breaking news
Khammam
-
బ్రెయిన్ స్ట్రోక్‌తో యువతి మృతి
ఖమ్మం: మండలంలో వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందారు. వివరాలిలా.. వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కిలారు రామారావు(67) శనివా రం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. రామారావుకు భార్య భార్గవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.భార్గవి రిటైర్డ్ ఉపాధ్యాయురాలు కాగా, వారి పిల్లలు విదేశాల్లో నివాసముంటున్నారు. రామారావు గతంలో వి.వెంకటాయపాలెం యూత్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అదేవిధంగా రాంక్యాతండాకు చెందిన జాటోత్ నవ్య (21) ఆదివారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. నవ్యకు భర్త, కుమార్తె ఉన్నారు. నవ్యకు భర్తతో గత రెండునెలల క్రితం విడాకులు కావడంతో తండ్రి వద్ద ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఇదీ చదవండి: లగ్జరీ కారులో మంటలు చెలరేగడంపై పోలీసుల ఆరా -
లగ్జరీ కారులో మంటలు ఎలా చెలరేగాయి?
సూర్యాపేటటౌన్/ఖమ్మం అర్బన్ : కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఇనుప రెయిలింగ్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించి అందులో ప్రయాణిస్తున్న డాక్టర్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం సుంకువారిగుంట గ్రామానికి చెందిన వైద్యుడు కాసుకుర్తి జగదీశ్(50) ఇరవై ఏళ్లుగా ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆయన భార్య సుమప్రీతి హైదరాబాద్‌లోని సురభి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీశ్ భార్య, పిల్లలు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారం లేదా 15 రోజులకు ఒకసారి కుటుంబ సభ్యులను కలిసేందుకు జగదీశ్ హైదరాబాద్‌కు వెళ్తుంటారు.కుమార్తె పుట్టినరోజుకు వెళ్తూ.. సోమవారం జగదీశ్ కుమార్తె పుట్టినరోజు ఉండటంతో ఆదివారం ఉదయం 6 గంటల సమీపంలో ఆయన ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. మార్గమధ్యలో పిల్లలమర్రి సమీపంలో ఖమ్మం–హైదరాబాద్ హైవేపై ఫ్లైఓవర్ ఎక్కుతుండగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోగా.. జగదీశ్ సజీవ దహనమయ్యారు.జగదీశ్ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో పోలీసులు వాహనం వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కొత్త కారు కావడంతో ఇంకా నంబర్ ప్లేటు కూడా లేదు. దీంతో ఖమ్మం రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద వాహనాన్ని గుర్తించి, అందులో డాక్టర్ జగదీశ్ ప్రయాణిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సూర్యాపేట ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.పోలీసుల ఆరా..అత్యంత ఖరీదైన కారులో మంటలు చెలరేగడంపై పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ కారు రెయిలింగ్‌ను ఢీకొన్న సమయంలో ఇంధనం, విద్యుత్ వ్యవస్థలో ఏదైనా సమస్య తలెత్తిందా అని పరిశీలిస్తున్నారు. వాహనం పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదానికి ముందు కారులో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడిందా అనే అంశంతోపాటు ప్రమాదానికి ముందు కారు వేగం, డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన పరిస్థితుల పైనా ఆరా తీస్తున్నారు.బాలాజీ–సరోజిని దంపతులకు నాలుగో సంతానంగా జగదీశ్ జన్మించారు. తండ్రి రైల్వే కూలీగా, తల్లి దినసరి కూలీగా పనిచేస్తుండగా, అన్నయ్య, అక్కయ్యలు సైతం వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. జగదీశ్ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఉపాధ్యాయులు, శ్రేయోభి లాషుల సహకారంతో వైద్యవిద్య పూర్తిచేశారు. వినాయకుడిని సాగనంపి.. పేషెంట్‌ను చూసి..డాక్టర్ జగదీశ్ శనివారం రాత్రి వరకు వైద్యులు, విద్యార్థులతో కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా నృత్యం చేశారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అత్య వసర కేసు రావడంతో ఆస్పత్రికి వెళ్లి రోగిని పరిశీలించారు. సోమవారం ఆపరేషన్ చేస్తానని రోగి కుటుంబీకులకు చెప్పారు. ఇంతలోనే ప్రమాదం జరిగింది. దీనికి నిద్రమత్తు కారణమా అన్న చర్చ జరుగుతోంది. ఖరీదైన కారు.. అయినా దక్కని ప్రాణంసురక్షిత ప్రయాణం కోసం సుమారు రూ.1.20 కోట్లు వెచ్చించి రెండు నెలల క్రితమే డాక్టర్ జగదీశ్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు సహచరులు తెలిపారు. అయితే అదే కారులో జరిగిన ప్రమాదం ఆయన ప్రాణాలను కాపాడలేకపోయిందని పలువురు వైద్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.డాక్టర్ జగదీశ్ భార్య, కుమార్తెలను ఓదార్చిన డాక్టర్లుడాక్టర్ జగదీశ్ బాబు మృతదేహంతో మమత ఆసుపత్రి ప్రాంగణానికి వచ్చిన డాక్టర్ భార్య, ఇద్దరుకుమార్తెలను పలువురు డాక్టర్లు ఓదార్చారు. ఇంతటి ఘోరం జరగడం ఎంతో బాధకరం అని పలువురు వారికి తమ సంతాపం వ్యక్తం చేశారు.వేలాదిమందితో అంతిమయాత్రసూర్యాపేటలో పోస్టుమార్టం అనంతరం డాక్టర్ జగదీశ్‌బాబు మృతదేహాన్ని ఖమ్మానికి తీసుకొచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి మమత ఆసుపత్రి వరకు అంతిమయాత్ర నిర్వహించారు. వేలాదిమంది వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది, జగదీశ్‌బాబు వద్ద వైద్యం పొందిన రోగులు, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మమత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మమత వైద్య విద్యాసంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ తదితరులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్యులు, విద్యార్థులు డాక్టర్ జగదీశ్ పార్థీవదేహాన్ని సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యుల రోదనలు, సహచర వైద్యుల కన్నీళ్లతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం అలుముకుంది.పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్యంఒంగోలు టౌన్: నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన డాక్టర్ కాసుకుర్తి జగదీశ్ కసితో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. అయినప్పటికీ తన మూలాలను మరిచిపోకుండా పేదలకు వైద్య సేవలందించారు. వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా ప్రజా సేవగా తలచిన డాక్టర్ జగదీశ్పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య చికిత్సలు చేశారని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: మిస్టరీ డాక్టర్ ఎక్కడ?అణగారిన ప్రజల బాధలను తన బాధగా భావించి నిరుపేదలకు అండగా నిలిచిన డాక్టర్ జగదీశ్ మరణం సామాన్య ప్రజలకు తీరని లోటని సీపీఐఎంఎల్ న్యూడెమక్రసీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కొత్తపట్నం మండలం నుంచి వచ్చిన తొలి వైద్యుడు జగదీష్ మతి పట్ల శ్రీరాం సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఎండీ డాక్టర్ చాపల వంశీకష్ణ నివాళులు అర్పించారు. నిరుపేదలకు వైద్యం చేయడంలో డాక్టర్ జగదీశ్ ముందుండేవారని, సామాజిక సేవాతో వ్యవహరించే ఆయన మరణం బాధకలిగిస్తుందన్నారు. చిన్నవయసులోనే నూరేళ్లు నిండిన డాక్టర్ జగదీశ్‌కు పలువురు వైద్యులు నివాళులు తెలిపారు. -
పదేళ్ల తర్వాత సమరం !
● చివరిసారి 2016 జూలై 19న ఆర్టీసీలో ఎన్నికలు ● నాడు ఆరు డిపోల పరిధిలో 2,950, నేడు ఏడింట్లో 1,808 ఓట్లే.. ● ‘గుర్తింపు’ ఎన్నికల్లో ప్రధాన సంఘాల మధ్యే పోటీకి అవకాశం ● ఎన్నికల నిర్వహణపై కార్మికుల్లో హర్షాతిరేకాలు2016 జూలై 19న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో నాటి అధికార పార్టీకి చెందిన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) విజయం సాధించింది. ఖమ్మం రీజియన్‌కు వచ్చే సరికి మాత్రం భిన్నమైన ఫలితం నమోదైంది. వామపక్ష పార్టీలకు అనుబంధంగా ఉన్న ఎస్‌డబ్ల్యూఎఫ్–ఈయూ కూటమిగా పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా రీజియన్ గుర్తింపు సంఘంగా నిలిచింది. ఇక రీజియన్‌లో రెండో స్థానంలో టీఎంయూ, మూడో స్థానంలో ఎన్ఎంయూ నిలిచాయి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో రీజియన్‌లో పోటీ రెండు ప్రధాన సంఘా ల మధ్యే పోటీ ఉంటుందన్న చర్చ జరుగుతోంది.ఖమ్మం మయూరిసెంటర్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ)లో సుదీర్ఘ కాలం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. చివరిసారి 2016 జూలై 19న యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరగ్గా, సరిగ్గా పదేళ్ల అనంతరం సమరానికి తెరలేచింది. ఈ నేపథ్యాన ఖమ్మం రీజియన్‌లోని ప్రధాన సంఘాలు ఎన్నికలను స్వాగతిస్తూ తమ గుర్తింపును చాటుకునేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అటు రాష్ట్ర, ఇటు రీజియన్ స్థాయిలో మొదటి వరసలో నిలిచేలా పోటీకి సిద్ధమవుతున్నారు. పెరిగిన డిపోలు.. తగ్గిన ఓటర్లు 2016 గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినప్పుడు ఖమ్మం రీజియన్ పరిధిలో ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోలు ఉన్నాయి. ఆతర్వాత ఇల్లెందు డిపో ఏర్పాటవడంతో ఆ సంఖ్య ఏడుకు చేరింది. 2016 నాటి ఎన్నికల్లో 2,950 మంది ఓటర్లు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు వేయికి పైగా తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం రీజియన్‌లో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు 1,808 మందే ఉన్నారు. గత దశాబ్ద కాలంలో పెరిగిన ఉద్యోగ విరమణలు, కొత్త నియామకాలు లేకపోవడంతో ఓటర్ల సంఖ్య 1,100 వరకు తగ్గింది. కొత్తగా చేపట్టిన నియామకాలన్నీ కాంట్రాక్ట్ విధానంలో కావడంతో ఆయా ఉద్యోగులకు ఓటు హక్కు లేదు. ఓట్ల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యాన అక్టోబర్ 9న జరిగే ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా నిలవనుంది. ప్రధాన డిమాండ్లే అజెండాగా.. ఈ ఏడాది అక్టోబర్ 9న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రధాన డిమాండ్లనే అజెండాగా తీసుకొని సంఘాలు ప్రచారంలో పాల్గొననున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం, ఉద్యోగులకు పూర్తిస్థాయి ప్రభుత్వ ప్రయోజనాల సాధన ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అలాగే, నిలిచిపోయిన పే–రివిజన్, బకాయిల విడుదల కూడా అజెండాలో చేరనుంది. ఇక రీజియన్‌లోని ఏడు డిపోలకు సరిపడా కొత్త బస్సులు తీసుకురావడం, ఉద్యోగుల నియామకం, కార్మికుల సమస్యలు పరిష్కారం, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందిపై పెరుగుతున్న పనిభారానికి చెక్ పెట్టడం వంటి డిమాండ్లు బలంగా వినిపించనున్నారు. వెల్ఫేర్ బోర్డుకు చెక్ గత ప్రభుత్వం 2016 జూలైలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించింది. అనంతర కాలంలో కార్మికులు పలు డిమాండ్లతో 50 రోజుల పాటు సమ్మె చేసి విధులకు దూరంగా ఉన్నారు. సమ్మె విరమించాక నాటి ప్రభుత్వం గుర్తింపు సంఘాలను రద్దు చేయడంతో పాటు తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. కార్మికుల సమస్యలను వినేందుకు ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డును తీసుకొచ్చి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడం మొదలైంది. కానీ ఈ విధానంలో కార్మికుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదనేది చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల్లో భాగమైన గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు ప్రకటన చేయడమే కాక.. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. దీంతో కార్మికులు, సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
తప్పేదెన్నడు?
ముంపు ముప్పుమున్నేటి వరద ముప్పు నుంచి ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలానికి శాశ్వత రక్షణ ఎప్పుడు లభిస్తుందనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. ఏటా వర్షాకాలం వస్తుందంటే మున్నేరు పరీవాహక కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఈక్రమాన ముంపు కట్టడికి రిటైనింగ్ వాల్ నిర్మాణం మొదలుపెట్టినా పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. సుమారు 17 కి.మీ.కు గాను 10 కి.మీ. మేర పూర్తయింది. అరవై శాతానికి పైగా పనులు పూర్తయినా మిగిలిన పనులతో పాటు డ్రెయిన్లు, రహదారుల నిర్మాణం భూసేకరణలో ఆలస్యంతో నత్తనడకన సాగుతోంది. – ఖమ్మం అర్బన్2024 వరదలతో కకావికలం మున్నేటికి ఎగువన కురిసిన భారీ వర్షాలతో 2024 ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ఉప్పొంగింది. మున్నేటిని ఆనుకుని ఉన్న 20 డివిజన్లలోని కాలనీలు వరదలో చిక్కుకోగా వేలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అంతకు ముందు ఏడాది కూడా మున్నేరు భారీగా ప్రవహించడంతో ఇదే పరిస్థితి ఎదురైంది. ఈక్రమాన గత ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదించగా నిధులు సైతం మంజూరయ్యాయి. అనంతరం ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడంతో పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. రెండేళ్ల గడువు.. ఆ తర్వాత ఇంకో రెండేళ్లు మున్నేటికి ఇరువైపులా సుమారు 17 కి.మీ. మేర రిటైనింగ్ వాల్ నిర్మాణంతో డ్రెయిన్లు, రహదారుల నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు సుమారు రూ.975 కోట్లతో ప్రతిపాదించారు. ఇంత మొత్తంలో నిధులు ఒకేసారి విడుదల చేయడం భారంగా మారడంతో తొలిదశగా సుమారు రూ.690 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. 2024లో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని నిబంధనల్లో పొందుపరిచారు. కానీ వర్షాలు, ఇసుక కొరత, కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో జాప్యం, భూసేకరణ సమస్యలతో పనులు వేగంగా జరగలేదు. ఫలితంగా పనుల పూర్తికి మరో రెండేళ్లపాటు గడువు పొడిగించినా అదే పరిస్థితి నెలకొంది. సవాల్‌గా మారిన భూసేకరణ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సుమారు 239 ఎకరాల భూమి అవసరమవుతోంది. ఇందులో 144 ఎకరాలు పట్టా భూములు, 11 ఎకరాలు ప్రభుత్వ భూమితో ఉన్నా మరో 84 ఎకరాలు ఎన్నెస్పీ భూములు అవసరమని గుర్తించారు. ప్రభుత్వ, ఎన్పెస్పీ భూముల ప్రాంతాల్లో పనులు వేగంగా జరుగుతున్నా, పట్టా భూములు, ప్లాట్ల ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు. నిర్వాసితులతో అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించినా పరిహారం తేలలేదు. భూములు కోల్పోయే వారికి ఇచ్చేలా ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో ఎన్నెస్పీకి చెందిన మిగులు భూములు 124 ఎకరాలను గుర్తించారు. ఈ భూమిని అభివృద్ధి చేసి అప్పగించాలని నిర్ణయించినా బదలాయింపులో జాప్యం జరిగింది. ఇటీవలే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి రోడ్లు నిర్మించారు. 580 కుటుంబాలపై ప్రభావం రిటైనింగ్ వాల్ నిర్మాణంతో మున్నేటికి ఇరువైపులా 580 మంది ఇళ్లు, ఇంటి స్థలాలు, భూములు కోల్పోనున్నారు. ఇందులో కొందరికి ప్రత్యామ్నాయ స్థలాలు, పరిహారం అందించే చర్యలు మొదలయ్యాయి. అయితే, భూసేకరణలో జాప్యం, పరిహారం విషయంలో కొందరి అభ్యంతరాలతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. డ్రెయిన్, రహదారులూ కీలకమే.. మున్నేటికి రిటైనింగ్ వాల్‌తో పాటు నగర, రూరల్ మండల ప్రాంతాల నుంచి వచ్చే వరదను మున్నేరులోకి మళ్లించేందుకు డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రిటైనింగ్ వాల్, డ్రెయిన్ మధ్యలో రహదారి కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. రిటైనింగ్ వాల్ ప్రారంభమయ్యే దానవాయిగూడెం సమీపం నుంచి ప్రకాశ్‌నగర్ వరకు ప్రారంభంలో 20 మీటర్లుగా, ముగింపు వద్ద సుమారు 40 మీటర్ల వెడల్పుతో డ్రెయిన్ నిర్మించాలని నిర్ణయించారు. అలాగే, డ్రెయిన్ – రిటైనింగ్ వాల్ మధ్య పది మీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రిటైనింగ్ వాల్‌తోపాటు డ్రెయిన్, రహదారి కూడా పూర్తయితేనే మున్నేటి వరదను సమర్థంగా నియంత్రించే అవకాశం ఉంటుంది.రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇప్పటివరకు దాదాపు 10 కి.మీ. మేర పూర్తయింది. మిగిలిన ప్రాంతాల్లో భూమి సేకరించి నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు డ్రెయిన్లు, రహదారులు నిర్మించాలి. ప్రస్తుత వేగాన్ని పరిశీలిస్తే మరో రెండు, మూడేళ్లు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది మున్నేటికీ వరద రాకున్నా గత అనుభవాల దృష్ట్యా పనులు వేగంగా జరిగేలా భూసేకరణ సమస్యలు పరిష్కరించడంతో పాటు సరిపడా నిధులు విడుదల చేయాల్సిన అవసరముంది. నత్తనడకన మున్నేటి రిటైనింగ్ వాల్ పనులు -
మూడు జిల్లాలు.. 2,646 మె.టన్నులు
చింతకాని: మూడు జిల్లాల అవసరాల కోసం ఎన్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన 2,646 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరుకుంది. చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు యూరియా చేరిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 1,846 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 400 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 మె.టన్నులు కేటాయించగా, మరో 100 మె.టన్నులు బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు. జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లలో సబ్ జూనియర్స్ విభాగం నుంచి జిల్లా క్రీడాకారులు ముగ్గురికి స్థానం దక్కింది. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న సీహెచ్.జయంత్, బి.గీతిక్ బాలుర జట్టుకు, బి.జీవన బాలికల జట్టుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని కోచింగ్ క్యాంప్‌నకు హాజరుకానున్న వీరు, ఈనెల 27నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులను బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయసారథి, కోచ్ చంద్రకాంత్ అభినందించారు. హామీలు అమలు చేయాలి టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు విజయ్, పద్మఖమ్మం సహకారనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీపీఎఫ్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్. విజయ్, వై.పద్మ హెచ్చరించారు. ఆదివారం సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం, ఉద్యోగుల ఆందోళనలను చులకనగా చూడటం సరికాదన్నారు. పెండింగ్ పీఆర్సీ, డీఏ సమస్యలను పరిష్కరించాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు పి. నాగిరెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు, జిల్లా నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సంధ్యారాణి, ఉమాదేవి, హనుమంతరావు, వైకేయూ బాషా తదితరులు పాల్గొన్నారు. 23 నుంచి పట్టణ ప్రాంతాల్లో ‘ఏక్ పేడ్.. మా కే నామ్’ఖమ్మం సహకారనగర్: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ఈ నెల 19వ తేదీన గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఒక్క రోజే 1,10,681 మొక్కలు నాటారు. దీంతో ఈ నెల 23 నుంచి పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. డీఆర్డీఏ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ, సాంఘిక, గిరిజన సంక్షేమ, మైనార్టీ తదితర శాఖలు, తెలంగాణ ప్రైవేటు పాఠశాలల సంఘం(ట్రస్మా) తదితరుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని డీఈఓ సదానందం సమన్వయం చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం● ఆర్పీఎఫ్ కమిషనర్ నవీన్‌కుమార్ ఖమ్మంక్రైం: రైల్వే ఆస్తుల రక్షణతోపాటు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్పీఎఫ్ కమిషనర్ నవీన్‌కుమార్ సూచించారు. రైజింగ్ డే వేడుకల్లో భాగంగా ఆదివారం ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ డివిజనల్ కమిషనర్ ఖమ్మంలోని ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. రైల్వే భద్రత, సిబ్బంది విధులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణ, అప్రమత్తత ముఖ్యమని సిబ్బందికి సూచించారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. ఆర్పీఎఫ్ సీఐ బుర్రా సురేష్‌గౌడ్, ఏఎస్ఐలు మెడీనిషా, రాంబాబు, సలాం, సిబ్బంది పాల్గొన్నారు. -
బీఆర్ఏఓయూలో నూతన కోర్సులు..
ఖమ్మం సహకారనగర్: విద్యార్థుల్లో నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ)లో ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు, విద్యా విధానాల ను అమలు చేస్తోందని యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఎక్స్టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి.ధర్మనాయక్ తెలిపారు. ఆదివారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలోని కేంద్రంలోని కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ,డిప్లొమా, సర్టిఫికెట్ తది తర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 30లోగా దరఖా స్తు చేసుకోవాలన్నారు. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో ఉందని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన కోర్సులు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ‘‘మీ ఆలో చనను వ్యాపారంగా మార్చండి.. మేము మీకు సహాయం చేస్తాము’’అనే నినాదంతో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు వ్యాపారాభివృద్ధి, ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నామన్నారు. ఈ సమావేశంలో రీజిన ల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎ.వీరన్న, జిల్లాలోని అధ్యయన కేంద్రాల కౌన్సిలర్లు, జాక్ట్లు, సీనియర్ కౌన్సి లర్లు ధనమూర్తి, రమేష్, రఫీ, నాగేశ్వరరావు, సర్వేశ్వరరావు, ఆంజనేయులు, వినోద్‌కుమార్, రవివర్ధన్, రాణి ముఖేష్, గాంధీ పాల్గొన్నారు. ఈ నెల 30 వరకు ప్రవేశాల గడువు -
అవాంతరాలు ఉండవు..
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికి త్స, పరీక్షలకు ఉపయోగించే ఏదైనా పరికరం మరమ్మతుకు వస్తే రోజులు, నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. సంబంధిత కంపెనీ నిపుణులు వచ్చి పరిశీలించి చిన్న మరమ్మతులు అవసరమైతే స్థాని కంగా లభించే విడిభాగాలతో సరిచేస్తున్నారు. అదే కీలకమైన పరికరాలు మొరాయించి, మరమ్మతులకు రూ.వేలు, రూ.లక్షలు కావాల్సి వస్తే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించి అనుమతి వచ్చేసరికి రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యాన పరికరాల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. తద్వారా ఎలాంటి మరమ్మతులైనా తక్కువ సమయంలో పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడనుంది. తొమ్మిది ఆస్పత్రుల్లో ఖమ్మం.. పలు ఆస్పత్రుల్లో బయో మెడికల్ పరికరాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్‌కు అప్పగించింది. తొలి దశగా మొత్తం తొమ్మిది ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అనుమతి ఇవ్వగా, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి, నిలోఫర్ మహిళా శిశు ఆస్పత్రి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎమ్ఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ కేన్సర్ సెంటర్, కింగ్‌కోటి ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రి, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జీజీహెచ్‌తో పాటు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కూడా ఇందులో ఉంది. ఆయా ఆస్పత్రుల్లో పరికరాల మరమ్మతులకు టీజీఎమ్‌ఎస్‌ఐడీసీ సాధారణ నిధుల నుంచి కేటాయించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ప్రాజెక్టు అమల్లోకి రానుండగా, ఆస్పత్రుల్లోని పరికరాల జాబితా పంపించాలని సూచించారు. -
రాత్రి వరకు సందడి.. తెల్లారేసరికి విషాదం
● పేషెంట్‌ను చూసి హైదరాబాద్‌కు బయలుదేరిన న్యూరోసర్జన్ ● కుటుంబసభ్యులను చేరకుండానే రోడ్డు ప్రమాదంలో మృతి ఖమ్మం అర్బన్: రాత్రి వరకు వైద్యులు, విద్యార్థులతో కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని, తెల్లవారుజామున అత్యవసర కేసు రావడంతో ఆస్పత్రికి వెళ్లి పరిశీలించి హైదరాబాద్‌కు బయలుదేరిన న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్‌బాబు ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలిలా.. శనివారం రాత్రి మమత ఆస్పత్రిలో వినాయక నిమజ్జన వేడుకల్లో సందడి చేసిన జగదీష్‌బాబు ఆదివారం తెల్ల వారుజామున అత్యవసర కేసు రాగా ఆస్పత్రికి వెళ్లి పరీక్షించి సోమవారం ఆపరేషన్ చేయాలని భావించి హైదరాబాద్ బయలుదేరాడు. ఈక్రమాన మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. కాగా, సురక్షిత ప్రయాణం కోసం సుమారు రూ.1.20 కోట్లు వెచ్చించి రెండు నెలల క్రితమే కారును కొనుగోలు చేసినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయిందని వైద్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది. మమత ఆస్పత్రి వరకు అంతిమయాత్ర.. సూర్యాపేటలో పోస్టుమార్టం అనంతరం డాక్టర్ జగదీష్‌బాబు మృతదేహాన్ని ఖమ్మానికి తీసుకురాగా మమత ఆస్పత్రి వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. మమత ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మమత వైద్య విద్యాసంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, వామపక్ష నేతలు నున్నా నాగేశ్వరరావు, విక్రమ్, పోటు రంగారావు, గుండాల కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్, బాగం హేమంతరావు, తదితరులు మృతదేహానికి నివాళులర్పించారు. జగదీష్ భార్య, చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం డాక్టర్ స్వగ్రామమైన ఏపీ రాష్ట్రంలోని కొత్తపట్నం మండలం సంకువారిగుంట గ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. -
‘విన్ విజన్’ ఆస్పత్రి ప్రారంభం
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలో ఏర్పాటు చేసిన విన్ విజన్ కంటి ఆస్పత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్నలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, నాగళ్ల దీపక్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్లను కూల్చొద్దు
ఖమ్మం వైరారోడ్: నగరంలో పేద ప్రజల ఇళ్లను ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లకు రక్షణ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన శ్రీనివాస్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న ఇళ్ల నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలుగుమట్లలో పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను అర్ధరాత్రి వేళ నేలమట్టం చేయడం బాధాకరమైన విషయమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 3 వేల మంది పేదలకు జీఓ నంబర్ 58 ద్వారా స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించామని గుర్తుచేశారు. వెలుగుమట్ల, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో కేసీఆర్ స్వయంగా పరిశీలించి న్యాయం చేశారని అన్నారు. మళ్లీ 2023 ఫిబ్రవరిలో జీఓను పొడిగించి ఖమ్మంలో అర్హులైన పేదలలకు పట్టాలు అందించామన్నారు. శ్రీనివాసనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో 696 కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని కమిషనర్, ఉన్నతాధికారులు గుర్తించారని తెలిపారు. కోర్టు ఆదేశించినట్లు వారం రోజుల్లో సరైన నివేదిక తయారుచేసి, నిరుపేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, నిరోషా, తిరుమల్ రావు, సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ -
గణనాథుడి లడ్డూ @ రూ.1.26 లక్షలు
మధిర: మధిర మండలం వంగవీడు గ్రామంలో నాయక్ యూత్ ఆధ్వర్యాన ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా స్వామి వారి చేతిలో పూజలు అందుకున్న లడ్డూ వేలం నిర్వహించగా బానోత్ శ్రీను రూ.1,26,116కు దక్కించుకున్నారు. అనంతరం స్వామి వారి విగ్రహాన్ని వంగవీడు చెరువులో నిమజ్జనం చేశారు. ఇక మధిర మెయిన్‌రోడ్డులోని వినాయక దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాన్ని స్థానిక చెరువులో నిమజ్జనం చేయగా తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సత్తుపల్లిలో భారీ వర్షంసత్తుపల్లిరూరల్: కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న సత్తుపల్లిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడగా ప్రజలు ఉపశమనం పొందారు. సింగరేణి ప్రాంతంలో 55 మి.మీ.వర్షపాతం నమోదైంది. ఈమేరకు సత్తుపల్లి జేవీ ఆర్, కిష్టారం ఓసీల్లో నీరు చేరగా 15వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి, 1.02 లక్షల టన్నుల మట్టి తొలగింపు నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. భారీ వర్షంతో గనుల్లో నిలిచిన నీటి ని భారీ మోటార్ల సాయంతో బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యపెనుబల్లి: మనస్థాపంతో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లంకా శేషయ్య బంజర గ్రామానికి చెందిన గొరిపత్తి నాగేశ్వరావు (40) భార్య ఇటీవల చనిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. వీరికి ఒక కుమారుడు. ఈనేపథ్యాన ఆదివారం గ్రామం పరిధిలోని ఆయిల్ఫామ్ తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న వీఎం బంజర ఎస్సై షేక్.షాకీర్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ షాకీర్ విచారణ చేపట్టారు. -
యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
ఖమ్మం మయూరిసెంటర్: గ్రామస్థాయి నుంచి యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని, యువతను పార్టీతో అనుసంధానం చేయాలని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి ఖలీద్ అహ్మద్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు వేజండ్ల సాయికుమార్ అధ్యక్షతన నిర్వహించిన యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, ఖమ్మం అర్బన్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జి వెంకటేష్ కూడా మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అంజనీ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్, బెజ్జం బాలగంగాధర్, బానోత్ కోటేష్, ఆదర్శ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బెల్లంకొండ శరత్, బిచ్చల అన్వేష్, బాలరాజు పాల్గొన్నారు.జాతీయ కార్యదర్శి ఖలీద్ అహ్మద్ -
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో ఇద్దరు మృతి
రఘునాథపాలెం: మండలంలో వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందారు. వివరాలిలా.. వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కిలారు రామారావు(67) శనివా రం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. రామారావుకు భార్య భార్గవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.భార్గవి రిటైర్డ్ ఉపాధ్యాయురాలు కాగా, వారి పిల్లలు విదేశాల్లో నివాసముంటున్నారు. రామారావు గతంలో వి.వెంకటాయపాలెం యూత్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అదేవిధంగా రాంక్యాతండాకు చెందిన జాటోత్ నవ్య (21) ఆదివారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. నవ్యకు భర్త, కుమార్తె ఉన్నారు. నవ్యకు భర్తతో గత రెండునెలల క్రితం విడాకులు కావడంతో తండ్రి వద్ద ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.చెరుకు తోటలో కణుజు..నీటి కోసం వచ్చి కొమ్ములు ఇరుక్కుని కన్నుమూత కల్లూరురూరల్: మండలంలోని లక్ష్మీపురం(రాళ్లబంజరు) గ్రామ సమీపాన చెరుకు తోటలో కణుజు మృతదేహా న్ని గుర్తించారు. చెరుకు తోటకు నీరు పెట్టేందుకు ఆది వారం ఉదయం వెళ్లిన రైతు భూక్యా రవి అక్కడ కణుజు మృతదేహాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏ.లక్ష్మి, డీఆర్ఓ సురేష్ చేరుకుని వెటర్నరీ డాక్టర్ మమతఆధ్వర్యాన పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, లక్ష్మీపురం గ్రామ సమీపంలోఉన్న అటవీ ప్రాంతం నుంచి నీటి కోసం కణుజు వచ్చిందని భావిస్తున్నారు. ఈక్రమాన కొమ్ములు చెరుకు తోటలో ఇరుక్కుపోయి బయటరాలేక.. అప్పటికే దాహంతో ఉండడం వల్ల మృతి చెందినట్లు భావిస్తున్నారు. ట్రావెల్స్ బస్సులో మంటలు..కొణిజర్ల: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులు, బస్సు డ్రైవర్ నారాయణ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వైజాగ్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి సుమారు 45 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తోంది. ఈక్రమాన కొణిజర్ల మండలం పల్లిపాడు పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే ఒక్క సారిగా ఇంజన్లో మంటలు చెలరేగగా.. డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన ఆపి మంటలార్పే యంత్రంతో మంటలు ఆర్పి వేశాడు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పెళ్లయిన రెండు నెలలకే అత్తింటి వేధింపులు..
ఖమ్మంక్రైం: పెళ్లయి రెండున్న ర నెలలు దాటకముందే అనుమానంతో తరుచూ వేధించే భర్త, అత్త, మామల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య కు పాల్పడింది. టూటౌన్ సీఐ బాలకృష్ణ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతం చిల్లకల్లుకు చెందిన నాగలీల, రామకృష్ణ దంపతుల కుమార్తె నాగలక్ష్మి(20)ని ఖమ్మంలోని రమణగుట్ట ప్రాంతంలో ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గుంజి నాగార్జునతో రెండున్నర నెలల క్రితం వివాహమైంది. అయితే వివాహం అయినప్పటి నుంచి నాగా ర్జున నాగలక్ష్మిపై అనుమానంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. దీనికి తోడు అతడి తల్లి నాగమణి, తండ్రి నాగేశ్వరావులు కుమారుడికి వత్తాసు పలుకుతూ నాగలక్ష్మిని మరింత వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి పక్కన వారు కిటికీలో నుంచి చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యాన మృతదేహాన్ని పెద్దాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాగలక్ష్మి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆమె మెడలో పుస్తెలతాడు సైతం కనిపించలేదని ఆమె బంధువులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు ఆందోళన చేశారు. మనస్తాపంతో నవ వధువు ఆత్మహత్య -
‘యువ వికాసం’లో కదలిక !
● వాయిదా పడిన పథకానికి మళ్లీ ఊపిరి ● నవంబర్ 19నుంచి రూ.లక్ష సాయంపై ప్రకటన ● ఉమ్మడి జిల్లాలో 1.60 లక్షలకు పైగా దరఖాస్తులుచుంచుపల్లి: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో మళ్లీ కదలిక వచ్చింది. గతంలో దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియ చేపట్టినా వివిధ కారణాలతో అమలు ముందుకు సాగలేదు. ఈక్రమాన నవంబర్ 19 నుంచి తొలి విడతగా రూ.లక్షలోపు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా అదికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లా యువతలో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో 1.60 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. యువతకు ఆర్థిక సాయం అందించి సొంతంగా వ్యాపారం, స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, పశుపోషణ, చిన్న పరిశ్రమలు, సేవా రంగం, రవాణా తదితర విభాగాల్లో యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది మార్చిలో దరఖాస్తులు 2025 మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యవ వికాసం పథకానికి వివిధ వర్గాల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈమేరకు ఖమ్మం జిల్లాలో 95,325, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 64,882 కలిపి మొత్తంగా 1,60,207 దరఖాస్తులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ తదితర వర్గాల నుంచి యువత దరఖాస్తు చేసుకున్నారు. రూ.50వేల నుంచి యూనిట్లు రాజీవ్ యువ వికాసం పథకం విధివిధానాల ప్రకారం స్వయం ఉపాధి యూనిట్ల స్థాయి ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణ సౌకర్యం, రాయితీ అమలవుతుంది. రూ.50 వేల యూనిట్‌కు వంద శాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో మొదటి విడతగా దాదాపు 38,230 యూనిట్ల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించగా.. దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే పూర్తయినందున జాబితా ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి యూనిట్లకు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఏడాది కాలంగా వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం.. తాజాగా రూ.లక్ష వరకు సాయం కోసం దరఖా స్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. నవంబర్ 19 నుంచి తొలి విడత సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తుండగా.. అధికారిక మార్గదర్శకాలు వెలువడ్డాక మరింత స్పష్టత రానుంది. కార్పొరేషన్ భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా బీసీ 20,602 39,616 ఎస్సీ 12,488 29,742 ఎస్టీ 27,792 14,416 మైనార్టీ 2,844 7,412 ఈ బీసీ 1,049 4,022 క్రిస్టియన్ 107 117 మొత్తం 64,882 95,325రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్ 19 నుంచి అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. గతంలో దరఖాస్తుల పరిశీలన మరింత లోతుగా చేపట్టాలనే నిర్ణయంతో వాయిదా వేసింది. యువ వికాసంపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటాం. మార్గదర్శకాలు వెలువడగానే లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేపడతాం. – బి.నాగలక్ష్మి, భద్రాద్రి జిల్లా కోఆర్డినేటర్, రాజీవ్ యువ వికాసం -
పెసర రొట్ట.. దక్కని పంట!
