Extra
-
రవీంద్ర నాట్య మందిర్ పునఃప్రారంభం
ముంబై: కళాకారులు, రంగస్థలనటులకు ప్రీతిపాత్రమైన రవీంద్ర నాట్య మందిర్ ఆడిటోరియం, పీఎల్ దేశ్‌పాండే మహారాష్ట్ర కళా అకాడమీ తిరిగి ప్రారంభం కానున్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తైన నేపథ్యంలో ఫిబ్రవరి 28న జరిగే పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్లు హాజరుకానున్నారని ఈ సందర్భంగా అకాడమీ కొత్త చిహ్నం ఆవిష్కరణ కూడా జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ‘రీఓపెన్’ఆర్ట్స్’ కమ్యూనిటీకి కొత్త ఉదయం– మంత్రి ఆశిష్ షెలార్ ఈ సందర్భంగా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న థియేటర్, ఆర్ట్స్ కమ్యూనిటీకి ఈ కార్యక్రమం ‘కొత్త ఉదయాన్ని‘ తెస్తుందని అన్నారు. అకాడమీతో తరతరాలుగా కళాకారులను, వారిలోని ప్రతిభకు మెరుగులద్దుతూనే ఉన్నామని , దీన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పునరుద్ధరించిన రవీంద్ర నాట్య మందిర్‌లో అధునాతన సౌండ్ సిస్టమ్స్, రిఫైన్డ్ ఇంటీరియర్స్, రెండు చిన్న థియేటర్లు, ఐదు ఎగ్జిబిషన్ హాళ్లు, ఆరి్టస్టుల కోసం 15 రిహార్సల్ రూమ్‌లు, గ్రాండ్ ఓపెన్–ఎయిర్ స్టేజ్, వర్చువల్ చిత్రీకరణ, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ కోసం స్టూడియోలు ఏర్పాటు చేశామని ఉన్నాయని మంత్రి తెలిపారు. అకాడమీలో త్వరలో వివిధ కళారూపాలకు సంబంధించి 20 సరి్టఫికెట్, డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో విషాదం, నెటిజనుల దిగ్భ్రాంతి
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అంటూ పాపులర్ అయిన చటోరి రజనీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద వార్తను రజని దంపతులు ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఆమె ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తమ 16 ఏళ్ల కుమారుడు తరణ్ జైన్ ఇకలేడని రజని జైన్, భర్త సంగీత్ జైన్ (ఫిబ్రవరి 18న) ఇన్‌స్టాలో ప్రకటించారు. 2008 ఆగస్టులో పుట్టిన తరణ్ 11వ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్ నుండి తిరిగి వస్తున్నపుడు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ వార్త ఆమె అనుచరులను షాక్‌కు గురిచేసింది. అయ్యో, ఎంత విషాదం, నమ్మలేక పోతున్నాం, బీ బ్రేవ్ అంటూ పలువురు వీరికి ధైర్యం చెబుతున్నారు.ఇదీ చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!రజని జైన్ సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరు. అనేక శాకాహార వంటకాలతో అభిమానులను ఆమె ఖుషీ చేసేవారు. రజని ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే ఆమెకున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. భర్త , కొడుకు కోసం ఆమె రోజువారీ టిఫిన్ వంటకాల వీడియోలు 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అనే ట్యాగ్‌లైన్‌తో రెసిపీలను షేర్ చేస్తూ క్రమంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సుషీ, వెజ్ రామెన్, సిజ్లర్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనే ప్రసిద్ధ వంటకాలను ఆమె పరిచయం చేశారు. వీడియోలలో భర్త ,కొడుకు తరచుగా కనిపించడంతో వారు కూడా రజని అభిమానులకు బాగా పరిచయం. తరణ్ చివరిసారిగా ఈ నెల (ఫిబ్రవరి)5, న రజనీ రీల్లో కనిపించాడు.(మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం)ఆత్మహత్య ఊహాగానాలు, రజని జైన్ స్పష్టతతన మరణానికి కొన్ని గంటల ముందు, తరణ్ జైన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కష్టతరమైన చదువుల గురించి పోస్ట్‌ను పంచుకోవడం అనుమానాలకు తావిచ్చింది పంచుకున్నారు. "నేను 11వ తరగతి పాసవుతానా, లేదా చనిపోతానా" అని ఉంది. దీంతో తరణ్ది ఆత్మహత్య అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తరణ్ చాలా మెరిట్స్టూడెంట్ అనీ, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రజనీ వివరణ ఇచ్చారు. -
సమ్‌థింగ్ స్పెషల్: గాల్లో ఎగిరొచ్చి పరీక్ష, ఇది కారా, బైకా?
‘ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వెళతారు?’ అనే ప్రశ్నకు జవాబు తెలియనిదేమీ కాదు. అయితే ఈ స్టూడెంట్ మాత్రం తన రూటే సెపరేట్ అని నిరూపించుకున్నాడు. ‘మనసు ఉంటే ఇలాంటి మార్గం కూడా ఉంటుంది’ అని చెప్పకనే చెప్పాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన బీకామ్ విద్యార్థి సమర్థ్ మహంగాడే పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఎవరూ ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు. రోడ్డుమీద వెళ్లకుండా ట్రాఫిక్ జామ్ భయంతో సమర్థ్ ఎంచుకున్న మార్గం... పారాగ్లైడ్!ప్రముఖ పర్యాటక కేంద్రం పంచగనిలో సమర్థ్ చిన్న జ్యూస్ స్టాల్ నడుపుతున్నాడు. పరీక్ష కేంద్రం అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది, సమయం ఇంకా ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా అక్కడికి సకాలంలో చేరుకోవడం అసాధ్యం అనుకున్న సమర్థ్ అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నాడు. పారాగ్లైడింగ్ గేర్ ధరించిన సమర్థ్ గాలిలో ఎగురుతూ పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకున్నాడు. ఇందు కోసం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ గోవింద్ యెవాలే సహాయం తీసుకున్నాడు. తన బృందం సహాయంతో సమర్థ్‌కు అన్నిరకాల ఏర్పాట్లు చేసి తోడ్పాటు అందించాడు గోవింద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.A Panchgani student paraglided 15 km to make it to his exam on time as the traffic was very high on the roads. 100 marks for creative problem solving! #ExamHacks #OnlyInIndia pic.twitter.com/YzFYKRWnSx— Harsh Goenka (@hvgoenka) February 17, 2025బైక్+కారు= బైకార్ కొన్ని వారాల క్రితం పాకిస్థాన్‌కు సంబంధించి హోమ్మేడ్ టెస్లా సైబర్ ట్రక్ రెప్లికా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇక తాజా విషయానికి వస్తే... సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఒక పాకిస్థానీ వ్యక్తి విచిత్రమైన, ఆకర్షణీయమైన హైబ్రీడ్ వాహనంలో ప్రయాణిస్తున్నాడు. ఈ వాహనాన్ని కారు అనలేము. అలా అని బైక్ అనలేము. ఎందుకంటే సగం కారు, సగం బైక్ ‘కళ’యిక ఈ వాహనం!వాహనం ముందుభాగంలో మోటర్ సైకిల్ హ్యాండిల్ బార్, వీల్ కనిపిస్తాయి. ‘వోన్లీ ఇన్ పాకిస్థాన్’ ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను చూసి ‘అయ్ బాబోయ్’ అంటున్నారు నెటిజనులు. కొందరు ఈ విచిత్ర వాహనాన్ని సల్మాన్‌ఖాన్ ‘కిక్’ సినిమాలో ఉపయోగించిన వాహనంతో పోల్చారు. ‘కిక్ సినిమాతో ఇన్స్పైర్ అయ్యి ఈ బైక్ ప్లస్ కారును తయారు చేశారు’ అని రాశారు. ఈ వీడియో మూడు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం మాట ఎలా ఉన్నా.... ‘సరదాలు, ప్రయోగాల సంగతి సరే... రోడ్ సేఫ్టీ మాటేమిటి’ అని ఘాటుగా ప్రశ్నించారు కొందరు. నిజమే కదా! -
పెళ్లి నిర్ణయం పెద్దలకేనా? యువత ఏమంటున్నారో తెలుసా?
కరీంనగర్ సిటీ: నేటి యువత చదువుకుంటూనే.. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ముందుకు సాగుతున్నారు. విద్య, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రేమ పెళ్లి వద్దు..పెద్దలు కుదిర్చిన పెళ్లి ముద్దు అంటున్నారు. మరికొందరు సరైన సమయంలో వివాహం జరగాలని చెబుతున్నారు. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం డిబేట్ నిర్వహించగా.. వారి అభిప్రాయాలు వెల్లడించారు.అర్థం చేసుకుంటే బెటర్ప్రేమ వివాహాలతో ఎదుటి వారి వ్యక్తిత్వం, ప్రవర్తన ముందుగానే తెలుసుకోవచ్చు. వారిపై మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వారితో వివాహబంధం ముందుకు సాగుతుందా లేదా తెలుస్తుంది. కొంతవరకూ ప్రేమపెళ్లిలు మంచివే. ఏ బంధం అయినా అర్థం చేసుకుని సర్దుకుపోతే నిలుస్తుంది.– శ్రీజ, విద్యార్థినిపెద్దలు కుదిర్చినదే..పెద్దలు అన్ని రకాలుగా మంచిగానే ఆలోచిస్తారు కాబట్టి వారి నిర్ణయం బలంగా ఉంటుందని నా నమ్మకం. వివాహ బంధంలో ఏదైనా సమస్యలు వచ్చినా పెద్దలు ముందుకు వచ్చి పరిష్కరిస్తారు. జీవితంలో మంచి సపోర్టుగా ఉంటారు. పెద్దలను విస్మరించి కొందరు ప్రేమ పేరుతో మోసపోతున్నారు.– వినోద, విద్యార్థినిప్రేమ వివాహాలపై 110మంది యువతులను వివిధ ప్రశ్నలు అడుగగా.. వెల్లడించిన అభిప్రాయాలుటీనేజీ ప్రేమపై మీ అభిప్రాయం65- ఆకర్షణ మాత్రమే45 -టీనేజ్‌లో ప్రేమ అవసరం లేదు85- కెరియర్ ఫస్ట్సరైన సమయంలో పెళ్లి అవసరం ప్రేమపై సోషల్ మీడియా ప్రభావం ఉందా?80-చాలా ఉందిఎలాంటి ప్రభావం లేదు-3060 - పెద్దలు కుదిర్చిందిప్రేమ వివాహం ప్రేమించి పెద్దలను ఒప్పించాలి- 30ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్‌లో పడితే జాగ్రత్త.. భయ్యా!ఒప్పించి.. మెప్పించాలిఒక మనిషి గురించి పూర్తిగా అర్థం చేసుకుని, వారి గురించి పెద్దలకు వివరించి ఒప్పించాలి. ప్రేమించి పెద్దల సహకారంతో వివాహం చేసుకుంటే జీవితం అనందంగా ఉంటుంది. ఉన్నత చదువులతో జీవితం ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే ఏదైనా సాధ్యం. పెద్దలు చేసిన పెళ్లిలు సైతం విడిపోతున్నాయి కదా.– భానుమతి, విద్యార్థినికుటుంబ జోక్యంతోనేపెద్దలు కుదిర్చిన, ప్రేమ పెళ్లి ఏదైనా దంపతుల మధ్య కుటుంబాల జోక్యంతో విడిపోతున్నాయి. చాలా వరకూ అమ్మాయి ఇంటి వద్ద పెరిగిన విధంగానే అత్తవారింట్లో ఉండాలని అనుకుంటారు. కాని అలా ఉండదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కావాలి. అబ్బాయిలు కూడా నమ్మి వచ్చిన వారిని మంచిగా చూసుకోవాలి. – సిరిచందన, విద్యార్థిని -
Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్‌లో పడితే జాగ్రత్త.. భయ్యా!
వాలెంటైన్స్ డే సందర్బంగా ప్రేమికులతో చాలా సందడిగా ఉంటుంది. ఎక్కడ చూసినా అందంగా ముస్తాబై సీతాకోక చిలుకల్లా విహరిస్తుంటారు. పార్క్‌ల్లో, సినిమాహాళ్లలో లవ్‌బర్డ్స్ హల్‌హల్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ వాతావరణం చాలావరకు తగ్గిపోయినట్టే కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాలతో యవతలో ప్రేమలు-పెళ్లిళ్లు అంటేనే భయం పెరుగుతోంది. కరియర్కే యువత ప్రాధాన్యతనిస్తోంది. దీనికితోడు సరియైన ఉద్యోగాలు కూడా లభించక పోవడంతో, ముందు బతుకు ఎలా ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. వాలెటైన్స్ డే సందర్భంగా సాక్షి.కామ్ పబ్లిక్టాక్ వింటే ఈ అభిప్రాయమే కలుగుతుంది ఎవరికైనా.. వాలెంటైన్స్ డే అంటే ఒకరోజు జరుపుకునేది కాదనీ, స్త్రీపురుఫుల మధ్య అయినా, మనుషుల మధ్య అయినా ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలంటోంది యువత. అమ్మాయిలు కరియర్ ముఖ్యం, ఆర్థికంగా స్థిరపడాలి అంటోంటే... అబ్బాయిలేమో మనకీ లవ్వులు, గివ్వులు వద్దు బ్రో..జర జాగ్రత్త భయ్యా.. అంటున్నారు.ప్రధానంగా అమ్మాయిల్లో ప్రేమిస్తే ఏమవుతుందో అనే ఆందోళన ఎక్కువ కనిపిస్తోంది. అందుకే బాగా చదువుకుని, ఆర్థికంగా నిలదొక్కు కోవాలంటున్నారు. అదే ఆడపిల్లలకు ఆత్మస్థైరాన్ని ఇస్తుందని ఒక యువతి పేర్కొంది. ఎంతో కష్టపడి పెంచి పోషించిన తల్లి దండ్రులనుజాగ్రత్తగా చూసుకోవాలి అంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది కెమెరా ముందుకు రావడం ఇష్టంలేని ఒక యువతి తన సొంత పిన్ని ఇంట్లో జరిగిన సంఘటన తమ కుటుంబంలో పెద్ద అలజడి రేపిందనీ, అందుకే తానీ నిర్ణయానికి వచ్చానని తెలిపింది. బాధ్యత ముఖ్యంప్రేమ అంటే బాధ్యత ఉండాలి. స్త్రీపురుషుల మధ్య అయినా, ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా బాధ్యత అనేది పునాది. అదే ప్రేమ. ఆ బాధ్యతతో కూడిన ప్రేమే కుటుంబాల్ని నిలుపుతుంది అన్నారు ఒక కార్పొరేట్ ఉద్యోగి. పిల్లలు బాధ్యతగా ఉన్నపుడు ఏ తల్లిదండ్రులైనా పిల్లల్నిఅంగీకరిస్తారు. యోగ్యుడైన అల్లుడు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు అందుకే చిత్తశుధ్దిగా ఉండండి. తల్లితండ్రులను ఒప్పించుకోండి.. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అంటూ యువతరానికి ఆయన సూచించారు. ఇదీ చదవండి: ఓటీటీ బెస్ట్ యాక్టర్‌గా రాగ్‌మయూర్ నామినేట్ : రాగ్ ఫ్యావరెట్ హీరోయిన్ ఎవరంటే..!ప్రేమా, గీమా ఇవ్వన్నీ వద్దు మనకి.. బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం కొట్టాలి, అమ్మానాన్నల్ని ఖుషీగా ఉంచాలి.. అంతే.. ఇంతకుమించి తనకే ప్రయార్టీస్ లేవని చెప్పాడు మరో యువకుడు. అలాగే ఒకవేళ ప్రేమిస్తే చిత్తశుద్ధిగా ఉండండి భయ్యా..కడదాకా నిలుపుకోండి అంటూ సలహా ఇస్తున్నాడు. కానీ జాగ్రత్త భయ్యా.. సింగిల్‌గా ఉంటేనే బెటర్ కదా భయ్యా అంటూ ఓ పెద్ద సందేశాన్నిచ్చేశాడు ఫన్నీగా.లేడీస్ హాస్టలా? ఎవడ్రా ఆ కూత కూసింది!ఎంత ధైర్యం చెప్పుకున్నా, ఆడపిల్లలు సాధికారతసాధిస్తున్నా..సమాజంలోజరుగుతున్న పరిణామాలు చాలా బాధిస్తున్నాయని ఒక తల్లి వాపోయింది. ప్రేమించిన పాపానికి కన్న తల్లిదండ్రులే ఆమె జీవితంలో నిప్పులు పోస్తున్నారు. మరొక చోట ప్రేమించకోతే, పెళ్లికి ఒప్పుకోకపోతే నరికి చంపుతున్నారు.. యాసిడ్లు పోస్తున్నారు కదా తల్లీ.. ఎలా అయితే ఎలా బతికేది ఆడపిల్లలు అంటూ భావోద్వేగానికి లోనైంది. అసలు వాలెండైన్స్డే మనది కాదు. ప్రేమ శాశ్వతం. శాశ్వతమైన ప్రేమే మనది. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలను జాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బలహీనమైన క్షణాల్లో వారికి అండగా ఉండాలి. అంతే తప్ప, నటుడు చిరంజీవి లేడీస్హాస్టల్ అనుకోవడం మూర్ఖత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారో తల్లి. అంతేకాదు తన తల్లి, చెల్లి, భార్య, కుమార్తెలు, కోడలు, ఆఖరికి మనవరాలిని కూడా ఘోరంగా అవమానించిన చిరంజివి మొత్తం స్త్రీ జాతికి క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. (ఈమె కూడా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు.) -
ఓటీటీ బెస్ట్ యాక్టర్‌గా రాగ్‌మయూర్ నామినేట్ : రాగ్ ఫ్యావరెట్ హీరోయిన్ ఎవరంటే..!
సివరపల్లి వెబ్ సిరీస్‌తో దూసుకుపోతున్న హీరో రాగ్ మయూర్ మరో ఘనతను సాధించారు. సెన్సేషనల్ హీరో అయిపోదామని కాకుండా... పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతూ, నటనలో రాటుదేలుతూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న రాగ్ తాజాగా మరో అడుగు ముందుకేసారు. సివరపల్లి సిరీస్‌లో నటనకు గాను ఇంటర్నేషనల్ ఐకానిక్ బెస్ట్ యాక్టర్ ఓటీటీ తెలుగు అవార్డ్ కోసం నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. దీంతో ఆయనకు ఫ్యాన్స్ అభినందనలు తెలియజేశారు.ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్ నటనపై ఆసక్తితో ఉన్నత చదువును పక్కన బెట్టి మరీ హీరో రాణిస్తున్నారు. అద్భుతమైన నటనతో సినీ లవర్స్‌కు దగ్గరవుతున్నారు. సినిమానే తన ప్రాణం, ప్రేక్షకులే నా దేవుళ్లు.. ప్రేక్షకులు లిచ్చిన ప్రేమ, వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అంటున్న వాలెంటైన్స్ డే సందర్బంగా హీరో రాగ్మయూర్తో స్పెషల్ చిట్ చాట్ రెండో భాగం. (చివరిది) మీకోసం! -
కోర్కెలు తీర్చే కల్పవల్లి తిరుపతమ్మ తల్లి
భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఆమె. పెళ్లిళ్లు చేసుకునే కొత్త జంటలకు ఆమె ఆశీస్సులు చాలని భక్తుల నమ్మకం. ఆ దేవత కొలువుంటే పవిత్ర పుణ్యక్షేత్రమే ఎన్టీఆర్జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారి దేవస్థానం. ఇది ఉమ్మడి జిల్లాలో విజయవాడ శ్రీకనకదుర్గమ్మవారి ఆలయం తరువాత రెండవ స్థానంలో ఉంది. విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేట, నందిగామకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే భక్తులతో అలరాలుతోంది. 17వ శతాబ్దంలో పెనుగంచిప్రోలు సమీప గ్రామాల్లో సాక్షాత్తు శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వరప్రసాదినిగా జన్మించిన తిరుపతమ్మ బాల్యదశలోనే సకల శాస్త్ర΄ారంగమూర్తిగా పేరు గాంచింది. తల్లిదండ్రులు కొల్లా రంగమాంబ, శివరామయ్యలకు పేరు తెచ్చే విధంగా తోటి బాలబాలికలకు జ్ఞానమార్గం బోధిస్తూ యుక్త వయస్సు వచ్చిన తిరుపతమ్మను పెనుగంచిప్రోలులోని సమీప బంధువులైన కాకాని వంశీయులు కృష్ణయ్య, వెంగమాంబ దంపతుల కుమారుడు గోపయ్యకు ఇచ్చి వివాహం చేశారు. తిరుపతమ్మ రాకతో కాకాని వారి కుటుంబం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లినప్పటికీ తోటికోడలు చంద్రమ్మ అసూయ వల్ల అత్త వెంగమాంబ మనస్సు మారటంతో అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయి. అదే సమయంలో కరువు తాండవించటంతో గోవులకు మేతకోసం గోపయ్య జీతగాళ్లతో ఆవుల మందను తీసుకుని ఉత్తరారణ్యాలకు వెళ్లాడు. కాలమహిమ అన్నట్లుగా తిరుపతమ్మకు కుష్ఠువ్యాధి సోకింది. దాంతో అత్త, తోటికోడళ్లు పట్టించుకోకుండా పశువుల పాకలోకి నెట్టేశారు. ఆ సమయంలో ముదిరాజ్ వంశానికి చెందిన పాపమాంబ ఆమెకు సేవలు చేసింది. ఆమె వంశానికి చెందిన వారే నేటికీ ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయంలో జరిగే క్రతువుల్లో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఒక్క పెనుగంచిప్రోలు ఆలయంలోనే మనకు కనిపిస్తాయి. గోవుల మేతకోసం అడవులకు వెళ్లిన గోపయ్య పులి రూపంలో వచ్చిన పెద్దమ్మ తల్లితో పోరాడి వీరమరణం పొందారు. భర్త మరణాన్ని ముందుగానే ఊహించిన తిరుపతమ్మ ప్రాయోపవేశానికి నిర్ణయించుకుంటుంది. ఆనాటి మునసబు కర్ల ముత్యాలనాయుడు, కరణం శ్రీశైలపతి సమక్షంలో మహిమలు చూపి భర్తతోపాటు సహగమనం చేస్తుంది.యోగాగ్నిలో తనువు చాలించిన చోట కాలక్రమంలో తన ప్రతిమతోపాటు గోపయ్య ప్రతిమ కూడా వెలుస్తుందని చెప్పింది. దానికిముందు ఆమె పతివ్రతా ధర్మాలను బోధించినట్లు చరిత్ర చెబుతోంది. తదుపరి పెద్దల సమక్షంలో ఆలయ నిర్మాణం జరగగా, నేడు కోట్లాది రూపాయలతో సుందర నిర్మాణం రూపు దాల్చింది. ఆలయం పక్కనే పవిత్ర మునేరు, మామిడి తోటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.పదుల సంఖ్యలో పెళ్లిళ్లు....పెళ్లిళ్ల సీజన్లో ప్రతిరోజూ సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారికి ఆలయంలో నిత్య కల్యాణం తోపాటు ఏడాదికి ఒక సారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. యోగాగ్నిలో ప్రవేశించిన తరువాత చితిమంటలు నుంచి తన భర్త ప్రతిమ, తన ప్రతిమతోపాటు పసుపు–కుంకుమలు వస్తాయని ఆరోజు నుంచి తనను కొలిచిన వారికి నిత్య సుమంగళితనం, సంతానం, సిరిసంపదలు ప్రాప్తమవుతాయని తిరుపతమ్మ చెప్పింది. అందుకు తగినట్లుగా ప్రధానాలయంలోని అమ్మవారి విగ్రహం చేతిలో కుంకుమ భరిణ ఉంటుంది. అందుకే ఆమె సమక్షంలో కల్యాణం చేసుకుంటే మంచిదని భక్తులు విశ్వసిస్తారు. సంతానం లేనివారు అమ్మ సన్నిధిలో ముడుపులు కడతారు. నిత్యం అన్నప్రాశనలు, కుంకుమపూజలు నిర్వహిస్తారు.ఏటా ఉత్సవాలు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అన్ని కులాల వారికి సంబంధించిన క్రతువులతో, యజ్ఞ యాగాదులతో అలరారుతున్న తిరుపతమ్మవారి అమ్మవారి పెద్ద తిరునాళ్ల ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు, చిన్న తిరునాళ్ల ఫాల్గుణమాసంలో ఐదు రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ఆ ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఏడాది పెద్ద తిరునాళ్ల, కల్యాణ ఉత్సవాలు ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు జరగనున్నాయి. వీటితోపాటు ప్రతి రెండేళ్లకు ఒకసారి రంగుల ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రతినెలా చండీహోమం, నిత్యం గోపూజ, కుంకుమపూజ, అభిషేక పూజ వంటి పూజలు జరుగుతుంటాయి. నిత్యం అమ్మవారికి భక్తులు పాలు, గంగళ్లతో బోనాలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. పులికొండ సాంబశివరావు, సాక్షి, పెనుగంచిప్రోలు (చదవండి: -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్
‘ప్రేమంటే ఏమిటంటే ...’’ యుగయుగాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదుకులాట నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి అర్థాలు వారివి. ఎవరి అనుభూతులు, అనుభవాలు వారివి. ఎవరి భావోద్వేగాలు వారివి. అందుకే రెండు హృదయాల మధ్య ప్రేమ సరికొత్తగా కొంగొత్తగా చిగురుస్తూనే ఉంది. చిక్కావే ప్రేమ.. అంటూ కూని రాగాలు కాదు...కాదు..కోటి రాగాలు పలికిస్తుంది. అదే ప్రేమ అనే రెండక్షరాల్లోని గమ్మత్తు... మత్తు. ఈ మత్తులోకి ఎవరికి వారు ఎపుడో ఒకపుడు జారిపోవాల్సిందే. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సివరపల్లి (పంచాయత్ సిరీస్ తెలుగు రీమేక్) హీరో రాగ్ మయూర్‌తో సాక్షి.కామ్ స్పెషల్‌గా ముచ్చటించింది.సినిమాబండి సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విలక్షణ నటుడు రాగ్ మయూర్. ముఖ్యంగా వాలెంటైన్స్ డే వీక్ మొదలైందంటే చాలు ‘స్వర మంజరీ’ అంటూ చెప్పే ఆయన డైలాగ్ గత మూడు నాలుగేళ్లుగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది అంటే రాగ్ యాక్టింగ్ స్కిల్స్‌ను అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్ సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ నటించడమే కాదు, అటు విలన్ కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.ఇదీ చదవండి: MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!ఇపుడు తన కరియర్లో మైలురాయిలాంటి సివరపల్లిలో పంచాయతీ సెక్రటరీగా తన నటనతో ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఓటీటీలో జనాలను ఒప్పించి, మెప్పించిన హిందీ ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తెలుగులోకి రీమేక్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవడం విశేషమే మరి. తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని పల్లె వాతావరణంలో సాగే ఈ సిరీస్ పిల్లా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటోంది.సినిమాపై ఆయనకు ప్రేమ ఎలాపుట్టింది లాంటి వివరాలతో పాటు, నిజజీవితంలో ప్రేమ, ప్రేక్షకులతో ఆయన ప్రేమ, రాగ్ కిష్టమైన నటీ నటులు ఇలాంటి మరిన్ని విశేషాలు ఆయన సాక్షితో పంచుకున్నారు. ఈ మొత్తం చిట్‌చాట్‌ను రెండు భాగాలుగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. రాగ్ అందించిన ప్రేమ కబుర్లలో ఏ ఒక్కటీ మిస్ కాకుండా దీన్ని సంపూర్ణంగా వీక్షించి, మీ అభిప్రాయాలను పంచుకోండి. సాక్షి.కామ్ ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. -
విమానంలో సీటు సరిపోలే...దెబ్బకి 82 కిలోల బరువు తగ్గాడు
అధికబరువు బాధపడేవారికి కష్టాలు మామూలుగా ఉండవు. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోలా ఉంటాయి. పదిమంది చూపులు, కొంటెచూపులు వారిని తొలిచేస్తే ఉంటాయి. కొంతమంది అవమానకరమైన మాటలు కూడా వారిలో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. మరికొన్ని ఘటనలు వారిలో పంతాన్ని పట్టుదలను పెంచుతాయి. అలా విమానంలో సీటు చాలకపోవడంతో అవమానంగా భావించిన యువకుడు దృఢ సంకల్పంతో బరువు తగ్గాడు. ఇంతకీ ఆ యువకుడు ఎంత బరువు ఉండేవాడు? బరువును ఎలా తగ్గించుకున్నాడు? తెలుసుకుందామా!గతంలో విమానంలో సీటు చాలట్లేదని ఏకంగా విమానాన్నే కొనేసింది ఒక మహిళ. కానీ అర్రాన్ యువకుడిది మరో గాథ. విమానం కొనే స్థోమత లేదుగనుక, తన బాడీని మార్చుకునేందుకు సిద్ధపడ్డాడు. స్కాట్లాండ్లోని తూర్పు ఐర్‌షైర్‌లోని ఆచిన్లెక్లోఎయిర్క్రాఫ్ట్ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు అర్రాన్ చిడ్విక్. నిండా 30 ఏళ్లు కూడా లేకుండానే వందకు దాటి బరువుండేవాడు. 24 ఏళ్ల వయసులో అతని బరువు 175 కిలోలు అంటే అతని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by Arran Chidwick (@arranchidwick)కబాబ్‌లు, బర్గర్లు, చైనీస్ ఫుడ్ , చిప్స్ బ్యాగులు వంటి పెద్ద మొత్తంలో జంక్ ఫుడ్ తినేవాడు. వారాంతంలో అయితే అతని తిండికి హద్దే ఉండేది కాదు. దీంతో షూలేస్‌లు కట్టుకోవడం , బట్టలు వేసుకోవడం లాంటి రోజువారీ పనులకు చాలా ఇబ్బందులు పడేవాడు. ఒకసారి విమానంలో సీటు సరిపోకపోవడంతో చాలా అవమాన పడ్డాడు. అప్పుడు నిర్ణయించుకున్నాడు. కఠినమైన మార్పులు చేయకపోతే తన మనుగడే కష్టమని గుర్తించాడు. బరువు తగ్గకపోతే ఇక నెక్ట్స్ పుట్టిన రోజు ఉండదని ఫిక్సై పోయాడు. అందుకే పట్టుబట్టి మరీ, ఆరోగ్యకరమైన ఎంపికల ద్వారా ఒక ఏడాదిలో 80 రెండున్నర కిలోలు తగ్గాడు. బరువు తగ్గించే ఇంజెక్షన్లు లేదా ఫ్యాషన్ డైట్లను ఇలాంటి వాటి జోలికి పోకుండా, హెల్దీగా తన బరువును నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. తనని చూసి ఒకరు జాలిపడేవారు. మరొకరు అవమానించేవారు. దీంతో బాగా ఆందోళన చెందేవాడు. నిరాశకు గురయ్యేవాడు. ఈ బాధతో మరింత ఎక్కువగా తినడం, తాగడం చేసేవాడినని స్వయంగా చెప్పాడు అర్రాన్. కానీ ఇంత లావుగా ఉంటే తనకిక వేరే ఉద్యోగాలు రావడం కూడా కష్టమని గ్రహించాడు. అంతేకాదు 30 పుట్టిన రోజు చూడటం అనుమానమే అని భావించాడు. అంతే బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించాడు. జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు, వ్యాయామంతో గణనీయంగా బరువు తగ్గాడు. ఎవ్వరూ ఊహించని విధంగా స్మార్ట్ అండ్ స్లిమ్‌గా మారిపోయాడు. అంతేకాదు హాఫ్ మారథాన్ రన్నింగ్‌కి సిద్ధంగా ఉన్నాడు. బరువు తగ్గిన తరువాత చాలా ఆనందంగాఉందని చెబుతున్నాడు. అంకితభావం,నిబద్ధతతో నలుగురికీ స్ఫూర్తినిస్తూన్నాడు.ఇదీ చదవండి: MahaKumbh Mela : సింపుల్‌గా, హుందాగా రాధిక-అనంత్ అంబానీ జంటజంక్ ఫుడ్ పూర్తిగా మానేశాడు.పండ్లు, కూరగాయలు , ప్రోటీన్ ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకునేవాడు. జిమ్‌లో గంటల కొద్దీ వ్యాయామం చేశాడు. అయితే మొదట్లో తన ఆకారంతో జిమ్కెళ్లడానికి సిగ్గుపడేవాడట. అందుకే ఎవ్వరూ ఉండరని సమయంలో ఎక్కువగా జిమ్ చేసేవాడు. దీంతో మూడు నెలల్లోనే మంచి మార్పుకనిపించింది. మంచి ఫలితం కనిపించడంతో మరింత ఉత్సాహంగా తన వెయిట్ లాస్ జర్నీని కొనసాగించాడు. ‘‘మీ పట్ల జాలిపడకుండా ,అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని అనుకోకుండా ఉండటం ముఖ్యం - మిమ్మల్ని మీరు మార్చుకోగలిగే ఏకైక వ్యక్తి మీరే" అంటాడు ఉత్సాహంగా. -
కొత్త పెళ్లికూతురికి పసుపుతో భయంకరమై ఎలర్జీ వచ్చిందట! ఫోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి, నటి నీలమ్ ఉపాధ్యాయను ( ఫిబ్రవరి 7న) పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి భార్యాభర్తలు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వచ్చి సందడి చేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరీ ముఖ్యంగా ఆడపడుచు హోదాలో ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 'సిడ్నీ కి షాదీ' తన సోదరుడి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను హల్దీ వేడుకతో ప్రారంభిస్తున్నట్లు ఫ్యాన్స్‌తో పంచుకుంది. హల్దీ, బారాత్, వెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి అందర్నిఫిదా చేసింది. భర్త నిక్, కుమార్తెతో కలిసి కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయతో పాటు, నిక్ జోనాస్ తల్లిదండ్రులుతో కలిసి స్పెషల్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. అయితే తాజాగా మరో విషయం నెట్టింట వైరల్‌గా మారింది.ప్రియాంక చోప్రా 'భాభి', నీలం ప్రీవెడ్డింగ్ వేడుకల అయిన హల్దీ వేడుక (ఫిబ్రవరి 5న)లో స్కిన్ ఎలర్జీతో బాధపడిందట. 'హల్దీ' మూలంగా తనకు అలర్జీ వచ్చిందని నీలం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని ప్రకారం మెడ , కాలర్‌బోన్ ప్రాంతం చుట్టూ భయంకరమైన చర్మ అలెర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా సేంద్రీయ పసుపుకాకపోవడంతో ఆమెకు ఎలర్జీ వచ్చినట్టుంది. ముందుగా టెస్ట్ చేసినప్పిటికీ, ఎలర్జీ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాపోయింది. ఈ ఫోటోలు నీలం నల్లపూసలతో కూడా మంగళసూత్రాన్ని కూడా చూపించింది. ఎండలో ఉండటం వల్ల ఇలా వచ్చిందా; అప్లయ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసా, అన్నీ బాగానే ఉన్నాయి. దీనికేంటి పరిష్కారం, అసలు ఎందుకిలా అయింది.. దయచేసి ఎవరైనా సలహా చెప్పండి అంటూ అభ్యర్థించింది.ఇదీ చదవండి :బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!పసుపుతో అలెర్జీ వస్తుందా? పసుపు సాధారణంగా చాలా మందికి సురక్షితమైనది . ప్రయోజనకరమైనది. కానీ కొందరిలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత ముఖ్యమైన దుష్ప్రభావం అలెర్జీ. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చర్మంపై పూసినప్పుడు కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఒక్కోసారి శ్వాస ఆడకపోవడంలాంటి కనిపించవచ్చు. ఇంకా లోపలికి తీసుకుంటే విరేచనాలు, వికారం,కడుపు నొప్పి వంటి తేలికపాటి జీర్ణ సమస్యల నుండి ఇనుము లోపం, పిత్తాశయ సమస్యలు, తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.ఎవరు జాగ్రత్తగా ఉండాలి?పిత్తాశయ వ్యాధి ఉన్నవారు పసుపును నివారించాలి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఆస్ప్రిన్, వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు పసుపు రక్తస్రావం పెంచే అవకాశం ఉన్నందున దానిని నివారించాలి. గర్భిణీలు , పాలిచ్చే స్త్రీలు కూడా పసుపును జాగ్రత్తగా వాడాలి.పసుపులో ఉండే పదార్ధం కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది.దురదలు, దద్దుర్లు తగ్గించే యాంటిహిస్టామైన్ లాంటి మందులను వాడాలి. సమస్య బాగా తీవ్రంగా ఉంటే కార్టికోస్టెరాయిడ్, అనాఫిలాక్సిస్ లాంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఇంకా సమస్య తీవ్రతను బట్టి సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ అవసరం అవుతుంది. ఏదిఏమైనా సమస్యను వైద్యుడి దృష్టికి తీసుకెళ్లి, తగిన పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.కాగా సిద్ధార్థ్ చోప్రా పెళ్లి చేసుకున్న నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 2012లో నక్షత్ర అనే మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2013లో హీరో అల్లరి నరేష్‌కు జోడీగా యాక్షన్ 3డి మూవీలో హీరోయిన్గా నటించింది నీలం. ఆ తరువాత తమిళ మూవీల్లో కూడా నటించింది. -
కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి..
కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి.. అన్నట్లు కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన బర్డ్స్ వాక్ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఇందులో 55 మంది వీక్షకులు భాగస్వామ్యం కాగా.. 62 రకాల పక్షి జాతులను గుర్తించారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, మేనేజర్ సుమల్ పర్యవేక్షణలో వివిధ రకాల థీమ్ పార్కులు, వృక్షపరిచయ క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ సఫారీ గురించి వీక్షకులకు వివరించారు.. – గచ్చిబౌలి పికిలిపిట్ట, షిక్రా, లొట్టకన్నుజిట్ట, నల్ల ఎట్రింత, అడవిరామదాసు, మగ నెమలి, ఆడ నెమలి, లకుముకి పిట్ట, టైగర్ స్వాలోటైల్ సీతాకోకచిలుక వంటి పక్షులను సందర్శకులు వీక్షించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ‘బర్డ్స్‌వాక్’ లో 62 రకాల పక్షి జాతులను సందర్శకులు గుర్తించారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్స్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, మేనేజర్ సుమల్ పర్యవేక్షణలో 55 మంది వీక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షిజాతుల పేర్లు, వాటి శాస్త్రీయ నామాలు, సహజమైన పేర్లు, వాటి అలవాట్లు, ప్రవర్తన గురించి పక్షుల నిపుణులు అపరంజని, ప్రవర్తన, మనోజ్ థామ్సన్, అబ్దుల్ వివరించారు. పాకెట్ గైడ్ ద్వారా పక్షులను ఎలా గుర్తించాలో, అవి ఎలాంటి శబ్దాలు చేస్తాయో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. జీవావరణ పరిరక్షణకు.. ప్రకృతి, జీవావరణ వ్యవస్థలో పక్షులు ప్రధాన భూమిక పోషిస్తాయని పక్షుల నిపుణులు సందర్శకులకు వివరించారు. విత్తనాల వ్యాప్తి, పర్యావరణ సమతుల్యతలో పక్షుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అందుకే ఆయా జాతుల మనుగడ మానవ మనుగడకు, ప్రకృతి మనుగడకు కీలకమన్నారు. ఎకో టూరిజమ్‌లో భాగంగా.. బొటానికల్ గార్డెల్స్లో బర్డ్స్‌వాక్ కార్యక్రమంలో భాగంగా అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పక్షుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 23న వికారాబాద్‌లో, మార్చి 2న గజ్వేల్ ఫారెస్ట్‌లో బర్డ్స్ వాక్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. – రంజిత్‌నాయక్, ఎకో టూరిజమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ -
‘ఇసుక తక్కెడ - పేడ తక్కెడ‘ : ఇది ఎలా వచ్చిందంటే!
ఒక ఊరిలో ఇద్దరు దొంగలు వుండేవాళ్ళు. ఒకని ఇల్లేమో ఉత్తరం వైపు, మరొకని ఇల్లేమో దక్షిణం వైపు. వాడు దొంగని వీనికి తెలీదు. వీడు దొంగని వానికి తెలీదు. ఇద్దరూ ఎదుటి వాళ్ళను మాటలతో బోల్తా కొట్టించి మోసం చేయడంలో ఆరితేరినవాళ్లే. ఒకసారి వాళ్ళలో ఒకడు ఒక కావడి తీసుకొని దానికి రెండు వైపులా రెండు ఇసుక కుండలు పెట్టి, అవి కనబడకుండా చిరిగిపోయిన బట్టలు కట్టి భుజానికి తగిలిచ్చుకోని ఎవరిని మోసం చేద్దామా అని వెదుక్కుంటా పోసాగాడు.సరిగ్గా అదే సమయానికి ఇంకొకడు కూడా ఒక కావడి తీసుకోని రెండు వైపులా రెండు పెండతో నింపిన కుండలు పెట్టి, అవి కనబడకుండా ఒక పాత మసిబట్ట కట్టి భుజానికి తగిలిచ్చుకోని మోసం చేయడానికి ఎవరు దొరుకుతారా అని వెదుక్కుంటా బైలు దేరాడు.వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక సత్రం వద్ద కలుసుకున్నారు. వాని మొహం వీడు గానీ, వీని మొహం వాడు గానీ ఎప్పుడూ చూల్లేదు. దాంతో ఇద్దరూ ఎదుటోడు చాలా మంచోడు అని అనుకున్నారు. ఒకరితో ఒకరు మాటల్లో పడ్డారు. మధ్యలో ఇసుక దొంగ ‘అనా.. .. అనా... ఎక్కడికి పోతావున్నావు. ఏముంది నీ కావడిలో అన్నాడు.అప్పుడు వాడు. ‘ఆ... ఏం లేదు. నేను పెద్ద రత్నాల వ్యాపారిని. ఈ రెండు కుండలనిండా మేలు జాతి రత్నాలు వున్నాయి. దారిలో దొంగల భయం ఎక్కువ గదా... అందుకని కుండలకు పాత బట్టలు కట్టినాను. మాపాప పెళ్ళీడు కొచ్చింది. ఈ రత్నాలు అమ్మి బంగారం కొని పాపకు నగలు చేపియ్యాల‘ అన్నాడు.ఆ మాటలు వినగానే ఇసుక దొంగ ‘అబ్బ... వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు వీడు కనబన్నాడు. ఎట్లాగయినా వీన్ని మోసం చేయాలి‘ అనుకున్నాడు. అంతలో పేడ దొంగ ‘అవును... నువ్వేమి చేస్తా వుంటావు. నీ కుండల్లో ఏమున్నాయి‘ అన్నాడు. దానికా ఇసుక దొంగ చిరునవ్వుతో ‘అనా... నేను నీ లాగే వ్యాపారినే. కాకపోతే నగల వ్యాపారిని. మంచి మేలు జాతి రత్నాలు కొని వాటిని బంగారంలో పొదిగి విలువైన హారాలు తయారు చేసి అమ్ముతుంటాను. ఈ రెండు కుండలనిండా బంగారం వుంది. దాన్ని అమ్మి విలువయిన రత్నాలు కొనాలని పోతున్నాను‘ అన్నాడు.ఆ మాటలినగానే పేడదొంగ ‘అబ్బ.... దొరికినాడురా కావలసినోడు. వీన్ని ఎట్లాగయినా మోసం చేసి వీని దగ్గరున్న బంగారం కొట్టేయ్యాలి‘ అనుకున్నాడు. వెంటనే ‘అరెరే... మనిద్దరినీ ఆ దేవుడు ఒక్క చోట కావాలనే కలిపినట్టున్నాడు. నీకు కావలసిన బంగారం నా దగ్గరుంది. నాకు కావలసిన మేలు జాతి రత్నాలు నీ దగ్గరున్నాయి. మనం ఒకరి కావడి మరొకరు మార్చుకుంటే సరి‘ అన్నాడు. ఆ మాటలకు ఇసుకదొంగలోపల్లోపల ‘పడిందిరా పిట్ట‘ అని నవ్వుకుంటా ‘అలాగే నువ్వెలా చెప్తే నేనలాగే‘ అన్నాడు. నీ కావడిలో ఏముందో చూపించు అంటే అవతలి వాడు కూడా నీ కావడిలో ఏముందో నువ్వూ చూపించు అంటారు గదా... అందుకని ఇద్దరు గూడా మారు మాట్లాడకుండా.. ఎదుటివాన్ని మోసం చేస్తున్నాం అనుకుంటా సంబరంగా ఒకరి కావడి మరొకరు మార్చుకున్నారు.మార్చుకున్నాక మరుక్షణం గూడా ఆలస్యం చేయకుండా ఇసుకదొంగ ‘అనా... జాగ్రత్త. దారిలో దొంగలుంటారు. నీ దగ్గరున్నది బంగారం అని తెలిస్తే అంతే.. చీకటి పడకముందే తొందరగా ఇంటికి చేరుకో’’ అన్నాడు. దానికి వాడు ‘తమ్ముడూ నువ్వు కూడా రత్నాలను జాగ్రత్తగా ఇంటికి తీసుకొని పో’ అంటూ వాడు బైలు దేరాడు.ఇద్దరూ సంబరంగా పరుగు పరుగున ఇంటికి చేరుకొని కావడి మీద వున్న బట్ట తీసి చూస్తే ఇంకేముంది ఇసుక దొంగ చేతికి పేడ అంటుకుంది. పేడ దొంగ చేతికి ఇసుక వచ్చింది. ‘అమ్మో నేనే పెద్ద దొంగను అనుకుంటే, ఆవతలోడు నా కన్నా నాలుగాకులు ఎక్కువే చదివినట్లున్నాడే‘ అనుకుంటా ఇద్దరూ గమ్మున నోరుమూసుకున్నారు. ఇదీ కథ.కథ విన్నారుగా... ఈ కథ నుంచే అంతా మోసం అనే అర్థంలో... ‘ఇసుక తక్కెడ – పేడ తక్కెడ‘ అనే జాతీయం వచ్చింది.– డా.ఎం. హరికిషన్ -
నకలు కాదు... సిసలు రాజ్యాంగం!
భారత స్వాతంత్య్ర సంగ్రామం చివరికి ఉపఖండం భారత్ (India), పాకిస్తాన్‌లుగా విభజితమవ్వడంతో ముగిసింది. బ్రిటిష్ రాణి 1947 జూలైలో ‘భారతీయ స్వాతంత్య్ర చట్టం–1947’ను ఆమోదించారు. ‘3వ జూన్ ప్లాన్’ పేరున ‘మౌంట్ బాటెన్ ప్రణాళిక’కింద రెండు (భారత్–పాక్) డొమినియన్ల సృష్టి జరిగింది. అవి స్వతంత్ర దేశాలని అనుకుంటున్నాం కాని, బ్రిటిష్ రాణి (British Queen) దయవల్లనే వాటికి డొమినియన్ స్థాయిని ఇచ్చారు (ఇది దానం వలె ‘ఇచ్చింది’ అని అర్థం చేసుకోవాలి). స్వాతంత్య్ర చట్టం ఆమోదానికి ముందే మన రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ సభ (1946) ఏర్పడింది. మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మన రాజ్యాంగ నిర్మాణం సాగి 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అయితే మన రాజ్యాంగం (Indian Constitution) కాపీ కొట్టిన రాజ్యాంగం అనే అపప్రథను మూట కట్టుకుంది. ఇప్పటికీ ఆ విమర్శ ఉంది. బ్రిటిష్ వాళ్లు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం–1935’ను మక్కీకి మక్కీ నకలు చేశారంటారు. అలాగే అనేక ప్రపంచ దేశాల నుంచి నచ్చిన అంశాలను గ్రహించి మన రాజ్యాంగంలో చేర్చారు. మనకు ఉన్న దేశాధ్యక్షుడు (రాష్ట్రపతి), మంత్రి వర్గం, పార్లమెంట్, న్యాయవ్యవస్థ వంటివి ప్రపంచంలో అనేకానేక ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నవే. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సాధారణ అంశాలు (భాగాలు) కాబట్టి అది నకలు అనడానికి వీల్లేదు. మనం ప్రజాస్వామ్య విధానం పాటిస్తున్నాం కాబట్టి మనకు నచ్చిన అంశాలను స్వీకరించడం తప్పుకాదు కదా. ఇక ఏ ఏ అంశాలను ఎక్కడి నుంచి స్వీకరించామనే విషయానికి వస్తే... బ్రిటన్ నుంచి పార్లమెంటరీ ప్రభుత్వ పరి పాలన, రూల్ ఆఫ్ లా, శాసన ప్రక్రియ, క్యాబినెట్ పద్ధతిలో ప్రజాస్వామ్యం, ప్రభుత్వ నిర్వహణలో న్యాయరంగంలో ఆజ్ఞల పాత్ర (రిట్ గొప్పతనం) వంటివి ఉన్నాయి.ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నికల పద్ధతి, రాష్ట్రపతి రాజ్యసభలో సభ్యులను ఎంపిక చేసే పద్ధతిని స్వీకరించాము. అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించినవాటిలో అధికారం నుంచి రాష్ట్రపతిని తొలగించడం (మహా అభిశంసనం), రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అధికారాలను నిర్వహించే విధానం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం, న్యాయ స్వతంత్రత, రాజ్యాంగ పీఠిక ఉన్నాయి. సమాఖ్య తరహా అధికారిక కేంద్రీకరణ... అంటే రాష్ట్రాలతో పోల్చితే బలమైన కేంద్రం, రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలు కాక మిగిలిన అన్ని అధికారాలను కేంద్రానికి అప్పగించడం, కేంద్రానికి రాష్ట్రాల గవర్నర్ (రాజ్ పాల్) నియామక అధికారం, సుప్రీంకోర్టుకు సలహా ఇచ్చే అధికారం వంటి వాటిని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఆస్ట్రేలియా నుంచి కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయగలిగిన అంశాల జాబితా (ఉమ్మడి జాబితా), లోక్‌సభ, రాజ్యసభల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించడంవంటి అంశాలు; సోవియట్ యూనియన్ నుండి ప్రాథమిక విధులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను పీఠికలో చేర్చడం; ఫ్రాన్స్ నుండి గణతంత్ర లక్షణం, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను పీఠికలో చేర్చడం వంటివాటిని స్వీకరించాం. అలాగే జర్మనీ నుంచి ఎమర్జన్సీలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే (సుషుప్తావస్థలో ఉంచే) విధానాన్ని, దక్షిణ ఆఫ్రికా నుంచి రాజ్యసభ ఎన్నికల విధానం, రాజ్యాంగ సవరణవంటివి మనం తీసుకున్నాం. ఈ లక్షణాలన్నీ వివేకంగా ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగ నిర్ణాయక సభలో నిర్ణయించారు. అంతకుముందు బీఎన్ రావ్ ఒక ముసాయిదా రాశారు. అయితే అది పూర్తిగా మారిపోయింది. పోల్చుకోవడం కూడా సాధ్యం కాని విభిన్నమైన ప్రజాస్వామ్యాల నుంచి అనేక అంశాలు, కీలకమైన కొన్ని విధానాలు చేర్చ వలసి ఉందని ఆయనే స్పష్టంగా చెప్పారు.చదవండి: బాలయ్య మాటల్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలంటే..అందుకు తగినట్లే అనేక రాజ్యాంగాల నుంచి తగిన విషయాలను స్వీకరించడం జరిగింది. కానీ ఇప్పటికీ కొందరు పెద్దలు అసలు మొదటి రాజ్యాంగం రాసింది రావ్ గారే తెల్సా అని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మన తాజా దేశభక్తులు కూడా ఇదే వాదన చేస్తుంటారు. విధిలేక అంబేడ్కర్‌ను ఈ భక్తులు మొక్కుతున్నారు గాని రాజ్యాంగ నిర్ణాయక సభ (లేదా రాజ్యాంగ నిర్మాణ పరిషత్)లోని సప్త రుషులవంటి ఏడుగురు రాజనీతిజ్ఞుల అవిరళ కృషి, మార్గదర్శకాలతో తొలి డ్రాఫ్ట్ రూపొందింది. తరువాత ఆ ఏడుగురిలో ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణం చేశారని అర్థం చేసుకోవాలి. ప్రతి నియమానికి నానా కష్టాలు పడి, చర్చించి, ఒప్పించి, అందరూ ఏకాభిప్రాయం సాధించిన తరువాత ఈ రాజ్యాంగం ఏర్పడిందని గ్రహించాలి.-మాడభూషి శ్రీధర్, మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, ఇతరులకు భారీ ఉపశమనం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అమలు చేయాలని చూస్తున్న పుట్టుకతో పౌరసత్వం (Birthright Citizenship) రద్దుకు సంబంధించిన ఆదేశాలకు మరో సారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేరీల్యాండ్‌లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఆటోమేటిక్ జన్మహక్కు పౌరసత్వాన్ని నిరవధికంగా పరిమితం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను అడ్డుకున్నారు. అమెరికా పౌరసత్వం జీవితం.. స్వేచ్ఛ కంటే తక్కువ విలువైన హక్కు కాదు అంటూ జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ఆర్డర్‌ను నిరవధికంగా నిలిపివేశారు. ఈ ఆదేశాల అమలుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 19 నుండి అమలులోకి రానుంది.ట్రంప్ బాధ్యతలు చేపట్టి, తొలి రోజున సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని అమెరికా జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్‌మన్ బుధవారం తీర్పు ఇచ్చారు. 14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా వర్తిస్తుందనీ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటుందని ఈ ఆర్డర్ స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా పేర్కొన్నారు. దీంతో వలసలను అడ్డుకోవాలనే ఆలోచనలో భాగంగా 125 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రణాళికలకు ఈ తీర్పు మరొక చట్టపరమైన దెబ్బ.కాగా బర్త్‌రేట్ సిటిజిన్ షిప్ ఆర్డర్ జారీ చేసిన నాటి నుంచి, ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సంకెళ్లతో తరలించడం లాంటి అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోనున్నారనే భయాలు వెంటాడుతున్నాయి.Birthright Citizenship అంటే ఏంటి?అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తే ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించరు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భావించారు. ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు వంటి చట్టబద్ధమైన తాత్కాలిక నివాసితులు కూడా తమ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కోల్పోతారనే ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతానికి దీనికి బ్రేక్‌లు పడినట్టే.ఈ ఉత్తర్వుల ద్వారా భారీ ఊరట లభించేది వీరికేH-1B (వర్క్ వీసాలు)H-4 (డిపెండెంట్ వీసాలు)L (ఇంట్రా-కంపెనీ బదిలీలు)F (స్టూడెంట్ వీసాలు) ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ -
ఆత్మసాక్షాత్కారం అంటే..?
ఆత్మసాక్షాత్కారం మానవుని జన్మహక్కు అంటారు శ్రీ మాతాజీ. మనలోని కుండలినీ శక్తియే మన తల్లి. ఆమె మన అన్ని జన్మలలోను మనతోనే ఉంటూ, జాగృతి చెందే సదవకాశం కోసం ఎదురు చూస్తూ వస్తున్నది. స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని వర్ణాల, జాతుల వారు, ఎవరైనా సహజయోగ సాధన చేసుకోవచ్చును. ఆత్మసాక్షాత్కార అనుభూతి పొందవచ్చును. దీనికి కావలసింది ఆత్మసాక్షాత్కారం పొందాలనే శుద్ధమైన కోరిక మాత్రమే. అన్ని మతాలలోను, జ్ఞానమూర్తులు, అవతార పురుషులు సహజ యోగం గురించే బోధించారు. ఆత్మసాక్షాత్కారం ద్వారా పొందే ఆధ్యాత్మిక జీవనమే గొప్పదని చెప్పారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?పూర్వంలోలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి ఏ అడవులకో, హిమాలయాలకో వెళ్ళనవసరం లేకుండానే తమ, తమ సంసారిక బాధ్యతలు, సాంఘిక పరమైన విధులు నిర్వర్తిస్తూనే ఆత్మసాక్షాత్కారం పొందే ప్రక్రియను మాతాజీ కనుగొన్నారు.ఆత్మసాక్షాత్కారం పొందాలి అనే శుద్ధ ఇచ్ఛాశక్తి మనకు కలిగినప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తి జాగృతమై కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ఊర్ధ్వముఖంగా పయనించి, శిరస్సునందు గల సహస్రార చక్రాన్ని ఛేదించి, పరమ చైతన్య శక్తితో అనుసంధానం జరగటం వలన అనంతమైన దైవశక్తులన్నీ అనుభవంలోకి వచ్చి, తద్వారా మనకున్న అజ్ఞానం తొలగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానిగా... బ్రహ్మజ్ఞానిగా మార టమే ఆత్మసాక్షాత్కార పరమార్ధం.ఆత్మసాక్షాత్కారం అనేది ఒక అంధ విశ్వాసం, మూఢ నమ్మకమూ కానే కాదు. అనుభవ స్థిరమైనది, స్వయం అనుభూతి కలిగినటువంటిది. మాతాజీ ఫోటో ముందు కూర్చుని, నిస్సంకోచంగా హృదయపూర్వకంగా శుద్ధ ఇచ్ఛాశక్తితో ధ్యానం చేసినా ఈ అనుభూతి సహస్రార చక్రంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు అప్రయత్నంగా ఆలోచనలు నిలిచి΄ోతాయి. ఈ స్థితిని ‘నిర్విచారస్థితి’ అంటారు. ఈ స్థితిలో మన అరచేతులలో గానీ, మాడు పైనగాని, చల్లని వాయుతరంగాల అనుభూతి కలుగుతుంది. ఇది మీలోనే సంభవించు ‘ఆత్మసాక్షాత్కార’ అనుభవం, అనుభూతి.శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన గీతోపదేశంలో ‘యోగక్షేమం వహామ్యహం’ అన్నాడు. భగవంతుని యందు ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉన్న వారి యోగ క్షేమాలు తానే వహిస్తానని, యోగం ద్వారా భగవంతుని చేరినప్పుడే ఈ క్షేమం కలుగుతుందని బోధించిన విషయం మనందరికీ తెలిసినదే. ఇటువంటి యోగం అంటే ఆ సర్వవ్యాప్త భగవంతుని శక్తితో కలయిక ఈ సహజ యోగం ద్వారా సిద్ధిస్తుంది. శ్రీ లలితా సహస్రనామావళిలో పొందుపరచిన మంత్రాల సారాంశం కుండలిని జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందగోరటమే. సాధారణంగా మనం ఎల్లప్పుడూ గతానికి సబంధించిన లేక భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన విషయాలను ఆలోచిస్తూ ఉండటం వల్ల, శారీరకంగానూ, మానసికంగానూ సమతుల్యత లోపించటం వలన సదా మానసిక ఒత్తిడికి, శ్రమకు గురవుతూ ఉంటాం. అయితే సహజయోగలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనల్ని ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచడం వల్ల మనం సమతుల్యతలో ఉండటం జరుగుతుంది. ఈ స్థితిని పొందటాన్ని ‘ఆధ్యాత్మిక పరివర్తన’ అని చెప్పవచ్చును.– డాక్టర్ పి. రాకేష్ (శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాల ఆధారంగా) (చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!) -
Manideep charitable trust : సామాజిక సేవలో మణిదీపం
చదువుతోనే సమాజ వికాసం జరుగుతుందన్న విశ్వాసం ఆయనది.. అందుకే ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలన్నదే అతడి ఆకాంక్ష.. విద్యకు డబ్బు సమస్య కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పుల పేరిట తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తూ వారు చదువు కొనసాగించేలా దోహదపడుతున్నారు. ఆయనే మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మణిదీప్. బేగంపేట కుందన్‌బాగ్‌కు చెందిన మణిదీప్ విభిన్న సేవా కార్యక్రమాలను చేపడుతూ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. – సనత్నగర్మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్‌ను 2018లో ప్రారంభించిన మణిదీప్ సేవలను విస్తరించుకుంటూ వెళ్తున్నారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతగా నిలవాలని తలంపుతో మహా యజ్ఞాన్ని ఆరంభించారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 180 మందికి వారి ఆర్థిక స్థోమతను బట్టి సహకారం అందించి అండగా నిలబడ్డారు. ఈ ఒక్క ఏడాదే 50 మందికి స్కాలర్‌షిప్పులను అందజేశారు. అలాగే చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గురుకుల్ ట్రస్ట్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు వైశ్య వికాస వేదిక వారు 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో టాప్‌గా నిలిచిన వారికి ల్యాప్‌ట్యాప్‌లను అందజేశారు. చదవండి : బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!పేద విద్యార్థులకు ఇప్పటి వరకు ఆయన 30 ల్యాప్‌ట్యాప్‌లను అందజేశారు. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 10 మంది విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు అందించేందుకు ముందుకువచ్చారు. నిరుపేదలకు మెడిసిన్‌తో పాటు న్యూట్రిషన్, విటమిన్ ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యపరంగానూ సేవలుఅందిస్తున్నారు. కరోనా సమయంలో సంస్థ తరఫున ఎన్నో సేవలు అందించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా యూత్ కన్వినర్‌గా కూడా మణిదీప్ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు సంస్థలతో కలిసి రక్తదాన శిబిరాల నిర్వహణ చేపట్టడంతో పాటు విపత్తుల సమయంలో తీవ్రంగా నష్టపోయిన వారికి అండగా నిలబడుతున్నారు. మణిదీప్ సేవలను గుర్తించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇటీవలే ప్రతిభా పురస్కారాన్ని కూడా అందించారు. ఇదీ చదవండి: ‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియోల్యాప్ట్యాప్లు అందిస్తున్నాం సమాజం మనకు ఏమి ఇచ్చింది అనే కంటే.. సమాజానికి మనం ఏం చేశామన్నది ముఖ్యం. చదువే అన్నింటికీ సమాధానం. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదువును ఎవరూ ఆపకూడదు. అందుకోసం మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం, అవసరమైన వారికి ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తున్నాం. రాజ్‌భవన్ వేదికగా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాం. ఇండియన్ రెడ్‌క్రాస్‌సొసైటీ తరఫున సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం. – మణిదీప్, మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ -
పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!
కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిలువెల్లా గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంద మరణమనే వరం తో విష్ణుసాయుజ్యాన్ని పొందుతాడు భీష్ముడు. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్మ అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల ఐదు రోజులూ భీష్మపంచకంగా ప్రసిద్ధికెక్కుతాయనీ, ముఖ్యంగా భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా... పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చాడు. ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈరోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్ర నామాలతో పూజించిన పాండడవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి.. అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన్రపాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన ‘విష్ణుసహస్రనామస్తోత్రం’ ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరం, సకల శుభకరం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం. భీష్మ ఏకాదశిన అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహ స్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట, భద్రాచాలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేకపూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని, ఈ రోజున తలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం అవుతాయనీ పెద్దలు చెబుతారు.ఈవేళ ఇవి నిషిద్ధం..మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు వంటి వాటికీ దూరంగా ఉండాలి.ఉపవాస దీక్ష చేపట్టాలి.ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి.ఏకాదశి రోజున.. ఇంటిని శుభ్రం చేసుకోకుడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటివి చంపే అవకాశం ఉంటుంది.తెల్లవారు జామునే నిద్ర లేవాలి.. మధ్యాన్నం కునుకు తీయకూడదు.ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ.. రాత్రంతా జాగారం చేయాలి.జుట్టు కత్తిరించకూడదు.ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు.విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం మంచిది.పేదవారికి, ఆకలి అన్నవారికి ఈ రోజు అన్నం పెట్టడం పుణ్యప్రదం. ఈవేళ ఇలా చేయాలిపూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం’’ఓం నమోనారాయణాయ’’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. అభ్యంగ స్నానం చేసి.. పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించ వలసి ఉంటుంది. --డి.వి.ఆర్(చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!
దేవాలయాల్లో దేవుళ్లను గజవాహనంతో ఊరేగించడం వంటివి చేస్తారు. అంతేగాదు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే ఏనుగులపై దేవుడిని ఊరేగిస్తారు. అందుకోసం మావటి వాళ్లు తర్ఫీదు ఇచ్చి దైవ కైంకర్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. దీని కారణంగా ప్రకృతి ఓడిలో హాయిగా స్వేచ్ఛగా బతకాల్సిన ఏనుగులు బందీలుగా ఉండాల్సిన పరిస్థితి. దీనివల్లే కొన్ని ఏనుగులు చిన్నప్పుడు వాటి తల్లుల నుంచి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా లాభపేక్షలే జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఒక చక్కని పరిష్కారమార్గం చూపించింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేస్తోందంటే..గజారోహణ సేవ కోసం ఏనుగుల బదులుగా యాంత్రిక ఏనుగుల(ఛMechanical elephant)ను తీసుకొచ్చింది పెటా ఇండియా. ఏనుగులు సహజ ఆవాసాలలోనే ఉండేలా చేసేందుకే వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం ద్వారా నిజమైన జంబోలు తమ కుటుంబాలతో కలిసి ఉండగలవని, పైగా నిర్బంధం నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంది పెటా ఇండియా. అలాగే ఆయుధాలతో నియత్రించబడే బాధల నుంచి తప్పించుకుని హాయిగా వాటి సహజమైన ఆవాసంలో ఉంటాయని పేర్కొంది. ఇక ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్ స్టీల్‌తో రూపొందించినట్లు తెలిపింది. ఇవి నిజమైన ఏనుగులను పోలి ఉంటాయి. ఈ యాంత్రిక ఏనుగు తల ఊపగలదు, తొండం ఎత్తగలదు, చెవులు, కళ్లను కూడా కదిలించగలదు. అంతేగాదు నీటిని కూడా చల్లుతుందట. ఇది ప్లగ్-ఇన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుందట. దీనికి అమర్చిన వీల్‌బేస్ సాయంతో వీధుల గుండా ఊరేగింపులకు సులభంగా తీసుకెళ్లచ్చొట. తాజాగా ప్రఖ్యాత సితార్ విద్వాంసురాలు, ఈ ఏడాది గ్రామీ నామినీ అనౌష్కా శంకర్(Anoushka Shankar) పెటా ఇండియా(Peta India) సహకారంతో కేరళ త్రిస్సూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయాని(Kombara Sreekrishna Swami Temple)కి ఇలాంటి యాంత్రిక ఏనుగుని విరాళంగా సమర్పించారు. సుమారు 800 కిలోగ్రాముల బరువున్న ఈ ఏనుగును బుధవారం(ఫిబ్రవరి 05, 2025న ) ఆలయంలో ఆవిష్కరించారు. ఈ యాంత్రిక ఏనుగు పేరు కొంబర కన్నన్.ఇలా పెటా ఇండియా కేరళ(Kerala) ఆలయాలకి యాంత్రిక ఏనుగులను ఇవ్వడం ఐదోసారి. త్రిస్సూర్ జిల్లాలో మాత్రం రెండోది. ఇటీవల మలప్పురంలోని ఒక మసీదులో మతపరమైన వేడుకల కోసం కూడా ఒక యాంత్రిక ఏనుగును అందించింది. నిజంగా పెటా చొరవ ప్రశంసనీయమైనది. మనుషుల మధ్య కంటే అభయారణ్యాలలోనే ఆ ఏనుగులు హాయిగా ఉండగలవు. అదీగాక ఇప్పుడు ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రత్యామ్నాయం ప్రశంసనీయమైనదని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Kombara Kannan, a 3-metre-tall mechanical elephant weighing 800 kilograms, was offered to Kombara Sreekrishna Swami Temple, in Thrissur district on Wednesday, by renowned sitarist Anoushka Shankar and PETA India.📹Thulasi Kakkat (@KakkatThulasi) pic.twitter.com/Cz0vD0NNHs— The Hindu (@the_hindu) February 5, 2025 (చదవండి: ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!) -
Aga Khan : ఆధ్యాత్మిక నేత, ప్రముఖ దాత ఆగా ఖాన్ కన్నుమూత
బిలియనీర్,ప్రపంచ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ ఆగాఖాన్ (88) (Aga Khan) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ ఫౌండేషన్ ధృవీకరించింది. పోర్చుగల్‌లోని లిస్బన్లో తుదిశ్వాస విడిచారని ఆగాఖాన్ ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. ఆగాఖాన్మృతిపై విచారాన్ని ప్రకటించిన షౌండేషన్, ఆయన కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలిపింది. ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమైన భేదాలు లేకుండా ఆయన కోరుకున్నట్లుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని తెలిపింది.His Highness Prince Karim Al-Hussaini, Aga Khan IV, 49th hereditary Imam of the Shia Ismaili Muslims and direct descendant of the Prophet Muhammad (peace be upon him), passed away peacefully in Lisbon on 4 February 2025, aged 88, surrounded by his family. Prince Karim Aga Khan… pic.twitter.com/bxOyR0TyZr— Aga Khan Development Network (@akdn) February 4, 2025ఆగా ఖాన్‌కు హైదరాబాద్‌తో చారిత్రక సంబంధం కూడా ఉంది. అతని పూర్వీకులు ఈ ప్రాంతంలో వాణిజ్యం ,దాతృత్వం సేవలను అందించారు. ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ (AKDN) ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో AKDN పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి శిక్షణా కేంద్రాలతో సహా అనేక విద్యా సంస్థలను స్థాపించింది. 1967లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వందిలాది ఆసుపత్రులు ,విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేయడంతోపాటు అనేక ఇతర సేవా కార్యక్రమాలకు తన సంపదను వెచ్చించారు. ఈ సేవలకు గాను 2015లో దేశీయ అతిపెద్ద పౌరపురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు. ప్రిన్స్ కరీం అల్-హుస్సేనీ అగా ఖాన్ IV అని పిలుచుకునే ఆగా ఖాన్ స్విట్జర్లాండ్‌లో జన్మించారు. ప్రస్తుతం బ్రిటన్ పౌరుడిగా ఉన్నారు. 1957లో తన 20 ఏండ్ల వయస్సులో ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా నియమితులయ్యారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతోపాటు అనేక ఇతర వ్యాపారాల్లో రాణించారు. యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో నిర్వహించే గుర్రాల రేసుల్లో ఆయన పాల్గొన్నారు. షేర్గర్ జాతికి చెందిన గుర్రంతో రేసుల్లో పాల్గొనేవారు. 1969లో బేగం సమ్లిమా అగా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. తరువాత 1998లో బేగం ఇనారా అగా ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఆగాఖాన్ ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆగాఖాన్ మృతిపట్ల కింగ్ చార్లెస్ 3 సంతాపం ప్రకటించారు. -
నటాషా అద్వానీతో కొడుకు పెళ్లి : చీరలో శోభాడే స్టన్నింగ్ లుక్
ప్రఖ్యాత నవలా రచయిత్రి, జర్నలిస్టు శోభా డే గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తన రచనలతో దేశవ్యాప్తంగా గొప్ప రచయిత్రిగా పేరొందారు. ప్రముఖ కాలమిస్గా అనేక విషయాలపై రచనలు చేశారు. ఆమె పుస్తకాలు ఎక్కువగా సామాజికవేత్తలు, బాలీవుడ్ పరిశ్రమ ఇలాంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి ఆమెను ప్రపంచ స్థాయి రచయిత్రి జాకీ కాలిన్స్‌తో పోలుస్తారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లు అడపాడదపా వివాదాల్ని కూడా రాజేసేవి. తాజాగా ఆమె తన పెద్ద కుమారుడు వేడుకలో అందంగా కనిపించింది. కుమారుడు పెళ్లి ఫోటోలతోపాటు, పట్టుచీరలో ఆకట్టుకుంటున్న శోభాడే నెట్టింట సందడి చేస్తున్నాయి.శోభాడే కుమారుడు పెళ్లిశోభాడే పెద్ద కుమారుడు ఆదిత్య కిలాచంద్, తన స్నేహితురాలు నటాషా అద్వానీని పెళ్లాడాడు. ముంబైలో వైభవంగా జరిగిన ఈ పెళ్లివేడుకు టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. ఈ వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం, కుటుంబసభ్యులు, సన్నిహితులుహాజరయ్యారు. ప్రఖ్యాత బ్రాండ్ అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన డ్రెస్‌లో నటాషా పెళ్లి లుక్, వధూవరుల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా నటాషా అద్వానీ బంగారు లెహంగా అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ ఎంబ్రాయిడరీతో చేసిన గోల్డెన్ కలర్ లెహంగా, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీనికి మ్యాచింగ్‌గా ఎరుపు ,బంగారు గాజులు, చూడామణి, బంగారు నెక్లెస్‌ను వేసుకుంది. మరోవైపు, ఆదిత్య తెల్లటి ఎంబ్రాయిడరీ షేర్వానీ, ఐవరీ-హ్యూడ్ స్టోల్‌తో మెరిసాడు.శోభాడే చీర కుమారుడు పెళ్లికి మీనాకారి వర్క్‌తో, స్పెషల్ మోటిఫ్‌లతో తయారు చేసిన ఎరుపు-రంగు స్వచ్ఛమైన పట్టు కటాన్ ప్రష్యన్ రౌలెట్ చీరను ధరించింది. ఇంకా ఆమె వేసుకున్న నెక్ పీస్, పాపిట బిళ్ల, ముక్కెర, చేతి ఉంగరాలు ఇలా ప్రతీదీ తళుక్కున మెరిసాయి. ఇదీ చదవండి: చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీశోభాడే భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రచయితలలో ఒకరు. ఆమె జర్నలిజంలోకి అడుగు పెట్టడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది, 1990లలో స్టార్‌డస్ట్ మ్యాగజైన్‌కు సంపాదకురాలిగా పనిచేసింది.. బాలీవుడ్, సమాజం ,సంబంధాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ప్రకటించేది. సంపాదించింది. సోషలైట్ ఈవినింగ్స్, స్టార్రీ నైట్స్, సెకండ్ థాట్స్ , స్మాల్ బిట్రయల్స్ లాంటి ఆమె పాపులర్ రచనలు. ఆమె భర్త దిలీప్ దే.ఇద్దరు సవతి పిల్లలతో సహా ఆరుగురు పిల్లల తల్లి శోభాడే.కాగా ఆదిత్య కిలాచంద్ శోభా డే మాజీ భర్త సుధీర్ కిలాచంద్ కుమారుడు. అలీబాగ్‌లోని లగ్జరీ వెల్నెస్ విల్లా ప్రాజెక్ట్ అవాస్ వెల్నెస్ ఫౌండర్ సీఈవో కూడా. ఆదిత్య 1970లలో జన్మించాడు.అమెరికాలో ఉన్నత చదువు పూర్తి చేసిన ఇండియాలో వ్యాపారంలోకి ప్రవేశించాడు.చదవండి: కేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు -
కేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు
కేరళ (Kerala)లోని కొచ్చిలో 15 ఏళ్ల మిహిర్ అహ్మద్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ యువకుడు ఎత్తైన భవనం 26వ అంతస్తులోని ఫైర్ ఎగ్జిట్ వింటోనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విపరీతమైన ర్యాగింగ్ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బలవంతంగా టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారని, నిగ్గా (నల్లగా ఉన్నాడని) అంటూ దారుణంగా వేధించడం వల్లనే తన కొడుకు చనిపోయాడని బాధితుడి తల్లి ఆరోపించారు. విచారణ జరిపించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసింది. వేధింపులపై దర్యాప్తు చేయాలని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సహాయం కోరింది. గుండెల్ని పిండేసే విషయాలుమరోవైపు మిహిర్ అకాలమరణంపై ఐడి ఫ్రెష్ ఫుడ్స్ సీఈఓ పీసీ ముస్తఫా iD Fresh Foods CEO, PC Musthafa) స్పందించారు. మిహిర్ తన మేనల్లుడు అని సోషల్‌మీడియాలో వెల్లడించారు. నల్లగా ఉన్నాడనే కారణంగానే అతణ్ణి వేధించి చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు నిగ్గుతేల్చి, తన మేనల్లుడు మిహిర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి ఒక భావోద్వేగ పోస్ట్‌ను ఎక్స్ (గతంలో ట్విటర్) ఇన్‌స్టాలో పంచుకున్నారు.అలాగే మిహిర్‌తో, తన కుమారుడి కలసి చిన్ననాటి స్నాప్‌ను పోస్ట్ చేసి బాధను వ్యక్తం చేశారు. చిన్నపుడు బెంగళూరులో కలిసిపెరిగారని వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులని తెలిపాడు. కేవలం పదిహేనేళ్లకే నూరేళ్లు నిండి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మిహిర్ పాఠశాలలో, బస్సులో విద్యార్థుల గ్యాంగ్ దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడింది. శారీరకంగా దాడికి గురిచేసింది. చనిపోయేముందు రోజుకూడా మిహిర్‌ను కొట్టారు. దుర్భాషలాడారు. అవమానించారు. అతన్ని బలవంతంగా వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారు. టాయిలెట్ ఫ్లష్ చేస్తున్నప్పుడు అతని తలని టాయిలెట్లోకి నెట్టారు. దీని తర్వాత, వారు అతన్ని 'పూపీహెడ్' అని పిలిచి ఎగతాళి చేశారు’’ అంటూ వేధింపుల తాలూకు వివరాలను పీసీ ముస్తఫా వెల్లడించారు. View this post on Instagram A post shared by Musthafa PC (@musthafapcofficial) మిహిర్ మరణించిన తర్వాత కూడా'నిగ్గా' అని సంబోధించారని, ఆ సేజ్స్చూసి చలించిపోయాయనని, చాట్ స్క్రీన్షాట్లను చదివిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయానని ముస్తఫా పంచుకున్నారు. చిన్నపిల్లాడి పట్ల ఇంత దారుణా అంటూ వాపోయారు. అందుకే ఈ దుర్మార్గుల బెదిరింపులు, ర్యాగింగ్లు లేని ప్రపంచానికి వెళ్లిపోయాడు. వాడి మరణం వృధా కాకూడదు. న్యాయం జరగాలి అని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది ,న్యాయం గెలుస్తుందదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని నెటిజన్లును కోరారు. తనకోసం కాదు, ఎదిగే ప్రతిబిడ్డకోసం, సురక్షితమైన వాతావరణంలో చదువుకునేందుకు తాను చేస్తున్న పోరాటంలో తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇవీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు -
Ratha Saptami 2025: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన ఇవాళే..!
మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమి రోజున సూర్య దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజున సూర్య నారాయణుడిని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం, రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే మకర సంక్రాంతి తర్వాత రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథ సప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా పూజవిధానం, చేయాల్సిన విధివిధానాలు గురించి సవివరంగా చూద్దామా..!.పురాణ కథనం ప్రకారం..కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథ సప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.రథ సప్తమి తిథి ఎప్పుడంటే:మాఘ మాసంలోని శుక్ల పక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 04 , 2025 ఉదయం 7:56 గంటలకు సప్తమి ప్రారంభమై, మరుసటి రోజు 05 ఫిబ్రవరి 2025 తెల్లవారుజామున 5:29 గంటలకు ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి 5న బుధవారం ఉదయం సూర్యదోయ సమయం 6:36 గంటల కంటే ముందే సప్తమి తిథి ముగుస్తుంది. అందువల్ల ఇవాళే (ఫిబ్రవరి 4వ తేదీన) జరుపుకుంటారు.స్నానానికి ఎంతో ప్రాధాన్యత..రథ సప్తమి రోజు చేసే స్నానం, దానం ఏడు జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలను తొలగింపజేస్తుందట! అందువల్ల రథ సప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం ఏడు జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లు తీసుకోవాలి. వాటిని శిరస్సుపై ఉంచి తలంటు స్నానం చేయాలని తెలిపారు. ఇక్కడ జిల్లేడు ఆకులు, రేగి పళ్లు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, అవి సూర్యుడికి ఇష్టమైనవి. ఈ విధమైన ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిస్తుందట. ఆ తర్వాత సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి ఈ విధంగా జపిస్తూ ఆర్ఘ్యం ఇవ్వాలి.‘‘ఓం సూర్యాయ నమఃఓం భాస్కరాయ నమఃఓం ఆదిత్యాయ నమఃఓం మార్తాండ నమః’’ అనే మంత్రాలను జపించాలి. వీటితో పాటు మరికొన్ని మంత్రాలను జపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది.‘‘యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసుతన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీఏతజ్ఞన్మకృతం పాపం యచ్ఛ జ్ఞాతాజ్ఞాతేచ యే పునఃసప్త విధం పాపం స్నానామ్నే సప్త సప్తికేసప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’పూజా విధానం:ఇంటి ఆవరణలో చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా పెట్టాలి. ఆ మండపం దగ్గర సూర్యుడి ఫొటో ఉంచాలి. ఇవన్నీ కుదరకపోతే పూజ గదిలో ఒక తమలపాకు తీసుకుని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి. దానిని సూర్యుడిగా భావించాలి. ఒకవేళ సూర్య భగవానుడి ఫొటో ఉంటే పెట్టండి. అక్కడ గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి. వీలైతే ఆవు పాలతో పాయసం చేస్తే మంచిది. పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రసాదం స్వీకరించాలి. సూర్య భగవానుడికి ప్రీతికరమైన రథ సప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అంతేగాదు ఈ రోజు ఆదిత్య హృదయం లేదా సూర్య చాలీసా వంటివి పఠిస్తే మరింత ఫలితాన్ని పొందుతారనేది పురాణ వచనం.(చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..) -
దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..
