వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తూ.. రూ.1,100 కోట్ల సేద్యపు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి.. వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు.. Full details
Breadcrumb
- Home
- వైఎస్సార్.. తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
Know YSR
-
నాన్న మీ మార్గం శిరోధార్యం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు.ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2024
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్సార్ 75వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాయి. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ సిద్ధం: సజ్జల వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ‘‘ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారు. హామీలు ఇచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్‌కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే జగన్ పరిపాలన తెచ్చారు. అందరం కలిసి ముందుకు సాగుదాం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దాం. రాష్ట్రానికి, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటుంది’’విశాఖపట్నం: వైఎస్సార్ జయంతి సందర్భంగా బీచ్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మేయర్ హరి వెంకట కుమారి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు వంటి గొప్ప పథకాలను మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టారన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు వైఎస్సార్‌ను ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకున్నారు. పేదల కోసం పరితపించిన వ్యక్తి వైఎస్సార్. వైఎస్ ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్ గత ఐదేళ్లు అమలు చేశారన్నారు.‘‘రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రజల గుండెల్లో నుంచి ఆయనను వేరు చేయలేరు. టీడీపీ నేతలు ధ్వంసం చేసిన విగ్రహాలన్నీ తిరిగి ఏర్పాటు చేస్తాం. ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ నిలబడుతుంది. కూటమి నేతల దాడులను ప్రతిఘటిస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.పార్లమెంట్లో వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి: ఎంపీ విజయసాయిరెడ్డి‘డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) సామాజిక న్యాయం, సాధికారత, పేదల పక్షపాతిగా కోట్లాది మందికి చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ రోజు వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా పార్లమెంట్లో డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని స్పీకర్ ఓంబిర్లాకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్సార్ శాశ్వత వారసత్వానికి నివాళి అర్పించినట్లు అవుతుంది’ అని ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.Dr. Y.S. Rajasekhara Reddy (YSR) will forever be remembered by crores as a champion of social justice, and empowerment, and an advocate for the poor. On the occasion of his 75th birth anniversary today, I earnestly appeal to the Hon. Speaker, @ombirlakota ji to install a statue…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 8, 2024 తిరుపతి: వైఎస్సార్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నివాసం వద్ద వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.హైదరాబాద్: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు, దానం నాగేందర్, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా వికోటలో చిత్తూరు జిల్లా చైర్మన్ జీ శ్రీనివాసులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ, సర్పంచ్ పీఎన్ లక్ష్మమ్మ, ఎంపీపీ యువరాజు, రాష్ట్ర కార్యదర్శి పిఎన్ నాగరాజు, వైస్ ఎంపీపీ తమ్మీఖాన్ , వైస్ సర్పంచ్ అక్మల్ , వికోట మహిళా అధ్యక్షురాలు శశికళ, మంజుల, సరస్వతి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.తూర్పుగోదావరి జిల్లా: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో ఎమ్మెల్సీ అనంతబాబు రాజానగరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రక్తదానం చేశారు. ఈ కార్యక్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.అల్లూరి సీతారామరాజు: రాజవొమ్మంగిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించారు.జనగామ: స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్ర పటానికి కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు కేక్ కట్ చేశారు.
-
ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్‌కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమం అనంతరం అరకు ఎంపీ తనూజ రాణి మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారని.. ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ప్రజల్లో గుండెల్లో వైఎస్ ఎప్పటికీ ఉంటారని ఆమె అన్నారు. పోడు భూములు విషయం లో గిరిజనులకు చేసిన మేలు మరిచి పోలేము. గిరిజనుల ఆరాధ్య దైవం మోద కొండమ్మ చిత్ర పటంతో పాటు , మా గిరిజనుల ప్రతి ఇంటిలో వైఎస్సార్ చిత్ర పటం ఉంది.. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన మా గిరిజన గ్రామాల్లో, ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తనూజ రాణి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
-
మహోన్నత నాయకత్వం
