Education
-
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,535 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్ పరీక్షలు మార్చి 15వ తేదీన ముగుస్తాయి. మైనర్, ఒకేషనల్ పరీక్షలు 20వ తేదీ వరకు ఉంటాయి. ఈ నెల ఐదో తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు 20వ తేదీతో ముగుస్తాయి. ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఈ నెల 20 నుంచి హాల్‌టికెట్ల పంపిణీకి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గత ఏడాది అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తున్నారు. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ప్రశ్నపత్రాల ట్యాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానం పాటిస్తారు. ఈ విధానంలో ప్రశ్నపత్రం బయటకు వస్తే.. అది ఎక్కడ నుంచి వచ్చింది అనేది సెంటర్‌తో సహా సమస్త వివరాలు తెలిసిపోతాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయనుంది. -
జేఈఈ మెయిన్ తప్పులతడక
సాక్షి, ఎడ్యుకేషన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ – మెయిన్. కొద్ది రోజుల క్రితం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలి దశ జేఈఈ మెయిన్(JEE Main 2025 exam)ను నిర్వహించింది.ఈ క్రమంలో ప్రశ్నల్లో లోపాలు, అనువాద దోషాలు, సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం, తుది ఆన్సర్ కీలో తొలగిస్తున్న ప్రశ్నల సంఖ్య పెరగడంపై విద్యార్థులు, అధ్యాపకులు విమర్శలు చేస్తున్నారు. జేఈఈ–మెయిన్ – 2025 జనవరి సెషన్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్‌లో లోపాలపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. పన్నెండు ప్రశ్నల తొలగింపుజేఈఈ – మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది.. పలు షిష్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది మొత్తం పది షిఫ్ట్‌లలో జేఈఈ మెయిన్ నిర్వహించగా.. ఏకంగా 12 ప్రశ్నలను తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ నుంచి 8 ప్రశ్నలు ఉంటే.. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల నుంచి రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదం కారణమని ఎన్టీఏ పేర్కొంది. జాతీయ స్థాయిలో జేఈఈ–మెయిన్‌తోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)–యూజీ, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్), తదితర పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏ వాటిని సమర్థంగా నిర్వహించడంలో విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నలు రూపొందించే ఎగ్జామినర్స్ విషయంలోనూ, అదే విధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలోనూ ఎన్టీఏ అప్రమత్తంగా ఉండట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి.గత కొన్నేళ్లుగా తప్పులే..జేఈఈ – మెయిన్ పరీక్ష తీరును పరిగణనలోకి తీసుకుంటే.. గత కొన్నేళ్లుగా ఏటా ప్రశ్నల్లో తప్పుల సంఖ్య పెరుగుతోంది. 2024 సెషన్–1లో ఆరు ప్రశ్నలు; సెషన్–2లో నాలుగు ప్రశ్నలు తొలగించగా.. 2023లో సెషన్–1లో నాలుగు ప్రశ్నలు, 2022 సెషన్–1లో నాలుగు, సెషన్–2లో ఆరు ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు (4 మార్కులు) కేటాయిస్తామని ఎన్టీఏ పేర్కొంది. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్ష హాల్లో సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని, లోపాలు లేని ప్రశ్నలు ఇచ్చే విధంగా ముందుగానే ఎన్టీఏ పటిష్ట చర్యలు తీసుకోవాలని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు..జేఈఈ – మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. సిలబస్‌లోని ప్రశ్నలు రావడాన్ని ఉదహరిస్తున్నారు. 2025 జనవరి సెషన్ పరీక్షలనే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పది షిఫ్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో.. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చాప్టర్‌కు సంబంధించి న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ నుంచి 22 ప్రశ్నలు, అదే విధంగా కార్నెట్ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు.అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్‌ను, అంతకుముందు ఏడాది కార్నెట్ లాను సిలబస్‌లో తొలగించారని సబ్జెక్ట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇలా సిలబస్‌లో లేని ప్రశ్నలు అడగడం కారణంగా విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.రాధాకృష్ణన్ కమిటీ స్పష్టంగా..జాతీయ స్థాయిలో వివిధ ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత కోసం పలు సిఫార్సులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ సైతం.. జేఈఈలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని తేల్చిచెప్పింది. అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. కానీ.. దీనికి భిన్నంగా ఎన్టీఏ వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నీట్–యూజీపై ఆందోళన..జేఈఈ– మెయిన్‌లో తప్పుల నేపథ్యంలో.. మే 4న నిర్వహించనున్న నీట్–యూజీ నిర్వహణ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు పది లక్షల మంది హాజరవుతారు. దీంతో ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలతో నీట్ – యూజీ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్టీఏ ఇప్పటి నుంచే పకడ్బందీగా ప్రశ్న పత్రాల రూపకల్పనలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో తొలగించిన ప్రశ్నల కోడ్ నంబర్లు..⇒ ఫిజిక్స్: 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917⇒ కెమిస్ట్రీ: 656445728, 6564451784⇒ మ్యాథమెటిక్స్: 6564451142, 6564451898డేటాను నిరంతరం సమీక్షించాలి..కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో.. ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్ రూపొందించి ప్రశ్నలు అడిగే వి«ధానాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే.. ఏదైనా ఒక చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మొదటగానే ఒక ప్రశ్న తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. దీనికి పరిష్కారంగా ఎప్పటికప్పుడు కొశ్చన్స్ డేటా బ్యాంక్‌ను సమీక్షిస్తుండాలి. పెన్ పేపర్ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్ రూట్స్, ఇతర సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్లో సరిగా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నల్లో తప్పులకు కారణం అవుతోంది. మొత్తంగా 12 ప్రశ్నలను తొలగించడం అనేది అసాధారణ పరిణామమే. – ఆర్. వి. శ్రీధర్, జేఈఈ–మెయిన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు -
తప్పులు.. సిలబస్‌లో లేని ప్రశ్నలు
సాక్షి, ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్(JEE Main 2025) విషయంలో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోపా లతో కూడిన ప్రశ్నల సంఖ్య పెరగడం, తుది ఆన్సర్ కీలో వాటిని తొలగించడం, సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం పరిపాటిగా మారింది. ఇటీవల ఫలితాలు విడుదలైన జేఈఈ మెయిన్– 2025 జనవరి సెషన్‌పై సైతం విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్టీఏ నిబద్ధతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఏ వైఫల్యంతో విద్యా ర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.సమర్థ నిర్వహణలో వైఫల్యం!జేఈఈ మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది పలు షిఫ్ట్ లలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యనే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్ నిపుణులు చెబు తు న్నారు. ఈ ఏడాది మొత్తం పది షిఫ్ట్‌లలో పరీక్ష నిర్వహించగా.. ఏకంగా 12 ప్రశ్నలను తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి 8 ప్రశ్నలు ఉంటే.. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల నుంచి రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదం కారణంగా పేర్కొనడం గమనార్హం. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్‌తో పాటు నీట్ యూజీ, సీమ్యాట్, తదితర పదుల సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏ వాటిని సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవ డంలో విఫలమవుతోందని.. ప్రశ్నలు రూపొందిచే ఎగ్జామినర్స్ విషయంలో, అదే విధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలో అప్రమత్తంగా ఉండట్లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏటేటా పెరుగుతున్న తప్పులుజేఈఈ మెయిన్ ప్రశ్నల్లో తప్పుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2024 సెషన్–1లో ఆరు ప్రశ్నలు; సెషన్–2లో నాలుగు ప్రశ్నలు తొలగించగా.. 2023లో సెషన్–1లో నాలుగు ప్రశ్నలు, 2022 సెషన్–1లో నాలుగు, సెషన్–2లో ఆరు ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు (4 మార్కులు) కేటాయిస్తామని ఎన్టీఏ పేర్కొంటోంది. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్ష హాల్లో సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని సబ్జెక్ట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సిలబస్ నుంచి తొలగించినా.. జేఈఈ మెయిన్ పరీక్షల్లో సిలబస్‌లోని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 2025 జనవరి సెషన్ పరీక్షలనే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పది షిఫ్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో.. ఫిజిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చాప్టర్‌కు సంబంధించి న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ నుంచి 22 ప్రశ్నలు, అదే విధంగా కార్నెట్ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు. అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్‌ను, అంతకుముందు ఏడాది కార్నెట్ లాను సిలబస్ నుంచి తొలగించారని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.రాధాకృష్ణన్ కమిటీ చెప్పినా.. జాతీయ స్థాయిలో ప్రముఖ ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ, యూజీసీ నెట్ పరీక్షల్లో పారదర్శకత కోసం పలు సిఫారసులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ.. ఈ పరీక్షల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని, అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్ యూజీపై ఆందోళన జేఈఈ మెయిన్‌లో తప్పుల నేపథ్యంలో..మే 4న నిర్వహించనున్న నీట్ యూజీ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు పది లక్షల మంది హాజరవుతారు. ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలు చోటు చేసుకుంటే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్టీఏ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ కోసమే ఎన్టీఏ ఏర్పాటు కావడాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అన్ని పరీక్షల్లో లోపాలు లేనివిధంగా ప్రశ్నలు ఇచ్చేలా ముందుగానే పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో తొలగించిన ప్రశ్నల కోడ్ నంబర్లివే..– ఫిజిక్స్: 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917– కెమిస్ట్రీ: 656445728, 6564451784– మ్యాథమెటిక్స్: 6564451142, 6564451898ప్రశ్నల డేటాను నిరంతరం సమీక్షించాలికంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్ రూపొందించి ప్రశ్నలు అడిగే విధానాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఒక ప్రశ్న ముందే తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. ఎప్పటికప్పుడు కొశ్చన్స్ డేటా బ్యాంక్‌ను సమీక్షిస్తుండటం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. పెన్, పేపర్ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్ రూట్స్, ఇతర సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్లో సరిగా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నల్లో తప్పులకు కారణం అవుతోంది. మొత్తంగా 12 ప్రశ్నలను తొలగించడం అనేది అసాధారణ పరిణామమే. – ఆర్వీ శ్రీధర్ (జేఈఈ–మెయిన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు) -
మన విద్యా రంగమే భేష్
‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’ – మన విద్యా రంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది.అయితే దీనికి భిన్నంగా.. మన విద్యా వ్యవస్థ.. కెరీర్ అవకాశాల విషయంలో నేటి తరం యువత స్పందించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశ విద్యా విధానమే బాగుంటుందనే ఆశాభావాన్ని యువత వ్యక్తం చేసింది. అదే విధంగా కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిష్యత్.. బ్రహ్మాండంగానే ఉంటుందనే రీతిలో స్పందించింది.ఈ వివరాలు.. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు నిర్వహించే ప్రముఖ టెస్టింగ్ సంస్థ.. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)(ETS survey) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ మేరకు మొత్తం 18 దేశాల్లో 18 వేల మంది యువత అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను ఈటీఎస్ విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.మన విద్యా వ్యవస్థ బాగుంటుంది..మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70 శాతం యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76 శాతం మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30 శాతం మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు.నాణ్యతతో కూడిన విద్య కష్టమే..ఒకవైపు.. మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. అలాగే అత్యున్నత నాణ్యమైన కోర్సులు, విద్యా సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందన్నారు.ముందంజలో నిలిచే అవకాశం..ప్రస్తుత అవకాశాలతో కెరీర్లో ముందంజలో నిలవడానికి అవకాశం ఉంటుందని 69% మంది భారత యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59% మాత్రమే కావడం గమనార్హం. అదే విధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగాల కొరత..ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది భారతీయ యువత పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అదే విధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33 శాతం మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు..మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనడం విశేషం. అదే విధంగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88 శాతం మంది పేర్కొన్నారు.ఏఐ.. అవకాశాల వేదిక..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో.. తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐని ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పది మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.లాభాపేక్ష లేని సంస్థలు కూడా..దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని.. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 19 శాతంగానే ఉంది.ఆ 3 స్కిల్స్ ప్రధానంగా..జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవడానికి ఏఐ/డిజిటల్ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే సంస్థలు శిక్షణ సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.బోధన, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలినేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగు పడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా.. ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.– రమేశ్ లోగనాథన్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ -
పారామెడికల్ వెబ్ఆప్షన్ నమోదుకు అవకాశం
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్ఆప్షన్ల స్వీకరణ ప్రారంభించింది.ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చారు. ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను అధికారిక వెబ్సైట్లో గురువారం పొందుపరిచారు. -
సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి: ఎస్డీ శిబులాల్
డి.ఎస్.పవన్‌కుమార్, సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్: మారుతున్న పరిస్థితుల్లో ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మార్పులు సహజమని, వీటిని ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈఓ ఎస్డీ శిబులాల్ చెప్పారు. అవసరమైనప్పుడల్లా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు, కెరీర్లో ముందుకు సాగేందుకు కృషి చేయాలని అన్నారు. ఇన్ఫోసిస్ లాంటి అగ్రశ్రేణి సంస్థ కూడా తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, పాతికేళ్లు సాధారణ ఐటీ సంస్థగానే ఉందని తెలిపారు. వ్యక్తులకైనా, సంస్థలకైనా సవాళ్లు సహజం అంటూ, వాటిని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యాన్నిసొంతం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత సహనం, ప్రణాళికలతో అడుగులు వేయాలని చెప్పారు. శిబులాల్ కుటుంబం ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పింది. ‘విద్యాధన్’ పేరుతో.. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌కు వచి్చన శిబులాల్‌తో.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే టాప్‌లోకి.. ఇన్ఫోసిస్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులకు గురైంది. ముఖ్యంగా క్లయింట్స్‌కు ఐటీ ఆవశ్యకతను వివరించడం, వారిని మెప్పించడం, వాటికి మా సంస్థ ద్వారా సేవలకు అంగీకరింపజేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పాతికేళ్ల సంస్థ చరిత్రలో దాదాపు 20 ఏళ్లు సాదాసీదా కంపెనీగానే ఉంది. కానీ అన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే సమర్థవంతమైన బృందంగా పని చేయడం వల్ల ఇప్పుడు టాప్ కంపెనీగా గుర్తింపు పొందుతోంది ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ఫోసిస్ ప్రస్థానాన్ని ఇన్ఫోసిస్ 2.0గా చెప్పొచ్చు. మార్పులు ఆహ్వానించాలి – ఒకే సంస్థలో ఉన్నా హోదా మారే కొద్దీ విధుల్లో మార్పులు, కొత్త సవాళ్లు, కొత్త అంశాలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత సహజం. దీన్ని నేటి యువత గుర్తించాలి. – ఇన్ఫోసిస్‌లో మూడేళ్లకోసారి నా హోదా మారేది. అలా మారినప్పుడల్లా ఆ హోదాకు తగినట్లుగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా కొత్త అంశాలు నేర్చుకున్నా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. నాట్ ఫర్ ఎవ్రిబడీ – ప్రస్తుతం దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్కృతి పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే నా ఉద్దేశంలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రిబడీ’. ఈ మాట ఎందుకు అంటున్నానంటే.. – సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే అత్యంత కీలకమైన లక్షణం సహనం. నేటి యువతలో అది లోపిస్తోంది. – చాలామంది ఇన్స్టంట్ ఫలితాలు ఆశిస్తున్నారు. అందుకే పలు వెంచర్స్.. ఫెయిల్యూర్ వెంచర్స్‌గా మారుతున్నాయి. – మా రోజుల్లో ఫండింగ్ సంస్థలు లేవు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో ఏంజెల్ ఇన్వెస్టర్స్.. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్‌ను అందించే స్టార్టప్స్‌కు ఫండింగ్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కానీ స్టార్టప్ ఔత్సాహికుల్లో సహనం ఉండట్లేదు. సరైన ప్రణాళిక ఉండట్లేదు. ఏఐతో కొత్త ఉద్యోగాలు: – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఏ మాత్రం సరికాదు. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పొందితే లక్షల ఉద్యోగాలు లభిస్తాయని గుర్తించాలి. – ఐటీలో నిరంతరం కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ అనేది దశాబ్దాలుగా జరుగుతోంది. ఉదాహరణకు కంప్యూటర్స్నే పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో కంప్యూటర్స్ అంటే కేవలం డేటా సేకరణకే వినియోగించారు. తర్వాత అవి.. డేటా క్రియేషన్, డేటా ఇంటర్వెన్షన్ ఇలా ఎన్నో విభాగాలకు విస్తరించింది. – ఐటీలో కూడా కంప్యూటర్ ఆపరేషన్స్‌తో మొదలై.. ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్‌లు ఎంత ముఖ్యంగా మారాయో మనం చూస్తున్నాం. 4‘సీ’స్ సూత్రాన్ని పాటించాలి – నేటి తరం యువత కెరీర్లో ముందుకు సాగేందుకు 4సీ సూత్రాన్ని (కరేజ్, కేపబిలిటీ, కెపాసిటీ, కమిట్మెంట్) అమలు చేసుకోవాలి. – మానసికంగా ఈ లక్షణాలు ఉంటే వృత్తి పరంగా ఎలాంటి నైపుణ్యాలనైనా ఇట్టే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. – దేశంలో కెరీర్ పరంగా ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ 80 శాతం మంది ఎంప్లాయర్స్ జాబ్ రెడీ స్కిల్స్ ఉన్న యువత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్కిల్స్‌ను సొంతం చేసుకుంటే.. ఉద్యోగ రేటు వృద్ధి చెందుతుంది. గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లిష్‌పై పట్టు ముఖ్యం – ప్రస్తుత విద్యా వ్యవస్థలో బేసిక్ సైన్సెస్‌ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పాఠశాల స్థాయి నుంచే దీన్ని ఆచరణలో పెట్టాలి. ఫలితంగా విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెరిగి, భవిష్యత్తులో పరిశోధనలు, ఆవిష్కరణలకు దారి తీస్తుంది. – నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లోని ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, స్కిల్ ట్రైనింగ్ వంటి అంశాలు పరిశీలిస్తే.. ఈ విధానం మన యువతకు ఎంతో అవసరం అనేది అవగతం అవుతుంది. ఇంగ్లిష్ మీడియం అనేది గ్లోబల్ లాంగ్వేజ్. దానిపై పట్టు సాధించడం నేటి పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. సైన్స్ అంటే ఇష్టం.. కానీ కంప్యూటర్స్లోకొచ్చా.. వాస్తవానికి నాకు బేసిక్ సైన్స్ అంటే ఇష్టం. మా నాన్న మాత్రం నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. అయినా నా ఇష్టాన్ని కాదనలేదు. కేరళ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేశా. వెంటనే అప్పటి బాంబే ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ విధులు మాత్రం కంప్యూటర్స్‌కు సంబంధించినవి. నా జీవితంలో నాకు ఏమైనా సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి అంటే నా తొలి ఉద్యోగంలోనే. వాటిని తట్టుకోవాలనే సంకల్పంతో, కంప్యూటర్ సైన్స్ భవిష్యత్తు ఆవశ్యకతను గుర్తించి అందులో పీజీ చదవడానికి సిద్ధమయ్యా. బోస్టన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. పత్ని కంప్యూటర్స్‌లో సిస్టమ్స్ ఇంజనీర్‌గా అడుగు పెట్టా. అక్కడే నారాయణమూర్తితో పరిచయం ఏర్పడడం, ఇన్ఫోసిస్ స్థాపనలో పాలుపంచుకోవడం జరిగింది. ఇలా కెరీర్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడం నేటి యువతకు ఎంతో ముఖ్యం. అప్పుడే ఉన్నత స్థానాలు, కోరుకున్న హోదాలు లభిస్తాయి. సంపాదనలో కొంత సమాజ సేవకు కేరళలో పుట్టి పెరిగిన నాకు.. చిన్నప్పటి నుంచి చదువు విషయంలో, ఇతర విషయాల్లో ఎందరో తోడ్పాటు అందించారు. అదే స్ఫూర్తితో మా సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలకు కేటాయించాలని భావించాం. అందుకే 1998లో శిబులాల్ ఫ్యామిలీ ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ (ఎస్ఎఫ్పీఐ) పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పి విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. విద్యార్థులకు తోడ్పాటునందిస్తే.. వారితోపాటు, దేశం కూడా వృద్ధి చెందుతున్న ఆలోచనతో విద్యా రంగాన్ని ఎంచుకున్నాం. ప్రస్తుతం పది వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. డ్రాప్ అవుట్స్‌ను తగ్గించమే ప్రధాన లక్ష్యం 11, 12 తరగతుల స్థాయిలో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడమే మా లక్ష్యం. 1990లలో భారత గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు..పదో తరగతి పూర్తయ్యాక మగ పిల్లలను పనికి తీసుకెళ్లాలని, ఆడ పిల్లలైతే పెళ్లి చేయాలనే ధోరణితో ఉండేవారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉండరనే ఉద్దేశంతోనే ఎస్ఎఫ్పీఐని ప్రారంభించాం. 11, 12 తరగతుల విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తున్నాం. -
31 నుంచి ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు ఈ నెల 31 (శుక్రవారం) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. విద్యార్థులు ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు ప్రతి రోజు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటన విడుదల చేసింది. జనవరి సెషన్ బీటెక్ ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వీటికి సంబంధించి రెస్పాన్స్ షీట్, ‘కీ’లను ఫిబ్రవరి 1 లేదా 2వ తేదీన ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. సులభమైన ప్రశ్నలే.. బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్ మొదటి షిఫ్ట్ పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులు చెప్పారు. ఫిజిక్స్‌లో గడిచిన నాలుగు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే ఎక్కువగా అడగడం గమనార్హం. ఈ సబ్జెక్ట్‌లో అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్‌లు, ఫార్ములా ఆధారితంగా ఉన్నాయి. ఎక్కువ ప్రశ్నలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సిలబస్ నుంచే వచ్చాయి. మ్యాథమెటిక్స్ ఓ మాదిరి క్లిష్టతతో ఉందని, కెమిస్ట్రీ విభాగం సులభంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఈ విభాగంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్ క్లిష్టంగా న్యుమరికల్ ఆధారిత ప్రశ్నలతో ఉందని, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలో డైరెక్ట్ ప్రశ్నలు అడిగారని విద్యార్థులు చెప్పారు. మార్కుల మధ్య వ్యత్యాసం జేఈఈ మెయిన్ జనవరి సెషన్ పరీక్షల్లో క్లిష్టత స్థాయిని బట్టి విద్యార్థులు పొందే మార్కుల్లో 35 నుంచి 60 మార్కుల వరకు వ్యత్యాసం ఉండొచ్చు. ఉదాహరణకు 2024లో క్లిష్టంగా ఉన్న పేపర్లో 176 మార్కులు వచ్చిన విద్యార్థికి 99 పర్సంటైల్ రాగా, ఓ మాదిరి క్లిష్టంగా ఉన్న పేపర్లో 224 మార్కులకు 99 పర్సంటైల్ వచ్చింది.దీంతో జనవరి సెషన్లో క్లిష్టమైన పేపర్స్ విషయంలో 170 నుంచి 150 మార్కులతో 99 పర్సంటైల్, ఓ మోస్తరు పేపర్లో 180–195 మార్కులతో 99 పర్సంటైల్ పొందే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు రెస్పాన్స్ షీట్స్, ‘కీ’లను చూసి ఆందోళన చెందవద్దు. మొత్తం పది షిఫ్ట్‌లలో 25, 29 తేదీల్లో షిఫ్ట్–1 పేపర్లు, 28వ తేదీ షిఫ్ట్–2 పేపర్లు కఠినంగా ఉన్నాయి. – ఎం.ఎన్.రావు, జేఈఈ శిక్షణ నిపుణుడు -
కొన్ని అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ రెండో దఫా పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి. రెండు షిఫ్ట్‌లలో పరీక్ష నిర్వహించగా.. మొదటి షిఫ్ట్ ప్రశ్నపత్రం ఓ మాదిరి క్లిష్టతతో ఉందని విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు చెప్పారు. గత పరీక్షల మాదిరిగానే.. రెండు షిఫ్ట్‌లలోనూ మ్యాథమెటిక్స్ క్లిష్టత స్థాయి ఓ మాదిరిగా ఉన్నప్పటికీ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. ఫిజిక్స్ మాత్రం క్లిష్టంగా ఉంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించిన పరీక్షలతో పోల్చితే మంగళవారం మొదటి షిఫ్ట్ కష్టంగా ఉందని అంటున్నారు. కొన్ని అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. ఫిజిక్స్‌లో ఆప్టిక్స్ నుంచి 3 ప్రశ్నలు, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు.మ్యాథమెటిక్స్‌లో వెక్టార్స్..3డి, కానిక్స్ నుంచి మూడు ప్రశ్నల చొప్పున మాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, సిరీస్, డీఈఎఫ్ ఇంటిగ్రేషన్ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రశ్నలు క్లిష్టంగా ఉండడమే కాకుండా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ప్రశ్నలు అడగడంతో బోర్డు పుస్తకాలకే పరిమితమైన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పిరియాడిక్ టేబుల్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి 3 ప్రశ్నల చొప్పున, అటామిక్ స్ట్రక్చర్, ఫినాల్ – ఈథర్–ఆల్కహాల్, కెమికల్ బాండింగ్‌ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. రెండో షిఫ్ట్‌లో కూడా మ్యాథమెటిక్స్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. సుదీర్ఘమైన ప్రశ్నలు, కాలిక్యులేషన్స్ అవసరమైన ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీ సులభంగా, ఫిజిక్స్‌లో సులభం, ఓ మాదిరి క్లిష్టత గల ప్రశ్నలు ఉన్నాయి. రెండు షిఫ్టుల్లోనూ కొన్ని టాపిక్స్ నుంచే.. మొత్తంగా చూస్తే.. రెండు షిఫ్ట్‌లలోనూ కొన్ని టాపిక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్‌లో ఏరియాస్, మాట్రిసెస్ అండ్ డిటర్మినేషన్స్, కానిక్స్, వెక్టార్ అండ్ 3డి జామెట్రీ, కానిక్స్, ఇంటెగ్రల్ కాలక్యులస్‌కు ఎక్కువ వెయిటేజీ కనిపించింది. కెమిస్ట్రీలో కోఆర్డినేట్ కాంపౌండ్, అటామిక్ స్ట్రక్చర్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్‌లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మో డైనమిక్స్, ఆప్టిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో కొన్ని ప్రశ్నలు కాసింత తికమక పెట్టేలా అడ్వాన్స్డ్ పరీక్ష స్థాయిలో ఉన్నాయని జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ నిపుణులు ఎం.ఎన్. రావు తెలిపారు. ఫిజిక్స్‌లో ఫార్ములా బేస్డ్గా డైరెక్ట్ కొశ్చన్స్ లేకపోవడం విద్యార్థులను కొంత ఇబ్బందికి గురి చేసిందని చెప్పారు. కాగా జాతీయ స్థాయిలో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షలు బుధవారంతో ముగియనున్నాయి. -
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో బెంగళూరు ఐఐఎస్సీ
సాక్షి, ఎడ్యుకేషన్: అంతర్జాతీయంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులను ప్రకటించే ప్రతిష్టాత్మక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ జాబితాలో మొట్టమొదటిసారి భారత్‌కు చెందిన ఓ విద్యా సంస్థ టాప్–100లో చోటు సాధించింది. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ – బెంగళూరు) 96వ ర్యాంకు సొంతం చేసుకొంది. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విభాగంలో సైతం 99వ ర్యాంకు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 11 వేల ఉన్నత విద్యా సంస్థల్లోని బోధన ప్రమాణాలు, ఇతర ప్రామాణికాల ఆధారంగా 2024 సంవత్సరానికి గత ఏడాది అక్టోబర్‌లో ర్యాంకులు కేటాయించగా.. తాజాగా 11 సబ్జెక్ట్ విభాగాల్లో సబ్జెక్ట్ వారీగా ర్యాంకులను ప్రకటించింది. ఓవరాల్ కేటగిరీలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అగ్రస్థానం దక్కించుకుంది.ఐఐఎస్సీ బెంగళూరు జోరు..సబ్జెక్ట్ వారీ ర్యాంకుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ – బెంగళూరు జోరు కనిపించింది. ఈ సంస్థ 250 లోపు ర్యాంకు శ్రేణిలో నాలుగు సబ్జెక్ట్ విభాగాల్లో ర్యాంకులు సాధించింది. కంప్యూటర్ సైన్స్‌లో 96వ ర్యాంకు, ఇంజనీరింగ్‌లో 99వ ర్యాంకు, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్‌లోనూ 201–250 ర్యాంకుల శ్రేణిలో నిలిచింది. మెడికల్ అండ్ హెల్త్ సబ్జెక్ట్‌లో సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్స్ 201–300 శ్రేణిలో ర్యాంకు పొందింది.సైకాలజీలో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 401–500 ర్యాంకుల్లో నిలిచింది. న్యాయ శాస్త్రంలో ఢిల్లీ యూనివర్సిటీ 301 ర్యాంకుల్లో బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో అమిటీ యూనివర్సిటీ 401 – 500 శ్రేణిలో, ఎడ్యుకేషన్ స్టడీస్‌లో ఢిల్లీ యూనివర్సిటీ 501–600 శ్రేణిలో, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్‌లో ఢిల్లీ యూనివర్సిటీ 401–500 శ్రేణిలో, సోషల్ సైన్సెస్‌లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 251–300 శ్రేణిలో నిలిచాయి.ఐఐటీలు.. 501పైగా ర్యాంకులతో..మరోవైపు.. ఇంజనీరింగ్ విద్యకు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు మాత్రం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విభాగంలో 501కి పైగా శ్రేణిలో నిలవడం గమనార్హం. ఐఐటీ గువహటి, ఇండోర్లు 501–600 శ్రేణిలో ఉన్నాయి. ఐఐటీ–పాట్నా 601–800; ఐఐటీ గాంధీనగర్, మండి, రోపార్లు 801–1000 ర్యాంకుల శ్రేణిలో నిలిచాయి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాత్రం ఐఐటీ–ఇండోర్ 401–500 జాబితాలో చోటు సాధించింది. ఐఐటీ–పాట్నా 501–600, ఐఐటీ–గాంధీనగర్ 601 – 800, ఐఐటీ – గువహటి 801–1000 జాబితాలో నిలిచాయి. తొలి తరం ఐఐటీలుగా పిలిచే ఖరగ్‌పూర్, కాన్పూర్, ఢిల్లీ, ముంబై, రూర్కీ, చెన్నైకి చోటే దక్కలేదు.సబ్జెక్ట్ వారీగా టాప్–1 ఇన్స్టిట్యూట్స్» కంప్యూటర్ సైన్స్ – యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్» ఫిజికల్ సైన్సెస్ – కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ» లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడికల్ అండ్ హెల్త్ సబ్జెక్ట్‌లలో – హార్వర్డ్ యూనివర్సిటీ» సైకాలజీ, న్యాయ శాస్త్రం – స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ» బిజినెస్ ఎకనామిక్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ – మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ» ఎడ్యుకేషన్ స్టడీస్ – యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాప్రామాణికంగా అయిదు అంశాలుఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు కేటాయించడంలో టీచింగ్, రీసెర్చ్ ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ క్వాలిటీ, ఇండస్ట్రీ ఔట్లుక్, ఇంటర్నేషనల్ ఔట్లుక్ అనే అయిదు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అంశాల్లో ఆయా విద్యా సంస్థల్లో నాణ్యత, నైపుణ్యం ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయిస్తారు. ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ రీసెర్చ్, ఇండస్ట్రీ కొలాబరేషన్ తదితర అంశాలను కూడా పరిశీలిస్తారు.ప్రామాణిక అంశాలపై భిన్నాభిప్రాయాలుర్యాంకుల నిర్ధారణకు ప్రామాణికంగా తీసుకునే అంశాల విషయంలో ఎప్పటి నుంచో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ వంటి ప్రామాణికాలు భారతీయ విద్యా సంస్థల పరిస్థితికి సరితూగేలా లేవని విద్యావేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికా, ఇంగ్లండ్లనే ఎంచుకుంటున్నారని, దీంతో ఈ విద్యార్థుల సంఖ్య భారతీయ విద్యా సంస్థల్లో తక్కువ ఉంటోందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ర్యాంకుల్లో ఇన్స్టిట్యూట్స్ వెనుకంజలో ఉంటున్నాయని చెబుతున్నారు. -
రెండు సెషన్లూ క్లిష్టంగానే..!
