breaking news
NRI
-
పిట్స్‌బర్గ్‌లో దారుణ హత్యకు గురైన ఎన్నారై
చంద్రమౌళి నాగమల్లయ్య ఉదంతం మరువక ముందే.. అమెరికాలో భారత సంతతి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. పెన్సిల్వేనియాలో ఓ మోటల్ మేనేజర్‌గా పని చేస్తున్న రాకేశ్ ఇహగబన్(51)ను ఓ దుండగుడు కాల్చి చంపేశాడు. తన మోటల్ బయట జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన క్రమంలోనే ఆయన అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. పెన్సిల్వేనియా స్టేట్ పిట్స్‌బర్గ్‌లో ఉన్న ఓ మోటల్లో రాకేశ్ ఇహబగన్(Rakesh Ehagaban) మేనేజర్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీన(శుక్రవారం) మధ్యాహ్నా సమయంలో మోటల్ బయట పార్కింగ్ వద్ద ఏదో అలజడి వినిపించింది. బయటకు వెళ్లిన ఆయనకు.. ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న గన్‌తో ఓ మహిళపై కాల్పులకు దిగడం కనిపించింది. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తిని ‘‘ఆర్ యూ ఆల్రైట్ బడ్’’ అంటూ రాకేష్ పలకరించాడు. అంతే తన చేతిలో గన్ను రాకేష్ వైపు తిప్పి పాయింట్ బ్లాక్ రేంజ్లో షూట్ చేశాడు ఆ దుండగుడు. బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి రాకేష్ మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పారిపోతున్న నిందితుడిపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. ఈ కాల్పుల్లో నిందితుడితో పాటు ఓ పోలీస్ అధికారి సైతం గాయపడ్డారు. నిందితుడిని స్టాన్లీ వెస్ట్గా(38) నిర్ధారించిన పోలీసులు.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన అదనపు వివరాల ప్రకారం.. స్టాన్లీ వెస్ట్ గత రెండు వారాలుగా రాకేష్ మేనేజర్‌గా పని చేస్తున్న పిట్స్బర్గ్ మోటల్లోనే ఉంటున్నాడు. పార్కింగ్ వద్ద అతను కాల్పులు జరిపిన మహిళ కూడా అతనితోనే అక్కడే ఉంటోంది(ఓ చంటి బిడ్డతో సహా). అయితే శుక్రవారం ఏదో గొడవ జరిగి ఆమె వెళ్లిపోతుంటే.. స్టాన్లీ ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆమె మెడలో తూటా దిగి తీవ్రంగా గాయపడింది. వెనక సీటులో ఉన్నా ఆమె బిడ్డకు అదృష్టవశాత్తూ ఏం కాలేదు. రక్తస్రావం అవుతుండగానే.. ఆమె తన వాహనాన్ని తీసుకుని కొద్దిదూరం పారిపోయింది. తర్వాత ఆమెను గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె స్పృహలోకి వస్తేనే ఏం జరిగిందనేది తెలుస్తుందని కేసు దర్యాప్తు చేస్తున్న రాబిన్సన్ టౌన్షిప్ పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఏం సంబంధం లేకుండా గొడవను ఆపేందుకు వెళ్లి భారత సంతతికి చెందిన రాకేశ్ ఇహగబన్ ప్రాణాలు పొగొట్టుకున్నారని వెల్లడించారు.సెప్టెంబర్ 10వ తేదీన.. అమెరికా టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలోని ఓ మోటల్ మేనేజర్ అయిన చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను అక్కడ పని చేసే.. యోర్డాన్స్ కోబోస్ కత్తితో తల నరికి హత్య చేసిన ఘటన తెలిసిందే. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో చిన్నపాటి గొడవకే ఆగ్రహంతో ఊగిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు కోబోస్. ఈ దారుణం మల్లయ్య భార్య, కుమారుడి కళ్ల ముందే జరగడం గమనార్హం. తల నరికి.. దానిని కాలితో తన్ని.. ఆపై చెత్త బుట్టలో వేసిన దృశ్యాలు కలవరపాటుకు గురి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చికాగోలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యారు(Telugu Man Dies in US Chicago). చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మరణించినట్లు సమాచారం. మృతుడిని హైదరాబాద్ చంచల్‌గూడకి చెందిన షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్(25)గా గుర్తించారు. ఆదివారం ఇల్లినాయిస్ ఈవెన్‌స్టన్ వద్ద జరిగిన ప్రమాదంలో షెరాజ్(Sheraz Chicago Road Accident) అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో హైదరాబాద్‌లోని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత స్థాయి అవకాశాల కోసం తమ కుమారుడు దేశంకాని దేశం వెళ్లి ఇలా మరణించడంటూ ఆయన తండ్రి అల్తాఫ్ మొహమ్మద్ చెబుతున్నారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. డల్లాస్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ పోలే అనే హైదరాబాదీ యువకుడు మరణించిన ఘటన తెలిసిందే. 48 గంటలు తిరకగ ముందే మరో నగరవాసి రోడ్డు ప్రమాదంలో మరణించడం అక్కడి భారతీయ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది. -
రెడింగ్‌లో భవ్యంగా బతుకమ్మ జాతర
బర్క్‌షైర్ (యూకే): యునైటెడ్ కింగ్డమ్ రెడింగ్లోని రెడింగ్ జాతర టీమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు కుటుంబాల సమాగమంగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి వెయ్యికి పైగా మంది హాజరై, తెలంగాణ సంస్కృతిని ఘనంగా చాటారు. పారంపర్య బతుకమ్మ పాటలతో మహిళలు బతుకమ్మలు ఆడగా, యువతులు, పిల్లలు ఉత్సాహంగా డాండియా ఆడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దుర్గాపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులు కట్టిపడేసేలా భరతనాట్యం ప్రదర్శించగా, తెలుగు వంటకాలతో సాంప్రదాయ విందు అందించారు. వేడుకల అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడంతో కార్యక్రమం ముగిసింది. ఈ భవ్య కార్యక్రమాన్ని గత 11 ఏళ్లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు విశ్వేశ్వర్ మంథని, రంజిత్ నడిపల్లి, ప్రసాద్ అవధానుల, రమేశ్ జంగిలి, రఘు, చందు, రామ్‌రెడ్డి, రామ్‌ప్రసాద్, నాగార్జున మాట్లాడుతూ – “తెలంగాణ సంప్రదాయాలను తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం కొనసాగిస్తాం” అని తెలిపారు. -
మలేషియాలో దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
కౌలాలంపూర్, అక్టోబర్ 4: భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో, మలేషియాలోని అన్ని భారతీయ సమాజాలు కలసి ఘనంగా “దసరా • బతుకమ్మ • దీపావళి 2025” మహోత్సవాన్ని టానియా బ్యాంక్వెట్ హాల్, బ్రిక్ఫీల్డ్స్ లో నిర్వహించాయి.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ గారు లోక్‌సభ సభ్యుడు, హాజరై ఆశీస్సులు అందించారు. అలాగే భారత హైకమిషనర్ మరియు మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొని వేడుకకు విశిష్టతను తీసుకువచ్చారు. అతిథులు మాట్లాడుతూ – “ఈ వేడుక తెలుగు వారికే పరిమితం కాకుండా భారత దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి భారతీయుడు ఐక్యంగా జరుపుకున్న ఒక గొప్ప సాంస్కృతిక మహోత్సవం. నిజంగా కన్నుల పండుగగా నిలిచింది” అని అభినందించారు.సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలు, పండుగ ప్రత్యేకతలతో కూడిన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకలో మలేషియాలో నివసిస్తున్న అన్ని భారతీయ NRIలు విశేషంగా పాల్గొని BAM మహోత్సవాన్ని విజయవంతం చేశారు.BAM ప్రధాన కమిటీ సభ్యులు* చోప్పరి సత్య – అధ్యక్షుడు* భాను ముత్తినేని – ఉపాధ్యక్షుడు* రవితేజ శ్రీదశ్యం – ప్రధాన కార్యదర్శి, IT మరియు PR కమ్యూనికేషన్* రుద్రాక్షల సునీల్ కుమార్ –కోశాధికారి * గజ్జడ శ్రీకాంత్ – సంయుక్తకోశాధికారి * రుద్రాక్షల రవికిరణ్ కుమార్ – యువజన నాయకుడు* గీత హజారే – మహిళా సాధికారత నాయకురాలు* సోప్పరి నవీన్ – కార్యవర్గ సభ్యుడు* యెనుముల వెంకట సాయి – కార్యవర్గ సభ్యుడు* అపర్ణ ఉగంధర్ – కార్యవర్గ సభ్యుడు* సైచరణి కొండ – కార్యవర్గ సభ్యుడు* రహిత – కార్యవర్గ సభ్యుడు* సోప్పరి రాజేష్ – కార్యవర్గ సభ్యుడు* పలకలూరి నాగరాజు – కార్యవర్గ సభ్యుడుBAM అధ్యక్షుడు చోప్పరి సత్య మాట్లాడుతూ: “ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన భారత హైకమిషన్, మలేషియా ప్రభుత్వ అధికారులు, అతిథులు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులు మరియు మలేషియాలోని భారతీయ సమాజానికి మనఃపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు -
అమెరికా డల్లాస్‌లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో గన్ కల్చర్ మరో నిండు ప్రాణం బలి తీసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు(Telangana Student Dies Dallas Gun Fire). భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ పోలే స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ డల్లాస్ వెళ్లాడు. ఆరు నెలల కిందటే అతని మాస్టర్స్ డిగ్రీ పూర్తైంది. అయితే ఫుల్‌టైం ప్లేస్మెంట్ కోసం ఎదురు చూసే క్రమంలో స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బీఎన్ రెడ్డిలోని చంద్రశేఖర్ కుటుంబం నివాసం ఉండే కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ‘‘బీడీఎస్ పూర్తి చేసి.. ఉన్నత పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది.... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారాయన.బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన… pic.twitter.com/RJy8BdteiD— Harish Rao Thanneeru (@BRSHarish) October 4, 2025సీఎం రేవంత్ విచారంఅమెరికాలో హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో పోలే చంద్రశేఖర్ మరణం ఆవేదన కలిగించింది. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తాం అని ఒక ప్రకటనలో తెలిపారు. -
లండన్‌లో తెలుగు విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా : జిల్లాలోని మేడిపల్లి మండలం దమ్మనపేట్లో విషాదచాయలు అలుముకున్నాయి. దమ్మనపేట్కు చెందిన ఎనుగు మహేందర్ రెడ్డి (26) అనే అనే విద్యార్థి లండన్‌లో దుర్మరణం చెందాడు. ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్‌కు వెళ్లిన మహేందర్‌రెడ్డికి గుండెపోటు రావడంతో మృత్యువాత పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నిన్న(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) రాత్రి మహేందర్‌రెడ్డి చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు తండ్రి రమేష్‌రెడ్డికి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం లండన్‌కు వెళ్లాడు మహేందర్‌రెడ్డి. కుమారడు ప్రయోజకుడు అవ్వడానికి లండన్ వెళ్లి ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు. -
అమెరికాలోని ఒమాహా నగరంలో బతుకమ్మ వేడుకలు
తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఓమాహా నగరంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ దేవాలయ సామాజిక భవనంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అత్యంత వైభవంగా నిర్వహించడం ద్వారా తమ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా, తమ తల్లిదండ్రుల నేలతో గల అనుబంధాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్తు తరాలకు ఈ సంప్రదాయాలు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించారు. గత దశాబ్దానికి పైగా ఈ వేడుకలను అపర్ణ నేదునూరి, స్నిగ్ధ గంటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వెయ్యికి పైగా తెలుగు కుటుంబాలు, సంఘ సభ్యులు హాజరయ్యారు.ఈ ఉత్సవంలో సంప్రదాయకంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రతి బతుకమ్మను ప్రత్యేకంగా రూపొందించారు. సువాసనభరిత పూలతో అలంకరించారు. వీటిలో భక్తి, సృజనాత్మకత, తెలుగు వారసత్వం ప్రతిబింబించింది. రంగురంగులు, వినూత్నంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా విజేతగా నిలిచిన శ్రీదేవి నలం ఈసారి కూడా తన సృజనాత్మక అలంకరణతో మూడోసారి బహుమతి గెలుపొందారు. ఇది వేల మైళ్ళ దూరంలో ఉన్నా, తెలుగు సంప్రదాయాలను సజీవంగా నిలుపుకునే నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలలో సంప్రదాయ తెలుగు వంటకాలు భోజన ప్రియుల నోరూరించాయి. పిల్లలు కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలారు. నిజమైన తెలుగు సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించారు. -
టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే..
ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రలో ఉమ్రాహ్‌కు ప్రత్యేకత ఉంది. రంజాన్ పర్వదినం తర్వాత హజ్ యాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో తబాబ్, అరాఫత్ పర్వత సందర్శన.. సైతానుపై రాళ్లను విసరడం.. అక్కడే ఒక నిద్ర చేయడం వంటి క్రతువులు ఉంటాయి. హజ్ సీజన్లో కాకుండా.. మక్కా యాత్ర చేయడాన్ని ఉమ్రాహ్ అంటారు. ఇప్పుడు ఉమ్రాహ్ విషయంలో సౌదీ సర్కారు కొత్త నిబంధనలను ప్రకటించింది. టూరిస్టు వీసాపై వచ్చేవారికి ఉమ్రాహ్‌కు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.ఏమిటీ ఉమ్రాహ్హజ్లో మాదిరిగానే ఉమ్రాహ్లోనూ క్రతువులుంటాయి. అయితే.. అరాఫత్ సందర్శన, సైతానుపై రాళ్లు వేయడం ఉండదు. ఉమ్రాహ్‌కు వెళ్లేవారు దోవతి, ఉత్తరీయం మాదిరి తెలుపురంగు దుస్తులను ధరించాలి. దీన్ని దీక్షగా భావిస్తారు. నిజానికి మక్కాకు 30కిలోమీటర్ల దూరంలోనే ఈ రీతిలో వస్త్రధారణ చేసి.. యాత్రను ప్రారంభించాలి. భారతీయులు మాత్రం విమానాశ్రయంలోనే ఈ దుస్తులను ధరిస్తారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాక.. బయటకు వచ్చి, శిరోముండనం చేయించుకుంటే.. ఉమ్రాహ్ పూర్తవుతుంది. మహిళా భక్తులు శిరోముండనం చేయించుకోరు. కానీ, మూడు లేదా ఐదు కత్తెరలు ఇస్తారు.ఉమ్రాహ్ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి విదేశాల నుంచి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన మార్పులను అసా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ కైసర్ మహమూద్ తెలిపారు.వీసా దరఖాస్తు చేసేటప్పుడే వసతి బుకింగ్యాత్రికులు ఇకపై వసతిని ధ్రువీకరించకుండా ఉమ్రాహ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు. నుసుక్ యాప్‌కు అనుసంధానించబడిన మసర్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు వీసా దరఖాస్తు సమయంలో ఆమోదించిన హోటల్‌ను ఎంచుకోవాలి. లేదా వారు సౌదీ అరేబియాలోని బంధువులతో ఉంటారని ధ్రువీకరించుకోవాలి. హోటళ్లు, రవాణా మసర్ అని పిలువబడే సౌదీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. టాక్సీలను కూడా పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలి.బంధువులతో ఉండటానికి హోస్ట్ ఐడీ అవసరంప్రయాణికులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉండాలని ప్లాన్ చేస్తే హోస్ట్ ఏకీకృత సౌదీ ఐడీ నంబర్‌ను అందించాలి. ఈ ఐడీ మీ వీసాకు డిజిటల్‌కు అటాచ్ చేస్తారు. ప్లాన్‌లో ఏదైనా మార్పు ఉంటే వసతి రుజువుగా అదే ఐడీతో సిస్టమ్‌లో అప్ డేట్ చేయాలి.టూరిస్ట్ వీసాలపై ఉమ్రాహ్ చేయకూడదు..టూరిస్ట్ వీసాపై ఉమ్రాహ్ చేయడం నిషేధించారు. ఒకవేళ ఇందుకోసం ప్రయత్నించే యాత్రికులను మదీనాలోని రియాజ్ ఉల్ జన్నా వంటి కీలక ప్రదేశాల్లో ప్రవేశం నిరాకరిస్తారు.డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా తప్పనిసరినుసక్ ప్లాట్‌ఫామ్ ద్వారా లేదా లైసెన్స్ పొందిన ఆపరేటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా మాత్రమే చెల్లుబాటు అవుతుంది.ప్రయాణ మార్పులు అనుమతించరు..వీసా దరఖాస్తు సమయంలో యాత్రికులందరూ వివరణాత్మక ప్రయాణ ప్రణాళికను అప్లోడ్ చేయాలి. దీన్ని సబ్మిట్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు లేదా వాయిదాలకు అవకాశం ఉండదు. ప్రయాణ తేదీలను మార్చడం కుదరవు. తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తే ఏజెంట్లకు ఒక్కొక్కరికి కనీసం 734(రూ.18 వేలు) దిర్హమ్లు జరిమానా విధిస్తారు.వీసా ఆన్ అరైవల్యూకే, యూఎస్, కెనడా లేదా షెంజెన్ వీసాలు కలిగి ఉన్నవారు లేదా ఆ దేశాల్లో నివాసితులుగా ఉన్నవారు వీసా ఆన్ అరైవల్ కోసం అర్హులు. ఈ వీసా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది.హోటల్, ట్రాన్స్పోర్ట్ బుకింగ్స్ కోసం తనిఖీలుసౌదీ విమానాశ్రయాల్లో అధికారులు నుసక్ లేదా మసార్ వ్యవస్థల ద్వారా చేసిన అన్ని బుకింగ్‌లను ధ్రువీకరిస్తారు. చెల్లని బుకింగ్‌లు తిరస్కరిస్తారు. దాంతోపాటు అక్కడికక్కడే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.అధీకృత రవాణాకు మాత్రమే అనుమతియాత్రికులు రవాణాను ముందస్తుగా బుక్ చేసుకోవాలి. టాక్సీలు, బస్సులు లేదా హరమైన్ రైలుతో సహా అధీకృత ఛానెళ్ల ద్వారా ముందే బుక్ చేయాలి. రిజిస్టర్ కాని సర్వీసులు అనుమతించరు.హరామైన్ రైలు టైమింగ్స్మక్కా, మదీనా మధ్య సులువైన రవాణా మార్గం అయిన హరామైన్ హై-స్పీడ్ రైలు ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తుంది. దీని తర్వాత వచ్చే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేయాలి.భారీ జరిమానాలుఈ కొత్త నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. అంటే ఎక్కువ కాలం ఉండటం, అనధికార రవాణాను ఉపయోగించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేయడం.. వంటి వాటికి కనీసం 734 దిర్హమ్ల నుంచి జరిమానాలు ఉంటాయి. ఏజెంట్లను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.ఇదీ చదవండి: లద్ధాఖ్‌లో వాణిజ్య అవకాశాలు ఇవే.. -
కెనడాలో సౌత్ ఇండియన్ సినిమాల ప్రదర్శన నిలిపివేత!
కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శన నిలిచిపోయింది. పవన్ కల్యాణ్ ఓజీ, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేసేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. వారం వ్యవధిలో అక్కడి ఓ థియేటర్‌పై జరిగిన కాల్పుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సమాచారం.అసలేం జరిగిందంటే.. ఒంటారియో(Ontario) ప్రావిన్సులోని ఓ థియేటర్‌పై గత వారం వ్యవధిలో రెండు దాడులు జరిగాయి. సెప్టెంబర్ 25వ తేదీన వేకువ జామున ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. థియేటర్ ఎంట్రెన్స్ వద్ద లిక్విడ్‌ను చల్లి చిన్నపాటి పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో థియేటర్ బయటి భాగం స్వల్పంగా దెబ్బ తింది. అలాగే.. తాజాగా అక్టోబర్ 2వ తేదీన ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలోనూ అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.कनाडा के सिनेमाघर में आग और फायरिंगकनाडा के ओकविले में स्थित Film. Ca सिनेमा थिएटर पर हमला, 2 युवकों ने थिएटर के दरवाजे पर पेट्रोल डालकर आग लगाई, दोनों चेहरे पर मास्क लगाए SUV कार में आए थे, सिनेमाघर में फायरिंग और आग लगाई, पूरा मामला CCTV में कैद#Canada | #CCTV pic.twitter.com/evEuTSsyaj— NDTV India (@ndtvindia) October 3, 2025ఈ ఘటనల నేపథ్యంలో.. భారతీయ చిత్రాలు అందునా ప్రత్యేకించి దక్షిణ భారత చిత్రాల(South Indian Films Canada) ప్రదర్శనే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని అక్కడి థియేటర్ల నిర్వాహకులు ఓ అంచనాకి వచ్చారు. ఓక్విల్లేలోని ఫిల్మ్.సీఏ సినిమాస్(Film.ca Cinemas) ఓజీ, కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 చిత్రాల ప్రదర్శనను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఫ్రాంచైజీ సీఈవో జెఫ్ నోల్ కూడా ఓ వీడియో సందేశంలో ఇదే విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు కూడా.ఎక్కడక్కెడంటే.. మరోవైపు అక్కడి ఆన్లైన్ బుకింగ్ జాబితాల నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించారు. రిచ్మండ్ హిల్‌లోని యార్క్ సినిమాస్ కూడా ఫిల్మ్.సీఏ బాటలోనే భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేసింది. తమ ఉద్యోగులు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్ల నగదును రిఫండ్ చేస్తామని ఒక ప్రకటనలో యార్క్ సినిమాస్ వెల్లడించింది. గ్రేటర్ టోరంటో ఏరియాలోనూ పలు థియేటర్లు ఇదే తరహా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కొలంబియా, అల్బర్టా, క్యూబెక్, మానిటోబా ఇతర ప్రావిన్స్‌లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.ఇదిలా ఉంటే.. ఇది ఖలీస్తానీల పని అయ్యి ఉండొచ్చని సమాచారం. గతంలోనూ ఇదే తరహా దాడులు జరగడమే ఆ అనుమానాలకు కారణంగా తెలుస్తోంది. అయితే హాల్టన్ పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న తమను సంప్రదించాలని అక్కడి దర్యాప్తు అధికారులు కోరుతున్నారు. ఇదీ చదవండి: అనుభవానికా? లేదంటే యంగ్ బ్లడ్‌కి పట్టమా?? -
ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐర్లాండ్‌లో స్థిరపడిన తెలంగాణ ఎన్నారైలు అల్లే శ్రీనివాస్, బలరాం కొక్కుల ఆధ్వర్యంలో డబ్లిన్ నగరంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలకు సుమారు 750 మంది హాజరయ్యారు. దుర్గా పూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ఆడపడుచులు బతుకమ్మ, కోలాటం, దాండియా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకు బతుకమ్మ పండుగ విశేషాలను వివరించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మను అందంగా పేర్చిన ఆడపడుచులకు బహుమతులు కూడా ప్రధానం చేశారు. వేడుకలకు హాజరైన వారందరికీ ప్రసాదంతోపాటు రుచికరమైన వంటలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తమ భవిష్యత్తు తరాలకు కూడా తెలియచేయాలనే లక్ష్యంతో తెలంగానైట్స్ ఆఫ్ ఐర్లాండ్ (Telanganites Of Ireland) ఆధ్వర్యంలో గత 13 ఏళ్లుగా ఏటా ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుమారు 40 మంది వాలంటీర్లు, 50 మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకల నిర్వహణకు ఏటా సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
గ్లాస్గో మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
గ్లాస్గో (స్కాట్లాండ్): నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో బతుకమ్మ వేడుకలను శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టెంపుల్ అధ్యక్షుడు డా. పునీత్ బెడి,,ఉపాధ్యక్షురాలు డా. మమత వుసికాలా ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న ఈ దేవాలయం, ఈ ఏడాది బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా జరిపింది. డా. మమత వుసికాలా, వినీల బత్తులా, వారి స్నేహితులు, దేవాలయ కమిటీ సభ్యుల సమన్వయంతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించారు.మహిళలు అందరూ రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేసి, సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో గానం చేస్తూ, నృత్యాలు, కోలాటం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా టెంపుల్లో భక్తి శ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపారు. అనంతరం సమీప సరస్సులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పండుగ అనంతరం భోజన విందు కూడా ఏర్పాటు చేయగా, అందరూ మంచి ఆహారం ఆస్వాదిస్తూ, ఉత్సాహంగా ఉత్సవాన్ని ముగించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని ప్రకటించారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
అంతర్జాతీయ సమస్యలకు అండగా కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కొత్త బ్రాంచ్
హనుమకొండ హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో పిట్టల సునీల్ కుమార్ మరియు భూపతి శంకర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో నడుస్తున్న సునీల్ అసోసియేట్స్ సంస్థతో కరీంనగర్ వాస్తవ్యులు, సీనియర్ న్యాయవాది ప్రస్తుతం అమెరికన్ పౌరసత్వం కలిగి ఉన్న అమెరికన్ సొలిసిటర్ కావేటి శ్రీనివాసరావు ఒప్పందం కుదుర్చుకొని, హనుమకొండలో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా కావేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ..తాను ప్రస్తుతం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నానని అక్కడ సొలిసిటర్గా , బ్రిటన్‌లో అటార్నీగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, వివిధ దేశాలలో తమ శాఖలు ఉన్నాయని తెలిపారు. హనుమకొండలో కూడా సునీల్ అసోసియేట్స్ సహకారంతో నూతన శాఖను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఇంటి నుండి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. వారిలో చాలామంది విదేశాలలో ఇమిగ్రేషన్ , వీసా, పాస్‌పోర్టు మరియు ఎంబసీ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటితో పాటు భార్య భర్తలు వైవాహిక సమస్యలతో అక్కడ కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. అలాగే అక్కడ రోడ్డు, ఇతర ప్రమాదాలలో మరణిస్తున్న భారతీయుల సంఖ్య పెరిగిందని అలాంటి సమస్యలకు తాము పరిష్కారం చూపేలా, దేశంలో శాఖలను విస్తరిస్తున్నామని బాధితులకు అండగా ఉంటామన్నారు. వారికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తామని.. అందుకోసం బాధితులు తమ ప్రాంతంలో గల కావేటి లా ఫర్మ్ సంప్రదించి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని, విదేశాలలో గల చట్టపరమైన సమస్యలకు తాము పరిష్కార మార్గం చూపిస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని బాధితులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ కన్జ్యూమర్ కౌన్సిల్ చైర్మన్ పల్లెపాడు దామోదర్, లా కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్ జెట్లింగ్ ఎల్లోసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హన్మకొండ వరంగల్ సీనియర్ న్యాయవాదులు వరంగల్ ప్రస్తుత జనరల్ సెక్రెటరీ డి. రమాకాంత్, హనుమకొండ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాతంగి రమేష్ బాబు, మాజీ ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణమూర్తి, మాజీ పీపీ గుర్రాల వినోద్ కుమార్, స్పెషల్ జిపి మహాత్మ, సీనియర్ న్యాయవాది కె.వి.కె గుప్తా, కేశవ్, వేల్పుల రమేష్, మామిడాలగిరి, సత్యనారాయణ, మొలుగురి రాజు , సూరయ్య, శీలం అఖిల్ రావు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ నృత్యాలు, అమ్మవారి అవతారాలకు ప్రత్యేక పూజలు, రావణ దహనం.. ఇలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఎన్నారై జంట చేసిన పాడు పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ప్రధానంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో హైలైట్ అవుతుంటుంది. ఇది దేవీ దుర్గాను ఆరాధిస్తూ.. వృత్తాకారంగా(సర్కిల్) నృత్యం చేస్తుంటారు. గర్భా నృత్యం భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందాన్ని ప్రతిబింబించే కళారూపం. అలాంటి నృత్యంలో పాల్గొన్న ఓ జంట ముద్దులతో నలుగురిలో హద్దులు దాటేసింది.గుజరాత్ వడోదరలో జరిగిన గర్బా వేడుకలో ఓ ఎన్నారై జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యునైటెడ్ వే గర్భా పేరిట నిర్వహించిన వేడుకల్లో.. ప్రతీక్ పటేల్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గర్భా చేస్తూ అత్యుత్సాహంలో ముద్దులు పెట్టుకున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. అది కాస్త వైరల్ కావడంతో సనాతన్ సంత్ సమితి తీవ్రంగా స్పందించింది. ధార్మిక భావాలను దెబ్బతీశారంటూ ఆ జంటపై అటలదారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయ్యింది. అయితే విమర్శల నేపథ్యంలో ఆ జంట స్పందించింది. చేసిన పనికి లిఖితపూర్వక క్షమాపణ ఇచ్చింది. ఇది మా తప్పే. ఇంతలా విమర్శలు వస్తాయని అనుకోలేదు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గత 16 సంవత్సరాలు ప్రతీక్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తాజా వీడియోపై విమర్శల నేపథ్యంలో ఆ జంట దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.The NRI couple has issued a formal apology after their kissing video at a Garba event in Vadodara went viral.The couple were called to the police station, they are Australian nationals of Indian origin. They issued a written apology.#GarbaControversypic.twitter.com/GiaLSsLY6V— ShingChana😯 (@BaanwraDil) September 28, 2025 -
కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఒట్టావా: తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ (TDF), కెనడా ఆధ్వర్యంలో బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో NRI లు కుటుంబ సమేతంగా హాజరై ఆట, పాటలతో బతుకమ్మ పండుగ ను జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్,కెనడా నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేసి, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. కెనడాలోనే పుట్టిపెరిగిన తెలుగు పిల్లలు మన పండగల ప్రత్యేకత తెలుసుకోవటం ఇలాంటి కార్యక్రమాలతో సాధ్యమౌతుందని టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డి, టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ కెనడా కమిటీ తరపున అందజేశారు. 21 సంవత్సరాల నుండి కెనడాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తోడ్పాడుతున్న ప్రతీ ఒక్కరికి టీడీఎఫ్ కెనడా కమిటీ ధన్యవాదములతో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది. -
యూకేలో ఎల్‌టీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
యూకేలోని లూటన్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు.. లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. దాంతో అక్కడ దసరా వేడుక కనుల పండువలా సాగింది. బతుకమ్మలను పేర్చినవారందరికీ బహుమతులను అందజేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. -
ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా చారిత్రక ఒప్పందం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association) ఆటా.. ఐఐటీ హైదరాబాద్‌తో చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇంజనీరింగ్‌లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణలలో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్ తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా అవగాహన ఒప్పందం కుదిరింది. విద్యార్థుల గ్లోబల్ ఇంటర్న్‌షిప్ అవకాశాల కల్పన కోసం అవగాహన ఒప్పందం జరిగింది.వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా,ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కొన్ని వారాల నుండి ఒక సంవత్సరం వరకు ఐఐటీలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించనున్నాయి. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఆధునిక పరిశోధన, ఇన్నోవేషన్లలో అనుభవం పొందే మార్గాలు ఏర్పడతాయని జయంత్ చల్లా పేర్కొన్నారు. టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడంలో యువతకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తొలిసారిగా భారతదేశం వెలుపల ఐఐటీ ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి. IITH అర్హులైన విద్యార్థులకు వసతి ఇతర సదుపాయాలు నామమాత్రపు ఫీజుతో కల్పిస్తుందన్నారు. -
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)/TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు స్థానిక సంబవాంగ్ పార్క్ లో సెప్టెంబర్ 27, శనివారం రోజున ఘనంగా జరిగాయి. భారతదేశం నుండి వచ్చిన స్థానికుల తల్లిదండ్రులు మరియు బంధువులు కూడా ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది అతిథులు మరియు ఎన్నారైలు సుమారు 2500 నుండి 3000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలలో పాల్గొన్న అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిరం (ISKM), సింగపూర్ వారికి , వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గార్లకు TCSS సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, ఉపాధ్యక్షులు జూలూరి సంతోష్ కుమార్ మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగువారు స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ దశాబ్దానికి పైగా సింగపూర్ లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పుతూ TCSS చరిత్రలో నిలిచిపోతుందని సొసైటీ సభ్యులు అన్నారు. TCSS తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన దాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరాలతో పొలిస్తే ఈ ఏడాది ఆడపడుచులు బతుకమ్మలని పోటా పోటీగా చాలా అందంగా అలంకరించి వివిధ రూపాలలో 100 పైగా బతుకమ్మలని పేర్చి తీసుకొచ్చారు. బతుకమ్మని పేర్చి తెచ్చిన ప్రతి ఆడపడుచుని రెడ్ కార్పెట్ పై స్వాగతించి తనిష్క్ జ్యూవెల్లర్స్ వారి గిఫ్ట్ హాంపర్ని బహుమతిగా అందించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దాదాపు 11 బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ముగ్గురు ఆడపడుచులకు వెండి వస్తువులు,చీరలు, తదితర ప్రత్యేక బహుమతులు అందజేశారు. ప్రతి యేడు లాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ చెక్కిలిపై సిరివెన్నెల కురిసేరా... పూలకే పూజ చేసే పండుగే మళ్ళొచ్చేరా" యూట్యూబ్ లో విడుదల చేసినప్పడినుండి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు. ఈ పాట మేకింగ్ కి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన స్థానిక ఏఐ పాల్స్ ప్రై. లి సంస్థకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే ఈ వేడుకల్లో TCSS ప్రత్యేకంగా తయారు చేయించిన ఫోటోబూత్ , కృత్రిమబతుకమ్మ ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలను విజయవంతానికి సహకరించిన అందరికీ పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలకు కార్పొరేట్ స్పాన్సర్స్ కు, సహకరించిన మిత్రులకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ లోని బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్ ,పుంగ్గోల్ , టాంపనీస్ ,బెడోక్ , మేల్విల్లీ పార్క్ మరియు సెరంగూన్ ప్రాంతాల నుండి బస్సులను నామ మాత్రపు రుసుముతో సమకూర్చి పండుగను విజయవంతగా నిర్వహించడం జరిగింది. సింగపూర్ వేడుకలను సొసైటీ సోషల్‌మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలాగే కమిటీ ఏర్పాటు చేసిన విందుభోజనాన్ని ఆరగించి భక్తులందరూ సంతోషం ప్రకటించారు. వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బొందుగుల ఉమా రాణి ,నంగునూరు సౌజన్య, బసిక అనిత రెడ్డి, హేమ లత, దీప నల్ల, జూలూరు పద్మజ,కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, ఎర్రమ రెడ్డి దీప్తి, హరిత విజాపుర్, సౌజన్య మాదారపు, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, రావుల మేఘన, చల్ల లత కీలక పాత్ర పోషించారు.ఈ పండుగ వేడుకకు సహకరించిన పార్క్ యాజమాన్యానికి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మలను మరియు సంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ఆడపడుచుల ఎంపికలో సహకరించిన మాధవి లాలంగర్, స్వప్న ముద్దం, సృజన బైస మరియు స్వప్నకైలాసపు, బతుకమ్మ ఆటకు కొరియోగ్రఫీగా సహకరించిన దీప రెడ్డి, స్థానిక మీడియాకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాసర్ల శ్రీనివాస్, రవికృష్ణ విజాపుర్, ప్రవీణ్ కుమార్ సి హెచ్ మరియు సాత్విక నడికట్ల & సంజన బొందుగుల (జూనియర్ కమిటీ మెంబెర్స్) లు పండుగ వేడుకల వ్యాఖ్యాతలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
“తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు” సభ విజయవంతం
డాలస్, టెక్సస్: తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 84వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం పద్మవిభూషణ్ డా. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన “తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు” అనే అంతర్జాల సమావేశం విజయవంతంగా జరిగింది.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులను ఆహ్వానించి సభను ప్రారంభిస్తూ తెలంగాణా గడ్డపై జన్మించిన ఎంతోమంది సాహితీవేత్తలు విశేష కృషి చేశారని, కాళోజీ జయంతి సందర్భంగా వారిలో కొంతమందిని ఈ రోజు స్మరించుకోవడం ఆనందదాయకం అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – తెలుగునేలపై ప్రభవించిన ప్రతిభావంతులు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనేగాక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య, సంగీత, విద్యా, వైజ్ఞానిక, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక, సినీ, రాజకీయ, క్రీడా, సేవా రంగాలలో కీర్తి గడించినప్పుడు ప్రాంతాలకతీతంగా ప్రతి తెలుగుగుండె గర్వంతో ఉప్పొంగుతుంది. తెలంగాణ ప్రాంతంలో జన్మించి సాహిత్యరంగంలో విశేష కృషిచేసిన వారిలో కొంతమందిని తెలంగాణా రాష్ట్ర తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్మరించుకుని ఘన నివాళులర్పించుకోవడం సముచితమైనది, సందర్భోచితమైనది అన్నారు. వీరు చేసిన సాహిత్య కృషి భావి తరాలకు స్పూర్తిదాయకమైనది అన్నారు”, ముఖ్యఅతిధిగా హాజరైన ఆచార్య డా. అనుమాండ్ల భూమయ్య (పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్) పద్మ విభూషణ్ డా. కాళోజీ నారాయణరావు బహుభాషా పండితులని, సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై ముఖ్యంగా నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్షర పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన ప్రజాకవి అని ప్రస్తుతించారు. విశిష్టఅతిథులుగా విచ్చేసిన - డా. జుర్రు చెన్నయ్య (ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సారస్వతపరిషత్తు ప్రధాన కార్యదర్శి కావేరమ్మపేట, మహబూబానగర్ జిల్లా) - ప్రముఖ పాత్రికేయుడు, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత అయిన డా. దేవులపల్లి రామానుజరావు గురించి; డా. కెడిడి మృణాళిని ( ఉపాధ్యాయురాలు, విద్యావేత్త, హైదరాబాద్) - ప్రముఖ సాహితీవేత్త, జానపద విజ్ఞాన పరిశోధకుడు అయిన ఆచార్య డా. బిరుదురాజు రామరాజు గురించి; రంగరాజు పద్మ (రచయిత్రి, ఇనుగుర్తి, మహబూబాబాద్ జిల్లా, ఒద్దిరాజు రాఘవ రంగారావుగారి కుమార్తె) - ప్రముఖ సాహితీవేత్తలు శ్రీయుతులు ఒద్దిరాజు సోదరులు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావుల గురించి; డా. వి. జయప్రకాష్ (ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, దేవుని తిర్మలాపురం, నాగర్ కర్నూలు జిల్లా) - ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్యుల గురించి; డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు (ప్రముఖ రచయిత, విమర్శకులు, కరీంనగర్) – ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు డా. కపిలవాయి లింగమూర్తి గురించి; డా. బ్రాహ్మణపల్లి జయరాములు (అధ్యాపకులు, సాహితీవేత్త, హైదరాబాద్) - అభినవ పోతన, ఉద్ధండ పండితుడు అయిన డా. వానమామలై వరదాచార్యుల గురించి; శ్రీధర్ రావు దేశ్ పాండే (ప్రముఖ రచయిత, బోథ్, ఆదిలాబాద్ జిల్లా) - తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు అయిన డా. సామల సదాశివ గురించి; డా. కొండపల్లి నీహారిణి (ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, హైదరాబాద్, కొండపల్లి శేషగిరిరావుగారి కోడలు) - సుప్రసిద్ద చిత్రకారుడు అయిన డా. కొండపల్లి శేషగిరిరావు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుని, ఈ లబ్ధప్రతిష్టులైన జీవితాలను అద్భుతంగా ఆవిష్కరించి నివాళులర్పించారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెలో వీక్షించవచ్చును.https://youtube.com/live/nB5Pw6gfuhs -
సింగపూర్‌లో ఘనంగా చండీ హోమ మహోత్సవం
సింగపూర్: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ 2025 తేదీన దేవి కృపను స్మరించుకుంటూ చండీ హోమ మహోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 350 మంది భక్తులు పాల్గొని, ఈ పవిత్ర హోమం ద్వారా చండీదేవి అమ్మ వారి ఆశీర్వాదాలను పొందారు. దేవి అనుగ్రహం కోసం ఈ చండీ హోమాన్ని సభ 30 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తోంది.కార్యక్రమం గణపతి పూజ మరియు కలశ స్థాపనంతో ఆరంభమైంది. అనంతరం గణపతి హోమం మరియు నవగ్రహ హోమం నిర్వహించబడింది. తదుపరి కవచ, అర్గళ, కీలక పఠనాలు చేసి, ఉత్సాహభరితమైన దేవీ మాహాత్మ్యం పరాయణ హోమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ కూడా నిర్వహించి, పూర్ణాహుతి, దీపారాధన మరియు ఉపచార పూజలతో కార్యక్రమం ముగిసింది. దేవీ మాహాత్మ్యం ఘోషతో ఆ ప్రాంగణం అంతా పవిత్రతతో నిండిపోయి, భక్తులలో ఆధ్యాత్మిక భావన మేల్కొంది.సభ తరపున వాలంటీర్లకు సత్కారం నిర్వహించారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక మరియు విశ్వవిద్యాలయ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డులతో సత్కరించారు. చివరగా భక్తులందరికీ పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాదం పంపిణీ చేయబడింది.SDBBS అధ్యక్షులు కార్తిక్, కార్యదర్శి బాలాజీ రామస్వామి, ఈవెంట్ లీడ్ సాయి రామ్ కల్యాణసుందరం సభ పురోహితులు విజయ్, కన్నన్ మరియు కార్తిక్ లకు అలాగే కార్యక్రమానికి తోడ్పడిన వాలంటీర్ల అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. -
జర్మనీలో అంబరాన్నంటిన.. బతుకమ్మ సంబరాలు
యూరప్: జర్మనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు మహిళలు ఉత్సాహంగా పాల్గొని పూల బతుకమ్మలను ఎత్తి, సాంస్కృతిక పాటలతో, నృత్యాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకున్న మహిళలు, పూలతో తయారుచేసిన బతుకమ్మలను పేర్చి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ఈ వేడుకలు జర్మనీ వాసులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, భోజన విందులు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించడంతో కుటుంబ సమేతంగా పాల్గొనే వాతావరణం ఏర్పడింది. బతుకమ్మ వేడుకలు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తమ మూలాలను గుర్తుచేస్తూ, సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రవాస తెలంగాణీయులు అబుదాబిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎడారి ప్రాంతమైన అబుదాబిలో పూలు దొరకడం కష్టమైన నేపథ్యంలో, సంఘ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణ నుండి వందలాది కిలోల పూలను తెప్పించి నగరాన్ని పూల వనంగా మార్చారు. శనివారం రాత్రి ఉదయం సామూహిక బతుకమ్మ తయారీతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యు.ఏ.ఈ.లోని భారత రాయబార కార్యాలయం నుంచి శ్జార్జీ జార్జ్ (First Secretary, Community Welfare and Coordination) ముఖ్య అతిథిగా విచ్చేసి, తెలంగాణ సంస్కృతిని ప్రశంసించారు. ఆయన ప్రవాస భారతీయుల సాంస్కృతిక అంకితభావాన్ని కొనియాడుతూ, “ఇలాంటి ఉత్సవాలు భారతీయతను ప్రపంచానికి పరిచయం చేస్తాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గౌరవ అధ్యక్షుడు జయచంద్రన్ నాయర్, గౌరవ ఉపాధ్యక్షుడు శ్షాజీ వి.కె., కర్ణాటక రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సర్వోత్తమ్ శెట్టి, మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు విజయ్ మానె, బీహార్ మరియు ఝార్ఖండ్ సంఘ అధ్యక్షుడు దివాకర్ ప్రసాద్, ఇండియా ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంఘ అధ్యక్షుడు వినాయక్ ఆవాటే, సంపంగి బ్యుటికా సంస్థల యాజమాన్యం ప్రత్యేక అతిథులుగా పాల్గొని, ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు. అలాగే, తమిళ సంఘం, మలయాళి సంఘం, కన్నడ సంఘం, మరాఠీ సంఘం, గుజరాతీ సంఘం, పంజాబీ సంఘం తదితర రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, బతుకమ్మ ఉత్సవాన్ని తమ హాజరుతో మరింత వైభవవంతం చేశారు. భారతీయ సమైక్యతకు ప్రతీకగా, వారు తమ సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ కవి, గాయకుడు డా. కోకిల నాగరాజు, యువ గాయని సోనీ యాదర్ల ప్రత్యేకంగా ఇండియా నుంచి విచ్చేసి తమ బతుకమ్మ ఆట పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలతో బతుకమ్మ ప్రాంగణం మరో తెలంగాణ ను తలపించింది. అందమైన బతుకమ్మలకు, ముందుగా వచ్చిన బతుకమ్మలకు, నాట్యం చేసిన మహిళలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఇండియా నుండి తెప్పించిన పిండి వంటలు—అరిసెలు, గారెలు, బోబట్ల వంటి వంటకాలు—అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మరింత ప్రాశస్త్యం పొందుతూ అందరి మన్ననలు పొందుతున్నందుకు కార్యవర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కార్య నిర్వాహకులు రాజా శ్రీనివాస రావు, గంగారెడ్డి, వంశీ సందీప్, గోపాల్, సతీష్, పావని, అర్చన, దీప్తి, పద్మజ తదితరులు తెలియ జేశారు “విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం” అని నిర్వాహకులు తెలిపారు.(చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్‌లో బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీ మాత పూజను నిర్వహించారు. ‘బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్థానిక స్ప్రింగ్ ఫీల్డ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు చిన్నపిల్లలు పాల్గొని తెలంగాణ సాంప్రదాయ నృత్యాలను కనుల విందుగా ప్రదర్శించారు.కాగా, దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ వేడకలు భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. అంటే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. అప్పుడే ఈ బతుకమ్మ వేడుకలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ వెన్నముద్ద బతుకమ్మని ఆరాదిస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.;(చదవండి: మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మలేషియా (malaysia) రాజధాని నగరం కౌలాలంపూర్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా శనివారం జరిగాయి. తెలంగాణా ఆడబిడ్డల గౌరవ ప్రతీక, ప్రకృతి పండుగ, బతుకమ్మలను వివిధ రకాల పూలతో అలంకరించారు. తెలుగు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై, బతుకమ్మ ఆటపాటలతో సందడిగా గడిపారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం ప్రసాదాలను ఒకరికొకరు పంచుకొని గౌరమ్మను నిమజ్జనం చేశారు. కౌలాలంపూర్‌లోని బ్రిక్స్ఫీల్డ్స్లోలోని కృష్ణా టెంపుల్లో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్ మలేషియా (Federation of nri cultural association malaysia) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ హైకమీషనర్ సుభాషిణి నారాయణన్, పెరెక్ స్టేట్ లెజిస్లేటివ్ సభ్యురాలు శాంతి చిన్నసామి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రతీ ఏడాది బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడం తమకు ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాసంతిసిన్ని సామిమలేషియాలో భారతీయవారసత్వాన్ని జీవం పోసేందుకు ఎఫ్ఎన్సీఏ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇండియన్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీమతి సుభాషిణినారాయణన్ గారు మహిళలతో చేరి ఆడి పాడి సందడి చేసారు . అలాగే ప్రవాసీ భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ఇండియన్ హై కమిషన్ ఎల్లపుడు సహాయం చేయడానికి ముందుంటుందని హామీ ఇచ్చారు. అత్యంత అందంగా అలంకరించిన బతుకమ్మకు బంగారు నాణెం బహుమతి అందించారు. అలాగే బతుకమ్మలు తీసుకొచ్చిన మహిళలందరికీ వారందరికీ వెండి నాణేలు కానుకగా ఇచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలకు వెండి బహుమతులు. మలేషియాలో ఉన్న తెలుగు రెస్టారెంట్లు స్పాన్సర్ చేసిన గొప్ప విందు, ఇందులో ప్రామాణిక తెలుగు వంటకాలు ప్రదర్శించారు.తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్ , కోశాధికారి నాగరాజు , మలేషియా ఆంధ్రా అసోసియేషన్ విమెన్ప్రెసిడెంట్ శారదా , భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ సత్య, విమెన్ప్రెసిడెంట్ గీత హజారే , భరత్ రాష్ట్ర సమితి మలేషియా వైస్ ప్రెసిడెంట్ అరుణ్, మలేషియా తెలుగుఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , మలేషియా తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి గారు , తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు పాల్గొన్నారు. ఎఫ్ఎన్సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన స్వాగత ప్రసంగంలో, విదేశాల్లో సాంస్కృతికసంప్రదాయాలను కాపాడుకోవడం మరియు భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యతను పెంపొందించడం యొక్కప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్నినిర్వహించడానికి సహకరించినస్పాన్సర్లు రాప్పినో టెక్ సొల్యూషన్స్ , టూట్కర్ సొల్యూషన్స్ ,సెంట్రల్ స్పైస్ ,టెక్మ్యాట్రిక్స్ ,రెడ్వేవ్ సొల్యూషన్స్ , టెక్డార్ట్ ,స్ప్రౌట్అకాడమీ ,బిఆర్ఎస్ మలేషియా ,జాస్ బెలూన్స్ అండ్ డెకరేటర్స్ ,లులు మనీ , బిగ్ సివెడ్డింగ్ కార్డ్స్ , శ్రీ రుచి రెస్టారెంట్, జబిల్లి , మై బిర్యానీ , శ్రీ బిర్యానీ ,స్పైసీ హబ్, ఫ్యామిలీ గార్డెన్, మైఫిన్ MY81 , MY81 , మెరిడియన్ , ఎన్ఎస్ టూర్స్ & ట్రావెల్స్ మరియు , స్వచ్ఛంద సేవకులు మరియు కోర్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞత లుతెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డిమోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మకనుమూరి,ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శిభాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావుగునుగంటి,యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతికవిభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహకసభ్యులు నాగరాజుకాలేరు,నాగార్జున దేవవరపు, ఫణీంద్రకనుగంటి,సురేష్ రెడ్డి మందడి , రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి ,మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు. -
హెల్త్ కేర్ ఫ్రాడ్ : భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల ఖైదు
అమెరికాలో హెల్త్‌కేర్ స్కామ్‌లో భారత సంతతి వైద్యుడికి శిక్షపడింది. హెల్త్ కేర్ ఫ్రాడ్ నియంత్రిత పదార్థాల చట్టవిరుద్ధ పంపిణీ నేరం భారత సంతతికి చెందిన వైద్యుడు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ మోసానికి నీల్ కె ఆనంద్ దోషిగా తేలాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పెన్సిల్వేనియాకు చెందిన వైద్యుడు 48 ఏళ్ల డా. ఆనంద్ 2 మిలియన్ల డాలర్లకు పైగా పరిహారాన్ని, 2 మిలియన్లపై జరిమానా పైగా జప్తు చెల్లించాలని ఆదేశించింది.బీమా చెల్లింపులను క్లెయిమ్స్ కోసం తన రోగులను గూడీ బ్యాగులను అంగీకరించమని బలవంతం చేసి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆనంద్ మెడికేర్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM), ఇండిపెండెన్స్ బ్లూ క్రాస్ (IBC) , ఆంథమ్ అందించిన ఆరోగ్య పథకాలకు తప్పుడు మరియు మోసపూరిత క్లెయిమ్‌లను సమర్పించడానికి కుట్ర పన్నాడు. వైద్యపరంగా అనవసరమైన ప్రిస్క్రిప్షన్ మందుల 'గూడీ బ్యాగులు' కోసం, వాటిని అతని యాజమాన్యంలోని ఇన్-హౌస్ ఫార్మసీలు రోగులకు పంపిణీ చేశాయి. ప్రిస్క్రిప్షన్లపై ముందే సంతకం చేయడం ద్వారా లైసెన్స్ కూడా లేని తన ఇంటర్న్లు మందులు సూచించడానికి అనుమతించాడు. ఆక్సికోడోన్ను పంపిణీ చేశాడు.ఓపియాయిడ్, నొప్పి నివారిణి అయిన ఆక్సికోడోన్ అమెరికాలో ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల్లో ఒకటి.ఇదీ చదవండి: బాలీవుడ్‌ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅలాగే ఆనంద్ ప్రిస్క్రిప్షన్లపై ముందస్తు సంతకం చేశాడు. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు డాక్టర్ ఆనంద్ ముందే సంతకం చేసిన ఖాళీ ఫారమ్‌లలో నియంత్రిత పదార్థాల కోసం ప్రిస్క్రిప్షన్లను పూరించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ పథకం కింద, డాక్టర్ అనేక మంది రోగులకు 20,850 ఆక్సికోడోన్ మాత్రలను ప్రిస్క్రైబ్ చేశాడు. మొత్తంగా, మెడికేర్, OPM, IBC,చ ఆంథమ్2.4 మిలియన్లకు పైగా మెడికల్ క్లెయిమ్‌లను చెల్లించాయి. జిల్లా న్యాయమూర్తి చాడ్ F కెన్నీ ప్రకారం, ఆనంద్ తన రోగుల అవసరాల కంటే దురాశ ,అక్రమ లాభాల ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోగుల చిక్సత మీద దృష్టిపెట్టకుండా లాభాలకోసం చూసుకున్నారని కెన్నీ వ్యాఖ్యానించారు.ఏప్రిల్‌లో, డాక్టర్ ఆనంద్ ఆరోగ్య సంరక్షణ మోసం మరియు వైర్ మోసం, మూడు ఆరోగ్య సంరక్షణ మోసం, ఒక మనీలాండరింగ్, నాలుగు చట్టవిరుద్ధమైన ద్రవ్య లావాదేవీలు , నియంత్రిత పదార్థాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు నిర్ధారించబడింది. భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అమెరికాన నేవీలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. కాగా ఈ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, డా. ఆనంద్, తని కుటుంబం 2001లో న్యూయార్క్‌లో జరిగిన 9/11 దాడుల బాధితులతో తాను ఎలా వ్యవహరించాడో వర్ణిస్తూ వివరణ ఇచ్చారు. రోగుల పట్ల ఆయనకున్నకరుణను నేరంగా పరిగణించడం అన్యాయమని డాక్టర్ కుటుంబం వాదించింది. -
'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!
