breaking news
Delhi
-
వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా కల్పిత కథనాలు.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరువు నష్టం దావా కేసులో ఈనాడు, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా పలు మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన కథనాలు తొలగించాలని, రూ.10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ జరిపారు.ఇక నుంచి లడ్డు వివాదంలో రాసే కథనాలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ వివాదంలో ఓ వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరో వైపు కల్పిత కథనాలు రాస్తూ వై.వీ సుబ్బారెడ్డి పరువు, ప్రతిష్టలకు ఎల్లో మీడియా భంగం కలిగించింది. ఇక నుంచి లడ్డూ వివాదంలో రాసే కథనాలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. -
పీఎం అభ్యర్థిగా ప్రియాంక..?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై చర్చ జరుగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికలలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చుపకపోవడంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సూచిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతల అంశంపై రాహుల్, ప్రియాంకలో మధ్య వారసత్వ పోరు నడుస్తోందని బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని, ప్రియాంకలో చూస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వారసత్వ పోరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రియాంక గాంధీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అయితే తనను ప్రధాని చేస్తే పాకిస్థాన్ భరతం పడుతుందని ఆమె ఇందిరా గాంధీ మనవరాలని తనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో అధికార బీజేపీ ఈవ్యాఖ్యలపై కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై నమ్మకం కోల్పోయారని వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన గురించి మాట్లాడారు.రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ "ప్రియాంకా చాలా కష్టపడుతుంది. ఆమె తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. ప్రజల సమస్యలపై ఆమె నిరంతరం పోరాడుతుంది. ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. ప్రజలంతా తనలో ఇందిరా గాంధీని చూస్తున్నారు.కాంగ్రెస్ ఎంపీలు సైతం ఆమెను ప్రధానమంత్రిగా ఆమెదిస్తున్నారు". అని రాబర్ట్ వాద్రా అన్నారు.అదే సమయంలో "రాహుల్ గాంధీ కూడా చాలా కష్టపడుతున్నారు. వారి రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయి. దేశం కోసం వారి ప్రియమైన వ్యక్తులను కోల్పోయారు" అని రాబర్డ్ వాద్రా తెలిపారు. అయితే తనను కూడా ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అయితే బీజేపీ నెపోటిజమ్ పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ సమయంలో తనపై ఈడీ రైడ్ జరుగుతుందన్నారు.అయితే తన పొలిటికల్ ఎంట్రీ అంశం భవిష్యత్తులో ఆలోచిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. -
ఢిల్లీలో ఉద్రిక్తత.. బంగ్లా హైకమిషన్ వద్ద హిందూ సంఘాల నిరసనలు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరససగా వీహెచ్‌పీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్‌పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణాలు, దీపూ చంద్ర దాస్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద బారికేడ్లు తోసుకుంటూ వీహెచ్‌పీ నేతలు లోపలికి వెళ్లే యత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో హిందూ సంఘాలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. #WATCH | Delhi | Members of Vishva Hindu Parishad and other Hindu organisations protest near the Bangladesh High Commission over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh pic.twitter.com/0nrtZ3XWYG— ANI (@ANI) December 23, 2025దీపు చంద్రదాస్ హత్య చేసిన వారిని శిక్షించాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యూనస్ ప్రభుత్వం రాడికల్స్ మద్దతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, హిందువులపై అత్యాచారాలు నిరోధించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని హిందువులను రక్షించాలని కోరారు. 1971 తరహాలో తప్పు చేయవద్దని ఇండియాలో బంగ్లాదేశ్‌ను కలపాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. అనంతరం.. ఆందోళకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలిసింది. మరోవైపు.. బంగ్లాదేశ్‌పై ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 జరగాలంటూ వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. #WATCH | Delhi | Vishva Hindu Parishad and other hindu organisations protest near the Bangladesh High Commission against the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das pic.twitter.com/aKo0T3BUs2— ANI (@ANI) December 23, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్‌లో సైతం హిందు సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భోపాల్‌లో బజరంగ్ దళ్ నేతలు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. #WATCH | Bajrang Dal and other Hindu organisations protest over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh, in BhopalA Bajrang Dal member says,"Bajrang Dal has protested against the Bangladesh government today. We demand that… https://t.co/O134zU9B9p pic.twitter.com/1xVG722dxQ— ANI (@ANI) December 23, 2025 -
26న చీఫ్ సెక్రటరీల సదస్సు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ వారంలో జరిగే చీఫ్ సెక్రటరీల 5వ జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు కొనసాగుతుందని అధికారులు సోమవారం తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సదస్సుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేసే యువ జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు అధికారులు సైతం ఇందులో పాల్గొనే అవకాశముందని చెప్పారు. -
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కు నోటీసులు
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఈడీ అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అప్పీలుపై స్పందన కోరుతూ సోనియా, రాహుల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజెఎల్‌కు కాంగ్రెస్ పార్టీ రూ. 90కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈవ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, అస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దుబే తదితరులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది.ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులు. ఈ సంస్థ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజేఎల్‌కు చెందిన సూమారు. రూ. రెండువేల కోట్ల విలువైన ఆస్తులు పొందారని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఇతర స్వాతంత్ర సమర యోధులు ప్రారంభించారు. దీని నిర్వహణ బాధ్యతలు AJL అనే సంస్థ చూసుకునేది. ఈ పత్రికకు ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. కాగా ఆస్తుల బదిలీ విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది. -
ఏపీ, తెలంగాణలోనే ఎస్సీలపై అధిక దాడులు
సాక్షి, ఢిల్లీ: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఏపీ, తెలంగాణలో ఎస్సీలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ఉదంతాలను ప్రస్తావిస్తూ సోమవారం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై అధిక దాడులు జరుగుతున్నాయి. దళితులను పోలీసు వ్యవస్థ చిన్న చూపు చూస్తూ అమానుషంగా వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఓ దళితుడిని పోలీసుల రౌడీల్లాగా పాశవికంగా కొట్టారు. ఈ ఘటనపై డీజీపీ ఇప్పటికైనా విచారణ జరిపి పూర్తి నివేదిక పంపాలి. అమరావతిలో దళితుల డీకే పట్టా భూముల విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. భూముల రేట్లు పెరిగిన తర్వాత.. వ్యవసాయం చేయడం లేదనే సాకుతో భూమి లాక్కుంటున్నారు. దీనిపై 85 ఫిర్యాదులు వచ్చాయి వాటిపై విచారణ చేస్తున్నాం. ఇప్పటిదాకా 35 ఎకరాలు భూమి బలవంతంగా తీసుకున్నారు. దానికి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి.. తెలంగాణ కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్‌పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేయాలి. ఈ ఘటనలో రీపోస్ట్‌మార్టం జరిగింది. సీఐ సస్పెన్షన్ తో సరిపోదు. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే అని అన్నారాయన. -
భరతం పట్టిన బార్ కోడ్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఒక హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించిన తీరు ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. అది డిసెంబర్ 15వ తేదీ.. కరోల్ బాగ్‌లోని అజ్మల్ ఖాన్ పార్కులో ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సరదాగా ఇన్‌స్టా రీల్స్ షూట్ చేసుకుంటున్నాడు. పక్కనే మద్యం తాగుతున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. గొడవకు కారణమేమిటంటే.. నిందితులు బాధితుడిని అగ్గిపెట్టె అడిగారు. లేదన్నందుకు అతని జేబులు వెతకడం మొదలుపెట్టారు. అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఆవేశంలో ఒక నిందితుడు బీర్ సీసాను పగులగొట్టి, బాధితుడి తలపై బలంగా బాదాడు. బాధితుడు రక్తపు మడుగులో పడిపోగా, నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. క్లూ దొరికిందిలా.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా, దాడికి ఉపయోగించిన పగిలిన బీర్ సీసా దొరికింది. దానిపై ’బార్ కోడ్’ చెక్కు చెదరకుండా ఉంది. అదే ఈ కేసులో కీలక మలుపు.. ఆ బార్కోడ్ ఆధారంగా పోలీసులు సమీపంలోని వైన్ దుకాణాలన్నీ గాలించారు.72 గంటల గాలింపు బార్కోడ్ మ్యాచ్ అయిన వైన్ దుకాణం దగ్గర సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించగా, నిందితులు వాడిన స్కూటర్ బయటపడింది. వరుస సీసీటీవీలను పరిశీలించిన స్పెషల్ టీమ్, కేవలం 72 గంటల్లోనే నిందితుల చిరునామా కనిపెట్టి వారిని చుట్టుముట్టింది.అసలు నిందితులు వీరే! డిసెంబర్ 18న హమ్మద్ అలియాస్ రిజ్వాన్ (22), కామ్రాన్ (24), ఫర్జాన్ (24) అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో హమ్మద్ అనే వ్యక్తి సాధారణ నేరస్తుడు కాదు.. అతనిపై ఇప్పటికే 20 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అగ్గిపెట్టె కోసం మొదలైన గొడవలో.. ఒక చిన్న బార్కోడ్ ఆధారం నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టింది. -
420 హామీలను మూసీలో కలిపారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీలను, 420 హామీలను గాలికి వదిలేశారా? లేక మూసీనదిలో కలిపారా? లేదంటే గాం«దీభవన్‌లో పాతరేశారా?’అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమెకు ఒక బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పుస్తకాన్ని ఢిల్లీకి వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీకు అందజేశారు. ఆ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ మీరు శుభాకాంక్షలు తెలిపారు.కానీ.. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సెపె్టంబర్ 17వ తేదీన హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన మీరు, అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారం చేపట్టి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది.ఈ రెండేళ్లలోఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు మీ పార్టీ ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయతి్నంచారా? కనీసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా?’అని కిషన్‌రెడ్డి తన లేఖలో ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు మరిచి, తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ, మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారని మండిపడ్డారు.‘ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? లేక గాం«దీభవన్‌లో పాతరేశారా?. తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఇచ్చిన మాటమీద నిలబడండి.. ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త హామీలు ఇచ్చే ముందు, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి, మీరు ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే మీరు ప్రకటించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై అధికారానికి దూరం చేస్తుంది’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా మీకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిచర్యలకు పాల్పడి, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాను’అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
రైల్వే ఛార్జీల పెంపు.. 26 నుంచే కొత్త రేట్లు
భారతీయ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. టికెట్ ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. పెరిగిన ఛార్జీలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా పెంచిన రేట్ల ప్రకారం.. లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే..అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే.. ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటరకు 1 పైసా చొప్పన పెంచింది. మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్-ఏసీ ట్రైన్లో 500 కి.మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే.. ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చివరిసారి రైల్వే ఛార్జీల పెంపు 2025 జూలైలో జరిగింది. ఆ పెంపుతో రైల్వేకు సుమారు రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. తాజా పెంపుతో దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. గాలి నాణ్యత ‘తీవ్ర’స్థాయికి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి నగరాన్ని ఘనమైన పొగమంచు, చల్లటి వాతావరణం కమ్మేసింది. దీంతో గాలి నాణ్యత సూచిక (AQI) తీవ్ర స్థాయికి చేరువైంది. శనివారం రాత్రి 11 గంటలకు గాలి నాణ్యత (AQI)410కి చేరి తీవ్ర స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు AQI 396గా నమోదైంది. ప్రభావిత ప్రాంతాలు.. చాంద్ని చౌక్ – 455, వజీర్పూర్ – 449, రోహిణి – 444, జహాంగీర్‌పురి – 444, ఆనంద్ విహార్ – 438 , ముండ్కా – 436కి గాలి నాణ్యత చేరడంతో ఈ ప్రాంతాలన్నీ తీవ్ర కాలుష్యం వర్గంలోకి చేరాయి. దాంతో భారత వాతావరణ శాఖ (IMD) ఘనమైన పొగమంచు హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. చల్లటి వాతావరణం,తక్కువ గాలి వేగం, ఉష్ణోగ్రత మార్పులు కాలుష్యాన్ని నేలమట్టం వద్దే నిలిపేశాయి. ఈ నేపధ్యంలో రోడ్డు, రైలు, విమాన రవాణాపై అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపునులు పేర్కొన్నారు.తక్కువ గాలి వేగం, ఉష్ణోగ్రత ఇన్వర్షన్ కారణంగా కాలుష్యం నేలమట్టం వద్దే నిలిచిపోతుందని నిపుణులు తెలిపారు. శీతాకాలం మరింతగా పెరుగుతున్న కొద్దీ ఢిల్లీలో గాలి కాలుష్యం సమస్య మళ్లీ మళ్లీ తలెత్తుతుందని హెచ్చరించారు. ఢిల్లీలో గాలి నాణ్యత సమస్యపై దీర్ఘకాలిక పరిష్కారాలు, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దాడి చేసిన ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ పాయింట్ వద్ద క్యూను పట్టించుకోకుండా కొందరు ఎయిరిండియా ఉద్యోగులు వెళ్లిపోవడంపై తలెత్తిన వివాదంతో ఈ గొడవ జరిగినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అంకిత్ దివాన్ అనే ప్రయాణికుడు శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎయిర్‌పోర్టులోని టెరి్మనల్–1 వద్ద కొందరు సిబ్బంది క్యూలో ఉన్న వారిని నెట్టేసి ముందుకు వెళ్తుండగా, తాను అభ్యంతరం తెలిపానని ఆయన పేర్కొన్నారు. దీంతో, వేరే విమానంలో అక్కడికి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ ఒకరు నానాదుర్భాషలాడుతూ తనపై చేయిచేసుకున్నారని, పక్కనే ఉన్న తన కూతురు ఈ ఘటన చూసి షాక్‌కు గురైందని అంకిత్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చూశాకనే తమకు తెలిసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై విమానాశ్రయం అధికారులు, ఎయిరిండియా సిబ్బందితోపాటు బాధితుడి నుంచి కూడా ఫిర్యాదు రాలేదని వివరించారు. ఒక వేళ వస్తే, ఘటనకు దారి తీసిన పరిస్థితులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా ఉండగా, ప్రయాణికుడిపై దాడి చేసినట్లుగా భావిస్తున్న పైలట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించామని ఎయిరిండియా తెలిపింది. అంతర్గత దర్యాప్తు చేపట్టామని పేర్కొంది. కాగా, ఆరోపణలను ఎదుర్కొంటున్న పైలట్..ఘటన అనంతరం ఇండిగో విమానంలో బెంగళూరు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
ఇక మహా ఉద్యమమే
న్యూఢిల్లీ: పేద కూలీల ప్రగతి కోసం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుల్డోజ్ చేసిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ మండిపడ్డారు. ఈ పథకాన్ని పక్కనపెట్టి కొత్తగా తీసుకొస్తున్న నల్ల చట్టంతో పేదలు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోనియా గాంధీ శనివారం వీడియో సందేశం విడుదల చేశారు. ఉద్యమంలోకి అడుగుపెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని, గ్రామీణ పేదల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో రైతులు, కూలీలు, భూమిలేని పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ చట్టం పార్లమెంట్లో ఏకాభిప్రాయంతో ఆమోదం పొందిన సందర్భాన్ని సోనియా గుర్తుచేశారు. ఈ చట్టం ఒక విప్లవాత్మకమైన అడుగుగా అభివరి్ణంచారు. ఉపాధి హామీ పథకంతో నిరుపేదలు, అణగారిన వర్గాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందారని వివరించారు. గ్రామాల నుంచి వలసలు ఆగిపోయాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం, గాంధీజీ పేరును తొలగించడం తీవ్ర విచారకరమని సోనియా గాంధీ ఉద్ఘాటించారు. ఎవరినీ సంప్రదించకుండా, ఎలాంటి చర్చ లేకుండా, ప్రతిపక్షాన్ని సైతం విశ్వాసంలోకి తీసుకోకుండా ఉపాధి హామీ పథకంలో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారని ధ్వజమెత్తారు. కొత్త చట్టంతో పథకం అసలు లక్ష్యం పూర్తిగా బలహీనపడుతోందని, ఎవరికి, ఎప్పుడు, ఎలా ఉపాధి కల్పించాలన్నది ఇక ఢిల్లీలోని ప్రభుత్వమే నిర్ణయించే పరిస్థితి వస్తుందన్నారు. నిరుపేద సోదర సోదరీమణులకు ఉపాధి హక్కు కల్పించాలన్న డిమాండ్‌తో 20 ఏళ్ల క్రితం ఉద్యమించానని, మరోసారి అలాంటి ఉద్యమానికి సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. తనతోపాటు తమ పార్టీ నేతలు, కార్యకర్తలంతా ప్రజలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. భారత్ అప్రమత్తం
త్రిపుర: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రికతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లా సరిహద్దు రాష్ట్రం త్రిపురాలో భద్రతా చర్యల్ని కఠినతరం చేసింది. త్రిపుర సీఎం మాణిక్ సాహా ఆదేశాలతో సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి.బంగ్లాదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రికత్తగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లు, శరణార్థుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు,బీఎస్ఎఫ్ సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నీ రక్షణ చర్యల తీసుకుంటోందని త్రిపురా సీఎం స్పష్టం చేశారు.మరోవైపు,బంగ్లాదేశ్‌లో అశాంతి కొనసాగితే, రెండు దేశాల మధ్య వాణిజ్యం, రవాణా, సాంస్కృతిక సంబంధాలు ప్రభావితం కావచ్చు. అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్ అశాంతి త్రిపురా, అసోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యక్ష ముప్పుగా మారవచ్చు.త్రిపురా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక ప్రజలు భద్రతా చర్యలను స్వాగతిస్తున్నప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన కొనసాగుతోంది. -
భాలూకా ఘటన.. యూనస్ సర్కార్‌పై ఆగ్రహజ్వాలలు
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మత దూషణ ఆరోపణలతో హిందూ మతానికి చెందిన ఓ యవకుడ్ని కొట్టి చంపి.. దహనం చేశారు. రాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాలో మళ్లీ కల్లోలం చెలరేగగా.. హిందూ యువకుడి హత్య ఆ అల్లర్లకు మరింత ఆజ్యం పోసినట్లైంది.ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మైమన్సింగ్ జిల్లా భాలూకా ఉపజిల్లాలో 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్‌పై గురువారం రాత్రి మూక దాడి జరిగింది. కొందరు దుండగులు అతణ్ని మతపరంగా దూషిస్తూ తీవ్రంగా కొట్టారు. ఆపై చెట్టుకు వేలాడదీసి ఉరి తీశారు. అనంతరం రహదారి పక్కన పడేశారు. మళ్లీ కొందరు ఆ మృతదేహానికి నిప్పు అంటించడం.. కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.ఈ ఘటనను బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ఎక్స్ వేదికగా స్పందించారు. మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. ఉస్మాన్ హాది మతసామరస్యం కోసం పాటు పడ్డాడని.. కాబట్టి శాంతియుతంగా ఉండాలని అతని అనుచరులకు యూనస్ పిలుపు ఇచ్చారు. మయమన్సింగ్ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని.. ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ప్రజలంతా సంయమనం పాటించాలని, మూక హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.భారత వ్యతిరేకి అయిన రాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. హిందూ యువకుడి మూక హత్య మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. స్క్వేర్ మాస్టర్‌బరీ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నాడు దీపూ చంద్ర దాస్. అయితే..ఇస్లాంకు వ్యతిరేకంగా అతను వ్యాఖ్యలు చేశాడంటూ స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు మత వ్యతిరేక నినాదాలు చేస్తూ అతన్ని ఫ్యాక్టరీ ఆవరణలోనే చితకబాది.. అతి కిరాతకంగా హత్య చేసి హైవేపై అతని మృతదేహాన్ని తగలబెట్టారు. తన కుటుంబానికి ఏకైక ఆధారం తన కొడుకేనంటూ.. అలాంటోడిని భయానకంగా చంపారంటూ జరిగిన ఘటనను వివరిస్తూ దాస్ తండ్రి రవిలాల్ కంటతడి పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ ఘటనపై భారత్‌లో పలువురు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులు సహా ఇతర మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను దాడి చేసి చంపడం దారుణం. నాగరిక సమాజంలో మతం, కులం, గుర్తింపు ఆధారంగా వివక్ష, హింస, హత్యలు జరగడం మానవత్వానికి వ్యతిరేకమైన నేరం. బంగ్లాదేశ్‌లో హిందూ, క్రైస్తవ, బౌద్ధ మైనారిటీలపై పెరుగుతున్న హింసను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. వాళ్ల భద్రత, రక్షణ అంశాన్ని ఢాకాతో బలంగా ప్రస్తావించాలి అని అన్నారామె.ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘1971లో భారత సైన్యం చేసిన త్యాగాలను చరిత్ర గుర్తుంచుకుంటుంది. అప్పట్లో సుమారు 3,900 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, 10,000 మందికి పైగా గాయపడ్డారు. బంగ్లాదేశ్ పుట్టుక కోసం వారు పోరాడారు. కానీ నేడు అదే నేలపై నిరపరాధ మైనారిటీల రక్తం కారడం బాధాకరం. ప్రస్తుతం అక్కడ శాంతి అనే పదం మాటల్లో మాత్రమే కనిపిస్తోంది.. వాస్తవంలో మైనారిటీలపై హింస కొనసాగుతోంది. బంగ్లాదేశ్ హిందూ–బౌద్ధ–క్రైస్తవ ఐక్య మండలి నివేదిక ప్రకారం.. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు 2,400కి పైగా మైనారిటీలపై దాడులు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అన్యాయంగా జైలుకు వెళ్లారు. కమ్యూనిస్ట్ నేత ప్రదీప్ భౌమిక్ లించింగ్.. ఇప్పుడు దీపు చంద్ర దాస్ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కేవలం ఖండనలతో ఆగిపోకుండా, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే, యునైటెడ్ నేషన్స్ (UN) మైనారిటీల పరిస్థితిని గమనించి చర్యలు తీసుకోవాలని కోరారు.జిహాదీల ఉత్సవం అది..బహిష్కృత బంగ్లాదేశ్ రచయిత, మానవ హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ ఈ ఉదంతంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ పథకం ప్రకారమే.. దీపు దాస్ హత్య జరిగిందని అన్నారామె. దీపు చంద్ర దాస్ మరో మతాన్ని కించపరిచాడన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఫ్యాక్టరీలో సహోద్యోగితో జరిగిన గొడవతో అతన్ని బలి పశువు చేశారు. తప్పుడు ప్రచారంతో అతనిపై మూక దాడి జరిగింది. పోలీసులు అతన్ని రక్షించి కస్టడీలోకి తీసుకున్నప్పటికీ.. చివరికి మళ్లీ వాళ్ల చేతికి అప్పగించారు. తాను అమాయకుడినని దీపు ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. అతన్ని ఉరి వేసి, కాల్చేసి “జిహాదీ ఉత్సవం” జరిపింది. దీపు తన కుటుంబానికి ఏకైక ఆదారంగా ఉన్నాడు. అతని సంపాదనతో వికలాంగ తండ్రి, తల్లి, భార్య, చిన్నారి జీవనం సాగించేవారని ఆమె చెప్పారు. ఇప్పుడు కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో, నేరస్తులను ఎవరు శిక్షిస్తారో ప్రశ్నించారు? అని అన్నారామె.భారతీయులకు ఇప్పటికే హెచ్చరికబంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులకు ఇప్పటికే భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ‘‘ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించండి’’ అని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో వెల్లడించారు. అయితే భాలూకా ఘటనపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
‘నో పీయూసీ– నో ఫ్యూయెల్’.. వాహనాలకు ఇంధన నిరాకరణ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా చేపట్టిన ‘నో పీయూసీ.. నో ఫ్యూయెల్’ అమలు గురువారం ప్రారంభమైంది. మొదటి రోజునే 2,800 వాహనాలకు చమురు నిరాకరించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 210 ఎన్ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేశారు.ఇక, పోలీసులతో కలిసి ఎన్ఫోర్స్ మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. డ్రైవ్‌లో భాగంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలవరకు పీయూసీ (పొల్యూషన్ అండ్ కంట్రోల్) నిబంధనలు ఉల్లంఘించిన వారికి 3,746 చలాన్లు జారీ చేసినట్లు తెలిపారు. గురువారం నుంచి ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’అమలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ప్రకటించిన తరువాత నో పీయూసీ సర్టిఫికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. డిసెంబర్ 17న 31వేలకు పైగా సర్టిఫికెట్లు జారీ చేశారు. -
చిమ్మచీకట్లలోనే ఢిల్లీ
ఉత్తర భారతంపై పొగమంచు దుప్పటి కమ్మేసుకుంది. దేశ రాజధాని సహా పంజాబ్, హర్యానా, ఇటు ఉత్తర్‌ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్ సహా బిహార్ రాష్ట్రాలపై ప్రభావం చూపెడుతోంది. ఢిల్లీలో శనివారం తెల్లవారు ఝామున 8గం. సమయంలోనూ చిమ్మచీకట్లు నెలకొన్నాయి. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి కనిపించింది. వాయు కాలుష్యానికి పొగమంచు తోడు కావడంతో ఊపిరి సైతం పీల్చుకోలేని స్థితిలో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెడ్ అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్‌కు మార్చింది వాతావరణ శాఖ. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు రోజంతా నెలకొంటాయని నగర వాసులను హెచ్చరిస్తోంది. మరోవైపు.. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్లలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను కంటిన్యూ చేస్తోంది. రాజధానిలో ఇవాళ ఉదయం 7గం. సమయంలో ప్రగతి మైదాన్ భైవర్ మార్గ్ వద్ద ఏక్యూఐ 433గా రికార్డు కావడం గమనార్హం. ఐటీవోలో 439, ఆనంద్ విహర్లో 423, జహంగీర్‌పూరీలో 420, నెహ్రూ నగర్లో 418, వాజిర్‌పూర్‌లో 417, పంజాబీ బాగ్‌లో 423, రోహిణిలో 407గా ఏఐక్యూ నమోదు అయ్యింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ మొత్తంగా 380గా ఉండి ‘వెరీ పూర్’ కేటగిరీలో కొనసాగుతోంది. #WATCH | Delhi | Dense layer of toxic fog engulfs the national capital. Visuals from Bhairav Marg near Pragati Maidan. CPCB claims that the AQI in the area is at '433', categorised as 'Severe'. pic.twitter.com/1D79ZqKSeG— ANI (@ANI) December 20, 2025పొగమంచు కారణంగా రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో.. రహదారుల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాజధాని రీజియన్ నుంచి 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంచువల్ల ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేయొద్దని.. విమాన ప్రయాణాల అంతరాయాల విషయంలో తగిన మార్గదర్శకాలు పాటించాలని ఇటు పౌర విమానయాన శాఖ.. అటు డీజీసీఏ ఎయిర్‌లైన్స్‌లకు హెచ్చరికలు జారీ చేశాయి. -
ఈసారి బడ్జెట్ ఆదివారమే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ‘కేంద్ర బడ్జెట్’ ఈసారి ఒక సంచలనానికి వేదిక కాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సెలవు రోజు పార్లమెంటు సభలు జరగడం అరుదైన విషయమైనా, ఈసారి అది కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.సస్పెన్స్ రేపుతున్న ఫిబ్రవరి 12017 నుండి బడ్జెట్‌ను ఫిబ్రవరి మొదటి తేదీనే ప్రవేశపెట్టడం ఒక ఆచారంగా మారింది. అయితే, 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కేంద్రంపై పడింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును దీనిపై ప్రశ్నించగా.. ‘సరైన సమయంలో క్యాబినెట్ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది’.. అంటూ సస్పెన్స్‌ను కొనసాగించారు.కొత్తేమీ కాదు కానీ..బ్రిటిష్ కాలం నాటి ’వారాంతపు సెలవు’ విధానం మన బడ్జెట్ తేదీని మార్చలేదు. గతంలో కూడా కోవిడ్ సమయంలో, పార్లమెంటు 60వ వార్షికోత్సవం (మే 13, 2012) సందర్భంగా ఆదివారాల్లో సభలు నిర్వహించిన చరిత్ర ఉంది. ఒకప్పుడు బడ్జెట్ అంటే ఫిబ్రవరి చివరి రోజు జరిగేది. -
సంప్రదాయ వైద్యానికి సముచిత స్థానం దక్కాలి
న్యూఢిల్లీ: సంప్రదాయ వైద్యానికి సరైన గుర్తింపు ఇప్పటికీ లభించలేదని ప్రధానమంత్రి మోదీ శుక్రవారం అన్నారు. ఈ వైద్య విధానం తన పరిధిని మరింతగా విస్తరించుకోవాలంటే, శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రజల నమ్మకాన్ని గెలవాల్సి ఉందని చెప్పారు. సంప్రదాయ వైద్యంపై శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ప్రధాని ప్రసంగించారు. డిజిటల్ సాంకేతికతను వాడుకుంటూ పరిశోధనలను మరింతగా విస్తరించుకుంటూ సంప్రదాయ వైద్యం తన పరిధిని పెంచుకోవాలని సూచించారు. లైఫ్‌స్టయిల్ విధానాలకు మాత్రమే సంప్రదాయ వైద్య పరిమితమనే నమ్మకం ఒకప్పుడు ఉండేది. ఈ ఆలోచనాధోరణిలో వేగంగా మార్పువచ్చింది. క్లిష్టమైన సందర్భాల్లో సైతం సంప్రదాయ వైద్య విధానాలు నేడు ప్రభావవంతంగా ఉంటున్నాయి. ఇదే దృక్పథం భారత్‌లోనూ ఉంది’అని ప్రధాని మోదీ చెప్పారు. ‘ఒకప్పుడు ప్రపంచంలోని అత్యధిక ప్రాంతంలో సంప్రదాయ వైద్యానికే పెద్దపీట వేసేవారు. అయినప్పటికీ, దీనికి దక్కాల్సిన స్థానం ఇప్పటికీ దక్కలేదు. సైన్స్ ద్వారా నమ్మకాన్ని పెంచుకోవాలి. మరింతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్లాలి’అని అన్నారు. భారతీయ సంప్రదాయ వైద్య విధానాల్లో కీలకంగా ఉన్న అశ్వగంధకు కోవిడ్ మహమ్మారి సమయంలో అంతర్జాతీయంగా డిమాండ్ వచ్చిందన్నారు. భారత వైద్య నిపుణులు అమూల్యమైన పరిశోధనలు, సాధించిన ప్రమాణాల ఫలితంగా అశ్వగంధకు సముచిత స్థానం దక్కిందని వివరించారు. ఇలాంటి మూలికలకు ప్రపంచ ఆరోగ్య రంగంలోభాగంగా మారేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రకటించారు. సంప్రదాయ వైద్యానికి అంగీకార యోగ్యతను కల్పించడం దేశాల బాధ్యతని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మై ఆయుష్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ పోర్టల్(ఎంఏఐఎస్‌పీ)ని ప్రారంభించారు. ఆయుష్ ఉత్పత్తులు, సేవల నాణ్యతను నిర్ధారించే ఆయుష్ మార్క్‌ను ఆవిష్కరించారు. అశ్వగంధపై తపాలా స్టాంపును విడుదల చేశారు. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ప్రతాప్‌రావ్ జాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేటి నుంచి ఉప రాష్ట్రపతి పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రెండు రోజుల పా టు తెలంగాణలో పర్య టించనున్నారు. శనివారం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.21న నందిగామ లోని కన్హా శాంతి వనంలోని హార్ట్ఫు ల్నెస్ గ్లోబల్ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రపంచ ధ్యాన దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఉపరాష్ట్రపతి సచివాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
26న విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కస్టడీని సుప్రీంకోర్టు మరో వారం పొడిగించింది. డిసెంబర్ 25 వరకు పోలీసు విచారణకు అనుమతి ఇచ్చిన కోర్టు, 26న ఆయన్ను విడుదల చేసి ఇంటికి పంపాలని ఆదేశించింది. ప్రభాకర్‌రావును జైలుకు పంపాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. తదుపరి విచారణ జరిగే 2026 జనవరి 16 వరకు అరెస్టు కూడా చేయరాదని స్పష్టం చేసింది. ’ఆయన మా ఉత్తర్వుల మేరకే సరెండర్ అయ్యారు..అలాంటప్పుడు విచారణ పూర్తయ్యాక మళ్లీ రిమాండ్‌కు ఎందుకు పంపాలి?’అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న సమయంలో ఇంటి భోజనం, మందులు అనుమతించాలని తెలిపింది. ప్రభాకర్‌రావు కూడా దర్యాప్తునకు సహకరించాలని, విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రభాకర్‌రావు కస్టడీ విచారణ రిపోర్టును కోర్టుకు సమరి్పంచింది. అనంతరం ఇరుపక్షాలు వాదనలు విన్పించాయి. కాల్చమని చెబితే కాల్చేస్తారా? ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ‘విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదు. డివైస్‌లలో ఎలాంటి సమాచారం లేదు. ముందుగానే వాటిని ధ్వంసం చేశారు. దర్యాప్తు ఇంకా కీలక దశలో ఉంది. నిందితుడి నుంచి రాబట్టాల్సిన సమాచారం చాలా ఉంది. అందువల్ల మరో వారం రోజుల కస్టడీ అవసరం. కస్టడీ గడువు ముగిసిన తర్వాత, తదుపరి విచారణ జరిగే వరకు ప్రభాకర్‌రావును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలివ్వాలి. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. జడ్జిలు, డ్రైవర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం. ప్రభుత్వ పెద్దలు.. ఎవరినైనా కాల్చమని చెబితే కాలుస్తారా?..’అంటూ వాదించారు. అసలు మీరెందుకు భయపడుతున్నారు? అయితే ఈ అభ్యర్థనను జస్టిస్ నాగరత్న తోసిపుచ్చారు. ’పోలీసు విచారణ కోసమే ప్రభాకర్‌రావు వచ్చారు. అది పూర్తయిన తర్వాత ఆయన్ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాల్సిన అవసరం ఏముంది?..’అని ప్రశ్నించారు. రిమాండ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ’అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య వహారం గురించి మీరెందుకు (ప్రభుత్వం) అంతగా భయపడుతున్నారు? ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు ఎవరైనా మీ ఫోన్ వింటే ఏమవుతుంది..’అని ప్రశ్నించారు. అది విచారణ కాదు.. ‘చైనీస్ టార్చర్’ అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్‌కుమార్, దామా శేషాద్రినాయుడు వాదించారు. ‘ప్రభాకర్‌రావు వయసు 69 ఏళ్లు. కేన్సర్ సర్వైవర్. ఆయన్ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. రోజుకు 12 గంటల పాటు కూర్చోబెట్టి నరకం చూపిస్తున్నారు. అడిగిన ప్రశ్నలే వందసార్లు అడుగుతూ వేధించడం దర్యాప్తు కాదు. ఇది మనిషిని మానసికంగా కుంగదీసే ‘చైనీస్ టార్చర్ మెథడ్’. తనకు వ్యతిరేకంగా తానే స్టేట్మెంట్ ఇచ్చేలా వేధిస్తున్నారు..’అని చెప్పారు. ‘ఒక సీనియర్ సిటిజన్‌ను, 30 ఏళ్లు ప్రజలకు సేవలందించిన అధికారిని ఇలా రోడ్డున పడేయడం దారుణం. సిట్ బృందాన్ని పెంచింది దర్యాప్తు కోసం కాదు. షిఫ్టుల వారీగా మారుతూ వృద్ధుడైన నిందితుడిని వేధించడానికే..’అని వాదించారు. -
ఈడీ దూకుడు.. సోనూసూద్ ఆస్తులు అటాచ్
ఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ 1xBet కేసులో ప్రముఖులు, క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకుల ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక సమాచారం.ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రముఖ క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకులు, మోడల్స్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది.అటాచ్ చేసిన ఆస్తులుయువరాజ్ సింగ్ (క్రికెటర్): రూ.2.5 కోట్లురాబిన్ ఉతప్ప (క్రికెటర్): రూ.8.26 లక్షలుసోనూసూద్ (నటుడు): రూ.1 కోటినేహా శర్మ (నటి): రూ.1.26 కోట్లుమిమి చక్రబోర్తి (మాజీ TMC MP): రూ.59 లక్షలుఅంకుష్ హజ్రా (బెంగాలీ నటుడు): రూ.47 లక్షలుఉర్వశి రౌతేలా తల్లి: రూ.2.02 కోట్లుమొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది.కేసు నేపథ్యం1xBet అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉందని ఈడీ అంచనా వేసింది. కేసు విచారణలో భాగంగా పీఎంఎల్ఏ కింద ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం. -
లోక్ సభ నిరవధిక వాయిదా
ఢిల్లీ: కాలుష్యంపై చర్చించకుడానే లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. నిన్న వీబీ జీ-రామ్-జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇవాళ కూడా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. వీబీ జీ-రామ్-జీ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ ఫొటోలతో విపక్షాల నిరసనకు దిగాయి. రాత్రంత సంవిధాన్ సదన్ ముందు తృణమూల్ ఎంపీలు నిరసనలు తెలిపారు.తెల్లవారుజాము దాకా అక్కడే ఉండి ఎంపీలు నిరసనలు తెలిపారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ(జీ రామ్ జీ) బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. తొలుత లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సభలో బిల్లు ప్రతులను చించేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని, గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను నీరుగారుస్తోందని మండిపడ్డారు.పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఏమిటని నిలదీశారు. గాం«దీజీ వారసత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. జీ రామ్ జీ బిల్లుపై లోక్‌సభలో దాదాపు 8 గంటలపాటు చర్చ జరిగింది.జీ రామ్ జీ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. సమగ్ర పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. బిల్లులో సవరణలు సూచించడానికి తగినంత సమయం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో అర్ధరాత్రి దాటాక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. -
ప్రభాకర్‌రావుకు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఐబీ మాజీ చీఫ్, ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావుకు మరో షాక్ తగిలింది. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని మరోసారి స్పష్టం చేస్తూ.. ఆయన కస్టడీని వారం పొడిగిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావుకు సంబంధించిన కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్టును ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఇవాళ కోర్టుకు సమర్పించింది. ‘‘ప్రభాకర్‌రావు కీలక విషయాలు దాటవేస్తున్నారు. విచారణకు ఏమాత్రం సహకరించలేదు’’ అని తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో.. ఆయన్ని మరికొన్ని రోజులు విచారణ జరపాల్సి ఉందని. కస్టడీ పొడిగించాలని మరో న్యాయవాది సిద్ధార్థ లూత్రా విజ్ఞప్తి చేశారు.పోలీస్ కస్టడీలో విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. డివైజ్‌లలో ఎలాంటి సమాచారం లేదు. ముందుగానే వాటిని ధ్వంసం చేశారు. మరో వారం రోజుల పోలీస్ కస్టడీ అవసరం. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. జడ్జిలు, డ్రైవర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు. వ్యక్తిగత గోప్యత కు సంబంధించిన అంశం. ప్రభుత్వ పెద్దలు.. ఎవరినైనా కాల్చమని చెబితే కాలుస్తారా?.. ప్రభాకర్ రావు అనేక సాక్షాధారాలను ధ్వంసం చేశారు.. అని తుషార్ మెహతా, సిద్ధార్థ్ లూత్రా వాదించారు. ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘విచారణ పేరుతో ప్రభాకరరావును వేధిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఏకకాలంలో విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు 69 ఏళ్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు. కనీసం మానవత్వం చూపించడం లేదు. తనకు వ్యతిరేకంగా తానే స్టేట్మెంట్ ఇచ్చేలా వేధిస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21 ఉల్లంఘించడమే. 17 సార్లు పిలిచి దాదాపు 96 గంటలకు పైగా విచారించారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ పోలీసుల తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం .. ఆయన కస్టడీని మరో వారం రోజులు(డిసెంబర్ 25 దాకా) పొడిగించింది. ఆ మరుసటిరోజు ఆయన్ని విడుదల చేయాలని సిట్‌ను ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ప్రభాకర్‌రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు (అరెస్ట్.. థర్డ్ డిగ్రీలాంటి చర్యలు) తీసుకోవద్దని సిట్‌కు స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే.. ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూనే అరెస్ట్ నుంచి ఇంతకాలం ఊరటగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు డిసెంబర్ 11వ తేదీన ఎత్తేసింది. ఆయన్ని తక్షణమే సిట్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. వారంపాటు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని.. ఆ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడని.. విచారణ వివరాలను తమకు నివేదిక రూపంలో సమర్పించాలని కోర్టు ఆ సమయంలో సిట్‌కు సూచించింది. వారం రోజుల కస్టడీ విచారణ ముగియడంతో శుక్రవారం ఆ నివేదికను కోర్టుకు అందించింది. అయితే విచారణలో ఆధారాలు ముందుంచి ప్రశ్నించినా కూడా.. ఆయన నోరు మెదపలేదని తెలుస్తోంది. ప్రభాకర్‌రావుకు సంబంధించి ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లలోని ఐక్లౌడ్, జీమెయిల్ అకౌంట్లలోని సమాచారాన్ని సిట్ కీలకంగా భావిస్తోంది. కానీ, అప్పటికే ఆయన ఆ సమాచారం అంతా డిలీట్ చేశారు. దీంతో ఫోరెన్సిక్ నివేదిక మీద సిట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు.. వారం కస్టడీ పొడిగింపుతోనైనా ఆయన్నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. -
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ చాలా తగ్గిపోయింది. రేపటి వరకు తీవ్రస్థాయిలో పొగమంచు కొనసాగుతుందని ఢిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఉత్తరాఖండ్లపై కూడా దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, త్రిపురలో రేపటి వరకు కూడా పొగమంచు కప్పేస్తుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది.కాగా, పొగమంచు కారణంగా ఢిల్లీలో వాహనాలూ కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో రాజధానిని పొగమంచు కప్పేసినట్లు ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. జాతీయ రాజధానిలో సగటు గాలి నాణ్యత సూచిక (AQI) ఇవాళ ఉదయం 7 గంటలకు 387గా నమోదైంది. నిన్న (గురువారం) వాయు నాణ్యత (AQI) 373గా నమోదైంది. ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు కారణంగా 27 విమానాలు రద్దు కాగా.. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.కాగా, ఢిల్లీ ప్రభుత్వం పలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది. గ్రాప్ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ- ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో నిర్వహణ, మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల వాహనాలు మినహా ఢిల్లీలోకి డీజిల్ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించారు. గడువు ముగిసిన వాహనాలపై నిషేధం అమలు చేస్తున్నారు. ఢిల్లీ పొల్యూషన్ నేపథ్యంలో 5వ తరగతి వరకు ఆన్లైన్లలో మాత్రమే తరగతులు నిర్వహించాలని.. 6 నుంచి 12వ తరగతి వరకు హైబ్రిడ్ విధానంలో క్లాసులు చేపట్టాలని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. -
ఆ 102 ఎకరాలు సర్కారువే.. సాలార్ జంగ్ వారసులకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ–మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని తేలి్చచెప్పింది. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అసలు వివాదం ఏమిటంటే? రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ (సాలార్జంగ్–3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వారు వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమరి్థంచాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు జాగీర్ల రద్దుతోనే సర్కారు పరం: 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని, అప్పటి నుంచి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అ«దీనంలోనే ఉందని పేర్కొంది. ఆ పత్రాలు చెల్లవు: సాలార్జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా, అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులు తీర్పునివ్వడం సరికాదని తప్పుబట్టింది. అధికారులు పరిధి దాటారు: టైటిల్ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, సమ్మరీ ఎంక్వైరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది. అటవీ శాఖ నిర్లక్ష్యం: ఈ కేసులో సరైన సమయంలో సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శించారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరో అప్పీల్ కూడా కొట్టివేత ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుస్త్రీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేలి్చనందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని తేలి్చచెప్పింది. 8 వారాల్లోగా పూర్తి చేయండి.. నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. ఈ 102 ఎకరాల భూమిని ’రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమరి్పంచాలని స్పష్టం చేసింది. -
ఆ వీడియో చూసి.. మానవత్వం అంటే ఏమిటో చెప్పండి..!
