Medak
-
నీతో ఏకాంతంగా ఉన్న ఆ ఇద్దరు మహిళలు ఎవరు? అంటూ హత్య
మెదక్: వివాహేతర సంబంధం మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. భార్య కళ్లుగప్పి మరో ఇద్దరు మహిళలతో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. ఆ విషయాన్ని గుర్తించిన భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. తన తల్లిదండ్రులు, సోదరుడి సాయంతో భర్తను అక్కడికక్కడే చంపేసింది. మెదక్, మిలిటరీ కాలనీలో ఓ ఆర్మీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగా పొన్నం కుమార్‌ను అతడి భార్య, అత్త, మామ, బావమరిది హత్య హత్యచేశారు. ఇంట్లో ఇద్దరు మహిళలతో పొన్నం కుమార్ ఏకాంతంగా ఉండగా అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ ఇద్దరు మహిళలు ఎవరంటూ ఆగ్రహంతో పొన్నం కుమార్‌ను హత్య చేసి, అనంతరం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితులు నలుగురు లొంగిపోయారు. ఉత్తరాఖండ్‌లో ఆర్మీ ఉద్యోగిగా పని చేస్తున్న కుమార్.. ప్రస్తుతం సెలవులు ఉండడంతో ఇంటికి వచ్చాడు. ఈ నెల 10న విధులకు తిరిగి వెళ్లాల్సి ఉండగా హత్యకు గురయ్యాడు. -
ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్
● ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు 15 మార్కులు ● ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుమెదక్ అర్బన్: ఇంటర్మీడియెట్ బోర్డు కీలక మా ర్పులు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లోనూ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఫస్టియర్‌కు 15, సెకండ్ ఇయర్లో 15 మార్కులు కేటాయిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 62 జూనియర్ కళాశాలలు ఉండగా, ఫస్ట్ ఇయర్లో 6,068, సెకండ్ ఇయర్లో 7,055 మంది విద్యార్థులు కలిపి మొత్తం 13,123 మంది ఉన్నారు. కాగా, ఇప్పటివరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీలోనే ప్రయోగ పరీక్షలు ఉండేవి. సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్‌కు 30 మార్కులు ఉండేవి. ఈసారి ఫస్ట్ ఇయర్లో 15, సెకండ్ ఇయర్లో 15 మార్కులు కేటాయించారు. ఎంపీసీలో భౌతిక, రసాయన శాస్త్రాలకు 15 మార్కుల చొప్పున ఫస్ట్ ఇయర్లో 30 మార్కులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయి. గణితంలో ఇప్పటివరకు 75 మార్కులకు రాత పరీక్ష ఉండగా.. ఈసారి నుంచి 60 మార్కులకు, మిగితా 15 మార్కులు కృత్యాధార అభ్ససనానికి కేటాయిస్తారు. ఇతర గ్రూపుల్లో కామర్స్, రాజనీతి శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ తదితర లాంగ్వేజీలకు 80 మార్కులకు రాత పరీక్ష, మరో 20 మార్కులకు అంతర్గత పరీక్షలు ఉండనున్నాయి. -
● భళా.. బాహుబలి
హైదరాబాద్ నుంచి ఒడిశాకు 60 టైర్లతో కూడిన భారీ వాహనంలో భారీ బైలర్ యంత్రాన్ని తరలిస్తున్నారు. శనివారం నర్సాపూర్‌లో రహదారిపై వాహనాన్ని కొద్దిసేపు నిలిపి ఉంచగా, వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా చూశారు. మండలంలోని రెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లుకు అధికారులు ధాన్యం కేటాయించారు. అయితే అన్లోడ్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో మెదక్– హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలు భారీగా నిలిచిపోయాయి. రోజుల తరబడి అన్లోడ్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – నర్సాపూర్ రూరల్లోడ్ దించరు.. లారీ పంపరు -
ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు
● త్వరలోనే షెడ్యూల్ ● విలీన ప్రక్రియ కోసం మొదలైన చర్యలు నారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం మొదలైంది. మెదక్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ కార్మిక నాయకులు సైతం గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీలో గుర్తింపు సంఘాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వంలో విలీనం తదితర ప్రధాన డిమాండ్లతో కార్మికులు ఇటీవల పెద్దఎత్తున ఆందోళన చేపట్టగా..కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల అనంతరం సమ్మె విరమించిన విషయం విదితమే. ఇచ్చిన హామీమేరకు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో రిటర్నింగ్ అధికారిగా జంట నగరాల కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్‌దాస్‌ను నియమించింది. ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, పోలింగ్ తేదీలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. రీజియన్‌లో కదలిక.. ఎన్నికల్లో గెలుపొందిన సంఘంతో ప్రభుత్వం, కమిటీ చర్చలు జరిపిన తర్వాతనే ఆర్టీసీ విలీన ప్రక్రియ జరగనుంది. తమను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు చేస్తున్న పోరాటం ఫలితంగా ప్రభుత్వం దిగిరావడం, విలీన ప్రక్రియకు ఎన్నికల నగారాకు ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. కాగా, మెదక్ రీజియన్ పరిధిలో సైతం కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రీజియన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియర్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్),ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన యూనియన్లుగా ఉండగా వీటితోపాటు మరికొన్ని యూనియన్లు కూడా ఉన్నాయి. కొన్ని ప్రధాన యూనియన్లలోనే సభ్యత్వ నమోదు గతంలో అధికంగా జరిగేది. -
నాయకత్వ లక్షణాలు పెంచుకోండి
ఎస్పీ శ్రీనివాస్రావుపాపన్నపేట(మెదక్): పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు బాల పంచాయతీలను ఏర్పా టు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందజేయడం మన బాధ్యత అన్నారు. బాలల ఆలోచనలు, అభిప్రాయాలు సమాజ అభివృద్ధికి తోడ్పడుతాయని చెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు, సామాజిక స్పృహను అలవర్చుకోవాలని సూచించారు. విద్యతో పాటు సామాజిక వికాసం కూడా ముఖ్యమన్నారు. బాల్య వివాహాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, నిరక్షరాస్యత, బాల కార్మిక చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీడబ్ల్యూఓ ఉప్పలయ్య, సర్పంచ్ పావని, ఎస్సై శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేటలో ని కేజీబీవీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రారంభిస్తున్నామని ప్రిన్సిపాల్ విజయ తెలిపారు. ఇంటర్లో చేరడానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 256 కేంద్రాల్లో Mö¯]l$-Vøâ¶æ$Ï ç³NÇ¢: MýSÌñæMýStÆŠḥæమెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇప్పటివరకు 256 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 80,391 మంది రైతుల నుంచి 3,67,685,080 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మద్యం అమ్మకాలపై నిషేధం చేగుంట(తూప్రాన్): మద్య నిషేధంపై మండలంలోని బీ.కొండాపూర్ గ్రామ సభలో తీర్మానం చేశారు. మండలంలోని ఆరు గ్రామా ల్లో శనివారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా, బీ.కొండాపూర్‌లో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్యర్యంలో మద్య నిషేధంపై తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే వడియారంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ పాల్గొని ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడుదాం.. పక్షులను రక్షిద్దాం హవేళిఘణాపూర్(మెదక్): ప్రకృతిని కాపాడి పక్షులను రక్షించుకుందామని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శనివారం మండల పరిధిలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అటవీ వారోత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా పోచారం అభయారణ్యంలో బర్డ్‌వాక్‌ను డీఎఫ్ఓ జోజీతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే బర్డ్‌వాక్ కార్యక్రమం చేపట్టామన్నారు. పో చారం విభిన్న పక్షి జీవనానికి ప్రసిద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు, వాచర్లు పాల్గొన్నారు. బ్యాంకర్ల పాత్ర కీలకం మెదక్ కలెక్టరేట్: ఆర్థికాభివృద్ధిలో జిల్లా దూసుకెళ్తుందని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 5,607.28 కోట్ల రుణాలు పంపిణీ చేసి, లక్ష్య సాధనలో 85.05 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందడంలో బ్యాంకర్ల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. రుణాల పంపిణీలో రైతులు, మహిళా సంఘాలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. లక్ష్య సాధనలో మిగితా పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో ఆర్బీఐ ప్రతినిధి శ్రీనివాస్, ఎల్డీఎం బాపూజీ, నాబార్డ్ డీడీఎం కృష్ణ చైతన్య, వివిధ బ్యాంకుల ఏజీఎంలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గజం రూ. 22 వేలు
భారీగా పెరిగిన భూముల విలువ భూముల విలువలు డబుల్ అయ్యాయి. మెదక్ పట్టణంలోని జేఎన్‌రోడ్డులో అత్యధికంగా గజం రూ. 22 వేలు పెరిగింది. పట్టణ శివారుల్లో గజం రూ. 700 నుంచి రూ.1,400 వరకు పెంచారు. అలాగే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఆయా మండలాల పరిధిలో సైతం భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం పెంచింది. – మెదక్‌జోన్ జిల్లా కేంద్రంలోని చమాన్ చౌరస్తా, జేఎన్‌రోడ్డులో మొన్నటి వరకు గజం భూమి రూ.17,600 ఉండగా, ఈనెల 5 నుంచి రూ.22 వేలకు పెరిగింది. ఇది మున్సిపాలిటీలో అత్యధికం. అలాగే మున్సిపాలిటీలో నూతనంగా విలీనం అయిన అవుసులపల్లి, ఔరంగాబాద్, పిల్లికొటాల్ శివారుల్లో గజం ధర మొన్నటి వరకు రూ. 700 ఉండగా, ప్రస్తుతం రూ.1,400కు చేరుకుంది. అంటే రెండింతలు పెరిగింది. అపార్ట్మెంట్లలో అంతస్తును బట్టి స్క్వేర్ ఫీట్‌కు మార్కెట్లో గజం ధర రూ.1,500 నుంచి రూ. 1,800లకు పెంచారు. మరికొన్ని చోట్ల రూ. 1,300 నుంచి రూ.1,500కు పెరిగింది. చర్చి ఏరియాలో గజం రూ. 3,100 నుంచి రూ. 5,000కు చేరుకుంది. అలాగే జిల్లాలోని పాపన్నపేట, పెద్దశంకరంపేట, కొల్చారం, టేక్మాల్, రేగోడ్, మెదక్, అల్లాదుర్గం, హవేళిఘణాపూర్ మండలాల్లో మాత్రం గజం రూ. 700 నుంచి రూ.1,300కు చేరుకుంది. మెదక్ పట్టణంలోని 1వ వార్డులో రూ.5000 నుంచి రూ. 6,200కు పెరగగా, స్లమ్ ఏరియా గొల్కొండ ప్రాంతంలో మాత్రం గజం ధర 4,100 ఉండగా, ఆ ప్రాంతంలో కొత్తగా భూముల ధరలు పెంచలేదు. నర్సాపూర్‌లో.. నర్సాపూర్ మున్సిపాలిటీలోని మెదక్–నర్సాపూర్, తూప్రాన్–నర్సాపూర్ ప్రధాన రహదారుల పక్కన గతంలో గజం భూమి రూ. 6,100 ఉండగా, ప్రస్తుతం రూ.10,700కు పెరిగింది. పట్టణం లోపలి భాగంలో రూ. 2,500 నుంచి రూ. 4,800కు పెంచారు. నర్సాపూర్ మండలంలో ఎకరా రూ.4.50 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.10 లక్షలకు పెరిగింది. తూప్రాన్‌లో.. తూప్రాన్ మండలంలో ఎకరా రూ.18 లక్షలకు ఉండగా, ప్రస్తుతం అది రూ.36 లక్షలకు చేరింది. పట్టణంలో గజం రూ. 22,300కు గానూ రూ. 23,400, హెచ్ఎండీఏ పరిధిలో రూ. 3,100 నుంచి రూ. 5,500 పెరిగింది. కాళ్లకల్‌లో రూ.3,100 నుంచి రూ.3,900కు పెంచారు. అలాగే ఎన్‌హెచ్–44ను ఆనుకొని ఉన్న భూమి ఎకరా రూ.1.52 కోట్లు ఉండగా, ప్రస్తుతం ఆ ధర పెరగలేదు. రామాయంపేటలో.. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును ఆనుకొని ఉన్న భూములు గజం రూ. 9,500 నుంచి రూ. 11 వేలకు పెరిగింది. జాతీయ ఎన్‌హెచ్– 44ను ఆనుకొని ఉన్న వ్యవసాయ భూమి ఎకరా రూ. 50.82 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ. 1.2 కోట్లకు పెరిగింది. మండలంలోని పలు గ్రామాల్లో గజం రూ. 2,400 నుంచి రూ. 3,600కు పెరిగింది. -
ధాన్యం కొనాలని ఆందోళన
కౌడిపల్లి(నర్సాపూర్)/కొల్చారం: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని ఆగ్రహ ం వ్యక్తం చేస్తూ శనివారం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని తునికి గేట్ వద్ద 765డీ హైవేపై తునికి దేవులతండా రైతులు రాస్తారోకో చేశారు. లారీలు రాకపోవడంతో ధాన్యం పేరుకుపోయిందని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షాకాలం ప్రారంభం అవుతుంటే ధాన్యం సేకరణ ఎప్పుడు పూర్తి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో ఎస్ఐ అమరేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అలాగే కొల్చారం మండలం చిన్నఘనాపూర్కు చెందిన రైతులు మెదక్–జోగిపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. -
చెరువుల్ని చెరమట్టి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మంతూరు పోచంపెద్ద చెరువులో పది వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకునేందుకు స్థానిక అధికారులు అడ్డదారిలో అనుమతులు కట్టబెట్టారు. వాల్టా చట్టాన్ని, పర్యావరణ నిబంధనలను చెరువులోనే తొక్కేసి ఇచ్చిన ఈ అనుమతుల జారీ వెనుక ఆయా శాఖల అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయనేది బహిరంగ రహస్యం. ఈ అడ్డదారిలో పొందిన అనుమతులను ఆసరాగా చేసుకుని ఇక్కడ విచ్చలవిడిగా మట్టి దందా సాగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా భారీ కెపాసిటీ కలిగిన జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. ఎన్ని క్యూబిక్‌మీటర్లు తరలిస్తున్నారనేది లెక్కపెట్టే నాథుడే లేకుండా నిత్యం వందలాది భారీ టిప్పర్లలో విలువైన సహజ సంపదను తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పెద్ద చెరువులోనూ 50 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ అయ్యాయి. ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ జేసీబీలతో పెద్ద చెరువు గర్భాన్ని తొలిచేస్తున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మట్టి అక్రమ దందా మూడు జేసీబీలు..ఆరు టిప్పర్లు అన్నట్లు సాగుతోంది. దొడ్డిదారిన తీసుకున్న నామమాత్ర అనుమతుల పేరుతో రూ.కోట్లు విలువ చేసే సహజ సంపదను లూఠీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రీ పగలు తేడా లేకుండా చెరువులను తొలిచేస్తున్నారు. హై కెపాసిటీ కలిగిన జేసీబీలు, ప్రొక్లయినర్లను దించి చెరువులను తొలిచేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో మట్టిని నింపి తరలిస్తున్నారు. అడ్డదారిలో తరలిస్తున్న ఈ మట్టి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా.అధికారులేమన్నారంటే.. ఈ మట్టి తవ్వకాలకు అక్రమ అనుమతుల జారీ విషయమై నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్‌ను ‘సాక్షి’ప్రతినిధి ఫొన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. ఆర్డీఓ రామకృష్ణను వివరణ కోరగా..అనుమతుల మంజూరుకు సంబంధించిన నిబంధనలను పరిశీలిస్తామన్నారు. పూర్తి వివరాలు కావాలంటే నీటిపారుదలశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంగీతను సంప్రదించగా తాను బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అంతకుముందు ఇచ్చి ఉండవచ్చని, ఫైల్ తెప్పించుకుని వివరాలు తెలుసుకుంటానన్నారు.ఇటుక బట్టీలకు తరలింపు.. నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టి (సిల్ట్) తవ్వుకోవాలంటే రైతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ మట్టిని పొలాల్లో వేసుకుని ఎరువులాగ వాడుకుంటారు. రైతులకు మినహా ఇటు వాణిజ్య అవసరాలకు తవ్వుకోవాలంటే తప్పనిసరిగా భూగర్భ గనుల శాఖ నుంచి క్వారీ అనుమతులు మంజూరు చేయించుకోవాలి. అక్కడి నుంచి తరలించే ప్రతీ మట్టి టిప్పర్‌కు సీనరేజీ చెల్లించి వేబిల్లులతో మట్టిని రవాణా చేయాలి. కానీ గనుల శాఖ నుంచి క్వారీ లీజు మంజూరు లేకుండానే తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డీఎంఎఫ్‌టీకి నామమాత్రంగా డబ్బులు చెల్లించి రూ.కోట్లు విలువ చేసే సహజ సంపదను లూఠీ చేస్తున్నారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ మట్టి అక్రమ దందాకు నీటిపారుదల శాఖ అధికారులతోపాటు, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు ప్రత్యక్షంగానే సహకరిస్తుండటం వెనుక రూ.లక్షల్లో ముడుపులే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యథేచ్ఛగా మట్టి దందా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం అల్వ చెరువును కూడా లూఠీ చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇక్కడ ఏకంగా 60 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకునే అనుమతులు కట్టబెట్టేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. స్థానికంగా ఉన్న అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏకమై తెరలేపిన ఈ మట్టి దందా కోసం పాత తేదీల్లో వేలం పాట నిర్వహించినట్లు రికార్డులు సృష్టించారు. రూ.లక్షల్లో మట్టి ముడుపుల పంపకాలు బయటకుపొక్కడంతో ఈ రెండు పార్టీ ల్లోని ఒక ప్రత్యర్థివర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దని పలువురు ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. గతంలో అనుమతి లే కుండా తవ్వకాలు జరిగితే అడ్డుకున్నారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం అడ్డదారిలో అనుమతులు కట్టబెట్టాలని చూస్తున్నారు. -
పేదల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిన్నశంకరంపేట(మెదక్): పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డ పెళ్లికి అసరాగా నిలిచిచేందుకు రూ. 1 లక్ష అందజేస్తున్నట్లు తెలిపా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు, ఉచిత కరెంట్, సన్నబియ్యం అందించడం ద్వారా పేదలకు మేలు చేశామన్నారు. గత పదేళ్లలో ఎక్కడా ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వంలో ఊరూరా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం మండలంలోని కొర్విపల్లి, టీ.మాందాపూర్, ప్యాటగడ్డలో ఎంఎస్ఎస్ఓ ద్వారా సొంత నిధుల తో వేసిన బోరు మోటర్లను ఎమ్మెల్యే ప్రారంభించా రు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, సర్పంచ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌నాయక్, రమణ, రాజిరెడ్డి, సత్యనారాయణ, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తొందరొద్దు!
ఖరీఫ్‌కు ‘ఎల్‌నినో’ ముప్పు ఖరీఫ్‌కు ఎల్‌నినో ముప్పు తొలకరి జల్లులు కురువగానే విత్తనాలు వేయడం రైతులకు అలవాటు. అయితే ఈ వానాకాలంలో ‘ఎల్‌నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. దీంతో జిల్లా వ్యవసాయశాఖ అప్రమత్తం అయింది. జూలై, ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్‌జోన్ మెతుకుసీమ అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు. 90 శాతానికి పైగా రైతులకు జీవనాధారం. ఈ ఖరీఫ్ సీజన్లో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను ఖరారు చేశారు. అయితే ఈసారి ‘ఎల్‌నినో’ ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అదే జరిగితే రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన విత్తనాలను సిద్ధంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. గతేడాది మే 26న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, ఈ ఏడాది ఆలస్యంగా ఈనెల రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కురవాల్సిన సమయంలో కాకుండా, ఒకేసారి భారీ వర్షం కురిసి పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని, అలాంటి పరిస్థితి ఆగస్టు 15 వరకు జరిగితే యథావిధిగా వరిసాగు చేసుకునే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మూడు విధాలుగా విభజన సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిస్తే మూడు విభాగాలుగా ఆకస్మికంగా ప్రణాళికలను మారుస్తూ, ముందుకు సాగాలనే నివేదికను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా జూలై 15 వరకు సాధారణం కన్నా తక్కువ వర్షం కురిస్తే పప్పు దినుసులు, మిల్లెట్స్, చిరుధాన్యాలు, నూనె గింజలు సాగు చేయాలని, జూలై 30 వరకు తక్కువ వర్షపాతం నమోదైతే కంది, సోయాబిన్, పొద్దు తిరుగుడు, కూరగాయల సాగు, ఆగస్టు 30 వరకు సాధారణం కన్నా తక్కువ వర్షం కురిస్తే కందులు, ఆముధం, కొర్రలు, మొక్కజొన్న, జొన్నలు, కూరగాయలు సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అప్రమత్తమైన వ్యవసాయ శాఖ రైతులకు విస్తృత అవగాహన సాగు పద్ధతులు మార్చుకోవాలని సూచన -
బ్రోకర్ల చేతిలో బ్రేకులు!
ఒక్కో సేవకు ఒక్కో రేటు ● ఆర్టీఏ కార్యాలయంలో మామూళ్ల జాతర ● రోజుకు రూ. లక్షల్లో ఆదాయం మెదక్ అర్బన్: మరో వారం రోజుల్లో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఇంకేముంది బస్సుల ఫిట్ నెస్‌తో ఆర్టీఏ కార్యాలయంలో మామూళ్ల జాతర ఊపందుకుంది. పెద్ద కళాశాలల వద్దకు స్వయంగా అధికారులే వెళ్లి.. మామూళ్లు దండుకొని ఫిట్నెస్లు ఇచ్చి వస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. రూ. లక్షల్లో కొనసాగుతున్న అవినీతి దందా.. అధి కారులకు కనక వర్షం కురిపిస్తుంది. బ్రోకర్ల చేతిలో బ్రేకులు అన్న చందంగా.. తమ చేతికి మట్టి అంటకుండా లంచాలు లాగేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బదిలీల వేళ.. ఆర్టీఏ కార్యాలయంలో బదిలీపై వెళ్లే అధికారులు మామూళ్ల జోరు పెంచారు. ఇందుకు స్కూల్ బస్సుల ఫిట్నెస్ కలిసి వచ్చింది. జిల్లాలో 314 స్కూల్ బస్సులు ఉన్నాయి. అందులో ఈనెల 1 వరకు వరకు 125 బస్సులు ఫిట్నెస్ పొందినట్లు తెలిసింది. 189కి ఫిట్నెస్ ఇవ్వాల్సి ఉంది. అయితే కొన్ని పేరు మోసిన విద్యా సంస్థలకు ఎక్కువ బస్సులు ఉండటంతో అధికారులు అక్కడికే వెళ్లి ఫిట్నెస్ ఇస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ప్రతి బస్సు ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వేల రూపాయల మామూళ్లు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కార్యాలయంలో పని చేసే పోలీస్, హోంగార్డులు, ఇతర సిబ్బంది తమకు తోచిన మేర పైరవీలు చేస్తూ లంచాలు సేకరించి, వాటాలేసి పంచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా కార్యాలయం నుంచి రోజుకు ఎంత లేదన్నా రూ.లక్ష వరకు ముడుపులు సేకరిస్తున్నారని సమాచారం. జిల్లాలోని వాహన వినియోగదారులకు సేవలందించేందుకు మెదక్‌లో ఆర్టీఏ కార్యాలయం ఉంది. బ్రోకర్ల వ్యవస్థ రద్దు చేసినా, వారి ద్వారా వస్తేనే ఏ పనైనా జరుగుతుందని బహిరంగ రహస్యం. ముడుపులు లేనిదే.. ఒక్క లైసెన్స్ బయటకు రాదనే ఆరోపణలున్నాయి. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేట మండలాల్లో సుమారు 50 మంది వరకు బ్రోకర్లు ఉంటారు. వాహనాల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్లు, లైసెన్స్ రెన్యువల్స్ తదితర సేవలకు ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లుకు తెగబడుతున్నారు. పేపర్‌పై ఒక్కో బ్రోకర్, ఒక్కో కోడ్ వేసి పంపుతుంటారు. పని అయిపోయిన తర్వాత సాయంత్రం ఒకరిద్దరు ఏజెంట్లు రోజు వారి వసూళ్లను జమ చేసి సంబంధిత అధికారులకు గుట్టు చప్పడు కాకుండా అందజేస్తున్నారు. ఈ విషయమై బదిలీపై వెళ్లిన డీటీఓ వెంకట్స్వామిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా.. స్పందించ లేదు. -
జొన్నల కొనుగోళ్లు వేగవంతం
రామాయంపేట(మెదక్): జొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కొనసాగుతున్న జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. రైతులు నాణ్యతగా ఉన్న జొన్నలను మాత్రమే కేంద్రాలకు తరలించాలని సూచించారు. నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశించారు. అనంతరం ధా న్యం కొనుగోళ్లకు సంబంధించి రైస్ మిల్లులను సందర్శించారు. వెంటనే అన్లోడింగ్ చేసు కోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రజని, ఇతర అధికారులు ఉన్నారు. చిలప్‌చెడ్(నర్సాపూర్): శీలాంపల్లి, గంగారం, చిట్కుల్ సబ్స్టేషన్లలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాకేశ్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. నర్సాపూర్: నర్సాపూర్‌లోని అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కాలేజీలో ఈనెల 12న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ గంగరాంనాయక్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలన్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మెదక్‌జోన్: జిల్లా రవాణా శాఖ అధికారిగా శ్రీకాంత్ చక్రవర్తి శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన కరీంనగర్ నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ చాలా కాలంగా పని చేసిన వెంకటస్వామి ఖమ్మం జిల్లా వైరాకు బదిలీ అయ్యారు. హవేళిఘణాపూర్(మెదక్): ఈనెల 2 నుంచి హవేళిఘణాపూర్ డైట్ కళాశాలలో ప్రారంభమైన ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. చివరి రోజు అధిక శాతం మంది విద్యార్థులు తరలివచ్చారు. మొత్తం 1,089 మంది అభ్యర్థులకు గానూ 1,208 మంది ధ్రువపత్రాలతో హాజరైనట్లు డైట్ ప్రిన్సిపాల్ రాధాకిషన్ తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది సుభాశ్‌రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కనాటి సంరక్షించాలని మె దక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్‌చైర్మన్ నరేశ్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని మల్లం చెరువు వద్ద మొక్కలు నా టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మెదక్‌ను హరితవనంలా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ నవీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మానవాళికి చెట్లే ఆధారం
పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహరిరామాయంపేట(మెదక్): మానవాళి మనుగడకు చెట్లే ప్రధానమని రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహరి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని అక్కన్నపేట అటవీప్రాంతం నగర వనయోజన పార్కులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించి పలు పథకాల కింద విరివిగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. మెదక్ అటవీప్రాంతాన్ని టూరిస్ట్ హబ్‌గా రూపొందించాలన్నారు. జిల్లావ్యాప్తంగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారీకి ప్రణాళికలు రూపొందించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని కోరారు. అమ్మ ప్రేమ, త్యాగానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అటవీ సంపద సంరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల రక్షణ విషయమై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంతకుముందు పార్కులో మొక్కలు నాటి అటవీ సంరక్షణ విషయమై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి జోజి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, రోడ్డు భవనాలశాఖ ఈఈ వేణు, అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అమ్మ పేరుతో మొక్క నాటండి
ఎంపీ రఘునందన్‌రావు మెదక్‌జోన్: జన్మనిచ్చిన తల్లి పేరుతో ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి పరిరక్షించాలని ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు, ప్రజలు, తప్పనిసరిగా ‘ఏక్ పెడ్ మాకే నామ్ పే’లో భాగంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. పర్యావరణ సమతుల్యత కోసం త్వరలోనే మెదక్– ఎల్కతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రజిత్‌రెడ్డి, సురేశ్, నాయకులు శంకర్‌గౌడ్, నాగరాజు, రాగి రాములు, నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో నాణ్యమైన విద్య
ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీఓ రాజేశం కౌడిపల్లి(నర్సాపూర్): గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజన వసతులు ఉంటాయని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలల ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీఓ రాజేశం తెలిపారు. శుక్రవారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలకు సంబంధించి విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 29 ఎంజేపీ బీసీ గురుకులాల్లో 508 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నారని వివరించారు. క్రమశిక్షణ, క్రీడలు, దుస్తులు మెరుగైన వసతులతో విద్యా బోధన ఉంటుందని చెప్పారు. విద్యార్థుల అభివృద్ధికి గురుకులాలు ఎంతో కృషి చేస్తున్నాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ హరిబాబు, వివిధ గురుకులాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది పాల్గొన్నారు. -
కర్షకుల కన్నెర్ర
కౌడిపల్లి(నర్సాపూర్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావ్‌పేటగేట్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పక్షం రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దకు లారీలు రావడం లేదన్నారు. దీంతో ధాన్యం బస్తాలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు వచ్చే వరకు రాస్తారోకో విరమించమని బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అమరేందర్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామాంజనేయులు, వెంకట్‌గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం వెంటనే కొనాలి
నిజాంపేట(మెదక్): భారీ వర్షాలకు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని నందిగామ శివారు రాయిలాపూర్ గేటు వద్ద హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర అందోళనకు గురవుతున్నారని తెలిపారు. మరో రెండు రోజుల్లో మృగశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లారీలు, కూలీల కొరతతో ధాన్యం తరలింపు నిలిచిపోయిందని, దీంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాయలపూర్‌లో తడిసిన ధాన్యాన్ని కొను గోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో పెద్దఎత్తున అందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రా మాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, నిజాంపేట సీనియర్ నాయకులు సంపత్, సుప్రభాతరావు, మాజీ సర్పంచ్ నర్సాగౌడ్, సత్యం, భిక్షపతి, ఉమామహేశ్వర్, అబ్దుల్ అజిజ్, హస్నొద్దీన్, నవీన్, మధుకర్, శ్రావణ్, మహేశ్ రంజిత్ గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
కొనుగోళ్లలో వేగం పెంచండి
కలెక్టర్ ప్రతిమాసింగ్ చిన్నశంకరంపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నార్సింగి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం కాంటా చేయడంతో పాటు తరలించేందుకు ఏర్పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఇప్పటికే ముగిసిన కొనుగోలు కేంద్రాల నుంచి సిబ్బంది, హమాలీలు, వాహనాలను అవసరమైన చోటుకు సమకూర్చుకోవాలని సూచించారు. అవసరమైతే గోదాంలలో ధాన్యం నిల్వ చేసే జీపీఓలకు బాధ్యతలు అప్పగించాలన్నారు. రైస్‌మిల్లుల వద్ద రెవెన్యూ సిబ్బందిని ఉంచి అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అనంతరం నార్సింగిలో జనగణన ప్రక్రియను పరిశీలించారు. ప్రజల సమాచారం పక్కాగా నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ నిత్యానందం, డీఎంసీఎస్ భుజంగరావు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ గ్రేసిబాయి ఉన్నారు. అనంతరం కలెక్టరేట్లో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ 2026–27 లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ నివారణను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు. -
నేటి నుంచే కొత్త ధరలు
● జిల్లాలో 20 నుంచి 50శాతం భూముల రేట్లు పెంపు ● మెదక్ సబ్ రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్ మెదక్ కలెక్టరేట్: బహిరంగ మార్కెట్లో ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం భూముల విలువను పెంచినట్లు మెదక్ సబ్ రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం సాక్షితో మాట్లాడారు. ఈ పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. దీని ప్రకారం నివాస, కమర్షియల్ స్థలాల ధరలను 20 నుంచి 50 శాతం పెంచగా, వ్యవసాయ భూముల ధరలను 75 శాతం మేర పెంచారన్నారు. ఈ మార్పులు మెదక్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మెదక్ మున్సిపాలిటీ సహా 8 మండలాలు, 160 గ్రామాల్లో వర్తించనున్నాయన్నారు. మెదక్ పట్టణ పరిధిలోని విలీన గ్రామాలైన ఔరంగాబాద్, అవుసులపల్లి, పిల్లికోటాల్, ఫత్తేనగర్ వంటి ప్రాంతాల్లో భూముల ధరలు 20 నుంచి 50 శాతం పెరిగాయని తెలిపారు. అయితే, ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని స్లమ్ ఏరియాల్లోనూ, మెదక్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ, గోల్కొండ వీధిలోని 1–9 ఇంటి సిరీస్ వంటి ప్రాంతాల్లోనూ పాత ధరలనే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ధరల పెంపుతో రిజిస్ట్రేషన్లపై పెద్దగా ప్రభావం ఉండదని, రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. -
చేయూత ఏదీ?
కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు నిరాశే ● జూన్ 2న ఇస్తామని ముందే ప్రకటించిన ప్రభుత్వం ● అవతరణ వేడుకల్లో ఆ ఊసెత్తని సర్కార్ ● నాలుగేళ్లుగా తప్పని ఎదురుచూపులు ● జిల్లాలో నూతన దరఖాస్తుదారులు 12,260 మెదక్‌జోన్: రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించింది. దీంతో నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు సంతోషించారు. కానీ ఆ రోజు పింఛన్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశకు లోనయ్యారు. మెదక్ జిల్లాలో వివిధ రకాల పింఛన్లు 1,08,402 ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఆగస్టులో చివరిసారిగా పింఛన్లు మంజూరు చేసింది. కాగా దుబ్బాక, మునుగోడు నల్గొండలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో అర్హులైన వారు చేయూత పింఛన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, సైట్‌ను నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంచింది. అలాగే ప్రజావాణిలో కొందరు, నేరుగా మరి కొందరు, ఆఫ్‌లైన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 వేల మంది వివిధ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. నాలుగేళ్లుగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 12,260 మందికి చేరుకుంది. కాగా పింఛన్లకోసం దరఖాస్తు చేసుకుని ఎప్పడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు నిరాశే మిగిలింది. జూన్ 2న, రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించటంతో జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు పలు ధ్రువపత్రాలు మీసేవా కేంద్రాల ద్వారా తీసుకున్నారు. ప్రధానంగా భర్తల మరణ ధ్రువీకరణ, వయస్సు నిర్ధారణ కోసం ఆధార్, సదరం క్యాంపుల్లో పొందిన వికలాంగుల ధ్రువీకరణ తదితర పత్రాలు తీసుకొని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. వృద్ధాప్య పింఛన్ పొందే వ్యక్తి చనిపోయినట్లయితే మృతుడి భార్య జీవించి ఉంటే ఆమెకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేస్తున్నారు. కానీ వయస్సు రీత్యా 65 ఏళ్లు దాటిన వారికి, సదరం క్యాంపు ద్వారా వికలాంగుల సర్టిఫికెట్ పొందిన వారికి, చిన్న వయస్సులో భర్త చనిపోయిన, ఒంటరి మహిళలు, బీడీ,గీత, చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరీ చేయడం లేదు. ఎలాంటి సమాచారం లేదు కొత్తగా చేయూత పింఛన్ల గురించి ఎలాంటి సమాచారం లేదు. నాలుగేళ్లుగా జిల్లాలో ఆన్లైన్ ద్వారా 1,260 మంది ఆఫ్‌లైన్ ద్వారా సుమారు 11 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరు కాగానే లబ్ధిదారులకు అందిస్తాం. – బీమయ్య, డీపీఎం, మెదక్ -
జొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయండి
జిల్లా కోఆపరేటివ్ అధికారి పద్మ అల్లాదుర్గం(మెదక్): జొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కోఆపరేటివ్ అధికారి పద్మ ఆదేశించారు. గురువారం అల్లాదుర్గంలో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతుల నుంచి సేకరించిన జొన్నలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ శివగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అదనపు కలెక్టర్ నగేశ్ చిన్నశంకరంపేట(మెదక్): రానున్న వర్షకాలంలో అనర్థాలను అరికట్టేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. మండలంలోని రుద్రారం గ్రామంలో సర్పంచ్ సంతోషనవీన్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, మురుగు కాలువలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, హార్టికల్చర్ జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్, ఎంపీడీఓ దామోదర్, తహసీల్దార్ మాలతి పాల్గొన్నారు. గ్రామసభ అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలకే అందిస్తున్నారని అదనపు కలెక్టర్ వద్ద వాపోయారు. రూ.25 వేల జరిమానా విధిస్తాం వ్యవసాయశాఖ జిల్లా అధికారి దేవ్‌కుమార్ చిన్నశంకరంపేట(మెదక్): వరికోతల అనంతరం వరికొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి దేవ్‌కుమార్ రైతులకు సూచించారు. వరికొయ్యలను తగలబెట్టి పర్యావరణానికి నష్టం కలిగిస్తే రైతులకు రూ. 25 వేల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. గురువారం మండల పరిధి రుద్రారం గ్రామంలో రైతు చేవెళ్ల దుర్గయ్య పంట పొలంలో వేసిన జీలుగను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు బలం చేకూర్చి, భూసారం పెంపొందించేందుకు అవసరమైన జీలుగ, పెద్ద జనుము నాటాలన్నారు. కోతల అనంతరం నీటి తడిపెట్టి పొలంలో సూపర్ ఫాస్పేట్ వేసి దుక్కిదున్నడం వల్ల సత్ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓలు ప్రవీణ్‌కుమార్, యాదగిరి, ఏఈఓ మధులిక ఉన్నారు. -
తరుగు పేరుతో దోపిడీ తగదు
● కొనుగోళ్లు చేయడం లేదని రైతుల ఆగ్రహం ● ధాన్యం తగలబెట్టేందుకు యత్నం ● అడ్డుకున్న అధికారులు అల్లాదుర్గం(మెదక్): బస్తాకు నాలుగు కిలోల తరుగు పేరుతో దొపిడీ చేయడం తగదని, కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహించారు. రోడ్డుపై ధాన్యాన్ని పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు. రైతులు మాట్లాడుతూ అల్లాదుర్గం ఐబీ చౌరస్తాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రైసు మిల్లుర్లు బస్తాకు నాలుగు కిలోల తరుగు ఇస్తే తీసుకుంటారని సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మల్లయ్య, సీఐ రేణుకారెడ్డి, ఎంపీడీఓ వేదప్రకాశ్రెడ్డి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. తరుగు ఎక్కువగా కట్‌చేస్తే కేసులు నమోదు చేస్తామ న్నారు. ఐకేపీ సీఏపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తరలించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు. -
ఫ్యూచర్లోకి నర్సాపూర్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర వాణిజ్య పన్నుల (జీఎస్టీ) శాఖను పునర్ వ్యవస్థీకరించిన రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి డివిజన్‌ను ఫ్యూచర్ సిటీ సర్కిల్లో విలీనం చేసింది. అలాగే మెదక్ జిల్లాలో ఉన్న నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లతోపాటు, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్‌ను కూడా ఫ్యూచర్‌సిటీ సర్కిల్లో కలిపారు. ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యూచర్‌సిటీ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం విదితమే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఫ్యూచర్‌సిటీని వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించిన కొత్త డివిజన్‌గా మార్చింది. రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ ఆర్) లోపల (ప్యూర్ ఏరియా) ఉన్న డివిజన్లన్నింటినీ కూడా ఈ ఫ్యూచర్‌సిటీ సర్కిల్లో విలీనం చేసినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలోని ఈ నాలుగు సర్కిళ్లు నిజామా బాద్ డివిజన్ పరిధిలో ఉండేవి. ఈ మేరకు ప్రభు త్వం ఇటీవల జీఓ నెంచి 126ను జారీ చేసింది. నిజామాబాద్ డివిజన్లో జహీరాబాద్.. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ సర్కిల్‌ను మాత్రం నిజామాబాద్ డివిజన్‌లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మెదక్, సిద్దిపేట ప్యూర్ ఏరియా పరిధిలో ఉన్న ఆశాఖ సర్కిళ్లను కూడా నిజామాబాద్ డివిజన్ పరిధిలోనే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ప్యూర్ ఏరియా పరిధిలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్ సర్కిళ్లను మాత్రం శేర్లింగంపల్లి సర్కిల్లో విలీనం చేశారు. ఇలా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన సర్కిల్ కార్యాలయాలన్నీ మూడు భాగాలుగా విడిపోయాయి. ఈ వాణిజ్య పన్నుల శాఖకు అత్యధికంగా జీఎస్టీ చెల్లించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ను సైతం శేర్లింగంపల్లి డివిజన్లో విలీనం చేశారు. ఇప్పటివరకు ఈ బీహెచ్ఈఎల్ నిజామాబాద్ డివిజన్లో కొనసాగింది. సంగారెడ్డి నుంచే ఖజానాకు కాసుల గలగల.. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు అత్యధిక పన్ను రాబడి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే ఎక్కువ. ఇక్కడ పరిశ్రమలతోపాటు, వ్యాపార సంస్థల నుంచి అత్యధికంగా జీఎస్టీ, ఇతర పన్నుల ఆదాయం లభిస్తుంది. ప్రధానంగా సంగారెడ్డి సర్కిల్ నుంచే రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల ఉంటుంది. ఇందుకు ఇక్కడ వివిధ దేశాలకు ఎగుమతి అయ్యే ఫార్మా, బల్క్‌డ్రగ్, ఇంజనీరింగ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ పరిశ్రమలే కారణం. బీహెచ్ఈఎల్తోపాటు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ భారీ పరిశ్రమలు ప్రతినెలా రూ.కోట్లలో జీఎస్టీలు, ఇతర పన్నులు చెల్లిస్తుంటాయి. అలాగే వ్యాపారులు, వ్యాపార సంస్థలు కూడా ప్రతినెలా జీఎస్టీ చెల్లింపులు ఉంటాయి. ఇలా వాణిజ్యపన్నుల రాబడిలో సంగారెడ్డి జిల్లా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పోటీ పడుతోంది. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న ఈ శాఖ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు వ్యాపార, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. -
చివరి గింజ వరకూ కొంటాం
● రైతులు అధైర్య పడొద్దు... ● కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు, బడిబాట, జనగణన అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ముందుగా జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, డీఆర్డీఓపీడీ శ్రీనివాసరావు, డీఎస్ఓ నిత్యానందలతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 71,327 మంది రైతుల నుంచి 3,50,620.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అలాగే 57,496 మంది రైతుల ఖాతాల్లో రూ.616.93 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 200 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలి.. బడిబాట’ కార్యక్రమంపై డీఈఓ రాజు, చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్ రాజు, ఏఎంఓ సుదర్శన మూర్తి, నవీన్‌లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. తక్కువ నమోదు ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రీ–ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పకడ్బందీగా జనగణన.. దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కీలకమైన జనగణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, ప్రజలు పూర్తి సమాచారంతో సహకరించాలని కోరారు. జనగణన సిబ్బందికి అవసరమైన శిక్షణ, సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026ఎమ్మెల్యే సునీతారెడ్డికౌడిపల్లి(నర్సాపూర్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, దీంతో పేదల సొంతింటికల నెరవేరుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మండలంలోని తునికి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఆమె భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులందరికీ ఇళ్లు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, ఉపసర్పంచ్ మధుసూదన్‌గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు ఎల్లం, మహిపాల్‌రెడ్డి, శేఖర్, శ్రీనివాస్, సాయాగౌడ్, మాణిఖ్యరెడ్డి, లక్యనాయక్, శంకర్, చంద్రయ్య, అమర్‌సింగ్, అనిల్, శ్యాంసుందర్‌రావు, కాంతారా వు, లింగం, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల ధరలను వెంటనే తగ్గించండి
రైతు రక్షణ సమితి రాష్ట్ర నేత శ్రీహరిరావు హవేళిఘణాపూర్(మెదక్): పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించి రైతు సంక్షేమానికి కృషి చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు కోరారు. మండల కేంద్రమైన హవేళిఘణాపూర్‌లో గురువారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి ధాన్యంను కొనుగోళ్లు వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని, క్రాప్లోన్లకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అశోక్, ఎల్లంయాదవ్, మాజీ సర్పంచ్ శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు. -
ఎరువు బరువై
మెదక్ అర్బన్: రైతన్నకు ఎరువు బరువై సాగు భారమైంది. సాగు కలిసి రాక, వచ్చిన పంటను సకాలంలో అమ్ముకోలేక దీనావస్థలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఎరువుల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో అన్నదాతలకు మరింత కుదేలవుతున్నారు. కాగా, వ్యాపారులు పాత స్టాకుకు ధరలు పెంచేసి అమ్ముతున్నారు. పైగా ఎరువులకు లింకులు పెట్టి విక్రయిస్తుండటంతో అన్నదాతల జేబును మరింత గుల్ల చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలో 3,67,668 ఎకరాల్లో పంటలు వేసే అవకాశం ఉండగా 59,870 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ముందే భారీగా నిల్వలు గల్ఫ్ యుద్ధం ఫలితమా అని, ఎరువుల ధరల పెంపును ముందే ఊహించిన హోల్‌సేల్ డీలర్లు..రిటైలర్లు భారీగా నిల్వలు పెట్టుకున్నారు. ఏప్రిల్ నుంచే ధర పెంపునకు తెర లేపారు. మెదక్ జిల్లాలో రైతులు కాంప్లెక్స్ ఎరువులనే ఎక్కువగా వాడుతుంటారు. అందులో 20:20:15 లాంటి వాటికి డిమాండ్ ఉంది. ఇది బస్తాకు రూ.200 నుంచి 400 వరకు పెరిగింది. దీంతో వేల టన్నుల్లో నిల్వలు ఉంచిన వారు రూ.1,400 ఎమ్మార్పీ ఉన్న బస్తాను రిటైలర్‌కు రూ.1,530 వరకు విక్రయించారు. ఇక రిటైలర్లు బస్తాను రూ.1,600 నుంచి రూ.1,650 వరకు అమ్ముకున్నారు. పైగా సరిగా అమ్మకాలు జరగని, లాభాలు ఎక్కువగా వచ్చే కొన్ని ఎరువులను లింకులు పెట్టి విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఈ ఎరువులు రూ.1,400 నుంచి రూ.1,800కు పెరిగాయి. ఇలా హోల్‌సేల్ డీలర్లు రూ.కోట్లలో,రిటైలర్లు రూ.లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు. అక్రమ అమ్మకాలను అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్‌కు 59,870 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి 3,67,668 ఎకరాల్లో పంటలు వేసే అవకాశముందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇందులో వరి పంట 3,16,690 ఎకరాల్లో వేయనున్నట్లు తెలిసింది. కాగా ఇందుకోసం సుమారు 59,870 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతుందని ఇందులో 26,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకు మించి ఎరువులు అమ్మకూడదని జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ స్పష్టం చేశారు.బస్తాకు రూ. 200 నుంచి 400 వరకు పెంపు పెరిగిన ఎరువుల ధరలివి పొటాష్ పాత ధర రూ.1,800 నుంచి రూ.1,975కు, 20–20 రూ.1,400 నుంచి రూ.1,800లు, 12–32–15 రూ.2,025 నుంచి 2,250, సూపర్ ఫాస్పేట్ రూ.600 నుంచి 775లు, 16–16–16 రూ.1,675 నుంచి 2,050లు 24–24–0 రూ.2వేల నుంచి 2,300లు, 20–20–13 రూ.1,800 నుంచి 2,150కి పెరిగినట్లు సమాచారం. -
తాళం వేయొద్దు.. గడువు ఇవ్వండి
నర్సాపూర్: ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఇన్‌గేట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన ఒక షెడ్డుకు తాళం వేయడానికి వచ్చిన అధికారులను బుధవారం బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. పైకోర్టుకు వెళ్లేందుకు కొంత గడువు ఇవ్వాలని వారు కోరడంతో అధికారులు తాత్కాలికంగా వెనుదిరిగారు. స్థానిక బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించి ఓ వ్యక్తి షెడ్డు నిర్మించగా ఆర్టీసీ అధికారులు జిల్లా కోర్టులో కేసు వేశారు. ఆ స్థలం ఆర్టీసీకే చెందుతుందని, స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. డిపోకు చెందిన పలువురు అధికారులు షెడ్డుకు తాళం వేయడానికి అక్కడికి వెళ్లారు. బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వచ్చి తాళం వేయొద్దని తమ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిపో మేనేజర్‌తో మాట్లాడుతారని చెప్పడంతో వారు కొంతసేపు నిరీక్షించారు. కొంతసేపటికి డిపో మేనేజర్ సురేఖ నుంచి స్థానిక ఆర్టీసీ అధికారులకు షెడ్డుకు తాళం వేయొద్దని ఫోన్ రావడంతో వారు అక్కడి నుంచి వెవెళ్లిపోయారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. షెడ్డు నిర్మించిన వ్యక్తి పైకోర్టుకు వెళ్లేందుకు కొంత గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిపో మేనేజర్‌కు వివరించి తాళం వేయొద్దని కోరారని చెప్పారు. -
గ్రామసభలు విజయవంతం చేయాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రజాపాలన ప్రత్యేక గ్రామసభలను విజయవంతం చేయాలని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాల్లో ఈ నెల 4, 6, 8, 10వ తేదీల్లో నిర్వహించే ప్రత్యేక గ్రామసభను విజయవంతం చేయాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, మంచినీరు, మురికి కాల్వల పరిశుభ్రత, పిచ్చిమొక్కలు పొదల తొలగింపు తదితర కార్యక్రమాలపై చర్చించాలని చెప్పారు. ఈ మేరకు గ్రామసభలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ రామారావ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.ఎంపీడీఓ శ్రీనివాస్ -
విధుల్లో నిర్లక్ష్యం సహించం
రామాయంపేట(మెదక్): సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో వార్డు సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగానే వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. ముఖ్యంగా పట్టణంలో పారిశుద్ధ్యం విషయమై ముందస్తు చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ వనితను ఆదేశించారు. సమస్యల విషయమై తనకు పట్టణవాసుల నుంచి ఫిర్యాదులు రావొద్దని, అన్ని వార్డుల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను సిబ్బంది కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మేనేజర్ రఘువరుణ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.మున్సిపల్ కమిషనర్ రవీందర్ -
ఎరువుల వాడకంపై అవగాహన
నిజాంపేట(మెదక్): మండల పరిధి కల్వకుంట గ్రామంలోని రైతుల వేదికలో బుధవారం కేతి బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకాంత్ ఖరీఫ్ సీజన్లో రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక మోతాదులో ఎరువుల వాడకం వల్ల జరిగే నష్టాలు, రసాయనిక ఎరువులు బదులు ప్రత్యామ్నాయ ఎరువులు, బయో ఫెర్టిలైజర్స్, నానో యూరియా, నానో డీఏపీపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల స్వభావం దెబ్బతిని పంట దిగుబడి తగ్గే ఆస్కారం ఉందన్నారు. రైతులు స్వల్ప కాలిక పంటలైన పెసలు, మినుములు, కంది పంటలను సాగు చేయడం శ్రేయస్కరమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయవిస్తరణ అధికారులు శ్రీలత, రమ్య, మౌనిక రైతులు పాల్గొన్నారు. -
ప్రజాసేవకు పరితపించే నేత హరీశ్‌రావు
మెదక్‌జోన్: ఉద్యమ కాలం నుంచి అనునిత్యం ప్రజాసేవే ధ్యేయంగా పరితపించే నేత హరీశ్‌రావు అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాజీ మంత్రి హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా పటణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఘనంగా నిర్వహించారు. నేతలు, కార్యకర్తలు, రక్తదానం, అన్నదానం నిర్వహించారు. పలువురు నేతలతో కలిసి కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ జెండాను చేతబట్టినప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి హరీశ్‌రావుని రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి ప్రతి జిల్లాను సందర్శిస్తూ ఉద్యమకారులను ఉత్తేజపరిచిన నాయకుడని కొనియాడారు.మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి -
జాతీయ రహదారిపైనే చేపల మార్కెట్
మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ నర్సాపూర్: మృగశిర కార్తె నాడు పట్టణంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ పాలక మండలి స్థలాన్ని నిర్ణయించినట్లు కమిషనర్ సాయికుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక పీఆర్ కార్యాలయం నుంచి రైతు వేదిక వరకు ఉన్న జాతీయ రహదారిపై చేపల దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాలకమండలి తీసుకున్న నిర్ణయం మేరకు వ్యాపారులందరూ తమ చేపల దుకాణాలను అక్కడే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసులు పట్టించుకోవడం లేదు.. మెదక్ కలెక్టరేట్: తన ఫ్యాక్టరీలో జరుగుతున్న దొంగతనాలపై పలుమార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి, టీఎం ట్రేడర్స్ ప్రొప్రైటర్ ఖాలేక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు నర్సాపూర్ పట్టణంలో టీఎం ట్రేడర్స్ అనే ఫ్యాక్టరీ ఉంది. అందులో పలుమార్లు దొంగతనాలు జరిగినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సీసీ పుటేజీలు ఇచ్చిన చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి దొంగలను పట్టుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చిన్నశంకరంపేట(మెదక్): ఎమ్మెల్యే రోహిత్ సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నార్సింగి మండలంలోని శేరిపల్లి, సంకాపూర్ గ్రామాల లబ్ధిదారులకు చిన్నశంకరంపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, మాజీ జెడ్పీటీసీ రమణ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొర్విపల్లి సర్పంచ్ పుల్లారావు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు భరత్, నాయకులు లక్ష్మీనర్సింహులు, వార్డు సభ్యులు లక్ష్మి, నవనీత పాల్గొన్నారు. మహిళా కౌన్సిలర్ల పాదయాత్ర జహీరాబాద్ టౌన్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు జన్మదినం పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్ ఆధ్వర్యంలో మహిళా కౌన్సిలర్లు, పార్టీ నాయకులు బుధవారం సిద్ధివినాయక ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పట్టణం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర 15 కిలోమీటర్లు సిద్ధివినాయక ఆలయ వరకు కొనసాగింది. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు స్రవంతి, అన్నపూర్ణ, సుజిత, స్వప్న, పాండు, సర్పంచ్‌లు మహాదేవి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
నర్సాపూర్: వరల్డ్ బైసైకిల్ డేను పురస్కరించుకుని బుధవారం అటవీశాఖ అధికారులు బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి దివ్య మాట్లాడుతూ.. 99రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. కాలుష్య నియంత్రణపై బాధ్యతగా ఉండాలన్నారు. అటవీశాఖ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో డిప్యూటీ రేంజ్ అధికారి సిద్దిరాంసింగ్, సెక్షన్ ఆఫీసర్లు సాయిరాం, రాజమణి, శ్రీధర్ పాల్గొన్నారు. కౌడిపల్లి ఎఫ్‌ఆర్‌ఓగా రవీందర్ కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి అటవీశాఖ రేంజ్ అధికారిగా బి. రవీందర్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎఫ్ఆర్ఓ అర్చన సిద్దిపేట ప్లయింగ్స్కాడ్కు బదిలీ అయ్యారు. రవీందర్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. దీంతో పాటు కౌడిపల్లి రేంజ్ కార్యాలయం పరిధిలోని డీఆర్ఓ రాజమణి బదిలీపై వెళ్లగా పృద్వీరాజ్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. అంసాన్పల్లి సెక్షన్ అధికారిగా ఓంప్రకాష్, కొల్చారం సెక్షన్ అధికారిగా మల్లేశం, కౌడిపల్లి బీట్ అధికారిగా మమత బదిలీపై వచ్చి విధుల్లో చేరారు. ఉద్యోగులకు బదిలీలు సహజంపెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని ఎంపీడీఓ క్రాంతికుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కమలాపూర్ గ్రామకార్యదర్శి రాజుగౌడ్ బదిలీపై వెళ్లగా గ్రామసర్పంచ్ కుంట్ల సుజాత ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ గ్రామానికి చేసిన సేవలను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, మాజీ సర్పంచ్‌లు నార్సిమ్ రాములు, కుంట్ల రాములు, శ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ లింగరాజు, గ్రామస్తులు ఉన్నారు. అందుబాటులో జనుము విత్తనాలు కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో సబ్సిడీపై జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఏఓ స్వప్న తెలిపారు. 40కిలోల బస్తా రూ.3,110లకు లభిస్తుందన్నారు. ఒక బస్తా రెండున్నర ఎకరాలకు సరిపోతుందన్నారు. జనుము భూసారం పెంచేందుకు ఉపయోగపడుతుందని చెప్పా రు. కావాల్సిన రైతులు పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో సంప్రదించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుపై విచారణ నిజాంపేట(మెదక్): మండల పరిధి వెంకటపూర్ కె గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుపై తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ బుధవారం విచారణ చేపట్టారు. అనంతరం నిజాంపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి కేసుకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతి, చట్టపరమైన చర్యలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీతో పాటు రామాయంపేట సీఐ సైదా, నిజాంపేట ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు. -
మండలానికి ఐదు రీపీ ప్రైమరీ పాఠశాలలు
కొల్చారం(నర్సాపూర్): మండలంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 5 పూర్వప్రాథమిక (ఫ్రీప్రైమరీ) పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ డైరెక్టర్ ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంఈఓ ఉమారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఐదింటిలో యూపీఎస్ కొల్చారం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అప్పాజీపల్లి, రాంపూర్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రంగంపేట, పోతంశెట్టిపల్లిలో ఈ నెల 12 నుంచి అధికారికంగా తరగతులు ప్రారంభించనున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రీ ప్రైమరీ బోధనా సిబ్బంది కోసం దరఖాస్తుల స్వీకరణ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేపట్టారు. ప్రతి పూర్వ ప్రాథమిక పాఠశాల నిర్వహణ కోసం ఒక ఇన్స్ట్రాక్చర్, ఒక ఆయా పోస్ట్ ఒప్పందం ప్రాతిపదికన మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఇన్స్ట్రాక్చర్ పోస్ట్ కోసం పూర్వ ప్రాథమిక విద్యలో డీఈడీ లేదా ఇంటర్మీడియట్ చదివిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. నెలవారి గౌరవ వేతనం రూ.8 వేలు అందించనున్నారు. ఆయా పోస్ట్ కోసం పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొన్నారు. వీరికి నెలవారి గౌరవ వెత్తనం రూ.6 వేలు అందించనున్నారు. రెండు పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికులై ఉండాలని,ఽ దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను జత చేస్తూపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని సూచించారు. ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. -
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
చేగుంట(తూప్రాన్): ప్రతి రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామని చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళ్రావు అన్నారు. బుధవారం పులిమామిడి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం తరలింపునకు లారీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చివరిగింజ వరకు కొనుగోలు చేసి రైతులకు తగిన సహకారం అందిస్తామన్నారు. అన్ని గ్రామాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం త్వరగా తరలించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మండలశాఖ అధ్యక్షుడు నవీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు ఉన్నారు. -
సింగూరు భూఆక్రమణలపై అధికారుల సర్వే
వట్పల్లి(అందోల్): సింగూరు ప్రాజెక్ట్ ముంపు ప్రాంతంలో వందల ఎకరాలను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు స్పందించారు. బుధవారం మండల పరిధిలోని ఖాదిరాబాద్ గ్రామ శివారులో సింగూరు భూముల్లో జరుగుతున్న పనులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. సర్వే నంబర్. 424 పెద్దచెరువులో గల 14 ఎకరాల పట్టా భూములు, సర్వే నెంబర్ 425లో గల శిఖం భూముల ఆక్రమణలపై సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఇరిగేషన్‌కు సంబంధించిన భూములు, రెవెన్యూ భూముల హద్దులను గుర్తించడంలో సర్వేను చేశారు. అదే విధంగా గడి నిర్మాణం చేపట్టేందుకు జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జంగేశ్వర్ మాట్లాడుతూ 424, 425 సర్వే నంబర్లలో సర్వే పట్టా భూములు, శిఖం భూములను గుర్తించడంలో సర్వే చేపట్టామన్నారు. -
బ్యాడ్మింటన్‌కు స్థలం కేటాయించండి
చేగుంట(తూప్రాన్): బ్యాడ్మింటన్ స్టేడియం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించినట్లు చేగుంట మండల బ్యాడ్మింటన్ క్లబ్ అధ్యక్షుడు విష్ణు తెలిపారు. మండలంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నప్పటికీ ఆటస్థలం లేకపోవడంతో ఆటలో నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. శ్రీనివాస్‌రెడ్డితో పాటు మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావును కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడి ఆటస్థలం ఏర్పాటుకు కృషి చేయాలని కోరినట్లు చెప్పారు. -
ఒకే కుర్చీ.. ఇద్దరు అధికారులు!