టెక్నాలజీ ఎన్నో ఆలోచనలకు తెరతీస్తుంది. సాంకేతిక సాయంతో దూరంగా ఉన్న తమ వాళ్లను తమవద్దకు చేర్చుకునేలా కొందరు భలే ఉపయోగిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఈ టెక్నాలజీని మన సంతోషాలకు, సంబరాలకు అనుగుణంగా మార్చుకుంటూ..ఇలా కూడా వాడుకోవచ్చా అని విస్తుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే..అసలేంటి కథ అంటే..విదేశాల్లో నివశించే చాలామంది భారత్‌లో జరిగినట్లు సంస్కృతి సంపద్రాయలకు అనుగుణంగా సంబరంగా జరిగే పండుగలను మిస్ అవుతుంటారు. ఒకవేళ అక్కడ భారత కమ్యూనిటీలంతా ఒకచోట చేరి చేసుకున్న మన దేశంలో ఉన్న మాదిరి ఆనందమైతే మిస్ అయిన వెలితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉండే పండుగ కోలాహలం, సందడి..అక్కడ ఉండదు. అత్యంత నిశబ్దంగా జరిగిపోతుందంతే. అలా ఉసురుమనుకుండా హాయిగా ఎంజాయ్ చేసేలా..సరికొత్త మార్గాన్ని పంచుకున్నాడు కంటెంట్ క్రియేటర్, నటుడు విరాజ్ ఘేలాని. ఈ నవరాత్రిని తన ఇద్దరు ఎన్ఆర్ఐ స్నేహితుల మిస్ అవ్వకుండా..వారి ఫోటోలను చెరో చేతిలో పెట్టుకుని సంబరంగా గర్భా డ్యాన్స్ చేశాడు. తన స్నేహితులు మిస్ అవ్వకుండా వాళ్లు కూడా ఎంజాయ చేస్తున్నారనిపించేలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నవరాత్రిని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నా, అలాగే తన స్నేహితులు ఈ పండుగ మిస్ అయ్యానని బాధపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు నటుడు విరాజ్ వీడియోలో. మీరు ఇలాంటి డిజిటల్ గర్భాలో పాల్గొనేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నవాళ్లు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు అని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లలో చాలామంది తమ దేశానికి దూరంగా ఉన్నమనే ఫీల్‌తో ఉన్నవాళ్లందరి మనసులను తాకింది ఈ వీడియో. కానీ మరికొందరూ బాస్ భారత్‌లో తొమ్మిది రోజులే గర్భా డ్యాన్స్ చేస్తారు, అదే కాలిఫోర్నియాలో నెలల తరబడి ఆ డ్యాన్స్ చేస్తామంటూ వ్యంగంగా పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా ఈ ఆలోచన మాత్రం అదుర్స్. చిన్న చిన్న పొరపచ్చలు సైతం ఇలా మనవాళ్లని భాగస్వామ్యం చేస్తే బాంధవ్యం బలపడటమే కాదు వాళ్లు ఖుషి అవుతారు. View this post on Instagram A post shared by Viraj Ghelani (@viraj_ghelani) (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
ఘనంగా శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్
శంకర నేత్రాలయ మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడవ వార్షిక 5K వాక్ ఘనంగా ముగిసింది. ఆదివారం, సెప్తెంబర్ 14th, 2025 నాడు స్థానిక నోవై నగరంలోని ఐటిసి స్పోర్ట్స్ పార్క్ లో ఈ వాక్ నిర్వహించారు.శంకర నేత్రాలయ చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం, అదేవిధంగా సభ్యులను ఉత్తేజ పరిచి వారి ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం సాగింది. ఎంతోమంది పాత, కొత్త మెంబర్లు ఈ కార్యక్రమానికి హాజరై 5K వాక్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని డెట్రాయిట్ చాప్టర్ తరఫున ట్రస్టీలు ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి; మరియు చాప్టర్ లీడ్స్ వెంకట్ గోటూరు, విజయ్ పెరుమాళ్ళ, మరియు వాలంటీర్లు సాయి గోపిశెట్టి, సుజాత తమ్మినీడి, తేజ జెట్టిపల్లి, వంశీ గోపిశెట్టి, మరియు యూత్ వాలంటీర్లు సమన్వయపరిచారు. శంకర నేత్రాలయ ప్రెసిడెంట్ డాక్టర్ బాలరెడ్డి ఇందుర్తి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ సూచనలు అందజేశారు. టి త్యాగరాజన్ టెక్నికల్ సహాయం అందజేసారు.ఈ 5K వాక్‌లో రెండు క్యాటగిరీలుగా విజేతలను ప్రకటించారు. విజేతలకు బహుమతులను అందింపజేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన సభ్యులకు, కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించిన పలువురు సభ్యులకు, శంకర నేత్రాలయ కార్యనిర్వాహక సంఘం డెట్రాయిట్ చాప్టర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. -
పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!
చాలామంది ఏదో ఒక కళ నేర్చుకుంటుంటారు. అయితే దాన్ని ఏవో కారణాలతో వదిలేయాల్సి రావొచ్చు. అయితే కొందరూ సమయం దొరికితే ఆ కళకు పదును పెట్టుకుంటూ..తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆరితేరిపోతారు. ఆ టాలెంట్ ఊరికేపోదు ప్రపంచ మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్లో రికార్డు సృష్టించి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందించే సౌది అరేబియాలో ఉంటున్న ఈ భారత సంతతి మహిళ నీను ప్రదీప్.కేరళకు చెందిన నీనుకి చిన్నప్పటి నుంచి చేతికళల పట్ల అమితాసక్తి. అయితే ఉన్నత చదువులు అభ్యసించడం వల్ల ఆ కళను కొనసాగించ లేకపోయింది. అలా ఆమె బీకామ్, ఎంకామ్ పూర్తి చేసిన అనంతరం పెళ్లి చేసుకుని సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. ఆ దంపతుల ప్రేమనురాగాలకు గుర్తుగా అరోనా, అలీనా ఇద్దరు పిల్లలు పుట్టడంతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్లై స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించారో అప్పటి నుంచి మంచి తీరిక దొరికింది ఆమెకు. ఉదయమే భర్త సామ్సన్ జాకబ్ ఉద్యోగానికి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తర్వాత చాలా ఖాళీ సమయం దొరికేది. ఆ సమయాన్ని అలా వృధాగా జారిపోనీకూడదని, తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అయిన హ్యాండ్ ఆర్ట్‌కి మళ్లీ పదును పెట్టుకునేందుకు రెడీ అయ్యింది. అయితే అందుకు అవసరమయ్యే ఫ్యాన్సీ క్రాఫ్ట్ టూల్స్, ఆర్ట్‌పరికరాలు చాలా ఖరీదుగా ఉండటమేగాక అందుబాటులో కూడా ఉండేవి కాదు. దాంతో ఆమె ఇంట్లో దొరికే వేస్ట్ మెటీరియల్స్ ఎగ్‌షెల్, పిస్తా షెల్‌లతో తన కళను మరింత సృజనాత్మక ధోరణిని జోడించి మెరుగులు పెట్టుకుంది. చెప్పాలంటే వేస్ట్‌తో ఇంటి అలంకార వస్తువులను తయారు చేసే స్థాయికి చేరుకుంది. అలా ఆమె పేపర్ పువ్వులు తయారు చేసే కాగితపు ఆర్ట్‌లో ఆరితేరిపోయింది. ఫలితంగా ఇల్లంతా నీను చేసిన పేపర్ కళాకృతులతో నిండిపోయింది. ఇక కొన్నింటిని ఈవెంట్లలోనూ, పలు స్టాల్స్ తన కళను ప్రదర్శించేది. అలా ఆమె కళ ప్రజలను ఇంప్రెస్ చేయడమే కాదు నేర్చుకునేలా ప్రేరేపించింది. ఇంతలో కోవిడ్ 19 రావడంతో తన పనికి బ్రేక్‌పడినా..ఆ లాక్‌డౌన్‌ని కూడా నీను సద్వినియోగం చేసుకునేలా మరింత వేగవంతంగా చేయడంపై పట్టు సంపాదించింది. రికార్డుల స్థాయికి..అలా ఆ నైపుణ్యం ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకునేందుకు దారితీసింది. క్రేప్ పేపర్ ఉపయోగించి ఒక వ్యక్తి తయారు చేసే వివిధ రకాల గరిష్ట పువ్వులకు మించి చేసే సామర్థ్యం నీనులో రికార్డు స్థాయిలో ఉందని ప్రశంసలందుకుంది. అది ఆమెకు గిన్నిస్ టైటిల్‌కు మార్గం సుగమం చేసింది. తన సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో నీను 2023లో గిన్నిస్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత గిన్నిస్ వాళ్లు స్పందించడంతో ఆ సాహసానికి పూనుకుంది. అలా ఆమె కేవలం 4 గంటల 39 నిమిషాల్లో ఒక వెయ్య నూటొక్క(1101) కాగితపు పువ్వులతో కూడిన 574 అడుగుల పూల ఫ్రేమ్‌ని తయారు చేసి గిన్నిస్ రికార్డులకెక్కింది. అభిరుచిగా మొదలైన ఆర్ట్..రికార్డుల సృష్టించే స్థాయికి దారితీసింది. అదీగాక ఈ కళలు మానసిక ఉల్లాసం తోపాటు మనపై మనకు నమ్మకాన్ని అందిస్తాయి కూడా.(చదవండి: కర్ణుని మాదిరి జననం..! కట్‌చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..) -
బర్లిన్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక
బర్లిన్, 21 సెప్టెంబర్ 2025 – బర్లిన్ హాసెన్హైడేలోని శ్రీ గణేశ ఆలయం రంగురంగుల పూలు, సాంప్రదాయ గీతాలు, నృత్యాలతో అలంకరించబడింది. తెలంగాణా అసోసియేషన్ జర్మనీ (TAG) e.V., స్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చాలిగంటి నాయకత్వంలో 12వసారి బతుకమ్మ ఉత్సవం ఘనంగా జరిగింది.ప్రధాన అతిథిగా భారత రాయబార కార్యాలయం (బర్లిన్) మంత్రి (పర్సనల్) డాక్టర్ మంధీప్ సింగ్ తులీ హాజరై బతుకమ్మను తలపై మోసి పూజల్లో పాల్గొన్నారు. జర్మనీలోని అనేక భారతీయ సంఘాల అధ్యక్షులు కూడా వేడుకను శుభాకాంక్షలతో అభినందించారు.300 మందికి పైగా తెలుగు మహిళలు, కుటుంబ సభ్యులు బర్లిన్ , పరిసర ప్రాంతాల నుండి చేరి బతుకమ్మలను పేర్చారు. బొడ్డెమ్మ పూజ, గౌరి పూజలు నిర్వహించిన తరువాత, సాంప్రదాయ తెలుగు వంటకాలతో విందు చేశారు. సాంప్రదాయం, వినోదం కలిసిన కార్యక్రమంలో నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్స్, తంబోలా వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.వేడుక విజయవంతం కావడంలో TAG సభ్యులు – వెంకట రమణ బోయినిపల్లి, అలేఖ్య భోగ, శరత్ రెడ్డి కమిడి, బాలరాజ్ ఆండే, అవినాష్ పోతుమంచి, శ్రీనాథ్ రమణి, నరేష్ తౌటమ్, నటేష్ చెట్టి, అమూల్య బొమ్మరబోయిన – కీలకపాత్ర పోషించారు. అంతేకాక, అనేక మంది వాలంటీర్లు ఉత్సాహభరితంగా సహకరించారు.బతుకమ్మ లాంటి వేడుకలు సంప్రదాయాన్ని నిలబెట్టి, సమాజ బంధాలను మరింత బలపరిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రవాస తెలుగు సమాజానికి TAG ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిర్వాకులు ప్రకటించారు. TAG ఈ సమాజాన్ని ఒక యూనిట్‌గా బలంగా నిలబెట్టేలా నిరంతరం కృషి చేస్తుందన్నారు నవ్వులు, స్నేహం, ఆత్మీయతలతో ముగిసిన ఈ ఉత్సవంలో, బర్లిన్లోని తెలుగు సమాజం తెలంగాణా సంస్కృతి, ఆత్మ, ఐక్యతను ఘనంగా ప్రతిబింబించింది -
మానవ మృగాన్ని వేటాడిన భారతీయుడు!
అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ మధ్యే నాగమల్లయ్య అనే కర్ణాటకవాసిని డల్లాస్‌లో ఓ వలసదారుడు అతికిరాతకంగా తల నరికి చంపడమూ చూశాం. అయితే.. ఇందుకు భిన్నంగా కాలిఫోర్నియా స్టేట్‌లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పసికందులపై అఘాయిత్యానికి పాల్పడ్డ మానవ మృగాన్ని.. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి మట్టుపెట్టాడు. అక్కడి వార్తా సంస్థల కథనాల ప్రకారం.. సెప్టెంబర్ 18వ తేదీన ఫ్రెమాంట్ సిటీ(Fremont City)లో డేవిడ్ బ్రిమ్మర్(71) అనే వ్యక్తి వరుణ్ సురేష్(29) చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం పోలీసులకు తానే సమాచారం అందించి నిందితుడు లొంగిపోయాడు. ఈ క్రమంలో.. విచారణ అనంతరం సెప్టెంబర్ 22వ తేదీన హత్యా అభియోగాలను పోలీసులు అధికారికంగా నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత.. అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఘటన ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. వరుణ్ సురేష్(Varun Suresh) పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు. చనిపోయిన డేవిడ్ బ్రిమ్మర్ గతంలో పసికందులపై లైంగిక వేధింపులకు పాల్పడి.. తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిచి వచ్చాడు. పబ్లిక్ సె* అఫెండర్ రిజిస్ట్రీలో అతని పేరు కూడా నమోదు అయ్యింది. ఇది గమనించిన వరుణ్ సురేష్.. అతన్ని ఎలాగైనా మట్టు పెట్టాలని అనుకున్నాడు. పబ్లిక్ సర్టిఫైడ్ అకౌంటెంట్ వేషంలో ఓ బ్యాగు వేసుకుని కస్టమర్ల కోసం ప్రతీ ఇంటికీ తిరిగే ముసుగులో బ్రిమ్మర్ కోసం నెలలపాటు వెతికాడు. అలా ఆఖరికి.. బ్రిమ్మర్ ఇంటి తలుపు తట్టి కలుసుకున్నాడు. ఆపై చుట్టుపక్కల వాళ్లను అతని గురించి ఆరా తీశాడు. తాను వెతుకుతున్న వ్యక్తి అతనేనని ధృవీకరించుకున్నాడు.సెప్టెంబర్ 18వ తేదీన మరోసారి డేవిడ్ బ్రిమ్మర్(David Brimmer) ఇంటి తలుపు తట్టాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ మెడలో తన దగ్గర ఉన్న కత్తితో పోట్లు పొడిచాడు. చేసిన ఘాతుకాలకు పశ్చాత్తాపం చెందుతున్నావా? అని ఆరా తీశాడు. అయితే రక్తపు మడుగులో బ్రిమ్మర్ అతన్ని తోసేసి పారిపోయే ప్రయత్నం చేయబోయాడు. ఈ క్రమంలో బ్రిమ్మర్ గొంతును కోసి తాను చేపట్టిన సర్పయాగం వరుణ్ పూర్తి చేశాడు. చేసిన నేరానికి తానేం బాధపడడం లేదని, పైగా అది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వరుణ్ సురేష్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వరుణ్ సురేష్ 2021లో ఓ ఆసక్తికరమైన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఫ్రెమంట్లోనే ఓ ప్రముఖ హోటల్లో బాంబు ఉందని బెదిరించడమే కాక.. చోరీకి ప్రయత్నించాడనే నేరం కింద మూడు నెలల జైలు జీవితం గడిపాడు. అయితే.. ఆ హోటల్ సీఈవో కూడా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే. ఆ సమయంలో అతన్ని చంపేందుకే తీవ్రంగా ప్రయత్నించాడనని వరుణ్ సురేష్ ఇప్పుడు వెల్లడించడం గమనార్హం. అలమెడా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసు విచారణ జరుపుతోంది. వరుణ్ సురేష్ నేపథ్యం ఏంటి?.. అతను పసికందులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని(Paedophile) ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు?. అనే వివరాలు తెలియరావాల్సి ఉంది.చదవండి: ప్రాణాల కోసం పరిగెత్తినా.. తల ఎగిరి పడింది! -
మోదీపై వీడియో.. పన్నూకు బిగ్ షాక్
ఖలిస్థానీ ఉగ్రవాది, 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)కు మరో షాక్ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఉపా చట్టం (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం) కింద అతనిపై తాజాగా ఓ కేసు నమోదు చేసింది. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పన్నూ చేసిన వీడియో ప్రకటనే ఇందుకు కారణంగా తెలుస్తోంది.పంద్రాగస్టు సందర్భంగా.. ఎర్రకోటలో దేశ ప్రధాని జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వేడుకల్లో మోదీని జెండా ఎగరేయకుండా అడ్డుకున్న వాళ్లకు భారీ నజరానా ప్రకటించాడు సిక్స్ ఫర్ జస్టిస్ ప్రధాన న్యాయ సలహాదారు గురుపత్వంత్ సింగ్. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్ఐఏ.. UAPA (Unlawful Activities Prevention Act) కింద కేసు నమోదు చేసింది.ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసిన ఆ వీడియోలో.. సిక్కు సైనికుల్లో ఎవరైనా సరే ప్రధాని మోదీని జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలని, అలా చేస్తే రూ.11 కోట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అంతటి ఆగకుండా.. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలిపి "కొత్త ఖలిస్తాన్" అనే పటాన్ని కూడా విడుదల చేశాడు.ఈ చర్యలను భారత దేశ భద్రత, భౌగోళిక సమగ్రతను భంగపరిచే ప్రయత్నంగా భావిస్తూ.. ఎన్ఐఏ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. సిక్కు సమాజంలో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తీవ్ర వాద భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తున్నాడని ఇదివరకే అతనిపై అభియోగాల కింద పలు కేసులు నమోదు అయ్యాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. ఈ సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.ఇదీ చదవండి: బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యమంటున్న భీమవారం వాసి! -
లాటరీకి స్వస్తి.. హెచ్–1బీ కోసం కొత్త విధానం!
వాషింగ్టన్: అత్యంత నైపుణ్యమున్న విదేశీయులకే హెచ్–1బీ వీసా ప్రక్రియలో అధిక ప్రాధాన్యత కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్ తాజాగా తక్కువ నైపుణ్యమున్న విదేశీయులకు హెచ్–1బీ వీసా దక్కకూడదనే కుట్రకు తెరతీసింది. ఏటా ఇచ్చే 85వేల హెచ్–1బీ వీసాల పరిమితిదాటాక సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనల్లో అత్యధిక నైపుణ్యంతో అధిక వేతనాలు పొందగల వారికే హెచ్–1బీ వీసాలు జారీచేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పాత లాటరీ విధానానికి స్వస్తిపలికి అధిక నైపుణ్యం, అధిక వేతనం ఉన్న వాళ్లకే హెచ్–1బీ వీసాలను కట్టబెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ వెలువడింది. ‘‘ లాటరీ విధానానికి బదుల వెయిటేజీ విధానానికి ప్రాధాన్యత కల్పించాలి. అమెరికన్ సంస్థలు కోరే అభ్యర్థుల్లో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ కారి్మకులకు మాత్రమే హెచ్–1బీల జారీలో అధిక వెయిటేజీ ఇవ్వాలి. అమెరికాకు వచ్చాక 1,62,528 డాలర్ల వార్షిక వేతనం పొందబోయే అభ్యర్థులకే వెయిటేజీ పూల్‌లో నాలుగుసార్లు ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ వేతన కారి్మకులకు వెయిటేజీ పూల్‌లో ఒక్కసారే అవకాశం ఇవ్వాలి. కిందిస్థాయి ఉద్యోగాల ఎంపికలో అమెరికన్ పౌరులకు తగు ప్రాధాన్యత కల్పించాలి. అసంబద్ధమైన విదేశీ కారి్మకుల జీతభత్యాల పోటీ నుంచి అమెరికన్లను కాపాడాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఉద్యోగి వేతన స్థాయికి అనుగుణంగా రిజి్రస్టేషన్‌లో ప్రాధాన్యత కల్పించడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
నాట్స్ స్వర వీణాపాణి మ్యూజిక్ థెరఫీకి మంచి స్పందన
ఎడిసన్, న్యూ జెర్సీ: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సర్వ సాధారణంగా మారాయి. వాటిని అధిగమించడానికి సంగీతం కూడా ఒక మార్గమని నిరూపించే కార్యక్రమం న్యూజెర్సీ ఎడిసన్‌లో జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన 'మ్యూజిక్ థెరపీ' కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు గ్రహీత, సప్తస్వర సామ్రాట్ స్వర వీణాపాణి విచ్చేసి తన స్వరాలతో అందరిని సమ్మోహితం చేశారు. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, అది మనసును శాంతపరిచే ఒక శక్తిమంతమైన ఔషధం అని స్వర వీణాపాణి పేర్కొన్నారు. ఆయన అభివృద్ధి చేసిన 'స్మార్ట్-సింక్రనైజ్డ్ మ్యూజిక్ థెరపీ' పద్ధతి ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ పద్ధతిలో వివిధ రాగాలను, వాటిలోని తరంగాలను ఉపయోగించి మన మెదడులోని నరాలను ఉత్తేజపరచడం, తద్వారా ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను నివారించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాట్స్ న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంపై ఆద్యంతం అందరిని అలరించింది. 72 మేళ కర్త రాగాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన పాటను నాట్స్ పూర్వ అధ్యక్షుడు గంగాధర్ దేసు విన్నపం మేరకు వీణాపాణి పాడి వినిపించారు.అజాత శత్రువు దాము గేదెలకు నాట్స్ సత్కారంఅమెరికాలో పలు తెలుగు సంఘాలకు సేవలందిస్తూ అందరివాడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ సంఘ సేవకులు దాము గేదెలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సత్కరించింది. తెలుగు వారిని కలిపే ఏ కార్యక్రమానికైనా దాము గేదెల అందించే మద్దతు అపూర్వమని కొనియాడింది. న్యూజెర్సీ ఎడిసన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో దాము గేదెలను నాట్స్ సేవా పురస్కారాన్ని అందించి సత్కరించింది. జూలై లో టంపా వేదికగా జరిగిన అమెరికా తెలుగు సంబరాల్లో దాము గేదెలకు నాట్స్ సేవా పురస్కారాన్ని ప్రకటించారు. ఆనాడు సంబరాల్లో సమయా భావం వల్ల అందించలేని ఆ పురస్కారాన్ని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఎడిసన్‌లో ప్రత్యేకంగా దాము గేదెలను ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు గంగాధర్ దేసు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి హాజరయ్యారు. గత 40 సంవత్సరాలుగా దాము గేదెల అమెరికాలో తెలుగు సంఘాలను, తెలుగువారికి అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. దాము గేదెల లాంటి సేవా దృక్పథం ఉన్న వారు సాటి తెలుగువారిలో స్ఫూర్తిని నింపుతారని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రశంసించారు.ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం లో నాట్స్ నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి , నార్త్ ఈస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట కీలక పాత్ర పోషించారు, నాట్స్ న్యూజెర్సీ టీమ్ పాస్ట్ ప్రెసిడెంట్ గంగాధర్ దేసు, బోర్డు ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా మురళి మేడిచెర్ల, న్యూజెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు, రామకృష్ణ బోను, జతిన్ కొల్ల, వెంకట చైతన్య మాదాల, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, శ్రీదేవి జాగర్లమూడి, ఈశ్వర్ అన్నం, సోమ తదితురులు సహకరించారు. సాయి దత్త పీఠం డైరెక్టర్ సుభద్ర పాటిబండ్ల, శేఖర్ & వల్లీ వేదుల, తెలుగు కళాసమితి అధ్యక్షుడు మధు అన్న మరియు వారి కార్య నిర్వాహక సభ్యులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గ్లాస్గోలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభం
తెలంగాణకు ప్రత్యేకమైన మరియు ఆడపడుచుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నివసించే తెలుగువారు ఘనంగా ప్రారంభించారు. నిన్నటితో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డా. మమతా వుసికల,వినీల బతులా ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో అనేక మహిళలు పాల్గొని పువ్వులతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తయారుచేశారు. అందరూ సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు. బతుకమ్మ పాటలకు గుంపులుగా చిందులేసి ఉత్సాహంగా నర్తించి ఆధ్యాత్మికతతో కూడిన ఉత్సవాలను జరుపుకున్నారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాక, విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారి ఐక్యతకు, వారి భాషా-బాషా సంస్కృతులకు నిదర్శనంగా నిలిచింది.ఈ ఉత్సవానికి మదర్ ఎర్త్ హిందూ టెంపుల్ గ్లాస్గో అధ్యక్షులు డా. పునీత్ బేడి, ఉపాధ్యక్షురాలు డా. మమతా వుసికల ముఖ్య నాయకత్వం వహించారు. వారు వచ్చే వారంలో మరింత విస్తృతంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులతో, సాంస్కృతిక ప్రదర్శనలతో, సంప్రదాయ తెలంగాణ వంటకాలతో ఆ వేడుకలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ విధంగా గ్లాస్గో నగరంలో బతుకమ్మ పండుగ ఆరంభం ప్రవాసాంధ్రులు, ప్రవాసతెలంగాణ వాసుల్లో ఆనందం కలిగించిందని, తమ పుట్టిన గడ్డ సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇది ఒక గొప్ప ముందడుగని హాజరైన వారు పేర్కొన్నారు. -
‘ట్రంప్ H1B బాంబ్’పై భారత్ స్పందన
భారత్‌పై 50 శాతం సుంకాలతో టారిఫ్ బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులు, విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక-మానవీయ ఒత్తిడిని కలిగించే అవకాశం లేకపోలేదు అని పేర్కొంది. అమెరికా హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు.. అధ్యయంన చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు..నిపుణుల రాకపోకల వల్ల ప్రతిభావంతుల మార్పిడి (skilled talent exchange)తో ఇంతకాలం ఇరు దేశాలకూ పరస్పల లబ్ధి చేకూరింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉంటూ వచ్చిందని, కాబట్టి ఈ నిర్ణయం ఇరుదేశాలనూ ప్రభావితం చేసే అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. 90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేంతో హెచ్-1బీ వీసా తెచ్చారు. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం.. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా.. అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి దరఖాస్తులపై ఏడాది అడ్మినిస్ట్రేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లుగా(రూ. 88 లక్షలకు పైగా) నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి అంతేసి చెల్లించాల్సి వస్తుంది. 2024 లెక్కల ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం ఈ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. -
H-1B Visa: కఠిన నిర్ణయంపై ట్రంప్ అలా.. మోదీ ఇలా!
హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం లక్షలాది హెచ్1బీ వీసా ఉద్యోగులను కలవరపెడుతోంది. కంపెనీలు దరఖాస్తుల సంఖ్య తగ్గించవచ్చని.. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని.. ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 20న సంతకం చేసిన ప్రోక్లమేషన్(ప్రభుత్వ ప్రకటన) ప్రకారం.. హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులు.. కొత్తగా వీసా పొందేవారు.. వీసా పొడిగించుకునేవాళ్లు.. వీరందరూ ప్రతి సంవత్సరం 1,00,000 డాలర్లు చెల్లించాల్సిందే. గతంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కేవలం $1,500 డాలర్లు మాత్రమే ఉండేది..సెప్టెంబర్ 21 నుంచి, ఒక్కో హెచ్1బీ ఉద్యోగికి $100,000 (సుమారు ₹83 లక్షలు) చెల్లించని పక్షంలో అమెరికాలోకి ప్రవేశం నిషేధం విధించబడుతుంది. ఈ మార్పు ఆదివారం ఉదయం 12:01 AM EDT (భారత కాలమానం ప్రకారం 9:30 AM IST) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన 12 నెలల పాటు అమలులో ఉంటుంది, అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థల సిఫారసు మేరకు దీన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే.. H-1B వీసా నిషేధ అంశంలో కొన్ని మినహాయింపులకు అవకాశం లేకపోలేదు. కానీ, ఇవి సర్వసాధారణంగా అందరికీ వర్తించవు, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department of Homeland Security) తమ స్వంత నిర్ణయాధికారంలో మాత్రమే ఇవి వర్తిస్తాయని సమాచారం. మినహాయింపులు వీళ్లకే!అత్యవసర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసేవారు.. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించని వాళ్లకు మినహాయింపు దక్కవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.. అలాగే.. అమెరికాలో కీలక రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(R&D), ఆరోగ్యం, టెక్నాలజీ, డిఫెన్స్ వంటి రంగాల్లో పనిచేసే సంస్థల ఉద్యోగులకు మినహాయింపు దక్కే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు అవసరమైన పరిశ్రమలు.. ఆరోగ్య సంరక్షణ, సైబర్ భద్రత, AI, బయోటెక్, ఎనర్జీ రంగాల విదేశీ ఉద్యోగులకూ ఆ మినహాయింపు ఉండొచ్చు.ఈ మినహాయింపులు సదరు సంస్థలు స్వయంగానో లేదంటే వాళ్లు వ్యక్తిగతంగానూ దరఖాస్తు చేసినా పరిశీలించే అవకాశం ఉంది. అయితే, అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ(హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.ట్రంప్ ఏమన్నారంటే..అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోదీ ఏమన్నారంటే.. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని ఇవాళ జరిగిన గుజరాత్ సభలో అన్నారు. ‘నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు.అంత ఫీజు చెల్లించకపోతే..హెచ్1బీ వీసా ఫీజు చెల్లించకపోతే.. అమెరికాలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు. ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తారు. యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) వీసాను రద్దు చేయొచ్చు. కంపెనీలు గనుక ఆ ఫీజు చెల్లించలేకపోతే.. ఉద్యోగి అమెరికాలో కొనసాగలేరు. అంటే ఉద్యోగం పోతుందన్నమాట. దొడ్డిదారిన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే.. అక్రమ వలసదారుడిగా పరిగణించబడే ప్రమాదం ఉంది. ఫీజు లేకుండా అమెరికాలో ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. డిపోర్టేషన్ కూడా జరగొచ్చు. -
స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో బతుకమ్మ వేడుకల సన్నాహాలు జోరుగా
స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఉన్న మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెంపుల్ అధ్యక్షుడు డాక్టర్ పునీత్ బెడి, ఉపాధ్యక్షురాలు మమతా వూసికల, కార్యదర్శి వినీలా బత్తుల సమర్థవంతంగా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు, మాతృశక్తిని ఆరాధించే విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. అంతేకాక, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కూడా ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.బతుకమ్మ మరియు నవరాత్రులు మిలితంగా జరుపుకోవడం అనేది అక్కడి భారతీయ సమాజానికి విశేషమైన ఆనందాన్ని అందిస్తోంది. సామూహికంగా జరుపుకునే ఈ పండుగలు, భారతీయ సాంస్కృతిక విలువలను కొత్త తరానికి పరిచయం చేస్తున్నాయి.అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలను ఎదురుచూస్తున్నారు. -
అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడి మృతి
మహబూబ్‌నగర్ క్రైం: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన ప్రభు త్వ ఉపాధ్యాయులు హసానుద్దీన్, ఫర్జానాబేగం దంపతుల కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) ఈ నెల 3న అమెరికాలోని కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో తనతోపాటు గదిలో అద్దెకు ఉంటున్న రూమ్మేట్తో ఏసీ విషయంలో గొడవపడ్డాడు. ఆవేశంలో కూరగాయలు కోసే కత్తితో అతడి ని పొడిచాడు. వారి గది నుంచి శబ్దాలు రావటాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమా చారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. లొంగిపోవాలని హెచ్చరించినా నిజాముద్దీన్ వినకపోటంతో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన అతడి రూమ్మేట్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి నిజాముద్దీన్ తండ్రి హసానుద్దీన్‌కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లి, పదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఇటీవల తల్లిదండ్రులతో మాట్లాడిన అతడు.. త్వరలో ఇండియాకు వస్తానని చెప్పాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మాకు న్యాయం చేయాలి నా కొడుకు 2016లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలో రెండేళ్లు చదువుకున్న తర్వాత ఏడాదిపాటు వెదక గా జాబ్ వచ్చింది. నాలుగేళ్లు పని చేసిన తర్వాత 2023లో ప్రమోషన్‌తో కాలిఫోర్నియాకు వచ్చాడు. వీసా గడువు ముగియడంతో పొడిగిస్తామని చెప్పిన కంపెనీవాళ్లు ఆపని చేయలేదు. ప్రభుత్వ అనుమతితో ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. అయితే, రూమ్మేట్ తరుచుగా ఏసీ బంద్ చేస్తుండటంతో గొడవ జరిగిందని చెబుతున్నారు. మా బాబు స్నేహితుడు రాయచూర్‌కు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ గురువారం ఉదయం ఫోన్ చేసి విషయం చెప్పిండు. అంతవరకు మాకు సమాచారం లేదు. ఏం జరిగిందో తెలియాలి. న్యాయం చేయాలి. దీనిపై విదేశాంగమంత్రికి ఫిర్యాదు చేస్తాం. – హసానుద్దీన్, నిజాముద్దీన్ తండ్రి -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. మహబూబ్‌నగర్ యువకుడి మృతి
అమెరికాలో మహబూబ్‌నగర్ యువకుడు మృతి చెందాడు. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. మహబూబ్‌నగర్ రామయ్య బౌలికి చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్.. డిసెంబర్ 2016లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు వెళ్లాడు. ఆ యువకుడిని శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారు. మృతదేహం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఓ ఆసుపత్రిలో ఉందని తమకు తెలిసిందని.. తమ కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్‌కు తీసుకురావడంలో సాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత కాన్సులేట్ ద్వారా సంప్రదింపులు జరపాలని అభ్యర్థించారు. -
గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. ఇదే ప్రధాన లక్ష్యం
మహిషి సంహారం కోసం ఈ లోకంలో ఉద్భవించిన హరిహర పుత్రుడు అయ్యప్పకు కేరళ సర్కారు ప్రపంచ వ్యాప్త పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గల్ఫ్‌లోని అబుధాబి సహా.. వేర్వేరు దేశాల్లో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయాలున్నా.. అమెరికా నుంచి ఆచంట వరకు అయ్యప్ప భక్తులు ఏటా శబరిగిరీశుడిని దర్శించుకుంటున్నా.. కేరళలోని శబరి కొండపై కొలువుదీరిన అయ్యప్పను విశ్వవ్యాప్తం చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)తో కలిసి సంకల్పించింది. ప్రభుత్వాలు శబరిమలను ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారంటూ ఇంతకాలం కొనసాగుతున్న అపవాదులను తుడిచిపెట్టేందుకు కేరళ సర్కారు ప్రపంచ అయ్యప్ప భక్తులను ఏకం చేస్తోంది. ఏటా మండల, మకరవిళక్కు సీజన్లలో శబరిమలకు వచ్చే భక్తుల సాధకబాధకాలను వినేందుకు తొలిసారి ‘గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్’ (global ayyappa conclave) పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దేవుడు అంటే నమ్మకం లేని, కరడుగట్టిన కమ్యూనిస్టుగా పేరున్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపడం గమనార్హం..!ఎన్నారైలు మొదలు.. సామాన్యులకూ ఆహ్వానం3 వేల మంది అయ్యప్ప భక్తులకు సరిపడేలా పంపానది తీరంలో టీడీబీ, కేరళ సర్కారు భారీ కాన్క్లేవ్కు ఏర్పాట్లు చేశాయి. భారతీయులు స్థిరపడ్డ దాదాపు అన్ని దేశాలకు చెందిన అయ్యప్ప భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించాయి. ఇక సామాన్య భక్తులకు కూడా చాలా సులభంగా అవకాశం కల్పించి, పాసులను జారీ చేశాయి. శబరిమల వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా ఏటా ఏదో ఒక సీజన్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకైతే.. సెల్ఫోన్లకు సందేశాలు పంపి మరీ ఆహ్వానించాయి. ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి, ఐడీకార్డులను జారీ చేశాయి. అలా ఐడీకార్డులు డౌన్లోడ్ చేసుకున్న వారికి పేరుపేరునా ఫోన్ చేసి.. ‘‘మీరు తప్పకుండా వస్తున్నారు కదా? సెప్టెంబరు 20వ తేదీన మీరు ఉండాల్సిందే.. ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరిచిపోవొద్దు’’ అని కాన్క్లేవ్ తేదీని గుర్తుచేస్తున్నాయి. అయ్యప్ప ముందు అందరూ సమానమే అన్నట్లుగా.. సామాన్య భక్తులకు కూడా సభాస్థలి వద్ద ముందు వరసలో చోటు కల్పించాయి.ఇప్పుడే ఎందుకు?ఇప్పుడే ప్రభుత్వం, టీడీబీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తులను కేటగిరీలుగా విభజించి, ఆదాయమార్గంగా మలచుకోవాలనేదే పినరయి సర్కారు ప్లాన్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ‘‘ఇది ఆరంభమే. సెక్యూలరిజాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మాకు అంతా సమానమే. త్వరలో మైనారిటీలకూ గ్లోబల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తాం’’ అని చెబుతోంది.ఇదే ప్రధాన లక్ష్యంశబరిమల అయ్యప్ప స్వామి కీర్తిని ప్రపంచానికి చాటడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీబీ, ప్రభుత్వం చెబుతున్నాయి. అదే సమయంలో ఏటా మాసపూజలు, ఓనం, మండల, మకరవిళక్కు(మకరజ్యోతి) సీజన్లో అయ్యప్ప కొండకు వచ్చే భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే ధ్యేయమని వివరిస్తున్నాయి. అయ్యప్ప భక్త సంఘాల ప్రతినిధులు చెప్పే సమస్యలను శ్రద్ధగా విని, రాబోయే సీజన్ నుంచే వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొంటున్నాయి. శబరిమల అభివృద్ధికి ఇటీవలి బడ్జెట్లో రూ.1,300 కోట్ల కేటాయింపు మొదలు.. కేంద్రం ఆమోదించిన రోప్‌వే ప్రాజెక్టు, పథనంతిట్టలో కొత్త విమానాశ్రయానికి, రైల్వే మార్గానికి చేస్తున్న ఏర్పాట్లు, త్వరలో పరిచయం చేయనున్న హెలిట్యాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు వివరించనున్నట్లు కేరళ పర్యాటక శాఖ చెబుతోంది.స్వాగతం ఇలా..ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తులకు పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. శబరిమలకు దారితీసే మార్గాలు- సీతాథోడ్, పెరునాడ్, పంపా ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భక్తులకు వసతి సదుపాయాలను సిద్ధం చేసింది. ఆహూతులందరికీ సెప్టెంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి హిల్ టాప్ వద్ద పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పంపా వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించింది. ఇక పారిశుద్ధ్యం మొదలు.. తాగునీటి సదుపాయం, భోజనాలు వంటి ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తును సిద్ధం చేసింది.బాలారిష్టాలెన్నెన్నో..గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్ అనే భావన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. అయితే.. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఉంటుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ నాయర్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ కోర్టు మెట్లెక్కారు. దీని వల్ల రాణి ఫారెస్ట్, పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలతో కేరళ హైకోర్టు ఏకీభవించడంతో.. ఓ దశలో కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. కేరళ సర్కారు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.చదవండి: రూ.కోటి వ్యయంతో అతి పురాతన వైష్ణవాలయానికి పూర్వవైభవంపందళ రాజకుటుంబం దూరంగ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్కు తాము దూరంగా ఉంటున్నట్లు పందళం రాజకుటుంబం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో పందళ రాజమాత మృతి చెందిన నేపథ్యంలో.. ఈ నెల 27 వరకు తాము దైవదర్శనానికి రాకూడదని పందళం ప్యాలెస్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించింది. తాము కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. దీంతో.. నీలక్కల్ను దాటి తాము పంపావైపు రాలేమని తెలిపింది.శబరిమల అభివృద్ధికి దోహదం: ఎస్.శ్రీజిత్, అదనపు డీజీపీ''గ్లోబల్ కాన్క్లేవ్ ద్వారా శబరిమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతుంది. ఇది భవిష్యత్‌ని ఉద్దేశించి చేపట్టిన ఓ ప్రాజెక్టు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు అయ్యప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా కృషి చేస్తున్నాం.''అయ్యప్ప అందరివాడు: నాగ మల్లారెడ్డి, గురుస్వామి''అయ్యప్ప ముందు అందరూ సమానమే. స్వామి దగ్గర తరతమబేధభావాలుండవు. ఆయన అందరివాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలవాడు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''స్వామి మహిమలెన్నెన్నో: వైవి సుబ్బారెడ్డి, గురుస్వామి(కడప)''అయ్యప్ప మహిమలు ఎన్నో.. ఎన్నెన్నో..! నమ్మినవారి కొంగు బంగారం ఆ మణికంఠుడు. ఉదాహరణకు ఎరుమేలి నుంచి పంపాకు పెద్దపాదం మార్గం(45 కిలోమీటర్లు) ఎత్తైన కొండల మీదుగా ఉంటుంది. కఠిన దీక్షలు చేసి, భక్తిప్రపత్తులతో వస్తున్న వారికి ఈ దూరం ఒక లెక్కే కాదు. అలాంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా వనయాత్రను పూర్తిచేసుకుంటారు. భక్తితో కాకుండా.. బలముందనే అహంకారంతో వచ్చేవారు 2 కిలోమీటర్లు నడిచినా.. 15 కిలోమీటర్ల దూరం నడిచామా? అనే భావన కలుగుతుంది. భక్తులకు కరిమల కొండ కఠిన పరీక్షలు పెడుతుంది. వాటిని అధిగమించి, స్వామిని చేరేవారి జన్మ ధన్యం.'' -
పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్‌లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్‌కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్‌తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్‌తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్‌తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్‌తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్‌కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్‌గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్‌పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్‌ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు తన లేఖలో పేర్కొంది. -
గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్‌కు చెందిన రాహుల్‌రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్‌కు గురయ్యాడు. అతనికి బోన్‌మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్‌రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్‌లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్‌పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్‌లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్‌కుమార్, వైస్‌చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్‌గౌడ్, ఎన్నారై, లండన్ -
యూఎస్‌లో శ్రామిక కొరతను అందిపుచ్చుకునేలా..