ఖమ్మంవ్యవసాయం: ఏటా వానాకాలంలో మెట్ట భూముల్లో పెసర సాగు చేయడం ఆనవాయితీ. అయితే కొందరు రైతులు మాగాణి భూముల్లోనూ పెసర వేస్తారు. వరి నాట్ల సమయానికి భూసారం పెరిగేలా పెసరను పచ్చిరొట్ట ఎరువుగా భూమిలో కలియదున్నుతారు. అయితే, ఈ ఏడాది అరకొరగా కురిసిన వర్షాలతో చేతికొస్తుందన్న ఆశించిన పలువురు మాగాణిలోనూ పెసర విస్తీర్ణాన్ని పెంచారు. కానీ పైరు రొట్టగా మారివారి ఆశలు అడియాశలు చేశాయి. అంచనాలకు మించి సాగు జిల్లాలో ఈ ఏడాది వానాకాలం అన్నీ కలిపి 5.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో పెసర 15,607 ఎకరాల్లో ఉంటుందని భావిస్తే... అంచనాలకు మించి 30,169 ఎకరాల్లో సాగైంది. మెట్ట, మాగాణి భూముల్లో 15వేల చొప్పున ఎకరాల్లో పెసర సాగు చేశారు. మెట్ట భూముల్లో వేసిన పంట ఎకరాకు రెండు క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చినా... మాగాణి భూముల్లో పైరు పెరిగిప్పటికీ పూత, కాత రాలేదు. ఆవిరైన ఆశలు వర్షాభావ పరిస్థితుల్లో పెసర సాగు అనుకూలమని అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వం చెప్పడంతో రైతులు కనీస ఆదాయం పొందొచ్చని వరి పండించే మాగాణి భూముల్లోనూ పెసర వేశారు. జూన్‌లో కురిసిన వర్షాలకు పైరు బాగానే మొలవగా.. ఎకరాకు ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ పైరు ఏపుగా పెరిగిందే తప్ప పూత, కాత అంతంత మాత్రంగా వచ్చింది. సాధారణంగా మాగాణి భూములు గతంలో వేసిన ఎరువులతో సారం కలిగి ఉంటాయి. దీంతో పెసర పైరు ఏపుగా పెరిగి రొట్టగా మారి ఫలితం దక్కలేదు. పంట రావాల్సిన పైరు రొట్టగా మారడంతో రైతులకు నిరాశ ఎదురైంది. శ్రమ, పెట్టుబడి.. నష్టం మాగాణిలో సాగు చేసిన పెసర రొట్టగా మారడంతో రైతుల శ్రమ, పెట్టుబడి వృథా అయ్యాయి. సాగు కోసం భూములను రెండేసి సార్లు దున్నించారు. దుక్కి దున్నడం, విత్తనాలకు కలిపి ఎకరాకు రూ.10 వేల వరకు వెచ్చించగా.. పైరు ఏపుగా పెరగడంతో ఎకరాకు పెట్టుబడి పోను రూ. 20వేల నుంచి రూ.25 వేల ఆదాయం వస్తుందని ఆశించారు. తీరా సరైన పూత లేక, కాత రాకపోవడంతో పెట్టుబడైనా వస్తాయని భావించారు. కానీ చివరకు రొట్టగా మారడంతో పైరుతో పాటు ఆశలనూ వదిలేసుకున్నారు.మండలం విస్తీర్ణం (ఎకరాల్లో) చింతకాని 8,129 కొణిజర్ల 5,770 వైరా 3,382 తిరుమలాయపాలెం 1,485 రఘునాథపాలెం 1,397 ముదిగొండ 1,377 ఏన్కూరు 1,161 తల్లాడ 1,095 ఖమ్మం రూరల్ 1,011 వరి వేయాల్సిన మాగాణి భూముల్లో సాగర్ నీరు రాదని పెసర వేశాం. గతంలో వేసిన ఎరువులతో సారం ఎక్కువై పెసర రొట్టగా పెరిగిందే తప్ప పంట రాలేదు. ఎకరాకు దాదాపు రూ.10 వేల మేర నష్టం వచ్చింది. – నాగేశ్వరరావు, వెంకటగిరి, ఖమ్మం రూరల్ మండలంరెండెకరాల మాగాణి భూమిలో పెసర సాగు చేశా. తొలుత ఆశాజనకంగా ఉన్నా.. చివరకు రొట్టగా పెరిగి ప్రయోజనం దక్కలేదు. వర్షాభావంతో పెసర మాత్రమే సాగు చేస్తే పెట్టుబడి కూడా రాక నిరాశ ఎదురైంది. – దారగాని లక్ష్మీనారాయణ, గంధసిరి, ముదిగొండ మండలం -
విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు
● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామకృష్ణ ● జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా లక్ష్మణ్, మనోజ్ఖమ్మంమయూరిసెంటర్: విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు శాసీ్త్రయ విద్యా విధానం అమలయ్యే వరకు రాజీలేని పోరా టాలు నిర్వహిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికాల రామకృష్ణ వెల్లడించారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవనంలో నిర్వహించిన సంఘం జిల్లా నూతన సమితి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో విద్యారంగం తీవ్ర సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురాకపోగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ విద్యను వ్యాపారీకరించి, కాషాయీకరణకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో విద్వేషాలు, చాందసవాదాన్ని విద్యార్థుల పసి మెదళ్లలో నూరిపోసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ కుట్రలను తిప్పికొడుతూ శాసీ్త్రయ విద్యా విధా నం కోసం విద్యార్థి లోకం ఐక్యంగా పోరాడాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. నూతన కమిటీ ఎన్నిక.. ఖమ్మంలో నిర్వహించిన సంఘం 27వ మహాసభల సందర్భంగా జిల్లా నూతన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రామకృష్ణ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా మడుపల్లి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శిగా బూర మనోజ్‌ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, 16 మంది ఆఫీస్ బేరర్లు, మొత్తం 51 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నంశెట్టి ఆకాష్, ఉపాధ్యక్షులు శివ నాయక్, అభిరామి రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ అండర్ పాస్‌లో ఇక్కట్లు
కొణిజర్ల: గ్రీన్‌ఫీల్డ్ హైవే మార్గంలోని కొణిజర్ల మండలం చిన్నగోపతి–పెద్దగోపతి గ్రామాల మధ్య నిర్మించిన అండర్‌పాస్ భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఎత్తు తక్కువగా ఉండడంతో కంటైనర్లు, భారీ లోడ్లతో వచ్చివెళ్లే వాహనాలకు ఆటంకం ఎదురవుతోంది. మండలంలోని పెద్దగోప తి, అనంతారం గ్రామాలతోపాటు చింతకాని మండలానికి చెందిన పలు గ్రామాల వారు ఈ రహదారి మీదుగానే ఖమ్మం మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఈక్రమాన శనివారం సాయంత్రం ఓ కంటైనర్ అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా టైర్లలోగాలి పూర్తిగా తొలగించి వాహనం ఎత్తు తగ్గాక బయటకు వచ్చారు. భారీ వాహనాలకు ఇది ఒక్కటే రహదారి కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి టీ.టీ. పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి పాఠశాలల క్రీడల్లో భాగంగా ఆదివారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్–14, 17 టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు రెండు విభా గాల నుంచి 150 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఈమేరకు సాయంత్రం జరిగిన సమావేశంలో విజేతలకు డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావు, టీ.టీ.అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వీ.వీ.సాంబమూర్తి, టోర్నీ నిర్వాహకులు చలపతి, మదహర్, రామారావు, రాజేష్‌రెడ్డి, సాయిశివ, కత్తుల నవ్య, పర్సా పవన్ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుల వివరాలను వై.రామారా వు వెల్లడించారు. అండర్–14 బాలుర విభాగంలో ఎస్.కే.ఫజల్, ఈ.హరి, ఏ.ఉజ్వల్, జాయ్, ఏ.యశ్వంత్, కె.హితేష్, బాలికల జట్టుకు ప్రవస్య, పి.వంశీక, బి.తన్మయిశ్రీ, బి.హార్విక, బి.ఆరాధ్య, పి.తన్వి ఎంపికయ్యారు. ఇక అండర్–17 బాలుర జట్టుకు పి.జ్వలిత్, జి.చార్విక్, ఇ.తరుణ్, కె.అఖిలేష్, బాలికల జట్టుకు బి.సాయిశివాని, శరణ్య, పావని, ఏ.శివకుమారి, జి.తీర్థ ఎంపికయ్యారని తెలిపారు. -
పరికరాల నిర్వహణ కాంట్రాక్టర్‌కు..
● పైలట్ ప్రాజెక్టు జాబితాలో జిల్లా ఆస్పత్రి ● ఏదైనా మరమ్మతుకు వస్తే వెంటనే సరిచేసే అవకాశం ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్సకు ఉపయోగించే ఏదైనా పరికరం మరమ్మతుకు వస్తే రోజులు, నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. సంబంధిత విభాగాల నిపుణులు వచ్చి పరిశీలించి చిన్న మరమ్మతులు అవసరమైతే స్థానికంగా లభించే విడిభాగాలతో పనిచేస్తున్నారు. అదే కీలకమైన పరికరాలు మొరాయించి, మరమ్మతులకు రూ.వేలు, రూ.లక్షలు కావాల్సివస్తే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించి అనుమతి వచ్చేసరికి రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యాన పరికరాల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. తద్వారా ఎలాంటి మరమ్మతులైనా వెంటనే పరీక్షించి తక్కువ సమయంలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడనుంది. తొమ్మిది ఆస్పత్రుల్లో ఖమ్మం కూడా.. పలు ఆస్పత్రుల్లో బయో మెడికల్ పరికరాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్‌కు కేటాయించింది. తొలి దశగా మొత్తం తొమ్మిది ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అనుమతి ఇవ్వగా, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి, నీలోఫర్ మహిళా శిశు ఆస్పత్రి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎమ్ఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ కేన్సర్ సెంటర్, కింగ్‌కోటి ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రి, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జీజీహెచ్‌తో పాటు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కూడా ఇందులో ఉంది. ఆయా ఆస్పత్రుల్లో పరికరాల మరమ్మతులకు టీజీఎమ్‌ఎస్‌ఐడీసీ సాధారణ నిధుల నుంచి కేటాయించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ప్రాజెక్టు అమల్లోకి రానుండగా, ఆస్పత్రుల్లోని పరికరాల వివరాలను పంపించాలని సూచించారు. తప్పనున్న ఇబ్బందులు ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో ఏదైనా పరికరం మరమ్మతులకు గురైతే రోజుల తరబడి సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చే వారిలో కొందరు నిరీక్షించలేక ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పెద్దాస్పత్రిలో సిటీ స్కాన్, వెంటిలేటర్లు, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, సీఆర్మ్ మిషన్లు, వార్మర్లు, ఫొటోథెరపీ, సీపాప్, ఆడియోమెట్రో వంటి పరికరాలు 200 వరకు ఉంటాయి. అలాగే ఎంఆర్ఐ త్వరలో అందుబాటులోకి రానుంది. వీటిని పర్యవేక్షణకు ఆస్పత్రిలో బయో మెడికల్ ఇంజనీర్ ఉన్నా, చిన్నపాటి మరమ్మతులకే జరుగుతున్నాయి. అవి కూడా ఒక్కోసారి వారం నుండి 10 రోజుల సమయం పడుతోంది. ప్రస్తుతం కాంట్రాక్టర్‌కు అప్పగించనుండడంతో ఏ యంత్రం పాడైనా సదరు కంపెనీ చూసుకుంటుందని సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. త్వరలో మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టర్ పరిధిలోకి వెళ్లనుండగా, ఆపై వైద్య పరీక్షలు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని వెల్లడించారు. -
జిల్లాకే జలగంనగర్ పాఠశాల ఆదర్శం
ఖమ్మంరూరల్: జలగంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులు సాధించడంతో జిల్లాకే ఆదర్శంగా నిలిచిందని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత అన్నారు. పాఠశాలలో శనివారం కౌన్సిలర్ బోయిన కృష్ణకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటీవల అవార్డులు అందుకున్న హెచ్ఎం శ్యాంసన్‌తో పాటు ఉపాధ్యాయులను చైర్పర్సన్ సత్కరించి మాట్లాడారు. విద్యార్థుల సంఖ్యను 400కు చేర్చడమే కాక ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులు ఆదిలక్ష్మి, రాజిదా బేగం, చీనియ, షాబుద్దీన్, ఎస్ఎంసీ చైర్ పర్సన్ విజయలక్ష్మితో పాటు బోయిన సాయియాదవ్ పాల్గొన్నారు. -
హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా విష్ణువర్ధన్
భద్రాచలం: బూర్గంపాడు మండలం నాగి నేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పత్తి విష్ణువర్ధన్ రెడ్డి హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాది గా నియమితుల య్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఈ హోదా పొందిన రెండో వ్యక్తి ఆయనే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాపిక్యూటర్‌గా వ్యవహరించారు. బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ న్యాయవా దుల సమస్యలు, హక్కులు, సంక్షేమంలో చురుకై న పాత్ర పోషించారు. రాష్ట్రస్థాయి టీ.టీ. టోర్నీలో ప్రతిభ ఖమ్మం స్పోర్ట్స్: అండర్ – 17, 18, 19 విభాగాల్లో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీలో జిల్లా బాలబాలికలు ప్రతిభ చాటారు. పోటీల్లో ఖమ్మం చెందిన రోష్మిత, హేయాన్, రోహిణికా తన్వి, ఇమ్మానుయేల్, యశస్విని, ఠాగూర్ ట్రోఫీలు దక్కించుకున్నారు. క్రీడాకారులను డీవైఎస్ఓ సునీల్‌రెడ్డి, టేబుల్ టెన్నిస్ కోచ్ వీవీఎస్.మూర్తి, అసోసియేషన్ ప్రతినిధులు చలపతి, ఎస్.కే.ముజాహర్, రంజిత్, సంతోష్ పాపారావు, మణికాంత్ అభినందించారు. తిరుమలకు పాదయాత్ర పెనుబల్లి: భద్రాచలం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులు శనివారం పెనుబల్లి మండలం వీఎం బంజర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా తాము పాదయాత్రగా తిరుమల వెళ్తున్నామని తెలిపారు. బృందానికి నాయకులు పంది వెంకటేశ్వరావు, నల్లమోతు వినీల, ఈ.వీ.రమేష్, సంధ్యారాణి స్వాగతం పలికారు. గిరిజన యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలి ● సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేల వినతి వైరా/ములకలపల్లి: గిరిజన ప్రాంతాల్లోని యువతీ యువకులు పోలీసు ఉద్యోగ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్లు కలిపించాలని వైరా, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు కోరారు. ఈ సందర్భంగా వారు శనివారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గిరిజన యువతకు భరోసా కల్పించేలా రిజర్వేషన్లు పెంచాలని, భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అలాగే, ములకలపల్లిలో బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. గణేష్ నిమజ్జనంలో ఎమ్మెల్యే వైరా: వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని శనివారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు ‘ఏక్ పేడ్.. మాకే నామ్’ కార్యక్రమంలో భాగంగా వైరా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ మొక్క నాటా రు. మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, కమిషనర్ రామచంద్రయ్య, నాయకులు బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, సూతకాని జైపాల్, డాక్టర్ కాపా మురళీకృష్ణ పాల్గొన్నారు. పాతర్లపాడులో డీజే సీజ్ చింతకాని: నిబంధనలకు విరుద్ధంగా మండలంలోని పాతర్లపాడులో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్ సిస్టంను పోలీసులు శనివారం సీజ్ చేశారు. డీజేను సీజ్ చేయడమే కాక సిస్టం యజమాని, వాహన యజమానిపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మండల వ్యాప్తంగా డీజే సిస్టంపై నిషేధం ఉన్నందున, నిబంధనలు పాటించాలని సూచించారు. -
‘హార్వెస్ట్’లో సిల్వర్ జూబ్లీ వేడుకలు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలో హార్వెస్ట్ విద్యాసంస్థలు ప్రారంభమై 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను శనివారం నిర్వహించారు. ఇదే వేదికపై క్లాస్ సాథీ చాంపియన్ షిప్ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కొరియా నుంచి క్లాస్ సాథీ సీఈఓ పంకజ్ అగర్వాల్‌తో పాటు ఖమ్మం ఎంపీ రామనహాయం రఘురాంరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరుకాగా, క్వెస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కె.నాగమణి, హార్వెస్ట్ గ్రూప్ విద్యాసంస్థల కరస్టాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యారంగ వ్యవస్థలో మేథస్సును అభివృద్ధి చేసుకునే అవసరం ఉందన్నారు. ఈ మేరకు తాము రూపొందించిన క్లాస్ సాథీ యాప్ ద్వారా పిల్లల్లో పాఠ్యాంశాలకు సంబంధించి క్విజ్ నిర్వహిస్తుండగా హార్వెస్ట్ విద్యాసంస్థల వారు నమర్ధవంతంగా ఉపయోగించుకొని 24,718 పాయింట్లు సాధించి దేశంలోనే మొదటి స్థానాన నిలిచారని తెలిపారు. ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్ దృష్ట్యా ఉన్నత విద్యావకాశాలను ఖమ్మంకు చేరువ చేసిన హార్వెన్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. కరస్పాండెంట్ రవిమారుత్ మాట్లాడుతూ పిల్లలు బాల్యాన్ని ఆనందంగా ఆస్వాదించేలా, వారిపై ఒత్తిడి లేకుండా బోధన అందిస్తున్నామని తెలిపారు. పాతికేళ్ల గతం గర్వంగా ఉండగా, మరింత బాధ్యతను గుర్తుచేస్తోందని చెప్పారు. ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ వేడుకలు వచ్చే మూడు నెలల్లోనూ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా, వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘క్లాస్ సాథీ’ అవార్డుల ప్రదానం -
రాపల్లె మేజర్‌కు గండి కొట్టిన రైతులు
కొణిజర్ల: రైతుల కష్టాలు తీర్చాలని సాగర్‌లో నీరు లేకున్నా తాగు అవసరాల కోసం విడుదల చేసిన నీటితో చెరువులు నింపేలా అధికారులు నిర్ణయించా రు. అయితే, కొందరు సాగర్ కాల్వకు గండి కొట్టడంతో నీరంతా వృథాగా పోతోంది. కొణిజర్ల మండలం పెద్దగోపతి సమీపాన రాపల్లె మేజర్ ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు సమీపంలోని చెరువులు నింపుతున్నారు. ఈక్రమాన శుక్రవారం అర్ధరాత్రి చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన కొందరు జేసీబీ సాయంతో పెద్ద గోపతి ఊరకుంట సమీపాన కాల్వకు గండి కొట్టినట్లు తెలిసింది. దీంతో చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారి నీరంతా వృథాగా పొలాల్లోకి చేరుతోంది. అంతేకాక చెరువులో పోసిన చేపలు కొట్టుకుపోయి రూ.5లక్షల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు వాపోయారు. నీరంతా వృథాగా గ్రామంలో నుంచి రోడ్డపై పారుతున్నందున అధికారులు తక్షణమే స్పందించి కాల్వ గండి పూడ్చి వేయించాలని రైతులు కోరుతున్నారు.వృథాగా పోతున్న సాగర్ జలాలు -
పురుగు మందు డబ్బాలతో మహిళల నిరసన
చింతకాని: చింతకాని గ్రామానికి చెందిన పలువురు దళిత మహిళలు శనివారం పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు ఇచ్చిన మూడెకరాల భూముల వద్దకు నిరసన తెలిపి మాట్లాడారు. గత ప్రభుత్వంలో హయాంలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయగా, చింతకానిలో 24 ఎకరాలకు సంబంధించి కొందరికి అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కరించమని ఉన్నతాధికారులను ఆదేశించినా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఇకనైనా స్పందించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడించారు. 17మందిపై కేసు నమోదు చింతకానికి చెందిన 17 మంది ఎస్సీ మహిళలపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన భూమిలో నారపోగు వెంకట్రావమ్మ వరి నాట్లు వేయగా.. గ్రామానికి చెందిన మహిళలు ధ్వంసం చేశారు. అడ్డొస్తే పురుగుల మందు తాగుతామని బెదిరించారని, పొలాన్ని ధ్వంసం చేయడంతో రూ.95 వేలు నష్టం వాటిల్లిందని వెంకట్రావమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. అధికార లాంఛనాలతో ఆర్ఐ అంత్యక్రియలు కారేపల్లి: నిజామాబాద్‌లో ఏఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న హనుమకొండ సతీష్ తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో శుక్రవారం మృతి చెందిన విషయం విదితమే. ఈమేరకు ఆయన మృతదేహాన్ని స్వస్థలమైన కారేపల్లి మండలం శాంతినగర్‌కు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. కాగా, శనివారం ఉదయం ఏఆర్ ఏసీపీ బి.కృష్ణ, ఆర్ఐ డి.హరికుమార్ ఆధ్వార్యన ఆయన కుటుంబానికి తక్షణ సాయంగా రూ.30వేలు అందజేశారు. అనంతరం అధికార లాంఛనాలతో సతీష్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ విధి నిర్వహణలో సతీష్ సేవలు మర్చిపోలేనివని, ఆయన అకాల మృతి కుటుంబానికే కాక పోలీసు శాఖకు తీరని లోటని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు హనుమకొండ వెంకటేశ్వర్లు, తాటిపాముల సురేష్, పోలీసు ఉద్యోగులు, నాయకులు పెద్దబోయిన ఉమాశంకర్, అడపా పుల్లారావు, హనుమకొండ రమేష్, గుడిపూడి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
ఖిలా వరంగల్: క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.రామచంద్రం తెలిపారు. వరంగల్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న కేయూ యూనివర్సిటీ అండ్ కాలేజ్ మహిళా క్రీడోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి 780 మంది మహిళా క్రీడాకారులు హాజరుకాగా ఈనెల 21 తేదీ వరకు కబడ్డీ, సాఫ్ట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, క్రాస్ కంట్రీ అంశాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ టి.శాస్త్రి, వాగ్దేవి కళాశాల డైరెక్టర్ వాణిదేవితో పాటు హెచ్.సుదర్శన్‌రెడ్డి, ఫ్రొఫెసర్ సునీల్‌రెడ్డి, రవీందర్, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం -
మొక్క నాటిన అదనపు కలెక్టర్
తల్లాడ: మండలంలోని పినపాక జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లి పేరుతో మొక్క నాటి సంరక్షించాలని, తద్వారా పర్యావరణ సమతుల్యత, పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఎంపీడీఓ శ్రీధర్‌రాజు, ఎంఈఓ దామోదరప్రసాద్, ఏపీఓ కోటయ్య, సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు, ఈసీ అరుంధతి, నజీర్, సునీత, పరశురామ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక వైరా ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బాజోజు ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. సందర్శించారు. ఇక వైరా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ రవిబాబు మొక్క నాటారు. -
గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మంమయూరిసెంటర్: గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ధంసలాపురం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సౌకర్యాల కల్పన, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ల ఖరారుపై సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, బారికేడ్లు, క్రేన్లు, బోట్లు ఏర్పాటుచేసి గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. భక్తులకు తాగునీరు సమకూర్చి, మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేయాలని, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ జయచందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ధంసలాపురం చెరువును పరిశీలించిన కలెక్టర్, సీపీ -
మృతి మిస్టరీ వీడేదెప్పుడు?
● వినీత్ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు ● ఎలాంటి క్లూ దొరకక విచారణలో జాప్యంసత్తుపల్లి: సత్తుపల్లిలోని పాత మిలీనియం స్కూల్ భవనం రెండో అంతస్తు నుంచి కింద పడిన బొడ్డు వినీత్(29) మృతి చెందగా, కారణాలు తెలియక మిస్టరీగానే మిగిలిపోయింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుమలూరు మండలం పోరంకి చెందిన సుబ్బారావు – సునీల దంపతుల కుమారుడు వినీత్ సత్తుపల్లిలోని ఓ మైక్రో సంస్థలో పనిచేసేవాడు. గతనెల 13న అర్ధరాత్రి ఆయన మృతి చెందగా, తల్లిదండ్రులు, బంధుమిత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా ముందడుగు పడకపోవడం గమనార్హం. ఆ రాత్రి ఏం జరిగింది? గతనెల 13న అర్ధరాత్రి ఒంటి గంట సమయాన మిత్రుడితో కలిసి వినీత్ పాత మిలీనియం స్కూల్ భవనం ఉన్న ప్రాంతానికి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆతర్వాత రెండోసారి ఒక్కడే 1–40 గంటలకు ఫోన్ మాట్లాడుతూ రాగా.. మూడు నిమిషాల్లోనే భవనం పైనుంచి కింద పడ్డాడు. రెండో అంతస్తులో తలుపు తీసి ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లగా, అందులో ఉన్న వారు కేకలు వేయడంతో కంగారులో చూసుకోకుండా కిందకు దూకినట్లు తెలుస్తోంది. తలకు తీవ్రమైన గాయమైన ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు 108ను పిలిపించగా సిబ్బంది చేరుకుని అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎందుకు వెళ్లాడు ? అపార్ట్‌మెంట్‌కు వినీత్ ఎందుకు వెళ్లాడు, అక్కడ ఏం జరిగిందనే అంశాన్ని తేల్చేందుకు పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. మెదటిసారి వినీత్‌తో కలిసి వెళ్లిన యువకుడిని విచారిస్తే బంధువులు ఉన్నారని చెప్పాడే తప్ప ఇతర వివరాలు తెలియదని బదులిచ్చినట్లు తెలిసింది. అలాగే, వినీత్ వెళ్లిన ఇంట్లోని దంపతులే కాక ఇంకొందరిని విచారించినా క్లూ లభించక.. వినీత్‌తో పాటు అపార్ట్మెంట్లోని అందరి కాల్ డేటా పరిశీలించినట్లు సమాచారం. వినీత్ లోపలకు వెళ్తున్న సమయాన ఏపీలో ఉండే కాబోయే భార్యతో ఫోన్లో మాట్లాడాడని నిర్ధారించుకున్నట్టు తెలిసింది. ఇంకొన్ని వివరాల సేకరణకు ఇంటర్నెట్ ప్రొటోకాల్ డెలివరీ రికార్డర్( ఐపీడీఆర్)కు మృతుడి ఫోన్‌ను పంపించారని, తద్వారా ఇంటర్నెట్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఫోన్ కాల్ మాట్లాడినా బయటపడే అవకాశముందని సమాచారం. అలాగే, శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపించారు.బొడ్డు వినీత్‌ది ముమ్మాటికీ హత్యేనని ఆయన తల్లిదండ్రులు సుబ్బారావు, సునీల ఆరోపించారు. ఈమేరకు సత్తుపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యాన నిర్వహించగా వారితో పాటు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ కందికట్ల విజయ్ మాట్లాడారు. ఘటన జరిగి నెల దాటినా దోషులను పోలీసులు పట్టుకోలేదని, అనేక అనుమానాలు ఉన్నా విచారణలో తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. నాయకులు కొలికపోగు వెంకటేశ్వరరావు, గొల్లమందల ముత్తారావు, అద్దేపల్లి సాగర్, సోర గుడి రాజేష్, గంధం పాండు, నందిగామ అఖిల్, అభిపాల్, అంబేద్కర్, మాణిక్యం పాల్గొన్నారు.వినీత్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధువులకు విచారణ వివరాలను ఇప్పటికే వివరించాం. ఎవరికై నా సందేహాలు ఉంటే నేరుగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. కేసుకు సంబంధించి ఐపీడీఆర్, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు రావాల్సి ఉంది. – వసుంధర యాదవ్, ఏసీపీ, కల్లూరు -
విద్య కాషాయీకరణకు యత్నాలు
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో విద్యను కాషాయీకరించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈక్రమాన చరిత్రను వక్రీకరిస్తూ, పసి మెదళ్లలో మతోన్మాదాన్ని నింపుతున్నారని తెలిపారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జిల్లా 28వ మహాసభలు శనివారం ఐఎంఏ హాల్లో జరగగా, తొలుత పాత నెహ్రూనగర్ నుంచి పాత బస్టాండ్, మయూరిసెంటర్ మీదుగా హాల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సంఘ పతాకాన్ని ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు రావి శివరామకృష్ణ ఆవిష్కరించగా లక్ష్మణ్ మాట్లాడుతూ బడ్జెట్లో విద్యకు నిధుల కేటాయింపు పూర్తిగా తగ్గిపోగా, కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ మాట మరవడమే కాక ప్రైవేట్‌లో ఫీజుల నియంత్రణను సైతం విస్మరించారని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి వేలాది మందికి లబ్ధి చేకూరిస్తే గత కేసీఆర్, నేటి రేవంత్‌రెడ్డి సర్కార్ విద్యా రంగాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ నివేదిక సమర్పించగా, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, మడుపల్లి లక్ష్మణ్, బుర్ర మనోజ్, అమృత, బత్తినేని నీరజ, మామిళ్ల శ్రీనాథ్ రెడ్డి, చింతల రమేష్, అజిత్, తదితరులు పాల్గొన్నారు.ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలో రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ -
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణ లోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. అలాగే, స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: సివిల్ సర్వీసెస్(ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ)కు సిద్ధమవుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఫిరంగి తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ, శ్రీరామ్స్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భాగస్వామ్యంతో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 100 మందిని ఎంపిక చేయనుండగా ఇందులో ఎస్టీలు 75మంది, ఎస్సీలు 15 మంది, బీసీలు 10 మందికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే, గత ఐదేళ్లలో ప్రిలిమ్స్ అర్హత సాధించిన ఎస్టీ అభ్యర్థులను మరో 20మందిని కూడా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, కుటుంబ వార్షికాదాయం రూ.3లక్షల్లోపు ఉండి 21 – 32 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులు కాగా, దివ్యాంగులకు సడలింపు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు https://welfare.sriramsias.com వెబ్సైట్ ద్వారా ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు. కలెక్టరేట్లో రేపటి ప్రజావాణి రద్దు ఖమ్మం సహకారనగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 21వ తేదీన రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మండల, డివిజన్ స్థాయిలో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు. రెండు రోజుల పాటు హబ్‌లో పరీక్షలకు బ్రేక్ ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రి ఆవరణలోని తెలంగాణ డయోగ్నస్టిక్ హబ్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు సేవలు నిలిపివేస్తున్నట్లు సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. హబ్‌లోని సిబ్బంది ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నందున వైరస్ నిర్మూలనకు ఫ్యూమిగేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతీనెల హానికరమైన సూక్ష్మజీవుల నిర్మూలనకు రసాయనాలతో ఫ్యూమిగేషన్ చేయాల్సి ఉన్నా, చాన్నాళ్లుగా జరగకపోవడంతో సిబ్బందికి కళ్లు, చర్మ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈమేరకు రెండు రోజుల పాటు సేవలు నిలిపివేసి ఫ్యూమిగేషన్ నిర్వహణకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పరీక్షలు నిలిపివేయగా, సోమవారం నుంచి సేవలు యథావిధిగా కొనసాగుతాయని సూపరింటెండెంట్ తెలిపారు. బోధనపై ప్రత్యేక దృష్టి వైరా: జూనియర్ కాలేజీల విద్యార్థులకు బోధనపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి రవిబాబు సూచించారు. వైరా జూనియర్ కాలేజీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థుల హాజరును పరిశీలించాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. సిలబస్ ఆధారంగా పాఠాలు బోధిస్తూ పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని తెలిపారు. కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయాఇ్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం ఆయన కళాశాలలో మొక్క నాటారు. ప్రిన్సిపాల్ ఎల్.నవీన.జ్యోతి, ఏఓ శ్రీకాంత్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. హజ్ యాత్రికులకు వైద్యపరీక్షలు ఖమ్మం వైద్యవిభాగం: హజ్ వెళ్తున్న యాత్రికులకు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయగా 40 మంది యాత్రికులు హాజరయ్యారు. వీరికి ఈసీజీ, టూడీ ఎకో, రక్త పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేశారు. -
మాదక ద్రవ్యాల కట్టడిపై ప్రత్యేక దృష్టి
చింతకాని: మాదక ద్రవ్యాల రవాణా, అమ్మకాలను పూర్తిగా నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. చింతకాని పోలీసుస్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో పరిశీలించాక పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల కట్టడికి నిఘా పెంచడమే కాక వాటి బారిన పడకుండా విద్యార్థులు, యువత, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, సైబర్ మోసాల బారిన పడకుండా సదస్సులు నిర్వహించాలని తెలిపారు. అంతేకాక కేసుల నమోదులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని, భూవివాదాల కేసుల్లో నిర్దేశిత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) పాటించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వేగంగా దర్యాప్తు చేపడుతూ మెరుగైన పోలీసింగ్ అమలుచేయాలని తెలిపారు.పోలీసు కమిషనర్ సునీల్‌దత్ -
విధుల్లో కండక్టర్ హఠాన్మరణం
ఖమ్మంమయూరిసెంటర్: తెల్లవారుజామున 3–30 గంటలకే విధులకు హాజరై హైదరాబాద్ వెళ్లిన ఆర్టీసీ కండక్టర్ సామినేని లక్ష్మీనారాయణ(57) గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం డిపో కండక్టర్ ఎస్.ఎల్.నారాయణ శనివారం ఇల్లెందు – హైదరాబాద్ సర్వీస్‌కు కండక్టర్‌గా వెళ్లారు. తెల్లవారుజామునే బయలుదేరి హైదరాబాద్ వెళ్లగా, అక్కడ టిఫిన్ చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలాడు. సిబ్బంది ఆయనను యశోద ఆస్పత్రికి, ఆతర్వాత తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బస్టాండ్‌లో సిబ్బంది ఆయనకు సీపీఆర్ చేసినా ప్రయోజనం దక్కలేదు. కాగా, లక్ష్మీనారాయణకు భార్య సుభద్ర, ఇద్దరు కొడుకులు ఉన్నారు. నవ్వుతూ పలకరించి.. ఖమ్మం డిపోలో శనివారం తెల్లవారుజామున విధులకు హాజరైన కండక్టర్ లక్ష్మీనారాయణ తోటి ఉద్యోగులను నవ్వుతూ పలకరించారు. హైదరాబాద్‌లో ఆయన మృతి చెందాడని తెలియడంతో ఉద్యోగులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా, పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పెద్ద కుమారుడి వివాహం కార్తీకమాసంలో చేయాలని సిద్ధమవుతుండగా ఈ ఘటన జరగడంతో విషాదం నెలకొంది. కాగా, ఎంజీబీఎస్‌లో లక్ష్మీనారాయణ గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలియగానే ఖమ్మం ఆర్ఎం సరిరామ్ స్పందించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడమే కాక ఆస్పత్రికి తీసుకెళ్లేలా సిబ్బందికి సూచనలు చేశారు. అయితే, ఫలితం దక్కక ఆయన మృతి చెందడంతో మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. ఖమ్మం నేతాజీనగర్‌లోని ఇంటికి లక్ష్మీనారాయణ మృతదేహాన్ని తీసుకురాగా భార్య సుభద్ర కన్నీరుమున్నీరయ్యారు. అక్కడ ఆర్ఎం సరిరామ్, డీఎం శివప్రసాద్, ఉద్యోగులు నివాళులర్పించారు. ఎంజీబీఎస్‌లో గుండెపోటుతో కుప్పకూలిన వైనం -
లక్ష్యాల ఆధారంగా ప్రణాళికతో విధులు
ఖమ్మం సహకారనగర్: విద్యారంగంలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు మండలాల వారీగా ప్రణాళిక రూపొందించుకుని నెల వారీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.సదానందం సూచించారు. ఖమ్మంలోని సైన్స్ మ్యూజియంలో జిల్లా అకడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందాల సమావేశాన్ని శనివారం అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పెసర ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలోడీఈఓ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఖమ్మం రెండో స్థానాన నిలిచినా ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు అవసరమైన సహకారం, శిక్షణ అందిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థాల పెంపునకు కృషి చేయాలని చెప్పారు. ప్రతీ టీం సభ్యుడు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఎంఈఓ శైలజాలక్ష్మి, ఎఫ్ఎల్ఎన్ జిల్లా సెల్ కన్వీనర్ శ్యామ్యూల్, సభ్యులు ప్రవీణ్ కుమార్, శ్రవణ్‌కుమార్, సేవ్యా పాల్గొన్నారు. కోర్టు కానిస్టేబుళ్లకు పదోన్నతి ఖమ్మం లీగల్: జిల్లా కోర్టులో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ముత్తయ్య, రవికుమార్, శ్రీనివాసులకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. అలాగే, హెడ్ కానిస్టేబుళ్లు చెన్నారావు, వెంకటేశ్వర్లుకు ఏఎస్సైలుగా పదోన్నతి రావడంతో శనివారం సన్మానించారు. ఎస్సై శ్రీకాంత్‌తో పాటు సీడీఓలు, లైజనింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
బోనకల్: గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువత పోలీస్, ఆర్మీ, పారామిలటరీ ఉద్యోగాలు సాధించేలా బోనకల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యాన ఎస్బీఐ ఫౌండేషన్ సహకారంతో శిక్షణ ఇస్తుండగా, పల్లె ప్రకృతి వనంలో శారీరక శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ బానోత జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె శిక్షణను పరిశీలించి వివరాలు వెల్లడించారు. గతంలోనూ ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యాన పది కంప్యూటర్లు సమకూర్చారని తెలిపారు. ఉపసర్పంచ్ బానోతు కొండ, భవిష్య ప్రాజెక్ట్ మేనేజర్ జి.శ్రీనివాస్, ఫీల్డ్ కోఆర్డినేటర్లు కె.వెంకటేశ్వరావు, జి.గోపి, కోచ్‌లు ఎం.డీ.అసద్, ఎం.కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
పీఆర్సీ హామీని నెరవేర్చాలి
కల్లూరురూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలుచేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేర్చాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు కోరారు. కల్లూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీ అమలుచేయాలని ఆరోపించారు. పీఆర్సీ అమలు, డీఏలు, బకాయిల చెల్లింపుతో పాటు సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోక ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నిరాశ అలుముకుందని తెలిపారు. ఈమేరకు రాష్ట్ర స్థాయిలో చేసిన ఉద్యమానికి తలొగ్గి త్వరలో పరిష్కరిస్తామని సీఎం స్వయంగా హామీ ఇచ్చినాకార్యాచరణ రూపొందించలేదన్నారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.బ్రహ్మారెడ్డి, నాయకులు పాకాల రమేష్, వెంకటేశ్వర్లు, సురేష్‌బాబు, చెన్నకేశవరెడ్డి, ఎం.డీ.మౌలాలి, షేక్ చాంద్సాహెబ్, టి.సత్యనారాయణరెడ్డి, వీరవల్లి శ్రీనివాసరావు, బోబోలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు -
గోమయం.. వినూత్నం!
