breaking news
Prakasam
-
టీచర్ల పోరుబాట
కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోగా వారిపై బోధనేతర పనుల భారాన్ని మోపుతూ విద్యాబోధనకు దూరం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు చదువు దూరమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఉపాధ్యాయులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా తమపై పనిభారం మోపుతున్నారంటూ టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాటతప్పింది. అడ్డగోలు నిర్ణయాలతో ఉపాధ్యాయుల మీద మరింత ఒత్తిడి పెంచింది. విద్యార్థులకు చదువులు చెప్పకుండా, ఇతర పనులు అప్పగించడంతో సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. దీంతో ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రకరకాల పనులను ఉపాధ్యాయులపై రుద్దింది. చంద్రబాబు తన ప్రచార యావతో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి ఉపాధ్యాయులను స్కూళ్లకు దూరం చేశారు. అలాగే పేరెంట్, టీచర్స్ సమావేశాల పేరుతో దాదాపు రెండు వారాలపాటు ఉపాధ్యాయులు పాఠాలకు దూరమయ్యారు. దీనికి తోడు రకరకాల శిక్షణ పేరుతో టీచర్లు బడులకు వెళ్లలేక పోయారు. ఫలితంగా విద్యార్థులు సైతం చదువులకు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం ఆంక్షలతో కొంతకాలం మౌనం వహించిన ఉపాధ్యాయ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. సమస్యల పరిష్కారం కోసం, హక్కులను కాపాడుకునేందుకు జిల్లాలో సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులు ఆందోళనబాటపట్టారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై విజయవాడ ధర్నా చౌక్‌లో నేడు రాష్ట్రస్థాయి ధర్నా చేపట్టారు. ధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు. -
శనగ రైతులను ఆదుకోవాలి
ఒంగోలు సబర్బన్: శనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద సోమవారం వివిధ రైతు సంఘాల నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద ఉన్న శనగ నిల్వలను క్వింటా రూ.10 వేల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే క్వింటా శనగలకు రూ.3 వేల సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల వద్ద శనగల నిల్వలు పేరుకుపోయాయని, కనీస ధరలు లేక అమ్ముకోలేకపోతున్నారన్నారు. మరో వైపు కేంద్రం దిగుమతి సుంకాలు రద్దు చేయడం దారుణమన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, టాంజానియా దేశాల నుంచి దిగుమతులు వస్తే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పప్పుదినుసులుగా ఉపయోగించే ఉతృత్తులను దేశీయ అవసరాలకు తగినట్లుగా సాగు ఉత్పత్తులను నియంత్రించి ధరలు నిలకడగా ఉండేలా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిగుమతి సుంకాలు పెంచి దిగుమతులను అడ్డుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. వివిధ రైతు సంఘాల నేతలు జె.జయంత్ బాబు, కె.వీరారెడ్డి, చుంచు శేషయ్య, పరిటాల కోటేశ్వరరావు, జి.నాగేశ్వరరావు, బెజవాడ శ్రీనివాసు పాల్గొన్నారు. క్వింటా రూ.10 వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన -
ప్రజల సొమ్ము ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పీ3
మార్కాపురం: ప్రజల సొమ్మును ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పీ3 ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సీపీఎం పట్టణ కార్యదర్శి డీకేఎం రఫీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ మార్కాపురం మెడికల్ కాలేజీని పీ3 విధానంలో నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అతి తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తికావడానికి అవకాశమున్న మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేట్ వారికి అప్పగించడం మంచి పద్ధతి కాదన్నారు. 66 ఏళ్ల పాటు వైద్యశాలను ప్రైవేట్ వారికి అప్పగించడమంటే వైద్య రంగాన్ని ప్రజలకు దూరం చేయడమేనన్నారు. కూటమి నాయకులు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీని సీట్ల అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారని, ఇప్పుడేమో మాట మార్చి మొత్తం వైద్యకళాశాలనే కార్పొరేటర్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. కార్పొరేటర్ల ప్రయోజనం కోసమే వైద్యరంగాన్ని ప్రభుత్వ రంగంగా కాకుండా ప్రైవేట్ వారికి మేలు చేయడమే అన్నారు. అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో సరైన వైద్యం అందక అనేక మంది సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాలకు తలొగ్గి మోడీ బాటలో పయనిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తన పీ3 విధానాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే నిర్మించాలన్నారు. ఎకరా 1 రూపాయితో వందల ఎకరాల ప్రజల భూమిని 66 ఏళ్ల లీజుకు ఇవ్వడమంటే ప్రజల సొమ్మును ప్రైవేట్ వారికి అప్పజెప్పడం కాదా అని విమర్శించారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కార్యాలయ ఏఓ రవీంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు అందె నాసరయ్య, ఎస్కే ఖాశీం, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సోమయ్య, రఫీ, గుమ్మా బాలనాగయ్య, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, అమ్ఆద్మీపార్టీ జిల్లా అధ్యక్షుడు వి.సుదర్శన్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఇమ్రాన్, మాబూవలి, కాాశయ్య, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ -
అమ్ముతాం ఆపేదెవరు !
● యథేచ్ఛగా నల్లబజారుకు పేదల బియ్యం మర్రిపూడి: కూటమి నేతల కనుసన్నల్లో సాగుతున్న రేషన్ దుకాణాల నుంచి రేషన్ బియ్యం యథేచ్ఛగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. రేషన్‌దుకాణాల నిర్వాహకులు పేదల నుంచి ప్రతినెలా ఇంటికి సైతం వెళ్లి వేలుముద్రలు సేకరించి బియ్యం పంపిణీ చేయకుండా వారికి కిలో బియ్యం రూ.10 వంతున చెల్లిస్తున్నారు. మిగిలిన బియ్యాన్ని రాత్రిపూట లారీలుపెట్టి దుకాణంలోని సరుకును లోడ్‌చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. విషయం అంతా తెలిసినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మర్రిపూడి మండలంలో 24 చౌకదుకాణాలు ఉండగా, 13,114 రేషన్‌కార్డులు ఉన్నాయి. సుమారు 39,342 టన్నుల బియ్యం, 6 వేల టన్నుల చక్కెర రేషన్ దుకాణాలకు ప్రతి నెలా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో 80 శాతం బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 4, 5 తేదీల్లో మర్రిపూడిలో 2వ నంబరు దుకాణందారుని భర్త నేరుగా లారీని దుకాణం ఎదురు నిలిపి పేదలకు పంచాల్సిన సరుకును లారీలో నింపి బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. 15 వ తేదీ దాకా కార్డుదారులకు అమ్మాల్సిన బియ్యాన్ని ముందే స్టాక్‌ను ఎత్తి వేయడం గమనార్హం. -
12వ పీఆర్సీ వెంటనే నియమించాలి
● పెన్షనర్ల అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం ఒంగోలు సబర్బన్: ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని నియమించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బోడా అంకిరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీని నియమించి ఐఆర్‌ను 30 శాతం ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో రెండింటిని వెంటనే ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ అలవెన్స్, 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే విడతల వారీగా చెల్లించాలన్నారు. అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఈహెచ్ఎస్ కార్డుపై అన్ని వ్యాధులకు క్యాష్‌లెస్ వైద్యం అందించాలని, మెడికల్ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి కె.సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పొన్నలూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని పొన్నలూరు పోలీసులు మూడు రోజుల కిత్రం పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీసులు గత శనివారం ముత్తరాసుపాలెం సమీపంలోని ముప్పాళ్ల అడ్డరోడ్డు వద్ద ఓవీ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తేండగా కనిగిరి నుంచి కందుకూరు వైపు మినీ ట్రక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని సోమవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై అనూక్ తెలిపారు. అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంబంధిత వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేశారు. బియ్యం బస్తాలను స్థానిక రేషన్ షాపుకు తరలించారు. వెలిగండ్ల(కనిగిరిరూరల్): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని గోకులంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన ఎన్ సుజాత (35) ఇంట్లో ఎవ్వలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణపావని సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కంభం: కాలువలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం కంభంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని పెద్దనల్లకాల్వ గ్రామానికి చెందిన బోధనం రవిశేఖర్ ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ తన కుమారుడు అశ్వంత్(12)ను పొలం పక్కనే పంట కాలువ గట్టుపై కూర్చొపెట్టాడు. కొద్ది సేపటి తర్వాత చూడగా పిల్లవాడు కనిపించకపోవడంతో పిల్లవాడు ఫిట్స్ వచ్చి కాలువలో పడిపోయినట్లు గుర్తించి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. చనిపోయిన బాలుడి స్థితి మానసికంగా బాగాలేదని తెలిసింది. -
ప్రకృతి పరిరక్షణ
పులుల సంరక్షణ.. మార్కాపురం: పర్యావరణ సమతుల్యతలో పులులు ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటిని రక్షించుకోవడం ద్వారా పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోగలం. జీవవైవిధ్యం దెబ్బతింటే మనిషి ఉనికికే ప్రమాదంగా మారుతుంది. ఈ క్రమంలో ఏటా అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే పులులు వాటి జీవనశైలిపై ప్రత్యేక కథనం. పెద్దపులల రక్షణకు ప్రత్యేక దృష్టి దేశంలోనే అతిపెద్దదైన నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టులో 87 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా వేశారు. నల్లమల అటవీ ప్రాంత పరిధిలో ఉండే మార్కాపురం, ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల పరిధిలో పెద్దపులుల రక్షణకు ప్రత్యేక టాస్క్ఫోర్సు ఏర్పాటుచేశారు. నల్లమల పరిధిలోని 4 అటవీశాఖ డివిజన్లకు ప్రస్తుతం డీఎఫ్ఓ స్థాయి అధికారులు ఉన్నారు. మార్కాపురం అటవీశాఖకు డిప్యూటీ డైరెక్టర్ హోదా అధికారి పర్యవేక్షిస్తున్నారు. వీరి పరిధిలో డీఆర్ఓలు, రేంజ్ ఆఫీసర్లు, బీటు ఆఫీసర్లు, గార్డులు వీరితో పాటు ప్రత్యేక బృందాలు పులుల సంరక్షణ కోసం పనిచేస్తున్నారు. మొత్తం 295 మంది సిబ్బంది పులుల సంరక్షణలో ఉన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో 32 బేస్‌క్యాంపులు ఏర్పాటుచేశారు. అటవీ ప్రాంతం మొత్తాన్ని 7 రేంజ్‌లుగా విభజించి 7 స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటుచేశారు. అతిపెద్ద టైగర్ రిజర్వు మార్కాపురం డివిజన్ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, మాచర్ల, నాగార్జునసాగర్ ప్రాంతాలున్నాయి. వీటి పరిధిలో 87 పెద్దపులులు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏకై క టైగర్ రిజర్వు అయిన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు 5360.22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా గుర్తింపు పొందింది. ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ, సహజసిద్ధమైన గొప్ప జీవ వైవిద్యాల ప్రాంతంగా నల్లమలకు గుర్తింపు వచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణానది సుమారు 200 కిలోమీటర్ల పొడవునా ఈ రిజర్వులో ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్టీఆర్ (నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్టు) లో 87 పెద్దపులులు ఉన్నాయి. పెద్దపులులు దక్షిణాది వైపు సంచరిస్తూ శేషాచలం బయోస్పియర్ రిజర్వులో తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు వన్యప్రాణ వేట నిరోధక శిబిరాలను ( యాంటీ పోచింగ్ క్యాంప్)ఏర్పాటు చేసి 295 మంది సిబ్బందితో పాటు అధనంగా చెంచు గిరిజనులను సంరక్షకులుగా, స్వచ్ఛ సేవకులుగా చెక్‌పోస్టులో, అటవీ ప్రాంతాల్లో నియమించారు. పులుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శ్రీలంకామల్లేశ్వర వన్యప్రాణ అభయారణ్యం, పెంచల నరసింహ వన్యప్రాణుల అభయారణ్యం, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ మూడు ప్రాంతాలు సుమారు 9335.78 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి భవిష్యత్‌లో పులులు తమ ఆవాసాలను ఏర్పరుచుకునే వాతావరణానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నల్లమలలో ఇప్పటికే 32 బేస్ క్యాంపులు ఏర్పాటుచేశారు. 2022లో ఏడాది దాదాపు 73 పెద్ద పులులు ఉండగా, గత ఏడాది ఈ సంఖ్య 80కి పెరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు 87కి చేరింది. పులుల సంరక్షణకు తీసుకునే చర్యలతో పులుల సంఖ్య పెరుగుతోంది. గత మూడేళ్లుగా అటవీ ప్రాంతంలో గడ్డి పెంపకం వల్ల పొదలు ఏర్పడ్డాయి. జింకలు, దుప్పుల సంఖ్య పెరిగింది. వీటి వలన పెద్దపులుల సంఖ్య కూడా పెరిగింది. బేస్ క్యాంపుల ఏర్పాటు.. అటవీ ప్రాంతంలో ఉన్న టైగర్ వాచర్స్ నిరంతరం అడవిలో తిరుగుతూ పులుల సంరక్షణపై దృష్టి పెట్టి పులుల కదలికలను ట్రాక్ చేస్తారు. సీసీ కెమెరాల ద్వారా పెద్దపులుల కదలికలను పరిశీలిస్తుంటారు. పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, నారుతడికల, పాలుట్ల, ఇష్టకామేశ్వరీ, దొరబైలు, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, చినమంతనాల, రోళ్లపెంట, కొర్రపోలు, తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో అటవీశాఖ సిబ్బంది ఉంటారు. అడవిలోకి ఎవ్వరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక రాత్రిపూట శ్రీశైలం వెళ్లే ప్రయాణికులను దోర్నాల చెక్‌పోస్టు వద్ద రాత్రి 9 గంటలకే నిలిపి వేస్తున్నారు. తెలంగాణ ప్రాంత నుంచి వచ్చే వాహనాలను కూడ ఈగలపెంట వద్ద 9 గంటలకు నిలిపి వేస్తున్నారు. ఇలా చేయటం వల్ల రాత్రిపూట పెద్దపులులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది. నల్లమలలో సంచరిస్తున్న పెద్దపులి -
ఉరుములు, మెరుపులతో బెంబేలు
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని తీర ప్రాంత మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి మొత్తం పెద్ద శబ్దాలతో ఉరుములు, మెరుపులతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత మండలాలతో పాటు వాటికి ఆనుకొని ఉండే మండలాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. కొత్తపట్నం మండలంలో 72.4 మిల్లీ మీటర్లు, చీమకుర్తి 72 మిల్లీ మీటర్లు, ఒంగోలు రూరల్ 62.6, ఒంగోలు అర్బన్ 62.6, మద్దిపాడు 48.8, నాగులుప్పలపాడు 40.6, సంతనూతలపాడు 39.8, టంగుటూరు 33.6, మర్రిపూడి 26 మి.మీ, పొదిలి, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో వర్షం కురిసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. ఒంగోలు నగరంతో పాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. తీర ప్రాంత మండలాలలోని పలు గ్రామాల్లో కూడా ఉదయం 8 గంటలకు వరకు కూడా విద్యుత్ సరఫరా చేయలేదు. ఒంగోలు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకు తీసి 10 గంటలకు విద్యుత్‌ను ఇచ్చారు. ఒక పక్క ఉరుములు, మెరుపులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే విద్యుత్ లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఒంగోలు నగరం, పరిసరాల్లో పిడుగులు, కుండపోత వాన మరోపక్క విద్యుత్ కోతలతో ప్రజల అవస్థలు నగర వీధులు జలమయం -
టీడీపీలో రేషన్ బియ్యం.. కయ్యం
సాక్షి నెట్వర్క్, ఒంగోలు: రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా రెండు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుల మధ్య చిచ్చుపెట్టింది. చివరకు వివాదంగా మారింది. ఆ వివరాలు... కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం కె.అగ్రహారం రేషన్ షాపు నుంచి 53 బస్తాల బియ్యాన్ని కావలి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు ఈ నెల 3న అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కొండపిలోని అన్ని మండలాల్లో డీలర్ల నుంచి రేషన్ బియ్యం కేజీ రూ.20 చొప్పున కొని తీసుకెళ్తున్నారు. అయితే, కొండపిలో రేషన్ బియ్యం అక్రమ దందాను మంత్రి లోకేష్‌కు సన్నిహితంగా ఉండే, నామినేటెడ్ పోస్టులోని నాయకుడు నడిపిస్తున్నారు. ఆయన అనుచరులు సింగరాయకొండ కేంద్రంగా రేషన్ మాఫియా సాగిస్తున్నారు. దీనికిగాను ఆ యువ నేతకు నెలకు రూ.25 లక్షలను ఓ రైస్ మిల్లు యజమాని అందజేస్తున్నట్లు సమాచారం. డీలర్లు కార్డుదారులకు బియ్యం బదులు నగదు ఇస్తూ భారీగా బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. డీలర్ నుంచి కిలో రూ.15– రూ.16కు కొండపి నేత అనచరులు కొంటున్నారు. 12 వేల బస్తాల రేషన్ బియ్యం నెలనెలా అక్రమంగా రవాణా అవుతోంది. అయితే, కావలి నేత అనుచరులు కేజీకి రూ.20 ఇస్తుండటంతో డీలర్లు వారివైపు మొగ్గుచూపారు. ఇది కొండపి నియోజకవర్గ నేతకు వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలా ఎందుకు జరిగింది? అని ఆయన ఆరా తీయగా... కావలి టీడీపీ నాయకుల దందా బయటపడింది. దీంతో పొన్నలూరు మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులకు ఉప్పందించారు. వారు వెళ్లి వాహనాన్ని పట్టుకున్నారు. ఆయన పోలీసులకు పట్టించారు.. ఈయన కేసు వద్దన్నారు తన అనుచరుల బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్టపడడంతో వెంటనే కావలి ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. కొండపి నుంచి రాష్ట్ర స్థాయి కీలక పదవిలో ఉన్న నాయకుడికి ఫోన్ చేశారు. కేసు లేకుండా తమవాళ్ల వాహనాన్ని వదిలేయాలని కోరారు. కేసులు పెడితే మీ బియ్యం లారీలు మా నియోజకవర్గం మీదుగా వెళ్లలేవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొండపి కీలక నాయకుడు.. కేసులు పెట్టవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చారు. కానీ, నామినేటెడ్ పదవిలో ఉన్న నేత కల్పించుకుని కేసులు పెట్టాలని పట్టుబట్టారు. ఈ పరిస్థితిలో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు, శ్ఙ్రీరేషన్ బియ్యం అక్రమ రవాణా సమాచారం మేరకు వెళ్లి వాహనాన్ని పట్టుకున్నాం. అందులో గోతాలు, పట్టాలే ఉన్నాయి. వాహనాన్ని స్టేషన్‌కు తరలించాంశ్రీశ్రీ అని వెల్లడించారు. కానీ, రేషన్ దందా బట్టబయలవడంతో ఎస్సై అనూక్ సోమవారం వివరణ ఇచ్చారు. ముప్పాళ్ల అడ్డరోడ్డు వద్ద తనిఖీల్లో 40 బస్తాల బియ్యాన్ని పట్టుకుని ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించామన్నారు. కేసు పెట్టామని చెప్పారు. శుక్రవారం పట్టుకున్న బియ్యానికి సోమవారం కేసు నమోదు, వాహనంలో బియ్యమే లేవని చెప్పి ఇప్పుడు 40 బియ్యం బస్తాలు పట్టుకున్నామని చెప్పడం గమనార్హం. మరోవైపు రేషన్ బియ్యం కె.అగ్రహారం నుంచి రవాణా అవుతుంటే... కనిగిరి వైపు నుంచి వస్తుండగా ముప్పాళ్ల అడ్డరోడ్డు వద్ద పట్టుకున్నామనడంతో ఏంజరిగిందో తెలిసిపోయింది. కొసమెరుపు ఏమంటే... ఆదివారం కావలి టీడీపీ నేతలు కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలంలో 80 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు పెట్టారు. -
సమాచార హక్కు చట్టంతో పారదర్శకత
ఒంగోలు సబర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత పెరుగుతుందని సేంద్రియ వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ వి.సుభాషిణి అన్నారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆ విభాగం అధికారులు, సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ ప్రతి పౌరుడు తనకు అవసరమైన సమాచారాన్ని పొందడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను ప్రోత్సహించవచ్చని చెప్పారు. క్యాడర్ సభ్యులు గ్రామస్థాయిలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, ప్రజలకు అవగాహన పెంపు గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా టీమ్ సభ్యులు, క్లస్టర్ కో ఆర్డినేటర్లు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు: ౖబెక్ చోరీ కేసులో నిందితునికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఒంగోలు ఎకై ్సజ్ మేజిస్ట్రేట్ ఎస్ కోమలవల్లి సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2022 ఆగస్టు 14వ తేదీ రాత్రి 10 గంటలకు సంతనూతలపాడు ఎన్ఎస్పీ కాలనీ నివాసి మందాడి సత్యన్నారాయణ తన ఇంటిముందు బైక్ పార్కు చేసి నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం బైక్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఒంగోలు జయప్రకాష్ కాలనీకి చెందిన మోటా నవీన్‌గా గుర్తించి ఆగస్టు 18న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ నవీన్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించారు. నిందితులకు శిక్ష పడడంలో కృషి చేసిన ఏపీపీ శ్రావణ్‌కుమార్, సంతనూతలపాడు ఎస్సై అజయ్‌బాబు, కోర్టు కానిస్టేబుల్ కె.వెంకట్రావులను ఎస్పీ హర్షవర్థన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు. సేంద్రియ వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ సుభాషిణి -
గోవిందయ్య జోలికి వెళ్తే ఊరుకోం
● మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సాక్షి, అమరావతి: గంగాధర నెల్లూరు అంబేడ్కర్ విగ్రహం కాలిపోయిన ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడైన గోవిందయ్యను విచారణ పేరుతో నిర్బంధించడాన్ని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఆయన జోలికి వచ్చినా .. గోవిందయ్యపై కేసులు బనాయించిన చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు సెగ్మెంట్ పరిధిలో వెదురుకుప్పం మండలం బొమ్మాయపల్లి పంచాయతీ దేవళంపేట అనే గ్రామంలో తమ పార్టీకి సంబంధించిన గోవిందయ్య, 2023 సంవత్సరంలో 10 అడుగుల అంబేడ్కర్ విగ్రహం స్థాపించారు. సర్పంచిగా ఉండి అనేక మంచి పనులు చేసిన ఆయనకు టీడీపీ నాయకుడు సతీష్ నాయుడుతో రాజకీయపరమైన వైరం ఉంది. ఈ విగ్రహం పెట్టే రోజు కూడా సతీష్ నాయుడు అడ్డుకోబోయాడు. విగ్రహం పెట్టడానికి వీల్లేదని పెట్టనీకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. విగ్రహ స్థాపన రోజు నుంచి ఆ విగ్రహాన్ని ఏవిధంగా తొలగించేందుకు సతీష్ నాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సొంత నియోజకవర్గం ఇది. స్థానిక ఎమ్మెల్యే థామస్ అండతోనే ఈ ఆరాచకాలు చేస్తున్నాడు. గురువారం అర్థరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చివేశారు. విగ్రహం పెట్టినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ మూకలు ఏవిధంగా నైనా ఆ విగ్రహాన్ని తొలగించాలని కుట్రతో ఈ ఘటనకు పాల్పడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈ దారుణం జరిగింది. బాబుకు మొదటి నుంచి దళిత వ్యతిరేక విధానం ఉంది. టీడీపీ అమలు చేసిన పథకాల వల్ల దళిత సమాజానికి ఎలాంటి మేలు జరగటం లేదు. విగ్రహం తగుల బెట్టించింది కాక గోవిందప్ప ఇంటిపై పోలీసులు దాడి చేసి, నీవే తగులబెట్టావ్ అని ఒప్పకో కేసులు లేకుండా చేస్తాం అంటున్నారు. సర్పంచ్‌ని అలా బెదిరిస్తే చూస్తూ ఊరుకోము. చంద్రబాబును గద్దెదింపే దాకా ఈ దళిత సమాజం నిద్రపోదు. సీసీ టీవీ పుటేజీ తీయండి. నిజనిర్ధారణ చేయండి. అసలైన నిందితుడిని పట్టుకోవాలని’’ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
మార్కాపురం: మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా నాయకుడు దగ్గుబాటి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి అనంతరం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ మార్కాపురం రెవెన్యూ డివిజన్లో వేలాది ఎకరాల్లో రైతులు విరివిగా పత్తిని సాగు చేశారని, గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాల్లో ప్రైవేట్ పత్తి వ్యాపారులు ప్రవేశించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. మార్కాపురం మార్కెట్‌యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా రూ.8,110లుగా ప్రకటించినా ఒక్క క్వింటా కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదన్నారు. ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని కోరారు. గ్రామాల్లో క్వింటా పత్తిని రూ.5,500 నుంచి 6,500 మధ్యనే కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతు సంఘం నాయకులు జి రాజశేఖర్‌రెడ్డి, ఏరువ పాపిరెడ్డి, డి.తిరుపతిరెడ్డి, రైతులు లక్ష్మినాయక్, కాశిరెడ్డి, వెంకట రమణ, నాగేశ్వరరావు, ఓర్సు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన -
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల వేదికకు ఎంతో నమ్మకంతో వస్తున్న బాధితుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి 66 ఫిర్యాదులు వచ్చాయి. బాఽధితులతో ఎస్పీ నేరుగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్య పూర్వాపరాలను అడిగి తెలసుకొని ఆయా పోలీసుస్టేషన్ అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చేవారిలో వృద్ధులు, నడవలేనిస్థితిలో ఉన్న మహిళలు వస్తుంటారని, అలాంటి వారి సమస్యలను సావదానంగా విని వారికి సత్వర న్యాయం అందిస్తామన్న భరోసా ఇవ్వాలని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు స్థానిక పోలీసుస్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్లలో ఫిర్యాదులను అందజేయాలని చెప్పారు. కార్యక్రమంలో పీసీఆర్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, పామూరు సీఐ బీమానాయక్, కంభం సీఐ మల్లికార్జునరావు, మీకోసం వేదిక ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు. -
కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి
ఒంగోలు వన్‌టౌన్: కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ కోరారు. ఆదివారం ఒంగోలు వచ్చిన ఆయన ప్రకాశం జిల్లా కాపు సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దొమ్మరులను గిరి బలిజగా మారుస్తూ ఇచ్చిన జీఓను స్టేటస్ కో ఇచ్చారన్నారు. దశాబ్ద కాలంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్ పెండింగ్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రకటన చేయాలన్నారు. కాపు సమస్యలు అనేకం పరిష్కారం కాకుండా ఉంటే, ప్రభుత్వ పెద్దలు నూతన సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. జనాభా దామాషా ప్రకారం కాపులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షుడు కే సంజీవ్ కుమార్, పీ రాజ్య సులోచన, ఎన్ హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు. -
సీనరేజి వసూలును ప్రైవేటుకు అప్పగించొద్దు
చీమకుర్తి రూరల్: గ్రానైట్ సీనరేజి వసూలు బాధ్యతను ప్రైవేటు సంస్థ అయిన ఏఎంఆర్ కు కేటాయించడాన్ని రద్దు చేయాలని ఎడ్జ్ కటింగ్ యూనిట్ల యూనియన్ అధ్యక్షుడు బూర్సు వెంకట కొండయ్య డిమాండ్ చేశారు. రామతీర్థంలోని వీటీసీ కార్యాలయంలో ఎడ్జ్ కటింగ్ యూనిట్లు నడుపుతున్న యజమానులు ఆదివారం సమావేశమయ్యారు. గ్రానైట్ పరిశ్రమల యజమానుల సమ్మెకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఫ్యాక్టరీలు మూతపడే స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు గ్రానైట్ పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఉండాలే కానీ, గ్రానైట్ పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మార్చేలా ఉండకూడదన్నారు. ఎడ్జ్ కటింగ్ వంటి చిన్న కుటీర పరిశ్రమలపై ఆధారపడి సుమారు వెయ్యి నుంచి 2 వేల మంది బతుకుతున్నారన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే తమ జీవితాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రానైట్ పరిశ్రమలను సంక్షోభం నుంచి బయటపడేలా రాయితీలు ఇవ్వాలని, కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎడ్జ్ కటింగ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఐనీడి బుల్లియ్య, చంద్ర, శివ పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహ దహనం హేయం
● వైఎస్సార్ సీపీ ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున సంతనూతలపాడు: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఆమేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై నిత్యం దాష్టీకాలేనని, దీనిలో భాగంగానే చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన టీడీపీ నేత సతీష్ నాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితుల గ్రామ బహిష్కరణలు, అంబేడ్కర్ విగ్రహాలకు అపచారం నిత్య కృత్యమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితద్రోహిగా చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. అంబేడ్కర్ భావజాలాలపై టీడీపీ ఆది నుంచి విషం చిమ్ముతోందని మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవం నిలబెట్టడానికి అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున విలువైన స్థలంలో రూ.450 కోట్లతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని చూసి తట్టుకోలేక స్మృతి వనంలో లైటింగ్ తీసివేయించారని ఆరోపించారు. ఒంగోలు టౌన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోనే పేద ప్రజలకు వైద్యం లభిస్తుందని, వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడమంటే పేద ప్రజలకు వైద్యాన్ని తిరస్కరించడమేనని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యను, ప్రజారోగ్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించే ఆలోచనలను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరగదని, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చే విధానాలను మానుకోవాలని కోరారు. జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.వెంకటరావు, జి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీ సహా రాష్ట్రంలోని ఇతర మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీ మార్కాపురం ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావు, ప్రముఖ వైద్యులు, వైద్యరంగ నిపుణులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జేవీవీ నాయకులు ఏవీ పుల్లారావు, కుర్రా రామారావు, సీహెచ్ జయప్రకాష్, డాక్టర్ దార్ల బుజ్జిబాబు, యు.భాస్కర్, డీఎల్ ప్రసాద్, ఎన్టీ వెంకటేశ్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు వన్‌టౌన్: అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని అరెస్టు చేయాలని ఐఎల్పీ అధ్యక్షుడు డీ సుందరరావు డిమాండ్ చేశారు. ఒంగోలు మంగమూరు డొంకలోని అంబేడ్కర్, పూలే, బుద్ధ విగ్రహాలకు ఆదివారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం దేవళంపేట గ్రామంలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో కే వరప్రసాద్, డీ సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. -
పులి సంచారంపై అటవీ అధికారుల విచారణ
వెలిగండ్ల (కనిగిరి రూరల్): నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లి, వెదుళ్ల చెరువు, గుడిపాటి పల్లి బీట్ అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారం రోజుల క్రితం మరపగుంట్ల పొలాల్లో పులి తిరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఆప్రాంతంలో పాద ముద్రల నమూనాలను సేకరించి.. అవి పెద్దపులి ఆనవాళ్లు కాదని తెలిపారు. చిరుత పులి, లేదా జంగుపిల్లి పాద ముద్రలు అయి ఉండవచ్చునని నిర్ధారించారు. తాజాగా శనివారం రాత్రి ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి (శివారు ప్రాంతాల్లోని) గ్రామాల్లోని పొలాల్లోకి రాత్రి పది గంటల సమయంలో పులి రోడ్డు దాటుతుండటాన్ని బైక్ పై వెళ్తున్న జీ వెంకటయ్య చూసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈమేరకు ఫారెస్ట్ రేంజర్ తుమ్మా ఉమా మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గుడిపాటిపల్లి, సీఎస్‌పురం బీట్ సెక్షన్ అధికారులు దొరసాని, నవీన్, నాయక్‌లు ఆయా ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. వన్యప్రాణుల ఆనవాళ్లు, పాద ముద్రల నమూనాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి తుమ్మ ఉమా మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ కనిగిరి ఫారెస్ట్ ప్రాంతంలో టైగర్ పెద్ద పులులు లేవని తెలిపారు. చిరుత లేదా, జంగుపల్లి ఆనవాళ్లుగా తెలుస్తోందన్నారు. పొలాల్లో సంచరిస్తున్న వన్యప్రాణులను నిర్ధారించేందుకు నాగిరెడ్డిపల్లి, వెదుళ్ల చెరువు బీట్ ప్రాంతాల్లో ‘కెమెరా ట్రాప్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొండ కింద గ్రామాల ప్రజలు రాత్రి వేళ ఆరు బయట పడుకోవద్దని, పొలాలకు, పశువుల మేతకు ఒంటరిగా అడవి ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. -
దోపిడీ హై..