న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) వీధి కుక్కలపట్ల అమానవీయంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘తదుపరి విచారణ సమయంలో ఒక వీడియో చూపిస్తాము, అమానవీయం ఏమిటో అప్పుడే మీరు చెబుదురుగాని అంటూ వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాట్లతో చిన్నారులు రేబిస్ బారినపడుతున్నారంటూ వచి్చన కథనంపై సుమోటోగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..నవంబర్ 7వ తేదీన విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లలో వీధికుక్కలు, ఇతర జంతువులు కనిపించరాదని, వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయించాలని దేశవ్యాప్త ఆదేశాలివ్వడం తెల్సిందే. అయితే, ఢిల్లీలోని అధికారులు అదనంగా మరికొన్ని నిబంధనలను చేర్చి, వీధి కుక్కలపై దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ గురువారం వాదించారు. అయితే, దీనిపై ఇప్పుడేమీ తాము విచారణ చేపట్టబోమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం స్పష్టం చేసింది. జనవరి 7వ తేదీన జరిగే విచారణ సందర్భంగా తామొక వీడియో చూపిస్తామని, దాన్ని చూశాక మానవత్వం గురించి మాట్లాడుతామంటూ వ్యాఖ్యానించింది. కుక్కల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న వైఖరిపై తామూ ఒక వీడియో చూపుతామని కపిల్ సిబాల్ తెలిపారు. -
‘బార్ కౌన్సిల్’లో మహిళలకు 30% కోటా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మహిళా న్యాయ వాదులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ, ఏపీ బార్ కౌన్సిళ్లలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కచి్చతంగా అమలు చేయాల్సిందేనని తేలి్చచెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగి్చలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్లోనే ఈ రిజర్వేషన్ అంశాన్ని స్పష్టంగా పొందుపరచాలని కోర్టు ఆదేశించింది.దేశవ్యాప్తంగా బార్ కౌన్సిళ్లలో మహిళలకు 1/3 వంతు ప్రాతినిధ్యం కోరుతూ న్యాయవాది యోగమయ, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 8న కోర్టు తీర్పునిచి్చంది. ఎన్నికల ప్రక్రియ మొదలుకాని చోట 30 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని సూచించింది. ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదని, కాబట్టి ఇక్కడ కూడా మహిళా రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుతూ సునీత, సుభాíÙణి గుడిమల్ల సహా మరికొందరు మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. వారి పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించి, పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ.. విచారణ సందర్భంగా తెలంగాణలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని సీజేఐ ప్రశ్నించగా.. శుక్రవారమే వస్తుందని న్యాయవాదులు బదులిచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. ‘తెలంగాణ ఒక ప్రగతిశీల రాష్ట్రం. అక్కడ మహిళా రిజర్వేషన్ల అమలులో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఇవే ఆదేశాలు ఏపీకి కూడా వర్తిస్తాయని, గతంలో ఇచి్చన ఉత్తర్వులను సవరిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎన్నికల్లో పోటీకి తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకపోతే.. 20 శాతం సీట్లను పోటీకి కేటాయించి, మిగిలిన 10 శాతం సీట్లకు మహిళలను కో–ఆప్ట్ (నామినేట్) చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. -
పోలవరం నిర్వాసితుల్ని పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు పోలవరం కోసం సర్వస్వం కోల్పోయిన నిర్వాసితుల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025–26) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్వాసితులకు న్యాయం చేయడం లేదని కమిటీ లోక్‌సభకు సమర్పించిన 24వ నివేదికలో తీవ్రస్థాయిలో మండిపడింది. గిరిజనులకు చట్టప్రకారం దక్కాల్సిన భూమికి భూమి హక్కును కాలరాస్తున్నారని, పునరావాస ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్) అమలులో తీవ్రమైన లోపాలున్నాయని తెలిపింది. 2024 నవంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు ఓవరాల్‌గా 53.47 శాతం.. హెడ్ వర్క్స్ 74.27 శాతం, ప్రధాన డ్యామ్ పనులు 75.60 శాతం పూర్తయ్యాయని తెలిపింది. కానీ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన భూసేకరణ, పునరావాసం పనులు మాత్రం 22.66 శాతం మాత్రమే పూర్తయ్యాయని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం చివరిదశకు చేరుకుంటున్నప్పటికీ, నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. గిరిజనులకు తీవ్ర అన్యాయం పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని సుమారు 371 ఆవాసాలు, 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపింది. పోలవరం ముంపులో ఉన్న 1,06,006 కుటుంబాల్లో సగానికి పైగా (56,504 కుటుంబాలు) గిరిజనులే ఉన్నారని పేర్కొంది. 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 41–42 ప్రకారం గిరిజన కుటుంబాలు భూమి కోల్పోతే వారికి ప్రత్యామ్నాయంగా సాగుభూమి ఇవ్వాలని, కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని తెలిపింది. తగిన భూమి దొరకలేదనే సాకుతో గిరిజనులకు నచ్చజెప్పి నగదు పరిహారాన్ని అంటగడుతున్నారని, ఇది స్వచ్ఛందంగా జరుగుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో భూసేకరణకు ముందు గ్రామసభల అనుమతి తప్పనిసరని తెలిపింది. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనుల వ్యక్తిగత, సామూహిక హక్కులను పూర్తిగా నిర్ధారించకముందే హడావుడిగా గ్రామసభలు నిర్వహిస్తున్నారని తప్పుబట్టింది. పోడుభూములు సాగుచేసుకునేవారిని, భూమిలేని కూలీలను, మత్స్యకారులను నిర్వాసితుల జాబితాలో చేర్చడంలో అధికారులు విఫలమయ్యారని ఎత్తిచూపింది.పాతరేట్లతో పరిహారంచట్టంలోని సెక్షన్ 26–30 ప్రకారం పరిహారం చెల్లించడంలో లోపాలున్నాయని కమిటీ నివేదికలో పేర్కొంది. భూమి విలువను నిర్ణయించేటప్పుడు పాత సర్కిల్ రేట్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నారని, దీనివల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపింది. కేవలం భూమి విలువనే కాకుండా అందులో ఉన్న ఆస్తుల విలువను పరిహారంలో సరిగ్గా లెక్కించడం లేదని పేర్కొంది.వసతులు కల్పించకుండానే నిర్వాసితుల తరలింపు చట్టంలోని సెక్షన్ 37–38 ప్రకారం పరిహారం మొత్తం చెల్లించి, పునరావాస కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించేంతవరకు నిర్వాసితుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోకూడదని, వారిని ఖాళీ చేయించకూడదని తెలిపింది. పునరావాస కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి కనీస సౌకర్యాలు కల్పించకముందే నిర్వాసితులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం పూర్తిగా చెల్లించి, పునరావాస కాలనీలు సిద్ధమయ్యేంతవరకు నిర్వాసితుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోకూడదని స్పష్టం చేసింది. పరిహారం, పునరావాస పనుల్లో పారదర్శకత కోసం గ్రామాల వారీగా వివరాలను ఆన్లైన్ పోర్టల్‌లో ఉంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అంతర్రాష్ట్ర చిక్కుముడి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ముంపు ప్రభావంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది. గోదావరి వరద ఉధృతిని 36లక్షల క్యూసెక్కులుగా కాకుండా, 50లక్షల క్యూసెక్కులుగా పరిగణించి రక్షణ చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయంది. ఈ వివాదం సుప్రీంలో ఉండటంతో, ఆయా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగలేదని నివేదిక తెలిపింది.2024 నవంబర్ నాటికి ఇదీ పోలవరం పరిస్థితిమొత్తం ముంపు గ్రామాలు 222 రెవెన్యూ గ్రామాలు నిర్వాసిత కుటుంబాలు 1,06,006ఇంకా సేకరించాల్సింది 54,640 ఎకరాలు తరలించినవి 12,797 కుటుంబాలు భూసేకరణ లక్ష్యం: 1,67,765 ఎకరాలు ప్రాజెక్టు ఓవరాల్ పురోగతి 53.47 శాతం భూ సేకరణ, పునరావాసం పురోగతి 22.66 శాతం -
స్పీకర్ నిర్ణయం విచారకరం
సాక్షి, న్యూఢిల్లీ: శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం విచారకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘కొందరు ఎమ్మెల్యేలు తాము పార్టీలు మారినట్లు స్వయంగా టీవీల ముందు, ప్రజల ముందు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఇన్ని ఆధారాలున్నా.. వారు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం విచారకరం. నాడు కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ రెండు పార్టీలు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాయి. తెలంగాణలో ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలి’అని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుందని కిషన్‌రెడ్డి చెప్పారు. నష్టాల ఊబిలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు.. ‘11 ఏళ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. విద్యుదుత్పత్తి, విద్యుత్ సరఫరాపై సమర్థవంతంగా పనిచేస్తోంది. పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో.. పారిశ్రామిక, గృహ, వ్యవసాయ అవసరాలకు విద్యుత్ కొరత ఉంది. తెలంగాణలోనూ విద్యుత్ సరఫరాకు అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తోంది. భవిష్యత్తులో అందించేందుకూ సిద్ధంగా ఉంది. కానీ.. తెలంగాణలో ప్రస్తుతం విద్యుదుత్పత్తి సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోవడం దురదృష్టకరం. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీల డిన్నర్ మీటింగ్
ఢిల్లీ: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో కాసేపటి క్రితం తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి, గొడం నగేశ్, ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, రామచంద్రరావు గారి నేతృత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, మునిసిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు నిర్ణయించారు. తెలంగాణ బీజేపీ ఎంపీల పని తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
విపక్షాల నిరసన మధ్యే ‘జీ-రామ్-జీ’ బిల్లుకు ఆమోదం
ఢిల్లీ: వికసిత భారత్ జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసన మధ్యే ‘జీ-రామ్-జీ’ బిల్లుకు ఆమోదం లభించింది. వీబీ-జీ-రామ్-జీ బిల్లు పత్రులను చించి విపక్షాలు నిరసన తెలిపాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం మార్చగా.. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ రేపటికి(శుక్రవారం) వాయిదా పడింది.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఈ బిల్లుతో కూలీలకు ప్రతిఏటా 125 రోజులపాటు పని లభిస్తుందని కేంద్రం చెబుతోంది. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని కేంద్ర సర్కార్ అంటోంది. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్ సభ్యుడు జైప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అది అతిపెద్ద నేరమన్నారు. కాగా, దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) 100 శాతం అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన సబ్కా బీమా సబ్కా రక్షా(బీమా చట్టాల సవరణ) బిల్లు–2025 పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతం ఎఫ్‌డీఐలను ఆమోదిస్తున్నారు. దీన్ని ఇకపై 100 శాతానికి పెంచబోతున్నారు. అలాగే, కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన రిపీలింగ్, అమెండ్మెంట్–2025 బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. -
ఇంకా గ్యాస్ చాంబర్‌లానే ఢిల్లీ!
న్యూఢిల్లీ: నివారణ చర్యలు చేపట్టినా కూడా రాజధానిలో వాయు కాలుష్యం తగ్గడం లేదు. ఢిల్లీలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసి, దృశ్యమానత గణనీయంగా తగ్గిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం గురువారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) 358 వద్ద నమోదైంది. ప్రస్తుత ఏక్యూఐ చాలా పేలవమైన విభాగంలోకి వస్తుంది. ఢిల్లీలోని 39 మానిటరింగ్ స్టేషన్లలో నాలుగు తీవ్రమైన కేటగిరీలో AQI నమోదు కాగా, మరికొన్ని ఇంకా కింద ఉన్నాయి. బుధవారం 24 గంటల సగటు AQI 334గా నమోదైంది. NCRలోని నోయిడా (331), గ్రేటర్ నోయిడా (310), గురుగ్రామ్ (279)లో కూడా గాలి నాణ్యత దారుణంగా ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఉదయం వేళల్లో వాయువ్య దిశ నుండి గంటకు 10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళల్లో గాలి వేగం 15 కి.మీ వరకు పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో పశ్చిమ దిశ నుండి 10 కి.మీ కంటే తక్కువకు పడిపోతుంది. ఈ గాలి మార్పులు పొగమంచును వెదజల్లడంలో సహాయపడతాయి. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండదు, తరువాతి రోజుల్లో 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని IMD అంచనా వేసింది. రాకపోకలకు అంతరాయమే..ఢిల్లీ విమానాశ్రయం తక్కువ విజిబిలిటీ కారణంగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక జారీ చేసింది. విమాన కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నప్పటికీ, ప్రయాణికులు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్స్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ కూడా ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. తాజా నిబంధనలతో గుర్గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుంచి ఎంటర్ అయ్యే 12 లక్షల వాహనాలపై ప్రభావం పడనుంది. ఈ వాహనాల తనిఖీ కోసం 126 చెక్ పాయింట్ల వద్ద 580 మంది పోలీసుల మోహరించారు. పెట్రోల్ బంకుల వద్ద ట్రాన్స్పోర్ట్, ఎం సి డి ,ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారుల మోహరించారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేతఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది గ్రాప్ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. గ్రాఫ్ ఫోర్ నిబంధనల నేపథ్యంలో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మిగిలిన తరగతులకు హైబ్రిడ్ మోడ్ క్లాసులు జరగనున్నాయి. పీయూసీసీ (Pollution Under Control Certificate) లేని వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేయబడుతుంది. BS-VI నిబంధనల కంటే తక్కువ ఉన్న ఢిల్లీయేతర వాహనాలు రాజధానిలోకి ప్రవేశించకుండా నిరోధించబడ్డాయి. పార్లమెంట్లో నేడు చర్చఢిల్లీ-ఎన్సీఆర్లో పొగమంచు, వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో AQI చాలా దారుణమైన స్థాయికి పడిపోతుందని ఓ అంచనా. ఢిల్లీ వాయు కాలుష్యంపై నేడు లోక్ సభలో చర్చ జరగనుంది. విపక్షాల నుండి చర్చ ప్రారంభించనున్న ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్. బీజేపి తరపున చర్చలో నిషికాంత్ దూబే, బన్సూరీ స్వరాజ్ పాల్గొననున్నారు. -
రాష్ట్రాలపై భారం మోపి.. ‘ఉపాధి’ని ఎత్తేసే కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ పేదలకు కష్టకాలంలో అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించేందుకు.. పేదలకు హక్కుగా ఉన్న ఉపాధిని అగమ్యగోచరంగా మార్చేలా, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాల మెడపై కత్తి వేలాడదీసేలా రూపొందించిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ బిల్లు–2025’పై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభలో బుధవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రా లపై భరించలేనంత భారం మోపి, పరోక్షంగా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టే ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ‘ఇన్నాళ్లూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక చట్టబద్ధమైన హక్కుగా ఉండేది. కానీ కేంద్రం తెస్తున్న కొత్త బిల్లులోని అస్పష్టమైన నిబంధనల వల్ల ఆ హక్కును పేదలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ బిల్లు పేదల్లో తీవ్ర అభద్రతాభావాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్రాలు కేవలం 10 శాతం మాత్రమే భరిస్తున్నాయి. కొత్త బిల్లులో కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించుకుని, రాష్ట్రాలపై ఏకంగా 40 శాతం భారం మోపడం దారుణం. ఇది సమాఖ్య స్ఫూర్తికే విఘాతం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలను మరింత సంక్షోభంలోకి నెట్టేయడమే. మరీ ముఖ్యంగా.. రాష్ట్రాలు తమ వాటా 40 శాతం నిధులను ముందుగా జమచేస్తేనే, కేంద్రం తన వాటా నిధులను విడుదల చేస్తుందన్న నిబంధన పెట్టడం పూర్తిగా అసంబద్ధం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తాన్ని ముందుగా ఎలా సర్దుబాటు చేస్తాయి? ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదు. ఇది పథకాన్ని నిర్వీర్యం చేయడమే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో సగటున రూ.8 వేలకోట్లు ఉపాధి హామీ కోసం ఖర్చు చేశారు. కొత్త నిబంధన అమలైతే రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.3,200 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇంతటి భారీ భారాన్ని రాష్ట్రం మోయలేదు. పనిదినాల పెంపు ఆచరణ సాధ్యం కాదు..మరోవైపు పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచామని కేంద్రం గొప్పగా చెప్పుకొంటున్నా.. అది ఆచరణలో సాధ్యం కాదు. రాష్ట్రాలు తమ వాటా నిధులను కట్టలేకపోతే, కేంద్రం నిధులు ఆగిపోతాయి. అప్పుడు ఈ పెంచిన పనిదినాల వల్ల పేదలకు ఒరిగేదేమీ ఉండదు. ఇది కేవలం కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుంది..’ అని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను గమనించకుండా, ఏకపక్షంగా రూపొందించిన ఈ బిల్లును వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర వాటాదారులతో విస్తత చర్చలు జరిపిన తర్వాతే, పేదల ప్రయోజనాలు కాపాడేలా మార్పులు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
రాష్ట్రపతిగా వాజ్ పేయి!
న్యూఢిల్లీ: అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఏపీజే అబ్దుల్ కలాం అనూహ్య రీతిలో రాష్ట్రపతిగా ఎన్నికవడం తెలిసిందే. కానీ అసలు వాజ్ పేయినే రాష్ట్రపతిగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అప్పట్లో బీజేపీ నాయకత్వానికి వచ్చిందట! అంతేగాక వాజ్ పేయి స్థానంలో నాటి పార్టీ అగ్ర నేత ఎల్ కే అడ్వాణీని ప్రధానిగా చేయాలన్న ప్రతిపాదన కూడా జోరుగా సాగిందట. కానీ రాష్ట్రపతి అయ్యేందుకు స్వయానా వాజ్ పేయే తిరస్కరించడంతో ఆ ప్రయత్నాలకు అక్కడితోనే తెర పడిందట! నాడు ఆయన మీడియా సలహాదారుగా ఉన్న అశోక్ టాండన్ తన తాజా పుస్తకం ’అటల్ సంస్మరణ్’ లో ఈ ఆసక్తికర అంశాన్ని పేర్కొన్నారు. పాలక ఎన్డీఏతో పాటు విపక్షాల మద్దతుతో కలాం 2022లో దేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికవడం తెలిసిందే.కలాం ఎంపిక వెనక...ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా కలాం ఎంపిక వెనక ఏం జరిగిందీ, ఈ విషయంలో కలిసి వచ్చేలా కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలను వాజ్ పేయి ఎలా ఒప్పించిందీ పుస్తకంలో టాండన్ వివరించారు. ‘తాను రాష్ట్రపతి కావాలన్న ప్రతిపాదనను వాజ్ పేయి తీవ్రంగా వ్యతిరేకించారు. జనాదరణ ఉన్న ఒక ప్రధాని ఇలా మెజారిటీ ఆధారంగా రాష్ట్రపతి కావడం భారత పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి మంచిది కాదని ఆయన భావించారు. అదో తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతుందన్నారు. అంతేగాక కలాం అభ్యర్థి త్వానికి అన్ని పార్టీ మద్దతు కూడగట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ విషయమై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను చర్చలకు ఆహ్వానించారు. సోనియాగాంధీ, ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్ వంటి అగ్ర నేతలు వచ్చి వాజ్ పేయితో చర్చించారు. రాష్ట్రపతిగా కలాంను నామినేట్ చేయాలని ఎన్డీఏ నిర్ణయించినట్టు వాజ్ పేయి తొలిసారిగా ఆ భేటీలోనే ప్రకటించారు. దాంతో కాసేపు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ముందుగా సోనియానే తేరుకున్నారు. ఈ ఎంపికతో ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. అయితే కలాంకు మద్దతివ్వడం తప్ప తమకు మరో మార్గం కూడా లేదని ఆమె అన్నారు‘ అని ఆయన రాసుకొచ్చారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్ర దాడి సందర్భంగా సోనియా, వాజ్ పేయి ఫోన్ సంభాషణ గురించి టాండన్ ప్రస్తావించారు. ‘నాడు విపక్ష నేతగా ఉన్న సోనియా వెంటనే వాజ్ పేయికి కాల్ చేశారు. ’మీరు క్షేమమేనా? నాకు ఆందోళనగా ఉంది’ అంటూ ఆరా తీశారు. ’నేను క్షేమం. మీరు పార్లమెంటు హాల్లో ఉన్నారేమోనని నేను ఆందోళన పడ్డా’ అంటూ వాజ్ పేయి బదులిచ్చారు‘ అని పేర్కొన్నారు. -
ఆ టోల్‌ప్లాజాలను మూసేయండి
న్యూఢిల్లీ: టోల్‌ఫీజు కట్టేందుకు తరచూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిల్చిపోతుండటం, వందల వాహనాల నుంచి ఒకేచోట వెలువడుతున్న పొగ, కాలుష్యం కారణంగా ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలో కాలుష్యఛాంబర్లుగా తయారైన 9 టోల్‌ప్లాజాలను తక్షణం తాత్కాలికంగానైనా మూసేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. లేదంటే కనీసం ఢిల్లీ–ఎన్సీఆర్ నుంచి సుదూరాలకు తరలించాలని జాతీయరహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ), మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లకు సుప్రీంకోర్టు బుధవారం సూచించింది. వారంలోపు మీ నిర్ణయం తెలపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంఛోలీల ధర్మాసనం ఆదేశించింది. టోల్‌ప్లాజాల తాత్కాలిక మూసివేత లేదా వేరే చోట ఏర్పాటు ద్వారా హస్తిన సరిహద్దుల్లో తీవ్ర వాయుకాలుష్యానికి కళ్లెం వేయొ చ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘చలికాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడం అనేది ఒక వార్షిక తంతుగా తయారైంది. వాయుకాలుష్యానికి ఇకనైనా చెక్‌పెట్టేలే చర్యలు తీసుకోండి. భారత్ స్టేజ్–4 స్థాయిలో తక్కువ ఉద్గారాలను వెదజల్లని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆగ స్ట్ 12న మేం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తాం. ఇక నర్సరీ నుంచి ఐదో తరగతి చిన్నారులు నేరుగా పాఠశాలకు రావొద్దంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోబోం. ఎందుకంటే త్వరలోనే చిన్నారులకు శీతాకాల సెలవు రాబోతున్నాయి. అప్పుడెలాగు పిల్లలు పాఠశాలకు రారు. ఆమాత్రందానికి మేం జోక్యం చేసుకోవడం అనవసరం’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంసీడీకి పరిహారం ఇవ్వండి ‘‘ఢిల్లీలోకి ఎంట్రీ పాయింట్లుగా మారిన ఈ 9 టోల్‌బూత్‌లు ప్రస్తుతం ఎంసీడీ నిర్వహిస్తోంది. వీటిని తాత్కాలికంగా మూసేయండి. మూసివేత కారణంగా ఎంసీడీ చవిచూసే నష్టాలను ఎన్హెచ్ఏఐ భర్తీచేయొచ్చేమో యోచించండి. తాత్కాలికంగా ఆదాయం కోల్పోయేందుకు ఎంసీడీ సిద్ధపడాలి. ఆ మేరకు తోడ్పాటునందించేలా ఎంసీడీ ముందుకురావాలి. ఈ విషయంలో ఎంసీడీ తన నిర్ణయాన్ని వారంలోపు తెలుపుతూ నివేదికను మా ముందు ఉంచండి’’అని ఎంసీడీని ధర్మాసనం ఆదేశించింది. కన్నాట్ ప్లేస్‌లోనూ పెట్టేస్తారా? కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఒకింత అసహనంవ్యక్తంచేశారు. ‘‘గురుగ్రామ్ సరిహద్దులోని ఒక టోల్‌ప్లాజా వద్ద గంటల తరబడివాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వందల వాహనాల నుంచి దట్టమైన పొగ ఒకేచోట పరుచుకుంటోంది. జనవరిదాకా టోల్‌ప్లాజాను తీసేస్తామని అధికారులు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు?. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోనూ టోల్‌ప్లాజా కట్టేస్తారు. ఎందుకంటే మీకు టోల్‌ప్లాజా నగదు వసూళ్లు మాత్రమే ముఖ్యంకదా? టోల్గేట్లు ఆదాయాన్ని కళ్లజూపిస్తాయేమో అంతకంటే ఎక్కువగా కాలుష్యాన్నీ తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో మీరు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో రండి. జనవరి 31వ తేదీదాకా టోల్‌ప్లాజా ఉండబోదని ధీమాగా చెప్పగలిగేలా ఒక ప్లాన్‌తో రండి’’అని మున్సిపల్ కార్పొరేషన్‌కు సీజేఐ సూచించారు. -
బీమా బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) 100 శాతం అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన సబ్కా బీమా సబ్కా రక్షా(బీమా చట్టాల సవరణ) బిల్లు–2025 పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతం ఎఫ్‌డీఐలను ఆమోదిస్తున్నారు. దీన్ని ఇకపై 100 శాతానికి పెంచబోతున్నారు. రాజ్యసభలో బిల్లుకు ప్రతిపక్షం సూచించిన పలు సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. సమగ్ర పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని విపక్ష సభ్యులు కోరగా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ప్రజలకు మేలు జరిగేలా బీమా రంగంలో మరిన్ని సానుకూల మార్పులు రాబోతున్నాయని చెప్పారు. ఈ రంగంలో విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయని వెల్లడించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రజలకు, వ్యాపారాలకు, వ్యవసాయానికి బీమా రక్షణ విస్తృతంగా లభిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. 100 శాతం ఎఫ్డీలతో బీమా సదుపాయం మరింత విస్తరిస్తుందని, చౌకగా పాలసీలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ రంగంలో వృద్ధికి అపరిమిత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. విదేశీ కంపెనీల రాకతో పోటీ పెరిగి, కొత్త పాలసీలు వస్తాయని, ప్రీమియం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా దేశంలో యువతకు మరిన్ని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ‘శాంతి’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన సస్టైనబుల్ హార్నెసింగ్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(శాంతి) బిల్లును లోక్‌సభలో బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించారు. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీల రాకతో అణు ఇంధన రంగం మరింత వేగం పుంజుకుంటుందని చెప్పారు. ‘రామ్ జీ’ బిల్లుపై చర్చ ప్రారంభం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ బిల్లుతో కూలీలకు ప్రతిఏటా 125 రోజులపాటు పని లభిస్తుందన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని వివరించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాం«దీజీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్ సభ్యుడు జైప్రకాశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అది అతిపెద్ద నేరమని పేర్కొన్నారు. 71 పాత చట్టాల రద్దు బిల్లుకు సై కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన రిపీలింగ్, అమెండ్మెంట్–2025 బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. మంగళవారం లోక్‌సభలో, బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. -
2026 చివరికల్లా శాటిలైట్ ఆధారిత టోల్వ్యవస్థ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా జాతీయరహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్‌చార్జీల వసూలు వ్యవస్థను అమలుచేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ప్రకటించారు. శాటిలైట్ టోల్ విధానం కారణంగా ఇకపై టోల్‌ప్లాజాల వద్ద చాలాసేపు కిలోమీటర్ల పొడవైన క్యూ వరసల్లో వేచి ఉండాల్సిన బాధ వాహనదారులకు తప్పుతుందని మంత్రి గడ్కరీ చెప్పారు. బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ‘‘కొత్త వ్యవస్థ పూర్తిగా కృత్రిమ ఉపగ్రహ, కృత్రిమ మేథ(ఏఐ)తో అనుసంధానమై పనిచేస్తుంది. దీంతో టోల్‌ప్లాజాల వద్ద వెయిటింగ్ పిరియడ్ అనేదే ఉండదు. క్యూ వరసల్లో వేచిఉన్నప్పుడు వాహనం ఇంజిన్ ఆన్‌చేసి ఉండటంతో ఏకంగా రూ.1,500 కోట్ల విలువైన ఇంధనం వృథాగా ఖర్చయిపోతోంది. ఇకపై ఈ వృథా ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సైతం రూ.6,000 కోట్లు పరోక్షంగా ఆదా అవుతాయి. కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా అమలుచేయబోయే మలీ్టలేన్ ఫ్రీ ఫ్లో టోల్(ఎంఎల్ఎఫ్ఎఫ్) విధానంతో వాహనదారులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం. గతంలో టోల్ వద్ద మ్యాన్యువల్ విధానం ఉన్నప్పుడు ఒక్కో వాహనదారుడు టోల్‌ఫీజు చెల్లించేందుకు మూడు నుంచి పది నిమిషాల సమయం పట్టేది. ఫాస్టాగ్ వచ్చాక ఈ సమయం 60 సెకన్లు, అంతకంటే తక్కువకు దిగొచ్చింది. ఇకమీదట ఆ సమయం సున్నాకు చేరుకోబోతోంది. టోల్‌ప్లాజాల వద్ద కార్లు ఏకంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. టోల్ వద్ద మిమ్మల్ని ఎవరూ ఆపరు’’ అని మంత్రి చెప్పారు. నంబర్ ప్లేట్‌ను గుర్తుపట్టి.. ‘‘నంబర్ ప్లేట్‌ను ఫాస్టాగ్, ఏఐ సాయంతో శాటిలైట్ అనేది గుర్తించి టోల్‌ప్లాజా వద్ద రుసుము చెల్లింపును అత్యంత సులభతరం చేయనుంది. ఇందుకోసం ఏఐ అనలైటిక్స్తో పనిచేసే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగీ్నషన్(ఏఎన్పీఆర్) వ్యవస్థ, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఎల్రక్టానిక్ టోల్ కలెక్షన్(ఫాస్టాగ్)ల కలబోతగా ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానాన్ని అమలుచేయబోతున్నాం. దీంతో టోల్‌ప్లాజాల వద్ద బడానేతల పేర్లు చెప్పి రుసుములు చెల్లించకుండా వెళ్లిపోవడం, బెదిరింపులు, చెల్లింపుల్లో సమస్యలు వంటివన్నీ మటుమాయం అవుతాయి. పేమెంట్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుంది. ఇదంతా 2026 ఏడాది చివరికల్లా 100 శాతం అమల్లోకిరానుంది. ఈ విధానంలో ఏవైనా అవకతవకలు చేయాలని కాంట్రాక్టర్లు ప్రయతి్నస్తే అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం. ఇప్పటికే ఇతర పనులు సవ్యంగా చేయని కాంట్రాక్టర్లను రెండేళ్ల పాటు పనుల నుంచి డిబార్ చేస్తాం. మరోదఫా టెండర్లు వేయడానికి కూడా అనుమతించబోం’’ అని గడ్కరీ స్పష్టంచేశారు. ఆ సమస్యలు మావి కాదు ‘‘జాతీయరహదారులపై నిర్వహణ మాత్రమే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. రాష్ట్రాల రహదారులు, నగర రహదారుల్లో రోడ్ల నిర్వహణ అనేది మా చేతుల్లో ఉండదు. స్టేట్, సిటీ రోడ్ల సంబంధ సమస్యలను సామాజిక మాధ్యమాల్లో కొందరు జాతీయరహదారుల సమస్యగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. వ్యవస్థను పారదర్శకంగా మార్చి అక్రమాలు జరక్కుండా చూస్తాం. పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ఎంఎల్ఎఫ్ఎఫ్ అమలవుతోన్న టోల్‌ప్లాజాల్లో ప్రాజెక్ట్ విజయావకాశాలను బేరేజువేసుకుని ఇతర ప్రాంతాల్లో దశలవారీగా ఈ విధానాన్ని విస్తరించుకుంటూ వెళ్తాం. వచ్చే కొన్ని నెలల్లో ఆయా టోల్‌ప్లాజాల్లో భౌతికంగా అక్కడ ఎలాంటి టోల్‌బూత్‌లు, బ్యారియర్లు, మెయిన్టెనెన్స్ సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు సైతం కలిసిరానున్నాయి’’ అని మంత్రి చెప్పారు. -
విడాకులపై ఢిల్లీ హైకోర్టులో కీలక తీర్పు
పరస్పర అంగీకారంతో విడాకులపై (Mutual Consent Divorce) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక తీర్పునిచ్చింది. విడాకుల కోసం మొదటి మోషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం విడిగా జీవించాల్సిన షరతు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ కాలాన్ని సెక్షన్ 14(1) ప్రొవైజో ఆధారంగా కోర్టు (ఫ్యామిలీ కోర్టు లేదా హైకోర్టు) మాఫీ చేయవచ్చని తెలిపింది.అలాగే, ఆరు నెలల కూలింగ్-ఆఫ్ పీరియడ్ (ఫస్ట్ మోషన్ – సెకండ్ మోషన్ మధ్య) కూడా స్వతంత్రంగా మాఫీ చేయవచ్చని పేర్కొంది. విడాకులు కోరుతున్న దంపతులను బలవంతంగా వివాహ బంధంలో ఉంచడం కోర్టు ధర్మం కాదని వెల్లడించింది.ఇలా చేయడం విడిపోవాలని నిశ్చయించుకున్న వారి ఆత్మగౌరవం మరియు స్వేచ్ఛకు విరుద్ధవుతుందని వ్యాఖ్యానించింది. శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఫుల్ బెంచ్ (జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని, జస్టిస్ రేణు భట్నాగర్) ఈ తీర్పు వెలువరించింది. -
రైల్వే ప్రయాణికులకు బిగ్‌షాక్!
న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ షాకిచ్చింది. రైల్వే ప్రయాణికులు ఇకపై ఉచిత పరిమితిని మించి తీసుకెళ్లే లగేజీపై అదనపు ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో స్పష్టం చేశారు. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. విమానాల్లో అమలవుతున్న విధానంలాగే రైల్వేలో కూడా సామాను పరిమితి నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ఏ కోచ్‌లో ఎంతమేర వరకు లేగేజీని తీసుకొని వెళ్లొచ్చు. ఎన్నికేజీల వరకు పరిమితి దాటితే అదనంగా డబ్బులు చెల్లించాలనే వివరాల్ని చదివి వినిపించారు. క్లాస్ వారీగా ఉచిత పరిమితులుసెకండ్ క్లాస్: 35 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 70 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు..35 కేజీల నుంచి పెరిగితే అదనపు ఛార్జీలు చెల్లించాలి.స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 80 కిలోల వరకు అనుమతి, అదనపు ఛార్జీలు తప్పనిసరి.ఏసీ 3-టైర్ / చైర్ కార్: 40 కిలోల వరకు ఉచితం.ఫస్ట్ క్లాస్, AC 2-టైర్: 50 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 100 కిలోల వరకు అనుమతి.ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 150 కిలోల వరకు అనుమతి, అదనపు ఛార్జీలు తప్పనిసరి’ అన్నారు. ‘ప్రయాణికులు నిర్దిష్ట పరిమితిని మించి సామాను తీసుకెళ్తే.. రైల్వే నియమాల ప్రకారం ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాలి. ఇది కొత్త నియమం కాదు. ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనే’ అని మంత్రి వైష్ణవ్ స్పష్టం చేశారు.ఇది కొత్త నియమం కాదు.. కానీ అవును, రైల్వే శాఖ గతంలో కూడా అదనపు సామానుపై ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇది కొత్త నియమం కాదు. కానీ ఇప్పటివరకు కఠినంగా అమలు చేయకపోవడం వల్ల చాలా ప్రయాణికులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.చాలా కాలం పాటు ఈ నియమాలు కఠినంగా అమలు కాలేదు. స్టేషన్లలో సామాను తూకం వేసే వ్యవస్థలు లేకపోవడం, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వసూళ్లు జరగలేదు.రైల్వే శాఖ.. ఎయిర్‌లైన్ తరహాలోతాజాగా.. రైల్వే శాఖ.. ఎయిర్‌లైన్ మాదిరి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాన స్టేషన్లలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు ఏర్పాటు చేసి, ఉచిత పరిమితిని మించిన సామానుపై తప్పనిసరిగా ఛార్జీలు వసూలు చేయనుంది. కాబట్టి, గతంలో కూడా నిబంధనలు ఉన్నప్పటికీ, అవి సడలింపుతో అమలయ్యాయి. ఇప్పుడు మాత్రం రైల్వే శాఖ కఠినంగా వసూలు చేయబోతోంది.కాగా,ప్రతిరోజూ కోట్లాది మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు రైల్వే సామాను పరిమితి నిబంధనలు అమలు చేస్తోంది. అయితే, చాలా మంది ప్రయాణికులు ఈ నియమాల గురించి తెలియకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. -
అన్ని సంస్థల్లో 50 శాతం వర్క్ ఫ్రం హోం : ధిక్కరిస్తే చర్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం నగర వాసులు అతలాకుతలం చేస్తోంది. ఎటు చూసినా కాలుష్య మేఘాలు దట్టంగా కమ్మేశాయి. రోజు రోజుకీ అత్యంత దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత మధ్య చిన్నా, పెద్దా అంతా పలు రకాల శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని సంస్థలకు 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేసింది.ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ కంపెనీలు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేయాలని తెలిపింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని కూడా హెచ్చరించింది.అలాగే తాజా ప్రకటన ప్రకారం, ప్రస్తుత కాలుష్య నిరోధక ఆంక్షల కింద నిర్మాణ కార్యకలాపాలను నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుతం పని చేయలేని రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10,000 పరిహారం అందిస్తుంది.ఇదీ చదవండి: మెస్సీకి అనంత్ అంబానీ సర్ప్రైజ్ గిఫ్ట్, ఖరీదెంతో తెలుసా?కాగా గత కొన్నేళ్లుగా కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరంలోడిసెంబర్ 15న సీజన్లో అత్యంత దారుణమైన వాయు నాణ్యత నమోదైంది. వాయు నాణ్యత AQI 'తీవ్రమైన ప్లస్' కేటగిరీలో 498గా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, అంతకు ముందు రోజు నుంచే AQI క్షీణించడం కొనసాగింది. వాయు నాణ్యత ఇంత దిగజారి పోవడం ఇదే తొలిసారి. శనివారం నుండి సోమవారం వరకు రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో, పలు రోడ్డు ప్రమాదాలు, వాహనాల గుద్దు కోవడాలు, విమానాల రద్దు, లేదా ఆలస్యాలు జరిగాయి. దీన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగాఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) త్వరగా రాజధాని అంతటా అత్యంత కఠినమైనకాలుష్య నిరోధక ఆంక్షలను అమలు చేస్తోంది. -
మసక మసక చీకటిలో..