ఐటీ జాబ్స్ కాకుండా విదేశీయుల కోసం యూఎస్‌లో చాలానే ఉద్యోగాలు ఉన్నాయి. యూఎస్‌లో పెరుగుతున్న శ్రామిక కొరత దృష్ట్యా భారత యువతకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం. ఐటీ కాకుండా అమెరికాలో ప్రస్తుతం నర్సింగ్, హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ), స్కిల్డ్ ట్రేడ్ ఉద్యోగాలు (వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ వంటివి), వ్యవసాయ రంగాల్లో భారతీయ యువతకు అవకాశాలు ఉన్నాయి.కొన్ని సంస్థల సర్వేల ప్రకారం.. భారతదేశంలో 18-40 సంవత్సరాల వయసు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయసు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్‌గా ఎదగడానికి భారత్‌కు అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన యూఎస్ వంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా యువ జనాభా అంతంతమాత్రంగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని భారత్ భర్తీ చేస్తుంది.యూఎస్‌లో ఐటీయేతర ఉద్యోగ అవకాశాలునర్సింగ్, ఆరోగ్య సంరక్షణ: అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సులకు, ఇతర ఆరోగ్య నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ): హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ వంటి హాస్పిటాలిటీ రంగాల్లో కూడా భారతీయ యువతకు అవకాశాలు లభిస్తాయి.నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలు: వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, గృహ నిర్మాణ కార్మికులు.. వంటి నైపుణ్యం కలిగిన ట్రేడ్‌ల్లో కూడా అమెరికాలో కొరత ఉంది. దీనికి తగిన శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయి.వ్యవసాయం: అమెరికా వ్యవసాయ రంగంలో కూడా వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం అమెరికా వీసా విధానాలు కఠినతరం కావడంతో ముఖ్యంగా హెచ్-1బీ వీసా వంటి వాటికి ఎంతో పోటీ ఉంది. భారత యువత వీటిని అందిపుచ్చుకోవడానికి సంబంధిత రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి. విద్యార్హతలు సంపాదించాలి. అమెరికా వీసా నిబంధనలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తు ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.వీసా విధానాలువీసా పేరుఉపయోగం / లక్ష్యంH‑2Aవ్యవసాయ రంగంలో సీజనల్ వర్కర్ల కోసం ఈ వీసా పని చేస్తుంది.H‑2Bవ్యవసాయేతర సీజనల్ / తాత్కాలిక ఉద్యోగాలు (హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, పార్క్స్, రిసోర్ట్స్ మొదలైనవి)L‑1కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వర్కర్లుO‑1అత్యుత్తమ ప్రతిభ (ఆర్ట్స్, అథ్లెటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్సెస్) ఉన్నవారికీ ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా? -
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్బంగా అమెరికాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఫిలడెల్ఫియా నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.డాక్టర్ రాఘవ రెడ్డి గోసల సమన్వయకర్తగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఆళ్ళ రామిరెడ్డి తోపాటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.గత 15 సంవత్సరాలుగా రాజన్నను స్మరించుకుంటూ ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలిచారు. ప్రజా శ్రేయస్సు కోసం మన వైస్సార్ అభిమానులు ముందుకు వచ్చి రక్త దానం చేయడం నిజంగా ప్రశంసనీయం. అదే మన రాజన్నకు ఇచ్చే ఘనమైన నివాళి అని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిని స్మరించుకుంటూ సంతాపం తెలియజేశారు. ఇక ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు.. వైఎస్సార్ అభిమానులను, సమన్వయ కర్త డాక్టర్ రాఘవ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: శంకర నేత్రాలయ యూఎస్ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి) -
శంకర నేత్రాలయ యూఎస్ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి
శంకర నేత్రాలయ USA తన అడాప్ట్-ఎ-విలేజ్ కంటి సంరక్షణ కార్యక్రమాల దిగ్విజయాన్ని స్మరించుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వెనుకబడిన గ్రామాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా ఏర్పాటు చేసేందుకు సహకరించిన పోషకదాతల అమూల్యమైన అనుభవాలు, సూచనలను తెలుకునేందుకు వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శంకర నేత్రాలయం యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందూర్తి అధ్యక్షతన ఈ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంతో దార్శనికులను, దాతల సముహాన్ని ఒకచోటుకి చేర్చింది. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో మెగా డోనార్లు, బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదార్లు, బోర్డు సభ్యులు ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్ తదితరలు ఉన్నారు. ఈ వేడుక గ్రామీణ భారతదేశం అంతటా జీవితాలను ప్రకాశవంతం చేసేలా అడాప్ల్ ఎ విలేజ్ పోషకదాత ఉనికిని ప్రతిధ్వనించేలా చేసింది. ఈ సందర్భంగా దత్తత గ్రామ పోషకులు కంటి శిబిరాలను తాము సందర్శించి వివరాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. అక్కడ వారు ప్రతి రోగికి లభించిన కంటి సంరక్షణ, శస్త్రచికిత్సలు గురించి తెలుసుకున్నారు. ఒక రకంగా ఇది సంస్థ అచంచలమైన ప్రమాణాలను, లోతుగా పాతుకుపోయిన సేవతత్వాన్ని ధృవీకరిస్తోంది. చాలామంది రోగులకు దృష్టిని పునరుద్ధరించి అత్యంత దుర్భలమైన వారి జీవితాలను మార్చింది. తరతరాలుగా కంటి సంరక్షణను ముందుకు తీసుకువెళ్లడంలో భాగస్వామ్యం, దాతృత్యంతో నడిచే నాయకత్వం శక్తిని పునరుద్ఘాటించింది. శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఎస్.వి. ఆచార్య ప్రసంగంలో, సంస్థ దార్శనిక వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్. బద్రీనాథ్ అందించిన సహాయ సహకారాలు,వి లువలు గురించి వివరించారు. అలాగే అడాప్ట్-ఎ-విలేజ్ పోషకుల ఉదార మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
భారతీయుడి హత్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
టెక్సాస్‌లోని డల్లాస్‌లో చోటుచేసుకున్న భారతీయుడి దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన పర్యవేక్షణలో వలస నేరస్తుల విషయంలో తమ యంత్రాంగం మృదువుగా వ్యవహరించదని తెగేసి చెప్పారు. అమెరికాను సురక్షిత ప్రాంతంగా మారుస్తామని పేర్కొన్నారు.టెక్సాస్‌లోని డల్లాస్ చంద్ర నాగమల్లయ్య హత్యకు సంబంధించిన భయంకరమైన రిపోర్టులను చూశానని, ఆయనను అతని భార్య, కుమారుని ముందు, క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు దారుణంగా తల నరికి చంపాడని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.నిందితుడు కోబో మార్టినెజ్‌పై పిల్లలపై లైంగిక వేధింపులు, గ్రాండ్ తెఫ్ట్ ఆటో, తప్పుడు జైలు శిక్ష తదితర నేరాలకు గతంలో అరెస్టు చేశారన్నారు. అలాంటి నేరస్తుడిని క్యూబా తమ దేశంలో ఉండాలని కోరుకోలేదన్నారు. అయితే గత అసమర్థ జో బైడెన్ పాలనలో నేరస్తుడు కోబో మార్టినెజ్ అమెరికాలో తలదాచుకున్నాడన్నారు.ఇలాంటి అక్రమ వలస నేరస్తుల విషయంలో మృదువుగా ఉండాల్సిన సమయం ఇక ముగిసిందని, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బోండి, బోర్డర్ జార్ టామ్ హోమన్ తదితర అధికారులు అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన కృషి చేస్తున్నారన్నారు. అమెరికా అదుపులో ఉన్న నేరస్తుడ్ని చట్ట అమలు సంస్థలు పూర్తి స్థాయిలో విచారిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.కర్ణాటకకు చెందిన నాగమల్లయ్య(50) ఓ మోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అదే చోట మార్టినెజ్(37) సిబ్బందిగా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం పాడైన క్లీనింగ్ మెషిన్ విషయంలో నాగమల్లయ్య, మార్టినెజ్ మధ్య చిన్నగొడవ జరిగింది. అయితే ఆ మందలింపును భరించలేక తన బ్యాగులో ఉన్న కత్తితో వెంటాడి మరీ మల్లయ్యను మార్టినెజ్ దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో నాగమల్లయ్య కొడుకు(18), భార్య అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వారిద్దరినీ నెట్టేసి మరీ కిరాతకంగా హతమార్చాడు. ఆపై తల నరికి కాలితో తన్ని మరీ దానిని అక్కడి చెత్త బుట్టలో పడేశారు. అనంతరం పోలీసులు హత్యా నేరం కింద అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతనిది నేరస్వభావమని, గతంలోనూ పలు నేరాలు చేశాడని, క్యూబా అతన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో ఇక్కడే అమెరికాలోనే ఉండిపోయాడని, ఈ ఏడాది జనవరిలో నిబంధనల ప్రకారం విడుదల చేయాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపార. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. మరోవైపు భారతీయ కమ్యూనిటీ ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరించి నాగమల్లయ్య కుటుంబానికి అందజేసింది. సెప్టెంబర్ 13వ తేదీ నాగమల్లయ్యకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి. -
డల్లాస్ ఎన్నారై హత్య: ప్రాణభయంతో నాగమల్లయ్య..
అమెరికా టెక్సాస్ డల్లాస్ నగరంలో జరిగిన ఎన్నారై దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటక మూలాలున్న చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్య(50)ను యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా తల నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డల్లాస్ సిటీ సామ్యూల్ బౌలేవార్డ్‌లో డౌన్‌టౌన్ సూట్స్ మోటల్ ఉంది. ఇందులో చంద్ర నాగమల్లయ్య(50) మేనేజర్‌గా పని చేసేవాడు. అదే హోటల్లో క్యూబాకు చెందిన యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ సిబ్బందిగా పని చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీన నాగమల్లయ్య పాడైపోయిన వాషింగ్ మెషిన్ విషయంలో కోబాస్‌కు ఏదో సూచన చేశాడు. అయితే అది నేరుగా చేయకుండా.. పక్కన ఉన్న మరో మహిళా సిబ్బందికి చెప్పి అతనికి చెప్పమన్నాడు. ఇది కోబాస్‌కు కోపం తెప్పించింది. తన గదిలో ఉన్న కత్తితో నాగమల్లయ్యను కోబాస్ వెంటాడి చంపాడు. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లో నాగమల్లయ్యను కోబాస్ ఆ మోటల్ కారిడార్‌లో కత్తితో వెంబడించిన దృశ్యాలు రికార్డయ్యాయి. నాగమల్లయ్య కొడుకు(18)బేస్‌బాల్ బ్యాట్‌తో కోబాస్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. నాగమల్లయ్యను అతని భార్యాకొడుకు ముందే కిరాతకంగా తలనరికి చంపాడు కోబాస్. అంతటితో ఆగకుండా.. ఆ తలను కాలితో ఫుట్బాల్లాగా తన్నాడు. అది కాస్త దూరం దొర్లుకుంటూ వెళ్లాక.. దానిని చెత్తబుట్టలో పడేశాడు. ఇది కూడా అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యింది. ఆపై పోలీసులు హత్యానేరం కింద కోబాస్‌ను అరెస్ట్ చేసింది. తొలుత క్షణికావేశంలో జరిగిన హత్య అని.. కాదు జాత్యాంహకార హత్య అని.. ఇలా రకరకాల కోణాల్లో చర్చ జరిగింది. అయితే.. నిందితుడు యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) అందించిన వివరాల ప్రకారం.. కోబాస్-మార్టినెజ్‌కు క్యూబాకు చెందిన వ్యక్తి. అమెరికాకు అక్రమంగా వచ్చిన వలసదారు. పైగా అతనిపై అమెరికాలోనే ఇంతకు ముందు దాడులు, దొంగతనాలకు పాల్పడిన తీవ్రమైన నేరచరిత కూడా ఉంది. అయితే.. క్యూబా ప్రభుత్వం అతనిపై ఉన్న తీవ్ర నేరాల దృష్ట్యా వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో బైడెన్ పాలనలో సూపర్వైజన్ ఆర్డర్ కింద Immigration and Customs Enforcement కస్టడీ నుంచి ఈ ఏడాది జనవరిలో అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఆనాడు అలా విడుదల చేయకుంటే లీగల్‌గా సమస్యలు ఎదురయ్యేవి. ఈ ఘటనపై భారతీయ సమాజం, అంతర్జాతీయ వేదికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత హింసాత్మకంగా జరిగిన ఈ హత్య.. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై, అలాగే ప్రవాస భారతీయుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. “బాబ్” అనే ముద్దుపేరుతో స్నేహితులు పిలిచే నాగమల్లయ్యను కర్తవ్యపరుడని, మానవతావాదిగా గుర్తు చేస్తోంది. మరోవైపు.. భారతీయ కమ్యూనిటీలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, ఫ్యూనరల్ ఖర్చులు, కుమారుడి విద్యా ఖర్చుల కోసం ఫండ్ రైజర్ ఏర్పాటు చేశాయి. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మందలించినందుకు తల నరికేశాడు
డాలస్: అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్‌లో దారుణం జరిగింది. భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను తోటి కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడు. తాము పనిచేస్తున్న హోటల్ వద్ద భార్య, కుమారుడి కళ్లెదుటే ఆయన తలను నరికేశాడు. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. ప్రాణభయంతో పరుగులు తీసిన నాగమల్లయ్యను వెంటాడి మరీ నరకడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హంతకుడు యొర్డానిస్ కోబోస్–మారి్టనెజ్(37)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేశారు. హంతకుడిని క్యూబా జాతీయుడిగా గుర్తించినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నేర చరిత్ర కలిగిన మారి్టనెజ్పై గతంలోనే కేసులు నమోదయ్యాయి. వాహనం దొంగతనం కేసుతోపాటు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకు వెళ్లాడు. వలసదారుడన్న సానుభూతితో జో బైడెన్ ప్రభుత్వం అతడిని జైలు నుంచి విడుదల చేసింది. నేరస్థుడైన మారి్టనెజ్కు తమ దేశంలోకి అనుమతించేందుకు క్యూబా ప్రభుత్వం నిరాకరించింది. దాంతోనే అమెరికాలోనే ఉంటున్నాడు. నాగమల్లయ్య హత్య విషయంలో నేరం నిరూపణ అయితే మారి్టనెజ్కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెప్పారు. అసలేం జరిగింది? చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అదే హోటల్లో మార్టినెజ్ కార్మికుడు. ఇద్దరికీ చాలా రోజుల నుంచే పరిచయం ఉంది. బుధవారం ఉదయం హోటల్ గదిని శుభ్రం చేసే విషయంలో గొడవ మొదలైంది. మారి్టనెజ్, మరో మహిళా కార్మికురాలు కలిసి విరిగిపోయిన మెషీన్‌తో గదిని ఊడ్చేందుకు ప్రయతి్నస్తుండగా నాగమల్లయ్య వారించాడు. అలా చేయొద్దంటూ మందలించినట్లుగా మాట్లాడారు. దాంతో ఆగ్రహానికి గురైన మారి్టనెజ్ అప్పటికే తన వద్దనున్న కత్తితో నాగమల్లయ్యపై దాడి చేసేందుకు ముందుకొచ్చాడు. ఆందోళన చెందిన నాగమల్లయ్య వెంటనే బయటకు పరుగెత్తారు. ఎవరైనా తనను కాపాడాలని గట్టిగా ఆరుస్తూ పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. మారి్టనెజ్ అక్కడికి దూసుకొచ్చి నాగమల్లయ్యను కత్తితో పొడిచేశాడు. ఉన్మాదిలా మారి విచక్షణారహితంగా తల నరికాడు. నాగమల్లయ్య జేబులోని తాళం కార్డును, సెల్‌ఫోన్‌ను తీసుకున్నాడు. తెగిపడిన తలను కాలితో రెండుసార్లు దూరంగా తన్నాడు. తర్వాత తలను చేతితో తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకున్నారు. మారి్టనెజ్ను అరెస్టు చేశారు. రక్తంతో కూడిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. ఈ హత్య జరుగుతున్న సమయంలో నాగమల్లయ్య భార్య, కుమారుడు హోటల్లోనే ఉన్నారు. కేకలు విని బయటకు వచ్చారు. నాగమల్లయ్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, వారిని మారి్టనెజ్ బలవంతంగా నెట్టేశాడు. నాగమల్లయ్య తల తెగిపోయేదాకా నరుకుతూనే ఉన్నాడు. ఇదంతా హోటల్ ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కళ్లెదుటే జరిగిన హత్యను చూసి నాగమల్లయ్య భార్య, కుమారుడు బిగ్గరగా రోదించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలు బాదుకున్నారు. ఈ హత్య పట్ల హూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబానికి తగిన సాయం అందిస్తామని, అండగా ఉంటామని ప్రకటించారు. కర్ణాటక వాసి నాగమల్లయ్య నాగమల్లయ్య స్వస్థలం భారత్‌లోని కర్ణాటక. చాలా ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. డాలస్ డౌన్‌టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్‌గా చేరారు. ఆయన చాలా సౌమ్యుడని, గొడవలకు దూరంగా ఉంటారని మిత్రులు చెప్పారు. కుటుంబం అంటే ఆయనకు ప్రాణమని, ఇతరుల పట్ల దయతో వ్యవహరిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం బాధగా ఉందన్నారు. నాగమల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన కుమారుడి చదువులకు అయ్యే ఖర్చుల కోసం మిత్రులు నిధుల సేకరణ ప్రారంభించారు. నాగమల్లయ్య అంత్యక్రియలు శనివారం అమెరికాలోనే జరుగుతాయని సమాచారం. -
ఆ దేశంలో తల్లులకు ఆర్థిక భరోసా వేరే లెవెల్..!
వర్కింగ్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే..కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..నెహా తాను ప్రెగ్నెంట్ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది. దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Neha Arora (@mylovefromkorea17) (చదవండి: 'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..) -
అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..
అబుదాబిలో ఆధ్యాత్మికత వెల్లివిరవడం అనేది ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలు అక్కడ హిందూ దేవాలయాలా..! అనే అనిపిస్తుంది గానీ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం అనేలా కళ్లముందు కదాలాడుతున్న ఆ వైరల్ వీడియోనే అందుకు నిదర్శనం. ఆ హారతి ఘటన చూస్తే..మనం దుబాయ్‌లో ఉన్నామా? కాశీలో ఉన్నామా..? అన్న సందేహం రాక మానదు. మరి ఆ కథా కమామీషు ఏంటో చదివేద్దాం రండి..ఇటీవల దుబాయ్‌కు వెళ్లిన ఒక భారతీయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ(BAPS) హిందూ మందిర్‌లో గంగా హారతి చూసి తన్మయత్వానికి గురయ్యాడు. యూఏఈకి మకాం మార్చిన మూడు వారాల తర్వాత ఈ 24 ఏళ్ల వ్యక్తి ఈ ఆలయ సందర్శన వీడియోని నెట్టింట పంచుకున్నాడు. రెండు వారాలు ఒక హోటల్లో గడిపి..చివరికి ఒక కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఈ ఐకానికి ఆలయాన్ని అన్వేషించాడు. ఒక వీక్ఆఫ్(సెలవు) రోజున ఈ ఆలయాన్ని సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. అక్కడ గంగా హారతిని చూసి తన దేశంలోనే ఉన్నానా అన్న బ్రాంతిని పొందానంటూ అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ వీడియోకి నేను "నేను UAEలో గంగా హారతిని చూశాను" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. విదేశాలలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ ఆలయాల పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. BAPSకి చెందిన ఈ ప్రార్థనా స్థలాలు మంచి ఆధ్యాత్మిక ఓదార్పుని అందిస్తాయి. తాము వేరు అనే భావన కాకుండా తన స్వదేశం మూలాలు, సంస్కృతితో గాఢంగా పెనవేసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. కాగా, ఈ ఆలయంలో రోజువారి గంగా ఆరతి వేడుకలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇక ఈ అబుదాబిలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ మందిర్ (BAPS) 27 ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంది. దీన్ని UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉదారంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని 2019లో నిర్మించారు. అందుకు 400 మిలియన్ యుఏఈ దిర్హామ్‌లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 961 కోట్లు పైనే ఖర్చు అయ్యింది. View this post on Instagram A post shared by Akash Kawale (@akashkawale10) (చదవండి: నైట్ ఈటింగ్ సిండ్రోమ్..! ఆరోగ్యాన్ని అమాంతం తినేస్తుంది..) -
కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండగలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా గణేష్ ఉత్సవాలను కెనడాలో స్థిరపడిన భారతీయులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒంటారియో రాష్ట్రం ఓక్ విల్లే పట్టణంలో తెలుగువారి కుటుంబాలన్నీ ఒక్క చోట చేరి గణేష్ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. టీమ్ యువ పేరుతో ఏర్పాటైన సంఘం ఆధ్వర్యంలో యువకులంతా ఒక జట్టుగా గణనాధుడి వేడుకలను కనులపండగగా నిర్వహించారు.పుట్టిన గడ్డకు సుదూరంలో ఉన్నా ఇక్కడ సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తున్నామని, రానున్న తరాలైన తమ పిల్లలకు భారతీయ పండగల విశిష్టత తెలిసేలా నిర్వహిస్తున్నామని టీమ్ యువ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఓక్ విల్లే పార్లమెంట్ మెంబర్ సిమా అకన్, మేయర్ రాబ్ బుర్టన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. భారతీయుల పండగలు కలర్ ఫుల్ గా ఉంటాయని మెచ్చుకున్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఉత్సవాల కోసం ప్రత్యేక సందేశం పంపారు. భిన్నత్వంలో ఏకత్వమనే సందేశాన్ని గణేష్ నవరాత్రులు నిరూపిస్తాయని ఆమె తెలిపారు.ఆనందోత్సహాల మధ్య జరిగిన ఈ వేడుకలకు రఘు యాదవ్, మధు రెడ్డి, హరీశ్వర్, వెంకట్, శివకుమార్, అభిలాష్, అరుణ్ రెడ్డి, మనీష్, దినేష్, సృజన్ తదితరుల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేసింది. -
విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థి కె. ఈరన్న ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ.1.5 లక్షలు సహాయం అందించి మోషన్ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిస్తున్నారు. రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఈరన్న ఇంటర్మీడియెట్ బైపీసీ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి 440 మార్కులకుగాను 425 మార్కులు సాధించాడు. ఈరన్న చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఈరన్నను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలో పదవతరగతిలో టాపర్‌గా వచ్చిన ఈరన్న ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రవి పొట్లూరి సహాయం మరువలేనిదని ఈరన్న అన్నారు. తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ అవ్వాలని తన కోరిక అని కష్టపడి చదువుకుని డాక్టర్ సీటు సాధించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడానికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని, సహకరిస్తున్న తానా ఫౌండేషన్ శశికాంత్ వల్లేపల్లికి ఈ సందర్భంగా రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్, మోషన్ రెసిడెన్షియల్ కళాశాల కరస్పాండెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.(చదవండి: లండన్‌లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
హాంకాంగ్‌లో గిడుగుకు ఘనంగా తెలుగు నివాళి
తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటారు. ఈ రోజును గిడుగు రామమూర్తి జయంతిగా జరుపుకుంటూ, తెలుగు భాష వికాసానికి ప్రధాన కారకుడైన గిడుగు రామమూర్తికి ఇది ఘన నివాళి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.గిడుగు రామమూర్తి పంతులు గారి తెలుగు భాషపై చేసిన కృషిని గురించి కొన్ని ముఖ్యాంశాలు: వ్యావహారిక భాషా ఉద్యమం: గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాషలో వ్యావహారిక భాషా ఉద్యమానికి పితామహులుగా పిలువబడతారు. వారు రాసిన కొన్ని ముఖ్యమైన రచనలు:"తెలుగు వ్యాకరణ విమర్శ" - తెలుగు భాషలో గ్రాంథిక, వ్యావహారిక భేదాలపై విశ్లేషణ"ఆంధ్ర పండిత భిషక్కులు" - తెలుగు భాషా సంస్కరణపై వ్యాసంసరళ వ్యావహారిక భాషా ప్రయోగం" - వ్యావహారిక భాష ఆవశ్యకతపై వివరణముఖ్య సిద్ధాంతాలు: "మాట్లాడే భాషే రాయాలి, రాసే భాషే మాట్లాడాలి" "భాష ప్రజల కోసం, ప్రజల భాషే అసలైన భాష" "గ్రాంథిక భాష కాకుండా వ్యావహారిక భాష విద్యాబోధనకు ఉపయోగపడుతుంది"భాషా సంస్కరణలు:-పాఠశాలల్లో వ్యావహారిక భాష బోధనకు కృషి-తేలికైన తెలుగు భాషా ప్రయోగాన్ని ప్రోత్సహించడం-తెలుగు భాషలో ఉన్న క్లిష్టమైన పదజాలాన్ని సరళీకరించడంఆయన రాసిన ముఖ్య పుస్తకాలు:సమాజిక భాషా శాస్త్రము"ఆంధ్ర భాషాభివృద్ధి"వ్యావహారిక భాషా వాదము""నూతన వ్యాకరణము"గిడుగు వారి ఆలోచనలు:భాష ప్రజల అవసరాలను బట్టి మారుతుందిభాష సజీవమైనది, నిరంతరం పరిణామం చెందుతుందిసామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషే ఉత్తమమైన భాషవిద్యాబోధన సులభతరం కావాలంటే వ్యావహారిక భాష అవసరం ఈనాటికీ గిడుగు వారి భాషా సిద్ధాంతాలు తెలుగు భాషా అభివృద్ధికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. ఆయన చూపిన బాట తెలుగు భాషా వికాసానికి ఎంతగానో తోడ్పడింది.ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య గిడుగు రామమూర్తి పుట్టినరోజును తెలుగు సాంస్కృతిక ఉత్సవంగా జరుపుకుంది. గిడుగు సేవలను తెలుపుతూ, తెలుగు భాషను నేర్చుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను స్థాపక సభ్యురాలు జయ పీసపాటి వివరించారు. ఈ సందర్భంగా పిల్లలు తెలుగు భాష, సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రదర్శిస్తు క్లాసికల్, సెమి క్లాసికల్, జానపద మరియు టాలివుడ్ పాటలు - నృత్యాలను ఘనంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కవితలు, కథా విన్యాసాలు కూడా నిర్వహించారు. పిల్లలకు చిత్రకళా పోటీలు కూడా నిర్వహించారు. వార్షికంగా, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పిల్లలని - వారి అభిరుచుల్ని, కళలను ప్రోత్సహించడాన్ని సమర్థిస్తున్నామని, దాదాపు రెండు దశాబ్దాలుగా వారాంతంలో తెలుగు తరగతులు నిర్వహిస్తున్నామని, తమ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన తమ కార్యవర్గ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలుపుతు , పిల్లలని వారి తల్లిదండ్రిని అభినందిస్తూ భాష నేర్చుకోవడంలో ముందడుగు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నందుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
లండన్‌లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..
విదేశాల్లో మన చిరుతిండ్లు ఫేమస్ అవ్వడం కాదు..వాటి రుచికి విదేశీయులు ఫిదా అవుతూ లొట్టలేసుకుంటూ లాగిస్తున్నారు. కేవలం మన ప్రవాస భారతీయులే కాదు..అక్కడ స్థానిక విదేశీయులు కూడా ఇష్టపడటం విశేషం. మళ్లీ మళ్లీ తినేందుకు ఆయా భారతీయ రెస్టారెంట్లు లేదా హోటళ్లకు వస్తున్న వీడియోలను చూశాం. అయితే ఇప్పుడు మనమంతా ఇష్టంగా స్నాక్స్ టైంలో తినే సమోసా లండన్‌లో నివశిస్తున్న భారతీయులకే కాదు అక్కడున్న విదేశీయలకు కూడా అత్యంత ఇష్టమైన వంటకంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.ఆ వీడియోలో బీహార్‌కి చెందిన వ్యక్తి లండన్‌లోని రద్దీగా ఉండే వీధుల్లో సమోసాలు అమ్ముతున్నట్లు కనపిస్తుంది. ఆ స్టాల్‌పై ఘంటావాలాస్ సమోసాస్. అతడు సమోసాలను పరిశుభ్రంగా తయారు చేసిన తీరుతోపాటు వాటిని అక్కడివాళ్లు ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తారో కూడా వివరించడమే కాదు, కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు. అంతేగాదు ఒక బిహారీ లండన్‌లో ఉన్నంత వరకు సమోసాల రుచి ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని సగర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు ఈ వీడయోకి "లండన్‌లో అత్యుత్తమ సమోసా" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఏకంగా 37 మిలియన్ల వ్యూస్, లైక్‌లు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!. View this post on Instagram A post shared by Bihari Samosa UK (@biharisamosa.uk) (చదవండి: భారత్‌లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..) -
బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మినిస్టర్ కావడమే తన లక్ష్యమని లండన్‌లోని రాయల్ బరో ఆఫ్ కెన్జింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్ ఉదయ్ శుక్రవారం.. భీమవరం వచ్చారు. తాను చదువుకున్న సెయింట్ మెరీస్ స్కూల్లో విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. టెన్నిస్ కోసం లండన్‌కు మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు గ్రామం. ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ తాత నాయనమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్‌లో చేరాను. స్కూల్ నేషనల్స్, ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్‌కు ఏపీ కెపె్టన్‌గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్ తరువాత టెన్నిస్ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్షిప్ రావడంతో లండన్‌లో ఎంఎస్ చేశాను. రాజకీయాల్లోకి.. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటూ కన్జర్వేటివ్ పార్టీ ఫాలోవర్‌గా ఉన్నాను. అక్కడి సిటిజన్‌షిప్ కూడా వచ్చింది. బ్రిగ్జిట్ టైంలో డేవిడ్ కేమరూన్ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పారీ్టల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామనే. ఈ పరిస్థితులను బట్టి బ్రిటిష్ వాళ్లు మనల్ని రూల్ చేయలేదు. మన అంతర్గత కొట్లాటలతో మనమే పాలించబడ్డామని నా అభిప్రాయం. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి. 2018, 2022ల్లో సెంట్రల్ కౌన్సిలర్‌గా ఎన్నిక నిజాం కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్కు ఆకర్షితుడినయ్యాను. లండన్‌లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులు, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్ జూలీమీల్స్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్ ఓటింగ్‌లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్ డిక్లేర్ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్ కౌన్సిలర్‌గా గెలిచాను. కౌన్సిలర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం.2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్‌లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్‌గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎని్వరాన్‌మెంట్ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆక్వా, ఎన్విరాన్మెంట్కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్ అవడం తదుపరి లక్ష్యాలు. -
శాశ్వత నివాసం కోసం ఆకర్షణీయ మార్గం
యూరప్‌లో నివసించాలని చూస్తున్నవారికి ఐర్లాండ్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. యురోపియన్ యూనియన్యేతర జాతీయులు ఐర్లాండ్‌లో దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరుచుకునేందుకు ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికోసం దరఖాస్తు చేసేకునేందుకు భారతీయులు సైతం అర్హులని చెప్పింది. ఈ అవకాశం కోసం దరఖాస్తు రుసుము కేవలం 500 యూరోలు (సుమారు రూ.52,000) అని వెల్లడించింది.ఐర్లాండ్‌లో శాశ్వత నివాసంఐర్లాండ్ శాశ్వత రెసిడెన్సీని అధికారికంగా లాంగ్-టర్మ్ రెసిడెన్సీ అని పిలుస్తారు. ఇది నాన్ ఈయూ/ ఈఈఏ(ఈయూతోపాటు ఐస్‌ల్యాండ్, లీచెన్‌స్టీన్, నార్వే) పౌరులు దేశంలో నివసించేందుకు అనుమతించే విధానం. ఇది దేశ పౌరసత్వం కానప్పటికీ, అనుమతులు అవసరం లేకుండా పనిచేసే హక్కు, ప్రజా సేవలకు అవకాశం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఐర్లాండ్‌లో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాసం తర్వాత నిబంధనల ప్రకారం ఈ హోదా ఇస్తారు.ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?(భారతీయులు కూడా అర్హులు)ఐర్లాండ్‌లో చట్టబద్ధంగా ఐదేళ్లు నివసించి, అక్కడ పనిచేసిన ఈయూ/ఈఈఏయేతన జాతీయులు ఈ కింది షరతులకు అనుగుణంగా స్థిర నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు.ఐర్లాండ్ లో ఐదు సంవత్సరాలు (60 నెలలు) నిరంతర చట్టపరమైన నివాసం ఉండాలి.క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ లేదా జనరల్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ వంటి చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉండాలి.దరఖాస్తు సమయంలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారని ధ్రువీకరించుకోవాలి.క్లీన్ క్రిమినల్ రికార్డ్ ఉండాలి.ఆర్థిక స్వాతంత్ర్యం- ప్రజాధనంపై ఆధారపడకుండా మిమ్మల్ని మీరు పోషించుకునే సామర్థ్యం ఉండాలి.ఐరిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తిగా పాటించాలి.పర్మినెంట్ రెసిడెన్సీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్‌తో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాస అవసరాలను తెలియజేసేలా డాక్యుమెంటేషన్ తయారు చేయాలి.రెసిడెన్సీ కోసం ఆ దేశ నిబంధనల ప్రకారం ఫారం 8ను పూర్తి చేయాలి.పాస్‌పోర్ట్, ఐరిష్ రెసిడెన్స్ పర్మిట్ (ఐఆర్పీ) వివరాలు వెల్లడించాలి.గత ఉపాధి అనుమతులు, పని చరిత్రను నివేదించాలి.నిరంతర నివాసం కోసం రుజువులు చూపాలి.అప్లికేషన్‌ను ఇమ్మిగ్రేషన్ సర్వీస్ డెలివరీ (ఐఎస్డీ)కి సబ్మిట్ చేయాలి.అప్రూవల్ నోటీస్ అందుకున్న 28 రోజుల్లోగా 500 యూరోలు (సుమారు రూ.52,000) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.ప్రాసెసింగ్ కోసం 6 నుంచి 8 నెలలు పట్టవచ్చు.ఆమోదం పొందితే ఐర్లాండ్‌లో దీర్ఘకాలిక నివాసాన్ని ధ్రువీకరించే స్టాంప్ 4 వీసాను అందుకుంటారు.ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా? -
తానా “తెలుగుభాషా యువభేరి” విజయవంతం
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన “తెలుగుభాషా యువభేరి” భారీ విజయం. డాలస్, టెక్సస్‌లో తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 83వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శ్రీ గిడుగు వెంకట రామమూర్తి (ఆగస్ట్ 29) 162వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన “తెలుగుభాషా యువభేరి” ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలుగు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, ఉపాధ్యాయుడు,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు తెలుగును గ్రాంధిక భాషనుంచి వ్యావహారిక భాషగా మార్చే ప్రయత్నంలో గిడుగు చేసిన కృషిని సోదాహరణంగా వివరించి ఘన నివాళులర్పించారు.“ఈ నాటి ఈ కార్యక్రమంలో 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్ధినీ విద్యార్దుల నుంచి ఎం.బి.బి.ఎస్ చదువుతున్న విద్యార్ధుల వరకు కేవలం తెలుగుభాషలో ప్రావీణ్యమే గాక, అవధానాలు చేసే స్థాయికి ఎదగిన యువతీయువకులు చూపిన సాహితీ ప్రతిభ, వెదజల్లిన సాహితీ పరిమళాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి అన్నారు. ఈ ప్రయాణంలో పసితనం నుంచే వీరిలో తెలుగుభాషపై ఆసక్తి, అనురక్తి కలిగించడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణ, ముఖ్యంగా అవధాన విద్యా వికాస పరిషత్ పోషించిన గురుతరమైన పాత్ర ఎంతైనా కొనియాడదగ్గవి అన్నారు” డా. తోటకూర ప్రసాద్ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ సినీగీత రచయిత తిపిర్నేని కళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ “నేను పట్టాలు పొందింది తెలుగులో కాదు, చదువుకున్నది ఎం టెక్, ఎం.బి.ఏ. ఐనప్పటికీ తన తాత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో గురువుల శిక్షణ తనకు తెలుగు భాషామాధుర్యాన్ని చవిచూసే అవకాశం కల్పించి, నేడు తెలుగు సినిమా రంగంలో దాదాపు వంద పాటలు వ్రాసే స్థాయికి తీసకు వెళ్ళాయన్నారు. కనుక చిన్నతనంనుండే పిల్లలకు తెలుగు నేర్పే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు” విశిష్టఅతిథులు పాల్గొన్న అద్దంకి వనీజ, 9వ తరగతి విద్యార్ధిని, విజయవాడ - “ఘనమైన గద్యం”; అష్టావధాని వింజమూరి సంకీర్త్, 9వ తరగతి విద్యార్ధి, హైదరాబాద్ (వింజమూరు, నల్గొండ జిల్లా) - “శతక సాహిత్యం”; బులుసు రమ్యశ్రీ, 10వ తరగతి విద్యార్ధిని (భీమడోలు, ఏలూరు జిల్లా) - “ఆధునిక సాహిత్యం”; శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, బి.ఏ విద్యార్ధి, తిరుపతి - “ఉదాహరణకావ్యవైభవం”; అష్టావధాని యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పి.హెచ్.డి విద్యార్ధి, తిరుపతి (బల్లిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా) - “అవధానంలో సామాజిక దృక్పధం”; అష్టావధాని డా. బోరెల్లి హర్ష, బి.డి.ఎస్, దంతవైద్యులు, కర్నూలు - “వర్ణన”; అష్టావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్, ఎం.టెక్ విద్యార్ధి, ఐఐటి, ఖరగ్‌పూర్ (హైదరాబాద్) - “నిషిద్ధాక్షరి”; అష్టావధాని గట్టెడి విశ్వంత్, పి.హెచ్.డి విద్యార్ధి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (మెట్పల్లి, జగిత్యాల జిల్లా) - “తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు”; అష్టావధాని బాణావత్ నితిన్ నాయక్, బి.టెక్, ఐఐఐటి, బాసర (నిజామాబాద్) - “అవధాన విద్య-ఒక సమీక్ష” అష్టావధాని సుసర్ల సుధన్వ, ఎం.బి.బి.ఎస్ విద్యార్ధి, చెన్నై (హైదరాబాద్) – “సమస్యాపూరణం” అనే అంశాల మీద అద్భుత ప్రసంగాలుచేసి అందరినీ ఆశ్చ్యర్య పరచారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో ఈ కార్యక్రమంలో ఈ యువతీ యువకులు చూపిన భాషా పాండిత్య ప్రతిభ చూస్తుంటే తెలుగు భాష భవిష్యత్తుకు ఏ ప్రమాదం లేదనే ఆశ కలుగుతోందన్నారు. పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లింకులో వీక్షించవచ్చు https://www.youtube.com/live/DqCQES2BcwM?si=eRcIZ3B-NFxtUcMX(చదవండి: ఖతర్‌లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం) -
బాపట్లలో విషాదం.. అమెరికాలో లోకేశ్ మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. అమెరికాలో బాపట్లకు చెందిన లోకేష్(21) మృతిచెందారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయి పాటిబండ్ల లోకేష్ చనిపోయాడు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్‌ను గుర్తించారు. కాగా, ఉన్నత చదువుల కోసం లోకేశ్.. అమెరికా వెళ్లాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఖతర్‌లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
ఖతర్‌లో తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దోహాలోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ తెలుగు లిటరేచర్ క్లబ్ అనుబంధ సంస్థలైన తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం తెలుగు సంఘాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, గొప్ప భాషలలో ఒకటైన "తెలుగు" భాషను గౌరవిస్తూ, గొప్ప తెలుగు కవి, వ్యవహారిక భాష శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజునాడు నాలుగు తెలుగు సంస్థలు - హరీష్ రెడ్డి (అధ్యక్షులు - TKS), శ్రీనివాస్ గద్దె (అధ్యక్షులు - TPS), నాగ లక్ష్మి (ఉపాధ్యక్షులు - TJQ), విక్రమ్ సుఖవాసి (ఆపద్ధర్మ అధ్యక్షులు - AKV) నాయకత్వంలో ఈ వేడుకను దిగ్విజయముగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులతో పాటు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు భాషాభిమానులు, వర్ధమాన కవులు, తెలుగు పండితులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, వివిధ కూరగాయలు, పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలు/మెదడును చురుకుగా ఉంచే ఆటలతో, ఆశక్తికరమైన సంభాషణలతో తెలుగు భాషలో వారి సృజనాత్మకతను ప్రదర్శించారు. అంతేగాక, ప్రపంచ వేదికపై వివిధ రంగాలలో తెలుగు ప్రజల విజయాలు,వారి కృషిని గురించి కొనియాడారు. తెలుగు భాష పై నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.గిడుగు వెంకట రామమూర్తి గారి కవిత్వాన్ని, ఇంకా వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని వివరిస్తూ.. తాము ఆ గ్రామానికి చెందినవారమని ఒక ప్రేక్షకురాలు గర్వంగా చెప్పినప్పుడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమం తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో అత్యధిక యువత భాగస్వామ్యం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మన సంస్కృతి ప్రస్తుత తరానికి వారసత్వంగా అందుతోందని ఆశించటం అతిశయోక్తి కాదనిపించింది. ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం మాతృదేశానికి దూరంగా ఉంటున్న యువత తమ మూలాలను గుర్తించి గౌరవించడం అని తెలియ చేశారు.ఈ కార్యక్రమం ఐసిసి తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్ఆర్, అడ్మిన్ అండ్ కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ హృదయపూర్వక స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఖతర్‌లో తెలుగు సమాజం తమ సంస్కృతిని నిరంతరం సజీవంగా ఉంచడంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్ తన అధ్యక్ష ప్రసంగంలో వివిధ వర్గాలు ఐక్యతను పెంపొందించడంలో భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచ స్థాయి కవులు, తత్వవేత్తలు, కళాకారులను తయారుచేసే తెలుగు వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే వారి రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్, ఐసిసి అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల ప్రత్యేక అభినందన ప్రసంగాలు చేశారు. సాహిత్యంలో మాట్లాడే మాండలికాన్ని ఉపయోగించడం కోసం ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం శాశ్వత వారసత్వాన్ని, తెలుగు సాహిత్య సాంస్కృతిక సంపదను ప్రవాసులలోని పిల్లలు, యువతకు అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించిన సౌమ్య, శిరీష, హారిక, నాగలక్ష్మి గార్లకు ఐ సి సి నాలుగు తెలుగు సంస్థల తరపున అభినందనలు తెలియజేశారు.(చదవండి: వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ) -
షార్జా, సౌదీలో వైఎస్సార్‌కు ఘన నివాళి
సింహాద్రిపురం/కడప కార్పొరేషన్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఏఈలోని షార్జాలో మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రసన్న సోమిరెడ్డి, కోటేశ్వరరెడ్డి నేతృత్వంలో తెలుగు ప్రజలు మంగళవారం వైఎస్సార్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.అనంతరం వైఎస్సార్ అభిమాని జిలాన్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్ (YSR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఆయన చూపిన దారి ఎప్పటికీ తమకు ప్రేరణ అని పేర్కొన్నారు. అనంతరం అభిమానులు వైఎస్సార్ స్మృతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు శ్రీనివాస్ చౌదరి, అక్రమ్ బాషా, బ్రహ్మానంద రెడ్డి, నాగ ప్రతాప్ రెడ్డి, కర్ణ, పవన్, గంగిరెడ్డి, క్రాంతికుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివలింగా రెడ్డి, హనుమంత్ రెడ్డి, తాజుద్దీన్, సత్య, అంజాద్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో...డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతిని సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. జుబైల్ ప్రాంతంలో అనుయాకినో కంపెనీ క్యాంపులో కడప పట్టణానికి చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనుయాకినో కంపెనీలో పని చేసే సుమారు 50 మంది కార్మికులకు అన్నదానం చేశారు.చదవండి: విదేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళులు ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు తాజుద్దీన్, అబ్రార్, ఖ్వాజా, బాషా, సలాం బాషా, మతివ్, అఫ్జల్, ఆతిఫ్, ముహమ్మద్, జాఫర్, ఫర్ ఖాన్, ఫైరోజ్, అసిమ్, ఫైసల్ తదితరులతో పాటు కిషోర్, సంతోష్, శ్రీను పాల్గొన్నారు. -
ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?