గాడ్స్ ఓన్ కంట్రీ... చూడాల్సినవి ఇవి అని చెప్పుకోవడం కష్టం. జాబితా వేళ్ల మీద లెక్కపెట్టేటంత చిన్నదిగా ఉండదు. ఆర్ట్ అండ్ కల్చర్, ఆధ్యాత్మికం, ధార్మికం, వీకెండ్ పిక్నిక్ స్పాట్స్, బీచ్‌లు, బ్యాక్ వాటర్స్, పర్వతాలు, కొండవాలులో టీ తోటలు, సముద్రం మీద సూర్యాస్తమయాలు, జలపాతాలు, వన్యప్రాణులు, హాలిడే రిసార్టులు... ఇలా పరస్పరంవైవిధ్యభరితమైన పర్యటనల నిలయం ఈ రాష్ట్రం. కేరళలో ఆధ్యాత్మికం కూడా ఆద్యంతం అలరిస్తుంది. త్రివేండ్రంలోని పద్మనాభ స్వామి ఆలయం మొదలు అంబళంపుర శ్రీకృష్ణుడు, చెట్టికుళాంగుర భగవతి, శబరిమల అయ్యప్ప, కొట్టరక్కర గణపతి, తిరునెల్లి ఆలయం, చర్చ్‌లు, మసీదులు ప్రతిదీ టూరిస్టులకు కనువిందు చేస్తాయి.శబరిమలైకి మహిళలను అనుమతించడం కోసం తృప్తి దేశాయ్ చేసిన ఉద్యమంతో ఉత్తరాదివాసుల దృష్టి కూడా కేరళ మీద కేంద్రీకృతమైంది. ఇప్పుడు కేరళలో హిందీవాళ్లు కూడా కనిపిస్తున్నారు.అరబిక్ కడలికేరళ టూర్‌కి కాలంతో పని లేదు. అరేబియా తీరం– పశ్చిమ కనుమల మధ్య విహారానికి ఎప్పుడైనా రెడీ కావచ్చు. ఎండకాలం చల్లగా అలరిస్తుంది. జూన్ నుంచి చిరు వానలు పలకరిస్తాయి. శీతాకాలం పచ్చదనం తన గాఢతను ప్రదర్శిస్తుంది. తలలు వాల్చి ఆహ్వానం పలికే కొబ్బరితోటలు, కోమలత్వాన్ని తాకి చూడమనే అరటి గుబుర్లు, ఎటూ వంగని పోకచెట్లు, ఏ చెట్టు దొరుకుతుందా అల్లుకుపోదామని వెతుక్కునే మిరియాల తీగలు, కాయల బరువుతో భారంగా వంగిపోతున్న కాఫీ చెట్లు, టూర్‌కి మినిమమ్ గ్యారంటీ ఇచ్చే అరేబియా సముద్రం మీద సూర్యాస్తమయాలు... ఇవన్నీ ప్రకృతి ప్రసాదితాలు.ఆది శంకరుడు పుట్టిన నేలకాలడి ఓ చిన్న పట్టణం. పెరియార్ నది ఒడ్డున ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యుడు పుట్టిన ప్రదేశం ఇది. ఇక్కడ ఆయన నివసించిన ఇల్లు, ఆయన తల్లి సమాధి ఉన్నాయి. ఇక్కడి స్నానఘట్టంలో ముత్తల కడవు (మొసలి మడుగు) ను కూడా చూడవచ్చు. ఆది శంకరుడు సన్యసించాలనుకున్నప్పుడు తల్లి అంగీకరించలేదు. ఆమె అంగీకారం కోసం ఆది శంకరుడు నాటకం ఆడిన ఘట్టం ఇది. స్నానఘట్టంలో దిగి మొసలి పట్టుకున్నదని, సన్యసించడానికి ఒప్పుకుంటేనే వదులుతుందని తల్లిని మాయ చేసి అంగీకారం పొందిన కథనాన్ని చెబుతారు పూజారులు. పెరియార్ నది కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగడానికి ముందే పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. పచ్చటి చేనులో నీలిరంగు వస్త్రాన్ని మలుపు తిప్పుతూ పరిచినట్లు ఉంటుంది దృశ్యం.కళల నిలయంకేరళ ప్రకృతిసోయగంతోపాటు కళలతోనూ ఆకట్టుకుంటుంది. కలరిపయట్టు వంటి యుద్ధ క్రీడ, మోహినీ అట్టం, కథాకళి వంటి నాట్యరీతులు, రాజారవివర్మ చిత్రలేఖన సమ్మేళనం ఇక్కడే పుట్టాయి. భరత్పుఱ నది తీరాన త్రిశూర్ జిల్లాలోని చెరుత్తురుతి పట్టణంలో కేరళ కళామండలం ఉంది. కళల సాధన కోసం ఏర్పాటు చేసిన ఈ కళామండలంలో నిత్యం సంప్రదాయ నాట్యరీతుల సాధన జరుగుతూ ఉంటుంది. మరో హాలులో కేరళ సంప్రదాయ నాట్య రీతుల నాట్య ముద్రలు, భంగిమలు, ఆహార్యంతో ఉన్న బొమ్మల మ్యూజియం ఒక ఎడ్యుకేషన్. ఈ కళల కోసమే కాదు, కేరళ కళామండలం భవన నిర్మాణశైలిని చూడడం కోసం ఆర్కిటెక్చర్ విద్యార్థులు వెళ్లాల్సిన ప్రదేశం.వాస్కోడిగామా ఎంట్రీ!కేరళ రాష్ట్రంలో సగం తీర్రప్రాంత జిల్లాలైతే మిగిలిన సగం కొండ్రప్రాంత జిల్లాలు. రైలు ప్రయాణంలో తమిళనాడు నుంచి కేరళకు వెళ్లేటప్పుడు పాలక్కాడ్ నుంచే మార్పు కనిపిస్తుంది. మనదేశంలో వలస పాలనలో మగ్గి΄ోవడానికి దారులు పడింది కూడా ఈ రాష్ట్రం నుంచే. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మనదేశంలోకి ప్రవేశించింది కోళికోద్ పట్టణానికి సమీపంలోని కప్పడ్ అనే చిన్న తీరగ్రామంలో. కప్పడ్ బీచ్‌లో వాస్కోడిగామా జ్ఞాపకచిహ్నాలున్నాయి. చర్చ్‌లు యూరోపియన్ నిర్మాణశైలిలో అందంగా ఉంటాయి. నది తీరాన నిర్మించడంలో గొప్ప అభిరుచి వ్యక్తమవుతుంటుంది. ఎర్నాకుళంలో సెయింట్ మేరీస్ బాసిలికా చర్చ్, మలయత్తూర్ చర్చ్, శాంతాక్రజ్ కేథడ్రల్, జార్జ్ ఫ్రాన్సిస్ చర్చ్, సముద్రతీరాన నిర్మించిన వల్లర΄ాదమ్ చర్చ్‌లు ప్రశాంత వాతావరణంలో మౌనముద్ర దాల్చి ఉంటాయి. ముఖ్యమైన మసీదులు ముప్పైకి పైగా ఉంటాయి.ఆరోగ్యదేవుడు ధన్వంతరిఆయుర్వేదంలో వైద్యానికి మూల పురుషుడు ధన్వంతరి. ధన్వంతరికి ‘ముక్కిడి’ పేరుతో 35 ఔషధాల మిశ్రమాన్ని నివేదిస్తారు. త్రిశూర్ జిల్లా, నెల్లువాయ్ గ్రామంలో ఉన్న ఆలయం పురాతనమైనది. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతభాండాన్ని ధన్వంతరి పట్టుకుని వస్తాడు. ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం, ఒకచేతిలో అమృతభాండం, మరో చేతిలో జలూకం(జలగ, ఆయుర్వేద వైద్యంలో జలగను ఉపయోగిస్తారు)తో ఉద్భవించాడు ధన్వంతరి. ఆ మూర్తినే ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు. మున్నువరువట్టం, గురువాయూర్లలో కూడా ధన్వంతరి ఆలయం ఉంది. శబరిమలకు వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.టీ తోటల మునార్మున్నార్ అంటే మూడు నదుల కలయిక. ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్‌స్టేషన్ ఇది. టీ తోటలు విస్తారంగా ఉంటాయి. ఈ తోటల మధ్య జలపాతాలు తెల్లగా పాలధారలను తలపిస్తుంటాయి. వర్షాకాలంలో దట్టంగా అలముమున్న నల్లటి మేఘాలను చీల్చుకుంటూ భూమ్మీద పాలను కుమ్మరిస్తున్నట్లు ఉంటుంది అట్టుకడ జలపాతం. ఈ టూర్లో ఎరవి కులమ్ నేషనల్ పార్క్‌ను, నీలగిరులు అనే పేరు రావడానికి కారణమైన నీలకురింజి మొక్కలను చూడాలి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాలను ఒకసారి చూసిన వాళ్లు కూడా కురింజి పూలు పూసినప్పుడు మళ్లీ చూడాలని ఆశపడతారు. బొటానికల్‌గా ఇవి 50 రకాల జాతులున్నాయి. కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్ చేయలేనంత లలితంగా ఉంటాయి. నీలకురింజి పూలు పన్నెండేళ్లకోసారి పూస్తాయి. 2018లో పూశాయి, మళ్లీ పూసేది 2030లోనే. కోవిడ్ సమయంలో కూర్గ్ కొండల్లో కొన్ని చోట్ల విరిశాయి. కానీ సీజన్లో పూసినట్లు కొండ మొత్తం విస్తరించలేదు. ఇక్కడ జంతు సంచారం కూడా ఎక్కువ. నీలగిరి థార్ ఇక్కడ మాత్రమే కనిపించే జింక జాతి.కోటలు... తోటలు!కేరళ గ్రామాల్లో మన దగ్గర ఉన్నట్లు ఇళ్లన్నీ ఒక చోట, పొలాలు ఒకచోట ఉండవు. రెండు – మూడు ఎకరాల స్థలంలో కొబ్బరి చెట్లు, మధ్యలో ఇల్లు ఉంటుంది. తోట పక్కన మరొక తోట... ఆ తోటలో ఒక ఇల్లు... చాలా ఇళ్లకు పై కప్పు ఎర్ర పెంకులే ఉన్నాయి. రెండస్తుల ఇల్లు కూడా పై కప్పు వాలుగా, ఎర్ర పెంకులతో ఉంటుంది. రాజుల ప్యాలెస్‌లు కూడా భారీ నిర్మాణాలేమీ కాదు. రాజస్థాన్ కోటలు, ప్యాలెస్‌లను చూసిన కళ్లతో ఇక్కడి ప్యాలెస్‌లను చూస్తే కళ్లు విప్పార్చలేం. కానీ ప్రకృతి సహజమైన, శాంతియుతమైన జీవనశైలికి నిదర్శనంగా కనిపిస్తాయి. పాలక్కాడ్, తలస్సెరి కోటలు పర్యాటకులను అలరిస్తుంటాయి. చిన్న చిన్న ప్యాలెస్‌లను రిసార్టులుగా మార్చేశారు. భరత్‌పుర నది ఒడ్డున ఉన్న ప్యాలెస్‌ను ‘ది రివర్ రిట్రీట్’ పేరుతో హెరిటేజ్ ఆయుర్వేదిక్ రిసార్టుగా మార్చారు. అందులో భోజనం చేయడం జిహ్వకు వైద్యం.మీన్ ముట్టి జలపాతంవయనాడు... కేరళ రాష్ట్ర్రంలో అత్యున్నత స్థాయి ప్రకృతి సౌందర్యాన్ని ఇముడ్చుకున్న ప్రదేశం. ఆ రాష్ట్రానికి శిఖరాగ్రం కూడ ఇదే. మీన్ముట్టి వాటర్ ఫాల్స్‌కి రెండు కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో ట్రెకింగ్ చేయాలి. ఈ కొండ మీద మీన్ముట్టి వాటర్‌ఫాల్స్ దగ్గర నుంచి చూస్తే ఒక వైపు తమిళనాడు నీలగిరులు, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్ కొండలు దోబూచులాడుతుంటాయి. వరదలు ముంచెత్తినప్పటికీ పర్యాటకం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటోంది. ట్రీ హౌస్‌లో బస చేయాలనే సరదా తీరాలంటే ముందుగానే ΄్లాన్ చేసుకోవాలి. ఇక్కడ పర్యటిస్తే కేరళ వాళ్లు తమ రాష్ట్రాన్ని ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.గిన్నిస్ బుక్‌లో జటాయుపురాజటాయు నేచర్ పార్క్... కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణం, జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో రావణాసురుడితో జటాయువు పోరాడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. నేచర్ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ మ్యూజియమ్ ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. వెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు.త్రివేండ్రం పద్మనాభుడుఅనంత పద్మనాభ స్వామి ఆలయం అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటుంది. తలుపులు తెరుచుకోని ఆరోగది మీదనే అందరి దృష్టి. అంతకంటే గొప్ప ఆసక్తి ఇక్కడి పద్మనాభుడి రూపం. ఈ ఊరికి తిరువనంతపురం అనే పేరు రావడానికి కారణం ఈ ఆలయమే. కేరళ రాజధాని నగరం ఇది. బంగారు గోపురం ఉన్న ఈ ఆలయం టావెన్కోర్ రాజవంశం సంపన్నతకు ప్రతీక.అలెప్పీ హౌస్బోట్హౌస్బోట్లో ప్రయాణం చేయకపోతే కేరళ టూర్ వృథా అనే చెప్పాలి. ఇప్పుడు హౌస్బోట్లు మరింత పెద్దవిగా క్రూయిజ్‌లుగా మారాయి. టూర్ ప్యాకేజ్‌లో డే క్రూయిజ్ ప్యాకేజ్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ప్రయాణంలో కేరళ సంప్రదాయ భోజనంలో రకరకాలను ఆస్వాదించవచ్చు. భోజనాన్ని అరిటాకులో వడ్డించడం మాత్రమే కాదు అరటికాయ చిప్స్, చేపను అరిటాకులో చుట్టి వేయించిన ఫిష్‌ఫ్రై ఇక్కడ ప్రత్యేకం. చికెన్ కర్రీలో కొబ్బరి ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి నూనె వంటల మీద అపోహ ఉంటుంది. కానీ ఈ వంటలు చాలా రుచిగా ఉంటాయి.షాపింగ్జరీ అంచు హాఫ్‌వైట్ చీర లేదా లంగా–ఓణీ తెచ్చుకోవడం మరువద్దు. ఉడెన్ కార్వింగ్ బాక్సులు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అందంగా ఉంటాయి. కొబ్బరి, అరటి నారతో చేసిన టేబుల్ మ్యాట్స్, కోషెలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాల్ హ్యాంగింగ్స్ కొనుక్కోవచ్చు. ఇవి తినాలికోకోనట్ హల్వా, అరటికాయ చిప్స్, అరటికాయ బజ్జీ ప్రసిద్ధి. కొబ్బరి బోండాం తప్పకుండా తాగాలి. వేడుకలివిఫిబ్రవరి 14 నిషగంధి డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు పరియాణమ్ పేట్ పూరమ్, పాలక్కాడ్, భగవతి టెంపుల్, త్రిశూర్ ఆలయంలో ఉత్రాళిక్కవు పూరమ్ వేడుకలు జరుగుతాయి. ప్యాకేజ్‌లిలా...సౌత్ కేరళ 4 రాత్రులు 5 రోజులకు 55 వేలు. 5 రాత్రులు 6 రోజులకు దాదాపుగా అరవై వేలు. ఎంటైర్ కేరళకు ఆఫర్ నడుస్తోంది. పది రాత్రులు 11 రోజులకు 55 వేలు. ఈ ఆఫర్ మార్చి 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో కొదుండుళూర్లోని చేరమాన్ జుమా మసీద్, చీయప్పార జలపాతం, వాలర జలపాతం, ఇడుక్కి దేవికులమ్ హిల్స్, కొచ్చిలోని బోల్గట్టీ ఐలాండ్, హౌస్‌బోట్, విలేజ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ మొదలైనవి కవర్ అవుతాయి. సెంట్రల్ కేరళ ప్యాకేజ్ కి20 వేలు. ఇందులో అళప్పుఱ, పెరియార్ టైగర్ రిజర్వ్, తెక్కడి, మునార్, ఫోర్ట్ కొచ్చి మొదలైనవి ఉంటాయి. --వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం చూతము రారండి) -
శివమణితో సమానంగా.. జూనియర్ శివమణి!
డ్రమ్స్ పేరు చెప్తే ఇండియాలో శివమణి గుర్తుకు వస్తాడు. ఆయనో పెద్ద డ్రమ్స్ ప్లేయర్. ప్రితీష్ కూడా ఏం తక్కువ కాదు. జూనియర్ శివమణి అని చెప్పచ్చు. ఎ.ఆర్ ప్రీతీష్ వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం తల్లిదండ్రులతోపాటు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఐదేళ్ల వయసులో అతను తొలిసారి డ్రమ్స్ చూశాడు. సరదాగా దాని మీద ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత అదే అతనికి పనిగా మారింది. వయసులో తనకన్నా పెద్దవాళ్ళతో పోటీ పడి మరీ వాయించేవాడు.డ్రమ్స్ మీద రకరకాల ప్రయోగాలు చేసేవాడు. 8వ తరగతి వచ్చేనాటికి ప్రదర్శనలు ఇస్తూ అందరి చేతా శభాష్ అనిపించుకునేవాడు. ఆ తర్వాత అతని దృష్టి గిన్నిస్ రికార్డ్ మీద పడింది. ఎలాగైనా దాన్ని సాధించాలని అత్యంత వేగంగా డ్రమ్స్ వాయించడాన్ని నేర్చుకున్నాడు. ఏడు నెలలపాటు అదే పనిగా డ్రమ్స్ వాయించి ఆ పట్టు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గిన్నిస్ ప్రతినిధుల ముందు నిమిషానికి 2,370 సార్లు డ్రమ్స్ వాయించాడు. అంటే ఒక సెకనుకు దాదాపు 40 సార్లు డ్రమ్ వాయించాడు. అతని ప్రతిభ చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అత్యంత చిన్న వయసులో ఒక నిమిషంలో అత్యధిక సార్లు డ్రమ్స్ వాయించిన వ్యక్తిగా అధికారిక రికార్డు అందజేశారు. ప్రీతీష్ కల నెరవేరింది.ఇదీ చదవండి: సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుతున్నారా..వద్దొద్దు! చిన్నారులకోసం చిన్నారుల గేయంపాడుదాం గేయం తారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలుచంద్రుడి పక్కన చుక్కల్లా మెరిసే బంగరు గోపికలుఅంబరానికి తోరణమై నిలిచే అందాల జ్ఞాపికలుఎగరేసే దారం లేదు ఎవరి చేతి ఆధారం లేదుఎత్తున నిలిచే ఊతం అయినా మెరిసే తారకలుఏ రోజూ సెలవు లేదు ఏనాడూ అలుపు రాదువజ్రాలంటి మెరుపు ΄ోదుఅందుకే అవి తారకలుతారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలు∙ -
సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుతున్నారా.. వద్దొద్దు!
పిల్లలూ! మీరెప్పుడైనా సరదాగా సముద్రం చూసేందుకు వెళితే ఏం చేస్తారు? అక్కడ ఒడ్డున ఉన్న రాళ్లను ఏరుకుంటారు. వాటిని మీతోపాటు తెచ్చుకొని దాచుకుంటారు. నలుపు, తెలుపు రంగుల్లో నునుపుగా ఉండే ఆ రాళ్లు చూసేందుకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని ఇంట్లో పెట్టుకొని మురిసి΄ోతుంటారు. అయితే ఇకపై ఆ పని చేయొద్దు. ఎందుకో తెలుసా?సముద్రంలో నిత్యం ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతుంటాయన్న విషయం మీకు తెలుసు కదా! ఆ అల్లు తాకిడికి తీరం కొట్టుకు΄ోకుండా రక్షించేది ఈ రాళ్లే. ఒడ్డున అందరూ ఆనందంగా ఉండాలన్నా, సముద్రం అలలు మన మీద ఉధృతంగా పడిపోకుండా ఉండాలన్నా ఈ రాళ్లు రక్షణ కవచాలుగా నిలబడతాయి. మీరు ఈ రాళ్లను మీతోపాటు తెచ్చుకుంటే ఆ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో అలలు తీరాన్ని కోసుకుంటూ వెళ్లిపోతాయి. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. మేమొక్కరం కొన్ని రాళ్లు తెచ్చుకుంటే నిజంగా ఇంత సమస్య వస్తుందా అని అనుకోవద్దు. మీరొక్కరే కాకుండా నిత్యం ఎంతోమంది సముద్రం చూసేందుకు వస్తారు. వారంతా మీలాగే ఆలోచించి తలా ఒక రాయి తీసుకొని వెళితే నష్టం తప్పక జరుగుతుంది. అందుకే ఉత్తర ఇంగ్లండ్‌లోని కంబర్‌ల్యాండ్ కౌన్సిల్ ప్రాంతంలో కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా సముద్రం ఒడ్డున రాళ్లు ఏరి, తీసుకెళ్తున్నట్టు తెలిస్తే వాళ్లకు 100 పౌండ్లు(సుమారు రూ.10 వేలు) జరిమానా విధిస్తారు. ఇదంతా సముద్రాన్ని, చుట్టూ ఉన్న తీరు ప్రాంతాన్ని కాపాడటం కోసమే! మన దేశంలో అలా రాళ్లు ఏరినందుకు ఎవరూ జరిమానా వేయరు. కానీ సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతానికి హాని కలగకుండా ఉండాలంటే మనమే సొంతంగా ఆ పని మానేయాలి. సముద్రం ఒడ్డున హాయిగా పరుగులు పెడుతూ, సముద్రం అలల్ని చూస్తూ గడపాలి.. కావాలంటే ఆ రాళ్లతో అక్కడే ఆడుకోవాలి తప్ప వాటిని ఏరుకొని ఇంటికి తీసుకురాకూడదు. తెలిసిందా! ఇదీ చదవండి: US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం! US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరు -
ఆకట్టుకుంటున్న ‘రివైవింగ్ రూట్స్’.. ఆర్ట్ ఎగ్జిబిషన్
సాలార్జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ వంటి మ్యూజియాలలో ప్రదర్శనకు ఉంచిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, చారిత్రక చిహ్నాలు (రాణి లక్ష్మీబాయి, రుద్రమదేవి, అక్కన్న, మాదన్న) ఇతర స్థానిక ప్రముఖుల నుంచి పౌరాణిక వ్యక్తులు, శకుంతల సిరీస్‌కు ప్రసిద్ధి. సందేశాత్మక, సంస్కృతి, సంప్రదాయాల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన చిత్రాలే. ఆయనే కళాకారుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు. ఆయన వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. – మాదాపూర్ ఆకర్షణగా రామాయణ ప్రధాన ఘట్టాల చిత్రాలు మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో ఆయన కుమారుడు వేణుగోపాల్‌రావు అధ్వర్యంలో రివైవింగ్ ది రూట్స్ పేరిట ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటుంది. 1940 నుంచి 2012 వరకూ గీసిన 250 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. రామాయణాన్ని కళ్లకు కట్టినట్టు ప్రతి సన్నివేశాన్నీ చిత్రరూపంలో గీసి సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేశారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను చిత్రప్రదర్శన ద్వారా నేటి యువతరం తెలుకునే విధంగా వివరించారు. యువతరం చిత్రరంగంలో రాణించడానికి ఈ ప్రదర్శన స్ఫూర్తినిస్తుందని పలువురు చిత్రకారులు చెబుతుండడం విశేషం. నేటి యువకళాకారులకు చిత్రకళపై ఆకర్షణ పెరిగేందుకు ఈ ప్రదర్శన తోడ్పడుతుందన్నారు. ఫిబ్రవరి 5 వరకూ నిర్వహించనున్న ఈ ప్రదర్శనను నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు సందర్శిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా...కళాకారుడు శేషగిరిరావు చిత్రాలు సందేశాత్మకంగా ఉంటాయి. యువతను ఆలోచింప జేస్తాయి. ఆయన చిత్రరంగంలో రాణించేందుకు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. నేటి భవిష్యత్తు తరాలకు తెలిసేలా ఆయన కోడలు కొండపల్లి నిహారిక చిత్రకళా తపస్వి కొండపల్లి శేషగిరిరావు పేరిట జీవిత చరిత్రను రాశారు. ప్రతి ఒక్కరూ కుటుంబాలతో కలసి చూడాల్సిన ప్రదర్శన. – డాక్టర్ కె.లక్ష్మి ఆర్ట్‌గ్యాలరీ డైరెక్టర్ ప్రదర్శన ఉపయోగకరం.. చిత్రరంగంలో రాణిస్తున్న వారికి ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగకరం. రామాయణ ఘట్టాలను చిత్రరూపంలో అద్భుతంగా చిత్రించారు. వీటి ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పొచ్చు. చిత్రకారులు వీటి ద్వారా ఎన్నో మెళకువలను తెలుసుకోవచ్చు. – కీర్తి, జేఎన్‌ఏఎఫ్‌యూ విద్యార్థినిఇవీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో! -
అంతరించిపోయిన ఐకానిక్ పక్షులకోసం అనంత్ అంబానీ కీలక నిర్ణయం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్య ప్రాణుల సంరక్షణలో మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న వంతారా బ్రెజిల్లో దాదాపు అంతరించి పోయినట్టు ప్రకటించిన ఐకానిక్ పక్షులను రక్షించేందుకు నడుంబిగించింది. బ్రెజిల్‌లోని కాటింగా బయోమ్ అడవిలో అంతరించిపోయిన 41 స్పిక్స్ మకావ్ (Cyanopsitta spixii) లకు పునరుజ్జీవం తెచ్చేందుకు రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి వంతారా అనుబంధ సంస్థ గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెండ్ పేరెట్స్ (ACTP)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.2000లో అంతరించిపోయినట్లు ప్రకటించినన స్పిక్స్ మాకా (సైనోప్సిట్టా స్పిక్సీ) అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్‌లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం. ఇందులో GZRRC ప్రాజెక్ట్‌లో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.జర్మనీలోని బెర్లిన్‌లోని ఏసీటీపీ బ్రీడింగ్ సెంటర్ నుండి 41 స్పిక్స్ మకావ్‌లను బ్రెజిల్‌లోని బాహియాలోని విడుదల కేంద్రానికి విజయవంతంగా తరలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించిందిఅనంత్ అంబానీ నేతృత్వంలోని వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా. ఈ గ్లోబల్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా, వంతారా నిపుణులు ఏసీటీపికి మార్గదర్శకత్వం చేయడంతో పాటు కీలకమైన వనరులను అందిస్తారు. వీటిల్లో 2022లో 20 స్పిక్స్ మకావ్‌లను అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ఫలితంగా 20 సంవత్సరాలలో తొలిసారి పిల్లలు పుటాయనీ, ఇది ప్రోగ్రామ్ పురోగతికి సామర్థ్యానికి నిదర్శనమని వంతారా ప్రకటించింది.బ్రెజిల్‌కు బదిలీకి ఎంపిక చేయబడిన 41 స్పిక్స్ మకావ్‌లను వాటి వంశపారంపర్యత, ఆరోగ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఇందులో 23 ఆడ, 15 మగ, 3 ఇంకా నిర్ధారించని చిన్న పిల్లలున్నాయి. ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా, మరికొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రామ్‌లో చేర్చారు.. బదిలీకి ముందు, పక్షులు బెర్లిన్‌లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో 28 రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్లో ఉన్నాయి. అక్కడి అడవి పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏవైనా వ్యాధులకు లేవని నిర్దారించుకునేందుకు వీలుగా సమగ్ర పరీక్షలు నిర్వహించారు. జనవరి 28న, ఆ పక్షులు బెర్లిన్ నుండి చార్టర్డ్ విమానంలో బ్రెజిల్‌లోని పెట్రోలినా విమానాశ్రయానికి బయలు దేరి, అక్కడికి చేరుకున్న తర్వాత, వాటిని నేరుగా క్వారంటైన్ సౌకర్యానికి తరలించారు. ఈ బదిలీని ఇద్దరు పశువైద్యులు , ఏసీటీపిఒక కీపర్ జాగ్రత్తగా పర్యవేక్షించారు, వీరితో పాటు వంటారా GZRRC నుండి నిపుణుల బృందం కూడా ఉంది.స్పిక్స్ మకావ్స్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్‌కు వారి అద్భుతమైన కృషి చేసిన అనంత్ అంబానీ , వంతారాబృందానికి ACTP వ్యవస్థాపకుడు మార్టిన్ గుత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోయిన జాతుల రక్షణలోఆర్థిక సహాయంతో పాటు, నైపుణ్యం ఎంతో అమూల్యమైనదని కొనియాడారు.హాలీవుడ్ చిత్రం రియోలో ప్రముఖంగా కనిపించిన స్పిక్స్ మకా, బ్రెజిలియన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో, బ్రెజిల్లో ఒక ప్రత్యేక విడుదల కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 2020లో జర్మనీ బెల్జియం నుండి 52 పక్షులను రవాణా చేశారు. 2022లో, 20 స్పిక్స్ మకావ్‌లను వాటి సహజ ఆవాసాలలోకి విడుదల చేయగా, ఏడు అడవి కోడిపిల్లలు జన్మించాయి. భారతదేశ వైవిధ్యమైన వన్యప్రాణుల వారసత్వాన్ని పునరుద్ధరించడానికి కూడా వంతారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కట్టడిలో ఉన్న ఖడ్గమృగాలను సురక్షితమైన ఆవాసాలలోకి తిరిగి ప్రవేశపెట్టడం, సంతానోత్పత్తి , ఆవాస పునరుద్ధరణ ద్వారా ఆసియా సింహాల జనాభాను బలోపేతం చేయడం వాటి సంతానోత్పత్తి కార్యక్రమం తర్వాత చిరుతలను భారతీయ అడవులకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్న సంగతి తెలిసిందే. -
దేశాన్ని అణుశక్తిగా మార్చిన మేధ
దేశభక్తి, సంస్కృతీ సంప్ర దాయాల పట్ల గౌరవం, సంగీత సాహిత్యాల పట్ల ప్రేమ, సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచా లన్న తపన కలిగిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న. ఆయన 1925 జనవరి 28న సంప్రదాయ మైసూర్ అయ్యంగార్ కుటుంబంలో కర్ణాటకలో పుట్టారు. సంగీతంపై ఉన్న అభిమానంతో సంగీత కళాశాలలో చేరాలనుకున్న రాజా రామన్న, సర్సి.వి. రామన్ పరిచయ ప్రభావం వల్ల వైజ్ఞానిక రంగంలోకి ప్రవేశించారు. ఆరేళ్ళ వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించారు.పన్నెండో ఏట మైసూర్ మహారాజు ఎదుట పియానో వాయించి ప్రశంసలందుకున్నారు. 1949లో టాటా గ్రూపు– స్కాలర్‌షిప్‌పై లండన్ వెళ్ళి, అక్కడి ‘కింగ్స్ కాలేజి’ నుండి ‘న్యూక్లియర్ ఫిజిక్స్’లో డాక్టరేట్ తీసుకుని స్వదేశం తిరిగి వచ్చారు. డా‘‘ హోమీ భాభా ఆధ్వర్యంలో పని చేయడానికి 1952లో– టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో చేరారు. బొంబాయి, ట్రాంబేలోని ఆ సంస్థ పేరు తరువాత కాలంలో భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ: బార్క్)గా మారింది. 1960లలో అణ్వాయుధా లను తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయ డంలో సాంకేతిక పరిశోధన చేపట్టారు. అప్పుడే మన దేశంలో అణుబాంబుకు రూపకల్పన జరిగింది. 1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు–అణుపరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ కొనసాగింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే 75 మంది శాస్త్రవేత్తల బృందానికి రాజా రామన్న నాయకత్వం వహించారు. బార్క్‌లో ‘పూర్ణిమ’ అనే పేరుతో ప్లుటోనియం ఇంధనంతో నడిచే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్థాపించడానికి కార కులయ్యారు. 1974 మే నెలలో అతి రహస్యంగా అణు పరీక్షను నిర్వహించారు. 1978లో అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, డా‘‘ రామ న్నను బార్క్ నుండి తీసు కొచ్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించారు. రక్షణ పరిశోధన కార్యదర్శిగా, డీఆర్డీఓ డైరెక్టర్ జన రల్‌గా కూడా నియమించారు. అప్పుడే ఒక విచి త్రమైన సంఘటన జరి గింది. ఈయన నేపథ్యం తెలుసుకుని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అణుబాంబుల తయారీలో రామన్న సహాయం అర్థించాడు. పరిస్థితి విషమించేట్టుగా ఉందను కుని, దేశభక్తుడయిన రాజా రామన్న చెప్పా పెట్ట కుండా ఇండియా విమానం పట్టుకుని హుటా హుటిన తిరిగొచ్చారు. నిబద్ధత గల దేశభక్తుల చర్యలు అలా ఉంటాయి. వారు వేటికీ లొంగరు.చదవండి: ఈశ్వరాజ్ఞ హోమీ జె. భాభా అకాల మరణం తర్వాత, ఆయన నిర్దేశించిన మార్గంలోనే రాజా రామన్న పరిశోధనలు కొనసాగించి, ఆణుశక్తి పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. ఆయన న్యూక్లి యర్ ఫిషన్ రంగంలో కూడా కృషి చేశారు. బరువైన కేంద్రకాలను విభజించి, శక్తిమంతమైన న్యూక్లియన్ రేడియేషన్‌ను ఉత్పత్తి చేయవచ్చని– ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం అణుపరిశోధనా రంగానికి, తద్వారా దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది. 1980లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా తిరిగి రావడంతో అణు కార్యక్రమం ఊపందుకుంది. ఆమె రామన్నను మళ్ళీ బార్క్‌కు డైరెక్టర్‌గా నియమించారు. పైగా అణుపరీక్షల కోసం అయనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వంలో రామన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్‌లతో పాటు అనేక పురస్కారాలు, పతకాలు, డాక్ట రేట్లు పొందారు.రాజా రామన్న శత జయంతి (28 జనవరి 1925 – 28 జనవరి 2025) సందర్భంలో మనం ఉన్నాం. మంచి మనిషిగా, అత్యున్నత స్థాయికి ఎదిగిన వైజ్ఞానికుడిగా, పియానో వాద్యకారుడిగా – ఎవరికి తోచిన విధంగా వారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు డా. రాజా రామన్న శతజయంతి)-డా. దేవరాజు మహారాజు -
శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం
పీరియడ్స్ లేదా ఋతుచక్రం అనేది మహిళలకు, ముఖ్యంగా చదువుకునే వయసులో ఆడపిల్లలకు ఎంత బాధాకరమో చాలా కొద్దిమందికే తెలుసు. ఆ నాలుగు రోజులు అనుభవించే శారీరక బాధలు కంటే.. సామాజికంగా అనుభించే క్షోభే దుర్భరమైంది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన దారుణం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేసింది. 11 ఏళ్ల బాలికపట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన విమర్శలకు దారితీసింది.ఉత్తరప్రదేశ్‌లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎంతో ఉత్కంఠతో పరీక్ష రాయడానికి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు పీరియడ్స్ స్టార్ట్ అయింది. (చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి సమస్య ఎదురౌతుంది. పరీక్ల ఒత్తిడి వల్ల రావాల్సిన సమయం కంటే ముందే మెన్సస్ సైకిల్ మొదలువుతుంది. ఈ సమయంలో వారు పడే కష్టాలువేదన వర్ణనాతీతం) టైం కంటే ముందే రావడంతో ప్రిపేర్డ్గాలేని బాలిక శానిటరీ ప్యాడ్కోసం ప్రిన్సిపాల్‌ను అడిగింది. సానుభూతి చూపించి సహాయం చేయడానికి బదులుగా ఆమేదో పెద్ద నేరంచేసినట్టు వ్యవహరించారు. దాదాపు గంటపాటు క్లాస్ రూం వెలుపల నిలబెట్టేశారు. శనివారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.ఒక పక్క పీరియడ్స్..కాళ్లు, నడుము నొప్పితోపాటు రక్త స్రావం పెరుగుతూ ఉంటుంది. ఈ బాధలకంటే. దుస్తులకు ఎక్కడ రక్తపు మరకలు అంటు కుంటాయో అన్న బెంగ, భయం. ఇవన్నీ ఇలా ఉంటే.. గంటసేపు బయటనిలబెట్టడంతో అవమాన భారంతో ఆ బాలిక ఎంత వేదన పడి ఉంటుందో అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుతో సంఘటనపై అధికారిక విచారణ జరుగుతోంది.జిల్లా మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIOS), రాష్ట్ర మహిళా కమిషన్ , మహిళా సంక్షేమ శాఖకు అధికారికంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. విచారణ జరుగుతోందని జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దేవ్కీ నందన్ ధృవీకరించారు. విచారణ అనంతరం, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగాచాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..! -
థాయ్ వెర్షన్ రామాయణం
ఇతిహాసాన్ని శక్తివంతమైన కథగా చెప్పడం, సాంస్కృతిక నేపధ్యంతో దానిని సజీవంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కళాకారుడికి అత్యంత సాహసోపైతమైన చర్య. దీనిని థాయ్‌లాండ్ కళాకారులు మన ఇతిహాసాన్ని తమ సంప్రదాయ కళారూపంతో మన దేశ రాజధానిలో ప్రదర్శించనున్నారు. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సహకారంతో రాయల్ థాయ్ ఎంబసీ ఖోన్ థాయ్ మాస్క్డ్ డ్యాన్స్ డ్రామాను న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ఫిబ్రవరి 7, 2025న సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లోని భీమ్ హాల్లో జరుగుతుంది.థాయిలాండ్ అత్యంత గౌరవనీయమైన కళారూపాలలో ఒకటైన ఖోన్, శాస్త్రీయ నృత్యం, లిరికల్ స్టోరీ టెల్లింగ్, ప్రత్యక్ష సాంప్రదాయ థాయ్ సంగీతాన్ని మిళితం చేస్తుంది. యునెస్కో చేత సాంస్కృతిక వారసత్వంగా గుర్తించబడింది. దుస్తులు, కొరియోగ్రఫీ, ఆధ్యాత్మిక వ్యక్తీకరణ ఈ నృత్యం ప్రత్యేకతలు. వారియర్ హనుమాన్ఈ ప్రదర్శనలో రామాయణం ఇతిహాసం నుండి హనుమాన్ ది మైటీ వారియర్ అనే ఎపిసోడ్ ఉంటుంది, ఇది హనుమంతుడి శౌర్యం, విధేయతను చూపే ఆకర్షణీయమైన కథ. ఈ కథ ఐదు దశలలో.. రావణుడిని ఓడించాలనే తపనతో రాముడికి సేవ చేయడానికి వాయు దేవుడు సృష్టించిన హనుమంతుడి దివ్య జననంతో ప్రారంభమవుతుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, హనుమంతుడి బాల్య దుశ్చర్య, రాముడి ఆశీర్వాదంతో అతని బలం తిరిగి వస్తుంది. సీతను రక్షించడానికి అతని అచంచలమైన నిబద్ధతను ఇది అన్వేషిస్తుంది. హనుమంతుడు, రాముడు వారి మిత్రులు రావణుడిపై విజయం సాధించే యుద్ధంతో కథనం ముగుస్తుంది. చారిత్రక సంబంధాలుఖోన్ థాయిలాండ్ రాజ ప్రాంగణాలలో భారతీయ ఇతిహాసం రామాయణంతో గల సంబంధం భారతదేశం– థాయిలాండ్ మధ్య గల లోతైన చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. దీంతో పాటు తమ కళ ద్వారా వ్యక్తీకరణ హావభావాలు, శక్తివంతమైన కథ చెప్పడం తరతరాలుగా అందించిన గొప్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది థాయ్ వారసత్వంలో ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారుతుంది. భారతీయ ప్రేక్షకులకు థాయిలాండ్ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని చూపిస్తుంది. ఇది ఉమ్మడి వారసత్వం, కళాత్మకత, రామకీన్, రామాయణ ఇతిహాసాల ద్వారా ప్రతిధ్వనించే భక్తి, శౌర్యం, సార్వత్రిక ఇతివృత్తాల వేడుక. రాయల్ థాయ్ ఎంబసీ, ఐసీసీఆర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేస్తుంది. -
Dock Bridge : ప్రకృతి ఆధారిత వేళ్ల వంతెన..!