ఖమ్మం అర్బన్: గోసేవతోపాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఖమ్మం టేకులపల్లిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల బాధ్యులు ముందడుగు వేశారు. గోమయం, గోమూత్రాన్ని వినియోగిస్తూ పర్యావరణహితమైన విగ్రహాలు, ధూప్‌స్టిక్స్, ప్రమిదలు, ఎరువులు, అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. వినాయక చవితి, కృష్ణాష్టమి సందర్భంగా వినాయకులు, కృష్ణుడి విగ్రహాలను సహజసిద్ధమైన రంగులతో తయారు చేస్తుండగా.. కొన్ని విగ్రహాల్లో విత్తనాలను చేరుస్తున్నారు. తద్వారా నిమజ్జనం చేశాక మొక్కలు మొలిచి పర్యావరణానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఎన్నో రకాల ఉత్పత్తులు గోమయంతో ధూప్‌స్టిక్స్, ధూప్ కప్‌లు, ప్రమిదలు, పిడకలు, హోమ సామగ్రి తయారుచేస్తున్నారు. ఇవేకాక తోరణాలు, కీ చైన్లు, ఫోన్ స్టాండ్లు కూడా తయారు చేస్తుండడం విశేషం. వీటితో పాటు పచ్చి గోమయాన్ని యంత్రాల ద్వారా ఆరబెట్టి సేంద్రియ ఎరువుగా రైతులు, ఇళ్లలో మొక్కల పెంపకందారులకు అందిస్తున్నారు. అలాగే, గోమూత్రంతో ఫినాయిల్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. విగ్రహాల తయారీలో గోమయంతోపాటు చెక్కపొట్టు, ముల్తానీ మట్టి వంటి సహజ పదార్థాలను వినియోగిస్తారు. ఈ మిశ్రమంలో చేసిన విగ్రహాలకు పగుళ్లు రాకుండా తొలుత 3 – 5 రోజులు నీడలో ఆరబెడతారు. ఆతర్వాత ఎండలో ఆరబెట్టి సహజ రంగులు అద్దుతున్నారు. గోశాల నిర్వాహకులు శ్రీనివాసచార్యులతో పాటు వారి కుటుంబసభ్యులు ఇందులో నిమగ్నమవుతున్నారు. వీరికి తోడు కొందరు మహిళలు ఖాళీ సమయాన పైకం ఆశించకుండా ఉచితంగా సేవ చేస్తున్నారు. 400కు పైగా గోవులకు ఆశ్రయం సుమారు 18 ఏళ్ల క్రితం 4–5 గోవులతో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర గోశాల ప్రస్తుతం 400కు పైగా గోవులకు ఆశ్రయం ఇస్తోంది. ఈక్రమాన గోమయంతో తయారు చేసే ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణకు వెచ్చిస్తున్నారు. గోమయంతో తయారు చేసిన విగ్రహాలు సైజు ఆధారంగా రూ.150 నుంచి రూ.వెయ్యి వరకు అమ్మతున్నారు. ఓ వైపు పర్యావరణ పరిరక్షణలో భక్తులను భాగం చేయడమే కాక గోవుల సంరక్షణకు తోడ్పాటు అందేలా తక్కువ ధరకే విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.గోశాలలో విగ్రహాలు, ఇతర ఉత్పత్తుల తయారీ -
రేపు అండర్–14, 17 టీ.టీ. పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన ఈనెల 20వ తేదీన జిల్లాస్థాయి అండర్–14, 17 బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా క్రీడా సంఘం కార్యదర్శి వై.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు వివరాల కోసం టేబుల్ టెన్నిస్ కోచ్ వీవీఎస్.మూర్తి(98484 08335)ను సంప్రదించాలని సూచించారు. మరో 2,632 మె.టన్నుల యూరియా చింతకాని: మూడు జిల్లాల పరిధిలోని రైతుల అవసరాల నిమిత్తం చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు వివిధ కంపెనీల యూరియా చేరుతోంది. ఈక్రమాన శుక్రవారం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 2,632.50 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని జిల్లా వ్యవసాయాదికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 832.50 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 1,200 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 500 మె.టన్నులు సరఫరా చేయగా మరో 100మె.టన్నుల బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు. 21నుంచి డీఈఐఈడీ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ) రెండో సంవత్సరం పరీక్షలు ఈ నెల 21నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ జి.సదానందం తెలిపారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలోని శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని ఆయన సూచించారు. రామదాసు ధ్యానమందిరానికి 300 గజాల స్థలం ● నేలకొండపల్లి వాసుల రిజిస్ట్రేషన్ నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని రామదాసు ధ్యాన మందిరానికి సమీపంలో విలువైన స్థలాన్ని భక్తులు సమర్పించారు. నేలకొండపల్లి కి చెందిన రెండు కుటుంబాలు వారు మర్ల అన్నపూర్ణ, సాయిరాం, సాయికృష్ణ, ప్రమీలా దేవి, అనురాధ, స్వాతిశ్రీ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి మందిరం ఎదురుగా 300 గజాల స్థలం ఉండడంతో రామదాసుపై భక్తితో మందిరం నిర్వహణకు ఉపయోగపడేలా అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయగా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయ ఉద్యోగి నిరంజన్‌కుమార్ సమక్షాన పత్రాలు అప్పగించగా వారిని సన్మానించారు. మందిరం పూజారి సౌమిత్రి రమేష్, విద్వత్ కళాపీఠం ప్రతినిధులు సాధు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, నంచర్ల దేవీప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శనివారం కూడా అపరాల కొనుగోళ్లు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ప్రతీ శనివారం సెలవు ఉన్నా అపరాల క్రయవిక్రయాలు చేపట్టనున్నట్లు మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గడిచిన కొద్ది నెలలుగా అన్ సీజన్ కావటంతో వారానికి ఐదు రోజులే అపరాల కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం సీజన్ కావడంతో చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యుల వినతితో ఇకపై శనివారం కూడా పెసలు, కందులు, మినుములు వంటి అపరాల కొనుగోళ్లు చేపడుతామని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కార్యదర్శి ఓ ప్రకటనలో సూచించారు. -
కరెంట్‌కు ఫుల్ డిమాండ్
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. వర్షాభావ పరిస్థితులకు తోడు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. అటు వ్యవసాయం, ఇటు గృహావసరాలకు విద్యుత్ వినియోగం గరిష్టస్థాయిలో నమోదవుతోంది. ప్రస్తుతం ఖమ్మం విద్యుత్ సర్కిల్‌కు నిత్యం 5.15 మిలియన్ యూనిట్లు కేటాయిస్తుండగా, అంతకు మించి 6.82 మొదలు 7.35 మిలియన్ యూనిట్ల వరకు వినియోగం జరుగుతుండడం గమనార్హం. సెప్టెంబర్ 1 నుంచి 17వ తేదీ వరకు ఖమ్మం సర్కిల్ కోటా 87.55 మిలియన్ యూనిట్లకు 110.46 మిలియన్ యూనిట్లు.. అంటే 17రోజుల్లో అదనంగా 22.91 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 17వ తేదీ వరకు విద్యుత్ కోటా 85.68 మిలియన్ యూనిట్లకు 86.6 మిలియన్ యూనిట్లే వినియోగం జరగగా.. ఈసారి గణనీయంగా పెరిగింది. బోర్లు, మోటార్ల ద్వారా.. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఈసారి సాగు అవసరాలకు నీరు విడుదల చేయలేదు. అయితే, జిల్లాలో ఈ ఏడాది పంటల సాగు లక్ష్యం 5.50 లక్షల ఎకరాలకు గాను 4.50 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. మరో 1.50 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్, మామిడి, మిరప వంటి ఉద్యాన పంటలను సాగవుతున్నాయి. సాగర్ నుంచి నీరు విడుదల కాకపోవడంతో స్థానికంగా ఉన్న జలాశయాలు, బోర్లు, బావుల నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా రైతులు పంటలకు అందిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయిలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది. గృహాల్లో కూడా... ప్రస్తుతం ఉష్ణోగ్రత వేసవిని తలపిస్తోంది. దాదాపు ప్రతీరోజు 34 – 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుండగా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు, ఏసీల వినియోగం పెరిగింది. పగలు, రాత్రి తేడా లేకుండా వీటిని వాడుతుండడంతో జిల్లాలోని 4.95 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్ల ద్వారా వాడకం గణనీయంగా పెరిగింది. నాలుగు డివిజన్లలో గరిష్టం ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో సత్తుపల్లి, ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, మధిర డివిజన్లు ఉన్నాయి. వీటిలో సత్తుపల్లి, ఖమ్మం టౌన్, మధిర, ఖమ్మం రూరల్ డివిజన్లలో కోటాకు మించి విద్యుత్ వినియోగం నమోదవుతోంది. వైరా డివిజన్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా కోటా కన్నా తక్కువ విద్యుత్ వినియోగం జరిగింది. కాగా, ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు ఉదయం 6–30 నుంచి సాయంత్రం 5–30 గంటల వరకే సరఫరా ఇస్తుండగా. తరచూ అంతరాయాలు, అనధికారిక కోతలతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎండలతో పాటే పెరుగుతున్న వినియోగం వర్షాభావం, ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది, వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగం గరిష్టస్థాయిలో నమోదవుతోంది. అయినా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇదే సమయాన వినియోగదారులు కూడా విద్యుత్ పొదుపు విధానాలు అలవర్చుకోవాలి. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ -
రూ.30వేలు చెల్లిస్తే సర్టిఫికెట్!
● ‘సదరమ్’ శిబిరాల్లో అక్రమాలు ● విచారణ చేపట్టిన ట్రెయినీ కలెక్టర్ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని నిర్వహించే సదరమ్ శిబిరాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తామని కొందరు డబ్బు దండుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించగా.. అక్రమార్కులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇదే సమయాన ఎలాగైనా సర్టిఫికెట్ పొందాలనే ఆతృతతో కొందరు దివ్యాంగులు అర్హత లేకున్నా దళారులను ఆశ్రయిస్తుండగా వారు సర్టిఫికెట్‌కు రూ.30 వేలకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. వీరికి కొందరు ఆస్పత్రి బాధ్యుల సహకారం కూడా ఉందనే విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్‌కు ఫిర్యాదుతో... సదరమ్ శిబిరాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల కొందరు కలెక్టర్ దివాకరకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు ట్రెయినీ కలెక్టర్ పరాస్ కుమార్ శుక్రవారం పెద్దాస్పత్రిలోని సదరమ్ విభాగంలో విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రిజిస్టర్లు తనిఖీ చేయడమే కాక వైకల్య పరీక్షలు నిర్వహించే వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. ప్రధానంగా ఇటీవల జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి అర్హత ప్రకారం ఇచ్చారా, లేదా అని విచారించారు. కాగా, అదనపు కలెక్టర్ శ్రీజ సదరమ్ విభాగాన్ని గత ఏడాది బలోపేతం చేశారు. విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడమే కాక క్యాంప్‌లకు వచ్చే దివ్యాంగులకు అర్హత ఆధారంగా యుడీఐడీ కార్డులు జారీ చేయించారు. అక్రమాలు జరగకుండా కఠినంగా వ్యవహరించినా మళ్లీ ఇటీవల అక్రమార్కులు కొత్త దారులు వెతుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యాన క్యాంపులపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఆర్టీసీలో ఎన్నికల వేడి
● నోటిఫికేషన్ విడుదల... అక్టోబర్ 9న పోలింగ్ ● రీజియన్‌లోని ఏడు డిపోల్లో 1,700 మంది ఓటర్లు ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం కోసం ఎన్నికల నిర్వహణ కు రాష్ట్ర కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. షెడ్యూల్ ప్రకటించడంతో ఖమ్మం రీజియన్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికకు పోలింగ్ నిర్వహించేందుకు కార్మిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో శుక్రవారం సాయంత్రం నుంచే కార్మిక సంఘాల నేతలు ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారు. రెగ్యులర్ ఉద్యోగులకే ఓటు హక్కు ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో దాదాపు 1,700 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రామిక్‌లు, మెకానిక్‌లు, కండక్టర్లు, డ్రైవర్లు, ఏడీసీలు, కంట్రోలర్లకు మాత్రమే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. వీరంతా రెగ్యులర్ ఉద్యోగులై ఉండాలి. ఇక ఆపై స్థాయి అధికారులు, సెక్యూరిటీ సిబ్బందికి ఓటు హక్కు ఉండదు. త్వరలోనే యూనియన్ల తరఫున ఓటర్ల జాబితాను కార్మిక శాఖ సంఘాల నాయకులకు అందజేస్తారు. కాగా, గుర్తింపు ఎన్నికల్లో ఒక్కో ఓటరు రెండేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇందులో రాష్ట్ర గుర్తింపు కోసం క్లాజ్–3 ఓటు, జిల్లా గుర్తింపు కోసం క్లాజ్–6 ఓటు వేయనున్నారు. రీజియన్‌లో పోటాపోటీ ప్రభుత్వం ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన రోజు నుంచే యూనియన్లు తమ బలాబలాలను ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నాయి. ప్రధాన కార్మిక సంఘాలు తమ అనుయాయులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్మికుల సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం వంటివి మొదలుపెట్టారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రావడంతో కార్మిక సంఘాలు జోరు పెంచనున్నాయి. -
హెచ్ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాను హెచ్ఐవీ, ఎయిడ్స్ రహితంగా తీర్చిదిద్దేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన అవగాహన బైక్ ర్యాలీని ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల వద్ద ఆయన ప్రారంభించారు. పాత బస్టాండ్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, లింక్ వర్కర్లు తదితరులు పాల్గొని హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు అవగాహన, ఆరోగ్య అలవాట్లు కీలకమని తెలిపారు. యువతలో ఎయిడ్స్‌పై శాసీ్త్రయమైన అవగాహన పెంచడంతో పాటు బాధితుల పట్ల వివక్ష చూపకుండా సామాజిక మద్దతు అందేలా చైతన్యం కల్పించాలని సూచించారు. అనంతరం కళాకారులు ‘పల్లె సుద్దులు’ ద్వారా అవగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ రామారావు, అధికారులు వేణుమాధవ్, ఎల్.ప్రవీణ, ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరుల్లా, అధ్యాపకులు డాక్టర్ బి.చెంచురత్నయ్య, డాక్టర్ ఎం.సునంద తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ దివాకర -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం కలిశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్, ఇగ్నైట్ శిక్షణ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల ఇప్పించాలని కోరారు. ఈమేరకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణాత్మక శిక్షణ అందించేందుకు ఇన్స్పైర్, ఇగ్నైట్ బందాన్ని సీఎంకు పరి చయం చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా పాల్గొన్నారు. సత్తుపల్లి బ్లాక్–3ను సింగరేణి కేటాయించండి సత్తుపల్లి ఓసీ బ్లాక్–3 బొగ్గు గనిని సింగరేణికు కేటాయించాలని ఎమ్మెల్యే రాగమయి కోరారు. ఈవిషయమై శుక్రవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ బ్లాక్–3 దక్కించుకున్న అవంతిక ప్రైవేట్ కంపెనీ ఇప్పటివరకు పనులు చేపట్టనందున రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని, తద్వారా స్థానికులు ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని తెలిపారు. అలాగే, జీఎం కార్యాలయం నిర్వహణ, 33/11 కేవీ విద్యుత్ లైన్ల మార్పుపై ఆమె మాట్లాడారు. -
మండలి సందడి !
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. బీఆర్ఎస్ నుంచి రాకేష్‌రెడ్డి పేరు అధికారికంగా ఖరారు చేయకున్నా ఆయన ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ముగ్గురు, నలుగురి పేర్లు అధిష్టానం వద్దకు వెళ్లాయి. మరోపక్క జనసేన నుంచి గడల శ్రీనివాస్ పేరు ఖరారైంది. ప్రస్తుతం ఓటర్ల నమోదు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావహులు ఓటర్ల నమోదుపై దృష్టి సారించారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంఎన్నికలో బీఆర్ఎస్.. ఉప ఎన్నికలో కాంగ్రెస్ వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) కొనసాగుతున్నారు. తొలుత ఈ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. అయితే, ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి గెలవగా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2024 మే 27న ఎన్నిక జరగ్గా జూన్ 8న వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏ.రాకేష్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. గ్రాడ్యుయేట్ ఎన్నిక కోసం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై రాజకీయ పార్టీలు కొద్ది నెలలుగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్వహించిన సమావేశంలోనూ వచ్చే ఏడాది జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు నుంచి నలుగురు పేర్లను అధిష్టానానికి సమర్పించారు. ఇక గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాకేష్‌రెడ్డి ఈసారి కూడా పోటీ చేయొచ్చనే అంచనాలతో ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే, జనసేన నుంచి గడల శ్రీనివాసరావు పేరు అధికారికంగా ప్రకటించగా.. బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. రాజకీయ పార్టీల్లో కదలిక ఓటర్ల దరఖాస్తు షెడ్యూల్ విడుదలతో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది. ప్రస్తుతం పార్టీలన్నీ ఓటర్ల నమోదును ప్రాధాన్యతగా తీసుకుంటున్నాయి. పార్టీల తరఫున ఎక్కువ మంది ఓటర్లను నమోదు చేయిస్తేనే గెలుపునకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే భావనతో ఆశావహులు ఆ దిశగా దృష్టి సారించారు. ఈనెల 28న నోటిఫికేషన్ విడుదలైన అనంతరం ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ఓటర్ల నమోదును చేయించాలనే భావనతో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టికెట్ ఖరారైన వారితోపాటు అభ్యర్థిత్వంపై ఆశ ఉన్న వారంతా గత ఓటర్ల జాబితా ఆధారంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతీసారి కొత్త ఓటర్ల జాబితా తయారు చేస్తారు. ఈక్రమాన వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఓటరు నమోదుకు ఈనెల 28న నోటిఫికేషన్ జారీ కానుండగా, నవంబర్ 6వ తేదీ వరకు ఫారం – 18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేనెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లయిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హడావుడి -
కలెక్టర్‌ను కలిసిన బీఆర్ఎస్ బృందం
ఖమ్మం సహకారనగర్/బోనకల్: జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మధు, సండ్ర మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, అధికార పార్టీ నేతలు జాబితాలను విచారణకు పంపిస్తున్నారని తెలిపారు. ఈమేరకు సర్పంచ్ల హక్కులు, స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడేలా గ్రామసభల్లోనే నిరుపేదలను ఎంపిక చేయాలని కోరారు. అలాగే, తల్లాడ మండలంలోని సిరిపురం మేజర్ కాల్వ ఆధునికీకరణ పనుల పూర్తి, పెనుబల్లి మండలంలోని రాతోని, తాళ్లపెంట ఎత్తిపోతల పథకాల పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, రఘునాథపాలెం మండలం జింకలతండాలో గత ఈద్గా, ఖబరస్తాన్ ఏర్పాటుకు స్థలాల కేటాయింపుపై దృష్టి సారంచాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు బెల్లం వేణుగోపాల్, రావూరి శ్రీనివాస్, బానోత్ కొండా, బిళ్లగిరి ధనుంజయ, మేదరమెట్ల శ్రీనివాస్, సైదారెడ్డి, బిక్కి కష్ణప్రసాద్, బంక మల్లయ్య, బలుసు మురళీకష్ణ, మహమ్మద్ రఫీ, ముత్యం కష్ణారావు, బానోత్ రవి, ధరావత్ శంకర్, షేక్ చందు తదితరులు పాల్గొన్నారు. -
25లోగా అందరికీ యూనిఫామ్
భధ్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ యూనిఫామ్ అందించాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. ఐటీడీఏ నుంచి శుక్రవారం ఆయన ఉమ్మడి జిల్లాలోని అధికారులు, హెచ్ఎంలు, వార్డెన్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈనెల 25వ తేదీలోగా యూనిఫామ్ అందించేలా అవసరమైతే మహిళా సంఘాల సభ్యుల సంఖ్య పెంచాలని తెలిపారు. అలాగే, అధికారులు తమ పరిధిలోని పాఠశాలల్లో ఉద్దీపకం, వారధి పుస్తకాల ద్వారా అందుతున్న బోధనపై దృష్టి సారించాలని, ఈ సమయాన ఫొటోలు దిగి పోస్ట్ చేయాలని తెలిపారు. కాగా, సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులను హెచ్ఎంలు రిలీవ్ చేసి, విధుల్లో చేరని వారి వేతనం నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం విద్యార్థులకు కుల, నివాసం, ఆదాయం, ఆధార్ ధ్రువీకరణ పత్రాలు అందేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. ఇంకా ఈ వీసీలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలి విద్యార్ధులు చదువుతో పాటు క్రీడల్లోనూ పాలు పంచుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. భద్రాచలం గురుకులం జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న మండల స్థాయి పాఠశాలల క్రీడాపోటీలను శుక్రవారం పీఓ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాపోటీల్లో పాల్గొనడం గెలుపోటములను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుందని తెలిపారు. భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, రామచందర్‌రావు, రాజా శ్రీనివాసరావు, హేమలత, రమణ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి రాహుల్ -
అమ్మ పేరిట మొక్క!
● నేడు జిల్లావ్యాప్తంగా నాటేలా కార్యాచరణ ● 1,88,284 విద్యార్థులతో కార్యక్రమంనేలకొండపల్లి: పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థితో ఒక మొక్క నాటించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. వనమహోత్సవంలో భాగంగా ‘అమ్మ పేరిట మొక్క(ఏక్ పేడ్.. మాకే నామ్)’ పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో శనివారం నాటించనుండగా.. పంచాయతీ నర్సరీల నుంచి పాఠశాలలకు మొక్కలు చేర్చడంపై డీఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు. ఈ విషయమై డీఆర్డీఏ కొండపల్లి శ్రీరామ్ మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు తమ పాఠశాలలో మొక్క నాటడమే కాక ఆ సమయాన తల్లితో దిగిన ఫొటోను అప్లోడ్ చేయించాలని సూచించారు. జిల్లాలోని 1,552 పాఠశాలల్లో 1,88,284 మంది విద్యార్థులు ఉండగా.. ఇంతే సంఖ్యలో మొక్కలను శనివారం నాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయవంతం చేయాలి వన మహోత్సవంపై శనివారం నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హమీ పధకం క్షేత్ర సహాయకులతో ఎంపీడీఓ ఎం.ఎర్రయ్య సమావేశమయ్యారు. ‘అమ్మ కోసం మొక్క’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మొక్కల పంపిణీ బోనకల్: బోనకల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎకో క్లబ్ ఆధ్వర్యాన ‘ఏక్ పేడ్.. మాకే నామ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు జ్యోతి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించాలని, తద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడవచ్చని తెలిపారు. ఉపసర్పంచ్ బానోతు కొండ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గోపి, ఉపాధ్యాయులు మంజూష, వెంకటలక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ త్రివేణితో పాటు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
శ్రీనివాసనగర్ బాధితులకు ఊరట
● తదుపరి ఆదేశాలిచ్చే వరకు యథాతఽథ స్థితి ● కేఎంసీ కమిషనర్‌కు కోర్టు సూచనఖమ్మంమయూరిసెంటర్: ఇళ్లను తొలగించాలనే నోటీసులు జారీ కావడంతో ఆందోళనకు గురవుతున్న ఖమ్మంలోని శ్రీనివాసనగర్ టింబర్ డిపోల ప్రాంత వాసులకు ఊరట లభించింది. కొద్దిరోజులుగా ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో నిరసన తెలుపుతున్న విషయం విదితమే. కోర్టు ఆదేశాలతో కేఎంసీ అధికారుల నుంచి జారీ అయిన నోటీసులను అందుకున్న వారు తాజాగా బీఆర్ఎస్, సీపీఎం పార్టీల మద్దతుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈమేరకు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య శుక్రవారం వర్చువల్‌గా విచారణకు హాజరుకాగా యథాతఽథ స్థితి కొనసాగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు.. శ్రీనివాసనగర్‌లో 80 అడుగుల రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లను తొలగించాలని స్థల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈమేరకు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఇళ్లు నిర్మించుకున్న వారికి అధికారులు నోటీసుల జారీ మొదలుపెట్టారు. ఈ అంశంపై శుక్రవారం విచారణ ఉండగా.. బాధితుల తరఫున మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు సీపీఎం నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత ఆదేశాలపై విచారణ చేపట్టడమే కాక ప్రస్తుత పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారించింది. తెలిసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు యథాతథస్థితి అమలుచేయాలని న్యాయస్థానం ఆదేశించినట్లు చెబుతున్నారు. అంతేకాక బాధితులకు న్యాయం జరిగేలా కలెక్టర్ సమన్వయంతో ప్రణాళిక అమలుచేయాలని కేఎంసీ కమిషనర్‌కు న్యాయస్థానం సూచించిందని వెల్లడించారు. ఈ విషయమై కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ శ్రీనివాసనగర్‌లో ఇళ్లకు నోటీసులు ఇవ్వడం ఆపాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తామని పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలపై హర్షం.. శ్రీనివాసనగర్‌లో ఇళ్లకు నోటీసులు ఇవ్వకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. ఇక సీపీఎం జిల్లా, డివిజన్ కార్యదర్శులు నున్నా నాగేశ్వర్రావు, వై.విక్రమ్ మాట్లాడుతూ పార్టీ తరఫున రిట్ పిటీషన్ దాఖలు చేయడంతో 15రోజుల పాటు బలవంతంగా ఇళ్లను తొలగించే చర్యలను చేపట్టవద్దని ఆదేశించిందని తెలిపారు. కాగా, శుక్రవారం ఉదయం బాధితులు మాజీ కార్పొరేటర్ దొడ్డా నగేష్ ఆధ్వర్యాన కలెక్టర్ దివాకరను కలిసి తమను రోడ్డున పడేయొద్దని కోరారు. -
బయటపడిన బీఆర్ఎస్ నేతల కబ్జాలు
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల భూకబ్జాలను సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పక్కా ఆధారాలతో బయటపెట్టారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన పార్టీ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరితో కలిసి మాట్లాడారు. గత 15 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై బీఆర్ఎస్ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారన్నారు. కానీ మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబీకుల పేరిట ఉన్న భూముల వివరాలను రేవంత్‌రెడ్డి బయటపడడంతో వారికి నోట మాట రావడం లేదని చెప్పారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, గజ్జెల్లి వెంకన్న, చోటా బాబా, కొత్త సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ పాల్గొన్నారు. పేదల ఇళ్లపై స్పష్టమైన వైఖరి పేదల ప్రయోజనాల దృష్ట్యా వారి ఇళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. ఏ ఒక్క ఇంటిని అనవసరంగా తొలగించడానికి వీల్లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్‌కు తెలియచేశారని పేర్కొన్నారు. అంతేకాక న్యాయ సాయం అందించేందుకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. ఈమేరకు శ్రీనివాసనగర్ వాసులు వదంతులను నమ్మకుండా సంయమనం పాటించాలని కోరారు. -
వెల్లివిరిసిన మతసామరస్యం
మధిర: మధిరలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మతసామరస్యం వెల్లివిరిసింది. మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన గురువారం వినాయక నిమజ్జనం నిర్వహించగా హిందువులతో పాటు ముస్లిం, క్రిస్టియన్ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి చేతిలోని లడ్డూను వేలం వేయగా కలర్స్ రెడీమేడ్ షోరూమ్ అధినేత పాషా రూ.12,016కు దక్కించుకున్నారు. అంతేకాక జానీ, సుకూర్ తదితరులు ప్రసాదం చేయించి భక్తులకు పంపిణీ చేశారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించా రు. మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరా జనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయ్‌కుమార్‌తో పాటు అర్చకులు పాల్గొన్నారు. రూ.12,016కు లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు పాషా -
భూముల రీసర్వేకు రైతులు సహకరించాలి
తిరుమలాయపాలెం: మండలంలోని రాజారంలో చేపడుతున్న భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. రాజారంలో రీసర్వే శుక్రవారం మొదలుకాగా, ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ భూముల హద్దులు స్పష్టంగా తెలియజేయడమే కాక పత్రాలను అధికారులకు సమర్పిస్తూ సర్వే సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు అలాగే కొనసాగుతాయని, అదనంగా ప్రతీభూ భాగానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్(ఎల్పీఎం) నంబర్లు కేటాయిస్తామని తెలిపారు. కాగా, గ్రామంలో 1,100 ఎకరాల భూమి ఉండగా వంద ఎకరాలు ప్రభుత్వ భూమి మినహా మిగతా భూమి సర్వే చేస్తామని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా చేపడుతున్న సర్వేకు రైతులు సహకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే(డీఐ) యర్రాప్రగడ, తహసీల్దార్ లూథర్ విల్సన్, డీటీ సుధీర్, సర్వేయర్ సతీశ్‌రెడ్డి, ఆర్ఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈనెల 21న జాబ్‌మేళా
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఎన్ఐఐటీ(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఆధ్వర్యానఈనెల 21న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో ఉదయం 10–30గంటలకు జాబ్‌మేళా మొదలవుతుందని డీఆర్డీఓ కె.శ్రీరామ్ తెలిపారు. ఆన్లైన్ పరీక్ష, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని, రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టుకు 2022 తర్వాత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారికి న్యూఢిల్లీలో 15 రోజుల ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇచ్చాక, తెలంగాణ జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నాగమణి భద్రాచలంటౌన్: భద్రాచలం బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ధనసరి నాగమణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ భవాని నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులు ప్రిన్సిపాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 22వరకు ఐటీఐలో ప్రవేశాలు ఖమ్మం సహకారనగర్: ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 22వ తేదీ వరకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేరుగా కళాశాలకు వచ్చి ప్రవేశం పొందొచ్చని, దరఖాస్తు చేసుకోని వారు కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లతో వస్తే ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు https://iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరుకావాలని సూచించారు. సురక్షిత, నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలోని ఆస్పత్రుల్లో సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు తెలిపారు. ఈమేరకు రోగి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన వైద్యసేవలు అందించడంతో పాటు వైద్య సేవల సమయాన సంభవించే అనుకోని ప్రమాదాలను నివారించడం, భద్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వెల్లడించారు. ఇందుకోసం ఆస్పత్రుల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అయితే, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కూడా మందుల వినియోగం, శస్త్రచికిత్సలు, సురక్షితమైన రక్త మార్పిడి, వైద్య పరికరాల వినియోగంపై శ్రద్ధ వహించాలని, బయో వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి శిక్షణ, కరపత్రాల ద్వారా ప్రచారం చేయనున్నట్లు డీఎంహెచ్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ సీట్లు సాధించిన గురుకుల విద్యార్థినులు ఖమ్మం అర్బన్: రఘునాథపాలెంలోని ఎంజేపీటీబీసీ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన పలువురు విద్యార్థినులు రాష్ట్రంలోని వివి ధ విశ్వవిద్యాలయాల్లో పీజీ సీట్లు సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.శ్రావణి, ఓ.స్రవంతి, వై.రేవతి, ఉజ్వల సీట్లు సాధించగా, కాకతీయ విశ్వవిద్యాలయంలో వి.అశ్విని, బి.జ్యోతి, జి.శ్రీజ, సాయి ప్రసన్నతో పాటు ఎంజీ విశ్వవిద్యాలయంలో డి.కవిత వివిధ విభాగాల్లో పీజీ సీట్లు సాధించారని ప్రిన్సిపాల్ వై.నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్‌తో పాటు ఆర్సీఓ రాంబాబు, ఏటీపీ కల్పన, అధ్యాపకులు అభినందించారు. ప్రభుత్వ స్థలాల లభ్యతపై ఆరా నేలకొండపల్లి: ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని క్షేత్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్ అపూర్వ పరిశీలించారు. మండలంలోని మోటాపురం, సధాశివాపురం, రామచంద్రాపురం గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన ఆమెను ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించడమే కాక ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ఉన్నాయా, లేదా అని ఆరా తీశారు. గ్రామాల వారీగా ఖాళీ స్థలాలు, లబ్ధిదారుల వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించారా, స్థలం తక్కువగా ఉండి లబ్ధిదారులు ఎక్కువగా ఉంటే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ఎంఆర్ఐ ఆలస్యం మధుసూధన్‌రావు, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
పొదుపు నగదుపై కన్ను
● వాయిదాల సొమ్మును పక్కదారి పట్టిస్తున్న కొందరు ● ఐకేపీ అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం ● నిలువునా మోసపోతున్న పేద మహిళలుఖమ్మంమయూరిసెంటర్: కూలి పనులు చేసుకుంటూ, పొదుపు సూత్రం పాటిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుందామనుకున్న పేద మహిళల కష్టార్జితానికి రక్షణ కరువైంది. ప్రభుత్వాలు అందించే రుణాలు ఆసరాగా చిన్నపాటి వ్యాపారాలు, ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్న స్వయం సహాయక సంఘాల సభ్యులను కొందరు నిలువునా ముంచుతున్నారు. క్షేత్రస్థాయిలో ఐకేపీ, సీ్త్రనిధి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు గ్రూపు అధ్యక్షులు, గ్రామ సమాఖ్యల బాధ్యులు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక మహిళలు ప్రతీనెలా కష్టపడి చెల్లిస్తున్న వాయిదా డబ్బును బ్యాంకుల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకుంటున్నారు. తీరా ఏళ్లు గడిచాక చూస్తే బకాయిలు అలాగే ఉంటుండడంతో మహిళలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో వెలుగుచూస్తున్న ఈ దోపిడీ సంఘాల నిర్వహణలో లోపాలను ఎత్తిచూపుతోంది. బ్యాంకుల్లో వేయకుండానే.. కూసుమంచి మండలం జక్కేపల్లిలో వెలుగుచూసిన ఘటన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అక్కడ ఓ స్వయం సహాయక సంఘానికి బ్యాంకు లింకేజీ ద్వారా అందిన రూ.14 లక్షల రుణాన్ని 10 మంది సభ్యులు పంచుకున్నారు. ప్రతినెలా రూ.3,600 చొప్పున కిస్తీలను సభ్యులు క్రమం తప్పకుండా గ్రూపు అధ్యక్షురాలికి చెల్లిస్తూ వచ్చారు. అయితే ఆమె సభ్యుల నమ్మకమే ఆసరాగా వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. అనుమానం రాకుండా నెలకు ఒకరిద్దరి ఖాతాల్లో జమ చేస్తూ రసీదులు ఇవ్వడంతో అంతా నమ్మారు. రెండేళ్ల తర్వాత అసలు విషయం బయటపడి బ్యాంకు అధికారులను సంప్రదించగా ఏకంగా రూ.4.13 లక్షలు పక్కదారి పట్టినట్లు తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. సీ్త్రనిధి రుణాల్లోనూ.. కల్లూరు మండలం ముగ్గువెంకటాపురంలోనూ సీ్త్రనిధి రుణాల వ్యవహారంలో గోల్మాల్ బయటపడింది. గ్రామ సమాఖ్య పరిధిలోని వివిధ గ్రూపుల్లో ఏకంగా రూ.43 లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితమే అప్పు మొత్తాన్ని అసలు, వడ్డీతో సహా చెల్లించినా రికార్డుల్లో ఇంకా బకాయి ఉన్నట్లే చూపిస్తున్నారు. మూడేళ్ల క్రితమే బాకీ మొత్తం చెల్లించి మృతి చెందిన సభ్యురాలి పేరిట నేటికీ రూ.1.89 లక్షల అప్పు ఉండడం గమనార్హం. రేణుక గ్రూప్ సభ్యులు 2021లోనే రుణం చెల్లించినా, రికార్డుల్లో రూ.4.96 లక్షల బకాయి చూపిస్తుండటంతో ఆగ్రహించిన మహిళలు ఇటీవల సీ్త్రశక్తి భవన్ ఎదుట నిరసన తెలపడంతో విచారణ చేపడుతామని అధికారులు సెలవిచ్చారు. క్షేత్ర స్థాయిలోనే.. అక్రమాలకు కొందరు ఐకేపీ సిబ్బంది, గ్రామ సమాఖ్య బాధ్యుల పర్యవేక్షణ లోపమే కారణమని తెలుస్తోంది. ప్రతీనెల వీఓ సమావేశాలు నిర్వహించి రికార్డులు, బ్యాంక్ పాస్‌బుక్కులను ఆడిటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పని సరిగ్గా జరగక అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం లేదా పోలీసులను ఆశ్రయించే వరకు అధికారుల దృష్టికి ఈ విషయాలు రాకపోవడం విస్తుగొలుపుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా పొదుపు సంఘాల ఖాతాలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలకు బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ వస్తోంది.కూసుమంచి మండలం జక్కేపల్లి, కల్లూరు మండలంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తున్నాం. మహిళా సభ్యుల నగదును పక్కదారి పట్టించిన వారి నుంచి రికవరీ చేస్తాం. సభ్యుల ఖాతాల్లో నగదు జమ చేయకుండా వాడుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. – కొండపల్లి శ్రీరామ్, డీఆర్డీఓ -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
కల్లూరు రూరల్: మండలంలోని బత్తులపల్లికి చెందిన బొల్లిపోగు గురువయ్య(44) వారం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయన ద్విచక్ర వాహనంపై కల్లూరు నుంచి బత్తులపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన గురువయ్యను ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయనకు భార్య ప్రమీల, ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిత తెలిపారు. -
మామయ్యా కడుపులో నొప్పి, మంటగా ఉంది..
ఖమ్మం: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురానికి చెందిన రైతు పుసులూరి శ్రీనివాస్ కలుపు మందు కలిపిన కూల్ డ్రింగ్ తాగి.. ఆ తర్వాత తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించిన విషయం విదితమే. ఘటనలో శ్రీనివాస్, ఆయన కుమార్తె లాస్య మృతి చెందగా.. కుమారుడు నిఖిల్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు తండ్రీకుమార్తె మృతదేహాలను గురువారం అప్పలనరసింహాపురం తీసుకురాగా.. కుటుంబీకులు, స్థానికుల రోదనల నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు.పిల్లలను పానీపూరి తినిపించి...పుసులూరి శ్రీనివాస్–లీలా దంపతులకు కుమార్తె లాస్య, కుమారుడు నిఖిల్ ఉన్నారు. ఆయన గ్రామంలోని పది ఎకరాలతో పాటు ముదిగొండ మండలం పెద్ద మండవ, ఏపీలోని గండ్రాయిలో పదేసి ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. ఇటీవల పెట్టుబడులకు అప్పులు చేయగా, చీడపీడలకు తోడు సరిపడా నీరు అందక మనోవేదనకు గురయ్యాడు. దాదాపు రూ.15 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వినాయకచవితి పండగ కోసం ఇంటికి వచ్చిన లాస్యను బుధవారం బైక్‌పై తీసుకుని నిఖిల్ స్కూల్‌కు వద్దకు వెళ్లి బయటకు తీసుకొచ్చాడు. కోదాడలో ఇద్దరికీ ఇష్టమని పానీపూరి తినిపించాక కలుపు మందు కలిపిన థమ్సఫ్ సీసాతో గండ్రాయిలో కౌలు చేస్తున్న పొలం వద్దకు వెళ్లాడు. తొలుత శ్రీనివాస్ తాగి... ఆ తరువాత లాస్యకు తాగించగా.. నిఖిల్ కొద్దిగా తాగగానే ఘాటుగా ఉందని తాగలేకపోయాడు. ఆ తర్వాత విషయాన్ని శ్రీనివాస్ తన బావమరిదికి ఫోన్లో చెప్పి స్విచాఫ్ చేసినా పోలీసుల సాయంతో ఘటనా స్థలిని గుర్తించే సరికి శ్రీనివాస్, లాస్య స్పృ హ కోల్పోయారు. ముగ్గురికి గండ్రాయిలో చికిత్స అందించి ఖమ్మం తరలించగా తండ్రి, కూతురు మృతి చెందారు.నన్ను బతికించండి మామయ్యాఖమ్మంలో చికిత్స పొందుతుండగా లాస్య వద్దకు వెళ్లిన మేనమామను చూసి బోరున విలపించించిందని కుటుంబీకులు తెలిపారు. ‘మామయ్యా కడుపులో నొప్పి, మంటగా ఉంది.. నన్ను బ్రతికించండి...’ అంటూ రోదించిందని గుర్తు చేసుకుంటూ మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న నిఖిల్‌ను గురువారం శ్రీనివాస్ తండ్రి రామారావుతో వీడియో కాల్ మాట్లాడించగా.. ‘తాతా నేను బాగున్నా.. నాకేమీ కాలేదు...’ అని చెప్పాడు. ఇక గండ్రాయి శివారులో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోగా అక్కడి పోలీసులు గురువారం అప్పలనరసింహాపురం వచ్చారు. శ్రీనివాస్ భార్య లీల, తండ్రి రామారావు నుంచి వివరాలు సేకరించారు. అయితే, ‘అప్పులు ఉన్నాయని చెప్పుకుని బాధపడేవాడు.. ఏమీ కాదని ధైర్యం చెప్పాను. అయినా ఇలా చేసుకుంటాడని ఊహించలేదు’ అని శ్రీనివాస్ తండ్రి రామారావు పోలీసులకు వివరించారు. ఇక భర్త, కుమార్తెను కోల్పోగా.. కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లీల రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. ఇదీ చదవండి: నీకు నా మీద లవ్ తగ్గిపోయింది కదా... -
నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా..
కొణిజర్ల: పని ముగించుకుని కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో ఓ పెయింటర్ మృతి చెందాడు. మండలంలోని పెద్దగోపతికి చెందిన కొమ్ము శివకృష్ణ(35) ఖమ్మంలో పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమాన ఖమ్మలో పని ముగిశాక బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై పెద్దగోపతి వెళ్తుండగా చిన్నగోపతి శివారు మూల మలుపులో స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం స్కిడ్ కావడంతో ఆయన రోడ్డుపై పడ్డాడు. ఈక్రమాన తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా, శివకృష్ణకు భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉండగా, ప్రస్తుతం భార్య ఎనిమిది నెలల గర్భిణి. శివకృష్ణ మృతితో కుటుంబంలో విషాదం నెలకొనగా.. ఘటనపై ఆయన కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూరజ్ తెలిపారు. బైక్ పైనుంచి జారి పడి పెయింటర్ మృతి -
సంక్షేమం, పారదర్శక పాలనే లక్ష్యం
ఖమ్మం సహకారనగర్: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరించాక మాట్లాడారు. ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన చారిత్రక రోజును ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని, నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిష్కరించడడాన్ని విధిగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారుల సెల్ఫీలు.. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించాక ఎఫ్ఎల్ఎన్ స్టాండ్(సెల్ఫీ స్టాండ్) వద్ద అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి సెల్ఫీలు దిగారు. డీఈఓ సదానందం, ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి కూడా ఎఫ్ఎల్టీం సభ్యులతో ఫొటోలు దిగారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్)లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానాన నిలవడంపై అభినందనలు తెలిపారు.అదనపు కలెక్టర్ శ్రీజ -
బాబోయ్.. ఇదేం ఎండ!