● నిజాంపేట పశువైద్యశాలలో వింత పరిస్థితి.. ● గందరగోళంలో రైతులునిజాంపేట (మెదక్): మండల పరిధిలోని పశువైద్యశాఖ కార్యాలయంలో ఒక వింత పరిస్థితి నెలకొంది. ఒకే పోస్టుకు ఒకరికి రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చి, మరొకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ప్రస్తుతం ఇద్దరు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా మండలంలోని రైతులు గందరగోళానికి గురవుతున్నారు. పశువులకు అనారోగ్యం వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. రిలీవింగ్ ఇచ్చినా కుర్చీ వదలని వైనం గతంలో ఇక్కడ ఇన్చార్జిగా పనిచేసిన డా.మణికుమార్ (వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ నుంచి నిజాంపేటకు వచ్చారు. అయితే, ఉన్నతాధికారులు గత నెల 15వ తేదీన ఆయనను విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ, ఆయన నిజాంపేట కార్యాలయాన్ని వదలకుండా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్తూ తానే అసలైన పశువైద్యాధికారిని అని రైతులకు చెప్పుకుంటుండటం గమనార్హం. రంగంలోకికొత్త ఇన్చార్జి డా. మణికుమార్ స్థానంలో ఉన్నతాధికారులు డా.సుధాకర్ దేశ్‌ముఖ్‌ను కొత్త ఇన్చార్జి పశువైద్యాధికారిగా నియమించారు. ప్రస్తుతం ఆయన కూడా బాధ్యతలు చేపట్టడంతో ఒకే కార్యాలయంలో ఇద్దరు అధికారులు చలామణి అవుతున్నారు. ఈ ఇద్దరి ఆధిపత్య పోరుతో కార్యాలయ సిబ్బందితో పాటు, సేవల కోసం వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నిజాంపేట పశువైద్య కార్యాలయంశాఖాపరమైన చర్యలు తీసుకుంటాం ‘డా. మణికుమార్‌ను ఇప్పటికే అధికారికంగా విధుల నుంచి రిలీవ్ చేశాం. ప్రస్తుతం నిజాంపేట ఇన్చార్జి పశువైద్యాధికారిగా డా. సుధాకర్ దేశ్‌ముఖ్ మాత్రమే బాధ్యతల్లో ఉన్నారు. రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత కూడా మణికుమార్ కార్యాలయానికి వస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తి వివరాలు సేకరించి, తగిన చర్యలు తీసుకుంటాం.‘ – వెంకటయ్య, జిల్లా పశువైద్యాధికారి -
ఆటో డ్రైవర్.. అదనపు కలెక్టర్.. ప్రయాణికురాలు.. కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: ఆటోలో కలెక్టర్ ప్రతిమాసింగ్ కూర్చోగా, అదనపు కలెక్టర్ నగేశ్ ఆటో నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన పథకం (ఏజీఈవై) కింద మెదక్ మండలం మక్తా భూపతిపూర్ గ్రామానికి చెందిన సంధ్యారాణికి ప్రభుత్వం రూ. 3.35 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటో మంజూరు చేసింది. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆమెకు ఆటోను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, లబ్ధిదారురాలు సంధ్యారాణి ఆటోలో కూర్చోగా అదనపు కలెక్టర్ నగేశ్ ఆటోను నడిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు రవాణా రంగంలోకి ప్రవేశించడం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
నర్సాపూర్ రూరల్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని చిన్న చింతకుంటలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. గురుకులంలో అడ్మిషన్లు చేగుంట(తూప్రాన్): మండల కేంద్రం చేగుంటలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుమతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో పరిమిత సీట్లు ఉన్నందున వాటిని భర్తీ చేసేందుకు రీజినల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇంటర్లో చేరాలనుకునే విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థి బలవన్మరణం చేగుంట(తూప్రాన్): విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని ఇబ్రహీంపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బీటి మహాలక్ష్మి(17) మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. కాగా పరీక్షలో ఆమె ఉత్తీర్ణత సాధించినా మా ర్కులు తక్కువగా వచ్చాయి. ఇటీవల నిర్వహించిన అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసింది. అయినా తనకు మార్కులు తక్కువ వస్తాయేమోనని నిత్యం బాధపడుతుంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో మహాలక్ష్మి ఉరి వేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి పంచనామా నిర్వహించారు. -
అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
పాపన్నపేట(మెదక్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా... మండల పరిధిలోని కుర్తివాడ శివారులో గల మంజీర నది నుంచి పది రోజులుగా రాత్రింబవళ్లు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీసీఎస్ , స్థానిక పోలీసులు అర్ధరాత్రి కాలి నడకన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ రెండు ఇసుక లోడ్‌తో కూడిన ట్రాక్టర్లు, మరో 9 ఇసుక నింపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో వాటిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, వాటిని తహసీల్దార్ సతీశ్‌కు అప్పగించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. -
రైతులను పట్టించుకునేవారు లేరా?
చిలప్‌చెడ్(నర్సాపూర్): కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానాఅవస్థలు పడుతున్నా.. అధికారుల తనిఖీలే తప్ప సమస్యలు పరిష్కరించడం విఫలమయ్యారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల పరిధిలోని చిట్కుల్ చౌరస్తా, ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా చేశారు. దీంతో చాలా సేపు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో.. తహసీల్దార్ శివప్రసాద్, పోలీసులు చర్చించి ధర్నా ఆపేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. రైతులను పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల గడుస్తున్నా తూకం జరగడంలేదని, తూకం జరిగినా లారీలు రావడం లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఆవేదనకు గురవుతుంటే, అధికారులు వచ్చి ఫొటోలు దిగి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం 44 కిలోలు పెడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మిల్లుల యజమానులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ, కోతలు విధిస్తున్నా చూస్తూ ఊరుకోవడం ఎంటని నిలదీశారు. రైతులకు న్యాయం చేయకపోతే తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, ఉద్యమ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, అనిల్, బలవంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం -
సేవా కార్యక్రమాలు అభినందనీయం
టేక్మాల్(మెదక్): గ్రామాల్లోని పేదలకు సేవలు చేయడం అభినందనీయమని అల్లాదుర్గం సీఐ రేణుకరెడ్డి అన్నారు. మంగళవారం టేక్మాల్ మండలంలోని మల్కాపూర్‌లో సర్పంచ్ వెంకటకృష్ణ అధ్యక్షతన 15మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి చదువుకునే విద్యార్థులకు సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నిరుపేద విద్యార్థినులు చదువుకు దూరం కావొద్దని సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. సైకిళ్లను పంపిణీ చేసిన రాధామనోహర్ ఫౌండర్ దాదాయిపల్లి సర్పంచ్ నర్సింహరావు దేశ్‌పాండేకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరాం, గడిపెద్దాపూర్ సర్పంచ్ హరి కృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. అల్లాదుర్గం సీఐ రేణుకరెడ్డి -
ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ నారాయణ, ఏఓ కృష్ణ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువులు, విత్తనాలతో పాటు పురుగుమందుల స్టాక్ వివరాలు పరిశీలించారు. ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హచ్చరించారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదులు తీసుకోవాలని సూచించారు. -
మున్సిపల్ కమిషనర్‌గా రవీందర్
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపల్ కమిషనర్‌గా రవీందర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జోగిపేట కమిషనర్‌గా పని చేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారం, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నూతన కమిషనర్‌ను మున్సిపల్ చైర్మన్ లావణ్య, కౌన్సిలర్లు సన్మానించారు. గోదాం పరిశీలన నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నందిగామలో మంగళవారం ధాన్యం నిల్వ చేయడానికి దుర్గారైస్ మిల్లును అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండల చుట్టూ పక్కల రైతులకు ధాన్యం తరలించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిగామలోని దుర్గా రైస్ మిల్లులో ధాన్యం నిల్వ చేయడానికి గోదాం పరిశీలించిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ శేరి స్వప్న, గ్రామ ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, ఉప సర్పంచ్ అంజిరెడ్డి, సెంటర్ ఇన్చార్జి బాజ చందు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయండి చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని తహసీల్దార్ శివప్రసాద్ అన్నారు. మంగళవారం మండల పరిధి అజ్జమర్రి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ధాన్యం కొనుగోళ్లు వందశాతం పూర్తయ్యేలా చూస్తామన్నారు. రైతులకు ట్రాక్టర్లు అందుబాటులో ఉంటే, వాటిలోనే ధాన్యం తరలించాలన్నారు. కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు విజయలక్ష్మి, శ్రీహరి, జీపీఓ రాధాకృష్ణ, రైతులు పాల్గొన్నారు. పీఆర్ డిప్యూటీఈఈగా సీహెచ్ రాధికలక్ష్మి కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి పంచాయతీరాజ్ డివిజన్ డిప్యూటీఈఈగా సీహెచ్ రాధికలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన అమరేశ్వర్ నర్సాపూర్ బదిలీ అయ్యారు. నర్సాపూర్ నుంచి ఆమె ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. సేంద్రియ సాగుతో ప్రయోజనం శివ్వంపేట(నర్సాపూర్): రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 శాతం సబ్సిడీపై జీలుగ అందుబాటులో ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీలుగ వల్ల భూసారం పెరగడంతో పాటు ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, సీఈఓ మధు, డైరెక్టర్లు ఉన్నారు. ఇరిగేషన్ డీఈగా ధర్మకుమార్ చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట డివిజన్ ఇరిగేషన్ డీఈగా ధర్మకుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బదిలీపై వచ్చారు. ఇక్క డ డీఈగా పని చేసిన శ్రీనివాస్‌రెడ్డి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు బదిలీపై వెళ్లారు. దుకాణంలో చోరీ తూప్రాన్: తాళం వేసిన దుకాణంలో మంగళ వారం రాత్రి చోరీ జరిగింది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం... పట్టణానికి చెందిన వ్యాపా రి రమేశ్ శ్రీసాయిరాం ట్రేడర్స్ నిర్వహిస్తున్నా డు. సోమవారం రాత్రి దుకాణం బంద్ చేసి ఇంటికెళ్లాడు. మంగళవారం వచ్చి చూసేసరికి షట్టర్ తాళాలు పగులగొట్టి ఉన్నా యి. లోపలికి వెళ్లి చూడగా డ్రాలో ఉన్న రూ.50 వేలు కని పించలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
త్రిపుల్ ఐటీకి విద్యార్థిని ఎంపిక
నర్సాపూర్ రూరల్: బాసర త్రిపుల్ ఐటీకి మండలంలోని నాగులపల్లి (బంజారానగర్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థి శిరీష ఎంపికయింది. 10వ తరగతిలో 551 మార్కులు సాధించి త్రిపుల్ ఐటీకి ఎంపికై నట్లు హెచ్.ఎం కరుణ సోమవారం తెలిపారు. బాలికను పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు. దారి పొడవునా ధాన్యం లారీలు హవేళిఘణాపూర్(మెదక్): వరిధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు, రైస్‌మిల్లులు నిండిపోవడంతో ధాన్యం తరలించేందుకు అధికారులు ఎన్డీఎస్ఎల్ గోదాంను కేటాయించారు. దీంతో మంగళవారం నుంచి నర్సాపూర్– మెదక్ రహదారిపై లారీలు ఇలా బారులుతీరాయి. ధాన్యం తరలింపు సాఫీగా కొనసాగితే రైతుల ఇబ్బందులు తీరుతాయి. ఇక నుంచి రోజుల తరబడి కాకుండా వెనువెంటనే ఆన్లోడింగ్ చేసేలా చూడాలని లారీల యజమానులు కోరుతున్నారు. త్వరగా ఖాళీ అయితే తిరిగి మళ్లీ ధాన్యం తీసుకువచ్చేందుకు వీలుంటుందని చెప్పారు. ప్రమాదవశాత్తు వరికుప్పకు నిప్పు వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని దామరంచ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డు పక్కన ఉన్న ధాన్యం రాశికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. కొనుగోలు కేంద్రానికి అటవీప్రాంతం దగ్గరగా ఉండడంతో, అటవీ ప్రాంతంలో మంటలు అంటుకొని నిప్పు రవ్వలు ఎగిసిపడటంతో గ్రామానికి చెందిన లక్ష్మయ్యకు చెందిన వడ్లరాశికి మంటలు అంటుకున్నాయి. దీంతో చుట్టుపక్కల రైతులు మంటలు ఆర్పివేయడంతో భారీ నష్టం తప్పినట్లయింది. -
ఇందిరమ్మ ఇళ్ల పథకంతో లబ్ధి
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లి, గొట్టిముక్కుల, ముసాపేట, బద్దారం తదితర గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా పేదలకు సొంత ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ ప్రసన్న, ఎంపీడీఓ క్రాంతికుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, సీనియర్ నాయకులు నారాగౌడ్, మురళిపంతులు, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, ఏఈ కౌశిక్ తదితరులున్నారు.ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి -
క్రమశిక్షణ తప్పిన టీచర్లు
అల్లాదుర్గం(మెదక్): టీచర్లు క్రమశిక్షణ తప్పారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఒకరు దూరంగా ఉండగా.. మరోకరు నిర్లక్ష్యంగా జాతీయ జెండాను ఎగురవేశారు. మండల పరిధిలోని సీతానగర్ తండా ప్రాథమిక పాఠశాల టీచర్ ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉన్నారు. పాఠశాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై టీచర్‌ను ప్రశ్నించగా మా ఊరు దూరంగా ఉంది.. రాలేకపోయానని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతరులకు మార్గదర్శంగా ఉండాల్సిన టీచర్లు నిర్లక్ష్యం వహించడంపై విమర్శలకు గురవుతున్నారు. అల్లాదుర్గం కాన్షీరాంనగర్ ప్రాథమిక పాఠశాల వద్ద జాతీయ జెండాను అవమానిస్తూ, సగం వరకే ఎగురవేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆవిర్భావ వేడుకలకు ఒకరు దూరం.. మరోకరు నిర్లక్ష్యం -
గ్రామాలకు వస్తే సమస్యలు చూపిస్తాం
నర్సాపూర్: కాంగ్రెస్ మంత్రులకు దమ్ముంటే గ్రామాలకు వస్తే కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను చూపిస్తామని ఎమ్మెల్యే సునీతారెడ్డి సవాల్ విసిరారు. ఆమె సోమవారం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు తనకు ఫోన్ చేసి కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను చెప్పి పరిష్కారానికి కృషి చేయాలని కోరారన్నారు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని వివరించారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల ధాన్యం తడిసిందని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆమె కోరారు. అనంతరం ఓ దాడిలో గాయాల పాలై వైద్యం కోసం వచ్చిన క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంపై ఎమ్మెల్యే సునీతారెడ్డి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, నయిం రమణాగౌడ్, సత్యంగౌడ్, భిక్షపతి, ప్రసాద్, రాజు, మోహిజోద్దీన్, రాకేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు. మంత్రులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి సవాల్ -
బాంబు స్క్వాడ్ తనిఖీలు
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెదక్ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ బస్టాండ్, రైల్వే స్టేషన్, జిల్లా కలెక్టరేట్లో బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. స్నిఫర్ డాగ్ ‘సింబ’ సహాయంతో ప్రాంగణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్సై రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుళ్లు నర్సింహులు, రాజేశ్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీఓ శ్రీనివాస్, జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ సోమవారం ప్రారంబించారు. గ్రామానికి చెందిన వంజరి భిక్షపతి, బంజ మంజూల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో సొంత ఇంటికళ నెరవేరిందని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్వేత, పంచాయతీ కార్యదర్శి నగేష్, నాయకులు పుండరీకంగౌడ్, దేవెందర్, భూమయ్య, వెంకటేశ్వరరావ్, మల్లికార్జున్‌గౌడ్, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. మక్కరాజీపేటలో.. చేగుంట(తూప్రాన్): మండల పరిధిలోని మక్కరాజీపేటలో సోమవారం అధికారులు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరంగా మారినట్లు తెలిపారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని డీఈ తెలిపారు. మండలంలో 30 ఇళ్లను ప్రారంభిస్తున్నట్లు మిగిలిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేస్తే రావాల్సిన డబ్బులను అందించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేఖ, ఎంపీడీఓ చిన్నారెడ్డి, హౌసింగ్ ఏఈ రియాజొద్దిన్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నవీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్టాలిన్ పాల్గొన్నారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
నర్సాపూర్ రూరల్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గూడెంగడ్డలో ఆలస్యంగా వెలుగు చూసింది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఆవంచ పోచయ్య (53) మే 30వ తేదీ రాత్రి గ్రామంలోని పెద్ద చెరువు వద్దకు వల తీసుకొని చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఉదయం వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. సోమవారం ఉదయం చెరువులో శవాన్ని గుర్తించిన పశువుల కాపరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పోచయ్య చేపల కోసం వేసిన వల తన కాళ్లకు చుట్టుకొని మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య కృష్ణవేణి, వివాహాలైన పిల్లలు ఉన్నారు. వడదెబ్బతో మహిళ మృతి పాపన్నపేట(మెదక్): వడదెబ్బతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన దూదేకుల సాదక్బీ((56)గత నెలలో బక్రీద్ పండుగ తెల్లారి తన కూతురుకు శుభాకాంక్షలు తెలిపేందుకు నిజాంపేట మండలంలోని రాంరెడ్డిపేటకు వెళ్లింది. బైక్‌పై వెళ్తుండగా వడదెబ్బకు గురైంది. వెంటనే ఆమెను సంగారెడ్డికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. పెట్టుబడి సాయం ఇవ్వాలి రేగోడ్(మెదక్): రైతులకు పెట్టుబడి సాయం నిధులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్ సోమవారం కోరారు. యాసంగిలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం డబ్బులు రెండు ఎకరాల వద్ద నిలిచిపోయిందని చెప్పారు. వానాకాలం సీజన్ కోసం రైతులు దుక్కులు దున్నుతున్నారని, పెట్టుబడికి రైతులు అవస్తలు పడే అవకాశం ఉందని చెప్పారు. వరిధాన్యం, జొన్నలను చివరి గింజ వరకు కొనాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ జెండా పండుగ మెదక్ కలెక్టరేట్: తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగను సోమవారం జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు నరేంద్ర యాదవ్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి చంద్రశేఖర్, నియోజవర్గ ఇన్చార్జి అజయ్, జెండా పండుగా ఇన్చార్జి రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిలప్‌చెడ్ తహసీల్దార్‌గా శివప్రసాద్ చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ తహసీల్దార్‌గా బదిలీపై వచ్చిన శివప్రసాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అలాగే మరో ఇద్దరు బదిలీపై వచ్చిన ఆర్ఐలు శ్రీహరి, విజయలక్ష్మిలు సైతం విధుల్లో చేరారు. చేగుంట మండలంలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన శివప్రసాద్ చిలప్చెడ్కువచ్చారు. కౌడిపల్లిలో ఆర్ఐగా విధులు నిర్వహించిన శ్రీహరి, నర్సాపూర్‌లో ఆర్ఐగా విధులు నిర్వహించిన విజయలక్ష్మి బదిలీపై చిలప్‌చెడ్‌కు వెళ్లారు. రేగోడ్ ఎంపీడీఓగా గంగాధర్ రేగోడ్(మెదక్): రేగోడ్ ఇన్చార్జి ఎంపీడీఓగా గంగాధర్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఎంపీడీఓగా పని చేసిన సీతారావమ్మ రంగారెడ్డి జిల్లాకు బదిలీ కాగా.. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓగా పని చేస్తున్న గంగాధర్‌కు ఉన్నతాధికారులు ఎంపీడీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 6న బహిరంగ వేలం పాట శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కొబ్బరికాయలు, పూజ సామగ్రి విక్రయాల కోసం బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్, ఆలయ ఫౌండర్, చైర్మన్ ఆంజనేయశర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే వేలంలో పాల్గొనే వారు రూ.2 లక్షలు దరావత్తు చెల్లించాలన్నారు. -
రైతుల వడ్లు రోడ్ల పాలు
నర్సాపూర్: రైతులు పండించిన ధాన్యం అమ్మాలంటే ఇక్కట్లు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. తరలించే సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని చిన్నచింతకుంటకు చెందిన రైతు అర్జున్ తాను పండించిన ధాన్యం బస్తాలు సోమవారం ట్రాక్టర్లో నర్సాపూర్ ఏఎంసీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలిస్తుండగా స్పీడ్ బ్రేకర్ల వద్దకు రాగానే బస్తాలకు కట్టిన తాడు పట్టు కోల్పోవడంతో ధాన్యం బస్తాలు రోడ్డుపై పడ్డాయి. వడ్లన్నీ రోడ్డు పాలయ్యాయి. అర్జున్ తోటి రైతుల సాయంతో వడ్లను ఎత్తి బస్తాల్లో నింపి కొనుగోలు కేంద్రానికి తరలించాడు. తడిసిన ధాన్యం బస్తాలు కొల్చారం(నర్సాపూర్): వర్షం రైతులను వెంటాడుతూనే ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులు, వర్షానికి ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు నానాతంటాలు పడవలసిన పరిస్థితి నెలకొంది. రైతులు ధాన్యాన్ని తరలించేందుకు సొంతంగా ట్రాక్టర్లను సమకూర్చుకుంటున్నప్పటికీ, ధాన్యం నిల్వకు సరైన గోదాములు లేకపోవడం రైతు వేదికల్లో అన్లోడ్ చేయవలసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ సైతం ధాన్యం బస్తాలు నిండుకోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను ఎంతకాలం కాపాడుకుంటూ రావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నర్సాపూర్ చౌరస్తాలో రోడ్డుపై పడిన వడ్లను బస్తాల్లోకి నింపుతున్న రైతులురంగంపేట కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం బస్తాలు -
పాడుబడిన బావిలో పడిన వలస కూలీ
రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందంచిన్నశంకరంపేట(మెదక్): మద్యం మత్తులో పాడుబడిన బావిలో పడిన కూలీని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. ఈ సంఘటన మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఏపీ, మార్కాపురం జిల్లా కొమురోలు మండలం నల్లగుంట్లకు చెందిన మంద భాస్కర్ మిర్జాపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి కూలి పనులు చేసేందుకు వచ్చాడు. రాత్రి సమయంలో మద్యం మత్తులో బావిని గమనించపోవడంతో కాలు జారి పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ శివానందం, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకొని నిచ్చెనవేసి బావిలోకి దిగారు. బావిలో పడిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పగాయాలు కావడంతో అంబులెన్స్‌లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన పోలీసులకు, ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
మెదక్‌కలెక్టరేట్: డ్వాక్రా సంఘాల మహిళలు ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవనంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతోందన్నారు. ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడానికి ప్రయత్నిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని వాపోయారు. 7, 8వ తేదీలలో శివ్వంపేటలో నిర్వహించనున్న సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేవయ్య, కార్యదర్శి కె.మల్లేశం, ఉపాధ్యక్షులు నరేందర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకురూ.10 లక్షలు ఇవ్వాలి వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ -
వరికొయ్యలకు మంటలంటుకొని..