ఇది వేళ్లాడే వంతెన. ఉంగాట్ నది మీద ఉంది. అభివృద్ధి చెందిన నగరాలన్నీ నగరం మధ్యలో ఉన్న చెరువు మీద ఇనుప చువ్వలతో వేళ్లాడే వంతెనలను కడుతున్నాయి. కానీ ఉంగాట్ నది మీద కనిపించేవి వేళ్లతో కట్టిన వంతెనలు. అది కూడా చెట్టు నుంచి వేరు చేసిన వేళ్లు కాదు, సజీవంగా ఉన్న వేళ్ల వంతెనలు. ఈ నైపుణ్యం ప్రపంచంలో మనదేశానికే సొంతం, అది కూడా మేఘాలయ వంటి మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించిన నైపుణ్యం. ఈ నది డాకీ పట్టణం నుంచి ప్రవహిస్తోంది. వంతెన డాకీ పట్టణంలో ఉంది. అందుకే డాకీ రూట్ బ్రిడ్జిగా వ్యవహారంలోకి వచ్చింది. ఇలాంటి వంతెనలు డాకీ పట్టణంలో మాత్రమే కాదు. మేఘాలయలో చాలా చోట్ల విస్తారంగా ఉంటాయి. కానీ మేఘాలయ పర్యటనకు వెళ్లిన వాళ్లు తప్పకుండా డాకీ పట్టణంలోని రూట్ బ్రిడ్జి మీద నడిచి మురిసిపోతారు. ఎందుకంటే ఇది దేశానికి చివరి వంతెన. డాకీ దాటితే బంగ్లాదేశ్‌లో అడుగుపెడతాం. మనిషికి జీవన నైపుణ్యాలు అవసరాన్ని బట్టి వృద్ధి చెందుతాయనడానికి నిదర్శనం ఈ వంతెనలు. ఇనుము, సిమెంటు వంటి భవన నిర్మాణ సామగ్రిని తరలించడం సాధ్యం కాని చోట్ల ప్రకృతి ఇచ్చిన మెటీరియల్‌తో జనం తమకు అవసరమైన విధంగా మలుచుకోవడం అంటే ఇదే. మేఘాలయలో నివసించే ఖాసీ, జైంతియా తెగల వాళ్లు నదికి రెండు వైపులా ఉన్న రబ్బరు చెట్ల వేళ్లను ఒకదానితో మరొక దానిని జడలాగ అల్లుతూ ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుతో కలుపుతారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి వంతెన రెడీ. సిమెంటు వంతెనలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు కానీ ఈ వేళ్ల వంతెనలను ఒకసారి అల్లితే వందేళ్లకు కూడా చెరగవు, పైగా మరింత దృఢమవుతూ ఉంటాయి. మరీ లేత వేళ్లను కాకుండా ఒక మోస్తరు ముదురు వేళ్లతో వంతెన అల్లుతారు. కాలం గడిచే కొద్దీ చెట్టు పెద్దదవుతుంది, వేళ్లు శక్తిపుంజుకుంటూ ఉంటాయి. మరో విచిత్రం ఏమిటంటే... ఈ వేళ్లు నది నీటిని అందుకోవడానికి మాన్గ్రోవ్లాగ పిల్ల వేళ్లను పెంచుకుంటాయి. కొత్త వంతెనలు మనం నడిచేటప్పుడు బరువుకు తగినట్లు ఊగుతుంటాయి. ముదురు వంతెనలు కదలవు. ఈ వంతెనల మీద నుంచి రాకపోకలు సాగించేది మనుషుల మాత్రమే కాదు, జింకలు, చిరుతపులులతోపాటు ఇతర జంతువులు కూడా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వంతెనల మీదనే వెళ్తాయి. ఇప్పటి వరకు వంతెన గొప్పదనాన్నే మాట్లాడుకున్నాం. కానీ ఉంగాట్ నదికి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విశేషణం ఉంది. మనదేశంలో అత్యంత పరిశుభ్రమైన నదుల్లో ఉంగాట్ నది ఒకటి. ఈ నదిలో పడవలో విహరిస్తుంటే నీటి కింద నేల అద్దంలో కనిపించినంత స్వచ్ఛంగా ఉంటుంది. వేళ్ల వంతెన మీద నడవడంతోపాటు పడవ ఎక్కి ఈ నదిలో విహరించడం కూడా గొప్ప అనుభూతి.రాముడు కూడా కట్టాడునది మీద చెట్ల వేళ్లతో వంతెన నిర్మించే నైపుణ్యం ఇతిహాస కాలం నాటిదని చెబుతారు. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు అడవుల్లో నివసించినట్లు చెప్పుకుంటాం. గంగానది తీరాన నివసించిన రోజుల్లో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరడానికి రాముడు, లక్ష్మణుడు నదిలో ఈదుతూ వెళ్లేవారని, ప్రతిరోజూ నది దాటడం సీతమ్మకు కష్టం కావడంతో ఆమె కోసం వంతెన నిర్మించారని చెబుతారు. గంగానది మీద రిషికేశ్ దగ్గర రామ్‌ఝాలా, లక్ష్మణ్ ఝాలా ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఈ వంతెనలను ఇనుముతో పునర్నిర్మించారు. రిషికేశ్‌లో గంగానది మీద ఇప్పుడు మనకు కనిపించేవి కొత్త నిర్మాణాలు. వాకా మంజూలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..) -
జనవరి 27న రవీంద్రభారతిలోఎఫ్–టామ్ ‘వారధి’
సాక్షి, ముంబై: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జనవరి 27న ‘వారధి’కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర (ఎఫ్–టామ్) అధ్యక్షుడు గంజి జగన్‌బాబు తెలిపారు. మూడు రాష్ట్రాల వ్యాపారాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఇందులో భాగంగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఏఎంసీసీఐ) సంస్థ ప్రారంభోత్సవం, లోగోఆవిష్కరణతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, నటుడు సాయికుమార్ ముఖ్యఅతిధులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల ప్రజలందరూ విచ్చేయాలని జగన్‌బాబు కోరారు. చదవండి : Birthright citizenship : ట్రంప్ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరటసంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో! -
International Day of Education 2025 దీని ప్రాముఖ్యత, ఏడాది థీమ్ ఇదే!
International Day of Education 2025 : ప్రతీ ఏడాది జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. జనవరి 24ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 2018 డిసెంబర్ 3, 2018న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, సమానత్వాన్ని తీసుకురావడంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించడం, అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.నైజీరియాతో సహా 58 సభ్య దేశాల మద్దతుతో వచ్చిన ఈ చారిత్రాత్మక తీర్మానం, విద్య ప్రాప్యత , ప్రతి వ్యక్తికి దాని లోతైన ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన అవసరం అని నొక్కి చెబుతుంది.International Day of Education.To grow is to become wise, and the foundation of wisdom is learning.#UGC #Education #InternationalDayofEducation@PMOIndia @EduMinOfIndia @PIB_India pic.twitter.com/Eam5G2Jiq6— UGC INDIA (@ugc_india) January 24, 2025మానవ అభివృద్ధిలో విద్య పాత్రను గుర్తించడంతోపాటు, సమానమైన నాణ్యమైన విద్యను ప్రాథమిక మానవ హక్కుగా ప్రోత్సహించేలా జనవరి 24, 2019న తొలి సారి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు.అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025, థీమ్ఈ సంవత్సరం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం థీమ్ "ఏఐ అండ్ ఎడ్యుకేషన్‌గా నిర్ణయించారు. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ విలువను పరిరక్షించడం". అంటే ఆటోమేషన్ యుగంలో రోజు రోజుకి అభివృద్ది చెందుతున్న సాంకేతిక తీరుతెన్నులు, పురోగతులు అర్థం చేసుకోవడం, అటువంటి వ్యవస్థలు మానవ నిర్ణయాలు, విద్యా కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రశ్నించడం, విద్యలో కృత్రిమ మేధస్సును పెంచడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.విద్య ప్రాముఖ్యతపేదరికం,లింగ సమానత్వంతో సహా అనేక సమస్యలను పరిష్కరించడంలో విద్య చాలా అవసరం. వ్యక్తిగత అభివృద్ధి, సామూహిక పురోగతిని పెంపొందిస్తుంది. శాంతిని నిర్మించడానికి విద్య ప్రాథమికమైనదని యూఎన్జీఏ పేర్కొంది. సమానమైన నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ జీవితాంతం అవకాశాలను ప్రోత్సహించడంతోపాటు, ఆయా వ్యక్తులు సమాజాలు విద్యకు ప్రాధాన్యతనిచ్చి పెట్టుబడి పెట్టడానికి ఇది పిలుపు.విద్యమనిషిని మనస్సును శక్తివంతం చేస్తుంది. భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నేర్చుకోవడంలోని శక్తిని గుర్తిద్దాం. సెలబ్రేట్ చేసుకుందాం. అది అందరికీ చేరేలా చూసుకుందాం. ఇదీ చదవండి : National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..! -
Mahakumbh Mela 2025: పర్యావరణం బాబా..ఏకంగా తల పైనే పంటలు పండిస్తున్నాడు..!
ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఈ మహా కుంభమేళ(Mahakumbh Mela 2025)లో రకరకాల బాబాలు దర్శనమిచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. పావురం బాబా నుంచి, ఇంజనీర్ బాబాల వరకు అందరిది ఒక్కో నేపథ్యం కానీ వాందర్నీ ఒకచోట చేర్చింది ఈ ఆధ్యాత్మికతే. ఈ కుంభమేళాలో కొందరి బాబాల బ్యాగ్రౌండ్ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఇంకొందరూ అందరి హితం కోరేలా జీవనం సాగిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన మరో బాబా ఈ మహాకుంభమేళలో హైలెట్‌గా నిలిచాడు. పర్యావరణ స్ప్రుహ కలిగించేలా అతడి ఆహార్యం ఎలా ఉందే చూస్తే కంగుతింటారు.ఈ పర్యావరణ బాబా పేరు అనాజ్ వాలే బాబా(Anaaj Wale Baba). ఈయన ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందిన బాబా. పర్యావరణం కోసం ఎంతమంది పాటుపడ్డారు. కానీ ఈ బాబా అత్యంత విభిన్నమైన శైలిలో పాటుపడుతూ..అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను పంటలనే(crops) ఏకంగా తన తల(Head)పై పండిస్తున్నాడు. మిల్లెట్లు, గోధుమలు, పప్పుధాన్యాలు, బఠానీల(wheat, millet, gram, and peas)తో సహా చాలా రకాల పంటలను తలపై పండించాడట. ఈ అసాధారణ ప్రయత్నాన్ని గత ఐదేళ్లు నుంచి చేస్తున్నట్లు తెలిపాడు ఆ బాబా. కేవలం అటవీ నిర్మూలనపై అవగాహన పెంచడం, పచ్చదనాన్ని ప్రోత్సహించడమే తన అసాధారణ ప్రయత్నం వెనుకున్న లక్ష్యమని అన్నారు అనాజ్ వాలే బాబా. చెట్లు నరకడం వల్ల యావత్తు ప్రపంచంపై ఎలాంటి ప్రభావితం చూపుతుందో తెలియడంతో ఇలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తన అసాధారణ విధానమైన పనితో ప్రజలు ప్రభావితమై మరిన్ని మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడేలా చేస్తారనేది తన ఆశ అని అన్నారు. ఈ కారణాల రీత్యా మహా కుంభమేళా కోసం కిలా ఘాట్ సమీపంలో ఉంటున్న ఈ అనాబ్ వాలే బాబా అందరి దృష్టిని ఆకర్షించేలా హైలెట్‌గా నిలిచారు. ఈ కుంభమేళాకి వచ్చే సందర్శకులు అతడి అసాధారణమైన ప్రయత్నానికి ఫిదా అవ్వడమే గాక ఆశ్చర్యపోతున్నారు. అంకితభావంతో తలపై మొక్కలను పెంచుతున్నారు. క్రమతప్పకుండా వాటికి నీళ్లు పోసి వాటి బాగోగులు చూస్తుంటారా బాబా. ఆయన దీన్ని హఠ యోగతో మిళితమైన పర్యావరణ కార్యకర్తగా చెబుతుంటాడు. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక, పర్యావరణ బాధ్యతల మధ్య సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మేళా ముగినిస తర్వాత కూడా ఈ అనాజ్ వాలే బాబా సోన్‌భద్రకు తిరిగి వచ్చి అటవీకరణ, పర్యావరణంతో ఈ పుడమి కళకళలాడేలా ప్రోత్సహించే లక్ష్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు.కాగా, ఈ మహా కుంభమేళాలో సామాజిక పర్యావరణ విలువలను ప్రోత్సహించేలా ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. జనవరి 13న మొదలైన ఈ కుంభమేళా, ఫిబ్రబరి 26,2025తో పూర్తవనుంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన ఈ పవిత్ర ప్రదేశంలో సాన్నాలు చేస్తే పాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం.(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
29న త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం
గచ్చిబౌలి: మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈ నెల 29న హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం(హెచ్‌టీఏఎంఎఫ్) వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ప్రముఖ సంగీత విద్వాంసుల కచేరీలతో ఆకట్టుకోకున్నారు. 18వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ వాగ్గేయకారులు త్యాగరాజ స్వామి రచించిన అనేక కీర్తనలు, శాస్త్రీయ సంగీత రాగాలను విభిన్న శైలిలో ప్రయోగించారు. ఆ కీర్తనలు రామభక్తిని చాటిచెప్పడమే కాకుండా తాతి్వకత, ఆధ్యాత్మాకతను లోతైన రీతిలో వెలువరిస్తాయి. త్యాగరాజ స్వామి కర్నాటక శాస్త్రీయ సంగీతానికి అందించిన సేవలను స్మరిస్తూ యేటా సంగీతోత్సవం నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతి, కళలను, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో సంస్కృతి ఫౌండేషన్ 16 ఏళ్ల క్రితం హెచ్టీఏఎంఎఫ్ను స్థాపించింది. పదేళ్లుగా త్యాగరాజ ఆరాదనా సంగీతోత్సవం నిర్వహిస్తోంది. 29న ప్రారంభం.. శిల్పారామంలో త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం జనవరి 29న ప్రారంభమవుతుంది. ప్రతి రోజూ 15కు పైగా సుమధుర సంగీత కచేరీలు ఉంటాయి. 4వ రోజు గురుకులం పేరిట విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన ఉంటుంది. జంట నగరాల్లోని సంగీత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 2న ఉదయం 9 గంటలకు ‘పంచరత్న సేవ’ ఉంటుంది. కర్నాటక శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవకు గుర్తింపుగా ‘గురు సన్మానం’ పేరిట ప్రసిద్ధ సంగీత విద్వాంసులను సంస్కృతి ఫౌండేషన్ సత్కరిస్తుంది. 400 మందికి పైగా సంగీతకారులు త్యాగరాజ కీర్తనలను ఆలపించనున్నారు. హనుమత్సమేత సీతారామలక్ష్మణులు, త్యాగరాజ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేక సేవ ఉంటుంది. ఇదీ చదవండి: ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు -
దివ్యాంగుల్లో కొత్త వెలుగులు, మన ‘సారా’ సేవకే అంకితం
తమ కోసం ఏదైనా పని చేసుకుంటే స్వార్థం.. అదే సమాజం కోసం చేస్తే సేవ. ఇందులోనూ ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంత మంది వృద్ధులకు సహాయం చేస్తే, మరి కొందరు అనాథలకు, పేద పిల్లలకు సహకారం అందిస్తారు. ఇలా పేద విద్యార్థులు, దివ్యాంగులు, అనాథ వృద్ధుల సంక్షేమం కోసం పరితపిస్తూ, తనకు తోచిన సేవలు అందించడమే కాకుండా, తన లాంటి ఎంతో మందికి దక్సూచిలా నిలుస్తున్నారు. అంగవైకల్యం కలిగిన వారికి భరోసా కల్పిస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 200 మంది విద్యార్థులు, 150 మంది దివ్యాంగులకు అండగా ఉన్నారు డాక్టర్ సారథామురుగన్. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ సేవకురాలు.. – అడ్డగుట్ట కేరళకు చెందిన ఈమె పదిహేను ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని తన బంధువులతో కలిసి ఉంటున్నారు. మొదట ఐటీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించిన సారా అనంతరం, ఉద్యోగం మానేసి పేద విద్యార్థులు, దివ్యాంగుల సేవకు 2016లో సెవెన్ రేస్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె సేవలను గుర్తించి ఇటీవల డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెలలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు డాక్టర్ సారా. దివ్యాంగుల్లో స్ఫూర్తి నిపుతూ.. దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తోంది. సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులతో చిరు వ్యాపారాలు పెట్టించడం, కుట్టు మిషన్లు పంపిణీ వంటి ఉపాధి మార్గాలను కల్పిస్తున్నారు. మురికివాడల్లోనూ, రోడ్లపైనా ఎలాంటి ఆసరా లేని వారికి ఆహారం పంపిణీ చేస్తారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కుట్టు మిషన్లతో పాటు 200 వీల్ చైర్లు పంపిణీ చేశారు. 30 వేల గ్రాసరీ కిట్ల పంపిణీ.. కోవిడ్ మహమ్మారి సమయంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు సెవెన్ రేస్ ఫౌండేషన్ ద్వారా 30 వేల నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఎంతో ముఖ్యమైన ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేశారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎందరికో అండగా నిలిచారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం.. ప్రస్తుత సమాజంలో ధనిక, పేద అనే భేదాలు లేకుండా ఉండాలంటే అది విద్యతోనే సాధ్యమని నమ్ముతాను. అందుకే మా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు, వికలాంగులకు సహాయ సహకారాలు అందించే దాతల సహాయంతో విద్యార్థులను చదివిస్తాం. ఇటీవల బాబా సాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం గర్వంగా ఉంది. – డాక్టర్ సారా, సెవెన్ రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పేదలకు ఉన్నత విద్య లక్ష్యంగా..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించేందుకు సారా నిరంతరం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఓల్డ్ సఫీల్‌గూడ, మౌలాలి ప్రాంతాల్లోని 6 ప్రభుత్వ పాఠశాలను సెవెన్‌రేస్ ఫౌండేషన్ దత్తత తీసుకుంది. ప్రతి ఏడాదీ ఉచితంగా నోటు పుస్తకాలు, స్టేషనరీ, విద్యారి్థనులకు శానిటరీ కిట్స్ పంపిణీ చేస్తుంటారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సెవెన్‌రేస్ సంస్థ సొంతంగా చదివిస్తుంది. -
దురలవాట్లను దూరం చేసే కొల్లూరు మూకాంబికాలయం
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. క్షేత్రపురాణం: జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు. ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు. కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైనా హారతి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతి ప్రత్యేకమైనది.సౌపర్ణికానది: ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుటజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. ఈ నది ఒడ్డున సుపర్ణుడు అంటే గరుత్మంతుడు తన తల్లి దుఃఖాన్ని పోగొట్టమని కోరుతూ అమ్మవారిని గురించి ఘోర తపస్సు చేసి వరం పొందాడట. ఆ నాటినుంచి ఈ నదికి సౌపర్ణికానది అని పేరు వచ్చింది. ఈ నదిలో అనేక వనమూలికలు ఉంటాయని, అందువల్ల ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు నయం అవుతాయని చెబుతారు. ఇతర సందర్శనీయ స్థలాలు ఆలయ బయటి ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి తదితర దేవతల సన్నిధులున్నాయి. కొల్లూరు చుట్టుపక్కల మంగుళూరు మంగళాదేవి, ఉడిపి కృష్ణుడు, కుందాపూర్, భత్కల్, షిమోగా, ధర్మస్థల, శృంగేరీ శారదాపీఠాలు సందర్శనీయ స్థలాలు. ఇక్కడ గల కుటజాద్రి పర్వత శ్రేణి అందమైన అటవీ సంపదతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వతశ్రేణి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎలా వెళ్లాలి? మంగుళూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కొల్లూరుకు వెళుతుంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. మంగుళూరుకు నేరుగా అన్ని ప్రధాన నగరాలనుంచి బస్సులు, రైళ్లు ఉన్నాయి. మంగుళూరులో విమానాశ్రయం కూడా ఉంది. (చదవండి: లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!) -
అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ
పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధిలో తల్లి తండ్రుల పాత్ర చాలా కీలకమైంది. అమ్మానాన్న ప్రోద్బలంతోనే బాగా చదువుకుంటే, మంచి జీవితం ఉంటుందని, సాధించాలనే పట్టుదల ఉంటే, ఎలాంటి కలల్ని అయినా సాకారం చేసుకోవచ్చనే గుణం అలవడుతుంది. అలా బాగా చదువుకుని తన కుటుంబానికి పేరు తేవడమే కాదు యూపీఎస్సీ సివిల్స్(UPSC Civils) మంచి ర్యాంకు సాధించాడు. అతని పేరే మర్రిపాటి నాగభరత్(Marripati Naga Bharath). పదండి నాగ భరత్ సక్సెస్గురించి తెలుసుకుందాం.వైఎస్సార్ కడప జిల్లాకు నాగభరత్ చిన్నప్పటినుంచి చదువులో బాగా రాణించాడు. ఉన్నత విద్య పూర్తైన తర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాడు. చక్కటి జీవితం. సంతృప్తికరమైన జీతం. కానీ కలెక్టర్ అవ్వాలన్న అమ్మ కోరిక నెరవేరలేదనే వెలితి అతడిని వెంటాడింది. అందుకే 15 లక్షల రూపాయల వేతనాన్ని వదులుకొని మరీ యూపీఎస్సీపై దృష్టి పెట్టాడు. 2023 యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) ఫలితాల్లో విద్యార్థి ఉన్నత ర్యాంక్ సాధించాడు.నాగ భరత్ ఖరగ్ పూర్ ఐఐటీలో( Kharagpur IIT ) బీటెక్ పూర్తి చేయడంతో పాటు అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. అయితే సివిల్స్ కొట్టాలనే ప్రయత్నాల్లో 2022లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కు వచ్చాడు. అయినా సరే పట్టువీడలేదు. ఆశించిన ఫలితాలు రాకపోయినా నాగభరత్ మాత్రం వెనుకడుగు వేయలేదు. నిపుణుల శిక్షణలో మరింత రాటు దేలాడు. చివరికి 580వ ర్యాంక్ సాధించాడు.తల్లి కోరిక (ఈమె 2013లో చనిపోయింది.) మేరకు బాల్యం నుంచి కలెక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్న నాగభరత్ భవిష్యత్తుపై చాలా ధీమా వ్యక్తం చేశాడు. ఐఏఎస్‌గా ఎంపికై పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని వెల్లడించాడు. రైతుల కష్టాలు తీర్చడానికి తన వంతు ప్రయత్నిస్తానని చెప్పడం విశేషం. అంతేకాదు తన చిన్నతనంలో తండ్రి కలెక్టర్ అంటే ఏంటి? ఈ పదవి ద్వారా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవచ్చు అనేది చెప్పేవారట. పేదలకు ఎలా సాయం చేయవచ్చో కూడా వివరించేవారట. తన తల్లి కోరిక,కల కూడా అదేనని, అమ్మనాన్నలే తన విజయానికి స్ఫూర్తి అని చెప్పాడు గర్వంగా. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణలో ఉన్నాడు. (ఒకే ఒక్క మాటతో 94 నుంచి 71 కిలోలకు : ఏం చేసిందో తెలిస్తే ఫిదానే!) View this post on Instagram A post shared by Marripati Naga Bharath (@bharath_avow) -
మీ చెక్ బౌన్స్ అయితే ఎలా? ఏం చేయాలి?
నేను ఒక వ్యక్తి దగ్గర 2019 జనవరి లో కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. కానీ కోవిడ్ వేవ్ రావడం వల్ల ఉద్యోగం పోయి అనుకున్న సమయానికి తిరిగి ఇవ్వలేకపోయాను. డబ్బు తీసుకునేటప్పుడు ష్యూరిటీ కింద ప్రామిసరీ నోటు, డేట్ వేయని రెండు చెక్కులు ఇచ్చాను. పోయిన నెలలో ఆ చెక్కులు నాకు చెప్పకుండా బ్యాంకులో వేసి బౌన్స్ చేశారు. చెక్ బౌన్స్ కేసు వేస్తాము అంటూ లీగల్ నోటీస్ కూడా పంపించారు. నేను డబ్బు కట్టేస్తాను అని వారికి తెలియజేయగా, ‘ఇప్పుడు తీసుకున్న దానికి మూడింతలు ఇవ్వాలి, లేకుంటే నీ మీద చీటింగ్ కేసు పెడతాము, జైలుకు వెళతావు’ అని బెదిరిస్తూ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తగిన పరిష్కారం చూపగలరు. – మానవేందర్, విజయవాడఅవతలి వాళ్లు మీ మీద చీటింగ్ కేసు పెడతామని అనగానే భయపడవలసిన అవసరం లేదు. కోర్టు వాయిదాల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ సరైన న్యాయసలహా పొందితే తప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా వర్ణించి, క్రిమినల్ చట్టాల కింద కేసులు పెట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. చాలా సందర్భాలలో హైకోర్టులు, సుప్రీంకోర్టు సైతం అలాంటి కేసులను కొట్టివేశాయి. మీ కేసులో కూడా సివిల్ కేసును క్రిమినల్ పరిధిలోకి తీసుకు రావడానికి చట్టాన్ని దుర్వినియోగం చేశారు అని రుజువైతే కేసు కొట్టివేస్తారు.ఇకపోతే... చెక్కు బౌన్స్ కేసులో వచ్చిన నోటీసుకు సరైన గడువులోపు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఆ సమాధానంలోనే చెక్కు మీద రాసినంత నగదు చెల్లిస్తాము అని అంగీకరిస్తూ కూడా మీరు నోటీసుకు రిప్లై ఇవ్వవచ్చు. ఒకవేళ నోటీసులో తప్పులు ఉన్నట్లయితే వాటన్నింటినీ తిరస్కరిస్తూ మీరు ప్రపోజల్ చేయవచ్చు. ఒకవేళ వాళ్లు అప్పటికీ కేసు వేస్తే, కోర్టుకు కూడా మీ వాదనలు తెలియపరుస్తూ, సగటు అప్పు చెల్లిస్తాము అని చెప్తే, కోర్టు మీ అభ్యర్థనను పరిగణించి అందుకు అనుగుణంగా తీర్పు చెబుతుంది. అప్పుడు మీకు జైలు శిక్ష పడకపోవచ్చు. అయితే చెక్ బౌన్స్ కేసులలో నిందారోపితులు డబ్బులు కట్టేస్తాము అన్నంత మాత్రాన నేరం లేకుండా పోదు. ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే చెప్తుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసును మాత్రం కొంత సీరియస్‌గానే పరిగణించండి. మీ లాయర్ గారి సలహా మేరకు కేసు నడపాలా లేక రాజీ కుదుర్చుకోవాలా అనే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. మీరు డబ్బులు ఇవ్వాలి అనేది నిజమే అని చెప్తున్నారు కాబట్టి, లాయర్ గారి ద్వారా లేదా కోర్టు అనుమతి ద్వారా కూడా మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదుర్చుకోవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసంsakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. ఇదీ చదవండి: మార్నింగ్ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్ ! ఇది కదా సక్సెస్! -
సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!