వేసవిని తలపిస్తున్న ఉష్ణోగ్రత ● పగటి పూట 35 డిగ్రీలకు చేరువగా నమోదు ● ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి ఖమ్మంవ్యవసాయం: ఎల్‌నినో తన ప్రతాపాన్ని చాటుతోంది. వాతావరణ శాఖ నుంచే హెచ్చరించిన విధంగానే వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. రోజురోజుకు జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. చల్లని గాలులు వీయాల్సిన ప్రస్తుత సమయాన ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సమీపానికి చేరింది. అంతేకాక హ్యుమిడిటీ(గాలిలో తేమ) 60 – 100 శాతం వరకు నమోదవడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంటలపై తీవ్ర ప్రభావం ఉష్ణోగ్రతల ప్రభావం సాగులో ఉన్న పంటలపై పడుతోంది. పలు ప్రాంతాల్లో సాగులో ఉన్న వరి, మిర్చి, పత్తి పంటలు వడబడుతున్నాయి. తేమ ఎక్కువగా ఉండడంతో పురుగు, తెగుళ్లు కూడా వ్యాపిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మిర్చిలో రసం పీల్చే పురుగులు, వరిలో కాండం తొలుచు పురుగు ఉధృతి పెరుగుతందని. నీటి ఎద్దడి ఉన్నచోట పత్తి పూత దశలోనే ఎండిపోయే స్థితికి చేరింది. కోటాకు మించి విద్యుత్ వినియోగం ఉష్ణోగ్రతల నేపథ్యాన జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. సంస్థ కేటాయించిన కోటాకు మించి జిల్లాలో విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు గంణాకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాకు రోజుకు 5.15 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేటాయించగా, 6.82 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. ప్రధానంగా వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఉక్కపోతతో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడం.. పంటలకు నీరందించేందుకు వ్యవసాయ విద్యుత్ మోటార్లు నడిపిస్తుండడంతో సబ్స్టేషన్లపై లోడ్ పడుతోంది. దీంతో అక్కడక్కడ లో ఓల్టేజీ సమస్య తలెత్తుతోంది. మరో మూడు రోజులు ఇలాగే.. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో 2, 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. పగటి ఉష్ణోగ్రత 34–35 డిగ్రీలు, రాత్రి 26–27 డిగ్రీలుగా ఉండే అవకాశముంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు, ఉరుములతో కూడిన వర్షం కురిసినా ఎండ మాత్రం కొనసాగే అవకాశముందని సమాచారం. అంతేకాక తేమ శాతం 66 – 83 శాతం వరకు ఉండడంతో ఉక్కపోత తప్పదని చెబుతున్నారు. -
వెదురు.. బెదురు లేకుండా!
● కొన్నేళ్ల క్రితమే అటవీ వృక్షజాతి జాబితా నుంచి తొలగింపు ● సాగు, రవాణాపై ఆంక్షలు ఎత్తివేత ● రైతులను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నేడు ‘ప్రపంచ వెదురు దినోత్సవం’ కల్లూరురూరల్: వెదురు సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు వెదురు సాగు, రవాణాపై ఆంక్షలు ఉండేవి. ఒకవేళ రైతుల సొంత భూమిలో పెరిగిన వెదురు నరకాలన్నా, రవాణా చేయాలన్నా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ఈక్రమాన కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వెదురును చెట్ల జాబితా నుంచి తొలగించి గడ్డి జాబితాలో చేర్చింది. ఫలితంగా ‘గ్రీన్ గోల్డ్’చే పిలిచే వెదురును రైతులు స్వేచ్ఛగా సాగు చేయడమే కాక నరికి ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా చేసే అవకాశం లభించింది. తక్కువ పెట్టుబడితో గరిష్ట లాభాలు అందించే గుణం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈమేరకు నేడు (శుక్రవారం) ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కథనం... సాగుకు రాయితీలు అనేక లాభాలు ఉన్న వెదురు సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. ఒక్కో రైతు 25 ఎకరాల వరకు వెదురు సాగు చేసుకునేందుకు సబ్సిడీ, రాయితీలు ఇస్తున్నారు. ఎకరాకు 150 మొక్కలు నాటే అవకాశం ఉండగా, ఒక్కో మొక్కకు ప్రభుత్వం రూ.150 రాయితీ చెల్లిస్తుంది. నేషనల్ బ్యాంబు మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కాక రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ మిషన్ ద్వారా రైతులకు సహకారం అందుతోంది. తక్కువ పెట్టుబడితో లాభాలు ఎల్‌నినో నేపథ్యాన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు చేసే పరిస్థితి లేకపోగా పంట చేతికి వచ్చే వర కు ఎదురుచూడక తప్పదు. కానీ తక్కువ పెట్టుబడి అవసరమయ్యే వెదురు సాగు చేస్తే త్వరగా దిగుబడి మొదలై దీర్ఘకాలం లాభాలు దక్కనున్నాయి. ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల లోపే ఖర్చవుతుంది. అంతేకాక వెదురు పంటకు చీడపీడలు, వైరస్లు ఆశించవు. క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, తుపాన్లను సైతం ఈ పంట తట్టుకుని నిలబడుతుంది. ఒక్కసారి నాటితే 40 – 45 ఏళ్లు వెదురు నాటిన మూడు లేదా నాలుగో సంవత్సరం నుంచి కోతకు వస్తుంది. పంట చేతికి రావడం ప్రారంభమైతే ఎకరానికి రూ.1.50 లక్షలు మొదలు రూ.4లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఈ పంట నాటితే సుమారు 40 – 45 ఏళ్ల వరకు నిరంతరంగా దిగుబడి వస్తుంటుంది. ఒక గడను నరికాక దుంప నుంచి మళ్లీ కొత్త పిలకలు వాటంతట అవే వేగంగా పెరుగుతాయి. అంతేకాక వెదురు నాటాక మొదటి మూడేళ్లు అల్లం, పసుపు, మిరప, వేరుశనగ లేదా కూరగాయాలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో డిమాండ్ వెదురు ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురు వస్తువుల వినియోగం పెరుగుతోంది. వెదురుతో చేసిన బుట్టలు, కుర్చీలపై పలువురు ఆసక్తి చూపిస్తుండగా.. కాగితం పరిశ్రమ, భవన నిర్మాణ రంగం, అగర్బత్తీల తయారీ, బయో ఇంధనాల్ తయారీలో వెదురు ఉపయోగిస్తున్నారు. ఎలాంటి భూమిలోనైనా పెరిగే వెదురు సాగుకు నీటి అవసరం కూడా పెద్దగా ఉండదు. వెదురు సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందున రైతులు ముందుకు రావాలి. సబ్సిడీలు, రాయితీలు అందుతాయి. నేషనల్ హార్టికల్చర్ మిషన్‌తో పాటు రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యాన సాగుకు ప్రోత్సహిస్తున్నాం. వెదురు సాగుతో రైతులకు మంచి లాభాలు ఉంటాయి. – నగేష్, ఉద్యాన శాఖ అధికారి, ఖమ్మం డివిజన్ -
శ్రీనివాసనగర్ వాసుల తరఫున న్యాయపోరాటం
ఖమ్మం వైరారోడ్: ఖమ్మం శ్రీనివాసనగర్‌లో యాభై ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్ల తొలొగింపునకు నోటీసులు ఇవ్వడంపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈమేరకు బాధితులకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వెల్లడించారు. ఇందులో భాగంగా న్యాయవాదులు బిచ్చల తిరుమలరావు, మేకల సుగుణరావు, కొత్త వెంకటేశ్వరరావు, దిరిశాల కృష్ణారావు గురువారం శ్రీనివాసనగర్‌కు వెళ్లి బాధిత కుటుంబాలతో చర్చించారు. హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి పువ్వాడ కూడా బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడి న్యాయ పోరాటానికి ఖర్చులన్నీ తానే భరిస్తానని తెలిపారు. నాయకులు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, పాలడుగు పాపారావు, బత్తుల మురళీప్రసాద్, మలుసూరు ముక్తేశ్వరరావు, పసుమర్తి రామ్మోహన్, మెంతుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఇళ్లు తొలగిస్తే ఊరుకునేది లేదు... ఖమ్మంమయూరిసెంటర్: గత 50 ఏళ్లుగా శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న వారి ఇళ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. సీపీఎం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యాన గురువారం అయ్యప్ప స్వామి గుడి ప్రాంత వాసులను కలిశారు. అనంతరం షేక్ సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడు తరాలుగా ప్రజలు జీవిస్తుండగా, వారి ఇళ్ల తొలగించే ప్రయత్నాలను సహించబోమని తెలిపారు. పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, నాయకులు యర్రా శ్రీనివాసరావు, భూక్యా శ్రీనివాసరావు, బండారు రమేష్, వజేనేపల్లి శ్రీనివాసరావు, ఎల్లంపల్లి వెంకట్రావు, బండారు వీరబాబు, బజ్జూరి రమణారెడ్డి, షేక్ హిమామ్, యర్రా రంజిత్, శీలం వీరబాబు, రంగు హన్మంతాచారి, షేక్ మస్తాన్, బండారు సునీత తదితరులు పాల్గొన్నారు. -
● ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో భారీ మోసం ● ఏసీటీఓ ఇంటి ఎదుట బాధితుల ధర్నా
భద్రాచలంలో రూ.ఐదు కోట్లకు టోకరా!భద్రాచలంటౌన్: భద్రాచలంలో చోటు చేసుకుంటున్న వరుస మోసాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇటీవల అధిక వడ్డీల ఆశ చూపి భరత్, ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే పీఏ కల్యాణ్ చేసిన ఉదంతాలు మరువక ముందే గురువారం మరో భారీ మోసం వెలుగుచూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్మెంట్లలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసి మోసగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులంతా ఆందోళనకు దిగడం, ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితుల కథనం ప్రకారం.. పిల్లల చదువుల ఫీజులు, వ్యాపార పెట్టుబడులు, ఇతర ఆకర్షణీయమైన పథకాల పేరుతో బత్తుల పద్మ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసింది. ఆమె భర్త బత్తుల శ్రీనివాస్ ప్రస్తుతం ఖమ్మంలో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బాధితులు ఇళ్లలోని బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, మరికొందరు వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ నమ్మకంతో పద్మకు డబ్బులు ఇచ్చినట్లు కన్నీరుమున్నీరయ్యారు. ఇల్లు ఖాళీ చేస్తుండగా ధర్నా.. ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోగా, ఏసీటీఓ బత్తుల శ్రీనివాస్ గురువారం ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారనే సమాచారంతో 30 మంది ఆయన నివాసానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈక్రమాన తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళా బాధితురాలు అందరూ చూస్తుండగానే ఆమె వెంట తెచ్చుకున్న మాత్రలు మింగడంతో పాటు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న మిగతా వారు ఆమెను అడ్డుకోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. సమాచారం అందుకున్న భద్రాచలం పట్టణ పోలీసులు అక్రడకు చేరుకుని ముందుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ నాగరాజు తెలిపారు. -
కొత్తగూడెం నుంచి ఏపీకి మూడు బస్సులు
చుంచుపల్లి: ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగూడెం ఆర్టీసీ డిపో నుంచి ఏపీలోని శ్రీకాకుళం, అమలాపురం, నర్సాపురం ప్రాంతాలకు గురువారం నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి తెలిపారు. శ్రీకాకుళం సర్వీసు భద్రాచలం నుంచి సాయంత్రం 5:15 గంటలకు మొదలై, కొత్తగూడెంకు 6:30 గంటలకు చేరుతుందని, అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30కు శ్రీకాకుళం చేరుతుందని వెల్లడించారు. అలాగే, అమలాపురం సర్వీసు కొత్తగూడెం నుంచి మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరి రాత్రి 9:30కు, నర్సాపురం బస్సు కొత్తగూడెం నుంచి మధ్యాహ్నం 3గంటలకు మొదలై రాత్రి 10 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. కాగా, రద్దీ దృష్ట్యా గుంటూరుకు అదనంగా డీలక్స్ సర్వీసులు నడిపిస్తున్నందున ప్రయాణికులు సద్వియోగం చేసుకోవాలి డీఎం సూచించారు. రేక్ పాయింట్‌కు 1,323 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు క్రిబ్కో కంపెనీకి చెందిన 1,323 మెట్రిక్ టన్నుల యూరియా గురువా రం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 523 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 400 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 మె.టన్నుల యూరియా సరఫరా చేశారు. మరో 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ‘ఉపాధ్యాయుల సర్దుబాటులో అక్రమాలు’ ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటులో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరిగిందని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు ఆరోపించారు. ఈమేరకు గురువారం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపాక డీఈఓ సదానందంకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సింది పోయి, ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి కూడా ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించారని పేర్కొన్నారు. కొన్నిచోట్ల జిల్లా యూనిట్‌గా, ఇంకొన్ని చోట్ల మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో పాటు సీనియారిటీ విషయంలో నిబంధనలు పాటించలేదన్నారు. మరోపక్క ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే అవసరమైన పాఠశాలల్లో నలుగురు ఉన్నా సర్దుబాటు చేయలేదని ఆరోపించారు. ఈమేరకు నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు తేలితే సరిచేస్తామని డీఈఓ హామీ ఇచ్చినట్లు తెలిపారు. నాయకులు వీరబాబు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, బావసన్, యాకోబు, పాషా, జి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీ్త్రనిధి రుణాల వసూళ్లపై విచారణ కల్లూరురూరల్: కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామంలో సీ్త్రనిధి రుణాల అవకతవకలపై సీ్త్రనిధి మేనేజర్ వేణు గురువారం విచారణ ప్రారంభించారు. గ్రామంలోని 22 సంఘాలకు రూ.43 లక్షల మేర రుణాలు మంజూరు చేయగా, తీసుకున్న సభ్యులు తిరిగి చెల్లించారు. అయితే, రేణుక గ్రూపు, దుర్గమ్మ గ్రూప్ సభ్యులు రుణాలు చెల్లించినా రికార్డుల్లో బకాయి ఉన్నట్లు చూపిస్తుండడంతో బుధవారం కల్లూరులోని ఐకేపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈవిషయమై ‘సాక్షి’లో కథనం రావడంతో అధికారులు స్పందించారు. ఈమేరకు ముగ్గువెంకటాపురం గ్రామాన్ని సందర్శించి మహిళలను కలిసి వివరాలు సేకరించారు. పది రోజుల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రూపుల వారీగా మంజూరైన రుణాలు, చెల్లింపుల వివరాలు తెలుసుకుంటామని వెల్లడించారు కేఎంసీ ఉద్యోగిపై దాడికి యత్నం ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిపై కొందరు దాడికి యత్నించారు. కొందరు వ్యక్తులు గురువారం ఉదయం డంపింగ్ యార్డ్‌లో వీడియో తీస్తుండగా.. అనుమతి లేకుండా తీయొద్దని సదరు ఉద్యోగి అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఉద్యోగి కేఎంసీ కార్యాలయానికి చేరుకోగా.. అప్పటికే వచ్చి ఉన్న సదరు వ్యక్తులు ఉద్యోగి చొక్కా పట్టుకుని దాడికి దిగడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉద్యోగికి కమిషనర్ సూచించినట్లు తెలిసింది. విధుల్లో చేరిన ఏఎంసీ.. అనారోగ్య సమస్యతో సుదీర్ఘ సెలవుల్లో వెళ్లిన కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్ విధుల్లో చేరారు. ఈమేరకు గురువారం కమిషనర్ అభిషేక్ అగస్త్యను కలిశారు. -
అమ్మానాన్నకు వీడ్కోలు
కొణిజర్ల: క్షణికావేశంలో భర్త నాగార్జునసాగర్ కాల్వలో దూకగా... ఆ విషయం తెలియగానే భార్య ఇంట్లో ఉరి వేసుకున్న విషయం విదితమే. కొణిజర్ల మండలం అమ్మపాలెంకు చెందిన ఆటో నడిపే తేజావత్ హరిప్రసాద్ కుటుంబంలో అప్పుల కారణంగా భార్య సునీతతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమాన బుధవారం ఉదయం బయటకు వెళ్లిన ఆయన సాగర్ కాల్వలో దూకుతున్నట్లు తన సోదరుడికి ఫోన్ చేశాడు. ఈ మేరకు గాలించగా వి.వెంకటాయపాలెం సమీపాన ఎన్నెస్పీ ప్రధాన కాల్వ వద్ద ఫోన్, ఆటో, చెప్పులు ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలియగానే ఇంట్లో ఉన్న సునీత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈక్రమాన రాత్రి వరకు గాలించినా హరిప్రసాద్ ఆచూకీ లభించలేదు. చివరకు గురువారం ఉదయం ఆయన మృతదేహం తనికెళ్ల బోనకల్ బ్రాంచ్ కాల్వ లాకుల వద్ద లభ్యమైంది. దీంతో భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుబీకులకు అప్పగించగా సాయంత్రం అమ్మపాలెం తీసుకొచ్చారు. ఈ క్రమాన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు మనోహర్, భార్గవి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అనంతరం కుటుంబీకులు, స్థానికుల కన్నీటి నడుమ దంపతుల అంత్యక్రియలు పూర్తిచేశారు. బీబీసీ లాక్‌ల వద్ద లభ్యమైన హరిప్రసాద్ మృతదేహం -
హెల్త్ కార్డులు రెడీ..
● ఆన్లైన్ చేసుకుంటున్న ఉద్యోగ, పెన్షనర్లు ● అప్రూవల్ కాగానే కార్డుల జారీఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతనంగా హెల్త్‌కార్డులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని రెగ్యులర్ ఉద్యోగులు 7,242మందితో పాటు పెన్షనర్లు 13,182మందికి కార్డులు అందనున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులు ఇప్పటికే తమ వివరాలను ఆన్లైన్ చేసుకున్నారు. ఆపై సంబంధిత విభాగం డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా ఆన్లైన్లో హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు పంపించి, అక్కడ అప్రూవల్ కాగానే కార్డులు జారీ అవుతున్నాయి. ఉద్యోగులు నేరుగా(ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్, తెలంగాణ – ఈహెచ్ఎస్ వెబ్సైట్) ద్వారా ఐడీ నంబర్ నమోదు చేసుకొని ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆపై అప్రూవల్ అయి ఉంటే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కుటుంబంలోని ఒక్కొక్కరికి ఒక్కో హెల్త్‌కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పటివరకై తే రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన హెల్త్‌కార్డులు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. పెన్షనర్లకు ఇలా... పెన్షనర్లు ఆన్లైన్లో హెల్త్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆయా దరఖాస్తులను సబ్ ట్రెజరీ ఆఫీసర్ అప్రూవల్ చేశాక హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు ఆన్లైన్లో వెళ్తుంది. అక్కడ అప్రూవల్ అయ్యాక కార్డులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పెన్షనర్ల హెల్త్‌కార్డులు జిల్లా ఎస్టీఓల స్థాయిలో ఆన్లైన్లో చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా రు. కాగా, హెల్త్‌కార్డుపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫొటోలు, రాష్ట్ర చిహ్నం ఉన్నాయి. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● రైతులు, భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితిరుమలాయపాలెం: పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇదే సమయాన రైతులు, భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి నుంచి బీరోలు వరకు నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడారు. మేడిదపల్లికి కేటాయించిన రూ.10.78 కోట్ల నిధులతో కొన్ని పనులు పూర్తికాగా, మరికొన్ని చివరిదశలో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.77 లక్షలు వెచ్చించామని, తాగునీటి సమస్య పరిష్కారానికి మూడు బోర్లు మంజూరు చేశామని తెలిపారు. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం పాలేరు నియోజకవర్గం అంతటా భూముల రీసర్వే నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. తద్వారా దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు పరిష్కారం లభించడమేకాక కుటుంబాలకు భూమిపై స్పష్టమైన యాజమాన్య హక్కు లభిస్తుందన్నారు. అలాగే, రైతులకు అండగా నిలుస్తూ పండిన ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో సాగు, తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలకు కేంద్ర సాయం కోరుతున్నామని మంత్రి చెప్పారు. కాగా, కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, తహసీల్దార్ లూథర్ విల్సన్ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, సర్పంచ్‌లు మోర అనిల్‌రెడ్డి, గుమ్మడి దేవభిక్షం, నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, కొప్పుల అశోక్, బెల్లం శ్రీనివాస్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి పెద్దపీట
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించా రు. 77 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ ప్రాంతం దేశంలో అంతర్భాగంగా మారినందున చర్రితలో సెప్టెంబర్ 17కు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నా రు. అందుకే ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజాపాలన దినోత్స వం సందర్భంగా గురువారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డిప్యూటీ సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించి శాఖల వారీగా ఏర్పాట్లు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కలెక్టర్ దివా కర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్ఓ రామ్మూర్తి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో భట్టి మాట్లాడుతూ ప్రతీ కుటుంబ సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగం ఆయన మాటల్లోనే... మహిళలకు అండగా.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. జిల్లాలో 6,39,31,602 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా, వారికి రూ. 343.44 కోట్ల చార్జీలు ఆదా అయ్యాయి. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. అలాగే, 2,45,233 మందికి 18,69,122 సిలిండర్లను రూ.500కే అందించాం. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 2,49,454 కుటుంబాల బిల్లులు రూ.257.22 కోట్లను ప్రభుత్వం భరించింది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత రాష్ట్రంలో రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతు భరోసా ద్వారా జిల్లాలో 3,41,913 మంది రైతులకు రూ.427.96 కోట్లు అందించగా, రుణ మాఫీ ద్వారా 1,31,760 మంది రైతులకు రూ.912.61 కోట్ల మాఫీ చేశాం. కనీస మద్దతు ధరతో 44,568 మంది రైతుల నుంచి 283956.397 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 2025–26 యాసంగిలో 245 20,085 మంది రైతుల నుంచి 14,62,411.60 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించాం. అలాగే, వ్యవసాయానికి శాశ్వత భరోసా కల్పించేందుకు సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశాం. సీతారామ ఎత్తిపోతల పథకం, పాలేరు లింక్ కాలువ ద్వారా 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పిస్తున్నాం. మున్నేరు – పాలేరు లింక్ కాల్వకు రూ.107.651 కోట్లు, జవహర్ లిఫ్ట్‌కు రూ.630.30 కోట్లు కేటాయించాం. ఆర్ధిక శక్తిగా మహిళా సంఘాలు మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నాం. ఈమేరకు 4,008 సంఘాలకు రూ.394.80 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 555 సంఘాలకు రూ.16.36 కోట్ల సీ్త్రనిధి రుణాలు, 52,059 సంఘాలకు రూ.57.15 కోట్ల వడ్డీలేని రుణాలు అందించాం. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తొలి దశగా రూ.2కోట్లతో 125 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తొలి దశలో 11,427 ఇళ్లు పూర్తయ్యాయి.జిల్లాకు కొత్తగా 41 సబ్ స్టేషన్లు మంజూరు చేశాం. రైతుల విద్యుత్ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా అధికారులు ‘పొలంబాట’ నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన 27 గ్రామాల్లో రూఫ్ టాప్ సోలార్, సౌర పంపుసెట్లు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే, 379 ప్రభుత్వ పాఠశాలల్లో 1,768 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి.సెప్టెంబర్ 17కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన, పనితీరు గ్రేడింగ్ సూచీలో ఐదో స్థానాన నిలిచింది. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహారం అందిస్తున్నాం. ఐదు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం. భూ రికార్డుల నవీకరణలో భాగంగా దాదాపు 96 ఏళ్ల తర్వాత భూ రీసర్వే ప్రక్రియ ప్రారంభించాం. తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ చట్టం–1923 ప్రకారం జిల్లాలో దశలవారీగా రీసర్వే జరుగుతుంది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, సత్తుపల్లి మండలం బేతుపల్లి, కూసుమంచి మండలం భగవత్‌వీడులో సర్వే మొదలైంది. -
కమ్యూనిస్టుల త్యాగ ఫలితమే విలీనం
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిస్టుల త్యాగ ఫలి తంగానే తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనమైతే.. ఈ విషయాన్ని కొందరు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే, అమరవీరులకు నివాళులర్పించాక హేమంతరావు మాట్లాడుతూ..నిజాం రాజు స్వతంత్రుడిగా ప్రకటించుకుని పాలన సాగిస్తున్నప్పుడు కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. ఈక్రమాన నాలుగున్నర వేల మంది ప్రాణాలు అర్పించాకే తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనమైందని తెలిపారు. నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, మహ్మద్ మౌలానా, యర్రా బాబు, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీపీఐ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో జరిగిన సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభకు ఖమ్మం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెళ్లారు. వారోత్సవాల ముగింపు సభలో బాగం -
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
ఖమ్మం లీగల్: కమిషనర్ న్యాయవాదులుగా కొనసాగేవారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నాగరాజు సూచించారు. న్యాయవాది పరిషత్ ఆధ్వర్యాన ఖమ్మంలో గురువారం ‘అడ్వకేట్ కమిషనర్స్ వర్క్’పై న్యాయవాదులకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ భూతగాదా కేసుల్లో న్యాయవాద కమిషనర్ వర్క్ కీలకమని తెలిపారు. న్యాయవాదుల్లో నైపుణ్యాలు పెంచడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి డాక్టర్ జీ.వీ.మహేష్నాధ్ కమిషనర్ వర్క్ బాధ్యతలు, విధులను వివిధ కేసుల ఆధారంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యడ్లపల్లి రమేష్, న్యాయవాది పరిషత్ బాధ్యులు సత్యప్రసాద్, వెంకటేశ్వరగుప్తా, విజయ్‌కుమార్, శేఖర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.మౌలిక వసతులతో విద్యుత్ సరఫరా బలోపేతం ఖమ్మంవ్యవసాయం: మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ముందస్తు ప్రణాళికతో మౌలిక వసతుల బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. సర్కిల్ పరిధిలో కొత్తగా నాలుగు 33/11 కేవీ సబ్స్టేషన్లు, మూడు అదనపు పవర్ ట్రాన్ఫార్మర్లు, 613 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అంతేకాక 4.059 కి.మీ. మేర 33 కేవీ విద్యుత్ లైన్లు, 158.4 కి.మీ. నిడివితో 11 కేవీ లైన్లు ఏర్పాటు చేయగా, లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి ఎనిమిది 600 కేవీఆర్ కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే, పవర్ ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణపై తమ ఉద్యోగుఉల దృష్టి సారించగా, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటుచేశామని తెలిపారు. ఇదే సమయాన వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా జరిగేలా అత్యవసర స్పందనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్ఈ ఓ ప్రకటనలో వివరించారు. ‘పీఎం మెంటార్షిప్’లో ఖమ్మం విద్యార్థి ఖమ్మం సహకారనగర్: జాతీయ స్థాయిలో యువ, విద్యార్థి రచయితలను ప్రోత్సహించేలా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మెంటార్ షిప్ – 2.0లో ఖమ్మం ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజీ విద్యార్థి ప్రతిభ చాటాడు. రెండేళ్ల క్రితం మెంటార్‌షిప్‌నకు ఎంపికై న డిగ్రీ విద్యార్థి మాదాసు ఉదయ్‌కిరణ్ ‘ప్రజాస్వామ్యం, సంస్థలు’ అంశంపై పరిశోధనాత్మక అధ్యయన నివేదిక సమర్పించగా నెలకు రూ.50వేల చొప్పున ఆరు నెలలకు రూ.3లక్షల గౌరవ భృతి అందుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా గురువారం అభినందించి మాట్లాడారు. తమ విద్యార్థి పరిశోధన సారాంశాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిందని తెలిపారు. విశ్రాంత తెలుగు అధ్యాపకుడు డాక్టర్ సీతారాం ఉదయ్‌ను ప్రోత్సహించగా, ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు డాక్టర్ రవివర్దన్, డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ ఎం.పిచ్చయ్య, డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
డోర్నకల్ ఎమ్మెల్యే కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలడంతో కారు క్యాబిన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చింతపల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకుంది.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని జెండా ఆవిష్కరించేందుకు మహబూబాబాద్ కలెక్టరేట్‌కు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ బయలుదేరారు. అయితే, చింతపల్లి వద్దకు రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో ఒక్కసారిగా కేబిన్‌లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఎమ్మెల్యే, సిబ్బంది వెంటనే వాహనం నుంచి బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. అయితే, డ్రైవర్‌కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి.భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం పెద్దదిగా మారలేదు. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిసి అధికారులు, స్థానికులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పవర్ బ్యాంక్ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి తప్పిన ప్రమాదంఎమ్మెల్యే వాహనంలో పవర్ బ్యాంక్ పేలి కారులో చెలరేగిన మంటలుడ్రైవర్కి స్వల్ప గాయాలు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బందిమహబూబాబాద్లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లో… pic.twitter.com/dR5qFiKciq— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026Video Credit: Telugu Scribeఇదీ చదవండి: మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్దం: కేటీఆర్ -
కాల్వలో దూకిన భర్త.. ఉరి వేసుకున్న భార్య
ఖమ్మం జిల్లా: క్షణికావేశంలో నాగార్జునసాగర్ కాల్వలో దూకిన గల్లంతయ్యాడనే విషయం తెలిసి సదరు వ్యక్తి భార్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలో బుధవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆటో నడుపుతూ జీవనం సాగించే అమ్మపాలెంనకు చెందిన తేజావత్ హరిప్రసాద్‌కు అన్నవరం గ్రామానికి చెందిన సునీత(28)తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా అప్పులయ్యాయి. దీనికి తోడు వారం రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలుకావడంతో హరిప్రసాద్ బుధవారం ఉదయం బయటకు వెళ్లి తన అన్న రామ్మూర్తికి ఫోన్ చేసి చనిపోతున్నానని, బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఇదే సమాచారం సర్పంచ్‌కు కూడా ఇవ్వగా వారు పోలీసులకు తెలపడంతో ఫోన్ నంబర్ ఆధారంగా వి.వెంకటాయపాలెం సమీపాన ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పరిశీలించగా హరిప్రసాద్ ఆటో, చెప్పులు, సెల్‌ఫోన్ ఉండడంతో ఆయన కాల్వలో దూకాడనే అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చేపట్టగా రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. కాగా, భర్త కాల్వలో దూకాడని తెలియగానే సునీత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హరిప్రసాద్ దంపతులు ఇటీవలే ప్రైవేట్ బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేసుకోగా విచారణకు వచ్చిన సిబ్బంది ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూశారు. దీంతో సునీత ఉరి వేసుకుని కనిపించగా స్థానికులకు చెప్పడంతో పరిశీలించేసరికి ఆమె మృతి చెందింది. అయితే, సునీత బలవన్మరణంపై ఆమె తరఫు బంధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, విచారణలో వివరాలు వెల్లడవుతాయని ఎస్ఐ సూరజ్ తెలిపారు. కాగా, హరిప్రసాద్ కానరాకుండా పోవడం, సునీత ఎందుకు మృతి చెందిందో తెలియక వీరి పిల్లలు మనోహర్, భార్గవి అడుగుతున్న ప్రశ్నలు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
నాన్నకు మనసెలా వచ్చిందో.. ఊహించని దారుణం!