రామాయంపేట(మెదక్): ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పశువుల కొట్టం, గడ్డివాము కాలిపోయాయి. అలాగే కొట్టంలో ఉన్న దూడ సజీవదహనమైంది. ఈ సంఘటన సోమవారం మండలంలోని రాయిలాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన ల్యాగల ఆంజనేయులు పంట చేనులో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టారు. మంటలు చెలరేగి గడ్డివాముతోపాటు పశువుల కొట్టం, అందులో ఉన్న దూడ మంటలకు ఆహుతైంది. మంటలు వ్యాపిస్తున్న క్రమంలో దూడ అరుపులు అక్కడికి సమీపంలో ఉన్న వారిని కదిలించాయి. కాగా మంటలు వ్యాప్తి చెందడంతో ఎవరూ కూడా దరిదాపుల్లోకి వెళ్లలేదు. పశువుల కొట్టం, గడ్డివాము దగ్ధం దూడ మృతి -
జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
రామాయంపేట(మెదక్): జిల్లాలో ప్రథమంగా జొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం స్థానిక మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య, సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించారు. సీవిల్ సప్లై ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేశారు. మండల పరిఽధిలో ఈ ఏడాది పెద్ద ఎత్తున జొన్న పంట సాగు చేశారని, రైతులు దళారులకు విక్రయించకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా త్వరితగతిన కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. వైస్ చైర్మన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రవి, మద్దెల మాధవి, బైరం స్వప్న, తహసీల్దార్ రజని, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రాధాభవాని, గౌస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సీఈఓ నర్సింలు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
అసైన్డ్ భూముల పరిశీలన
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అసైన్డ్ భూమి అన్యాక్రాంతం అయిన విషయంపై సాక్షి దినపత్రికలో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు గాను రెవెన్యూ సిబ్బంది స్పందించారు. సర్వేయర్ అరుణ్, ఆర్ఐ అనితలు సంబంధిత సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ ఆధీనంలో ఉన్న భూముల వివరాలు సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమికి సంబంధించి ఐడెంటిఫికేషన్ మ్యాపింగ్ చేపట్టారు. పూర్తిస్థాయిలో సర్వే చేసి ఆక్రమణకు గురైన అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు సదరు పరిశ్రమకు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కమలాద్రి చెప్పారు. బీజేపీ నాయకులపై అసత్య ప్రచారాలు తగదు టీబీజేపీ రాష్ట్ర నాయకుడు విజయ్ నిజాంపేట(మెదక్): బీజేపీ నాయకులపై అసత్య ప్రచారాలు తగదని టీబీజేపీ రాష్ట్ర నాయకుడు విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొంతమంది అసత్య ప్రచారాలకు తెరలేపడం దురదృష్టకరమన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు రాజేంద్ర తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు. చేగుంట తహసీల్దార్‌గా బాలలక్ష్మి చేగుంట(తూప్రాన్): చేగుంట తహసీల్దార్‌గా బాలలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ చిలిపిచెడ్కు బదిలీపై వెళ్లగా కలెక్టర్ కార్యాలయం నుంచి బాలలక్ష్మి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఆమె మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి రైతులకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. వెల్దుర్తి తహసీల్దార్‌గా విజయలక్ష్మి వెల్దుర్తి(తూప్రాన్): మండల తహసీల్దార్‌గా విజయలక్ష్మి నియమితులయ్యారు. ఇన్చార్జి తహసీల్దార్‌గా పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ నుంచి సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. మండలంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తహసీల్దార్ ప్రకటించారు. ఏవేని సమస్యలుంటే నేరుగా వచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. ఆర్టీసీని విలీనం చేయాలి డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జిలతో నిరసన మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మెదక్ ఆర్టీసీ డిపో కమిటీ చైర్మన్ సంగమేశ్వర్, మేడి రాధాకిషన్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీఎస్ ఆర్టీసీ సమైక్య జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపు మేరకు నిరసన చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ సంస్థతోపాటు ఉద్యోగులను విలీనం చేయాలన్నారు. కార్యక్రమంలో డిపో కమిటీ వైస్ చైర్మన్ నర్సింలు, కన్వీనర్ రాజు, కో కన్వీనర్ వనితారెడ్డి, సత్యం, ప్రభుకుమార్, శేఖర్ పాల్గొన్నారు. సహకారం సంఘం చైర్మన్ పదవికి రాజీనామాబాలకృష్ణారెడ్డి తూప్రాన్: రైతులను పట్టించుకోని ప్రభుత్వంలో కొనసాగలేక ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పదవితో పాటు కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసినట్లు చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి చెప్పారు. సహకార సంఘం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సహకార సంఘంలో 1,102 మంది రైతులకు రుణమాఫీకి పంపించగా 370 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. మిగతా రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదన్నారు. అలాగే ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రైతులు నిలదీస్తే సమాధానం చెప్పలేకపోతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తమకు తగిన ప్రాధాన్యం కల్పించడంలేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులకు గుర్తింపు లేదని విమర్శించారు. ఇలాంటి పార్టీలో కొనసాగడం ఇష్టంలేక రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరో 20 మంది పార్టీకి రాజీనామ చేసినట్లు చెప్పారు. -
ధాన్యాన్ని తరలించి రైతులను ఆదుకోవాలి
నర్సాపూర్ రూరల్: కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే తరలించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని చిన్నచింతకుంట కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ ఇతర నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు నెలకు రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పట్టుకొని రాత్రి పగలు కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్సీకి విన్నవించారు. దీంతో ఎమ్మెల్సీ జేసీ, ఆర్డీఓలకు ఫోన్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించాలని తెలిపారు. దీనికి అధికారులు స్పందిస్తూ రెండు రోజుల్లో అన్ని కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించనున్నట్లు తెలిపినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ వెంట ఎస్టీ మోర్చా నాయకుడు రాములు, తదితరులు ఉన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు నర్సాపూర్: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్సీ అంజిరెడ్డి హెచ్చరించారు. ఆయన సోమవారం స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు వైద్యులు, సిబ్బందితో సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. ఆయా వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, వైస్ చైర్మన్ బుచ్చెష్‌యాదవ్, నాయకులు రఘువీరారెడ్డి, ఆంజనేయులుగౌడ్, శ్రీకాంత్, నీరంజన్, సిద్దార్థ్, రాజు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి -
ఆలయాల్లో చోరీ.. నిందితుల అరెస్టు
తూప్రాన్: దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఎస్ఐ గంగరాజు కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పెద్దమ్మ ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రెండు రోజుల క్రితం చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. పట్టణానికి చెందిన కాలకంటి వెంకటేశ్, మహమ్మద్ షరీఫ్ చోరీకి పాల్పడి, ఆలయంలోని విలువైన సామగ్రితో పాటు విగ్రహాలను ఎత్తుకెళ్లారు. విచారణలో నిందితులు ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి విగ్రహాలు, పూజా సామగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. గుండెపోటుతో వార్డు సభ్యుడి మృతిచేగుంట(తూప్రాన్): గుండెపోటుతో చేగుంట రెండో వార్డు సభ్యుడు సాయిబాబా ఆదివారం మృతి చెందాడు. బీజేపీకి చెందిన బక్క సాయిబాబా(55) చేగుంట రెండో వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుకు గురైన సాయిబాబాను నార్సింగి ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయిబాబా అంత్యక్రియల్లో సర్పంచ్ స్రవంతి పాలకవర్గ సభ్యులు, బీజేపీ సర్పంచులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్సంగారెడ్డి: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావును ఆదివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
శివ్వంపేట(నర్సాపూర్): సాగు కోసం పేదలకు ప్రభుత్వం ఇచ్చిన విలువైన అసైన్డ్ భూమి అన్యా క్రాంతం అవుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పేదలు సాగు చేపట్టాల్సిన భూమిని ఓ పరిశ్రమ నిర్వాహకులు చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకొని వినియోగించుకుంటున్నారు. మండల పరిధి ఉసిరికపల్లి గ్రామ శివా రు, వెల్దుర్తి–ఉసిరికపల్లి ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 220/ఊ లోని 30 గుంటల ప్రభుత్వ భూమిని సాగు కోసం గ్రామానికి చెందిన ఒక పేద రైతుకు గతంలో ప్రభుత్వం అసైన్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆ భూమి.. గ్రామ శివారులో ఉన్న ఓ సిమెంట్ ఇటు కల తయారీ ఫ్యాక్టరీ ఆధీనంలో ఉంది. సదరు ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యర్థాలను ఈ భూమిలోనే వేయడంతో పాటు, అక్కడ పనిచేసే కార్మికులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలు నిర్మి ంచారు. ప్రభు త్వ రికార్డుల ప్రకారం సదరు భూమి ఇప్పటికీ అసైన్డ్ పొందిన వ్యక్తి పేరు మీదే ఉన్నప్పటికీ, పొజిషన్ మాత్రం పరిశ్రమ యాజ మాన్యం చేతుల్లో ఉంది. సాగు కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి లో యథేచ్ఛగా కమర్షియల్ కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ, రెవెన్యూ అధికారులు ఉదాసీన ంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. తిరిగి స్వాధీనం చేసుకోవాలి.. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిశ్రమ యాజమాన్యం నుంచి తిరిగి స్వాధీనం చేసుకొని, ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, భూమిని సర్వే చేయించి.. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఓ పరిశ్రమ ఆధీనంలో ప్రభుత్వ భూమి రికార్డుల్లో ఒకరి పేరు..పొజిషన్లో మరొకరు స్పందించని జిల్లా ఉన్నతాధికారులు -
ఆత్మీయ అభినందనలు
మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలోని 14వ వార్డు నవాబుపేట వీధిలో స్థానిక కౌన్సిలర్ దొంతి లక్ష్మి– ముత్యంగౌడ్ దంపతులకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై కౌన్సిలర్ దొంతి లకి్ష్మ్ముత్యంగౌడ్లను ఘనంగా సన్మానించారు. అనంతరం నరేష్‌గౌడ్ మాట్లాడుతూ.. తమకు ఓటు వేసి గెలిపించిన రెడ్డి కుల సంఘం పెద్దలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కులసంఘం పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సమ్మేళనంలో అప్పటి ఉపాధ్యాయులు, విద్యార్థులునిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని రేణుకా మాత ఫంక్షన్ హాల్లో ఆదివారం 1996– 97 బ్యాచ్‌కి సంబంధించి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులను శాలువాతో సన్మానించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అప్పటి తీపి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, బాలయ్య, విద్యార్థులు నసీరుద్దీన్, మహేందర్, శివప్రసాద్, ప్రభుదాస్, ఎల్లం యాదవ్, నర్సింలు, ఎల్లం, యాదగిరి, రాము పాల్గొన్నారు. -
ఏడుపాయల్లో భక్తుల సందడి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివాదం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఓడి బియ్యం పోసి బోనాలు తీసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. శక్తిపీఠంలో విశేష పూజలు శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రం శివ్వంపేటలో కొలువైన బగలాముఖీ శక్తిపీఠంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, మహాపూజా, మహామంత్రహవనం, ఇతర పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ భూదాత పబ్బ రమేష్‌గుప్తా, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్‌గుప్తా, తదితరులు ఉన్నారు.అంజన్నకు ప్రత్యేక పూజలు శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన చిన్నగొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి పూజారులు ’లక్షనాగవల్లి అర్చన’ మహోత్సవాన్ని కనులపండువగా జరిపారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయుడికి సన్మానం అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం జిల్లా పరిషత్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు రాజేశ్వర్ ఆదివారం పదవి విరమణ పొందారు. ఉపాధ్యాయుడికి పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ఎం పిచ్చయ్య మాట్లాడుతూ.. ఉద్యోగులకు పదవి విరమణ తప్పదని, వారు చేసిన సేవలు ప్రజల్లో గుర్తిండిపోతాయని కొనియాడారు. రాజేశ్వర్ క్రమశిక్షణతో నిధులు నిర్వహించేవారని అన్నారు. నేడు మెగా ఉచిత వైద్య శిబిరం రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ మెదక్ కలెక్టరేట్: మెదక్ సమీకృత కలెక్టరేట్లో సోమవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రెడ్‌క్రాస్ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉ. 9:30 గంటలకు మేడ్చల్‌లోని మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో మెగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కలెక్టరేట్లోని అధికారులు, ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వివినియోగించుకోవాలన్నారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రారంభిస్తారని తెలిపారు. చాముండేశ్వరికి ప్రత్యేక పూజలు చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల పరిధి చిట్కుల్ శివారులో మంజీరా తీరంలో వెలసిన చాముండేశ్వరి అమ్మవారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి భక్తులకు తీర్థ, ప్రసాదాల వితరణ చేశారు. -
ధాన్యాన్ని తరలించి ఆదుకోండి
నర్సాపూర్ రూరల్: నాగులపల్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని తరలించి, తమను నష్టాల నుంచి గట్టెక్కించాలని స్థానిక రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ, నేటికీ దాదాపు 80 శాతం మంది రైతుల ధాన్యాన్ని తూకం వేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రోజుల తరబడి నిలిచిపోవడంతో కొన్నిచోట్ల ధాన్యం మొలకలు కూడా వచ్చాయి. ఆరుగాలం కష్టపడి, పెట్టుబడులు పెట్టి పండించిన పంట కళ్లముందే నాశనమవుతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నాగులపల్లి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి, మిల్లులకు తరలించేలా తగిన ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు. -
నార్సింగి అభివృద్ధికి సహకరించండి
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రం అభివృద్ధికి సహకరించాలని ఇన్చార్జి జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామిని స్థానిక నాయకులు కోరారు. హైదరాబాద్ నుంచి నార్సింగి మీదుగా నిజామాబాద్ వైపు వెళ్తున్న మంత్రి గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, గ్రామపంచాయతీ సభ్యులు రవీందర్, బాచిస్వామి తదితరులు అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. నూతన మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రెండు వైపుల బస్షెల్టర్లు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ హెల్త్ స్కీంలో లోపాలున్నాయి..
చేగుంట(తూప్రాన్): ప్రభుత్వం ఉద్యోగులందరికీ హెల్త్ స్కీం తీసుకొచ్చామని చెబుతున్నా ఆ స్కీములో లోపాలున్నాయని తపస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెల్త్ కార్డుకు ఎలాంటి నియమ నిబంధనలు విధించకపోయినా ఉద్యోగుల వేతనం నుంచి 1.5 శాతం డబ్బులు వారి అనుమతి లేకుండా తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే దరఖాస్తు చేసుకున్న వారి వేతనం నుంచి మాత్రమే డబ్బులు తీసుకోవాలన్నారు. సమావేశంలో తపస్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లం, సిద్దూ, జిల్లా నాయకులు శ్రీధర్‌రెడ్డి, నర్సింలు, నాయకులు ఉన్నారు. జీతంలో కోత విధించడం సరికాదు.. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రావు మెదక్‌జోన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను లక్ష్యంగా అమలు చేయనున్న ఎంప్లాయ్ హెల్త్‌స్కీం (ఈహెచ్ఎస్) పథకాన్ని స్వాగతిస్తున్నామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రావు పేర్కొన్నారు. దానికి సంబంధించిన విధివిధానాలు పూర్తిగా ఖరారు కాకముందే, ఉద్యోగుల వేతనాల నుంచి కోత పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి అనేక కీలక అంశాలు ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్యానెల్ ఆస్పత్రులతో పూర్తిస్థాయి ఒప్పందాలు కుదరక ముందే వైద్య సేవలకు సంబంధించిన ప్యాకేజీ రేట్లు ప్రకటించనే లేదని తెలిపారు. ఉద్యోగులకు నేటికీ డిజిటల్ హెల్త్‌కార్డులు అందజేయలేదు. చందా మినహాయింపుపై స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పథకం అమలుకు అవసరమైన మౌలిక ఏర్పాట్లు లేకుండానే మే నెల జీతంలో కోత విధించడం సరికాదన్నారు. ప్రక్రియ పూర్తి కాకుండానే కోతా? మెదక్ కలెక్టరేట్: ఈహెచ్ఎస్ ప్రక్రియ పూర్తికాకుండానే ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టడం ఏమిటని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి, వెంకట్రాంరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించి మే నెల వేతనం నుంచి ఈహెచ్ఎస్ కోసం 1.5 శాతం వేతనాన్ని బలవంతంగా మినహాయింపు చేయడాన్ని టీపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. విధివిధానాలు రూపొందించకుండా మినహాయించిన వేతనాన్ని వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. విధివిధానాలు ఖరారు కాలేదు.. నర్సాపూర్: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పేరిట మే నెల వేతనాల్లో కోత విధించ డాన్ని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు ఖండించారు. ఆదివారం మండల యూటీఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఖరారు కాలేదని, ఆస్పత్రులతో ఒప్పందం కుదరలేదని, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వకపోయినా ఆర్థిక శాఖ అధికారులు ఉత్సాహంతో ఉద్యోగుల మే నెల వేతనాల నుంచి ఈహెచ్ఎస్ చందా పేరిట డబ్బులు కోత విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
నైపుణ్యం పెంచేందుకు తోడ్పాటు
నర్సాపూర్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాజ్మకత, సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు అవగాహన సదస్సులు తోడ్పాటునిస్తాయని బీవీఆర్ఐటీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ జేఎన్టీయూల సహకారంతో స్థానిక బీవీఆర్ఐటీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఏఐ, డిజిటల్ లెర్నింగ్ వర్క్‌షాప్ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్ డెమోస్, ఇంటరాక్టివ్ సెషన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు హెచ్ఓడీ దశరథరామయ్య చెప్పారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సాయికిరణ్, చంద్రకళ, ల్యాబ్ అసిస్టెంట్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. -
ట్రిపుల్ ఐటీకి విద్యార్థుల ఎంపిక
శివ్వంపేట(నర్సాపూర్): శివ్వంపేట మండల టాపర్‌గా నిలిచిన విద్యార్థిని రేవతి ట్రిపుల్ ఐటీ బాసరకు ఎంపికై ంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రేవతి శివ్వంపేట ఉన్నత పాఠశాలలో చదివి 10వ తరగతిలో 557 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. ట్రీపుల్ ఐటీ బాసరకు ఎంపిక కావడంపై విద్యార్థిని తల్లిదండ్రులు లలిత బంగారయ్య, ఎంఈఓ బుచ్చనాయక్, హెచ్ఎం బాలచంద్రం,ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ముస్లాపూర్ పీఎంశ్రీ పాఠశాలలో.. అల్లాదుర్గం(మెదక్): మండల పరిధిలోని ముస్లాపూర్ పీఎంశ్రీ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యబోధన అందిస్తున్నారు. గంథాలయం, కంప్యూటర్ విద్య, ఆటలు, టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ పాఠశాల నుంచి ఏడుగురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక అయ్యారు. టెన్త్‌లో మంచి మార్కులతో పాసైన మొల్ల నేహ, నందు, దుర్గాప్రసాధ్, భువనేశ్వరి, సాయికుమార్, నవప్రసన్న, అంజయ్యలు త్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. వీరిని పాఠశాల హెచ్ఎం రమేశ్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. విద్యార్థుల కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్ల విజయం సాధించినట్లు తెలిపారు. కూచన్‌పల్లి జెడ్పీ హైస్కూల్ ..హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని కూచన్‌పల్లి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు రవితేజ, దివ్యలు బాసర ట్రిపుల్ఐటీకి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుమోహన్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను ప్రిన్సిపాల్ మధుమోహన్, ఉపాధ్యాయులు శివరాజ్, మల్లారెడ్డి, సందీప్, శ్రీనివాస్, కొండల్‌రెడ్డి అభినందించారు.మోడల్ స్కూల్ విద్యార్థులు.. చిన్నశంకరంపేట(మెదక్): బాసర ట్రిపుల్ ఐటీకి చిన్నశంకరంపేట మోడల్‌స్కూల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ వాణికుమారి తెలిపారు. తెలంగాణ మోడల్‌స్కూల్ టాపర్స్‌గా నిలిచిన గుండు భవ్యశ్రీ, సాహితి, వైష్ణవి, సంధ్య, రాకేష్, రిషివర్ధన్, దీపక్ ట్రిపుల్ఐటీకి ఎంపికై నట్లు చెప్పారు. పదవ తరగతి పరీక్షలో సత్తాచాటి బాసర ట్రిపుల్ఐటీకి ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్ వాణికుమారి అభినందించారు. -
మహాలక్ష్మికి స్మార్ట్ కార్డు
జూన్‌లో అమలుకు ఆర్టీసీ కసరత్తు రామాయంపేట(మెదక్): మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు వారు ఆధార్ కార్డు చూపించి వెళ్లేవారు, ఇక నుంచి వారికి చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీంతో సమయం ఆదాతో పాటు నకిలీ గుర్తింపు కార్డులను అరికట్టవచ్చని భావిస్తుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ కార్డులను అమలులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్ డిపోలు కొనసాగుతున్నాయి. ఈరెండు డిపోల పరిధిలో మహాలక్ష్మి పథకం ప్రారంభమైన 2023 డిసెంబర్ నుంచి ఈనెల 29 వరకు మొత్తం 4.16 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కొనసాగించారు. ఈ మేరకు రెండు డిపోల్లో వీరు ప్రయాణం ద్వారా మొత్తం రూ.148.37 కోట్ల మేర పొదుపు చేయగలిగారు. దుర్వినియోగానికి అడ్డుకట్ట నకిలీ కార్డులతో కొందరు మహాలక్ష్మి పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకరి ఆధార్ మరొకరు చూపడం, ఒరిజనల్ కాకుండా డూబ్లికేట్ కార్డు చూపుతూ ప్రయాణించడం వంటి కొన్ని సంఘటనలు అక్కడక్కడ వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం నకిలీ కార్డులతో ప్రయాణిస్తుండటాన్ని ఇటీవల గుర్తించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొన్ని ఆధార్ సెంటర్లలో డబ్బులు తీసుకొని పేర్లు, చిరునామా మారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏటీఎం తరహా చిప్‌తో.. మహాలక్ష్మి పథకం కింద త్వరలో చిప్‌తో కూడిన డిజిటల్ కార్డులు మహిళలకు అందించనున్నారు. జిల్లాలో ఒకేసారి అందరికి కాకుండా పైలట్ ప్రాజెక్టుగా గుర్తించిన మండలంలో ఈపథకాన్ని ముందుగా అమలుపర్చనున్నారు. తద్వారా రెండు డిపోల పరిధిలో మహిళా ప్రయాణికులకు కార్డులు అందనున్నాయి. ఈ కార్డులు అమలులోకి వచ్చిన తర్వాత ఆధార్ ఉచిత ప్రయాణం రద్దువుతుందని, కొత్త కార్డు చూపాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలోని రెండు డిపోల పరిధిలో నిత్యం 70 వేల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అంచనా. విడతల వారీగా మహిళలకు పంపిణీవిధి విధానాలు రాలేదు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు స్మార్ట్ కార్డుల పంపిణీ విషయమై తమకు ఇంకా విధి విధానాలు రాలేదు. కొత్త కార్డులు వచ్చే వరకు మహిళలు ఆధార్ కార్డులు చూపించి బస్సుల్లో ప్రయాణాలు కొనసాగించవచ్చు. – సురేఖ, మెదక్ డిపో మేనేజర్డిపో మహిళల పొదుపు మెదక్ 3.23 కోట్లు రూ.119.13 కోట్లు నర్సాపూర్ 96 లక్షలు రూ.30.14 కోట్లు -
3న సంగారెడ్డి జిల్లాకు సీఎం రాక
హత్నూర(సంగారెడ్డి): వచ్చేనెల 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. హత్నూర మండలం బోరుపట్ల శివారులోని నూతనంగా నిర్మించిన తెరానియం బయోలాజిక్స్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి రానుండటంతో ఏర్పాట్లను శనివారం ఎస్పీ పరితోశ్ పంకజ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించే పరిశ్రమను పూర్తిగా జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాలు, సభ ఏర్పాట్లు చేసే హాల్‌ను, హెలిప్యాడ్‌ను ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించారు. మల్కాపూర్ గ్రామ శివారులోని ఖాళీ స్థలాన్ని కూడా హెలీప్యాడ్ స్థలం కోసం ఎస్పీ పరిశీలించారు. పరిశ్రమ వెనుకభాగంలోనే ముఖ్యమంత్రి హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రభాకర్, సీఐ రమణారెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రవీందర్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, ఆర్ఐ హరిబాబు, పరిశ్రమ ప్రతినిధులు అధికారులున్నారు. -
టెట్ పాసయ్యేదెట్టా..!
