్. ఒక చెడు ఉంటేనే మంచి జరుగుతుంది. అపజయాలను నేను ఇలానే భావిస్తాను. ఫెయిల్యూర్ ఎదురైతేనే కదా సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తాం. సో... ఫెయిల్యూర్స్‌ని చెడుగా భావించను. చెడుని అంతం చేయడానికి అమ్మవారు ఏం చేసిందో మనందరికీ తెలుసు. అలాగే మనకు ఎదురయ్యే ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొందరు మహిళలు సపోర్ట్‌ని ఆశిస్తారు. కానీ మనకు మనమే సపోర్ట్ సిస్టమ్ అవ్వాలి. మన శక్తిని మనం గుర్తించగలగాలి. నాకు ఏదైనా చెడు ఎదురైందనుకోండి అది నా ‘స్టెప్పింగ్ స్టోన్’ అని నమ్ముతాను. జీవితం లో ఎదురయ్యే సవాల్‌ని అలా అనుకుంటే సక్సెస్ అయిపోతాం.⇒ స్త్రీలు ఇంటిల్లిపాదినీ చూసుకోవాలి. అది చాలా పెద్ద బాధ్యత. అయితే అందరి బాగోగులు చూస్తూ చాలామంది మహిళలు తమ గురించి పట్టించుకోరు. కానీ మన గురించి కూడా మనం పట్టించుకోవాలి. ఇన్నర్‌గా మనం హ్యాపీగా ఉంటే చుట్టూ ఉన్నవాళ్లను మనం ఇంకా హ్యాపీగా ఉంచగలుగుతాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... అందర్నీ హ్యాపీగా ఉంచడమే మన పని అని ఫిక్స్ అయిపోకండి. మనం హ్యాపీగా, హెల్తీగా ఉండటం కూడా ముఖ్యం.చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!⇒ జీవితంలో ‘పాజిటివిటీ’ చాలా ముఖ్యం. ఒక పని చేసే ముందు ‘ఇది మనవల్ల అవుతుంది. చేసి తీరతాం’ అని పాజిటివ్‌గా ఆలోచించాలి. ఆ పాజిటివిటీ మనల్ని చాలా దూరం తీసుకెళుతుంది. చదువుకునే అమ్మాయిలకు, ఉద్యోగం చేసుకునేవారికి నేను చెప్పేదేంటంటే... ఏ విషయంలోనూ ‘నా వల్ల కాదు’ అనుకోకండి. స్త్రీలు తలచుకుంటే చేయలేనిదేం ఉండదు. పాజిటివ్ గా ఆలోచించండి. అంతా మంచే జరుగుతుంది. చెడు ఆలోచనలను దూరం పెట్టండి. ఆటోమేటిక్‌గా మంచి దగ్గరవుతుంది. ఈ పద్ధతి ఫాలో అయితే జీవితం కష్టంగా ఉండదు... తేలికగా సాగిపోతుంది’’ అని చె΄్పారు. – డి.జి. భవాని -
నా సామిరంగ బ్యూటీ లేటేస్ట్ మూవీ.. టీజర్ రిలీజ్
నా సామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్ నటించిన కన్నడ సినిమా గతవైభవ. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ హీరో దుశ్యంత్ నటించారు. ఫాంటసీ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సింపల్ సుని దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగులోనూ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ మూవీని ఎపిక్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కించారు. టీజర్ చూస్తుంటే మైథాలజీ టచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సీన్స్ చూస్తే పురాణాల నేపథ్యంలో రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను సర్వ్గర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్లపై దీపక్ తిమ్మప్ప, సుని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జుడా సంధి సంగీతమందించగా.. విలియం జె డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. -
కాంతార మేకర్స్ ప్రకటన.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం కాంతార చాప్టర్-1. ఈ మూవీని కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు అంతా సిద్ధమైంది. దీంతో కాంతార మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. తాజాగా ముంబయిలోనూ బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.(ఇది చదవండి: కాంతార చాప్టర్ 1 లాంటి సినిమా చేయడం సులభం కాదు: ఎన్టీఆర్)అయితే మంగళవారం చెన్నైలో కాంతార చాప్టర్-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన కరూర్ ఘటన నేపథ్యంలో కాంతార నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు చెన్నైలో జరగాల్సిన ప్రమోషనల్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. సరైన సమయంలో తమిళనాడు ప్రేక్షకులను కలవడానికి మేము ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. Due to the recent unfortunate incident, we are cancelling the #KantaraChapter1 promotional event in Chennai tomorrow.Our thoughts and prayers are with those affected. Thank you for your understanding, we look forward to meeting our audience in Tamil Nadu at a more appropriate… pic.twitter.com/ROhmiu6glR— Hombale Films (@hombalefilms) September 29, 2025 -
'బాయ్‌కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?
ఉన్నట్టుండి సడన్‌గా 'కాంతార ఛాప్టర్ 1' సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివిటీ కనిపిస్తోంది. 'బాయ్ కాట్ కాంతార' అంటూ ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ సృష్టించి హడావుడి చేస్తున్నారు. తెలుగు చిత్రాలని కర్ణాటకలో ఆదరించట్లేదు మనమెందుకు ఆ చిత్రాల్ని ఎంకరేజ్ చేయాలి? హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే సదరు హీరో తెలుగులో మాట్లాడలేదు ఇంత పొగరా? అని రకరకాల కారణాలు చెప్పి మూవీపై వ్యతిరేకత పెంచే పనిచేస్తున్నారు కొందరు. ఇంతకీ అసలేం జరుగుతోంది? దీని వెనక ఎవరున్నారు?రిషభ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో రిలీజై బ్లాక్‌బస్టర్ అందుకున్న చిత్రానికి ఇది ప్రీక్వెల్. అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. అయినా సరే ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి సడన్‌గా దీనిపై వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే దీని వెనక ఓ తెలుగు హీరో ఫ్యాన్స్ ఉన్నారా అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?)ఎందుకంటే మొన్నీమధ్య కర్ణాటకలో ఓ తెలుగు మూవీ రిలీజ్ అయింది. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ బయటున్న సదరు సినిమా పోస్టర్స్‌ని కొందరు వ్యక్తులు చించేశారు. మరోవైపు తొలిరోజు తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో సదరు చిత్రానికి ఏమంత చెప్పకోదగ్గ వసూళ్లు రావటం లేదు. తొలిరోజు ఘనంగా ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్ అని పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ.. రెండో రోజు నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. చూస్తుంటే అభిమానులు తప్పితే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదా అనిపిస్తుంది. ఇప్పుడు గానీ 'కాంతార 1' రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ మూవీని జనాలు మరిచిపోవడం గ్యారంటీ!మరి కారణం ఇదేనో ఏమో తెలీదు గానీ 'బాయ్ కాట్ కాంతార' అని కావాలనే ట్రెండ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయినా సినిమా బాగుంటే ఆడుతుంది లేదంటే ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంది. కానీ అంతకంటే ముందే ఏదో మనసులో పెట్టుకుని 'కాంతార'ని టార్గెట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది! చెప్పాలంటే తమిళనాడులోనూ తెలుగు చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండదు. చేస్తే తమిళ డబ్బింగ్ చిత్రాలకు కూడా ఇలా ట్రెండ్ చేయాలి కదా! కానీ ఈ మధ్య కాలంలో అలాంటివే కనిపించలేదు. మరి కేవలం 'కాంతార'నే ఎందుకు టార్గెట్ చేసినట్లు? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం) -
కాంతార చాప్టర్ 1 లాంటి సినిమా చేయడం సులభం కాదు: ఎన్టీఆర్
‘‘నన్ను ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకుని వెళ్లాలని ఎప్పట్నుంచో మా అమ్మగారి ఆకాంక్ష. రిషబ్ సార్ లేకపోయి ఉంటే ఆ దర్శన భాగ్యం కలిగి ఉండేది కాదు. థ్యాంక్స్ చెప్పి, మా మధ్య దూరాన్ని పెంచలేను. మా అమ్మగారి ఆకాంక్షను నెరవేర్చినందుకు ఐ లవ్ యూ సార్. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కోసం రిషబ్ ఎంత కష్టపడ్డారో చూశాను. ఈ సినిమా చేయడం అంత సులభం కాదు. రిషబ్ అరుదైన దర్శక–నటుడు. ఆయనలోని డైరెక్టర్ అతన్ని డామినేట్ చేస్తాడా? లేక యాక్టర్ డామినేట్ చేస్తాడా? అనే ఆలోచన నాకు ఉండేది. కానీ సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌ని రిషబ్ డామినేట్ చేస్తారు’’ అని ఎన్టీఆర్ అన్నారు.రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం తెరకెక్కింది. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ అక్టోబరు 2న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మాములుగా ప్రతిసారీ అరిచినట్లుగా ఈసారి మాట్లాడలేను.కొంచెం నొప్పిగా (ఈ మధ్య స్వల్ప గాయం అయింది) ఉంది. నాకు తెలిసి నా వయసు మూడేళ్లో, నాలుగేళ్లో అయ్యింటుంది. అప్పుడు మా అమ్మమ్మ నన్ను కూర్చోబెట్టి, కుందాపూర్ దగ్గరే మా ఊరు... అంటూ చిన్నప్పుడు ఆమె విన్న కొన్ని కథలు చెప్పింది. ఈ కథ నిజమేనా? ఇది జరిగి ఉంటుందా? అని అర్థమయ్యేది కాదు. కానీ ఆ కథలు ఆసక్తిగా ఉండేవి. ఒక్కసారైనా ఈ గుళిగ ఆట అనేది ఏంటి? ఈ బింజురుళి అంటే ఏమిటో చూడాలని నా చిన్నప్పుడే నాటుకుపోయింది. కానీ ఏ రోజూ అనుకోలేదు. నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఒక సినిమా తీస్తాడని. ఆ దర్శకుడు ఎవరో కాదు... నా సోదరుడు రిషబ్ శెట్టి. నేను విన్న కథలను సిల్వర్ స్క్రీన్‌పై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు.కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ కొత్తగా తెలిసినవాళ్లు ఏమయ్యారో అదే ‘కాంతార 1’ సినిమా రిజల్ట్. ఈ ‘కాంతార: చాప్టర్ 1’ గొప్ప బ్లాక్‌బస్టర్ చిత్రంగా భారతీయ సినిమా చరిత్రలో ప్రస్ఫుటంగా కనపడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సినిమాను అక్టోబరు 2న థియేటర్స్‌లో చూడండి. రిషబ్ కష్టాన్ని ఆశీర్వదించి, ‘కాంతార: చాప్టర్ 1’ను విజయం బాటవైపు నడిపిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. ‘‘ఎన్టీఆర్‌గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక బ్రదర్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాను మీరందరూ థియేటర్స్‌లో చూసి, ఆశీర్వదించి, పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు రిషబ్ శెట్టి.హోంబలే ఫిలింస్ సహ వ్యవస్థాపకుడు చలువే గౌడ మాట్లాడుతూ– ‘‘‘కాంతార: చాప్టర్ 1’ మన సంస్కృతి, నమ్మకాలు, కథలు, మూలాలకు నివాళి’’ అని చె΄్పారు. ‘‘ఈ సినిమా చూసిన ఓ నలుగురు పెద్దవాళ్లు ‘ఈ సినిమా స్పెల్‌బౌండ్’ అని చె΄్పారు. ‘కాంతార: చాప్టర్ 1’ పెద్ద చిత్రం అవుతుంది. ఇక వచ్చే నెల ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ పేర్కొన్నారు. ‘‘కాంతార’ సినిమాల కోసం రిషబ్ ఐదేళ్ళుగా కష్టపడుతున్నారు’’ అని కాస్ట్యూమ్ డిజైనర్, రిషబ్ భార్య ప్రగతి అన్నారు. ‘‘కాంతార: చాప్టర్1’ తెలుగు వెర్షన్లోనూ రెండు పాటలు రాశాను’’ అని చెప్పారు రాంబాబు గోసాల. మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి, ప్రోడక్షన్ డిజైనర్ బంగ్లన్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల బతుకుల్లో విషాదం.. విజయ్ను అరెస్ట్ చేయాలి: హీరోయిన్
గుండెనిండా దాగిన అభిమానం ఆ గుండె ఆగిపోయేలా చేసింది. అభిమాన నటుడు, నేతను దగ్గరి నుంచి చూడాలని వెళ్లిన వారంతా కళ్లనిండా విజయ్ (Actor Vijay) రూపాన్ని నింపుకుని అక్కడే ఆయువు వదిలారు. కొండంత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, హీరో విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన 'మీట్ ది పీపుల్' ప్రచారంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 39 మంది మరణించారు.. 60 మందికి పైగా గాయపడ్డారు.విజయ్ను అరెస్ట్ చేయాలిఇంతటి విషాదానికి కారణమైన విజయ్ను అరెస్ట్ చేయాలంటూ హీరోయిన్ ఓవియా (Oviya) డిమాండ్ చేసింది. ఈ మేరకు 'అరెస్ట్ విజయ్' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. దీనిపై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్ను బండ బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆమె తన పోస్ట్‌ను గంటల వ్యవధిలోనే డిలీట్ చేసింది. తనను తిడుతూ పెట్టిన కామెంట్ల స్క్రీన్షాట్లను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. 'జీవితం జ్ఞానవంతులకు కలలాంటిది, మూర్ఖులకు ఆట, ధనవంతులకు కామెడీ, అదే పేదలకు మాత్రం విషాదం' అని రాసుకొచ్చింది.బిగ్‌బాస్, సినిమాకేరళ కుట్టి ఓవియా 2007లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. కంగారు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఇది నా లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. కాంచన 3లోనూ యాక్ట్ చేసింది. 90 ఎంఎల్ అనే వివాదాస్పద సినిమాతో సెన్సేషన్ అయింది. ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో చనిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. గతేడాది ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకవగా.. చూసి ఆనందించండి అంటూ బోల్డ్‌గా రియాక్టైంది.చదవండి: నా గుండె వణికిపోయింది.. కరూర్ ఘటనపై 'కమల్, రజనీ' -
'ఆ ట్విటర్ ఖాతా అంతా ఫేక్'.. కరూర్ ఘటనపై డ్రాగన్ హీరోయిన్ క్లారిటీ
తన పేరుతో వస్తోన్న ట్విటర్ అంతా నకిలీ అని.. దయచేసి అలాంటివీ నమ్మవద్దని డ్రాగన్ హీరోయిన్ అభిమానులకు విజ్ఞప్తి చేిసంది. ఈ మేరకు ట్విటర్లో తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. కరూర్ ర్యాలీలో జరిగిన విషాద సంఘటన నన్ను తీవ్రంగా బాధపెట్టిందని.. అయితే తన పేరుతో ఉన్న నకిలీ ఖాతా పోస్టులను నమ్మవద్దని హితవు పలికింది.కాయాదు తన ట్వీట్లో రాస్తూ..' నా పేరుతో పోస్ట్‌లు సర్క్యులేట్ చేస్తున్న ట్విట్టర్ ఖాతా నకిలీది. నాకు దానితో ఎటువంటి సంబంధం లేదు . ఆ అకౌంట్ నుంచి చేసిన ప్రకటనలు నావి కావు. కరూర్ ర్యాలీలో జరిగిన విషాద సంఘటన నన్ను తీవ్రంగా బాధపెట్టింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. అయితే, కరూర్‌లో నాకు వ్యక్తిగత స్నేహితులు ఎవరూ లేరని.. నా పేరుతో వ్యాప్తి చెందుతున్న కథనం అబద్ధమని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. దయచేసి ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు.. ప్రచారం చేయవద్దు. మరోసారి ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. తమిళనాడు జరిగిన విషాదంపై డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ పేరుతో ట్వీట్ వైరలైంది. . కాగా.. నిన్న తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాదంపై పలువురు సినీతారలు స్పందించారు. రజీనీకాంత్, కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్.. ఈ ఘటనతో తన గుండె పగిలిందని ట్వీట్ చేశారు. వారిని ఓదార్చేందుకు కూడా మాటలు రావడం లేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున రూ.20 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.The Twitter account circulating posts under my name is fake. I have no connection with it, and the statements made there are not mine.I am deeply saddened by the tragic incident at the Karur rally, and my heartfelt condolences go out to the families who have lost their loved…— Kayadu Lohar (@11Lohar) September 28, 2025My deepest condolences to the families of those who lost their lives 💔 Lost one of my closest friends in the Karur rally. All for TVK’s selfish politics. Vijay, people are not props for your stardom. How many more lives for your hunger? #Karur #Stampede #TVKvijay pic.twitter.com/jW3qlxvPbO— Kayadu Lohar (@Kayadu__Lohar) September 27, 2025 -
కట్టప్ప కథ ఏంటి?
బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి’లో కట్టప్ప పాత్ర ఓ మేజర్ హైలైట్. ఈ పాత్రనే ప్రధాన కథాంశంగా‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్ ఓ కథను రెడీ చేస్తున్నారట. ఈ కథతో ఓ సినిమా తీసేందుకే ఆయన కట్టప్ప పాత్ర ఆధారంగా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని, స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మాహిష్మతి రాజ్యంలో కట్టప్ప ఎందుకు కట్టుబానిసలా ఉన్నాడు? కట్టప్ప గతం, కట్టప్ప పూర్వీకుల నేపథ్యం వంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయట.మరి... ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను పోషించిన సత్యరాజ్ ‘కట్టప్ప’ సినిమాలోనూ హీరోగా నటిస్తారా? లేక మరొకరు నటిస్తారా? ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే అంశాలపై స్పష్టత రావడానికి కొంత టైమ్ పడుతుంది. ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాలను సాధించింది. అలాగే ఈ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’గా ఈ అక్టోబరు 31న విడుదల చేయనున్నారు. -
మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా...