విలక్షణ నాయకుడు వై.ఎస్.ఆర్. విపక్షాలు సైతం కొనియాyì న వ్యక్తిత్వం ఆయనది! ఇచ్చిన మాట తప్పని నైజం. ‘పేదల కోసమే పాలన’ అన్నది ఆయన సిద్ధాంతం. అన్నదాతకు ఆపద్బాంధవుడు. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి తెచ్చి, అసమానతలను రూపుమాపిన క్రాంతదర్శి. జన జీవితంతో ఆయన మమేకం అయ్యారు. జయాపజయాలకు అతీతంగా పాలన సాగించారు. ఏం చేసినా అది ప్రజల కోసమే! ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అది ప్రజా సంక్షేమం కోసమే! తెలుగు నేలను సస్యశ్యామలం చేయటానికి జలయజ్ఞం తలపెట్టారు. విశ్వసనీయతే తన సైన్యంగా విమర్శలను తిప్పికొట్టారు. తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ఆదర్శప్రాయుడైన ప్రజా నాయకుడిగా నిలబడ్డారు. నేడు ఆయన జయంతి.అధికారం కోసం వెన్నుపోటుకైనా వెనుకాడని నేతలుండొచ్చు. పదవి కోసం ఎలాంటి వంచనకైనా నిస్సిగ్గుగా సిద్ధపడే పార్టీలుండొచ్చు. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా, జన జీవితంతోనే పెనవేసుకున్న నాయకత్వాన్ని వైఎస్ రక్తంలోనే చూస్తాం. అందుకే వైఎస్ఆర్ అనే మూడక్షరాలు తెలుగువాడి గుండె గొంతుకయ్యాయి. దశాబ్దకాలం దాటినా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోని పున్నమి వెలుగులే పేదవాడి చిరునవ్వుగా మారాయి. ఎంత పెద్ద ఆపదొచ్చినా పెద్దాయన ఉన్నాడనేది వైఎస్ పాలనలో ప్రజలకు ఉన్న నమ్మకం. మాటిస్తే మడమ తిప్పడనేది వైఎస్‌పై జనానికి ఉన్న విశ్వాసం. మేలు చేసేటప్పుడు వైఎస్ రాజకీయాలు చేయడనేది విపక్షాలే ఒప్పుకున్న నిజం. ఓ బ్యూరోక్రాట్‌గా నేను ఆయన్ని దగ్గర్నుంచీ చూశాను. ప్రజల కోసమే బతికిన విలక్షణ నాయకుడే వైఎస్ఆర్లో నాకు కన్పించాడు. కార్యకర్తలే కుటుంబం అనుకున్న గొప్ప వ్యక్తిత్వం వైఎస్‌లోనే చూశాను. దశాబ్దాల రాజకీయ అనుభవం కావచ్చేమో... ప్రజలకు ఏం కావాలో నిక్కచ్చిగా నిర్ణయించే సామర్థ్యం వైఎస్‌కే సొంతం. ఆయన పాలనలో ఎన్నో ఘటనలు... ఇంకెన్నో జ్ఞాపకాలు... మరెన్నో మరపురాని ఘట్టాలు..!విన్నాడు... ఉన్నానని ధైర్యమిచ్చాడు!పాదయాత్ర వైఎస్‌ను పూర్తిగా ప్రజల పక్షానికి చేర్చింది. ఊరూవాడా జనం గుండె చప్పుళ్ళు విన్నాడు. అప్పుడే ‘నేనున్నా’ననే భరోసా ఇచ్చాడు. వాళ్ళ కోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఆయనలో బహుశా అప్పుడే మొదలైందేమో! పాలనలో అది స్పష్టంగా కన్పించింది. పేదవాడికి పెద్ద జబ్బొస్తే ఊపిరి పోవడమే వైఎస్ వచ్చే నాటికి ఉన్న పరిస్థితి. ముద్ద పెట్టే పొలం, తలదాచుకునే ఇల్లు అమ్మేసి వైద్యం చేయించుకునే దయనీయ పరిస్థితి అది. ఇది వైఎస్ మనసును చలించేలా చేసింది. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఈ పరిస్థితే ఉండకూడదని ఆశించారు. చిన్న అర్జీ తీసుకొస్తే చాలు ఎన్ని లక్షలైనా వైద్యం కోసం ఇవ్వాలని ఆదేశించారు. ఇలా రోజుకు రూ. 1.20 కోట్లు ఖర్చయ్యేది. ఇదంతా ఖజానాకు భారం అని బ్యూరోక్రాట్స్ చెప్పబోతే వారించారాయన. ‘పేదవాడి ఆపద తీర్చలేకపోతే ఎందుకయ్యా? బేవరేజ్ మీద సెస్ 1 నుంచి 2 శాతానికి పెంచితే సరిపోదా?’ అంటూ తేలికగా చెప్పేవారు. పనుల్లో బిజీగా ఉండి, రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చినా.. ‘సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులన్నీ క్లియర్ అయ్యాయా?’ అని అడిగేవారు. పేదవాడిపై ఇంత ప్రేమ ఎంతమందికి ఉంటుంది? గ్రేట్ అన్పించేది. ఇలా ఎంతకాలం సీఎం ఆఫీసుకు పేదవాళ్ళు అర్జీలు పట్టుకుని రావాలి? శాశ్వత పరిష్కారం లేదా? వైఎస్ వేసిన ఈ ప్రశ్నల్లోంచే ‘ఆరోగ్య శ్రీ’ పథకం ఆవిర్భవించింది. దీనిపైనా విపక్షాలు విమర్శలు చేశాయి. విషయం ఏమిటంటే విమర్శించిన విపక్ష నేతలే ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం! వాళ్ళే వైఎస్ తమకు ప్రాణ భిక్ష పెట్టారని చెప్పటం!తప్పు చేయను... ఏం చేసినా మీ కోసమే!ఇది వైఎస్ గట్టిగా నమ్మిన సిద్ధాంతం. జలయజ్ఞం పేరుతో భారీగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రతీ ప్రాజెక్టుపైనా విపక్షాలు రాద్ధాంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అనుసరించిన విధానం విపక్షాల నోటికి తాళం వేసింది. ప్రతీ ప్రాజెక్టు దగ్గరకు విపక్ష నేతలను పిలిపించి, వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పే ఏర్పాటు చేయడం వైఎస్ విజ్ఞతకు నిలువుటద్దం. ‘‘నేను తప్పు చేయనయ్యా... ఏం చేసినా ప్రజలకోసమేనయ్యా...’’ అని వైఎస్ చెప్పిన ఈ మాటలను ప్రజలు విశ్వసించారు. కాలగర్భంలో కలిసిన పోలవరం ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసినా... పోతిరెడ్డిపాడుతో వరద జలాలు వాడుకునే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజాభిష్టమే లభించింది. ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ‘ఇక మిమ్మల్ని విమర్శించలేను’ అంటూ జి. వెంకటస్వామి కృతజ్ఞతా పూర్వకంగా అనడం ఇప్పటికీ చాలామంది గుర్తు చేస్తారు. ఒక ప్రాంతం కాదు... ఒక పార్టీ కాదు... ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేసి తీరాల్సిందే అనేది వైఎస్ సిద్ధాంతం. అద్భుతమైన తెలివితేటలుండీ ఆర్థిక ఇబ్బందులతో చదవలేని పేదలకు ఫీజు రీ–ఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన వైఎస్ వల్ల... డాక్టర్లు, ఇంజనీర్లు అయిన పేదవాళ్ళున్నారు. అలా కొత్త వెలుగులు విరజిమ్ముతున్న జీవితాలు ఎన్నో! పేదవాడి నోటికాడికి ముద్ద చేర్చాలన్న లక్ష్యంతో రూ. 5.30 కిలో బియ్యం ధరను రూ. 2కు తగ్గించాలని భావించారు. దీన్ని బ్యూరోక్రాట్స్ వ్యతిరేకించారు. ‘‘మీ అభ్యంతరాలు మీరు చెప్పండి... కానీ ఇది అమలు చేయడం నా బాధ్యత’’ అంటూ... నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ గొప్ప వ్యక్తి వైఎస్ అనడం అతిశయోక్తేమీ కాదు.తిరుగులేని నిర్ణయాలువైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అంతర్జాతీయ పరిణామాల వల్ల మిర్చి ధర ఒక్కసారిగా పడిపోయింది. ఆ సమయంలో మిర్చి రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. జిల్లాల నుంచి అందిన ఈ సమాచారంతో వైఎస్ అప్పటికప్పుడే అధికారులను సమావేశపర్చారు. మార్కెట్లో రూ. 