ఖమ్మం జిల్లా: ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ... ఓ రైతు కలుపు మందు తాగడమేకాక తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించాడు. ఘటనలో తండ్రి, కుమార్తె మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాస్ (44) స్వగ్రామంలోనే కాక ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయిలో భూమి కౌలుకు తీసుకుని భార్యతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు.ఈక్రమాన భార్య అప్పలనరసింహాపురంలోని ఇంట్లో ఉండగా... సూర్యాపేట జిల్లా కోదాడలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న కుమార్తె లాస్య (14), నేలకొండపల్లి మండలం చెరువుమాధారం ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న కుమారుడు నిఖిల్ (11)ను బుధవారం వారి పాఠశాలలకు వెళ్లి తీసుకొచ్చాడు. ఆపై పిల్లలతో కలిసి గండ్రాయిలో కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లాడు. తండ్రి ఇచ్చింది విషమని తెలియక... ముందుగా శ్రీనివాస్ థమ్సప్ సీసాలో గడ్డి మందు కలిపినట్లు తెలుస్తుండగా, పొలం వద్ద తొలుత తాను తాగాడు. ఆ తర్వాత లాస్య, నిఖిల్‌కు కూడా తాగించాడు. తండ్రి ఇచ్చింది విషమని తెలియని ఆ చిన్నారులు సైతం తాగేశారు. ఆపై బంధువులకు ఫోన్ చేసిన శ్రీనివాస్ విషయాన్ని చెప్పి స్విచ్చాఫ్ చేశాడు. దీంతో బంధువులు, గ్రామస్తులు గండ్రాయిలోని పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. చివరకు పోలీసుల సాయం తీసుకుని ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా గుర్తించేసరికి ముగ్గురూ స్పృహ తప్పి కనిపించాడు. ఈ మేరకు శ్రీనివాస్, ఇద్దరు పిల్లలను ఖమ్మం జనరల్ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ తండ్రి, కుమార్తె లాస్య మృతి చెందారు. ఇక కుమారుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. శ్రీనివాస్‌కు గ్రామంలో ఉత్తమ రైతుగా పేరుండటమేకాక అందరితో కలివిడిగా ఉండేవాడు. దీంతో ఆయన ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఈ ఘటనపై ఏపీలోని చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. -
వేగంగా చేయూత పరిశీలన
● ప్రత్యేక యాప్‌తో ఇంటింటికీ అధికారులు ● జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం 25,912 దరఖాస్తులు ● ఈనెల 25 నాటికి పరిశీలన పూర్తికి చర్యలు ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో నూతన చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలనను యంత్రాంగం వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్పొరేషన్, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈమేరకు ఆన్లైన్లో నమోదు చేశాక, ప్రత్యేక యాప్ ద్వారా అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పరిశీలన మొదలుపెట్టారు. సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయగానే అర్హత, అనర్హతల వివరాలు వెల్లడవుతున్నాయని తెలిపారు. ఈనెల 25వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనున్నారు. దరఖాస్తుల నమోదులో ముందంజ జిల్లాలో నూతన పింఛన్ల కోసం మొత్తం 25,912 దరఖాస్తులు రాగా, ఇప్పటికే 22,564 దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. అంతేకాక క్షేత్రస్థాయిలో 1,926 దరఖాస్తులను పరిశీలించారు. అందులో 1,868 దరఖాస్తులకు అర్హత ఉందని నిర్ధారించగా, వివిధ కారణాలతో 58 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిసింది. కాగా, జిల్లాలో అత్యధికంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 4,410 దరఖాస్తులు రాగా, చింతకాని మండలంలో 1,426, ముదిగొండలో 1,257, నేలకొండపల్లిలో 1,168 దరఖాస్తులు నమోదయ్యాయి. అత్యల్పంగా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో 375, సత్తుపల్లి మున్సిపాలిటీలో 523, మధిర మున్సిపాలిటీలో 566 దరఖాస్తులు అందాయి. పరిశీలనలో ఏదులాపురం టాప్.. పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం వివరాలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో అందిన 1,029 దరఖాస్తులకు ఇప్పటి వరకు 270 పరిశీలన పూర్తి చేశారు. ఆ తర్వాత నేలకొండపల్లిలో 177, మధిర మండలంలో 163, రఘునాథపాలెంలో 128 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇక పెనుబల్లి మండలంలో 838 దరఖాస్తులు అందితే కేవలం రెండు దరఖాస్తులనే పరిశీలించడం గమనార్హం. మండలం / మున్సిపాలిటీ దరఖాస్తులు ఖమ్మం కార్పొరేషన్ 4,410 28 ముదిగొండ 1,257 57 చింతకాని 1,426 108 తిరుమలాయపాలెం 1,132 58 నేలకొండపల్లి 1,168 177 కారేపల్లి 857 39 కొణిజర్ల 978 66 ఖమ్మంరూరల్ 921 53 బోనకల్ 977 82 ఏదులాపురం 1,029 270 పెనుబల్లి 838 2 రఘునాథపాలెం 890 128 ఎర్రుపాలెం 896 34 వైరా మున్సిపాలిటీ 692 16 వైరా 720 77 సత్తుపల్లి 800 17 వేంసూరు 711 27 కామేపల్లి 625 55 ఏన్కూరు 610 113 కల్లూరు 727 54 సత్తుపల్లి మున్సిపాలిటీ 523 36 మధిర 666 163 కల్లూరు మున్సిపాలిటీ 375 22 తల్లాడ 977 88 మధిర మున్సిపాలిటీ 566 28 కూసుమంచి 1,141 28 -
సాయుధ సమరం
అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో ఖమ్మం గడ్డకు సుదీర్ఘ చరిత్ర ఉంది. రజాకార్ల దమనకాండకు విప్లవ యోధులు ఎదురొడ్డి వారి దాష్టికాలను నిలువరించారు. ప్రాణాలను లెక్కచేయకుండా ఆయుధాలు చేత పట్టి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. నిజాం నవాబుపై పోరాటానికి ఎందరో నాయకులను అందించిన ప్రాంతంగా ఉమ్మడి జిల్లాకు పేరుంది. నాటి సాయుధ రైతాంగ పోరాటం నేటి అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలవడమే కాక పోరాటాల గడ్డగా జిల్లాకు పేరు సాధించి పెట్టింది. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఏటా సెప్టెంబర్ 17న(నేడు) నాటి వీరులకు జిల్లా ప్రజానీకం నివాళులర్పించనున్న నేపథ్యాన ప్రత్యేక కథనం. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంబోనకల్ మండలంలోని పల్లెలు సాయుధ పోరాటంలో అగ్నిశిఖలై రగిలాయి. చిరునోములకు చెందిన తామ్రపత్ర గ్రహీత రావెళ్ల జానకి రామయ్య ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ రజాకార్లకు వ్యతిరేకంగా యువతను చైతన్యవంతం చేశారు. భూస్వాముల వెట్టిచాకిరీపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మల్లెల వెంకటేశ్వర్లు దళ కమాండర్‌గా, చుండూరు నరసింహారావు, తమ్మారపు గోవిందు, జొన్నలగడ్డ రామయ్య ఉప కమాండర్లుగా వ్యవహరిస్తూ ముష్టికుంట్ల, లక్ష్మీపురం, బ్రాహ్మణపల్లి ప్రాంతాల యువతను పోరాట బాట పట్టించారు.నిజాం అరాచకాలపై తిరగబడిన ఖమ్మం గడ్డ -
రజాకార్లపై సమరశంఖం
కొణిజర్ల, తనికెళ్ల ప్రాంతాలకు చెందిన మల్లెల వెంకటేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, షేక్ రజాక్ అలీ దళాల్లో పనిచేశారు. తనికెళ్లపై పడిన రజాకార్లు ప్రజలను తీవ్రంగా హింసించారు. దళ నాయకుడు గడల సీతారామయ్య ఆచూకీ కోసం వేధించగా, గ్రామస్తులు మరొకరి మృతదేహాన్ని చూపించి సీతారామయ్యను కాపాడుకున్నారు. ఇక 1948 జనవరి 15న ఎర్రుపాలెం మండలం మీనవోలు ప్రజలు రజాకార్ల సైన్యంపై ఈటెలతో విరుచుకుపడ్డారు. బ్రిటిష్ అధికారి సార్జెంట్ చేసిన విచక్షణారహిత కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ తిరుగుబాటును అణచివేసేందుకు నిజాం సర్కార్ రైలులో రజాకార్లను రప్పించి ఇళ్లను తగలబెట్టడంతో ప్రజలు గ్రామాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. -
ప్రజా ఉద్యమంతోనే నాణ్యమైన విద్య
ఖమ్మం సహకారనగర్: నాణ్యమైన విద్య అందాలంటే రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఖమ్మంలో విద్యాభిమానులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ విద్యావ్యవస్థ ఐసీయూలో ఉన్నందున ప్రజలే వైద్యులుగా మారి చికిత్స చేసి బ్రతికించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మారిస్తే ప్రైవేట్ బడులకు పిల్లలను పంపాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. యుడైస్ గణాంకాలు ప్రకారం తెలంగాణలో 2,582 పాఠశాలలు ఒకే గదిలో నడుస్తున్నాయని, 2,245పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానాన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రైవేట్ పాఠశాలల నియంత్రణ చట్టం చేసి, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పద్మజాషా, ఎం.చంపాలాల్. పి.అశోక్ కుమార్, సృజన యాదవ్, ఎం.కుపోరన్న, ఎం.నర్సింహరావు, హరీష్, రుబీనా, నిఖిల్, జగదీష్ తదితరులు పాల్గొనగా.. జిల్లా నుంచి వివిధ సంఘాల బాధ్యులు ఎన్.తిర్మల్, డాక్టర్ ఎం.ఎఫ్.గోపినాథ్, భద్రూనాయక్, కట్టా శేఖర్, జి.మల్లయ్య, ఉద్దండు, సుంకర శ్రీనివాస్, మస్తాన్, పి.రాంబాబు, కనకయ్య, టి.వేణు, నాగిరెడ్డి, దేవేందర్, బొబ్బిలి భారత్చంద్ర, మణి భూషణాచారి, ఖలీల్, ఝూన్సీ, సునీత, సృజన, విజయకుమార్, గుంతేటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. విద్యా కమిషన్ మాజీ చైర్మన్ మురళి -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ముదిగొండ: ముదిగొండ మండలం మేడేపల్లి సాగర్ కాల్వ వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన పేరం పార్వతి(50) తన మేనల్లుడు వీరబాబు ద్విచక్రవాహనంపై కూసుమంచి మండలం నాయక్‌గూడెం నుంచి వస్తోంది. ఈక్రమాన మేడేపల్లి సాగర్ కాల్వ వద్ద ద్విచక్రవాహనంపై పార్వతి కిందపడడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త పుల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు చికిత్స పొందుతున్న వృద్ధుడు... తిరుమలాయపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని మహ్మదాపురం శివారు బోడతండాకు చెందిన బోడ మదార్(75) ఈనెల 14న పొలం వద్ద రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా సుబ్లేడు క్రాస్ వద్ద పల్సర్ బైక్ అతివేగంగా ఢీకొట్టింది. ఘటనలో మదార్‌కు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబీకులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఆయనకు భార్య దుబ్లీ, ఇద్దరు కుమారులు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహంతో ఆందోళన ఖమ్మం అర్బన్: ప్రేమ పేరిట వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం బుధవారం రాత్రి ఖమ్మం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మృతదేహంతో టేకులపల్లి వద్ద సాగర్ కాల్వ వంతెనపై ఆందోళనకు దిగారు. వేధింపులకు గురిచేసిన ఇద్దరిపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సాగర్ కాల్వ వంతెన బైపాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొనగా ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్, సిబ్బంది చేరుకుని నచ్చచెబుతున్నారు. కొండముచ్చుల దాడిలో ఇద్దరికి గాయాలుకల్లూరురూరల్: కల్లూరులో బుధవారం కొండముచ్చులు దాడి చేయగా ఇద్దరికి గాయాలయ్యాయి. కల్లూరు మెయిన్ సెంటర్ మీదుగా వెళ్తున్న బొల్లం వెంకటేశ్వరరావు, హరిపై దాడి చేసిన కొండముచ్చులు గోళ్లతో రక్కి తీవ్రంగా గాయపరిచాయి. వీరిని స్థానికులు ప్రభుత్వ ఆస్పపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మున్సిపల్ అధికారులు స్పందించి కొండముచ్చుల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. చెల్లని చెక్కు కేసులో రెండేళ్ల జైలుశిక్ష ఖమ్మం లీగల్: ఖమ్మంశ్రీరాంనగర్కు చెందిన షేక్ జానీమియా వద్ద మామిళ్లగూడెంకు చెందిన టి.సునంద 2013 డిసెంబర్లో రూ.2.50లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2015 ఆగస్టులో రూ.3.50లక్షలకు చెక్కు ఇచ్చినా ఆమె ఖాతాలో సరిపగా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో జానీమియా తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. సాక్షులను విచారించాక నేరం బుజువు కావడంతో సునందకు రెండేళ్ల శిక్ష విధించడమేకాక ఫిర్యాదికి రూ.6.90లక్షలు చెల్లించాలని, రూ.10వేల జరిమాన కట్టాలని ఖమ్మం మూడో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి అరవ ప్రవీణ్ బుధవారం తీర్పు చెప్పారు. మరొకరికి ఆరు నెలలు.. ఖమ్మం ద్వారకానగర్‌కు తోట లింగయ్య వద్ద అదే ప్రాంతానికి చెందిన బి.శైలు 2018 జూలైలో రూ.3లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2019 డిసెంబర్లో రూ. 3.90లక్షలకు చెక్కు ఇచ్చిన చెల్లలేదు. దీంతో లింగయ్య దాఖలు చేసిన కేసును విచారించాక శైలుకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కాకుమాని జ్యోతిర్మయి తీర్పు చెప్పారు. అంతేకాక ఫిర్యాదికి రూ.6.25వేలు చెల్లించాలని తీర్పులో పేర్కొనగా రూ.5వేల జరిమానా కూడా విధించారు. అత్యాచారయత్నం కేసులో ఏడాది.. వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన సత్తుపల్లి రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన జల్లి సురేష్‌కు ఏడాది జెలుశిక్షతో పాటు రూ.6వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఐదో అదనపు జిల్లా ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి వి.సీనయ్య తీర్పు చెప్పారు. సత్తుపల్లికే చెందిన వివాహితతో 2015 మార్చి 10న సురేష్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా సాక్షులను విచారించాక న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ పాస్రిక్యూటర్ ఆర్.ఉపేందర్ వాదించగా ఉద్యోగులుకె.శ్రీకాంత్, ఎం.డీ.యూసఫ్ సహకరించారు. -
ఎన్ఎంసీ తనిఖీలు పూర్తి
● మెడికల్ కాలేజీలో 25 పీజీ సీట్లకు ప్రతిపాదన ● అనుమతి లభిస్తే ఈ ఏడాదే ప్రవేశాలు ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) సీట్ల అనుమతులకు అడుగులు పడుతున్నాయి. అధికారులు పంపించిన ప్రతిపాదనల మేరకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బృందం బోధన ఆస్పత్రితో పాటు మెడికల్ కళాశాలలో తనిఖీలు చేపట్టింది. ఎన్ఎమ్సీ నిబంధనల ప్రకారం వసతులు, సౌకర్యాలు, బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య తదితర వివరాలు పరిశీలించారు. ఈనెల 3వ తేదీన ఒక విభాగంలో పరిశీలనతో తనిఖీలు మొదలుకాగా, బుధవారం చివరి విభాగంలో తనిఖీ పూర్తి చేశారు. ఐదు విభాగాల్లో సీట్లకు కసరత్తు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2023 ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు మొదలయ్యాయి. ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి ఇప్పటికే 72 మంది చేరారు. కౌన్సెలింగ్ పూర్తయ్యే నాటికి 100 సీట్లు భర్తీ కానుండగా, వచ్చే నెల మొదటి వారంలో తరగతులు మొదలవుతాయి. ఈనేపథ్యాన కళాశాలలో 25 పీజీ సీట్ల కోసం ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ నేతృత్వాన డీఎంఈకి ప్రతిపాదించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్తీషియా, ఆర్థోపెడిక్, గైనకాలజీ విభాగాల్లో ఐదేసీ సీట్ల చొప్పున 25 సీట్లు అవసరమని నివేదించగా.. డీఎంఈ నుంచి ఎన్ఎంసీకి ప్రతిపాదనలు చేరాయి. ఈక్రమాన కళాశాల, ఆస్పత్రిలో పీజీ బోధనకు సరైన వసతులు ఉన్నాయో, లేదో పరిశీలనకు ఎన్ఎంసీ బృందం తనిఖీలు చేపట్టింది. అన్ని విభాగాల్లో పరిశీలన ఎన్ఎంసీ నిబంధనల మేరకు ఆస్పత్రితో పాటు కళాశాలలో సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్నాయో, లేదో తెలుసుకునేందుకు ఐదు విభాగాల్లో బృందాలు ఈ రెండు వారాల్లో తనిఖీ చేపట్టాయి. ఈనెల 3న సిరిసిల్ల మెడికల్ కళాశాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంధ్య నేతృత్వాన గైనకాలజీ విభాగంలో, 9వ తేదీన జనరల్ సర్జరీ విభాగాన్ని ఒడిశాకు చెందిన భరత్‌కుమార్, అనస్తీసియా విభాగాన్ని పూణేకు చెందిన డాక్టర్ వీణ, ఈ నెల 10వ తేదీన ఆర్థో విభాగాన్ని వారణాసికి చెందిన అషుతోష్ విక్ర మ్, చివరగా బుధవారం జనరల్ మెడిసిస్ విభాగా న్ని కర్ణాటకకు చెందిన డాక్టర్ రమేష్ కె.నారాయణ స్వామి బృందం తనిఖీ చేపట్టింది. అంతేకాక పూర్తి వివరాలను ఎన్ఎంసీ పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. ఈ నివేదిక ఆధారంగా పీజీ సీట్లకు అనుమతి వస్తే ఈ ఏడాదే ప్రవేశాలు కల్పించనుండగా, ఆస్పత్రిలో వైద్యుల కొరత తీరి, సేవలు మరింత మెరుగుపడే అవకాశముందని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.శంకర్ వెల్లడించారు. కళాశాలలో బోధన, ఆస్పత్రి సౌకర్యాలపై ఎన్ఎంసీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యాన తప్పక అనుమతి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉచితం.. అనుచితమైందా?!
రకం సగటు యూపీఐ వార్షిక బిల్లు చార్జీ భారం విద్యుత్ బిల్లు రూ.2,000 రూ.5 రూ.60 తాగునీరు రూ.2,100 రూ.5 రూ.60 పిల్లల విద్య రూ.6,000 రూ.5 రూ.60 ఇంటర్నెట్ రూ.2,200 రూ.5 రూ.60 పెట్రోల్ రూ.3,000 రూ.5 రూ.60 బీమా ప్రీమియం రూ.3,500 రూ.5 రూ.60 నెలకు ఆరు లావాదేవీలపై రూ.30, ఏటా రూ.360 అవుతుంది. ఇవి నెలవారీ బిల్లులే కాగా, రూ.2 వేలు దాటే బట్టలు, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లపై మరింత భారం తప్పదు. రూ.10 వేల కొనుగోలుపై రూ.40 అనుకున్నా జిల్లాలోని 3 లక్షల మధ్యతరగతి కుటుంబాలపై ఏటా సుమారు రూ.15 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా.ఖమ్మంగాంధీచౌక్: డిజిటల్ ఇండియా పేరుతో ఇన్నాళ్లూ ఉచితంగా అందించిన యూపీఐ సేవలపై ఇప్పుడు చార్జీలు అమలుకానున్నాయి. రూ.2 వేలు దాటిన ప్రతీ చెల్లింపుపై రూ.5 ఫ్లాట్ చార్జీ విధిస్తూ ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీసుకున్న నిర్ణయంపై జిల్లా వ్యాపారులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇంటి బడ్జెట్ తడిసి మోపెడుతున్న తరుణాన యూపీఐ చార్జీలు భారమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.2 వేలు దాటితే... ఎన్పీసీఐ నిర్ణయం వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపే డబ్బు(వ్యక్తి నుంచి వ్యక్తికి)పై, రూ.2 వేల లోపు దుకాణాల్లో కొనుగోళ్లపై ఎలాంటి చార్జీ ఉండదు. విద్యుత్, తాగునీరు, గ్యాస్, టెలికాం, రైల్వే టికెట్లు, పెట్రోల్ బంకులు, విద్యాసంస్థల ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటి 15 రకాల అత్యవసర సేవలకు రూ.2 వేలు దాటితే ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున వ్యాపారి ఖాతా నుంచి కట్ చేస్తారు. ఇతర షాపింగ్‌లకు 0.4 శాతం చొప్పున కట్ అవుతుంది. నూతన విధానం అమల్లోకి వస్తే మళ్లీ నగదు లావాదేవీలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఫలితంగా చిల్లర సమస్య ఎదురుకానుంది. అయోమయం యూపీఐ చార్జీల అంశం అన్నివర్గాల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. యూపీఐ చార్జీల భారం వ్యాపారులే కట్టాలని చెబుతున్నా వారు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఖమ్మంలోని పలు ప్రాంతాల వ్యాపారులు ఇప్పటికే ‘రూ.2 వేలపైన యూపీఐ లేదు, ఓన్లీ క్యాష్’ అంటూ బోర్డులు ఏర్పాటుచేస్తున్నారు. నెలకు రూ.3 వేల కోట్లకు పైగానే.. జిల్లాలో నెలకు సుమారు రూ.3 వేల కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. ఇందులో రూ.2 వేలు దాటే అత్యవసర బిల్లుల లావాదేవీలు నెలకు 1.5 లక్షల వరకు ఉంటాయి. అంటే జిల్లా నుంచే నెలకు రూ.7.5 లక్షలు, ఏటా దాదాపు రూ.90 లక్షలు చార్జీల రూపంలో వెళ్లనుంది. ఇది రానురాను మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.యూపీఐ చార్జీలపై జనం పెదవి విరుపు నిత్యావసర సరుకులు, కరెంట్ బిల్లు, గ్యాస్, ఇన్సూరెన్స్, పిల్లల ఫీజులన్నీ ఫోన్ పే ద్వారానే చెల్లిస్తా. రూ.2 వేలు దాటిన బిల్లుకు రూ.5 అంటే నెలకు రూ.20–30 అదనం. చూడడానికి చిన్నమొత్తమే అయినా ఏటా రూ.400 దాటడం ఖాయం. – మాదంశెట్టి శ్రీనివాసరావు, ఖమ్మంయూపీఐపై చార్జీలు వ్యాపారులకు భారమే. ఇప్పటికే వ్యాపారాలు పడిపోయాయి. ఈ తరుణాన చార్జీ విధించడం సరికాదు. వ్యాపారాలు చేసే వారిపై ఈ చర్య భారమవుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి. – సోమ నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్ఇప్పటికే ఉన్న పన్నుల మోతకు యూపీఐ చార్జీలు అదనపు భారమవుతాయి. 80 శాతం మంది వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేస్తుండగా, ఇందులో 20 శాతం మంది బిల్లు రూ.2 వేలు దాటుతుంది. దీంతో వ్యాపారులకు భారం తప్పదు. – జి.రమేష్, శ్రీరామేశ్వర మెడికల్ షాప్, గాంధీచౌక్చార్జీలు చూస్తుంటే నగదు లావాదేవీలే మంచిదనిపిస్తుంది. నగదు రహిత లావాదేవీలు అలవాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు చార్జీలు విధించడం సరికాదు. వ్యాపారులపైనే భారమని చెబుతున్నా అంత మేర మా దగ్గరే వసూలు చేస్తారు. – శీలం కార్తీక్, ప్రైవేట్ ఉద్యోగి, ఖమ్మం -
భూముల రీసర్వే పరిశీలన
ముదిగొండ: మండలంలోని ఖానాపురంలో చేపట్టిన భూముల రీ సర్వేను బుధవారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. భూములు, ఇప్పటివరకు జరిగిన సర్వే వివరాలపై తహసీల్దార్ రవికుమార్, సర్వేయర్లతో చర్చించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు ముందస్తు సమాచారం ఇస్తూ రీ సర్వే పకడ్బందీగా చేయాలని సూచించారు. ఆర్ఐ కల్యాణి, సర్వేయర్లు పాల్గొన్నారు. శాసీ్త్రయ విధానాలతో అధిక దిగుబడి మధిర: రైతులు సంప్రదాయ విధానాలకు బదులు సాగులో ఆధునికత విధానాలు అమలుచేస్తే అధిక దిగుబడులు వస్తాయని మధిర వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణీదేవి సూచించారు. మధిర రైతువేదికలో బుధవారం ఆత్మ కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సాగు సమయంలోనే అధిక దిగుబడి వచ్చే మేలు రకాల విత్తనాలు ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఆతర్వాత తెగుళ్ల నివారణ, నాణ్యమైన విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించగా శాస్త్రవేత్త నాగస్వాతి, ఉద్యానవన శాఖ అధికారి విష్ణు, వ్యవసాయ అధికారి సాయిదీక్షిత్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఆత్మ డైరెక్టర్లు గోపాల్‌రావు, శ్రీలక్ష్మి, కౌన్సిలర్ నాగేశ్వరరావు, ఏఈఓలు పాల్గొన్నారు. పోషకాహారంతో రక్తహీనతకు చెక్ కల్లూరురూరల్: గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇస్తున్న పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రమీల తెలిపారు. కల్లూరు మండలం చంద్రుపట్లలో బుధవారం జరిగిన పోషణ మాసోత్సవాల సదస్సులో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలమైన పోషకాహార పదార్థాలను అందిస్తున్నామని చెప్పారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించగా, లోకవరంలో బాలల రక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. సూపర్వైజర్లు ఉషారాణి, సుజాత, సర్పంచ్ కాటంలేని విజయలక్ష్మి, కౌన్సిలర్ కళ్యాణపు ప్రమీల, అంగన్వాడీ టీచర్లు జ్యోతి పద్మ, యశోద, కృష్ణవేణి. రుక్మిణి, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. నేటితో ముగియనున్న వరి సాగు నమోదు ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి సాగు చేస్తున్న రైతులు ఆన్లైన్లో నమోదు చేయించుకునే గడువు గురువారంతో ముగియనుంది. నిర్దేశించిన రకాలు సాగు చేస్తున్న వారు రశీదులతో విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్లను సంప్రదించి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని డీఏఓ ధనసరి పుల్లయ్య సూచించారు. సొంత విత్తనం లేదా ఇతర రైతుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన వారైతే పూర్తి వివరాలతో ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేయించుకున్న రైతులకే ప్రభుత్వం చెల్లించే బోనస్ అందనున్నందున సద్వి నియోగం చేసుకోవాలని డీఏఓ తెలిపారు. టీపీఎస్‌లకు రూ.12కోట్ల నిధులు బోనకల్: అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించేలా ఏర్పాటుచేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు రాష్ట్రప్రభుత్వం రూ.12.84 కోట్ల నిధులు కేటాయించింది. బోనకల్ మండలంలోని రావినూతల, చిరునోముల పాఠశాలలను టీపీఎస్‌లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు భవన నిర్మాణాలు, వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల కాగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటుహక్కు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికి తుది జాబితాలో స్థానం దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సరైన ఆధారాలతో విచారణకు హాజరయ్యే అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 1,75,841 నోటీసులకు గాను 1,60,623 నోటీసులు(91.34 శాతం) జారీ చేశామన్నారు. ఇందులో ఇప్పటివరకు 81,446 మందికి విచారణ పూర్తయిందని తెలిపారు. ఖమ్మం నగర పరిధిలో ఆన్లైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారమ్‌లు సమర్పించిన ఓటర్లు అందుబాటులో లేక 9వేలకు పైగా నోటీసుల జారీలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. అనంతరం పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఈవీఎం గోదాంను తనిఖీ చేసి భద్రతపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఎస్డీసీ సదానందం, వివిధ శాఖల ఉద్యోగులు ఎం.ఏ.రాజు, లఖన్‌నాయక్, అన్సారీ పాల్గొన్నారు. సజావుగా నిర్వహించాలి ఖమ్మంమయూరిసెంటర్: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ, అనామిలిస్ జాబితాలోని ఓటర్లకు నోటీసులు జారీ చేయడమే కాక విచారణలో వారు సమర్పించిన పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఖమ్మం బస్ డిపో రోడ్, పాత డీఆర్డీఓ కార్యాలయ పరిధిలో విచారణ శిబిరాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హియరింగ్‌కు హాజరైన ఓటర్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అధునిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే ఖమ్మంరూరల్: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కచ్చితమైన భూ రికార్డులను రూపొందించడమే లక్ష్యంగా రీ సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. మండలంలోని పల్లెగూడెంలో రీసర్వేను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఇప్పటికే చేసిన సర్వే, ఎదురైన సమస్యలపై ఉద్యోగులతో చర్చించారు. అనంతరం రైతులతో మాట్లాడి రీసర్వే ఉద్దేశంపై అవగాహన కల్పించి సరైన పత్రాలతో ఉద్యోగులకు సహకరించాలని సూచించారు. సర్వేకు అందరూ సహకరిస్తేనే సమస్యలు పరిష్కారమై యజమానులకు హక్కులు దక్కుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినయేందర్‌రెడ్డి, సర్వేయర్లు పాల్గొన్నారు. ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఖమ్మంగాంధీచౌక్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టి అర్హులెవరూ నష్టపోకుండా చూడాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్లో మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, హౌజింగ్ అధికారులతో సమావేశమైన ఆయన లబ్ధిదారుల ఎంపికపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీల నుంచి వచ్చిన లబ్ధిదారుల పేర్లను అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాక అర్హతల ఆధారంగా ఎంపిక చేయాలని తెలిపారు. గతంలో తప్పుడు సమాచారం, సర్వే లోపాలతో పలువురు పేదల పేర్లు ఎల్–3 జాబితాలో చేరాయని, ఈసారి అలాంటి తప్పిదాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే, పంచాయతీకి సమీపంలో ఉచిత ఇసుక లభ్యత స్థలాలను గుర్తించాలని, ఇసుక కొరత ఉన్న మండలాల్లో గోదావరి లేదా ఇతర వనరుల నుండి ఇసుక తెచ్చి నిల్వ చేసేలా స్థలాలు ఎంపిక చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్’పై సమీక్షలో కలెక్టర్ దివాకర -
అగ్రనేతల అడ్డాగా పిండిప్రోలు
తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు సాయుధ పోరుకు కేంద్రబిందువుగా నిలిచింది. పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి రామకిషన్రావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, భీంరెడ్డి నర్సింహారెడ్డి వంటి అగ్రనేతలు ఇక్కడే వ్యూహాలు రచించారు. దున్నేవాడిదే భూమి నినాదంతో భూములను పంచిపెట్టారు. దళ కమాండర్ రాయల వెంకటనారాయణ నేతృత్వాన పలువురు రజాకార్లపై పోరాడి అమరులయ్యారు. ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన ఏరియా కమాండర్ మచ్చ వీరయ్య, ఆయన కొరియర్ కృష్ణమూర్తిని 1949 జనవరి 17న వాగు వద్ద నిజాం బలగాలు కాల్చి చంపాయి. అలాగే మేడేపల్లికి చెందిన యువకులు నల్లమల గిరిప్రసాద్ నాయకత్వాన అడవుల్లో ఉంటూ రజాకార్లపై పోరాడారు. -
సీ్త్రనిధిలో రూ.43 లక్షల గోల్మాల్
కల్లూరురూరల్: కల్లూరు మండలం ముగ్గువెంకటాపురం సీ్త్రనిధి రుణాల్లో గోల్మాల్ జరిగింది. గ్రామంలో 22 మహిళా సంఘాలకు ఇచ్చిన రూ.43 లక్షల రుణాలు లెక్క తేలడం లేదు. రుణాలను క్రమం తప్పకుండా మహిళలు చెల్లించినా రికార్డుల్లో నమోదు కాకపోవడంతో వారు బుధవారం కల్లూరులోని సీ్త్ర శక్తి భవన్ ముందు నిరసన తెలిపారు. రుణ బకాయి, అందని బీమా ముగ్గు వెంకటాపురంలోని రేణుక గ్రూప్‌నకు రూ.3 లక్షల సీ్త్ర నిధి రుణం మంజూరైంది. ఇందులో బీమా రూ.20వేలు పోగా మిగతా రూ.2.80 లక్షలను ఏడుగురు సభ్యులు వాటాగా తీసుకున్నారు. రుణ మొ త్తాన్ని 2021 నాటికే చెల్లించినా, ప్రస్తుతం రూ.4.96 లక్షల బకాయి ఉందని రికార్డులో చూపిస్తున్నారని సభ్యులు చిలక పద్మ, చింతకాయల వెంకటరమణ వాపోయారు. అంతేకాక బీమా నగదు మినహా యించినా ఓ సభ్యురాలు 2023లో మృతి చెందితే రుణ బకాయి ఉందంటూ క్లెయిమ్ చేయలేదని తెలిపారు. అంతేకాక గ్రామానిరే చెందిన దుర్గమ్మ గ్రూప్ సభ్యులు 2020 సంవత్సరంలో రూ.2.5 లక్షల రుణం తీసుకుని 2023 నాటికి చెల్లించినా రికార్డులో బకాయిగా చూపిస్తున్నారని సభ్యలు చిలకా భాగ్యలక్ష్మి, శిరీష, రమ్య వెల్లడించారు. ఈమేరకు గ్రామంలోని 20 గ్రూపుల్లో ఇచ్చిన రూ.43 లక్షల రుణాలపై విచారణ చెల్లించాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం అశోక్రాణిని వివరణ కోరగా.. సీ్త్రనిధి రుణాలు, వసూళ్లకు సంబంధించి విచారణ జరిపిస్తామని చెప్పారు. డబ్బు చెల్లించిన మహిళలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణాలు చెల్లించినా రికార్డుల్లో బకాయే.. -
బీసీ సాహిత్య ప్రకటనకు ఇదే సమయం
ఖమ్మంగాంధీచౌక్: బీసీల హక్కుల సాధన రాజకీయ నినాదంగా మిగలకుండా, సామాజిక దృక్పథంగా, సాంస్కృతిక ఉద్యమంగా రూపుదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. బీసీ కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులు, మేధావులు ఒక వేదికపైకి వచ్చి ‘బీసీ లిటరరీ డిక్లరేషన్ – సాహిత్య ప్రకటన’ రూపొందించాలని పేర్కొన్నారు. ‘వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు’ వెలువడి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 20న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజతోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈమేరకు పోస్టర్లను బుధవారం ఖమ్మంలో ఆవిష్కరించాక ఆయన మాట్లాడారు. ఈ రజతోత్సవం బీసీ సాహిత్యం, సామాజిక ఉద్యమం ఎటువైపు ప్రయాణించాలో నిర్ణయించుకునే ఆలోచనా వేదిక అని తెలిపారు. సమాజ నిర్మాణంలో బీసీ సమూహాలు అందించిన పాత్రను సాహిత్యం తిరిగి వెలికితీయాల్సిన అవసరముందని చెప్పారు. కవులు, కళాకారులు, వివిధ వర్గాల ప్రతినిధులు ప్రసేన్, సీతారాం, రంగరాజు, శంకర్, రమేష్‌కుమార్ ధరణికోట, ఎం.వీ.రమణ, ఉరిమళ్ల సునంద, సురేష్, ఆంజనేయులు పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ గౌరీశంకర్ -
ఇళ్లు ఇచ్చి.. ఇప్పుడు కూల్చేస్తారా?
● శ్రీనివాసనగర్‌లో స్థానికుల ఆందోళన ఖమ్మంమయూరిసెంటర్: స్థలాల పట్టాలు ఇవ్వడమే కాక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వమే తమ ఇళ్లను కూల్చాలని నోటీసులు ఇస్తుందా అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం శ్రీనివాసనగర్‌లో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్ల తొలగింపుపై కేఎంసీ అధికారులు ఇవ్వడంతో స్థానికులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈమేరకు శ్రీనివాసనగర్ ఆర్ఓబీ రోడ్డుపై బైఠాయించారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు గత ప్రభుత్వంలో 58 జీఓ కింద పట్టాలు ఇచ్చారని, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈమేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని, సమస్య కోర్టులో ఉన్నందున తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని సూచించడంతో ఆందోళన విరమింపజేశారు. కానీ కాసేపటికి మళ్లీ స్థానికులు ఆందోళనకు దిగడంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేరుకుని మద్దతు తెలిపారు. దీంతో మరోమారు అదనపు కలెక్టర్ వచ్చి నచ్చచెప్పారు. కాగా, శ్రీనివాసనగర్‌లో నిరుపేదల ఇళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై సీపీఎం ఆధ్వర్యాన కుటుంబాలతో కలిసి ఉదయం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం ఇవ్వగా, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. నాయకులు వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, ఎస్.కే.సైదులు, భూక్యా శ్రీనివాసరావు, బండారు రమేష్, దొంగల తిరుపతిరావు, ఎం.ఏ.జబ్బార్, ఎస్.కే.నాగులు మీరా తదితరులు పాల్గొన్నారు. కూల్చివేతలే కాంగ్రెస్ అజెండా ఖమ్మం వైరారోడ్: కాంగ్రెస్ ప్రభుత్వానికి విధ్వంసం, కూల్చివేతలు తప్ప మరో అజెండా లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం శ్రీనివాస్‌నగర్ ప్రాంతంలోని ఇళ్ల కూల్చివేతకు నోటీసులపై ఆయన ప్రకటన విడుదల చేశారు. పేదల ఇళ్లను కూల్చివేయాలనుకునే ఆలోచనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విరమించుకోవాలని కోరారు. -
నేత్రపర్వంగా గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: భక్తజన సందోహం నడుమ నృసింహుడి గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రం(స్వాతి నక్షత్రం) సందర్భంగా మంగళవారం ఖమ్మంలోని స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. తొలుత ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చి పల్లకీపై ఆసీనులను చేయించారు. ఆతర్వాత గుట్ట పైనుంచి కిందకు తీసుకువచ్చి నగర పుర వీధుల్లో ప్రదక్షిణ చేశారు. ఆతర్వాత గుట్టపైన ఆలయానికి చేర్చిన అర్చకులు అక్కడ రాతి కొండపై నక్షత్ర జ్యోతి వెలిగించారు. ఈఓ కె.జగన్మోహన్ రావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అర్చకులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నెస్పీ క్యాంప్‌లో ఇంజినీర్స్ డే ఖమ్మంఅర్బన్: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే వేడుకలను మంగళవారం ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఇంజనీర్లు, అధికారులు, విశ్రాంత ఇంజినీర్లు విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. ఇంజినీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈ వెంకట్రామ్, ఆర్అండ్బీ ఎస్ఈ యుగంధర్, రిటైర్డ్ ఇంజినీర్లు సత్యంబాబు, మధుసూదన్‌రావు, డీవీఎన్. చౌదరి, హన్మంతరావుతో పాటు వివిధ శాఖల డీఈలు, ఏఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. రేక్ పాయింట్‌కు ఎరువులు చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు మంగళవారం కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో 20–20–00–13 ఎరువులు 1,337.200 మెట్రిక్ టన్నులు, 24–24–0 ఎరువులు 1,178.95 మెట్రిక్ టన్నులు, 9–24–24 ఎరువులు 129 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు డీఏఓ ధనసరి పుల్లయ్య వెల్లడించారు. ఈ ఎరువులను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు కోటా వారీగా పంపిణీ చేయడమేకాక కొంతమేర బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు తెలిపారు. నేడు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ ఖమ్మం సహకారనగర్: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనాశక్తి, సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో బుధవారం జిల్లా స్థాయి నేషనల్ సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి సైన్స్ అధికారి తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థులు నూతన ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఆదివాసీ అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి కలిగిన ఎస్టీ నేతల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈనెల 16న ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించన్నుట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేయాలనుకునే ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖేలో ఇండియా ఆర్చరీ పోటీలకు ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా ఆర్చరీ పోటీలు ఖమ్మంలో జరగనున్నా యి. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయగా, దమ్మపేట మండలం పట్వారీగూడెంకు చెందిన కె.లోహితకు స్థానం దక్కింది. ప్రస్తుతం ఆమె హాకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ పొందుతోంది. రికర్వ్ ఈవెంట్లో ప్రతిభ కనబరిచిన ఆమెను పోటీలకు ఎంపిక చేశారు. ఆమెను ఆర్చరీ కమిటీ సభ్యుడు పుట్టా శంకరయ్య, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాదుల సారంగపాణి, డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి అభినందించారు. -
నేరాల కట్టడి, ప్రమాదాల నివారణ
ఖమ్మంక్రైం: గంజాయి అమ్మకాలు, వినియోగాలను పూర్తిగా నిర్మూలించేలా అనుమానం ఉన్న అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ గంజాయి వినియోగం, విక్రయాలను అరికట్టడమే కాక బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేకాక యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, సైబర్ నేరాల నియంత్రణకు సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని, నిందితుల వెనక నెట్‌వర్క్‌ను ఛేదించేలా దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే బ్యాంకులు–ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ నగదు ఫ్రీజ్ చేయించాలని చెప్పారు. కాగా, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అందుకు కారణాలను విశ్లేషించడం ద్వారా నివారణ చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. అంతేకాక అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్‌రూట్, హెల్మెట్ , సీట్ బెల్ట్ ధరించని వారిని గుర్తించేలా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే, పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా కోర్టుల్లో చార్జీషీట్లు దాఖలు చేయాలని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. నేర సమీక్ష సమావేశంలో సీపీ సునీల్‌దత్ -
నాణ్యమైన విద్య ప్రభుత్వాల బాధ్యతే..
తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ మురళిఖమ్మంరూరల్/కొణిజర్ల: ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యాన చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం సాయంత్రం ఖమ్మం జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పరిధి రాజీవ్ గృహకల్ప ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడగా ఆర్థిక స్తోమత లేకే ప్రభుత్వ బడికి పంపుతున్నామని తెలిపారు. ఇక్కడ 92మందితో ఐదు తరగతులు నిర్వహిస్తుండగా మూడే గదులు ఉన్నాయని చెప్పారు. మున్నేరు పొంగితే పాఠశాల మూతపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మురళి మాట్లాడుతూ పది జిల్లాల్లో పాఠశాలలను పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో పాటు లక్ష మంది తల్లిదండ్రులతో ప్రదర్శన చేసి సౌకర్యాల కల్పన కోసం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. రోజూ ఒక్కో జిల్లాలో కొన్ని పాఠశాలలు సందర్శించి ఒక పాఠశాలలో రాత్రి బస చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, అన్ని సౌకర్యాలతో మండలానికి నాలుగు ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం, ఏటా విద్యారంగానికి బడ్జెట్లో 18శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్లతో ఈ యాత్ర చేపడుతున్నామని మురళి వెల్లడించారు. ఈ యాత్రలో మాజీ ఐఏఎస్ ఎం.చంపాలాల్, డాక్టర్ ఎం.వీ.రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ పద్మజ, వివిధ వర్గాల ప్రముఖులు రుబీనా, నిర్మల, అశోక్ కుమార్, నిఖిల్, విజయ్, మణిభూషణాచారి, ఖలీల్, శంకరయ్య, విజయ్‌కృష్ణ, సృజన్యాదవ్, ఎన్.తిర్మల్, దండా లింగయ్య, విజయకుమార్, కనకయ్య పాల్గొన్నారు. కాగా, యాత్ర రాత్రి కొణిజర్ల మండలానికి చేరుకోగా, ఇక్కడి ఎల్లన్ననగర్ పాఠశాలలో స్థానికులతో మాట్లాడాక రాత్రి బస చేశారు. -
నీళ్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు?
నేలకొండపల్లి: ‘కాల్వలకు అవసరమైన నీటి సరఫరా చేయకుండా ఏం చేస్తున్నారు... విషయాన్ని కనీసం నా దృష్టికి తెచ్చారా... అందరూ బాధ్యత లేకుండా పని చేస్తున్నారు’ అంటూ జల వనరుల శాఖ అధికారులపై సీఈ వాసంతి మండిపడ్డారు. నేలకొండపల్లి మండలం మంగాపురం మేజర్ కాల్వకు నీరు రావడం లేదని గ్రామానికి చెందిన ధీరావత్ రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యాన రైతులు భూక్యా గోబ్రియా, శంకర్, నాగేశ్వరరావు తదితరులు మంగళవారం నిరసన తెలిపారు. రాజేశ్వరపురం వద్ద ప్రారంభమయ్యే నందిగామ బ్రాంచ్ నుంచి చెరువుమాధారం చెరువు నింపేందుకు నీరు విడుదల చేయగా, 15 కి.మీ. ప్రవహించాల్సి ఉంటుంది. కాల్వ సామర్థ్యం 980 క్యూసెక్కులైతే కేవలం 200 – 300 క్యూసెకులే విడుదల చేస్తుండడంతో మంగాపురం కాల్వకు ఇంకా చేరలేదు. ఇక చెరువుమాధారం, అప్పలనరసింహాపురం చెరువులకు చేరడానికి ఇంకా పది రోజులైనా పడుతుందని రైతులు పేర్కొన్నారు. అంతేకాక మేజర్ పరిధి 14, 26 కాల్వలకు కంట్రోలింగ్ షట్టర్లు లేక నీరు వృథా అవుతోందని ఖమ్మంలో సీఈ వాసంతికి వినతిపత్రం అందజేశారు. ఈక్రమాన స్పందించిన ఆమె మంగాపురం–19 మేజర్ కాల్వ పరిశీలనకు వచ్చారు. ‘మంగాపురం మేజర్‌కు ఎంత నీరు అందిస్తున్నారు.. ఎందుకు తక్కువ తీసుకున్నారు.. ఇబ్బందులు ఉన్న విషయాన్ని నాకెందుకు చెప్పలేదు.. నీటి సరఫరా పనులు వదిలేసి ఏం చేస్తున్నారు’ అంటూ అక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘ఎస్ఈ, డీఈలు పని చేయడం లేదు.. సెలవు దొరికితే వెళ్లిపోతున్నారు...’ అని పేర్కొన్నారు. ఇకపై మంగాపురం మేజర్‌కు 450, నందిగామ బ్రాంచ్ 16, 17 కెనాళ్లకు 800 క్యూసెకుల నీరు విడుదల చేయాలని సీఈ ఆదేశించారు. కల్లూరు ఎస్ఈ శ్రీకాంత్, నేలకొండపల్లి డీఈఈ పొట్టయ్య, ఏఈలు మనోజ్‌రెడ్డి, నరేష్, రుత్విక్‌రెడ్డి, మదీనా, పద్మరాజు, దీక్షిత తదితరులు పాల్గొన్నారు.అధికారుల తీరుపై ఇరిగేషన్ సీఈ మండిపాటు -
బకాయిలు చెల్లించకుండా కేసులా ?