ప్రతి ఇండస్ట్రీలోనూ మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతూనే ఉంటాయి. ఓ సీనియర్ హీరో, ఓ రైజింగ్ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు స్టార్స్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి మల్టీస్టారర్ సినిమాలూ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్‌తో రాణించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, ఇద్దరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండటం, చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. ‘మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా’ అంటూ రెడీ అయిన కొంతమంది సీనియర్ హీరోలు చేస్తున్న మూవీస్‌పై ఓ లుక్ వేయండి.46 సంవత్సరాల తర్వాత... కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్‌హాసన్. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది. రజనీకాంత్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ అని ఇటీవల ఓ సందర్భంలో కమల్‌హాసన్ చె΄్పారు.ఇలా కమల్ చెప్పిన తక్కువ రోజుల్లోనే కమల్‌హాసన్‌తో తాను సినిమా చేస్తున్నానని, రెడ్ జెయింట్ మూవీస్–కమల్‌హాసన్ ప్రోడక్షన్ హౌస్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయని రజనీకాంత్ స్పష్టం చేశారు. దీంతో రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో ఊపందుకుంది.కాగా, ఈ చిత్రానికి తొలుత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. కమల్‌తో ‘విక్రమ్’ వంటి హిట్ మూవీ తీశారు లోకేశ్. అలాగే రజనీకాంత్‌కు ‘కూలీ’తో తమిళనాట మంచి విజయాన్ని అందించారు లోకేశ్. దీంతో కమల్–రజనీకాంత్ కాంబినేషన్ సినిమాకి లోకేశ్ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మంచి కథ, స్క్రీన్ ప్లే కుదిరితేనే లోకేశ్‌తో సినిమా చేయాలని భావిస్తున్నారట కమల్–రజనీ. అంతేకాదు... మరికొంత మంది యువ దర్శకులను కూడా మంచి కథల కోసం అ్రపోచ్ అవుతున్నారట.తాజాగా ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడిగా ‘కోమలి’ సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఆ తర్వాత ‘లవ్ టుడే’ సినిమాతో దర్శకుడితో పాటు హీరోగానూ సక్సెస్ అయ్యారు. రజనీకాంత్–కమల్‌హాసన్ కాంబినేషన్‌కు తాజాగా ఈ యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్‌గా 46 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్–రజనీకాంత్ కాంబోతో రానున్న సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.పండక్కి వస్తున్నారు సిల్వర్‌స్క్రీన్‌పై ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, వెంకటేశ్ కనిపిస్తే తెలుగు ఆడియన్స్‌కు పండగే. అదీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా పండక్కి రిలీజైతే, ఈ పండగ సంక్రాంతి అయితే... ఇక చెప్పేది ఏముంది? వినోదాల సంబరాలు రెట్టింపు అవుతాయి. వచ్చే సంక్రాంతికి ఈ వినోదాల సంబరాలను సిల్వర్ స్క్రీన్‌పై చూపించనున్నారు ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, కేథరీన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో వెంకటేశ్ కూడా పాల్గొననున్నారు. చిరంజీవి – వెంకటేశ్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. అలాగే చిరంజీవి–వెంకటేశ్–నయనతార– కేథరీన్‌ల కాంబినేషన్లో ఓ సెలబ్రేషన్ సాంగ్‌ను కూడా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత రానుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.మరో మల్టీస్టారర్! మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో సీనియర్ హీరో వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. ‘ఎఫ్ 2, వెంకీమామ, గోపాల గోపాల’... ఇలా వెంకీ కెరీర్లో మల్టీస్టారర్ మూవీస్ మెండుగానే ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వెంకటేశ్ మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయనున్నట్లు వెంకటేశ్ తెలిపారు. అయితే ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ కాదు. దీంతో వెంకటేశ్ చేయనున్న లేటెస్ట్ మల్టీస్టారర్లోని తాజా చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పేట్రియాటిక్ మూవీలో...మలయాళ స్టార్ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టీ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ 2008లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘ట్వంటీ 20’ తర్వాత మమ్ముట్టీ, మోహన్‌లాల్ కలిసి మరో సినిమా చేయడానికి పదహారేళ్లు పట్టింది. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలోని ‘పేట్రియాట్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మమ్ముట్టీ, మోహన్‌లాల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లుగా తెలిసింది.ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో ముగిసింది. అయితే మమ్ముట్టీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుందనీ అజర్ బైజాన్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల లోకేషన్స్‌లో చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పఠాన్ వర్సెస్ టైగర్! షారుక్ ఖాన్ హీరోగా చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘టైగర్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్ ఖాన్–షారుక్ ఖాన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఈ ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్‌లో నటించి, దాదాపు 30 సంవత్సరాలవుతోంది. 1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లు కలిసి లీడ్ రోల్స్‌లో మరో సినిమా చేయలేదు. అయితే గత ఏడాదిగా సల్మాన్, షారుక్ హీరోలుగా ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోందని బాలీవుడ్ సమాచారం.‘పఠాన్’, ‘టైగర్ 3’... ఈ రెండూ వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లోని చిత్రాలే. కాబట్టి ఈ స్పై యూనివర్స్‌లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ అనే సినిమా రానుందని, యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. ‘పఠాన్, వార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని, కాకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడానికి కొంత సమయం పడుతుందనే వార్త బాలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది.అలాగే ‘వార్’ సినిమా కూడా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగమే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం లేకపోలేదని, ఇదే నిజమమైతే అప్పుడు సల్మాన్, షారుక్, హృతిక్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చని బాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి... ఫ్యాన్స్ ఆశలు నిజమౌవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.17ఏళ్ల తర్వాత... బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్‌ల కాంబినేషన్లో బాలీవుడ్లో ‘హైవాన్’ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలాజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. కొచ్చి, ఊటీ లొకేషన్స్‌లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు మేకర్స్. తాజా షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్‌కు మోహన్‌లాల్‌తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ ‘హైవాన్’లో మోహన్‌లాల్ ఓ గెస్ట్ రోల్ చేసేందుకు అంగీకరించారట. ఇక ఈ చిత్రంలో మోహన్‌లాల్‌నే ఎందుకు గెస్ట్ రోల్‌కి తీసుకోవాలనుకున్నారంటే.. ‘ఒప్పం’కు హిందీ రీమేక్‌గా ‘హైవాన్’ సినిమా తెరకెక్కుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒప్పం’ సినిమా 2016లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. మరోవైపు ‘తషాన్’ చిత్రం తర్వాత 17 ఏళ్లకు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’యే కావడం విశేషం. ముగ్గురు డాన్లు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ డాన్స్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘డాన్ 3’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2023 ఆగస్టులోనే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే 1978లో వచ్చిన ‘డాన్’ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, 2006, 2011లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ సైతం ‘డాన్ 3’లో భాగం కానున్నారని, ఆ దిశగా ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.మరి... రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్లు కలిసి ఒకే ఫ్రేమ్‌లో హిందీ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపిస్తే, అంతకుమించిన ఆనందం హిందీ సినీ లవర్స్‌కి ఏముంటుంది. ఇక ‘డాన్ 3’లో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నారు. విలన్‌గా విజయ్ దేవరకొండ, విక్రాంత్ మెస్సే, అర్జున్ దాస్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ‘డాన్ 3’ చిత్రంలో ఎవరు విలన్‌గా నటిస్తారనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2027లో ‘డాన్ 3’ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.కథే హీరో కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రధారులుగా ఆర్.బి. శెట్టి మరో ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘45’. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసిన అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎం. రమేశ్ రెడ్డి, ఉమా రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్రయూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరని, కథే ఈ సినిమాకు హీరో అని శివ రాజ్‌కుమార్ ఓ సందర్భంలో చె΄్పారు. ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘ఓం’ (1995) సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర కలిసి మళ్లీ అసోసియేట్ కావడం ఇదే అని టాక్. కొంత గ్యాప్ తర్వాతనో లేక సరికొత్తగానో మల్టీస్టారర్ సినిమాలు చేసే సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
వరలక్ష్మీ కొత్త జర్నీ.. ఒకేసారి మూడు బాధ్యతలు
తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు కొత్త జర్నీ మొదలుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్.. రీసెంట్ టైంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూవీస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా దర్శకురాలిగా, నిర్మాతగా మారిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు కొత్త చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!)తండ్రి శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వరలక్ష్మీ.. 13 ఏళ్లుగా సినిమాలు చేస్తోంది. దక్షిణాదిలోని అన్ని బాషల్లోనూ నటించింది. ఈ ఏడాది నాలుగు చిత్రాలతో ప్రేక్షకులు ముందుకొచ్చింది. ఇప్పుడు సడన్‌గా 'సరస్వతి' అనే మూవీని ప్రకటించింది. ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వరలక్ష్మీ వ్యవహరించనుంది.థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో వరలక్ష్మీ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. తమన్ సంగీతమందిస్తున్నాడు. చెల్లి పూజతో కలిసి వరలక్ష్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దోస డైరీస్ పేరుతో నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది. గతేడాది నికోలాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు దర్శకనిర్మాతగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చు.(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి) -
ఇండస్ట్రీలోకి వచ్చేసిన సూర్య కూతురు.. 17 ఏళ్లకే ఇలా
తమిళ హీరో సూర్య ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. భార్య జ్యోతిక కూడా కొన్నాళ్ల క్రితం రీఎంట్రీ ఇచ్చింది. అడపాదడపా మూవీస్ చేస్తోంది. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి తర్వాత తరం కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. సూర్య కూతురు దియా.. ఏ మాత్రం హడావుడి లేకుండా కొత్త ప్రాజెక్ట్ చేసింది. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం బయటపడింది.సూర్య-జ్యోతిక లది ప్రేమ వివాహం. 'కాకా'(తెలుగులో ఘర్షణ) అనే సినిమా చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి 2006లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు దియా, దేవ్ అని కూతురు కొడుకు ఉన్నారు. దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. మొన్నీమధ్య స్కూలింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు 'లీడింగ్ లైట్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది.(ఇదీ చదవండి: మరోసారి తండ్రయిన హీరో సుహాస్)సినిమా తీయడంలో తెర వెనక చాలామంది మహిళలు పనిచేస్తుంటారు. అసలు వాళ్లు ఎలాంటి కష్టాలు పడుతుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని దియా తీసింది. ఆస్కార్ అర్హత కోసం ప్రస్తుతం దీన్ని కాలిఫోర్నియాలోని రీజెన్సీ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 02 వరకు ప్రతిరోజూ ఈ డాక్యుమెంటరీ వేయనున్నారు.సూర్య-జ్యోతిక కూతురు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చింది, దర్శకత్వం చేసింది అనే విషయాన్ని ఇప్పటివరకు సైలెన్స్‌గానే ఉంచారు. దీన్ని సూర్య-జ్యోతిక తమ ప్రొడక్షన్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. తాజాగా సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. అలా సూర్య కూతురిని అభినందిస్తున్నారు. మొన్నీమధ్య షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌తో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు సూర్య కూతురు కూడా డైరెక్టర్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?) -
'కొత్తలోక' సీక్వెల్.. వీడియోతో ప్రకటన
మలయాళంలో తెరకెక్కిన ‘కొత్తలోక: చాప్టర్1’ కాసుల వర్షం కురిపించింది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒక వీడియోను పంచుకున్నారు. రూ. 30 కోట్లతో చిన్న సినిమాగా విడుదలైన కొత్తలోక ఏకంగా రూ. 267 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రంగా నిలిచింది. దేశంలోనే మొదటి ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించారు.కొత్తలోక చాప్టర్1లో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే, సీక్వెల్లో వీరి పాత్ర కీలకం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన పార్ట్2 వీడియోలో వారిద్దర మధ్య జరిగిన సంభాషణను చూపించారు. సీక్వెల్‌ను కూడా డామినిక్ అరుణ్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రత్యేక ప్రోమో అభిమానులను మెప్పిస్తుంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. విడుదల తేదీ, నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. -
అలాంటి సినిమా చేయాలనుంది.. కోరిక బయటపెట్టిన అదితి శంకర్
సినిమా రంగుల ప్రపంచం.. ఆశల పల్లకి. ఇందులో గొప్పగా రాణించాలన్న ఆశ నటీనటులకు ఉంటుంది. అందుకోసం ఉన్నత ఉద్యోగాలను, వృత్తిని పక్కనపెట్టినవారున్నారు. హీరోయిన్ అదితి శంకర్ (Aditi Shankar) కూడా అదే కోవకి చెందుతుంది. స్టార్ దర్శకుడు శంకర్ కూతురే అదితి. ఈమె వైద్య విద్యలో పట్టభద్రురాలు. అయినప్పటికీ సినిమాపై ఆసక్తితో కథానాయికగా రంగప్రవేశం చేసింది. విరుమాన్ చిత్రంతో సినిమా కెరీర్ మొదలుపెట్టింది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ తరువాత మావీరన్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్లో బోర్లాపడ్డ బ్యూటీఈమె నటించిన మూడో చిత్రం నేశిప్పాయా పూర్తిగా నిరాశపరచింది. నాలుగో చిత్రం భైరవంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే భైరవం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలా 2022లో హీరోయిన్గా పరిచయమైన అదితి శంకర్ ఈ నాలుగేళ్లలో చేసిన నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఐదో చిత్రం ఒన్స్ మోర్ నిర్మాణంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.మోడ్రన్ లుక్‌లో..అదితి శంకర్ లంగా ఓణీ ధరిస్తే పక్కింటి అమ్మాయిలా, మోడ్రన్ దుస్తులు ధరిస్తే ఈ తరం అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటి వరకూ పూర్తిగా మోడ్రన్ యువతి పాత్రల్లో నటించలేదనే చెప్పాలి. అయితే అలాంటి పాత్రలో నటించాలన్న ఆశ ఉందనే అభిప్రాయాన్ని తాజాగా అదితి వ్యక్తం చేసింది. ఒక సమావేశంలో అదితి శంకర్ మాట్లాడుతూ.. తండ్రిని చూసి చిన్నతనంలోనే నటినవ్వాలన్న కోరిక బలంగా కలిగిందని తెలిపింది.అలాంటి సినిమా చేయాలనుందితన ఆశను త్రండి శంకర్‌కు చెప్పగా ముందు చదువు పూర్తి చేయమని చెప్పారంది. దీంతో తనకు ఇష్టమైన వైద్య విద్యను ఎంపిక చేసుకుని దాన్ని కంప్లీట్ చేశానంది. ఆ తరువాత తనకు నచ్చిన సినిమా రంగంలోకి అడుగు పెట్టానని, నటిగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తిని చేపడతానని నాన్నకు చెప్పానని పేర్కొంది. ఇప్పుడు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపింది. తనకు ఒక చారిత్రక కథా చిత్రంలో నటించాలన్నది ఆశ అని, అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial)చదవండి: నా కుమార్తెకు అనుమతి లేదు.. అందుకే ఆ నెక్లెస్ ధరించా: రాణీ -
కాంతార కోసం వస్తున్న ఎన్టీఆర్.. జోష్‌లో ఫ్యాన్స్
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ట్రైలర్ దుమ్మురేపుతుంది. పాన్ ఇండియా రేంజ్లో ఏకంగా 150 మిలియన్ల వ్యూస్ దాటేసింది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్నడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ జోరు పెంచింది. కన్నడ ప్రాంతీయ చిత్రంగా విడుదలైన కాంతార తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం.ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య స్నేహబంధం ఉంది. ఇటీవల, జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని ఉడిపిని సందర్శించినప్పుడు రిషబ్ శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28న జరిగే కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన ఒక పోస్టర్‌ను చిత్ర మేకర్స్ విడుదల చేశారు.కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేయనున్నారు. -
వెండితెరపై గోట్స్ ఫైట్..‘మడ్డీ’ డైరెక్టర్ మరో ప్రయోగం!
భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్ నేపథ్యంలో రూపోందిన మడ్డీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అదే విజయోత్సాహంతో మరింత ఆసక్తికరమైన కథాంశంతో, ప్రేక్షకులకు థ్రిల్ ను పంచడానికి డా. ప్రగభల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాకీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది.వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది. రియల్ లోకేషన్స్ లో చిత్రీకరించడమే కాకుండా 2022 నుంచి అక్కడి సాంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి అదే ప్రాంతంలో ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు.సహజసిద్దంగా చిత్రీకరించేందుకు అక్కడి ప్రజలతో మమేకమై, ప్రతీది తెలుసుకొని జాగ్రత్తగా షూట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు సినిమా కావాల్సిన ప్రతీ అంశాన్ని జోడించి ఎంతో గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ను సెట్ చేసినట్లు పేర్కొన్నారు. అందుకోసం నటీనటులు గోట్స్ సంరక్షకులతో కొద్దిరోజులు సవాసం చేసి, వారితో, గోట్స్ తో అనుబంధం పెంచుకున్నట్లు మేకర్స్ తెలిపారు. నటీనటులు అద్భుతమైన ప్రదర్శనతో ఆద్యాంతం కట్టిపడేస్తారని, ఫైట్ సన్నివేశాలకోసం శారీరంగా, మానసికంగా రెడీ అయ్యారని అందుకే ప్రతీ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా గోట్ సంరక్షకుల భావోద్వేగాలు కట్టిపడేస్తాయని, అలాగే మదురైలో ఉన్న ఈ సంస్కృతి ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. -
8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్!
కుబేరతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ (Dhanush) ఇడ్లీ కొట్టు మూవీ (Idly Kadai Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధనుష్ స్వీయదర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇటీవల సినిమా ఆడియా లాంచ్ ఈవెంట్లో ధనుష్ తన బాల్యం గురించి చెప్తూ ఎమోషనలయ్యాడు. చిన్నప్పుడు రోజూ ఇడ్లీ తినాలనుండేదని, కానీ తన దగ్గర అంత డబ్బుండేది కాదన్నాడు. ట్రోలింగ్‌పై స్పందించిన ధనుష్ఏదైనా చిన్నపనికి వెళ్లి, ఆ డబ్బుతో ఇడ్లీ కొనుక్కుని తినేవాడినని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ కామెంట్స్‌పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ధనుష్ తండ్రి కూడా ఒక దర్శకుడేనని, అలాంటి వ్యక్తి పేదరికంలో ఎందుకుంటాడని, అంతా కట్టుకథ అని విమర్శించారు. ఈ వివాదంపై మధురైలో జరిగిన ఇడ్లీ కొట్టు ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ స్పందించాడు. నా స్పీచ్ మీరు పూర్తిగా విన్నారా? 1983లో నేను పుట్టాను. 1991లో మా నాన్న దర్శకుడయ్యాడు. ఆ ఎనిమిదేళ్లపాటు మేము కష్టపడుతూనే ఉన్నాం. 1995 తర్వాతే మా కుటుంబ పరిస్థితి మెరుగుపడింది. మేము నలుగురం సంతానం కాబట్టి బయట తినడానికి డబ్బు అడిగినప్పుడు ఇచ్చేవాళ్లు కాదు! అందుకే ఏదైనా పని చేసి కొనుక్కునేవాడిని.అన్న దొంగచిన్నప్పుడు నేను అల్లరి ఎక్కువ చేసేవాడిని. మా అన్న సెల్వరాఘవన్ నన్ను మించిపోయేవాడు. నేను 20 పైసలు, చారానా.. ఇలా కాయిన్లు దాచుకునేవాడిని. అవి నాలుగైదు రూపాయలవగానే మా అన్న వాటిని దొంగిలించేవాడు. క్రికెట్ ఆడేటప్పుడు కూడా మూడున్నరగంటలవరకు ఔట్ అవకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉండేవాడు. నేను బౌలింగ్ చేసేవాడిని. నా వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాడిని. కానీ ఎప్పుడైతే అతడు ఔటయి నేను బ్యాట్ పట్టుకుంటానో.. వెంటనే బౌలింగ్ చేయకుండా అక్కడినుంచి పారిపోయేవాడు. అలా నన్ను చీటింగ్ చేసేవాడు అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.బయోపిక్ కాదుఅలాగే ఇదో ప్రముఖ చెఫ్ బయోపిక్ అంటూ వస్తున్న రూమర్లను కొట్టిపారేశాడు. ఇది ఎవరి బయోపిక్ కాదని, తన బాల్యంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలు, తన ఊహలను కలగలిపి ఈ సినిమా తీసినట్లు పేర్కొన్నాడు. ఇడ్లీ కొట్టు సినిమా విషయానికి వస్తే ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ విజయ్, రాజ్‌కిరణ్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్ -
ఓటీటీకి వచ్చేస్తోన్న మదరాసి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన చిత్రం మదరాసి. అమరన్ సూపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న బిగ్ స్క్రీన్‌పై సందడి చేసింది. అయితే ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా.. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూ.100 వసూళ్లు రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా మెప్పించింది.ఈ యాక్షన్ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ వైరల్ కావడంతో అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు శివ కార్తికేయన్‌తో వీడియో రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విద్యుత్ జమాల్ విలన్‌గా మెప్పించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.మదరాసి కథేంటంటే?తమిళనాడులో గన్ కల్చర్ తీసుకురావాలనేది విరాట్(విద్యుత్ జమ్వాల్) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్లాన్. ఇందులో భాగంగా గన్స్ ఉన్న ఆరు కంటెయినర్లని రాష్ట్రంలోకి తీసుకొస్తుంటాడు. ఈ సంగతి ఎన్ఐఏ(NIA)కి తెలుస్తుంది. ఆఫీసర్ ప్రేమ్(బిజు మేనన్).. తన టీమ్‌తో కలిసి వీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ పెద్ద గొడవ. ఆఫీసర్ ప్రేమ్ తీవ్ర గాయాలపాలవుతాడు. మరోవైపు లవ్ ఫెయిలైందని రఘు(శివకార్తికేయన్) ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఫ్లైఓవర్ పై నుంచి దూకేస్తాడు. ఇతడికీ గాయాలవుతాయి. అనుకోకుండా ప్రేమ్-రఘని ఒకే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొస్తారు. తర్వాత ప్రేమ్ లీడ్ చేస్తున్న మిషన్‌లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? రఘు ప్రేమించిన మాలతి (రుక్మిణి వసంత్) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. Brace yourself for a mad ride with yours truly Madharaasi ❤️🔫#MadharaasiOnPrime, Oct 1@SriLakshmiMovie @Siva_Kartikeyan @ARMurugadoss @anirudhofficial @VidyutJammwal #BijuMenon @rukminitweets @actorshabeer @vikranth_offl @SudeepElamon pic.twitter.com/McLGlMBEN4— prime video IN (@PrimeVideoIN) September 26, 2025 -
ఓం నమః శివాయ.. జటాధర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులు. సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్గురువారం ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధర’ను విడుదల చేశారు. ఈ ట్రాక్‌లో ‘ఓం నమః శివాయ’ అంటూ వినిపిస్తుంది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి పాడారు. ‘‘మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి–విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ‘జటాధర’ చిత్రం చూపించబోతోంది. పౌరాణిక ఇతివృత్తాలు, సూపర్ విజువల్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీ మ్యూజిక్ కో. చదవండి: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్ -
క్రైమ్ థ్రిల్లర్ మూవీలో యషిక.. 25 రోజుల్లోనే ప్లాన్!