800 క్వింటాలున్న మిర్చిని, రూ.1500కు కొనాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయంతో కొన్ని వేల మంది మిర్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూశాం. ఇలాంటిదే మరో ఘటన. నిజామాబాద్‌లో రైతులు పండించే ఎర్ర జొన్నలు పంజాబ్, హర్యానాలకు సరఫరా అవుతాయి. వీటిని సేకరించే దళారులకు కేజీకి రూ. 12 వస్తే, రైతుకు వచ్చేది రూ. 4. రైతులకు ఎక్కువ ధర చెల్లించే ఓ దళారికి అవసరమైన బ్యాంకు లోన్ ఇప్పించడంలో అధికారులు కాదన్నా, వైఎస్ఆర్ నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేయడాన్ని ఇప్పటికీ అక్కడి రైతులు మరిచిపోరు. మరొక సందర్భం – వైఎస్ఆర్ హయాంలో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రతీ సిలిండర్‌కు రూ. 50 సబ్సిడీ ప్రకటించారు. రూ. 50 సబ్సిడీ ఇవ్వడం మామూలు విషయమేమీ కాదు. ఆర్థిక భారం పడుతుందని అధికారులు, ఆర్థిక మంత్రి చెప్పినా ‘ప్రతీ ఇంట్లో మేలు జరుగుతుంది కదా’ అని తన నిర్ణయంతో ముందుకు వెళ్లారు వైఎస్ఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వేసేప్పుడు స్వపక్షం నుంచే అనేక రకాల ఒత్తిడి వచ్చింది. ఇవేవీ లెక్క చేయలేదు. 150 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును అంత ధైర్యంగా చేపట్టడం వల్ల రాజధాని రూపురేఖలే మారాయి. హైదరాబాద్ విమానాశ్రయం పరిశీలనకు వెళ్ళినప్పుడు ఓ ముఖ్య విషయం ఆయన దృష్టికి వచ్చింది. విమానాల హబ్ ఏర్పాటు వల్ల అనేక రకాల అభివృద్ధి ఉంటుంది, దీనికి టాక్స్‌ను 14 నుంచి ఒక్క శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తి అది. అప్పటికప్పుడే ఆయన దానిపై అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల విమానాశ్రయం ఆర్థిక పురోగతే మారింది.విశ్వసనీయతే ఆయన సైన్యంఇంటిలిజెన్స్ కన్నా ముందే వైఎస్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలిసేది. ఒకసారి గుంటూరు దగ్గర రైలు ప్రమాదం జరిగితే అధికారుల కన్నా ముందే ఆయన అప్రమత్తమయ్యారు. ఆయనే అందరికీ ఫోన్లు చేసి బాధితులకు అండగా ఉండమని చెప్పారు. ప్రతీ ఊళ్ళో ఆయనకు నెట్వర్క్ ఉండేది. ఏ జిల్లాకు వెళ్ళినా కనీసం 40 మంది కార్యకర్తలతో ఆయన విడిగా మాట్లాడేవారు. ఏ అర్ధరాత్రయినా ఆయనకు వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు. విషయం చెప్పేవాళ్లు. ఆయన కూడా వినేవాడు. దీంతో కచ్చితమైన సమాచారం వచ్చేది. చుట్టూ ఉన్న కోటరీపై ఆయన ఎప్పుడూ ఆధారపడేవాడే కాదు. ఎంత పెద్ద ఆందోళన జరిగినా రైతులు, ప్రజలపై తుపాకులు ఎక్కు పెట్టొద్దని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేవాడు. నిజామాబాద్‌లో ఎర్రజొన్నల వివాదం సందర్భంగా, ముదిగొండలో కాల్పుల సందర్భంగా... ‘రైతులకు ఏమైనా జరిగిందా?’ అంటూ ఆయన పడ్డ కంగారు మాటల్లో చెప్పలేనిది. విపక్ష నేతలను అసెంబ్లీలోనూ పేర్లు పెట్టి పిలిచే స్వతంత్రం... చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా– మళ్ళీ సెక్యులర్ మాటలు చెప్పినా తేలికగా కొట్టిపారేసే ధైర్యం... ఓడిపోయినా ప్రతీ క్షణం ప్రజా క్షేత్రంలోనే ఉండే గొప్ప నైజం... వైఎస్ ఉన్నతిని పెంచాయి. ఈనాటికీ ఏ నేతకూ లేని ప్రజాదరణను తెచ్చి పెట్టింది. వైఎస్ మన మధ్య లేకపోవచ్చు. సడలని విశ్వాసం... చెదిరిపోని ప్రజల కలల స్వప్నంలో పథకాల రూపంలో ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి(వై.ఎస్.ఆర్. సీఎంగా ఉన్నప్పుడు సీఎంవో కార్యదర్శి)
-
మెల్బోర్న్లో వైఎస్సార్ జయంతి.. వర్చువల్‌గా హాజరైన కాకాణి, మోదుగుల
మెల్బోర్న్: ప్రజల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తే.. తండ్రిని మించి పాలనను వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు వర్చువల్‌గా హాజరయ్యారాయన. ‘‘వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. అయితే వైఎస్ జగన్ తండ్రిని మించిన పాలన అందించారు. వ్యవసాయం, విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదు’’ అని కాకాణి అన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం. వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచిన కుటుంబాలకు కృతజ్ఞతలు. ప్రజాసేవకులుగా ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా.. అండగా నిలుస్తాం. ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటాం. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో.. జూమ్ కాల్ ద్వారా పార్టీ నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక.. వైఎస్సార్ జయంతి సందర్భంగా మెల్బోర్న్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, మరియు నాగార్జున పాల్గొన్నారు.
-
మరపురాని మహానేత వైఎస్సార్.. ది లెజెండ్
వైఎస్సార్ .. ఆ పేరు వినపడగానే తెలుగునేల మీద ప్రతి గుండె స్పందిస్తుంది. మహానుభావుడు.. అంటూ ఆయన జ్ఞాపకాలను తడుముకుంటుంది. మరపురాని మహానేత వైఎస్సార్.. ది లెజెండ్. 2009.. సెప్టెంబర్ 2. ఒక దుర్దినం. తెలుగుజనం గుండెమీద బండ పడ్డ దినం. నిరంతరం తమ గురించి, తమ మేలు గురించి ఆలోచించే ఓ పాలకుడిని కోల్పోయిన రోజు. పదమూడేళ్లు గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఆ రూపం చెదిరిపోలేదు. ఆ నవ్వుల రేడు...సంక్షేమసారధి లేడుగానీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయాడు. జోహార్ వైఎస్సార్. వర్షం గురించి కలవరించే మనిషి. ఊరూరా వర్షం లెక్కలు వేసుకునే ముఖ్యమంత్రి. జలసిరులతో పంటలు బాగా పండాలని, రైతన్నల గడపల్లో సంతోషం వెల్లివిరియాలన్నది నిరంతర తపన. వైఎస్సార్ దగ్గర పనిచేసిన అధికారులు తరచూ గుర్తు చేసుకునే విషయమిది. వర్షం పడుతుంటే కిటికీ పక్కన చేరి హర్షాతిరేకం ప్రకటించే వైఎస్సార్ కన్నా రైతుబంధువు ఎవరుంటారు? పదమూడేళ్ల క్రితం ఆ సెప్టెంబర్ 2న కూడా అదే రోజు. మేఘాలు పట్టాయి. రాజన్న ప్రజాబాట పట్టారు. రచ్చబండలో ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకోవాలని బయలు దేరారు. వర్షం మొదలయిందో.. ముందే దుశ్శకునం పలికిందో ఆకాశం భోరుమంది. వైఎస్సార్ పయనిస్తున్న హెలికాప్టర్ పావురాలగుట్టలో కూలింది. అంతా అన్వేషణ. రాజన్న తిరిగొస్తాడన్న ఆశ. ఆయన రాలేదు. తిరిగిరాని లోకాలకు మరలిపోయిన రాజన్న ఇక లేడన్న చేదునిజం భరించడానికి వేలాది గుండెలకు సాధ్యం కాలేదు. ఆ దుఃఖసాగరంలోనే మునిగిపోయిన జీవితాలెన్నో... గుండెలాగిపోయిన బతుకులెన్నో.. కాలం ఆగిపోలేదు. కదలిపోతూనే వుంది. పదమూడేళ్లపోయినా రాజన్న స్మృతులు చెరిగిపోలేదు. ఎక్కడ సంక్షేమ ఫలాలు అందుతున్నా. ఎక్కడ అభివృద్ది జాడలు కనిపించినా...