విలాసవంతమైన జీవితం కంటే తల్లిదండ్రుల బాగోగులే ముఖ్యం అంటూ భారత సంతతి మహిళ భారత్‌కి తిరిగి వచ్చేయాలనకుంటున్నా అంటూ తన మనసులో మాటను నెట్టింట షేర్ చేసుకుంది. అయితే ఇక్కడ అంత జీతంతో తాను లైఫ్‌ని లీడ్ చేయగలనా అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చింది. అయితే నెటిజన్లు ఆమె ఆలోచన విధానానికి ఇంప్రెస్ అవ్వగా మరికొందరూ వాళ్లు ఎన్నోత్యాగాలు చేసి పంపితే ఆ కష్టమంతా మట్టిలో కలిపేస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం విశేషం. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని డెన్వర్‌లో తన జీవిత భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్న గడుపుతున్న భారత సంతతి మహిళ రెడ్డిట్ వేదికగా తన గోడుని వెల్లబోసుకుంది. తాను భారత్‌కి తిరిగి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేశారని, వారి బాగోగులు చూసుకునేందుకు తిరిగి ఇండియాకు వచ్చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ భారత్‌లో ప్రజలు కొందరు చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించడం చూసి చాలా అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. తాను మాస్టర్స్ పూర్తి చేశానని ఏడాదికి రూ. 3 కోట్లు పైనే సంపాదిస్తానని, తన భర్త ఏడాదికి దాదాపు రూ. 2 కోట్లు వరకు సంపాదిస్తారని అన్నారు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్‌కి తిరిగి వచ్చేయాలని భావిస్తున్నా..బెంగళూరులో ఉండే అవకాశం లభిస్తోంది. అక్కడ ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్లు వేతనం అని, అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి ఆ మాత్రం సంపాదన సరిపోతుందా అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తనకు యూఎస్‌లో మంచి స్నేహితులు ఉన్నారని, సౌకర్యవంతంగా జీవించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అదీగాక అమెరికాలో తన జీతం పెద్ద మొత్తం కావడంతో చాలా లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేయగలిగానని, అందువల్లే భారత్‌తో సహా వివిధ దేశాలకు సులభంగా వెళ్లగలిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాగే వర్క్ పరంగా ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదంటూ అమెరికాలోని తన లైఫ్‌స్టైల్ గురించి తెలిపింది. పైగా తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చేందుకు సిద్ధంగా లేరంటోంది. అదీగాక వాళ్లు ఇక్కడ సంస్కృతికి, స్నేహితులకు అలవాటుపడ్డ మనుషులకు అలా నాలుగు గోడల మధ్య బతకడం అంటే అత్యంత దుర్భరంగా అనిపిస్తుందని వాపోయింది. అందుకే వారి బాగోగులును తాను స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్‌కి తిరిగి వచ్చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.,అయితే తన సొంతూరిలో ఉద్యోగం చేయడం సాధ్యపడదని ఇలా బెంగళూరులో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే మరి బెంగళూరులో బతికేందుకు ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందంటారా అని సందేహ్నాన్ని లేవనెత్తతూ పోస్ట్ ముగించింది. (చదవండి: నాన్న చెప్పిన కథలే.. స్ఫూర్తి..) -
వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మొట్టమొదటి మహాసభలు అమెరికా, వర్జీనియాలోని లీస్బర్గ్లో ఉత్సాహంగా జరిగాయి. ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండురోజుల పాటు భారీ ఎత్తున వీటిని నిర్వహించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది సారథ్యంలో కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA వ్యవస్థాపక సభ్యులు ప్రవీణ్ అండపల్లి, డాక్టర్ జనార్ధన్ , డాక్టర్ గణేష్ తోట, సతీష్ పసుపులేట్, దేవేష్ కుమార్, విజయ్ దండ్యాల, మురళీధర్ రావు , మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ కమలాకర్ నల్లాల, ట్రెజరర్ వినయ్ పటేలోల్ల, జాయింట్ సెక్రటరీ సురేష్ చెంచల, జాయింట్ ట్రెజరర్ చంద్ర మోహన్ ఆవుల, మహాసభ కోర్ టీమ్ జనార్ధన్ పన్నెల , కృష్ణశ్రీ గంధం , అన్వేష్ బొల్లం, రంజిత్ భూముల, ఫౌండర్స్ కమిటీ, మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహాసభ కోర్ కమిటీ, మహాసభ ఛైర్స్, GMA గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో పాటు వందల సంఖ్యలో వాలంటీర్లు అలుపెరుగకుండా కృషి చేసి ఈ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు.ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, ప్రముఖ సినీ గేయ రచయిత,ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, ప్రముఖ మ్యూజిక్ డైర్టకర్ కోటి, ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల , గంగవ్వ, జయశ్రీ, తదితర సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.GMA మహాసభలను ఆగస్టు 30 న బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA టీమ్ పూజ నిర్వహించి మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఇక తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలతో.. డప్పు చప్పుళ్ల మధ్య అందరూ నృత్యాలు చేస్తూ.. ఊరేగింపుగా వేదక వద్దకు తరలివచ్చారు.అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు, ఇతర వివరాలతో పొందుపరిచిన ఈ సావనీర్ ను అతిథులు ఆవిష్కరించారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యాజిక్ షో నిర్వహించారు. ఇక కార్యకర్తలలో ప్రత్యక ఆకర్షణగా భారతీయతను ఇనుమడింపజేసేలా వేదిక్ మ్యాథ్య్ నిలిచింది. గాయత్రి రజినీకాంత్ ఆధ్వర్యంలో బోధించబడిన క్లిష్టమైన గణిత సమస్యలకు వేదిక్ మ్యాథ్స్ చక్కని పరిష్కారంగా నిలుస్తుంది, గతకొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా వేదిక్ మ్యాథ్స్ ఆదరణ పొందుతున్న విషయం విధితమే.! ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువత క్రూజ్ ట్రిప్ ఎంతగానో అలరించింది. ఇక బ్యూటీ పేజెంట్, మ్యాట్రిమోనియల్, GMA సరిగమ సంగీత పోటీలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి.ఇక వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ GMA అవార్డ్సుఅందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనార్స్ ని, పలువురు నేతలను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ సందర్భంగా GMA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు.ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ తన ప్రసంగంతో అందరినీ అలరించారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆస్కార్ అవార్డు వరకు సాగిన ఆయన జర్నీ గురించి వివరించారు. ఇక చంద్రబోస్ మాటలకు హర్షాతిరేకాల ప్రతిస్పందనలతో మార్మోగిపోయింది. ఆయన సందేశాత్మక ప్రసంగం ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించింది. GMA ఆధ్వర్యంలో తనకు సన్మానం జరగటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఇక ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ పోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. ఇక కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల హాస్యం పండించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఫైనల్‌గా తెలంగాణ జానపద లైవ్ బ్యాండ్ షో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రముఖ గాయనీగాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. సూపర్‌హిట్ తెలంగాణ జానపద పాటలు, సినీ పాటలతో అలరించారు.ఈ మహాసభల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేదపండితులచే సంప్రదాయ బద్ధంగా స్వామి వారి కళ్యాణం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని.. స్వామివారి ఆశీస్సులు, తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ మహాసభల్లో భాగంగా రెండు రోజు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక వేదికపై స్టూడెంట్స్ కెరీర్ పాత్, పొలిటికల్ ఫోరం, బిజినెస్ ఫోరం, ఇమ్మిగ్రేషన్ అండ్ వాల్ స్ట్రీట్ నిర్వహించారు. ఇక బ్రేకౌట్ సెషన్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ సెషన్స్, ఉమెన్ ఫోరం, హెల్త్ సెమినార్, మాట్రిమోనీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను వేదిపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు.మున్నూరుకాపులతో పాటు బీసీలను మరింత చైతన్య పర్చేందుకు,సంఘటితం చేసేందుకు ఈ మహాసభను ఏర్పాటు చేసిన రజనీకాంత్, వెంకట్, వారి మిత్ర బృందాన్ని పలువురు అభినందించారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడిన వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తానికి ఉపయోగపడాలని, బహుజనుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.ఈ సందర్బంగా పలువురికి GMA అవార్డులు అందజేశారు. ఇక అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. ఇక ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్, హాస్యవల్లరులు జరిగాయి. ఈ మహాసభ సందర్భంగా వేసిన రంగవల్లులు అందరిని ఆకర్షించాయి. ఇక ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు.. చిత్ర విచిత్ర జిమ్మిక్కులతో మాయా ప్రపంచాన్ని కళ్ళముందు ఆష్కరించారు. దేశ విదేశాల నుంచి విచ్చేసిన వందలాది మందిని సామల వేణు తన మ్యాజిక్ తో అద్భుత ప్రదర్శన ఇచ్చి అబ్బురపరిచారు.ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలను మరిపించే విధంగా ఉల్లాసభరిత వాతావరణంలో ఈ మహాసభ జరిగింది. రుచికరమైన తెలంగాణ వంటకాలతో పసందైనా విందు భోజనం అందిచారు. GMA వేడుకలు ఘనంగా జరగడానికి తమకు సహకరించిన కమిటీ సభ్యులకు, EC, BOD, RVPS, సహాయ సహాకారాలు అందించిన దాతలకు, వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ అధ్యక్షులు వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ను విజయవంతంగా నడిపిస్తున్న డోనర్లను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించి.. వారి సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలకు విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ తరపున పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 2026కు సంబంధించి అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు.. సంఘం అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, మహాసభల కన్వీనర్ రజనీకాంత్ సంఘని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఐక్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఐకమత్యంతో ఉండాలని కోరారు. వివిధ ప్రాంతాల సభ్యులను ఒకచోట చేర్చి సహకార స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యమన్నారు. మున్నూరుకాపు కుటుంబాలను అనుసంధానించి, వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ,ప్రోత్సహించడమే సంఘం ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ మహాసభలకు విచ్చేసిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, అధ్యక్షుడు వెంకట్ పెద్ది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.కన్వెన్షన్ ముగింపు వేడుకలలో భాగంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ కన్సర్ట్ అందరిని మైమరిపించి మధురానుభూతులను అందించింది. కోటి ఆధ్వర్యంలో పలువురు సింగర్స్ సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఆడియన్స్ ను మంత్రముగ్థులను చేశారు. సింగర్స్ అద్భుత పాటలతో సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. GMA కన్వెన్షన్‌లో పాల్గొన్న అతిథులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ మహాసభలు అందించాయి. భవిష్యత్తులో జరిగే మహాసభలకు GMA కన్వెన్షన్ సరి కొత్త మార్గాన్ని చూపించింది.(చదవండి: మెల్బోర్న్లో అద్భుతంగా అష్టావధాన కార్యక్రమం) -
లండన్‌లో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి
బడంగ్పేట్/ ఉప్పల్: లండన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువకులు దుర్మరణంపాలయ్యారు. మృతులను నాదర్ గుల్కు చెందిన చైతన్యయాదవ్ (అభి), పీర్జాదిగూడకు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్కు చెందిన తర్రె ఐలయ్యయదవ్, మంగమ్మ దంపతులకు చిన్న కుమారుడు చైతన్యయాదవ్ (23) బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో లండన్ వెళ్లాడు. బోడుప్పల్ లోని పీర్జాదిగూడ మున్సిపాలిటీ అమృత కాలనీలో నివా ముండే రాపోలు రవీందర్రావు, కిరణ్మయి దంపతుల కుమారుడు రిషితేజ (21)హైదరాబాద్‌లో బీబీఏ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం గత మే నెలలో లండన్ వెళ్లాడు. వీరు మరికొందరు తెలుగు విద్యార్థులతో కలిసి అక్కడ నివా సం ఉంటున్నారు. వినాయక చతుర్థిని పురస్కరించుకుని స్నేహితులంతా గణనాథున్ని ప్రతిష్టించారు. ఆదివారం సా యంత్రం నిమజ్జనం కోసం 9 మంది రెండు కార్లలో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు మలుపు వద్ద వారి కారును వెనక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. వెనుక వస్తున్న ట్రక్కు రెండు కార్లను ఢీకొట్టడంతో కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో చైతన్య యాదవ్, రిషితేజ మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.రెండు కుటుంబాల్లో విషాదంఇద్దరు యువకుల మరణంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. చైతన్యయాదవ్ మరణవార్తతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రిషితేజ చివరగా తల్లి కిరణ్మయితో ఆదివారం మాట్లాడాడు. ‘నిద్ర వస్తోంది.. లేచాక మాట్లాడతాను అని చెప్పిన మాటలే చివరివి అయ్యాయి’అని అతడి తండ్రి రవీందర్రావు కన్నీరు మున్నీరయ్యాడు. -
మెల్బోర్న్లో అద్భుతంగా అష్టావధాన కార్యక్రమం
మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా) నగరంలో అష్టావధాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఆగస్టు 30న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా అవధాని, అవధానార్చనా భారతి, కవిరాజహంస, శారదామూర్తి తటవర్తి శ్రీకళ్యాణ శ్రీచక్రవర్తి చేసిన అవధానం అందర్నీ ఆకట్టుకుంది. ఈ అవధాన కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రప్రథమ శతకకర్తగా రికార్డులు సాధించిన డాక్టర్ తంగిరాల నాగలక్ష్మిగారు సంచాలకురాలిగా నిర్వహించారు. సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ఉన్నత సాహిత్య ప్రమాణాలతో కొనసాగింది. తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచు నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.ఈ కార్యక్రమము ఆధ్యాత్మిక కేంద్రమైన సంకట మోచన మందిరంలో విచ్చేసిన ప్రముఖులు ఆసాంతం వీక్షించి అవధాని గారిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించారు. అప్రస్తుత ప్రసంగంలో పాల్గొన్న 11 ఏళ్ళ చిరంజీవులు కృష్ణ సుహాస్ తటవర్తి ధ్రువ్ అకెళ్ళ అప్పటికప్పుడే అద్భుతమైన ప్రశ్నల వర్షం కురిపించడం అవధానాలలోనే ప్రత్యేకంగా నిలిచింది. కృతిపద్యము అనే అంశంలో చిన్నారులు గాయత్రి నందిరాజు, తన్వి వంగల సభాసదుల మనసులను చూరగొన్నారు. సాంకేతిక సహకారం శరణ్ తోట అందించారు.(చదవండి: YSR Vardhanthi: విదేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళులు) -
విదేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్థంతిని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. పలువురు ఎన్నారైలు డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. తెలుగు జాతి వైఎస్సార్‌కి రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా కన్వీనర్ కృష్ణారెడ్డి, సహ కన్వీనర్ భరత్, కోర్ టీమ్ సభ్యులు బ్రహ్మరెడ్డి, రామాంజి, సురేష్ రెడ్డి, సతీశ్, పవన్, బాషా, తేరా జయవర్ధన్ రెడ్డి, దశరథ్ రెడ్డి, డి.శ్రీధర్ పాల్గొన్నారు. సౌత్ ఆఫ్రికాలో... సౌత్ ఆఫ్రికాలోని వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జోహనెస్‌బర్గ్‌లో సోమవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 2 వర్ధంతి సందర్భంగా ముందురోజు సోమవారం జోహనెస్‌బర్గ్‌లోని కమ్యూనిటీ సెంటర్ బేకరీ అనాథాశ్రమంలో చిన్నారులకు ఆహారంతోపాటు రూ.5 లక్షల విలువచేసే వ్రస్తాలను దానం చేశారు. తమలో చాలామంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారానే ఉన్నత చదువులు చదువుకుని ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు కల్లా నరసింహారెడ్డి, సూర్య రామిరెడ్డి, విజయ శ్రీనివాసు, శ్రీకృష్ణారెడ్డి, వాసు సింగారెడ్డి, పెట్లూరు విక్రం, మాగంటి వెంకట్, సానికొమ్మ అంజిరెడ్డి, అవనిగడ్డ పుష్పాంజలి, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆత్మకూరు హరి, బుద్ధ సురేంద్ర, అనిపి రెడ్డి నవీన్ రెడ్డి, బాల భాస్కర్, రాజారపు శివ, పల్లె మధు పాల్గొన్నారు. ఐర్లాండ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌కు వెలుగు నింపిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఐర్లాండ్‌లోని వైఎస్సార్సీపీ అభిమానులు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆలోచనలు, ప్రజల కోసం చేసిన కృషి ఎప్పటికీ మరవలేనివని అన్నారు. దివంగత మహానేత వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన జీవన విధానం, ప్రజాసేవా పథకాలను స్మరించుకుంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థించారు. పేదల కోసం, రైతుల కోసం, సాధారణ కుటుంబాల కోసం వైఎస్సార్ చేసిన సేవలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే మహానేత డాక్టర్ వైఎస్సార్ అంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ ఆకేపాటి, గోపిరెడ్డి కోటి, వీర రెడ్డి, శ్రీను డేగ, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ రక్తదానం డాక్టర్ వైఎస్సార్ 16వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ రక్తదాన డ్రైవ్ నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్‌రెడ్డి యర్రపురెడ్డి, ఆది, రేఖ మోర్రెడ్డి, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, ధీరజ్పోలా, అంజిరెడ్డి, రుక్మాన్, రమేశ్, శ్రీధర్ చెమిడ్తి, బాలమురళీకృష్ణ, ఇంద్రసేనారెడ్డి, నాగేషొ్పర్ల, వేమశేఖర్, విఘ్నేష్, కొండారెడ్డి, జ్ఞానదీప్, నాగి బోనం తదితరులు పాల్గొన్నారు. -
ఫీనిక్స్‌లో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
ఫీనిక్స్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఉత్సవాలు అమెరికాలో (ఫినిక్స్,ఆరిజోనలో) ఘనంగా జరిగాయి. పురస్కరించుకుని, వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్త, బయోథెరపీ సంస్థ విటాలెంట్ సహకారంతో, ఈ శిబిరం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్ఆర్ఐ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. డాక్టర్ వైఎస్ఆర్కు పుష్పగుచ్ఛాలర్పణతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఆయన జీవిత విశేషాలు, ప్రజాసంక్షేమం పట్ల ఆయన నిబద్ధతను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది. కమిటీ సభ్యులు డాక్టర్ వైఎస్ఆర్తో తమ అనుభవాలను గుర్తుచేసుకుంటూ, ఆయన వినయం, ధైర్యం, ప్రజా కేంద్రిత పాలనపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన సాంబశివారెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ను ‘జననాయకుడు’గా ప్రశంసించారు. ఆయన దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీని ప్రశంసిస్తూ, ఈ రక్తదాన కార్యక్రమం డాక్టర్ వైఎస్ఆర్ సేవా సూత్రాలను ప్రతిబింబిస్తుందని, సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని సోమశేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, ఆది & రేఖ మోర్రెడ్డి, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, ధీరజ్ పోలా, అంజిరెడ్డి, రుక్మాన్, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, బాలమురళీకృష్ణ, ఇంద్రసేనా రెడ్డి, నాగేష్ పొర్ల, వేమ శేఖర్, విఘ్నేష్, కొండారెడ్డి, జ్ఞానదీప్, అజయ్ కాల్వ, నాగి బోనంలు ఘనంగా నిర్వహించారు. విటాలెంట్ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ..ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన స్వచ్ఛంద సేవకులు, నిర్వాహకులు, హాజరైన వారందరికీ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తద్వారా ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ, డాక్టర్ వైఎస్ఆర్ సేవా,కరుణ, సమాజ సంక్షేమ వారసత్వాన్ని నిలబెట్టేందుకు తన అంకితభావాన్ని మరోసారి పునరుద్ఘాటించింది. -
విదేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో జనరంజక పాలన అందించిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రవాసాంధ్రులు కొనియాడారు. సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతి సందర్భంగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్‌లోని సాండ్రింగ్‌హామ్ కమ్యూనిటీ సెంటర్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.సంక్షేమాభివృద్ధిలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి, కృష్ణారెడ్డి, విజయ్ అల్లా, రాజారెడ్డి, బాలశౌర్య, గీతారెడ్డి, రమేష్ పానాటి, సంకీర్త్ రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, సుస్మిత, రేఖ, గౌతమి, సింధు, ప్రియాంక, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంఆ్రస్టేలియాలో రక్తదాన శిబిరం డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆడిలైడ్ నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాయకులు వంశీ బొంతు, రామ్మోహన్‌రెడ్డి మునగల తదితరులతో పాటు వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మెల్బోర్న్ నగరంలో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి తదితరులు పాల్గొన్నారు. -
ఫీనిక్స్‌లో మినీ కన్వెన్షన్‌గా సాగిన ‘ఆటా డే’
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA).. అనిర్వచనీయమైన వేడుక నిర్వహించింది. ఫీనిక్స్, అరిజోనాలోని మెసా కన్వెన్షన్ సెంటర్లో వైభవోపేతమైన కార్యక్రమం ‘ఆటా డే’ (ATA DAY -2025)ను చేపట్టి నాలుగువేల మందికి పైగా ఆహుతులను మధురానుభూతుల్లో నింపింది. ఆటా (ATA) సంప్రదాయ కార్యక్రమం.. ఏడుకొండలవాడైన శ్రీనివాసుడి కల్యాణంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించింది.అందరి శ్రేయస్సు కోరుతూ నిర్వహించిన ఈ కమ్మని వేడుకలో భాగస్వాములవడం తమకు దక్కిన మహాభాగ్యమని హాజరైన తెలుగువారందరూ మురిసిపోయారు. ఎంతో రుచికరమైన.. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాన్ని కన్నులకద్దుకుని స్వీకరించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలుఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం కనువిందు చేసింది. రోజంతా జరిగిన కార్యక్రమాలతో మెసా కన్వెన్షన్ సెంటర్ కళకళలాడింది. ఫ్యాషన్ షో, పిల్లల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ ఒక గొప్ప మెమొరీగా నిలిచాయి. హాయిగొలిపే సాయంత్రం వేళ... గాయని సుమంగళి అండ్ రాగిన్ బ్యాండ్ లైవ్కాన్సర్ట్తో అందరినీ హుషారెత్తించారు. ఉర్రూతలూగించే పాటలతో ప్రతి ఒక్కరినీ కుర్చీలోంచి లేపి డ్యాన్స్ చేయించారు.ఔత్సాహికులకు మార్గదర్శిగా బిజినెస్ ఫోరంస్వామి వారి కల్యాణానంతరం బిజినెస్ ఫోరమ్ (Business Forum) సమావేశం నిర్వహించారు. తమతమ వ్యాపారాల్లో తమదైన మార్క్ చూపిన వ్యాపారులు తమ అనుభవాలను, అనుసరించిన మార్గాలను ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వివరించి ప్రోత్సహించారు. ఆటా నేషనల్ టీమ్ అధ్యక్షుడు జయంత్ చల్లా, మాధవీరెడ్డి, కిరణ్ వేదాంతం, బాల పట్తెం, మధు రాయపాటి ఈ ఫోరంలో తమ అమూల్య సందేశమిచ్చారు. మొత్తమ్మీద ఈ కార్యక్రమం నూతన వ్యాపారవేత్తలకు ఒక మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు.ప్రశంసించిన చాండ్లర్ మేయర్ కెవిన్ హార్ట్కీచాండ్లర్ (ఫీనిక్స్) మేయర్ కెవిన్ హార్ట్‌కీ ఈ వేడుకకు హాజరై తెలుగు కమ్యూనిటీ సేవలను ప్రశంసించారు. ఆటా నేషనల్ టీమ్ అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్‌రెడ్డి, కార్యదర్శి సాయినాథ్ బోయపల్లి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సిరెడ్డి గడ్డికోపుల, ట్రస్టీ వెన్నరెడ్డి హాజరై ఫీనిక్స్ టీమ్‌కు అభినందనలు తెలిపారు.ఆటా ప్రాంతీయ డైరెక్టర్ రఘునాథ్ గాడి, కోఆర్డినేటర్లు సునీల్ అన్నపురెడ్డి, శుభ గాయం, మదన బొల్లారెడ్డి, స్పోర్ట్స్ చైర్ శేషిరెడ్డి గాడి, మహిళా విభాగం బింద్యా, కో చైర్ దివ్య తలసిల, కల్చరల్ చైర్ కాంతిప్రియ, సహచరులు నివేదిత గాడి, ప్రధాన సభ్యులు పరితోష్ పోలి, శివ దేవగుడి, రవి గర్లపాటి, అరవింద్, ప్రణయ్, ప్రవీణ్, దీరజ్ పోలా, రుకుమైలా, మాలతి గర్లపాటి, విజయ్ కందుకూరి, సారితా బండారు, సుదర్శన్ ఈ ఈవెంట్‌ను గొప్పగా నిర్వహించడానికి విశేషంగా కృషి చేశారు.డిసెంబర్ 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆటా(ATA) సేవా కార్యక్రమాలుఆటా(ATA) నేషనల్ టీమ్ అధ్యక్షుడు జయంత్ చల్లా.. గత కొన్నినెలలుగా అమెరికాలోని 25 నగరాల్లో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. రాబోయే 19వ ఆటా కన్వెన్షన్ (ATA Convention)ను వచ్చే ఏడాది(2026) జూలై 31, ఆగస్టు1, 2 తేదీల్లో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్‌రెడ్డి.. అమెరికాలో, భారత్ లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రస్తావించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది (2025) డిసెంబర్ 12 నుంచి 27 వరకు ఆటా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గ్రాండ్ ఫినాలే (grand finale) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. -
NRI News: వైఎస్సార్.. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం
సాక్షి, మెల్బోర్న్: దివంగత మహానేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి నేపథ్యంతో ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం.. వైఎస్సార్ అని ఈ సందర్బంగా సభకు హాజరైన వాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా నాయకులు నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి, విష్ణు రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. -
భారతీయుల్లో వీసా గుబులు
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అక్కడున్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. వీసా గడువును పరిమితం చేయాలంటూ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులకు ఎలాంటి నిర్దేశిత గడువు లేదు. ఇప్పుడు దీన్ని నాలుగేళ్లకు కుదించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మన విద్యార్థుల్లో గుబులు రేపుతోంది. ఎంఎస్ కోసం వెళ్లిన విద్యార్థులు రెండేళ్లల్లో కోర్సు పూర్తి చేసి.. ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కుంటారు. కనీసం మూడేళ్లల్లో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. అప్పుడు వారికి హెచ్1బీ వీసా వస్తుంది. కొంతకాలం ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వీసా గడువును నాలుగేళ్లకు తగ్గించడంతో ఎంఎస్ పూర్తయ్యాక, ఉద్యోగానికి అవసరమైన శిక్షణ, ఉద్యోగం వెతుక్కునే సమయం ఉండదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలకు కోత పడ్డాయి. ట్రంప్ నిర్ణయాలతో భారత్‌లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ గుబులు పెరుగుతోంది. తగ్గుతున్న అవకాశాలుఅమెరికాలో భారత విద్యార్థులు ప్రధానంగా పార్ట్ టైం ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకుంటారు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గినట్లు విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. ఈ దేశానికి అగ్రరాజ్యానికి ఏటా 3 లక్షల మంది భారతీయులు వెళ్తుంటే, వారిలో 1.25 లక్షల మంది తెలుగువారే ఉండటం గమనార్హం. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీపడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. అమెరికాతో పోలిస్తే కెనడాలో 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. అయితే ఇటీవల కెనడాలోనూ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు వచ్చాయి. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. బ్రిటన్, ఆ్రస్టేలియాలోనూ విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఏటా రూ.5.86 లక్షల కోట్లు అమెరికాలో రెండేళ్లుగా ఖర్చులు పెరిగాయి. రూపాయి మారక విలువతో పోలిస్తే యూనివర్సిటీ ఫీజులూ పెరిగాయి. సాధారణంగా ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ విద్యార్థులు నెట్టుకొస్తారు. ట్రంప్ వచి్చన తర్వాత ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను డబ్బు కోసం ఆశ్రయిస్తున్నారు. అమెరికాకు పంపేటప్పుడే అప్పులు చేసిన తల్లిదండ్రులు మళ్లీ అప్పులు తేవడం కష్టంగా ఉంటోంది. ఏటా పర్యాటకులతో కలిపి 13 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరింది. భారత్ నుంచి విదేశాలకు చదువుల కోసం వెళ్లే వారిలో 38 శాతం తెలంగాణ, ఏపీ వారే ఉన్నారు. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ.3.10 లక్షల కోట్లు. 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ. 3.93 లక్షల కోట్లకు చేరింది. 2024లో ఖర్చు సుమారు 10 శాతం మేర పెరిగి, రూ. 4.32 లక్షల కోట్లకు చేరింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ ఊహించని విధంగా పతనమవ్వడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపై 14 శాతం అదనపు భారం పడే వీలుంది. అంటే, రూ. 5.86 లక్షల కోట్ల మేర విదేశీ విద్య భారం ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజు తలచుకుంటేనే... విదేశీ విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజులు తలుచుకుంటే భారత విద్యార్థులు వణికిపోతున్నారు. విదేశాలకు వెళ్లే ముందు అమెరికా వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా అంచనా వేసుకున్నారు. డాలర్ ముందు రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కెనడాలో రూ.1.60 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.1.80 లక్షలు, బ్రిటన్‌లో రూ.2 లక్షలకు పైగా అదనపు వ్యయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు వసతి ఖర్చులు ఏకంగా 10–15 శాతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఇతర సంక్షోభాల నేపథ్యంలో జీవన వ్యయం ఏకంగా 22 శాతం పెరిగింది. దీంతో విద్యార్థుల అంచనాలు తారుమారయ్యాయి. అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడది రూ.52 లక్షల వరకూ వెళ్లిందని అంటున్నారు. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే.. వీసా కాలపరిమితి తగ్గించడంతో భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన మొదలైంది. వీసా కుదిస్తే ఎలా.. ఎంఎస్ పూర్తయ్యే వరకూ ఉద్యోగం చేయకూడదు. ఎంఎస్ అయ్యాక ఉద్యోగానికి అవసరమైన శిక్షణ తీసుకుంటారు. అప్పటికే మూడున్నరేళ్లు పూర్తవుతుంది. మిగిలిన ఆరు నెలల్లో ఉద్యోగం రాకపోతే హెచ్–1బీ వీసా రాదు. కాబట్టి భారత్‌కు వెళ్లాలి. నేను ఎంఎస్ పూర్తి చేసి ఆరు నెలలైంది. రూ.40 లక్షల అప్పు చేశాను. మరో రెండేళ్లు ఉద్యోగం రాకపోతే అప్పు రెట్టింపవుతుంది. అమెరికా ఆంక్షల వల్ల నలిగిపోతున్నాం. – మందస బాల శేఖర్ (అమెరికాలో భారత విద్యార్థి) ఇది అన్యాయంట్రంప్ వచ్చిన తర్వాత ఐటీ రంగం పరిస్థితి మారిపోయింది. ప్రతి కంపెనీలోనూ అనుభవం అడుగుతున్నారు. విద్య పూర్తి చేసిన వెంటనే అనుభవం ఎలా వస్తుంది. అనుభవం కోసం కనీసం ఏడాది ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉండాలి. వీసా కాలపరిమితి కుదిస్తే విద్యార్థులు నష్టపోతారు. – పరమేశ్వర్ త్రిపాఠి (అమెరికాలో భారత కన్సల్టెన్సీ నిర్వాహకుడు) -
సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌తో డాలస్ సాహితీ ప్రియుల ముఖాముఖి
డాలస్, టెక్సస్: ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, సినిమా సంభాషణల రచయిత బుర్రా సాయిమాదవ్ తో డాలస్‌లో సాహితీ ప్రియుల సమక్షంలో డా. ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం చాలా ఆసక్తి దాయకంగా.. ఉల్లాసభరితంగా జరిగింది. రంగస్థల నటునిగా, నాటక రచయితగా, టి.వి ధారావాహికల రచయిత ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఇప్పుడు ఒక ప్రసిద్ధ సినిమా మాటల రచయితగా, సంభాషణల రచయితగా సినీమా పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందే స్థాయికి చేరడంలో చేసిన కృషి వెనుక ఉన్న నేపధ్యాన్ని, సాహితీ ప్రియులు అడిగిన అనేక ప్రశ్నలకు సాయిమాధవ్ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాతో సినీ సంభాషణల రచయితగా సినీ రంగానికి పరిచయమవడం, తాను మాటలు రాసిన “కంచె”, “మహానటి” రెండు సినిమాలు భారత ప్రభుత్వముచే ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ పురస్కారాలు అందుకోవడం, “మళ్లీ మళ్లీ ఇది రానిరోజు” సినిమాకు ఉత్తమ మాటలర చయితగా నంది పురస్కారం, ”పుత్తడిబొమ్మ”, “సీతామహాలక్ష్మి” ధారావాహికలకు ఉత్తమ రచయితగా నంది పురస్కారాలు అందుకోవడం తన రచనా జీవితంలో కొన్ని మైలురాళ్ళు మాత్రమేనని, ఇంకా ఎంతో సాధించ వలసినది ఉంది అన్నారు.‘కృష్ణం వందే జగద్గురుం”, “గోపాల గోపాల”, “కంచె”, “సర్దార్ గబ్బర్ సింగ్”, “గౌతమీపుత్ర శాతకర్ణి”, “మహానటి”, “ఖైదీ 150” లాంటి పలు సినిమాలలో తాను వ్రాసిన మాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ తనకు ఎంతో సంతృప్తిని, బలాన్ని ఇచ్చిందని ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, నటులకు, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదములు” అన్నారు బుర్రా సాయిమాధవ్. తాను ఏమి వ్రాసినా సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రచనలు చేస్తానని, సమాజానికి హానికల్గించే మాటలు తనను ఎంత ప్రలోభపెట్టినా తన కలంనుండి వెలువడవని అందరి హర్షద్వానాల మధ్య సాయిమాధవ్ వెల్లడించారు.తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఆహూతులందరితో కలసి బుర్రా సాయిమాధవ్ ని దుశ్శాలువ, సన్మాన జ్ఞాపికతో ఘనంగా సత్కరించి మాట్లాడుతూ – “సినీరంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, తాను వచ్చిన నాటక రంగాన్ని విస్మరించకుండా, ‘కళల కాణాచి’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి, రంగస్థల కళాభివృద్ధికోసం లక్షలాది రూపాయల తన స్వంత నిధులను సైతం వెచ్చిస్తూ, ఎన్నో సంవత్సరాలగా సాయిమాధవ్ చేస్తున్న కృషి ఎంతైనా అభినందించదగ్గది, ఇతరులకు ఆదర్శప్రాయమైనది అన్నారు.”ఇదే సభలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడు చేంబోలు శ్రీరామశాస్త్రి వ్రాసిన “సిరివెన్నెల తొలి గురువు ‘సమ్మాన్యుడు’ కొత్తగా” అనే పుస్తకాన్ని డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించి తొలిప్రతిని బుర్రా సాయిమాధవ్‌కు అందజేశారు. “టి.వి, సినీ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన కళాకారులకు ఎన్నో సంవత్సరాలగా సంప్రదాయంగా ఇస్తున్న నంది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేయడం శోచనీయమని, వెంటనే వాటిని పునరుద్దరించి ఆ రంగాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు” డా. ప్రసాద్ తోటకూరబుర్రా సాయిమాదవ్ తనకు ఈ ఆత్మీయసమావేశం ఎంతో సంతృప్తినిచ్చిందని, ఒక ప్రక్క ఎన్నో సంవత్సరాలగా తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం కృషి చేస్తూ, మరో ప్రక్క సామాజికసేవలో ముందుంటున్న మిత్రులు డా. ప్రసాద్ తోటకూర ఈ అభినందన సభను ఏర్పాటుచేసి, చక్కగా సభా సమన్వం చేసినందులకు వారికి, వారి మిత్రబృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.ఆద్యంతం ఉత్సాహంగాజరిగిన ఈ సాహితీ సమావేశంలో సత్యన్ కళ్యాణ్ దుర్గ్, రవీంద్ర పాపినేని, సాయి సత్యనారాయణ, రాజా రెడ్డి, మురళి వెన్నం, సిద్ధూ, రమేశ్ ప్రేమ్ కుమార్, శివకుమారి, గాయకులు గని మరియు వారి కుటుంబసభ్యులు, యాజీ జయంతి, చినసత్యం వీర్నపు, ప్రశాంతి హారతి, చంద్రహాస్ మద్దుకూరి, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, రాంకీ చేబ్రోలు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చంద్ర కన్నెగంటి, ఇక్బాల్, శ్రీనివాస్, డా. ఇస్మాయిల్ పెనుగొండ, దయాకర్ మాడ, డా. జగదీశ్వరన్ పూదూర్, చంద్రశేఖర్ లంక, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, మడిశెట్టి గోపాల్, సతీష్ బండారు తదితరులు ఈ ముఖా ముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలిగి అందరి పై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల , కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు , ఇంకా కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ గ్రూప్ బిల్డర్స్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ , వజ్ర బిల్డింగ్ వాల్యూస్ ఎవోల్వ్ కు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధానం
ఆగస్టు 23 శనివారం నాడు సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం నిర్వహించబడింది. మెల్బోర్న్ నగరవాసులు, తటవర్తి గురుకులం సంస్థాపకులు, అవధాన శారదామూర్తి శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారిచే చేయబడిన ఈ అవధాన కార్యక్రమానికి సాహిత్యరత్న శ్రీ తూములూరి సుబ్రహ్మణ్య శాస్త్రి సంచాలకులుగా నిర్వహించారు. సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో 3 గంటలకు పైగా ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం నాలుగు ఆవృత్తులతో (రౌండ్స్), 20 మంది పృచ్ఛకులతో, ఉన్నత సాహిత్యప్రమాణాలతో కొనసాగింది. తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచు నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలకమండలి సభ్యులు శ్రీమతి సంధ్యారెడ్డిగారు అవధాని గారిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించగలమని తెలిపారు. తదుపరి 11 వత్సరాల చిరంజీవి కృష్ణ సుహాస్ తటవర్తి అనర్గళంగా చెప్పిన గజేంద్రమోక్షం కథ సభా సదుల మనసుల రంజింప చేసినది. 30 ఆగస్టు శనివారం నాడు మెల్బోర్న్ నగరంలో కూడా శ్రీ కళ్యాణ చక్రవర్తి గారి చేతనే మరొక అష్టావధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనరంజని కల్చరల్ కోఆర్డినేటర్ శ్రీమతి స్వర్ణలత సీతంరాజు తెలిపారు. -
నార్త్ కరోలైనాలో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్
అమెరికాలో తెలుగు వారికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నార్త్ కరోలైనాలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ నార్త్ కరోలైనా విభాగం నార్త్ క్వారీ పార్క్‌లో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు స్థానిక తెలుగు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 24 జట్లు ఐదు డివిజన్లలో పోటీ పడి తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాయి. ఈ టోర్నమెంట్ కేవలం ఒక ఆటల పోటీగానే కాకుండా, తెలుగు వారందరిని ఒకచోట చేర్చే ఒక వేదికగా నిలిచింది. క్రీడాకారుల మధ్య కనిపించిన అద్భుతమైన సమన్వయం, తెలుగు వారి ఐక్యతకు ప్రతిబింబింలా నిలిచాయి. అభిమానుల నుంచి లభించిన ఉత్సాహభరితమైన మద్దతు ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్కంఠను పెంచింది. నాట్స్ నార్త్ కరోలైనా విభాగం నిర్వహించిన ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు దగ్గుబాటి, నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ ఉమాశంకర్ నార్నే, నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్ దీపిక సాయపురాజు, వెబ్ అండ్ మీడియా కో ఆర్డినేటర్ రాజేష్ మన్నేపల్లి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రవి ఖాజా చేసిన కృషి ప్రశంసనీయం. వారి నిబద్ధత, అంకితభావం కారణంగా ఈ టోర్నమెంట్ ఒక చిరస్మరణీయమైన ఈవెంట్‌గా నిలిచింది. నార్త్ క్వారీ పార్క్‌లో నిర్వహించిన నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ నార్త్ కరోలైనా టీం సభ్యులను అభినందించారు. ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేతలకు నాట్స్ నాయకులు బహుమతులు ప్రదానం చేశారు. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. • Division 1: Beer Box జట్టు విజేతగా నిలవగా, Chill Out జట్టు ద్వితీయ స్థానంతో పోరాట స్ఫూర్తిని చాటింది.• Division 2: Infinity జట్టు అద్భుతమైన ఆట తీరుతో విజయం సాధించగా, Unicorn Beeta జట్టు రన్నరప్‌గా నిలిచింది.• Division 3: Strikers తమ పేరుకు తగ్గట్టుగా బలమైన ప్రదర్శనతో విజేతగా నిలవగా, Falcon Wings జట్టు పట్టుదలతో ద్వితీయ స్థానం సాధించింది.• Division 4: Warrior Xtremes మరియు Warrior Ignites జట్ల మధ్య జరిగిన పోరులో, Warrior Xtremes విజయం సాధించింది.• Division 5: Arrow Club జట్టు తమ కచ్చితత్వంతో గెలుపొందగా, Cava జట్టు బలమైన పోరాటాన్ని కనబరచి ద్వితీయ స్థానంలో నిలిచింది. -
న్యూయార్క్ వీధుల్లో ఉప్పొంగిన భారతీయత
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ఎఫ్.ఐ.ఏ ఆధ్వర్యంలో జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నేనుసైతం అంటూ పాల్గొని మాతృభూమి పట్ల మమకారాన్ని చాటింది. నాట్స్ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమకు ప్రేమను ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో తెలుగు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక కూడా పాల్గొని ఈ పరేడ్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎఫ్.ఐ.ఏ ఏర్పాటు చేసిన ర్యాలీలో నాట్స్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ పూర్వ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, బోర్డ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి, నాట్స్ జాయింట్ సెక్రటరీ రామ్ నరేష్ కొమ్మనబోయిన, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల, నాట్స్ నాయకులు నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి, నార్త్ ఈస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, న్యూ జెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, కో- కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి, న్యూ జెర్సీ చాప్టర్ అడ్వైజర్ వంశీ కృష్ణ వెనిగళ్ల, శ్రీకాంత్ పొనకాల, శంకర్ జెర్రిపోతుల, శ్రీదేవి పులిపాక, గాయత్రి చిట్లేటి, గీత, కృష్ణ నెక్కంటి, రాకేష్ వేలూరు,సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, సురేష్ బొందుగుల, DJ శేఖర్ తదితరులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. నాట్స్ సభ్యులు, నాట్స్ కుటుంబ సభ్యుల చిన్నారులు ఈ పరేడ్‌లో చేసిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తారిక, తన్వి లు చేసిన టాలీవుడ్ డాన్స్, సింధూర చేసిన క్లాసికల్ నృత్యం విశేషం గా ఆకర్షించాయి. రంగ మేడిశెట్టి చేసిన కృష్ణ వేషధారణ, భాగవత సందేశాలు కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. భారత్ మాతా కీ – జై! వందేమాతరం! జై హింద్ వంటి నినాదాలతో న్యూయార్క్ నగరం హోరెత్తింది. మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. చక్కటి సమన్వయంతో న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా చాప్టర్స్ నుంచి వచ్చిన నాట్స్ మిత్రులందరికీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందనలు తెలియచేసారు. -
లార్డ్ స్వరాజ్‌పాల్ కన్నుమూత
లండన్/న్యూఢిల్లీ: ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్‌లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. స్వరాజ్‌పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన దానశీలిగా ఆయన్ను అభివరి్ణంచారు. బ్రిటన్–భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు స్వరాజ్ పాల్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వ్యాపార దిగ్గజం, దానశీలి, అంతర్జాతీయంగా ప్రవాస భారతీయులకు ఆయనొక ఐకాన్ అని తెలిపారు. 1966లో కుమార్తె చికిత్స కోసం బ్రిటన్ వెళ్లిన లార్డ్ పాల్ ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ సంస్థ కపారో గ్రూప్‌ను నెలకొల్పారు. ఉక్కు, ఇంజినీరింగ్, ప్రాపర్టీ తదితర రంగాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దారు. బ్రిటన్‌లో అత్యంత సంపన్న ఏషియన్‌గా ఎదిగారు. దశాబ్దాల పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కీలకంగా నిల్చారు. -
అమెరికా నుంచి వచ్చి.. ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేసిన ఎన్నారై
కోదాడరూరల్: తన మిత్రుడు మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను సోషల్ మీడియాలో చూసి అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కోదాడకు వచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు ఓ ఎన్నారై. వివరాలు.. సూర్యాపేట జిల్లా (Suryapet District) కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పి. పెంటయ్య, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ చప్పిడి సుధాకర్ 30 ఏళ్ల కిందట హైదరాబాద్‌లోని పశువైద్య కళాశాలలో కలిసి చదువుకున్నారు.చదువు పూర్తయిన తర్వాత పెంటయ్య కోదాడ (Kodad) ప్రాంతంలో పశువైద్యాధికారిగా పనిచేస్తుండగా.. సుధాకర్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. డాక్టర్ పెంటయ్య కోదాడ పశువైద్యాశాలలో రైతులకు ఉపయోగపడేలా పశుఔషధ బ్యాంకును ఏర్పాటు చేసి మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను కాలిఫోర్నియాలో ఉంటున్న అతడి స్నేహితుడు సుధాకర్ సోషల్ మీడియాలో చూశాడు. పెంటయ్య ఫోన్ నంబర్ తీసుకున్న సుధాకర్ త్వరలో కలుస్తానని అడ్రస్, లోకేషన్ షేర్ చేయమని చెప్పాడు.కాలిఫోర్నియా (california) నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సుధాకర్ బుధవారం కోదాడకు వచ్చి తన మిత్రుడు పెంటయ్యను కలిసి సర్ప్రైజ్ ఇచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు స్నేహితులు ఆనందంలో మునిపోయారు. అనంతరం పశుఔషధ బ్యాంక్‌కు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌తో పలు రకాల పండ్ల మొక్కలను నాటించారు.చదవండి: తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి -
హ్యూస్టన్‌లో విజయవంతమైన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
ఆగస్ట్ 16-17, 2025 తేదీలలో హ్యూస్టన్ మహానగరం, అమెరికాలో జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” తెలుగు భాషా, సాహిత్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వైభవంగా జరిగింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సాహితీ సదస్సులో భారత దేశం నుంచి 15 మంది ప్రముఖ సాహితీవేత్తలు, అమెరికాలో పలు నగరాల నుండి 75 మందికి పైగా విచ్చేసి, 28 విభిన్న వేదికలలో పాల్గొని సుమారు 250 మంది ఆహూతుల సమక్షంలో తెలుగు భాషా, సాహిత్య సౌరభాలని పంచుకున్నారు. హ్యూస్టన్ లో తెలుగు బడి, మన బడి బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఉపాద్యాయులకి గురువందన సత్కారాలతో మొదలైన ఈ జాతీయ స్థాయి సాహిత్య సదస్సుని “పద్మభూషణ్” ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంఛనప్రాయంగా ప్రారంభించగా భారతదేశం నుంచి తొలిసారి అమెరికా విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ “సినిమా సాహిత్యం, తెలుగు భాష” అనే అంశం మీద సాధికారంగా చేసిన ప్రధానోపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు.కాలిఫోర్నియాలోని ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పురోభివృధ్ధికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున వంగూరి చిట్టెన్ రాజు, గిరిజ దంపతులు లక్ష డాలర్ల భూరి విరాళం చెక్కును సభాముఖంగా ఆ విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజు చమర్తి గారికి అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషా, సాహిత్యాలకి ఎవరో, ఏదో చెయ్యాలి అనే కంటే ఉన్న వ్యవస్థలని పటిష్టం చెయ్యాలి అని వంగూరి చిట్టెన్ రాజు పిలుపునివ్వగా, దానికి ఆచార్య యార్లగడ్డ, రాజు చమర్తి సముచితంగా స్పందించారు. శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, బుర్రా సాయి మాధవ్ పాల్గొన్న ఈ ప్రత్యేక వేదిక సదస్సు విశిష్ట ప్రాధాన్యతని సంతరించుకుంది.ఈ సదస్సులో మొత్తం 17 నూతన తెలుగు గ్రంథాలు ఆవిష్కరింపబడగా అందులో 5 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణలు కావడం విశేషం. పాణిని జన్నాభట్ల నిర్వహణలో జరిగిన ‘అమెరికా కథ’ చర్చా వేదిక, విన్నకోట రవిశంకర్ నిర్వహణలో జరిగిన కవితా చర్చా వేదిక, బుర్ర సాయి మాధవ్ తో శాయి రాచకొండ నిర్వహించిన ముఖాముఖి, ఉరిమిండి నరసింహారెడ్డి, శారదా కాశీవజఝ్ఝల నిర్వహించిన సాహిత్య ప్రహేళికల కార్యక్రమాలు, కథా రచన పోటీ మొదలైన ఆసక్తికరమైన అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డాలస్ నివాసి, తానా సాహిత్య వేదిక అధ్యక్షులు, అమెరికాలో ప్రముఖ సాహితీవేత్త అయిన డా. తోటకూర ప్రసాద్ గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం అందించి సత్కరించింది.రెండు రోజులపాటు 50కి పైగా వక్తలు పాల్గొన్న వివిధ ప్రసంగ వేదికలలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బుర్రా సాయి మాధవ్, ఈమని శివనాగిరెడ్డి, జీ. వల్లీశ్వర్, రాధిక మంగిపూడి, కోసూరి ఉమాభారతి, హరి మద్దూరి, శారద ఆకునూరి, జ్యోతి వలబోజు, ఇర్షాద్ జేమ్స్, దయాకర్ మాడా, సత్యం మందపాటి, మద్దుకూరి విజయ చంద్రహాస్, కె గీత, అఫ్సర్, కల్పనా రెంటాల, వ్యాసకృష్ణ, జెపి శర్మ, కొండపల్లి నిహారిణి, విజయ సారథి జీడిగుంట, అత్తలూరి విజయలక్ష్మి, కేతవరపు రాజ్యశ్రీ తదితరులు ప్రసంగించగా, అమెరికా డయాస్పోరా కథ షష్టిపూర్తి ప్రత్యేక వేదికలో ఆచార్య కాత్యాయనీ విద్మహే, సి నారాయణస్వామి, భాస్కర్ పులికల్ ప్రసంగించారు.సదస్సు నిర్వహణకి ఆర్థిక సహాయం అందజేసిన దాతలకు ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీకాంత్ రెడ్డి ధన్యవాదాలుతెలిపింది. సదస్సు నిర్వాహకవర్గ సభ్యులుగా శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల, ఇంద్రాణి పాలపర్తి, కోటి శాస్త్రి, పంకజ్, రామ్ చెరువు, పుల్లారెడ్డి, కావ్య రెడ్డి, ఇందిర చెరువు, శాంత సుసర్ల, ఉమా దేశభొట్ల, వాణి దూడల తదితరులు వ్యవహరించారు. రెండు రోజుల కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. -
డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అమెరికాలో అరుదైన గౌరవం
డాలస్, టెక్సస్: తెలుగు, హిందీ భాషల్లో పీహెచ్‌డిలు చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, రెండుమార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది.టెక్సస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా, డాలస్ పరిసర ప్రాంతంలో నెలకొనిఉన్న మూడు ముఖ్య నగరాలైన ఫ్రిస్కో, గార్లండ్, లిటిల్ ఎల్మ్ నగరాల మేయర్లనుండి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభినందన పూర్వక అధికారిక గుర్తింపు పత్రాలు పొందడం తెలుగువారం దరికి గర్వకారణమని పలువురు ప్రవాస భారతీయులు కొనియాడారు. గార్లాండ్ నగర మేయర్ డిలన్ హెడ్రిక్ తో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో డా. యార్లగడ్డకు అధికారిక గుర్తింపు పత్రాన్ని మేయర్ స్వయంగా అందచేసి అభినందిం చారు.సాహిత్య రంగంలోనే గాక, సాంస్కృతిక రాయబారిగా, రచయితగా, ఉత్తర, దక్షిణ ప్రాంతాల భారతదేశ వారధిగా తన రచనలతో సౌభ్రాతృత్వం, జాతీయ ఐక్యతను పెంపొందించినదుకుగాను టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా టెక్సాస్ రాష్ట్రంలోని లిటిల్ ఎల్మ్, గార్లాండ్, ఫ్రిస్కో నగరాలు ఆయన్ను అభినందిస్తూ లేఖలు విడుదల చేశాయి. మంగళవారం సాయంత్రం ఫ్రిస్కోలో స్థానిక తెలుగు వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వీటిని ఆయా నగరాల అధికార ప్రతినిధులు ఆచార్య యార్లగడ్డకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులు డా. యార్లగడ్డ ను ఘనంగా సత్కరించారు. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్‌కు, ప్రభుత్వానికి, ప్రజలకు, ఆయా నగరాల మేయర్లకు, ప్రజలకు లక్ష్మీప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సన్మాన కార్యక్రమంలో వేణు భాగ్యనగర్, ఆత్మచరణ్ రెడ్డి, గోపాల్ పోనంగి, డా. తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శారద సింగిరెడ్డి, అనంత్ మల్లవరపు, సమీర్, చాంద్ పర్వతనేని, సుబ్బారావు పర్వతనేని, లెనిన్ వేముల, ఉదయగిరి రాజేశ్వరి, రమణ్ రెడ్డి క్రిస్టపాటి, మాధవి లోకిరెడ్డి, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, డా. తుమ్మల చైతన్య, చినసత్యం వీర్నపు, కాకర్ల విజయమోహన్, అత్తలూరి విజయలక్ష్మి, ఎ. ల్ శివకుమారి, జ్యోతి వనం, మడిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లోరిడాలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆత్మీయ సమావేశం
అమెరికాలోని ఫ్లోరిడాలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. డాక్టర్ కొండా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ వైద్య, ఆరోగ్య శాఖ సలహాదారు డాక్టర్ వాసుదేవ రెడ్డి.. కాటసాని రాంభూపాల్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టులు వంటి వివిధ రంగాలలో చేసిన అభివృద్ధి కార్యకలాపాలను డాక్టర్ వాసుదేవ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభు త్వం.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజలను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇక ఎన్నారై నాయకులకు, వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని రాంభూపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండా మోహన్ రెడ్డి , డాక్టర్ వాసుదేవ రెడ్డి, సాయి ప్రభాకర్ , డాక్టర్ నరేందర్ రెడ్డి , రఘు , కేశవ్ , జనార్ధన్ , సంజీవ , సురేందర్, వీరారెడ్డి , వంశీ , రమేష్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు -
లగ్జరీ కారులో పేరెంట్స్‌ను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి
బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించాలి అమ్మానాన్నల్నికారులో తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలి. లేదంటే.. తొలిసారి వాళ్లని విమానం ఎక్కించాలనే కలను సాకారం చేసుకోవాలి. ఇలాంటి కలలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే సగటు భారతీయ ఉద్యోగులకు సర్వ సాధారణం. అలా ఒక భారతీయ యువతి ఖరీదైన కారులో తల్లిదండ్రులను షికారుకు తీసుకెళ్లిన వీడియో ఒకటి నెట్టింట్ పలువుర్ని ఆకట్టుకుంటోంది.ఇండియాకు చెందిన అపూర్వ బింద్రే తన తల్లిదండ్రులను డ్రైవర్ లేని కారులో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవ్‌కు తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల ఆమెను, ఆమె తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తూ, బింద్రే “నా తల్లిదండ్రులను శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్ కారు వేమోలో తీసుకెళ్లా.. వావ్, నైస్ ఫీలింగ్! ఇది మాన్యువల్ డ్రైవర్ కంటే సురక్షితంగా, స్మూత్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఇంకో రైడ్ కూడా బుక్ చేసుకున్నాం. మా అమ్మా నాన్న చెప్పాల్సింది చాలా ఉంది అది త్వరలోనే’’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు View this post on Instagram A post shared by Apurva Bendre (@apurva_bendre)‘‘ఈ రైడ్‌తో మీ పేరెంట్స్ పూర్తిగా థ్రిల్ అయి ఉండాలి!” అని ఒకరు, “చాలా సరదాగా ఉంది! వారి స్పందన ఏమిటి?” అని మరొకరు దీనిని “ఒక తరాల ప్రయాణం” అని ఇంకొకరు అభివర్ణించారు. చాలా గర్వంగా ఉంది. మీరు మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అనే కమెంట్లు కూడా చూడొచ్చు.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
ఎవరీ కృషాంగి మేష్రామ్? అతి పిన్నవయస్కురాలైన సొలిసిటర్గా..