తనదైన అందాలతో యువతను ఆకట్టుకునే బ్యూటీ యషిక ఆనంద్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం టాస్. ఈ మూవీలో తేజస్విని మరో హీరోయిన్గా నటిస్తోది. ఈ చిత్రంలో రత్నం మౌళి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సగు పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ఇటీవల తమిళనాడులోని కోవెల్ పట్టిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ సందర్భంగా టాస్ దర్శకుడు మాట్లాడుతూ.. 'ఇది ఒక ప్రాంతంలో జరిగే 3 హత్యల నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఆ హత్యల నేపథ్యం ఏమిటి? వాటికి నటి యషిక ఆనంద్‌కు ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్నాం. ఈ మూవీ షూటింగ్‌ను కోవెల్ పట్టి, బిరుదు నగర్, సాత్తూర్ ప్రాంతాల్లో నిర్వహించి 25 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో గాని 2026 ప్రథమార్ధంలో గాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు' చెప్పారు.ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మముందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రానికి శాంతన్ అనిభజనే సంగీతం అందిస్తుండగా.. ధర్మ దురై సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ టీవీ ఫేమ్ యోగి ,షన్న, సంజయ్ శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బ్లాక్ డైమండ్ స్టూడియో పతాకంపై సయ్యద్ జాఫర్ నిర్మిస్తున్నారు. -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది!
‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్...’ (మురళీ శర్మ), ‘ఇవ్వలా... వచ్చింది...’ (అల్లు అర్జున్) అనే డైలాగులు ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో బాగా పాపులర్ అయ్యాయి. కొందరు కథానాయికల కెరీర్ విషయంలో ఈ డైలాగులు కరెక్టుగా సరి పోయాయనిపిస్తోంది. తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు, ఫుల్ క్రేజ్‌తో బిజీ బిజీగా దూసుకెళ్లిన పలువురు హీరోయిన్లకు ప్రస్తుతం టాలీవుడ్లో గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ కావాలని ఇచ్చింది కాదు... ఇతర భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ఇక్కడ సరైన కథ, పాత్ర కుదరక పోవడం కూడా ఈ గ్యాప్‌కి కారణం అని చె పొ్పచ్చు. తమ అభిమాన హీరోయిన్ల సినిమా ఎప్పుడొస్తుందా అని టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తెలుగులో గ్యాప్ వచ్చిన కథానాయికలెవరో ఓ లుక్కేద్దాం.పచ్చజెండా ఊపుతారా? తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం కాజల్ అగర్వాల్‌ది. తేజ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయమయ్యారామె. 2007 ఫిబ్రవరి 15న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ చిత్రంలో నటించారు కాజల్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కాజల్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. ‘ఆర్య 2, మగధీర, గోవిందుడు అందరివాడేలే, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మేన్, బ్రహ్మోత్సవం, బృందావనం, టెంపర్, బాద్ షా, వీర, నేనే రాజు నేనే మంత్రి, సీత, ఖైదీ నంబర్ 150, భగవంత్ కేసరి’... ఇలా తెలుగులో వరుసగా సినిమాలు చేశారు కాజల్. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీకి తెలుగులో గ్యాప్ వస్తోంది. ‘భగవంత్ కేసరి’ సినిమా తర్వాత ఆమె లీడ్ రోల్లో నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘సత్యభామ’ 2024 జూన్ 7న విడుదలైంది.ఆ చిత్రం తర్వాత తెలుగులో అటు హీరోయిన్గా కానీ ఇటు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కానీ చేయలేదు కాజల్. అయితే మంచు విష్ణు హీరోగా రూ పొందిన ‘కన్నప్ప’ చిత్రంలో పార్వతీ దేవి పాత్రలో కనిపించారామె. జూన్ 27న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఆమె చేతిలో ఏ సినిమా లేనప్పటికీ తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరి... టాలీవుడ్‌కి ఆమె పచ్చజెండా ఊపుతారా? వేచి చూడాలి. కొత్త కబురు ఎప్పుడు? ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకెళుతున్నారు తమన్నా. అంతేకాదు... ప్రత్యేక పాటల్లోనూ సందడి చేసి, అభిమానులను అలరిస్తుంటారామె. తెలుగులో ఆమె లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల 2’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న విడుదలైంది. ఆ సినిమా విడుదలై దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఆమె మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్లిన ఈ బ్యూటీకి ప్రస్తుతం మాత్రం గ్యాప్ వస్తోంది.ఆ మాటకొస్తే చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ (2023) చిత్రం తర్వాత ఆమె నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రం ‘ఓదెల 2’. అంటే... ఈ రెండేళ్లలో ఆమె కేవలం రెండు తెలుగు సినిమాల్లో మాత్రమే నటించారు. ఈ మిల్కీ బ్యూటీకి టాలీవుడ్లో గ్యాప్ వస్తున్నప్పటికీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ‘రోమియో, రేంజర్, వి వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమాలతో పాటు రోహిత్ శెట్టి చిత్రంలో నటిస్తున్నారు.ఈ నాలుగు సినిమాల్లో ‘వి వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారామె. అరుణభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. మైథలాజికల్ హారర్, థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2026 మే 15న విడుదల కానుంది. మరి... తమన్నా తెలుగుకి సంబంధించి కొత్త కబురు ఎప్పుడు వినిపిస్తారు? అన్నది వేచి చూడాలి.రెండేళ్లు దాటినా... తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సమంత. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించారామె. అంతేకాదు.. తెలుగులో ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటించిన ‘ఖుషి’ (2023) చిత్రం తర్వాత సమంత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ని స్థాపించి, సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’.ఈ ఏడాది మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించి, నిర్మాతగా సమంతకు మంచి పేరు, లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఆమె అతిథి పాత్రలో కనిపించారు. ఇక ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజై రెండేళ్లు దాటి పోయినా ఇప్పటికీ తెలుగులో మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు సమంత.అయితే తన సొంత ్ర పొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్న ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియంటెండ్ మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు సమంత. అంతేకాదు... తన బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం పోస్టర్ని కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా గురించి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే... సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. నో అప్డేట్ టాలీవుడ్లో శ్రుతీహాసన్‌ది దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తనయుడు కె. ప్రకాశ్ తెరకెక్కించిన చిత్రం ‘అనగనగా ఒక ధీరుడు’ ద్వారా తెలుగుకి పరిచయం అయ్యారు శ్రుతీహాసన్. 2011 జనవరి 14న విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో నటించారు శ్రుతి. అయితే ఈ రెండు సినిమాలు పరాజయం కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించడంతో ఐరన్ లెగ్ అన్నవాళ్లే గోల్డెన్ లెగ్ అన్నారు. ‘బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, ప్రేమమ్, కాటమరాయుడు, క్రాక్, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’ వంటి సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు శ్రుతీహాసన్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’ చిత్రం 2023 డిసెంబరు 22న విడుదలైంది.ఆ సినిమా హిట్ అయినప్పటికీ ఆ తర్వాత శ్రుతీహాసన్ నటించనున్న మరో తెలుగు చిత్రంపై ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు. ‘సలార్’ విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆమె నుంచి మరో తెలుగు సినిమా అనౌన్స్మెంట్ లేదు. అయితే ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’కి సీక్వెల్‌గా రూ పొందనున్న ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’లో ఆమె పాత్ర ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగులో సినిమాలేవీ లేకున్నప్పటికీ తమిళ చిత్రాలు చేస్తున్నారు శ్రుతి. మరి... ఆమె నుంచి టాలీవుడ్లో కొత్త చిత్రం అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.మూడేళ్లు అయినప్పటికీ... తెలుగు చిత్ర పరిశ్రమలో ‘అలా మొదలైంది’ చిత్రంతో ఆరంభమైంది మలయాళ కుట్టి నిత్యామీనన్ కెరీర్. నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘అలా మొదలైంది’ చిత్రం 2011 జనవరి 21న విడుదలై, ఘన విజయం సాధించింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నిత్య. ఆ తర్వాత తెలుగు–తమిళ ద్విభాషా చిత్రం ‘180’లో నటించారామె. అనంతరం పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో నితిన్ హీరోగా నటించిన ‘ఇష్క్’ మూవీలో నటించి, మరో హిట్ అందుకున్నారు.ఆ తర్వాత ‘ఒక్కడినే, జబర్దస్త్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, ఒక్క అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్’ వంటి తెలుగు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. అయితే ‘భీమ్లా నాయక్’ చిత్రం రిలీజై మూడేళ్లు దాటి పోయినప్పటికీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు నిత్య. ఆ సినిమా తర్వాత వరుసగా మలయాళ, తమిళ చిత్రాలకే పరిమితం అయ్యారామె. విజయ్ సేతుపతి–నిత్యామీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’. ఈ చిత్రం తెలుగులో ‘సార్.. మేడమ్’ పేరుతో విడుదలైంది.ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన నిత్య తెలుగులో గ్యాప్ రావడంపై స్పందిస్తూ.. ‘‘తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ, అభిమానం మరచి పోలేను. తెలుగులో నేను కావాలని గ్యాప్ ఇవ్వలేదు... వచ్చిందంతే. సరైన కథ, పాత్ర కుదిరితే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే’’ అన్నారు. మరి రచయితలు, దర్శకులు ఆమెను దృష్టిలో పెట్టుకుని సరైన పాత్రలు రాస్తారేమో చూడాలి. ఏది ఏమైనప్పటికీ నిత్యామీనన్ తెలుగులో నటించే కొత్త సినిమా ప్రకటన కోసం వేచి చూడక తప్పదు.రెండేళ్లయినా.... టాలీవుడ్‌కి కెరటంలా దూసుకొచ్చారు రకుల్ ప్రీత్‌సింగ్. 2011 ఆగస్టు 26న విడుదలైన ‘కెరటం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు రకుల్. ఆ చిత్రం తర్వాత తెలుగులో రెండేళ్లు గ్యాప్ వచ్చింది ఆమెకి. ఈ గ్యాప్‌లో తమిళంలో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో తిరిగి టాలీవుడ్‌కి వచ్చారు. సందీప్ కిషన్ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013 నవంబరు 29న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారీ బ్యూటీ.‘లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయకి, స్పైడర్, మన్మథుడు 2, చెక్, కొండ పొలం, బూ’ వంటి సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు రకుల్. ‘బూ’ చిత్రం 2023 మే 27న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు దాటి పోయినప్పటికీ ఆమె నటించనున్న మరో తెలుగు సినిమాపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన లేదు. తెలుగులో రకుల్‌కి గ్యాప్ వచ్చినప్పటికీ తమిళ, హిందీ సినిమాలు చేస్తున్నారు. మరి... రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగులో కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు? అంటే కాలమే సమాధానం చె΄్పాలి.గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ‘అమ్మాయిలు కాదు... అమ్మాయి... భానుమతి... ఒక్కటే పీస్... రెండు కులాలు... రెండు మతాలు... హైబ్రీడ్ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశారు సాయిపల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగుకి హీరోయిన్గా పరిచయం అయ్యారామె. తొలి చిత్రంతోనే తనదైన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, తండేల్’ వంటి సినిమాల్లో నటించి, ఆడియన్స్‌ని అలరించారు.నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం ‘తండేల్’. ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి సాయిపల్లవి, నాగచైతన్య నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణంగా ఓ సినిమా హిట్ అయిందంటే హీరో, హీరోయిన్లకు, డైరెక్టర్స్‌కి వరుస అవకాశాలు వస్తుంటాయి. ‘తండేల్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత తెలుగులో మరో కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు సాయిపల్లవి.అయితే తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన ఆమె ‘మేరే రాహో’ అనే చిత్రం ద్వారా తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అలాగే రణ్‌బీర్ కపూర్ రాముడిగా రూ పొందుతోన్న ‘రామాయణ : పార్ట్ 1, పార్ట్ 2’ సినిమాల్లో సీతగా నటిస్తున్నారు. ఈ సినిమాలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి కావడంతో ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితం అయ్యారామె. మరి... సాయిపల్లవి తెలుగులో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. ఏడాది దాటి పోయినా... తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా అభిమానం సొంతం చేసుకున్నారు కృతీ శెట్టి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారామె. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, కస్టడీ, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చె΄్పాలి, మనమే’ వంటి చిత్రాల్లో యువ హీరోలకి జోడీగా నటించారు కృతీ శెట్టి. ‘మనమే’ సినిమా 2024 జూన్ 7న రిలీజైంది.ఆ సినిమా విడుదలై ఏడాది దాటి పోయినా టాలీవుడ్లో ఇప్పటికీ మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు కృతి. అయితే తెలుగులో ఒక్క సినిమా చేతిలో లేక పోయినా తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం బిజీ బిజీగా ఉన్నారు ఈ బేబమ్మ. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వా వాతియార్, జెనీ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారీ బ్యూటీ. మరి... కృతీ శెట్టి తెలుగులో కొత్త సినిమాకి ఎప్పుడు పచ్చజెండా ఊపుతారు? అన్నది వేచి చూడాలి. పైన పేర్కొన్న కథానాయికలే కాదు... అంజలి, డింపుల్ హయతి, శ్రద్ధా శ్రీనాథ్, రీతూ వర్మ వంటి మరికొందరు హీరోయిన్లకు కూడా తెలుగులో గ్యాప్ వచ్చింది. వారు నటించనున్న తర్వాతి తెలుగు సినిమాలపై ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ లేదు. మరి... వీరి నుంచి కొత్త కబురు ఎప్పుడొస్తుందో వేచి చూడాలి. – డేరంగుల జగన్ మోహన్ -
వచ్చే ఏడాది స్టార్ట్
ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూ పొందిన క్రైమ్ డ్రామా మూవీ ‘వడ చెన్నై’ (2018) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రకథలో రెండో భాగానికి అవకాశం ఉందని వెట్రిమారన్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అప్పట్నుంచి ‘వడ చెన్నై 2’ అప్డేట్ కోసం ధనుష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇటీవల ఓ సందర్భంలో వెట్రిమారన్ సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా తన ‘ఇడ్లీ కడై’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ధనుష్ కూడా ఈ సీక్వెల్ గురించి మాట్లాడారు. ‘‘వడ చెన్నై 2’ షూటింగ్‌ని 2026లో ఆరంభిస్తాం. 2027లో గ్రాండ్‌గా విడుదల చేస్తాం’’ అని ధనుష్ పేర్కొన్నారు. మరి... తొలి భాగంలో నటించిన ఆండ్రియా. సముద్ర ఖని, ఐశ్వర్యా రాజేశ్ సీక్వెల్లోనూ నటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
మార్కో దర్శకుడితో..?
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు తమిళ హీరో అజిత్. అయితే అజిత్ నెక్ట్స్ చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తీసిన అధిక్ రవిచంద్రన్‌తోనే అజిత్ మళ్లీ ఓ సినిమా చేయనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపించింది. అయితే మలయాళ యాక్షన్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మార్కో’ ఫేమ్ హనీష్ అధేని డైరెక్షన్లోఅజిత్ హీరోగా ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం రూ పొందనుందనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని, అజిత్‌తో ఆల్రెడీ ‘దిల్’ రాజు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఇక హనీష్‌తో నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్, సునీత తాటి ఓ హై బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాను నిర్మించనున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో ఓ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి... ఈ మల్టీస్టారర్ సినిమాలో అజిత్ హీరోగా చేస్తారా? లేక అజిత్‌తో సోలో సినిమాను నిర్మించేందుకు ‘దిల్’ రాజు సన్నాహాలు చేస్తున్నారా? అనే అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది. -
మోహన్‌లాల్ రికార్డ్.. ఒకే ఏడాదిలో రూ. 600 కోట్లు
మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ (Mohanlal)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తాజాగా తను నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam) రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకు మలయాళ అభిమానులు ఫిదా అయ్యారు. మాళవికా మోహనన్, ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదలైంది. సెప్టెంబర్ 26న ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar)లో స్ట్రీమింగ్కు కూడా రానుంది.ఎంతో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రీసెంట్గా మెహన్‌లాల్ అందుకున్నారు. ఆపై ఇదే ఏడాదిలో ఆయన నటించిన మూడు చిత్రాలు రూ. 100 కోట్ల క్లబ్లో చేరాయి. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో ఉన్నారు. 2025 మోహన్‌లాల్‌కు బాగా కలిసొచ్చిన ఏడాదిగా ఎప్పటికీ మిగిలిపోతుందని పేర్కొంటున్నారు. లూసిఫర్ (ఎంపురాన్) రూ. 268 కోట్లు, తుడరమ్ రూ. 235 కోట్ల మేరకు కలెక్ట్ చేశాయి. తాజాగా హృదయపూర్వం చిత్రం కూడా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది.మలయాళ పరిశ్రమలో ఒకే ఏడాదిలో వంద కోట్ల మార్క్‌ను ఏకంగా మూడు చిత్రాలకు అందుకున్న నటుడిగా లాల్‌కు గుర్తింపు దక్కింది. ఆపై ఒక ఏడాదిలో చిత్రపరిశ్రమలో రూ. 600 కోట్లకు పైగా మార్కెట్‌ను క్రియేట్ చేసిన నటుడిగా గుర్తింపు పొందారు. దర్శకుడు సత్యన్ అంతికాడ్తో సుమారు పదేళ్ల తర్వాత మోహన్‌లాల్ కలిసి పనిచేశారు. దర్శకుడిగా ఆయనకు వంద కోట్ల సినిమా కూడా ఇదే కావడం విశేషం. -
తమిళ దర్శకుడు నారాయణమూర్తి కన్నుమూత
సినీ దర్శకుడు నారాయణమూర్తి (59) (R D Narayanamurthy) మంగళవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. నారాయణమూర్తి 'మనదై తిరిడి విట్టాయ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత 'ఒరు పొన్ను ఆరు పయ్యా' చిత్రం చేశారు. పలు టీవీ సీరియల్స్‌కు సైతం దర్శకత్వం వహించిన నారాయణమూర్తి ఇటీవల అనారోగ్యంతో చైన్నెలోని ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అంత్యక్రియలుఅక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. స్థానిక పంబల్లో నివసించిన నారాయణమూర్తికి భార్య హంసవేణి, లోకేశ్వరన్ అనే కుమారుడు ఉన్నారు. లోకేశ్వరన్ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన శుక్రవారం చైన్నెకి రానున్నారు. అదేరోజు పంబల్లో దర్శకుడు నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్శకుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: నేనూ సెలవు తీసుకుంటా! -
'కూలీ' చేశా.. చాలా డిసప్పాయింట్ అయ్యా: రెబా
సూపర్‌స్టార్ రజనీకాంత్.. గత నెలలో 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విడుదలకు ముందు బీభత్సమైన అంచనాలు ఉండగా.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత చాలా నిరాశపరిచింది. కథకథనం ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అతిథి పాత్ర చేసిన ఆమిర్ ఖాన్ కూడా ఇందులో నటించానని తప్పు చేశానని అన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీలో నటించిన హీరోయిన్ రెబా మోనికా కూడా చాలా అప్సెట్ అయ్యానని బహిరంగంగానే చెప్పింది.తెలుగులో సామజవరగమన, మ్యాడ్ స్క్వేర్, సింగిల్ తదితర చిత్రాల్లో నటించిన రెబా మోనికా జాన్.. తమిళ, మలయాళంలోనూ హీరోయిన్గా మూవీస్ చేస్తోంది. 'కూలీ'లో శ్రుతి హాసన్ చెల్లి పాత్రలో ఈమె నటించింది. సినిమా మొత్తంలో ఈమెవి మూడు నాలుగు సీన్లు మాత్రమే ఉంటాయి. డైలాగ్స్ ఏం ఉండవు. తాజాగా ఇన్ స్టాలో ఫాలోవర్స్‌తో ముచ్చటించిన ఈమె.. 'కూలీ'లో నటించడంపై ఇప్పుడు స్పందించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అనుష్క ‘ఘాటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. నా పాత్రని ఇంకాస్త బాగా చూపించి ఉండొచ్చు. కానీ పరిస్థితులు కుదరక అనుకున్నది జరగలేదు. కానీ తలైవర్ రజనీకాంత్‌తో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉన్నాను' అని ఓపెన్‌గానే రెబా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.రెబా మాత్రమే కాదు 'కూలీ'లో ఉపేంద్ర పాత్రకు కూడా పరిమిత స్క్రీన్ స్పేస్ ఉంటుంది. ఆమిర్ ఖాన్ పాత్ర కూడా తేలిపోయింది. నాగార్జున పాత్రని కూడా ప్రారంభంలో బాగానే చూపించారు కానీ ముగింపు సరిగా ఇవ్వలేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌పైనా చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.(ఇదీ చదవండి: నేను ఇప్పుడు ఇలా.. అల్లు అర్జున్ దీనికి కారణం: తమన్నా)I am really upset and disappointed ☹️ I know I could have offered so much more but sometimes things dont go your way. Still I am happy that I got the chance to work with #Thalaivar #Rajinikanth 🙂– #RebaMonicaJohn opens up about her role in #Coolie 📽️pic.twitter.com/zDUEAKHUMC— Movies Singapore (@MoviesSingapore) September 23, 2025 -
తమిళనాడు అవార్డ్స్ ప్రకటన.. సాయి పల్లవి, అనిరుధ్, ఎస్ జే సూర్యలకు దక్కిన గౌరవం