పరిహారంలో● పొదిలి–తూర్పు గంగవరం హై టెన్షన్ టవర్ల నిర్మాణంలో మాయాజాలం ● రైతులకు పరిహారం చెల్లింపులో నిబంధనలు బేఖాతరు ● రైతులను మోసగించిన ట్రాన్స్ కో, రెవెన్యూ అధికారులు ● హై టెన్షన్ విద్యుత్ లైన్ వెంట 144 ఎకరాల్లో నష్టపోయిన రైతుల గగ్గోలు ● రైతుల సొమ్ము మింగేసిన అధికారులు, కాంట్రాక్టర్లు హైటెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణంలో నష్టపోయే రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఐదు రకాల పరిహారాలు ఇవ్వాల్సి ఉంటే లబ్ధిదారులకు అరకొరగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. పరిహారం చెల్లింపులో తమకు జరిగిన అన్యాయంపై కొందరు రైతులు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడంతో చివరకు ట్రాన్స్‌కో అధికారులు రైతులతో చర్చలకు దిగారు.పరిహారాల్లో లోపం జరిగింది నిజమే.. రైతులకు నష్ట పరిహారం విషయంలో రెవెన్యూ అధికారులతో, రైతులతో చర్చలు జరుపుతున్నాం. ఇటీవల ఒంగోలు ఇన్చార్జ్ ఆర్డీఓ సమక్షంలో ట్రాన్స్ కో అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులతో చర్చించాం. రైతులకు పరిహారాల్లో కొంత లోపం జరిగిన మాట వాస్తవమే. నేను బాధ్యతలు తీసుకోకముందు జరిగిన పరిస్థితులు కొన్ని ఉండవచ్చు. అయితే నేను వచ్చిన తరువాత రైతులతో నేరుగా మాట్లాడుతున్నాను. ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇద్దరు కాంట్రాక్టర్లు మారారు. రైతులకు న్యాయం చేస్తాం. – ఏ.కృష్ణారెడ్డి, ట్రాన్స్ కో ఈఈ పంట పొలాల్లో వేసిన విద్యుత్ టవర్లు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: విద్యుత్ కాంట్రాక్టుల విషయంలో ట్రాన్స్ కో అధికారుల దోపిడీ అంతా ఇంతా కాదు. పెద్ద పెద్ద టవర్లు...హైటెన్షన్ విద్యుత్ లైన్లు పొలాల్లో గుండా పోతుంటాయి. కానీ రైతులకు రావాల్సిన పరిహారాలు ఇవ్వకుండానే అధికారులు, అధికార పార్టీ నాయకులు తినేస్తున్నారు. రైతులకు తెలియక ప్రభుత్వం విద్యుత్ లైన్లు వేస్తుంది మనమేమీ చేయలేమని వదిలేస్తున్నారు. అదే ట్రాన్స్ కో అధికారులకు వరంగా మారి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... పొదిలి–తూర్పు గంగవరం హైటెన్షన్ విద్యుత్ లైను నిర్మాణాన్ని ట్రాన్స్ కో అధికారులు చేపట్టారు. ఏడు సంవత్సరాల నుంచి పనులు చేపడుతున్నా ఇప్పటికీ విద్యుత్ లైన్ నిర్మాణం పూర్తి కాలేదు. ఇద్దరు కాంట్రాక్టర్లు మారారు. మొత్తం రూ.50 కోట్ల నిర్మాణ పనులు. మొదటి కాంట్రాక్టర్ రూ.12 కోట్లు పనులు చేశామని పూర్తిగా పనులు చేయకుండానే చేతులెత్తేశాడు. ఆ తరువాత మరో కాంట్రాక్టర్ రూ.15 కోట్ల వ్యయంతో చేస్తామని పనులు ప్రారంభించాడు. కానీ అదీ కూడా అంతంత మాత్రమే. రైతులకు శఠగోపం... పొదిలి నుంచి తూర్పు గంగవరం వరకు హై టెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణంతో పాటు పెద్ద పెద్ద విద్యుత్ టవర్లు కూడా నిర్మించాల్సి ఉంది. అందుకు సంబంధించి రైతులకు ఐదు రకాలుగా పరిహారాలు చెల్లించాలి. రైతులకు చెల్లించకుండానే చెల్లించామని రూ.10 కోట్లు ఇద్దరు కాంట్రాక్టర్లు, ట్రాన్స్ కో అధికారులు తినేశారన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. పొదిలి నుంచి తూర్పు గంగవరం వరకూ వెళ్లాల్సిన హైటెన్షన్ విద్యుత్ లైను, టవర్ల నిర్మాణంలో 144 ఎకరాలు పొడవునా రైతులు నష్ట పోతున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో రైతుకు పది సెంట్ల మొదలుకొని 30 సెంట్ల వరకు పొలాన్ని కోల్పోతున్నాడు. అంటే మొత్తంగా విద్యుత్ లైన్ కింద మాత్రమే కోల్పోయే రైతులు 144 ఎకరాలు లెక్కల ప్రకారం తేలుతుంది. ఈ 144 ఎకరాలు లెక్కేస్తే మొత్తం రూ.8 కోట్లు అవుతుంది. మొత్తంగా 73 టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ నిర్మాణం, స్థలం ఖరీదు లెక్కేస్తే ఒక్కో టవర్ ఏరియాకు రూ.1.20 లక్షలు రైతులకు ఇవ్వాల్సి ఉంది. మొత్తం కలిపి రూ.87.60 లక్షలు రైతులకు పరిహారంగా ఇవ్వాలి. దానికి తోడు పంట నష్టం మొత్తం 500 ఎకరాల్లో జరుగుతుంది. పంట నష్టం కింద ప్రభుత్వం విడుదల చేసిన జీఓల ప్రకారం ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంది. అంటే మొత్తం రూ.2.50 కోట్లు ఇవ్వాలి. మొత్తంగా 73 టవర్లు నిర్మించాల్సి ఉంటే వాటి నిర్మాణ సమయంలో చుట్టూ 50 మీటర్లు పొలాన్ని వాడుకుంటారు. పంట ఉన్నా ధ్వంసం చేసిమరీ వాడుకున్నారు. ఆ విధంగా చూస్తే 73 టవర్లకు ఒక్కోటవర్ కింద రైతుకు మరో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంది. అన్నీ కలిపి దాదాపు రూ.12 కోట్ల వరకు ఉంటుంది. తమకు నిబంధనల మేరకు పరిహారం అందలేదని పది మంది రైతులు నెల రోజుల క్రితం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమాల విషయం వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు మరికొంత మంది రైతులకు కూడా పూర్తిస్థాయిలో పరిహారం దక్కలేదని తెలుస్తోంది. అక్రమాల వెనుక రెవెన్యూ అధికారుల పాత్ర... సాధారణంగా ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి పరిశ్రమలకై నా, విద్యుత్ లైన్లకై నా భూములు కావాలంటే రెవెన్యూ అధికారులు సర్వే చేయాల్సి ఉంది. రైతులను గుర్తించాలి. వాళ్లకు నోటీసులు ఇవ్వాలి. ఆ తరువాత వాళ్ల వద్ద నుంచి ఆధార్ కార్డులు, వాళ్ల బ్యాంకు అకౌంట్లు తీసుకోవాలి. రైతులు ఇష్ట పడితేనే వాళ్లకు రావాల్సిన ఐదు రకాల నష్ట పరిహారాలు వాళ్ల బ్యాంకు అకౌంట్లలో పరిహారం జమ చేయాలి. అయితే ట్రాన్స్ కో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క 73 టవర్లు నిర్మాణంలో ఉన్న రైతులకు మాత్రమే రూ.30 వేల నుంచి రూ.65 వేల వరకూ వేశారు. అంటే ఇక్కడ కూడా నిబంధనలు పాటించలేదు. ట్రాన్స్ కో, రెవెన్యూ అధికారులు కూడబలుక్కొని రైతులకు చెందాల్సిన సొమ్ముకు వాటాలు వేసుకున్నారు. అసలు ఈ విద్యుత్ లైన్ కింద ఎంత మంది రైతులు ఉన్నారు. వాళ్లకు ఎంతమేర నష్ట పరిహారం ఇచ్చామని ట్రాన్స్ కో అధికారులు కూడా లెక్కలు బయట పెట్టడం లేదంటే రైతుల సొమ్ము ఎంత దోచుకున్నారో అర్థమవుతోంది. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
ఒంగోలు టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సిగ్గుచేటని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ తీవ్రంగా విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ హాలులో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన 17 మెడికల్ కళాశాలలు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం నిర్మాణాల కోసం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం అభ్యంతరకరమన్నారు. పీపీపీ పేరుతో సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ వినోద్ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన యూనివర్శిటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీలను నిర్మించలేదని, మార్కాపురానికి కేటాయించిన వైద్య కళాశాలను నిర్మాణం పూర్తిచేయకుండా పీపీపీ పేరుతో సొంత వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్కాపురం వైద్య కళాశాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని సీపీఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడం భావ్యం కాదని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేగ్ విమర్శించారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు మోహన్, సీపీఐ నాయకులు ఎంఏ సాలార్, ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు కార్తీక్, ప్రగతిశీల యువజన సంఘం నాయకులు సుధాకర్, పీడీఎస్‌యూ నాయకులు సచిన్, ప్రేమ్, సామాజిక కార్యకర్త శివరామ్ తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న మట్టి దొంగలు
పామూరు: ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, చెరువులను వదలకుండా కూటమి నేతలు యథేచ్ఛగా మట్టిని జేసీబీలతో తవ్వించి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. మండలంలోని అనుములకొండ సమీపంలో చింతలపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన పొలాల్లో కొన్ని రోజులుగా జేసీబీ, ట్రాక్టర్లతో కూటమి నాయకులు పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో నూతనంగా వేస్తున్న లేఅవుట్ల రోడ్లకు, నూతన భవనాల నిర్మాణాల పునాదుల కోసం తరలిస్తున్నారు. ఈప్రాంతంలో ఉన్న మరసమట్టి మేలురకం కావడంతో ట్రాక్టర్ రూ.650 నుంచి రూ.800 దాకా పలుకుతోంది. ఇంత జరుగుతున్నా అటు పంచాయతీ కార్యదర్శులుగానీ, వీఆర్ఓలు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా 167బి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దూబగుంట్ల చెరువులో ఇటీవల కూటమి నాయకులు డోజర్, జేసీబీలను పెట్టి మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కన ఇలా తవ్వకాలు చేపడుతున్నారంటే అధికార బలంతోనే కూటమి నాయకులు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఆగని తవ్వకాలు: ఇటీవల మండలంలోని దూబగుంట్ల చెరువులో మట్టి తవ్వకాలను అధికారులు అడ్డుకుని జేసీబీ, ట్రాక్టర్ యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా దూబగుంట్లలో తవ్వకాలు ఆపేసి మరో ప్రాంతంలో తవ్వకాలకు తెరలేపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేఅవుట్లలో చదునుకోసం, రోడ్ల నిర్మాణానికి వందల సంఖ్యలో ట్రాక్టర్ల మట్టి అవసరమవుతుండగా దీనిని అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు
ఒంగోలు టౌన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఆదివారం పోలీసులు విస్తృతంగా దాడులు చేశారు. ఒంగోలు తాలూకా, సంతనూతలపాడు, సింగరాయకొండ, జరుగుమల్లి, మార్కాపురం, మర్రిపూడి, మార్కాపురం రూరల్, కనిగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి 55 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి 93,630 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సింగరాయకొండలో కోడిపందేలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,27,800 స్వాధీనం చేసుకున్నారు. కొండప్రాంతాలు, పొలాల్లో పేకాట శిబిరాలను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి మరీ దాడులు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 47 మందితో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేశారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే వెంటనే 112, పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారం తెలియజేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు కోరారు. మార్కాపురం: మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి శనివారం సాయంత్రం తన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా కోలభీమునిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బోయలపల్లి పోలిరెడ్డి దూషించడంతోపాటు అధికారిక విధులను ఆటంక పరిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సైదుబాబు తెలిపారు. -
తాడిపత్రి డేరా బాబావి.. ఒంగోలులో ఏం పీకుతావు జేసీ!: టీడీపీ నేత ఫైర్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉండి ఒంగోలుకు వచ్చి ఏమి పీకుతావు జేసీ ప్రభాకరరెడ్డి’.. అంటూ ఒంగోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌రెడ్డి(Surya Prakash) మండిపడ్డారు. ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేసీ ఫోన్‌చేసి తనను బెదిరించారని శనివారం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి వెల్లడించారు.ఆయన ఏమన్నారంటే.. జేసీ ప్రభాకరరెడ్డి(Prabhakar Reddy) శుక్రవారం సాయంత్రం ఫోన్‌చేసి ఒంగోలులోని 148 సర్వే నంబరులోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వాళ్లకు ఆ స్థలం అప్పగించాలంటూ నన్ను బెదిరించాడు. నీ స్థలంలోకి నా మనుషులు వస్తారు.. నువ్వక్కడ లేకుంటే నీ ఇంటికి వస్తారు. సెటిల్ చేసుకో. లేకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నుంచే ఎత్తుకు వస్తారు అని బెదిరించాడు. గలీజు మాటలు, బండ బూతులు, మీడియా ముందు చెప్పుకోలేని పదజాలం వాడాడు. గడ్డం బాబా మాదిరిగా తాడిపత్రిలో పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి ఒక డేరా బాబా మాదిరిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. జేసీ ప్రభాకర్‌రెడ్డీ.. అనంతపురం జిల్లాలో, తాడిపత్రిలో చేసినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు, బెదిరింపులు ఒంగోలులో చేస్తే చెల్లవు. నువ్వూ టీడీపీ నాయకుడివే. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌వి. తాడిపత్రిలో ఉన్న మురుగు సంగతి చూసుకో. అక్కడ మురుగు కంపుకొడుతోంది. దానిని కడుక్కోలేని నువ్వు ఒంగోలుకు వచ్చి పీకేది ఏంది? అంటూ ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు టీడీపీలో(TDP) కొత్త ట్విస్ట్ ఇచ్చాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
కొండపోరంబోకులు
గిద్దలూరు రూరల్: గిద్దలూరు మున్సిపల్ పరిధిలోని కొండపోరంబోకు స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. అధికార టీడీపీ నేతలకు ప్రభుత్వ భూములు మేతగా మారుతున్నాయి. పట్టణంలోని హోసన్న మందిరం వైపు ఉండే కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాలను టీడీపీ నాయకులు అధికారం బలంతో ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పట్టణంలోని రాజానగర్, నల్లబండబజారు, కొండపోరంబోకు స్థలాల్లో పెద్ద ఎత్తున లేఔట్లు వేసి పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆ ప్రదేశాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం అటు వైపు అడుగులు వేయకపోగా ఉన్న కొద్ది పాటి స్థలాలు ఆక్రమణలకు గురవుతుంటే చూస్తూ ఉండిపోయింది. హోసన్న మందిరం వైపు ఉన్న కొండపోరంబోకు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా రెవెన్యూ శాఖ బోర్డు పెట్టింది. కొండపోరంబోకు స్థలాలు ఎవరూ కొనరాదు, అమ్మరాదు, ఇంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆ బోర్డులో పేర్కొన్నారు. ఈ ప్రకటన ఉల్లంఘించిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. చివరకు హెచ్చరిక బోర్డును ఆనుకుని కొన్ని అక్రమ నిర్మాణాలు జరిగాయి. హెచ్చరిక బోర్డుకు కూతవేటు దూరంలో ఇటీవల ఓ టీడీపీ నాయకుడు అధికారుల అండదండలతో సుమారు 20 స్లెంట్ల స్థలాన్ని పొక్లెయిన్‌తో చదును చేయించాడు. సదరు స్థలంలో రాతి కట్టడం కట్టాడు. ప్రభుత్వ స్థలాలు అప్పన్నంగా కాజేస్తున్నా వారి పేరు మీదు ఎలాంటి నోటీసులు లేదా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎటువంటి రాజకీయ అండదండలు లేని నిరుపేదలు ఆక్రమణలు జరిపిన వారికి మాత్రం నోటీసులు జారీ చేస్తూ కట్టడాలను అడ్డుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఏకంగా గృహాలే నిర్మాణం పట్టణంలోని రాజానగర్, హోసన్న మందిరం, నల్లబండ బజారు, శ్రీరామ్‌నగర్, నరసింహాస్వామి మెట్లరోడ్డు వైపు ఉండే కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురై వందల సంఖ్యలో గృహ నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణకు పాల్పడిన వారి నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 225 జీఓ ప్రకారం వారి వద్ద ఉన్న ఆధారల మేరకు నగదు చెల్లించుకుని వారి అక్రమ కట్టడాలను రెగ్యులరైజేషన్ చేయాల్సి ఉంది. రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు వేయలేదు. రాజానగర్, హోసన్న మందిరం, నల్లబండబజారు, శ్రీరామ్‌నగర్, నరసింహాస్వామి మెట్లరోడ్డు ప్రాంతాల్లోని కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు చేసి దర్జాగా నివశిస్తున్నా రెగ్యులరైజేషన్లు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. గిద్దలూరు పట్టణంలో భూకబ్జాలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండాపోయింది. కొండపోరంబోకు స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. ఖాళీ జాగా కనిపిస్తే క్షణాల్లో ఏదో ఒక కట్టడం కట్టేస్తున్నారు. అక్రమార్కులు ఇష్జారాజ్యంగా రెచ్చిపోతున్నా ఇదేందని అడిగే వారు లేకుండాపోయారు. ఇటీవల ఓ టీడీపీ నాయకుడు 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి చదును చేయించినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
జవాన్ భూమి కబ్జాకు పచ్చనేతల పన్నాగం
యర్రగొండపాలెం: ఆర్మీ జవాన్‌కు దాదాపు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమిని కబ్జా చేసేందుకు పచ్చనేతలు తహసీల్దార్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూమిని ఆన్లైన్ నుంచి తొలగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం సర్వే నంబర్ 383లో దాదాపు 163.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 86.24 ఎకరాల భూమి సేద్యానికి ఉపయోగపడుతుందని అధికారులు గుర్తించి 2008 అక్టోబర్ 30న పేదలకు భూమిని పంపిణీ చేశారు. అందులో భాగంగా దూదేకుల తంగెళ్ల ఖాశిం 4.70 ఎకరాలు, ఆయన సోదరుడు దూదేకుల ఖాశింకు 3 ఎకరాలు చొప్పున ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుంచి వారు ఆ భూమిలో వివిధ పంటలు పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారిలో తంగెళ్ల ఖాశిం ఆర్మీ జవాన్‌గా, ఖాశిం హైదరాబాద్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కె.ఏడుకొండలు, ఆర్.చిన్నతిరుపాలు ఆ భూములపై కన్నేశారు. 2020లో వారికి ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలపై కొండవాగు పోరంబోకు భూమి అని అభ్యంతరం తెలిపారు. దీనిపై అప్పటి తహసీల్దార్ దర్యాప్తు జరిపి వారికి భూమిని స్వాధీనం చేశారు. తమకు, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ సోదరులు ఇద్దరు ఎస్పీకి అర్జీ పెట్టుకున్నారు. అప్పటి తహసీల్దార్ కూడా వారి కుటుంబంతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి రక్షణ కల్పించాలని త్రిపురాంతకం పోలీస్‌స్టేషన్‌కు లెటర్ పెట్టారు. ఈ విషయంపై పోలీసులు వారిని పిలిపించి హెచ్చరించడంతో వారు మిన్నకుండిపోయారని ఆర్మీ జవాన్ తెలిపాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య మొదటికి వచ్చింది. ఆ భూమిపై కన్నేసిన ఏడుకొండలు, చిన్న తిరుపాలు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అండదండలతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ చీరాల కృష్ణమోహన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఆన్లైన్లో వారి భూములను తొలగింప చేశారు. అంతేకాకుండా ఆర్మీ జవాన్ తండ్రి దూదేకుల జానయ్యపై దాడి చేయించారు. ఈ విషయంపై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టినప్పటికీ నిందితులపై ఎటువంటి చర్య తీసుకోలేదని, కనీసం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మందలించక పోవడంతో వారు మరింతగా రెచ్చిపోయి పొలానికి రక్షణగా వేసుకున్న కంచెను, విద్యుత్ బోరు పరికరాలను ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయులు చేస్తున్న దౌర్జన్యాలపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, ఆయనకు ఇచ్చిన అర్జీని దర్శి డీవైఎస్పీకి పంపారని తెలిపారు. ఎస్పీ ఫార్వర్డ్ చేసిన అర్జీపై డీవైఎస్పీ మాట్లాడుతూ ఇది సివిల్ కేసని, కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని చెప్పారు. సమగ్ర దర్యాప్తు జరపకుండా ఆన్లైన్ తొలగింపు టీడీపీ వర్గానికి చెందిన వారు చేసిన ఫిర్యాదు మేరకు ఎటువంటి విచారణ జరపకుండా తమ భూమిని తహసీల్దార్ ఆన్లైన్ నుంచి తొలగించారని బాధితులు ఆరోపించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏడుకొండలు అతని అనుచరులు తాము అనుభవిస్తున్న భూమిపై అర్జీలు ఇవ్వడం వారితో చీవాట్లు పెట్టించుకోవడం అలవాటైపోయిందని, అధికారం ఉందన్న అహంకారంతో తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టి వారం రోజులు కాకముందే పచ్చ నేతలు హాజరు కావడం, అర్జీ ఇవ్వడం, ఆన్లైన్ నుంచి ఆర్మి జవాన్ అతని సోదరుడి భూమిని తొలగించడం యుద్ధప్రాతిపదికగా జరిగి పోయాయని ఆ గ్రామస్తులు ఆరోపించారు. విచారణ జరపకుండా ఆన్లైన్ నుంచి భూమిని ఏ విధంగా తొలగించావని కలెక్టర్ తహసీల్దార్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అధికార వర్గీయుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటం వలన తాను వారి భూమిని ఆన్లైన్ నుంచి తొలగించాల్సి వచ్చిందని తహసీల్దార్ కృష్ణమోహన్ సమాధానం తెలిపినట్లు తెలిసింది. ఆ భూమిపై కన్నేసి.. డబ్బులు దండుకొని ఆర్మీ సోదరుల భూమిపై కన్నేసిన పచ్చ గద్దలు అర ఎకరం ప్రకారం తమ పేర్లతో ఆన్లైన్ చేయిస్తానని 10 మంది నుంచి డబ్బులు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం ఆ గద్దలు భూమిపై హక్కుపొందిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వాగు పోరంబోకు భూమి అని సాకులు చూపుతున్న రెవెన్యూ అధికారులు ఆ సర్వే నంబర్లో పంపిణీ చేసిన 86.24 ఎకరాల భూమిని పక్కనపెట్టి కేవలం 7.70 ఎకరాలపైనే దృష్టి పెట్టి పచ్చ గద్దలకు ఆహారంగా వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దేశరక్షణ కోసం పాటు పడుతున్న ఆర్మీ జవాన్, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. భూ పత్రాలు చూపినా ఆన్లైన్ నుంచి తొలగింపు పట్టాదారు తండ్రిపై దాడి చేసినా పట్టించుకోని పోలీసులు దౌర్జన్యంగా పొలం ఫెన్సింగ్ తొలగింపు, బోరు ధ్వంసం కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించిన బాధితులు -
గంజాయి ప్రియులకు కౌన్సెలింగ్
ఒంగోలు టౌన్: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 46 మందికి, 9 మంది విక్రేతలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. శనివారం గంజాయి వినియోగిస్తున్న మామిడిపాలెం, కేశవరాజుకుంట, కమ్మపాలెం, ఇందిరమ్మ కాలనీ, గోపాల్ నగర్, మంగమూరు రోడ్డు, భారత్ కాలనీ, నెహ్రూ నగర్, వెంకటేశ్వర కాలనీ, త్రోవగుంట, దిబ్బల రోడ్డు ప్రాంతాలకు చెందిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి విక్రయిస్తున్న మామిడిపాలెం, శివప్రసాద్ కాలనీ, గాంధీనగర్, మదర్‌థెరిసా కాలనీ, పేర్నమిట్ట, వెంకటేశ్వరకాలనీ, ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని ప్రాంతాలకు చెందిన వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వివరించి చెప్పారు. చట్టపరంగా ఎదురయ్యే కష్టనష్టాలను, దాని వలన కలిగే సామాజిక ప్రభావాన్ని వివరించారు. గంజాయి కట్టడికి ప్రజలు సహకరించాలని, ఏదైనా సమాచారం ఉంటే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
అమ్మకానికి ప్రభుత్వ స్థలాలు
పట్టణంలోని నల్లబండబజారు, రాజానగర్, శ్రీరామ్‌నగర్, నరసింహస్వామిమెట్ల రోడ్డు, హోసన్న మందిరం రోడ్డుల్లోని కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో కబ్జాచేసి అక్రమ కట్టడాలు చేపట్టి అమ్మకాలు జోరుగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. కొండపోరంబోకు స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలకు ఇతర సర్వే నంబర్లు వేసి ఆ సర్వే నంబర్లో ఇంటి నిర్మాణం చేపట్టినట్లు మున్సిపల్ శాఖ నుంచి పన్ను రసీదులు పుట్టించుకుని దాని ఆధారంగా అమ్మకాలు కొనసాగిస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. -
రేషన్ బియ్యంపై నిరంతరం నిఘా
నాగులుప్పలపాడు: రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. బాపట్ల నుంచి కృష్ణపట్నం పోర్టుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ స్థానిక పోలీసులకు పట్టుబడిన బియ్యాన్ని శనివారం ఎన్ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్లు నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌లో పరిశీలించారు. 720 బ్యాగుల్లో ఉన్న బియ్యాన్ని ఒంగోలు స్టాక్ కేంద్రానికి తరలించారు. అనంతరం మద్దిపాడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లును పరిశీలించారు. అక్కడ ఎలాంటి పీడీఎస్ రైస్ లేవని స్పష్టం చేశారు. మద్దిపాడు: మండలంలోని గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్సై వెంకట సూర్య అందించిన సమాచారం ప్రకారం.. తిమ్మనపాలెం గ్రామానికి చెందిన అన్నంగి కుమార్ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రోత్ సెంటర్ వైపు నుంచి నాగులుప్పలపాడు రోడ్డుకు వెళ్తుండగా ఒంగోలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఒంగోలు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంగోలు వన్‌టౌన్: ఏసీ, రిఫ్రిజిరేటర్ మరమ్మతులపై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరక్టర్ పీ శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ 30 రోజుల పాటూ ఈ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు 18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలన్నారు. అభ్యర్థులు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. శిక్షణ కాలంలో పూర్తి ఉచిత, భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు 9573363141 అనే నంబరుపై సంప్రదించాలన్నారు. కందుకూరు రూరల్: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఓగూరు సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన పి.భార్గవ్నాథ్ కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై కందుకూరు వచ్చి విధులు ముగించుకొని తిరిగి ఒంగోలు వెళ్తున్నాడు. ఓగూరు సమీపంలోని రవి గార్డెన్ వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ నాన్ స్టాప్ బస్ ఢీకొట్టింది. భార్గవ్నాథ్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కందుకూరు రూరల్ ఎస్సై మహేంద్ర నాయక్ తెలిపారు. -
ఆర్భాటం తప్ప..సాయం అంతంత మాత్రమే
ఒంగోలు సబర్బన్: ఆటో డ్రైవర్ సేవ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంటే జిల్లా కేంద్రం ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమానికి కనీసం 400 ఆటోలు కూడా రాలేదు. జిల్లా వ్యాప్తంగా 11,356 మంది ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమాన్ని అందిస్తుంటే కనీసం 400 ఆటోలు కూడా రాలేదని జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా.. అంటూ మంత్రి మండిపడ్డారు. ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమం శనివారం ఒంగోలులోని మినీ స్టేడియంలో జరిగింది. ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మెగా చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు. అర్హత ఉన్న ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.15 వేలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, కలెక్టర్ పి.రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ, డీటీసీ ఆర్.సుశీల, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి అసహనం లబ్ధిదారులు తక్కువ మంది హాజరు కావడంపై ఆగ్రహం -
కౌశల్ పోటీలను విజయవంతం చేయండి
ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కౌశల్ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని డీఈఓ కిరణ్‌కుమార్ కోరారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కౌశల్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కౌశల్ రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభ అన్వేషణ పోటీల్లో అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. స్కూల్ లెవెల్ పరీక్షలో.. ● క్విజ్ పోటీలకు అర్హత 8, 9, 10వ తరగతి విద్యార్థులు, విద్యార్థుల సంఖ్య తరగతికి ముగ్గురు మాత్రమే ఉండాలి. ● రీల్ పోటీలకు పదో తరగతి విద్యార్థులు పాల్గొనాలి. ● పోస్టర్ కాంపిటీషన్–1 పోటీలకు అర్హత 9వ తరగతి, ఇద్దరు మాత్రమే ఉండాలి. ● పోస్టర్ కాంపిటీషన్–2 పోటీలకు అర్హత 8వ తరగతి, ఇద్దరు మాత్రమే ఉండాలి. క్విజ్, రీల్ కాంపిటీషన్, పోస్టర్ కాంపిటీషన్లో పాల్గొనే విద్యార్థులు స్కూల్ లెవెల్లో ఆన్లైన్ పరీక్ష రాయాలి. పైన తెలిపిన పోటీల్లో పాల్గొనే విద్యార్థులు సిలబస్ కోసం క్విజ్ పోటీలకు ఎస్సీఈఆర్టీ అక్టోబర్ వరకు, రీల్ పోటీలకు ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్ వెబ్ సైట్లో, పోస్టర్ కాంపిటేషన్ పోటీలకు భారత దర్శన్ మెటీరియల్‌లో చూడాలి. స్కూల్ లెవెల్ ఎగ్జామ్‌లో ప్రతి తరగతి నుంచి క్విజ్‌కు 20 మంది విద్యార్థులు, రీల్‌కు 20 మంది విద్యార్థులు, పోస్టర్–1కు 20 మంది విద్యార్థులు, పోస్టర్–2కు 20 మంది విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయికి ఎంపికై న విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష జరుగుతుంది. రాష్ట్రస్థాయికి ప్రతి జిల్లా నుంచి క్విజ్ పోటీలకు ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు ఇద్దరు, 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు పాల్గొంటారు. రీల్ కాంపిటీషన్‌కు 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు, పోస్టర్ కాంపిటీషన్–1కు 9వ తరగతి విద్యార్థులు విద్యార్థులు, పోస్టర్ కాంపిటీషన్–2కు 8వ తరగతి విద్యార్థులు ఇద్దరు ఎంపికవుతారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు వారి విభాగాల్లో ముఖాముఖి పోటీలు జరుగుతాయి. స్కూల్ లెవెల్లో పరీక్షలు 8వ తరగతి నవంబర్ 1, 9వ తరగతి–నవంబర్ 3, పదో తరగతి– నవంబర్ 4వ తేదీల్లో జరుగుతాయి. జిల్లా స్థాయి పరీక్షలు 8వ తరగతి, 9వ తరగతికి నవంబరు 27న, 10వ తరగతికి నవంబరు 28న పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబర్ 27 తిరుపతిలో భారతీయ విజ్ఞాన జాతీయ సమ్మేళనంలో జరుగుతాయని డీఈఓ కిరణ్‌కుమార్ వివరించారు. డీవైఈఓ చంద్రమౌలేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్, గుడివాడ శ్రీనివాసరావు, నాగినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. డీఈఓ కిరణ్‌కుమార్ -
పొగాకు రైతులను ఆదుకోవాలి
ఒంగోలు టౌన్: రైతుల వద్ద ఇంకా 30 శాతం బర్లీ పొగాకు మిగిలిపోయిందని, రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం నిర్వహించిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని, వర్జీనియా పొగాకు లో గ్రేడ్ రకాన్ని రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తగినంత మేర నిధులు కేటాయించి పొగాకును కొనుగోలు చేయకపోతే రైతులు కోలుకోని విధంగా నష్టపోతారని చెప్పారు. ఇటీవల వర్జీనియా నంబర్ పొగాకుకు కాస్త రేటు వచ్చినప్పటికీ అది తాత్కాలికంగా కొనుగోలు చేశారని, తిరిగి మాములు పరిస్థితి నెలకొందని చెప్పారు. లో గ్రేడ్ పొగాకు రేట్లు బాగా పతనమయ్యాయన్నారు. దీని వలన బ్యారన్‌కు రూ.5 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలో శనగలను దాచి పెట్టుకున్నా సరైన ధరలు రాక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారన్నారు. శనగలు క్వింటాకు రూ.10 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రిజర్వ్ బ్యాంకు రూ.234 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి జమ చేసినా రైతుల రుణమాఫీ గురించి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లాడుతూశనగలు రూ.10 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 6వ తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంతిబాబు అధ్యక్షత వహించగా పెంట్యాల హనుమంతరావు, ఏడుకొండలు, అబ్బూరి వెంకటేశ్వర్లు, రత్నారెడ్డి, గంగినేని సత్యనారాయణ, కరిచేటి హనుమంతరావు, బెజవాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టండి
ఒంగోలు టౌన్: కులగణన చేపట్టిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, కులాల జనాభా ప్రతిపాదికన స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో శనివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కులగణన చేపట్టాన్న డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జనగణనతో పాటుగా కులగణన చేపట్టాలని, కులాల జనాభా ప్రతిపాదికన వారికి దక్కాల్సిన హక్కులు కేటాయించాలని కోరారు. బీసీలలో 143 కులాలు ఉన్నా వాటిలో ఎక్కువ భాగం కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల కంటే హీనమైన జీవితాలను అనుభవిస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వారికి సక్రమంగా దక్కడం లేదని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్ఆర్సీ తీసుకొచ్చిందని చెప్పారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కులగణన ప్రతిపాదికన రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వలన ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కోల్పోయిన యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోవున్న పార్టీలు ప్రజలను కులమతాలుగా విడగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు తన్నీరు శివప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలు ఐక్య పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవాలని చెప్పారు. కులగణన చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు ఆచరణలో వెనేకంబ వేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ముందుకు వచ్చి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మొండిబండ కులసంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గంగిరెడ్డు, బుడబుక్కల, కాటికాపరులు, పాముకులస్తులు బీసీ కులాల జాబితాలో ఉన్నా ఎస్సీ, ఎస్టీల కంటే హీనంగా బతుకుతున్నారని చెప్పారు. పోరాటాల ద్వారానే కులగణన సాధ్యమవుతుందని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు సయ్యద్ యాసిన్, కృష్ణ గౌడ్, యం.విజయ, ఖాసీం, బేగ్, ఎల్.రాజశేఖర్, పి.సుధాకర్, పేరయ్య, సుబ్బారావు, ఆర్.వెంకటరావు, కవరది సుబ్బారావు, వీరారెడ్డి, మురళి, డి.శ్రీనివాస్, మౌలాలి, లక్ష్మీ, రామయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. -
పత్తిపై విద్వేష కత్తి
దొనకొండ: కోర్టు ఇంజెక్షన్ ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా, కాపు దశలో ఉన్న 6.39 ఎకరాల పత్తి పొలాన్ని విద్వేషంతో దున్నేసిన టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ ఇది. దొనకొండ మండలం వద్దిపాడు గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తొలుచూరి చిన్నయ్య సర్వే నంబర్ 174లో తను కొనుగోలు చేసిన 7.80 ఎకరాలను కుమారుడు కోటయ్యకు అలాగే అల్లుడు గుమ్మా కొండయ్యకు సమానంగా 1992లో జాయింట్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో పాటు సర్వే నంబర్ 166/2లో 1.66 ఎకరాలు, 158/2లో 0.83 ఎకరాలు అల్లుడు కొండయ్యకు రిజిస్ట్రేషన్ చేశారు. తద్వారా మొత్తం 6.39 ఎకరాలు కొండయ్యకు దఖలుపడింది. అప్పటి నుంచి వీరు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మోసంతో రిజిస్ట్రేషన్... కాగా, కొద్ది సంవత్సరాల క్రితం కొండయ్య మతి స్థిమితం తప్పింది. దీనిని ఆసరాగా చేసుకుని కొండయ్యకు చెందిన 6.39 ఎకరాలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తాడి నారాయణరెడ్డి తన బినామీ తోట వెంకట రమణ పేరున 2022 మేలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ తరువాత కొద్ది నెలలకే కొండయ్య మృతి చెందడంతో ఈ మొత్తం వ్యవహారంపై తొలుచూరి కోటయ్య, ఆయన సోదరి, గుమ్మా కొండయ్య భార్య పెద్ద కోటమ్మ అదే ఏడాది సెప్టెంబర్‌లో దర్శి జూనియర్ కోర్టులో ఇంజెక్షన్ దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. నేటికీ ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఈ ఉత్తర్వుల మేరకు నాటి తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావు ఈ భూమిని‘డిస్ప్యూట్’ పెట్టారు. కోర్టు కేసుల్లో ఉన్న పొలం ‘తిరిగి’ రిజిస్ట్రేషన్ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే సదరు టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి తహసీల్దార్‌తో లాలూచీ పడి ఈ ఏడాది ఏప్రిల్ 24న భూమిని ‘డిస్ప్యూట్’ నుంచి తొలగించారు. అదే నెలలో ఈ భూమిని తోట వెంకట రమణచేత నారాయణరెడ్డి తన కుమారుడు తాడి శేఖర్‌రెడ్డిపై తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. కోర్టులో పొలం వ్యాజ్యం ఉండగా, ఈ రిజిస్ట్రేషన్ అన్యాయమని పేర్కొంటూ కోటమ్మ ఈ వ్యవహారాన్ని ఆగస్టులో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా, కొద్ది నెలల క్రితం కోటమ్మ తమ ఆధీనంలో ఉన్న మొత్తం 6.39 ఎకరాల్లో రూ.లక్షలు ఖర్చుచేసి పత్తి పంట వేసింది. పొలం మొత్తం కాపు దశలో ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి, ఆయన అనుచరులు శనివారం తెల్లవారుజామున భూమిని ట్రాక్టర్‌తో దున్నేశారు. ఉదయం 6 గంటలకు ఈ దారుణాన్ని తెలుసుకున్న బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దున్నడం తప్పే: ఈ ఘటనపై తహసీల్దార్ బి.రమాదేవిని వివరణ కోరగా.. రైతు సాగు చేసిన పొలాన్ని అన్యాక్రాంతంగా వేరే వారు దున్నటం తప్పని పేర్కొన్నారు. ఆటో మ్యుటేషన్ కారణంతో రెండవదఫా రిజిస్ట్రేషన్ జరిగి ఉండవచ్చని తెలిపారు. – తహసీల్దార్ త్రిపురాంతకం సీఐ బెదిరించారు ఈ వ్యవహారంపై నన్ను త్రిపురాంతకం సీఐ హసన్ పిలిపించి పొలం నుంచి వైదొలగకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరించారు. – తొలుచూరి కోటయ్య, వద్దిపాడు నా భర్తకు మతి స్థిమితం లేదు నా భర్త కొండయ్యకు మతి స్థిమితంలేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని మా కుటుంబ సభ్యులకు తెలియకుండా నా భర్తతో నారాయణరెడ్డి తన బినామీ వెంకటరమణకు రిజిస్ట్రేషన్ చేయించాడు. మా భూమికి సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్లు దారుణం. – గుమ్మా పెద్ద కోటమ్మ, వద్దిపాడు -
దోపిడీ బండ
బాహాటంగాచీమకుర్తి: గ్రానైట్‌పై సీనరేజి వసూలు బాధ్యతలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడాన్ని నిరశిస్తూ గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ప్రైవేటు సంస్థకు, గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులకు మధ్య జరిగిన చర్చల్లో సదరు ప్రైవేటు సంస్థ బహిరంగంగానే అదనపు వసూళ్లకు పట్టుబడుతూ గ్రానైట్ యజమానులపై ఒత్తిడి తేవడంతో చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న గ్రానైట్ పరిశ్రమలో ప్రభుత్వం ఒక్కో బ్లేడ్‌కు అదనంగా మైనింగ్ బిల్లుకు రూ.8 వేలు పెంచింది. దాని వలన ఇప్పటి వరకు శ్లాబ్ విధానంలో ఒక్కో బ్లేడ్‌కు చెల్లించే రూ.27 వేలకు అదనంగా మరో రూ.8 వేలు పెంచటంతో మొత్తం కలిసి రూ.35 వేలు అయింది. దానికి జీఎస్టీ, ఇతర ఖర్చులు కలిపితే మొత్తం రూ.40 వేలకు చేరుకుంటుంది. ఒక్కో గ్రానైట్ ఫ్యాక్టరీలో కనీసం రెండు బ్లేడ్లు నుంచి మూడు, నాలుగు, మల్టీ సంఖ్యలో బ్లేడ్లు ఉంటాయి. ఎన్ని బ్లేడ్లు ఉంటే అన్ని రూ.35 వేలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్లాబ్ విధానంలో చెల్లించే బిల్లులను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి అప్పగించటంతో ఈ బిల్లులను ప్రైవేటు కంపెనీకి చెల్లించాలి. అయితే ప్రైవేటు కంపెనీ వారు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒక్కో బ్లేడ్‌కు రూ.35 వేలతో పాటు కంపెనీకి అనధికారకంగా మరో రూ.35 వేలు చెల్లించాలని బాహాటంగా చర్చల్లో పెట్టి నిలువు దోపిడీకి తెరలేపింది. దానిపై శనివారం ఒంగోలులోని గ్రానైట్ క్వారీల యజమానుల అతిథి గృహంలో ప్రైవేటు కంపెనీకి, చీమకుర్తిలోని గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులకు మధ్య జరిగిన చర్చల్లో ప్రైవేటు రుబాబు వసూళ్ల వద్దే ఫ్యాక్టరీల యజమానులు అడ్డం తిరిగారు. భారమైనా ప్రభుత్వం చెల్లించమన్న రూ.35 వేలను ఒక్కో బ్లేడ్‌కు చెల్లిస్తాం.. అంతే గానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేటు కంపెనీ రుబాబు చేసి అనధికారికంగా చెల్లించమన్న రూ.35 వేలను కట్టే ప్రసక్తే లేదని తెగేసి చెప్పటంతో ప్రైవేటు కంపెనీ వారు తమ ఉన్నత స్థాయి ప్రతినిధులతో మాట్లాడి ఈనెల 9వ తేదీ లోపు చెప్తామంటూ చర్చలను అసంతృప్తిగా ముగించారు. ముడిరాయి, వేస్ట్ రాళ్లపై కూడా ప్రైవేటు కంపెనీ బాదుడు: గ్రానైట్ క్వారీలో నుంచి ఫ్యాక్టరీల యజమానులు కొనుగోలు చేసే ముడిరాళ్లు అన్నీ ప్రాసెస్ చేసే సమయానికి వేస్ట్, క్రాక్‌లు, సక్రమ సైజులు లేకపోవడం వలన కొనుగోలు చేసిన రాళ్లల్లో దాదాపు 20–25 శాతం రాయి వృథాగా పోతోంది. కానీ క్వారీ నుంచి కొనుగోలు చేసిన రాయి బయటకు వచ్చే సమయంలో సీనరేజి వసూళ్లకు వచ్చిన ప్రైవేటు కంపెనీ మాత్రం వేస్ట్‌గా పోయే రాళ్లతో సహా రాయల్టీని చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్టరీల యజమానులపై ఇప్పుడే ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఫ్యాక్టరీల యజమానులు మాత్రం ఫినిష్డ్ చేసిన మెటీరియల్‌పై మాత్రమే రాయల్టీ చెల్లిస్తామంటున్నారు. ఇలా రాయల్టీ, శ్లాబ్ విధానంలో మైనింగ్ బిల్లులు చెల్లించలేక ఫ్యాక్టరీల యజమానులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి నెలసరి వాయిదాలు, కరెంటు బిల్లులు చెల్లించలేక ఇబ్బంది పడుతుంటే వాటితో పాటు అనధికారకంగా ఒక్కో బ్లేడ్‌కు రూ.35 వేలు చెల్లిస్తారా..? లేక చెల్లించరా ? అంటూ ఫ్యాక్టరీల యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీల మూసివేత ఎప్పటి వరకు ఉంటుందో... వారి మధ్య సయోధ్య ఎప్పటికి కుదురుతుందోనని ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీల యజమానులకు గ్రానైట్ రాళ్లను రవాణా చేసే ట్రాలీలు, లారీల యజమానులు సంఘీభావం ప్రకటించి తమ మద్దతు తెలిపారు. మర్రిచెట్లపాలెంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో గ్రానైట్ బ్లాకులను కట్ చేస్తున్న బ్లేడ్ రుబాబు వసూళ్లపై నోరు మెదపని మైన్స్ అధికారులు ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు నిస్సిగ్గుగా గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులను అనధికారికంగా రూ.35 వేలు చెల్లించాలని బహిరంగంగా చర్చలు పెట్టి మరీ మేము అడిగినంత ఇస్తారా..? లేదా..? డిమాండ్ చేస్తుంటే జిల్లా మైన్స్ అధికారులు నోరు మెదపకపోవడం శోచనీయమని ఫ్యాక్టరీల యజమానులు వాపోతున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రైవేటు కంపెనీ వారి వసూళ్లలో వీరి పాపం కూడా ఉందేమోనని ఫ్యాక్టరీల యజమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబర్లుగా నియామకం
కనిగిరిరూరల్: పార్టీలో నిబద్ధతగా, అంకిత భావంతో పనిచేసిన వారికి పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉన్నత స్థానం కల్పించారు. వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం కల్పించారు. కనిగిరి నియోజకవర్గానికి చెందిన చింతలచెరువు సత్యన్నారాయణరెడ్డిని సీఈసీ మెంబర్‌గా నియమించారు. ఆయన గతంలో వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకునిగా, 2024 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ పరిశీలకుడిగా, ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. తన నియామకం పట్ల చింతల చెరువు సత్యన్నారాయణరెడ్డి పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చింతల చెరువు సత్యన్నారాయణరెడ్డి మాట్లాడుతూ అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. మార్కాపురం నుంచి జంకె వెంకటరెడ్డి మార్కాపురం: వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యునిగా ప్రస్తుత నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని నియమించారు. జంకె వెంకటరెడ్డి రెండు సార్లు మార్కాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ పరిశీలకునిగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన పై ఎంతో నమ్మకంతో అప్పగించిన ప్రతి పదవిని బాధ్యతగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని జంకె వెంకటరెడ్డి తెలిపారు. కొండపి నుంచి డాక్టర్ మాదాసి వెంకయ్య సింగరాయకొండ: కొండపి నియోజకవర్గానికి చెందిన మాజీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్, పీడీసీసీబీ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. -
రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ కార్యదర్శిగా మన్నం వెంకయ్య
టంగుటూరు: రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ కార్యదర్శిగా మండలానికి చెందిన మన్నం వెంకయ్యను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మన్నం వెంకయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పదవి రావడానికి సహకరించిన పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు టౌన్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేయడానికి ఈకేవైసీ కచ్చితంగా చేసుకోవాలని డ్వామా పీడీ జోసఫ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ అమలులోకి వస్తుందని, ఈకేవైసీ పూర్తి చేయని శ్రామికులకు పని ఇచ్చే అవకాశం ఉండదన్నారు. నవంబర్ 7వ తేదీలోగా జిల్లాలోని ఉపాధి శ్రామికులు ఈకేవైసీ పూర్తి చేయాలని సూచించారు. ఒంగోలు వన్‌టౌన్: మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీ నిర్వహిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, సాధికారత అధికారి నిర్మలా జ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కాన్ఫరెన్సు హాలులో ఈ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని వాల్మీకి సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కనిష్ట, గరిష్ట ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం ప్రారంభం నుంచి గరిష్ట ధర కేజీ రూ.280 కి కొనుగోలు చేసి వేలం చివర దశకు వచ్చేసరికి కేజీ రూ.346 చేశారు. అనంతరం ఇదే రౌండ్లో రూ.316 కు గరిష్ట ధరను తీసుకొచ్చారు. ఒక్క రోజులోనే గరిష్ట ధర పది రూపాయలు పడిపోయింది. 12వ రౌండ్ వేలం ప్రారంభంలో గరిష్ట ధర పెంచుకుంటూ పోయిన వ్యాపారులు చివరి దశకు వచ్చేసరికి మళ్లీ తగ్గించుకుంటూ వస్తున్నారని రైతులు వాపోతున్నారు. అదేమని అడిగితే అప్పుడు అవసరం ఉంది ఇప్పుడు అవసరం లేదని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. నాణ్యమైన పొగాకును గతంలో తక్కువకు కొనుగోలు చేయడం వల్ల నష్టపోయామని, ఇప్పుడు కనిష్ట ధరలు కూడా తగ్గించుకుంటూ పోతూ కేజీ రూ.85కు తీసుకొచ్చారని రైతులు వాపోతున్నారు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్ట ధర కేజీ రూ.85 పలికిందని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని కట్టవారిపాలెం, నర్సింగోలు గ్రామాలకు చెందిన రైతులు 1162 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 1019 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 143 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ.316, సరాసరి ధర కేజీ రూ.233.33 గా నమోదైంది. వేలంలో 16 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: గ్రానైట్ రాయల్టీని పెంచి వసూలు బాధ్యతను ఏఎంఆర్ సంస్థకు అప్పగించడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలం సుబ్బారావు, యం.రమేష్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిపోయిన తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలు పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని వివరించారు. ఫ్యాక్టరీల రాయల్టీని రూ.27 వేల నుంచి రూ.35 వేలకు పెంచడంతో పాటుగా జీఎస్టీతో కలిపి రూ.40 వేలకు చేరిందని తెలిపారు. అంతేకాకుండా రాయల్టీ వసూళ్లను ఏఎంఆర్ కంపెనీకి అప్పగించిందని, పెంచిన రాయల్టీతో పాటు అనధికార వసూళ్లకు తెరలేపడం, పనికిరాని రాయికి కూడా రాయల్టీ చెల్లించాలని యజమానులపై ఒత్తిడి చేయడం వంటి చర్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా 800 ఫ్యాక్టరీలు మూతవేసి ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలిపారు. గ్రానైట్ పాలిషింగ్ అండ్ కటింగ్ ఫ్యాక్టరీల యజమానులు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. -
పండగ పూటా పచ్చ కుట్రలు
కొండపి: కొండపి నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. పండగ పూటా పచ్చ నేతలు కుట్రలు చేసిన తీరు చూసి జనం చీకొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మహర్నవమి సందర్భంగా బుధవారం రాత్రి కొండపి మండలం పెద్ద కండ్లగుంట గ్రామంలో రామలింగేశ్వరస్వామి ఆలయంలో వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రభపై కోలాట ప్రదర్శనకు, టీడీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభపై పాటకచేరీకి ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు పోలీసుల అనుమతికి దరఖాస్తు చేసుకోగా నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కోలాట ప్రదర్శనకు పోలీసులు అనుమతించక తప్పలేదు. తొలుత అనుమతి నిరాకరించేలా పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసిన టీడీపీ నాయకులు తమ కుట్రలకు మరింత పదునుపెట్టారు. కోలాట ప్రదర్శనను సవ్యంగా సాగకుండా పోలీసులను ఉసిగొల్పి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. లైట్లు ఆపేసి.. ప్రదర్శన త్వరగా నిలిపేసి.. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బెలూన్లు తొలగింపజేసిన పోలీసులు.. డెకరేషన్ లైట్లను సైతం ఆపివేయించారు. మైకుల సంఖ్యను కూడా కుదించి కోలాట ప్రదర్శనను నిర్వహించుకోవాలని సూచించారు. అయినప్పటికీ సంయమనం పాటించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు.. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు ఇచ్చిన ఆదేశాలను పాటించారు. అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ల వెలుగులోనే కోలాట ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రభపై అశ్లీలతకు పేరొందిన రికార్డ్ డ్యాన్స్‌కు అడగగానే అనుమతిచ్చేసిన పోలీసులు.. సాంస్కృతిక కార్యక్రమమైన కోలాట ప్రదర్శనకు అనుమతి నిరాకరించడం, లైట్లు ఆపేయడం, బెలూన్లు సైతం తొలగించడం చూసి చుట్టుపక్కల గ్రామాల భక్తులతోపాటు గ్రామస్తులు విస్తుపోయారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన కోలాటాన్ని రెండు గంటల వ్యవధిలోనే అంటే 11 గంటలకే నిలిపేసిన పోలీసులు.. టీడీపీ ప్రభపై రికార్డ్ డ్యాన్స్‌ను మాత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు దగ్గరుండి జరిపించడం గమనార్హం. ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన పెద్దకండ్లగుంటలో కోలాట ప్రదర్శన ఆహూతులను అలరించింది. సుమారు 46 మంది కళాకారులు రెండు నెలలపాటు సాధన చేసి కోలాటం ప్రదర్శించారు. కోలాటాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు. రెండు గంటలపాటు సాగిన ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా 2 వేల మందికి అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, వైస్ ఎంపీపీ వేముల ప్రసాద్, మండల సీనియర్ నాయకులు వేముల రమేష్, ఎంపీటీసీ సుబ్బారావు, లక్ష్మీనరసయ్య, కార్తీక్ సుల్తాన్, రవీంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఓబుల్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొండపి మండలం పెద్దకండ్లకుంటలో టీడీపీ నేతల దుశ్చర్య కోలాట ప్రదర్శనకు అనుమతివ్వకుండా పోలీసులపై ఒత్తిడి హైకోర్టు అనుమతితో కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ శ్రేణుల ఏర్పాట్లు అయినా పోలీసులను పురమాయించి అడుగడుగునా ఆంక్షలు ప్రభ డెకరేషన్ లైట్లు ఆపి, రాత్రి 11 గంటలకే ప్రదర్శన నిలిపివేత టీడీపీ ప్రభపై తెల్లవారుజామున 3 గంటల వరకు రికార్డు డ్యాన్స్ అనవసర రాద్ధాంతం చేశారు కోలాట ప్రదర్శనకు అనుమతి అడిగితే పోలీసులు కాదనడంతో హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ టీడీపీ నేతల ఒత్తిడితో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన నిర్వహించకూడదన్నది వారి ఉద్దేశం. అందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులు పెట్టారు. అయినా మేమంతా సంయమనం పాటించాం. పోలీసుల సూచన మేరకు లైట్లు ఆపేసి ఉన్న కాస్త వెలుగులోనే ప్రదర్శన కొనసాగించాం. ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన కోలాట ప్రదర్శన పోలీసుల ఆంక్షల వల్ల 9 గంటలకు మొదలైంది. టీడీపీ ప్రభ వద్ద జనం లేరన్న కారణంతో 11 గంటలకే మా ప్రోగ్రామ్‌ను ఆపేశారు. పండగ పూట రాజకీయాలు చేయడం, అందుకు పోలీసులు సహకరించడం ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలి. – భువనగిరి సత్యనారాయణ, పెద్దకండ్లగుంట సర్పంచ్ -
డీపీవో ఉద్యోగులు సమయపాలన పాటించాలి
● ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో) ఉద్యోగులు సమయపాలన పాటించాలని, ఫైల్స్ పెండింగ్ లేకుండా సకాలంలో పనులు పూర్తిచేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ఆదేశించారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, పనులు వాయిదా వేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి తన దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ, డీటీఆర్బీ, పరిపాలనా విభాగంలోని అన్ని సెక్షన్లు, అడిషనల్ ఎస్పీ కార్యాలయాలను పరిశీలించారు. సంబంధిత అధికారుల నుంచి ఆయా విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించిన ఎస్పీ.. వాటిని క్రమబద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ విధుల గురించి ఆరా తీశారు. వారి పనితీరుపై సమీక్షించి సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు పలు సలహాలు, సూచనలు చేశారు. వివిధ కమిషన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి నిర్ణీత కాలంలో సమాధానాలు పంపించాలని చెప్పారు. ఎస్పీ వెంట డీపీవో ఏవో రామ్మోహన్రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఆర్ఐ సీతారామిరెడ్డి ఉన్నారు. ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా నాయకులను పార్టీలోని వివిధ పదవుల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన జంకె వెంకటరెడ్డి, కనిగిరి నియోజకవర్గానికి చెందిన చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, కొండపి నియోజకవర్గానికి చెందిన మాదాసి వెంకయ్యని నియమించారు. అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) మెంబర్లుగా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, కొండపి నియోజకవర్గానికి చెందిన బత్తుల అశోక్‌రెడ్డి, గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. ఒంగోలు సిటీ: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు (జనరల్, ఒకేషనల్)కు పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 2026 మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ కె.ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ వాళ్లకు 2026 ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఒకేషనల్ వాళ్లకు 2026 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెక్షన్లలో జరుగుతాయని తెలిపారు. సమగ్రశిక్ష ఒకేషనల్ ట్రేడ్ ఎగ్జామ్ 13–02–2026న జరుగుతుందన్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జాం జనవరి 23 ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్... ఫిబ్రవరి 23న తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/తమిళ్/ఒరియా/కన్నడ/అరబిక్/ఫ్రెంచ్, 25న ఇంగ్లిష్, 27న హిస్టరీ, మార్చి 2న మ్యాథ్స్, 5న బయాలజీ, 7న ఎకనామిక్స్, 10న ఫిజిక్స్, 12న కామర్స్, 14న సివిక్స్, 17న కెమిస్ట్రీ, 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, 24న మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫి పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్... ఫిబ్రవరి 24న తెలుగు, 26న ఇంగ్లిష్, 28న బోటనీ/హిస్టరీ, మార్చి 3న మ్యాథ్స్ 2ఏ/సివిక్స్ 2, 6న జువాలజీ–2/ఎకనామిక్స్–2, 9న మ్యాథ్స్ 2బీ, 11న కామర్స్–2/సోషియాలజీ–2/ఫైన్ ఆర్ట్స్/మ్యూజిక్, 13న ఫిజిక్స్–2, 16న మోడరన్ లాంగ్వేజ్/జాగ్రఫీ, 18న కెమిస్ట్రీ–2, 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ పరీక్షలు జరుగుతాయి. సెకండియర్ పరీక్షలు పాత సిలబస్ ప్రకారం జరుగుతాయని, అదేవిధంగా విద్యార్థులకు ఫస్టియర్ సబ్జెక్ట్‌లు పెండింగ్ ఉంటే కూడా పాత సిలబస్ ప్రకారమే జరుగుతాయని తెలిపారు. -
‘ప్రకాశం’ పేరును నిలబెడదాం
● ఆయుధ పూజలో ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: ప్రశాంత వాతావరణానికి నిలయమైన ప్రకాశం జిల్లా పేరును నిలబెట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామని ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు పిలుపునిచ్చారు. విజయ దశమి పండగను పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలంలో శాస్త్రోక్తంగా ఆయుధపూజ నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో సతీసమేతంగా ఎస్పీ పూజలు చేశారు. నిత్యం పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడటంలో ఆయుధాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు , సిబ్బంది పునరంకితం కావాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, తాలుకా సీఐ విజయకృష్ణ, మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, సీసీఎస్ సీఐ జగదీష్, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: గంజాయి, ఇతరా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి చేసే నేపథ్యంలో జిల్లా పోలీసులు శుక్రవారం రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ డిపోల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలోని పార్శిల్ కార్యాలయంలో అనుమానాస్పద బుకింగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన స్లీపర్ డాగ్ రాక్సీతో కలిసి బస్సులు, రైళ్లలోని ప్రయాణికుల లగేజీ బ్యాగులను పరిశీలించారు. తనిఖీలకు నేతృత్వం వహించిన వన్‌టౌన్ సీఐ నాగరాజు మాట్లాడుతూ.. గంజాయి రవాణాను కట్టడి చేయడానికి ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాలతో పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల రవాణా విషయంలో నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేదిత వస్తువులకు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, పోలీసు వాట్సప్ నంబర్ 91211 02266కు తెలియజేయాలని కోరారు. -
గ్రానైట్ అక్రమ తవ్వకాలు ఆపాలి
ఒంగోలు సబర్బన్: చీమకుర్తిలో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని, లేకుంటే అనేక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని వైఎస్సార్ సీపీ చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు కలెక్టర్ పీ రాజాబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఒంగోలు ఎంపీ, జిల్లా దిశ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 18 గ్రామాలకు తాగునీరు, 20 వేల ఎకరాలకు సాగునీరు అందించే కారుమంచి కాలువ దాని పక్కనున్న క్వారీలో పడిపోయి రైతులు, రైతు కూలీల జీవనోపాధికి ఆటంకం కలుగుతోందని తెలిపారు. కారుమంచి కాలువను ఆనుకుని ఉన్న మధుకాన్ గ్రానైట్ క్వారీ వారు పరిధిని మించి తవ్వకాలు చేపట్టారని, ఇరిగేషన్ పరిధిలో ఉన్న ఎన్ఎస్పీ కాలువను కూడా అక్రమంగా తవ్వారని తెలిపారు. ఫలితంగా చీమకుర్తి పట్టణ దక్షిణపు గ్రామాల రైతులు, రైతు కూలీలు సాగునీరు అందకపోవడంతో పాటు తాగునీరు కూడా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చివరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాల్సి వచ్చిందని కూడా గుర్తు చేశారు. డీఎంఎఫ్ గ్రాంట్ నుంచి 2.62 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ టెండర్ పిలవకపోవడంలో ఆంతర్యం ఏమిటని వేమా ప్రశ్నించారు. లైనింగ్ మార్చి ఉన్న ప్రాంతానికి దూరంగా లైనింగ్ వేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రైతుల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండో విధానంలో పైపులైను ద్వారా కారుమంచి కాలువను పునరుద్ధరించాలనే ఆలోచన కూడా చేస్తున్నారని, ఇది రైతులకు ప్రయోజనకరం కాదని అన్నారు. రైతులకు నష్టం వాటిల్లే నిర్ణయం తీసుకుంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఉమ్మడి కార్యాచరణతో క్షేత్రస్థాయి నుంచి ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు. స్పందించిన కలెక్టర్.. తక్షణమే ఈ విషయంపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలపై కమిటీ చైర్మన్ మాగుంట సమీక్షించారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
త్రై లోక్య మాతా.. ధన్యోస్మి
యర్రగొండపాలెం/మార్కాపురం టౌన్: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం యర్రగొండపాలెంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు విజయ ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రూ.27 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో నిర్వాహకులు అలంకరించగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శమిపూజ అనంతరం మహిషాసురమర్దినిగా అమ్మవారిని అలంకరించి రథోత్సవం నిర్వహించారు. అలాగే మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి వద్ద ముద్దసానమ్మ ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిగ్రహ మూర్తిని రూ.24,11,116 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. -
గాంధీజీ మార్గం అనుసరణీయం
ఒంగోలు సబర్బన్: జాతిపిత మహాత్మాగాంధీ వ్యక్తిత్వం, ఆయన చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని కలెక్టర్ పీ రాజాబాబు అన్నారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు గాంధీరోడ్డులోని గ్రామచావిడి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల జయంతులు నిర్వహించుకోవడం మనందరి అదృష్టమన్నారు. వారు చూపిన మార్గంలో పయనిస్తూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. 40 లక్షల రూపాయల వ్యయంతో గ్రామచావిడిని పునర్నిర్మిస్తున్నామని, ఇది అందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 10 మంది పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, బీఎన్ విజయ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్‌కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత పాల్గొని గ్రామ చావిడి పునర్నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీకి వైఎస్సార్ సీపీ నాయకుల నివాళులు... ఒంగోలు సిటీ: స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బొగ్గుల శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు, రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ అశోక్, రాష్ట్ర ఇంటలెక్చువల్ కమిటీ ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, నాయకులు సయ్యద్ అప్సర్, షేక్ మీరావాలి, వీసం బాలకృష్ణ, పిగిలి శ్రీనివాసరావు, షేక్ జిలానీబాషా, ఫణిదపు సుధాకర్, డివిజన్ అధ్యక్షులు రాజేష్, భాస్కర్, గళ్లా దుర్గా, పార్టీ నాయకులు వేముల శ్రీకాంత్, వెంకయ్య నాయుడు, పెట్లూరి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగంగానే మాంసం అమ్మకాలు...