ప్రాజెక్టులు కనిపించినా రాజన్న పేరే తలపుకొస్తుంది. తన ముందు తన తర్వాత కూడా ఏ నాయకుడూ తలపెట్టలేనని పథకాలను ప్రవేశపెట్టిన ఆ ఘన చరిత్ర చరిత్ర పుటల్లో చెరగని ముద్ర. రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైయస్ రాజశేఖరరెడ్డిది బలమైన ముద్ర. ఆయన జీవితం ప్రజలతో ముడిపడిపోయింది. అది విడదీయలేని బంధం. అంతే కాదు, వైఎస్సార్ హయాంలో ప్రతి పేదకుటుంబానికి జరిగిన మేలెంతో ఉంది. అటు విద్యారంగంలోనూ, ఇటు వైద్యరంగంలోనూ, వ్యవసాయరంగంలోనూ వైయస్సార్ ప్రజలకు చేసిన మేలెంతో! హిమగిరి ఎవరెస్టే అందుకు ప్రామాణికం. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం అన్నది.. వైఎస్సార్ జీవనసిద్దాంతం. అందుకు అనుగుణంగానే ఆయన జీవించారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. సువిశాల ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కలవరించి, పలవరించారు. రాష్ర్టరూపురేఖలను తీర్చిదిద్దే క్రమంలో నిరంతరం శ్రమించారు. హరితాంధ్రప్రదేశ్‌ను స్వప్నించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కోసం అద్భుతాలు చేశారు. ఆదర్శాంధ్రప్రదేశ్ సాధనలో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ దార్శనికుడు. పేదబిడ్డల పెద్దచదువులకు పేదరికం అడ్డు కాకూడదని వైయస్..తన పాదయాత్ర దారిలోనే సంకల్పించారు. చదువులు చదివితే..ఉద్యోగాల్లో స్థిరపడితే, ఆ పేదింట తలరాతే మారిపోతుందన్నది ఆయన దార్శనికత. ఆలోచనను అద్భుతరూపంలో తీర్చిదిద్దారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేదింటబిడ్డల పెద్దచదువులకు దీపం వెలిగించారు. వైయస్సార్ హయాంలో లక్షలాది మంది పేదింటబిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. తమ తలరాతలే మార్చుకోవడమే కాదు, కుటుంబాల తలరాతలు మార్చారు. ఆ పథకం లబ్దిపొందిన కుటుంబాల్లో నేటికీ వైయస్సార్‌ను తలచుకోనిదే పొద్దుగడవదు. ఆ మహానుభావుడి చలవే ఇదంతా.. అన్నది లబ్దదారుల గడపల్లో ఓంకారమైన ధ్వనిస్తుంటుంది. నిరుపేదల సంజీవని రాజీవ్ ఆరోగ్యశ్రీ. అనారోగ్యం ఎవరికైనా ఒకే విధమైన బాధ కలిగిస్తుంది. కానీ పేదవాడికి అది పెనుశాపమై పీడిస్తుంది. వైయస్‌కు ముందు పేదల అనారోగ్యబాధల గురించి పెద్దగా ఆలోచించిన నాయకులు లేరు. బీద,బిక్కి, అనారోగ్యం పాలైతే ఆదుకునే నాథుడే కరువయ్యారు. ఒక డాక్టర్‌గా రోగి బాధ తెలిసిన డాక్టర్ రాజశేఖరరెడ్డి, పేదలకు ఆరోగ్యభద్రతపై శ్రద్దపెట్టారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట బీదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ధనవంతులతో సమానంగా కార్పొరేటు స్థాయి ఆస్పత్రులలో ఉచితంగా వైద్యసౌకర్యాలు అందగలిగాయి. ఆ పథకం ద్వారా నాడు.. నేడు లబ్దిపొందిన.. పొందుతున్నవారు లక్షలాదిమంది. లక్షలాది కుటుంబాలకు అది పెద్ద భరోసా. ఆపదలో ఆపన్నహస్తంలా 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, నడిచే వైద్యశాలగా 104 మొబైల్ ఆస్పత్రులు అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్సార్ విప్లవాత్మక పథకాలు అనితరసాధ్యమైనవి. అసలు సిసలు ప్రజానాయకుడి మాత్రమే వచ్చే ఆలోచనలవి. ఇలా ప్రజాజీవితాల్లో.. మరీ ముఖ్యంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపే పథకాలెన్నో వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్నవే. ప్రజాసంక్షేమమే శ్వాసగా జీవించినవాడు వైఎస్సార్.. ఆయన రాజకీయాల్లో వేసిన ప్రతి అడుగూ.. ఆ దిశగానే సాగాయి. ముఖ్యమంత్రిగా ఆయన తెచ్చిన సంక్షేమపథకాలు, చేసిన అభివృద్ది పనులు గుర్తు చేసుకుంటే.. ఇదంతా మరొకరి వల్ల సాధ్యమయ్యేదేనా? అనిపించకపోదు. ప్రజాసేవలో అనుక్షణం తపించిపోయిన వైయస్సార్ సంకల్పబలం ఆయనకు మాత్రమే స్వంతమైనది. ఎన్నెన్ని పథకాలు.. ఊరువాడా, పట్టణాల తలరాతలు మార్చేశాయో! రాజశేఖరుడు జననేత. వారికేం కావాలో ఆయనకు తెలుసు. ప్రజల సమస్యలు ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. అందుకే, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై దృష్టి సారించారు. ప్రజాసంక్షేమమే శ్వాసగా పరిపాలన సాగించారు. అరకొరగా పథకాలను అమలు చేయడం కాకుండా.. సంతృప్తస్థాయిలో అందరికీ అన్నీ ఇవ్వాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగారు. ముఖ్యమంత్రిగా ఆయన తొలిసంతకం ఉచితవిద్యుత్తు, విద్యుత్ బకాయిల మాఫీపై సంతకం చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు తొమ్మిదేళ్ల కరవు నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకున్నారు. ఆ పాఠాలతోనే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను ఒడిసి పట్టి రిజర్వాయర్లలో నిలిపితే, కరవు సమయంలో రైతన్నలను ఆదుకోవచ్చనే ఉద్దేశంతో, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో 81 ప్రాజెక్టులను నిర్మించి, కోటి ఎకరాలకు నీరందంచాలన్నదే ఈ అపరభగీరధుడి లక్ష్యం. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆయన ఇచ్చిన వరం పావలా వడ్డీ. మొదట స్వయం సహాయక సంఘాల మహిళలకే ఈ పధకాన్ని ఇచ్చినా, ఆ తర్వాత రైతులతో పాటు వివిధ వర్గాలకు కేటాయించారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానన్నది రాజన్న లక్ష్యం. మహిళల ఆర్ధికస్వావలంబనే కుటుంబాల వెలుగు అన్నది ఆయన ఆలోచన. అలాగే ఏ ఆసరాలేని వృద్దులు, వితంతువులు, వికలాంగులు..