సాక్షి ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్ రెండోరోజు గురువారం రెండు సెషన్ల పరీక్షలూ మొదటి రోజుతో పోల్చితే క్లిష్టంగా ఉన్నా యని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. మొదటిరోజు మాదిరిగానే రెండోరోజు కూడా మ్యాథమెటిక్స్ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో అభ్యర్థులకు సమయం సరిపోలేదు. తొలి సెషన్లో విద్యార్థులు 55 నుంచి 60 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగారు. ఫిజిక్స్‌లో కొన్ని సులభంగా, మరికొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఓ మోస్తరు క్లిష్టతతో అడిగారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ద్వితీయ సంవత్సరం సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు.కొన్ని టాపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతరెండు సెషన్లలోనూ.. మూడు సబ్జెక్ట్‌ల ప్రశ్నలను పరిశీలిస్తే కొన్ని టాపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. మ్యాథమెటిక్స్‌లో సిరీస్ (2 ప్రశ్నలు), ఇంటిగ్రెల్ కాలిక్యులస్ (4 ప్రశ్నలు), 3–డి వెక్టార్ అల్జీబ్రా (3 ప్రశ్నలు), కానిక్స్ (3 ప్రశ్నలు)కు ప్రాధాన్యత ఇచ్చారు. సిరీస్, కానిక్స్, పెర్ముటేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. అయితే ఈ సబ్జెక్ట్‌లో దాదాపు ఏడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ (9 ప్రశ్నలు), పిరియాడిక్ టేబుల్ (2 ప్రశ్నలు), అటామిక్ స్ట్రక్చర్ (2 ప్రశ్నలు), కెమికల్ బాండింగ్ (2 ప్రశ్నలు)కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ఫిజిక్స్‌లో హీట్ అండ్ థర్మో డైనమిక్స్ (2 ప్రశ్నలు), ఎలక్ట్రిసిటీ (3 ప్రశ్నలు), ఏసీ సర్క్యూట్ (2 ప్రశ్నలు)కు వెయిటేజీ లభించింది. 50% ప్రశ్నలు ఫార్ములా, కాన్సెప్ట్స్ ఆధారంగానే..ఫిజిక్స్, కెమిస్ట్రీలలో దాదాపు 50 శాతం ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ములా, కాన్సెప్ట్ ఆధారంగా సమాధానం ఇవ్వాల్సినవే ఉన్నాయి. దీంతో సబ్జెక్ట్‌ను పూర్తిగా చదివిన వారికే సమాధానం ఇచ్చే నేర్పు ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండోరోజు కూడా 2021, 2022 జేఈఈ మెయిన్ పేపర్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనార్హం. అదే విధంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అన్ని ప్రశ్నలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. పరీక్షకు సాధారణ స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులకు 120 మార్కులు, పూర్తి స్థాయి పట్టు సాధించిన వారికి 270కు పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.బెంగళూరు సెంటర్లో రీ షెడ్యూల్ఈ నెల 22వ తేదీన బెంగళూరులోని ఒక పరీక్షా కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మొదటి సెషన్ పరీక్ష నిలిచిపోయింది. దీంతో ఆ సెంటర్లోని 114 మంది విద్యార్థులకు ఈ నెల 28 లేదా 29న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. -
రెండు సెషన్లూ క్లిష్టంగానే..!
సాక్షి ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్(JEE Main) రెండోరోజు గురువారం రెండు సెషన్ల పరీక్షలూ మొదటి రోజుతో పోల్చితే క్లిష్టంగా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. మొదటిరోజు మాదిరిగానే రెండోరోజు కూడా మ్యాథమెటిక్స్ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో అభ్యర్థులకు సమయం సరిపోలేదు. తొలి సెషన్లో విద్యార్థులు 55 నుంచి 60 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగారు. ఫిజిక్స్‌లో కొన్ని సులభంగా, మరికొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఓ మోస్తరు క్లిష్టతతో అడిగారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ద్వితీయ సంవత్సరం సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. కొన్ని టాపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత రెండు సెషన్లలోనూ.. మూడు సబ్జెక్ట్‌ల ప్రశ్నలను పరిశీలిస్తే కొన్ని టాపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. మ్యాథమెటిక్స్‌లో సిరీస్ (2 ప్రశ్నలు), ఇంటిగ్రెల్ కాలిక్యులస్ (4 ప్రశ్నలు), 3–డి వెక్టార్ అల్జీబ్రా (3 ప్రశ్నలు), కానిక్స్ (3 ప్రశ్నలు)కు ప్రాధాన్యత ఇచ్చారు. సిరీస్, కానిక్స్, పెర్ముటేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. అయితే ఈ సబ్జెక్ట్‌లో దాదాపు ఏడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ (9 ప్రశ్నలు), పిరియాడిక్ టేబుల్ (2 ప్రశ్నలు), అటామిక్ స్ట్రక్చర్ (2 ప్రశ్నలు), కెమికల్ బాండింగ్ (2 ప్రశ్నలు)కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ఫిజిక్స్‌లో హీట్ అండ్ థర్మో డైనమిక్స్ (2 ప్రశ్నలు), ఎలక్ట్రిసిటీ (3 ప్రశ్నలు), ఏసీ సర్క్యూట్ (2 ప్రశ్నలు)కు వెయిటేజీ లభించింది. 50% ప్రశ్నలు ఫార్ములా, కాన్సెప్ట్స్ ఆధారంగానే.. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో దాదాపు 50 శాతం ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ములా, కాన్సెప్ట్ ఆధారంగా సమాధానం ఇవ్వాల్సినవే ఉన్నాయి. దీంతో సబ్జెక్ట్‌ను పూర్తిగా చదివిన వారికే సమాధానం ఇచ్చే నేర్పు ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండోరోజు కూడా 2021, 2022 జేఈఈ మెయిన్ పేపర్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనార్హం. అదే విధంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అన్ని ప్రశ్నలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. పరీక్షకు సాధారణ స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులకు 120 మార్కులు, పూర్తి స్థాయి పట్టు సాధించిన వారికి 270కు పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. బెంగళూరు సెంటర్లో రీ షెడ్యూల్ ఈ నెల 22న బెంగళూరులోని ఒక పరీక్షా కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మొదటి సెషన్ పరీక్ష నిలిచిపోయింది. ఆ సెంటర్లోని 114 మంది విద్యార్థులకు ఈ నెల 28 లేదా 29న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. -
మ్యాథ్స్‌లో కొంత క్లిష్టత ఫిజిక్స్ సులభం
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో బీటెక్ చేసేందుకు, అదే విధంగా ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్షగా ఎన్టీఏ ఏటా రెండుసార్లు దీనిని నిర్వహిస్తోంది. మొదటి దఫా పరీక్షకు జాతీయ స్థాయిలో 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో దాదాపు 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారని అంచనా. 23, 24, 28, 29, 30 తేదీల్లో కూడా రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. 300 మార్కులకు పరీక్ష మూడు సబ్జెక్ట్‌లలో 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 75 ప్రశ్నలతో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహించారు. కాగా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, గత ప్రశ్న పత్రాలు సాధన చేసిన వారికి కొంత మేలు కలిగించేదిగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. రెండు సెషన్లలోనూ మ్యాథమెటిక్స్ విభాగం ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో కొందరు విద్యార్థులకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదు. ఫిజిక్స్ విభాగం ప్రశ్నలు సులభంగా, కెమిస్ట్రీలో కొన్ని సులభంగా, కొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 50 శాతం ప్రశ్నలు చాలా సులభంగా ఉండడం విద్యార్థులకు ఉపశమనం కలిగించింది. ఈ రెండు విభాగాల ప్రశ్నలకు అభ్యర్థులు 45 నిమిషాల చొప్పున సమయంలో జవాబులు ఇవ్వగలిగారు. అయితే మిగతా గంటన్నర సమయంలో మ్యాథమెటిక్స్‌లో 15 నుంచి 20 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణంగా సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే కెమిస్ట్రీ ప్రశ్నలు.తొలిరోజు రెండు సెషన్లలోనూ ప్రశ్నలు జేఈఈ–మెయిన్ గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా అడిగారు. ముఖ్యంగా 2021, 2022 ప్రశ్నలకు సరిపోలే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక కెమిస్ట్రీలో అధిక శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే.. డైరెక్ట్ కొశ్చన్స్‌గా అడగడంతో ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఇన్–ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 30 శాతం ప్రశ్నలున్నాయి. కెమికల్ బాండింగ్, బయో మాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, కాటలిస్ట్సŠ, వేవ్ లెంగ్త్, ఎస్ఎంఆర్, పొటెన్షియల్ మీటర్, కెమికల్ ఈక్వేషన్ ఎనర్జీ, రేడియో యాక్టివ్ డికే, ఆర్గానిక్ కెమిస్ట్రీ (3 ప్రశ్నలు), కో ఆర్డినేట్ కాంపౌండ్, ఆక్సిడేషన్ స్టేట్ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఫిజిక్స్, మ్యాథ్స్‌లో ఇలా.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్, ప్రొజెక్టైల్ మోషన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, డయోడ్స్, ఈఎం వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఏసీ సర్క్యూట్, డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అడిగారు. మ్యాథ్స్‌లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సింపుల్ ప్రాబ్లమ్, వెక్టార్, 3డి జామెట్రీ, షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్, మాట్రిసెస్, డిటర్మినెంట్స్, బయనామియల్ థీమర్, ట్రిగ్నోమెట్రీ, క్వాడ్రాట్రిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్, సిరీస్, పారాబోలా, ఏరియా ఆఫ్ సర్కిల్, పెర్ముటేషన్, హైపర్ బోలా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సర్కిల్ ఇంటర్సెక్టింగ్ ప్రాబ్లమ్స్ అడిగారు. అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనా ఇలా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీలో 91–92 మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 79–80, ఓబీసీ కేటగిరీలో 77–78, ఎస్సీ కేటగిరీలో 56–58, ఎస్టీ కేటగిరీలో 42–44 మార్కులు కటాఫ్‌గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
వ్యక్తి లోపలనే గుప్తంగా దాగి ఉండే ధనరాశి అదేంటో తెలుసా?
‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’ – ఇతరుల కళ్ళకు కనిపించకుండా, వ్యక్తి లోపలనే గుప్తంగా దాగి ఉండే ధనరాశి వంటిది విద్య అని భర్తృహరి సుభాషితం చెప్పింది. విద్య వలన ప్రయోజనం అదొక్కటి మాత్రమే కాదనీ, మనిషి విద్యావంతుడు కావడం వలన సమకూరే ఉత్తమమైన ప్రయోజనాలు మరి కొన్ని వున్నాయనీ తెలుగు కవులు చెప్పారు. వారిలో, విక్రమార్కుడి సింహాసనపు సాలభంజికలు భోజరాజుకు చెప్పిన కథలను తెలుగులో ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యంగా రచించిన కొఱవి గోపరాజు ఒకరు. ‘పరులకు, సోదరులకు, భూమిని పాలించే భూవరులకు నిలువెత్తు ధనం వెచ్చించైనా ఒకవ్యక్తి నుండి కొనలేనిది అతడి విద్య అని, ఏ వ్యక్తిలో ఉంటేఆ వ్యక్తికి మాత్రమే నూటికి నూరుపాళ్ళు వశ్యమై ఉండేది విద్య ఒక్కటే అని, ఒకరు తనలోని విద్యను మరొకరికి బోధించినపుడు, ఆ బోధనను గ్రహించిన వ్యక్తిలో తిరిగి అదే రకమైన వృద్ధికి ఆ విద్య దారితీస్తుందని ఆయన చెప్పిన మాటలు చిరస్మరణీయాలు. పరాయి ఊరికి వెళ్ళినప్పుడు వ్యక్తి లోపల ఉన్న విద్యా ధనం ఒక్కటే దొంగలకు కనపడకుండా ఉంటుందని, విద్య ఒక్కటి మాత్రమే ఒక్కొకసారి వ్యతిరేక పరి స్థితులలో సైతం స్నేహితులను పుట్టించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుందని, కాబట్టి విద్యను పోలిన ధనం మరొకటి ఉంటుందనుకోవడం అవివేకమే అవుతుందని కూడా చెప్పాడు కొఱవి గోపరాజు. విద్యను గురించి కావ్యాంతర్గతమైన వివరణ అలా ఉండగా, భారతీయుల ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యమైన మార్గదర్శకాలుగా భావించే అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘శ్రీవిష్ణుపురాణం’ పంచమ అంశం, పదవ అధ్యాయం, 30వ శ్లోకంలో విద్యను గురించిన అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక భావన కనపడుతుంది. విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్,సైవ పూజ్యార్చనీయా చ సైవ తస్యోపకారికా. ఏ విద్య ఆసరాతో ఒక వ్యక్తి తన జీవనాన్ని సాగిస్తుంటాడో, ఆ విద్యయే అతడికి ఇష్టదైవం వంటిది. ఆ విద్యయే ఆ వ్యక్తికి పూజనీయమైనది. ఆ విద్యయే ఆ వ్యక్తికి చిరకాలం ఆనందాన్ని కలిగించేదిగా కూడా ఉంటుంది అని పై శ్లోకంలో చెప్పబడింది.– భట్టు వెంకటరావు -
చేయూతగా ‘పీఎం విద్యాలక్ష్మి’ ..ఉన్నత చదువులకు వరం
కరీంనగర్: ప్రతిభ ఉన్నా ఉన్నత విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారుతోంది. దీనికి ఆర్థిక పరిస్థితులే కారణమవుతున్నాయి. ఉన్నత విద్య, విదేశాల్లో చదువు కోసం గతంలో రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సిఫార్సులు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ పూచీకత్తులు సమర్పించాల్సి వచ్చేది. అయినా. రుణం మంజూరు అవుతుందో లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం అవేమీ అక్కర్లేదు. ఉన్నత చదువులకు పీఎం విద్యాలక్ష్మి(PM Vidyalaxmi Scheme) పథకం చేయూతనిస్తుంది. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ గత నవంబర్‌లో ఆమోదం తెలి పింది.విద్యాలక్ష్మి పోర్టల్..పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. చదువుకు సంబంధించిన వివరాలు వాస్తవికతతో ఉంటే చాలు రుణం పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. దీనికి ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్(Vidyalaxmi Portal)ను అందుబాటులోకి తెచ్చాయి. ఎన్ఎస్డీఎల్ ఈ–గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఎంత వరకు రుణం?విద్యాలక్ష్మి పథకం ద్వారా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందులో రూ.4.5 లక్షల వరకు రుణానికి కేంద్ర ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది. రుణం రూ.7.5 లక్షలు దాటితే పూచీకత్తు ఉండాలి.వివరాలు నమోదు చేయాలిపోర్టల్లో నమోదు చేసుకున్నాక www.vidyalakshmi.co.in వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అందులో అడిగిన వివరాలు నమోదు చేయాలి. ఒక విద్యార్థి ఒకేసారి గరిష్టంగా మూడు బ్యాంకులకు విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.జాతీయ ఉపకార వేతనాలకు సైతం..విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా జాతీయ ఉపకార వేతనాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారిని పోర్టల్‌లో అనుసంధానం చేయడంలో భాగంగా ప్రతిభ ఉపకార వేతనాల వివరాలు పొందుపరుస్తున్నారు. రుణాలు, స్కాలర్షిప్లు అందుకొని, స్థిరపడినవారి స్ఫూర్తిదాయక గాథల్ని పేజీల్లో ఉంచారు.ఏయే చదువులకు?ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ డిప్లొమా, కాస్ట్ అకౌంటెన్సీ, చార్టెడ్ అకౌంట్, ఐఐఎం మేనేజ్మెంట్, ఐఐటీ, వృత్తి విద్యా కోర్సులు, విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదివేవారికి రుణాలు ఇస్తారు. యూజీసీ, ఏఐసీటీఈ ఇతర ప్రభుత్వ అధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి రుణాలు అందుతాయి.దరఖాస్తు విధానం..రుణాల కోసం మూడు పద్దతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదు కావాలి. తర్వాత వివరాలతో కూడిన దరఖాస్తు పూరించాలి. చివరగా వివిధ రకాల బ్యాంకులను ఎంపిక చేసుకోవాలి. ఇదంతా పూర్తయితే రుణానికి సంబంధించిన వివరాల సమాచారం మొబైల్, ఈ–మెయిల్‌కు ఎప్పటికప్పుడు అందుతుంది.జత చేయాల్సినవి..విద్యాలక్ష్మి పథకంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద విద్యారుణాలు పొందేందుకు విద్యార్థులు పలు పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది. చదివిన విద్యాసంస్థ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ), మార్కుల జాబితా, ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు, ఉన్నత విద్యకు సంబంధించిన ర్యాంకు కార్డు, ప్రవేశ అనుమతి పత్రాలు, చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు, తల్లి, తండ్రి, సంరక్షకుడు, విద్యార్థికి సంబంధించిన పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన సర్టిఫికెట్లు, ఆస్తి వివరాలు, నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు లాంటివి జత చేయాలి.36 బ్యాంకులు..విద్యాలక్ష్మి పోర్టల్‌లో 36 బ్యాంకులు నమోదై ఉన్నాయి. అవి విద్యారుణాలు ఇస్తాయి. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, విజయ, ఐవోబీ, యూనియన్, ఆంధ్రాబ్యాంక్, ఐడీబీఐ, యూబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యూకో, దీనా, కరూర్‌వైశ్య, సిండికేట్, జీఏఏబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యాక్సిస్, ఫెడరల్, న్యూ ఇండియా, ఆర్బీఎల్, అలహాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. -
నేటి నుంచి టెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. 10 రోజుల పాటు 20 సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి టెట్ పేపర్–1కు 94,327 మంది, పేపర్–2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. రోజూ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. టెట్ కోసం 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఎస్సీపై కోటి ఆశలు: ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత ఏడాది 11 వేల టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా 17 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో టీచర్ ఉద్యోగార్థులు కొండంత ఆశతో పుస్తకాలతో కుస్తీ పడుతూ ప్రిపేరవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ అర్హత సాధించినవారు దాదాపు 3 లక్షల మంది ఉన్నా రు. డీఎస్సీలో టెట్‌కు వెయిటేజీ ఉండటంతో వీరిలో కొంతమంది స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ టెట్ రాస్తున్నారు. టెట్ అర్హత లేనివారు ఈసారి ఎలాగైనా అర్హత సాధించాలని కష్టపడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లు కూడా టెట్, డీఎస్సీ కలిపి కోచింగ్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా టెట్, డీఎస్సీ కోసమే 418 కోచింగ్ కేంద్రాలు వెలిశాయి. ఇవి కాకుండా కొన్ని ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాయి. ఈసారి టెట్ పరీక్షలో ఇంటర్ వరకూ సిలబస్‌ను తీసుకొచ్చారు. జా తీయ విద్యా విధానంలో మానసిక బోధన విధానానికి అత్యంత ప్రాధాన్యమిస్తుండటంతో.. ఆ కోణంలోనూ టెట్ ప్రశ్న పత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. -
రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతుండటంతో, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎమ్మెస్ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యూఎస్ వెళ్లేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్న విద్యార్థులు అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్ సీజన్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్)లో డాలర్ విలువ రూ.79 కాగా ఇప్పుడది రూ.85.03కు ఎగబాకడం గమనార్హం. 2014లో డాలర్ (Dollar) విలువ రూ. 60.95 మాత్రమే కావడం గమనార్హం. రూపాయి (Rupee) విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్ ఫీజు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చు కోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చు కుంటే డాలర్ విలువ గత రెండేళ్లలోనే 8 శాతం పెరగడం విద్యార్థులపై పెనుభారం మోపుతోంది. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలకు (part time jobs) అవకాశాలు సన్నగిల్లడంతో విద్యార్థులు భారత్‌లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 2025లో రూ.5.86 లక్షల కోట్ల భారంభారత్ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో 2024లోఇది 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ. 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది రూ.5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజుకే అదనంగా రూ. 2.40 లక్షల వ్యయంస్ప్రింగ్ (మార్చి నుంచి జూన్) సీజన్లో చదువుకు సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా.. మొత్తం మీద అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడదని రూ. 52 లక్షల వరకు వెళుతుందని అంచనా. ఉపాధి భరోసా ఏదీ?అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ – డాలస్ విమానంఇక్కడ అమెరికాతో పోల్చుకుంటే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెర్చారు. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితి ఊహించలేదు అమెరికా వస్తున్పప్పుడు రూ. 50 లక్షల వరకు అప్పు చేశా. రూపాయి విలువ పతనంతో ట్యూషన్ ఫీజు మొత్తం పెరిగింది. ప్రస్తుతం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిలో నలుగురం ఉంటున్నాం. అయినా ఇబ్బందిగానే ఉంది. పార్ట్ టైం ఉద్యోగం చేసినా పెద్దగా ఆదాయం ఉండటం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. – పాయం నీలేష్ (అమెరికాలో ఎంఎస్ విద్యార్థి)వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా..యూఎస్ వెళ్లడానికి బ్యాంక్ లోన్ ఖాయమైంది. కానీ ఈ సమయంలోనే రూపాయి పతనంతో యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొత్తం పెరిగింది. బ్యాంకు వాళ్లు అదనంగా లోన్ ఇవ్వనన్నారు. మిగతా ఖర్చుల కోసం నాన్న అప్పుచేసి డబ్బులు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. – నీలిమ (అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్న విద్యార్థిని)2014లో డాలర్ విలువ రూ.60.952022 (ఫాల్ సీజన్)లో రూ.792024 డిసెంబర్లో రూ.85.032025లో రూ.9 లక్షల వరకు అదనపు భారం! -
ఇష్టంగా చదివితే ఏదీ కష్టం కాదు
సాక్షి, హైదరాబాద్: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు.. దేశంలో ఎంతో క్లిష్టమైన చదువుల్లో వాటి లో ఒకటిగా భావించే కోర్సు. ఈ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుందని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ, సీఏ విజ యవంతంగా పూర్తిచేసినవారికి అద్భుతమైన కెరీర్ ఆహ్వనం పలుకుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న కోర్సులో చేరి 22 ఏళ్ల వయసులోనే దానిని పూర్తి చేయటమే కాకుండా.. ఈ నెల 26న ఐసీఏఐ విడుదల చేసిన ‘ఫైనల్’ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.. పలమనేరుకు చెందిన రిషబ్ ఓస్వాల్. తన విజయానికి హార్డ్ వర్క్, ప్లానింగే కీలకంగా నిలిచాయని చెబుతున్న రిషబ్ ఓస్వాల్ సక్సెస్ స్టోరీ అతని మాటల్లోనే... రాజస్తాన్ నుంచి పలమనేరుకు.. రాజస్తాన్‌కు చెందిన మా కుటుంబం.. వృత్తి రీత్యా చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థిరపడింది. నాన్న రాజేశ్ ఓస్వాల్ బంగారం, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నా స్కూల్ చదువు పలమనేరులోని ఎమ్మాస్ స్విస్ స్కూల్లోనే సాగింది. 2018లో ఐసీఎస్ఈ పదో తరగతిలో 97.5 శాతం మార్కులతో పాసయ్యాను. ఆ తర్వాత సీఏ కోర్సు అభ్యసించడానికి గుంటూరులోని మాస్టర్‌మైండ్స్ అకాడమీలో చేరాను. 2020లో ఇంటర్లో 96.8% మార్కులతో ఉత్తీర్ణత సాధించాను సీఏ దిశగా ఇలా..ఇంటర్మీడియెట్ పూర్తవగానే 2020లో సీఏ కోర్సులో చేరాను. 2021లో సీఏ ఇంటర్మిడియట్‌లో జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించాను. ఆ తర్వాత ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీలో ఆర్టీకల్íÙప్ పూర్తి చేశాను. ఒకవైపు ఆర్టీకల్ షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపేరయ్యాను. గత నవంబర్‌లో పరీక్షలకు హాజరయ్యాను. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. సీఏంఏ కూడా.. సీఏ కోర్సు కంటే ముందు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులో చేరి.. 2020లోనే సీఎంఏ ఫౌండేషన్‌లో, 2021లో సీఎంఏ ఇంటర్మీడియట్లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకున్నాను. అయితే సీఏనే నా లక్ష్యం కావటంతో 2021 నుంచి పూర్తిగా సీఏపైనే దృష్టి పెట్టాను. డైలీ ప్లానింగ్సీఏ కోర్సులో రాణించడానికి ప్రతి రోజూ దాదాపు 10 గంటలు చదివాను. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి రోజుకు 12 గంటలు.. చివరి 15 రోజులు రోజుకు 14 నుంచి 15 గంటలు కష్టపడ్డాను. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవడం, ప్రాక్టీస్ టెస్ట్స్‌కు హాజరవడం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చాయి.‘సాక్షి’ స్పెల్–బి మెడల్ స్కూల్లో చదివేటప్పుడు కోకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నాను. ఈ క్రమంలో 2016లో ‘సాక్షి’స్పెల్–బి ఫైనల్స్‌కు చేరుకుని మెడల్ కూడా సాధించాను. దీంతోపాటు వీఐటీ స్పెల్–బిలోనూ రెండో ర్యాంకు సాధించాను. -
AP: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీనుంచి జరిగే ఇంటర్మీడియట్ (Intermediate) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తత్కాల్ (Tatkal Scheme) కింద అవకాశం కల్పించారు. అభ్యర్థులు రూ.3 వేల ఆలస్య రుసుంతో మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంజనవరి నుంచి 1,48,923 మంది ఇంటర్ విద్యార్థులకు భోజనం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించేందుకు సమగ్ర శిక్ష విభాగం ఏర్పాట్లు చేసింది. మొత్తం 475 కాలేజీల్లో 398 కాలేజీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు అప్పగించారు. మరో 77 కాలేజీలకు ఎన్జీవోల ద్వారా భోజనం సరఫరా చేయనున్నారు.రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలకు రూ.100 కోట్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షాభియాన్ (పీఎం–ఉష)లో భాగంగా దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించింది. వర్సిటీలకు అవసరమైన ల్యాబ్స్, మౌలిక సదుపాయాల కల్పన కోసం గత విద్యాసంవత్సరం (2023)లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్రం త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (పేరెంట్స్ కమిటీ)లకు ఒక్కరోజు శిక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 45,124 పాఠశాలలకు సంబంధించి జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలోనూ, 31 నుంచి జనవరి 2 వరకు మండల స్థాయిలోనూ, 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలోనూ శిక్షణ నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు డీఈవోలను ఆదేశించారు. కాగా, జిల్లా స్థాయిలో 3,765 మందికి, మండల స్థాయిలో 93,643 మంది శిక్షణకు గానూ రూ.1,92,80,070 నిధులు మంజూరు చేశారు. నాన్ టీచింగ్ సిబ్బందికి జేఎల్ పదోన్నతులుప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2024–25 విద్యా సంవత్సరం ప్యానల్ సంవత్సరానికి బోధనేతర సిబ్బందికి 10 శాతం కోటా కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జేఎల్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆర్జేడీలను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అభ్యంతరాలను నమోదు చేయాలని సూచించారు. వీటిపై ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి తుది సీనియారిటీ జాబితాను పంపించాలన్నారు. కాగా, ఇదే కేటగిరీ కింద ఇటీవల 24 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. -
రెండో విడత మెడికల్ పీజీ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ రెండో దశ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం కేటాయించింది. సీట్లు పొందిన వైద్యులు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రతి కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఇద్దరు లేదా ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీలను ఏర్పాటుచేసి ఆయా కాలేజీల్లో చేరే వైద్యుల ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు. ముఖ్యంగా స్థానికత, రిజర్వేషన్ల వారీగా నీట్ కటాఫ్ స్కోర్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు. -
యూజీసీ సిఫార్సులు ఆచరణ సాధ్యమేనా?