గాంధీ జయంతి రోజు జిల్లాలో బహిరంగంగానే మాంసం అమ్మకాలు జరగాయి. నగరంలోని 60 అడుగుల రోడ్డు, నెల్లూరు బస్టాండు సెంటర్, అద్దంకి బస్టాండ్ సెంటర్, కర్నూలు రోడ్డు, గుంటూరు రోడ్లలో బిర్యానీ సెంటర్లను వ్యాపారాలు నిర్వహించుకోవడం కనిపించింది. ఇక, చికెన్ పకోడా సెంటర్లయితే లెక్కేలేదు. చికెన్ దుకాణాలు మూసివేసినప్పటికీ బిర్యానీ హోటళ్లకు చికెన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేనాథుడే లేడు. ఒంగోలు నగరం పాతమార్కెట్ సెంటర్, ఊరచెరువు రోడ్డు, కొత్త కూరగాయల మార్కెట్లో చికెన్, మటన్ అమ్మకాలు జోరుగా సాగాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
ఎయిడెడ్ స్కూళ్లకు సీఆర్పీలను కేటాయించాలి
● ఏపీ టీచ ర్స్ గిల్డ్ జిల్లా నేతల డిమాండ్ ఒంగోలు సిటీ: జిల్లా పరిధిలోని 39 ఎయిడెడ్ ఏకోపాధ్యాయ పాఠశాలలకు సీఆర్పీలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్రావు, సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెళ్లూరు, కొప్పోలు, ఒంగోలు, కొత్తపల్లి, బసవన్నపాలెం, మద్దిరాలపాడు, పోతవరం, అమ్మనబ్రోలు, తిమ్మసముద్రం, ఉప్పుగుండూరు, చెరుకూరు, ఇడుపులపాడు, మార్టూరు, రాజుపాలెం, అద్దంకి, చీమకుర్తి, రాజుపాలెం, రావిపాడు, కంభం,తిరుమలాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, కనిగిరి, గుడిపాటి పల్లి, కరేడు ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచరే 1 నుంచి 5వ తరగతి, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు బోధిస్తున్నారని వివరించారు. టీచర్లు సెలవు పెట్టినప్పుడు సీఆర్పీలను పంపాల్సి ఉండగా కొందరు విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటరీ టీచర్‌ను నియమించుకుని సెలవు పెట్టుకోవాలని ఎంఈఓలు సూచించడాన్ని తప్పుబట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి ఏకోపాధ్యాయ పాఠశాలలకు శాశ్వత సీఆర్పీలను కేటాయించాలని కోరారు. ● ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రజలకు అందాలని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. వినియోగదారులకు కలిగే మేలుపై అవగాహన కల్పించడానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్లో నిర్వహించిన సదస్సుకు దినకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణలను సక్రమంగా అమలు చేసి ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సేవలు న్యాయమైన ధరకు అందేలా పర్యవేక్షించాలని వినియోగదారుల కమిషన్ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రకాశ్, డీఆర్ఓ ఓబులేసు, ఒంగోలు చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువాయి కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దేవతు శ్రీరాములు, ఎస్టీపీ అసోసియేషన్ అధ్యక్షుడు రోశయ్య పాల్గొన్నారు. -
ఎన్సీడీసీ రుణాల మంజూరులో భారీ అవినీతి
ఒంగోలు సబర్బన్: నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) రుణాల మంజూరులో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఎన్.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల పెంపకందారుల జిల్లా సహకార యూనియన్ ద్వారా ఇచ్చిన ఎన్సీడీసీ రుణాల్లో అవినీతిని నిగ్గు తేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా యూనియన్ ద్వారా 2014 నుంచి 2021 వరకు గొర్రెల పెంపకందారుల అభివృద్ధి కోసం మూడు దఫాలుగా రూ.20 కోట్ల రుణాలు సుమారు 1000 మందికి ఇచ్చారన్నారు. అయితే అప్పటి పాలకవర్గం, అధికారులు కుమ్మకై ్క నిబంధనలకు విరుద్ధంగా రుణాలు పంపిణీ చేశారని ఆరోపించారు. ఆడిట్ అధికారులు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రుణాల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు నివేదిక ఇచ్చారన్నారు. దీనినిబట్టి రుణాల మంజూరు సమయంలో దరఖాస్తుదారుల డాక్యుమెంట్ల పరిశీలన కూడా సరిగా చేయలేదని అర్థమవుతోందన్నారు. ప్రధానంగా ఒకే మార్ట్గేజిపై ఇద్దరికి, ముగ్గురికి ఒకరి డాక్యుమెంట్ల జిరాక్సులే పెట్టి రుణాలు ఇవ్వడం, సొసైటీలో లేని సభ్యులకు రుణాలు ఇవ్వడం, అలాగే ఒకే సొసైటీలో 10 నుంచి 20 మందికి రుణాలు ఇవ్వడం, బినామీ పేర్లతో రుణాలు పొందేందుకు సహకరించడం లాంటి అక్రమాలకు యథేచ్ఛగా పాల్పడ్డారని, అందుకు అప్పటి అధికారులు సహకరించడం దారుణమన్నారు. ఈ క్రమంలో అర్హులు ఉన్నప్పటికీ కొన్ని సొసైటీల్లో ఒక్కరికీ కూడా ఎన్సీడీసీ రుణం మంజూరు చేయలేదని చెప్పారు. రుణాల మంజూరులో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు నగదు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.5 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసపాటి వెంకటరావు, జిల్లా కార్యదర్శి తోట తిరుపతరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ఆంజనేయులు, చిట్టిబోయిన చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అక్రమాల నిగ్గు తేల్చాలి పశుసంవర్ధక శాఖ జేడీకి ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఫిర్యాదు -
కార్యకర్తలే పార్టీకి బలం
ఒంగోలు సిటీ: ‘కార్యకర్తలే పార్టీకి బలం. వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. 17 మెడికల్ కళాశాలలు, సచివాలయ వ్యవస్థ, పోర్టులు వంటి వాటితో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. పార్టీని ఎలా పటిష్టం చేసుకోవాలో వివరించారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకే డిజిటల్ బుక్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసుకోవడంలో కార్యకర్తలకే కీలకమన్నారు. ఏ పార్టీకై నా జెండా మోసే నాయకులు, కార్యకర్తలు లేకపోతే పార్టీ నిలబడదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల తీరుతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. అందుకే వారికి అండగా ఉండేందుకు డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు వారి సమస్యలను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులపై భవిష్యత్‌లో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక చిన్న స్థాయి ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎదిగానంటే మీ అందరి ఆదరణ అభిమానమేనన్నారు. కార్యకర్త పడే కష్టాలు, ప్రజాప్రతినిధులు పడే కష్టాలు తెలుసని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్‌లో పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను మర్చిపోమన్నారు. ప్రజా సమస్యలపై చేస్తున్న కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. కష్టపడి పనిచేసిన వారికి రానున్న రోజుల్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు మాట్లాడుతూ 75 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించాలని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని, జిల్లాలోని అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగ నాగార్జున, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైజాగ్ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.శివశంకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్రా భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి కసుకుర్తి ఆదెన్న, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, జిల్లా అఫిలియేటెడ్ వింగ్ ఇన్చార్జి వెంకటప్పరెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ విజయభాస్కరరెడ్డి, అషోది యలమందారెడ్డి, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో వారే కీలకం వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు బూచేపల్లి అధ్యక్షతన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
● అర్బన్ వైద్యశాలను సందర్శించిన సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి ఒంగోలు టౌన్: పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడడం దుర్మార్గమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి తీవ్రంగా విమర్శించారు. వైద్యం కోసం పేదలు అప్పులు చేస్తున్నారని, నిరుపేదలకు వైద్య సేవలను అందిస్తున్న అర్బన్ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ నాయకులతో కలిసి స్థానిక పాపాకాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో బుధవారం సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందిని, చికిత్స కోసం వచ్చిన రోగులను వైద్యశాలలో లభిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అత్యవసర సేవా రంగంగా గుర్తించిన వైద్యరంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో నిరుపేదలు అనివార్య పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం అందుతున్న అరకొర ప్రభుత్వ వైద్యాన్ని సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒంగోలు నగరంలోని పాపా కాలనీలో పనిచేస్తున్న వైద్యుడిని మంగళవారం, గురువారం, శనివారం డిప్యూటేషన్‌పై నియమించడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఇన్ సర్వీసు కోటా పునరుద్ధరించాలి ప్రభుత్వ వైద్యులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు పీజీ చేయడం పరిపాటేనని రమాదేవి చెప్పారు. గతంలో పీహెచ్సీ వైద్యులకు పీజీ ప్రవేశాల్లో 30 శాతం ఇన్ సర్వీసు కోటా ఉండేదని , దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి 15 శాతానికి కుదించడం దారుణమన్నారు. పీహెచ్సీ వైద్యులకు కోటాను యథాతధంగా కొనసాగించాలని చెప్పారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెను ఉపసంహరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని, వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు, కంకణాల రమాదేవి, సయ్యద్ హుసేన్, ఆర్.శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసరావు, జి.రమేష్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
ఎస్పీని కలిసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు
ఒంగోలు టౌన్: సాధారణ బదిలీల్లో భాగంగా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వి.హర్షవర్థన్ రాజును జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్‌కు వచ్చిన నాయకులు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎంఎల్సీ తూమాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, పార్టీ పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ, కదిరి బాబురావు, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రసిడెంట్ కనకరావు మాదిగ, రాష్ట్ర బూత్ వింగ్ ప్రసిడెంట్ కాకుమాను రాజశేఖర్ ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. -
కారు ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు
కనిగిరిరూరల్: బైక్‌ను కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం కనిగిరి పొగాకు బోర్డు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..పెదారికట్లకు చెందిన ఎస్కే ఖదీర్ స్కూటీపై కనిగిరి వైపు వస్తున్నాడు. ఆ సమయంలో కనిగిరి నుంచి పొదిలి వైపుకు వేగంగా వస్తున్న కారు పొగాకు బోర్డు యార్ట్ వద్ద బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ బైక్ ఉన్న ఎస్కే ఖదీర్‌కు తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. స్కూటీని ఢీకొన్న కారును గడ్డమీదపల్లి వద్ద స్థానికులు అడ్డుకుని ఆపినట్లు తెలిసింది. క్షతగాత్రుడు ఖదీర్ మంగళవారమే బెంగుళూరు నుంచి వచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులు
ఒంగోలు సిటీ: కూటమి పాలన నానాటికీ దిగజారుతోందని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కూటమి పార్టీల ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. యూరియా గురించి తాము మాట్లాడితే అబద్ధమంటారని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం యూరియా సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు. రోడ్లు బాగలేవని తమ నియోజకవర్గాల్లో ప్రజలు తిరగనిచ్చే పరిస్థితులు లేవని అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాపోతున్నారన్నారు. లంచాలు తీసుకుంటున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని కారుమూరి దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక పంటలను రోడ్డుపై పారబోసుకుంటున్నారని వాపోయారు. కార్యకర్తలే వెన్నెముక.. వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే వెన్నెముక అని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, ఎమ్మెల్యే చంద్రశేఖర్, అన్ని వర్గాల ఇన్చార్జిలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. డిసెంబరు నెలాఖరులోపు కార్యకర్తలకు ఐడీ కార్డులు, బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకాలతో ఇబ్బందులు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని కారుమూరి చెప్పారు. గ్రామస్థాయిలో ఎలాంటి చిన్న సమస్య ఎదురైనా క్షణాల్లో అధిష్టానం దృష్టికి వచ్చేలా ఇది ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, ఎస్‌ఎన్‌పాడు ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, మార్కాపురం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైజాగ్ పార్లమెంట్ అబ్జర్వర్ కదిరి బాబురావు, కనిగిరి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఆదెన్న, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు బొట్ల రామారావు, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, మీరావలి, తదితరులు పాల్గొన్నారు. -
వేలం తీరును పరిశీలించిన పొగాకు బోర్డు ఈడీ
ఒంగోలు సబర్బన్: త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రం–2ను పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ బుధవారం పరిశీలించారు. వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం విధానాన్ని పరిశీలించారు. వ్యాపారులతో కలిసి కొనుగోలు చేస్తున్న తీరును, రైతులకు ధర వస్తున్న వైనాన్ని కూడా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద పొగాకు స్టాక్ ఎంత ఉందో గ్రామాల వారీగా అడిగి తెలుసుకున్నారు. 2025–26 పంట కాలానికి బోర్డు ఇచ్చిన పరిమితి మేరకే పొగాకు సాగు చేసుకోవాలని కోరారు. ఒంగోలు–2 వేలం కేంద్రం సూపరింటెండెంట్ జే.తులసిని పొగాకు మార్కెట్ పరిస్థితిని, బ్యాలెన్స్ క్వాంటిటీ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్లాట్‌ఫాంలోని గోడౌన్ని కూడా పరిశీలించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఆక్షన్ మేనేజర్ రామాంజనేయులు, రీజినల్ మేనేజర్ రామారావు, రైతు నాయకులు పాల్గొన్నారు. -
పొగాకు వేలం అడ్డగింత
కొండపి: ఒక్కసారిగా పొగాకు ధరలు దిగ్గోయడంపై రైతులు మండిపడ్డారు. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్లీ ధరలు తగ్గించడం ఏంటని రైతులు పొగాకు వేలాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన బుధవారం కొండపి పొగాకు వేలం కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..క్లస్టర్ పరిధిలోని గుర్రప్పడియ, మూగచింతల, నెన్నూరుపాడు, చతుకుపాడు, కె.అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు వేలానికి వచ్చారు. అయితే వేలం ప్రారంభమైన కొద్ది సేపటికే కొన్ని రోజులుగా పెంచిన ధరలను ఒక్కసారిగా రూ.100 తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి వేలాన్ని అడ్డుకున్నారు. తమ క్లస్టర్ పరిధిలోకి వచ్చేసరికి ధరలు ఎందుకు తగ్గిస్తున్నారని వేలం నిర్వహణ అధికారి సునీల్‌కుమార్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం మార్కెట్ లేకపోవడంతో ధరలు తగ్గించారని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా..రైతులు ఒప్పుకోలేదు. రైతులందరి వద్ద ఒకే విధంగా కొనుగోలు చేయానే గానీ ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తే కుదరదని చెప్పి వేలాన్ని బహిష్కరించారు. గరిష్ట ధర రూ.340లకు కొనుగోలు చేయాల్సిందేనని భీష్మించారు. దీంతో వేలం నిర్వహణాధికారి రైతులు, వ్యాపారులతో చర్చించి అదే ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి వేలం ప్రారంభమైంది. పొగాకు కనిష్ట ధర రూ.90 స్థానిక పొగాకు వేలం కేంద్రంలో నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్ట ధర రూ.90 పలికిందని వేలం నిర్వహణాధికారి జి.సునీల్‌కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని మూగచింతల గుర్రప్పడియ, నెన్నూరుపాడు, కె అగ్రహారం, చతుకుపాడు గ్రామాల చెందిన రైతులు 1214 బేళ్లను వేలానికి తీసుకురాగా 1146 బేళ్లను కొనుగోలు చేసి 68 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.330, సరాసరి ధర రూ.260.09గా నమోదైంది. వేలంలో 19 కంపెనీలు పాల్గొన్నాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె ఒక్కసారిగా ధరలు తగ్గించడంపై రైతుల మండిపాటు వ్యాపారులతో చర్చల అనంతరం కొనసాగిన వేలం -
బాణసంచా కేంద్రాలపై ఆకస్మిక దాడులు
ఒంగోలు టౌన్: దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లాలోని బాణసంచా పరిశ్రమలు, గోడౌన్లు, విక్రయ కేంద్రాలపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. బాణసంచా విక్రయదారులు ఫైర్ అధికారుల నిబంధనలను అమలు చేస్తున్నారో లేదో పరిశీలించారు. షాపుల్లో అమర్చిన అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయా లేదో పరిశీలించారు. ఊహించని విధంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పేందుకు సమీపంలో నీరు, ఇసుక అందుబాటులో ఉంచారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఫైర్ ఇంజన్ వెంటనే చేరుకునేందుకు తగిన స్థలం ఉందో లేదో చూశారు. బాణసంచా తయారీ కేంద్రాలలో కానీ, విక్రయ కేంద్రాలలో కానీ 18 ఏళ్ల లోపు పిల్లల చేత పనిచేయించరాదని సూచించారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు హెచ్చరించారు. 1034 మందిపై బహిరంగ మద్యం కేసులు నమోదు.. గత నెలలో బహిరంగంగా మద్యం తాగుతున్న 1034 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు తెలిపారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 293 ప్రదేశాలను గుర్తించి అందులో 265 ప్రదేశాలను శుభ్రం చేయించినట్లు వివరించారు. గుడి, బడి పక్కన గుబురుగా ప్రదేశాలను శుభ్రం చేయించినట్లు చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుందని చెప్పారు. ఎవరైనా బహిరంగంగా మద్యం సేవిస్తుంటే వెంటనే వీడియో తీసి పోలీసు వాట్సప్ నెంబర్ 9121102266 నంబర్‌కు పంపించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎంఎస్‌సీడీ ద్వారా నిందితుల గుర్తింపు.. శాంతి భద్రతలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రి గస్తీ నిర్వహించడమే కాకుండా మొబైల్ సెక్యురిటీ చెక్డ్ డివైజ్ (ఎంఎస్సీడి) అనే అత్యంత ఆధునిక పరికరం ద్వారా అనుమానిత వ్యక్తుల వేలి ముద్రలను సేకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ పరికరం ద్వారా పోలీసులు ఒక వ్యక్తి నుంచి సేకరించిన వేలిముద్రలను అక్కడిక్కడే స్కాన్ చేసి అతడి నేరచరిత్రను గుర్తించవచ్చన్నారు. గత నెలలో 4494 మంది వేలిముద్రలు సేకరించగా వారిలో 15 మంది నిందితులను గుర్తించామని, తనిఖీల్లో ఒంగోలుకు చెందిన షేక్ రఫీ అనే నిందితుడు 12 కేసుల్లో ఉన్నట్లు గుర్తించి వెంటనే అతడిని సంబంధిత పోలీసు స్టేషన్లలో బైండోవర్ చేసినట్లు తెలిపారు. నేరాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉన్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రాంతాల్లో వాహన తనిఖీలు, కొత్తగా వచ్చిన వారి పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరిక -
గనుల శాఖ ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో గనులు, ఏపీ ఎండీసీ, పర్యావరణ కాలుష్యం నియంత్రణ మండలి, రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలోని గనుల విస్తీర్ణం, వాటి రకాలు, లభిస్తున్న ఉపాధి, రవాణా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆయా వివరాలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఇదే సమయానికి 18శాతం వృద్ధి ఉన్నట్లు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ప్రభుత్వం మన జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలోని 12 స్టాక్ యార్డుల్లో 80 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ రాఘవరెడ్డి, డీటీసీ ఆర్.సుశీల, ఆర్టీసీ ఆర్ఎం జి.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో చోరీ ● 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.9 వేల నగదు అపహరణ ఒంగోలు టౌన్: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ డిపో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని దొంగలు చేతివాటం ప్రదర్శించి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సర్వేరెడ్డిపాలెంకు చెందిన పోపూరి సుమతి పర్చూరు వెళ్లేందుకు బుధవారం ఒంగోలు ఆర్టీసీ డిపోకు వచ్చారు. ఈ క్రమంలో బస్సు రాగానే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ బస్సు ఎక్కారు. ఎందుకో అనుమానం వచ్చిన సుమతి తన పర్సు తీసి చూడగా అందులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఆందోళన చెందిన ఆమె వెంటనే ఆర్టీసీ డిపోలో ఔట్‌పోస్టులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేబస్సులో కొత్తపట్నం మండలం ఆలూరు నుంచి ఇంకొల్లు వెళ్లేందుకు బస్సు ఎక్కిన కనపర్తి సువార్తమ్మ పర్సులోని రూ.9 వేల నగదు మాయమైనట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సీసీ కెమెరాలు పరిశీలించారు. వన్‌టౌన్ సీఐ నాగరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాచర్ల: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఒద్దులవాగుపల్లెలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒద్దులవాగుపల్లె గ్రామానికి చెందిన మదిరె ఈశ్వర్‌రెడ్డి (60) అప్పుల బాధ భరించలేక బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఉరేసుకొని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వైయస్సార్సీపి కార్యకర్తలపై పోలీసుల అత్యుత్సాహం
ప్రకాశం: ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెదకండ్లగుంటలో పోలీసుల అత్యుత్సాహం చూపించారు. మహర్నవమి సంధర్బంగా హైకోర్ట్ ఉత్తర్వులతో గ్రామంలో కోలాటం ఏర్పాటు చేసుకొన్న వైయస్సార్సీపి కార్యకర్తలు. దానికి పోటీగా రికార్డు డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలుగుదేశం కార్యకర్తలు.కోలాటం మైకులు లేకుండా అలంకరణ లేకుండా వెయ్యలంటూ పోలీసుల హుకుం జారీ చేశారు. స్టేజీ తొలగించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులను అడ్డుకొన్న వైయస్సార్సీపి కార్యకర్తలు.సంప్రదాయ పద్దతిలో చేస్తున్న కోలాటంను అడ్డుకోని రికార్డు డ్యాన్స్ కి పరిమీషన్ ఇవ్వడం పై గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు. -
రోల్ ఆఫ్ పప్పెట్రీ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్‌పై శిక్షణ
ఒంగోలు సిటీ: సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల నుంచి ఎన్సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేసిన 68 మంది ఉపాధ్యాయులకు రోల్ ఆఫ్ పప్పెట్రీ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్‌పై శిక్షణ శిబిరం ఢిల్లీలో నిర్వహించారు. గత నెల 10 నుంచి 24 వరకు జరిగిన ఈ శిక్షణలో రాష్ట్రం నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు పాల్గొనగా మన జిల్లా నుంచి నాగులుప్పలపాడు మండలానికి చెందిన వై మంజుల పాల్గొన్నారు. సృజనాత్మక బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడంపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో పాల్గొన్న వారికి ఎన్సీఆర్టీ డైరెక్టర్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయం
ఒంగోలు సబర్బన్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయటం అన్యాయమని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జీ.దేవ ప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ప్రకాశం భవన్ ఎదురుగా ఉన్న మహానేతలు జగజ్జీవన్ రామ్, బీఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ పేద పిల్లల వైద్య విద్యకు అడ్డుపడుతున్న కూటమి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, వాటికి అనుసంధానంగా ఉండే ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేటుపరం చేయటం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురంలో వందల కోట్ల రూపాయలతో వైద్యశాల నిర్మిస్తే దానిని ప్రైవేటుపరం చేయాలని చూడటం పశ్చిమ ప్రకాశం ప్రజలను నిలువునా మోసం చేయటమేనన్నారు. దానికితోడు మార్కాపురాన్ని ప్రత్యేకంగా జిల్లా చేస్తానని ప్రకటించిన చంద్రబాబు నాయుడు మార్కాపురంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం ఏవిధంగా చేస్తావని ఆయన ప్రశ్నించారు. పేదల వైద్యంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. పేదలను ప్రైవేటు వైద్యశాలలకు పంపించేందుకే చంద్రబాబు పన్నాగం పన్నాడని, అందుకే ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవాలని చూస్తున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పేద పిల్లల వైద్య విద్యకు అడ్డుపడుతున్న కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, వాటికి అనుసంధానంగా ఉండే ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేటు పరం చేయటమేమిటని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు జీవితం అంతా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయటమేనని ఆదెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి విడతలోనే మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేయాలని చూడటం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం ప్రజలను నిలువునా మోసం చేయటమేనని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవ ప్రసాద్ మాట్లాడుతూ 2019–2024 మధ్యకాలంలో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో ఒక్కటి అంటే ఒక్క మెడికల్ కాలేజీని కూడా స్థాపించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు చర్యల వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయటమేనని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం సంవత్సరానికి రూ.5 వేలకే ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేవలం కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మొత్తం 29 ప్రైవేటు కాలేజీలను ఈ వివరాలివ్వాలని విజిలెన్స్ విభాగం అధికారులు కోరారని అందులో 15 కాలేజీలు స్పందించగా, 6 కాలేజీల యాజమాన్యాలు కొత్తగా వచ్చామని చెప్పారన్నారు. ఆందోళన కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిలకా ఇశ్రాయేలు, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దుడ్డు వినోద్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉన్నం జనార్దన్ రావు (బుజ్జి), ఎస్సీ సెల్ ఒంగోలు పట్టణ అధ్యక్షుడు గోపీ చంద్, నాయకులు మాజీ ఎంపీపీ కే నరసింహారావు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవరపల్లి రమణ, బి యోహాన్, ఒంగోలు టౌన్ అధ్యక్షుడు గోపీ, కావూరి ఏసోబు, జె.ఇశ్రాయేలు, మధు, కంభంపాటి సన్నిబాబు, జి సామేలు, డగ్లస్, దర్శి నియోజకవర్గ అధ్యక్షుడు జి.ఏసుదాసు, మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షుడు ఆదిమూలపు లూకా, పూనూరి దేవదానం, సంతనూతలపాడు నియోజకవర్గం తేళ్ల పుల్లారావు, మద్దిపాడు మండల నాయకులు రాయపాటి విల్సన్, కావూరి యేసోబు, కొనకమిట్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంచికల చిన్న కోటేశ్వరరావుతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. ఒంగోలులో అంబేడ్కర్ బొమ్మ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు -
హైలెవల్ వ్యాపారం
ఒంగోలు సబర్బన్: బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్న ప్రముఖులు నిబంధనలకు పాతరేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాల్సింది పోయి నిలువునా పాతరేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీలు కమిటీ సభ్యులుగా ఉన్న హైదరీ క్లబ్ నిర్వాహకులది ఇష్టారాజ్యమైంది. కలెక్టరేట్‌కు అతి సమీపంలో ఉన్న హైదరీ క్లబ్ ప్రాంగణంలో వందల సంవత్సరాల నాటి చెట్లను నిలువునా నరుకుతున్నారు. పచ్చదనానికి మారుపేరుగా ఉండే హైదరీ క్లబ్‌ను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాల కేంద్రంగా, జూదాలకు ఆలవాలంగా మార్చారు. క్లబ్లో కార్యదర్శిగా ఉండి.. అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్న ఒక ప్రైవేటు వైద్యుడు, కోశాధికారిగా ఉంటూ రెవెన్యూ విభాగంలో కీలక పదవులు నిర్వహించి పదవీ విరమణ చేసిన వ్యక్తి క్లబ్లో భారీ వృక్షాలను నేలమట్టం చేసిన వారిలో కీలంకంగా వ్యవహరించారు. వందల సంవత్సరాల చెట్లు నేలమట్టం హైదరీ క్లబ్ ప్రాంగణంలో వందల సంవత్సరాల నాటి చెట్లు నేలమట్టం చేశారు. రావి, జువ్వి, వేప చెట్లు ఎత్తుకు ఎదిగి ఉండేవి. క్లబ్‌కు కేటాయించిన స్థలం కాకుండా వైద్య విధాన పరిషత్‌కు చెందిన స్థలాన్ని దాదాపు 53 సెంట్లు కబ్జా చేసీ మరీ దురాక్రమణకు పాల్పడ్డారు. రిక్రియేషన్ కోసం క్లబ్ ఏర్పాటు చేస్తే దాన్ని వ్యాపార కేంద్రంగా, అక్రమాలకు, జూద క్రీడలతో పాటు ఒక బార్ అండ్ రెస్టారెంట్లా తయారు చేశారు. అవన్నీ వాళ్ల అంతర్గత వ్యవహారాలు అనుకుంటే.. పర్యావరణాన్ని నిలువునా హననం చేశారు. అసలు అంత పెద్ద భారీ వృక్షాలను కొట్టేయాల్సిన అవసరం వీళ్లకు ఎందుకు వచ్చింది. స్విమ్మింగ్ పూల్ అని, టెన్నీస్ కోర్టులని కాగితాల్లో చూపించి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునేందుకు వీళ్లకు ఎవరు అనుమతిచ్చారు. ఒంగోలు నగర పాలక సంస్థ ప్లాన్ అప్రూవల్ ఇవ్వకపోయినా ఏ విధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. కలెక్టర్, ఎస్పీలకు క్లబ్ కమిటీలో కీలక పదవులు హైదరీ క్లబ్ కమిటీలో కలెక్టర్‌గా ఎవరున్నా ఆ అధికారి క్లబ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో అధికారి లా అండ్ ఆర్డర్‌ను తన చేతుల్లో ఉంచుకొనే ఎస్పీ కో ఆప్టెడ్ చైర్మన్‌గా ఉంటారు. జిల్లాని పరిపాలించే ఇద్దరు కీలకమైన అధికారులు హైదరీ క్లబ్ కమిటీలో ఉంటేనే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మరీ అక్రమాలకు పాల్పడుతుంటే ఎందుకు కళ్లప్పగించి చూస్తున్నారు. చెట్లు నరకడానికి అటవీ శాఖ అధికారులు అనుమతులు కూడా తీసుకోలేదు. అక్రమాలు వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ హైదరీ క్లబ్లో జరుగుతున్న అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన జిల్లా పేజీలో ‘కబ్జా విస్తరిస్తూ..కార్పొరేషన్ విస్మరిస్తూ’ అంటూ కథనాన్ని ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. అందులో స్పష్టంగా వైద్యవిధాన పరిషత్‌కు చెందిన స్థలాన్ని కబ్జా చేసి మరీ నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారని ప్రచురించాం. ఆ తర్వాత హైదరీ క్లబ్ పాలక మండలి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. హైదరీ క్లబ్ అక్రమాలపై జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేసు విచారణ చేపట్టారు. అయినా క్లబ్ నిర్వాహకులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఆపనేలేదు. ప్రధానంగా నగర కమిషనర్ కె.వెంకటేశ్వరరావు కమర్షియల్ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణం విషయంలో పూర్తిగా సహకరించారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. హైదరీ క్లబ్లో పచ్చదనం హననం పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న నిర్వాహకులు వందల సంవత్సరాల నాటి చెట్లు నిలువునా నరికివేత వైద్య విధాన పరిషత్ స్థలం 53 సెంట్లు యథేచ్ఛగా కబ్జా బాధ్యులపై చర్యలకు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ డిమాండ్ హైదరీ క్లబ్ నిర్వాహకులు రూ.100 కోట్ల విలువైన వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ స్థలం కబ్జా చేశారు. సాక్షి దిన పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. గత కలెక్టర్ కమిటీలో చైర్మన్‌గా ఉన్నా ఆమెకు తెలియకుండా అక్రమాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. కమిటీలో ఉన్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు. మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. డీఆర్ఓను విచారణాధికారిగా నియమించారు. ఈ మొత్తం వ్యవహారంలో నగర కమిషనర్ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు. – చావలి సుధాకర్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు -
దుర్గతి నాశిని..సద్గతి దాయని
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025రామతీర్థంలోని గ్రానైట్ క్వారీ, గ్రానైట్ రాళ్ళుగ్రానైట్ పరిశ్రమలను ఆదుకుంటామని యువగళం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన గ్రానైట్ పరిశ్రమల యజమానుల సదస్సులో నారా లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలు మరిచారు. అంతంత మాత్రంగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల మనుగడనే ప్రశ్నార్ధకరంగా మార్చేలా ప్రైవేటు పెత్తనానికి పచ్చజెండా ఊపింది చంద్రబాబు సర్కార్. దీనిపై పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నష్టాల పాలవుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పెత్తనాన్ని సహించబోమంటూ బుధవారం నుంచి పరిశ్రమలు మూసివేతకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకూ ఫ్యాక్టరీలు తెరవబోమని తెగేసి చెబుతున్నారు. దుష్ట సంహారిణి..శిష్ట రక్షణిగా లోకాలను కాపాడే ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవిని శరన్నవరాత్రులలో భక్తులు దుర్గాష్టమి రోజున ప్రత్యేకంగా అలంకరించి అర్చించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం కూడా కలసిరావడంతో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. – సాక్షి, ఒంగోలు -
అనితమ్మా.. చలపతి చౌదరికి క్షమాపణ చెప్పాలి
యర్రగొండపాలెం: ‘‘ఏపీ హోం మంత్రి అనితమ్మా.. నా నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని గుర్రం చలపతి చౌదరిపై మీరు ప్రస్తావించిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని’’ యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. చలపతి చౌదరి కాదని, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడని అనిత చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ఒక అసత్యపు ప్రచారాన్ని మీరు తీసుకొచ్చి, కమ్మ కులంలో కూడా పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక ఆక్రోశంతో మీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఆ బిడ్డకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలంలోని మేడపి గ్రామానికి చెందిన చలపతి కమ్మ కులానికి చెందినవాడని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వీరాభిమాని అని అన్నారు. అటువంటి వ్యక్తి మీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను, కూటమి నేతలు చేస్తున్న దాడులు, దోపిడీలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని ముందు వెనక చూసుకోకుండా హోం మంత్రిగా బాధ్యతను మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం కూటమి ప్రభుత్వ పనితీరు, అవివేకాన్ని ఎత్తి చూపుతున్నాయని అన్నారు. -
నెత్తిన బండేశారు..