భారత సంతతి అమ్మాయి అసాధారణమైన ఘనతను సాధించింది. అతి చిన్న వయసులోనే ఇంగ్లాండ్, వేల్స్‌లలో సొలిసిటర్ అయ్యారు. అతి చన్ని వయసులోనే ఈ ఘనతను సాధించి..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరంటే..ఆ అమ్మాయే పశ్చిమ బెంగాల్‌కి చెందిన కృషాంగి మేష్రామ్. కేవలం 21 ఏళ్ల వసులోనే సొలిసిటర్ అయ్యింది. 15 ఏళ్లకే మిల్టన్ కీన్స్ ది ఓపెన్ యూనివర్శిటీలో తన లా చదువును ప్రారంభించి.. న్యాయశాస్త్రంలో ఫస్ట్‌క్లాస్ ఆనర్స్ డిగ్రీని పొందింది. అయితే కృషాంగి మాత్రం 15 ఏళ్లకే ఓపెన్ యూనివర్సిటీలో చదివే అవకాశం లభించడం వల్లే ఈ ఘనత సాధించగలిగానని ఆనందంగా చెప్పుకొచ్చింది. తనకు న్యాయశాస్త్ర పట్ల ఉన్న ప్రగాఢమైన అభిరుచే ఈ విజయానికి కారణమని అంటోందామె. ఓపెన్‌యూనివర్సిటీ ద్వారా లాగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మరీ ఈ విజయాన్ని అందుకుందామె. ఎవరీ కృషాంగి మేష్రామ్ అంటే..పశ్చిమ బెంగాల్లో జన్మించి కృషాంగీ ఇస్కాన్ మాయాపూర్ కమ్యూనిటీలో పెరిగింది. 15 ఏళ్ల వయసుకే మాయాపూర్‌లోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో మాధ్యమిక విద్యను పూర్తి చేసింది. తర్వాత ఒపెన్ యూనివర్సిటీ(ఓయూ)లో మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసి న్యాయ పట్టా పొందింది. అలా 18 ఏళ్లకే న్యాయశాస్త్రంలో ఫస్ట్‌క్లాస్ ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రురాలైందామె. 2022లో ఒక అంతర్జాతీయ న్యాయసంస్థలో ప్రాక్టీసు కూడా ప్రారంభించింది. అలాగే ఆమె హార్వర్డ్ ఆన్లైన్లో గ్లోబల్ ప్రోగ్రామ్‌లు కూడా చేసింది. పైగా సింగపూర్‌లో వృత్తిపరమైన అనుభవాన్ని సంపాదించింది. ప్రస్తుతం యూకే, యూఏఈలలో చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తోంది. ఇక కృషాంగికి చట్టపరంగా ఫిన్‌టెక్, బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీలునామాలు, ప్రొబేట్ వంటి ప్రైవేట్ క్లయింట్ తదితర సేవలపై ఆసక్తి ఎక్కువ. (చదవండి: Gaurav Kheterpal: భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?) -
బెర్లిన్‌లోని చారిత్రాత్మక బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద భారత్ పరేడ్
ఇండియన్ నేషనల్ డేస్ కల్చరల్ కమిటీ (INDCC), బెర్లిన్‌లోని వివిధ భారతీయ సంఘాల సహకారంతో, ఆగస్టు 16, 2025న చారిత్రాత్మక బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద భారత్ పరేడ్ (ఇండియన్ నేషనల్ డే పరేడ్)ను విజయవంతంగా నిర్వహించింది. ఇండో-జర్మన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని INDCC అధ్యక్షుడు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.భారతదేశం - జర్మనీ మధ్య సామరస్యం, స్నేహం మరియు సాంస్కృతిక మార్పిడికి ప్రతీకగా బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద కవాతు ప్రారంభమై శాంతి స్థూపం వరకు కొనసాగింది.జర్మనీకి భారత రాయబారి శ్ అజిత్ వినాయక్ గుప్తే , ప్రీతి గుప్తే ఈ వేడుకల్లో పాల్గొని భారతీయ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం భారతీయ సంఘాలు, సాంస్కృతిక బృందాలు, కళాకారులు మరియు సమాజ సభ్యుల విస్తృత శ్రేణిని ఒకచోట చేర్చింది. కుటుంబాలు, పిల్లలు మరియు స్వచ్ఛంద సేవకులు సహా 5,000 మందికి పైగా పాల్గొన్నవారు రంగురంగుల భారత్ పరేడ్‌లో పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, ధోల్‌లు, దేశభక్తి గీతాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు భారతదేశపు శక్తివంతమైన వైవిధ్యాన్ని ప్రదర్శించాయి, బెర్లిన్ హృదయాన్ని "భిన్నత్వంలో ఏకత్వం" అనే స్ఫూర్తితో నింపాయి.తెలంగాణ/తెలుగు సమాజం బతుకమ్మ - తెలంగాణ పూల పండుగ - మరియు అందమైన కూచిపూడి శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించడం ద్వారా ప్రత్యేక సహకారాన్ని అందించింది, ఈ రెండూ ప్రేక్షకులను ఆకర్షించాయి మరియు వేడుకలకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక రుచిని జోడించాయి. ఈ వేడుకను గొప్పగా విజయవంతం చేయడంలో అవిశ్రాంతంగా సహకరించిన అన్ని భారతీయ సంఘాలు, స్వచ్ఛంద సేవకులు, స్పాన్సర్లు మరియు శ్రేయోభిలాషులకు INDCC హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతుంది.బెర్లిన్‌లో జరిగిన భారత్ పరేడ్ ఇండో-జర్మన్ సంబంధాలను బలోపేతం చేసిన మరియు జర్మనీలోని భారతీయ ప్రవాసుల ఐక్యత మరియు గర్వాన్ని హైలైట్ చేసిన చారిత్రాత్మక క్షణంగా గుర్తుండిపోతుందని కమిటీ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా, TAG ఉపాధ్యక్షుడు వెంకటరమణ బోయినెపెల్లి, శ్రీమతి అలేఖ్య భోగా (జర్మనీ తెలంగాణ అసోసియేషన్ కార్యదర్శి), మరియు శ్రీ శరత్ కమిడి (జర్మనీ తెలంగాణ అసోసియేషన్ సాంస్కృతిక కార్యదర్శి) ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. -
డాలస్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. "దేశ స్వాతంత్ర్య సముపార్జనలో, సర్వసం త్యాగం చేసి అసువులు బాసిన సమరయోధులకు, గాంధీ, నెహ్రు, వల్లభ భాయ్ పటేల్, నేతాజీ శుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల కృషి ఎంత కొనియాడినా తక్కువే అన్నారు. డా. తోటకూర భారత పతాక ఆవిష్కరణ చేసి, శుక్రవారం పనిరోజు అయినప్పటికీ, ఉదయమే ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయలు హాజరుకావడం వారి మాతృ దేశభక్తిని చాటు తుందని అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి డబుల్ హార్స్ వారు ఇండియా నుంచి పంపిన అందరికీ ప్రీతి పాత్రమైన తెలుగింటి సున్నిండలు అందరి ముఖాలలో చిరునవ్వులు చిందించాయి. బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదిర నాయకులు హాజరైనారు.(చదవండి: బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు) -
టీ ఒక్కటి వెయ్యి రూపాయలా..?
దుబాయ్: భారత్‌లో ఒక్క టీ ఖరీదు వెయ్యి రూపాయలుందంటూ వ్లాగర్ పరీక్షిత్ బలోచ్ ఆశ్చర్యంతో చేసిన పోస్ట్‌కు భారీగా స్పందన లభిస్తోంది. దుబాయ్‌లో ఉంటున్న భారతీయ ట్రావెల్ వ్లాగర్, రేడియో ప్రజెంటేటర్ ఇటీవల ముంబైలో తనకు కలిగిన అనుభవాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘ముంబైలోని ఓ హోటల్లో ఒక కప్పు టీ తాగితే నాకు వెయ్యి రూపాయల బిల్లయింది. అది చూసి షాకయ్యా. సాధారణమైన అవసరాలు సైతం ఇంత ఖరీదుగా మారడం చూసి నమ్మలేకపోయా. దుబాయ్‌లో ఉంటూ దిర్హామ్‌లలో సంపాదన కలిగిన నేను భారత్‌లో ఉండగా ఎన్నడూ పేదవానిగా భావించలేదు. కానీ, టీ బిల్లు చూసి మునుపటిలా కాకుండా, భారత్‌లో సైతం పరిస్థితులు మారాయని అనిపించింది’అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. భారత్‌లో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఇలాంటి అనుభవాల్నే పంచుకున్నారు. ముంబైలాంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ‘నేను ఏటా ముంబై వెళ్తుంటా. కొన్నిటికైతే దుబాయ్ కంటే ముంబైలోనే ఖరీదెక్కువ’అని ఒకరంటే, ‘చివరికి ఏవరో ఒకరు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. భారత్‌కు వచ్చాక పేదవానిగా మారింది నేను ఒక్కడినే అని ఇప్పటిదాకా అనుకునేవాణ్ని’అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఇండియా వెళ్లిన ప్రతిసారీ నాకు ఇదే అనుభవం ఎదురవుతోంది. డాలర్లలో సంపాదన కలిగిన నేనే ఇంతగా ఇబ్బంది పడితే, స్థానికంగా ఉండే వారు ఎలా బతుకుతున్నారో ఏమో? ఇంత డబ్బు వారికి ఎలా వస్తుంది? నాకీ విషయం తెలిస్తే, ఇండియాను వదిలేసే వాణ్నే కాదు’అంటూ ఇంకొకరు ముక్తాయింపునిచ్చారు. -
ఎడారి దేశంలో బిక్కుబిక్కుమంటూ..
వెల్గటూర్: బతుకుదెరువు కోసం ఎడారి దేశం వెళ్లిన తొమ్మిది మంది తెలుగువారు అక్కడ ఓ ముఠా చేతిలో మోసపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో ఆరుగురు తెలంగాణవారు కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. తమను కాపాడి ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి పంపించాడు జగిత్యాల జిల్లా ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ గ్రీన్ స్కెచ్ ఎల్ఎల్సీ కంపెనీలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరాడు. అతడితోపాటు తెలంగాణకు చెందిన మరో ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పనికి కుదిరారు. అక్కడ వీరికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను వేరే కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని చెప్పగా.. అతడి మాటలు నమ్మిన ఈ తొమ్మిది మంది అతడితో ఓ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఆ ముఠా సభ్యులు వీరి నుంచి ఐడీ కార్డులు, సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, సంతకాలు, ఫొటోలు తీసుకుని ఈనెల 5న విడిచిపెట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కిరణ్‌తోపాటు ఏపీకి చెందిన ఓ వ్యక్తిని విడిచి పెట్టారు. మిగిలిన ఏడుగురిని పోలీసుల అదుపులోనే ఉంచుకున్నారంటూ కిరణ్ సెల్ఫీ వీడియో తీసి అతని స్నేహితులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డికి పంపించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు జేబలాలి ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకున్నట్లు కిరణ్ తెలిపాడు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో వెల్గటూర్ మండలం జగదేవుపేటకు చెందిన మధు, నిజామాబాద్ జిల్లాకు చెందిన వినయ్, రాజు, శ్రీకాంత్ నిర్మల్ జిల్లాకు చెందిన అశోక్, ఏపీకి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. పొట్ట కూటికి ఆశపడి పొరుగు దేశం వెళ్లి మోసపోయిన తమవారిని ప్రభుత్వం ఆదుకొని ఇండియాకు తీసుకురావాలని కిరణ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
అట్లాంటాలో శంకర నేత్రాలయ సేవా దీక్ష..
గ్రామీణ భారత్‌లో అంధత్వ నిర్మూలన లక్ష్యంతో శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జార్జియాలోని కమ్మింగ్ వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలో MESU (మొబైల్ ఐ సర్జికల్ యూనిట్) “అడాప్ట్-ఎ-విలేజ్” నేత్ర శస్త్ర చికిత్స శిబిరాలకు మద్దతుగా $1.25 మిలియన్ (రూ.10.4 కోట్లు) నిధులు సమీకరించారు.అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమల్ల మాట్లాడుతూ.. సేవ కోసం అట్లాంటా ప్రజా హృదయం స్పందించిందన్నారు. ఈ సాయంత్రం జీవితాలకు వెలుగునిచ్చే లక్ష్యం కోసం అంతా ఐక్యంగా కృషి చేశామన్నారు. కోశాధికారి మూర్తి రేకపల్లి మాట్లాడుతూ.. ప్రజలు మంచి ఉద్దేశ్యంతో కలిసి వచ్చినప్పుడు దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుందన్నారు. ఈ సాయంత్రం దాతృత్వం, సంస్కృతి చేయి చేయి కలిపి నడవగలవని రుజువు చేసిందన్నారు.శాంతి మెడిచెర్ల, సందీప్ కౌతా, ఉషా మోచెర్ల, జనార్ధన్ పన్నెల, స్రవంతి కెటి, శిల్పా ఉప్పులూరి, శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల వంటి ప్రతిభావంతులైన గాయకులకు ఇదొక గొప్ప వేదికయ్యింది. నీలిమ గడ్డమణుగు సమన్వయం చేసి, వారి కళాత్మకత, సాయంత్రారానికి లోతైన, చిరస్మరణీయమైన కోణాన్ని జోడించి, హాజరైన వారందరి నుండి హృదయపూర్వక ప్రశంసలను పొందారు.ప్రారంభోపన్యాసం తర్వాత, వేదిక అద్భుతమైన శాస్త్రీయ భారతీయ నృత్య ప్రదర్శనలతో సజీవంగా మారింది. అట్లాంటా ప్రాంతం అంతటా నృత్య అకాడమీలు - లాస్య స్కూల్ ఆఫ్ డ్యాన్స్ కు చెందిన గురు.శ్రీదేవి రంజిత్-మోహినీయాట్టం, నాట్యవేద నృత్య అకాడమీకి చెందిన గురు.సోబియా సుదీప్ కిషన్-భరతనాట్యం, కళాక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (KIPA) నుండి గురు. మిటల్ పటేల్-కథక్, మరియు నటరాజ నాట్యాంజలికి చెందిన గురు. నీలిమా గడ్డమణుగు-కూచిపూడి సంప్రదాయం నృత్య ప్రదర్శనలో పాతుకుపోయిన నేపథ్య భాగాలను ప్రదర్శించారు. అధ్యక్షులు బాలరెడ్డి, మాధవి ఇందుర్తి దంపతులు శ్రీ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, సలహాదారులు SV ఆచార్య, శ్రీమతి నిర్మలా ఆచార్య, శ్రీమతి లీలా కృష్ణమూర్తి, శ్రీమతి నాట్ కృష్ణమూర్తి, డాక్టర్ కిషోర్ చివుకుల, మరియు శంకర నేత్రాలయ అట్లాంటాలోని ప్రధాన బృందం - మూర్తి రేకపల్లి, శ్రీని వంగిమల్ల, రాజ్ ఐలా, రమేష్ చాపరాల, డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లులను సత్కరించి విందును నిర్వహించారు. -
నేషనల్ ఇండియా హబ్ గాలా డిన్నర్లో యువీ సందడి
అమెరికాలోని ఇల్లినాయిస్ లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చికాగోలోని నేషనల్ ఇండియా హబ్ ఆధ్వర్యంలో జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. ఇక ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని నేషనల్ ఇండియా హబ్ నిర్వహించిన గాలా డిన్నర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఈవెంట్ జరిగింది. గాలా డిన్నర్ లో భాగంగా యువరాజ్ సింగ్ తో పలు సంఘాల నాయకులు, ప్రవాసులు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇండియా హబ్ ఫ్రీ హెల్త్ క్లినిక్ ని యువరాజ్ సింగ్ ప్రారంభించారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేనివారి కోసం ఈ హెల్త్ క్లినిక్ లో ప్రముఖ డాకర్ల సహాకారంతో ఉచిత వైద్య సేవలు అందిచనున్నారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ చేస్తున్న ఛారిటీ కార్యక్రమాలను పలువురు కొనియాడారు. ఇక యువరాజ్ సింగ్ యొక్క క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ YouWeCan కోసం భవిష్యత్తులో నేషనల్ ఇండియా హబ్ తో కలిసి పనిచేయటానికి ఆయన ఆసక్తి చూపించారు. నేషనల్ ఇండియా హబ్ వార్షిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఛారిటీ గాలా డిన్నర్ ఈవెంట్ కి విశేష స్పందన రావటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఇండియా హబ్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు K.K. రెడ్డి, పలువురు ప్రముఖులు, తదితరులు సంస్థ గురించి వివరించారు. అలాగే ఈ హబ్ ను స్థాపించటానికి గల కారణాలు కూడా వెల్లడించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, CPR ట్రైనింగ్, ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. యువరాజ్ సింగ్ తో గాలా డిన్నర్ ఏర్పాటు చేయటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ ని ఎంతో విజయవంతంగా నిర్వహించిన నేషనల్ ఇండియా హబ్ ను పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా అందరికీ 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని మైమూన్ ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ. 1.75 లక్షలు సహాయం అందించి ఆమెను ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు.రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్ లో ప్రతిభ ప్రదర్శించడంతోపాటు ప్రవేశపరీక్షలో 6,947 ర్యాంక్ సాధించి వెటర్నరీ కాలేజీలో సీటుకు అర్హత సాధించింది. చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలోనే పదవతరగతిలో టాపర్ గా వచ్చిన ఆమె ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మైమూన్ మాట్లాడుతూ, రవి పొట్లూరి గారి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రవి పొట్లూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్
షా ఆలం; ఆగస్టు, 2025: తెలుగు భాషాసంస్కృతులను తర్వాతి తరాలకు అందించడం గొప్ప విషయం అని తెలుగు విశ్వవిద్యాలయ పూర్వాచార్యులు రెడ్డి శ్యామల అన్నారు. భాష బోధన చేయడానికి భాషా శాస్త్ర పరిజ్ఞానం అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈనెల 13 నుంచి 23 వరకు మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్ లో భాగంగా నిర్వహించిన కార్యశాల ప్రారంభ సమావేశంలో ఆమె పాల్గొని, తెలుగు సంఘాన్ని అభినందించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, తెలుగు భాషా సాంస్కృతిక మూలాలను బతికించుకోవాలనుకోవడం గొప్ప విషయమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మలేషియాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం తెలుగు నేర్పించడం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మలేషియా తెలుగు అసోసియేషన్‌ను ఆమె అభినందించారు. ఈ కార్యశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా. చంద్రయ్య, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు డా. ప్రతాప్, కోఆర్డినేటర్ రమేష్, ఉపాధ్యక్షులు సీతారావు విద్యార్థులు పాల్గొన్నారు. -
సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం
తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మొల్లమాంబ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గత ఎనిమిదేళ్లుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను శ్రీహరి మందాడి ప్రశంసించారు. మొల్లమంబ వృద్ధాశ్రమానికి నాట్స్ తన వంతు చేయూత అందిస్తుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. కన్న తల్లిదండ్రులను ఎవరూ విస్మరించకూడదని శ్రీహరి అన్నారు. పేద వృద్ధులకు మానవత్వంతో సాయం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.. అమెరికాలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, ముఖ్యంగా పేదల ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తుందని శ్రీహరి తెలిపారు. -
తెలుగు విద్యార్ధుల కోసం నాట్స్ రోబోటిక్ వర్క్ షాప్
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మేరీల్యాండ్ విభాగం ఆన్లైన్ ద్వారా రోబోటిక్ వర్క్ షాప్ నిర్వహించింది. ప్రైమరీ, హైస్కూల్ విద్యార్ధులకు రోబోటిక్, అంతర్జాతీయంగా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ పోటీలపై అవగాహన కల్పించింది. రోబోటిక్స్ నిపుణులు అలోక్ కుమార్ ఎన్నో విలువైన అంశాలను ఈ వర్క్ షాప్‌లో తెలిపారు. అలాగే విద్యార్దుల ప్రశ్నలకు ఎంతో ఓపికగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్ధుల్లో రోబోటిక్స్ పై ఆసక్తి పెరిగేలా ఈ వర్క్ షాప్ జరిగింది. మేరీల్యాండ్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ ఆన్లైన్ వర్క్ షాప్‌కి మేరీల్యాండ్‌తో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్ధులు పాల్గొన్నారు. రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకున్నారు. నాట్స్ నాయకులు రవికిరణ్ తుమ్మల, కిరణ్ మందాడిలు ఈ వర్క్‌షాపు మద్దతు ఇచ్చినందుకు నాట్స్ మేరీ ల్యాండ్ విభాగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్క్ షాప్ నిర్వహణలో నాట్స్ మేరీ ల్యాండ్ చాప్టర్ కో ఆర్డినేటర్ వకుల్ మోర్, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వ మార్ని, మేరీల్యాండ్ నాట్స్ మహిళా విభాగం నాయకురాలు హరిణి నార్ల, కల్చరల్ టీం అధ్యక్షురాలు సువర్ణ కోనగల్లలు కీలక పాత్ర పోషించారు. రోబోటిక్ వర్క్ షాప్‌ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు. -
ఆటిజం బాధితులకు అండగా నాట్స్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో స్పర్శ్ స్పెషల్ స్కూల్ ఫర్ ఆటిజం చిల్డ్రన్కు నాట్స్ మద్దతు ఇస్తుంది. తాజాగా నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారెలు ఈ ఆటిజం పాఠశాలను సందర్శించారు. ఆటిజం పిల్లలకు తమ వంతు సాయం అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆటిజం పిల్లల మానసిక వికాసానికి నాట్స్ చేయూత అందిస్తుందని నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ తెలిపారు. గతంలో ఆటిజం ఆన్ వీల్స్ అనే వాహనాన్ని నాట్స్ ఈ పాఠశాలకు అందించింది. -
బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బ్రూనై దారుస్సలాంలో భారత హైకమిషన్ నిర్వహించిన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బ్రూనై తెలుగు సంఘం, గర్వంగా పాల్గొంది.ఈ వేడుకల్లో సంఘానికి చెందిన పిల్లలు దేశభక్తి గీతాలకు నృత్యాలు, భారత మాత వేషధారణ, ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. భారత హైకమిషనర్ శ్రీ రాము అబ్బగాని గారు భారత గౌరవనీయ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని వాచించారు మరియు కొత్తగా ప్రారంభించిన భారత హైకమిషన్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వెంకట రమణ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు: ఈ చారిత్రాత్మక వేడుకలో భాగం కావడం మా గర్వకారణం. ఇది మన చిన్నారుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా, భారతదేశం మరియు బ్రూనై దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందన్నారు. భారతీయ సాంస్కృతిక సంపదను విదేశాల్లో ప్రోత్సహించే సాంస్కృతిక, విద్యా సామాజిక కార్యక్రమాలలో బ్రూనై తెలుగు సంఘం చురుకుగా పాల్గొంటూనే ఉందని తెలిపారు. -
TDF: అమెరికాలో ఘనంగా టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
మిల్పిటాస్ (కాలిఫోర్నియా): తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) USA రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ‘ ప్రగతి తెలంగాణం’ పేరిట ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు పంపగా, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, సాన్‌ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డా. కే. శ్రీకర్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డా. ఎం.వి. రెడ్డి, ‘ఆటా’ అధ్యక్షుడు జయంత్ చల్లా తదితరులు హాజరయ్యారు.కలర్ఫుల్గా మూడు రోజుల వేడుకలుటీడీఎఫ్ అమెరికా చైర్మన్ మురళి చింతలపాణి, అధ్యక్షుడు మణికొండ శ్రీనివాస్, కన్వీనర్ మహేందర్ రెడ్డి గూడూరు, కో-కన్వీనర్ సుజేందర్ ప్రొదుటూరి సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ బిజినెస్ ఫోరం, పొలిటికల్ ఫోరం, స్టార్టప్ ఫోరం, విజన్ తెలంగాణ-2050 వంటి అంశాలపై చర్చలు జరిగాయి. 2050 నాటికి తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే వ్యూహాలపై ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.పురస్కారాల ప్రదానంఈ సందర్భంగా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు డా. దివేష్ అనిరెడ్డి, డా. గోపాల్ రెడ్డి గాదేలకు, టీడీఎఫ్ లైఫ్‌టైమ్ ఫిలాంత్రఫీ అవార్డు టీ. రామచంద్రరెడ్డికి ప్రదానం చేశారు. సోషల్ ఇంపాక్ట్ పార్ట్నర్ అవార్డులు గ్లోబల్ ప్రగతి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అలోక్ అగర్వాల్, డాక్టర్ సంగీతకు అందజేశారు. టీడీఎఫ్ పూర్వ అధ్యక్షురాలు చల్లా కవితను ఘనంగా సత్కరించారు. వారి సేవలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియోలు ప్రదర్శించారు.సాంస్కృతిక వైభవంతెలంగాణ ఫోక్ నైట్, ఆటా పాటలు, బోనాల వేడుకలు ఆహూతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమాల్లో యాంకర్ వాణి గడ్డం తెలంగాణ యాసతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీరామ్ వెదిరె, బిక్ష గుజ్జ నీటి నిర్వహణపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. టీడీఎఫ్ సీనియర్ నాయకులు మధు కె. రెడ్డి, సుధీర్ కోదాటి, ఎలక్ట్ ప్రెసిడెంట్ భరత్ నేరవెట్ల, ఉపాధ్యక్షురాలు ప్రీతి జొన్నలగడ్డ, స్వాతి సుదిని, ఉపాధ్యక్షులు శ్రావణ్ పోరెడ్డి, శ్రీని గెల్లిపెల్లి, సెక్రటరీ రాజ్ గడ్డం, జాయింట్ సెక్రటరీ మనోహర్, ట్రెజరర్ శ్రీకళ, ట్రస్టీలు గోపాల్ రెడ్డి గాదే, ఇందిరా, కళ్యాణ్ రెడ్డి, కాసప్ప, రవిరెడ్డి, సదానంద్, విజేందర్, వినయ తదితరుల సమిష్టి కృషితో ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. 70 మంది బేఏరియా TDF వాలంటీర్లు వేడుకలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. తెలంగాణ నుంచి, అమెరికా నలుమూలల నుంచి ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థిని దుర్మరణం చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస వర్మ తన కుటుంబంతో కలిసి 15 ఏళ్ల కిత్రమే నగరానికి వలస వచ్చాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బాలాజీ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి భార్య హేమలత, శ్రీజ వర్మ (23), శ్రీయ వర్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.శ్రీనివాస వర్మ బౌరంపేటలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జిగా హేమలత ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. శ్రీజ వర్మ మాస్టర్స్ చదివేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలో వెళ్లింది. చార్లెస్టన్లోని ఈస్టర్న్ ఇల్లినోయిస్ యూనివర్సిటీలో కంప్యూటర్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన శ్రీజ వర్మ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి భోజనం తెచ్చుకునేందుకు తాము నివసిస్తున్న అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచి్చన ట్రక్కు శ్రీజను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: విదేశీ ప్రయాణాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు!రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందన్న విషాద వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలాజీ కాలనీలోని శ్రీజ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి శ్రీజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరుతున్నారు. -
సింగపూర్‌లో కురిసిన రామాయణ ప్రవచనామృతం
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" (sri smakrithika kalasarathi) సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో, పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ ఆధ్వర్యంలో శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై మూడు రోజుల ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.సింగపూర్ దేశపు నాలుగు మూలల నివసించే తెలుగువారందరికీ అందుబాటులో ఉండేలా 5 వేర్వేరు వేదికలలో 5 భాగాలుగా, 15 గంటలపాటు మొత్తం రామాయణంలోని 7 కాండలు , రామాయణ ప్రాశస్త్యంపై సోదాహరణంగా డా. మేడసాని మోహన్ ప్రవచించారు.5 వేదికలలోనూ సుమారు 250 మంది తెలుగువారు పాల్గొనగా 'సింగపూర్ తెలుగు టీవీ'వారి సాంకేతిక నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, ఆన్లైన్ ద్వారా దాదాపుగా 2000 మంది పైగా వీక్షించారు. వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకములు, తెలుగులో రామాయణ కల్పవృక్షము, భాస్కర రామాయణము వంటి వాటినుండి తెలుగు పద్యములు కూడా ఉదహరిస్తూ, కథను ఆసక్తికరంగా వర్ణిస్తూ, రామాయణంలో నిక్షిప్తమైన ఎన్నో అంశాలను, జీవన విధానానికి తోడ్పడే నైతిక సూత్రాలను కూడా రామాయణ గాథతో మేళవించి, పిల్లలు పెద్దలు అందరినీ ఆకట్టుకునే విధంగా మేడసానివారు తమ ప్రవచనం అందించారు.ప్రొఫెసర్ బి వి ఆర్ చౌదరి రాజ్యలక్ష్మి దంపతులు డాక్టర్ మేడసాని మోహన్ గారికి ఆతిథ్యమీయగా, మొదటి వేదిక పంగోల్ రివర్వెల్ కాండోలోను, రెండవ వేదిక బర్గండీ క్రెసెంట్ లోను, మూడవ వేదిక మెల్విల్ కాండోలోను, నాలుగవ వేదిక క్యాన్బర్రా కాండోలోను, 5వ వేదిక జూబిలీ రోడ్ లోను ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వేదికలతో పాటు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఘనంగా జరిగింది. 15వ తేదీ రామ పట్టాభిషేకంతో ఈ పారాయణం సుసంపన్నం అవుతుంది."సంస్థ సభ్యులు రాధిక మంగిపూడి, సుబ్బు పాలకుర్తి ఈ సభలకు వ్యాఖ్యానం చేయగా, ప్రొ. బి వి ఆర్ చౌదరి దంపతులు, సౌభాగ్యలక్ష్మీ రాజశేఖర్ తంగిరాల దంపతులు, సుబ్బు పాలకుర్తి మాధవి దంపతులు, సత్య జాస్తి సరిత దంపతులు, రామాంజనేయులు చామిరాజు రేణుక దంపతులు, రంగా ప్రకాష్ కాండూరి తేజశ్వని దంపతులు ఈ 5 వేదికల ఏర్పాటలో సహకరించారని, మరి ఎంతో మంది దాతలు అన్నదానానికి ఆర్థిక సహాయం అందించిని వారందరికీ సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అయిదువేదికలలో రామనామ కీర్తనలు ఆలపించిన గాయనీమణులు కృష్ణకాంతి , స్నిగ్ద ఆకుండి, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, కాండూరి శ్రీసన్వి, శ్రీధన్వి, షర్మిల చిత్రాడకు నిర్వాహుకులు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు ప్రకాశరావు దంపతులు, రంగా రవి దంపతులు, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ దంపతులు తదితరులు పాల్గొన్న ఈ సభలో, సింగపూర్ తెలుగు టీవీ నిర్వాహకులు గణేశ్న రాధాకృష్ణ కాత్యాయని దంపతులు, సత్య జాస్తి కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించారు. సంస్థ సభ్యులు పాతూరి రాంబాబు, శ్రీధర్ భారద్వాజ్, రామాంజనేయులు చామిరాజు, గుంటూరు వెంకటేష్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. -
వైఎస్సార్సీపీ డల్లాస్ మీట్ అండ్ గ్రీట్ విజయవంతం
అమెరికాలోని వైఎస్సార్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డల్లాస్ లో వైఎస్సార్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. రాంభూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభు త్వం.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజలను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుత్తూ.. అరాచకానికి కూడా తెరలేపిందన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు తీరాలంటే.. జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. మళ్లి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటానికి ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డల్లాస్ వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్నారు. చంద్ర శేఖర్ చింతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి వీర శివా రెడ్డి, కృష్ణ కోడూరు, మణి శివ అన్నపు రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. -
Nimisha Priya Case: ‘నిమిషకు వెంటనే శిక్ష అమలుపరచండి’
కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. వారానికో మలుపు తిరుగుతోంది. మరణ శిక్ష అమలుకు ఒక్కరోజు ముందు.. అంటే జులై 15న వాయిదా పడ్డట్లు యెమెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిమిష తల్లి విజ్ఞప్తి, మతపెద్దల జోక్యంతో శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఉత్తర్వులు వెలువరించారు. అయితే..అప్పటి నుంచి బాధిత కుటుంబంతో నిమిష తల్లి, మధ్యవర్తులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బ్లడ్ మనీ ప్రైవేట్ వ్యవహారం కావడంతో భారత విదేశాంగ శాఖ దూరంగా ఉంటోంది. దీంతో నిమిష ప్రియ కేసులో చర్చలు ఎలా కొనసాగుతున్నాయో అనే గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహ్దీ హతమార్చిన కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. అయితే నిమిషకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని అతని సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహ్దీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు యెమెన్ డిప్యూటీ జనరల్‌ను కలిసి మరణశిక్ష తేదీ అమలుకు తేదీని ఖరారు చేయాలని కోరారు. అదే సమయంలో ఆ దేశ అటార్నీ జనరల్‌కు శిక్షను త్వరగతిన అమలు చేయాలంటూ శుక్రవారం ఓ లేఖ రాశాడు.‘‘మా కుటుంబం అంతా కోరుకునేది ఒక్కటే. ఆమె చేసింది క్రూరమైన నేరానికి పాల్పడింది. ఆ నేరానికి క్షమాపణ ఉండదు.. ఉండబోదు. ఆమెకు తక్షణమే శిక్ష అమలు కావాలి. ఇంక ఆలస్యం చేయకుండా న్యాయం అందించాలి’’ అని ఫేస్‌బుక్‌లోనూ ఫతాహ్ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఫతాహ్ ఇలా డిమాండ్ చేయడం ఇదే తొలిసారేం కాదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాస్తవానికి నిమిషకు మరణశిక్ష జూన్ 7వ తేదీనే అమలు కావాల్సి ఉందని, అయితే దానిని జులై 16వ తేదీకి ాయిదా వేశారు. అప్పట ఇనుంచి అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచారని ఫతాహ్ ఆరోపిస్తున్నాడు. నిమిషకు మరణశిక్షలో జాప్యం చేయొద్దని జులై 25న, ఆగస్టు 4వ తేదీల్లో అక్కడి అదికారులకు లేఖ రాశాడు. మరోవైపు.. కేరళ మతపెద్ద, భారత గ్రాండ్ ముఫ్తా కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చేస్తున్న వరుస ప్రకటనలనూ అబ్దుల్ ఫతాహ్ ఖండించాడు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. ఇది ఆ మత పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి. నిమిషకు శిక్ష పడితేనే మా కుటుంబానికి న్యాయం దక్కేది’’ అని అంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ మరణశిక్ష తన దౌత్యం వల్లే వాయిదా పడిందని కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ తాజాగా ప్రకటించారు. అలాగే.. ఈ వ్యవహారంలో కొందరు ఆ ఘనతేనని ప్రకటించుకున్నారని, అవసరమైతే ఆ క్రెడిట్ వాళ్లకే కట్టబెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. మరోవైపు.. నిమిష ప్రియ వ్యవహారంలో భారత ప్రభుత్వం తాము చేయగలిగినదంతా చేశామంటూ ఇదివరకే ప్రకటించింది. అయితే శిక్ష వాయిదా ప్రకటనను అధికారికంగా ధృవీకరించిన విదేశాంగ శాఖ.. ఏదైనా పురోగతి కనిపిస్తే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటిదాకా వదంతులను నమ్మొద్దంటూ స్పష్టం చేస్తూ వస్తోంది. -
అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ సంప్రదాయాలను మరవటం లేదు. ఏదేశ మేగినా ఎందుకాలిడినా మాతృదేశ విశ్వాసాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు వేదికైన రక్షాబంధన్ ను న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్ హిక్స్ విల్లేలో ఉన్న అసమాయ్ హిందూ టెంపుల్ రాఖీ పండగ సంబరాలకు వేదిక అయింది.నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు ఆహ్వానం మేరకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెలుగు కుటుంబాలు ఆనందోత్సహాల మధ్య రాఖీ పండగను నిర్వహించారు. తోడబుట్టిన సోదరులకు కొందరు అక్కాచెల్లెళ్లు రాఖీలు కడితే, తాము స్ధిరపడిన అమెరికాలో బాంధవ్యాల రీత్యా సోదరభావం ఏర్పడిన అన్నలు, తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టి, వారి నోరు తీపిచేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు.చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి నైటా నేతృత్వంలో బహుమతులు అందించారు. అలాగే హాజరైనవారందరికీ నైటా కార్యవర్గం పసందైన విందును కూడా ఏర్పాటుచేసింది. వారాంతం కావటంతో తెలుగు కుటుంబాలన్నీ ఒక్కచోట చేరి రాఖీ వేడుకలకు మరింత శోభను తెచ్చారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తమ్ రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వయిజరీ కమిటీ, ట్రస్టీలు, ఈవెంట్ స్పాన్సర్లు పాల్గొన్నారు.(చదవండి: ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్‌లో అమానుష ఘటన) -
వామ్మో.. మామూలు ఖర్చు కాదు!