ముంబై: ఢిల్లీ విమానాశ్రయంలో తక్కువ దృశ్యమానత(విజిబిలిటీ) కారణంగా విమానాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీని ఫలితంగా మంగళవారం మొత్తం 131 విమానాలను రద్దు చేసినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అధికారి తెలిపారు. రద్దయిన 131 విమానాలలో 52 బయలుదేరే విమానాలు కాగా, 79 వచ్చే విమానాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో, ఎయిర్ ఇండియా ప్రధాన కేంద్రమైన ఢిల్లీలో, దట్టమైన పొగమంచు కారణంగా తక్కువ దృశ్యమానత నెలకొంది. దీని ప్రభావం మొత్తం నెట్‌వర్క్‌లోని విమాన షెడ్యూల్‌పై పడింది. ఈ సంవత్సరం శీతాకాలం కోసం, ఏవియేషన్ రెగ్యులేటర్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) డిసెంబర్ 10 నుండి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు అధికారిక ‘పొగమంచు విండో’గా ప్రకటించింది. ఈ అంతరాయాల కారణంగా, ఎయిర్‌లైన్ ఇండిగో తన నెట్‌వర్క్‌లో ఏకంగా 113 విమానాలను రద్దు చేసింది. అంతేకాకుండా, ఢిల్లీ వాతావరణం కారణంగా బుధవారం కూడా 42 విమానాలను నడపబోమని ఇండిగో ప్రకటించింది. -
వాళ్లు మెంటలోళ్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో చర్చించిన విషయాలు లీక్ కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీ వ్రంగా మండిపడ్డారు. ఆ అంశాలు బయటకు చెప్పిన వాళ్లు మెంటలోళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో తన నివాసంలో విలేకరులతో సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల పార్లమెంట్లో ప్రధాని తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశం, అక్కడ చర్చించిన అంశాలు బయటకు రావడం చర్చకు వచ్చింది. దీనిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘అక్కడ జరిగింది వేరు.. మీడియాలో వచ్చింది వేరు.పార్టీని, సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై ప్రధాని పలు సూచనలు చేశారు. అక్కడ చర్చించిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని స్వయంగా ఆదేశించారు. అయినా.. ఎవరో మెంటలోళ్లు అక్కడ జరిగింది వేరైతే మీకు చెప్పింది వేరు. వాళ్లెవరో చెబితే చర్యలు తీసుకుంటాం’ అని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండటం దురదృష్టకరం: మోదీపై ఏఐసీసీ అగ్రనేత రా హుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢి ల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్‌చో ర్–గద్దీ ఛోడ్ మహాధర్నాలో ప్రధానిపై రాహుల్ తీవ్ర వ్యా ఖ్యలు చేయడం సరికాదు. ప్రధాని స్థాయిని తగ్గించేలా రా హుల్ వ్యాఖ్యలున్నాయి. రాహుల్ లాంటి ప్రతిపక్ష నేత మన కు ఉండటం దురదృష్టకరం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించా...‘తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సోమవారం చర్చించాను. 42 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై చర్చించాం. రూ. 400కోట్లతో హైదరాబాద్ నుంచి యాదగి రిగుట్ట వరకు పొడిగించాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశపైనా మాట్లాడాం. కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కోరాను’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
లూథ్రా సోదరుల అప్పగింత.. అరెస్ట్
న్యూఢిల్లీ: గోవా అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన కేసులో, ’బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ సహ యజమానులైన గౌరవ్, సౌరభ్ లూథ్రా సోదరులను థాయ్‌లాండ్ అప్పగించిన అనంతరం మంగళవారం అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలో ఈ సోదరులిద్దరూ థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోవడం తెలిసిందే. దీంతో అధికారులు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసి, వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేశారు. డిసెంబర్ 11న, భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు థాయ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఇరు దేశాల మధ్య ఉన్న న్యాయ ఒప్పందాల కింద లూథ్రా సోదరులను బ్యాంకాక్ నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి, అధికారులకు అప్పగించారు. 44 ఏళ్ల గౌరవ్, 40 ఏళ్ల సౌరభ్‌లను పటియాలా హౌస్ కోర్టులో జ్యుడీíÙయల్ మేజిస్ట్రేట్ ట్వింకిల్ చావ్లా ముందు హాజరుపరచగా, గోవా పోలీసుల అభ్యర్థన మేరకు రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరైంది. నిందితులను బుధవారం ఉదయానికల్లా విమానంలో గోవాకు తీసుకురానున్నట్లు గోవా పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు. -
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషిట్ స్వీకరించలేం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీతోపాటు మరో ఐదుగురికి ఊరట లభించింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. చార్జిషిట్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా, ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై జరిపిన విచారణ ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేశారని ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే తప్పుపట్టారు.చట్టప్రకారం దీన్ని స్వీకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు న్యాయమూర్తి గుర్తుచేశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాతోపాటు యంగ్ ఇండియా కంపెనీ పాత్ర ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను వారు అక్రమంగా కొట్టేశారని చెబుతోంది. యంగ్ ఇండియా కంపెనీలో సోనియా గాం«దీకి 76 శాతం వాటా ఉంది. ఏజేఎల్‌కు ఈ కంపెనీ రూ.90 కోట్లు రుణంగా ఇచ్చింది. రుణాన్ని తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఏజేఎల్ ఆస్తులను కుట్రపూరితంగా లాక్కున్నారని ఈడీ వాదిస్తోంది. మరోవైపు ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుపై అప్పీల్ చేస్తామని ఈడీ వెల్లడించింది. -
‘రోజ్‌గార్’ బిల్లుపై గరం గరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 20 ఏళ్లుగా అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో.. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ప్రతిఏటా 125 పనిదినాలకు హామీ ఇస్తూ మరో చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం లోక్‌సభలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లు–2025ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి.చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం పట్ల మండిపడ్డాయి. బిల్లును క్షుణ్నంగా పరిశీలించాలని, అందుకోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. చరిత్రాత్మకమైన ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి మోదీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించాయి. విపక్షాల అభ్యంతరాలను శివరాజ్‌సింగ్ చౌహాన్ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను విశ్వసించడమే కాకుండా త్రికరణ శుద్ధిగా అమలు చేస్తోందని వివరించారు. ఉపాధి హక్కుపై దెబ్బ: ప్రియాంక మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిరుపేదలకు ఏడాదికి 100 రోజులపాటు పని దొరుకుతోందని అన్నారు. మోదీ ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టం అమలుకు కేంద్రం 90 శాతం నిధులు ఇస్తోందని, ప్రస్తుతం దీన్ని 60 శాతానికి కుదిస్తున్నారని తప్పుపట్టారు. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. పథకం నుంచి గాం«దీజీ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు. జాతిపితను అపహాస్యం చేస్తున్నారు: బాలు గాం«దీజీ గ్రామాల్లో నివసించారని, పేదల సంక్షేమం కోసం పనిచేశారని డీఎంకే సభ్యుడు టి.ఆర్.బాలు చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడానికి మన్మోహన్సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని నీరుగార్చవద్దని కేంద్రాన్ని కోరారు. జాతిపితను మోదీ ప్రభు త్వం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. వీబీ–జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. గాందీజీ ఫొటోలను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం ఆందోళనకు దిగారు. గాంధీజీకి జరిగిన అవమానాన్ని దేశం సహించబోదంటూ నినదించారు. రాముడి పేరును బద్నాం చేయొద్దు: థరూర్ వీబీ–జీ రామ్ జీ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యతిరేకించారు. 1971 నాటి బాలీవుడ్ పాటను ప్రస్తావించారు. ‘ఈ పని చేయొద్దు, రాముడి పేరును బద్నాం చేయొద్దు’ అని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. పేదలకు అండగా నిలస్తున్న పథకాన్ని బలహీనపర్చొద్దని తేల్చిచెప్పారు. అనుమానాలు వద్దు: కేంద్రం బిల్లుపై అనుమానాలు అవసరం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన దిశగా గ్రామీణ పేదల ఉపాధికి హామీ ఇస్తూ చట్టం తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది ఆధునిక చట్టబద్ధమైన ఏర్పాటు అని పేర్కొంది. పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశమని వివరించింది. విప్ జారీ చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ సభ్యులకు మంగళవారం విప్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించింది. వీబీ–జీ రామ్ జీ సహా కీలకమైన బిల్లులపై చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉందని పేర్కొంది. బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని, ప్రజల గొంతుకను వినిపించాలని సూచించింది. గాందీజీ ఆదర్శాలకు అవమానంమహాత్మా గాంధీ ఆదర్శాలను ప్రభుత్వం అవ మానిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కేంద్రం తెచ్చిన బిల్లును తప్పుపడుతూ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బకొట్టాలన్నదే మోదీ ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలువీబీ–జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఈ మేరకు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖ రాశారు. మహాత్మాగాంధీ చిత్రపటాలు చేతబూని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. -
ప్రాణాలు తీసిన పొగమంచు
మథుర: చిమ్మచీకట్లో శీతాకాలపు పొగమంచు ఉత్తరాదిన పలువురికి యమపాశంగా మారింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే రహదారిపై దట్టంగా అలుముకున్న పొగమంచు 13 మంది ప్రయాణికుల ప్రాణాలను అనంతలోకాల్లో కలిపేసింది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ముందుఏముందో కనపడనంతగా విపరీతంగా ఉన్న పొగమంచు కారణంగా ఆగ్రా–నోయిడా పరిధిలో రహదారిపై ఎనిమిది బస్సులు, మూడు చిన్న వాహనాలు ఒకదానికి వెంట మరోటి ఢీకొని ధ్వంసమయ్యాయి. వీటిల్లో చిక్కుకుపోయి రక్తమోడుతూ 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.43 మంది క్షతగాత్రులను హుటాహుటిన ఆగ్రాలోని ఎస్ఎన్ వైద్య బోధనాస్పత్రి, బృందావన్, ఢిల్లీ ఆస్పత్రుల్లో చేర్పించామని మథుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ చెప్పారు. అయితే 60 మందికిపైగా గాయపడినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. స్వల్ప గాయాలైన ప్రయాణికులను యూపీ ప్రభుత్వ వాహనాల్లో తమతమ గమ్యస్థానాలకు చేర్చారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్దేవ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రహదారిపై 127 నంబర్ మైలురాయి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసబెట్టి ఢీ.. వెనువెంటనే చెలరేగిన మంటలు క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పూట తొలుత ఒక బస్సును మరో వాహనం మాత్రమే ఒకదానివెనుక మరోటి ఢీకొన్నాయి. వాటిలోని ప్రయాణికులు గాయపడ్డారు. వాళ్లు ప్రమాదం షాక్ నుంచి తేరుకుని కిందకు దిగి తర్వాత అటుగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేలోపే వెనకనుంచి మరికొన్ని వాహనాలు అతివేగంతో ఢీకొట్టాయి. ‘‘కొన్ని వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పక్కకు పోనిద్దామని చూసినా అప్పటికే గాయపడిన ఇతరవాహన ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిలబడటంతో మరోదారిలేక వీటినే గుద్దేశారు.ఘటనాస్థలికి నేను వెళ్లిచూసేసరికి అక్కడ దృగ్గోచరత(విజిబిలిటీ) కేవలం మీటర్ మాత్రమే. అంతకుమించి దూరంలో ఏముందో కనిపించనంతా పొగమంచు అలుముకుంది’’అని ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించారు. ఇలా మొత్తం ఎనిమిది బస్సులు, కార్లు, వాహనాలు ఢీకొని తుక్కుతుక్కయ్యాయి. దీంతో ఇంధన ట్యాంక్‌లు బద్దలై మంటలు చెలరేగాయి. నుజ్జునుజ్జయిన వాహనాల్లో కొందరు, అగ్నికీలల కారణంగా తీవ్రంగా కాలిన గాయాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.వరుసబెట్టి బస్సులు, కార్లు తగలబడుతున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాలిపోయిన వాహనాలు కుప్పగా రహదారిపై అడ్డుగా ఉండటంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది, మథుర జిల్లా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను క్రేన్లతో పక్కకు తీసుకొచ్చారు. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతటా భీతావహస్థితి.. చిమ్మచీకటి, చలిలో వాహనాల్లో తమతమ సీట్లలో మఫ్లర్లు ధరించి, బెడ్షీట్లు కప్పుకుని ముసుగుతన్ని నిద్రపోతున్న పలువురు అగ్నికీలల్లో కాలి బూడిదయ్యారు. కొందరు శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి మాంసపుముద్దలుగా మారిపోయారు. వాహనాల నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టమైన పొగ, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహకంగా మారింది. వేగంగా వాహనాలు ఢీకొన్న శబ్దం సుదూరంలోని తమకూ వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు చెప్పారు. మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిళ్లను సేకరించి కుటుంబసభ్యులు, బంధువుల డీఎన్ఏతో పోల్చిచూశాక పార్థివదేహాలను పోలీసులు అప్పగించనున్నారు.ఇప్పటికే 17 మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. డీఎన్ఏ ప్రక్రియ కోసం రెండు వైద్య బృందాలను నియమించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధా వల్లభ్ చెప్పారు. కొందరు మృతుల జాడ గుర్తించారు. వాళ్ల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మథుర జిల్లా మేజి్రస్టేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ చెప్పారు. దుర్ఘటనపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సారథ్యంలో నలుగురు సభ్యులతో మేజి్రస్టియల్ విచారణకు ఆదేశించారు. రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఘటనపై ఒక అనామక డ్రైవర్‌పై తొలుత ఒక కేసు నమోదుచేసి నేరదర్యాప్తు ఆరంభించారు. పిల్లలను బయటకు విసిరేసి.. బలంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన వాహనాలకు హఠాత్తుగా మంటలంటుకోవడంతో అందులోని ప్రయాణికులు తమ చిన్నారులను కాపాడేందుకు శతథా ప్రయత్నించారు. పార్వతి అనే 42 ఏళ్ల మహిళ తన ఇద్దరు చిన్నారులు ప్రాచీ, సన్నీలను వెంటనే బస్సు నుంచి బయటకు విసిరేశారు. కానీ బద్దలైన బస్సు కిటికీ అద్దాలు ఆమె మెడకు గుచ్చుకోవడంతో రక్తమోడుతూ లోపలికి పడిపోయారు. ‘‘పిల్లల్ని విసిరేశాక ఆమెను నేను చూడలేదు. ఆమెకు ఏమైందో ఎక్కడుందో అర్ధంకావట్లేదు’’అని ఆమె సమీప బంధువు గుల్జారీ ఏడుస్తూ చెప్పారు. ‘‘క్షతగాత్రులను చేర్పించిన ఆస్పత్రుల చుట్టూ ఆమె జాడ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఆమె ఎక్కడా కన్పించట్లేదు’’అని గుల్జారీ రోదిస్తూ చెప్పారు.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలను ప్రధానమంత్రి అత్యవసర నిధి నుంచి కేటాయించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం’’అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేíÙయా, క్షతగాత్రులకు తలో రూ.50,000 ఆర్థికసాయం ప్రకటించారు. -
వాళ్లు మెంటలోళ్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో చర్చించిన విషయాలు లీక్ కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీ వ్రంగా మండిపడ్డారు. ఆ అంశాలు బయటకు చెప్పిన వాళ్లు మెంటలోళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో తన నివాసంలో విలేకరులతో సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల పార్లమెంట్లో ప్రధాని తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశం, అక్కడ చర్చించిన అంశాలు బయటకు రావడం చర్చకు వచ్చింది. దీనిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘అక్కడ జరిగింది వేరు.. మీడియాలో వచ్చింది వేరు. పార్టీని, సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై ప్రధాని పలు సూచనలు చేశారు. అక్కడ చర్చించిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని స్వయంగా ఆదేశించారు. అయినా.. ఎవరో మెంటలోళ్లు అక్కడ జరిగింది వేరైతే మీకు చెప్పింది వేరు. వాళ్లెవరో చెబితే చర్యలు తీసుకుంటాం’ అని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండటం దురదృష్టకరం: మోదీపై ఏఐసీసీ అగ్రనేత రా హుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢి ల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్‌చో ర్–గద్దీ ఛోడ్ మహాధర్నాలో ప్రధానిపై రాహుల్ తీవ్ర వ్యా ఖ్యలు చేయడం సరికాదు. ప్రధాని స్థాయిని తగ్గించేలా రా హుల్ వ్యాఖ్యలున్నాయి. రాహుల్ లాంటి ప్రతిపక్ష నేత మన కు ఉండటం దురదృష్టకరం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించా...‘తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సోమవారం చర్చించాను. 42 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై చర్చించాం. రూ. 400కోట్లతో హైదరాబాద్ నుంచి యాదగి రిగుట్ట వరకు పొడిగించాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశపైనా మాట్లాడాం. కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కోరాను’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
విద్యకు ఇవ్వండి మినహాయింపు.. నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీసీ)ను ఏర్పాటు చేయనున్నామని, దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. నిర్మలా సీతారామన్‌తో పార్లమెంట్ ఆవరణలోని ఆమె చాంబర్లో రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాధాన్యతను రేవంత్ వివరించారు. ‘5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2,560 మంది విద్యార్థులు ఉంటారు. మొత్తం 105 పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యాహబ్లుగా ఉండటంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. అత్యాధునిక వసతులు, లే»ొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుంది. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచి్చంచనున్నాం’అని రేవంత్ కేంద్రమంత్రికి వివరించారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, విద్యారంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపుతున్న చొరవను నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి.. ఎస్‌పీసీకి సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు. ఐఐఎం మంజూరు చేయండి తెలంగాణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యాసంస్థను మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్Šడ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌తో పార్లమెంట్ ఆవరణలోని ఆయన చాంబర్లో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణ లోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ‘ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించాం. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంది. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేస్తే.. అవసరమైన వసతుల కల్పనకు మేం సిద్ధంగా ఉన్నాం. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్‌కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీతోపాటు అనుకూల వాతావరణం ఉంది’అని ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని రేవంత్ కోరారు. కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు; హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, ఇతర వసతులు కలి్పంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. సోనియాతో భేటీ ఏఐసీసీ అగ్రనేత సోనియాగాం«దీతోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియాకు అందజేశారు. ప్రజాపాలనలో రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృధ్ధికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సోనియా ఆకాంక్షించారు. -
ఢిల్లీ వాయు కాలుష్యంపై మంత్రి కీలక ప్రకటన
ఢిల్లీ కాలుష్య తీవ్రతపై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి స్పందించారు. కేవలం తొమ్మిది, పది నెలల్లో ఢిల్లీలోని కాలుష్య తీవ్రతను తగ్గించడం ఎన్నికైన ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలు తమ ప్రభుత్వాన్ని క్షమించాల్సిందిగా మంత్రి మంజీందర్ సింగ్ సిస్రా ప్రజలను కోరారు.ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత రోజురోజూకి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రాజధానిలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సైతం గాలి కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలని ఆదేశించింది. అయితే గత మూడురోజులుగా ఢిల్లీలోని వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు.మంత్రి మంజీందర్ సింగ్ మాట్లాడుతూ "పర్యావరణ కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రజలకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. తొమ్మిది లేదా పది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడం ఎన్నికైన ఏప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే వాయు కాలుష్యాన్ని నివారించడానికి గత ప్రభుత్వంతో పోల్చితే మెరుగైన చర్యలు మేము తీసుకుంటున్నాం" అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిందని దానిని నివారించడానికి మేము సరైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అయితే ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం 400 పాయింట్ల కంటే అధిక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బొగ్గు,కట్టెలతో తందూరి వంటకాలను తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లపై బ్యాన్ విధించింది. ఇది వరకే కాలుష్య కారకాలకు సంబంధించిన పలు కారకాలపై నిషేధాజ్ఞలు విధించింది. -
ఏ బిల్లునూ ఇష్టారాజ్యంగా మార్చకూడదు: ప్రియాంకా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్ భారత్ - జీ- రామ్- జీ (గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో కొత్త బిల్లును తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు చట్టాన్ని బలహీనపరుస్తుందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఎవరైనా వ్యక్తిగత అభిలాష, పక్షపాతం, స్వేచ్ఛ ఆధారంగా చట్టాలు చేయకూడదని ప్రియాంకా గాంధీ అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ ఇచ్చే MGNREGS పథకాన్ని రద్దు చేసి కొత్త బిల్లుతో భర్తీ చేయడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు రైతులు, కార్మికులు, గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా బలమైన నిరసన వ్యక్తం చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలోని కోట్లాది కుటుంబాలకు రక్షణ కవచం. దానిని బలహీనపరచడం ప్రజల హక్కులను హరించడం అవుతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.గాంధీ పేరు తొలగించడం అనైతికం: థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ నిరసనకు మద్దతు తెలిపారు. రాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయొద్దు అంటూ కేంద్రాన్ని కోరారు. ప్రజల జీవనోపాధి కోసం రూపొందించిన పథకానికి పేరు మార్చడం అనైతికమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడే పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేశారు.ఈ మేరకు పార్లమెంటులో మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పేరును తొలగించి "జిరాంజీ"గా మార్చడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. -
ఢిల్లీ కాలుష్యం.. తందూర్‌లపై నిషేధం
సాక్షి,ఢిల్లీ: రాజధానిలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తందూరి వంటకాలను తయారు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో బొగ్గు లేదా కట్టెలతో నడిచే తందూర్లను పూర్తిగా నిషేధించింది. ఇకపై అన్ని వాణిజ్య సంస్థలు విద్యుత్, గ్యాస్ ఆధారిత లేదా శుభ్రమైన ఇంధన పరికరాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.బొగ్గు, కట్టెలతో నడిచే తందూర్లు ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో వాడకూడదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు Air (Prevention and Control of Pollution) Act, 1981లోని సెక్షన్ 31(A) కింద జారీ అయ్యాయి.మంగళవారం ఉదయం 10 గంటలకు ఆనంద్ విహార్, ITO ప్రాంతాల్లో AQI 400 వద్ద నమోదైంది. ఇది ప్రమాదకరమైన స్థాయిగా పరిగణించబడుతుంది. కాలుష్యం తీవ్రత పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) – Stage IV (Severe+) అమల్లోకి వచ్చింది. బయోమాస్, వ్యర్థాలు లేదా బొగ్గు వంటి పదార్థాలను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధం. కాలుష్య స్థాయి ప్రమాదకరంగా పెరగడంతో అన్ని అత్యవసర చర్యలు తక్షణమే అమలు చేయాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) నిర్ణయించింది. ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు రెస్టారెంట్ వ్యాపారాలపై ప్రభావం చూపనున్నాయి. -
ప్రధాని మీటింగ్ లీక్స్.. కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని, ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి సమావేశం జరిగిన విషయాన్ని కిషన్ రెడ్డి వివరించారు. ఆ సమావేశం మర్యాదపూర్వక భేటీ అని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు.ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయట పెట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా? లీక్ చేసినోడు మెంటలోడు. ఎవరో తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
ఢిల్లీలో ఈ ఎమర్జెన్సీ.. ఇంకెన్నేళ్లో?
తీవ్ర వాయుకాలుష్యానికి తోడయ్యే దట్టమైన పొగమంచు.. ఎటు చూసినా మాస్కులు ధరించిన ప్రజలు.. కరోనా కానరాకుండా పోయినా శీతాకాలంలో మన దేశరాజధాని వీధుల్లో కనిపించే దృశ్యాలివే!. వాహనాల గొట్టాలు కక్కే పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే ప్రాణాంతక వాయువులు, నిర్మాణాలు వెదజల్లే ధూళి.. పంట అవశేషాల దహనాలు .. ఇవన్నీ కలగలిసిపోయి ఢిల్లీని ఓ గ్యాస్ చాంబర్‌గా మార్చేస్తున్నాయి.. ప్రతి సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ III, స్టేజ్ IV లాంటి ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటోంది. ఆ సమయంలో కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తారు. డీజిల్, పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెడతారు. స్కూల్స్ మూసేస్తారు. ఆఫీసులను హైబ్రిడ్.. మరింత దిగజారితే వర్క్‌ఫ్రమ్ హోంకు పరిమితం చేస్తారు. గాలి మందగించి, పొగమంచు కమ్ముకుని, ప్రజలు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ ఏడాది పరిస్థితి మరింతగా ముదిరింది. పిల్లలను కనీసం బయట కూడా తిరగొద్దని కోర్టులు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం వల్ల ఎమర్జెన్సీనే నార్మల్‌గా మారింది. పాలసీ ఫాటీగ్(మానసిక, భావోద్వేగ అలసట) పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కూడా ఈ చర్యలను సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. ఢిల్లీ కాలుష్యం కథ ఒక నిరంతర యుద్ధం. ప్రతి సంవత్సరం అదే దృశ్యం.. అదే చర్యలు.. అదే విఫలత. కానీ ఈసారి ప్రశ్న వేరుగా ఉంది. దేశరాజధానికి ఊపిరి ఇవ్వాలంటే.. సిస్టమ్ మొత్తాన్ని రీడిజైన్ చేయగలమా? లేదంటే ఎమర్జెన్సీని నార్మల్‌గా అంగీకరించేస్తూ పోతారా?.. ఢిల్లీలోనే ఎందుకంటే.. ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ ఎందుకు పడిపోతోంది?. ఎందుకంటే.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ. ఎన్సీఆర్లో ప్రధానంగా ఉండే కోల్ ఆధారిత పవర్ప్లాంట్లు.. ఫ్యాక్టరీలు ప్రమాదకరమైన వాయువుల్ని విడుదల చేస్తుంటాయి. చుట్టుపక్కల పంజాబ్, హర్యానాల రైతులు పంటలని కాల్చడంతో ఆ పొగ కాలుష్యానికి తోడవుతోంది. వీటన్నింటికి తోడు.. నిరంతరాయంగా కొనసాగే నిర్మాణ పనులతో ఆ ధూళి గాల్లో కలిసి కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. శాశ్వత పరిష్కారం ఉండవా?దేశరాజధానిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజల అవసరాలకు తగ్గట్లు పెంచాలి. మెట్రో లైన్లు విస్తరించినా.. బస్సుల సంఖ్య తక్కువ. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు. పంట అవశేషాల దహనం ఆపడానికి రైతులకు ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి, కానీ సపోర్ట్ సిస్టమ్ బలహీనంగా ఉంది. రైతులు తక్కువ ఖర్చుతో పంట అవశేషాలను కాల్చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ కాలుష్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. WHO ప్రమాణాల కంటే 10–15 రెట్లు ఎక్కువ టాక్సిక్ లెవెల్స్ ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో శ్వాస సమస్యలు, కంటి ఇర్రిటేషన్, గుండె సంబంధిత సమస్యలతో రోగులు పెరుగుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా విఫలమవుతున్నదనే సూచన.ప్రైవేట్ రంగం, స్టార్టప్‌లు కాలుష్య నివారణ కోసమంటూ ముందుకు వస్తున్నాయి. కార్‌పూలింగ్ యాప్‌లు, ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, క్రాప్ రెసిడ్యూ ప్రాసెసింగ్ వంటి పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఇవి చిన్న స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ లాంటి మహానగరానికి ఇవి సరిపోవు. పెద్ద స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వ మద్దతు, ప్రజల సహకారం కచ్చితంగా అవసరం.అంటే ఢిల్లీ పొల్యూషన్ కేవలం వాతావరణ సమస్య కాదు.. ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్‌కి ప్రతీక. ఇది ప్రభుత్వ పాలసీల లోపం, అమలు బలహీనత, ప్రజల ప్రవర్తన, ఆర్థిక ఒత్తిళ్లు అన్నీ కలిసిన విఫలత. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, రైతులకు ప్రత్యామ్నాయాలు, ఇండస్ట్రీలపై కఠిన నియంత్రణ, ప్రజల అవగాహన.. మొత్తం వ్యవస్థనే మార్చగలిగినప్పుడు మాత్రమే ఢిల్లీ మళ్లీ మంచి ఊపిరి తీసుకోగలుగుతుంది. -
ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రస్థాయి వాయు కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావొద్దని అధికార యంత్రాగం జాగ్రత్తలు సూచిస్తోంది. ఇప్పటికే పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీ పొగమంచు రవాణా వ్యవస్థపై వరుసగా రెండో రోజు కూడా ప్రభావం పడింది. విజిబులిటీ పడిపోవడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఒక్క సోమవారం నాడే 200కి పైగా విమానాలు రద్దయ్యాయి. AQI(గాల్లో వాయు నాణ్యత) తీవ్రత నిన్న 500 మార్కును దాటింది. అయితే ఈ రోజు ఉదయం నమోదైన డేటా ప్రకారం ఇది సుమారు 370గా ఉంది. లోధి కాలనీ, పూసా రోడ్ వంటి నిర్దిష్ట ప్రాంతాలలో స్థాయిలు సుమారు 350గా నమోదయ్యాయి. కాలుష్య స్థాయిలో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ, నివాసితులు ఈ సంక్షోభంతో పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. నర్సరీ నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు క్లాసులను ఆన్లైన్లోనే కొనసాగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. ప్రమాదానికి కారణమిదే!
ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారు ఝామన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనకు పొగమంచు కారణంగా తెలుస్తోంది. భారీ పొగమంచులో తొలుత రెండు వాహనాలు వేగంగా ఢీ కొట్టుకోగా.. ఆ వెంటనే మిగతా వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టి మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం వేకువజామున 4గం. ప్రాంతంలో ఆగ్రా-నోయిడా లేన్ 127వ మైలురాయి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మూడు కార్లు వరుసగా ఢీ కొట్టకున్నాయి. ఆ తర్వాత ఏడు బస్సులు ఢీ కొట్టుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సుల్లో ఒకటి ఆర్టీసీ ఉండగా.. మిగతా ఆరు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సులు. మొత్తం 7 బస్సులు.. నాలుగు కార్లు మంటల్లో చిక్కకుని బూడిదయ్యాయి.ఇప్పటిదాకా నాలుగు మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం నుంచి పలువురు సురక్షితంగా బయటపడగా.. నిద్రలో ఉండడం, ఒక్కసారిగా మంటల ఎగసి పడడం, వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి బయటపడలేని స్థితిలో పలువురు సజీవ దహనం అయ్యి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రంగంలోకి దిగిన 11 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ ఘోర ప్రమాదంతో ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.#WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/k8LdYmBOC1— ANI (@ANI) December 16, 2025#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited.#firemishap #buses #DelhiAgraExpresswayANI pic.twitter.com/kKqC31C7MR— Argus News (@ArgusNews_in) December 16, 2025ఇదిలా ఉంటే.. నిన్న ఢిల్లీ-ముంబై రహదారిపైనా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నుహ్(హర్యానా) వద్ద సోమవారం ఉదయం 5గం. ప్రాంతంలో వాహనాలు భారీ పొగమంచు కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకున్నాయి. రెండు ఓవర్‌లోడెడ్ డంపర్లు యాక్సిడెంట్‌కు గురి కాగా.. ఆ వెనక 20 దాకా వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. సుమారు 20 మంది దాకా గాయాలయ్యాయి. పొగ మంచు వరుస ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వాహనదారులకు సూచిస్తున్నాయి. -
సీఐసీగా ఆర్కే గోయెల్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయెల్ మరో 8 మంది సమాచార కమిషనర్ల నియామకంతో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పూర్తి సామర్థ్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ సారథ్యంలో హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ గత వారం వీరిని ఎంపిక చేసి, రాష్ట్రపతికి సిఫారసు చేయడం తెల్సిందే. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్ కుమార్ గోయెల్ తదితరులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర కుమార్ పాల్గొన్నారు. సీఐసీ సారథ్యంలోని ఈ కమిషన్‌లో గరిష్టంగా 10 మంది సమాచార కమిషనర్లకు గాను ప్రస్తుతం ఇద్దరు కమిషనర్లు మాత్రమే పని చేస్తున్నారు. తాజా నియామకాలతో దాదాపు తొమ్మిదేళ్లకు సీఐసీ పూర్తిస్థాయిలో పనిచేయనుంది. సోమవారం కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జయ వర్మ సిన్హా, స్వాగత్ దాస్, సంజీవ్ కుమార్ జిందాల్, సురేంద్ర సింగ్ మీనా, కుష్వంత్ సింగ్ సేథి, పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, సుధారాణి రేలంగి ఉన్నారు. -
దేవుడిని విశ్రాంతి కూడా తీసుకోనివ్వరా..?
న్యూఢిల్లీ: ఆలయాల్లో ధనవంతులిచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి దేవుడి విశ్రాంతి వేళలోనూ ప్రత్యేక పూజలకు అనుమతించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడి విశ్రాంతికి అంతరాయం కల్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బృందావన్‌లోని ప్రఖ్యాత బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళలతోపాటు సంప్రదాయాల్లో తీసుకువచ్చిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు స్పందించింది. బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశారని, దెహ్రి పూజ వంటి పలు ముఖ్యమైన మతాచారాలను నిలిపివేశారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, తన్వి దుబేలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ‘సంప్రదాయం, వేడుకల్లో దర్శన వేళలు కూడా ఒక భాగం. భక్తుల దర్శనాల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచడం ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయం. ఆలయ వేళలను మార్చితే, లోపల జరిగే పూజలు, వేడుకల వేళలు కూడా మారుతాయి. తదనుగుణంగా దేవుడి ఉదయం మేల్కొనే వేళ, రాత్రి నిద్రించే వేళలూ మారుతాయి. ఇలా జరగరాదు. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని, పవిత్రతను తుచ తప్పక అనుసరించాలి’అని ఈ సందర్భంగా దివాన్ వాదించారు. సెపె్టంబర్లో జారీ అయిన ఆఫీసు మెమోరాండం ప్రకారం ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా సంప్రదాయాల్లో మార్పులు తెచ్చారని ఆయన తెలిపారు. ఆలయంలో దర్శన వేళలు పూర్తయ్యాక, ఒక ప్రత్యేక ప్రదేశంలో చేపట్టే దెహ్రి పూజను సైతం రద్దీని నివారించేందుకంటూ రద్దు చేస్తూ తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కనబెట్టారని పిటిషనర్లు తెలిపారు. గురు–శిష్య పరంపరలో భాగంగా గోస్వామీలు మాత్రమే ఈ పూజా కార్యక్రమాన్ని జరపాల్సి ఉంటుందన్నారు. ఈ వాదలనపై సీజేఐ సూర్యకాంత్ మౌఖికంగా.. ‘బంకీ బిహారీ జీ ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని నామమాత్రంగా మూసివేస్తున్నారు. అయితే, ఆ వెంటనే దేవుడికి ఒక్క సెకను కాలం కూడా విశ్రాంతినివ్వకుండా, ఇతర విషయాల మాదిరిగానే దేవుడిని కూడా వాడేసుకుంటున్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపే ధనవంతుల కోసం ప్రత్యేక పూజలకు అనుమతిస్తున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమాధానమివ్వాలని ఆలయ నిర్వహణ కమిటీతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ఆలయంలో వేడుకలు, పూజలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ 1939 నాటి నిబంధనల ప్రకారం జరుగుతోంది. అయితే, 2025లో తీసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ శ్రీ బంకీ బిహారీ జీ ఆలయ ట్రస్ట్ ఆర్డినెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం మత సంస్థల్లో జోక్యం చేసుకునేందుకు అవకాశ మేర్పడింది. తద్వారా అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగుతోందన్న వాదనలు ఉన్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్ట్‌లో దాఖలైన పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టుకే విడిచిపెట్టింది. అదే సమయంలో, హైకోర్టు స్పష్టత ఇచ్చే వరకు ఆర్డినెన్స్‌పై స్టే విధించింది. ఆలయ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ సారథ్యంలో కమిటీని నియమించింది. -
ఏపీలో కమీషన్ల కోసమే ప్రైవేటు అప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభలో సోమవారం అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వ తీరును, కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరించడాన్ని ఎండగట్టారు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ముందుకొస్తున్నా.. కమీషన్ల కక్కుర్తితో అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెస్తున్నారని చెప్పారు.ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా తెచ్చే ఈ అప్పులకు ఏకంగా రాష్ట్ర ఖజానా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచే నేరుగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. గతంలో అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) 13.5 శాతంగా ఉంటే, ప్రస్తుతం అది దేశంలోనే అత్యధికంగా 22 శాతానికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.రూ.150 కోట్ల కమీషన్: ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్ల పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు (9.3 శాతం) నిధులు సమీకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులు 6 శాతానికే రుణాలు ఇస్తుంటే.. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 1.5 శాతం బ్రోకరేజ్ కమీషన్ కోసమే ఈ దందా నడుస్తోందని, దాదాపు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని కమీషన్ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.అంతేగాక ప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చే అప్పులకు గ్యారెంటీగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌ను చూపించడం, ప్రభుత్వ అనుమతి లేకుండానే అందులోంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడం దుర్మార్గమని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల అప్పులను కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని లేఖలు రాసిన కేంద్ర ఆర్థికశాఖ.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.ఇప్పుడు నిబంధనలు మారాయా? లేక కూటమి ప్రభుత్వానికి ఒక న్యాయం, మాకో న్యాయమా?.. అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు గత ఏడు నెలలుగా డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఉందంటే సిగ్గుచేటని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వమే నడపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేయడాన్ని మిథున్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. -
బ్యాలెట్ పేపర్లతోనే ప్రజాస్వామ్యం పదిలం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టెక్నాలజీ పేరుతో వస్తున్న ఈవీఎంల కంటే నమ్మకమైన బ్యాలెట్ పేపర్ విధానాన్నే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో సోమవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.2024లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ఎండగడుతూ, ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఎన్నికల సంఘం 2024 మే 25న విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పోలైన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ తర్వాత ఫాం–20లో చూపించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను ఈ తేడాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఈ తప్పులకు బాధ్యులెవరని ప్రశ్నించారు. బాధ్యులపై ఈసీ ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు. అసెంబ్లీకి, లోక్‌సభకు ఓట్లలో తేడా ఎలా? ‘ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో.. ఒకే ఓటరు జాబితా, ఒకే పోలింగ్ బూత్ ఉన్నప్పుడు ఫాం–17ఏ (ఓటరు రిజిస్టర్), ఫాం–17సీ (ఓట్ల లెక్క) మధ్య తేడాలు ఎలా వస్తాయి? రాజమహేంద్రవరం, రాయచోటి, యలమంచిలి, కడప, పులివెందుల వంటి అనేక నియోజకవర్గాల్లో ఈ వ్యత్యాసాలు వెలుగుచూశాయి. ఇది కచ్చితంగా ఓట్ల డేటాలో మాయాజాలం లేదా అవకతవకలే. ఎంత ఆధునికమైనా ఈవీఎంలను పూర్తిగా నమ్మలేం. అదే బ్యాలెట్ పేపర్ అయితే పాత పద్ధతే అయినా ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ఆడిట్ చేయడానికి వీలులేని ఏ వ్యవస్థా విశ్వసనీయం కాదు.అందుకే రాబోయే అన్ని ఎన్నికల్లోను ఈవీఎంలను రద్దుచేసి, బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం వైఎస్సార్సీపీ తరఫున ఆయన కేంద్రానికి, ఈసీకి పలు సూచనలు చేశారు. ‘పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజీ, ఫాం–17ఏ, 17సీ వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంల వెరిఫికేషన్‌ను కచ్చితంగా అమలు చేయాలి. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉండాలి..’ అని సూచించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 40 శాతం ఓటింగ్ షేర్ వచ్చిందని చెప్పారు. కానీ జరిగిన అవకతవకలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
డెడ్ ఎకానమీయా?
న్యూఢిల్లీ: భారత్ డెడ్ ఎకానమీ అయితే గ్లోబల్ ఏజెన్సీలు అంతంత గొప్ప రేటింగులు ఎలా ఇస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను డెడ్ ఎకానమీగా పేర్కొనడంపై కేంద్రం వివరణ ఇచ్చి తీరాలని విపక్షాలు సోమవారం లోక్‌సభలో పట్టుబట్టాయి. దాంతో నిర్మల మాట్లాడారు. విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 8.2 శాతం వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ గతంలో బయటి సాయంపై ఆధారపడేది. అలాంటిది గత పదేళ్లలో బయటి దేశాలకు ఆదర్శంగా మారేలా ఎదిగింది. డెడ్ ఎకానమీ అన్నదే నిజమైతే డీబీఆర్ఎస్, ఎస్ అండ్ పీ, సర్ అండ్ ఐ వంటి ప్రముఖ సంస్థలు మన క్రెడిట్ రేటింగ్‌ను పెంచుతాయా? ఎవరో ఏదో అంటే మనం పట్టించుకోవాలా? ఆరోపణలు చేసేది ఎంత పెద్దవారైనా సరే, గణాంకాలు ఏం చెబుతున్నాయన్నదే చూడాలి. వాటి ఆధారంగానే మాట్లాడాలి’’ అంటూ విపక్షాలకు మంత్రి నిర్మల హితవు పలికారు.రూ. 41 వేల కోట్ల వ్యయానికి లోక్ సభ ఆమోదంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కీలక శాఖలకు సంబంధించి రూ.41,455 కోట్ల మేరకు అదనపు వ్యయానికి లోక్‌సభ అనుమతి మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్లను సోమవారం ఆమోదించింది. దీన్ని బడ్జెట్ రూపకల్పనలో అసమర్థతగా విపక్ష ఎంపీలు చేసిన విమర్శలను మంత్రి నిర్మల తిప్పికొట్టారు. బాధ్యతాయుత ప్రభుత్వానికి ఇలాంటి సప్లిమెంటరీ డిమాండ్లు చాలా అవసరమన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని చెప్పారు. -
వరకట్న వ్యతిరేక చట్టాలకు కోరల్లేవు
న్యూఢిల్లీ: వరకట్న భూతాన్ని సమూలంగా రూపుమాపడం తక్షణావసరం అని అత్యున్నత న్యాయస్థానం సోమవారం అభిప్రాయపడింది. అయితే వరకట్న వ్యతిరేక చట్టాలు ఆచరణలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. పైగా తరచూ వాటి దుర్వినియోగం జరుగుతుండటం మరో ఆందోళనకర పరిణామం. దాంతో మన దేశంలో వరకట్న దురాచారం ఇప్పటికీ నిర్ని రోధంగా కొనసాగుతూనే ఉందని న్యాయ మూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఆవేదన వెలిబు చ్చింది. 24 ఏళ్లనాటి వరకట్న హత్య కేసులో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వారికి జీవిత ఖైదు విధించడమే సరైనదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘కేవలం కలర్ టీవీ, మోటార్ సైకిల్, రూ.25 వేలు ఇవ్వలేదని నవ వధువును కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. అయితే నిందితుల్లో మహిళకు ఇప్పుడు 94 ఏళ్లు గనుక ఆమెకు తీర్పు అమలు కాబోదు. రెండో వ్యక్తి మాత్రం 4 వారాల్లో లొంగిపోవాలి‘ అని ఆదేశించింది. వరకట్న దురాచారం విషయమై కేంద్ర రాష్ట్రాలకు, దిగువ కోర్టులకు ఈ సందర్భంగా పలు నిర్దేశాలు చేసింది. పెండింగ్ లో ఉన్న వరకట్న హత్యలు (సెక్షన్ 304–బి), భర్త, అత్తింటివారి హింస (398–ఏ) కేసులపై హైకోర్టులు మరింతగా దృష్టి పెట్టాలి. వరకట్నం సాంఘిక దురాచారమని మన భావితరాలకు తెలియాలి. ఆ మేరకు బాలల్లో అవగాహన కలిగేలా విద్యా ప్రణాళికల్లో కేంద్రం, రాష్ట్రాలు అవసరమైన మార్పులు చేయాలి. చట్టం పేర్కొన్న మేరకు వరకట్న నిషేధ అధికారులను రాష్ట్రాలన్నీ తక్షణం నియమించాలి. వారికి అవసరమైన అన్ని అధికారాలు, సాధన సంపత్తి కట్టబెట్టాలి. వారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబరు, మెయిల్ ఐడీలను అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలి. వరకట్న కేసులను విచారించే పోలీసు, న్యాయాధికారులకు ఇందుకు సంబంధించిందిన అంశాలపై తరచూ శిక్షణ ఇవ్వాలి‘ అని సూచించింది. -
మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం అక్రమ కేసులో బెయిల్‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాజీ ఐఏఎస్ కె.ధనంజయ రెడ్డి, పెల్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్లు సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు... పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి. ఆర్యమ సుందరం, నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపిస్తూ, కౌంటర్ అఫిడవిట్లకు సంబంధించి శనివారం రెండు రిజాయిండర్లు దాఖలు చేశామని, మరొకటి సోమవారం దాఖలు చేస్తున్నామని వివరించారు. ఇరుపక్షాల కౌంటర్లు, రిజాయిండర్లు, వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.కాగా ఈ కేసులో ట్రయల్ కోర్టు తదుపరి చర్యలకు తమ మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాదని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. నేపథ్యం ఇదీ... తప్పుల తడక చార్జ్‌షిట్ నేపథ్యంలో ముగ్గురు నిందితులకు గతంలో ట్రయల్ కోర్టు ‘డిఫాల్ట్ బెయిల్’ మంజూరు చేసింది. అయితే, దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు వారి డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసింది. నవంబర్ 26లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లకు అనుకూలంగా నవంబర్ 26న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
‘ఉపాధి’ భారం రాష్ట్రాలపైనా!
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) చట్టం ఇక కనుమరుగు కానుంది. దాని స్థానంలో వికసిత భారత్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్ (వీబీజీ ఆర్‌ఏఏఎం–జీ) పేరిట కోటా చట్టాన్ని మోదీ సర్కారు తేనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇది గ్రామీణులకు ఏటా కనీసం 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తుందని బిల్లు ప్రతిలో పేర్కొన్నారు. ఇది చట్టంగా అమల్లోకి వచ్చిన ఆర్నెల్ల లోపు అందులోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా కొత్త పథకాన్ని అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకం కాగా కొత్త చట్ట భారాన్ని మాత్రం రాష్ట్రాలు కూడా మోయాల్సి ఉంటుంది. దాన్ని ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 10 శాతంగా, ఇతర రాష్ట్రాలకు 40 శాతంగా నిర్ణయించారు. అసెంబ్లీలు లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో పథక వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి గా భరిస్తుంది. అంతేకాకు మరో మెలిక కూడా పెట్టారు. కొత్త పథకం కింద ప్రతి రాష్ట్రానికీ ఆర్థిక సంవత్సరం మొత్తానికీ నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించి అంతటితో సరిపెడతారు. వ్యయం అంతకు మించితే సంబంధిత రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. నాలుగింటిపై దృష్టి కొత్త ఉపాధి హామీ పథకం ప్రధానంగా 4 రకాల పనులపై దృష్టి సారించనుంది. జలభద్రత ( నీటి సంరక్షణ, సాగునీరు, నీటి వనరుల పునరుజ్జీవం, అడవుల పెంపకం వంటివి), మౌలిక గ్రామీణ వసతులు (రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల వంటివాటి నిర్మాణం, మెరుగుదల), జీవనాధార సంబంధిత వసతులు, వాతావరణానికి అనుగుణంగా సర్దుబాట్లు. ‘ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 20 ఏళ్లుగా గ్రామీణులకు ఉపాధి భద్రత బాధ్యతను నెరవేరుస్తూ వచ్చింది. అయితే గ్రామాల్లో మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరింత బలోపేతం చేయాల్సిన సమయం వచ్చింది‘ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.గాంధీ పేరెందుకు తీసేశారు? కేంద్రానికి విపక్షాల ప్రశ్నా్రస్తాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పేరు మార్పు ప్రతిపాదనపై విపక్షాలు సోమవారం మండిపడ్డాయి. పథకం నుంచి గాంధీ పేరు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ను ఎలాగైనా టాప్ మోదీ ప్రధాని అయిన నాటినుంచి చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సప్తగిరి ఉలక ఆరోపించారు. గాంధీ పేరు తొలగించి అధికార బీజేపీ ఏం సాధిస్తోందని కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పార్లమెంటు ఆవరణలో మీడియాముఖంగా ప్రశ్నించారు. దీన్ని గాం«దీకి అవమానంగా రుణం కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ అభివరి్ణంచారు. పేరు మార్పు ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్నే దుంపనాశనం చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి దుయ్యబట్టారు. -
Rajya Sabha: ఈవీఎంలను నమ్మలేం: వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీ: రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చర్చలో పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో అనేక తేడాలు వచ్చాయన్న వైవీ సుబ్బారెడ్డి.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలన్నారు.సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంచాలి. ఈవీఎంలను నమ్మలేము. పేపర్ బ్యాలెట్ సిస్టంపైనే అందరికీ నమ్మకం ఉంది. స్వతంత్ర సంస్థ ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై స్వేచ్ఛగా, పారదర్శకంగా ఉండాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
సుప్రీం కోర్టులో కూటమి సర్కార్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో కూటమి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే విడుదల చేయాలంటూ జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అణచివేత ధోరణిని కూటమి ప్రదర్శించడం చూస్తున్నదే. ఈ క్రమంలోనే యూరియా కొరతపై తారక్ ప్రతాప్ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. ఈ పరిణామంలో రగిలిపోయిన ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. తారక్‌ను అక్రమ అరెస్ట్ చేయించింది. తారక్ తరఫున సుప్రీం కోర్టులో సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ‘‘యూనిఫాంలో కాకుండా మఫ్టీలో వైఎస్ఆర్సిపీ సోషల్ మీడియా కార్యకర్తలను కిడ్నాప్ చేస్తున్నారని.. ప్రభుత్వ దమనకాండపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని’’ వాదించారు. సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. తారక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. -
మెస్సీ భాయ్.. మరి నీ లంగ్స్‌కు ఇన్సూరెన్స్ చేయించావా?