చీమకుర్తి: ఉరుము ఉరిమి మంగళంపై పడినట్టు గ్రానైట్ పరిశ్రమపై ఏఎంఆర్ ప్రైవేటు కంపెనీ విధి విధానాల పిడుగు పడ్డట్టయింది. ప్రభుత్వం, ఏఎంఆర్ కంపెనీ సంయుక్తంగా గ్రానైట్ పరిశ్రమపై దోపిడీకి తెరతీయడం గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులను ఆగ్రహానికి గురిచేసింది. అంతంత మాత్రంగానే ఉన్న వ్యాపారులను ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటోందని ఫ్యాక్టరీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న స్లాబ్ విధానంలో గ్రానైట్ ఫ్యాక్టరీల్లో సింగిల్ బ్లేడ్ పై రూ.27 వేలు, మల్టీ బ్లేడ్‌పై రూ.54 వేలు చెల్లించే వారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న కొత్త విధానాలతో సింగిల్ బ్లేడ్‌పై అదనంగా రూ.8 వేలు అంటే జీఎస్టీ మొత్తం కలిపి రూ.35 వేలు, మల్టీ బ్లేడ్‌పై అదనంగా రూ.16 వేలు కలుపుని రూ.70 వేలతో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ గ్రానైట్ ఫ్యాక్టరీల మనుగడకే ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో ఫ్యాక్టరీల యజమానులు మంగళవారం చీమకుర్తిలో సమావేశమై ఈనెల 1వ తేదీ బుధవారం నుంచి జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలను మూసేయాలని తీర్మానించారు. ప్రైవేటు ఏఎంఆర్ కంపెనీకి మేలు చేసేలానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 వేల మంది కార్మికులపై ప్రభావం.. చీమకుర్తి మండలంలోని చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం, బూదవాడ, ఏలూరు రోడ్డు పరిధిలోని నాలుగు గ్రానైట్ ఫ్యాక్టరీల సంఘాలకు సంబంధించి సుమారు 1200 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవన్నీ బుధవారం నుంచి మూతపడనున్నాయి. తీర్మానాలలో ఇక నుంచి ప్రభుత్వానికి మైనింగ్ బిల్లులు చెల్లించకూడదని, క్వారీల నుంచి ముడిరాయిని కొనుగోలు చేయొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బంద్ సందర్భంగా ఫ్యాక్టరీలను మూసేయాలని ఫ్యాక్టరీ యజమానులు తీర్మానం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2500 ఫ్యాక్టరీలు ఉన్నట్లు అంచనా. వాటిలో ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్, బీహార్, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు దాదాపు 30 వేల వరకూ ఉంటారు. ఫ్యాక్టరీలను మూసేస్తే వీరి జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రైవేటు దోపిడీ వెనుక మతలబు ఏమిటీ? ప్రకాశం జిల్లాలోని గ్రానైట్, దాని అనుబంధ మినరల్స్‌పై ఇప్పటి వరకు ప్రభుత్వమే నేరుగా సీనరేజీ వసూలు చేస్తోంది. దాని ద్వారా మేజర్ మినరల్స్(ఇసుక)ను మినహాయిస్తే గ్రానైట్, గ్రావెల్ ఇతర చిన్నా చితక మినరల్స్‌పై ప్రభుత్వానికి ప్రస్తుతం ఏడాదికి రూ.500 కోట్లు వంతున రెండేళ్లకు రూ.1000 కోట్లు రాయల్టీ వస్తోంది. అలాంటిది ఇప్పటి వరకు ఉన్న సీనరేజి రాయల్టీ వసూళ్లలో ఉన్న సూపర్ గ్యాంగ్సా, గ్యాంగ్సా, కట్టర్ సైజు, ఖండాస్ అనే నాలుగు రకాలు గ్రానైట్ బ్లాకులను రెండు రకాలుగా విభజించి సీనరేజిలో కూడా సగానికి పైగా తగ్గించి ఏఎంఆర్ కంపెనీకి మేలు చేసేందుకు ప్రభుత్వం జీఓ నెంబర్ 100ను గడిచిన జూన్ నెలలోనే జారీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వంతో అవగాహన కుదిరిన ఏఎంఆర్ కంపెనీ నెలకు రూ.47 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.1135 కోట్లు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసి జిల్లాలో రాయల్టీ వసూలుకు ఏర్పాట్లు చేసుకుంది. దానిలో భాగంగానే రెండు రోజుల క్రితం ఒంగోలులో గ్రానైట్ క్వారీల యజమానులతోను, అనంతరం ఫ్యాక్టరీల యజమానులతో ఏఎంఆర్ కంపెనీ చర్చించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారికంగా చెల్లించాల్సిన రాయల్టీతో పాటు అనధికారకంగా ఒక్కో ఫ్యాక్టరీలోని సింగిల్ బ్లేడ్‌కు రూ.35 వేలు చెల్లించాలని ఏఎంఆర్ కంపెనీ డిమాండ్ చేయటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాక్టరీల యజమానులు అసలు మేము ఫ్యాక్టరీలనే నడపమని, ఫ్యాక్టరీలను మూసేస్తున్నామనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏఎంఆర్ కంపెనీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరిగా మారింది. ఏం చేయాలో తెలియక గత నెల 29న మైన్స్ అధికారులతో చేసుకోవాల్సిన ఒప్పందం ఈ నెల 9వ తేదీ లోపు చేసుకుంటామని ఏఎంఆర్ కంపెనీ యూటర్న్ తీసుకుంది. నేటి నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీలను మూసేస్తున్నాం... ఏఎంఆర్ ఒప్పందంలోని అదనపు భారం కారణంగా ఈ రోజు నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీలను మూసేయాలని ఫ్యాక్టరీల సంఘం తీర్మానించింది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలపై ప్రైవేటు కంపెనీలకు సీనరేజి వసూళ్ల బాధ్యతను ప్రభుత్వం ఇవ్వడం వలన ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. – యర్రగుంట్ల శ్రీనివాసరావు, ఫ్యాక్టరీల సంఘం నాయకుడు ఈనెల 9లోపు ఒప్పందం చేసుకుంటారు... వాస్తవానికి గతనెల 29న మైన్స్ అధికారులతో ఏఎంఆర్ కంపెనీ ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. దానిని ఈనెల 9వ తేదీ లోపు అగ్రిమెంట్ చేసుకుంటామని ఆ కంపెనీ వారు తెలిపారు. – టీ.రాజశేఖర్, మైన్స్ డీడీ, ఒంగోలుమాట మరిచిన లోకేష్.. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రానైట్ పరిశ్రమ యజమానులతో సదస్సు నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించి మాట మరిచారని పరిశ్రమల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
7న ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి
ఒంగోలు సిటీ: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈనెల 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు చెన్నుపాటి మంజుల పిలుపునిచ్చారు. ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్టీయూ భవన్లో సన్నాహక సమావేశం జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కాగుటూరి యర్రయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడం, అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని తెలిపారు. రాష్ట్రంలోని 12 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడం గానీ, చర్చించిన పరిస్థితి కానీ లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సిన దాదాపు రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినా ఇంతవరకు స్పందన లేదన్నారు. ఫ్యాప్టో చైర్మన్ కాగుటూరి యర్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో విద్యా రంగ, ఆర్థిక సమస్యలపై చర్చించి పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ ఎస్.కే రఫి, కో చైర్మన్ వీ మాధవరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్ రవి, డీ శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు చల్లా శ్రీనివాసులు, వై సీనయ్య , కే దేవ సహాయం, బీ అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
భారం కాదు.. బాధ్యత
ఒంగోలు వన్‌టౌన్: నవమాసాలు మోసి కని పెంచిన పిల్లలే వృద్ధాప్యంలో అసరాగా ఉంటారనుకుంటే ఆ భాగ్యం తల్లిదండ్రులకు కలగడం లేదు. వృద్ధులు సమాజానికి నాణ్యమైన వారసులు. వారి జ్ఞానం, అనుభవం అమూల్యమైన సంపద. కుటుంబాల్లో సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడంలో వారిదే కీలక పాత్ర. అయితే మలిసంధ్యలో పట్టించుకునేవారు లేక వృద్ధులు మనో వేదన చెందుతున్నారు.కుటుంబ విలువలు ప్రశ్నార్థకం..త్వరితగతిన మారుతున్న సమాజం, ప్రపంచీకరణ, సాంకేతిక పరిజ్ఞానం వల్ల జీవన ప్రమాణాలు పెరిగినా మానవీయ విలువలు క్షీణిస్తున్నాయి. మన–తన అన్న తేడా లేకుండా తల్లిదండ్రులపై దారుణాలకు పాల్పడే వారసుల ఉన్నారు. ‘మీరు మీ తల్లిదండ్రులను ఎలా చూస్తారో, మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారు’ అనే సూక్తి యువత స్మరణలోంచి మాయమవుతోంది. ఐక్యరాజ్య సమితిలెక్కల ప్రకారం 2050 నాటికి దేశ జనాభాలో 21 శాతం వృద్ధులు ఉంటారని ఒక అంచనా. దీంతో భారత ప్రభుత్వం 1999లో జాతీయ వృద్ధుల విధానాన్ని రూపొందించింది. ఈ విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వాలు కుడా అనుసరించాలని ఆదేశించింది.వృద్ధులకు సదుపాయాలు తప్పనిసరి.జాతీయ వృద్ధుల విధానంలో భాగంగా వృద్ధులు జీవితాన్ని సజావుగా గడిపేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు కల్పించాలి. ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. రాయతీలు పొందేందుకు 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. పన్నుల చెల్లింపులో రాయితీ, బ్యాంకులో డిపాజిట్లపై అధిక వడ్డీ, అనాథలైన వృద్ధుల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించాల్సి ఉంది. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధ్యర్యంలో వృద్ధులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అవాస యోజన పథకం ద్వారా పెద్దలకు గృహాల మంజూరు, రైల్వే రిజర్వేషన్లలో రాయితీ, ప్రయాణ టికెట్లలో 30 శాతం రాయితీలు, విమాన ప్రయాణ టికెట్లలో 50 శాతానికి పైగా రాయితీలు ప్రభుత్వం కల్పిస్తుంది. అర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీతో ప్రయాణం, రెండు సీట్లను వృద్ధులకు రిజర్వ్ చేస్తారు. జిల్లాలో మెత్తం జనాభాలో దాదాపు 20 శాతానికి పైగా వృద్ధులు ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ సహాయంతో మూడు వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. వీటన్నింటిని ఉపయోగించుకుని వృద్ధులు కొంత వరకై నా ఆశ్రయం పొందవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 15 వరకు వృద్ధాశ్రమాలు ఉన్నా వాటిలో ఎక్కువగా చీరాల, బాపట్ల పరిసరాల్లో ఉండటంతో ప్రకాశం జిల్లాలో 3 వృద్ధాశ్రమాలు మాత్రమే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మరికొన్ని వృద్ధాశ్రమాలు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వృద్ధులు కోరుతున్నారు.రోజుకు రూ.54తో ఎలా..?ఒంగోలులోని సీతారామపురంలో నడుస్తున్న సమతా వృద్ధాశ్రమంలో ప్రస్తుతం 25 మంది వృద్ధులు ఉంటున్నారు. ప్రభుత్వం వారి ఆహార ఖర్చుల కోసం రోజుకు ఒక్కొక్కరికి రూ.54 మాత్రమే విడుదల చేస్తోంది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలతో పోషకాహారం కలిగిన ఆహారం ఈ ధరకు అందించడం చాలా కష్టంగా ఉందని ఆశ్రమ అధికారులు చెబుతున్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ప్రభుత్వ–స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే మూడు వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఒంగోలులో రెండు, కనిగిరిలో ఒక వృద్ధాశ్రమం ఉంది. కేంద్ర ప్రభుత్వం వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధుల పోషణ ఖర్చులకు నిధులు విడుదల చేస్తోంది.– సీహెచ్ సువార్త, వయోవృద్ధుల శాఖ ఏడీ -
ఆర్టీసీ బస్సు నుంచి పొగలు
● డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదంకురిచేడు: వినుకొండ నుంచి పొదిలి ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ శ్రీనివాసరావు బస్సును నిలిపి ప్రయాణికులను దింపేశారు. వివరాలు.. వినుకొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 29జెడ్ 0472 నంబర్ గల బస్సు మంగళవారం వినుకొండ నుంచి పొదిలి వెళ్తోంది. మండలంలోని బోధనంపాడు వద్ద ఇంజిన్‌లో మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును పక్కకు తీసి నిలిపేశాడు. ప్రయాణికులను బస్సు నుంచి దింపి ప్రమాదం జరగకుండా కాపాడాడు. ప్రయాణికులను వెనుక వచ్చిన బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. కాలంతీరిన బస్సులు నడపడం వల్లే ఇల్లా జరుగుతోందని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగ విరమణతో కొత్త జీవన అధ్యాయం
● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: ఉద్యోగ విరమణతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు అన్నారు. సుదీర్ఘకాలం ఉద్యోగ జీవితంలో ఒత్తిడితో గడిపిన పోలీసు అధికారులు ఇప్పుడు కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు. మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావును పోలీసు కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు. శాలువాకప్పి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం 34 ఏళ్లు వివిధ స్థాయిలో సేవలందించిన కొల్లూరి శ్రీనివాసరావు పోలీసు శాఖకు, ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమే ఉంటుందని, వ్యక్తిత్వానికి ఉండదని చెప్పారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, కఠిన పరిస్థితులను కూడా సులువుగా అధిగమించి విజయవంతంగా ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. పోలీసు ఉద్యోగిగానే కాకుండా రచయితగా, కవిగా, గాయకుడిగా కూడా కొల్లూరు శ్రీనివాసరావు రాణించారని, నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, తాలుకా సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్సైలు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో విఫలం
ఒంగోలు సిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకటరావు అన్నారు. బీటీఏ జిల్లా కార్యాలయంలో మంగళవారం బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవ సహాయం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకటరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంలో ఘోరంగా విఫలమైందన్నారు. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు ఉన్న ఆర్థిక, సర్వీసు సమస్యలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 11 వ పీఆర్సీ టైం ముగిసి రెండేళ్లు పూర్తయినా కనీసం వేతన సవరణ కమిటీ వేయడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం శోచనీయమన్నారు. బకాయిలు మొత్తం చెల్లిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేకపోవడం చూస్తే ఏమనుకోవాలి, సరెండర్ లీవులు చెల్లించకపోవడం, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు బెనిఫిట్ లు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి 12 వ పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్చూరి మాధవరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 4 డీఎలను విడుదల చేయాలని, 11 వ పీఆర్సీ, సీపీఎస్ వారికి 90 శాతం చెల్లించాల్సిన డీఏ బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టి కూటమి ప్రభుత్వానికి కూడా బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎం.శరత్ చంద్రబాబు మాట్లాడుతూ 2004 ముందు చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో 57 అమలు, కోర్టు కేసులు క్లియర్ అయిన లాంగ్వేజ్ పండితుల పదోన్నతులు చేపట్టకపోవడం బాధాకరం అని, వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీ మాల్యాద్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు అప్పగించరాదని యాప్‌ల భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని బీటీఏ పక్షాన డిమాండ్ చేశారు. అక్టోబర్ 7వ తేదీ జరిగే రాష్ట్ర ఫ్యాప్టో ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా నాయకులు పల్లె తిరుపతి స్వామి, కొండమోరి కొండల రాయుడు, బొంత కళ్యాణ్, అల్లరి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. -
కళారాల కళకళ
శక్తిరూపిణి అయిన ఆదిపరాశక్తి దానవ సంహారానికి కాళికామాత అవతారం దాల్చి భక్తుల కోరిక మేరకు తన ప్రతిరూపంగా ఇచ్చినట్లు భావించే కళారాలు దుర్గాష్టమి, మహార్నవమి రోజుల్లో ఒంగోలు పురవీధుల్లో దర్శనమిస్తాయి. దసరా ఉత్సవాల్లో ప్రకాశం జిల్లాకు ప్రత్యేకమైన ఈ కళారాల ఊరేగింపు.. వాటి విశిష్టత తెలుసుకుందాంఒంగోలు మెట్రో: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రోజుకొక అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో అర్ధరాత్రి పూట జరిగే కళారాల వేడుకలకు జిల్లా నలు వైపుల నుంచి ప్రజలు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో వారి మొక్కులు తీర్చుకుంటారు. దసరా నవరాత్రుల్లో ముఖ్యమైన దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి రోజున కళారాల ఊరేగింపు, నగరంలోని వివిధ దేవాలయాల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపునకు పారువేట వేడుకలకు ఒంగోలు నగరం ముస్తాబైంది. మంగళవారం మూడు కళారాలు ఊరేగించనుండగా, బుధవారం మరో మూడు కళారాలకు నగరోత్సవం నిర్వహించనున్నారు. మైసూర్ తర్వాత ఒంగోలుకే ఈ కళారాల ఉత్సవం ప్రత్యేకం. వందలేళ్ల నాటి చరిత్ర ఒంగోలులో జరిగే కళారాల ఉత్సవానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పట్లో చిన్న గూడు బండ్లు కట్టుకొని అమ్మవారి కళారాన్ని ఊరేగిస్తూ తప్పెట్లు వాయిస్తూ కాగడాలు పట్టుకొని అర్ధరాత్రి నుంచి నగరం మొత్తం తిరిగేవారు. తెల్లవారే వరకు ఈ సందడి కొనసాగేది. ఎంత రాత్రి అయినా సరే తమ వీధిలోకి వస్తున్న కళారాన్ని చూసి అమ్మవారికి హారతులు సమరి్పంచి ఆశీస్సులు అందుకునేవారు. ఇప్పటి కాలంతోపాటు ఉత్సవ తీరులోనూ ఆధునికత చోటు చేసుకుంది. అదిరిపోయే డీజే, బాణసంచా శబ్దాలతో దేవాలయాల నుంచి వీధుల్లోకి ఊరేగింపుగా వచ్చే అమ్మవారి కళారాన్ని దర్శిస్తే మళ్లీ ఏడాది వరకు ఎలాంటి దుష్ట శక్తుల పీడ, ఈతి బాధలు ఉండవని భక్తుల నమ్మకం.భక్తుల కొంగుబంగారం ఆరు కళారాలు... ఒంగోలు మొత్తం ఆరు కళారాలు ఉన్నాయి. స్థానిక బాలాజీరావుపేటలో కనకదుర్గాదేవి, గంటపాలెంలో పార్వతీదేవి, కొత్తపట్నం బస్టాండ్ నల్లూరి నర్సింగ్ హోమ్ దగ్గర బాలా త్రిపుర సుందరీ దేవి, నరసింహస్వామి, ఏనుగు చెట్టు దగ్గర ఉన్న అంకమ్మపాలెం కాళికాదేవి, కేశవ స్వామిపేటలోని మహిషాసుర మర్దిని కళారాలు ఉన్నా యి. నాలుగు కళారాలు పసుపు వర్ణంతో, కాళికాదేవి ఎర్రగా, నరసింహ స్వామి తెల్లగా ఉంటారు. ఈసారి బాలాజీరావు పేటలోని కనకదుర్గమ్మ కళారం నూతనంగా తయారు చేశారు. సుమారు 50 కేజీల పంచలోహాలతో అమ్మవారి కళారాన్ని తయారుచేసి నగరోత్సవం నిర్వహిస్తున్నామని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు.దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం రాత్రి బాలాజీరావు పేటలోని కనకదుర్గమ్మ అంకమ్మపాలెంలోని కాళికా దేవి. కొత్తపట్నం బస్టాండ్ నల్లూరి నర్సింగ్ హోమ్ దగ్గర బాలా త్రిపుర సుందరీ దేవి, నగర ఉత్సవానికి బయలుదేరుతాయి. నగరంలోని వేరువేరు మార్గాల్లో పయనించి బుధవారం ఉదయం మస్తాన్ దర్గా సెంటర్ దగ్గరకు చేరుకుంటాయి. బుధవారం అర్ధరాత్రి కేశవస్వామి పేటలోని మహిషాసుర మరి్ధని, గంటాపాలెంలోని పార్వతీదేవి కొత్తపట్నం బస్టాండ్ నల్లూరి నర్సింగ్ హోమ్ దగ్గర నరసింహ స్వామి కళారాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి.కళారం అంటే... ఒకసారి రక్త బీజుడు అనే రాక్షసుడుతో అమ్మవారు యుద్ధం చేయాల్సి వచ్చింది. అతని శిరస్సును ఖడ్గంతో ఖండిస్తుంది. రక్తం ధారలుగా నేల మీద పడుతుంది. ప్రతి రక్తపు చుక్క నుంచి మళ్లీ ఒక రక్త బీజుడు పుట్టుకొస్తాడు. బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడికి ఇచ్చిన వరంతో అమ్మవారితో యుద్ధం చేస్తూ పోటీగా నిలబడతాడు. అమ్మవారు తన శక్తి నుంచి నల్లని కాళీ రూపాన్ని సృష్టించి కాళికాదేవిగా దేవిగా మారి పెద్ద నాలుకతో రక్తబీజుడి నుంచి కారే రక్తపు బొట్టును భూమి మీద పడకుండా తాగేస్తూ ఆ రాక్షసుడి శక్తిని హరించి అంతం చేస్తుంది.అప్పుడు ప్రజలంతా కాళికామాతకు జయ జయ ధ్వానాలు పలికి అమ్మవారిని తమ మధ్య ఉండి పోవాలని కోరగా దానికి అమ్మవారు ‘‘అలా కుదరదు, ముల్లోకాలు రక్షణ బాధ్యత నాదే కదా. మీ కోరిక ప్రకారం ప్రజలందరికీ దుష్టశక్తుల భయం లేకుండా నా అంశంతో నిబిడీకృతమైన కళారాన్ని నోరు తెరిచి ఉన్న శిరస్సు భాగం ప్రసాదిస్తున్నాను. ఆ రూపాన్ని పూజించి ఆరాధించండి. దసరా నవరాత్రులలో దుర్గాష్టమి, మహార్నవమి రోజుల్లో అర్ధరాత్రి కళారాన్ని నగరసంచారం చేయించండి. నగరంలోని దుష్టశక్తులన్నీ పారిపోతాయని’’ అమ్మవారు అభయమిస్తుంది. విష్ణుమూర్తి తత్వమైన నరసింహ స్వామి కళారంగా వచ్చి మిమ్మల్ని తరింప చేస్తానని అమ్మవారు వరమిస్తుంది. అని పెద్దలు చెబుతారు. ఈ విధంగా ప్రారంభమైనదే మన కళారాల చరిత్ర. -
కలెక్టర్ ఉత్తర్వులనూ లెక్కచేయం..!
మర్రిపూడి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చనేతల అవినీతి అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ భూములను సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తూ పశువుల మేత భూమిని కూడా మేసేస్తున్నారు. పలువురు పచ్చనేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారుల అండతో మేత భూమికి వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదు చేయించుకుని ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలు తెచ్చుకున్నారు. దీనిపై కలెక్టర్ ఉత్తర్వులను కూడా లెక్కచేయకుండా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఆ వివరాల్లోకెళ్తే.. మర్రిపూడి మండలంలోని గుండ్లసముద్రం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 571లో 207.86 ఎకరాల విస్తీర్ణంలో పశువుల మేత భూమి ఉంది. ఆ భూమిలో మండలంలోని ఎస్టీరాజుపాలెం, గుండ్లసముద్రం, కోష్టాలపల్లి, రేగలగడ్డ గ్రామాలకు చెందిన పశువులను మేపుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు, కాసులకు కక్కుర్తిపడి పశువుల బీడును సబ్‌డివిజన్ చేసి మరీ పచ్చనేతల పేర్లను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. సుమారు 200 ఎకరాల మేత భూమిని పలువురు ఆక్రమించుకుని యథేచ్ఛగా అనుభవిస్తున్నారు. ఈమేత భూమి ఆక్రమణపై ‘పశువుల బీడు ఫలహారం’ అనే శీర్షికతో ఈ ఏడాది మే 17న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. పశువుల మేత భూమిని ఆక్రమణదారుల చర నుంచి కాపాడాలంటూ అప్పటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు గుండ్లసముద్రం గ్రామస్తులు ఫిర్యాదు కూడా చేశారు. విచారించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్లో ఉన్న పేర్లను తొలగిస్తామని కలెక్టర్, జేసీ హామీ ఇచ్చారు. ఆ మేరకు కిందిస్థాయి అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం. కానీ, నేటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు పశువుల మేత భూమిని యథేచ్ఛగా ఆక్రమించి దున్నుకుంటున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మిన్నకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారుల నుంచి మేతభూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ నాగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా, ఈ విషయం తనకు తెలియదని, స్థానిక వీఆర్ఓను అడిగి తెలుసుకుని చెబుతానని అన్నారు. 200 ఎకరాల పశువుల మేత భూమిని యథేచ్ఛగా ఆక్రమించిన పచ్చనేతలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించండి
● కలెక్టర్ రాజాబాబు కనిగిరిరూరల్: అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరం పరిష్కరించేలా దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక పవిత్ర ఫంక్షన్ హాలులో సోమ వారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై 814 అర్జీలు వచ్చాయని, వాటిలో 70 శాతం రెవెన్యూకి సంబంధించిన అర్జీలే ఉన్నాయన్నారు. రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో అర్జీల సంఖ్య తగ్గించాలని, అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. . వైశాల్యం పరంగా జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున సమస్యలు విన్నవించుకునేందుకు జిల్లా కేంద్రానికి వచ్చేందుకు ప్రజలు ఎంతో వ్యయప్రయాసలకు లోనవుతారన్నారు. అందుకే ప్రజల వద్దకే వచ్చి అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఎక్కడ జరిగితే అక్కడికే అధికారులంతా వస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, డీఆర్ఓ చిన్న ఓబులేసు, ఆర్డీఓ కేశవర్ధన్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, పార్ధసారధి, జాన్సన్‌లు పాల్గొన్నారు. -
గ్రామ బహిష్కరణ సమస్య పరిష్కారం
కొత్తపట్నం: మాజీ సర్పంచ్ కుటుంబం గ్రామ బహిష్కరణ సమస్య ప్రశాంతంగా పరిష్కారమైంది. మండలంలోని ఈతముక్కల పంచాయతీ చెంచుపాపాయిపాలెం పట్టపుపాలెంలో మాజీ సర్పంచ్ బసంగారి ప్రసాద్ కుటుంబాన్ని గ్రామకాపులు ఆ గ్రామం నుంచి బహిష్కరించి అతని ఇంటికి తాళం వేయడంతో బాధిత కుటుంబం ఆదివారం సాక్షి దినపత్రికను ఆశ్రయించింది. దీనిపై ‘మాజీ సర్పంచ్ కుటుంబం గ్రామ బహిష్కరణ’ అనే శీర్షికతో సోమవారం సాక్షి దినపత్రిక జిల్లా పేజీలో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి స్పందించిన కొత్తపట్నం ఎస్సై వేముల సుధాకర్‌బాబు సిబ్బందితో సోమవారం ప్రసాద్ ఇంటికి చేరుకుని సమస్య తెలుసుకున్నారు. గ్రామ కాపులను పిలిపించి ఏం జరిగిందో తెలుసుకున్నారు. గ్రామంలో ప్రసాద్ తీసుకున్న డబ్బు రూ.60 వేలు రెండు రోజుల్లో తిరిగి చెల్లించే విధంగా ఒప్పందం కుదిర్చి అతని ఇంటికి వేసిన తాళాలను గ్రామ కాపులతోనే తీయించారు. తన జీవనోపాధిని కూడా నిలిపివేశారని ఎస్సై ముందు ప్రసాద్ వాపోయాడు. దీంతో ఎస్సై మాట్లాడుతూ ప్రసాద్ జీవనోపాధిని నిలిపివేసే హక్కుగానీ, అతని తల్లి చర్చికి వెళ్తే అడ్డుకునే హక్కుగానీ ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అతని ఇంటికి కుళాయి కనెక్షన్‌ను కూడా తిరిగి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. -
ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: బాధితుల సమస్యలు పరిష్కరించినప్పుడే పోలీసులపై నమ్మకం పెరుగుతుందని, బాధితులు ముఖాల్లో సంతోషం కనిపిస్తుందని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు వచ్చా యి. ఎస్పీ వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..వేదికలో వచ్చిన ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను అదేశించారు. నిర్ణీత గడువు లోగా సమస్యల ను పరిష్కరించాలని చెప్పారు. వికలాంగులు, వృద్ధు లు, మహిళల సమస్యలను సత్వరమే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు స్థానిక పోలీస్స్టేషన్లలో కానీ, సబ్ డివిజన్లలో కానీ ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. మహిళా పోలీసు డీఎస్పీ వీవీ రమణకుమార్, రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు, పొది లి సీఐ వెంకటేశ్వర్లు, మార్కాపురం సీఐ సుబ్బారావు, కొండపి సీఐ సోమశేఖర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు. -
పన్ను తగ్గింపుపై అవగాహన కల్పించాలి
● అవగాహన ర్యాలీని ప్రారంభించిన జేసీ గోపాలకృష్ణ ఒంగోలు సబర్బన్: వస్తుసేవల పన్ను తగ్గింపు ఫలాలు ప్రజలందరికీ చేరేలా అవగాహన కల్పించాలని జేసీ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. వస్తు సేవల పన్ను తగ్గింపుపై ఏర్పాటు చేసిన ర్యాలీని స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం జెండా ఊపి ఆయన ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ.. అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను తగ్గింపు ఫలాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జేసీ కోరారు. వస్తు సేవా పన్నుల సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరుతుందని వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు వారాలు చేపట్టే ఈ కార్యక్రమాలను ఒక్కొక్క అంశంతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ప్రజలు అవగాహన పొందితే మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మెప్మాలోని పొదుపు సంఘాల మహిళలు, వివిధ వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ప్రజలు, అనుబంధశాఖల అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు అక్టోబర్ 1వ తేదీ ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తామన్నారు. సఫాయీ మిత్ర సురక్షా సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరానికి జీజీహెచ్ వైద్యులతో పాటు ఒంగోలు నగరంలోని ప్రముఖ ప్రైవేటు వైద్యశాలల స్పెషలిస్టులు కూడా హాజరై సేవలందిస్తారని, పారిశుధ్య కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వలంటీర్ విధుల నుంచి విముక్తి కలిగించండి
● నిరసన వ్యక్తం చేసిన వార్డు సచివాలయ కార్యదర్శులు ఒంగోలు సబర్బన్: వలంటీర్ విధుల నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల రాష్ట్ర ఉమ్మడి ఐక్యవేదిక నూతన కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.శ్రీ మహా విష్ణు మాట్లాడుతూ సచివాలయం ఉద్యోగులకి డోర్ టు డోర్ సర్వీసెస్, సర్వేలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 21 విభాగాల్లో ఉన్న ఉద్యోగులందరికీ జిల్లా డీఎస్సీ ద్వారా మెరిట్ లిస్ట్ తయారుచేసి అవకాశం ఉన్నంత వరకు ప్రమోషన్స్ కల్పించాలన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో టెక్నికల్, ప్రొఫెషనల్ ఉద్యోగులకి గ్రేడ్ 1,2,3 అనే విధానం రద్దు చేయాలని కోరారు. అందర్నీ డైరెక్ట్ డిీజిగ్నేషన్తో గుర్తించాలన్నారు. బీఎల్ఓ డ్యూటీ సచివాలయ ఉద్యోగులందరికీ పూర్తిగా తొలగించి గతంలో ఉన్న వారికే అప్పగించాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రికార్డ్ అసిస్టెంట్ స్కేలు పూర్తిగా తొలగించి కనీసం బేసిక్ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అమలు చేయాలన్నారు. అక్టోబర్ 2 నాటికి ఆరేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఒకటి ఇవ్వాలని కోరారు. అదనపు డ్యూటీ ఇన్చార్జిగా చేసినప్పుడు వాళ్లకి ప్రత్యేక శాలరీ మంజూరు చేయాలన్నారు. రావాల్సిన సరెండర్ లీవ్స్ వెంటనే క్యాష్ చేసుకునేలా అప్డేట్ చేయాలన్నారు. అలాగే గతంలో ప్రొబేషన్ లేట్ అయినందుకు ఎనిమిది నెలల అరియర్స్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు వారి మాతృ శాఖలు గుర్తించి వారి అండర్లో నడిచేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జనరల్ సెక్రటరీ ఎస్కే.రహంతుల్లా, కోశాధికారి షేక్ గౌస్ భాష పాల్గొన్నారు. -
నిత్యావసరాల ధరలు తగ్గించాలి
ఒంగోలు సబర్బన్: నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో సంతకాలు సేకరించి సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా అధికారులకు అర్జీ అందజేశారు. జేసీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రకాశం భవన్‌లోని పీజీఆర్ఎస్ భవన్లో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ 14 రకాల సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వమే ప్రజలకు అందించాలన్నారు. ధరల నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. గత ఆరు నెలలుగా రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారని, కందిపప్పు, నూనె ఊసే లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కందిపప్పు, నూనె, నిత్యావసర వస్తువులన్నీ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేసేవారని, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే వాహనాలు రద్దు చేశామనడం సమంజసంగా లేదన్నారు. రేషన్ షాపులు ఉన్న కాలంలోనూ, వాహనాలు నడిచిన కాలంలోనూ, నేడు కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్నారు. అక్రమాలను అరికట్టాలంటే ప్రజలు తినగలిగే సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందించాలని కోరారు. రేషన్ షాపుల ద్వారా తినడానికి వీలైన నాణ్యమైన బియ్యం అందిస్తే అక్రమాలు క్రమంగా ఆగిపోతాయన్నారు. ధరలకు అనుగుణంగా సామాన్యులకు వేతనాలు పెరగడం లేదన్నారు. అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజానీకం పౌష్టికాహారాన్ని తినలేకపోతున్నారని, ఫలితంగా మహిళలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు ప్రభుత్వాలు ఎగుమతి, దిగుమతుల్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, ధరల పెరుగుదలకు అవి మరింత ఆజ్యం పోస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి జి.ఆదిలక్ష్మి, సహాయ కార్యదర్శి కె.రాజేశ్వరి పాల్గొన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి : జేసీ గోపాలకృష్ణ ప్రజల నుంచి వస్తున్న అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు నాణ్యతతో పరిష్కరించాలని జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రకాశం భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో మాట్లాడారు. తన పరిధిలో ఉన్న వాటిపై వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులతో చర్చించారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల అర్జీలు పునరావృతమయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 227 అర్జీలు ఆయా శాఖలలో పునరావృతం అయ్యాయన్నారు. నిబంధనల ప్రకారం సరైనవో, కావో చూడాలని, సరైనవి కాకుంటే అర్జీదారులకు వివరించాలని సూచించారు. గడువులోగా అర్జీలను పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. గడువు తీరిన అర్జీలు 15 ఆయా శాఖలలో పెండింగ్‌లో ఉండటంపై జేసీ ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీవో కళావతి, సబ్ కలెక్టర్లు వరకుమార్, మాధురి, విజయ, జ్యోతికుమారి, వరలక్ష్మి, అనుబంధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 14 రకాల సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా అందించాలి మీ కోసం కార్యక్రమంలో జేసీకి అర్జీ అందజేత -
సెపక్ తక్రా విజేతలు.. తూర్పుగోదావరి, శ్రీకాకుళం
ఒంగోలు: సెపక్ తక్రా రాష్ట్రస్థాయి పోటీల్లో పురుషుల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు, మహిళల విభాగంలో శ్రీకాకుళం జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో కర్నూలు జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో, ప్రకాశం, అనంతపురం జిల్లాల జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో, కోనసీమ అంబేడ్కర్, తూర్పుగోదావరి జిల్లా జట్లు తృతీయ స్థానం సాధించాయి. స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించిన 35వ రాష్ట్ర స్థాయి పోటీల ముగింపు కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, సెపక్ తక్రా జిల్లా చైర్మన్ డాక్టర్ కృష్ణసాయి, కార్యదర్శి డి.రవిప్రసాద్, శాప్ కోచ్ పి.వేణు, బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. -
మాజీ సర్పంచ్ కుటుంబం గ్రామ బహిష్కరణ
కొత్తపట్నం: చర్చికి వెళుతున్నారనే నెపంతో ఒక కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామ పంచాయతీ పరిధిలో చెంచుపాపాయిపాలెం పట్టపుపాలెంలో మాజీ సర్పంచ్ బసంగారి ప్రసాద్ తల్లి రాములమ్మ ఈతముక్కలలోని చర్చిలో ప్రార్థన కోసం వెళ్తుంటారు. అలా చర్చికి వెళ్లడం గ్రామ కాపులకు ఇష్టం లేదని గత సంవత్సరం నుంచి ఆ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామంలోని రచ్చబండ వద్దకు పిలవడం, మీ తల్లి చర్చికి వెళ్లడం ఆపకపోతే మీ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తామని హెచ్చరించడం జరుగుతూ వస్తోంది. గత సంవత్సరం క్రిస్మస్ పండుగ నుంచి గ్రామపెద్దల వేధింపులు ఎక్కువయ్యాయి. వారి ఇంటికి తాగునీటి పైపులైన్ కట్ చేశారు. ప్రసాద్ ట్రాక్టర్, జేసీబీలు తిప్పుతుంటాడు. గ్రామంలోని ఓ హేచరీకి ట్యాంకర్లతో నీళ్లు తోలుతుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తులు హేచరీ నిర్వాహకులను ప్రసాద్ చేత నీళ్లు తెప్పించుకున్నా.. ఇతర ఏ పనులు చేయించుకున్నా హేచరీ మూతవేయిస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో హేచరీ నిర్వాహకులు అతడి చేత పనులు ఆపించారు. ఈ క్రమంలో ఆదివారం ప్రసాద్ ఇంట్లోని వ్యక్తులను బయటకు పిలిపించిన గ్రామకాపులు బలవంతంగా ఇంటికి తాళం వేశారు. గతంలో గ్రామంలో కొంత మొత్తాన్ని ఎవరో ఒకరు పాటలాగా పాడుకుని ఆ డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుంటారు. ప్రసాద్ కూడా కొంత నగదు తీసుకున్నాడు. డబ్బు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఇంటికి తాళం వేశామని గ్రామకాపులు చెబుతున్నారు. వాస్తవానికి వచ్చే నెల 20వ తేదీ వరకు పాట చెల్లింపు గడువు ఉందని, కేవలం తన తల్లి చర్చికి వెళ్తుందన్న కారణంతోనే ఇలా ఇంటికి తాళం వేశారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామంలో నుంచి తమ కుటుంబాన్ని వెలివేసే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయంపై కొత్తపట్నం పోలీసులకు ఫోన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ప్రార్థనకు చర్చికి వెళ్తున్నారని ఇంటికి తాళాలు తాగునీటి పైపులైన్ తొలగింపు -
దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
యర్రగొండపాలెం: సాక్షాత్తు శాసనసభలోనే హోం మంత్రి వంగలపూడి అనిత ఒక కులానికి చెందిన వ్యక్తిని ఇంకొక కులానికి చెందిన వ్యక్తిగా తన పేరును మార్చి చదవడమనేది అత్యంత దిగజారుడు రాజకీయమని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. అసెంబ్లీలో శనివారం హోం మంత్రి అనిత గుర్రం చలపతి చౌదరిపై మాట్లాడుతూ ఆయన చౌదరి కాదని, రెడ్డి కులానికి చెందిన వాడని వ్యాఖ్యానించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంత దిగజారుడు రాజకీయం చేసే పరిస్థితికి కూటమి ప్రభుత్వం రావడం వారి పరిపాలనకు అద్దం పడుతోందన్నారు. చంద్రబాబు సామాజిక వర్గంలో వచ్చిన వ్యతిరేకతను, జగనన్నపై ఉన్న అభిమానాన్ని తట్టుకోలేకే కుల ప్రస్ధావన చేయకూడని చట్టసభలో ఆ విధంగా మాట్లాడినందుకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీలో కమ్మ వాళ్లు ఉండకూడదు, ఉంటే వారిని ఏవిధంగానైనా డామేజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిట్లేనని ఆయన అన్నారు. గుర్రం చలపతి చౌదరిది మేడపి అని, వాళ్లది చౌదరి కుటుంబం, వైఎస్సార్ సీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, జగనన్న అభిమానులు లక్షల మంది ఉన్నారనటానికి ఇదో ఉదాహరణ అని అన్నారు. గతంలో నాని, వల్లభనేని వంశీలను కమ్మ సామాజిక వర్గంలో వైఎస్సార్ సీపీలో బలంగా ఉన్నవారిని ఏ విధంగా ఇబ్బందిపెట్టారో.. అదేవిధంగా చిట్టచివరికి సోషల్ మీడియా వారిపై కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందనటానికి మచ్చుతునక అని అన్నారు. -
పెంపుడు కుక్కలకు రేబిస్ రాకుండా చూసుకోవాలి
ఒంగోలు సబర్బన్: పెంపుడు కుక్కలకు రేబిస్ రాకుండా వాటి యజమానులు క్రమం తప్పకుండా రేబిస్ ఇంజక్షన్లు వేయించాలని పశుసంవర్థకశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ సూచించారు. ఆదివారం వరల్డ్ రేబిస్ డేని పురస్కరించుకుని ఒంగోలు సంతపేటలోని జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వెటర్నరీ పాలీక్లినిక్‌లో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ ఇంజక్షన్లు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ కే వెంకటేశ్వరరావు ప్రారంభించగా, ఒంగోలు నగరంలోని పెంపుడు కుక్కల యజమానులు వాటిని తీసుకొచ్చి రేబిస్ ఇంజక్షన్లు వేయించారు. సుమారు 275 పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి రాకుండా టీకాలు వేసినట్లు సంతపేటలోని పాలీక్లినిక్ పశువైద్యుడు, పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.జగత్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటరీ సూపర్వైజర్ బాబ్జి, పశువైద్యులు డాక్టర్ సురేంద్ర, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా రేబిస్ ఇంజక్షన్లు వేయించాలి జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రవికుమార్ వరల్డ్ రేబిస్ డే సందర్భంగా ఒంగోలులోని పశువైద్యశాలలో ఉచితంగా రేబిస్ ఇంజక్షన్లు -
ఎకో టూరిజానికి గ్రీన్ సిగ్నల్
● వచ్చే నెల 1వ తేదీ నుంచి తెరుచుకోనున్న జంగిల్ సఫారీ ● మొదలు కానున్న ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని ఎకో టూరిజానికి సంబంధించిన జంగిల్ సఫారీలతో పాటు నల్లమలలోని ప్రసిద్ధి గాంచిన ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయ యాత్రలు వచ్చే నెల 1వ తేదీ నుంచి పునః ప్రారంభించనున్నట్టు పెద్దదోర్నాల రేంజి అధికారి హరి తెలిపారు. పెద్దపులులు తమ సంతానోత్పత్తి ప్రక్రియను కొనసాగించేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు దట్టమైన అభయారణ్యంలోని నిషిద్ధ ప్రాంతాల్లోకి పర్యాటకులు, ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సాధారణంగా నిషేధిత సమయం పూర్తిగా వర్షాకాలం కావడంతో కురిసిన వర్షాలతో అడవంతా పచ్చగా దట్టమైన చెట్లు, పొదలతో నిండి ఉంటుంది. ఈ కాలంలోనే పెద్దపులులు తాము జత కట్టిన ఆడపులులతో ప్రశాంతంగా సంచరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ఉన్న 50 పులులు సంరక్షణా కేంద్రాల్లోని ఎకోటూరిజాలు, జంగిల్ సఫారీలలో పర్యాటకులను సంచరించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని పలు ప్రాంతాల్లో మూత పడిన ఎకో టూరిజాలతో పాటు పలు పర్యాటక కేంద్రాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో గిద్దలూరు సమీపంలో ఉన్న పచ్చర్ల, ఆత్మకూరు సమీపంలో ఉన్న బైర్లూటి, మండల పరిధిలోని తుమ్మలబైలు, ఎకోటూరిజాలకు సంబంధించిన జంగిల్ సఫారీలతో పాటు, యర్రగొండపాలెం మండల పరిధిలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. -
పవన్ కళ్యాణ్‌ని అడ్డుపెట్టుకుని సనాతన ప్రచారం
ఒంగోలు టౌన్: పవన్ కళ్యాణ్‌ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సీఎస్ సాగర్ విమర్శించారు. నగరంలోని మాదాల నారాయణస్వామి భవన్లో ఆదివారం సత్యశోధక్ సమాజ్ 153వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సభకు ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.మోహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవడం ద్వారా ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు అధికారంలోకి వచ్చాయని చెప్పారు. దళిత కులాల మధ్య గల సాంస్కృతిక వైరుద్యాన్ని ఉపయోగించుకుని కులవ్యవస్థలను కాపాడుతున్నాయని విమర్శించారు. దక్షిణ భారతదేశంలో కూడా కులవ్యవస్థలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. దళిత కమ్యూనిస్టులు ఏకమై కుల వ్యవస్థను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. అందుకోసం విప్లవ శక్తులు పోరాడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా అధ్యక్షుడు నాంచార్లు, అరుణోదయం సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జాలన్న పాల్గొన్నారు. -
మధ్యతరగతికి అందుబాటులో భవనాల నిర్మాణం
● క్రెడాయ్ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశంలో తీర్మానాలుఒంగోలు సబర్బన్: మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండేలా అపార్ట్మెంట్లు, ఇండివిడ్యువల్ భవనాల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు క్రెడాయ్ (బిల్డర్స్ అసోసియేషన్) నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పాత గుంటూరు రోడ్డులోని పాటిబండ్ల గోపాల స్వామి ఫంక్షన్ హాలులో క్రెడాయ్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. క్రెడాయ్ జిల్లా అధ్యక్షుడు జీ.రాజేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా అపార్ట్మెంట్ల ప్లాట్లు, వ్యక్తిగత భవనాల ధరలు పెరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువుల మీద జీఎస్టీ తగ్గించటం మంచి పరిణామమన్నారు. సెక్రటరీ కే.ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం నాలా చార్జీలను తీసేసి, నిర్మాణాల విషయంలో స్థానిక సంస్థలకు ఆ బాధ్యతలు అప్పజెప్పిందన్నారు. వాటితో పాటు అపార్ట్మెంట్ల విషయంలో సెట్ బ్యాక్స్ 24 మీటర్లలోపు, 24 మీటర్లకు పైన అనే విషయంలో అందరూ అర్థం చేసుకొని ముందుకు సాగాలన్నారు. క్రెడాయ్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ బిల్డర్స్‌కు సంబంధించిన సమస్యలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వాటిని వెంటనే పరిష్కరిస్తే బిల్లర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. తొలుత జరిగిన కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలను కమిటీ ఆమోదించింది. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఎన్.రఘు రామయ్య, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్.హరి ప్రసాద రావు, ట్రెజరర్ ఎం.తిరుమల, జాయింట్ సెక్రటరీ సిహెచ్.రాఘవ రెడ్డి, ఈసీ మెంబర్లు టి.వరుణ్ కుమర్, వై.ఇస్సాక్ న్యూటన్, కే.రఘునాథ్, ఏవిఎన్ బాబు, పి.నాగేశ్వరరావు, సలహాదారులు ఐవీ.వీర బాబు, ఎం.శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. -
గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి
ఒంగోలు వన్‌టౌన్: గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమీషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశం ఒంగోలు గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో ఇతరులను చేరిస్తే ఉద్యమిస్తామన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గిరజన హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. గిరిజనులకు కనీసం ఇంటి వసతి, గానీ, మంచి నీటి వసతి గానీ లేని గ్రామాలు ఇప్పటికీ అనేకం ఉన్నాయన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని గిరిజనులకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వీటిని ఏర్పాటు చేయాలన్నారు. గిరిజనుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధులను గిరిజనులకే ఖర్చు చేయాలని కోరారు. షెడ్యూల్డు తెగల జాబితాలో సుగాలీ, చెంచు, ఎరుకల, యానాది, నక్కల అనేక జాతు ఉన్నాయని వీరందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించడంలేదన్నారు. మైదాన ప్రాంతాలైన కదిరి, కావలి, మాచర్ల, జగ్గయ్య పేట, నాలుగు అసెంబ్లీ స్థానాలను ఎస్టీలకు రిజర్వేషన్ చేయాలన్నారు. సమావేశంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్మా, జీపీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణునాయక్, డాక్టర్ బాలాజీ నాయక్, ఆర్ హనుమా నాయక్, జె సంతోష్ నాయక్, ఏ శ్రీను నాయక్, రవీంద్ర నాయక్, దుర్గా నాయక్, జీ గణేష్ నాయక్, బండి రూతమ్మ, కాకి రమణమ్మ, పాములేటి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఈ–క్రాప్ గగనమే
సాగు సగమే..జిల్లాలో పంట నమోదు నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు దాటుతోంది. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు, కొన్ని మండలాల్లో అధిక వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో పక్క ముందస్తు సాగు చేసిన పంటలు కోతకు రావడంతో నూర్పిళ్లు మొదలవుతున్నాయి. ఈదశలో రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ–క్రాప్ నమోదుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఈ–క్రాప్ 37 శాతం మాత్రమే నమోదైంది. దీంతో ఖరీఫ్ సీజన్లో పంటలు వేసిన రైతులకు తీవ్ర నష్టం వచ్చే ప్రమాదం ఉంది. పంట నమోదు కాకపోవడంతో విపత్తుల సమయంలో పరిహారం, పంట అమ్మకాల సమయంలో ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. 20–31 శాతంలోపుబేస్తవారిపేట: జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పంటలతో సంబంధం లేకుండా ప్రతి ఎకరా భూమిని సర్వే నంబర్ల ఆధారంగా వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 1.30 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా కేవలం 69 వేల హెక్టార్లలో సాగైంది. సగం మాత్రమే సాగు చేసిన పంటలకు ఈ–క్రాప్ బుకింగ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనపడుతోంది. వరిపంట 12,826 హెక్టార్లకు గాను 4,428, పత్తి 26,981కి 12,759 హెక్టార్లు, కంది 68,287కు 36,074, సజ్జ 7020 హెక్టార్లకు 2,918 హెక్టార్లలో సాగు చేశారు. 37.12 శాతం పూర్తి.. జిల్లా వ్యాప్తంగా 15,94,311 వెబ్‌ల్యాండ్ పార్శిల్స్ ఉండగా ఇప్పటి వరకు 5,91,858 ల్యాండ్ పార్శిల్స్ మాత్రమే పంట నమోదు పూర్తయింది. ఇంకా 63 శాతం ల్యాండ్ పార్శిల్స్‌కు ఈ–క్రాప్ నమోదు కావాల్సి ఉంది. ఈ నెల 30వ తేదీ లోపు ఈ–క్రాప్ నమోదు గడువు పూర్తి కానుంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది లక్ష్యాన్ని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గడువులోపు పంట నమోదు కాకుంటే విపత్తుల సమయంలో పరిహారం, పంట అమ్మకాల సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమన్వయ లోపం.. పంటల నమోదు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమన్వయంతో పూర్తి చేయాల్సి ఉంది. రైతులతో కలిసి పంట పొలాలకు వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంట వివరాలు, సర్వే నంబర్ ఆన్లైన్లో నమోదు చేసి ధ్రువీకరణ చేసిన తర్వాతనే ఈ–క్రాప్ పూర్తి చేయాల్సి ఉంది. కానీ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించింది. రెవెన్యూ సిబ్బంది ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. బదిలీల నేపథ్యంలో.. వీఏఏల బదిలీల నేపథ్యంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడక్కడా కొందరు వ్యవసాయ సిబ్బంది మాత్రమే ఈ ప్రక్రియను మమ అనిపిస్తున్నారు. గ్రామంలో ఎక్కడో ఒకచోట కూర్చొని తూతూమంత్రంగా నమోదు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినపడుతున్నాయి. దీంతో ఈ–క్రాప్ నమోదులో స్పష్టత ఎంత వరకూ అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. నత్తనడకకు కారణాలు: ● గుట్టలు, చిల్లకంప ఉన్న సర్వే నంబర్లలో దగ్గరికి వెళ్తేకానీ జియో ట్యాగింగ్ తీసుకోవడం లేదు. ● కొత్తగా వీఏఏలు గ్రామాలకు రావడంతో రైతులపై, గ్రామంలోని సర్వే నంబర్లపై పట్టులేకపోవడం. ● ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం సర్వే నంబర్ల వారీగా పంట సాగు చేసిన లేదా బీడుగా ఉన్నా జియో మ్యాపింగ్ చేసి, ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. ఈ తతంగం క్షేత్ర స్థాయిలో పూర్తికావడానికి ఎక్కువ సమయం పడుతోంది. ● భూములు రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎల్పీ నంబర్లకు వ్యవసాయశాఖ సిబ్బంది దగ్గరున్న సర్వే నంబర్లకు సరిపోకపోవడంతో సమస్య ఎదురవుతోంది. ● బయోమెట్రిక్ పడని రైతులకు ఐరిస్ చేయడానికి సిగ్నల్ సమస్య వేధిస్తోంది. ● వెబ్‌ల్యాండ్, అటవీ భూముల్లో పంటలు ఉన్నా లేకపోయినా ఫీల్డ్ సర్వే చేయాలి. బీడు భూములను అయిదేళ్లకు పైగా సాగు చేయనివి, 1–5 ఏళ్ల మధ్య చేయనివి, ఈ ఏడాది మాత్రమే చేయనిగా విడదీయాలి. నా పంట ఈ–క్రాప్‌లో నమోదు కాలేదు ఐదు ఎకరాల్లో కందిపంట సాగుచేశాను. నా పంట ఈ–క్రాప్‌లో నమోదు చేసేందుకు అధికారులు రాలేదు. ఈ–క్రాప్ విధానాన్ని సక్రమంగా అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరపొందే అవకాశాన్ని కోల్పోతాం. పండించిన పంటలు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ఈ–క్రాప్ నమోదై ఉండాలి. – పీ సుబ్బారెడ్డి, రైతు, బేస్తవారిపేట -
అక్షరాయుధం.. జాషువా కవిత్వం
● డీఆర్వో ఓబులేసు ఒంగోలు వన్‌టౌన్: జాషువా కవిత్వం సామాజిక అసమానతలపై చేసిన పోరాటంలో అక్షరాయుధంగా నిలిచిందని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) చిన్న ఓబులేసు అన్నారు. గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలను స్థానిక కలెక్టరేట్లోని జాషువా విగ్రహం వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్వో మాట్లాడుతూ తన రచనల ద్వారా సమాజంలో సంస్కరణలకు పాటుపడిన వ్యక్తి గుర్రం జాషువా అని కొనియాడారు. కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, తదితరులు పాల్గొని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత నాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనం – ఆర్టీసీ బస్సు ఢీ
మృతిచెందిన జశ్వంత్ ప్రమాదానికి కారణమైన కర్ణాటక ఆర్టీసీ బస్సు ● యువకుడు దుర్మరణం పెద్దదోర్నాల: ఎదురెదురుగా వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై కొత్తూరు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా మదనపల్లె తంబళ్లపల్లికి చెందిన బీటెక్ విద్యార్థి ఈడకొట్టు జశ్వంత్ (20) దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న ఏఎస్సై కృష్ణమూర్తి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి కృష్ణమూర్తి కథనం మేరకు.. కర్నూలు నుంచి ద్విచక్ర వాహనంపై పెద్దదోర్నాల మండల కేంద్రం వైపునకు వస్తున్న జశ్వంత్‌ను శ్రీశైలం నుంచి ఆత్మకూరు వైపునకు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు కొత్తూరు వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జశ్వంత్.. సంఘటన స్థలంలోనే తుది శ్వాస విడిచాడు. మృతుడు మార్కాపురం పట్టణంలోని ఏ1 గ్లోబల్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించనున్నట్లు ఏఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు చెప్పారు. -
80 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసులు పేకాట, కోడిపందేలు, మట్కా స్థావరాలపై పంజా విసిరారు. జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. కలుగులో దాక్కున్న ఎలుకలను పట్టుకున్నట్లు కొండ ప్రాంతాలు, పొలాలతోపాటు రహస్య ప్రదేశాలలో పేకాటాడుతున్న వారిని పట్టుకున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 16 ప్రదేశాలలో దాడులు నిర్వహించి 80 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి 1,35,800 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. చీమకుర్తి, మద్దిపాడు, పొదిలి, తర్లుపాడు, త్రిపురాంతకం, కొండపి, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, అర్ధవీడు పోలీసుస్టేషన్లలో ఒక్కో కేసు చొప్పున నమోదు చేశారు. కంభం, యర్రగొండపాలెం పోలీసు స్టేషన్లలో రెండు కేసుల చొప్పున నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా సరే పేకాట, మట్కా, కోడిపందేలకు పాల్పడితే వదిలిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. -
పెరిగిన భారం..అందని జీతం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుండటంతో ఇప్పటికే కొందరు చిరుద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడగా మరి కొందరు ఉద్యోగులు జీతాలు సక్రమంగా అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో ఔట్సోర్సింగ్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఇచ్చే కొద్దిపాటి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేస్తుంటే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కంభం: కూటమి ప్రభుత్వం తీరుతో ప్రభుత్వ వైద్యశాలల్లో ఔట్ సోర్సింగ్ కింద పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బంది నెలల తరబడి జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 18 వైద్యశాలల్లో సుమారు 230 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులున్నారు. కంభం, గిద్దలూరు, దోర్నాల, యర్రగొండపాలెం, పామూరు, కనిగిరి, పొదిలి, కొండపి, చీమకుర్తి, ఒంగోలు, మార్కాపురం తదితర వైద్యశాలల్లో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ థర్డ్ పార్టీ ఏజన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తుంటారు. శానిటరీ పనిచేసే సిబ్బందికి రూ.11,858, సూపర్ వైజర్లకు రూ.13,500 జీతం ఉంటుంది. సిబ్బందిని పెంచకపోవడంతో పెరిగిన పని ఒత్తిడి: ‘ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ ద్వారా ప్రభుత్వ వైద్యశాలలో శానిటరీ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. 30 పడకల వైద్యశాలలో 8 మంది, 50 పడకల వైద్యశాలలో 13 మంది, 100 పడకల వైద్యశాలల్లో సుమారు 30 మంది వరకు విధులు నిర్వహించాల్సి ఉంది. శానిటరీ ఉద్యోగులు విదుల్లో చేరిన కొంతకాలానికే కొన్ని వైద్యశాలలు 30 పడకల నుంచి 50 పడకలకు, 50 పడకల నుంచి 100 పడకల వైద్యశాలలుగా అప్ గ్రేడ్ అయ్యాయి. అప్ గ్రేడ్ చేసిన తర్వాత అందుకు తగ్గట్టుగా సిబ్బంది సంఖ్యను పెంచకపోవడంతో తమ పై పనిభారం పెరిగిందని శానిటరీ వర్కర్లు వాపోతున్నారు. 6–7 నెలలుగా అందని వేతనాలు: జూన్, జూలై నెలల వరకు జీతాలకు సంబంధించిన బిల్స్ పంపించినప్పటికీ జీతాల విడుదలలో జాప్యం ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని కొన్ని వైద్యశాలల్లో 5–6 నెలల జీతాలు పెండింగ్ లో ఉండగా, మరికొన్ని చోట్ల 7 నెలల వరకు జీతాలు రాలేదని ఉద్యోగులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పాత ఏజెన్సీ తొలగించి కొత్త వారికి అప్పగిస్తే తమ జీతాల పరిస్థితి ఏంటని ఉద్యోగుల్లో ఆందోళన మొదలవుతోంది. గతంలో పీఎఫ్ డబ్బులు ప్రతినెలా తమ ఖాతాల్లో జమయ్యేవని, గత కొన్ని నెలలుగా పీఎఫ్ డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎవరిని అడిగినా స్పందించడం లేదని ఉన్నతాధికారులు స్పందించి జీతాలతో పాటు పీఎఫ్ డబ్బులు ప్రతి నెల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆందోళన బాటలో కార్మికులు: సుమారు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని, వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీ యర్రగొండపాలెం ఏరియా వైద్యశాల వద్ద సీఐటీయూ నాయకులతో కలసి పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించకపోతే అదే బాటలో మిగిలిన వైద్యశాలల్లో పనిచేసే సిబ్బంది ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలి వైద్యశాలకు రోగులు క్యూ కడుతున్న నేపథ్యంలో శానిటరీ వర్కులు ఆందోళన బాటకు దిగితే వైద్యశాలల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా మారిపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నకిలీలకు చెక్..!
