breaking news
OTT
-
ఓటీటీలోకి వచ్చేసిన ‘మయసభ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘మయసభ’ ఓటీటీలోకి వచ్చేసింది. ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నేటి(ఆగస్ట్ 7) నుంచి ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని తెరెక్కించారు. తొమ్మిది ఎపిసోడ్ల సిరీస్ ఇది. కొన్ని ఎపిసోడ్లు దాదాపు 30 నిమిషాల నిడివితో రూపొందగా మరికొన్ని 50 నిమిషాల రన్టైమ్తో తెరకెక్కాయి. ఇందులో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు, ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా నటించారు. జీవితంలో ఏదో సాధించాలి, ప్రజలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఇద్దరు స్నేహితుల దారులు ఎలా మారాయి? చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారే.. రాజకీయ గమనంలో ప్రత్యర్థులుగా ఎలా మారారు. ఇద్దరి గొప్ప స్నేహితుల మధ్య ఉండే స్నేహం, మానసిక సంఘర్షణ.. పొలిటికల్ జర్నీలో వారు ఎదుర్కొన పరిస్థితులను భావోద్వేగంగా ఆవిష్కరించిన వెబ్ సిరీస్ ‘మయసభ’. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు -
ఓటీటీలో హారర్ వెబ్ సిరీస్.. ఎప్పటినుంచంటే?
హారర్ సినిమాలకు క్రేజ్ ఎప్పుడూ ఉండేదే! తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ హారర్ వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. అదే "అంధేరా" (Andhera). ఈ వెబ్ సిరీస్‌ను ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అంధేరా విషయానికి వస్తే.. ప్రియా బాపత్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్త కోలి, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. గౌరవ్ దేశాయ్ కథ అందించగా రాఘవ్ దర్ దర్శకత్వం వహించాడు. ఇది ఎనిమిది ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. Brace yourself, this Andhera doesn’t just haunt, it hunts 🫣#AndheraOnPrime, New Series, Aug 14 pic.twitter.com/vg5IAB3TgX— prime video IN (@PrimeVideoIN) August 6, 2025 చదవండి: 'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్ -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన 'జురాసిక్' సినిమా
హాలీవుడ్లో డైనోసార్లు ఉండే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా జురాసిక్ పార్క్ పేరుతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఆ జానర్లో తీసిన ఓ చిత్రం రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చింది. ఓకే పర్లేదు అనిపించుకునే టాక్ తెచ్చుకుంది. మన దేశంలోనూ ప్రేక్షకులు మూవీని చూశారు. ఇప్పుడు ఈ చిత్రం సరిగ్గా నెల రోజులు అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్'. స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్ చేయగా, గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన 'జురాసిక్ వరల్డ్: డొమినియన్'కు సీక్వెల్‌గా తీసిన చిత్రం ఇది. అయితే అది ఆకట్టుకోలేకపోయింది. ఇది కూడా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది. దీంతో నెలరోజులు తిరగకుండానే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో వీడియో ఆన్ డిమాండ్(అద్దె విధానంలో) అందుబాటులోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు)'జురాసిక్ వరల్డ్ రీబర్త్' విషయానికొస్తే.. గుండె జబ్బులు సహా మనిషి ఎదుర్కొంటున్న ఎన్నో వ్యాధులు నయమయ్యేలా చేసే శక్తి.. మూడు అరుదైన డైనోసార్ల రక్తంతో చేసిన ఔషదానికి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. కానీ బతికున్న వాటి నుంచి ఆ రక్తాన్ని సేకరిస్తేనే అది ప్రయోగానికి ఉపయోగపడుతుంది. దీంతో అడ్వెంచర్ ఆపరేషన్స్ చేసే జోరా బెన్నెట్‌తో (స్కార్లెట్ జాన్సన్) మార్టిన్ (రూపర్ట్ ఫ్రెండ్) అనే ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి ఒప్పందం చేసుకుంటాడు.ఈక్వెడార్‌లో మాత్రమే సంచరించే అరుదైన, డేంజరెస్ డైనోసార్లని గుర్తించి, వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్ హెన్రీ (జొనాథన్ బెయిలీ), బోటు యజమాని, సాహసీకుడు డంకన్ (మహర్షలా అలీ) అందరూ కలిసి ప్రయాణిస్తారు. తర్వాత ఏమైంది? డైనోసార్ల నుంచి రక్తం సేకరించారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహ' ఓటీటీ బిగ్ డీల్) -
ఓటీటీకి అనుపమ కోర్ట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ మూవీ రిలీజ్‌కు ముందే వివాదానికి దారితీసింది. సినిమా టైటిల్లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. ఆ తర్వాత జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా పేరును మార్చారు. దీంతో సెన్సార్ బోర్డ్ విడుదలకు ఓకే చెప్పింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.కోర్టు రూమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలోకి రిలీజైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే విడుదలైన ఈ సినిమా.. ఆగస్టు 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ..సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఆమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకికి న్యాయం దక్కిందా లేదా అనేదే అసలు స్టోరీ. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో బకాసుర రెస్టారెంట్, రాజుగాని సవాల్, భళారే సిత్రం లాంటి తెలుగు సినిమాలతో పాటు కన్నడలో రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'సు ఫ్రమ్ సూ' చిత్రాన్ని ఈ వీకెండే రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఈసారి తెలుగువి చాలానే ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ సినిమా)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఓహో ఎంథన్ బేబీ, పరందు పో, మామన్, నడికర్ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు అరేబియా కడలి, మోతెవరి లవ్ స్టోరీ తదితర తెలుగు వెబ్ సిరీసులు ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితో పాటు ఈ వీకెండ్లో 'జూనియర్' కూడా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 04 నుంచి 10వ తేదీ వరకు)అమెజాన్ ప్రైమ్అరేబియా కడలి (తెలుగు సిరీస్) - ఆగస్టు 08నెట్ఫ్లిక్స్ఎస్ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08మ్యారీ మీ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10హాట్స్టార్ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 04పరందు పో (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 05లవ్ హర్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07మిక్కీ 17 (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 07సలకార్ (హిందీ సిరీస్) - ఆగస్టు 08జీ5మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు సిరీస్) - ఆగస్టు 08మామన్ (తమిళ మూవీ) - ఆగస్టు 08జరన్ (మరాఠీ సినిమా) - ఆగస్టు 08సోనీ లివ్మయసభ (తెలుగు సిరీస్) - ఆగస్టు 07సన్ నెక్స్ట్హెబ్బులి కట్ (కన్నడ సినిమా) - ఆగస్టు 08ఆపిల్ ప్లస్ టీవీప్లాటోనిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06ఎమ్ఎక్స్ ప్లేయర్బిండియే కే బాహుబలి (హిందీ సిరీస్) - ఆగస్టు 08సైనా ప్లేనడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 08లయన్స్ గేట్ ప్లేప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 08బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు) -
ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ సినిమా
ఈ వీకెండ్లో దాదాపు 35కి పైగా కొత్త సినిమాలు,వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో తమ్ముడు, సితారే జమీన్ పర్, 3 బీహెచ్‌కే, ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064 ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటే రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా 'గార్డ్' కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ లీడ్ రోల్స్ చేసిన సినిమా 'గార్డ్'. జగ్గా పెద్ది దర్శకత్వం వహించారు. అనసూయ రెడ్డి నిర్మాత. ఈ ఏడాది ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ కాగా.. గత నెలలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి అత్యధిక వ్యూస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఆస్ట్రేలియాలో షూటింగ్ చేసిన హారర్ కామెడీ మూవీ ఇది. హాలీవుడ్ టెక్నీషియన్స్ పలువురు ఈ సినిమా కోసం పనిచేయడం విశేషం. 'గార్డ్' త్వరలో మరో రెండు ఓటీటీల్లోనూ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. 'గార్డ్' విషయానికొస్తే.. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే హీరో. ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంలో నిషేధిత ల్యాబ్‌లోకి అడుగుపెట్టి ఓ అమ్మాయిని రక్షిస్తాడు. అప్పటినుంచి వింత వింత సంఘటనలన్నీ జరుగుతుంటాయి. ఓ అమ్మాయి దెయ్యం రూపంలో కనిపిస్తూ అందరికీ భయపెడుతూ ఉంటుంది. మరి చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన 'బిగ్‌బాస్' ఫేమ్ గౌతమ్) -
రొమాన్స్ ఇరుక్కు, ట్విస్ట్ ఇరుక్కు.. ఓటీటీలో లవ్ స్టోరీ.. ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ నిర్మించిన చిత్రం "ఓహో ఎంతన్ బేబి" (Oho Enthan Baby Movie). రుద్ర, మిథిలా పాల్కర్ జంటగా నటించారు. కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా దాదాపు నెల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.ఓటీటీలో ఎప్పుడంటే?ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix).. ఓహో ఎంతన్ బేబీ చిత్రాన్ని ఆగస్టు 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. రొమాన్స్ ఇరుక్కు (ఉంది), ట్విస్ట్ ఇరుక్కు, డ్రామా ఇరుక్కు.. అంతా ఒకే.. హ్యాపీ ఎండింగ్ ఇరుక్కుమా? (ఉంటుందా?) అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది. మరి ఈ లవ్‌స్టోరీ చూడాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే! Open pannaa… oru love story. Romance irukku, twist irukku, drama irukku. Aana, happy ending irukkuma? 👀 pic.twitter.com/YF8H7YtVaG— Netflix India South (@Netflix_INSouth) August 3, 2025 చదవండి: రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో -
ప్రాణాంతకమైన గేమ్.. ఆ చేయి పట్టుకుంటే దెయ్యం వచ్చేస్తుంది!
కొన్ని ఆటలు చాలా ప్రమాదకరం. ఈ విషయం తెలిసినా సరే ఓసారి ఆడి చూస్తే పోలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులోనూ దెయ్యాన్ని చూడొచ్చు అనగానే ఓ పక్క ఎగ్జయిట్ అవుతూ, మరో పక్క భయపడుతూనే రంగంలోకి దిగుతారు. ఒక్క లైన్లో చెప్పాలంటే టాక్ టు మి సినిమా (Talk To Me Movie Review) కథ ఇదే! ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ దగ్గర రాతి చేయి ఉంటుంది. కథఓ క్యాండిల్ వెలిగించి.. ఆ చేయిని పట్టుకుంటే చాలు దెయ్యాలు కనిపిస్తాయి. కనిపించడంతో ఆగవు. చేయి పట్టుకున్న వ్యక్తి శరీరంలోకి కూడా వెళ్తాయి. చేయిని వదిలేసి, క్యాండిల్ ఆర్పేసినప్పుడు ఆ దెయ్యం ఒంట్లో నుంచి తిరిగి వెళ్లిపోతుంది. దెయ్యం శరీరంలోకి చేరినప్పుడు ఎవరేం చేస్తున్నారనేది సరదాగా వీడియోలు షూట్ చేస్తూ ఉంటారు మిగతా ఫ్రెండ్స్. అప్పటివరకు వచ్చిన దెయ్యాలేవీ పెద్దగా భయపెట్టకపోవడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. దీంతో చీకటి అంటేనే భయపడే ఓ బాలుడు కూడా ధైర్యం చేసి తనూ గేమ్ ఆడతానంటాడు.అందుకు అతడి అక్క ఒప్పుకోదు. అప్పటికే ఆమె ప్రియుడి శరీరంలోకి దెయ్యం ప్రవేశించి చేసిన పిచ్చిపనిని చూసి ఆమె బిక్కచచ్చిపోతుంది. ఇదేమంత సరదా గేమ్ కాదని, ఇక ఆపేయమని వారిస్తుంది. అయినా పట్టించుకోకుండా చిన్నపిల్లాడితో గేమ్ ఆడిస్తారు. ఈసారి గేమ్ వైల్డ్‌గా మారుతుంది. అతడు తన కనుగుడ్లు పీకేసుకుంటాడు. తలను టేబుల్‌కేసి బాదుకుంటూ చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. రక్తం ఏరులై పారుతుండటంతో అందరూ భయంతో వణికిపోతారు. ఎలా ఉంది?దీంతో అందరూ ఎలాగోలా ఆ రాతి చేతి నుంచి బాలుడి చేతిని విడిపిస్తారు. తర్వాతేం జరిగిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! దెయ్యాన్ని ఆహ్వానించే ఆటలాడితే ఏం జరుగుతుందనేది చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అలాంటిదే! కాకపోతే కథ ఎక్కడా దారితప్పకుండా స్పీడ్‌గా వెళ్లిపోతూ ఉంటుంది. అనవసరమైన సీన్లు ఉండవు. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది. అయితే మరీ ఎక్కువగా భయపెట్టే సన్నివేశాలు లేవు.టాక్ టు మి.. ఆస్ట్రేలియన్ హారర్ మూవీ. 2023లో రిలీజైన ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. టాక్ టు మి 2 కథ ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది. 'టాక్ టు మి' మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. దీనికి ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్ ఉంది. -
ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి వచ్చిన 'కింగ్డమ్' జనాల్ని అలరిస్తోంది. ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లోనూ దాదాపు 37 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇవన్నీ కూడా ఒక్క శుక్రవారం నాడే రిలీజ్ కావడం విశేషం.(ఇదీ చదవండి: దొంగచాటుగా 'కింగ్డమ్' చూసొచ్చిన రష్మిక)ఓటీటీల్లో ఈ వీకెండ్ రిలీజైన సినిమాల విషయానికొస్తే.. 3 బీహెచ్‌కే, ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064, సితారే జమీన్ పర్, తమ్ముడు.. ఉన్నంతలో చూడొచ్చు. ఇవన్నీ కూడా తెలుగులోనే అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చింది?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (ఆగస్టు 01)అమెజాన్ ప్రైమ్3 బీహెచ్‌కే - తెలుగు సినిమాఓ భామ అయ్యో రామ - తెలుగు మూవీహౌస్ఫుల్ 5 - హిందీ చిత్రంద లెజెండ్ ఆఫ్ ఓచీ - ఇంగ్లీష్ మూవీనథింగ్ బట్ యూ - తెలుగు డబ్బింగ్ సిరీస్నైట్ సైలెన్స్ - పోలిష్ సినిమాడోప్ గర్ల్స్ - ఇంగ్లీష్ సిరీస్కెన్ యూ సమన్ 100 ఫ్రెండ్స్ - జపనీస్ సిరీస్బిల్డ్ ఇన్ బర్మింగ్హమ్ - ఇంగ్లీష్ సిరీస్ఏప్రిల్ మే 99 - మరాఠీ సినిమాఆంబట్ సౌకిన్ - మరాఠీ మూవీసీస్ కడ్డీ - కన్నడ సినిమానెట్ఫ్లిక్స్తమ్ముడు - తెలుగు మూవీద స్టోన్ - థాయ్ సినిమాద హస్బెండ్ ఆఫ్ రోసారియా - తగలాగ్ మూవీనథింగ్ అన్కవర్డ్ - కొరియన్ సిరీస్మై ఆక్స్ఫర్డ్ ఇయర్ - ఇంగ్లీష్ సినిమాడెత్ ఇంక్ సీజన్ 1 & 2 - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్సూపర్ సారా - ఇంగ్లీష్ సిరీస్ఐస్ ఆఫ్ వాకాండా - ఇంగ్లీష్ సిరీస్ఆహాపాపా - తెలుగు డబ్బింగ్ మూవీచక్రవ్యూహం - తమిళ డబ్బింగ్ చిత్రంబుక్ మై షోద ఫోయెనికన్ స్కీమ్ - ఇంగ్లీష్ సినిమాజీ5సత్తముమ్ నీదియమ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్బకైటి - హిందీ సిరీస్యూట్యూబ్సితారే జమీన్ పర్ - తెలుగు డబ్బింగ్ సినిమా (రెంట్ విధానం)సన్ నెక్స్ట్సురభిల సుందర స్వప్నం - మలయాళ మూవీజిన్ ద పెట్ - తెలుగు డబ్బింగ్ చిత్రంగరుడన్ - తమిళ మూవీమనోరమ మ్యాక్స్‌సూపర్ జిందగీ - మలయాళ సినిమాఆపిల్ ప్లస్ టీవీస్టిల్ వాటర్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్చీఫ్ ఆఫ్ వార్ - ఇంగ్లీష్ సిరీస్లయన్స్ గేట్ ప్లేప్రాజెక్ట్ సైలెన్స్ - కొరియన్ మూవీకోడ్ ఆఫ్ సైలెన్స్ - ఇంగ్లీష్ సిరీస్కలియుగం 2064 - తెలుగు సినిమాటెంట్కోట్టాగట్స్ - తమిళ మూవీఅస్త్రం - తమిళ సినిమా(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి) -
తండేల్ సినిమాను తలపించేలా తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
తాజాగా కింగ్డమ్ మూవీతో అలరించిన సత్యదేవ్ మరో ఆసక్తికర కంటెంట్‌తో అభిమానుల ముందుకొస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్‌కు వీవీ సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లోనే ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్‌కు బందీలుగా దొరికిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్‌లో చూపించనున్నారు. ఈ సిరీస్‌లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు.ఇది కేవలం బ్రతకడం గురించి కాదు. మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుందని దర్శకుడు సూర్య కుమార్ అన్నారు. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. నా కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటని సత్యదేవ్ అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాల్‌తో కూడుకున్నదని చెప్పారు. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని,.. అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని హీరోయిన్ ఆనంది తెలిపారు. -
ఓటీటీలో 'హరి హర వీరమల్లు'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్!
పవన్ కల్యాణ్ నటించిన తొలి పాన్-ఇండియన్ సినిమ 'హరి హర వీరమల్లు' నెలరోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. జులై 24న విడుదలైన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, మొదటి ఆటతోనే భారీ డిజాస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సుమారు రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.'హరి హర వీరమల్లు' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మొదట ఢీల్ సెట్ చేసుకున్నారట. అయితే, సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో నిర్మాతలు తమ ప్లాన్‌లో మార్పులు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం వీరమల్లు డిజిటల్ విడుదల విషయంలో పరిశీలిస్తున్నారట.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్కు తీసుకురావలనే ప్లాన్‌లో ఉన్నారట. అదే జరిగితే 30రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. అయితే, ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.'హరి హర వీరమల్లు' విడుదలతోపాటు వివాదాలను కూడా తీసుకొచ్చింది. కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. అయితే, ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీయడంతో చాలామంది తప్పుబట్టారు. కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడనేది సినిమా కథగా చెప్పడం ఏంటంటూ విమర్శించారు. ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడం.. ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ కొందరు పేర్కొన్నారు. ఇలా అనేక కారణాల వల్ల సినిమాకు ఎక్కువ నష్టం జరిగింది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. నాసర్, సునీల్, దలీప్ తాహిల్, ఆదిత్య, సచిన్ ఖేడేకర్ కూడా ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. -
బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడు.. డేట్ రివీల్ చేసిన ఓటీటీ సంస్థ
బుల్లితెర ప్రియులను అలరించే బిగ్‌బాస్ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే హోస్ట్‌గా మరోసారి ఆ స్టార్ హీరోనే అలరించనున్నారు. ఈ బిగ్‌బాస్ షోకు ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో వచ్చిన ఈ రియాలిటీ షో బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిందీలో బిగ్‌బాస్ సీజన్-19కు సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ప్రకటించింది.ఆగస్టు 24 నుంచి బిగ్‌బాస్-19 సీజన్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఈ సీజన్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో జియో హాట్‌స్టార్‌తో పాటు కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.రెమ్యునరేషన్ తగ్గించుకున్న సల్మాన్ ఖాన్..అయితే ఈ ఏడాది సీజన్‌కు సల్మాన్ ఖాన్ భారీగా పారితోషికం తగ్గించుకున్నారు. ఈ ఏడాది వీకెండ్‌కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్‌బాస్ 17వ సీజన్‌కు రూ.200 కోట్లు, 18వ సీజన్‌కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం తగ్గించుకోవడం గమనార్హం.Bhai ke saath laut aaya hai Bigg Boss ka naya season!Aur iss baar chalegi - Gharwalon Ki Sarkaar👑Dekhiye #BiggBoss19, 24th August se, sirf #JioHotstar aur @colorstv par.@BeingSalmanKhan @danubeprop #VaselineIndia#BiggBossOnJioHotstar#BB19OnJioHotstar pic.twitter.com/MxqX8s0Cor— JioHotstar (@JioHotstar) July 31, 2025 -
ఓటీటీకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ప్రస్తుత రోజుల్లో ఓటీటీలు సరికొత్త కంటెంట్‌తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఓటీటీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగానే డిఫరెంట్ కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు మరో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ నెట్వర్క్. ఈ సిరీస్‌కు సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం నిర్మించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతోన్న ఈ వెబ్ సిరీస్‌ను ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి. -
'కింగ్డమ్' ఓటీటీ డీటైల్స్.. ఎప్పుడు రావొచ్చు?
విజయ్ దేవరకొండ హిట్ పడి చాలా కాలమైంది. దీంతో తన లేటెస్ట్ సినిమా 'కింగ్డమ్'పై బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. కానీ ఒకటి రెండు రోజులు ఆగితే అసలు రిజల్ట్ ఏంటనేది బయటపడుతుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్ ఏంటి? ఎప్పుడు రావొచ్చు?ఒకప్పటితో పోలిస్తే థియేటర్లకు జనాలు బాగానే వెళ్తున్నారు. ఆగస్టు 14 వరకు మరో పెద్ద మూవీ లేదు కాబట్టి.. 'కింగ్డమ్'కి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కానీ ఏ మేరకు దాన్ని క్యాష్ చేసుకుంటుందనేది చూడాలి. అలానే కలెక్షన్ కూడా రాబట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నిర్మాణ సంస్థ ఎప్పుడో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు విక్రయించింది. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రావొచ్చు?(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రీసెంట్ టైంలో సితార ఎంటర్టైన్మెంట్స్ తీసే సినిమాల్ని దాదాపుగా నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తోంది. 'కింగ్డమ్' కూడా అలానే దక్కించుకుంది. అలానే ఈ చిత్రాలన్ని చాలావరకు నాలుగు వారాల గ్యాప్‌తోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఈ మూవీ కూడా అలానే రావొచ్చని తెలుస్తోంది. అంటే ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబరు తొలివారంలో 'కింగ్డమ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!) -
లీగల్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. తెలుగు వర్షన్ రిలీజ్‌పై ప్రకటన
కోలీవుడ్‌లో ఓటీటీ వేదికగా విడుదలైన 'సట్టముం నీతియుం' వెబ్ సిరీస్‌పై పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులోనూ రాబోతోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ జీ5 తమిళ్లో జులై 18న విడుదలై దూసుకెళ్తుంది. ఇందులో శరవణన్, నమ్రితా ఎంవీ ప్రధాన పాత్రలు పోషించారు.ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలతో పాటు భావోద్వేగంతో కూడిన 'సట్టముం నీతియుం' వెబ్ సిరీస్ ఆగష్టు 1న తెలుగులో విడుదల కానుంది. జీ5 వేదికగా తెలుగు, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సిరీస్ సుందరమూర్తి (శరవణన్) అనే ఓ లాయర్ చుట్టూ తిరుగుతుంది. కోర్టులో పేదవారికి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది ఒక సామాన్యుడి ధైర్యాన్ని, న్యాయాన్ని సాధించేందుకు చేసే పోరాటాన్ని చూపించే కథగా రూపొందించబడింది. శక్తివంతమైన కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్‌గా నిలుస్తుందని చాలామంది రివ్యూలు ఇచ్చారు.A battle, a long lost hope for justiceWatch #SattamumNeedhiyum – Premieres on 1st August Produced by: 18 CreatorsPrabha & Sasikala#Saravanan @namritha_mv @balajiselvaraj @soori_prathap@vibinbaskar @RamDasa2 @BhavnaGovardan@mariamila1930 @harihmusiq @srini_selvaraj pic.twitter.com/leCiC7erZG— ZEE5 Telugu (@ZEE5Telugu) July 30, 2025 -
'పెళ్లికి ముందే హద్దులు దాటితే'.. ఓటీటీకి సూపర్ హిట్ సినిమా
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'డా..డా'. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. పెళ్లికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ సందడి చేసేందుకు వస్తోంది. ఈ అర్ధరాత్రి నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పాపా మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన డా.. డా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ హాలీవుడ్ హారర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. జాంబీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత, 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ డాని బోయెల్ దర్శకత్వం వహించాడు. జూన్‌లో ఇది థియేటర్లలోకి రాగా అలా నెల దాటిందో లేదో ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ హారర్ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.2002లో రిలీజైన '28 డేస్ లేటర్', 2007లో విడుదలైన '28 వీక్స్ లేటర్' చిత్రాలకు సీక్వెల్ '28 ఇయర్స్ లేటర్'. దీన్ని రెండు భాగాలుగా తీశారు. ఇందులోని తొలి పార్ట్ జూన్‌లో రిలీజైంది. కాకపోతే థియేటర్లలో అనుకున్నంతగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయింది. మరి అందుకేనేమో ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వీడియో అన్ డిమాండ్(రెంట్ విధానంలో) అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో ఈ మూవీ చూడొచ్చు. ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్‌లో రెండు తెలుగు థ్రిల్లర్స్)'28 ఇయర్స్ లేటర్' విషయానికొస్తే.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రేజ్ వైరస్ మహమ్మారిలా వ్యాపించేసరికి బ్రిటన్ ప్రజలందరూ జాంబీలుగా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు.. ఓ ఐలాండ్‌లో బతుకుతుంటారు. మరి అక్కడికి కూడా జాంబీలు ఎలా వచ్చేశారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. 'ఓపెన్‌హైమర్' నటుడు కిలియన్ మర్ఫీ.. జాంబీ పాత్ర చేశాడు. ఈ మూవీకి రెండో భాగం '28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్'.. వచ్చే జనవరిలో థియేటర్లలోకి రానుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి దాదాపు 25కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం. 3 బీహెచ్‌కే, తమ్ముడు, నెట్వర్క్, జిన్ ద పెట్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని సర్ప్రైజ్ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?) -
పృథ్విరాజ్ సుకుమారన్ ‘సర్ జమీన్’ మూవీ రివ్యూ
ఈ రోజుల్లో మంచి కోసం వెతకాలి, అయితే అదే చెడు గురించి ఆలోచిస్తే చాలు చుట్టూ చటుక్కున అల్లుకుపోతుంది. మనవాడు అనేవారు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు, అలాగే పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకోని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే అదే సర్ జమీన్ సినిమా.ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. కాయోజీ ఇరానీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులుగా వర్ధమాన మళయాళ నటుడు పృథ్విరాజ్, బాలీవుడ్ నటి కాజల్ వంటి హేమాహేమీలే కాక ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కొడకు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా నటించడం విశేషం.ఈ కథ ఓ ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. నాలుగంటే నాలుగు ముఖ్య పాత్రలు, రెండున్నర గంటల నిడివి తో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపధ్యంతో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తాడు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్ పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. దేశమా, ప్రాణమా అంటేనే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం. విజయ్ కి హర్మన్ అనే ఓ కొడుకుంటాడు. చిన్నప్పటి నుండి హర్మన్ చాలా భయస్తుడు. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. ఓ సారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్ ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని లేదంటే విజయ్ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్ ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, విజయ్ భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కాని తీవ్రవాదులు హర్మన్ కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్ ని తీవ్రవాదిగా తయారు చేసి మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్ అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా అన్నది హాట్ స్టార్ లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్.మస్ట్ వాచ్.- హరికృష్ణ, ఇంటూరు -
ఓటీటీకి మౌనీ రాయ్ స్పై థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ కంటెంట్‌తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు క్రేజీ కంటెంట్‌తో ఓటీటీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త జానర్లతో వస్తోన్న వెబ్ సిరీస్‌లు ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. స్పై జానర్లో వస్తోన్న సలాకార్ అనే ఓటీటీలో సందడి చేయనుంది.దేశ భద్రత కోసం ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన స్పై మాస్టర్ కథగా ఈ వెబ్ సిరీస్‌ను ఫరూక్ కబీర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న ఈ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేస్తూ.. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సలకార్ వెబ్ సిరీస్‌ను హిందీతో పాట దక్షిణాది భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ వెబ్ సిరీస్‌లో మౌనీ రాయ్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్‌లో రెండు తెలుగు థ్రిల్లర్స్
ప్రతివారంలానే ఈసారి కూడా ఓటీటీల్లోకి దాదాపు 20కి పైగా సినిమాలు వస్తున్నాయి. వాటిలో తమ్ముడు, 3 బీహెచ్‌కే లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు ఈ వీకెండ్లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు మరో రెండు తెలుగు థ్రిల్లర్స్ కూడా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రాలేంటి? ఎందులోకి రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.కొన్నిరోజుల క్రితం తమిళ హారర్ ఫాంటసీ సినిమా 'జిన్ ద పెట్'.. సన్ నెక్స్ట్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా.. ఆగస్టు 01 నుంచి తెలుగులోనూ చూడొచ్చని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్ట్ పెట్టింది. చిన్న వీడియో బిట్ కూడా రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)'జిన్ ద పెట్' విషయానికొస్తే.. జిన్ అనే దెయ్యం ఉన్న పెట్టెని శక్తి(ముగెన్ రావ్).. తన ఇంటికి తీసుకొస్తాడు. అయితే దీని వల్ల తన ఫ్యామిలీ కష్టాలపాలవుతుందని అనుకుంటాడు. కానీ బాక్స్‌లోని దెయ్యం వీళ్లకు సాయం చేస్తుంది. ఇంతకీ ఆ దెయ్యం సంగతేంటి? వీళ్లకు ఎందుకు సాయం చేస్తుందనేది మిగతా స్టోరీ.'నెట్వర్క్' అనే టెక్నో థ్రిల్లర్ సిరీస్.. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామ్ , శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించారు. మనకు రోజువారీ ఫోన్ అనేది చాలా అలవాటు అయిపోయింది. ఒకవేళ మన ఫోన్లో సిగ్నల్ రోజంతా మిస్ అయితే? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇలా నలుగురికి జరిగితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు సిరీస్ ఇది. థ్రిల్లర్స్ కావాలనుకునేవాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా) View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
ఓటీటీలో 'సిద్ధార్థ్ ' సినిమా.. అఫీషియల్ ప్రకటన
సిద్ధార్థ్ హీరోగా నటించిన కొత్త సినిమా '3BHK' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 7న విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో బాగా ఆకర్షించింది. కథ కాస్త నెమ్మదిగా రన్ అవుతుందని విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు నటించారు.థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న '3 బీహెచ్‌కే'.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగష్టు 1 నుంచి సింప్లీ సౌత్(Simply South) ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటన వచ్చేసింది. తమిళ్, తెలుగులో విడుదల కానుంది. కానీ, భారత్‌లో ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా చూసే ఛాన్స్ లేదు. కేవలం ఇతర దేశాల్లో ఉన్నవారికి మాత్రమే ఆ అవకాశం ఉంది. అయితే, అదేరోజున అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం భారత్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఒకవేళ ఆ తేదీన రాకుంటే.. ఆగష్టు 8న తప్పకుండా విడుదల కావచ్చని టాక్ ఉంది.నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు. కథ కాస్త నెమ్మదిగా సాగినా.. సినిమా అందరికీ నచ్చుతుంది. -
ఓటీటీలో హిట్ సినిమా.. ఎమోషనల్‌గా 'అక్కా-తమ్ముడి' అనుబంధం
కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించిన 'మామన్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 16న తమిళ్లో విడుదలైంది. అయితే, సమ్మర్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా మామన్ నిలిచింది. ప్రతి కుటుంబంలో కనిపించే బాంధవ్యాలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారు. మనందరి జీవితంలో మేనమామ బంధం గొప్పదని, అది తల్లి తర్వాతి స్థానమని ఈ చిత్రం ద్వారా వెల్లడించారు. స్వాసిక, ఐశ్వర్య లక్ష్మీ, రాజ్‌కిరణ్, రాజేంద్రన్ వంటి నటీనటులు నటించారు.మామన్ చిత్రం జీ5 తమిళ్లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. రాఖీ పండుగ సందర్భంగా అగష్టు 8న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందరూ చూడొచ్చు. కానీ, తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురావలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'అక్క తమ్ముడు' బంధాన్ని చాలా ఎమోషనల్‌గా ఈ చిత్రంలో చూపించారు. ఆపై అక్క బిడ్డల కోసం మేనమామగా చేయాల్సిన బాధ్యతలను నేటి సమాజానికి గుర్తుచేసేలా ఈ చిత్రం ఉంది. -
మరో ఓటీటీకి సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ కమెడియన్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం గరుడన్. విడుదలై మూవీతో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్ సూరి లీడ్ రోల్లో నటించారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. అక్కడ హిట్ కావడంతో తెలుగులోనూ భైరవం పేరుతో రీమేక్ చేసి ఇటీవలే విడుదల చేశారు. తెలుగు వర్షన్లో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే గరుడన్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని మరో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సన్ నెక్ట్స్ వేదికగా గరుడన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. Power, loyalty, betrayal – when friends turn foes, the fight becomes deadly.Garudan is coming to SunNXT on August 1. Are you ready for the storm?#GarudanOnSunNXT #Garudan #TamilCinema #PowerAndBetrayal #SunNXT #ActionDrama pic.twitter.com/wrcLo57YRF— SUN NXT (@sunnxt) July 28, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో రాబోయే సినిమాల్లో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనితో పాటు విజయ్ సేతుపతి 'సార్ మేడమ్', ఉసురే లాంటి డబ్బింగ్ చిత్రాలు.. సన్ ఆఫ్ సర్దార్ 2 అనే హిందీ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. నితిన్ 'తమ్ముడు' ఈ వీకెండ్లోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికైతే ఇదొక్కటే స్ట్రెయిట్ తెలుగు మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. దీనితో పాటు బకైటి అనే హిందీ సిరీస్ కొంతలో కొంత ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. మరి శుక్రవారంనాడు సడన్‌గా ఓటీటీల్లో కొత్త మూవీస్ స్ట్రీమింగ్ అవుతాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 28 నుంచి ఆగస్టు 03 వరకు)నెట్ఫ్లిక్స్ఇరాన్ చెఫ్ థాయ్ లాంట్ వర్సెస్ ఆసియా (రియాలిటీ సిరీస్) - జూలై 28ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లీష్ మూవీ) - జూలై 29WWE: అన్ రియల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29కన్వర్జేషన్స్ విత్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 30అన్ స్పీకబుల్ సిన్స్ (స్పానిష్ సిరీస్) - జూలై 30యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ సినిమా) - జూలై 31గ్లాస్ హార్ట్ (జపనీస్ సిరీస్) - జూలై 31లియాన్నే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31మార్క్డ్ (జులు సిరీస్) - జూలై 31తమ్ముడు (తెలుగు సినిమా) - ఆగస్టు 01అమెజాన్ ప్రైమ్లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 28చెక్ (తెలుగు సినిమా) - జూలై 28హాట్స్టార్అడ్డా ఎక్స్ట్రీమ్ బాటిల్ (రియాలిటీ సిరీస్) - జూలై 28క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 29బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 28పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ సిరీస్) - ఆగస్టు 02సన్ నెక్స్ట్సురభిల సుందర స్వప్నం (మలయాళ సినిమా) - ఆగస్టు 01ఆపిల్ ప్లస్ టీవీచీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01జీ5బకైటి (హిందీ సిరీస్) - ఆగస్టు 01(ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ప్లాన్ ఛేంజ్!) -
ఓటీటీలోకి తెలంగాణ ప్రేమకథ.. ట్రైలర్ రిలీజ్
'మై విలేజ్ షో' పేరుతో యూట్యూబ్‌లో గుర్తింపు తెచ్చుకున్న టీమ్.. ఇప్పుడు సినీ అరంగేట్రానికి సిద్ధమైంది. అయితే థియేటర్లో కాకుండా ఓటీటీలో సందడి చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ వివరాల్ని కూడా వెల్లడించారు. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ సోనియా సీమంతం వేడుక)అనిల్, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ'. శివకృష్ణ దర్శకుడు. ఆగస్టు 8 నుంచి జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. గతంలో యూట్యూబ్‌లో 'విలేజ్ షో' టీమ్ అంతా ఎక్కువగా రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలనే తీశారు. ఇప్పుడు సిరీస్ కోసం ఆ తరహా కథనే ఎంచుకున్నారు.పల్లెటూరిలో ఉంటే ఓ ఆకతాయి కుర్రాడు.. ఓ అమ్మాయితో లేచిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఎలాంటి తిప్పలు పడ్డాడు? చివరకు ఆ అమ్మాయితో ఒక్కటయ్యాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్, అందున రూరల్ స్టోరీతో తీసిన సిరీస్ కాబట్టి క్లిక్ కావొచ్చేమో చూడాలి?(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ) -
ఓటీటీలో ‘చౌర్యపాఠం’ నయా రికార్డు
థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించని ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఆ చిన్న సినిమానే చౌర్యపాఠం. ఇటీవల ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది.ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే... కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. -
OTT: 2025లో ఎక్కువ మంది చూసిన హిందీ వెబ్ సిరీస్, షోస్ లివే..!