ఫుట్‌బాల్ రారాజు లియోనెల్ మెస్సీ భారత పర్యటన చివరి అంకానికి చేరుకుంది. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా దేశ రాజధానిలో ఇవాళ ఈ స్టార్ ప్లేయర్ పర్యటించబోతున్నారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న వేళ.. ఈ పర్యటనపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఢిల్లీ పొల్యూషన్ గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో.. విద్యాసంస్థలకు, ఆఫీసులకు ఊరట ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది అక్కడి అధికార యంత్రాంగం. ఈ తీవ్ర వాయుకాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. చాలా చోట్ల జీరో విజిబిలిటీతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల మధ్య అర్జెంటీనా ఫుట్‌బాల్ వీరుడు రావడంపై జోకులు ఇలా ఉన్నాయి.. 🤧మెస్సీ బాయ్.. ఢిల్లీకి మీకు స్వాగతం. మీ ఎడమ కాలిని 900 మిలియన్ డాలర్లకు((దాదాపు ₹7,500 కోట్లకు పైగా) ఇన్సూరెన్స్ చేయించారని విన్నా. ఇంతకీ మీ ఊపిరితిత్తులకు ఇన్సురెన్స్ చేయించారా?😬విరాట్ కోహ్లి.. మెస్సీ.. ఇది గోట్లు కలిసి చేయబోయే సందడి కోసం ఢిల్లీ ఎదురు చూస్తోంది. కానీ, ఆ దృశ్యం ఇలా ఉండొచ్చు.. అంటూ మసకగా ఉన్న ఇద్దరి ఫొటోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడుFans are waiting to see Virat Kohli and Leo Messi together in Delhi.Meanwhile, this is how the photo would probably look in Delhi air. 😭 pic.twitter.com/xvln8edSu8— Selfless⁴⁵ (@SelflessCricket) December 14, 2025😓మెస్సీ తన కెరీర్లో ఇప్పటిదాకా 896 గోల్స్ చేశారు.. ఇప్పుడు ఢిల్లీ ఏక్యూఐ(వాయు నాణ్యత) ఆ రికార్డును బద్ధలు కొడుతుందేమో! 😎మెస్సీకి పొగ తాగే అలవాటు లేదు. కానీ, ఈ ఒక్కరోజే ఆయన 20 సిగరెట్లు తాగుతారేమో!.. అంటూ ఢిల్లీ పొల్యూషన్‌ను అన్వయించి సెటైర్లు వేస్తున్నారు. కోల్‌కతా మినహాయించి హైదరాబాద్, ముంబైలో మెస్సీ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఫుట్‌బాల్ అభిమానుల కోలాహలం నడుమ స్టేడియంలో మెస్సీ సందడి చేశాడు. ఇక్కడి అభిమానానికి ముగ్దుడైనట్లు ప్రకటించాడు. నేటితో ఈ టూర్ ముగియనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ ఈవెంట్‌కు ప్రధాని మోదీ సైతం హాజర కావొచ్చనే ప్రచారం వినిపించినప్పటికీ.. విదేశీ పర్యటనల నేపథ్యంలో అది జరగకపోవచ్చనే తెలుస్తోంది.లియోనెల్ మెస్సీ ఎడమ కాలికి సుమారు 900 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన ఎడమ కాలే ఆటలో ప్రధాన బలం. గోల్స్, ఫ్రీకిక్స్, డ్రిబ్లింగ్ అన్నీ ఎక్కువగా ఎడమ కాలుతోనే చేస్తారు. ఒకవేళ ఏదైనా గాయమై ఆట కొనసాగించలేని పరిస్థితి వస్తే.. క్లబ్‌లు, స్పాన్సర్లకు ఆర్థిక రక్షణ లభించేందుకు ఇంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించారు. అసలు ఈ భారీ ఇన్సూరెన్స్ కారణంగా, మెస్సీ ఇండియా టూర్ 2025లో పూర్తి మ్యాచ్ ఆడలేకపోతున్నారు. ఎందుకంటే.. ఆయనకు అనుమతి ఉన్నది కేవలం అర్జెంటీనా జాతీయ జట్టు, తన క్లబ్ (Inter Miami) తరఫున మాత్రమే పూర్తి మ్యాచ్‌లు ఆడటానికి. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు లేదా ఇతర ఈవెంట్లలో పూర్తి స్థాయిలో ఆడితే, ఇన్సూరెన్స్ నిబంధనలు ఉల్లంఘన అవుతాయి.మెస్సీ మాత్రమే కాదు.. ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర క్రీడాకారులకు కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్ హీరోలు క్రిస్టియానో రొనాల్డో తన కాళ్లకు, డేవిడ్ బెక్‌హమ్ తన ముఖానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే.. మెస్సీ ఎడమ కాలు ఇన్సూరెన్స్ విలువ ప్రపంచంలోనే అత్యధికంగా భావించబడుతోంది. -
విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర భారతదేశానికి భారీ పొగమంచు అలర్ట్ జారీ చేసింది. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని విమానాలు మార్గం మళ్లించబడ్డాయి. విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. Heavy Fog Alert for Northern IndiaDelhi (DEL) & other airports in Northern India are experiencing dense fog, severely affecting visibility.For Passengers:Before heading to the airport, please check the latest flight status with your airline.Check flight information on the…— MoCA_GoI (@MoCA_GoI) December 15, 2025ఉత్తర భారతదేశంలో శీతాకాలం తీవ్రత పెరగడంతో పొగమంచు మరింతగా అలుముకుంటోంది. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో కూడా పొగమంచు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. -
గ్యాస్ ఛాంబర్లా దేశ రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. AQI తీవ్రత 500 పాయింట్లతో ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం గ్రాఫ్ 4 నిబంధనలు అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో 50% సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్మాణ పనులపై సంపూర్ణ నిషేధం విధించారు. నగరంలో డీజిల్ వాహనాలకు ప్రవేశం నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను “పబ్లిక్” సెట్టింగ్స్‌లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్‌ఫార్మ్‌లలోని కంటెంట్‌ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. -
బీజేపీ డీఎన్ఏలో ఓటు చోరీ
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యం, ఓట్ల చోరీ బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలోనే ఉన్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సత్యం, అహింస అనే నినాదంతో బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రతిన బూనారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీతోపాటు ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ విచుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వారంతా బీజేపీ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అధికారం అండతో విచ్చలవిడిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించేవారి డీఎన్ఏలో సత్యం ఉంటుందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలో మాత్రం అసత్యం, ఓట్ల చోరీ మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం ‘‘సత్యమే మన ఆయుధం. సమయం పట్టొచ్చు గానీ ఎప్పటికైనా సత్యానిదే విజయం. ప్రపంచం సత్యాన్ని పట్టించుకోదని, అధికారాన్ని, బలాన్ని మాత్రమే చూస్తుందని ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ చెప్పడం దారుణం. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తున్న సంగతి నిజం కాదా? ఎన్నికల కమిషనర్లను కాపాడేందుకు ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారు. మేమే వచ్చాక ఈ చట్టాన్ని తప్పనిసరిగా మారుస్తాం’’ అని అన్నారు. దొంగతనమే వారి డీఎన్ఏ దొంగతనం బీజేపీ డీఎన్ఏలో ఉందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. డబ్బు దొంగతనం, భూమి దొంగతనం, వ్యవస్థల దొంగతనం, హక్కుల దొంగతనం, ఉద్యోగాల దొంగతనం, ప్రజా తీర్పును దొంగిలించడం, ప్రభుత్వాన్ని దొంగిలించడం, ఎన్నికలను, ఓట్లను దొంగిలించడం బీజేపీకి అలవాటేనని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకొని అధికారం అనే నిచ్చెనపైకి ఎగబాకడం బీజేపీ విధానమని దుయ్యబట్టారు. ప్రజల కోసమే రాహుల్ పోరాటం: ఖర్గే ప్రజల కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయనను బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ చోర్–గద్దీ ఛోడ్ ధర్నాలో ఖర్గే ప్రసంగించారు. రాహుల్ గాం«దీకి మద్దతు ఇవ్వకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. దేశాన్ని, ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమంతా కలిసి పోరాటం చేయాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, భావజాలం దేశాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హిందూమతం, హిందుత్వం పేరుతో పేదలను బానిసలుగా మార్చడానికి ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశ ద్రోహులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలకు, ఓట్ల దొంగలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి మరింత బలోపేతం చేయాలని ప్రజలకు ఖర్గే విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్లతో గెలిచే దమ్ముందా?బ్యాలెట్ పేపర్లతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి గెలిచే దమ్ముందా? అని బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా సాగుతోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం సహకరించకపోతే ఎన్నికల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గలేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోదీ సర్కార్ ఎదుట మోకరిల్లుతున్నాయని ఆరోపించారు. -
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. శాఖలే మారుస్తారా? లేదంటే.. మంత్రులనే మారుస్తారా? అనే విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్నారు. అయితే, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,« అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిందనని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్, సురేఖను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, వాళ్లిద్దరూ కాంగ్రెస్ నేతలే అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన తెంగాణభవన్‌లో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే నన్ను మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. స్వయంగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదన పెట్టారు. కానీ, నాకు మంత్రి పదవిపై మక్కువ లేదని చెప్పాను’అని అన్నారు. మహేశ్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. వేదికపైకి మంత్రులను పిలిస్తే బాగుండేది.. గ్లోబల్ సమ్మిట్‌లో రాజకీయ ప్రాధాన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే మంత్రులను స్టేజీ మీదకు ఆహ్వానించలేదు. అయితే, మంత్రులను కూడా వేదికపైకి పిలిస్తే బాగుండేది. కొందరు ఐఏఎస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గ్లోబల్ సమ్మిట్‌కు కూడా వస్తే బాగుండేది. గ్లోబల్ సమ్మిట్ ప్రతిఏటా పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం. బీసీ ప్రైవేట్ బిల్లు పార్లమెంటులో పెడితే బాగుంటుందని రాహుల్ గాం«దీకి చెప్పాం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ పదవులనూ తొలివిడతలోనే భర్తీ చేయాలి. కానీ, అక్కడ వచి్చన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోలలేదు. అందుకే ఆ రెండింటిని పెండింగ్‌లో ఉంచాం. జనం కవిత మాటలు నమ్ముతున్నారు... బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని కవిత దగ్గర నుంచి చూసింది కాబట్టే.. ఆమె మాటలను ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకుండా మనుగడ సాధించడం అంత సులభం కాదు. కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్‌కు రాలేదు. హరీశ్‌రావు దెబ్బకొట్టడం ఖాయం. డబ్బులతో కేటీఆర్ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో కేసీఆర్ ముందే ఊహించారు.. అందుకే ప్రచారానికి రాలేదు’ బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏమాత్రం లేదు. బీజేపీ అధిష్టానానికీ ఆ విషయం తెలుసు. బీజేపీకి 60–70 స్థానాల్లో కనీసం కేడరే లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తు న్నారు. కానీ మేమే కొన్ని విలువలు పాటిస్తున్నాం. కాబట్టే.. అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ ప్రభుత్వం రావడం అనేది మాకు నల్లేరు మీద నడకే. ఇన్వెస్లర్ల చూపు హైదరాబాద్ వైపే... రేవంత్ రెడ్డి విజనరీ ఉన్న లీడర్. ఫోర్త్ సిటీ పూర్తయితే దేశంలోని మరే నగరం హైదరాబాద్‌తో తట్టుకోలేదు. కంపెనీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పాలసీలు రూపొందించాం. టెస్లాను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహకరించాలని రాహుల్ గాం«దీని కోరాం. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇన్వెస్టర్లు మాత్రం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏ పెద్ద వెంచర్లోకి వెళ్లినా పుణే, చెన్నై, ముంబై, బెంగళూరుకు చెందిన వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువశాతం వెంచర్లలో 25 నుంచి 30 శాతం మహారాష్ట్ర వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ ఇండియాలోనే నంబర్ వన్ నగరంగా మారబోతోంది. -
ఓట్లే కాదు.. అన్నీ లాగేసుకుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ (ఓట్ల దొంగతనం) అనే అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్యే కాదు.. ఇది మొత్తం దేశం సమస్య..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ఓట్ చోరీపై జరుగుతున్న యుద్ధంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీకి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ఒక సిపాయిలా మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ నుంచి తాము వెన్నంటి ఉంటామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాందీ, ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ యుద్ధంలో రాహుల్‌ను గెలిపించాలి ‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కు కోసం చేస్తున్న యుద్ధంలో రాహుల్‌ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే ఓటు హక్కును లాక్కుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ముందుగా ఓటరు లిస్టు నుంచి పేరు తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, భూమి, ఆస్తులు కూడా లాక్కుంటారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో చట్ట సభలో విస్తృత్తంగా చర్చ జరిగింది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మాగాం«దీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరారు. కానీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్ గోల్వాల్కర్ తదితరులు ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించారు. కానీ మహాత్మాగాందీ, అంబేడ్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం ఇచ్చారు..’అని సీఎం చెప్పారు. రాహుల్ ముందే హెచ్చరించారు.. ‘ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆలోచనా విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ, అమిత్‌షా గత పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలంటూ ఓటర్లను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని రాహుల్‌గాంధీ అప్పుడు చెప్పారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 240 సీట్లతోనే సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయంటే వారికి 400 సీట్లు రాలేదు కాబట్టే. వారు ఎస్ఐఆర్ పేరిట ఓట్ చోరీ చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదలకు జరుగుతున్న అన్యాయానికి వ్య తిరేకంగా మహాత్మాగాందీ, అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్, ఖర్గే ఈ వర్గాలకు మద్దతుగా, మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా.. ఆర్ఎస్ఎస్, గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రామ్‌లీలా మైదానంలో మీ ముందు ఉన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు కూడాధర్నాలో పాల్గొన్నారు. -
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నబీన్
న్యూఢిల్లీ/లక్నో: అందరి అంచనాలను తలకిందుల చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం బిహార్ యువనేత నితిన్ నబీన్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. నబీన్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం నోటిఫికేషన్లో ప్రకటించారు. కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బిహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో భవిష్యత్తులో ఈయన బీజేపీ చీఫ్ పదవిని చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. తద్వారా తక్కువ వయస్సులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. మోదీ అభినందనలు.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్‌ను ప్రధాని మోదీ అభినందించారు. కష్టించి పనిచేసే కార్యకర్తగా గుర్తింపు పొందిన నబీన్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్న విశ్వాసం తనకుందన్నారు. ‘యువకుడు, కష్టించి పనిచేసే నేత, సంస్థాగత వ్యవహారంలో అనుభవమున్న వాడు, ఎమ్మెల్యేగా మంచి రికార్డు ఉంది. బిహార్‌కు పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు బాధ్యతలు నిర్వర్తించారు’అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం లక్నోలో కేంద్రమంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. ఈ పదవికి శనివారం పంకజ్ చౌదరి నామినేషన్ వేశారన్నారు. పోటీలో ఆయన ఒక్కరే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మొత్తం 1.62లక్షల బూత్‌ల ద్వారా ఈ ఎన్నిక జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నుంచి పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారని గోయెల్ తెలిపారు. యూపీ బీజేపీ 17వ అధ్యక్షుడిగా ఎన్నికైన పంకజ్ చౌదరి కుర్మి వర్గానికి చెందిన వారు. ఈ వర్గం ఇతర వెనుకబడిన కులా(ఓబీసీ)ల జాబితాలో ఉంది. ఈ సందర్భంగా పియూష్ గోయెల్ పార్టీ జాతీయ కౌన్సిల్‌లోని 120 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. వీరిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి, సీఎం ఆదిత్య నాథ్ గోరఖ్‌పూర్ నుంచి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లక్నో నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు. 45 ఏళ్లకే 5 సార్లు ఎమ్మెల్యేగా.. బిహార్‌లో బీజేపీ సీనియర్ నేత, నాటి ఎమ్మెల్యే నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా 2006లో ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్ నబీన్‌కు పార్టీ అధిష్టానం పటా్న(పశ్చిమ) నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తొలిసారిగా బరిలోకి దింపింది. ఏకంగా 60వేల ఓట్ల భారీ మెజారిటీతో నబీన్ గెలిచారు. అప్పట్నుంచి వరసగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. తాజాగా బిహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 51,000 ఓట్ల మెజారిటీతో బంకింపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా కేవలం 45 ఏళ్ల వయసుకే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. నబీన్ గతంలో యువ మోర్చాలో పనిచేశారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు. బీజేపీ చీఫ్‌గా నడ్డా స్థానంలో మరొకరిని నియమించాల్సిన సమయంలో నబీన్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను అప్పగించడం గమనార్హం. నడ్డా తర్వాత బీజేపీ నూతన చీఫ్ అయ్యే అవకాశాలు నబీన్‌కు అత్యధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు స్వయంగా చెబుతున్నాయి. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులైనట్లు తెలియడంతో పటా్నలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సవాలు మిన్నంటాయి. నితిన్ నబీన్‌కు శుభాకాంక్షల సందేశాలు వెల్లువలా వచ్చాయి. ఈ నియామకం పార్టీ కార్యకర్తలకు అంకితమిస్తున్నానని మీడియాతో నబీన్ పేర్కొన్నారు. తనపై విశ్వాసముంచి గురుతర బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధిష్టానం యువనాయకత్వం వైపు మొగ్గుచూపుతోందనడానికి నబీన్ నియామకం ఒక సంకేతమని వార్తలొచ్చాయి. #BREAKING: Nitin Nabin Appointed As National Working President of BJP. pic.twitter.com/rdCbo9KpYq— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 14, 2025 -
ప్రధాన సమాచార కమిషనర్‌గా గోయల్
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి రాజ్‌కుమార్ గోయల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక ప్యానెల్ బుధవారం సమావేశమై గోయల్ పేరును సీఐసీ పదవికి సిఫార్సుచేసినట్లు శనివారం ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సీఐసీగా గోయల్‌తోపాటు మరో ఎనిమిది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్(ఐసీ)లను కొత్తగా ప్యానెల్ సిఫార్సుచేసింది.గోయల్ చేత సీఐసీగా సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయిస్తారు. అరుణాచల్ ప్రదేశ్–గోవా–మిజోరం–యూనియన్ టెరిటరీస్(ఏజీఎంయూటీ) క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్(రిటైర్డ్) ఐఏఎస్ అధికారి అయిన గోయల్ ఇటీవల కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిగా సేవలందించారు. గతంలో ఈయన కేంద్ర హోం శాఖలో సరిహద్దు నిర్వహణ విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. అవిభాజ్య జమ్మూకశీ్మర్ రాష్ట్రంతోపాటు కేంద్రప్రభుత్వంలో పలు పదవుల్లో సేవలందించారు. సెపె్టంబర్ 13వ తేదీన ప్రస్తుత సీఐసీ హీరాలాల్ సమారియా రిటైర్ కావడంతో అప్పట్నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్గోయల్ను సీఐసీ పదవికి ఎంపికచేశారు. కొత్త కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించాక దాదాపు 9 ఏళ్ల తర్వాత కమిషన్ గరిష్ట సామర్థ్యంతో పనిచేయనుంది. బుధవారం 8 మందిని ఐసీలుగా సిఫార్సుచేయగా ఇప్పటికే ఆనందీ రామలింగం, వినోద్ కుమార్ తివారీలు ఐసీలుగా పనిచేస్తున్నారు. సమాచార కమిషనర్(ఐసీ) పోస్ట్‌కు ప్రభుత్వం ఎంపికచేసిన 8 మందిలో సీనియర్ పాత్రికేయులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ బోర్డ్‌లో లీగల్ సభ్యురాలైన రేలంగి సుధారాణి, మాజీ రైల్వేబోర్డ్ చీఫ్ జయవర్మ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, సెంట్రల్ సెక్రటేరియట్ సరీ్వస్ మాజీ అధికారి సంజీవ్ కుమార్ జిందాల్, మాజీ ఐఏఎస్ అధికారి సురేంద్ర సింగ్ మీనా, మాజీ ఇండియన్ ఫారెస్ట్ సరీ్వస్ అధికారి కుష్వంత్ సింగ్ సేథీ ఉన్నారు. -
సివిల్స్ విజేతలు.. వారే ఎక్కువ!
రాశి కంటే వాసి ముఖ్యమని మన పెద్దలు అంటుంటారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అనేది దీని అర్థం. ఎంత పని చేశామనే దానికంటే ఎంత బాగా చేశావన్నదే ముఖ్యం. చదువు, ఉద్యోగాల్లో ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటే గ్రాడ్యుయేట్లే ఎక్కువగా విజయం సాధించారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.గత ఐదు సంవత్సరాల డేటాను విశ్లేషిస్తే.. పీజీ చేసిన వారి కంటే డిగ్రీ పట్టభద్రులే ఎక్కువగా సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయినట్టు తేలింది. ప్రణాళిక ప్రకారం ప్రిపేరయితే బ్యాచిలర్ డ్రిగీతోనే సివిల్స్ సాధించొచ్చని దీని ద్వారా నిరూపితమవుతోంది. యూపీఎస్సీ సివిల్ పరీక్షల్లో (UPSC CSE) గత మూడేళ్లలో మహిళల ఉత్తీర్ణత రేటు కూడా గణనీయంగా పెరిగింది. సబ్జెక్టుల వారీగా చూసుకుంటే ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించినట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది. లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023లో సివిల్స్ పాసైన అభ్యర్థుల్లో 75% మందికి కేవలం బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే ఉంది. మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు 25% మంది ఎంపికయ్యారు. గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు మొత్తం 4,655 మంది అభ్యర్థులు సివిల్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో 3,520 మంది గ్రాడ్యుయేట్లు (సుమారు 76%) ఉన్నారు. ఉన్నత విద్యార్హతలు లేకపోయినా.. పటిష్టమైన సన్నద్ధత, సరైన ప్రణాళిక ఉంటే సివిల్స్ పరీక్షలో విజయం సాధించవచ్చని దీన్నిబట్టి అర్థమవుతోంది.గ్రాడ్యుయేట్ల హవా ఇలా..2022: 1,020 మందిలో 765 మంది గ్రాడ్యుయేట్లు2021: 748 మందిలో 585 మంది గ్రాడ్యుయేట్లు2020: 833 మందిలో 650 మంది గ్రాడ్యుయేట్లు2019: 922 మందిలో 672 మంది గ్రాడ్యుయేట్లుఅమ్మాయిలు పెరుగుతున్నారుసివిల్స్లో మహిళల విజయం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గత మూడేళ్లలో మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత రేటు పెరిగింది. 2019లో 24 శాతం మంది మహిళలు ఉత్తీర్ణత సాధించగా, గత మూడేళ్లలో ఇది 35 శాతంగా ఉంది. 2019లో 922 మంది సివిల్స్ సాధించగా, వీరిలో 220 మంది మహిళలు ఉన్నారు. 2024లో 1009 మంది సివిల్స్ పాసయితే వీరిలో 350 వరకు మహిళలు ఉన్నారు. అంతేకాదు టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురు అమ్మాయిలు ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శక్తి దూబే (Shakti Dubey) ఫస్ట్ ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ టాప్ఏ స్ట్రీమ్ విద్యార్థులు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఎక్కువగా పాసవుతున్నారనే ప్రశ్న ఎక్కువగా అడుగుతుంటారు. ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. 2023 ఫలితాల్లో ఇంజనీరింగ్ (49%), హ్యుమానిటీస్ (32%), సైన్స్ (12), మెడికల్: (6%) అభ్యర్థులు విజయం సాధించారు. గత కొనేళ్లుగా ఇదే తరహాలో ఫలితాలు వస్తున్నాయి. 2020 సివిల్స్ ఫలితాల్లో కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులు 53 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచారు. చదవండి: సివిల్స్‌లో తగ్గుతున్న ఐఏఎస్‌ల వారసులు! -
3–6 ఏళ్ల చిన్నారుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి
న్యూఢిల్లీ: దేశంలోని 3–6 ఏళ్ల మధ్య చిన్నారుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రాజ్యసభ నామినేటెడ్ సభ్యురాలు సుధా మూర్తి కోరారు. ఈ చిన్నారులకు ఉచిత విద్య, సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వాలే చేపట్టాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21బీ సవరించవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రైవేట్ బిల్లును శుక్రవారం ఆమె రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ‘చిన్నారులే మనందరి భవిష్యత్తు. వారు ఉదయించే సూర్యుని వంటివారు. ప్రారంభ విద్య వారి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతమున్న 6– 14 ఏళ్లకు బదులుగా 3– 14 ఏళ్లకు ప్రభుత్వమే ఉచితంగా విద్య, సంరక్షణను అందించేందుకు వీలు కలి్పంచేలా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని రాజ్యసభలో ఆమె తెలిపారు. చిన్నారులకు మంచి విద్యనందించడం ఎంతో కీలకమని నూతన విద్యా విధానం కూడా చెబుతోందన్నారు. -
పార్లమెంట్ ప్రాంగణంలో ఈ–సిగరెట్.. ఆ ఎంపీపై చర్యలు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ ఈ–సిగరెట్ తాగుతూ దొరికిపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సౌగతా రాయ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా సదరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సౌగతా రాయ్ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిషేధిత ఈ–సిగరెట్ తాగుతూ కనిపించారు. అనురాగ్ ఠాకూర్ ఈ అంశాన్ని ఆదేరోజు లోక్‌సభలో ప్రస్తావించారు. పవిత్రమైన పార్లమెంట్లో సిగరెట్ తాగడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సౌగతా రాయ్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. దాంతో అనురాగ్ ఠాకూర్ శుక్రవారం లిఖిపూర్వక ఫిర్యాదు అందించారు. నిషేధిత సిగరెట్ తాగడం చట్టప్రకారం తీవ్రమైన నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్లమెంట్ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై మండిపడ్డారు. యువతకు ప్రమాదకరమైన సందేశం ఇచ్చారని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఈ–సిగరెట్లను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. ఇదిలా ఉండగా, ఈ–సిగరెట్ తాగడం చిన్న విషయమని, దీనిపై రాద్ధాంతం అవసరం లేదని సౌగతా రాయ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. మరోవైపు అనురాగ్ ఠాకూర్ తీరును తృణమూల్ కాంగ్రెస్ మరో ఎంపీ కీర్తి ఆజాద్ తప్పుపట్టారు. లిఖితపూర్వక ఫిర్యాదులో సౌగతా రాయ్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని కీర్తి ఆజాద్ ప్రశ్నించారు. -
పరస్పర ఆరోపణలు పక్కనపెట్టి కాలుష్యంపై చర్చిద్దాం
న్యూఢిల్లీ: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికార, విపక్షాలు కలిసికట్టుగా కృషి చేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విన్నవించారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం పక్కనపెట్టి.. వాయు కాలుష్యంపై అధికార, విపక్ష సభ్యులు కలిసి సభలో సమగ్ర చర్చ జరపాలని కోరారు. ప్రజల ఇక్కట్లు తీర్చడానికి ఇరుపక్షాలు కలిసి పని చేస్తాయన్న సందేశాన్ని ఇద్దామన్నారు. దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న కాలుష్యంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన నగరాల్లో ప్రజలు విష వాయువు దుప్పటి కింద నివసిస్తున్నారని చెప్పారు. లక్షలాది మంది చిన్నారులు ఉపిరితిత్తుల జబ్బుల బారిన పడుతున్నారని, వారి భవిష్యత్తు దెబ్బతింటోందని అన్నారు. ప్రజలు క్యాన్సర్ పీడితులుగా మారుతున్నారని, వృద్ధులు శ్వాస సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్య సమస్యపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని కోరారు. శుక్రవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన కాలుష్యం రాజకీయ సిద్ధాంతపరమైన అంశం కాదని అన్నారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కార మార్గం కనిపెట్టాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు. చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు రాహుల్ విజ్ఞప్తిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. కాలుష్యంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. దీనిపై లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమయం కేటాయిస్తుందన్నారు. -
1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు 36 మందికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. జీవితంలో మర్చిపోలేని విషాదానికి గురైన వీరంతా నాలుగు దశాబ్ధాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని సీఎం గుప్తా పేర్కొన్నారు. ఇది కేవలం ఉద్యోగ కల్పనే కాదు, వారి ఆత్మగౌరవాన్ని, హక్కులను, గుర్తింపును పునరుద్ధరించడమేనని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బాధిత కుటుంబాలకు పారదర్శక, సత్వర ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారని చెప్పారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1984లో అంగరక్షకుల కాల్పుల్లో చనిపోవడం తెల్సిందే. అనంతరం ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కుటుంబసభ్యులను కోల్పోయిన 19 మందికి ప్రభుత్వ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలిచి్చంది. తాజాగా నియామక పత్రాలిచి్చన వారితో కలిపితే ఇప్పటి వరకు 55 మందికి ఉద్యోగా లిచి్చనట్లయింది. -
ఇండిగో సీఈవోపై ప్రశ్నల వర్షం
ముంబై/న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు తో తలెత్తిన సంక్షోభంపై సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ విచారణ కొనసాగుతోంది. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు శుక్రవారం వరుసగా రెండో రోజూ పీటర్ ఎల్బర్స్‌ను దాదాపు ఏడుగంటలపాటు ప్రశ్నించారు. ఇండిగో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇసిడ్రోను కూడా ఐదుగంటలపాటు విచారణ జరిపారు. అదేవిధంగా, విమానాల రాకపో కలను పర్యవేక్షించడంలో లోపాలను గుర్తించిన డీజీసీఏ అధికారులు అందుకు బాధ్యులైన నలుగురు ఫ్లయిట్ ఆప రేషన్స్ ఇన్స్పెక్టర్లను తొలగించారు. ప్రయా ణికులకు పరిహారంగా రూ.10వేల చొప్పున ట్రావెల్ వోచర్లు ఇస్తే, సంస్థపై రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని ఇండిగో శుక్రవా రం తెలిపింది. అంతేకాదు, విమాన రాకపో కల్లో మూల కారణాన్ని తెలుసుకునేందుకు వైమానిక రంగ నిపుణుడిని నియమిస్తున్నట్లు తెలిపింది. రివైజ్డు తగ్గింపు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం 2 వేలకు పైగా విమానాలను నడిపినట్లు తెలిపింది. -
ప్రభుత్వ వాదనను విజయవంతంగా తిప్పికొట్టాం
న్యూఢిల్లీ: వందేమాతరం, ఎన్నికల సంస్కరణలపై ఉభయ సభల్లో ఇటీవల జరిగిన చర్చల సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వాదనల్లో పస లేదని నిరూపించామని రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత కూడా అయిన రాహుల్ శుక్రవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి ఎదురైన దాడితో ప్రభుత్వం ఒత్తిడికి గురైన ట్లుగా కనిపించిందన్నారు. ‘వందేమాతరం, ఎస్ఐఆర్ అంశాలపై ఉభయసభల్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ రెండు చర్చలలోనూ, మేము ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టినందుకు సంతోషంగా ఉంది. ఎస్ఐఆర్ చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవర పడ్డారని, పార్లమెంటులో దుర్భాషను కూడా ఉపయోగించారు’అని ఎంపీలతో భేటీ అనంతరం రాహుల్ మీడియాతో అన్నారు. ఓటు చోరీ అంశంపై ప్రభుత్వానికి ప్రమేయం ఉందన్న విషయం యావత్ దేశానికే తెలుసన్నారు. ఇండిగో సంక్షోభం, వాయు కాలుష్యం, కార్మిక చట్టాలు వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందన్నారు. -
కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే
ఢిల్లీ: జనాభా లెక్కల సేకరణకు 11,718 కోట్ల రూపాయల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలివిడతలో ఇళ్ల లెక్కింపు, అనంతరం జనాభా లెక్కలు చేపట్టనున్నారు. 2026 ఏప్రిల్, సెప్టెంబర్లలో హౌస్ లిస్టింగ్, 2027 ఫిబ్రవరిలో జనగణన చేయనున్నారు.30 లక్షల మంది సిబ్బందితో జనాభా లెక్కల సేకరణ చేయనున్నారు. మొబైల్ యాప్‌తో డేటా సేకరించనున్నారు. సెంట్రల్ పోర్టల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించనున్నారు.‘కోల్ సేతు విండో’కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం కొత్త పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరి కి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్.. 2026 సీజన్లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి కి క్వింటాల్‌కు రూ. 445 రూపాయలు. బాల్ కొబ్బరి క్వింటాలుకు 400 రూపాయలు మద్దతు ధర పెంచింది. మిల్లింగ్ కొబ్బరి క్వింటాలు ధర: 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి ధర 12,500 ప్రకటించింది.ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్పు చేసింది. పనిదినాలు ఏడాదికి 120 రోజులకు పెంచింది. ఈ పథకాన్ని మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA)గా ప్రారంభించగా.. తరువాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)గా మార్చారు. తాజాగా.. 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. -
ప్రియాంక గాంధీపై పార్టీ నేత సంచలన లేఖ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ నాయకత్వం సరిగ్గా లేదని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. త్వరలోనే నాయకత్వ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలన్నారు. అందుకోసం యావద్దేశం ఎదురుచూస్తుందని తెలిపారు. ఈ లేఖతో అధికార బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో మరోసారి గ్రూప్ వార్ నడుస్తోందని శుక్రవారం కామెంట్ చేసింది. కాంగ్రెస్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గడ్డుకాలం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు పరాజయం పాలవడంతో పాటు పలు రాష్ట్రాల్లో ఆపార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 16 రోజుల పాటు యాత్ర నిర్వహించారు. ఆయన అక్కడ ఇండియా కూటమికి చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పార్టీ భవిష్యత్తుపై మరోసారి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఒరిస్సాకు చెందిన బరాబతి-కటక్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మెుఖ్యుం సోనియాగాంధీకి లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే లేఖలో "ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి జాతీయ స్థాయితో పాటు రాష్ట్రాలలో ఆశాజనకంగా లేదు. కేంద్రంలో మనం మూడు సార్లు వరుసగా పరాజయం పాలయ్యాము. ఈ పరిస్థితి పార్టీనే దైవంగా కొలిచే మాలాంటి కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. బిహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, కశ్మీర్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఓడిపోవడానికి పార్టీ అంతర్గత సంక్షోభాలు కారణమన్నారు. భారత్‌లో ప్రస్తుతం 35 సంవత్సరాలలోపు జనాభా గలవారు దాదాపు 65శాతం మంది ఉన్నారు. భవిష్యత్తు మెుత్తం యువత చేతుల్లోనే ఉంటుంది. కనుక ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి (83) వయస్సు రీత్యా వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోలేరు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ ప్రియాంక గాంధీ చేతికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి. దేశ యుువత వారి నాయకత్వం కోసం వేచిచూస్తుంది". అని లేఖలో ఆయన పేర్కొన్నారు. పార్టీలో సరైన నాయకత్వం లేకే జ్యోతిరాధిత్య సిందియా, హిమంత్ బిశ్వాస శర్మ, జైవీర్ శెర్గిల్ లాంటి కీలక నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఒడిస్సాతో పాటు దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏమి బాగాలేదని ఇప్పటికైనా మేల్కోని తగిన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై బీజేపీ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో అంతర్గతంగా రాహుల్ గాంధీ గ్రూప్, ప్రియాంక గాంధీ గ్రూప్ వార్ నడుస్తోందని తెలిపింది. అవి ఇప్పుడు బహిర్గతమయ్యాయని బీజేపీ కామెంట్ చేసింది. -
న్యాయ వ్యవస్థకు బెదిరింపా?
తమిళనాట తీవ్ర రాజకీయ దుమారం రేపిన తిరుప్పరన్కుండ్రం ఆలయ తీర్పు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఆ తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను అభిశంసించాలని ప్రతిపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాయి. అన్నాడీఎంకే-బీజేపీ అభ్యంతరాలతో రాజకీయ దుమారం కొనసాగుతోంది. అయితే.. ఆయనకు మద్దతుగా న్యాయమూర్తులు రంగంలోకి దిగారు. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ మద్దతుగా 46 రిటైర్డ్ జడ్జిలు, 10 మంది ప్రస్తుత జడ్జిలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అభిశంసన నిర్ణయం న్యాయవ్యవస్థను బెదిరించడమేనని.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఇందులో పలువురు సుప్రీం కోర్టు మాజీలు కూడా ఉండడం గమనార్హం. ‘‘తమకు రాజకీయంగా అనుగుణంగా లేరని కారణంతో న్యాయమూర్తులను బాహాటంగా బెదిరించే ప్రయత్నం ఇది. వాళ్లు తీసుకుంది సరైన నిర్ణయమని భావించినా.. అది ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యానికి మూలాలను దెబ్బతీస్తుంది. ఇది నాటి దేశ ఎమర్జెన్సీని తలపించే అంశం. రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా లేని తీర్పులు ఇచ్చినప్పుడు సీనియర్ న్యాయమూర్తులను బద్నాం చేయడం పరిపాటిగా మారుతోంది’’ అని మాజీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అభిశంసనను న్యాయవ్యవస్థ స్వేచ్ఛను కాపాడటానికి ఉపయోగించాలేగానీ.. రాజకీయ ఒత్తిడికి కాదు అని పేర్కొన్నారు. తమిళనాడులోని మధురై పర్వత ప్రాంతంపై ఆరో శతాబ్దానికి చెందిన తిరుప్పరన్కుండ్రం సుబ్రహ్మణ్య ఆలయం.. ఆ ప్రాంగణంలోనే 14వ శతాబ్దానికి చెందిన దర్గా ఉన్నాయి. ఈ క్రమంలో ఆలయం కింద ఉన్న స్తంభం వద్ద కార్తీక దీపోత్సవం నాడు భక్తులు దీపం వెలిగించడం వందల ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే.. డిసెంబర్ 1వ తేదీన ఈ అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ జడ్జి జస్టిస్ స్వామినాథన్.. కింద ఉన్న స్తంభంలో కాకుండా ఆలయం పైన ఉన్న స్తంభం వద్దే దీపం వెలిగించాలని తీర్పు ఇచ్చారు. పైన ఉన్న స్తంభం కూడా ఆలయ సొత్తేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ తీర్పుపై ప్రభుత్వం, అటు ఆలయ నిర్వాహకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో దర్గా ఉందని.. అక్కడి స్తంభం వద్ద దీపాలు వెలిగిస్తే అది మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీయొచ్చని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పు 2017లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని వాదించింది. అయినప్పటికీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఆ ఆదేశాలను ఆలయ నిర్వాహకులు పాటించలేదు. కొండ దిగువ భాగంలో ఉన్న స్తంభంపైనే దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. ఈ పరిణామంతో జస్టిస్ స్వామినాథన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం పైనా దీపాలు వెలిగించాల్సిందేనని.. లేకుంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని మరోమారు తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. దీంతో.. డిసెంబర్ 3వ తేదీన వందల మంది కేంద్ర బలగాల సాయంతో కొండపైన దీపాలు వెలిగించే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో.. అధికారులు ఆంక్షలు విధించారు. ఈలోపు తిరుపరన్‌కుండ్రం కార్తీక దీపం తీర్పు వల్ల రాజకీయ వివాదం చెలరేగింది. జస్టిస్ స్వామినాథన్ గతంలో బీజేపీ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారని.. అందుకే ఇలాంటి తీర్పు ఇచ్చారని విమర్శలు గుప్పించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ డిసెంబర్ 4వ తేదీన మద్రాస్ హైకోర్టును మరోసారి తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో ఆ మరుసటిరోజే సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేయగా.. అది ఇంకా విచారణకు రావాల్సి ఉంది. ఈలోపు.. జడ్జిపై అభిశంసనను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. జస్టిస్ స్వామినాథన్‌ను అభిశంసించాలంటూ 120 మంది ఎంపీలు చేసి సంతకాలను డీఎంకే నేత కనిమొళి నేతృత్వంలోని ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు కనిమొళి వెంట ఉన్నారు. అయితే ఈ చర్యను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇండియా కూటమి చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జడ్జిని తొలగించే ప్రయత్నం జరగలేదని.. ఓటు బ్యాంక్ కోసం దిగజారాయని ప్రతిపక్షాలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. మరో ఆరు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో మతపరమైన ఉద్రిక్తతలు ఏమాత్రం మంచిది కాదని డీఎంకే భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇది డీఎంకే హిందూ వ్యతిరేక విధానాలకు నిదర్శనమని మండిపడుతోంది. ఎవరీ స్వామినాథన్?జీఆర్ స్వామినాథన్ తమిళనాడు తంజావూర్ జిల్లా తిరువారుర్‌లో(1968లో) జన్మించారు. సేలం, చెన్నైలో న్యాయవిద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా దీర్ఘకాలం పనిచేసి, తర్వాత మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్‌కు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలందించారు. అటుపై 2017లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దేశంలో.. తన పనితీరును ప్రజలకు తెలియజేయడానికి రిపోర్ట్ కార్డు విడుదల చేసిన మొదటి జడ్జి కూడా ఈయనే. -
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే.. ఇక అంతే?
"వైద్యో నారాయణ హరి" అంటే ప్రాణం పోసే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అయితే వాస్తవం కూడా అదే ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రాణం పోయడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరోకటి ఉండదు. అయితే అంతటి ప్రాముఖ్యత కలిగిన డాక్టర్లకు ఇతర వైద్య సిబ్బందికి సరైన భద్రత కల్పించడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. అందుకే వైద్య సిబ్బంది భద్రతపై రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు.ఒక వ్యక్తికి ఆరోగ్యం విలువ తెలిసేది వారు అనారోగ్యం పాలయినప్పుడే అంటారు. ఎందుకంటే అన్నింటిని మించిన సంపద ఆరోగ్యమే అదే లేకుంటే ఎంత సంపద, అధికారం,పరివారం ఇలాంటివి ఎన్ని ఉన్నా అవి వృథానే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు వారి ప్రాణాలనే కాపాడే వైద్యులను సంఘంలో ఏంతో గౌరవంతో చూస్తారు. అయితే కొన్నికొన్ని సందర్భాలలో తమ వారికి ఏదైనా హాని కలిందనో, లేదా ఇతరాత్రా కారణాలతో వైద్యులతో పాటు ఇతరాత్ర సిబ్బందిపై కొంతమంది దాడులకు పాల్పడుతుంటారు. ఆస్పత్రుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటారు. ఆగ్రహంతో క్షణికావేశంలో వైద్యసిబ్బందిపై దాడి చేయడంతో డాక్టర్లు సైతం తమ విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కొన్ని సార్లు డాక్లర్లు సైతం తాము వైద్యం చేయమని ధర్నాలకు దిగుతున్నారు. వైద్యసిబ్బందిపై దాడి చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల ఎన్సీపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ ఫౌజియా ఖాన్ "సెంట్రల్ ప్రోటెక్షన్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ అండ్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ -2025" పేరుతో రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టారు. 1.వైద్యసిబ్బందిపై దాడులు 6నెలల నుంచి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ. 5లక్షల వరకూ జరిమానా 2.తీవ్ర దాడులకు పాల్పడితే 3 నుంచి 10 సంవత్సరాల జైలుశిక్ష రూ. 2 నుంచి 10 లక్షల జరిమానా. 3.ఆసుపత్రులపై దాడిని తీవ్రనేరాలుగా పరిగణించాలి.పై శిక్షలను చట్టంలో పేర్కొన్నారు. ఈ నేరాలను కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్‌గా పరిగణించాలని తెలిపారు.2025లో డాక్టర్లపై జరిగిన దాడి ఘటనలు.1ఇటీవల కోల్‌కతాలో ఒక యువ డాక్టర్‌పై హత్యాచారం చేసి చంపిన సంగతి తెలిసిందే.2.హౌరాలో మహిళ డాక్టర్‌పై రోగి బంధువులు తీవ్రంగా దాడి చేసి అత్యాచారం చేశారు.3. మహారాష్ట్ర సతారాలో యువవైద్యురాలిపై లైంగిక దాడి ఆరోపణలు చేయడంతో ఆమె ఆత్మహాత్య చేసుకుంది.4. ఢిల్లీ ఏయిమ్స్‌లో రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు.భారత్‌లో దాదాపు 75 శాతం మంది తమ విధి నిర్వహణలో ఏదో సందర్భంలో దాడికి గురయ్యారని సర్వేలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా అధికారికంగా రికార్టుల్లోకి ఎక్కకుండా మరెన్నో ఘటనలు జరుగుతున్నాయి.ET-హెల్త్‌కేర్ సర్వేఈ సంస్థ సెప్టెంబర్‌లో ఎస్ఎన్ మెడికల్ కాలేజ్ జోధ్‌పూర్‌లోని 658మంది డాక్టర్లపై అధ్యయనం చేసింది. ఇందులో 60 శాతానికి పైగా డాక్టర్లు ఏదో ఒక రకమైన హింస ఎదుర్కొంటున్నట్లు తేలింది. అంతేకాకుండా అందులో 3శాతంకు పైగా డాక్టర్లపై శారీరక దాడులు జరిగినట్లు సర్వేలో వెల్లడైంది. అయితే డాక్టర్లపై దాడుల నియంత్రించడానికి గతంలోనూ దేశవ్యాప్తంగా చట్టాలు తేవడానికి ప్రయత్నాలు జరిగాయి. కాని అవి అమలులోకి నోచుకోలేదు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక మైన ఒక చట్టం తేవాలని భావిస్త్నున్నారు.తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వైద్యులపై దాడికి ప్రత్యేక చట్టాలున్నాయి. అయితే వాటి అమలు విధానంలో లోపాలతో అవి సరైన కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే చట్టం రూపకల్పణ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. -
శశి థరూర్.. మళ్లీనా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం ఆ పార్టీకి చెందిన అగ్రనేత నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఎంపీల భేటీకి డుమ్మా కొట్టారు. అయితే.. ఆయన ఇలా గైర్హాజరు కావడం ఇది వరుసగా మూడోసారి. అదీ పార్లమెంట్ సమావేశాల వేళ కావడంతో ఆసక్తికర చర్చకు దారి తీసింది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం కోసం రాహుల్ గాంధీ అధ్యక్షతన శుక్రవారం కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. ఈ భేటీకి థరూర్ దూరంగా ఉన్నారు. థరూర్‌తో మరో సీనియర్ నేత, ఛండీగఢ్ ఎంపీ మనీశ్ తివారీ కూడా గైర్హాజరు అయ్యారు. అయితే..థరూర్ గత రాత్రి కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తాను అందుబాటులో ఉండటంలేదని థరూర్ ముందే సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ చీఫ్ విప్ మాత్రం థరూర్, తివారీల గైర్హాజరు గురించిన సమాచారం తనకు తెలియదని చెబుతుండడం గమనార్హం.శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్డీయే హయాంలోని విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన నేరుగా ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్‌పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈలోపు..నవంబర్ 30వ తేదీన జరిగిన మీటింగ్‌కు విమాన ప్రయాణంలో ఉన్నందున హాజరు కాలేకపోయానని థరూర్ మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరిగిన చర్చలోనూ ఆయన పాల్గొనలేదు. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా పాల్గొనలేకపోయానని అన్నారాయన. కానీ, ఆయన కార్యాలయం మాత్రం తన తల్లి(90) వెంట ఉండాల్సి రావడంతోనే హాజరు కాలేకపోయారని భిన్నమైన ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే.. థరూర్ వరుసగా ఇలా ఎగ్గొట్టడాన్ని కాంగ్రెస్ నేతలు తేలికగా తీసుకోవడం లేదు.పుతిన్ పర్యటన సమయంలో ప్రభుత్వం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందుకు హాజరు కావడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ సీనియర్లు. ఇలా పార్టీ మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అయితే థరూర్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.ఐదేళ్ల కిందటే మొదలై..2020లో కాంగ్రెస్‌లో జీ-23 గ్రూప్ పరిణామం తీవ్ర కలకలం రేపింది. పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ గ్రూప్‌లో థరూర్ కూడా ఉన్నారు. ఆ సమయంలో దీనిని సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) ఓ తిరుగుబాటులాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అధిష్టానం అండతో ఖర్గే గెలిచినా, థరూర్‌కు 1,000కి పైగా ఓట్లు రావడం కొసమెరుపు.2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్‌కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ చెబుతూ వస్తున్నారు. -
శివరాజ్ పాటిల్ ఇక లేరు
విలువలతో కూడిన రాజకీయాలు ఈ రోజుల్లో అత్యంత అరుదు. అందునా.. నైతిక బాధ్యత అనే పదం వినిపించడం లేదు. అయితే 26/11 (2008లో..) ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి పదవిని వదులుకున్నారు శివరాజ్ పాటిల్. అలాంటి నిబద్ధత కలిగిన దిగ్గజ నేత ఇక లేరు. కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటిల్(90) ఇక లేరు. అనారోగ్యంతో మహారాష్ట్ర లాతూర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా.. కేంద్ర మంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, గవర్నర్‌గానూ ఆయన సేవలందించారు. శివరాజ్ పాటిల్ 1935 అక్టోబర్ 12న లాతూర్‌లో జన్మించారు. 1966–1970 మధ్య లాతూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా వెళ్లారు. 1977–1979 మధ్య డిప్యూటీ స్పీకర్, స్పీకర్‌గా సేవలందించారు. 1980లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, లాతూర్ నియోజకవర్గం నుండి వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచారు. లోక్‌సభకు 10వ స్పీకర్‌గా(1991–1996) పనిచేశారు.2004లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. 26/11 (2008లో..) ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాస్త గ్యాప్‌తో 2010–2015లో పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. మొత్తంగా పార్లమెంటులో, ప్రభుత్వంలో నాలుగు దశాబ్దాలకుపైగా సేవలు అందించారు. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన్ని.. రాజకీయాల్లో శాంత స్వభావుడిగా, క్రమశిక్షణ.. నిబద్ధత కలిగిన నేతగా అభివర్ణిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన నిరంతర సేవలు అందించారు, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ పనిచేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడిన స్పీకర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శివరాజ్ పాటిల్ భార్య పేరు విజయా పాటిల్. కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన (బీజేపీ నాయకురాలు), ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. శివరాజ్ పాటిల్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.కోమటి రెడ్డి సంతాపంహైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ మరణం పట్ల తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1972లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ పాటిల్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలుపొందారనీ,ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు,మన్మోహన్ సింగ్ కేబినెట్లో రక్షణ (Defence), సైన్స్ & టెక్నాలజీ, మరియు హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారనీ గుర్తు చేశారు. 10వ లోక్‌సభ స్పీకర్‌గా, పంజాబ్ గవర్నర్‌గా కూడా ఆయన సేవలందించారన్నారు. సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెబుతూ.. వారి కుటుంబ సభ్యులకు,ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
పీల్చేగాలి.. ధనికులకే సొంతమా?