సాక్షి, ఎడ్యుకేషన్: ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన సంస్కరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, పీజీలో ప్రవేశాలు మొదలు.. కోర్సుల వ్యవధి వరకు యూజీసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తే ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయి. అయితే ఈ సిఫార్సులపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు సత్ఫలితాల నివ్వడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటు న్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం ‘మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులేషన్స్–2024’ పేరుతో యూజీసీ ఈ నెల ఐదో తేదీన ముసాయిదాను విడుదల చేసింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి, ఈ నెల 23వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలు రాసింది. యూజీసీ సిఫార్సులపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఏటా రెండు సార్లు ప్రవేశం..యూజీసీ సిఫార్సుల్లో ముఖ్యమైనది.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏటా రెండు సార్లు (జూలై / ఆగస్ట్, జన వరి/ఫిబ్రవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహించటం. ఇది విద్యా ర్థులకు కొంత మేలు చేసే అంశమేనని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య అభ్యసించే విషయంలో సమయం వృథా కాకుండా ఈ ప్రతిపాదన మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే..ఈ ప్రతిపాదన అమలుచేయాలంటే ఫ్యాకల్టీ, ఇతర బోధన సదుపాయా లను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్ప టికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. హెచ్‌ఈసీతో బీటెక్ చదవగలరా?యూజీసీ మరో సిఫార్సు.. అకడమిక్ నేపథ్యం ఏదైనా.. విద్యార్థులు ఉన్నత విద్యలో తమకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం కల్పించడం. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్‌లో హెచ్ఈసీ చదివిన విద్యార్థి.. బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌లలో (జేఈఈ, ఈఏపీసెట్ తదితర) ఉత్తీర్ణత సాధించి బీటెక్‌లో చేరొచ్చు. దీనిపై వ్యతిరేక అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యా ర్థులు.. గణితం, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే బీటెక్‌లో రాణించడం సాధ్యం కాదని అంటున్నారు. బహుళ ప్రవేశ, నిష్క్రమణ అవకాశంయూజీసీ ప్రతిపాదనల్లో మరో కీలకమైన అంశం బహుళ ప్రవేశ, నిష్క్రమణ (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) విధానం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో కోర్సు నుంచి వైదొలగే అవకాశం, ఆ తర్వాత మళ్లీ అదే కోర్సులో.. తదుపరి తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కల్పించటం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. కానీ.. ఇలాంటి విధానం ఫలితంగా విద్యార్థుల్లో ఉన్నత విద్య స్ఫూర్తి కొరవడే ప్రమాదం ఉందని, ఇది జాబ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. స్కిల్ కోర్సులు, అప్రెంటిస్షిప్స్ఉన్నత విద్యలో స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్స్ను సమీకృతం చేసేలా మరో ప్రతిపాదన చేశారు. బ్యాచిలర్ డిగ్రీలో మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం పూర్తి చేసుకున్న వారు.. మరో 50 శాతం క్రెడిట్స్ కోసం స్కిల్ కోర్సులను, అప్రెంటిస్‌షిప్‌ను, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్కిల్ కోర్సులను అందించే క్రమంలో.. రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.ఒకే సమయంలో రెండు డిగ్రీలుఅకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విధానంలో ఒకే సమయంలో రెండు డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అభ్యసించే విధానాన్ని కూడా యూజీసీ ప్రతిపాదించింది. విద్యార్థులు తాము చేరిన కోర్సు/విద్యా సంస్థతోపాటు మరో ఇన్స్టిట్యూట్లో లేదా మరో అభ్యసన విధానంలో అర్హత మేరకు మరేదైనా బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీలో చేరొచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మన విద్యా వ్యవస్థకు సరితూగేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండున్నరేళ్లకే బ్యాచిలర్ డిగ్రీరెండున్నరేళ్లకే డిగ్రీ పూర్తి చేసుకునేలా యూజీసీ ప్రతి పాదన చేసింది. యాక్సెలెరేటెడ్ డిగ్రీ ప్రోగామ్ పేరుతో ప్రతి విద్యా సంస్థలోని మొత్తం విద్యార్థుల్లో పది శాతం మందికి ఈ అవకాశం కల్పించాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగామ్స్ విషయంలో మూడేళ్లలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ యాక్సలెరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానంలో.. టీచింగ్–లర్నింగ్ కోణంలో సమస్య ఉత్పన్నమవుతుందని, విద్యార్థులు ఒత్తిడికి గుర వుతారని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని రెండున్నరేళ్లలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన యూ జీసీ.. పీజీ విషయంలో మాత్రం మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వారినే అర్హులుగా నిర్దేశించాలని సూచించింది. దీంతో.. రెండున్నరేళ్లకు లేదా మూడేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పీజీ ప్రవేశాల అర్హతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తక్షణ అమలు సాధ్యం కాదు..యూజీసీ ప్రతిపాదనలు, సిఫార్సులను తక్షణం అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అయిదు నుంచి పదేళ్ల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ప్రభు త్వ విద్యా సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో కొంత మేర వీటిని వెంటనే అమలు చేసే వీలుంది. – ప్రొఫెసర్. డి.ఎన్. రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీఆహ్వానించదగ్గ పరిణామంయూజీసీ తాజా సిఫార్సులను ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విషయంలో అదనపు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం అవసరమైన వనరులను ఉన్నత విద్యా సంస్థలు కల్పించాలి. – ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రొ వైస్ ఛాన్స్లర్ అడ్వయిజర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీదశల వారీగా అమలు చేయాలిగ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సంస్కరణలు అవస రమే.. కానీ అమలు విషయంలో ఫ్యాకల్టీ కొరత సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కోణంలో పలు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విధానంలో బీటెక్, సైన్స్ కోర్సుల్లో రాణించడం కష్టంగానే ఉంటుంది. – ప్రొఫెసర్. వి. బాలకిష్టారెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి -
జేఈఈ అడ్వాన్స్డ్ తర్వాతే ఈఏపీ సెట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్)ను ఈసారి ముందుకు జరిపి ఏప్రిల్‌లోనే నిర్వహించాలన్న ఉన్నత విద్యా మండలి ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ఈఏపీ సెట్‌ను ముందుకు జరపటం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్పష్టం చేసినట్టు తెలిసింది. జాతీయ, రాష్ట్ర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈఏపీ సెట్ తేదీని గత ఏడాదికన్నా ముందుకు జరపడం సాధ్యంకాదని తెలిపినట్లు సమాచారం. ప్రధాన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఈఏపీ సెట్ తేదీని ఖరారు చేయాలని ఇటీవల తమతో భేటీ అయిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి టీసీఎస్ ప్రతినిధులు సూచించినట్లు తెలిసింది. ఈసారి సెట్‌ను ముందే నిర్వహిస్తామని బాలకిష్టారెడ్డి మండలి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ పరీక్ష తేదీలను పరిశీలించి టీసీఎస్ సెట్ తేదీని మండలికి సూచించడం ఆనవాయితీ. మే 18 తర్వాత అయితే ఓకే.. మార్చి ఆఖరి వారంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. ఈ ఫలితాలు ఏప్రిల్ రెండో వారం వెల్లడించే వీలుంది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాస్తారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఈఏపీ సెట్‌కు సన్నద్ధమవ్వడానికి విద్యార్థులకు సమయం అవసరం. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8 వరకు నిర్వహిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 18న నిర్వహిస్తామని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. దీని తర్వాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. ఏటా ఈ కౌన్సెలింగ్ పూర్తయ్యే సమయంలో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపడుతుంటారు. జాతీయ కాలేజీల్లో సీట్లు రాని వారికి ఇది ఉపయోగపడుతుంది.ఇవన్నీ పట్టించుకోకుండానే ఈఏపీ సెట్‌ను ఏప్రిల్‌లో నిర్వహించాలని మండలి భావించింది. ఇలా చేయడం వల్ల మెయిన్స్, అడ్వాన్స్డ్ రాసే విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని టీసీఎస్ భావిస్తోంది. అడ్వాన్స్డ్ తర్వాతే ఎప్పటిలాగే సెట్ నిర్వహించాలని సూచించినట్లు టీసీఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మండలిలోనూ భిన్నాభిప్రాయాలు ఈఏపీ సెట్‌ను ముందుకు జరపాలన్న ప్రతిపాదనపై మండలిలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలిసింది. వివిధ సెట్స్ ఏ వర్సిటీకి ఇవ్వాలి? కన్వీనర్‌ను ఎవరిని పెట్టాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈఏపీసెట్ నిర్వహించే జేఎన్టీయూహెచ్కు వీసీని కూడా నియమించలేదు. ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేస్తామని చెబుతున్నా... ప్రభుత్వం నుంచి అందుకు సమ్మతి రాలేదు. ఇన్ని సమస్యల మధ్య సెట్ నిర్వహణ ముందే ఎలా చేపడతామని మండలి వైస్ చైర్మన్ ఒకరు సందేహం వ్యక్తంచేశారు. -
ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2024)కు సంబంధించిన ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీసీ స్ట్రీమ్‌లో బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సులతోపాటు బైపీసీ స్ట్రీమ్‌లో బీఈ, బీ.టెక్‌లలో బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాసూ్యటికల్ ఇంజనీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సుల సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేశాయి. ఏపీ ఈఏపీసెట్–2024లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ట్ఛ్టట.టఛిజ్ఛి.్చp.జౌఠి.జీn లో లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు శనివారం రాత్రి వరకు అవకాశం ఉంది. డిసెంబర్ ఒకటో తేదీ వరకు విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఎంపిక చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో పరిశీలిస్తారు. శని, ఆదివారాల్లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు డిసెంబర్ 2వ తేదీ ఒక్క రోజు అవకాశం ఉండగా, 4వ తేదీన సీట్లు కేటాయిస్తారు. డిసెంబర్ 4 నుంచి ఆరో తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంది. బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు శనివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కళాశాలల ఎంపిక కోసం 3 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 8వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. డిసెంబర్ 11 సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి 14వ తేదీలోపు కళాశాలల్లో చేరాలి. -
ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది. పదో తరగతి పరీ క్షలు మార్చి 18వ తేదీన ముగియ నున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ నాలుగో తేదీన ముగియనున్నాయి. సీబీఎస్ ఈ 86 రోజుల ముందుగానే బోర్డ్ పరీక్షల తేదీలను ప్రకటించడం ఇదే తొలిసారి. ‘‘ప్రతి రెండు సబ్జెక్ట్ పరీక్షల మధ్య సరిపోను వ్యవధి ఉండేలా చూశాం. 40,000 సబ్జెక్ట్ కాంబినేషన్లను దృష్టిలో ఉంచుకుని పరీక్ష తేదీల ను సిద్ధంచేశాం. -
టీజీసెట్–2024 ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ: అధ్యాపక ఉద్యోగాల అర్హత పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్–2024 (టీజీసెట్–2024) ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ శనివారం విడుదల చేశారు. ఫలితాలను http://telanganaset.org అనే వెబ్సైట్లో చూడవచ్చు. గత సెప్టెంబర్‌లో జరిగిన పరీక్షకు 26,294 మంది అభ్యర్థులు హాజరుకాగా 1,884 మంది (7.17 శాతం) అర్హత సాధించారు. అందులో 50.21 శాతం పురుషులు కాగా 49 శాతం మహిళలున్నారు. అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను త్వరలో పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు. -
విదేశాల్లో.. ‘త్రివర్ణ’ విద్యా పతాక!
నూతన విద్యావిధానంలో భాగంగా విదేశీ వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు భారత్ తలుపులు బార్లా తెరిచింది. అదేసమయంలో విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతక రెపరెపలకూ సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొట్టమొదటిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) తమ క్యాంపస్‌లను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ‘వాణిజ్య సంప్రదింపులు’ అనే కొత్త సబ్జెక్ట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ ప్రకటించారు. విదేశాల్లో క్యాంపస్‌లను స్థాపించాలనుకునే భారతీయ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలను అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం2021 నుంచి అడుగులు...! విదేశాల్లో భారతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుపై 2021లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఐఐటీల్లోని డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 1:10 నిష్పత్తిలో విద్యార్థులను తీసుకోవాలని, ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని ఇలా కొన్ని ప్రతిపాదనలు కూడా పరిశీలించారు. ఇక గతేడాది దేశానికి చెందిన ప్రభుత్వ రంగ ఉన్న విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం విదేశాల్లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దుబాయ్, టాంజానియా, ఈజిప్‌్ట, ఆఫ్రికా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఆలోచిస్తున్నాయి.ఐఐటీ ఢిల్లీ – యూఏఈలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, విదేశాల్లో భారతీయ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ముందుకొచి్చంది ఐఐఎఫ్‌టీ మాత్రమే.విదేశాల్లో భారత్‌కు చెందిన 10 ప్రైవేట్ వర్సిటీలు1. అమిత్ యూనివర్సిటీ: 2013లో దుబాయ్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. విదేశీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.2. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2000లో ఈ వర్సిటీ ఏర్పాటుచేసింది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో వివిధ కోర్సులను అందజేస్తోంది. అక్కడి వర్సిటీల్లో టాప్–10లో కొనసాగుతోంది. 3. ఎస్పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్: 2004లో దుబాయ్, సింగపూర్, సిడ్నీ దేశాల్లో వర్సిటీలను ఏర్పాటు చేసింది. 4. బిట్స్ పిలానీ: దుబాయ్‌లో 2000లో ఈ సంస్థ ఏర్పాటైంది. భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో.. దుబాయ్‌లోని అంతే క్రేజ్ కొనసాగుతోంది. ఇక్కడ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 5. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: 2010లో దుబాయ్‌లో సేవల్ని ప్రారంభించిన ఎస్ఆర్ఎం.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 6. మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 2013లో రువాండాలో ఏర్పాటైంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐటీలో పీజీ, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది. 7. అమృత విశ్వ విద్యాపీఠం: దుబాయ్‌లో 2015లో ఈ యూనివర్సిటీ సేవలు ప్రారంభించింది. విభిన్న కోర్సుల్ని అందిస్తోంది. 8. సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ: దుబాయ్‌లో 2008లో క్యాంపస్ ఏర్పాటు చేసింది. 9. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2002లో మొదలైంది. 10. విట్ యూనివర్సిటీ: 2017లో తన సేవల్ని దుబాయ్‌లో విస్తరించింది. భారత్‌లోనూ విదేశీ క్యాంపస్లుఉన్నత విద్యకోసం విదేశాలు వెళుతున్న భారతీయల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో... విదేశీ విద్యా సంస్థలే భారత్‌కు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం అనుమతులిచ్చేందుకూ సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ముందుకొచ్చింది. తమ క్యాంపస్‌ను గుర్గావ్లో ఏర్పాటు చేయనున్నామని, జూలై 2025లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఇలా విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతాకను ఎగురవేసేందుకు భారత్ అడుగులు వేస్తుండగా, విదేశీ విద్యాసంస్థలు సైతం భారత్‌లో వర్సిటీల స్థాపనకు సిద్ధమవుతున్నాయి. టాప్–10లో స్థానమే లక్ష్యం..చదువుల్లో నాణ్యత, ఉద్యోగవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల్లో జెండా పాతేందుకు దేశీయ వర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఆసక్తి, అభిరుచి, డిమాండ్, ఫ్లెక్సిబిలిటీ, ఆర్థిక స్థోమత మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఆ దేశ విద్యార్థులకు అవసరమయ్యే కోర్సుల్ని ప్రవేశపెడుతూ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా.. విదేశాల్లోనూ పాగా వేస్తూ.. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్–10లో భారతీయ విశ్వవిద్యాలయాలే ఉండే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -
తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపర్చినట్లు కమిషన్ పేర్కొంది.8,180 పోస్ట్‌లకు డిసెంబర్ 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9 లక్షల 51 వేల 321 మంది దరఖాస్తు చేసుకోగా జూలై 1, 2023న జరిగిన నియామక పరీక్ష నిర్వహించారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన తర్వాత పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. -
గ్రూప్–2 మెయిన్స్ వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్లో చూడాలని పేర్కొంది. అక్షరాస్యత కమిటీ ఏర్పాటుసాక్షి, అమరావతి: వయోజన విద్యకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర అక్షరాస్యత కేంద్రానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్‌గాను, ఏపీ లిటరసీ మిషన్ అథారిటీ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. మెడికల్ అండ్ ఫ్యామిలీ సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, స్కిల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ ఐటీ కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, ఐటీ సెల్ డైరెక్టర్‌తో పాటు ఇండియన్ పోస్టల్ సర్వీస్ రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉంటారు.ట్రిపుల్ ఐటీలో 14న జాతీయ సదస్సునూజివీడు: జాతీయ మెటలర్జీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 14న ఏలూరు జిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మంగళవారం తెలిపారు. జాతీయ సదస్సు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. లోహ పదార్థాలు, వాటి ప్రాసెసింగ్‌లపై పరిశోధన చేసి, దేశానికి వెన్నుదన్నుగా నిలిచే శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ మెటలర్జీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సగం సీట్లు ‘ఇతరులకే’..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ మెడికల్ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా 50 శాతం సీట్లను నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజీ మెడికల్ సీట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. ఎంబీబీఎస్‌లో నేషన ల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో ఏకంగా సగం కేటాయిస్తున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ విద్యార్థులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మనోళ్ల అనాసక్తి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి దాదాపు 2,800 పీజీ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 1,200 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వాటిల్లో 600 వరకు (50 శాతం) జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర కౌన్సెలింగ్‌లో నింపుతారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విధానం మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్న రాష్ట్రాల విద్యార్థులకు మేలు చేస్తుండగా, తెలంగాణలాంటి రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం నష్టం కలిగిస్తున్నదని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాదికి చెందిన చాలామంది విద్యార్థులు మన రాష్ట్రంలోని సీట్లపై ఆసక్తి చూపుతారు. కానీ మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో జాతీయ కోటాలో నింపే మన రాష్ట్ర 600 సీట్లలో దాదాపు 300 మంది ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో మన రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని చెబుతున్నారు. -
నేడు స్ట్రే వేకెన్సీ ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: యాజమాన్య కోటా ఎంబీబీఎస్ స్ట్రే వేకెన్సీ సీట్లను ఆరోగ్య విశ్వ విద్యాలయం శనివారం కేటాయించనుంది. స్ట్రే వేకెన్సీ ప్రవేశాల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. రాత్రి 9 గంటలకు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సీట్లు పొందిన వారు నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా, స్ట్రే వేకెన్సీ రౌండ్ 1కు 18 సీ కేటగిరి సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. -
విదేశాల్లో మారిన పరిస్థితులు.. మనోళ్ల ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల విదేశీ విద్య ఆశలు ఆవిరైపోతున్నాయి. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ లాంటి దేశాలకు ఎమ్మెస్‌కు వెళ్లాలనుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఆర్థిక సంక్షోభంతో అమెరికా తదితర దేశాల్లో ఐటీ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన వారు కూడా పునరాలోచనలో పడుతున్నారు. కొన్నాళ్లు వేచి చూడటమే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. కొందరు ఆయా దేశాల్లో ఉన్న తమతోటి మిత్రులతో అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించిన వివరాలు కనుక్కుంటున్నారు. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆయా దేశాల్లో ఉన్నవిద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజులు పోయాయ్! విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎమ్మెస్ చదువు చాలామంది విద్యార్థులకు ఓ కల. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేయగానే ఏదో ఒక వర్సిటీలో చదువుకోసం ప్రయతి్నంచేవారు. వీలైనంత త్వరగా ఎమ్మెస్ పూర్తి చేస్తే, ఫుల్‌టైమ్ జాబ్‌తో త్వరగా సెటిల్ అవడానికి వీలవుతుందని భావించేవారు. అప్పు చేసి మరీ విమానం ఎక్కేసేవారు. ఎమ్మెస్ చేస్తూనే ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్‌తో ఎంతోకొంత సంపాదించుకోవడానికి ఆసక్తి చూపేవారు.కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పరిస్థితి అంత సాను కూలంగా లేదని కన్సల్టెన్సీలు, ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు చెబుతున్నారు. 2021లో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య 6.84 లక్షలుగా ఉంది. 2023లో కూడా పెరుగుదల నమోదైనా 2024కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితిని, విద్యార్థుల నుంచి వస్తున్న ఎంక్వైరీలను బట్టి చూస్తే 2025లో ఈ సంఖ్య మరింత తగ్గే వీలుందని కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. వెళ్లినవారికి ఉపాధి కష్టాలు ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో విదేశాల్లో స్కిల్డ్ ఉద్యోగం దొరకడం గగనంగా మారుతోందని, అన్ స్కిల్డ్ ఉద్యోగాలకు కూడా విపరీతమైన పోటీ ఉందని అంటున్నారు. ఆర్థిక సంక్షోభంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉద్యోగాలు తీసివేసే పరిస్థితి నెలకొనడం, మరోవైపు భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య ఇప్పటికే గణనీయంగా పెరిగిపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా, ప్రయత్నాలు కొనసాగిస్తున్నా.. ఉద్యోగం రాకపోవడం మాట అలా ఉంచితే కనీసం ఇంటర్వ్యూకు పిలిచే పరిస్థితి కూడా ఉండటం లేదని తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఫీజులు ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకు అవసరం. కాగా ఈ మేరకు అప్పు చేసి వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఖర్చులకు సరిపడా సంపాదించుకోవడంతో పాటు రుణం తీర్చగలమనే ధీమా గతంలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి అమెరికాలో కొనసాగుతోంది. తాజాగా నాస్కామ్ జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు అమెరికాలో 20 వేల మంది ఉన్నట్టు తేలింది. అస్ట్రేలియాలో ఇచ్చిన ఆఫర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పు తీర్చలేక, ఇండియా రాలేక, అమెరికాలో ఉద్యోగం లేకుండా ఉండలేక విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు. దేశంలో ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఇండియా ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం చూపించింది. పలు కంపెనీలు వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. నైపుణ్యం సమస్య! దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే అవసరమైన నైపుణ్యం ఉంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లే బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొంటున్నాయి. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు చిన్నాచితకా ఉద్యోగంతో సరిపెట్టుకుంటుండగా, ఎక్కువమంది అన్‌స్కిల్డ్ ఉద్యోగులుగా లేదా నిరుద్యోగులుగా కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా అమెరికాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మరింత దిగజార్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లినవారి సంఖ్య 2024లో గణనీయంగా తగ్గిందని అంటున్నారు. మంచి ఉద్యోగం మానుకుని అమెరికా వచ్చా బీటెక్ అవ్వగానే ఓ ఎంఎన్సీలో మంచి ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళల్లో ప్రమోషన్లు కూడా వచ్చాయి. కానీ అమెరికా వెళ్ళాలనే కోరికతో అప్పు చేసి ఇక్కడికి వచ్చా. ప్రస్తుతం ఎంఎస్ పూర్తి కావొచ్చింది. కానీ జాబ్ దొరికే అవకాశం కని్పంచడం లేదు. ఇప్పటికీ డబ్బుల కోసం ఇంటి వైపే చూడాల్సి వస్తోంది. – మైలవరపు శశాంక్ (అమెరికా వెళ్ళిన ఖమ్మం విద్యారి్థ) రెండేళ్ళ క్రితం వరకూ అమెరికాలో ఎంఎస్ గురించి రోజుకు సగటున 50 మంది వాకబు చేసేవారు. ఇప్పుడు కనీసం పది మంది కూడా ఉండటం లేదు. కెనడాలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండటం, అమెరికాలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం సన్నగిల్లడమే ఈ పరిస్థితికి కారణం. – జాన్సన్, యూఎస్ కన్సల్టింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు అమెరికాలో ఐటీ రంగం పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. కొందరు ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారతీయ విద్యార్థులు నూటికి కనీసం ఆరుగురు కూడా కొత్తగా స్కిల్డ్ ఉద్యోగాలు పొందడం లేదు. – అమెరికాలోని భారతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎన్వీఎన్అప్పుచేసి అమెరికా వచ్చా. పార్ట్ టైం జాబ్ కూడా ఒక వారం ఉంటే ఇంకో వారం ఉండటం లేదు. కన్సల్టెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. మరోవైపు ఎంఎస్ పూర్తి చేసిన నా స్నేహితులకు స్కిల్డ్ ఉద్యోగాలు దొరకడం లేదు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా ఉంటోంది. – సామా నీలేష్ (అమెరికా వెళ్ళిన హైదరాబాద్ విద్యార్థి) -
పైథాగరస్ వర పుత్రికలు!
