breaking news
West Godavari
-
భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే..
సాక్షి, ఏలూరు జిల్లా: సెల్ఫీ వీడియో.. ఆపై సూసైడ్.. భార్యాభర్తలిద్దరూ మృతి.. అనాథైన మూడేళ్ల కుమారుడు.. తొందరపాటుతనమా..? శరీరేచ్ఛలా..? దేనికి సంకేతం.. వెరిసి అనాథగా మారిన బాలుడు..!!. కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్న ఫ్యామిలీస్.. అరచేతిలో మొబైల్ ఫోన్.. అడ్డుకునే వారే లేరు. నా జీవితం.. నా ఇష్టం.. ఒకరిపై ఇష్టం.. మరొకరిపై మోజు.. సంసారం ఒకరితో.. మరొకరితో...!.. వివరాల్లోకి వెళితే..అవమాన భారంతో జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భీమడోలుకు చెందిన గుండుమోలు భానుపూర్ణిమ (22), భర్త సుధాకర్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా భార్య సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త ఇవాళ(అక్టోబర్ 29, బుధవారం) తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చికిత్స పొందుతూ అదే ఆసుపత్రిలో మృతి చెందాడు.ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఇరువురు శనివారం విషo తాగి ఆ సెల్ఫీ వీడియోను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపించారు. అదే గ్రామానికి చెందిన కటారి మోహన్ అనే వ్యక్తి 15 రోజులు కిందట మాయమాటలు చెప్పి భాను పూర్ణిమను తీసుకెళ్లడంపై... భర్త సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు.కొన్ని రోజులు గడిచిన తర్వాత పూర్ణిమ మళ్లీ తిరిగి వచ్చిన క్రమంలో.. మోహన్ అనే వ్యక్తి వారి లైఫ్ లోకి రావడం వల్ల తాము మానసికంగా కృంగిపోతున్నామని సెల్ఫీ వీడియో తీసి పంపిన జంట.. తదనంతరం విషం తాగి సోమవారం రాత్రి భార్య మృతి చెందగా.. ఈరోజు తెల్లవారుజామున భర్త మృతి చెందారు. భాను పూర్ణిమ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి కారకుడైన కటారి మోహన్‌ను అరెస్ట్ చేసిన భీమడోలు పోలీసులు.. రిమాండ్‌కి పంపించారు. -
హడలెత్తించిన మోంథా
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పెనుగొండ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈదురుగాలుల బీభత్సం అధికంగా ఉండడంతో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. లంక గ్రామాల్లో ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులకు, ఇతర ప్రాణులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): మోంథా తుపానును ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కలెక్టర్ చదలవాడ నాగరాణిలతో కలసి కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బియ్యపుతిప్ప, వేములదీవి గ్రామాలకు చెందిన ప్రజలను అవసరమైతే నరసాపురం పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. ఈదురు గాలుల వల్ల కరెంటు తీగలు తెగిపోవడం ద్వారా ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవా లని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. చింతలపూడి : మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మంగళవారం అధికారులు 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు నెలలుగా పడుతున్న భారీ వర్షాలకు తమ్మిలేరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.45 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చనని అధికారులు చెప్పారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు డీఈ తెలిపారు.సాక్షి, భీమవరం: మోంథా తుపాను జిల్లాపై విరుచుకుపడింది. తీరానికి చేరువయ్యేకొద్దీ బలమైన గాలులతో, ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లా వాసులను వణికించింది. ఈదురు గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలతో పాటు పలుచోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత నుంచి మోంథా విశ్వరూపం చూపించింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి అలలు ఎగసిపడుతూ నరసాపురం రూరల్ చినమైనివాలంక నుంచి పెదమైనివానిలంక వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవునా సముద్రం అర కిలోమీటరు మేర ముందుకు చొచ్చుకువచ్చింది. ఈదురుగాలులకు విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు.. గాలుల తీవ్రతకు నరసాపురం రూరల్ రాజుల్లంక, సారవ, ఎల్బీ చర్ల, లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, తూర్పుతాళ్లు, వీరవాసరం మండలంలో మత్స్యపురి, బలుసుకుయ్యలపాలెం, రాయకుదురు, నవుడూరు, అండలూరు, పాలకొల్లు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. పాలకొల్లు వీరావారివీధి, యలమంచిలి మండలం మేడపాడు, పెనుమంట్ర మండలం పొలమూరు, ఆలమూరు, వెలగలేరు, కొయ్యేటిపాడు, బ్రాహ్మణచెరువు, పెనుగొండ మండలం ఇలపర్రు, తణుకులోని పిండిమరల వారి వీధి, వెంకటరాయపురం, పెంటపాడు మండలం ముదునూరు తదితర గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు ఎగిరిపడ్డాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెరిపివ్వని వర్షం తుపాను ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల సమయానికి జిల్లాలో 583 మిల్లీమీటర్ల వర్షం కురవగా 20 మండలాల్లో సగటు వర్షపాతం 29.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 116, మూడు గంటల సమయానికి 130 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆచంట, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు తదితర చోట్ల అధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు నీటమునిగాయి. అప్రమత్తంగా... జిల్లా యంత్రాంగం తాడేపల్లిగూడెంలో 3, నరసాపురంలో 30, భీమవరం డివిజన్లో 3 ముంపు ప్రాంతాలు, 10 తీవ్ర ప్రభావిత గ్రామాలను గుర్తించారు. తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆర్అండ్బీ పరిధిలో 28, రవాణా శాఖ పరిధిలో 40 చొప్పన మొత్తం 69 జేసీబీలు, 79 పవర్ సాలను, 96 డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచారు. నరసాపురంలో 34 మంది సభ్యులతో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, ఏపీఎస్పీ ప్లటూన్ ఒకటి భీమవరంలో, మరొకటి నరసాపురంలో సిద్ధంగా ఉంచారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 60 మంది సిబ్బందిని ఉండిలో మోహరించారు. 150 వరకు వైర్లెస్ సెట్లు, ఒక శాటిలైట్ ఫోను, ఒక డ్రోను అందుబాటులో ఉంచారు. భీమవరం ప్రాంతంలో వర్షాలతో నేలనంటిన వరి పంట నరసాపురం : 12వ వార్డులో కూలిన భారీ వృక్షం తుపాను పరిస్థితులు చక్కబడే వరకు కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేస్తాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజలు ఏదైనా అత్యవసర సమాచారాన్ని తెలియజేయడానికి, సహకారాన్ని పొందడానికి కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 08816 299219 భీమవరం ఆర్డీవో కార్యాలయం 98484 13739 నరసాపురం ఆర్టీవో కార్యాలయం 93911 85874తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం 93817 01036 జిల్లా అంతటా ఈదురుగాలులతో కూడిన వర్షాలు నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు 3581 ఎకరాల్లో నేలనంటిన వరి పైర్లు నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ పునరావాస కేంద్రాలను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు బాధితులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ.. మోంథా తుపాను బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ప్రభుత్వాన్ని కోరారు. తీరప్రాంత గ్రామాల ప్రజల కోసం నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఏర్పాటుచేసిన పలు పునరావాస కేంద్రాలను మంగళవారం ఆయన సందర్శించారు. అక్కడి ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తుపాను బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ప్రసాదరాజు తెలిపారు. పునరావాస కేంద్రాలకు 4,150 మంది తరలింపు జిల్లాలోని నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం డివిజన్ల పరిధిలో 44 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయగా 37 కేంద్రాలను వినియోగంలోకి తెచ్చారు. ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి 9,409 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించగా, మంగళవారం సాయంత్రానికి 4,150 మందిని మాత్రమే తరలించారు. ఆయా కేంద్రాలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, తుపాను పర్యవేక్షణ జిల్లా ప్రత్యేకాధికారి వి.ప్రసన్నవెంకటేష్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ నాగరాణి సెలవును ప్రకటించారు. ఉత్తర్వులను అన్ని విద్యాసంస్థలూ తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పిల్లలు బయట తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. 3581 ఎకరాల్లో పంట నష్టం తుపాను ప్రభావంతో మంగళవారం నాటికి జిల్లాలోని 3581 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈదురుగాలులతో ఇరగవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్, కాళ్ల, ఆకివీడు, వీరవాసరం, పాలకోడేరు తదితర మండలాల్లో వేల ఎకరాల్లోని వరిపైరు నేలనంటింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉప్పుటేరు, యనమదుర్రు, ఎర్రకాలువ, చినకాపవరం, గునిపూడి సౌత్, బక్లెస్, కాజ తదితర డ్రెయిన్లు, పంట కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంపునీరు బయటకు పోయేదారి లేక పొలాలు నీట మునిగాయి. మరో పది రోజుల్లో కోతకు రానున్న పంట కళ్లముందే నీట మునిగిపోయిందని రైతులు వాపోతున్నారు. -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: కార్తీక మాసం మంగళవారం సందర్భముగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి 108 ప్రదక్షణలు చేసి, స్వామిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తరం పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయానికి మధ్యాహ్నం వరకు వివిధ సేవల రూపేణా రూ.4,05,550 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. అన్నదాన సత్రంలో సుమారు 7,300 భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు చెప్పారు. ఉంగుటూరు: కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వెదురు పావులూరి జీవమణి (33) సోమవారం రాత్రి సమయంలో పురుగుమందు తాగి అనంతరం గ్రామ ఊరచెరువులో పడి మృతి చెందింది. ఆమెకు భర్త శ్రీహరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవమణి కడుపునొప్పి తాళలేక చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జీవమణి తల్లి నూజివీటి అనుసూయ ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం: కంపెనీలో పనిచేసి అదే కంపెనీ పేరు వచ్చేలా నకిలీ కంపెనీ పెట్టి కొందరిని మోసం చేసిన నేరంపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ చెప్పారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టకు చెందిన వంకాయల సతీష్, పట్టణానికి చెందిన మండపాక వినోద్‌కుమార్‌లను అరెస్టు చేశామన్నారు. వివరాల ప్రకారం.. బొమ్మగాని బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉన్న ఐఎఫ్ఎల్ గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్ధలో కొంతకాలం వీరంకి శ్రీరాములు, వంకాల సతీష్, మండపాక వినోద్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. వీరు కంపెనీ నుంచి బయటకు వచ్చి అదే పేరు వచ్చేలా ఇనాకుల ఫార్మర్స్ లైఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఐఎఫ్ఎల్) పేరుతో మరో కంపెనీ ప్రారంభించి బాలకృష్ణ కంపెనీకి చెందిన ఖాతాదారులను, రైతులను మభ్యపెట్టి మోసం చేశారని బాలకృష్ణ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో వీరంకి శ్రీరాములను అరెస్టు చేయగా, అతను హైకోర్టు నుంచి ఉత్తర్వులు పొందినట్లు ఎస్సై చెప్పారు. కాగా ఈ కేసులో వంకాయల సతీష్, మండపాక వినోద్‌కుమార్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
కుదించిన బోగీలు.. ప్రయాణికుల అగచాట్లు
ఉంగుటూరు: ఒకప్పటి పాస్టు ప్యాసింజరు.. ప్రస్తుతం విజయవాడ మొము ఎక్సుప్రెస్గా నడుపుతున్న నం.17258 రైలులో బోగీలు తగ్గించేయడంతో రైల్వే ప్రయాణికులకు ప్రయాణం కష్టతరంగా మారింది. గతంలో ఈ రైలులో 13 బోగీలు ఉండగా ప్రస్తుతం వాటిని 7కి పరిమితం చేశారు. దీంతో ప్రయాణికులు నిలబడే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. బోగీలు తగ్గించేసి గోదావరి జిల్లాల ప్రజలపై రైల్వే శాఖ చిన్నచూపు చూస్తోందంటూ సర్వత్రా విమర్శిస్తున్నారు. అనువైన రైలు.. సౌకర్యాలు లేవు ఈ రైలు కాకినాడలో తెల్లారుజాము 4.10 గంటలకు బయలుదేరి ఉదయం 9 గంటలకు విజయవాడ చేరుతుంది. తిరిగి కాకినాడకు చేరుకునేందుకు సాయంత్రం 6.15కి విజయవాడ నుంచి బయలుదేరుతుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో అనువైన సమయంలో ఈ రైలు ప్రయాణం ఉండడంతో ఎక్కువమంది ఈ రైలులో ప్రయాణం సాగిస్తుంటారు. ఉదయం వచ్చే రైలులో సామర్లకోట, రాజమండ్రిలోనే ఈ రైలులోని సీట్లు పుల్ అయిపోతుంటాయి. ఆతరువాత నుంచి రైలు ఎక్కిన ప్రయాణికులు నిలబడి ప్రయాణం సాగించాల్సిందే. అలాగే ఈ రైలులో మరుగుదొడ్లు కూడా రెండుకు మించి లేవు. దాంతో అవసరాలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఉద్యోగులకు సరైన సమయం ఈ రైలు ఉదయం వేళ గోదావరి, కొవ్వూరు, పశివేదల నిడదవోలు, తాడేపల్లిగూడెం, చేబ్రోలు, పూళ్ల, భీమడోలు, ఏలూరు, పవరుపేట, నూజువీడు స్టేషన్లలో ఆగుతూ విజయవాడ చేరుతుంది. ఉద్యోగస్తులకు సరైన సమయం కావడంతో ఎక్కువగా సీజన్ టికెట్లు తీసుకుని ఈ రైలును ఆశ్రయిస్తున్నారు. అలాగే మార్కెటు పనులమీద వెళ్లేవారికి, దైవక్షేత్రాలకు వెళ్లే వారికి ఈ రైలు చాలా అనుకూలంగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు ఈ రైలు ద్వారా విజయవాడ చేరుకుని అక్కడ నుంచి మరో రైలు పట్టుకుని ప్రయాణం సాగిస్తుంటారు. ఇదే రైలు గుంటూరు కూడా వెళుతుంది. దాంతో ఎక్కువమంది ఈ రైలును ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి రైలులో సౌకర్యాలు పెంచాల్సి ఉండగా బోగీలను ఇంకా తగ్గించేయడంపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణికుల బాధలు పట్టించేకునే రైల్వే అధికారులు గానీ, పార్లమెంటు సభ్యులు గాని ఎవరూ లేరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాస్టుప్యాసింజరుగా పిలుచుకునే మెము ఎక్స్‌ప్రెస్ రైలులో బోగీల కుదింపు ప్రయాణికులకు తప్పని పాట్లు గోదావరి జిల్లాలపై రైల్వే శాఖ చిన్నచూపు! -
యోగాసన పోటీల్లో సత్తా చాటిన జిల్లా జట్టు
నూజివీడు: విశాఖపట్టణంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసనా పోటీల్లో జిల్లాలోని నూజివీడు, ఆగిరిపల్లి, శోభనాపురం, వడ్లమాను తదితర గ్రామాలకు చెందిన యోగ సాధకులు ఉత్తమ ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు. 38వ యోగాసనా చాంపియన్‌షిప్ పోటీల్లో ఏలూరు జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు యండూరు నరసింహమూర్తి, ప్రధాన కార్యదర్శి బొద్దూరు సాంబశివరావు, కోశాధికారి ఏపీవీ బ్రహ్మచారి, యోగ గురువులు టీవీకె కుమార్ నేతృత్వంలో 35 మంది యోగ సాధకులు పాల్గొన్నారు. ఈనెల 25, 26 తేదీలలో జరిగిన ఈ పోటీల్లో ఏలూరు జిల్లా యోగ అసోసియేషన్ నుంచి పది డివిజన్లో పోటీపడగా ఏడింటిలో విజయం సాధించారు. మహిళల విభాగంలో బొద్దూరు పద్మశ్రీలత 3వ స్థానం సాధించగా, పురుషుల విభాగంలో మూడో స్థానంలో నూజివీడుకు చెందిన పత్రి కనకభూషణం, 5వ స్థానంలో టి.సాయి ప్రసన్నలక్ష్మి, 7వ స్థానంలో కే శ్రీనివాసరావు, 8వ స్థానంలో ఎం జ్యోతి కుమారి, 9వ స్థానంలో యండూరు నరసింహమూర్తి, 10వ స్థానంలో భావన, జూనియర్స్‌లో ఆరో స్థానంలో ఎల్ అను నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ యోగ అసోసియేషన్ అధ్యక్షుడు కోన కృష్ణదేవరాయలు. ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్లచే షీల్డ్స్, మెడల్స్ అందజేశారు. -
తుపాను రక్షణ చర్యలపై సమీక్ష
ఏలూరు టౌన్: జిల్లాలో మోంథా తుపాను రక్షణ చర్యలపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌తో ప్రత్యేక అధికారి ఆక్టోపస్ డీఐజీ ఎస్.సెంఽథిల్‌కుమార్ మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తుపాను ముందస్తు రక్షణ చర్యలపై ఆయన సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన డీఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ముందస్తు సహాయక చర్యలపై ఎస్పీ వివరించారు. తుపాను కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. డ్రోన్ నిఘా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకున్నామని, పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహాయక చర్యలకు సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏలూరు డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఈడీఆర్ఎఫ్) బృందాలు సన్నద్దం చేశామన్నారు. ఆక్టోపస్ డీఐజీ సెంథిల్ కుమార్ -
మున్సిపల్ కార్మికుల బైక్ ర్యాలీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ పేట పార్క్ వద్ద నుంచి విజయ విహార్ సెంటర్, రైతు బజార్, శంకర మఠం, సుబ్బమ్మ దేవి స్కూలు, రమా మహల్ సెంటర్ మీదుగా ఈ బైక్ ర్యాలీ సాగింది. అనంతరం మున్సిపల్ వాటర్ సప్లై ఎస్ఆర్ 2 పాయింట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు పీ. కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఏ. అప్పలరాజు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఇంజనీరింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 12వ పీఆర్సీని ప్రకటించాలని, మధ్యంతర భృతి 30 శాతం చెల్లించాలని, కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో పనులను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అడ్డకర్ల లక్ష్మీ ఇందిర, కురెళ్ళ వరప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు బీ.నారాయణరావు, సీహెచ్.అప్పారావు, డీ. అప్పారావు, డీ.వేంకటేశ్వరరావు, కే.శ్రీనివాసరావు, బీ.దుర్గారావు, ఎస్కే.ఆలీ, పీ.దుర్గారావు, ఎస్.గౌరీ శంకర్, ఎన్.శ్రీనివాసరావు, జీ.రవి, కే.బాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
కూలిన చెట్టును ఢీకొన్న బస్సు
పెంటపాడు: తుపాను, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రత్తిపాడులో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును ఆర్టీసీ బస్సు మంగళవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వై.జంక్షన్ దుర్గమ్మ గుడి నుంచి జాతీయ రహదారి వెళ్లే ప్రాంతంలో రెండు కొబ్బరి చెట్లు తుపాను వల్ల నేలకొరిగాయి. తణుకు వైపు రోడ్డు పక్కగా చెట్టు ఉండడంతో గమనించని ఆర్టీసీ డ్రైవర్ అటుగా బస్సును పోనివ్వడంతో ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు జ్యోతి (దువ్వ), అనిత (తేతలి) యాకూబ్ (తణుకు)కు గాయాలయ్యాయి. వారితో పాటు, ఇతర ప్రయాణికులను వేరే బస్సులో తణుకు పంపించారు. పెంటపాడు ఎస్సై స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జంగారెడ్డిగూడెం: మోంథా తుపాను బాధితుల కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు కర్పూరం గుప్త మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయ రాజు, బత్తిన నాగలక్ష్మి నేతృత్వంలో జంగారెడ్డిగూడెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున బత్తిన చిన్న కళ్యాణ మండపం వద్ద తుపాను బాధితులకు షెల్టర్, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బత్తిన చిన్న, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని భార్యాభర్తలకు గాయాలు
చింతలపూడి: లారీ ఢీకొని భార్యాభర్తలు గాయపడిన ఘటన చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం కామవరపుకోట మండలం, దొండపాటివారి గ్రామానికి చెందిన భార్యాభర్తలు తాడిగడప రాజారావు, జ్యోతి వైద్యం నిమిత్తం చింతలపూడి ఆసుపత్రికి వచ్చి తిరిగి స్వగ్రామం వెళుతుండగా కామవరపుకోట వైపు నుంచి చింతలపూడి వస్తున్న పామాయిల్ లోడ్ లారీ రాంగ్ రూట్లో వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజారావు, జ్యోతిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై కె రమేష్ రెడ్డి ఘటనా స్ధలానికి చేరుకుని గ్రామస్తుల నుంచి సమాచారం సేకరించారు. లారీ డ్రైవర్ పరారు కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆపదలో రాని 108.. వైఎస్సార్ సీపీ నేత సాయం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు 108కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. అదే సమయంలో అటువైపు వెళుతున్న వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎస్ రమేష్‌రెడ్డి స్పందించి స్థానికుల సహకారంతో తన వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. -
ఆత్మహత్యాయత్నం ఘటనలో భార్య మృతి
భీమడోలు: తీవ్ర మనోవేదన, అవమానాన్ని భరించలేక కలుపు మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో భార్య గుండుమోలు భానుపూర్ణిమ (22) సోమవారం రాత్రి మృతి చెందింది. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న భీమడోలు పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. వివరాల ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ దంపతులు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. గ్రామానికి చెందిన కటారి మోహన్ నాగ వెంకట సాయి భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి ఆమెను 15 రోజుల పాటు గ్రామాంతరం తీసుకుని వెళ్లాడు. ఆమె తనను కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్లాలని గొడవ చేయడంతో ఈనెల 19వ తేదీన భీమడోలు తీసుకుని వచ్చాడు. అయితే తీవ్ర మనోవేదన, అవమానాన్ని తట్టుకోలేక ఈనెల 25వ తేదీ రాత్రి భీమడోలు సమీపంలోని ఓ పశువుల పాకలో భార్యాభర్తలు సుధాకర్, భానుపూర్ణిమ కూల్‌డ్రింక్‌లో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని గుంటూరు ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భానుపూర్ణిమ మృతి చెందింది. భర్త సుధాకర్ పరిస్థితి విషమంగా ఉంది. ఏఎస్సై చలపతిరావు, వీఆర్వో సింహాచలం సమక్షంలో మృతురాలి మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. భానుపూర్ణిమ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భీమడోలు ఎస్సై షేక్ మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరిస్థితి విషమం -
పారా షూటింగ్లో సిల్వర్ మెడల్
అత్తిలి: పారా షూటింగ్లో అత్తిలికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ సిల్వర్ మెడల్ సాధించినట్టు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి రామస్వామి ప్రకటనలో తెలిపారు. విజయవాడ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ వారి సహకారంతో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర పారా షూటింగ్ చాపియన్ షిప్ –2025లో ఎస్‌హెచ్ – సిట్టింగ్ విభాగంలో సూర్యనారాయణ ఈ ప్రతిభ సాధించారన్నారు. షూటింగ్ అకాడమీ డైరెక్టర్, చీఫ్ కోచ్ ఎన్.సుబ్రహ్మణ్యశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు కె.దయానంద్ చేతుల మీదుగా సూర్యనారాయణ మెమొంటో, సర్టిఫికెట్ అందుకున్నారు. పారా స్పోర్ట్స్‌లో దివ్యాంగులు ఉన్నతస్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్న రాష్ట్ర గ్రంథాలయాల శాఖా చైర్మన్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ అంద్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుకుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామికి సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. -
గుంతల రోడ్లపై పెల్లుబికిన ప్రజాగ్రహం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గుంతల రోడ్లపై ప్రజాగ్రహం పెల్లుబికింది. రోడ్లకు మరమ్మతులు చేయలేరా అంటూ ఏలూరులోని వంగాయగూడెం ప్రాంత ప్రజలు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. మోంథా తుపాను ప్రభావంతో ఏలూరు నగరంలో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఏలూరు నుంచి పెదపాడు వెళ్లే ప్రధాన మార్గంగా ఉపయోగపడుతున్న వంగాయగూడెం – కేన్సర్ ఆసుపత్రి రోడ్డులో ప్రమాదకర గుంటలు ఏర్పడి, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తుండగా, గత ఏడాది నుంచి రోడ్డు మరమ్మతులు చేపట్టకుండా వదిలివేయడంతో వర్షాలు మొదలైనప్పుడల్లా రహదారి మొత్తం బురద గుంటలుగా మారుతోంది. చిన్న వాహనాలు, టూ–వీలర్ ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరమైన అత్యవసర తరుణాల్లో కేన్సర్ ఆసుపత్రికి వెళ్లే రోగుల ప్రయాణం కూడా ప్రాణాంతకంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగాయగూడెం మాత్రమే కాకుండా, ఏలూరులోని హనుమాన్ నగర్ నుంచి కొత్తూరు వెళ్తున్న కాలువ పక్క రోడ్డుతో పాటు అనేక కనెక్టింగ్ రోడ్లు కూడా ఇదే దుస్థితిలో ఉన్నాయని నివాసితులు వాపోయారు. పూర్తి స్థాయిలో రోడ్డు వేయలేకపోయినా కనీసం గుంటలను కూడా పూడ్చలేరా అని ప్రజలు నిలదీస్తున్నారు. స్థానికులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడంతో అటువైపు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు వారిని వారించి ధర్నా విరమించాలని సూచించినా వారు నిరాకరించారు. కొంతసేపు ధర్నా నిర్వహించిన అనంతరం అధికార యంత్రాంగం అంతా తుపాను విధుల్లో ఉన్నట్టు తెలుసుకుని తాత్కాలికంగా ధర్నాను విరమించారు. తుఫాను ప్రభావం ముగిసిన అనంతరం అధికారులు తమ సమస్య పరిష్కరించకుంటే రోజంతా ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
హడలెత్తించిన పొగ
కొయ్యలగూడెం: బయ్యన్నగూడెం సమీపంలోని పవర్ గ్రిడ్ ఎదురుగా ఓ రైతు చేలో నుంచి వచ్చిన పొగ ప్రయాణికులను, సమీపంలోని రైతులను హడలెత్తించింది. జాతీయ ప్రధాన రహదారికి ఆనుకుని పవర్ గ్రిడ్ సమీపంలోని ఎదురుగా ఉన్న మేకల సత్యనారాయణకి చెందిన వ్యవసాయ భూమిలో మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున దట్టంగా తెల్లని పొగ అలముకుంది. ఆ ప్రాంతంలో గ్యాస్ పైపులైను ఉందని, గ్యాస్ పైప్ లైన్ లీకు కావడం వల్లే పొగ పైకి వస్తోందని ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్.నాగరాజు వెంటనే డిప్యూటీ తహసీల్దారు వెంకటలక్ష్మి, రెవెన్యూ అధికారులను ఘటనా స్థలానికి పంపారు. సత్యనారాయణ తన పొలంలో ఉన్న మినప పంటను తగలబెట్టడం వల్ల పొగ దట్టంగా కమ్ముకుందని తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఆందోళనలో అన్నదాతలు
సాక్షి, భీమవరం: మోంథా తుఫాను దూసుకొస్తోంది. తీరం వెం ్డ బలమైన గాలులతో కెరటాలు ఎగసిపడుతున్నాయి. జిల్లా అంతటా ముసురు కమ్ముకుని ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తుపాను రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి మోంథా ప్రభావం మొదలైంది. తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమైంది. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల సమయానికి జిల్లాలో 25.4 మి.మీ వర్షం కురవగా మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 101 మి.మీ, 2.30 గంటల సమయానికి 135.6 మి.మీ, 6.30 గంటల సమయానికి దాదాపు 180 మి.మీ వర్షం కురిసింది. రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. మొగల్తూరు, నరసాపురం, పెనుమంట్ర, పాలకొల్లు, పెనుగొండ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తీరం వెంట అలలు ఎగసిపడుతున్నాయి. ఈదురుగాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్య్సకారులు వేటకు వెళ్లకుండా నిషేధించారు. పేరుపాలెం బీచ్‌లోకి పర్యాటకులను అనుమతించడం లేదు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని, రాత్రికి కాకినాడ – మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారుల సమీక్ష : పునరావాస ఏర్పాట్లు, నష్ట నివారణ చర్యలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కోస్తా జిల్లాల తుపాను ప్రత్యేక అబ్జర్వర్ ఆర్పీ సిసోడియా సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్, ఎస్పీ అద్నాన్ నయీం అష్మీలతో సమీక్షించారు. మోంథాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్టు ఆయన వివరించారు. జిల్లాలో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటు 26 పక్కా భవనాలను పునరావాస కేంద్రాల నిర్వహణకు సిద్ధం చేసినట్టు సిసోడియా తెలిపారు. గర్భిణులు, వృద్ధులను సమీప పీహెచ్‌సీలకు తరలించినట్టు చెప్పారు. అవసరమైన సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ నరసాపురంలో సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. 68 జేసీబీలు, 57 పవర్ సాసర్లు సిద్ధం చేశామన్నారు. నరసాపురం నియోజకవర్గంలోని పెద్దమైన వానిలంక, వేముల దీవి, బియ్యపుతిప్ప, చిన్నమైనవానిలంక, పాతపాడు, కేపి పాలెం గ్రామాల్లో జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్, జేసీ టి. రాహుల్కుమార్రెడ్డిలు పర్యటించి పునరావాస ఏర్పాట్లను పరిశీలించారు. నరసాపురం: నరసాపురం తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. తీరం పొడవునా సముద్రం 50 మీటర్లు మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. ఆదివారం రాత్రి నుంచి తీరం వెంట సముద్ర అలల తీవ్రత ఎక్కువగానే ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాలల్లో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక, మొగల్తూరు మండలంలో పేరుపాలెం బీచ్‌ల్లో ఒక్కసారిగా పరిస్థితి మారింది. పేరుపాలెం బీచ్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహం సమీపం వరకూ కెరటాలు చొచ్చుకు వస్తున్నాయి. చినమైనవానిలంకలో పాత తుపాను షెల్టర్ బిల్డింగ్ సమీపం వరకూ సముద్రం చొచ్చుకు వచ్చింది. పెదలంక, తూర్పుతాళ్లు, మోళ్లపర్రు ప్రాంతాల్లో సముద్రగట్టు కోతకు గురైంది. మంగళవారం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు 25 గ్రామాలపై తుపాన్ ప్రభావం ఉండొచ్చని అధికారులు గుర్తించారు. దీంతో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీఎం లంకలోని డిజిటల్ భవనంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆర్డీవో దాసి రాజు ఆదేశించారు. తుఫాన్ తీవ్రతను బట్టి 10 వేల మందిని పునరావస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టామని ఆర్డీవో తెలిపారు. జిల్లా అంతటా కమ్ముకున్న ముసురు అల్లకల్లోలంగా తీరం నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆందోళనలో అన్నదాతలు ఆక్వాలో ఆక్సిజన్ సమస్య జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా ప్రస్తుతం పంట కీలక వెన్నుదశలో ఉంది. ఇప్పటికే తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో వరి కోతలు జరుగుతుండగా మరో పది రోజుల్లో జిల్లా అంతటా మొదలుకానున్నాయి. విత్తనాలు, నారుమడి తయారీ, పంట దమ్ము, నాట్లు, ఎరువులు, పురుగు మందులు, కూలి ఖర్చులు తదితర రూపాల్లో ఇప్పటికే ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మరో పదిరోజుల్లో పంట కోత కొచ్చి తమ కష్టం గట్టెక్కుతుందని గంపెడాసతో ఉన్నారు. ఈ తరుణంలో తుఫాను రైతులను బెంబేలెత్తిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆకివీడు, కాళ్ల, ఉండి, నరసాపురం తదితర చోట్ల నాలుగు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. సోమవారం నాటి వర్షానికి పెనుమంట్ర, వీరవాసరం, పోడూరు తదితర ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. మంగళ, బుధవారాల్లో గాలులతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గాలులు, వర్షాలకు వెన్ను బరువెక్కి పంట నేలకొరగడం, ముంపునకు గురికావడం వలన గింజ తాలుగా మారిపోయి దిగుబడులు దెబ్బతింటాయని రైతులు వాపోతున్నారు. మరోపక్క చలిగాలుల ప్రభావంతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చేపలు, రొయ్యల చెరువుల్లో సాధారణ పీపీఎం లెవల్స్ ఐదు నుంచి ఆరు కాగా ప్రస్తుత వాతావరణంతో 3.4కు పడిపోతుండటంతో ఆక్సిజన్ లెవల్స్ పెంచుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. -
జగన్ జపం చేయనిదే నిద్రపట్టదా?