తమిళనాడు ప్రభుత్వం తాజాగా కలైమామణి అవార్డ్స్‌ను ప్రకటించింది. సాహిత్యం, సంగీతం, నాటకం వంటి రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి ఈ అవార్డ్‌తో గౌరవిస్తారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను ఈ అవార్డ్‌కు ఎంపికైన వారి జాబితాను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెలలో చెన్నైలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో అత్యున్నత పౌర పురస్కారంగా 1954 నుంచి ఈ అవార్డ్స్‌ను అందిస్తున్నారు.ఈ అవార్డు అందుకోనున్న గ్రహీతలలో నటి సాయి పల్లవి, దర్శకుడు-నటుడు ఎస్.జె. సూర్య, దర్శకుడు లింగుసామి (2021), నటుడు విక్రమ్ ప్రభుతో పాటు మరో ముగ్గురు (2022), సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్, నటుడు మణికందన్ (2023) ఉన్నారు. 2021- 2023 సంవత్సరాలకు సంబంధించి ఈ అవార్డ్ కోసం మొత్తం 90 మంది కళాకారులు ఎంపికయ్యారు. కొరియోగ్రాఫర్, నటుడు శాండీతో పాటు నేపథ్య గాయని శ్వేతా మోహన్ వంటి స్టార్స్ ఉన్నారు. జాతీయ పురస్కారాల విభాగంలో నేపథ్య గాయకుడు కె.జె.ఏసుదాస్‌కు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పురస్కారాన్ని ప్రకటించారు. 1954లో తమిళనాడు ప్రభుత్వం స్థాపించిన తమిళనాడు ఈశై నాటక మండలి (Tamil Nadu Iyal Isai Nataka Mandram) ద్వారా ఈ అవార్డ్ ప్రారంభించబడింది. సంగీతం, నాటకం, నృత్యం, చిత్రకళ, సినిమా, సాహిత్యం వంటి రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులకు ఈ అవార్డు అందజేస్తారు. ఇది తమిళనాడులో అత్యున్నత కళా పురస్కారంగా భావించబడుతుంది. దక్షిణ భారతదేశంలో కళాకారులకు ఇది ఒక గౌరవ చిహ్నంగా నిలుస్తుంది. కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వైయస్ సుధా రఘునాథన్, వైజయంతీమాలా వంటి ప్రముఖులు ఈ అవార్డును ఇప్పటికే పొందారు. -
అక్కడ అన్ని బూతు సినిమాలే.. మా పేరెంట్స్ నటించవద్దని చెప్పారు: సినీ నటి
ఇంటర్నెట్ పుణ్యమా అని అడల్ట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఒకప్పుడు అంటే షుమారుగా 3 దశాబ్ధాల క్రితం ఈ పరిస్థితి లేదు. పెద్దలకు మాత్రమే అంటూ ఊరించే ఎ సర్టిఫికెట్ సినిమాల కోసం సదరు అడల్ట్ మూవీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. అలాంటి వారందరికీ ఆంగ్ల చిత్రాల తర్వాత మన దేశీయ భాషలో ఒకే ఒక చిత్ర పరిశ్రమ నుంచి సాంత్వన లభించేది. అది...ప్రస్తుతం దేశంలోనే అత్యంత వైవిధ్య భరిత చిత్రాలకు కేరాఫ్‌గా ఉన్న మళయాల చిత్ర పరిశ్రమ. అదే ఒకప్పుడు బూతు చిత్రాలకు చిరునామాగా ఉండేది. అప్పట్లో షకీలా తదితర అడల్ట్ మూవీ స్టార్స్ మళయాళ సినిమాలపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించేవారు. దాంతో దేశవ్యాప్తంగా బి గ్రేడ్ సినిమాలంటే మళయాళమే అనే గుర్తింపు వచ్చేసింది. బహుశా ఇప్పటి తరానికి పెద్దగా తెలియని ఆనాటి విషయాలను గుర్తుకు వచ్చేలా చేసింది తమిళ సినీనటి ఛార్మిల(Charmila)మలయాళ సినిమాలో ఒకప్పుడు ప్రముఖ తారగా వెలుగొందింది నటి చార్మిల, ఆ పరిశ్రమలో చేరడానికి ముందు తనకు ఆ పరిశ్రమ పట్ల ఉన్న అభిప్రాయం గురించి వెల్లడించింది, గతంలో అంటే 1980– 1990 మధ్య కాలంలో మళయాళ చిత్రపరిశ్రమ ఖ్యాతి బి–గ్రేడ్ చిత్రాలవెల్లువలో కొట్టుకుపోయిందని చెప్పిందామె. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో మలయాళ సినిమా ఆఫర్లను అంగీకరించకుండా తన తల్లిదండ్రులు అడ్డుకున్నారని గుర్తుచేసుకుంది. ‘‘అప్పట్లో, మలయాళ సినిమా అంటే కేవలం బి–గ్రేడ్ చిత్రాలను మాత్రమే నిర్మిస్తుందని చాలా మంది భావించేవారు, అందుకే నా తల్లిదండ్రులు ఆ పరిశ్రమకు నన్ను పంపడానికి ఇష్టపడలేదు, అందుకే మొదటి ఆఫర్ వచ్చినప్పుడు భయపడ్డా. పేరొందిన దర్శకులు సంప్రదించినప్పుడు కూడా నటించడానికి నిరాకరించాను’’ అంటూ వెల్లడించారామె.కేరళ లోపల కాకుండా ఆ రాష్ట్రం బయట థియేటర్లలో నడిచిన మళయాళ సినిమాల వల్లనే మళయాళ చిత్ర పరిశ్రమకు ఈ రకమైన కళంకం అంటిందని ఆమె అభిప్రాయపడింది. పక్కరాష్ట్రాల్లోని జనం మలయాళ చిత్రాల గురించి మాట్లాడినప్పుడు, వారికి గుర్తుకు వచ్చేది ఎ–సర్టిఫికేట్ సినిమాలు, వాటి పోస్టర్లు మాత్రమే. ‘వారికి మళయాళ వినోదం అంటే డ్రగ్స్ లేడీస్,‘ అంటూ చెప్పిందామె. సీనియర్ నిర్మాత కె బాలాజీ తన కుటుంబాన్ని ఒప్పించిన తర్వాతే బాలాజీ అల్లుడు నేటి సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో తాను నటించానంది. మలయాళ సినిమా అంతా బి–గ్రేడ్ టైప్ కాదని, మోహన్ లాల్ మమ్ముట్టి వంటి ప్రధాన నటులు మంచి చిత్రాలలో మాత్రమే పనిచేస్తారని ఆయన అర్ధం అయేలా చెప్పడంతో చార్మిల తన తొలి మలయాళ ప్రాజెక్ట్‌లో మోహన్ లాల్ సరసన నటించింది, తరువాత క్లాసిక్‌ల ద్వారా ఆ భాషలో కెరీర్‌కు బాటలు వేసుకుంది.ఆ కాలపు మళయాళ చిత్ర పరిశ్రమ గురించి గుర్తు చేసుకుంటూ ‘‘ బి–గ్రేడ్ సినిమాలో పనిచేసిన నటులు ‘పూర్తిగా భిన్నమైన వర్గానికి‘ చెందినవారని వారు బస చేసిన హోటళ్ళు మా హోటళ్ళలా ఉండేవి కావు‘ అని ఆమె చెప్పింది, తరువాత వారిలో చాలామంది సినిమాలను విడిచిపెట్టారని, కొందరు వివాహం తర్వాత విదేశాలకు వెళ్లారని లేదా ఇతర భాషలలో గ్లామర్ పాత్రలకు మారారని ఆమె చెప్పింది.ఆ సమయంలో మలయాళ సినిమా చుట్టూ వివాదాలు ఎలా ఉన్నా చార్మిల సినిమాలు స్వర్ణ యుగంలో భాగంగా పరిగణన పొందాయి. ఆమె తమిళనాడులో జన్మించినప్పటికీ, ’ధనం’లో గ్రామీణ అమ్మాయి థంకమ్ పాత్రలో తన నటనతో మలయాళ ప్రేక్షకుల హదయాలను గెలుచుకుంది. తరువాత ఆమె ’అంకుల్ బన్ ’, ’కేళి’, ’ప్రియపెట్ట కుక్కు’ మోహన్ లాల్, జయరామ్, వినీత్ వంటి తారలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో పనిచేస్తోంది. అయినప్పటికీ ఆమె అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలు మాత్రం ఆమె మలయాళ విహారయాత్రలుగా మిగిలిపోయాయి. నటుడు బాబు ఆంటోనీ ఆ తరువాత విడాకులు తీసుకున్న నటుడు హోస్ట్ కిషోర్ సత్యతో ఆమె గత సంబంధాలు సహా ఆమె వ్యక్తిగత జీవితం ఆమె స్క్రీన్ కెరీర్ లాగే అందరి దృష్టినీ ఆకర్షించింది. -
కాంతార చూడాలంటే మందు, ముక్క జోలికి వెళ్లకూడదంటూ పోస్ట్!
ఈ ఏడాది సినీజనం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కాంతార ప్రీక్వెల్ ఒకటి. 2022లో వచ్చిన కాంతార మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. దీనికి ప్రీక్వెల్‌గా వస్తోంది కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1 Movie). రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది.కాంతార చూడాలంటే..అయితే కాంతార చూడాలంటే కొన్ని నియమాలు పాటించాలంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. మద్యం సేవించకూడదు, సిగరెట్ తాగకూడదు, మాంసం తినకూడదు. కాంతార చూసేవరకు వీటిని కచ్చితంగా ఫాలో అవండి అన్నది ఆ పోస్ట్ సారాంశం. అయితే అది ఫేక్ ప్రచారమని కొట్టిపాడేశాడు రిషబ్ శెట్టి (Rishab Shetty). బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకరి అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఎవరిష్టం వారిది. డిలీట్ చేశారుకొందరు ఫేక్ పోస్ట్ సృష్టించిన విషయం మా దృష్టికి వచ్చింది. అది చూడగానే నేను షాకయ్యాను. వెంటనే దాన్ని నిర్మాతల గ్రూప్‌కు పంపించాను. ఆ పోస్ట్ చూశాక వెంటనే స్పందించలేకపోయాం. సినిమా పేరు ట్రెండింగ్‌లో ఉండటంతో పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆ ఫేక్ పోస్ట్ చేసినవారు దాన్ని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు అని రిషబ్ శెట్టి తెలిపాడు.చదవండి: బిగ్‌బాస్‌కు వద్దన్నాం.. మీరే ఓట్లేశారు.. మరిప్పుడెందుకు ట్రోలింగ్? -
సూర్య పనిమనుషుల చేతివాటం.. రూ.42 లక్షలు స్వాహా!
తమిళ హీరో సూర్య (Suriya)కి భద్రతా అధికారిగా పని చేస్తున్న జార్జ్ ప్రభు ఆర్థికంగా మోసపోయారు. సూర్య ఇంట్లో పనిచేసేవారి చేతుల్లో రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య ఇంట్లో సులోచన, ఆమె కుమారుడు పని చేస్తున్నారు. వీరు సెక్యూరిటీ ఆఫీసర్ జార్జ్‌కు అధిక వడ్డీ ఆశ చూపారు. దీంతో ఆయన మొదటగా రూ.1 లక్ష ఇచ్చారు. దానికి బదులుగా 30 గ్రాముల బంగారాన్ని వీళ్లు తిరిగిచ్చారు. జార్జ్‌కు నమ్మకం కుదరడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం రూ.42 లక్షలను నిందితులకు బదిలీ చేశారు. రూ.2 కోట్ల మేర మోసంఅప్పటినుంచి వాళ్లు డబ్బులివ్వకుండా సైలెంట్ అయ్యారు. దీంతో భద్రతా అధికారి తన డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా సులోచన కుటుంబం అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇదే కుటుంబం చెన్నైలో పలువురిని నమ్మించి రూ.2 కోట్ల దాకా మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ నలుగురూ సూర్య ఇంట్లో పనిచేసేవారే కావడం గమనార్హం! చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. -
కాంతార ప్రీక్వెల్.. అంచనాలకు తగ్గట్లుగానే బిగ్ ప్లాన్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కాంతార చాప్టర్-1(Kantara Chapter 1). పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్)అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం ఫుల్‌గా ప్రిపేర్ అయ్యారు. ఈ ప్రీక్వెల్ మూవీ కోసం ఇప్పటికే బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. కాంతార ప్రీక్వెల్‌ను దేశవ్యాప్తంగా దాదాపు 7 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ కానుంది. అంతే కాకుండా దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో.. ఇప్పుడు ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రిషబ్‌శెట్టి పోస్ట్ ప్రొడక్షన్పనుల్లో బిజీగా ఉన్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు. -
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బహుకరించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన మోహన్ లాల్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సినీరంగంలో అందించే అత్యుత్తమ అవార్డ్‌ను ప్రకటించింది.కాగా.. 1980లో సినిమాల్లో అడుగుపెట్టిన మోహన్ లాల్ దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. మంజిల్ విరింజ పూక్కళ్ అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 45 ఏళ్ల తన సినీ కెరీర్లో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ నటించారు. తెలుగులో జనతా గ్యారేజ్ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మోహన్ లాల్.. కంప్లీట్ యాక్టర్ అనే పేరును సంపాదించుకున్నారు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటనతో ఆయన నట సామర్థ్యానికి తగిన గౌరవం దక్కిందని సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.#WATCH | Delhi: 71st National Film Awards | Dadasaheb Phalke Award recipient Actor Mohanlal says, "...This is not a dream come true. This is something far greater. It's magical. It's sacred..."He says, "As a representative of the Malayalam film industry, I am deeply humbled to… pic.twitter.com/x1z6veIslh— ANI (@ANI) September 23, 2025 -
ఆ మాట నేనెప్పుడు అనలేదు: హీరోయిన్
సినిమా తారలపై రకరకాల రూమర్స్ వస్తుంటాయి. వాళ్ల సినిమాలతో పాటు పర్సనల్ విషయాలపై కూడా నెట్టింట గాసిప్స్ చక్కర్లు కొడుతుంటాయి. అయితే చాలా మంది నటీనటులు వాటిని పెద్దగా పట్టించుకోరు. అవసరం అయితే తప్ప స్పందించరు. అయితే ఆ అబద్దం నిజమని నమ్మినట్లుగా తెలిస్తే మాత్రం వెంటనే ఖండిస్తారు. తాజాగా నటి కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan ) అదే పని చేశారు. తనపై మీడియాలో వచ్చిన ఓ పుకారుని తీవ్రంగా ఖండించారు.తనను, తన సోదరుడిని తల్లిదండ్రులు వియత్నాంలోని అనాథశ్రమంలో వారం రోజుల పాటు వదిలి వెళ్లారని.. జీవితం అంటే ఏంటో తెలియాలనే ఉద్దేశ్వంతో అలా చేశారని కల్యాణి చెప్పినట్లుగా ఓ సినీ వెబ్సైట్ వార్తలను రాసుకొచ్చింది. ఈ విషయం కళ్యాణి దృష్టికి వెళ్లడంతో..ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి మాటలను నేనెప్పుడు అనలేదని..దయచేసి ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురే ఈ కల్యాణి.‘హలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘చిత్రలహరి’తో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల ఆమె నటించిన ‘కొత్త లోక’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆగస్ట్ 28న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 270పైగా వసూళ్లను సాధించింది.. మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రగా నిలిచింది. -
అట్టహాసంగా జాతీయ అవార్డుల వేడుక.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం
దేశ రాజధాని ఢిల్లీ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. 2023 ఏడాది గానూ ఈ అవార్డులను అందించారు. ఉత్తమ నటులుగా షారూఖ్ ఖన్, విక్రాంత్ మాస్సే.. జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 12 th ఫెయిల్ చిత్రానికి ఘనత దక్కింది. ఇవాళ ఢిల్లీలో 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్‌గా నిర్వహించారు.తెలుగులో జాతీయ అవార్డు గ్రహీతలు వీళ్లే.. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి జాతీయ అవార్డ్ దక్కింది. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్,స్టంట్ కొరియోగ్రఫీ అవార్డ్ హనుమాన్ సొంతం చేసుకుంది. బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాట అనే పాటకు బెస్ట్ లిరిక్స్ విభాగంలో అవార్డ్ సొంతమైంది. బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ సినిమా( సాయి రాజేష్ నీలం), బెస్ట్ మెయిల్ ప్లే బ్యాక్ సింగర్ రోహిత్‌ను జాతీయ అవార్డులు వరించాయి. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) జాతీయ అవార్డ్ అందుకుంది. ఉత్తమ్ చిత్రం యానిమేషన్ విజువల్స్,గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్ నేషనల్ అవార్డ్‌ను సాధించింది.#WATCH | Delhi: Superstar Shah Rukh Khan, actors Rani Mukerji and Vikrant Massey present at Vigyan Bhawan for the 71st National Film Awards. The Best Actor in a Leading Role award has been shared by Shah Rukh Khan for 'Jawan' and Vikrant Massey for '12th Fail', and the Best… pic.twitter.com/PfogNDvfyx— ANI (@ANI) September 23, 2025 -
లగ్జరీ కార్ల స్మగ్లింగ్.. స్టార్ హీరోల ఇళ్లపై కస్టమ్స్ దాడులు
భూటాన్ ద్వారా లగ్జరీ వాహనాల అక్రమ దిగుమతిపై కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) కేరళ వ్యాప్తంగా భారీ దాడులను ప్రారంభించింది. సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ అధికారులతో సహా వారి నివాసాల్లో రవాణ కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా కొచ్చిలోని నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇళ్లపై కూడా ఈ బృందం దాడులు చేశాయి.'ఆపరేషన్ నమ్‌ఖోర్' (భూటాన్ భాషలో వాహనం) పేరుతో ఈ ఆపరేషన్ కేరళ అంతటా కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం, కుట్టిపురం, త్రిస్సూర్‌తో సహా దాదాపు 30 ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు చేశారు. భూటాన్ నుంచి హై-ఎండ్ కార్లను అక్రమంగా భారత్‌లోకి దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అనుమానిస్తోంది. ఇందులో ల్యాండ్ క్రూయిజర్లు, ప్రాడో, ల్యాండ్ రోవర్లు వంటి లగ్జరీ SUVలు ఉన్నాయి. భూటాన్‌లో మొదట రూ.5 లక్షల కంటే తక్కువ ధరకు అక్కడ కొనుగోలు చేస్తారు. ఆపై కేరళ నంబర్ ప్లేట్‌తో రీమోడల్ చేసి తిరిగి రూ.40 లక్షల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. వాటి అసలు ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ క్రమంలో పన్ను వెగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ వాహనాల్లో కొన్నింటిని మలయాళ నటులు కొనుగోలు చేశారని కస్టమ్స్ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లపై కూడా కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. అయితే, వారి వద్ద ఎలాంటి అక్రమ వాహనాలు లేవని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ వాహనాల స్మగ్లింగ్ వెనుక హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక రాకెట్ ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వాహనాలను తెలిసి కూడా ప్రముఖులు ఎందుకు కొంటున్నారనేది విచారణలో తేలాల్సిన విషయం.వివిధ నివేదికల ప్రకారం, భూటాన్ ఆర్మీ వాహనాలతో పాటు ఫారిన్ కార్లను వేలంలో తక్కువ ధరలకు విక్రయించి, కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాతనే ఈ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఖరీదైన వాహనాలను హిమాచల్ ప్రదేశ్‌కు రవాణా చేసి, తాత్కాలిక చిరునామాలను ఉపయోగించి మొదట నమోదు చేస్తారు. నటులు, వ్యాపార ప్రముఖులు సహా ప్రముఖ కొనుగోలుదారులకు అధిక ధరలకు వాటిని ప్లాన్ ప్రకారం విక్రయిస్తారు. ఈ వాహనాలను భూటాన్‌లో చట్టబద్ధంగా వేలం వేస్తున్నప్పటికీ, సరైన పన్ను లేకుండా భారతదేశంలో వాటిని దిగుమతి చేస్తున్నారు. సరైన ఆధారాలు లేని ఈ వాహనాల వల్ల భారత సెలబ్రిటీలకు కూడా చిక్కలు తప్పవని చెప్పవచ్చు. -
హైకోర్ట్ తీర్పు.. 'కాంతార'కు లైన్ క్లియర్
కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే టికెట్ రేట్ల విషయమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చిత్ర నిర్మాతలు హైకోర్టుని ఆశ్రయించారు. గత కొన్నిరోజులుగా ఈ కేసు విషయమై వాదనలు నడిచాయి. ఇప్పుడు నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వెలువడింది.కర్ణాటకలోని టికెట్ రేట్లని ప్రభుత్వం నిర్ణయిస్తూ కొన్నిరోజుల క్రితం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏ థియేటర్లోనైనా సరే రూ.200 కంటే ఎక్కువ ధరకు టికెట్ అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు. 'కాంతార'కి ఇదే అమలు చేస్తే పెట్టిన బడ్జెట్ తిరిగి రావడం కష్టమవుతుంది. దీంతో నిర్మాతలు హైకోర్ట్‌కు వెళ్లారు. టికెట్ ధరల్లో వెసులుబాటు కల్పించాలని పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వ రూల్‌ని తాత్కాలికంగా హోల్ట్‌లో పెట్టింది. టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు నిర్మాతలకు కల్పించింది.(ఇదీ చదవండి: 'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)ఈ క్రమంలోనే 'కాంతార' టికెట్ రేట్ల విషయంలో లైన్ క్లియర్ అయింది. ఫలితంగా కర్ణాటకలో భారీ రేట్లు ఉండబోతున్నాయి. తమిళనాడులో ఎలానూ రూ.200 లోపే టికెట్ ధర ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి పెంపు ఏమైనా తీసుకొస్తారా? లేదంటే ఉన్న రేట్లకు టికెట్స్ అమ్ముతారా అనేది చూడాలి?'కాంతార' తొలి భాగానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమాని తీశారు. ఈసారి భారీ ఎత్తున మూవీని తెరకెక్కించారు. ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, భక్తి, యుద్ధాలు తదితర అంశాలు ఉన్నాయి. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. ఇతడికి జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్‌గా చేశాడు.(ఇదీ చదవండి: ఈ హీరోలు అసలెక్కడున్నారు? సినిమాలు ఎందుకు చేయట్లేదు?) -
'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి
కన్నడ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో వచ్చిన తొలి భాగానికి ప్రీక్వెల్ ఇది. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం అన్ని భాషల ట్రైలర్స్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో టీమ్ అంతా పాల్గొని మూవీ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి.. సినిమా గురించి మాట్లాడాడు. అలానే 'కాంతార 1' చూడాలంటే మందు, సిగరెట్, మద్యం సేవించకుండా రావాలని చెప్పి వైరల్ అవుతున్న పోస్టర్‌పైన స్పందించాడు.'కాంతార అనేది ఐదేళ్ల ఎమోషనల్ జర్నీ. తొలి భాగానికి రెండేళ్లు, ప్రీక్వెల్ కోసం మూడేళ్లు. ఈ ఐదేళ్లలో నా కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేకపోయాను. అయితే సినిమాని పూర్తి చేసిన అనుభూతి కలిగింది. మా టీమ్‌కి గత మూడు నెలలుగా సరైన నిద్ర లేదు. ఎందుకంటే పని జరుగుతూనే ఉంది. ప్రతిఒక్కరూ ఇది తమ మూవీ అన్నట్లు కష్టపడ్డారు. చెప్పాలంటే షూటింగ్లో నేను కూడా 4-5 సార్లు చనిపోవాల్సిన వాడిని. కానీ ఆ దైవమే నన్ను రక్షించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: నామినేషన్స్‌లో ఆరుగురు.. రీతూని మోసం చేసిన పవన్)'కాంతార' తొలి భాగం ఓ పల్లెటూరిలో జరిగే డ్రామా కాగా ఈసారి సినిమాని భారీగానే తెరకెక్కించారు. స్టోరీ సెటప్ అంతా అడవికి మారింది. అలానే శివ(రిషభ్) తండ్రి కాంతార, అడవిలో తప్పిపోవడానికి కంటే ముందు ఏం జరిగింది అనే బ్యాక్ డ్రాప్‌తో ప్రీక్వెల్ తీశారు. ఈసారి స్నేహం, నమ్మకద్రోహం, యుద్ధాలు తదితర అంశాల్ని ట్రైలర్లో చూపించారు. బ్యౌక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈసారి రిషభ్ శెట్టి జంటగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్‌గా చేశాడు.ఇకపోతే 'కాంతార 1' సరికొత్త రికార్డ్ సృష్టించింది. 12 గంటల్లోపే అన్ని భాషాలు కలిపి 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మంగళవారం మధ్యాహ్నం వస్తే 24 గంటలు పూర్తవుతుంది. అప్పటికీ మరిన్ని మిలియన్స్ వ్యూస్‌తో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా చూడాలంటే మందు, సిగరెట్, మద్యం తాగకుండా రావాలని వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని రిషభ్ శెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు. తొలుత ఇది చూసి షాకయ్యానని, నిర్మాణ సంస్థని అడిగితే అది ఫేక్ పోస్టర్ అని క్లారిటీ ఇచ్చారని, దాని గురించి మాట్లాడలనుకోవట్లేదని అన్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా)"#KantaraChapter1: We haven't slept properly for 3 months because of continuous work🫡👏. Everyone supported it as like their own film♥️. In fact, if I count, I was about to die 4 or 5 times during shoot, the divinity we trust saved me🛐♥️"- #RishabShetty pic.twitter.com/8pufSUj7ZI— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025"#KantaraChapter1: I got shocked when I saw no smoking, no alcohol, and no meat Poster😳. In fact I cross checked with the production too🤝. Someone has fakely posted it to get popularity, we don't even want to react for that fake poster❌"- #RishabShettypic.twitter.com/I89jj7y7GP— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025 -
జార్జ్ కుట్టి ప్రపంచంలోకి...