2025లో ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పెద్దగా సందడి చేయలేకపోయింది. అయితే ఇంటింటి థియేటర్‌గా అవతరించిన ఓటీటీ రంగం మాత్రం వరుస హిట్లు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న సిరీస్‌లతో జోరుగా సాగుతోంది. విశేషం ఏమిటంటే గొప్ప హైప్ ఉత్సాహంతో దూసుకొచ్చిన అనేక సిరీస్‌లు విఫలమైతే, తక్కువ మధ్యస్థపు అంచనాలతో వచ్చిన పలు షోలు వాటి ఆకర్షణీయమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకర్షించాయి. అటువంటివాటిలో కొన్ని...బ్లాక్ వారెంట్... వావ్ కంటెంట్...ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన్ బ్లాక్ వారెంట్ ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదలైన అత్యంత ఉత్కంఠభరితమైన షోలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రై మ్ థ్రిల్లర్ ఇప్పటివరకు లైమ్‌లైట్‌లోనే ఉంది. ఈ సిరీస్‌లో జహాన్ కపూర్, రాహుల్ భట్ తదితరులు తమ అద్భుతమైన నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు.పాతాళ్‌లోక్...సూపర్ క్లిక్జైదీప్, అహ్లవత్ ప్రముఖ పాత్రల్లో నటించిన పాతాల్ లోక్ సీజన్ 2 కూడా మంచి విజయం సాధించింది. ప్రైమ్ వీడియో అందిస్తున్న ఈ సంవత్సరపు మరో హిట్ థ్రిల్లర్ గా నిలిచింది. హై ప్రొఫైల్ హత్య కేసు దర్యాప్తు అనుకోని రీతిలో అనేక ఇతర రహస్యాలను వెలుగులోకి తీసుకురావడాన్ని ఈ సిరీస్ ప్రదర్శిస్తుంది.రియలిస్టిక్ షేడ్స్‌తో...బ్లాక్ వైట్ అండ్ గ్రే.. లవ్కిల్స్నిజజీవిత సంఘటనల ఆధారంగా అంటూ నమ్మించేలా రూపొందిన బ్లాక్, వైట్ గ్రే కూడా ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సోనీలివ్ లో అందుబాటులో ఉన్న ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. హై–ప్రొఫైల్ వ్యక్తుల వరుస హత్యల నేపధ్యంలో ఇది నిజమైన సంఘటనల ఆధారంగా దీనిని పుష్కర్ సునీల్ మహాబల్, హేమల్ ఎ ఠక్కర్ లు రూపొందించారు.సైకలాజికల్ థ్రిల్...ఖాఫ్...ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖాఫ్ కూడా సక్సెస్ జోరు కొనసాగిస్తోంది. గత ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ సిరీస్‌లో... మోనికా పన్వర్, రజత్ కపూర్ ప్రముఖ పాత్రల్లో నటించిన ఖౌఫ్ భయానక శైలి కారణంగా చాలా సంచలనం సృష్టించింది, ప్రేక్షకులపై భారీ ప్రభావాన్ని చూపింది.ఈ ఓటీటీ షోలను అసాధారణంగా చేసింది దీర్ఘకాలం పాటు కొనసాగే ట్విస్టులతో కథ చెప్పడం, ఏదేమైనా భారతీయ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థ్రిల్లర్ల వైపు పూర్తిగా మొగ్గుతున్నారు మరోవైపు ఈ షోలు 2025లో బాలీవుడ్ బాక్సాఫీస్ కంటే ఓటీటీని రంగాన్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చాయి ఈ ఏడాదిలో ఇదే విధంగా తన పైచేయిని కొనసాగిస్తుందా?చూడాలి. -
ఓటీటీలో 'తమ్ముడు' సినిమా.. అధికారిక ప్రకటన
నితిన్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘తమ్ముడు’ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ అయింది. అయితే, సినిమా కథలో పెద్దగా బలం లేకపోవడంతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటించారు.'తమ్ముడు' సినిమా నెట్‌ఫ్లిక్స్(Netflix) ఓటీటీలో విడుదల కానున్నట్లు ఆ సంస్థ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఆగష్టు 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు షోషల్‌మీడియాలో పేర్కొంది. నితిన్-దిల్ రాజు కాంబినేషన్లో ఇప్పటికే ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో తమ్ముడు సినిమా రావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను ఎదుర్కొంది.కథ ఏంటంటే..జై (నితిన్) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేకపోతాడు. దానికి కారణం.. చిన్నప్పుడు తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ( లయ) విషయంలో చేసిన ఒక చిన్న తప్పు! ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది. అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్ర ( వర్ష బొల్లమ) తో కలిసి వైజాగ్ వస్తారు. అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగు జాతర వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో జై అక్కడికి వెళ్తాడు. అక్కడ బిజినెస్మెన్ అజార్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు? అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది? ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి? చివరకు అది నెరవేరిందా లేదా? అక్క విషయంలో జై చేసిన తప్పు ఏంటి? చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేదే మిగతా కథ.Thana lakshyanni, akkani thirigi thevadaniki ee thammudu is on a mission!Watch Thammudu on Netflix, out 1 August in Telugu, Tamil, Malayalam and Kannada.#ThammuduOnNetflix pic.twitter.com/5mAUQ9GXwY— Netflix India South (@Netflix_INSouth) July 27, 2025 -
ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా
థ్రిల్లర్ సినిమాల్లో మీరు చూసిన బెస్ట్ అంటే ఏం చెబుతారు? తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది 'దృశ్యం' అంటారు! ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ చూపించింది మరి. ఒకవేళ దాన్ని మించిపోయే మూవీ ఉంటే?.. ఏంటి అలాంటి సినిమా ఉందా? ఎక్కడ చూడాలి? ఏ భాషలో ఉంది అని కచ్చితంగా అడుగుతారు. అందుకే మీ కోసం మెంటలెక్కించే ఓ కొరియన్ థ్రిల్లర్‌ని తీసుకొచ్చేశాం. అదే 2017లో వచ్చిన 'ఫర్గాటెన్'. ఇంతకీ దీని సంగతేంటి? అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?జిన్ సోక్ (కాంగ్ హా న్యుల్).. తన అమ్మ, నాన్న, అన్నయ్యతో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతాడు. కొన్నిరోజులకే కుటుంబమంతా ఇంట్లో సెట్ వాతావరణానికి సెట్ అయిపోతారు. జిన్‌కి మాత్రం ఇంట్లోని ఓ గది నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. పీడకలలు వస్తుంటాయి. ఓ రోజు జిన్ అన్నయ్య యో సూక్(కిమ్ మ్యు యోల్)ని ఇతడి కళ్ల ముందే కొందరు కిడ్నాప్ చేస్తారు. పోలీస్ కేసు పెట్టినా లాభముండదు. కానీ 19 రోజుల తర్వాత యో సూక్ తిరిగి క్షేమంగా ఇంటికొచ్చేస్తాడు. తిరిగొచ్చిన అన్నయ్యతో పాటు తల్లిలోనూ జిన్ కొన్ని మార్పులు గమనిస్తాడు. భయమేసి ఇంట్లో వాళ్ల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. విచారణ మొదలవుతుంది. అసలు ఇంతకీ జిన్ ఎవరు? ఇద్దర్ని హత్య చేసి గతాన్ని ఎందుకు మర్చిపోయాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామందికి ఓ ఐడియా ఉంటుంది. కానీ 'ఫర్గాటెన్' అలాంటి వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎందుకంటే సినిమా మొదలవడమే ఓ ఫ్యామిలీ స్టోరీలా అనిపిస్తుంది. చక్కని కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు. ఏం జరుగుతుందా? ఎలాంటి థ్రిల్ ఇస్తుందా అని చిన్న ఆసక్తి. అలా చూస్తుండగానే కాసేపటికి హారర్ మూవీలా చిన్నగా భయపెడుతుంది. హీరో కుటుంబం ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది. దీంతో మన హీరో పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఇక అక్కడి మొత్తం సీన్ మారిపోతుంది.ఎక్కడైనా సినిమాలో ట్విస్టులు ఉంటాయి. 'ఫర్గాటెన్'లో మాత్రం ట్విస్టులు మధ్య సినిమా ఉందా అన్నట్లు సాగుతుంది. అప్పటివరకు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుడికి.. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తుంది. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ చేస్తుంది. అదే టైంలో హత్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఆ సంఘటనని మర్చిపోవడం.. ఇలా ఒక్కో సీన్ చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సిన థ్రిల్లర్ అని కచ్చితంగా అనిపిస్తుంది.అదే టైంలో తొలుత చూపించిన సన్నివేశాల్ని, చివర్లో ఒక్కొక్కటిగా లింక్ చేసిన విధానం చూస్తే భలే ముచ్చటేస్తుంది. రెండు గంటల్లోపే ఉన్న ఈ సినిమా క్రేజీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం గ్యారంటీ. ఒకవేళ చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే కొరియన్ భాషలో మాత్రమే ఆడియో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు లేదు కదా అని అనుకుని స్కిప్ చేస్తే మాత్రం ఓ మంచి సినిమా మిస్ అవుతారు.ఈ సినిమాలో స్టోరీని చూపించే విధానంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ అంతా కాస్త నెమ్మదిగా ఉంటుంది గానీ చివరికొచ్చేసరికి అవేం గుర్తుండవు. అదిరిపోయే సినిమా చూశాం ఈ రోజు అనే అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఒకటి రెండు సన్నివేశాలు మినహా ఫ్యామిలీతోనూ చూడొచ్చు.- చందు డొంకాన -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ
సీనియర్ నటుడు శరత్ బాబు కొడుకు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'దక్ష'. హారర్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ చిత్రం రెండేళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ మూవీకి వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తాజాగా శుక్రవారం(జూలై 25) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె పద్ధతిలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. 'దక్ష' స్టోరీ విషయానికొస్తే.. ఆరుగురు స్నేహితులు ఓ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకుంటూ 'చాసర్' అనే గేమ్ ఆడతారు. గేమ్ ఓడిపోయిన వారు చనిపోతారని తెలుసుకుంటారు. మరి చివరకు ఏమైంది? ఎవరు బతికారు అనేదే మిగతా స్టోరీ.ఈ మూవీనే కాదు ఈ వారం చాలా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు కూడా ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో 'రోంత్' అనే పోలీస్ డ్రామా హాట్‌స్టార్‌లో.. షో టైమ్, మార్గన్ మూవీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో.. సోలో బాయ్, సారథి చిత్రాలు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రోంత్, షో టైమ్, మార్గన్ కచ్చితంగా చూసే లిస్టులో ఉంటాయి. (ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఇప్పటికే షో టైమ్, మార్గన్, సారథి తదితర తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు బిగ్‌బాస్ గౌతమ్ మూవీ కూడా కేవలం మూడు వారాలకే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడూ చూద్దాం.ప్రస్తుతం చిన్న సినిమాలని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. మరీ బాగుంది అనే టాక్ వస్తే తప్పితే థియేటర్లకు వెళ్లి వాటిని చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు. అయినా సరే యంగ్ హీరోలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ.. ఈనెల 4న 'సోలో బాయ్' చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేశాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గానీ స్టార్ నటీనటులు లేకపోవడంతో ఒకటి రెండు రోజులకే బిగ్ స్క్రీన్ నుంచి మాయమైపోయింది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)ఇప్పుడు ఆహా ఓటీటీలోకి శుక్రవారం సాయంత్రం నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండా సడన్ అందుబాటులోకి వచ్చింది. వీలుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. బిగ్‌బాస్ 7, 8 సీజన్లలో పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ ఇది కాస్తోకూస్తో సందడి చేసింది.'సోలోబాయ్' విషయానికొస్తే.. కృష్ణమూర్తి(గౌతమ్ కృష్ణ) మిడిల్ క్లాస్ కుర్రాడు. ఇంజినీరింగ్ చదువుతూ ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. ఓ సందర్భంలో ఆమె బ్రేకప్ చెప్పడంతో మందుకు బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరతాడు. అక్కడ శ్రుతి(శ్వేత అవస్తి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. మరోవైపు ఆర్థిక పరిస్థితుల వల్ల భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. ఓ పక్క తండ్రి చావు, మరోవైపు భార్య విడాకులు.. వీటన్నింటిని తట్టుకొని కృష్ణ మూర్తి మిలియనీర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ)) -
సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో నిన్న(జూలై 24) రిలీజైన 'హరిహర వీరమల్లు'కి మిక్స్డ్ టాక్ వచ్చింది. హిట్ అని పవన్ అభిమానులు హడావుడి చేస్తున్నారు గానీ రెండు రోజులు ఆగితే అసలు ఫలితం ఏంటో తెలుస్తుంది. సరే దీని గురించి పక్కనబెడితే ఓటీటీల్లోనూ బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. షో టైమ్, మార్గన్ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి రాగా.. మరో మూడు తెలుగు మూవీస్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంతకీ ఏంటవి?సునీల్, చైతన్యరావు, శ్రద్దాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''పారిజాత పర్వం'. గతేడాది ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. నెల తిరగకుండానే అప్పుడే ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి వచ్చేసింది. లయన్స్ గేట్ ప్లేలో తాజాగా స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా విషయానికొస్తే.. ఓ కుర్రాడు డైరెక్టర్ కావాలనుకుంటాడు. కానీ అడ్డంకులు వచ్చేసరికి ఓ నిర్మాతని కిడ్నాప్ చేయాలనుకుంటాడు. కానీ ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటనేది మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))'ఈగ', 'బాహుబలి' తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచమైన కన్నడ హీరో సుదీప్.. 2017లో చేసిన సినిమా 'హెబ్బులి'. దీన్ని ఇప్పుడు 'సారథి' పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశారు. ఆహా ఓటీటీలోకి సడన్‌గా తీసుకొచ్చేశారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో సుదీప్ ఆర్మీ అధికారిగా నటించగా.. ఇతడి సరసన అమలాపాల్ హీరోయిన్గా చేసింది.2023లో వచ్చిన తెలుగు మూవీ 'దక్ష'. ఆయుష్ తేజస్, ఆర్య అను హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. హారర్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఆరుగురు స్నేహితులు ఓ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకుంటూ 'చాసర్' అనే గేమ్ ఆడతారు. గేమ్ ఓడిపోయిన వారు చనిపోతారని తెలుసుకుంటారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇలా ముందు ప్రకటించనవే కాకుండా కొత్తగా ఈ మూడు తెలుగు సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు బోలెడన్నీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమైపోయాయి. ప్రస్తుతం థియేటర్లలో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సందడి చేస్తోంది. ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వారాంతంలో తెలుగు సినిమా షో టైమ్‌తో పాటు విజయ్ ఆంటోనీ చిత్రం మార్గన్, హిందీలో సర్జామీన్ మూవీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.అమెజాన్ ప్రైమ్నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25రంగీన్ (హిందీ సిరీస్) - జూలై 25మార్గన్(తమిళ సినిమా)- జూలై 25సన్ నెక్స్ట్షో టైమ్ (తెలుగు మూవీ) - జూలై 25ఎక్స్ & వై (కన్నడ చిత్రం) - జూలై 25నెట్ఫ్లిక్స్మండల మర్డర్స్ (హిందీ సిరీస్) - జూలై 25ది విన్నింగ్ ట్రై- (కొరియన్ మూవీ)- జూలై 25ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) - జూలై 25హ్యాపీ గిల్మోర్-2- (హాలీవుడ్ కామెడీ చిత్రం) - జూలై 25ఆంటిక్ డాన్-(హాలీవుడ్ హారర్ మూవీ)- జూలై 25జీ5సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) - జూలై 25లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) - జూలై 25ద ప్లాట్ (కొరియన్ మూవీ) - జూలై 25ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25 -
ఆ ఓటీటీలోకి హరి హర వీరమల్లు.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) నేడు(జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయితే ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని సీజీ వర్క్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలకు సైతం అద్భుతమైన వీఎఫెక్స్ వాడుతున్నారు. కానీ ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకు ఇంత పేవలమైన సీజీ వర్క్ చేయడం ఏంటని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి: హరి హర వీరమల్లు రివ్యూ)పవన్ ఫ్యాన్స్ సైతం ఆ సినిమా పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది అనేది గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ వెతుకున్నారు.విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మంచి ధరకు డిజిటల్ రైట్స్ పొందింది. సినిమా రిలీజ్ అయినా 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారట. ఈ లెక్కన సెప్టెంబర్ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు అన్యూహ్యంగా నెగెటివ్ టాక్ రావడంతో ఓటీటీలో అనుకున్నదాని కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. సినిమా హిట్ అయితే ఎనిమిది వారాల వరకు ఆగేవారు కానీ.. ఇప్పుడున్న టాక్ని బట్టి చూస్తే నెలలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఈ లెక్కన ఆగస్ట్ ఎండింగ్లోపే ఈ సినిమా డిజిటల్ తెరపై వచ్చే అవకాశం ఉంది. -
ఓటీటీలోకి 'టామ్ క్రూజ్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Impossible) ఓటీటీలోకి రానుంది.. సుమారు రెండు నెలల తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చేసింది. హాలీవుడ్ ఫ్రాంఛైజీల్లో మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సిరీస్‌లో భాగంగా 8వ సినిమాగా వచ్చిన ‘మిషన్ ఇంపాసిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో టామ్ క్రూజ్ చేసిన సాహసాలు అత్యంత ప్రమాధకరంగా ఉన్నాయని హాలీవుడ్ మీడియా కూడా కథనాలు రాసింది. ఆగష్టు 19న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్కు రానున్నట్లు ఒక పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 6వేల కోట్ల వరకు ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 3400 కోట్ల వరకు ఈ చిత్రం కోసం నిర్మాతలు ఖర్చు చేశారు. క్రిస్టోఫర్ మేక్‌క్వారీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సిరీస్ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్ ఇంపాజిబుల్. సిరీస్ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి... అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. -
మరో వారం రోజులే...నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ సినిమాలు అవుట్..!
ఓటీటీలు అందుబాటులోకి వచ్చినంత వేగంగా ఏ సినిమాలు చూడాలి ఏ సినిమాలు చూడకూడదు అనే అవగాహన కూడా వచ్చి ఉంటే బాగుండేది. బాగుందని ఓ సినిమా గురించి తెలిసి చూసేలోగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోవడం మనకు అనుభవమే. అదే పరిస్థితి ఓటీటీల్లోని కొన్ని సినిమాల విషయంలోనూ మనకు ఎదురవుతుంటుంది. ఈ నేపధ్యంలో ఈ నెలాఖరులోగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనున్న కొన్ని మంచి సినిమాల వివరాలివి.. వీటిలో మంచి ప్రశంసలు పొందిన ఆఫ్‌బీట్ కామెడీల నుంచి రోమాంచితం చేసే థ్రిల్లర్ల వరకు ఉన్నాయి ఈ జూలై 31లోగా చూడాలనుకుంటే తప్పక చూసేయండి. ఆ సినిమాలివే...రెడ్ ఐ (2005)వెస్ క్రావెన్ దర్శకత్వం వహించిన రెడ్ ఐ థ్రిల్లర్‌లో హోటల్ మేనేజర్ అయిన రాచెల్ మెక్ఆడమ్స్ ని పూర్తిగా అపరిచితుడైన సిలియన్ మర్ఫీని అర్థరాత్రి పూట ఓ లేట్ నైట్ ఫ్లైట్ లో కలుస్తుంది. వారిద్దరి పరిచయం స్నేహపూర్వక సంభాషణగా ప్రారంభమై ఎన్ని అనూహ్య మలుపులు తీసుకుంటుంది? రెడ్ ఐలో చూడొచ్చు. అనుక్షణం ఉత్కoఠ తో నడిచే ఈ సినిమా థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని బాగా ఆకట్టుకుంటుందిఅవేకెనింగ్స్ (1990)పెన్నీ మార్షల్ దర్శకత్వం వహించిన హృదయాన్ని తాకే ఈ డ్రామా జోనర్ చిత్రంలో రాబిన్ విలియమ్స్ అంకితభావంతో కూడిన వైద్యుడిగా కనిపిస్తాడు. కాటటోనిక్ రోగుల కోసం ఒక విప్లవాత్మక చికిత్సను ఆవిష్కరించిన తర్వాత జరిగింది ఏమిటి? పలు నిజమైన సంఘటనల నుండి అల్లుకున్న ఈ కధలో రాబర్ట్ డి నీరో పాత్రధారిగా లియోనార్డ్ లోవ్ కనిపిస్తాడు. జీవితంలోని సంక్షిప్త, విలువైన క్షణాలకు సంబంధించిన శక్తివంతమైన కథగా ఈ సినిమాని చెప్పొచ్చు.అమెరికన్ బ్యూటీ (1999)సామ్ మెండిస్ దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ డార్క్ కామెడీలో కెవిన్ స్పేసీ లెస్టర్ బర్న్హామ్గా నటించాడు, శివారు ప్రాంతాల్లోని రొటీన్ లో చిక్కుకున్న తన జీవితానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఈ పాత్ర ఆకట్టుకుంటుంది. అన్నెట్ బెనింగ్, థోరా బిర్చ్ మేనా సువారీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కాంక్ష, గుర్తింపులతో పాటు అమెరికన్ కలల తాలూకు భ్రమలను మనకు చూపిస్తుంది.అమెరికాస్ స్వీట్‌హార్ట్స్ (2001)జో రోత్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో ఒకనాటి స్టార్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ హాలీవుడ్ తారల మధ్య చిక్కుకున్న ప్రచారకర్తగా నటించారు, ఆమెతో పాటు కేథరీన్ జీటా జోన్స్ జాన్ కుసాక్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. బిల్లీ క్రిస్టల్ హాస్యాన్ని జోడిస్తూ, ఈ చిత్రం గ్లామర్ ప్రపంచంలో తెరవెనుక ప్రేమల గందరగోళాన్ని మనకు చూపిస్తుంది.పంచ్ డ్రంక్ లవ్ (2002)విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ నుంచి వచ్చిన ఈ ఆఫ్‌బీట్ రొమాంటిక్ డ్రామాలో ఆడమ్ సాండ్లర్ బారీ ఎగాన్ పాత్రలో నటించారు, కోపం అనే వ్యాధి తాలూకు సమస్యలతో ఉన్న ఒంటరి వ్యాపారి, అతను ఊహించని విధంగా ఎమిలీ వాట్సన్ తో ప్రేమలో పడతాడు. చమత్కారమైన, సున్నితమైన సన్నివేశాలతో ఆకట్టుకునే ఈ చిత్రం సాండ్లర్ అత్యంత ప్రసిద్ధ నటనల్లో ఒకటిగా నిలిచింది. -
ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలు అనగానే చాలామందికి మలయాళ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో మూవీస్‌ని రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలా 'రోంత్' అనే చిత్రం తెలుగు డబ్బింగ్‌తో హాట్స్టార్లోకి వచ్చేసింది. రాత్రి గస్తీలో పోలీసులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు? వాళ్లకు ఎలాంటి రిస్కులు ఎదురవుతాయి అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది. ఇంతకీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)కథేంటి?ధర్మశాల పోలీస్ స్టేషన్లో యోహన్నా(దిలీశో పోతన్) ఎస్సై. దిన్నాథ్(రోషన్ మ్యాథ్యూ) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారు. ఓ రోజు రాత్రి గస్తీ కోసం వీళ్లకు డ్యూటీ వేస్తారు. అలా పెట్రోలింగ్‌కి వెళ్లిన వీళ్లిద్దరికి ఓ చోట లవర్స్ లేచిపోవడం, మరోచోట ఓ సైకో కన్నబిడ్డని డబ్బా కింద దాచడం, మరోచోట ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం.. ఇలా రకరకలా సంఘటనలు ఎదురవుతాయి. చివరగా అనుకోకుండా జరిగిన ఓ మరణం వల్ల వీళ్లు సమస్యల్లో ఇరుక్కుంటారు. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మలయాళ సినిమాలు ఎందుకు చూస్తారు? అని అడిగితే.. సహజత్వానికి దగ్గరగా ఉంటాయని చాలామంది చెప్పేమాట. ఈ సినిమా కూడా సేమ్ అలాంటిదే. రోంత్ అంటే గస్తీ అని అర్థం. అందుకు తగ్గట్లే మూవీ అంతా ఇద్దరు పోలీసులు, జీప్‌లో తిరుగుతూ.. రాత్రి కాపల కాయడమే చూపిస్తారు. అదే టైంలో వాళ్ల జీవితంలో అనుకోని సంఘటనలు జరగడం, వాటి పరిణామాల వల్ల ఊహించని పరిస్థితులు ఎదుర్కోవడం లాంటివి కూడా చాలా రియలస్టిక్‌గా చూపించారు.ఈ సినిమాలో దాదాపు 80 శాతం రాత్రిపూట ఇద్దరు పోలీసులు పెట్రోలింగ్ చేయడమే చూపిస్తారు. వాళ్లకు ఎదురయ్యే సంఘటనలు.. ఈ విషయంలో వాళ్లు తీసుకునే నిర్ణయాలే కథని ముందుకు తీసుకెళ్తాయి. మధ్యమధ్యలో వచ్చే ఎమోషన్స్ కూడా బాగుంటాయి.స్టోరీ సాఫీగా సాగిపోతుందే అనుకునే టైంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. చివరి అరగంట ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కలిగిస్తుంది. ఊహించని క్లైమాక్స్ సర్ప్రైజ్ చేస్తుంది.సిన్సియర్‌గా పనిచేయడమే కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం కూడా అవసరమే. లౌక్యం లేకపోతే ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగతంగానూ దెబ్బయిపోతాం అనే మెసేజ్ ఇచ్చిన స్టోరీ ఇది. పై స్థాయి అధికారులు అవసరమొస్తే కిందస్థాయి అధికారుల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తారనేది కూడా చాలా నేచురల్‌గా చూపించారు.అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే రెండు గంటల సినిమా. అంతా పోలీసులు డ్యూటీ చేయడం లాంటి సీన్సే ఉంటాయి. ఒకవేళ పోలీస్ డ్రామాలు అంటే ఆసక్తి ఉంటేనే దీన్ని చూడండి. లేదంటే మాత్రం డిసప్పాయింట్ కావొచ్చు. సింపుల్ కథలానే అనిపిస్తుంది గానీ చివరకొచ్చేసరికి పోలీసుల జీవితం ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?యోహన్నాగా చేసిన దిలీశ్ పోతన్, దిన్నాథ్గా చేసిన రోషన్ మ్యాథ్యూ చాలా నేచురల్‌గా నటించారు. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతే వీళ్లతో పాటు మనం ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. మిగిలిన పాత్రధారులకు పెద్ద స్కోప్ లేదు. కానీ బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. ఇందులో పెద్ద కథేం లేదు. కానీ డైరెక్టర్ షాహీ కబీర్ తనదైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఈయనకు మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. పోలీసుల గురించి, రాత్రి పూట వాళ్లకు ఎదురయ్యే పరిస్థితుల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'డీఎన్ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ) -
OTT: ‘ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ రివ్యూ
వెబ్‌సిరీస్: ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్నటీనటులు: అమిత్ సియాల్, షాహిల్ వేద్, భగవతి పెరుమాళ్, గిరిష్ శర్మ, దానిష్ ఇక్బాల్, విద్యుత్ గార్గి తదితరులుదర్శకత్వం: నగేష్ కుకునూర్ఓటీటీ వేదిక: సోనీలివ్(7 ఎపిసోడ్స్)ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది హంట్–ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఎన్నో సంచలన ఘటనలకు సజీవ సాక్ష్యం చరిత్ర. కానీ సామాన్యులకు చరిత్ర ద్వారా ఆ ఘటనల గురించి తెలిసేది గోరంతే... తెలియాల్సింది కొండంత. అయితే ఇప్పుడు జరిగిపోయిన సంచలన ఘటనలను విశ్లేషించి వాటికో సజీవ రూపాన్ని అందించే ప్రయత్నం ఓటీటీ సిరీస్ రూపంలో జరుగుతోంది. సాధారణంగా ఏదైనా ఘటన అంటే అది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అన్న ఉత్సుకత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అటువంటి ఉత్సుకతను దృష్టిలో పెట్టుకునే ఓటీటీ నిర్మాతలు జరిగిపోయిన సంచలనాత్మక ఘటనలపై దృష్టి సారిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల సోనీ లివ్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న సిరీస్ ‘ది హంట్–ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ బాగా ప్రేక్షకాదరణ పొందుతోంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చెన్నై నగరంలోని పెరుంబుదూర్ ప్రాంతంలోని ఓ మీటింగ్‌లో ఎల్టీటీఈ తీవ్రవాదులు మానవబాంబుతో అతి కిరాతకంగా చంపడం మనందరికీ తెలుసు. అయితే ఆ చంపిన తీవ్రవాదులను సరిగ్గా 90 రోజుల్లోనే మన ఇంటెలిజెన్స్ బృందం మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ ఇంత త్వరగా ఆ సంస్థ ఎలా చేసింది? అనేది 7 ఎపిసోడ్లలో అద్భుతంగా చిత్రీకరించారు. మొదటి ఎపిసోడ్లో జరిగిన ఘటనను చూపించి ఆ తదనంతర విచారణను చాలా స్పష్టంగా తీశారు దర్శకుడు. ఇటువంటి ఘటనలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన నగేశ్ కుకునూర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇంట్లో ఏదైనా రహస్యం ఉంటేనే మనం దానిని కనుక్కోవాలని విపరీతంగా ఉబలాటపడతాం. అలాంటిది మన దేశ ప్రధాని హత్య వెనుక రహస్యాన్ని చూడడం ఇంకెంత ఆసక్తి రేపుతుందో చెప్పనక్కరలేదు. ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ తెలుగు భాషలో కూడా లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ సిరీస్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి 'కన్నప్ప'.. డేట్ ఫిక్సయిందా?
మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన లేటెస్ట్ సినిమా 'కన్నప్ప'. రిలీజ్‌కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. అదే ఊపులో థియేటర్లలోకి రాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వీకెండ్ అయ్యేసరికే సైలెంట్ అయిపోయింది. ఇదంతా జరిగి దాదాపు నెల కావొస్తుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? ఎప్పుడు రావొచ్చు?'కన్నప్ప'లో విష్ణు హీరోగా కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితర ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇలా స్టార్ కాస్టింగ్ చాలామంది నటించిన ఈ సినిమాని 'భక్త కన్నప్ప' స్టోరీతోనే తీశారు. కాకపోతే కమర్షియల్ అంశాలు, యాక్షన్ కాస్త జోడించారు. ఇవన్నీ కాదు ప్రభాస్ ఇందులో అతిథి పాత్ర చేయడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త ఆసక్తి చూపించారు.(ఇదీ చదవండి: వరలక్ష్మి శరత్ కుమార్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)ఇలా ఓ మాదిరి అంచనాలతో గత నెల 27న 'కన్నప్ప' థియేటర్లలో రిలీజైంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు వార్తలు రాగా.. కేవలం రూ.40-50 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్లు టాక్. ఇకపోతే రిలీజ్‌కి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు.. ఓటీటీ హక్కుల్ని అమ్మలేదని చెప్పాడు. కానీ ఇప్పుడేమో మూవీ డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని, ఈ వీకెండ్లో అంటే జూలై 27న స్ట్రీమింగ్ చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.'కన్నప్ప' విషయానికొస్తే.. గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు(విష్ణు).. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల నాస్తికుడిగా మారిపోతాడు. చుట్టుపక్కలా గూడేల్లో ఏ ఆపద వచ్చిన ముందుంటాడు. అలాంటి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి బహిష్కరణకు గురవుతాడు. ప్రేయసి నెమలి(ప్రీతి ముకుందన్) కూడా ఇతడి వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు.. గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? ఇంతకీ రుద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
ఓటీటీలో 'మార్గన్'.. ట్విస్ట్ ఇస్తూ ప్రకటన
కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త సినిమా 'మార్గన్: ది బ్లాక్ డెవిల్' గురించి ఓటీటీ ప్రకటన వచ్చేసింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. చిత్రపరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంట్‌ను ప్రదర్శించడంతో ఆయనకు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, ఈ సారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘మార్గన్’ అనే చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు.మార్గన్ సినిమా జులై 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. కోలీవుడ్ ప్రముఖ ఓటీటీ సంస్థ 'టెంట్కొట్ట'లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో ఎక్కువగా తమిళ సినిమాలే ప్రదర్శనకు వస్తుంటాయి. ఇప్పుడు మార్గన్ చిత్రం కూడా తమిళ్ వర్షన్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. జులై 25 నుంచే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది.కథ ఏంటి..?నగరంలో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఓ ఇంజక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆ కేసును చేధించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగలోకి దిగుతాడు. సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురికావడంతో ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధృవ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కావొద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు.కానీ, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలను ధృవ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు ఆరవింద్‌కు సంబంధం ఉందా. ధృవ కూతురిని చంపింది ఎవరు..? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల పాత్ర ఏంటి..? ఫైనల్‌గా హంతకుడు ఎలా దొరికాడు..? అనేది తెలియాలంటే మార్గాన్ సినిమా చూడాల్సిందే. -
మరో ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ఈ ఏడాది వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే ఎలెవన్, బ్లైండ్ స్పాట్ లాంటి థ్రిల్లర్ సినిమాలతో మెప్పించారు. ఆ తర్వాత నవీన్ చంద్ర నటించిన మరో చిత్రం 'షో టైమ్'. ఈ మూవీ జూలై 4న థియేటర్లలో రిలీజైంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దీంతో ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూలై 25 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.అయితే ఈ మూవీని మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు హీరో నవీన్ చంద్ర తెలిపారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుందని ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. అయితే స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఈ ప్రకటనతో షో టైమ్ రెండు ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది. సన్ నెక్స్ట్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది.షో టైమ్ అసలు కథేంటంటే..'షో టైమ్' విషయానికొస్తే.. ఓ ఇంటిలో రాత్రి 11 గంటలప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్‌గా అక్కడికి వచ్చిన సీఐ లక్ష్మీకాంత్(రాజా రవీంద్ర).. అర్థరాత్రి న్యూసెన్స్ ఏంటని వార్నింగ్ ఇస్తాడు. దీంతో సూర్య(నవీన్ చంద్ర), శాంతి(కామాక్షి).. సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడుతున్న టైంలో ఓ సంఘటన జరుగుతుంది. స్టోరీ మలుపు తిరుగుతుంది. సూర్య-శాంతి ఓ కేసులో ఇరుక్కుంటారు. దీని నుంచి ఎలా బయడపడ్డారు. వీళ్లకు లాయర్ వరదరాజులు(వీకే నరేశ్) ఎలాంటి సాయం చేశాడనేదే మిగతా స్టోరీ.When the truth is too dangerous to reveal, how long can you keep running?#ShowTime, coming soon on Amazon Prime. @PrimeVideoIN#ShowTime #KamakshiBhaskarla @ItsActorNaresh @Rajaraveendar @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop… pic.twitter.com/Ptd0ilnxPG— Actor Naveen Chandra (@Naveenc212) July 21, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు'తో పాటు 'మహావతార నరసింహా', 'ద ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్', 'సార్ మేడమ్' తదితర డబ్బింగ్ చిత్రాలు కూడా వస్తున్నాయి. వీటిలో పవన్ సినిమాపై చాలా తక్కువ హైప్ అయితే ఉంది. మిగతా వాటి గురించి జనాలకు పెద్దగా తెలియదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 25కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'డీఎన్ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'షో టైమ్' (స్ట్రెయిట్ తెలుగు సినిమా), రోంత్ (డబ్బింగ్ మూవీ) మండల మర్డర్స్(హిందీ సిరీస్), ఎక్స్ & వై(కన్నడ చిత్రం) ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీకెండ్ వచ్చేసరికి ఏవైనా కొత్త చిత్రాలు సడన్ సర్ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి? ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 21 నుంచి 27 వరకు)హాట్స్టార్ద సొసైటీ (హిందీ రియాలిటీ షో) - జూలై 21రోంత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 22వాషింగ్టన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23షర్జమీన్ (హిందీ మూవీ) - జూలై 25అమెజాన్ ప్రైమ్జస్టిస్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 21టిన్ సోల్జర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 23హ్యాండ్సమ్ గాయ్స్ (కొరియన్ సినిమా) - జూలై 24నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25రంగీన్ (హిందీ సిరీస్) - జూలై 25సన్ నెక్స్ట్షో టైమ్ (తెలుగు మూవీ) - జూలై 25ఎక్స్ & వై (కన్నడ చిత్రం) - జూలై 25నెట్ఫ్లిక్స్ద హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 21ట్రైన్ రెక్: పీఐ మామ్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 22క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ఏ నార్మల్ ఉమన్ (ఇండోనేసియన్ సినిమా) - జూలై 24హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24మై మెలోడీ & కురోమి (జపనీస్ సిరీస్) - జూలై 24మండల మర్డర్స్ (హిందీ సిరీస్) - జూలై 25ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) - జూలై 25జీ5సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) - జూలై 25లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) - జూలై 25ద ప్లాట్ (కొరియన్ మూవీ) - జూలై 25ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25ఆపిల్ ప్లస్ టీవీఅకపుల్కో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ఎమ్ఎక్స్ ప్లేయర్హంటర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 24(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా
మరో క్రేజీ తెలుగు థ్రిల్లర్ సినిమా ఓటీటీలో డేట్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. నవీన్ చంద్ర, కామాక్షిభాస్కర్ల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో ఎప్పుడు వచ్చివెళ్లిందో అని తెలియనంత వేగంగా థియేటర్ల నుంచి మాయమైంది. ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ అన్నట్లు ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?నవీన్ చంద్ర రీసెంట్ టైంలో 'ఎలెవన్', 'బ్లైండ్ స్పాట్' లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించాడు. ఇప్పుడు అదే జానర్లో చేసిన మరో చిత్రం 'షో టైమ్'. జూలై 4న థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదేరోజు నితిన్ 'తమ్ముడు' కూడా విడుదల కావడంతో దీనికి పెద్దగా బజ్ రాలేదు. థియేటర్లు దొరకలేదు. అలా ఒకటి రెండు రోజుల్లోనే మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూలై 25 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు)'షో టైమ్' విషయానికొస్తే.. ఓ ఇంటిలో రాత్రి 11 గంటలప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్‌గా అక్కడికి వచ్చిన సీఐ లక్ష్మీకాంత్(రాజా రవీంద్ర).. అర్థరాత్రి న్యూసెన్స్ ఏంటని వార్నింగ్ ఇస్తాడు. దీంతో సూర్య(నవీన్ చంద్ర), శాంతి(కామాక్షి).. సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడుతున్న టైంలో ఓ సంఘటన జరుగుతుంది. స్టోరీ మలుపు తిరుగుతుంది. సూర్య-శాంతి ఓ కేసులో ఇరుక్కుంటారు. దీని నుంచి ఎలా బయడపడ్డారు. వీళ్లకు లాయర్ వరదరాజులు(వీకే నరేశ్) ఎలాంటి సాయం చేశాడనేదే మిగతా స్టోరీ.ఈ కథంతా ఒక రోజులోనే జరుగుతుంది. సింపుల్ కథని అంతే క్లియర్‌గా దర్శకుడు ప్రెజెంట్ చేశాడు. 45 నిమిషాల్లోనే ఫస్టాప్ ముగించేసి.. సెకండాఫ్‌లో అసలు స్టోరీ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సీన్లో లాయర్‌గా నరేష్ ఎంటర్ అవుతాడో అక్కడి నుండి అదిరిపోయేలా నవ్వించాడు. అదే టైంలో స్టోరీలో సస్పెన్స్ కూడా బాగా మెంటైన్ చేశారు. సాధారణంగా ఇలాంటి మూవీస్ మలయాళంలో ఎక్కువగా వస్తుంటాయి. అలాంటిది ఒక గదిలోనే సినిమాని తీసేసిన మదన్.. దర్శకుడిగా మెప్పించాడు. సస్పెన్స్ కామెడీ మిక్స్ చేయడం బాగుంది. రాజా రవీంద్ర, నరేష్ మధ్యలో ఉండే ఎపిసోడ్ హైలెట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజులోనే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా) -
ఓటీటీలో కోర్ట్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చట్టం, పోలీస్ వ్యవస్థ ఈ రెండూ శక్తివంతమైనవే. అయితే ఒక్కోసారి ఈ రెండూ డబ్బుకు అమ్ముడుపోతుంటాయి. అలాంటప్పడు సామాన్యుడికి న్యాయం లభించడమనేది గగనంగా మారుతుంది. అయితే న్యాయం కోసం అలుపెరగకుండా పోరాడే న్యాయవాదులు ఉంటారు. న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఓడిపోయినా.. డబ్బు ఎక్కువై విర్రవీగేవారితో, అవినీతిపరులైన డిపాంర్ట్మెంట్ అధికారులతో అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. చట్టముమ్ నీతియుమ్అందులో అవమానాలు, అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయరు. అలాంటి ఒక న్యాయవాది ఇతి వృత్తంతో రూపొందిన తమిళ వెబ్ సిరీస్ చట్టముమ్ నీతియుమ్ (Sattamum Needhiyum). నటుడు పరుత్తివీరన్ శరవణన్ ప్రధాన పాత్ర పోషించిన ఇందులో నటి నమ్రిత, అరుళ్ డీ.శంకర్, షణ్ముగం, తిరుసెల్వమ్, విజయశ్రీ, ఇనియరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బాలాజీ సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. 18 క్రియేటర్స్ పతాకంపై శశికళ ప్రభాకరన్ నిర్మించారు. న్యాయాన్ని గెలిపించలేక..డబ్బుకు లోకం దాసోహం అవుతున్న తరుణంలో సామాన్యులకు న్యాయం అనేది అందని ద్రాక్షలాగే మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అమాయకుడికి న్యాయస్థానంలో న్యాయాన్ని అందించలేకపోయిన ఒక నిజాయితీ పరుడైన న్యాయవాది అదే కోర్టు బయట నోటరీలు రాసుకుంటూ కాలం గడుపుకుంటాడు. దీంతో ఆయనకు ఇంటా బయట కనీస మర్యాద కూడా లేని పరిస్థితి. ఏ ఓటీటీలో అంటే?అలాంటి వ్యక్తి ఆవేశంతో, సమాజంపై కోపంతో.. తన కళ్ల ముందు జరిగిన దుర్ఘటనపై ప్రజావ్యాజ్యం వేస్తాడు. అప్పుడూ పరిహాసానికి గురవుతాడు. అతడు న్యాయం కోసం చేసే నిరంతర పోరాటమే చట్టముమ్ నీతియుమ్. పలు ఆసక్తికరమైన అంశాలతో సహజత్వానికి దగ్గరగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో పరుత్తివీరన్ శరవణన్ న్యాయవాదిగా ప్రధానపాత్ర పోషించారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం (జూలై 18) నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: హీరోయిన్ ఫామ్‌హౌస్‌లో దొంగతనం.. సీసీటీవీలు ధ్వంసం! -
5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఓటీటీలోకి కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు మూవీస్‌ని చూసేందుకు మన ప్రేక్షకులు కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం రెండు మూడుకు మించి వచ్చేస్తుంటాయి. అలా వీకెండ్ టైమ్ పాస్ చేసేస్తుంటారు. ఈ వారం కూడా తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం)కుబేర, భైరవం మాత్రమే ఈ వీకెండ్ ఓటీటీలో రిలీజైన వాటిలో కొత్త సినిమాలు. వీటితో పాటు 'గార్డ్' అనే తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉంటే దీనిపై లుక్కేయొచ్చు.'గార్డ్' విషయానికొస్తే.. షూటింగ్ అంతా ఫారిన్లోనే తీశారు. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే హీరో. ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంలో నిషేధిత ల్యాబ్‌లోకి అడుగుపెట్టి ఓ అమ్మాయిని రక్షిస్తాడు. అప్పటినుంచి వింత వింత సంఘటనలన్నీ జరుగుతుంటాయి. ఓ అమ్మాయి దెయ్యం రూపంలో కనిపిస్తూ అందరికీ భయపెడుతూ ఉంటుంది. మరి చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో రిలీజయ్యే మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఆయా సినిమాల్ని నేరుగా మన దగ్గర స్ట్రీమింగ్ చేస్తుంటారు. గత కొన్నాళ్లలో చూసుకుంటే నాయట్టు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ తదితర మూవీస్ ఇలానే ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీటి బాటలోనే మరో చిత్రం కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం)దిలీష్ పోతన్, రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రోంత్'. ఈ టైటిల్‌కి అర్థం 'రాత్రి గస్తీ'. పాట్రోలింగ్ చేసే ఇద్దరు పోలీసులు.. ఒకేరోజు జరిగే సంఘటనల వల్ల ఎలా ప్రభావితమయ్యారు? వీళ్లు ఆ క్షణంలో తీసుకునే నిర్ణయాలు వీళ్ల జీవితాల్ని ఎలా తలకిందులు చేశాయనే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పోలీస్ వ్యవస్థ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.పాము తన గుడ్లని తానే తినేసినట్లు.. అనుకోని పరిస్థితి వస్తే తోటి పోలీసుల్ని, పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తారు అనేది ఇందులో చక్కగా చూపించారు. సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే అస్సలు ఊహించలేరు. అలా ఉంటుంది. గత నెల 13న థియేటర్లలో చిత్రం రిలీజ్ కాగా.. ఈ నెల 22 నుంచి అంటే వచ్చే మంగళవారం నుంచి హాట్‌స్టార్‌లో 'రోంత్' స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చూడొచ్చు.(ఇదీ చదవండి: టీజర్‌ని టార్గెట్ చేశారు.. 'విశ్వంభర' స్టోరీ ఇదే: వశిష్ట) -
ఓటీటీలో 'హౌస్‌ఫుల్ 5'.. సడెన్‌గా స్ట్రీమింగ్
హిందీ చిత్రపరిశ్రమలో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీస్‌లో ‘హౌస్‌ఫుల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఐదో సినిమా ‘హౌస్‌ఫుల్ 5’.. జూన్ 6న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా స్ట్రీమింగ్కు రావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖ తారలు ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాలో నటించారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మించారు.కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్5’ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ మూవీ చూడాలంటే రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ముందు భాగాలకు పూర్తి భిన్నంగా మరింత నవ్వులు పంచేలా సినిమా ఉండటంతో భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 250 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. హౌస్‌ఫుల్ 5 విమర్శకుల నుంచి మిశ్రమ-ప్రతికూల రివ్యూలను అందుకుంది. అయితే, ఇందులోని మహిళల పాత్రల గురించి కాస్త విమర్శలు వచ్చాయి. వారిని వస్తువు రూపంలో చూపించారనే అపవాదు వచ్చింది. ఈ చిత్రం హౌస్‌ఫుల్ 5A, హౌస్‌ఫుల్ 5B అనే రెండు వెర్షన్లలో విడుదలైంది. ఇందులో భిన్నమైన క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. -
వీకెండ్లో చిల్ అవ్వండి.. ఓటీటీల్లో ఒక్కరోజే 16 చిత్రాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు థియేటర్ల సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఈ వారంలో శ్రీలీల- కిరీటి జంటగా నటించిన జూనియర్‌పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు రానా సమర్పణలో వస్తోన్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ధనుశ్- నాగార్జున నటించిన కుబేర డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన భైరవం సైతం ఓటీటీలో అలరించనుంది. బాలీవుడ్ నుంచి స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, ద భూత్ని చిత్రం ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ శుక్రవారమే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుందా? అయితే ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.అమెజాన్ ప్రైమ్కుబేర (తెలుగు మూవీ) - జూలై 18నెట్ఫ్లిక్స్వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18వాల్ టూ వాల్ - (కొరియన్ సినిమా)- జూలై 18డెరిలియమ్ - (వెబ్ సిరీస్)- జూలై 18ఆల్మోస్ట్ ఫ్యామిలీ(బ్రెజిలియన్ కామెడీ చిత్రం)- జూలై 18డిలైట్‌ఫుల్లీ డిసీట్ఫుల్(హాలీవుడ్ మూవీ)- జూలై 18జియో హాట్స్టార్స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 18స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18జీ5భైరవం (తెలుగు సినిమా) - జూలై 18ద భూత్ని (హిందీ మూవీ) - జూలై 18సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) - జూలై 18ఆపిల్ ప్లస్ టీవీసమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 18మనోరమ మ్యాక్స్అస్త్ర(మలయాళ థ్రిల్లర్)- జూలై 18 -
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
ఓటీటీల రాకతో సినిమా చూసే ప్రేక్షకులకు సదుపాయం బాగా పెరిగిపోయింది. ఏ మూవీని థియేటర్లో చూడాలి? దేన్ని మొబైల్లో చూడాలనేది ముందే ఫిక్సయిపోతున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం థియేటర్లకు జనాలు రావట్లేదు అని గగ్గోలు పెడుతున్నారు. మరీ నెలలోపే కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుండటం ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని డబ్బింగ్ చిత్రాల పరిస్థితి ఇంకా దారుణం.గత నెల 20న తమిళంలో 'డీఎన్ఏ' అనే సినిమా రిలీజైంది. పాజిటివ్ టాక్ అందుకుంది. 'గద్దలకొండ గణేష్'తో తెలుగులోనూ నటించిన అధర్వ మురళి ఇందులో హీరోగా నటించాడు. మలయాళ బ్యూటీ నిమిషా సజయన్ హీరోయిన్. 2014లో ఓ సాఫ్ట్వేర్, ఆర్టిటెక్ట్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. తమిళంలో మంచి టాక్ వచ్చింది. దీన్ని తెలుగులో 'మై బేబీ' పేరుతో ఈ నెల 18న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)ఇప్పుడు సడన్‌గా 'డీఎన్ఏ' ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చింది. అంటే తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైన ఒక్కరోజుకే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుందనమాట. ఇలా అయితే థియేటర్లకు వెళ్లాలనుకునే ఒకరు ఇద్దరు కూడా వెనకడుగు వేస్తారు. మరి ఓటీటీ డేట్ తెలియకుండా తెలుగులో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారా? లేదంటే ఓటీటీ సంస్థ సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందా అనేది తెలియట్లేదు.'డీఎన్ఏ' విషయానికొస్తే.. ఆనంద్(అధర్వ మురళి) లవ్ ఫెయిలవడంతో తాగుబోతుగా మారతాడు. కొన్నాళ్లకు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉన్న దివ్య(నిమిషా సజయన్)ని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆనంద్‌లో మార్పు వచ్చి భార్యతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్నాళ్లకు దివ్య ప్రెగ్నెంట్ అవుతుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్తారు. ప్రసవం అయిన కాసేపటికే ఈ బిడ్డ తన బిడ్డ కాదని, ఎవరో మార్చేశారని దివ్య, డాక్టర్లని నిలదీస్తుంది. ఇంతకీ దివ్య చెప్పింది నిజమేనా? చివరకు బిడ్డ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ మూవీ) -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఓటీటీలో కంటెంట్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో మేకర్స్ సైతం సరికొత్త మిస్టరీ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణీ కపూర్ లీడ్‌రోల్ పోషించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్‌లో వాణీకపూర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్‌దాస్‌పూర్‌లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఈనెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ మూవీ
హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలంటే ఇష్టమా? మీ కోసమే రీసెంట్ హిట్ మూవీ లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెలలో థియేటర్లలో రిలీజై దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం)గతంలో యానిమేషన్ రూపంలో నాలుగైదు భాగాలుగా వచ్చి ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం 'హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్'. ఇప్పుడు దీన్ని లైవ్ యాక్షన్ మూవీగా తీశారు. ఇది ఇప్పుడు మంగళవారం నుంచి వీడియో ఆన్ డిమాండ్ అంటే రెంట్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.'హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్' విషయానికొస్తే.. బర్క్ అనే దీవిపై సమీపంలో ఉండే డ్రాగన్స్ ఎప్పటికప్పుడు దాడి చేస్తుంటాయి. పశువులని ఎత్తుకెళ్తుంటాయి. గ్రామస్థులు వాటిని చంపాలని చూస్తుంటారు కానీ కుదరదు. ఓ రోజు స్టాయిక్ ది వాస్ట్ అనే యోధుడి కుమారుడు హికప్ హాడక్ వల్ల అరుదైన నైట్ ఫ్యూరీ జాతికి చెందిన డ్రాగన్ తీవ్రంగా గాయపడుతుంది. దాన్ని రక్షించి, దానితోనే స్నేహం చేస్తాడు. మరి చివరకు డ్రాగన్స్ సమస్యని ఆ ఊరి ప్రజలు తీర్చారా లేదా అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్) -
ఐదేళ్ల తర్వాత సినిమాగా తెలుగు వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ ప్రియులను అలరించిన ఆసక్తికర వెబ్ సిరీస్ మస్తీస్. లాక్ డౌన్ టైమ్‌లో వచ్చిన ఈ సిరీస్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2020లో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సిరీస్‌కు క్రిష్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ వెబ్ సిరీస్‌ను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూలై 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌లో నవదీప్, హెబ్బా పటేల్, బిందు మాధవి, చాందిని చౌదరి, అక్షర గౌడ, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా చెప్పుకోదగ సినిమాలేం థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. ఉన్నంతలో 'జూనియర్' కాస్త ఆకట్టుకునేలా ఉంది. ఎందుకంటే గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఇది. శ్రీలీల హీరోయిన్ కావడంతో కాస్త హైప్ ఏర్పడింది. దీనితో పాటు కొత్తపల్లిలో ఒకప్పుడు, పోలీస్ వారి హెచ్చరిక అనే మరో రెండు చిత్రాలు కూడా ఈ వీకెండే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: లారెన్స్‌ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు')మరోవైపు ఓటీటీలోనూ 15 చిత్రాలు-వెబ్ సిరీసులే స్ట్రీమింగ్ కానున్నప్పటికీ వీటిలో ఐదు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. కుబేర, భైరవం లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్తోపాటు ద భూత్ని అనే హిందీ చిత్రం, స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, గుటర్ గూ సీజన్ 3 సిరీస్‌లు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చిందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 14 నుంచి 20 వరకు)అమెజాన్ ప్రైమ్కుబేర (తెలుగు మూవీ) - జూలై 18నెట్ఫ్లిక్స్అపాకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 14ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ సీజన్ 1 (జపనీస్ ఎనిమీ సిరీస్) - జూలై 14వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18హాట్స్టార్కోయిటల్, హీరో అండ్ బీస్ట్ (స్పానిష్ సిరీస్) - జూలై 15స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 18స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18జీ5భైరవం (తెలుగు సినిమా) - జూలై 18ద భూత్ని (హిందీ మూవీ) - జూలై 18సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) - జూలై 18ఆపిల్ ప్లస్ టీవీసమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 18ఎమ్ఎక్స్ ప్లేయర్గుటర్ గూ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూలై 17(ఇదీ చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!') -
ఓటీటీలోకి కొత్త సినిమా.. అప్డేట్ ఇచ్చిన హీరో
ప్రస్తుతం చిన్న సినిమాలని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. మరీ బాగుంది అంటే తప్పితే థియేటర్లకు వెళ్లి వీటిని చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు. అయినా సరే యంగ్ హీరోలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ కూడా రీసెంట్‌గానే తన కొత్త సినిమాతో వచ్చాడు. ఇప్పుడు ఇది థియేటర్లలో ఉండగానే ఓటీటీ రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చేశాడు.బిగ్‌బాస్ 7, 8 సీజన్లలో పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ 7వ సీజన్ పూర్తయిన తర్వాత ఈ మూవీ మొదలుపెట్టాడు. దాని షూటింగ్ అంతా పూర్తి చేసి ఈ నెల 4న థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రమోషన్లు కాస్తోకూస్తో చేశారు. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది గానీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: ఒక్క పాటతో పూజా హెగ్డే కంటే ఫేమస్.. ఎవరీ నటుడు?)ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాని ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నట్లు హీరో గౌతమ్ కృష్ణ పోస్ట్ పెట్టాడు. త్వరలో స్ట్రీమింగ్ అప్డేట్ ఉంటుందని అన్నాడు. అంటే మరో వారంలో డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేస్తుందేమో?'సోలోబాయ్' విషయానికొస్తే.. కృష్ణమూర్తి(గౌతమ్ కృష్ణ) మిడిల్ క్లాస్ కుర్రాడు. ఇంజినీరింగ్ చదువుతూ ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. కానీ ఓ సందర్భంలో ఆమె బ్రేకప్ చెప్పడంతో మద్యానికి బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరతాడు. అక్కడ శ్రుతి(శ్వేత అవస్తి) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు భార్య విడాకులు.. వీటన్నింటిని తట్టుకొని కృష్ణ మూర్తి మిలియనీర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) View this post on Instagram A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna) -
ఓటీటీలోకి ప్రియాంక చోప్రా యాక్షన్ కామెడీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’.. కథేంటంటే?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం హెడ్స్ ఆఫ్ స్టేట్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఏదైనా సినిమా చూసే ప్రేక్షకులకు తాము చూసే ఆ సినిమా పై కొంత అవగాహన, కొంత ఊహ ఉంటాయి. ఆ ప్రేక్షకుల అవగాహనను, ఊహను పటాపంచలు చేస్తూ ఉత్కంఠభరితంగా సినిమాని తీసుకువెళ్లగలిగితే అప్పుడు ప్రతిభగల దర్శకుడు అనిపించుకుంటారు. ఆ విషయంలో ఈ సినిమా దర్శకుడు ఓ అయిదాకులు ఎక్కువే తిన్నారని చెప్పవచ్చు. నాయిషుల్లర్ దర్శకత్వంలో వచ్చిన ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఓ ఊహకందని యాక్షన్ కామెడీ మూవీ అనొచ్చు. ప్రైమ్ వీడియో వేదికగా ఈ పూర్తి యాక్షన్ థ్రిల్లర్ కామెడీ స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ప్రేక్షకుడి ఊహకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. కథ సింపుల్ అయినా ఆ స్టోరీ లైన్ విచిత్రంగా ఉంటుంది. అంతలా ఈ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం. ఈ సినిమా కథ ప్రకారం యూఎస్, యూకె ప్రెసిడెంట్లు బద్ధ శత్రువులు. కానీ ఓ అనుకోని మీటింగ్‌లో ఇద్దరూ కలవాల్సి వస్తుంది. అయితే అదే మీటింగ్ నుండి ఈ ఇద్దరినీ ఓ ప్లాన్ ప్రకారం ఒకే ఫ్లైట్‌లో ఓ ఐల్యాండ్‌కు పంపుతాడు విలన్. ఎడమొహం అంటే పెడమొహం అనుకునే అత్తాకోడళ్ళలా కొట్టుకునే ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే నడుస్తుంది. ఇంతలో ఆ ఫ్లైట్‌ను విలన్ అనుచరులు దాడి చేసి, కూల్చేస్తారు. యూఎస్, యూకె ప్రెసిడెంట్లు ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ ఎక్కడో మారుమూల చిట్టడివిలో కూలిపోతే ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంది. దాదాపుగా అందరూ వీళ్ళిద్దరూ చనిపోయారనుకుంటారు. కానీ అక్కడి నుండి బయటపడి వీరిద్దరూ విలన్ని ఎలా కట్టడి చేస్తారనేది సినిమాలోనే చూడాలి. ప్రముఖ నటులు జాన్ సేనా, ఇడ్రిస్ ఎల్బా ప్రధాన పాత్రలలో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు. వీళ్ళకి తోడుగా ఏజెంట్ పాత్రలో మన భారతీయ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నటించడం విశేషం. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా లైన్‌తో పాటు ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ఊహతో సంబంధం లేకుండా నడుస్తుంది. అంతేకాదు... సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. అన్ని భాషల సినిమాలు థియేటర్లకు వెళ్లి చూడలేం కాబట్టి డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అందుకు తగ్గట్లు ఓటీటీ సంస్థలు కూడా హాలీవుడ్‌తోపాటు విదేశీ భాషల్లో తెరకెక్కిన చిత్రాల్ని మన ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హాలీవుడ్లో తీసిన కరాటే మూవీ సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)చైనీస్ నటుడు జాకీ చాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు. 2010లో 'కరాటే కిడ్' అనే మూవీ చేశాడు. అది తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తోనే తీసిన మూవీ 'కరాటే కిడ్: లెజెండ్స్'. మే 30న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.సినిమా విషయానికొస్తే.. ఓ చైనీస్ కుర్రాడు తల్లితో కలిసి అమెరికా వచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన కంగ్ ఫూని కూడా పక్కనబెట్టేస్తాడు. అయితే కాలేజీలో ఓ ఆకతాయి కుర్రాడు.. ఇతడిని ఇబ్బంది పెడతాడు. దీంతో ఇద్దరు మాస్టర్స్ ఆధ్వర్యంలో మళ్లీ కంగ్ ఫూ ప్రాక్టీస్ చేయడంతో పాటు కరాటే నేర్చుకుంటాడు. మరి చివరకు ఏమైంది? ఆకతాయికి చైనీస్ కుర్రాడు కరాటేతో సమాధానమిచ్చాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో థియేటర్లలోకి వచ్చిన హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ 'కుబేర'. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. యునానిమస్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. అయితేనేం ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై ఉండగానే డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం)విడుదలకు ముందు 'కుబేర' ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పుడు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో మిస్ కావొద్దు.'కుబేర' విషయానికొస్తే.. దీపక్ (నాగార్జున) సీబీఐ ఆఫీసర్. అక్రమ కేసు కారణంగా జైలులో ఉంటాడు. దేశంలో సంపన్నుడైన నీరజ్ మిత్రా(జిమ్ షర్బ్) ఇతడిని బయటకు తీసుకొస్తాడు. ఓ ఆయిల్ డీల్ విషయమై లక్ష కోట్ల రూపాయలని ప్రభుత్వంలో పెద్దలకు ఇవ్వడంలో భాగంగా దీపక్‌ని వాడుకోవాలనేది నీరజ్ ప్లాన్. ఈ క్రమంలోనే దేవా (ధనుష్)తో పాటు మరో ముగ్గురు అనాథల పేరుపై బినామీ కంపెనీలు సృష్టిస్తాడు దీపక్. వాళ్ల అకౌంట్స్ నుంచి ప్రభుత్వ పెద్దలకు డబ్బులు చేరవేయాలనేది ఆలోచన. అయితే... దీపక్, నీరజ్ మిత్రా గ్యాంగ్ నుంచి దేవా తప్పించుకుంటాడు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న నీరజ్ మిత్రాని ఓ బిచ్చగాడు ఎన్ని ఇబ్బందులకు పెట్టాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సినిమా టికెట్ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు) -
ఓటీటీలో టేస్టీ తేజ సినిమా.. చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘6జర్నీ’. మే 9న విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బసీర్ ఆలూరి దర్శకత్వం వహించారు.'6జర్నీ' సినిమా సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ మూవీలో పెద్ద స్టార్లు ఎవరూ లేకపోవడంతో థియేటర్లలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. అయితే, ఈ సినిమాను చూడాలంటే రూ. 149 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడిలేని ఈ చిత్రానికి అదనంగా రెంట్ చెల్లించడం ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. -
'రాజాసాబ్' విలన్ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హారర్ సినిమా 'ద భూతిని' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. సంజయ్ దత్ (Sanjay Dutt) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మౌనీ రాయ్, సన్నీ సింగ్, పాలక్ తివారి కీలక పాత్రలు పోషించారు. సిద్దాంత్ కుమార్ సచ్దేవ్ దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్తో పాటు దీపక్ ముకుత్ నిర్మించారు.నెలన్నర తర్వాతే ఓటీటీలో రిలీజ్మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తాజాగా జీ5 ద భూతిని ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. జూలై 18న జీ5లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో క్లిప్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. సినిమా బాలేదంటే నెల తిరిగేలోపే ఓటీటీలో రిలీజ్ చేస్తారు. కానీ ఈ చిత్రాన్ని మాత్రం నెలన్నర గ్యాప్ తర్వాతే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.సినిమాలుసంజయ్ దత్ విషయానికి వస్తే.. బాలీవుడ్లో హీరోగా, విలన్‌గా అనేక సినిమాలు చేశాడు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నాడు. ఈయన కీలక పాత్రలో నటించిన ది రాజా సాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈయన హిందీలో యాక్ట్ చేసిన ధురంధర్ మూవీ కూడా అదే రోజు (డిసెంబర్ 5నే) రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాకూడదని కోరుకుంటున్నాడు సంజయ్. Pyaar, panic, aur ek possessive bhootnii — jab bhootnii takrayegi baba se, shuru hoga full-on madness! #TheBhootnii premieres on 18th July, 8 pm, on #ZEE5 & #ZEECinema#TheBhootniiOnZEE5 pic.twitter.com/SmzceTDH6j— ZEE5Official (@ZEE5India) July 10, 2025 చదవండి: యాంకరింగ్‌లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను -
ఈ వీకెండ్లో ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ ఫ్రైడే ఇప్పటికే థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. తెలుగులో సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీపైనే అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు తెలుగులో వర్జిన్ బాయ్స్, ద 100 సినిమాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి మాలిక్.. హాలీవుడ్ నుంచి సూపర్ మ్యాన్ బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సుహాస్ మూవీ కోసమే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీల్లోనూ చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వీకెండ్లో కూడా మిమ్మల్ని అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో ఇటీవలే విడుదలైన 8 వసంతాలు, ఆర్జీవీ తెరకెక్కించిన శారీ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కలియుగం, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తిగా ఉన్నాయి. జూలై 11న ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఫ్యామిలీతో కలిసి మీకు నచ్చిన సినిమాను చూసి ఈ వీకెండ్లో ఎంజాయ్ చేయండి.జియో హాట్‌స్టార్..ద రియల్ హౌస్‌వైఫ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ (సీజన్ 9) - జూలై 11జాస్ ది డిఫినేటివ్ ఇన్సైడ్ వెడ్డింగ్- జూలై 11బరీడ్ ఇన్ ద బ్యాక్‌యార్డ్ (సీజన్ 6) - జూలై 13నెట్‌ఫ్లిక్స్8 వసంతాలు (తెలుగు సినిమా) -జులై 11ఆప్ జైసే కోయ్ - జూలై 11మడియాస్ డెస్టినేషన్ వెడ్డింగ్ - జూలై 11ఎమోస్ట్ కాప్స్ - జూలై 11డిటెక్టివ్ ఉజ్వలన్(మలయాళ సినిమా) -జులై 11ఆహాశారీ(తెలుగు సినిమా)- జూలై 11కలియుగం(తెలుగులో)- జూలై 11సన్నెక్స్ట్కలియుగం(తమిళంలో) - జూలై 11కర్కి(కన్నడ సినిమా)- జూలై 11మనోరమ మాక్స్మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ - జూలై 11సోనీలివ్నరివెట్ట(మలయాళ సినిమా)- జూలై 11(స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ టీవీ ప్లస్ఫౌండేషన్ (సీజన్ ) - జూలై 11లయన్స్‌గేట్ ప్లేఫోర్ ఇయర్స్ లేటర్ - జూలై 11జాస్ @ 50: ద డెఫినిటివ్ ఇన్సైడ్ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11మిస్టర్ రాణి - జూలై 11ద సైలెంట్ అవర్ - జూలై 11బుక్ మై షోపాల్ అండ్ పాలెట్ టేక్ ఎ బాత్ - జూలై 11 -
ఓటీటీలో ‘మోతేవరి లవ్‌స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?
అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘మోతేవరి లవ్‌స్టోరీ’. ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్‌గా తెరకెక్కిన ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ ఆగస్ట్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. నటుడు ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్, టైటిల్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. లంబాడిపల్లి అనే గ్రామంలోని ఇద్దరు సోదరులు, స్వర్గస్తులైన తండ్రి ఓ మహిళకు రాసిచ్చిన ఐదు ఎకరాల భూమి, రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్ జీలా) జంట, ఈ భూ వివాదం, కుటుంబ గర్వం, వారసత్వం మధ్య సాగే ఈ సిరీస్ ఆద్యంతం అందరినీ అలరించేలా ఉంటుంది. ఈ ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ టైటిల్, పోస్టర్ రిలీజ్ అనంతరం..ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ .. ‘నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా.. చిన్న సిరీస్, పెద్ద సిరీస్ అని అనడం నాకు నచ్చదు. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే టైటిల్, పోస్టర్ చాలా కొత్తగా ఉంది. నాకు ఇలా ఈవెంట్లకు రావడం కాస్త భయం. కానీ అనిల్ పిలిచిన వెంటనే రావాలని అనిపించింది. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి వారు మై విలేజ్ షో కంటెంట్‌ను చూసేవాళ్లు. నేను కూడా ఫాలో అయ్యేవాడ్ని. మధుర శ్రీధర్ గారు నా దొరసాని సినిమాను నిర్మించి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ మూవీకి మై విలేజ్ షో కంటెంట్ చూసే డైలాగ్స్, యాసను నేర్చుకున్నాను. నా జర్నీలో మై విలేజ్ షో టీం పాత్ర చాలా ఉంది. ఈ సిరీస్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పెద్ద సక్సెస్ రావాలి. ఈ సిరీస్‌కు సీక్వెల్స్ వస్తూనే ఉండాలి. సక్సెస్ అవుతూనే ఉండాలి’ అని అన్నారు.అనిల్ జీలా మాట్లాడుతూ ..‘మా ‘మై విలేజ్ షో’ టీం నుంచి మొదటి సారిగా ఇలా సిరీస్ చేశాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్‌కే కథను ఓకే చేశారు. జీ5 టీం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. మేం ఇప్పటి వరకు ఎన్నో సార్లు చూశాం. ఆద్యంతం నవ్వుకుంటూనే ఉన్నాం. నన్ను విజయ్ దేవరకొండ అన్ననే సినిమాల్లోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు నా కోసం వచ్చిన ఆనంద్ అన్నకి థాంక్స్. మా సిరీస్ ఆగస్ట్ 8న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. -
ఒక రోజు ముందుగానే ఓటీటీకి వచ్చిన సూపర్ హిట్ మూవీ
మలయాళీ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'నరివెట్ట'. ఈ చిత్రానికి అనురాగ్ మనోహర్ దర్శకత్వం వహించారు. తెలుగులో మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2003లో జరిగిన ముతంగ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఐడెంటిటీ హిట్ తర్వాత టోవినో థామస్ మరో మూవీని సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. సోనీ లివ్ వేదికగా నరివెట్ట మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇంకేందుకు ఆలస్యం ఈ బ్లాక్‌బస్టర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రంలో వెంజరమూడు, చేరన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.Digital Premiere:Kannada Version Of Malayalam Film #Narivetta(2025) Now Streaming On @SonyLIVLink:https://t.co/l80BCRNHnNIMDb: 7/10Also Available In Telugu, Tamil & Hindi #KannadaDubbed pic.twitter.com/DnojlPyUrr— Shrikrishna (@Shrikrishna_13) July 10, 2025 -
ఓటీటీలో 'డిటెక్టివ్' సినిమా స్ట్రీమింగ్
మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా 'డిటెక్టివ్ ఉజ్వలన్'.. ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మిస్టరీ కామెడీ జానర్లో దర్శకులు ఇంద్రనీల్ గోపికృష్ణన్, రాహుల్ సంయుక్తంగా తెరకెక్కించారు. సోఫియా పాల్ వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 23న విడుదలైన ఈ చిత్రం రూ. 4.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. ఈ చిత్రం మలయాళంలో రూ. 10 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టింది.డిటెక్టివ్ ఉజ్వలన్ (Detective Ujjwalan) చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా జులై 11 నుంచి అందుబాటులోకి రానుందని ఆ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఎలాంటి నేరాలు జరగనటువంటి ప్రశాంతమైన ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ ఉంటే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది. గ్రామ డిటెక్టివ్‌గా పనిచేస్తున్న ఉజ్వలన్ (ధ్యాన్ శ్రీనివాసన్) ఆ సీరియల్ కిల్లర్‌ను ఎలా కనిపెడితాడు..? అతన్ని పట్టించేందుకు పోలీసులకు ఎలాంటి సాయం చేశాడు..? ఆ సీరియల్ కిల్లర్ చేసిన హత్యలు ఏంటి..? వంటి అంశాలు ఈ చిత్రంలో ఆసక్తిగా తెరకెక్కించారు. -
ఆసక్తికర వెబ్ సిరీస్ వాయిదా.. కొత్త స్ట్రీమింగ్ ఇదే!
గతంలో ఓటీటీ ప్రియులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే స్పెషల్ ఓపీఎస్ సీజన్-2 ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ప్రకటించారు. జూలై 11 నుంచే స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.అయితే తాజాగా మేకర్స్ స్పెషల్ ఓపీఎస్-2 వెబ్ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేశారు. ఈ నెల 18 నుంచి వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తుందని మేకర్స్ వీడియో ద్వారా తెలిపారు. కొన్నిసార్లు అన్ని మనచేతుల్లో ఉండవని అందుకే వాయిదా వేయాల్సి వచ్చిందని నటుడు కేకే మేనన్ పేర్కొన్నారు. మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదని ఆడియన్స్‌ను కోరారు. ఈ సారి అన్ని ఎపిసోడ్స్ ఓకేసారి స్ట్రీమింగ్ చేస్తామని తెలిపారు.కాగా.. ఈ వెబ్ సిరీస్‌లో కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త కీలక పాత్రలు పోషించారు. స్పై యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్‌కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ జూలై 18 నుంచి జియోహాట్‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రెండో సీజన్లో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు.We understand you're on the edge of your seat, but thoda aur intezar and it’s going to be worth all the wait! #HotstarSpecials #SpecialOps2, all episodes streaming from July 18, only on #JioHotstar#SpecialOps2OnJioHotstar pic.twitter.com/ky15pZPgnh— JioHotstar (@JioHotstar) July 8, 2025 -
ఓటీటీలోకి ముగ్గురు హీరోల మాస్ డ్రామా ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు యువ హీరోలు కలిసి నటించిన చిత్రం భైరవం(Bhairavam). విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్ బస్టర్ 'గరుడన్’ తెలుగు రీమేకే ఈ భైరవం. ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి ఈ ఏడాది మే 30న థియేటర్స్‌లో విడుదల చేయగా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. జులై 18 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 సంస్త అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ని విడుదల చేసింది.భైరవం కథేంటంటే..తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్), వరద(నారా రోహిత్),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు.మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శీను ఎలా రక్షించాడు. గజపతి గురించి శీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అమ్మవారి పూనకం వచ్చే శీను.. న్యాయం కోసం చివరకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా పని చేశారు.Powerful. Intense. A story that leaves you with an afterthought - BHAIRAVAM Get ready for a high voltage thrillerPremieres 18th Jul@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @DirVijayK @AditiShankarofl @anandhiactress @DivyaPillaioffl @KKRadhamohan @dophari @satyarshi4u pic.twitter.com/3i6s0aKJKI— ZEE5 Telugu (@ZEE5Telugu) July 8, 2025 -
ఓటీటీలో 'శారీ' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’(Saaree Movie ) సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, 'ఆహా'లో కూడా ఈ చిత్రం విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటన వచ్చేసింది. జుల్లై 11 నుంచి ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ ఉవుతుందని ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా నటించారు.కథ ఏంటి..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ. -
సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఐదో సీజన్.. మేకర్స్ అఫీషియల్ ప్రకటన
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌ల్లో పంచాయత్ ముందు వరుసలో ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సిరీస్‌కు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవలే నాలుగో సీజన్ విడుదలై అభిమానులను అలరించింది. దీంతో మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. త్వరలోనే మీ ముందుకు వస్తామంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాదిలో పంచాయత్ ఐదో సీజన్ రానుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 2026లో మీ ముందుకొస్తామని మేకర్స్ వెల్లడించారు.జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు దీపిక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇటీవలే నాలుగో సీజన్ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.Hi 5 👋 Phulera wapas aane ki taiyyaari shuru kar lijiye 😌#PanchayatOnPrime, New Season, Coming Soon@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77 @Sanvikka #DurgeshKumar… pic.twitter.com/59R6Xvj3R1— prime video IN (@PrimeVideoIN) July 7, 2025 -
ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్
అందమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం '8 వసంతాలు'.. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే, తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ మూవీ ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.8 వసంతాలు చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. జులై 11న స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. '8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీకెండ్లో చూడతగిని చిత్రమేనని చెప్పొచ్చు.కథ ఏంటి..?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ. -
థియేటర్లో చిన్న చిత్రాలు.. ఓటీటీలో 26 సినిమాలు/ సిరీస్‌లు
జూలై మొదటివారంలో నితిన్ తమ్ముడు సినిమా రిలీజైంది. దీనికి పోటీగా పెద్ద సినిమాలేవీ లేవు. అయినా ఈ అవకాశాన్ని నితిన్ మిస్ చేసుకున్నాడు. తమ్ముడు కథలో బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ దిశగా సాగిపోతోంది. మరోవైపు పెద్ద సినిమాలన్నీ వాయిదా దిశగా వెళ్తుండటంతో ఈ వారం చిన్న సినిమాలు థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అటు ఓటీటీలోనూ కొత్త కంటెంట్ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయింది. మరి అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..థియేటర్ రిలీజయ్యే చిత్రాలుఓ భామ అయ్యో రామా - జూలై 11వర్జిన్ బాయ్స్ - జూలై 11ద 100 - జూలై 11మాలిక్ (బాలీవుడ్ మూవీ) - జూలై 11సూపర్ మ్యాన్ (హాలీవుడ్) - జూలై 11ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్లుజియో హాట్స్టార్మూన్ వాక్ - జూలై 8రీఫార్మ్‌డ్ - జూలై 9స్పెషల్ ఓపీఎస్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - జూలై 11ద రియల్ హౌస్‌వైఫ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ (సీజన్ 9) - జూలై 11బరీడ్ ఇన్ ద బ్యాక్‌యార్డ్ (సీజన్ 6) - జూలై 13నెట్ఫ్లిక్స్ట్రైన్వ్రెక్: ద రియల్ ప్రాజెక్ట్ ఎక్స్ - జూలై 8జియామ్ - జూలై 9అండర్ ఎ డార్క్ సన్ (వెబ్ సిరీస్) - జూలై 9సెవెన్ బియర్స్ (యానిమేషన్ సిరీస్) - జూలై 10టూమచ్ - జూలై 10బ్రిక్ - జూలై 10ఎ బ్రదర్ అండ్ 7 సిబ్లింగ్స్ - జూలై 10ఆప్ జైసే కోయ్ - జూలై 11మడియాస్ డెస్టినేషన్ వెడ్డింగ్ - జూలై 11ఎమోస్ట్ కాప్స్ - జూలై 11అమెజాన్ ప్రైమ్ వీడియోబల్లార్డ్ (వెబ్ సిరీస్)- జూలై 9సోనీలివ్నరివెట్ట - జూలై 11సన్నెక్స్ట్కలియుగం - జూలై 11మనోరమ మాక్స్మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ - జూలై 11ఆపిల్ టీవీ ప్లస్ఫౌండేషన్ (సీజన్ ) - జూలై 11లయన్స్‌గేట్ ప్లేఫోర్ ఇయర్స్ లేటర్ - జూలై 11జాస్ @ 50: ద డెఫినిటివ్ ఇన్సైడ్ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11మిస్టర్ రాణి - జూలై 11ద సైలెంట్ అవర్ - జూలై 11బుక్ మై షోగుడ్ వన్ (హాలీవుడ్) - జూలై 8పాల్ అండ్ పాలెట్ టేక్ ఎ బాత్ - జూలై 11చదవండి: నాలుగో భార్య వచ్చిన వేళావిశేషం.. లాటరీ గెలిచిన నటుడు -
ఓటీటీలోకి హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. ‘క్లీనర్’ కథేంటి?
ఊహించని, ఊహకందని విషయాలను మనం చూడగలిగేది వెండితెర మీదే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సన్నివేశాలతో ప్రేక్షకులను రక్తి కట్టించే దర్శకుల ఊహ మాత్రం ఎవరి ఊహకూ అందనిది. అటువంటి ఊహతోనే అల్లుకున్న కథ ఈ క్లీనర్ సినిమా. ఈ కథ లైన్ ఎంత చిన్నది గా ఉంటుందో కథ నడిచే తీరు మాత్రం అందనంత ఎత్తులో ఉంటుంది. గంటన్నర నిడివితో ఉన్న సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. జోయే తన తమ్ముడు మైఖేల్ తో లండన్ లో ఓ అపార్ట్ మెంట్లో ఉంటుంది. మైఖేల్ ఆటిజమ్ వ్యాధి బారిన పడ్డ స్పెషల్ ఛైల్డ్, కాని మంచి టాలెంటెడ్ కిడ్. జోయే ఆర్మీలో పని చేసిన అమ్మాయి ఇప్పుడు మాత్రం పోషణ కోసం ఆగ్నియన్ యనర్జీ సంస్థ కి సంబంధించన బిల్డింగ్ లో క్లీనర్ గా చేస్తుంటుంది. ఓ రోజు ఆ బిల్డింగ్ లో పెద్ద పార్టీ జరుగుతుంది. దాని కోసంగా వంద అంతస్తుల బిల్డింగ్ లోని పై ఫ్లోర్ అద్దాలు క్లీన్ చేయాలని జోయేకు టాస్క్ ఇస్తాడు మేనేజర్. తను ఆ పని చేస్తున్నపుడు తన తమ్ముడిని ఓ సూపర్ వైజర్ దగ్గర వదిలి పెట్టి జోయో గాల్లో వేలాడుతూ అద్దాలను క్లీన్ చేస్తుంటుంది. ఇంతలో బిల్డింగ్ లోకి కొందరు దుండగులు పెద్ద బాంబులు, తుపాకీలతో చొరబడి పార్టీలో ఉన్న విఐపీలనందరినీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. జోయే అద్దాలను క్లీన్ చేస్తూనే ఇదంతా గమనిస్తూ తన తమ్ముడి గురించి బెంగపడుతుంది. జోయే గాల్లోనుండి బిల్డింగులోకి రావాలన్నా సూపర్ వైజర్ తన రోప్ ని ఆపరేట్ చేయాలి. కాని దుండగులు ఆ సూపర్ వైజర్ ని చంపేసుంటారు. మరి జోయే అక్కడి నుండి బయటపడి తనను తనతో పాటు తన తమ్ముడిని రక్షించుకోగలదా అన్నదే సినిమా. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ముఖ్యంగా ఈ సినిమాలో జోయే చేసే స్టంట్స్ ఒళ్ళు గగుర్పొడిస్తాయి. అంతేకాదు కథలో చాలా ట్విస్టులతో నడుస్తూ ప్రేక్షకుడి మతి పోగొడుతుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ఈ వీకెండ్ కి మంచి టైంపాస్ మూవీ. ఎంజాయ్ ది క్లీనింగ్ డన్ బై జోయే. -
ఓటీటీలో 'అభిషేక్ బచ్చన్' కొత్త సినిమా రివ్యూ
టైటిల్ : కాళిధర్ లపతానటీనటులు: అభిషేక్ బచ్చన్, దైవిక్ భగేలా, జీషన్ అయూబ్, నిమ్రత్ కౌర్ఓటీటీ: జీ5దర్శకత్వం: మధుమితఇటీవల కొన్ని సినిమాలు ఎక్కువగా నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. చిన్న చిత్రాలు అయినా కంటెంట్ బాగుంటే ఓటీటీలో అదరగొట్టేస్తున్నాయి. ఇటీవల తెలుగులో 'ఉప్పు కప్పురంబు' డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేసింది. అదే రోజు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన మూవీ 'కాళిధర్ లపతా' సైతం ఓటీటీలోనే విడుదలైంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కథ ఆధారంగా వచ్చిన చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. తమిళ చిత్రం 'కె.డి. ఎ. కరుప్పు దురై' సినిమాకు ఇది రీమేక్.కాళిధర్(అభిషేక్ బచ్చన్)ను మతిస్థిమితం లేని వ్యక్తి. ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరితో కలిసి నివసిస్తూ ఉంటాడు. జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతున్న అతని వైద్య ఖర్ఛులు భరించలేక కుటుంబం వదిలించుకోవాలనుకుంటుంది. కంభమేళాలో వదిలించుకోవాలని తోబుట్టువులు ప్లాన్ చేస్తున్నారన్న విషయం అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ. కాళిధర్ (అభిషేక్ బచ్చన్)తోనే ఈ కథ ప్రారంభమవుతుంది. తన కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్న కాళిధర్ తానే దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఓ బస్సు ఎక్కి కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.ఓ గ్రామానికి చేరుకున్న కాళిధర్ అక్కడే ఉన్న ఆలయంలో రాత్రి నిద్రపోతాడు. అక్కడే అతనికి ఎనిమిదేళ్ల బాలుడు బల్లుతో(దైవిక్ భగేలా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అతని జీవితం మలుపు తిరుగుతుంది. వీరిద్దరు వయస్సుతో సంబంధం లేకుండా స్నేహితులుగా ఉంటారు. అయితే కాళిధర్కు మతిస్థిమితం లేదని తెలుసుకున్న బల్లు.. అతన్ని ఇబ్బంది పెడుతుంటాడు. కాళిధర్ను కేడీ అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటాడు. అలా వీరిద్దరు అనాథలే కావడంతో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఈ కథ మొత్తం మధ్యప్రదేశ్‌లో గ్రామాల్లోనే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇద్దరి పరిచయం, గ్రామాల్లో తిరగడం చుట్టే ఉంటుంది. కథ నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.ఓ సారీ కేడీ(కాళిధర్) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు బల్లు వ్యవహరించిన తీరు ఆడియన్స్‌ను ఆలోచింపజేస్తుంది. ఎనిమిదేళ్ల పిల్లాడు మాట్లాడిన తీరు ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మన కోణంలో చూస్తే వాస్తవానికి దూరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కాళిధర్, బల్లు మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య భావోద్వేగ క్షణాలతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కుటుంబమే వద్దనుకున్న ఓ వ్యక్తి జీవితం ఎలా మలుపు తిరిగిందనే విషయాన్ని డైరెక్టర్ ఎమోషనల్‌గా ఆడియన్స్‌కు చూపించారు. వదిలించుకోవాలని చూసిన వాళ్లు సైతం అతని కోసం గ్రామాల వెంట తిరగడం చూస్తే మానవీయ కోణంలోనూ సందేశమిచ్చారు మధుమిత. అయితే కొన్ని సీన్స్ చాలా లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు వర్కవుట్ కాలేదు. ఓవరాల్‌గా చూస్తే ఓ ఇద్దరు అనాథల ఎమోషనల్ స్టోరీనే కాళిధర్ లపతా. స్నేహానికి వయస్సు అడ్డంకి కాదని మరో సందేశం కూడా ఇచ్చాడు.ఈ సినిమాలో మతిస్థిమితం లేని వ్యక్తిగా తనపాత్రలో అభిషేక్ బచ్చన్ అలరించాడు. అమాయకంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేశాడు.ఎనిమిదేళ్ల బాలుడి పాత్రలో దైవిక్ భగేలా మెప్పించాడు. అభిషేక్ బచ్చన్‌తో పోటీపడి మరి నటించాడు. కాళిధర్ను ప్రేమించే అమ్మాయిగా.. నిమ్రత్ కౌర్ తన పాత్ర పరిధిలో అలరించింది. కాళిధర్ను కనుగొనే పాత్రలో మొహమ్మద్ జీషన్ అయూబ్ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించాడు. సాంకేతికత విషయానికొస్తేఅమిత్ ద్వివేది నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. అమితోష్ నాగ్‌పాల్ స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. -
ఓటీటీకి శ్రద్ధా శ్రీనాథ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కలియుగం-2064'. ఈ సినిమాకు ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే మే 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్లపై కేఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. జూలై 11 నుంచి సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 2064లో మనుషులు పరిస్థితి ఏంటనే కోణంలోనే ఈ సినిమాకు రూపొందించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి డాన్ విన్సెంట్ సంగీతమందించారు. When the world ends, who do you become?Hope, fear, and survival collide in a future gone dark.Kaliyugam — streaming from 11th July on SunNXT.#KaliyugamOnSunNXT #DystopianDrama #StreamingFromJuly11 #EdgeOfDarkness #Kaliyugam #NewOnSunNXT #FutureUnraveled #WatchItOnSunNXT… pic.twitter.com/DX64AIVYZf— SUN NXT (@sunnxt) July 4, 2025 -
ఓటీటీకి వచ్చేసిన ఫీల్ గుడ్ మూవీ.. ఓకేసారి నాలుగింటిలో స్ట్రీమింగ్!
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మద్రాస్ మ్యాట్నీ. ఈ సినిమాకు కార్తికేయన్ మణి దర్శకత్వం వహించారు. జూన్ 6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ సమర్పణలో మెడ్రాస్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.ఎలాంటి ప్రకటన లేకుండానే ఏకంగా నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 4 తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు సన్ నెక్స్ట్, టెంట్కొట్టా, సింప్లీ సౌత్ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది ఈ సినిమా. మద్రాస్ మ్యాట్నీ చిత్రంలో మిడిల్ క్లాస్ లైఫ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కథను యథార్థంగా తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రానికి బాలా సారంగన్ సంగీతం అందించారు. Recent Tamil Feel Good Movie ❤️✨ #MadrasMatinee streaming from Tonight on PrimeVideo, Tentkotta, Sunnxt & SimplySouth 🍿!!@kaaliactor @keyanmk@Roshni_offl @gk_anand@cinemapayyan#OTT_Trackers pic.twitter.com/TlyWKLW4Xv— OTT Trackers (@OTT_Trackers) July 3, 2025 -
మహేష్, రాజమౌళి సినిమా ఆ ఓటీటీలోనే...రికార్డ్స్ బద్ధలయ్యాయిగా...
దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎమ్బి29(SSMB29) సినిమా ఇప్పుడు మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సినీ వర్గాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని విక్రయించారంటూ వస్తున్న వార్తలు కూడా సంచలనంగా మారాయి. దీనికి కారణం చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ సినిమా ఓటీటీ హక్కుల ధర పలకడమే.ఇప్పటి దాకా ఓటీటీలో అత్యధిక ధర పలికిన చిత్రంగా రాజమౌళి, రామ్‌చరణ్,ఎన్టీయార్ల సినిమా ఆర్ఆర్ఆర్ నిలుస్తోంది. ఆ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్‌ల పుష్ప 2, లోకేష్ కనగరాజ్ హీరో విజయ్‌ల తమిళ చిత్రం లియో, అట్లీ, షారూఖ్ఖాన్ల హిందీ చిత్రం జవాన్, ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ల సలార్, ఓంరౌత్, ప్రభాస్‌ల ఆదిపురుష్, సిద్ధార్ధ్ ఆనంద్, షారూఖ్ ల పఠాన్ చిత్రాలు నిలుస్తున్నాయి ఇవన్నీ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య చెల్లించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు స్వంతం చేసుకున్నట్టు సమాచారం. వీటిలో ఆదిపురుష్, పఠాన్, పుష్ప2 తప్ప మిగిలినవన్నీ నెట్‌ఫ్లిక్స్ ఖాతాలోనే పడ్డాయి. తద్వారా భారతీయ సినిమాలకు అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడంలో ఎవరికీ అందనంత స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ దూసుకుపోతోంది.అదే క్రమంలో మరోసారి తన సత్తా చాటిన నెట్‌ఫ్లిక్స్ ఎస్ఎస్ఎమ్బి 29 హక్కుల్ని కూడా దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మరే చిత్రానికి పెట్టనంత ధరను చెల్లించి ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తద్వారా ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద నాన్–థియేట్రికల్ డీల్స్‌గా నిలుస్తోందని సమాచారం.రాజమౌళి మునుపటి చిత్రం ఆర్ఆర్ఆర్ సైతం నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆ సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ ప్రారంభంలోనే అద్భుతమైన వీక్షక విజయం అందుకుంది, అంతేకాక ఆ సినిమా పాట ఆస్కార్ అందుకోవడంతో నెట్‌ఫ్లిక్స్‌కు మరోసారి కాసుల పంట పండింది. ఆ అవార్డ్ ద్వారా వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ఓటీటీలో ఆ సినిమాకు వీక్షకులు వెల్లువెత్తారు. దాందో ఆర్ఆర్ఆర్కి భారీ ధర చెల్లించినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ భారీ లాభాలను ఆర్జించడానికి ఇదో కారణం.ఈ నేపధ్యంలో రాజమౌళి చిత్రాలపై గురి కుదిరిన నెట్‌ఫ్లిక్స్ చాలా ముందస్తుగానే ఓటీటీ హక్కులపై కన్నేసింది. అపజయాలు అంతే తెలియని దర్శకుడు రూపొందిస్తున్న ఎస్ఎస్ఎమ్బి 29 చిత్రంలో ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ స్టార్ ఉండడం అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అంశమే. అందుకే ఈ చిత్రం అత్యంత భారీ ధర పలికింది అనుకోవచ్చు. వచ్చే 2027లో విడుదల కానున్న ఈ భారీ చిత్రం ఇంకెన్నో సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. -
ఆర్మీ ఆఫీసర్‌గా సలార్ హీరో.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మరో యాక్షన్ సినిమాతో అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న యాక్షన్ చిత్రం సర్జమీన్. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కాజోల్ హీరోయిన్గా నటించింది.తాజాగా సర్జమీన్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు. ఈ నెల 25 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. Yahaan har faisla ek kurbani hai, desh ki ya apno ki… kuch aisi Sarzameen ki kahaani hai🇮🇳#Sarzameen, releasing July 25, only on #JioHotstar#SarzameenOnJioHotstar@PrithviOfficial @itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze… pic.twitter.com/qMDDJA19Vq— JioHotstar (@JioHotstar) July 4, 2025 -
ఓటీటీలో 'నార్నే నితిన్' ఫస్ట్ సినిమా స్ట్రీమింగ్
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) నటించిన మొదటి సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది. వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న నార్నే నితిన్.. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు పొందాడు. అయితే, ఈ చిత్రాల కంటే ముందుగా ఆయన నటించిన చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'. ఈ ఏడాది జూన్ 6న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సంపద హీరోయిన్గా నటించగా చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలు.'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మూవీ ఆహా(Aha) తెలుగులో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆపై అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే జులై 4న ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2022లో ప్రారంభం అయిన ఈ మూవీ పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న(Satish Vegesna) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన 'శతమానం భవతి' వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు. నార్నే నితిన్ మొదటి సినిమా కావడంతో ఓపెనింగ్స్ కాస్త పర్వాలేదనిపించాయి.కథేంటంటే..మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సుబ్బరాజు (నరేశ్ వీకే), కృష్ణమూర్తి (రావు రమేశ్) మంచి స్నేహితులు. అయితే, పుట్టుకతోనే చలనం లేకుండా జన్మించిన జన్మించిన రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కుమారుడిలో తిరిగి చలనం కనిపించడంతో సుబ్బరాజు (నరేశ్ వీకే) చాలా సంతోషిస్తాడు. అయితే, తన కుమారుడు పెరిగే కొద్ది సిగరెట్‌కు బానిస కావడం తండ్రిగా సహించలేడు. రాజాకు ఉన్న సిగరెట్ అలవాటుతో అతన్ని ఊరి వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు.కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే రాజాకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకరినిఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో ఉంటారు. కానీ, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. జులాయిగా తిరుగుతున్న రాజాకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. కానీ, కూతురి కోసం పెళ్లికి ఓకే చెబుతాడు. అయితే, నిశ్చితార్థం నాడు రాజా చేసిన ఒక పొరపాటు వల్ల అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఆపై స్నేహితులుగా ఉన్న వారి తండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి సుబ్బరాజు ఒక ఛాలెంజ్ ఇసురుతాడు. ఈ సవాల్లో తాను గెలిస్తే నిత్యను రాజాకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా రెడీ అంటాడు. అయితే, ఫైనల్‌గా రాజా గెలుస్తాడా..? తను ప్రేమించిన నిత్యను పెళ్లి చేసుకుంటాడా..? ఛాలెంజ్ కోసం సిగరెట్ ఆపేస్తాడా..? నిశ్చతార్థంలో జరిగిన గొడవకు కారణం ఏంటి..? వంటి అంశాలు తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చూడాల్సిందే. -
సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్‌లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్‌కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్‌లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. కండీషన్‌కు ఒప్పుకుంటే..అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.ఆన్లైన్లో అయినా ఓకేఅప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్లోనే నేను చెప్పింది చేయండి. ఆన్లైన్లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్‌ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.సీరియల్స్- సినిమాహెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ మెరిశారు.చదవండి: ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?