భారత్.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అలాంటి దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. శీతాకాలం మరింత విషాన్నికలిపి, గాలి నాణ్యతను మరింత దిగజార్చుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పీల్చే గాలి కూడా ధనికులకే సొంతమా? కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం ఊపిరి ఆడని పరిస్థితిని ఎదుర్కొంది. ముఖ్యంగా ఆస్పత్రిలో పడకలకోసం సామాన్యులు నానా ఇబ్బందులూ పడుతూ.. ఆక్సిజన్ లేక రోడ్లపైనే చనిపోతున్న సమయంలో.. ధనికులు ఆక్సిజన్ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో ప్రాణాలు నిలుపుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ వాసులు నాటి కోవిడ్-19 పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల స్థాయిలు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విశ్లేషణలో తేలింది. దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. వాయు కాలుష్య కారకాలను తగ్గించడం, కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పని వేళల తగ్గించడం,కార్యాలయాల్లో 50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని (ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు) కల్పించడం, అనవసర నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించడం, ఐదవ తరగతిలోపు ఉన్న అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల మూసివేయడం, రైల్వే, మెట్రో, విమానాశ్రయాలు, రక్షణ రంగాలకు సంబంధించిన నిర్మాణాలు మినహా ఇతర నిర్మాణాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కానీ అప్పటికే విషవాయువుల ప్రభావం అక్కడి ప్రజలపై ప్రతాపం చూపించింది. నగర ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్ల మంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితిని చాలా తీవ్రమైనదిగా అభివర్ణించింది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోవని వ్యాఖ్యానించింది.ఢిల్లీ నగరంలో గాలి విషపూరితమై, జీవనమే ప్రశ్నార్థకమవుతున్న ఈ సమయంలో ధనికులు తమ ఇళ్లను ‘క్లీన్ ఎయిర్ బబుల్స్’గా మార్చుకుంటున్నారు. ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలు, పదుల సంఖ్యలో ఎయిర్ ప్యూరిఫయర్లు, డీహ్యూమిడిఫయర్లు ఇలా లగ్జరీ సీల్డ్ హోమ్స్‌లో వారు తమకోసమే ఒక మైక్రో క్లైమేట్ సృష్టించుకున్నారు. బయట గాలి ఎంత విషపూరితమైనా.. ఇంటి లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని పీల్చేలా వాతావారణాన్ని కల్పించుకుంటుకున్నారు.క్లీన్ ఎయిర్ బుడగలుసంపన్న కుటుంబాలు తమ ఇళ్లలోకి ప్రవేశించే ముందు బయట గాలిని ఫిల్టర్ చేసే ప్రత్యేక వెంటిలేషన్, ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థలు ఇంటి లోపల శుభ్రమైన గాలిని ఉంచి, కలుషిత గాలి లోపలికి చొరబడకుండా అడ్డుకుంటాయి.ఎయిర్ ప్యూరిఫయర్లుకొన్ని అపార్ట్మెంట్లలో యజమానులు 10–12 ఎయిర్ ప్యూరిఫయర్లను ఉపయోగిస్తున్నారు. లోపలి గాలి శ్వాసించదగిన స్థాయిలో ఉండేందుకు ఫిల్టర్లను సంవత్సరంలో అనేకసార్లు మార్చుతున్నారు.డీహ్యూమిడిఫయర్లుఇళ్లను పూర్తిగా సీల్ చేయించుకున్న వారు తలుపులు, కిటికీలను మూసివేసి ఉంచుతారు. తేమ పెరగకుండా, గాలి కలుషితం కాకుండా ఉండేందుకు డీహ్యూమిడిఫయర్లను కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు.లగ్జరీ సీల్డ్ ఇళ్లుఢిల్లీలోని పలువురు ధనికులు బయట గాలి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విధంగా వారు నియంత్రిత మైక్రోక్లైమేట్‌లను సృష్టించి, బయట వాతావరణం కంటే లోపల గాలి నాణ్యతను చాలా మెరుగ్గా ఉంచుతున్నారు.కానీ ఈ సౌకర్యం పేదలకు మాత్రం అందని ద్రాక్షాల మారింది. ఖరీదైన పరికరాలు, నిర్వహణ ఖర్చులు.. మధ్యతరగతి,పేద కుటుంబాలకు దూరమైంది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోకపోవడంతో విషపూరిత గాలిని పీల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. అదే సమయంలో ధనికులు, పేదల మధ్య అంతరం మరింత పెరిగిపోతుంది. ధనికులు శుభ్రమైన గాలిని పీలుస్తుంటే.. సాధారణ ప్రజలు విష వాయుల్ని పీల్చి దినదినగండంగా కాలం వెళ్లదీయడం ప్రశ్నార్ధకంగా మారింది.ఢిల్లీలో గాలి సంక్షోభం ఇప్పుడు సామాజిక అసమానతకు ప్రతీకగా మారింది. ధనికులు తమ ఇళ్లలో బబుల్స్ సృష్టించుకుంటే, పేదలు విషవాయువులను పీల్చి జీవించాల్సి వస్తోంది. గాలి పీల్చడం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో కాకుండా..దీర్ఘకాలిక పరిష్కారాలు తీసుకురావాలి. లేకపోతే ఢిల్లీ గాలి సంక్షోభం, అసమానత సంక్షోభంగా మారిపోతుంది. -
జాతీయ గీతం, గేయానికి సమాన హోదా దక్కాలి
న్యూఢిల్లీ: జాతీయ గీతం వందేమాతరం జాతీయవాదానికి సంబంధించిన అంశమ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. జాతీయ గీతానికి జాతీయ గేయం జనగణమన, జాతీయ జెండాతో సమాన హోదా, గౌరవం దక్కా లని అన్నారు. ఈ మేరకు ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. నడ్డా గురువారం రాజ్యసభలో మాట్లాడా రు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత వందేమాతర గీతానికి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ గీతం దేశాన్ని ఐక్యం చేసిందని, అది చూసి బ్రిటిష్ పాలకులు వణికిపోయారని పేర్కొన్నారు. జాతీయ గేయం జనగణమ నను సైతం ఎంతగానో గౌరవిస్తున్నానని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చను నడ్డా ముగించారు. చరిత్ర గురించి ప్రజలకు వాస్తవాలు తెలియ జేయడమే ఈ చర్చ ఉద్దేశమని వివరించారు. జవహర్లాల్ నెహ్రూ పాలనలో జాతీయ గీతానికి తగిన గౌరవం దక్కలేదని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. చరిత్రను వక్రీకరించొద్దని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ సైతం స్పందించారు. జాతీయ గీతానికి, జాతీయ గేయానికి సమాన స్థాయి, హోదా ఉన్నాయని తేల్చిచెప్పారు. -
సామాన్యుడి మొహంలో చిరునవ్వే మేం కోరుకునేది
న్యూఢిల్లీ: రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి కుటుంబానికి రైల్వే శాఖ దాదాపు 23 ఏళ్లకు పరిహారం అందజేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, హైకోర్టు పరిహారం అవసరం లేదంటూ తీర్పు వెలువరించినా, సుప్రీంకోర్టు జోక్యంతో యంత్రాంగం కదిలింది. రైల్వే శాఖ, పోలీసులు కలిసి వృద్ధురాలై మృతుడి భార్య జాడ కనుక్కుని పరిహారంగా రూ.8.92 లక్షలను ఆమెకు అందజేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హర్షం వ్యక్తం చేశారు. తమకు కావాల్సింది ఇలాంటివేనన్నారు. ‘మేం కోరుకునేది ఒక్కటే. అదే నిరుపేద మొహంలో చిరునవ్వు. అంతకుమించి మాకేం వద్దు..’అంటూ ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి కూడా ఉన్నారు. 2002లో జరిగిన ఘటన ఇది.. విజయ్ సింగ్ అనే వ్యక్తి భక్తియార్‌పూర్‌లో రైలు టిక్కెట్ కొనుక్కుని భాగల్పూర్–దానాపూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో లక్నోకు బయలుదేరారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎలాగోలా లోపలికి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. కొద్దిదూరం వెళ్లాక పట్టుతప్పి, పట్టాలపై పడిపోయారు. అటుగా వచి్చన మరో రైలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పరిహారం కోసం విజయ్ సింగ్ భార్య దేవి రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విజయ్ సింగ్‌కు మతి స్థిమితం లేనందున, పరిహారానికి అర్హుడు కాదని ట్రిబ్యునల్ తోసిపుచి్చంది. అనంతరం ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడ నిరాశే ఎదురైంది. తీర్పును సవాల్ చేస్తూ వృద్ధురాలైన దేవీ సింగ్ తరఫున లాయర్ ఫౌజియా షకీల్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. 2023 ఫిబ్రవరి 2వ తేదీన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..రైల్వే ట్రిబ్యునల్, పట్నా హైకోర్టు ఇచి్చన తీర్పులను తప్పుబట్టింది. మతి స్థిమితం లేని వ్యక్తి తనంతానే రైలు టిక్కెట్ ఎలా కొంటారని, పట్నా వెళ్లేందుకు తనొక్కడే ఎలా రైలు ఎక్కుతారని ప్రశ్నించింది. విజయ్ సింగ్ మృతికి కారణమైనందుకు రూ.4 లక్షల పరిహారాన్ని పిటిషన్ వేసినప్పటి నుంచి 6 శాతం వడ్డీ చొప్పున ఆయన కుటుంబానికి రెండు నెలల్లోగా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, వృద్ధురాలైన దేవీ సింగ్ తనున్న చోటు నుంచి కుటుంబసభ్యులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో, పరిహారం అందుకోవాలంటూ రైల్వే శాఖ రాసిన లేఖలు ఆమెను చేరలేదు. ఆమె కోసం హిందీ, ఇంగ్లిష్ పత్రికల్లో ప్రకటనలు వేయించాలని, స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేవీ సింగ్‌కు పరిహారం అందేలా చూడాలంటూ నలంద ఎస్ఎస్పీ, భక్తియార్పూర్ ఎస్‌హెచ్‌వోలకు ప్రత్యేకంగా ఆదేశాలిచి్చంది. చివరికి ఎలాగోలా దేవీ సింగ్ జాడను యంత్రాంగం కనిపెట్టింది. -
ఆ ప్రైవేట్ వైద్యుల కుటుంబాలు పీఎంజీకేవైకి అర్హులే: సుప్రీం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద రూ.50 లక్షల బీమా పరిహారానికి అర్హమైనవేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పీఎంజీకేవై ప్యాకేజీకి ప్రైవేట్ వైద్యులు అర్హులు కారంటూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పును గురువారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం పక్కనబెట్టింది. చట్టాలు, నిబంధనల ప్రకారం వైద్యులకు ఉపయోగపడేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలించాలి. పైపెచ్చు, కోవిడ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వైద్యులకు, ఆరోగ్య నిపుణులకు యావత్తూ దేశం దన్నుగా ఉంటుందనే హామీ ఇవ్వడానికి ఉద్దేశించిన బీమా పథకమిది’అని ధర్మాసనం తెలిపింది. ‘పీఎంజీకేవై–ప్యాకేజీ కింద చేసిన బీమా కోసం వ్యక్తిగత క్లెయిమ్‌లు చట్టానికి లోబడి రుజువుల ప్రాతిపదికన పరిశీలించాలి. అనుగుణంగా పరిహారాన్ని నిర్ణయించాలి’అని పేర్కొంది. ‘కోవిడ్ సంబంధిత విధి నిర్వహణలోనే ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయినట్లు నిరూపించే బాధ్యత క్లెయిమ్ చేసిన కుటుంబీకులపై ఉంటుంది. నమ్మదగిన సాక్ష్యం ఆధారంగా దానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పనిచేస్తేనే తప్ప, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు పీఎంజీకేవై ప్యాకేజీ వర్తించదంటూ బాంబే హైకోర్టు 2021లో వెలువరించిన తీర్పును ప్రదీప్ అరోరా తదితరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అంతకుముందు, మహారాష్ట్రలోని థానెలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో వైద్యుడైన తన భర్త 2020లో కోవిడ్ సమయంలో చనిపోయారని, పీఎం జీకేవై ఆయనకు వర్తింప జేయాలంటూ కిరణ్ భాస్కరే సుర్గాడే వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన పనిచేసే ఆస్పత్రిని కోవిడ్–19 ఆస్పత్రిగా ప్రభుత్వం గుర్తించనందున బీమా వర్తింజేయలేమని బీమా కంపెనీ తెలిపింది. కోవిడ్ సేవల్లో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు కేంద్రం 2020 మార్చిలో పీఎంజీకేవైను ప్రకటించింది. -
ఇండిగోపై దూకుడు పెంచిన డీజీసీఏ
న్యూఢిల్లీ/ముంబై: వేలాదిగా విమాన సర్వీసు లను రద్దు చేసి, తీవ్ర సంక్షోభానికి తెరలేపిన ఇండిగోపై అధికారులు సమీక్ష పెంచారు. ఇండిగో ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అధికారులు ఆ సంస్థ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు టిక్కెట్ల రుసుమును వాపసు చేయడంపైనా సమీక్ష జరిపారు. అదేవిధంగా, ఈ శీతాకాల సీజన్లో ఇండిగో నడపాల్సిన 2,300 విమానాల్లో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఇలా ఉండగా, విమానాల రద్దుతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారాన్ని ట్రావెల్ వోచర్ల రూపంలో అందజేస్తామని ఇండిగో గురువారం ప్రకటించింది. వీటిని ఏడాదిలోగా వాడుకోవచ్చంది. అయితే, ఈ వెసులుబాటును ఎందరికి ఇస్తున్నదీ వివరించలేదు. అదేసమయంలో, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన 200కు పైగా విమాన సర్వీసులను గురువారం రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. తాము సుమారు 3 లక్షల ప్రయాణికుల కోసం 1,950 విమానాలను నడపగలమని పేర్కొంది. సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను డీజీసీఏ ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ గురువారం ప్రశ్నించింది. శుక్రవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో విమానాల రద్దుకు దారితీసిన వాస్తవ పరిస్థితులపై మరింత లోతుగా ఈ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఇండిగోలో పైలట్ల షెడ్యూల్ నిర్ణయం, రోస్టర్ విధానంలో లోపాలు, పైలట్ల కోసం కేంద్రం జారీ చేసిన నిబంధనల అమలుకు ఇండిగో చేపట్టిన సన్నద్ధతా చర్యల వంటి వాటిపై కమిటీ క్షుణ్నంగా పరిశీలన జరపనుంది. -
యాసిడ్ బాధితుల కోసం చట్టాన్ని సవరించాలి
న్యూఢిల్లీ: నేరగాళ్ల బలవంతంపై యాసిడ్ తాగిన బాధితులను ‘రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్’లో చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టాన్ని సవరించి, యాసిడ్ కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు సంక్షేమ పథకాలను ఉపయోగించుకునేలా చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం కోరింది. యాసిడ్ దాడి బాధితురాలు షహీన్ మాలిక్ వేసిన పిల్‌పై ఈ నెల 4వ తేదీన విచారణ జరిపిన ధర్మాసనం..ఢిల్లీలోని రోహిణి కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంపై విస్మయం వ్యక్తం చేయడంతోపాటు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలను తెలపాలంటూ ఆదేశాలివ్వడం తెల్సిందే. షహీన్ మాలిక్ కేసు విచారణ రోజువారీగా జరుగుతోందని, ముగింపునకు వచ్చిందని గురువారం విచారణ సందర్భంగా ధర్మాసనానికి రోహిణి కోర్టు సమాచారం అందజేసింది. అదే సమయంలో, యాసిడ్ దాడి కేసుల గురించి మాత్రమే తమకు ఇప్పటి వరకు తెలుసని, నేరగాళ్లు యాసిడ్ తాగించడంతో అంతర్గత వ్యవస్థలు దెబ్బతిన్న కేసులు కూడా ఉన్న విషయం ఇప్పుడే తెలిసిందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పిటిషనర్ కోరిన విధంగా, ఇటువంటి బాధితులకు న్యాయం చేసేందుకు, చట్టాన్ని అవసరమైన సవరణ చేపట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ఆయన అన్నారు. చట్టానికి తీసుకురావాల్సిన సవరణలపై ఒక నోట్ అందజేయాల్సిందిగా సీజేఐ ఈ సందర్భంగా పిటిషనర్‌ను కోరారు. అందులోని అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. దీంతోపాటు, బలవంతంగా యాసిడ్ తాగిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.3 లక్షలు మాత్రమే పరిహారంగా అందజేస్తున్నాయని పిటిషనర్ తెలపగా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) నుంచి కూడా పరిహారం అందించే విషయం పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఐదు యాసిడ్ దాడి కేసులపై వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వు జారీ చేసింది. -
ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పుతిన్ భారత్ పర్యటన తర్వాత ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై మోదీ, ట్రంప్ చర్చించారు. ఉమ్మడి, లాభదాయక అంశాలపై కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. వ్యాపారం, సాంకేతిక సహకారంపై కూడా చర్చించారు.కాగా, భారత్, పాక్ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయని కల్పించుకుని దాన్ని నివారించానంటూ తాజాగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. మంగళవారం(డిసెంబర్ 9) పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకోనో వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ పాలు గొప్పలకు పోయారు. ‘గత 10నెలల్లోనే నేను ఏకంగా 8 యుద్ధాలను ఆపాను. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు 70వ సారి కావడం విశేషం! కొసావో, సెర్బియా, ఇండో–పాక్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపి యా, ఆర్మేనియా, అజర్ బైజాన్‘ అంటూ ఏకంగా జాబితానే ఏకరువు పెట్టారు. ‘ఇప్పుడు కంబోడి యా, థాయ్ లాండ్ తలపడుతున్నాయి. రేపు ఆ దేశాధినేతలకు కాల్ చేయబోతున్నా. ఇలాంటి ప్రకటనలు నేనుగాక ఇంకెవరు చేయగలరు?‘ అంటూ గొప్పలకు పోయారు. సోమాలియా, అఫ్ఘానిస్థాన్ వంటి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వతం ఫుల్ స్టాప్ పెట్టానని చెప్పుకొచ్చారు. మరోవైపు, భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రధాని మోదీతో టెలిఫోన్లో సంభాషించిన సంగతి తెలిసిందే. నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఇరువురు అగ్రనేతలు త్వరలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. మోదీ, నెతన్యాహు మధ్య స్నేహపూర్వక, ఆత్మీయ సంభాషణ సాగినట్లు ఇజ్రాయెల్ పీఎంవో పేర్కొంది. -
భారత్‌లో నచ్చిన పార్టీకి ఓటేసే ఛాన్స్ వస్తే..
నచ్చిన అభ్యర్థికే ఓటేయడం అన్నది ఓటర్ల ఇష్టం. కానీ, నచ్చిన పార్టీకి కూడా ఓటేసే అవకాశం వస్తే.. దాని ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితుల ఏర్పడితే??. ఇందుకోసం ఒక ఓటరు.. రెండు ఓట్ల విధానం మన దేశంలోనూ అమలయ్యేలా చూడాలని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు. లోక్‌సభ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విప్లవాత్మక సంస్కరణను ప్రతిపాదన చేశారాయన. ఇంతకీ ఇలాంటి విధానం ఒకటి ఉందని.. అది ఏ దేశంలో అమల్లో ఉందని.. అది ఎలా పని చేస్తుందనే విషయం మీకు తెలుసా?..ఎమ్ఎమ్పీ (మిక్స్డ్ మెంబర్ ప్రపొర్షనల్) మోడల్.. జర్మనీ దేశం ఈ పద్దతిని ఫాలో అవుతోంది. దీని ప్రకారం.. అర్హత గల పౌరులకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటుతో అభ్యర్థులను నేరుగా ఎన్నుకుంటారు. గెలిచిన వారు నేరుగా పార్లమెంట్‌కి వెళ్తారు. మరో ఓటు మాత్రం పార్టీలకు వేయాల్సి ఉంటుంది!.దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో దాని ఆధారంగా మొత్తం పార్లమెంట్లో ఆ పార్టీకి ఉండాల్సిన సీట్లు(అదనపు) నిర్ణయిస్తారు. ఆ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి కూడా.!ఉదాహరణకు.. A, B, C అనే మూడు పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు.. తమ నియోజకవర్గంలో ఎవరు గెలవాలో నిర్ణయించడానికి ఓటేస్తారు.. రెండో ఓటు దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం సీట్ల రావాలో నిర్ణయించడానికన్నమాట. ఇందులో A అనే పార్టీ స్థానికంగా 180 సీట్ల నెగ్గింది. B అనే పార్టీ 90 సీట్లు గెలిచింది. C అనే పార్టీ 29 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే.. దేశవ్యాప్తంగా ఓట్ల శాతం అంటే పార్టీ ఏకి వచ్చిన ఓట్లు 40% ఓట్లు( రేషియో ప్రకారం.. 280 సీట్లు రావాల్సి ఉంటుంది), పార్టీ బీకి 35% ఓట్లు(రేషియో ప్రకారం.. 245 సీట్లు రావాల్సి ఉంటుంది). పార్టీ సీకి 25% ఓట్లు(175 సీట్లు రావాల్సి ఉంటుంది) పోలయ్యాయి. ఈ లెక్క ప్రకారం.. పార్టీ ఏకి అదనంగా 100 సీట్లు, పార్టీ బీకి అదనంగా 155 సీట్లు, పార్టీ సీకి అదనంగా 146 సీట్లు కేటాయిస్తారు.జర్మనీలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేది ఎక్కువ ఓట్లు పొందిన పార్టీ + ఎవరు కూటమి చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పార్టీ A (40%) ఒంటరిగా మెజారిటీ సాధించలేకపోతే, పార్టీ C (25%)తో కలిస్తే 65% మెజారిటీ వస్తుంది. అలాగే పార్టీ B (35%) + పార్టీ C (25%) కలిస్తే 60% మెజారిటీ వస్తుంది. ఇలా MMPలో స్థానిక గెలుపు + జాతీయ ఓట్ల శాతం రెండూ కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి.భారత్‌లో.. భారత్ పార్లమెంటరీ ఎన్నికల విధానాన్ని అవలంభిస్తోంది. దీనిని ఎఫ్‌పీటీపీ ( First Past The Post)గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో ప్రజలు నేరుగా అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఏ వ్యక్తికైతే అధికంగా ఓట్లు పోలవుతాయో వారినే విజేతగా నిర్ణయిస్తారు. ఎక్కువ సభ్యులు ఏ పార్టీ వాళ్లు ఉంటే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ గనుక సాధించకపోతే అప్పుడు కూటమికి వెళ్తుంది. అంతేగానీ.. పార్టీలకు ప్రత్యేకించి సీట్ల కేటాయింపు అనేది ఉండదు.మిక్స్డ్ విధానం వల్ల ఒరిగేదేంటి?..ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం పార్లమెంట్లో న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అంటే, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం సీట్లు కేటాయించబడతాయి, దీనివల్ల చిన్న పార్టీలకు కూడా అవకాశం కలగవచ్చు. అలాగే స్థానిక ప్రతినిధులు కూడా ఎలాగూ ఉండనే ఉంటారు. చట్ట సభలో స్థానికత ఫ్లస్ జాతీయ విధానం రెండూ ప్రతిబింబిస్తాయి.ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అరుదుగా జరగొచ్చు. కాబట్టి రెండు లేదంటే అంతకంటే ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. దీని వల్ల సహకారం, చర్చలు, సమతుల్య నిర్ణయాలు ఎక్కువగా జరుగుతాయి.ఓటర్లు తమ ప్రాంతానికి ఒక ప్రతినిధిని ఎంచుకోవచ్చు. అదే సమయంలో, తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసి దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సీట్లు పెంచవచ్చు. దీని వల్ల ఓటు వృథా అనే ప్రస్తావనే ఉండదు. ఎంఐఎం అధినేత ఒవైసీ ఈ ఎంఎంపీ మోడల్‌ను భారతదేశంలో అమలు చేయాలని ప్రతిపాదించడం వెనుక బలమైన కారణం ఉంది, భారత్‌లో ప్రస్తుతం అమలువుతున్న FPTP విధానం వల్ల చట్టసభలో చిన్న పార్టీలకు, మైనారిటీలకు, ప్రాంతీయ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రాతినిధ్యం కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎఫ్‌పీటీపీ వల్ల విధానంలో ఒక పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు రావొచ్చు. కానీ ఎంఎంపీలో అలాంటిది జరిగే అవకాశం ఉండదు. తద్వారా ప్రజాస్వామ్యం మరింత సమతుల్యంగా ఉంటుంది. -
ఏపీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి: వైవీ
ఢిల్లీ: ఓటర్ల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఈసీ వ్యవహరించొద్దని.. ఎన్నికల సంఘం పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి కస్టోడియన్‌లా ఉండాలన్నారు. ఏపీ ఎన్నికల అవకతవకలపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు అడ్డుతగిలారు.ఏపీ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని.. హడావుడిగా ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయని వైవీ అన్నారు. పని భారంతో బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌరులకు ఎస్ఐఆర్ పైన తగిన సమాచారం ఇవ్వలేదు. నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల కౌంటింగ్‌లో అనేక లోపాలు బయటపడ్డాయి’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.‘‘మైదుకూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను మించి ఓట్లు రికార్డు అయ్యాయి. ఫామ్ 20లో మాత్రం జీరో ఓట్స్ రికార్డ్ చేశారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో జరిగింది. మా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు 472 ఓట్లు వస్తే, అసెంబ్లీ ఎన్నికలకు 1 ఓటు మాత్రమే వచ్చింది. సాంకేతికతను ఉపయోగించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజ్‌ను కూడా ఇవ్వడం లేదు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ శాతం ఆకస్మాత్తుగా పెరగడం దేనికి సంకేతం’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. -
ఎస్.ఐ.ఆర్‌పై ఈసీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది.తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, అండమాన్ అండ్ నికోబార్, ఉత్తరప్రదేశ్,కేరళలో ఓటర్ల జాబితా సవరణ గడువు వారం రోజులకు పొడిగించింది. తమిళనాడు,గుజరాత్ (డిసెంబర్ 14), మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ అండమాన్ నికోబార్ దీవులు (డిసెంబర్ 18), ఉత్తర ప్రదేశ్ (డిసెంబర్ 26)కు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కాగా, గోవా, లక్షద్వీప్, రాజస్థాన్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ గడువు ఈరోజు ముగిసింది. -
పోలీసులు అదుపులో లూథ్రా బ్రదర్స్
గోవా అగ్నిప్రమాద ఘటనలో ప్రధాన నేరారోపణలు ఎదుర్కొంటున్న లుథ్రా బ్రదర్స్‌ను ఎట్టకేలకు థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకొని వారికి సంకెళ్లు వేశారు. ఈ రోజు ఊదయం భారత విదేశాంగ శాఖ సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరి పాస్ పోర్టులను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే వారి అరెస్టు జరిగింది.గత శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్‌క్లబ్‌లో అగ్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఈ క్లబ్ యజమానులైన లూథ్రా బ్రదర్స్ థాయిలాండ్ పరారయ్యారు. దీంతో ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన గోవా ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో నిందితులను వదలబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారి ఇద్దరిపై పోలీసులు లూకౌట్ జారీ చేశారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిద్దరిపై బ్లూకార్నర్ ఇష్యూ చేసింది. దీంతో థాయిలాండ్ పోలీసులు ఫుకెట్‌లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి బేడీలు వేశారు. కాగా వీరిద్దరిని పట్టుకోవడానికి ఇదివరకే గోవా పోలీసులు థాయిలాండ్‌కు బయిలు దేరినట్లు తెలుస్తోంది.అధికారిక ప్రక్రియ పూర్తయిన అనంతరం వారిద్దరిని గోవా పోలీసులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. భారత్- థాయిలాండ్ దేశాల మధ్య 2013లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ జరిగింది. దీనిప్రకారం ఒక దేశంలో నేరం చేసి మరో దేశంలో తలదాచుకుంటే ఆ నేరస్థులను సంబంధిత దేశానికి అప్పగించాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా ప్రస్తుతం థాయిలాండ్ లూథ్రా బ్రదర్స్‌ను భారత్‌కు అప్పగిస్తుంది. ఈ ఒప్పందం 2015 జున్ 9నుంచి అమలులోకి వచ్చింది. కాగా ఈ శనివారం అర్థరాత్రి గోవాలోని నైట్ రోమియో నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాగా క్లబ్లో సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో క్లబ్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇది వరకే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు భారీ షాక్ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. వారంపాటు ఆయన్ని విచారణ జరపొచ్చని సిట్‌కు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ప్రభాకర్‌రావు రేపు సరెండర్ కావాలి. అలాగే ఆయన్ని ఫిజికల్‌గా టార్చర్ చేయొద్దు. థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంటరాగేషన్ చేయండి. వారంపాటు కస్టోడియల్ విచారణ జరిపాక ఆ వివరాలను మాకు తెలియజేయండి’’ అని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంతకాలం సుప్రీం కోర్టు తాత్కాలిక రక్షణతో ప్రభాకర్‌రావు అరెస్ట్ నుంచి ఊరట పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి విచారణలో.. ‘‘డేటా ఎక్కడుంది?. 36 హార్డ్ డిస్క్ లను ఎలా ధ్వంసం చేస్తారు?. హార్డ్ డిస్క్ లలో డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వక ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా?. ఆ ఆదేశాల ప్రతులు చూపండి’’ అని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఆ ఆదేశాలు తమ వద్ద లేవని ఆయన కోర్టుకు తెలిపారు. అందుకే కస్టడీ కోరుతున్నారని జస్టిస్ మహదేవన్ అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు లొంగిపోవాలి. ఫిజికల్ టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయండి. మందులు, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు ఆయన్ని అనుమతి ఇవ్వండి అని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో.. విచారణ రోజునే కస్టడీ పొడగింపు కోరుతామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా అన్నారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని అభియోగాలున్నాయి. అంతేకాదు.. ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నమూ జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బంధువు, ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు అరెస్ట్‌తో ట్యాపింగ్ తేనెతుట్టె కదిలింది. ఈ కేసులో ఏ1గా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేర్చింది. ప్రణీత్‌రావు అరెస్ట్ అప్పటి నుంచి ప్రభాకర్‌రావు విదేశాల్లో ఉంటూ వచ్చారు. చివరకు.. సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో అరెస్ట్ నుంచి ఊరట పొందిన ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. అరెస్టు నుంచి ఊరట కావాలంటే దర్యాప్తునకు అన్నివిధాలా సహకరించాలని ప్రభాకర్‌రావుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా కూడా ఆయన ఐక్లౌడ్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వకుండా డేటాను డిలీట్ చేశారని.. దర్యాప్తులో ఏరకంగానూ సహకరించడం లేదని సిట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో.. తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్, తిరుపతి రావులు అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ తన కన్ఫెషన్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. కేసీఆర్‌కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన పీ రాజశేఖర్ రెడ్డిని ఇటీవలె SIT ప్రశ్నించింది కూడా. ఇప్పుడు ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తాయా? అనే ఆసక్తి నెలకొంది. -
అమిత్ షా, రాహుల్ మాటల యుద్ధం
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, అమిత్ షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఓట్ల చోరీపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ సవాలు విసిరారు. ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మంపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హరియాణాలో ఓట్ల చోరీ జరగలేదంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఓట్ల చోరీకి ఆధారాలున్నాయని చెప్పారు. అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు తాను నడుచుకోవాలా? అని నిలదీశారు. విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా భయపడుతున్నారని, ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. నా ప్రశ్నకు సమాధానమేది?ఓట్ల చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో తాము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఓట్ల చోరీ, ఈవీంఎల పనితీరు గురించి తాము ప్రశి్నస్తే అమిత్ షా ఒక్కమాట కూడా మట్లాడలేదని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటికే ఆధారాలు చూపించానని గుర్తుచేశారు. కానీ, అమిత్ షా దానిపై స్పందించలేదని రాహుల్ ఆక్షేపించారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నారని, దీనిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు. ‘సర్’ను గబ్బర్‌సింగ్‌లా మార్చారు ‘‘గౌరవప్రదమైన ‘సర్’ పదాన్ని గబ్బర్‌సింగ్‌లా భయంకరమైన అంశంగా మార్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్ సర్ అంటూ బీజేపీ ఎంతగా గొంతు చించుకున్నా బెంగాల్ ప్రజలు మాత్రం మేడమ్‌కు(మమతా బెనర్జీ) అండగా నిలుస్తారు. బీజేపీ నేతలు బెంగాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి తిరిగివెళ్లారు. బీజేపీ బిహార్‌లో గెలిచిందేమో గానీ బిహార్‌లో వారి ఆటలు సాగవు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎందుకు చేపట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ – శతాబ్ది రాయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బ్యాలెట్ పేపర్ల విధానం కావాలి ‘‘ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలి. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. చాలా ఏళ్లుగా బీజేపీకి సహకరిస్తోంది. ఎన్నికల సంఘానికి కలి్పంచిన కొన్ని చట్టపరమైన వెసులుబాట్లను తొలగించాలి. ప్రధాని ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించిన ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలి’’ – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఎస్ఐఆర్ అంటే బ్యాక్‌డోర్ ఎన్ఆర్సీ ‘‘పౌరుల జాతీయ రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి మరో రూపమే ఎస్ఐఆర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసుగులో దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమలు చేస్తున్నారు. మతం ఆధారంగా ఓటు హక్కును తొలగించడానికి ద్రోహపూరితమైన ప్రక్రియ జరుగుతోంది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఎస్ఐఆర్ చేపట్టడం పార్లమెంటరీ వ్యవస్థను ఉల్లంఘించడమే అవుతుంది. పౌరులకు పార్లమెంట్ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ఈ ప్రక్రియ విరుద్ధమే’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ప్రజల హృదయాలను మోదీ హ్యాక్ చేశారు ఎన్నికల్లో నెగ్గడానికి ఈవీఎంలను హ్యాక్ చేయాల్సిన అసవరం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశారు. వారి మనసులు గెల్చుకున్నారు. ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారు’’ – కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ మళ్లీ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ కావాలా? ‘‘ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానం మళ్లీ ప్రవేశపెడితే అప్పటి అరాచకాలు పునరావృతం అవుతాయి. బూత్ ఆక్రమణ, రిగ్గింగ్ మళ్లీ జరుగుతుంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ల వాడకాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు సమరి్థంచాయి. ఈవీఎంలకు అనుకూలంగా ఎన్నో తీర్పులిచ్చాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఈవీఎంలను అనుమానాలను ఇకనైనా మానుకోవాలి. ఈవీఎంలతో ఎన్నికలు వేగంగా, సురక్షితంగా జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలు ముసిగిన తర్వాత ఓట్ల చోరీ అంశంపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. నిజంగా ఓట్ల చోరీ జరిగిందని రుజువులుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎన్నికలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరగడానికి ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ఎన్నికల వరుస పరాజయాలను జీరి్ణంచుకోలేక ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మరో 15–20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడం తథ్యం’’ – రవి శంకర్ ప్రసాద్, బీజేపీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి -
చొరబాటుదారుల ఓట్ల కోసమే!
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ అమిత్ షా కొట్టిపారేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగితే.. తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో నెగ్గే అవకాశం పోతుందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటములకు ఆ పార్టీ నాయకత్వమే తప్ప ఈవీంఎలు లేదా ఓట్ల చోరీ కారణం కాదని తేల్చిచెప్పారు. దేశంలో ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో కొనసాగించడానికే ఎస్ఐఆర్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎంతగా వ్యతిరేకించినా, సభ నుంచి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా సరే చొరబాటుదారులను గుర్తించడం, వారి ఓట్లను తొలగించడం, వారిని బయటకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించినవారికి ఓటు హక్కు ఇవ్వాలనడం న్యా యమేనా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులను అధికారికంగా గుర్తించి, ఎన్నికల జాబితాలో చేర్చాలంటూ నిస్సిగ్గుగా వాదిస్తున్నాయంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది ‘‘దేశంలో మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఓట్ల చోరీకి పాల్పడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుతూ 28 మంది ఆయనకు మద్దతిచ్చారు. నెహ్రూకు కేవలం ఇద్దరే మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది. అయినా సరే ఆమె ప్రధానమంత్రి అయ్యారంటే కారణం ఓట్ల చోరీ. ఇక సోనియా గాంధీ ఈ దేశ పౌరురాలు కాకముందే ఎన్నికల్లో ఓటు వేశారు. అలా చేయడం ఓటు చోరీ కాదా? విపక్ష నాయకులు కేసుల్లో ఓడిపోతే న్యాయమూర్తిని నిందిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై నిందలేస్తున్నారు. ఆ నిందలను జనం పట్టించుకోకపోతే ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. బిహార్‌లో కాంగ్రెస్ పరాజయానికి ముమ్మాటికీ ఆ పార్టీ నాయకత్వమే కారణం. ఈవీఎంలు లేదా ఓట్ల చోరీ కారణం అనడం ఉత్తమాట. కాంగ్రెస్ పెద్దలు ఏదో ఒకరు ఆ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి మృతి చెందినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, 18 ఏళ్ల వయసున్నవారిని చేర్చడం, విదేశీయులను తొలగించడం ఎస్ఐఆర్ అసలు ఉద్దేశం. ఈ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నిజానికి మన దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఓట్ల చోరీ ఓట్ల చోరీ అంటూ కేకలు పెట్టారు. చొరబాటుదారులను కాపాడాలంటూ యాత్రలు చేశారు. చివరికి బిహార్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో మేమే గెలిచాం. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని, ఓటర్ల జాబితాను తప్పుపట్టడం, ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగితే ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీచేశాయి? దేశంలో ఇప్పటిదాకా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సందర్భాల కంటే ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ. అయినా సరే ఏనాడూ ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టలేదు. ఈవీఎంలతో ఎన్నికల చోరీని అడ్డుకోవచ్చు. తప్పుడు పనులు చేయడం సాధ్యం కాదు. అందుకే విపక్షాలు ఈవీఎంలు వద్దంటున్నాయి. వారి బండారం పూర్తిగా బయటపడింది. దేశ ప్రజలు ప్రతిపక్షాలకు ఓట్లు వేయడం లేదు. ఎస్ఐఆర్తో చొరబాటుదారుల ఓట్లు కూడా రద్దయితే ఇక పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. 2004, 2009లో ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా! 2014లో ఓడిపోయిన తర్వాతే ఈవీఎంలపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించకుండా మేము పారిపోవడం లేదు. ఎస్ఐఆర్ అంశం ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. అందుకే సభలో చర్చించలేం. ఎన్నికల సంస్కరణలపై చర్చించాలని కోరితే వెంటనే అంగీకరించాం. ఎస్ఐఆర్పై ఏకపక్షంగా అసత్య ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలి’’ అని అమిత్ షా తేల్చిచెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఐఆర్ ప్రారంభం ఎస్ఐఆర్ గురించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. చొరబాటుదారులు మన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను ఎన్నుకొనే పరిస్థితి ఉంటే దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉంటుందా? ఈ విషయం అందరూ ఆలోచించాలి. చరిత్ర గురించి మేము మాట్లాడడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. చరిత్ర తెలుసుకోకుండా సమాజం గానీ, దేశం గానీ ఎలా ముందుకెళ్తాయి. దేశంలో మొట్టమొదటి ఎస్ఐఆర్ను 1952లో నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. రెండోసారి 1957లో నెహ్రూ హయాంలో, మూడోసారి 1961లో నెహ్రూ హయాంలోనే ఎస్ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో, ఇందిరా గాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో, పీవీ నరసింహారావు హయాంలో కూడా ఎస్ఐఆర్ చేపట్టారు. అనంతరం అటల్ బిహారీ వాజ్‌పేయి పాలనలో, మన్మోహన్ సింగ్ పాలనలోనూ ఎస్ఐఆర్ జరిగింది. అప్పట్లో ఎస్ఐఆర్ను ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలంటే, ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎస్ఐఆర్ అవసరం కాబట్టి వ్యతిరేకించలేదు. -
ఈ ఏడాదే 1.40 లక్షల రేషన్‌కార్డుల రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 2025లో అక్టోబర్ నెల వరకు కేవలం పది నెలల కాలంలోనే ఏకంగా 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగా వెల్లడించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సహా ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020లో 12,154, 2022లో 4,988, 2023లో 34,064, 2024లో 3,424, 2025లో (అక్టోబర్ వరకు) 1,40,9473 రేషన్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమలులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. నకిలీ కార్డుల ఏరివేత, అనర్హుల గుర్తింపు, కుటుంబ సభ్యుల మరణాలు, శాశ్వత వలసలు వంటి కారణాలతోనే ఈ కార్డులను రద్దు చేసినట్టు రాష్ట్రాలు నివేదించాయని కేంద్రం తెలిపింది. కేవలం ఈ–కేవైసీ లేదా ఆధార్ ధ్రువీకరణ పూర్తి కాలేదన్న ఏకైక కారణంతో ఏ ఒక్క రేషన్‌కార్డునూ రద్దు చేయలేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. అంగన్వాడీల్లో ఖాళీల మోతతెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత గత మూడేళ్లలో రెట్టింపు అయ్యిందని రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఇచ్చిన సమాధానంలో తెలిపారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ‘పోషణ్ ట్రాకర్’గణాంకాల ప్రకారం తెలంగాణలో అక్టోబర్ 2022 నాటికి 1,344 ఖాళీలు, అక్టోబర్ 2023 నాటికి 1,317 ఖాళీలు, అక్టోబర్ 2024 నాటికి 2,056 ఖాళీలు, అక్టోబర్ 2025 నాటికి 2,757 ఖాళీలు ఉన్నాయి. 2023 అక్టోబర్ నాటికి 1,317గా ఉన్న ఖాళీలు, 2025 అక్టోబర్ నాటికి ఏకంగా 2,757కు చేరాయి. ‘మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0’పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, ఖాళీల భర్తీ విషయమై రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు.మైనారిటీల సంక్షేమంపై నాలుగేళ్లుగా ఒక్క ప్రతిపాదన కూడా రాలేదు తెలంగాణలో మైనారిటీ సంక్షేమ పథకాల అమలులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం’కింద 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు ప్రతిపాదన కూడా పంపలేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో స్పష్టం చేశారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మైనా రిటీ విద్యార్థులకు ఆసరాగా నిలిచే ప్రీ–మెట్రిక్, పోస్ట్– మెట్రిక్, మెరిట్–కమ్–మీన్స్ స్కాలర్‌షిప్‌ల అమలుకు 2021–22 తర్వాత అనుమతి ఇవ్వలేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఎన్ఎండీఎఫ్సీ ద్వారా కెనరా బ్యాంక్ సహకారంతో ఇస్తున్న రుణాల సంఖ్య దారుణంగా పడిపోయిందని.. 2022–23లో 669 మందికి రూ. 6.08 కోట్ల రుణాలు ఇవ్వగా.. 2024–25 నాటికి లబ్ధిదారుల సంఖ్య కేవలం 8 మందికి (రూ. 4 లక్షలు) పడిపోయిందన్నారు. పోలీసులకు కేంద్రం మొండిచేయినార్కోటిక్స్, సైబర్ బ్యూరోలకు నిధులు ఇవ్వలేంతెలంగాణలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను బలోపేతం చేసేందుకు నిధులు కావాలన్న రాష్ట్ర అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘పోలీసుల ఆధునీకరణ పథకం’కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ పరిమితికి మించి ఈ అభ్యర్థన ఉందని, అందుకే దీనిని పరిగణనలోకి తీసుకోలేమని మంత్రి స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వల్లే 17 రైల్వే పనుల్లో జాప్యం తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి భూసేకరణ జాప్యం వల్లే రైల్వే ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్రం తేల్చిచెప్పింది. తెలంగాణకు మొత్తం 63 ఆర్వోబీ పనులు మంజూరు కాగా, అందులో 17 పనులు రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే ఆలస్యమవుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ వంశీకష్ణ గడ్డం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇందులో 16 చోట్ల భూసేకరణ సమస్యలు ఉండగా, ఒకచోట అలైన్మెంట్ ఖరారు కావాల్సి ఉందన్నారు. భూసేకరణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటేనే పనులు వేగవంతం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. -
ఢిల్లీకి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్‌రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈసారి పర్యటనలో ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీని కలుస్తారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. గ్లోబల్ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ హాజరు కాని నేపథ్యంలో, సమ్మిట్ జరిగిన తీరు గురించి సీఎం ఆయనకు వివరిస్తారని సమాచారం. గురువారం పార్లమెంటుకు వెళ్లి వీలును బట్టి కొందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలుస్తోంది. సోనియా గాందీని కలిసి జన్మదిన శుభాకాంక్షలుతెలియజేస్తారని, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె. సి.వేణుగోపాల్‌తో సమావేశమై పార్టీ పరిస్థితులు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ లాంటి అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం. శరద్ పవార్ విందులో రేవంత్, రాహుల్ భేటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 12న శరద్ పవార్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ తోపాటు, మధుయాష్కీ గౌడ్ ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు..కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. -
సివిల్స్‌లో తగ్గుతున్న ఐఏఎస్‌ల వారసులు!