ప్రేక్షకులను మరోసారి జార్జ్ కుట్టి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు మోహన్‌లాల్ సిద్ధమయ్యారు. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్‌లాల్ కాంబినేషన్లోని ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే వచ్చిన ‘దృశ్యం 1, దృశ్యం 2’ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 3’ రానుంది.ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం కేరళలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాల్లో నటించిన మీనా ‘దృశ్యం 3’లోనూ నటిస్తున్నారు. జార్జ్ కుట్టి పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. ‘‘జార్జ్ కుట్టి ప్రపంచం మళ్లీ జీవం పోసుకుంది. ‘దృశ్యం 3’ పూజా కార్యక్రమాలతో మొదలైంది’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా మోహన్ లాల్ పోస్ట్ చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇక మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ వార్ డ్రామా ‘వృషభ’ చిత్రం ఈ దీపావళికి రిలీజ్ కానుంది. -
తల్లి అంత్యక్రియలు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన రాధిక!
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్(Radhika Sarathkumar) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి మరణంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని రాధిక నివాసంలో తల్లి గీత పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధిక ఫుల్ ఎమోషనలయ్యారు. ఈ విషాదం సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. రాధిక సోదరి, నటి నిరోష కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రాధిక తల్లి, సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధ సతీమణి గీత (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ రాధిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. రాధిక కుమార్తె రాయనే మిథున్ తన అమ్మమ్మను తలచుకుంటూ భావోద్వేగాని గురైంది.(ఇది చదవండి: రాధిక శరత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం) -
ఉన్ని ముకుందన్ బర్త్‌డే.. 'మా వందే' నుంచి పోస్టర్ రిలీజ్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతమవుతోంది. 'మా వందే' (Maa Vande Movie) పేరిట ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan).. మోదీగా నటించనున్నారు. క్రాంతి కుమార్ సీహెచ్ దర్శకత్వం వహిస్తుండగా వీర్ రెడ్డి.ఎం నిర్మిస్తున్నారు. ఇటీవల (సెప్టెంబర్ 17న) మోదీ బర్త్‌డే సందర్భంగా మా వందే ప్రాజెక్ట్ ప్రకటించారు. నేడు (సెప్టెంబర్ 22) ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.మోదీ బయోపిక్..ఇందులో మోదీ జనం ఎదుట స్టేజీపై నడుస్తున్నట్లుగా ఉంది. అతడి ఆశయాన్ని, సంకల్పాన్ని తల్లి ఆశీర్వదిస్తున్నట్లుగా పోస్టర్లో చూపించారు. ఈ మూవీలో మోదీ బాల్యం నుంచి నేటి వరకు జరిగిన ఎన్నో అంశాలను చూపించనున్నారు. వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ప్రేరణ ఎంతో ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని.. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఇవ్వనున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.From Maa’s blessing to the nation’s anthem… ✨Team #MaaVande wishes @Iamunnimukundan a very Happy Birthday! ❤️🤗#HBDUnniMukundan@silvercast_prod @sannajaji @veerreddy_m @DOPSenthilKumar @RaviBasrur @Sreekar_Prasad @sabucyril @SolomonStunts @GangadharNS1 @MaaVandeMovie pic.twitter.com/rb6JsF30yp— Maa Vande (@MaaVandeMovie) September 22, 2025చదవండి: హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై మనీష్ బిగ్‌బాంబ్ -
రాధిక శరత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రాధిక తల్లి, సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధ సతీమణి గీత (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (సెప్టెంబర్ 21న) రాత్రి మరణించారు. గీత మృతితో రాధిక కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అంత్యక్రియలునేడు సాయంత్రం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో గీత అంత్యక్రియలు జరపనున్నట్లు కుటంబసభ్యులు వెల్లడించారు. ప్రముఖ నటుడు మద్రాస్ రాజగోపాల్ రాధాకృష్ణన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతడి ముగ్గురు భార్యలు సరస్వతి, ధనలక్ష్మి, గీత ద్వారా మొత్తం 12 మంది సంతానం జన్మించారు. వారిలో హీరోయిన్లు రాధిక శరత్ కుమార్, నిరోషా ఉన్నారు.చదవండి: 25 ఏళ్ల తర్వాత విజయ్, జ్యోతికల హిట్ సినిమా రీరిలీజ్ -
25 ఏళ్ల తర్వాత విజయ్, జ్యోతికల హిట్ సినిమా రీరిలీజ్
కోలీవుడ్ నటుడు విజయ్, జ్యోతిక జంటగా నటించిన చిత్రం ఖుషి. నటి శిల్పాశెట్టి, ముంతాజ్ వేరువేరుగా 2 ప్రత్యేక పాటల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. ఎస్జే. సూర్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఖుషీ చిత్రానికి దేవా సంగీతాన్ని, జీవా చాయాగ్రహణం అందించారు. చిన్న ఈగో ప్రధాన అంశంగా రూపొందిన ఈ యూత్‌ఫుల్ లవ్ కథా చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. 25 ఏళ్ల తర్వాత ఖుషి చిత్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, డిజిటల్ ఫార్మెట్లో రూపొంది ఈనెల 25న రీ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శక్తి ఫిలిమ్స్ అధినేత శక్తివేల్ తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాదరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ విజయ్ మాస్ హీరోగా ఎదుగుతున్న సమయంలో రూపొందించిన క్లాసికల్ ప్రేమకథా చిత్రం ఖుషి అని చెప్పారు. తాను ఇంతకు ముందు విజయ్ హీరోగా నిర్మించిన గిల్లి చిత్రం రీ రిలీజ్ అయి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందన్నారు. అదేవిధంగా ఖుషీ చిత్రం కూడా రికార్డ్ కలెక్షన్లను సాధిస్తుందనే నమ్మకం ఉందని ఏఎం రత్నం అన్నారు. అదేవిధంగా ఖుషీకి సీక్వెల్ చేయాలన్న ఆలోచన కూడా కలుగుతోందని ఆయన చెప్పారు. అయితే ఎస్జే. సూర్య మాట్లాడుతూ ఖుషీకి సీక్వెల్ అనేది కాలమే నిర్ణయిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగులో పవన్ రీమేక్ఖుషి సినిమా 2000 సంవత్సరంలో మొదట తమిళ్లో విడుదలైంది. అక్కడ భారీ విజయం అందుకున్న తర్వాత తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేశారు. అయితే, కథ బాగుండటంతో దర్శకుడు ఎస్. జె. సూర్య హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్ వర్షన్లను ఒకేసారి ప్లాన్ చేశారని సమాచారం. అయితే, మొదట తమిళ్ వర్షన్ విడుదల అయింది. 2001లో తెలుగులో ఖుషి విడుదలైన విషయం తెలిసిందే. -
రాజమౌళి కంటే ధనుష్‌తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్
తమిళ నటుడు సత్యరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 'బాహుబలి' కట్టప్పగా చాలా ఫేమస్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఇతడు ధనుష్ 'ఇడ్లీ కడై' మూవీలో కీలక పాత్ర పోషించాడు. అక్టోబరు 01న ఈ చిత్రం తెలుగు, తమిళంలో థియేటర్లలోకి రానుంది. శనివారం సాయంత్రం ట్రైలర్ లాంచ్ జరగ్గా.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్యరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. హీరోయిన్ రాశి)'రాజమౌళి, ధనుష్ ఇద్దరితో పనిచేయడం పోల్చిచూస్తే.. ధనుష్‌తో పనిచేయడమే కష్టం. ఎందుకంటే దర్శకుడిగా ధనుష్‌కి చాలా క్లారిటీ ఉంది. ఇడ్లీ కడై ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ సినిమా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఢమాల్ డుమాల్ అనే యాక్షన్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇది అలాంటి మూవీ కాదు. ఇదో ఫీల్ గుడ్ మూవీ' అని సత్యరాజ్ చెప్పుకొచ్చాడు.రాజమౌళి డైరెక్షన్ అంటే నటీనటులని బాగా కష్టపెడతాడనే పేరుంది. అలాంటిది ఈ డైరెక్టర్ కంటే ధనుష్ డైరెక్షన్లో పనిచేయడం కష్టమని సత్యరాజ్ చెప్పడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇకపోతే ఈ మూవీ 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. మురళి అనే ఓ కుర్రాడు.. చెఫ్‌గా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాడు. కానీ వారసత్వంగా వచ్చిన ఓ ఇడ్లీ కొట్టు నడిపేందుకు తిరిగి సొంతూరికి వచ్చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మరి మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్.. కనిపించకుండా పోయిన ‘అందాల తార’!) -
మలయాళ స్టార్ జంట కూతురు.. చిన్నప్పుడు అనాథాశ్రమంలో..
మలయాళ స్టార్ నటుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) రికార్డులు తిరగరాస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ మోహన్‌లాల్ 'ఎల్2: ఎంపురాన్' కలెక్షన్లను దాటేసి ఏకంగా రూ.266 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా రికార్డులోకెక్కింది. మంచి సలహాసూపర్ హీరోగా నటించిన కల్యాణికి సౌత్ నుంచి నార్త్ వరకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె తండ్రి విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోవద్దని జాగ్రత్తలు చెప్పాడు. అలాగే పరాజయాన్ని మనసుకు తీసుకోవద్దని మంచి మాట చెప్పాడు. కల్యాణి కూడా ఎప్పుడూ స్టార్ హీరో కూతుర్ని అని ఎప్పుడూ బిల్డప్ కొట్టలేదు. పైగా తండ్రి మాటను తు.చ తప్పకుండా పాటిస్తుంది.అనాథాశ్రమంలో..అందుకే చిన్నప్పుడు తల్లిదండ్రుల కోరిక మేరకు కొద్దిరోజులపాటు అనాథాశ్రమంలో ఉంది. కల్యాణియే కాదు, ఆమె సోదరుడు సిద్దార్థ్ కూడా అనాథాశ్రమంలో ఉన్నారు. మలయాళ స్టార్ జంట ప్రియదర్శన్- లిస్సీ జంటే తమ పిల్లల్ని వియత్నాంలోని ఓ ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఇందుకో బలమైన కారణం ఉంది. పేరు, సంపాదన, లగ్జరీని పక్కనపెట్టి జీవితం విలువ నేర్పడానికే వాళ్లు ఈ పని చేశారు. కల్యాణి, సిద్దార్థ్ కూడా అనాథలతో కలిసి తినేవారు, ఆడుకునేవారు, వాళ్లతోనే కలిసి నిద్రించేవారు. అలా చిన్నప్పటినుంచే వారికి మానవత్వం, మంచితనం వంటి విలువలను నేర్పించారు.చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. జీవితంలో మర్చిపోలేని విషాదం -
నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. జీవితంలో మర్చిపోలేని విషాదం!
శుభాకాంక్షలు, గోకులంలో సీత, పెళ్లి పందిరి, స్నేహితులు, ప్రేయసి రావే.. ఇలా పలు సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది రాశి (Raasi). ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. హీరోయిన్‌గానే కాకుండా నిజం మూవీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ యాక్ట్ చేసి మెప్పించింది. చాలాఏళ్ల తర్వాత మళ్లీ ఆమె సినిమాలతో బిజీ అవుతోంది.చిరంజీవితో సినిమాతాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాశి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. నేను చెన్నైలోని తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగాను. నాకు మేకప్ వేసుకోవడం నచ్చదు, సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒక్కసారి యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాక నేను చేసే పనిని ఎప్పుడూ తక్కువ చూడలేదు. నా పనిని నేనెంతో గౌరవిస్తాను. ఇండస్ట్రీకి వచ్చేవారికి కూడా పనిని గౌరవించడం నేర్చుకోమని చెప్తాను. పెళ్లికూతురినయ్యాక..ఇకపోతే నేను చిరంజీవితో ఓ సినిమా చేయాల్సింది. ఆర్తి అగర్వాల్‌కు, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ దర్శకుడితో చిరంజీవి విభేదాల కారణంగా సినిమా ఆగిపోయింది. రంగస్థలం సినిమాలో సుకుమార్.. రంగమ్మత్త పాత్ర ఆఫర్ చేశారు. ఆ పాత్రలో నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారో, లేదోనన్న భయంతో రిజెక్ట్ చేశాను. నాకు 2004లో పెళ్లయింది. ఆ సమయంలోనే సౌందర్య చనిపోయింది. నన్ను పెళ్లికూతురిని చేశాక బెంగళూరులో సౌందర్య సంతాపసభకు వెళ్లొచ్చాను.మొదటిరోజే అలాంటి సీన్పెళ్లయిన పదేళ్లకు పాప పుట్టింది. అదే నా జీవితంలో మ్యాజికల్ మూమెంట్. డైరెక్టర్ తేజ 'నిజం' సినిమాలో నా క్యారెక్టర్‌ను పాజిటివ్‌గా చెప్పాడు. తీరా సెట్‌కు వెళ్లాక మొదటి రోజే నాతో చేయకూడని సీన్ చేయించారు. అసలు ఈ సీన్ ఉంటుందనే చెప్పలేదు. చాలా హర్టయ్యాను, ఈ సినిమా చేయనన్నాను. నాకున్న ఇమేజ్‌కు ఈ సినిమా చేశానంటే కెరీర్ ఇంతటితో ఆగిపోతుంది, నా వల్ల కాదన్నాను. వాళ్లు చేయాల్సిందేనన్నారు. అయిష్టంగానే మూవీ పూర్తి చేశాను. క్షమించలేనుడబ్బింగ్ సమయంలో తేజ ఫోన్ చేసి సారీ చెప్పారు. ఈ మూవీ విషయంలో మాత్రం ఆయన్ను నేను క్షమించలేను. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్‌ను మర్చిపోవాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు తేజ పేరే చెప్తాను. ఆ సినిమా వల్ల నిజంగానే కెరీర్ దెబ్బతింది. నా పుట్టినరోజే నాన్న చనిపోయాడు. అది మర్చిపోలేని విషాదం. నా కెరీర్ మొదట్లో నాన్న నాకు అసిస్టెంట్‌లా, టచప్ బాయ్‌లా పనిచేసేవారు అంటూ రాశి ఎమోషనలైంది.చదవండి: ప్రముఖ నటుడి మరణం.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన భార్య -
ప్రముఖ నటుడి మరణం.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన భార్య
ప్రముఖ కమెడియన్, నటుడు రోబో శంకర్ (46) మృతిపై తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినిమా సెట్లో స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా గురువారం (సెప్టెంబర్ 18న)చికిత్స పొందుతూ మరణించాడు. రోబో శంకర్ (Robo Shankar) మృతి పట్ల కమల్ హాసన్, ధనుష్, శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేశ్ సహా పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు.అంత్యక్రియల్లో చివరిసారిగా..రోబో శంకర్ మృతితో అతడి భార్య ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపించింది. శుక్రవారం నటుడి అంత్యక్రియలు జరగ్గా.. చివరిసారి భర్తకు డ్యాన్స్‌తో వీడ్కోలు పలికింది. మనసులో విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతం లాంటి బాధను డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రియ ఈ బాధ నుంచి ఎలా బయటపడుతుందో? ఏంటో? అని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ రోబో శంకర్?కాగా శంకర్.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయ్యారు. అలా ఆయన పేరు రోబో శంకర్‌గా స్థిరపడిపోయింది. మారి, ఇరుంబు తిరై, విశ్వాసం, చక్ర, కోబ్రా, కలకలప్పు 2, పులి, యముడు 3, మిస్టర్ లోకల్ తదితర చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్నారు. దాదాపు 80కి పైగా సినిమాలు చేశారు. ఈయన భార్య ప్రియాంక కూడా కన్ని మేడమ్ సినిమాలో నటించింది. వీరి కుమార్తె ఇంద్రజ.. విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) మూవీలో గుండమ్మగా నటించింది. చదవండి: మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతి.. అయినా స్పందించవా?: హేమ -
చిన్న సినిమా.. బిగ్ హిట్.. ఏకంగా మోహన్‌లాల్ మూవీ రికార్డ్ బ్రేక్!
కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మలయాళ చిత్రం లోకా చాప్టర్-1 చంద్ర. ఈ మూవీని తెలుగులో కొత్త లోకా పేరుతో రిలీజ్ చేశారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ వసూళ్లపరంగా అదరగొట్టేసింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా లోకా చాప్టర్-1 చంద్ర నిలిచింది. ఈ క్రమంలో ఏకంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ సినిమాను అధిగమించింది. కాగా.. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆగస్టు 28న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఈ మూవీ రిలీజైన 23 రోజుల్లో ఇండియాలో రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.266 కోట్లు కలెక్ట్ చేసింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎల్2 ఎంపురాన్ మనదేశంలో రూ.105 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.265.5 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో కొత్త లోకా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో మొదటి స్థానం దక్కించుకుంది. -
చిన్న సినిమాతో సూపర్ హిట్.. ఏకంగా స్టార్ హీరోతో ఛాన్స్!
లబ్బర్ పందు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోలు, నిర్మాతల దృష్టిలో పడ్డారాయన. దీంతో తన రెండో సినిమాకే స్టార్ హీరో ధనుష్‌తో జతకట్టారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల నటుడు ధనుష్ హీరోగా నటించిన ఇడ్లీ కడై ఆడియో లాంఛ్ కార్యక్రమంలో డైరెక్టర్ తమిళరసన్ పచ్చ ముత్తు పాల్గొన్నారు.తన తర్వాత చిత్రాన్ని ధనుశ్తోన చేయనున్నానని.. ఆయనకు క్లాప్ కొట్టి యాక్షన్ చెప్పడం కోసం ఎదురు చూస్తున్నట్లు పచ్చముత్తు పేర్కొన్నారు. ధనుశ్ సార్ తన కథను ఒపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు అన్నారు. ఆయన చిత్రానికి తాను దర్శకత్వం వహించవచ్చని.. దాన్ని డాన్ ఫిక్చర్స్ సంస్థ నిర్మించవచ్చని.. ఇవన్నీ వదంతులు కావచ్చు అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అయితే మొత్తం మీద ధనుశ్- తమిళరసన్ పచ్చముత్తు కాంబోలో తెరకెక్కనున్న చిత్రాన్ని డాన్ ఫిక్చర్స్ సంస్థ నిర్మించనుందని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందో మాత్రం వెల్లడించలేదు. ఈ మూవికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్లామరస్‌గా ఉంటే క్యారెక్టర్‌నే తప్పుపడతారా?: హీరోయిన్ ఫైర్
కొందరు నటీమణులను చూస్తే వీరికి వయసు పెరగదా? అనిపిస్తుంది. అలాంటి వారిలో వేదిక (Actress Vedhika) ఒకరు. ఈ మహారాష్ట్ర బ్యూటీ వయసు ఇప్పుడు 37 ఏళ్లు. అయినప్పటికీ ఇప్పటికీ పదహారేళ్ల పడుచుపిల్లలాగే కనిపిస్తుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో హీరోయిన్గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతూనే ఉంది. హీరోయిన్స్ అంటే చాలు..తమిళంలో ముని, సక్కరకట్టి, కాళై, పరదేశీ, కావియ తలైవన్, కాంచన–3 వంటి చిత్రాల్లో నటించిన వేదిక ఇప్పటికీ తన సొగసులతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా కొన్ని విమర్శలు ఈ బ్యూటీకి కోపం తెప్పించాయి. గ్లామరస్‌గా కనిపిస్తే చాలు వేలెత్తి చూపడానికి రెడీ ఉంటారని ఆగ్రహించింది. సాధారణంగానే హీరోయిన్లు అంటే విమర్శలు గుప్పించడానికి ఒక వర్గం రెడీగా ఉంటుందని, అందులోనూ కాస్త గ్లామరస్ దుస్తులు ధరిస్తే ఏకంగా వారి క్యారెక్టర్‌నే తప్పుపడుతున్నారని మండిపడింది.నేను లెక్క చేయనుదుస్తుల గురించి విమర్శించే దుస్థితి మారాలంది. తానూ బికినీ ధరించి కూడా నటిస్తానని, ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోనని చెప్పింది. తానేమిటో తనకు బాగా తెలుసని, తప్పుడు బుద్ధి కలవారు మారితే మంచిదని వేదిక పేర్కొంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తోంది.చదవండి: ఒక్క మూవీతో ప్రేమలో పడ్డారా?.. సూపర్ హిట్ జంటపై డేటింగ్ రూమర్స్ -
'ఈ ఘనత అంతా మీవల్లే'.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌పై మోహన్‌లాల్
సినీ రంగంలో అందించే అత్యుత్తమ అవార్డ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ రావడంపై మోహన్ లాల్ స్పందించారు. ఈ అవార్డ్ అందుకోవడం నిజంగా గౌరవంగా ఉందన్నారు. అయితే ఈ విజయం నా ఒక్కడిది కాదు.. నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ ఈ ఘనత దక్కుతుందని ట్వీట్ చేశారు. నా కుటుంబం, అభిమానులు, సహచరనటులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ వల్లే ఈ రోజు నాకు అవార్డ్ దక్కిందన్నారు. ఈ గుర్తింపుతో నా హృదయం నిండిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా.. 2023 ఏడాదికి గానూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కేంద్రం దాదా సాహెబ్ అవార్డ్ ప్రకటించింది. సెప్టెంబర్ 23న జరిగే జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని మోహన్ లాల్‌కు అందజేయనున్నారు.కాగా.. 1980లో సినిమాల్లో అడుగుపెట్టిన మోహన్ లాల్ దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. మంజిల్ విరింజ పూక్కళ్ అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 45 ఏళ్ల తన సినీ కెరీర్లో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ నటించారు. తెలుగులో జనతా గ్యారేజ్ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మోహన్ లాల్.. కంప్లీట్ యాక్టర్ అనే పేరును సంపాదించుకున్నారు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటనతో ఆయన నట సామర్థ్యానికి తగిన గౌరవం దక్కిందని సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.Truly humbled to receive the Dadasaheb Phalke Award. This honour is not mine alone, it belongs to every person who has walked alongside me on this journey. To my family, audience, colleagues, friends, and well wishers, your love, faith, and encouragement have been my greatest…— Mohanlal (@Mohanlal) September 20, 2025 -
దీపావళికి డ్యూడ్
‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా దీ పావళి సందర్భంగా అక్టోబరు 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘సెకండ్ గేర్ బాగుండు పో..’ పాటని శనివారం రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని సంజిత్, సాయి అభ్యంకర్ పాడారు. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. ‘సెకండ్ గేర్ బాగుండు పో..’ పాట మనసుని హత్తుకునే మెలోడీగా ఉంటుంది.వినగానే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దీ పావళికి అద్భుతమైన మ్యూజిక్‌తో కూడిన కలర్‌ఫుల్ సినిమాని అందించడానికి మా ‘డ్యూడ్’ సిద్ధంగా ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాకి సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: అనిల్ యెర్నేని, కెమెరా: నికేత్ బొమ్మి. -
ట్రైలర్ రెడీ
రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించగా, గుల్షన్ దేవయ్య, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను రేపు (సెప్టెంబరు 22) రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించి, ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రభాస్, హిందీ ట్రైలర్‌ను హృతిక్ రోషన్, తమిళ ట్రైలర్‌ను శివకార్తికేయన్, మలయాలం ట్రైలర్‌ను పృథ్వీరాజ్ సుకు మారన్లు డిజిటల్‌గా విడుదల చేయనున్నారు.‘‘ఈ సినిమా కోసం 3వేలమంది ప్రజలు, 500 మంది యోధులు పాల్గొన్న ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందుకోసం 25 ఎకరాల స్థలంలో ఓ పట్టణాన్ని నిర్మించి, దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ చేశాం. భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఈ యుద్ధ సన్నివేశం ఒకటిగా నిలుస్తుంది.‘కాంతార’ (‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం తెరకెక్కింది) విజయాన్ని కొనసాగించడంలో హోంబలే ఫిలింస్ రాజీ పడటం లేదు. ఆడియన్స్‌కు థియేటర్స్‌లో గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం అక్టోబరు 2న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. -
ఈ హీరోయిన్ల సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?
ఓ వైపు కళారంగంలో తళుక్కుమంటూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు నేటి సినీ తారలు. నటనలో అవకాశాలను సద్వినియోగం చేయడంలోనే కాదు తమలో ఉన్న సాధికారిత శక్తిని కూడా నిరూపిస్తున్నారు. నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మికా మందన్నా నుంచి నయనతార, సమంత, తమన్నా... ఇలా ప్రతీ నటీమణి తమ జీవితాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. సినిమా స్టార్స్‌గా కోట్లలో పారితోషికం తీసుకుంటున్న ఈ తారలు ఆ డబ్బుని రెట్టింపు చేసే పని మీద ఉన్నారు. వ్యా పారంలోనూ కోట్లు సం పాదించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ‘షో (సినిమా) బిజినెస్’లో రాణిస్తూ వేరే ఏయే ‘బిజినెస్’లోకి ఈ స్టార్స్ ఎంటరయ్యారో తెలుసుకుందాం.తండ్రి బాటలో...మిల్కీ బ్యూటీగా నార్త్, సౌత్‌లో బోలెడంత క్రేజ్ సం పాదించుకున్నారు తమన్నా. హీరోయిన్ అయి, దాదాపు 20 ఏళ్లు కావొస్తున్నా అదే స్పీడుతో దూసుకెళుతున్నారు. ఇక ఇటీవల ఐటెమ్ సాంగ్స్‌తోనూ అలరిస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ నగల వ్యా పారాన్ని ఆరంభించారు. ఈ ఆభరణాలను తనే డిజైన్ చేస్తున్నారు కూడా. ఇంతకీ తమన్నాకి జ్యుయెలరీ బిజినెస్ ఎందుకు చేయాలనిపించిదంటే... ఆమె తండ్రి వల్లే. తమన్నా తండ్రికి నగల వ్యా పారం ఉంది. దాంతో కుమార్తెకి కూడా ఆ వ్యా పారంపై ఆసక్తి కలిగింది. ఒకవైపు నటన... మరోవైపు జ్యుయెలరీ బిజినెస్‌తో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీ. మ్యూజిక్‌పై మమకారంతో..బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌హాసన్ తనయగా శ్రుతీహాసన్ కూడా మల్టీ టాలెంటెడ్. తనలో మంచి నటి, గాయని, సంగీతదర్శకురాలు... ఇలా ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. అయితే హీరోయిన్గా బిజీగా ఉంటున్న శ్రుతీహాసన్ తనకెంతో నచ్చిన మ్యూజిక్‌పై కూడా దృష్టి సారించాలనుకున్నారు. అందుకే ‘ఇసిడ్రో’ అనే నిర్మాణ సంస్థను ఆరంభించారామె. ఈ సంస్థ లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాలు, వీడియో రికార్డింగ్‌లను ఈ రూపొందిస్తుంటుంది. క్లాతింగ్ బ్రాండ్... ప్రోడక్షన్నటనలో భేష్ అనిపించుకున్న సమంత తన స్టైలిష్ లుక్స్‌కు కూడా చాలా పాపులర్. సినిమాల్లోనే కాదు... విడిగా కూడా సమంత రకరకాల డ్రెస్ డిజైన్స్ ట్రై చేస్తుంటారు. ఇప్పటికే ‘సాకీ’ పేరుతో సమంతకు క్లాతింగ్ బ్రాండ్ ఉంది. 2020లో ఈ బ్రాండ్‌ని ఆరంభించారామె. అలాగే ఏ సినిమా ఫీల్డ్ అయితే తనకు నటిగా మంచి జీవితాన్ని ఇచ్చిందో అదే సినిమా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుని, ‘ట్రా లా లా’ బేనర్‌ని ఆరంభించారు. ఈ బేనర్లో తొలి ప్రయత్నంగా ‘శుభం’ చిత్రాన్ని నిర్మించారు సమంత. అలాగే ఇదే బేనర్లో తాను కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించారు. నయన... నాలుగైదు వ్యా పారాలు నటనలో లేడీ సూపర్‌స్టార్ అని పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ‘ది లిప్ బామ్ కంపెనీ’ని స్థాపించారు. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ‘రౌడీ పిక్చర్స్‘ అనే నిర్మాణ సంస్థలో పాలు పంచుకున్నారు. చెన్నైలో ‘ఛాయ్వాలే’ అనే స్థానిక పానీయాల బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టి, రెస్టారెంట్ వ్యా పారంలో కూడా రాణిస్తున్నారు. ఇటీవల ‘9 స్కిన్’ అనే చర్మ సంరక్షణ బ్రాండ్‌నూ ప్రారంభించారామె. మొత్తానికి ఈ లేడీ సూపర్ స్టార్ ఒక్క వ్యా పారంలో కాదు... నాలుగైదు వ్యా పారాల్లో పెట్టుబడి పెట్టి, దూసుకెళుతున్నారు. ఫ్యాషన్ రంగలోకి నేషనల్ క్రష్ ‘నేషనల్ క్రష్’గా పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న రష్మికా మందన్నా తన కొత్త వ్యా పారాన్ని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన తల్లితో జరిపిన సంభాషణ వీడియోను పంచుకున్నారామె. తన తల్లితో మాట్లాడుతూ– ‘అమ్మా... ఈ రోజు చాలా చాలా ముఖ్యమైన షూటింగ్ చేయబోతున్నాను. మీరు చెప్పినట్టుగా ఈ వ్యా పారాన్ని ప్రారంభించబోతున్నాను’ అని ఆమె తన తల్లితో పేర్కొన్నారు. రష్మిక తల్లి ‘దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు’ అని కుమార్తెను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఇంతకీ రష్మిక ఏ బిజినెస్ చేయనున్నారంటే.... తన సొంత బ్రాండ్‌తో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు.శ్రద్ధగా వ్యా పారంలోకి... కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఆ బిజీని ఎంజాయ్ చేసి, కాస్త అవకాశాలు తగ్గగానే డీలా పడి పోతుంటారు కొందరు తారలు. కానీ శ్రద్ధా దాస్ అలా కాదు. ఒకప్పుడు మంచి కెరీర్‌ని చూసిన ఈ బ్యూటీ... ఇప్పుడు నటిగా అంత బిజీగా లేక పోయినా నగల వ్యా పారంతో జోష్‌గా ఉన్నారు. ‘పల్మోనాస్’ అనే డెమీ ఫైన్ జ్యుయెలరీ బ్రాండ్‌ని ఆరంభించారు. పల్మోనాస్కి ఆమె ఒక ఫౌండర్. ఈ నగల వ్యా పారాన్ని కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నారు శ్రద్ధా దాస్. ఇలా మరికొందరు తారలు ఇతర వ్యా పారాల్లో పెట్టుబడి పెట్టి, ‘బిజినెస్ ఉమన్’గానూ రాణిస్తున్నారు. ప్రతిభ, వ్యా పార చతురతతో అటు కెరీర్ ఇటు వ్యా పార రంగంలోనూ విజయవంతంగా విస్తరిస్తున్నారు ఈ కథానాయికలు. ఈ స్టార్స్ నవతరానికి సవాల్‌తో కూడిన ఆలోచననూ అందిస్తున్నారు. -
మోహన్ లాల్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
మలయాళ హీరో మోహన్ లాల్‌ని అత్యున్నత పురస్కారం వరిచింది. ఈయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కినట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబరు 23న ఢిల్లీలో జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని మోహన్ లాల్‌కి ప్రదానం చేయబోతున్నారు. ఆయన అసమాన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, అవిశ్రాంత కృషి.. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక బంగారు ప్రమాణాన్ని నెలకొల్పాయని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2023 సంవత్సరానికిగానూ మోహన్ లాల్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. -
మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam Movie). సంగీత్ ప్రతాప్, ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అయిన సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించాడు. ఆశీర్వాద్ సినిమా బ్యానర్‌పై ఆంటొని పెరుంబవూర్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది. వచ్చేవారమే రిలీజ్కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ కేరళలోని పలు థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. సినిమా రిలీజై మూడువారాలు దాటిపోవడంతో ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 26న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.వరుస హిట్లుమోహన్లాల్ ఈ ఏడాది ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజవగా ఆ మూడు కూడా బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టాయి. ఎల్2: ఎంపురాన్ మూవీ ఏకంగా రూ.260 కోట్లు రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి సినిమాగా రికార్డుకెక్కింది. తర్వాత తుడరుమ్ రిలీజ్ అవగా ఈ మూవీ కూడా రూ.230 కోట్లు వసూలు చేసింది. తర్వాత వచ్చిన హృదయపూర్వం రూ.70 కోట్లు కలెక్ట్ చేసింది. మరి మోహన్‌లాల్ మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి! എന്ന് ഹൃദയപൂർവം ജിയോഹോട്ട്സ്റ്റാർ#Hridayapoorvam will be streaming from September 26 on JioHotstar. @mohanlal @antonypbvr @aashirvadcine @MalavikaM_#Hridayapoorvam #HridayapoorvamOnJioHotstar #Mohanlal #HridayapoorvamMohanlal #Family #Drama #Comedy #Malayalam #JioHotstar pic.twitter.com/r8Q1hL4JEv— JioHotstar Malayalam (@JioHotstarMal) September 19, 2025చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్‌పై సంజనా చీప్ కామెంట్స్ -
60% షూటింగ్ పూర్తి.. ఆ హీరోను తీసేశా: దర్శకుడు
దర్శకుడు బాలాజీ తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'ది డార్క్ హెవెన్'. క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఇందులో నటుడు నకుల్ హీరోగా నటించడానికి ఎంపికయ్యారు. అయితే కొంత షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ చిత్రం నుంచి నకుల్ వైదొలిగారు. దీంతో రాజారాణి–2 చిత్రం ఫేమ్ సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శక, నిర్మాత బాలాజీ మాట్లాడుతూ.. కథకు కరెక్ట్‌గా సూటవుతుందనే ఇంగ్లీష్ టైటిల్‌ను నిర్ణయించాం.60% షూటింగ్ అయ్యాక..ఒక గ్రామంలో జరిగే వరుస హత్యల గురించి దర్యాప్తు చేయడానికి పోలీస్ అధికారి రంగంలోకి దిగుతారు. ఆయన ఈ హత్యల మిస్టరీని ఎలా చేధించాడు? అన్నదే చిత్రకథ. ఈ చిత్రంలో ముందుగా హీరోగా నకుల్‌ను ఎంపిక చేశాం, ఆయనతో 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన్ని సినిమా నుంచి తప్పించి సిద్ధును కథానాయకుడిగా ఎంపిక చేశాం. నా స్పీడ్‌ను నకుల్ అందుకోలేకపోయారు.షూటింగ్లో కథానాయకుడు కట్ చెప్పడం సరికాదు. నకుల్ మాత్రం సీన్లు చేస్తుండగా కట్ చెప్పేవారు. నాకు సంబంధించినంత వరకు హీరో ఎవరన్నది ముఖ్యం కాదు, ఆ పాత్రకు ఎవరు కరెక్ట్ అన్నదే ముఖ్యమని భావించాను. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ దర్శిక కథానాయికగా, రితిక, అరుల్‌జ్యోతి, ప్రదీప్, జయకుమార్ జానకిరామన్,అజిత్ జోషి, చాప్లిన్ బాలు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు అని చెప్పారు. పీకే చాయాగ్రహణం, శక్తి బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్‌గా రాము రాథోడ్ -
'సు ఫ్రమ్ సో' నటి.. మనసుని కదిలించే షార్ట్ ఫిల్మ్
కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా 'సు ఫ్రమ్ సో'. ఇందులో భాను అనే పాత్రలో నటించిన సంధ్య ఆకట్టుకుంది. అయితే ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఓ షార్ట్ ఫిల్మ్‌లోనూ లీడ్ రోల్ చేసింది. అదే 'హిండె గాలి ముందే మత్తె'. దాదాపు ఎనిమిదికిపైగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు దీన్ని కన్నడ నటుడు కమ్ డైరెక్టర్ రాజ్ బి శెట్టికి చెందిన లైటర్ బుద్దా ఫిల్మ్స్ తన యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: షూటింగ్లో ఎన్టీఆర్‌కు ప్రమాదం)షార్ట్ ఫిల్మ్ విషయానికొస్తే.. బెంగళూరులోని ఓ అద్దె ఇంట్లో భార్యభర్త జీవిస్తుంటారు. భర్త ఓ మెషీన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. భార్య ఇంట్లోనే ఉంటుంది. అయితే వస్తున్న జీతం సరిపోవట్లేదని భార్యకు మూడుసార్లు అబార్షన్ చేయిస్తాడు. నాలుగోసారి ప్రెగ్నెన్సీ వచ్చినా సరే భర్తకు చెప్పకుండా భార్య విషయం దాస్తుంది. దీని గురించి భర్తకు ఎలా తెలిసింది? చివరకు భార్య ఏం చేసింది అనేదే స్టోరీ.దాదాపు అరగంటపాటు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్.. మధ్య తరగతి ఉద్యోగి జీవితాన్ని, భర్తకు ఎదురుచెప్పని ఓ భార్య జీవితాన్ని, పిల్లల్ని కనాలనే ఆశ ఉన్నా సరే పెంచలేం ఏమో అని భయపడి మదనపడే ఓ జంట భావోద్వేగాల్ని చక్కగా చూపించారు. కన్నడలో ఆడియో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. చూస్తే కచ్చితంగా ఎమోషనల్ అవుతారు. అలానే సిటీల్లో ఉండే చాలామంది జంటలు దీనికి కనెక్ట్ అవ్వొచ్చు కూడా.(ఇదీ చదవండి: హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం) -
హ్యాపీ బర్త్ డే ఆంధ్ర కింగ్
సూపర్‌స్టార్ సూర్యకుమార్ తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్నారు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్‌కుమార్ అండ్ టీ–సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సినీ సూపర్‌స్టార్ సూర్య కుమార్ పాత్రలో ఉపేంద్ర, ఈ హీరో ఫ్యాన్ పాత్రలో రామ్ నటిస్తున్నారని తెలిసింది. గురువారం ఉపేంద్ర బర్త్ డే సంద ర్భంగా, ‘హ్యాపీ బర్త్ డే ఆంధ్ర కింగ్’ అంటూ, ఆయన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నవంబరు 28న విడుదల కానుంది. -
ఆ హీరోను ఇష్టపడ్డా.. చెల్లి అని పిలిచాడు: హీరోయిన్
హీరోయిన్ మహేశ్వరి (Actress Maheswari) గుర్తుందా? ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించింది. ఇటీవల ఆమె జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా ఓ హీరోపై తనకున్న క్రష్‌ను బయటపెట్టింది. మహేశ్వరి మాట్లాడుతూ.. 'హీరో అజిత్ కుమార్ అంటే నాకు క్రష్. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. తనతో రెండు సినిమాలు చేశాను. షూటింగ్ చివరి రోజు..ఓ మూవీ షూటింగ్ సాగదీయడం వల్ల ఏడాదిన్నర పాటు తనతో కలిసి పని చేశాను. అంతా అయ్యాక షూటింగ్ చివరి రోజు ఊహించనిది జరిగింది. అసలే ఆయన్ను మళ్లీ కలవలేనని బాధపడుతూ కూర్చున్నాను. ఇంతలో అజిత్ నా దగ్గరకు వచ్చి మహి, నువ్వు నా చెల్లెలిలాంటిదానివి. నీ జీవితంలో ఎప్పుడు, ఏం అవసరమొచ్చినా దయచేసి నన్ను అడుగు.. నేను నీకోసం ఉన్నాను అని చెప్పాడు. అలా నా క్రష్ నన్ను చెల్లి అని పిలిచాడు' అని గుర్తు చేసుకుంది.సినిమామహేశ్వరి.. 1994లో కరుత్తమ్మ సినిమాతో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి కాపురం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. గులాబి సినిమాతో సెన్సేషన్ అయింది. దెయ్యం, పెళ్లి, ప్రియరాగాలు, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ.. ఇలా అనేక సినిమాలు చేసింది. అజిత్‌తో ఉల్లాసం, నేశం సినిమాల్లో నటించింది. రెండున్నర దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కొంతకాలం పాటు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన ఆమె ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తోంది.చదవండి: ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి -
మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ.. పవర్ఫుల్ టీజర్ వచ్చేసింది
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫుల్ యాక్షన్ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వృషభ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.టీజర్ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా టీజర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు. కత్తితో ఫైట్ చేస్తున్న సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్ల నిర్మించారు. ఇంకెందుకు ఆలస్యం వృషభ టీజర్ చూసేయండి. -
థియేటర్లలో దక్ష, బ్యూటీ.. మరి ఓటీటీలో ఏయే సినిమాలో తెలుసా?