కొన్ని సినిమాలు థియేటర్లలో మ్యాజిక్ చేద్దామనుకుంటాయి. తీరా కనీస ఆదరణ కూడా దక్కక బొక్కబోర్లా పడతాయి. థగ్ లైఫ్ సినిమా అలాంటి కోవకు చెందినదే! మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓటీటీలో థగ్లైఫ్ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో రూ.90 కోట్లే ఇస్తామని పేచీ పెట్టింది. చివరకు చర్చల అనంతరం రూ.110 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు భోగట్టా. అంతేకాదు సినిమా రిలీజయ్యాక 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేస్తామన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దాంతో నాలుగు వారాల్లోనే థగ్ లైఫ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేడ (జూలై 3) సడన్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో దర్శనమిచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.వివాదాలుథగ్ లైఫ్ రిలీజ్‌కు ముందు భారీ అంచనాలున్నాయి. ఎప్పుడైతే కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ నోరు జారారో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో థగ్‌లైఫ్ కన్నడలో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళ్లగా.. కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కానీ అప్పటికే థగ్‌లైఫ్ మిగతా చోట్ల రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. థగ్ లైఫ్ సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దాన్ని రద్దు చేయడం వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు.. థగ్‌లైఫ్ నిర్మాత కమల్ హాసన్‌పై రూ.25 లక్షల జరిమానా వేసినట్లు తెలుస్తోంది. Streaming now on NETFLIX #ThugLife pic.twitter.com/u3BxaX2Dfm— Christopher Kanagaraj (@Chrissuccess) July 2, 2025 చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
ఓటీటీకి వచ్చేస్తోన్న హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో మలయాళ చిత్రాలకు పుల్ డిమాండ్ ఉంటోంది. గతంలో వచ్చిన పలు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు సైతం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఆడియన్స్‌ను ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో నుంచి వచ్చే చిత్రాల్లో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కావడంతో ఓటీటీల్లో సత్తా చాటుతున్నాయి. తాజాగా మరో మలయాళ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.టొవినో థామస్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ నరివెట్ట స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 11 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించగా.. సూరజ్ వెంజరమూడు, చేరన్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ మూవీకి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.Echoes of truth, shadows of injustice!Watch Narivetta from July 11 only on SonyLIV#NarivettaOnSonyLIV@ttovino #SurajVenjaramoodu #Cheran #AnurajManohar #AryaSalim #JakesBijoy pic.twitter.com/lon0ikr836— Sony LIV (@SonyLIV) July 2, 2025 -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఆ తెలుగు సినిమానే కాస్తా స్పెషల్!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్లలో కన్నప్ప సందడి చేస్తుండగా.. ఈ వారంలో తమ్ముడు అంటూ నితిన్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ గౌతమ్ నటించిన సోలో బాయ్ కూడా బాక్సాఫీస్ వద్దకు రానుంది. అయితే ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు.మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమైపోయాయి. వాటిలో ప్రధానంగా తెలుగులో వస్తోన్న ఉప్పు కప్పురంబు సినిమాపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్, ప్రియాంక చోప్రా హెడ్ ఆఫ్ స్టేట్, అమితాబ్ బచ్చన్ నటించిన కాళిధర్ లపతా కాస్తా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. వీటితో పాటు కమల్ హాసన్ నటించిన భారీ చిత్రం థగ్ లైఫ్ కూడా ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూలై మూడో తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. మరి ఏ యే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..అటాక్ ఆన్ లండన్- హంటింగ్ ది 7/7 బాంబర్స్- జూలై 01ది ఓల్డ్ గార్డ్-2- జూలై 02థగ్ లైఫ్(తమిళ సినిమా)- జూలై 03(రూమర్ డేట్)ది శాండ్‌మాన్ సీజన్-2- జూలై 03ది సమ్మర్ హికరు డైడ్- జూలై 05అమెజాన్ ప్రైమ్ వీడియో..ది హెడ్స్ ఆఫ్ స్టేట్- జూలై 02ఉప్పు కప్పురంబు(తెలుగు సినిమా)- జూలై 04జియో హాట్స్టార్కంపానియన్- జూన్ 30గుడ్ వైఫ్(వెబ్ సిరీస్)- జూలై 04జీ5కాళిధర్ లపతా(హిందీ సినిమా)- జూలై 04సోనిలివ్ది హంట్- రాజీవ్ గాంధీ హత్య కేసు- జూలై 04 -
డైరెక్ట్‌గా ఓటీటీకి సలార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సలార్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఫేమ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఆడుజీవితం సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించాడు. ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించారు.ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న సర్జమీన్ అనే బాలీవుడ్లో చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో కాజోల్ హీరోయిన్గా కనిపించనుంది. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు.సర్జమీన్ మూవీని జూలై 25 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన పేరుతో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఇబ్రహీం అలీ ఖాన్ ఉగ్రవాదిగా కనిపంచనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు.సర్జమీన్' కథేంటంటే?కశ్మీర్ నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. తన విధి పట్ల ఎంతో నిబద్ధత చూపించే విజయ్ మీనన్ (పృథ్వీరాజ్) చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో మీరా పాత్రలో కాజోల్, హర్మన్ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. మాతృభూమిని కాపాడటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు అనే క్యాప్షన్‌తో జియోహాట్‌స్టార్ ఈ వీడియోను షేర్ చేసింది. Sarzameen ki salamati se badhkar kuch nahi 🇮🇳#Sarzameen, releasing July 25, only on @JioHotstar!#SarzameenOnJioHotstar@itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze @MARIJKEdeSOUZA @somenmishra0 @Soumil1212 #ArunSingh… pic.twitter.com/qtxTBsq4Iq— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 30, 2025 -
ఓటీటీలో 'కె.విశ్వనాథ్' చివరి సినిమా.. 15 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్
కళాతపస్వి 'కె.విశ్వనాథ్' దర్శకత్వం వహించిన చివరి సినిమా 'శుభప్రదం'.. 15 ఏళ్ల తర్వాత ఓటీటీలో విడుదలైంది. 2010లో విడుదలైన ఈ చిత్రంలో అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ జంటగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాటలు పరంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. సాగర సంగమం, శ్రుతిలయలు, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం... ఇలా ఒకదాన్ని మించి మరొకటి? సినిమాలను తెరకెక్కించిన దర్శకులు కె. విశ్వనాథ్.. అయితే, చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన 'శుభప్రదం' సినిమా కోసం మళ్లీ మెగాఫోన్ పట్టారు. కానీ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బలహీనంగా ఉన్నాయని ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉందని , హీరో పాత్ర అంతగా మెప్పించలేదని రివ్యూలు ఇచ్చారు. ప్రేక్షకుల హృదయాలను శుభప్రదం అస్సలు ఆకర్షించలేదని చాలామంది చెప్పారు. సుమారు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి విశ్వనాథ్ చివరి సినిమా రావడంతో ఆయన అభిమానులు మాత్రం చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.'శుభప్రదం' సినిమా 'జియోహాట్‌స్టార్' (jiohotstar)లో సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. కె.విశ్వనాథ్ సుమారు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో 5 సినిమాలు జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డ్స్ అందుకోవడం విశేషం. అంతటి గొప్ప దర్శకుడి చివరి సినిమా అందరికీ అందుబాటులో ఉండాలని ఓటీటీలో విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో కె. విశ్వనాథ్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందారు. -
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు క్రైమ్ డ్రామా!
చిన్న సినిమాలో ఓటీటీలో దూసుకెళ్తున్నాయి. థియేటర్స్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్ర సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు 23 మూవీ కూడా చేరింది. మల్లేశం'ఫేం రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామా మే 16న థియేటర్స్‌లో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక రీసెంట్గా ఓటీటీలో విడుదలై మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఒకేసారి మూడు ఓటీటీల్లో ఈ చిత్రం ప్రీమియర్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా, ఈటీవీ విన్‌లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. అలాగే ఆహాలో ట్రెండింగ్ అవుతున్న టాప్ 10 సినిమాలో టాప్ 2 ప్లేస్‌లో ఈ చిత్రం ఉంది.23 విషయానికొస్తే..1991లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సాగర్(తేజ) ఓ పల్లెటూరిలో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలనేది కోరిక. కానీ అప్పు దొరకదు. పొగాకు కూలీ సుశీల(తన్మయి)ని ప్రేమిస్తుంటాడు. పెళ్లి కాకుండానే ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దీంతో తన ఫ్రెండ్ దాస్‌తో కలిసి బస్సు దోపిడీ చేయాలని అనుకుంటాడు. కానీ అది అమలు చేసే క్రమంలో ప్రయాణికులు తిరగబడతారు. అనుకోకుండా నిప్పంటుకుని 23 మంది సజీవ దహనం అయిపోతారు. తర్వాత ఏమైంది? కోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేదే మిగతా స్టోరీ. -
స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా?
టైటిల్: స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ (మూడో సీజన్)తారాగణం: లీ జుంగ్ జే, లీ బ్యుంగ్ హు, వి హా జూన్క్రియేటర్: హ్వాంగ్ డాంగ్ హ్యుక్ఓటీటీ: నెట్ఫ్లిక్స్చిన్నప్పుడు ఆడిన ఆటలకు లెక్కే లేదు. బడిలో తన్నులు తిన్నా, ఇంట్లో చీవాట్లు పెట్టినా సరే ఫ్రెండ్స్‌తో కలిసి పొద్దేక్కేదాకా ఆడుతుంటే ఆ మజానే వేరుండేది. కానీ, ఆ సరదా ఆటలే ప్రాణాంతకంగా మారితే? గేమ్స్ ప్రాణాలు తీస్తే.. అన్న ఆలోచనలో నుంచి వచ్చిందే స్క్విడ్ గేమ్. డబ్బు, స్వార్థం.. మనిషిని రాక్షసుడిలా మారుస్తుందని, విచక్షణ కోల్పోయేలా చేస్తుందని ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు.మొదటి సీజన్లో ఏం జరిగింది?ఈ సిరీస్‌లో రెండు రకాల మనుషులుంటారు. పైసా కోసం ప్రాణాలకు తెగించేవారు.. వారి ప్రాణాలు పోతుంటే చూసి ఆనందించేవారు. తొలి సీజన్లో 456 మంది గేమ్ ఆడేందుకు వస్తారు. ప్లేయర్ 456 (హీరో లీ జుంగ్ జే) లక్ష్యం కూడా డబ్బు గెలుచుకోవడమే.. కానీ గేమ్ చివరి వరకు వచ్చేసరికి తనముందున్న 455 మంది పిట్టల్లా రాలిపోతారు. అవన్నీ తనను మానసికంగా డిస్టర్బ్ చేస్తాయి. కోట్లాది సంపదను గెలుచుకున్నా.. అది తనకు సంతోషాన్ని ఇవ్వదు. మనుషుల ప్రాణాలతో గేమ్ ఆడుతున్నవారి అంతు చూడాలని, ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు.. అదే మొదటి సీజన్.రెండో సీజన్ ఎలా ముగిసింది?ప్లేయర్ 456 మరోసారి ఆటలో అడుగుపెట్టడంతో రెండో సీజన్ ప్రారంభమవుతుంది. ఈ గేమ్‌కు ఎలాగైనా ముగింపు పలకాలని ఆవేశానికి పోయి కొంతమంది ప్లేయర్ల చావుకు కారణమవుతాడు. అంతటితో రెండో సీజన్ ఎటువంటి ముగింపు లేకుండానే అర్ధాంతరంగా ఆగిపోతుంది. అసలు ప్లేయర్ 456.. ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అన్న ఉత్సుకతో మూడో సీజన్ (Squid Game season 3 Review) మొదలవుతుంది. గేమ్‌ను ఎలాగైనా ఆపేయాలన్న కోపంతో గ్యాంగ్‌ను తయారు చేసుకుని విలన్‌కే ఎదురెళ్తాడు హీరో. సిరీస్‌ను మలుపు తిప్పే సంఘటనఈ క్రమంలో ఆ గ్యాంగ్‌లోని వారంతా చనిపోతారు. కానీ హీరోను మాత్రం చంపకుండా వదిలేస్తారు. నన్నెందుకు బతికించారు? చంపేయండి అని హీరో విలవిల్లాడతాడు. తనవల్ల ఏదీ మారదని.. ఏది జరగాలనుంటే అది జరుగుతుందని భావించి డీలా పడిపోతాడు. కానీ ఒక్క సంఘటన అతడిలో మళ్లీ శక్తిని, ధైర్యాన్ని నింపుతుంది. వరుసగా ప్రాణాలు పోతున్న ప్రదేశంలో ఓ చిన్నబిడ్డ ఊపిరి పోసుకుంటుంది. ఆ పసిపాప కోసం హీరో మళ్లీ పోరాటం మొదలుపెడతాడు. అప్పుడు సిరీస్ వేగం పుంజుకుంటుంది.విషాదకర క్లైమాక్స్మంచి పైచేయి సాధించినప్పుడే అందరికీ ఆనందం. కానీ, చెడు విజయం సాధించినప్పుడు అది అందరికీ రుచించదు. క్లైమాక్స్ చాలామందికి మింగుడుపడదు. దీనికోసమేనా మూడు సీజన్లు సాగదీశారు అనిపిస్తుంది. ప్రాణాంతక ఆటలకు కేంద్రమైన దీవిని కనిపెట్టేందుకు ప్రయత్నించిన డిటెక్టివ్ కష్టం కూడా వృథాగా పోతుంది. ఇదే చివరి సీజన్ అని ప్రకటించారు కానీ, ఈ క్లైమాక్స్ చూస్తుంటే మాత్రం సీజన్ 4కూ ఆస్కారం ఉందన్న అనుమానాలు వెలువడుతున్నాయి.సిరీస్ ఏం చెప్తోంది?డబ్బుకు షార్ట్‌కట్స్ ఉండవు. అలాంటి అడ్డదారులున్నాయంటే అది మీ ప్రాణాలతో పందెం కాస్తున్నట్లే లెక్క అని ఈ సిరీస్ హెచ్చరిస్తుంది. డబ్బు మనిషిని ఎలా ఏమార్చుతుందని చూపించారు. పసిపాప ప్రాణానికి హీరో తన ప్రాణం అడ్డేసినప్పుడు మంచితనం, మానవత్వం ఇంకా బతికే ఉందని తెలియజేశారు. ఈ సిరీస్ విషాదంగా ముగిసింది. చూసే జనాల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. -
ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'. వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్‌తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే వెండితెరపై ఆశించిన స్థాయిలో విజయం సాధించని ఈ చిత్రం.. డిజిటల్ స్క్రీన్‌పై మాత్రం దూసుకెళ్తుంది. జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అతున్న ఈ చిత్రం.. రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు గార్లపాటి రమేష్, వినోద్ విజయన్ మాట్లాడుతూ... ''మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది’ అన్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో హీరో సాయిరామ్ శంకర్ నటించారు. విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యల మీద అతని మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. నిజంగా ఆ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేదంటే వాటి వెనుక వేరొకరు ఉన్నారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఒసామా బిన్‌లాడెన్‌పై వెబ్ సిరీస్.. ఎలా ఉందంటే?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్ వెబ్ సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.9/11... అమెరికా చరిత్రలో ఇదో మరచిపోని సంఖ్య. నాటికి, నేటికి, రేపటి తరానికి గుర్తుండిపోయే దారుణ ఘటన ఈ 9/11. న్యూయార్క్ నగరంలోని రెండు పెద్ద ఆకాశ హార్మ్యాలను విమానాలతో నేలమట్టం చేసి దాదాపు 3000కి పైగాప్రాణాలను బలిగొన్న ఈ ఘటన అతి కిరాతక చర్యగా అమెరికా చరిత్రలో నిలిచిపోయింది. అత్యంత హేయమైన ఈ తీవ్రవాద దాడి 9/11కి సూత్రధారి బిన్ లాడెన్. అంతటి కరుడు గట్టిన తీవ్రవాదిని ఉత్కంఠభరితంగా మట్టుబెట్టాయి నిఘా సంస్థలు. ఇదే ఇతివృత్తంగా నాటి ఘటనలను సిరీస్ రూపంలో నేడు నెట్ ఫ్లిక్స్ మన ముందుకు తీసుకొచ్చింది.‘అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్’ పేరుతో ఈ సిరీస్ మూడు భాగాలతో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు భాషతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషలలో ఈ సిరీస్‌ని విడుదల చేశారు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే ... సిరీస్ మొత్తం అప్పుడు జరిగిన కొన్ని వాస్తవ సన్నివేశాలతో రూపకల్పన చేయడం. అంతేకాదు... అమెరికాలో ఈ ఆపరేషన్ గురించి అధికారులు ఎప్పటికప్పుడు అప్పటి ప్రెసిడెంట్‌కి బ్రీఫ్ చేయడం, అలాగే అప్పటి ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కొందరు అధికారుల వీడియో బైట్స్‌ను కూడా చాలా చక్కగా ఎడిట్ చేసి, చూపించారు.నిజానికి ఈ సిరీస్ చూడడం మొదలు పెట్టిన కొద్ది సమయానికే మనం కూడా ఈ ఆపరేషన్‌లో వర్చ్యువల్‌గా ఇన్వాల్వ్ అయిపోతాం. మనకు 9/11 ఘటన గురించి తెలిసింది పిడికిడెంత అయితే ఈ సిరీస్ ద్వారా కొండంత విషయాలు తెలుస్తాయి. ‘అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్’... వర్త్‌ఫుల్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ‘23’ (23 Movie) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన చిలకలూరి పేట, చుండూరు, జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు సంఘటనల గురించి ఈ సినిమా ఉంటుంది. మే 16న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అయితే, తాజాగా భారత్‌లోని యూజర్స్‌కు కూడా చూసేలా మేకర్స్ ఛాన్స్ కల్పించారు.‘మల్లేశం’ (Mallesam) సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న రాజ్.ఆర్ 23 మూవీని తెరకెక్కించారు. తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో స్టూడియో 99 సంస్థ ఈ మూవీని నిర్మించింది. అయితే, ఈ చిత్రం జూన్ 27 నుంచి సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. 1991 సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ ఘటన, 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్ బాంబు దాడి గురించి 23 సినిమాతో తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్‌తో '23' చిత్రంలో చూపించారు. ఈ మూడు కేసుల్లో నేరం ఒక్కటే అయినప్పటికీ శిక్షల్లో ఎక్కువ తక్కువలు ఎందుకంటూ మన న్యాయ వ్యవస్థని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది.ఓటీటీలో ఆర్జీవీ సైకలాజికల్ థ్రిల్లర్ 'శారీ' సినిమాఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’(Saaree Movie ) సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో కూడా విడుదల కావచ్చని సమాచారం. ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా ఇందులో నటించారు.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ. -
థియేటర్లలో కన్నప్ప.. ఓటీటీల్లో ఏకంగా డజన్ చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ శుక్రవారం థియేటర్లలో టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ కన్నప్ప సందడి చేయనుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 27, 2025 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నుంచి కాజోల్ హారర్ థ్రిల్లర్ మా, నికిత రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్నెస్, కోలీవుడ్ నుంచి విజయ్ ఆంటోనీ మార్గన్, లవ్ మ్యారేజ్, ఎం3గన్ 2.0, మలయాళం నుంచి కూడల్ అనే చిత్రాలు బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి.ఇక థియేటర్ల సంగతి పక్కనపెడితే శుక్రవారం వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వీకెండ్లో ఫుల్ వినోదం అందించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు విరాటపాలెం (తెలుగు సిరీస్), ఒక పథకం ప్రకారం మూవీ టాలీవుడ్ ప్రియులకు అలరించేందకు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఒక్క రోజులోనే దాదాపు 12కు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ లిస్ట్ మీరు కూడా చూసేయండి.నెట్‌ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 27 పొకేమాన్ హారిజన్స్- సీజన్-2 - జూన్ 27జియో హాట్‌స్టార్ మిస్త్రీ (హిందీ సిరీస్) - జూన్ 27జీ5 విరాటపాలెం (తెలుగు సిరీస్) - జూన్ 27 బిబీషణ్ (బెంగాలీ సిరీస్) - జూన్ 27 అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) - జూన్ 28సన్ నెక్స్ట్ అజాదీ (తమిళ సినిమా) - జూన్ 27 ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) - జూన్ 27 ఆప్ కైసే హో- జూన్ 27 నిమ్మ వస్తుగలిగే నీవే జవాబ్దారు(కన్నడ సినిమా)- జూన్ 27ఆపిల్ ప్లస్ టీవీ స్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27లయన్స్ గేట్ ప్లేక్లీనర్- జూన్ 27 -
ప్రియమణి థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రియమణి, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ 'గుడ్ వైఫ్'. అమెరికన్ సిరీస్ 'గుడ్ వైఫ్' అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు ఓ మాజీ మహిళ లాయర్ ఏం చేసింది? అనే కోణంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో ప్రియమణి లాయర్‌గా కనిపించనుండగా.. ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ నటించారు.తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. జూలై నాలుగో తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. Behind every powerful woman is a story waiting to be told 👩🏽🔥Mark your calendars 🗓️ - #TheGoodWife streaming from July 4th ✨#HotstarSpecials #GoodWife streaming from July 4 on #JioHotstar#GoodWifefromJuly4onJioHotstar #GoodWifeTrailer #GoodWifeOnJioHotstar #JioHotstarTamil… pic.twitter.com/ITRWF89kLC— JioHotstar Tamil (@JioHotstartam) June 26, 2025 -
ఓటీటీలో క్రేజీ సిరీస్.. చాన్నాళ్లకు కొత్త అప్డేట్
ఓటీటీల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సిరీస్‌లో 'ఫ్యామిలీ మ్యాన్' టాప్‌లో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇదివరకే రెండు సీజన్లు రాగా అవి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో మూడో సీజన్ కోసం వ్యూయర్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. గతేడాది షూటింగ్ మొదలుపెట్టినట్లు అప్డేట్ రాగా.. కొన్నాళ్ల క్రితం దాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సరికొత్త అప్డేట్తో వచ్చేశారు.మూడో సీజన్‌కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. 'అందరి కళ్లూ మా ఫ్యామిలీ మ్యాన్‌పైనే. కొత్త సీజన్ త్వరలో వస్తుంది' అని క్యాప్షన్ పెట్టారు. ఫొటోలో ఎప్పటిలానే శ్రీకాంత్ తివారీ(మనోజ్ భాజ్‌పాయ్) ఉండగా.. గన్స్ పట్టుకుని ముష్కరులు కూడా కనిపించారు. ఈ సీజన్ అంతా కూడా కొవిడ్19 నేపథ్య కథతో చైనా నుంచి ఇండియాపై జరిగే దాడుల చుట్టూ ఉంటుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లే రెండో సీజన్ చివరలోనే హింట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్)తొలి సీజన్లో మిషన్ జుల్ఫీకర్ ప్రధానంగా ఉండగా, రెండో సీజన్లో మిషన్ రాజీ చూపించారు. ఇప్పుడు మూడో సీజన్లో ప్రాజెక్ట్ గ్వాన్ యూ పేరిట జరగబోయే దాన్ని.. ప్రధాన పాత్రధారి శ్రీకాంత్ తివారీ ఎలా అడ్డుకున్నాడనేది చూపించబోతున్నారు. ఇందులో మనోజ్‌తోపాటు ప్రియమణి, ఆశ్లేషా ఠాకుర్, షరీబ్ అష్మీ, వేదాంత్ తదితరులు ఉన్నారు. జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమ కెరీర్లోనే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ అత్యంత కష్టమైనదిగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే చెప్పుకొచ్చాడు. నాగాలాండ్‌తోపాటు దేశ సరిహద్దుల్లో షూటింగ్ చేయడమే దీనికి కారణం.ఇకపోతే కొన్నాళ్ల క్రితం ఓ సందర్భంలో మాట్లాడిన మనోజ్ భాజ్‌పాయ్.. నవంబరులో మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుందని చెప్పాడు. మరికొందరు మాత్రం ఆగస్టు 15న రావొచ్చని అంటున్నారు. ఏదేమైనా ఈ సిరీస్ కొత్త సీజన్ కోసం వ్యూయర్స్ కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అప్డేట్ రావడంతో కాస్త ఖుషీ అయిపోతున్నారు.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఓటీటీకి అజయ్ దేవ్‌గణ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అజయ్ దేవ్‌గణ్ , రితేశ్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ రైడ్-2. గతంలో విడుదలైన రైడ్ మూవీకి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గత నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. థియేటర్ల వద్ద దాదాపు రూ. 157.88 కోట్ల నికర వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో రైడ్-2 ట్రైలర్‌ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ పాత్రలో కనిపించారు. రితేష్ దేశ్‌ముఖ్ ఎప్పుడూ చూడని పవర్ఫుల్ రోల్లో కనిపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో వాణి కపూర్, సౌరభ్ శుక్లా ప్రత్యేక పాత్రల్లో నటించారు.Aaj se ulti ginti shuru 🔥Amay Patnaik is back with a new case and the same old fire 👊 Watch Raid 2, out 26 June, on Netflix.#Raid2OnNetflix pic.twitter.com/f06uJB6feQ— Netflix India (@NetflixIndia) June 24, 2025 -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
'మల్లేశం' సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ.. తర్వాత హిందీలో ఒకటి చేశారు. రీసెంట్గా '23' అనే తెలుగు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1991లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?అంతా కొత్త నటీనటులతో తీసిన '23' సినిమా.. మే 16 థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే రెగ్యులర్ మూవీ కాకపోవడంతో ఇది జనాల దృష్టిలో పడకుండానే బిగ్ స్క్రీన్‌పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం 23 చిత్రం.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. త్వరలో మన దగ్గర కూడా స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: చిరంజీవి తల్లికి తీవ్ర అస్వస్థత!)23 విషయానికొస్తే.. సాగర్(తేజ) ఓ పల్లెటూరిలో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలనేది కోరిక. కానీ అప్పు దొరకదు. పొగాకు కూలీ సుశీల(తన్మయి)ని ప్రేమిస్తుంటాడు. పెళ్లి కాకుండానే ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దీంతో తన ఫ్రెండ్ దాస్‌తో కలిసి బస్సు దోపిడీ చేయాలని అనుకుంటాడు. కానీ అది అమలు చేసే క్రమంలో ప్రయాణికులు తిరగబడతారు. అనుకోకుండా నిప్పంటుకుని 23 మంది సజీవ దహనం అయిపోతారు. తర్వాత ఏమైంది? కోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేదే మిగతా స్టోరీ.చిలకలూరిపేట బస్సు దహనం సంఘటనతో పాటు 1991 చుండూరు మారణకాండ, 1997లో జూబ్లీహిల్స్ కారు బాంబు ఘటనని కూడా సినిమాలో చూపించారు. హంతకులకి శిక్ష పడటమే న్యాయమైతే, అందరు హంతకులూ ఉరికంబం ఎక్కుతున్నారా? అనే పాయింట్ ఆధారంగా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. రియలస్టిక్‌గా ఉండే చిత్రం చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలోకి వచ్చేసిన 'పంచాయత్' కొత్త సీజన్
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది కానీ లాక్ డౌన్ టైంలో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాంటి ఓ సిరీస్ 'పంచాయత్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్టైనింగ్గా ఈ సిరీస్‌కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. గత మూడు సీజన్లు చూసేసిన చాలామంది కొత్త సీజన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు దీపిక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సీజన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలోనే అందుబాటులో ఉంది.పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. జాబ్ అయితే చేస్తుంటాడు గానీ అస్సలు ఇష్టముండదు. విదేశాలకు వెళ్లిపోవాలనేదే ఇతడి డ్రీమ్. అలాంటిది ఇతడిని పల్లెలోని ఉంటే కొందరు మనుషులు మార్చేస్తారు. తర్వాత ఏమైందనేదే స్టోరీ. తొలి మూడు సీజన్లు వివిధ అంశాల ఆధారంగా తెరకెక్కించారు. నాలుగు సీజన్లో పంచాయతీలో జరిగే ఎన్నికల స్టోరీతో తీశారు. ఈసారి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్‌గా ఉండే ఈ సిరీస్ ని తెలుగులోనూ 'సివరపల్లి' పేరుతో రీమేక్ చేశారు.(ఇదీ చదవండి: మరో హీరోయిన్‌తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?) -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ కానుంది. అలానే హిందీలో 'మా' అనే హారర్ మూవీ రాబోతుంది. ఇవి తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 18కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే ఈ లెక్క కనిపిస్తుంది. వీకెండ్ వచ్చేసరికి నంబర్ పెరగొచ్చు. (ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వారమే రైడ్ 2, ఒక పథకం ప్రకారం సినిమాలతో పాటు స్క్విడ్ గేమ్ సీజన్ 3, పంచాయత్ సీజన్ 4, విరాటపాలెం సిరీస్‌లు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (జూన్ 23 నుంచి 29 వరకు)నెట్ఫ్లిక్స్స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24ట్రైన్ రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 24ద అల్టిమేటమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 25రైడ్ 2 (హిందీ సినిమా) - జూన్ 27స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 27అమెజాన్ ప్రైమ్పంచాయత్ సీజన్ 4 (హిందీ సిరీస్) - జూన్ 24హాట్స్టార్స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26మిస్త్రీ (హిందీ సిరీస్) - జూన్ 27జీ5విరాటపాలెం (తెలుగు సిరీస్) - జూన్ 27బిబీషణ్ (బెంగాలీ సిరీస్) - జూన్ 27అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) - జూన్ 28సన్ నెక్స్ట్అజాదీ (తమిళ సినిమా) - జూన్ 27ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) - జూన్ 27బుక్ మై షోఅల్ఫా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24ద బ్రేకప్ క్లబ్ (డచ్ మూవీ) - జూన్ 24రక్తబీజ్ (గుజరాతీ సినిమా) - జూన్ 26ఆపిల్ ప్లస్ టీవీస్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27(ఇదీ చదవండి: ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?) -
ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్, సినిమాలు ఇవే!