మేథ్స్ సబ్జెక్ట్ కష్టం. అందులోని ట్రిగొనమెట్రీ మరింత కష్టం. ట్రిగొనమెట్రీ లోని పైథాగరస్ సిద్ధాంతం ఇంకాస్త కష్టం. ప్లస్ లు, మైనస్ లను ఎలాగో లాగించేయొచ్చు. త్రిభుజాలు, త్రికోణాల ట్రిగొనమెట్రీ (త్రికోణమితి) ని, పైథాగరస్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోటానికి, ఆ లెక్కల్ని పరిష్కరించటానికి ఒక గణిత శాస్త్రవేత్తకు ఉండేంత ఐ.క్యూ.లో పిసరంతైనా లేకుంటే బుర్ర తిరిగి పోతుంది. అలాంటిది ఈ అమ్మాయిలను చూడండి, త్రికోణమితిని ఉపయోగించి పైథాగరస్ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఐదు కొత్త సూత్రాలను కనుక్కున్నారు! లూసియానా లోని న్యూ ఆర్లీన్స్ కాలేజ్ విద్యార్థినులు... కాల్సియా జాన్సన్, నేకియా జాక్సన్ వీళ్లు. మొదటిసారి 2022లో ఈ అమ్మాయిలు పైథాగరస్ సిద్ధాంతాన్ని రుజువు చేసే కొన్ని సూత్రాలను ఆవిష్కరించారు. ఆ హద్దులను కూడా దాటి ఇప్పుడు ఐదు అదనపు రుజువులకు దారి తీసే ఐదు ప్రత్యక్ష రుజువులు కనిపెట్టారు. వీటివల్ల ట్రిగ్నామెట్రీని అర్థం చేసుకోవటం మరింత తేలిక అవుతుంది.వీరు సాధించిన ఈ ఘనతను ప్రఖ్యాత ‘అమెరికన్ మేథమేటికల్ మంత్లీ‘ తన తాజా సంచికలో గొప్పగా ప్రచురించింది. అబ్బాయిలూ... మీరింకా ఫుట్ బాల్ గ్రౌండ్ లోనే ఉన్నారా.. మేథ్స్ పరిశోధనలో అమ్మాయిలు ఇంత పెద్ద గోల్ కొట్టారని తెలిసినా కూడా!! -
ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చదివిస్తా.. పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి అండ
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుల తల్లి సుమలతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఫీజు చెల్లించి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీల కూతురు కాట్రోత్ సుమలతకు ఎంబీబీఎస్ సీటు వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులతో కూలి పనులకు వెళ్తోందని బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలీ పనులకు’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సుమలత, ఆమె తండ్రి శివరాంను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. సుమలత చదువుకు ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్య కళాశాలకు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఇతర ఖర్చులకు రూ.50 వేలు అందజేశారు. సుమలత ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాగా చదివి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రికి సుమలత తండ్రి శివరాం కృతజ్ఞతలు తెలిపారు. సాయం చేస్తే డాక్టర్ అవుతా..బీహెచ్ఎంఎస్ సీటు సాధించిన పేద విద్యార్థి సంతోష్‌కుమార్ ఫీజు కట్టలేని స్థితిలో దాతల చేయూత కోసం ఎదురుచూపు అనంతగిరి: డాక్టర్ కావాలనుకుంటున్న ఆ విద్యార్థి కలకు పేదరికం అడ్డుపడుతోంది. మనసున్న దాతలు ఎవరైనా ఆర్థికంగా చేయూతనందిస్తే.. భవిష్యత్‌లో సమాజ సేవకు పాటుపడతానని చెబుతున్నాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద చెల్మెడ గ్రామానికి చెందిన సంతోష్.. వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివి, 959 మార్కులు సాధించాడు. నీట్‌లోనూ ఉత్తమ ర్యాంకు రావడంతో హైదరాబాద్‌లోని రామంతాపూర్ జేఎస్పీఎస్ హోమియో మెడికల్ కాలేజీలో బీహెచ్ఎంఎస్ (బ్యాచ్‌లర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసన్ అండ్ సర్జరీ) సీటు వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఫీజు, వసతి కోసం నవంబర్ 2న లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. అనారోగ్యం బారిన పడిన తండ్రి అశోక్ 11 నెలల క్రితం మృతిచెందగా.. తల్లి పుష్పమ్మ కూలి పనులు చేస్తోంది. తండ్రి మరణంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఫీజు కట్టే స్తోమత లేదని సంతోష్ వాపోతున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు సెల్ నంబర్ 9963870085లో సంప్రదించాలని కోరాడు.చదవండి: ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడుగోండు కళాకారుడికి అవార్డు జైనూర్ (ఆసిఫాబాద్): ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను తెలిపేలా దండారీ ఉత్సవాల చిత్రాన్ని గీసిన ఆదివాసీ కళాకారుడు మడావి ఆనంద్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా బుధవారం అవార్డు అందుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన మడావి ఆనంద్‌రావు చిత్రకళలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో 13 రోజులుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సంప్రదాయ చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ఆనంద్‌రావు గుస్సాడీ నృత్యాలకు సంబంధించిన చిత్రం గీసి అవార్డు అందుకున్నారు. -
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)మెయిన్స్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) సోమవారం విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్)లో జేఈఈ మెయిన్స్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి నవంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది.వచ్చే నెల 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా పేర్కొంది. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటించనుంది. పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ తెలిపింది. జనవరి 22 నుంచి 31వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షిఫ్టుల్లో కంప్యూటర్‌పై పరీక్షను నిర్వహించనున్నట్టు వివరించింది. ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడించనుంది. జేఈఈ మెయిన్స్‌ను 13 ప్రాంతీయ భాషల్లో చేపట్టనుంది. -
28 నుంచి పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. 2024–25లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28 నుంచి వచ్చేనెల 11 వరకు ఫీజు చెల్లించాలని ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ నామినల్ రోల్స్‌ను సైతం ఈ తేదీల్లోనే సమర్పించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 18 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.500 లేట్ ఫీజుతో నవంబర్ 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు. ఫీజును bse.ap.gov.inలో స్కూల్ లాగిన్‌లో చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.శిక్షణ, ఉపాధిపై వర్క్షాప్సాక్షి, అమరావతి: యువతకు శిక్షణ ఇచ్చి, మెరుగైన ఉపాధి అందించేలా ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడాప్) కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. ఎనిమిది సెక్టార్ల వారితో సీడాప్ కార్యాలయంలో శుక్రవారం యువతకు శిక్షణ, ఉపాధిపై వర్క్‌షాప్ జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించే వారికి స్కిల్డ్ యువతను అందిస్తామని ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి తెలిపారు. -
లాంగ్వేజ్ ఫర్ ఎర్న్.. విదేశీ భాష.. విజయాలు లెస్స
కొత్త భాషలు నేర్చుకోవడం కొన్నేళ్ల క్రితం వరకూ కేవలం హాబీగా భావించేవారు. అయితే, ప్రపంచీకరణతో విదేశీ భాషా నైపుణ్యం ఆదాయమార్గంగా కూడా అవతరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లోనూ విదేశీ భాషలపై ఆసక్తి పెరుగుతోంది. సంపాదన కోసమో, మరేదైనా లక్ష్యాలతోనో సీరియస్‌గా ఫారిన్ లాంగ్వేజెస్‌కు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ చైనీస్ అరబిక్ వంటి అనేక విదేశీ భాషలు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. ఇటీవలే కొరియన్ వెబ్‌సిరీస్, మ్యూజిక్కూ పెరిగిన ఆదరణ కొరియన్ భాషా పరిజ్ఞానంపై యువత ఆసక్తిని పెంచింది. విదేశీ భాషని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన రెస్యూమ్‌ను బలోపేతం చేయడంతో పాటు పర్యాటక రంగంలో, గైడ్స్‌గా ఇతరత్రా రంగాల్లో రాణించడానికి, ట్రావెల్, బ్లాగులను తయారు చేయడం తదితర ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలకూ కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయలో ప్రవేశాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం వర్క్ కల్చర్, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో విదేశీ భాషా నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్‌గా అవకాశాలు పెరిగాయి. ఓటీటీ తదితర వేదికల విజృంభణతో అనువాదకులకు భారీగా డిమాండ్ పెరగడం కూడా విదేశీ భాషలను క్రేజీగా మార్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు దేశ విదేశాలలో రాయబార కార్యాలయాలు, హై–కమిషన్లలో విదేశీ భాషా ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలైన కోర్సులకు డిమాండ్ సంతరించుకుంటున్నాయి. ఫ్రెంచ్ పట్ల ఆసక్తి.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా మాట్లాడే ఫ్రెంచ్ అత్యధికంగా మాట్లాడే భాషగా ఆరో స్థానంలో ఉంది. ఇది ఫ్రాన్స్, కెనడాతో సహా 29 దేశాల్లో అధికారిక భాష. ఫ్యాషన్, హాస్పిటాలిటీ, టూరిజంలో కెరీర్‌కు ఉపకరించే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విశ్వవ్యాప్తంగా విలువైన భాష. శిక్షణా తరగతులు..ఈ నేపథ్యంలో విదేశీ భాష నేర్చుకోవడంలో సహాయపడే అనేక అకాడమీలు, సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. ఆయా భాషల కోర్సు వ్యవధి సాధారణంగా ఆరు నుంచి 12 నెలల్లో పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీని అందుకుంటారు. అయితే అనర్గళంగా మాట్లాడడం, చదవడం, రాయడం అర్థం చేసుకోవడంపై పూర్తి పట్టు సాధించేందుకు మరింత వ్య«వధి అవసరం అవుతుందని శిక్షకులు అంటున్నారు. ఇవి కాకుండా ఒక విద్యార్థి ఆ భాష చరిత్ర, భాష సంస్కృతి సంబంధిత దేశాల ప్రజలు, అర్థం చేసుకునే పద్దతి, ఆ భాష యాస, డిక్షన్ గురించి కూడా నేర్చుకుంటేనే పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత సరి్టఫికెట్ డిప్లొమా స్థాయి కోర్సు లేదా పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత విదేశీ భాషలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించవచ్చు. నగరంలో ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు వంటివి విదేశీ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే పలు ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విదేశీ భాషా కోర్సులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్పాని‹Ù.. జోష్.. దాదాపు 50 కోట్ల మందికి పైగా మాట్లాడే వారితో స్పానిష్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండో స్థానంలో ఉంది. స్పానిష్ మాట్లాడే దేశాలతో మన దేశానికి ఇటీవల పెరుగుతున్న వాణిజ్యం దృష్ట్యా నేర్చుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యాపారం, ఆతిథ్యం పర్యాటక రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్. విన్.. జపాన్.. సాంకేతిక హబ్ హోదా, భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన జపాన్ జపనీస్ అత్యధికులు కోరుకునే భాషగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా మాట్లాడే ఈ భాష సాంకేతికత, యానిమేషన్, గేమింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న సిటీ యూత్ ఎంపికగా మారింది.జర్మన్‌కు జై.. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా, యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే భాష జర్మన్. జర్మన్ నేర్చుకోవడం ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విభిన్న అవకాశాలకు తలుపులు తెరుస్తోంది.ఇదీ..ఇటాలియన్.. యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే నాల్గో భాష ఇది. పర్యాటక కేంద్రంగా మరియు ఫ్యాషన్ మరియు డిజైన్‌కు కేంద్రంగా ఇటలీకి ఉన్న ప్రాచుర్యంతో ఫ్యాషన్, డిజైన్, హాస్పిటాలిటీలో కెరీర్‌ను లక్ష్యంగా చేసుకున్న సిటీ విద్యార్థులకు రైట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. మాండరిన్.. మంచిదే.. మనదేశపు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనాను దృష్టిలో ఉంచుకుంటే.. అంతర్జాతీయ వ్యాపారం, దౌత్యం పర్యాటక రంగం కోసం మాండరిన్ నేర్చుకోవడం అవసరంగా మారింది. కో అంటే కొరియన్.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా మాట్లాడే కొరియన్‌కు నగరంలో బాగా డిమాండ్ ఉంది. ఆసియాలో మనదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కొరియా కావడం సాంకేతిక, వినోద పర్యాటక రంగాల్లో ఈ భాషా నైపుణ్యానికి డిమాండ్ పెంచుతోంది.గ్రేస్.. పోర్చుగీస్.. బ్రెజిల్ పోర్చుగల్‌తో సహా ఎనిమిది దేశాల్లో మాట్లాడేది పోర్చుగీస్. ఈ దేశాలతో మనకు విస్తరిస్తున్న సంబంధాల కారణంగా పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం అనేది భవిష్యత్తు విజయాలకు బాట వేస్తుంది.పలు భాషల్లో ప్రావీణ్యం కోసం.. విదేశీ భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో ప్రయోజనాలను యువత ఆశిస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు చేరింది. కెనడాలో ఉండే భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా మాకు స్టూడెంట్స్‌గా ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఇలా సులభంగా మారడం కూడా విదేశీ భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది. – ఎం.వినయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్రెంచ్ భాషా విభాగం, ఉస్మానియా వర్సిటీ -
నెలాఖరుకు జేఈఈ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ–2025 నోటిఫికేషన్ ఈ నెలాఖరులో వెలువడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నవంబర్ మొదటి వారంలో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. జనవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో రెండో విడత మెయిన్స్‌ను ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశానికి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)ను నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు పంపుతారు. అడ్వాన్స్‌డ్‌లో పొందిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందే వీలుంది. ఈ పరీక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలపై దృష్టి పెట్టారు. ఏయే కేంద్రాలను ఎంపిక చేయాలనే సమాచారాన్ని ఎన్టీఏ సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదటినుంచీ తెలంగాణ వ్యాప్తంగా 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి పరీక్ష కేంద్రాలను కుదించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పరీక్ష కేంద్రాలను 17 పట్టణాలకే పరిమితం చేశారు. కాగా, గత ఏడాది జేఈఈ రాసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా ఈ సంవత్సరం పరీక్ష కేంద్రాలను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారు.సిలబస్‌పై కసరత్తు.. గత సంవత్సరం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌కు కూడా పరీక్ష సిలబస్‌ను తగ్గించారు. 2020లో కరోనా కారణంగా 8 నుంచి 12వ తరగతి వరకూ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్లను తీసివేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈతో పాటు ఇతర జాతీయ సిలబస్ ఉండే విద్యార్థులకు జేఈఈలో ఆయా చాప్టర్లను తొలగించాలనే డిమాండ్ వచ్చింది. ఈ కారణంగా గత సంవత్సరం కొన్ని చాప్టర్లను ఇవ్వలేదు. అయితే, ఈ ఏడాది ఆ సమస్య లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాత సిలబస్‌ను మళ్లీ కలపడమా? లేదా ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిర్వహించడమా? అనే దానిపై ఎన్టీఏ, ఇతర కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
TG: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌కి, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు.ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేయడంతో గ్రూప్-1 పరీక్షకు అడ్డంకి తొలిగింది. మరో ఆరు రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుండి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు.ఇదీ చదవండి: TG: డీఎస్సీ టీచర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదాహైకోర్టు తీర్పు నిరాశ కలిగిందని గ్రూప్-1 అభ్యర్థులు అంటున్నారు. కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయాం. మెయిన్స్‌లో ప్రిపరేషన్‌కు కొంత సమయం ఇవ్వాలి. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
తెలంగాణ: గ్రూప్-1పై రేపు హైకోర్టు తీర్పు
హైదరాబాద్: గ్రూప్-1పై రేపు (మంగళవారం) హైకోర్టు రిజర్వు చేసిన తీర్పును వెల్లడించనుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో 10కి పైగా పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్- 1పై హైకోర్టులో తీర్పు వెల్లడిపైసస్పెన్స్ వీడనుంది. పలు పిటీషన్లపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పుని రిజర్వ్ చేసింది. గత విచారణలో నేడు తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు చెప్పంది. అయితే సోమవారం విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కోర్టు తీర్పుపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
దేశంలో ‘ఐఐఎస్సీ’ టాప్
సాక్షి, అమరావతి : దేశంలో అగ్రశ్రేణి వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ తాజా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల ఓవరాలవిభాగంలో 251–300 మధ్య కొనసాగుతోంది. అయితే, గతేడాదితో 201–250 బాండ్ నుంచి స్వల్పంగా పడిపోయింది. ఫలితంగా వరల్డ్ టాప్–250లోకి ప్రవేశించలేకపోయింది. ఈ క్రమంలో 53.7–55.7 స్కోరు సాధించింది. పరిశోధన, ఇంటెన్సివ్ వర్సిటీలను ఐదు ప్రధాన అంశాల ఆధారంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ ర్యాంకులు కేటాయిస్తోంది. వీటిల్లో బోధన, పరిశోధన వాతావరణం, పరిశోధన నాణ్యత, అంతర్జాతీయ అవుట్‌లుక్, ఇండస్ట్రీ ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఈ ఏడాది 115 దేశాలకు చెందిన 2,092 ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే 185 కొత్త ఎంట్రీలు వచి్చనట్లు పేర్కొంది. ఈ ఏడాది ర్యాంకుల్లో భారతీయ వర్సిటీలు కేవలం మిశ్రమ ఫలితాలు మాత్రమే చూశాయి. బెనారస్ హిందూ వర్సిటీ, భారతియార్ వర్సిటీ, ఐఐటీ గౌహతి వంటివి 2025లో భారతీయ టాప్–10 జాబితా నుంచి చోటుకోల్పోయాయి. ప్రపంచ వేదికపై బలమైన పోటీదారులు ఉండటంతోనే భారతీయ వర్సిటీలు కొంత వెనుకబడినట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీల్లో కేవలం ఇండోర్ ఐఐటీ మాత్రమే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. భారతీయ వర్సిటీల పురోగతి.. అన్నా వర్సిటీ, మహాత్మా గాంధీ వర్సిటీ, సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, శూలినీ వర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ర్యాంకులను మెరుగుపర్చుకుని 401–500 బాండ్లోకి చేరుకున్నాయి. ఈ సంస్థల్లో ప్రతి ఒక్కటి 46–49.2 మధ్య స్కోర్‌ను సాధించాయి. అయినప్పటికీ కొన్ని వర్సిటీలు వెనుకబడ్డాయి. ఇక్కడ జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ర్యాంకు గతేడాదితో పోలిస్తే తగ్గింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఇండోర్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)తో కలిసి 501–600 ర్యాంకును పంచుకుంది. ఈ రెండు సంస్థలు గణనీయమైన పురోగతి ప్రదర్శించడం విశేషం. 601–800 బెల్ట్‌లో 14 భారతీయ విద్యా సంస్థలు నిలిచాయి. వీటిల్లో అలీఘర్ ముస్లిం వర్సిటీ, అమిటీ వర్సిటీ, బెనారస్ హిందూ వర్సిటీ, బిట్స్ పిలానీ, చిత్కారా వర్సిటీ, ఐఐటీ పాటా్న, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ (కేఐఐటీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ, సింబయాసిస్ ఇంటర్నేషనల్ వర్సిటీ, థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, విట్ వర్సిటీ (తమిళనాడు) స్థానం దక్కించుకున్నాయి.జేఎన్టీయూ అనంతపురం.. ఎస్వీయూలకు చోటు.. ఇక 801–1000 మధ్య 22 భారతీయ విద్యా సంస్థలు ఉండగా.. మన రాష్ట్రం నుంచి జేఎన్టీయూ అనంతపురం, కేఎల్‌యూ (34.5–38.1)లకు మాత్రమే చోటుదక్కింది. అలాగే, 1,201–1,500 మధ్య 23 సంస్థలు ఉండగా.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీ–ఎస్వీయూ (25.2–30.6)తో పాటు తెలంగాణకు చెందిన ఉస్మానియా, ఎన్ఐటీ–నిట్ (25.2–30.6) ఉంది. 1,501 ప్లస్ విభాగంలో.. ఆచార్య నాగార్జున వర్సిటీ, గీతం, జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజ్ఞాన్ (10.5–25.1) నిలిచాయి. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో సంచలనం సృష్టించిన ఐఐటీ గౌహతి 801–1000 బెల్డ్కు దిగజారింది.అగ్రస్థానంలో ఆక్స్ఫర్డ్.. మరోవైపు.. ప్రపంచ అత్యుత్తమ వర్సిటీగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)ని ఆరో స్థానానికి నెడుతూ స్టాన్ఫోర్డ్ వర్సిటీ రెండో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది బ్రెజిల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విద్యా సంస్థలు టాప్–200లో చోటు దక్కించుకోవడం విశేషం. కానీ, ఆ్రస్టేలియాలోని టాప్–5 విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్‌లో పడిపోయాయి. చైనా విశ్వవిద్యాలయాలు అద్భుత ప్రదర్శనతో టాప్–10కి చేరువలోకి రావడం విశేషం. యూఎస్, యూకే ఉన్నత విద్యా రంగాల ప్రతిష్ట క్షీణిస్తున్నట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. -
TG: ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈనెల 21 నుంచి 27వరకు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహించనుంది.మధ్యాహ్నం 12:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఒకటిన్నర తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులకు అనుమతించరు. ఇక ఈ నెల 14 నుంచి వెబ్ సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. అదే విధంగా పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు.ఇక గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి. -
యువత కోసం కొత్తగా ఇంటర్న్‌షిప్ పథకం
న్యూఢిల్లీ: యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటర్న్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చి0ది. ఏటా రూ.66,000 మేర ఆర్థికసాయం అందించనుంది. ఐదేళ్లకాలంలో మొత్తంగా కోటి మంది 21–24 ఏళ్ల యువత ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారని కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.800 కోట్లు ఖర్చుచేయనుంది. ఈ ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ రెండో తేదీన ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా 1,25,000 మంది లబి్ధపొందే వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే యువతకు బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే pminternship.mca.gov.inలో యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.6,000 అదనం నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000 ఆర్థికసాయం అందనుంది. దీనికి అదనంగా ఏడాదిలో ఒకసారి రూ.6,000 గ్రాంట్ ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి ప్రతి లబ్ధి దారుడు రూ. 66,000 లబ్ధి పొందనున్నారు. ఈ వెబ్‌పోర్టల్‌లో అక్టోబర్ 12వ తేదీ నుంచి 25వ తేదీలోపు అందుబాటులో ఉన్న సమాచారంతో దరఖాస్తులను నింపొచ్చు. వీటిని అక్టోబర్ 26వ తేదీన షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత అభ్యర్థులను అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీలోపు కంపెనీలు ఎంపిక చేస్తాయి. ఎంపికైన అభ్యర్థు లు తమ నిర్ణయాన్ని నవంబర్ 8–15ల మధ్య తెలపాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా మూడు ఆఫర్స్ ఇస్తారు. టాప్ 500 కంపెనీల ఎంపిక గత మూడేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధి పథకంలో భాగంగా తమ నికరలాభాల్లో కొంతమేర సమాజసేవ కోసం సవ్యంగా ఖర్చుచేసిన టాప్ 500 కంపెనీలను ఈ పథకం కోసం కేంద్రం ఎంపికచేస్తుంది. రిజర్వేషన్లూ వర్తిస్తాయి! అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లనూ వర్తింపజేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అలెంబిక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లు 1,077 ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గుడ్‌న్యూస్.. వరద బాధితులకు ఉచితంగా ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, సెప్టెంబర్‌లో సంభవించిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోయారు. ఇలాంటి వారికి ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు/ డూప్లికేట్ సర్టిఫికెట్లు అందించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించినట్లు ఇంటర్ విద్య కార్యదర్శి కృతికా శుక్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఐవోలు, డీఐఈవోలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, లేదా నేరుగా బోర్డు అధికారులను గాని సంప్రదించాలని సూచించారు.పదో తరగతి హిందీ సిలబస్ కుదింపుసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లను ప్రభుత్వం స్టేట్ సిలబస్‌లోకి మార్చిన నేపథ్యంలో ఆయా స్కూళల్లో సిలబస్‌ను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హిందీ సిలబస్ అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని చాప్టర్లను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్కూళ్ల విద్యార్థులకు జూన్– జూలై సిలబస్‌తో ఎఫ్ఏ–1 హిందీ నమూనా పరీక్షను మంగళవారం పూర్తి చేశామని తెలిపారు. అలాగే, కొత్త విధివిధానాల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు హిందీ సిలబస్ అధికంగా ఉన్నందున పద్యభాగ్–7 (ఆత్మత్రాణ్), గద్యభాగ్–11 (తీసరీ కసమ్ కే వశల్ పకార్ శేలేంద్ర), గద్యభాగ్–12 (అబ్ కహా దూస్రోంకే దుఖ్ సే దుఖీ హోనీవాలీ), ఉపవాచక్–3 (టోపీ శుక్లా) పాఠాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. కేఎల్‌యూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదలతాడేపల్లిరూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష 2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యావిధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజినీరింగ్ కోర్సులకు మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