ఆయిల్ అక్రమాలు లీక్.. సింగరాయకొండ: డీజిల్ వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన నైట్రోజన్ ఆకై ్సడ్ (ఎన్ఓఎక్స్) ఉద్గారాలను తగ్గించి వాయు కాలుష్యాన్ని నివారించడానికి డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) అనే ఆయిల్‌ను వినియోగిస్తారు. దీనినే యాడ్ బ్లూ ఆయిల్ అని అంటారు. బీఎస్–6 డీజిల్ వాహనాలలో యాడ్ బ్లూ ఆయిల్‌ను కచ్చితంగా వాడాలి. లేకుంటే వాహనం ఆగిపోవడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు నకిలీ ఆయిల్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రముఖ కంపెనీల ఆయిల్ అంటూ వాహనదారులను నమ్మించి మోసం చేస్తున్నారు. జాతీయ రహదారిపై సింగరాయకొండ మండలంలోని విమానాల రన్‌వే పక్కన ఈ అక్రమ వ్యాపారం కొన్నాళ్లుగా జోరుగా సాగుతోంది. ఇటీవల ఒక ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ఆయిల్ మాఫియా గుట్టు రట్టయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రముఖ కంపెనీల ఆయిల్ పేరుతో నకిలీ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.80 వేల విలువైన 20 లీటర్ల డబ్బాలు 68 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 7 పాయింట్ల ద్వారా నాశిరకం ఆయిల్ విక్రయాలు... డీజిల్ వాహనాల ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం యాడ్ బ్లూ ఆయిల్‌ను ప్రవేశపెట్టింది. 2022 నుంచి బీఎస్–6 మోడల్ కార్ల నుంచి భారీ వాహనాల వరకు అన్నింట్లో ఈ ఆయిల్ ఉపయోగిస్తారు. ఆయా వాహనాలలో డీజిల్ ట్యాంకు పక్కనే యాడ్ బ్లూ ఆయిల్ ట్యాంకు ఉంటుంది. వాహనాన్ని బట్టి 20 నుంచి 60 లీటర్ల కెపాసిటీతో ఈ ఆయిల్ ట్యాంకులు ఉంటాయి. లీటరు యాడ్ బ్లూ ఆయిల్ ధర 60 రూపాయలు ఉంటుంది. కొందరు అక్రమార్కులు సాధారణ కంపెనీలు తయారు చేసిన నాశిరకం ఆయిల్ తీసుకొచ్చి ప్రముఖ బ్రాండ్ల స్టిక్కర్లు వేసి అమ్మకాలు సాగిస్తూ వాహనదారులను మోసగిస్తున్నారు. జాతీయ రహదారిపై సింగరాయకొండ మండల పరిధిలో ఉన్న విమానాల రన్‌వే పక్కన రోడ్డుకు ఇరువైపులా సుమారు సంవత్సర కాలంగా ఈ ఆయిల్ అమ్మకాలు సాగిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఐరన్ స్టాండ్ల మీద తెల్లట్యాంకు ఏర్పాటు చేస్తారు. తమ వద్ద ప్రముఖ బ్రాండ్ల యాడ్ బ్లూ ఆయిల్ దొరుకుతుందని బోర్డులు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. రన్‌వే పక్కన 7 పాయింట్లలో ట్యాంకుల ద్వారా వాహనాలకు నేరుగా ఆయిల్ నింపుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు ఉన్న 20 లీటర్ల డబ్బాలు కూడా అమ్ముతారు. వారానికి ఒకసారి ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఉన్న నకిలీ ఆయిల్ డబ్బాలను లారీలలో తీసుకొచ్చి వీరికి కొందరు అప్పగిస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సిబ్బందిని ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్న ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుండగా, ఓ ప్రముఖ ఆయిల్ కంపెనీకి చెందిన ప్రతినిధి ఈ నెల 24వ తేదీ దీనిపై ఫిర్యాదు చేశారు. విమానాల రన్ వే పక్కన రాజ్ ఎంటర్ ప్రైజెస్, మహదేవ్ మోటార్స్, బాలాజీ మోటార్స్ పేరు మీద నిర్వాహకులు ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఉన్న యాడ్ బ్లూ ఆయిల్ క్యాన్లు తీసుకొచ్చి వాహనదారులను మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్ద ట్యాంకులలో యూరియా, వాటర్ కలిపి యాడ్ బ్లూ ఆయిల్ తయారు చేసి మరీ విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైవేపై పోలీసుల పర్యవేక్షణ శూన్యం... ఆయిల్ మాఫియాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న జాతీయ రహదారిపై పోలీసులు పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంవత్సరం నుంచి ఒడిశాకు చెందినవారు యాడ్ బ్లూ ఆయిల్ పేరుతో అక్రమ వ్యాపారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి విమానాల రన్‌వేకి ఇరువైపులా ఎలాంటి షాపులు ఏర్పాటు చేయకూడదు. కానీ, ఆయిల్ మాఫియా అక్కడ 7 పాయింట్లు ఏర్పాటు చేసి మరీ ఒడిశా సిబ్బందిని ఏర్పాటు చేసి నకిలీ ఆయిల్ విక్రయిస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు.. ఇక్కడ ఏం చేస్తున్నారు.. వారు చేస్తోంది అక్రమమా.. సక్రమమా అని ఏరోజైనా పోలీసులు పట్టించుకున్నారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నేటికీ యాడ్ బ్లూ ఆయిల్ అమ్మే ఆయిల్ ట్యాంకులను పోలీసులు స్వాధీనం చేసుకోకపోవడంతో అవి ఇప్పటికీ రోడ్డు పక్కనే ఉన్నాయి. వాటిలో పనిచేసే సిబ్బంది పరారయ్యారని పోలీసులు చెబుతుండటం విశేషం. గత ఆరు నెలల క్రితం విమానాల రన్‌వే పక్కన కళ్యాణ మండపం సమీపంలో లారీల నుంచి డీజిల్ చోరీ చేసే ముఠా స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసుకుందని పత్రికలలో కథనాలు రావటంతో అక్కడి నుంచి దుకాణం ఎత్తివేశారని, అతనికి పోలీసుల సహకారం కూడా ఉందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో యాడ్ బ్లూ ఆయిల్ మాఫియా పట్ల కూడా ఏడాది నుంచి పోలీసులు పట్టించుకోకపోవడం, ఓ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు చేసినా మొక్కుబడిగా చర్యలు తీసుకోవడంతో పోలీసుల తీరుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజిల్ వాహనాలలో వాడే యాడ్ బ్లూ ఆయిల్ పేరుతో సింగరాయకొండ మండలంలో దందా ప్రముఖ కంపెనీల ఆయిల్ అంటూ నకిలీ ఆయిల్ అమ్మకం జాతీయ రహదారిపై విమానాల రన్‌వే పక్కన నాశిరకం యాడ్ బ్లూ ఆయిల్ విక్రయం ప్రముఖ బ్రాండ్ల ఆయిల్ అని చెప్పడంతో నమ్మి కొనుగోలు చేసి మోసపోతున్న వాహనదారులు ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదుతో ఆయిల్ మాఫియా మోసాలు బట్టబయలు కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసిన పోలీసులు దుకాణాలు తొలగించాం రాజస్థాన్‌కు చెందిన ముఠా ఆధ్వర్యంలో యాడ్ బ్లూ ఆయిల్ మాఫియా జరుగుతోంది. వీరు యూరియా, నీరు కలిపిన మిశ్రమాన్ని ప్రముఖ కంపెనీ బ్రాండ్ల పేరుతో అమ్ముతున్నారన్న ఫిర్యాదు రావడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. 20 లీటర్ల ఆయిల్ డబ్బాలు 68 స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వారు పరారయ్యారు. ప్రస్తుతం ఆ దుకాణాలు తొలగించాం. – బి.మహేంద్ర, ఎస్సై, సింగరాయకొండ -
డిజిటల్ యాప్
కూటమి అరాచకాలను ఎదుర్కొనేందుకే యర్రగొండపాలెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రత్యేక డిజిటల్ బుక్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో ఐటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న జిల్లాకు చెందిన వారు డిజిటల్ బుక్ యాప్‌ను ఆదివారం ఎమ్మెల్యేతో ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్నివర్గాలకు చెందిన పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను పక్కనపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు నమోదు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. అటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు జగనన్న డిజిటల్ బుక్ యాప్‌ను ప్రారంభించారన్నారు. ఎవరికై నా అన్యాయం జరిగితే ఈ యాప్‌లో నమోదవుతుందని, ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన పరచాలని అన్నారు. కార్యక్రమంలో పెద్దారవీడు మండల మాజీ జెడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, పెద్దదోర్నాల మండల పార్టీ కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు దుద్యాల రామకృష్ణారెడ్డి, లింగంగుంట్ల ప్రవీణ్, వెన్నా కాశీశ్వరరెడ్డి, కొల్లి నాగేశ్వరరెడ్డి, మూల హర్షవర్ధన్, కందుల వెంకటసుబ్బారెడ్డి, పతంగి అంజిరెడ్డి పాల్గొన్నారు. -
బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!
లోపల, బయట ప్రయాణికులతో నిండిపోయిన ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ అధిక సంఖ్యలో బస్సు ఎక్కుతున్న మహిళలు కూటమి ప్రభుత్వ నిర్వాకంతో బస్సులెక్కాలంటేనే భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రయాణికులకు సరిపడా సర్వీసులు ఏర్పాటు చేయకుండానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించడంతో జిల్లాలో అరకొరగా నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగి రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో జిల్లాలోని ప్రయాణికులకు బస్సులెక్కడం అనేది ఒక సవాలుగా మారింది. ఒకవేళ ఎలాగోలా అష్టకష్టాలుపడి తోటివారిని తోసుకుంటూ బస్సు ఎక్కినా సీటు దొరకడం గగనమైంది. ఈ రెండూ సజావుగా జరిగి గమ్యస్థానానికి చేరితే ఆ రోజుకి గండం గట్టెక్కినట్లే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు అన్ని పట్టణాల్లోని బస్టాండ్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతరత్రా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం, శనివారం నుంచి కళాశాలలకు కూడా సెలవులు కావడంతో ఒక బస్సు వస్తే ఎక్కేందుకు 120 నుంచి 150 మంది వరకూ ప్రయాణికులు పోటీపడుతున్నారు. ప్రభుత్వం బస్ సర్వీసులు పెంచకపోవడంతో వచ్చిన బస్సు మిస్సయితే మళ్లీ బస్సు ఉంటుందో ఉండదో తెలియక ఎలాగైనా అదే బస్సు ఎక్కాలనే ప్రయత్నంలో తీవ్రంగా తోసుకుంటున్నారు. బస్సులో సీట్ల కోసం పోటీపడే క్రమంలో ఏకంగా ప్రయాణికుల మధ్య వాదనలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియా ట్రోల్ కూడా అవుతున్నాయి. దీనంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేయకపోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. – సాక్షి, ఒంగోలు సీట్ల కోసం పాట్లు బస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు -
టీడీపీ నాయకుడి దౌర్జన్యంపై బాధితుల నిరసన
ఒంగోలు వన్‌టౌన్: ఒంగోలు నెహ్రూకాలనీలో గత 20 సంవత్సరాలుగా తాము నివాసం ఉంటున్న గృహాన్ని కూలగొడతామని టీడీపీ నాయకుడు పసుపులేటి శ్రీను బెదిరిస్తున్నాడంటూ శనివారం బాధితులు నిరసన వ్యక్తం చేశారు. దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ మాల కులానికి చెందిన ఈద జాస్మిన్, విజయల కుటుంబం నెహ్రూకాలనీలో గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో నివాసం ఏర్పాటు చేసుకుని ఇంటి పన్ను, కుళాయి పన్నులను ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటోందని తెలిపారు. అయితే, అదే ప్రాంతానికి చెందిన బిల్డర్ అపార్టుమెంటు కట్టేందుకు ప్రయత్నిస్తూ వీరి కుటుంబానికి చెందిన గృహాన్ని కూలగొట్టేందుకు మున్సిపల్ అధికారులతో కలిసి కుట్రలు చేస్తున్నాడన్నారు. టీడీపీ నాయకుడు పసుపులేటి శ్రీను, మున్సిపల్ అధికారులు కూడా బాధితులను బెదిరిస్తున్నారన్నారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ డీఆర్ఓ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కె.జయకుమార్, ఎస్కే జిలానీ, సీహెచ్ సంపత్ కుమార్, బాధితులు పాల్గొన్నారు. -
రాయలసీమ వెళ్లే వాహనాల దారి మళ్లింపు
● బైర్లూటి చెరువు నిండి రోడ్లపై నీరు పారుతుండటంతో డైవర్షన్ పెద్దదోర్నాల: మండల కేంద్రం నుంచి రాయలసీమ వైపునకు వెళ్లే వాహనాలను అధికారులు శనివారం దారి మళ్లించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని బైర్లూటి వద్ద ఉన్న సిద్ధాపురం చెరువు పూర్తిస్థాయిలో నిండిపోయింది. దీంతో అధికారులు చెరువు అలుగు ద్వారా వరద నీటిని వదలడంతో రోడ్డుపై భారీగా నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రహదారిని మూసివేయడంతో మండల కేంద్రం మీదుగా రాయలసీమ వైపు వెళ్లే అన్ని వాహనాలను దారి మళ్లించారు. గుంటూరు, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గిద్దలూరు, నంద్యాల మీదుగా కర్నూలు, తదితర ప్రాంతాల మీదుగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ఐనముక్కల వద్ద ఏఎస్సై కృష్ణమూర్తి, రైటర్ మోహన్ పర్యవేక్షించారు. -
పొంగిన వాగులు, వంకలు
మార్కాపురం: మార్కాపురం ప్రాంతంలో శుక్రవారం వేకువజామున నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పారుతున్నాయి. మార్కాపురం, పెద్దారవీడు, యర్రగొండపాలెం, తర్లుపాడు, త్రిపురాంతకం తదితర ప్రాంతాల్లో వర్షం కరుస్తోంది. మార్కాపురం ప్రాంతంలో 21.6 మి.మీ, యర్రగొండపాలెంలో 38.6, పుల్లలచెరువులో 45.4, పెద్దారవీడులో 8.4, దోర్నాలలో 4.8, త్రిపురాంతకంలో 22.6, కంభంలో 5.4, బేస్తవారిపేటలో 3.8, అర్ధవీడులో 8.6, గిద్దలూరులో 1.6, తర్లుపాడులో 8.4, రాచర్లలో 2.2 మి.మీ వర్షం కురిసింది. దీనితో మార్కాపురం–కుంట మధ్య ఉన్న చెరువువాగు, కుంట–జమ్మనపల్లి మధ్య ఉన్న ఉప్పువాగు, మార్కాపురం చెరువుకట్టపై ఉన్న అలుగు ప్రాంతాల్లో రోడ్డుపై వర్షపు నీరు పారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. మార్కాపురం రూరల్ ఎస్సై అంకమరావు తన సిబ్బందితో వాగులు రోడ్డుపై పారుతున్న ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి ప్రమాదాలు జరగకుండా నివారించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి కోలభీమునిపాడు గ్రామంలో డోలు కిరణ్ మట్టిమిద్దె కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరికీ ప్రాణాపాయం తప్పింది. అయితే ఇంట్లో ఉన్న బీరువా, ఇతర సామాన్లు రాళ్లుపడి ధ్వంసమయ్యాయి. -
ప్రభుత్వ వైద్యుల పోరుబాట
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రభుత్వ వైద్యులు సమ్మె బాట పట్టారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను రద్దు చేయడంతో కొన్నాళ్లుగా దాన్ని పునరుద్ధరించాలని ప్రాథమిక వైద్యశాలల్లో పనిచేస్తున్న వైద్యులు కోరుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో శుక్రవారం నుంచి సమ్మెకు దిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాహుల్ తెలిపారు. రోజువారి విధుల్లో భాగంగా పంపించే ఆన్లైన్ రిపోర్టులను నిలిపేసినట్లు చెప్పారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునురుద్ధరించాలని, టైం బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు బేసిక్ పే 30 శాతం ట్రైబల్ అలవెన్స్, నేటివిటి అండ్ అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచినట్లు తెలిపారు. వైద్యులకు కచ్చితమైన పనిగంటలు, వారంతపు సెలవులు, స్పష్టమైన జాబ్ కార్డ్ ఇవ్వడం, నాన్ మెడికల్ వ్యక్తులు విచ్చలవిడిగా ఇన్స్పెక్ట్ చేయకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసన ప్రజలపై కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యంపైనే అని స్పష్టం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు వైద్య సేవలను అందించామని, ప్రభుత్వం ప్రాథమిక వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. -
రుణాల లక్ష్యాలు అమలు చేయాలి
ఒంగోలు సబర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేటాయించిన రుణ లక్ష్యాలు సాధించడంతో పాటు జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పీఎంఈజీపీ, ముద్ర, పీఎం విశ్వకర్మ, తదితర కేంద్ర, రాష్ట్ర పథకాలకు సంబంధించిన రుణాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు, బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, డీఆర్డీఏ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నారాయణ, శ్రీహరి, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్, సీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వరరావు, జిల్లా హార్టీకల్చర్ అధికారి గోపీచంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకు కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో కలెక్టర్ రాజాబాబు -
వైఎస్సార్ సీపీ వర్గీయులు బెయిల్‌పై విడుదల
ఒంగోలు టౌన్: వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన ఊరేగింపులో జరిగిన తోపులాట విషయంలో ఒంగోలు 45వ డివిజన్‌కు చెందిన గణేష్ భక్తులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న మూరక నారాయణరెడ్డి, భూమిరెడ్డి తిరుపతిరెడ్డి, తమ్మినేని సిద్దారెడ్డి శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. వారిని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, డివిజన్ అధ్యక్షుడు మాల్యాద్రిరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజేష్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మలిశెట్టి దేవా జిల్లా జైలు వద్దకు వెళ్లి కలిసి మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చుండూరి రవిబాబు భరోసా ఇచ్చారు. పరామర్శించిన చుండూరి రవిబాబు, నాయకులు -
గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా శిద్దా సుధీర్
చీమకుర్తి: చీమకుర్తిలోని గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా గోల్డెన్ గ్రానైట్ ఎండీ శిద్దా సుధీర్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. రెండు రోజుల క్రితం ఒంగోలులోని గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ గెస్ట్ హౌస్‌లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్–1గా శిద్దా భరత్, వైస్ ప్రెసిడెంట్–2గా శిల్పారెడ్డి, వైస్ ప్రెసిడెంట్–3గా ఆనంద్ శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా రవిచంద్రన్, జాయింట్ సెక్రటరీ–1గా భాస్కర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ–2గా నవీన్‌రెడ్డి, ట్రెజరర్‌గా చలువాది బదరీనారాయణను ఎన్నుకున్నారు. వారితో పాటు మరో 9 మంది గ్రానైట్ యజమానులను ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నుకున్నారు. ఒంగోలు టాస్క్‌ఫోర్స్: ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి ప్రైవేటు అసోసియేషన్లకు సంబంధించిన ఆటల పోటీలు, ఎంపికలు, సమావేశాలు నిర్వహించరాదని, అలాంటి కార్యక్రమాలకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు అనుమతులు ఇవ్వరాదని డీఈవో ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అయితే, ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ టంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శుక్రవారం ఏపీ సాఫ్ట్‌బాల్ ఆర్గనైజింగ్ అసోసియేషన్ వారికి పురుషులు, సబ్ జూనియర్స్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమానికి అనుమతివ్వడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ పీడీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాగైతేనేమీ అధికార పార్టీ నాయకుల అండదండలతో సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక కార్యక్రమం పూర్తయింది. దీనిపై ప్రైవేటు అసోసియేషన్ ఆటల పోటీలకు అనుమతులు ఎలా ఇస్తారని వ్యాయాయ పీడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఏపీ సాఫ్ట్‌బాల్ ఆర్గనైజింగ్ అసోసియేషన్ వివాదాల్లో కోర్టులో ఉందని, అంతేగాకుండా అవకతవకలకు పాల్పడుతోందని అన్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేస్తామని పీడీలు తెలిపారు. దీనిపై డీఈవోను ఫోన్లో టంగుటూరు ఎంఈఓ సంప్రదించబోగా.. ఆయన అందుబాటులోకి రాలేదని తెలిసింది. ఒంగోలు సబర్బన్: కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ నిర్మాణానికి భూమి సిద్ధంగా ఉందని కలెక్టర్ పీ రాజాబాబు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ దృష్టికి తీసుకెళ్లారు. సీబీజీ ప్లాంట్ నిర్మాణంపై నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ విజయానంద్ శుక్రవారం రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీబీజీ ప్లాంట్‌కి జిల్లాలో 4,993 ఎకరాల భూమి ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో భూ సేకరణ పూర్తయిందన్నారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి సమస్య ఏమీ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే నెట్ క్యాప్, రిలయన్స్ సంస్థ సంయుక్తంగా ప్రకాశం జిల్లాలో సోలార్ పార్క్ నిర్మించనుందన్నారు. సోలార్ పార్క్ నిర్మాణానికి 90 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖలు అందాయన్నారు. ఇందు కోసం ప్రస్తుతం 55 వేల ఎకరాల భూమిని గుర్తించామని సీఎస్ కి వివరించారు. -
సైకో అంటే గుర్తుకొచ్చేది బాలకృష్ణే
మార్కాపురం: శాసనసభలో గురువారం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సైకో అంటూ విమర్శించడం మంచిపద్ధతి కాదని, సైకో అంటే గుర్తుకొచ్చేది బాలకృష్ణేనని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు జి. శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం బాధకలిగిస్తోందన్నారు. బాలకృష్ణ వద్దకు ఎవరైనా అభిమానులు వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే చెంపలు పగులకొడతారన్నారు. ఒక్కో సారి దాడి కూడా చేస్తారన్నారు. గతంలో మీ ఇంట్లో కాల్పుల ఘటన ఎందుకు జరిగిందో.. ఎలా జరిగిందో.. మాకు తెలీదుకానీ జరిగిన సంఘటన వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్సార్ వద్దకు మీ కుటుంబం అంతా వెళ్లి సమస్యను వివరించడంతో ఆయన పెద్ద మనసుతో పరిష్కారం చేసిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. ఆ తర్వాత ఒక డాక్టర్ ద్వారా మెంటల్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఎన్టీ రామారావు సొంత జిల్లా కృష్ణ జిల్లాకు ఆయన పేరు పెట్టకపోతే జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్టీఆర్ పేరుపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తూ వస్తే తాము చూస్తూ ఊరుకోమని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఇంటలెక్చువల్స్ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల ఆదినారాయణ, మార్కాపురం నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు జంకె కృష్ణారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, పబ్లిసిటీ ప్రచార కార్యదర్శి సింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి నాలి కొండయ్య యాదవ్, వార్డు ఇన్చార్జి ఉత్తమ్‌కుమార్, మార్కాపురం యూత్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, పొదిలి ప్రచార కమిటీ అధ్యక్షుడు డేగ వెంకటరావు, జిల్లా స్టూడెంట్ సెక్రటరీ గుంటక అంజిరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి -
ఒక ఓటు హక్కు మాత్రమే కలిగి ఉండాలి
ఒంగోలు సబర్బన్: ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరూ ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) బి.చిన ఓబులేసు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్లో ఎన్నికల అధికారులతో కలిసి జిల్లాలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితా తయారీ, పోలింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, 18–19 ఏళ్ల వయసు గల యువతకు ఓటు నమోదు వంటి అంశాలపై సలహాలు, సూచనలు అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. రెండేసి ఓట్లు కలిగిన వారు వెంటనే ఒక ఓటును రద్దు చేసుకుని నివాసం ఉన్న చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలని ఓటర్లకు డీఆర్వో విజ్ఞప్తి చేశారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోనివారంతా వెంటనే ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఒంగోలు నగరం, జిల్లాలోని పట్టణాల్లో డోర్ నంబర్లు లేకుంటే డోర్ నంబర్లు వేసేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో చనిపోయిన వారి ఓట్లను వెంటనే ఓటరు లిస్టు నుంచి తొలగించాలని సూచించారు. సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు కళావతి, కేశవర్దనరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, ఏ కుమార్, వరకుమార్, సత్యనారాయణ, రవీంద్రారెడ్డి, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు వైఎస్సార్ సీపీ నుంచి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు వెంకటరావు, ఓ సైదా, ఓ రసూల్, గుర్రం సత్యం, రఘురామ్, సుదర్శన్, జిల్లా ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో డీఆర్వో ఓబులేసు -
దేవునికే పాలుపోక!
దేవస్థానం భూమిలో నిర్మించిన ఒంగోలు డెయిరీ భవనంసాక్షి ప్రతినిధి, ఒంగోలు: పురాణ ప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూములకు రక్షణ లేకుండా పోయింది. స్వామి వారికి వేలాది ఎకరాలు ఉన్నా అవి అన్యాక్రాంతమై పరుల ఆధీనంలో ఉన్నాయి. ఆలయానికున్న ఆస్తులతో గుడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ అవి అన్యాక్రాంతమవడంతో దాతల సహకారంపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా దేవస్థానానికి చెందిన 7.30 ఎకరాల భూమి సంతనూతలపాడు మండల పరిధిలోని పేర్నమిట్టలో 128–1 సర్వే నంబరులో ఉంది. దాని విలువ రూ.85 కోట్లు పైనే ఉంది. ఆ భూమిలో ప్రభుత్వం డెయిరీని నిర్మించింది. ఇది కాకుండా తిరుపతి జిల్లా గూడూరులో 99 ఎకరాలు, మండలంలోని కనుమళ్ల పంచాయతీలో 98 ఎకరాల భూమి ఉంది. ఇవి కూడా ఆక్రమణలో ఉన్నాయి. రికార్డులు తారుమారు దేవస్థానం భూమి 7.30 ఎకరాల్లో ఒంగోలు సహకార డెయిరీని నిర్మించారు. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తులదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో 1978లో దీనిని ప్రారంభించారు. సుమారు రెండు ఎకరాల స్థలంలో భవనాలు, మిషనరీ ఏర్పాటు చేయగా మిగిలిన స్థలం ఖాళీగా ఉందని దేవదాయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయం తెలిసినా అప్పటి ఆలయాధికారులు పెద్దగా పట్టించుకోలేదు. 2013 ఇనాం అబాలిష్ చట్టం వచ్చిన తర్వాత అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు దేవస్థానం అధికారులు ప్రయత్నించినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. 2018 సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అడంగల్, వన్–బీలో మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీగా పేరు మార్చేసింది. 1905 సంవత్సరం నాటి (బ్రిటీష్ కాలంలోని) ఆర్‌ఎస్‌ఆర్‌లో మాత్రం వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పేరుమీద ఈ భూములు ఉన్నాయి. దీనిని ప్రభుత్వం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీగా పేరు ఎలా మారుస్తుందని భక్తులు నిలదీస్తున్నారు. జేసీ కోర్టులో కేసు.. దేవస్థానానికి చెందిన భూమిలో డెయిరీ నిర్మించడంపై జేసీ కోర్టులో కేసు దాఖలు చేశారు. దేవుడి భూముల హక్కును సైతం మార్చేయడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జేసీ కోర్టులో పలుసార్లు వాదనలు జరిగాయి. ఇదిలా ఉండగా ఏడు ఎకరాల భూమిలో ఎకరం భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ కొందరు అత్యాశపరులు హైకోర్టులో కేసు నమోదు చేశారు. దీనిపై సంతనూతలపాడు మండల రెవెన్యూ అధికారులు సైతం ఆ భూములను పరిశీలించారు. దేవుని ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని, ఇందు కోసం న్యాయపోరాటం చేస్తామని దేవస్థానం అధికారులు తెలియజేస్తున్నారు. మూతపడిన డెయిరీ.. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తులదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో డెయిరీ 1978లో ప్రారంభమైంది. రోజుకు 3.5 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో పాటు, 30 మెట్రిక్ టన్నుల పాలపొడి తయారీ యూనిట్, 20 మెట్రిక్ టన్నుల వెన్న తయారీ, 10 మెట్రిక్ టన్నుల నెయ్యి తయారీ సామర్థ్యంతో ఒంగోలు డెయిరీ ఉండేది. 278 పాల సహకార సంఘాల ద్వారా 35 వేల మంది పాడి రైతులు నిత్యం పాలుపోసేవారు. ఒక వెలుగు వెలిగిన ఈ డెయిరీ కాలక్రమంలో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని, రైతులకు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. దీనినే నమ్ముకుని పనిచేసిన రెగ్యులర్, తాత్కాలిక సిబ్బంది 120 మంది రోడ్డున పడ్డారు. ప్రస్తుతం డెయిరీ కూడా మూలపడడంతో రూ.కోట్లు విలువజేసే భూములను తిరిగి దక్కించుకునేందుకు అధికారులు పోరాటం చేస్తున్నారు. ఆధారాలు ఉన్నాయి.. జిల్లా డెయిరీ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూమిలో నిర్మించారు. ఆర్ఎస్ఆర్ ప్రకారం పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానీ కొందరు రెవెన్యూ అధికారుల మాయాజాలంతో దేవునికి చెందాల్సిన భూములకు హక్కుదారుగా అడంగల్, వన్–బీ లో మిల్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీగా నమోదు చేశారు. ఈ భూములు దేవునికి దక్కేలా న్యాయపోరాటం చేస్తాం. ఇప్పటికే దీనిపై జేసీ కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాం. – పీ కృష్ణవేణి, ఈఓ, వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం -
బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు
ఒంగోలు సిటీ: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పై, సినీ హీరో చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చిరంజీవి, జగన్ పట్ల బాలకృష్ణ అమర్యాదకరంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వారి గురించి మాట్లాడే అర్హత బాలకృష్ణకి లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తవుతున్నట్లు తెలిపారు. టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లటంతో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో అర్థంకానీ అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. మీరు మాట్లాడే భాషను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారనీ, భవిష్యత్ లో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సభ్యసమాజం తలదించుకునేలా బాలకృష్ణ వ్యాఖ్యలు ● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి మార్కాపురం: అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సభలో బాలకృష్ణ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అమర్యాదకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు బాలకృష్ణకు లేదన్నారు. చిరంజీవి, చంద్రబాబుతో విభేదాలుంటే వారితోనే బాలకృష్ణ తేల్చుకోవాలే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. అసెంబ్లీలో సభ్యసమాజం తలదించుకునేలా ఆయన మాట్లాడటం తగదని అన్నారు. ఇలా సభా మర్యాదలు పాటించకుండా మాట్లాడి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు చూశాక ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలేమో అనిపించేలా ఉందని అన్నారు. బాలకృష్ణ సొంత ఇంట్లో కాల్పులు జరిపి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసునన్నారు. మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని జంకె సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి ● పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ వై.ఎం.ప్రసాద్‌రెడ్డి ఒంగోలు సిటీ: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ వై.ఎం.ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చిరంజీవిపై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. చిరంజీవి అన్నా, మీరన్నా ఎంతో గౌరవం ఉండే వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. అటువంటి వ్యక్తిని సైకోగాడు అనడానికి మీకు మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మీకు మంత్రిపదవి రాలేదనే బాధతో లేదా పార్టీ చంద్రబాబునాయుడు చేతుల్లోకి పోయిందనే బాధల్లో జగన్మోహన్రెడ్డిని అలా మాట్లాడటం తగదని విమర్శించారు. ప్రతి ఒక్కరినీ ఉన్నతంగా గౌరవంగా సంబోధించే ఏకై క వ్యక్తి జగన్ అని కొనియాడారు. బాలకృష్ణ అన్న మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. -
బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..!
