
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ బుధవారం ప్రకటించింది. పదో తరగతి పరీ క్షలు మార్చి 18వ తేదీన ముగియ నున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ నాలుగో తేదీన ముగియనున్నాయి.
సీబీఎస్ ఈ 86 రోజుల ముందుగానే బోర్డ్ పరీక్షల తేదీలను ప్రకటించడం ఇదే తొలిసారి. ‘‘ప్రతి రెండు సబ్జెక్ట్ పరీక్షల మధ్య సరిపోను వ్యవధి ఉండేలా చూశాం. 40,000 సబ్జెక్ట్ కాంబినేషన్లను దృష్టిలో ఉంచుకుని పరీక్ష తేదీల ను సిద్ధంచేశాం.