3 నుంచి ‘టెట్’.. 21 వరకు రెండు సెషన్లలో నిర్వహణ
సాక్షి, అమరావతి: ఈ నెల 3 (గురువారం) నుంచి జరిగే టెట్–2024 (జూలై) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 వరకు ఎంపిక చేసిన సెంటర్లలో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. అన్ని జిల్లాల డీఈవో కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా వీటిని సంప్రదించాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం స్క్రైబ్‌ను ఏర్పాటు చేశామని, వారికి అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించినట్టు తెలిపారు. ఎవరికైనా రెండు హాల్ టికెట్లు వచ్చి ఉంటే వారు ఏదో ఒక సెంటర్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి సెల్‌ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమన్నారు. హాల్టికెట్లలో తప్పులుంటే సరైన ఆధారాలు చూపి పరీక్ష కేంద్రంలోని అధికారి వద్దనున్న నామినల్ రోల్స్‌లో సరిచేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు హాల్ టికెట్లు తీసుకోని అభ్యర్థులు cse.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
3.16 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నీట్లో ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీటు లభించింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మొదటి విడత జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న కన్వీనర్ సీట్లలో దాదాపు 4,760 సీట్లను విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఎవరికి సీట్లు వచ్చాయో విద్యార్థులకు సమాచారం పంపించింది. గతేడాది అత్యధికంగా నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఒక ఎస్సీ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు లభించగా.. ఈసారి బీసీ ఏ కేటగిరీలోనే 3,16,657 ర్యాంకర్‌కు సీటు లభించడం విశేషం. గత ఏడాది మొదటి విడతలో 1.31 లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. ఈసారి మొదటి విడతలో 1.65 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. బీసీ బీ కేటగిరీలో గతేడాది మొదటి విడతలో 1.40 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.94 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. అలాగే గతేడాది బీసీ డీ కేటగిరీలో 1.35 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.80 లక్షల ర్యాంకర్‌కు వచ్చింది. కన్వీనర్ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్ జరగనుంది. బీసీ ఈ కేటగిరీలో ప్రస్తుతం 2.03 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కేటగిరీలో 2.90 లక్షల ర్యాంకుకు, ఎస్సీ కేటగిరీలో 2.87 లక్షల ర్యాంకుకు సీటు లభించడం గమనార్హం. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో దివ్యాంగ రిజర్వేషన్ కింద 13.41 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఇలావుండగా జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి కూడా మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు.పెరిగిన సీట్లతో విస్త్రృత అవకాశాలురాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలు పెరిగాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకర్లకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు లభిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 64 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మల్లారెడ్డికి చెందిన రెండు, నీలిమ మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలయ్యాయి. వీటితో పాటు ఎయిమ్స్ మెడికల్ కాలేజీని మినహాయించి 60 మెడికల్ కాలేజీల్లోని సీట్లకు ఇప్పుడు కన్వీనర్ కోటా కింద సీట్ల కేటాయింపు జరిపారు. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
బీడీఎస్ కన్వినర్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ వైద్య కళాశాలల్లో యూజీ డెంటల్ కోర్సుల్లో (బీడీఎస్) మొదటి ఏడాది ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) శనివారం విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వర్సిటీ వెల్లడించింది. tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు వర్సిటీ ఫీజు రూ.12 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీకి ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.10 వేలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.45 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 డెంటల్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. -
ఏపీ నిట్‌లో 125 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఉద్యోగాల జాతర త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. అర్హులైనవారు అక్టోబరు 10లోపు దరఖాస్తులు సమర్పించాలి. కేంద్ర ఉన్నత విద్యా శాఖ విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన ఆమోదాలు, పరిపాలనా పరమైన ఆమోదాలు దాటి ఫ్యాకల్టీల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–10కు సంబంధించి 48 పోస్టులను భర్తీ కానున్నాయి. వీటిలో అన్ రిజర్వ్డ్ కోటాలో 20, ఓబీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, ఈడబ్ల్యూఎస్ కింద 5 కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–11కు సంబంధించి భర్తీ చేయనున్న 20 పోస్టుల్లో అన్ రిజర్వ్‌డ్‌కు 9, ఓబీసీకి 5, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒకటి, ఈడబ్ల్యూఎస్‌కు 2 పోస్టులు కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్–13 ఏ2 కేటగిరీకి సంబంధించి 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అన్ రిజర్వ్‌డ్‌కు 12, ఓబీసీకి 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్‌కు 3 పోస్టులను కేటాయించారు. ప్రొఫెసర్ 14ఏ గ్రేడ్‌కు సంబంధించి 7 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో అన్ రిజర్వుడ్‌కు 4, ఓబీసీకి ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి పోస్టులను రిజర్వు చేశారు. బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎంఎంఈ, స్కూల్ ఆఫ్ సైన్సెస్, ఫిజిక్స్, మ్యా«థ్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ విభాగాల్లో కొత్తగా తీసుకొనే ఫ్యాకల్టీలను నియమించనున్నారు. -
పీజీ వైద్యవిద్యలో క్లినికల్ కోర్సుల్లో రిజర్వేషన్ 15 నుంచి 20% పెంపు
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటాను క్లినికల్ కోర్సుల్లో 15 నుంచి 20 శాతానికి పెంచుతామని పీహెచ్సీ వైద్యులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. బుధవారం పీహెచ్ వైద్యుల సంఘం ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చర్చించారు. ఆ వివరాలను మంత్రి కార్యాలయం వెల్లడించింది. కోటాను 15 నుంచి 20 శాతానికి పెంచడంతోపాటు అన్ని కోర్సుల్లో ఇన్‌సర్వీస్ కోటా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొంది.భవిష్యత్‌లో కోటాలో మార్పులు చేయాల్సివస్తే ముందు వైద్యులతో చర్చిస్తామన్నట్టు తెలిపింది. సర్వీస్‌లోకి రాకముందు పీజీ చేసినవారికి రెండో పీజీ చేయడానికి ప్రభుత్వం మీద భారం లేకుండా అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఇవే చివరి చర్చలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగీకరించి వైద్యులు సమ్మెను విరమించాలని స్పష్టం చేసింది. అలా కాకుండా జీవో రద్దుచేయాలని మొండిపట్టుతో సమ్మె కొనసాగిస్తే జీవో 85లో ఎటువంటి సవరణలు లేకుండానే పీజీ ప్రవేశాలు చేపడతామని హెచ్చరించింది. ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం 14కు వాయిదా202425 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు వచ్చే నెల (అక్టోబర్) 14 నుంచి ప్రారంభమవుతాయని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రకటించారు. అయితే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) సవరించిన మార్గదర్శకాలను ఎన్ఎంసీ విడుదల చేసిందని, దాని ప్రకారం తరగతుల ప్రారంభం 14కు వాయిదా పడినట్టు వివరించారు.నర్సింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పెంపుబీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకూ పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నర్సింగ్ విద్యా సంస్థల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాధికారెడ్డి తెలిపారు. ఇకపై పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. -
ఆ ఊరి పేరు ఐఏఎస్ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!
ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్ మోడల్...ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని నయాబస్ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే గృహిణి.అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్ను ఇప్పుడు ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్లు కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్ సెంటర్ల వారు అంటించిన ఈ పోస్టర్లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్ ఉన్నాయి.చదువు వల్ల నయాబస్ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.ఆటల్లోనూ...ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు. -
దారి చూపే దివిటీలు
పిల్లల కంటే ముందే వారి కలలు తల్లిదండ్రులు కంటారు. ‘నేను సాధించగలను’ అని పిల్లలు అనుకోవడానికి ముందే ‘మా పిల్లలు సాధించగలరు’ అనే బలమైన నమ్మకం తల్లిదండ్రులకు కలుగుతుంది. తమ పిల్లలను పై స్థాయిలో చూడాలని కలలు కంటారు. కేవలం కలలకే పరిమితం కాకుండా ‘పిల్లల కోసమే మా జీవితం’ అన్నట్లుగా కష్టపడతారు. ఆ నిబద్ధతే ఎంతోమంది పిల్లలు విజేతలుగా నిలవడానికి కారణం అవుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దే శిల్పులు. వారి భవిష్యత్ చిత్రపటాన్ని అందంగా మలిచే చిత్రకారులు.తండా నుంచి ఐఐటీ దాకా...ఈ ఫొటో చూడండి...దారి కూడా సరిగ్గా లేని ఒక మారుమూల గిరిజన తండా. అబ్బాయిల సంగతి ఎలా ఉన్నా తండా దాటి పై చదువులకు వెళ్లడం అనేది అమ్మాయిలకు అంత సులువేమీ కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గోన్యానాయక్ తండాకు చెందిన బదావత్ రాములు, సరోజ దంపతులు ‘మా అమ్మాయి చదివింది’ చాలు అని ఎప్పుడూ రాజీ పడలేదు.‘నువ్వు ఎంత పెద్ద చదువు చదివితే మాకు అంత సంతోషం’ అనేవాళ్లు తమ కూతురు మధులతతో. ఈ మాటలు మధులతకు బలమైన టానిక్‌లా పనిచేశాయి. ‘ఏదో ఒకటి సాధించి తల్లిదండ్రుల కలను నిజం చేయాలి’ అని బలంగా అనుకునేలా చేశాయి. రాములు, సరోజ దంపతుల చిన్న కూతురు మధులత. పెద్ద కూతురు మంజుల, రెండో కూతురు మమతను డిగ్రీ వరకు చదివించారు. మూడో తరగతి వరకు వీర్నపల్లి సర్కారు బడిలో చదివిన మధులత నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరరకు సిరిసిల్ల సంక్షేమ హాస్టల్లో ఉంటూ గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంది. సారంపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకులంలో తొమ్మిది నుంచి పదవ తరగతి వరకు చదువుకుంది. ఇంటర్మీడియట్లో 939/1000 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావడంతో తన మీద తనకు నమ్మకం బలపడింది. ఆ నమ్మకం వృథా ΄ోలేదు. అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ (అడ్వాన్స్డ్)లో ఆల్ ఇండియా స్థాయిలో 824 ర్యాంకు సాధించింది. మధులతకు సంబంధించి ఇదొక అపురూప విజయం. ఎందుకంటే...ఆమె కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, పేదవాళ్లు.‘మా బిడ్డ గొప్ప చదువులు చదువుతుంది’ అనే నమ్మకం తప్ప వారి దగ్గర ఏమీ లేదు. అయితే తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం, తన మీద పెట్టుకున్న ఆశలు మధులతను ముందుకు నడిపించాయి. ‘నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు. ఉన్న దాని గురించి దృష్టి పెట్టు’ హైస్కూల్ రోజుల్లో తాను చదివిన మంచి మాట మధులతకు బాగా గుర్తుండి ΄ోయింది. పేదరికం తప్ప తన దగ్గర ధనం లేక΄ోవచ్చు, కాని విద్య రూపంలో విలువైన నిధి ఉంది. ఆ నిధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది మధులత. ఏదో సాధించాలనే తపనతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.ఖరీదైన కోచింగ్‌లు లేక΄ోయినా సొంతంగా ఆల్ ఇండియా స్థాయిలో ‘జేఈఈ’లో ర్యాంక్ తెచ్చుకునేలా చేసింది. పట్నా ఐఐటీలో సీటు సాధించిన మధులతకు ఉన్నత చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఇంటికే పరిమితం అయ్యేలా చేశాయి. ఇక ఏమీ చేయలేక, పై చదువులకు వెళ్లలేక తండాలో మేకలు కాయడం మొదలుపెట్టింది మధులత. మధులత దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఐఐటీకి వెళ్లలేక మేకల కాపరిగా’ కథనం చూసి స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి మధులత చదువుకు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తామని ప్రకటించారు. ఆరోజు ఎంత బాధ పడ్డానో!‘చదివించింది చాలు. ఎందుకంత కష్టపడతావు’ అనే వాళ్లు కొందరు. అయితే మధు మీద మాకు చాలా నమ్మకం, చదువు తనకు ్ర΄ాణం. పట్నంలో ఎప్పుడైనా పెద్ద ఆఫీసర్ అమ్మలను చూసినప్పుడు వారిలో నా బిడ్డే కనిపించేది. ఏదో ఒకరోజు నా బిడ్డను ఇలా గొప్పగా చూస్తాను అనుకునేవాడిని. డబ్బులు లేక, పై చదువుకు పట్నాకు వెళ్లలేక మధు ఇంట్లోనే ఉండి΄ోవాల్సి రావడం నాకు చాలా బాధగా ఉండేది. చదువు ఇచ్చిన దేవుడు దారి చూడడా! అనుకునే వాడిని. దేవుడు దయ తలిచాడు.– బదావత్ రాములు, మధులత తండ్రిచదువే లోకం...నా బిడక్డు చదువే లోకం. సెలవులకు వస్తే కూడా చదువుకొనుడు లేదా మా మేకలతో వెళ్లేది. మా తండాకు తొవ్వ కూడా లేదు. ఇప్పుడు మా బిడ్డకు ర్యాంకు వచ్చిందని మండల అధికారులు మా ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది. మా బిడ్డ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నా. – సరోజ, మధులత తల్లి – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ సిరిసిల్ల– ఫొటోలు: వంకాయల శ్రీకాంత్ -
రెడీ స్టడి గో
⇒ వచ్చే నెల నుంచే పలు దేశాల్లో అడ్మిషన్ల ప్రక్రియలు ప్రారంభం⇒ సరైన అవగాహనతో ముందుకెళితే సమస్యలు రాకుండా ఉంటాయంటున్న నిపుణులు⇒ విదేశీ విద్యకు అర్హతలు, అవకాశాలపై సూచనలివీ ఒకప్పుడు విదేశాల్లో చదువుకోవాలంటే అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా విదేశీ విద్య వైపు చూస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.వారంతా విదేశాలకు వెళ్లే ముందు హైదరాబాద్‌కే చేరుతున్నారు. ఇక్కడున్న కన్సల్టెన్సీలను సంప్రదించి విదేశీ విద్య కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చే నెలలోనే కొత్తగా అడ్మిషన్ల ప్రక్రియలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో సరైన అవగాహనతో ముందుకెళితే.. సులువుగా విదేశీ విద్య పూర్తి చేసుకోవచ్చని, మంచి జాబ్ కూడా సంపాదించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అసలు విదేశీ విద్యకు అర్హతలు, తీసుకో వాల్సిన జాగ్రత్తలేమిటో స్పష్టంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.అవకాశం, అవగాహన పెరగడంతో..విదేశాల్లో విద్య అంటే ఒకప్పుడు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమన్న భావన ఉండేది. దానికితోడు పెద్దగా అవగాహన లేకపోవడంతో.. విదేశాలకు వెళ్లడం ఎందుకులేనన్న పరిస్థితి ఉండేది. కానీ పెరిగిన అవకాశాలు, అవగాహన, ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారితో సులువుగా అనుసంధానమయ్యే వీలు వంటివి.. విదేశాలకు వెళ్లి చదువుకునేవారి సంఖ్య పెరిగేందుకు దారితీస్తోంది. పాస్‌పోర్టు జారీ విధానం సులభతరం కావడం, విదేశాల వీసాలు సులువుగా దొరుకుతుండటం, స్కాలర్ షిప్‌లతో అవకాశాలూ పెరిగాయి. మరోవైపు స్థానికంగా విద్య కోసం ఖర్చులు కూడా బాగా పెరిగిన నేపథ్యంలో.. మరింత అదనంగా ఖర్చు చేస్తే విదేశాల్లో చదువుకోవచ్చని, అక్కడే ఉద్యోగమూ సంపాదించవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.స్టూడెంట్ వీసా తీసుకుని..⇒ స్టూడెంట్ వీసా ఉంటే ఆ దేశంలోసంబంధిత కోర్సు పూర్తయ్యేంత వరకు ఉండి చదువుకునేందుకు అనుమతిఉంటుంది. తర్వాత కూడా రెండేళ్ల పాటు వర్క్ పర్మిట్ మీద ఉండేందుకు అనుమతిస్తారు.ఆ రెండేళ్లలోగా సరైన ఉద్యోగం పొందలేకపోతే.. స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.⇒ స్టూడెంట్ వీసా కోసం ఏ దేశానికి వెళ్లాలనుకుంటే ఆ దేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయం లేదా రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా వీసా అప్లికేషన్ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.⇒ విద్యార్థులకు అమెరికా అయితే ఎఫ్, ఎం, జే వీసాలు ఇస్తుంది. యూకే అయితే టైర్–4 వీసాలు జారీ చేస్తుంది. కెనడా స్టడీ పర్మిట్స్ పేరిట ఇస్తుంది.హైదరాబాద్ నుంచే ఎక్కువఅమెరికాకు గతేడాది 75,000 మంది ఇండియా నుంచి వెళ్తే..అందులో హైదరాబాద్ నుంచే 22,500 మంది ఉన్నట్టు అంచనా. ఇక కెనడాకు మొత్తం 1.3 లక్షల మంది వెళ్లగా.. దాదాపు 35,000 మంది హైదరాబాద్ మీదుగా వెళ్లారని.. ఇందులో సిటీవారే ఎక్కువని ఓపెన్ డోర్ సంస్థ నివేదిక చెబుతోంది. మిగతా దేశాలకు కూడా హైదరాబాద్ నుంచి వెళ్లిన విద్యార్థులే ఎక్కువని పేర్కొంటోంది.ఏమేం అర్హతలు ఉండాలి?⇒ చదువుకున్న కాలేజీ నుంచి కండక్ట్ సర్టిఫికెట్ ఉండాలి.⇒ సరైన పాస్‌పోర్టు ఉండాలి. ⇒ ఆదాయ వనరులు సరిగ్గా ఉండాలి⇒ ఆంగ్లంలో నైపుణ్యం ఉండాలి (ఐఈఎల్‌ఈఎస్, టోఫెల్లో మంచి స్కోర్ కలిగి ఉండాలి)⇒ మెడికల్, పోలీస్ క్లియరెన్స్ ఉండాలి.⇒ టోఫెల్, ఐఈఎల్టీఎస్, డుయో లింగో, ఎస్ఏటీ, జీఆర్ఈ వంటి పరీక్షల్లో స్కోరును బట్టి యూనివర్సిటీలు అడ్మిషన్లు ఇస్తుంటాయి. ఒక్కో దేశంలోని ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పరీక్షలో స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది.⇒ వీసా కోసం అప్లికేషన్ చేసుకున్న తర్వాత కాన్సులర్ అధికారితో ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు దరఖాస్తులో అందజేసిన వివరాలు సరైనవేనా, కాదా అనే విషయాన్ని ఇంటర్వ్యూలో రూఢి చేసుకుంటారు. అక్కడికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? చదువు అయిపోయాక ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలపై సమగ్రంగా ప్రశ్నలు అడుగుతారు.వీసాలు రిజెక్ట్ అవుతుంటాయి.. ఎందుకు? ⇒విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నవారికి ఒక్కోసారి వీసా రిజెక్ట్అవుతుంటుంది. ఇందుకు కారణాలు చాలానే ఉంటాయి.⇒ ఆదాయ వనరులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడం⇒ డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడం.⇒ చదువు పూర్తయ్యాక తిరిగి స్వదేశం వెళతామని రుజువు చేయలేకపోవడం⇒ చదువులో మంచి మార్కులు లేకపోవడం ళీఏదైనా తప్పులు లేదా ఫ్రాడ్ చేయడంవిదేశాల్లో స్కాలర్షిప్ పొందడమెలా?విదేశాలకు చదువు కోసం వెళ్తున్న అందరికీ అక్కడి వర్సిటీల్లోఫీజులు చెల్లించే స్తోమత ఉండకపోవచ్చు. అందువల్ల కాస్త ఆర్థిక భారంతగ్గించుకునేందుకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కాలర్షిప్ పొందడం కూడా సులువే..1. విదేశాల్లో వర్సిటీలు మాత్రమే కాకుండా వేరే సంస్థలు కూడా స్కాలర్షిప్స్ ఇస్తుంటాయి. అందుకే యూనివర్సిటీ వెబ్సైట్లతోపాటు స్కాలర్షిప్లు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్సైట్లను కూడా తరచూ చూస్తుండాలి.2. విదేశాలకు వెళ్లాలనుకోవడానికి ఏడాది ముందే స్కాలర్‌షిప్‌ల గురించి వెతుకుతుండాలి. ముందుగా స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.3. చాలా స్కాలర్షిప్ టెస్టుల కోసం అడ్మిషన్ లెటర్ అవసరం ఉండదు. అందుకే అడ్మిషన్ లెటర్ వచ్చాక దరఖాస్తు చేసుకోవాలనుకోవడం సరికాదు.4. పూర్తి స్థాయి స్కాలర్షిప్ కాకుండా కొంతమేరకే వస్తే మాత్రం వేరే స్కాలర్‌షిప్‌ల కోసం కూడా వెతకాలి. ఒకటికన్నా ఎక్కువ స్కాలర్షిప్లు పొందే అవకాశం కూడా ఉంటుంది.5. మెరిట్ ఉన్న విద్యార్థులకే స్కాలర్షిప్ వస్తుందనుకోవడం పొరపాటు. స్పోర్ట్స్, ఇతర నైపుణ్యాల ఆధారంగా కూడా స్కాలర్షిప్ ఆఫర్ చేసే సంస్థలు చాలా ఉంటాయి. వాటిని గుర్తించాలి.టోఫెల్లో అక్రమాలతో ఇబ్బంది..గతేడాది టోఫెల్ పరీక్షలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. టోఫెల్, జీఆర్ఈలో మార్కులు ఎక్కువ వచ్చేలా చేస్తామంటూ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వల వేసిన గుట్టు రట్టయింది. అలాంటి వారిని నమ్మి పరీక్షలు రాయిస్తే.. తీరా విదేశాలకు వెళ్లాక అది ఫేక్ అని తేలితే చిక్కులు తప్పవు. ఆ విద్యార్థులను భారత్‌కు తిప్పిపంపడమేగాక.. భవిష్యత్తులో మళ్లీ విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించే ప్రమాదం ఉంటుంది. స్టూడెంట్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్స్‌తో వెళ్లొచ్చుభారత విద్యార్థులు విదేశాల్లోని అవకాశాలు అందిపుచ్చుకునేలా.. ఆయా దేశాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. వాటిద్వారా మన విద్యార్థులు విదేశాల్లోని వర్సిటీల్లో కొంతకాలం చదువుకొనేందుకు అవకాశం ఉంటుంది. ‘సెమిస్టర్ ఎట్ సీ, రోటరీ యూత్ ఎక్సే్ఛంజ్ , ఎరామస్ ప్లస్, ఫుల్ బ్రైట్ నెహ్రూ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్, యూత్ ఫర్ అండర్ స్టాండింగ్’ వంటి కార్యక్రమాల ద్వారా విదేశాల్లోని విద్యార్థులతో కలసి చదువుకుని, అక్కడి స్థితిగతులను అర్థం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.ఉద్యోగ అనుభవంతో వెళ్తే మేలు..విదేశాల్లో చదువుతోపాటు అక్కడే స్థిరపడాలనుకునే వారు డిగ్రీ అయిపోయాక ఇక్కడ కనీసం రెండేళ్లపాటు ఏదైనా ఉద్యోగం చేసిఉంటే మంచిది. దీనివల్ల విదేశాల్లో ఎంఎస్ అయ్యాక.. ఇక్కడి అనుభవంతో అక్కడ ఉద్యోగం సులువుగా పొంది, స్థిరపడేందుకు అవకాశాలు మెండుగాఉంటాయి. ఏ దేశంలో త్వరగా సెటిల్ కాగలమో ముందుగానే తెలుసుకుని వెళ్తే బాగుంటుంది. ఐర్లాండ్ వంటి దేశాల్లో ఐదేళ్లలోనే గ్రీన్‌కార్డు వస్తుంది.సందీప్‌రెడ్డి , ఐర్లాండ్ ప్రస్తుత పరిస్థితులు బాగోలేవుఅమెరికాలో ప్రస్తుత పరిస్థితులు అంత బాగోలేవు. ఆర్థిక మాంద్యం నడుస్తోంది. రెండేళ్ల నుంచీ ఉద్యోగాల్లేవు. ఉన్న వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. స్టూడెంట్స్ చాలా మంది చదువు కోసం వస్తున్నారు. వారికి పార్ట్‌టైమ్ జాబ్స్ దొరకట్లేదు. ఇంటి అద్దెతోపాటు కూరగాయలు, నిత్యావసర ధరలు కూడాభారీగా పెరిగాయి. దీంతో ఇక్కడ జీవనం కష్టంగా మారుతోంది. సాయి సింధూజ న్యూజెర్సీ వర్సిటీలపై స్టడీ చేయాలి ముందుగానే ఏ యూనివర్సిటీమంచిదో కాస్త పరిశోధన చేయాలి. ఆ తర్వాతే కన్సల్టెన్సీల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అదే నేరుగా కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తే.. సరైన కాలేజీ లేదా యూనివర్సిటీకి దరఖాస్తు చేయకపోవచ్చు. తర్వాత బాధపడి ఏమీ లాభం ఉండదు. కొన్ని కన్సల్టెన్సీలు ఎక్కువ కమీషన్ ఇచ్చే వర్సిటీలకు దరఖాస్తు చేయిస్తుంటాయి. అందుకే వర్సిటీలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.నిఖిల్ మండల, మాంచెస్టర్, బ్రిటన్ -