జిల్లాలో ప్రాచీన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న బౌద్ధ స్థూపం గురించి పట్టించుకునే వారు లేక శిథిలావస్థకు చేరింది. దొనకొండ మండలంలోని చందవరం సమీపంలో ఉన్న ఈ బౌద్ధ స్థూపం సుమారు 50 సంవత్సరాల క్రితం వెలుగుచూసింది. ఇక్కడ తవ్వకాల్లో లభించిన ఆధారాలను పరిశీలిస్తే బౌద్ధ విశ్వవిద్యాలయం, 60 ఎకరాలలో బౌద్ధ విహారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అశోకుని కాలానికి ముందే నిర్మించిన స్థూపమని, అమరావతి స్థూపంకన్నా పెద్దదని, నాగార్జున కొండలోని స్థూపాలకన్నా ముందుదని భావిస్తున్నారు. మండల సరిహద్దు జగన్నాథపురం రెవెన్యూ గ్రామ పరిధిలో గుండ్లకమ్మ నది ఒడ్డున 1965వ సంవత్సరంలో బయటపడిన ఈ బౌద్ధ స్థూపం రాష్ట్రంలోనే పెద్దదిగా పేర్కొంటారు. శింగరకొండ నుంచి దక్షిణాన గల కాంచీపురం వెళ్లే ప్రాచీన రహదారిపై ఉండగా, రెండో శతాబ్ధంలో శాతవాహన పాలనలో ఈ స్థూపాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సుమారు 800 సంవత్సరాల పాటు ఇది ప్రముఖ బౌద్ధ ధార్మిక కేంద్రంగా, బౌద్ధ విశ్వవిద్యాలయంగా విరాజిల్లినట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో వెలుగొందే అవకాశం ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టక కళావిహీనంగా మారింది. దశబ్ధాలుగా కనీస మరమ్మతులకు కూడా నోచుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 2022లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి మరమ్మతులు చేయించి పూర్వ వైభవం ఉట్టిపడేలా చర్యలు చేపట్టారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యాటక శాఖాధికారులు పర్యవేక్షణా లోపం కారణంగా కనీసం కేర్ టేకర్ కూడా లేకపోవడంతో బౌద్ధ స్థూపం గోడలపై గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగాయి. గోడల మధ్య ఇటుక రాళ్లు ఊడిపోతున్నాయి. స్థూపం వద్దకు వెళ్లే దారి కూడా అధ్వానంగా ఉంది. మెట్లకు రాళ్లన్నీ పగిలిపోయి సందర్శకులు వెళ్లేందుకు కూడా దారి లేకుండా పోతోంది. ఇలాగే వదిలేస్తే భావితరాలకు ఫొటోల్లో మాత్రమే చూపించాల్సిన దుస్థితి నెలకొంది. నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా.. జిల్లాలో ఎంతో ఘన చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం గురించి పాలకులు, అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. – సాక్షి, ఒంగోలు -
భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు టౌన్: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఆపద వచ్చినా తక్షణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నదులు, వాగులు వంకలు, చెరువుల వద్ద పికెట్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని, పునరావాస కేంద్రాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సముద్ర తీరం వెంబడి నివశిస్తున్న ప్రజలు ఆయా ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు కానీ తుఫాన్ షెల్టర్లకు వెళ్లాలని సూచించారు. తీరప్రాంత ప్రజలు పోలీసు, రెవెన్యూ అధికారుల సూచనలు, సలహాలను పాటించాలన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. గాలులకు రోడ్లపై విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లించాలని చెప్పారు. ఉధృతంగా ప్రవహించే నదీ పరీవాహక ప్రాంతాలలో గస్తీ నిర్వహించాలని, నీట మునిగిన రహదారుల వద్ద పికెట్లు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 112కు కానీ పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు సమాచారం అందజేయాలని కోరారు. ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యా మండలి అకడమిక్ క్యాలెండరు ప్రకారం జిల్లాలోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించాలని ఆర్ఐఓ కె.ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు కానీ స్పెషల్ క్లాస్‌లు కానీ నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీమకుర్తి: చీమకుర్తి మున్సిపాలిటీలోని వార్డుల సంఖ్య 20 నుంచి 27కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసినట్లు కమిషనర్ వై.రామకృష్ణయ్య శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు 20 వార్డులు ఉండగా ఓటర్ల సంఖ్య పెరగటంతో అదనంగా మరో 7 వార్డులను పెంచినట్లు అయింది. మొట్టమొదట నగర పంచాయతీగా ఉన్న చీమకుర్తి రెండేళ్ల క్రితం గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడం, ఓటర్ల సంఖ్య పెరగటంతో ప్రస్తుతం ఉన్న పాలకవర్గం రాష్ట్ర మున్సిపల్ కార్యాలయానికి పంపించిన ప్రతిపాదనలు ఆమోదం పొందటంతో రానున్న మున్సిపల్ ఎన్నికల నాటికి 27 వార్డుల్లో 27 మంది కౌన్సిలర్లను ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వార్డుల్లో సరాసరిన ఒక్కో వార్డుకు 1000 మంది నుంచి 1150 మంది ఓటర్ల వరకు ఉండేవారు. 27 వార్డులకు పెరగటంతో వారి సంఖ్య 800 నుంచి 850 మంది ఓటర్ల మధ్య ఉండే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. ఇప్పుడున్న మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చినెల 17తో ముగియనుంది. దాదాపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావచ్చని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టు భూముల పరిశీలన
కొత్తపట్నం: మండల పరిధిలో అల్లూరు ఆలూరు మధ్యలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అవసరమైన భూములను కలెక్టర్ పి.రాజాబాబు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే 700 ఎకరాలను గుర్తించామని, అవసరమైతే వెంటనే సేకరిస్తామని చెప్పారు. అనంతరం ఆలూరు–అల్లూరు మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించారు. కలెక్టర్ వెంట జేసీ జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ శాంతికుమారి, సర్వేయర్ సుధీర్‌బాబు, ఆర్ఐ వరకుమార్, సిబ్బంది ఉన్నారు. తాళ్లూరు: మండలంలో జరుగుతున్న బెంగళూరు ఎక్స్‌ప్రైస్ హైవే పనులను కలెక్టర్ పి.రాజాబాబు, జేసీ ఆర్ గోపాలకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను నిర్దేశించిన సమయం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులతో సమావేశమయ్యారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే పీడీ అనీల్‌కుమార్, తహసీల్దార్ బీవీ రమణారవు, ఎంపీపీ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ యడమకంటి వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకారెడ్డి పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అధికార పార్టీ రాజకీయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సాగర్ కాలువ కారుమంచి మేజర్ కట్టకు మరమ్మతుల విషయంలో తలెత్తిన విభేదాలతో అధికార టీడీపీలోనే రాజకీయం రాజుకుంది. చివరకు కొందరు టీడీపీ నాయకులు ఏకంగా రోడ్డెక్కి ఆందోళన బాట పట్టడం ఆ పార్టీ పాలకులు, అధికారుల అవినీతి, నిర్లక్ష్యపు పనితీరును ఎండగడుతోంది. కాలువ కట్టకు మరమ్మతుల సమస్య పరిష్కరించాలని కోరుతూ కొంతమంది రైతులతో కలిసి పేరుమోసిన టీడీపీ నాయకులు రెండు రోజుల క్రితం ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడంతో జిల్లాలో టీడీపీ అభాసుపాలైంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారుల తీరును విభేదించి రైతులతో కలిసి ఆ పార్టీకి చెందిన మార్కెటింగ్ కమిటీ, టీడీపీ చీమకుర్తి రూరల్ మండల అధ్యక్షుడు, పలు నీటి సంఘాల నాయకులు, మాజీలు, మున్సిపల్ చైర్మన్ పదవికి, ఇతర పదవులకు పోటీపడగలిగే స్థాయి కలిగిన పలువురు నాయకులు ధర్నా చేయడం చర్చనీయాంశమైంది.మధుకాన్ చుట్టూ తిరుగుతున్న టీడీపీ రాజకీయం...సాగర్ కాలువ ఒంగోలు బ్రాంచ్ కెనాల్ నుంచి చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లోని దాదాపు 50 గ్రామాలకు సుమారు 130 క్యూసెక్కుల నీటిని తరలించే కారుమంచి మేజర్ కట్ట విరిగి దాని పక్కనే ఉన్న మధుకాన్ గ్రానైట్ క్వారీ లోయలో పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ కాలువ కట్టకు మరమ్మతులు నిర్వహించే విషయం మధుకాన్ గ్రానైట్ క్వారీ చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ నాయకులు రోడ్డెక్కడానికి కూడా కారణం మధుకాన్ గ్రానైట్ క్వారీనే కావడం విశేషం. ఈ క్వారీ యజమాని నామా నాగేశ్వరరావు ఒకప్పుడు తెలంగాణలో టీడీపీకి చెందిన ఎంపీ. కాగా, రైతులకు సాగునీరు, 50 గ్రామాల ప్రజలు, పశువులకు తాగునీరు సరఫరా చేసే కారుమంచి మేజర్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి కలెక్టర్ రూ.2.62 కోట్ల నిధులను ఈ సంవత్సరం జూన్ నెలలోనే మంజూరు చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సిఫార్సుల మేరకే ఆ నిధులు మంజూరైనట్లు కొందరు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే, ఆ నిధులతో కారుమంచి మేజర్‌కు మరమ్మతులు చేయడాన్ని ఇరిగేషన్ ఉన్నతాధికారులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం మధుకాన్ గ్రానైట్ క్వారీ యాజమాన్యానికి మేలు చేసేందుకు అలా చేస్తున్నట్లు సమాచారం. రైతులకు అనుకూలంగా కాకుండా క్వారీ యాజమాన్యానికి మేలు చేసే విధంగా కాలువకు మరమ్మతులు చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సులతో అధికారులు అలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలా కాకుంటే అధికారులను ఎంపీ, ఎమ్మెల్యేలు ఒప్పించలేకపోతున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధర్నా చేసిన టీడీపీ నాయకుల మాటలను నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టారా..? వారు చెప్పినా జిల్లా స్థాయి ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదా..? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు లేక చివరకు అధికారులు, పాలకులు, నియోజకవర్గ నాయకులు తీరుపై రైతుల పేరిట మండల స్థాయి టీడీపీ నాయకులు రోడ్డెక్కి ధర్నా చేయాల్సి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.క్వారీ యాజమాన్యం అడ్డుపడుతోంది నిజమేనా..?సాగర్ కాలువ కట్ట పునర్నిర్మాణానికి మధుకాన్ క్వారీ యాజమాన్యం మోకాలడ్డుతోంది నిజమేనా..? అంటే జిల్లా, రీజినల్ స్థాయిలోని ఇరిగేషన్ అధికారుల నుంచి నిజమేననే సమాధానాలు వస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రానైట్ క్వారీ కారుమంచి మేజరు ఒడ్డున ఉంది. వాస్తవానికి గ్రానైట్ బఫర్ జోన్ నిబంధనలను తుంగలో తొక్కి కాలువ ఒడ్డు వరకు తవ్వటం, అదే కాలువ కట్టపై భారీ గ్రానైట్ రాళ్లతో ట్రాలీలు తిరగడం వలన కాలువ కట్ట బలహీనపడింది. కాలువ ఒడ్డు దాదాపు 50 మీటర్ల పొడవున విరిగి పక్కనే ఉన్న మధుకాన్ గ్రానైట్ క్వారీలో పడింది. విరిగి పడిన కాలువ కట్ట నుంచి కాలువ కిందిగా ఉన్న భూమిలో మధుకాన్ క్వారీ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే గ్రానైట్ నిక్షేపాలున్నాయి. కారుమంచి కాలువ కట్టను పునర్నిర్మిస్తే వాటిని తిరిగి తవ్వుకోవడానికి వీలు కాదు. ఎలాగో కారుమంచి కాలువ విరిగి క్వారీలో పడింది. ఇప్పుడు దాని ద్వారా సాగర్ నీటిని తరలించడం వీలు కాదు. అందుకే కారుమంచి కాలువను దూరంగా ఉన్న ఇతర భూములలో నిర్మించేందుకు అనుమతినిస్తే తామే నిర్మిస్తామంటూ మధుకాన్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం ఇరిగేషన్ రాష్ట్ర, రీజినల్ స్థాయి అధికారులకు లేఖల మీద లేఖలు రాస్తోంది. దానిలో ఇరిగేషన్ అధికారులకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా మేలు జరిగే అవకాశాలుండటంతో ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కారుమంచి కాలువ నుంచి రైతులకు గతంలో 130 క్యూసెక్కుల నీరు ప్రవహించేది. ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల పేరుతో పైపుల ద్వారా లేక టబ్ విధానంలో సాగర్ నీటిని పంపించేందుకు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ, ఆ విధానం ద్వారా చాలీచాలని నీరు దిగువనున్న రైతులకు సరిపోవడం లేదని, దానిని పూర్తిగా గతంలోలా 130 క్యూసెక్కుల నీరిచ్చే విధంగా నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాని ఆధారంగా మధుకాన్ క్వారీ యాజమాన్యం కారుమంచి కాలువను పక్కకు తప్పించాలనే ఆలోచనలకు రాష్ట్రస్థాయిలో ఒకరిద్దరు అధికారులు మద్దతు తెలపటంతో దానిని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు అనుగుణంగా కారుమంచి కాలువను పునర్నిర్మించేందుకు నియోజకవర్గ టీడీపీ నాయకులు, పాలకులు బాధ్యత తీసుకుని పనిచేయడం లేదంటూ మండల స్థాయి నాయకులు ధర్నా చేశారు. మొత్తం మీద టీడీపీ నాయకులు అధికారంలో ఉండి కూడా ధర్నా చేయటం ఆ పార్టీ పరిపాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.దీనిపై ఇరిగేషన్ ఉన్నతాధికారులను వివరణ కోరగా, కారుమంచి మేజర్‌ను ఇప్పుడున్న స్థానంలోనే నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాకపోతే కాలువను మళ్లీ నిర్మించేందుకు సాయిల్ టెస్ట్ చేపిస్తున్నామన్నారు. గతంలో కాలువ డిజైన్‌కు సంబంధించి పంపించిన సమాచారం లోపభూయిష్టంగా ఉండటంతో దానిని తిరిగి పూర్తి సమాచారంతో పంపించాలని జిల్లా అధికారులకు విజయవాడలోని సీఈసీడీఓ విభాగం లేఖ రాసింది. నూతనంగా తయారు చేసిన డిజైన్ రిపోర్ట్, ఇతర సమాచారం రాగానే కారుమంచి కాలువను పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేస్తున్నారు. డిజైన్, ఫీల్డ్డేటాను మళ్లీ అడిగాంకారుమంచి కాలువ నిర్మాణానికి కావాల్సిన డిజైన్, ఫీల్డ్ డేటాను మళ్లీ అడిగాం. వాటిని సీఈసీడీఓకి పంపించాల్సి ఉంటుంది. వారి నుంచి రిపోర్ట్ రాగానే కారుమంచి కాలువ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. కారుమంచి కాలువను తమకు ఇవ్వాలని మధుకాన్ గ్రానైట్ క్వారీ వారు ఉన్నత స్థాయి అధికారులకు లేఖలు రాసిన మాట వాస్తవమే.– శ్యామ్‌ప్రసాద్, సీఈ, ఇరిగేషన్ డిపార్టుమెంట్ -
పశుపోషకుల పరిస్థితి దయనీయం..
రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పాడిలో ముందంజలో ఉంటుంది. జిల్లాలో పాడిపై ఆధారపడి జీవించే రైతులు అధికం. అయితే పాడికోసం పెంచుతున్న పచ్చగడ్డికి కేవలం యూరియా మాత్రమే వాడతారు. యూరియా వేస్తేనే మేత త్వరగా పెరిగి కోతకు వస్తుంది. అయితే ప్రస్తుతం యూరియా అందుబాటులో లేకపోవడంతో పశువుల గడ్డి పెంచే పశుపోషకులు ఏం చేయాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడా బస్తా యూరియా కూడా ప్రస్తుతం అందని పరిస్థితి. ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టాలి
ఒంగోలు సబర్బన్: పరిశ్రమల్లో భద్రత పరమైన చర్యలు తప్పక తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు పరిశ్రమల శాఖ అధికారులతో పాటు అనుబంధ విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో గురువారం జిల్లా పరిశ్రమల కేంద్రం, ఫ్యాక్టరీలు, కార్మిక, ఏపీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల్లో పర్యావరణ సంబంధ నిబంధనలను కచ్చితంగా పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని వివిధ తరహా పరిశ్రమలు, వాటికి ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు, అనుమతులు మంజూరు చేస్తున్న విధానం, భద్రతా ప్రమాణాలు, కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేస్తున్న తీరుపై ఆయన ఆరా తీశారు. సంబంధిత వివరాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ కార్మికులకు భద్రతాపరంగా విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని, ఈ దిశగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ దిశగా ఉన్న మానవ వనరులను సమర్ధంగా వినియోగించుకోవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగరాదన్నదే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రాఘవరెడ్డి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రిదేవీ, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మదన్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి. ఈశ్వర్‌చంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల అనుబంధ విభాగాల సమీక్షలో కలెక్టర్ రాజాబాబు -
కలిసి పుట్టారు..కలిసిపోయారు
వాళ్లిద్దరు కవలలు. ఒకే రూపం. పుట్టకలాగే ఏం చేసినా ఒక్కటిగానే. కలిసి పాఠశాలకు వెళతారు. కలిసి చదువుకుంటారు. ఆడినా, పాడినా కలిసే ఉంటారు. వారిని చూసి విధికి కూడా కన్నుకొట్టిందేమో. ఇద్దరినీ ఒకేసారి తీసుకువెళ్లిపోయింది. ఆ ఇద్దరూ మృత్యువులోనూ విడిపోకుండా కలిసి వెళ్లిపోయారు. ఈ హృదయ విధారకర సంఘటన దర్శి మండలం చలివేంద్ర గ్రామంలోని జగనన్న కాలనీలో జరిగింది. దసరా సెలవులకు విజయవాడ నుంచి అమ్మమ్మ ఊరికి వచ్చిన నిఖిల్, అఖిల్ నీటి కుంటలో పడి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగావిలపించారు. –దర్శి -
ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలు
కంభం: ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తుడిమెళ్ల గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..బేస్తవారిపేట గ్రామానికి చెందిన ఈ.బాలగురుమూర్తి ఆటోలో ఏడుగురు కూలీలు వ్యవసాయ పనులు చేసేందుకు తుడిమెళ్ల గ్రామానికి వెళుతున్నారు. ఆటో ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డు మలుపు వద్ద రాగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాలగురుమూర్తితో పాటు ఆకుల నారాయణమ్మ, షేక్.మీరాభి, మహలక్ష్మిలకు తీవ్రంగా గాయాలు కాగా మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
రైతుల జీవితాలతో ఆటలు..
అరకొర కేటాయింపులు.. యూరియా సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తిసింది. ఒక్క బస్తా కోసం రైతులు విలవిలలాడుతుంటే అరకొరగా వచ్చిన యూరియాను సైతం అవసరపైన ప్రాంతాలకు కేటాయించడం లేదు. అసలు జిల్లాకు ఎంత యూరియా అవసరం..ఎంత నిల్వ ఉంది..ఎక్కడకు కేటాయించాలన్న నిర్ధిష్ట ప్రణాళిక కరువైంది. ఫలితంగా అరకొరగా ఉన్న యూరియా పక్కదారి పడుతోంది. అధికారుల తీరు బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించాలే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శి: జిల్లాలో సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఈ పాటికే నార్లు పోశారు. కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా వేశారు. ఈ తరుణంలో ప్రతి రైతుకు యూరియా తప్పనిసరి. అయితే యూరియా కేటాయింపుల్లో సైతం అధికారులు పచ్చపాతం చూయిస్తున్నారు. ఫలితంగా యూరియా రైతులకు అందడం లేదు. జిల్లాకు కేటాయించిన యూరియాలో 70శాతం మార్క్‌ఫెడ్‌కు కేటాయించారు. మార్క్‌ఫెడ్ నుంచి సొసైటీలకు యూరియా సరఫరా చేస్తున్నామని చెబుతున్నారే గానీ ఆచరణలో మాత్రం ఏ సొసైటీలో కూడా యూరియా కనిపించడం లేదు. సొసైటీ నిర్వాహకులను సంప్రదిస్తే జిల్లా అధికారులు అలాట్మెంట్ ఇవ్వడం లేదని చెప్తున్నారు. ఈ క్రమంలో అత్యవసరంగా యూరియా అవసరమైన రైతులు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. బయట ఎరువుల దుకాణాల్లో యూరియా కొనుగోలు చేయాలంటే ఇతర ఎరువులూ కొనుగోలు చేస్తేనే ఒక బస్తా యూరియా ఇస్తామని తెగేసి చెబుతున్నారు. అది కూడా రూ.266లకు అమ్మాల్సిన యూరియాను రూ.400 నుంచి రూ.450లకు విక్రయిస్తున్నారు. యూరియా కోసం వెళితే ఇతర ఎరువులు కొనుగోలు చేయాలని బెదిరించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఈ విధంగా ఉన్న అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. సొసైటీలకు ఎరువుల కేటాయింపు ఎక్కడ..? జిల్లాలో 91 పీఏసీఎస్‌లు, నాలుగు మల్టీస్టేట్ (ఎంఎస్సీఎస్)సొసైటీలు, ఐదు టుబాకో సొసైటీలు ఉన్నాయి. వీటిలో 15 పీఏసీఎస్‌లు, నాలుగు మల్టీస్టేట్ సొసైటీలు, టుబాకో సొసైటీలు రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నాయి. ఈ సొసైటీలకు మార్క్‌ఫెడ్ నుంచి నేరుగా ఎరువులు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం జిల్లా వ్యవసాయాధికారులు గత 15 రోజులుగా వారికి అనుకూలైన ఆర్బీకేలు, సొసైటీలకు మాత్రమే ఎరువులు కేటాయిస్తున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతమైన దర్శి నియోజకవర్గంలో 15 సొసైటీలు ఉండగా 7 సొసైటీలకు మాత్రమే అరకొరగా ఎరువులు సరఫరా చేశారు. పక్కదారి పట్టించేందుకే.. యూరియాను పక్కదారి పట్టించేందుకు అధికారులు కొత్త దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలంగా ఉండే ఆర్బీకేలకు అధిక మొత్తంలో కేటాయించి అక్కడ నుంచి పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా సాగర్ నీరు అందుబాటులో లేని, ఎరువులు అవసరం లేని ప్రాంతాలకు యూరియా కేటాయించి అక్కడ నుండి బయట ఎరువుల దుకాణాలకు బిల్లులు లేకుండా యూరియా తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ తతంగం మొత్త జిల్లా వ్యవసాయాధికారుల కనుసన్నల్లో మండల వ్యవసాయాధికారులు నడిపిస్తున్నట్లు సమాచారం. ఇదే తరహాలో తరలించిన యూరియా జిల్లాలో అనేక ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అన్నీ ఆర్బీకేల పరిధిలో వ్యవసాయాధికారులు పర్యవేక్షణలోనే ఈ తతంగం సాగినట్లు తెలిసింది. జిల్లాలో యూరియా సరఫరాలో అక్రమాలు అవసరమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉండని వైనం అవసరం లేని ప్రాంతాలకు తరలించి బ్లాక్‌కు తరలించేందుకు పన్నాగం అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం -
జల్సాలకు అలవాటు పడి చోరీలు
ఒంగోలు టౌన్: జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు స్నేహితులు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నారు. సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం గురువాయపాలెం గ్రామానికి చెందిన తాళ్లూరి గాబ్రియేల్, బండారు నవీన్, మరో బాలుడు ముగ్గురు స్నేహితులు. ఒకే గ్రామానికి చెందిన వీరు జల్సాలకు అలవాటుపడ్డారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ద్విచక్రవాహనాలను చోరీ చేయడం మొదలుపెట్టారు. వీరిపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో 6 మోటారు బైకులను దొంగతనాలు చేసినట్లు కేసు నమోదైంది. అదే విధంగా ఒంగోలు వన్‌టౌన్ పరిధిలో 5 బైక్‌లు, ఒంగోలు టూటౌన్ పరిధిలో మూడు, తాలుకా పోలీస్‌స్టేషన్ పరిధిలో 8 మోటార్ బైక్‌లను దొంగించిన కేసులు నమోదై ఉన్నాయి. అదే విధంగా టంగుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, అద్దంకి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ చోరీలను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ జగదీష్, తాలుకా సీఐ టి.విజయ కృష్ణ, ఎస్సై హరిబాబు, సీసీఎస్ సిబ్బందితో రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్నీ కోణాల్లో విచారణ చేసిన పోలీసు బృందాలు గురువారం నగరంలోని నేతాజీ కాలనీ శివారు వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 19 మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.13.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ముగ్గురు మోటార్‌బైక్ దొంగల అరెస్టు నిందితుల నుంచి 19 వాహనాలు స్వాధీనం -
ఇన్చార్జి వీఆర్ఓగా బాలేశ్వరరావు తొలగింపు
యర్రగొండపాలెం: మండలంలోని కొలుకుల పంచాయతీ ఇన్చార్జి వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న కర్రె బాలేశ్వరరావును తొలగించి బోయలపల్లి వీఆర్వో ఓబయ్యను ఇన్చార్జి వీఆర్వోగా నియమించినట్లు తహసీల్దార్ మంజునాథరెడ్డి తెలిపారు. గంగపాలెం వీఆర్వోగా పనిచేస్తున్న బాలేశ్వరరావు తన స్వగ్రామమైన కొలుకుల ఇన్చార్జిగా వేయించుకున్నాడు. నియోజకవర్గ పచ్చ నేత అండతో ఓ వర్గాన్ని రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నాడని, ఈ విషయంపై 3 నెలల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలో ఆ గ్రామస్తుల ఆవేదన బుధవారం సాక్షి దినపత్రికలో శ్రీపైసలిస్తేనే పని.. ప్రత్యర్థులకు వేధింపులుశ్రీ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ స్పందించారు. బాలేశ్వరరావును తన స్వగ్రామం నుంచి ఇన్చార్జి వీఆర్వోగా తొలగించి మరో వీఆర్వోను నియమించారు. దీంతో కొలుకుల గ్రామస్తులు తహసీల్దార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు సబర్బన్: ప్రకాశం భవన్లో శాశ్వత కమాండ్ కంట్రోల్ రూమ్‌ను గురువారం ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూంను డీఆర్ఓ బీసీహెచ్ ఓబులేసు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించిన సేవలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి టి.రవి, కలెక్టరేట్ కో ఆర్డినేషన్ సూపరింటెండెంట్ సీహెచ్ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్: గుర్తు తెలియని ఓ తల్లి తన పేగు బంధాన్ని వద్దనుకొని పురిటిబిడ్డను స్థానిక వైద్యశాలలో వదిలివెళ్లిన విషయం తెలిసిందే. ఈ మగ శిశువును పట్టణంలోని చిన్నపిల్లల వైద్యశాలల్లో రెండు రోజుల పాటు చికిత్స అందించారు. అనంతరం బిడ్డ తల్లి కోసం ఎంత గాలించినా కనిపించలేదు. దీంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి ఆ చిన్నారిని ఒంగోలు బాలసదన్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి దినేష్‌కుమార్‌కు అప్పగించారు. చీమకుర్తి రూరల్: రామతీర్థం జలాశయం నుంచి ఒంగోలు వెళ్లే ఎన్ఎస్పీ కాలువలో తూర్పు బైపాస్ జంక్షన్లో ఏలూరివారిపాలెం లాకులు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్సై కథనం ప్రకారం..మృతుని వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతదేహం కుడిచేతిపై అమ్మానాన్న, కుడిచేతి మణికట్టు వద్ద నాని అని పచ్చుబొట్టు ఉంది. మృతుని వివరాలు తెలిస్తే చీమకుర్తి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై కృష్ణయ్య తెలిపారు. -
పొలం తగాదాలో కత్తితో దాడి
గిద్దలూరు రూరల్: పొలం విషయంలో ఘర్షణకు దిగి భార్యభర్తలపై కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన మండలంలోని ఓబులాపురంతాండాలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఇస్లావత్ బ్రహ్మానాయక్, ఇస్లావత్ హస్లీబాయ్ భార్యభర్తలు. వారిపై ప్రత్యర్థులైన కాశీనాయక్, అతని తల్లిదండ్రులు కేశాలనాయక్, లక్ష్మీబాయ్‌లు కత్తితో దాడి చేశారు. బ్రహ్మానాయక్ అనుభవంలో ఉన్న పొలం తనదంటూ కేశాలనాయక్ అతడి కుమారుడు కాశీనాయక్లు తప్పుడు ఆధారాలు సృష్టించి ఏడాది నుంచి ఘర్షణకు దిగుతూ కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో కాశీనాయక్ పొలంలో డ్రిప్ ఏర్పాటు చేసుకునేందుకు వెళ్లగా ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో కాశీనాయక్ కత్తితో వారిపై దాడికి పాల్పడ్డాడు. బ్రహ్మానాయక్ వర్గం వారు కూడా కాశీనాయక్పై దాడికి పాల్పడినట్లు తెలిసింది. గాయాలపాలైన బ్రహ్మానాయక్, హస్లీబాయ్లు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండానే...
చంద్రబాబు ప్రచార యావకు అంతేలేకుండా పోతోంది. చేసేది గోరంత..ప్రచారం కొండంతగా డీఎస్సీ హైడ్రామా సాగుతోంది. కేవలం 879 మందికి టీచర్ ఉద్యోగాలిచ్చి బాబు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. 2025 డీఎస్సీ ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందజేసేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మరీ వెలగపూడి సచివాలయానికి తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 7 వేల మందికి గ్రామ, వార్డు సచివాలయాల కొలువులిచ్చి హుందాగా కాల్ లెటర్లు ఇంటికి పంపించింది. పెద్దదోర్నాల: కూటమి ప్రభుత్వ తీరుతో పండుగ రోజుల్లో గమ్యస్థానాలకు చేరేందుకు బస్సులు లేక ప్రయాణికులు అవస్థపడ్డారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ 2025లో ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలు అందించేందుకు వారందరినీ అమరావతి తరలించే ఆర్భాటపు కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం బస్సులు తరలించింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో డీఎస్సీ 2025లో 3,750 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిని అమరావతి తీసుకెళ్లి నియామకపత్రాలు అందించేందుకు వారితో పాటు మరో 3,750 మంది సహాయకులను సైతం తరలించేందుకు ప్రభుత్వం 150 బస్సులు కేటాయించింది. ఆయా జిల్లాల అభ్యర్థులను తీసుకొచ్చేందుకు బుధవారం బస్సులను వారి స్వస్థలాలకు పంపించారు. దీంతో అభ్యర్థులు బుధవారం ఆయా జిల్లాల నుంచి అమరావతి తరలివెళ్లారు. ఈ తతంగమంతా పూర్తయ్యే సరికి పూర్తిగా రెండు రోజుల సమయం పట్టడంతో గురువారం కూడా ప్రయాణికులకు తీవ్ర బస్సుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి అధిక శాతం బస్సులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తుంటాయి. ఆయా రూట్లలో ఓ ఐదు ఆర్డినరీ సర్వీసులు మినహా మిగతావన్నీ సూపర్ ఎక్స్‌ప్రెస్‌లే తిరుగుతుంటాయి. డీఎస్సీ అభ్యర్థుల కోసం సూపర్ ఎక్స్‌ప్రెస్‌లు కేటాయించటంతో బస్సుల కొరత ఏర్పడింది. దీంతో బుధ, గురువారాలలో పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి ఽశ్రీశైలం వెళ్లేందుకు బస్సులు లేకపోవటంతో పలువులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేశారు. గోరంత పోస్టులకుబస్సంత డప్పు! సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సాధారణంగా ఏ ఉద్యోగ నియామకాలకై నా ఎంపికై న అభ్యర్థికి అపాయింట్మెంట్ ఆర్డర్‌ను రిజిస్టర్ పోస్టు ద్వారా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఆన్లైన్ విధానం అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వ వెబ్సైట్లో నియామకాలకు సంబంధించిన లిస్ట్ పెట్టడం, నేరుగా అభ్యర్థి మొబైల్‌కు ఈ మెయిల్ మెసేజ్ పంపించడం జరుగుతోంది. కొన్ని ఉద్యోగాలకు కౌన్సెలింగ్ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం అనాదిగా వస్తోంది. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన కూటమి నేతలు ఏడాదిన్నర కాలం పాటు కాలయాపన చేశారు. కూటమి ప్రభుత్వం అనేక ఆపసోపాలు పడి డీఎస్పీ నిర్వహించింది. అనేక అవకతవకలతో చివరికి ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ ఆ సందేహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్పీ ఉపాధ్యాయులకు నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్‌ను ఇంటికి పంపించకుండా కుంభమేళా తరహాలో రాష్ట్రస్థాయిలో ఎంపికై న అభ్యర్థులందరినీ వెలగపూడి సచివాలయానికి పిలిపించి మరీ నియామకపత్రాలు అందజేసే కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది. ఇది విమర్శల పాలవుతోంది. కొత్త ఉపాధ్యాయులకు ఆదిలోనే అగచాట్లు... జిల్లా నుంచి డీఎస్సీకి ఎంపికై న వారిలో 661 మంది ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. జోనల్ స్థాయి ఉపాధ్యాయులు 189 మంది కలిపి మొత్తం 849 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 591 మంది పురుషులు, 258 మంది మహిళలు ఉన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న ఉపాధ్యాయులతో పాటు వారి సహాయకులు ఒక్కొక్కరిని వెలగపూడి తరలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంటే 849 మంది ఉద్యోగులతో పాటుగా మరో 849 మంది సహాయకులతో కలుపుకుని మొత్తం 1,698 మందిని వెలగపూడి తరలించే బాధ్యత విద్యాశాఖ అధికారుల నెత్తిమీద పడింది. జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, వారి సహాయకులు అనేక వ్యయప్రయాసలకోర్చి ఒంగోలు చేరుకోవాల్సి వచ్చింది. మహిళా అభ్యఽర్థులు బాగా ఇబ్బంది పడ్డారు. అయితే, వీరిని వెలగపూడి తరలించడానికి ఒంగోలు నుంచి 43 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రే వీరందరినీ జిల్లా కేంద్రమైన ఒంగోలు తరలించారు. వారికి రాత్రి బస ఏర్పాటు చేయడానికి అధికారులు నానా అగచాట్లు పడ్డారు. ప్రైవేటు కళాశాలల్లో వారికి ఏర్పాట్లు చేశారు. ఒంగోలులో దోమల బెడదకు ఉపాధ్యాయులు, వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు నిద్రలేకుండా నరకం అనుభవించారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి నలుగురు నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఆర్టీసీ సంగతి దేవుడెరుగు... డీఎస్సీ నియామకపత్రాలు అందజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా నుంచి 43 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం 16 గంటలకుగానూ 18 వేల రూపాయల అద్దెతోపాటుగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో బస్సుకు 20 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. 43 బస్సులకుగానూ సుమారు రూ.9 లక్షల భారం జిల్లా ఆర్టీసీ మీద పడుతోంది. అయితే, దీనికి కూడా ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదని తెలుస్తోంది. ఈ ఖర్చును రీయింబర్స్ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నట్టు తెలిసింది. ఇటీవల అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సభకు జిల్లా నుంచి 300కుపైగా ఆర్టీసీ బస్సులు తరలించారు. దాని బిల్లులు ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఇక వెలగపూడి సభ తాలూకు బిల్లులు ఎప్పటికొస్తాయో దేవుడికే ఎరుకని ఆర్టీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. దీనికి తోడు 43 బస్సులను వెలగపూడి తరలించడంతో రెగ్యులర్ ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఇలా... కూటమి ప్రభుత్వం కేవలం 849 ఉద్యోగాలిచ్చి చేస్తున్న హడావిడి చూసి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం 849 ఉద్యోగాలకే ఇంత హడావిడి చేస్తే.. వేలాది మందికి ఉద్యోగాలిచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక ఎంత హంగామా చేయాల్సిందోనని చెప్పుకుంటున్నారు. జగన్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 7 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. వారందరికీ హుందాగా ఇంటి వద్దకే అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించి గౌరవించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు చోటివ్వకుండా నూరుశాతం పారదర్శకంగా ఉద్యోగాలకు ఎంపిక చేసి చరిత్ర సృష్టించారు. 12 వేల మంది వలంటీర్లను నియమించారు. అలాగే 2001–02లో ఎంపికై కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న 29 మంది ఫార్మసిస్టులు, 26 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 123 మంది పురుష ఆరోగ్య కార్యకర్తలు, 115 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలను జగన్ ప్రభుత్వం పర్మినెంట్ చేసింది. 23 ఏళ్ల వారి కలల్ని నిజం చేశారు. అయినప్పటికీ నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎలాంటి హడావిడి చేయలేదు. పండుగ రోజుల్లో బస్సుల కొరత ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందజేయడాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా కూటమి ప్రభుత్వ ప్రమోషన్ ఈవెంట్‌గా నిర్వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ప్రజల సొమ్ముతో పాలకులు సొంత ప్రచారం చేసుకుంటున్నారని ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. అయితే అభ్యర్థులకు ఒంగోలులో బస, బోజన ఏర్పాట్లు చేయడానికి, ఒంగోలు నుంచి వెలగపూడి తరలించడానికి, తిరిగి ఒంగోలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం. దీంతో విద్యాశాఖ అఽధికారులు ఏం చేయాలో పాలుపోక కిందామీద పడినట్లు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలలు, యాజమాన్యాల కాళ్లు, చేతులు పట్టుకుని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అంతేగాకుండా గత నెలలో రెండు రోజుల పాటు జరిగిన అభ్యర్థుల వెరిఫికేషన్ ప్రక్రియకు, ఆ తర్వాత వారం పాటు చేపట్టిన రీ వెరిఫికేషన్ ప్రక్రియకు ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టుకోలేక, వచ్చే జీతం డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరి పట్ల విద్యాశాఖ ఉద్యోగులలో అసంతృప్తి కనిపిస్తోంది. -
గమ్యం చేరని గమనం..!