సుప్రీం తీర్పుతో గురువుల్లో గుబులు● మూడేళ్ల గడువు కాస్త ఊరట ● జిల్లాలో 3,796 మంది ఉపాధ్యాయులుమెదక్ అర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ రాసి నిర్ణీత సమయంలో అర్హత సాధించాల్సిందేనని శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గురువుల్లో గుబులు మొదలయ్యింది. అయితే టెట్ పాస్ కావడానికి ఇది వరకు ఇచ్చిన రెండేళ్ల గడువును మూడేళ్లకు అంటే 2027 ఆగస్టు 31 వరకు పొడిగించడం కాస్త ఊరట కలిగించే అంశం. ఉద్యోగ విరమణకు ఐదేళ్లకు పైగా కాలపరిమితి ఉన్న టీచర్లు, ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాల్సిందేనని 2025 సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా టీచర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీంతో 69 ఉపాధ్యాయ సంఘాలు గతేడాది అక్టోబర్ 12న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం ఈమేరకు తీర్పునిచ్చింది.జిల్లాలో మొత్తం 3,796 టీచర్లు ఉండగా, 1,752 మంది టెట్ పాసయ్యారు. ఇంకా 2,044 మంది పాస్ కావాల్సి ఉంది. విద్యాహక్కు చట్టం – 2009 ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పని సరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2011లో మొదటిసారి టెట్ నిర్వహించారు. మొత్తం 150 మార్కులకు గాను ఓసీలు 90, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలైతే 60 మార్కులు సాధిస్తేనే పాస్ అవుతారు. అంతకు ముందు డీఎస్సీల ద్వారా టీచర్ల నియామకం చేపట్టేవారు. ఎస్జీటీ టీచర్లకు ఇంటర్‌తో పాటు టీటీసీ, స్కూల్ అసిస్టెంట్లకు డిగ్రీతో పాటు బీఈడి పాస్ అయిన వారు అర్హులుగా ఉండేవారు. అయితే ఉత్తర్వులతో వేల మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోతారని, దాని వల్ల విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందని టీచర్లు ఆందోళళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టెట్ పరీక్షలను ఏడాదిలో కనీసం 2 పర్యాయాలు నిర్వహించాలని, అర్హులైన టీచర్లు అర్హత సాధించేందుకు సహేతుకమైన అవకాశాలు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.అనుత్తీర్ణులు 2,044 మంది -
బీజేపీకి కార్యకర్తలే బలం
మెదక్‌జోన్: బీజేపీకి అసలైన బలం నిబద్దత గల కార్యకర్తలేనని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పార్టీ స్థాపన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షు డు మల్లేశంగౌడ్ మాట్లాడుతూ.. కలిసికట్టుగా ముందుకు సాగుదామని, క్షేత్రస్థాయి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రంజిత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సుధాకర్‌రెడ్డి, నందారెడ్డి, నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్‌రావు -
పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని పురాతన పర్యాటక ప్రదేశాలు పూర్వ వైభవం సంతరించుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై డెక్కన్ టైరెన్ స్వచ్ఛంద సంస్థ, మీర్ఖాన్ సభ్యులు, ఈడీఎం సందీప్, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేశ్‌తో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అనుభవాలను కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ మధు, డిప్యూటీ జోనల్ మేనేజర్, శ్రావణి, మేనేజర్ శ్రీవాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సంగీతతో భూ సేకరణపై సమీక్షించారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటివరకు 40 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
వడ్లు పూర్తిగా కొనుగోలు చేయాలి
గజ్వేల్: రాబోయే నాలుగు రోజుల్లో వడ్లను పూర్తిగా కొనుగోలు చేయకపోతే రాజీవ్ రహదారిపై 30 ట్రాక్టర్ల వడ్లను పోసి దిగ్బంధిస్తామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం గజ్వేల్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి రైతులపై భారీ కుట్రకు తెరలేపాయని మండిపడ్డారు. వ్యవసాయ బోరు మోటా ర్ల వద్ద మీటర్లు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి మీటర్ల బిగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తాం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
చిలప్‌చెడ్(నర్సాపూర్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గౌతాపూర్ శివారులోని గోదాంను సందర్శించి మాట్లాడారు. మండలంలో కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని నర్సాపూర్‌లో గల రెండు గోదాంలకు పంపిస్తామని, మిగితా ధాన్యం దక్కన్ ఆగ్రో గోదాంలో ఖాళీ చేయిస్తామన్నారు. గోదాంలో ఎక్కువ ధాన్యం బస్తాలు ఖాళీ చేసే విధంగా కూలీలను పెంచాలన్నారు. అదేవిధంగా రైతులు తమ సొంత ట్రాక్టర్లలో తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే ఖాళీ చేయించాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ జహీర్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని ఆయా గ్రామ శివారుల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నవీన్ తెలిపారు. మండల పరిధిలోని రాజ్‌పేట, వాడి, తొగిట, హవేళిఘణాపూర్, నాగాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. ఉద్యోగుల అనుమానాలు నివృతి చేయాలి మెదక్‌జోన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల హెల్త్‌కార్డులకు సంబంధించిన సందేహాలను ప్రభుత్వం నివృతి చేయాలని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. హెల్త్‌కార్డుల గురించి ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5 శాతం మినహాయింపు చేస్తామని చెబుతున్నారే తప్ప, ఇందుకు సంబంధించిన విధి విధానాలు చెప్పలేదన్నారు. ఉద్యోగులకు ఏ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తారు..? ఎన్ని రకాల వ్యాధులకు కవరేజీ ఉంటుంది..? వాటికి సంబంధించిన ఆస్పత్రుల జాబితా ప్రకటన నేటికీ చెప్పలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఉపాధ్యాయుల సందేహాలు, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దు, జిల్లా ఉపాధ్యక్షులు మాధవరెడ్డి, నర్సింలు, ప్రసాద్, మంగ నర్సింలు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన టీజీపీఎస్సీ పరీక్షలు వర్గల్(గజ్వేల్): గౌరారం కావేరి విశ్వవిద్యాలయంలో ఈనెల 23 నుంచి కొనసాగుతున్న టీజీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలు శనివారం ముగిశాయి. చివరి రోజు ఉదయం సెషన్లో 71 మందికి 57, మధ్యాహ్నం సెషన్లో 136 మందికి 113 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 170 మంది హాజరైనట్లు కావేరి వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. -
వనదుర్గమ్మకు పల్లకీ సేవ
పౌర్ణమిని పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గమ్మకు శనివారం పల్లకీ సేవ నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీపై ఉంచి, దుర్గామాతకు జై అంటూ భక్తులు స్తుతిస్తుండగా, పల్లకీ సేవ మొదలైంది. ఆలయం వద్ద నుంచి గోకుల్ షెడ్డు వరకు యాత్ర కొనసాగింది. ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. – పాపన్నపేట(మెదక్)నాచగిరి.. వ్రతసిరిసుప్రసిద్ధ నాచగిరి క్షేత్రం శనివారం సామూహిక సత్యదేవుని వ్రతాలతో శోభిల్లింది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించి వ్రతమండపం చేరుకుని భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతమాచరించారు. శ్రీవారికి అభిషేకం, కల్యాణం సేవలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తరించారు. – వర్గల్(గజ్వేల్) -
రైతు డిస్కం పేరిట ఉరితాడు
మాజీ మంత్రి హరీశ్రావునంగునూరు(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న రైతు డిస్కం ఉచిత విద్యుత్‌కు ఉరితాడులా మారుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. పొద్దున సూర్యుడు వచ్చిన తర్వాత మోటార్లు ఆన్ అయి, సాయంత్రం 5 గంటలకు ఎండపోగానే బంద్ అవతాయని ఆరోపించారు. శనివారం పాలమాకులలో పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ముండ్రాయిలో రైతులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ పాలనలో చిన్న సమస్య వచ్చినా మెసేజ్ పెట్టగానే పరిష్కారమయ్యేదని, నేడు పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల ధరలు నేలచూపు చూస్తుండటంతో పిల్లల ఫీజులు కట్టలేక అల్లాడుతున్నారన్నారు. రైతు డిస్కంకు సోలార్ పవర్ మాత్రమే కేటాయించడంతో రోజుకు 7, 8 గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. రైతులను ఆదుకుంటామని గొ ప్పలు చెప్పిన ప్రభుత్వం రైతుబంధుకు ఎగనామం పెట్టిందని ఎద్దేవా చేశారు. -
రైతులు అపోహలు నమ్మొద్దు
డీసీఓ కరుణాకర్ చిలప్‌చెడ్(నర్సాపూర్): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అపోహలను నమ్మొద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా సహకార శాఖ అధికారి కరుణాకర్ అన్నారు. శనివారం చిలప్చెడ్తో పాటు అజ్జమర్రి, బండపోతుగల్, ఫైజాబాద్ గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందన్నారు. ట్రాక్టర్లు ఉన్న వారు ధాన్యాన్ని తమ వాహనంలోనే మిల్లులకు తరలించాలని సూచించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామన్నారు. కేంద్రం నిర్వాహకులు, రైతుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. మిల్లుకు వెళ్లిన ధాన్యం వెంటనే ఖాళీ చేయించడం, గన్నీ బస్తాల నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సొసైటీ సిబ్బందికి సూచించామన్నారు. ఆయన వెంట సొసైటీ సీఈఓ దత్తాత్రి, సిబ్బంది నర్సింహులు, రైతులు ఉన్నారు. -
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026
నిప్పు.. భూసారానికి ముప్పుగా మారుతోంది. యాసంగి వరి కోతలు పూర్తి కావడంతో రైతులు వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలో వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. ఇది శ్రేయస్కరం కాదని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పేర్కొంటున్నారు. పర్యావరణానికి నష్టమే కాకుండా, భూమిలో పోషకాలు, పంటలకు మేలు చేసే కీటకాలు చనిపోయి చీడ పీడలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. – మెదక్‌జోన్ జిల్లావ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు సాగు భూములు ఉండగా, ఏటా యాసంగి, వానాకాలం సీజన్లలో 2.80 నుంచి 3.95 లక్షల ఎకరాల వరకు వరి సాగవుతోంది. కాగా పంట కోయగానే రైతులు వెంటనే వ్యర్థాలకు నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు. ఈ విధానాన్ని పంట సాగులో భాగం చేశారు. దీని వల్ల భూసారం దెబ్బతింటుందని వ్యవసాయశాఖ అధి కారులు చెబుతున్నారు. అయితే పంట వ్యర్థాలను తగులబెట్టడంతో వాయు కాలుష్యం పెరుగుతుంది. పొగతో పాటు బూడిద గాలిలో కలిసి శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు పెరుగుతాయి. అలాగే పంటలకు మేలు చేసే వానపాములతో పాటు బ్యాక్టీరియా చనిపోతుంది. గాలి కలుషితం అవుతుంది. పీల్చిన వారు అనారోగ్యాల బారిన పడతారు. నేల ఆరోగ్యం సైతం దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొగతో ఓజోన్ పొర దెబ్బతిని పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. కలియదున్నితే లాభాలు వరి కోతలు పూర్తి కాగానే నేల గట్టి పడిన అనంతరం నీరు పెట్టి రోటావేటర్తో వరి కొయ్యలు, ఇతర అవశేషాలను పొలంలోనే కలియదున్నితే వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఫలితంగా భూసారం మరింత పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. రసాయన ఎరువులు చాలా తక్కువ మోతాదులో వేసినా సరిపోతుంది. ప్రభుత్వం కఠిన చర్యలు పంట వ్యర్థాలను కాల్చడాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీఓ నెంబర్ 27 ప్రకారం సాధారణంగా వ్యవసాయ వ్యర్థాలు కాల్చి తే రూ.5000, భారీ స్థాయిలో కాల్చితే రూ.25 వేల వరకు పర్యావరణ పరిహారం కింద జరిమానా రూపంలో వసూలు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా కాల్చిన వారు శిక్షార్హులు అవుతారని హెచ్చరించింది.ఆస్తి, ప్రాణాలకు ప్రమాదమే పది రోజుల క్రితం మెదక్ మండలం పేరూరుకు చెందిన ఓ రైతు 105 బస్తాల ధాన్యాన్ని పండించాడు. లారీ రావటం ఆలస్యం కావటంతో వాటిని తన పొలం సమీపంలోని రోడ్డు పక్కన నిల్వ ఉంచాడు. గ్రామానికి చెందిన మరో రైతు తన పొలంలోని వరి కొయ్యలకు నిప్పు పెట్టాడు. గాలి వీయటంతో మంటలు వ్యాప్తించి ధాన్యం బస్తాలకు అంటుకుంది. దాదాపు 25 బస్తాల ధాన్యం కాలిబూడిదయింది. ఏటా ఇలాంటి ఘటనలు జిల్లాలో పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. కొంత మంది రైతులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన సంఘటన లు ఉన్నాయి. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
రామాయంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు రూ. 2.18 కోట్ల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరిశుభ్రత విషయంలో మహిళదే ప్రధాన పాత్ర అని, ఇళ్లలో చెత్తను ట్రాక్టర్లలోనే వేయాలన్నారు. పట్టణంలో పరిశుభ్రత విషయమై ప్రజలు సహకరించాలని కోరారు. టీనేజీ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే సమాజం బాగు పడుతుందని వివరించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, మద్దెల మాధవి, నాయకులు డాకి స్వామి తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య -
అర్హత లేని వైద్యం.. ప్రాణాపాయం
తూప్రాన్: అర్హత లేని వైద్యంతో కొందరు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కట్టడి చేయాల్సిన అధికారులు నోటీసులే ఘనం అన్నట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రంలో వచ్చీరాని వైద్యంతో అనర్హులు డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. పట్టణంలో ప్రాథమిక చికిత్స కేంద్రం పేరిట ఓ మహిళ వైద్యం అందిస్తున్నారు. ఎలాంటి అర్హత పత్రాలు లేనప్పటికీ గర్భిణులు, మహిళలకు చికిత్స చేస్తున్నారు. పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం రోగులు వస్తున్నారు. ఆమె సూచనలు, సలహాలు పాటిస్తున్నారు. సొంతింట్లో సాగే ఈ వైద్యంతో అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. డీఎస్పీ, ఆర్డీఓ స్థాయి అధికారులతో కూడిన డివిజన్ కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం వైద్యశాఖ నిఘా లోపం, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. తనిఖీలు, సామగ్రి జప్తు పట్టణంలో అర్హత లేకుండా మహిళ వైద్యం చేస్తున్నారనే అనుమానంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్ ఏప్రిల్ 14న తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అర్హత పత్రాల చూపలేదు. దీంతో వైద్యం కోసం వినియోగిస్తున్న సామగ్రి, ఫర్నీచర్ జప్తు చేశారు. ఆ తర్వాత ఎలాంటి వైద్యం చేయవద్దని హెచ్చరించారు. ఆ తర్వాత కొద్ది రోజులు వైద్య సేవలకు దూరంగా ఉండి, తిరిగి యథావిధిగా వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు. విషయం తెలిసిన అధికారులు తాజాగా ఈనెల 2న మరోసారి దాడులు నిర్వహించారు. పీసీపీఎన్డీసీ యాక్ట్‌కు విరుద్ధంగా స్కానింగ్‌లకు ప్రొత్సహిస్తున్నారని పేర్కొంటూ, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆ మహిళకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల వ్యవధిలో పూర్తి ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు. అయితే గడువు ముగిసి 10 రోజులు అవుతున్నా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, నిరాటంకంగా ఆ మహిళ వైద్యం కొనసాగుతున్నాయి. ఇదే విషయమై డీఎంహెచ్ఓను ఫోన్ ద్వారా ‘సాక్షి’ సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించడానికి నిరాకరించారు. చోద్యం చూస్తున్న అధికారులు నోటీసులకే పరిమితం -
నాణ్యతలో రాజీ పడొద్దు
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ వీధిలో రూ. 5 కోట్లతో చేపడుతున్న భవన నిర్మాణాన్ని శుక్రవారం పరిశీలించి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల శిక్షణకు, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ భవ నం ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు కనిపించొద్దని స్పష్టం చేశారు. గడు వులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించా రు. అలాగే జిల్లాలో జరుగుతున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి రైతులకు ఇబ్బందులు లేకుండా వెంట వెంటనే ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. అన్నిశాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. -
బాయిల్డ్ మిల్లులకు తడిసిన వడ్లు
పాపన్నపేట(మెదక్): తడిసిన ధాన్యం బాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జిల్లాలో పలు చోట్ల ధాన్యం తడిసిందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఆ ధాన్యం సైతం ప్రభుత్వం కొను గోలు చేస్తుందన్నారు. నిరుపేద యువతుల పెళ్లి ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మొత్తం 104 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రతిపక్షాలు అనవసరంగా ధాన్యం కొనుగోళ్లపై బద్నాం చేస్తున్నాయని మండిపడ్డారు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్‌గౌడ్, సర్పంచ్ పావని, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్‌లు శ్రీధర్, ఏగొండ, శ్రీశైలం, రజిత, భాగ్యమ్మ, గౌస్, సతీశ్, ప్రవీణ్, శివ్వయ్య తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే రోహిత్‌రావు -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
తూప్రాన్: రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి డీలర్లకు సూచించారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలను డివిజన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. వానాకాలం సీజన్ ప్రారంభమవుతు న్న నేపథ్యంలో యూరియా బ్లాక్ చేయకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సీఐ వెంకటరాజు గౌడ్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను విక్ర యిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి డీలర్ రోజువారీ క్రయవిక్రయాలను రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు స్టాక్ బోర్డు కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీఏ, ఏఈఓలు సంతోశ్, సింధు, డీలర్లు వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హులకు జాబ్ కార్డులివ్వాలి చిలప్‌చెడ్(నర్సాపూర్): అర్హులందరికీ ఉపాధి జాబ్ కార్డులు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం నాయకులతో కలిసి మండల పరిధిలోని అజ్జమర్రిలో పర్యటించారు. ఈ మేరకు ఉపాధి పనులను పరిశీలించి, కూలీలతో చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలను రెండుసార్లు ఫొటో క్యాప్చర్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యని వాపోయారు. పాత పద్ధతిలోనే ఉపాధి పనులను కొనసాగించాలన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. చాలా మంది కూలీల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కూలీల సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 5న ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కొల్చారం(నర్సాపూర్)/కౌడిపల్లి: కౌడిపల్లి ఫీడ ర్ పరిధిలో మరమ్మతుల కారణంగా కొల్చారం మండలంలోని అన్ని సబ్స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ మహ మూద్ తెలిపారు. అలాగే కౌడిపల్లి మండలంలోని గ్రామాలకు విద్యుత్ నిలిపి వేస్తున్నట్లు ఏఈ సాయికుమార్ తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. పాలిసెట్ కౌన్సెలింగ్ షురూ ‘టీచర్ల సమస్యలు పరిష్కరించాలి’ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేటేడ్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం సిద్దిపేట జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
అన్లోడింగ్ వేగవంతం చేయండి
నర్సాపూర్: వీలైనంత వేగవంతంగా లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ చేపట్టాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ రైస్ మిల్లర్లకు సూచించారు. శుక్రవారం నర్సాపూర్‌లోని పలు రైస్ మిల్లులు, గోదాంలను పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా చేపట్టాలన్నారు. కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఆయా రైస్‌మిల్లులు, గోదాంలలో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్ విధానం, వడ్ల స్వీకరణ, అన్లోడింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా పోలీస్స్టేషన్ల పరిధిలోని కొనుగోలు కేంద్రాలు, రైసుమిల్లల పనితీరును పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు అధైర్యపడొద్దన్నారు. పండుగల సమయంలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఎలాంటి సందేహాలున్నా పోలీస్ అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ జాన్‌రెడ్డి, ఎస్ఐ రంజిత్‌రెడ్డి ఉన్నారు.ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ -
త్వరగా ధాన్యం తరలించాలి
నర్సాపూర్ రూరల్: ధాన్యం త్వరగా తరలించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలంలోని కాగజ్మద్దూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా రైతులు తమ గోడును ఎమ్మెల్యేకు విన్నవించారు. గోనె సంచులు, లారీల కొరత కారణంగా వడ్లు తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు వడ్లు తడవడంతో పాటు నిద్రాహారాలు మాని ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు ఫోన్ చేశారు. కాగజ్మద్దూర్, నత్నయపల్లి, కొండాపూర్ తదితర గ్రామా లకు గోనె సంచులు, లారీలను పంపి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, నాయకులు శేఖర్, మాజీ సర్పంచ్‌లు పరమేశ్వర రాజు, శంకరయ్య, రైతులు ఉన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
చివరి గింజ వరకు కొంటాం
నారాయణఖేడ్: రైతులు పండించిన పంట ఉత్పత్తులను చివరిగింజ వరకు కొంటామని, రైతులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ధైర్యం చెప్పారు. ఖేడ్ మండలం లింగాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం, మనూరులో జొన్నల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ధాన్యం నాణ్యత, రికార్డులను పరిశీలించారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈసారి 35% వరకు అధిక దిగుబడి వచ్చిందన్నారు. గోడౌన్లలో ఖాళీలేక, లారీల కొరత, మిల్లుల్లో పాతవడ్లు ఉండటం తదితర వాటివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. నిబంధనలను సడలించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందన్నారు. రెండేళ్లుగా జొన్నలు గోడౌన్లలో మగ్గుతుండగా తక్కువ ధరకు ప్రభుత్వం ఇస్తామన్నా కొనేవారు లేరన్నారు. జొన్నలు పండించవద్దని చెప్పినా పండిస్తున్నారన్నారు. పంట మార్పిడికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని కోరారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
కర్షకుడి కన్నెర్ర
టేక్మాల్(మెదక్)/నర్సాపూర్ రూరల్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్య క్తం చేశారు. టేక్మాల్ చౌరస్తాలో బొడ్మట్‌పల్లి– మెదక్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వీరప్ప, జిల్లా యువజన విభాగం కార్యదర్శి నాయికోటి భాస్కర్ తదితరులు రైతులకు మద్దతు తెలిపారు. ఎస్సై అరవింద్ కుమార్, రెవెన్యూ అధికారులు రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. అలాగే నర్సాపూర్– సంగారెడ్డి రహదారిలోని ఆవంచ గేటు వద్ద ధాన్యం అన్లోడ్ చేసుకోవడం లేదని రైతులు రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత ఉందని, సొంతంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి రైస్ మిల్లులలో అన్లోడ్ చేసేందుకు వెళ్లగా హమాలీలు లేరని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, అధికారులు కల్పించుకొని రైతుల రాస్తారోకోను విరమింప చేశారు. -
Ķ欧ýl®-{´ë-†-ç³-¨-MýS¯]l «§é¯]lÅ… Mö¯]l$-Vøâ¶æ$Ï: MýSÌñæMýStÆŠḥæ
మెదక్ కలెక్టరేట్: అకాలవర్షంతో తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో తడిసిన సుమారు 4 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులను తరలించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 62,103 మంది రైతుల నుంచి 2,85,054.080 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. 30 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ముగిసిందన్నారు. రైతులు ధాన్యం సమస్యలపై 9391942254 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. అనంతరం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.కేంద్ర మంత్రిని కలిసిన రైతు కౌడిపల్లి(నర్సాపూర్): కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను గురువారం భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మండలంలోని మహమ్మద్‌నగర్‌కు చెందిన టమాట రైతు మహిపాల్‌రెడ్డి ఢిల్లీలో కలిశారు. ఈసందర్భంగా వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. ఎరువుల ధర తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అన్లోడింగ్ వేగవంతం కొల్చారం(నర్సాపూర్): రైస్ మిల్లులకు ధాన్యం లోడుతో వచ్చిన లారీల అన్లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. గురువారం మండలంలోని వరిగుంతం శివారులోని రైస్ మిల్లును సందర్శించారు. గోదాంలో అన్లోడింగ్ చేసే సమయాన్ని రాత్రి 10 గంటల వరకు చేపట్టాలని ఆదేశించారు. ఖాళీ అయిన లారీలను అవసరమైన కొనుగోలు కేంద్రాలకు వెళ్లేలా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులు పరిష్కరించండి శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాల్లో నేరాల నియంత్రణకు కృషి చేయాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, పీఎస్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు గోదాంలు, రైస్‌మిల్స్‌కు తరలింపులో ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ మధుకర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు. ‘ఉపాధి కూలి పెంచాలి’ కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలి రూ.800కు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం కౌడిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వీబీజీ రాంజీ పథకాన్ని రద్దుచేసి ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో రోజూ రెండు పూటల కూలీల హాజరు ఫొటోతీసే విధానాన్ని సైతం రద్దు చేయాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు ప్రతిరోజు రూ. 800 గిట్టుబాటు కూలీ చెల్లించాలన్నారు. ఈసందర్భంగా మండల వ్యవసాయ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కోషాధికారి నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో రైతు అరిగోస
చిన్నశంకరంపేట(మెదక్): రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని కామారం, నార్సింగి మండలం శేరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులను కదిలిస్తే కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. గన్నీ బ్యాగులు, లారీలు అందుబాటులో లేక రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా తహసీల్దార్‌తో పాటు అదనపు కలెక్టర్ నగేశ్‌తో ఫోన్లో మాట్లాడారు. ధాన్యం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజు, బాబు, నాయకులు లక్ష్మారెడ్డి, గొండస్వామి తదితరులు ఉన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
ఏకరూపం.. ఆలస్యం!