నీట్ కౌన్సెలింగ్.. ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా నీట్–యూజీ! దేశ వ్యాప్తంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! కొద్దిరోజుల క్రితమే నీట్ యూజీ–2024 ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్నా.. నీట్ కౌన్సెలింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు! ఈ నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై విశ్లేషణ..‘నీట్ యూజీ–2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా.. మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వాలి’ అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు⇒ నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం–దేశ వ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్‌తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ⇒ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు; మరో 16 ప్రైవేట్ కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. రెండు మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు; స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి.. రెండు ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు; 14 ప్రైవేట్ కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి.⇒ తెలంగాణ రాష్ట్రంలో.. ఎంబీబీఎస్‌కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు; 29 ప్రైవేట్, మైనారిటీ కళాశాల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు; పది ప్రైవేట్ కళాశాలల్లో 1,000 సీట్లు; వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో ఆరు సీట్లు ఉన్నాయి.పేరున్న కళాశాలలో సీటుప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో రెండు లక్షల వరకు ర్యాంకు వరకూ సీట్లు పొందే అవకాశముందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు.కౌన్సెలింగ్.. ఏఐక్యూ, స్టేట్ కోటానీట్ యూజీ కౌన్సెలింగ్‌ను రెండు విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి.. రాష్ట్రాల వైద్య విశ్వ విద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.ఆల్ ఇండియా కోటాజాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్‌లోకి తీసుకెళ్లినప్పటì æనుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం.. జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.స్టేట్ కోటా కౌన్సెలింగ్జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు), ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్–బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.ఫీజులు ఇలా⇒ ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు; పైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(కేటగిరీ–సి) సీట్లకు: రూ.36 లక్షలుగా పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు రూ.13 వేలు; ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ–బి మేనేజ్మెంట్ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. ⇒ తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.60 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీటుకు రూ.11.55 లక్షలు–రూ.13 లక్షలుగా ఫీజు ఉంది. అదే విధంగా.. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు రెండు రెట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో.. ప్రభుత్వ కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్ కోటా) సీట్లు: రూ.45 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లు: రూ.4.2 లక్షలు – రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి–కేటగిరీ(ఎన్ఆర్ఐ కోటా) సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ⇒ ఈ ఫీజుల వివరాలు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సెలింగ్ సమయానికి వీటిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఏఐక్యు.. కౌన్సెలింగ్ విధానమిదే⇒ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ⇒ ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. ⇒ తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే.. ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. వీరు రెండో రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. ⇒ తొలి రౌండ్ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.పూర్తిగా ఆన్లైన్హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడీ, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకూ.. అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యంనీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఎంసీ–విశాఖపట్నం, జీఎంసీ–గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి.ఈ సర్టిఫికెట్లు సిద్ధంగానీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి.. నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది. ఇలా కౌన్సెలింగ్ విధానంతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుంటే.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటులేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. -
చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండి
మార్కులు రాలేదని తల్లి పెద్ద ర్యాంకు రాలేదని తండ్రి ఫలానా కోర్సు చదవాలని తల్లి ఆ కాలేజీలోనే చేర్పిస్తానని తండ్రి టీనేజ్ పిల్లలకు ఇది కీలక సమయం. వారు ఇంటర్లో, డిగ్రీలో చేరాలి. కాని పిల్లల మాట వింటున్నారా? మీరే గెలవాలని పట్టుబడుతున్నారా? అప్పుడు పిల్లలు లోలోపల నలిగి పోవడం కన్నా ఏం చేయలేరు. పత్రికల్లో వస్తున్న ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఆచితూచి అడుగు వేయండి.‘నువ్వు ఆ కోర్సు చేయాలనేది మా కల’ అనే మాట తల్లిదండ్రుల నుంచి వెలువడితే అది పిల్లల నెత్తిమీద ఎంత బరువుగా మారుతుందో పిల్లలకే తెలుసు. టీనేజ్ మొదలయ్యి టెన్త్ క్లాస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ‘కలలు వ్యక్తపరచడం’ తల్లిదండ్రులు మొదలెడతారు. టెన్త్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో, ఇంటర్లో ఏ స్ట్రీమ్‌లోకి వెళ్లాలో, అందుకు ఏ కాలేజీలో చేరాలో, ఆ కాలేజీ ఏ ఊళ్లో ఉంటే బాగుంటుందో ఇన్ని డిసైడ్ చేసి పిల్లలకు చెబుతుంటారు. పిల్లలు వినాలి. వారికి ఏ అభిప్రాయం లేకుండా ఆ కోర్సు పట్ల ఆసక్తి ఉంటే మంచిదే. వారికి మరేదో ఇంటరెస్ట్ ఉండి, ఇంకేదో చదవాలని ఉంటే... ఆ సంగతి చెప్పలేకపోతే ఇబ్బంది. అది భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టగలదు.ఏంటి... ఆ కోర్సా?ఆ ఇంట్లో తండ్రి అడ్వకేట్, తల్లి గవర్నమెంట్ ఉద్యోగి. కుమార్తెకు మేథ్స్గాని, బయాలజీగాని చదవాలని లేదు. హాయిగా టీచర్‌గా సెటిల్ అవ్వాలని ఉంది. తన స్కూల్లో చక్కగా తయారై వచ్చే టీచర్ పిల్లల పేపర్లు దిద్దే సన్నివేశం ఆ అమ్మాయికి ఇష్టం. తాను కూడా టీచరయ్యి పేపర్లు దిద్దాలని అనుకుంటుంది. టెన్త్ అవుతున్న సమయంలో ‘టీచర్ అవుతాను’ అని కూతురు అంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ‘మన హోదాకు టీచర్ కావడం ఏం బాగుంటుంది... మన ఇళ్లల్లో టీచర్లు ఎవరూ లేరే’ లాంటి మాటలు చెప్పి ఎంపీసీలో చేర్పించారు. ఆ అమ్మాయి ఆ లెక్కలు చేయలేక తల్లిదండ్రులకు చెప్పలేక కుమిలిపోయింది. డిప్రెషన్ తెచ్చుకుంది. అదే ‘టీచర్ కావాలనుకుంటున్నావా? వెరీగుడ్. అక్కడితో ఆగకు. నువ్వు హార్వర్డ్‌లో ప్రోఫెసర్ అవ్వాలి. అంత ఎదగాలి’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే హార్వర్డ్‌కు వెళ్లకపోయినా ఒక మంచి యూనివర్సిటీలో లెక్చరర్ అయినా అయ్యేది కదా.అన్నీ మాకు తెలుసుతల్లిదండ్రులకు అన్నీ మాకు తెలుసు అనే ధోరణి ఉంటుంది. నిజమే. కాని వాళ్లు ఇప్పుడున్న స్థితి రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల దారుల్లో ప్రయత్నించి ఒక మార్గంలో సెటిల్ అయి ఉంటారు. తమ లాగే తమ పిల్లలు కూడా కొన్ని దారుల్లో నడవాలని అనుకోవచ్చు అని భావించరు. అన్నీ తమ ఇష్టప్రకారం జరగాలనుకుంటారు, ఓవర్ కన్సర్న్ చూపించి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఉదాహరణకు ఒకబ్బాయికి ‘నీట్’లో మెడిసిన్ సీటు వచ్చే ర్యాంకు రాలేదు. కాని డెంటిస్ట్రీ సీటు వచ్చే ర్యాంకైతే వచ్చింది. అబ్బాయికి ఆ కోర్సు ఇష్టమే. కాని తల్లిదండ్రులకు తమ కొడుకు ఎలాగైనా ఎంబిబిఎస్ మాత్రమే చదవాలనేది ‘కల’. ‘లాంగ్ టర్మ్ తీసుకో’ అని సూచించారు. లాంగ్ టర్మ్ అంటే ఒక సంవత్సరం వృథా అవుతుంది... పైగా ఈసారి ఎంట్రన్స్‌లో కూడా మంచి ర్యాంక్ వస్తుందో రాదో అనే భయం ఆ అబ్బాయికి ఉన్నా బలవంతం చేస్తే ఎంత చెప్పినా వినకపోతే ఆ అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అవ్వడా?ప్రతిదీ నిర్ణయించడమేతల్లిదండ్రుల స్తోమత పిల్లలకు తెలుసు. వారు చదివించ దగ్గ చదువులోనే తమకు ఇష్టం, ఆసక్తి, ప్రవేశం ఉన్న సబ్జక్టును చదవాలని కోరుకుంటారు. పైగా తమ స్నేహితుల ద్వారా వారూ కొంత సమాచారం సేకరించి ఫలానా కాలేజీలో ఫలానా కోర్సు చదవాలని నిశ్చయించుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికి ఏ మాత్రం విలువ లేకుండా ఎలాగైనా చేసి రికమండేషన్లు పట్టి తాము ఎంపిక చేసిన కాలేజీలోనే చదవాలని శాసిస్తారు. ఇది అన్నివేళలా సమంజసం కాదు. ఒత్తిడి వద్దుటీనేజ్ సమయంలో పిల్లల భావోద్వేగాలు పరిపక్వంగా ఉండవు. కొంత తెలిసీ కొంత తెలియనితనం ఉంటుంది. ఆసక్తులు కూడా పూర్తిగా షేప్ కావు. ఇంటర్, గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి వారికి ఎన్నో సందేహాలుంటాయి. ఎంపికలు ఉంటాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ‘తాము చదివించాలనుకున్న కోర్సు’ కోసం ఏకంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇంట్లో ఉండి చదివే వీలున్నా రెసిడెన్షియల్ కాలేజీల్లో పడేస్తున్నారు. అంతంత మాత్రం చదువు చెప్పినా పర్లేదని మెడిసన్ పట్టా ఉంటే చాలని ఆసియా దేశాలకు సాగనంపుతున్నారు. పిల్లలతో ఎంతో మాట్లాడి, కౌన్సెలింగ్ చేసి, మంచి చెడ్డలన్నీ చర్చించి, వారికి సంపూర్ణ అవగాహన కలిగించి రెండు ఆప్షన్లు ఇచ్చి వారి ఆప్షన్లు కూడా పరిగణించి సానుకూలంగా ఒక ఎంపిక చేయడం ఎప్పుడూ మంచిది. లేదంటే ‘కోటా’ లాంటి కోచింగ్ ఊర్లలో జరుగుతున్న విషాదాలు, హైదరాబాద్‌లాంటి చోట్ల ఇల్లు విడిచి పోతున్న సంఘటనలు ఎదుర్కొనాల్సి వస్తుంది. -
TG: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ మూడు విడతల్లో జరగనుంది. జూన్ 27 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంజూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లుజులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 24న రెండో విడత సీట్ల కేటాయింపుజులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్ఆగస్టు 5న తుది విడత సీట్ల కేటాయింపుఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు. పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ..తెలంగాణలో రెండు విడతల్లో పాలిసెట్ కౌన్సెలింగ్ జరగనుంది.జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంజూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లుజూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లుజులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు పాలిసెట్‌లోనూ ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం ఉంటుంది. జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు విడుదలవుతాయి. -
తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు.EAP CET టాపర్లు (ఇంజనీరింగ్)మొదటి ర్యాంక్ - సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం,ఏపీ) రెండో ర్యాంక్ - గొల్లలేక హర్ష (కర్నూల్, ఏపీ) మూడో ర్యాంక్- రిషి శేఖర్ శుక్లఇంజనీరింగ్ విభాగంలో టాట్టెన్లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచారు.EA PCET టాపర్లు ( అగ్రి కల్చర్ అండ్ ఫార్మసీ)మొదటి ర్యాంక్- ఆలూర్ ప్రణిత ( మదనపల్లి, ఏపీ) రెండో ర్యాంక్ - నాగుడసారి రాధా కృష్ణ (విజయనగరం, ఏపీ) మూడో ర్యాంక్- గడ్డం శ్రీ వర్షిణి (వరంగల్,తెలంగాణ)ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ‘ఎప్ సెట్‌ను మొదటి సారిగా నిర్వహించాం. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించాం’ అని తెలిపారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడారు. ‘ఈ ఏడాది ఈఎపి సెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు . ఈఎపి సెట్‌కి గత పదేళ్ళలో లేనంతమంది ఈ సారి రిజిస్ట్రేషన్. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ. ఒక్కో షిఫ్ట్ లో 50వేల మంది పరీక్ష రాశారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు. అడ్మిషన్ షెడ్యుల్ త్వరలో విడుదల చేస్తాం’అని అన్నారు. -
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
గుంటూరు: ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రరెడ్డి తెలిపారు. ‘‘రేపటి(గురువారం) నుంచి ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. రేపు, ఎల్లుండి బైపీసీ గ్రూపుకి ఎప్‌సెట్ పరీక్షలు జరుగుతాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్. మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండవ సెషన్‌గా పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు. హైదరాబాద్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 3,61,640 మంది ఈ ఎప్‌సెట్‌కు హాజరవుతున్నారు. ఇందులో మహిళలు 1,81,536 మంది, పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంపీసీ విభాగంలో 34,828 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో మాత్రం 13,138 మంది విద్యార్ధులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని తెలిపారు.ముఖ్యమైన సూచనలు..‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. పరీక్షా కేంద్రంలో పలికి విద్యార్ధులను అరగంట ముందుగా అనుమతి ఇస్తాం. పరీక్షా కేంద్రాలకి బస్సులు నడపాలని ఆర్టిసిని విజ్ణప్తి చేశాం. పరీక్షా కేంద్రాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాం. 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు విధానం లేదు. బయోమెట్రిక్ విధానంతో హాజరు తీసుకుంటాం కాబట్టి చేతులకి మెహందీ పెట్టుకోవద్దు. చెవులకి చెవి దిద్దులు తీసేసి పరీక్షలకి హాజరు కావాలి. ప్రతీ హాల్ టికెట్ వెనుక పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది’’ అని హేమచంద్రారెడ్డి తెలిపారు.ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం..ఏపీ ఈఏపీసెట్ రీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎప్‌సెట్ చైర్మన్, కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరాజు తెలిపారు. ‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకి ముందుగానే చేరుకోవాలి. ఇప్పటికే విద్యార్ధులకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంచాం. విద్యార్థులెవరూ ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’’ అని తెలిపారు. -
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
నూటికి నూరు శాతం అంకితం చదువుల తల్లి సరస్వతే అయినా ఆడపిల్ల చదువుకు వెనుకా ముందు ఆలోచించేవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారందరూ అంకితను చూసి ఆలోచన మార్చుకోవాలి. ఎందుకంటే కర్నాటక రైతు బిడ్డ అంకిత పదవ తరగతి ఫలితాల్లో 625కు 625 మార్కులు తెచ్చుకుంది. రాష్ట్రం మొత్తం మీద సెంట్ పర్సెంట్ వచ్చింది అంకితకే. ఇలాంటి అంకితలు ఎందరో ఉంటారు చదువులో ్ర΄ోత్సహిస్తే.మే 9 వ తేదీ. ఆ ఫోన్ వచ్చేసరికి బసప్ప పొలంలో ఉన్నాడు. అవతలి వైపు ఉన్నది స్కూల్ టీచరు.‘బసప్ప గారు మీ అమ్మాయికి పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ మార్కులు వచ్చాయి’ ‘ఓ.. ఎన్ని మార్కులు వచ్చాయి సార్?’‘ఎన్ని వచ్చాయి ఏంటి బసప్ప గారు. అంతకు మించి వేయలేక 625కు 625 వేశారు. అంత బాగా చదివింది మీ అమ్మాయి. ఇన్ని మార్కులు ఇంకెవరికీ రాలేదు’...కర్నాటకలోని బాగల్కోట్కు దాదాపు గంట దూరంలో ఉండే చిన్న పల్లె వజ్రమట్టి. ఆ ఊరే బసప్పది. ఆరెకరాల రైతు. పెద్దమ్మాయి అంకిత. ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వార్త తెలిశాక ఇంటికి ఆఘమేఘాల మీద చేరుకున్నాడు. మరి కాసేపటిలో ఊరు ఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. సందడి చేసింది. కోలాహాలం సృష్టించింది. పులకరించింది. మరి ఒక చిన్న పల్లెటూరి నుంచి అంత బాగా చదివితే ఆ అమ్మాయిని ఆశీర్వదించకుండా ఎలా? అంకితను చూసి ప్రతి ఒక్కరూ మెటికలువిరవడమే.హాస్టల్లో ఉండిఅంకిత తన ఊరికి నలభై నిమిషాల దూరంలో ఉన్న ముధోల్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంది. స్కూల్ హాస్టల్లో ఉండి చదువుకుంటూనే సెలవుల్లో ఇంటికి వచ్చేది. ‘నేను సెల్‌ఫోన్ వాడను. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటాను. డిజిటల్ లైబ్రరీలో అదనపు మెటీరియల్ చదివాను. ఉదయం ఐదుకు లేస్తాను. మళ్లీ రాత్రి చదువుతూనే నిద్ర΄ోతాను. ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఏవో ఒకటి చేయాల్సి వస్తుంది. కాని హాస్టల్లో ఉంటే చదువు తప్ప వేరే పనేముంది. నా పాఠాలు అయ్యాక ఆడుకోవడం కూడా నేను మానలేదు. మా స్కూల్ టీచర్లు ముందు నుంచి నాకు మంచి మార్కులు వస్తాయని ఊహించారు. వారు నాకు అన్ని విధాల స΄ోర్ట్ చేస్తూ వచ్చారు. నాకు సెంట్ పర్సెంట్ వచ్చినందుకు ఆనందమే. కాని నా కంటే మా అమ్మా నాన్నలు, స్కూల్ టీచర్లు ఎక్కువ సంతోషపడటం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా స్కూల్లో మంచి క్రమశిక్షణ ఉంటుంది. అందువల్లే నేను బాగా చదివాను‘ అని చెప్పింది అంకిత.ఐ.ఏ.ఎస్. కావాలని‘మా అమ్మాయి బాగా చదువుతుందనుకున్నాము గాని ఇంత బాగా చదువుతుందని అనుకోలేదు. మేము ఇక ఆమె ఎంత చదవాలంటే అంత చదివిస్తాము. ఏది చదవాలన్నా ఎంత కష్టమైనా చదివిస్తాము’ అన్నారు బసప్ప, అతని భార్య గీత. భర్తతో పాటు పొలానికి వెళ్లి పని చేసే గీత కూతురిని చూసి మురిసి΄ోతోంది. ‘నేను ఇంటర్లో సైన్స్ చదివి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఐ.ఏ.ఎస్. చేస్తాను’ అంది అంకిత.ముఖ్యమంత్రి ప్రశంసఅంకితకు వచ్చిన మార్కుల గురించి విని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభినందనలు తెలియచేశారు. ఇంకా బాగల్కోట్ ప్రభుత్వ అధికారులు ప్రశంసలు తెలియచేశారు. ఇక కర్నాటక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ డి.కె.శివకుమార్ తానే స్వయంగా ఇంటికి వచ్చి అభినందిస్తానని కబురు పంపారు. అంకిత విజయం బాగా చదివే అమ్మాయిలందరికీ అంకితం. -
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సాక్షి,విజయవాడ: పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి బుధవారం(మే8)ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈ పరీక్షను ఏప్రిల్ 27న నిర్వహించారు.మొత్తం 1.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1.24 లక్షల మంది అర్హత సాధించారు. దీంతో ఈసారి 87.61 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... -
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
సాక్షి,విజయవాడ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష నీట్ రేపు (మే5) జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. ఏపీ నుంచి75 వేల మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు.ఏపీలో 29 నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు మద్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్దులికు సెంటర్లోకి అనుమతి ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు. -
Parvathy Gopakumar: ఒంటి చేత్తో విజయం
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి గోపకుమార్ సివిల్స్ 2023లో 282వ ర్యాంక్ సాధించడానికి ఒంటి చేత్తో పోరాడింది. ‘మీరు సంతోషంగా ఉంటేనే సరిగ్గా చదవగలరు’ అంటున్న పార్వతి సమస్యలను జయించగల చిరునవ్వును సొంతం చేసుకుంది. పార్వతి గోపకుమార్ సంతోషంగా ఉంది. ఆమెకు కలెక్టర్ కావాలని ఉంది. సివిల్స్ 2023 ఫలితాలలో 282 ర్యాంక్ సాధించింది. కాని ఆ ర్యాంక్‌కు ఐ.ఏ.ఎస్. రాకపోవచ్చు. కాని దివ్యాంగ కోటాలో చూసినప్పుడు ఆమెది టాప్ ర్యాంక్. కనుక రావచ్చు.‘మాది అలెప్పి. బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చదువుకున్నాను. ఆ సమయంలో అలెప్పి కలెక్టరేట్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి కలెక్టర్ ఎస్.సుహాస్ పనిచేసే విధానం, కలెక్టర్ స్థానంలో ఉంటే ప్రజలకు చేయదగ్గ సేవ చూసి నాక్కూడా ఐ.ఏ.ఎస్. కావాలనిపించింది. ఆ విషయం తెలిశాక కలెక్టరేట్లో అందరూ నన్ను అందుకు కష్టపడమని ్రపోత్సహించారు. 2022లో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ దాటలేకపోయాను. ఒక సంవత్సరం విరామం ఇచ్చి 2023లో రెండోసారి రాశాక ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను’ అని తెలిపింది పార్వతి. ఇప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు. 7వ తరగతిలో ప్రమాదం2010లో పార్వతి ఏడవ తరగతిలో ఉండగా కారు ప్రమాదంలో ఆమె కుడిచేయి మోచేతి వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వయసులో అలాంటి నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బగా ఉంటుంది. అయితే తండ్రి గోపకుమార్, తల్లి శ్రీకళ ఇచ్చిన ధైర్యంతో వెంటనే ఎడమ చేత్తో రాయడం ్రపాక్టీసు చేసింది పార్వతి. ఆ తర్వాత మూడు నెలల్లో వచ్చిన పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిలికాన్, ΄్లాస్టిక్లతో చేసిన కృత్రిమ హస్తాన్ని అమర్చుకుంది.‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ΄్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.మహిళా దివ్యాంగుల కోసంఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోందామె. -
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్‌లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు ఎంపికయ్యి నీతి ఆయోగ్‌లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్‌లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్‌లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్‌లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్‌ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్‌లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్‌కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్‌గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్‌లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్‌లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్‌లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్‌కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్‌పూర్‌కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్‌తో జార్ఖండ్‌లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్‌లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్‌గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
Wardah Khan: ఇంట్లో ప్రిపేరయ్యి విజేతల వీడియోలు చూసి
యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులున్నారు. భిన్న జీవనస్థాయుల నుంచి వీరంతా మొక్కవోని పట్టుదలతో పోరాడి ఇండియన్ సివిల్ సర్వీసుల్లో సేవలు అందించేందుకు ఎంపికయ్యారు. 18వ ర్యాంకు సాధించిన 23 ఏళ్ల వార్దా ఖాన్ సివిల్స్ కల కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. సొంతగా ఇంట్లో ప్రిపేర్ అవుతూ గతంలో ర్యాంక్ సాధించిన విజేతలతో స్ఫూర్తిపొందింది. నోయిడాలోని ఆమె ఇలాకా ఇప్పుడు సంతోషంతో మిఠాయిలు పంచుతోంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా వార్దా ఖాన్‌ను ‘మాక్ ఇంటర్వ్యూ’లో ఒక ప్రశ్న అడిగారు– ‘నువ్వు సోషియాలజీ చదివావు కదా. సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏమేమి తెస్తావు’ అని. దానికి వార్దా ఖాన్ సమాధానం 1.స్త్రీల పట్ల సమాజానికి ఉన్న మూస అభి్రపాయం మారాలి. వారికి అన్ని విధాల ముందుకెళ్లడానికి సమానమైన అవకాశాలు కల్పించగల దృష్టి అలవడాలి. 2. దేశ అభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరిగింది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. 3. దేశానికి ప్రమాదకరంగా మారగల మత వైషమ్యాలను నివారించాలి. ‘నా మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇంతే ఆసక్తికరంగా సాగింది’ అంటుంది వార్దా. నోయిడాకు చెందిన వార్దా ఖాన్ రెండో అటెంప్ట్‌లోనే సివిల్స్‌ను సాధించింది. 18వ ర్యాంక్ సాధించి సగర్వంగా నిలుచుంది. ఇంటి నుంచి చదువుకుని వార్దాఖాన్ది నోయిడాలోని వివేక్ విహార్. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభ చూపిన వార్దా వక్తృత్వ పోటీల్లో మంచి ప్రతిభ చూపేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ వెంటనే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినా ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ప్రజారంగంలో పని చేసి వారికి సేవలు అందించడంలో ఒక తృప్తి ఉంటుందని భావించి సివిల్స్‌కు ప్రిపేర్ అవసాగింది. అయితే అందుకు నేరుగా కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు, ఆ తర్వాత సొంత తర్ఫీదు మీద ఆధారపడింది. అన్నింటికంటే ముఖ్యం గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు, వారి సూచనలు వింటూ ప్రిపేర్ అయ్యింది. ‘సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆందోళన, అపనమ్మకం ఉంటాయి. విజేతల మాటలు వింటే వారిని కూడా అవి వేధించాయని, వారూ మనలాంటి వారేనని తెలుస్తుంది. కనుక ధైర్యం వస్తుంది’ అని తెలిపింది వార్దాఖాన్. ఏకాంతంలో ఉంటూ ‘సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే మనం లోకంతో మన సంబంధాలు కట్ చేసుకోవాలి. నాకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టం. కాని దానివల్ల సమయం వృథా అవుతుంది. సివిల్స్‌కు ప్రిపేర్ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్ మీడియాలో ఉండటం అన్నీ మానేశాను. అయితే మరీ బోర్ కొట్టినప్పుడు ఈ సిలబస్ ఇన్నిగంటల్లో పూర్తి చేయగలిగితే అరగంట సేపు ఎవరైనా ఫ్రెండ్‌ని కలవొచ్చు అని నాకు నేనే లంచం ఇచ్చుకునేదాన్ని. అలా చదివాను’ అని తెలిపిందామె. పది లక్షల మందిలో 2023 యు.పి.ఎస్.సి పరీక్షల కోసం 10,16,850 మంది అభ్యర్థులు అప్లై చేస్తే వారిలో 5,92,141 మంది ప్రిలిమ్స్ రాశారు. 14,624 మంది మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యారు. 2,855 మంది ఇంటర్వ్యూ వరకూ వచ్చారు. 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పురుషులు 352 మంది స్త్రీలు. ఇంత పోటీని దాటుకుని వార్దా ఖాన్ 18 వ ర్యాంకును సాధించిందంటే ఆమె మీద ఆమెకున్న ఆత్మవిశ్వాసమే కారణం. ‘మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కష్టపడితే కచ్చితంగా సివిల్స్ సాధించవచ్చు’ అని తెలుపుతోందామె. ఆమె ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్)ను తన మొదటి ్రపాధాన్యంగా ఎంపిక చేసుకుంది. ‘గ్లోబల్ వేదిక మీద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేసి దౌత్య సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించడమే నా లక్ష్యం’ అంటోంది వార్దా. -