నల్లమల అభయారణ్య పరిధిలో రహదారులు రక్తమోడుతున్నాయి. అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపటం ఇలాంటి కారణాలతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే ప్రమాదాల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదు. గత 10 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడగా పదుల సంఖ్యలో గాయాలయ్యాయి.పెద్దదోర్నాల: మండల పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూల్–గుంటూరు రోడ్లతో పాటు, శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధిక వేగం, నిద్రలేమి, అనుభవరాహిత్యంతో పాటు మద్యం మత్తు, పలు కారణాలతో పాటు, ఘాట్ రోడ్లలోని కొన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయటంలో అధికారుల నిర్లక్ష్యం, బోర్డులు ఏర్పాటు చేసినా చెట్లకొమ్మలు పెరిగి అవి పొదలమాటున ఉండటం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.ఆరు ప్రమాదాలు.. ఏడుగురు మృతులుగత ఏడాది నవంబర్ నుంచి 10 నెలల కాలంలో 6 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక స్వల్ప గాయాలతో బయటపడిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు, కర్నూల్, గుంటూరు ప్రధాన రహదారుల్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాలు రహదారులు సరిగా లేక పోవటంతో పాటు, వాహనాల అతి వేగం వల్లే జరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.● కర్నూలు– గుంటూరు రోడ్డులోని వెలిగొండ ప్రాజెక్టు వద్ద గత ఏడాది నవంబర్ 19న లారీ ఢీకొన్న సంఘటనలో ఓ చిన్నారి సహా మహిళ దుర్మరణం పాలవ్వగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ● ఏప్రిల్ 4న కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిలో గంటవానిపల్లె సమీపంలో మోటార్ సైకిల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ● ఆగస్టు 19న మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డులో చిన్నారుట్ల సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడగా వ్యక్తి మృతి చెందాడు. ● ఆగస్టు 9న మండల పరిధిలోని ఐనముక్కల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ నుంచి జారిపడి వృద్ధురాలు మృతి చెందింది. ● సెప్టెంబర్ 12న కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిపై కొర్రపోలు ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ● సెప్టెంబర్ 17న బైక్‌పై వెళుతున్న ఓ గిరిజనుడిని అడవి పందులు ఢీకొనడంతో బోల్తా పడి దుర్మరణం పాలయ్యాడు. అదే రోజు బైక్ అదుపుతప్పి బోల్తా పడగా తీవ్రంగా గాయపడిన వ్యక్తి కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ● సెప్టెంబర్ 18న వేగంగా ప్రయాణిస్తున్న కారు టైర్ బస్ట్ కావడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటన మండల పరిధిలో శ్రీశైలం రహదారిలోని ఈద్గా వద్ద జరిగింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
బాబు మోసాలను ఎండగడదాం
కొత్తపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మండిపడ్డారు. మండలంలోని పిన్నింటివారిపాలెం, గుండమాల, మోటుమాల గ్రామాల్లో బుధవారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కాలేజీలను నిర్మాణం ప్రారంభించారన్నారు. ఆ కాలేజీల ద్వారా ఏటా 5 వేల మంది డాక్టర్లు వైద్యులు బయటకు వస్తే ఎంతో మంది భవిష్యత్ మారుతాయన్నారు. కాలేజీ కూటమి ప్రభుత్వం ప్రభుత్వంకాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం ఎన్నో లక్షల కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ పథకానికి నిధులు ఇవ్వకపోవడంతో నిర్వీర్యమవుతోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్ సెంటర్లు నిర్మించి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారన్నారు. పోర్టులు, ఫిష్షింగ్ హార్బర్లు నిర్మించారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్సార్ సీపీ హయాంలో పాలన సాగిందన్నారు. కానీ కూటమి అధికారంలోకి అవినీతి, అక్రమాలు మాత్రమే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఆళ్ల రవీంద్రరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా మహిళల ఖాతాలకే నగదు జమ చేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. మత్స్యకారుల సంక్షేమానికీ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా కూడా కొంతమందికి అందలేదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మండలంలో రూ.21 కోట్లతో విద్యుత్ లైన్లు, స్తంభాల ఆధునికీకరణ చేశామన్నారు. గుండమాల గ్రామస్తులకు సాగు భూముల పట్టాలు, గుండమాలలో వేటకు వెళ్లి మరణించిన యానాది కుటుంబానికి మత్స్యకార ఇన్సూరెన్సు కింద రూ.10 లక్షలు ఇచ్చామని గుర్తు చేశారు. అనంతరం బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ క్యూ ఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, సైకం రాంబాబు, గుండమాల, మోటుమాల సర్పంచ్‌లు కారాని జయరావు, కోడూరి గోపిరెడ్డి, వెంకటరెడ్డి, గాలి ముసలారెడ్డి, మల్లికార్జున, వెంకటనారాయణ, అప్పాడి సురేష్, గొల్లపోతు వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల హామీల అమలులో కూటమి సర్కాలు విఫలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం ఎయిడెడ్ ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పని చేస్తున్న 765 ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే 3 వేల మంది ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, పదోన్నతుల సమస్య, 150 మంది ఎయిడెడ్ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల సమస్య పరిష్కరించాలని, 30 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరారు. చీమకుర్తి రూరల్: గ్రానైట్, ఇతర క్వారీల నుంచి వచ్చే నెల 1వ తేదీ నుంచి సీనరేజ్ వసూలు చేయడానికి ఏఎంఆర్ సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా చీమకుర్తి, రామతీర్థం పరిధిలో పలు ప్రాంతాల్లో ఏఎంఆర్ సంస్థ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఇతర క్వారీల నుంచి సీనరేజ్ వసూలు చేసే కాంట్రాక్టు కోసం ప్రభుత్వానికి రెండేళ్లలో రూ.1136 కోట్లు చెల్లించేలా ఏఎంఆర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల రామతీర్ధం వీటీసీ సెంటర్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీల అసోసియేషన్ల అధ్యక్షులు, గ్రానైట్ ప్యాక్టరీ యజమానులు సీనరేజ్ వసూలు ఏఎంఆర్ సంస్థకు అప్పగించడం పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. సీనరేజ్ వసూల పై విధి విధానాలు ముందుగా గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులతో చర్చించకపోతే అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్యాక్టరీలు మూసివేస్తామన్నారు. ఏఎంఆర్ సంస్థ మాత్రం ఇప్పటి వరకు సీనరేజ్ వసూలుపై గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులతో చర్చించకుండా తనపని తను చేసుకుంటూ పోతోంది. ఒంగోలు టౌన్: జిల్లాలో అర్ధరాత్రి భూమి కంపించింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిద్రలో పెద్ద శబ్దాలు వినిపించడంతో ఏమైందో అర్థంకాక ఇంటి నుంచి బయటకు పరుగులు దీశారు. ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట, గోపాల్‌నగర్, కమ్మపాలెం, నీలంపాలెం, బండ్లమిట్ట, గాంధీరోడ్డు, బలరాం కాలనీ, కేశవరాజుకుంట, బిలాల్ నగర్, సిఎస్ఆర్ శర్మ కాలేజీ, దేవుడి చెరువు, సంతపేట, రాంనగర్ తదితర ప్రాంతాలలో అర్దరాత్రి 2 గంటల సమయంలో కంపించింది. దీని ప్రభావంతో ఇళ్లలోని వస్తువులు శబ్దం చేస్తూ కిందకు పడిపోయాయి. మంచం లాగేసినట్లు కదిలిపోయిందని ఇస్లాంపేట ప్రజలు చెప్పుకుంటున్నారు. శర్మ కాలేజీ సమీపంలో ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చి పరిశీలించడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు భూకంపం అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు. ఒంగోలుతో పాటుగా సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులప్పలపాడు, చీమకుర్తి, దర్శి, మార్కాపురం, పొదిలి తదితర ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు కనిపించినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. -
మార్పే లక్ష్యంగా ముందుకు..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పోలీసుల్లో జవాబుదారీతనం పెంచడమే తన లక్ష్యమని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా తిరుపతి నుంచి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక్కడి స్థితిగతులను పరిశీలించేందుకు ఆయన పర్యటిస్తున్నారు. ఒకవైపు జిల్లా పరిస్థితిని అధ్యయనం చేస్తూనే.. మరోవైపు సామాజిక బాధ్యత దిశగా పోలీసుల్లో కదలిక తీసుకొస్తున్నారు. బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడిన ఎస్పీ.. తన ప్రధాన లక్ష్యాలను వివరించారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు. గంజాయి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. విజిబుల్ పోలీసింగ్‌కు కృషి చేస్తామన్నారు. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచడం, అవినీతికి తావులేకుండా చేయడం తన ముందున్న లక్ష్యాలన్నారు. ప్రశాంతంగా వుండే జిల్లాగా వున్న పేరును నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టిన గడ్డ మీద ఎస్పీగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ప్రజలకు సేవలందిస్తానని స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో గంజాయి కట్టడి... జిల్లాలో గంజాయి సాగులేదు. కానీ విశాఖ పట్టణం వైపు నుంచి భారీగా రవాణా అవుతోంది. దీనికి కారణం హైవేకు ఆనుకుని ఉండడం, విస్తృతంగా రైలు సౌకర్యం వుండడంతో గంజాయి వ్యాపారులకు సౌకర్యంగా ఉంది. ముందుగా రవాణాకు చెక్ పెడితే తరువాత దానికదే దారులు మూసుకుంటుంది. ఎప్పుడైతే గంజాయి అందుబాటులో లేకుండా పోతుందో అప్పుడు దాన్ని వాడకం కూడా తగ్గిపోతుందన్నది నా నమ్మకం. అంతటితో ఊరుకోకుండా గంజాయి వినియోగం వలన కలిగే కష్టనష్టాలను ప్రచారం చేస్తాం. విద్యార్థులు గంజాయి, ఇతర చెడు వ్యసనాల బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు అన్నీ రకాల వేదికలను ఉపయోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాను. వారికి కెరీర్ మీద దృష్టి సారించే విధంగా కౌన్సెలింగ్ ఇస్తే ఉపయోగం ఉంటుంది. గంజాయి కట్టడిలో ప్రజలను భాగస్వాములను చేస్తాను. ప్రజలు భాగస్వాములు కాకుండా ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. బహిరంగ మద్యపానంపై కొరడా... బహిరంగ మద్యపానం అనేది ఒక సమస్యగా నేను పరిగణిస్తున్నాను. దీని వలన సమాజంలోని వ్యక్తులు ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు, బాలికలు, చిన్నారులు బాధితులవుతున్నారు అందువలన బహిరంగ మద్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాను. ఎవరైనా సరే బహిరంగంగా మద్యం సేవిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా వుంచడం జరుగుతుంది. ఇది ప్రతిఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తున్నాను. అసాంఘిక శక్తులను వదిలిపెట్టేది లేదు... అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వదిలిపెట్టే సమస్యే లేదు. గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు, అరాచకాలు, రౌడీయిజంలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. ఎంతటివారైనా సరే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటా. ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోలేము కదా. శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసు విధుల్లో ప్రధానమైన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. మహిళల రక్షణకు ప్రాధాన్యత.. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. మహిళలు, బాలికలు, చిన్నారుల మీద జరిగే నేరాలను అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా. మహిళల రక్షణకు సంబంధించిన కేసులను వెంటనే నమోదు చేయడం, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు ప్రారంభించడం వంటి చర్యలు తీసుకుంటాం. మహిళల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చూపినా.. అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేదిలేదు. పోలీసు అధికారులు, సిబ్బంది మహిళలు, బాలికల సమస్యలపై అప్రమత్తంగా వుండాలని సూచనలు ఇవ్వడం జరిగింది. మహిళలు ముందుకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. పోలీసులు సకాలంలో స్పందిచపోతే నా దృష్టికి తీసుకురావాలి. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కృషి.. పోలీసు ఉద్యోగం అంటేనే బాధ్యత కలిగిన ఉద్యోగం. సమాజంలో ఎక్కడేం జరిగినా ముందుగా స్పందించేది పోలీసులే. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేది పోలీసులే. ప్రజల పట్ల పోలీసులు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో వుంది. పోలీసులంటే ఒక స్నేహితుడన్న భావన ప్రజల్లో పెంచాల్సిన బాధ్యత పోలీసుల మీదనే వుంది. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కృషి చేస్తా. విధులపట్ల మరింత అంకితభావంతో పనిచేసేలా చూడడం నా బాధ్యతగా భావిస్తున్నా. అలాగే, అవినీతిని అరికట్టి నిజాయితీగా విధులు నిర్వహించేందుకు కృషి చేస్తా. -
విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి
దరఖాస్తు గడువు పొడిగింపు ఒంగోలు సిటీ: 2026–27 విద్యా సంవత్సరంలో జవహర్ నవోదయ విద్యాలయంలో 9,11 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ సి.శివరాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8, 10 తరగతి చదువుకున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అప్లికేషన్ కావాల్సిన వారు నేరుగా సంప్రదించాలన్నారు. ● భారీగా స్తంభించిన ట్రాఫిక్ ● దిగువమెట్ట చెక్‌పోస్టు వద్ద వాహనాల నిలిపివేత ● 3 గంటల పాటు నిలిచిన వాహనాలుగిద్దలూరు రూరల్: నల్లమల ఘాట్‌రోడ్డులో భారీ క్రేన్‌తో వెళుతున్న లారీ నిలిచిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని దిగువమెట్ట సమీపంలోని బెంగళూరు నుంచి విజయవాడకు భారీ క్రేన్‌తో వెళుతుండగా నల్లమల ఘాట్ రోడ్డులో బుధవారం భారీ క్రేన్‌తో వెళుతున్న ఓ లారీ సాంకేతిక మరమ్మతులతో ఆగిపోయింది. దీంతో దీంతో నంద్యాల నుంచి గిద్దలూరు వైపుగా వస్తున్న వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు గిద్దలూరు నుంచి నంద్యాలకు వెళ్లే వాహనాలను దిగువమెట్ట చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. భారీ క్రేన్‌తో నిలిచిపోయిన లారీని బాగు చేయించి రోడ్డుకు అడ్డం లేకుండా పక్కకు తీయించారు. రోడ్డుపై వాహనాలు కిలో మీటరు మేర నిలిచిపోయాయి. సుమారు 3 గంటల పాటుగా ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముగిసిన కబడ్డీ శిక్షణ శిబిరం ఒంగోలు సిటీ: జిల్లా అండర్–18 కబడ్డీ జట్టుకు స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ బుధవారంతో ముగిసింది. విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ, మెళకువలు నేర్పించినట్లు ప్రకాశంజిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కె.భాస్కర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆటగాళ్లకు వసతి, సౌకర్యాలు కల్పించినందుకు క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రిలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎస్ రంగారావు, కార్యదర్శి వై. పూర్ణచంద్రరావు, కోశాధికారి డి.రమేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీనయ్య పాల్గొన్నారు. వినోద్, సుప్రజ, భవాని తదితరులు ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. ● వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు ఒంగోలు సిటీ: విద్యార్థులు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు అన్నారు. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ సమావేశం హాలులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విభాగం 1969 సెప్టెంబర్ 24వ తేదీన ఏర్పాటైందని, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఒక గొప్ప వాలంటరీ సంస్థ అని అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని ఇటువంటి సంస్థ ద్వారా భారతదేశంలో వైద్య ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు, మొక్కల పెంపకం, పచ్చదనం–పరిశుభ్రత, జాతీయ సమైక్యత, మహిళా చైతన్యం, ప్రకతి వైపరీత్యాల సమయంలో సేవా కార్యక్రమాలు, ప్లాస్టిక్ నిర్మూలన, నేత్రదాన శిబిరాలు వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవలో భాగస్వాములు కావడం హర్షించదగిన విషయమని అన్నారు. కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ అధ్యక్షత వహించారు. -
ఈ–పంట త్వరితగతిన నమోదు చేయాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఈ–పంట నమోదు త్వరితగతిన నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులకు, సహాయ వ్యవసాయ సంచాలకులకు ఈ–పంట నమోదుపై కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికి జిల్లాలో మొత్తం 15,68,517 భూ కమతాలకు గాను 4,63,071 భూ కమతాలు మాత్రమే అంటే 30 శాతం నమోదు చేశారన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ లోపల నమోదు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారులందరూ గ్రామ వ్యవసాయ సహాయకులకు రోజుకు 100 కమతాలు చొప్పున లక్ష్యంగా నిర్దేశించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలేమైనా ఉంటే వెంటనే సవరించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావును ఆదేశించారు. జిల్లా సరాసరి కన్నా తక్కువగా నమోదు చేసిన వ్యవసాయ అధికారులను చేయకపోవటానికి కారణాలను చెప్పమని కోరారు. సహాయ వ్యవసాయ సంచాలకులను మీ పరిధిలోని మండలాలను లక్ష్యంగా పెట్టుకొని పూర్తిచేసేట్టుగా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి గోపీచంద్, ఉద్యానవన శాఖ అధికారులు గ్రామ సహాయకులు చేసిన రికార్డ్స్‌ను ఆమోదించటంలో వెనకబడి ఉన్నారని, త్వరగా చేయాలని ఆదేశించారు. జియో ఫెన్సింగ్ 20 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచితే బీడు కమతాలను తొందరగా పూర్తిచేయవచ్చని, అదే విధంగా చివరి తేదీ అక్టోబర్ 15 వరకు పొడిగించాలన్న విషయాలను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళతానని జేసీ చెప్పారు. బ్లాక్ బుర్లీ పొగాకు సాగును కట్టడి చేయాలని ఆదేశించారు. యూరియా అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా అధికారి వి. సుభాషిణి, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ సాంకేతిక అధికారులు పాల్గొన్నారు. ఈ నెలాఖరులోగా నమోదు పూర్తి చేయాలి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలో జేసీ గోపాలకృష్ణ -
గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
దర్శి మండలంలో చందలూరు, వెంకట చల్లంపల్లి, పోతవరం, మారెడ్డిపల్లి, బసివిరెడ్డిపల్లి, భీమవరం, తూర్పు వెంకటాపురం, జముకులదిన్నె, పొతకమూరు తదితర గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు తనిఖీ అధికారులు నిర్ధారించారు. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటకుండా, పంట కాల్వలు నిర్మాణం చేయకుండానే బిల్లు చేసుకొని లక్షల కొల్లగొట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. పెద్దారవీడు మండలంలోని అన్నీ పంచాయతీల్లోనూ ఇదే తరహాలో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం 19 పంచాయతీలు ఉండగా అధికార పార్టీ నాయకులు, సిబ్బంది కూడబలుక్కొని అవినీతికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. యర్రగొండపాలెం మండలంలో టీడీపీ ఇన్చార్జి అనుచరులు జాబ్ కార్డుకు వంద రూపాయల ప్రకారం వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో తవ్వేకొద్దీ అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడబలుక్కొ మేసినోడికి మేసినంత అన్నట్లు ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. ఎక్కడో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారిపేరు మీద మస్టర్లు వేయడం, చనిపోయిన వారి పేరుమీద కూడా మస్టర్లు వేసి అందిన కాడికి సొమ్మును స్వాహా చేసేస్తున్నారు. ఈ పథకం ద్వారా నాటిన చెట్లకు పండ్లు కాయలు కాయడంలేదు కానీ అధికారుల జేబులు నిండుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు. అక్రమాలను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సామాజిక తనిఖీలు సైతం ప్రహసనంగా సాగుతుండడంతో అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 4.41 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అందులో 3.82 లక్షల కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. 8.13 లక్షల మంది కూలీలు ఉండగా, వీరిలో 6.78 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా ఉన్నారు. ఉపాధి హామీ నిధులతో సీసీ, బీటీ రోడ్ల పనులు, గోకులం షెడ్లు, పచ్చ గడ్డి పెంపకం, ఇంకుడు గుంతల పనులన్నీ అధికార కూటమి నేతలు తమకు నచ్చిన వారికి కేటాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ మండలంలో చూసినా కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర అధికారులు, కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని ఆ శాఖ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. డ్వామాలో సామాజిక తనిఖీల డ్రామా కొనసాగుతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సిబ్బంది అవినీతిని స్వయంగా జిల్లా అధికారులే కాపుకాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెరవెనుక డీల్ చేసుకొని జరిమానాలతో సరిపుచ్చుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.6 కోట్లకు పైగా అవినీతి... జిల్లాలో నిరంతరాయంగా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాట వినని ఉద్యోగులను లొంగదీసుకోవడానికి సామాజిక తనిఖీలను ఆయుధంగా ప్రయోగిస్తున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దర్శి, పెద్దారవీడు మండలాల్లో జరిగిన సామాజిక తనిఖీలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దారవీడు మండలంలో జరిగిన అవినీతిపై పెద్ద దుమారం రేగింది. ఈ మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 2024–25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనుల్లో ఏకంగా రూ.6 కోట్ల భారీ అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలో గుర్తించారు. మొత్తం 637 పనులు చేసినట్లు రికార్డుల్లో చూపెడుతున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ నాయకులు, ఉపాధి సిబ్బంది కలిసి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినప్పటికీ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. అలాగే దర్శి మండలంలో జరిగిన ఉపాధి పనుల మీద ఇటీవల సామాజిక తనిఖీ జరిగింది. ఈ మండలంలోని పలు గ్రామాల్లో మొక్కలు నాటకుండానే నాటినట్లు డబ్బులు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని గ్రామాల్లో పంట కాల్వల నిర్మాణానికి సంబంధించిన పనుల్లో అవినీతి జరిగినట్లు తెలిసింది. మొత్తం మీద 1444 పనులకు గాను సుమారు రూ.10 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. అధికారుల అండదండలతోనే అవినీతి... జిల్లా ఉపాధి హామీలో అక్రమార్కులు బరితెగించడానికి కారణం అధికారుల అండదండలేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలవారీగా మామూళ్లు ముట్టచెబుతున్నాం కనుక మనమేం చేసినా చెల్లుబాటవుతుందన్న భరోసాతోనే కిందిస్థాయి సిబ్బంది విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఒక్క దర్శి మండలంలోని ఒక గ్రామంలోనే భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటే ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది ఏ మేరకు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. పనిచేసినా వేతనం లేదు... జిల్లాలోని కురిచేడు మండలంలో ఒక మహిళ గత పదేళ్లుగా ఉపాధి హామీ పనులకు వెళుతోంది. ఆయితే ఆమె వేతనం బ్యాంకులో జమ చేస్తున్నట్లు చెప్పిన స్థానిక సిబ్బంది ఆ వేతనాన్ని దిగమింగారు. వేతనం కోసం ఆమె బ్యాంకుకు వెళితే ఒక్క రూపాయి కూడా జమ కాలేదని తెలిసి ఆమె బిత్తరపోయింది. గత రెండేళ్లుగా ఆమె వేతనం కోసం అధికారులు, స్థానిక సిబ్బంది చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎలాంటి సమాధానం రావడం లేదు. చివరికి పీడీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజం లేకుండా పోయింది. పోయిన డబ్బులు తిరిగి రావు కానీ కొత్తగా మరో జాబ్‌కార్డు రాయించుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చినట్లు ఆమె వాపోతున్నారు. ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)అవినీతికి హామీబతికి ఉన్న వారు పనులు చేసినా వేతనాలు వేయకుండా మింగేస్తున్న సిబ్బంది చనిపోయిన వారిని కూడా వదిలిపెట్టడం లేదు. మరణించిన వారి వివరాలను సేకరించి వారి పేర్ల మీద జాబ్ కార్డులు సృష్టించి మస్టర్లు వేస్తున్నారంటే ఎంతగా బరితెగించారో అవగతమవుతుంది. జిల్లాలోని బేస్తవారిపేట, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లల చెరువు, పెద్దారవీడు, దర్శ, కొనకనమిట్ల తదితర మండలాల్లో మరణించిన వారిపేర్ల మీద మస్టర్లు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దారవీడు మండలంలోని తోకపల్లి పంచాయతీ పరిధిలో మూడేళ్ల క్రితం మరణించిన వారికి మస్టర్లు వేసినట్లు తనిఖీ బృందం విచారణలో తేలింది. దర్శి మండలంలోని గ్రామాల్లో కూలీలు పనులకు రాకపోయినప్పటికీ మస్టర్లు వేసినట్లు తెలుస్తోంది. -
మున్సిపాలిటీల్లో తాగునీటి అవసరాలు తీర్చాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని ఒంగోలు నగర కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పి. రాజాబాబు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరెట్లోని తన ఛాంబర్లో బుధవారం జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలక్రిష్ణతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు, పబ్లిక్ హెల్త్, జిల్లాలోనీ అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాల అమలు తీరును, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ డ్రై వేస్ట్ నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పట్టిష్టంగా అమలయ్యేలా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరంలోకి ప్రవేశించే ప్రదేశాన్ని పూర్థి స్థాయిలో సుందరీకరణంగా అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. నగరంలో చేపట్టిన ప్రధాన కాలువల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రానున్న సంవత్సరాల్లో ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా రూ.100 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర రావు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంజయ్ కుమార్, అన్నీ మున్సిపాలిటీల కమిషనర్లు, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు -
ఓబులక్కపల్లిలో పట్టపగలే చోరీ
● రూ. 4 లక్షల విలువైన సొత్తు అపహరణ పెద్దారవీడు: మండలంలో ఓబులక్కపల్లి గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన దుగ్గెంపూడి మల్లారెడ్డి కుటుంబసభ్యులు పొగాకు నారు వేసుకునేందుకు ఉదయం పొలానికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చారు. అ సమయంలో ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వచ్చి చూడగా ఇళ్లంతా దుస్తులు, వంటపాత్రలు, బియ్యం బస్తాలు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో భయంతో చుట్టుపక్కల వారికి విషయం తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా బీరువాలోని రూ.40 వేల నగదు, బంగారు కమ్మలు, బుట్టలు, ఉంగరాలు, నల్లపూసల దండా అపహరణకు గురైనట్లు గుర్తించారు. వాటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. రెండు రోజుల నుండి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని, వారే దొంగతనానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఒంగోలులో భూ ప్రకంపనలు
సాక్షి, ఒంగోలు: ఒంగోలు(Ongole)లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి లాయర్‌పేట, శర్మ కాలేజీ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రకంపనల కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.వివరాల ప్రకారం.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి రెండు గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో భూమి అత్యధికంగా కనిపించినట్లు స్థానికులు తెలిపారు.. అయితే, రాత్రి సమయం కావటంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్టుగా తెలుస్తోంది. కొందరు మాత్రం ప్రకంపనల కారణంగా భయంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఇక, దీనిపై సమాచారం అందుకున్న అధికారులు.. స్థానిక ప్రజల నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.. కాగా, ప్రకాశం జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది మే నెలలో ఓసారి.. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఓసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి.. అయితే, తాజాగా సంభవించిన భూప్రకంపనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
స్టడీ సర్కిల్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కో సంక్షేమ పథకం నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. సంక్షేమ పథకాల సంగతి అటుంచితే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పని చేస్తున్న సంక్షేమ పథకం ఒక్కటీ లేదు. ముఖ్యంగా జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ పనితీరు మరింత దారుణంగా ఉంది. పోటీ పరీక్షలకు శిక్షణ అక్కడ మచ్చుకై నా కనిపించడం లేదు. ఏడాదిలో రెండు నెలలు శిక్షణ ఇవ్వడం కూడా అక్కడ గగనంగా మారుతోంది. నిరుద్యోగులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూ వేలాది రూపాయలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. బీసీ స్డడీ సర్కిల్ కార్యాలయం ఒంగోలు వన్‌టౌన్: కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ కరువైంది. పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆచరణలో నామమాత్రంగా పనిచేస్తోంది. ప్రస్తుత సంవత్సరంలో కేవలం డీఎస్సీకి మాత్రమే అధికారులు రెండు నెలల పాటు శిక్షణ ఇప్పించి చేతులు దులుపుకున్నారు. బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది వేతనాలు, కార్యాలయం నిర్వహణకు సంవత్సరానికి లక్షలు వెచ్చిస్తున్నా ఆశించిన స్థాయిలో నిరుద్యోగులకు శిక్షణ అందడం లేదు. దీంతో నిరుద్యోగులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూ వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. అసలు బీసీ స్టడీ సర్కిల్ అనే సంస్థ ఒంగోలులో ఉంది అనే విషయం చాలా మంది నిరుద్యోగులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. బీసీ స్టడీ సర్కిల్‌పై అవగాహన కల్పించాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. ఒంగోలులో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భవనాల సముదాయం వెనుక వైపు బీసీ స్టడీ సర్కిల్‌ను గతంలో ఏర్పాటు చేశారు. ఈ స్టడీ సర్కిల్లో గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ఆ వాతావరణం అక్కడ మచ్చుకై నా కనిపించదు. సంవత్సరంలో ఏదో ఒక శిక్షణను రెండు నెలల పాటు ఇప్పించి మిన్నకుండిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్లకు అనుగుణంగా బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా శిక్షణ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర కాలంలో కేవలం డీఎస్సీకి మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఇతర ఎటువంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చింది లేదు. బీసీ స్టడీ సర్కిల్లో బీసీలకు 66, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 శాతం మేర సీట్లు కేటాయించి శిక్షణ అందిస్తుంటారు. వీరితో పాటూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. కోచింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.1500 స్టైఫండ్, మెటీరియల్‌కు రూ.1000 అందిస్తారు. 75 శాతం హాజరు ఉన్న వారికి స్టైఫండ్ ఇస్తారు. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. ఆఫ్ లైన్, ఆన్లైన్ ద్వారా రెండు పద్ధతుల్లో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించాల్సి ఉండగా ఒంగోలు బీసీ స్టడీ సర్కిల్లో కేవలం ఆఫ్‌లైన్‌లోనే శిక్షణ అందిస్తున్నారు. ఆన్లైన్లో శిక్షణను అందించేందుకు ఏర్పాట్లు లేవు. డీఎస్సీకి 200 మంది వరకు శిక్షణకు అవకాశం ఉండగా కేవలం 125 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 75 మంది లోపు మాత్రమే ఉచిత శిక్షణకు హాజరయ్యారు. వీరిలో కూడా చాలా మంది మధ్యలోనే మానేశారు. సుశిక్షితులైన ఫ్యాకల్టీతో, సీనియర్లతో కోచింగ్ ఇవ్వాల్సి ఉండగా నామ మాత్రంగా జూనియర్లతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. నాణ్యమైన శిక్షణ అందకపోవడంతో అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్‌కు రావడం లేదు. ఒక్కో ఫ్యాకల్టీకి సబ్జెక్టు గంటన్నరకు రూ.600 చొప్పున చెల్లిస్తున్నారు. అభ్యర్థులు నూతన విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు ఉద్దేశించిన లైబ్రరీలో నూతన పుస్తకాలు ఉండటం లేదు. ఎప్పటివో పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్నారు. కరెంట్ ఎఫైర్స్ పుస్తకాలు ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం లేదు. బీసీ స్టడీ సర్కిల్లో కోఆర్డినేటర్, లైబ్రేరియన్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించారు. వీరి జీత భత్యాలకే సంవత్సరానికి దాదాపు రూ.10 లక్షల వరకూ వెచ్చిస్తున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు.అవసరమైన శిక్షణ ఇస్తాం: బదిలీపై నూతనంగా జిల్లాకు వచ్చా. బీసీ స్టడీ సర్కిల్లో ఇతర శిక్షణలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. మెగా డీఎస్సీలో బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన వారిలో ఏడుగురు అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయి. – నిర్మలాజ్యోతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి కూటమి ప్రభుత్వంలో పోటీ పరీక్షలకు శిక్షణ కరువు పేరుకే బీసీ స్టడీ సర్కిల్.. ఏడాదిలో రెండు నెలలే శిక్షణ సిబ్బంది జీతభత్యాలకే ఏడాదికి అక్షరాలా రూ.10 లక్షలు -
వ్యవసాయాన్ని రైతుకు లాభసాటిగా చేయాలి
ఒంగోలు సబర్బన్: వ్యవసాయాన్ని రైతుకు లాభసాటిగా చేయడమే లక్ష్యంగా సంబంధిత అధికారులు పనిచేయాలని కలెక్టర్ పీ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖలైన హార్టీకల్చర్, పశుసంవర్ధక, మైక్రో ఇరిగేషన్, సహకార, ప్రకృతి వ్యవసాయం, మత్స్య శాఖల అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 15 శాతం వృద్ధిరేటే లక్ష్యంతో వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో వ్యవసాయానికి అనుకూలంగా ఉండి నిరుపయోగంగా ఉన్న భూమిని సాగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దానికనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతి రైతుకు ఖర్చు తగ్గించి ఉత్పత్తి పెంచేలా, అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతుల అవసరాలకు అనువైన యంత్రాలను గుర్తించాలన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఆ మండలాల్లో రైతుల అవసరాలను గుర్తించి మంచి ఫలితాలు సాధించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.06 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేస్తుండగా, మరో 1.01 లక్షల హెక్టార్లలో అమలు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రానున్న 2, 3 సంవత్సరాల్లో లక్ష హెక్టార్లలో సూక్ష్మ సేద్యం విధానాన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు తయారుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పశుగ్రాసం పంపిణీ, పశు బీమా లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలకు వంద శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన వృద్ధి రేటు సాధించేలా మత్స్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాస రావు, పశుసంవర్ధక శాఖ జేడీ రవి కుమార్, మత్స్య శాఖ జేడీ శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ సుభాషిణి, మార్క్‌ఫెడ్ అధికారి శ్రీహరి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాస రావు, జిల్లా సెరీకల్చర్ అధికారి సుజయ్, జిల్లా ఉద్యాన శాఖాధికారి గోపిచంద్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అరాచకాలపై ధర్నాకు సిద్ధం
మార్కాపురం టౌన్: మార్కాపురం ఎమ్మెల్యే అరాచకాలపై త్వరలో ఒంగోలులో ధర్నా చేస్తామని, వెలుగొండ ప్రాజెక్టు, మెడికల్ కాలేజి, జిల్లా కేంద్రంగా మార్కాపురం ఏర్పాటుపై ఎవరితోనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని తేదీ, సమయం, స్థలం చెపితే చాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాయవరం వద్ద ఉన్న మెడికల్ కాలేజి వద్ద పీపీపీ వద్దు, ప్రభుత్వం మెడికల్ కాలేజిని నడపాలని నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇందుకు కౌంటర్‌గా 21న మార్కాపురం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే వైఎస్సార్ సీపీ వాళ్లు అడ్డుకుంటున్నారని వాడు, వీడు అని నోరుపారేసుకుని మాట్లాడారన్నారు. అధికారం ఉందని నోరు పారేసుకోవద్దని, మాకు నోరుంది మేము అనలేక కాదు మాకు సభ్యత ఉందికాబట్టే మాట్లాడటం లేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తెచ్చిందని, 2023లో 5 కాలేజీలను ప్రారంభించారన్నారు. గత సంవత్సరం 2 కాలేజీలు పూర్తయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అడ్మిషన్లు చేయకుండా అనాసక్తత చూపుతూ నిలుపుదల చేశారన్నారు. మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్వహిస్తే పేద విద్యార్థులకు ఉపయోగమా, ప్రైవేటు యాజమాన్యం నిర్వహిస్తే ఉపయోగమా అనేది ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. పీపీపీ విధానంలో కేవలం 33 ఏళ్లు మాత్రమే నిర్వహిస్తారని, అనంతరం ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పటం ప్రజలకు అర్థం కాదా అని ప్రశ్నించారు. కాలేజీని నిబంధనల ప్రకారం 66 సంవత్సరాలు పీపీపీ విధానం కింద ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని కూటమి ఎమ్మెల్యే తెలుసుకోవాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై ఏ ప్రభుత్వ కాలంలో ఎంత ఖర్చు పెట్టింది కాగ్ నివేదికలు పేర్కొంటున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని ప్రజలు చెప్తే బేషరతుగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ నియోజకవర్గంలో గత 15 నెలలుగా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మద్యం దోపిడీ, బియ్యం దోపిడీ, ల్యాండ్ దోపిడీలు జరుగుతుంటే మీరెందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, మీరు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించండన్నారు. అంతే కానీ నోరుందని పారేసుకుంటే ఫలితం ఉండదన్నారు. కార్యక్రమంలో ఏపీ మైనార్టీ కార్పొరేషన్ బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ అలీబేగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల కృష్ణ, ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ జీ.శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు డాక్టర్ కనకదుర్గ, ఎం.శ్రీనివాసులు, సలీం, చంద్ర, తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షుడు మురారి వెంకటేశ్వర్లు, డాక్టర్ మగ్బుల్‌బాషా, నజీర్, నాయకులు పీ.చెంచిరెడ్డి, జీ.సత్యనారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, గుంటక చెన్నారెడ్డి, ఉత్తమ్‌కుమార్, నాలీ కొండయ్య యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నీళ్ల బాధలు.. ఇంకెన్నాళ్లు?
ఒంగోలు సబర్బన్: ఎన్ఎస్పీ కారుమంచి మేజర్ కాలువకు పడిన గండిని వెంటనే పూడ్చాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆయకట్టు కమిటీ నీటి సంఘం అధ్యక్షుడు పాలడుగు వెంకట నారాయణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఆయకట్టు కమిటీ నీటి సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.. రామతీర్థం జలాశయం నుంచి సరఫరా అయ్యే సాగర్ నీరు చీమకుర్తి, సంతనూతలపాడు, టంగుటూరు మండలాలకు సక్రమంగా అందడం లేదన్నారు. దాదాపు 20 గ్రామాల ప్రజలకు నీరందించే కారుమంచి మేజర్ కెనాల్‌కు 2019లో చీమకుర్తిలోని మధుకాన్ గ్రానైట్ క్వారీ వెనుక భాగంలో భారీ గండి పడిందన్నారు. 18 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ కెనాల్లో గండి పడినప్పటి నుంచి 130 క్యూసెక్కులకు బదులు కేవలం 40 క్యూసెక్కుల నీరే ప్రవహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గండి పడిన ప్రదేశం పక్క నుంచి తాత్కాలికంగా కాలువ ఏర్పాటు చేశారని, 40 క్యూసెక్కుల ప్రవాహం తొలి మూడు గ్రామాలకు కూడా సరిపోవడం లేదన్నారు. ఇక చివరి గ్రామాల ప్రజలు గొంతు తడుపుకోవడానికి కూడా నీరు అందడం లేదని చెప్పారు. కాలువ గండి పూడ్చేందుకు ప్రభుత్వం ఏపీడీఎంఎఫ్ నిధులు రూ.2.63 కోట్లు మంజూరు చేసినప్పటికీ నిర్మాణ పనులను మధుకాన్ గ్రానైట్ కంపెనీ యాజమాన్యం అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ కాలువ కింద ఉన్న గ్రానైట్ నిక్షేపాల కోసమే మధుకాన్ సంస్థ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాలువ స్థలాన్ని తమకు కేటాయిస్తే ల్యాండ్ రిక్రూట్మెంట్ ద్వారా కొంచెం ముందు నుంచి కాలువ తీస్తామనడాన్ని తప్పుబట్టారు. నీరు పల్లం నుంచి మెరకకు ఎక్కవన్న సంగతి మధుకాన్ యాజమాన్యం గుర్తుంచుకోవాలన్నారు. పాత డిజైన్ ప్రకారం కాలువ నిర్మిస్తేనే 20 గ్రామాల్లో ఉన్న ఆయకట్టు భూములకు నీరు అందుతాయని తేల్చిచెప్పారు. సాగు నీరు అందక రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారన్నారు. 10 మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులకు సక్రమంగా నీరు సరఫరా కాక ప్రజలతోపాటు పశువులకు తాగునీటి కోసం విలవిల్లాడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ గండి పూడ్చకుండా అడ్డుతగులుతున్న మధుకాన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతి పత్రం అందజేశారు. రామతీర్థం వద్ద సాగర్ కెనాల్‌కు పడిన గండిని పూడ్చాలి మధుకాన్ గ్రానైట్ సంస్థ కుట్రలతోనే పనులకు అడ్డంకి 20 గ్రామాల ప్రజలు, రైతుల ఇబ్బందులు పరిష్కరించరా? కలెక్టరేట్ వద్ద ధర్నాలో కారుమంచి మేజర్ కెనాల్ రైతుల ఆగ్రహం -
అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఒంగోలు సిటీ: ప్రజలు, ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్ట్రాగామ్ వాల్‌పై అసభ్యంగా వ్యాఖ్యానిస్తున్న వారిపై దృష్టి సారించామని తెలిపారు. మహిళలు, ఇతరులను కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, కులం–మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. సమాజాన్ని కలవరపెట్టేలా కాకుండా, వాస్తవాలను తెలుసుకున్న తర్వాతనే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలని ప్రజలకు సూచించారు. యువత సోషల్ మీడియాను మంచి కోసమే వినియోగించుకోవాలని సూచించారు. -
ఆశ చూపి టోకరా!