నిమ్మలపై గుడాల గోపి ఆగ్రహం పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జపం చేయనిదే నిద్రపట్టడం లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ది పనులకు కూడా మంత్రి నిమ్మల శిలా ఫలకాలు వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వంలో వాటర్ వర్క్స్‌లో రూ.13 కోట్లతో పంప్ హౌస్ ప్రారంభిస్తే అక్కడ జనరేటర్ ఏర్పాటుచేసి దానికో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవం చేయడం చూస్తుంటే నిమ్మల పబ్లిసిటీ పరాకాష్ట అర్థమవుతుందన్నారు. తెల్లారితే చాలు తట్ట మట్టి, సిమెంట్ బస్తా అంటూ వైఎస్సార్సీపీ బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. తట్ట మట్టి, సిమెంట్ బస్తా వాడకుండానే నియోజకవర్గంలో 56 సచివాలయాలు, 80 హెల్త్ సెంటర్లు, 80 ఆర్బీకేల నిర్మాణం జరిగిందా? అని ప్రశ్నించారు. ఎదుటివారి అభివృద్ధి కూడా తన ఖాతాలోనే వేసుకోవాలని చూడడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. మీకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే మొదటి సంవత్సరం శ్రావణమాసంలో ఇస్తామని మహిళలకు ఇచ్చిన టిడ్కో గృహాల హామీని నెరవేర్చి అప్పుడు ప్రచారం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికే రెండు శ్రావణమాసాలు వెళ్లాయి పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని వెళ్లాలో అని అన్నారు. టిడ్కో గృహాలు మిగిలిన పది శాతం వైఎస్సార్సీపీ చేయలేకపోయిందని దుష్పచారం చేశారని, ఆ పది శాతం పూర్తిచేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల సమయం కావాలని నిలదీశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాసరావు, మద్దా చంద్రకళ, బండి రమేష్, జోగి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
భీమవరం (ప్రకాశంచౌక్): మోంథా తుపాను నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. డివిజనల్, మండల స్థాయి కంట్రోల్ రూమ్‌ల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి సంబంధిత సమాచారాన్ని ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దుఅత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని, నదీ తీరం, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి విజ్ఞప్తి చేశారు. సోమవారం భీమవరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి జల వనరులు, మున్సిపల్, ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యనమదుర్రు డ్రెయిన్ ప్రవాహ వేగాన్ని గమనించి ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు. గట్లు బలహీనంగా ఉన్నచోట్ల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. బ్యాంక్ కాలనీ బీఎంకే రైస్ మిల్ ప్రాంతంలో యనమదుర్రు కట్ట ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భీమవరం డివిజన్‌కు సంబంధించి రూరల్‌లో మూడు, కాళ్లలో ఒకటి, ఆకివీడులో ఒకటి, భీమవరం టౌన్లో ఒక్క పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. 36 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు వచ్చిందని, అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అవసరమైన చోట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ప్రజలకు సూచనలు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలినరసాపురం రూరల్: నియోజకవర్గ తీర ప్రాంత గ్రామాలలో జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సముద్ర అలల ఉధృతిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
కార్తీక శోభ
కార్తీక మాసం మొదటి సోమవారం జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహించారు. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ రెండు క్షేత్రాలకు జిల్లా నలుమూలతో పాటు ఇతర జిల్లాల నుంచి యాత్రికులు భారీగా తరలిరావడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ద్వారకా తిరుమల శివాలయం, మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. – సాక్షి నెట్వర్క్ దూసుకొస్తున్న మోంథా -
మోటార్‌సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
ముదినేపల్లి రూరల్: మోటారు సైకిళ్లు చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిలో ఒక మైనర్ ఉన్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో కై కలూరు రూరల్ సీఐ వి రవికుమార్, ఎస్సై వీఎస్ వీరభద్రరావు వివరాలు వెల్లడించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయం దేవపూడి వద్ద తనిఖీలు చేస్తుండగా కొచ్చెర్ల వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు మోటారుబైక్పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులు విజయవాడకు చెందిన జలసూత్రం సాయిసురేష్‌కుమార్, మండలంలోని ప్రొద్దువాకకు చెందిన యండూరి జీవరాజు, విజయవాడకు చెందిన మరో మైనర్ కొంతకాలంగా మండలంతో పాటు విజయవాడ, కై కలూరు, కలిదిండి మండలాలతోపాటు తాడేపల్లి, దేవపూడి, ముదినేపల్లి ప్రాంతాల్లో 18 మోటారుబైక్‌లు, ఒక మొబైల్ఫోను దొంగతనం చేశారన్నారు. వీటి విలువ రూ.10లక్షలు పైగా ఉంటుందని చెప్పారు. దొంగిలించిన వాహనాలను మండలంలోని ప్రొద్దువాకకు చెందిన కుర్మా సుధాకర్ వద్ద దాచిపెట్టగా వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కానిస్టేబుళ్లు బి నాగబాబు, పి పవన్‌కుమార్, జి శివకోటయ్య, వై నాగరాజును సీఐ, ఎస్సై అభినందించారు. భీమడోలు: మహిళ నిర్బంధం కేసులో నిందితుడు కటారి మోహన్ నాగ వెంకట సాయిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై షేక్ మదీనాబాషా తెలిపారు. వివరాల ప్రకారం భీమడోలు గ్రామానికి చెందిన గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ దంపతులు. నిందితుడు కటారి మోహన్ నాగ వెంకట సాయి భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి 15 రోజులపాటు గ్రామాంతరం తీసుకువెళ్లగా ఆమె తన కుటుంబ సభ్యుల కోసం గొడవ చేయడంతో ఈనెల 19న భీమడోలు తీసుకువచ్చాడు. అనంతరం తీవ్ర మనోవేదన, అవమానభారంతో సూసైడ్ నోట్ రాసి భార్యభర్తలు సుధాకర్, భానుపూర్ణిమ కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 7వ తేదీన గుండుమోలు సుధాకర్ ఫిర్యాదు మేరకు భీమడోలులో మహిళా అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే భానుపూర్ణిమ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇచ్చిన వాంగ్మూలం మేరకు మహిళ అదృశ్యం విభాగం నుంచి పరాయి సీ్త్ర నిర్బంధం, ఇతర సెక్షన్ల కింద మార్పు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ కేపీఎస్ కి షోర్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు సీఐ యూజే విల్సన్, ఎస్సై మదీనా బాషా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు కటారి మోహన్ నాగ వెంకట సాయిను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎస్సై మదీనా బాషా తెలిపారు. -
శ్రీవారి క్షేత్రంలో కొత్త క్యూలైన్ నిర్మాణ పనులు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో నూతన క్యూలైన్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా యాగశాల పక్కన కొత్తగా గుమ్మం ఏర్పాటు చేసేందుకు సిబ్బంది యంత్రంతో గోడను కట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ప్రస్తుతం రూ. 200 టికెట్లు తీసుకున్న భక్తులు ఉత్తరం వైపు క్యూలైన్ల ద్వారా పడమర వైపునకు చేరుకుని, అక్కడి నుంచి ఆలయంలోకి వెళుతున్నారు. అలాగే నిత్యార్జిత కల్యాణంలో పాల్గొంటున్న భక్తులు ధ్వజస్తంభం పక్కనున్న క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకుంటున్నారు. ఇక రూ.100 టికెట్లు తీసుకున్న వారు, ఉచిత దర్శనం భక్తులు ఉత్తరం వైపు క్యూలైన్ల ద్వారా తూర్పు వైపునకు చేరుకుని, అక్కడున్న గుమ్మంలోంచి ఆలయంలోకి వెళుతున్నారు. ఇదిలా ఉంటే రూ.200 టికెట్లు తీసుకునే వారిని, నిత్యార్జిత కల్యాణంలో పాల్గొనే భక్తులను తూర్పు వైపు ప్రత్యేకంగా గుమ్మాన్ని ఏర్పాటు చేసి, అందులోంచి ఆలయంలోకి పంపాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో తూర్పు వైపు (యాగశాల పక్కన) గుమ్మం ఏర్పాటు చేసేందుకు గోడను యంత్రంతో కట్ చేయిస్తున్నారు. అలాగే పాత క్యూలైన్లలో ర్యాంపు ఏర్పాటు నిమిత్తం గోడను నిర్మిస్తున్నారు. ఈ పనులను ఆలయ ఈఈ డీవీ భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన ఈ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. యాగశాల పక్కన గోడను కట్ చేస్తున్న సిబ్బంది అక్కడ గుమ్మం ఏర్పాటు చేసేందుకు అధికారుల చర్యలు రూ.200 టికెట్, నిత్య కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం ఏర్పాట్లు -
ఏలూరులో జోరుగా చోరీలు
ఒకే రోజు రెండు ఇళ్లల్లో దొంగతనాలు ఏలూరు టౌన్: ఏలూరు రూరల్, టూటౌన్ పరిధిలో రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. భారీగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకుపోయారు. వివరాల ప్రకారం ఏలూరు రూరల్ పరిధిలో చొదిమెళ్ళ ప్రాంతంలో శ్రీ లక్ష్మీ గణపతినగర్ 5వ రోడ్డులో నివాసం ఉంటున్న వేమూరి వెంకట అనంత రామం భార్యపిల్లలతో కలిసి ఈనెల 26న తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయానికి వెళ్లి అదేరోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చారు. ఈలోగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువా తాళాలు తెరిచి సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు, కిలో వెండి దోచుకుపోయారు. బాధితుడి ఫిర్యాదుతో ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు టూటౌన్ పరిధిలో మోతేవారి తోటలో తాళాలు వేసిన ఇంటిలో దొంగలు పడ్డారు. ఇంటి యజమానులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాళాలు పగులగొట్టి ఇంటిలోకి వెళ్లిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు చెబుతున్నారు. -
నాగేంద్రహారాయ.. నమఃశివాయ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని పేరంపేట రోడ్డులో ఉన్న బాట గంగానమ్మ గుడి సమీపంలోని వేప చెట్టు వద్ద ఉన్న పుట్టల వద్ద కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పూజలు నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో పుట్ట వద్ద నాగు పాము ప్రత్యక్ష కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. కార్తీక సోమవారం రోజున నాగుపాము రూపంలో శివుడు కరుణించాడంటూ భక్తులు నాగుపాముకు పూజలు నిర్వహించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంపై సోమవారం మోంథా తుపాను ఎఫెక్ట్ పడింది. కార్తీక మాస పర్వదినాల్లో క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. అయితే మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో భక్తుల్లో అధిక శాతం తమ యాత్రను వాయిదా వేసుకున్నారు. దాంతో స్వల్ప సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తుల లేమితో నిర్మానుష్యంగా మారింది. దర్శనం క్యూలైన్లు, తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాల్లో భక్తులు నామమాత్రంగా కనిపించారు. -
అధికారుల వివక్షపై దళిత సర్పంచ్ ధర్నా
ముసునూరు: తనపై పంచాయతీ అధికారులు వివక్ష చూపుతున్నారని, తనకు న్యాయం చేయాలని దళిత సర్పంచ్ గ్రామస్తులతో సహ ఆందోళనకు దిగారు. మండలంలోని చింతలవల్లి గ్రామ సర్పంచ్ పిల్లి సత్యనారాయణపై గతంలో పని చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రస్తుత కార్యదర్శి ఇరువురు కూడా వివక్షత చూపడంపై సోమవారం గ్రామస్తులతో కలసి నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని పనుల్లోనూ గ్రామ కార్యదర్శులకు ఎంత సహకరించినా, ఇబ్బందులు పెడుతున్నారని, బిల్లులు చెల్లించక పోగా, అధికార కార్యక్రమాలకు కూడా సమాచారం అందించడంలేదని వాపోయారు. గత కార్యదర్శి ఇళ్ల పన్నులు వసూలు చేసి, పంచాయతీ అక్కౌంటుకు నగదు జమ చేయలేదని, దానిని తాను గమనించి, నిలదీయగా రూ.6 లక్షల, 40 వేలు పంచాయతీ ఖాతాకు చెల్లించాడన్నారు. గతంలో తాను చేయించిన పనులకు కార్యదర్శి బిల్లులు పెట్టలేదని వాపోయారు. అధికారిక కార్యక్రమాలకు సమాచారం లేదు ప్రస్తుతం పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి మరో అడుగు ముందుకేసి, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సైతం తనకు సమాచారం ఇవ్వకుండా చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత నిధులు రూ.14 లక్షలతో గ్రామ పంచాయతీలో చేయించిన పనులకు సంబంధించి బిల్లులు సమర్పించినా, నగదు పుస్తకంలో నమోదు చేయకుండా, చెల్లింపులు జరుపకుండా, గ్రామ టీడీపీ నేతలు చెబితేనే బిల్లులు మంజూరు చేయిస్తానంటున్నారని ఆరోపించారు. సర్పంచ్‌నైన తనకు తెలియకుండా కార్యదర్శి సొంతగానూ. ప్రైవేటు వ్యక్తులతోనూ పనులు చేయిస్తూ, వారి బిల్లులు నగదు పుస్తకంలో నమోదు చేసి, చెల్లిస్తున్నారని, కానీ తనకు రావలసిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఎస్సీ సర్పంచ్‌పై జరుగుతున్న వివక్షతను తొలగించి, బకాయిల చెల్లింపు విషయంలో న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసి సుధాకర్, సొసైటీ మాజీ అధ్యక్షుడు సుగసాని శ్రీనివాసరావు, గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పల్లెపాము సూర్య, వైఎస్సార్ సీపీ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి తొర్లపాటి శ్రీనివాసరావు, సుందరరావు, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. -
పాపికొండల బోటు ప్రయాణం రద్దు
బుట్టాయగూడెం: పాపికొండల బోటు ప్రయాణాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల బోటు ప్రయాణాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం కావడంతో పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో పాపికొండల విహారయాత్రకు బయల్దేరి వెళ్తున్నారు. అయితే మోంథా తుపాను ప్రభావంతో దేవీపట్నం మండల గండిపోచమ్మ రోడ్డు పాయింట్ నుంచి పర్యాటక బోటు సర్వీస్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గుబ్బల మంగమ్మతల్లి దర్శనం నిలిపివేత బుట్టాయగూడెం: మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బుట్టాయగూడెం మండలం కామవరం అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి దర్శనాలను ఆలయ కమిటీవారు నిలిపివేశారు. వాతావరణం చక్కబడి పరిస్థితులు అనుకూలించిన తర్వాత మళ్లీ దర్శనాల తేదీలు ప్రకటిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా గంగరాజు, కోర్సా రాంబాబు తెలిపారు. అప్పటివరకూ మంగమ్మతల్లి దర్శనానికి భక్తులెవ్వరూ రావొద్దని వారు విజ్ఞప్తి చేశారు. -
కార్తీకం.. శివోహం
వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తజనంపాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం మొదటి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వేకుజాము నుంచి భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు వేకువజాము 2 గంటల నుంచి కాలువలో స్నానాలు చేయడానికి తరలివెళ్లారు. కాలువలో కార్తీక దీపాలు వదిలి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారికి అభిషేకాలు చేయించుకునే భక్తులు మహన్యాసంలో పాల్గొన్నారు. ఆలయం వెనుకభాగం, అభిషేకాల మండపం భక్తులతో నిండిపోయింది. ఆలయం నుంచి బయటకు వెళ్లే మార్గాన్ని ఉత్తరం వైపునకు ఏర్పాటుచేశారు. యాత్రికులతో కిటకిట మధ్యాహ్నం 11 గంటల నుంచి పంచారామ యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకుని వచ్చే భక్తులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో, అమరావతి, భీమవరం క్షేత్రాలను దర్శించుకుని వచ్చే భక్తులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే పాలకొల్లు, పరిసర గ్రామాల భక్తులు ముందుగా పైనాలుగు క్షేత్రాలను దర్శించుకుని రాత్రి 8 గంటల సమయంలో క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. కార్తీకమాసం మొదటి సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలయ అధికారులు అంచనాలు వేశారు. అయితే వాతావరణం మార్పు వల్ల అనుకున్నంత స్థాయిలో భక్తులు రాలేదు. సుమారు 15 నుంచి 20 వేల మంది వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా వేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, పట్టణ సీఐ కె.రజనీకుమార్, పోలీసు సిబ్బంది, ఆలయ సిబ్బంది, డీఎన్నార్ కళాశాల విద్యార్థినులు, పలు సేవా సంస్థల సభ్యులు పాల్గొని తమ సేవలను అందించారు. భక్తులకు తప్పని ఇబ్బందులు ఆలయ ప్రాకార మండపం లోపల మహిళలు కార్తీకదీపాలు వెలిగించి అక్కడే కూర్చోవడంతో స్వామివారిని దర్శనానికి వెళ్లే భక్తులు నడవడానికి కూడా వీలు లేకుండా ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 8.30 గంటల నుంచి వర్షం పడడంతో క్యూలైన్లో ఉన్న భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం పక్కన ఉన్న రేపాక వారి సత్రంలో అన్నదానం ఏర్పాటు చేయగా కనీసం ఒక్క టెంట్ కూడా ఏర్పాటుచేయకపోవడంతో భక్తులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. కాసేపటికి నిర్వాహకులు టెంట్ ఏర్పాటుచేయడంతో భక్తులు ఉపశమనం పొందారు. స్పెషల్ దర్శనం రూ.100కు పెంపు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు కొరకు ప్రత్యేక దర్శనం టికెట్ ధర రూ.50 ఉండేది. ఈ ధరను రాత్రికి రాత్రి రూ.100 చేయడంతో భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావును ప్రశ్నించగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ధర రూ.100 వరకూ పెంచుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. అయినా రూ.50, రూ.100 రెండు టికెట్లు విక్రయిస్తున్నామన్నారు. దీనిపై భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో మధ్యాహ్నం నుంచి రూ.100 దర్శనం టికెట్లు నిలిపివేసి రూ.50 మాత్రమే స్పెషల్ దర్శనం చేశామని వివరించారు. మద్దిలో కార్తీకమాసోత్సవాలు జంగారెడ్డిగూడెం: మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం క్షేత్రంలోని ఆంజనేయస్వామి వారికి ఆలయ అర్చకులు వేదపండితులు, రుత్విక్‌లు శాస్త్రోక్తంగా లక్ష తమలపాకులతో లక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.1,35,420 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. అలాగే సుమారు 3,018 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు. పాలకొల్లు సెంట్రల్ : క్షీరారామంలో గోశాల వద్ద కార్తీకదీపాలు వెలిగిస్తున్న మహిళలు, సాలగ్రామ దానాలు ఇస్తున్న భక్తులు భీమవరం(ప్రకాశం చౌక్) : శ్రీభీమేశ్వర స్వామికి నిర్వహస్తున్న అభిషేకంపాలకొల్లు సెంట్రల్ : క్షీరారామలింగేశ్వరునికి అభిషేకం చేస్తున్న అర్చకస్వాములు భీమవరం(ప్రకాశం చౌక్): కార్తీక మాసం మొదటి సోమవారం శివనామస్మరణతో భీమవరం పంచారామక్షేత్రం శ్రీఉమాసోమేశ్వరజనార్థన స్వామి వారి దేవస్థానం మార్మోగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పంచారామక్షేత్రాల యాత్రికులు, జిల్లా నలమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో స్వామి వారికి అభిషేకాలు, పూజలు, కార్తీక దీపారాధానలు, కార్తీక నోములు నోచుకున్నారు. దేవస్థానం ఆద్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్వామికి ప్రత్యేక పూజలు శ్రీఉమాసోమేశ్వర స్వామికి కార్తీక మాసం మొదటి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుధ్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వీరామంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి లక్షపత్రి పూజ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.రామకృష్ణంరాజు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ చింతలపాటి బంగార్‌ారజు, ధర్మకర్తలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని మరో శివక్షేత్రమైన శ్రీభీమేశ్వర స్వామి వారికి కార్తీక మాసం మొదటి సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి తోట శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పంచారామాల్లో మార్మోగిన శివనామస్మరణ కార్తీక సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తజనం వేకువజామునుంచే క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు -
శాయ్ లిఫ్టర్లకు పతకాల పంట
ఏలూరు రూరల్: ఏలూరులోని ఖేలో ఇండియా సెంటర్ (శాయ్) వెయిట్ లిఫ్టర్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారని సెంటర్ ఇన్చార్జి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26 వరకూ తెనాలిలో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న లిఫ్టర్లు మొత్తంగా 3 గోల్డ్‌మెడల్స్, 3 సిల్వర్‌మెడల్స్, 3 బ్రాంజ్‌మెడల్స్ సాధించారని వివరించారు. సీహెచ్ కీర్తన ఉత్తమ వెయిట్‌లిఫ్టర్‌గా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. అండర్ 17 విభాగంలో పోటీపడిన ఎం పావని, సీహెచ్ కీర్తన రెండు గోల్డ్ మెడల్స్, జి.పవిత్ర, ఎన్ విహారిక రెండు సిల్వర్ మెడల్స్, ఎం దీక్షిత్, కె ఆశాజ్యోతి రెండు బ్రాంజ్‌మెడల్స్ చేజిక్కించుకున్నారని వివరించారు. అండర్ 19 విభాగంలో యు శశికళ గోల్డ్ మెడల్, పి దీపిక, కె శ్రీవెన్నల, సీహెచ్ హారికరెడ్డి మూడు సిల్వర్‌మెడల్స్, జడ్ పావని బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నారని వెల్లడించారు. బాలికలు అందరూ స్థానిక ఏఆర్డీజీకె పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/పెదపాడు: కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలను ముమ్మరం చేశారు. మూడవ రోజు సోమవారం తెల్లవారుజామున పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 35 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. టాక్స్ లేకుండా నడుపుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు. ఈ మేరకు వివరాలను ఏలూరు ఉపరవాణా కమిషనర్ షేక్ కరీమ్ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు సోమవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల నుంచి సుమారు 200 మంది పోటీల్లో పాల్గొనగా, 15 మంది క్రీడాకారులు ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్‌కి అర్హత సాధించారని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ నవంబర్ 22 నుంచి 24 వరకు విజయవాడలో జరుగుతుందని చెప్పారు. విజేతల్లో మొదటి ఐదు స్థానాల్లో వరుసగా శ్రీ సాయి నంద గోపాల్, నవదీప్ కావూరి, కె.ఓంకార్, కుషాల్ కార్తికేయ నాయుడు, సూర్య జితేష్ నిలిచారు. బెస్ట్ ఓపెన్ మహిళగా శ్యామలను చీఫ్ ఆర్బిటర్ కిరణ్ కుమార్ ప్రకటించారు. పోటీలకు అవకాశం కల్పించిన జిల్లా ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి టోర్నమెంట్ డైరెక్టర్ సూర్య నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ హంస చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక నారాయణ స్కూల్లో ఈ పోటీలు నిర్వహించారు. భీమవరం : భీమవరం రెండో పట్టణంలో జరిగిన దొంగతనంలో 113 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.46 క్యారెట్ల వజ్రాలు అపహరణకు గురయ్యాయి. వివరాల ప్రకారం సూర్యనారాయణపురంలో నివాసం ఉంటున్న కె.శ్రీనివాసరావు ఇంటికి హైదరాబాద్‌లో ఉంటున్న అతని కుమార్తె సూర్యదీప్తి ఈ నెల 25న వచ్చారు. తణుకులో జరిగిన ఓ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 26న వెళ్లారు. అక్కడ్నుంచి అదేరోజు రాత్రి భీమవరం చేరుకున్నారు. తన హ్యాండ్ బ్యాగులో బంగారు ఆభరణాలు, వజ్రాలను ఉంచి గదిలోని కప్‌బోర్డులో పెట్టారు. తెల్లారిన తర్వాత చూసేసరికి బ్యాగు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నరసాపురం టీడీపీలో వర్గపోరు
జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎదుట నిరసన నరసాపురం: నరసాపురం టీడీపీలో వర్గపోరు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో రోడ్డెక్కింది. ఏఎంసీ ప్ర మాణ స్వీకార ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెలే బండారు మాధవనాయుడు పేరు వేయలేదని మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న బండారు వర్గీయులు ఆదివారం పట్టణంలో మో టార్ సైకిళ్లతో నిరసన ప్రదర్శన చేశారు. ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతున్న స్థానిక గోదావరి గట్టున ఉన్న అల్లూరి సాంస్కృతిక ప్రదర్శన కేంద్రం వద్దకు చేరుకుని గొడవ చేశారు. కార్యక్రమానికి హజరైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆపి టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి పొత్తూరి రామరాజును తప్పించి పార్టీని కాపాడాలని డిమాండ్ చేశారు. దీంతో అల్లూరి సాంస్కృతిక కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరకు మంత్రికి వినతిపత్రం ఇచ్చి ఆందోళన విరమించారు. లోపల ఏఎంసీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే బయట బండారు వర్గీయులు ఆందోళన చేయడం గమనార్హం. అయితే ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండానే ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. -
బెల్టుబారులు.. మద్యం ఏరులు
‘మద్యం’తర ముప్పు కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. ఊరూరా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. ఏనీటైమ్ మద్యం అందుబాటులో ఉంటోంది. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్ సిండికేట్లు స్థానిక కూటమి నేతలతో కలిసి బడ్డీ దుకాణాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో వందలాది బెల్టుషాపులు ఏర్పాటుచేశారు. కావాల్సిన చోటుకు డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో ఐదు నుంచి పది వరకు బెల్టుషాపులు ఉంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో బెల్టుషాపులు, నాటుసారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. – సాక్షి భీమవరం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు జాతీయ రహదారి నంబర్ 165కు చేర్చి కెనరా బ్యాంక్ సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్, బ్రాందీ షాపులు నడుపుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో జాతీయ రహదారికి చేర్చి పెట్రోల్ బంక్ పక్కనే మరో బ్రాందీ షాపును నడుపుతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ సమీపంలో ఉన్న హైవేను ఆనుకుని మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. సమయంతో పనిలేకుండా నిత్యం మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.ఏలూరు జిల్లా కై కలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో సుమారు 50 బెల్టుషాపులు నడుస్తున్నాయి. లంక గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయిస్తున్నారు. కూటమి నేతల అండదండలు ఉన్నాయి. కామవరపుకోటలో బెల్టు షాపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బస్టాండ్ సమీపంలో ఓ వైపు కళాశాల, మరోవైపు ఆస్పత్రి ఉండగా మధ్యలో బార్ ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో దుర్గమ్మ ఆలయం కూడా ఉండటం గమనార్హం. రోడ్డును ఆనుకుని ఉన్న ఇదే బార్ వల్ల కళాశాల విద్యార్థులు, ఆసుపత్రికి, గుడికి వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో బెల్టుషాపు అమ్మకాలు జోరుగా నిర్వహిస్తున్నారు. బెల్టు షాపుల్లో అదనపు రుసుములు సైతం వసూలు చేస్తున్నారు. రాష్ట్రీయ రహదారికి ఆనుకుని యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో పబ్లిక్‌గా బెల్టుషాపు నిర్వహిస్తూ ఎనీటైమ్ మద్యం విక్రయిస్తున్నారు. -
తుపానును ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మోంథా తుపా నును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి తుపాను సన్నద్ధత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లా లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నరసాపురం డివిజన్లో 10, తాడేపల్లిగూడెం డివిజన్లో 8, భీమవరం డివిజన్లో 10 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం జిల్లాలోని 7 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని, అత్యవసర పరికరాలు, వాహనాలను సిద్ధంగా ఉంచినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా 7 అగ్నిమాపక వాహనాలు, 10 నీటిని తోడే యంత్రాలు, 80 లైఫ్ జాకెట్లు, 40 లైఫ్ బాయ్స్, 30 రోప్‌లు, చెట్లను నరకడానికి ఉపయోగించే యంత్రాలు 12 సిద్ధం చేశామన్నారు. ప్రత్యేకంగా చెట్లను నరకడానికి 12 బృందాలతో 24 మందిని నియమించామన్నారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు జిల్లా కలెక్టరేట్లో 08816 299219, భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో 9848413739, 87907 31315, నరసాపురం ఆర్టీఓ కార్యాలయంలో 9391185874, తాడేపల్లి ఆర్డీఓ కార్యాలయంలో 9381701036, 9849712358 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. పాఠశాలలకు సెలవులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సోమ, మంగళవారాలు సెలవులు ప్రకటించారు. ఆదేశాలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రాక పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి.ప్రసన్న వెంకటేష్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, ముందస్తు చర్యలపై సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఏదైనా సమాచారాన్ని 8639541520 నంబర్లో సంప్రదించి ప్రత్యేకాధికారికి తెలియజేయవచ్చు. కలెక్టర్ నాగరాణి -
చంద్రబాబుది దుర్మార్గ పాలన
● మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి ● మాజీ మంత్రి కొట్టు డిమాండ్ తాడేపల్లిగూడెం అర్బన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సీఎం చంద్రబాబు దుర్మార్గ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. స్థానిక 4వ వార్డులోని గాంధీ బొమ్మ సెంటర్లో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చార న్నారు. వాటిని చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించకపోవడం నిర్లక్ష్య వైఖరికి తార్కాణమన్నారు. సుమారు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క మెడికల్ కళాశాలను కూడా స్థాపించలేదన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధనార్జనే ధ్యేయంగా కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం దందా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని, దీనిని తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి కొట్టు ఆరోపించారు. జగన్ పాలనలో మద్యాన్ని క్రమపద్ధతిలో ప్రభుత్వం ద్వారా విక్రయిస్తే చంద్రబాబు రాష్ట్రంలో సుమారు 85 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. మద్యంపై ఆదా యం 4 శాతమే వస్తుందని చెప్పడం వారి దోపిడీతనానికి నిదర్శనమన్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల ఏర్పాటు పేరుతో మద్యం దుకాణాలను అధికం చేశారని ఆరోపించారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని పట్టణవాసులు జయప్రదం చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలుకులూరి ధర్మరాజు, చామన సూర్యచంద్రరావు, హసీనా బీబీ, షేక్ నాగూర్, బోళెం రమణ, నరెడ్ల వీరబాబు, ప్రసాద్, తగరంపూడి మురళీ, మస్తాన్ వలి, సిర్రాపు శాంతకుమార్, కట్టా నాగరాజు, తోట గోపి, పాలూరి శివ, జడ్డు హరిబాబు, ముప్పిడి సంపత్‌కుమార్, మేడపాటి రమేష్‌రెడ్డి, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ ప్రాంగణం పూడ్చివేత
ఆకివీడు: ఆకివీడు పెదపేటలోని బీసీ హాస్టల్ ప్రాంగణాన్ని మట్టితో పూడ్చి ఎత్తు చేస్తున్నా రు. హాస్టల్ ప్రాంగణం లోతట్టుగా ఉండటంతో వర్షానికి, డ్రెయినేజీలో నీరు ప్రాంగణంలోకి చొచ్చుకువస్తోంది. దీంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ‘దుక్కి వర్షానికే హాస్ట ల్ ప్రాంగణం ముంపు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ప్రాంగణాన్ని మట్టితో పూడ్చుతున్నారు. లారీ ఢీకొని బాలుడు మృతి ఆకివీడు: అమ్మా.. ప్రైవేటుకు వెళ్లివస్తానంటూ సైకిల్‌పై బ్యాగ్ తగిలించుకుని వెళ్లిన బా లుడు లారీ ఢీకొని దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సాయంత్రం గుమ్ములూరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మల్లా వీరన్న కుమారుడు మోనేష్ శ్రీసాయి (11) సైకిల్‌పై ప్రైవేటుకు వెళుతుండగా గ్రామంలోని ప్రధాన సెంటర్లో గణపవరం వైపు వెళుతున్న రొయ్యల లోడు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో శ్రీసాయి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలు అక్కడకు చేరుకున్నారు. వీరన్నకు ఏకై క కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఆకివీడులోని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఏఎస్సై స త్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ వేగంగా రావడంతో అదుపు తప్పి బాలుడిని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని కలెక్టరేట్, డివిజినల్, మండల స్థాయిలో సోమవారం జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ని రద్దు చేసినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. తుపాను కారణంగా రద్దు చేశామన్నారు. భీమడోలు: భీమడోలులో భార్యాభర్తలు శనివారం రాత్రి కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని కుటుంబ సభ్యులు గ్రామంలో ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి ఏలూరు ఆంధ్రా ఆస్పత్రికి, గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వీరు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. గ్రామానికి చెందిన కటారి మోహన్ అనే యువకుడు తన చేతిలో పలుసార్లు కుంకుమ పోసి అమ్మవారి కుంకు మని చెప్పి ఉచ్చు లోకి లాగి తనను మోసం చేశాడని, మాయమాటలు చెప్పి 15 రోజుల పా టు గ్రామాంతరం తీసుకుని వెళ్లాడని పూర్ణిమ పేర్కొంది. భర్త, కుటుంబసభ్యులు కా వాలని తాను గొడవ చేస్తే ఈనెల 19న తిరిగి భీమడోలు తీసుకువచ్చాడని, మోహన్ వల్ల తన జీవితం నాశనమయ్యిందని వాపోయింది. మోహన్‌పై చర్యలు తీసుకోవాలని కోరినా న్యాయం జరగలేదని ఆరోపించింది. దీంతో తీవ్ర మనోవేదన, అవమాన భారంతో భార్యాభర్తలిద్దరూ చనిపోతున్నట్టు, బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని సూసైడ్ నోట్ రాయగా గ్రామంలో ఈ లేఖ సంచలనం కలిగించింది. గుంటూరు ఆస్పత్రిలో భార్యాభర్తలిద్దరు చికిత్స పొందుతున్నారని, అక్కడ నుంచి వచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమో దు చేస్తామని ఎస్సై షేక్ మదీనా బాషా తెలిపారు. ఈనెల 7న భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో భాను పూర్ణిమ అదృశ్యం కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం 71 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన విద్యుత్ ఉద్యోగుల సంఘం (327) తన పోరాటాలను కొనసాగిస్తోందని ఆ సంఘ ఈపీడీసీఎల్ డిస్కం అధ్యక్షుడు భూక్యా నాగేశ్వరరావు నాయక్ అన్నారు. -
మోంథా వణుకు
భీమవరం: ముంచుకొస్తున్న మోంథా తుపాను జిల్లాలోని రైతులను కలవరపెడుతోంది. ఇప్పటికే పలుచోట్ల వరిపైరు నేలవాలి నష్టం ఏర్పడటంతో రానున్న తుపాను మరింత చేటుతెచ్చేలా ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో సార్వా సీజన్లో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సీజన్ ప్రారంభం నుంచి సాగునీటి ఇబ్బందులు, ఎరువుల కొరత, ఎలుక బెడద, అన్నదాత సుఖీభవ సాయం సక్రమంగా అందకపోవడం వంటి సమస్యలతో నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో ఎడతెగని వర్షాలు, వాయుగుండాలతో సతమతమవుతున్నా డు. తాజాగా తుపాను హెచ్చరికలతో పంటను కాపాడుకోవడం ఎలా అంటూ గుబులు చెందుతున్నాడు. కల‘వరి’పాటు మోంఽథా తుపాను రైతులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఇప్పటికే వరి పంట మాసూళ్లు ప్రారంభంకాగా కొన్ని మండలాల్లో పంట చేతికి వచ్చే స్థితిలో ఉంది. మరికొన్ని చోట్ల గింజలు గట్టిపడడం, వరిపైరు ఈనిక దశలో చేలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కోతకు వచ్చిన పంటను ఎలా ఒడ్డుకు చేర్చాలో తెలియక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గింజలు గట్టిపడే దశ, పాలుపోసుకునే దశలో ఉన్న పైరు వర్షాలు, తుపాను కారణంగా నేలవాలితే తెగుళ్లు సోకడంతో పాటు పూతదశలో ఉన్న పైరు గింజలు గట్టిపడక తప్పలుగా మారి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 4 వేల ఎకరాల్లో.. భారీ వర్షాలకు జిల్లాలో సుమారు 4 వేల ఎకరాలకు పైగా పంట నేలవాలినట్టు వ్యవసాయశాఖ అంచనా వేయగా రైతులు మాత్రం ఇంకా ఎక్కువగానే ఉంటుందంటున్నారు. నేలవాలిన పైరు దుబ్బులను కట్టలు కట్టి పంటను రక్షించుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మోంథా తుపాను మంగళవారం నాటికి తీవ్ర ప్రభావం చూపుతుందని వాతా వరణశాఖ హెచ్చరించడంతో పాటు జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేయడం మరింత భయపెడుతోంది. జిల్లాలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పొలాల్లోని నీరు బయటకు వెళ్లక పైరు కుళ్లిపోయే ప్రమాదముందని రైతులు అంటున్నారు. తుపాను ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే పంటకు నష్టం ఏర్పడే ప్రమాదముంది. వరి పంట కోతకు వచ్చిన పొలాల్లో నీరు నిలిచిపోకుండా కాలువలు ఏర్పాటుచేసుకుని నీటిని బయటకు తీసివేయాలి. కోతకు వచ్చిన పంట నేలవాలితే వెన్నులపై 5 శాతం ఉప్పు ద్రావణాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లు నివారణకు ఎకరాకు ప్రోపికొనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేయడం ద్వారా గింజలు రంగు మారకుండా, పొడ తెగులు, మానిపండు తెగులు సోకకుండా నివారించవచ్చు. – జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భీమవరం వరి పైరు దుబ్బులను కట్టలు కట్టిన దృశ్యంతణుకు మండలం తేతలిలో నేలవాలిన వరి చేను రైతుల గుండెల్లో తుపాను జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా సాగు భారీ వర్షాలకు సుమారు 4 వేల ఎకరాల్లో నేలవాలిన పంట తుపాను ప్రభావంతో నష్టపోతామంటున్న రైతులు నివారణ చర్యలు పాటించాలని వ్యవసాయశాఖ సూచన -
కార్మికుల హక్కులకు భంగం
ఏలూరు (టూటౌన్): కేంద్రంలోని మోదీ–షా ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ధా వెంకట్రావు అన్నారు. నవంబర్ 1 నుంచి 4 వరకు ఏలూరులో జరిగే ఇఫ్టూ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం ఇఫ్టూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇఫ్టూ నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.వి.రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావులు మాట్లాడుతూ కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో భద్రత కరువైందని, కార్మిక హక్కులు రక్షించుకునేలా చైతన్యవంతం చేసేందుకు ఇఫ్టూ క్లాసులను నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రెసిడెంట్ కాకి నాని, ఇఫ్టూ నాయకురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మార్జిన్ దిగితే.. అంతే
ద్వారకాతిరుమల: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది క్షేత్రంలోని బైపాస్ రోడ్డు పరిస్థితి. ధ్వంసమైన పాత సీసీ రోడ్డును తొలగించి, నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. డ్రైనేజీ కంటే రోడ్డును ఎత్తుగా నిర్మించడమే ఇందుకు కారణం. నూతన సీసీ రోడ్డును నిర్మించామని భుజాలు తట్టుకుంటున్న కూటమి నేతలు, పాలకులకు ఇది కనబడటం లేదా.. లేక చూసిచూడనట్టు నటిస్తున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే. క్షేత్రంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, కామవరపుకోట వైపుకు వెళ్లే వాహనాలు స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి సూపర్ బజార్ వరకు ఉన్న ఈ బైపాస్ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తాయి. భక్తులు, స్థానికులు, ప్రయాణికుల సౌకర్యర్ధం శ్రీవారి దేవస్థానం శతాబ్ద కాలం క్రితం, లక్షలాది రూపాయలు వెచ్చించి దీన్ని సీసీ రోడ్డుగా నిర్మించింది. అది ధ్వంసం కావడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.40 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి గతేడాది అక్టోబర్ 2న రాజమండ్రి కూటమి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేసి, పనులను త్వరితగతిన పూర్తిచేశారు. ముందుచూపు లేకుండా.. రహదారి నిర్మాణానికి ముందు పాత సీసీ రోడ్డును పూర్తిగా తొలగించారు. ఆ తరువాత నూతన రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ముందుచూపు లేకుండా మెటల్ డస్ట్‌తో బెడ్‌ను ఎత్తుగా నిర్మించి, దానిపై సీసీ రోడ్డు పోయడంతో, డ్రైనేజీ కంటే రహదారి పెరిగింది. దాంతో ప్రస్తుతం వాహనాలు మార్జిన్లు దిగే వీలు లేకుండా ఉంది. మార్జిన్ దిగితే అంతే సంగతులు బస్సులు, కార్లు ఇతర వాహనాలు ఈ రోడ్డుపై ఎదురుగా వచ్చినప్పుడు మార్జిన్ దిగేందుకు వీలులేక వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. అదే సమయంలో ఆ వాహనాలను తప్పించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు డ్రైనేజీల్లో పడిపోతున్నారు. కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు.. కార్లు ఇతర వాహనాలు సైతం మార్జిన్ దిగిపోతున్నాయి. మళ్లీ రోడ్డు మీదకు ఎక్కడం కష్టమవుతోంది. ఆ సమయంలో పక్కనే ఉన్న డ్రైనేజీలో వాహనం ఎక్కడ పడిపోతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. డ్రైనేజీపై సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేసి, మార్జిన్లను నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. చేతులు దులుపుకున్న వైనం రోడ్డు నిర్మించేశామని బీరాలు పలుకుతున్న కూటమి నేతలకు ఈ దుస్థితి కనబడటం లేదా.. లేక కనబడనట్టు నటిస్తున్నారా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ తనకు అప్పగించిన పని అయిపోయిందని చేతులు దులుపుకుని వెళ్లిపోయారు. కూటమి నేతలు రోడ్డు నిర్మించేశామని వారి భుజాలు వారే తట్టుకుని శెభాష్ అనుకుంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న ఈ దుస్థితిపై ప్రజలు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే నిర్మించిన కొద్దిరోజులకే రోడ్డు నాణ్యతపై కూటమి నాయకులే అనుమానాలను వ్యక్తం చేయడం గమనార్హం. ఏది ఏమైనా మార్జిన్లు సరిచేయకపోతే ఈ రహదారిపై పెనుప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ద్వారకాతిరుమలలో ప్రమాదకరంగా బైపాస్ రోడ్డు డ్రైనేజీ కంటే ఎత్తుగా రహదారి నిర్మాణం మార్జిన్ దిగే వీలు లేక వాహనదారుల ఇక్కట్లు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నరసాపురం రూరల్: చెట్టును బైక్ ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం పేరుపాలెం బీచ్ రోడ్డులో జరిగిన ఈ సంఘటనపై స్థానికుల వివరాల ప్రకారం నరసాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన మల్లుల దుర్గా ప్రసాద్ (23), కుడుపూడి సాయికృష్ణ, కవురు ప్రవీణ్ బీచ్‌కు వెళ్ళి తిరిగి బైక్ పై వస్తుండగా అదుపు తప్పి కొబ్బరి చెట్టును ఢీకొట్టడంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మెగల్తూరు ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపారు. -
ఉమ్మడి జిల్లా ఆర్చరీ ఎంపికలు
భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్చరీ సెలక్షన్స్ భీమవరం వంశీకృష్ణనగర్లోని వోల్గా ఆర్చరీ అకాడమీలో ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.జయరాజు, కోచ్ ఈ.సాహిత్ పర్యవేక్షణలో జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. సబ్ జూనియర్ విభాగంలో సబ్‌జూనియర్ కాంపౌండ్ గర్ల్స్ విభాగంలో ఎం.సూర్యహంసిని, వి.స్ఫూర్తి, కె.సుష్మిత, కె.హేమశ్రీ, ఎ.కనిష్క, వి.శ్రద్ధ ఎంపికయ్యారు. రికర్వ్ బాలికల విభాగంలో ఎన్.హంసిని, ఇండియన్ రౌండ్ బాయ్స్ విభాగంలో సీహెచ్ హర్షద్, వి.వివేక్, పి.రిత్విక్ జై ఎంపికయ్యారు. ఎంపికై న ఆర్చర్లు నవంబర్ 1 నుంచి విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఏలూరు (మెట్రో): తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ముందస్తు ఏర్పాట్లను సమీక్షించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి నాందెండ్ల మనోహర్ నేడు జిల్లాకు రానున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సందర్శించి, తుపాను తీవ్రత, ప్రభావం, జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించనున్నారు. -
ఆక్వాకు తుపాను గండం
● చేపల, రొయ్యల రైతుల ఆందోళన ● ఆక్సిజన్ సమస్య తలెత్తే ప్రమాదం కై కలూరు: అమెరికా సుంకాల దెబ్బకు విలవిల్లాడుతున్న ఆక్వా రంగానికి మోంథా సూపర్ సైక్లోన్ రూపంలో మరో విపత్తు ముంచుకొస్తోంది. చేపల, రొయ్యల ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న కొల్లేరు ప్రాంతంపై దీని ప్రభావం కనిపించనుంది. మోంథా తుపాను నష్టంపై ఆక్వా రైతులు ఆలోచనలో పడ్డారు. ఆక్వా సాగు అధికంగా ఉఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ముప్పును ఎదుర్కొవడం ఎలా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2.90 లక్షల ఎకారల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. వీటిలో చేపలు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, ఏడాది టర్నోవర్ రూ.18 వేల కోట్లు పైనే ఉంది. ప్రస్తుత చేపల చెరువుల్లో 700 గ్రాముల నుంచి కేజీ బరువు చేప పెరుగుతుంది. ఇటీవల అల్పపీడనం కారణంగా విస్తారంగా కురిసిన భారీ వర్షాలకు ఆక్వా చెరువుల్లో నీరు గట్ల అంచుల వరకు చేరింది. ఈదుర గాలులకు సైతం నీటి అలల తాకిడికి చెరువు గట్లు బలహీనపడ్డాయి. ఇలాంటి తరుణంలో తుపాను భయం అణువణువునా ఆక్వా రైతుల్లో కనిపిస్తోంది. ఆక్సిజన్ సమస్య తలెత్తే ప్రమాదం వాతావరణం మారినప్పుడల్లా ఆక్వా రైతులను డీవో(ఆక్సిజన్ సమస్య) పట్టి పీడిస్తోంది. సాధారణంగా చేపల, రొయ్యల చెరువుల్లో 5 పీపీఎం నుంచి 6 పీపీఎం వరకు ఆక్సిజన్ నిష్పత్తి ఉండొచ్చు. విస్తార వర్షాలకు చెరువుల్లో పీపీఎం 3.4కి పడిపోయింది. పీహెచ్ తగ్గితే చేపలకు ఊపిరాడక తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఇప్పటికే చేపల్లో రెడ్ డిసీజ్, మోర్టాలిటీ, రొయ్యల సాగులో విబ్రోయో, వైరస్, తెల్ల మచ్చ తెగుళ్లు రైతులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. తుపాను కారణంగా గట్లు తెగి నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● చెరువు నీరు పెరగకుండా గట్టు నీటి మట్టం 20–30 సెం.మీ. తగ్గించాలి. ● పగుళ్లు, బలహీన స్థానాలు ఉంటే ముందుగానే మట్టి, రాళ్లతో పటిష్టం చేయాలి. ● విద్యుత్ పోయే అవకాశం ఎక్కువ. డీజిల్ ఎరియేటర్లు, జనరేటర్లు, తగిన ఇంధనం నిల్వ ఉంచుకోవాలి. ● తుపానుకు ముందు ఆక్సిజన్ బూస్టర్, హైడ్రోజన్ పెరాకై ్సడ్ ఉపయోగించాలి. ● తుపానుకు ముందు రోజు నుంచే మేత మొత్తాన్ని 30–40 శాతం తగ్గించాలి. ● చెరువులో వల వేసే పని, సున్నం చల్లే పనులు నిలిపివేయాలి ● చెరువులోకి నీరు బాగా ఎక్కితే ఒక్కసారిగా తీసేయకుండా 3–4 గంటల వ్యవధితో నెమ్మదిగా బయటకు పంపాలి. వాతావరణ మార్పుల సమయంలో ఆక్వా రైతులు మేతలను తగ్గించడం ఉత్తమం. భారీ వర్షాలకు కొత్త నీరు ప్రవేశించినప్పుడు చేపలు బయటకు దూకడానికి ప్రయత్నిస్తాయి. వలలను సిద్ధం చేసుకోవాలి. చెరువు గట్లపై మేతల దాణాలను వర్షానికి తడవకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఆక్వా ల్యాబ్‌లో చెరువు నీటిని పరీక్ష చేయించాలి. – డాక్టర్ పి.రామ్మోహనరావు, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీష్ -
ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: నవంబర్ 7 నుంచి 10 వరకూ విశాఖపట్నంలో 7వ ఏపీ అంతర జిల్లాల సీనియర్ మెన్, ఉమెన్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు చెప్పారు. ఆదివారం ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాల ఆవరణలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది మహిళలు పోటీలకు తరలివచ్చారు. ఎంపిక పక్రియ అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి ఆద్వర్యంలో కోశాధికారి కె.మురళీకృష్ణ జట్టుకు ఎంపికై న క్రీడాకారుల పేర్లు వెల్లడించారు. బి.లీలావతి, బి.భవానిదేవి, ఏ టాలీఅనిత, జి.నాగదేవి, టి.జ్యోతి, పి.నాగవినయశ్రీ, పి.ప్రవల్లిక, పి.జయశ్రీ,, ఆర్.మహతి, వి.నిఖిలరెడ్డి, ఎం.నీరజాలాస్య, డి.సాయిభవాని, పి.నందిని, ఎ.పూర్ణచంద్రిక, వి.యామిని ఎంపికయ్యారు. పురుషుల బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక పెంటపాడు: సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల సెలక్షన్ ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయలో ఆదివారం నిర్వహించారు. వివరాలను అసోషియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి, కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికై న వారిలో సాయిరాం, అహ్మద్ ఆలీషా, అన్నవరంరెడ్డి, శివతేజ రెడ్డి, తేజా కృష్ణారెడ్డి, సత్యకిరణ్, ఆదిత్య రెడ్డి, గణేష్, జోసఫ్, ఈశ్వర్‌తేజ, సందీప్, తేజ వివేక్ లోకేష్, శివకృష్ణ ఉన్నారు. కార్యక్రమంలో కోశాధికారి మురళీకృష్ణ, చింతకాయల సత్యనారాయణ, వెలగల సత్తిరెడ్డి తదితరులు ఉన్నారు. కొయ్యలగూడెం: కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జనసేన కార్యకర్తలు రోడ్ల దుస్థితిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. గవరవరం, కృష్ణంపాలెం, ఈవిడిపాలెం, గంగన్నగూడెం, గొల్లగూడెం, యర్రంపేట గ్రామాలకు చెందిన జనసేన కార్యకర్తలు తమ గ్రామాలలోని ప్రధాన రహదారుల దుస్థితిని తెలియజేస్తూ ఆయా గ్రామాలలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ పదవుల కోసమే కాదు ప్రశ్నించడానికి కూడా అంటూ ఫ్లెక్సీలు కట్టారు. శ్రీమన కూటమి ప్రభుత్వంలో రోడ్ల దుస్థితి నుంచి విముక్తి కల్పించండి అని డిప్యూటీ సీఎంకు సందేశం పంపించారు. ఏలూరు రూరల్: అంతర జిల్లాల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా అథ్లెట్ రంజని గోల్డ్‌మెడల్ సాధించిందని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో పెదవేగిలో పోటీలు జరిగాయి. 400 మీటర్ల పరుగు, 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో రెండు బంగారు పతకాలు, 4 ఇన్‌టూ 100 మీటర్ల పరుగులో సిల్వర్ మెడల్ సాధించిందన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
నరసాపురం రూరల్: మోంథా తుఫాను హెచ్చరికల నేపధ్యంలో తీరంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని కేపీ పాలెం, పేరుపాలెం ఉన్నత పాఠశాలలతో పాటు, మెట్రేవు, మోళ్ళపర్రు, లైన్ పల్లవపాలెం, పాతపాడు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు మొగల్తూరు తహసీల్దార్ రాజ్ కిషోర్ తెలిపారు. పునరావాస కేంద్రాలను నరసాపురం ఆర్డీవో దాసిరాజు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కిషోర్ రెడ్డి పరిశీలించి అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తే వారికి ఆహరం అందించేందుకు వంట గ్యాస్, కూరగాయలు, నిత్యావసరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
ముంచెత్తిన చిన కాపవరం డ్రెయిన్
ఆకివీడు: మండలంలోని చినకాపవరం డ్రెయిన్ భారీ వర్షాలకు పొంగి ప్రవహించింది. స్థానిక సమతానగర్లోని వీరమల్లు కాలనీ వద్ద గట్లపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వెంకయ్య వయ్యేరు పంట కాల్వలోని అదనపు నీటిని చినకాపవరం డ్రెయిన్‌లోకి గత మూడు రోజులుగా వదిలేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి పంట కాల్వలోకి వేలాది క్యూసెక్కుల నీరు చేరడంతో గట్లకు గండ్లు పడకుండా అదనపు నీటిని డ్రెయిన్‌లోకి వదిలేస్తున్నారు. దీంతో చినకాపవరం డ్రైయిన్ ఆయకట్టు భూముల్ని ముంపునకు గురిచేయడమే కాకుండా, డ్రెయిన్ పొంగి ప్రవహించడంతో స్థానిక సమతానగర్ వద్ద వీరమల్లు కాలనీ ప్రాంతంలో గట్లపైకి చొచ్చుకువస్తుంది. ఆదివారం రాత్రికి మరింతగా నీరు పెరిగే అవకాశం ఉండటంతో కాలనీలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, సమతానగర్లోని రోడ్లు, ఇళ్లు ముంపునకు గురవుతాయని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనతో ఉన్నారు. చినకాపవరం లాకుల వద్ద అన్ని గేట్లూ ఎత్తివేయడంతో ముంపునీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. -
పేకాట క్లబ్బులతో భీమవరంలో రూ.కోట్ల దోపిడీ
భీమవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గంలో 14 నెలల పాటు విచ్చలవిడిగా పేకాట క్లబ్బుల నిర్వహణ వెనుక కూటమి నేతల ప్రమేయం ఉందని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పారు. రెండు నెలలుగా పేకాట క్లబ్బుల నిర్వహణ నిలిచిపోవడంతో ఆదాయం తగ్గి పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తూ భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యను బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు. భీమవరంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార కూటమి నాయకులు క్లబ్బుల నుంచి ప్రతినెలా రూ.10 లక్షల వరకు వసూలు చేయడమేగాక కీలక నేత ఒకరు ఒక క్లబ్బులో స్వయంగా రూ.5 లక్షల బోర్డు నిర్వహించారని, బ్రాందీ షాపుల నుంచి ప్రతి నెలా రూ.4.50 లక్షలు వసూలు చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయని చెప్పారు. భీమవరంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ తెలుసన్నారు. రెండు నెలలుగా పేకాట క్లబ్బుల్ని మూయించడంతో.. 14 నెలలుగా రూ.కోట్లు దండుకున్న నేతలు ఆదాయం కోల్పోయి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. పవన్‌కల్యాణ్ దృష్టికి డీఎస్పీ వ్యవహారం తీసుకెళ్లిన నేతకు.. ఆర్అండ్బీ రోడ్డును ఆక్రమించుకుని సైకిల్ స్టాండ్ నిర్వహణ, మంచినీటి చెరువు పేరుతో తక్కువ ధరకు 50 ఎకరాల భూమిని లాక్కుని రైతులను మోసగించిన చరిత్ర ఉందని అందరికీ తెలుసని పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)పై ఆరోపణలు చేశారు. క్లబ్బుల వ్యవహారంలో డీఎస్పీపై విచారణ అవసరం లేదని, పట్టణ ప్రజలను అడిగితే మొత్తం బండారం బయటపడుతుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ను తరలించడానికి అవకాశం లేదు భీమవరం నుంచి కలెక్టరేట్‌ను వేరే ప్రాంతానికి తరలించడానికి చట్టబద్ధత లేద న్నారు. అందువల్లనే ఉండి ఎమ్మెల్యే పెద అమిరంలో కలెక్టరేట్ ఏర్పాటుకు అవసరమైతే ఉండి నుంచి పెద అమిరాన్ని భీమవరంలో కలుపుతామన్నారని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ -
తుపానుపై అప్రమత్తంగా ఉండాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టచర్యలు తీసుకోవాలని, అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెనన్స్ హాల్ నుంచి కలెక్టర్ మొంథా తుపాను ప్రభావాన్ని యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను కారణంగా ఈ నెల 26 నుంచి 29 వరకు జిల్లాలో భారీగా వర్షాలు కురియనున్న దృష్ట్యా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. తీరం దాటే సమయంలో సుమారు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తొలుత వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ తుపాను సమర్ధంగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. గూగుల్ మీట్లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డీఎంహెచ్ఓ డాక్టర్ జి.గీతా బాయి తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి భీమవరం: యువత, విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ఎకై ్సజ్ అధికారులు ప్రధాన బాధ్యత నతీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్లో సురక్ష యాప్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, గంజాయి వంటి మత్తు పదార్థాల తనిఖీలు, ఎకై ్సజ్ శాఖ ప్రగతి వంటి అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. కల్తీ, అక్రమ మద్యాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రభుత్వం వినియోగదారులకు సురక్ష యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మద్యం షాపులు, బార్లు వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధం అమలు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. -
కొనుగోడు తీరేనా?