ఇప్పటివరకు జిల్లాకు చేరని క్లాత్ విద్యార్థుల కొలతలు తీసుకుంటున్న సిబ్బంది(ఫైల్ ) ప్రభుత్వ బడులు తెరుచుకునే నాటికి పిల్లలకు యూనిఫామ్స్ అందేనా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అందిస్తామని విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. స్కూళ్ల రీ ఓపెన్‌కు మరో 15 రోజులే మిగిలి ఉండగా, ఇప్పటివరకు జిల్లాకు క్లాత్ సరఫరా చేయకపోవడంగమనార్హం. – మెదక్‌జోన్● మరో 15 రోజుల్లో బడుల పునః ప్రారంభం ● జిల్లావ్యాప్తంగా 904 పాఠశాలలు ● 69 మందికి పైగా విద్యార్థులుపాత డ్రెస్‌తోనే బడికి.. క్లాత్ రాగానే కుట్టిస్తాం -
తడిసిన ధాన్యం వెంటనే కొనాలి
వెల్దుర్తి(తూప్రాన్)/చిలప్‌చెడ్(నర్సాపూర్): అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో రైతులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రాలకు నెలన్నర క్రితం ధాన్యం తీసుకొచ్చినా, కొనుగోళ్లు పూర్తి కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. గ్రామాల్లో 25 శాతం కొనుగోలు కూడా పూర్తి కాలేదన్నారు. ఆందోళనలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, నాయకులు భూపాల్‌రెడ్డి, నర్సింలు, అశోక్‌గౌడ్, శ్రవణ్‌కుమార్, మహేశ్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు. అలాగే చిలప్‌చెడ్ మండలంలోని పలు గ్రామాల్లో కొనుగో లు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆశోక్‌రెడ్డి, సర్పంచ్ అనిల్, నాయకులు, రైతులు ఉన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
దోసె.. పూరీ.. మిల్లెట్ ఇడ్లీ
మెదక్ అర్బన్: ఇక ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకో రకం టిఫిన్‌తో పాటు మధ్యా హ్న భోజనం ఇవ్వనున్నారు. మూడు రోజులు పాలు.. మరో మూడు రోజులు రాగి జావ అందించనున్నారు. జూన్ 12 నుంచి పథకం ప్రారంభించేందుకు ఇంటర్ విద్యాశాఖ సమాయత్తం అవుతుంది. జిల్లాలో 16 జూనియర్ కళాశాలలు ఉండగా, సుమారు 6 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఆకలి తీరుస్తూ.. నమోదు శాతం పెంచుతూ ‘తెలంగాణ బ్రేక్‌ఫాస్ట్’ పథకంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలన్నీ మండల కేంద్రాల్లో ఉన్నాయి. అయితే సుమారు 90 శాతం విద్యార్థులు సమీప గ్రామాలు, తండాల నుంచి వస్తున్నారు. మెజార్టీ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో ఉదయం విద్యార్థులు సరిగా తినకుండానే కాలేజీకి వస్తున్నారు. సాయంత్రం 4.30 వరకు అర్ధాకలితో గడుపుతున్నారు. కొన్నేళ్లుగా ప్రత్యేక తరగతులు కూడా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పాఠాలు కూడా సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ఎదిగే వయసులో సమయాను కనుగుణంగా పోషకాహరం లేక, బల హీనంగా మారుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని చాలా కాలంగా విద్యారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. టిఫిన్, మధ్యాహ్న భోజనం అమలైతే విద్యార్థుల నమోదు.. హాజరు శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ జూన్ 12 నుంచి ప్రారంభం జిల్లాలో 16 కళాశాలలు సుమారు 6 వేల మంది విద్యార్థులురోజుకో రకం టిఫిన్.. పాలు, జావ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రోజుకో రకం టిఫిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం దోసె, చట్నీ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ (రెండు) సాంబారు, బుధవారం పూరీ(రెండు), మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా, గురువారం బోండా– చట్నీ, శుక్రవారం ఇడ్లీ–చట్నీ, శనివారం ఉప్మా– చట్నీని మెనూగా నిర్ణయించారు. వీటితో పాటు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా మొదట కేంద్రీకృత కిచెన్ల ద్వారా వీటిని అందించనున్నారు. -
విద్యుత్ నకిలీలలు
విద్యుత్‌శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఉన్నట్లు ఆశాఖ విజిలెన్స్ విచారణలో తేలింది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డిట్రాన్ ్సకోలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కేసు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి వద్ద నుంచి సీనియర్ అసిస్టెంట్ రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేల్చిన విజిలెన్స్ విభాగం ఈ ముడుపుల్లో కొంత మొత్తాన్ని తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నట్లు ఆధారాలతో సహా గుర్తించింది. ఈ మేరకు పూర్తి నివేదిక ఆశాఖ ఉన్నతాధికారులకు పంపడంతో సదరు అధికారిపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. జేఎల్‌ఎంలుగా ఉద్యోగంలో చేరి.. 2020లో నలుగురు ఆర్టిజన్లు నకిలీ ఎస్సెస్సీ సర్టిఫికెట్లు పెట్టి జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం)లుగా ఉద్యోగాలు పొందారు. గుట్టుచప్పుడు కాకుండా వీరు దాదాపు నాలుగేళ్లుగా ఉద్యోగాల్లో కొనసాగారు. రూ.వేలల్లో జీతభత్యాలు, ఇతర అన్ని సౌకర్యాలు పొందారు. అలాగే ఐటీఐ కూడా పూర్తి చేశామని చెప్పి అసిస్టెంట్ లైన్మెన్ (ఏఎల్ఎం)లుగా పదోన్నతి కూడా పొందినట్లు తెలుస్తోంది. పదోన్నతుల సందర్భంగా పెట్టిన ఐటీఐ సర్టిఫికెట్లు ఫేక్ అని టెక్నికల్ బోర్డు ధ్రువీకరించింది. దీంతో విజిలెన్స్ అధికారులు లోతుగా విచారిస్తే వీరివి ఎస్సెస్సీ సర్టిఫికెట్లు కూడా నకిలీవేనని తేలింది. మరింత కూపీ లాగడంతో ఈ వ్యవహరంలో మరికొందరి అధికారుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. నకిలీగాళ్ల నుంచి ఈ అధికారి రూ.లక్షల్లో ముడుపులను తీసుకున్నట్లు తేలింది. ఇలా తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ముడుపుల మళ్లింపు ఆధారాలు లభించాయి. ఎంకై ్వయిరీ పెండింగ్ పెట్టి.. సాధారణంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలన కోసం పంపుతారు. ఈ సర్టిఫికెట్లు సరైనవేనా? కాదా? అని తెలుసుకుంటారు. ఎస్సెస్సీ సర్టిఫికెట్లను ఎస్సెస్సీ బో ర్డుకు, ఐటీఐ సర్టిఫికెట్లను టెక్నికల్ బోర్డుకు పంపుతారు. సదరు అధికారి వీరి సర్టిఫికెట్లను ఆయా బోర్డులకు పంపకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. పదోన్నతుల సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఐటీఐ సర్టిఫికెట్లను టెక్నికల్ బోర్డుకు పంపగా అవి నకిలీవని తేల్చారు. ఇన్నాళ్లు వెరిఫికేషన్ కోసం పంపకుండా పెండింగ్‌లో పెట్టి వారిని కాపాడినందుకు సదరు సీనియర్ అసిస్టెంట్ ఒక్కోక్కరి వద్ద రూ.లక్షల్లో ముడుపులు పొందినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో కొంత మొత్తాన్ని కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాకు మళ్లినట్లు గుర్తించారు.మరో ఇద్దరు యూనియన్ లీడర్ల పాత్ర?ఈ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారంలో మరో ఇద్దరు యూనియన్ లీడర్ల పాత్ర కూడా ఉన్నట్లు ఆశాఖ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పించడంతో అప్పట్లో వీరు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విభాగం మరింత లోతుగా విచారణ చేపడితే ఈ ఇద్దరు యూనియన్ లీడర్ల పాత్ర కూడా వెలుగులోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వీరిద్దరు ముందు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ గాళ్లతో ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆనవాళ్లను లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐదేళ్ల క్రితం జరిగిన నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక చాలా నెలల క్రితమే ఉన్నతాధికారులకు అందింది. ఈ నివేదికపై వెంటనే చర్యలు చేపట్టాల్సి పోయి..ఏళ్ల తరబడి సాగదీయడం వెనుక కూడా ఆ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలోని కొందరు అధికారులపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. విజిలెన్స్ విచారణలో ఆధారాల గుర్తింపు కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లిన అవినీతి సొమ్ము సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు -
అన్నదాతను ఆదుకోండి
కొండాపూర్(సంగారెడ్డి): అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన కొండాపూర్‌లో గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం నాయకులు పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ...కొనుగోలు కేంద్రాలకు ధా న్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలతో రైతుల ధాన్యం వర్షార్పణం కావడం బాధగా ఉందని, తడిసిన ధా న్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. సకాలంలో కొను గోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో పాటు కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే కొనుగోలు ఆలస్యం అయ్యిందన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశా రు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు సకాలంలో ఎరువులను పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఇన్చార్జి దశరథ్, జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, రాంరెడ్డి, బ్రహ్మం, బాల్‌రాజ్, నర్సింహులు, శివరాములు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
బక్రీద్‌కు పటిష్ట బందోబస్తు
ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మెదక్‌జోన్: బక్రీద్ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డయల్ 100కు వేగంగా స్పందించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎలాంటి సంఘటనలు గమనించినా, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు సందీప్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రేణుకారెడ్డి, కృష్ణమూర్తి, మహేశ్, రామకష్ణ, శైలేందర్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రేపటి నుంచి నీటి నాణ్యతా పరీక్షలు నర్సాపూర్: మున్సిపాలిటీలోని పలు ట్యాంకుల నుంచి సరఫరా అయ్యే నీటిని శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పరీక్షించనున్నట్లు కమిషనర్ సాయికుమార్ తెలిపారు. పట్టణంలోని నమాజ్గడ్డ, మటన్ మార్కెట్ వద్ద ఉన్న ట్యాంకుల నీటిని టెస్టింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఆయా ట్యాంకుల నుంచి 6, 7, 8 వార్డులతో పాటు 14వ వార్డు ప్రజలకు నీరు సరఫరా అవుతాయని, ఆయా వార్డుల ప్రజలు నీటిని తాగొద్దని కోరారు. నీటి నాణ్యత పరిశీలన కోసం పలు రకాల పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. మనోధైర్యం కోల్పోవద్దు -
ఇదేం కనికట్టు!
లేనిది ఉన్నట్టు..మళ్లీ మొదటి కొచ్చిన సర్వే ఎల్లాపూర్‌లో సెన్సెస్ సర్వేకు బయలు దేరిన ఎన్యుమరేటర్లు‘మెదక్ మండలంలోని ఓ గిరిజన తండాలో సుమారు 20 కుటుంబాలకు వ్యక్తిగత మరుగు దొడ్లు లేవు. సెన్సెస్ ఎన్యుమరేటర్ ఈ మేరకు వివరాలు నమోదు చేశారు. కానీ చార్జి ఆఫీసర్ మాత్రం.. టాయిలెట్, గ్యాస్ లేకున్నా ఉన్నట్లు రాయండి, లేదా కమ్యునిటీ టాయిలెట్ ఉపయోగించుకున్నట్లు రాయండి అని హుకుం జారీ చేశారు. ఇంతకీ ఈ తప్పును ఎందుకు చేయమంటున్నారు అని ఆరా తీస్తే.. నవంబర్ 16, 2017న జిల్లాను ఓడీఎఫ్ (ఓపెన్ డెఫకేషన్ ప్రీ) బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా ప్రకటించడంతో, అప్పటి జిల్లా అధికారి అవార్డు సైతం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ అధికారి సెన్సెస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో అప్పటి తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రస్తుత జిల్లా అధికారులు మరో తప్పుకు పురమాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి’. -
గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026
వర్షార్పణంఅకాల వర్షం అతలాకుతలం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. రైతుల రెక్కల కష్టం వర్షార్పణం అయింది. కాంటాలు కాక, రైస్ మిల్లులకు పంపేందుకు లారీలు రాక, నెల రోజులుగా అష్టకష్టాలు పడుతున్న అన్నదాతకు చివరికి తీరని నష్టం మిగిలింది. కొనుగోళ్లలో జాప్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలవాలగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. – మెదక్‌జోన్/కొల్చారం/నర్సాపూర్‌రూరల్/శివ్వంపేట/వెల్దుర్తి(తూప్రాన్):వెల్దుర్తి: కొనుగోలు కేంద్రంలో నిలిచిన వర్షపు నీరు జిల్లాలోని మెదక్, శివ్వంపేట, నిజాంపేట, కొల్చారం, కౌడిపల్లి, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్, తూప్రాన్, వెల్దుర్తి, హవేళిఘణాపూర్, రామాయంపేట తదితర మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. నెలరోజులుగా ధాన్యం తరలించాలని మొరపెట్టుకుంటున్నా, అధికారులు రేపు, మాపు అంటూ కాలయాపన చేశారని మండిపడ్డారు. ముందే లారీలు తెప్పించి ఉంటే తమకు ఈ గోస పట్టేది కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో 34.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా చిలప్‌చెడ్ మండలంలో 68.8 ఎం.ఎం నమోదు కాగా, అతి తక్కువగా హవేళిఘణాపూర్ మండలంలో 18 ఎం.ఎం వర్షం కురిసింది. -
ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. స్థానిక నాయకత్వంతో మమేకమై ప్రణాళికబద్ధంగా పనిచేయాలని, సమన్వయంతో పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు. నాయకులు ప్రతీ కార్యకర్తకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.50 రుసుముగా నిర్ణయించామని, ఆన్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. స్పాట్లో లైవ్ ఫొటో తీసుకుని ఓటరు వివరాలు కూడా వెంటనే నమోదవుతాయన్నారు. తద్వారా ఈ సభ్యత్వ నమోదు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ సభ్యత్వ నమోదు పకడ్బందీగా నిర్వహించడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని, రానున్న ఎన్నికల్లో పదికి పది చోట్ల విజయం సాధించేలా పునాదులు వేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నందున..రైతులు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్ మొదటి వారంలో ఆన్లైన్ సభ్యత్వ నమోదు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్‌రావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు పద్మారెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వంటేరు ప్రతాపరెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మెంబర్షిప్ డ్రైవ్ జిల్లా ఇన్చార్జి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతీ కార్యకర్తకు సమయం ఇవ్వండి నాయకులు, కార్యకర్తలుసమన్వయంతో పనిచేయాలి సభ్యత్వ నమోదు సన్నాహకసమావేశంలో హరీశ్‌రావు -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి డీడబ్ల్యూఓ స్వరూప బుధవారం పేర్కొన్నారు. జిల్లాలోని 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల బాల బాలికలు వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చి ఉండాలన్నారు. ఆవిష్కరణలు, క్రీడలు, సృజనాత్మకత, మంచి అభ్యాసన, సాంస్కృతిక కళలు, సాహాసం, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 31లోగా ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని డీడబ్ల్యూఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
అన్నదాత ఆగ్రహం
● కొనుగోళ్లలో జాప్యంపై ఆందోళన ● జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలుమెదక్కలెక్టరేట్/వెల్దుర్తి(తూప్రాన్)/చిలప్‌చెడ్/కొల్చారం(నర్సాపూర్): ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా రైతులు బుధవారం రోడ్డెక్కారు. వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్‌లో ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై ధాన్యం బస్తాలు ఉంచి నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, ఆర్ఐ సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై వాహనాలు అడ్డుపెట్టి మరోసారి ధర్నాకు దిగారు. కొల్చారం మండలంలోని చిన్నఘనాపూర్, రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని గ్రామాల రైతులు మెదక్–జోగిపేట రహదారిపై తడిసిన ధాన్యం బస్తాలతో రాస్తారోకోకు దిగారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని హవేళిఘణాపూర్ మండలం సర్ధన గ్రామ రైతులు కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేపట్టారు. స్పందించిన అదనపు కలెక్టర్ నగేశ్ లారీలను త్వరగా పంపించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అలాగే చిలప్‌చెడ్ మండల పరిధిలోని చిట్కుల్ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇన్చార్జి తహసీల్దార్ జహీర్‌తో పోలీసులు రైతు లు ముందే ఫోన్లో మాట్లాడారు. గంటలో 5 లారీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.చిలప్‌చెడ్: చిట్కుల్ చౌరస్తా వద్ద రైతులకు నచ్చచెబుతున్న పోలీసులు -
తడిసిన ప్రతి గింజా కొంటాం
నర్సాపూర్ రూరల్: అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం మ ండలంలోని తుల్జారాంపేట కొనుగోలు కేంద్రా న్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా 400 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని క్షేత్రస్థాయిలో అధికారులు ఇచ్చిన రిపోర్టు ద్వారా తెలిసిందన్నారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. బుధవారం సాయంత్రం వరకు 250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పుకార్లు నమ్మి మధ్యవర్తులను ఆశ్రయించవద్దని విజ్ఞప్తి చేశా రు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. 18 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో 18 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించే ఏర్పా ట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు, గన్నీ సంచుల లభ్యత, కాంటా పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న ధాన్యం బస్తాల వివరాలు, రిజిస్టర్ నిర్వహణ, తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
● పోలీసుల ఫ్లాగ్‌మార్చ్
బక్రీద్ సందర్భంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం పట్టణంలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా, రాందాస్ చౌరస్తా, పొట్టి శ్రీరాములు విగ్రహం, చామన్ ప్రాంతాల మీదుగా ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు మహేశ్, కృష్ణమూర్తి, శైలేందర్, రామకృష్ణ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. – మెదక్‌జోన్ -
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) మధ్యాహ్నం వరకూ ఎండతో అల్లాడిన ప్రజల్ని వర్షం పలకరించింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎల్లారెడ్డి మండలం అల్మాస్పూర్లో గాలివాన బీభత్సానికి వర్షపు నీరు కల్లాల్లోకి చేరింది. దాంతో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి బీభత్సంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ చెట్టు కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుంతపల్లి చెరువు తండాలో పిడుగుపడింది. మెదక్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి మెదక్ మండలంలో ధాన్యం తడిసిపోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలో ఈదురు గాలికి పశువుల పాక కూలింది. లక్ష్మయ్య అనే గొర్లె కాపరి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తడిచిపోయింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆవేదన చెందుతున్నారు. -
నూతన మిల్లులో ధాన్యం నిల్వ చేయండి
చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల పరిధి చండూర్ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఓ రైస్‌మిల్లులో మండల రైతులకు సంబంధించిన ధాన్యం బస్తాలు నిల్వ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మిల్లు ఓనర్ సుబ్బరాజును జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై డీఎం జగదీష్ కోరారు. శనివారం వారు రైస్ మిల్లును సందర్శించి, ధాన్యం బస్తాల గోదాంగా వినియోగించేందుకు ఓనర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సీజన్లో ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండటంతో ధాన్యం బస్తాలు నిల్వ చేసేందుకు గోదాంలు సరిపోవడం లేదన్నారు. ప్రస్తుతం నూతన రైస్‌మిల్లు నడిపేందుకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో, ధాన్యం బస్తాలు నిల్వ ఉంచేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. త్వరలోనే మిల్లు నడిపేందుకు పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మిల్లులోకి లారీలు వచ్చేందుకు ర్యాంప్‌లు, ధాన్య బస్తాల నిల్వకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఓనర్ సుబ్బరాజు సైతం ధాన్యం బస్తాల నిల్వకు అంగీకరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ జహీర్, ఎంపీడీఓ ప్రశాంత్, మాజీ వైస్ ఎంపీపీ విశ్వంభర, సొసైటీ సిబ్బంది నర్సింహులు పాల్గొన్నారు. జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ -
భూవివాదంలో పరస్పర దాడులు
చేగుంట(తూప్రాన్): భూవివాదంలో ఇరువర్గాలు దాడి చేసుకున్న సంఘటన మండలంలోని జెత్రంతండాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాలోని 85 సర్వే నంబర్లో వ్యవసాయ భూమిని నరేష్, రవీందర్ అనే వ్యక్తిలు రియల్ వ్యాపారులకు విక్రయించాడు. సంబంధిత భూమి కంటే ఎక్కువ భూమిని ఆక్రమించి కడ్డీలు వేసేందుకు రియల్ వ్యాపారి కొందరిని తీసుకొని తండాకు చేరుకున్నారు. పొలం ఎక్కువ భాగం ఆక్రమించి హద్దులు వేయడానికి వీలు లేదని చెప్పడంతో రియల్ వ్యాపారి తీసుకొచ్చిన వ్యక్తులు.. తండావాసులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. విద్యుత్‌షాక్‌తో ఎద్దు మృతి టేక్మాల్(మెదక్): ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో ఎద్దు మృతి చెందిన సంఘటన టేక్మాల్ మండల కుసంగి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముత్యంగారి శ్రీశైలం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. శనివారం అతని భార్య ముత్యంగారి రాణెమ్మ ఎడ్లను మేపడానికి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లింది. అవి మేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న 33కేవీ ట్రాన్స్ఫార్మర్కు తగిలి అక్కడికక్కడే ఎద్దు మృతిచెందింది. రూ.85వేల విలువ గల ఎద్దు మృతి చెందడంతో బాధితులు బోరున విలపించారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేగుంట(తూప్రాన్): కార్మికుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో చేగుంటలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. వేతన పెంపు నిర్ణయం కార్మికుల కుటుంబాల్లో ఎంతో సంతోషం వ్యక్తమవుతోందతని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, కాంగ్రెస్ నాయకులు లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, ఉపసర్పంచ్ రఫీ, నాయకులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలో.. వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్‌రెడ్డి కటౌట్‌కు కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్మికుల జీతాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి మహేశ్‌రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, మల్లేశం, మల్లేశంచారి, వెంకట్‌రెడ్డి, రవి పాల్గొన్నారు. -
గోదావరి జలాలు వచ్చేనా?
శివ్వంపేట(నర్సాపూర్): నర్సాపూర్ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకంలో భాగంగా అప్పటి ప్రభుత్వం గోదావరి నీటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. నిధులు మంజూరు చేసి పనులు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా నీటి నిల్వ కోసం శివ్వంపేట వద్ద 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో భారీ సంపు నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. పనులు పూర్తయినా ఈ సంపు ప్రస్తుతం నిరుపయోగంగా మారడం గమనార్హం. రూ. 30 కోట్ల కేటాయింపు గజ్వేల్ నియోజకవర్గం కొమటిబండ నుంచి గోదావరి జలాలను (హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా) నర్సాపూర్ నియోజకవర్గానికి తరలించేందుకు గత ప్రభుత్వం రూ. 30 కోట్లు కేటాయించింది. రివర్స్ పంపింగ్ పద్ధతిలో ఇక్కడికి నీటిని తరలించే ప్రక్రియను చేపట్టారు. కొమటిబండ నుంచి నర్సాపూర్ పీర్లగుట్ట వరకు ఉన్న 45 కిలోమీటర్ల పైప్‌లైన్‌లో సుమారు 16 కిలోమీటర్ల మేర కొత్త లైన్‌ను ఏర్పాటు చేశారు. నర్సాపూర్‌లోని పీర్లగుట్ట వరకు నీటిని తరలించి, అక్కడి నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలన్నది ఈ పథకం ముఖ్యఉద్దేశం. నిరుపయోగంగా 8 లక్షల లీటర్ల సంపు గోదావరి జలాల తరలింపులో భాగంగా శివ్వంపేటలో నిర్మించిన భారీ సంపు ప్రస్తుతం వృథాగా ఉంది. కొమటిబండ నుంచి ఏర్పాటు చేసిన ప్రధాన పైప్‌లైన్ కొన్ని చోట్ల పాడైపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. మంజీరా, గోదావరి నీటి కలయికే ఏకై క మార్గం శివ్వంపేటలో నిర్మించిన సంపులోకి గోదావరి జలాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సంపులోనే మంజీరా, గోదావరి నదుల నీటిని కలిపి సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనుల కారణంగా నీరు నిల్వ లేకపోవడంతో.. 15 రోజులుగా గ్రామాలకు మంజీరా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా గోదావరి నీటిని అందుబాటులోకి తీసుకొస్తేనే తాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయి. శివ్వంపేటలో నిరుపయోగంగా ఉన్న సంపు రూ.30 కోట్లు ఖర్చు చేసినా తీరని దాహార్తి పైప్‌లైన్ మరమ్మతులకు నోచుకోక నిలిచిపోయిన సరఫరా 15 రోజులుగా నీటి సరఫరా బంద్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
ధాన్యం కొనుగోలు చేయండి
చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోయిందని, వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, నార్సింగి బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం నార్సింగి తహసీల్దార్ గ్రేసిబాయికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతుతూ.. కొనుగోలు కేంద్రాల్లో 75 శాతం ధాన్యం ఇప్పటికీ కాంటా వేయకుండా ఉందన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కాంటా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మైలారం నర్సింలు, నాయకులు హరిబాబు, లక్ష్మణ్, శ్రీనివాస్, నరేష్ ఉన్నారు. -
నైపుణ్యం వెలికితీసేందుకే క్యాంపులు
పాపన్నపేట(మెదక్): విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆచరణ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ప్రవీణ్, నాగేశ్వర్రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొడుపాక ఉన్నత పాఠశాలలో ట్రస్ట్ తరఫున సమ్మర్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు పాఠశాలలో క్రీడలు, కెరీర్ గైడెన్స్, విద్య ప్రాముఖ్యత, నైతిక విలువలు, సృజనాత్మకత, డ్రాయింగ్, పెయింటింగ్ తదితర విషయాలపై అవగాహన పెంపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి నాయుడు, సర్పంచ్ పంకజ కాశీనాథ్, పీఈటీ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
నర్సాపూర్: కిషోర బాలికలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కిషోర బాలికలకు హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్లు వేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ సాయికుమార్, డాక్టర్ సునీత మెప్మా ఇన్చార్జి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు బాలికలకు పలు టెస్టులు నిర్వహించారు. పకడ్బందీగా జనగణన నిర్వహణ పెద్దశంకరంపేట(మెదక్): ఎన్యూమరేటర్లు పకడ్బందీగా జనగణన నిర్వహించాలని తహసీల్దార్ ప్రభుదాస్ పేర్కొన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ఎన్యూమరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లకు కేటాయించిన ఇళ్ల వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్ల సమస్యలపై చర్చించాలని, ఇబ్బందులు లేకుండా జనగణన పూర్తి చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల పరిశీలన పెద్దశంకరంపేట(మెదక్): మండలంలోని జూకల్, కొత్తాపేట, కమలాపూర్, బూర్గుపల్లి తదితర గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ప్రభుదాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఐకేపీ సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ధాన్యం వెంటవెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లారీల కొరత, ధాన్యం అన్లోడింగ్ విషయాలపై మిల్లర్లతో చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సీసీలు పాల్గొన్నారు. ఎల్ఓసీ అందజేత కౌడిపల్లి(నర్సాపూర్): బాధిత కుటుంబానికి రూ 2.25లక్షల ఎల్ఓసీ మంజూరయింది. శనివారం మండల పరిధి వెంకట్రావ్‌పేటకు చెందిన లక్ష్మణ్‌గౌడ్ కూతురు అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ మేరకు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎల్ఓసీ అందచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కుతుబుద్దీన్, రాజయ్య తదితరులు ఉన్నారు. కరాటేతో ఆత్మరక్షణ కొల్చారం(నర్సాపూర్): ఆపదలో ఎదుటి వారి ని ఎదుర్కొనేందుకు కరాటే ఒక సాధనం. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచన విధానం మారి.. వారి పిల్లలను కరాటేలో నైపుణ్యం సాధించేలా తర్ఫీదు ఇస్తున్నారు. మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలలో వేసవి క్రీడాశిక్షణ శిబిరంలో భాగంగా పిల్లలకు వాలీబాల్,కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. ఆడపిల్లలు ఎక్కు వగా హా జరై కరాటే నేర్చుకుంటున్నారు. కరాటే మాస్టర్ మల్లేశం ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తున్నారు. కొనుగోళ్లు సజావుగా సాగేలా చూస్తాం గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డు పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లో వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ 22 వరకు 74,554 క్వింటాళ్ల వడ్లు, 26,090 క్వింటాళ్ల మొక్కజొన్న, మరో 3,654 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు కొనుగోళ్లు జరిగాయన్నారు. -
రైతులపై కాంగ్రెస్‌ది కపటప్రేమ
చిన్నశంకరంపేట(మెదక్): రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కపటప్రేమ చూపుతుందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. శనివారం చిన్నశంకరంపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. మండలంలోని ఆగ్రహారంలో రైతు ధాన్యం కొనడం లేదని ఆత్మహత్యకు పాల్పడిన విషయం పత్రికల్లో చూసి .. ప్రధాన ప్రతిపక్షంగా గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాం. అంతే తప్ప శవరాజకీయాలు చేయలేదన్నారు. పరామర్శించడం కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిని విమర్శించడం కాంగ్రెస్ నాయకుల నోటి దురుసుకు నిదర్శనమన్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సిద్దిరాములు, కృష్ణాగౌడ్, నరేష్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, ప్రభాకర్, చందాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటి ట్యాంక్.. మురికికూపం!