దేశంలో అత్యున్నత ప్రభుత్వ సర్వీసు అయిన సివిల్స్ పట్ల యువత మొగ్గుచూపుతోంది. ఏటా లక్షలాది మంది యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రమైన ఉద్యోగం, మంచి హోదా, సమాజంలో గౌరవం, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక భాగస్వామ్యం.. వంటి అంశాలు యువతను ఈవైపుకు నడిపిస్తున్నాయి. ఫలితంగా సివిల్స్ రాస్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నాణేనికి మరోవైపు చూస్తే.. సివిల్స్ వైపు వచ్చే ఐఏఎస్‌ల పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్న వాదన వినిపిస్తోంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 2018లో లోక్‌సభలో ప్రసంగిస్తూ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఐఏఎస్ అధికారుల వారసుల్లో చాలా మంది సివిల్ సర్వీసుల్లో చేరడానికి ఆసక్తి చూపడం లేదని, వారు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఐఏఎస్ అధికారులే తనతో స్వయంగా ఈ విషయం చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థుతులను బట్టి చూస్తే ట్రెండ్ అలాగే ఉన్నట్టు కనబడుతోంది. ఈ మార్పును ట్రాక్ చేసే అధికారిక డేటా ఏదీ లేనప్పటికీ.. సోషల్ మీడియాలో వివిధ రకాలుగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అంచనాకు రావొచ్చు.భిన్నమైన జీవనశైలిఐఏఎస్ సాధించడం అనేది ఆశావహులకు జీవితకాల స్వప్నం. సివిల్స్‌లో పాస్ కావడానికి సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తుంటారు. విజేతలను స్ఫూర్తిగా తీసుకుని తమ కలను సాకారం చేసుకునేందుకు శ్రమిస్తుంటారు. కానీ ఐఏఎస్ అధికారుల పిల్లలు దృక్పథం మరోలా ఉంటుంది. ఎందుకంటే తమ తల్లిదండ్రులు అప్పటికే ఐఏఎస్ అధికారులు (IAS Officials) కాబట్టి వారికి ఆ వాతావరణం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఐఏఎస్ అధికారులు ఎలా పనిచేస్తారనే దానిపై అవగాహన ఉంటుంది. దీంతో అలాంటి ఉద్యోగం తమకు సరిపడుతుందో, లేదోనన్నఅంచనాకు వచ్చేస్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. తమ తల్లిదండ్రుల కంటే భిన్నమైన జీవనశైలిని బ్యూరోక్రాట్ పిల్లల్లో ఎక్కువ మంది కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది. అమెరికాలో చదువుతున్న ఓ సీనియర్ ఐఏఎస్ కుమారుడు మాటలు వింటే కొంత వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ''మా నాన్న తెల్లవారుజామున 2 గంటలకు పనిచేయడం నేను చూశాను. నేను ఆయనను ఆరాధిస్తాను. కానీ దాని ప్రభావం కూడా నాకు తెలుసు. నా సమయం నాదే అనే కెరీర్ నాకు కావాల''ని అతడు అన్నాడు.కర్ణాటకలో ఓ సీనియర్ మహిళా ఐఏఎస్ కుమార్తె కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ''మా అమ్మ తరం వాళ్లు సమాజంపై ప్రభావం చూపించడానికి ఏకైక మార్గంగా ఐఏఎస్‌ను ఎంచుకున్నారు. టెక్నాలజీ రాజ్యమేలుతున్న మా తరంలో ప్రతిచోట ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అది వాతావరణ సాంకేతికతలో కావొచ్చు. AIలో కావొచ్చు. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కావొచ్చు. దీనికి యూపీఎస్సీ సివిల్స్ మాత్రమే ఏకైక మార్గం కాద''ని అన్నారు.అంతర్జాతీయ అవకాశాలుదీన్ని బట్టి చూస్తే తమ తల్లిదండ్రుల ఉద్యోగ జీవితం లాంటి లైఫ్‌స్టైల్ వారు కోరుకోవడం లేదని స్పష్టమవుతోంది. తరచుగా బదిలీలు, రాజకీయ ఒత్తిడి, సుదీర్ఘమైన పనివేళలు వంటి అంశాలు వీరిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్టు కనబడుతోంది. అందుకే వీరి వారసులు అంతర్జాతీయ అవకాశాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్, కన్సల్టింగ్, పబ్లిక్ పాలసీ, పరిశోధన, టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లా, డిజైన్, సృజనాత్మక రంగాలలో గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా సాగుతున్నారు. ఫలితంగా ఎక్కువ మంది ఐఏఎస్‌ల పిల్లలు అమెరికా, బ్రిటన్ దేశాల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లా స్థాయి ఎక్స్పోజర్ కంటే కార్పొరేట్ లేదా రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌లను ఇష్టపడుతున్నారు. దీంతో UPSC కోచింగ్‌లో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అటు తల్లిదండ్రులు కూడా ఈ మార్పును నిశ్శబ్దంగా అంగీకరిస్తున్నట్టు కనబడుతోంది.యువత ఆలోచనా ధోరణిలో మార్పుగత దశాబ్ద కాలంలో భారతదేశంలో స్టార్టప్ కల్చర్ (start-up culture) పెరగడం కూడా యువత ఆలోచనా ధోరణిలో మార్పు కనబడుతోంది. ఆలోచనలను అమలు చేసే స్వేచ్ఛ, సరళమైన పని సంస్కృతి, వేగవంతమైన కెరీర్ వృద్ధి, అధిక రాబడులు వంటి అంశాలు స్టార్టప్లపైపు యువతను ఆకర్షిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడటం, రాజకీయ నేతల కనుసన్నల్లో మెలగడం వంటి పద్ధతులను పాతవిగా పరిగణిస్తున్నారు. తమ సొంత ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే ప్రొఫెషనల్ స్పెస్లను వారు ఇష్టపడుతున్నారు. నేను కలిసిన విద్యార్థుల్లో సగం మంది తమ సొంతంగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. ప్రమోషన్ల కోసం 30 సంవత్సరాలు పనిచేయాలనే ఆలోచన వారికి నచ్చదని ఇంటర్న్‌లకు మార్గదర్శకత్వం వహించే ఒక యువ IAS అధికారి చెప్పారు.చదవండి: శభాష్.. గోలూ భాయ్!విజయానికి కొత్త నిర్వచనంయూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనేది దశాబ్దాలుగా భారతీయ కుటుంబాల్లో ఉత్కృష్ట విజయంగా పరిగణించబడింది. ప్రస్తుత సమాజంలో ఇలాంటి విజయాలకి నిర్వచనాలు మారుతున్నాయి. ఐఏఎస్ అధికారుల వారసులు సివిల్ సర్వీసులను తిరస్కరించడం లేదు, తమ ఆకాంక్షలను పునర్ నిర్వచిస్తున్నారు. వారి ఎంపికలు భారతీయ సమాజంలో విస్తృత మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వ పదవిలో ఉంటేనే సమాజంలో మార్పు సాధ్యమన్న భావనను నుంచి వారు బయటపడుతున్నారు. కొత్త తరం (New Generation) మితిమీరిన అదుపాజ్ఞల కంటే స్వేచ్ఛను.. భద్రత కంటే ఆవిష్కరణను.. సాంప్రదాయ ప్రతిష్ట కంటే వ్యక్తిగత ఏజెన్సీని ఎంచుకుంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి వ్యవస్థ యొక్క వారసత్వాన్ని పునర్ లిఖిస్తున్నారు. -
నెహ్రూ, ఇందిర, సోనియానే ఓట్ చోరీ చేశారు
సాక్షి, ఢిల్లీ: ఓట్ చోరీ వ్యవహారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభలో రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై చర్చకు రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. అయితే.. ఆ సవాల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చకు అమిత్ షా భయపడుతున్నారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల నకిలీ టోర్లు ఉన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో నా ఆరోపణలకు జవాబివ్వగలారా? చర్చకు సిద్ధమా? అని రాహుల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. నేను ఎప్పుడు మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎవరూ నిర్ణయించలేరు. వాళ్లకు(రాహుల్‌ను ఉద్దేశించి..) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరిట హైడ్రోజన్ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ, అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు. నెహ్రూ హయాంలోనే ఓట్ చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మెజారిటీ వచ్చినా.. నెహ్రూనే ప్రధాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. అలహాబాద్‌లో ఇందిరా గాంధీ ఓట్ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్ చోరీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ మేం ఈసీని తప్పుబట్టలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. సీఈసీని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్ఐఆర్ ప్రక్రియ తాము మొదలుపెట్టిందేం కాదని.. ఏనాటి నుంచో కొనసాగుతోందని.. అలాంటప్పుడు దీనిపై చర్చే అనవసరం అని అన్నారాయన. చివర్లో.. భారత్‌లోని విదేశీ ఓటర్లను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని షా వ్యాఖ్యానించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఇండిగో తరహా సంక్షోభమే!
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వేగంగా చేయాలని ప్రయత్నిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరుతున్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెడికల్ కోర్సులు చదవడం కష్టంగా మారుతుంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర ఇది. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. ఈనెల 17న ఈ కోటి సంతకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కు అందిస్తారు. అందుకే ప్రభుత్వం వేగంగా మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రైవేటీకరణను ఆపాలి.. .. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయంలో 17 కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులను లీజుకు ఇస్తున్నారు. వంద రూపాయలకు ఎకరం చొప్పున ఒక్కో సంస్థకు 50 ఎకరాలు అప్పజెప్తున్నారు. దొడ్డి దారిన వారి నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ విధానాల వల్ల ప్రభుత్వ కాలేజీలలో డాక్టర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని వినతి పత్రంలో ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో.. వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, రఘునాథ్ రెడ్డి , సుభాష్ చంద్రబోస్ , బాబురావు , అయోధ్య రామిరెడ్డి తదితరులు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామను కలిసి కుట్రను వివరించాం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆమెనే నిధులు కేటాయించారు. ఏపీలో ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు ఫండింగ్ వచ్చింది. మిగిలిన మెడికల్ కాలేజీలకు ఫండ్ ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని కోరాంప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల పేదల విద్యార్థులకు పేదలకు అన్యాయం జరుగుతుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పిన అమరావతికి ఇప్పుడు అప్పు ఎందుకు తెచ్చారు?. మెడికల్ కాలేజీల రూపంలో లక్ష కోట్ల రూపాయలు ఆస్తి వస్తున్నా.. తనకు కావలసిన మనుషులకు పంచడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు, పేదలకు నష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను విద్యార్థులు తమ టాపు ప్రయారిటీగా ఎంచుకుంటారు. వైద్య రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఇండిగో లాంటి సంక్షోభం తలెత్తుతుంది అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. -
టికెట్ రేట్లు పెంచుతుంటే చర్యలెందుకు తీసుకోలేదు?
సాక్షి, ఢిల్లీ: ఇండిగో సంక్షోభం వేళ.. విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచి ప్రయాణికులను దోచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను బుధవారం కోర్టు విచారణ జరిపింది.ఒకవైపు సంక్షోభం కొనసాగుతుంటే.. దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు అనుమతి ఎలా లభించింది?. టికెట్ ధరలు kp.35,000 నుంచి 39,000 వరకు ఎలా పెరిగాయి? ఇతర ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి అధిక ధరలు వసూలు చేయడం ఎలా సాధ్యమైంది? ఇది ఎలా జరుగుతుంది? అని జస్టిస్ గెడెలా కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే.. కేంద్రం చర్యలు తీసుకుందని అదనపు సాలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇండిగో సంక్షోభాన్ని (Indigo) పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే.. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనికి ఎవరు కారణం..? అని న్యాయస్థానం ప్రశ్నించింది. దాంతో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. ఆ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు.ఇండిగో వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయింది. పరిస్థితి ముందుగా అంచనా వేయలేకపోయారు. ఇటు ఇతర ఎయిర్‌లైన్సులు ధరలు పెంచుతున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు?.. ఎయిర్‌లైన్స్ అధిక ధరలు వసూలు చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారు? అని పౌరవిమానయాన శాఖను ఢిల్లీ హైకోర్టు సమగ్ర వివరణ కోరింది. "మీరు సంక్షోభం ఏర్పడిన తర్వాతే అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రశ్న అది కాదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు?" అని న్యాయస్థానం ప్రశ్నించింది. పైలట్లపై అధిక పనిభారం ఎందుకు ఉందో, దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కూడా కోర్టు కేంద్రాన్ని కోరింది. అదే సమయంలో.. ఇండిగో తగినంతమంది పైలట్లను నియమించుకోవాలని, ఎఫ్డీటీఎల్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది.‘ఇండిగో వందల సంఖ్యలో సర్వీసుల్ని రద్దు చేయడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఆ ఎఫెక్ట్‌తో ఇతర విమానయాన సంస్థల్లో టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ వ్యవహారంపై చాలా ఆలస్యంగా స్పందించిన కేంద్రం.. ఎయిర్‌లైన్స్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ మధ్యలోనే.. ఎయిర్‌లైన్స్‌లు అసాధారణంగా అధిక ధరలు వసూలు చేస్తున్నాయని, ప్రయాణికులకు సమయానికి సమాచారం ఇవ్వడం లేదని.. ఇది ప్రయాణికుల హక్కుల ఉల్లంఘన అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
వీర్ సావర్కర్ అవార్డా.. అదేంటో తెలియదు!
కాంగ్రెస్ ఎంపీ ఎంపీ శశిథరూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయనకు ప్రకటించిన వీర్ సావర్కర్ అవార్డును తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అసలు ఆ పురస్కారాన్ని ఎందుకు ప్రదానం చేస్తారో తనకు తెలియదని దాని గురించి ఎటువంటి సమాచారం లేదని మీడియాతో అన్నారు.వీర్ సావర్కర్ అవార్డు ప్రకటించడంపై ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ "మీడియా ప్రతినిధుల ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. నేను నిన్న కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు నన్ను ఈ విషయం అడిగారు. అప్పుడు ఈ అవార్డు నాకు ప్రకటించారని, ఢిల్లీలో ఈ రోజు దానిని అందుకోవాలని తెలిసింది. అవార్డు ఇచ్చే సంస్థ కనీసం నన్ను సంప్రదించకుండా నాకు అవార్డు ప్రకటించడం మంచి పద్దతి కాదు. ఇది చాలా నిర్లక్షమైన చర్య" అని శశి థరూర్ అన్నారు.అసలు ఆ అవార్డు యెుక్క ఉద్దేశం ఏమిటో? దానిని ఎందుకు ఇస్తారో తెలియకుండా.. పురస్కారం తీసుకునే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతోంది అర్ధం కావడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నలనుద్దేశించి శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. వీర్ సావర్కర్ ఇంపాక్ట్ అవార్డు-2025 ను హైరేంజ్ రూరల్ సొసైటీ అనే ఎన్జీవో సంస్థ అందిస్తుంది. ఈ పురస్కారాన్ని సమాజాన్నిప్రభావితం సాంస్కృతిక కృషి చేసిన వ్యక్తులకు అందిస్తారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు.కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్ తీరుపై ఆ పార్టీ అధిష్ఠానం కొంత అసహానంతో ఉంది. ఈ మధ్య కొన్ని సార్లు కేంద్రానికి మద్దతుగా శశిథరూర్ మాట్లాడారు. దీంతో ఆయన వ్యవహారంపై కాంగ్రెస్ కొంత కోపంగా ఉంది. -
గోవా నైట్ క్లబ్ ప్రమాదం... ఇద్దరిపై లుకౌట్ నోటీసులు
న్యూఢిల్లీ/పనజీ: 25 నిండు ప్రాణాలు బలిగొన్న గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం ఉదంతంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించి క్లబ్ యజమానులుగా భావిస్తున్న అజయ్ గుప్తా అనే భారతీయునితో పాటు సురేందర్ కుమార్ ఖోస్లా అనే బ్రిటిష్ జాతీయునిపై మంగళవారం లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రాథమిక యజమానులుగా చెబుతున్న సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే థాయ్ లాండ్ కు పారిపోవడం తెలిసిందే.వారిని తిరిగి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం వారిపై ఇంటర్ ఆయిల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసినట్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా ఐదుగురిని అరెస్టు చేసినట్టు డీఐజీ వర్షా శర్మా తెలిపారు. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి కట్టిన ఆ క్లబ్ మొత్తాన్నీ మంగళవారం నేలమట్టం చేశారు. -
కొన్ని గాల్లో.. ఇంకొన్ని నేలపై
న్యూఢిల్లీ/ముంబై: గత రెండు రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వరుసగా ఎనిమిదో రోజు సైతం విమానాల రద్దు పర్వం కొనసాగింది. మంగళవారం మరో 422 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే 152 విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 121, హైదరాబాద్‌లో 58, చెన్నైలో 50, ముంబైలో 41 విమానాలు రద్దయి హ్యాంగర్లకే పరిమితమయ్యాయి.సంక్షుభిత ఇండిగో మాత్రం తమ సర్వీసులు దాదాపు మళ్లీ సాధారణస్థాయికి చేరుకుంటున్నాయని ప్రకటించింది. ఈ మేరకు ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ మంగళవారం ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ఇండిగో మళ్లీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. గతంలో విమానాల రద్దు ఘటన విషయంలో మరోసారి ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నా. మా వెబ్సైట్లో కనిపించే దాదాపు ప్రతి విమానం షెడ్యూల్ సమయానికి రాకపోకలు సాగించేలా శతథా కృషిచేస్తున్నాం’’ అని ఆయన అన్నారు. ఇండిగో సర్వీసులపై కేంద్రం కోతతరచూ విమానాలు రద్దవడంతో ఇండిగో టికెట్లు కొన్న ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ఈ కంపెనీ టికెట్లు కొని అవస్థలు పడకుండా నివారించేందుకు దేశవ్యాప్త షెడ్యూల్లో సంస్థకు చెందిన 5 శాతం సర్వీసులపై మోదీ ప్రభుత్వం కోత విధించింది. ఆ మేరకు 5 శాతం షెడ్యూల్ స్లాట్‌ను ఇతర కంపెనీలకు కేటాయించింది. ముఖ్యంగా అత్యంత రద్దీ ఉండే, ప్రధాన రూట్లలో ఈ 5 శాతం షెడ్యూల్‌ను ఇతర కంపెనీలకు కేటాయించింది. దేశీయ పౌరవిమానయాన రంగంలో 65 శాతం వాటాను ఆక్రమించిన ఇండిగోపైనే పూర్తిగా ఆధారపడకుండా ఇతర కంపెనీలకూ అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో వాటికి 5 శాతం స్లాబ్‌ను కేటాయించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అనుమతించిన షెడ్యూల్లో విమానాలను నడపలేక విఫలమైన ఇండిగోకు ప్రభుత్వం ఇలా స్లాట్ కోత రూపంలో పాక్షికంగా శిక్షించింది. -
బెంగాల్ ఎన్నికల్లో లబ్ధికే వందేమాతరంపై చర్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సామాన్య ప్రజల సమస్యలపై చర్చించి, పరిష్కరించిన రోజున మాత్రమే భారత మాతకు నిజమైన నివాళి అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలో బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ వందేమాతరంపై చర్చను చేపట్టారని ఆయన విమర్శించారు. నిరుద్యోగం, దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ, రూపాయి విలువ పతనం తదితర దేశం ముందున్న ప్రధానమైన సమస్యలపై అందరి దృష్టినీ మళ్లించేందుకు కూడా ఈ చర్చను కేంద్రం నిర్వహిస్తోందని ఆరోపించారు.మంగళవారం ఆయన వందేమాతర గీతానికి 150 ఏళ్లవుతున్న సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొని, దాదాపు గంటపాటు మాట్లాడారు. వందే మాతర గీతాన్ని రెండు చరణాలకే పరిమితం చేశారంటూ నెహ్రూపై ప్రధాని మోదీ, అమిత్‌షాలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అంశంపై మహాత్మాగాంధీ, సుభాష్ చంద్ర బోస్, మదన్ మోహన్ మాలవీయ, ఆచార్య కృపలానీ, రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి మహామహులతో కలిసి ఆయన తీసుకున్న నిర్ణయమన్నారు. అప్పట్లో వందేమాతరం ఆలపించేందుకు ఇష్ట పడిన వారు సైతం నేడు వందేమాతరం అంటున్నారని, ఇదే జాతీయ గీతం గొప్పదనమని ఖర్గే చెప్పారు.‘దక్షిణాసియా దేశాలను బాహాటంగానే చైనా తన వైపు లాక్కుంటోంది. తన ఛాతీ 56 అంగుళాలని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ చైనాకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడారా?’అని ఖర్గే ప్రశ్నించారు. యూపీఏ హయాంలో 55 రూపాలయ వరకు ఉన్న డాలరు విలువ నేడు ఏకంగా ఆకాశమంత ఎత్తుకు పెరిగి రూ.90కి చేరుకుందన్నారు. వందేమాతరం గురించి మాట్లాడటమంటే, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ పరిణామాలను గురించి మాట్లాడుతున్నారంటూ అధికార పక్షాల సభ్యులు అభ్యంతరం తెలపగా అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ వారితో ఏకీభవించారు. -
వందేమాతరంను విభజించడం వల్లే దేశం ముక్కలు
న్యూఢిల్లీ: వందేమాతర గీతానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాంగ్రెస్ రక్తంలోనే ఉందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ వందేమాతర గీతాన్ని బుజ్జగింపు రాజకీయాల కోసం రెండుగా విడగొట్టడమే దేశ విభజనకు కారణమైందని, లేకుంటే దేశం ముక్కలై ఉండేది కాదని వ్యాఖ్యానించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభలో మంగళవారం చేపట్టిన చర్చను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. వందేమాతరం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ 1937లో జవహర్లాల్ నెహ్రూ ఈ గీతాన్ని రెండు ముక్కలుగా చేసి, కేవలం రెండు చరణాలకే పరిమితం చేశారన్నారు.బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఆయన అలా చేసినట్లు చాలా మంది భావించారని, వందేమాతరంను రెండుగా విభజించకుంటే దేశం ముక్కలయ్యేది కాదని కూడా అనుకున్నారని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ అలాంటి రాజకీయాలు చేస్తోందన్నారు. వందేమాతర గీతం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించిందన్నారు. జాతీయ గీతాన్ని త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలతో ప్రతిపక్షం ముడిపెట్టడాన్ని ఆయన నిరసించారు. దేశ సాంస్కృతిక జాతీయవాదాన్ని మేలుకొల్పిన మంత్రం వందేమాతరమని ఆయన చెప్పారు.స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆ గీతం ఎలాంటి ప్రముఖ పాత్ర పోషించిందో నేటికీ ఆ గీతానికి అంతే ప్రాముఖ్యత ఉందన్నారు. భవిష్యత్ వికసిత్ భారత్‌కు కూడా వందేమాతరం ఎంతో అవసరమైందని చెప్పారు. ఇతర అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే వందేమాతరంపై ప్రభుత్వం చర్చకు పెట్టిందని చాలా మంది కాంగ్రెస్ సభ్యులు అనుకుంటున్నారన్న ఆయన.. కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వం ఎన్నడూ భయపడలేదన్నారు. పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయకుండా, సరిగ్గా కార్యకలాపాలు జరగనిస్తే అన్ని అంశాలపైనా చర్చకు అవకాశమేర్పడుతుందని అమిత్ షా తెలిపారు. -
బ్యాలెట్ పేపర్‌కు మళ్లుదాం: లోక్‌సభలో విపక్షాలు
న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో ఈవీఎంల వినియోగానికి స్వస్తిపలికి మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని మంగళవారం ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో జరిగిన చర్చలో విపక్షాలు డిమాండ్‌చేశాయి. ఈ మేరకు పలు విపక్షపార్టీల ఎంపీలు మాట్లాడారు. ‘‘ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చాంతాడంత క్యూ లైన్లలో నిల్చునే ప్రతి ఒక్క ఓటరులో తమ ఓటు సద్వినియోగం అవుతోందన్న భరోసాను కల్పించాలి. ఈవీఎంలతో మోసగిస్తున్నారని నేను చెప్పడంలేదు. కానీ ఈవీఎంలను దుర్వినియోగం చేయొచ్చు అనేది మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను.ఈవీఎంలపై ఓటర్లలో గూడుకట్టుకుపోయిన అపోహలను తొలగించాలంటే రెండే మార్గాలున్నాయి. ఈవీఎం ఓట్లకు సరిసమానంగా వీవీప్యాట్ చిట్టీలను అన్నింటినీ లెక్కించాలి. లేదంటే ఈవీఎంలను పక్కనపడేసి మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్లాలి. పేపర్ బ్యాలెట్ విధానమే అత్యంత ఉత్తమం. ఎందుకంటే సాంకేతికంగా ఎంతో పురోగమించిన జపాన్, అమెరికా సైతం ఈవీఎంలాంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలను పక్కనబెట్టేసి పేపర్బ్యాలెట్కు జై కొట్టాయి. ఎంతకాదన్నా ఈవీఎంలు అనేది మెషీన్లు. ఎలాంటి మెషీన్లో అయినా మార్పులు చేయొచ్చు’’ అని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. ‘‘ పేపర్ బ్యాలెట్ పట్ల ఓటర్లలో ఎంతో విశ్వసనీయత, నమ్మకం ఉన్నాయి. బ్యాలెట్ విధానం మంచిది’’ అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘‘మీట అయితే ఓటరు నొక్కుతున్నాడుగానీ తన ఓటు ఎటు పోతుందనేది ఇప్పటికీ అతనికి ఇక చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈవీఎంలో ఇదే స్పష్టత కరువైంది. ఓటరు మదిలో సూక్ష్మస్థాయి అనుమానం ఉన్నాసరే దానిని నివృత్తిచేయాల్సిందే. అనుమానాలతో ఎన్నికల క్రతువును కొనసాగించడం నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు’’ అని శివసేన (యూబీటీ) నేత అనిల్ దేశాయ్ అన్నారు. సీపీఐ(ఎం) నేత ఆమ్రా రామ్, రాష్ట్రయ జనతాదళ్ ఎంపీ అభయ్ కుమార్ సిన్హా సైతం ఇదే వాదనకు తమ మద్దతు ప్రకటించారు. 2004 ఏడాది నుంచి ఐదు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించిన విషయం విదితమే. -
సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్లా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, అప్పుడే గెలిచిన వారికైనా, ఓడిన వారికైనా వ్యవస్థపై నమ్మకం ఉంటుందని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జరిగిన వింత పోకడలను ఎండగట్టారు. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశాలే ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్వైపు వెళుతుంటే.. మనం ఇంకా ఈవీఎంలను పట్టుకుని వేళ్లాడటంలో అర్థం లేదని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మిథున్‌రెడ్డి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3 కోట్ల 38 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 15 శాతం ఓట్లు.. అంటే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. రాష్ట్ర చరిత్రలో 2014లోగానీ, 2019లోగానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదు. ఒడిశాలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి’ అని ఆయన సభ దృష్టికి తెచ్చారు. చార్జింగ్ పెరగడం.. స్లిప్పులు తగులబెట్టడం..‘విజయనగరంలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ 99 శాతంగా ఉంది. కానీ పోలింగ్ రోజున అది 60 శాతమే ఉంది. వాడకం తర్వాత బ్యాటరీ చార్జింగ్ తగ్గాలి. కానీ, ఎలా పెరుగుతుంది? అని మా మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ నుంచి స్పందన లేదు. స్ట్రాంగ్‌రూమ్ సీసీటీవీ ఫుటేజీ అడిగితే ఇవ్వలేదు. కనీసం వీవీపాట్ స్లిప్పులు లెక్కించమని అడిగితే.. వాటిని తగులబెట్టేశాం, ధ్వంసం చేశాం అని సమాధానం ఇచ్చారు. అనుమానం ఉన్న ఈవీఎంలను కాకుండా వేరేవాటిపై మాక్ పోలింగ్ నిర్వహించారు’ అని మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పోలింగ్ బూత్‌లో మరీ విడ్డూరం ‘హిందూపురం నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్‌లో మరీ విడ్డూరం జరిగింది. ఒకేరోజు, ఒకే సమయాన జరిగిన ఎన్నికల్లో.. ఒక బూత్‌లో మా ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు వచ్చాయి. కానీ అదే బూత్‌లో మా ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. అక్కడ మాకు ఐదుగురు ఏజెంట్లున్నారు. వాళ్ల కుటుంబసభ్యుల ఓట్లే 30 వరకు ఉంటాయి. గత 30 ఏళ్లుగా మేము గెలుస్తున్న బూత్ అది. ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పడినచోట, ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక్క ఓటు పడటం ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది’ అని చెప్పారు. అమెరికానే బ్యాలెట్ వైపు వెళ్తోందిటెక్నాలజీలో ఎంతో ముందున్న ఎలాన్ మస్క్ వంటి వారే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్నారని, అమెరికాలో 92 శాతం ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీదే జరుగుతున్నాయని మిథున్‌రెడ్డి చెప్పారు. నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ ఈవీఎంలను రద్దుచేసి బ్యాలెట్ పేపర్‌కు మళ్లాయని తెలిపారు. ‘నేను మూడుసార్లు ఎంపీగా గెలిచింది ఈవీఎంల మీదనే అయినా, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్‌లో వెబ్‌కాస్టింగ్ ఉండాలని, ఆ ఫుటేజీని అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని మిథున్‌రెడ్డి సూచించారు.కేంద్రమంత్రి పెమ్మసానిపై మిథున్‌రెడ్డి సెటైర్లుఎస్ఐఆర్పై జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతుండగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అడ్డుపడ్డారు. దీంతో ‘ఉపాధిహామీ పథకం డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్రంలోని కూలీల పరిస్థితులపై నీకు సరైన అవగాహన లేదు. బ్యాలెట్ పేపర్ విషయంపై మాట్లాడుతుండగా ఈ విషయంలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు’ అంటూ మిథున్‌రెడ్డి ప్రతిఘటించారు. ‘లేదు వచ్చాయి, అయ్యాయి’ అంటూ పెమ్మసాని ఏదో చెప్పబోతుండగా.. ‘ఎలా వచ్చాయి? బస్సులో వచ్చాయా?’ అంటూ మిథున్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉపాధిహామీ నిధులపై మిథున్‌రెడ్డి ప్రస్తావించిన సమయంలో కూటమి ఎంపీలు ఎవరూ నోరు మెదపకపోవడం, పెమ్మసానికి సపోర్ట్‌గా మాట్లాడకపోవడం గమనార్హం. -
ఎస్ఐఆర్ పాతదే: మేఘ్వాల్
న్యూఢిల్లీ: ఎస్ఐఆర్ పేరిట మోదీ సర్కార్ మరోమారు పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి తెగిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసిన లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీకి ప్రభుత్వం తరఫున బీజేపీ నేతలు దీటైన జవాబులిచ్చారు. మంగళవారం లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చలో ప్రభుత్వం తరఫున న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్‌సింగ్ మేఘ్వాల్ మాట్లాడారు. ‘‘ వాస్తవానికి తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను ఓడించాలనే దుర్బుద్ధితో ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది.ఈవీఎంలు, ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు గుప్పిస్తోందిగానీ సహేతుక కారణాలను వెల్లడించలేక చతికిలపడింది. 1952 నుంచి 2002 ఏడాదిదాకా ఎస్ఐఆర్ను పలుమార్లు చేపట్టారు. ఇది కొత్తదేమీ కాదు. గత 2 దశాబ్దాలుగా ఎస్ఐ ఆర్ నిర్వహించట్లే రు. దీంతో వల సలు, మరణాలు, సవరణలు, పట్ట ణీకర కారణాలతో ఓటర్ల జాబితాలో మార్పులొచ్చాయి.వాస్తవాలు ప్రతిబింబించేలా పారదర్శకంగా ఎస్ఐఆర్ను తాజాగా చేపట్టాల్సిన సమయం వచ్చింది. అందుకే బిహార్‌లో పూర్తిచేశాం. మిగతా రాష్ట్రాల్లోనూ చేస్తాం. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన కమిటీ అనేది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకే నూతన చట్టం తెచ్చాం’’ అని మేఘ్వాల్ చెప్పారు.ఈవీఎంలు రాజీవ్ హయాంలోనే..ఈవీఎంలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై జార్ఖండ్ నేత, గోధా నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తప్పుబట్టారు. ‘‘ఈవీఎంలపై విపక్ష పార్టీలు యాగీచేస్తున్నాయి. వాస్తవానికి నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో 1987లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈవీఎంలను పరీక్షించారు. 1991లో కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఎన్నికల్లో ఉపయోగించారు. ఇప్పుడు విమర్శిస్తున్న ఇదే కాంగ్రెస్‌లోని ఆనాటి నేతలు ఈవీఎంలను వేనోళ్ల పొగిడారు. అత్యంత పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ పరికరం ఇదేనని ఆకాశానికి ఎత్తేశారు. రిగ్గింగ్‌ను నివారించేందుకు ఈవీఎంలే సరైన పరిష్కారమని 1961లో కమిటీ సైతం అభిప్రాయపడింది’’ అని దూబే.. రాహుల్‌కు దీటైన బదులిచ్చారు. -
అది అతిపెద్ద దేశద్రోహం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి మోదీ సర్కార్ ఓట్ల చోరీకి పాల్పడుతూ భారత్‌లోనే అతిపెద్ద దేశద్రోహానికి ఒడిగట్టిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంస్కరణలు అంశంపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా విపక్షాల తరఫున కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్షనేత హోదాలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈసీపై, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌పై విమర్శల జడి కురిపించారు. అతిపెద్ద నేరమేదంటే.. అది ఇదే‘‘అతిపెద్ద దేశద్రోహ నేరమంటూ ఉందంటే అది ఓట్ల చోరీనే. మీరు చేసిన ‘ఓట్ల చోరీ’ స్థాయి అతిపెద్ద నేరం దేశంలో ఇంతవరకు జరగలేదు. నిజమైన పౌరుల వాస్తవిక ఓటును హరించి దేశ ప్రజాస్వామ్య వస్త్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేస్తున్నారు. నవభారత్ను విధ్వంసం చేస్తున్నారు. భారత్ అనే భావనను కూలదోస్తున్నారు. లోక్‌సభలో అటు పక్క అధికార కుర్చీల్లో కూర్చున్న వాళ్లంతా కలిసి దేశ వ్యతిరేక దుశ్చర్యలు తెగిస్తున్నారు’’ అని అన్నారు.ఈవీఎం సంగతేంటి?‘‘ఈవీఎంతో మీరెన్నో గిమ్మిక్కులు చేస్తున్నారు. మాకూ ఈవీఎంను తనిఖీచేసే అవకాశం ఇవ్వండి. మా సాంకేతిక నిపుణులు సైతం ఈవీఎంల పనిపడతారు. అసలు ఈవీఎంలోపల ఏం పెట్టా్టరో తేలుస్తారు. ఇప్పటిదాకా మాకు ఈవీఎంలపై కనీస హక్కు లేదు’’ అని రాహుల్ అన్నారు. ఎలక్షన్ కమిషన్లనుద్దేశిస్తూ రాహుల్ పలు వ్యాఖ్యలుచేశారు. ‘‘వాళ్లకో విషయం చెబుతున్నా. ఇప్పుడున్న సవరణ చట్టాన్ని భవిష్యత్తులో మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ మారుస్తాం. అధికారంలో ఉన్నప్పుడు కమిషనర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వాళ్లనే బాధ్యులను చేస్తాం. కారకుల భరతం పడతాం’’ అని రాహుల్ పరోక్షంగా హెచ్చరించారు. మళ్లీ బ్రెజిల్ యువతి ప్రస్తావనహరియాణాలో బ్రెజిల్ యువతి పేరు ఓటర్ల జాబితాలో 22 సార్లు వచ్చిందన్న అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘బ్రెజిల్ యువతి మాత్రమేకాదు ఎంతో మందిపేర్లు ఇలా హరియాణా ఓటర్ల జాబితాలో పలుమార్లు పునరావృతమయ్యాయి. ఒక మహిళ పేరు ఏకంగా 200 సార్లు ఉంది. ఇవన్నీ చూశాక హరియాణా ఎన్నికలు చోరీ అయ్యాయనేది సుస్పష్టం. ఇది ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లోనే జరిగింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.‘‘బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే చేపట్టామని ఈసీ ఘనంగా చెప్పుకుంది. మరి అలాంటప్పుడు మళ్లీ 1.2 లక్షల డూప్లికేట్ ఫొటోలు ఎలా తుది జాబితాలో ప్రత్యక్షమయ్యాయి? ఈ ప్రశ్నకు ఈసీ దగ్గర సూటి సమాధానమే లేదు’’ అని రాహుల్ ఎద్దేవాచేశారు.మనది గొప్పదైన ప్రజాస్వామ్యంఅందరూ మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటారు. వాస్తవానికి మనది గొప్పదైన ప్రజాస్వామ్యం. అమెరికా తమది పురాతన ప్రజాస్వామ్యం అంటుంది. నిజానికి మనదే గొప్పది. అత్యధిక మంది ఓటర్లు, భిన్న ప్రాంతాలు, మతాలు, భాషలు, రాష్ట్రాల సమ్మేళనంగా భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రజలందర్నీ ఒక్కతాటి మీదకు తెస్తున్న ఇదే ప్రజాస్వామ్యభావనకే బీజేపీ తూట్లు పొడుస్తోంది. ధ్వంసం చేస్తున్నామని వాళ్లకూ తెలుసు. ఆనాడు గాంధీజీని ఆర్ఎస్ఎస్ వ్యక్తి నాథూరాం గాడ్సే మూడు బుల్లెట్లు ఛాతీలో దింపి మహాత్ముడి ప్రాణాలను బలితీసుకున్నాడు.బీజేపీ వాళ్లు నాటి చేదు నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. గాంధీజీ హత్యతో అక్కడితో ఆ ఘోర క్రతువు ఆగిపోలేదని నేడు ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఓటు చోరీతో సాధించిన అధికారంతో రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ ఆర్ఎస్ఎస్ గుప్పిటపట్టే దుస్సాహసానికి తెరతీసింది. నాడు గాంధీజీ హత్యోదంతం తొలి మెట్టు అయితే తర్వాతి మెట్టు ఇప్పటి రాజ్యాంగబద్ధ వ్యవస్థను కబళించడం’’ అని అన్నారు. ‘‘ ఓటు చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహం. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసంచేసేందుకు బీజేపీ, ఈసీ మూకుమ్మడిగా బయల్దేరాయి. ప్రజల గొంతుకను తొక్కిపెడుతున్నాయి’’ అని తర్వాత ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్ పెట్టారు.3 ప్రశ్నలకు సమాధానం చెప్తారా?చర్చ సందర్భంగా మోదీ సర్కార్‌పై రాహుల్ మూడు సూటి ప్రశ్నలను సంధించారు.1.‘‘ఎలక్షన్ కమిషన్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తప్పించారు?. సీజేఐను తొలగించడానికి వెనుక మతలబు ఏంటి? సీజేఐ అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాంటి సీజేఐకు ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియ నుంచి ప్రభుత్వం ఏ కారణంతో పక్కకు తప్పించింది?. ఆనాడు ఎలక్షన్ కమిషన్ల ఎంపిక సంబంధ భేటీకి నేనూ హాజరయ్యా. ఇటు పక్క నేను కూర్చున్నా. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసీనులయ్యారు. అక్కడ నా వాదనలకు వీసమెత్తయిన విలువ లేకుండా పోయింది. వీళ్లిద్దరు ఏం ఆలోచించారో అది మాత్రమే ఆచరణలోకి వచ్చింది. కేవలం ఫలానా వ్యక్తులు మాత్రమే ఎలక్షన్ కమిషనర్లుగా రావాలని ఎందుకు ప్రధాని, హోం మంత్రి అంతగా దృష్టిసారిస్తున్నారు?2.‘‘దేశ చరిత్రలో గతంలో ఏ ప్రధాని చేయనట్లుగా మోదీ 2023 డిసెంబర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్లకు నేర విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో ఎలక్షన్ కమిషనర్లు ఈసీలో విధుల్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు పక్షపాతంతో కూడినవి అని తేలినా సరే వాళ్లపై ఎలాంటి విచారణ మొదలుపెట్టలేని దురవస్థ ఏర్పడింది. వాళ్లపై కేసుల ఈగ వాలకుండా మోదీ రక్షణ కల్పించారు. కమిషనర్లకు ఇంతటి రక్షణను ప్రధాని, హోం మంత్రి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?3.‘‘ఎన్నికలు పూర్తయిన కేవలం 45 రోజులకే సంబంధిత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసంచేయాలంటూ మోదీ సర్కార్ చట్టాన్నే మార్చేసింది. అంత అవసరం ఏమొచ్చింది?. ఇది డేటాకు సంబంధించిన అంశమంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూసింది. ఇది డేటాకు సంబంధించిన అంశం కాదు. దీనికి ఎన్నికల చోరీతో సంబంధముంది. ఎన్నికలకు నెల రోజుల ముందే మెషీన్ చదవగలిగే ఓటర్ల జాబితాను రాజకీయపక్షాలకు అందివ్వాల్సిందే. సీసీటీవీ ఫుటేజీ తొలగింపు చట్టాన్ని సవరించాల్సిందే. అసలు సీసీటీవీ ఫుటేజీ డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? -
S.I.R. Row: ఎస్ఐఆర్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. వరుసగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ జరుగుతోంది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండోదశ ఎస్ఐఆర్ కొనసాగుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్లను వేర్వేరుగా విచారిస్తున్న సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని మంగళవారం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో భాగమైన బీఎల్ఓలు (బూత్ లెవెల్ అధికారులు), ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురుకావొచ్చని హెచ్చరించింది. బీఎల్ఓలకు బెదిరింపులు, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే.. వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ.. ఎస్ఐఆర్ జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే.. అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం (Election Commission) కోర్టుకు వెల్లడించింది. -
వ్యవస్థలను ఒక్కొక్కటిగా ఆర్ఎస్ఎస్ కబ్జా చేస్తోంది: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలపై కేంద్రం ఎన్నో గొప్పలు చెబుతుందని.. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తానేమి తప్పుగా.. నిరాధార ఆరోపణలు చేయడం లేదని, స్పష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతున్నానని అన్నారాయన. మంగళవారం ఎస్ఐఆర్పై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ అనేది ఎన్నికల వ్యవస్థతో పాటు సీబీఐ, ఈడీ సంస్థలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందన్నారు. సీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదని అడిగారు. కేంద్రం విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసిందని మెరిట్‌తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారని ప్రశ్నించారు.ఈసీలను రక్షించడానికి ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఏంటని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషనర్లకు ఇంత పెద్ద గిప్ట్ ఏ ప్రధాని, హోంమంత్రి ఇవ్వలేదన్నారు. 45 రోజుల్లో సీసీటీవీ పుటేజ్ ధ్వంసం చేసే నిబంధన ఎందుకని?.. ఇది డేటా సంరక్షణ కాదు డేటా చోరీ అని రాహుల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఓటు చోరి జరిగిందన్నారు. ఫేక్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని ప్రభుత్వం టార్టెట్ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో ఉంచడానికి ప్రయత్నిస్తుందని రాహుల్ అన్నారు. ఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉందని విమర్శించారు. ఎస్ఐఆర్ చర్చలో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పేరెత్తడంతో బీజేపీ సభ్యలు తీవ్ర అభ్యంతంరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు స్పందిస్తూ రాహుల్ పార్లమెంట్లో అనవసరంగా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ టాపిక్ తీస్తున్నారన్నారు. ఆ సమయంలో బీజేపీ-విపక్ష ఎంపీల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు.దీంతో లోక్ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా విపక్షాలను సున్నితంగా మందలించారు. -
పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి: లోక్‌సభలో మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)ను విపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నేడు ఈ అంశంపై చర్చ జరిగింది. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. ఈ చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలి. వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం.... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 6గం. తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాతే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. మేం ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉంది. ఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు. వీవీ ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారు. వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారు.... ఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదు. హిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే.. అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి’’ అని మిథున్‌రెడ్డి అన్నారు. -
జస్టిస్ స్వామినాథన్‌పై అభిశంసన నోటీసు