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ థియేటర్ల రిలీజ్ కావడం లేదు. మంచు లక్ష్మీ లీడ్ రోల్లో వస్తోన్న దక్ష, అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర నటించిన లవ్ స్టోరీ ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటితో పాటు విజయ్ ఆంటోని భద్రకాళి, కన్నడ సినిమా వీర చంద్రహాస కూడా థియేటర్లలో రిలీజవుతున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం కొత్త సినిమాలు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. కాజోల్ వెబ్ సిరీస్ ద ట్రయల్ సీజన్- 2, వాటిలో శ్రీలీల, కిరిటీ నటించిన జూనియర్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అయితే జూనియర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. రేపటి నుంచి సడన్ స్ట్రీమింగ్కు వస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.నెట్ఫ్లిక్స్సీ సెయిడ్ మేబీ- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 19హంటెడ్ హోటల్-(యానిమేషన్ హారర్ సిరీస్)- సెప్టెంబర్ 19బిలియనీర్స్ బంకర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 1928 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్జూనియర్ (కన్నడ డబ్బింగ్ సినిమా)- సెప్టెంబర్ 19(రూమర్ డేట్)కాన్పిడెన్స్ క్వీన్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 20జియో హాట్స్టార్పోలీస్ పోలీస్ (తమిళ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19ద ట్రయల్ సీజన్ -2 (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19ఆహాష్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 19జూనియర్- (కన్నడ సినిమా)- సెప్టెంబరు 19(రూమర్ డేట్)జీ5హౌస్మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19లయన్స్ గేట్ ప్లేద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19మనోరమ మ్యాక్స్రండం.. యామం(మలయాళ మూవీ)- సెప్టెంబరు 19 -
మోస్ట్ వయొలెంట్ చిత్రం.. సీక్వెల్ నుంచి తప్పుకున్న హీరో!
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన మోస్ట్ వయోలెన్స్ చిత్రం మార్కో. గతేడాది రిలీజైన ఈ సినిమా మలయాళంలో సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది.మార్కో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో మేకర్స్ పుల్ బిజీ అయిపోయారు. తాజాగా లార్డ్ మార్కో టైటిల్‌ను మలయాళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా నమోదు చేశారు. దర్శకుడు హనీఫ్, నిర్మాత షరీఫ్ ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో మార్కో హీరో ఉన్ని ముకుందన్ పేరు లేకపోవడం మాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఉన్ని ప్లేస్‌లో మరో హీరోను తీసుకొస్తున్నారా? అనే చర్చ మొదలైంది. దీంతో ఈ మూవీలో మమ్ముట్టి, యశ్, పృథ్వీరాజ్, హృతిక్ రోషన్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. లేదంటే మలయాళంలో ఎవరైనా స్టార్ హీరోతో ప్లాన్ చేయనున్నారని టాక్.అయితే ఇప్పటికే మార్కో సీక్వెల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఉన్ని ముకుందన్ ప్రకటించారు. ఈ మూవీపై విపరీతమైన నెగెటివిటీ రావడంతో ఈ ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలిపారు. మార్కో సిరీస్‌ను కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. మార్కో కంటే మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని వెల్లడింతారు. అందుకే ఉన్ని ముకుందన్‌ను సీక్వెల్ నుంచి మేకర్స్ తప్పించినట్లు తెలుస్తోంది.కాగా.. 2024 డిసెంబర్లో విడుదలైన ‘మార్కో చిత్రంలో వయొలెన్స్ విపరీతంగా ఉన్నట్లు టాక్ వినిపించింది. దీంతో కొందరు మార్కో చిత్రంపై విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాగా.. తెలుగు వెర్షన్ జనవరి 1న, తమిళ వెర్షన్ జనవరి 3న థియేటర్లలోకి వచ్చింది.Director Haneef Adeni and Producer Shareef Muhammed have registered the title '#LordMarco' at the Film Chamber. #UnniMukundan is not part of the project. Who do you think will lead in #Marco2? Any guesses? pic.twitter.com/va4OpaACf8— AB George (@AbGeorge_) September 17, 2025 -
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే?
ఓటీటీలో మలయాళ సినిమాలకున్న క్రేజే వేరు. అయితే ఈసారి లవ్‌స్టోరీకి బదులుగా ఓ కామెడీ హారర్ మూవీ ఓటీటీ (OTT)లోకి రానుంది. ఆ సినిమాయే సుమతి వలవు (Sumathi Valavu Movie). ఇందులో అర్జున్ అశోకన్, సైజు కురుప్, గోకుల్ సురేశ్, మాళవిక మనోజ్, బాలు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది.ఓటీటీలో హారర్ మూవీతాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 26 నుంచి జీ5లో ప్రసారం కానుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సుమతి వలవు అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో హారర్, కామెడీతో పాటు మిస్టరీ, ఎమోషన్స్, థ్రిల్ కూడా ఉందని చిత్రయూనిట్ చెప్తోంది. ఐఎమ్‌డీబీలో ఈ సినిమా 7.7 రేటింగ్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. വരുന്നു, "സുമതി വളവ്". സെപ്റ്റംബർ 26 മുതൽ നമ്മുടെ ZEE5 മലയാളത്തിൽ#SumathiValavu Premieres 26th September on ZEE5#ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada pic.twitter.com/NGNr99ihOA— ZEE5 Malayalam (@zee5malayalam) September 18, 2025చదవండి: అమ్మ పేరుతో పేదలకు రుచికరమైన భోజనం: రాఘవ లారెన్స్ -
అమ్మ పేరుతో పేదలకు రుచికరమైన భోజనం: రాఘవ లారెన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ స్టైలే వేరు.. అది సినిమాల్లో మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ ఆయన అంతే. అందరు హీరోలకు భిన్నంగా సమాజ సేవలో చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరు పేదల శ్రేయస్సే లక్ష్యంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రైతులు, విద్యార్థులు, దివ్యాంగులు ఇలా ఎందరినో ఆదుకున్న రాఘవ లారెన్స్.. తాజాగా మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.పేదలకు రుచికరమైన భోజనం అందించేందుకు తన తల్లి పేరు మీద 'కణ్మణి అన్నదాన విందు' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధనవంతులు తినే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందించనున్నారు. నిరుపేద చిన్నారుల్లో చిరునవ్వులు చిందించడమే తన లక్ష్యమని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు.రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'కన్మణి అన్నదాన విరుందు ఒక కొత్త ప్రారంభం. ఈ రోజు నా హృదయానికి దగ్గరగా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించా. ఈ కార్యక్రమానికి కన్మణి అన్నదాన విరుందు అని నా తల్లి పేరుతోనే పెట్టాం. ధనవంతులు మాత్రమే ఆస్వాదించే ఆహారాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడని వారికి అందుబాటులో ఉంచడమే తన ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. ఆహారం ఒక ప్రత్యేక హక్కుగా ఉండకూడదు.. అది ప్రతి హృదయానికి చిరునవ్వులు తెచ్చే ఆనందంగా ఉండాలి. పిల్లలు, పెద్దలతో కలిసి నారి కురవర్గల్ సంఘంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదించినప్పుడు వారి కళ్లలో ఆనందాన్ని చూసి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో, అందరి ఆకలిని తీర్చే ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని నేను ఆశిస్తున్నా' అని తన ఆనందాన్ని పంచుకున్నారు.I want to take a moment to express my gratitude to everyone of you for the love and support you’ve shown towards my new video about my initiative, Kanmani Annadhana Virundhu. Your encouragement gives me the strength to continue this journey of service. With all your blessings,… pic.twitter.com/YyJYi1BYpy— Raghava Lawrence (@offl_Lawrence) September 18, 2025 -
నా భర్త మరణం.. మోహన్‌లాల్ తన బుద్ధి చూపించాడు: నటి
మలయాళ సీనియర్ నటి శాంతి విలియమ్స్ మోహన్‌లాల్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళ, మలయాళంలో వందకు పైగా సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో సహాయక పాత్రలు పోషించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్‌కు తల్లిగా కూడా నటించారు. తనకు 12 ఏళ్ల వయసు ఉండగానే చిత్రపరిశ్రమలో ఆమె అడుగుపెట్టారు. ఆమె 1979లో మలయాళీ కెమెరామెన్ జె. విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్‌లాల్ తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించారు.మలయాళ సినిమాల్లో ఒకప్పుడు సుపరిచితుడైన సినిమాటోగ్రాఫర్ జె విలియమ్స్‌ను వివాహం చేసుకున్న శాంతి, తన భర్త అనారోగ్యానికి గురైనప్పుడు కుటుంబం తీవ్ర పేదరికంలోకి నెట్టబడిందని, కానీ పరిశ్రమ నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విలియమ్స్ 2005లో అనారోగ్యంతో మరణించారు. అయితే, ఆ సమయంలో మోహన్ లాల్‌తో జరిగిన ఒక సంఘటన గురించి శాంతి ఇలా అన్నారు, “ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అప్పట్లో, అతనికి చిన్నపిల్లవాడి అమాయకత్వం ఉండేది. అతను మా ఇంటికి వచ్చి, మాతో ఎప్పుడూ మాట్లాడేవాడు. నవ్వుతూ అన్ని విషయాలు పంచుకునే మంచి వ్యక్తి. కానీ, అతను పాపులర్ అయిన తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. చాలా మంది ఇతరులు కూడా అదే చెప్తారు.లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లాడుతన ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహాన్ని మోహన్‌లాల్ ఎలా తీసుకెళ్లాడో శాంతి ఇలా చెప్పింది. "మా ఇంట్లో పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్న కృష్ణుడి విగ్రహం ఉండేది. నేడు ఆ విగ్రహం మోహన్‌లాల్ ఇంట్లో ఉంది. నా భర్తకు ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం. ఆ సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము సరిగ్గా నిర్వహించగలమో లేదోనని నా భర్తకు అనిపించింది. మా ఇంట్లో ఎయిర్ కండిషనర్ లేదని, పిల్లలకు ఇబ్బందిగా ఉందని మోహన్‌లాల్‌తో నా భర్త విలియమ్స్ చెప్పాడు. మా ఆర్థిక పరిస్థితిని లాల్ సద్వినియోగం చేసుకున్నాడు. లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లి, బదులుగా తన ఆఫీసు నుండి పాత ఎయిర్ కండిషనర్ను మాకు ఇచ్చాడు. కేవలం పదిరోజుల తర్వాత అది రిపేయర్‌కు వచ్చింది. దీంతో మేము దానిని అమ్మినప్పుడు, మాకు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చాయి. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే.., మేము మోహన్‌లాల్ కోసం చాలా చేసినప్పటికీ, నా భర్త మరణించినప్పుడు అతను రాలేదు. నేను దాని గురించి మాట్లాడే ప్రతిసారీ, నాలో కోపం ఉప్పొంగుతుంది. ఆకలితోనే నా పిల్లలు నిద్రపోయేవారునాకు నలుగురు పిల్లలు ఉన్నారనే విషయం మోహన్‌లాల్‌కు తెలుసు. విలియమ్స్ మంచం పట్టిన తర్వాత, కుటుంబాన్ని పోషించడానికి నేను డబ్బింగ్, నటన అంటూ తిరగాల్సి వచ్చింది. పిల్లలకు కడుపు నిండా ఆహారం లేని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు వారు ఆకలితోనే నిద్రపోయేవారు. ఇప్పటివరకు నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, దర్శకుడు శంకర్ సార్ నా భర్త మరణించారని తెలుసుకొని రూ. 25వేలు సాయం చేశారు. ఏదైనా సాయం అవసరమైతే కాల్ చేయమని కూడా చెప్పారు. అయితే, మలయాళ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా సాయం చేయలేదు. కానీ, తమిళ పరిశ్రమ నుంచి కొందరు చేశారు. నా మాతృభూమి కేరళ, నేను మలయాళీని. అయినప్పటికీ నన్ను నేను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన సమయంలో ఎవరూ కూడా పలకరించలేదు.' అని ఆమె అన్నారు. ప్రస్తుతం శాంతి పిల్లలు పెద్దవారయ్యరు. ఉద్యోగాలు చేస్తూ జీవితంలో సెటిల్ అయ్యారు. భర్త మరణం తర్వాత తనకు చిన్న పాత్ర వచ్చినా సరే చేస్తూ పిల్లలను చదివించారని అక్కడి పరిశ్రమ గురించి తెలిసిన వారు చెప్తారు. -
లోకేశ్ కనగరాజ్‌ని పక్కనబెట్టేశారా? నెక్స్ట్ 'ఖైదీ 2'
లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్. ఇతడితో సినిమా చేసేందుకు ఇతర భాషల హీరోలు కూడా రెడీ అంటున్నారు. కానీ 'కూలీ' దెబ్బకు మొత్తం పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రజినీకాంత్ హీరోగా చేసిన 'కూలీ'పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని అందుకోవడంలో ఈ చిత్రం కాస్త విఫలమైంది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్‌ని సైడ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించబోతున్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న కమల్.. స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. అప్పటినుంచి ఈ మూవీ తీయబోయేది లోకేశ్ కనగరాజ్ అని రూమర్స్ మొదలయ్యాయి. అందరూ ఇది నిజమని అనుకున్నారు కూడా. కానీ లేటెస్ట్గా విమానాశ్రయంలో కనిపించిన రజినీకాంత్‌ని పలువురు మీడియా ప్రతినిధులు ఇదే విషయం అడగ్గా.. కమల్‌తో మూవీ చేయబోతున్నానని చెప్పారు. కాకపోతే స్టోరీ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్)అయితే లోకేశ్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు కాదని తెలిసి కొందరు తమిళ ఫ్యాన్స్ బాధపడుతుండగా.. మరికొందరు సంతోషపడుతున్నారు. ఎందుకంటే లోకేశ్ తీసిన వాటిలో చాలా గుర్తింపు తెచ్చుకున్న సినిమా 'ఖైదీ'. దీని సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఎప్పటినుంచో వెయిటింగ్. ఒకవేళ లోకేశ్ గనక.. కమల్-రజినీ మూవీ తీస్తే ఈ సీక్వెల్ రావడం లేటు అయిపోతుంది. మరోవైపు లోకేశ్ కాకుండా ఈ మల్టీస్టారర్ హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరున్నారా అనే డిస్కషన్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్.. హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ అనే డైరెక్టర్ తీస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో 'ఖైదీ 2'ని లోకేశ్ మొదలుపెట్టే అవకాశముంది. మరి 'కూలీ' రిజల్ట్ చూసి.. కమల్-రజినీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్‌ని పక్కనబెట్టేశారా? లేదంటే నిజంగానే లోకేశ్ పేరుని పరిగణలోకి తీసుకోలేదా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)Director is Not Confirmed Yet 👀So There is an Option other than #Lokeshkanagaraj 💥pic.twitter.com/pGN4okSvJP— SillakiMovies (@sillakimovies) September 17, 2025 -
ఒక్క డైలాగ్‌తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు!