తిరిగే కాలు, తిట్టే నోరు ఉరికే ఉండవని సామెత. కొంతమంది తెగ తిరుగుతుంటారు. నిరంతరం ప్రయాణిస్తుంటారు. కొత్త ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రపంచ యాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడం లేదు.15 లక్షల కోట్లు!ప్రపంచ యాత్రలు చేసేవాడు ప్రజ్ఞావంతుడౌతాడని పెద్దలు చెబుతుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారు మనవాళ్లు. విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు భారీగానే ఖర్చుపెడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2009-10లో విదేశీ ప్రయాణాలకు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) వెచ్చించారు. ఈ వ్యయం 2024-25 నాటికి దాదాపు వెయ్యి రెట్లు (975%) శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ లెక్కన చూసుకుంటే సగటు వార్షిక వృద్ధి రేటు 58.2 శాతంగా ఉంది.జర్నీలకే ఎక్కువ!గతంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రయాణాల కోసం కూడా అధికంగా వెచ్చిస్తున్నారు. ఈక్విటీ నుంచి రియల్ ఎస్టేట్ (Real Estate) వరకు ప్రతిదానికీ డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే విదేశీ ప్రయాణాలకు కూడా ఎక్కువ మొత్తంలో వ్యయం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే విదేశాల్లో చదువు కంటే కూడా జర్నీలు చేయడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయం గత 15 ఏళ్లలో 1000 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.ఎక్కడికి వెళ్తున్నారు?తుర్కియే, ఫ్రాన్స్, మారిషస్, అమెరికా, బ్రెజిల్, చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలను భారతీయులు చుట్టి వస్తున్నారు. 2009 సంవత్సరంలో 1.1 కోట్ల మంది ఇండియన్స్ విదేశాలు వెళ్లారు. కోవిడ్-19 (Covid-19) మహమ్మారికి ముందు ఈ సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో ఈ సంఖ్య బాగా తగ్గింది. కానీ, కరోనా ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో, 2022లో విదేశాలకు ప్రయాణించిన (travel abroad) భారతీయుల సంఖ్య మళ్లీ 2 కోట్లు దాటింది.చదువుకెంత ఖర్చు?భారతీయులు మెరుగైన జీవితాన్ని గడపడానికి విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని టీఓఐ నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య, మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఉపాధికి భరోసాయిచ్చే నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం 2024-25లో మనవాళ్లు చేసిన వ్యయం 9.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 2009-10లో ఈ వ్యయం 549 మిలియన్ డాలర్లు. ఏడాదికి 21 శాతం పెరుగుదల నమోదయింది. చదవండి: ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా? -
ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్‌లో అమానుష ఘటన
విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నదే. తాజాగా ఐర్లాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల చిన్నారిపై తోటి పిల్లలు జాత్యాంహకారం ప్రదర్శించారు. ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఐర్లాండ్ వాటర్‌ఫోర్డ్ నగరంలో ఆగస్టు 4వ తేదీన దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలికపై జాత్యంహకార దాడి జరిగింది. భారత్‌కు తిరిగి వెళ్లిపో అంటూ తోటి పిల్లల్లో కొందరు ఆమెపై ఈ దాడికి తెగబడడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె ప్రైవేట్ భాగాలను గాయపరిచినట్లు తల్లి మీడియాకు వివరించారు.సోమవారం సాయంత్రం కిల్‌బర్రీ ప్రాంతంలోని తన నివాసం బయట నియా నవీన్(6) తోటి పిల్లలలో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో 12-14 ఏళ్ల వయసున్న పిల్లలు కొందరు బాలిక వద్దకు వచ్చారు. అప్పటిదాకా అక్కడే ఉన్న బాలిక తల్లి.. మరో బిడ్డకు పాలిచ్చేందుకు లోపలికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆ బ్యాచ్ సదరు బాలికపై దాడికి తెగబడింది. ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. సైకిల్‌తో ప్రైవేట్ భాగాలను గాయపరిచింది.బాలిక కేకలు విని బయటకు పరిగెత్తుకొచ్చింది ఆ తల్లి. ఆ సమయంలో వాళ్లంతా పారిపోగా.. నడవలేని స్థితిలో బాలిక భయంతో వణికిపోతూ కనిపించింది. డర్టీ ఇండియన్.. గో బ్యాక్ టూ ఇండియా అంటూ వాళ్లు అసభ్య పదజాలం ప్రయోగిస్తూ ఆ బాలికను వారించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.తాను ఎనిమిదేళ్లుగా ఇక్కడ నర్సుగా పని చేస్తున్నానని, ఈ మధ్యే ఐర్లాండ్ పౌరసత్వం దక్కిందని బాలిక తల్లి అనుపా అచ్యుతన్ ‘ఐరీష్ మిర్రర్’ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘మేం అధికారికంగానే ఇక్కడ వచ్చి ఉంటున్నాం.. మంచి వృత్తుల్లో స్థిరపడ్డాం. కానీ, ఇక్కడ భారతీయులెవరికీ భద్రత లేకుండా పోయింది. చివరికి ఇంట్లోనూ భయంతోనే గడపాల్సి వస్తోంది. నా బిడ్డను నేను దాడి నుంచి రక్షించుకోలేకపోయా. ఆమె ఇక నుంచి మునుపటిలా సరదాగా ఆడుకోలేదని నేను భావిస్తున్నా’’ అని జరిగిన ఘటన గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలిక తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పిల్లలపై కఠిన చర్యలు తీసుకోకుండా.. విషబీజాలను వాళ్ల మనసుల్లోంచి తొలగించేలా కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆమె కోరుకుంటోంది.ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యాంహకార దాడులు పెరిగిపోయాయి. గత జులై నుంచి ఇప్పటిదాకా ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. కిందటి నెలలోనూ ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. రాజధాని నగరం డబ్లిన్‌లోని టల్లాట్‌లో 40 ఏళ్ల వ్యక్తిని దుండగులు దుస్తులు విప్పించి హింసించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను భారత రాయబారి ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక కౌన్సిలర్ బాధితుడిని పరామర్శించి, బాసటగా నిలిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రెండు నెలల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఐర్లాండ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యి.. హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది.Credits: irishmirror -
త్వరలో యూఎస్ కొత్త వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్
యునైటెడ్ స్టేట్స్ నిర్దిష్ట దేశాల నుంచి కొంతమంది వీసా దరఖాస్తుదారులకు 12 నెలల వీసా బాండ్ పైలట్ కార్యక్రమాన్ని అమలు చేయాలని చూస్తుంది. వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని నిబంధనలు ఉపయోగించుకుంటూ, ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆగస్టు 20, 2025న ఈ ప్రోగ్రామ్‌ను అమల్లోకి తేనున్నారు. దీని ప్రకారం..నిర్దిష్ట దేశాలకు చెందిన బీ-1 (వ్యాపారం), బీ-2 (పర్యాటక) వీసా దరఖాస్తుదారులు రిఫండబుల్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు పుట్టిన దేశాన్ని బట్టి ఈ బాండ్ కోసం 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాలి. పెరుగుతున్న వలసలు, జాతీయ భద్రతపై ప్రమాదాన్ని గుర్తించి వీసా నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశారు.ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే దేశాలుఈ 12-నెలల వీసా బాండ్ పరిధిలోకి వచ్చే దేశాల వివరాలను ప్రాథమికంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.1. మలావి: ఈ దేశంలోని వారు బీ-1, బీ-2 కింద యూఎస్ వెళ్లాలంటే 15,000 డాలర్ల వరకు బాండ్ తీసుకోవాలి.2. జాంబియా: 15,000 డాలర్ల వరకు బాండ్ అవసరం.అమెరికా కొత్త వీసా ప్రోగ్రామ్ పరిధిలో ప్రస్తుతానికి భారత్ ఈ జాబితాలో లేదు. ఏదేమైనా ఈ పైలట్ ప్రోగ్రామ్‌లోని అంశాలను పరిగణించి క్రమంగా ఈ విధానాన్ని ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యూఎస్ అధికారులు సూచించారు.ఈ బాండ్ ఎలా పని చేస్తుంది?వీసా ఓవర్ స్టే(అధిక కాలంపాటు యూఎస్‌లో నివసించడం)ను నిరోధించడానికి, ప్రయాణీకులు వారి వీసా నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు ఈ బాండ్ వ్యవస్థను రూపొందించారు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కింద తెలుసుకుందాం.వీసా అప్రూవల్ తర్వాతే బాండ్ అవసరం అవుతుంది. దరఖాస్తుదారులు యూఎస్ ట్రెజరీ Pay.gov ప్లాట్పామ్ ద్వారా బాండ్ చెల్లింపులు చేయాలి.దరఖాస్తుదారులు తమ పుట్టిన దేశాన్ని బట్టి 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.వీసా నిబంధనలు పాటిస్తూ, వీసా గడువు ముగియకముందే అమెరికాను వీడే ప్రయాణికులకు బాండ్ పూర్తి రీఫండ్ లభిస్తుంది.వీసా హోల్డర్ తమ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే (అనధికార ఉద్యోగం లేదా వారి వీసా పరిధినిదాటి కార్యకలాపాలు సాగిస్తే) బాండ్ జప్తు చేసుకుంటారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయాణికులు నిర్దేశిత విమానాశ్రయాల ద్వారానే యూఎస్‌లోకి ప్రయాణం సాగించాలి.బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీఓఎస్)న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం (జేఎఫ్‌కే)వాషింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐఏడీ)భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..ఓవర్ స్టే పరిమితంగానే..ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు పరిమితంగానే ‘ఓవర్ స్టే రేట్లు’ కలిగి ఉన్నారని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) గుర్తించింది. బాండ్ అవసరాలకు సంబంధించి భవిష్యత్తు నిర్ణయాలను ఈ డేటా ప్రభావితం చేస్తుంది.భవిష్యత్తు విస్తరణఈ కార్యక్రమం పైలట్ పీరియడ్‌లో భారతదేశాన్ని చేర్చలేదు. అయితే ఇది శాశ్వతం మాత్రం కాదు. భారతీయ బీ -1 / బీ -2 దరఖాస్తుదారులు త్వరలో బాండ్ చెల్లించాలని కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ బ్రేక్అసలు యూఎస్ సమస్య ఏంటి?వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. 2023లో యూఎస్‌లోకి వచ్చి అక్కడే నిలిచిపోతున్న వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చాలా ఓవర్ స్టేలు హానికరం కానప్పటికీ, కొన్ని భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తాయి. వాటిని ట్రాక్ చేయడం కష్టం. సందర్శకులు, ఇతరులు సకాలంలో దేశం వదిలి వెళ్లేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ బాండ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. బాండ్ రీఫండబుల్.. సందర్శకులకు వీసా నిబంధనలను పాటించేలా చేస్తుంది. -
భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?
ఈ ప్రశ్న వేసింది వాన్షివ్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ ఖేటర్‌పాల్. తనను బాధ పెట్టిన సంఘటన గురించి తలుచుకుంటూ ఆయన ఈ ప్రశ్న వేశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. కని, పెంచి ప్రయోజకులను చేసిన పేరెంట్స్‌ను చివరి రోజుల్లో ఒంటరిగా వదిలేస్తున్న వారు ఎందరో. కనీసం కన్నవారి చివరిచూపునకు కూడా నోచుకోకుండా కన్నుమూస్తున్న తల్లిదండ్రులు కోకోల్లలు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఖేటర్‌పాల్ ఎక్స్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడొకరు.. తండ్రి చివరి రోజుల్లో వ్యవహరించిన తీరును తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.'15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న స్నేహితుడొకరు ఇటీవల తన తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో అతడి తండ్రి (84) జైపూర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల ముందు తెల్లవారుజామున 3 గంటలకు నాకొక ఫోన్ కాల్ (Phone Call) వచ్చింది. తన తండ్రి ఆరోగ్యం బాలేదని, వెళ్లి చూడమని అమెరికా నుంచి ఫ్రెండ్ ఫోన్లో చెప్పాడు. కొంతమంది స్నేహితులతో కలిసి నేను వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించాను. గుండెపోటు, అవయవాలు పనిచేయకుండా పోవడంతో పెద్దాయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. సరైన సమయంతో మంచి వైద్యం అందిచడంతో ఆయన కోలుకుకున్నారు. బంధువులు ఆయన చూడటానికి వచ్చారు. కానీ ఎవరూ ఎటువంటి బిల్లులు చెల్లించలేదు సరికదా, ఆయన బాధ్యత భుజానికెత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఇక పెద్దాయన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తండ్రి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంటే కొడుకు మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం అమెరికాలోనే ఉన్నాడు. తండ్రిని చూడటానికి రాలేదు. గత వారమే పెద్దాయన ప్రాణాలు వదిలారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇండియాకు వచ్చిన కొడుకు మళ్లీ 3 రోజులకే తిరుగు పయనమయ్యాడు.నన్ను కదిలించినది ఏమిటంటే..అంతిమ గడియల్లో ఉన్న తండ్రి కంటే అమెరికా కలే అతడికి ముఖ్యమైంది. తండ్రి చనిపోయినప్పుడు కూడా అతడి భార్య, పిల్లలు రాలేదు. వాళ్లు అమెరికాలోనే ఉండిపోయారు. "ఆమెకు ఉద్యోగం ఉంది, పిల్లలకు చదువు ఉంది" అని అతడు అన్నాడు - నమ్మశక్యం కాదు!నేను, నా స్నేహితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి, ఖర్చులు చూసుకుంటూ, వంతులవారీగా ఆస్పత్రికి వెళుతూ అతడి తండ్రిని చివరి శ్వాస వరకు వెన్నంటే ఉన్నాం. కానీ నగరంలోని అతడి బంధువులెవరూ మర్యాదపూర్వకంగా కలవడం తప్ప ఎటువంటి సహాయం చేయలేదు.తండ్రి చనిపోయిన మూడో రోజునే నా స్నేహితుడు స్వదేశం విడిచి వెళ్లాడు. తండ్రి అస్థికలను నిమజ్జనం కూడా చేయకుండానే అతడు అమెరికా వెళ్లిపోయాడు.భారతీయ కుటుంబ విలువలు, మన ఆచారాలు, బంధాలు ప్రపంచంలో మరెక్కడా లేనంత మెరుగ్గా.. బలంగా ఉన్నాయని ఇప్పటివరకు నేను నమ్మాను. కానీ ఈ సంఘటన నన్ను పూర్తిగా కదిలించింది! భారతీయ సమాజం ఎటు పయనిస్తోంది, మన కుటుంబ విలువలు ఎక్కడ కనుమరుగవుతున్నాయ'ని గౌరవ్ ఖేటర్‌పాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. విదేశాల్లో ఉంటూ కెరీర్ కొనసాగిస్తువారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కువ మంది మాత్రం విచ్ఛిన్నమవుతున్న భారతీయ కుటుంబ విలువల గురించే ఆందోళన చెందారు.స్నేహితుడిని బద్నాం చేస్తారా?మరికొందరైతే గౌరవ్‌పై విరుచుకుపడ్డారు. ట్వీట్ కోసం స్నేహితుడిని బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు. 'కేవలం 3 రోజుల కోసమే అమెరికా (America) నుంచి ఎవరూ ఇండియాకు రారు. ప్రయాణానికే ఒక రోజు పడుతుంది. జెట్ లాగ్ ఎలాగూ ఉంటుంది. అతడి తండ్రికి అప్పటికే 84 ఏళ్లు, తన కొడుకుతో ఉండటానికి నిరాకరించి ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం, చలి వాతావరణం కారణంగా అమెరికాలో వృద్ధులు నివసించడం కష్టం. అతడు తన తండ్రిని చూసుకోవడానికి సహాయకులను నియమించుకునే ఏర్పాటు చేసి ఉండాలి. మీరు ఎటువంటి రుజువు ఇవ్వకుండానే ఇక్కడ మీ స్నేహితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించారని కూడా మీరు పేర్కొన్నారు. మీరు నిజం చెబుతుంటే, ఆసుపత్రి పత్రాలు, బిల్లులతో పాటు వృద్ధుడు, అతడి కొడుకు వివరాలను వెల్లడించండి' అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేశాడు. దీనిపై ఖేటర్‌పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'మీ స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం మీద.. 3 రోజుల కోసం ఎవరూ అమెరికా నుంచి భారతదేశానికి రారు అనే వాస్తవాన్ని మీరు ఇప్పుడే గమనించారు. మీ IQ వేరే స్థాయిలో ఉందంటూ' సమాధానమిచ్చారు.చదవండి: టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్యలో గతంలో చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య బాగా పెరుగుతుండడంతో.. తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఎడబాటు తప్పడం లేదని మరో నెటిజన్ (Netizen) అభిప్రాయపడ్డారు. అఖరి గడియాల్లో పిల్లల కోసం వేచిచూసి తనువు చాలిస్తున్న పేరెంట్స్ సంఖ్య నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. చాలా మంది పిల్లలకు.. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత, ఆస్తులన్నీ అమ్మేసి ముందుకు సాగడమే ఏకైక లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దాదాపు 2 లక్షల మంది భారతీయులు (Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు ఇటీవల వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం.ఎవరీ గౌరవ్ ఖేటర్‌పాల్?రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు గౌరవ్ ఖేటర్‌పాల్ (Gaurav Kheterpal). గూగుల్ డెవలపర్ ఏఐ ఎక్స్పర్ట్ అయిన గౌరవ్‌కు ఐటీ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మల్టీ-క్లౌడ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్‌గానూ ఆయన పేరు గాంచారు. చాలా దేశాల్లో ఐటీపై ప్రసంగాలు ఇచ్చారు. గ్లోబల్ మొబైల్ డెవలపర్ చాలెంజ్, యాప్స్ హకథాన్ వంటి పలు రకాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాన్షివ్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించి సీఈవోగా కొనసాగుతున్నారు. Is the Indian family system dead?A friend (let's call him 'X') recently lost his father. He's been living in the US for the last 15 years while his father lived alone in Jaipur - his mother passed away 3 years back. Few days earlier, I received a frantic call from him at 3 AM…— Gaurav Kheterpal (@gauravkheterpal) August 3, 2025 -
దుబాయ్‌కి డ్రైవర్లు కావలెను.. జీతం ఎంతంటే?
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్‌కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీనికోసం జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. దుబాయ్‌కి చెందిన త్రీస్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్‌పోర్టు, దుబాయ్పోర్ట్ వంటి సంస్థలు డ్రైవర్ల నియామకం కోసం 10, 30వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో గణేష్‌కుమార్ తెలిపారు.కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో దుబాయ్ (Dubai) నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు (Drivers) అత్యధికంగా ఉన్నారని, వారిని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యూఏఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించనున్నారు. 24 నుంచి 48 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని, నెలకు రూ.35,000 నుంచి రూ.94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్ఎస్డీసీ తెలిపింది. డ్రైవింగ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆగస్టు 10న స్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగాలకు ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. లేదా skillinternational@apssdc.in ఈమెయిల్, 91–99888533 35, 8712655686, 8790118349, 8790117279 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరింది.చదవండి: స్కూల్లో కూలి పనులు చేయిస్తున్నారు -
విద్యార్థుల చూపు.. ఐర్లాండ్ వైపు
బలమైన అకడమిక్ పాలసీలు, అనుకూలమైన వీసా విధానాలు, విస్తరిస్తున్న కెరియర్ అవకాశాలతో ఐర్లాండ్ భారతీయ విద్యార్థులను ఎంతో ఆకర్షిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 40,400 మంది విదేశీ విద్యార్థులకు ఐర్లాండ్ స్వాగతం పలికింది. ఇది గత సంవత్సరం కంటే 15% పెరుగుదల నమోదు చేసింది. ఐడీపీ ఎడ్యుకేషన్ తెలిపిన వివరాల ప్రకారం 2024లో భారతదేశం నుంచి ఐర్లాండ్ వెళ్లే విద్యార్థినుల సంఖ్య గతంలో కంటే 60 శాతంపైగా పెరిగింది. ఈ గణనీయమైన పెరుగుదల విద్యార్థి-స్నేహపూర్వక, సురక్షితమైన, సమ్మిళిత వాతావరణాన్ని సూచిస్తుంది. ఆ దేశంపై విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి ఐరిష్ విద్యా నాణ్యతను మాత్రమే కాకుండా దాని క్రియాశీల విధానాలు, భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుండడాన్ని హైలైట్ చేస్తుంది.ఎందుకంత ఆసక్తి?ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ టెక్నాలజీ, గేమింగ్ వంటి అధిక వృద్ధి, ఆవిష్కరణ ఆధారిత పరిశ్రమలకు ప్రపంచ కేంద్రంగా ఐర్లాండ్ నిలుస్తుంది. గూగుల్, మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫైజర్, స్ట్రిప్.. వంటి ప్రధాన బహుళజాతి కంపెనీల యూరోపియన్ ప్రధాన కార్యాలయాలకు ఐర్లాండ్‌లో స్థాపిస్తున్నారు. ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత డైనమిక్ రంగాల్లో కెరియర్ అవకాశాల కోసం యువత ఈ దేశంవైపు చూస్తోంది.మెరుగైన యూనివర్సిటీలుప్రపంచవ్యాప్తంగా టాప్‌లో నిలుస్తున్న విశ్వవిద్యాలయాలు అకడమిక్ విద్యను బలోపేతం చేస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ యూనివర్సిటీలు చోటు సంపాదిస్తున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఆరు ఐరిష్ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకోగా, ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ 75వ స్థానంలో నిలిచింది.ట్రినిటీ కాలేజ్ డబ్లిన్: #75యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్: #118యూనివర్శిటీ ఆఫ్ గాల్వే: #289యూనివర్శిటీ కాలేజ్ కార్క్: #292డబ్లిన్ సిటీ యూనివర్శిటీ, యూనివర్సిటీ ఆఫ్ లిమెరిక్: 436వ స్థానంలో నిలిచాయి.ఈ సంస్థలు ముఖ్యంగా డేటా సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, బిజినెస్ అనలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో ప్రోగ్రామ్‌లకు ప్రసిద్ధి చెందాయి. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఇది గమ్యస్థానంగా తోస్తుంది. యూకే, ఆస్ట్రేలియాతో పోలిస్తే ఐర్లాండ్‌లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉంటాయని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లకు ఇది ఎంతో ఉపయోగడుతుంది.విద్య తర్వాత పని అవకాశాలుఐర్లాండ్ పోస్ట్ స్టడీ వర్క్ పాలసీ విదేశీ విద్యార్థులను మరింత ఆకర్షిస్తోంది. 2023లో 7,000 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు పొందారు. థర్డ్ లెవల్ గ్రాడ్యుయేట్ స్కీమ్ కింద, అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత రెండు సంవత్సరాల వరకు ఐర్లాండ్‌లో ఉండి పనిచేయవచ్చు. ఇది అంతర్జాతీయ పని అనుభవాన్ని పొందడానికి తోడ్పడుతుంది. విద్యార్థులు అకడమిక్ పరంగా వారానికి 20 గంటలు, సెలవు దినాల్లో 40 గంటలు పనిచేయడానికి అనుమతులున్నాయి. ఇది వారి అకడమిక్ సమయంలో ఆర్థికంగా సహాయపడుతుంది.భారతదేశంతో సంబంధాలు బలోపేతంఐర్లాండ్-భారతదేశంలో విద్యార్థులు పెరుగుతున్న నేపథ్యంలో పరస్పరం విద్యా సహకారాలను పంచుకుంటున్నాయి. మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ), సంయుక్త పరిశోధన కార్యక్రమాలతో సహా 30కి పైగా సంస్థాగత భాగస్వామ్యాలు ఇప్పటికే కుదుర్చుకున్నాయి. ఐర్లాండ్-ఇండియా ఎఫినిటీ డయాస్పోరా నెట్వర్క్ విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇది ఐర్లాండ్‌లోని భారతీయ విద్యార్థులకు సహాయక వ్యవస్థను అందిస్తోంది. ‘గ్లోబల్ సిటిజన్స్ 2030 ఇంటర్నేషనల్ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ’ వంటి జాతీయ వ్యూహాల ద్వారా అంతర్జాతీయ విద్య పట్ల ఐర్లాండ్ నిబద్ధతను హైలైట్ చేస్తుంది. అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులకు ఐర్లాండ్ మొదటి ఎంపికగా ఉంచాలనే ప్రభుత్వ దార్శనికతను ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రతిబింబిస్తుంది.ఇదీ చదవండి: బక్కచిక్కుతోన్న రూపాయి -
ఆస్తిపాస్తులు గోప్యంగా ఉంచితే అంతే..
యాపిల్, అమెజాన్, టెస్లా వంటి టెక్ దిగ్గజాలను కలిగి ఉన్న యూఎస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని చాలామంది ఇతర దేశాల పెట్టుబడిదారులు యోచిస్తుంటారు. యూఎస్ మార్కెట్ ఆకర్షణీయంగా తోస్తున్నా భారతీయ పెట్టుబడిదారులు అక్కడ ఇన్వెస్ట్ చేసేముందు చాలా విషయాలు తీలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడి బ్రోకర్ ఖాతా తెరవడం, స్టాక్ ఎంచుకోవడం, అందులో పెట్టుబడి పెట్టడం అంత సులభం కాదని చెబుతున్నారు.విదేశాల్లో ముఖ్యంగా యు.ఎస్‌లో పెట్టుబడి పెట్టడంతోపాటు భారతీయ ఇన్వెస్టర్లకు అక్కడ అమల్లో ఉన్న సంక్లిష్టమైన చట్టపరమైన ఫ్రేమ్ వర్క్‌లు, పన్ను చిక్కులు, ఖర్చులపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అక్కడ పెట్టుబడి పెట్టి భారతీయ విధానాలు పాటించడంలో విఫలమైతే భారీ జరిమానాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.లీగల్ ఫ్రేమ్వర్క్ఆర్బీఐ 2004లో ప్రవేశపెట్టిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రస్తుత పరిమితి మైనర్లతో సహా ప్రతి వ్యక్తికి ఆర్థిక సంవత్సరానికి 2,50,000 డాలర్లుగా ఉంది. ట్రావెల్, ఎడ్యుకేషన్, యూఎస్ ఈక్విటీలతో సహా విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వంటి వివిధ లావాదేవీలు ఇందులో కవర్ అవుతాయి. ఇన్వెస్టర్ల మొత్తం వార్షిక విదేశీ రెమిటెన్స్ రూ.10 లక్షలు దాటితే మూలం వద్ద వసూలు చేసిన పన్ను (టీసీఎస్) వర్తిస్తుంది.డివిడెండ్లుఅమెరికా కంపెనీల నుంచి డివిడెండ్లు వస్తే వాటిని భారత్‌లో విదేశీ ఆదాయంగా వర్గీకరిస్తారు. ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా అమెరికా 25% పన్నును ముందస్తుగా నిలిపివేస్తుంది. అయితే, భారత్-అమెరికాల పరిధిలో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ) అమలులో ఉంది. భారతీయ పన్నులను దాఖలు చేసేటప్పుడు ఈ మినహాయింపు కోసం విదేశీ పన్ను క్రెడిట్‌ను క్లెయిమ్ చేయవచ్చు.క్యాపిటల్ గెయిన్స్అమెరికా పన్ను నిబంధనల ప్రకారం ప్రవాస భారతీయులుగా పరిగణించే భారతీయ నివాసితుల మూలధన లాభాలపై అమెరికా పన్ను విధించదు. కానీ భారత్‌లో పన్నులు చెల్లించాల్సిందే. 24 నెలల కంటే ఎక్కువకాలం ఉన్న పెట్టుబడి లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)గా ఇండెక్సేషన్, సర్ఛార్జ్, సెస్‌తో కలిపి 20 శాతం పన్ను విధిస్తారు. 24 నెలల కంటే తక్కవగా ఉన్నవాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ)గా పరిగణించి ఆదాయ శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.స్టాక్స్ వివరాలు తెలపాల్సిందే..భారతదేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేటప్పుడు అన్ని విదేశీ ఆస్తులను షెడ్యూల్ ఎఫ్ఏ (విదేశీ ఆస్తులు) కింద ప్రకటించాలి. చిన్నమొత్తంలోని పెట్టుబడులను సైతం బహిర్గతం చేయాలి. అందులో విఫలమైతే బ్లాక్‌మనీ (అప్రకటిత విదేశీ ఆదాయం, ఆస్తులు), పన్ను విధింపు చట్టం, 2015 కింద తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ వివరాలు వెల్లడించని వారికి ఏడాదికి రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.రివైజ్డ్ రిటర్న్ఏదైనా పరిస్థితుల్లో ఐటీఆర్ దాఖలు చేసేపుడు విదేశీ హోల్డింగ్స్‌ను ప్రకటించడంలో విఫలమైతే గడువులోగా రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయాలి. లేదంటే సెక్షన్ 139(8ఏ) కింద అప్డేటెడ్ రిటర్న్ (ఐటీఆర్యూ) ఆప్షన్‌ను ఉపయోగించాలి. ఏదేమైనా మీ ఫైలింగ్‌లను సమీక్షించడానికి, పూర్తి సమ్మతిని నిర్ధారించడానికి అర్హత కలిగిన పన్ను నిపుణులను సంప్రదిస్తే మేలు.ఇదీ చదవండి: ఆర్బీఐ ఎంపీసీ దారెటు..?విదేశాల్లో పెట్టుబడులు పెట్టే ముందు..చట్టపరమైన ఆంక్షలు, విధానలను అర్థం చేసుకోవాలి.రెండు దేశాల్లో వాటి పన్ను ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.ప్రతి హోల్డింగ్, ఆదాయ మార్గాన్ని ఐటీఆర్‌లో వెల్లడించాలి.అవసరమైనప్పుడు ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాలి.ఎంతైనా తప్పును ఐటీ అధికారుల ముందు సమర్థించుకోవడం కంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. -
USA: విషాదాన్ని మిగిల్చిన ఎన్ఆర్ఐ వృద్ధుల ‘అదృశ్య ఘటన’
అమెరికాలో న్యూయార్క్‌కు చెందిన నలుగురు భారత సంతతి వృద్ధులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీరు కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే, చివరికి ఈ అదృశ్య ఘటన విషాదాన్ని మిగిల్చింది.వెస్ట్ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని.. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు మార్షల్ కౌంటీ పోలీసులు తెలిపారు. మరణించినవారు ఒకే కుటుంబానికి చెందిన ఆశా దివాన్(85), కిశోర్ దివాన్ (89), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)లుగా పోలీసులు గుర్తించారు. న్యూయార్క్‌లోని బఫెలో నుంచి వెస్ట్ వర్జీనియాలోని మార్షల్ కౌంటీలో ఉన్న ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డులో వీరి వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో ఈ ప్రమాదాన్ని ఎవ్వరూ గమనించలేకపోయారు.జులై 29న అదృశ్యం కాగా, వీరి వాహనం ప్రమాదానికి గురైనట్లు నిన్న (ఆగస్టు 2) పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఆ నలుగురు మృతి చెందినట్లు పోలీసులు ద్రువీకరించారు. చివరిసారిగా జులై 29న వీరు పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. క్రెడిట్ కార్డును కూడా చివరిసారి అక్కడే వాడినట్లు తెలిసింది. నలుగురి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. చివరికి వారు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. -
ఎడిసన్‌లో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం
అమెరికాలో భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ తన దౌత్య సేవలను మరింత విస్తరించింది. ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా కొత్తగా 8 ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా వెల్లడించారు. ఎడిసన్, బోస్టన్, కొలంబస్, డల్లాస్, డెట్రాయిట్, ఓర్లాండో, రాలీ, శాన్ జోస్ వంటి నగరాల్లో ఈ నూతన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో మొత్తం ICACల సంఖ్య 17కి చేరినట్లు వివరించారు.ఇక న్యూజెర్సీలోని ఎడిసన్‌లో జరిగిన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయా ప్రధాన్ హాజరై ప్రసంగించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎడిసన్ మేయర్ సామ్ జోషితో పాటు ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో VFS గ్లోబల్ నార్త్ అమెరికా, కరేబియన్ అధిపతి అమిత్ కుమార్ శర్మ పాల్గొని ప్రసంగించారు. VFS 150 దేశాలలో 70 ప్రభుత్వాలతో కలిసి పనిచేసిందన్నారు. ఇక నూతన కేంద్రాల నుండి వర్చువల్‌గా చేరిన ప్రవాసులను ఉద్దేశించి వినయ్ ప్రసంగించారు. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటు ద్వారా భారతీయ డయాస్పోరాకు కాన్సులర్ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని, సేవలు సులభతరం, వేగవంతమౌతాయని వినయ్ పేర్కొన్నారు. శనివారాల్లో కూడా ఈ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో- అమెరికా వ్యాప్తంగా నివసించే లక్షలాది మంది భారతీయులకు కాన్సులర్ సేవలు మరింత చేరువ చేసినట్టవుతుందని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ఈ కొత్త కాన్సులేట్లను తెరవడం ద్వారా భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని.. ముఖ్యంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలమని అభిప్రాయపడ్డారు.(చదవండి: డాలస్‌లో కొత్తగా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్) -
డాలస్‌లో కొత్తగా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్
డాలస్, టెక్సస్: వాషింగ్టన్, డి.సి.లోని భారత రాయబార కార్యాలయం డాలస్ నగరంలో కొత్తగా ప్రారంభించిన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ఆగస్ట్ 1వ తేదినుంచి అమలులోకి వచ్చింది.ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ (IAFC) అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రవాస భారతీయల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్న డాలస్ నగరంలో ఇలాంటి ఒక కేంద్రం కావాలని ఎన్నో ఏళ్లగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని, అది ఇప్పటికి సాకారం కావడం సంతోషదాయకం అన్నారు. ప్రతి చిన్న కాన్సులర్ సేవకు డాలస్ నుండి హ్యుస్టన్ వెళ్లి రావడానికి పది గంటలకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తోందని, ఇప్పుడు ఆ ప్రయాస తప్పుతోందని అన్నారు. శనివారంతో సహా వారానికి ఆరు రోజులు పనిచేసే ఈ కేంద్రం 8360 LBJ Free Way, Ste. # A 230, Dallas, TX లో నెలకొని ఉన్నదన్నారు. పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) సేవలు, వీసా దరఖాస్తులు, జనన మరియు వివాహ రిజిస్ట్రేషన్లు వంటి కాన్సులర్ సేవలను ఈ కేంద్రంలో పొందవచ్చునని తెలియజేశారు.”సుదూర ప్రయాణం చేయవలసిన అవసరం లేకుండా డాలస్లోనే ఎక్కువ భారతీయ కాన్సులర్ సేవలను సులభంగా పొందే అవకాశం కల్పించినందుకు అమెరికాలో గౌరవ భారత రాయబారి వినయ్ క్వాట్రా, కాన్సల్ జనరల్ డి. సి మంజునాథ్, వి.ఎఫ్.స్ అధికారులకు ప్రవాస భారతీయులందరి తరపున IAFC అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ప్రారంభోత్సవం సందర్భంగా- ఫోటో (ఎడమ నుంచి కుడికి) వి.ఎఫ్.ఎస్ అధికారి సుభాశీష్ గంగూలి, ఫ్రిస్కో నగర కౌన్సిల్ మెంబర్ బర్ట్ టక్కర్, ఐ.ఏ.ఎఫ్.సి అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, టెక్సాస్ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ నాయకుడు పాట్రిక్ వ్యామ్ హాఫ్, వి.ఎఫ్.ఎస్ డిప్యూటీ మేనేజర్ తన్వి దేశాయ్. -
నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
యెమెన్‌లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్‌మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్‌కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్ కుటుంబంతో బ్లడ్ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. బ్లడ్‌మనీ అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది. -
అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ..
లింగాలఘణపురం: అమెరికాలోని ఓక్లహోమ్ రాష్ట్రంలోని ఎడ్జుండ్ నగరంలో ఉంటున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడి కోర్టు 35 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో మానసిక ఆందోళనకు గురై సాయికుమార్ జూలై 26న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు గత నెల 31న అమెరికా బయల్దేరారు. సాయికుమార్ పదేళ్ల కిందట అమెరికా (America) వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఓక్లహోమ్లో ఉంటున్నాడు.2023లో అక్కడి ఎఫ్‌బీఐ సోషల్ మీడియా మేనేజింగ్ యాప్‌లో నిందితుడి అకౌంట్‌పై విచారణ జరపగా 13–15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ బాలికలతో నమ్మకంగా ఉంటుండేవాడు. అతని అభ్యర్థనను తిరస్కరించిన వారిని బెదిరించడం, మానసికంగా వేధించడం, అసభ్య చిత్రాలు తీసి పంపించినట్లు ఆరోపణలు రావడంతో సాయికుమార్‌ను అరెస్ట్ చేశారు. అతను 19 మంది మైనర్లను లైంగికంగా వేధించినట్లు కోర్టులో నిరూపితమవడంతో 35 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు? -
తానా: నవ్వులు కురిపించిన ‘సాహిత్యంలో హాస్యం’
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “సాహిత్యంలో హాస్యం” నవ్వుల జల్లులు కురిపించింది. తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలకు పైగా, ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం” (2 వ భాగం) “ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం” చాలా ఉల్లాస భరితంగా, ఆద్యంతం నవ్వులతో నిండింది.తానా నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ – “తానా ఎన్నో దశాబ్దాలగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళా వికాసాలకోసం అవిరళకృషి చేస్తోందని, తన పదవీకాలంలో తానా సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే దిశగా పయనించడం సంతోషంగాఉందని, అందరి సహకారంతో సంస్థ ఆశయాలను సాకారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణ, పర్యాప్తిలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో గత 5 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ సాహిత్య కృషి ఎంతైనా కొనియాడదగ్గదని, ఈ నాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకూ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.”తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “డా. నరేన్ కొడాలి తానా అధ్యక్ష పదవీకాలం ఫలవంతం కావాలని, తానా సంస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత సాహిత్య చర్చాంశం గురించి ప్రస్తావిస్తూ - తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ హాస్యం పుష్కలంగా పండిందని అన్నారు.కాళ్ళకూరి నారాయణగారి “చింతామణి”, “వరవిక్రయం” నాటకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి “సాక్షి” వ్యాసాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుగారి “గణపతి” నవల, మునిమాణిక్యం నరసింహారావుగారి “కాంతం కథలు”, సురవరం ప్రతాపరెడ్డిగారి “మొగలాయి కథలు”, గురజాడ అప్పారావుగారి కలం నుండి జాలువారిన “కన్యాశుల్కం” నాటకంలోని అనేక హాస్య సన్నివేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. జీవితంలో వత్తిడిని తగ్గించేందుకు హాస్యం మిక్కిలి దోహదపడుతుందని, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్న హాస్యాన్ని అందరూ ఆస్వాదించవచ్చును అన్నారు.”గౌరవఅతిథిగా విచ్చేసిన తెలుగువేద కవి, ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు-సాహిత్యంలో వివిధ హాస్య ఘట్టాలను వివరించి నవ్వించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ చలనచిత్ర కథా, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి - సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు రంగనాయకమ్మ పండించిన హాస్యాన్ని; ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, నృత్య రూపకాల రచయిత, కథా, సంభాషణా రచయిత బ్నిం – నరసింహారావు పేరుతో ఉన్న వివిధ ప్రముఖ రచయితలు సృష్టించిన హాస్యాన్ని ‘గాండ్రింపులు మానిన హాస్యాలుగా’; ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు సుధామ - ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రచనలలోని హాస్యాన్ని;ప్రముఖ కథా, నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనుమరాలు అయిన లలిత రామ్ - తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రిల సాహిత్యంలోని హాస్యాన్ని; కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షురాలు డా. వి. వింధ్యవాసినీ దేవి – సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలలోని హాస్యాన్ని; ప్రముఖ హాస్యనటుడు, రచయిత, ఉపన్యాసకుడు అయిన డా. గుండు సుదర్శన్ – ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణతో తనకున్న సాంగత్యం, శ్రీరమణ సాహిత్యంలో హాస్యం; ప్రముఖ రచయిత, సినీనటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ – ప్రముఖ రచయితలు వేటూరి సుందర రామమూర్తి, పైడిపల్లి సత్యానంద్, కొడకండ్ల అప్పలాచార్యలు సృష్టించిన హాస్యరీతుల్ని ఇలా పాల్గొన్న అతిథులందరూ వేర్వేరు రచయితలు పండించిన హాస్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అందరిని కడుపుబ్బ నవ్వించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో కార్యక్రమం యావత్తూ హాస్యరస ప్రధానంగా సాగిందని, పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఇదేం పాడుబుద్ధయ్యా.. పైలటూ!