లోక్‌సభలో మంగళవారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలంటూ ఇండియా బ్లాక్ ఎంపీలు అభిశంసన (impeachment) నోటీసులు సమర్పించారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నోటీసుల అందజేసింది. మధురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ తాజాగా జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తీర్పు ఇచ్చారు. ఈ స్థలం సమీపంలో 14వ శతాబ్దపు దర్గా ఉండటంతో సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తుందనే అభ్యంతరాలు వెల్లవెత్తాయి. డీఎంకే.. దాని మిత్రపక్షాలు ఆయన తీర్పు పక్షపాతంగా ఉందని ఆరోపించాయి. గతంలో దీపం కొండ అడుగున ఉన్న స్తంభం వద్ద వెలిగించేవారు. కానీ, జస్టిస్ స్వామినాథన్ తీర్పు ప్రకారం దీపం కొండ మధ్యలో ఉన్న స్తంభం వద్ద వెలిగించాలి అని ఆదేశించారు. ఈ తీర్పు సెక్యులర్ విలువలకు విరుద్ధంగా ఉందంటూ మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో 120 ఎంపీల సంతకాలతో కూడిన అభిశంసన పిటిషన్ సమర్పించాయి. డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత.. ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆ సమయంలో కనిమొళి వెంట ఉన్నారు. VIDEO | Delhi: DMK leader Kanimozhi submits an Impeachment Notice to Lok Sabha Speaker Om Birla, seeking the removal of Madras High Court Judge G R Swaminathan, after obtaining signatures from more than 120 MPs.Congress MP Priyanka Gandhi Vadra, Samajwadi Party chief Akhilesh… pic.twitter.com/yzn9gq2lio— Press Trust of India (@PTI_News) December 9, 2025 భారతదేశంలో న్యాయమూర్తులపై అభిశంసన చాలా అరుదుగా జరుగుతుంది. అయితే తాజా పరిణామాలతో తమిళనాడులో రాజకీయ-న్యాయపరమైన ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో.. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది. ఆయన నోటీసును స్వీకరిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. నెక్ట్స్ ఏం జరగొచ్చు.. స్పీకర్ నోటీసును పరిశీలిస్తారు.. అవసరమైతే విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారులోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ 2/3 మెజారిటీతో తీర్మానం ఆమోదం కావాలిచివరగా రాష్ట్రపతి ఆమోదిస్తేనే న్యాయమూర్తి పదవి నుంచి తొలగింపబడతారుజస్టిస్ స్వామినాథన్ నేపథ్యం.. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తమిళనాడు తంజావూర్ జిల్లా తిరువారుర్‌లో(1968లో) జన్మించారు. సేలం, చెన్నైలో న్యాయవిద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా దీర్ఘకాలం పనిచేసి, తర్వాత మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్‌కు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలందించారు. అటుపై 2017లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తన పనితీరును ప్రజలకు తెలియజేయడానికి రిపోర్ట్ కార్డు విడుదల చేసిన మొదటి జడ్జి కూడా ఈయనే. గతంలో బీజేపీ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా తిరుపరంకుండ్రం కార్తీక దీపం తీర్పు వల్ల రాజకీయ వివాదం చెలరేగింది. -
ఎస్ఐఆర్పై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ
Parliament Session Updates.. లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెబుతోంది: రాహుల్ గాంధీక్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలుఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలనూ తన గప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోంది: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ఉందిరాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరంరాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజురాహుల్ గాంధీ అనవసరంగా పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ టాపిక్ లేవనెత్తుతున్నారు: కిరెణ్ రిజిజురాహుల్ వ్యాఖ్యలతో బీజేపీ-విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తతవిపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహంస్పీకర్ చెయిర్‌ను మీరు బెదిరించలేరు: స్పీకర్ ఓం బిర్లానేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు: రాహుల్ గాంధీనేను ఆరోపణలు చేయడం లేదు.. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నా: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట పెట్టుకుంది: రాహుల్ గాంధీసీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదు?: రాహుల్ గాంధీవిద్యావ్యవస్థను కూడా ఆర్ఎస్ఎస్ తన గుప్పిట పెట్టుకుంది : రాహుల్ గాంధీఇప్పటికే విద్యా వ్యవస్థను మార్చేశారు: రాహుల్ గాంధీమెరిట్తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారు: రాహుల్ గాంధీప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఈసీని అస్త్రంగా ఉపయోగించకుంటున్నారు: రాహుల్ గాంధీఎన్నికల సీసీ ఫుటేజీని ధ్వంసం చేశారు: రాహుల్ గాంధీఉత్తర ప్రదేశ్, హర్యానాలో ఓట్చోరీ జరిగింది: రాహుల్ గాంధీఫేక్ ఓట్లపై ఈసీ క్లారిటీ కూడా ఇవ్వలేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్ వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్ చేసింది: రాహుల్ గాంధీ లోక్‌సభలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చప్రసంగిస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ సర్ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్రెడ్డిఎస్ఐఆర్పై లోక్‌సభలో చర్చచర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయిఅనేక నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌పై ప్రజలకు అనేక డౌట్లు ఉన్నాయిఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని అనేకమంది టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతంఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సా.6 గంటల తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగిందిసాయంత్రం 6.. తర్వాత 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి మేము ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదువిజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉందిఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదువివి ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారువెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారుఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదుహిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే, అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చిందిఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారుఅభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం SIRపై లోక్‌సభలో ప్రత్యేక చర్చఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అమలుపై కాంగ్రెస్ అభ్యంతరంఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ చేస్తున్నారు: కాంగ్రెస్ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి: కాంగ్రెస్ఈసీల నియామక ప్రక్రియ చేపట్టిండి: మనీశ్ తివారీఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ.కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కామెంట్స్..బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి.అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి.ఎన్నికల సంస్కరణల్లో తొలుత జరగాల్సింది ఈసీల నియామక ప్రక్రియ.ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయండి.ప్రస్తుత ముగ్గురు సభ్యులతో పాటు రాజ్యసభలో విపక్ష నేత సీజేఐను చేర్చండి. Congress MP Manish Tewari speaks in Lok Sabha during debate on electoral reforms He says, "...The first reform that should happen is an amendment to the law governing the selection of members of the Election Commission. My suggestion is that LoP Lok Sabha and Chief Justice of… https://t.co/qt6rVkTu4d pic.twitter.com/ZZiLL1DzfN— ANI (@ANI) December 9, 2025ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలి: అఖిలేష్ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రసంగించిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్అఖిలేష్ కామెంట్స్..ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రతిపక్షాలకు అనేక అనుమానాలు ఉన్నాయి.బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలిSpeaking in Lok Sabha on electoral reforms, Samajwadi Party MP Akhilesh Yadav says, "Elections should be conducted using ballot papers because many questions are being raised on the use of electronic devices." pic.twitter.com/QCO063kGIN— ANI (@ANI) December 9, 2025ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్..రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.కొందరు బెంగాల్ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చిస్తున్నారని అంటున్నారు.బెంగాల్ ఎన్నికలకు చూపిస్తూ వందేమాతరాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు.కాలంతో సంబంధం లేకుండా ‘వందేమాతరం’ దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది.ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉంది.. భవిష్యత్తులోనూ ఉంటుంది. రామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తిఇండిగో విమానాల రద్దుపై లోక్‌సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనరామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తితమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ..చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.రాజీవ్ గాంధీ హయాంలో కీలక ఎన్నికల సంస్కరణ జరిగాయి.వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి చర్చ జరుగుతోంది. #WinterSession2025 लोकसभा में ''ELECTION REFORMS'' पर चर्चा शुरु I#LokSabha @LokSabhaSectt @loksabhaspeaker #ParliamentWinterSession2025 Watch Live : https://t.co/16ABiCqhz5 pic.twitter.com/hICFXNVRot— SansadTV (@sansad_tv) December 9, 2025 ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..ప్రజలను వేధించడానికి నిబంధనలు వాడకూడదువ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలుఇండిగో సంక్షోభంపై ప్రధాని మాట్లాడారని వెల్లడించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజుఎన్డీయే పక్ష సమావేశ వివరాలను వెల్లడించిన కిరణ్ రిజిజునేడు లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చవిపక్షాల తరఫున చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీఎస్ఐఆర్ పై చర్చ జరపాలని గత వర్షాకాల సమావేశాల నుంచి డిమాండ్ చేస్తున్న విపక్షాలుఎట్టకేలకు ఎన్నికల సంస్కరణలు అనే అంశం కింద ఎస్ఐఆర్ చర్చకు ఒప్పుకున్న ప్రభుత్వంఎస్ఐఆర్తో ఓటు చోరీ జరుగుతుందని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలుఎస్ఐఆర్తో బీఎల్వోలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పని భారం పెరుగుతుందని విపక్షాల ఆరోపణలుపెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ చేపట్టారని ఆరోపణలుప్రభుత్వం తరఫున జవాబు చెప్పనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్వైఎస్సార్సీపి తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ మిథున్ రెడ్డిరాజ్యసభలో వందేమాతరంపై చర్చనేడు రాజ్యసభలో వందేమాతరంపై చర్చవైఎస్సార్సీపీ తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.కొనసాగుతున్న ఎన్డీయే సమావేశం..కొనసాగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంసమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్షాలు ఎంపీలుఎస్ఐఆర్ పై చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం#WATCH | Delhi | NDA leaders felicitate PM Narendra Modi during the NDA Parliamentary Party meeting. pic.twitter.com/di7IGDBozP— ANI (@ANI) December 9, 2025 -
ఢిల్లీలో గోవా పోలీసుల తనిఖీలు
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదం సంభవించిన గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేట్’నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూథ్రా, సౌర భ లూథ్రాల న్యూఢిల్లీ నివాసానికి పోలీసు బృందం సోమవారం చేరుకుంది. హడ్సన్ లే న్లోని వారి ఇంట్లో తనిఖీలు చేయగా లూథ్రా సోదరులు కనిపించలేదు. వారి ఆచూకీని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. నైట్ క్లబ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే భరత్ కోహ్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గోవా పోలీసులు ఇప్పటివరకు క్లబ్ చీఫ్ జనరల్మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సింఘానియా, గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్లను అరెస్టు చేశారు. క్లబ్ మేనేజర్‌ను విచారిస్తుండగా భరత్ కోహ్లీ ప్రస్తావన రావడంతో.. ఆయనను అరెస్టు చేశారు. -
నేడు ఎస్ఐఆర్పై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే, ఎన్నికలపై సంస్కరణలపై మంగళవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ అంశంపై లోక్‌సభలో మొత్తంగా పది గంటల సమయం కేటాయించారు. కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్ష గైక్వాడ్, మొహమ్మద్ జావైద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇషా ఖాన్ చౌదరి, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్‌లు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం తరఫున కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బుధవారం చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ‘, ఎన్నికల కమిషన్ జవాబుదారీతనం అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది. ఓటర్ల జాబితాలో గణనీయమైన వ్యత్యాసాలు, ఎన్నికల విధానాలను తారుమారు చేయడం వంటి అంశాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించడం తెల్సిందే. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని, ఓటరు జాబితా సవరణ పేరిట పెద్ద ఎత్తున నిజమైన పౌరుల ఓట్లను తొలగించారని, నకిలీ ఓట్లను కలిపారని రాహుల్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఎస్ఐఆర్ కసరత్తు చాలా మంది బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) పాలిట శాపంగా తయారైందని, అందుకే తీవ్ర ఒత్తిడితో పలువురు చనిపోయారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు సభలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. -
బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి
న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం వందేమాతరంపై ప్రత్యేక చర్చ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వందేమాతర గీత రచయిత బంకించంద్ర చటర్జీ పేరును ప్రధాని నరేంద్ర మోదీ ‘బంకిం దా’అని అని పలికారు. దీనిపై బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి అంటూ సూచించారు. బంకించంద్ర చటర్జీ పేరు చివర గౌరవ సూచకంగా బాబు అనే మాట చేర్చాలని చెప్పారు. అందుకు మోదీ స్పందింస్తూ... ‘‘బంకిం బాబు అని చెబుతా. మీకు కృతజ్ఞతలు. మీ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నా’’అని బదులిచ్చారు. మిమ్నల్ని దాదా అని సంబోధించవచ్చా? అందుకు మీకేమైనా అభ్యంతరమా? అంటూ సౌగతా రాయ్‌ని సరదాగా ప్రశ్నించారు. దా అంటే బెంగాలీ భాషలో అన్న అని అర్థం. మరింత గౌరవంగా బాబు అని అంటుంటారు. బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పనిపడతాం వందేమాతరంపై చర్చను ప్రారంభించడానికి ప్రధాని మోదీ లోక్‌సభలోకి ప్రశిస్తుండగా, అప్పటికే సభలో ఉన్న బీజేపీ ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ‘బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పని పడతాం’అంటూ నినదించారు. అలాగే వందేమాతరం అంటూ మోదీకి అభివాదం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగబోతున్నాయి. -
బార్ కౌన్సిళ్లలో మహిళా లాయర్లకు 30% సీట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం సీట్లు కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఆయా కౌన్సిళ్లలో ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలుకాని రాష్ట్రాల్లోనే తమ నిర్ణయాన్ని వర్తింపజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగీ్చల ధర్మాసనం స్పష్టంచేసింది. ‘‘కౌన్సిళ్లకు ఎన్నికలు జరగని పక్షంలో ఆయా రాష్ట్రాల్లో మహిళలకు 20 శాతం సీట్లు కేటాయించాలి. పోటీ చేయడానికి సరిపడా మహిళా అభ్యర్థులు లేనిపక్షంలో మరో10 శాతం సీట్లను వీలైతే పురుషులకు కేటాయించుకోవచ్చు’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఇప్పటికే ఆరు బార్ కౌన్సిళ్లలో ఎన్నికల ప్రక్రియ మొదలెట్టేశామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఛైర్మన్‌పర్సన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిళ్లలో ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్ అమలుచేయాలని లాయర్లు యోగమయ ఎంజీ, షెహ్లా చౌదరిలు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఆఫీస్ బేరర్ పోస్టుల్లో కనీసం ఒక్కటైనా మహిళలకు కేటాయించాలని వాళ్లు ధర్మాసనాన్ని గతంలో కోరారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఒక ఆఫీస్‌బేరర్ పోస్ట్ రిజర్వ్‌చేస్తూ గత ఏడాది మే రెండో తేదీన సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. -
నెహ్రూ విశ్వాస ఘాతుకం
న్యూఢిల్లీ: మహోన్నతమైన వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని, ఈ గీతం విషయంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి నెహ్రూ లొంగిపోయారని, వందేమాతరం ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ గీతంలో ముఖ్యమైన చరణాలు తొలగించారని మండిపడ్డారు. వందేమాతరం 150 వార్షికోత్సవంపై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ గీతానికి అన్యాయం చేసిందెవరో భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ 1937లో వందేమాతరానికి వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం చేసిందని వెల్లడించారు. దు్రష్పచారాన్ని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్, నెహ్రూ అందుకు వత్తాసు పలికారని, గీతాన్ని ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. జిన్నా వ్యతిరేకించిన తర్వాత నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు నెహ్రూ లేఖ రాశారని, వందేమాతర గీతం ముస్లింలను రెచ్చగొట్టేలా, అసహనం కలిగించేలా ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నారని మోదీ గుర్తుచేశారు. 1937లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ గీతానికి నిజంగా అంత గొప్పదనం ఉందా? అంటూ సమీక్ష చేశారని తెలిపారు. అప్పట్లో కాంగ్రెస్ తీరు చూసి దేశంమొత్తం ది్రగ్బాంతికి గురైందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు జరిగాయని వెల్లడించారు. సామాజిక సామరస్యం ముసుగులో వందేమాతరాన్ని ముక్కలు చేయడం ద్వారా దేశాన్ని బుజ్జగింపు రాజకీయాల దిశగా నడిపించారని, చివరకు దేశం ముక్కలైందని ఆవేదన వ్యక్తంచేశారు. గాందీజీ కోరినా అన్యాయం చేశారు ‘‘బంకిం దా(బంకించంద్ర చటర్జీ) 1875లో వంతేమాతరం గీతం రాశారు. వెంటనే ఇది స్వాతంత్య్ర సమరయోధుల గళాల్లో నినాదంగా మారింది. దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త శక్తినిచి్చంది. ప్రజల సంకల్పానికి ఒక ప్రతీకగా మారింది. బ్రిటిష్ సామ్రాజ్యానికి బలమైన సవాలుగా నిలిచింది. వందేమాతరాన్ని నిషేధించడానికి బ్రిటిష్ పాలకులు ఎన్నో కుట్రలు చేశారు. ఈ గీతాన్ని ప్రచురించకుండా, ఆలపించకుండా చట్టాలు తీసుకొచ్చారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు సాగించినా బంకించంద్ర చటర్జీ వెనక్కి తగ్గలేదు. ఆత్మస్థైర్యంలో సవాలును ఎదుర్కొన్నారు. వందేమాతరం ఇచి్చన బలంతో కొనసాగుతున్న స్వాతంత్య్ర పోరాటం పట్ల బ్రిటిషర్లు ద్వేషం ప్రదర్శించారు. 1905లో బెంగాల్‌ను విభజించారు. అయినా సరే వందేమాతరం ఒక శిలలా స్థిరంగా నిలిచే ఉంది. గత శతాబ్దంలో వందేమాతరం చాలా ప్రాచుర్యం పొందింది. దీన్ని జాతీయ గీతం మార్చాలని కోరుతూ మహాత్మాగాంధీ 1905లో లేఖ రాశారు. అయినప్పటికీ గీతానికి అన్యాయం జరిగింది. గాంధీజీ అభిమతాన్ని కూడా లెక్కచేయని శక్తివంతులైన వ్యక్తులెవరో ప్రజలు తెలుసుకోవాలి. ఎలాంటి సవాలునైనా తిప్పికొట్టగలం దేశానికి సవాళ్లు ఎదురైనప్పుడల్లా వందేమాతరం ఇచ్చిన స్ఫూర్తితో దీటుగా ప్రతిస్పందిస్తున్నాం. చరిత్రలో కొన్ని ఘట్టాలను పక్కనపెడితే.. ప్రతికూల పరిస్థితుల్లో దేశం ఒక్కటవుతోంది. ఆహార భద్రత సంక్షోభం ఎదురైనప్పుడు మన రైతులు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు పండించి ప్రజల ఆకలి తీర్చారు. ఇందుకు వందేమాతరమే స్ఫూర్తి. ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ను కూడా ఈ స్ఫూర్తి ఓడించింది. యుద్ధాలు జరిగినప్పుడు మన సైనికులు శత్రువులను చిత్తు చేశారు. కోవిడ్–19 సంక్షోభాన్ని కలిసికట్టుగా అధిగమించాం. వందేమాతరం మనకు సమైక్యత, బలం, సామర్థ్యాన్ని అందిస్తోంది. ఎలాంటి సవాలునైనా మనం తిప్పికొట్టగలం. వందేమాతరం అంటే కేవలం ఒక గీతం కాదు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు బలమైన స్ఫూర్తి. ‘స్వదేశీ’ నినాదానికి మరింత బలం చేకూర్చాలి. వందేమాతరమే మన మంత్రం. వందేమాతరం నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇది విలువల ప్రవాహం. వేదాల్లోని సత్యాన్ని చాటిచెబుతోంది. భూమే మన తల్లి, మనం ఈ భూమి బిడ్డలం అని తెలియజేస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడ్డుతగలడానికి పలుమార్లు ప్రయతి్నంచారు. నినాదాలు చేశారు. మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను తృణమూల్ కాంగ్రెస్ ఔట్‌సోర్సింగ్‌కు తీసుకున్నట్లుగా కనిపిస్తోందని చురక అంటించారు. ఆనాటి వైభవాన్ని పునరుద్ధరించాలి ‘‘పవిత్రమైన వందేమాతరం మనకు గర్వకారణం. 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చరిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలుస్తున్నందుకు మనమంతా గరి్వంచాలి. వందేమాతరం దశాబ్దాలుగా మనకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంది. గీతానికి 50 ఏళ్లు పూర్తయిన సమయంలో మన దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. 100 ఏళ్లు పూర్తయినప్పుడు దేశం ఎమర్జెన్సీ పడగ నీడలో ఉంది. అప్పట్లోదేశభక్తులను జైల్లో పెట్టారు. రాజ్యాంగం గొంతు కోశారు. దురదృష్టవశాత్తూ ఎమర్జెన్సీ సమయంలో చీకటి కాలం నడిచింది. గీతానికి ఇప్పుడు 150 ఏళ్లు పూర్తయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన వందేమాతరం వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇదొక గొప్ప అవకాశం’’ అని మోదీ అన్నారు. భారతీయ విశ్వాసాలకు ప్రతీక ‘‘వందేమాతరం భారతీయ విశ్వాసాలు, విలువలకు ప్రతీక. ఈ గీతం దేశ సామరస్యం, బలాన్ని, సంస్కృతిని, మాతృత్వాన్ని సూచిస్తుంది. నేటికీ ప్రతి భారతీయుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో లక్షల మందిని ముందుకు నడిపించింది. పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి కలి్పంచాలన్న స్ఫూర్తిని రగిలించింది. దేశ సంకల్పానికి గుర్తుగా నిలిచింది.’’ – ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్ వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం కాదు ‘‘వందేమాతరం గీతం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం జరిగింది. అప్పట్లో బెంగాల్ నవాబ్, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలనే ఇందులో ప్రస్తావించారు. కరువు కాలంలో పన్నుల పేరిట ప్రజలను పీడించిన పాలకుల గురించి ఆనంద్‌మఠ్ గ్రంథంలో రాశారు. ఆ గ్రంథంలోనే వందేమాతరం తొలుత ప్రచురితమైంది. దాంతో ఈ గీతం ముస్లింలకు వ్యతిరేకమనే వాదన మొదలుపెట్టారు. వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం అన్న వాదనలు ఏమాత్రం వాస్తవం లేదు. నిజాలు బహిర్గతం చేయడానికి ఇదే సరైన సమయం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వందేమాతరం స్థాయిని తగ్గించే ప్రయత్నం జరిగింది. తొలగించిన చరణాలు భారతీయతను వివరిస్తాయి. పూర్తి గీతం గురించి అందరూ తెలుసుకోవాలి’’ – రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి బీజేపీ నేతలకు వందేమాతరం అర్థం తెలుసా? ‘‘ఒకరి విశ్వాసాలను మరొకరిపై రుద్దడానికి వందేమాతరం గీతాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూడడం సరైంది కాదు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడూ పాల్గొనని బీజేపీ నాయకులు ఇప్పుడు వందేమాతరం విలువల గురించి మాట్లాడుతున్నారు. వందేమాతరం స్ఫూర్తిని యథాతథంగా అలవర్చుకోవాలి. సొంతం ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడం దారుణం. జాతీయ గీతాన్ని వారే సృష్టించినట్లు అధికార పార్టీ నాయకులు డ్రామాలాడుతున్నారు. ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. జాతీయ గీతం రాజకీయ ఆయుధం కాకూడదు. బీజేపీ నాయకులకు వందేమాతరం అర్థం తెలుసా? విభజన శక్తులు ప్రజల్లో చిచ్చు పెట్టడానికి వందేమాతరం గీతాన్ని వాడుకుంటున్నాయి’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ హిందువులకే సొంతమన్నట్లు చిత్రీకరించారు వందేమాతరం గీతం హిందువులకే సొంతం అన్నట్లుగా 20వ శతాబ్దం మొదట్లో చిత్రీకరించారు. దీంతో ముస్లింలకు సంబంధం లేదన్నట్లుగా అసంబద్ధమైన వాదన తీసుకొచ్చారు. వందేమాతరం హిందువులదే అని చెప్పిన వ్యక్తులే అసలు వివాదానికి కారకులు. హిందువులకు ఈ గొడవతో సంబంధం లేదు. వందేమాతరాన్ని ముక్కలు చేయడం వల్లే దేశం ముక్కలైందని ప్రధాని మోదీ ఆరోపించడం గర్హనీయం. వందేమాతరం స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలి’’ – ఎ.రాజా, డీఎంకే ఎంపీ బెంగాల్ ఎన్నికల కోసమే బీజేపీ ఆరాటం వచ్చే ఏడాది జరిగే పశి్చమ బెంగాల్ ఎన్నికల్లో విజయంపై బీజేపీ దృష్టిపెట్టింది. రాజకీయ లబ్ధి కోసం వందేమాతరాన్ని వాడుకుంటోంది. వందేమాతరం ఆత్మను బీజేపీ హత్య చేస్తోంది. 1937 నాటి కాంగ్రెస్ తీర్మానం కంటే ఇప్పు డే ఎక్కువ అన్యాయం జరుగుతోంది. సరిగ్గా బెంగాల్ ఎన్నికల ముందే వందేమాతరంపై పార్లమెంట్లో చర్చ చేపట్టారంటే బీజేపీ అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జాతీయ గీతాన్ని బీజేపీ నాయకులు సరిగ్గా ఆలపించగలరా? స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేదని వ్యక్తులు నేడు వందేమాతరానికి సంరక్షకులమని చెప్పుకుంటున్నారు. బీజేపీ పాలనలో వందేమాతరం స్ఫూర్తి ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ నిర్వాకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వందేమాతరంపై చర్చ సాగిస్తున్నారు’’. – మహువా మొయిత్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ -
‘విమాన’ సంక్షోభంపై మంత్రి రామ్మోహన్‌ను నిలదీసిన ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడును ఎంపీలు నిలదీశారు. సంక్షోభం జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టికెట్ల ధరలు రూ.50 వేలు, రూ.60 వేలు, రూ.75 వేలు, రూ.1 లక్ష ఏమిటని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు మంత్రి రామ్మోహన్నాయుడు చెప్పిన సమాధానాలపై ఆ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభ నుంచి ఇండియా కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు.మరోపక్క జాతీయ మీడియాతో పాటు, అన్ని రాష్ట్రాల మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో జరిగే డిబేట్స్‌లో పాల్గొంటున్న వక్తలు, నెటిజన్లు కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో పౌరవిమానయానశాఖపై పలువురు ఎంపీలు ప్రశ్నలు సంధించారు. వీరిలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే వారున్నారు. ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఏఎంఎస్ఎస్), ఎఫ్డీటీఎల్ నిబంధనలు, ఇండిగో సంక్షోభం, టికెట్ల ధరలు, క్యాన్సిలేషన్ రీఫండ్ తదితర సమస్యలపై ఎంపీలు ప్రశ్నలు వేశారు. వీటికి కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మౌఖిక సమాధానమిచ్చారు. ‘ఎఫ్డీటీఎల్ నిబంధనలను రూపొందించేముందు మేం అందరితో చర్చించాం. నవంబర్ 1 నుంచి రెండోదశ నిబంధనలు అమల్లోకి తెచ్చాం.అవి అమల్లోకి వచ్చాక నెలవరకు సర్విసులు సజావుగా సాగాయి. డిసెంబర్ 3 నుంచే ఈ సమస్య తలెత్తింది. ఇండిగో అంతర్గత సమస్యల వలనే ఈ సంక్షోభం ఏర్పడింది’ అని చెప్పారు. ఈ సమాధానాలపై ఎంపీలు రాంజీలాల్ సుమన్, ప్రమోద్ తివారీ, డాక్టర్ తంబిదొరై తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. . సంక్షోభం రాబోతోందని తెలిసి కూడా ముందే ఎందుకు అడ్డుకోలేకపోయారని నిలదీశారు. పైలెట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసులు రద్దయ్యాయని, తాము ప్రయాణికులకు భరోసా కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. మీరు ధరలను నియంత్రిస్తే నేను రూ.75 వేలు ఖర్చుచేసి టికెట్ ఎందుకు కొంటానంటూ అన్నాడీఎంకే ఎంపీ డాక్టర్ తంబిదొరై మంత్రిని ప్రశ్నించారు.ఇప్పటి వరకు 5,86,705 టికెట్లు క్యాన్సిల్ అయ్యాయని, వీటికి దాదాపు రూ.569 కోట్లు రీఫండ్ చేశారని మంత్రి సమాధానమిచ్చారు. తాము ఒకటి అడిగితే మంత్రి మరొకటి చెబుతున్నారంటూ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా విమాన సంక్షోభం ఏర్పడితే దాన్ని అరికట్టడంలో కేంద్రమంత్రి పూర్తిగా వైఫల్యం చెందారు. ఎఫ్డీటీఎల్ నిబంధనలు రెండోదశవి నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తే డిసెంబర్ నెల మొదటి వారంలో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడింది? వీటిపై మీకు ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదా? మేం అడిగే వాటికి మీరెందుకు సూటిగా సమాధానం చెప్పటంలేదు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీలు సభనుంచి వాకౌట్ చేశారు.రామ్మోహన్నాయుడిపై ఆగ్రహజ్వాలలు కేంద్రమంత్రిపై ప్రజల్లో ఇంకా ఆగ్రహజ్వాలలు తగ్గలేదు. జాతీయ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన మీడియాలోను డిబేట్లు పెట్టి కేంద్రమంత్రి రామ్మోహన్ తీరును ఎండగడుతున్నారు. లక్షలాదిమంది ప్రయాణికులు అష్టకష్టాలు పడుతుంటే మంత్రికి కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇండిగో సంక్షోభం రాబోతుందని ముందే తెలిసినా మంత్రి మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫ్లైట్క్యాన్సిల్ అయినప్పుడు క్షణాల వ్యవధిలో రీఫండ్ వచ్చేలా ఎందుకు చేయలేకపోయారంటూ మండిపడుతున్నారు.దేశంలోని అన్ని విమానాశ్రయాలు.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను తలపిస్తున్నాయని పేర్కొంటున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులకు మంత్రి ఎందుకు భరోసా కల్పించలేదని నిలదీస్తున్నారు. కేంద్రమంత్రి తన పదవికి గౌరవంగా రాజీనామా చేయాలంటూ మీడియా డిబేట్లలో కూర్చున్న విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ డిమాండ్ రోజురోజుకు పెరగడం గమనార్హం. కేంద్రమంత్రి తీరును ఎండగడుతూ ఎక్స్ వేదికగా నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
ఆ విషయంలో చైనా స్పష్టతనివ్వాలి
ఇటీవల చైనా షాంగై ఎయిర్ పోర్టులో ఇండియాకు చెందిన ఓ మహిళను చైనా అధికారులు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఆ విషయంపై చైనాను వివరణ కోరింది. భారతీయులు చైనా దేశం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని తెలిపింది. ఈ మేరకు డ్రాగన్ దేశం నమ్మకం కలిగేలా హామీ ఇవ్వాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తరచుగా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటుంది. ఆ ప్రాంతం చైనాదేనని చెప్పడం అంతేకాకుండా ఆదేశ మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్ భాగంగా చూపడంతో తరచుగా ఈ అంశంలో ఇరు దేశాలకు ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఓ మహిళ యూకే నుండి జపాన్ ప్రయాణిస్తుండగా మార్గం మద్యలో షాంఘై విమానాశ్రయంలో ఆగింది. ఆసమయంలో అక్కడి ప్రభుత్వాలు ఆమె అరుణాచల్ ప్రదేశ కు మహిళ అని తెలిసి తనను వేధించారని తెలిపింది. అంతే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అన్నారని పేర్కొంది. ఈ ఘటనను భారత్ ఆసమయంలోనే ఖండించింది.తాజాగా భారత్ చైనాను ఒక వివరణ కోరింది. భారత విదేశాంగ కార్యదర్శ రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ " భారతీయులు చైనా మీదుగా వెళ్లేటప్పుడు వారినే టార్గెట్ గా చేసుకొని ఇబ్బందులు పెట్టమని చైనా తెలపాలి. ఆ మేరకు నమ్మకం కలిగేలా అధికారులు ప్రకటన చేయాలి. ఇష్టానుసారంగా వ్యవహరించకుండా అంతర్జాతీయ ప్రయాణ చట్టాలను గౌరవించాలి. చైనా మీదుగా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు భారతీయులు జాగ్రత్తగా ఉండాలి" అని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని ఇది వరకే చాలా సార్లు భారత్ చెప్పింది. దాని గురించి మరోసారి మాట్లాడదలుచుకోలేదని రణధీర్ జైశ్వాల్ అన్నారు. అయితే ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని సహృద్భావ వాతరణంలో ఇరు దేశాల మైత్రి సాగుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. -
ఖాళీ కుర్చీతో.. టీడీపీని ఏకిపారేసిన అర్నబ్ గోస్వామి
సాక్షి, ఢిల్లీ: తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ ఎంపీ.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిపై ప్రముఖ న్యూస్ యాంకర్ అర్నబ్ గోస్వామి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిణామాలపై విమానయాన శాఖ మంత్రిగా కాకుండా.. మరెవరిని ప్రశ్నించాలంటూ నిలదీశారాయన. ఇండిగో సంక్షోభ వ్యవహారంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్నాయుడి వైఫల్యాన్ని ఇంతకు ముందు అర్నబ్ ప్రశ్నించారు. ఇండిగోపై సమీక్ష జరపడానికి అసలు లోకేష్ ఎవరంటూ నిలదీశారు. అయితే ఈ వైఫల్యాన్ని.. లోకేష్‌ను ఎత్తి చూపడాన్ని టీడీపీ తట్టుకోలేకపోయింది. తప్పు చేసినా తమను ప్రశ్నించవద్దనే తీరుతో టీడీపీ నేతలు.. రిపబ్లికన్ టీవీని బ్యాన్ దిశగా అడుగులు వేసింది. దీంతో అర్నబ్ అనూహ్య చర్యకు దిగారు. స్టూడియోలో ఖాళీ కుర్చీ వేయించి మరీ.. కేంద్రమంత్రిని కాకుండా ఇంకెవరిని ప్రశ్నించాలంటూ టీడీపీ అండ్ కోను కడిగిపారేశారు. లక్షల మందిని ఇబ్బంది పెట్టిన మంత్రిని నిలదీయకూడదనడం ఎంత వరకు కరెక్ట్ అని ఏకిపారేశారు. -
వందేమాతరం స్ఫూర్తిని కాలరాసేలా ఏపీలో పాలన: ఎంపీ గురుమూర్తి
సాక్షి, ఢిల్లీ: వందేమాతర గేయాన్ని వేడుకలా చేయడమే దేశభక్తి కాదని.. అన్యాయాన్ని ఎదిరించడం, ప్రభుత్వాలను జవాబుదారి చేయడమే భారతమాతకు నిజమైన సేవ చేయడమని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. సోమవారం లోక్‌సభలో వందేమాతరంపై చర్చ సందర్భంగా(Vande Mataram debate) ఆయన మాట్లాడుతూ.. భారతీయులందరిలో స్వాతంత్ర ప్రేరణ కల్పించిన గేయం వందేమాతరం అని.. ప్రభుత్వం పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సామాజిక న్యాయాన్ని, సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించారు. కానీ, ఇప్పుడు ఏపీలో రాజ్యాంగ స్పూర్తి, సామాజిక న్యాయానికి విరుద్ధంగా పాలన జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. కీలకమైన వైద్య రంగాన్ని కొద్ది మంది చేతుల్లో పెట్టి . ..ప్రజలను గాలికి వదిలేశారు. ఏపీలో రైతులకు కనీస మద్దతు ధర దొరకడం లేదు. రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. విద్యార్థులకు సరైనటువంటి ఆహారం ప్రభుత్వాన్నించకపోవడంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లైంగిక వేధింపులు యదేచ్చగా జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ పాలన వైఫల్యమే. ఇది వందేమాతరం స్ఫూర్తిని కాలరాయడమే అని గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. -
యువ ఐఏఎస్‌లకు కేడర్ల కేటాయింపు
ఢిల్లీ: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్)కు ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం కేడర్ కేటాయించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 సైకిల్లో ఐఏఎస్ సాధించిన వారి కేడర్ కేటాయింపు జాబితా (IAS cadre allocation list) విడుదలైంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఈమేరకు జాబితాను విడుదల చేసింది. ఫస్ట్ ర్యాంకర్ శక్తి దూబే (Shakti Dubey) తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను తన కేడర్‌గా పొందారు. హరియాణాకు చెందిన రెండో ర్యాంకర్ హర్షిత గోయల్.. గుజరాత్ కేడర్‌కు ఎంపికయ్యారు. మహారాష్ట్రకు చెందిన మూడో ర్యాంకర్ డోంగ్రే అర్చిత్ పరాగ్.. కర్ణాటక కేడర్ దక్కించుకున్నారు. నాలుగో ర్యాంకర్ షా మార్గి చిరాగ్(గుజరాత్), ఐదో ర్యాంకర్ ఆకాష్ గార్గ్ (ఢిల్లీ) సొంత రాష్ట్రాల్లో కేడర్ పొందారు. టాప్ 10 ర్యాంకర్లలో ఆరుగురు తమ సొంత రాష్ట్ర కేడర్ దక్కించుకున్నారు. టాప్ 25లో 11 మంది మహిళలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఏప్రిల్ 22న సివిల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలను ప్రకటించింది. 1,009 మంది అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వీరీలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. యూపీఎస్ఈ 2024 ఫలితాల్లో యూపీకి చెందిన శక్తి దూబే మొదటి స్థానం సాధించారు. టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. టాప్ 25లో 14 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. దేశంలో అత్యంత పోటీ ఉన్న పరీక్షల్లో ఒకటైన సివిల్స్‌లో ప్రతిఏటా లక్షలాది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్‌లతో పాటు ఇతర కేంద్ర సర్వీసుల్లో గ్రూప్ A, B ఉద్యోగాలు పొందేందుకు సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించాలి. టాప్ 10 ర్యాంకర్ల కేడర్ కేటాయింపలు ఇలా ఉన్నాయి..ర్యాంక్పేరుకేటగిరీసొంత రాష్ట్రంకేడర్1శక్తి దూబేజనరల్ఉత్తరప్రదేశ్ఉత్తరప్రదేశ్2 హర్షిత గోయల్జనరల్హరియాణాగుజరాత్3డోంగ్రే అర్చిత్ పరాగ్జనరల్మహారాష్ట్రకర్ణాటక4షా మార్గి చిరాగ్జనరల్గుజరాత్గుజరాత్5ఆకాష్ గార్గ్జనరల్ ఢిల్లీAGMUT6కోమల్ పునియాజనరల్ఉత్తరాఖండ్ఉత్తరప్రదేశ్7ఆయుషి బన్సల్జనరల్మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్8రాజ్ కృష్ణజనరల్బిహార్ బిహార్ 9ఆదిత్య విక్రమ్ అగర్వాల్జనరల్హరియాణాఉత్తరప్రదేశ్10మయాంక్ త్రిపాఠిజనరల్ఉత్తరప్రదేశ్ఉత్తరప్రదేశ్చదవండి: 'ప్యూర్ వెజిటేరియనా.. ఏదో మిస్సవుతున్నారు' -
బెంగాల్ ఎన్నికల కోసమే ఈ డ్రామా
న్యూఢిల్లీ: వందేమాతరంపై పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం అసలు ఏముందని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నిలదీశారు. కేవలం పశి్చమ బెంగాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఈ డ్రామాకు తెర తీశారంటూ దుయ్యబట్టారు. తొలి ప్రధాని నెహ్రూ వందేమాతరాన్ని అవమానించారన్న మోదీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వందేమాతర రచయిత బంకించంద్ర చటర్జీ బెంగాలీ గనుక, ఆ గేయంపై చిచ్చు రాజేసి ఓట్లు రాబట్టుకోవడమే మోదీ పన్నాగమని ఆరోపించారు. ‘ఇందుకోసం బెంగాల్ కే చెందిన మరో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ కు నెహ్రూ రాసిన లేఖను మోదీ అడ్డం పెట్టుకుంటున్నారు. కానీ మోదీ ఆరోపించినట్టుగా వందేమాతరంలోని కొన్ని చరణాలు ముస్లింలను కించపరిచేలా ఉన్నాయని నెహ్రూ ఎన్నడూ అనలేదు. పైగా మోదీ చెబుతున్నట్టుగా వాటిని తీసేయించనూ లేదు. నిజంగా ఆయన అలా చేసి ఉంటే వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే జాతీయ గేయంగా ఆమోదించిన రాజ్యాంగ అసెంబ్లీలో సభ్యుడైన ఆరెస్సెస్ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ అభ్యంతర పెట్టలేదేం?‘అని ప్రశ్నించారు. ముస్లిం సంతుషీ్టకరణ కోసం నాటి ముస్లిం లీగ్ నేత జిన్నా డిమాండ్ కు లొంగి వందేమాతరంలోని పలు పంక్తులను నెహ్రూ తొలగించారని మోదీ పార్లమెంటులో ఆరోపించడం తెలిసిందే. ఈ విషయమై నెహ్రూ రాసిన లేఖే ఇందుకు రుజువని ఆయన చెప్పారు. ఇదంతా పచ్చి అబద్ధమని ప్రియాంక స్పష్టం చేశారు. వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో చేపట్టిన ప్రత్యేక చర్చలో సోమవారం ఆమె పాల్గొన్నారు. నెహ్రూపై మోదీ ఆరోపణలన్నింటినీ పూర్తిస్థాయిలో తిప్పికొట్టారు. వందేమాతరంలోని కొన్ని పంక్తులపై నెహ్రూ అభ్యంతరాలు లేవనెత్తారన్నది నాటి మతోన్మాద శక్తుల దుష్ప్రచారమే తప్ప అందులో నిజం లేదని ఆమె చెప్పారు. బోస్ కు నెహ్రూ లేఖలో కొద్ది భాగాన్ని మాత్రమే తన వాదనకు అనువుగా మోదీ అన్వయించుకున్నారని ఆక్షేపించారు. ‘నెహ్రూపై మీకెందుకీ అకారణ ద్వేషం? మీకు గనుక దమ్ముంటే నెహ్రూపై మీరు చేస్తాను అన్ని ఆరోపణల మీదా పూర్తి స్థాయిలో ముందుగా సభలో చర్చ చేపడదాం రండి. ఆ తర్వాత ఈ అంశానికి మీరు శాశ్వతంగా తెర వేయాలి. మీ రాజకీయ ప్రయోజనం కోసం అవసరమైనపుడల్లా నెహ్రూపై బురదజల్లడాన్ని మానుకోవాలి‘ అంటూ మోదీ సర్కారుకు సవాలు ప్రియాంక విసిరారు. ‘కనీసం ఆ తర్వాతైనా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలపై చర్చిద్దాం. తద్వారా సభా సమయాన్ని సద్వినియోగం చేద్దాం‘ అని సూచించారు. ‘మోదీ దాదాపు 12 ఏళ్లుగా ప్రధానిగా ఉంటున్నారు. దేశం కోసం పోరాడినందుకు నెహ్రూ దాదాపు అంతేకాలం జైల్లో గడిపారు‘ అంటూ తూర్పారబట్టారు. మోదీలో భయం.. ప్రధానికి ఆత్మవిశ్వాసం నానాటికీ సన్నగిల్లుతోందని ప్రియాంక అన్నారు. ‘కొద్ది రోజులుగా అది కొట్టొచి్చనట్టు కనిపిస్తోంది. మోదీ ఒకప్పటి మోదీ కాదు. అన్నింటికీ భయపడుతూ గడుపుతున్నారు. ఆయన విధానాలన్నీ దేశాన్ని నానాటికీ బలహీన పరుస్తుండటమే అందుకు కారణం’అని ప్రియాంక అన్నారు. #WATCH | During debate in Lok Sabha on 150 years of 'Vande Mataram, Congress MP Priyanka Gandhi Vadra says, "The truth is that Modi is no longer the Prime Minister he once was. The truth is, it's beginning to show. His self-confidence is declining. His policies are weakening the… pic.twitter.com/nkHAOooBSe— ANI (@ANI) December 8, 2025 -
భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, ఢిల్లీ: రాజధాని విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి సీజ్ చేశారు. పట్టుకున్న విదేశీ గంజాయి విలువ దాదాపు రూ. 15 కోట్లు ఉంటుందని తెలిపారు.గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. అధికారులు ఎంతగా కట్టడి చేసినప్పటికీ నిందితులు ఎదో రకంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ గంజాయి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. కాగా గతంలోనూ ఢిల్లీలో ఎయిర్ ఫోర్టులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన స్మగ్లర్ల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.47 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు. -