ఖమ్మం సహకార నగర్: నిబంధనలకు విరుద్ధంగా అధికారుల దాడులు, వేధింపులకు నిరసనగా ఉమ్మడి జిల్లాలో రైస్‌మిల్లుల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చినట్లు అసోసియేషన్ బాధ్యులు వెల్లడించారు. ఈమేరకు ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో మంగళవారం నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఆతర్వాత మిల్లర్ల అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించడమే కాక బియ్యం సేకరణలో జాప్యంతో తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అంతేకాక తేమ విషయంలోనూ నష్టాన్ని భరిస్తున్నామని పేర్కొన్నారు. ఇక బియ్యం సిద్ధంగా ఉన్నా, గోదాంలు ఖాళీ లేవని నెలల పాటు జాప్యం చేస్తూ.. మరోపక్క మిల్లర్లను బాధ్యులుగా చేసి వడ్డీ, జరిమానా విధించడం సరికాదని తెలిపారు. అంతేకాక గత ఎనిమిదేళ్లుగా రవాణా చార్జీలు, గోదాము అద్దె ప్రభుత్వం చెల్లించడం లేదని వెల్లడించారు. ఇవన్నీ పక్కన పెట్టి అధికారులు మిల్లుల్లో తనిఖీల ద్వారా తమను వేధిస్తున్నారని, లెక్కల్లో స్వల్ప తేడా వస్తే రీ–కౌంటింగ్‌కు నిరాకరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించడమే కాక తనిఖీల పేరిట వేధింపులు నిలిచివేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, జుగల్కిషోర్ భండేల్వాల్తో పాటు జవ్వాజి నగేష్, వై.శ్రీనివాస్‌రెడ్డి, చలువాది నగేష్, పల్లెపోతు శ్రీనివాస్, మామిళ్లపల్లి రాంబాబు, వనమా సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ఉమ్మడి జిల్లాలో రైస్‌మిల్లుల నిరవధిక బంద్ -
ఫైనల్‌గా బిల్లు వచ్చేసింది!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చివరి బిల్లు అందుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ(పీఎంఏవైజీ) పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.72 వేల చొప్పున విడుదల కావాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లు వచ్చాక మరో రూ.28 వేలు కలిపి ఇవ్వాలని భావించింది. కానీ కేంద్రం నుంచి ఎంతకూ స్పందన లేకపోవడంతో చివరకు రాష్ట్ర ప్రభుత్వమే చివరి విడత బిల్లును మంజూరు చేసింది. దీంతో జిల్లాలో ఈ ఏడాది మార్చి 31నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 1,689 ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున రూ.16.89 కోట్లు జమ అయ్యాయి. మార్చి తర్వాత నుంచి ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించేందుకు గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది. సత్తుపల్లిలో అత్యధికం జిల్లాకు రూ.16,495 ఇళ్లు మంజూరు కాగా.. అత్యధికంగా 522 ఇళ్లను పూర్తి చేసి సత్తుపల్లి నియోజకవర్గం మొదటి స్థానాన నిలిచింది. ఇక్కడ మొత్తం 3,416 ఇళ్లు మంజూరు కాగా 2,092 ఇళ్ల పనులు చివరి దశకు చేరగా 522 ఇళ్ల గృహప్రవేశాలు జరిగాయి. ఇక పాలేరు నియోజకవర్గంలో 2,146 ఇళ్లు స్లాబ్ స్థాయికి చేరగా మొత్తం 3,421 ఇళ్లలో 415 నిర్మాణాలు పూర్తయ్యాయి. మధిర నియోజకవర్గంలో 2,719 ఇళ్లు మంజూరు కాగా, 1,828 ఇళ్లు స్లాబ్, 238 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వైరా నియోజకవర్గంలో 2,927 ఇళ్లకు గాను 1,619 స్లాబ్ స్థాయికి చేరగా, 305 గృహప్రవేశాలు జరిగాయి. ఖమ్మం నియోజకవర్గంలో 3,351 ఇళ్లకు గాను 1,405 స్లాబ్ పూర్తి కాగా, 166 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇల్లెందు నియోజకవర్గ పరిధి కామేపల్లి మండలంలో 661ఇళ్లకు 288 ఇళ్ల స్లాబ్ పనులు పూర్తి కాగా, 43 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఎల్–3 లబ్ధిదారులకు ఊరట గతంలో ఇళ్లు మంజూరైన పలువురికి ప్రొసీడింగ్స్ ఇవ్వగా పునాదులు, ఆ పైన నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ ఇందులో కొందరికి వాహనాలు ఉన్నాయని, ఏళ్ల క్రితం ఇళ్లు మంజూరయ్యాయనే కారణంతో దాదాపు 150 మందిని ఎల్3 జాబితాలో చేర్చారు. అంతేకాక బిల్లులు నిలిపివేశారు. ఈ అంశంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో బిల్లులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జీఓ విడుదల కానుంది. ఈ ఏడాది మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తయిన 1,689 ఇళ్ల లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున చివరి విడత బిల్లు జమ అయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు కూడా బిల్లులు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇక ఎల్–3 జాబితాలో ఉన్న 150 మందికి సైతం బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక ప్రొసీడింగ్స్ ఇచ్చి వారు ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించారు. – భూక్యా శ్రీనివాస్, పీడీ, గృహనిర్మాణ శాఖఇందిరమ్మ ఇళ్లకు విడతల వారీగా నిధులు మంజూరవుతాయి. బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, రూఫ్ లెవల్ నిర్మాణం జరిగాక ఇంకో రూ.లక్ష, స్లాబ్ స్థాయిలో రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష అందజేస్తారు. అయితే, లబ్ధిదారులకు మూడు విడతల్లో రూ.4 లక్షలు అందినా, చివరి విడత రూ.లక్ష విషయంలో జాప్యం జరిగింది. కేంద్రం నుంచి నిధుల మంజూరు ఆలస్యం జరగడంతో లబ్ధిదారులు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. మంజూరైన ఇళ్లు 16,495నిర్మాణాలు ప్రారంభం కానివి 1,953మార్కింగ్ చేసినవి 601పునాదులు పూర్తయినవి 1,551గోడలు పూర్తయినవి 1,323స్లాబ్ వేసినవి 9,378నిర్మాణం పూర్తయిన గృహాలు 1,689మొన్నటి వరకు పూరి గుడిసెలో జీవనం సాగింది. చిన్న వర్షం వచ్చినా ఇల్లంతా నీటితో కునుకు పట్టేది కాదు. ఎట్టకేలకు మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నిర్మాణం పూర్తిచేశాం. ఇప్పుడు సొంతింట్లో కంటి నిండా నిద్ర పోతుండగా.. చివరి విడత బిల్లు కూడా రావడంతో కష్టాలు తీరాయి. – షేక్ ఖురేషా, కోరట్లగూడెం, నేలకొండపల్లి మండలంఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలో ఆఖరి రూ.లక్ష జిల్లాలో 1,689మందికి రూ.16.89 కోట్లు -
వినాయక.. వివిధ రూపాయ!
రిక్కా బజార్లో బాల రాముడి రూపంలో వినాయకుడు, పక్కన హన్మంతుడువినాయక నవరాత్రులు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎవరికి వారు ప్రత్యేకత చాటేలా విగ్రహాలను కొలువుదీర్చారు. ఖమ్మం బ్రాహ్మణబజార్‌లో దక్షిణ ముఖ వినాయకుడి విగ్రహాన్ని గంగానది మట్టి, లక్ష సీడ్‌బాల్స్ ఉపయోగించి 40 అడుగుల ఎత్తుతో రూపొందించారు. అలాగే, గోపికలతో ఉన్న కృష్ణుడు, నరసింహస్వామి, బాల రాముడు, హన్మంతుడు, దశావతారాలతో కూడిన వినాయక విగ్రహాలు ఆకట్టుకునే రీతిలో ఉండడంతో దర్శనానికి భక్తులు వస్తున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన కేసీఆర్
ఖమ్మం వైరారోడ్: గిరిజనుల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి పది శాతం ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయడమే కాక తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పాలన, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయాన గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ఇకనైనా గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు, పోడు భూముల సమస్యలు, తండాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాక గిరిజనులకు రిజర్వేషన్ల కల్పన, తండాలు గ్రామపంచాయతీలుగా మార్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేలా ఈనెల 17న నిర్వహించనున్న కార్యక్రమాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చంద్రవతి కోరారు. ఈ సమావేశంలో నాయకులు వసంత, బదావత్ అనూష, బుగ్లోత్ మాధవి, బానోత్ దిక్షంనాయక్, జర్పుల బాలాజీ, బోడా మంచానాయక్, అమర్‌సింగ్, బోడా వీరకుమార్, భూక్యా సాయి, ధరావత్ శంకర్, బానోత్ కొండా, బానోత్ కిషన్, లకావత్ గిరిబాబు, మంచానాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చంద్రావతి -
మట్టి తరలింపును అడ్డుకున్న రైతులు
మధిర: మధిర మండలం యండపల్లి గట్టు సమీపాన వ్యవసాయ భూముల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీని మంగళవారం రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో పేదలకు కేటాయించిన భూముల నుంచి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల హక్కులను పరిరక్షించాలని రైతు సంఘం నాయకుడు మందడపు ఉపేందర్‌రావు కోరారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై విశ్వతేజ చేరుకుని రైతులతో చర్చించారు. సమస్యను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
అను‘బంధం’ తీర్చుకుంది..
వైరా: కడవరకు కలిసి జీవించాలని ప్రమాణం చేసిన భర్త రోడ్డుప్రమాదంలో తనువు చాలించాడు. సంతానం కూడా లేకపోవడంతో మిగతా జీవితం ఒంటరిగా జీవించాలనే బాధనుపంటి బిగువున భరిస్తూ నే ఆయన భార్య తలకొరివి పెట్టి కన్నీటి వీడ్కోలు పలికిన ఘటన ఇది. వైరా మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన పువ్వాళ్ల వెంకటేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అయితే, వెంకటేశ్వర్లుకు పిల్లలు లేకపోవడంతో ఆయన భార్య కళావతి కుండ మోసి చితికి నిప్పంటించింది. మున్సిపల్ వైస్‌చైర్మన్ కట్ల సంతోష్, నాయకులు చెరుకూరి కిరణ్, కర్నాటి హన్మంతరావు, పొదిల హరినాధ్, కోసూరి శ్రీనివాసరావు, కొల్లి రమేష్, మద్దెల రవి, తదితరులు కుటుంబీకులను పరామర్శించారు.భర్తకు తలకొరివి పెట్టిన మహిళ -
మక్క రైతుల విలవిల
సీడ్ పంట అమ్మి నెలలు.. ● అయినా ఇప్పటివరకు నగదు అందక ఎదురుచూపులు ● జిల్లా రైతులకు రూ.50కోట్ల మేర బకాయి?కొణిజర్ల: ఓ వైపు పెరిగిన పెట్టుబడుల భారం. మళ్లీ పంట వేద్దామన్నా ఎల్‌నినో కారణంగా నిరాశ.. ఈ పరిస్థితుల్లో గత రబీలో పంట అమ్మిన డబ్బులు కూడా అందక మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్న వైనమిది. జిల్లాలోని పలు మండలాల రైతులు గత రబీలో సీడ్ మొక్క(ఆడ – మగ) జొన్న సాగు చేశారు. ఆపై ఆర్గపైజర్లకు పంట అప్పగించగా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో కొత్త అప్పు పుట్టక అల్లాడి పోతున్నారు. వేలాది మంది సాగు జిల్లాలోని కొణిజర్ల, వైరా, తల్లాడ, ఏన్కూరు. బోనకల్, చింతకాని తదితర మండలాలకు చెందిన సుమారు 6వేల మందికి పైగా రైతులు పలు కంపెనీలకు చెందిన సీడ్ మొక్కజొన్న సాగు చేశారు. రబీలో సాగు చేసిన పంటను ఆరు నెలల క్రితమే ఏపీలోని ఓ ప్రైవేట్ విత్తన కంపెనీకి చెందిన ఆర్గనైజర్లకు అప్పగించారు. వారం రోజుల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పిన ఆర్గనైజర్లు, స్థానిక ఏజెంట్లు ఆ తర్వాత ముఖం చాటేశారు. అధిక దిగుబడి వస్తుందని, ఎక్కువ ధర చెల్లిస్తామని ఆశ చూపి తీరా డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని మండలాల్లో కలిపి రైతులకు దాదాపు రూ.50 కోట్ల మేర బకాయి ఉండొచ్చని తెలుస్తోంది. అధిక ధర వస్తుందని నమ్మి భారీగా పెట్టుబడి పెట్టడమే కాక భూమి కౌలు ముందే చెల్లించి సాగు చేశారు. తీరా డబ్బు అందకపోవడం.. కొత్తగా పంటల సాగుకు అప్పులు పుట్టక ఇబ్బంది పడుతున్నారు. నాకు ఎకరం భూమి ఉంది. అందులో ఏలూరు ఆర్గనైజర్ ద్వారా తీగలబంజర్ ఏజెంట్ ఇచ్చిన సీడ్ మొక్కజొన్న సాగుచేశా. 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఆర్గనైజర్‌కు అప్పగించా. ఆరు నెలలు దాటినా డబ్బులు ఇవ్వడం లేదు. అప్పులకు వడ్డీ పెరిగి పోతోంది. ఇకనైనా మా రైతుల బాధలను మంత్రులు, జిల్లా అధికారులు, నేతలు గుర్తించి తక్షణమే డబ్బులు ఇప్పించాలి. – భూక్యా సుమన్, మేకలకుంటసొంత భూమి ఎకరానికి తోడు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని సీడ్ మొక్క జొన్న సాగుచేశా. కౌలు, పెట్టుబడి కలిపి ఎకరాకు రూ.90 వేలు ఖర్చయింది. ఎకరాకు 40 క్వింటాళ్ల చొప్పున 200 క్వింటాళ్లు వచ్చింది. రూ.3.200 క్వింటా చొప్పున కొనుగోలు చేసి రూ.1.50 లక్షలే ఇచ్చారు. ఇంకా రూ.4 లక్షలకు పైగా నగదు కోసం ఆర్గనైజర్ చుట్టూ తిరుగుతున్నా. – పామర్తి బసవయ్య, రైతు, సింగరాయపాలెంకొణిజర్ల మండలంలోని మేకలకుంట, సిద్దిక్‌నగర్, సింగరాయపాలెం, మల్లుపల్లి, సాలెబంజర తదితర గ్రామాలతో పాటు ఏన్కూరు మండలం రేపల్లెవాడకు చెందిన రైతులు ఏపీ ఏలూరు ప్రాంతంలోని ఆర్గనైజర్ వద్ద సీడ్ మొక్కజొన్న కొనుగోలు చేశారు. వీరికి తీగలబంజరకు చెందిన ఓ రైతు ఏజెంట్‌గా వ్యవహరించాడు. అయితే విత్తనం ఫెయిల్ అయిందని, డీఎన్ఏ పరీక్షలు చేయాలంటూ వివిధ కారణాలు చెబుతూ డబ్బు ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నాడని సమాచారం. దాదాపు ఆరు నెలలు గడిచినా ఫలితం లేకపోవడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్, కలెక్టర్ దివాకర దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు నగదు అందేలా చూడాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
పెద్దాస్పత్రి కిటకిట
ఖమ్మం వైద్యవిభాగం: వరుస సెలవుల అనంతరం మంగళవారం ఖమ్మం జనరల్ ఆస్పత్రి కిటకిటలాడింది. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 8గంటలకే క్యూ మొదలైంది. అలాగే, ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. ఎండలో ఎదురుచూపులు జనరల్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం దివ్యాంగులను పరీక్షించేందుకు నిర్వహించిన సదరమ్ శిబిరానికి 230మంది హాజరయ్యారు. అయితే, యూడీఐడీ భవనం వద్ద షెడ్డు 50 – 60 మంది మాత్రమే సరిపోతుండగా, మిగతా దివ్యాంగులు, వారి సహాయకులు ఎండలో వేచి చూడాల్సి వచ్చింది. కనీసం టెంట్లు ఏర్పాటు చేయకపోవడం, ఇంతకాలం నీడ ఇచ్చిన చెట్లను తొలగించడంతో అవస్థ ఎదురైంది. -
న్యాయం చేయాలని స్టేషన్ ఎదుట ఆందోళన
ముదిగొండ: పోక్సో కేసు నమోదైన యువకుడిని వేధించిన ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ముదిగొండ పోలీసుస్టేషన్ వద్ద బంధువులు సోమవారం ఆందోళన చేపట్టారు. నిరసన తెలిపారు. ముదిగొండకు చెందిన మెట్టెల వినయ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదు కాగా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, బాలిక బంధువుతో పాటు నూకల నాగేశ్వరరావు రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసిన వినయ్ గత శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈమేరకు ఆయన మృతికి కారకులపై చర్య తీసుకోవాలని వినయ్ తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు సోమవారం పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. వినయ్ చనిపోయి ఐదు రోజులవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అరగంట పాటు స్టేషన్ ఎదుట మెట్టెల విజయ్ తల్లిదండ్రులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయమై సీఐ మురళిని విరణ కోరగా వినయ్ తండ్రి గోపయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే, వారు ఫిర్యాదులో పేర్కొన్న ఇద్దరు పరారీలో ఉండడంతో ఆచూకీ కోసం తమ సిబ్బంది గాలిస్తున్నారని వెల్లడించారు. -
కుమార్తె కళ్ల ముందే తండ్రి మృతి
కూసుమంచి: వినాయక చవితి పండుగ రోఉన మండలంలోని పోచారంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సట్టు శ్రీను(48) తన కుమార్తె నిశితతో కలిసి సోమవారం కూరగాయల కొనుగోలు నిమిత్తం ద్విచక్ర వాహనంపై కూసుమంచి వచ్చాడు. అక్కడి నుంచి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా కూసుమంచి పాత పోస్ట్ ఆఫీస్ వద్ద వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ట్రక్కు ముందు భాగం శ్రీను బలంగా తాకగా తల రెండు ముక్కలుగా చీలి అక్కడకక్కడే మృతి చెందాడు. ఘటనలో ఆయన కుమార్తెకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. కాగా, కళ్ల ముందే తండ్రి మృతి చెందగా తీవ్రగాయాల పాలైన నిశిత రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. కాగా, శ్రీనుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం -
భార్యను వెతికి వస్తుండగా ఉపాధ్యాయుడు మృతి
బోనకల్: మండలంలోని రామాపురం రైల్వే గేట్ సమీపంలో రైలు నుండి ప్రమాదవశాత్తు జారి పడిన ఉపాధ్యాయుడు మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల గ్రామానికి చెందిన జాటోతు సుందర్(50) మైలవరం ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉండగా ఇటీవల మతిస్థిమితం కోల్పోయిన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెను వెతికే క్రమాన హైదరాబాద్ వెళ్లి రైలులో తిరిగి వస్తుండగా సుందర్ ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. ఈమేరకు రైల్వే పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని రేగళ్ల పంపించారు.చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో జైలుశిక్ష ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్క చెల్లకపోవడంతో ముదిగొండకు చెందిన కొడకండ్ల రామారావుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బిక్కం రజిని మంగళవారం తీర్పు చెప్పారు. ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు వద్ద రామారావు 2018 డిసెంబర్లో రూ.5.10లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2021 జూలైలో రూ.8.26లక్షలకు చెక్కు ఇచ్చిన ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో వెంకటేశ్వర్లు కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం రామారావుకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.8.26లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మరొకరికి... ఖమ్మం బుర్హాన్‌పురానికి చెందిన మైలవరపు సంతోష్ వద్ద డాబాల బజార్ వాసి రాయపూడి శ్రీధర్ 2016 మేలో రూ.4 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2018 జూలైలో రూ.6.12లక్షలకు చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో సంతోష్ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం శ్రీధర్‌కు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.10లక్షలు చెల్లించాలని ఖమ్మం మూడో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి అరవ ప్రవీణ్ మంగళవారం తీర్పు చెప్పగా రూ.5వేల జరిమానా సైతం విధించారు. హత్యాయత్నం కేసులో ఐదేళ్లు.. ఖమ్మం లీగల్: హత్యాయత్నం కేసులో ఖమ్మం చెరువు బజార్ చెందిన మరుపల్లి రాంబాబుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శివరంజని మంగళవారం తీర్పు చెప్పారు. అంతేకాక రూ.41,500 జరిమానా విధించారు. ఖమ్మం వన్ టౌన్ పోలీసుస్టేషన్లో ఆయనపై 2024లో హత్యాయత్నం కేసు నమోదైంది. విచారణ అనంతరం దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు. కేసు దర్యాప్తు ఎస్సైలు ఓ.వెంకటేష్, యయాతి రాజు చేపట్టగా ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ పాపని స్వప్న వాదనలు వినిపించారు. ఈమేరకు ఎస్సైలు, ఏపీపీతో పాటు సీఐ కరుణాకర్, కానిస్టేబుల్ రామకృష్ణను సీపీ సునీల్‌దత్ అభినందించారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
ఏన్కూరు: గురుకులాలు, కేజీబీవీల్లోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు కోరారు. ఏన్కూరులోని గురుకులం, కేజీబీవీని మంగళవారం ఆయన నాయకులతో కలిసి సందర్శించారు. తొలుత ఎస్సెస్సీ ఉత్తమ ఫలితాలు నమోదైన కేజీబీవీ ప్రిన్సిపాల్ లావణ్యను సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ గురుకులాల పనివేళలను మార్చడమే కాక రాత్రి విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులకు సీసీఎల్ ఇవ్వాలని, రెండో శనివారం సెలవు ప్రకటించడమే కాక హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.గోపి, బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ బాధితులకు చేయూత ఖమ్మం మామిళ్లగూడెం: అసోంలో ఎదురైన తుఫాన్‌తో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు జమియాతే ఉలేమాయే హింద్ సంస్థ బాధ్యలు ముందుకొచ్చారు. ఈమేరకు జిల్లాలోని మసీదుల్లో రూ.1,52,200 విరాళాలు సేకరించారు. ఈ నగదును మంగళవారం జేయూహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎహెసనుద్దీన్కు జిల్లా బాధ్యులు మహమ్మద్ జవ్వాద్ అహ్మద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ సయీద్ అహ్మద్ ఖాస్వీ తదితరులు పాల్గొన్నారు. సాగర్ జలాలతో రైతులను ఆదుకోవాలి చింతకాని: పంటలను కాపాడేలా సాగర్ జలాలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. చింతకాని తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యాన మంగళవారం ధర్నా నిర్వహించగా ఆయన మాట్లాడారు. ఎల్‌నినో సాకుతో సాగర్ జలాలను విడుదల చేయకుండా ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని విమర్శించారు. ఇకనైనా నీరు విడుదల చేయడంతో పాటు యూరియా యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా సొసైటీల ద్వారా సరఫరా చేయాలన్నారు. అలాగే, పెసలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కరుణశ్రీకి వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, నల్లగొండలో నవంబర్ 15వ తేదీ నుంచి జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలన జయప్రదం చేయాలని సుదర్శన్‌రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చింతకానిలో 36 బెలూన్లు ఎగరవేసి ర్యాలీ నిర్వమించగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, సీపీఎం డివిజన్, మండల కార్యదర్శులు మడుపల్లి గోపాలరావు, దేశబోయిన ఉపేందర్, నాయకులు వత్సవాయి జానకీరాములు, తోటకూరి వెంకటనర్సయ్య, రౌతు అప్పారావు, దొడ్డ చందర్రావు, మద్దిని బసవయ్య, ఆలస్యం రవి తదితరులు పాల్గొన్నారు. పిడుగుపాటుతో వ్యక్తికి గాయాలు వైరారూరల్: మండలంలోని తాటిపూడికి చెందిన చిలక వెంకటేశ్వర్లు పిడుగుపాటుతో గాయపడ్డారు. ముసలిమడుగులోని గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు సోమవారం ఆయన వెళ్లారు. పాఠశాల గేట్ వద్ద నిలబడి ఉండగా సమీపంలో పిడుగు పడడంతో వెంకటేశ్వర్లు సొమ్మసిల్లగా, స్థానికులు వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వ్యభిచార ముఠా నిర్వాహకుడిపై పీడీ యాక్ట్ ఖమ్మం క్రైం: మహిళలను వ్యభిచారంలోకి దింపి ఆర్థిక లాభాలు పొందుతున్న బత్తుల బాలకృష్ణపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన ఆయన జిల్లాలోని వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడనిగుర్తించారు. ఈమేరకు ఖమ్మం టూ టౌన్, త్రీ టౌన్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి 6న ఖమ్మం గాంధీచౌక్‌లోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా బాలకృష్ణతో పాటు మరో మహిళ, లాడ్జి మేనేజర్ పట్టుబడ్డారు. ఈక్రమాన బాలకృష్ణపై పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. -
హైదరాబాద్‌లో రౌడీషీటర్ హత్య
నాగోలు/ఇల్లెందు: పాత గొడవల నేపథ్యాన ఓ రౌడీషీటర్‌ను దుండగులు కళ్లలో కారం చల్లి వెంబడించి వేట కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగోలు పోలీసులు తెలిపిన మేరకు.. భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన మహ్మద్ నయీమ్(34), అదే ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వర్రావు అలియస్ మహేష్ చిన్ననాటి స్నేహితులు. వీరు పలు కేసుల్లో ఉండగా ఇల్లెందులో రౌడీషీట్ తెరిచారు. దీంతో నయీమ్ నాగోలు బండ్లగూడ రాజీవ్ స్వగృహకు మకాం మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడ కూడా సెటిల్మెంట్లు చేస్తుండడంతో ఉప్పల్, నగరంలో కేసులు నమోదయ్యాయి. ఈక్రమాన సెటిల్మెంట్ డబ్బు విషయమై వివాదంలో నయీమ్‌ను చంపివేస్తానని మహేష్ హెచ్చరించాడు. సోమవారం రాత్రి బండ్లగూడలోని సుప్రీం వైన్స్ వద్ద ఇల్లెందుకు చెందిన రవి, ఖమ్మంకు చెందిన సాయి, వెంకటేష్‌తో కలిసి మద్యం తాగుతుండగా ప్రభుత్వ వాహనం బోర్డు ఉన్న కారులో వచ్చి నయీమ్ కళ్లల్లో కారం చల్లి వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. పారిపోయే ప్రయత్నంలో ఇనుప కడాయి(పెద్దపాత్ర)తో తలపై కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై నిందితులు కారులో పారిపోయారు. పోలీసులు చేరుకుని నయీమ్‌తో పాటు మద్యం సేవించిన వారినే కాక నయీమ్ హత్యలో పాల్గొన్న నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, వీరిలో మహేష్ ఉన్నట్లు సమాచారం. కాగా, హత్య జరిగిన వైన్స్‌లోని సీసీ కెమెరాల వీడియోలు కలకలం సృష్టించాయి. నిందితుల్లో ఖమ్మం వాసి? ఖమ్మంక్రైం: నయీమ్ హత్య ఘటనలో ఖమ్మం వాసి ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు కాల్వొడ్డు ప్రాంతానికి చెందిన ఓ రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.అంతమొందించిన చిన్ననాటి స్నేహితుడు? -
వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డు వినీత్ కుటుంబసభ్యులు
కృష్ణా: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం ఎయిర్‌పోర్టులో పోరంకి మహిళలు మంగళవారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. విషయంలోకి వెళితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బొడ్డు వినీత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే వినీత్ మృతి కేసును అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తమకు అండగా ఉండాలని వైఎస్ జగన్‌కు వినీత్ తల్లి సునీల, ఆమె కుటుంబసభ్యులు వినతిపత్రం అందించారు. దీనిని పరిశీలించిన వైఎస్ జగన్ వినీత్ కుటుంబసభ్యులకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. -
పెసరకు పిసరంతే...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకున్నా, అడపాదడపా కురిసిన వర్షాలతో సాగు చేసిన పెసర పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వ పరంగా కొనుగోళ్లు లేక కేంద్ర ప్రభుత్వం క్వింటాకు నిర్ణయించిన రూ.8,780 ధర దక్కక, వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారుల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌కు మార్క్‌ఫెడ్ లేఖ రాసి చేతులు దులుపుకుంది. గణనీయంగా పెరిగిన సాగు రాష్ట్రంలో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 64,610 ఎకరాలుగా అంచనా వేశారు. గత ఏడాది 61,348 ఎకరాల్లోనే సాగైంది. కానీ ఈసారి అంచనాలకు మించి 1,60,182 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాభావంతో మెట్టతోపాటు తరి పంటలు లేని చోట రైతులు పెసర సాగు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే 98,834 ఎకరాల్లో అదనంగా పంట సాగవగా.. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పంట చేతికి వచ్చి నూర్పిడి చేస్తున్న రైతులు వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తున్నారు. అయితే, ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకున్నా రెండు క్వింటాళ్లు దాటలేదు. ఈ పంటకు కూడా మద్దతు ధర లేక రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మద్దతు ధర హుష్ కేంద్ర ప్రభుత్వం పెసర క్వింటాకు రూ.8,780 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర మార్కెట్లలో ఎక్కడా దక్కడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పరిశీలిస్తే గత నెల 14న కొనుగోళ్లు ప్రారంభం కాగా క్వింటాకు గరిష్టంగా రూ.7,600, రూ.3,400 కనిష్ట ధరగా నమోదైంది. అంటే గరిష్ట – కనిష్ట ధరకు మధ్య వ్యత్యాసం క్వింటాకు ఏకంగా రూ.4,200 తేడా ఉంది. ఈనెల 1న గరిష్టంగా రూ.7,600 పలకగా.. కనిష్ట ధర రూ.3,400కే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర ఒక్క క్వింటాకూ దక్కలేదు. దిగుబడి లేదు.. ధర లేదు ఈ ఏడాది వర్షాలు అనుకూలించక పెసర దిగుబడి తగ్గింది. ఎకరాకు ఐదు క్వింటాళ్లకు బదులు రెండు క్వింటాళ్లు మించడం లేదు. రెండున్నర ఎకరాల్లో పెసర సాగు చేస్తే ఆరు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. మార్కెట్లో క్వింటాకు రూ.6,700 మాత్రమే ధర పెట్టడంతో ఇక్కడ కూడా నష్టపోయాం. – తూము వీరస్వామి, చింతకాని, ఖమ్మం జిల్లా ప్రభుత్వ కొనుగోలు లేక.. అంతా దగా ప్రభుత్వ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వ్యాపారుల ఇష్టం నడుస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర కన్నా క్వింటాకు రూ.3 వేలకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మంచి ధర పలికితే సాగు ఖర్చులైనా మిగిలేవి. – మడిపల్లి రమేశ్, రేపల్లెవాడ, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
● వైద్యులు, సిబ్బంది శ్రద్ధ వహించాలి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.మధిర: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఇందుకోసం వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. మధిర ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, వైద్యులు, సిబ్బంది హాజరు, ల్యాబ్ పరీక్షలు, ఔషధాల లభ్యత, వార్డులు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం కావాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించడమే కాక తాగునీరు, విద్యుత్ వసతులు మెరుగుపర్చాలని చెప్పారు. తొలుత కలెక్టర్ మధిరలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అదనపు భవన నిర్మాణ పనులను పరిశీలించి సూచనలు చేశారు. అలాగే, మధిర మండలం సిరిపురంలో జూనియర్ కళాశాల, ఐటీఐ భవనం, ఏఐటీసీ సెంటర్ పనులను కూడా తనిఖీ చేశారు. తహసీల్దార్ రాంబాబు, విద్యశాఖ ఇంజనీరింగ్ అధికారి బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ కళాశాల పనులు ప్రారంభించాలి చింతకాని: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. చింతకాని మండలం లచ్చగూడెంలో నర్సింగ్ కళాశాల నిర్మాణ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్ పనులను ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించి పనులు మొదలయ్యేలా చూడాలని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం కళాశాల నిర్వహించేందుకు మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియాలను పరిశీలించారు. సర్పంచ్ కొప్పుల రజిని, కళాశాల ప్రిన్సిపాల్ రాజమణి, కాంగ్రెస్ నాయకులు కొప్పుల గోవిందరావు, గొడుగు రమేష్ పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనుల్లో వేగం బోనకల్: బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ దివాకర సూచించారు. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన మాట్లాడుతూ నిర్మాణాలను నిర్ణీత సమయంలో నాణ్యతో పూర్తిచేయాలన్నారు. తహసీల్ధార్ సుధాకర్, ఉద్యోగులు నర్సింహారావు, నాగేశ్వరావు పాల్గొన్నారు. -
93.5 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక
ఖమ్మంవ్యవసాయం: పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలో 55 సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 93.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించినట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. కల్లూరు మండలంలోని మిట్టపల్లి సబ్‌స్టేషన్ పరిధి, వైరా మండలంలోని జానకీపురం సబ్ స్టేషన్ పరిధిలో రెండేసి మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఎస్ఈ పర్యవేక్షణలో శనివారం గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారా పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. అంతేకాక అదనపు విద్యుత్ లభ్యత పెరిగి, స్థానికంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు 25ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం లభించనుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పీఎం కుసుమ్ పథకం కింద ఐదు ప్లాంట్ల ద్వారా 9 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను గ్రిడ్‌కు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని సబ్ స్టేషన్ల సమీపాన ఉన్న ప్రభుత్వ భూములు సేకరించి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే తిరుమలాయపాలెం, పెద్దగోపతి, తల్లాడ సబ్ స్టేషన్లో ఒక్కో మెగావాట్ విద్యుత్ ప్లాంట్ల పనులు చేపట్టామని తెలిపారు. ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి -
విచారణకు రండి..