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అంచనా దిగుబడి, సేకరణ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం తాడేపల్లిగూడెంలో ప్రారంభించనున్నారు. 48 గంటల్లోనే ధాన్యం సొమ్ములు జమచేస్తామని ప్రభుత్వం చెబుతుండగా గత సీజన్లో అనుభవాల దృష్ట్యా ఈసారి సేకరణ సవ్యంగా సాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం రూరల్‌లో ఇప్పటికే కోతలు మొదలయ్యాయి. పీఆర్ 126, విత్తనం కోసం సాగుచేసిన ఎంటీయూ 1121 స్వల్పకాలిక రకాలకు సంబంధించి దాదాపు ఆరు వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. తణుకు, ఉండి, ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని అధికశాతం విస్తీర్ణంలో వరిపంట చిరుపొట్ట దశ నుంచి పూత దశల్లో ఉంది. జిల్లా అంతటా మరో పదిరోజుల్లో వరికోతలు మొదలవుతాయని రైతులు అంటున్నారు. జిల్లాలో 5.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా సేకరణ లక్ష్యం ఐదు లక్షల మెట్రిక్ టన్నులుగా అధికారులు నిర్ణయించారు. వరి కామన్ వైరెటీ క్వింటాల్‌కు రూ. 2369, ఏ గ్రేడ్ రకాలకు రూ. 2389కు కొనుగోలు చేయనున్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటలలోపే చెల్లింపులు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అస్తవ్యస్తంగా.. గత రెండు సీజన్లుగా ధాన్యం సేకరణ అస్తవ్యస్తంగా తయారై రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మిల్లింగ్ సామర్థ్యాన్ని బట్టి మిల్లులకు లెవీ లక్ష్యాలను నిర్ణయించారు. ఈ మేరకు టార్గెట్ పూర్తయిన మిల్లులు ధాన్యం సేకరణ చేయక కొందరు రైతులు దళారులను ఆశ్రయించి అయినకాడికి అమ్ముకోవడం, మరికొందరు ఇబ్బందులు పడుతూ దూర ప్రాంతాల్లోని మిల్లులకు తరలించుకోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. గత రబీలో జిల్లాలో 2.2 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేయగా 9.25 లక్షల మెట్రిక్ టన్ను (మె.ట) దిగుబడికి కేవలం ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తర్వాత 7.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. సంచులకు సమస్యే మొదట్లో సంచులకు కొరత లేదన్నట్టుగా కనిపించినా మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో లోపాలు బయటపడుతున్నాయి. గత దాళ్వాలో ఆచంట, పాలకొల్లు, తణుకు నియోజకవర్గాల్లోని పలుచోట్ల గోనెసంచుల కొరతతో రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సంచులు అందక ఆరిన ధాన్యాన్ని వారం రోజులపైనే రోడ్లు పక్కన, కళ్లాల్లోనే ఉంచేసిన రైతులు ఎందరో ఉన్నారు. కొందరు మిల్లర్లు సంచులను రైతులకు కాకుండా దళారులకు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల్లో ధ్రువీకరించిన తేమశాతం మేరకు మిల్లర్లు కొనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, అందుకు మిల్లర్లు అంగీకరించడం లేదని రైతులు అంటున్నారు. తేమశాతం పేరిట కోత పెడుతున్నారని చెబుతున్నారు. వే బ్రిడ్జిల వద్ద మోసాలు జరుగుతున్నాయని అంటున్నారు. రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయశాఖ సిబ్బంది నిర్ణయించిన తేమ శాతాన్ని మిల్లర్లు ఒప్పుకోవడం లేదు. తేమ శాతం ఎక్కువ ఉందని కోత పెడుతున్నారు. వేబ్రిడ్జిల వద్ద తూకాల్లోనూ తేడాలుంటున్నాయి. రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. – ములగాల గంగారావు, రైతు, దండగర్రు పంట చేతికొచ్చే సమయంలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీడం లేదు. ఇప్పటికే చాలాచోట్ల వరిపంట పడిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గతంలో మాదిరి కాకుండా వెంటనే రైతులకు ధాన్యం డబ్బులు జమచేయాలి. – దేవరశెట్టి రాంబాబు, కౌలు రైతు, బి.కొండేపాడు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. రబీలో రెండో దశ సొమ్ములు వేయడానికి రెండు నెలల సమయం పట్టడం గమనార్హం. జిల్లాలో దాదాపు 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్లు విలువైన 7.17 లక్షల మె.ట ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో రూ.1,360 కోట్లు రైతుల ఖాతాలకు జమచేసింది. సుమారు 18 వేల మంది రైతులకు రూ.290 కోట్లు మేర నెలన్నర రోజులు వరకు చెల్లింపులు చేయక రైతులు తీవ్ర అగచాట్లు పడ్డారు. ఆయా అవరోధాలను అధిగమించడం ద్వారా ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా సాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రబీ ధాన్యం సొమ్మును జమ చేయకుండా రెండు నెలల పాటు జాప్యం చేయడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. మొదటి నుంచి చివరి రైతుకు సకాలంలో సొమ్ములు చెల్లించాలి. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. – చిన్నం రామిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రేపటి నుంచి జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం సేకరణ లక్ష్యం ఐదు లక్షల మెట్రిక్ టన్నులు గత రబీ చివరిలో కొనుగోలు కష్టాలు దాదాపు రెండు నెలల పాటు సొమ్ములందక రైతుల ఇక్కట్లు -
ఎన్‌హెచ్–165పై అడుగడుగునా మడుగులే
● పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు ● డ్రెయిన్లు తవ్వించినా పరిష్కారం శూన్యం ఆకివీడు: జాతీయ రహదారి నెం.165 ఆధునికీకరణ దేవుడెరుగు.. ప్రస్తుతం ఉన్న రోడ్డు అడుగడుగునా గుంతలతో భయపెడుతుంది. వాహన చోదకులు, ప్రయాణికులు, పాదచారుల అవస్థలు వర్ణణాతీతం. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరు, మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తూ.. తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. రోడ్డుపై వెళ్లే వారు వ్యాధులకు గురవుతామనే ఆందోళనలో ఉన్నారు. ఇటీవల కచ్చా డ్రెయిన్ తవ్వినప్పటికీ వర్షపు, మురుగు నీరు ప్రవహించడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఎన్‌హెచ్ నెం.165 అభివృద్ధికి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రూ.2200 కోట్లు కేటాయించినా, పనులు మాత్రం అంగుళం ముందుకు కదలడం లేదు. ఏళ్ల తరబడి జాతీయరహదారి అభివృద్ధి అంటూ పాలకులు, ఆ శాఖ అధికారులు ప్రజల్ని ఊరిస్తున్నారు. పామర్రు నుంచి పాలకొల్లు వరకూ ఉన్న రోడ్డును జాతీయ రహదారుల శాఖ విలీనం చేసుకుని రెండు పుష్కర కాలాలు గడిచినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజ్ సౌకర్యం కల్పించకుండా, రోడ్డు ఇరువైపులా ఉంటున్న వారినే డ్రైయినేజీ నిర్మించుకోమనడం దారుణమని పలువురు వాపోతున్నారు. ఉప్పుటేరు నుంచి జాతీయ రహదారిని అభివృద్ధిచేయాలని, రోడ్డును పునర్నిర్మించాలని, ఆక్రమణల్ని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రహదారికి ఇరువైపులా పక్కా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ రహదారి అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. పలు చోట్ల రోడ్డు అధ్వానంగా ఉంది. ప్రమాదాలు జరిగినా ఆ శాఖ అధికారులు కనీస మరమ్మతులు చేపట్టడంలేదు. ఆకివీడు–చెరుకువాడ మధ్య రహదారి కుంగిపోయి దారుణంగా ఉంది. మరికొన్ని చోట్ల రోడ్లపైనే వర్షపు నీరు నిలబడి ఇబ్బందికరంగా మారింది. – అంబటి రమేష్, ఆకివీడు జాతీయరహదారిపై వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారి పలు చోట్ల ముంపుకు గురైంది. సైకిల్‌పై, నడిచి వెళ్లే హైస్కూల్ విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ప్రాంతంలో వర్షపు నీరు, మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌హెచ్ అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలి. – అద్దంకి ప్రసాద్, అధ్యాపకులు, ఆకివీడు -
మాతా శిశు మరణాలపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి ఆధ్వర్యంలో మాతృ మరణాలు, శిశు మరణాలు సబ్ కమిటీ అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ త్రెమాసికంలో శిశు మరణాలు, కారణాలపై సంబంధిత వైద్యాధికారులు, పర్యవేక్షకులు ఏఏన్‌ఏం ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలతో సమగ్ర విశ్లేషణ నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధా లక్మీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సూర్యనారాయణ, గర్భకోశ వ్యాధుల నిపుణులు డా.మాధవి కళ్యాణి, చిన్న పిల్లలు వ్యాధి నిపుణులు డా.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: జిల్లా వ్యాప్తంగా శనివారం 507 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకొల్లులో 69.6 మిల్లీమీటర్లు నమోదుకాగా భీమవరంలో 26, నరసాపురంలో 16.6, తాడేపల్లిగూడెంలో 8, తణుకులో 7.6, ఆకివీడులో 30.2, పెంటపాడులో 14, అత్తిలిలో 22.6, గణపవరంలో 29.6, ఉండిలో 30.4, పాలకోడేరులో 19.2, పెనుమంట్రలో 23.8, ఇరగవరంలో 18.8, పెనుగొండలో 14.4, ఆచంటలో28, పోడూరులో 22.2, వీరవాసరంలో 34.2, కాళ్లలో 22.2, మొగల్తూరులో 22.2, యలమంచిలిలో 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ద్వారకాతిరుమల: శ్రీవారి గోదానం, గో దత్తత పథకాలను వచ్చే నెల 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. లంపి స్కిన్ వ్యాధి తీవ్రత కారణంగా ఇటీవల ఈ పథకాలను దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మళ్లీ వీటిని పునః ప్రారంభిస్తోంది. దానంగా ఇచ్చే ఆవులు, దూడలతో పాటు గతంలో వాటికి గాలి కుంటు, ముద్దచర్మ వ్యాధులు సోకలేదని మండల పశువైద్యాధికారి ధృవీకరించిన పత్రాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చి ఇవ్వాలని సూచించారు. భీమవరం: జిల్లాలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఎలాంటి టార్గెట్లు పెట్టలేదని జిల్లా అబ్కారీ శాఖాధికారి కెవీఎన్ ప్రభుకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం వ్యాపారులు అమ్మకాలకు సరిపడా స్టాక్‌ను డిపోల నుంచి కొనుగోలు, అన్ని రకాల స్టాక్ ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల మద్యం, కల్తీ మద్యం షాపుల్లో అమ్మకుండా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోడానికి ప్రభుత్వం సురక్షయాప్‌ను అందుబాటులోని తీసుకొచ్చినట్లు వివరించారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఉప్పు నీటి ఆక్వా చెరువులు తప్పనిసరిగా సీఏఏ కింద రిజిస్టర్ కావాలని, కాని చెరువులకు చట్టబద్ధత లేకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ(సీఎఎ) రిజిస్ట్రేషన్‌కు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే బ్రాకిష్ ఆక్వాసాగు నిర్వహించాలని, నిబంధనలను పాటించిన వారి సాగుకు గుర్తింపు నమోదు చేయరని చెప్పారు. రిజిస్ట్రేషన్ కాల పరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత ఎవరూ రెన్యువల్ చేయించుకోకపోవడంతో ప్రస్తుతం సుమారు 100 మంది మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసిన దరఖాస్తులు, డాక్యుమెంట్లు గురించి వివరించారు. సమావేశంలో మత్స్య శాఖ అధికారి పి.సురేష్, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతతో చిన్నారి ఆచూకీ లభ్యం
తణుకు అర్బన్: అదృశ్యమైన చిన్నారి ఆచూకీని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొని ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈమేరకు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన ధనకొండ దుర్గమ్మ తన సోదరి రెండు కుటుంబాలతో గంగిరెద్దులు ఆడిస్తూ ఉపాధి కోసం దీపావళి ముందురోజు తేతలి శ్మశానవాటిక సమీపంలోని బస్‌షెల్టర్‌లో తలదాచుకున్నారు. ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం గంగిరెద్దులు ఆడించి నివాస ప్రాంతానికి వచ్చిన వారికి సోదరి కుమార్తె వీరమ్మ కనిపించకపోవడంతో తణుకు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారి వీరమ్మను ఆకివీడు రైల్వేస్టేషన్లో కనిపెట్టారు. పెద్దలంతా బయటకు వెళ్లిన సమయంలో చిన్నారి తేతలి జాతీయ రహదారిపైకి వచ్చి ఆటో ఎక్కి బస్టాండ్ వద్ద దిగగా అక్కడ నుంచి ఆకివీడుకు చెందిన యాచక వృత్తిలో ఉన్న ఇద్దరు పాపవద్ద ఎవరూ లేకపోవడంతో తమ వెంట తీసుకువెళ్లారు. ఈ వ్యవహారమంతా సీసీ పుటేజీలు, సాంకేతికపరంగా సేకరించిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అత్తిలి, గణపవరం, ఆకివీడు ప్రాంతాల్లో జల్లెడపట్టగా చివరకు ఆకివీడు రైల్వేస్టేషన్లో పాప నేలపై పడుకుని ఉండడాన్ని చూసి గుర్తించి తణుకు తీసుకువచ్చారు. అయితే ఆకివీడుకు చెందిన భార్యాభర్తలు సైతం ఉద్దేశ్యపూర్వకంగా తీసుకువెళ్లలేదని, ఒంటరిగా ఉందని తీసుకువెళ్లి సాకుతున్నట్లుగా డీఎస్పీ విశ్వనాథ్ చెప్పారు. రూరల్ సీఐ బి.కృష్ణకుమార్ నేతృత్వంలో చిన్నారి అదృశ్యం ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సైలు కె.చంద్రశేఖర్, డి.ఆదినారాయణ, జె.సతీష్, పి.ప్రేమరాజులతోపాటు హెడ్‌కానిస్టేబుల్ ఎ.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు షేక్ అన్వర్, మలక శ్రీనివాస్, ఎ.రవీంద్ర, వి.మహేష్, ఎస్.భాస్కరాచారిలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పాపను తల్లితండ్రులకు అప్పగించారు. తేతలిలో అదృశ్యమై ఆకివీడులో దొరికిన చిన్నారి -
గంజాయి పట్టివేత
తణుకు అర్బన్: తణుకు కొండాలమ్మ పుంత రోడ్డులో నిషేధిత గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి సమాచారంతో రెవెన్యూ, పోలీసులు నిర్వహించిన దాడిలో 7గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 4 కేజీల 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ తెలిపారు. ఉండ్రాజవరం మండలం పాలంగికి చెందిన పాలాడి భానుప్రకాష్, తణుకుకు చెందిన కాకరపర్తి బాలాజీ, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన కాకరపర్తి గణపతి, నల్లాకులవారిపాలెంనకు చెందిన పితాని వజయబాబు, తణుకుకు చెందిన గుబ్బల ఉదయ్‌ప్రసాద్, బొడ్డు షారోన్, ఖండేటి సత్యనారాయణ అలియాస్ సత్యలను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. బువ్వనపల్లిలో ఈగల్ టీమ్ తనిఖీలు నిడమర్రు: బువ్వనపల్లిలో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం మేరకు ఎలైట్ యాంటీ–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ( ఈగల్) టీమ్ సభ్యులు శనివారం వేకుమజామున బువ్వనపల్లి గ్రామంలోని దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, ఏలూరు నుంచి వచ్చిన 20 మంది బృంద సభ్యులతో పాటు డ్యాగ్ స్కాడ్, స్థానిక పోలీస్ సిబ్బందితో సుమారు 3 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి గంజాయి లేదని నిర్ధారించకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆక్వా చెరువుల మీద పని చేసేందుకు ఒరిస్సా నుంచి వచ్చే కూలీల వద్ద గంజాయి ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఈ ఆకస్మిక తఖీలు నిర్వహించినట్లు ఈగల్ టీమ్ సభ్యులు తెలిపారు. అనంతరం గణపవరం ఇందిరమ్మ కాలనీల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సీఐలు ఎం.రవీంద్ర, రజనీకుమార్, ఎస్సైలు రమేష్, సుఽధీర్, ఫణికుమార్ తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
నరకప్రాయంగా నగర రహదారి
పెద్ద రైల్వేస్టేషన్ మెయిన్‌రోడ్డు దుస్థితి గోతులమయంగా ఏలూరు గూడ్స్‌షెడ్డు మెయిన్ రోడ్డు ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఎక్కడ చూసినా గుంతలే. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆ గుంతలు కాస్త పెద్దవిగా మారి ప్రమాదాలకు నిలయంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఏలూరు పాతబస్టాండ్ నుంచి తూర్పులాకుల వరకు ప్రధాన రహదారి అడుగడుగునా గోతులతో అధ్వానంగా ఉంది. తరచూ వాహనదారులు ఈ గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నా కూటమి నాయకుల్లో మాత్రం చలనం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
ప్రకృతి వ్యవసాయ పద్ధతులే మేలు
భీమవరం: రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అనుసరించడం ద్వారా పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై నూకరాజు చెప్పారు. భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఎఫ్ఎంటీ మాస్టర్ ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు బయోకంట్రోల్ పద్ధతులు, జీవామృతం, ఘనజీవామృతం, కీటకనాశక తయారీ విధానాలు వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయశాఖాధికారులు, ఎఫ్ఎంటీ మాస్టర్ ట్రైనర్స్, సహాయక సిబ్బంది పాల్గొన్నారు. ఆగిరిపల్లి : లారీ ఢీకొని మహిళ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అడవినెక్కలంలో చోటు చేసుకుంది. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామానికి చెందిన దేవరశెట్టి అప్పారావు, తన భార్య ప్రమీల దేవి (60)తో కలిసి ద్విచక్ర వాహనంపై మండలంలోని నెక్కలం గొల్లగూడెం అడ్డ రోడ్డులోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుండగా అడవినెక్కలం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమీల దేవి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. భర్త అప్పారావు ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం: టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను పూర్తిగా మినహాయించాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షుడు హరికృష్ణ, అసోసియేట్ అధ్యక్షురాలు శ్రీవల్లి శనివారం ఒక ప్రకటనలో కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం మినహా సుప్రీంకోర్టు ఉత్తర్వులలో ఏమున్నాయి, ఎవరికి వర్తిస్తాయి, కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటనేది సమీక్షించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలుపర్చాలని చూడడం దారుణమన్నారు. ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉత్తర్వులు తీవ్రంగా కలచి వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. 20 నుంచి 30 ఏళ్లు పైబడి సర్వీస్ పూర్తి చేసిన అనేకమంది ఉపాధ్యాయులు ఈ వయస్సులో టెట్ ఉత్తీర్ణత విషయంలో ఒత్తిడి గురవుతున్నారని, పదోన్నతులకు కూడా టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాకముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ వర్తింపజేయడం సహేతుకం కాదని, విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్నారు. -
శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైనరోజు అయినప్పటికీ నాగులచవితి కావడంతో నామమాత్రంగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. దాంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట తదితర విభాగాల్లో భక్తులు స్వల్ప సంఖ్యలో కనిపించారు. ఇదిలా ఉంటే స్వామివారి దీపారాధన మండప ప్రాంతంలో ఉన్న చెట్టు వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. దాంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని రోడ్లన్నీ గుంతలతో అధ్వానంగా ఉండడంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ రోడ్డులో స్థానిక టౌన్ ఆసుపత్రి వద్ద ఉన్న పెద్ద గుంత, అలాగే ఆర్ఆర్ రైస్‌మిల్లు వద్ద చిప్స్ లేచిపోవడంతో వాహనాలు జారి పడిపోతున్నాయి. అలాగే పెనుమదం రోడ్డులో గుంతలో పడి ఓ మహిళ మృతి చెందింది. దీంతో నియోజకవర్గంలో రోడ్ల అధ్వాన పరిస్థితులపై సెప్టెంబర్ 17న ‘ప్రాణాలు తీస్తున్న గుంతల రోడ్లు’ శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎట్టకేలకు శనివారం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్టేట్ హైవే (ఎస్‌హెచ్) నిధులు రూ.1.50 కోట్లతో టౌన్ ఆసుపత్రి వద్ద శ్రీనిధి రెస్టారెంట్ నుంచి దాదాపు పెనుమదం రోడ్డులో గగ్గిపర్రు రోడ్డు వరకూ నిర్మాణం చేస్తున్నట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. కాళ్ల: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కె.షాలేంరాజు (15) మృతికి విద్యుత్ తీగలు తగలడం కారణంగా తెలుస్తోంది. ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన విషయం తెలిసి హుటాహుటిన కోపల్లెకు వస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ముసునూరు: పొలానికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. ఎస్సై ఎం చిరంజీవి తెలిపిన వివరాలు ఇవి. మండలంలోని వేల్పుచర్లకు చెందిన జోగి వెంకట రంగారావు(49) శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో అతడి కోసం వెదికినా ఆచూకీ లభించలేదు. శనివారం గ్రామ శివారులోని నీటి వరల తొట్టిలో పడి మృతి చెందిన స్థితిలో స్థానికులు కనుగొన్నారు. రంగారావు సోదరుడు జోగి లక్ష్మణరావు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉండి: నమ్మిన రైతులను ఓ బ్యాంకు ఉద్యోగి నిలువునా ముంచేశాడు. అతనిపై బ్యాంక్ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ ఆధ్వర్యంలో కోలమూరు బ్రాంచ్‌లో 2022–24 మధ్య కాలంలో పైలా దుర్గారావు బ్రాంచ్ ఇన్చార్జిగా పనిచేశాడు. ఈ కాలంలో రైతులు బ్యాంకులో పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న బంగారం నుంచి 140 గ్రా. బంగారాన్ని దొంగిలించి ఇతర ప్రాంతంలో అమ్మేసుకున్నాడు. గత కొంత కాలం నుంచి ఉండి రూరల్ బ్యాంక్‌లో జరిగిన అవినీతిని వెలికితీసే కార్యక్రమంలో భాగంగా ఈ విషయం బయటపడింది. దీంతో దుర్గారావుపై ఉండి కోఆపరేటివ్ రూరల్ బ్యాంకు కార్యదర్శి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొల్లేరుకు ముంపు ముప్పు
పెదఎడ్లగాడి వంతెన వద్ద శనివారం 2.47 మీటర్ల నీటి మట్టం నమోదైంది. మోంథా తుపాను కారణంగా ఎగువ నుంచి భారీ నీరు చేరితే ప్రమాదకరంగా మారుతుంది. ఇటీవల ఇక్కడ వంతెన వద్ద డెక్క తొలగించాం. తిరిగి పేరుకుపోయింది. ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నాం. – ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరుకై కలూరు: కొల్లేరుకు వరద ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఐదు రోజులుగా విస్తార వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు మోంథా తుపాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లేరు గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎగువ నుంచి వచ్చిపడుతున్న వర్షపు నీటికి స్థానికంగా అధిక వర్షాలు తోడవడంతో కొల్లేరు నిండుకుండలా కనిపిస్తోంది. తుపానుతో కొల్లేరు ఉగ్రరూపం దాల్చితే భారీ నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొల్లేరుకు చేరే వరద నీటిని సముద్రానికి పంపే పెద ఎడ్లగాడి వంతెన వద్ద గురప్రుడెక్క పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో మొత్తం 122 గ్రామాలున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు కొల్లేరులోకి చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. వివిధ డ్రెయిన్ల ద్వారా చేరుతున్న వరద నీరు మండవల్లి మండలం పెద ఎడ్లగాడి, చిన ఎడ్లగాడి, పోల్‌రాజ్ డ్రెయిన్లకు చేరుతోంది. అక్కడ నుంచి నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రానికి చేరాలి. పెదఎడ్లగాడి నుంచి ఉప్పుటేరు వరకు చానలైజేషన్ జరగకపోవడంతో లక్షా 10 వేల క్యూసెక్కుల నీటికి కేవలం 10 వేల క్యూసెక్కుల నీరే సముద్రంలోకి ప్రవహిస్తోంది. గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క వరద నీటిని సముద్రానికి చేరవేసే పెదఎడ్లగాడి వంతెన వద్ద మొత్తం 56 ఖానాలకు ఇంచుమించు అన్ని ఖానాల్లో గురప్రుడెక్క పేరుకుపోయింది. ఇటీవల పలు పర్యాయాలు డెక్కను తొలగిస్తున్న తిరిగి ఖానాల వద్ద పేరుకుపోతోంది. యంత్రాలు, మనుషులు ఇలా రెండు పద్ధతుల్లో తూడు తొలగింపులు విఫలమవుతున్నాయి. డెక్క కారణంగా నీటి ప్రవా హం తగ్గి సమీపంలో గ్రామాలను ముంచెత్తుతోంది. ప్రస్తుతానికి పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.47 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ఇది 3.5 మీటర్లకు చేరితే లోతట్టు గ్రామాలు నీట మునుగుతాయి. కొల్లేరు పరివాహక గ్రామాలన్నీంటిలో వర్షపునీరు భారీగా చేరడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పెనుమాకలంక రహదారిలో రాకపోకలు బంద్ విస్తార వర్షాల కారణంగా పెదఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంక మీదుగా ఇంగిలిపాకలంక చేరే రహదారి పూర్తిగా కొల్లేరు నీటిలో మునిగిపోయింది. దీంతో ఐదు రోజులుగా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. అంతకుముందు కూడా ఇదే పరిస్థితి రహదారిలో కొనసాగింది. ప్రమాదకరమైనప్పటికీ ప్రజలు పడవలపై గ్రామాలకు చేరుతున్నారు. ఈ రహదారిలో ఓ బడా రైతు వందల ఎకరాలను అక్రమంగా సాగు చేస్తున్నా పట్టించుకోని ఫారెస్టు అధికారులు పెనుమాకలంక రహదారి నిర్మాణానికి అడ్డుతగులుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఎత్తులో రోడ్డు పనులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పెద ఎడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు మూత మండవల్లి: పెదఎడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు మూసి వేసినట్లు తహసీల్దార్ కె గోపాల్ శనివారం పేర్కొన్నారు. పెదఎడ్లగాడి వద్ద కొల్లేరుకు ఎగువనున్న డ్రెయిన్లు రామిలేరు, తమ్మిలేరు, బుడమేరుల నుంచి వచ్చిన నీటి కారణంగా నిండు కుండలా మారింది. దీంతో పెనుమాకలంక రహదారిపై సుమారు మూడు అడుగుల మేర నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలు సాగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డును మూసివేసినట్లు తహసీల్దార్ చెప్పారు. ఎగువ నుంచి భారీగా చేరుతున్న వర్షపు నీరు పెద ఎడ్లగాడి వంతెన వద్ద 2.47 మీటర్ల నీటి మట్టం మోంథా తుపాను హెచ్చరికతో అధికారులు అప్రమత్తం ఐదు రోజులుగా పెనుమాకలంక రహదారిలో రాకపోకలు బంద్ పెద ఎడ్లగాడి వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్క -
2న శ్రీవారి తెప్పోత్సవం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న తెప్పోత్సవానికి శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 2న రాత్రి స్వామివారి తెప్పోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా పుష్కరిణి గట్లపై ఉన్న ముళ్ల పొదలను, పిచ్చిమొక్కలను ఇప్పటికే తొలగించారు. ప్రస్తుతం విద్యుద్దీప అలంకారాల పనులు జరుగుతున్నాయి. అలాగే పుష్కరిణిని బోరు నీటితో నింపుతున్నారు. ఉత్సవం జరిగే రోజు రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలసి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగి, 8 గంటల సమయంలో పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభం అవుతుందని, భక్తులు ఈ వేడుకలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి కోరారు. -
చంద్రబాబుతో ప్రజలకు తీరని అన్యాయం
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం రూరల్: రాష్ట్రంలో దోచేసిన సొ మ్ములను సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఇంటికి తరలిస్తూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. గురువారం మండలంలోని వెంకట్రామన్నగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నా డు జగన్ ఎంతో సమర్థవంతంగా రాష్ట్రానికి 17 మె డికల్ కళాశాలలను మంజూరు చేయించారన్నారు. 2023లోనే ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధమయ్యాయన్నారు. మరో రెండు మెడికల్ కళాశాలలు పూర్తి కాగా, 10 మెడికల్ కళాశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఈ కళాశాలల్లో వైద్య విద్యకు ఏటా రూ.13 వేల నుంచి రూ.17 వేలు ఫీజు చెల్లిస్తే సరిపోతుందన్నారు. తద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉండేదన్నారు. అయితే కూ టమి ప్రభుత్వం వాటిని 33 ఏళ్ల లీజుతో ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దీనిద్వారా మెడికల్ సీటు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు పలుకుతుందని, తద్వారా దోచుకోవాలని చంద్రబాబు యత్నిస్తున్నారని కొట్టు ఆరోపించారు. ఇది లా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు నెలలకోసారి రాష్ట్ర ప్రజలకు ముఖం చూపిస్తున్నా రని విమర్శించారు. జిల్లా కేంద్రం పేకాట క్లబ్‌లకు కేరాఫ్‌గా మారిందని పవన్ కళ్యాణ్ డీఎస్పీపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. డిప్యూటీ స్పీకర్ ర ఘురామకృష్ణరాజు డీఎస్పీకి వత్తాసు పలకడం శో చనీయమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండించాలన్నారు. ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగించాలని కోరుతూ గవర్నర్‌కు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. -
తీరంలో ‘అల’జడి
నరసాపురం: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పేరుపాలెం బీచ్‌లో సందర్శకుల రాకపై నిషేధాజ్ఞలు విధించారు. కార్తీకమాసం పురస్కరించుకుని బీచ్‌లోకి సందర్శకుల రద్దీ ఎక్కువయ్యింది. అయితే బీచ్ వద్ద సముద్ర అలలు ప్రమాదకరంగా ఉండటంతో స్నానాలు చేయడానికి అనుకూల పరిస్థితులు లేవు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వేట బోట్లకు లంగరు పడింది. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లను తీరానికి తరలిస్తున్నారు. అధికారులను ఆర్డీఓ దాసి రాజు అప్రమత్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్రూట్ ఏర్పాటు చేశారు. నరసాపురంలో ఉద యం నుంచి ఎడతెగని వాన కురిసింది. శివారు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై మోకాలు లోతులో నీరు నిలిచిపోయింది. భీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్ఎస్ ఫి ర్యాదులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నాలుగు డీఏలు ప్రకటించాల్సి ఉండగా కేవలం ఒక డీఏ మాత్రమే ప్రకటించడం ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్లూరి రామారావు, బి.రెడ్డి దొర ప్రకటనలో విమర్శించారు. డీఏ బకాయిలను నాలుగు విడతల్లో 2027 ఫిబ్రవరి వరకు చెల్లిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జనవరి 2024 నుంచి రావాల్సిన డీఏనే 2027 వరకు చెల్లింపులు చేస్తే ఇంకా ప్రకటించాల్సిన మూడు డీఏలను ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశా రు. ఆయా డిమాండ్ల సాధనకు ఏపీటీఎఫ్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొయ్యలగూడెం: పొగాకు సీజన్ ముగుస్తున్నా తమ వద్ద ఉన్న బేళ్లను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని రైతులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో వేలం ప్రక్రియ నిర్వహిస్తుండగా నోబిడ్లు అధికంగా రావడం వారి నిరసనకు కారణమైంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఓ వైపు పొగాకు పంట సీజన్ ప్రారంభమైందని, పెట్టుబడుల కోసం తమ వద్ద ఉన్న పొగాకును అమ్మితే తప్ప వేరే మార్గం లేదన్నారు. వేలం కేంద్రానికి తీసుకువచ్చిన బేళ్లను కిలోకు రూ.60కు అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీల ప్రాతినిధ్యం పెరిగితే ధరలు పెరిగే అవకాశం ఉందని రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది తెలిపారు. ఎన్ఎల్ఎస్ పరిధిలోని కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1,–2 కేంద్రాల్లో సుమారు 10 మిలియన్ కిలోల పొగాకు మిగిలి ఉందని, త్వరగా కొనుగోలు చేయాలని ఈడీకి విన్నవించినట్టు చెప్పా రు. త్వరలోనే ట్రేడర్స్‌తో సమావేశ నిర్వహించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని ఈడీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. -
జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుత దశలో నష్టనివారణ చర్యలు ద్వారా పంటను సంరక్షించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఈ జాగ్రత్తలు పాటించాలని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎంవీ కృష్ణాజీ తెలిపారు. ● పొట్ట, పూత దశలో పైరు ఒకటి నుంచి రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు నీట మునిగితే కంకి పూర్తిగా బయటకు రాకపోవడం, పుష్పాలలో నీరు చేరడం వలన ఫలదీకరణ శక్తి కోల్పోయి తాలు గింజలు ఏర్పడతాయి. ● పూత దశలో వర్షం పడితే, పుష్పాలలోనికి నీరుచేరి మానుకాయ తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు వర్షాలు ముందు జాగ్రత్త చర్యగా చిరుపొట్ట దశలో లీటరు నీటికి 1.0 మి.లీ ప్రొపికొనజోల్ 25 ఈసీ మందు కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. ● పాలు పోసుకునే దశలో రెండు మూడు రోజులు కన్నా ఎక్కువగా పంట నీట మునిగితే పిండి పదార్థాలు గింజల్లో చేరక గింజ బరువు తగ్గి తద్వారా దిగుబడి, నాణ్యత తగ్గుతాయి. ఈ దశలో గింజ రంగు మారకుండా లీటరు నీటికి 1.0 గ్రాముల కార్బెండిజమ్, లేదా 2.0 గ్రాముల కార్బెండిజమ్ + మాంకోజెబ్ కలిసిన మందు, లేదా 1.0 మి. లీ ప్రోపికోనజోల్ కలిపి పిచికారీ చేయాలి. ● అధిక వర్షాలకు పడిపోయిన చేలల్లో మాగుడు లేదా పాము పొడ తెగులు ఆశించే అవకాశం ఉన్నందున లీటరు నీటికి 2.0 మి.లీ హెక్సాకొనజోల్ లేక 2.0 మి.లీ వాలిడామైసిన్ లేక 1.0 ప్రొపికొనజోల్ లేక 0.4 గ్రా. ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ 25 శాతం, టెబుకొనజోల్ 50 శాతం కలిపి పిచికారీ చేయాలి. ● గింజ గట్టిపడే దశ నుంచి కోత దశ చేను పడిపోకుండా ఉండి, నిద్రావస్థ కలిగిన రకాల్లో నష్టం తక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేనటువంటి బీపీటీ 5204 వంటి రకాలు నీటమునిగితే గింజ మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ ఉన్న రకాల్లో కూడా చేను పడిపోయి వారం రోజులకన్నా ఎక్కువగా నీట మునిగినట్టైతే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలకవచ్చే అవకాశం ఉంది. నివారణకు 5 శాతం ఉప్పు ద్రావణం (లీటరు నీటికి 50 గ్రా ఉప్పు కలిపి) పంటపై పిచికారీ చేయాలి. ● గింజ తోడుకునే లేదా గట్టిపడే దశలో వెన్ను బరువుకు మొక్కలు కొద్దిపాటి గాలి, వర్షాలకే కణుపుల వద్ద విరిగి పడిపోతాయి. దీనివల్ల పిండి పదార్థం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గడం, తాలు గింజలు ఏర్పడి దిగుబడి తగ్గిపోతుంది. ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూక ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. యంత్రాలతో కోత కోసేందుకు ఎక్కువ సమయం పట్టడం వల్ల కోతఖర్చు పెరిగిపోతుంది. వీలైనంత తొందరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టలుగా కట్టాలి. -