‘ఐఎస్బీ’లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
రాయదుర్గం: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ) క్లాస్–2024, డాక్టోరల్ ప్రోగ్రామ్ ఫెల్లో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఎఫ్‌పీఎం), ఎగ్జిక్యూటివ్ ఫెల్లో ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(ఈఎఫ్‌పీఎం) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 617 మంది విద్యార్థులు, వారిలో 593 మంది పీజీపీ క్లాస్–2024, 19 మంది ఈఎఫ్‌పీఎం విద్యార్థులకు, ఐదుగురు ఎఫ్‌పీఎం విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్‌ను ప్రదానం చేశారు. ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెబీ చైర్మన్ మధబి పూరి బుచ్ హాజరయ్యారు. ఐఎస్బీ చైర్మన్ హరీష్ మన్వాని, పలువురు ప్రొఫెసర్లు, అధికారులు, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, డీన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్‌ను ప్రదానం చేశారు. అంకితభావం, నిబద్దత ప్రశంసనీయం : సెబీ చైర్మన్ మధబిపూరిబుచ్ నేటి తరం విద్యార్థుల అంకిత భావం, నిబద్దత ప్రశంసనీయమని సెబి చైర్మన్ మధబిపూరిబుచ్ అన్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రపంచ చిన్నదిగా భావించినప్పుడు సమృద్ధిగా అవకాశాలను అందిస్తూ కాలం వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తుందన్నారు. పని–జీవితం, కుటుంబం మధ్య సమతుల్యతను కొనసాగిస్తూ, కార్పొరేట్, ప్రభుత్వ పాత్రలను అన్వేషించడానికి, బ్యాలెన్స్ చేయడానికి అనేక రకాల కెరీర్ ఎంపికలు ఉన్నాయన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమయాన్ని వెచ్చించాలని సూచించారు. ఇటీవలే యువతిని కలిశానని ఆమె పలు దేశాల్లో 32 స్టార్టప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ఆశ్చర్య పోయానన్నారు. ఐఎస్బీ చైర్మన్ హరీష్ మన్వాని మాట్లాడుతూ ఐఎస్బీలో చదివినవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో గ్రాడ్యుయేషన్ డే ఎంతో విలువైనదని, భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుందని భావిస్తూ ముందుకు సాగే రోజు వచ్చిందన్నారు. కార్యక్రమంలో పలువురు ఐఎస్బీ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కుటుంబసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
పది పరీక్ష రాశారా? మా కాలేజీలో చేరండి
‘హలో.. నమస్కారమండి.. మీ పాప/బాబు పదో తరగతి అయిపోయింది కదండి.. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు.. మాది కార్పొరేట్ కాలేజ్. ఐఐటీ.. మెయిన్స్.. అడ్వాన్స్.. ఏసీ.. నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లున్నాయి. ఇప్పుడు జాయిన్ అయితే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం.. రిజల్ట్స్ వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి.. మీ ఇష్టం.. ఆలోచించుకొండి..’ ఇది జిల్లాలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్. ఇలా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకొని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి. ఆదిలాబాద్‌టౌన్: తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ నాలి చేసైనా మంచి కళాశాలలో చదివించాలనే ఆ లోచనలో ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. అందించేది అరకొర విద్యే అ యినప్పటికీ.. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రౌచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులు సైతం అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫలితాలు రాక ముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునేలా.. ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్వోలు వి ద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజ మాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధన ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వరాదు. కానీకాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈవిధంగా వ్యవహరిస్తున్నా యి. హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకు పీఆర్వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళా శాలల్లో ఇచ్చే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, తదితర విషయాలను వివరిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. టార్గెట్ పెడుతూ.. కొన్ని యాజమాన్యాలు పీఆర్వోలను ప్రత్యేకంగా ని యమించుకొని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నా యి. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటీవ్లు సైతం అందజేస్తున్నాయి. మరోవైపు సంబంధి త కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర అ ధ్యాపకులు, సిబ్బంది తప్పకుండా ప్రతి ఒక్కరు 25 చొప్పున ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. ప్రవేశాలు చేసిన వారికి మాత్రం ఇన్సెంటీవ్, కొంత కమీ షన్ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్ కళాశాలకు రూ.5వేల వరకు, హాస్టల్ క్యాంపస్ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2500 అందజేస్తున్నా రు. కాగా, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నది కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 13 మోడల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబాపూలే, ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు 45 ప్రైవేట్ కళాశాలలు 14 భారీగా ఫీజులు.. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌కు సంబంధించి జిల్లా నుంచి ఏటా వెయ్యి నుంచి 2వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఐఐటీ, నీట్, ఏసీ సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో ఏడాదికి రూ.3లక్షలు, సాధారణ చదువుకు రూ.1లక్ష 50వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు సైతం రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కారు కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నాం. స్కాలర్షిప్ కూడా పొందవచ్చు. – రవీంద్రకుమార్, డీఐఈవో -
వేమన వెలుగుల్లో.. విద్యా పరిమళాలు
వైవీయూ : యోగివేమన నీకు వందనం.. విశ్వకవితాత్వికా నీకు వందనం.. అన్న విశ్వవిద్యాలయ గీతంతో ఉత్తేజితులవుతూ.. సామాజిక స్పృహ కల్పించిన ప్రజాకవి పేరుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం 18వ వ్యవస్థాపక, వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమైంది. 2006 మార్చి 9వ తేదీన పీజీ కేంద్రం నుంచి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది నేడు 27 కోర్సులతో విలసిల్లుతోంది. దాదాపు 1500 మంది విద్యార్థులు, 100 మంది అధ్యాపక బృందం, 300 మంది దాకా బోధనేతర సిబ్బంది, 100 మంది దాకా పరిశోధక విద్యార్థులతో ప్రగతి పథంలో దూసుకువెళ్తోంది. 1977 నవంబర్ 20వ తేదీన తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కడప నగర సమీపంలో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2006లో 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. అభివృద్ధికి అడుగులు.. ఇలా... యోగివేమన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశ్వవిద్యాలయానికి నిధుల వరద పారించారు. వైవీయూకు 2012లో 12బీ గుర్తింపు సైతం లభించడంతోపాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, ప్రపంచ పరిశోధకుల జాబితాల్లో స్థానం, పలు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు. అదే విధంగా 2022 నవంబర్‌లో విశ్వవిద్యాలయం న్యాక్ ఏ గ్రేడ్ సాధించి సత్తా చాటింది. విశ్వవిద్యాలయం 2023 జూన్‌లో విడుదల చేసిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో దేశంలోని అత్యుత్తమ విద్యాలయాల్లో 151 నుంచి 200 లోపు స్థానం సాధించింది. వీటితోపాటు పలు అవార్డులు, పలు ప్రొజెక్టులు సొంతం చేసుకుని అభివృద్ధి బాటలో పయనిస్తోంది. గ్రంథాలయ ప్రాంగణంలో.. న్యాక్ ఏ గ్రేడ్ సాధించిన తర్వాత సరికొత్త హంగులతో విలసిల్లుతున్న విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం 10.00 గంటలకు వైవీయూలోని ఏపీజే అబ్దుల్‌కలాం కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో 18వ వ్యవస్థాపక, కళాశాల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. వాస్తవానికి మార్చి 9వ తేదీన వ్యవస్థాపక దినోత్సవం రోజునే వేడుకలు నిర్వహించడం అనవాయితీ కాగా, వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు అందుబాటులో లేకపోవడంతో 23వ తేదీ శనివారం నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య వి.శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్‌యూ వైస్ చాన్సలర్ ఆచార్య బి.ఆంజనేయప్రసాద్, న్యూఢిల్లీకి చెందిన ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ వై.సురేష్‌రెడ్డి విచ్చేయనున్నారు -
2018 గ్రూప్-1 మెయిన్స్‌పై రాజకీయ విమర్శలా? : గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: 2018 మెయిన్స్ పరీక్ష రద్దుపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. సర్వీస్ కమిషన్, ప్రభుత్వంపైనా రాజకీయ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు రాజకీయ విమర్శలకు కమిషన్ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా జరిగిందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పకడ్బందీగా ఒకేసారి మాన్యువల్ వ్యాల్యువేషన్ చేశామని, రెండోసారి జరగలేదని స్పష్టం చేశారు. 162 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు 55 రోజులు క్యాంపులో కూర్చుని వ్యాల్యువేషన్ చేశారన్నారు. వ్యాల్యువేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఎపీపీఎస్సీ వద్ద ఉన్నాయని చెప్పారు. నియామకాల్లో ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉద్యోగాలు చేస్తున్న 162 ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పీల్ దాఖలు చేశారు. 2019 నుంచి ఇప్పటి దాకా కమిషన్ ఒక్క తప్పు లేకుండా పూర్తి పారదర్శకతతో వేలాది పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు గౌతమ్ సవాంగ్. 2018 గ్రూప్-1 పోస్టుల భర్తీలోనూ అంతే పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల్లో 14 మంది ఐఏఎస్‌కు ఎంపికవ్వడమే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాదరహితంగా భర్తీ చేసిందని తెలిపారు. బాబు హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను సీఎం జగన్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్-1, గ్రూప్-2 వంటి గెజిటెడ్ పోస్టులతోపాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు జరిగాయని తెలిపారు. నాడే పడిన వివాదాల బీజం 2018లో బాబు హయాంలో గ్రూప్-1 విషయంలో వివాదాలు తలెత్తిన్నట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 2018 మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్లో దాదాపు 62 తప్పులు దొర్లాయని చెప్పారు. వీటికి నాటి చంద్రబాబు ప్రభుత్వంగానీ, నాటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్గానీ సమాధానం చెప్పలేదని ప్రస్తావించారు. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం ఎప్పటి నుంచో ఉండగా..డిజిటల్ మూల్యంకనం ప్రతిపాదన నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్‌దేనని అన్నారు. సంప్రదాయ పద్ధతి విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన చేయగా, నాటి కమిషన్‌లోని సభ్యులు కూడా ఆమోదం తెలిపి కొత్త ప్రభుత్వం ముందుంచారని చెప్పుకొచ్చారు. అనంతరం దీనిపై జాతీయ స్థాయి సదస్సును విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయగా అందుకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని తెలిపారు. మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేయాలని చూడగా.. నోటిఫికేషన్లో చెప్పని కారణంగా కోర్టు ద్వారా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. దీంతో సంప్రదాయ విధానంలోనే పేపర్లను మూల్యాంకనం చేశారన్నారు. ‘2018 గ్రూప్-1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక అయ్యారు. ఇందులో ఐఐటీ నుంచి 19 మంది, ఐఐఎం నుంచి 7, ఎన్ఐటీ నుంచి 17, బిట్స్ పిలానీ నుంచి 2, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది ఉన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ చేసినవారు 177 మంది, సాధారణ పీజీ 51, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు. ఇక ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో 40 మంది సివిల్స్ రాయగా.. వీరిలో 14 మంది అదే ఏడాది ఐఏఎస్ సాధించగా, ఇద్దరు కేంద్ర సర్వీసుకు ఎంపికయ్యారు. మరో 24 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 163 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు. వీరంతా 2018 గ్రూప్-1 కంటే ముందే పలు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నవారు. వీరంతా మెయిన్స్‌లో ప్రతిభ చూపిన తర్వాతే ఇంటర్వ్యూని ఎదుర్కొన్నారు. సివిల్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని చదివినవారికి గ్రూప్-1లో గెలవడం లెక్కకాదు’ అని తెలిపారు. -
International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే?
స్త్రీలు సంపాదనపరులైతే ఏమవుతుంది? ఆర్థికంగా సమృద్ధి సాధిస్తే ఏమవుతుంది? తమ జీవితాలపై అధికారం వస్తుంది. కీలక నిర్ణయాలప్పుడు గొంతెత్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. తమకు ఏ హక్కులు రక్షణ ఇస్తాయో ఎరుక కలుగుతుంది. స్త్రీ ఇవన్నీ కుటుంబ సంక్షేమానికే వెచ్చిస్తుంది. స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంటా, బయటా స్త్రీ, పురుషుల సమ భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుంది. కాని స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి ఇంకా ఎంతో చైతన్యం కావాలి. స్త్రీలు సాధికారత పొందటం అంటే ఏమిటి? పరాధీనత నుంచి బయటపడటమే. అంటే? మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటమే. తండ్రి, భర్త, కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయట పడటం. అంటే బంధం నుంచి బయటపడటం కాదు. స్థితి నుంచి మాత్రమే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబపరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి. పుట్టుక నుంచే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే తీసివేయడం నేటికీ జరుగుతోంది. ‘ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టడానికి’ అనుకునే తల్లిదండ్రులు, భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికీ జరుగుతూనే ఉంది. ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చినా చదువు వల్ల వచ్చే, ఆమెకై ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు. స్త్రీలను ‘అదుపులో ఉంచడం’ అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే. పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు. దానివల్ల న్యూనతతో ఉండాలి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త/తండ్రి/కుమారుడి మాట చెల్లుబాటు కావడానికి కారణం వారు ‘ఆర్థిక వనరులు కలిగి ఉండటం’. ‘రూపాయి సంపాదన లేని దానివి నువు కూడా మాట్లాడేదానివేనా’ అని స్త్రీలను పరోక్షంగా అనడం. అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తోంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు. కుటుంబపరంగా, సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వావలంబన వల్ల కలుగుతుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. అందుకు చదువు ముఖ్య సాధనం. సాధికారత అంటే? స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంట్రప్రెన్యూర్ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలనుకున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై–యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం. ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించడం. ఆర్థిక అక్షరాస్యత స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ బడ్జెట్, పొదుపు, ఆదాయం తెచ్చే పెట్టుబడి... వీటి గురించి అవగాహన ఉండాలి. ‘మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే’ మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి... అందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. సొంత ఆస్తి, స్వీయపేరు మీద పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఎమర్జన్సీ ఫండ్ కలిగి ఉండటం, డిజిటల్ పరిజ్ఞానం పొంది ఉండటం– అంటే ఆర్థిక లావాదేవీలు ఫోన్‌మీద, కంప్యూటర్ మీద చేయగలిగి వేగంగా పనులు నిర్వర్తించ గలగడం. కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్ డే సందేశం అదే. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్‌ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్‌టేబుల్‌లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్‌గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్‌ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్‌ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్‌కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్‌గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్‌గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్‌గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్‌ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్‌పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్‌కు లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్‌ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
Jones Manikonda: ట్యూషనమ్మ
విజయవాడకు చెందిన 50 ఏళ్ల జోన్స్ మానికొండ వెనుక ఏ ఆర్థిక అండాదండా లేదు. కాని ఆమె విజయవాడలో, కృష్ణాజిల్లాలో ఇంకా రాష్ట్రవ్యాప్తంగా మురికివాడల పిల్లల కోసం 60 ట్యూషన్ కేంద్రాలను వాలంటీర్లతో నడుపుతోంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వల్ల స్కూల్ ΄ాఠాల పట్ల భయం ఏర్పడకుండా, స్కూల్ మానేయకుండ ఈ ఈవెనింగ్ ట్యూషన్స్ సాయపడుతున్నాయి. మొత్తం 6 వేల మంది పిల్లలు ఇప్పటికి జోన్స్ వల్ల మేలు ΄÷ందారు. మామూలు పిల్లల సాయంత్రాలు వేరు. తల్లి వారికి స్నానం చేయించి, తినడానికి ఏదైనా ఇచ్చి, కాసేపు ఆడుకోనిచ్చి, ఆ తర్వాత చదువుకు కూచోబెడుతుంది. చదివిస్తుంది. లేదంటే ట్యూషన్‌కు పంపుతుంది. మరి మురికివాడల్లోనో? ఆ పిల్లలు స్కూల్‌కు వెళ్లడమే కష్టం. ఇంటికొచ్చాక ΄ాఠాలు చదివించాలంటే తల్లికి తీరిక ఉండదు. లేదా ఆమెకు చదువు రాదు. తండ్రికి అసలే పట్టదు. మరుసటి రోజు స్కూల్‌కు వెళితే హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ తిడుతుందని భయం. దాని బదులు స్కూల్ ఎగ్గొట్టడమే నయం. ఇలా ఆ పిల్లలు డ్రాపవుట్స్‌గా మారితే? అందుకే జోన్స్ మానికొండ మురికివాడల్లో ట్యూషన్లు నడుపుతుంది. ఆదర్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ పేరుతో ఆమె నడుపుతున్న ట్యూషన్లు ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల చదువుకు మేలు చేస్తున్నాయి. చదువే గౌరవం విజయవాడలోనే పుట్టి పెరిగిన జోన్స్ మానికొండ ఏడుగురు సంతానంలో రెండవది. సోషియాలజీలో ΄ోస్ట్గ్రాడ్యుయేషన్ చేశాక ఎం.ఈడీ. చేసి, సైకాలజీలో మరో పీజీ చేసింది. ‘మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరం బాగా చదువుకున్నాం. చదువు మాత్రమే మనిషికి గౌరవం, ఉ΄ాధి ఇవ్వగలదు. కాని నేటికీ చాలా పేదవాడల్లో పిల్లలకు చదువు అందడం లేదు. మురికివాడల్లోని పిల్లల కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాను. ప్రతి ఒక్కరూ చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే కాదు సమాజం మీద కూడా ఉంది’ అంటుందామె. సమాజసేవ కోసం అవివాహితగా ఉండాలని నిర్ణయించుకుంది జోన్స్. వెనుకబడ్డ సమూహాలు మురికివాడల్లో ఎక్కువగా ఉంటున్నది వెనుకబడ్డ సమూహాలు అని గమనించి ఆ సమూహాల మీద దృష్టి పెట్టింది జోన్స్. యానాది, ఎరుకల, వడ్డెర, జంగం, సుగాలి, కోయ... ఇలా 19 సమూహాలను గుర్తించి వారి నివాస ్ర΄ాంతాల్లో ట్యూషన్ సెంటర్లను నిర్వహిస్తోంది. మొత్తం కృష్ణాజిల్లాలో 22, విజయవాడలో 13, వైజాగ్‌లో 4, హైదరాబాద్‌లో 3 సెంటర్లు ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 48 టీచర్లు, 13 మంది వాలంటీర్లు మురికివాడల్లో ట్యూషన్లు చెబుతూ పిల్లలు స్కూళ్లకెళ్లి బాగా చదువుకునేలా సహాయం చేస్తున్నారు. బంధుమిత్రుల సాయంతో జోన్స్ నిర్వహిస్తున్న ఈవెనింగ్ ట్యూషన్లకు నెలకు దాదాపు 2 లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో దాదాపు ఎక్కువ భాగం సౌత్ ఆఫ్రికాలోని ఒక సోదరుడు, సింగపూర్‌లో ఉన్న ఒక సోదరి ఇస్తారు. మరికొంత సాయం స్నేహితుల వల్ల... దాతల వల్ల అందుతుంది. ‘కేవలం చదువు మాత్రమే కాదు... ఈ పిల్లలకు ΄ûష్టికాహారం, పరిశుభ్రమైన బట్టలు కూడా కావాలి. ఆ దిశగా కూడా నా సేవ కొనసాగాలని కోరుకుంటున్నాను. పేదరికం వల్ల పిల్లల్ని పనుల్లో పెట్టే తల్లిదండ్రులను ఒప్పించి ఆ పిల్లలను బడికి పంపేలా చూడటం మాకున్న అతిపెద్ద సవాలు’ అంటుంది జోన్స్. లెక్చరర్‌గా ఉద్యోగం మానేసి మరీ ఆమె చేస్తున్న ఈ సేవకు సమాజం నుంచి మరింత మద్దతు దొరుకుతుందని ఆశిద్దాం. -
వల్లీ టీచర్... వెరీ స్పెషల్