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా జిల్లాలోని అనామలీస్, అన్‌మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ జాబితాలో 1,75,841 మంది ఉండగా, ఇప్పటివరకు నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది విచారణకు హాజరుకాలేదు. సరైన ధ్రువపత్రాలతో నిర్దేశిత తేదీన విచారణకు రావాలని, లేకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంఅనామలీస్, అన్ మ్యాపింగ్ అయిన 1,75,841 మంది ఓటర్లకు నోటీసులు జారీ కానున్నాయి. ప్రస్తుత ఓటరు వివరాలు, వారి తల్లిదండ్రుల వివరాలు 2002 ఓటర్ల జాబితాలో అనుసంధానం కాకపోవడాన్ని అన్‌మ్యాపింగ్ జాబితాలో చేర్చారు. ఇక పేర్లు, ఇంటిపేర్లలో తేడాలు, అక్షర దోషాలు, వయస్సు తేడా ఉంటే అనామలీస్‌లో పెట్టారు. ఇలాంటి వారికి నోటీసులు జారీ చేస్తూ, ఎక్కడ తప్పు ఉంది, ఏయే పత్రాలతో ఎప్పుడు విచారణకు హాజరు కావాలో సూచిస్తున్నారు. ఈమేరకు ఓటర్లు అధికారులు సూచించిన రోజున విచారణకు హాజరు కావడంతోపాటు 11రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, నోటీసులు అందుకున్న 1,56,621 మందిలో కేవలం 58,451 మందే విచారణకు హాజరయ్యారు. కాగా, నిర్దేశిత రోజు కుదరకపోతే మరో రోజైనా రావాలని, అయినా హాజరుకాకపోతే ఓటు హక్కు కాపాడుకునేందుకు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు వచ్చే సమయాన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి. ఇందులో 10వ తరగతి మెమో, కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. కాగా, ఓటరుతో పాటు తల్లిదండ్రుల కుల ధ్రువీకరణ, ఇతర పత్రాలు లేకపోవడంతో దరఖాస్తు చేసుకోగానే త్వరగా జారీ చేసేలా తహసీల్దార్ కార్యాలయాలకు కలెక్టర్ దివాకర ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు ఓటర్లు ఈ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. హియరింగ్‌కు హాజరైన ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాల్లో ఒకటి సమర్పిస్తే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ గుర్తింపు కార్డు, 1987 జూలై 1కి ముందు ప్రభుత్వ అధికారులు, బ్యాంక్, పోస్టాఫీస్, ఎల్ఐసీల జారీ చేసిన గుర్తింపు కార్డు / ధ్రువీకరణపత్రం / అధికారిక పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, శాశ్వత నివాస ధ్రువీకరణపత్రం, అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, జాతీయ పౌర పట్టిక, రాష్ట్ర / స్థానిక అధికారులచే తయారు చేయబడిన కుటుంబ రిజిస్టర్,. భూమి లేదా ఇంటి కేటాయింపు ధ్రువీకరణ పత్రం, 1987 జూలై 1ముందు జన్మించిన వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 1, 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారైతే దరఖాస్తుదారుల సొంత పత్రంతోపాటు తల్లిదండ్రులలో ఒకరి పత్రం కూడా సమర్పించాలి. 2024 డిసెంబర్ 2తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రులిద్దరి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి.జిల్లాలో 1,75,841 మందికి ‘సర్’ నోటీసులు -
సత్వర న్యాయమే లక్ష్యం
● లోక్ అదాలత్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు ● జిల్లాలో 11,168 కేసుల పరిష్కారంఖమ్మం లీగల్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు తెలిపారు. ఖమ్మంలోని జిల్లా కోర్టుతో పాటు సత్తుపల్లి, మధిర కోర్టుల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించగా, ఖమ్మం న్యాయ సేవాసదన్‌లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దేవీమానస అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా జడ్జి మాట్లాడారు. పురాతన కాలంలో రచ్చబండ వంటి వేదికల ద్వారా న్యాయం చెప్పేవారని, ప్రస్తుత లోక్ అదాలత్‌కు అదే మూలాధారమని అన్నారు. పెండింగ్ కేసులు, సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాలు గెలవడమే కాక ప్రశాంత వాతావరణం నెలకొంటుందని తెలిపారు. అనంతరం న్యాయమూర్తులు వి.సీనయ్య, మహేష్నాధ్, కృష్ణార్జున్, బార్ కౌన్సిల్ సభ్యుడు మందడపు శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యడ్లపల్లి రమేష్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా శాశ్వత, అంతిమ పరిష్కారం లభిస్తుందని, కేసుల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఆతర్వాత లోక్ అదాలత్ ద్వారా రాజీ పడిన మూడు కేసుల్లో కక్షిదారులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఓ కేసులో రోడ్డు ప్రమాద బాధిత మహిళకు రూ.88 లక్షల బీమా చెక్కు అందించారు. న్యాయమూర్తులు కల్పన, శివరంజని, మురళీమోహన్, జ్యోతిర్మయి, రజని, బిందుప్రియ, ప్రవీణ్, నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ కార్యదర్శి కొప్పుల రవికుమార్, ఉపాధ్యక్షుడు జానీమియాతో పాటు పోలీసు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 11,168 కేసులు పరిష్కారం లోక్ అదాలత్ నిర్వహణకు ఖమ్మంలో జిల్లా కోర్టులో పలు బెంచ్‌లు ఏర్పాటుచేశారు. అలాగే, మధిర, సత్తుపల్లి కోర్టుల్లోనూ లోక్ అదాలత్ నిర్వహించగా మొత్తంగా 11,168 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 80, క్రిమినల్ కేసులు 1,246 పరిష్కారం కాగా, 75 మోటార్ ప్రమాద కేసులను పరిష్కరించడంతో బాధితులకు రూ.5.85 కోట్ల పరిహారం అందింది. ఇక చెక్ బౌన్స్, ఎస్టీసీ, సైబర్ క్రైమ్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు కూడా పరిష్కరించగా రూ.2,60,63,115 పరిహారం అందజేశారు. ఇందులో సైబర్ క్రైమ్ బాధితులకు రూ.27,90,612 అందజేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఈమేరకుఅత్యధిక పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు న్యాయవాదులు, సహకరించిన కక్షిదారులను ఆయన ఓ ప్రకటనలో అభినందించారు. -
కరుణ చూపిన వరుణుడు
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం ● వడబడుతున్న పైర్లకు ప్రాణం ఖమ్మంవ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు రుతుపవన ద్రోణి కారణంగా శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సింగరేణి మండలంలో భారీవర్షం కురవగా, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో తేలికపాటి వర్షం నమోదైంది. గేటు కారేపల్లిలో 65 మి.మీ. భారీ వర్షపాతం నమోదు కాగా సత్తుపల్లిలో 53.5, సత్తుపల్లి ఓసీల వద్ద 51.5, పెనుబల్లిలో 36.3, వేంసూరులో 25.6 మి.మీల వర్షపాతం నమోదైంది. అలాగే, సిరిపురంలో 8, వైరా ఏఆర్ఎస్ వద్ద 6.8, కల్లూరులో 6.5, పంగిడిలో 6.3, కుర్నవల్లిలో 4 మి.మీ.ల వర్షపాతం నమోదైందని అధికారులు నివేదిక విడుదల చేశారు. ప్రాణం పోసుకున్న పైర్లు కొద్దిరోజులుగా వర్షాలు లేకపోగా, మండిపోతున్న ఎండలతో పత్తి, మిర్చి, వరి పంటలు వడబడుతున్నాయి. ఈ నేపథ్యాన శనివారం కురిసిన వర్షంతో పైర్లకు కొంత మేర ప్రాణం పోసినట్లయింది. ప్రధానంగా పూత, కాత దశలో ఉన్న పత్తికి ఈ వాన ప్రయోజనం కలిగిస్తుంది. పత్తి కాయ విచ్చుకొని పంట వచ్చేందుకు ఈ వాన దోహదపడే అవకాశముంది. అలాగే, ఉద్యాన పంటలు, కూరగాయల పంటలు, మిర్చితో పాటు వరికి కూడా కొంత మేరకు ప్రయోజనం కలిగించింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉండడంతో భారీ వర్షంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇక వర్షంతో వాతావరణం చల్లబడగా ఉక్కపోతతో సతమతమైన జనం ఊపిరి పీల్చుకున్నారు. -
కేసీఆర్ హయాంలో కోతల్లేని కరెంట్
సత్తుపల్లి/వేంసూరు: పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో సీఎంగా కేసీఆర్ రైతాంగానికి కోతలు లేకుండా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గంటలు కూడా ఇవ్వలేకపోతోందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని తెలిపారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ వేంసూరు మండలం కందుకూరు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శనివారం భరణిపాడు, దుద్దేపూడి, కందుకూరు, లచ్చన్నగూడెం, వెంకటాపురం రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యాన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని కథనాలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు త్రీ ఫేజ్ కరెంట్ ఎన్ని గంటల పాటు ఇస్తున్నారో లాగ్ బుక్ చూపించాలని కోరితే అధికారులు నిరాకరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నెలలోనే విద్యుత్ సమస్యలను తీర్చి ప్రజలకు వెలుగులు పంచారని చెప్పారు. ఖర్చుకు వెనకాడకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు అందించిన ఘనత తమ పార్టీదేనని తెలిపారు. ఇప్పుడు ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని పేర్కొన్నారు. అంతేకాక వరిలో ఎంపిక చేసిన సన్న రకా లకు బోనస్ ఇస్తామని చెప్పడం, యూరియా యాప్ తో ఇబ్బందులు తీర్చకపోవడం, బీమా అమలులో జాప్యం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని సండ్ర ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు మందపాటి వెంకటరెడ్డి, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, యర్రా రమేష్, పాల వెంకటరెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, మోరంపూడి శ్రీధర్, దొడ్డా వెంకటకృష్ణారెడ్డి, మందపాటి మహేశ్వర్‌రెడ్డి, రాయల సత్యనారాయణ, నాగరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు. -
భూవివాదాలు ఉన్నా యథావిధిగా సర్వే
బోనకల్: ఎక్కడైనా భూవివాదాలు ఉన్నప్పటికీ భూముల రీసర్వే మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో రీ సర్వేను ఆయన శనివారం పరిశీలించారు. ఈక్రమాన కొందరు రైతులు సర్వే నంబర్ల పరిధిలో వివాదాలు ఉన్నందున సర్వే నిలిపివేయాలని కోరగా, అదనపు కలెక్టర్ స్పందిస్తూ క్షేత్రస్థాయి సర్వేలో అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా తేల్చుకోవాలని సూచించారు. అంతేతప్ప సర్వే ఆపేది లేదని, ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని తెలిపారు. సర్వే రికార్డులు, ప్రస్తుత స్థితికి తేడా ఉంటే డొంక వెడల్పు 33 అడుగులుగా హద్దులు నిర్ణయించి, రికార్డుల ప్రకారం కేటాయిస్తామని స్పష్టం చేశారు. అలాగే, కెనాల్ భూమిని ఎవరైనా కలిపి సాగు చేసుకుంటున్నా కొలతల ప్రకారం భూమి సంబంధిత శాఖ పరిధిలోకి వెళ్తుందన్నారు. ప్రస్తుతం ప్రాథమిక కొలతలు మాత్రమే(సేత్వార్ ప్రక్రియ) ఖరారు చేస్తుండగా, దీని ఆధారంగా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయబోమని తెలిపారు. కొలతలు పూర్తయ్యాక అభ్యంతరాల స్వీకరించి వాటిని పరిష్కరించాకే తుదిరికార్డులు సిద్ధమవుతాయని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, సర్వేయర్ రవి, ఆర్ఐ నర్సింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
జమలాపురంలో భక్తుల అన్నదానానికి రూ.లక్ష విరాళం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్‌కు అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరిపించారు. ఈ సందర్భంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కొత్త మంగాపురం గ్రామానికి చెందిన వేమిరెడ్డి రామకోటారెడ్డి – లావణ్య దంపతులు ఆలయంలో అన్నదానానికి రూ.1,00,011 విరాళం అందజేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ‘భారత్ పశుధన్’ పోర్టల్‌లో రైతుల వివరాలు నేలకొండపల్లి: జిల్లాలో పశువులు కలిగిన ప్రతీ రైతు వివరాలను భారత్ పశుధన్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ పురంధర్ సూచించారు. మండలంలోని చెన్నారంలో శనివారం పశువైద్య శిబిరం నిర్వహించి పశువులకు పరీక్షలు చేశాక వ్యాక్సిన్లు వేశారు. ఈ శిబిరాన్ని పరిశీలించిన పురంధర్ మాట్లాడుతూ పోర్టల్‌లో రైతుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చే సిబ్బందికి ఆధార్ నంబర్, ఇతర వివరాలు అందించాలని సూచించారు. ఇంకా జిల్లాలో 15వేల మంది మిగిలి ఉన్నందున ముందుకు రావాలని తెలిపారు. కాగా, సాస్కిలో భాగంగా చేపట్టిన కృత్రిమ గర్భధారణ లక్ష్యాన్ని ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే, లంపిస్కిన్ వ్యాధి కట్టడికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ డాక్టర్ కె.కిషోర్, పశు వైద్యాధికారులు శ్రీనివాసరావు, భువనేష్, ఉద్యోగులు, నాయకులు వెంకటేశ్వరరావు, చింతనిప్పు సైదులు, నాగరాజు, తాజ్‌పాషా, నరేష్, పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు. కమనీయం.. రామయ్య కల్యాణంభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం రామయ్య నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారి సన్నిధిలో అరకు ఎంపీశ్రీ సీతారామ చంద్రస్వామివారిని శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఎంపీ గుమ్మ తనుజా రాణి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దర్శించుకున్నారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఐదు రోజుల పని దినాలే లక్ష్యం
ఖమ్మంగాంధీచౌక్: వారానికి ఐదు రోజుల పని దినాలు అమలుచేయాలనే డిమాండ్‌తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మె నిర్వహించారు. ఖమ్మంలోని వైరారోడ్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ 11 ఏళ్లుగా కోరుతున్న ఐదు రోజుల పనిదినాలు అమలు చేయడమే కాక ప్రభుత్వ ప్రత్యేక వివక్షాత్మక పీఎల్ఐ స్కీంను ఉపసంహరించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూఎఫ్‌బీయూ నాయకులు ఎస్.కే.ఇబ్రహీం, టి.రాజేష్, కె.రాంబాబు, శ్రీకాంత్, ఆర్.శివకుమార్, జి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎస్ఎన్ఎల్, టీయూసీఐ ప్రతినిధులు కల్యాణం వెంకటేశ్వరరావు, సింగు నర్సింహారావు, సీతా మహాలక్ష్మీ, తిరుమలాచారి, సీహెచ్.పుల్లయ్య తదితరులు సంఘీభావం తెలిపారు. ఒక రోజు సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు -
సాగుకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి
కూసుమంచి: వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడమే కాక లోఓల్టేజీ సమస్యను పరిష్కరించి పంటలను కాపాడాలని సీపీఎం, తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కూసుమంచిలోని విద్యుత్ శాఖ ఏడీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి డీఈఈ సీహెచ్.నాగేశ్వరరావు, ఏడీఏ వెంకట్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, నాయకుడు మల్లెల సన్మతరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నా కనీసం 8గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తున్న నేపథ్యాన ఇకనైనా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం, రైతు సంఘం నాయకులు యడవల్లి రమణారెడ్డి, బిక్కసాని గంగాధర్, శీలం గురుమూర్తి, కర్ణబాబు, గన్యా నాయక్, జవ్వాజి శీను, సోమనబోయిన కృష్ణయ్య, ఊడుగు వెంకన్న, ఎర్రబోయిన సురేష్, ఎస్.కే బాబు, బాసు నాయక్, గుగులోత్ నాగేశ్వరరావు, వై.రంగయ్య, వెన్ను ఉపేందర్, మాధవరావు, సురేష్ ఉపేందర్, ప్రసాద్, పాల్గొన్నారు. -
సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన ఏడీఈ
వేంసూరు: విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో నీరు అందించలేని పరిస్థితి ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయని జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యాన రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో శుక్రవారం ‘రైతుల వరిగోస’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో సత్తుపల్లి ఏడీఈ ప్రసాద్‌బాబు, వేంసూరు ఏఈ అంకారావు శుక్రవారం వేంసూరు కందుకూరు సబ్ స్టేషన్‌ను పరిశీలించారు. సబ్ స్టేషన్ నుంచి రోజువారీగా సరఫరా అవుతున్న విద్యుత్ వివరాలే కాక ఎప్పుడెప్పుడు అవాంతరాలు వచ్చాయన్న వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. పంటలు ఎండకుండా విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. -
సహాయ ఉపకరణాలకు విద్యార్థుల గుర్తింపు
ఖమ్మం సహకారనగర్: దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాలు అందజేసేందుకు ఖమ్మం నయాబజార్లోని భవిత కేంద్రంలో శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. అలింకో, సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ శిబిరంలో ఖమ్మం అర్బన్‌తోపాటు 11 మండలాల విద్యార్థులు హాజరయ్యారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహించాక వీల్చైర్లు, త్రిచక్ర వాహనాలు, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ కిట్లు, వైట్ కేన్లు తదితర ఉపకరణాలు అవసరమైన వారిని గుర్తించారు. జిల్లాలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిబిరాలకు 514 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బాజోజు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శైలజాలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఫిజియోథెరపిస్టులు పాల్గొన్నారు. పుచ్చ పంట ధ్వంసం పెనుబల్లి: పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామంలో కౌలు రైతు మాయర సూర్యనారాయణకు చెందిన పుచ్చ పంటను గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామంలోని కళ్యాణం నాగేశ్వరావుకు చెందిన రెండెకరాలు భూమిని సూర్యనారాయణ కౌలుకు తీసుకుని పుచ్చ పంట సాగు చేస్తున్నాడు. ఈమేరకు పంటను ధ్వంసం చేయగా, బాధితులు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వీఎం.బంజరు ఎస్ఐ ఎస్.కే.షాకీర్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
ఖమ్మంవ్యవసాయం: అటవీ సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, పోలీసు కమిషనర్ సునీల్‌దత్, జిల్లా అటవీ అధికారి అనూజ్ అగర్వాల్ మాట్లాడుతూ అమరవీరుల ఆశయాలు, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు కూడా అటవీ శాఖకు సహకరించాలని కోరారు. అక్రమంగా చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట, ఇతర అటవీ నేరాలను అరికట్టడంలో భాగం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ అటవీ అధికారి భవానీశంకర్, రేంజ్, డిప్యూటీ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అటవీ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీ అమరుల దినోత్సవంలో అధికారులు -
పెద్దాస్పత్రిలో సేవల విస్తరణ
జనరల్ ఆస్పత్రిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టితో సేవలు మెరుగుపడుతుండగా, త్వరలోనే ఎంఆర్ఐ అందుబాటులోకి రానుంది.శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఓటర్లు ఆందోళన చెందొద్దుప్రశ్న : నా ఓటరు ఐడీలో మా నాన్న పేరు, నా పేరు ఒకటే ఉంది. అన్ని వివరాలు సమర్పించినా ఇప్పుడు నోటీసు ఇచ్చి 18న విచారణకు హాజరు కావాలని చెప్పారు. – గుడిపల్లి జ్యోత్స్న, తల్లాడజవాబు : మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నిర్ణీత తేదీన పదో తరగతి సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం ఏది ఉన్నా తీసుకుని మీ నాన్నతో కలిసి వెళ్లండి. సమస్య పరిష్కారం అవుతుంది. మ్యాపింగ్ కరెక్ట్‌గా ఉంటే పరిష్కరిస్తారు.‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో నోటీసులు అందుకునే ఓటర్లు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ దివాకర టీ.ఎస్. స్పష్టం చేశారు. ‘సర్’పై ఓటర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యాన నిర్వహించిన ఫోన్ ఇన్‌లో ఓటర్ల సందేహాలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. అక్షర దోషాలు, వయసు లేదా పేర్లలో వ్యత్యాసాలను సిస్టమ్ ‘ఫ్లాగ్’ చేయడంతో నోటీసులు జారీ అవుతున్నాయని తెలిపారు. చాలావరకు సమస్యలను అధికారుల స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. అయితే, నోటీసులు అందుకున్న వారు నిర్ణీత తేదీన 11 రకాల ఆమోదిత పత్రాల్లో ఒకటి సమర్పించేలా విచారణకు కచ్చితంగా హాజరు కావాలని, తద్వారా ఓటు కోల్పోకుండా తప్పులు సరిచేసే వీలుంటుందని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు లేనివారు తహసీల్‌లో దరఖాస్తు చేసుకుంటే రెండు, మూడు రోజుల్లో ఇచ్చేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. నోటీసులు అందుకున్న వారు కేటాయించిన తేదీలో విచారణకు రాకున్నా, పత్రాలు సమర్పించలేకపోయినా రీ–షెడ్యూల్ ద్వారా మరో అవకాశం కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 7వరకు క్లయిమ్‌లు, అభ్యంతరాల గడువు ఉండగా, తుది ఓటరు జాబితా నవంబర్ 9న విడుదలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ల సందేహాలు, కలెక్టర్ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి. ప్ర : మాది ఖమ్మంలోని 50వ డివిజన్. సర్‌లో అన్ని పత్రాలు ఇచ్చిన నోటీసు వచ్చింది. మా నాన్నగారి సర్టిఫికెట్ కావాలంటే ఇచ్చినా రిజెక్ట్ అయింది. ఆరా తీస్తే మా అమ్మ సర్టిఫికెట్ కావాలంటున్నారు. వాళ్లు ఎప్పుడో చనిపోయినందున ఏంచేయాలో అర్థంకా వడం లేదు. – యాకూబ్‌పాష, బుర్హాన్‌పురం, ఖమ్మంజ : మీకు ఇచ్చిన నోటీసులోని తేదీ, వేదిక ఆధారంగా అక్కడికి వెళ్లి సమస్యను వివరించండి. మీ తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారంటున్నారు. విచారణ అధికారికి నేను చెబుతాను. ప్ర : మా వివరాలన్నీ సక్రమంగానే ఉన్నా, మా కుటుంబసభ్యుల ఓట్లు నాలుగైదు డివిజన్లలోకి మారాయి. మీసేవ సెంటర్‌కు వెళ్తే బూత్ నంబర్ ఆప్షన్ లేదన్నారు. – చిరుమామిళ్ల నాగేశ్వరరావు, రాధాకృష్ణ నగర్, ఖమ్మం జ : ఒకే కుటుంబంలోని సభ్యుల ఓట్లు వేర్వేరు డివిజన్లలోకి వెళ్తే.. పోలింగ్ స్టేషన్ పరిధిలోకి ఓటు మార్చుకునేలా దరఖాస్తు చేసుకోండి. ఎస్ఐఆర్ ముగిశాక ఫామ్–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్ర : కూసుమంచిలో నివాసం ఉంటే చలమయ్య కుటుంబానికి పాలేరులో ఓట్లు ఉన్నాయి. బీఎల్ఓ అడిగినప్పుడు కూసుమంచిలో ఓట్లు కావాలని చెప్పారట. కానీ ఇ ప్పుడు రెండు చోట్ల లేకుండాపోయాయి. – గుండా ఉపేందర్‌రెడ్డి, కూసుమంచిజ : బీఎల్ఓకు వారు ఏం చెప్పారో తెలుసుకోండి. కూసుమంచిలో ఓటు కావాలంటే ఫామ్–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ సమయాన మరెక్కడా ఓట్లు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి. ప్ర : రెండు చోట్ల ఓట్లు ఉంటే ఓచోట ఆటోమేటిక్‌గా ఓటు తీసేస్తారా? మా సోదరుడు వేరే ప్రాంతంలో ఉంటూ అక్కడ ఓటు ఉండి ముజ్జుగూడెంలోనే కొనసాగితే రెండో ప్రాంతంలో తీసేస్తారా? – కె.నరేష్, ముజ్జుగూడెం, నేలకొండపల్లిజ : ఓటు హక్కు ఉన్నచోటల్లా ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. మీకు ఓటు కావాల్సి న చోటే ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తే కొనసాగుతుంది. అవసరం లేని చోట ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే అక్కడి ఓటు డిలీట్ అవుతుంది. ప్ర : ఏజ్ ప్రెగ్నెన్సీ గ్యాప్ అని నోటీస్ ఇచ్చారు. మా నాన్న బర్త్ సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సర్టిఫికెట్లు బీఎల్ఓకు ఇస్తే ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. డాక్యుమెంట్లు సక్రమంగా అప్లోడ్ చేశారా, లేదా తెలుసుకోవచ్చా? – రత్నబాబు, ఖమ్మంజ : మీరు విచారణ కు వెళ్లినప్పుడు మీది, పత్రాల ఫొటో తీసుకు ని అప్లోడ్ చేస్తారు. ఇప్పటికే అప్లోడ్ చేసి ఉంటే మీరు చూసుకోవచ్చు. వివరాలు సక్రమంగానే చేస్తారు. సందేహాలుంటే ఏఈఆర్ఓను అడగండి. ప్ర : నోటీసు వచ్చాక పత్రాలు సమర్పించాం. ఆ పత్రాలు సరైనవే అయినా పేర్లు తొలగించే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అలా జరిగితే అప్పీల్ చేసుకోవచ్చా? – బి.గణేష్‌రెడ్డి, సత్తుపల్లిజ : అప్పీల్ చేసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. మీకేమైనా తప్పు జరిగిందనిపిస్తే డీఈఓ(డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్)కు అప్పీల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా న్యాయం జరగలేదనుకుంటే సీఈఓ (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్)కు సైతం అప్పీల్ పెట్టుకోవచ్చు. ప్ర : హెవీ వాటర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన నాకు నోటీసులు రావడంతో గురువారం విచారణకు హాజరయ్యా. కానీ రీచ్ కావడం లేదంటూ మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పారు. – మురళీకృష్ణ, నాయుడుపేట, ఏదులాపురం మున్సిపాలిటీ జ : మీరు వివరాలన్నీ ఇచ్చామని చెబుతున్నారు. సాంకేతిక పరమైన ఇబ్బందితో అలా జరిగి ఉంటుంది. అది ఓకే అయితే ఫర్వాలేదు. లేకపోతే మరోసారి విచారణకు పిలుస్తాం. ప్ర : విచారణలో తల్లిదండ్రుల సర్టిఫికెట్లు అడుగుతున్నారు. కొందరి వద్ద ఆ సర్టిఫికెట్లు లేవు. ఒకే ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే బూత్‌లు వేరేగా ఉంటున్నా యి. – శీలంశెట్టి వీరభద్రం, బుర్హాన్‌పురం, ఖమ్మంజ : తల్లిదండ్రులకు ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోతే తహసీల్‌లో దరఖాస్తు చేసుకోండి. గత నాలుగు నెలల నుంచి ఇదే విషయం చెబుతున్నాం. ఎస్ఐఆర్ గడువు కూడా పెంచాం. విచారణకు హాజరయ్యేందుకు రెండుసార్లు అవకాశం కల్పించాం. ఒకే ఇంటి కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే బూత్‌లోకి రావడానికి ఫామ్–8లో షిఫ్టింగ్ పెట్టుకోవాలి. అలాగే ఎడిట్ పెట్టుకోవాలి. ప్ర : మా దగ్గర ఉన్న 200 మంది ఓట్లు పెనుబల్లి పరిధిలోకి వెళ్లాయి. అలాగే అక్కడి ఓట్లు కూడా వీఎం బంజరలోకి వచ్చాయి. – భూక్యా ప్రసాద్, సర్పంచ్, వీ.ఎం.బంజర జ : దీనిపై విచారణ చేయిస్తా. అక్కడికి అధికారులను పంపించి ఏం జరిగిందో తెలుసుకుంటాం.ప్ర : మా నాన్న పేరు మహ్మద్ అబ్దుల్ సత్తార్ అయితే పొరపాటున షేక్ అని వచ్చింది. అలాగే నాది, మా సోదరుడి పుట్టిన సంవత్సరం ఒకటే కావడం, సోదరుడి తండ్రి ఇంటి పేరు వద్ద మహ్మద్ అని ఉండడంతో నోటీసు ఇచ్చారు. – షేక్ సద్దాం, బల్లేపల్లి, 3వ డివిజన్, ఖమ్మం కార్పొరేషన్ జ : మీ పదో తరగతి సర్టిఫికెట్ లేనందున బీసీ సర్టిఫికెట్, తల్లిదండ్రుల బీసీ సర్టిఫికెట్తో విచారణకు వెళ్లండి. సర్టిఫికెట్ లేకపోతే తహసీల్‌లో దరఖాస్తు చేసుకుని అది ఇస్తే సరిపోతుంది. ఇంటి పేరు షేక్ నుంచి మహ్మద్‌కు మారడానికి తర్వాత ఫామ్–8 ఇవ్వండి.ప్ర : చాలామందితో మేము ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపించాం. బీఎల్ఓలు కొన్ని ఫామ్స్ నింపే సమయాన తప్పులు చేయడంతో కొందరికి నోటీసులు వచ్చాయి. ఒక్కో బూత్ నుంచి చాలామందికి నోటీసులొచ్చాయి. – ఆరెంపుల వీరభద్రం, రాపర్తినగర్, ఖమ్మంజ : విచారణ సమయంలో మీరు చేసింది తప్పా, ఒప్పా.. అని చూడడమే కాక బీఎల్ఓ దగ్గర జరిగిందని తెలిసినా సవరిస్తారు. నోటీసులు వచ్చిన వారందరినీ విచారణకు వెళ్లమని చెప్పండి. గడువు పొడిగించినందున విచారణ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నారు. -
కొత్త చట్టాలపై పూర్తి అవగాహన
ఖమ్మంక్రైం: పోలీసు శాఖలోని ప్రతీ ఉద్యోగి క్రిమినల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. అంతేకాక చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాలపై సిటీ ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు గత వారం రోజులుగా సీటీసీలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని ముఖ్య నిబంధణలు, కేసుల నమోదు, దర్యాప్తు విధానం, సాక్ష్యాల సేకరణ, డిజిటల్ సాక్ష్యాల ప్రాధాన్యత, బాధితుల హక్కులపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం శిక్షణను పరిశీలించిన సీపీ మాట్లాడుతూ కొత్త చట్టాల ప్రకారం కేసుల దర్యాప్తు మరింత శాసీ్త్రయంగా, సమర్థంవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో సీటీసీ ఏసీపీ హరిఽనాధ్బాబు, ఆర్ఐ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సునీల్‌దత్ సూచించారు. శాంతి కమిటీలతో శుక్రవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఘటనలు జరగకుండా, మత సామరస్యాన్ని కాపాడుతూ అన్నివర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వివిధ శాఖల సమన్వయంతో ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తుండగా, పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈక్రమాన విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం సమయాన వివాదాలకు తావు లేకుండా నిర్వాహకులు బాధ్యయుతంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు మోహన్‌బాబు, బాలకృష్ణ, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్‌దత్ -
వ్యక్తిగత పరిశుభ్రత కీలకం
ఖమ్మంరూరల్: బాలికలు వ్యక్తిగత శుభ్రత పాటించడం కీలకమని డిప్యూటీ కలెక్టర్ అపూర్వ, జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల సూచించారు. ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లిలోని టీజీఎస్జేసీజీలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్, డీడబ్ల్యూఓ మాట్లాడుతూ విద్యార్థినులకు రుతుస్రావ సమయాన వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే కాక శానిటరీ ప్యాడ్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అలాగే, పోషకాహారం తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ విషయమై బాలికల్లో అవగాహన పెంచేలా ఉపాధ్యాయినులు కూడా కృషి చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీలత, మెడికల్ ఆఫీసర్ కనకదుర్గ, అధ్యాపకులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రిలో సేవల విస్తరణ
ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రి అంటే సాధారణ వైద్యమే అందుతున్న భావనను తొలగించేలా ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఆధునిక వైద్య పరీక్షలు, అధునాతన స్కానింగ్ సదుపాయాలు, రేడియాలజీ సేవలు, మాతా శిశు సంరక్షణ సేవలతో నాణ్యమైన వైద్యం అందుతుండగా, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన భారం తగ్గుతోంది. ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేసేలా కలెక్టర్ దివాకర టీ.ఎస్. ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యాన మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. పోర్టబుల్ అల్ట్రాసౌండ్ యంత్రాలు జనరల్ ఆస్పత్రిలో కొత్తగా మూడు పోర్టబుల్ అల్ట్రాసౌండ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పరీక్షలు అవసరమైన వారిని ఒక విభాగం నుంచి మరో విభాగానికి తీసుకెళ్లే అవసరం లేదకుండా ఉన్న ప్రదేశంలోనే అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఏర్పడింది. అలాగే, త్వరలో ఎంఆర్ఐ యంత్రం అందుబాటులోకి రానుంది. కలెక్టర్ చొరవతో ఇందుకు అవసరమైన పనులు జరుగుతుండగా, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుపై దృష్టి సారించారు. మెదడు, వెన్నెముక, కీళ్లు, కండరాలు, అంతర్గత అవయవాలు, తదితర ప్రాంతాలకు సంబంధించి సమస్యలను గుర్తించేందుకు ఎంఆర్ఐ పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సేవ అందుబాటులోకి వస్తే ప్రజలపై ఆర్థికభారం తగ్గుతుంది. ఖాళీల భర్తీకి చర్యలు ఆస్పత్రిలో చికిత్స కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి వస్తుంటారు. ఈమేరకు సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకంపైనా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు సరిపడా వైద్య నిపుణులను నియమిస్తే ఆస్పత్రిలో సేవలు ఇంకా మెరుగుపడనున్నాయి. పెద్దాస్పత్రిలో అల్ట్రాసౌండ్ సేవలను జనం వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆర్థో తదితర విభాగాలకు వచ్చే వారి అవసరాల ఆధారంగా 13,816 అల్ట్రాసౌండ్ స్కాన్లు చేశారు. జూలైలో 1,977, ఆగస్టులో 1,943 స్కాన్లు జరిగాయి. ఇక మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 16,961 స్కానింగ్‌లు నిర్వహించారు. ఇందులో 8,945 ఓబీజీ స్కాన్లు, 5,417 ఉదర భాగం స్కాన్లు, 546 టిఫ్ఫా స్కాన్లు ఉండగా.. చిన్నారులు 2,053 మందికి స్కానింగ్ చేశారు. నెలల వారీగా పరిశీలిస్తే ఓబీజీ స్కాన్లు జనవరిలో 910 నిర్వహిస్తే, ఆగస్టులో 1,329 చేశారు. టిఫ్ఫా స్కాన్లు సైతం ఫిబ్రవరిలో 19గా నమోదైతే ఆగస్టులో 136కు చేరాయి. -
కాంగ్రెస్ శ్రేణుల ‘దళిత గర్జన’ ర్యాలీ
ఖమ్మంమయూరిసెంటర్: బీఆర్ఎస్, బీజేపీ పార్టీల దళిత వ్యతిరేక, మనువాద వైఖరిని అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ ఆధ్వర్యాన ‘దళిత గర్జన’ పేరిట శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయం నుంచి జెడ్పీసెంటర్ వరకు ర్యాలీ సాగగా, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, నాగండ్ల దీపక్‌చౌదరి మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పర్యటించిన ప్రదేశాన్ని బీజేపీ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేస్తే, ఎర్రవల్లి వద్ద దళితులు నిరసన తెలిపిన రహదారిని బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో కడగడం దళితుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధు శాసనమండలి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైఖరి మార్చుకోని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెంటే నిలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ ఖాదర్ బాబా, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నాయకులు పులిపాటి వెంకయ్య, పట్టాభి, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం -
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
నేలకొండపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. నేలకొండపల్లి ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన రోజువారీ ఓపీ, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలు తెలుసుకున్నారు. ఆతర్వాత డీసీహెచ్ఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందేలా సౌకర్యాలు సమకూరుస్తున్నందున వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో మందుల కోసం రూ.1.80 లక్షలు కేటాయించగా, నేలకొండపల్లి సీహెచ్‌సీని 50 పడకలకు అప్‌గ్రేడ్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంగళ, డాక్టర్ కె.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ధంసలాపురం దారిలో..
ఖమ్మం మయూరిసెంటర్: వినాయక చవితి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఖమ్మం వాసులు సిద్ధమయ్యారు. ఇళ్లలోనే కాక వీధులు, కూడళ్లలో లంబోదరుడి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మూడో రోజు నుంచి నిమజ్జనాలు మొదలుకానుండగా.. ఈసారి ఎల్‌నినో పరిస్థితులతో భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. వర్షాభావ పరిస్థితులతో ఖమ్మం నగరాన్ని ఆనుకుని ప్రవహించే మున్నేరు వాగు పూర్తిగా ఒట్టిపోయింది. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది పెద్ద విగ్రహాలను మున్నేరులోనే నిమజ్జనం చేసేవారు. కానీ ఇప్పుడు మున్నేరులో నీరు లేక నిమజ్జనం చేయడం అసాధ్యమేనని చెప్పాలి. వెయ్యికి పైగా విగ్రహాలు జిల్లా కేంద్రంలో ప్రతీ వీధిలో, కొన్ని చోట్ల రెండేసి గణనాథుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. గతేడాది 700 విగ్రహాలు ఏర్పాటుకాగా.. ఈసారి ఆ సంఖ్య వెయ్యి దాటొచ్చని ఉత్సవ సమితి బాధ్యులు, అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవికాక నగరానికి సమీప గ్రామాల నుంచి మరో 200 విగ్రహాలను నిమజ్జనం కోసం ఖమ్మంకే తీసుకొస్తారు. ఇవన్నీ నిమజ్జనం చేసేలా మున్నేటిలో నీరు లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. అన్నీ అటే... మున్నేటిలో నీరు లేకపోవడంతో ఖమ్మం కార్పొరేషన్, పోలీసు అధికారులు విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాలు పరిశీలించే క్రమాన ధంసలాపురం చెరువు కనిపించింది. గతేడాది 700 విగ్రహాలను ఏర్పాటుచేస్తే మున్నేరు పరీవాహక ప్రాంతమైన కాల్వొడ్డు, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిలతో పాటు ధంసలాపురం చెరువులో నిమజ్జనం చేయించారు. ఇందుకోసం 20కి క్రేన్లు వినియోగించారు. ఈసారి విగ్రహాల సంఖ్య వెయ్యి దాటనుండగా అన్నింటినీ ధంసలాపురం చెరువులో నిమజ్జనం చేయించడం అధికారులకు సవాల్‌గా మారనుంది. కానీ ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో ధంసలాపురం చెరువు వద్ద 16 క్రేన్ల ఏర్పాటుకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. తాత్కాలిక నీటి గుంతల ఏర్పాటుతో... ఒకే చెరువు వద్దకు పెద్దసంఖ్యలో విగ్రహాలు తీసుకురానుండడంతో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తనుంది. అంతేకాక నిమజ్జనం కూడా గంటల తరబడి సాగే అవకాశముంది. వందలాది విగ్రహాల వెంట భక్తులు, నిర్వాహకులతో పాటు నిమజ్జనాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చెరువు వద్దకు వస్తారు. ఈక్రమాన ట్రాఫిక్‌ను నియంత్రించడం, ఇతర ఏర్పాట్లు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. అయితే, నగర నలు మూలల తాత్కాలిక నీటి గుంతలు (ఆర్టిఫీషియల్ పాండ్స్) ఏర్పాటు చేస్తే చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశమున్నందున ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలనే వినతులు వస్తున్నాయి. -
సాగునీరు, కరెంట్ లేక రైతుల కష్టాలు : పువ్వాడ
ఖమ్మం వైరారోడ్: ఉమ్మడి జిల్లాలో పంటలకు సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సక్రమంగా జరగగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు అవసరమైన సాగునీరు, విద్యుత్ అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇకనైనా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి అత్యవసరంగా సాగునీరు, సరిపడా విద్యుత్ అందించి రైతులను ఆదుకోవాలని పువ్వాడ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలుగు విభాగంలో పీహెచ్డీ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంకు చెందిన పెద్దపల్లి తేజస్వి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఖమ్మం పంపింగ్‌వెల్ రోడ్‌కు చెందిన పెద్దపల్లి యాకయ్య – సావిత్రి దంపతుల కుమార్తె తేజస్వి ఓయూ తెలుగు విభాగంలో డాక్టర్ నాళేశ్వరం శంకరం పర్యవేక్షణలో ‘తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం–సీ్త్ర జీవన చిత్రణ (1991–2015)’ అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా పీహెచ్డీ సాధించిన ఆమెను పలువురు అభినందించారు. గెస్ట్ ఫ్యాకల్టీ మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. జాబితా ల్లో అభ్యర్థుల పేరు, విద్యార్హతలు, మెరిట్, ఇతర వివరాల్లో తప్పులు, అభ్యంతరాలు ఉంటే తగిన ధ్రువపత్రాలతో ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు భద్రాచలంలోని ఆర్సీఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వివరాలకు 85001 36628 నంబర్లో సంప్రదించాలని పీఓ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి కామేపల్లి: గ్రామాల్లో ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి వినోద్‌కుమార్ సూచించారు. మండలంలోని కొమ్మినేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించాక మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో తాగునీటి సరఫరా, డ్రెయినేజీలు, రహదారుల నిర్మాణమే కాక మొక్కల పెంపకం, వైకుంఠధామాలు, రైతు వేదికలు నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. అంతేకాక రికార్డుల్లో వివరాలు నమోదు చేస్తూ పారదర్శకత పాటించేలా సర్పంచ్‌లు, కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎంపీఓ వీ.వీ.శాసీ్త్ర, కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు. క్రమశిక్షణతో విద్యార్థులకు విజయంమధిర: విద్యార్థులు క్రమశిక్షణతో చదివేతేనే ఉన్నత స్థాయికి చేరి జీవితంలొ విజయం సాధించొచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు తెలిపారు. మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ జి.శంకర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి సహకారం, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకుల కృషితో కాలేజీలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ ఏడాది పుస్తకాలు, నోట్బుక్కులే కాక అల్పాహారం సమకూరుస్తున్నందున విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. గంజాయి తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూడాలని, సెల్‌ఫోన్ వినియోగం తగ్గిస్తే చదువులో రాణించవచ్చని చెప్పారు. అనంతరం విద్యార్థులు ఇచ్చినసాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పూర్వ విద్యార్థులు వనమా సూరి, విప్లవకుమార్, బెజవాడ రవిబాబు, కౌన్సిలర్ బానోతు వెంకటరమణనా యక్, కాంగ్రెస్ నాయకుడు సూరంశెట్టి కిషోర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎఫ్బీఓ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం
కారేపల్లి: విధినిర్వహణలో భాగంగా తనిఖీలకు వెళ్లి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తాకి మృతి చెందిన ఫారెస్టు బీట్ ఆఫీసర్ బానోతు నవీన్‌కుమార్ కుటుంబానికి ప్రభుత్వం రూ.30లక్షల పరిహారం ప్రకటించింది. ఈమేరకు అటవీ అమరవీరుల దినో త్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, డీజీపీ సీ.వీ.ఆనంద్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ తదితరులు నవీన్ సతీ మణి ప్రమీలకు చెక్కు అందజేశారు. కారేపల్లి మండలం వెంకిట్యాతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బానోతు దేవ్లానాయక్ – సర్పంచ్ బూలి కుమారుడైన నవీన్ భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారం బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. గతనెల 11న నకిరిపేట అటవీ ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన సమయాన మృత్యువాత పడిన విషయం విదితమే. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కారేపల్లి మండలానికి చెందిన రాజేందర్, అడ్డగోడ ఐలయ్య యాదవ్, అడపాపుల్లారావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో చెక్కు అందజేసిన మంత్రి జూపల్లి -
అసంపూర్తి పనులతో రాకపోకలకు ఇక్కట్లు
నేలకొండపల్లి: మండలంలోని కోనాయిగూడెం – ఆరెగూడెం మధ్య నందిగామ బ్రాంచి కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతుండగా, కాల్వలో నుంచి రాకపోకలకు ప్రత్యేకంగా రహదారి ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం తాగునీటి సౌకర్యం కోసం కాల్వలో వేసిన మట్టి రహదారిని తొలగించారు. ఇదే సమయాన ప్రత్యామ్నయ చూపకపోవడంతో కోనాయిగూడెం, ఆరెగూడెం, ఆచార్లగూడెం గ్రామాల చెందిన ప్రజలు, రైతులు అవస్థ పడుతున్నారు. బ్రిడ్జి పూర్తికా, ప్రత్యామ్నాయ రహదారి లేక మూడు కి.మీ. చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా, బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని కాంగ్రెస్ నాయకులు మేకల వెంకటేశ్వర్లు, ఆనం వెంకటరెడ్డి, చెరుకుపల్లి రాజేష్, వడ్లమూడి వెంకటేశ్వర్లు, మేకల ఆర్జున్, కర్ల ఆశోక్, బోయిన కొండలు, వుల్లోజి రాకేష్, కొత్తపల్లి నవీన్ శుక్రవారం పరిశీలించారు. -
అన్ని అంశాల్లో ముందు నిలపాలి
ఖమ్మం సహకారనగర్: విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నమోదు, విద్యాపరమైన ప్రగతితోపాటు విద్యాశాఖ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన నిలిపేందుకు కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్ సూచించారు. డీఈఓ జి.సదానందం అధ్యక్షతన గురువారం జరిగిన పీఎంశ్రీ పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ మండలంలోని పీఎంశ్రీ పాఠశాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ నమోదు, హాజరులో ప్రగతి సాధించడమే కాక ర్యాంకింగ్‌లో జిల్లాకు మెరుగైన స్థానం సాధించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అత్యుత్తమ పనితీరు కనబరిచే అధికారులు, ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తామని, అవసరమైతే విదేశాల్లో అధ్యయనానికి ఎంపిక చేస్తామని జేడీ తెలిపారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారులు, ఎఫ్‌ఏఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ●ఏన్కూరు: ఏన్కూరులోని గురుకుల విద్యాలయాన్ని విద్యాశాఖ జేడీ మదన్మోహన్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, రికార్డులను, పీఎంశ్రీ పథకం ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. అంతేకాక అటల్ టింకరింగ్, ల్యాబ్‌ను పరిశీలించి గత ఏడాది ఇంటర్, పదో తరగతి ఫలితాలు తెలుసుకుని బోధనపై అధ్యాపకులకు సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ వేము రాజు, ఉద్యోగులు మాధవరావు, శాంసన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.విద్యాశాఖ జేడీ మదన్మోహన్ -
పూర్వ కానిస్టేబుళ్ల ఆత్మీయ సమ్మేళనం
ఖమ్మంక్రైం: ఏపీఎస్పీ పూర్వ కానిస్టేబుళ్ల (1976–77 బ్యాచ్) ఆత్మీయసమ్మేళనం గురువారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాచ్‌లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం శిక్షణ, ఉద్యోగంలో ఎదురైన అనుభవాలు, ప్రస్తుత విశ్రాంత జీవితం, కుటుంబ వివరాలను పరస్పరం పంచుకున్నారు. అంతేకాక పలువురిని సత్కరించారు. ఈకార్యక్రమంలో విశ్రాంత ఎస్ఐలు రుద్ర వెంకటనారాయణ, నర్సింహారావు, అప్పారావు, అమిత్‌ఖాన్, అబ్దుల్ఘనీ, కృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి, పురుషోత్తం, సత్తయ్య, సంపదయ్య, ఎంఎస్ఆర్.ఆచార్యులు, సాయిరెడ్డి నూరుద్దీన్, సోమేశ్వరరావు, రామస్వామి, సాంబంశివరావు, జయదేవరెడ్డి, రవీందర్, వీరన్న, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు
ఖమ్మం అర్బన్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనానికి భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా నిర్వాహకులు సహకరించాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో ఖమ్మంలో గురువారం ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్నేటిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ధంసలాపురం కొత్తూరు చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం పీఓపీ కాకుండా మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాలని సూచించారు. అంతేకాకుండా మండపాల వివరాలను పోలీస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. అలాగే, మండపాల ఏర్పాటు, విద్యుత్ వైరింగ్, అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన సీపీ.. డీజేలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కాగా, ప్రధాన రహదారులు, వివాదాస్పద స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీలు రమణమూర్తి, మహేష్, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్‌బాబు, భానుప్రకాష్, ఉస్మాన్ షరీఫ్, సత్యనారాయణ, విద్యుత్ శాఖ డీఈ రామారావు, ఫైర్ అధికారి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.సమన్వయ సమావేశంలో సీపీ సునీల్‌దత్ -
ప్రత్యేక గ్రీవెన్స్‌కు దరఖాస్తుల వెల్లువ
రఘునాథపాలెం: పోడు సాగుదారుల సమస్యల పరిష్కారానికి రఘునాథపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. బోర్లకు అనుమతి కోసం 295 మంది, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 21 మంది, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం 12 మంది, రైతుభరోసా కోసం ఇద్దరు దరఖాస్తులు సమర్పించారు. ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్ ఆధ్వర్యాన దరఖాస్తులు స్వీకరించగా, డివిజనల్ ఫారెస్ట్ అధికారి భవానీశంకర్, డీటీడబ్ల్యూ ఫిరంగి, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్‌కుమార్, డీఆర్ఓ సల్మాన్‌రాజు, ఉద్యోగులు జి.ఉపేంద్రయ్య, ఎస్.కే.అఫ్జల్ పాల్గొన్నారు. కాగా, మండలంలోని గణేశ్వరం, చింతగుర్తి, దొనబండ, మల్లేపల్లి, పంగిడి, ఈర్లపూడి తదితర గ్రామాల్లో పోడు భూమి సాగు చేస్తున్న పేద గిరిజనేతర రైతులందరికీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎస్.నవీన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. నాయకులు వల్లూరి శ్రీనివాసరావు, గుగులోత్ కుమార్, కూచిపూడి నరేష్, కే.నవీన్‌కుమార్, నాయకులు కృష్ణయ్య, మల్లయ్య, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. బోర్లు, విద్యుత్ కనెక్షన్లు, పట్టాల కోసం వినతి -
కారులోనే మట్టుపెట్టాడు..