రామ్మోహన్..రాజీనామా చెయ్!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇండిగో’ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా దేశం పరువు మసకబారడం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం.. లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురి కావడం.. ఎయిర్‌పోర్టుల్లో కన్నీళ్లు పెట్టడం.. ఐదారు రోజులు గడిచిపోయినా కష్టాలు తీరకపోవడం.. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అసమర్థ పనితీరుతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటంతో ఇక ప్రధాని కార్యాలయం నేరుగా రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రెండు నెలల ముందే ఈ సమస్య తన దృష్టికి వచ్చినా పట్టించుకోకపోవడంతోనే సమస్య జటిలమైందని కేంద్ర ప్రభుత్వం ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రధాని కార్యాలయమే నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రధాని పర్యవేక్షణలో పీఎంలో ఉన్నతాధికారులు నేరుగా ఇండిగో సీఈవో, ఇతర అధికారులతో చర్చలు జరిపారు. సంక్షోభం ముంచుకొస్తోందని పసిగట్టిన ఆల్ ఇండియా పైలెట్ల అసోసియేషన్ రెండు నెలల క్రితమే ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ దృష్టికి తెచ్చింది. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు కనీసం స్పందించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. సమస్యకు మూల కారణం తెలిసినా దాన్ని పరిష్కరించకుండా ప్రయాణికులకు రీఫండ్ ఇప్పిస్తామంటూ ఎల్లో మీడియాలో ప్రచారానికి తెర తీశారు. కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ కేవలం ఎల్లో మీడియాను మాత్రమే పిలిపించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎన్డీఏలోని కీలక నేతలు సైతం ఆయన కేంద్ర మంత్రా? లేక టీడీపీ మంత్రా? అని విస్తుపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంత అసమర్థ మంత్రి, చేతకాని మంత్రి, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని మంత్రి, టికెట్ల ధరల మోత, సంక్షోభాన్ని అరికట్టలేని మంత్రి మాకొద్దు..! అంటూ జాతీయ స్థాయిలో మీడియాలో, సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని, అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం నుంచి తాజాగా ఇండిగో సంక్షోభం దాకా దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. రామ్మోహన్నాయుడు తక్షణం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశనీయమైంది. ఫోన్ కాల్స్‌కి కేంద్ర మంత్రి స్పందించడం లేదని.. ప్రజల సమస్యను గాలికొదిలేసి స్నేహితులతో కలిసి పార్టీలు, నెట్ఫ్లిక్ చూసుకోవడం, రీల్స్ చేసుకోవడంలో మంత్రి బిజీగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంక్షోభం తలెత్తిన మూడోరోజు న్యూఢిల్లీలో స్నేహితుడి పార్టీలో పాల్గొన్న రామ్మోహన్నాయుడి ఫోటోలను షేర్ చేస్తూ మండిపడుతున్నారు. గతంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రమాద సమయంలో కూడా సంఘటనాస్థలికి వెళ్లి వాటిని రీల్స్‌గా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న సంఘటలను గుర్తు చేస్తున్నారు. దేశం దిగ్భ్రాంతిలో ఉంటే వీడియోలా!ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేంద్రం చెక్ పెట్టనుందా? అనే చర్చ దేశ రాజధానిలో జోరుగా సాగుతోంది. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం మొదలు ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైన రామ్మోహన్ నాయుడుపై ప్రధాని కార్యాలయం సహా కేంద్ర పెద్దలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 230 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజుగా నిలిచింది. సంఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్, షర్ట్‌ను మోచేతి వరకు మడతపెట్టడం చూసిన నెటిజన్లు మండిపడ్డారు. దేశం అంతా దిగ్భ్రాంతిలో ఉంటే వీడియోలు చేసుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరక కేంద్ర విద్యాశాఖ, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. విద్యార్థినిలపై లెక్చరర్ల లైంగిక వేధింపుల అంశంలో జోక్యం చేసుకోవాలని విన్నవించారు. ‘సంస్కృత విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయంలో బీఈడీ మొదటి సంవత్సరం విద్యార్థినిపై లెక్చరర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ విద్యార్థినిపై తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆమె చదువు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయింది. ఈ అంశం నేపథ్యంలో బాధితురాలి ప్రాణాలకు హాని ఏర్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి , కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితురాలు చదువు కొనసాగించేందుకు తగిన సురక్షిత వాతావరణం కల్పించాలి’ అని పేర్కొన్నారు.కాగా, విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మొబైల్లో రికార్డు చేశాడు.అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
కమీషన్లమయంగా కాంగ్రెస్ సర్కార్: ఎంపీ ధర్మపురి సెటైర్లు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్లమయంగా మారిపోయిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. టోకెన్‌కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.ఢిల్లీ వేదికగా.. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్‌కు ప్రజలకు మంచి చేయాలనే కనీస ఉద్దేశం లేదు. లాటరీ తగిలింది.. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లమయంగా మారింది. టోకెన్‌కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారు. గత రెండేళ్లలో 790 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు లక్షల రుణమాఫీ సరిగా చేయలేదుఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా అంటున్నారు. ఫుట్‌బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?. కేంద్రం నుంచి నిధులు వస్తున్న వాటిని సరిగా వినియోగించడం లేదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులందరూ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50% ఖాళీలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. బీజేపీలో మేమంతా ఒక్కటే.. తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మేము అంతా ఒక్కటే.. మా మధ్య సఖ్యత ఉంది. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు నాకు పెద్దన్న లాంటి వారు. ఆయన నాయకత్వంలో పని చేస్తాం. రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాము అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ వాసులకు తీపి కబురు
సాక్షి ఢిల్లీ: తీవ్రమైన గాలి కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసులకు కొంత ఉపశమనం లభించింది. ఆదివారం గాలి నాణ్యత కొంత మేర మెరుగుపడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 305పాయింట్ల వద్ద ఉందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే గాలి నాణ్యత కొంతమేర మెరుగుపడినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా తెలిపింది.దేశ రాజధాని ఢిల్లీ నగరం గాలి నాణ్యత సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వాయు కాలుష్యం విపరీతంగా పెరగడంతో అక్కడ ప్రజల దైనందిన జీవితం దెబ్బతినడంతో పాటు వారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పలు సర్వేలు నివేదించాయి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సైతం కేంద్రాన్ని ఆదేశించింది.కాగా ప్రస్తుతం ఢిల్లీలో వాయుకాలుష్యం కొంతమేర తగ్గినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెబుతోంది. ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 305గా నమోదైనట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలిపింది. మెుత్తంగా 39 మానిటరింగ్ స్టేషన్లలో 26 స్టేషన్లు వెరీపూర్ క్యాటగిరీలో ఉండగా 13 స్టేషన్లు పూర్ క్యాటగిరీలో ఉన్నట్లు పేర్కొన్నాయి. వీటిలో 365 పాయింట్లతో ముండక స్టేషన్ వెరీపూర్ క్యాటగిరీలో ఉన్నట్లు పొల్యూషన్ బోర్డు తెలిపింది.ఢిల్లీ వాయుకాలుష్యంలో వాహనాల వల్ల అధికంగా 14.8శాతం కాలుష్యం సంభవిస్తుండగా ఇండస్ట్రీస్ 7.3శాతం, గృహాలు 3.6శాతం, నిర్మాణ రంగం 2శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయని నివేదికలు తెలిపాయి. అదే విధంగా ఢిల్లీ పరిసరాల్లోని ఝజ్జర్ జిల్లా 13.9 శాతం, రోహ్తక్ 5.2శాతం వాయు కాలుష్యానికి కారకాలుగా నిలుస్తున్నాయని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది -
సామాన్యుల కోసమే సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అంటే సామాన్య ప్రజల కోసమేనని, తాను ఇవ్వాలనుకుంటున్న సందేశం అదేనని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంచేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు. ఇందుకోసం స్పష్టమైన టైమ్‌లైన్, ఏకీకృత జాతీయ జ్యుడీషియల్ విధానం తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ప్రజలకు న్యాయం సులభంగా అందాలన్నారు. లిటిగేషన్ వ్యయాన్ని తగ్గించడం దృష్టి పెట్టానని చెప్పారు. నిర్దేశిత గడువులోగా కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నానని, తద్వారా కక్షిదారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పెండింగ్ కేసులన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయని తాను చెప్పడం లేదని, కేసుల పరిష్కారం అనేది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. పాత కేసులను తొలుత పరిష్కరించాలి న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. మన రాజ్యాంగం మూడు కీలక విభాగాల మధ్య స్పష్టమైన అధికారాల విభజన చేసిందని వివరించారు. శాసన వర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ వేటికవే స్వతంత్రంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ అతిగా జోక్యం చేసుకోకుండా రాజ్యాంగం ఏర్పాట్లు చేసిందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కొత్త కేసుల కంటే పాత కేసుల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మధ్యవర్తిత్వం కీలకమైన అస్త్రం అవుతుందన్నారు. మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. పాత కేసులను మొదట పరిష్కరించే దిశగా రాబోయే రోజుల్లో కొన్ని సంస్కరణలు చేపట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇందుకోసం తనకు సహకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి కేసులను విచారించడానికి న్యాయ వ్యవస్థను ఆధునీకరించాలని వివరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులకు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. -
పెళ్లిళ్లకు వెళ్లలేక!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. ఇండిగో దేశీయ విమాన సర్వీసుల నిలిపివేత తాలూకు సంక్షోభం నిజంగానే ఎన్నెన్నో పెళ్లిళ్లను నిజంగానే చావుదెబ్బ తీస్తోంది. పెళ్లి అంటేనే చెప్పలేనన్ని పనులుంటాయి. నెలల తరబడి ప్లానింగ్ చేసినా అంతా సజావుగా ముగిసేదాకా పెళ్లంటే ఇరు పక్షాలకూ కత్తిమీద సాము తరహా వ్యవహారమే. అలాంటిది, ఇండిగో దేశీయ విమాన సేవల సంక్షోభం కారణంగా నవ దంపతులు ఏకంగా తమ సొంత పెళ్లి విందు వేదికకే చేరుకోలేక చివరికి వర్చ్యువల్‌గా హాజరు కావాల్సిన విచిత్రమైన పరిస్థితి తలెత్తడం తెలిసిందే. ఈ సీజన్లో, అంటే నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 నడుమ దేశవ్యాప్తంగా ఏకంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. అలాంటి సీజన్ మంచి పీక్‌లో ఉండగా ఇండిగో విమాన సేవల అంతరాయం పెళ్లిళ్లపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఆ దెబ్బకు కొన్ని వందల పెళ్లిళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్యాచిలర్స్ పార్టీ గోవిందా ముంబైకి చెందిన వర్షా అగర్వాల్‌కు వచ్చే జనవరిలో పెళ్లి జరగనుంది. ఈలోపు తన బెస్ట్ ఫ్రెండ్స్ ఆరుగురికి కోల్‌కతాలో ఘనంగా బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వాల ని అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంది. తను ముంబై నుంచి ఎయిరిండియా విమానంలో ముందుగానే కోల్‌కతా చేరుకుని వారికోసం ఎదురు చూడసాగింది. కానీ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి రావాల్సిన తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాస్తా కర్మ కాలి ఇండిగోలో టికె ట్లు బుక్ చేసుకున్నారు. తెలియక వారు చేసిన ఈ ఒక్క పొరపాటు చివరికి బ్యాచిలర్స్ పారీ్టకే పురిట్లోనే సంధి కొట్టింది. ఢిల్లీ నుంచి వరుసగా రెండు రోజుల పాటు కోల్‌కతాకు ఇండిగో తన విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసేసింది. దాంతో ఒక స్నేహితురాలితో పాటు వర్షా కూడా హతాశురాలైంది. ఇక హైదరాబాద్ నుంచి రావాల్సిన మిత్రురాలిది మరో వ్యథ. ఆమె సకాలానికి విమానాశ్రయానికి చేరుకున్నా డిస్ ప్లే బోర్డుపై ఎంతకూ కోల్‌కతా విమానం జాడేకన్పించని పరిస్థితి. ఇండిగో సిబ్బంది నుంచి కూడా అరకొ ర సమాచారమే. చివరికి విమానం ఆలస్యమన్నారు. అలా రెండు మూడుసార్లు జరిగి ఐదారు గంటలు గడిచాక, విమానం రద్దయిందంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ‘‘చివరికి నా బ్యాచిలర్స్ పార్టీని ఒకే ఒక్క ఫ్రెండ్‌తో ఏదో అయిందనిపించి ముంబై తిరిగొచ్చా. ఇండిగో నాకు మర్చిపోలేని చేదు అనుభవం మిగిల్చింది’’అంటూ మండిపడుతోంది వర్షా. జనవరిలో పుణేలో జరిగే తన పెళ్లికి ఎట్టి పరిస్థితు ల్లోనూ ఇండిగో సేవలను నమ్ముకునేది లేదని తెగేసి చెబుతోంది. వీలైతే అసలు జీవితంలో ఎన్నడూ ఇండిగో విమానమే ఎక్కబోనని కూడా అంటోంది! రేడియో ఆరెంజ్‌లో ఆర్జేగా చేసే గౌరిదీ అలాంటి వ్యథే. ఆఫీసు వ్యవహారంతో పాటు సన్నిహితుల్లో ఒకరు పెళ్లికి కూడా వెళ్లొచ్చని ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకుందామె. కానీ తీరా చూస్తే అది కాస్తా చివరి నిమిషంలో రద్దయింది. అది కూడా తాను విమానాశ్రయానికి చేరుకున్నాక ఇండిగో సిబ్బంది చాలాసేపటికి తీరిగ్గా వెల్లడించారు. తొలుత విమానం ఆలస్యమైందంటూ రెండుమూడుసార్లు దాటవేస్తూ వచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి! సిలిగురికి చెందిన వ్యాపారవేత్త అనీశ్ సింఘానియా ది కూడా ఇలాంటి బాధే. ఇండిగో నిర్వాకం వల్ల ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికే వెళ్లలేకపోయానంటూ వాపోతున్నారాయన. ‘‘డిసెంబర్ 4న ముంబై వెళ్లేందుకు ఇండిగోను నమ్ముకున్నా. తీరా చూస్తే ఆ సంస్థ కాస్తా నన్ను నట్టేట ముంచి చేతులు దులుపుకుంది. పోనీ ఇతర సంస్థల విమానాల్లో వెళ్దామంటే అవి కూ డా ఈ దుస్థితిని వీలైనంతగా సొమ్ము చేసుకుని నా ఆశలపై నీళ్లుజల్లాయి. పదేసి రెట్లు పెరిగిన విమాన ధరలు చెల్లించలేక అసలు ప్రయాణమే మానుకు న్నా. ఇండిగోకు నాలాంటివారి ఉసురు తగిలి తీరుతుంది’’అంటూ శాపనార్థాలు పెడుతున్నారు అనీశ్. దౌత్యాధికారికీ తప్పని తిప్పలు సాధారణ దేశీయ ప్రయాణికులకు మాత్రమే కాదు, భారత్‌లో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్కూ ఇలాంటి చేదు అనుభవాన్నే రుచిచూపింది ఇండిగో. తన దౌత్య సిబ్బందిలో ఒకరి పెళ్లి నిమిత్తం ఢిల్లీ నుంచి దేవగఢ్‌కు ఇండిగోలో టికెట్ బుక్ చేసుకున్నారాయన. ‘‘ఆ పొరపాటు చేసినందుకు ప్రయాణం రద్దై ఏమీ చేయలేక తీరని బాధకు లోనైన వేలాది మంది ఇండిగో ప్రయాణికుల్లో నేనూ ఒకనిగా మిగిలాను. నా కొలీగ్‌కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం మినహా ఇంకేం చేయగలను?’’అంటూ ఎక్స్‌లో వాపోయారాయన! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండిగో ఇంకా నేల మీదే!
సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: దేశంలో ఇండిగో సంక్షోభం వరుసగా ఐదో రోజుకు చేరుకుంది. ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శనివారం ఒక్కరోజే 800కుపైగా విమానాలు రద్దు కావడంతో ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న దృశ్యాలే కనిపించాయి. పైలట్ల విధులు, విశ్రాంతి విషయంలో పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల నుంచి తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. తగిన సంఖ్యలో పైలట్లు, విమాన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. శుక్రవారం వెయ్యికిపైగా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంపై నాలుగు రోజులపాటు మౌనం పాటించిన ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ ఎట్టకేలకు స్పందించారు. ప్రయాణికులను క్షమాపణ కోరారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. అసౌకర్యానికి మన్నించాలని విజ్ఞప్తి చేశారు. అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అన్ని శ్లాబుల్లో టికెట్ల లభ్యత గురించి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం అందించాలని ఎయిర్‌లైన్స్ సంస్థలకు పౌర విమానయాన శాఖ సూచించింది. డిమాండ్ పెరిగిన రూట్లలో అవసరమైతే విమానాల సంఖ్య పెంచాలని సూచించింది. ఏదైనా నగరానికి విమానాన్ని రద్దు చేస్తే ఆ మార్గంలో ఏ ఇతర సంస్థ కూడా చార్జీలు పెంచకూడదని ఆదేశించింది. విమానం రద్దు లేదా ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రయాణికులకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని పేర్కొంది. సాధ్యమైన ప్రతి చోటా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టంచేసింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని విమానయాన సంస్థలను హెచ్చరించింది. విమాన రుసుములపై నియంత్రణ ఇండిగో సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు చక్కగా సొమ్ము చేసుకుంటున్నాయి. విమాన చార్జీలను భారీగా పెంచేశాయి. ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. విమానయాన సంస్థల తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఊరట కలి్పస్తూ విమాన చార్జీలపై పరిమితి విధించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. దూరాన్ని బట్టి చార్జీలను ఖరారు చేసింది. ఇవి రూ.7,500 నుంచి రూ.18,000 దాకా ఉన్నాయి. సంక్షోభం ముగిసేదాకా ఇవే చార్జీలు అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. టికెట్లను విమానయాన సంస్థల అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసినా లేక ప్రైవేట్ సంస్థల ఆన్లైన్ వేదికల నుంచి కొనుగోలు చేసినా ఈ చార్జీలనే వసూలు చేయాలని ఆదేశించింది. యూజర్ డెవలప్మెంట్ ఫీజు(యూడీఎఫ్), ప్యాసింజర్ సరీ్వసు ఫీజు(పీఎస్ఎఫ్), టిక్కెట్లపై పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బిజినెస్ క్లాస్ ప్రయాణాలు, ఉడాన్ విమానాలకు ఈ చార్జీల నియంత్రణ వర్తించదని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా విమాన చార్జీల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తేల్చిచెప్పింది. ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు, ఎయిర్‌లైన్స్ డేటాను రియల్ టైంలో గమనిస్తామని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా.. ప్రజా ప్రయోజనాల దష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నేడు రాత్రి 8 గంటల్లోగా రీఫండ్ చేయండి రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికు లకు టికెట్ల రుసుమును తిరిగి చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఇండిగోను పౌర విమానయాన శాఖ ఆదేశించింది. టికెట్ రీఫండ్ ఆదివారం రాత్రి 8 గంటల్లోగా పూర్తి కావాలని తేల్చిచెప్పింది. రీఫండ్ విషయంలో ఆదేశాలు పాటించకపోయినా, ఆలస్యం చేసినా చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. రీషెడ్యూలింగ్ విమానాల విషయంలో ప్రయాణికుల నుంచి అదనంగా చార్జీలు వసూలు చేయకూడదని సూచించింది. ప్రయాణికులకు సహకరించడానికి ప్రత్యేకంగా రీఫండ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇండిగోను ఆదేశించింది. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఈ కేంద్రాలను కొనసాగించాలని వెల్లడించింది. ఒకవేళ ప్రయాణికుల నుంచి బ్యాగేజీ తీసుకొని ఉంటే రెండు రోజుల్లోగా తిరిగి అందజేయాలని పేర్కొంది. నిబంధనల ప్రకారం అవసరమైన చోట ప్రయాణికులకు పరిహారం అందించాలని వెల్లడించింది. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, దివ్యాంగులైన ప్రయాణికులు, విద్యార్థులు, రోగులు, అత్యవసర ప్రయాణం అవసరమయ్యే వారందరికీ సరైన సౌకర్యాలు కల్పించడానికి పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేసినట్లు తెలిపింది. ఇండిగో సీఈఓపై వేటు పడుతుందా! దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికుల ఆగచాట్లకు కారణమైన ఇండిగో విమానాల రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ అలసత్వమే ఈ సంక్షోభానికి దారి తీసినట్లు భావిస్తోంది. ఆయనపై వేటు వేయాలని దాదా పు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇండిగో సీఈఓ పదవి నుంచి పీటర్‌ను అతి త్వరలోనే తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఈవోకు డీజీసీఏ షోకాజ్ నోటీస్ ఇండిగోతో తలెత్తిన సంక్షోభం, విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంపై వివరణ ఇవ్వాలని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శనివారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ‘పెద్ద సంఖ్యలో విమానాల రద్దుకు విపరీతమైన నిర్వహణా వైఫల్యాలు, ప్రణాళికా లోపమే కారణ మని భావిస్తున్నాం. సీఈవోగా మీరు, సంస్థ సమర్థ నిర్వహణకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, కార్యకలాపాల నిర్వహణ, ముందు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించడమనే విధి నిర్వహణలో విఫలమయ్యారు’అని నోటీసులో పేర్కొంది. ఎఫ్డీటీఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్)ను సజావుగా అమలు చేయడానికి, సవరించిన నిబంధనలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లను చేయకపోవడమే అంతరాయాలకు ప్రధాన కారణమని భావిస్తున్నట్లు తెలిపింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎల్బర్స్‌ను ఆదేశించింది.రీఫండ్‌కు అధిక ప్రాధాన్యం: ఇండిగో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఇండిగో శనివారం వెల్లడించింది. శుక్రవారంతో పోలిస్తే రద్దయిన విమానాల సంఖ్య శనివారం తగ్గినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. 850 కంటే తక్కువ విమానాలే రద్దయ్యాయని తెలిపింది. టికెట్ రీఫండ్ విషయంలో ప్రయాణికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. రీఫండ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, టికెట్ల చార్జీలు కచ్చితంగా తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఇందుకోసం వెబ్సైట్ లేదా కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించాలని సూచించింది. మరికొద్ది రోజుల్లోనే ఇబ్బందులు తొలగిపోతాయని వెల్లడించింది. విమానాల షెడ్యూళ్లలో స్థిరీకరణ, ఆలస్యాన్ని తగ్గించడం, ప్రయాణికులకు సహకరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఇండిగో తెలియజేసింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ఇండిగో విమానాల రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడానికి 84 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ శనివారం ప్రకటించింది. దేశమంతటా అన్ని జోన్లలో ఈ రైళ్లను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పటా్న, హౌరా తదితర నగరాల మధ్య రైళ్లు ప్రారంభమయ్యాయని వివరించింది. ఇవి 104 ట్రిప్పులు నడుస్తాయని పేర్కొంది. ప్రయాణికుల అవసరాలను బట్టి ప్రత్యేక రైళ్ల సంఖ్య, ట్రిప్పుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు వెల్లడించింది. లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని రైల్వే బోర్డు ఉన్నతాధికారి దిలీప్ కుమార్ తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు, రాకపోకల సమయాన్ని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ప్రదర్శిస్తున్నారు. -
బానిస మనస్తత్వం ఇంకెన్నాళ్లు?
న్యూఢిల్లీ: మన మెదళ్లలో ఇంకిపోయిన బానిస మనస్తత్వాన్ని రాబోయే పదేళ్లలో పూర్తిగా వదిలించుకోవాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధిలో దేశం పని తీరును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా అభివరి్ణస్తూ మన భారతీయ నాగరికతకు మచ్చతెచ్చే కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ మనదేశం గొప్ప ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన ప్రగతి ప్రయాణం ఎక్కడా ఆగడం లేదని హర్షం వ్యక్తంచేశారు. భారత్ కొత్త చరిత్రను లిఖిస్తోందని ఉద్ఘాటించారు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ దేశం కూడా ముందుకు సాగలేదని తేల్చిచెప్పారు. నేడు అన్ని రంగాల్లో వలసవాద మనస్తత్వాన్ని క్రమంగా వదిలించుకుంటున్నామని వివరించారు. స్వశక్తి, స్వయంకృషితో ఎన్నో ఘనతలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టంచేశారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధనకు వలసవాద, బానిస మనస్తత్వం పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. అందుకే ఆ మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి చెందే దిశగా మన దేశం అడుగులు వేస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఇండియాను ప్రపంచ దేశాలు ‘గ్లోబల్ గ్రోత్ ఇంజిన్’గా గుర్తిస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఆ ఘనతను దేశానికి గర్వకారణంగా భావించడం లేదన్నారు. బానిస మనస్తత్వమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రతి అంశంపైనా మత ముద్ర ‘‘మన దేశం రెండు శాతం, మూడు శాతం ఆర్థిక వృద్ధి కూడా సాధించలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే మాట పుట్టించారు. ఆర్థిక ప్రగతిని ప్రజల విశ్వాసంతో ముడిపెట్టారు. మన సమాజాన్ని పేదరికానికి పర్యాయపదంగా మార్చారు. హిందూ నాగరికతకు సంబంధించిన పరిణామాల వల్లనే ఆర్థిక ప్రగతి జరగడం లేదని నిందించారు. పుస్తకాల్లో, పరిశోధన గ్రంథాల్లో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్‌ను చేర్చారు. కుహన మేధావులు నేడు ప్రతి అంశాన్నీ మతం దృష్టితో చూస్తున్నారు. మత ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్న మేధావులు గత ప్రభుత్వాల హయాంలో నమోదైన తక్కువ వృద్ధిరేటు గురించి మాట్లాడడం లేదు. దేశంలో బానిస మనస్తత్వం అనే విత్తనాలు నాటిన మెకాలే విధానానికి 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయి. అంటే మరో పదేళ్లు మిగిలి ఉన్నాయి. ఈ పదేళ్లలో బానిస మనస్తత్వం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించాలి. మౌలిక మార్పునకు ప్రతీక ఆర్థిక వృద్ధితో మనకు తిరుగులేదు. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం మన బలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి సాధించాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే గ్రోత్ డ్రైవర్. ప్రపంచ వృద్ధి రేటు 3 శాతమే ఉంది. జీ7 దేశాల సగటు వృద్ధిరేటు 1.5 శాతమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం 8.2 శాతం వృద్ధిరేటు సాధించడం సామాన్య విషయం కాదు. ఇది కేవలం అంకెలకు సంబంధించిన సంగతి కాదు. గత పదేళ్లలో మనం తీసుకొచ్చిన మౌలిక మార్పునకు ప్రతీక’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ
ఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి పనితీరుపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానయాన శాఖ అధికారులతో నేరుగా మోదీ సమీక్షించారు. ఇండిగో సంక్షోభంపై మోదీకి అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారు. అయితే, సమీక్షకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ను పీఎంవో పిలవలేదని సమాచారం.పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఘోరంగా విఫలమయ్యారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చేతకానితనంతో దేశ ఏవియేషన్ రంగంలో పెను సంక్షోభం నెలకొందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని చివరి వరకు రామ్మోహన్ పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.కాగా, ఇండిగో సంస్థపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాల ఆకస్మిక రద్దు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై సీరియస్ అయ్యింది. ప్రయాణికుల టికెట్ రద్దు రీఫండ్‌ను ఆలస్యం చెయవద్దని.. రేపు రాత్రి 8లోపు డబ్బులు తిరిగివ్వాలని తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు, ఉద్దేశపూర్వకంగానే విమానాల సంక్షోభం సృష్డించి దానికి డీజీసీఏ నిబంధనలు సాకుగా చూపుతుందని ఆరోపించింది. రద్దైన విమానాల సమాచారం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది. -
విమాన టికెట్ల ధర పెంపుపై కేంద్రం సీరియస్
ఇండిగో సంక్షోభంతో గగనతల ప్రయాణం ఒక్కసారిగా ఖరీదుగా మారింది. అయితే విమాన టికెట్ల ధరల పెంపుపై కేంద్రం సీరియస్ అయ్యింది. సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని ఎయిర్‌లైన్స్‌లకు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. నిర్దేశించిన ఛార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుతో.. మిగతా ఎయిర్‌లైన్స్ క్యాష్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలు రూట్లలో దాదాపు 10 రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అయితే మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ దోపిడీ ప్రభుత్వం దృష్టికి చేరింది. అయితే.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణికులను కొన్ని విమానయాన సంస్థలు దోచుకోవడం సరికాదని కేంద్రం చెబుతోంది. అడ్డగోలుగా రేట్లు పెంచితే చూస్తూ ఊరుకోబోమని.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ జారీ చేసింది.మరోవైపు.. ఇండిగో సంక్షోభంగా ఐదో రోజుకి అడుగపెట్టింది. దేశంలోని పలు ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల వద్ద ప్రయాణికుల నిరీక్షణ కొనసాగుతోంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ఎయిర్‌లైన్స్ ఘోరంగా విఫలం అయ్యిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. విమానాల రద్దు గురించి తెలీక.. సరైన సమాచారం లేక.. ఎయిర్‌పోర్టులలో హెల్ప్‌డెస్క్‌ల వద్ద ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇండిగో సిబ్బంది తమతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ‘‘క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?’’ అంటూ ఎయిర్‌లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రైవేటు సంస్థలపై పెరుగుతున్న సైబర్ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేటు కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు, డేటా దొంగతనాలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. 2020–24 మధ్య దేశవ్యాప్తంగా ప్రైవేటు సంస్థలపై 5.77 లక్షల సైబర్ దాడులు జరిగినట్లు తెలిపారు. చాట్ జీపీటీ, ఏఐ వాడితే రహస్య సమాచారం లీక్ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది చాట్ జీపీటీ, ఏఐ వంటి టూల్స్ వాడటంవల్ల రహస్య సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రహస్య, సున్నిత సమాచారం దేశం బయటకు చెప్పడం, సురక్షితం కాని ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం నిషేధమని తెలిపారు.భారత్–బ్రిటన్ వాణిజ్య ఒప్పందం ఇటీవల జరిగిన భారత్–బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పంద సమావేశం (సీఈటీఏ)లో క్రాస్–బోర్డర్ డేటా ప్రవాహాలు, డేటా లోకలైజేషన్ నియమాలను పునఃసమీక్షించే అవకాశాలపై ఒప్పందం జరిగినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరావిురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద జవాబిచ్చారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవురాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎన్ఐఎల్)లోని 32 డివిజన్లనను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు, ప్రైవేటు భాగస్వామ్యం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ) ఆహ్వానించినట్లు వస్తున్న వార్తలు నిజంకాదని కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. ప్రైవేటీకరణకు ప్రతిపాదనలేవీ లేవని చెప్పారు. రైతులకు సహాయం 2022–23 నుంచి 2024–25 మధ్య ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ద్వారా దాదాపు రూ.609 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు కేంద్ర వ్యవసాయ, సంక్షేమశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్ ఠాకూర్.. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
రక్షణ పరిశ్రమల్ని ఆకర్షించలేని ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణరంగ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించలేకపోతున్నట్లు రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ చెప్పారు. లోక్‌సభలో శుక్రవారం వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవా బిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా రక్షణ తయారీ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్‌లు (కేంద్ర పథకాలు) ప్రారంభించలేదని తెలిపారు. వైద్య పరికరాల ఎగుమతుల్లో వృద్ధి మన దేశం నుంచి వైద్య పరికరాల ఎగుమతులు 2021–22లో 2.9 బిలియన్ డాలర్లుండగా 2024–25లో 4.1 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. వైద్యపరికరాల దేశీయ ఉత్పత్తి వృద్ధిరేటు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఐఆర్ఎస్పై నాలుగే ఫిర్యాదులుగత పదేళ్లలో ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) పనితీరులో జరిగిన అక్రమాలు, అవకతవకలు, ఆలస్యాలకు సంబంధించి నాలుగు ఫిర్యాదులు మాత్రమే అందినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్.. వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
ఆలయం సొమ్మును ఆ దేవత కోసమే వినియోగించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: ఆలయానికి చెందిన సొమ్మును ఆ దేవత కోసం వాడాలే తప్ప, కష్టాల్లో ఉన్న సహకార బ్యాంకుల కోసం వినియోగించరాదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. తిరునెల్లి టెంపుల్ దేవస్వోమ్కు చెందిన డిపాజిట్లను తిరిగి ఆలయానికి వాపసు చేయాలంటూ కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ కొన్ని సహకార బ్యాంకులు వేసిన పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘బ్యాంకులను కాపాడుకునేందుకు మీరు ఆలయం సొమ్మును వాడుకోవాలనుకుంటున్నారా? నష్టాల్లో ఉన్న ఒక సహకార బ్యాంకులో ఆలయం డబ్బును ఉంచే బదులు, ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుకు మళ్లించాలని ఆదేశించడంలో తప్పేముంది?’అని పిటిషనర్లను ప్రశ్నించింది. ‘ఆలయం సొమ్ము ఆ దేవతకే చెందుతుంది. అందుకే, ఆ సొత్తును దాచాలి, కాపాడుకోవాలి, ఆలయ ప్రయోజనాల కోసమే వాడాలి. అంతేగానీ, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకు మనుగడకు ఒక వనరుగా ఆ సొమ్ము మారరాదు’అని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. బ్యాంకులు ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలన్న ధర్మాసనం.. ఖాతాదారులను, డిపాజిట్లను ఆకర్షించలేకపోవడం మీ సమస్య’అని పిటిషనర్లనుద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. అయితే, డిపాజిట్ల ఉపసంహరణ గడువు పెంచాలని కేరళ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఆలయానికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను కొన్ని సహకార బ్యాంకులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో తిరునెల్లి ఆలయ బోర్డు కోర్టుకెక్కింది. -
ఉపా కేసులో వ్యక్తికి సుప్రీం బెయిల్
న్యూఢిల్లీ: నకిలీ కరెన్సీ నోట్లు కలిగి ఉన్న ఆరోపణలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా)కింద అరెస్టయిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నప్పటికీ ఇప్పటి వరకు అసోం పోలీసులు కోర్టులో చార్జిషీటు వేయలేదని అత్యున్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశిత సమయంలోగా విచారణ మొదలు కాలేదని, ఇలా కస్టడీలో ఉంచటం అక్రమమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం స్పష్టం చేసింది. ఉపా–1967 కింద అరెస్ట్ చేసిన వ్యక్తిపై 90 రోజుల్లోగా చార్జిషీటు వేయాలి. కోర్టు అనుమతి లేకుండా ఈ గడువును 180 రోజుల వరకు పొడిగించే వెసులుబాటు కూడా ఉంది. ‘రెండేళ్లు గడిచినా ఎందుకు చార్జిషీటు వేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఇది అక్రమ కస్టడీ అన్నది వాస్తవం. మీరేమైనా గొప్ప వాళ్లనుకుంటున్నారా? అంటూ కడిగిపారేసింది. అయితే, మయన్మార్ వాసి అయిన నిందితుడు తొన్లొంగ్ కొన్యాక్పై పలు కేసులున్నాయని, నకిలీ నోట్ల కేసులో సహ నిందితులు పరారీలో ఉండటంతో చార్జిషీటు వేయలేకపోయామని పోలీసుల తరఫున లాయర్ ధర్మాసనానికి నివేదించారు. అయితే, ఈ కేసును ప్రత్యేకమైందిగా భావించి నిందితుడికి బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఇండిగో ఓ మాట.. కేంద్రం మరో మాట!
న్యూ ఏవియేషన్ రూల్స్‌ను వెనక్కి తీసుకోవడంతో విమానయాన ప్రయాణాలు ఇక సాఫీగా సాగుతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ తప్పడం లేదు. పైలట్లు సత్వరమే అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ.. విమానాల రద్దు, వాయిదాలపర్వం ఇంకా కొనసాగుతోంది. దీంతో.. వేల మంది ఇంకా ఎయిర్‌పోర్టులలోనే ఇరుక్కుపోయారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగస్తుందనే విషయంపై ఇటు కేంద్రం, అటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లు ఓ స్పష్టత అంటూ ఇవ్వలేకపోతున్నాయి. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఇంకోన్నిరోజులు సమయం పట్టొచ్చు.. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ చెబుతున్న మాట ఇది. గత నాలుగు రోజులుగా నెలకొన్న పరిస్థితులకు.. తీవ్రస్థాయిలో అవస్థలు పడ్డ ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారాయన. ఇండిగో మొత్తం ఆపరేషనల్ సిస్టమ్ రీబూట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడిందని.. దీని వల్ల షెడ్యూల్లు, క్రూ మేనేజ్మెంట్, ఫ్లైట్ ప్లానింగ్ అన్నీ తాత్కాలికంగా దెబ్బతిన్నాయన్నారు. విమానాల రద్దుపై ప్రయాణికులకు సమాచారం చేరవేస్తున్నామని.. అనవసరంగా ఎయిర్‌పోర్టుల వద్దకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 10–15 మధ్యకల్లా సేవలు క్రమంగా సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. కేంద్రం మాత్రం మరోలా చెబుతోంది. శనివారం(ఇవాళ)కి పరిస్థితి కాస్త చక్కబడుతుందని.. సోమవారం నుంచి సర్వీసులన్నీ యధాతథంగా, సాధారణ పరిస్థితుల మధ్య నడవొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ.. 24x7 కంట్రోల్ రూమ్ ద్వారా పౌరవిమానయాన శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అయితే పరిస్థితులు మాత్రం కేంద్రం చెబుతున్నట్లుగా ఏమాత్రం లేవు.పైలట్లకు వారాంతపు విశ్రాంతి విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ.. ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగడానికి కారణాలున్నాయి. భారీ సంఖ్యలో విమానాల రద్దుతో ఇప్పటికే షెడ్యూల్లు గందరగోళంగా మారిపోయాయి. తీవ్ర పైలట్ కొరత, రోస్టరింగ్ సమస్యలను చక్కబెట్టుకోవడానికి ఇండిగోకు ఇంకొంత సమయం పట్టొచ్చు. సిస్టమ్ రీబూట్ వల్ల ఏర్పడిన ఆపరేషనల్ అంతరాయం ఒక్కసారిగా సరిచేయలేని స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఫలితంతో.. ఇవాళ కూడా వెయ్యికి పైగా విమానాలు రద్దు అయ్యాయి. ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న మిగతా ఎయిర్‌లైన్స్‌లు ఛార్జీలు భారీగా పెంచాయి. దీంతో ఈ సంక్షోభం ఇప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు.. ప్రయాణికులకు విమానాల రద్దుపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇండిగో కావాలనే ఇలా చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డీజీసీఏ తెచ్చిన కొత్త రూల్స్ విషయంలో ఒత్తిడి పెంచేందుకే ఈ కృత్రిమ సంక్షోభాన్ని ఇండిగోనే సృష్టించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కేంద్రం అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది. ప్యానెల్ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. అయితే.. రూల్స్ వెనక్కి తీసుకోవడంపై పైలట్ అసోషియేషన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇది భద్రతా ప్రమాణాలను తగ్గించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇటు ఇండిగో.. అటు డీజీసీఏ.. ఇద్దరి నిర్వాకంతోనే బిగ్ ట్రబుల్ ఏర్పడిందని, కాబట్టి సమిష్టిగా భాద్యత వహించాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే డీజీసీఏ గనుక రూల్స్‌ను వెనక్కి తీసుకోకపోయి ఉంటే మాత్రం ఈ సంక్షోభం రెండు మూడు నెలలైనా ముగిసేది కాదనేది నిపుణుల మాట. -
పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లులో పాన్ మసాలా తయారీ యూనిట్లపై పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు. ఈ పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఆరోగ్య పథకాల కోసం వెచ్చిస్తామని తెలిపారు. హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025పై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రత్యేక ప్రయోజనాల కోసం సెస్ విధించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 వీలు కల్పిస్తోందని చెప్పారు. అనంతరం బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పాన్ మసాలా, అలాంటి ఉత్పత్తులను తయారు చేసేందుకు వినియోగించే యంత్రాలు, వాటి సామర్థ్యం ఆధారంగా విధించే సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం వినియోగించుకునేందుకు ఈ బిల్లులో ఏర్పాటుంది. గతంలోనూ ఇలా సెస్‌లను వివిధ వనరులపై ప్రభుత్వాలు విధించాయన్నారు. 1974 నుంచి క్రూడాయిల్‌పై సెస్, 2001 నుంచి నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ, 2000 నుంచి రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో పన్ను వసూలు చేస్తున్న చరిత్ర ఉందన్నారు. పాన్ మసాలా చౌకగా మారడానికి, అదే సమయంలో ఆదాయాన్ని కోల్పోయేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆమె తెలిపారు. వినియోగం ఆధారంగా పాన్ మసాలాపై గరిష్టంగా 40 శాతం మేర జీఎస్టీ ఉంటుందని చెప్పారు. అయితే, జీఎస్టీ ఆదాయంపై ఈ సెస్ ఎటువంటి ప్రభావం చూపదని ఆమె స్పష్టం చేశారు. -
ఉద్యోగులకు ఆఫీసు కాల్ కట్ చేసే హక్కు
న్యూఢిల్లీ: పని వేళలు పూర్తయ్యాక ఆఫీసు నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిళ్లను స్వీకరించడంపై ఉద్యోగులకు హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ సభ్యుల బిల్లు లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరముందని భావించే అంశాలపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రైవేటుగా బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత సాధారణంగా ఈ ప్రతిపాదిత బిల్లులను ఉపసంహరించుకుంటారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే శుక్రవారం లోక్‌సభలో ఈ మేరకు ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు–2025’ను ప్రవేశపెట్టారు. ప్రతి ఉద్యోగి పని వేళల తర్వాత, సెలవు దినాల్లో వచ్చే విధి నిర్వహణ సంబంధిత ఫోన్ కాల్స్, ఈమెయిల్స్‌ను డిస్కనెక్ట్ చేసేందుకు హక్కు ఉండాలి. ఇందుకోసం ఉద్యోగుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించారు. తమిళనాడును నీట్ ప్రవేశ పరీక్ష నుంచి మినహాయించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, దేశంలో మరణ శిక్షను రద్దు చేయాలంటూ డీఎంపీ ఎంపీ కనిమొళి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని విశాల్దాదా ప్రకాశ్ బాపు పాటిల్(స్వతంత్ర) ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు.