కొల్చారం(నర్సాపూర్): గ్రామపంచాయతీలో నిధుల లేమియా? లేక అధికారుల నిర్లక్ష్యమా? రక్షిత మంచినీటి ట్యాంక్ చుట్టూ పేరుకుపోయిన మురికి గ్రామాభివృద్ధికి అద్దం పడుతోంది. మండలంలోని తుక్కాపూర్ గ్రామ ప్రవేశానికి ముందే, ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న రక్షిత మంచినీటి ట్యాంకు చుట్టూ నీరు నిలిచిపోయి మురికికూపాన్ని తలపిస్తోంది. ట్యాంకు నుంచి గ్రామాల్లోకి వెళ్లే ప్రధాన పైపులైన్లు సైతం మురికి నీటిలోనే ఉండడం గమనార్హం. పైపులైన్లలో ఏమాత్రం లీకేజీ ఏర్పడినా.. ఆ మురికి నీరే నేరుగా ఇళ్లకు సరఫరా అయ్యే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. అదే గనుక జరిగితే గ్రామ ప్రజలు తీవ్రమైన రోగాల బారిన పడడం ఖాయమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు, పక్కనే ఉన్న పశువుల తొట్టిలోకి కూడా ఈ మురికినీరు కలిసే ప్రమాదం పొంచి ఉంది. మరోకొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. స్కూల్ పక్కనే ఈ మురికి నీటి గుంట ఉండడంతో, చిన్నారులు అటువైపుగా వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికై నా అధికారులు తక్షణమే స్పందించి, రక్షిత మంచినీటి ట్యాంకు చుట్టూ ఉన్న మురికిని తొలగించి, పైపులైన్లను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
భూమి ఇప్పించాలని వినతి
చేగుంట(తూప్రాన్): అక్రమంగా భూమిని తన పేరుపై మార్చుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని.. తమ భూమిని ఇప్పించాలని బాధిత రైతు కుటుంబం మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మాసాయిపేట మండలం పోతాన్‌పల్లి గ్రామానికి చెందిన బర్రె సత్తయ్య కుటుంబీకులకు సర్వే నం.203లో 25 గుంటల భూమి ఉండగా 30 ఏళ్లుగా సాగు చేసుకొని జీవిస్తున్నారు. రెవెన్యూ శాఖలో పనిచేసే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సంబంధిత భూమిని తన పేరుపై రికార్డులను మార్పు చేయించి భూమి తనదేనని దౌర్జన్యం చేస్తున్నాడని సత్తయ్య ఆరోపించారు. విచారణ చేసి తమకు న్యాయం చేయాలని సత్తయ్య కుటుంబీకులు తహసీల్దార్ జ్ఞానజ్యోతికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరమేశ్, భాస్కర్, బాలుతో పాటు బాధిత కుటుంబీకులు తదితరులు ఉన్నారు. -
పంట మార్పిడితో ప్రయోజనం
కొల్చారం(నర్సాపూర్): పంట మార్పిడితో రైతులకు మేలు చేకూరుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ప్రమీల సూచించారు. శనివారం మండల పరిధి సంగాయిపేట గ్రామంలో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ప్రమీల మాట్లాడుతూ.. వివిధ పంటలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. ముఖ్యంగా వరి నారుమాడిలో యాజమాన్యం, నీటి యాజమాన్యంపై రైతులకు తెలిపారు. పత్తి, మొక్కజొన్న పంటల్లో వచ్చే చీడపీడల గురించి వివరిస్తూ పంట మార్పిడి పద్ధతిని పాటించాలన్నారు. పచ్చి రొట్టె ఎరువులు జనుము, జీలుగ వంటి విత్తనాలను రైతు తన పొలంలో ఒక మడిలోనైనా పండించి దానిని రాబోయే పంట కాలానికి విత్తనంగా ఉపయోగించాలన్నారు. పంట మార్పిడి చేయాలన్న కోతుల బెడద వల్ల ముందడుగు వేయలేకపోతున్నామని రైతులు శాస్త్రవేత్త దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచ్ కాంతమ్మ, ఎఫ్‌పీఓ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఏఓ రాజశేఖర్ గౌడ్, రైతులు పాల్గొన్నారు. -
లారీ ట్రాన్స్‌పోర్టు ప్రతినిధుల నిర్బంధం
కొల్చారం(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాలకు కుప్పల తెప్పలుగా వచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం వేసేందుకు హమాలీల కొరత ఒకవైపు... లారీల కొరత మరోవైపు సమయానికి తిండి తినలేక రైతులు ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తూకం వేసిన ధాన్యం రవాణా చేసేందుకు లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు శనివారం సంఘానికి వచ్చిన లారీ ట్రాన్‌న్స్‌పోర్ట్ ప్రతినిధులను రెండు గంటల పాటు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న సంఘం చైర్మన్ రమేష్ అధికారులతో మాట్లాడి రైతులను సముదాయించారు. సంఘం పరిధిలో తూకం వేసిన 22,000 బస్తాల ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. తూకం వేసిన బస్తాలు నింపుకొని వెళ్లిన లారీలను వెంటనే అన్లోడ్ చేసి తిరిగి పంపించాలని చైర్మన్ రమేష్ తహసీల్దార్ శ్రీనివాస్ చారి దృష్టికి తీసుకువచ్చారు. రంగంపేట పీఏసీఎస్‌లో నెలకొన్న పరిస్థితి ముందుకు సాగని తూకం, ధాన్యం రవాణా -
వీఓఏల సమస్యలపై ఆందోళన
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వీఓఏలు ఐకేపీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ వేతనాలను రూ.20 వేలకు పెంచాలన్నారు. అలాగే, ఆరోగ్య భద్రత కార్డులు, అర్హులను సీసీలుగా పదోన్నతులు కల్పించాలని.. వీఓఏలకు ట్యాబ్‌లు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో వీఓఏల సంఘం కార్యదర్శి గుండన్న, కోశాధికారి స్వరూప, సహాయ కార్యదర్శి శ్రీశైలం, బేతయ్య, కవిత, పుష్ప, విజయలక్ష్మి, ఉమారాణి, స్వప్న, సంతోష, గంగ, పోచయ్య తదితరులు ఉన్నారు. -
అధికారులున్నా లేనట్లే!
అల్లాదుర్గం(మెదక్): గ్రామస్థాయిలోనే రెవెన్యూ సమస్యలను పరిష్కరించి, ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అల్లాదుర్గం మండలానికి నలుగురు జీపీఓలను నియమించింది. వీరిని అల్లాదుర్గం, చిల్వెర, కాయిదంపల్లి, బహిరన్‌దిబ్బ క్లస్టర్లకు కేటాయించారు. వీరు నిరంతరం గ్రామాల్లోనే ఉంటూ స్థానిక రెవెన్యూ సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా, క్లస్టర్ గ్రామాలకు కేవలం చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన జీపీఓలు గ్రామాల్లో ఉండకపోవడంతో, ప్రజలు తమ సమస్యల కోసం ఎప్పటిలాగే తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జీపీఓలతో తహసీల్దార్ కార్యాలయంలోనే పనులు చేయిస్తుండటం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి, విచారణ జరిపి గ్రామపరిపాలన అధికారులు స్థానికంగా గ్రామాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇష్టారాజ్యంగా విధులు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సిబ్బంది ఉ.11 గంటలు దాటిన తర్వాతే విధులకు హాజరవుతుండగా, మరికొందరు కార్యాలయంలో ఉంటూ సెల్ఫోన్లలో కాలక్షేపం చేస్తున్నారు. శనివారం సాక్షి ప్రతినిధి కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఓ ఉద్యోగిని విధులను పక్కనబెట్టి ఫోన్లో రీల్స్ చూస్తూ కెమెరాకు చిక్కడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. సిబ్బంది విధుల్లో ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా పైఅధికారులు పట్టించుకోవడం లేదని, దూరప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చే తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ● తహసీల్దార్ కార్యాలయంలోనే తిష్ట.. ● ఫోన్లతో కాలక్షేపం -
కర్షకుల కన్నెర్ర
హవేళిఘణాపూర్(మెదక్): తూకం వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రావడం లేదంటూ మండల పరిధిలోని గంగాపూర్ రైతులు శుక్రవారం మెదక్– రామాయంపేట జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. తాము పండించిన పంటలు కొనుగోలు చేయకుండా ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించా రు. తూకం వేసిన ధాన్యం తరలించమని మొర పెట్టుకున్నా ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమించారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనమెదక్ కలెక్టరేట్: ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండిపడ్డారు. శుక్రవారం హవేళిఘణాపూర్ మండలం కొత్తపల్లి రైతులు కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మూలుగుతుందన్నారు. ఇప్పటికే అకాల వర్షాలు పడుతుంటే ధాన్యం తడిసిపోయే పరిస్థితి ఉందన్నారు. వారానికో లారీ వస్తుందని, దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోయినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోలేదు. తహసీల్దార్ సింధు రేణుక వచ్చి తాను రేపు లారీలను పంపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. లారీల కోసం మాటు చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలు సమకూర్చేందుకు అ ధికారులు చర్యలు ప్రారంభించారు. తహసీల్దార్ గ్రేసిబాయి, ఎస్ఐ సృజన పోలీస్ సిబ్బందితో కలిసి శుక్రవారం నార్సింగి జాతీయ రహదారిపై ఖాళీగా వెలుతున్న లారీలను గుర్తించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించారు. ఈసందర్భంగా తహసీల్దార్ గ్రేసిబాయి మాట్లాడుతూ.. రైతుల ధాన్యం తరలించేందుకు హైవేపై ఖాళీ లారీలను గుర్తిస్తున్నట్లు తెలిపారు.పెండింగ్ కేసులు పూర్తి చేయండిఎస్పీ డీవీ శ్రీనివాసరావురేగోడ్(మెదక్)/పెద్దశంకరంపేట: పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు రాజశేఖర్‌రెడ్డి, రేణుకారెడ్డి, సందీప్‌రెడ్డి, ఎస్ఐ పోచయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం 161వ జాతీయ రహదారి కోళాపల్లి పాత టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. -
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు
శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026బడిలోనే బ్రేక్‌ఫాస్ట్ మెదక్‌అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2026– 27 విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందివ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో నిధులు సైతం కేటాయించారు. పథకం అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. దీంతో నిరుపేద పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆకలి బాధలు తీరనున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి హైస్కూల్ చదువుల కోసం కాలినడకన వచ్చే విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనకరంగా మారనుంది. తద్వారా డ్రాపౌట్స్ తగ్గే అవకాశం ఉంది. విజయ డెయిరీ పాలు సర్కార్ బడుల్లో 10వ తరగతి వరకు విద్యార్థులకు రోజుకో టిఫిన్, పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో మూడు రోజులు పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడి, మరో మూడు రోజులు బోండా, ఉప్మా, ఇడ్లీ ఇవ్వాలని నిర్ణయించారు. 1 నుంచి 5 తరగతుల వారికి రోజుకు రూ.8తో, 6 నుంచి 10 తరగతుల వారికి రూ.12 ఖర్చుతో అల్పాహారం అందించనున్నారు. ఇక పౌష్టికాహారంగా పాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిబంధనల మేరకు 150 నుంచి 200 మి.లీ వరకు టెట్రా ప్యాక్‌లలో పాలు ఇవ్వాలని సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు విజయ డెయిరీకి ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. కాగా గతంలో ఇచ్చే రాగి జావాను మూడు రోజుల పాటు, మరో మూడు రోజులు పాలు ఇవ్వాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై మెదక్ డీఈఓ రాజును వివరణ కోరగా.. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, అయితే ఇంకా ఉత్తర్వులు రాలేదని చెప్పారు.జిల్లా పాఠశాలలు విద్యార్థులు మెదక్ 881 68,219 సిద్దిపేట 935 80,541 సంగారెడ్డి 1,222 1,06,2992,55,059 విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 2,55,059 విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా హైస్కూళ్లు చిన్న గ్రామాల్లో ఉండకపోవడం, బస్సు సౌకర్యాల లేమితో చాలా మంది విద్యార్థులు కాలినడకన కాలే కడుపుతో ఉదయం పూట బడికి వస్తుంటారు. వారికి ఈ పథకం ఆకలి తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని అందివ్వనుంది. -
సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలే కేంద్ర బిందువని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి కృషితోనే జిల్లా ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ జీవన భద్రత కోసం బీమా పథకాల అమలు, భూసారాన్ని కాపాడేందుకు పంటల మార్పిడి, లాభదాయక వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం ఆయాశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్లు రాధిక, లావణ్య, సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్య ంగా అధికారులు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేగుంట(తూప్రాన్): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం రెడ్డిపల్లి కొనుగోలు కేంద్రంతో పాటు చందాయిపేటలోని రైస్‌మిల్లును సందర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జనగణన కార్యక్రమాన్ని పరిశీలించారు. -
కొనుగోడు
జిల్లాలో ఇలా.. లక్ష్యం 3.50 లక్షల మె.ట ఇప్పటివరకు కొన్నది 2.11 లక్షల మె.ట ఇంకా సేకరించాల్సింది 1.39 మె.ట రైస్ మిల్లులు 100కొనుగోలు కేంద్రాలు 533మెదక్‌జోన్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. చివరి గింజ కొంటామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలు రావడం లేదు. అధికారులు ముందస్తు ఆలోచన చేయకపోవటంతో హమాలీల కొరత ఏర్పడింది. ఎంతమంది అవసరమో అంచనా వేయటంతో, పాటు వారిని సకాలంలో రప్పించటంలోనూ విఫలమయ్యారు. ఏటా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగానే జిల్లాకు బీహార్‌కు చెందిన హమాలీలు ఎక్కువగా వచ్చేవారు. కాగా ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగటంతో వారి రాక ఆలస్యమైంది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగానే ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత.. గుండెకోత జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈ యాసంగి సీజన్లో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని సెంటర్లలో తూకం వేయటం ఆలస్యం అవుతుండగా, మరికొన్ని చోట్ల తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరుగుతుంది. ఫలితంగా రైతులు ఏదో ఒక చోట ఆందోళనలు చేపడుతున్నారు. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఓ రైతు బలవన్మరణం చెందగా, మరో రైతు గుండెపోటుతో మరణించాడు. ఈ రెండు ప్రభుత్వ హత్యలని ప్రతిపక్షాలు విమర్శిస్తే, అధికారులు మాత్రం వారి మరణాలకు వేరే కారణం ఉందని అంటున్నారు. లారీలు లేక.. కొనుగోళ్లు సాగక బ్లాక్ లిస్టులో 6 రైస్ మిల్లులు చిన్నశంకరంపేట మండలం శాలిపేట కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి 10 రోజులు కావొస్తుంది. సకాలంలో లా రీలు రాకపోవటంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. ధాన్యం రైస్ మిల్లులకు చేరే వరకు పూర్తి బాధ్యత సదరు రైతులదే కావటంతో కర్షకులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇది ఒక్క శాలిపేటలోనే కాదు జిల్లాలోని వందలాది కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి. జిల్లాలో 132 రైస్ మిల్లులు ఉండగా, వాటిలో 32 మిల్లులపై పలు రకాల కేసులు ఉండటంతో వాటికి ధాన్యం కేటాయించలేదు. మిగితా 100 మిల్లులకు యాసంగిలో ధాన్యం కేటాయించారు. వాటిలో 61 రారైస్, 39 బాయిల్డ్ మిల్లులకు కేటాయించగా, వాటిలో ఇప్పటివరకు 6 రారైస్ మిల్లుల యాజమాన్యాలు, యాసంగిలో నూకశాతం అధికంగా ఉంటుందనే కారణం చూపి ధాన్యం దింపుకోవటంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆ రైస్ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టారు. -
కొత్త పింఛన్లు!
నారాయణఖేడ్: ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న 50 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు చేయూత పేర నూతన పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి పింఛన్లు అందజేయాలని యోచిస్తుండగా జిల్లాలో కూడా అర్హులైన వారికి పెన్షన్లు దక్కనున్నాయి. దాదాపు మూడేళ్లుగా నూతన పింఛన్లు మంజూరు కావడంలేదు. మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పింఛను మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 2న నూతన పింఛన్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లాలో నూతన పింఛన్ల కోసం సుమారు 22వేల మంది దరఖాస్తులు సమర్పించారు. లాగిన్‌కు అనుమతులు కొత్త చేయూత పింఛనుదార్ల మంజూరు నేపథ్యంలో ప్రభుత్వ శాఖలకు వెబ్ సైట్లోకి లాగిన్ అయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికై తే ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారు మున్సిపల్ కార్యాలయాలను సంప్రదించాలి. ఎంపీడీఓ, ఇటు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. చేయూత పేర పంపిణీకి చర్యలు -
రూ.850 కోట్ల రుణాలు
కంది(సంగారెడ్డి): అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కందిలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కోసం గ్రామ,మండల, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో ఉన్న 50% మహిళలకు భద్రత ఆర్థికాభివృద్ధి కోసం పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రూ.850 కోట్లను బ్యాంకు లింకేజీతో రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందజేసినట్లు చెప్పారు. మహిళాశక్తిని పెంచేందుకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు కేటాయించామని గుర్తు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో సంఘాలకు పావలా వడ్డీపై రుణాలు అందజేశామని అదే స్ఫూర్తితో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. పేదలందరికీ వైద్యం అందాలనే ఉద్దేశంతో గతంలో ఉన్న రూ.ఐదు లక్షల పరిధిని రూ.పది లక్షలకు ఆరోగ్యశ్రీలో పెంచామని వివరించారు. దీంతోపాటు మరో 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు పేర్కొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ -
వారసత్వ సంపదనుకాపాడుకోవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. వారసత్వ సంపద పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని వెల్మకన్నలో పర్యటించారు. పాపన్నపేట సంస్థానంలోని రాణి శంకరమ్మ ఇనాం గ్రామం వెల్మకన్న అన్నారు. గ్రామంలో నాలుగు దిక్కుల నాలుగు సింహ ద్వారాలు, గ్రామం చుట్టూ కోటగోడ, బురుజులు ఉండేవన్నారు. ప్రస్తుతం కోటగోడ, బురుజులు ధ్వంసం అయ్యాయని చెప్పారు. వార సత్వ సంపదను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం కౌడిపల్లి(నర్సాపూర్): సీహెచ్‌సీ నూతన భవనం ప్రారంభం అయితే ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ. 9.67 కోట్లతో నిర్మించిన సీహెచ్‌సీ భవనాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించేందుకు సీహెచ్‌సీ మంజూరు చేసి రూ.9.67 కోట్లు కేటాయించిందన్నారు. ప్రస్తు తం నిర్మాణం పూర్తి కాగా, వైద్య పరికరాలు రావాల్సి ఉందన్నారు. డయాలసిస్ కేంద్రం సైతం మంజూరైందని తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ శివదయాల్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, మండల వైద్యాధికారి శ్రీకాంత్, ఈఈ రవీందర్, ఏఈ మహేశ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామాగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చివరి గింజ వరకు కొంటాం నర్సాపూర్ రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు అంజనేయులుగౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని రెడ్డిపల్లితో పాటు తదితర కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. ఆవంచ, రెడ్డిపల్లి వద్ద ఉన్న గోదాంలను వినియోగంలోకి తీసుకువచ్చి ధాన్యం నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు. రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు యాదగిరిగౌడ్, పద్మావతి, నాయకులు పాల్గొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా..? రామాయంపేట(మెదక్): మున్సిపల్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, కొందరు కౌన్సిలర్లు అకౌంటెంట్ గదికి తాళం వేయడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. శుక్ర వారం కౌన్సిలర్లు చరిత, ప్రవీణ్, మాధవి కా ర్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప, ఇలా ప్రవర్తించవద్దన్నారు. వారి వైఖరితో మున్సిపాలిటీకి చెడ్డపేరు వచ్చిందన్నారు. పది రోజుల క్రితం గదికి తాళం వేసి ఇప్పటివరకు తీయకపోవడం సరికాదన్నారు. తాళం వేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమన్నారు. పట్టణంలో చాలా సమస్యలు పేరుకుపోయాయని, ముందుగా వాటిని పరిష్కరించాలని హితవు పలికారు. -
ధాన్యం కొనాలని రైతుల ఆందోళన
కౌడిపల్లి(నర్సాపూర్): ధాన్యం కొనుగోలు చేయా లని డిమాండ్ చేస్తూ బుధవారం మండలంలోని కొట్టాల, వెల్మకన్న గ్రామాలకు చెందిన రైతులు మండలంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలరోజులు అవుతున్నా, ఇప్పటివరకు ధాన్యం తూకం వేయడం లేదన్నారు. తూకం వేసిన ధాన్యం లోడింగ్ చేయడం లేదని ఆగ్రహించారు. ఎస్ఐ అమరేందర్‌రెడ్డి, ఆర్ఐ విజయలక్ష్మి రైతులు వద్దకు రావడంతో వాగ్వాదానికి దిగారు. కాగా అధికారులు సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్, నాయకులు రమేశ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి రైతులు పాల్గొన్నారు. కోమటిపల్లిలో.. రామాయంపేట(మెదక్): కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం రామాయంపేట– దౌల్తాబా ద్ రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రంలో ఆరు లోడ్లకు సరిపడా ధాన్యం సంచులుండగా, లారీలు సక్రమంగా రావడం లేదన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమాచారం అందుకున్న సీఐ సైదా వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు. -
పొద్దు తిరుగుడు కొనండి
దుబ్బాక: యాసంగిలో పండిన పొద్దుతిరుగుడు పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఎంపీ రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రిని బుధవారం ఎంపీ కలిశారు. తెలంగాణలో పొద్దుతిరుగుడు పంట 21,091 నుంచి 27,675 ఎకరాలకు పెరిగిందని, పంట ఉత్పత్తి సైతం 13,935 మెట్రిక్ టన్నుల నుంచి 19,373 మెట్రిక్ టన్నులకు చేరిందని విన్నవించారు. కనీస మద్దతు ధర రూ.7,721 వచ్చేలా చూడాలని కోరారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో పంట మార్పిడిలో భాగంగా పొద్దుతిరుగుడు పంట ఎక్కువగా పండిస్తున్నారని తెలిపారు. వెంటనే పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా సంబంధిత శాఖకు సూచించాలని ఈ సందర్భంగా మంత్రికి రఘునందన్‌రావు విన్నవించారు.కేంద్ర మంత్రికి ఎంపీ రఘునందన్‌రావు వినతి -
పకడ్బందీగా ఎస్ఐఆర్ మ్యాపింగ్
మెదక్ కలెక్టరేట్: లక్ష్యాలకనుగుణంగా ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆర్డీఓ రమాదేవి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. బీఎల్ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన ధ్రువీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకతతో పని చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను జూన్ 24 నుంచి జూలై 25 వరకు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సమయంలో బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించి, ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా వివరాలు సేకరిస్తారన్నారు. మరణించిన ఓటర్ల వివరాలను ధ్రువీకరించి, తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. బదిలీ, మరణించిన ఓటర్ల వివరాలను సక్రమంగా పరిశీలించి, రికార్డులను నవీకరించాలన్నారు. బీఎల్ఓలు పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐఆర్ అధికారులు పాల్గొన్నారు.ఆర్డీఓ రమాదేవి -
రైతుల గోస పట్టించుకోరా?
దుబ్బాక: ‘ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు.. నెలరోజులుగా రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం.. సీఎం, మంత్రులు ఏం చేస్తున్నట్లు’ అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు నరకయాతన పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి -
ఇంటింటా సౌరభం
పల్లెలు సౌర కాంతులీననున్నాయి. పేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మిగులు విద్యుత్ విక్రయంతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించనున్నాయి. ఇందు కోసం జిల్లాలో అధికారులు మూడు గ్రామాలను ఎంపిక చేశారు. – రామాయంపేట(మెదక్) ‘పీఎం సూర్య ఘర్’ పథకంలో భాగంగా రా ష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని ఎంపిక చేసింది. ఈ మేరకు తెలంగాణ రెడ్కో సంస్థ ద్వారా మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి, నర్సాపూర్‌లోని మాసాయిపేట గ్రామా లు ఎంపికయ్యాయి. కొర్విపల్లిలో 163, మాసాయిపేటలో 2,710 ఇళ్లపై సోలార్ పలకలు బిగించనున్నారు. గృహజ్యోతి పథకం కింద ఎంపికై న లబ్ధిదారులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఎంపిక చేసిన ఇళ్లపై రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పలకలు ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా నెలకు సుమారు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 200 యూనిట్ల వరకు గృహావసరాలకు పోనూ అదనంగా ఉండే వంద యూనిట్లను ప్రభుత్వ గ్రిడ్‌కు విక్రయించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రతినెల ఒక్కో కుటుంబం రూ. 500 వరకు అదనంగా సంపాదించుకునే అవకాశం ఉంటుందని రెడ్కో అధికారులు చెబు తున్నారు. ‘పేట’కు రూ. కోటి మంజూరు కేంద్ర నూతన పునరుత్పాద ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంన్ఆర్ఈ) పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో పాపన్నపేట ఎంపికై ంది. సదరు గ్రామంలో ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైంది. పలుశాఖల అధికారులు గ్రామంలో ప్రాథమికంగా సర్వే నిర్వహించారు. ఈ పథకంలో ప్రభుత్వ భవనాలు, ఆస్తులకే సోలార్ సదుపాయం కల్పించనున్నారు. ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, ఎలక్ట్రిక్టూ వీలర్లు, ఈ–ఆటోలు ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా గ్రామంలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెన్లు, ఇన్వర్టర్లు బిగిస్తారు. వీటితో పాటు భద్రత కోసం పకడ్బందీగా ఎర్తింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. మోడల్ సోలార్ విలేజీలుగా ఎంపికై న మూడు గ్రామాల్లో అధునాతనమైన ఎల్ఈడీ బల్బులతో కూడిన సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు. జిల్లాలో మూడు గ్రామాలు ఎంపిక గృహజ్యోతి లబ్ధిదారులకు చేయూత మిగులు విద్యుత్ కొనుగోలుకు అవకాశం -
మిల్లర్ల మాయాజాలం!