కోలీవుడ్ స్టార్ విజయ్ 'బీస్ట్' సినిమాతోనే తెలుగులో ఫుల్ బిజీ అయిపోయానంటున్నాడు తమిళ నటుడు వీటీవీ గణేశ్ (VTV Ganesh). టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నానని చెప్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ చిత్రం కిస్ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యాడు. కెవిన్, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ సతీశ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 19న విడుదల కానుంది.ఒక్క డైలాగ్‌తో పాపులర్ఈ మూవీ ప్రెస్మీట్లో గణేశ్ మాట్లాడుతూ.. బీస్ట్ సినిమాలో ఎవర్రా, నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్ అనే ఒక్క డైలాగ్‌తో నేను తెలుగు ఇండస్ట్రీలో ఫేమసయ్యాను. ఈ సినిమాలో ఛాన్సిచ్చిన విజయ్ సర్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నా.. నా గొంతే నా బలం. ఇప్పుడు తెలుగులో చిరంజీవి, నాగచైతన్య.. వంటి స్టార్ హీరోలతో దాదాపు 8 సినిమాలు చేస్తున్నాను. ఇకపోతే కిస్ మూవీ తెలుగు ట్రైలర్లో నా గొంతు మార్చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఈజీగా తప్పించుకుంటారునాకు తెలుగొచ్చు. రేపే డబ్బింగ్ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, నాకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నాడు. అదే లేడీ డైరెక్టర్ అయ్యుంటే సరే, నేను చెక్ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది. మేల్ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. గణేశ్.. తెలుగులో భగవంత్ కేసరి, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్ సినిమాల్లో నటించాడు. తమిళ 'జైలర్', 'వారసుడు', 'డాడా'(పాపా), 'ప్రిన్స్' మూవీస్‌తోనూ అలరించాడు.చదవండి: ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్' -
ఇళయరాజా ఫిర్యాదు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి అజిత్ మూవీ తొలగింపు
సంగీత దర్శకుడు ఇళయరాజా ఫిర్యాదు కారణంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తొలగించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారంటూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేశారు. కాపీరైట్ చట్టానికి ఇది విరుద్దమని, ఆ పాటలను తొలగించడమే కాకుండా.. ఉపయోగించినందుకుగానూ తనకు పరిహారం ఇవ్వాలని ఇళయరాజా కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాసు కోర్టు.. ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించింది. పాటలను తొలగించి..మళ్లీ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తారా లేదా మొత్తానికి స్ట్రీమింగ్ చేయకుండా వదిలేస్తారో చూడాలి.కాగా,ఈ వివాదం గురించి చిత్ర నిర్మాత రవి గతంలో మాట్లాడుతూ.. ఇళయరాజా పాటలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగానే పాటలను ఉపయోగించామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే 8 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు,హిందీ,తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు కోర్డు ఆదేశాలతో సడెన్‌గా నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించారు. -
రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్ ఠాకూర్
సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ భామ టీవీ సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత సినీ రంగప్రవేశం చేసింది. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించి ఆపై హిందీ చిత్రాల్లో నటిస్తుండగా టాలీవుడ్ కన్ను ఈ అమ్మడిపై పడింది. అలా సీతారామం అనే తెలుగు చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించి పాపులర్ అయింది. హాయ్ నాన్నతో మరింత స్టార్డమ్ అందుకుంది. కానీ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని పెద్దగా ఆదరణ పొందలేవు. దీంతో హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న ఈ అమ్మడికి తాజాగా మరో లక్కీచాన్స్ వరించినట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీలో..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో మృణాల్‌ఠాకూర్ ఒక కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఇంతకుముందు శివకార్తికేయన్‌కు జంటగా మదరాశి చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని ఆమె చేజార్చుకుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా ఈ అమ్మడికి రాలేదు. ఇకపోతే హీరోయిన్గా తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ చేతినిండా సంపాదిస్తూ కోట్లు కూడబెడుతున్న ఈ బ్యూటీ ఖర్చు చేయడంలో మాత్రం మహా పొదుపరి!అంతకంటే ఎక్కువ పెట్టనుదీనిపై మృణాల్ ఇటీవల చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. తనకు ఖరీదైన దుస్తులు కొనడం ఇష్టం ఉండదని, ఎంతో డబ్బులు పోసిన కొన్నప్పటికీ అవి బీరువా అరల్లో మూలుగుతుంటాయంది. తాను కొనుగోలు చేసిన దుస్తుల ఖరీదు అత్యధికంగా రూ.2వేలు దాటి ఉండవన్నారు. అయితే సినీ కార్యక్రమాలకు ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మాత్రం లక్షల ఖరీదైన దుస్తులు ధరిస్తానని, అయితే అవన్ని సొంతం కాదని, అద్దెకు తెచ్చుకునేవేనని మృణాల్ తెలిపింది.చదవండి: కథ నచ్చి ఓజీ ఒప్పుకున్నాను: ప్రియాంక మోహన్ -
ఇక నటనపైనే ఫోకస్: శాండీ
‘‘లియో, లోక, కిష్కింధపురి’... ఇలా వరుసగా నేను నటించిన చిత్రాలు హిట్ అయినందుకు హ్యాపీగా ఉంది. నా చిన్నప్పుడు అందరూ నా కళ్లను చూసి, ‘డెత్ గోట్ ఐస్’ అని ఆటపట్టించేవారు. ఆ కళ్లు నచ్చే ‘లియో’కు లోకేశ్‌గారు నన్ను నటుడిగా ఎంపిక చేసుకున్నారు’’ అన్నారు కొరియోగ్రాఫర్–యాక్టర్ శాండీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా, శాండీ మాస్టర్ విలన్‌గా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా శాండీ మాస్టర్ మాట్లాడుతూ– ‘‘కిష్కింధపురి’ సినిమా కోసం లుక్ టెస్ట్ చేసి, ఫైనల్‌గా దివ్యాంగుడు లుక్‌ను ఓకే చేశాం. ఓ సీన్లో డమ్మీ సిలిండర్‌తో హీరో నన్ను కొట్టాలి. కానీ అనుకోకుండా నిజమైన సిలిండర్‌తో కొట్టడంతో నా తలకు దెబ్బతగిలింది.ఎమ్ఆర్ఐ స్కానింగ్ తీశారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇక ‘కూలీ’లోని ‘మోనికా..పాట, ‘విక్రమ్’లోని పాతల...పాతల’, ‘ఓజీ’ సినిమాలోని ఓ ప్రమోషనల్ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా యాక్టింగ్పైనే. ప్రస్తుతంపా. రంజిత్ నిర్మాణంలో హీరోగా ఓ సినిమా, మలయాళ ‘కథనార్’లో విలన్ రోల్ చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘కిష్కింధపురిని’ అందరూ చూడాలి: చిరంజీవి ‘కిష్కింధపురి’ని హీరో చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించి, ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నా రాబోయే చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ నిర్మాత సాహు గారపాటిగారు నిర్మించిన ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని సాధించింది. హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ దెయ్యం కథ చెబుతుంటారు. కానీ, ఈ సినిమాలో హారర్‌తోపాటు మంచి సైకలాజికల్పాయింట్ని యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ప్రమాదకరమని చెప్పారు డైరెక్టర్ కౌశిక్. ఈ సినిమా ద్వారా సాయి శ్రీనివాస్, అనుపమ మంచి హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు. చేతన్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాని అందరూ చూడాల్సిన అవసరం ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్..!
దసరా విలన్ షైన్ టామ్ చాకో నటించిన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సూత్రవాక్యం. ఈ మూవీ ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ చిత్రంలో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో రిలీజయ్యాక 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌కు పైగా దూసుకెళ్తోంది. థియేటర్లలో అంతగా రాణించకపోయినా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి యూజీన్ జోస్ చిరమ్మెల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకోతో పాటు విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్ నటించారు. ఈ సినిమాలో క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో కనిపించారు. నిర్మాత శ్రీకాంత్ కండ్రాగుల నిర్మాత ఓ కీలక పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. -
'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్
సినిమాలు తీయడం అనేది జూదం లాంటిది. వస్తే భారీ లాభాలు. లేదంటే భారీ నష్టాలు. కొన్నిసార్లు మాత్రం ఊహించని సక్సెస్, కోట్ల కొద్దీ కలెక్షన్ వస్తుంటాయి. తాజాగా రిలీజైన సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగులో 'లిటిల్ హార్ట్స్' ఎంతలా సంచలనం సృష్టిస్తుందో చూస్తునే ఉన్నాం. దీని కంటే ముందు రిలీజైన ఓ మలయాళ చిత్రం కూడా ఊహించని వసూళ్లతో రికార్డ్స్ బద్దలుకొడుతుంది. ఈ మూవీ గురించి హీరో కమ్ నిర్మాత దుల్కర్ సల్మాన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?)'నిర్మాతగా 'లోక' కోసం పెట్టిందంతా నష్టపోతానని అనుకున్నాను. స్టోరీ బాగా నచ్చింది. మంచి సినిమా అవుతుందని తెలుసు. కానీ బడ్జెట్ ఎక్కువైపోయింది. మలయాళంలో ఇంత బడ్జెట్ చాలా రిస్క్. కానీ కథని నమ్మి పెట్టాను. థియేటర్లలో రిలీజ్ చేద్దామంటే డిస్ట్రిబ్యూటర్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. లోక ఫ్రాంచైజీ మొదలుపెడితే సీక్వెల్స్‌తో లాభాలొస్తాయని అనుకున్నాను. ఆ నమ్మకంతోనే రిలీజ్ చేశాం. కానీ ఈ సక్సెస్ మాత్రం ఊహించలేదు. మొదటిరోజు నుంచే సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది. మా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది' అని దుల్కర్.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మలయాళంలో వచ్చిన తొలి లేడీ సూపర్ హీరో సినిమా ఇది. తెలుగులోనూ దీన్ని 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు గానీ ఇక్కడ ఓ మాదిరిగానే లాభపడింది. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకుడు కాగా.. ఇందులో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, సౌబిన్ షాహిర్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించారు. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లలో రెస్పాన్స్ వస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!)"As Producer, we thought that we'll lose money on #Lokah😳. we know it's good film, but Budget is high & Buyers are not interested🙁. I thought if this franchise is established, we might do profit🤞. But this success was unimaginable🥶♥️"- #DulquerSalmaanpic.twitter.com/pmy1Bum8a1— AmuthaBharathi (@CinemaWithAB) September 15, 2025 -
విజయ్ ఎన్నికల బస్సుకు అదే నంబర్.. గుండెను కదిలించే స్టోరీ తెలుసా?
కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. మరో 6 నెలల్లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుచ్చి నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. అందుకు ప్రత్యేకమైన ఒక బస్సును కొనుగోలు చేశారు. ఆ వాహనానికి తీసుకున్న రిజిస్ట్రేషన్ నంబర్ వైరల్‌గా మారింది. తన జీవితంలో ఎంతో సెంటిమెంట్‌గా మిగిలిపోయిన సంఘటన ఈ నంబర్‌ను సూచిస్తుంది.విజయ్ కొనుగోలు చేసే కారు ధర ఎంత ఉన్నా సరే నంబర్ మాత్రం మారదు.. తన వద్ద ఉన్న ప్రతి వాహనానికి 0277 అనే నంబర్ ఉంటుంది. TN 14 అనేది సాధారణం. దాని తర్వాత వచ్చే ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే మారుతుంటాయి. ప్రస్తుతం అతని ప్రచార వాహనం నంబర్ ప్లేట్ కూడా TN 14 AS 0277 ఉండటం విశేషం. అతని వాహనాలపై 14-02-77 రూపంలో ఒక తేదీని ఎల్లప్పుడూ సూచిస్తుంది.ఈ నంబర్ వెనుక విజయ్ సెంటిమెంట్ స్టోరీ ఉంది. విజయ్ చెల్లెలు విద్య అదే 14-02-1977లో జన్మించింది. అయితే, 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే ఆమె మరణించింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడని తెలిపింది. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు. విజయ్ వద్ద ఇప్పటికే TN 14 AH 0277, TN 14 AL 0277, TN 14 AM 0277, TN 14 AS 0277 నంబర్ ప్లేట్లతో వాహానాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Nithin Barath SR (@theactorvijayteamoff) -
కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?
మరో రెండు వారాల్లో 'కాంతార' కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇంతవరకు ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే మిగతా అన్నీ పనులు పూర్తయినప్పటికీ సొంత రాష్ట్రంలోనే ఓ సమస్య ఇబ్బందిగా మారింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించారని టాక్. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్‌గానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా టికెట్స్ విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టికెట్ ధరలు తగ్గించేసింది. మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ఠ టికెట్ ధర రూ.236 మాత్రమే ఉంది. ఇంతకంటే పెంచడానికి వీలు లేదని తీర్మానించింది. దీన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు కూడా. చిన్న బడ్జెట్ మూవీస్‌కి దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 'కాంతార' లాంటి చిత్రానికి పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ విషయమై నిర్మాతలు హొంబలే ఫిల్మ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అరుంధతి రీమేక్‌లో శ్రీలీల.. 'మెగా' డైరెక్టర్!)టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని 'కాంతార' నిర్మాతలు రిట్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే.. వీళ్లతో పాటు భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలకు మార్గం సుగమమం అవుతుంది. లేదంటే 'కేజీఎఫ్' రికార్డులు కాదుకదా రూ.1000 కోట్ల మార్క్ కూడా దాటడం కష్టమైపోతుంది. అలానే కర్ణాటకలో తక్కువ రేట్, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధర పెడితే మాత్రం కచ్చితంగా విమర్శలు వస్తాయి. మరి ఈ పిటిషన్‌పై ఫలితం ఏమొస్తుందో చూడాలి?దసరా కానుకగా అక్టోబరు 2న 'కాంతార: ఛాప్టర్ 1' థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ సింపుల్‌గా రూ.15-20 కోట్లతో తీస్తే రూ.400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో రెండో భాగాన్ని కళ్లు చెదిరే బడ్జెట్ పెట్టారు. అలానే రుక్మిణి వసంత్ లాంటి నటుల్ని సినిమాలో భాగం చేశారు. మరి ఈసారి 'కాంతార' ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో?(ఇదీ చదవండి: మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!) -
'ఇడ్లీ కొట్టు' టైటిల్ ఎందుకు పెట్టామంటే..: ధనుష్
నటుడు ధనుష్ తాజాగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు). నటి నిత్యామీనన్ నాయకిగా నటించారు. శాలిని పాండే, సత్యరాజ్, అరుణ్‌విజయ్, రాజ్‌కిరణ్, పార్తీపన్, సముద్రఖని తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్1వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇడ్లీ కొట్టు అని పేరు పెట్టడానికి కారణం గురించి చెబుతూ చిన్నతనంలో తనకు రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదన్నారు. అయితే చేతిలో డబ్బు ఉండేది కాదన్నారు. దీంతో తోటల్లో పూలు కోసే పనికి వెళితే రోజుకు రూ. 2 లేదా 2.50 రూపాయలు ఇచ్చేవారన్నారు. ఆ డబ్బుతో నాలుగు లేదా ఐదు ఇడ్లీ వస్తే కొనుక్కుని తినేవాడినన్నారు. ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు పెద్ద పెద్ద ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ లభించడం లేదన్నారు. ఆ ఇడ్లీ కొట్టు ఇతి వృత్తంతో చిత్రం చేయాలని అనిపించిందన్నారు. అలా నిజమైన కథ, నిజమైన పాత్రలతో చిత్రం చేసినట్లు ధనుష్ చెప్పారు. అదే విధంగా తన హేటర్స్ గురించి స్పందిస్తూ అసలు హేటర్స్ అనే కాన్సెప్టే పరిశ్రమలో లేదన్నారు. అలాంటి వారు కూడా ఇక్కడ లేరన్నారు. అందరూ అన్ని చిత్రాలు చూస్తుంటారని, అలాంటిది హేటర్స్ ఎవరని చెప్పాలంటూ పేర్కొన్నారు. అయితే ఒక 30 మంది తమ జీవనం కోసమో లేదా మరేదైనా ఆశించో 300 ఐడియాలతో ఏదైనా తప్పుడు ప్రచారం చేయడమే హేట్ అని తెలిపారు. ఆ 30 మంది కూడా చిత్రాలను చూస్తారని ధనుష్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ వేదికపై మాట్లాడిన నటుడు పార్తీపన్ నటుడు ధనుష్‌ను సకలకళావళ్లభుడిగా పేర్కొన్నారు. ఇక ఆయన అభిమానులైతే యువ సూపర్‌స్టార్ అంటూ పోస్టర్లతో ప్రచారం చేశారు. -
భద్రకాళి నిరుత్సాహ పరచదు: విజయ్ ఆంటోని
‘‘భద్రకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదని కచ్చితంగా చెప్పగలను’’ అని విజయ్ ఆంటోని చెప్పారు. ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది.ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా కలిసి తెలుగులో విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సురేష్ బాబు మాట్లాడుతూ–‘‘విజయ్‌గారి క్రమశిక్షణే ఆయన్ను గొప్పస్థాయికి తీసుకువెళ్తుంది’’ అన్నారు. ‘‘మంచి పొలిటికల్ థ్రిల్లర్ ఇది’’ అని తెలిపారు అరుణ్ ప్రభు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అన్నారు రామాంజనేయులు. ఈ వేడుకలో తృప్తి రవీంద్ర, రియా, రైటర్ భాష్యశ్రీ మాట్లాడారు. -
ఆయన వల్లే నా పేరు మార్చుకున్నా: కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వీర చంద్రహాస మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన రవి తనకు సాయం చేసిన వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు రవి అనే వ్యక్తి అండగా నిలిచారు. అందుకే ఆయన పేరును పెట్టుకున్నానని తెలిపారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చింది మాత్రం ప్రశాంత్ నీల్ అన్నారు.రవి బస్రూర్ మాట్లాడుతూ.. ఎనిమిదో తరగతి ఫెయిల్ అయినా నాలో సంగీత దర్శకుడిని గుర్తించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నాపై నమ్మకంతో ఉగ్రం సినిమాలో అవకాశమిచ్చారు. అప్పటికే నా లైఫ్ అంతా గందరగోళంగా ఉంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు రవి అనే వ్యక్తి ఆర్థిక సాయం చేశారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. లేకుంటే ఉండేవాడిని కాదు. అందుకే కృతజ్ఞతగా నా పేరును రవి అని పెట్టుకున్నా. వృత్తిపరంగా నన్ను గుర్తించి అవకాశమిచ్చిన ప్రశాంత్ నీల్ నాకు దైవంతో సమానం. నా సంపాదనతో వచ్చిన డబ్బులతో ఏడాది ఒక సినిమా తీయాలని అనుకున్నా. అందుకే వీర చంద్రహాస తెరకెక్కించా. ఇది నా 12 ఏళ్ల కల’’ అని అన్నారు.కాగా.. వీర చంద్రహాస చిత్రం ఇప్పటికే కన్నడలో రిలీజైంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 19న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. కేజీఎఫ్ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేసిన రవి బస్రూర్ నిర్మాతగా మారారు. ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్- నీల్ కాంబోలో వస్తోన్న మూవీకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు రవి బస్రూర్. -
నేను ధనుష్‌ని వెన్నుపోటు పొడవలేను: జీవీ
డబ్బింగ్ సినిమాల మూలాన తమిళ హీరోహీరోయిన్లతో పాటు టెక్నిషియన్లు కూడా తెలుగు ప్రేక్షకులకు చాలావరకు పరిచయమైపోతున్నారు. పాన్ ఇండియా మూవీస్ వల్ల చాలామంది కోలీవుడ్.. మన దగ్గర పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఒకడు. తెలుగు, తమిళంలో పలు చిత్రాలు సంగీతమందిస్తూ బిజీగా ఉండే ఇతడు.. ఇప్పుడు ఓ సీక్రెట్ బయటపెట్టాడు. ధనుష్‌ని తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పుకొచ్చాడు.ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'ఇడ్లీ కడై'. దీన్ని 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబరు 01న థియేటర్లలోకి రానుంది. నిన్న అంటే ఆదివారం ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలోనే మాట్లాడిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్.. గతేడాది రిలీజైన ధనుష్ 'రాయన్'లో తనకు నటించే అవకాశం వచ్చిందని, కానీ దాన్ని వద్దనుకున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?)'రాయన్ మూవీలో తమ్ముడి పాత్ర చేయమని ధనుష్ నన్ను మొదట అడిగారు. అయితే ఆ పాత్ర ధనుష్ పాత్రని వెన్నుపోటు పొడుస్తుంది. ఆ పాయింట్ నచ్చక నేను నో చెప్పేశాను. సినిమాలో కూడా నా స్నేహితుడిని మోసం చేసే పాత్రని చేయను' అని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రాయన్'లో ధనుష్ తమ్ముళ్లుగా కాళిదాస్, సందీప్ కిషన్ నటించారు. ఇందులో ఓ పాత్రనే జీవీ చేయాల్సింది కానీ వద్దనేశాడనమాట.ఇకపోతే 'ఇడ్లీ కొట్టు' సినిమా.. పూర్తిగా ఎమోషన్స్ బేస్ చేసుకుని తీశారు. ధనుష్, నిత్యామేనన్, సత్యరాజ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే లీడ్ రోల్స్ చేశారు. దసరా కానుకగా తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీనికి ఐదు రోజుల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ', ఓ రోజు తర్వాత 'కాంతార' సీక్వెల్ విడుదల కానున్నాయి. మరి వీటితో నిలబడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: రూ.100 కోట్లకు చేరువలో 'మిరాయ్' కలెక్షన్) -
నా ఫోన్ హ్యాక్ చేశారు.. అభిమానులకు స్టార్ హీరో హెచ్చరిక
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా నా ఫోన్ నుంచి కాల్ వస్తే స్పందించవద్దని కోరారు. తన ఫోన్ హ్యాక్ చేశారని ఉపేంద్ర తెలిపారు. తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ కూడా ఇవ్వొద్దని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఉపేంద్ర వెల్లడించారు. తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన వస్తువుకు సంబంధించి సోమవారం ఉదయం ఒకరు కాల్ చేశారని.. కొన్ని హ్యాష్‌ట్యాగ్స్, నంబర్లు ఎంటర్ చేస్తే డెలివరీ అవుతుందని చెప్పాడని ఉపేంద్ర అన్నారు. ఆ కాల్ తర్వాతే ఫోన్ హ్యాక్ అయిందని తెలిపారు. ఇలాంచి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉపేంద్ర తన అభిమానులకు సూచించారుBeware… pic.twitter.com/ftbQDFodTf— Upendra (@nimmaupendra) September 15, 2025