అన్నదాత వెన్నులో వణుకు
సాక్షి, భీమవరం: ఖరీఫ్ పంట కీలక వెన్నుదశలో ప్రతికూల వాతావరణం రైతులను వణుకు పుట్టిస్తోంది. మరో రెండు వారాల్లో జిల్లా అంతటా వరి కోతలు ముమ్మరం కానున్న తరుణంలో అల్పపీడనం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుత వర్షాలు, గాలులు తీవ్రతకు పంట నేలకొరిగి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. స్వల్పకాలిక రకాలు జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్, అత్తిలి, తణుకు, ఇరగవరం, గణపవరం, వీరవాసరం, పెనుమంట్ర, పోడూరు, భీమవరం తదితర ప్రాంతాల్లోని ఏడు వేల ఎకరాల్లో పీఆర్ 126, విత్తనం కోసం సాగుచేసిన ఎంటీయూ 1121 స్వల్పకాలిక రకాలు కోతలు పూర్తయ్యాయి. అధిక శాతం విస్తీర్ణంలో చిరుపొట్ట దశ నుంచి పూత దశల్లో ఉంది. సాగు ఆలస్యమైన ఆచంట, యలమంచిలి, నరసాపురం ఏరియాలో నవంబరు చివరిలోను, మిగిలిన ప్రాంతాల్లో మరో పది రోజుల్లో వరికోతలు మొదలవుతాయని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో 24 వేల ఎకరాలకు ఇప్పటికే ఆరు వేల ఎకరాల్లో కోతలు పూర్తి చేసుకుని పంటను ఒబ్బిడి చేసుకునే పనిలో రైతులు ఉన్నారు. ఎడతెగని వాన బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా చలిగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం జిల్లాలో 94 మి.మీ., బుధవారం 478 మి.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం భీమవరం, ఉండి, వీరవాసరం, పాలకొల్లు తదితర చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిపివ్వకుండా వర్షం కురిసింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడి మరో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. పల్లపు పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోతోంది. గాలులు, వర్షాలకు వెన్ను బరువెక్కి చాలాచోట్ల పొలాల్లోని వరిపంట నేలకొరుగుతోంది. ప్రస్తుత దశలో వరి నీట మునగడం వలన గింజ తాలుగా మారిపోయి దిగుబడులు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాయుగండం జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు అధిక శాతం విస్తీర్ణంలో వెన్నుపై వరి పంట తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఇప్పటికే 25 శాతం విస్తీర్ణంలో వరి కోతలు మరో పదిరోజుల్లో జిల్లా అంతటా మొదలుకానున్న మాసూళ్లు చివరిలో ఆందోళన కలిగిస్తున్న అల్పపీడనం -
ఆక్వాకు ఆక్సిజన్ సమస్య
గణపవరం: పూటకోరకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గుదిబండలా తయారైంది. ముఖ్యంగా ఈ వాతావరణం రొయ్యల సాగుకు పూర్తి ప్రతికూలంగా ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల దారుణంగా దెబ్బతిన్న రొయ్య సాగు కొద్దిగా కుదుటపడుతున్న సమయంలో వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో గత పదిరోజులుగా నిలకడలేని వాతావరణం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తుపాను ప్రభావంతో ఆక్వా కుదేలు వేసవి సాగు మొత్తం తుడిచిపెట్టుకు పోవడంతో గత సెప్టెంబర్ నెలలో ఎక్కువమంది రైతులు చెర్వులలో రొయ్య సీడ్ వేశారు. ప్రస్తుతం రొయ్య కౌంట్ 200 నుంచి 300 మధ్యలో ఉంది. ఈ పరిస్థితుల్లో తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. రొయ్యల చెర్వులలో ఆక్సిజన్ సమస్యతో పాటు వ్యాధుల ముప్పుతో రైతులు సతమతమవుతున్నారు. దీనితో రొయ్యల చెరువులలో నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ ఆక్సిజన్ లోటు భర్తీచేయడానికి శ్రమిస్తున్నారు. ఈ సమస్యలకు తోడు విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజన్లు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. నిరంతరం వర్షం జల్లులు పడుతూ వాతావరణం పూర్తిగా చల్లబడి పోవడంతో రెండు రోజులుగా రొయ్యల చెర్వులలో డీవో సమస్య ఏర్పడి రొయ్యలు సరిపడా ఆక్సిజన్ అందక అసహనంతో నీటి ఉపరితలం మీద తేలియాడుతున్నాయి. ఈసమస్య మరీ తీవ్రమైతే అప్పటికప్పుడు రొయ్యలు చనిపోతున్నాయి. దీనితో రైతులు ఆఘమేఘాలమీద రొయ్యలు పట్టుబడిచేసి అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్నారు. ఆక్సిజన్ సమస్య అధిగమించేందుకు.. రైతులు నిరంతరం చెర్వులలో ఏరియేటర్లు తిప్పుతూ, చెర్వులలో ఇంజన్లువేసి నీటిని రీసైక్లింగ్ చేస్తూ, నిరంతరం నీటిలో కదలిక తేవడం ద్వారా ఆక్సిజన్ సమస్యను కొంతమేర అధిగమిస్తున్నారు. ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినలేక నీరసించి పోవడంతో రైతులు యుద్ధ ప్రాతిపదికన పట్టివేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా 50 శాతం చెర్వులలో అంటే 1.25 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు జరుగుతుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో జూన్ నెలలో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో రొయ్యలు అర్ధాంతరంగా పట్టివేసినట్లు అంచనా. ప్రతికూల వాతావరణం తట్టుకోవాలంటే.. రొయ్యసీడ్ నాణ్యత కలిగి ఉండాలి. నీటి పీహెచ్‌స్థాయి సరైన మోతాదులో ఉండాలి. నిరంతరం ఆక్సిజన్ స్థాయిని సరిచూసుకుంటూ ఉండాలి. నీటి క్షారస్వభావం, నీటి కాఠిన్యం సరైన స్థాయిలో ఉండేలా చూడాలి. చెర్వులో ప్రమాదకరమైన విషవాయువులు అమ్మోనియా నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి తయారవకుండా చర్యలు తీసుకోవాలి. చెర్వుల్లో రొయ్యపిల్ల సాంద్రతను బట్టి పాక్షిక పట్టుబడి చేసుకుంటే మిగిలిన రొయ్యలు ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మత్స్యశాఖ అధికారుల సూచనలు చెర్వులలో ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీసైక్లింగ్ చేయాలి. ఆక్సిజన్ లోపనివారణకు పొటాషియం పర్మాంగనేటు, ఆక్సిజన్ టాబ్లెట్స్ సిద్ధంగా ఉంచుకుని, అవసరం మేరకు చెర్వులో చల్లుతుండాలి. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినని కారణంగా పరిమితంగా మేతలు వేస్తుండాలి. ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో చెర్వులలో మేత, సేంద్రియ ఎరువులను వేయడం పూర్తిగా మానివేయాలి. చెర్వులలో మినరల్స్ ఎక్కువగా వినియోగించకూడదు. నీటి పరీక్షలు చేయించి చెర్వులో అమ్మోనియా స్థాయిని నిర్ధారించుకోవాలి. ఎడతెరిపిలేని వర్షాలతో అనర్థం -
డిప్యూటీ స్పీకర్ వర్సెస్ జనసేన!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భీమవరం డీఎస్పీ జయ సూర్య కేంద్రంగా కూటమి పార్టీలో చిచ్చురేగింది. జయసూర్య తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, పేకా టను ప్రోత్సహిస్తూ ప్రైవేట్ సెటిల్మెంట్లు భారీగా చేస్తున్నాకని జనసేన నేతల ఫిర్యాదుల ఆధారంగా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన విష యం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు.. జయసూర్య మంచి ఆఫీసర్ అంటూ కితాబివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమలో పేకాట సహజమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో డీఎస్పీ జయసూర్యపై విచారణ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ ప్రకటించారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, లేదంటే స్వయంగా కలిసి ఫిర్యాదు చేసినా తీసుకుంటామని చెప్పారు. అన్ని అంశాలను విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు. ఆధిపత్య పోరేనా ! భీమవరం డీఎస్పీ వ్యవహారం రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. గతంలో భీమవరం సబ్ డివిజన్లో భీమవరం రూరల్, భీమవరం టూ టౌన్ సీఐగా జయసూర్య సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈ క్రమంలో పేకాట క్లబ్‌లు, కోడిపందాల నిర్వాహకులు, క్రికెట్ బుకీలు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ముఠాలు.. ఇలా అన్నింటిపైనా పూర్తి అవగాహనతో పాటు వ్యక్తిగతంగా పరిచయాలున్నాయి. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ద్వారా డీఎస్పీగా భీమవరం సబ్ డివిజన్‌కు వచ్చిన జయసూర్య తొలుత భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇద్దరితోనూ, రెండు పార్టీల కేడర్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తనకున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా క్లబ్ లు మొదలు కోడిపందాల వరకు అన్నింటిలో ప్ర త్యక్ష జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో భీమవరం జూదానికి హబ్‌గా మారిందని విస్తృత ప్రచారం జరగడం, పత్రికల్లో వరుస కథనాలు రావడంతో భీమవరంలో పేకాటను కొద్దిగా కట్టడి చేసినట్లు హడావుడి చేసి వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. ఇదే సమయంలో భీమవరంలో తగ్గించి ఉండి నియోజకవర్గంలో కోడిపందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగులు ఇలా అన్నింటికీ డీఎస్పీ నే గేట్లు ఎత్తారనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల క్రమంలో కొద్ది నెలల క్రితం డీఎస్పీపై కూటమిలో ఓ వర్గం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, బదిలీ చేయించింది. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడి తేవడంతో బదిలీ నిలిచిపోయిందని ప్రచారం సాగుతోంది. దీంతో డీఎస్పీ పూర్తిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా మారి, ఉండిలో అసాంఘిక కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో సహకరించడంతో పాటు ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. భీమవరం రూరల్ పరిధిలో ఓ రొయ్యల వ్యాపారికి సంబంధించి రూ.8 కోట్ల డబ్బు పంచాయితీ చేశారని ఆరోపణలు. గతంలో సీఐగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత స్నేహితుడిగా ఉన్న ఓ పేకాటరాయుడి కోసం భీమవరం–నరసాపురం మార్గంలో పేకాట శిబిరం ఏర్పాటు చేయించి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు. భీమవరంలో కీలక క్రికెట్ బుకీ నుంచి రూ.లక్షల్లో తీసుకున్నట్లు ఆరోపణలు. జనసేన రాష్ట్ర ప్రొటోకాల్ చైర్మన్ మల్లినేని బాబి భీమవరంలో రియల్ ఎస్టేట్, బిల్డర్‌గా ఉన్నారు. బాబికి సంబంధించి ఓ సెటిల్మెంట్లో భా రీగా వసూలు చేశారని, ఓ విద్యాసంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ సెటిల్మెంట్లోనూ భారీగా వసూలు చేశారని తేలింది. రికవరీలు బాగా చేస్తారని పేరుంది. ఆ ముసుగులో చేయాల్సింది చేసి, ట్రాక్ రికార్డు కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుంటారు. ఈ వ్యవహారాలన్నీ భీమవరంలోని ఒక సీఐ చూసుకుంటారు. ఆ సీఐ.. డీఎస్పీకి షాడోగా వ్యవహరిస్తూ.. ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉంటారనేది జనసేన నేతల ఫిర్యాదు. కూటమిలో చిచ్చు రేపిన భీమవరం డీఎస్పీ డీఎస్పీ జయసూర్యపై తీవ్రస్థాయిలో ఆరోపణలు భీమవరాన్ని జూదానికి హబ్‌గా మార్చారంటూ జనసేన ఫిర్యాదు ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ డీఎస్పీ మంచి ఆఫీసర్ అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కితాబు డీఎస్పీ వ్యవహారంపై పశ్చిమ ఎస్పీ విచారణ ప్రారంభం -
విమాన యానం.. తెలుగుకు ప్రోత్సాహం
నిడమర్రు: విద్యార్థులు, తల్లిదండ్రులు గణితం, సైన్స్‌లో నూటికి, నూరు వస్తే భవిష్యత్ అని భావిస్తారు. అదిశగా ఆయా సబ్జెక్టులపై దృష్టి పెట్టి, తెలుగుపై తక్కువ శ్రద్ధ పెడుతుంటారు. దీంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు తెలుగుపై ఆసక్తి పెంచేలా వినూత్న హామీ ఇచ్చారు. ఎంత మందికి తెలుగులో 100 మార్కులు సాధిస్తే, అంతమందిని విమాన ప్రయాణ అనుభూతి కలిగిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది విడుదలైన పది ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు తెలుగు భాషలో 100 మార్కులు తెచ్చుకోవడంతో తాజాగా ఆ ఉపాధ్యాయుడు తన హామీని నిలబెట్టుకున్నారు. ఆ ఇద్దరు విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో వేరే రాష్ట్రానికి తీసుకువెళ్లి వారి కలను నెరవేర్చారు. ఈ ఘటన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులకు ఉన్న అంకితభావాన్ని, వాగ్ధానాన్ని నిలబెట్టుకునే గొప్పతనాన్ని తెలయజేస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను జవహర్లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న షేక్ మౌలాలి తన విద్యార్థులకు విమాన యానం బహుమతి ఇచ్చారు. అన్న మాట ప్రకారం తెలుగు భాషలో నూటికి నూరు మార్కులు సాధించి, ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న నిమ్మల పావని, నిమ్మల సత్యసాహితీలను గన్నవరం నుంచి విమానంలో విహార యాత్ర తరహాలో హైదరాబాద్ తీసుకువెళ్లి మూడు రోజుల పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వారు తిలకించేలా కృషి చేయడంతో విద్యార్థుల్లో ఆనందోత్సాహాలకు అవధుల్లేవని వారు చెబుతున్నారు. గత మూడేళ్లుగా తెలుగులో టార్గెట్ గతంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్ రాఘవరం యూపీ స్కూల్లో ఎస్జీటీగా ఉన్న కాలంలో తోటి టీచర్ల ప్రోత్సాహంతో డిజిటల్ తరగతి గదులు, ఇతర పాఠశాల అభివృద్ధి పనులకు దాతల నుంచి రూ.4.5 లక్షలు సమకూర్చినట్లు మౌలాలీ తెలిపారు. పాఠశాలల్లో జరిగే వార్షికోత్సవాల్లో తన వంతుగా ప్రతిభగల విద్యార్థులను సత్కరించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. అక్కడ నుంచి 2019 నవంబర్‌లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతిపై పెదనిండ్రకొలను జెడ్పీస్కూల్ల్లో బాధ్యతలు స్వీకరించానని, గత మూడేళ్లుగా పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో తెలుగులో ఎక్కువ మార్కులు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించినట్లు తెలిపారు. 2023లో తెలుగులో 98, 2024లో 99 మార్కుల లక్ష్యాలను ఇవ్వగా.. సాధించిన విద్యార్థులకు ఇంటర్లో కళాశాలలకు తీసుకువెళ్లాలా స్కై బ్యాగ్స్లను బహుమతులుగా అందించినట్లు ఆయన చెప్పారు. 2025లో తెలుగులో నూరు మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని వియాన ప్రయాణం చేయిస్తానని ఇచ్చిన ప్రోత్సాహక హామీని నెరవేర్చినట్లు వివరించారు. మా ఇద్దరికి తొలిసారి హైదరాబాద్ వెళ్లడం, అది విమానంలో వెళ్లడం మంచి అనుభూతిని ఇచ్చింది. తెలుగులో 100 మార్కులు సాధించిన మేము ఇద్దరం బాలికలు అవ్వడంతో మా తెలుగు టీచర్ మౌలాలీ, మా గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్న మాస్టారిగారి సతీమణి మహమ్మద్ గుల్షీన్ బేగంను మాకు తోడుగా తీసుకువచ్చారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని చార్మినార్, హైటెక్ సిటీ, సాలార్జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రదేశాలు సందర్శించడం ఆనందంగా ఉంది. వెళ్లేటప్పుడు గన్నవరం నుంచి విమానంలో, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో ప్రయాణం సాగింది, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను ఇలా ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువుల్లో రాణిస్తామని మా టీచర్లకు హామీ ఇస్తున్నాం. – నిమ్మల సత్యసాహితీ, నిమ్మల పావని తెలుగులో 100 మార్కులొస్తే.. విమాన ప్రయాణం హామీ ఫలించిన పెదనిండ్రకొలను తెలుగు గురువు వినూత్న ఆలోచన మాటనిలబెట్టుకుని విద్యార్థులను విమానం ఎక్కించిన మౌలాలి -
దళారులతో నిర్వాసితులకు సమస్యలు
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సమస్యలు సృష్టిస్తున్న దళారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిర్వాసితులతో కలిసి గురువారం జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం మండలం కొరుటూరు, గాజులగొంది, చీడూరు, టేకూరు గ్రామాలకు చెందిన నిర్వాసిత గిరిజనులు జీలుగుమిల్లి మండలం తరలివచ్చినట్లు తెలిపారు. వీరికి పి.నారాయణపురం సమీపంలో సుమారు 250 ఎకరాలను భూమికి భూమిగా ప్రభుత్వం కేటాయించగా.. గత ప్రభుత్వంలో పలు రకాల పంటలు వేసుకుని జీవనం సాగించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు దళారులు ఆ భూముల్లో సమస్యలను సృష్టిస్తూ నిర్వాసితులను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. భూముల్లో వ్యవసాయం చేయనీయకుండా అడ్డుకుంటున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూములపై అన్ని హక్కులు నిర్వాసితులకే ఉన్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని, అలాగే నిర్వాసితులను ఇబ్బంది పెడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఉదయ్‌కు, పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం అందించారు. ఎంపీటీసీ సు న్నం సురేష్, నాయకులు తగరం రాంబాబు, మాజీ సర్పంచ్ కోర్సా వెంకటేశ్వరరావు, నిర్వాసిత కాలనీ సర్పంచ్ పి.రామ్‌గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ అరగంటి పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గృహయోగం లేనట్టేనా?
● కూటమి పాలన ఏడాదిన్నర దాటినా పేదలకు మంజూరుకాని ఇళ్లు ● గత వైఎస్సార్ ప్రభుత్వంలో 1,961 ఇళ్లు మంజూరు పెంటపాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. ఇప్పటివరకు పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కొత్త ప్రభుత్వ పాలనలో ఇప్పట్లో గృహయోగం కనిపించడం లేదని అర్హులైన ప్రజలు నిట్టూర్పు వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో పెంటపాడు మండలంలో 1,961 జగనన్న ఇళ్లు మంజూరు కాగా అందులో 1,489 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతావి వివిద దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఇవి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కూటమి హామీలు ఓట్ల కోసమే కూటమి నాయకులు ఎన్నికలకు మందు 3 సెంట్లు చొప్పున పేదలకు ఇంటి స్థలం ఇస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర గడిచాక తాజాగా ఒక ప్రకటన చేసింది. సొంత స్థలం ఉన్నవారు దరఖాస్తు చేసుకొంటే ఇల్లు మంజూరు చేస్తామనడంతో ఇంటి స్థలాల కోసం, ఇల్లు మంజూరుకోసం ఇప్పటికే ఆన్లైన్లో 670 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వారికి కూడా ఇల్లు మంజూరు చేయడం లేదు. వీరిలో అర్హులను ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎంత మందికి ఇళ్లు మంజూరు చేస్తారో తెలియడం లేదు. ఇక స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చే ప్రతిపాదన ఇప్పటివరకు ఏదీ చేయలేదు. జగన్ హయాంలో నెరవేరిన సొంతింటి కల గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సెంటున్నర స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించుకొనేందుకు రూ.1.80 లక్షలతో మెటీరియల్, ఆర్థిక సాయం అందించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలం లేని ప్రాంతంలో పేదలు ఇల్లు లేకుండా ఉండకూడదని కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి భూములు కొనుగోలు చేసి మరీ లే అవుట్లు ఏర్పాటు చేసింది. దీంతో చాలా గ్రామాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకొని సంతోషంగా ఉంటున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్రెడ్డి కొత్తగా ఊర్లు వెలిసేలా గృహాలు మంజూరు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉండగానే దాదాపు 60 శాతం గృహాలు పూర్తయి గృహప్రవేశాలు చేశారు. మిగతావి నిర్మాణ దశల్లో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడానికి ఎస్సీ, బీసీ, ఎస్టీలకు అదనంగా ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు వివిధ నిర్మాణ దశలో నాలుగు విడతలుగా అందించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వాటిని పూర్తిచేయాలని, లేకుంటే పథకం రద్దు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గృహ నిర్మాణాల్లో కొద్దిగా కదలిక వచ్చింది. అయితే బిల్లుల చెల్లింపులు జరపడంలో జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. జగనన్న కాలనీలో సౌకర్యాలు మెరుగుపరచాలి. ఇప్పటికీ రహదారులు, డ్రెయినేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గత వర్షాకాలంలో నడుం లోతు వరకు నీళ్లు చేరాయి. ఇంటివద్ద బురదతో నిండిపోయింది. పాములు, విష సర్పాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – ముప్పిడి మల్లేశ్వరి, జగనన్న లబ్ధిదారు, ఉమామహేశ్వరంకొత్త గృహాలు మాత్రం మంజూరు కాలేదు. సొంత స్థలాలు ఉన్నవారు ఆన్లైన్ దరఖాస్తు చేశారు. వీరిలో అర్హులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేస్తారు. ఒక్కొక్క ఇంటికి అందించే ఆర్థిక సాయాన్ని రూ.2.80 లక్షలకు పెంచుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇళ్లు పూర్తి చేయకపోతే రద్దు అవుతాయి. – ప్రశాంత రెడ్డి, ఇన్చార్జి ఏఈ, హౌసింగ్‌శాఖ -
మహిళా దొంగ అరెస్ట్
భీమడోలు: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగులను దొంగిస్తున్న ఓ మహిళా దొంగను గురువారం భీమడోలు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామానికి చెందిన మహిళా దొంగ వేములపల్లి దుర్గ నుంచి 33.5 గ్రాముల బంగారు అభరణాలు, 117 గ్రాముల వెండి అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భీమడోలు సర్కిల్ కార్యాలయంలో గురువారం ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌తో కలిసి సీఐ యూజే విల్సన్ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గత నెల 28వ తేదీ సాయంత్రం విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన గొడుగు సత్యవాణి తన 8 ఏళ్ల కుమారుడితో కలిసి ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంట తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా ద్వారకాతిరుమల బస్టాండ్‌లో బస్సు ఎక్కే క్రమంలో బంగారు అభరణాలు, వెండి ఆభరణాల గల బ్యాగ్ ఆపహారణకు గురైంది. దీనితో సత్యవాణి ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాల మేరకు భీమడోలు సీఐ యూజే విల్సన్ పర్యవేక్షణలో ఎస్సై టి.సుధీర్ తన సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ద్వారకాతిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళా దొంగ వేములపల్లి దుర్గను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వేములపల్లి దుర్గ, ఆమె భర్త శివకుమార్ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగుల లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారిలో వేములపల్లి దుర్గను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి చిన్నపిల్లల బ్రేస్లేట్, చైన్, గ్రీన్ రాయి, మ్యాటీలు, చిన్నపిల్లల ఉంగరాలు, చెవి బుట్టలు, చిన్న, పెద్ద చెవి దిద్దులు, జూకాలును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా వెండి జాలర్ల పట్టిలు, వెండి చైన్, చిన్న పిల్లల వెండి బ్రాస్లెట్, వెండి తాళం గుత్తి, వెండి రాఖీలను రికవరీ చేశారు. రెండు బంగారు గాజులను మహిళా దొంగ అట్టికా గోల్డ్‌లో పెట్టిందని, వాటిని రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఆమెను భీమడోలు కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసుల ఛేదనకు కృషి చేసిన బృందం సభ్యులు జి.దుర్గారావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎం.రాఘవ, టి.లక్ష్మీనారాయణ, వీజే ప్రకాష్బాబులను సీఐ అభినందించారు. -
ఎక్స్ఆర్డీ ల్యాబ్ ప్రారంభించిన నిట్ డైరెక్టర్
తాడేపల్లిగూడెం: స్ఫటికాకార పదార్థా పరమాణు, పరమాణు నిర్మాణాన్ని విశ్లేషించడానికి ఎక్స్‌రే డీప్రాక్షన్ పరికరాలను ఉపయోగిస్తారని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్‌లో బృందావనం భవనంలో రూ.కోటి 65 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎక్స్ఆర్డీ ల్యాబ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మెటీరియల్ క్యారెక్టరైజేషన్, నాణ్యత నియంత్రణ కోసం మెటీరియల్ సైన్సు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉపయోగిస్తారన్నారు. విద్యార్థులు నాణ్యమైన పరిశోధనలు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఉన్న నూతన ల్యాబ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ల్యాబ్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డీన్ రీసెర్చ్ కిరణ్‌శాస్త్రి, ఆచార్యులు కృష్ణమూర్తి పి.తపస్ పర్మానిక్, రిజిస్ట్రార్ దినేష్, డీన్లు సందీప్, హిమబిందు, వీరేశ్‌కుమార్ పాల్గొన్నారు. ఏలూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం అందించే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులతో పాటు రాష్ట్రీయ ప్రోత్సాహన్ పురస్కార అవార్డులకు అర్హత కల్గిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ రాత్రి గం.11.59 లోపు డబ్ల్యూడబ్ల్యూబడబ్ల్యూ.డీబీఏటీవైఏఎస్–ఎస్పీఓఆర్టీఎస్.జీఓవీ.ఏఎన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భీమడోలు: జాతీయ రహదారి కురెళ్లగూడెం, భీమడోలు గ్రామాల మధ్య రోడ్డు పక్కనే గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలం, తెలుపు రంగు గల షర్టు, సిమెంట్ కలర్ ఫ్యాంటును ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కురెళ్లగూడెం వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు భీమడోలు ఎస్సై షేక్ మదీనా బాషా తెలిపారు. -
డైట్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని దూబచర్ల డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను 2025–26 విద్యా సంవత్సరానికి భర్తీ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యజమాన్యాల్లో (ప్రభుత్వ/జిల్లా పరిషత్, మున్సిపల్) పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఉత్తీర్ణత సాధించిన వారిని ఆయా పోస్టుల్లో నియమిస్తారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 29వ తేదీ వరకూ సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా / మండల విద్యాశాఖాధికారి వారి ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. నవంబర్ 5 నుంచి 8వ తేదీ వరకూ రాత పరీక్షలు నిర్వహిస్తారని, అదే నెల 13వ తేదీన పరీక్షల ఫలితాలు వెల్లడించి అర్హులైన వారికి నవంబర్ 14, 15 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపికై న వారికి నవంబర్ 18వ తేదీన డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేస్తారని, 19వ తేదీన సదరు పోస్టుల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నారు. డైట్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు డిసిప్లినరీ కేసు, క్రిమినల్ కేసు గాని ఉంటే దరఖాస్తు చేయరాదని, ప్రస్తుతం డైట్లో పనిచేస్తున్న వారు కూడా దరఖాస్తు చేయరాదన్నారు. దరఖాస్తు చేసుకునే వారు అర్హత ప్రకారం ఒక పోస్టుకు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించాలని, స్కూల్ అసిస్టెంటుగా పని చేస్తున్న వారు 2015 అక్టోబర్ 31 తేదీ నాటికి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలని, 58 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం మాస్టర్ డిగ్రీలో 55 శాతం, ఎంఈడీలో 55 శాతం మార్కులు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. పెదవేగి: గత రెండు రోజులుగా ఉత్కంఠభరితంగా జరిగిన అండర్ 19 అంతర్ జిల్లాల అథ్లెటిక్ చాంపియన్‌లో శ్రీకాకుళం బాల, బాలికల జట్టులు సత్తా చాటి చాంపియన్స్‌గా నిలిచారు. పెదవేగి మండలం ఎంఆర్సీ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఈనెల 22, 23 తేదీల్లో అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాల బాలికలు అన్ని రకాల విభాగాల్లో సత్తాచాటారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా శ్రీకాకుళం బాల, బాలికలు నిలిచారని ఎస్జీఎఫ్ అండర్ 19 కార్యదర్శి కె జయరాజు తెలిపారు. విజేతలను బహుమతులు, మెడల్స్, ప్రశంసా పత్రాలతో సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ శివప్రసాద్, పలువురు పీడీలు, తదితరులు పాల్గొన్నారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
తణుకు అర్బన్: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తణుకు మండలం తేతలిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గరగ సాయితేజ (19) పైడిపర్రుకు చెందిన యువతిని 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల వీరి ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడిన అనంతరం సాయితేజ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సాయితేజ నాలుగో ఏటనే తండ్రి మృతి చెందగా తల్లికి ఒక్కగానొక్క కొడుకు కావడంతో గారాబంగా పెరిగాడు. సాయితేజ కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సాయితేజ మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. బంధువుల ఫిర్యాదు మేరకు తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇది మీకు తెలుసా..
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఏదైనా అసౌకర్యం కలిగితే దానికి కారణమైన దేవస్థానం సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అధికారులకు ఏవైనా సలహాలు, సూచనలు కూడ ఇవ్వొచ్చు. దశాబ్దాల కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ ఫిర్యాదుల పుస్తకాల గురించి చాలా మంది భక్తులకు తెలియదు. వివరాల్లోకి వెళితే. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. వారి సౌకర్యార్థం అధికారులు ఎప్పటికప్పుడు అనేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈ సలహాలు, సూచనల పుస్తకాలు, బాక్సులను ఆలయ కార్యాలయం, కేశఖండనశాల, వకుళమాత నిత్యాన్నదాన భవనం, సీఆర్వో కార్యాలయం, సత్రాలు తదితర విభాగాల వద్ద భక్తులకు అందుబాటులో ఉంచారు. వాట్సాప్, మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసేవారి కోసం సలహాలు, సూచనల బాక్సులపైన, ఇతర ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. అయితే టీటీడీ సదనం, ప్రసాదాల మెయిన్ కౌంటర్లో ఈ పుస్తకాలు లేవు. దాంతో టీటీడీ సదనంలో ఇటీవల ఓ భక్తురాలికి కలిగిన అసౌకర్యంపై ఆమె స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న సమాచార కేంద్రానికి వెళ్లి, అక్కడ ఫిర్యాదుల పుస్తకంలో తన ఫిర్యాదు రాయాల్సి వచ్చింది. ఎవరిపై ఫిర్యాదు చేయొచ్చంటే.. భక్తుల పట్ల అమర్యాదగా నడుచుకునే.. దురుసుగా ప్రవర్తించే.. మరేరకంగానైనా అవమానపరిచే వారిపై.. అలాగే శ్రీవారి సేవలకు అదనపు రుసుములు వసూలు చేసే సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అధికారులకు అన్ని రకాల సూచనలు, సలహాలను ఇవ్వొచ్చు. ఫిర్యాదు చేసేదిలా.. ఫిర్యాదు చేయదలచిన, లేదా సూచనలు, సలహాలు ఇవ్వదలచిన భక్తులు సంబంధిత కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడి ఉద్యోగులను ఫిర్యాదుల పుస్తకం అడిగి, అందులో రాయొచ్చు. లేదా ఆయా కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సలహాలు, సూచనల బాక్సుల్లో ఫిర్యాదు పత్రాలను వేయొచ్చు. డిజిటల్ విధానం ద్వారా ఫిర్యాదులు చేసే వారు ఆ బాక్సులపై ఉండే క్యూఆర్ కోడ్‌ను సెల్‌ఫోన్‌లోని గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఆలయ ఈఓ వాట్సాప్‌కు, లేదా మెయిల్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాది దారుడి చిరునామా, సెల్ నెంబర్ లను తప్పనిసరిగా అందులో చూపాలి. ఫీడ్‌బ్యాక్ సెక్షన్ పర్యవేక్షణలో.. సలహాలు, సూచనల బాక్స్‌లు, పుస్తకాలు డీఈఓతో పాటు, సంబంధిత విభాగాల గుమస్తాలతో కూడిన ఫీడ్‌బ్యాక్ సెక్షన్ పర్యవేక్షణలో ఉంటాయి. భక్తుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదు, సలహా, సూచనను వారు ఈఓకు చేరవేస్తారు. పరిష్కారం ఇలా.. ప్రతి పది, పదిహేను రోజులకు ఒకసారి ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఈ ఫిర్యాదులు, సలహాలు, సూచనలను పరిశీలించి, సంబంధిత సెక్షన్ అధికారుల నుంచి వివరణ తీసుకుంటారు. ఆ తరువాత తగు చర్యలు చేపడతారు. వాటి వివరాలను నెలకోసారి ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు ముందు ఉంచుతారు. ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే ఈఓకు ఆయన సూచిస్తారు. అధికారులు తగు సమాచారాన్ని ఫిర్యాదికి తెలియజేస్తారు. ఇలా ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం లభిస్తుంది. శ్రీవారి ఆలయంలో అసౌకర్యాలపై ఫిర్యాదు చేయొచ్చు అందుబాటులో సలహాలు, సూచనల బాక్సులు, పుస్తకాలు ప్రతి ఫిర్యాదుకు ఖచ్చితంగా లభిస్తున్న పరిష్కారం -
ఎల్లో గ్యాంగ్ చేతుల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్!