నాగులుప్పలపాడు: మీరు కొంత డబ్బు చెల్లిస్తే రోజు వారీగా మీ బ్యాంకు ఖాతాలో మేము కొంత జమ చేస్తాం. వాటిని మీ అవసరాలకు మీ వద్ద ఉన్న యాప్ ద్వారా వారంలో మూడు రోజుల పాటు ఆ డబ్బును డ్రా చేసుకోవచ్చు. అంతే కాకుండా మీరు కొత్త వారిని మన వ్యాపారంలోకి చేరిస్తే వారి చేరిక ద్వారా వచ్చే కమీషన్ వెంటనే మీ ఖాతాలో జమ చేస్తాం. డబ్బు సంపాదించడానికి ఇంతకు మించిన మంచి తరుణం లేదంటూ ఆ ఊరి ప్రజలను నమ్మించి వంచించాడో ప్రబద్ధుడు. నిజమేనని నమ్మిన గ్రామస్తులు ఈ యాప్ ద్వారా సుమారు 500 మందికి పైగానే రూ.5 కోట్లకు పైగా చెల్లించి తిరిగి చెల్లింపులు లేకపోవడంతో పాటు ఈ యాప్ అలవాటు చేసిన వ్యక్తి ఊర్లో కనిపించకపోవడంతో మోసపోయామని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగులుప్పలపాడు మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన తూతిక నాగాంజనేయులు అనే వ్యక్తి ఎల్ఎఫ్ వర్క్ మనీ పేరుతో ఉన్న యాప్ ద్వారా డబ్బులు పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని గ్రామస్తులకు ఆశ చూపించాడు. గ్రామంలోనే సుమారు 500 మంది నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి అందులో చేర్పించాడు. ఈ ఎల్ఎఫ్ వర్కు యాప్‌ను ఈ ఏడాది జనవరిలో నాగాంజనేయులుకు ఒడిశాకు చెందిన కొందరు వ్యక్తులు పరిచయం చేశారు. రూ.2400 డిపాజిట్ చేస్తే రోజుకి రూ.72 చొప్పున 9 నెలలు తిరిగి ఇస్తారు, రూ.6 వేలకు రోజుకి రూ.350 చొప్పున 9 నెలలు, రూ.12 వేలు చెల్లిస్తే రోజుకి రూ.725 చొప్పున 9 నెలలు ఇస్తామని చెప్పి ప్రజలకు అలవాటు చేసి మొదట్లో తిరిగి చెల్లింపులు కూడా చేశారు. అనంతరం ఆశావాహులు పెరిగారని నమ్మకం కుదిరిన తరువాత రూ.24 వేలు, రూ.51,100 లాంటి పెద్ద మొత్తాలను కూడా డిపాజిట్ చేయొచ్చని నమ్మబలికారు. ఎల్ఎఫ్ వర్కు పేరుతో చీరాల, ఇంకొల్లు ప్రాంతాల్లో కార్యాలయాలు కూడా తెరిచారు. దీనికి ప్రజలను బాగా అలవాటు చేయడానికి ఈ మధ్య కాలంలో చీరాలలోని ఓ రిసార్టులో హంగు, ఆర్భాటాలతో ఓ పెద్ద అవగాహన సభ ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన క్లైంట్లకు భారీ విందు కూడా ఇచ్చారు. దీనిని నమ్మిన జనం ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ మొదటి వారాల్లో అందిన కాడికి అప్పులు తెచ్చి కోట్లలో పెట్టుబడులు పెట్టారు. తిమ్మసముద్రం గ్రామానికి చెందిన తూతిక నాగాంజనేయులు ఈ సంస్థకు చీరాల ఏరియా మేనేజర్ని అని తనకు తానుగా పరిచయం చేసుకోవడంతో తిమ్మసముద్రం గ్రామంతో పాటు చీరాల, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల ప్రజలు తమ బంగారాలను సైతం తాకట్టు పెట్టి ఈ యాప్ లో పెద్ద మొత్తంలో జమ చేశారు. అయితే ఈనెల 13వ తేదీ నుంచి యాప్ ద్వారా రోజువారీగా వచ్చే డబ్బులు విత్‌డ్రా చేయడానికి రావడం లేదు. ఈ వ్యవహారం మొత్తానికి కారణమైన నాగాంజనేయులు ఊరి విడిచి వెళ్లిపోవడంతో పాటు 2 రోజుల నుంచి అతని ఫోన్ పనిచేయకపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం గ్రామంలో పోలీసులు విచారణ చేపట్టారు.రూ.51 వేలు జమ చేశా.. బర్లీ పొగాకు వలన పూర్తిగా నష్టపోయిన తరుణంలో గ్రామంలో ఈ యాప్ ద్వారా ఎక్కువ మంది డబ్బులు సంపాదిస్తున్నారన్న సమాచారంతో అప్పు చేసి మరీ మా గ్రామానికి చెందిన యువకుడి ద్వారా రూ.51 వేలు జమ చేశాను. తీరా అసలు చూస్తే యాప్ ద్వారా మోసం జరిగిందని గ్రహించాం. – దేశబోయిన వెంకట్రావు, బాధితుడు నాతో పాటు, నేను చేర్పించిన వారూ నష్టపోయాం.. యాప్ ద్వారా డబ్బులు వస్తున్నాయన్న ఆశతో నేను స్వయంగా రూ.2.60 లక్షల పెట్టుబడి పెట్టడంతో పాటు నాకు తెలిసిన వారి ద్వారా మరో రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టించాను. చివరికి మోసపోయాం. – మాగులూరి రత్తయ్య, బాధితుడు -
రోడ్డు ప్రమాదంలో తెగిపడిన చిన్నారి కాలు
అర్ధవీడు: బొలెరో వాహనం ఎక్కడంతో ఓ చిన్నారి కాలు రెండు ముక్కలుగా తెగిపడింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గన్నెపల్లిలో బయట ఆడుకుంటున్న మూడేళ్ల ఆస్మ కాలిపై పత్తి లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఎక్కింది. చిన్నారి కాలు రెండు ముక్కలకు విడిపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాదంలో చిన్నారి ఎడమ కాలు పూర్తిగా వేరైంది. చిన్నారిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స చేశారు. అనంతరం గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లారని ఎస్సై శివ నాంచారయ్య తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
నిర్లక్ష్యం వీడండి.. సమస్యలు పరిష్కరించండి
ఒంగోలు సబర్బన్: సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారులతో అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. ఉద్యోగులు, అధికారులు ఇష్టారీతిగా ప్రవర్తిస్తే ఊరుకోబోనని స్పష్టం చేశారు. మంగళవారం ప్రకా శం భవనం నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్ఓ బి.చిన ఓబులేసుతో కలిసి మండల స్థాయి అధికారులతో రెవెన్యూ సంబంధిత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘కోరుకున్న చోటకు పోస్టింగ్ వచ్చింది కదా.. ఇక పరవాలేదులే’ అనుకుని ప్రజలతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఉపేక్షించేది లేదన్నా రు. సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని దిశానిర్దేశం చేశారు. ‘మీకోసం’ కార్యక్రమానికి వస్తున్న అర్జీల్లో ఎక్కువగా రెవెన్యూ సంబంధిత అంశాలవే ఉంటున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లాలోని అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న టాప్–10 అంశాలకు సంబంధించిన పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలన్నారు. ప్రజలు ప్రస్తావించిన, మీడియాలో వస్తున్న సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. డిమాండ్ల సాధనకే యూటీఎఫ్ రణభేరి ఒంగోలు సిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి.వీరాంజనేయులు డిమాండ్ చేశారు. కూటమి పార్టీలు అధికారం చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 25న గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల్లో సభ్యులందరూ భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు. విద్యారంగ సమస్యలను ఒక్కటి కూడా పరిష్కరించకపోగా ఉపాధ్యాయులలో బోధనేతర పనులు చేయించడం సరికాదని పేర్కొన్నారు. పిల్లలకు పాఠాలు బోధించడం వరకే ఉపాధ్యాయులను పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు న్యాయంగా రావాల్సిన బకాయిలను ఏళ్ల తరబడి చెల్లించపోవడం వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారం చేపట్టగానే పీఆర్సీ కమిషన్ సభ్యులు రాజీనామా చేశారని, ఇంత వరకు నూతన కమిషన్‌ను నియమించకపోగా, ఐఆర్ కూడా ప్రకటించకపోవడం సరైనాదేనా అని ప్రశ్నించారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బును సైతం చెల్లించకపోవడాన్ని ఆక్షేపించారు. పై అంశాలపై ప్రభుత్వ అధికారులకు అనేకమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించలేదని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులందరితో కలిసి యూటీఎఫ్ రణభేరి మోగిస్తోందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ఉపాధ్యాయులను చైతన్యపరచడంతోపాటు ప్రజానీకానికి కూడా తమ బాధను తెలియజేశామన్నారు. ప్రభుత్వం ఇదే తీరును కొనసాగిస్తే భవిష్యత్తులో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్జీదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు అధికారులకు కలెక్టర్ రాజాబాబు హెచ్చరిక ఉపాధ్యాయుల సమస్యలపై కూటమి ప్రభుత్వ స్పందన శూన్యం ఐఆర్ ఇవ్వకపోగా పీఆర్సీ నూతన కమిటీ ఏర్పాటుపై తాత్సారం రేపు గుంటూరులో రణభేరికి తరలిరావాలని యూటీఎఫ్ నేతల పిలుపు -
కూటమి దొంగలు
కారడవిలోకనిగిరిరూరల్: ఇష్టారీతిగా సహజ వనరులను దోచుకుంటూ అధికార పార్టీ నేతలు సంపద సృష్టించుకుంటున్నారు. నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరిహద్దులో ఉంటుంది. నల్లమల అడవిలోని భైరవకోన బీట్, అంబవరం బీట్లలో జోరుగా కలప (జానా, ఇల్లూరు, కోయ, ఊటీ, చీమచింత, మర్రి, జామాయిల్, చిల్ల, ఇలా పలు రకాల జాతి కర్రలు), కొండ కర్రలను యథేచ్ఛగా కొట్టి తరలిస్తూ.. కూటమి నేతలు లక్షలు గడిస్తున్నారు. కొద్ది కాలం క్రితం భైరవకోన కొండ అటవీ ప్రాంతంలో తుంగోడు, మైలుచర్ల, దేవకిమర్రి కొండల్లో ఎర్రచందనం కర్రను తరలించేందుకు సిద్ధంగా ఉంచగా.. దాడులకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో అవి ఫారెస్ట్ పరిధిలో లేవంటూ రాత్రి రాత్రికి గప్‌చుప్‌గా వెనక్కి తిరిగినట్లు సమాచారం. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగినా.. అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో మౌనం దాల్చారనే ఆరోపణలున్నాయి. అనుమతి గోరంత.. దోపిడీ కొండంత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటవీ భూముల్లోని పలు రకాల జాతి కర్రలను యథేచ్ఛగా కొడుతున్నారు. నామమాత్రంగా అనుమతులు తీసుకుని కొండంత దోపిడీకి పాల్పడుతూ రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ రెండు వారాల క్రితం సీఎస్‌పురం మండలంలోని అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న కొండ కర్ర లారీని అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక రకమైన కర్ర కొట్టేందుకు అనుమతి తీసుకుని మరో రకమైన జాతి కర్రను తరలిస్తుండగా ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.1.50 లక్షల విలువైన కర్రను, లారీని సీజ్ చేశారు. ఈ కేసులో ఒక ఎఫ్‌బీవో, సెక్షన్ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కొట్టుకున్నోడికి కొట్టుకున్నంత.. పీసీపల్లి మండలంలో అధికార పార్టీ నేతల దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఓ వైపు తెల్లరాయి.. మరో వైపు ఇసుక, ఇంకో వైపు మట్టి ఇలా అన్ని రకాల సహజ వనరులను దోచుకుంటున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, భూముల్లో జోరుగా తెల్లరాయి అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. మైనింగ్ శాఖ అధికారులు నామ్‌కే వాస్తే దాడులు చేసి.. మమ అనిపిస్తున్నారు. ఇక చిల్లకర్ర, జామాయిల్ కర్రలను యథేచ్ఛగా కొడుతున్నారు. అన్నపరెడ్డిపల్లి, కోడూరివారిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని అటవీ భూముల్లో, చెరువు భూముల్లోని చిల్లకర్రను భారీగా కొట్టి తరలించుకుంటున్నా ఇరిగేషన్, ఫారెస్ట్, మైనింగ్ అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. జోరుగా జామాయిల్ కర్ర కొట్టివేత పీసీపల్లి, వెలిగండ్ల, సీఎస్‌పురం, పామూరు మండలాల్లోని శివారు ప్రాంతాల్లోని అటవీ భూముల్లో జామాయిల్ కర్రను అధికార పార్టీ నేతలు అక్రమంగా కొట్టి తరలించుకుంటున్నారు. ఈ అక్రమ దందా వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. కొద్ది రోజుల క్రితం అక్రమంగా కొట్టి తరలిస్తున్న జామాయిల్ కర్రలోడును వెలిగండ్ల పోలీసులు పట్టుకున్నారు. సీఎస్‌పురం, హెచ్‌ఎంపాడు మండలాల్లో జోరుగా జామాయిల్ కర్రను ప్రభుత్వ భూముల్లో కొడుతున్నారు. కనిగిరి ప్రాంతంలోని తెల్లరాయికి ఎక్కువ గిరాకీ ఉండటంతో అధికార పార్టీ నేతల అండతో నియోజకవర్గంలో జోరుగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. కొద్ది కాలం క్రితం కనిగిరి, వెలిగండ్ల మండలాల శివారు ప్రాంతాల్లో సుమారు రూ.10 లక్షల విలువైన తెల్లరాయిని అధికారులు పట్టుకోగా.. పీసీపల్లి మండలంలోని మురుగమ్మిలో, గుంటుపల్లి ఏరియాల్లో మైనింగ్, విజిలెన్స్ అధికారులు రెండు దఫాలు తెల్లరాయిని ఫారెస్ట్, రెవెన్యూ భూముల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. పీసీపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని రెవెన్యూ, అటవీ భూముల్లో గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు తదితర ప్రాంతాలకు చెందిన వారు స్థానిక అధికార పార్టీ నాయకులతో ములాఖత్ అయి.. వారి వాటా వారికి చెల్లిస్తూ.. గప్ చుప్‌గా రాత్రి వేళల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. వచ్చిపట్టుకునే పరిస్థితి లేదు. ఇటీవల జమ్మలమడక, నాగిరెడ్డిపల్లి కొండ వద్ద అటవీ భూముల్లో తవ్విన తెల్లరాయిని స్థానిక ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం తప్ప.. మిగిలిన అధికారులు ఆవైపు కన్నెత్తి చూసింది లేదు. ఇక కనిగిరి, పామూరు, సీఎస్‌పురం మండలాల్లో కొందరు అర ఎకరా భూమిలో తెల్లరాయి తవ్వకానికి అనుమతి పొంది.. పది ఎకరాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ దోచుకుంటున్నారు. అక్రమంగా తెల్లరాయిని తవ్వినా, కొండ కర్రను తరలించినా కఠిన చర్యలు ఫారెస్ట్ భూముల్లో అక్రమంగా, అనుమతి లేకుండా తెల్లరాయిని తవ్వినా, కొండ భూముల్లో, అటవీ ప్రాంతాల్లో కర్రను, కలపను, చిల్ల కర్రను కొట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం. కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ఇటీవల అనుమతి లేకుండా తరలిస్తున్న సుమారు రూ.1.40 లక్షల విలువైన కర్రను పట్టుకున్నాం. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎస్‌పురం మండలంలోని ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశాం. పీసీపల్లి మండలం ఏరియాలో పొగాకు రైతులు ఎక్కువగా అనుమతి లేకుండా చిల్లకర్రను కొడుతున్నట్లు తెలిసింది. నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాం. సీఎస్‌పురం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దుంగల అక్రమ తరలింపు జరగడం లేదు. కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని పటిష్ట నిఘాకు అధికారులకు, సిబ్బందికి గట్టి ఆదేశాలిచ్చాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటాం. – తుమ్మా ఉమామహేశ్వరరెడ్డి, కనిగిరి ఫారెస్ట్ రేంజర్ -
ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
● ఎస్పీ హర్షవర్ధనరాజు ఒంగోలు సిటీ: ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ వి.హర్షవర్ధనరాజు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి 116 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ హర్షవర్ధనరాజు అర్జీలను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధ్యానం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలు, సబ్‌డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఆయా పోలీస్‌స్టేషన్‌లో అధికారులు స్పందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్, ఉద్యోగ మోసాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సీ, ఎస్టీసెల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఒంగోలు వన్‌టౌన్ సీఐ నాగరాజు, దర్శి సీఐ రామారావు, కనిగిరి సీఐ ఖాజావలి, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల నిరసన గళం
ఒంగోలు సబర్బన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా సోమవారం ఒంగోలు నగరంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అన్ని యూనియన్లకు చెందిన విద్యుత్ ఉద్యోగులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రామ్ నగర్‌లోని విద్యుత్ భవన్ నుంచి జిల్లా పరిపాలనా కేంద్రం కలెక్టరేట్ వరకు విద్యుత్ ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీసీపీడీసీఎల్ డిస్కం జేఏసీ చైర్మన్ రాచగర్ల సంజీవరావు, ఏపీసీపీడీసీఎల్ కన్వీనర్ బి.సురేశ్, ప్రకాశం జిల్లా జేఏసీ చైర్మన్ సీహెచ్.హరికృష్ణ, కన్వీనర్ కేవీ రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ భవన్ వద్ద యూనియన్ నాయకులు, ఏపీసీపీడీసీఎల్ డిస్కం జేఏసీ చైర్మన్ రాచగర్ల సంజీవ రావు మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో అమలులో ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం స్కేల్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ స్కేలు గరిష్ట పరిమితితో నిమిత్తం లేకుండా వార్షిక, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. అర్హులైన ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్ ఖాళీల్లో నియమించాలని కోరారు. ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజినీర్లకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతిలో ఒక అవకాశం కల్పించాలని, ఫీల్డ్ విభాగంలో తగినంత సిబ్బంది లేనందున వినియోగదారుల సేవల్లో జాప్యం జరుగుతున్న కారణంగా ఎస్ఓపీ నామ్స్ పేరుతో ఉద్యోగుల నుంచి అపరాధ రుసుం మినహాయిస్తున్న విధానాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఆపాలన్నారు. 01.07.1993కు ముందు నియమితులైన ఉద్యోగులకు వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను తొలగించాలన్నారు. ఉద్యోగుల సమస్యల నివారణకు, పూర్వపు పద్ధతిలో మూడు నెలలకు ఒకసారి సర్కిల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పీఎన్సీ సమావేశాలు పునరుద్ధరించాలని కోరారు. గతంలో అంగీకరించిన విధంగా అన్ని విభాగాలలోనూ, ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అమల్లో ఉన్న పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలన్నారు. విద్యుత్ సంస్థల్లో ఉన్న అన్ని ట్రస్టులను బలోపేతంచేసి మూడు నెలలకు ఒకసారి ట్రస్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సాంకేతికపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని, సమగ్ర విచారణ జరిపిన తదుపరి మాత్రమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలన్నారు. ఏపీడీసీఎల్ కన్వీనర్ బి.సురేశ్, ప్రకాశం జిల్లా జేఏసీ చైర్మన్ సీహెచ్.హరికృష్ణ, కన్వీనర్ కేవీ రవి, డి.మనోహర్ సురేష్, రవికాంత్, ఆనందరావు, తేళ్ల జాన్సన్, అంజయ్య, చంద్రశేఖర్, జబ్బార్, బి.వెంకటేశ్వర్లు, నరసింహారావు, వాహబ్, మల్లికార్జున్, అద్దంకి సురేష్, చీరాల మనోహర్, చుక్క రవి, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సెక్రటరీ వెంకట్రావు, బాలాజీ, తదితర నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. చర్చి సెంటర్లో నిరసన తెలుపుతున్న విద్యుత్ ఉద్యోగులు -
ప్రభుత్వ వైద్యశాల చైర్మన్‌ను పక్కన పెట్టి...
యర్రగొండపాలెం: ప్రభుత్వ వైద్యశాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను సిబ్బంది పక్కనపెట్టి ఎటువంటి హోదాలేని కూటమి నాయకుడితో ప్రారంభోత్సవం చేయించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఆ నాయకుడు నిస్సిగ్గుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా వైద్యశాలలో కంటి సేవా సెంటర్‌ను కూటమి నాయకుడు గూడూరి ఎరిక్షన్ బాబుతో ప్రారంభోత్సవం చేయించారు. ఆ వైద్యశాలకు ఎమ్మెల్యే చైర్మన్ అయినప్పటికీ కూటమి నాయకుడి సలహా మేరకు ఆయనకు ఆహ్వానం పంపలేదని తెలిసింది. అధికారం ఉందని పచ్చనేతలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వైద్యశాల సిబ్బంది భయంతోనే టీడీపీ నాయకులను ఆహ్వానించాల్సి వచ్చిందని పలువురు తెలిపారు. ఇటువంటి పరిస్థితి అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో చోటు చేసుకుందని ప్రజలు విమర్శిస్తున్నారు. -
వెల్లువెత్తిన ఫిర్యాదులు
ఒంగోలు సబర్బన్: ప్రకాశం భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. కలెక్టర్ పి.రాజాబాబు వినతిపత్రాలు స్వీకరించారు. బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం విద్యాశాఖ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఇటీవల సస్పెండ్ అయిన సింగరాయకొండ మండల ఊళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పిల్లి హజరత్తయ్యపై పోక్సో కేసు పెట్టాలని డీఈఓ ఆదేశాలు జారీ చేసినా ఆ టీచర్‌కు ఓ కార్పొరేషన్ చైర్మన్ అండగా ఉండటంతో ఇంత వరకు కేసు నమోదు చేయలేదన్నారు. హజరత్తయ్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన డిప్యూటీ ఈఓ చంద్రమౌళీశ్వరరావు నుంచి ఎస్సై ఫిర్యాదు తీసుకోలేదని తెలిపారు. -
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
ఒంగోలు సబర్బన్: కలెక్టర్ పీ రాజాబాబును ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సోమవారం కలెక్టర్ ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్క అందజేశారు. అనంతరం ఇద్దరు జిల్లాలోని పరిస్థితుల గురించి కొంతసేపు చర్చించుకున్నారు. ● లేకుంటే రూ.3 వేల బోనస్ ఇవ్వాలి ● ఉప్పుగుండూరులో శనగ రైతుల సమావేశం నాగులుప్పలపాడు: జిల్లాలో రైతుల వద్ద నిల్వ ఉన్న శనగలను క్వింటా రూ.10 వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేకుంటే రూ.3 వేల బోనస్ ఇవ్వాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జే జయంతిబాబు, కిసాన్ సంయుక్త మోర్చ నాయకుడు హనుమారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ఉప్పుగుండూరు మార్కెట్ యార్డ్ లో కిసాన్ సంయుక్త మోర్చ ఆధ్వర్యంలో సోమవారం శనగ రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతిబాబు, హనుమారెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా శనగపంట సాగుచేశారని, గత రెండు సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి పండించిన శనగ పంటను కోల్డ్ స్టోరేజ్ ల్లో నిల్వచేశారని చెప్పారు. విత్తనం వేసేటప్పుడు క్వింటా రూ.10 వేలు ఉన్న శనగ రేట్లు ఒక్కసారిగా రూ.5 వేలకు దిగజారడంతో రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్నారన్నారు. ఒక పక్క తెగుళ్లు, మరోపక్క రేట్లు దిగజారడంతో రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజ్ ల్లో నిల్వ ఉన్న శనగలను క్వింటా రూ.10 వేలకు కొనాలని, లేదా రూ.3 వేలు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని తీర్మానించారు. కార్యక్రమంలో రైతుసంఘం మండల అధ్యక్షుడు టీ శ్రీకాంత్, జీ బసవపున్నయ్య, చెరుకూరి వాసు, గాదె నాగేశ్వరరావు, వివిధ గ్రామాల శనగ రైతులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులపై దృష్టి
● ఎస్పీ హర్షవర్ధనరాజు పామూరు: పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అన్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌ను సోమవారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులపై చర్చించారు. రాత్రిళ్లు గస్తీ, ట్రాఫిక్, ఇతర కేసుల వివరాలపై ఎస్సైతో చర్చించారు. సమస్యలపై స్టేషన్‌కు వచ్చేవారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులను సత్వరం పరిశీలించి న్యాయంచేయాలని ఆదేశించారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ ముమ్మరంచేయాలని, సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, పామూరు ఎస్సై టి.కిషోర్‌బాబు ఉన్నారు. పొన్నలూరు: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల పట్ల పారదర్శకంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలు, రికార్డులను తనిఖీ చేసి పలు అంశాలపై పోలీసులకు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతలపై, నేర నివారణ వ్యూహాలపై నిత్యం సమీక్ష చేసుకోవాలన్నారు. బెల్ట్ షాపులు, పేకాటపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. నేర ప్రవర్తన కలిగిన వారి కదిలికలపై ప్రత్యేక నిఘా ఉంచి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పీసీపల్లి: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దొంగతనాలు నివారించేందుకు సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రోన్ కెమెరాలతో కోడిపందేలు, పేకాటపై నిఘా ఉంచాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్సై కోటయ్య ఉన్నారు. -
లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం
టంగుటూరు: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తూర్పు నాయుడుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు... మండలంలోని ఆలకూరపాడు పంచాయతీ పరిధిలోని పుల్లారెడ్డిపాలెంకు చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు(51), టంగుటూరు పంచాయతీ పరిధిలోని వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చొప్పర శీను(43) ఇద్దరూ మోటార్ సైకిల్‌పై టంగుటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా తూర్పునాయుడుపాలెంలో ఫ్లైఓవర్ దిగే క్రమంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సింగరాయకొండ సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సై నాగమల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్సులో ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులిద్దరూ రైతులే. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్దరూ రైతులే.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరూ రైతులే. బొడ్డు వెంకటేశ్వర్లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర్లుకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు వివాహం కాగా కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. చొప్పను శ్రీను ట్రాక్టర్ తోలుకుంటూ జీవనం సాగిస్తుండగా ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. రెండు కుటుంబాల్లో ఇంటి పెద్దలు మృతి చెందడంతో తీవ్ర శోకంలో మునిగిపోయాయి. -
ఉచిత ఇసుక ఎక్కడ..?
● సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం నేతల ధర్నా మార్కాపురం: మార్కాపురం పట్టణంలో ఉచిత ఇసుక అమలు కావడం లేదని సీపీఎం నేతలు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు రఫీ, సోమయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత ఇసుక హామీ ఏమైందని ప్రశ్నించారు. టన్ను రూ.900లకే లారీ యజమానులు ఇస్తామని చెబుతుంటే, వారిని బెదిరించి కూటమి నాయకులు టన్ను రూ.1350 చొప్పున అమ్ముతుంటే మార్కాపురం ప్రజలకు ఉచిత ఇసుక దక్కేనా అని ప్రశ్నించారు. చిన్న చిన్న గృహ అవసరాలకు, మరమ్మతులకు కూడా ఇసుక అందని ద్రాక్షలా మారిందన్నారు. ఽఇసుక దందాను అరికట్టి ప్రజలకు అందుబాటులో ఇసుకధరలను అందుబాటులో ఉంచి భవన నిర్మాణ కూలీలను, భవన నిర్మాణ యజమానులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం వినతిపత్రం ఇచ్చారు. ఒంగోలు: పురుషుల, సబ్ జూనియర్స్ బాల బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక ఈనెల 26న టంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఏపీ సాఫ్ట్‌బాల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరశింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2011 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే సబ్ జూనియర్స్ ఎంపికకు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువపత్రం, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలని నరశింహారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు పేర్ని తిరుపతి స్వామి సెల్: 9949564264, త్రినాథ్‌బాబు సెల్: 9398479248 ను సంప్రదించాలన్నారు. యర్రగొండపాలెం: భార్య చికెన్ వండలేదని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నావని ఇళ్ల లక్ష్మినారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. ఆదివారం కావడంతో చికెన్ తినాలని ఉందని చెప్పినా ఆమె చికెన్ వండకపోవడంతో లక్ష్మినారాయణ తీవ్రమనస్థానికి గురై పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యర్రగొండపాలెం: పురుగుమందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని పాలుట్ల గిరిజన గూడెంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు..దేశావత్ అంజలీబాయి(16)అనే బాలిక తన తమ్ముడు మంత్రూనాయక్ను బావి వద్దకు వెళ్లి నీళ్లు తీసుకురమ్మని చెప్పగా..అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన అంజలీబాయి అలిగి పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి మంగ్లీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
టిప్పర్ కిందపడి యువకుడు మృతి
కొనకనమిట్ల: కంకర లోడుతో వస్తున్న టిప్పర్ కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గొట్లగట్టు బస్టాండ్ సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని గొట్లగట్టు గ్రామానికి చెందిన పొదిలి తిరుపతయ్య కుమారుడు శ్రీనివాసులు(28) ద్విచక్రవాహనంపై బస్టాండ్ నుంచి వస్తున్నాడు. అదే సమయంలో చీమకుర్తి నుంచి కంకరలోడుతో టిప్పర్ లారీ వస్తుండగా..శ్రీనివాసులు టిప్పర్ పక్కగా వెళుతూ ప్రమాదవశాత్తు కిందపడగా టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. మృతునికి భార్య లక్ష్మి, మూడేళ్ల పాప, 15 రోజుల పాప ఉన్నారు. 15 రోజుల క్రితమే శ్రీనివాసులు భార్య లక్ష్మి రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చి పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల్లో శ్రీనివాసులు తన భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్ల దగ్గరుకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిందని శ్రీనివాసులు తండ్రి తిరుపతయ్య, బంధువులు బోరున విలపించిన తీరు స్థానికులు కంటతడి పెట్టారు. సమాచారం అందుకున్న ఇన్చార్జి ఎస్సై వేమన, ఏఎస్సై ముల్లా మహమ్మద్‌లు సంఘటనా స్థలానికి వచ్చి ప్రమాదానికి కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాసులు మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కుల సాధన
ఒంగోలు సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అంగన్వాడీలు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు పిలుపునిచ్చారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం ఒంగోలు కొత్త మార్కెట్ సెంటర్ వద్ద రాష్ట్ర అధ్యక్షురాలు జీ బేబి రాణి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి సింధు మాట్లాడుతూ దేశంలో 80 శాతం ప్రజలకు పోషకాహారం అందడం లేదన్నారు. 70 శాతం మంది మహిళలు రక్తహీనతతో ఉన్నారని, దేశంలో ప్రతి రోజూ పౌష్టికాహార లోపంతో వేలాది మంది పసికందులు మృత్యువాత పడుతున్నారన్నారు. గౌరవ వేతనంతోనే పేదలకు పోషకాహారం అందిస్తూ సామాజిక బాధ్యతగా సేవ చేస్తున్న అంగన్వాడీలకు కనీస వేతనంతో పాటు తగిన గౌరవం దక్కాలంటే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాల అమలులో ఒక్కో రాష్ట్రం ఒక తీరుగా చెల్లిస్తున్నారని, గుజరాత్లో కార్యకర్తలు రూ.24,800, హెల్పర్లకు రూ.20 వేల వేతనాన్ని కోర్టు ద్వారా సాధించిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రతి వ్యక్తికి పోషకాహారం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌లో, మిడ్ డే మీల్ లో, రేషన్ లో కోత విధిస్తున్నట్లు దుయ్యబట్టారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ నెలలో కేంద్ర మంత్రుల నివాసాల వద్ద పది రోజులు పాటు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎస్మా వంటి నిర్బంధాలు ఎదిరించి ఎన్నో విజయాలు సాధించిన ఉద్యమ స్ఫూర్తితో అంగన్వాడీలు స్కీమ్ వర్కర్స్, ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. -
మహిళా సాధికారత చేతల్లో చూపాలి
పొదిలి: మహిళా సాధికారిత గురించి పాలకులు మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మహిళా ఉపాధ్యాయ జిల్లా చైతన్య సదస్సు నిర్వహించారు. సహాధ్యక్షురాలు జి.ఉమామహేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ జండాను డి.గురవమ్మ, యూటీఎఫ్ జండాను రాజసులోచన, ఉమామహేశ్వరి ఆవిష్కరించి జండా వందనం చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యకర్తలు పాఠశాలల్లో కుల, మత, ప్రాంత, లింగ బేధం చూడకుండా బోధించాలన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తోందని ఉపాధ్యాయులకు నెలనెలా జీతం తప్ప ఏమీ ఇవ్వటం లేదన్నారు. 11వ పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు మంజూరు చేయలేదన్నారు. ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్మును, రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం రూ.30 వేల కోట్లు ఉన్నాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువగా ఉన్నాయని, దీంతో బడులకు వచ్చే బడుగు, బలహీన వర్గాల పిల్లలకు బోధించే అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. ముందుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా, తాలూకా నాయకులు అబ్దుల్‌హై, బాల వెంకటేశ్వర్లు, ఎస్.రవి, ఐవీ.రామిరెడ్డి, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
నేటి నుంచి దసరా నవరాత్రులు
త్రిపురాంతకం: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం త్రిపురాంతకంలో బాలాత్రిపురసుందరీదేవి, పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక నవరాత్రి పూజా కార్యక్రమాలు వేదపండితుల మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించనున్నారు. నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ గురువారం వరకు దసరా నవరాత్రులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం మంగళ వాయిద్యాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారికి అభిషేకం, కాలపూజ, బాలభోగం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్వికరణం, పంచగవ్యప్రాసన, అఖండ స్థాపన, మండపారాధన, అష్టధిక్పాలకులకు పూజ, సప్తశతీపారాయణం, చండీహోమం ప్రత్యేక పూజలను వేదపండితులు నిర్వహించనున్నారు. ప్రతిరోజు దంపతులచే కుంకుమార్చనలు, ఉభయ దాతల పూజలు, గోపూజ, బాలపూజ, మహానివేదన, ఉభయదాతల ఆశీర్వచనం, ప్రత్యేక పూజలు భక్తులచే నిర్వహించనున్నారు. 22 సోమవారం నవరాత్రి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అదే విధంగా 29 సప్తమి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి పూజ, అక్షరాభ్యాసాలు, 30న దుర్గాష్టమి, మహర్నవమి ప్రత్యేక పూజలు, అక్టోబర్ 1వ తేదీ బుధవారం మహర్నవమి రోజున సుహాసిని పూజ, దంపతుల పూజలు, 2వ తేదీ గురువారం విజయదశమి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి సందర్భంగా కుంభం, బలిహరణ, కూష్మాండదుర్గ, కలశ ఉద్వాసన సంప్రోక్షణ, భక్తులకు ఆశీర్వచనం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ప్రత్యేక అలంకారం..వాహన సేవలు: ● 22 సోమవారం బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం పల్లకీసేవ, రాత్రి పద్మవాహనంపై అమ్మవారు ఉత్సవం నిర్వహించనున్నారు. ● 23వ తేదీ బ్రహ్మచారిణి అలంకారంలో హంసవాహన సేవ, 24న చంద్రఘంట వ్యాఘ్ర వాహనసేవ, 25న కూష్మాండదుర్గ అలంకారంలో శేషవాహనసేవ, 26న శైలిపుత్రి అలంకారంలో వాహనసేవ, 27న స్కందమాత అలంకారంలో మయూర వాహనసేవ, 28న కాత్యాయని అలంకారంలో సింహ వాహనసేవ, 29న కాళరాత్రి అలంకారంలో గజవాహన సేవ, 30న మహాదుర్గ అలంకారంలో నంది వాహన సేవ, అక్టోబర్ 1న సిద్ధిదాయిని అలంకారంలో అశ్వవాహన సేవ, 2న రాజరాజేశ్వరి దేవి అలంకారంలో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ● త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయం వద్ద శమీపూజ, పారువేట కార్యక్రమం గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఆలయాల వద్ద దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
జిల్లాను త్వరగా ఏర్పాటు చేయాలి
మార్కాపురం కేంద్రంగా త్వరగా జిల్లాను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలి. నాడు ప్రతిపక్ష నాయకులుగా ప్రస్తుత కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో మార్కాపురం వచ్చినప్పుడు మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పారు. కార్యరూపం దాల్చి నిర్ణీత సమయాన్ని ప్రకటించి త్వరగా జిల్లా ఏర్పాటు చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం పుల్లలచెరువు నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాలంటే సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో యర్రగొండపాలెం, పుల్లలచెరువు, గిద్దలూరు, అర్ధవీడు, దోర్నాల మండలాల ప్రజలు వివిధ పనుల కోసం ఒంగోలుకు వెళ్లాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. – డీ సోమయ్య, సీపీఎం జిల్లా నాయకులు -
శీతకన్ను!
పశ్చిమంపైజిల్లాలోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. గత ప్రభుత్వంలో వడివడిగా సాగిన మెడికల్ కాలేజీ, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాలు కూటమి ప్రభుత్వం వచ్చాక నిలిచిపోగా.. మరే ఇతర అభివృద్ధి పనుల ఊసే లేకుండా పోయింది. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. పశ్చిమ ప్రకాశంపై కూటమి ప్రభుత్వ వివక్షపై జనం మండిపడుతున్నారు. మార్కాపురం: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా జిల్లాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎన్నికల హామీలు ఇంతవరకూ అమలుకాలేదు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను కూడా నిలిపివేయడంపై ప్రజల్లో కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మార్కాపురం మండలం రాయవరం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ, మూడు జిల్లాల్లో శాశ్వతంగా కరువును నివారించే వెలుగొండ ప్రాజెక్టు పనులు, మార్కాపురం పట్టణంలో షాదీఖానా నిర్మాణం, బీసీ భవన్, పొదిలి పెద్దచెరువు తదితర పనులన్నీ ఆగిపోయాయి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతామని ప్రకటించడంపై ఈ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక వెలుగొండ ప్రాజెక్టుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.309.13 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇలా కీలకమైన అభివృద్ధి పనులన్నీ నిలిచిపోగా కొన్ని మాత్రం నత్తనడకతో పోటీపడుతున్నాయి. ఎప్పుడు పూర్తవుతాయో ? ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మార్కాపురం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇక జిల్లా ఏర్పాటుపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ప్రకటనలు అయితే ఇస్తున్నారు కానీ కార్యరూపం దాల్చడంలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి ప్రొఫెసర్లను నియమించారు. పెద్దదోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంజూరు చేశారు. పొదిలి పెద్దచెరువు నిర్మాణానికి రూ.50 కోట్లు ఇచ్చారు. మెడికల్ కళాశాల కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిలిచిపోయింది. జిల్లా వైద్యశాల నుంచి జీజీహెచ్‌గా మారి అత్యున్నతమైన కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా పేద ప్రజలకు అందించే హాస్పిటల్‌కు నేడు రోగులు కరువయ్యారు. కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజీని అర్ధాంతరంగా ఆపడంతో పాటు పీపీపీ విధానంలో చేస్తామంటూ చేసిన ప్రకటన కూడా వాస్తవరూపం దాల్చలేదు. జిల్లా ఏర్పాటు ప్రకటనలకే పరిమితం: గత ఎన్నికలకు ముందు మార్కాపురాన్ని జిల్లాగా చేసి సీఎంగా మార్కాపురం వస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు హామీ నెరవేర్చకుండానే మార్చి 8న మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరయ్యారు. అప్పుడు కూడా ప్రజలు అడిగిన ప్రశ్నలకు కచ్చితంగా జిల్లా చేస్తానని హామీ ఇచ్చాడు కానీ ఎప్పట్లోగా చేస్తానని మాత్రం ప్రకటించలేదు. ఇటీవల కాలంలో జిల్లా ఏర్పాటుపై ప్రకటనలు మాత్రం అధికారపార్టీల నుంచి వస్తున్నాయే తప్ప ఆచరణలో కనిపించడం లేదు. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. 4 నియోజకవర్గాల్లోని 20 మండలాలకు చెందిన 10 లక్షల మంది ప్రజల అభివృద్ధికి జిల్లా ఏర్పాటు ఉపయోగపడుతుంది. క్షేత్ర స్ధాయిలో అభివృద్ధి పనులను అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాల ప్రత్యేక నిధులు వస్తాయి. కలెక్టర్, ఎస్పీ, అగ్రికల్చర్, హార్టీకల్చర్, జేడీలు, వైద్యశాఖ డీఎంహెచ్ఓ, ఇతర సంక్షేమశాఖల ఈడీలు ఇక్కడే ఉండి అభివృద్ధిని పర్యవేక్షించే అవకాశం ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా మార్కాపురానికి వస్తుంది. వెలుగొండ ఎప్పటికి పూర్తవుతుందో ? నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు తాను అధికారంలోకి రాగానే వెలుగొండను పూర్తిచేస్తానని చెప్పి బడ్జెట్లో రూ.309.13 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. ముంపు గ్రామాల ప్రజల ఆర్ఆర్ ప్యాకేజీల కోసం కనీసం రూ.1200 కోట్లు కేటాయించాలి. ప్రభుత్వం కేటాయించిన నిధులు సిబ్బంది జీతభత్యాలకు, అరకొర పనులకు మాత్రమే ఉపయోగపడతాయి. మరోవైపు ప్రాజెక్టును 2026కు పూర్తిచేస్తామని చెబుతున్నా నిధుల కేటాయింపు జరగకపోవడంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
మెడికల్ కాలేజీని, వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలి
మార్కాపురం మండలం రాయవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. అప్పుడే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లో శాశ్వతంగా కరువును నివారించే వెలుగొండ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేయాలి. అప్పుడే ఈ ప్రాంతంలో కరువు పోతుంది. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. పునరావాస కాలనీల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి. వెలుగొండ నీటిని ప్రతి ఇంటికి అందించాలి. బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించాలి. – బీ బాలకృష్ణారెడ్డి, ౖవెఎస్సార్ సీపీ యూత్ నేత -
గురజాడ, బోయి భీమన్నకు ఘన నివాళులు
ఒంగోలు మెట్రో: సా్థనిక మంగమూరు రోడ్డులోని శివాజీ నగర్ రెండో వీధిలో ఉన్న రాజ్యలక్ష్మి నిలయంలో కళామిత్రమండలి (తెలుగు లోగిలి) సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహాకవి గురజాడ అప్పారావు 163వ జయంతి, బోయి భీమన్న 114 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు డా.నూనె అంకమ్మరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. జాతీయ భావాలను గుండె నిండా నింపుకున్న నవ్యమార్గ నిర్దేశకులు, సాంఘిక దురాచారాలు, కులవ్యవస్థను చీల్చిచెండాడుతూ మానవతా వాదానికి పెద్దపీట వేసిన దార్శనికులు గురజాడ, బోయి భీమన్న అని కొనియాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ప్రసంగిస్తూ కాలంతో పాటు కదులుతూ జీవితాన్ని, సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ భాషలోనూ, భావంలోనూ విప్లవాన్ని తమ రచనల్లో ప్రతిపాదించిన గొప్ప సంఘసంస్కర్తలు, ఆధునిక సాహిత్య భాస్కరులు గురజాడ, బోయి భీమన్న అని అన్నారు. ముత్యాల సరాల సృష్టికర్త, కొత్త జాడల వెలుగు జాడ గురజాడ అని శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు తెలిపారు. సంస్థ ప్రధాన కార్యదర్శి సింహాద్రి జ్యోతిర్మయి, జంగం రాజశేఖర్, తేళ్ల అరుణ, యు.వి.రత్నం, కేఎస్వీ ప్రసాద్, గుంటూరు సత్యనారాయణ, బీరం అరుణ, నాళం నరసమ్మ తదితరులు పాల్గొని గురజాడ, బోయి భీమన్నలకు నివాళులర్పించారు. గొప్ప సంఘ సంస్కర్త గురజాడ జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయప్రకాష్ ఒంగోలు సిటీ: కన్యాశుల్కం, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలను మహాకవి గురజాడ అప్పారావు తీవ్రంగా వ్యతిరేకించారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ జయప్రకాష్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సాయిరాం బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం గురజాడ 164వ జయంతి ఉత్సవం నిర్వహించారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ మాట్లాడుతూ శ్రీమతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగునుశ్రీ అని ప్రకటించిన సత్యశోధకుడు గురజాడ అన్నారు. గురజాడ రాసిన దేశభక్తి కవిత అర్థవంతమైందనీ, నేటి పరిస్థితులకు చక్కగా సరిపోతుందని, విద్యార్థులు ప్రతి ఒక్కరూ గేయాన్ని చదివి అర్థం చేసుకోవాలని కోరారు. మహాకవి గురజాడ జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. జేవీవీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్టీ వెంకటేష్ మాట్లాడుతూ జేవీవీ ఆధ్వర్యంలో దేశభక్తి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పాటలు, డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 12న పోటీలు నిర్వహించి విజేతయలకు బహుమతులు అందజేస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపల్ రాఘవ, సీనియర్ లెక్చరర్స్ ఫణింద్ర, అంజిరెడ్డి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
పొంగిపొర్లి
దంచికొట్టి.. యర్రబాలెం బ్రిడ్జిపై నుంచి పారుతున్న గుండ్లకమ్మ వాగు ఎల్లయ్య నగర్ వద్ద ఒంగోలు కర్నూలు రహదారిపై పారుతున్న వర్షం నీరు కొండపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద సగిలేరువాగు దర్శి: ఆర్టీసీ బస్టాండ్ ముందు భారీగా నిలిచిన వర్షం నీరు సాక్షి నెట్వర్క్: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం భానుడు ఉగ్రరూపం దాలుస్తుండగా సాయంత్రానికల్లా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లూరు: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దోసకాయలపాడు, విఠలాపురం, మల్కాపురం, తాళ్లూరు గ్రామాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విఠలాపురం–తాళ్లూరు బ్రిడ్జిపై నీళ్లు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే దోసకాయల పాడు–తోట వెంగన్నపాలెం గ్రామంలోని బ్రిడ్జిపై వర్షం నీరు ప్రవహించడంతో పాటు రోడ్లు కోతకు గురవడంతో గ్రామస్తుల రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ పరవళ్లు.. రాచర్ల: నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గుండ్లకమ్మవాగు పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. చోళ్లవీడు గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద గుండ్లకమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అకవీడు, చోళ్లవీడు, చినగానిపల్లె పంచాయతీల్లోని తురకవానిచెరువు, దొడ్డేని చెరువు, రంగయ్యనాయుడు చెరువులకు గుండ్లకమ్మ వరద నీటితో కళకళలాడుతున్నాయి, చినగానిపల్లెలో రంగయ్యనాయుడు చెరువు అలుగు పారుతుండటంతో పంటకాలువలు, సైడుకాలువలు మరమ్మతులకు గురికావడంతో గ్రామం నుంచి మోకాలి లోతులో నీరు ప్రవహిస్తున్నాయి. అర్ధవీడు: నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని జంపలేరు వాగు పొంగడంతో పాపినేనిపల్లె నుంచి బొల్లుపల్లి, అచ్చెంపేట గ్రామాలకు వాహనరాకపోకలు స్తంభింఛాయి. దీంతో కంభం, గిద్దలూరు, ఒంగోలు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రానికి వాగు ప్రవాహం తగ్గడంతో రాకపోకలు కొనసాగాయి. దర్శి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఎక్కడడికక్కడ నిలిచిపోయింది. బస్టాండ్ ఆవరణలో భారీగా నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక వెలవారి బజారులో భారీగా వర్షం నీరు నిలిచి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడతున్నారు. కంభం చెరువుకు జలకళ కంభం: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుండ్లకమ్మ, జంపలేరు వాగులు ఉధృతంగా పారుతుండటంతో కంభం చెరువుకు వరదనీరు వచ్చి చేరుతోంది. తురిమెళ్ల వద్ద వాగు ఉధృతంగా పారుతోంది. యర్రబాలెం వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి వాగు పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం నుంచి వాగు ఉధృతిగా ఎక్కువగా ఉంది. ఇప్పటికే కంభం చెరువులో సుమారు 9 అడుగుల మేర నీరు ఉండగా గుండ్లకమ్మ, జంపలేరు వాగులు ఉధృతంగా కంభం చెరువు వైపుకు పారుతుండటంతో చెరువు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. కంభం చెరువుకు నీరు చేరుతుండటంతో ప్రజలు భారీగా తరలివచ్చి తిలకిస్తున్నారు. ముండ్లమూరు(దర్శి): ముండ్లమూరులో వేంపాడు వద్ద చిలకలేరు, ఈదరవాగు, వేములవాగు పొంగి పొర్లుతున్నాయి. వాగు ఉధృతితో రాకపోకలకు అంతరాయం కలిగింది. చీమకుర్తి రూరల్: మండలంలో మర్రిచెట్లపాలెంలో ఆదివారం సాయంత్రం గంటకుపైగా భారీవర్షం కురిసింది. ఎల్లయ్య నగర్ నుంచి మర్రిచెట్లపాలెం వరకు రహదారిపై నీళ్లు పారుతూ జలమయమై ఒంగోలు – కర్నూలు రహదారి సాగర్ కాలువలను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉప్పొంగిన సగిలేరు వాగు గిద్దలూరు రూరల్: గత శనివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా మండలంలోని సగిలేరు వాగు ఉప్పొంగింది. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో దిగువమెట్ట గ్రామ సమీపంలో సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. భీమలింగేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి ప్రతాప్‌రెడ్డి కాలనీకి వెళ్లే రోడ్డు వాగు పొంగడంతో రోడ్డు నీటమునిగింది. స్థానికులు వాగు దాటకుండా పోలీసులు అప్రమత్తం చేశారు. కొండపేట సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం మీదుగా సగిలేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో జగనన్న కాలనీకి వెళ్లేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల మద్దిపాడు: మండలంలోని మల్లవరం వద్ద ఉన్న కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం నుంచి ఆదివారం 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు రిజర్వాయర్ ఏఈ రామాంజనేయులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రెండు రోజులుగా గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాలుగు గేట్లను 0.5 అడుగులు ఎత్తి పది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లోకి 7 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో 24 మీటర్ల వద్ద నీటిని నిలుపుదల చేస్తున్నారు. అదనంగా వస్తున్న నీటిని గుండ్లకమ్మ నదిలోకి విడుదల చేస్తున్నారు. పైనుంచి వచ్చే వరద నీటినిబట్టి కిందకు నీటి విడుదల పరిమాణాన్ని పెంచడం, తగ్గించడం చేస్తామని ఏఈ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఉదయం ఎండ..సాయంత్రం వర్షం నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు పశ్చిమ ప్రకాశంలో అధిక వర్షపాతం -
ఏకల్ విద్యాలయాలతో విద్యార్థుల్లో దేశభక్తి
త్రిపురాంతకం: ఏకల్ అభియాన్ విద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలు పెంపొందిస్తున్నట్లు ఏకల్ విద్యాలయాల జిల్లా అధ్యక్షుడు డీ రాములు పేర్కొన్నారు. త్రిపురాంతకంలో ఏకల్ అభియాన్ విద్యాలయాల రాయలసీమ జిల్లాల కో ఆర్డినేటర్ల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకల్ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 95 వేల గ్రామాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రెండు లక్షల గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా విద్యార్థుల్లో విద్యతో పాటు, దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ విలువలు వంటి వాటిపై చిన్ననాటి నుంచి శిక్షణ ఇస్తారని చెప్పారు. రాయలసీమ జిల్లాలకు చెందిన 60 మంది వారం రోజుల పాటు శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీపీ కృష్ణారావు, ఇన్చార్జి ఎం హనుమంతు, రాయలసీమ ఇన్చార్జి మల్లికార్జున్, ప్రకాశం జిల్లా ఇన్చార్జిలు వెంకటేశ్వర్లు నాయక్, సూర్యనారాయణ, సుబ్బారావు, హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిపురాంతకంలో శోభాయాత్ర నిర్వహించారు. -
రెండు రోజుల్లో విదేశాలకు..అంతలోనే
కనిగిరిరూరల్: రెండు రోజుల్లో ఆస్ట్రేలియాకు బయల్దేరాల్సిన యువకుడు.. మృత్యువడికి చేరిన దుర్ఘటన కనిగిరిలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళి.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన ముక్కు సుధీర్‌రెడ్డి(34) ఆస్ట్రేలియాలో పదేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సుధీర్‌రెడ్డి తాత దేవిరెడ్డి వెలుగొండారెడ్డి మృతి చెందడంతో కనిగిరికి వచ్చి నెల రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లి తిరిగి బైక్‌పై కనిగిరి పట్టణంలోకి వస్తుండగా పామూరు రోడ్డులోని కొత్తూరు సమీపంలోని మిల్లు దగ్గర కుక్క అడ్డం రావడంతో తప్పించే క్రమంలో బైక్ పైనుంచి జారి కింద పడ్డాడు. ప్రమాదంలో సుధీర్‌రెడ్డికి తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. క్షతగాత్రున్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సుధీర్ రెడ్డి(34), విశ్రాంత టీచర్ ముక్కు నాసరెడ్డి, లతిత కుమారి( టీచర్) దంపతుల పెద్ద కుమారుడు. వీరి స్వగ్రామం హనుమంతునిపాడు మండలం తాటిచెట్లవారిపల్లి. సుమారు 30 ఏళ్ల నుంచి కనిగిరిలో నివాసముంటున్నారు. సుధీర్‌రెడ్డి భౌతికకాయానికి దద్దాల నివాళి.. బైక్ ప్రమాదంలో మృతి చెందిన ముక్కు సుధీర్ రెడ్డి భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం రాత్రి సందర్శించి, నివాళులర్పించారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, మాజీ ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, గాయం ఈశ్వరమ్మ, పులి శ్రీను, యక్కంటి శ్రీను, సానికొమ్ము మధుసూదన్ రెడ్డి, జి.ఆదినారాయణరెడ్డి, గుంటక వెంకట రమణారెడ్డి, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, సైకం ఏడుకొండలరెడ్డి ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి తాత మరణంతో నెల రోజుల క్రితం స్వదేశానికి