ఇలా దాదాపు 70లక్షల మందకి ఫించను పథకాన్ని విస్తరించడమే కాదు, నెలనెలా అందేలా చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ ,మహిళలకు అభయహస్తం. నిరుపేదలకు రూ.2కే కిలోబియ్యం ఇలా ఎన్నెన్నో పథకాలు విజయవంతంగా అమలు చేసిన వైయస్సార్‌ను ఒకే ఒక్కడు అనక తప్పదు. కలలు అందరూ కంటారు. కానీ అవి సాకారం అయ్యేలా శ్రమించడం కొందరే చేస్తారు. ముఖ్యమంత్రిగా వైయస్సార్ ఐదేళ్ల పాలనా కాలం పాలకులకుల ఆదర్శప్రాయం. రాజశేఖరరెడ్డికి ప్రజల మనసు తెలుసు. ప్రజలకు ఏం కావాలో తెలుసు. అభివృద్ది ఎంత అవసరమో తెలుసు. దానికోసం ఏ స్థాయిలో కృషి చేయాలో తెలుసు. సమర్ధపాలనకు వైయస్సార్ కేరాఫ్ అడ్రస్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షనేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేశస్థాయిలో గుర్తింపు పొందారు. ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేయించాలో చాటి చెప్పిన రాజకీయ నాయకులలో వైయస్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతిపక్షనేతగా వైయస్ ప్రజల హృదయాల్లో నాటుకొనిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వైఎస్సార్ జనహృదయనేత.. జనహృదయాలను గెలిచిన నేతలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అనేందుకు వైఎస్సార్ ఓ ఉదాహరణ. ఆయన ఓ లెజెండ్ ఆఫ్ పాలిటిక్స్. ముఖ్యమంత్రిగా ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా ఆయనది ఒకే తీరు. ప్రజాసమస్యల పరిష్కారమే ఆయన ప్రధాన ఎజెండా. అనాథలను, అభాగ్యులను ఆదరిస్తూ...అభివృద్ది ఫలాలకు నోచుకోని మట్టిబిడ్డల అభివృద్దే లక్ష్యంగా పనిచేసిన జనహృదయనేత వైయస్సార్. మిన్ను విరిగి మీద పడ్డా భయపడని ధృఢమైన వ్యక్తిత్వం వైఎస్ రాజశేఖరరెడ్డిది. నమ్మినవారికి ప్రాణాలు అడ్డువేసే ఆయన వ్యక్తిత్వమే కార్యకర్తల్లో, నాయకుల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ తెచ్చింది. అత్యంత జనాకర్షణ ఉన్న నేతగాపేరు సంపాదించిపెట్టింది. పేదలు, రైతులు, చేను, చెట్టు, మట్టి, గ్రామీణం, వ్యవసాయం ఇవి వైయస్‌కు ఇష్టమైన పదాలు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్తులకు పెద్ద చదువులు, ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందచేసిన నిజమైన విద్యాధికుడు, డాక్టర్ వైయస్సార్. రెండురూపాయల బియ్యం, వృద్దులకు, వికలాంగులకు నెలనెలా పెన్షన్లు, అర్హులందరికీ తెల్లకార్డులు, బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన అండదండలు, అన్నింటికీ మించి ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్న చిత్తశుద్ది, నిబద్దత తిరిగి రెండోసారి అధికారాన్ని తెచ్చిపెట్టాయి. విలువలు, విశ్వసనీయతలే ప్రాణంగా... రైతులు, సేద్యం, పేదలు, అభివృద్ది ప్రాతిపదికగా సాగిన వైఎస్ పాలనకు వరుణుడు మనసారా సహకరించారు. ఐదేళ్లు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మనుషుల్ని ప్రేమించడమెలాగో వైఎస్‌కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. అది ఆయనకు సహజంగా అబ్బిన గుణం. మాటంటే మాటే. పోరాటమంటే పోరాటమే. అంతే....ధైర్యం, సాహసం, పట్టుదల, రిస్క్ తీసుకోవడం, ఆలోచనలతో తాత్సారం చేయకపోవడం.. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడం, జనాన్నినమ్మడం లాంటి ప్రతేక లక్షణాలకు పెట్టింది పేరు.. వైఎస్సార్. నేను ఏ నాటికైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలను. ఆ విశ్వాసం నాకుంది అని.. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి రోజుల్లోనే వైఎస్సార్ ఎక్కువగా అంటూ వుండేవారట. ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలని స్వప్నించిన వైఎస్.. అందుకనుగుణంగా ప్రణాళికలు ఏర్పరచుకోవడం మొదలెట్టారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం అలవరచుకున్నారు. ఊరికే కలవడం కాదు, వారి కష్టసుఖాలు తెలుసుకోవడం, తనకు వీలయినంత సాయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజాసమస్యలపై నిజాయితీగా పోరాడాలన్న సిద్దాంతం వైయస్సార్‌ది. ఆ విషయంలో రాజశేఖరుడి చిత్తశుద్దిని శంకించలేనిది. మండుటెండాకాలంలో నాటి వైయస్సార్ పాదయాత్ర ఆయన్న జనహృదయాలకు మరింత దగ్గర చేసింది. అది కరువు కాలం. రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఆత్మహత్యల స్థాయి దాటి ఆకలిచావులు ముంచుకొచ్చాయి. గ్రామీణులు, రైతులు, రైతు కూలీలు, చేతివృత్తులవారు, నిరుపేదలు, నిరుద్యోగులు, చిన్నచిన్న వ్యాపారులు..ఇలా అన్ని వర్గాలు, రకరకాల పీడలు, పీడనల్లో నలిగిపోయాయి. సంప్రదాయ గ్రామీణ ఆర్ధికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. మొత్తానికి పల్లెలు కన్నీరు పెడుతున్న వేళ వైయస్సార్ పాదయాత్రికుడయ్యారు. 1400కిలోమీటర్లకు పైగా నడిచారు. ఆ కష్ణకాలంలో ప్రజలకు నేనున్నానన్న భరోసానిచ్చారు. అధికారంలోకి రాగానే ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేస్తానని శపథం చేశారు. వైయస్సార్‌ను జనం నమ్మారు. ఆయన్ను, ఆయన పార్టీని 2004లో అఖండ మెజారిటీతో గెలిపించారు. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ ప్రజలకు చేయని మేలంటూ లేదు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ వెంటే నిలిచారు జనం. అన్ని రాజకీయపార్టీలు ఒక్కటైనా, ఒకే ఒక్కడుగా వైఎస్సార్ తన పార్టీని గెలిపించారు. రెండోసారి వైయస్సార్ ముఖ్యమంత్రి కావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఆ తర్వాత వందరోజుల పాటే ఆయన పాలన సాగింది. విశాలాంధ్రప్రదేశ్ అదృష్టం అక్కడితో ఆగింది. వైఎస్సార్‌లాంటి ప్రజలమనిషి, ఆత్మీయమూర్తి అరుదుగా ఉంటారు. నూటికో..కోటికో ఒక్కరు అంటారే, అలాగన్నమాట. వ్యవస్థ ఏదైనా కావచ్చు. పాలకుడి విధానాల్లో స్పష్టత, ఆచరణలో చిత్తశుద్ది ఉంటే ప్రజల జీవన స్థితి ఎలా మెరుగుపడుతుందో అన్నదానికి, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలన ఓ ఉదాహరణ. ఆయన దూరదృష్టి, దార్శనికత భవిష్యత్తుకు మార్గదర్శి. ఆయన మహానాయకుడు. మరిచిపోలేని మన రాజన్న చిరస్మరణీయుడు.