కోవిడ్ తర్వాత ఓవర్ ద టాప్(ఓటీటీ)ల వాడకం ఎక్కువైంది. మహమ్మారి సమయంలో థియేటర్స్ మూత పడడంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలవైపు మొగ్గుచూపారు. కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో వీక్షకుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోయింది. గతేడాది(2024) నాటికి దేశవ్యాప్తంగా ఓటీటీ వీక్షకుల సంఖ్య 55 కోట్లకు చేరిందంటేనే దీని స్పీడ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఓటీటీలలో సినిమాల కంటే వెబ్ సిరీస్‌ల హవానే ఎక్కువగా కొనసాగుతుంది. గతేడాదిలో రిలీజైన 315 ఒరిజినల్స్‌లో 214 వెబ్ సిరీస్‌లే ఉన్నాయి. అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్‌గా మీర్జాపూర్ సీజన్ 3 నిలిచింది. ఈ హిందీ వెబ్ సిరీస్‌ని 3 కోట్ల మంది వీక్షించారు. ఇక తెలుగులో సేవ్ ద టైగర్స్ సీజన్ 2ని అత్యధికంగా(50లక్షల మంది) వీక్షించారట. సినిమాల విషయానికొస్తే దో పత్తీ(హిందీ)ని 1.51 కోట్ల మంది ఓటీటీలో చూశారు. ఇంటర్నేషనల్ షోలలో.. స్వీడ్ గేమ్ సీజన్ -2ని 1.96 కోట్ల మంది భారతీయులు వీక్షించారు. కంటెంట్ పరంగా హీందీ అగ్రస్థానంలో ఉంది. ఓటీటీలో వస్తున్న మొత్తం ఒరిజినల్స్‌లో మూడింట రెండొంతులు బాలీవుడ్ నుంచే ఉందట. బెంగాలీ 2వ స్థానంలో ఉండగా.. 9 శాతం వాటాలతో తెలుగు మూడో స్థానంలో ఉంది. -
ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు సినిమా
కొన్ని చిత్రాలు థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతున్నాయి. అలాంటి చిత్రాల్లో ‘చౌర్యపాఠం’ ఒకటి. ఇటీవల ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ చిత్రం 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే... కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు.నిధుల కోసం ధనపల్లి అనే గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ఒక చిన్న ముఠాతో కలిసి పథకం వేసే దర్శకుడిగా అతడి నటన ఆకట్టుకుంటుంది. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. -
‘స్ట్రా' మూవీ రివ్యూ.. కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం
ఓ ఊహకు మంచి ఆలోచన తోడై దానికి క్రియేటివిటీ అనే మసాలాను జోడిస్తే అవుతుంది ఓ అద్భుతమైన సినిమా. ఒక వ్యక్తిని అది కూడా ఒక తల్లిని... పరిస్థితులు, సమాజం నిస్సహయరాయుల్ని చేస్తే... నలుగురు కలిసి అన్ని రకాలుగా ఒక మూలకు నెట్టేస్తే ఆమేం చేసిందన్న విషయాన్ని ఊహకు అందనట్టుగా అదే సమయంలో మనసుకు హత్తుకునేట్టుగా తీసే దర్శకులు ప్రపంచ స్థాయిలో చాలా మందే ఉన్నారు. బోలెడంత ఖర్చుతో , పెద్ద స్టార్ కాస్టింగ్ తో ఓ కథను తీయడం పెద్ద కష్టమేమీ కాదు, కాని అదే సమయంలో చిన్న ఆలోచనను చిన్న స్టార్ కాస్ట్ తో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం కత్తి మీద సామే. అలా తన ఆలోచనకు తానే నిర్మాతగా మారి, దర్శకత్వం వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన హాలివుడ్ దర్శకుడు టైలర్ పెర్రీ నిజంగా పెద్ద సాహసమే చేశాడు. ఆ సాహసం పేరే తాను తీసిన సినిమా స్ట్రా(Straw Movie Review). చిన్న ఆలోచనతో తన సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కదలనివ్వకుండా చేసిన సినిమా ఈ స్ట్రా. ఇది ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం...జనయా ఓ సింగిల్ మదర్, తన కూతురితో చిన్నపాటి ఇరుకు గదిలో అతి కష్టం మీద సర్దుకుంటూ ఉంటుంది. ఓ షాపింగ్ మాల్ లో పని చేసే జనయాకు ఆనందం అన్న విషయమే తెలియదు, అంతగా ఆమె జీవితం కష్టాలమయం. కనీసం స్కూల్ లో కూతురికి ఓ రోజు బ్రెడ్ కూడా పెట్టలేని పరిస్థితి. ఓ రోజు కూతురి బ్రెడ్ కోసం డబ్బులు లేక బ్యాంకు కు వెళ్ళి విత్ డ్రా చేయడానికి వెళితే, బ్యాంకు సిబ్బంది ఏదో కారణాల వల్ల డబ్బు ఇవ్వలేమని చెబితే వాళ్ళని ఎదిరించడానికి గన్ చూపిస్తుంది. బ్యాంకు లో గన్ చూపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది అవాక్కయి పోలీసులకు ఫోన్ చేస్తారు.ఇక అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. జనయాకి బ్యాంకుల వాళ్ళు డబ్బులు ఇస్తారా, లేదా గన్ చూపించినదానికి జనయాను పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. చూడడానికి ఇది చిన్న కథే అయినా ఆఖర్లో వచ్చే ట్విస్ట్ తో చూసే ప్రేక్షకుల మతి పోవడం ఖాయం. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా తరాజి పి హాన్సన్ జీవించిందని చెప్పవచ్చు. నిజానికి ఆ ఆలోచనకే దర్శకుడికి హాట్సాఫ్ చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా పెద్ద వాళ్ళకు మాత్రమే. అలాగే ఇది తెలుగులోనూ లభ్యమవుతుంది. ఈ రివ్యూ చదివిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కాని ఇలాంటి సినిమా మాత్రం చాలా అరుదు. మస్ట్ వాచ్. -
సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా
రీసెంట్ టైంలో కొత్త సినిమాలు ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే త్వరగానే వచ్చేస్తున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలైతే మరీ రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ ఇలానే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'రాజాసాబ్' దర్శకుడు మారుతి దీన్ని సమర్పించడం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ప్రస్తుతం అందుబాటులో ఉంది?(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)'ఉయ్యాలా జంపాలా', 'బాహుబలి' తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఘటికాచలం'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని తీసుకుని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించగా.. నిఖిల్‌తో పాటు ప్రభాకర్, ఆర్వికా గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ రెండు ఓటీటీల్లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది.మే 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు 20 రోజులకే అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ అంశాలు బాగున్నప్పటికీ చిన్న సినిమా కావడంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు చూస్తారేమో? ఘటికాచలం విషయానికొస్తే.. తండ్రి కోరిక మేరకు మెడిసన్ చదివే ఓ కుర్రాడికి భయంకరమైన గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అలా చేయడానికి కారణమేంటి? ఆ గొంతు ఎవరిది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
కొత్త సినిమాలు.. వచ్చేది ఆ ఓటీటీల్లోనే
ఈ వారం ఓటీటీల్లో దాదాపు 24 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. మరోవైపు థియేటర్లలోనూ మూడు కొత్త మూవీస్ వచ్చేశాయి. వీటిలో 'కుబేర'కి పాజిటివ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. బిచ్చగాడిగా ధనుష్ యాక్టింగ్ ఇరగదీశాడని అంటున్నారు. నాగార్జున, రష్మిక కూడా ఆకట్టుకున్నారని రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూసేవాళ్లు చూస్తారు. అలానే ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లు కూడా ఉంటారు.'కుబేర' ఓటీటీ డీల్ విషయానికొస్తే.. రిలీజ్‌కి ముందు డిజిటల్ హక్కులు అమ్మేశారు. లెక్క ప్రకారం నిర్మాతలు.. జూలైలో వద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ చేయాలని చెప్పాడు. దీంతో నిర్మాతలు తలొగ్గారు. అయితే ఓటీటీ ఒప్పందం మాత్రం నాలుగు వారాలకే చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే జూలై 3వ వారంలో అలా స్ట్రీమింగ్ కావొచ్చేమో?(ఇదీ చదవండి: Kuberaa Review: ‘కుబేర’ మూవీ రివ్యూ)'8 వసంతాలు' విషయానికొస్తే.. ఓ చక్కటి ప్రేమకథా చిత్రం. బాగుందనే టాక్ వస్తుంది. అదే టైంలో స్టోరీ చాలా నెమ్మదిగా సాగేలా ఉందని అంటున్నారు. హీరోయిన్గా అనంతిక యాక్టింగ్ ఇచ్చిపడేసిందని రివ్యూలు వచ్చాయి. కంప్లీట్ లవ్ స్టోరీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో సినిమాలన్నీ నాలుగు వారాలకే వచ్చేస్తున్నాయి. ఇది కూడా అలానే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.ఈ రెండింటితో పాటు హిందీ సినిమా ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' కూడా థియేటర్లలో రిలీజైంది. దీని బుకింగ్స్ చాలా డల్‌గా ఉన్నాయి. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఎంతమేర నిలబడుతుందో చూడాలి? ఎందుకంటే ఆమిర్ గత చిత్రాలు దారుణంగా ఫెయిలయ్యాయి. అలానే ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని ఏ ఓటీటీ సంస్థకు కూడా అమ్మలేదు. 8 వారాల తర్వాత యూట్యూబ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ) -
టాప్ ట్రెండింగ్‌లో టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర మరో ఆసక్తికర సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు. బ్లైండ్ స్పాట్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో అలరించాడు. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు.అయితే ఇటీవలే బ్లైండ్ స్పాట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అంతగా రాణించలేకపోయినప్పటికీ.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా వ్యాప్తంగా ఏకంగా టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ క్రైమ్ థ్రిల్లర్ కథేంటో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో రాశీసింగ్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు.బ్లైండ్ స్పాట్ కథేంటంటే?హైదరాబాద్‌కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే. View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన '8 వసంతాలు', 'కుబేర', 'సితారే జమీన్ పర్' సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్ కళకళలాడటం గ్యారంటీ. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ శుక్రవారం 24 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఘటికాచలం, హద్దులేదురా, జింఖానా, యుద్ధకాండ, లవ్లీ, గ్రౌండ్ జీరో సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీసు.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పుడు చెప్పిన వాటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఉన్నాయి. అలానే ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 20)అమెజాన్ ప్రైమ్యుద్ధకాండ ఛాప్టర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాలవ్లీ - మలయాళ మూవీఘటికాచలం - తెలుగు మూవీఆహాఅలప్పుజా జింఖానా - తెలుగు మూవీజిన్ ద పెట్ - తమిళ సినిమాసేవ్ నల్ల పసంగ - తమిళ సిరీస్యుగీ - తమిళ సినిమా నెట్ఫ్లిక్స్కె-పాప్ డీమన్ హంటర్స్ - కొరియన్ సినిమాఒలింపో - స్పానిష్ సిరీస్సెమీ సోయిటర్ - ఇంగ్లీష్ సినిమాఏ కింగ్ లైక్ మీ - ఇంగ్లీష్ మూవీగ్రీన్ బోన్స్ - తగలాన్ సినిమాబేబీ ఫార్మ్ సీజన్ 1 - నైజీరియన్ సిరీస్ఏ లాగోస్ లవ్ స్టోరీ - నైజీరియన్ మూవీద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 - హిందీ కామెడీ షో (జూన్ 21)హాట్స్టార్ఫౌండ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5డిటెక్టివ్ షెర్డిల్ - హిందీ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీప్రిన్స్ అండ్ ఫ్యామిలీ - మలయాళ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్ఫస్ట్ కాపీ - హిందీ సిరీస్లయన్స్ గేట్ ప్లేకబోల్ - ఫ్రెంచ్ సిరీస్ఎలెవన్ - తమిళ మూవీబుక్ మై షోహద్దులేదురా - తెలుగు సినిమా(ఇదీ చదవండి: హిట్3 మేకర్స్‌పై కేసు వేసిన అభిమాని) -
'పెళ్లి రోజే వధువు మరణిస్తే'.. ఆసక్తిగా టాలీవుడ్ థ్రిల్లర్ ట్రైలర్!
ఓటీటీలు వచ్చాక హారర్ అండ్ థ్రిల్లర్ కంటెంట్‌కు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఈ జోనర్లో ఎక్కువగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ అలరించేందుకు వస్తోంది. యూట్యూబర్ అభిజ్ఞ కానిస్టేబుల్‌గా నటిస్తున్న ఈ థ్రిల్లర్‌కి 'విరాటపాలెం'. ఇటీవలే ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు పొల్లూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూస్తే ఓ గ్రామంలో పెళ్లైన వధువు అదే రోజు రాత్రి మరణిస్తుంది. ఇదంతా ఆ ఊరికి ఉన్న శాపం వల్లే గ్రామస్తులు భావిస్తారు. కానీ ఆ ఊరికి వచ్చిన లేడీ కానిస్టేబుల్ దీని వెనుక ఉన్న గుట్టును బయట పెట్టేందుకు యత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లతో ఈ కథను ఆసక్తికరంగా తెరెకెక్కించారు. ఈ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జూన్ 27న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
OTT: రాజీవ్ గాంధీ హత్య కేసు ఆధారంగా 'ద హంట్'
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అదే ద హంట్ (The Hunt: The Rajiv Gandhi Assassination Case). ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. జూలై 4 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది. అందులో.. 'రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా? ఆయనింకా బతికే ఉన్నారా?' అని శ్రీలంకలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి ఫోన్ రావడంతో టీజర్ మొదలవుతుంది. బాంబు పేల్చి రాజీవ్‌గాంధీని చంపిందెవరు? వారి ఉద్దేశ్యం ఏంటి? అన్న కోణాల్లో విచారణ మొదలుపెడతారు. ప్రతి సెకను కూడా ముఖ్యమేనంటూ నిందితులను పట్టుకునే పనిలో ఉంటారు. తర్వాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఓటీటీలో సిరీస్ చూడాల్సిందే! ద హంట్‌కు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కాగా 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. The assassination that shook the nation. The manhunt that stunned the world.The Hunt - The Rajiv Gandhi Assassination Case, streaming from 4th July on Sony LIV.#TheHuntOnSonyLIV pic.twitter.com/ExOXEZxYFK— Sony LIV (@SonyLIV) June 18, 2025 -
సడన్‌గా ఓటీటీలో వచ్చేసిన రాధికా ఆప్టే సినిమా
కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చిన వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా హీరోయిన్ రాధిక ఆప్టే లేటెస్ట్ మూవీ ఒకటి అలానే సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. బోల్డ్ కాన్సెప్ట్‌తో డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి కరణ్ కాందహారి దర్శకుడు కాగా మిగిలిన విభాగాల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఇంతకీ ఏంటీ సినిమా? ఎందులో అందుబాటులో ఉంది?రాధికా ఆప్డే లేటెస్ట్ బోల్డ్ మూవీ 'సిస్టర్ మిడ్ నైట్'. మే 30న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇదో సినిమా ఉందనే విషయం కూడా జనాలకు తెలియలేదు. దీంతో ఎలా వచ్చిందో అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రెండు వారాలు కాగానే ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ప్రస్తుతం యూకేలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే ఫ్లాట్ ఫామ్స్‌లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన దగ్గర కూడా అందుబాటులోకి రావొచ్చు.(ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్)'సిస్టర్ మిడ్ నైట్' విషయానికొస్తే.. పెద్దలు పెళ్లి కుదర్చడంతో ఉమ(రాధికా ఆప్టే) గోపాల్ని పెళ్లి చేసుకుంటుంది. ముంబైలోని ఓ మురికివాడలో వీళ్లు నివసిస్తుంటారు. ఈ వివాహం ఇష్టం లేకుండా చేసేసరికి ఉమ.. భర్తతో కలవలేకపోతుంది. అతడు కూడా భార్యని తాకడానికి కూడా ఇబ్బంది పడుతుంటాడు. పెళ్లయి చాన్నాళ్లు అవుతున్నా భర్త తనతో అంటీముట్టనట్లు ఉండటంత.. తన లైంగిక వాంఛ గురించి బయటకు చెప్పలేక ఇబ్బంది పడుతుంది. అనారోగ్యానికి గురవుతుంది.ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసి భర్తతో కలుస్తుంది. కానీ తెల్లారి లేచి చూసేసరికి ఉమ శవమై కనిపిస్తాడు. దీంతో ఈమె ఏం చేసింది? చివరకు ఏమైందనేదే స్టోరీ. బోల్డ్ అండ్ డార్క్ కామెడీకి తోడు కొన్ని సీన్లు మరీ పచ్చిగా ఉన్నాయి. రాధికా ఆప్డే యాక్టింగ్ బాగుందని అంటున్నారు. ఒకవేళ పొరపాటున గనక ఈ మూవీ చూస్తే మాత్రం ఒంటరిగానే చూడండి.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కామెడీ ఎంటర్టైనర్) -
ఓటీటీ సినిమా రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్
సింపుల్ బడ్జెట్, డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీయడంలో మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే రీసెంట్ టైంలో అలా వచ్చిన పలు చిత్రాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో దుమ్మురేపుతున్నాయి. అలాంటి ఓ చిత్రమే 'పడక్కళమ్'. ఓవైపు నవ్విస్తూనే కన్ఫ్యూజన్ కామెడీతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉంది? దీని సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ ఇంజినీరింగ్ కాలేజీ. షాజీ(సూరజ్ వెంజరమోడు) అనే ప్రొఫెసర్. ఆయన డిపార్ట్మెంట్ హెచ్ఓడీని సస్పెండ్ చేయడంతో ఆ స్థానంలోకి షాజీ వెళ్తాడు. అదే కాలేజీలో పనిచేస్తున్న మరో ప్రొఫెసర్ రంజిత్(షరాఫుద్దీన్)కి ఇది నచ్చదు. దీంతో తన దగ్గరున్న మాయాపెట్టెతో షాజీని తన కంట్రోల్‌కి తీసుకుని ఆటాడిస్తాడు. ఇదంతా జతిన్(సందీప్ ప్రదీప్) అనే కుర్రాడు చూసేస్తాడు. తన ఫ్రెండ్స్‌కి చెబుతాడు. కానీ వాళ్లు నమ్మరు. దీంతో రంజిత్ బ్యాగ్‌ని దొంగిలించడానికి జతిన్ ప్రయత్నిస్తాడు. తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల జతిన్ శరీరంలో రంజిత్, రంజిత్ బాడీలోకి షాజీ, షాజీ శరీరంలోకి జతిన్ ఆత్మలు ప్రవేశిస్తాయి. అసలు ఎందుకిలా జరిగింది? చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ సినిమాలు అనగానే హా ఏముంది లవ్ స్టోరీ అయ్యింటుందిలే అనుకుంటాం. కానీ ఇందులో 'జంబలకిడిపంబ' తరహాలో ఒకరి శరీరంలో మరొకరు ప్రవేశించడం అనే కాన్సెప్ట్‌ని జోడించడం కాస్త కొత్తగా అనిపించింది. పడక్కళమ్ అంటే యుద్ధభూమి అని అర్థం. సినిమా ప్రారంభంలోనే ఓ రాజ్యం, యుద్ధం అని మొదలుపెడతారు. ఓ మాయ పెట్టె గురించి చెబుతారు. కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తాం. కాలేజీలో జతిన్ గ్యాంగ్ చేసే అల్లరి, షాజీ-రంజిత్ పాత్రలు కాస్త నవ్విస్తాయి. అలా అలా ఫస్టాప్ అయిపోతుంది. సరిగ్గా ఇంటర్వెల్ సమయానికి ప్రధాన పాత్రధారులు ముగ్గరు.. ఒకరి శరీరాల్లోకి ఒకరు వెళ్లడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.సెకండాఫ్ అంతా కూడా ఒకరి శరీరంలోకి ప్రవేశించిన మరొకరు అసలు ఏం చేశారు? చివరకు మళ్లీ యాధావిధిగా వచ్చేశారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీస్‌తో పోలిస్తే ఈ సినిమా బాగుంది. కాకపోతే ఫస్టాప్ సరదాగా సాగిపోయినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం కన్ఫ్యూజన్ కామెడీతో కొంతమేర ఆకట్టుకుంది. అక్కడక్కడ థ్రిల్లింగ్‌గా అనిపించినా లాజిక్స్ లాంటివి ఏం పట్టించుకోకుండా చూస్తే టైమ్ పాస్ అయిపోతుంది. చివర్లో కాస్త ఎమోషన్ సీన్స్ పడేసరికి ఓ మంచి సినిమా చూశాంలే అనే ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో జతిన్‌గా చేసిన సందీప్ ప్రదీప్‌కి ఎక్కువ స్కోప్ దొరికింది. ఫస్టాప్ అంతా అమాయక కుర్రాడిగా, సెకండాఫ్ అంతా అగ్రెసివ్‌గా పాత్రలో ఆకట్టుకున్నాడు. విలనీ లక్షణాలున్న పాత్రలో షరాఫుద్దీన్ కూడా మెప్పించాడు. సూరజ్ వెంజరమోడు పాత్ర కూడా బాగుంది కానీ ఇంకాస్త మంచిగా సీన్స్ పడుంటే బాగుంటుంది కదా అనిపించింది. మిగతా పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. కాలేజీలో జరిగే కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్ సింపుల్ బడ్జెట్లో తీసేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఓకే ఓకే. డైరెక్షన్ కూడా పర్లేదు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగు డబ్బింగ్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాసేపు అలా ఫ్యామిలీతో కలిసి నవ్వుకుందాం అనుకుంటే ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు.- చందు డొంకాన -
ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం'
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ వస్తూనే ఉంటుంది. గతవారం అలా 30కి పైగా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఈ వారం కూడా పలు తెలుగు స్ట్రెయిట్ మూవీస్, డబ్బింగ్ చిత్రాలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి సంగతి అలా పక్కనబెడితే ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ ప్రకటించడంతో స్ట్రీమింగ్ తేదీని కూడా ఖరారు చేశారు.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్)యూట్యూబర్ అభిజ్ఞ కానిస్టేబుల్‌గా నటిస్తున్న ఈ థ్రిల్లర్‌కి 'విరాటపాలెం' అనే టైటిల్ నిర్ణయించారు. ఇది వెబ్ సిరీస్‌గా రాబోతుంది. పొల్లూరు కృష్ణ దర్శకుడు. జూన్ 27న అంటే వచ్చే వారం నుంచి ఇది జీ5లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. ఫస్ట్ లుక్ బట్టి చూస్తే ప్రధాన పాత్రధారి కానిస్టేబుల్, వెనక చాలామంది కొత్త పెళ్లి కూతుళ్లు, ఆ వెనక అమ్మవారి విగ్రహం ఉంది. చూస్తుంటే ఆసక్తికరంగానే ఉంది.1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజే మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం లాంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఓ పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ) ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. గ్రౌండ్ జీరో, డిటెక్టివ్ షెర్డిల్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ లాంటి పరభాషా సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్, ద గ్రేట్ ఇండియన్ కపిల్ కామెడీ షో ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏం లేవు.. వారాంతంలో సడన్ సర్ప్రైజులు ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్) -
ఓటీటీలో 'ఫైనల్ డెస్టినేషన్' చూడాలంటే..
హాలీవుడ్లో 'ఫైనల్ డెస్టినేషన్' ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలకు తెలుగులో భారీ క్రేజ్ ఉంది. తాజాగా ఈ సీక్వెల్ చిత్రాల నుంచి విడుదలైన కొత్త చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అప్పట్లో అందరినీ ఈ సీక్వెల్స్ చిత్రాలు వణికించాయని చెప్పవచ్చు. అయితే, సుమారు 15 ఏళ్ల తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగమైన చివరి పార్ట్ ని తీశారు. మే 15న భారత్‌లో విడుదలైంది. ప్రేక్షకులను థియేటర్లో భయపెట్టిన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, ప్రస్తుతం భారత్ నెట్‌వర్క్‌లో అందుబాటులో లేదు. ఇతర దేశాల్లో ఉంటున్న ఈమెజాన్ ప్రైమ్ యూజర్స్‌కు మాత్రమే ఈ చిత్రాన్ని చూసే ఛాన్స్ ఉంది. అయితే, మరో వారంలోనే భారత్‌లో కూడా స్ట్రీమింగ్కు రావచ్చని తెలుస్తోంది. రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్‌వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్ తదితరులు నటించారు. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది. -
ఓటీటీలో క్రేజీ సిరీస్.. ఇప్పుడు రెండో సీజన్ రెడీ
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది. లాక్ డౌన్ టైంలో మాత్రం పలు హిందీ సిరీసులు తెగ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. వాటిలో ఒకటి 'స్పెషల్ ఓపీఎస్'. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. మధ్యలో 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. వ్యూయర్స్‌ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత రెండో సీజన్‌ని సిద్ధం చేశారు. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడంతో పాటు ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?)కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషించిన తొలి సీజన్‌కి నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ జానర్లో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్‌కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సిరీస్‌పై అంచనాలు పెంచుతోంది. జూలై 11 నుంచి హాట్‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.రెండో సీజన్ కోసం ఇప్పటికే ఉన్నవాళ్లతో పాటు కొత్తగా పలువురు నటీనటులు చేరారు. అందులో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. గతంలో వచ్చిన వాటితో పోలిస్తే ఈసారి మరింత థ్రిల్ పంచేలా సిరీస్‌ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇకపోతే ఈ వారం దాదాపు 22కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లేవు. కానీ పలు డబ్బింగ్, పరభాషా చిత్రాలు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్) -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో ధనుష్-నాగార్జున 'కుబేర', '8 వసంతాలు' అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఆమిర్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన 'సితారే జమీన్ పర్' కూడా ఈ వీకెండ్లోనే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. వీటితో పాటు పలు చిత్రాలు-వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' టీజర్ రిలీజ్.. భయపెట్టడమే కాదు)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. గ్రౌండ్ జీరో, డిటెక్టివ్ షెర్డిల్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ లాంటి పరభాషా సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్, ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో కూడా ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏం లేవు.. వారాంతంలో సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 16-22 వరకు)అమెజాన్ ప్రైమ్గ్రౌండ్ జీరో (హిందీ సినిమా) - జూన్ 20 (రెగ్యులర్ స్ట్రీమింగ్)హాట్స్టార్సర్వైవింగ్ ఓహియో స్టేట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూన్ 18కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 20ఫౌండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 20జీ5డిటెక్టివ్ షెర్డిల్ (హిందీ మూవీ) - జూన్ 20ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మలయాళ సినిమా) - జూన్ 20నెట్ఫ్లిక్స్జస్టిన్ విలియమ్: మ్యాజిక్ లవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 17కౌలిట్జ్ & కౌలిట్జ్ సీజన్ 2 (జర్మన్ సిరీస్) - జూన్ 17ట్రైన్ రెక్: మేయర్ ఆఫ్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 17అమెరికాస్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 18రోషారియో టిజెరస్ సీజన్ 4 (స్పానిష్ సిరీస్) - జూన్ 18సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 18యోలాంతే (డచ్ సిరీస్) - జూన్ 18ద వాటర్ ఫ్రంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 19కే-పాప్: ద డీమన్ హంటర్స్ (కొరియన్ సినిమా) - జూన్ 20గ్రెన్ ఫెల్ అన్ కవర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 20ఒలింపో (స్పానిష్ సిరీస్) - జూన్ 20సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 20ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 (హిందీ కామెడీ షో) - జూన్ 21సన్ నెక్స్ట్జిన్: ద పెట్ (తమిళ సినిమా) - జూన్ 20ఆపిల్ ప్లస్ టీవీద బుకనీర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 18లయన్స్ గేట్ ప్లేకాబోల్ (ఫ్రెంచ్ సిరీస్) - జూన్ 20(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్) -
కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్
తెలుగులో ఫేమస్ పద్యాల్లో 'ఉప్పు కప్పురంబు.. నొక్క పోలికనుండు' ఒకటి. ఈ పద్యాన్నే టైటిల్‌గా పెట్టుకుని ఓ సినిమా వచ్చేస్తోంది. హీరోయిన్ కీర్తి సురేశ్- హీరో సుహాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఉప్పు కప్పురంబు. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం రూపొందించిన ఒరిజినల్ మూవీ ఇది.ఓటీటీలో..ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ కథ అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జూలై 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. చిట్టి జయపురం గ్రామవాసులు అందించే వినోదాల విందుకు సిద్ధంగా ఉండమని ప్రైమ్ వీడియో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. Get ready for this heartwarming ride with the citizens of Chitti Jayapuram 🌴🫰#UppuKappuRambuOnPrime, New Movie, July 4 pic.twitter.com/kzV6ssNucY— prime video IN (@PrimeVideoIN) June 16, 2025 -
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
మరో క్రేజీ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్లే చాలా ఏళ్ల తర్వాత చివరి భాగాన్ని రిలీజ్ చేయగా, యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)సీక్వెల్స్, ఫ్రాంచైజీల ట్రెండ్ మన దగ్గర రీసెంట్ టైంలో బాగా పాపులర్ అయింది. కానీ హాలీవుడ్లో మాత్రం చాలా ఏళ్ల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అలా 'ఫైనల్ డెస్టినేషన్' అనే భయానక చిత్రాల ఫ్రాంచైజీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చావులు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తారు. 2000లో తొలి భాగం రిలీజ్ కాగా.. 2003, 2006, 2009, 2011లో వరసగా నాలుగు చిత్రాలు రిలీజయ్యాయి. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.ఈ ఫ్రాంచైజీలో భాగంగా చివరిదైన 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' మూవీ.. గత నెల అంటే మే 16న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఇంకా ఆడుతోంది. అదే టైంలో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికాలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే అద్దె విధానంలో చూడొచ్చు. జూన్ 17 నుంచి అంటే ఈ మంగళవారం ఉదయం నుంచి మన దేశంలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ హారర్, భయానక చిత్రాలంటే ఇష్టముంటే దీన్ని ఓసారి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగానే చూడండి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) -
ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ
ఓటీటీలో ఎప్పటికప్పుడు బోలెడన్ని కొత్త సినిమాలు వస్తుంటాయి. కొన్ని మాత్రమే నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా మస్ట్ వాచ్ అనిపించుకుంటూ ఉంటాయి. అలాంటి ఓ మూవీ గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. కేవలం గంటన్నర నిడివితో రిలీజైన ఈ చిత్రం.. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోంది? అదే 'స్టోలెన్'. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ చిన్న ఊరి రైల్వే స్టేషన్. జుంపా(మియా మేల్జర్) అనే మహిళ.. ఐదు నెలల తన కూతురితో ఫ్లాట్‌ఫామ్‌పై నిద్రపోతుంటుంది. మరో మహిళ సైలెంట్‌గా ఈ పాపని ఎత్తుకుపోతుంది. అదే టైంలో ట్రైన్ దిగి సోదరుడి కోసం ఎదురుచూస్తున్న రామన్(శుభం).. పాపని ఎత్తుకుపోయిన దొంగ అని జుంపా అనుమానిస్తుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. కేసు నమోదు చేస్తారు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రామన్ సోదరుడు గౌతమ్(అభిషేక్ బెనర్జీ) కూడా.. ఈ వ్యవహారంలో ఇరుక్కుంటాడు. ఇంతకీ పాపని ఎత్తుకెళ్లింది ఎవరు? ఊరి ప్రజలు.. అన్నదమ్ములపై ఎందుకు దాడి చేశారు? చివరకు పాప దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. ఈ మాట గతంలో మీరు చాలాసార్లు వినే ఉంటారు. 'స్టోలెన్' చూస్తున్నంతసేపు మీరు కచ్చితంగా అదే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎలాంటి అనవసర హంగామా లేకుండా స్ట్రెయిట్‌గా స్టోరీలోకి వెళ్లడంతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి 90 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా కథ పరుగులు పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే ట్విస్టులు మనకు మతిపోయేలా చేస్తాయి. చివరకు ఓ మంచి మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.2017లో అసోంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా 'స్టోలెన్' సినిమా తీశారు. ఓ చిన్న ఊరిలోని రైల్వే స్టేషన్లో పాప కిడ్నాప్ కావడంతో మూవీ మొదలవుతుంది. పాపని ఎత్తుకుపోయిన కాసేపటికి నిద్రలేచిన తల్లి.. స్టేషన్లో ఓ వ్యక్తిని చూసి అనుమానిస్తుంది. కొంతసేపటి తర్వాత అసలు దొంగ ఎవరో ఆమెకు తెలుస్తుంది. కానీ అనుమానిత వ్యక్తి, అతడి సోదరుడు కూడా పోలీసుల దగ్గర ఇరుక్కుంటారు. సదరు వ్యక్తి అతి మంచితనం వల్ల.. గాలికి పోయే వ్యవహారాన్ని కాలికి తగిలించుకుంటాడు. అక్కడి నుంచి అన్మదమ్ములు ఎలాంటి కష్టాలు పడ్డారు? ఇంతకీ ఆ పాప.. సదరు మహిళ కూతురేనా? లేదంటే ఆమె కూడా దొంగతనంగా ఎత్తుకొచ్చిందా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి.సినిమా చూస్తున్నప్పుడు మనం ఊహించింది జరగనప్పుడే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇందులో కేవలం నాలుగైదు పాత్రలే ఉంటాయి. అవి ప్రవరిస్తున్న విధానం చూసి వీడు మంచోడు, ఈమె చెడ్డది అని అనుకుంటాం. కానీ స్టోరీ ముందుకెళ్లేకొద్దీ మనం అనుకున్నది జరగదు. అదే టైంలో సాదాసీదాగా మొదలైన ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామా కాస్త థ్రిల్లర్‌గా మారుతుంది. క్లైమాక్స్‌కి వచ్చేసరికి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పిల్లల అక్రమ రవాణా, సరోగసి గురించి సరికొత్త నిజం తెలుస్తుంది. కానీ చూస్తున్నంతసేపు మనం కూడా సినిమాలోని పాత్రలతో పాటు ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఈ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు పూర్తిగా సక్సెస్ అయ్యారు.ఎవరెలా చేశారు?ఓటీటీలో సినిమాలు-వెబ్ సిరీసులతో పరిచయమైన అభిషేక్ బెనర్జీ ఇందులో గౌతమ్ పాత్రలో కనిపించాడు. ఇతడిదే మెయిన్ రోల్. రియలస్టిక్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రామన్‌గా చేసిన శుభం, జుంపా రోల్ చేసిన మియా మేల్జర్ కూడా జీవించేశారు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్‌గా చూస్తే చాలా బ్రిలియంట్ మూవీ. డైరెక్టర్ కరణ్ తేజ్‌పాల్‌కి ఇదే తొలి సినిమా. కానీ చూస్తున్నంతసేపు అలా ఎక్కడా అనిపించదు. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అయితే టాప్ నాచ్ ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూడ్‌కి తగ్గట్లు భలే కుదిరిందని చెప్పొచ్చు. మిగిలిన టెక్నీషియన్స్ కూడా అదరగొట్టేశారు. ప్రస్తుతానికి ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ మంచి రియలస్టిక్ థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం 'స్టోలెన్' బెస్ట్ ఆప్షన్. -