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్‌ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్‌ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్‌గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషంఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది. -
ఘనంగా ముగిసిన కార్గిల్ విజయ్ దివస్-సురభి ఏక ఎహసాన్
తన చిన్ననాటి కల 'దేశం కోసం ఏమైనా చెయ్యాలి' అనే తపన పూర్తీ కాలేదు ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ లో సీటు దక్కలేదు. ఒక రేడియో వ్యాఖ్యాతగా, ఆ కాలనీ సాకారం చేసే అవకాశం లభిస్తుందని ఊహించలేదు టోరీ రేడియో వ్యాఖ్యాత జయ. తన రేడియో షో పేరు జై హింద్, ఈ పేరు ఎంచుకున్నందుకు రెండు కారణాలు - ఒకటి భారత్ దేశం కోసం కాబట్టి, రెండవ ది హిందీ వివిధభారతి లో 'జయ్ మాల' అని సైనికుల కార్యక్రమం తనకు అత్యంత ప్రియమైన ప్రోగ్రాం కాబట్టి దానికి తగినట్టుగా ఉండాలనే యత్నంలో 'జై హింద్' నిలిచిపోయింది.అయితే షో పేరుకి కార్గిల్ విజయ్ దివస్ కి ఏమిటి సంబంధం? జై హింద్ లో అనేక హోదాల్లో వున్న విశ్రాంత సైనికులు, వారిలో ఎక్కువగా 'గాలంటరీ అవార్డ్స్ 'అందుకున్న వారు, వీర నారీలతో పరిచయాలు మరియు త్రిదళాల కుటుంబాలకు సేవలు అందచేసే స్వచ్చంద సంస్థలతో పరిచయాలు చెయ్యడం జరిగింది. వీరిలో కొందరు కార్గిల్ యుద్ధం లో సేవలు అందించిన వారున్నారు కనుక కార్గిల్ విజయ్ దివస్ వెనుక వున్న త్యాగం, భావోద్వేగాలు మరియు ఆనందాల విలువలు నెమ్మదిగా అర్ధం చేసుకొన్న జయ, కార్గిల్ విజయ దివస్ ని తన కర్మ భూమి హాంగ్ కాంగ్ లో చేయడం ప్రారంభించి 'సురభి ఏక ఎహసాన్ ' గా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొంది.జయ మాట్లాడుతూ తన రేడియో షో ముఖ్య ఉద్దేశాన్ని పునరుద్ధరిస్తూ సైనికుల జీవితాలను వారి కుటుంబ త్యాగాలను సామాన్య పౌరులకు తెలియజేసే ప్రయత్నమని అందుకు టోరీ రేడియో యాజమాన్యం మరియు శ్రోతలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, ఆ స్ఫూర్తి తో ఒక పుష్కర కాలంగా 'జై హింద్' షో చేస్తున్నాని తెలిపారు. హాంగ్ కాంగ్ ప్రవాస భారతీయులందరు , ప్రతి సంవత్సరం "సురభి ఏ ఎహసాన్ " కార్యక్రమాన్నికి ఎంతో ఆదరణ అభిమానంతో వారందరూ దీనిని వారి వార్షిక క్యాలెండర్ ఈవెంట్లలో ఒకటిగా ఎదురు చూస్తారు. వారి హృదయాలలో ఈ స్థానం సంపాయించగలిగాను అంటే వారు మన రక్షణ దళాల గురించి ముఖ్యం గా మన సానికుల గురించి ఆలోచిస్త్రున్నారు అన్న తృప్తి నాకు ఒక వరం గా భావిస్తాను అంటారు టోరీ వ్యాఖ్యాత జయ పీసపాటి.ఈ సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్' కార్యక్రమం లో భాగంగా పిల్లలకు చిత్రలేఖనం పోటీలు మరియు మన జాతీయ భాష హిందీ లో కవితలు / గీత రచనల పోటీలు కూడా నిర్వహించడం ఒక విశేషం. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత తాత్కాలిక కాన్సుల్ జనరల్ మిస్ సురభి గోయల్ గారు మరియు భారతీయ గోర్ఖా రెజిమెంట్ విశ్రాంత జవాన్లు విచ్చేసారు. స్థానిక ప్రముఖులు, తమ అనేక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించే స్వచ్చంద సంస్థ - టచ్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ మిస్ కోనీ వాంగ్ కూడ కార్యక్రమానికి సంతోషంగా హాజరయ్యారు.గౌరవ సత్కారాలనంతరం గౌరవనీయ మిస్ సురభి గోయల్ గారు తమ సందేశంలో, ఇటువంటి కార్యక్రమం ద్వారా భారతీయ పౌరులని ఒక తాటి పై తేవడం మరియు దేశ రక్షకుల గురించి అవగాహన కల్పించడాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ తరం వారికి చక్కటి సందేశాన్ని అందించే కార్యక్రమ స్ఫూర్తిని అభినందించారు. ప్రతి యేటా తన టాక్ షో అతిదులైన సైనికుల సందేశాన్ని హాంగ్ కాంగ్ ప్రేక్షకులకి చూపిస్తారు, అలా ఈ సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్ లో కార్గిల్ వెటరన్ కెప్టెన్ అఖిలేష్ సక్సేనా గారి కార్గిల్ యుద్ధంలో వారి స్వీయ అనుభవాలని తెలియజేస్తూ సందేశాన్ని అందించారు .అనంతరం పిల్లలు,పెద్దలు మరియు విశేషంగా జాలీ గుడ్ మైత్రివన్ క్లబ్ యొక్క సీనియర్ సిటిజన్లు దేశభక్తి గీతాలు మరియు నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిత్రలేఖనం పోటీలో పాల్గొన్నవారందరికీ కషునుట్జ్ ఆర్ట్ స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ మిస్ కశ్మీరా మెహతా దోషి బహుమతులు అందజేశారు. హిందీ కవిత / గీత రచన పోటీ విజేతలకు మరియు జడ్జెస్ కి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, పోటీల విజేతలకు సర్టిఫికెట్లు మరియు బహుమతులను గౌరవనీయ మిస్ సురభి గారు అందజేశారు.వందన సమర్పణలో రేడియో వ్యాఖ్యాత జయ గౌరవప్రదమైన హాజరుతో మరియు వారి వివేకవంతమైన మాటలతో అందరికి స్ఫూర్తినిచ్చినందుకు యాక్టింగ్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సుర్భి గోయల్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గూర్ఖా రెజిమెంట్ నుండి వచ్చిన ధైర్యవంతులైన విశ్రాంత సైనిక అనుభవజ్ఞులకు ప్రత్యేక వందనాలందించారు. లీజుర్ అండ్ కల్చరల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ట, టచ్ సెంటర్ కి , జడ్జెస్ కి, కార్యక్రమ స్వచ్చంద సేవకులకు, నిర్వాహకులు శ్రీ పరేష్ న్యాతికి, పాల్గొన్న వారికి మరియు విచ్చేసిన వారికి కృతజ్ఞత వ్యక్తం చేశారు. అనంతరం అందరు జాతీయ గీతాన్ని ఆలపించి మళ్ళి వచ్చే సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్' పదవ వార్షికోత్సవం ఇంతకన్నా ఘనంగా చేద్దామంటూ వీడ్కోలు చెప్పారు. టోరీ 'జై హింద్' కార్యక్రమ వివరాలకు ఈ లింక్ ను అనుసరించగలరు : https://whatsapp.com/channel/0029VaBqh4rCxoAmoITb0w0V -
నిమిష ప్రియ మరణశిక్ష రద్దు కాలేదు: కేంద్రం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో మరణశిక్ష రద్దు అయ్యిందన్న కథనాలను కేంద్ర విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆమె మరణశిక్ష రద్దు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. తన సహచర భాగస్వామిని హత్య చేసిన అభియోగాల మీద ఆమెకు ఈ శిక్ష పడిన సంగతి తెలిసిందే.కేరళకు చెందిన ప్రముఖ మత గురువు, సున్నీ నేత కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాయలం నుంచి ఆమెకు మరణశిక్ష తప్పిందనే ప్రకటన వెలువడింది. యెమెన్ రాజధాని సనాలోని ఓ జైలులో ఖైదీకి ఉన్న నిమిషకు.. హౌతీ మిలిటరీ ప్రభుత్వం నుంచి ఊరట లభించిందని తెలిపింది. అయితే ఆ ప్రకటనపై ఎలాంటి అధికారిక సమాచారం లేదంటూ కేంద్రం కాసేపటి కిందట స్పష్టత ఇచ్చింది. నిమిష ప్రియ కేసులో వ్యక్తిగతంగా చేసే ప్రకటనలతో సంబంధం లేదని.. అక్కడి అధికారులు ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ప్రముఖ వెబ్సైట్ హిందూ ఓ కథనం ఇచ్చింది.#Government denies claim of #NimishaPriya's #deathpenalty being revoked: Sources https://t.co/sNMZ3AhC9S #WeRIndia pic.twitter.com/PszX95Kbz1— Werindia (@werindia) July 29, 2025సనాలో అత్యున్నత సమావేశం తర్వాత.. సోమవారం అర్ధరాత్రి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం మరణశిక్ష రద్దు అంటూ ప్రకటన చేసింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు.అబుబాకర్ ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ కేంద్రం ఇప్పుడు ఆ ప్రకటనను తోసిపుచ్చడం గమనార్హం. మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరమే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ పలుమార్లు కోరడంతో జులై 16న అమలు కావాల్సిన మరణశిక్షను వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను ఫలించి.. మరణశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. -
అమెరికాలో శానోజె నగరంలో అద్భుత శివపదం కార్యక్రమం
అమెరికాలో శానోజె నగరంలో అద్భుత శివపదం కార్యక్రమం జూలై 26న ఘనంగా జరిగింది. శివపదం రచయితసామవేదం షణ్ముఖ శర్మ సమక్షంలో వాణి గుండ్లాపల్లి నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమానికి 900 మంది హాజరయ్యారు. ఈ శక్తి ఆ గీతాల్లో ఉందా, భారతీయ నృత్య రీతుల్లో భక్తి తత్త్వం ఉప్పొంగేలా అభినయించిన ఆ కళాకారుల్లో ఉందా అన్నంత సంశయాత్మక సమ్మోహనాన్ని కలిగించాయి దాదాపు 40 మంది కళాకారులు పాల్గొన్నారు.సామవేదం షణ్ముఖ శర్మ కాలిఫోర్నియాలోని బే ఏరియాలో అయిదురోజులపాటు (జూలై 22-26) జ్ఞానయజ్ఞంగా నిర్వహించిన 'శివ మహిమామృతం 'ప్రవచనోత్సవాలకు పూర్ణాహుతి ఇదే అన్నంత నేత్రపర్వంగా ఆయన రచించిన శివపదాలను వివిధ భారతీయ నృత్య రీతుల్లో అమెరికాలోని కళాకారులు శివ విష్ణు దేవాలయ ప్రాంగణంలోని లకిరెడ్డి ఆడిటోరియంలో ప్రదర్శించారు. మోహినీయాట్టంలో బాలా త్రిపుర సుందరి శక్తివర్ణన, కూచిపూడిలో నదీ రూపంతో - పరబ్రహ్మ స్వరూపమైన సాగరంలోకి - ఒంపుసొంపులతో సరస్వతి ప్రయాణం, మైసూర్ భరతనాట్యంలో శివకామ సుందరిగా అమ్మవారి మూర్తి-శక్తి వర్ణన, ఒడిస్సీలో 'వారాహీ రక్షతు మాం ' అంటూ వారాహి రూపంలో అమ్మవారి ఆరాధన, కథక్ లో కాళీమాత శక్తి స్వరూప పరమార్థం, మోహినీయాట్టం + భరతనాట్యంలో 'శ్రీగజలక్ష్మి చింతయామ్యహం ', భరతనాట్యంలో 'నీ కాలిగోటి రాకా సుధాంశువులు ' అంటూ అమ్మవారి శక్తివర్ణన, భరతనాట్యంలో 'అగజాధరమున నగవులవే, సిగపై వెన్నెల చిన్నబోయెరా..' అంటూ అమ్మవారి చిరునవ్వుల కాంతి వర్ణన .., ఇంకా శివ శివాని ఛిద్రస రూపా, పాయసాన్న ప్రదాత కాశీ అన్నపూర్ణ, ఆది పరాశక్తి తత్త్వం తదితర నృత్య రూపాల్లో ప్రతి ఒక్కటీ - నేపథ్యంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మల్లాది సూరిబాబు వంటి గాయకుల గాత్రంతో - ప్రేక్షకుల్ని భక్తి తన్మయుల్ని చేశాయి. ముఖ్యంగా 'అమ్మా వాణి అక్షర వాణి...' అంటూ మనస్విని (రెండు రోజుల వ్యవధిలో సాధన చేసిన) అణువణువునా భక్తి భావన పలికించే అభినయంతో, ముద్రలతో, మెరుపు వేగంతో చేసిన నృత్యం ప్రేక్షకుల్ని ఎంత మంత్రముగ్ధుల్ని చేసిందంటే, ఒక్కసారిగా అందరూ లేచి నిలబడి కరతాళధ్వనులతో (Standingg Ovation) హర్షం వ్యక్తం చేశారు. "సరస్వతి దేవిని ఇక్కడ మనస్విని సాక్షాత్కరింపజేసింది " అని షణ్ముఖ శర్మ ప్రశంసించారు.ఒడిస్సి + భరతనాట్యంలో కళాకారుల బృందం 'శివుడు ధరించిన మాతృరూపమిది..' అంటూ నయనాందకరంగా ప్రదర్శించిన శివ-శక్తి రూపాల వర్ణన కూడా ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేసింది. మిల్పిటాస్ నగర మేయర్ కార్మెన్ మొంటానో భారతీయ నృత్య రీతులను ప్రశంసించారు. షణ్ముఖ శర్మ నిర్వాహకులకు మల్లాది రఘు బృందాన్ని, శివవిష్ణు ఆలయ కమిటీని అభినందించారు. ముఖ్యంగా వేయికి పైగా శివపదాల్లోంచి ఎంపిక చేసిన వాటికి వాణి గుండ్లాపల్లి 12 దేశాల్లో ఇలా భారతీయ నృత్య రీతుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తూండాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడు పారిస్ నగరంలోకూడా వాణి ప్రదర్శన ఇవ్వబోతున్నారని ప్రకటించారు. -
మరో భారత సంతతి వ్యక్తిపై అమానుషం : చేయి తెగి వేలాడింది, కానీ
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని భారతసంతతికి చెందిన వ్యక్తిపై దుండగులు దాడి చేశాడు. సౌరభ్ ఆనంద్ (33) మందులు కొనుగోలు చేసి ఫార్మసీ నుండి ఇంటికి వెళుతుండగా, ఐదుగురు యువకులు కత్తితో దారుణంగా దాడి చేశారు. దీంతో అతనుతీవ్రంగా గాయపడ్డాడు.మెల్బోర్న్లో ఈ నెల(జూలై) 19న ఘటన చోటు చేసుకుంది. దీంతో భారతీయులపై వరుస జాత్యహంకార దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది.జూలై 19న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆల్టోనా మెడోస్‌లోని సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్లోని మందుల దుకాణంలో సౌరభ్ మందులు తీసుకున్నాడు. తన స్నేహితుడితో కాల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఐదుగురు యువకులు అతన్ని చుట్టుముట్టి, చితకబాదారు. మరొకరు అతని తలపై నేలపై పడే వరకు కొట్టారు. మూడవ యువకుడు ఒక కత్తితో గొంతుకు పట్టుకుని దాడిచేయబోతే వెంటనే తన చేతిని రక్షణ కోసం పైకి లేపాడు. దీంతో అతని ఎడమ చేయి దాదాపు వేరుపడి పోయింది. ఒక చిన్న నూలుపోగు లాంటి నరం సాయంతా వేలాడుతూ ఉండింది. అతని భుజంపై, వీపుపై కూడా పొడిచారు. దీంతో వెన్నెముక విరిగింది ఇతర ఎముకలు కూడా విరిగిపోయాయి. తనను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, కత్తి నా మణికట్టుపై వేటు పడింది. రెండో కత్తిపోటు మరో చేతితి గుండా పోయింది. మూడవ దాడి ఎముక గుండా పోయిందనీ, నొప్పి మాత్రమే గుర్తుంది, నా చేయి దాదాపు వేరుపడిన స్థితిలో ఉంది అంటూ బాధితుడు ఆస్ట్రేలియన్ మీడియాతో తెలిపాడు. చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదనతీవ్రగాయాలతో రక్తపు మడుగులతో పడి వున్న సౌరభ్ షాపింగ్ సెంటర్ బయటకొచ్చి సహాయాన్ని అర్థించాడు. దీంతో అతడిని సమీపంలోని రాయల్ మెల్బోర్న్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మొదట అతని చేతిని తీసివేయాల్సి వస్తుందని భావించారు. కానీ అదృష్టవశాత్తూ చేతిని తిరిగి అటాచ్ చేయగలిగారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురు యువకులలో నలుగురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. కాగా గత వారం ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. కారు పార్కింగ్ వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే భారతీయుడిపై దారుణంగా దాడి చేసి, జాతిపరంగా దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ స్ఫూర్తిని చాటుతూ అమెరికాలో కొత్త చాప్టర్లు ప్రారంభించిన జీటీఏ
న్యూజెర్సీ/న్యూయార్క్: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను 43 దేశాల్లో ఘనంగా చాటుతున్న తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ (GTA) మరో కీలక ముందడుగు వేసింది. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో జీటీఏ చాప్టర్లను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. జూలై నెలలో న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్సిప్పనీ మేయర్ జేమ్స్ ఆర్ బార్బెరియో ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జీటీఏ ఫౌండర్స్ అలుమల మల్లారెడ్డి (ఇండియా ఛైర్మన్), విశ్వేశ్వర్ రెడ్డి (అమెరికా ఛైర్మన్) అతిథులను ఆత్మీయంగా సత్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో ఆహ్లాదంగా సాగిన ఈవెంట్లో కపిడి శ్రీనివాస్ రెడ్డి జీటీఏ న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "జీటీఏలో భాగమవడం ఒక గౌరవం. అమెరికాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా జీటీఏ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తాను" అని హామీ ఇచ్చారు.ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో ప్రముఖులు టీటీఏ అమెరికా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, యూఎస్ జీటీఏ ప్రెసిడెంట్ బాపు రెడ్డి, చార్లెస్ చాప్టర్ డైరెక్టర్ మన్మోహన్, న్యూజెర్సీ ఐకా ప్రతినిధులు మహేందర్ రెడ్డి ముసుగు, పృథ్వీ రెడ్డి, వాషింగ్టన్ డీసీ ప్రెసిడెంట్ తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ అలుమల మల్లారెడ్డి మాట్లాడుతూ.. “జీటీఏ మూడేళ్ల క్రితం ప్రారంభమై అప్పుడే 43 దేశాలకు విస్తరించింది. డిసెంబర్లో విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మా టీం అందరి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కన్వెన్షన్ ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క తెలంగాణ ఎన్నారై తమ సొంత గ్రామానికి కనెక్ట్ చేసే విధంగా జీటీఏ సంస్థ ప్రయత్నిస్తుంది. సొంత గ్రామానికి, ప్రాంతానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలి. రాజకీయాలను సైతం మార్చే శక్తిగా మారాలి. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఎన్నారైల పిల్లలు కూడా పాటించడం, సొంత గ్రామానికి నాయకులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, మన యువతకు మద్దతుగా నిలవడం వంట కార్యక్రమాలు చేపడతాం.” అని తెలిపారు. జీటీఏ ఫౌండర్, అమెరికా ఛైర్మన్ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ ఎన్నారైలందరిని ఒకే వేదికపైకి తీసుకు వచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ప్రారంభించాము. మూడేళ్లలోనే జీటీఏ 43 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్య, వైద్యం, ఉపాధి, సాంస్కృతిక రంగాల్లో ఒక చోటికి తీసుకు వస్తోంది జీటీఏ..” అని చెప్పారు.టీటీఏ అమెరికా అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, “జీటీఏతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిసెంబర్ 10న అమెరికాలో, డిసెంబర్ 25న హైదరాబాద్‌లో టీటీఏ దశాబ్దోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అలాగే వచ్చే జూలైలో చార్లెస్‌లో జీటీఏ కన్వెన్షన్ ఉంటుందని, అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం” అన్నారు.జీటీఏ కో ఫౌండర్ శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ, “న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ల ప్రారంభం ఒక మంచి మైలురాయిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలకు ఒక సమర్థవంతమైన వేదికగా జీటీఏ నిలుస్తోంది. సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తాం” అన్నారు.జీటీఏ: ఒక ఉద్యమం – ఒక వ్యవస్థజీటీఏ ప్రారంభమైన మూడేళ్లలోనే 43కి పైగా దేశాల్లో విస్తరించింది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, సాంస్కృతిక అభివృద్ధి, తెలంగాణ గ్రామీణ అభివృద్ధి వంటి అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణ పౌరుడి గొంతును ప్రపంచమంతా వినిపించాలనే సంకల్పంతో జీటీఏ ఫౌండర్స్ విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. "జీటీఏ పేరు కాదు – ఇది ఒక సామాజిక శక్తి, ఒక సేవా వ్యవస్థ" అని నిర్వాహకులు గర్వంగా చెబుతున్నారు. ప్రపంచంలోని అన్ని రాష్ట్రాలలోనూ జీటీఏ కార్యకలాపాలు విస్తరించడం లక్ష్యంగా జీటీఏ బృందం ముందుకు సాగుతోంది. -
ఎవరీ లండన్ చాయ్‌వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్‌లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్‌లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్‌వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్‌వాలా. అది కుడా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్‌లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్‌ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "చెకర్స్‌లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్‌పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్‌లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్‌ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్‌ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్‌కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్‌లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్‌లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్‌కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్. -
థాయ్-కంబోడియా ఘర్షణలు.. భారతీయులకు అడ్వైజరీ
థాయ్‌లాండ్, కంబోడియా దేశాలు సరిహద్దు వివాదంతో పరస్పర దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం.. తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం అడ్వైజరీ జారీ అయ్యింది.భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌ల వైపు ప్రయాణం చేయొద్దని శుక్రవారం థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సూచింది. అంతేకాదు మార్గదర్శకాల కోసం థాయ్ అధికారుల సహకారం కోరవచ్చని అందులో స్పష్టం చేసింది. ట్రాట్, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కవావో, ఛంథాబురి, ఉవోన్ రట్చథాని..ప్రావిన్స్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.In view of the situation near Thailand-Cambodia border, all Indian travelers to Thailand are advised to check updates from Thai official sources, including TAT Newsroom.As per Tourism Authority of Thailand places mentioned in the following link are not recommended for… https://t.co/ToeHLSQUYi— India in Thailand (@IndiainThailand) July 25, 2025ఇదిలా ఉంటే.. మరోవైపు థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని పుమ్తోమ్ వెచయాచై కూడా ఆయా ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్ని దశాబ్దాలుగా థాయ్‌లాండ్ – కాంబోడియా మధ్య నడుస్తున్న వివాదం.. తాజాగా తీవ్రరూపం దాల్చింది.Ta Muen, Ta Moan Thom దేవాలయాలు తమవంటే తమవని ఇరు దేశాలు కొన్ని దశాబ్దాలుగా వాదించుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. థాయ్‌లాండ్ నుంచి అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. మే నెలలో కంబోడియాకు చెందిన సైనికుడ్ని థాయ్ సైన్యం కాల్చి చంపింది. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దులో వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్ ప్రధాని షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో రాయబారం చేయబోయారు. ఆ సమయంలో ‘అంకుల్’ అని సంబోధిస్తూ మాట్లాడిన ఫోన్‌కాల్ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్ సైన్యం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశంపై అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం విచారణకు ఆదేశించడంతో పాటు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 3న పుమ్తోమ్ వెచయాచై థాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.జూలై 23, 2025న ల్యాండ్‌మైన్ పేలడంతో థాయ్‌లాండ్‌కు చెందిన ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ప్రతిగా.. థాయ్‌లాండ్ F-16 యుద్ధ విమానాలతో కాంబోడియా లక్ష్యాలపై బాంబుల దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరు దేశాల రాయబారులను ఉపసంహరించుకున్నారు.గురువారం నాటి ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన 14 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ సంక్షోభంతో సరిహద్దులో ఉంటున్న వేలమంది తమ తమ దేశాలకు పారిపోయారు. శుక్రవారం సైతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. థాయ్‌లాండ్ కంబోడియన్ సరిహద్దులో వైమానిక దాడులు చేస్తోంది. -
ఇందుగలరందులేరను...భారతీయుల సంఖ్యలో టాప్ 10 దేశాలు ఇవే
ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఉంది. అది టొరంటోలోని ఓ మూలగా ఉన్న కిరాణా దుకాణంలో కనిపిస్తుంది, బెర్లిన్ లోని ఒక టెక్ సంస్థకు గుండెకాయగా మారుతుంది. సందడిగా ఉండే దుబాయ్ మెట్రోలో లేదా న్యూయార్క్ టైమ్స్ బైలైన్ లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే..భారతీయ పౌరులు నివసించాలని నిర్ణయించుకునే దేశంలో సులభంగా కలిసిపోతారు.నేడు, గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జన్మస్థలం వెలుపల నివసిస్తున్నారు. ప్రపంచంలోని 281 మిలియన్ల అంతర్జాతీయ వలసదారులలో, భారతీయులు అతిపెద్ద సింగిల్ గ్రూపుగా ఏర్పడ్డారు, దాదాపు 18 మిలియన్ల మంది భారతదేశంలో జన్మించి ఇప్పుడు వేరే చోట నివసిస్తున్నారని తాజా వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన వారిని కూడా చేరిస్తే ఆ సంఖ్య 35 మిలియన్లకు పైగా ఉంటుంది.అగ్రరాజ్యం...అగ్రస్థానంలో..టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ రంగాలలో విపరీతమైన అవకాశాల కారణంగా దాదాపు 5.4 మిలియన్లకు పైగా భారతీయులతో, మనవాళ్లను ఆకర్షించడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇంకా, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు నైపుణ్యం కలిగిన నిపుణులకు అనుకూలంగా ఉండే పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలు కూడా దీనికి దోహదం చేశాయి. ఎడిసన్ (ఎన్జె), జాక్సన్ హైట్స్ (ఎన్వై), ఆర్టీసియా (సిఎ) వంటి ప్రాంతాలను తరచుగా ‘లిటిల్ ఇండియాస్‘ అని పిలుస్తారు ఇవి వందలాది భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు సాంస్కృతిక కేంద్రాలతో నిండి ఉంటాయి.70 శాతం శ్రామిక శక్తి మనదే..3.57 మిలియన్ల మంది భారతీయులతో యుఎఇ రెండో అతిపెద్ద భారతీయ నివాస దేశం. నిర్మాణం, ఆతిథ్యం,ఆర్థిక రంగాలలో పన్ను రహిత జీతాలు బ్లూ, వైట్ కాలర్ కార్మికులను ఆకర్షిస్తాయి; దుబాయ్ శ్రామిక శక్తిలో 70 శాతానికి పైగా భారతీయులే కావడం గమనార్హం.మేలు కలయిక...మలేషియానేడు, మన దేశస్థులు మలేషియా మొత్తం జనాభాలో 9% మంది భారతీయులే ఉన్నారు. దాదాపుగా 2.75మిలయన్ల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారని అంచనా. తమిళం, మళయాళం, తెలుగు, పంజాబీ భాషలు మాట్లేడేవారు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరే కాకుండా ఇండియన్ ఎక్స్‌పాట్స్ (అక్కడ స్థిరపడనివారు) సైతం 2.25లక్షల మంది వరకూ ఉంటారని అంచనా. ఇండియన్స్ కేరాఫ్...కెనడాకెనడాలో దాదాపు 2.88 మిలియన్ల భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారు. టొరంటో (700,000 కంటే ఎక్కువ మంది భారతీయులు) వాంకోవర్ వంటి ప్రధాన కేంద్రాలు పంజాబీ మార్కెట్లు, గురుద్వారాలు బాలీవుడ్ చలనచిత్రోత్సవాలను సైతం ఇక్కడ నిర్వహిస్తు న్నారు.3వేల వ్యాపారాలు మనవే...సౌదీ అరేబియాసౌదీ అరేబియాలో దాదాపు 2.46 మిలియన్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు, ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2023–24లో ఈ సంఖ్య 200,000 పెరిగింది, ఇది నిర్మాణం, మౌలిక సదుపాయాలు సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో డిమాండ్‌లో పదునైన పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, భారతీయ వ్యాపారాల ఉనికి విస్తరించింది, ఇప్పుడు 3,000 కంటే ఎక్కువ నమోదిత భారతీయ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి, ఇది రెండు దేశాల మధ్య లోతైన ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.స్టడీస్‌కి స్టార్ డమ్...యునైటెడ్ కింగ్ డమ్భారతీయ సంతతికి చెందిన 1.86 మిలియన్ల మందికి నిలయంగా ఉన్న యుకె 40 శాతం కంటే ఎక్కువ మంది లండన్ బారోగ్స్, లీసెస్టర్ బర్మింగ్హామ్లలో నివసిస్తున్నారు, చిన్నపాటి వ్యాపారాలు ఫైనాన్స్, వైద్య రంగాలలో ఉన్న నిపుణులు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఆజ్యం పోస్తున్నారు. భారతీయ విద్యార్థులు (సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ మంది) టైర్ 4 వీసాలపై అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు హాజరవుతారు.మన వ్యాపార ఆధిపత్యం దక్షిణాఫ్రికాదక్షిణాఫ్రికాలో దాదాపు 1.7 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా 19వ శతాబ్దపు నాటల్ చెరకు తోటలకు తీసుకువచ్చిన ఒప్పంద కార్మికుల వారసులు. ఆధునిక వలసదారులలో ఇంగ్లీష్ మీడియం విద్య కేప్ టౌన్‌లోని అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ కేంద్రాల ద్వారా ఆకర్షించబడిన వైద్యులు ఐటీ నిపుణులు ఉన్నారు. డర్బన్ లోని స్థానిక రిటైల్ బిజినెస్‌లో భారతీయ యాజమాన్యంలోని వ్యాపారాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, అయితే తమిళ గుజరాతీ భాషా విద్య కోసం వార్షిక బడ్జెట్లు 10 మిలియన్లకు మించింది.ఉమ్మడి చరిత్రతో...శ్రీలంకశ్రీలంక లో 1.61 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు ఇది టీ, పర్యాటక ఐటీ రంగాలలో ఆధునిక కాంట్రాక్ట్ ఉద్యోగులను మిళితం చేస్తుంది. ఉమ్మడి తమిళ సింహళ సాంస్కృతిక చరిత్ర కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి సజావుగా మారడానికి సహాయపడుతుంది. మరోవైపు, కొలంబోలో అభివృద్ధి చెందుతున్న ఫైనాన్స్ జోన్ భారతీయ ఫిన్‌టెక్ నిపుణులను ఆకర్షిస్తుంది.జనాభాలో 20శాతం.. కువైట్కువైట్లో దాదాపు 995,000 మంది భారతీయులు ఉన్నారు. అంటే దాని జనాభాలో 20 శాతానికి పైగా మనమే ఉన్నాం అన్నమాట. మనవాళ్లలో అత్యధికులు అక్కడ చమురు క్షేత్రాలు, నిర్మాణం, ఆసుపత్రులు గృహ రంగాలలో పనిచేస్తున్నారు.దీపావళికి ‘దియా’...ఆస్ట్రేలియాఆస్ట్రేలియాలో 976,000 మంది భారతీయులు ఉన్నారు. అర్హతలు ఆంగ్ల నైపుణ్యానికి విలువనిచ్చే పాయింట్ల ఆధారిత నైపుణ్య వలస కార్యక్రమం కింద ఇక్కడ వీరు అభివృద్ధి చెందుతున్నారు. ఏటా 120,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ ఐటీలలో చేరుతున్నారు, ట్యూషన్ ఫీజుగా 5 బిలియన్లను అందిస్తున్నారు. మెల్బోర్న్ సిడ్నీ వంటి నగరాల్లో భారతీయ వాణిజ్య మండలులు, యోగా స్టూడియోలు కనిపిస్తాయి. ఇక దీవాళి స్ట్రీట్ ఫెయిర్స్ సైతం అక్కడ .చురుకుగా జరుగుతున్నాయి. -
భారతీయులకు ఉద్యోగాలు ఆపండి
న్యూయార్క్/వాషింగ్టన్: విపరీతమైన వీసా ఆంక్షలు అమలుచేస్తూ, సోషల్‌మీడియా ఖాతాలను జల్లెడపడుతూ వీలైనంతవరకు భారతీయులను అమెరికా గడ్డపై కాలుమోపకుండా అడ్డు తగులుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు నేరుగా అక్కడి కంపెనీలకే ఆదేశాలు ఇచ్చేందుకు తెగించారు. చట్టబద్ధంగా, అత్యంత నైపుణ్యముండి వీసాలతో అమెరికాకొస్తున్న భారతీయులను కాదని, అమెరికన్లకే కొలువుల్లో పట్టంకట్టాలని ట్రంప్ అక్కడి టెక్ దిగ్గజ సంస్థలకు హితవు పలికారు. బుధవారం వాషింగ్టన్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలనుద్దేశిస్తూ సూటిగా సూచనలు ఇచ్చారు. ‘‘ వేర్పాటు వాదంలాంటి ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) భావాజలంలో మన అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు కొట్టుకుపోతున్నాయి. గ్లోబలైజేషన్ కోసం పరితపిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలన్నీ కోట్లాది మంది అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయి కృతçఘ్నులుగా తయారవుతున్నాయి. మీరు తోటి అమెరికన్ల పట్ల తీవ్ర నిర్లక్ష ధోరణిని కనబరుస్తున్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇక్కడి కంపెనీలు చైనాలో భారీ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాయి. భారత్ నుంచి తక్కువ జీతభత్యాలకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఐర్లాండ్‌లో నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ఇక్కడ లాభాలను తక్కువచేసి చూపిస్తూ పన్నుల భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇవన్నీ చేస్తూ మీ తోటి అమెరికన్పౌరుల ఉద్యోగ హక్కులను కాలరాస్తున్నారు. ఇక నా హయాంలో మీ ఆటలు సాగవు. అమెరికా టెక్నాలజీ సంస్థలన్నీ మన దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. ఫ్యాక్టరీల కల్ప నలో, ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం దక్కాలి. ఇకనైనా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపండి. అమెరికన్లకు ఉపాధి కల్పించండి. మిమ్మల్ని నేను అడిగేది ఇదొక్కటే. ఈ పని మీరు ఖచ్చితంగా చేస్తారనే భావిస్తున్నా’’ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.#WATCH | Trump promises to bring tech jobs back home, slamming US firms for outsourcing to China and hiring Indian workers abroad.#DonaldTrump #UnitedStates #China #India pic.twitter.com/p2KLKkDqj9— News18 (@CNNnews18) July 24, 2025 ట్రంప్ వ్యాఖ్యలు.. భారతదేశంపై ప్రభావంట్రంప్ వ్యాఖ్యలు అమెరికా-భారత టెక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇండియన్ IT ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ రంగం పై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.“No more Indian workers” అని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు.Apple, Google, Tesla వంటి కంపెనీలు భారతదేశం లో ఉద్యోగాలు ఇవ్వడం పై 25% టారిఫ్ విధించవచ్చని హెచ్చరిక జారీ చేశారు. -
''నెల నెలా తెలుగువెన్నెల'' 18వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెల నెలా తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం 2025 జూలై నెల 19 వ తేదీన డాలస్‌లోని ఇన్నోవేషన్ హబ్ మీటింగ్ హాల్లో ఘనంగా జరిగింది. తొలుత చిరంజీవి సమన్విత మాడా త్యాగరాజ కీర్తన''మనవ్యాలకించరాదటే' ప్రార్ధన గీతంతో సదస్సును ప్రారంభం కాగా, తరువాత ప్రముఖ కవి కీ శే వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సంస్థ ప్రత్యేక గీతం ''నెల నెలా -తెలుగు వెన్నెలా ''ని ప్రముఖ గాయని శివాత్మిక ఆలపించారు. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు. గత రెండేళ్లుగి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాని కలిగించిందన్నారు. ముఖ్య అతిథి సంస్కృతాంధ్ర ద్విశతావధాని పాలడుగు శ్రీచరణ్ గారిని సాహితీ ప్రియులకు పరిచయం చేశారు. సాఫ్ట్వేర్ రంగం లో ఉద్యోగం చేస్తూ గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో నివాసం ఉంటున్న వీరు, ఇప్పటిదాకా 36 అష్టావధానాలు, 2 శతావధానాలు, ఒక ద్విశతావధానము చేసారు. ఈ రోజు విశిష్టమయిన సంస్కృతాంధ్ర ఏకాదశావధానం చేయబోతున్నారు.కార్యక్రమానికి సంధాతగా తొలి తెలుగు అమెరికా అవధాని ఆచార్య పుదూరు జగదీశ్వరన్ గారు వ్యవహరించి అవధాన ప్రక్రియ ని సభకు పరిచయం చేసి కార్యక్రమం ఆరంభించారు.అటు సంస్కృతం, ఇటు తెలుగు పూరణలతో, సమయోచిత సందర్భ సహిత వివరణలతో, చతురోక్తులతో ఆద్యంతం అవధాని గారు ఆహుతులను అలరించారు.పృచ్చకులుగా నిషిద్ధాక్షరి- జంద్యాల జయకృష్ణ బాపూజీ, సమస్య- ఉపద్రష్ట సత్యం, దత్తపది-చంద్రహాస్ మద్దుకూరి, వర్ణన-డా.గుర్రం మైథిలి, న్యస్తాక్షరి-సిద్దా శ్రీధర్,అప్రస్తుత ప్రసంగము-మాడాదయాకర్, పురాణము-వేముల లెనిన్, ఆశువు-పాలూరి సుజన,సంస్కృతము దత్తపది-నేమాని రాజశేఖర్, సమస్య-పేరి భార్గవి,వర్ణన-రామడుగు నరసింహాచార్యులు వ్యవహరించారు. 'కృత్స్న జ్యోత్స్నల వీడి చెప్పగదవే హృత్స్నేహమేపారగన్' అంటూ క్లిష్టమైన ప్రాసలతో కూడిన సమస్యను వారు పూరించిన తీరు, 'రసాభాసోజాతః కవికులగురోః కావ్యనిచయే' సంస్కృత సమస్యాపూరణము ఆహుతులను అలరించింది. అవధానానంతరము సభికుల కరతాళ ద్వనుల మధ్య సంస్థ అవధాని గారిని ఘనంగా సత్కరించింది.విశిష్ట అతిథులుగా విచ్చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం పొందిన పర్వ నవలానువాద అనుభూతులను పంచుకుంటూ 'అనువాద పర్వం' పై ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోని అనువర్తిత భాషాశాస్త్రం మరియు అనువాద అధ్యయనాల కేంద్రానికి నిర్దేశకుడిగా పదవీ విరమణ చేసిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు ' యంత్రానువాద వ్యవస్థల ' పై సోదాహరణముగా ప్రసంగం గావించారు. ఈ ఇరువురి ప్రధాన ప్రసంగాలు ఆహుతులని చాలా అలరించాయి. భాషకి సంబంధించిన కొత్త కోణాలని పరిచయం చేసాయి.చివరగా కాలార్చన డాక్టర్ రాళ్ల బండి కవిత ప్రసాద్ శాస్త్రీయ నృత్య రూపకం, దేవి భాగవతం ఆధారంగా చేసుకుని కాలాన్ని నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ విశిష్టమైన సాహిత్యం, శ్రవ్యమైన సంగీతంతో 40 మంది నర్తకి నర్తకులతో కనుల పండుగగా ఈ నృత్య రూపకాన్ని కళా రత్న కెవి సత్యనారాయణ నృత్య దర్శకత్వం వహించారు. డాలస్ నగరంలోని ప్రముఖ నృత్య సంస్థల నుండి నాట్య గురువులు, నాట్య కళాకారులు ఈ నృత్య రూపకంలో పాత్రను పోషించారు. అనంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ కార్యవర్గ బృందము మరియు పాలక మండలి, సంస్థ తరపున అతిథులందరికీ సన్మాన పత్ర జ్ఞాపికలు శాలువాలతో సత్కరించారు.ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి వందన సమర్పణ చేసి, సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. సభా వేదికను ఇచ్చి సహకరించిన విజయ్ బొర్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమములో సంస్థ ఉత్తరాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి,పాలక మండలి అధిపతి డా కొండా తిరుమల్ రెడ్డి, సభ్యులు డా శ్రీనాథ్ రెడ్డి పల్వల, సురేష్ మండువ, జ్యోతి వనం, కార్యవర్గ బృందం ఉదయ్ నిడిగంటి, దీప్తి సూర్యదేవర, సునీల్ సూరపరాజు, నరసింహ పోపూరి, శివారెడ్డి వల్లూరు, లెనిన్ తుళ్ళూరి సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర,శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి ,చిన్న సత్యం వీర్నాపు,చంద్ర కన్నెగంటి మరియు ప్రముఖ రచయితలు వంగూరి చిట్టెం రాజు, అత్తలూరి విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఆరోగ్యం కోసం మైక్రోసాఫ్ట్ కెరీర్‌ని వదిలేసుకున్న సీఈవో..!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కొందరు ప్రముఖులు. అందుకోసం అత్యున్నతమైన కెరీర్‌ని కూడా వదిలేస్తున్నారు. ఆ కోవకు చెందని వారే భారత సంతతికి చెందిన ఈ సీఈవో. ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చి మంచి కెరీర్‌కి స్వస్తి పలికిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారాయన. ఎందుకిలా అంటే..అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన సీఈఓ సుధీర్ కోనేరు ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. ఆరోగ్యవంతంగా జీవించాలని మైక్రోసాఫ్ట్‌లో సుమారు 15 ఏళ్ల విజయవంతమైన కెరీర్‌కు స్వస్థి పలికి రిటైరయ్యారు. ప్రస్తుతం ఆయన సియాటిల్‌కు చెందిన జెనోటీ అనే కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇది సెలూన్లు, స్పాలు, ఫిట్నెస్ కేంద్రాలకు మంచి వ్యాపార సాఫ్ట్‌వేర్‌ని అందిస్తుందట. అంతేగాదు 56 ఏళ్ల సుధీర్ మంచి ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరీ బెంగళూరు బ్రీతింగ్ వర్క్‌షాప్‌లకు హాజరవుతారట. అందుకోసం సుమారు రూ. 1లక్ష నుంచి 1.6 లక్షలు ఖర్చు చేస్తారు. కేవలం నాలుగు రోజుల ఈ బ్రితింగ్ వర్క్‌షాప్‌లకు ఆయన ప్రతి ఏడాది రూ. 3.5 లక్షల వరకు ఖర్చు చేస్తారట. ఈ సెషన్లలో ఆధ్యాత్మిక శ్వాస పద్ధతులకు సంబంధించి రెండు గంటల గైడ్‌లైన్స్, ధ్యానాలు ఉంటాయట. వాటిని సుధీర్ శరీరాన్ని అద్భుతంగా నయం చేసేవి, చాలా శక్తిమంతమైనవిగా పేర్కొంటారాయన.మైక్రోసాఫ్ట్‌లో సుధీర్ ప్రస్థానం..సుధీర్ 1992లో మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి..జస్ట్ ఎనిమిదేళ్లకే 2000లో తన సొంత కంపెనీ ఇంటెలిప్రెప్ను ప్రారంభించారాయన. సరిగ్గా 2008లో అంటే 39 ఏళ్ల వయసులో కెరీర్ మంచి పీక్ పొజిషన్లో ఉండగా యోగా, వాకింగ్, జాగింగ్ వంటి ఫిట్నెస్ కోసం కంపెనీని విడిచిపెట్టారు. తాను ఆర్థికంగా ఉన్నత స్థితిలోఉన్నా..కానీ ప్రస్తుత లక్ష్యం కేవలం తన వ్యక్తిగత శ్రేయస్సు తోపాటు కుటుంబంతో బలమైన బంధాలు ఏర్పరుచుకోవడమేనని చెబుతున్నారు సుధీర్. వర్క్ పరంగా తాను చాలా బెస్ట్ కానీ, కేవలం డబ్బు సంపాదించడమే కాదు..అంతకుమించి తన కోసం సమయం కేటాయించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని గ్రహించానంటాడు సుధీర్. అందుకోసమే రెండేళ్ల సుదీర్థ సెలవుల అనంతరం మైక్రోసాఫ్ట్ కంపెనీని నుంచి పదవీ విరమణ చేసి జెనోటిని స్థాపించానని తెలిపారు. తన కంపెనీ సంస్కృతిలో వెల్నెస్ సూత్రాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేగాదు తన సంస్థ పని సమయంలో యోగా, కిక్‌బాక్సింగ్, పైలేట్స్, వంటి ఫిట్నెస్ తరగతులను నిర్వహిస్తుంది. ఉద్యోగులు వీటిలో పాల్గొని వర్కౌట్లు చేసినట్లయితే మంచి పారితోషకం కూడా పొందుతారట. అంతేగాదు తన ఉద్యోగులకు స్పా, సెలున్లలో మంచి మసాజ్‌లు, ఆరోగ్యకరమైన స్నాక్స్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇక తన దృష్టిలో ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్‌ని కలిగి ఉండటం కాదట. సమతుల్యమైన ఆహారంతో మంచి సామర్థ్యంతో జీవించడమే తన ధ్యేయమని చెబుతున్నారు. ఇక సుధీర్ వీక్ఆఫ్లతో సహా వారం రోజులు ఉదయమే ఏడింటికే యోగా చేస్తారట. బాలికి వెళ్లి కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటారట. అక్కడ మసాజ్‌లు, సన్‌బాత్ వంటి చికిత్సలు తీసుకుంటారట. అలాగే బెంగళూరులోని నాలుగు రోజుల శ్వాస వర్క్‌షాప్‌లో కూడా పాలుపంచుకుంటారట.(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్‌కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..) -
అమెరికాలో అంగరంగ వైభవంగా బోనాల జాతర
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ సంప్రదాయ బోనాల పండగ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రేటర్ న్యూయార్క్, న్యూజెర్సీ చుట్టుపక్కల స్థిరపడిన వందలాది తెలుగు ప్రవాస కుటుంబాలు ఒక్కచోట చేరి బోనాల జాతరను జరుపుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో జరిగిన ఈ పండగ అమెరికాలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటింది. ఇటు తెలంగాణలో ఆషాడ బోనాల సందడి మొదలుకాగానే, అటు అమెరికాలో ప్రవాసులు కూడా జాతర ఉత్సవాలకు సిద్దమయ్యారు. న్యూయార్క్‌లో స్థానిక ఐసన్ హోవర్ పార్కులో ఘనంగా బోనాల జాతర జరిగింది. ఆడపడుచులు, అమ్మాయిలు సంప్రదాయ దుస్తులతో స్వయంగా బోనాలను తయారుచేసి దేవతలకు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో మరింత అభివృద్ధి దిశగా పయనించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని ప్రార్ధించారు. తెలంగాణ జానపద కళాకారులు జంగిరెడ్డి, దండుపల్లి శ్రీనివాస్ ల ఆటపాటలు నైటా బోనాలకు మరింత ఉత్సాహాన్ని నింపాయి, వాటి ఆటపాటలతో వేడుకల ప్రాంతం దద్దరిల్లింది. అలాగే అశోక్ చింతకుంట పోతురాజు వేషం వేయగా, వీరితో పాటు ఆహుతులు అందరూ కలిసి ఆడిపాడారు. ఆటపాటలతో పాటు చిన్నారులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులు నైటా ఆధ్వర్యంలో అందించారు. అలాగే ఆహుతులందరికీ తెలంగాణ స్టయిల్లో పసందైన బోనాల విందును నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ వడ్డించింది.న్యూయార్క్ మహానగరంలో నివసిస్తూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను నిలుపుకుంటున్న తెలుగు కుటుంబాలకు నైటా అధ్యక్షురాలు వాణి ఏనుగు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో పాటు, ప్రముఖ ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి, వివిధ ఈవెంట్లను స్పాన్సర్ చేసిన సంస్థలు, వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా..
సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు విదేశీ విద్య ఆశలు కల్పించారు.. కానీ ఏళ్ల తరబడి ఫీజులు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో ఫీజు, ఇతర ఖర్చులు భరించలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. 2022లో అప్పటి సోషల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ రోనాల్డ్‌రోస్ గురుకులాల విద్యార్థులకు అత్యున్నత విద్యనందించేలా శాట్ క్యాంప్ ద్వారా శిక్షణ ఇప్పించారు. అదే ఏడాది ఇంటర్ విద్యార్థులకు శాట్ పరీక్ష నిర్వహిస్తే 20 మంది విద్యార్థులు (Students) హాజరయ్యారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు అమెరికాలోని కుడ్జ్టౌన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివేందుకు ఎంపికయ్యారు. ఈ మేరకు 2023 ఆగస్టులో ఇంజనీరింగ్ సీఎస్సీ బ్రాంచ్‌లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొక్కెరగడ్డ అనూహ్య శాంతిశ్రీరాజ్, హైదరాబాద్‌కు చెందిన పి.సృజనసింహ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జి.అక్షయ చేరారు. రెండేళ్లయినా.. విదేశీ విద్యపై ఆశతో అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురికీ ఫీజు చెల్లించలేదు. ఏటా 6 వేల డాలర్ల చొప్పున రెండేళ్లకు ఒక్కొక్కరికి 12 వేల డాలర్లను రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌గా మంజూరు చేయాల్సి ఉంది. ఏటా ఆరు వేల డాలర్ల స్కాలర్షిప్ ఇస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పడంతో.. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో విమాన టికెట్లు, ఫీజులకు అప్పులు చేసి పంపించారు. ఇప్పటికి ఒక్కొక్క విద్యార్థిపై సుమారు రూ.46 లక్షలు వెచ్చించినా.. ప్రభుత్వం నుంచి విడుదల కాక అప్పులు ఎలా తీర్చాలా? అని ఆందోళన చెందుతున్నారు.అధికారుల చుట్టూ తిరుగుతూ.. విదేశీ విద్య స్కాలర్షిప్లు (Overseas Education Scholarship) అందించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు రెండేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సచివాలయంలో ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకంటే ముందు బ్యాచ్‌కు స్కాలర్షిప్ ఇవ్వడంతో.. ఆ ఆశతోనే విదేశీ విద్య వైపు మొగ్గు చూపామని చెబుతున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో.. చదువు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. సీఎం జోక్యం చేసుకుంటేనే.. విదేశీ విద్య స్కాలర్షిప్కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జోక్యం చేసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చొరవ చూపి ఎస్సీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించినందున తమ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నారు. చదవండి: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. కటాఫ్ తగ్గింది.. పోటీ పెరిగింది -
బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్ఆర్ఐ జంట
టెక్సాస్‌లోని ప్లానోకు చెందిన భారతీయ సంతతికిచెందిన దంపతులు రియల్ ఎస్టేట్ స్కామ్‌లో 100 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలతో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. రూ. 33 కోట్ల విలువైన పెట్టుబడి స్కాం ఆరోపణలపై వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తర టెక్సాస్‌లోని ఇండియన్-అమెరికన్ సమాజంలో సిద్ధార్థ సామీముఖర్జీ , అతని భార్య సునీత ప్రముఖ వ్యక్తులుగా చలామణి అయ్యారు. రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, ఛారిటీలు ,బాలీవుడ్ తరహా ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించారు. అలా రూ.33 కోట్లకు నమ్మినవారిని ముంచేశారు. రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలు , మహమ్మారి సహాయ నిధుల దుర్వినియోగం, ఇలా పలు రకాలు ఏళ్ల తరబడి మోసపూరిత ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారనే అభియగాలు నమోదైనాయి.ఈ జంట నకిలీ కంపెనీని ఉపయోగించి, ఫేక్ సాలరీ స్లిప్పుల ద్వారా పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (PPP) రుణాన్ని పొందారని ఆరోపించారు.ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు. ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు.ఇదీ చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణంఈ జంట ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో వీరి బండారం వెలుగులోకి వచ్చింది. కనీసం 20 మంది బాధితులను గుర్తించారు. తొలుత ఈ కేసును విచారించిన డిటెక్టివ్లు ఆ తరువాత ఈ కేసును FBIకి అప్పగించారు. 100 మందికి పైగా వ్యక్తులను మోసంచేశారంటూ అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఈ జంటను అరెస్ట్‌చేశాయి. నిజానికి బాధితుల సంఖ్య 100 దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు. తన 23 ఏళ్ల సర్వీసులు ఇంతటి మోసగాడిని చూదడలేదని డిటెక్టివ్ బ్రియాన్ బ్రెన్నాన్ వ్యాఖ్యానించారు. అరెస్టు తర్వాత, సామీ , సునీతా ముఖర్జీ ఇద్దరూ 5 లక్షల డాలర్ల చొప్పున బెయిల్‌ను దాఖలు చేశారు. సామీని తరువాత యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అదుపులోకి తీసుకుంది. డబ్బును క్రిప్టోకరెన్సీ ఖాతాలుగా మార్చారా అనే విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ముంబైలో ముంబైలో కూడా సామిపై మోసానికి పాల్పడినట్టు ఆరోపలున్నాయట. విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.మరోవైపు ఈ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ముఖర్జీ దంపతులు ఈ ఏడాది మేలో అంటే అరెస్టుకు కొన్ని వారాల ముందు, ప్లానోలో ఎన్జీవీ పేరుతో విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి హేమ మాలిని, ప్లానో మేయర్ సహా ఉన్నత స్థాయి అతిథులు హాజరు కావడం గమనార్హం.చదవండి: -
లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే
పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే మహిళలపై వేధింపులకు నిదర్శనం ఈ ఘటన. కావాలనే జీతాలు పెంచకపోవడం, ప్రమోషన్లు నిరాకరించడం, జీతం ఆలస్యంగా ఇవ్వడం ఇలాంటివి సాధారణంగా కొంతమంది ఉద్యోగులెదుర్కొనే వేధింపులు. దీనికి అదనంగా మహిళలు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన వేధింపుల పర్వంపై ఇండియన్ టెకీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.10 మంది ఉద్యోగులతో కూడిన ఒక చిన్న యూరోపియన్ టెక్ కంపెనీ అది. అలాంటి కంపెనీలో భారతీయ టెక్ రిమోట్‌గా పనిచేస్తోంది. అయితే ఆమెకు వివాహితుడైన మేనేజర్ ఒక అభ్యంతరకర ప్రపోజల్ పెట్టాడు. దీన్ని ఆమె అంగీకరించలేదు. అంతే అతగాడి వేధింపులు మొదలైనాయి. బాస్ ఇన్‌డైరెక్ట్‌గా పెట్టిన ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిన తర్వాత తనను వృత్తిపరంగా లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడని రెడ్డిట్‌లో ఆరోపగించింది. చీటికి మాటికి కోపగించుకోవడం, పురుష సహోద్యోగులతో మాట్లాడుతున్నా కూడా సహించేవాడు కాదు. వృత్తిపరంగా, జీతాల జాప్యం, ఆమె చేయని తప్పులకు బహిరంగంగా మందలింపులు లాంటివి కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. తన ప్రతీ పనినీ, ప్రతీ కదలికను ప్రశ్నించడం, అవమానించడం, అతనికి పరిపాటిగా మారిపోయిందని వాపోయింది. ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాడు. గతంలో, రెండు రోజులు సెలవు అడిగినా ఇచ్చేవాడని, దీనికి తన పనితీరు, టాలెంటే కారణమని భావించాను కానీ, దాని వెనుకున్న అతని దుర్బుద్ధి ఇపుడు అర్థమవుతోందని తెలిపింది. ఇంత జరుగుతున్నా, ఈ ఉద్యోగాన్ని వదల్లేను. ఎందుకంటే..రిమోట్‌గా వర్క్ చేసుకోడానికి అవకాశం ఉంది.ఈ సమయంలో తన కుటుంబానికితన అవసరం చాలా ఉంది. కానీ ఈ వేధింపులో భరించలేనిదిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ గొప్పగా లేదు, కాబట్టి మారడం కష్టం అని ఆమె పేర్కొంది.దీనిపై నెటిజన్లు చాలా మంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ, కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం మారితేనే మంచిది. ఎందుకంటే ఎవరికి కంప్లయింట్ చేసినా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు Prevention of Sexual Harassment (POSH) కేసు పనిచేస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే HRలు కంపెనీల కోసం పనిచేస్తాయి తప్ప ఉద్యోగుల కోసం కాదు. కాబట్టి వీలైతే ఉద్యోగం మారిపోండి అని మరికొందరు సలహా ఇచ్చారు.‘‘నీ పని నువ్వు చూస్కో.. అనవసర మెసేజ్‌లు జోలికి పోకు. మరో ఉద్యోగం దొరికేవరకు జాగ్రత్తగా ఉండు’’ అని ఒకరు, ‘‘మున్ముందు పరిస్థితి మరింత టాక్సిక్‌గా మారుతుంది. మీ మెంటల్ హెల్త్‌ను కాపాడుకోండి’’ అని ఒకరు, ఇది చేదు నిజం.ఉద్యోగం మారడం ఒక్కటే ఆప్షన్ మరొకరు సూచించారు. మొత్తానికి ఆమె పోస్ట్ కార్యాలయంలో వేధింపుల గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలామంది మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని , సురక్షితమైన ఆఫీసు వాతావరణాన్ని కోరుకోవాలని సూచించారు. -
డల్లాస్‌లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంచ్
అమెరికాలోని డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. టెక్సాస్, ఫెయిర్‌వ్యూ లోని సౌత్విండ్ ఎల్ఎన్ వేదికగా ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అమెరికా, భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ AAA నుంచి రఘు వీరమల్లు , పవన్ కుమార్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా AVని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ USA కి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ అవటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. ఇక సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ నార్త్ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు. -
ఇస్కాన్ రెస్టారెంట్లోకి చికెన్ తెచ్చిన యువకుడు.. తీవ్ర విమర్శలు
ఇస్కాన్ ఆలయాలను కృష్ణ భక్తులు ఎంతో పరిత్రమైనవిగా భావిస్తారు. ఇక్కడ నిత్యం పూజలు, భజనలు జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చేవారు ఆలయంలోని వాతావరణానికి ముగ్ధులువుతుంటారు. ప్రశాంతతకు ఇస్కాన్ ఆలయం చిరునామా అని చెబుతుంటారు. అయితే తాజాగా ఒక ఇస్కాన్ ఆలయంలో ప్రశాంతతను భంగపరిచే ఉదంతం చోటుచేసుంది. అది వైరల్‌గా మారింది.లండన్‌లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక యువకుడు కేఎఫ్‌సీ చికెన్ బాక్స్‌తో ప్రాంగణంలోకి ప్రవేశించి, దానిని తినడం మొదలుపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఇదొక రెచ్చగొట్టే చర్యగా, ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా అభివర్ణించారు. వైరల్‌గా మారిన ఆ వీడియోలో గోవింద రెస్టారెంట్‌కు చికెన్ తీసుకువచ్చిన ఆ యువకుడు అక్కడి సిబ్బందితో ‘మాంసాహారం ఉందా?’ అని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ రెస్టారెంట్లో శాఖాహార వంటకాలు మాత్రమే ఉంటాయని తెలియగానే, ఆ యువకుడు కేఎఫ్‌సీ అతను కేఎఫ్‌సీ బాక్స్ నుండి చికెన్‌ను తీసి, కౌంటర్ దగ్గరే తినడం ప్రారంభిస్తాడు. SHOCKING NEWS 🚨 African-British man forcibly eats chicken at ISKCON Govinda’s restaurant in London.MAN (Enters): Only veg food here?STAFF: Yes, only vegetarian food. What would you like?Then he pulled out KFC chicken and began eating it inside 😳He even offered the… pic.twitter.com/ISWyTwwBf0— Times Algebra (@TimesAlgebraIND) July 20, 2025తరువాత అతను తన దగ్గరునున్న చికెన్‌ను అక్కడున్న అందరికీ చూపిస్తాడు. ఇంతలో అక్కడి సిబ్బంది అతనిని వారించగా, అతను వారితో వాగ్వాదానికి దిగుతాడు. దీంతో వారు సెక్యూరిటీ సాయంతో అతనిని ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పంపిస్తారు. ఇస్కాన్లోకి చికెన్ తెచ్చిన యువకునిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు అతనిపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. మరికొందరు దీనిని జాతివివక్ష చర్యగా పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేసివుంటారని ఆశిస్తున్నానని ఒక యూజర్ పేర్కొన్నారు. హిందువులు ప్రతీకారం తీర్చుకోరని భావించిన అతను ఈ పనికి పాల్పడి ఉంటాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్‌లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు. -
భారతీయులకు గుడ్ న్యూస్.. రూ.7500కే వీసా : ఎవరికి? ఎలా? ఎక్కడ?