సాక్షి టాస్క్‌ఫోర్స్: క్రయ, విక్రయదారులకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు అక్రమార్కులకు వరంగా మారుతోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అపహాస్యమవుతోంది. ఇతర జిల్లాల నుంచి వచ్చి పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. బ్యాంకుల్లో పత్రాలు పెట్టి రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్ విచారణ నివేదిక ఆధారంగా అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం జిల్లా కలెక్టర్లు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసినా వాస్తవరూపం దాల్చలేదు. దీంతో కూటమి నేతలు అక్రమార్కులతో చేయి కలుపుతున్నారు. స్థానిక బలంతో అధికారుల విధులకు అడ్డు తగులుతున్నారు. గణపవరానికి చెందిన కురెళ్ళ రాజ్‌కుమార్‌కు కలిదిండి మండలం, పటమటిపాలెం బర్రింకలగరువులో సర్వే నంబరు 728/9లో 9 సెంట్ల భూమి ఉంది. ఇదే గ్రామానికి చెందిన కూటమి నేత ఇదే సర్వే నంబరుతో 10.13 సెంట్లకు ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాడు. విషయం తెలుసుకున్న రాజ్‌కుమార్ పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేశాడు. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బ్యానర్‌తో నిరసన తెలిపాడు. ఇదిలా ఉంటే పీజీఆర్ఎస్లో సమస్య పరిష్కారం అయ్యిందని ఉండి ఎస్సై ఎండార్స్‌మెంటు ఇచ్చినట్లు రాజ్‌కుమార్‌కు మెసేజ్ వచ్చింది. తప్పుడు ఫొటోను సైతం అప్లోడ్ చేశారు. ఎస్సై నా ప్రమేయం లేదని చెప్పడంతో తిరిగి విచారణ చేశారు. ఎట్టకేలకు కూటమి నాయకుడిది తప్పుడు రిజిస్ట్రేషన్ అని అధికారులు విచారణలో తేల్చారు. కూటమి నేతల కుట్రలతో అధికారికి చిక్కులు కలిదిండిలో మరొకరి స్థలాన్ని తనదే అంటున్న కూటమి నేతకు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల పదవీ విరమణ చేసిన జిల్లా స్థాయి అధికారి స్నేహితుడు. దీంతో ఉండి రిజిస్ట్రార్‌కు తన స్నేహితుడికి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని సిఫార్సు చేశాడు. దీంతో ఆమె ఎటువంటి పత్రాలను పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేసింది. బాధితుడు రాజ్‌కుమార్ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉండి సబ్ రిజిస్ట్రార్ తప్పుడు రిజిస్ట్రేషన్ వెలుగుచూసింది. సదరు అధికారిణి నాలుగు నెలలుగా రావడం లేదు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ నుంచి మెమోను సైతం అందించారు. సిఫార్సు చేసిన అధికారి వద్దకు తనను సమస్య నుంచి బయటపడేయాలని అధికారిణి తిరుగుతున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లకు అడ్డాగా ఉండి, ఆకివీడు అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి, అకివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మారుతున్నాయి. ఏలూరు జిల్లా కై కలూరు, మండవల్లి మండలాలు, కృష్ణాజిల్లా బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఇక్కడ జరుగుతున్నాయి. రాజ్‌కుమార్ వంటి అనేక మంది బాధితులు తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మరీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్లు కలిదిండికి చెందిన భూమికి మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ కాళ్లరిగేలా తిరుగుతున్న బాధితుడు ఆక్రమణదారుడికి కూటమి నాయకుల అండ నా భూమిని ఆక్రమించుకోవడానికి ఉండిలో తప్పుడు రిజిస్ట్రేషన్‌కు కలిదిండికి చెందిన కూటమి నేత పాల్పడ్డాడు. అతని తప్పుని నేను ఎండగట్టాను. ఒకరి భూమిని ఆక్రమించుకుంటున్న వ్యక్తికే కూటమి నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఉండిలో అక్రమ సవరణ దస్తావేజు 1531/2025ను రద్దు చేసి, మోసం చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నా భూమిని అధికారులు అప్పగించాలి. – కురేళ్ళ రాజ్‌కుమార్, బాధితుడు, గణపవరం -
శ్రీవారి క్షేత్రంలో కార్తీక సందడి
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో కార్తీకమాసం సందడి మొదలైంది. తొలిరోజు బుధవారం చినవెంకన్న ఆలయానికి విచ్చేసిన భక్తుల్లో అధిక శాతం మంది, స్వామివారి దీపారాధన మండప ప్రాంతంలోని చెట్టు వద్ద కార్తీక దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించారు. అలాగే క్షేత్రపాలకుని ఆలయంలో అర్చకులు శివదేవునికి విశేష అభిషేకాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కొయ్యలగూడెం, తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏటీఎంల వద్ద పహారాకు సిబ్బందిని నియమించాలని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఆర్కే హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ లేకపోవడం వలన చోరీలు, నిరక్షరాస్యులైన వారు, వృద్ధులు మోసాలకి గురవుతున్నారని అన్నారు. బ్యాంకర్లు తొలుత ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసినప్పటికీ ఆపై వదిలేశారని దీంతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. ఆర్బీఐ గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అంబుడ్స్‌మెన్, గవర్నర్లకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు హనుమంతరావు తెలిపారు. -
విద్యార్థి ఉసురు తీసిన బెట్టింగ్ వ్యసనం
మైలవరం: బెట్టింగ్‌లతో అప్పులపాలై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైలవరంలో బుధవారం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవరపల్లికి చెందిన గొర్రె అరవింద్ (23) మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అతను స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్లైన్లో బెట్టింగులకు అలవాటు పడ్డాడు. చేసిన అప్పులు చెల్లించలేక బుధవారం కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
క్షీరారామలింగేశ్వరస్వామి ఖాతాకు చేరిన నగదు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి కార్తీకమాస నిత్యాన్నదానం కమిటీ ఆధ్వర్యంలో ఉన్న నిల్వ సొమ్ము ఆలయానికి జమ చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 19వ తేదీన ‘విరాళాలు దేవస్థానం ఖాతాలోకి వెళ్లేనా’ శీర్షికతో సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన పాత కమిటీ సభ్యులు శ్రిఖాకొల్లు వెంకన్న, శిడగం సతీష్ రూ.7,18,333 చెక్కు, రూ.62,101 నగదు రూపంలో మొత్తం రూ. 7,80,434 ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావుకు అందించినట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఆలయ శాశ్వత అన్నదాన నిధికి ఎఫ్‌డీఆర్‌లో రూ.30 లక్షలు, క్యాష్ బుక్‌లో రూ.9,26,105 ఉన్నట్లు చెప్పారు. పాత కమిటీ జమ చేసిన నగదుతో నేటికి మొత్తం అన్నదాన నిధికి రూ.47,06,539 వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అతి త్వరలో స్వామివారి అన్నదాన నిధికి రూ.50 లక్షలు పూర్తిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రూ.47 లక్షలకు చేరిన నిత్యాన్నదాన నగదు -
ఏలూరు జిల్లా డీఎస్‌డీఓగా అజీజ్ బాధ్యతలు
ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్డీఓ) అధికారిగా సయిద్ అబ్దుల్ అజీజ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విని కలిశారు. గతంలోనూ ఆయన ఏలూరు జిల్లా డీఎస్‌డీఓగా పనిచేశారు. ఇప్పటి వరకూ డీఎస్‌డీఓగా పనిచేసిన బి శ్రీనివాసరావు విజయవాడకు బదిలీ అయ్యారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా డీఎస్‌డీఓగా నియమితులైన అధికారి బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఆయన స్థానంలో అజీజ్ ఇన్చార్జి డీఎస్‌డీఓగా వ్యవహరించనున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది జీతాల బకాయిలపై వినతి ఏలూరు టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ చక్రధర్‌బాబుకు బుధవారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు, జిల్లా కార్యదర్శి వి.దత్తాత్రేయ (దత్తు) వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ పనులు చేపట్టిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ శానిటేషన్ వర్కర్లకు జీతాలు చెల్లించలేదనీ, భారీగా బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ప్రస్తుతం ఫస్ట్ అబ్జెక్ట్ ప్రైవేటు లిమిటెడ్, ఫస్ట్ అబ్జెక్ట్ ఏజెన్సీ అని వేర్వేరుగా అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్ట్ సంస్థలు తమ పారిశుద్ధ్య కార్మికులను దారుణంగా మోసం చేశాయని ఆరోపించారు. కార్మికులకు న్యాయం చేయకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సిబ్బందికి జీతాలు చెల్లించని పక్షంలో వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెల్త్ కమిషనర్ హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ ఏలూరు బ్రాంచ్ అధ్యక్షురాలు పీ.విజయ, సూపర్వైజర్ అజయ్ ఉన్నారు. బాలికల కుస్తీలో ‘పశ్చిమ’కు మూడో స్థానం విజయవాడరూరల్: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఏపీఎస్‌జీఎఫ్), సమగ్ర శిక్ష(ఎస్ఎస్), ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అశోక్ ఫంక్షన్‌హాలులో 69వ స్కూల్ గేమ్స్ అండర్–19 అంతర్ జిల్లాల కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. నున్న గ్రామంలో బుధవారం జరిగిన బాలికల కుస్తీ పోటీల్లో పశ్చిమ గోదావరి జట్టు మూడోస్థానంలో నిలిచింది. బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలకు 350 మంది క్రీడాకారులు, కోచ్‌లు మేనేజర్లు హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఆకివీడు: మండలంలోని గుమ్ములూరు గ్రామానికి చెందిన కొదమ మార్కురాజు(34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో బుధవారం మృతుడి బంధువులు స్థానిక పొలీస్ స్టేషన్ వద్ద మృతదేహంతో ధర్నా చేశారు. గత నెల 24వ తేదీన మార్కు రాజు కన్పించకుండా పోయిన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కన్పించకుండా పోయిన మార్కురాజు బుధవారం చేపల మార్కెట్ రోడ్డు వద్ద ఫిష్ ప్యాకింగ్ ప్రాంతంలో పురుగుల మందు తాగి తన సోదరుడికి తెలియజేయాలని అక్కడున్నవారికి చెప్పడంతో అతని సోదరుడు అహరోన్ వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం భీమవరం, విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద మార్కురాజు మృతదేహంతో ధర్నాచేశారు. అహరోన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
అన్ని రంగాల్లో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర
భీమవరం: రానున్న రోజుల్లో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహిస్తుందని జాయింట్ కలెక్టర్ టి రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఇన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన సైన్స్ మేళా ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఇన్నోవేటివ్ స్టాల్స్‌ను పరిశీలించారు. వాటిలో ప్రమాద సమయాల్లో, వ్యవసాయ రంగానికి, అడవుల రక్షణకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు తయారుచేసిన పలు రకాల డ్రోన్స్‌ను జాయింట్ కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. సెట్వెల్ సీఈవో కేఎస్ ప్రభాకరరావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్‌వర్మ, కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, కోఆర్డినేటర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి పాల్గొన్నారు. మొదటి బహుమతి ఎస్ఆర్కేఆర్కే జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్లో దాదాపు 135 ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు ప్రదర్శించగా మొదటి బహుమతి భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ద్వితీయ బహుమతి నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు దక్కింది. అలాగే తృతీయ బహుమతి తణుకు ఎస్కేఎస్డి ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్టుకు బహుమతి దక్కింది. వీరు అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. -
బాలుడి అదృశ్యం కేసు సుఖాంతం
తణుకు అర్బన్: తణుకులో పాఠశాలకు బయలుదేరి అదృశ్యమైన బాలుడి వ్యవహారం సుఖాంతమైంది. సజ్జాపురానికి చెందిన బాలుడు అన్నెపు రూప భానుప్రసాద్ (13) కనిపించడంలేదని పట్టణ పోలీస్ స్టేషన్లో తాతయ్య కూన నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 21వ తేదీ రాత్రి తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా పూళ్లలోని నానమ్మ ఇంట్లో బాలుడు ఉన్నాడని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భానుప్రసాద్ తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 21న పాఠశాలకు వెళ్లకుండా పూళ్లలో నివసిస్తున్న నానమ్మ, తాతయ్యల వద్దకు సైకిల్‌పై వెళ్లాడు. మధ్యాహ్నం పాఠశాలకు క్యారేజీ తీసుకువెళ్లిన తాతయ్య నరసింహారావుకు భానుప్రసాద్ పాఠశాలకు వెళ్లలేదనే విషయం తెలిసింది. ఆరోజు సాయంత్రం ఆయన పోలీసులను ఆశ్రయించారు. చైన్నెలో ఉంటున్న తల్లిదండ్రులు బుధవారం తణుకు వచ్చి పిల్లాడి వెతుకులాటలో పడ్డారు. అయితే నానమ్మ ఇంట్లో ఫోన్ సౌకర్యం లేకపోవడంతో తల్లిదండ్రులు పక్కింటి వారికి ఫోన్‌చేయడంతో అక్కడే ఉన్నట్లుగా తెలిసింది. -
పడకేసిన వైద్యం
అత్తిలి, మంచిలి పీహెచ్సీ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ఇన్చార్జిగా ఉన్న వైద్యులు రెండు రోజులు మాత్రమే ఆస్పత్రులకు వచ్చి సేవలందించారు. తర్వాతి నుంచి వారు రావడం లేదు. సాధారణ వ్యాధులతో వచ్చేవారికి పాత చీటీల ప్రకారం ఇక్కడి వైద్య సిబ్బంది మందులిచ్చి పంపిస్తున్నారు. మిగిలిన కేసుల్ని తణుకు జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తుండటంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నెలరోజుల క్రితం వరకు రోజుకు 60కు ఓపీ నమోదయ్యేది. రెగ్యులర్ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రస్తుతం 30 నుంచి 40 లోపు ఉంటోంది. సాక్షి, భీమవరం : డిమాండ్ల సాధన కోసం రూరల్ పీహెచ్సీ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో మూడు వారాలుగా గ్రామీణ వైద్యం పడకేసింది. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల నుంచి సర్ధుబాటు చేసిన వైద్యులు చాలాచోట్ల చుట్టపు చూపునకే పరిమితమవుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్యసేవలందక రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గతంతో పోలిస్తే రోజువారీ ఓపీ తగ్గిపోయింది. సర్వీస్‌లోని పీహెచ్సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లు పునరుద్ధరించాలని, టైం బాండ్ పదోన్నతులు కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్‌పై 50 శాతం అలవెన్స్ ఇవ్వాలని, కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువుని ఐదు సంవత్సరాల కుదించడం, నేటివిటీ పై స్పష్టత కావాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5000 అలవెన్స్ ఇవ్వాలని కోరుతూ ఏపీపీహెచ్‌సీడీఏ (ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్) ఆందోళనకు పిలుపునిచ్చింది. జిల్లాలో 34 రూరల్ పీహెచ్‌సీల పరిధిలో దాదాపు 68 మంది వైద్యులకు దాదాపు 60 మంది ఈనెల 1వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు వైద్యసేవలకు అంతరాయం కలుగకుండా జిల్లాలోని తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడులలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్ల్ సెంటర్ల నుంచి దాదాపు 27 మంది వైద్యులను డిప్యుటేషన్‌పై పీహెచ్‌సీలకు సర్దుబాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆస్పత్రిలోనే ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలి. చాలాచోట్ల వైద్యులు రెండు మూడు గంటలు సేవలందించి మధ్యాహ్నం 1 గంట సమయానికి వెళ్లిపోతుండగా, కొన్నిచోట్ల విధులకు గైర్హాజరవుతున్నారు. అక్కడకక్కడ మాత్రమే సాయంత్రం వరకు అందుబాటులో ఉంటున్నారు. బుధవారం పలు పీహెచ్‌సీల్లో ఇటువంటి దృశ్యాలే కనిపించాయి. సిబ్బందే దిక్కు వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఇన్చార్జిలు ఎప్పుడు వస్తారో? ఎప్పుడు వెళ్లిపోతారో తెలీని పరిస్థితుల్లో ఆస్పత్రులకు వచ్చే వైద్య సిబ్బంది వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. మధ్యాహ్నం తర్వాత దాదాపు అన్ని పీహెచ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి. తమ పరిధిలో సేవలందించి మిగిలిన కేసులను సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సూచిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో ఎందుకొచ్చిన గొడవన్నట్టు ముందుగానే రోగులు పట్టణాలకు వెళ్లిపోతున్నారు. రెగ్యులర్ వైద్యులు ఉన్న సమయంతో పోలిస్తే చాలా పీహెచ్‌సీల్లో ప్రస్తుత ఓపీ తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు రూరల్ పీహెచ్‌సీల్లో ప్రసవాలు సంఖ్య తగ్గింది. వైద్యుల ఆందోళనపై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో సమ్మె ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలీని పరిస్థితి. అప్పటి వరకు వైద్యసేవల కోసం ఇబ్బందులు తప్పవని రోగులు వాపోతున్నారు. త్వరితగతిన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. పాలకోడేరులో ఖాళీగా ఉన్న బెడ్లు మూడు వారాలుగా సమ్మెలో రూరల్ పీహెచ్సీ వైద్యులు మధ్యాహ్నం వరకే ఆస్పత్రుల్లో అందుబాటులో ఇన్చార్జులు ఏఎన్ఎంలు, అటెండర్లే దిక్కు వైద్యం కోసం రోగుల ఇక్కట్లు వైద్యుల సమ్మెతో పెంటపాడు, ముదునూరు పీహెచ్‌సీల్లో రోజువారి ఓపీ 120 నుంచి దాదాపు సగానికి తగ్గింది. రెండు పీహెచ్‌సీలకు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి నుంచి ఇద్దరు ఇన్చార్జి వైద్యుల్ని నియమించినా వారు సకాలంలో రాకపోవడం, గంట లేదా రెండు గంటలు మాత్రమే వైద్యసేవలు అందించి వెళ్లిపోతుండటంతో వైద్యం కోసం వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెంటపాడు పీహెచ్సీలో ఉదయం 11 గంటల వరకు వైద్యుడు రాకపోవడంతో రోగులు పాత చీటిపై మందులు తీసుకుని వెళ్లారు. పాలకోడేరు ఇన్చార్జి డాక్టర్ బుధవారం విధులకు హాజరుకాకపోవడంతో ఆయుష్ డాక్టర్ ఓపీ చూశారు. రెగ్యులర్ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ఇన్చార్జి వైద్యులు మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలో ఉండి వెళ్లిపోతున్నారు. తర్వాత ఆనారోగ్య సమస్యలతో వచ్చేవారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో రోజుకు 60 నుంచి 70 వరకు ఓపీ ఉంటే వైద్యులు అందుబాటులో లేక ప్రస్తుతం తగ్గుతోంది. బుధవారం 47 ఓపీ నమోదైంది. బెడ్లు ఖాళీగానే ఉంటున్నాయి. గుండెల్లో మంటగా ఉండడంతో అత్తిలి పీహెచ్‌సీకి వైద్యం నిమిత్తం వచ్చాను. వైద్యులు అందుబాటులో లేరని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. స్థానికంగా వైద్యులు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – కోట జగపతిబాబు, అత్తిలి -
వైఎస్ జగన్‌ను కలిసిన కారుమూరి
తణుకు అర్బన్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి పలు విషయాలపై చర్చించారు. భీమవరం: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కిల్లారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. వచ్చే నెల 3 నుంచి కార్మికులు చేపట్టనున్న సమ్మె సన్నాహాల్లో భాగంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు నిర్వహించిన ఆందోళనలో మాట్లాడారు. ఆందోళనల్లో భాగంగా 25న బైక్ ర్యాలీ, 27న మునిసిపల్ రీజినల్ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడి, 29, 30 తేదీల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకుల కార్యాలయం ఎదుట దీక్షలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవంబరు 3 నుంచి చేపట్టే సమ్మెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రజలు, రైతులు, అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. వరి పొలాలు ముంపునకు గురైతే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న జాయింట్ ఎల్పీఎంలు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే, హౌసింగ్ ఫర్ ఆల్, పీజీఆర్ఎస్ పిటిషన్ల పరిష్కారాలు తదితర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా బుధవారం సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాయింట్ ఎల్పీఎంలు ఇంకా జిల్లాలో 3800 పెండింగ్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న జాయింట్ ఎల్పీఎంలకు శనివారం లోపుగా దరఖాస్తులు చేయించాలని అన్నారు. 3వ ఫేజ్ రీ సర్వే చేస్తున్న గ్రామాలు టైం లైన్ ప్రకారం నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేయాలని అన్నారు. భీమవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రతిభను గుర్తించి వెలికి తీసేందుకు కౌశల్ రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ అన్నారు. భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎం), ఏపీ సైన్స్ సిటీ, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఎపీ కాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే కౌశల్ పోస్టర్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సత్తా చాటాలన్నారు. కౌశల్ కోఆర్డినేటర్ రేపాక వెంకన్నబాబు మాట్లాడుతూ ఆన్లైన్లో ఈ నెల 24 లోపు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 98496 66417, 94919 70676 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
ఎదురీదుతున్న వనామీ
భీమవరం అర్బన్: ఉమ్మడి జిల్లాలో వనామీ రొయ్య పెంపకం సిరులు కురిపించడంతో రొయ్య రైతులు మొగ్గు చూపుతున్నప్పటికీ వర్షాకాలంలో సోకే వైట్ స్పాట్, విబ్రియో, వైట్‌గట్ లాంటి వ్యాధులు రైతులను నష్టాల బాట పట్టిస్తున్నాయి. దీంతో పట్టుబడికి వచ్చిన రొయ్యలు లేకపోవడంతో రొయ్య ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. భీమవరం మండలంలో సుమారు 12 వేల ఎకరాలలో వనామీ పెంచుతున్నారు. ఈ ఏడాది మొత్తం రొయ్యల పెంపకంలో ప్రతికూల వాతావరణంతో వైరస్ సోకి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పన్ను పోటు వనామీ రొయ్యలపై పడటంతో కేజీకి రూ.40 నుంచి రూ.60 తగ్గించేయడం, మరోపక్క వైరస్ల దాడితో నష్టాల బాట పడుతున్నామని రైతులు చెబుతున్నారు. వర్షాకాలంలో వనామీ విలవిల ఈ ఏడాది వర్షాకాలంలో రెండు మూడు రోజులు వర్షాలు పడటం, మరో నాలుగు రోజులు ఎండలు తీవ్రంగా ఉండి ఉక్కబోతగా ఉండటంతో తరచూ వాతావరణ మార్పుల కారణంగా వనామీ రొయ్యలకు వైట్‌స్పాట్, విబ్రియో, ఈహెచ్‌పీ వంటి వైరస్లు సోకి రొయ్య పిల్ల దశలోనే మృత్యువాత పడుతోంది. మండలంలో 20 నుంచి 40 శాతం లోపు సీడ్ దశ నుంచి కౌంట్ వరకు రొయ్యలున్నాయి. వైరస్ దాడి చేయడంతో రైతులు గట్ల చుట్టూ బ్లీచింగ్ కొడుతూ పక్షులు వాలకుండా జాగ్రత్తలు తీసుకుని నిరంతర ఏరియేటర్లు తిప్పుతూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తూ రొయ్యలను కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం వనామీ ధరలు ప్రస్తుత వనామీ ధరలు 100 కౌంట్ రూ.200, 90 కౌంట్ రూ.205, 80 కౌంట్ రూ.215, 70 కౌంట్ రూ.245, 60 కౌంట్ రూ.280, 50 కౌంట్ రూ.290, 45 కౌంట్ రూ.300, 40 కౌంట్ రూ.320, 30 కౌంట్ రూ.345 వరకూ ఉన్నాయి. రొయ్య ధరలపై ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటే రైతుకు లబ్ధి చేకూరుతుంది. మార్చి నుంచి జూన్ వరకు వ్యాపారస్తులు కుమ్మకై ్క రొయ్యలు కొనుగోలు చేయడం లేదని చెప్పడంతో వారు చెప్పిన ధరకు అమ్ముకుని నష్టపోతున్నాం. రొయ్య ధరలను స్థిరీకరించి ఎప్పుడూ ఒకే ధర ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే రైతుకు లబ్ధి చేకూరుతుంది. –పెనుమాల నరసింహస్వామి, గొల్లవానితిప్ప రొయ్యల చెరువులకు సంబంధించి ఫీడ్, సీడ్, మెడిసిన్, కూలీల ధరలు పెరిగినప్పటికీ రొయ్యల ధరలు మాత్రం పెరగడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా చెరువులకు సబ్సిడీలు రాకపోవడంతో పెట్టుబడులు పెరిగి పెంపకం భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దిగుమతిపై 50 శాతం సుంకాలు పెంచడంతో ఆక్వా ట్రేడర్స్ కేజీకి 40 నుంచి 60 వరకు తగ్గించేశారు. దీంతో సాగులో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులు రొయ్యల సాగు చేపట్టకుండా ప్రత్నామ్నాయ మార్గాలైన పండుగొప్ప, శీలావతి, చేపల చెరువు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వాతావరణ మార్పులతో వైరస్ ముప్పు -
వైద్య విద్యను దూరం చేసే కుట్ర
పెనుగొండ: కూటమి ప్రభుత్వ పాలనలో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బుధవారం పోడూరు మండలం తూర్పుపాలెంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో వైద్య విద్య పేదలకు ఖరీదుగా మారనుందన్నారు. ప్రజలు కలసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్ పాలనలో మెడికల్ కళాశాలలే రాలేదని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించి కూటమి ప్రభుత్వం అభాసు పాలైందన్నారు. గత ఏడాది పులివెందులలో మెడికల్ సీట్లు కేటాయిస్తే చేయలేమంటూ కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఇపుడు వాటి ప్రైవేటీకరణకు తెరతీసిందన్నారు. ఇది కేవలం వారి నాయకులు సంపాదన కోసమేనని ఆరోపించారు. 16 నెలలు కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు. కోటి సంతకాలు సేకరణ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు, సర్పంచ్‌లు గుబ్బల ఉషా వీర బ్రహ్మం, ఇళ్ల లక్ష్మీ చంద్రిక, జక్కంశెట్టి చంటి, సుంకర సీతారామ్, జక్కంశెట్టి శ్రీరామ్, పార్టీ సీనియర్ నాయకులు నల్లిమిల్లి బాబిరెడ్డి, పిల్లి రుద్ర ప్రసాద్, పోతుమూడి రామచంద్రరావు. కుక్కల సూరిబాబు, దంపనబోయిన బాబూరావు, జెంట్రీ శ్రీను, జే సునీల్ వర్మ, ఏసురత్నం, పూరీళ్ల శ్రీను, కేశవరపు గణపతి, కుడిపూడి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
కుడి కాలువ గట్టుకు తూట్లు
పోలవరం రూరల్: పోలవరం మండలంలో కుడికాలువ వెంట మట్టి, గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇటికిల కోట నుంచి రేపల్లెవాడ వరకు కాలువ సమీపంలో పలు చోట్ల అక్రమార్కులు తవ్వుకుపోతున్నా పట్టించుకునే వారులేరు. కాలువ గట్టు వెంట తరలించేస్తున్న అధికారుల కంటపడకపోవడం విశేషం. రేపల్లెవాడ సమీపంలో కుడికాలువ గట్టు పక్కన గావెల్ తవ్వి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలానికి ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. గ్రావెల్ తరలించేస్తున్న విషయాన్ని గ్రామస్తులు ఇంజినీరింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు కాలువ వెంట తిరుగుతుండగా, ఒక ప్రదేశంలో జేసీబీ, ట్రాక్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వీటిని అడ్డుకుని అనుమతులు ఎవరిచ్చారంటూ ప్రశ్నించడంతో వారు అక్కడి నుంచి జేసీబీ, ట్రాక్టర్‌తో సహా పరారయ్యారు. కాలువ మట్టి తరలిస్తున్నారన్న విషయంపై కుడి కాలువ డీఈ కోటేశ్వరరావును అడగ్గా సిబ్బందిని పంపామని, కాలువ వెంట పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
లోతట్టు ప్రాంతాల పరిశీలన
భీమవరం (ప్రకాశంచౌక్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. రోడ్ల మార్జిన్, లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిపోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అల్పపీడనం దృష్ట్యా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని దీని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ పారిశుద్ధ్య లోపం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలను గుర్తించడంతోపాటు, రోడ్ల మార్జిన్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన భవన యజమానులకు నోటీసులు జారీచేసి, తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సోమేశ్వర స్వామి దేవస్థానం ముందు పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించారు. కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణాలు అత్యంత పరిశుభ్రతగా ఉండేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే అండర్ పాస్ కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ కాలేజీ బాయ్స్ వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించి, విద్యార్థులను మౌలిక వసతులపై ఆరా తీశారు. -
కార్తీక మాస పూజలు ప్రారంభం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం పూజలు ప్రారంభమయ్యాయి. బుధవారం వేకువజామున 4 గంటలకు ఆలయం తెరవడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాకారంలో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసంలో ప్రదోష కాలం సమయంలో ఆలయంలో వెలిగించే ఆకాశ దీపాలను మంగళవారం రాత్రి నుండి పాఢ్యమి రావడంతో దీపాలను వెలిగించారు. నెలవారీ పూజలు చేయించుకునే భక్తులు మహన్యాసపూర్వక అభిషేకాలు చేయించుకున్నారు. అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటుచేశారు. క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఉమాసోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామక్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో బుధవారం కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుంచే ఉమాసోమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేశారు. -
కేదారీ ఘాట్ రేవులకు మోక్షం
పెనుగొండ: కార్తీక మాసం సమీపిస్తుండడంతో కేదారీఘాట్ రేవుల దుస్థితిపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి పంచాయతీ, దేవదాయ శాఖాధికారులు స్పందించారు. అధ్వానంగా మారిన సిద్ధాంతం కేదారీఘాట్ రేవులను పంచాయతీ, దేవదాయ శాఖల ఆధ్యర్యంలో శుభ్రం చేశారు. సర్పంచ్ చింతపల్లి గనిరాజు(చంటి), దేవస్థానం అధికారి ముత్యాల సత్యనారాయణల ఆధ్వర్యంలో రేవుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు, జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో దళిత బాలుడు బేతాళ నాగచైతన్యను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపర్చిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నాగచైతన్య ఈ నెల 5న దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు జరుగుతుండగా చూసేందుకు వెళ్లాడు. ఊరేగింపు నిర్వాహకులు బాలుడిని కులంపేరుతో దూషించి గాయపర్చారు. ఈ ఘటనకు సంబంధించి నులకాని రామచంద్, సారేపల్లి ధర్మరాజు, కోటపోతుల పవన్, వనుముల సాయిలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆ రోజున బాలుడి తరుపున ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ నెల 17న నాగ చైతన్యకు కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి అక్కడి నుంచి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, పాంక్రియాస్ దెబ్బతిందని నిర్ధారించి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాలుడి తండ్రి గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదుపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తానని డీఎస్పీ తెలిపారు. ముదినేపల్లి రూరల్: మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం 12 గంటల వరకు ఎండ కాయగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి గాలివాన రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. పలుగ్రామాల్లో గాలివానకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. గాలి బీభత్సానికి కాకరవాడలో ఒక ఇంటిపై కొబ్బరి చెట్టు కూలిపోయింది. గంటన్నరకు పైగా కుండపోతగా వర్షం కురియడంతో ముదినేపల్లి సెంటర్ జలమయంగా మారింది. ఏలూరు (టూటౌన్): దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం ఏలూరులో జరిగింది. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ కె వీర్రాజు, అధ్యక్షుడు కుందేటి జయరాజు, కార్యదర్శి ఎల్.రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ అందించాలని చెప్పినప్పటికీ, చాలాచోట్ల రేషన్ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ అందించేవారని గుర్తు చేశారు. సమావేశంలో ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి లక్కపాము రాంబాబు, ఉపాధ్యక్షుడు సీహెచ్ వాసు, కోశాధికారి భూలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
తుస్సుమన్న డీఏ హామీ
ఏలూరు, (మెట్రో): ఉద్యోగులకు నెల జీతంలో వంద పెరిగినా ఎంతో ఆనంద పడతారు. అలాంటిది ఉద్యోగికి రావాల్సిన రూ.కోట్లాది బకాయిల్లో కాస్త ఇస్తున్నామని ప్రకటిస్తే ఆ ఉద్యోగి ఆనందానికి అవధులు ఉండవు. కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల జీవితాలతోనే ఆడుకుంటోంది. బతికుండగా ఇవ్వలేకపోతే ఉద్యోగులు మరణించాక వారికి బకాయిలు చెల్లిస్తామని చెబుతోంది. కనీసం పెన్షనర్లపైనా దయ చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైంది. కనీసం ఉద్యోగుల ప్రయోజనాలపై ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదు. ఇటీవల ఉద్యోగులు, పెన్షనర్లతో సమావేశంలో ఉద్యోగులకు ఒక డీఎ, పెన్షనర్లకు ఒక డీఆర్ ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కాస్త ఊరట కలిగిందని భావించే లోపే ఉద్యోగులకు, పెన్షనర్లపై కూటమి సర్కారు పిడుగు వేసింది. ప్రకటించిన డీఎ, డీఆర్‌లను ఉద్యోగులు రిటైర్ అయిన తరువాత చెల్లిస్తామని లేకుంటే ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు చెల్లిస్తామని, పెన్షనర్లకు 2027–28 సంవత్సరాల్లో 12 విడతల్లో చెల్లిస్తామని ప్రకటించింది. ఇప్పటికే నాలుగు డీఏలు బకాయి : ప్రతి ఆరు నెలలకు డీఎ ప్రకటించి ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 67 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. ఏలూరు జిల్లాలో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 29 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 వేలకు పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరికి ఇప్పటికే 4 డీఎలు చెల్లించాల్సి ఉంది. 2024 జనవరి 1 నుంచి 2024 జూన్ 30 నాటికి ఒక డీఎ, 2024 జూలై 1 నుంచి 2024 డిసెంబరు 31 2వ డీఏ, 2025 జనవరి 1 నుంచి జూన్ 30 3వ డీఎ, 2025 జూలై 1 నుంచి 2025 డిసెంబరు 31వరకూ 4వ డీఎ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 2024 జనవరి 1 నుంచి 2025 సెప్టెంబరు 30 వరకూ 21 నెలల డీఎ 3.64 శాతాన్ని చెల్లిస్తామని గొప్పలు చెప్పిన కూటమి సర్కారు ఉద్యోగులు చనిపోవాలని, లేదంటే ఉద్యోగవిరమణ చేయాలని జీఓలు విడుదల చేసింది. వాస్తవానికి పెన్షనర్లకు డీఆర్ ప్రకటించిన వెంటనే వచ్చే నెల పెన్షన్‌తో బకాయిలు ఇవ్వాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా 2027 తరువాత 12 విడతల్లో చెల్లిస్తానని చెప్పడం చూస్తుంటే బకాయిలు తీసుకోవాలంటే ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోవాలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాగా ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం బకాయిలను 10 శాతం 2016 ఏప్రిల్‌లో, మిగతా 2026 ఆగస్టు, నవంబరు, 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని మరో జీవో విడుదల చేసింది. దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. డీఎ బకాయిలు రావాలంటే ఉద్యోగి మరణించాలి.. లేదంటే రిటైరవ్వాలి ఆ మేరకు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం ప్రకటించిన ఒక్క డీఎ ఇప్పట్లో లేనట్టే ఉమ్మడి జిల్లాలో 67 వేల మంది ఉద్యోగులకు మొండిచేయి 20 వేల మంది పెన్షనర్లదీ ఇదే పరిస్థితి -
ఎంత వరకూ సమంజసం?
నాలుగు డీఎలు ఉద్యోగులకు బకాయిలు పడిన ప్రభుత్వం ఒక డీఎ విడుదలకు హామీ ఇచ్చింది. ఆ డీఎను ఉద్యోగులు మరణిస్తే ఇస్తామనడం, లేదంటే ఉద్యోగ విరమణ చేసిన తరువాత చెల్లిస్తామనడం ఎంత వరకూ సమంజసం. ఈ జీఓలను మార్చి ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి – ఆర్ఎస్ హరనాథ్, పీఏఓ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం ఇచ్చిన ఒక డీఎ ప్రకటన చూసి ఉద్యోగులు కాస్త ఆనందం వ్యక్తం చేశారు. దీపావళికి టపాసులు పేలాయి. ప్రభుత్వం ఇచ్చిన డీఎ హామీ మాత్రం తుస్సుమంది. తక్షణమే ఈ డీఎ నిధులు జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలి. పెన్షనర్లకు తక్షణమే చెల్లించే ఏర్పాట్లు చేయాలి. – కె.రమేష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుత్వం ప్రకటించిన డీఎ బకాయిలను తక్షణమే విడుదల చేసి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలి. ఇప్పటికే 4 బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి గురించి పక్కన పెట్టినా ఇచ్చిన హామీ ప్రకారం ఒక డీఎ బకాయినైనా ప్రభుత్వం చెల్లించే విధంగా జీఓలో మార్పులు చేయాల్సిందే. – సిహెచ్ శ్రీనివాస్, జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు ఇప్పటికే పెన్షనర్లు 70 సంవత్సరాల పైబడి ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన డీఆర్ బకాయిలు రానున్న నెల నుంచి అమలు చేయాలి. మరో రెండు సంవత్సరాల తరువాత చెల్లిస్తానమడం, అది కూడా 12 విడతల్లో చెల్లిస్తాననడం ఎంత వరకూ సమంజసం. – కె.మహాలక్ష్ముడు, జిల్లా పెన్షనర్ల కార్యదర్శి -
27న ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
భీమవరం: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నుంచి రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. అక్టోబర్ 27న తాడేపల్లిగూడెంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. అధికారులు సత్వరమే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాలలో 50 శాతం గోనె సంచులు సిద్ధం చేయాలన్నారు. రైతులకు తప్ప దళారులకు ఎవరికై నా గోనె సంచులు ఇచ్చినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు అవసరమైతే వారి సొంత వాహనంలో ధాన్యాన్ని రైతు సేవా కేంద్రానికి తరలించుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. -
అమర వీరుల కుటుంబాలకు భరోసా కల్పించాలి
భీమవరం: విధి నిర్వహణలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం భీమవరం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా సమాజ భద్రత, రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల ఆశయాలను స్మరించుకుంటూ ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, ఆర్మర్డ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.సత్యనా రాయణ తదితరులు అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి వీరమరణం పొందిన పోలీసుల గౌరవార్థం మౌనం పాటించారు. ఈ ఏడాది జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డీఎస్పీ ఎం.చక్రధరరావు, ఎస్సై ఏజీఎస్ మూర్తి, పీసీలు సీహెచ్ వెంకటేశ్వరరావు, పి.శ్రీహరి, జి.సురేంద్రనాథ్, జేసీలు పి.సుధీర్ బాబు(గ్రేహౌండ్స్), కె.మనోజ్ కుమార్(గ్రేహౌండ్స్) కుటుంబ సభ్యులను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడి, ఏపీఐఐసీ ఛైర్మనన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. -
కార్మికుల సమ్మె బాట
తణుకు అర్బన్: ఆసుపత్రుల్లోని పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. తమకు 4 నెలల వేతన బకాయిలు, 40 నెలల పీఎఫ్ సొమ్ము తక్షణమే ఇవ్వాలని, ఆస్పత్రిలోని బెడ్లకు అనుగుణంగా 50 మంది కార్మికులను కేటాయించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నుంచి ఆందోళన బాట పట్టారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలతోపాటు మేనెలలో కూడా వేతనం ఇవ్వలేదని కానీ అధికారులు మాత్రం మే నెల వేసేశామని చెబుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు బకాయిలు ఉండగా తరచూ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో కూడా కార్మికులు సమ్మెబాట పట్టగా వైద్యాధికారులు చర్చలు జరపడంతో విధుల్లోకి వచ్చారు. జిల్లాలో మిగిలిన ఆస్పత్రుల్లోని కార్మికులు కూడా సమ్మెబాట పట్టేలా ఉన్నారని తెలుస్తోంది. ఒక్క రోజుకే కంపు... పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో మంగళవారం ఒక్కరోజుకే ఆస్పత్రి అంతా కంపు కొట్టింది. ఆస్పత్రి వార్డుల్లోకి వెళ్లాలంటే దుర్వాసనతో దుర్గంధంగా మారిందని రోగులు ఆరోపిస్తునారు. వార్డుల్లో ఏర్పాటుచేసిన డస్ట్బిన్లు నిండిపోయి నేలపై వ్యర్థాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ముఖ్యంగా బాలింతలు, బిడ్డలు ఉన్న వార్డులో చెత్త, వ్యర్థాలు నేలపైనే పడిపోయి కడు దయనీయంగా మారింది. వార్డులో ఉన్న టాయిలెట్స్ సైతం రొచ్చు కంపుతో కునారిల్లిపోయింది. ఆవరణ, వార్డుల్లో ఉన్న డస్ట్బిన్లు నిండిపోయి నేలపై పడిపోయిన వ్యర్థాలతో ఆస్పత్రి అంతా దుర్వాసన వెదజల్లుతోంది. సమ్మె కొనసాగితే ఆస్పత్రిలోని బాలింతలు, గర్భిణులు, వివిధ శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఆస్పత్రి వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. డీసీహెచ్ఎస్, ఆర్డీవో చర్చలు విఫలం పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో మంగళవారం ఉదయం డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ, ఆర్డీవో కౌసర్ బానో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చి వైద్యాధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో చర్చలు జరిపారు. ఈ రోజు రెండు నెలల వేతనాలు వేస్తే విధుల్లోకి వస్తామని కార్మికులు పట్టుబట్టడంతో చర్చలు విఫలమయ్యాయి. అనంతరం డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఈ సమస్య నెలకొందని, తణుకు ఆస్పత్రిలో 3 నెలల వేతన బకాయిలు, పీఎఫ్ పెండింగ్ సమస్యలతో కార్మికులు సమ్మెలోకి వెళ్లారని తెలిపారు. 48 గంటల్లో సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు. అప్పటివరకు తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపల్ కమిషనర్ల సహాయంతో ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. కూటమి పాలనలో మూడు సమ్మె నోటీసులు 16 నెలల కూటమి పాలనలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు వేతన బకాయిలు, పీఎఫ్ సొమ్మును ఇప్పించాలని మూడుసార్లు సమ్మె నోటీసులు వైద్యాధికారులకు అందచేశారు. మొదటగా 5 నెలల వేతన బకాయిలతో ఈ ఏడాది మార్చి 4వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లుగా 3వ తేదీన, 4 నెలల వేతన బకాయిలతో సెప్టెంబరు 29 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని 27వ తేదీన, తిరిగి 4 నెలల వేతన బకాయిలతో ఈనెల 21 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని 17వ తేదీన వైద్యాధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. జిల్లా ఆస్పత్రి 1 ఏరియా ఆస్పత్రులు 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 పారిశుధ్య కార్మికులు 135 నిత్యం 6 వేలకు పైగా అవుట్ పేషెంట్స్, వెయ్యిలోపు ఇన్ పేషెంట్స్ విధులు బహిష్కరించిన ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు 4 నెలల వేతన, 41 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ ఆస్పత్రుల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు రోగులపై పడనున్న సమ్మె ప్రభావం -