మాతృదేవోభవ... పితృదేవోభవ... ఆచార్యదేవోభవ... అని నేర్చుకున్నాం. స్పెషల్ ఎడ్యుకేటర్‌లో గురువుతోపాటు తల్లి, తండ్రి కూడా ఉంటారు. ఆ ప్రత్యేక గురువులకు ఎన్ని వందల వందనాలు సమర్పించినా తక్కువే. ఈ పిల్లలకు ప్రేమను పంచడానికే అంకితమైన వల్లీసుధీర్కి ప్రత్యేక వందనం! భగవంతుడు కొంతమంది పిల్లలను భూమ్మీదకు ప్రత్యేకంగా పంపిస్తాడు. కల్మషం తెలియని ఆ స్పెషల్ కిడ్స్‌కి పాఠం చెప్పే టీచర్లు కూడా అంతే స్వచ్ఛమైన మనసు కలిగిన వారై ఉండాలి. ఆ టీచర్లు ప్రతి బిడ్డకూ అమ్మగా మారి తల్లిప్రేమను పంచాలి. స్పెషల్ టీచర్ అనేది ఉద్యోగం కాదు, అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ. నాలుగు దశాబ్దాలకు పైగా అలాంటి సేవకు తనను అంకితం చేసుకున్న మనీషి వల్లీసుధీర్. స్పెషల్ కిడ్స్‌కు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రమాణం చేసుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆమె. తాను స్పెషల్ టీచర్‌గా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు వల్లీసుధీర్. సినిమారీళ్లన్ని మలుపులు! ‘‘నేను స్పెషల్ టీచర్ కావడం వెనుక సినిమా కథలో ఉన్నన్ని మలుపులున్నాయి. మాది తెలుగు కుటుంబమే. కానీ పుట్టింది చెన్నైలో. మా నాన్న కెవీఎస్ శర్మ నటులు. ఎన్టీఆర్‌తో కలిసి చదువుకున్నారు, ఆయనతో కలిసి చెన్నైకి వెళ్లారు, ఆయనతో కలిసి సినిమాలు చేశారు. అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్న హటాత్తుగా పోయారు. దాంతో నేను, అమ్మ మా అమ్మమ్మగారింటికి విజయవాడకు వచ్చేశాం. టెన్త్ క్లాసు పూర్తయ్యేసరికి తాతగారు కూడా పోయారు. ఇక నేను, అమ్మ హైదరాబాద్‌లోని పిన్ని వాళ్లింటికి వచ్చాం. పూర్తిగా వాళ్ల మీద ఆధారపడిపోకుండా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకున్నాను. స్వీకార్, ఉప్కార్ లో పిల్లలకు శిక్షకుల కోసం చూస్తున్నారని తెలిసింది. అలా స్పెషల్ చిల్డ్రన్ కోసం పని చేయాల్సిన రంగంలోకి అడుగుపెట్టాను. మొదటిరోజు నాకు ఇద్దరు కవల పిల్లలనిచ్చి చూసుకోమన్నారు. పిల్లల అవసరాలు తెలుసుకుని సముదాయించగలిగిన వయసు కాదది. ఇందులో ఇమడలేననుకుని, బాబాయ్‌కి చెప్తే ‘భయపడి వదిలేయడం కాదు, నీ వంతు ప్రయత్నం చెయ్యి. తర్వాత చూద్దాం’ అన్నారు. అలా కొనసాగుతున్న సమయంలో స్వీకార్ వాళ్లు నన్ను శిక్షణ కోసం మణిపాల్‌కి పంపించారు. ఆ శిక్షణ నా మీద అంతటి ప్రభావం చూపిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. అమ్మకు పరీక్షలు పెట్టానట! పిల్లలు మానసిక సమస్యలతో పుట్టడానికి దారి తీసే కారణాలను వివరించారు. నొప్పులు మొదలైన తర్వాత ప్రసవం జరగడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఉమ్మనీరు పోవడం, పుట్టిన వెంటనే బిడ్డ ఏడవకపోవడం... వంటి సమస్యలను వివరిస్తూ ప్రసవం సమయంలో తల్లిమాత్రమే కాదు బిడ్డ కూడా తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతుందని చెప్పారు. ఎక్కువ సమయం ఆక్సిజన్ అందక పోవడంతో ఎదురయ్యే పరిణామాలను వివరించారు. అంతే... నా గురించి అమ్మ ఎప్పుడూ చెప్పే ఒక విషయం గుర్తు వచ్చింది. ‘నేను పుట్టినప్పుడు మా అమ్మ రెండు రోజులు నొప్పులు పడిందట. నార్మల్ డెలివరీ కాదని సిజేరియన్ చేశారు. ఉమ్మనీరు తాగడంతోపాటు, ఆక్సిజన్ అందక దేహం నీలిరంగులోకి మారిపోయిందట. పైగా పుట్టగానే ఏడవలేదు’. ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య నేను నార్మల్‌గా పుట్టడం ఒక మిరకిల్. అవన్నీ మణిపాల్ శిక్షణ సమయంలో ఒక్కసారిగా రీలు తిరిగినట్లు కళ్ల ముందు మెదిలాయి. నాకు తెలియకుండానే చెంపల మీద కన్నీళ్లు కారిపోయాయి. భగవంతుడికి మనసులోనే దణ్ణం పెట్టుకుని, నార్మల్‌గా పుట్టించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ... ‘నా చివరి ఊపిరి వరకు స్పెషల్ కిడ్స్‌కి సర్వీస్ ఇస్తాను’ అని ఒట్టుపెట్టుకున్నాను. అప్పటి నుంచి స్పెషల్ చిల్డ్రన్‌కి సర్వీస్ ఇవ్వడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. గ్రాడ్యుయేషన్, డీఎమ్ఆర్, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీలో పీజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో పీజీతోపాటు లండన్‌లో ‘కోర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్’ కోర్సు చేశాను. స్వతంత్రులుగా నిలబెట్టాలి! స్పెషల్ చిల్డ్రన్ గురించి సమగ్రంగా చదివిన తరవాత హైదరాబాద్‌లో‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్’ స్థాపించాను. ఈ పిల్లలు ప్రతి పనికీ ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు సొంతంగా చేసుకునేటట్లు తయారు చేయడం ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నాను. పర్సనల్ నీడ్స్... అంటే సొంతంగా తినడం, కాలకృత్యాలకు వెళ్లడం, శుభ్రం చేసుకోవడం వంటి పనులకు ఎవరి మీదా ఆధారపడకూడదు. రెండవది డొమెస్టిక్ స్కిల్స్, అంటే... తల దువ్వుకోవడం, దుస్తులు ధరించడం, చెప్పులు సరిగ్గా వేసుకోవడం వంటివి. ఇక మూడవది కాగ్నిటివ్ స్కిల్స్, అంటే... ప్రమాదాల గురించి తెలియచేయడం, అగ్నిప్రమాదం, జల ప్రమాదాలకు దూరంగా ఉండడం ఎలాగో నేర్పించడం, ప్రమాదాలు ఎదురైతే తప్పించుకోవడంలో శిక్షణనివ్వడంతోపాటు ఒక వస్తువు కొనడం, దుకాణానికి వెళ్లి డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన తరవాత చిల్లర డబ్బు తీసుకుని లెక్క చూసుకోవడం వంటి వాటిలో శిక్షణనివ్వడం అన్నమాట. ఈ మేరకు తర్ఫీదు ఇస్తే ఇక వాళ్లు జీవితంలో ఎవరికీ భారంగా పరిణమించరు. అందుకే ఈ మూడింటినే ప్రధానంగా తీసుకున్నాను. కానీ ముందే చెప్పాను కదా! నా జీవితంలో సినిమాకంటే ఎక్కువ మలుపులున్నాయని. నా ప్రయత్నం ఒకదారిలో పడే సమయానికి అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఇక నేను ఈ సెంటర్ మీద పూర్తి సమయం కేటాయించడం కుదిరేపని కాదని నా ఫ్రెండ్‌కి అప్పగించాను. శ్రద్ధ సెంటర్లో పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా చేయగలిగాను. కానీ నాకు రోజులు గడిచేదెలా? అమ్మకు వైద్యం చేయించేదెలా? అప్పుడు ‘గీతాంజలి దేవశాల’ స్పెషల్ స్కూల్లో చేరాను. అందులో 24 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. స్వీకార్ ఉప్కార్ నుంచి చూసుకుంటే 44 ఏళ్లు పూర్తయ్యాయి. పిచ్చి టీచర్ అనేవాళ్లు! సమాజంలో అప్పటికీ ఇప్పటికీ కొంత మార్పు వచ్చిన మాట నిజమే, కానీ రావలసినంత మార్పు రాలేదనే చెప్పాలి. అప్పట్లో మా గుర్తింపు ‘పిచ్చి టీచర్’, ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్ బాధ్యత ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకుని మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఈ సున్నితత్వం స్పెషల్ చిల్డ్రన్ విషయంలోనూ రావాలి. అప్పటిలాగ దూరం పెట్టడం లేదు కానీ దగ్గరకు రానివ్వడంలో ఒకింత సందిగ్ధంగానే ఉంటున్నారు. తమ పొరుగింట్లో స్పెషల్ కిడ్ ఉంటే ఆ కిడ్ని సానుభూతితో చూస్తున్నారు తప్ప, తమ పిల్లలతో ఆడుకోవడానికి అనుమతించలేకపోతున్నారు. విద్యావ్యవస్థ మాత్రం స్పెషల్ కిడ్స్ కోసం ఒక విభాగం ఉండాలనే నియమంతో ఓ ముందడుగు వేసిందనే చెప్పాలి. ఇద్దరు పిల్లల్లో ఒకరు స్పెషల్ కిడ్, ఒకరు నార్మల్ కిడ్ అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరించాలి, స్పెషల్ కిడ్ తల్లి ఇరుగుపొరుగు వారితో, వారి పిల్లలతో ఎలా మెలగాలి వంటివన్నీ చెప్పడానికి ఒక వేదిక ఉంటే బావుణ్నని చూస్తున్నాను. ఇన్నాళ్లూ నా సర్వీస్‌కి వేదిక గీతాంజలి దేవశాల. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో చెప్పాలా లేక వేరే మాధ్యమాలలో ప్రయత్నించాలా అనేది ఇంకా ఆలోచించలేదు. నాకు నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం చివరి శ్వాస వరకు స్పెషల్ కిడ్స్ కోసం పని చేస్తూనే ఉంటాను’’ అన్నారు వల్లీసుధీర్. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే! ఇన్నేళ్ల నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే... స్పెషల్ చిల్డ్రన్‌కి శిక్షణ ఇవ్వడానికి రూపొందించిన కోర్సులన్నీ ఒకరకమైన సాధనాలు మాత్రమే. వాటిని పిల్లవాడికి ఎలా అన్వయింపచేయాలనేది టీచర్ స్వీయ విచక్షణతో తెలుసుకుని ఆచరించాలి. ఒక సూత్రం ఏ ఇద్దరు పిల్లలకూ వర్తించదు. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే. మా దగ్గరకు వచ్చిన పిల్లలకు ప్రేమ పంచాలి, బాధ్యతగా శిక్షణనివ్వాలి. అలా నేర్పిస్తూ పాతిక మందిని ఓపెన్ స్కూలింగ్‌లో టెన్త్ క్లాస్ పరీక్షకు సిద్ధం చేశాం. ఆటల్లో శిక్షణనిచ్చి పోటీలకు తీసుకెళ్లాం. మా దగ్గర శిక్షణ పొందిన పిల్లలు స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఇంగ్లండ్‌లో క్రీడల పోటీలకు కూడా వెళ్లారు. – వల్లీ సుధీర్, స్పెషల్ టీచర్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
విద్యాప్రవీణ
మద్యానికి బానిసై తండ్రి చనిపోయాడు. కష్టాల మధ్య పెరిగిన ప్రవీణ పశువుల కాపరిగా పనిచేసింది. కూలిపనులు చేసింది. చదువు ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను 23 సంవత్సరాల వయసులో సర్పంచ్‌ని చేసింది. బాలికల విద్య నుంచి స్త్రీ సాధికారత వరకు ఎన్నో విషయాలపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది ప్రవీణ. రాజస్థాన్‌లోని పలి జిల్లా సగ్దార గ్రామానికి చెందిన ప్రవీణ తన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు స్ఫూర్తిదాయక మహిళగా మారింది. మూడోక్లాసులో ఉన్నప్పుడు ప్రవీణను చదువు మానిపించారు. దీంతో తనకు ఇష్టమైన చదువుకు దూరం అయింది. చదువుకు దూరం అయిన ప్రవీణ పశువులను మేపడం నుంచి కూలిపనుల వరకు ఎన్నో చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. తమ ఊరికి నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవి)లో చదువుకునే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. అయితే మొదట్లో కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక ఫీల్డ్ వర్కర్ కృషివల్ల ఎట్టకేలకు బడిలో ప్రవీణను చేర్పించడానికి ఒప్పుకున్నారు. స్కూల్ చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం మాత్రమే కాదు, ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగింది ప్రవీణ. చదువు పూర్తయిన తరువాత ఒక కన్స్ట్రక్షన్ వర్కర్‌తో ప్రవీణ పెళ్లి జరిగింది. ‘చదువుకున్న అమ్మాయి’గా అత్తగారి ఇంట్లో ప్రవీణకు తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. తాను తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడేవారు. ‘సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను’ అన్నప్పుడు అందరూ అండగా నిలబడ్డారు. కొంతమంది మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. సర్పంచ్‌గా విజయం సాధించింది. చదువు విలువ తెలిసిన ప్రవీణ సర్పంచ్ అయిన రోజు నుంచి బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటికి వెళ్లి చదువుకోవడం వల్ల ఆడపిల్లలకు కలిగే ఉపయోగాల గురించి ప్రచారం చేసేది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుకునేది. ‘అప్పుడెప్పుడో మా అమ్మాయిని చదువు మానిపించాం. ఇప్పుడు తిరిగి బడిలో చేర్చాలనుకుంటున్నాం’ అంటూ ఎంతోమంది తల్లిదండ్రులు ప్రవీణ సలహాల కోసం వచ్చేవారు. సర్పంచ్‌గా ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూలు కట్టించింది ప్రవీణ. బాలికల విద్య కోసం పనిచేస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్రవీణ ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు తమ స్కూలుకు తీసుకువెళ్లి ఆడపిల్లలకు పరిచయం చేసేవారు. ‘చదువుకోకపోతే ప్రవీణ కూలిపనులు చేస్తూ ఉండిపోయేది. చదువుకోవడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను సర్పంచ్‌ను చేసి పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేసేలా చేసింది. మీరు బాగా చదువుకుంటే సర్పంచ్ మాత్రమే కాదు కలెక్టర్ కూడా కావచ్చు’... ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేవారు. ఆడపిల్లల చదువు కోసం పనిచేస్తున్న‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రచార చిత్రాలలో ప్రవీణ ఫొటోలను ఉపయోగించుకుంటుంది. దీంతో ఎన్నో గ్రామాలకు ఆమె సుపరిచితం అయింది. ‘ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు స్కూల్లో చదివే అమ్మాయిలతో మాట్లాడుతుంటాను. మీ గురించి ఫీల్డ్ వర్కర్స్ మా పేరెంట్స్‌కు చెప్పి స్కూల్‌కు పంపించేలా ఒప్పించారు... అని ఎంతోమంది అమ్మాయిలు అన్నప్పుడు గర్వంగా అనిపించేది. ఆడపిల్లల విద్యకు సంబంధించి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’ అంటుంది ప్రవీణ. -
Hetvi Khimsuriya: బంగారంలాంటి బిడ్డ
గుజరాత్‌లోని వడోదరకు చెందిన హెత్వి ఖిమ్సూరియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పీఎం నేషనల్ చైల్డ్ అవార్డ్ (ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–పీఎంఆర్బీపి) అందుకుంది. వివిధ రంగాలలో పిల్లలు సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారం ఇది. పదమూడు సంవత్సరాల హెత్వి సెరిబ్రల్ పాల్సీని అధిగమించి పెయింటింగ్, పజిల్ సాల్వింగ్‌లో అసా«ధారణ ప్రతిభ చూపుతోంది. తనకు వచ్చే పెన్షన్‌ను దివ్యాంగుల సంక్షేమ నిధికి ఇస్తోంది. తన ఆర్ట్‌పై యూట్యూబ్ చానల్ నడుపుతోంది.... వడోదరలోని 8–గ్రేడ్ స్టూడెంట్ హెత్వి ఖిమ్సూరియాకు పురస్కారాలు కొత్త కాదు. ప్రశంసలు కొత్తకాదు. గత సంవత్సరం ఫ్రీహ్యాండ్ పెయింటింగ్, క్రాఫ్ట్, పజిల్ సాల్వింగ్‌లో చూపుతున్న ప్రతిభకు ‘గుజరాత్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. ‘వరల్డ్స్ ఫస్ట్ సీపీ గర్ల్ విత్ ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్’ టైటిల్ సాధించింది. వంద ఎడ్యుకేషనల్ పజిల్స్ సాల్వ్ చేసిన ఫస్ట్ సీపీ గర్ల్‌గా ఆమెను ‘ది లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు సాధించిన హెత్వి గీసిన చిత్రాలు యాభై ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి. చిత్రకళలపై పిల్లల్లో ఆసక్తి కలిగించడానికి ‘స్పెషల్ చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ–హెత్వి ఖిమ్సూరియా’ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. హెత్వి విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. కూతురు ప్రస్తావన వచ్చినప్పుడు ‘అయ్యో! మీ అమ్మాయి’ అంటూ ఎంతోమంది సానుభూతి చూపే సమయాల్లో ‘బాధ పడాల్సిన అవసరం ఏముంది. మా అమ్మాయి బంగారం. భవిష్యత్‌లో ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడండి’ అనేవారు. ఆ మాట అక్షరాలా నిజమైంది. చిన్నప్పటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. హెత్విని చూసుకోవడానికి ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది. రంగులు, పజిల్స్‌తో బేసిక్స్ ప్రారంభించారు. రంగులు, పజిల్స్ అంటే హెత్విలో ఇష్టం ఏర్పడేలా చేశారు. బొమ్మలు వేస్తున్నప్పుడు, పజిల్స్ పరిష్కరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్లలో శక్తి కనిపిస్తుంది. ఆ శక్తితో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని తల్లిదండ్రులలో నింపింది. హెత్వి మోములో ఎప్పుడూ చెరగని చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వే ఈ చిన్నారి బలం. హెత్వి ఖిమ్సూరియా మర్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. -
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్‌ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో చేరి, నా కెరీర్‌ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్‌ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్‌గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్‌ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్‌లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్‌లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్
తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండో సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు ఇండియాటుడే తరపున రాజ్‌దీప్ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు సవివరంగా.. రాజ్‌దీప్ : తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం, చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయం సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు రాజ్‌దీప్ : మూడో తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి. తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? సీఎం జగన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి రాజ్‌దీప్ : అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? సీఎం జగన్ : ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం. పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్ నేర్చుకునేందుకు అందించాం. రాజ్‌దీప్ : 8వ తరగతి విద్యార్థికి టాబ్ ఇచ్చారా? కోవిడ్ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు? ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.? వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా? సీఎం జగన్ : 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి. డిసెంబర్ 21న టాబ్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్ అందజేస్తాం. రాజ్‌దీప్ : ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు, మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా? IB సిలబస్ కూడా ప్రవేశపెట్టారా? అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.? అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.? సీఎం జగన్ : ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్ ప్రవేశపెడతాం. అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం. ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకెట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా.. ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి రాజ్‌దీప్ : అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే. కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా? సీఎం జగన్ : ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది. 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు. ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం. రాజ్‌దీప్ : ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా? దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా? సీఎం జగన్ : ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం. నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం. రాజ్‌దీప్ : 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48, ఆ ఏడాది జాతీయ సగటు 99.21. ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు? జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా? ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా? సీఎం జగన్ : మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది. గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం. అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు. రాజ్‌దీప్ : ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.? నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది. ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా? సీఎం జగన్ : ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది. నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను. కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను. మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం: ------------- విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి 5.12pm, జనవరి 24, 2024 విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు సీఎం జగన్ 5.11pm, జనవరి 24, 2024 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చర్చ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 5.10pm, జనవరి 24, 2024 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్ తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ Updates: ►ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం జగన్ ►ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చ ►దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంస ►రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం జగన్ ►తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. -
AP: విదేశాల్లో చదువుతున్నారా? ఉచిత బీమా పథకాన్ని సద్వినియోగించుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది. ఇందులో ఒకటి ముఖ్యమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వారు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తీగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం 15 జనవరి 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి, ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోగలరు. (ఇంతకుముందు సంవత్సరానికి రూ.180 ల ప్రీమియంగా ఉండేది). లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ విద్యకు పంపుతున్నారు. అలా వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసా. ఈ మధ్యకాలంలో మనం పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము... విద్యార్థులు సరదాగా బయటకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలకు గురవ్వడం అత్యంత బాధాకరం. ఈ బీమా లో నమోదు చేసుకోవడం వలన హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది. విద్యార్థులు, లేదంటే వారి తరఫున వారి పేరు మీద తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమా లో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. ఈ పథకం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ బీమా వలన ముఖ్య ప్రయోజనాలు ► బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ► ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. 1లక్ష వరకు చెల్లింపు ► ప్రమాదం/అస్వస్థతకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే, స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లింపు ... ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ప్రవాసాంధ్ర భరోసా బీమా నందు నమోదు కొరకు APNRTS 24/7 హెల్ప్‌లైన్ +91-863-2340678; +91 85000 27678 (వాట్సప్) ను సంప్రదించండి మరియు వెబ్ సైట్-బీమా పేజి https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అవ్వండి. లేదా insurance@apnrts.com; helpline@apnrts.com కు ఇమెయిల్ చేయండి. ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ ని సందర్శించండి. -
MPhil కోర్సులపై UGC కీలక హెచ్చరిక
ఢిల్లీ: మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ(MPhil) కోర్సులపై యూనివర్సిటీ గ్రాండ్స్ కమీషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసీంది. ఎంఫీల్(MPhil)కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ కార్యదర్శి మనీష్ ఆర్. జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు యూనివర్సిటీలు ఇచ్చే ఎంఫీల్ (MPhil) ప్రోగ్రామ్‌కు ఎటువంటి గుర్తింపు లేదని (UGC)యూజీసీ వెల్లడించింది. ఎంఫీల్(MPhil)ను రద్దు చేసినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు అందిస్తున్నందున విద్యార్థులు ఎవరూ చేరవద్దని పేర్కొంది. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి 2023-2024 విద్యా సంవత్సరంలో ఎంఫీల్(MPhil) అడ్మిషన్లు నిలిపిలి వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 2022 నాటి యూజీసీ నిబంధనలను గుర్తు చేస్తూ.. ఎంఫీల్(MPhil)కు గుర్తింపు లేదని యూజీసీ బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. చదవండి: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’.. కేంద్రంపై టీఎంసీ ఎంపీ విమర్శలు -
ఐఐటీ బాంబేకి పూర్వ విద్యార్థుల భారీ విరాళం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బాంబే)కి పూర్వ విద్యార్థులు భారీగా విరాళం అందించారు. 1998 బ్యాచ్‌కి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు రూ. 57 కోట్లు ప్రకటించారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా 1971 బ్యాచ్ విద్యార్థులు ఇచ్చిన రూ. 41 కోట్లకన్నా ఇది అధికం కావడం గమనార్హం. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ్ సక్సేనా, పీక్ ఫిఫ్టీన్ ఎండీ శైలేంద్ర సింగ్, గ్రేట్ లెరి్నంగ్ సీఈవో మోహన్ లక్కంరాజు, వెక్టర్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ తదితరుల 1998 బ్యాచ్‌లో ఉన్నారు. ఈ నిధులు సంస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడగలవని ఐఐటీ బాంబే డైరెక్టర్ శుభాశీస్ చౌదరి తెలిపారు. అలాగే 2030 నాటికల్లా ప్రపంచంలోనే టాప్ 50 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోవాలన్న లక్ష్య సాకారానికి కూడా తోడ్పడగలదని పేర్కొన్నారు. -
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
25 ఏళ్లు..23 అటెంప్ట్‌లు..చివరికి సాధించాడు
భోపాల్: అతడొక సెక్యూరిటీ గార్డు.. అతడి నెల సంపాదన రూ.5 వేలు. కానీ అతడిప్పుడు పట్టుదలకు, ధృడ నిశ్చయానికి, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో నివిసించే 56 ఏళ్ల ఆసెక్యూరిటీ గార్డు పేరు రాజ్‌కరణ్ బారువా. ఇంతకీ అతడి గొప్పేంటంటే ఎమ్మెస్సీ మ్యాథ్స్ పీజీ డిగ్రీలో పాసవ్వాలనే కల కోసం 25 ఏళ్లు వేచి చూశాడు. 25 ఏళ్లలో 23 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. 24వసారి విజయం సాధించాడు. మ్యాథ్స్‌లో పీజీ సాధించి కల నెరవేర్చుకున్నాడు. నిజానికి 1996లోనే అతనికి ఆర్కియాలజీలో మొదటి పీజీ వచ్చింది. అప్పుడే అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ మ్యాథ్స్‌లో రెండో పీజీ సాధించడం అతడి కల. కల కోసం పట్టు వదలని విక్రమార్కునిలా కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. ఈ 25 ఏళ్లలో అతడు రాత్రి సెక్యూరటీగార్డుగా, పగలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ చదివాడు. ‘నాకు ఇంఘ్లీష్ పెద్దగా రాదు. ఇదే నాకు మ్యాథ్స్ పీజీ పాసవడానికి అడ్డంకిగా మారింది. ప్రతిసారి ఒక్క సబ్జెక్టు తప్ప అన్నింటిలో ఫెయిల్ అయ్యేవాడిని. కానీ చివరికి ఇండియన్ ఆథర్ రాసిన పుస్తకాలు చదవి పాసయ్యాను. నేను పరీక్షలు రాస్తున్నట్టు పనిచేసే చోట ఎవరికీ చెప్పే వాడిని కాదు. ఎవరికి తెలియకుండా రాత్రి వేళల్లో చదువుకునేవాడిని. అప్పుడు కూడా ఎవరైనా పని ఉందని పిలిస్తే వెళ్లి పనిచేసేవాడిని. నేను పెళ్లి చేసుకోలేదు. కానీ నా కలలతోనే నాకు పెళ్లి జరిగింది’అని బారువా చెప్పుకొచ్చాడు. ఇదీచదవండి..ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్