భారతీయులకు శుభవార్త. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి ఇదొక గొప్ప అవకాశం. రూ. 7,500కే వీసా అందిస్తోంది. ఫ్రాన్స్, యుఎస్, యుకె, స్పెయిన్ కాదు, మరేంటి ఆ దేశం! ఏంటి నమ్మబుద్ధి కావడం లేదు కదా. పదండి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.వీసా దరఖాస్తు ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు, కొన్నిసార్లు అదనపు ఛార్జీలు ఇవన్నీ కలిపి కొంత ఖర్చుతో కూడుకున్నదే. వీసా ఫీజు ఎంత అనేది ఆయా దేశాలను బట్టి మారుతుంది.ప్రతి ఒక్కరూ ఒకసారి విదేశాలకు వెళ్లి అక్కడ పని చేసి మంచి డబ్బు సంపాదించాలని కలలు కంటారు. అయితే, ఖరీదైన వీసాల కారణంగా, ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు, రూ.7,500 కంటే తక్కువకే వీసాను అందించడమే కాకుండా, అక్కడ ఒక ఏడాది దాకా పని చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ దేశం పేరే జర్మనీ. రొమాంటిక్ రైన్ వ్యాలీ నుండి బవేరియాలోని అద్భుత కోటలు, గొప్ప చరిత్ర, ఉత్సాహభరితమైన నగర జీవితం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది జర్మనీ. జర్మనీ బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగాలు , అధిక జీవన నాణ్యత భారతీయులతో సహా ఈయూ యేతర నివాసితులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి, జర్మనీ ఫ్రీబెరుఫ్లర్ వీసా అని కూడా పిలిచే ఫ్రీలాన్స్ వీసాను అందిస్తోంది. ఇది వారికి ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు దేశంలో స్వతంత్రంగా( ఫ్రీలాన్సర్లుగా) పని చేయడానికి వీలు కల్పిస్తుంది. హైక్వాలిటీ లైఫ్ గడపాలనుకునే వారికి, క్రియేటివ్ ప్రొఫెషనల్స్, పర్యాటకులకు గొప్ప అవకాశం అంటూ ఊరిస్తోంది. ఎవరు అర్హులుభారతదేశంలోని జర్మన్ మిషన్ల ప్రకారం, జర్మన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 18 కింద ఈ క్రింది వర్గాల ఫ్రీలాన్స్ వీసాలు పొందే అర్హత వీరికి ఉంది.ఇండిపెండెంట్ సైంటిస్టులు, శాస్త్రవేత్తలుకళాకారులు, ఉపాధ్యాయులు , విద్యావేత్తలున్యాయవాదులు, నోటరీలుపేటెంట్ ఏజెంట్లుసర్వేయర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లుపశువైద్యులువాణిజ్య రసాయన శాస్త్రవేత్తలుఅకౌంటెంట్లు, పన్ను సలహాదారులుకన్సల్టింగ్ ఆర్థికవేత్తలు, స్వార్న్ అకౌంటెంట్లు, పన్ను ఏజెంట్లుదంతవైద్యులు, వైద్యేతర నిపుణులు, ఫిజియోథెరపిస్టులుజర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వ్యాఖ్యాతలుఅనువాదకులు, పైలట్లు , ఇతర సారూప్య వృత్తులు.ఫ్రీలాన్స్ వీసా అంటే ఏంటి? అర్హతలు, పైన పేర్కొన్న వృత్తిలో స్వయం ఉపాధి పొందుతున్న వారు ఫ్రీలాన్స్ వీసాను వినియోగించుకోవచ్చ. వీసా కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ పని రుజువు , అర్హత రుజువుతో సహా కొన్ని అవసరాలను తీర్చాలి. వీసా కోసం చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా కూడా అవసరం.అదనంగా, దరఖాస్తుదారులు జర్మనీ లేదా యూరప్‌లోని వారి సంబంధిత వృత్తిపరమైన రంగంలో వ్యాపార పరిచయాల ఉన్నవారి వివరాలను, వారి ఫ్రీలాన్స్ జాబ్ వివరాలపై సమగ్ర సమాచార మివ్వాలి.ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన పత్రాలుఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (6 నెలల కంటే పాతవి కానివి), ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ వర్క్, అర్హత రుజువుతో సహా అనేక దృవీకరణ పత్రాలను సమర్పించాలి. జర్మనీలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థ లేదా ఇతక సంస్థనుంచి డిగ్రీ చదివి ఉండాలి.. 75 యూరోలు లేదా రూ. 7,486 వీసా రుసుము, సుమారుగా. 45 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు, పెన్షన్ లేదా యాజమాన్యంలోని ఆస్తులతో సహా అదనపు పదవీ విరమణ ప్రయోజనాల ధృవపత్రాలు అవసరం.జర్మన్ ఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు ప్రక్రియలో సాధారణంగా జర్మనీలోకి ప్రవేశించే ముందు స్వదేశం నుండి నేషనల్ డి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. జర్మన్ ఎంబసీ లేదా కాన్సులేట్‌తో అపాయింట్మెంట్ తీసుకొని, అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్ డేటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీసా మంజూరైన తరువాత జర్మనీకి వెళ్లిన తరువాత రెండు వారాలలోపు వారి చిరునామాను నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత, వారు ఫ్రీలాన్సర్‌గా లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తిగా నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక విదేశీయుల కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుందినివాస అనుమతి ఫ్రీలాన్స్ వీసా సాధారణంగా ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు చెల్లుతుంది. ఆ తరువాత సంబంధిత నియమాలకు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారి వీసా రెన్యూల్ అవుతుంది. జర్మనీలో వరుసగా ఐదేళ్ల నివాసం తరువాత వారి ఫ్రీలాన్సర్ భాషా ప్రావీణ్యం, ఆర్థిక పరిస్థితి అక్కడి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే శాశ్వత నివాసం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్లు స్థానిక పన్ను కార్యాలయంలో నమోదు చేసుకుని పన్ను నంబర్‌ను పొందాలి.ఫ్రీలాన్స్ వీసా ప్రయోజనాలుఫ్రీలాన్స్ వీసా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు జర్మనీలో స్వతంత్రంగా పనిచేసే అవకాశం, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగానికి ప్రాప్యత మరియు అధిక నాణ్యత గల జీవనంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఫ్రీలాన్స్ వీసాతో, వ్యక్తులు తమ వృత్తిపరమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని తద్వారా జర్మన్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడవచ్చు. అన్నీ సవ్యంగా ఉండి, అక్కడి భాషలో ప్రావీణ్యం సంపాదించి, ఆర్థిక పరిస్థితులు ప్రమాణాల కనుగుణంగా వుంటే ఫ్రీలాన్స్ వీసా శాశ్వత నివాసానికి ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది, ఇది జర్మనీలో దీర్ఘకాలికంగా స్థిరపడాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశమని చెప్పవచ్చు. -
అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్‌వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు. -
పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నాట్స్ ముందడుగు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్‌గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
అమెరికా స్టోర్‌లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చ
భారతదేశానికి చెందిన మహిళను దొంగతనం ఆరోపణల కింద అమెరికాలో అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్ నుండి 1,300 డాలర్ల (సుమారు రూ.1.11 లక్షలు) విలువైన వస్తువులను దొంగిలించినట్టు ఆరోపణలు నమోదైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైఐరల్గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది.స్టోర్ ఉద్యోగుల ప్రకారం, విలువైన వస్తువులను కొట్టేసే ఆలోచనతోనే ఆ మహిళ ఏడు గంటలకు పైగా స్టోర్‌లో సంచరిస్తూ, తన ఫోన్‌ను నిరంతరం తనిఖీ చేసుకుంటూ కనిపించింది. చివరికి డబ్బు చెల్లించ కుండానే పశ్చిమ గేటు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించిందని దీంతో వారు పోలీసులకు సమాచారం అందించించారు. దీంతో ఆమెను అమెరికా పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె చేతికి సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై నేరపూరిత దొంగతనం అభియోగం మోపారు. అయితే దీనిపై డబ్బులు చెల్లిస్తానంటూ క్షమాపణలు చెప్పిన మహిళ తాను ఇక్కడికి చెందిన దాన్ని కాదని, తన ఫ్యామిలీ ఇండియాలో ఉంది, వాళ్లకి ఫోన్ చేయాలి లేకపోతే నేను ఎక్కడ ఉన్నానో వారికి తెలియదు.. అమెరికాకు ఒంటరిగా వచ్చాను.. ఇంట్లో 20 ఏళ్ల కూతురు ఉంది అంటూ దీనంగా చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!ఈ ఏడాది మే 1న జరిగినట్టుగా చెబుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. అలా ఎలా చేసింది? అని కొంతమంది ప్రశ్నించగా, మరికొంతమంది దేశం పరువుతీసింది అంటూ విమర్శించారు. ఈ ఘనకార్యం కోసమేనా పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లింది. ఇలాంటి వారి వల్లనే అమెరికా సోషల్ మీడియా భారతీయుల పట్ల ద్వేషం, అసహ్యంతో నిండిపోయింది అని మరొకరు కమెంట్ చేశారు."ప్రపంచ వేదికపై భారతదేశానికి తలవంపులు తెచ్చి పెడుతోంది. విదేశాలలో దేశానికి అవమానం తీసుకురావద్దు. గౌరవంగా ప్రవర్తించండి అని మరొకరు హితవు పలకడం విశేషం. నోట్: అయితే ఆ మహిళ ఏ ప్రదేశానికి చెందినవారు, ఎవరు? అనే వివరాలేవీ అందుబాటులో లేవు. -
నిమిషా ప్రియను క్షమించలేం
సనా: తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని దారుణంగా హత్య చేసిన కేరళ నర్స్ నిమిషా ప్రియను క్షమించలేమని అబ్దెల్ ఫతాహ్ మెహదీ తేల్చిచెప్పారు. ఆమె నుంచి క్షమాపణ గానీ, నష్టపరిహారం(బ్లడ్ మనీ) గానీ తాము కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు. యెమెన్‌లో నిమిష తల్లి ప్రేమకుమారియెమెన్లో మాజీ వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీని 2017లో విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు నిమిషా ప్రియకు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆమెకు బుధ వారం శిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమి షంలో వాయిదా పడింది. బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫతాహ్ మెహదీ బీబీసీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఖిసాస్’ తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదని చెప్పారు. షరియా చట్టం ప్రకారం తమకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సోదరుడిని చంపినందుకు నిమిషా ప్రియను ఉరి తీయాల్సిందేనని, అంతకుమించి ఇంకేదీ అక్కర్లే దని వెల్లడించారు. -
మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి కేసు.. ఎన్ఆర్ఐ అరెస్ట్
ఛండీగఢ్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారత దిగ్గజ మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్ కేసులో ఎన్ఆర్ఐ అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్(30)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన సమయంలో వాహనం నడిపిన అమృత్‌పాల్ సింగ్‌ను కర్తార్‌పుర్‌లో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అతడు కెనడా నుంచి భారత్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడు నడిపిన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరికాసేపట్లో అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.ఇదిలా ఉండగా.. పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏళ్ల ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఫౌజాసింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రపంచంలోనే కురువృద్ధ అథ్లెట్‌గా పేరుగాంచిన ఈ పంజాబ్ పుత్తర్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వందేళ్ల వయసును ఏమాత్రం లెక్కచేయకుండా యువకులకు సవాలు విసురుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ మారథాన్లలో బరిలోకి దిగి సత్తాచాటారు. ఫౌజా సింగ్ మృతి పట్ల పలు ప్రపంచ దేశాలు తమ దిగ్భ్రాంతి ప్రకటించాయి. 1911 ఏప్రిల్ 1న జన్మించిన ఫౌజాసింగ్ 89 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ కెరీర్ మొదలుపెట్టారు. 1993లో ఇంగ్లండ్‌కు వెళ్లిన ఈ దిగ్గజ అథ్లెట్.. ‘టర్బన్ టోర్నడో’ అంటూ అందరి మనన్నలు పొందారు. 2011లో జరిగిన టొరంటో మారథాన్‌లో 100 ఏళ్ల వయసులో 8 గంటల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐదేళ్ల పసిప్రాయం వరకు నడవని ఆయన.. తన 14 ఏళ్ల అథ్లెటిక్స్ కెరీర్లో తొమ్మిది మారథాన్ రేసుల్లో పోటీపడటం విశేషం.The world's oldest marathon runner, Fauja Singh, has died at the age of 114. He was involved in a hit-and-run near Jalandhar, India.Singh began running at 89 and ran nine full marathons - and was one of the 2012 London Olympic torchbearers. pic.twitter.com/kvevQ84FaD— Channel 4 News (@Channel4News) July 15, 2025తన కుటుంబసభ్యుల మరణాల నుంచి తేరుకునేందుకు పరుగును ఎంచుకున్న ఫౌజాసింగ్ను 2015లో బ్రిటిష్ ఎంపైర్ మెడల్ వరించింది. 2012లో జరిగిన హాంకాంగ్ మారథాన్.. ఆయన చివరి అంతర్జాతీయ రేసుగా నిలిచింది. పంజాబ్‌లో డ్రగ్స్ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఈ దిగ్గజ అథ్లెట్ కీలకంగా వ్యవహరించారు. కనీసం నడిచే వీలు లేని వయసులో కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఫౌజాసింగ్ అకాల మృతి అందరినీ కలిచివేసింది. -
నిమిష కేసు: భారతీయల పాలిట లైఫ్‌లైన్.. బ్లడ్‌మనీ!
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవతో మరణశిక్ష అయితే వాయిదా పడింది. క్షమాభిక్ష కోసం యెమెన్‌లో ఇంకా రాయబారం నడుస్తోంది. బాధిత కుటుంబం గనుక బ్లడ్‌మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తేనే నిమిష మరణశిక్ష తప్పుతుంది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ(క్షమాధనం) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2008లో తన కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిష.. కొన్నాళ్లకు సొంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీతో ఆమెకు పొరపచ్చాలు వచ్చాయి. తన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుని తనను వేధిస్తున్నాడంటూ నిమిష ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో మత్తుమందు ఇవ్వడంతో తలాల్ మరణించాడు. ఈ కేసులో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం.. యెమెన్‌లోని సనా సెంట్రల్ జైలులో బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో నిమిషా ప్రియకు శిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈలోపు చర్చలకు తొలిసారి తలాల్ కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో శిక్ష వాయిదా పడింది. మరి బ్లడ్‌మనీకి ఆ కుటుంబం అంగీకరిస్తుందా?.. అసలు బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి ఇంతకు ముందు ఎవరైనా బయటపడ్డారా?. వర్కవుట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా?క్షమాధనం అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఇది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.నిమిష కేసులో తలాల్ అబ్దో మహ్దీ కుటుంబానికి $1 మిలియన్ రక్తపరిహారం(మన కరెన్సీలో 8 కోట్లకు పైనే) ప్రతిపాదించింది నిమిష తల్లి ప్రేమ కుమారి. అయితే బ్లడ్‌మనీ తమ గౌరవానికి భంగం కలిగించే అంశమంటూ గతంలో వాళ్లు తిరస్కరించారు. యెమెన్ అనేది హౌతీ నియంత్రణలో ఉన్న దేశం. ఈ కారణంగానే భారత ప్రభుత్వ జోక్యం కష్టంగా మారింది. క్షమాభిక్ష కోసం మత పెద్దలు, Save Nimisha Priya Action Council ప్రయత్నాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.8.6 కోట్లు తీసుకునేందుకు యెమెన్‌లోని బాధిత కుటుంబాన్ని ఒప్పిస్తే నిమిష ప్రియకు ఊరట దక్కనుంది.వీరంతా ‘బ్లడ్ మనీ’తో బయటపడినవారే..!నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్‌మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం.. ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. 👉2008లో.. సహోద్యోగిని చంపిన కేసులో జస్బీర్ సింగ్ సౌదీ అరేబియా జైలు నుంచి రూ.30 లక్షల బ్లడ్‌మనీ చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2005లోశ్రీలంక పౌరుడ్ని చంపిన కేసులో సులేమాన్‌తో పాటు మరో ఎనిమిది మందికి సౌదీ అరేబియాలోనే మరణశిక్ష పడింది. అయితే రూ. 40 లక్షల బ్లన్మనీతో వీళ్లంతా క్షేమంగా బయటపడ్డారు👉2012లో.. షార్జాలో పాకిస్తానీని మూకహత్య చేసిన కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. బ్లడ్‌మనీ కింద రూ.16 కోట్లు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సాయం కూడా ఉంది. 👉2013లో.. కర్ణాటకకు చెందిన ట్రక్కు డ్రైవర్ సలీమ్ భాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గానూ ఈ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు రూ.1.5 కోట్ల బ్లడ్‌మనీ బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీమ్ శిక్ష నుంచి బయటపడ్డాడు.👉2014లో.. సౌదీలో కారుతో ఓ చిన్నారిని ఢీ కొట్టిన కేసులో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత్య కార్యాలయం సహకారంతో బ్లడ్‌మనీ చెల్లించి ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉2014లో బ్లడ్‌మనీ ఆధారంగానే ముగ్గురు భారతీయులను విడుదల చేసింది సౌదీ. మృతుడి కుటుంబానికి రూ.1.12 కోట్లు చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరణశిక్ష పడింది. ఈ కేసులో ‘బ్లడ్ మనీ’ కింద 2 లక్షల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో ప్రస్తుతం దాదాపు రూ.47లక్షలు) చెల్లిస్తే క్షమిస్తామని బాధిత కుటుంబం తెలిపింది. దాతల సాయంతో ఆ మొత్తాన్ని చెల్లించడంతో ఎనిమిదేళ్ల తర్వాత 2017లో శంకరనారాయణ యూఏఈ జైలు నుంచి విడుదలయ్యాడు.👉2017లోనే.. ఓ పాక్ పౌరుడ్ని హత్య చేసిన కేసులో 10 మంది పంజాబ్ పౌరులకు సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. అయితే బాధిత కుటుంబానికి ₹24 లక్షల (200,000 దిర్హామ్స్) బ్లడ్‌మనీ చెల్లించడంతో క్షమాభిక్ష లభించింది. ఆపై వారు భారత్‌కు తిరిగొచ్చారు. భారత రాయబార కార్యాలయం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు, సామాజిక సంస్థలు కలిసి బ్లడ్‌మనీ సేకరణ చేపట్టారు.👉2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత.. లింబాద్రి తరఫున రూ.1.8 కోట్లు బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. దీంతో ఆయన శిక్ష నుంచి బయటపడి స్వదేశానికి తిరిగొచ్చారు.👉2024లో.. అబ్దుల్ రహీమ్ కేసు విస్తృతంగా చర్చనీయాంశమైంది. కేరళ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీ అరేబియాకు హౌజ్ డ్రైవర్‌గా వెళ్లారు. అక్కడ తన యజమాని ఇంట దివ్యాంగుడైన అనాస్ అల్ షహ్రీ బాధ్యతలు కూడా చూసుకునేవాడు. ఈ క్రమంలో.. ఓ రోజు ప్రమాదవశాత్తూ మరణించాడు. 2018లో సౌదీ కోర్టు హత్య ఆరోపణలపై రహీమ్‌కు మరణశిక్ష విధించింది. 2022లో అక్కడి సుప్రీం కోర్టు కూడా శిక్షను సమర్థించింది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ తెర మీదకు వచ్చింది. బాధిత కుటుంబం ₹34 కోట్లు (15 మిలియన్ సౌదీ రియాల్స్) బ్లడ్‌మనీ తీసుకుంటే క్షమించేందుకు సిద్ధమని తెలిపింది. ఆరు నెలల్లో మొత్తం చెల్లించేలా 2023 అక్టోబర్ 16న ఒప్పందం కుదిరింది. SAVEABDULRAHIM' యాప్ ద్వారా క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు. అలా.. 2024 జూలై 2న రియాద్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో శిక్ష రద్దు అయ్యింది. బ్లడ్‌మనీ చెక్కును బాధిత కుటుంబానికి అప్పగించారు. అయితే.. ఈ ఏడాదిలోనే రహీమ్ విడుదల కావాల్సి ఉంది. ఈ ఘటన.. మానవత్వం, భారతీయుల ఐక్యత, న్యాయం కోసం పోరాటం చూపిన ఉదాహరణగా నిలిచింది.👉2019లో.. అర్జునన్ అతిముత్తు, తమిళనాడులోని తంజావూరు జిల్లా, అతివెట్టి గ్రామంకు చెందిన వ్యక్తి. ఆయన 2013లో కువైట్‌లో తన రూమ్మేట్ అబ్దుల్ వాజిద్ (మలప్పురం, కేరళ)ను హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురయ్యారు. 2016లో శిక్ష ఖరారు అయ్యింది. అయితే బ్లడ్‌మనీ ఒప్పందం కింద.. బాధిత కుటుంబం ₹30 లక్షలు తీసుకుని క్షమాభిక్ష ఇచ్చేందుకు అంగీకరించింది. ఆపై కువైట్ ప్రభుత్వం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అప్పటి కోటక్కల్ MLA అబిద్ హుస్సేన్, యూత్ లీగ్ నేతలు కలిసి క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు.కాగా.. ఈ బ్లడ్ మనీతో భారతీయులకు కూడా పరిహారం దక్కిన సందర్భం ఉంది. 2019 దుబాయ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో భారత్‌కు చెందిన మహ్మద్ మీర్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్.. బ్లడ్ మనీ కింద మీర్జా కుటుంబానికి 5 మిలియన్ల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో అప్పటికి దాదాపు రూ.11కోట్లు) చెల్లించాడు.బ్లడ్‌మనీ తప్పించలేకపోయింది!సౌదీ పౌరుడ్ని హత్య చేసిన కేఏసులో ధరమ్‌పాల్ సింగ్(2020)ను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్లడ్‌మనీని బాధిత కుటంబం తిరస్కరించడంతో మరణశిక్ష అమలు చేశారు.తన యాజమానిని హత్య చేసిన కేసులో కే మాధవన్‌కు సౌదీలో మరణశిక్ష పడింది. అయితే కుటంబం బ్లడ్‌మనీని సేకరించడంలో విఫలమైంది. దీంతో 2004లో మరణశిక్ష అమలు చేశారు.సహోద్యోగిని హత్య చేసిన కేసులో.. షంసుద్దీన్కి మరణశిక్ష పడింది. అయితే బ్లడ్‌మనీని బాధిత కుటుంబం తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలైంది.పెండింగ్‌లో..ఓ దాడి కేసులో యూఏఈలో యూనస్ అనే భారతీయడికి మరణశిక్షపడింది. ఫ్యామిలీ బ్లడ్‌మనీ సేకరించడంలో ఇబ్బంది పడుతోంది. అయితే శిక్ష ఇంకా అమలు కాలేదు.నిమిష ప్రియ కేసులో.. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్‌మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు చర్చల వేళ.. శిక్ష తప్పుతుందో..? లేదో అనే ఉత్కంఠ నెలకొంది. -
నిమిష మరణశిక్ష వాయిదా
యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్‌కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం.నిమిష శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్‌లో ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ సభ్యుడు శ్యామూల్ జోరెమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయితే.. బాధిత కుటుంబం బ్లడ్‌మనీ(పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని అంటున్నారాయన.కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్‌లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం. మరోవైపు.. నిమిషా ప్రియ విషయంలో భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఈఏ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హౌతీ నియంత్రణలోని యెమెన్‌తో భారతకు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. ఈ తరుణంలో తామ చేయగలిగినదంతా చేశామని, ఇంతకు మించి చేయలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే.. నిమిష కేసును బాధాకరంగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అనధికారిక మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చినా.. కేంద్రం యెమెన్ న్యాయవిభాగానికి విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భర్తతో నిమిషఇంకోవైపు క్షమాభిక్షపైగానీ, బ్లడ్‌మనీపైగానీ చర్చించేందుకు సైతం తలాల్ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే తాజా భేటీలో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి పాల్గొన్నట్లు తెలస్తోంది. ఈ పురోగతితో నిమిష శిక్ష రద్దయ్యే అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. -
Dallas: డాలస్‌లో ఘనంగా “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం
డాలస్‌లో ఆదివారం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్య్వర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం కన్నుల పండుగగా జరిగింది.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ కూచిపూడి నాట్య రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నాట్య గురు, శ్రీకాకుళం జిల్లాలో నెలకొనిఉన్న ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ డైరెక్టర్ అయిన స్వాతి సోమనాథ్ తన శిష్యులైన కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన వివిధ నృత్య ప్రదర్శనలు రెండు గంటలపాటు ఆహుతులను అలరించాయి అన్నారు.స్వాతి సోమనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనలమేరకు శ్రీకాకుళం జిల్లాలో 11 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొల్పబడిన ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ ప్రపచంలోనే తొలి కూచిపూడి గురుకులం అని, వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది విద్యార్ధినీ, విద్యార్ధులు శ్రద్ధాసక్తులతో నాట్యం నేర్చుకుంటూ కూచిపూడి నాట్యంలో డిగ్రీలు సంపాదించుకుని, దేశ విదేశాలలో తమ ప్రతిభా పాటవాలను చూపుతున్నారని, ఇటీవల డిట్రాయిట్ లో జరిగిన తానా మహా సభలకు ఆహ్వానం అందుకుని తొలిసారి అమెరికాలో అడుగుపెట్టిన పిల్లలకు డాలస్ నగరంలో డా. ప్రసాద్ తోటకూర, వారి బృందం చూపిన ఆదరణ ఎన్నటికీ మరువలేనిది అంటూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు గంటల పాటు కన్నుల పండుగగా సాగిన నాట్యవిభావరి లో “శ్రీ గణనాధం” - త్యాగరాజ కృతి కనకాంగి రాగం, ఆది తాళంలో ఉన్న వినాయకుడి స్తుతితో ప్రారంభమైంది. “ఒక పరి ఒక పరి” – ఖరహర ప్రియ రాగం, ఆది తాళంలో అన్నమాచార్య కీర్తన శ్రీ వేంకటేశ్వర స్వామి అందాన్ని వర్ణిస్తుంది. ముదురు రంగులో అలమేలుమంగ సరసమైన ఛాయతో మెరుపుల పరంపరతో ఆలింగనం చేయబడిన చీకటిమేఘంతో పోల్చబడింది. “క్షీర సాగర శయన” – దేవ గాంధారి రాగం, ఆది తాళాల్లో ఉన్న ఈ త్యాగరాజ కృతి - గజేంద్ర మోక్షం, ద్రౌపది వస్త్రాపహరణం అంశాలలో చక్కగా చూపబడింది. “అద్వైతం - యోగా నృత్యం” - ప్రపంచ శాస్త్రీయ నృత్యాల చరిత్రలో మొదటిసారిగా యోగా, భారతీయ శాస్త్రీయసంగీతం యొక్క ఏడు స్వరాలు, ఆ స్వర చిహ్నాల కలయిక ఈ అంశంలో వినూత్నంగా చూపబడింది. మానవ శరీరంలో మూలాధారంతో ప్రారంభమై సహస్రారంతో ముగుస్తుంది. 7 శక్తి కేంద్రాలు నాట్యశాస్త్రం యొక్క వివిధ నృత్య భంగిమలతో చూపించబడ్డాయి.“తెలుగు కవన నర్తనం” - తెలుగు భాషా సాహిత్యం, కవిత్వం, సంగీతానికి ముఖ్యమైనది. త్యాగరాజస్వామి కృతి ‘ఎందరో మహానుభావులు’, ‘ఎంకి నాయుడు బావ’ యుగళగీతం, అన్నమయ్య 'బ్రహ్మం ఒక్కటే’, విశ్వనాథ వారి ‘కిన్నెరసాని’, మంగళంపల్లి బాలమురళి గారి ‘తిల్లానాతో’ మొదలై భక్త రామదాసు పాటలతో తెలుగుసాహిత్యంలోని వాగ్గేయకారులకు, కవులకు నివాళితో గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన కూచిపూడి నృత్యహేల అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ “మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సాహిత్యం, కళలను నిరంతరం ప్రోత్స హిస్తున్న డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో యింతటి గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసినందులకు వారిని, మహాత్మాగాంధీ మెమోరియల్, తానా, ఆటా, టిపాడ్, ఇండియా అసోసియేషన్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సభ్యులను ప్రత్యేక అభినందనలు అన్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలను చేరదీసి కూచిపూడి నాట్యంలో ఎంతో అకుంటిత దీక్షతో ఆణిముత్యాలను తయారుచేస్తున్న స్వాతి సోమనాథ్ కృషి ఎంతో కొనియాడదగ్గది అని ప్రశంసించారు. ప్రముఖ కూచిపూడి నాట్యగురు కళారత్న కె.వి సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతి సోమనాథ్ తో చిరకాల పరిచయం అని, ఇద్దరం కలసి కొన్ని ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశామని, ఈ రోజు డాలస్ లో కలుసుకోవడం ఆనందంగా ఉందని, కూచిపూడి నాట్యాన్ని ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళే ఆమె కృషి సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.గౌరవ అతిథులుగా విచ్చేసిన బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలు వివిధ సంఘాల నాయకులతో కలసి నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలలను ఘనంగా సన్మానించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంఘ నాయకులు – డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వల, తయాబ్ కుండావాల, బి ఎన్ రావు, మహేంద్ర రావు, మురళి వెన్నం, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకులు షబ్నం మాడ్గిల్, సుష్మా మల్హోత్రా, డా. జే పి, ముర్తుజా, ఆటా, టి పాడ్ నాయకులు రఘువీర్ బండారు, వేణు భాగ్యనగర్, శారదా సింగిరెడ్డి, పాండు పాల్వాయి, సత్య పెర్కారి, తానా నాయకులు లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, టాన్ టెక్స్ నాయకులు చంద్ర పొట్టిపాటి, సుబ్బు జొన్నలగడ్డ, భీమ పెంట, ఆనందమూర్తి, లలిత మూర్తి కూచిభొట్ల, చిన సత్యం వీర్నపు, నరసింహా రెడ్డి ఊరిమిండి, పుర ప్రముఖులు లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, చంద్రహాస్ మద్దుకూరి, జాకీర్ హుస్సేన్, మడిసెట్టి గోపాల్, అత్తలూరి విజయలక్ష్మి, భార్గవి పేరి, నాగరాజు నలజుల, పూర్ణా నెహ్రు మొదలైన వారు హాజరై ఈ కార్యక్రమాన్ని ఆసాంతం ఆస్వాదించారు.బి.ఎన్ రావు తన వందన సమర్పణలో ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన కాక తీయహాల్ నిర్వాహకులకు, డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి, ఫన్ ఏషియా, సురభి రేడియో యాజమాన్యాలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, హాజరైన కళాపోషకులకు, అద్భుతమైన నాట్య ప్రదర్శనలు చేసిన కళాకారులు నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలకు, గౌరవ అతిథులుగా విచ్చేసిన బిజెపి నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
నిమిష కేసు: చేతులెత్తేసిన కేంద్రం! అంతా మంచి జరగాలంటూ..
కేరళ నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం చేతులెత్తేసింది. యెమెన్‌లో ఈ నెల 16వ తేదీన ఆమె మరణ శిక్ష అమలు కానుంది. అయితే కేంద్రం తక్షణ జోక్యం చేసుకుని.. నిమిష శిక్షను తప్పించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఈ కేసులో ఎలా ఆర్డర్ పాస్ చేయాలి, ఎవరు ఫాలో అవుతారని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆరా తీసింది. అయితే తాము (కేంద్రం) చేయగలిగినదంతా చేశామని, యెమెన్‌తో భారత్‌కు సత్సంబంధాలు అంతగా లేవని, అయినా కూడా అక్కడి ప్రాసిక్యూటర్‌కు మరణశిక్షను వాయిదా వేయాలని రాశామని, బ్లడ్‌మనీ చివరి అవకాశమని, ఆ చర్చలంతా ప్రైవేట్ వ్యవహారమని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదని, అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్నామని అటార్నీ జనరల్ వెంకటరమణి ధర్మాసనానికి స్పష్టం చేశారు. దీంతో జస్టిస్ సందీప్ మెహతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ప్రాణాలు పోతే గనుక చాలా బాధాకరమని అన్నారాయన. అయితే అనధికారిక మార్గాలు ఏమైనా ఉన్నాయో పరిశీలన చేసి వెంటనే సంప్రదించాలని ఆయన ఏజీకి సూచిస్తూ.. ఈ పిటిషన్లో విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. యెమెన్‌లో ఓ వ్యక్తిని చంపిన కేసులో నిమిషా ప్రియాకు 2017లో మరణశిక్ష పడింది. యెమెన్‌లో తాను తీవ్ర చిత్రహింసలకు గురయ్యానని, తన వ్యాపార భాగస్వామి(బాధితుడి) తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అతనికి మత్తు మందు ఇచ్చానని నిమిష చెబుతోంది. అయితే మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతను మరణించాడని తేలింది. ఈ కేసులో చివరగా మిగిలిన ఆశ బ్లడ్‌మనీ ఒక్కటే. షరీయత్ చట్టం ప్రకారం ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమాపణ దక్కే అవకాశం ఉంది. అయితే.. బాధితుడి కుటుంబానికి $1 మిలియన్ (రూ. 8.3 కోట్లు) చెల్లించేందుకు నిమిష కుటుంబం అంగీకరించింది. కానీ అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరణశిక్ష అమలుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో నిమిషాకు అంతర్జాతీయ మద్దతు కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్ 2025 టోర్నమెంట్ ఘన విజయం
సింగపూర్: స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్ 2025 ఆధ్వర్యంలో తెలుగు సంఘానికి ప్రత్యేకంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడపా, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు, కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ భరద్వాజ్, తెలుగు సమాజం నుంచి నాగేశ్ టేకూరి మద్దతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాయబార కార్యాలయం నుంచి VSR కృష్ణ, సన్యమ్ జోషి భాగస్వామ్యం మరో ప్రత్యేకత. ఈ టోర్నమెంట్లో మొత్తం 40 జట్లు తమ ప్రతిభను చాటుకున్నాయి. ప్రారంభ రౌండ్లు రౌండ్-రాబిన్ లీగ్ తరహాలో నిర్వహించగా, అనంతరం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నుండి నాక్అవుట్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. తుదిపోరులో అనూప్- విజయ్ జంట విజేతలుగా నిలిచింది. నిర్వాహకులు ద్వారకానాద్ మిట్టా, నవీన్ మల్లం, మహేశ్వర చౌదరి కాకర్ల, సాయి కృష్ణ సేలం, రమేష్ గోర్తి, ఉమామహేశ్వర రావు తెళదేవర, వెమ్మెసెన కులశేఖర్ రీగన్, ప్రసాద్, చంద్రబాబు జొన్నారెడ్డి, విశ్వనాథ్ తదితరులు ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!క్రీడా స్పూర్తిని, సాంఘిక సమైక్యతను,సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ టోర్నమెంట్ సాగింది. ఖచ్చితమైన ప్రణాళిక, స్నేహపూర్వక పోటీలు, ఉత్సాహభరిత వాతావరణంతో ఈ కార్యక్రమం అందరి మెప్పు పొందింది. స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన ఆటగాళ్లు, స్వచ్ఛంద సేవకులు, ప్రోత్సాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా వీరా ఫ్లేవర్స్, సరిగమ, కుంభకర్ణ, ఫ్లింటెక్స్ కన్సల్టింగ్, ERA, ఈస్ట్ కోస్ట్ ఫిజియోథెరపీ సంస్థల సహకారం ఈ టోర్నమెంట్‌కు బలాన్ని చేకూర్చిందని నిర్వాహకులు తెలిపారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఆదివారం (13 జూలై 2025) సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. వర్షం కారణంగా కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ..భక్తులందరూ ఉత్సహంగా పాల్గొని బోనాల పండగని విజయవంతం చేశారు. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరులో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు.ప్రముఖ సెలెబ్రిటీ సంజయ్ తుమ్మ - వాహ్ చెఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంజయ్ తుమ్మ గారి ఆట పాటలతో బోనాల ఊరేగింపులో అందరికీ ఉత్తేజాన్ని కలిగించారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. తెలుగు వారందరితో తో కలిపి సుమారు 650 నుండి 750 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మ వారి భక్తి మరియు బోనాలకు సంబందించిన ప్రత్యేక పాటలకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీసీఎస్ఎస్ వారు తొలిసారి 2017 లో బోనాల పండుగను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకొని సంతోషించారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు.బోనాల జాతరలో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి, అరవింద్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఏడాది బోనం సమర్పించిన ఫ్యామిలీస్ లో రమేష్ గడప, వివేక్ బుర్గోజు, శశిధర్ రెడ్డి, నిఖిల్ ముక్కావర్, సందీప్ రెడ్డి పుట్టా, శ్వేత కుంభం, శ్రీనివాస్ గర్రెపల్లి, అలేఖ్య తడిసిన, అలేఖ్య దార, బండ శ్రీ దేవి, అనిత రెడ్డి చాడ, చీర్లవంచ రాజు, మనోహర్ సల్లా, మోతే శ్రీనివాస రెడ్డి, వేముల సురేష్, హర్షిణి కషాబోయినా, రాధాకృష్ణ ఎం.వి.ఎస్., విజయ్ అనూష, దీపా రెడ్డి మండల ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు ఇంట్లో వండి తెచ్చిన అన్న తీర్థ ప్రసాదాన్ని పంచి సంతోషాన్ని వెలిబుచ్చారు. వీరితో పాటు గడప రమేశ్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.బోనాలు పండుగ లో పాల్గొన్న భక్తులందరూ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద (పులిహోర , పెరుగు అన్నం మరియు కేసరి ) వితరణలో పెద్ద ఎత్తులో సంతోషంగా పాల్గొని అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సింగపూర్ బోనాలు - 2025 పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ మొదలగు వారు మాట్లాడుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి మరియు స్పాన్సర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.ఎలాంటి తొక్కిసలాట జరగకుండా తీసుకున్న జాగ్రత్తలకు సొసైటీ చేసిన ఏర్పాట్లను భక్తులు అభినందించారు. ముఖ్య అతిథి సంజయ్ తుమ్మ - వాహ్ చెఫ్ గారిని సన్మానించి టిసి ఎస్ ఎస్ జ్ఞాపికను వారికి అందజేయడం జరిగింది. సంజయ్ తుమ్మ గారి ఆతిథ్యంలో సహకరించిన సూపర్ డీలక్స్ కిచెన్ యాజమాన్యానికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారుఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, గారెంటో అకాడమీ, వజ్ర బిల్డర్స్ బిల్డింగ్ వాల్యూస్, మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, అభిరామి జ్యూవెల్లర్స్, ఎవోల్వ్, సూపర్ డీలక్స్ కిచెన్ సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ & బిస్ట్రో , జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, చంద్రశేఖర్ దోర్నాల, నగేష్ టేకూరి, అజయ్ నందగిరి, పవన్ కుమార్ అంబల్ల, స్వాతి ఖానాపురం తదితరులకు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పండుగను యూట్యూబ్‌లో లైవ్ కవరేజ్ చేసిన సింగపూర్ తెలుగు టీవీ మరియు నిర్వాహకులు రాధాకృష్ణ గణేశ్న గారికి, ఫొటోగ్రఫీ కవరేజ్ చేసిన కృష్ణ నెల్లుట్ల, సౌండ్ సాంకేతికతలో సహకరించిన రజనీకాంత్ మెరుగు, కార్యక్రమంలో సహకరించిన పూర్వ కమిటీ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ రాజు కల్వ పండుగ విజయవంతంగా జరగడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరున కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. -
లక్షల మంది హృదయాల్లో భగవద్గీత జ్ఞానాన్ని నింపిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
వాషింగ్టన్: గత 65 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికను పంచుతూ, ఆ శక్తిని, భక్తిని అందరికీ అందించడమే కాకుండా అనేక దేవతా ఆలయాలను భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిర్మించి, మన సనాతన సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. పరపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. లక్షల మందికి మంత్రోపదేశాలు చేసి వారి జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతిని అందించారు శ్రీ స్వామీజీ. శ్రీ కృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా వున్న అసంఖ్యాకమైన భక్తులకు ప్రచారం చేస్తూ వారి జీవన మార్గాన్ని సుగమం చేస్తున్నారు శ్రీ స్వామీజీ.అలా పూజ్య స్వామీజీ చూపిన మార్గంలో భగవద్గీతను కంఠస్థం చేసి ఎందరో తమ జీవితాల్లో మార్పును చూస్తున్నారు. మన సనాతన ధర్మం ద్వారా సమసమాజ నిర్మాణానికి అహర్నిశం శ్రమిస్తూ ఆధ్యాత్మికతను సుస్థిరం చేస్తున్న మహనీయులు, అవధూత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద మహాస్వామీజీ. అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా విశేషంగా భగవద్గీతను అమెరికాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు శ్రీ స్వామీజీ. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో నిర్వహించిన విధంగా పది వేలమంది భక్తులతో అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ ఫ్రీస్కో నగరంలోని అలెన్ స్టేడియంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతను పఠించారు. -
లండన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రోజున బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని లండన్ ఇల్ఫార్డ్‌లోని బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, స్వీట్లు, పంపిణి మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు.బీజేపీ లండన్ అధ్వర్యంలో ఇల్ఫార్డ్ లోని బండి సంజయ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాటిపల్లి సచిందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత అని కొనియాడారు. కార్పొరేటర్ నుండి ఎంపీ, కేంద్రమంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదిగిన తీరు కార్యకర్తలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. సరస్వతీ శిశు మందిరం లో విద్యనభ్యసించిన బండి సంజయ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు.ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పని చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో, బిజెపి కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షులుగా, జిల్లా , రాష్ట్ర కార్యవర్గాల్లో వివిధ హోదాల్లో బిజెపిలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా ను ఆయన పని చేశారని, ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ బండి సంజయ్ కుమార్ భాగం పంచుకున్నారని , 35 రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. 1994 _ 2003 మధ్యకాలంలో బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశారన్నారు.2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా బండి సంజయ్ విజయం సాధించారని, వరుసగా మూడుసార్లు ఆయన కార్పొరేటర్ గా గెలుపొందారన్నారు.2019 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన సారాధ్యంలో బిజెపి రాష్ట్రంలో పుంజుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ గ్రామ గ్రామానికి చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారని తెలిపారు.బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు చరిత్ర సృష్టించాయన్నారు. బండి సంజయ్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు. అనంతరం బండి సంజయ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. కరీంనగర్ చరిత్రలోనే భారీ మెజారిటీతో రెండోసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర బిజెపి కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరని చెప్పారు.ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రెండు టర్ములలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటి తో గెలుపొంది రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా పనిచేసి కేంద్రమంత్రి గా కొనసాగుతూ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమం లోఓవర్సీస్ బీజేపీ నాయకులు వాస భరత్, బండ సంతోష్, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, జయంత్, సంజయ్, బద్దం చిన్న రెడ్డి, సురేష్, చార్లెస్, జేమ్స్, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్‌ఎస్టేట్‌కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు. -
ట్రంప్‌కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. -
యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!