● భార్య గొంతు నులిమి హతమార్చిన వ్యక్తి ● ఇద్దరికీ రెండో వివాహం.. ఆపై అనుమానంతో హత్యఖమ్మంఅర్బన్/ఇల్లెందు: ఇద్దరిదీ రెండో వివాహమే. అయితే, ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నందనే అనుమానంతో గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఖమ్మంలో వెలుగు చూసింది. కారులో బయటకు తీసుకెళ్లి హతమార్చిన భర్త.. కారును వదిలేసి పరారు కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నాలుగు నెలల క్రితమే వివాహం.. ఇల్లెందు మండలం చర్చి రొంపేడుకు చెందిన మేడిపల్లి విద్యాసాగర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యాన మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు జన్మించాక విడాకులు తీసుకున్నాడు. అనంతరం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న ఇల్లెందు స్టేషన్ బస్తీ వాసి చిన్నబోయిన రేణుక(40)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు కూడా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి జీవిస్తోంది. ఆమెను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న విద్యాసాగర్ ఖమ్మంలో నివాసముంటున్నాడు. ఇటీవల రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై గొడవలు జరుగుతుండగా బయటకు వెళ్దామని బుధవారం సాయంత్రం ఆమెను విద్యాసాగర్ కారులో ఎక్కించుకుని ఇల్లెందు వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో ఘర్షణ జరిగినట్లు తెలుస్తుండగా గొంతు నులిమి హత్య చేశాడు. ఆతర్వాత విషయాన్ని ఇల్లెందులోని తన స్నేహితుడికి ఫోన్లో వివరించి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ మృతదేహం సహా కారు వదిలేసి పారిపోయాడు. స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విద్యాసాగర్ ఫోన్ సిగ్నళ్లు పరిశీలిస్తూ బుధవారం రాత్రి 10–30 గంటల సమయాన ప్రగతి స్కూల్ సమీపాన అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. పిల్లలను ఎలా సాకాలి ? కారులో నుంచి రేణుక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఖమ్మం అర్బన్ పోలీసులు ఆమె తల్లి ఉపేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా, రేణుక మృతదేహం వద్ద తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. కొంతకాలంగా విద్యాసాగర్‌తో గొడవలు జరుగుతున్నందున ఆయనతో వెళ్లొద్దని చెప్పినా బలవంతంగా తీసుకెళ్లాడని ఆరోపించారు. ఆమె మృతితో ఇద్దరు పిల్లల భవిష్యత్ ఏమిటని రోదించారు. కాగా, పోస్టుమార్టం అనంతరం ఇల్లెందులోని ఇంటికి రేణుక మృతదేహాన్ని సాయంత్రం తీసుకురాగా, ప్రేమించిన వ్యక్తి చేతిలో హతం కావడంతో పిల్లలు అనాథలయ్యారంటూ బంధువులు, స్థానికులు కన్నీంటి పర్యంతమయ్యారు. -
గుండె ‘లయ’ తప్పుతోంది..
ఖమ్మం వైద్యవిభాగం: ఒకప్పుడు గుండె పోటు అంటే వయస్సు మళ్లిన వారికే వస్తుందని భావించేవారు. సుమారు 50 ఏళ్లు పైబడిన వారు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులే ఎక్కువగా బాధితుల జాబితాలో ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, యుక్త వయస్సు వారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వ్యాయామం చేస్తూ కొందరు, నృత్యం చేస్తూ ఇంకొందరు.. ఉన్నట్టుండి కుప్పకూలి మరికొందరు మృత్యువాత పడుతున్నారు. అక్కడికక్కడే మృతి చెందేవారు కొందరైతే, మరికొందరి ప్రాణాలు వైద్యుల వద్దకు తీసుకెళ్లే లోపే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గుండెలో రక్త నాళాలు కుచించుకుపోవడం వల్ల రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటు వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇటీవల యుక్త వయస్సు వారు, ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే వారు కూడా గుండెపోటుకు గురవుతుండడంతో జనాల్లో ఆందోళనకు కారణమవుతోంది. జీవనశైలిలో మార్పులతో... ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరగడానికి జీవన విధానంతో పాటు ఆహార శైలిలో వచ్చే మార్పులే కారణమని వైద్యులు చెబుతున్నారు. యువత ఎక్కువగా జంక్‌ఫుడ్ తినడం, మత్తు పదార్థాలు తీసుకోవడంతో అనారోగ్యం ఎదురవుతుంది. ఈ ప్రభావం శరీరంలోని అవయవాలపై పడి చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ఆధునిక జీవన శైలికి అలవాటు పడడంతో శారీరక శ్రమ మరిచిపోవడం, వ్యాయామం లేకపోవడం కూడా వ్యాధులకు కారణమవుతోంది. కలుషిత ఆహారం కూడా రక్త ప్రసరణ సక్రమంగా జరగకుండా అడ్డుకుంటుంది. అంతేకాక పురుగు మందులు ఎక్కువగా వాడిన కూరగాయలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు తీసుకుంటే కేన్సర్‌తో పాటు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సత్తుపల్లిలో నివాసముంటున్న 65 ఏళ్ల ఏలపాటి భారతమ్మ బుధవారం ఇంట్లో ఉండగా.. అకస్మాత్తుగా కింద పడి అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రఘునాథపాలెం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల విద్యార్థి బుధవారం ఉదయం స్నేహితులతో కలిసి ఆడుకుంటూ మైదానంలో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడని వైద్యులు తేల్చారు. విద్యార్థి మృతికి స్పష్టమైన కారణాలు తెలియకున్నా ఆకస్మిక గుండెపోటే కావొచ్చని అనుమానిస్తున్నారు.ఆందోళన కలిగిస్తున్న గుండెపోటు మరణాలు అందరూ రోజువారీ జీవనంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. ప్రతీరోజు 30 – 45 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి. యోగా, ప్రాణాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సరైన రీతిలో ఉండే ఆహారం తీసుకోవాలి. మద్యపానం, సిగరెట్లకు దూరంగా ఉండాలి. చిన్న వయస్సులోనే గుండెపోటు రావడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. జీవనశైలిలో వచ్చే మార్పులు, ఒత్తిడి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కనీసం ఆరు నెలలకోసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఛాతిలో నొప్పి, గుండె సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిది. – డాక్టర్ సీతారామ్, కార్డియాలజిస్ట్, జిల్లా జనరల్ ఆస్పత్రిగుండె పనిచేయడం హఠాత్తుగా ఆగిపోవడాటాన్ని వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ అంటారు. స్పృహ కోల్పోవడం, స్పందించకపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్‌గా భావించాలి. మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడాన్ని హర్ట్స్ట్రోక్ అని చెబుతారు. అయితే సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వస్తుంది. రక్తం గడ్డ కట్టినప్పుడు గుండెకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయి గుండెపోటుతో మరణం ఎదురవుతుంది. అనారోగ్య జీవనశైలి, పెరిగిన ఒత్తిళ్లే గుండె సంబంధిత మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమతుల ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, సరైన జీవన విధానం పాటించకపోవడం వంటివి ఇందుకు కారణమవుతాయని చెబుతున్నారు. -
‘భారత్ యంగ్ లీడర్స్’ డైలాగ్ లోగో ఆవిష్కరణ
ఖమ్మం రాపర్తినగర్: మై భారత్, యువజన శాఖ ఆధ్వర్యాన జాతీయ స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల లోగోను జిల్లా అధికారి ఎం.వెంకట్ రాంబాబు గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’పేరిట ఆన్లైన్ క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనుండగా, 15 – 29 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు. తెలుగుతో పాటు 22భాషల ద్వారా పోటీల్లో పాల్గొనవచ్చని, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటిన వారు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి డైలాగ్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 30వ తేదీలోగా mybharat.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బానోతు రెడ్డి, అధ్యాపకులు, ఉద్యోగులు కె.భానుచందర్, డాక్టర్ చరిత్ర, సయ్యద్ షారూఖ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ మ్యాప్‌తో భూధార్ కార్డులు
● రైతుల సమక్షాన పారదర్శకంగా హద్దుల నిర్ధారణ ● రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ దివాకరమధిర/ఎర్రుపాలెం/బోనకల్: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ద్వారా రైతులెవరికీ అన్యాయం జరగకుండా వివాదాలు, విస్తీర్ణం వ్యత్యాసాలు, రికార్డుల్లోని లోపాలను సరిచేస్తామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. మధిర మండలం తొండలగోపవరం, ఎర్రుపాలెం మండలం రాజుపాలెం రెవెన్యూ పరిధి వెంకటాపురం, రాజుపాలెం గ్రామాలతో పాటు బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో భూముల రీసర్వేను ఆయన గురువారం పరిశీలించారు. తొండలగోపవరంలో పొలాల్లో గట్ల వెంట నడిచి వెళ్లిన ఆయన రీసర్వేను పరిశీలించి రైతుల అభిప్రాయాలు తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మనిషికి ఆధార్ మాదిరి సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తున్న భూసర్వే ద్వారా ప్రతీ రైతు భూమికి డిజిటల్ మ్యాప్‌తో కూడిన భూధార్ కార్డు అందుతుందని తెలిపారు. ప్రతీ రైతుకు ముందుగా నోటీసులు జారీ చేసి వారి సమక్షానే సర్వే చేసి హద్దులు నిర్ధారించడంతో భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు రావని చెప్పారు. ఈమేరకు రైతులు పట్టా పాస్‌బుక్, ఇతర వివరాలతో అధికారులకు సహకరించాలని సూచించారు. సర్వే అనంతరం భూ వివరాలను ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించాక భూధార్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్, తహసీల్దార్లు రాళ్లబండి రాంబాబు, కె.సునీత ఎలిజబెత్, సర్పంచ్ బొగ్గుల గోవర్దన్‌రెడ్డి, ఉద్యోగులు రవికుమార్, శిరీష, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోషణ సేవలను బలోపేతం చేయాలి ఖమ్మంమయూరిసెంటర్: వచ్చే నెల 8వ తేదీ వరకు జరిగే జాతీయ పోషణ మాసం కార్యక్రమాల్లో ప్రతీఒక్కరు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యాన రూపొందించిన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కచి మాట్లాడారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు మెరుగైన పోషకాహారం అందించడంతో పాటు పోషణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జాతీయ పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్యోగులకు సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల, డీఎంహెచ్ఓ రామారావు, డీపీఓ వినోద్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వచ్చేనెల 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు
ఖమ్మం సహకారనగర్: వానాకాలం సీజన్లో సాగు చేస్తున్న వరి ధాన్యం కొనుగోళ్లకు వచ్చేనెల 1 నుంచి కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ఆయన సంబంధిత శాఖల అధికారులు, ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు, గోదాముల నిర్వాహకులతో సమావేశమయ్యారు. జిల్లాలో సుమారు 2.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా కేంద్రాలు, గోదాములు, రవాణా ఏర్పాట్లు ముందుగానే చేయాలని సూచించారు. అక్టోబర్ 1 నుంచి అన్ని కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాక రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, నిర్దేశిత తేమ శాతం వచ్చాకే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పంచాయతీ నుంచి సిబ్బందిని నియమించడమే కాక కేంద్రాల ఇన్చార్జిలకు నాణ్యత గుర్తింపు, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. సన్న రకాలకు రూ.500 బోనస్.. ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర చెల్లించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తామని పేర్కొన్నారు. కేంద్రాల ఎంపిక, గోదాముల గుర్తింపు, ధాన్యం రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ పరికరాల బిగింపుపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో సహాయ పౌర సరఫరాల అధికారి మల్లికార్జునబాబు, జిల్లా వ్యవసాయ, సహకార శాఖల అధికారులు పుల్లయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి -
గోదావరి జలాలకు పూజలు
మధిర/ఎర్రుపాలెం: మధిర, ఎర్రుపాలెం మండలా ల్లో రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను సాగర్ కాల్వ ద్వారా విడుద ల చేశారు. మధిర మండలం నాగవరప్పాడు గ్రామ సమీపంలోని నిధానపురం మేజర్‌తో పాటు ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులోని చెరువు వద్దకు నీరు చేరడంతో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పూజలు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచనలతో నీరు విడుదల చేయగా, మధిర బ్రాంచ్ కాల్వ ద్వారా మధిర మండలానికి, నిధానపురం మేజర్ ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందనుందని వారు తెలిపారు. మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మధిర మండల, పట్టణ అధ్యక్షులు పారుపల్లి విజయ్‌కుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, నాయకులు శీలం ప్రతాపరెడ్డి, సూరంశెట్టి కిషోర్, కర్నాటి రామారావు, ముక్కర చిన్నలక్ష్మారెడ్డి, అయిలూరి రవీంద్రరెడ్డి, శీలం మాధవరెడ్డి పాల్గొన్నారు. -
రైతుల వరిగోస
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. ఓ పక్క వర్షాభావం, మరోపక్క మండుతున్న ఎండలతో పంటలు వడబడుతున్నాయి. ఈనేపథ్యాన బోర్లు, బావులను నమ్ముకుని వరి సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎల్సీ(లోకల్ కటింగ్), సబ్స్టేషన్ల నిర్వహణ పేరుతో సరఫరా చేసే 12 గంటల్లో కూడా ఎడాపెడా విద్యుత్ కోత విధిస్తుండడంతో పంటకు నీరందించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కరెంట్‌నే నమ్ముకుని సాగు.. ఈ సీజన్లో జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేదు. దీంతో ఆయకట్టు చాలా వరకు బీడుగా వదిలేశారు. ఇంకొన్ని చోట్ల బోర్లు, బావుల నీరు.. సత్తుపల్లి, వైరా, మధిర ప్రాంతాల్లో గోదావరి జలాల ఆధారంగా 1,65,725 ఎకరాల్లో వరి సాగైంది. జిల్లాలో 1.18 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. వీటి పరిధిలో సుమారు 70వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే, 12గంటల పాటు కోతలు లేకుండా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అయితేనే పైరుకు నీరందించే అవకాశముంది. కానీ తరచూ కోతలతో కలుపు పెరుగుతుండగా, పంట కూడా వడబడుతోంది. రోజు 5 – 7 గంటల కోత నిరంతరాయంగా 12గంటల పాటు విద్యుత్ సరఫరా ఉంటేనే వరికి నీరు అందించే అవకాశం ఏర్పడుతుంది. కానీ లోకల్ కటింగ్‌తో మూడేసి గంటలు, సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పేరుతో రెండు గంటల చొప్పున కోత విధిస్తున్నారు. ఇదికాక వారానికోసారి సబ్ స్టేషన్ నిర్వహణ పేరుతో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. రోజుకు ఐదు గంటలు, వారంలో ఓ రోజు అదనంగా మరో రెండు గంటలు కోత విధిస్తుండడంతో పంటకు సరిపడా నీరు అందించలేకపోతున్నామని చెబుతున్నారు. కరెంట్ వచ్చి, పోతుండడంతో చివరి తడులకు నీరు అందక వడలిపోతోందని ఆవేదన చెందుతున్నారు. పంటలు తీస్తూ.. వేంసూరు మండలంలో బోర్లు, బావుల కింద 18వేల ఎకరాల్లో వరి సాగైంది. అప్రకటిత కోతలతో ఈ మండలంలో వరి ఎండి నెర్రలు బారుతోంది. మండలంలోని వేంసూరు, భరిణిపాడు, కందుకూరు, దుద్దిపుడి, లింగపాలెం, వెంకటాపురం, చౌడవరం, అమ్మపాలెం, రాయుడుపాలెంల్లో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి పంట ఎండిపోయే స్థితికి చేరింది. దీంతో కొందరు రైతులు ఎండిన పంట తొలగిస్తూ తక్కువ నీటి అవసరం ఉంటుందని జొన్న సాగుకు మళ్లారు.కరెంట్ కోతలతో ఎండుతున్న పైర్లు బోర్ల ఆధారంగా పదెకరాల్లో వరి వేశా. ఉదయం 6నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా అని చెబుతున్నా గంటల కొద్దీ కోత విధిస్తున్నారు. విద్యుత్ కోతతో నీరు అందించలేకపోతున్నాం. మరోపక్క ఎండతో వరి చేతికి రావడం కష్టమే. – మందపాటి మహేశ్వర్‌రెడ్డి, భరణిపాడు, వేంసూరు మండలం రైతులకు అనుకూలంగా ఉదయం 6–30నుంచి సాయంత్రం 6–30 గంటల వరకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. పీక్ అవర్స్‌లో ఓవర్ లోడ్‌తో ఎక్కడైనా ఇబ్బంది ఉంటేనే సరఫరా చేయడం లేదు. మిగతా అంతా సక్రమంగా సరఫరా చేస్తున్నాం. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, విద్యుత్ శాఖ, ఖమ్మం సర్కిల్ -
పంట విక్రయాల్లో అక్రమాల కట్టడి
ఖమ్మంవ్యవసాయం: పంటల విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాపారులు జీరో వ్యాపారం, ఆర్డీ(రేట్ డిఫరెన్స్)కు పాల్పడుతూ ప్రభుత్వానికి తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. ప్రధానంగా మిర్చి క్రయవిక్రయాల్లో ఈ వ్యవహారం జరుగుతుండగా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఇటీవల వెలుగుచూసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మిర్చి క్రయవిక్రయాలపై పర్యవేక్షణ బృందాలను నియమించి నివేదికలను తెప్పించుకుంది. అయినా అక్రమాలు ఆగలేదన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ బృందాలను నియమించారు. మిర్చి క్రయవిక్రయాలు జరిగే ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఈ బృందాలను ఏర్పాటుచేశారు. కోల్డ్ స్టోరేజీలు, చెక్ పోస్టుల్లో తనిఖీ చేస్తూ వ్యాపారులు కొనుగోలు చేసిన ధరలు, బిల్లుల్లో పేర్కొన్న ధరల్లో వ్యత్యాసం ఉంటే రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు నివేదించాల్సి ఉంటుంది. ఈమేరకు ఖమ్మం జిల్లాలో ఏడుగురు అధికారులతో బృందాన్ని నియమించగా తనిఖీలు మొదలుపెట్టారు.విజిలెన్స్ కమిటీలను నియమించిన ప్రభుత్వం -
వంద శాతం సబ్సిడీపై కుట్టు మిషన్లు
ఖమ్మంమయూరిసెంటర్: బీసీ మహిళలకు రాష్ట్రప్రభుత్వం వందశాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ చేయనుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన మహిళలు, 18 – 55 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగులు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథల్లో కుట్టు వృత్తిలో నైపుణ్యం కలిగి, ప్రాథమిక అక్షరాస్యత ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం దాటనివారు తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. అర్హులు ఈనెల 15వ తేదీలోగా tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. క్రీడాసామగ్రి సరఫరాకు టెండర్లు ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలలకు క్రీడా సామగ్రి సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానించినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. మొత్తం 167 రకాల ఆట వస్తువులు సరఫరా చేయాల్సి ఉండగా, ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున రూ.14 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. టెండర్ల దాఖలకు జిల్లా వాసులే అర్హులని, దరఖాస్తు రుసుము రూ.4వేలు, ధరావతు రూ.50 వేలను ‘జిల్లా కలెక్టర్ అండ్ చైర్మన్, సమగ్ర శిక్ష, ఖమ్మం’ పేరుతో డీడీ సమర్పించాలని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు టెండర్లు స్వీకరించి, 19న ఉదయం చైర్మన్ సమక్షంలో పరిశీలించి ఖరారు చేస్తామని అదనపు కలెక్టర్ వెల్లడించారు. స్ఫూర్తిదాయకం.. చాకలి ఐలమ్మ పోరాటం ఖమ్మంమయూరిసెంటర్: సమాజంలో నెలకొన్న అసమానతలపై నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మార్గదర్శకమని బీసీ సంక్షేమ శాఖ డీడీ జి.జ్యోతి పేర్కొన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని ఐలమ్మ విగ్రహం వద్ద గురువారం ఆమె వర్ధతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జమీందారీ వ్యవస్థ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చారిత్రక ఘట్టంగా నిలిచిందన్నారు. ముదిగొండ సొసైటీ చైర్మన్ ఎలగొండ స్వామి, బీసీ, రజక కులసంఘాల నాయకులు జక్కుల వెంకటరమణ, తమ్మరపు బ్రహ్మం, మాచర్ల యాలాద్రి, కోడి లింగయ్య, సట్టు వెంకటేశ్వర్లు, కత్తి నెహ్రూగౌడ్, మునిగ కోటేశ్వరరావు, ఎల్లురి విజయ్ కుమార్, ఎస్.కే.సయ్యద్ బాషా, వల్లపు సోమరాజు, శాఖ అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’లో సందేహాలా ?!
కలెక్టర్ దివాకరతో నేడు ‘ఫోన్ ఇన్’ఖమ్మం సహకారనగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా ప్రస్తుతం అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ కొనసాగుతోంది. అయితే, జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు బీఎల్ఓలను సంప్రదిస్తున్నారు. అంతేకాక నోటీసులు అందుకున్న వారు ఏమేం పత్రాలు సమర్పించాలో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యాన ఓటర్ల సందేహాలకు ‘సాక్షి’ ఆధ్వర్యాన నిర్వహించే ఫోన్ ఇన్‌లో కలెక్టర్ దివాకర టీ.ఎస్. స్వయంగా సమాధానాలు ఇవ్వనున్నారు. ఓటర్లు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తేదీ : 11–09–2026, శుక్రవారం (నేడు) సమయం : ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 90102 23697 -
నిషేధిత జాబితా సమస్య పరిష్కరించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు ఖమ్మం మామిళ్లగూడెం: ‘22ఏ’నిషేధిత జాబితాలో భూములను చేర్చడంతో యజమానులు ఇబ్బంది పడుతున్నందున సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు డిమాండ్ చేశారు. ఈమేరకు పార్టీ ఆధ్వర్యాన గురువారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత విద్య, చికిత్స వంటి అత్యవసర అవసరాలకు భూమి విక్రయించాలనుకున్నా జాబితా అడ్డంకిగా మారిందని తెలిపారు. ప్రభుత్వం సత్వరమే స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాయకులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, సన్నె ఉదయ్‌ప్రతాప్, గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, నంబూరి రామలింగేశ్వరరావు, వాకదాని పుల్లారావుయాదవ్, దొంగల సత్యనారాయణ, వీరభద్రం, వీరెల్లి రాజేష్, నున్నా రవి, నాగేశ్వరావు, రవిరాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ●ఖమ్మంఅర్బన్: నిషేధిత భూముల జాబితా అంశంపై కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులపై కేసు నమోదైంది. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు మరో 11మందిపై కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. -
నిలిచిపోయిన అద్దె బస్సులు
సత్తుపల్లిటౌన్: బస్సు నిండినా, మరింత మందిని ఎక్కించుకోవాలంటూ స్టాప్‌లు పెంచడమే కాక అత్యధిక ఆదాయం తేవాలని ఒత్తిడి చేస్తున్నారంటూ సత్తుపల్లి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు గురువారం ఆందోళనకు దిగారు. తెల్లవారుజామునే ఆందోళన చేపట్టగా డిపో నుంచి వెళ్లాల్సిన 54 బస్సులు నిలిచిపోయాయి. దీంతో మధిర, కొత్తగూడెం, ఖమ్మం డిపోల బస్సులను అధికారులు అవసరమైన రూట్లలో పంపించారు. అనంతరం డీఎం లక్ష్మీనారాయణ అద్దె బస్సు యజమానులు, డ్రైవర్లతో చర్చించి అంతా కలిసి సంస్థ అభివృద్ధికి పనిచేయాలని నచ్చచెప్పడంతో నిరసన విరమించగా మధ్యాహ్నం బస్సులు మొదలయ్యాయి. అద్దె బస్సుల యజమానులు వనమా శ్రీనివాసరావు, పుల్లా సుబ్బారావు, పి.కేశవ, సీహెచ్.కిషోర్, సూర్యనారాయణ, వై.నాగరాజు, డ్రైవర్లు రవి, రమేష్, వాసు, అక్రమ్, అవినాష్ పాల్గొన్నారు. పెద్దాస్పత్రిలో ఉచిత గుండె చికిత్స శిబిరం ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గురువారం చిన్న పిల్లలకు ఉచిత గుండె చికిత్స శిబిరం నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), హైదరాబా ద్‌లోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఆధ్వర్యాన ఈ శిబిరం నిర్వహించగా 0–18 ఏళ్ల వయస్సు పిల్లలు 62 మంది హాజరయ్యారని డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. వీరిని పరీక్షించిన నిపుణుల బృందం ముగ్గురికి మేజర్, 11 మందికి మైనర్ సర్జరీలు అవసరమని గుర్తించారన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువపత్రంతో జూబ్లీ హిల్స్ అపోలో మెడికల్ కాలేజీలో సంప్రదిస్తే, ఉచితంగా గుండె శస్త్రచికిత్స చేస్తారని తెలిపారు. ప్రముఖ వైద్యులు సుజాతా పాటీల్, సునీల్‌కుమార్, అనుపమ పాటేల్ పరీక్షలు చేయగా, జీజీహెచ్ సూపరింటెండెంట్ నరేందర్, అధికారులు బాబురత్నాకర్, వేణుమాధవరావు, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, ప్రకాష్, రవి, ప్రవీణ్‌కుమార్, సతీష్ పాల్గొన్నారు. సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యాన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఎనిమిది నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఉంటుందని పేర్కొన్నారు. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై, 21–32 ఏళ్ల వయస్సు, రూ.3 లక్షల్లోపు వార్షిక ఆదాయం కలిగిన అభ్యర్థులు ఈనెల 23 సాయంత్రంల్లోపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఈనెల 27న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, శిక్షణకు ఎంపిక చేస్తామని పీఓ తెలిపారు. రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు బాలికల జట్టు ఎంపిక కల్లూరు రూరల్: రాష్ట్ర స్థాయి ఖో–ఖో పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి ఖమ్మం బాలికల జట్టును గురువారం ఎంపిక చేశారు. కల్లూరులోని మినీ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీలకు 101 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబర్చిన గొంది మౌనిక, జమిలి రవళిక, గుండు రాధిక, గోనె శ్రావణి, కడారి భవాని, ధరావత్ ప్రవళిక, ఊకే మాధవి, కారం సమ్మక్క, వెంకటలక్ష్మి, శీలం తేజశ్రీ, మోకాళ్ల కావ్య, షేక్ సాదికతో జట్టును ఖరారు చేశారు. ఈ జట్టు 17న సరూర్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. ఖో–ఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరరాఘవయ్యతో పాటు కాటేపల్లి కిరణ్, మట్టూరి జనార్దన్, ఈ.నరసయ్య, ఎస్.రామారావు, ఎస్.ప్రసాద్, బి.బీమా, పి.సతీష్ కుమార్, కె.తులసి, రమాదేవి, త్రివేణి పాల్గొన్నారు. చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో నాలుగు కేసుల్లో ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బిక్కం రజిని గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం కవిరాజునగర్కు చెందిన రావూరి వెంకటరంగారావు వద్ద ముదిగొండ మండలం మల్లారానికి చెందిన నాదెండ్ల వరప్రసాదరావు 2016 అక్టోబర్‌లో రూ.15లక్షల అప్పు తీసుకున్నాడు. ఆతర్వాత 2019 సెప్టెంబర్‌లో వేర్వేరు తేదీల్లో నాలుగు చెక్కులు ఇచ్చాడు. కానీ ఆయన ఖాతా బ్లాక్ చేయడంతో చెక్కులు బౌన్స్ కాగా, వెంకటరంగారావు న్యాయస్థానంలో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం వరప్రసాదరావుకు నాలుగు కేసుల్లో ఏడాది జైలు, మరో కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. -
క్రిటికల్ కేర్ భవనంలో సేవలు ఆరంభం
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జనరల్ ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన క్రిటికల్ కేర్ భవనంలో వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. జనరల్ ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఐసీయూ విభాగాల సామగ్రిని గురువారం అందులోకి తరలించారు. ఆస్పత్రి ఆవరణలోని కార్డియాలజీ విభాగం ఎదుట రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ నిధులతో క్రిటికల్ కేర్ భవన నిర్మాణం మొదలుపెట్టారు. రూ.23.75 కోట్లతో జీ+4 భవనం నిర్మాణం పూర్తికాగా, 40 పడకలు అత్యవసర వైద్యానికి, 20 పడకలు జనరల్ వార్డుకు, మరో ఐదు పడకలు డయాలసిస్ సేవలకు వినియోగించనున్నారు. ఇక జనరల్ ఆస్పత్రిలో ఖాళీ అయిన గదులను ఓపీ సేవలకు వినియోగిస్తారు. ఈక్రమంలోనే అన్ని విభాగాల ఓపీ సేవలు ఒకే చోట అందేలా మార్పు చేయాలని మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ నిర్ణయించారు. ఈమేరకు ఖాళీ అయిన గదుల్లోకి అక్కడక్కడా ఉన్న కార్డియాలజీ, కంటి, ఈఎన్టీ విభాగాల ఓపీ ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
వరి సాగు నమోదుకు 17 వరకు అవకాశం
ఖమ్మంవ్యవసాయం: వరిలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాలు సాగు చేస్తున్న రైతులు వివరాలను ఆన్లైన్ చేయించుకునే గడువును పొడిగించారు. విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద ఈనెల 17లోగా నమోదు చేయించుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. నిర్దేశించిన సన్న రకాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్దకు బిల్లులతో వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలని, సొంత విత్తనాలైతే ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్లో నమోదు చేయించుకున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ అందుతుందని డీఏఓ ఓ ప్రకటనలో తెలిపారు. రేపు జాతీయ లోక్ అదాలత్ ఖమ్మం లీగల్: అత్యధిక కేసుల పరిష్కారం, కక్షిదారులకు సత్వర న్యాయమే లక్ష్యంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి దేవీమానస తెలిపారు. ఇందుకోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ఆదేశాలతో ఖమ్మంలో పలు బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద కేసులు, చెక్ బౌన్స్, మనోవర్తి, కుటుంబ తగాదాల కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అంతేకాక ట్రాఫిక్ కేసులు, సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారానికి వీలున్నందున కక్షిదారులు ముందుకు రావాలని న్యాయమూర్తి ఓ ప్రకటనలో సూచించారు. -
విత్తనోత్పత్తిలో సంఘాల కీలకపాత్ర
ఖమ్మంవ్యవసాయం: విత్తనోత్పత్తిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కీలకపాత్ర పోషించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన విభాగం డైరెక్టర్ డాక్టర్ నాగేష్‌కుమార్ సూచించారు. ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో గురువారం నాబార్డ్ సహకారంతో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల స్థాయి సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, విత్తన ఉత్పత్తిదారులు, రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నాగేష్ విత్తనోత్పత్తి ప్రాజెక్టు విధానాలు, మార్గదర్శకాలు, లక్ష్యాలను వివరించారు. పీఏసీఎస్‌లు విత్తన ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తే రైతులకు నాణ్యమైన విత్తనాలు అంది పంటల ఉత్పాదకత, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఖమ్మం డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకటఆదిత్య, విత్తన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం ప్రొఫెసర్ డాక్టర్ విద్యాధర్, విత్తన ధ్రువీకరణ అధికారి వేణు, డీసీఓలు గంగాధర్, శ్రీనివాసరావు, శ్రీరామ్, నాబార్డ్ డీడీఎం సుజిత్‌కుమార్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, వైరా కేవీకేల సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ టి.భరత్, డాక్టర్ పావని, డాక్టర్ రాములమ్మ, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ నాగేష్‌కుమార్ -
ఆధునిక విధానాలతో మత్స్య రంగం అభివృధ్ధి
కూసుమంచి: మత్స్యకారులు, మత్స్య రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని యూనియన్ బ్యాంకు పాలేరు మేనేజర్ వెంకట ఫణీంద్రకుమార్ తెలిపారు. పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్ జిల్లాల మత్స్యకారులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. మత్స్య రైతులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం బ్యాంకు ద్వారా అందే రాయితీలను వివరించగా పరిశోధన కేంద్రం పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడాక మత్స్యకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు శాంతన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సాగు ఆరంభంలోనే అడ్డంకులు
కామేపల్లి: వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులు మిర్చి సాగు చేద్దామని భావించిన రైతుకు ఆదిలోనే తెగుళ్ల రూపంలో అడ్డంకి ఎదురైంది. కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బొగ్గారపు నరసింహారావు 150 ప్యాకెట్ల మిరప విత్తనాలతో నారు పెంచాడు. ఒక్కో ప్యాకెట్‌కు రూ.700 చొప్పున రూ.లక్షకు పైగా వెచ్చించాడు. నారు చేతికొచ్చి నాటాలని భావిస్తున్న సమయాన కాండం కుళ్లు తెగులు సోకడంతో మిరప మొక్కలన్నీ ఎండిపోయాయి. దీంతో చేసేదేం లేక ఆశలను చంపుకుని గురువారం నారుమడిని ట్రాక్టర్‌తో దున్నించాడు. మరోపక్క నర్సరీ నుంచి రూ.1కి ఒకటి చొప్పున పదెకరాలకు సరిపడా మిర్చి నారును మరో రూ.1.50లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. అంతా అనుకూలిస్తేనే పెట్టుబడి వచ్చే అవకాశముందని నరసింహారావు చెబుతున్నాడు.మిర్చి నారుకు తెగులు సోకడంతో దున్నించిన రైతు -
‘బీఆర్ఎస్, బీజేపీది దళిత వ్యతిరేక వైఖరి’
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మకై ్క దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, ఈక్రమాన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు, ప్రజాప్రతినిధులను కించపరిచేలా వ్యవహరించడం అత్యంత హేయమని కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులునూతి సత్యనారాయణ గౌడ్, నాగండ్ల దీపక్‌చౌదరి పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్య సమాజం తలదించుకునేలా స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అంతేకాక నిరసన తెలిపేందుకు వెళ్లిన సామాజిక వర్గం ప్రతినిధులు తిరిగి ప్రదేశాన్ని పసుపు నీళ్లతో కడగడం మరింత అమానవీయమని తెలిపారు. కాగా, వారం రోజులుగా జిల్లా బీఆర్ఎస్ నిర్వహించిన నిరసనలకు ప్రజల నుంచి స్పందన రాలేదని ఎద్దేవా చేశారు. ఈమేరకు బీఆర్ఎస్, బీజేపీ శైలిని నిరసిస్తూ శుక్రవారం ఉదయం ఖమ్మంలోని పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, నాయకులు కొత్త సీతారాములు, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్‌గౌడ్, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, తూములూరి లక్ష్మీనరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. భార్య రేణుకను భర్త విద్యాసాగర్ గొంతు నులిపి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో దారిలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగ్గా.. రఘునాథపాలెం సమీపంలో కారులోనే భార్యను భర్త హత్య చేశాడు.భార్యను హతమార్చిన అనంతరం ఇల్లెందులోని బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానంటూ విద్యాసాగర్ చెప్పినట్లు సమాచారం. ప్రగతి స్కూల్ సమీపంలో కారును పక్కకు ఆపిన విద్యాసాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడు విద్యాసాగర్‌కు ఇది రెండో వివాహం కాగా, మృతురాలు రేణుకతో కేవలం నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. సంచలనం సృష్టించిన ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత
కల్లూరు రూరల్/పెనుబల్లి: పెండింగ్ కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా విచారణలో వేగం పెంచాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. కల్లూరు పోలీసుస్టేషన్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించాక మాట్లాడారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపించడం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే, నేరాల నియంత్రణకు పెట్రోలింగ్ పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటుతో లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంకా రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా, సమస్మాత్మక ప్రాంతాల్లో నిఘా, గంజాయి రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. ఆతర్వాత పెనుబల్లి మండలం వీఎం.బంజర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించిన సీఐ కార్యాలయాన్ని సీపీ సునీల్‌దత్ ప్రారంభించారు. సీఐ ముత్తులింగయ్య, ఎస్ఐలు షాకీర్, హరిత, ప్రదీప్, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్