ఆహ్లాదం... విహారం
బుట్టాయగూడెం: కార్తీకమాసం ప్రారంభం కావడంతో పర్యాటకులు దైవ దర్శనాలతో పాటు పిక్నిక్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పిక్నిక్ పేరుతో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు సిద్దమవుతున్నారు. చలికాలం కూడా ప్రారంభం కావడంతో అందమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడున్నాయో అని ఆరా తీస్తున్నారు. జిల్లాలో అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలతోపాటు ఆధ్యాత్మిక దేవాలయాలవైపు ఒక లుక్కేద్దాం. పశ్చిమ ఏజెన్సీలోని అటవీ అందాలు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అడవి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. జాలువారుతున్న జలపాతాలు, కొండలను తాకుతున్న మేఘాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసును దోచుకుంటున్నాయి. జల్లేరు జలాశయం, ముంజులూరులోని ఏనుగుతోగు జలపాతం, ఉప్పరిల్ల జలపాతం, గుబ్బల మంగమ్మ సన్నిధి, పోగొండ రిజర్వాయర్‌తో పాటు అటవీప్రాంతంలోని పలు ప్రదేశాలు పిక్నిక్ స్పాట్లుగా ఉన్నాయి. ప్రతి ఏటా కార్తీకమాసంలో లక్షలాది మంది పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో కూడా పిక్నిక్ సందడి ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా వర్షాలు విస్తరంగా కురుస్తున్నందున ప్రకృతి ఒడిలో విరాజిల్లే జలపాతలు వర్యాటకులు మనస్సును దోచుకుంటున్నాయి. ఆహ్లాదకరం గోదావరి విహారం కార్తీకమాసం వచ్చిందంటే పాపికొండల యాత్రకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. గోదావరి తీర ప్రాంతాలతో పాటు పాపికొండల విహారానికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి యాత్రికుల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది అత్యధిక వర్షాలు కురిసి గోదావరి వరద కూడా ఉధృతంగా ప్రవహించడంతో బోటు ప్రయాణాలను పర్యాటక శాఖ నిలిపివేసింది. ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పట్టడంతో పర్యాటక శాఖ తిరిగి పాపికొండల విహార యాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఘాట్ నుంచి పాపికొండల విహారయాత్రకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సందర్శన స్థలాలు పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. ఇసుక తిన్నెలపై కొలువైన పోలవరం మండలం పట్టిసీమ వీరభద్రస్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మగుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కార్టేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ శివుడిని దర్శించుకోవచ్చు. అలాగే గోదావరి వెంబడి ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులను కనువిందు చేస్తాయి. పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనసును దోచుకుంటుంది. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టును తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇది పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతోంది. నేటి నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం సందడి విహారయాత్రలకు పశ్చిమ మన్యం సోయగాల ఆహ్వానం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అందుబాటులోకి అనేక సౌకర్యాలు -
డీఎస్పీ సారు.. జూదాలను పట్టించుకోరు!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు అందిందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుండటంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా విషయం చర్చనీయాంశంగా మారింది. భీమవరం డీఎస్పీగా జయసూర్య సుమారు ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టారు. సంక్రాంతి కోడిపందేల నిర్వహణ, పెద్ద ఎత్తున పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, దీనికి పరోక్షంగా డీఎస్పీ సహకారం ఉందంటూ ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ప్రధానంగా భీమవరం పట్టణంలోని క్లబ్బుల్లో విచ్చలవిడిగా జూదాలు నిర్వహిస్తున్నారని, అందుకు గాను పోలీసులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే కార్యాలయానికి ముడుపులు ఇవ్వాలంటూ పోలీసులే ముడుపులు వసూలు చేస్తున్నారంటూ ప్రచారం సాగింది. దీంతో మండిపడ్డ ఎమ్మెల్యే.. క్లబ్బుల్లో జూదాల నిర్వహణను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. పక్కనున్న ఉండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట వంటి జూదాలు నేటికీ జోరుగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, దీనికి పక్క నియోజకవర్గ కూటమి పెద్దలతో డీఎస్పీ అంటకాగడమే కారణమని బహిరంగంగా చెబుతున్నారు. దీంతో సుమారు ఆరు నెలల క్రితం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. అయితే బదిలీని పక్క నియోజకవర్గ నాయకుడి అండదండలతో బదిలీని నిలుపుదల చేయించుకుని ఆయనకు అనుకూలంగా పనిచేస్తూ జూదాల నిర్వాహకుల జోలికి పోకుండా.. వారినుంచి పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా సివిల్ తగాదాల్లో డీఎస్పీ ప్రమేయం ఉంటోందని, భీమవరంలో డీఎస్పీ జయసూర్య ప్రత్యేక దందా నిర్వహిస్తున్నారంటూ జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు చేయడంతో నేరుగా పవన్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనిపై భీమవరం నియోజకవర్గంలో జనసేన కూటమి నాయకులు గాని, పోలీసులు గాని నోరుమెదపడం లేదు. డీఎస్పీ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోననే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. డీఎస్పీ జయసూర్యపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం -
50 మంది పని 19 మంది చేస్తున్నారు
తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన పనికి వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. 4 నెలలపాటు వేతనాలు లేక కార్మికులు అల్లాడుతుంటే ప్రభుత్వానికి, అధికారులకు చీమకుట్టినట్లుగా లేదు. ఆస్పత్రిలో 50 మంది చేయాల్సిన పనిని కేవలం 19 మందితో చేయిస్తున్నారు. – కోనాల భీమారావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, తణుకు శాఖ అధ్యక్షుడు 4 నెలలపాటు జీతాలివ్వకపోతే మా బిడ్డలను ఎలా పోషించుకోమంటారు. ఆసుపత్రిలో 50 మంచాలతో ఉన్ననాటి నుంచి 19 మందితో పనిచేస్తున్నాం. నేడు 200 మంచాలకు పెరిగి 50 మంది కార్మికుల అవసరం ఉన్నా ఆ 19 మందిమే చెమట కక్కుతూ పనిచేస్తున్నాం. అయినా జీతాలు సక్రమంగా అందడం లేదు. – ధర్మాని పుష్పలత, పారిశుధ్ధ్య కార్మికురాలు ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో ఉన్న మాకు వేతనాలు ఇవ్వకపోవడంతో మా బిడ్డలకు మూడు పూటలా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నాం. కాంట్రాక్టర్ ఇవ్వలేనప్పుడు మా జీతాలు ప్రభుత్వం అయినా చెల్లించాలి. మా పేద బతుకులకు 4 నెలల జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకమంటారు. వెంటనే జీతాల బకాయిలు చెల్లించాలి. – బి.ప్రసన్న కుమారి, పారిశుద్ధ్య కార్మికురాలు -
శ్రీవారికి దీపావళి ఉత్సవం
ద్వారకాతిరుమల: బాణ సంచా వెలుగుల నడుమ ఉభయ దేవేరులతో శ్రీవారికి కోవెల ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రతి ఏటా క్షేత్రంలో దీపావళి ఉత్సవాన్ని ఘనంగా జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే పండుగ తిథిలో తగులు, మిగులు రావడంతో శ్రీవారి దేవస్థానం అధికారులు దీపావళిని మంగళవారం రాత్రి నేత్రపర్వంగా జరిపారు. క్షేత్ర పురవీదుల్లో అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈ ఉత్సవం, ఆకాశం మేఘావృతం కావడంతో ఆలయానికే పరిమితమైంది. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని దీపాలతో విశేషంగా అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లను తోళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం శ్రీవారి వాహనాన్ని కోవెల చుట్టూ మూడుసార్లు తిప్పారు. దేవస్థానం సిబ్బంది స్వామివారి వాహనం ముందు, అలాగే ఆలయ ప్రధాన రాజగోపురం మెట్లపై పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఇదిలా ఉంటే స్వామివారి రాక కోసం.. వేయి కళ్లతో ఎదురు చూసిన గ్రామ ప్రజలు, గ్రామోత్సవం రద్దవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. నూజివీడు: పట్టణంలోని ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన కళాశాల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది. మండలంలోని బోర్వంచ సమీపంలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద 40 మంది విద్యార్థులతో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులందరూ క్షేమంగా బయటపడటంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 23, 24 తేదీల్లో ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండర్ 14, అండర్ 17 బాల బాలికల క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కే. అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 23వ తేదీన వాలీబాల్ ఎంపిక పోటీలు కొవ్వూరు అల్లూరి వెంకటేశ్వరరావు వాలీబాల్ గ్రౌండ్స్ ఎన్టీఆర్ స్టేడియంలో, 24న ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు దేవరపల్లి ఏఎస్‌ఎన్‌ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి జరుగుతాయన్నారు. అండర్ 14 జట్లకు వచ్చే విద్యార్థులు 2012 జనవరి 1 వ తేదీ నుంచి, అండర్ 17 జట్ల ఎంపికకు వచ్చే విద్యార్థులు 2009 జనవరి 1వ తేదీ నుంచి జన్మించినవారై ఉండాలన్నారు. వివరాలకు 90308 94311, 814330 96604 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. బాలిక అదృశ్యంపై కేసు తణుకు అర్బన్: బాలిక అదృశ్యంపై తల్లి ధనకొండ దుర్గమ్మ ఫిర్యాదుమేరకు తణుకు రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు మండలం తేతలి బస్టాండ్ ప్రాంతంలో తాత్కాలికంగా నివసిస్తున్న గంగిరెద్దుల వృత్తిలో ఉన్న దుర్గమ్మ తన పిల్లలను అక్కడే విడిచిపెట్టి ఉపాధిలో భాగంగా గంగిరెద్దులు ఆడించుకుంటూ ఊరూరా తిరిగేందుకు ఈనెల 20వ తేదీన ఉదయం వెళ్లింది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి నివాస ప్రాంతానికి వచ్చేసరికి తన పిల్లల్లో 5 ఏళ్ల వయస్సున్న బాలిక వీరమ్మ కనిపించలేదు. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన వీరు నాలుగు రోజుల క్రితమే ఉపాధి కోసం తేతలి వచ్చారు. బాలిక ఆచూకీ తెలిస్తే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ 9441144789లో తెలియచేయాలని కోరారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె జయప్రదానికి పిలుపు
ఏలూరు (టూటౌన్): నగరపాలక సంస్థలు, పుర పాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఉద్యోగ, సిబ్బంది సమస్యల పరిష్కారానికి వచ్చేనెల 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను, అలాగే ఈనెల 22న ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే పిలుపునిచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె తలపెట్టామన్నారు. ఆదివారం స్థానిక స్ఫూర్తి భవనంలో ఏలూరు ఏరియా కార్యదర్శి ఎ.అప్పలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టి 16 నెలలు పూర్తయినా ము న్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, బకాయిపడిన డీఏలను తక్షణం చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ పేమెంట్స్‌ను చెల్లించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కార్తీకమాస ఏర్పాట్ల పరిశీలన
భీమవరం (ప్రకాశం చౌక్ ): భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దనస్వామి దేవస్థానంలో కార్తీకమాస ఏర్పాట్లను దేవదాయశాఖ ఆర్జేసీ వేండ్ర త్రినాథరావు ఆదివారం పరిశీలించారు. దేవస్థానంలో క్యూలైన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 నుంచి ప్రారంభకానున్న కార్తీక మాసోత్సవాలకు వేలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఈవోకు సూచించా రు. భక్తులకు టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారురాజు, ఈఓ డి.రామకృష్ణంరాజు, సిబ్బంది ఉన్నారు. భీమవరం: అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 21.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా తాడేపల్లిగూడెంలో అధికంగా 42.4 మి.మీ., పెంటపాడులో 16.8, తణుకులో 10.4, అత్తిలిలో 22.6, గణపవరంలో 32.4, ఆకివీడులో 25.6, ఉండిలో 22.6, పాలకోడేరులో 37.2, పెనుమంట్రలో 35.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇరగవరంలో 12.2, పెనుగొండలో 6.8, ఆచంటలో 10.4, పోడూరులో 19.4, వీరవాసరంలో 23.2, భీమవరంలో 10.6, కాళ్లలో 26.8, మొగల్తూరులో 25.4, నరసాపురంలో 16.2, పాలకొల్లులో 17, యలమంచిలిలో 20.2 మి.మీ.. మొత్తంగా 433.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
దళిత బాలుడిపై దాడి
● ప్రాణాప్రాయ స్థితిలో చికిత్స పొందుతున్న వైనం ● ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన జంగారెడ్డిగూడెం: మండలంలోని వేగవరం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి, దళిత బాలుడు చైతన్య విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. కొందరు యువకులు విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 5న వేగవరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఊరేగింపులో డీజే చూసేందుకు చైతన్య వెళ్లాడు. అయితే ఓ వ్యక్తి ప్రోద్బలంతో కొందరు నిర్వాహక యువకులు నువ్వెందుకు వచ్చావంటూ బాలుడిని ప్రశ్నిస్తూ, కులం పేరుతో దూషించి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి విజయవాడ రిఫర్ చేశారు. విచక్షణారహితంగా కడుపులో కాలుతో తన్నడం, పిడిగుద్దులు గుద్దడంతో బాలుడి ప్యాంక్రియాస్‌కు తీవ్ర గాయమైంది. ప్యాంక్రియాటిక్ ట్యూబ్ చీలడంతో రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో బాలుడు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడి నుంచి బాలుడిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసినట్టు సమాచారం. కాగా బాలుడిపై దాడి చేసిన యువకులంతా జనసేన పార్టీకి చెందిన వారుగా తెలిసింది. ఇదిలా ఉండగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాలుడికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్దెత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం దళితులు వేగవరం జాతీయ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి ఆందోళన నిర్వహించారు. అదే రోజు మరిన్ని గొడవలు ఈనెల 5న శరన్నవరాత్రుల ముగింపు ఉత్సవాలు సమయంలో యువకుల తీరుతో మరో గొడవ జరగడంతో పెద్దలు సర్దుబాటు చేశారు. అలాగే తూర్పు, పడమరపేటలో వేర్వేరు ఉత్సవాల సందర్భంగా ఇరువర్గాల వారు మద్యం సేవించి గొడవలు పడినట్టు తెలిసింది. -
కార్తీకం.. శివోహం
● 23 నుంచి కార్తీక మాసోత్సవాలు ● జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ ● పంచారామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ● వేలాది మంది భక్తుల రాక భీమవరం(ప్రకాశం చౌక్): పరమ పవిత్రమైన కార్తీక మాసోత్సవాలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 23 నుంచి కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. జిల్లాలో దేవదాయశాఖ నిర్వహణలో 30కు పైగా ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. ఆలయ కమిటీల ద్వారా నిర్వహించే శివాలయాలు మరో 15 వరకు ఉంటాయి. ముఖ్యంగా జిల్లాలో భీమవరం, పాలకొల్లులో పంచారామ క్షేత్రాలకు ఏటా కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రత్యేక పూజలు.. విశేష అలంకరణలు నెల రోజులపాటు పంచారామ క్షేత్రాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేస్తుంటారు. అలాగే ప్రత్యేక అభిషేకాలు, కార్తీక దీపారాధనలు జరుగుతుంటాయి. రాత్రిళ్లు విద్యుత్ కాంతులతో క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతాయి. శక్తీశ్వరస్వామి ప్రత్యేకం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భీమవరం మండలం యనమదుర్రులో పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారు తలకిందులుగా దర్శనమిస్తారు. పార్వతీమాత బాలింతగా, కుమారస్వామి వారి ఒడితో పెట్టుకుని ఒకే పీఠంపై దర్శనమిస్తారు. ఈ ఆలయానికీ వేలాదిగా భక్తులు తరలివస్తారు. భీమవరం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. మరిన్ని ప్రసిద్ధి ఆలయాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. భీమవరంలో భీమేశ్వరస్వామి వారు, ఆచంటలో ఆచంటేశ్వరస్వామి, నత్తారామేశ్వరంలో రామేశ్వరస్వామివారు, జుత్తిగలో ఉమా సోమేశ్వరస్వామివారు, లక్ష్మణేశ్వరంలో దుర్గా లక్ష్మణేశ్వరస్వామి, వీరవాసరంలో వీరేశ్వరస్వామి, కొడమంచిలిలో సర్వేశ్వరస్వామి, శివ దేవుని చిక్కాలలో శివదేవస్వామి, సజ్జాపురంలో సోమేశ్వరస్వామి, పెనుగొండలో నగరేశ్వరస్వామి, ఎన్పార్పీ అగ్రహారంలో విశ్వేశ్వరస్వామి, ఉండిలో మల్లేశ్వరస్వామి, ఆకివీడులో భీమేశ్వరస్వామి, మల్లేశ్వరస్వామి, వేండ్ర అగ్రహారంలో రామలింగేశ్వరస్వామి, అండలూరులో మల్లేశ్వరస్వామి, నవుడూరులో రామలింగేశ్వరస్వామి, విస్సాకోడేరులో సోమేశ్వరస్వామి, తాడేరులో రామలింగేశ్వరస్వామి, తుందుర్రులో సోమేశ్వరస్వామి ఇలా పలు శివాలయాలు కార్తీక మాసోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. భీమవరంలో ఉమాసోమేశ్వరస్వామి పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరస్వామి జిల్లాలో రెండు పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం (సోమారామం), పాలకొల్లులో క్షీరా రామలింగేశ్వరస్వామి దేవస్థానం (క్షీరారామం)గా కీర్తిగడించాయి. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరుడు చంద్రుడి ప్రతిష్ఠాపన కావడంతో శివలింగం అమావాస్యకు గోధుమ వర్ణంలో, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోకి మారడం ఇక్కడ ప్రత్యేకం. కార్తీకమాసం నెల రోజులపాటు ఈ రెండు క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతాయి. దేశంలోని నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా సోమవారం రోజుల్లో 70 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. కార్తీకం ఎంతో పవిత్రమైన మాసం. శైవక్షేత్రాలను సందర్శించి పరమేశ్వరుడికి పూజలు చేయడంతో పాటు నిత్య దీపారాధన చేయాలి. పరమేశ్వరుడికి అభిషేకాలు చేయడం ద్వారా విశేష ఫలితం దక్కుతుంది. నవ వధువులు కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి కార్తీక నోములు నోచుకుంటారు. దీపదానం, వస్త్రదానం, వెండి ఆవు, వెండి దూడ దానం, ఉసిరి దానం విశిష్టమైనవి. కాలువల్లో అరటి తెప్పలో దీపాలు పెట్టి వదలడం పుణ్యఫలం. – అకొండి రాంబాబు, అర్చకులు, గునుపూడి -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని లంకలకోడేరులో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల పోస్టర్లను ఆవిష్కరించి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాలకు వైద్య విద్యను దూరం చేసి పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసి లబ్ధి పొందాలనే దురుద్దేశంతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరంకుశత్వ పాలన కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా ఈ పోరాటంలో భాగం కావాలని కోరారు. సంతకాలు చేయడం ద్వారా నిరసన తెలపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు, చెల్లెం ఆనందప్రకాష్, యడ్ల తాతాజీ, పెన్మెత్స ఏసురాజు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
కరుణించు మంగమ్మ తల్లీ
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు గుబ్బల మంగమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఎవరూ ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా చర్యలు చేపట్టారు. ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. ముదినేపల్లి రూరల్: అధిక కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారంటూ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. మండలంలోని వాడవల్లికి చెందిన అచ్యుత సంధ్యకు సీతారామపురానికి చెందిన యర్రంశెట్టి రమేష్‌తో ఏడాది కిందట వివాహం జరిగింది. వివాహానంతరం ప్రతీరోజూ భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారు. కొంతకాలం కిందట భర్త, అత్తమామలు సంధ్యను ఇంటి నుంచి గెంటేయగా పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల పుట్టింటికి వెళ్లి వీరు గొడవపడ్డారని సంధ్య పిర్యాదులో పేర్కొంది. వేధింపులను అరికట్టి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పెద్దింట్లమ్మా.. రక్షించమ్మా
కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. నీ చల్లని ఆశీస్సులతో మమ్ములను రక్షించమ్మా.. అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. జోరున వర్షం కురుస్తున్నా సమీప జిల్లాల నుంచి ఆదివారం భక్తులు కొల్లేటికోటలో అమ్మను దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి, అమ్మకు పొంగళ్లు, వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున రూ.40,877 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
అక్రమ కలప లోడు ట్రాక్టర్ సీజ్
తాడేపల్లిగూడెం రూరల్: ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను మండలంలోని అప్పారావుపేట జంక్షన్ వద్ద ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కలపను కోరుమామిడి నుంచి పట్టెంపాలెంకు తరలిస్తున్నట్లు తెలిసింది. నీలాద్రిపురం గ్రామానికి చెందిన రైతు తోటలో మరో తొమ్మిది దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఫారెస్ట్ అధికారిని ఆదివారం వివరణ కోరగా, మొత్తం 20 దుంగల విలువ రూ.లక్ష ఉంటుందని అంచన వేస్తున్నట్లు తెలిపారు. కలప పట్టెంపాలెంకు చెందిన కంకిపాటి గన్నియ్యకు చెందినదిగా గుర్తించామన్నారు. కలపను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్తిలి: అత్తిలి మండలం పాలూరు గ్రామానికి చెందిన శరకడం అప్పల సత్య సూర్యనారాయణ( 65) ఆరవల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అత్తిలి ఎస్సై పి.ప్రేమరాజు వివరాల ప్రకారం సూర్యనారాయణ లక్ష్మీనారాయణపురంలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా ఆరవల్లి వైఎస్సార్ కాలనీ సమీపంలో ఆటో ఢీకొంది. దీంతో అతని తలకు గాయమైంది. ప్రమాదం వివరాలు తెలుసుకున్న కుమారుడు అతన్ని తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఏలూరు టౌన్: ఒక వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నెహ్రూ కాలనీ 9వ రోడ్డుకు చెందిన ముని దుర్గాప్రసాద్ (49)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రీటౌన్ పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. -
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: మండలంలోని దిగమర్ర గ్రామానికి చెందిన పెచ్చెట్టి ఆంజనేయులు (52) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి దిగమర్రు నుంచి చించినాడ వెళ్తున్న ఆంజనేయులను వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన ఆంజనేయులును స్థానికులు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై బి.సురేంద్రకుమార్ కేసు నమోదు చేశారు. ఆకివీడు: మండలంలోని మందపాడు శివారు పెద ఉప్పరగూడెంలోని రొయ్యల చెరువుపై పనిచేస్తున్న భూటారి సంజీవరావు(45) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు ఆదివారం చెప్పారు. గ్రామంలోని పెరుమాళ్ల పెద వెంకటేశ్వరరావు చెరువుపై పనిచేస్తున్న సంజీవరావు అల్లూరి సీతారామరాజు జిల్లాకు వాసి అని తెలిపారు. అతని సోదరుడు దేవా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెనుగొండ: ములపర్రు శివారు పితానివారి పాలెంకు చెందిన జక్కంశెట్టి సతీష్(24) అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామని పెనుగొండ ఎస్సై కే గంగాధర్ తెలిపారు. ఆదివారం తెల్లావారుజామున ఇంటి నుంచి యాక్టివాపై వెళ్లిపోయినట్లు సోదరుడు వినోద్‌కుమార్ ఫిర్యాదు చేసినట్లు వివరించారు. మోటార్ సైకిల్ దొంగరావిపాలెం బ్రిడ్జి వద్ద పార్కు చేసిఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెదికినా ఆచూకీ లభించకపోవడంతో ఫిర్యాదు చేశారన్నారు. గోదావరిలో దూకారన్న అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. -
అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
ఆగిరిపల్లి: మండలంలోని ఈదులగూడెంలో అనుమతి లేకుండా గత పది రోజుల నుంచి తమ పొలంలోని గ్రావెల్‌ను గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు యథేచ్ఛగా తవ్వేస్తున్నాడని రైతులు కుప్పాల శేషగిరి, ముల్లంగి జోజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులు నుంచి తమ పక్కనే ఉన్న పొలంలో ప్రభుత్వం అనుమతిలేకుండా టీడీపీ నేత గ్రావెల్, మట్టిని తవ్వి లారీలలో బయటకు తరలిస్తున్నాడు. ఆ రైతు పొలానికి పక్కనే ఉన్న తమ పొలంలో కూడా పది రోజుల నుంచి దాదాపు పది అడుగుల లోతు తవ్వి మట్టిని లారీలలో తరలిస్తున్నాడని తెలిపారు. ఇదేంటని బాధితులు ప్రశ్నించగా బెదిరింపులు పాల్పడుతున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఏ, అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
తాడేపల్లిగూడెం (టీఓసీ): పేదలకు ఉచిత వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఆదివారం మాట్లాడుతూ చంద్రబాబు బినామీలకు వైద్య కళాశాలలను కట్టబెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో నాసి రకం మద్యం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ప్రస్తుత ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. నిర్భయంగా వార్తలు రాస్తున్న సాక్షి యాజమాన్యంపైనా, విలేకర్లపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని మంగరాజు డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. -
22 నుంచి కార్తీక మాసోత్సవాలు
జంగారెడ్డిగూడెం: ఈ నెల 22 నుంచి వచ్చే నెల 21 వరకు మద్ది క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు వార్షిక సప్తాహ మహోత్సవాలు జరగనున్నాయి. 22న ప్రభాత సేవ, నిత్యార్చన, గోపూజ, కార్తీక మాసోత్సవాల ప్రారంభం, 24న సప్తాహ ప్రారంభ పూజా కార్యక్రమాలు, యాగశాల ప్రవేశం తదితర పూజలు, 25న పంచామృతాభిషేకాలు, 26న హనుమద్ హోమం అనంతరం సువర్చల హనుమద్ కల్యాణం, 27న స్వామి గ్రామోత్సవం, స్వామికి తమలపాకులతో వార్షిక లక్షార్చన నిర్వహించనున్నారు. 28న విశేష అష్టోత్తర పూజలు, 29న లక్ష పుష్పార్చన, 30న మద్ది ఆలయ ఉపాలయమైన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వెంకటేశ్వరస్వామికి శాంతి కళ్యాణం, 31న ప్రాతఃకాల అర్చన, మహాపూర్ణాహుతి, నవంబర్ 18న సాయంత్రం స్వామికి పుష్కరిణిలో తెప్పోత్సవం, ఈ నెల 26, వచ్చే నెల 2, 9, 16 తేదీల్లో హనుమద్ హోమాలు, సువర్చల హనుమద్ కల్యాణాలు జరుగుతాయి, ఈ నెల 27, వచ్చే నెల 3, 10, 17 తేదీల్లో స్వామికి లక్ష తమలపాకుల పూజ, ఈ నెల 25, వచ్చే నెల 1, 8, 15 తేదీల్లో స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ నెల 22, 29, వచ్చే నెల 5, 12, 19 తేదీల్లో స్వామికి విశేష లక్ష పుష్పార్చన జరుగుతాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈవో ఆర్వీ చందన తెలిపారు. -
ప్రాణాలు తీస్తున్న గుంతల రోడ్లు
కై కలూరు: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది కై కలూరు నియోజకవర్గ పరిస్థితి. ఆక్వా ఉత్పత్తులతో ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్నా రోడ్లపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. చిన్నపాటి వర్షాలకే రహదారులు తటాకాలుగా కనిపిస్తున్నాయి. రోడ్డు ఏదో, గుంత ఎక్కడుందో గుర్తించలేని పరిస్థితి. పామర్రు–దిగమర్రు 216 జాతీయ రహదారిలో గుంతల సమస్య జఠిలమవుతోంది. జాతీయ రహదారి విస్తరణ పనులు ఆలస్యం అవుతోన్నాయి. వీటి నిర్మాణాలకు తీసిన గుంతలలో నీరు నిల్వ ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధిక లోడ్లతో రోడ్లు ఛిద్రం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో మొత్తం 84,852.4 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. కై కలూరు పరిసర ప్రాంతాల్లో ప్రతి రోజు వందల లారీల ఎగుమతులు ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. 10 చక్రాల లారీ సరుకుతో కలిపి 25 టన్నులు, 12 చక్రాల లారీ 30 టన్నుల బరువు ఉంటుంది. కూటమి పాలనలో అక్రమ మైనింగ్ టిప్పర్లు నిత్యం తిరుగుతున్నాయి. కై కలూరు ప్రాంతంలో హైవే పనులకు మట్టి అవసరం కావడంతో అధిక లోడ్లతో టిప్పర్లు రహదారులను పాడుచేస్తున్నాయి. గుడివాడ, ఏలూరు వంటి ప్రాంతాల నుంచి కై కలూరు మీదుగా భీమవరం వెళ్ళే వాహదారులు ఇదేం కర్మరా బాబూ! అంటూ అసహానం వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్ వద్ద భారీ గుంతలు భయపెడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌లో గుంతల కారణంగా ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు నానా తిప్పలు పడుతున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వర్షపు నీరు చేరుతుంది. టౌన్‌హాలు వద్ద వర్షం కురిస్తే పెద్ద కాల్వలా రోడ్డు మారుతుంది. ప్రమాదకరంగా పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి -
తణుకులో గంజాయి కలకలం
● ఎకై ్సజ్ దాడులతో వెలుగులోకి ● యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు తణుకు అర్బన్: తణుకు ప్రాంతంలో తెరవెనుక విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు ఆందోళన కలిగిస్తోంది. గంజాయి విక్రయాలు, కొనుగోళ్లకు తణుకు ప్రాంతం అడ్డాగా మారిందనడానికి ఇటీవల తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులకు తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి ఉదాహరణ. ఈ నెల 12న తణుకు–ఉండ్రాజవరం జంక్షన్లో ఎకై ్సజ్ శాఖ నిర్వహించిన దాడుల్లో ద్విచక్ర వాహనంపై రూ.15 వేల విలువైన 5 కిలోల గంజాయి తరలిస్తూ ముగ్గురు యువకులు పట్టుబడ్డారు. అందులో ఒకరు తప్పించుకున్నారు. ఈ ముగ్గురు యువకులు తణుకు మండలం మండపాక, పైడిపర్రుకు చెందిన వారిగా ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. దీంతో పైడిపర్రు ప్రాంతం గంజాయి విక్రయాలకు అనువుగా ఉందని, విక్రయించే వారు సైతం ఇక్కడే తిష్టవేశారని తెలుస్తోంది. తణుకు ఉండ్రాజవరం రోడ్డులోని శ్మశాన వాటికలో గంజాయిని నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో ఎకై ్సజ్ పోలీసులు దాడిచేసి వాహనంపై తరలిస్తుండగా పట్టుకున్నారు. తణుకులో సంచలన ఘటనలు గత నెలలో తణుకులో జరిగి భారీ చోరీలో 70 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. తాడేపల్లిగూడెంకు చెందిన యువకుడిని తణుకులో హత్య చేయడం వంటి ఘటనలు సంచలనం రేకెత్తించగా తాజాగా గంజాయి వ్యవహారం బయటపడడంతో తణుకులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రశాతంతకు మారుపేరుగా ఉండే తణుకులో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో తణుకు వాసులు బెంబేలెత్తిపోతున్నారు. 5 కిలోల గంజాయిని ద్విచక్ర వాహనంపై సాధారణంగా తరలించుకుపోవడం చూస్తుంటే తణుకులో గంజాయి వినియోగం ఏ స్థాయిలో ఉందోనని భయపడుతున్నారు. యువతకు అంగట్లో దొరికే ఒక సాధారణ వస్తువు మాదిరిగా గంజాయి తణుకులో అందుబాటులో ఉందనే అనుమానాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాలపై నిఘా తణుకు మునిసిపాలిటీ పరిధిలోని సంతమార్కెట్, టీటీడీ కల్యాణ మండపం, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో గంజాయి వాడకం, విక్రయాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తణుకులో శ్మశాన వాటికల్లో గంజాయిని దాచిపెడుతున్నారనే విషయం ఇటీవల నిర్వహించిన ఎకై ్సజ్ దాడుల్లో బహిర్గతమైంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయిని రోడ్డు మీదే కొందరు అలవాటుపడ్డ వ్యక్తులు దమ్ములాగుతూ కనిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నారని సమాచారం. గంజాయి తరలిస్తూ పట్టుబడిన పైడిపర్రుకు చెందిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, అతనిపై పలు ప్రాంతాల్లో 5 కేసులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. పోలీసులు గట్టిగా దృష్టిపెడితే గంజాయి అమ్మకాలను నిరోధించే పరిస్థితులు ఉంటాయని, ఇటీవల కాలంలో పోలీసులకు బందోబస్తులు, సమావేశాల్లో పాల్గొనేందుకే సమయం కేటాయించలేని పరిస్థితి. ఇక గంజాయి తదితర వ్యవహారాలపై దృష్టిసారించే సమయం లేదనేది వాస్తవంగా కనిపిస్తోంది. ఇటీవల యువత అధికంగా గంజాయికి అలవాటు పడి విక్రయించే వారికోసం ఎదురుచూపులు చూసే పరిస్థితి తణుకులో నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతున్నారని, ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్‌కు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. గంజాయి విక్రయాలను అరికట్టాలని, పోలీసులు, నేర విభాగం నిఘా పెట్టి గంజాయి విక్రయాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
బాలికపై మేనమామ వేధింపులు
కై కలూరు: మేనమామ వేధించడంతో పాటు తల్లి, అమ్మమ్మ, తాత చిత్రహింసలకు గురిచేశారని 9వ తరగతికి చెందిన బాలిక బావురుమంది. నరకం నుంచి బయటపడ్డానని గాయాలను చూపించింది. కై కలూరు మండలం చటాకాయికి చెందిన బాలికపై వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సమీప అగ్రహారంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం ఆమెను తండ్రి కై కలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చాడు. పోలీసులకు ఆమె వివరాలు వెల్లడించింది. బాధితురాలు, ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. చటాకాయికి చెందిన జయమంగళ కుమార అభిమన్యుడుకి ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన కా మాక్షితో 2009లో వి వాహమైంది. వీరికి 2012లో అమ్మాయి జన్మించింది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కుమార్తె తండ్రి వద్ద ఉంటోంది. కామాక్షి మరో వ్యక్తిని వివాహం చేసుకోగా.. అభిమన్యుడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె (14) తండ్రి అభిమన్యుడు వద్దే ఉంటూ భుజబలపట్నం హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది.దసరా పండక్కి తీసుకెళ్లి.. తండ్రి లేని సమయంలో కామాక్షి, ఆమె తల్లి చటాకాయలో ఉంటున్న బాలిక వద్దకు వచ్చి దసరా పండగకు దుస్తులు కొంటామని ప్రత్తికోళ్లలంక, అక్కడ నుంచి కామాక్షి సోదరుడు ఉమాశంకర్, తల్లిదండ్రులు నాగులమ్మ, వెంకటరమణ ఉంటున్న కడప జిల్లా బద్వేలుకు తీసుకువెళ్లారు. బాలికను అక్కడే ఉండాలని బలవంతం చేయడంతో ఆమె నిరాకరించి తండ్రి వద్దకు వెళతానని చెప్పింది. దీంతో తన తల్లి కామాక్షి ఇష్టానుసారం తనను కొట్టిందని బాలిక వాపోయింది. మేనమామ ఉమాశంకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పక్కనే పడుకోవాలని అనే వా డని పోలీసుల వద్ద తెలిపింది. బద్వేలులో బాలిక పరిస్థితిని చూసిన ఓ వ్యక్తి తండ్రి అభిమన్యుడికి ఫోన్ చేయగా అక్కడికి వెళ్లి శుక్రవారం రాత్రి చటకాయికి తీసుకువచ్చారు. మేనమామ బాలికతో అసభ్యకంగా ప్రవర్తించాడా? లేదా అన్న విషయాన్ని బద్వేలు పోలీసులు విచారిస్తారని కై కలూరు రూరల్ ఎస్సై వి.రాంబాబు తెలిపారు. బాలిక విషయంలో తల్లిదండ్రులకు విభేదాలు ఉన్నాయన్నారు. ఫిర్యాదును పోలీసుతో బద్వేలు పంపామని చెప్పారు. -
చేనేత రంగాన్ని కాపాడాలి
భీమవరం (ప్రకాశంచౌక్): అంతరించిపోతున్న హ స్తకళలు, చేనేత ఉత్పత్తుల పునర జ్జీవానికి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్లో చేనేత, జౌళి శాఖ, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చేనేతదారులు, కార్మికుల సన్మాన కార్యక్రమానికి ఆమె ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత రంగాన్ని కా పాడుకోవాల్సి అవసరం ఉందన్నారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంస్థ సెక్రటరీ ఎస్.రంజనా మాట్లాడు తూ చేనేత రంగాన్ని, చేనేత కార్మికులను ఆదుకునేందుకు కౌన్సిల్ తరఫున అవగాహన కార్యక్రమాలు చే పడుతున్నామన్నారు. అనంతరం నైపుణ్యంతో చే నేత ఉత్పత్తులు తయారుచేస్తున్న చింతపర్రుకి చెందిన వీర గణపతి, వాసా భ్రమరాంబ, కె.వీరనరసన్నకు రూ.25 వేల నగదు బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందించాలనే అలాగే చింతపర్రు, భగ్గేశ్వరం, రాయకుదురు, పాలకొల్లు, రామచంద్రపురం, దగ్గులూరు, భీమవరం, ఆచంట వేమవరం గ్రామాలకు చెందిన చేనేత కార్మికులను చేనేత కండువాతో కలెక్టర్ సన్మానించారు. జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి ఎ.అప్పారావు, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, క్రాఫ్ట్ కౌన్సిల్ వైస్ చైర్మన్ బి.సుజాత, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
బాణసంచా.. ధరల మోత
సాక్షి, భీమవరం: బాణసంచా ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాదితో పోలిస్తే 20 నుంచి 40 శాతం మేర పెరిగి వినియోగదారులను బేజారెత్తిస్తున్నాయి. ముడి సరుకుల ధరల పెరుగుదల, స్థానికంగా తయారీ తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం, ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు. జిల్లాలో 500 వరకు దుకాణాలు జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లులో బాణసంచా హోల్‌సేల్ వ్యాపారులు ఉన్నారు. శనివారం నాటికి 350 దుకాణాలకు పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులు తాత్కాలిక లైసెన్సులు జారీచేశారు. మరో 150 వరకు దరఖాస్తులకు లైసెన్సులు ఇవ్వాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా బాణసంచా వ్యాపారం జరుగుతుందని అంచనా. బొగ్గు, గంధకం, అల్యూమినియం, సూరేకారం, బేరియం నైట్రేట్ తదితర ముడి సరుకుల ధరలు పెరిగిపోగా, స్థానికంగా తయారీ తగ్గిపోగా, శివకాశీ, ఇతర ప్రాంతాల నుంచి బాణసంచా తెస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. అగ్గిపెట్టెలు, తారాజువ్వలు, మతాబులు, భూచక్రాలు, 1,000 వాలాలు తదితర వైరెటీలు, వాటి కంపెనీలను బట్టి 20 శాతం నుంచి 40 శాతం వరకు ధరలు పెరిగాయంటున్నారు. రూ.1,000 పెడితే సంచుడు బాణసంచా రావడం లేదని వినియోగదారులు అంటున్నారు. ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి : సాధారణంగా నవంబరు మొదటి రెండు వారాల్లో దీపావళి రావడం, అదే సమయానికి ఖరీఫ్ కోతలు, మాసూళ్లు ముమ్మరంగా ఉండేవి. రైతులు, వ్యవసాయ కూలీల వద్ద డబ్బులు ఉండటం, ఉద్యోగులకు జీతాలు రావడం వలన బాణసంచా అమ్మకాలు ఆశాజనకంగా ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అక్టోబరు మూడో వారంలో దీపావళి రాగా, నవంబరులో కాని ఖరీఫ్ కోతలు ముమ్మరం కావు. మరోపక్క ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మిక వర్గాలకు సరిగా పనులు లేవు. ఆయా ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది అమ్మకాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు. బాణసంచా గతేడాది ఈ ఏడాది (సుమారు) అగ్గిపెట్టెలు (10 బాక్స్‌లు) 550 750 కాకర పువ్వొత్తులు (10 బాక్స్‌లు) 600 750 విష్ణుచక్రాలు (10) 100 180 చిచ్చుబుడ్లు (డజను) 180 260 జువ్వ (100) 250 350 భూ చక్రాలు (10) 100 180 టపాకాయలు (25) 25 40 పేలుడు జువ్వ (100) 1,000 1,600 డిస్కో చిచ్చుబుడ్లు (12) 260 380 ధరలకు రెక్కలు 20 నుంచి 40 శాతం మేర పెరుగుదల వినియోగదారుల బెంబేలు ప్రతికూల వాతావరణంతో వ్యాపారుల్లో ఆందోళన -
సమ్మెకు సై!
● మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం ● వరుసగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని తీరు ● నవంబర్ 3 నుంచి సమ్మెకు మున్సిపల్ కార్మికుల నోటీసులు ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఏలూరు (టూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి సమ్మె లోకి వెళ్లనున్నట్లు యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందిందని విమర్శిస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌కు సమ్మె నోటీసును ఇప్పటికే అందజేశారు. 12వ పీఆర్సీ ప్రకటించి, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, మరణించిన, పదవి విరమణ పొందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను ఔట్ సోర్సింగ్ విధానంలో విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీలో ్లపెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల నిష్పత్తిని పెంచాలని, పర్మినెంట్ కార్మికుల పెండింగ్ బకాయి లు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా రు. కార్మికుల బ్యాంకు ఖాతాలు బలవంతంగా యాక్సిస్ బ్యాంకుకు మార్చరాదని, కార్మికుల పదవీ విరమణ వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలని కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మున్సిపల్ కాలనీలో నిర్మించాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు అందజేత రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మి కులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నవంబర్ 3 నుంచి సమ్మె చేయనున్నట్లు మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు చెబుతున్నారు. దీనిలో భాగంగా అక్టోబరు 14న ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఎ.భానుప్రతాప్‌కు జిల్లా నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చేనెల 3 నుంచి చేపట్టే సమ్మెలో ఉద్యోగ, కార్మిక సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది అంతా పాల్గొనాలి. యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏలూరు కమిషనర్‌కు సమ్మె నోటీసును అందించాం. – ఎ.అప్పలరాజు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఏలూరు రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బందిపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలి. ఉద్యోగ, కార్మికులందరికీ గుర్తింపు కార్డులను అందజేయాలి. – భజంత్రీ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏలూరు కాంట్రాక్ట్–ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను ఆప్కాస్ విధానంలో కొనసాగించాలి. జీఓ నెం.12 ప్రకారం 2024 సంక్రాంతి పండగ బోనస్ రూ. వెయ్యిని పెండింగ్‌లో ఉన్న సిబ్బంది అందరికీ వెంటనే చెల్లించాలి. వాటర్‌వర్క్స్, వాటర్ సప్లయ్, వీఽధి లైట్లు, డ్రైనేజీ, అండర్ డ్రైనేజీ పనుల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ రక్షణ పరికరాలను అందించాలి. – దొడ్డిగర్ల నాగబాబు, మున్సిపల్ కార్మికుడు, ఏలూరు కార్పొరేషన్ 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలి. బకాయిపడిన డీఏలను తక్షణం చెల్లించాలి. పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ పేమెంట్స్‌లో చెల్లించాలి. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. సీనియర్స్ అందరికీ పదోన్నతులు ఇవ్వాలి. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌లను రెగ్యులరైజ్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి నెలకి రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఇవ్వాలి. ఎన్‌ఎంఆర్‌లకు హెచ్ఆర్ఏ, డీఏతో కలిపి ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి. పీహెచ్ డ్రైవర్లగా, ఫిట్టర్లుగా, ట్యాప్ ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎన్‌ఎంఆర్‌లతో కలుపుకుని బకాయి పడిన మూడేళ్ల యూనిఫాం, కుట్టుకూలీ, టవల్స్, పాదరక్షలు, కొబ్బరి నూనె, సబ్బులు ఇవ్వాలి. -
ఆర్టీసీ ప్రత్యేక యాత్రా బస్సులు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల్లో ఆదివారం నుంచి పంచారామ క్షేత్రదర్శిని టూర్ ప్యాకేజీ ప్రారంభించామని జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ తెలి పారు. ఇంద్ర రూ.1,600, అల్ట్రా డీలక్స్ రూ. 1,100, సూపర్ లగ్జరీ రూ.1,200లుగా చార్జీలు ఉంటాయన్నారు. కార్తీక మాసంలో భక్తులు ఒకేరోజు పంచారామాలు దర్శించుకునేలా బస్సు సర్వీసులు ఏర్పాటుచేశామన్నారు. అలాగే ఎక్కడి నుంచైనా 40 మంది భక్తులు ఉంటే అదనపు చార్జీలు లేకుండా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీశైలం స్పెషల్ సర్వీసులు, అయ్యప్ప భక్తుల కోసం శబరిమలైకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. ప్రతి పౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షణ, దర్శన సమయాలకు చేరువిధంగా అరుణాచల యాత్ర స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో నెల రోజులపాటు నిర్వహించిన సూపర్ జీ ఎస్టీ–సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ముగింపు సభ ఆదివారం భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. జంగారెడ్డిగూడెం: ఖరీఫ్ సీజన్‌లోని పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలు తెరవాలని, పత్తి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో శనివారం జరిగిన రైతు సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిర్ణయించిన క్వింటాల్‌కు రూ.8,110 మద్దతు ధర రైతులకు దక్కే పరిస్థితి లేదన్నారు. పత్తి వ్యాపారులు రకరకాల పద్ధతుల్లో క్వింటాలుకు రూ.ఆరేడు వేలకు మించి ధర ఇవ్వకుండా రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే సీసీఐ కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని, క్వింటాల్‌కు రూ.10,500 మద్దతు ధర ప్రకటించాలని కోరారు. నూజివీడు: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయటాన్ని అందరూ వ్యతిరేకరించాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.హరినాథ్ శనివారం ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక కారణాల సాకుగా విద్య, వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటం బాధ్యతా రాహిత్యమేనన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగించడం ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లుపోడవటమేనని, సామాన్య ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం కొనసాగాలని చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు న్యాయపరంగా కూడా అడ్డుకుంటామని పేర్కొన్నారు. -
3.4 టన్నుల గంజాయి ధ్వంసం
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పోలీసులు దాడులు చేసి, వాహన తనిఖీల్లో పట్టుబడిన భారీ గంజాయి నిల్వలను పర్యావరణహిత విధానంలో ధ్వంసం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో గంజా యి ధ్వంసంపై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో భారీ ఎత్తున పట్టుబడిన 3,403.753 కిలోల గంజాయిని ఆధునిక విధానంలో పర్యావరణానికి హాని లేకుండా ధ్వంసం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లావ్యాప్తంగా కొంత కాలంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలను గుంటూరు జిల్లాలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధ్వంసం చేయించా మని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో రెండేళ్లుగా 58 కేసులకు సంబంధించి 3.4 టన్నుల గంజాయిని పోలీసులు పట్టుకున్నారన్నారు. గంజాయితో పలు సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితుల నేపథ్యంలో గంజాయి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నా రు. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై ఉ క్కుపాదం మోపుతామని హెచ్చరించారు. జిల్లా అ దనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర, డీసీఆర్బీ సీఐ హ బీబ్ బాషా, సీఐలు జి.సత్యనారాయణ (ఏలూరు వన్‌టౌన్), సీహెచ్ రాజశేఖర్ (పెదవేగి), సీఐ వెంకటేశ్వరరావు (జీలుగుమిల్లి), రామకృష్ణ (కై కలూరు), ఎం.సుబ్బారావు (ఏలూరు మహిళా స్టేషన్), సీఐ క్రాంతికుమార్ (చింతలపూడి), ఎస్సైలు ఉన్నారు. -
టపాసులు కొనలేకపోతున్నాం
బాణసంచా ధరలు చూస్తుంటే కొనలేని పరిస్థితి. గతంలో ఓ మాదిరిగా ఉన్న ధరలు ప్రస్తుతం బాగా పెరిగాయి. రూ.500 తీసుకెళ్తే ఏమీ రావడం లేదు. ప్రతిరకం ధరలు పెరిగాయి. ఇలా అయితే దీపావళి సందడి తగ్గుతుంది. – ఎన్.శ్యామ్‌కుమార్, మోగల్లు గతేడాదితో పోలిస్తే దీపావళి టపాసుల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సరదాగా జరుపుకునే దీపావళిని నిరాశగా జరుపుకోవాల్సి వస్తుంది. రేట్లు ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేయడానికి కూడా వెళ్లడం లేదు. – బేరా రామ్, నూజివీడు టపాసులు ధరలతో మోతెస్తున్నాయి. కొనాలంటే చాలా ఇబ్బంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ఇది భారం. అలాగే నిత్యావసరాలు, పూలు, పండ్ల ధరలు పెరిగాయి. పండగ అంతంతమాత్రంగానే జరుపుకోవాలి. – అభినేష్, నూజివీడు -
ప్రైవేటీకరణతో కార్మికులకు అన్యాయం
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ కార్మికులు చేయాల్సిన పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడాన్ని నిలిపివేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి అంగుళూరు జాన్‌బాబు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంలో కాంట్రాక్టర్ల ద్వారా మున్సిపల్ పనులు జరిగిన కాలంలో కార్మికులకు కష్టానికి తగిన వేతనాలు లేవని, పీఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలను సైతం పొందలేకపోయేవారమని ఆవేదన వ్యక్తం చేశారు. మరలా ఇదే విధానాన్ని ఏలూరులో ప్రవేశపెట్టడం అంటే కార్మికుల కడుపుకొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడమే అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం జీఓ తీసుకురాగా సీఐటీయూ ప్రతిఘటనతో నిలిపివేశారని.. మరలా అదే పద్ధతిని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని కార్మికులంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడారు. ధర్నాకు జె.గోపి, ఎం.ఇస్సాకు, వైఎస్ కనకారావు, పి.రవికుమార్, ధనాల వెంకటరావు, బండి రాజు సామ్రాజ్యం, గంగాధర్‌రావు నాయకత్వం వహించారు. -
సిండికేట్‌మయం.. దోపిడీ పర్వం
నూజివీడు: నూజివీడు పురపాలక సంఘంలో అభివృద్ధి పనులను చేపట్టే విషయంలో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి దోపిడీ పర్వానికి తెరలేపారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు గాను ప్రవేశపెట్టిన ఈ ప్రొక్యూర్‌మెంట్‌కు తూట్లు పొడుస్తూ అభివృద్ధి పనులను ఎవరెవరికి ఇవ్వాలనే విషయమై అధికార పార్టీ కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క పంచుకున్నారు. తమ అనుమతి లేకుండా టెండర్లు వేసిన కాంట్రాక్టర్లతో బలవంతంగా లెటర్లు ఇప్పించి ఉపసంహరించుకునేలా చేశారు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. నూజివీడు పురపాలక సంఘం పరిధిలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.3 కోట్లతో మున్సిపాలిటీ ఇంజినీరింగ్ అధికారులు గత నెలలో 31 పనులు చేపట్టేందుకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి ప్రజాధనాన్ని దోచుకుంటున్న నేపథ్యంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు గాను ప్రభుత్వాలు ఈ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏ కాంట్రాక్టరైనా టెండర్లలో పాల్గొని టెండర్ వేయొచ్చు. అయినప్పటికీ నూజివీడులోని అధికార పార్టీ కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు కూర్చొని ఈ ప్రొక్యూర్‌మెంట్‌కు తూట్లు పొడుస్తూ వర్కులను పంచుకున్నారు. తమకు ఇష్టం లేని కాంట్రాక్టర్లు ఎవరైనా టెండర్లు వేసి ఉంటే వారిని నయానో భయానో బెదిరించి విత్‌డ్రా చేసుకునేటట్లు చేశారు. దీంతో ఏకపక్ష దోపిడీకి అధికార పార్టీ కాంట్రాక్టర్లు, కౌన్సిలర్లు తెరతీశారు. కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొంటే ఎవరు తక్కువకి వేస్తారో వారికి వర్కులు ఇస్తారు. నూజివీడు మున్సిపాలిటీలో మాత్రం అలా ఉండదు. అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో వాళ్లు చెప్పిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలి. టెండర్ల విత్ డ్రా ఈ ప్రొక్యూర్మెంట్ విధానం అమలవుతున్నప్పటికీ నూజివీడు మున్సిపాలిటీలో పంచుకున్నంత దారుణంగా ఇంకెక్కడా పంచుకోరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 31 వర్కులకు రూ.3 కోట్లతో టెండర్లు పిలవగా అందులో 24 వర్కులకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ టెండర్లు వచ్చాయి. కొన్ని పనులకు అయితే ఐదు, నాలుగు, మూడు టెండర్లు సైతం వచ్చాయి. దీంతో అధికారపార్టీ నాయకులు కొందరు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లందరిని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో కూర్చోబెట్టి తమకు నచ్చని కాంట్రాక్టర్ల చేత విత్‌డ్రా చేయించారు. విత్‌డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లందరూ ప్రస్తుతం వర్కులు దక్కించుకున్న వారి కంటే తక్కువకు టెండర్లు వేసిన వారే. వారు విత్‌డ్రా చేసుకోకుండా ఉంటే ప్రజాధానం ఆదా అయ్యేది. టెక్నికల్ బిడ్ తెరిచేవరకు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ బిడ్ తెరిచే ముందు వారితో విత్‌డ్రా లెటర్లు తీసుకోవడం గమనార్హం. ఇంత దారుణంగా ప్రజాధానాన్ని దోచుకునేందుకు కాంట్రాక్టర్లు సిద్ధపడితే వారికి ఇంజినీరింగ్ విభాగం అధికారులు వత్తాసు పలకడం గమనార్హం. సిండికేట్ అయ్యారని కళ్లకు కట్టినట్లు కనబడుతుంటే టెండర్లను ఎలా ఆమోదించారని, దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అధికారులు సైతం కంచే చేను మేసిన విధంగా మిన్నకుండటం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రజాధనం దోపిడీ కాకుండా అడ్డుకోవాలని పలు రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు. నూజివీడు మున్సిపాలిటీలో ఈ ప్రొక్యూర్మెంట్ అభాసుపాలు పలువురు కాంట్రాక్టర్లతో విత్‌డ్రాలు చోద్యం చూస్తున్న ఇంజినీరింగ్ అధికారులు -
మేతల యాజమాన్యం ఆక్వాలో ప్రాముఖ్యం
ఉండి: మేతల యాజమాన్య పద్ధతులే ఆక్వాలో అత్యత ప్రాముఖ్యమైనవని విజయవాడ సీఐఎఫ్ఏ శాస్త్రవేత్త డాక్టర్ రమేష్‌రాథోడ్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఆక్వాలో మేతల తయారీ, యాజమాన్య పద్ధతులపై ఎన్నార్పీ అగ్రహారం మత్స్యపరిశోధనా కేంద్రంలో మూడు రోజుల పాటు విద్యార్థులు, రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్తలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆక్వాసాగులో నాణ్యమైన మేతలను సరైన మోతాదులో వినియోగిస్తేనే మంచి దిగుబడులను సాధించగలరని అన్నారు. ఎఫ్ఆర్ఎస్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ రొయ్యలు, చేపల లార్వాకు సమతుల్య ఆహారం రోగనిరోధకశక్తి, వేగవంతమైన వృద్ధి కలిగిస్తుందని తెలిపారు. కార్యక్రమాల్లో సైంటిఫిక్ స్టాఫ్ భీమేశ్వరరావు, ధీరణ్, శివకుమార్, షష్టి రిష పాల్గొన్నారు. -
జిల్లాలో శాస్త్రవేత్తల బృందం పర్యటన
ఉండి: వరిపంటలో వచ్చే తెగుళ్లు, నాణ్యమైన రకాల పరిశీలనకు శాస్త్రవేత్తల బృందం శనివారం జిల్లాలో పర్యటించింది. ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం కేవీకే నుంచి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు, డాక్టర్ పీ వినయలక్ష్మి, ప్రాంతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం మార్టేరు నుంచి డాక్టర్ ఎం గిరాజారాణి, డాక్టర్ వీ భవనేశ్వరీ, డాక్టర్ పీవీ రమేష్‌బాబు బృందం జిల్లాలోని పెనుమంట్ర మండలం ఎస్ఐ పర్రు, పెంటపాడు మండలం జట్లపాలెం, ఉండి మండలం యండగండి తదితర ప్రాంతాల్లో పర్యటించి వరిసాగులో వచ్చే తెగుళ్లు, వాటిని తట్టుకునే రకాలపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐ పర్రులో గత వర్షాలకు వరిలో బాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చి వ్యాప్తి చెందినప్పటికీ దానికదే తగ్గుముఖం పట్టిందని అన్నారు. అయితే ఉధృతి ఎక్కువగా ఉన్న రైతులు ఎకరాకు 400 గ్రా.కాపర్ హైడ్రోజన్‌తో పాటు 200 గ్రా.పాంటో మైసిన్‌ను పిచికారీ చేసుకుని నత్రజని ఎరువుల వినియోగం తగ్గించాలని సూచించారు. ఎంటీయు 1318, 1262, 1121 మొదలైన రకాలు వర్షాల్లో ఈనినప్పుడు మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున గింజరంగు మారకుండా మానిపండు రాకుండా ఉండటం కోసం చిర్రుపొట్ట నుంచి పిగులు పొట్ట దశలో ప్రోపికొనజోల్ అనే మందును ఎకరాకు 200 మి.లీ పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నట్లు శాస్త్రవేత్తల బృందం తెలిపారు. -
సాంస్కృతిక ఉత్సవాల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: విజయవాడలో ఈనెల 17న నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కళల విభాగం విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఆరు విభాగాల్లో బహుమతులు సాధించారు. వ్యక్తిగత విభాగంలో మృదంగంలో సీహెచ్ సుధా ప్రణీత్, బీ గాయత్రి ప్రథమ, ద్వితీయ స్థానాల్లోను, కూచిపూడి నృత్యంలో యూ డాలీ నాగమైత్రి తృతీయస్థానంలో నిలిచారు. బృంద విభాగంలో జానపద వాద్య సమ్మేళనం విభాగంలో పీ కార్తీక్ బృందం ప్రథమ స్థానంలోను, బృందగానం విభాగంలో ఎం శేఖర్, ఎం అనూష బృందం ప్రథమ స్థానంలోను, లఘునాటికలో అంతిమ సంస్కారం అనే స్కిట్‌కు ఏవీఎన్ సాయితేజ బృందానికి ద్వితీయ స్థానం లభించింది. మొత్తం ఆరు విభాగాలలో కలిపి రూ.36 వేల నగదు బహుమతిని విజేతలు అందుకున్నారు. సంగీత విభాగం హెచ్ఓడీ జినగం చంద్రమౌళి ఆధ్వర్యంలో విజేతలను, ఈ ఉత్సవంలో పాల్గొన్న విద్యార్థులను, విభాగపు అధ్యాపకులు మంగళగిరి శ్రీధర్, బంకుపల్లి వెంకట విద్యాసాగర్‌లను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ అభినందించారు. -
నూతన కార్మిక విధానానికి వ్యతిరేకంగా పోరాడాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): శ్రమ శక్తి పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన కార్మిక విధానాన్ని నిరసిస్తూ, రాష్ట్రంలో పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో నాయకులు రాష్ట్ర కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పట్టణంలో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శనివారం స్థానిక సిపాయి పేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగాయి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు డి.సోమసుందర్, జే.లలితమ్మ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఏఐటీయూసీ సమావేశాలలో 26 జిల్లాలకు చెందిన 47 మంది కార్మిక నేతలు, ప్రతినిధులు మాట్లాడారు. పనిని భారంగా మార్చడాన్ని నాయకులు తప్పు పట్టారు. నవంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా తలపెట్టిన నిరసన దినాన్ని రాష్ట్రంలో విజయవంతం చేస్తామని నాయకులు తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పవన్ కళ్యాణ్ కార్యాలయాన్ని ముట్టడించాలని వెల్లడించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతుండడంతో ఆయన స్థానంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఎస్.వెంకట సుబ్బయ్యను ఇన్చార్జి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర కౌన్సిల్ తీర్మానాన్ని అమోదించారు. -
ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు
జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి భీమవరం: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలులో రై తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికా రులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పౌర సరఫరాలు, సహకార, రవాణా శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. త్వరలో ధాన్యం సేకరణ ప్రారంభం కానున్న దృష్ట్యా సత్వర ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న గోనె సంచులు, వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు, రైతులకు అవగాహన కార్యక్రమాలపై చేపట్టిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ సమయంలో రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఎస్ఓ ఎన్.సరోజ, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఎండీ ఇబ్రహీం, జిల్లా సహకార శాఖ అధికారి సంకు మురళీకృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి ఎంవీ కృష్ణారావు, ఏఎస్ఓ ఎం.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తణుకు అర్బన్: పేద వర్గాలకు వైద్య విద్య, నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలంటే కూటమి ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలు నడుంకట్టాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా తణుకు 15వ వార్డు వీరభద్రపురంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి ఐదు కాలేజీలను పూర్తిచేశారన్నారు. అయితే చంద్రబాబు సర్కారు మెడికల్ కాలేజీలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే క్రమంలో ప్రైవేటీకరణకు కంకణం కట్టుకుందని విమర్శించారు. వైద్యకళాశాలలు ఎక్కడా లేవని, జీవో కూడా విడుదల కాలేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు చెంపదెబ్బ మాదిరిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి వెళ్లి స్వయంగా వైద్య కళాశాల చూపిస్తే స్పీకర్ తోకముడిచారని గుర్తుచేశారు. తణుకుకు సమీపంలోని పాలకొల్లులో వైద్య కళాశాల పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తే ఎటువంటి ఆపరేషన్లు అయినా ఉచితంగా చేసే వీలుంటుందన్నారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచితే ప్రస్తుత కూటమి సర్కారు అటకెక్కించిందని విమర్శించారు. జీఎస్టీ ఫ్లెక్సీలు విడ్డూరం తణుకు ఎమ్మెల్యే జీఎస్టీ కారణంగా కుటుంబానికి రూ.15 వేలు పొదుపంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. పేదలు రూ.2 లక్షలు ఖర్చుపెడితేనే రూ.15 వేలు పొదుపు వస్తుందని.. అయితే అంత మొత్తంలో ఖర్చుచేసే స్థితి పేదలకు ఉందా అని నిలదీశారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల రూపంలో ప్రజల ఖాతాలకు డబ్బులు జమచేసేవారని, దీంతో దీపావళి వంటి పండగల రోజుల్లో తణుకు ప్రాంతం కళకళలాడుతుండేదన్నారు. అయితే ప్రస్తుతం ప్రజలు, వ్యాపారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి ఎదురైందన్నారు. పేరు ప్రఖ్యాతలు ఉన్న తణుకులో నేడు కల్తీ మద్యం, పేకాట, గంజాయి విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వద్దంటూ స్థానికులు పత్రాలపై సంతకాలు చేశారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ధనలక్ష్మి, 15వ వారు్డ్ నాయకులు గనసాల సింగ్, మల్లిపూడి వెంకట్రావు, ఆచంట లక్ష్మణరావు, కాసగాని రామన్న, నూతంగా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి -
కలానికి సంకెళ్లపై కన్నెర్ర
కూటమి ప్రభుత్వం మీడియాను కట్టుబానిసలుగా చూస్తోంది. తమకు అనుకూలంగానే రాయాలనే ధోరణితో అనుకూల మీడియాను అందలమెక్కించి ప్రజల పక్షాన నిలిచే మీడియాను అణగదొక్కాలని కుట్రలు చేస్తోంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా, మీడియా వ్యతిరేక విధానాలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. – గాదిరాజు రామరాజు, వైఎస్సార్సీపీ భీమవరం పట్టణ అధ్యక్షుడు ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న సాక్షి మీడియాపై కూటమి కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. నకిలీ మద్యం, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారన్న అక్కసుతో సాక్షిని కట్టడి చేయాలని చూస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పోకడలు సరికాదు. –బంధన పూర్ణచంద్రరావు, సీనియర్ జర్నలిస్ట్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కూటమి ప్రభుత్వం మీడియాతో చెలగాటమాడుతోంది. తాము చెప్పిందే రాయాలి, ప్రచారం చేయాలనే ధోరణి మంచిది కాదు. అక్రమాలు, అవకతవకలు జరిగినప్పుడు బయటపెట్టడం మీడియా బాధ్యత. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్న సాక్షిపై ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరించడం మంచిది కాదు. – చిగురుపాటి సందీప్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే అక్కసుతో కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు సరికాదు. కల్తీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూటమి నాయకులను దుమ్మెత్తిపోస్తుంటే.. కల్తీ మద్యంలో జరిగిన అక్రమాలను బయటపెడుతున్న సాక్షిపై దాడులు, నిర్బంధాలు దారుణం. – బి.వాసుదేవరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు, అక్రమ కేసులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు వంటిది. సమాజంలో అక్రమాలు, అన్యాయాలను వెలికితీసే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్న మీడియాను అడ్డుకోవాలని చూడటం దారుణం. సాక్షి పత్రికపై దాడులు, నిర్బంధాలను ప్రజలు సహించరు. – యర్రంశెట్టి గిరిజాపతి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గసభ్యుడుసాక్షి, భీమవరం: నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు ‘సాక్షి’పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలను ప్రజా, జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి అధికారులకు వినతులు అందజేశారు. భీమవరంలో ఏపీయూడబ్ల్యూజే, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, దళిత ఐక్యవేదిక సంఘాల నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపారు. మీడియాపై దాడులు ఆపాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, విలేకర్లపై నిర్బంధాలను అరికట్టాలని నినాదాలు చేశారు. డీఎస్పీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఏపీ యూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయి బాబా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యర్రంశెట్టి గిరిజాపతి, వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు గాదిరాజు రామరాజు, చిగురుపాటి సందీప్, గుంటి ప్రభు, గంటా సుందరకుమార్, బి.వాసుదేవరావు, చెల్లబోయిన రంగారావు, మల్లుల శ్రీనివాసరావు, ఎం.వైకుంఠరావు, ఎం.ఆంజనేయులు, డి.నాగు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బంధన పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని పోలీసులను పత్రికా కార్యాలయాలకు పంపి ఎడిటర్, జర్న లిస్టులను వేధింపులకు గురి చేయడం రాజ్యాంగ విరుద్ధం. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే రీతిలో ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. సాక్షిపై కక్ష సాధింపు చర్యలను ఆపాలి. – కామన మునిస్వామి, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి కళంకం తెస్తోంది. కల్తీ మద్యం విక్ర యాలు, దాని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే వివరాలను ప్రజల ముందుకు తీసుకురావడంతోనే సాక్షిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. – చెల్లబోయిన రంగారావు, సీపీఐ పట్టణ కార్యదర్శి, భీమవరం నిజాన్ని నిర్భయంగా బయటపెడుతున్న సాక్షిపై ప్రభుత్వం జులుం ప్రదర్శించడం మంచిది కాదు. సాక్షిపై కూటమి ప్రభుత్వం అకారణంగా కేసులు పెడుతూ వేధిస్తున్న వైనాన్ని అందరూ ఖండించాలి. ప్రభుత్వ తీరుతో ప్రజాస్వామ్యంలో పత్రికలకు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. – గుంటి ప్రభు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ సెక్రటరీ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సాక్షి మీడియాలో వచ్చిన వరుస కథనాలకు బెంబేలెత్తిన కూటమి ప్రభుత్వం సాక్షిని అణచివేయాలని పోలీసులను ఉసిగొల్పడం దారుణం. పత్రికా స్వేచ్ఛను హరించేలా ఇలాంటి చర్యలు దుర్మార్గం. – గంటా సుందర్‌కుమార్, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నారాయణకు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. పాలకొల్లులో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ ఎన్.దుర్గకు వినతిపత్రం సమర్పించారు. తాడేపల్లిగూడెంలో ఏపీయూడబ్ల్యూజే, ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి ఆర్ఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఉండి నియోజకవర్గం ఆకివీడులో తహసీల్దార్ కార్యాలయం వద్ద పాత్రికేయులు ధర్నా చేశారు. అనంతరం ఆర్ఐ వి.ఆంజనేయులకు వినతిపత్రం అందజేశారు. కక్ష సాధింపుపై గర్జన కూటమి ప్రభుత్వ తీరును ఖండించిన ప్రజా, జర్నలిస్ట్ సంఘాలు ‘సాక్షి’పై దాడులను ఆపాలని డిమాండ్ జిల్లావ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు అధికారులకు వినతిపత్రాలు అందజేత -
యథేచ్ఛగా ఇసుక అరకమ రవాణా
● చింతలపూడి కేంద్రంగా తెలంగాణకు.. ● నిబంధనలు మీరి తరలింపు చింతలపూడి: చింతలపూడి కేంద్రంగా ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మండల సరిహద్దు గ్రామాలను కేంద్రంగా చేసుకుని రాత్రి వేళల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలకు లారీలు, టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. చెక్ పోస్ట్‌లను తప్పించుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా సాగుతున్నట్టు సమాచారం. దీంతో ఇసుక అక్రమ రవాణాకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. కొవ్వూరు, తాళ్లపూడి నుంచి ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలిపోతోంది. ఈ నేపథ్యంలో కొవ్వూరు, తాళ్లపూడి ఇసుక రీచ్‌లలో చింతలపూడికి సంబంధించిన లారీలకు ఇసుక లోడింగ్‌కు నిరాకరించడంతో ఇక్కడి లారీ యజమానులు గత వారం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఇక్కడి లారీలకు కూడా ఇసుక లోడింగ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం ఇసుక తెలంగాణ నుంచి వచ్చిన లారీల్లో పక్క రా ష్ట్రానికి తరలిపోతున్నట్టు స్థానిక లారీ యజమాను లు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ చెక్ పోస్టుల ద్వారా నిఘా పెట్టినా ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. గత నెల 4న పోలీసులు తెలంగాణకు తరలిపోతున్న సుమారు 16 లారీలను చింతలపూడిలో పట్టుకుని సీజ్ చేశారు. అప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దా డులు చేసి ఈనెల 9న రాత్రి ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులోని చింతలపూడి మండలంలో తనిఖీలు నిర్వహించి మరో 5 లారీలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదుచేశారు. సరిహద్దు గ్రామాల పేరుమీద బిల్లు తీసుకుని తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. ఇసుకను స్థానిక లారీలకు మాత్రమే సరఫరా చేయాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా లభ్యమయ్యే గోదా వరి ఇసుకను స్థానిక లారీలకు లోడింగ్ చేయడం వల్ల జిల్లాలో ఇసుక కొరత ఉండదు. అధికారులు ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. – త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు -
కార్తీకానికి క్షేత్రపాలకుడి ఆలయం ముస్తాబు
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రపాలకుడి ఆయలంగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 21 నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుంది. ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రూ.4.50 కోట్లతో ఆలయం ముందు చేపట్టిన రాజగోపుర నిర్మాణ పనులు పూర్తి కాగా, ప్రస్తుతం రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. కార్తీకమాసం ప్రారంభం నుంచి భక్తులు పూర్తిస్థాయిలో ఈ రాజగోపురంలోంచి రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 21న సాయంత్రం 6 గంటలకు ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. వచ్చేనెల 5న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు సాయంత్రం ఆలయ ఆవరణలో జ్వాలా తోరణాన్ని, అనంతరం స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. -
క్షేత్రంలో కుక్కల స్వైరవిహారం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన వస్తున్న భక్తులపై సైతం అవి దాడులకు తెగబడుతున్నాయి. దాంతో వారు బిక్కుబిక్కుమంటూ ఆలయానికి చేరుకుంటున్నారు. శ్రీవారి క్షేత్రానికి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన వస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఈ సంఖ్య వేలల్లో ఉంటోంది. రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దూబచర్ల–రాళ్లకుంట మీదుగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. అలాగే ఉయ్యూరు, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భీమడోలు మీదుగా, అదేవిధంగా దగ్గర దారైన తడికలపూడి–వెంకటకృష్ణాపురం మీదుగా వస్తున్నారు. ఈ దగ్గర దారిలో వచ్చే భక్తులు శ్రీవారి పుష్కరణి(నృసింహ సాగరం) వెనుక వైపు నుంచి, గట్టు వెంట చెరువు వీధికి చేరుకుంటున్నారు. అక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద, దసరా మండప ప్రాంతంలోని ఇళ్ల వద్ద ఆ భక్తులు కాసేపు సేదతీరి, శ్రీవారి ఆలయానికి చేరుకుంటున్నారు. హడలెత్తిస్తున్న శునకాలు.. పుష్కరిణి ముందు, పుష్కరిణిలోని ర్యాంపుపై వీధి కుక్కలు గుంపులుగా ఉంటున్నాయి. చేతి కర్ర లేని కాలినడక భక్తులపై అవి దాడులకు పాల్పడుతున్నాయి. ఎక్కువగా బాలలు, చిన్నారులపై దాడి చేస్తున్నాయి. ఇటీవల లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కాలినడక భక్తుడు సాయిల రవి కుమారుడు యశ్వంత్‌పై దాడి చేశాయి. కొందరు పరుగులు తీస్తూ వాటి నుంచి తప్పించుకుంటున్నారు. ఈ వీధి కుక్కల బెడద కొండపైన భక్తులకూ తప్పడం లేదు. దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద భక్తులు సంచరించే ప్రాంతాల్లో సంచరిస్తూ, అక్కడే పడుకుంటున్నాయి. అవి ఎక్కడ దాడి చేస్తాయోనని భక్తులు భయపడుతున్నారు. వైరస్ శునకాలతో ఆందోళన వీధి కుక్కల్లో ఎక్కువగా వైరస్ సోకినవే ఉంటున్నాయి. శరీరంపై పుండ్లు పడి.. భక్తుల మధ్యలో సంచరిస్తూ, అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నాయి. వైరస్‌తో ఉన్న ఈ కక్కలు కరిస్తే పరిస్థితి ఏంటా.. అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దేవస్థానం అధికారులు అప్పుడప్పుడు కొండపైన, ఆలయ పరిసరాల్లో తిరిగే శునకాలను పట్టిస్తున్నారు. వాటిని పట్టుకుని తీసుకెళ్తున్న వారు అటవీ ప్రాంతంలో విడిచి పెట్టకుండా, గ్రామ శివారుల్లో వదిలేస్తున్నారు. శ్రీవారి పుష్కరణి ముందు రోడ్డుపై గుంపుగా ఉన్న వీధి కుక్కలు, శ్రీవారి ఆలయ తూర్పు ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల వద్ద పడుకున్న వీధి కుక్కలు క్షేత్రంలో స్వైరవిహారం చేస్తున్న వీధి కుక్కలు కాలినడక భక్తులపై తరచు దాడులు చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్న భక్తులు కుటుంబ సమేతంగా కాలినడకన శ్రీవారి క్షేత్రానికి వచ్చాను. పుష్కరిణి గట్టుపై నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్దకు చేరుకోగా, అక్కడున్న వీధి కుక్క మా బాబు యశ్వంత్‌పై దాడి చేసింది. కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సాయంతో పీహెచ్‌సీకి వెళ్లాం. అధికారులు వీధి కుక్కల నుంచి భక్తులకు రక్షణ కల్పించాలి. – సాయిల రవి, కాలినడక భక్తుడు, లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామం ఆలయ పరిసరాల్లో తిరిగే వీధి కుక్కలను ఆరు నెలల క్రితమే పట్టించి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేలా చర్యలు తీసుకున్నాం. మళ్లీ కాలినడక భక్తుల వెంట అవి క్షేత్రానికి చేరుకుంటున్నాయి. వాటిని పట్టిస్తుంటే జంతు ప్రేమికులు ఊరుకోవడం లేదు. పెరిగిన కుక్కలబెడదపై ఆలయ అధికారులతో చర్చించి, తగు చర్యలు తీసుకుంటాం. – టి.సూర్యనారాయణ, శ్రీవారి దేవస్థానం డీఈ -
మనసున్న మెకానిక్
కై కలూరు: అతనిదో మధ్య తరగతి కుటుంబం.. బండి రిపేరు చేస్తే కాని బతుకు బండి ముందుకు సాగదు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి మరణించాడు. సోదరుడు కూడా మరణించాడు. తల్లి బట్టలు అమ్ముతూ చేదోడుగా మారింది. భార్య, ముగ్గురు సంతానం. కానీ ఎదో వెలితి. పట్టెడన్నం కోసం పరితపిస్తున్న బడుగులకు అన్నదానం చేయాలని సంకల్పించాడు. పేదరికంలో మగ్గుతున్న అభాగ్యులకు ప్రతీ సోమవారం అన్నదాతగా మారాడు. మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన నీలం నాగరాజు బైక్ మెకానిక్. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. సాదాసీదా జీవనం. శివుడు అంటే ఇష్టం. శివుడికి ఇష్టమైన సోమవారం పేదలకు అన్నదానం చేయాలని భావించాడు. కై కలూరులో యానాదుల కాలనీ, బస్టాండ్, రైల్వే స్టేషన్, తాలూకా సెంటర్లలో యాచకులు, అనాథలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తాడు.నాగరాజు నాలుగేళ్లగా ప్రతీ సోమవారం పేదల ఆకలి తీరుస్తున్నాడు. కరోనా సమయంలోనూ సేవలు ఆపలేదు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులు వంటలు తయారు చేస్తారు. అప్పుడప్పుడు దాతల సాయంతో మరింత మందికి భోజనాన్ని అందిస్తున్నాడు. ఒక వేళ సోమవారం ఇతర ప్రాంతాల్లో ఉంటే అక్కడ కూడా హోటల్లో భోజనాలు కట్టించి పేదలకు పంపిణి చేయిస్తాడు. కుటుంబ సభ్యుల ఆదరణ కోల్పోయి వృద్ధాప్యంలో అనేక మంది చాలీచాలని కడుపుతో జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారి కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు నాగరాజు తెలిపారు. నాలుగేళ్లుగా ప్రతి సోమవారం పేదలకు అన్నదానం -
చెరువులో మునిగి రిటైర్డ్ ఉద్యోగి మృతి
భీమడోలు: భీమడోలు శివాలయం వద్ద చెరువులో ప్రమాదవశాత్తు జారి పడి రైల్వే రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ మృతి చెందాడు. భీమడోలు గ్రామానికి చెందిన బసవ ప్రభాకరరావు(74) రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నెల 15న సంతమార్కెట్కు సైకిల్‌పై వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అతని సైకిలు చెరువులో సమీపంలో దొరికింది. చెరువులో ప్రభాకరరావు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చలపతిరావు తెలిపారు. ఆగిరిపల్లి: నేరం రుజువు కావడంతో ముద్దాయికి సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ నూజివీడు కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కృష్ణా జిల్లా పామర్రు మండలం మల్లవరానికి చెందిన చుండూరు రమేష్ సగ్గూరులో బైక్ చోరీ చేశాడు. దీనిపై ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముద్దాయిని రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగిరిపల్లి ఎస్సై శుభ శేఖర్ దర్యాప్తు పూర్తి చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. నేరం రుజువు కావడంతో రమేష్‌కు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శ్రావణి తీర్పు వెల్లడించారు. ఏలూరు (టూటౌన్): పీడీఎస్ఓ, ఎన్‌వైఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక ఫైర్ స్టేషన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్య, ఉపాధి రంగాల సంక్షోభం, యువత ఆత్మహత్యలు అంశంపై జిల్లా సదస్సును స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. సదస్సులో కవి, రచయిత సుంకర గోపాల్ మాట్లాడారు. విద్యా విధానం అశాసీ్త్రయంగా ఉందని, మార్కులు, ర్యాంకులు, సర్టిఫికెట్లే లక్ష్యంగా సాగుతున్న చదువులు విద్యార్థుల ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయని అన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ద్వారకాతిరుమల: పొలంలోని మోటారు వద్ద ఫ్యూజ్ తీస్తున్న ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కోడిగూడెంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని దొరసానిపాడుకు చెందిన మానుకొండ విలియమ్స్(20) దెందులూరు ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కళాశాలకు సెలవు పెట్టి, కోడిగూడెంలో ఆయిల్‌పామ్ తోటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. పని పూర్తయిన తరువాత మోటారును ఆఫ్ చేసే ప్రయత్నంలో స్విచ్ లేకపోవడంతో, ఫ్యూజ్‌ను తీస్తున్నాడు. ఆ సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విలియమ్స్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఏలూరు (టూటౌన్) : అత్యాచార యత్నం కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ఏలూరు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీ కృష్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన కేసులో దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామానికి చెందిన మాండ్రు వెంకట ఆనంద్‌కు శిక్షను ఖరారు చేశారు. కొయ్యలగూడెం పీఎస్‌లో అప్పట్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు. -
సంతగుంట చెరువు ఆక్రమణ
కొయ్యలగూడెం: యర్రంపేట సంత చెరువు ఆక్రమణలకు గురైంది. మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న సంతచెరువు గట్టుపై కబేళా దుకాణాల సముదాయాలు వరుసగా నిర్మించారు. మరికొంతమంది వాణిజ్య దుకాణాలను నిర్మిస్తున్నారన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 30 ఎకరాల గర్భం కలిగిన సంత చెరువు ఆక్రమణలకు గురికాగా ఇరవై ఎకరాల గర్భం మిగిలిందని, దీంతో 150 ఎకరాలకు సాగునీరు అందే చెరువు నీరు పట్టుమని 25 ఎకరాలకు కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. కబేళా వ్యర్ధాలు చెరువులో కలపడంతో నీరు కలుషితం అవుతోందంటున్నారు. దుర్గంధంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఎదురవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలోనే వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేయగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వాటిని అధికారులు తొలగించారన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక ఆక్రమణలు యథాతథంగా కొనసాగుతున్నాయని అన్నారు. -
నిబంధనలను లెక్కచేయక
వాహనాలకి నెంబర్ ప్లేట్లు తప్పనిసరి.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ నెంబరు ప్లేట్‌తో యజమాని చిరునామా సేకరించడానికి వీలుంటుంది. రవాణా శాఖ ఫోన్గ్రామ్తో కూడిన నెంబర్ ప్లేట్లు వాహనదారుడికి కేటాయిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాల్సిన సంబంధిత అధికారులు మనకెందుకులే అన్నట్లుగా ఉన్నారు. దీంతో వాహనదారులు వారికి ఇష్టమైన నాయకుల పేర్లు, అభిమాన నేతల ఫొటోలతో యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కొన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్లు కూడా ఉండడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
అలరించిన యువజనోత్సవాలు
తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో యువజనోత్సవాల్లో డమరుకంతో నృత్యం చేస్తున్న విద్యార్థినులు, జానపద నృత్యం చేస్తున్న విద్యార్థినులుతణుకు అర్బన్: తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు అలరించాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన క్లాసిక్, ఫోక్, జానపద నృత్యాలతోపాటు వ్యవసాయ రంగ అంశాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ, సెట్వెల్ ఆధ్వర్యంలో ఈ యువజనోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. సెట్వెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కేఎస్.ప్రభాకర్, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు, కళాశాల ప్రిన్సిపల్ యుఎల్ సుందరీబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి వారసత్వ సంప్రదాయాలపై అవగాహన పెంచుకొని వాటిని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు . ఎస్‌కేఎస్‌డీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువజనోత్సవాల్లో పాల్గొన్న ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
ఇంటర్ కాలేజీ ఫెన్సింగ్ పోటీలు
భీమవరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ ఎట్ ఫెన్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం భీమవరంలోని సీఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి సుమారు 50 మంది పాల్గొనగా వారికి పలు విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు సీఎస్ఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ, ప్రిన్సిపల్ సకుమళ్ల సత్యనారాయణ, స్టేట్ ఫెన్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ జీఎస్వీ కృష్ణమోహన్ తదితరులు బహుమతులు అందజేశారు. జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. నిత్య కై ంకర్యాలు, పంచామృతాభిషేకాలు, ఏకాదశ హారతి పూజలు నిర్వహించినట్లు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. అమ్మవారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కమిటీ ఛైర్మన్ రొంగల నాగేశ్వరరావు, కుటుంబసభ్యులు రూ.5,01,116 అందజేసినట్లు చైర్మన్ తెలిపారు. రొంగల నాగేశ్వరరావు రమాదేవి దంపతులు, దేవీ ప్రసాద్, అనూష దంపతులు, భాస్కర్ కుమార్, సాయి చంద్రిక దంపతులు, వారి కుటుంబ సభ్యులను సత్కరించారు. నరసాపురం రూరల్: పంచాయతీలో ఇతర సర్పంచుల కాలంలో చెల్లించిన బిల్లులు తాము చెల్లించినట్లుగా చూపించి తమ పరువును దిగజార్చేలా ప్రకటనలు ఇచ్చిన డీఎల్పీఓ కిరణ్మయిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు మల్లవరం సర్పంచ్ సంధి సుజాత తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. 2021, ఏప్రిల్ 12, మే 7 తేదీలతో పంచాయతీ సొమ్మును డ్రా చేశారని ఆ సమయానికి సర్పంచిగా ఎన్నికై నప్పటికీ చెక్ పవర్ రాలేదని వాటిని దుర్వినియోగం చేసినట్లు డీఎల్పీఓ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారన్నారు. కొంతమంది ఒత్తిడితో నోటీసులు ఇప్పించారని భావిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్: బైక్‌పై వెళ్తున్న వారిని కారు ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. రూరల్ హెచ్‌సీ జిలానీ వివరాల ప్రకారం.. ఉండి మండలం చిలుకూరుకు చెందిన నల్లం సత్యనారాయణ, అతని భార్య, మనువడు గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తున్నారు. వెంకట్రామన్నగూడెం వచ్చే సరికి వారి బైక్‌ను కారు ఢీకొంది. సత్యనారాయణ, అతని భార్య, మనుమడికి గాయాలయ్యాయి. వారిని 108లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలించారు. రూరల్ హెచ్‌సీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
100 ఏళ్ల రావిచెట్టు నరికివేత
టి.నరసాపురం: ఒక వ్యక్తి స్వార్థం కోసం వందేళ్ల పైబడిన రావిచెట్టు నేలకొరిగింది. మండలంలో మక్కినవారిగూడెం పంచాయతీ కొల్లివారిగూడెం రెవెన్యూ గ్రామంలో రావిచెట్టును ఓ రైతు నిబంధనలకు విరుద్దంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నరికి కలపను ట్రాక్టర్‌పై తరలించాడు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. కొల్లి వారిగూడెం పరిధిలో ముత్యాలమ్మ గుడి బండి దారి భూమి సుమారు 70 సెంట్లు ఉంది. ఈ భూమిని కొంతకాలంగా ఒక వ్యక్తి ఆక్రమించి సాగు చేస్తున్నాడు. అతను మరో వ్యక్తికి ఆ భూమిని కౌలుకు ఇచ్చినట్లు సమాచారం. కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆ భూమిలో ఉన్న 100 ఏళ్ల రావిచెట్టును నరికి ట్రాక్టర్‌పై తరలించాడు. ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని, కలపను స్వాధీనం చేసుకుని ఆక్షన్ నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
రాష్ట్రంలో ఏరులై పారుతున్న నకిలీ మద్యం
● సీబీఐ దర్యాప్తు జరిపించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు డిమాండ్ నరసాపురం: పైకి బ్రాండెడ్ లేబుళ్లు, పక్కా బ్యాచ్ నంబర్లు ఉన్న మద్యం బాటిళ్లు మూతలు తెరిస్తే నాసిరకం, నకిలీ మద్యం ప్రజల ప్రాణాలు తీ స్తున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. రాష్ట్రం అంతా నారవారి వాకిట్లో తయారైన నకిలీ మద్యం ఏరులై పారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం అరికట్టాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం నరసాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ఎకై ్సజ్ సీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలైనా కూటమి ప్రభుత్వం నోరుమెదపకపోవడం దారుణమన్నారు. పైగా వైఎస్సార్సీపీ అల్లరి చేస్తుందని కూటమి నేతలు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటన్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. నరసాపురం పక్కనే ఉన్న పాలకొల్లులోనే మద్యం తయారీ వ్యవహారం వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. కూటమి నేతలే మద్యం సిండికేట్లుగా అవతారమెత్తి వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపించారు. వీధివీధినా బెల్ట్‌షాపులు వెలిసినా ఎకై ్సజ్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునేవారే లేరన్నారు. నకిలీ మద్యం నివారణ, ఎమ్మార్పీ ధరలకు విక్రయాలు, బెల్ట్‌షాపులు అరికట్టేందుకు వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఎకై ్సజ్ సీఐ రాంబాబుకు వినిపత్రం అందించారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్ కార్యాలయం వరకూ ర్యాలీ సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైస్ చైర్పర్సన్ కామన నాగిని, పార్టీ సీఈసీ సభ్యుడు పీడీ రాజు, పెండ్ర వీరన్న, జెడ్పీటీసీలు బొక్కా రా ధాకృష్ణ, తిరుమాని బాపూజీ, ఎంపీపీ మైలాబత్తుల సోనీ తదితరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, పార్టీ నాయకులునరసాపురంలో మహిళా నేతలతో కలిసి ఎకై ్సజ్ సీఐకు వినతిపత్రం ఇస్తున్న దృశ్యం -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
అత్తిలి: పేదలకు ఉచిత వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, కూటమి సర్కారు వాటిని ప్రైవేటుపరం చేయడానికి పూనుకోవడం దుర్మా ర్గమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా గురువారం అత్తిలి మండలం పాలి, కె. స ముద్రపుగట్టు, అత్తిలి పెదపేటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేలా వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని దుయ్యబట్టారు. కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు సేవల కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు కుటిల యత్నాలను అడ్డుకునేలా జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రతిఒక్కరూ సంతకాల సేకరణకు ముందుకు వచ్చి గవర్నర్‌కు సమర్పించేందుకు సంఘీభావం తెలపాలని కోరారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజారోగ్యానికి జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చారని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచితే నేడు కూటమి సర్కారు అటకెక్కించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఏది చూసినా నకిలీ అని భయమేసే పరిస్థితి ఉందన్నారు. ప్రజలను లక్షాధికారులను చేస్తానని చంద్ర బాబు అబద్దాలు చెప్పి నట్టేట ముంచారని అన్నారు. తణుకులో పశువధ యథేచ్ఛగా సాగుతోందని, జూద క్రీడలకు నిలయంగా మారిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బుద్దరాతి భరణీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, సర్పంచ్‌లు కేతా గౌరీపార్వతి, కసిరెడ్డి బాలలక్ష్మీనారాయణ, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబీబుద్దీన్, ఎంపీటీసీ సభ్యులు నల్లమిల్లి నాగమణి, అనిశెట్టి త్రిమూర్తులు, ఆడారి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకులు రంభ సూరిబాబు, పోలినాటి చంద్రరావు, సబ్బితి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు -
మందు బిళ్లలకు కోత
జిల్లాలోని ఒక ఆస్పత్రికి రోజుకు దాదాపు 400 వరకు ఓపీ నమోదవుతుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు మొదటి క్వార్టర్‌గా మందుల కోసం వైద్యారోగ్యశాఖ సుమారు రూ.10.5 లక్షలు, సర్జికల్స్‌కు రూ.3.3 లక్షలు బడ్జెట్ ఇచ్చింది. జూలై, ఆగస్టు, సెప్టెంబరుకు రెండో క్వార్టర్‌గా మందుల కోసం రూ.11.42 లక్షలు, సర్జికల్స్‌కు రూ.3.8 లక్షలు ఇచ్చింది. అక్టోబరు, నవంబరు, డిసెంబరుకు సంబంధించి ప్రస్తుత క్వార్టర్‌కు మందులకు రూ.8.5 లక్షలు, సర్జికల్స్‌కు రూ.2.42 లక్షలు మాత్రమే బడ్జెట్ ఇచ్చింది. రెండో క్వార్టర్‌తో పోలిస్తే మూడో క్వార్టర్ బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయాయి. జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో దాదాపు ఇదే పరిస్థితి. సాక్షి, భీమవరం: జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, మూడు సీహెచ్‌సీలు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 34 వరకు పీహెచ్‌సీలు, 18 యూపీహెచ్‌సీలు వరకు ఉన్నాయి. రోజుకు 15,500 వరకు ఓపీ నమోదవుతుంది. సాధారణంగా యూనివర్శల్ (యూ), సబ్ డివిజనల్ (ఎస్), టెరిసరీ (టీ) కేటగిరీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు మందుల కేటాయింపు చేస్తుంటారు. రోజువారీ ఓపీ, పెర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రతి మూడు నెలలకు క్వార్టర్ ప్రాతిపదికన మందులు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు వైద్యారోగ్య శాఖ బడ్జెట్ మంజూరు చేస్తుంది. ఆస్పత్రి స్థాయిని బట్టి మందుల కోసం అర్బన్ పీహెచ్‌సీలకు రూ.90 వేల నుంచి రూ.1.5 లక్షలు, రూరల్ పీహెచ్‌సీలకు రూ.1.75 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, సీహెచ్‌సీలకు సుమారు రూ.15 లక్షల వరకు, ఏరియా ఆస్పత్రులకు రూ.20 లక్షల వరకు, అలాగే సర్జికల్ సామగ్రికి నిధులను కేటాయిస్తారు. ఈ నిధులతో మూడు నెలల కాలానికి గాను ఆస్పత్రికి అవసరమైన మందులు, శస్త్రచికిత్సల పరికరాలను సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి వైద్య సిబ్బంది తెచ్చుకోవాలి. బడ్జెట్లో కోత.. రోగులకు వెత గతంతో పోలిస్తే మందులు, సర్జికల్స్‌కు సంబంధించి ప్రస్తుత క్వార్టర్‌కు బడ్జెట్ కేటాయింపులు తగ్గినట్టుగా తెలుస్తోంది. యూపీహెచ్సీ, పీహెచ్‌సీలకు యథావిధిగా కేటాయింపులు చేసినా సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు కోత పడింది. తణుకులోని జిల్లా ఆస్పత్రితో పాటు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెంలో ఏరియా ఆస్పత్రులు, ఆకివీడు, పెనుగొండ, ఆచంటలోని సీహెచ్‌సీలకు రోజువారీ ఓపీ అధికంగా ఉంటుంది. ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందే వారూ ఎక్కువే. ఆయా ఆస్పత్రులకు మూడో క్వార్టర్ బడ్జెట్లో 20 నుంచి 30 శాతం వరకు కోత పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఆస్పత్రులకు మందులు తగ్గి రోగులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్దినెలల క్రితం బీపీ అదుపులో ఉంచే ఎటన్లాల్ 50, నొప్పులు తగ్గేందుకు వినియోగించే ప్రియాబ్లిన్ టాబ్లెట్లు, రోగికి సత్తువనిచ్చే మెట్రోజిల్ సైలెన్లు తదితర రకాల మందులు సరిపడా సరఫరా లేక రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అవసరమైన డ్రగ్స్‌తో ఇండెంట్ పెడుతున్నా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్‌లో కొన్నిరకాల మందులు అందుబాటులో లేక రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇబ్బంది లేదు మందులకు కొరత లేదని, అవసరమైన మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్లో మిగిలి ఉన్న స్టాకు, రోజువారీ ఓపీ, మందుల వినియోగాన్ని బట్టి క్వార్టర్ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ తెలిపారు. అవసరమైతే ఆరోగ్యశ్రీ నిధుల నుంచి మందుల కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చినట్టు వివరించారు. ఏ మాత్రం శ్రద్ధ లేదు ప్రమాదంలో ప్రజారోగ్యం ప్రభుత్వాస్పత్రులపై కూటమి నిర్లక్ష్యం మందులు, సర్జికల్ సామగ్రి బడ్జెట్ తగ్గింపు 20 నుంచి 30 శాతం మేర కోత రోగులకు తప్పని ఇక్కట్లు -
బాణసంచా.. తస్మాత్ జాగ్రత్త!