మెదక్ అర్బన్: జిల్లాలో యాసంగి సంబంధించి మొత్తం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని భావిస్తుండగా, ఇందులో 50 లక్షల టన్నులు సన్నాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 25 వేల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు, 1.75 లక్షల దొడ్డు వడ్లు కొనుగోళ్లు జరి గాయి. అయితే ఇందులో సన్నాలకు డిమాండ్ ఉండటంతో మిల్లర్లు అనేక ఎత్తులు వేస్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రతి కేంద్రం నుంచి దళారులను రంగంలోకి దించి రూ.100 నుంచి రూ.150 వరకు కమీషన్లు ఇస్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. సర్కార్ బోనస్ ఇస్తే.. మేము ఇస్తాం కొనుగోలు కేంద్రాల్లో సన్నాలను దొడ్డు వడ్లుగా నమోదు చేయాలని మిల్లర్లు షరతులు పెడుతున్నారు. అందుకు దళారులకు కమీషన్లు ఇస్తున్నారు. ఒక వేళ సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తే, తాము క్వింటాల్‌కు రూ.400 చెల్లిస్తామని హామీలు ఇస్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. దళారులకు క్వింటాల్‌కు రూ.100 నుంచి 150 వరకు చెల్లిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, దళారులు, పలుకుబడి గల నాయకులు సన్నాల వ్యాపారం చేస్తున్నారు. ఇందుకోసం మిల్లర్లు తమ సొంత లారీలను పంపుతున్నారు.సన్నాలే ఎందుకు..? సన్నాలు మిల్లర్లకు లాభదాయకంగా ఉండటంతో వాటి కొనుగోలు కోసం పోటీ పడుతున్నారు. దీంతో మిల్లర్ల అసోసియేషన్ ఒక్కో మిల్లు 70 లారీల కన్న ఎక్కువ వడ్లను తీసుకోవద్దని అంక్షలు పెట్టింది. అంత కన్నా ఎక్కువ తీసుకుంటే క్వింటాల్‌కు రూ.350 జరిమానా కట్టాలని షరతు పెట్టింది. అయినా కొంత మంది మిల్లర్లు తమ కోటా అయిపోయినా, ఇతర మిల్లర్ల పేరు మీద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ధనూర, రేగోడ్, రంగంపేట ప్రాంతాల్లోని మిల్లర్ల పేర్ల మీద శంకరంపేట ప్రాంతంలోని ఓ మిల్లర్ సన్న వడ్లను డంప్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం అయితే స్థానికంగా సివిల్ సప్లై అధికారులు పాస్ చేస్తారు. అక్కడ ఎక్కువ అంక్షలు లేకుండా పాస్ అయ్యే అవకాశం ఉంది. అదే దొడ్డు బియ్యం అయితే ఎఫ్‌సీఐ అధికారులు పాస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆంక్షలు ఎక్కువ అని తెలిసింది. ఒక వేళ రిజక్ట్ చేస్తే మిల్లర్‌కు సుమారు రూ.15 వేల వరకు ఖర్చు వృథా అవుతుందని తెలిసింది. దీంతో మిల్లర్లు సన్న బియ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అవసరమైతే సన్న బియ్యం బయట కూడా రూ. 5,500 నుంచి రూ.6 వేలకు క్వింటాలు అమ్ముడవుతాయి. దీంతో సన్న వడ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తుంది.‘సన్నాలను దొడ్డు వడ్లుగా నమోదు చేస్తే క్వింటాల్‌కు రూ.100 కమీషన్ ఇస్తాం. ఒక వేళ ప్రభుత్వం బోనస్ ఇస్తే, అప్పటికి రూ.400 చెల్లిస్తాం అని పాపన్నపేట మండలంలోని ఒక గ్రామం నుంచి ఓ మిల్లర్ 3 లారీల ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా సమీప మండలానికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.’ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు దొడ్డు వడ్లుగా నమోదు దళారులకు కమీషన్లు చేష్టలుడిగి చూస్తున్న అధికారులు -
చరిత్ర ఆనవాళ్లకు మెదక్ ప్రసిద్ధి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు చరిత్రకు ఆనవాళ్లని, వీటిని భవిష్యత్ తరాలకు అందించే చర్యలు చేపడుతామని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. పర్యాటక వారోత్సవాల్లో భాగంగా బుధవారం మెదక్ ఖిల్లాపై హెరిటేజ్ వాక్ నిర్వహించగా, కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల ఉనికి అందించేలా డాక్యుమెంటరీ తయారు చేస్తామన్నారు. మెదక్ పోర్ట్ అనేది చారిత్రాత్మక పర్యాటక ప్రాంతంగా పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. ఈనెల 22 రోజున హెరిటేజ్ ప్రాంతాలను హైలెట్ చేయడంలో భాగంగా ఖిల్లాపై అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. అంతకుముందు వెస్లీ పాఠశాల, మెదక్ చర్చిని, గుల్షన్ క్లబ్‌ను సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, మత్స్యశాఖ అధికారి మల్లేశం, యువజన, క్రీడల నిర్వహణ అధికారి రమేశ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీపీఓ యాదయ్య, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
మౌలిక వసతులు కల్పించండి
మెదక్‌జోన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాంలు, బుక్స్ అందించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన యూనియన్ నేతలతో కలిసి మాట్లాడారు. అ నేక పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. జనాభా గణన నేపథ్యంలో బడిబాట, విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి మొదలు పెట్టాలన్నారు. పీఆర్సీ ప్రకటించి, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు అందించాలన్నారు. అలాగే రామాయంపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం నాగమణి తోటి ఉపాధ్యాయులను మనోవేదనకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుడు సంగయ్య, హీరాలాల్, నజీరొద్దీన్, రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్, దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు. నేలకు జీలుగ జీవం కౌడిపల్లి(నర్సాపూర్): నేలకు జీలుగ జీవన ఎరువు అని ఏడీఏ పుణ్యవతి తెలిపారు. బుధవారం కౌడిపల్లి రైతు వేదికలో రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగు, జనుముతో భూసారం పెరుగుతుందన్నారు. జీలుగు విత్తనాలు సాగు చేసి 45 రోజుల తర్వాత నేలలో కలియ దున్నడం వల్ల భూసారం పెరిగి పంటలకు కావాల్సిన పోషకాలు అందుతాయని చెప్పారు. రైతులు జీలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. కళలకు మరింత గుర్తింపు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో కళలకు మరింత గుర్తింపు తీసుకురావాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం కలెక్టరేట్లో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కళలకు నెలవన్నారు. వివిధ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరన్నారు. భవిష్యత్‌లో కళలకు మరింత గుర్తింపు తేవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన జానపద నృత్యాలు అందరిని అలరించాయి. ఇందులో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. జనగణనకు సహకరించాలి తూప్రాన్: ప్రభుత్వం చేపడుతున్న జనగణనకు ప్రజలు సహకరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నాగులపల్లిలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఇప్పటివరకు డివిజన్లో మొత్తం 52,689 ఇళ్లకు గాను 19,064 ఇళ్ల ఎన్యూమరేషన్ పూర్తయిందన్నారు. జూన్ 9 నాటికి జనగణన ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. కాగా కొంతమంది ప్రజలు వాహనాల వివరాలు ఇస్తే రేషన్ కార్డులు తొలగిస్తారనే అపొహతో సమాచారం ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారని చెప్పారు. అలాంటి భయం అవసరం లేదన్నారు. ఈసమాచారం కేవలం ప్రభుత్వ గణాంకాల కోసం మాత్రమే సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
చేయూతలో అక్రమాలకు చెక్
మెదక్‌జోన్: ప్రభుత్వం చేయూత పథకంలో వివిధ వర్గాల వారికి పింఛన్లు అందజేస్తోంది. కొందరికి తపాలా కార్యాలయాల ద్వారా, మరికొందరికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లబ్ధిదారులు చనిపోయినా.. వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న పింఛన్ డబ్బులను కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారు. దీనిని అరికట్టి మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. అధికారులు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రతీ నెల రూ. 24.71 కోట్లు పంపిణీ జిల్లాలో 9 రకాల పింఛన్‌దారులు 1,08,642 మంది ఉండగా, వారిలో 60,740 మందికి నేరుగా బ్యాంకు అకౌంట్ల ద్వారా ఖాతాలో జమచేస్తున్నారు. మరో 47,902 పింఛన్‌దారులకు మాత్రం పోస్టాఫీస్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రతీ నెల రూ.24.71 కోట్లు పంపిణీ జరుగుతుంది. కాగా పోస్టాఫీస్ ద్వారా లబ్ధిదారుల బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేస్తుండటంతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పంపిణీ జరుగుతుందని అధికారులు గుర్తించారు. అదే బ్యాంకు అకౌంట్ ద్వారా పింఛన్లు పొందుతున్న వారిలో చనిపోయిన వారి పేర్లపై సైతం నెలనెల పింఛన్లు జమవుతున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా లబ్ధిదారుల సర్వేను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు చేస్తుండగా, అర్బన్ ప్రాంతాల్లో వార్డు అధికారులు చేస్తున్నారు. ఈనెల 15న ప్రారంభమైన సర్వే జూన్ 15 వరకు కొనసాగనుంది.జిల్లాలో ఇలా..వికలాంగులు 863 వృద్ధులు 37,800ఒంటరి మహిళలు 4,596వితంతువులు 45,838కల్లుగీత 834చేనేత 444బోధకాలు 455బీడీ కార్మికులు 17,652డయాలసిస్ 160ముమ్మరంగా సాగుతున్న సర్వే యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్న అధికారులు జిల్లావ్యాప్తంగా 1.8 లక్షల పింఛన్‌దారులు రికవరీ చేస్తాం మెదక్ బల్దియాలోని నాలుగు వార్డులను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే చేయగా 39 మంది చనిపోయిన వారి ఖాతాల్లో చేయూత పింఛన్ డబ్బులు పడినట్లు గుర్తించాం. వాటిలో మృతుల కుటుంబీకులు కొందరు ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేయగా, మరికొందరు చేయలేదు. డ్రా చేసిన వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తాం. – శ్రీనివాసరెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్ -
బీరు సీసాలో కండోమ్
మిరుదొడ్డి(దుబ్బాక): బీరు సీసాలో నిరోధ్ దర్శనమివ్వడంతో మందుబాబులు అవాక్కయ్యారు. ఈ సంఘటన మంగళవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో కొనుగోలు చేసిన బీరు సీసాలో నిరోధ్ ప్యాకెట్ దర్శనమివ్వడంతో కలకలం రేగింది. బీరు తాగేందుకు సీసాను పరిశీలించిన మద్యం ప్రియులు అందులో నిరోధ్ ఉండడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో మందుబాబులు మద్యం దుకాణం నిర్వాహకులను ప్రశ్నించగా, యజమానులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో దుకాణం నిర్వాహకులు, మందుబాబులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌శాఖ ఎస్ఐ సరిత సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పోలీ సులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో వాగ్వాదం సద్దుమనిగింది. -
ఉద్యమకారులకు సరైన గౌరవం
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌడిపల్లి(నర్సాపూర్): తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, సరైన గౌరవం కల్పిస్తామని కేకే కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మండలంలోని రాయిలాపూర్ ఉన్నత పాఠశాలకు స్థలం ఇచ్చిన దాత రావి కామాక్షమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కలేదన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కేకే కమిటీని వేసిందన్నారు. తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, కవులు, కళాకారులను గుర్తించి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించనున్నట్లు చెప్పారు. ఇందులో అమరులకు ప్రథమ స్థానం, ఉద్యమంలో పోరాడి గాయపడిన వారికి ద్వితీయ, జైలుకు వెళ్లిన వారికి తృతీయస్థానం ఇచ్చి వారికి సముచిత గౌరవం కల్పించేందుకు కేకే కమిటీ చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో దేవయ్య, బాలరాజుగౌడ్, యాదిగిరి, అశోక్, శ్రీరాములు, సధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): బీఆర్ఎస్ నాయకుల పోరాటంతోనే బండి భగీరథ్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ అన్నారు. సోమవారం నిజాంపేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్ పదవిలో ఉంటే పోలీస్‌లు అతడికి లొంగి కేసును మరోవైపు తిప్పే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై ప్రధాని చొరవ తీసుకొని సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు. కేసును సరైన రీతిలో విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని వేడుకున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ప్రతి గింజను కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు బాపురెడ్డి, రంజిత్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, పార్టీ పట్టణాధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, ఓబీసీ విభాగం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చింతల శేఖర్ ఆరోపించారు. సోమ వారం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి సంబంధించి 13 దుకాణాలుండగా, వాటిలో రెండు దుకాణాలకు సంబంధించి పేర్లను నిబంధనలకు విరుద్ధంగా మార్పిడి చేశారన్నారు. సదరు దుకాణాల లీజు గడువు ముగిసినా, ఇప్పటివరకు కొత్తగా రీటెండర్ వేయలేదన్నారు. ఏడా దిగా మున్సిపాలిటీలో రూ. కోటిన్నరకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఈవిషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మాజీ అధ్యక్షుడు భానుచందర్, పట్టణ ఉపాధ్యక్షుడు యాదగిరిగౌడ్, నాయకులు వెంకటేశ్, సంతోష్, అనిల్ పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల తుది ఓటరు జాబితాను విడుదల చేసినట్లు జిల్లా చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ సహాయ అధికారి సాగర్ సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, తుది సభ్యత్వ జాబితాను అధికారికంగా ఆమోదించినట్లు చెప్పారు. జిల్లా చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ కార్యాలయం, ప్రాథమిక చేనేత సహకార సంఘాల కార్యాలయాల్లో తుది ఓటరు జాబితా అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూసేందుకు, ఈ తుది ప్రతిపాదనలను వీలైనంత త్వరగా రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. తుది జాబితా ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. -
కంకర పరిచి.. వెన్ను విరిచి
● ఇబ్బంది పడుతున్న రెండు జిల్లాల ప్రజలు ● పట్టించుకోని అధికారులు రామాయంపేట/నిజాంపేట(మెదక్): అది ఎంతో ప్రాధాన్యత గల అంతర్ జిల్లా లింకు రోడ్డు. మెదక్– కామారెడ్డి జిల్లాలను కలుపుతున్న ఈ రోడ్డుపై నిత్యం వందలాది మంది ప్రయాణిస్తారు. పూర్తిగా శిథిలమైన ఈరోడ్డును మరమ్మతు చేయడానికి గాను మూడేళ్ల క్రితం కంకర పరిచి వదిలేశారు. అప్పటి నుంచి మరమ్మతుల విషయమై ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మూడేళ్లుగా ముప్పు తిప్పలు జిల్లా పరిధిలోని చల్మెడ కమాన్ నుంచి కామారెడ్డి జిల్లా బీబీపేట, దోమకొండ మండలాలకు వెళ్లడానికి ఇది దగ్గరి మార్గం కావడంతో రెండు జిల్లాలకు చెందిన ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తారు. బీబీపేట, ఇతర సమీప గ్రామాలకు చెందిన విద్యార్థులు వందలాది మంది చదువు నిమిత్తం రోజూ ఆర్టీసీ బస్సులో రామాయంపేట వస్తుంటారు. రోడ్డు పాక్షికంగా ధ్వంసం కావడంతో గతంలో కొన్ని రోజులు ఆర్టీసీ బస్సులు సైతం రద్దు చేశారు. కామారెడ్డి జిల్లా పరిధిలో రోడ్డు బాగానే ఉండగా, మెదక్ పరిధిలో మాత్రం 6 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా శిథిలమైంది. మరమ్మతుల కోసం గతంలోనే నిధులు మంజూరు కావడంతో సంబంధిత కంట్రాక్టర్ కంకర తొక్కించి వదిలేశాడు. ఏమైందో తెలియదు కాని అప్పటి నుంచి రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు. ఈవిషయమై పలుమార్లు ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. ఈరోడ్డుపై ప్రయాణిస్తే తమ వాహనాలు దెబ్బతింటున్నాయని, తాము తరచూ ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు సైతం తరచూ పంక్చర్ అవుతున్నాయని, ముఖ్యంగా రాత్రివేళ ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చల్మెడ తిరుమలనాథస్వామి ఆలయానికి వస్తున్న భక్తులు సైతం ఈ రోడ్డుతో ఇబ్బందులపాలవుతున్నారు. ఇబ్బంది పడుతున్నాం మూడేళ్ల క్రితం చల్మెడ రోడ్డుపై కంకర తొక్కించి వదిలేశారు. అప్పటి నుంచి అధికారులు పట్టించుకోకపోవడంతో తాము ఇబ్బందులపాలవుతున్నాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలి. – కనకరాజు, నందగోకుల్ త్వరలో మరమ్మతులు చల్మెడ కమాన్ వద్ద నుంచి జిల్లా శివారు వరకు గతంలో కంకర తొక్కించి వదిలేసిన రోడ్డు మరమ్మతుల కోసం కృషి చేస్తున్నాం. నిధులు సైతం సిద్ధంగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో రహదారిని మరమ్మతులు చేయిస్తాం. – విజయసారథి, ఏఈ, ఆర్అండ్బీ -
ధాన్యం సేకరణ వేగవంతం
రామాయంపేట(మెదక్): జిల్లావ్యాప్తంగా 519 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతం అయిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం మండలంలోని అక్కన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ఇప్పటివరకు 1,32,992 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా టోకెన్ విధానాన్ని ఖచ్చితంగా అమలు పర్చాలని సిబ్బందిని ఆదేశించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున రైతులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు చెప్పారు. అన్ని కేంద్రాల్లో గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజని, ఎంపీడీఓ సజీలుద్దీన్, సిబ్బంది ఉన్నారు. బ్లాక్ లిస్టులో రైస్ మిల్లులు మెదక్ కలెక్టరేట్: ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. పాపన్నపేట మండలంలోని సాయిలక్ష్మి ట్రేడర్స్, రామాయంపేటలోని భవాని ఇండస్ట్రీస్‌ను బ్లాక్ లిస్టులో చేర్చినట్లు చెప్పారు. కస్టం మిల్లింగ్ ఆపరేషన్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు వెల్లడించిన యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా రైస్ మిల్లులకు ఎటువంటి ధాన్యం కేటాయింపు చేయబడవని వెల్లడించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
సమన్వయంతో పని చేయండి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ శ్యామ్‌లాల్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిల్లుల్లో ధాన్యం దిగుమతులు, నిల్వ, నాణ్యత ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో ధాన్యాన్ని విక్రయిస్తున్నట్లు చెప్పారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్‌న్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని, వాహనాలు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మిల్లర్లకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, మార్కెటింగ్ డీఎం అభిషేక్, సివిల్ సప్లై డిప్యూటీ కమిషనర్ కొండల్రావు, బాయిల్డ్ రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ చంద్రపాల్, రామిల్లర్స్ ప్రెసిడెంట్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.సివిల్ సప్లై డైరెక్టర్ శ్యామ్‌లాల్ -
రెండెకరాలకే ‘భరోసా’
పూర్తిస్థాయిలో అందని పెట్టుబడి సాయంమెదక్జోన్: వానాకాలం సీజన్ ముంచుకొస్తుంది. పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. అయితే యాసంగి సీజన్ ముగింపు దశకు వచ్చినా, రైతు భరోసా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందలేదు. కేవలం రెండెకరాల వరకు మాత్రమే ఖాతాలో జమ చేశారు. మిగితా సాయం అందిస్తారా? లేదా అని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 3,00,558 మంది రైతులు ఉండగా, 4 లక్షల పైచిలుకు ఎకరాల సాగు భూములు ఉన్నాయి. కాగా మార్చి 22న మొదటి విడతలో 2,59,936 మంది రైతులకు ఎకరం వరకు రూ.110,09,34,682 రైతుల ఖాతాల్లో జమచేశారు. మిగితా రెండో విడతను ఏప్రిల్ 20న కేవలం 2 ఎకరాలకు వరకు 8,063 మంది రైతులకు రూ.56, 39,04,952 అందించారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 2,67,999 మంది రైతులకు రూ.166,48,39,634 కోట్లు జమ చేశారు. ఈ లెక్కన ఇంకా 32,532 మంది రైతులకు 2 ఎకరాల పైచిలుకు భూములు గల ఉండగా, వారికి రైతు భరోసా నిధులు అందాల్సి ఉంది. పెట్టుబడికి తిప్పలు పంట పెట్టుబడి సాయం కోసం గత ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. కాగా రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ. 6 వేలు అందజేస్తామని చెప్పింది. గత వానాకాలంలో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించింది. యాసంగి సీజన్‌కు వచ్చేసరికి పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో పెట్టుబడి సాయం అందకపోవడతో రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. యాసంగికి సంబంధించిన పెట్టుబడి సాయం నేటికీ పూర్తిస్థాయిలో అందలేదు. ఇక వానాకాలం సీజన్‌కు సంబంధించి స్పష్టత కొరవడింది. ముగిసిన యాసంగి సీజన్ ఆందోళనలో అన్నదాతలు -
భూ పట్టా అక్రమాలపై చర్యలేవి?
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా అధికారుల అండదండలతో సిబ్బంది పలు అక్రమాలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో బయటపడినా, ఉన్నతాధికారుల హస్తం ఉండటంతో తూతూమంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. బతికున్న రైతు మరణించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, మరొకరికి అక్రమ పట్టా చేశారు. ఆ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు. ఏ అధికారి జారీ చేశారనే విషయం ఇప్పటికీ బయటపడలేదు. అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు చేసిన తప్పులకు రూ.లక్షలు ఖర్చు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిపెద్దాపూర్‌లో ఎలాంటి ఆధారాలు లేకున్నా నాలుగెకరాల భూమిని మరో వ్యక్తికి పట్టా చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు జరుగుతాయి, సవరిస్తామని ఆర్డీఓ స్థాయి అధికారులే చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తహసీల్దార్ మల్లయ్య అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురిపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూ భారతి చట్టాన్ని అక్రమాలకు నిలయంగా మార్చిన అధికారులపై కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించాలని రైతులు కోరుతున్నారు. -
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
పెద్దశంకరంపేట(మెదక్): తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన మండల పరిధిలోని చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పలు ఇళ్లలో చొరబడి 113 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని అపహరించారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో ఐదు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. మూడు ఇళ్లలో ఎలాంటి వస్తువులు పోలేదని పోలీసులు తెలిపారు. మిగితా రెండిళ్లలోనే ఏకంగా 113 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారన్నారు. గ్రామానికి చెందిన రాయిని రాములు గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన పాఠశాల ప్రారంభోత్సవానికి తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లాడు. రాములుకు భార్య, ముగ్గురు కుమారులు, కోడళ్లు, మనుమలు ఉన్నారు. వీరికి చెందిన 110 తులాల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి చోరీకి గురైంది. అలాగే ఏసీరెడ్డి మాణిక్‌రెడ్డి ఇంట్లో 3 తులాల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. శుక్రవారం ఉదయం రాములు ఇంటికి వచ్చిన పనిమనిషి గమనించి వారికి సమాచారం అందించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రేణుకారెడ్డి, ఎస్సైలు ప్రవీణ్ రెడ్డి, శంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరించారు. ఎస్పీ శ్రీనివాసరావు చీలపల్లిలో పర్యటించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. 113 తులాల బంగారం, 2.5 కిలోల వెండి అపహరణ -
అవసరమైతేనే బయటకు వెళ్లండి
డీఎంహెచ్ఓ శ్రీరామ్హవేళిఘణాపూర్(మెదక్): ఎండలు మండుతున్న వేళ ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని డీఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని సర్ధన పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై ఆరా తీశారు. అలాగే ఆస్పత్రిలో డెలివరీలు, మందులు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆస్పత్రిలో వసతులు, వైద్య సేవలను గురించి తెలుసుకొని మండల వైద్యాధికారి వినయ్సుశీల్ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తు తం మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రజలు ఆనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలోని పీహెచ్సీలలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆయన వెంట ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
రామాయంపేట(మెదక్): కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు పంపించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని కాట్రియాల, లక్ష్మాపూర్, అక్కన్నపేట గ్రామాల్లో ధాన్యం కొను గోలు కేంద్రాలను సందర్శించారు. అధికారులు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లు వేగవంతం అయ్యే లా చూడాలని ఆదేశించారు. కొనుగోళ్లు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. -
తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం
జిల్లాలో బడిబాట షురూ వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా బడిబాట ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అక్షయ, రెండో ర్యాంకు మేఘన, మూడో ర్యాంకు వచ్చిన లిప్సికను సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం సాంబయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మాధురి, ఉపాధ్యాయులు వెంకటస్వామి, శ్రీనివాస్‌రావు, నరసింహారెడ్డి, చార్లెస్, అర్చన, అమూల్య, శైలజ, వెంకట్‌రెడ్డి, ధనరాజ్, వాణిశ్రీ, జయసుధ, విజయ మోహన్‌రాజ్, ప్రశాంతి దేవి, రేణుకా దేవి, రాము, రాధిక ప్రియదర్శిని, ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ సాగు ఖరారు
జిల్లాలో పంటల విస్తీర్ణం 3.67 లక్షల ఎకరాలు● గతేడాది కంటే 17 వేలు అధికం ● అత్యధికంగా వరి వైపు మొగ్గు మెదక్ కలెక్టరేట్: ఖరీఫ్ సాగు ప్రణాళికను వ్యవసాయ సిద్ధం చేసింది. ఈ ఏడాది జిల్లాలో ఆయా రకాల పంటలు మొత్తం 3,67,668 ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా వేశారు. అయితే గతేడాది వానాకాలంలో 3,15,675 ఎకరాలు సాగు కాగా, ఈఏడాది 10 వేల ఎకరాలు అత్యధికంగా సాగు కానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా వరి 31,6,690 ఎకరాలు కాగా, రెండో స్థానంలో పత్తి 36,000 వేల ఎకరాల్లో సాగు కానున్నట్లు ప్రకటించారు. గత మూడేళ్లలో వరితో పాటు అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నట్లు వ్యవసాయ అంచనా వేసింది. ఇందుకోసం అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయమే ఆధారం జిల్లాలో ఏటా రెండు పంటలు సాగు చేస్తారు. ఏకై న మధ్య తరహా ప్రాజెక్టు ఘనపూర్, హల్దీ కింద చెరువు లు, కుంటలు, బోరు బావులపై ఆధారపడుతున్నారు. వానాకాలంలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కందులు పండిస్తుంటారు. అయితే జిల్లాలో రైతులు అత్యధికంగా సన్న వడ్ల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సైతం బోనస్ ఇస్తుండటంతో గత మూడేళ్లుగా రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతుతో పాటు బోనస్ లభిస్తుండటంతో ఈ ఏడాది సన్నాల సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా వ్యవసాయ అధికారులు సైతం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతుండగా, మరోవైపు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
‘ఖేడ్’ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరంపెద్దశంకరంపేట(మెదక్): పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వరమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నా రు. గురువారం మండల పరిధిలోని మాడ్చెట్పల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. పేదలకు తక్కువ స్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకం తీసుకొచ్చిందన్నారు. ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ సకాలంలో బిల్లులు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మధు, నాయకులు నారాగౌడ్, సర్పంచ్ కుమార్, ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. -
కరాటేలో విద్యార్థుల ప్రతిభ
మెదక్ కలెక్టరేట్: జిల్లాస్థాయి కరాటే కలర్ బెల్ట్ ఎగ్జామ్‌లో మెదక్ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు మాస్టర్ దినకర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని గుల్షన్ క్లబ్లో రెంజుకి షాటోకన్ స్పోర్ట్స్ కరాటే అఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు వి విధ మండలాల నుంచి వచ్చినట్లు చెప్పారు. బెల్ట్ ఎగ్జామ్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కరాటే మాస్టర్ నగేశ్ బెల్టులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైష్ణవి, గణేశ్, అఖిల్, తణ్మయి, విహాన్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్: మున్సిపల్ కో– ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నేటి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో నలుగురి కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగనుందన్నారు. అర్హులు గడువులోగా నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. వివరాలకు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