-
ఆపదొస్తే నేనున్నా.. మనసున్న మారాజు మా రాజన్న
జననేత వైఎస్సార్ ఏ నాయకుడైనా దశాబ్దాల తరబడి ప్రజల మనసులలో గూడు కట్టుకుంటే ఆయన గొప్ప నాయకుడు అవుతారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనసులలో తన తండ్రితో పాటు తను గుర్తుండిపోవాలని కోరుకుంటుంటారు. నిజమే! జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల స్మృతిలో ఎలా ఉండిపోగలిగారు? ఒక ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు కారణమా? ఆయనలోని మానవత్వ కోణం కారణమా? తనను కలిసి సాయం అభ్యర్ధించినవారందరికి ఏదో రూపంలో సహాయపడాలని భావించే వ్యక్తి కావడం కారణమా? వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా అనేక రూపాలలో జనం గుండెల్లో నిలిచిపోయారు. ఆయన ప్రాతినిద్యం వహించిన రాజకీయ పార్టీపై భిన్నాభిప్రాయం కలిగినవారైనా, ఆయన వ్యక్తిత్వం గురించి పాజిటివ్ గా మాట్లాడుకోవడం గొప్ప విషయం అని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకువచ్చిన కొన్ని స్కీములు చిరకాలం నిలిచిపోయాయి. ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు సైతం వాటిని కొనసాగించవలసి రావడమే వాటి గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు అప్పట్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ను ఆయన ప్రతిపాదించి అమలు చేసినప్పుడు తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు ఖర్చు పెడితే సరిపోతుందని వాదించేది. పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం కాని వైఎస్ ఆర్ పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని తలపెట్టి ఆ స్కీమ్ ను కొనసాగించారు. అప్పట్లో కొన్ని సన్నివేశాలను మాబోటి వాళ్లం చూసి ఆశ్చర్యపోయామంటే అతిశయోక్తి కాదు. ఒకసారి ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తూ అక్కడే ఉన్న మెడికల్ షాప్ కు వెళ్లాను. అక్కడ ఒక పేద వృద్దురాలు ఒక కార్డును కౌంటర్ లో ఇచ్చి కొన్ని మందులు తీసుకుంది. ఇంత వృద్దురాలు, అంతగా చదువు లేని ఈ మనిషి ఇంత పెద్ద ఆస్పత్రికి ఎలా వచ్చిందా? అన్న ఆసక్తి కలిగి ఆరా తీశాను. వైఎస్ ప్రభుత్వం అందించిన ఆరోగ్యశ్రీ కార్డు ఆధారంగా ఆమె వచ్చి డాక్టర్ కు చూపించుకుని మందులు కూడా తీసుకువెళుతోంది. ఆ రకంగా నిరుపేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నేతగా వైఎస్ ఆర్ నిలిచిపోయారు. (చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్) బాబుకు ఆనాడే చెప్పారు ఆయనకు నీటిపారుదల ప్రాజెక్టులంటే ప్రాణం. ఈ మాట ఏదో ఇప్పుడు చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఒకసారి హైదరాబాద్ జూబ్లిహాల్ లో ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం జరిగింది. లోక్ సభ సభ్యుడిగా అప్పట్లో వైఎస్ ఉండేవారు. ఆ సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ పోలవరం తదితర భారీ ప్రాజెక్టులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ, అలా చేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతావని హెచ్చరించారు. అయినా చంద్రబాబు ఆ మాటను సీరియస్ గా తీసుకోలేదు. కాకపోతే ఎన్నికల ముందు ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటూ హడావుడి చేసేవారు. 1999 ఎన్నికల తర్వాత వైఎస్ శాసనసభలో ప్రతిపక్ష నేత అయ్యారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో వైఎస్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు వేసిన శంకుస్థాపన రాళ్ల వద్ద పూలు పెట్టి నిరసన తెలిపేవారు. తదుపరి 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ప్రాదాన్యత క్రమంలో ఇరిగేషన్ కు సంబందించి ఒక అధికారిక సమావేశం మంత్రులతో నిర్వహించారు. ఆ సందర్భంగా శర్మ అనే సీనియర్ ఐఎఎస్ అధికారి ఉండేవారు. ఆయన ఆ సమావేశంలో ఒక నివేదిక ఇచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. నలభైఆరువేల కోట్ల రూపాయల వ్యయం చేస్తే ఇరవైతొమ్మిది ప్రాజెక్టులను చేపట్టవచ్చని వివరించారు. అప్పట్లో జెసి దివాకరరెడ్డి కూడా వైఎస్ క్యాబినెట్ లో ఉండేవారు. ఇంత పెద్ద నివేదికను చంద్రబాబుకు చూపించలేదా అని అడిగారు. దానికి ఆ అధికారి సమాధానం ఇస్తూ తాము చూపించామని, కాని అంత ఆసక్తి కనబరచలేదని, దాంతో దానిని పక్కనపెట్టామని చెప్పారు. ప్రభుత్వం చూపే శ్రద్దను బట్టే తాము నివేదికలు ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇది వాస్తవమే. చంద్రబాబు సి.ఎమ్. గా ఉన్న రోజుల్లో పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల గురించి ఎవరైనా అడిగినా సీరియస్ గా తీసుకునేవారు కారు. అవి అయ్యే ప్రాజెక్టులు కావని ఆయన భావించేవారు. ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని వైఎస్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేశారు. ఆ రోజు అధికారిక సమావేశం నుంచి బయటకు వచ్చి లిప్ట్ లో కిందకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న పాత్రికేయులను ఆయనే వాట్ సర్ అంటూ పలకరించారు. (చదవండి: అన్నదాత కలల పండుగ!) అలా మాట్లాడడం ఆయనకు అలవాటు. ఆ క్రమంలో నా వద్దకు కూడా ఆయన వచ్చారు. పోలవరం, పులిచింతల పూర్తి చేస్తారా? సార్ ? అని నేను ప్రశ్నించాను. అవును చేసి చూపిస్తాం సార్ అని జవాబు ఇచ్చారు. అదే విషయాన్ని ఆ తర్వాత తిరుపతి మీడియా సమావేశంలో కూడా వెల్లడించారు. పట్టు వదలని వైఎస్సార్ అయినా అవి అంత తేలికగా అవుతాయా అన్న సంశయం ఉండేది. కాని వైఎస్ ఆర్ మాత్రం పట్టు వదలిపెట్టలేదు. చంద్రబాబు టైమ్ లో పులిచింతల ప్రాజెక్టును నల్గొండ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నేతలు వ్యతిరేకించేవారు. దాంతో ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టిడిపి నేతలు ఈ ప్రాజెక్టు గురించి అడిగినా, ఇప్పుడు మాట్లాడవద్దంటూ వారిని వారించేవారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం సంబంధిత నాయకులను పిలిచి మాట్లాడి ఎవరైనా సహకరించాల్సిందేనని స్పష్టం చేసి పనులు ఆరంభించారు. అదే ఈరోజు కృష్ణా,గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు వరదాయిని అయింది. ఈ ఏడాది జూన్ మొదట్లో ఆశించిన మేర వర్షాలు పడలేదు. అయినా పులిచింతల ప్రాజెక్టులో నిల్వచేసిన నీటిని సాగునీటి అవసరాలకోసం ప్రభుత్వం విడుదల చేయగలిగింది. మహానేత ముందు చూపు పోలవరం ప్రాజెక్టు ఈ రోజు ఈ స్వరూపం సంతరించుకోవడానికి కారణం వైఎస్ ఆర్ అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఆయన పోలవరంపై అఖిలపక్షం పెట్టి దాని ఆనుపానులను చర్చించారు. అంతేకాదు. ఖమ్మం జిల్లాలో, పశ్చిమగోదావరి జిల్లాలో ముంపు ప్రాంతవాసులకు, నిర్వాసితులకు అప్పట్లో మంచి ప్యాకేజీ ప్రతిపాదించి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత కేంద్రం నుంచి ప్రాజెక్టుకు రావల్సిన అనుమతులు సంపాదించడంలో నిర్విరామకృషి చేశారు. అవన్ని ఒక రూపానికి వచ్చిన దశలో, ప్రాజెక్టు పనులు ఆరంభించబోయే టైమ్ కు ఆయన దురదృష్టవశాత్తు కన్నుమూశారు. అయినా ఆయన కలలు కన్న పోలవరం ఇప్పుడు సాకారం అవుతోంది. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా రాష్ట్ర విభజన సమయంలో ఒప్పుకోవడానికి అప్పటికే అన్ని అనుమతులకు ఓకే కావడం కూడా కారణం అని చెప్పాలి. అప్పట్లో పోలవరం కుడి, ఎడమ కాల్వల తవ్వకం చేపట్టి విశాలమైన కాల్వలను నిర్మించారు. ప్రాజెక్టు లేకుండా కాల్వలేమిటని అప్పట్లో టిడిపి విమర్శించేది. కాని వైఎస్ దూరదృష్టి ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు టైమ్ లో పట్టిసీమ లిప్ట్ ను చేపట్టగలిగారంటే దానికి కారణం వైఎస్ తవ్వించిన కాల్వే. ఈ రోజుల్లో ఈ కాల్వలకు భూ సేకరణ చేయాలంటే ఎంతో కష్టం అయ్యేది. ఈ రకంగా ఆయన చేసిన మేలును విభజిత ఆంద్రప్రదేశ్ ఎన్నటికి మరవదు. అదే కాదు. వెలిగొండ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ.. వాటన్నిటిపై ఎన్నో రకాలుగా విపక్షాలు అడ్డు తగలడానికి ప్రయత్నించినా ఆయన లెక్క చేయలేదు. అవే ఇప్పుడు ఎపికి ప్రాణపదంగా మారాయి. హైదరాబాద్ అభివృద్దికి అవుటర్ రింగ్ రోడ్డు ఎంతగా ఉపకరిస్తోందో చెప్పనవసరం లేదు. దానికి పునాదిరాయి వేసింది వైఎస్ ఆరే. భూ సేకరణ జరిపించింది ఆయనే. ప్రధానిని ఒప్పించిన వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని వాదించి ఆనాటి ప్రధానిని ఒప్పించిన ఘనత కూడా వైఎస్ దే. చంద్రబాబు నాయుడు టైమ్ లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం నిర్మించి మొత్తం హైదరాబాద్ నగరాన్ని తానే కట్టానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ హయాంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో సహా అనేక ఐటి పరిశ్రమలు ఆయన టైమ్ లో వచ్చాయి. కాని కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో విఫలం అయింది. అంతేకాక సోనియాగాంధీ మాట వినలేదన్న కక్షతో ఏకంగా వైఎస్ కుమారుడైన జగన్ స్థాపించిన పరిశ్రమలలో పెట్టుబడులపై పిచ్చి ఆరోపణలతో కేసులు పెట్టించి జైలులోకూడా నిర్భందించారు. దాని ఫలితమే ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది. రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారం లేకుండా పోయింది. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావాలని చాలా కష్టపడుతోంది. ఎపిలో అయితే ఆ ఆశ కూడా లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పట్టణాలలో రాజీవ్ గృహకల్ప వంటి స్కీములు చేపట్టారు. జిల్లా కేంద్రాలన్నిటిలో రోడ్లకు ఒక షేప్ తెచ్చి అందంగా తయారు చేయించడంలో ఆయన ప్రభుత్వ కృషి ఎంతగానో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అడిగితే కాదనని నేత వ్యక్తులుగా తనను కలిసినవారిపట్ల ఆయన ఎంతో ఆదరణ చూపించేవారు. ఉదాహరణకు పులివెందుల నుంచి నీరుకావి పంచె కట్టిన ఒక సామాన్య రైతు వచ్చి సెక్రటేరియట్ లో వైఎస్ ను కలిశారు. ఆయన తన ఇంటిలో పెళ్లికి ఆర్ధికసాయం అడిగారు. వెంటనే వైఎస్ ఎవరికో పోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఒక స్టార్ హోటల్ వద్దకు వెళ్లి డబ్బు తీసుకోవాలని సిబ్బంది చెప్పారు. ఆ రైతు అక్కడకు వెళ్లారు. ఆయన వెళ్లి ఒక పారిశ్రామికవేత్తను కలిసి సార్ వెళ్లమన్నారని చెప్పగా ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ఈ వ్యక్తికి ఐదు లక్షలు ఇవ్వడమా అని అనుకున్నారు. అసలు ఎందుకు ఈ డబ్బు వాడాలని అనుకుంటున్నది అడిగాడు. దానికి తన ఇంటిలో పెళ్లి గురించి ఆ రైతు చెప్పగానే చాలా సంతోషంగా ఆ పారిశ్రామికవేత్త డబ్బు అందచేశాడు. ఈ విషయాన్ని ఆ తర్వాత రోజుల్లో ఒక ప్రముఖుడు నాకు చెప్పారు. ఇలా ఒకటికాదు. ఉదయాన్నే ప్రజాదర్బార్ లో విన్నపాలు ఇవ్వడానికి వచ్చేవారందరిని పలకరించి వారి సమస్యలు వినేవారు. ఒకసారి ఒక వ్యక్తిని చూసి ఇదేమిటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగారు. మిమ్మల్ని కలవడానికే వచ్చానని అతను చెప్పారు. వెంటనే ఆయనను క్యాంప్ ఆఫీస్ లోని ఒక గదిలో కూర్చోబెట్టమన్నారు. దర్బార్ ముగిసిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆయన ఆర్దికసాయం కోసం వచ్చారు. ఆ వివరాలు తెలుసుకుని తను చేయదగిన సాయం చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే వైఎస్ కు క్లాస్ మేటే. తెనాలి నుంచి వచ్చిన ఆయనను అంత ఆదరంగా చూసి పంపించారు. ఇలా ఎన్నో ఘట్టాలు వైఎస్ చరిత్రలో ఉన్నాయి. ఆ 30 సీట్లు ఎంతో కీలకం ఇక రాష్ట్ర విభజనపై ఆయన అభిప్రాయాలు అందరికి తెలిసినవే. అందులో రాజకీయ కోణాలు ఎలా ఉన్నా, వైఎస్ జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నది ఎక్కువ మంది నమ్మకం. 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి మొత్తం బాధ్యతను తన భుజ స్కందాల మీద వేసుకుని పార్టీని గెలిపించారు. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రాగలిగిందంటే ఎపి నుంచి వచ్చిన ముప్పైకి పైగా లోక్ సభ సీట్లు ఎంత కీలకం అయ్యాయో చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ కి వచ్చేసరికి కాంగ్రెస్ కు 156 సీట్లే వచ్చాయి. అధికారం వచ్చినా ఆ సీట్ల సంఖ్య తనకు సంతృప్తి కలిగించలేదు. అందుకే తనకు ప్రజలు పాస్ మార్కు మాత్రమే ఇచ్చారని, వచ్చేసారి ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేలా పాలన చేస్తానని నిజాయితీగా తన అభిప్రాయాన్ని వైఎస్ ఆర్ చెప్పారు. ఒక నేత లేకుంటే రాష్ట్రం ఎన్ని గండాలను ఎదుర్కుంటుందో చెప్పడానికి ఆ రోజుల్లో చాలా మంది వైఎస్ లేని లోటు గురించి ఉదహరించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ప్రస్తుతం విభజిత ఎపిలో అంతకు మించిన పాలన అందించడమే కాదు. వైఎస్ ఆర్ ను నిత్యం జనం గుండెల్లో ఉండేలా చేస్తూ, ఆయన జయంతిని ఒక పండగలా మార్చారు. ఏ కుమారుడు తన తండ్రికి ఇంతకన్నా గొప్ప నివాళి అర్పించలేడని రుజువు చేసుకుంటున్నారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
-
వైఎస్సార్.. తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
ఆ పేరే ఒక స్ఫూర్తి వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తూ.. రూ.1,100 కోట్ల సేద్యపు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి.. వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. రూ.లక్ష కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి.. ఐదేళ్లలోలోనే 41 ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించి.. 3 పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చిన ప్రగతిశీలి. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పిన ఆర్థికవేత్త. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత.. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు వైఎస్సార్సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలే. ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ రుణాలు, అర్హులందరికీ ఇళ్లు వంటి విప్లవాత్మక పథకాలు.. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. మహానేత మరణించి 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన చిరస్మరణీయుడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు జీవం అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైఎస్సార్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను, అటు కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాదయాత్రలో ఇచి్చన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు. వైఎస్సార్ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం.ప్రజారోగ్యం, విద్యకు పెద్దపీట⇒ 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను విడుదల చేశారు. ఆ సమయంలో పేదలు పడిన వేదన గమనించారు. జబ్బునపడ్డ పేద కుటుంబాలు ఆ ఆపత్కాలంలో సహాయం కోసం సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచి్చంది. 108, 104 అంబులెన్స్ సరీ్వసులను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్‌ను చేపట్టింది. ⇒ కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతోసహా 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు. ⇒ కొన్ని ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం సంచలనం సృష్టించింది. మన రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా పొదుపు సంఘాల (డ్వాక్రా) వ్యవస్థలో విప్లవం తీసుకొచి్చంది. ⇒ 2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైఎస్సార్ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధన ప్రవాహం కొనసాగేలా చేశారు. 2009 ఎన్నికల్లోనూ మరోసారి రాష్ట్రంలో, కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ⇒ పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదువులు దక్కేలా చేశారు⇒ పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. శ్రీసిటీ సెజ్తోసహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడంలో భాగంగా గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి.
-
మార్గనిర్దేశకుడు వైఎస్సార్.. ఆ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలుగా..
దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే. దానిని 2004, మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన ప్రారంభించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే. దానిని 2004, మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన ప్రారంభించారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నత విద్యను పేదలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అమలుచేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తొలుత శ్రీకారం చుట్టిందీ వైఎస్సే. పాలకులకు వైఎస్ రాజశేఖరరెడ్డి టార్చ్‌బేరర్‌గా నిలిచారనడానికి ఈ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలు. ఆ మహానేత భౌతికంగా దూరమై నేటికి సరిగ్గా 13 ఏళ్లు. సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పనిచేసింది కేవలం ఐదేళ్ల మూడు నెలలే. కానీ, ఆ కొద్దికాలంలోనే తెలుగునేల ఆయన్ను కలకాలం గుర్తుంచుకునేలా సుపరిపాలన అందించారు. పాలనకు మానవత్వాన్ని జోడించి పాలకుడంటే ఇలా ఉండాలి అని దేశానికి చాటిచెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949, జూలై 8న జన్మించిన వైఎస్.. వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటుచేసి.. రూపాయికే వైద్యంచేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రజాభ్యుదయమే పరమావధిగా.. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటినుంచి తుదిశ్వాస విడిచే వరకూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాభ్యుదయమే పరమావధిగా రాజీలేని పోరాటం చేశారు. దాంతో పులివెందుల నుంచి 1978, 1983, 1985.. కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998.. ఆ తర్వాత పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజలు ఆయన్ను అజేయుడిగా నిలిపారు. పాలకులకు మార్గనిర్దేశకుడిగా.. వరుస ఓటములతో ఉమ్మడి ఏపీలో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌ను వైఎస్ మండుటెండలో 1,475 కి.మీల పొడవున పాదయాత్ర చేసి ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థంచేసుకుని, నేనున్నానని భరోసా ఇచ్చిన ఆయన 2004, మే 14న సీఎంగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రజలను ఓటర్లుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించారు. విద్య, వైద్యం కోసం ప్రజలు అప్పులపాలవుతుండటాన్ని పసిగట్టి.. వాటిని ఉచితంగా అందించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారు. చదవండి: మరో రూపంలో మహానేత అలాగే, ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి 108 సర్వీసును ప్రారంభించి లక్షలాది మందికి ప్రాణంపోశారు. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులను అనేక రాష్ట్రాలు అమలుచేస్తుండటం ఆయన దార్శనికతకు నిదర్శనం. ఇక ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించిన వైఎస్.. గెలుపోటములకు తనదే బాధ్యత అని 2009 ఎన్నికల్లో ప్రకటించారు. ప్రతిపక్షాలు మహాకూటమి కట్టినా 2009 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి, 2009, మే 20న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారంచేశారు. రూ.లక్ష కోట్లతో జలయజ్ఞం.. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరాన్ని పట్టాలెక్కించారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు. దార్శనికతకు తార్కాణాలెన్నే.. ప్రపంచవ్యాప్తంగా 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అనేక దేశాలను అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం భారత్‌పై కూడా పడింది. కానీ.. అది రాష్ట్రంపై పడకుండా వైఎస్ చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల పనులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి.. మార్కెట్లోకి ధనప్రవాహం కొనసాగేలా చేసి.. వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి.. మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని వైఎస్ కాపాడారని అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. ఇక ఐటీకి వెన్నుదన్నుగా నిలిచి ఎగుమతులను రెట్టింపయ్యేలా చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తిచేసి హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపారు. పండగలా వ్యవసాయం.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్‌కు రైతుల కష్టనష్టాలు బాగా తెలుసు. అందుకే పంట పండినా.. ఎండినా రైతు నష్టపోకుండా.. వ్యవసాయాన్ని పండగలా మార్చేలా పలు కీలక నిర్ణయాలు అమలుచేశారు. ♦పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ♦పంటలులేక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తేశారు. ♦రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ.. ఆ తర్వాత ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా వెనక్కు తగ్గలేదు. ♦వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన నేతలు కూడా అధికారంలోకి వచ్చాక.. ఆ పథకాన్ని కొనసాగించాల్సిన ♦పరిస్థితిని వైఎస్ కల్పించారు. వైఎస్ స్ఫూర్తితో దేశంలో పలు రాష్ట్రాలు సాగుకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ♦ఇక పావలా వడ్డీకే రైతులకు రుణాలందించి.. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని తప్పించారు. ♦నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించారు. పంట పండినా.. ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలుచేశారు. ఇన్çపుట్ సబ్సిడీని అందించారు. ♦పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1,000 వరకూ పెరగడమే అందుకు నిదర్శనం.