'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఇదే సమయంలో విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. 2023లో జియో హాట్‌స్టార్ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్' వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు. పార్ట్ 1లో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించాడు. పోలీసులకు సవాలుగా మారిన ఆ కేసును ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్2 కూడా క్రైమ్ కథాంశంతోనే నిర్మించారు. పలు మర్డర్ కేసులకు సంబంధించి పోలీసులు ఎలా చేధించారనేది దర్శకడు చెబుతున్నట్లు తెలుస్తోంది. అజు వర్గీస్, లాల్,నివాస్ వాలిక్కున్ను, జిన్జ్ షాన్, శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు. జూన్ 20న జియోహాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడలో కూడా స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో చాలామంది చూసేవి థ్రిల్లర్స్. అందుకు తగ్గట్లే ఇతర భాషల్లో అలరించిన కొన్ని మూవీస్‌ని డబ్బింగ్ చేసి తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ చిత్రాన్ని దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి తీసుకొచ్చారు. సడన్ సర్ప్రైజ్ అన్నట్లు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)2022లో తమిళంలో రిలీజై ఆకట్టుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'యుగి'. కథిర్, నరైన్, జోజూ జార్జ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఇప్పుడు 'కార్తీక: మిస్సింగ్ కేస్' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆహా ఓటీటీలోకి శుక్రవారం(జూన్ 13) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్తీక అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని ఛేదించే క్రమంలో ఓ డిటెక్టివ్ బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు ఆ అమ్మాయి దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.ఇకపోతే ఇదే వీకెండ్లో ఈ సినిమాతో పాటు మరో 22 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి వచ్చేయడం విశేషం. వీటిలో శుభం, కేసరి 2, ఏస్, ఎలెవన్, జింఖానా, బ్లైండ్ స్పాట్, సిన్, డియర్ ఉమ, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీసే. ఈసారి థియేటర్లలో కొత్త సినిమాలేం రిలీజ్ కాలేదు కాబట్టి ఓటీటీ మూవీస్‌పై తెలుగు ప్రేక్షకులు లుక్కేయడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నా: అల్లు అరవింద్) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ రిలీజ్ కాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 22 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తొమ్మిది వరకు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. వీటిలో ఏస్, ఎలెవన్, శుభం, జింఖానా తదితర చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ ఉండటం విశేషం. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 13)అమెజాన్ ప్రైమ్బ్లైండ్ స్పాట్ - తెలుగు సినిమాఏస్ - తెలుగు డబ్బింగ్ మూవీఎలెవన్ - తెలుగు సినిమాఇన్ ట్రాన్సిట్ - హిందీ సిరీస్అమెరికన్ థండర్ - ఇంగ్లీష్ సినిమాద ట్రైటర్స్ - హిందీ రియాలిటీ షోడీప్ కవర్ - ఇంగ్లీష్ సినిమానెట్ఫ్లిక్స్కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్రానా నాయుడు 2 - తెలుగు సిరీస్ఫ్యూబర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఫ్లాట్ గర్ల్స్ - థాయ్ మూవీగ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 14)హాట్స్టార్కేసరి ఛాప్టర్ 2 - హిందీ సినిమాశుభం - తెలుగు మూవీఅండర్ డాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)సోనీ లివ్అలప్పుళా జింఖానా - తెలుగు డబ్బింగ్ మూవీఆహాసిన్ - తెలుగు సినిమాసన్ నెక్స్ట్డియర్ ఉమ - తెలుగు మూవీజీ5డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ - తెలుగు డబ్బింగ్ సినిమాఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ - ఇంగ్లీష్ మూవీనాట్ ఏ బాక్స్ - ఇంగ్లీష్ సిరీస్మనోరమ మ్యాక్స్‌సూపర్ గర్ల్స్ - మలయాళ సిరీస్(ఇదీ చదవండి: లైఫ్ అంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు) -
ఓటీటీలో 'కేసరి చాప్టర్ 2' స్ట్రీమింగ్
‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్‌లైన్‌ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. 1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. చరిత్ర గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్న వారికి ఈ మూవీ మంచి అవకాశం అని చెప్పవచ్చు. జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు వర్షన్ మరో వారంలోపు విడుదల కావచ్చు.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది.అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు.డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో సడెన్ సర్ప్రైజ్.. 'విజయ్ సేతుపతి' కొత్త సినిమా స్ట్రీమింగ్
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) ఓటీటీలోకి వచ్చేసింది. మే 23న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీగా ఆకట్టుకున్న ఈ మూవీని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి తర్వాత ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ వీకెండ్లో ఓటీటీలో మీరూ ఈ చిత్రాన్ని చూసేయండి.'ఏస్' (Ace) చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ చిత్రాన్ని జూన్ 13న అందుబాటులోకి తీసుకొచ్చారు. తమిళ్‌తో పాటు తెలుగు వర్షన్‌ను ఒకేసారి విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.కథబోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు. అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో 'నవీన్ చంద్ర' క్రైమ్ థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra), రాశీసింగ్ (Rashi Singh) జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'బ్లైండ్ స్పాట్'(Blind Spot). తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 9న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినప్పటికీ క్రైమ్ కథలను ఇష్టపడే వారిని మెప్పించింది. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ తదితరులు నటించారు.'బ్లైండ్ స్పాట్' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అందులో తెలిపారు. ఈ చిత్రంలో ఒక పాత్రే రెండు విభిన్న కోణాల్లో చాలా ఆసక్తిగా దర్శకుడు చూపారు. కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అక్కడక్కడ పండుతుంది. ఓటీటీలో చూడతగిన సినిమానే అని చెప్పవచ్చు.కథ ఏంటి..?హైదరాబాద్‌కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే. -
ముందుగానే వచ్చేస్తోన్న పంచాయత్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఓటీటీలు వచ్చాక సినీ వినోదం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. థియేటర్లలో కేవలం సినిమాలే కాదు.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్‌లకు ప్రత్యేకమై క్రేజ్ ఉంది. అలాంటి వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సరికొత్త సిరీస్ పంచాయత్. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్‌కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో రెండో సీజన్.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను అలరించాయి. ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆదరణ దక్కడంతో మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ఇంకాస్తా తొందరగానే స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు.విలేజ్ నేపథ్యంలో సాగే సరికొత్త కామెడీ డ్రామా సిరీస్‌గా వస్తోన్న నాలుగో సీజన్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పంచాయత్ సీజన్- 4 జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటి ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. మొదట జూలై 2న స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తాజాగా తేదీ మారడంతో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఈనెలలోనే సినీ ప్రియులకు అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు. shuru ho chuka hai election🗳 Manju Devi ya Kranti Devi, kiski hogi selection 👀#PanchayatOnPrime, New Season, June 24@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy@Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77… pic.twitter.com/dflHA71wbe— prime video IN (@PrimeVideoIN) June 11, 2025 -
ఓటీటీలోకి తెలుగమ్మాయి తీసిన లేటెస్ట్ సినిమా
తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్గా చేస్తూ ఓ సినిమా నిర్మించింది. కథ కూడా ఈమెని సమకూర్చడం విశేషం. తొలి చిత్రంతోనే ఇలా ఇన్ని విభాగాలకు పనిచేసిన సుమయ.. మంచి ప్రయత్నం చేసిందనే ప్రశంసలు కూడా అందుకుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ కాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)సుమయ రెడ్డి స్టోరీ అందించి హీరోయిన్-నిర్మాతగా చేసిన సినిమా 'డియర్ ఉమ'. కన్నడ నటుడు పృథ్వీ అంబర్ హీరోగా నటించాడు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా మెడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 17న రిలీజై మంచి ప్రయత్నం చేశారనే ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ.. సన్ నెక్స్ట్ ఓటీటీలో జూన్ 13 నుంచి అంటే ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికైతే తెలుగులో మాత్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'డియర్ ఉమ' విషయానికొస్తే.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధిస్తుంది. హాస్పిటల్ కట్టి తన తండ్రి కల నెరవేర్చాలని అనుకుంటుంది. మరోవైపు దేవ్(పృథ్వీ అంబర్)కి మ్యూజిక్ అంటే ప్రాణం. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్ కారణంగానే ఆమె ఇతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఓ డైరీ ద్వారా ఉమ, దేవ్ జీవితంలోకి వస్తుంది. అలా డైరీ చదువుతూ ఉమతో ప్రేమలో పడతాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్న టైంలో షాకింగ్ నిజం ఒకటి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? కార్పొరేట్ మెడికల్ మాఫియాపై సాగించిన పోరాటంలో ఉమకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంతానం కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది!
రీసెంట్ టైంలో ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి ఘోరమైన డిజాస్టర్ అయిన సినిమా 'థగ్ లైఫ్'. తొలిరోజు తొలి ఆటకే ఫలితం ఏంటో తెలిసిపోయింది. రిలీజ్‌కి కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత తేలిపోయింది. ఇప్పుడు వీకెండ్ కూడా పూర్తి కావడంతో చాలాచోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో టీమ్ పునరాలోచనలో పడిపోయింది. దీంతో ఓటీటీ లెక్క మారే సూచనలు కనిపిస్తున్నాయి.సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత సదరు సినిమా.. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కావాలనేది ముందే మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుంటారు. కమల్ హాసన్ 'థగ్ లైఫ్' చిత్రానికి కూడా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనిమిది వారాల తర్వాతే స్ట్రీమింగ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఉత్తరాదిలోనూ మల్లీప్లెక్స్ రిలీజ్ దక్కింది. తీరా చూస్తే తొలి వీకెండ్‌కే సినిమా ఫలితం ఏంటో తెలిసిపోయింది. దీంతో నిర్మాతలు.. ఓటీటీ సంస్థతో బేరాసారాలు మొదలుపెట్టారట.ఒప్పందం చేసుకున్నట్లు ఎనిమిది వారాలు కాకుండా నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అడుగుతున్నారట. తద్వారా కొంత మొత్తం ఎక్కువ రాబట్టుకోవాలని నిర్మాతల ఆలోచన. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు నడుస్తున్నాయి. రీసెంట్ టైంలో థియేటర్లలో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. కంగువ, విడామయూర్చి, రెట్రో ఈ కోవలోకే వస్తాయి. బహుశా 'థగ్ లైఫ్' కూడా అలానే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రెండ్ అవుతుందేమో చూడాలి? ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ఓటీటీ రిలీజ్ విషయంలో క్లారిటీ రావొచ్చు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్‌స్టర్. అనుకోకుండా తండ్రిని కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని శక్తిరాజు పెంచుకుంటాడు. తన తర్వాత తన ముఠాకు అమర్‌ని నాయకుడిగా చేస్తాడు. దీన్ని అదే ముఠాలోని ఇతర సభ్యులు తీసుకోలేకపోతారు. ఇంతలోనే శక్తిరాజుపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఇంతకీ శక్తిరాజుని చంపాలనుకున్నది ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో ఇంద్రాణి, లక్ష్మీ పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి కాంట్రవర్సీ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి మరో హారర్ కామెడీ సినిమా వచ్చేందుకు రెడీ అయింది. గత నెలలో ఓ పేరడీ పాట వల్ల వివాదాస్పదమైన ఈ చిత్రం.. తిరుమల వేంకటేశ్వర స్వామిని నమ్మే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది. పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అలా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎప్పుడు రాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)తమిళ కమెడియన్ సంతానం హీరోగా నటించిన కామెడీ మూవీ 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్'. మే 16న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. కానీ కంటెంట్ తేలిపోవడంతో ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. అయితే గోవింద అంటూ సాగే దేవుడి పాటని ఇందులో పేరడీ చేయడం కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది. తర్వాత దాన్ని తొలగించడంతో అందరూ సైలెంట్ అయిపోయారు.ఇక ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి నెల కూడా అవ్వకుండానే ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 13 నుంచి జీ5లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విషయానికొస్తే.. కిస్సా 47 అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే కృష్ణ(సంతానం)కి ప్యారడైజ్ అనేది థియేటర్ నుంచి స్పెషల్ టికెట్ వస్తుంది. దీంతో కుటుంబంతో సహా కృష్ణ ఆ థియేటర్‌కి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఆ థియేటర్లో అసలేం జరుగుతుందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?
ఓటీటీలోకి మరో మంచి సినిమా రాబోతుంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని, రూ.150 కోట్ల మేర వసూళ్లు సాధించింది. చాన్నాళ్ల హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ కుమార్.. కాస్త బూస్టప్ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ రిలీజ్ చేశారు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ వైరల్ అవుతోంది.జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'కేసరి చాప్టర్ 2'. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. కోర్టు రూమ్ డ్రామాగా తీసిన ఈ మూవీని తొలుత హిందీలో ఏప్రిల్ 18న రిలీజ్ చేయగా మంచి టాక్ వచ్చింది. నెల తర్వాత అంటే మే 23న తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో జూన్ 13 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై ప్రకటన రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)కేసరి 2 విషయానికొస్తే.. 1919లో జలియన్ వాలా బాగ్ మరణకాండ జరిగింది. దీనికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. తన అధికారం ఉపయోగించి ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో ఎక్కడా రాకుండా మేనేజ్ చేస్తాడు. అలానే బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని జనరల్ డయ్యర్ కోరాడు.కానీ జలియన్ వాలా బాగ్ ఘటన గురించి అర్థం చేసుకున్న శంకరన్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనరల్ డయ్యర్‌పై కేసు వేస్తాడు. దీంతో మైకేల్ డయ్యర్ తనని తాను కాపాడుకునేందుకు లాయర్ నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్)ని అపాయింట్ చేసుకుంటాడు. మరి జలియన్ వాలా బాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. లెక్క ప్రకారం ఈ వీకెండ్లో రావాల్సిన 'హరిహర వీరమల్లు' వాయిదా పడటంతో థియేటర్లన్నీ ఖాళీగానే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోకి ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని చూడదగ్గవి ఉండటం విశేషం. (ఇదీ చదవండి: గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. సమంత 'శుభం', ఎలెవన్ అనే తెలుగు మూవీస్‌తో పాటు 'జింఖానా' అనే డబ్బింగ్ సినిమాతో పాటు 'రానా నాయుడు' సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 9 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్ద క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 09ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10ట్రైన్ రెక్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 10అనీలా (పోలీష్ సిరీస్) - జూన్ 11ఛీర్ టూ లైఫ్ (పోర్చుగీస్ మూవీ) - జూన్ 11కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11అవర్ టైమ్స్ (స్పానిష్ సినిమా) - జూన్ 11టైటాన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 11ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13ఆహాఎలెవన్ (తెలుగు సినిమా) - జూన్ 13అమెజాన్ ప్రైమ్ద ట్రైటర్స్ (హిందీ రియాలిటీ షో) - జూన్ 12ఇన్ ట్రాన్సిట్ (హిందీ సిరీస్) - జూన్ 13హాట్స్టార్పడక్కలమ్ (మలయాళ సినిమా) - జూన్ 10ద రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామి సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12శుభం (తెలుగు మూవీ) - జూన్ 13అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 15సోనీ లివ్జింఖానా (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 13ఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 13నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13మనోరమ మ్యాక్స్కర్ణిక (మలయాల సినిమా) - జూన్ 09(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 'లెవన్' (Eleven) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ వర్షన్లో మే 16న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీని లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ మూవీలో అభిరామి, రవి వర్మ కీలక పాత్రలు చేశారు. ఏఆర్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు.'ఆహా' (Aha) వేదికగా ఈ నెల 13 నుంచి 'లెవన్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఐఎమ్‌డిబి రేటింగ్‌లో కూడా ఈ చిత్రం 7.9 సాధించింది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి లెవన్ తప్పకుండా నచ్చుతుందని నెటిజన్లు చెబుతున్నారు. కథలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటే వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్లాన్ వేశారు అనేది మూవీలో చక్కగా చూపారు.'లెవన్' కథేంటంటే.. అరవింద్(నవీన్ చంద్ర) ) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. ఏసీపీ హోదాలో వైజాగ్‌కి ట్రాన్స్ఫర్ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్ కుమార్ (శశాంక్) డీల్ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ తొలి వెబ్ సిరీస్
బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డాని. ‘శ్రీకారం’ ఫేమ్ బి. కిశోర్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా, సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరోలుగా నటించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కామెడీ, హారర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది.రీతు వర్మ ఓటీటీ లో డెబ్యూ , పల్లెటూరి అమ్మాయి గా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అందంగా ఉంది , టీచర్ గా ప్రాబ్లం వస్తే ఎదిరించే అమ్మాయి లాగా బాగా చేసింది. సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది , శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయి గా బాగా సెట్ అయ్యాడు. సుబ్బరాజు నీ పల్లెటూరి క్యారెక్టర్ లో కొత్తగా అనిపించాడు. చాలా రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిచించారు... సిరీస్ కి ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. -
ఓటీటీలో 'సమంత' సినిమా.. ట్రైలర్ విడుదల
టాలీవుడ్ నటి సమంత నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా 'శుభం' ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణంలోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. తన తొలి ప్రయత్నంలోనే కొత్తతరం నటులతో తెరకెక్కించడమే కాకుండా ఆమె ఇందులో మాయ అనే అతిథి పాత్రలోనూ మెప్పించారు. మే 9న విడుదలైన శుభం మూవీని ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, వంశీధర్ గౌడ్, శ్రియ కొంతం, శర్వాణి లక్ష్మీ, షాలిని కొండెపూడి తదితరులు నటించారు. జియో హాట్‌స్టార్ వేదికగా జూన్ 13 నుంచి శుభం చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది. -
ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్ డార్క్ కామెడీ మూవీ... 'సొప్పన సుందరి' ఎలా ఉందంటే?
టైటిల్: సొప్పన సుందరినటీనటులు: ఐశ్వర్య రాజేశ్, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, దీపా శంకర్, కరుణాకరన్ తదితరులుడైరెక్టర్: ఎస్జీ ఛార్లెస్ఓటీటీ ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బ్యూటీ 'ఐశ్వర్య రాజేశ్'(Aishwarya Rajesh). ఇప్పుడు తెలుగువారికి సుపరిచితమైన పేరు. గతంలో ఆమె పలు తమిళ చిత్రాల్లో మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో వచ్చిన డార్క్ కామెడీ ఎంటర్టైనర్ సొప్పన సుందరి (Soppana Sundari). 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'సొప్పన సుందరి' కథేంటంటే..అహల్య (ఐశ్వర్య రాజేశ్) తన తల్లి, అక్కతో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటుంది. తాను ఓ నగల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది. అయితే అహల్యకు ఉహించని విధంగా రూ.10 లక్షల విలువైన లక్కీ డ్రాలో బహుమతిగా లభిస్తుంది. అయితే కారు దక్కిందని సంతోషించేలోపే అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ ఆ కారు అహల్య కుటుంబానికి దక్కిందా? నగలే కొనకుండా అసలు ఈ బహుమతి వీరికెలా వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సొప్పన సుందరి చూడాల్సిందే.ఎలా ఉందంటే..వీకెండ్ వచ్చిందంటే చాలు. సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. అలాంటి వారిని కడుపుబ్బా నవ్వించే డార్క్ కామెడీ చిత్రం సొప్పన సుందరి. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి సందేశం కూడా ఇచ్చే మూవీ. అహల్య(ఐశ్వర్య రాజేశ్), అన్నయ్య దొర (కరుణాకరన్) పెళ్లి చేసుకుని కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో అహల్య తన అక్క పెళ్లి బాధ్యతను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రథమార్థంలో అహల్య కారు గెలుచుకోవడం, ఆ తర్వాత అహల్య అక్కకు కూడా పెళ్లి కుదురుతుంది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కారు కోసం అన్నయ దొర ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి. అలా ఈ కథ చివరికీ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.పోలీసుల చేతికి కారు వెళ్లడంతో.. సెకండాఫ్ వచ్చేసరికి కథ మొత్తం కారు చుట్టే తిరుగుతుంది. ఆ కారును దక్కించుకునే క్రమంలో ఐశ్వర్య రాజేశ్.. ఆమె అన్నయ్య దొర తన టీమ్‌తో కలిసి చేసే ప్రయత్నాలు ఫుల్ కామెడీని తలపిస్తాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ లాజిక్‌లెస్‌గా ఉంటాయి. అయితే కామెడీ కథ కోణంలో చూస్తే అలా ఉంటేనే సెట్ అవుతుంది. అందుకే డైరెక్టర్ ఎలాంటి లాజిక్ లేకుండా కథను రాసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ కలగదు. చివర్లో కారును అడ్డం పెట్టుకుని ఎస్సై చేసే దుర్భుద్దిని చూపిస్తూ డైరక్టర్ ఆ కోణంలోనూ ఆడియన్స్‌కు మేసేజ్ ఇచ్చారు. అయితే ఈ మూవీతో మనది కానీ వస్తువును బలవంతంగా తీసుకెళ్తే మనిషికి మనశ్శాంతి ఉండదనే సందేమిచ్చారు. కక్లైమాక్స్‌లో దురాశ దుంఖానికి చేటు అనే సామెతతో కథను ముగించాడు. కామెడీతో పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి సందేశాన్నిచ్చే చిత్రం సొప్పన సుందరి. వీకెండ్లో మంచి కామెడీతో పాటు సందేశాత్మక చిత్రం చూడాలనుకుంటే సొప్పన సుందరి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..ఐశ్వర్య రాజేశ్ ఈ కథకు ప్రధాన బలం. తన పాత్రలో సహజంగా నటించి అభిమానులను మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా తన పాత్రలో ఒదిగిపోయింది. ఐశ్వర్యకు తల్లి పాత్ర పోషించిన దీపా శంకర్, ఆమె అన్నయ్యగా దొరగా కరుణాకరన్ తమ పాత్రల్లో మెప్పించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్‌లో సాగదీత సన్నివేశాలు కట్ చేయాల్సింది. నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఫర్వాలేదనిపించాయి. -
ఓటీటీలోకి 'ప్రేమలు' హీరో స్పోర్ట్స్ కామెడీ మూవీ
'ప్రేమలు' సినిమాతో హీరోయిన్ మమిత బైజు గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సూర్య, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో మూవీస్ చేస్తోంది. ఇదే చిత్రంలో హీరోగా నటించిన నస్లేన్ కూడా వరస సినిమాలు చేస్తున్నాడు. అలా ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ.. మలయాళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలో రిలీజై హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఆ చిత్రం సంగతేంటి? ఎందులో రానుంది?'ప్రేమలు' హీరో నస్లేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జింఖానా'. ఏప్రిల్ 10న మలయాళ వెర్షన్ రిలీజ్ కాగా.. ఇదే నెల చివర్లో తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్‌తో పాటు ఓ మాదిరి కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)'జింఖానా' సినిమా విషయానికొస్తే.. అలప్పుజాకు చెందిన ఆకతాయి కుర్రాళ్లు జాన్సన్ (నస్లేన్)తో పాటు మరో ఐదుగురు ఫ్రెండ్స్. వీళ్లలో షణవాస్ అనే కుర్రాడు తప్పితే మిగిలిన వాళ్లంతా 12వ తరగతిలో ఫెయిల్. దీంతో డిగ్రీ చదవాలంటే స్పోర్ట్స్ కోటా ద్వారా వెళ్లాలనుకుంటారు. అలా బాక్సింగ్ నేర్చుకుంటారు. స్థానికంగా 'అలప్పుజా జింఖానా' అకాడమీలో శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. స్థానిక పోటీల్లో ఎలాగో గెలిచిన కుర్రాళ్ల గ్యాంగ్.. కేరళ స్టేట్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అవుతుంది. ఫ్రొఫెషనల్ ఆటగాళ్లు ఉండే ఆ బాక్సింగ్ పోటీల్లో ఈ ఆకతాయి గ్యాంగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? గెలిచారా లేదా అనేది మిగతా స్టోరీ.ఇక ఈ వీకెండ్ దాదాపు 30కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్, స్టోలెన్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది.(ఇదీ చదవండి: హిందీ హీరో చేసిన తెలుగు ఫ్లేవర్ సినిమా.. 'జాట్' ఓటీటీ రివ్యూ)Watch the group that trained for marks…and ended up fighting for much more.#AlappuzhaGymkhana streaming from 13th June on Sony LIV#AlappuzhaGymkhana #AlappuzhaGymkhanaOnSonyLIV#NaslenKGafoor #LukmanAvaran #AnaghaMayaRavi #GanapathiSPoduval #BabyJean #SandeepPradeep pic.twitter.com/oEikMxNAQ5— Sony LIV (@SonyLIV) June 6, 2025 -
హిందీ హీరో చేసిన తెలుగు ఫ్లేవర్ సినిమా.. ఓటీటీ రివ్యూ
తెలుగులో లెక్కలేనన్నీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అలా తెలుగు దర్శకులు.. ఇతర భాషల్లోనూ మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీసిన హిందీ సినిమా 'జాట్'. ఏప్రిల్‌లో హిందీ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'.. తెలుగు రివ్యూ)కథేంటి?శ్రీలంక నుంచి అక్రమంగా ఇక్కడికి వలసొచ్చిన రణతుంగ(రణదీప్ హుడా).. ప్రకాశం జిల్లాలోని మోటుపల్లితో పాటు చుట్టుపక్కన 30 గ్రామాల్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. మరోవైపు అయోధ్య వెళ్తున్న జాట్(సన్నీ డియోల్).. ట్రైన్లో సాంకేతిక లోపం కారణంగా మోటుపల్లిలో దిగుతాడు. ఆకలేసి ఓ షాపులో ఇడ్లీ తినబోతుంటే.. కొందరు రౌడీలు జాట్ ప్లేట్‌ని తోసేస్తారు. దీంతో వాళ్లని సారీ చెప్పమంటాడు. వాళ్లు చెప్పరు. ఫలితంగా ఈ పంచాయతీ.. రణతుంగ దగ్గరకు చేరుతుంది. తర్వాత ఏమైంది? ఇంతకీ జాట్, రణతుంగ గతమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?జాట్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు సినిమాల్లో అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ ఇది. కొన్ని గ్రామాల ప్రజల్ని ఇబ్బంది పెట్టే కరుడుగట్టిన విలన్.. అనుకోకుండా హీరో ఆ ఊరికి రావడం, సమస్య తెలుసుకుని విలన్‌తో తలపడటం.. చివరకు కథ సుఖాంతం. ఎన్నిసార్లో తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సినిమాల్ని చూసి చూసి విసుగెత్తిపోయారు. బహుశా అందువల్లనేమో మన దగ్గర థియేటర్లలో నేరుగా రిలీజ్ చేయలేదు. హిందీలో రిలీజ్ చేస్తే ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది.ట్రైన్లో వెళ్తుండే హీరో.. అనుకోకుండా విలన్ ఉండే ఊరిలో దిగడం, తర్వాత కొందరు రౌడీలతో ఇడ్లీ పంచాయతీ. అది కాస్త మెయిన్ విలన్ దగ్గరకు వెళ్లడం.. ఇలా ఫస్టాప్ ముగుస్తుంది. ఊహించినట్లే సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోటుపల్లి గ్రామస్థులని విలన్, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏంటి? లాంటి సీన్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. హీరో బ్యాక్ గ్రౌండ్ రివీల్ చేసి, విలన్ని చంపే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో క్లైమాక్స్‌ని రొటీన్‌గా ముగిస్తారు.రెండున్నర గంటల సినిమానే గానీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించేలా సాగుతుంది. యాక్షన్ సీన్లలో డోస్ ఎక్కువైపోయింది. హీరో అడుగేస్తే భూమి బద్దలవడం, కొట్టగానే రౌడీలు గాల్లో అంతెత్తున ఎగరడం లాంటి సీన్స్ యాక్షన్ ప్రియులకు నచ్చుతాయేమో గానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం నవ్వు తెప్పిస్తాయి.ఎవరెలా చేశారు?హీరోగా చేసిన సన్నీ డియోల్.. కొందరు తెలుగు ప్రేక్షకులకు తెలుసంతే. సినిమాలో ఆయన పాత్రని చూస్తున్నప్పుడు ఇది బాలకృష్ణ చేయాల్సిన రోల్ కదా అనిపిస్తుంది. విలన్‌గా రణదీప్ హుడా బాగానే చేశాడు. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కడు. మిగిలిన వాళ్లలో రెజీనా, సయామీ ఖేర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.సినిమాని చాలా రిచ్‌గా తీశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు బాగోలేవు. యాక్షన్ సీన్స్ హిందీ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో గానీ తెలుగు ప్రేక్షకులు అయితే ఇదివరకే ఇలాంటి చాలా చూసేశాం కదా అని కచ్చితంగా అనుకుంటారు. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రొటీన్ రెగ్యులర్ మసాలా మూవీనే హిందీ హీరోతో తీసేశాడు. ఒకవేళ మీకు టైమ్ ఉండి, ఏదైనా రొటీన్ మాస్ మసాలా మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.-చందు డొంకాన(ఇదీ చదవండి: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' తేలిపోయింది. పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు శుక్రవారం.. బద్మాషులు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిన్న సినిమాలు వచ్చాయి. కాకపోతే వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. కానీ ఓటీటీల్లోకి మాత్రం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి.(ఇదీ చదవండి: సడన్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్' శుభశ్రీ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (జూన్ 06)అమెజాన్ ప్రైమ్సింగిల్ - తెలుగు సినిమాసుశీల సుజిత్ - మరాఠీ మూవీబెంగాల్ 1947: ద అన్‌టోల్డ్ స్టోరీ - హిందీ సినిమామట్ లాక్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్జొరకయ్యా తట్టుంగ - తమిళ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీభోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమాఅంటిల్ డాన్ - ఇంగ్లీష్ మూవీగుల్కండ్ - మరాఠీ సినిమాపారిస్ ఇన్ బాలీ - ఇండోనేసియన్ మూవీద అకౌంటెంట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాహాట్స్టార్దేవిక & డానీ - తెలుగు సిరీస్గెట్ ఎవే - ఇంగ్లీష్ మూవీఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ - ఇంగ్లీష్ సినిమావై 2 కే - ఇంగ్లీష్ మూవీనెట్ఫ్లిక్స్కె.ఓ - ఇంగ్లీష్ సినిమామెర్సీ ఫర్ నన్ - కొరియన్ సిరీస్స్ట్రా - ఇంగ్లీష్ మూవీద సర్వైవర్స్ - ఇంగ్లీష్ సిరీస్గోల్డెన్ సిక్స్టీన్స్ సీజన్ 1 - జపనీస్ రియాలిటీ షోజాట్ - తెలుగు సినిమాజీ5ఛల్ కపట్ - హిందీ సిరీస్సన్ నెక్స్ట్లాల్ సలామ్ - తెలుగు డబ్బింగ్ సినిమాజిగేల్ - తెలుగు మూవీఆహావడక్కన్ - తెలుగు డబ్బింగ్ మూవీఒక యుమడి ప్రేమకథ - తెలుగు డబ్బింగ్ సినిమాలయన్స్ గేట్ ప్లేచౌర్య పాఠం - తెలుగు సినిమాకోడ్ 8 - ఇంగ్లీష్ మూవీహై ఫోర్సెస్ - చైనీస్ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్లఫంగే - హిందీ సిరీస్బుక్ మై షోద లాస్ట్ విష్ - తెలుగు డబ్బింగ్ మూవీమనోరమ మ్యాక్స్పట్త్ - మలయాళ సినిమా(ఇదీ చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ బొమ్మ.. ఎక్కడంటే?