బాణసంచా దుకాణాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. IIలో uనరసాపురం రూరల్: కార్తీకమాసంలో వన సమారాధనలనకు కేపీపాలెం–పేరుపాలెం సాగర తీరాలకు వచ్చే సందర్శకులకు బీచ్ వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు సూచించారు. గురువారం పేరుపాలెం బీచ్ గెస్ట్ హౌస్ వద్ద అధికారులతో సమీక్షించారు. కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది యాత్రికులు, సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదుల నిర్మాణంతో పాటు సముద్రంలో స్నానానికి దిగిన వారికి ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్‌కు వచ్చే మూడు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడటంతో పాటు వాహనాలు పార్కింగ్‌కు అవసరమయ్యే స్థలాన్ని గుర్తించాలన్నారు. ప్రత్యేకంగా శని, ఆదివారం రోజుల్లో పెద్దఎత్తున సందర్శకులు వస్తారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. నిర్దేశించిన ప్రదేశం దాటి సముద్ర స్నానం చేసేవారిని తక్షణమే ఒడ్డుకు తీసుకువచ్చేందుకు గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను వివరించారు. సర్పంచ్‌లు తిరుమాని విజయలక్ష్మి, అందే దొరబాబు, డీపీఓ ఎన్.రామనాథరెడ్డి, తహసీల్దార్ రాజ్‌కిషోర్, డీఎల్పీఓ జ్యోతిర్మయి, డిప్యూటీ ఎంపీడీఓ నవీన్‌కిరణ్, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
కారు డిక్కీలో క్షతగాత్రురాలి తరలింపు
● ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ● మహిళకు తీవ్రగాయాలు ● సమయానికి రాని 108 వాహనం తణుకు అర్బన్: జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన తేతలిలో గురువారం చోటుచేసుకుంది. తేతలి ఇండస్ట్రీయల్ ఏరియాలోకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుర్తుతెలియని మహిళను తాడేపల్లిగూడెం వైపు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. వాహన సీటు దూరంగా పడిపోగా వాహనం తిరగబడిన తీరు ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో మహిళకు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. కారు ఢీకొట్టిన వేగానికి ద్విచక్ర వాహనంతోపాటు మహిళ కూడా గాల్లోకి ఎగిరిపడినట్టు స్థానికులు చెబుతున్నారు. 108 కోసం అరగంట వేచిచూసినా..ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసినా అరగంట వరకూ జాడ లేకపోవడంతో చేసేది లేక మహిళ పరిస్థితి చూసిన ప్రయాణికులు ఒక కారు వెనుక భాగంలో డిక్కీ తెరిచి పొడవాటి చెక్కను పెట్టి దానిపై ఆమెను పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. అయితే ఆ మహిళ ఎవరు, ఏ ఆస్పత్రికి తీసుకువెళ్లారనే విషయాలు తెలియలేదు. ప్రమాదం జరిగిన తరువాత ఘటనా ప్రాంతానికి పోలీసులు వెళ్లారని అయితే ఎటువంటి వివరాలు తెలియకపోగా, బాధిత వర్గాల నుంచి ఫిర్యాదు కూడా రాలేదని తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. మహిళను కారు వెనుక భాగంలో ఎక్కించి తీసుకెళ్తున్న దృశ్యం తేతలిలో గాయపడ్డ మహిళను చెక్కపై పడుకోబెట్టి కారు ఎక్కిస్తున్న స్థానికులు -
‘సాక్షి’పై కూటమి కుట్రలు
● నేడు జర్నలిస్ట్, ప్రజాసంఘాలతో ధర్నాలు ● దాడులను నిరసిస్తూ అధికారులకు వినతులు సాక్షి, భీమవరం: నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. పోలీసులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. నోటీసులు, విచారణల పేరుతో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను కాలరాస్తోంది. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డికి నాలుగురోజుల వ్యవధిలో పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. పత్రికా స్వేచ్ఛపై, ప్రజల పక్షాన పోరాడుతున్న సాక్షిపై కూటమి దాడిని ఖండిస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా జర్నలిస్ట్, ప్రజాసంఘాలు శాంతియుతంగా నిరసన తెలిపి అధికారులకు వినతులు అందజేయనున్నట్టు ఏపీయూడబ్ల్యూఏజే జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయిబాబా తెలిపారు. భీమవరంలో జరిగే కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు నిజాలు తెలియకుండా సాక్షిని అణగదొక్కాలని చూస్తోంది. విచారణ పేరుతో మీడియా ప్రతినిధులను వేధింపులకు గురిచేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. దీనిని అందరూ సంఘటితంగా ఎదుర్కోవాలి. – బంధన పూర్ణచంద్రరావు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ పత్రికా స్వేచ్ఛను కాలరాయాలని చూడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిది. పత్రికా కథనాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయబద్ధంగా ఎదుర్కోవాలే తప్ప ఇలా వ్యవహరించడం సరికాదు. ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తున్నాం. సాక్షి మీడియా ప్రతినిధులపై వేధింపులు ఆపాలి. – కోనాల భీమారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
ఉద్యోగ భద్రత కల్పించాలి
భీమవరం: పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘ అధ్యక్ష, కార్యదర్శులు శివరామ్, రాజారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలు వినే నాథుడే కరువయ్యాడన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు పెరిగాయని, వేతన బకాయిలు, పని ఒత్తిడి బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. టెండర్ తో నిమిత్తం లేకుండా ఉద్యోగాలు కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా టెండర్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం మానుకోలేదని ఆరోపించారు. యూనియన్ గౌరవ అ ధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ స్వచ్ఛభారత్, క్లీన్ అండ్ గ్రీన్ వంటి పేర్లు పెట్టి ప్రజాప్రతినిధులు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప పరిశుభ్రతను కాపాడే వారి పరిస్థితిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం కొత్తగా చెబుతున్న స్వర్ణ పంచాయతీల్లో సీనియార్టీని బట్టి పంచాయతీ కార్మికులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు కిరణ్, రాజబాబు, మల్లుల ఏసుబాబు, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఉప్పునీటి సాంద్రత కలిగిన ప్రాంతంలో ఆక్వా సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా సీఐఐఏ రిజిస్ట్రే షన్ చేయించుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో రిజిస్ట్రేషన్‌పై సమీక్షించారు. దేశంలోనే పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేసి బ్రాకిష్ వాటర్ క్లస్టర్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీనివలన కేంద్ర ప్రభుత్వం సీఐఐఏఎ కింద మంజూరు చేసే ప్రయోజనాలను పొందడానికి వీలవుతుందని తెలిపారు. జిల్లా లో 17,100 ఎకరాలు బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగులో ఉందని, ఈ పరిధిలో రైతులు నెలాఖరులోపు రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలన్నారు. మొగల్తూరు మండలంలో ఐదు, నరసాపురం మండలంలో ఆరు, యలమంచిలి, భీమవరం మండలాల్లో రెండేసి చొప్పున రెవెన్యూ గ్రా మాలు ఈ పరిధిలో ఉన్నాయన్నారు. సముద్ర తీరానికి రెండు కిలోమీటర్లు, ఉప్పునీటి సాగు కాలువలకు రెండు వందల మీటర్ల దూ రంలో సాగు చేసేవి మాత్రమే బ్రాకిష్ వాటర్ సాగు పరిధిలోకి వస్తాయన్నారు. జిల్లాలో ఫ్రెష్ వా టర్ కింద 1,32,503.91 ఎకరాల్లో ఆక్వా సాగు విస్తీర్ణం ఉందని, ఇప్పటివరకు 56,881.8 ఎకరాల విస్తీర్ణంలోని రైతులు అప్సడా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారన్నారు. మిగిలిన వారూ పూ ర్తిచేసుకోవాలన్నారు. డీఆర్వో బి.శివ న్నారాయ ణ రెడ్డి, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ అయ్యా నాగరాజా, ఏడీ ప్రసాద్, నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్, రైతులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: రాష్ట్రంలో సంచలనంగా మారిన కల్తీ మద్యం వ్యవహారంలో సిట్ అధికారులు ఏలూరులోని ఒక మద్యం వ్యాపారిని విచారించారు. కల్తీ మద్యం కుంభకోణంలో కీలక పా త్రధారి జనార్దన్‌కు ఏలూరులోని వ్యక్తికి మద్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏలూరుకు చెందిన వ్యక్తిని విచారించినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. గ తంలో ఇద్దరి మద్య జరిగిన వ్యాపార లావాదేవీల్లో భాగంగానే డబ్బులు ఇచ్చినట్లు, ప్ర స్తుతం అలాంటి ఆర్థిక లావాదేవీలేమీ జరగలేదని అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. -
శ్రీవారి అంతరాలయ దర్శనం పునరుద్ధరణకు చర్యలు
ద్వారకాతిరుమల: ద్వారాకతిరుమల చినవెంకన్న ఆలయంలో పాత పద్ధతిలో స్వామివారి అంతరాలయ దర్శనం, అలాగే అంతరాలయం (అమ్మవార్లు) ముందు భాగం నుంచి భక్తులకు సాధారణ దర్శనం కల్పించేందు అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మధ్యాహ్నం ట్రయిల్‌రన్ వేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఏలూరుకు చెందిన ఆధ్యాత్మికవేత్త, హైకోర్టు న్యాయవాది అయ్యంగార్ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదు, ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. వివరాల్లోకి వెళితే. ఐదేళ్ల క్రితం కోవిడ్ కారణంగా అధికారులు శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని, అలాగే అమ్మవార్ల ముందు నుంచి భక్తులకు సాధారణ దర్శనాన్ని నిలిపివేశారు. కోవిడ్ నిర్మూలన అనంతరం ఇతర ఆలయాల్లో అంతరాలయ దర్శనాలు పునః ప్రారంభం అయిననా, శ్రీవారి ఆలయంలో మాత్రం పునరుద్ధరణ కాలేదు. దీంతో భక్తులు శ్రీవారిని, అమ్మవార్లను బయట (దూరం) నుంచే దర్శించుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే అధికారులు అంతరాలయ దర్శనం టికెట్ రూ.500 లుగా నిర్ణయించి, దేవదాయశాఖ కమిషనర్ నుంచి ఎప్పుడో అనుమతులు పొందినా దానినీ అమలు పరచలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గతంలో ఉన్న చెక్కల ర్యాంప్‌ను మళ్లీ ఆలయ అంతరాలయం ముందు భాగంలో ఏర్పాటుచేశారు. భక్తులు తూర్పు గుమ్మం లోంచి ఆలయంలోకి ప్రవేశించి, చెక్కల ర్యాంపు మీదుగా వెళుతూ స్వామి, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించే పాత విధానాన్ని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తికి అధికారులు వివరించారు. అయితే ఇన్నేళ్లుగా మూలనపడి ఉన్న చెక్కల ర్యాంప్ దెబ్బతినడంతో ట్రయిల్‌రన్ వేయడం కుదరలేదు. దీంతో ర్యాంపునకు మరమ్మతులు చేయించాలని ఈఓ ఆదేశించారు. ఈనెల 21న అమావాస్య తరువాత అంతరాలయం, సాధారణ దర్శనాన్ని పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, మిగిలిన రోజుల్లో పునరుద్ధరించాలని నిర్ణయించారు. అయ్యంగార్ ఫిర్యాదు, ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో కదలిక -
అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ?
పెరుగుతున్న ఖర్చులతో గత కొన్నేళ్లుగా ఇస్తున్న గౌరవ వేతనం నెలకు రూ.3 వేలు సరిపోవడం లేదు. ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలి. మూతపడుతున్న స్కూళ్లలో ఎండీఎం కార్మికులు, ఆయాలు రోడ్డున పడుతున్న పరిస్థితి, వీరందరికి ఉద్యోగ భద్రత కల్పించాలి. – మోడియం నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎండీఎం కార్మిక సంఘం బిల్లులు 3, 4 నెలలు ఆలస్యంగా జమవ్వడంతో ప్రతి నెలా అప్పులు చేసి వంటలు చేయాల్సిన సరిస్థితి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచితే ఆర్థిక భారం తగ్గుతుంది. యూపీ బిల్లులు జూలై నెల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. విడతల వారీగా వేయడంతో బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. – కాసాని సత్తెమ్మ, నిర్వాహకురాలు, ఎండీఎం ఏజెన్సీనిడమర్రు: ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు, పోషకాహారలోపం నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులకు గ్రహణం పట్టింది. ఈ పథకం నిర్వాహకులకు నిధులను సకాలంలో చెల్లిచకపోవడంతో వారికి భారమవుతోంది. సరైన సమయానికి బిల్లులు రాకపోయినా, పిల్లల ఆకలి తీర్చడానికి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు అప్పులు చేసి వండి వడ్డిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం కళాశాలల్లో నిర్వాహకులకు 5 నెలల నుంచి, యూపీ స్కూళ్లలో నిర్వాహకులకు జూలై నుంచి బిల్లులు కూటమి సర్కారు మంజూరు చేయలేదు. మరోవైపు వంట సహాయకులకు ఇచ్చే రూ.3 వేలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలంటూ విడతల వారీగా ఇస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల్లో పరిస్థితి మరింత దారుణం గ్రామీణ ఇంటర్ కళాశాలల్లో గత ఏడాది నుంచి అమలవుతున్న భోజన పథకం నిర్వాహకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారికి ఫిబ్రవరి నెల నుంచి నిర్వహణ నిధులు కేటాయించకపోవడంతో వారంతా అప్పులు మీద అప్పులు చేసే పరిస్థితి నెలకొంది. ఉంగుటూరు మండలంలో నారాయణపురం, గణపవరం గ్రామాల్లో మాత్రమే రెండు ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. బిల్లులు నెలలుగా బకాయి పడటంతో అప్పుల భారంతో కొన్ని చోట్ల మెనూ సక్రమంగా అమలు చేయడం లేదనే వాదనలు ఉన్నాయి. బియ్యం, గుడ్లు, రాగిపిండి, పప్పు చిక్కీలను ప్రభుత్వం సరఫరా చేసినా, అవసరమైన వంట గ్యాస్, కూరగాయలు, పప్పు, ఇతర వంట సామగ్రి నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ దుకా ణాల వద్ద అరువు తీసుకొచ్చి వంట చేస్తున్నారు. తమకు రావాల్సిన సొమ్ములు ప్రభుత్వం నుంచి అందకపోవడం, అరువు ఇచ్చిన దుకాణదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో అందినచోట అప్పులు చేసి ఆర్థిక భారానికి గురవుతున్నామని వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చేది అరకొర.. అదీ నెలల తరబడి భోజన పథకం నిర్వాహకులకు మెనూలోని వంటల తయారుకు ఇచ్చేది అర కొర నిధులు, అవి కూడా నెలల తరబడి పెండింగ్లతో అనేక సమస్యలతో వారు సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. మెనూ ప్రకారం సోమవారం కూరగాయలు/ ఆకుకూర పప్పు, మంగళవారం పులిహోర, రోటీ పచ్చడి, బుధవారం మిశ్రమ కూరగాయల కూర, గురువారం పలావు, బంగాళ దుంప కుర్మా, శుక్రవారం ఆకు కూర పప్పు, శనివారం మిశ్రమ కూరగాయాల కూర, చక్కెర పొంగల్ వండాలి. వీటితోపాటు రైస్ వండాలి, వారానికి మూడు రోజులు రాగిజావ, గుడ్డును వడ్డించాల్సి ఉంది. వీటి తయారీకి మాత్రం ప్రాథమిక విద్యార్ధులకు రూ. 5.88, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ రూ.8.57 ఒక్కో విద్యార్థికి వంట, సరుకుల కొనుగోలు ఖర్చుల కింద చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఇచ్చే నగదు మార్కెట్లో ఒక్క ఇడ్లీ కూడా రాదంటూ వాపోతున్నారు. ఇటీవల జిల్లా స్థాయిలో ఎండీఎం కార్మికులు ఆందోళన అనంతరం అర కొరగా బిల్లులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. భోజన పథకంలో బిర్యానీ వడ్డిస్తున్న కార్మికులు సమస్యలపై ఎండీఎం నిర్వాహకులు, కార్మికుల ఆందోళన (ఫైల్) ప్రతీ నెలా 5వ తేదీలోపు గౌరవ వేతనం, వంట ఖర్చుల బిల్లులు చెల్లించాలి. గౌరవ వేతనం రూ.10 వేలు ఇవ్వాలి, మెనూ ఖర్చుల చార్జీలు పెంచాలి. మూతపడుతున్న స్కూళ్లలోని నిర్వాహకులకు ఉపాధి భద్రత కల్పించాలి, యూనీఫాం, గుర్తింపు కార్డులు ప్రభుత్వం అందించాలి. గ్యాస్, వంట పాత్రలు ప్రభుత్వమే సరఫరా చేయాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. జిల్లా పాఠశాలలు ఎండీఎం కార్మికులు నమోదు ఏలూరు 1,710 92,203 5,732 పశ్చిమగోదావరి 1,384 78,755 4,350 వంట బకాయిలు అందక ఎండీఎం నిర్వాహకుల అవస్థలు అరకొరగా నిధులు కేటాయిస్తున్న కూటమి సర్కారు కళాశాలకు 5 నెలలు, యూపీలకు 3 నెలలుగా నిలిచిన చెల్లింపులు పెరిగిన ధరలతో అప్పులతో కొనసాగిస్తున్న నిర్వాహకులు -
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు!
● గణితం, ఇంగ్లీషు బోధించడానికి ఈసీఈ ఫ్యాకల్టీ! ● ట్రిపుల్ ఐటీలో పీయూసీ బోధన తీరుపై విమర్శలు నూజివీడు: ఇంటి పెద్ద ఇల్లును పట్టించుకోకపోతే ఇల్లు ఎలా గాడి తప్పి పతనమవుతుందో... ఇలాంటి పరిస్థితే ట్రిపుల్ ఐటీలో నెలకొంటోంది. ట్రిపుల్ ఐటీ అంటే ఎంతో ఉన్నత స్థాయి విద్యాసంస్థ అని ప్రజలు భావిస్తుండగా, యాజమాన్యం మాత్రం నవ్వులపాలయ్యే నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న 10 మంది ఫ్యాకల్టీకి ఉద్యోగాలు రావడంతో వారు ఇక్కడ ఉద్యోగాలకు రిజైన్ చేసి వెళ్లిపోయారు. దీనిలో భాగంగానే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న శ్రీకాకుళం పీయూసీలో గణితం, ఇంగ్లీషు బోధిస్తున్న రాజేష్, రమాదేవి అనే ఫ్యాకల్టీకి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడంతో వారు రిజైన్ చేసి వెళ్లిపోయారు. దీంతో గణితం, ఇంగ్లీషు బోధించేందుకు ఫ్యాకల్టీ అవసరమైంది. ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధించే ఈసీఈ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పీయూసీలో గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులను బోధించేందుకు నియమిస్తూ శ్రీకాకుళం డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ట్రిపుల్ ఐటీలోని ఫ్యాకల్టీ సిబ్బందిలోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఇంజినీరింగ్‌లో ఈసీఈ విద్యార్థులకు బోధించాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను పీయూసీలో గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులు బోధించడానికి ఎలా నియమిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెస్సీ, ఎంఏ చదివిన వారు అర్హులు కదా..! పీయూసీలో గణితం బోధించడానికి ఎమ్మెస్సీ గణితం చదివిన వారు, ఇంగ్లీషు బోధించడానికి ఎంఏ ఇంగ్లీషు చేసిన వారు అర్హులు కాగా, ఈసీఈ చదివిన వారు ఎలా చెబుతారో అంతుబట్టడం లేదు. ఎంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను అందించే ట్రిపుల్ ఐటీలాంటి సంస్థలో యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం దారుణం. అర్హత ఉన్న వారు లేకపోతే నియమించుకోవాలే తప్ప ఇలా అనర్హులతో బోధన చేయిస్తే రేపు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారో యాజమాన్యమే బదులివ్వాల్సిన అవసరం ఉంది. పీయూసీ విద్యార్థులకు గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులను బోధించడానికి ఈసీఈ ఫ్యాకల్టీని నియమించినప్పటికీ దానిని తిరస్కరించాం. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతోనే బోధన చేయిస్తాం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ నుంచి వచ్చిన ఆర్డర్‌ను కుదరదని తిప్పి పంపించాం. – ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ -
చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
తాడేపల్లిగూడెం రూరల్ : చోరీ కేసులో ఇద్దరు నిందితులతో పాటు ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తాడేపల్లిగూడెం రూరల్ సీఐ బీబీ రవికుమార్ తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. పెంటపాడు మండల, పరిసర ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీ, దొంగతనాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయన్నారు. ఈ క్రమంలోనే రావిపాడు గ్రామానికి చెందిన పెదపోలు శ్రీనివాస్ తన ఇంటి ముందు షెడ్డులో ఉన్న మోటారు సైకిల్ చోరీకి గురైనట్లు గత నెల 18న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముందస్తు సమాచారం మేరకు చిలకంపాడు లాకుల వద్ద ర్యాలీ లోకేష్, మానుపాటి దుర్గాప్రసాద్, మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, మోటారు సైకిళ్ల దొంగతనాలను వారు అంగీకరించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించగా, లోకేష్, దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేశామన్నారు. మోటారు సైకిళ్ల విలువ రూ.2.75 లక్షలుగా పేర్కొన్నారు. మానుపాటి దుర్గాప్రసాద్‌పై తణుకు, ఇరగవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆలయాల్లో హుండీ, ఇళ్లు, మోటారు సైకిళ్ల దొంగతనాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయన్నారు. కాగా, ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పెంటపాడు ఎస్సై కేసీహెచ్ స్వామి, కానిస్టేబుళ్లు అనిల్‌కుమార్, బి.మోహన్, కే.నవీన్, డి.వెంకటేశ్వరరావులను అభినందించారు. -
పంచాయతీ పూర్వపు భవనాలకు మోక్షం
ఆకివీడు: స్థానిక నగర పంచాయతీ పరిధిలో గంగానమ్మకోడు ప్రాంతంలో నిర్మించిన పంచాయతీ అసంపూర్తి భవనాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల సాక్షిలో వచ్చిన కథనానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఆక్రమణల్లో ఉన్న భవన ప్రాంగణాల్ని ఖాళీ చేయించారు. ఆకివీడు పంచాయతీ పరిధిలోని ఈ ప్రాంతంలో 20 ఏళ్ల కూరగాయలు, మాంసం, చేపల దుకాణాల్ని ఏర్పాటు చేసేందుకు భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే ఆ ప్రాంతం తనదేనని, తన వద్ద రికార్డులున్నాయని ప్రైవేటు వ్యక్తి కోర్టుకు వెళ్లారు. దీంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో బిచ్చగాళ్లు, అనాథలు ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారు. స్థానికులు కూడా కొంత ఆక్రమించారు. ఇటీవల బిచ్చగాళ్లను, అనాథల్ని అక్కడ నుండి పంపించివేసి, ఆ అసంపూర్తి భవనాల్ని ఆక్రమించారు. దీనిపై సాక్షిలో కథనం రావడంతో స్పందించి, వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. అసంపూర్తి భవన నిర్మాణాల్ని పూర్తి చేసి, అవసరమైతే కూరగాయల వ్యాపారాలకు, ఇతరులకు అద్దెకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఆ ప్రాంతాన్ని గురువారం ఉపసభాపతి కె.రఘురామకృష్ణంరాజు, నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్ సందర్శించారు. ఆ భవనాలను సద్వినియోగంచేసుకోవాలని ఆదేశించారు. -
ఏజెన్సీలో ఆగని మట్టి రవాణా
● రాత్రి, పగలు తేడాలేకుండా తోలకాలు ● పట్టించుకోని అధికారులు బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని సర్వత్రా విమర్శిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం ఎన్ఆర్పాలెం సమీపంలో ఇటీవల ఒక గిరిజనుడికి చెందిన పట్టా భూమిలో ఉన్న కొండను కూటమి నాయకులు నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్లు పెట్టి లారీలతో మట్టి రవాణా చేస్తూ సొమ్ములు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కొండను తవ్వి చదును చేసేందుకు పీసా కమిటీ తీర్మానం చేసుకున్నామని గిరిజనులు చెబుతున్నప్పటికీ అది ఆ గ్రామ పరిధిలో తప్ప లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేదని పలువురు వాపోతున్నారు. ఇక్కడ తవ్విన మట్టిని బుట్టాయగూడెం పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ కూటమి నాయకులు సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. నూతిరామన్నపాలెంలో అక్రమంగా మట్టిని తరలిస్తూ కూటమి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. అది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు ఉండడం బాధాకరం. ఇప్పటికై నా అక్రమ మట్టి రవాణాపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలం -
బాణసంచా.. తస్మాత్ జాగ్రత్త!
భీమవరం: దీపావళి అంటే పిల్లలు, పెద్దలు అందరికీ పండుగే. పండుగకు 15 రోజుల ముందునుంచే బాణసంచా తయారీ, కొనుగోలుపై దృష్టిపెడతారు. గత కొన్నేళ్లుగా వివిధ రకాల కంపెనీల బాణసంచా మార్కెట్లోనికి రావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాణసంచా విక్రయ కేంద్రాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట తదితర ప్రాంతాల్లో తాత్కాలికంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటుచేసుకోడానికి 200కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. భీమవరం పట్టణంలో బాణసంచా దుకాణాలు ఏర్పాటుకు 25 మంది దరఖాస్తు చేసుకోగా లూథరన్ హైస్కూల్ ఆవరణలో ఇప్పటికే కొన్ని దుకాణాలు వెలిశాయి. జనావాసాలకు దూరంగా దుకాణాలు పెద్ద సంఖ్యలో ఒకే చోట ఏర్పాటు చేస్తున్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుకాణాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● బాణసంచా దుకాణాల వద్ద మండే స్వభావం కల్గిన వస్తువులను ఉంచరాదు. ● ఒక్కొక్క దుకాణం మధ్య కనీసం మూడు మీటర్ల దూరం తప్పనిసరి. ● నూనె, గ్యాస్ దీపాలు వంటివి దుకాణాల్లో పెట్టకూడదు. ● బాణసంచా దుకాణాల వద్ద బాణసంచాను పరీక్షించేందుకు దుకాణ యజమానులు అంగీకరించకూడదు. ● విక్రయదారులు తక్కువ ప్రేలుడు స్వభావాన్ని కలిగిన బాణసంచా మాత్రమే అమ్మకాలు చేయాలి తప్ప స్థానికంగా తయారుచేసిన తారా జువ్వలు, చిచ్చు బుడ్లు, తాటాకు టపాకాయలు, నార బాంబులు వంటివి అనగా ఎక్కువ ప్రేలుడు స్వభావాన్ని కలిగిన గన్ పౌడర్, నైట్రేట్, క్లోరేట్, అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసిన మందుగుండును విక్రయించరాదు. ● ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవిస్తే అగ్ని మాపకవాహనం రావడానికి వీలుగా బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి. దుకాణాల వద్ద 9 లీటర్ల సామర్థ్యం కల్గిన నాలుగు ఫైర్బకెట్స్ను ఏర్పాటు చేసుకోవాలి. రెండిటినీ పొడి ఇసుకతో, మరో రెండింటినీ నీటితోనూ నింపాలి. ● బాణాసంచా దుకాణాల వద్ద పొగ తాగడాన్ని పూర్తిగా నిషేధించాలి. ● దుకాణాల వద్ద స్థానిక ఫైర్ స్టేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 101, పోలీసు డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ 100 ప్రదర్శన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. బాణసంచా విక్రయ దుకాణాల వద్ద తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. దుకాణదారులకు బాణసంచా తయారీకి అనుమతులు లేవు. ఇతరప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయించే బాణసంచాను 18 ఏళ్లలోపు పిల్లలకు విక్రయించకుండా తగిన జాగ్రత్తలతో వ్యాపారం చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – కె శ్రీనివాసరావు, ఏడీఎఫ్‌వో, భీమవరం -
అవార్డు గ్రహీత రాంప్రసాద్‌కు సత్కారం
భీమవరం: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల ఏఐఅండ్డీఎస్ విభాగాధిపతి కె సూర్యరాంప్రసాద్ను గురువారం కళాశాలలో ఘనంగా సత్కరించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును తమ కళాశాలకు చెందిన రాంప్రసాద్ అందుకోవడం తమ కళాశాలకే గర్వకారణమని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), ఉపాధ్యక్షుడు గోకరాజు పాండురంగరాజు అన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సంస్థ అవార్డుల ప్రదానోత్సవాన్ని విజయవాడలో నిర్వహించగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచేగాక పలు దేశాల నుంచి సుమారు 200 మంది ప్రొఫెసర్లు పాల్గొనడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం : మండలంలోని దుద్దుకూరుకు చెందిన గిరిజనుడు తెల్లం కన్నయ్య(60) తాడిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ జారి కిందపడి గురువారం మృతిచెందాడు. మృతుడు కన్నయ్య మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సోదరుడు. కన్నయ్య మరణ వార్త విన్న బాలరాజు కన్నీరు మున్నీరయ్యారు. కన్నయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కన్నయ్య కుటుంబానికి పెద్ద దిక్కు అని, ప్రభుత్వం కన్నయ్య కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని బాలరాజు కోరారు. పెదపాడు: నకిలీ విలేకరులు పెదపాడు మండలంలో హల్చల్ చేస్తున్నారు. కోళ్ల వ్యర్థాల వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం ఖాళీగా వెళ్తున్న ఓ వాహనాన్ని ఆప్పి నకిలీ విలేకరి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో అనుమానించిన ఆ వాహనదారుడు ఆ వ్యక్తిని నకిలీ విలేకరిగా గుర్తించి పెదపాడు పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి తాను పేరొందిన మీడియా సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులను నమ్మబలికాడు. అతని వద్ద ఉన్న ఐడీ కార్డును పరిశీలించి నకిలీ విలేకరుగా పోలీసులు గుర్తించి వారి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా గుడివాడ ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే ప్రదీప్ అనే వ్యక్తి వచ్చి సదరు వ్యక్తిని తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో సదరు నకిలీ విలేకరికు 41 నోటీసు అందించినట్లు విస్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రిపుల్ ఐటీలో మ్యూజిక్ వర్క్‌షాప్ నిర్వహణ
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో గురువారం సంగీత విభాగం ఆధ్వర్యంలో మ్యూజిక్‌పై వర్క్‌షాపును నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రముఖ గాత్ర విద్వాంసురాలు, సంగీత సుధానిధి వీ లలితా చంద్రశేఖర్ పాల్గొని భారతీయ సంగీతంలోని ప్రాథమిక అంశాలు, విద్యార్థులకు కలిగే ఉపయోగాలు అనే అంశంపై ఉపన్యసించారు. దేశంలో ముఖ్యంగా హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలున్నాయన్నారు. సంగీతంలో స్వరాలు, రాగాలు ముఖ్యమైనవని, భావాలను, మానసిక స్థితిని వ్యక్తపరచడానికి రాగాలను ఉపయోగిస్తారన్నారు. సంగీతం వినడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలగడం, సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ పెరగడం, జ్ఞాపకశక్తి మెరుగుపడటం, క్రమశిక్షణ అలవడటంతో పాటు విద్యార్థులకు విద్యాపరమైన పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. అనంతరం సంగీత కచేరీ చేస్తూ కచేరీ పద్ధతిపై సోదాహరణగా వివరించారు. వీరికి వయోలిన్‌పై జే చంద్రమౌళి, మృదంగంతో మంగళగిరి శ్రీధర్ తమ సహకారాన్ని అందజేశారు. లలిత విద్యార్థులకు దీక్షితార్ నోటు స్వరం నేర్పించారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు, సంగీత విభాగం హెచ్ఓడీ జే చంద్రమౌళీ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు: అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా గోడోన్పై పెంటపాడు పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు. ప్రత్తిపాడు ఆటోనగర్ ప్రాంతంలో గూడెంకు చెందిన ఒక వ్యాపారి గుట్టుగా బాణసంచాను గోడౌన్లో నిల్వ ఉంచాడు. ఈ గోడౌన్‌ను ఎస్సె స్వామి ఆధ్వర్యంలో పరిశీలించి సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యల కోసం రెవెన్యూ, ఫైర్ సిబ్బందికి సమచారం అందించామన్నారు. -
రేషన్ సరఫరా అవకతవకలపై విచారణ
తాడేపల్లిగూడెం రూరల్: దండగర్ర రేషన్ డిపోలో రేషన్ సరఫరాలో అవకతవకలపై బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. దండగర్ర రేషన్ డిపో నిర్వాహకుడు చిక్కాల అంబేడ్కర్ రేషన్ సక్రమంగా పంపిణీ చేయడం లేదని, అవకతవకలకు పాల్పడుతున్నాడని కార్డుదారుల నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయిస్ డీటీ అన్నపూర్ణ విచారణ చేశారు. రేషన్ డిపో వద్ద స్టాకు బోర్డు లేకపోవడం, కార్డుదారుల ఫిర్యాదుల మేరకు రేషన్‌డీలర్‌పై కేసు నమోదు చేస్తామని డీటీ అన్నపూర్ణ తెలిపారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే అధికారులకు సమాచారం ఇవ్వాలని, వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా ఆర్ఎస్ఎఫ్ఐ, ఏపీఆర్ఎస్ఏ రోలర్ స్కేటింగ్ హాకీక్వాడ్, కేడెడ్ (అండర్ 12), సబ్ జూనియర్స్ (అండర్ 15) ఎంపికలు బుధవారం తణుకు మాంటిస్సోరీ స్కూలు రింక్‌లో నిర్వహించారు. ఈ ఎంపికల్లో 7గురు కేడెడ్ బాలురు, సబ్ జూనియర్ బాలురు 8 మంది ఎంపికై నట్లు అబ్జర్వర్ షేక్ ఖాసిం తెలిపారు. సానబోయిన స్నేహశ్రీ ఓపెన్ కేటగిరీలో ఎంపికై ంది. వీరంతా వచ్చేనెల 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా స్కూలు డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు విద్యార్థులకు శిక్షణనిచ్చిన కోచ్ అరెకపూడి భార్గవ్‌ను అభినందించారు. భీమవరం: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 22వ తేదీన డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా జిల్లాస్థాయి ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, సెట్వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకరరావు తెలిపారు. బుధవారం కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో సైన్స్ మేళా, సైన్స్ ఎగ్జిబిషన్ పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ఎన్ గోపాలకృష్ణమూర్తి, ఎం సురేష్‌బాబు మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్లో బహుమతులు పొందిన ప్రాజెక్టులను అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షుడు సాగి విఠల్ రంగరాజు, చీఫ్ అడ్మిని స్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి, సెట్వెల్ అధికారులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం పట్టణంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ బీవీ రాజు జయంతి సందర్భంగా బుధవారం భీమవరం పరిసర ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా బీవీ రాజు పాఠశాలలోని ప్రతిభ కనబర్చిన 20 మంది విద్యార్థులకు రూ.83 వేలు స్కాలర్షిప్లు అందించారు. భీమవరం, శృంగవృక్షంలోని లెప్రసీ రోగులకు బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని సెంట్‌మేరీస్ లెప్రసీ సెంటర్లోని ఎయిడ్స్, టీబీ, లెప్రసీ రోగులకు రూ.60 వేలు విలువైన మందులతోపాటు 250 మందికి బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. విష్ణు విద్యాసంస్థల విద్యార్థులు ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్‌బ్యాంక్‌లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. వీరవాసరం: కిల్కారి సేవల (చిన్నారి చిరునవ్వు)ను గర్భిణులు, బాలింతలు వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ గీత బాయ్ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆశ నోడల్ ఆఫీసర్స్ మీటింగ్‌లో కిల్కారి సేవలపై ఆమె సమీక్ష నిర్వహించారు. కిల్కారి కాల్ ద్వారా వచ్చే ప్రతి సమాచారాన్ని గర్భిణులు, బాలింతలు పూర్తిగా వినేటట్లు చేయాలన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కిల్కారి కాల్ సర్వీస్‌ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గర్భిణీ అయినా 4 వ నెల మొదలు పుట్టిన బిడ్డకు ఏడాది వయసు వచ్చే వరకు కిల్కారి కాల్స్ వస్తాయని, తద్వారా తల్లీ బిడ్డల ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అందజేస్తుందన్నారు. ఆశ నోడల్ ఆఫీసర్లు గర్భిణీలు, బాలింతలకు కిల్కారి సేవలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజషన్ అధికారిణి డాక్టర్ సుధా లక్ష్మి, డీపీహెచ్ఎన్ఓ వెంకట్రత్నం, డీసీఎం ఎన్.వెంకట స్వామి, కిల్కారి రీజనల్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.రాజు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పరిమితిని యూజీసీ నిబంధనల మాదిరిగానే 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వేసిన రిట్లపై విచారణ ఈ నెల 13న జరిగింది. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే ఈనెలమూడో వారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంతో ఉద్యాన వర్సిటీ వీసీ నియామక వ్యవహారం ముడిపడి ఉండటంతో, వర్సిటీలోని వీసీ కుర్చీ 45 రోజులుగా ఖాళీగానే ఉంది.