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈ ఏడాది సింగిల్‌తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 6) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడ మరో సర్ప్రైజ్ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ అందుబాటులోకి రావడం విశేషం.సింగిల్ సినిమా కథేంటంటే?విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్‌గానే ఉంటాడు. ఓసారి మెట్రో రైలులో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) సాయంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తాడు. అదే సమయంలో విజయ్ జీవితంలో హరిణి (ఇవానా) వస్తుంది. పూర్వను పడేసేందుకు విజయ్ ఏమేం చేస్తాడో హరిణి కూడా అవన్నీ చేస్తుంది. అతడు ఛీ కొట్టినా అతడి వెనకాలే తిరుగుతుంది. అసలు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదంటే హరిణి ప్రేమకు పడిపోతాడా? అదీకాక సింగిల్‌గానే మిగిలిపోయాడా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సింగిల్ (Single Movie) చూడాల్సిందే!చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ 'ది అకౌంటెంట్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 2016లో విడుదలైన అకౌంటెంట్ మూవీకి సిక్వెల్‌గా పార్ట్ 2 చిత్రాన్ని దర్శకుడు గావిన్ ఓ'కానర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆపై ఎమ్డీబీలో 7 రేటింగ్ సాధించింది. బెన్ అఫ్లెక్, జోన్ బెర్నాల్, సింథియా అడ్డై-రాబిన్సన్, J. K. సిమన్స్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు.అకౌంటెంట్ 2 మూవీ అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 5నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుందని చెప్పవచ్చు. ఇంగ్లీష్ వర్షన్‌తో తెలుగు సబ్‌టైటిల్స్‌లో కూడా చూడవచ్చు. అత్యంత భారీ బడ్జెట్‌తో అమెజాన్ MGM స్టూడియోస్ (యునైటెడ్ స్టేట్స్), వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ముఖ్యంగా హారర్ మూవీలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారికోసమే మరో సూపర్ హిట్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. మలయాళంలో ఇప్పటికే అభిమానులను మెప్పించిన చిత్రం వడక్కన్. ఈ సూపర్ థ్రిల్లర్ మూవీ మార్చి 7, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ కిశోర్, శృతి మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సజీద్ ఎ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.ఈ శుక్రవారం అంటే జూన్ 6వ తేదీ నుంచి నుంచి ఆహాలో స్ట్రీమింగ్కు రానుంది. ఆహాలో తెలుగు, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇక కథ విషయానికొస్తే అతీంద్రీయ శక్తుల గురించి శోధించే ఇద్దరు వ్యక్తులు కేరళలోని ఓ చోట జరిగిన కొన్ని అంతు చిక్కని మరణాల గురించి తెలుసుకోవడానికి వస్తారు. అక్కడ వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే వడక్కన్ స్టోరీ. Mattrum oru thriller🔥🔥on the way makkaley😉#Vadakkan premieres from June6 on @ahatamil @OffbeetStudios #Vadakkanonaha #ahatamil pic.twitter.com/OAobkRgUyB— aha Tamil (@ahatamil) June 3, 2025 -
ఆరేళ్ల తర్వాత ఓటీటీకి దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
గతేడాది లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం 'ఓరు యమండన్ ప్రేమకథ'. ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌కు బీసీ నౌఫల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. 2019లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మలయాళంలో అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది.తాజాగా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఒక యముడి ప్రేమకథ టైటిల్‌తో ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత రావడంతో ఓటీటీ ప్రియులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
ఓటీటీకి వచ్చేసిన రూ.120 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా జాట్. ఈ సినిమాలో సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'జాట్' ఏప్రిల్ 10న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జాట్.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్ల వరకు రాబట్టింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా విలన్‌గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.జాట్ అసలు కథేంటంటే..?ఆంధ్రప్రదేశ్‌లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్‌దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్ (సన్నీ డియోల్)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్‌కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది. ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్‌తో జాట్ రెచ్చిపోతాడు. ఈ విషయం కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్‌కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.Don't fear, Jaat is finally here 💥 Iske jaisa na kabhi hua hai, na kabhi hoga 🔥💪Watch Jaat, out now in Hindi and Telugu on Netflix.#JaatOnNetflix pic.twitter.com/3IBxy7QNhi— Netflix India (@NetflixIndia) June 5, 2025 -
సడన్‌గా ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 20కి పైగా మూవీస్-సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రజనీకాంత్ 'లాల్ సలామ్', సన్నీ డియోల్ 'జాట్' చిత్రాలు కాస్త చెప్పుకోదగ్గవిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటితో పాటు కొన్ని సడన్ సర్ప్రైజ్ అన్నట్లు డేట్ లాక్ చేసుకుంటున్నాయి. అలాంటి ఓ తెలుగు సినిమా దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమైంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ)తెలుగు, తమిళంలో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. అప్పుడప్పుడు హీరోగానూ పలు చిత్రాల్లో నటించారు. అలానే 'జిగేల్' అనే మూవీ.. ఈ మార్చి తొలివారంలో థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎలా వచ్చిందో అలా కనుమరుగైపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాబోతుందని ప్రకటించారు.జూన్ 5నుంచి అంటే రేపటి(గురువారం) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో 'జిగేల్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రం విషయానికొస్తే.. చిన్న చిన్న దొంగతనాలు చేసే ఓ ప్రేమ జంట కథతో ఈ మూవీ తెరకెక్కించారు. లాకర్లని చాకచక్యంగా తెరిచే టాలెంట్ ఉన్న నందు(త్రిగుణ్).. మీనా(మేఘా చౌదరి)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి రాజాచంద్ర వర్మ ప్యాలెస్‌లో పాతకాలం నాటి లాకర్‌పై కన్నేస్తారు. ఈ క్రమంలో మీనా.. జేపీ(షాయాజీ షిండే) దగ్గర పీఏగా చేరుతుంది. మరి నందు-మీనా.. ఆ లాకర్ కొట్టేశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా) -
ఓటీటీలో కోర్ట్ థ్రిల్లర్ 'గుడ్ వైఫ్'
కొన్నాళ్ల ముందు వరకు ప్రియమణి.. దక్షిణాది భాషల్లో హీరోయిన్ మాత్రమే. ఎప్పుడైతే 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ చేసిందో ఈమె దశ తిరిగిపోయింది. అటు ఓటీటీల్లో సినిమాలు,సిరీస్‌లు చేస్తూ మరోవైపు రెగ్యులర్ మూవీస్‌లోనూ ప్రధాన పాత్రలు చేస్తూ అలరిస్తోంది. ఇప్పుడు ఈమె కీ రోల్ చేస్తున్న కోర్ట్ థ్రిల్లర్ సిరీస్‌ని ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులో రాబోతుంది?(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా)ప్రియమణి, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ 'గుడ్ వైఫ్'. అమెరికన్ సిరీస్ 'గుడ్ వైఫ్' అదే పేరుతో ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి డేట్ ప్రకటించలేదు గానీ త్వరలో హాట్ స్టార్లోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.'గుడ్ వైఫ్' సిరీస్ విషయానికొస్తే.. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు ఓ మాజీ మహిళ లాయర్ ఏం చేసింది? అనేదే స్టోరీ పాయింట్. ఇందులో ప్రియమణి లాయర్‌గా కనిపించనుండగా.. ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ నటించారు. వీళ్లకు ఓ కొడుకు, కూతురు కూడా ఉన్నట్లు పోస్టర్లో చూపించారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ) -
OTT: టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ రివ్యూ
హాలీవుడ్ సిరీస్‌లలో ‘మిషన్ ఇంపాజిబుల్’కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో ఎనిమిదో భాగం మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఓ సీరియల్‌ను ప్రేక్షకులకు అలవాటుగా మార్చడం కొంచెం సులభం. కానీ అదే కథను సిరీస్ రూపంలో సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి. ఆ విషయంలో పాశ్చాత్య సిరీస్‌లు చాలావరకు విజయం సాధించాయి. అది కూడా పాతికేళ్ళకు పైగా ఒకే సిరీస్‌లో సినిమాలు నడపడమంటే మాటలా... ఇంపాజిబుల్. కానీ ఆ ఇంపాజిబుల్ టాస్క్‌ని పాజిబుల్ చేసి, ప్రేక్షకులను అలరిస్తున్న సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇటీవల ఈ హాలీవుడ్ సిరీస్‌లో 8వ సినిమాగా రిలీజ్ అయిన ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సూపర్ అనే చెప్పాలి. క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈసారి కథానాయకుడైన ఇథన్ హంట్ స్టంట్స్ అదరహో అనేలా ఉన్నాయి. సిరీస్‌లోని అన్ని సినిమాలలో ఇథన్ హంట్ పాత్రలో ప్రముఖ హాలీవుడ్ కథానాయకుడు టామ్ క్రూజ్ నటించారు. ఆయన నిజమైన సూపర్ స్టంట్స్‌తో ఆకట్టుకుంటారు. అందుకే ఈ సిరీస్ అంత స్పెషల్. ముఖ్యంగా ఎనిమిదో భాగంలో వచ్చే రెండు స్టంట్ ఎపిసోడ్లలో ప్రేక్షకులకు మతి పోతుందనే చెప్పాలి. సిరీస్ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్ ఇంపాజిబుల్. సిరీస్ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి... అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. సో... ‘ఎంజాయ్ మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ ఇన్ థియేటర్స్. – హరికృష్ణ ఇంటూరు -
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. వీళ్లు చెప్పిందే రాజ్యం అన్నట్లు నడుస్తోంది. కొత్త మూవీస్ ఎప్పుడు రిలీజ్ కావాలి? ఎప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావాలనేది సదరు సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ సినిమా విషయంలో అలానే జరిగినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఉండగానే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేస్తున్నారట. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులోకి రానుంది?రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా 'భోల్ చుక్ మాఫ్'. లెక్క ప్రకారం ఈ మూవీ గత నెల తొలి వారంలో రిలీజ్ కావాల్సింది. కానీ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని సడన్‌గా ప్రకటించారు. దీంతో ప్రముఖ మల్టీప్లెక్ సంస్థ.. కోర్టుని ఆశ్రయించింది. రూ.60 కోట్ల మేర దావా వేసింది. దీంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. అలానే మే 23న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కురచ దుస్తులపై కామెంట్స్.. సురేఖావాణి ఏమందంటే?)విడుదలై రెండు వారాలు కూడా కాలేదు. అప్పుడే 'భోల్ చుక్ మాఫ్' సినిమాని అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. జూన్ 6 నుంచి అంటే ఈ వీకెండ్లో సినిమా ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే గనక థియేటర్లలో ఉండగానే సినిమా.. డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేస్తున్నట్లే.భోల్ చుక్ మాఫ్ విషయానికొస్తే.. వారణాసిలో ఉండే రంజన్(రాజ్ కుమార్ రావ్).. టిట్లీ(వామికా గబ్బీ)ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ శివుడికి ఇచ్చి మొక్కుని మరిచిపోతాడు. దీంతో టైమ్ లూప్‌లో చిక్కుకుని, పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకే మళ్లీ మళ్లీ వస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడే ఏం చేశాడనేదే మిగతా స్టోరీ. కామెడీని ఎంజాయ్ చేసే వాళ్లకు ఇదో టైమ్ పాస్ మూవీ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు) -
ఓటీటీలో 'జాట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని(GopiChand malineni) బాలీవుడ్‌లోకి జాట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు. హీరో సన్నీ డియోల్‌తో(Sunny Deol) తెరకెక్కించిన 'జాట్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. భారీ మాస్ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రణదీప్ హుడా విలన్‌గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు.బాలీవుడ్‌ను మెప్పించిన మాస్ యాక్షన్ సినిమా 'జాట్' జూన్ 6న ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చని సమాచారం. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జాట్.. బాక్సాఫీస్ వద్ద టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేవలం రూ. 120 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, జాట్ సినిమాతో బాలీవుడ్ మాస్ ప్రేక్షకుల పల్స్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని పట్టేసుకున్నాడు. అందుకే జాట్ చిత్రానికి సీక్వెల్ కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాడు.కథేంటంటే..?ఆంధ్రప్రదేశ్‌లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్‌దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్ (సన్నీ డియోల్)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్‌కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది. ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్‌తో జాట్ రెచ్చిపోతాడు. ఈ విషయం కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్‌కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా.. తెలుగు రివ్యూ
ఎప్పుడూ అదే థ్రిల్లర్, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిందా? కాసేపు మనసారా నవ్వుకుని, కాస్త ఫీల్ అవుదామని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఓటీటీలోకి ఓ అద్భుతమైన సినిమా వచ్చేసింది. అదే 'టూరిస్ట్ ఫ్యామిలీ'. గత నెలలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. ఇప్పుడు హాట్స్టార్లోకి వచ్చేసింది. మరి అంతగా ఈ సినిమాలో ఏముంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శ్రీలంకకు చెందిన ధర్మదాస్ (శశికుమార్).. సొంత దేశంలో బతుకు కష్టమైపోవడంతో భార్య వాసంతి(సిమ్రన్), ఇద్దరు కొడుకులతో కలిసి మన దేశానికి అక్రమంగా వలస వస్తాడు. చెన్నైలోని ఓ కాలనీలో అద్దెకు దిగుతాడు. ఇతడికో బావమరిది (యోగిబాబు) సాయం చేస్తాడు. ఎవరితోనూ పెద్దగా మాడ్లడొద్దు, మీ గతం గురించి చెప్పొద్దని ధర్మదాస్కి సలహా ఇస్తాడు. కానీ ధర్మదాస్ కుటుంబం.. సదరు కాలనీ వాసులతో కలిసి పోతారు. తమ గురించి నిజం చెప్పేస్తారు. మరోవైపు రామేశ్వరం పోలీసులు.. ధర్మదాస్ కుటుంబం కోసం ఎందుకు వెతుకుతున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మనుషులు మంచోళ్లు.. అసలు మనుషులు అంటేనే మంచోళ్లు అని 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలా మనుషుల్లో ఉండే మానవతా విలువలని తట్టి లేపే ప్రయత్నమే ఈ మూవీ. శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వచ్చిన ఓ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడింది? నిజం చెప్పినా సరే మనవాళ్లు వారికి ఎలా సహాయపడ్డారు. ఒకరికి ఒకరు ఎందుకు సాయం చేసుకోవాలి అనే అంశాల్ని మనసుకు హత్తుకునేలా ఈ చిత్రంలో చూపించడం విశేషం.శ్రీలంక నుంచి ధర్మదాస్ కుటుంబం.. ఓ పడవలో అక్రమంగా రామేశ్వరం వస్తారు. అక్కడ పోలీసులకు దొరికిపోతారు. కానీ ఎలాగోలా మేనేజ్ చేసి చెన్నైకి వచ్చేస్తారు. ఓ కాలనీలో అద్దెకు దిగాతారు. నిజానికి ఆ కాలనీలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనంతంగా ఫాస్ట్ లైఫ్‌కి జనాలు అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి కాలనీలో ఉండేవాళ్లతో.. ధర్మదాస్ కుటుంబం ఎలా మార్పులు తీసుకొచ్చింది. అనేదే మిగతా స్టోరీ. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతాం.ఓవైపు సరదాగా సున్నితమైన హస్యంతో నవ్విస్తూనే, మరోవైపు గుండెని పిండేసే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. చెప్పాలంటే హ్యుమర్ విత్ హ్యుమానిటీ అనే సరికొత్త జానర్ సినిమాలా అనిపిస్తుంది. ఈ రెండు అంశాల్ని మూవీలో బ్యాలెన్స్ చేసిన విధానం చూస్తే తెగ ముచ్చటేస్తుంది. సినిమాలో కొన్ని సీన్లు అయితే భలే కనెక్ట్ అవుతాయి. ఓ ముసలావిడ చనిపోతే కాలనీ అంతా ఒక్కటైన తీరు మనల్ని కంటతడి పెట్టేలా చేస్తుంది.తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయిందని ధర్మదాస్ పెద్ద కొడుకు బాధపడుతుంటాడు. ఈ సీన్ చూస్తున్న మనకు కూడా అయ్యో అనిపిస్తుంది. వెంటనే చిన్న కొడుకు చేసే హంగామా వల్ల మొత్తం సీనే మారిపోయి ఫుల్ నవ్వొచ్చేస్తుంది. చర్చిలో అదే కాలనీకి చెందిన ఓ తాగుబోతు కుర్రాడు తన జీవితం గురించి చెప్పే సీన్ హైలెట్. ధర్మదాస్ పెద్ద కొడుకు, వాళ్ల ఇంటి యజమాని కూతురు మధ్య క్యూట్ ప్రపోజల్ సీన్‌కి యూత్ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. రెండు గంటల సినిమానే కానీ చూస్తున్నంతసేపు అసలు సమయమే తెలియనంత వేగంగా అయిపోతుంది. ఇంకాసేపు ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ధర్మదాస్గా శశి కుమార్ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇతడి భార్యగా సిమ్రన్.. వాసంతి అనే పాత్రలో ఒదిగిపోయింది. వీళ్ల పెద్ద కొడుకు పాత్ర ఓకే. కానీ చిన్న కొడుకు మురళిగా చేసిన పిల్లాడైతే ఇరగదీశాడు. ఓ రకంగా సినిమాలో కామెడీ సీన్లన్నీ ఇతడి మీదే ఉంటాయి. కచ్చితంగా ఈ పాత్ర మీకు నచ్చేస్తుంది. మిగిలిన వారిలో తాగుబోతు కుర్రాడు, ఓ కుక్కపిల్ల.. ఇలా ప్రతి పాత్ర సినిమాలో కీలకమే. ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు అనేలా జీవించేశారు.టెక్నికల్ విషయాలకొస్తే సినిమా అంతే ఓ కాలనీలో తీశారు. చూస్తున్నంతసేపు మనం కూడా అక్కడే ఉన్నామా అనేలా సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. మిగతా అన్నీ విభాగాలు తమ తమ పనిని పక్కాగా చేశాయి. చివరగా డైరెక్టర్ అభిషణ్ జీవింత్ గురించి చెప్పుకోవాలి. స్వతహాగా ఇతడో యూట్యూబర్. వయసులోనే చిన్నోడు. కానీ ఇలాంటి సినిమా తీసి అందరి మనసులు గెలుచుకున్నాడు. రాజమౌళి, నాని కూడా ఈ మూవీ చూసి మెచ్చకున్నారంటే మనోడి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఓటీటీలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మీ కుటుంబం అంతా కలిసి కచ్చితంగా సినిమా చూడండి. అస్సలు మిస్ కావొద్దు.-చందు డొంకాన -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఈ వారం ఏకంగా 22 చిత్రాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ నెలలోనే పెద్ద సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ సందడి చేసే వాటిలో కమల్ హాసన్ థగ్ లైఫ్ ఒక్కటే కాస్తా బజ్ ఉన్న సినిమా. ఆ తర్వాత తెలుగులో వస్తోన్న శ్రీ శ్రీ రాజావారు, గ్యాంబ్లర్స్, బద్మాషులు లాంటి చిత్రాలు ఆసక్తిగా పెంచుతున్నాయి. బాలీవుడ్ నుంచి హౌస్‌ఫుల్-5 కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.అయితే ఈ వారం ఓటీటీల విషయానికొస్తే రజినీకాంత్ లాల్ సలామ్, జింఖానా, టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి వచ్చేస్తున్నాయి. తెలుగులో తెరకెక్కించిన వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ వచ్చేస్తోంది. ఈ సిరీస్‌లో రీతూ వర్మ, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇవీ మినహయిస్తే ఓటీటీల్లో అంతగా చెప్పుకొదగ్గ సినిమాలేవీ రావడం లేదు. బాలీవుడ్, హాలీవుడ్‌తో పాటు దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..ది మార్టిషియన్- డాక్యుమెంటరీ చిత్రం- జూన్ 02క్రిమినల్ కోడ్- సీజన్ 4- జూన్ 04వన్ ఆఫ్ దెమ్ డేస్- (హాలీవుడ్ మూవీ) - జూన్ 04జిన్నీ అండ్ జార్జియా- సీజన్-3 - జూన్ 05టైర్స్ - సీజన్-2- జూన్ 05జాట్ (హిందీ మూవీ) - జూన్ 05 (రూమర్ డేట్)మెర్సీ ఫర్ నన్- హాలీవుడ్ మూవీ- జూన్ 06స్ట్రా- హాలీవుడ్ మూవీ- జూన్ 06ది సర్వైవర్స్- వెబ్ సిరీస్- జూన్ 06అమెజాన్ ప్రైమ్స్టోలెన్- జూన్ 04సన్ నెక్ట్స్లాల్ సలామ్- జూన్ 06జియో హాట్స్టార్టూరిస్ట్ ఫ్యామిలీ(తమిళ మూవీ)- జూన్ 02గజానా (హిందీ) - జూన్ 02దేవిక అండ్ డానీ- (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 06జీ5చాట్ కపట్- ది డిసెప్షన్ (హిందీ)- జూన్ 06సోనీ లివ్..అల్లప్పుజా జింఖానా- జూన్ 05మహారాణి- సీజన్-4- జూన్ 06లయన్స్‌గేట్ ప్లేరెడ్-2- అడ్వంచర్ మూవీ- జూన్ 0612 స్ట్రాంగ్- హాలీవుడ్ మూవీ- జూన్ 06హై ఫోర్సెస్- హాలీవుడ్ మూవీ- జూన్ 06కోడ్ 8- హాలీవుడ్ మూవీ- జూన్ 06యాపిల్ టీవీ ప్లస్స్టిక్- కామెడీ వెబ్ సిరీస్- జూన్ 04 -
ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్.. ఫైనల్లీ గుడ్ న్యూస్
గత నాలుగైదేళ్లుగా ఓటీటీల వాడకం చాలా పెరిగిపోయింది. అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. మూవీస్ సంగతి కాసేపు పక్కనబెడితే ఇంగ్లీష్‌లో అదిరిపోయే సిరీసులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'స్ట్రేంజర్ థింగ్స్'. నెట్‌ఫ్లిక్స్ అంటే గుర్తొచ్చే సిరీస్‌ల్లో ఇది కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పేశారు.ఇప్పటివరకు 'స్ట్రేంజర్ థింగ్స్' నుంచి నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. ఇవి వేటికవే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. చివరగా 2022లో నాలుగో సీజన్ వచ్చింది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. కొన్నాళ్ల క్రితం 2025లోనే వస్తుందని అన్నారు గానీ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)ఐదో సీజన్‌ని మూడు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 26న 'వాల్యూమ్ 1', క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న 'వాల్యూమ్ 2', న్యూఇయర్ కానుకగా జనవరి 1న 'ఫైనల్ ఎపిసోడ్' స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పాత్రధారుల లుక్, సీన్స్ ఆసక్తి కలిగించేలా ఉన్నా.యి.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఓ ఊరిలో నలుగురు పిల్లలు స్నేహితులుగా ఉంటారు. ఓరోజు అనుకోకుండా అతీంద్రయ శక్తులున్న ఎలెవన్ అనే అమ్మాయి వీళ్ల దగ్గరకొస్తుంది. ఈమె రాకతో సదరు ఊరిలో ఎలాంటి వింతలు, విడ్డూరాలు జరిగాయి? ఏమైందనేదే సింపుల్‌గా స్టోరీ. చూడటానికి చిన్నపిల్లలా సినిమాల ఉంటుంది గానీ విజువల్స్, స్టోరీ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు) -
ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సమంత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం శుభం(Subham). ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటించారు. మే 09న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో మెరిసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 13 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ పోస్టర్‌ను షేర్ చేసింది. శుభం కథేంటంటే..వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్‌రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది.ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్‌కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. This June 13th, katha aarambham on JioHotstar 💫 Chacchina choodalsindhe 👀 #SubhamOnJioHotstar #Subham @Samanthaprabhu2 @TralalaPictures #JioHotstar pic.twitter.com/If7zN9utiY— JioHotstar Telugu (@JioHotstarTel_) June 1, 2025 -
ప్రాణాలతో చెలగాటమాడే గేమ్.. ఫైనల్ సీజన్ ట్రైలర్ చూశారా?
ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదించాలన్న దానికన్నా ఎలాగోలా సొంతం చేసుకోవాలన్న ఆశే ఎక్కువవుతోంది. ఇందుకోసం అడ్డదారులు తొక్కేవారు కొందరైతే అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకునేవాళ్లు మరికొందరు. ఈ డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. డబ్బు మనిషి ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది? డబ్బు కోసం మనిషి ఎంతదూరం వెళ్తాడన్న అంశంపై తెరకెక్కిన సిరీస్ స్క్విడ్ గేమ్.ప్రాణాంతక గేమ్ఈ సిరీస్ ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. గేమ్‌లో గెలిస్తే చాలు.. కలలో కూడా ఊహించలేనంత డబ్బు మీ సొంతం అనడంతో వందలాది మంది గేమ్ ఆడేందుకు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్లాక గేమ్‌లో ఓడినవారి ప్రాణాలు తీస్తారు. తమ గెలుపు కోసం కొందరు ప్లేయర్స్ పక్కవారి ప్రాణాలు తీయడానికీ వెనకాడరు. చివరకు ఒకే ఒక్కరు విజేతగా నిలిచి డబ్బు గెలుచుకుంటారు. అలా ప్లేయర్ 456 ఓసారి గేమ్‌లో గెలిచి కోట్లాది ధనం పొందుతాడు. కోట్లు గెలిచినా దక్కని సంతోషంకానీ అందరి చావులను కళ్లారా చూసిన అతడికి ఆ విజయం సంతోషాన్నివ్వకపోగా మరింత బాధపడతాడు. అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్న ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలని మరోసారి గేమ్‌లో అడుగుపెడతాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండగా రెండో సీజన్ ముగుస్తుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మూడో సీజన్ వచ్చేస్తోంది. జూన్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఫైనల్ సీజన్ ప్రసారం కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఆటకు ముగింపు?ఫస్ట్ సీజన్లో రెడ్ లైట్- గ్రీన్ లైట్ అని గేమ్ ఆడించిన ఓ బొమ్మను మరోసారి ఈ సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ సారి గేమ్ మరింత క్రూరంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ప్లేయర్ 456.. పాశవికమైన ఆట ఆడిస్తున్న వ్యక్తిని నేరుగా కలిసినట్లు చూపించారు. మరి అతడు ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ నెలాఖరులో స్క్విడ్ గేమ్ చివరి సీజన్ చూసేయాల్సిందే! చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే? -
ఓటీటీలో అదరగొడుతున్న చిన్న సినిమా
చిన్న చిత్రాలకు ఓటీటీలు వరంగా మారుతున్నాయి. థియేటర్స్‌లో ఆడని కొన్ని చిత్రాలు ఓటీటీలో మంచి విజయం సాధిస్తున్నాయి. బడా సినిమాలను పక్కకునెట్టి టాప్‌లో దూసుకెళ్తున్నాయి. అలా ఓటీటీలో అదరగొడుతున్న మరో చిన్న చిత్రమే ‘టుక్ టుక్’.తెలుగమ్మాయి శాన్వి మేఘన, ‘కోర్ట్’ఫేం హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో థియేటర్లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ చిత్రం..అక్కడ టాప్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాల్లో టుక్ టుక్ మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 100 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక్క చిన్న చిత్రానికి ఈ స్థాయిలో వ్యూస్ రావడం గొప్ప విషయమే. వీక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించడమే కాకుండా, ప్రతి క్యారెక్టర్‌ను, ప్రతి నటుడి నటనను ప్రశంసిచడం సంతోషంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. మంచి కంటెంట్‌తో వస్తే ఆదరణ ఉంటుందనే ఈ చిత్రం మరోసారి నిరూపించిందని అన్నారు.టుక్ టుక్ కథేంటి?ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే గత వారం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు వారం తిరగకుండానే స్ట్రీమింగ్ అయిపోతోంది. ఈ వీకెండ్లో 30కి పైగా చిత్రాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాగా.. ఇప్పుడు ఈ లిస్టులో ఈ మూవీ కూడా చేరింది. రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.రుద్ర వీరాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'వీరరాజు 1991'. అర్జన, అజయ్ ఘోష్, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 22న థియేటర్లలో మూవీ రిలీజ్ కాగా.. అక్కడికి వారం తర్వాత అంటే మే 30న ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. రెండు గంటల కంటే తక్కువ నిడివితో ఉన్న ఈ చిత్రం సముద్ర తీర ప్రాంతంలో జరిగే ఓ కథతో తీశారు. థియేటర్లలో అనుకున్నంత రీచ్ లేకపోవడంతో త్వరగానే ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)ఈ సినిమాలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రుద్ర వీరాజ్ది ఆదోని. ఇక మూవీ విషయానికొస్తే.. నెల్లూరు కృష్ణలంకలో చేపలు పట్టే వీరరాజు.. అదే ఊరిలోని అన్యాయాలు చేస్తున్న రాజకీయ నాయకుడికి ఎదురుతిరుగుతాడు. చివరకు ఏమైంది? వీరరాజు ఏం చేశాడనేదే మిగతా స్టోరీ. ఇందులో అజయ్ ఘోష్ తప్పితే సగటు ప్రేక్షకుడికి తెలిసిన నటీనటులు పెద్దగా లేరు.ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే హిట్ 3, రెట్రో, తుడరుమ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, డీమన్ తదితర స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో చాలావరకు రీసెంట్ టైంలో రిలీజై ప్రేక్షకుల్ని అలరించడం విశేషం.(ఇదీ చదవండి: శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్) -
బక్రీద్ కానుకగా ఓటీటీలో 'లాల్ సలామ్'.. అధికారిక ప్రకటన
సౌత్ ఇండియాలో భారీ అంచనాలతో రజనీకాంత్ 'లాల్ సలామ్'(Lal salaam) (2024) విడుదలైంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ (Rajinikanth) అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్‌సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిగా రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించారుబక్రీద్ పండుగ కానుకగా జూన్ 6న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సన్ నెక్ట్స్(Sun NXT) ప్రకటించింది. ఎదురుచూపులకు తెర పడింది అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా ఓటీటీ ఢీల్స్ మొదట నెట్‌ఫ్లిక్స్‌తో కుదుర్చుకుంది. అయితే, సినిమా విడుదల సమయంలో నెట్‌ఫ్లిక్స్ సూచించిన సీన్స్ కలపకపోవడంతో ఆ ఢీల్‌ను క్యాన్సల్ చేసుకున్నారు. దీంతో లాల్ సలామ్ ఓటీటీ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం అయింది.కథేంటంటే'లాల్ సలామ్' కథ మొత్తం 1990ల కాలం బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తోంది. మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) కుమారుడు సంషి (విక్రాంత్), గురు (విష్ణు విశాల్) స్నేహితులు. షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్‌ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్ - ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలౌతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్).. దాడి చేసిన గురు కూడా మొయిదీన్ భాయ్‌కి ప్రాణ స్నేహితుడు అయిన (ఫిలిప్ లివింగ్‌స్టోన్) కుమారుడు కావడం విశేషం. హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారావేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్ అ గ్రామానికి తిరిగొస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిదీన్ ఏం చేస్తాడు..? క్రికెట్లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే జూన్ 6న సన్ నెక్ట్స్‌లో లాల్ సలామ్ చూడాల్సిందే. -
Manchu Lakshmi: 20 మంది ప్రముఖులతో రియాలిటీ గేమ్ షో.. కంటెస్టెంట్‌గా మంచు లక్ష్మీ!
గతంలో కాఫీ విత్ కరణ్ షోతో ప్రముఖలను ఇంటర్వ్యూ చేసిన కరణ్ జోహార్ మరో రియాలిటీ షోతో ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన హోస్ట్‌గా వస్తోన్న రియాలిటీ గేమ్ షో 'ది ట్రైటర్స్'. ఈ షోలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది నటులు కూడా ఉండడం ఈ షోపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ షోలోనే పాల్గొనే వారి పేర్లను రివీల్ చేశారు. అంతేకాకుండా ఈ రియాలిటీ షో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.ఈ రియాలిటీ షోలో దాదాపు 20 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. ఈ గేమ్ షోలో ఊహించని మలుపులు, హై-వోల్టేజ్ డ్రామాతో పాటు ఉత్కంఠభరితమైన గేమ్ ఆడనున్నారు. ఈ షోను రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో నిర్వహించనున్నారు. ఇందులో కరణ్ కుంద్రా, రాజ్ కుంద్రా, రఫ్తార్, జాస్మిన్ భాసిన్, జన్నత్ జుబైర్, ఉర్ఫీ జావేద్, అన్షులా కపూర్, మహీప్ కపూర్, మంచు లక్ష్మీ కూడా కంటెస్టెంట్‌గా అడుగు పెట్టనున్నారు. ఈ రియాలిటీ షో గెలిచిన వారికి భారీగా నగదు బహుమతి అందుకోనున్నారు.అయితే గేమ్ షోను ఓటీటీ వేదికగా ప్రసారం చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచి తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ రియాలిటీ గేమ్ షోను వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ గేమ్ షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్‌తో మీ ముందుకు రానుంది.