కాళ్లకు చక్రాలుంటే బావుణ్ణు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేశమంతా చుట్టేయవచ్చు. ఈ కోరిక చాలామందికే ఉంటుంది. తమిళనాడుకి చెందిన సరస్వతి అయ్యర్ మాత్రం ఈ మాటను నిజం చేస్తోంది. నిజం చేయడమంటే కాళ్లకు చక్రాలు కట్టుకోలేదు కానీ కాళ్లకు పని చెబుతోంది, చక్రాలున్న వాహనాల్లో హిచ్‌హైకింగ్ (ఆ దారిలో వెళ్లే వాహనాల్లో లిఫ్ట్ అడుగుతూ వెళ్లడం) చేస్తూ పర్యటిస్తోంది. దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు ఈ మూల నుంచి ఆ మూలకు అటూ ఇటూ పర్యటించేసింది. ఉమన్ సోలో ట్రావెల్ ఒక ట్రెండ్‌గా మారిన ఈ రోజుల్లో సోలో ట్రావెల్‌తోపాటు జీరో బడ్జెట్ ట్రావెల్ కూడా సాధ్యమేనని నిరూపించింది సరస్వతి అయ్యర్.జీవితాన్ని చదివేస్తోంది!సరస్వతి అయ్యర్ రెండేళ్ల కిందట ఉద్యోగం నుంచి విరామం తీసుకుంది. ఉద్యోగం చేయడానికి పుట్టలేదు, ఇంకా ఏదో సాధించాలనుకుంది. దేశమంతా చుట్టి వచ్చిన తర్వాత తన గురించి తాను సమీక్షించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ప్రయాణం కట్టింది. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమె దగ్గర ఉన్నది రెండు జతల దుస్తులు, ఒక గుడారం, ఫోన్ చార్జింగ్ కోసం ఒక పవర్ బ్యాంక్. ఈ మాత్రం పరిమితమైన వనరులతో ఆమె పర్వత శిఖరాలను చూసింది. మారుమూల గ్రామాలను పలకరించింది. దేవాలయాల్లో ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించింది. బస కోసం ఆలయ్ర ప్రాంగణాలు, ఆశ్రమాలు, ధర్మశాలలను ఎంచుకుంది. భోజనం కూడా అక్కడే. ఎక్కడైనా శ్రామికులు పని చేస్తూ కనిపిస్తే వారితో కలిసి పని చేస్తోంది. వారితో కలిసి భోజనం చేస్తోంది. పొలంలోనే గుడారం వేసుకుని విశ్రమిస్తోంది. ఈ పర్యటన ద్వారా ఆమె ఇస్తున్న సందేశం మహిళలు సోలో ట్రావెల్ చేయగలరని నిరూపించడం మాత్రమే కాదు. మనదేశంలో మహిళలకు ఉన్న భద్రతను చాటుతోంది. ఒక సాహసం చేయాలంటే అది అంత ఖరీదైనదేమీ కాదని. అలాగే... ఒక పర్యటన జీవిత దృక్పథాన్ని మార్చేస్తుందనే జీవిత సత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది సరస్వతి అయ్యర్.(చదవండి: నృత్యం చిత్తరువు అయితే..!) -
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్‌గా
ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్‌గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్‌గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్‌గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్‌కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్‌లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్‌కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్‌తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్‌లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్‌లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్‌గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్‌లు, బార్లు, కాఫీ హౌస్‌లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్‌లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్‌తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్‌లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్‌ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
అద్భుతమై చేతిరాతకోసం చేతనైనంత మేర..!
టెక్నాలజీ యుగంలో చేతిలో సెల్ ఫోన్ వాడుతున్న రోజుల్లో కలంతో దోస్తీ చేయిస్తూ.. చేతితో అక్షరాలను అందంగా రాయిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాత శిక్షణా శిబిరాలను నిర్వహిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ వంపు మల్లయ్య. నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, చింతల్æ, షాపూర్ నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాత నేర్చుకో.. మార్కులు పెంచుకో.. అనే నినాదంతో ఇంగ్లిష్ ల్యూసిడా, కర్సివ్ రైటింగ్, తెలుగులో పదాలు ఎలా రాయాలో సూచిస్తూ బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు సునాయస పద్ధతిలో, అందమైన చేతిరాతను నేర్పిస్తూ ప్రోహిస్తున్నాడు. – జగద్గిరిగుట్ట నగరంలోని జగద్గిరిగుట్టలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ల్యూసిడా, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ శిక్షణను ప్రారంభించారు. విద్యార్థుల్లో మార్పు కనిపించడంతో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మల్లన్నను సంప్రదించడం, విద్యార్థులకు ఉచితంగా మెళకువలు నేరి్పంచడం మెదలుపెట్టాడు. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు, ఇటీవలె ఓ ప్రభుత్వ పాఠశాలలో శిబిరం నిర్వహిస్తున్న మల్లయ్యను కుత్బుల్లాపూర్ ఎంఈఓ జెమినీ కుమారి అక్కడికి వచ్చి అభినందించి సత్కరించారు. ప్రాణ స్నేహితుడి పేరుతో.. మరణించిన ప్రాణ స్నేహితుడు జితేందర్ పేరుతో అకాడమీ స్థాపించి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెళకువలు నేర్పుతున్నారు. ఉచితంగా అనేక చేతిరాత శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇతనికి సహకారం అందిస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నాడో.. అక్కడే వెతుక్కుంటూ.. సాంఘిక, గురుకుల సంక్షేమ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదవడంతో పాటు ఇంగ్లీసు ధారాళంగా మాట్లాడలేక పోవడం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు వదులుకోవడంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఉన్నత చదువులు చదివి ‘ఎక్కడైతే పోగొట్టుకొన్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న పట్టుదలతో అదే ఆంగ్లంలో ల్యూసిడా, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ శిక్షణ పొందారు. ఇప్పడు ఆకర్షణీయమైన టెక్నిక్స్‌తో విద్యార్థుల చేతిరాతను మారుస్తున్నాడు. ‘నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు. విద్యార్థులు చేతిరాతను నిర్లక్ష్యం చేయవద్దు. ఆసక్తి ఉన్న విద్యార్థులు శిక్షణ కోసం 9182989283 సంప్రదించవచ్చు’ అని వంపు మల్లయ్య చెబుతున్నారు. ల్యూసిడా, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ శిబిరాలు పంజగుట్టమనం రాసే అక్షరాలు మన మనసుకు అద్దం పడతాయి. మన వ్యక్తిత్వం ఏమిటో మన చేతి రాతలో తెలుస్తుందంటారు. అలాంటి చేతిరాతను ఉర్దూ, ఇంగ్లీషులో ఎలా పెంపొందించుకోవాలి అనే అంశంపై శిక్షణ ఇస్తుంటారు. అదే కేంద్ర ఉన్నత విద్య, ఉర్దూ భాష జాతీయ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎర్రమంజిల్ లోని ఇదారే ఇ అదబియాత్ ఇ ఉర్దూ సెంటర్లోని కాలిగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ ట్రైనింగ్ సెంటర్. ఈ సెంటర్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కాలిగ్రాఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో 2022–2024 బ్యాచ్ విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రపంచ పురాతన కాలపు అక్షరాలు, ఇస్లామ్ పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్‌ను లిఖించిన అక్షరాలు, అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్ వివిధ ఫాంట్స్‌తో కాగితం, బియ్యం గింజ, మేక చర్మం, కోడిగుడ్డు, బాదాం గింజపై అద్భుత చిత్రాలను, ఖురాన్లో చెప్పిన ప్రవచనాలను ప్రదర్శించారు. దీంతో ఇంగ్లిష్ చేతిరాత ఎలా పెంపొందించుకోవాలి, ఒక లెటర్, పెళ్లి పత్రిక, చెక్‌బుక్‌పై ఎలా రాయాలి అన్న అంశాలను కూడా ఇక్కడ నేర్పుతారని నిర్వాహకులు ఎ.షుఖుర్, సయ్యద్ రఫియుద్దీన్ ఖాద్రీ తెలిపారు. వారం రోజుల శిక్షణ.. జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ మా పాఠశాలలో వారం రోజుల పాటు చేతిరాత శిక్షణా తరగతులను నిర్వహించింది. దీని వల్ల ల్యూసిడా రైంటిగ్పై ఆసక్తి పెరిగింది. రానున్న వార్షిక పరీక్షల్లో అధిక మార్కులు సాధిచగలననే నమ్మకం కలిగింది. – దక్షిత, 10వ తరగతి విద్యార్థిని జెడ్పీహెచ్ఎస్ ఆత్మ స్థైర్యం పెరిగింది.. చేతిరాత శిక్షణ నాలో ఆత్మ స్థైర్యాన్ని పెంచింది. రానున్న పదో తరగతి పరీక్షలకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. గతంతో పోలిస్తే నా చేతిరాత మెరుగుపడింది. – శ్వేత, 10వ తరగతి విద్యార్థిని -
కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో: మన చుట్టూనే ప్రేమ, ఆదరణ నోచుకోని బాల్యాలెన్నో..తల్లిదండ్రులు లేకపోవడం వలనో, పేదరికం కారణంగానో అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు ఎందరో.. అందమైన భవిష్యత్ కలలు కంటూ, ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతుంటాయి ఆ పసి హృదయాలు. ఆ పిల్లలకు ప్రపంచ విజ్ఞానం, సంస్కృతుల సమ్మేళనం, ప్రస్తుత ఆధునిక జీవన శైలి గురించి తెలియాల్సిన అవసరం ఉందని కొందరి ఆలోచన. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని అనాథ చిన్నారులను హైదరాబాద్‌కు ఆహ్వానించి, విలాసవంతమైన ఆతిథ్యమిచ్చి వారి సంతోషాలకు, విజ్ఞానానికి ప్రోత్సాహం అందించే ‘యూనిటీ–ఎక్స్’ అనే అద్భుత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడి చిన్నారులను సైతం వివిధ నగరాలకు తీసుకెళ్లే నూతన సంస్కృతికి నాంది పలికారు. గతేడాది సెప్టెంబర్ నెలలో చెన్నైలోని ఫరెవర్ ట్రస్ట్‌కు చెందిన 45 మంది చిన్నారులు నగరానికి చేరుకుని 4 రోజుల విజ్ఞాన, వినోద పర్యటనను ఆస్వాదించారు. ఈ యూనిటీ–ఎక్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని పర్యాటక ప్రాంతాలు, పరిశోధన కేంద్రాలను వీక్షించారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే నగరంలోని వాల్మీకి గురుకుల్కు చెందిన 20 మంది చిన్నారులు చెన్నైకి సుసంపన్నమైన యాత్ర చేశారు. ఐకమత్యం, కల్చరల్ ఎక్స్చేంజ్ లో భాగంగా ఈ చిన్నారులు ఎన్నో మధుర జ్ఞాపకాలను, సామాజిక–వాస్తవిక అవగాహన పెంచుకుంటున్నారు. ఇలాంటి వినూత్న ప్రాజెక్టును హైదరాబాద్‌లోని వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజం సొల్యూషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ హరి కిషన్ వాల్మీకి ప్రారంభించారు. ఈ గొప్ప ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా భాగస్వామిగా చేరింది. ఈ సంస్థల సీఎస్ఆర్ నిధులతో యూనిటీ–ఎక్స్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జీఆర్టీ రాడిసన్, టెంపుల్ బే, రెయిన్ ట్రీ, ది పార్క్ హోటల్, రెసిడెన్సీ హోటల్స్ తదితర 5–స్టార్ హోటళ్లలో బస చేయడం, అక్కడి ఆహారాన్ని విందు చేయడం, విలాసవంతమైన బెంజ్ బస్సులతో గరుడ లాజిస్టిక్స్‌లో ప్రయాణం చేయడం వంటి అవకాశాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా విద్య, విజ్ఞానం, కెరీర్ సెమినార్స్ తదితర అంశాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు విభిన్న సంస్కృతుల సమ్మిళిత ప్రయాణం, అనుభవాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గొప్ప ఉపాధ్యాయుడితో సమానం. ఈ కోణంలోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వ్యవస్థాపకులు డాక్టర్ హరికిషన్ వాల్మీకి తెలిపారు. మా ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ అధ్యక్షుడు షబిన్ సర్వోత్తమ్ వంటి వారు భాగస్వామ్య సహకారం అందించడం శుభపరిణామం అన్నారు. ఈ ప్రాజెక్టును నగరంలోని వాల్మీకి ఫౌండేషన్ పర్యవేక్షిస్తూ, అవసరమైన మద్దతు, సహకారం అందిస్తోంది. ఐక్యతకు నిదర్శనంగాప్రేమ, ఆదరణ పొందకపోవడమే కాకుండా సామాజికంగా నిర్లక్ష్యానికి గురైన పిల్లలు ఈ అనాథలు. వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటే సౌలభ్యాలు, విద్య మాత్రమే సరిపోదు. అధునాతన ప్రపంచం, ఈ తరం జీవనశైలి, సామాజిక పరిపక్వత చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఇలాంటి చిన్నారులు సైతం అందరి పిల్లలమాదిరిగానే వారి జీవితాన్ని ఆస్వాదించడంలో ప్రాజెక్ట్ యూనిటీ–ఎక్స్ విశేషంగా కృషి చేస్తుంది. ఈ తరహా కార్యక్రమాలు సామాజిక సమానత్వానికి, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి. – డాక్టర్ సూర్య గణేష్ వాల్మీకి, వాల్మీకి ఫౌండేషన్ అధ్యక్షుడు. ఆలోచన మారింది.. మా ఆశ్రమం తప్ప మరే ప్రపంచం తెలియని మేమంతా చెన్నై వెళ్లడం మంచి అనుభూతి. ఈ ప్రయాణం విజ్ఞానంతో పాటు చెన్నైలో మంచి మిత్రులనూ చేరుకునేలా చేసింది. మళ్లీ అక్కడి పిల్లలు హైదరాబాద్ రావడం కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. యూనిటీ–ఎక్స్ నా ఆలోచనా విధానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను మార్చింది. ప్రపంచం చాలా పెద్దది, అవకాశాలకు కొదువ లేదు అనే నమ్మకాన్ని ఇచ్చింది. – మారుతి, వాల్మీకి గురుకుల్ విద్యార్థి ఇదీ చదవండి: 2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..బెస్ట్ టిప్స్! -
లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!
గయాసురుడు... పేరుకే అసురుడు కానీ ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు. అతడొకసారి విష్ణువును గురించి గొప్ప తపస్సు చేసి, తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు. తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పు విస్తరించి, జీవించసాగాడు. దాంతో ప్రతివారూ గయుణ్ణి తాకి మోక్షం ΄పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోవడంతో ఇంద్రుడికి, యమధర్మరాజుకు పని లేకుండా పోయింది. దాంతో వారిద్దరూ కలిసి బ్రహ్మవద్దకు వెళ్లి, ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వైచిత్రి గురించి త్రిమూర్తులు పరిపరివిధాలుగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇంద్రుడు గయాసురుడి వద్దకెళ్లాడు. ‘‘గయాసురా! లోకకల్యాణం కోసం మేమంతా కలసి ఒక యజ్ఞం చేయదలచుకున్నాము. ఆ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగినదనిపించింది. కనుక నీవు అనుమతిస్తే, నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము’’ అని అడిగాడు ఇంద్రుడు. గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి, తన శరీరాన్ని పెంచి ఉత్తరదిశగా తలను ఉంచి పడుకున్నాడు. సకల దేవతలు, రుషులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా, బ్రహ్మదేవుడు యజ్ఞం ఆరంభించాడు. అయితే, యజ్ఞంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నితత్వాన్ని తట్టుకోలేక గయుడి తల కదలడం ప్రారంభించింది. బ్రహ్మ సూచన మేరకు ‘దేవవ్రత’ అనే శిలను గయుడి తల మీద ఉంచి, ఆ శిలమీద విష్ణువు నిల్చున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞవేడిమిని, తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుడిని చూసి హృదయం ద్రవించిపోయిన విష్ణువు ‘‘వత్సా! ఏదైనా వరాన్ని కోరుకో’’ అని అడిగాడు. అందుకు గయాసురుడు ‘‘దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల, అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదధూళి సోకడం వల్ల నా జన్మ ధన్యమైంది. నేను ఇంతకుముందు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనదైనప్పటికీ, మీ భక్తుడినైన నన్ను సంహరించలేక, ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది. అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ అని కోరుకున్నాడు. నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు అనుగ్రహించాడు. గయుడి శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ. పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ. రాక్షసుడైనప్పటికీ, లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు. ‘‘నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ దాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ – డి.వి.ఆర్(చదవండి: ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి) -
రిలయన్స్ జ్యువెల్స్ డ్రీమ్ డైమండ్ సేల్
ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్, వార్షిక ‘డ్రీమ్ డైమండ్ సేల్’ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ సేల్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జ్యువెల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టైల్‌కి, సందర్భానికి త గినట్టుగా డైమండ్ ఆభరణాలను తీసుకొచ్చినట్టు వెల్లడించింది.ఈ ప్రత్యేకమైన ఆఫర్ కస్టమర్లకు డైమండ్ విలువ మరియు మేకింగ్ ఛార్జీలపై 30శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. వివిధ వజ్రాభరణాలతో, ఈ సంవత్సరం డ్రీమ్ డైమండ్ సేల్ కొనుగోలుదారుల జీవితాల్లోని ప్రతీ సందర్బంలో విలువైన క్షణాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో స్టేట్మెంట్ బ్రైడల్ సెట్స్, ఉంగరాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్ , గ్రాండ్ నెక్లెస్‌ల ఉంటాయని రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ తెలిపారు. దేశవ్యాప్తంగా 180+ స్వతంత్ర షోరూమ్‌లలో డైమండ్ కలెక్షన్‌ను దుకాణదారులు పొందవచ్చన్నారు. ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప చేసే డైమండ్ నగలు మెరుపు పోకుండా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్ మీకోసం!స్నానం చేసేటప్పుడు డైమండ్ ఆర్నమెంట్స్‌ను తీయాలి. మైల్డ్ సోప్, మైల్డ్ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లెట్లు ఎక్కువగా సొల్యూషన్ బారిన పడుతుంటాయి. వాతావరణంలో సొల్యూషన్ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్ మెరుపు తగ్గుతుంది. వేడి నీటిలో లిక్విడ్ సోప్ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఎలిమెంట్. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడకూడదు. పైన చెప్పుకున్నవి కట్ డైమండ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్‌కట్ డైమండ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తయారీలో అన్‌కట్ డైమండ్ వెనుక సిల్వర్ ఫాయిల్ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.ఇటీవల వేడుకల్లో ఎయిర్‌కూలర్‌లో పెర్ఫ్యూమ్ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ నల్లబడే ప్రమాదముంది. అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్ చేయించుకోవాలి.ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్ బాక్సులకు ముఖమల్ క్లాత్‌ని గమ్‌తో అతికిస్తారు. డైమండ్ ఆర్నమెంట్స్‌ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్ మీద అమర్చి భద్రపరుచుకోవాలి. -
‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!
ఉద్యోగులు, పనిగంటలపై కార్పొరేట్ కంపెనీ ఎల్అండ్టీ (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఇంట్లో కూర్చుని భార్యను ఎంత సేపు చూస్తారూ, ఆదివారం కూడా పని చేయండి అంటూ సుబ్రహ్మణ్యన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో సుదీర్ఘ పని గంటలపై మరోసారి చర్చకు దారి తీసింది. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలుకూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి డైరీ బ్రాండ్ అమూల్ చేరింది.అమూల్ ఏమంది?ఎల్ అండ్ టి బాస్ "స్టేర్ ఎట్ వైఫ్" వ్యాఖ్యలపై అమూల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక డూడుల్ విడుదల చేసింది. ఇందులో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమూల్ "90 గంటల పని వారం గురించి వివాదం!" అనే శీర్షికతో పాటు ఒక డూడుల్‌ను షేర్ చేసింది! డూడుల్‌లోని టెక్స్ట్ బోల్డ్‌లో L & T లెటర్స్‌తో ((Labour & Toil) "శ్రమ అండ్ కఠోర శ్రమ?" అంటూ సుబ్రహ్మణ్యన్ను విమర్శించింది "మీరు మీ భార్యను ఎంతసేపు తదేకంగా చూడగలరు?" "అమూల్ రోజూ బ్రెడ్‌ను తదేకంగా చూస్తుంది," అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.#Amul Topical: Controversy about the 90 hour work week! pic.twitter.com/VQlwoLoTx8— Amul.coop (@Amul_Coop) January 14, 2025కాగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు, అంశాలపై ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ,పోస్టర్లను రూపొందించడంలో అమూల్ కంపెనీబాగా ప్రసిద్ధి చెందింది. క్రీడల నుండి వినోదం వరకు, అన్ని ముఖ్యమైన సందర్భాలు, ప్రధానంగా ప్రముఖులు చనిపోయినపుడు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 90 గంటల పనివారం గురించి కొనసాగుతున్న వివాదంపై కూడా స్పందించడం విశేషం. గతంలో వారానికి 70 గంటలు పని చేయాలనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఇంకో అడుగు ముందుకేసి, 90 గంటలు, "ఇంట్లో కూర్చొని మీరు ఏమి చేస్తారు? భార్యను ఎంత సేపు చూస్తారు,ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించండి." అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధిక జీతం , సౌకర్యాలు ఉన్న కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, కింది స్థాయి, తక్కువ జీతం పొందే ఉద్యోగుల నుండి అదే స్థాయి నిబద్ధతను ఎందుకు ఆశిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. మరికొంతమంది కార్మిక శ్రమను దోచుకునే వీళ్లకి కార్మిక చట్టాలు, అమలు, కార్మిక సంక్షేమం గురించి మాట్లాడే మనసు ఉండదంటూ మండిపడ్డారు. అంతేకాదు ఈ వివాదంపై అనేక కార్డూన్లు, ఫన్నీ కామెంట్లు,వీడియోలు నెట్టింట సందడి చేశాయి కూడా. Dedicated to the L&T Chairman who wants a 90 hour work week pic.twitter.com/QtPtLjh2ej— Prashant Bhushan (@pbhushan1) January 13, 2025బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే, ఆర్పీసీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా 90 గంటల పనివారం చర్చపై స్పందిస్తూ.. తూకం వేసి, పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. సుదీర్ఘ పని గంటల కంటే ఉత్పాదకత ,సామర్థ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.బండ చాకిరీ : మన దేశంమరోవైపు అంతర్జాతీయ కార్మిక సంస్థ( ILO) నివేదిక ప్రకారం, భారతదేశం ఇప్పటికే ప్రపంచ ఓవర్ వర్క్ రంగంలో ముందు వరుసలో ఉంది. అదనపు పని విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం 13వ స్థానంలో ఉందని వెల్లడించింది. సగటున భారతీయ ఉద్యోగులు ప్రతి వారం 46.7 గంటలు పనిచేస్తారని, భారతదేశంలోని 51శాతం మంది శ్రామిక శక్తి ప్రతి వారం 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తుందని, అత్యధికంగా సుదీర్ఘమైన పని గంటలు ఉన్న దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని కూడా సంస్థ పేర్కొన గమనార్హం. -
త్రీ ఇడియట్స్లోని మాధవన్‌లా ఫోటోగ్రఫీ వైపు మళ్లాడు..!కట్ చేస్తే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీని పేరుకి తగ్గట్టుగానే ఈ కుంభ మేళ ఆధ్యాత్మిక గురువులుగా మారిన మహా మహా మేధావులను పరిచయం చేసింది. ఎందరో గొప్ప గొప్ప చదువులు చదివి వాటన్నింటిని పరిత్యజించి సాధువుగా జీవిస్తున్న వాళ్లను కళ్లకుకట్టినట్లు చూపించింది. చూడటానికి సాదాసీదా సాధువుల అనుకుంటే పొరపడ్డట్టే.. అనేలా వాళ్ల చరితలు ఉన్నాయి. వారంతా ఏకంగా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో చదివి, మంచి జీతాలతో హుందాగా జీవించినవారే. ఆధ్యాత్మికతకు ఆకర్షితులై..అందుకోసమే జీవితాన్ని అర్పించి..సాధువులుగా జీవిస్తూ..అందర్నీ ఆశ్చర్యచికితుల్ని చేశారు. వారి జీవన విధానం మహాత్తర జీవన సారాన్ని గురించి వెలుగెత్తి చాటింది. అలాంటికోవకు చెందిన వ్యక్తే ఈ మహకుంభమేళలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతనెవరంటే..ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh,)ని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పాల్గొని త్రివేణి సంగమ పవిత్ర జలాల్లో స్నానమాచరించి తరిచేందుకు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. ఈ ఆధ్మాత్మిక సంబరంలో మునిగితేలుతున్న ఎందరో సాధువులు, రుషులు, మత గురువుల మధ్య ఓ వ్యక్తి మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతడే హర్యానా(Haryana,)కు చెందిన అభిసింగ్(Abhey Singh). ఆయన్ని అంతా ఇంజనీర్ బాబాగా పిలుస్తారు. ఎంతో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి అకస్మాత్తుగా దైవ చింతన వైపుగా మళ్లాడు. అంతే ఇక వెంటనే ఉన్నతోద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా విడిచి పెట్టి సన్యాసిలా జీవిస్తున్నాడు. అతడి కథ వింటే విస్తుపోతారు. అంతటి హోదాను వదలుకుని సాదాసీధాగా బతకాలని ఎలా నిర్ణయించుకున్నాడు?. ఇది మనోనిబ్బరమా..? ఆధ్యాత్మికతకున్న శక్తినా? అనేది మాటలకందనిది. ఇక్కడ అభిసింగ్ ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్(Aerospace Engineer) డిగ్రీని పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ మంచి ఉద్యోగాన్ని కూడా పొందాlo. అయితే ఇది తన కెరీర్ కాదని త్రీ ఇడియట్స్లోని మాధవన్ మాదిరి ఫోటోగ్రఫీపై మక్కువతో ట్రావెల్ ఫోటోగ్రఫీ కెరీర్ వైపుకి మళ్లాడు. ఆ కళ అతనికి జీవతం విలువ, తత్వశాస్త్రం గురించి తెలుసుకునేందుకు దోహదపడింది. ఆ తర్వాత భౌతిక శాస్త్రాన్ని బోధించే కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు. అలా ఓ ఎంటర్ప్రెన్యూర్ టీచర్‌గా మంచి సక్సెస్‌ని కూడా అందుకున్నాడు. అయినా అవేమి అతడికి సంతృప్తినివ్వలేదు. క్రమంగా అతడి మనసు దైవ చింతన, ఆధ్యాత్మికత వైపుకి దృష్టిమళ్లింది. అందులో మమేకమై..గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస రేకెత్తింది. అలా అతను శివ సాధువుగా మారిపోయాడు. ఆయన తరచుగా అంతా శివమయం, సత్యమే శివుడు అని మాట్లాడుతుంటాడు. అంతేగాదు ఇంత సాధారణంగా ఉండే ఇంజనీరింగ్ బాబాకు సోషల్ మీడియాలో దాదాపు 30 వేలకు పైగా మంచి ఫాలోయింగ్ ఉంది కూడా. ప్రస్తుతం ఈ కుంభమేళలో పాల్గొన్న ఆయన అక్కడకు వచ్చిన మీడియా ముందు జర్నలిస్ట్‌లతో అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటంతో అతడెవరనే ఉత్సుకతను రేకెత్తించింది. ఈ క్రమంలోనే అతడి ఆధ్మాత్మికత ప్రయాణం వెలుగులోకి వచ్చింది. (చదవండి: సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ ఆరోగ్యానికి మంచి గేమ్ ఛేంజర్..!) -
మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!
మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది. కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ మహాకుంభ మేళని 144 ఏళ్ల కోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణకుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహించడం ఆనవాయితీ. అలాంటి మహా కుంభమేళలో ఎందరెందరో ప్రముఖుల, నాగసాధువులు, యోగగురువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. తాజాగా ఈ కుంభ మేళలో ప్రధాన ఆకర్షణగా యోగ మాతగా తొలి విదేశీ మహిళ నిలిచింది. ఆమె ఏ దేశస్తురాలు..మన హిందూ ఆచారాలను అనసరించడానికి రీజన్ తదితరాల గురించి తెలుసుకుందామా..!.యోగమాతా(Yogmata) కైకో ఐకావా(Keiko Aikawa) సిద్ధ గురువు లేదా హిమాలయ సమాధి యోగి హోదాను పొందిన తొలి భారతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన నిపుణురాలు. అంతేగాదు మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించబడిన తొలి విదేశీ మహిళ కూడా ఆమెనే. ఈ మహామండలేశ్వర్ అనేది ఆది శంకరాచార్య స్థాపించిన దశనామి క్రమంలో హిందు సన్యాసులకు ఇచ్చే బిరుదు. ఈ బిరుదు ప్రకారం వారిని గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా పరిగణిస్తారు. ఆమె ప్రస్తుతం జరగుతున్న మహాకుంభ మేళలో పాల్గొననున్నది. నేపథ్యం..1945లో జపాన్‌లో జన్మించిన యోగమాత కైకో ప్రకృతి వైద్యంలో మంచి ఆసక్తిని పెంచుకున్నారు. ఈ అభిరుచి పశ్చిమ దేశాలలో హిప్పీ ఉద్యమం ద్వారా సంక్రమించింది. అలాగే కైకో జపాన్‌లో యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసింది.ఆ నేపథ్యంలోనే టిబెట, చైనా, భారతదేశం గుండా పర్యటనలు చేసింది. 1972లో జపాన్ జనరల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ను స్థాపించింది. అక్కడ యోగా నృత్యం, ప్రాణ యోగాను నేర్చుకుంది. ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారిందంటే..1984లో జపాన్‌లో పైలట్ బాబాను కలిసినప్పుడు పరివర్తన చెందింది. ఎత్తైన హిమాలయాలలో సిద్ధ మాస్టర్స్‌తో కలిసి యోగాను నేర్చుకోవడానికి పైలెట్ బాబా ఆమెను ఆహ్వానించారు. అక్కడ ఆమె "సమాధి" పొందడానికి కఠినమైన శిక్షణ పొందింది. హిందూ, బౌద్ధ మతాల ప్రకారం సమాధి అనేది శరీరానికి కట్టుబడి ఉండగానే సాధించగల అత్యున్నత మానసిక ఏకాగ్రత స్థితి. ఇది వ్యక్తిని అత్యున్నత వాస్తవికతతో ఏకం చేస్తుంది. 1991లో తన తొలి బహిరంగ సమాధిని ప్రదర్శించింది. ఇది ఒక అసాధారణ యోగ సాధన. ఇందులో ఆమె ఆహారం, నీరు లేకుండా 72 గంటలకు పైగా గాలి చొరబడి భూగర్భ ఆవరణలో ఉండటం జరిగింది. ఈ ఘనతను కొద్దిమంది మాత్రమే సాధించగలరు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న ఇద్దరు సిద్ధ మాస్టర్లలో ఒకరు. 2024లో పైలట్ బాబా మరణానంతరం అతని వారసురాలిగా యోగా మాత కేవలానంద్గా పేరుపొందింది. ఆమె తరుచుగా హిమాలయ రహస్య ధ్యానం"ను బోధిస్తుంది, సాధన చేస్తుంది. ఆమె అంతర్గత పరివర్తన శక్తిని విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ విశ్వ ప్రేమ ఉంటుంది. దానిని గుర్తించి, సమతుల్యత, ప్రశాంతతను సాధించడమే ధ్యానం లక్ష్యం. అని చెబుతుంటుంది యోగమాత కైకో.(చదవండి: పల్లవించిన ప్రజ్ఞ! తమిళులైనా.. తెలుగులో..) -
సందళ్లే సందళ్లే.. సంక్రాంతి సందళ్లే..!
ఉద్యోగాల పేరుతో ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉన్నా..ఈ పండగకి మాత్రం తమ సొంతూళ్లకి చేరి చేసుకునే గొప్ప పండుగా సంక్రాంతి. అందర్నీ ఒక చోటకు చేర్చే పండుగ. ఎంత వ్యయప్రయాసలు కోర్చి అయినా.. ఈ పండగకి సోంతూరికి వెళ్తేనే ఆనందం. అలాంటి ఈ పండుగ విశిష్టత ఏంటి, దేశమంతా ఏఏ పేర్లతో ఈ పండగను జరుపుకుంటుంది తదితరాల గురించి చూద్దామా..!.సంక్రాంతి పండగా ప్రకృతికి కృతజ్ఞత చెబుతూ జరుపుకునే సంబరం. ఈ పండుగ నాటికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకే సంతోషంతో ఈ పండుగ చేసుకుంటారు. పురాణ కథనం ప్రకారం తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. అది సరిగ్గా మకర సంక్రాంతి పండుగ రోజునే. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14న(మంగళవారం) మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ పర్వదినంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలతో హాయిగా ఉంటామని విశ్వసిస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తారు. అంత మహిమాన్వితమైన మకర సంక్రాంతిని దేశమంతా ఏఏ పేర్లతో ఎలా జరుపుకుంటుందో చూద్దామా..!.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతిని "మకర సంక్రాంతి" అని పిలుస్తారు. అక్కడ పెద్దల పేరు చెప్పి భోజనం పెట్టడం లేదా ఏవైన దానధర్మాలు చేయడం వంటివి చేస్తారు. వరి దుబ్బులు తీసుకొచ్చి పక్షులకు ఆహారం పెట్టడం వంటివి చేస్తారు.తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్‌గా జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున రైతులు తమ ఎద్దులను అలంకరించి పూజిస్తారు. వాళ్లు ఈ పండగను వ్యవసాయ ఉత్పాదకత, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.కేరళలో మకర సంక్రాంతి పేరు మకరవిళక్కు. ఈ రోజున శబరిమల ఆలయం దగ్గర ఆకాశంలో మకర జ్యోతి కనిపిస్తుంది. ప్రజలు దానిని సందర్శిస్తారుకర్ణాటకలో ఈ పండుగను ఎల్లు బిరోధు అని పిలుస్తారు. ఈ రోజున మహిళలు కనీసం 10 కుటుంబాలతో చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో చేసిన వస్తువులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మాఘి నాడు శ్రీ ముక్తసర్ సాహిబ్‌లో ఒక ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు ఈ రోజున నృత్యం చేసి ఆడి, పాడతారు. ఈ రోజున కిచిడి, బెల్లం, ఖీర్ తినే సంప్రదాయం ఉంది. గుజరాత్లో మకర సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్య కాలంగా జరుపుకుంటారు. ఆ రోజున గాలిపటాల పండుగ జరుగుతుంది. అలాగే ఉండియు, చిక్కీ వంటకాలు తింటారు.హిమాచల్ ఫ్రదేశ్లో ఈ పండుగను మాఘాసాజీ అని పిలుస్తారు. సాజి అనేది సంక్రాంతికి పర్యాయపదం. కొత్త నెల ప్రారంభం… మాఘమాసం కూడా నేటినుంచే ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం ప్రారంభ సూచికగా ఈ పండుగ చేసుకుంటారు.ఉత్తరాఖండ్‌లోని కుమావున్ ప్రాంతంలో మకర సంక్రాంతి గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున నేతిలో వేయించి తీసిన పిండి పదార్ధాలను కాకులకు ఆహారంగా పెడతారు. ఒడిషాలో ప్రజలు మకర చౌలా పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు. కొత్తబియ్యం, బెల్లం, నువ్వులు. కొబ్బరి వంటి వాటితో చేసిన ఆహార పదార్ధాలను తయారు చేస్తారు ముఖ్యంగా కోణార్కో లోని సూర్యదేవాలయానికి ఈరోజు భక్తులు పోటెత్తుతారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యభగవానుడిదర్శనం చేసుకుంటారు.పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతి పేరుతో ఈ పండుగ జరుపుకుంటారు. ప్రజలు గంగానది బంగాళా ఖాతంలో కలిసే ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీన్ని పౌష్ పర్బన్ అనే పేరుతో కూడాజరుపుకుంటారు. ఇక్కడి ప్రజలు ఖర్జూర పండును ఎక్కువగ ఉపయోగిస్తారు. కొత్త బియ్యం, కొబ్బరి, బెల్లం ఖర్జూరాలతో తయరు చేసిన ఖీర్ వంటివి ఆరగిస్తారు.,డార్జిలింగ్ లోని హిమాలయ ప్రాంతాల్లో ఈరోజున ప్రజలు శివుడిని ఆరాధిస్తారు.బీహార్,జార్ఖండ్‌లలో ఈ రోజున ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేసి ఆనంద డోలికల్లో మునిగిపోతారు. సాయంత్రం వేళ ప్రత్యేక ఖిచిడీని తయారు చేసి పాపడ్, నెయ్యి, కూరగాయలతో చేసిన వంటకాన్ని బంధువులు స్నేహితులతో కలిసి సామూహికంగా ఆరగిస్తారు.ఇతర దేశాల్లో..నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, కాంబోడియా వంటి దేశాల్లోనూ ఈ పండగ కనిపిస్తుంది. అక్కడ ప్రజలు నది -సముద్రం కలిసే సంగమ ప్రదేశంలోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తారట. అలాగే పతంగులు, తీపి వంటలు ప్రధానంగా ఉంటాయట.(చదవండి: Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?) -
మ్యాట్రి 'మనీ' స్కాం: అలాంటి వీడియోలతో బెదిరింపులు, బీ కేర్‌ఫుల్!
పెళ్లిళ్ల పేరయ్యల కాలం దాదాపు కనుమరుగైపోయింది. ఇపుడంతా మ్యాట్రీ మోనీ వెబ్సైట్ల హవానే నడుస్తోంది. ప్రాథమికంగా అన్ని వివరాలను ఆన్లైన్లోనే తెలుసుకుని అపుడు రంగంలోకి దిగుతున్న పరిస్థితినిమనం చూస్తున్నాం. అమ్మాయిల తల్లిదండ్రులైనా, అబ్బాయిల తల్లిదండ్రులైనా చాలావరకు ‘మ్యాట్రీ మోనీ’ పై ఆధారపడుతున్నారు. ఇక్కడే కేటుగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. పదండి!మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్టు.. ప్రతీ విషయాన్ని తమ కనుగుణంగా మలుచు కుంటున్నారు కేడీగాళ్లు. ఆఖరికి మ్యాట్రీమోనీ సైట్లను కూడా వదలడం లేదు. మ్యాట్రిమోని సైట్ల కేంద్రంగా పెరిగిపోతున్న మోసాలు అంటూ దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియోను షేర్ చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త! అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సజ్జనార్ ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీడియో కాల్స్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగిన కచ్చితంగా అనుమానించాల్సి ఉందనీ, ఒకటి పది సార్లు ఆలోచించాలని తెలిపారు. అలాగే మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ ట్వీట్ చేశారు.ఈ వీడియోలో ఒక యువతి తన స్నేహితురాలి అనుభవాన్ని గురించి వివరించారు. ఈ వివరాల ప్రకారం మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు స్కాం రాయుళ్లు. ఆ తరువాత పెళ్లి పేరుతో మాయమాటలు చెబుతారు. మభ్యపెట్టి మెల్లిగా వీడియో కాల్స్ చేస్తారు. ఆ తరువాత ఈ వీడియో సాయంతో న్యూడ్ వీడియోలను తయారు చేస్తారు. ఆపై ఈ వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడతారు. అడిగిన సొమ్ము ముట్టచెప్పక పోతే..న్యూడ్ వీడియోలను బయట పెడతామంటూ బెదిరిస్తారు. దీంతో ఈ వ్యవహారం బయటకి వస్తే పరువు పోతుందని భయంతో వణికిపోతారు బాధితులు. అడిగినంత ముట్జచెప్పి కష్టాల్లో పడుతున్నారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరిన్ని సమస్యలు తప్పవనే భయంతో ఫిర్యాదులకు జంకుతున్నారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!!మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్.న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడిగిన డబ్బు ఇవ్వాలని బెదిరింపులు.మ్యాట్రిమోని… pic.twitter.com/wS48rAVmTp— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 13, 2025 ఇలాంటి స్కాంలపై అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇలాంటి బెదిరింపులకు భయపడ కూడదు. సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదంటే సైబర్ క్రైం విభాగాన్ని గానీ వెంటనే సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల మరింత బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన వారమవుతాం. అలాకాకుండా పరువు పోతుందని భయపడితే, కేటుగాళ్లు పన్నిన ఉచ్చులోకి మరింత లోతుగా చిక్కుకుంటామనే సంగతి గుర్తుంచు కోవాలి. -
డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, రూ..11.42 కోట్ల జరిమానా
ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు మరో జన్మ. గర్భంలో పాపాయి రూపు దిద్దుకోవడం మొదలు, ప్రసవం దాకా నిరంతరం పర్యవేక్షణ అవసరం. స్వయంగా గర్భిణీతోపాటు, కుటుంబ సభ్యులు, చికిత్స అందించే వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులకు కన్నతల్లిని దూరం చేసింది. మలేసియాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈకేసులో ఆ దేశ కోర్టు ఇచ్చిన తీర్పు నెట్టింట చర్చకు దారి తీసింది. 2019లో జరిగిన సంఘటన ఇది. 36 ఏళ్ల పునీత మోహన్(Punita Mohan) రెండో కాన్పుకోసం ఆస్పత్రి లో చేరింది. అయితే ప్రసవం తరువాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ (Postpartum Hemorrhage) కారణంగా విపరీత రక్తస్రావం అయింది. నొప్పితో ఆమె విలవిల్లాడి పోయింది. బ్లీడింగ్ అవుతోందని ఆమె తల్లి ఆమెకు వైద్యం చేసిన వైద్యడు డాక్టర్లు రవి, క్లినిక్ యజమాని షణ్ముగానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రాణాంతకమని తెలిసినా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించారు. పైగా మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతోందని, అంతా సర్దుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఎటో వెళ్లి పోయారు. రెండు గంటలు గడిచిన తరువాత కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. పరిస్థితి విషమించడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తన కళ్ల ముందే తన బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి నానాయతన పడిందని, ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశారంటూ పునీత తల్లి కన్నీటి పర్యంతమైంది.ఈ కేసును విచారించిన హైకోర్టు బాధిత కుటుంబానికి రూ.11.42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. వైద్యులు రోగికి భద్రత కల్పించకుండా, గంటల తరబడి వదిలివెళ్లడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది. అంతులేని నిర్లక్ష్యం కారణంగానే పునీత మరణించిందని ఆగ్రహించిన కోర్టు ఇద్దరు వైద్యులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. -
మది నిండుగా మహా కుంభమేళా!
మహాకుంభమేళా ఆర్ట్ వర్క్‌తో అందమైన రూపాన్ని నింపుకుంది. కళాకారులు తమదైన శైలిలో భారతీయ సంస్కృతిని కళ్లకు కడుతున్నారు. రికార్డులు కొల్లగొడుతున్నారు. మహాకుంభమేళా ఈవెంట్‌కు దాదాపు 40 – 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా.రూపు మారిన రైల్వే స్టేషన్లుఅధిక సంఖ్యలో భక్తులు రైలు ప్రయాణం ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల రైల్వే స్టేషన్లు హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన ఆకర్షణీయమైన కుడ్యచిత్రాలతో అందమైన హబ్‌లుగా మారిపోయాయి. రామాయణం, కృష్ణ లీల, లార్డ్ బుద్ధ, శివశక్తి, గంగా హారతి, మహిళా సాధికారత.. వంటి పౌరాణిక ప్రతిబింబాలను అందించడానికి థీమ్‌లను ఎంపిక చేశారు. యాత్రికులకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని సజీవంగా అందించడానికి, స్వాగతం పలకడానికి మన సంప్రదాయానిన ఈ విధంగా కళ్లకు కట్టారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైని జంక్షన్, ఫఫామౌ, ప్రయాగ్ జంక్షన్, ఝూన్సీ స్టేషన్, రాంబాగ్ స్టేషన్, చెయోకి, సంగం, సుబేదర్‌గంజ్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లను ’పెయింట్ మై సిటీ’ డ్రైవ్ కింద సుందరీకరించింది. లోతైన సంస్కృతిగురు–శిష్య బంధం, విజ్ఞానం, పరిత్యాగం సామరస్య సమ్మేళనంతో సహా ఒక లోతైన సంప్రదాయాలను నగరం లోపల గోడలపై కళాకారులు చిత్రించారు. ఈ శక్తివంతమైన ఈ కుడ్యచిత్రాలు ప్రతి మూల మహాకుంభ వైభవంతో ప్రతిధ్వనిస్తుందనడానికి నిదర్శనంగా నిలిచాయి. ‘రామ నామం’ మహాకుంభంఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ మేళా సందర్భంగా చాలా మంది కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. మహాకుంభంలో ముఖ్యమైన ఆచారంగా ఉన్న అమృత కలశాన్ని కళాకారిణి ప్రతిభాపాండే ‘రామ నామం’తో చిత్రించింది. ‘ఈ కుంభ కళశాన్ని మహాకుంభ మేళాకు అంకితం చేస్తున్నాను. ఈ కళశాన్ని పూర్తి చేయడానికి ఏడు రోజులు పట్టింది. ఇది నాకు ధ్యాన వ్యాయామంలా ఉపయోగపడింది. గృహిణిగా ఇంటి పనులను త్వరగా పూర్తి చేసుకొని, పగలు–రాత్రి ఈ రామ కళశ కుంభాన్ని చిత్రించాను’ అని చెబుతోంది ఈ చిత్రకారిణి.వరల్డ్ లార్జెస్ట్ రంగోళి రికార్డ్ఇండోర్కు చెందిన శిఖా శర్మ నాయకత్వంలో రూపొందించిన అతి పెద్ద మహాకుంభ మేళా రంగోలీ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో యమునా క్రిస్టియన్ కళాశాల ప్రాంగణంలో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 11 టన్నుల సహజ రంగులను ఉపయోగించి, 72 గంటలలో శిఖా శర్మ, ఆమె బృందం ఈ రంగోలీని పూర్తి చేశారు. నదీ జలాలు, జన సంద్రం, పడవలు, భారీ సాధువు బొమ్మను ఇందులో చిత్రించారు. (చదవండి: 'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!) -
'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!
నేలకు దిగివచ్చిన కైలాసం. ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ. త్రిపురలోని అందమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతి ఒడిలో కొలువైన భారీ శిల్పాలు. హెరిటేజ్ సైట్ హోదా సొంతమైన చరిత్ర.ఈశాన్య రాష్ట్రాల టూర్లో ప్రకృతి పచ్చదనానిదే పైచేయి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ అచ్చమైన స్వచ్ఛత ఒడిలోకి చేరుకుంటాం. చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. రఘునాథ హిల్స్‌లో పచ్చదనం లోపించిన కొండవాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరికించి చూస్తే అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎవరు చెక్కి ఉంటారు? ఎప్పుడు జరిగిందీ వింత? ఉనకోటి శిల్పాల సముదాయాన్ని ఏడు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్యలో చెక్కి ఉండవచ్చనేది ఆర్కియాలజిస్టుల అంచనా. ‘కల్లు కుమ్హార్’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. కైలాస పర్వతంలోని శివపార్వతులను దర్శించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, ఆ రూపాలను, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు.క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే మొఘలు గవర్నర్ భువనేశ్వర్‌లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేశాడని, ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో ఈశాన్యరాష్ట్రాలన్నింటి నుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటారు. జనపద కథనం...శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఈ ప్రదేశానికి వచ్చేసరికి చీకటి పడింది. ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చిందని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే ఈ శిల్పాల సముదాయంలో శివుడి శిల్పం ఉండకూడదు, కానీ శివుడి శిల్పం కూడా ఉంది. దేశంలో అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదే. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్ మధురానుభూతిగా మిగులుతుంది. పెద్ద శివుడు ఈ భారీ శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవుడు. విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. తలమీద ఎంబ్రాయిడరీ చేసిన తలపాగా ధరించినట్లు చెక్కారు. ఆ తలపాగా ఎత్తు పది అడుగులుంది. తలకు రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నంది విగ్రహం సగానికి నేలలో కూరుకుపోయి ఉంటుంది. గణేశుడు ప్రశాంతంగా మౌనముద్రలో ఉంటాడు. ఈ శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే మనకు శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే నోటిస్ బోర్డులుంటాయి. ఏఎస్ఐ అడవినంతా గాలించి, పరిశోధించింది. ఏఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ప్రదేశం హెరిటేజ్ సైట్ల జాబితాలో చేరింది. యునెస్కో గుర్తించి సర్టిఫికేట్ జారీ చేసే లోపు చూసివద్దాం.ఉనకోటి ఎక్కడ ఉంది!త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్‌హర’ పట్టణానికి దగ్గరగా ఉంది. ఎలా వెళ్లాలంటే... సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. సమీప రైల్వేస్టేషన్ కుమార్‌ఘాట్‌లో ఉంది. ఇది ఉనకోటికి 20 కి.మీ.ల దూరంలో ఉంది.ఎప్పుడు వెళ్లవచ్చు!ఇది పర్వతశ్రేణుల ప్రదేశం కాబట్టి వర్షాకాలం మంచిది కాదు. అక్టోబర్ నుంచి మే నెల మధ్యవాతావరణం అనువుగా ఉంటుంది. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: భావోద్వేగాల 'కిజిక్ తివాచీ'..!) -
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?
'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్య రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!) -
ఆగర్భ శత్రువులం కాదు.. భూగర్భవాసులం : అబ్బురపర్చే వెంకటేష్ చిత్రాలు
శాలు, జాతులు, మతాలు, కులాల పేరిట విద్వేషాల కుంపట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో మానవులందరూ సహోదరులేనని, అందరి అమ్మఒడి భూగర్భమేననే విషయాన్ని గుర్తు చేస్తూ ఓ అద్భుత చిత్రాన్ని రూపొందించారు నగరవాసి. త్వరలోనే ఆ చిత్రాన్ని అంతర్జాతీయంగా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ చిత్రకారుడు వెంకటేష్ కందునూరి(35) తన చిత్రం వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో మాది మహబూబ్‌నగర్ జిల్లా.. ప్రస్తుతం నగరంలోని చైతన్యపురిలో ఉంటున్నా.. చిన్నప్పటి నుంచీ కళల పట్ల ఉన్న ఆసక్తితో నగరంలోని జేఎన్టీయూలో బీఎఫ్ఏ చేసి ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఆరి్టస్ట్‌గా పనిచేస్తున్నాను. తరచూ సామాజిక అంశాలపై చిత్రాలను గీయడం నాకు అలవాటు. అదేవిధంగా ఈ ఆర్ట్ వర్క్ రూపొందించాను. భూమి.. బలిమి.. ఈ చిత్రంలో ప్రధానంగా భూమి, మనుషులు, జెండాలు, తుపాకులు అనే నాలుగు అంశాలు కనిపిస్తాయి. ఒక మహిళ తన గర్భంలో భూమిని మోస్తూ ఉంటే, ఆ భూమి లోపల తుపాకీతో కాలుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తుపాకీ భూమి లోపల దించి ఉండటం వల్ల ఆ మట్టిని తాకిన తుపాకీకి ఉన్న చెక్క జీవం పోసుకుని, చిగురు ఆకులతో కనిపిస్తుంది. మరోవైపు వివిధ రకాల జెండాలు, తుపాకులను చేతబట్టిన ప్రజలు యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబిస్తారు. ‘ఓ మనిషి నువ్వు నన్ను ఎన్ని రకాలుగా చిత్రవధ చేసినా నేను మాత్రం చివరి వరకూ నిన్ను కాపాడుతూనే నీకు జీవాన్ని పోస్తూనే ఉంటా’ అని చెబుతున్న భూమి విలువ గుర్తించమనేదే ఈ చిత్రంలోని అంతరార్థం. ఆరు అడుగుల పొడవు, ఆరున్నర అడుగుల వెడల్పు కలిగిన ఈ భారీ చిత్రాన్ని దేశ రాష్ట్రపతితో ప్రారంభించి, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలని, అలాగే ఐక్యరాజ్యసమితి వరకు చేర్చాలని ప్రయత్నిస్తున్నాను అన్నారాయన.ఆగర్భ శత్రువులం కాదు.. భూగర్భవాసులం జాతి కుల మత విద్వేషాలు వదిలితేనే బలం ఆలోచింపజేసే సందేశం అందిస్తున్న అద్భుత చిత్రం అంతర్జాతీయంగా ప్రదర్శించేందుకు సన్నాహాలు -
ముక్కోటి ఏకాదశి విశిష్టత..! ఉత్తరద్వార దర్శనం అంటే..
శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi). పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుదర్శనం తర్వాత పూజచేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ పర్వదినం గురించి.. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే పాలకడలి నుంచి అమృతం పుట్టిందంటారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం. ముక్కోటి నాడు విష్ణుమూర్తిని నియమ నిష్ఠలతో పూజ చేసివారికి పుణ్యఫలముతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని, వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణుపూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాల్లోనూ, పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా, ఉపవాసాలు చేసి, జాగరణ ఉంటూ, నియమ నిష్ఠలతో పూజాదికాలు చేసి, తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో, ఒకే విధమైన పూజాదికాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం.తిరుమలలో వైకుంఠ ఏకాదశి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర(Tirumala Venkateswara temples) స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం, తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. శ్రీరంగంలో...శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయం(Sri Ranganathaswamy)లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. (చదవండి: అనంతపద్మనాభ స్వామి ఆలయం..! కొండనే ఆలయాలుగా..) -
సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!
సంక్రాంతి వస్తోందంటే వాకిట రంగవల్లులు, తెల్లవారు జామున హరిదాసులు, తెల్లవారిన తర్వాత గొబ్బియల్లో పాటలు, మధ్యాహ్నానికి పతంగులు గాల్లో ఎగురుతాయి. ఇవన్నీ పండుగ రాకను సూచించే ఉల్లాసాలు. సంక్రాంతి పండుగకు ఇంతే ఉల్లాసంగా ఉత్సవాలు కూడా జరుపుకుంటాం. సంక్రాంతి పండుగకు మనదేశంలో, గుజరాత్లో జరిగే పతంగుల ఉత్సవం అంటే విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఉరకలు వేస్తూ వస్తారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ వేడుకలకు నవంబర్ నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. నగరం డిసెంబర్ నాటికే పూర్తి స్థాయిలో ముస్తాబవుతుంది.తోకలేని గాలిపటాలుఅహ్మదాబాద్లో ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2025’ను ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది. కేవాడియా, రాజ్‌కోట్, వడోదరా, శివరాజ్ పూర్, ధోర్డో, సూరత్‌లలో కూడా వేడుకలు నిర్వహిస్తారు. గాలిపటం అంటే తోక ప్రధానం, కానీ తోకలేని గాలిపటాలు కూడా ఈ వేడుకల్లో కనిపిస్తాయి. నక్షత్ర పతంగులు, చేపలు, పులుల ఆకారంలో ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లతో రూపొందిన గాలిపటాలను చూడవచ్చు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఈ ఫెస్టివల్‌కి వస్తారు. అహ్మదాబాద్, కచ్, సూరత్, సాఉతారా, రాజ్‌కోట్, పోర్బందర్, గాంధీధామ్, అమ్రేలి, భావ్‌నగర్‌లలో గతంలో నిర్వహించిన ఫెస్టివల్లో పాల్గొన్న గాలిపటాల ఫొటో గ్యాలరీ స్టాల్ కూడా ఉంటుంది. ఏకకాలంలో ఐదు వందల పతంగులు గాల్లో ఎగురుతుంటే చూడడానికి రెండు కళ్లు చాలవనే మాట చాలా చిన్నది. అహ్మదాబాద్ లో1989 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ముందు ఒకటి రెండు రోజుల నుంచి తర్వాత మరో రోజు వరకు మొత్తం నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కి పతంగి తయారీదారులు ప్రత్యేకంగా నెల రోజుల ముందు నుంచే చేరుకుంటారు. మలేషియా, ఇండోనేషియా, యూఎస్, జ΄ాన్, చైనా, ఇటలీ వంటి అనేక దేశాల నుంచి పతంగులు చేసే నిపుణులు, పతంగులను ఎగురవేసే ఉత్సాహవంతులు నగరానికి చేరుకుంటారు. ప్రత్యేకమైన పతంగులను తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేడుకలో పాల్గొంటాయి.కాంతులీనే పతంగులురంగురంగుల పతంగులను పగలంతా ఎగురవేస్తారు. వెలుగులు విరజిమ్మే తెల్లటి పతంగులను రాత్రి పూట ఎగురవేస్తారు. అవి ఆకాశంలో చంద్రుడికి పోటీగా విహరిస్తుంటాయి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ని సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నప్పటికీ ఇందులో మతపరమైన ధార్మిక నియమాలేవీ ఉండవు. వేడుకలో అన్ని మతాల వాళ్లూ సంతోషంగా పాల్గొంటారు. బంధువులు, స్నేహితులు కుటుంబాలతోపాటుగా కలిసి వేడుకలకు హాజరవుతుంటారు. ఇది ఊరంతా కలిసి నిర్వహించుకునే వేడుకన్నమాట. రంజాన్ సమయంలో చార్మినార్ నైట్ బజార్లాగ అహ్మదాబాద్ నగరంలోని పతంగిబజార్ డిసెంబర్ మూడోవారం నుంచి జనవరి రెండు వారాల వరకు మొత్తం నెలరోజుల పాటు రోజూ 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఎన్నివేల పతంగులు అమ్ముడవుతాయో లెక్క అందదు. మాంజాకు గాజు పొడి అద్దే దుష్టసంప్రదాయాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేటట్లు గట్టి నిఘా కూడా ఉంటుంది.పెద్దల కేరింతలుమన తెలుగువాళ్లు సంక్రాంతికి ప్రతి ఇంట్లో పతంగులు ఎగురవేస్తారు. హైదరాబాద్ ఆకాశం కూడా పతంగులతో కనువిందు చేస్తుంది. కానీ ఇక్కడ పిల్లలు పతంగులతో ఆనందిస్తుంటే పెద్దవాళ్లు పిల్లలను చూసి ఆనందిస్తుంటారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పెద్దవాళ్లు చిన్న పిల్లలైపోతారు. పరుగులు తీస్తూ మాంజాను జాడిస్తూ పతంగి పైకి ఎగిరే కొద్దీ కెవ్వున కేరింతలు కొడుతూ ఉంటే వాళ్లను చూసి పిల్లలు చప్పట్లు కొడుతూ ఈ వేడుకను ఎంజాయ్ చేస్తారు. (చదవండి: -
అనంతపద్మనాభ స్వామి ఆలయం..! కొండనే ఆలయాలుగా..
ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్తంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిధ ఆకృతులలో మలచిన ఆనాటి శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి వందనాలు సమర్పించాల్సిందే. శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోవాలసిందే! గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 –620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలుగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. . మొదటి అంతస్తు: కింద భాగం మొదటి అంతస్తులో గుప్తుల,చాళుక్యుల కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ధ సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం ప్రారంభమైంది. వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి మార్గం, విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది. రెండవ అంతస్తు: రెండవ అంతస్తు లోనికి మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా చెపుతున్నారుగాని ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతిగా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి. మూడవ అంతస్తులోకి మెట్లమార్గం...చారిత్రక నేపథ్యం – ఈ గుహాలయాలు నాలుగు అంతస్తులు కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా విష్ణు బంధమైన గుహాలయం. సాధారణం గా బౌద్ధ, జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాధికారిగా పనిచేసిన మాధవరెడ్డి ఈ అనంత పద్మనాభుని గుహాలయాన్ని నిర్మింపజేసినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడ నుంచి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించే వారని నానుడి. ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం. మహా గణపతి...లంబోదరుని సహస్ర రూ΄ాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను శిల్పంలో దర్శింపజేయడం అనన్య సామాన్యం. ఉగ్రనరసింహుడు: ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితోపాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి. శ్రీ లక్ష్మీదేవితో ఆదివరాహస్వామి...స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు. ఆకాశంలో విహరిస్తున్నట్లున్న గరుత్మంతుడు... నాగబంథం: మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ప్రచారం జరిగింది.నారద తుంబురులా ? ఈ మూడవ అంతస్థులో వెలుపల భాగాన నాలుగు విగ్రహాలు, సింహం బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద, తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా! కాని ఎందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీకలనే భావన కలుగుతుంది. వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల, రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కాబట్టి పండితులు, మేథావులు, చరిత్ర పరిశోథకులు మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే విశేషం వెలుగు చూడవచ్చు? రవాణాసౌకర్యాలు...విజయవాడకు దేశంలోని అన్ని ్ర΄ాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడనుండి ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు. రోడ్డు మార్గం... ఉండవల్లి గుహలకు చేరుకునే మార్గాలు ఆలయానికి మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 31 కిలోమీటర్ దూరంలో ఉంది. మంగళగిరి నుండి ఉండవల్లి గుహలకు 7 దూరంలో ఉంది. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ గుహలను సందర్శించడానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. అదేవిధంగా గుంటూరులో రైల్వే జంక్షన్, విజయవాడలో రైల్వే జంక్షన్ ఉంది. గుంటూరు నుంచి ఆలయానికి 30 కిలోమీటర్లు, విజయవాడ నుంచి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్లు ఉంది. రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మంగళగిరిలో రైలు జంక్షన్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా ఉండవల్లి గుహకు వెళ్లడానికి సదుపాయాలు ఉన్నాయి.(చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం) -
ట్రా'వెల్నెస్' టిప్స్..!
నిన్నమొన్ననే జరిగిన క్రిస్మస్ సెలవుల కోసమని కొందరు, జనవరి మొదటిరోజు తమకు ఇష్టమైన వారిని కలవడం కోసం లేదా రాబోయే సంక్రాంతికి ఇంకొందరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కారణమేదైనా రకరకాల అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ప్రయాణాలు చేయాల్సిన ఆవశ్యకత ఉండనే ఉంటుంది. ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది. అన్నిటికంటే ముందుగా ప్రయాణం చేయబోయే ముందర తాము రెగ్యులర్‌గా సంప్రదించే జనరల్ ఫిజీషియన్‌ను తొలుత తప్పనిసరిగా కలవాలి. తాము వెళ్తున్న ప్రదేశం గురించి తెలపాలి. అక్కడ ఉండే వాతావరణానికి అనువుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని... ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్‌కు చెప్పి, ఆ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోవాలి. ఆ మేరకు డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేసిన ప్రకారం... తమకు అవసరమైన మందులను ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఉదాహరణకు హై–బీపీ, డయాబెటిస్, హై–కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు తాము ప్రయాణం చేసే కాలానికి అవసరమైనన్ని మందులను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సరిగ్గా తాము అనుకున్న వ్యవధికి అవసరమైనన్నే కాకుండా... వీలైతే కొద్దిగా ఎక్కువ మందులే తీసుకెళ్లడం మంచిది. ఉదాహరణకు ఆస్తమా బాధితులు ఎటాక్ వచ్చిన వెంటనే తాము తక్షణం వాడాల్సిన (ఎస్ఓఎస్) మందుల్ని వెంట ఉంచుకోవాలి. అలాగే వారు తమతోపాటు క్యారీ చేయాల్సిన ఇన్హేలర్స్, ప్రివెంటివ్ ఇన్హేలర్స్ను (వీలైతే ఒకటి రెండు ఎక్కువగానే) తీసుకెళ్లాలి. ఇది ఉదాహరణ మాత్రమే. ప్రయాణికులు తమ ఆరోగ్య సమస్యను బట్టి మందులు క్యారీ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు... అక్కడ ఉండే ఆరోగ్య పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన ముందస్తు టీకా మందులు (వ్యాక్సిన్స్) తీసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్రికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో ఫీవర్ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఆ దేశాలకు ప్రయాణం చేసేవారు ముందుగానే అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలి. గర్భవతులు తాము వాడాల్సిన మందులూ, అలాగే తీసుకోవాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లను తీసుకొని ఉండాలి. పిల్లలకు వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి వారు తీసుకోవాల్సిన మందుల్ని రెడీగా ఉంచుకోవాలి. ఆయా దేశాలే కాదు... కొన్ని సందర్భాల్లో తాము ప్రయాణం చేసే విమాన సంస్థలు సైతం కొన్ని ఆంక్షలు పెడుతుంటాయి. ‘‘ఫిట్ టు ఫ్లై’’ నిబంధనలుగా పేర్కొనే ఈ నిబంధనల గురించి ముందుగానే తెలుసుకోవాలి. దీంతో తమ ప్రయాణంలో రాబోయే సమస్యలను తెలుసుకుని, నివారించుకోవడం తేలికవుతుంది. తాము బస చేయబోయే చోట కొందరు పాస్ట్ ట్రావెల్ హిస్టరీ’ అడిగి తీసుకుంటూ ఉంటారు. అంటే... గతంలో ఏయే ప్రాంతాలు / దేశాలు తిరిగివచ్చారో అడిగి తెలుసుకుంటుంటారు. తమ పాస్ట్ ట్రావెల్ హిస్టరీ గురించి ఎవరికి వారు ముందుగానే సమీక్షించుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అయితే ప్రజలందరి సంక్షేమం కోసం తమ ట్రావెల్ హిస్టరీని పారదర్శకంగా సమర్పించడం ప్రయాణికులకూ మేలు. ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టడం... వారికే ఇబ్బందులు తెచ్చేందుకు అవకాశమిస్తుంది. ఇవే గాకుండా... తాము వెళ్లబోయే ప్రదేశంలో ఉండే వాతావరణానికి అనువుగా దుస్తులు, అక్కడ ఎదురవ్వబోయే సమస్యలకు అనువుగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం మంచిది. ఇటీవల పిల్లలకూ, పెద్దలకు దాదాపుగా అందరికీ కళ్లజోళ్లు ఉంటున్నాయి. ఉన్న కళ్లజోడుకి తోడుగా మరొకటి అదనంగా తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే జర్నీలో కళ్లజోడు పోయినా లేదా విరిగిపోయినా అప్పటికప్పుడు మరొకటి సమకూర్చుకోవడం ప్రయాణ సమయంలో కష్టమవుతుంది. మరొకటి అదనంగా (స్పేర్‌గా) పెట్టుకోవడం చాలావరకు ఉపకరిస్తుంది. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రయాణంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యల్ని తేలిగ్గానే అధిగమించవచ్చు. అందుకే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ప్రయాణం మొదలుపెట్టడం చాలావరకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ∙ -
మల్లాది వెంకట కృష్ణమూర్తి మెచ్చిన 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'
దిగ్గజ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గురించి తెలియని తెలుగు ప్రజలు, పాఠకులు ఉండరు. తన నవలలు, పుస్తకాలు, రచనలతో 55 ఏళ్లుగా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. మల్లాది పుస్తకాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం తప్ప, ఆయన కనిపించింది - వినిపించింది లేదు. వేరే పుస్తకాల గురించి ఆయన చెప్పడం అరుదు. అటువంటి మల్లాది వెంకట కృష్ణమూర్తిని మెప్పించింది 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' బుక్. 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'కు ముందుమాట రాయడమే కాకుండా ఈ పుస్తకాన్ని అభినందిస్తూ మల్లాది వెంకట కృష్ణమూర్తి ఒక ప్రశంసా పూర్వకమైన ఆడియో విడుదల చేశారు. 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి మాట్లాడుతూ... ''ఇంగ్లీష్ సినిమాలు చూడని వారికి కూడా దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ పేరు సుపరిచితం. కారణం ఆయన సినిమాల్లోని విశిష్టత. దాన్ని చూసిన వారు చూడని వారికి ఆ సినిమాల గురించి చెప్పేంత విశిష్టమైనవి. కొన్ని మినహాయిస్తే... హిచ్‌కాక్ తీసినవి క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ డ్రామాలు. ఆయన తన పేరును ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకు ఆయన తన ఫోటోలను, చతురోక్తులను బాగా ఉపయోగించుకున్నారు. 'నేను సిండ్రెల్లా సినిమా తీస్తే... ప్రేక్షకులు శవం కోసం ఎదురు చూస్తారు' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు హిచ్‌కాక్. 'సైకో' విడుదలయ్యాక ఒక భర్త నుంచి వచ్చిన ఉత్తరాన్ని హిచ్‌కాక్ కు స్టూడియో హెడ్ అందించారు. 'సైకో' సినిమాలోని బాత్ టబ్ హత్య సన్నివేశం చూశాక తన భార్య స్నానం చేయడం మానేసిందని, ఏం చేయాలో చెప్పమని సలహా కోరతాడు భర్త. అందుకు హిచ్‌కాక్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? 'మీ ఆవిడను లాండ్రీకి పంపించండి' అని. సస్పెన్స్ గురించి హిచ్‌కాక్ చెప్పింది అక్షర సత్యం. ఆతృతగా ఎదురు చూడటంలోనే ఉత్కంఠ ఉంటుంది. సస్పెన్స్ మహిళ వంటిదని, ఊహకు ఎంత వదిలేస్తే అంత ఉత్కంఠ పెరుగుతుందని హిచ్‌కాక్ చెప్పారు. సినిమా నిడివి ప్రేక్షకుడు బాత్ రూంకు వెళ్లకుండా భరించేంత కాలం మాత్రమే ఉండాలని చెప్పింది కూడా హిచ్‌కాక్. స్నేహితులు పులగం చిన్నారాయణ, రవి పాడి సంపాదకత్వంలో వెలువడ్డ 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పుస్తకంలో ఆయన తీసిన సినిమాల గురించి వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకం మొదటి ఎడిషన్ రెండు వారాల్లో అమ్ముడు కావడం తెలుగు వారికి హిచ్‌కాక్ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం. పులగం చిన్నారాయణ, రవి పాడి గార్లకు ఆ అభినందనలు. ఈ పుస్తకంలో ముందుమాట రాసే అవకాశం రాకపోతే నేనూ హిచ్‌కాక్ ఫ్యాన్ అని తెలియజేసే అవకాశం ఉండేది కాదు'' అని ఆడియోలో పేర్కొన్నారు.ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు భగవద్గీత, బైబిల్ వంటివి అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. ఇందులో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల సీనియర్ దర్శకులు వంశీ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని హరీష్ శంకర్ అందుకున్నారు.#MalladiVenkataKrishnaMurthy garu is well known as a Senior Novelist with 55+ years of experience in literature. His books have inspired generations yet he kept his identity very private.For the first time, he gave his words of appreciation to our one-of-its-kind book "Master… pic.twitter.com/JhoY7RHZWc— Pulagam Chinnarayana (@PulagamOfficial) December 27, 2024 (చదవండి: వెయిటర్గానే ఉండిపోతానేమో అనుకున్నాడు...కట్ చేస్తే..!) -
దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం
పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునే వాళ్ళు. గంగానది, పాపం, వీళ్ళందరి పాపలతో అపవిత్రమై, నల్లని రూపాన్ని సంతరించుకుంది. ఆ పాపలనుంచి విముక్తికై ఆమె మహావిష్ణువుని ప్రార్ధించింది. అప్పడాయన, పాపత్ముల పాపల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు, అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ వుండు. ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు. గంగ కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ, కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది. వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది. అందుకని ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథ.పులిగడ్డ దగ్గర కృష్ణానది చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినౖ వెనం గురించి ఒక కథ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది. పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయం నిర్మించాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారుట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. దాంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగినా, అసంపూర్తిగా వున్న గాలి గోపురాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలి గోపురాన్ని నిర్మించారు. పురాతన గాలి గోపుర శిధిలాలు కొన్ని ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.స్వామి ఆవిర్భావం గురించి.... పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా ఉండేవి. అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు. అవి వెళ్ళి ఒక పుట్ట దగ్గర పాలు వర్షించటం చూసి గోపాలురు కోపంతో అక్కడున్న చెత్తా చెదారం పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులబెట్టారు. పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలయింది. స్వామిని చూసిన గోవుల కాపరి వెంటనే మంట ఆపివేశాడు. అందరూ వచ్చి పుట్ట తవ్వి చూడగా ముఖం తప్ప మిగతా శరీరమంతా ఛిన్నా భిన్నమయిన స్వామి దర్శనమిచ్చారు.. అదిచూసి వారంతా సతమతమవుతున్న సమయంలో స్వామి ఒకరికి కలలో కనిపించి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకరపర్తి అనే గ్రామంలో భూస్వామి ఇంటి ఈశాన్య మూలగల కాకర చెట్టుకింద వున్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించమని ఆనతినిచ్చారు. ఆ విగ్రహమే ఇది. నల్లశానపు రాతిలో చెక్కిన విగ్రహంలాగా కాక నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది.దేవాలయంపై పెద్ద రాతి దూలాలు అమర్చబడివున్నాయి. ఈ ప్రాంతంలో కొండ గుట్టలు కానీ, పర్వతాలుగానీ లేవు. ఆ రాతి దూలాలను ఇప్పుడు తీసుకు రావాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. మరి ఎటువంటి సౌకర్యాలూ లేని ఆ కాలంలో వాటిని ఎక్కడనుంచి తెచ్చారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆలయ కుడ్యాలపై గరుత్మంతుడు, లక్ష్మీ నారాయణులు, నరసింహుడు, ఆంజనేయ స్వామి మొదలగు విగ్రహాలున్నాయి.ఉత్సవాలు...ప్రతి సంవత్సరం మాఘ శుధ్ధ నవమి నుండి మాఘ బహుళడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.సరదాలు... కృష్ణా నది సముద్రంలో కలిసే అందమైన ప్రదేశంలో సత్యభామ, రుక్మిణీ సమేత శ్రీ వేణు గో΄ాల స్వామి ఆలయం ఉంది. దీన్ని దేవతలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. అంతే కాదు మహర్షులు, దేవతలకు మధ్య అనేక విషయాలు జరిగిన ప్రదేశం కూడా ఇది. దీన్ని చూడటానికి పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇక్కడి దైవాన్ని దేవతలు ప్రతిష్టించారు అని ,సముద్ర తీరంలో చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద తీరడానికి అందరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడతారు.ఎలా వెళ్లాలి?విజయవాడకు 110 కి.మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది హంసలదీవి. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే మచిలీ పట్నం నుంచి కూడా. అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం తక్కువ. అవనిగడ్డనుంచి హంసలదీవి దాకా బస్సులున్నాయి.దారి బాగుంటుంది. సొంత వాహనాల్లో వెళ్తే కృష్ణానదీ, సాగర సంగమాల దాకా కూడా వెళ్ళిరావచ్చు. అయితే మనకి కావలసిన ఆహారం, మంచినీరు వగైరాలన్నీ తీసుకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఇంకా అన్ని సౌకర్యాలూ లేవు. వెలుతురు ఉన్న సమయంలో వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. – స్వాతీ భాస్కర్(చదవండి: జీవితాల్ని మార్చే జీవన'గీత'!) -
అభిరామం నృత్యంతో చెప్పే రామాయణం : ఎవరీ ఐశ్వర్య హరీష్!
ఇతిహాసమైన రామాయణం అందం, భక్తి, సంక్లిష్టతలను ఐశ్వర్య హరీష్ ప్రదర్శించే భరతనాట్యం అన్వేషిస్తుంది. శాస్త్రీయ నృత్యాన్ని బహుభాషా కథనాలతో మిళితం చేసి మన ముందు ప్రదర్శిస్తుంది. రామాయణంలో తెలియని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ‘అభిరామం’ ప్రదర్శనను ఎంచుకున్నాను అని చెబుతుంది. ఐశ్వర్య హరీష్ పుట్టుకతోనే నృత్యకారిణి అని చెప్పవచ్చు. ఐదు తరాలుగా ఆ ఇంట నృత్యకళాకారులే ఉన్నారు. ఆ విధంగా చాలా చిన్న వయస్సు నుండి తన తల్లి ద్వారా శిక్షణ పొందుతూ ఐశ్వర్య తన స్వంత నృత్య కథల గురించి కలలు కంటూ పెరిగింది. ఇటీవల ముంబయ్‌లో ప్రఖ్యాత నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఎ)లో ప్రదర్శన ద్వారా అబ్బురపరిచిన ఐశ్వర్య రామాయణాన్ని నృత్యంగా ఎందుకు ఎంచుకున్నానో వివరించింది.నృత్యంతో అన్వేషణ‘‘రాముడు నా ఇష్ట దేవత. నా చిన్నప్పుడు రాముని గంభీరమైన రూపం, అతనిపై పాట, పద్యం, నృత్యం ఏది నేర్చుకున్నా అది నన్ను ఉత్తేజపరిచింది. ఇటీవల, వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనగా వాల్మీకి రామాయణాన్ని దాని అనువాదంతో పాటు చదవడం ప్రారంభించాను. చదివేటప్పుడు కథలో ఇంకా ఏవో తెలియని అంశాల సారంశాం ఉందని గ్రహించాను. చాలా అన్వేషించని కోణాలు ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్లోనూ రసాలు ఎక్కువ. ఇది నాకు నృత్యంలో అన్వేషించాలనే ఆలోచనను ఇచ్చింది. రామాయణానికి చాలా వెర్షన్లు ఉన్నాయి. అందుకే నా పరిశోధన విస్తృతం చేశాను. దీంతో అనేక అవకాశాలు నాకు లభించాయి. అన్ని వెర్షన్లు కథాంశం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కటి విభిన్న దృష్టి, రుచిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు– వాల్మీకి రామాయణం రాముడిని మానవ శ్రేష్ఠతగా చూస్తే, అధ్యాత్మ రామాయణం అతనిని అంతిమ భగవంతునిగా, అద్భుతంగా చూసింది. రామాయణంలో సీత పాత్రకు భిన్నమైన టేకింగ్ ఉంది.ఆత్మను కదిలించాలిఅభిరామం నృత్య రూపకం వివిధ రామాయణ గ్రంథాల నుండి సేకరించిన ఆరు అరుదైన ఎపిసోడ్లను వర్ణిస్తుంది. రామాయణం భారతీయ మనస్తత్వంలో చాలా పాతుకుపోయింది కాబట్టి, నేను కథ టైమ్‌లైన్‌ను నిర్వహించాలనుకున్నాను. రాముడి కథ ప్రతి మట్టిని దాని స్వంత ఫ్లేవర్‌లో తాకింది. నేను దానిని ఉపదేశాత్మకంగానో, సాదాసీదాగానో స్తుతించేలనుకోలేదు. శృంగార భక్తి కోణాన్ని కొనసాగించాను. అదే నన్ను మొదటి స్థానంలో ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చింది. ఎక్కడి నుంచైనా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని, దానిని మరో కోణంలో వివరిస్తే అది వినోదభరితంగా ఉండాలి అలాగే ఆత్మను కదిలించాలి. ప్రేక్షకుల ఊహల మైదానంలో ఆ అంశం తిరగాలి. నేను ఎంచుకున్న కథ మాత్రమే కాదు నా డ్యాన్స్ ఎలిమెంట్‌ను కూడా కోల్పోకూడదు. దీన్ని మరింత థియేట్రికల్ ప్రెజెంటేషన్‌గా మార్చాలనుకున్నాను. ఆకర్షించిన అంశాలుమొదట వాల్మీకి రామాయణాన్నే చదివాను. మా అమ్మ అప్పటికే తులసీదాస్ రచనలపై కొంత పరిశోధన చేసింది. అలా తులసి రామాయణం నుండి నాకు నచ్చిన అంశాలను సేకరించడానికి అది ఒక కిటికీలా ఉపయోగపడింది. కౌసల్య తన నవజాత శిశువుతో చేసిన మొదటి సంభాషణ నన్ను అమితంగా ఆకర్షించింది. అదేవిధంగా, రావణుడి పాత్రను చూస్తే విష్ణువు దైవిక బలాన్ని ఎదుర్కోవడంలో పూర్తి జ్ఞానంతో అతను సీతను అపహరించాడు. రావణుడు మోక్షానికి తన ఏకైక సాధనం – భగవంతుడి చేతిలో మరణం ఇదేనని గ్రహించాడు. తులసీరామాయణం రాముడు, సీత స్వయంవరం, వారి కలయిక గురించి చాలా అందంగా, సుందరంగా కవితాత్మకంగా అన్వేషించబడింది. రావణుడి సోదరి శూర్పణఖ సీతను అపహరించడానికి, ఆమె చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సోదరుడిని ప్రేరేపించడం ద్వారా రామాయణంలో మలుపు తిరిగింది. అరుణాచల కవి తమిళంలో రామనాటకంలో ఈ క్యారెక్టరైజేషన్‌ని చాలా అందంగా చూపించాడు, రాక్షసి బెంగను అనుభూతి చెందాడు. ప్రొడక్షన్లో ఇది మూడో ఎపిసోడ్‌గా తీసుకోబడింది. కథను ఇలా ముందుకు తీసుకెళ్తుంటే హనుమంతుని అద్భుతమైన చర్యలు, సెయింట్ పురందర దాసు కన్నడ పద్యాల పదునుగా బయటకు వచ్చాయి. తల్లే గురువుమా అమ్మ నా గురువుగా ఉండటం నాకు దొరికిన అద్భుతమైన ఆశీర్వాదం. చిన్నతనం నుండే సాంప్రదాయ సంగీతం, నృత్యం, కథల రూపంలో ఉండే సాహిత్యం, ఏదైనా సాధించాలనే కల, క్రమశిక్షణతో కూడిన ఆలోచనలతో ఉన్నాను. పరిపూర్ణత గురించి ఎప్పుడూ చర్చలు ఉండకూడదు. అలాగే, నాణ్యతలో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఇది నా వారసత్వాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించే సవాల్, మరింత పరిపూర్ణత కోసం పట్టుదలతో కూడిన బాధ్యత. దానిని స్వీకరించి ముందు తరాలకు ఇవ్వాలనే నిబద్ధతో కృషి చేస్తున్నాను. కూర్పులో సవాల్ప్రతి ఎపిసోడ్ లోనూ కథనంలో మార్పు లేకుండా అందులోని అందాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం. సంగీతం, నృత్యం అన్నీ వేర్వేరు వ్యక్తులచే కం΄ోజ్ చేయబడ్డాయి. కౌసల్య వాత్సల్యమైనా, రాముడు– సీతల శృంగారమైనా, సీత వైభవం, హనుమంతుడి సుందరకాండ ఇలా ప్రతీది ‘అందం’లోని అంశమే ఈ నృత్యంలో ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని వివరిస్తుంది ఐశ్యర్వ. -
వెయిటర్గానే ఉండిపోతానేమో అనుకున్నాడు...కట్ చేస్తే..!
అవార్డ్ విజేత, చిత్రకారుడు దీనా సో ఓతేహ్ నీడ– కాంతిలో విలక్షణతను చూపడంలో మాస్టర్. యునైటెడ్ స్టేట్స్లో ఉండే ఈ కళాకారుడి చిత్రాలు మిగతా వాటితో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. చీకటి నుండి వెలువడే ప్రకాశవంతమైన చిత్రాలను మన కళ్లకు కడతాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటాన్ని ‘చిత్రం’గా చూపుతాడు. గురువెవ్వరూ లేకుండానే తన ఊహల్లో నుండి పుట్టుకువచ్చిన కళ గురించి వివరిస్తుంటే వినేవారు చాలా అబ్బురంగా చూస్తారు. ‘‘మా అమ్మ చిన్నప్పటి నుండి నాలో కళాత్మక అభిరుచిని గుర్తించింది. దానిని పెంపొందించడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. నేను మంచి కళాకారుడిగా మారుతానని ముందే అనుకున్నాను. కళను వృత్తిగా కొనసాగించాలనే ఆలోచన చాలా ఆలస్యంగా వచ్చింది. నాకు 12 ఏళ్ల వయసులో నా కుటుంబం యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చింది. నాటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మా అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలన్నీ నాన్న తనతో తీసుకెళ్లిపోయారు. సరైన పత్రాలు లేకపోవడంతో 18 ఏళ్ల వయసులో చదవుకు స్కాలర్షిప్కు అర్హత కోల్పోయాను. దీంతో ఎనిమిదేళ్లు వెయిటర్‌గా పనిచేశాను. అప్పుడు నా కెరీర్ వెయిటర్ అనే అనుకున్నాను. అనిశ్చితి నుంచి నైపుణ్యాలుమొదట నేను ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్‌ను కాదు. సరైన పత్రాలు లేక΄ోవడం వల్ల వలసదారునిగా ఎనిమిదేళ్లు అనిశ్చితిని ఎదుర్కొన్నాను. ఇష్టపడే పని చేస్తున్నప్పుడే స్థిరత్వం లభించడం ప్రారంభమైంది. నాకు నేను స్వయంగా ఇలస్ట్రేషన్స్ వేసేవాణ్ణి. ఈ సాధన ద్వారా ఇలస్ట్రేషన్ నా నైపుణ్యాలు పెరిగాయి. అది ఎంతగా అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ సాధించాను. మాస్టర్స్ ప్రోగ్రామ్ద్వారా స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో మరింత అధ్యయనం సాధ్యమైంది. అప్పుడే ఇలస్ట్రేషన్ నాకు సరిగ్గా సరి΄ోతుందనిపించింది. కథలు చెప్పడం, నేర్చుకోవడం, సమస్యను పరిష్కరించడం, సృష్టించడం... ఇలా ప్రతీది నా మనో వికాసానికి, వృద్ధికి ఇలస్ట్రేషన్ ఆర్ట్ కొత్త తలుపులు తెరిచింది. చివరకు నాది అయిన మార్గంలో ఉన్నట్టు అనిపించింది. ఇదంతా సాధ్యమైంది మా అమ్మ ద్వారా. ఆమే నన్ను నేను గర్వపడేలా చేసింది.నిశ్శబ్దం నుంచి...పరధ్యానాన్ని నివారించడానికి సాధారణంగా స్కెచ్ వేయడం ప్రారంభిస్తాను. కొన్నిసార్లు తెల్లవారుజామున 4–5 గంటల సమయాన్ని ఎంచుకుంటాను. ఆ నిశ్శబ్ద సమయం, ప్రపంచం మేల్కొనే ముందు నేను చాలా సృజనాత్మకంగా ఉంటాను. పరధ్యానాల నుండి విముక్తి పొందుతాను. ఏదైనా ‘రంగు’లోనే ఆలోచిస్తాను. ఎందుకంటే అది ఏదో ఒక చిన్న సృష్టికి కారణం అవుతుంది. అక్కడ నుంచి నా స్కెచ్లకు విస్తృతంగా పని దొరుకుతుంది. ఆరిస్ట్ మార్షల్ అరిస్కాన్ ఎప్పుడూ ఒక మాట చెబుతాడు ‘మీకు తెలిసిన వాటిని గీయండి’ అని. ఆ పదాన్ని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. కానీ, కాలక్రమేణా అది స్పష్టమైంది. కాంతి–చీకటి మధ్య అంతర్గత పోరాటం నాకు తెలిసింది. నేను నా జీవితంలో చాలా చీకటి కాలాలను ఎదుర్కొన్నాను. పోరాటాలకు మించిన అందం వాటిలోనే ఉందని నా ప్రగాఢ నమ్మకం. ఒక అంశంపై తగినంత అవగాహన లేకుండా పని మొదలుపెడితే ఆందోళన కలుగుతుంది. అయితే, ఆ క్షణంలో నేను నా అహం, ఊహాత్మక తీర్పులను, ఫెయిల్ అవుతానేమో అనే భయాలను వదిలేస్తూ ఆర్ట్‌లోకి ప్రయాణిస్తాను’’ అని వివరిస్తాడు ఈ చిత్రకారుడు View this post on Instagram A post shared by Nautilus Magazine (@nautilusmag) -
కెనడాలో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం!
కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (LMIA) మద్దతుతో ఉద్యోగ ఆఫర్‌కు సంబంధించినఎక్స్ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను రద్దు చేయాలని భావిస్తోంది. జాబ్ ఆఫర్పేరుతో జరుగుతున్న మోసపూరిత పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను త్వరలో తొలగించనున్నట్లు ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.ఇది కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (CRS) కట్-ఆఫ్ స్కోర్‌ను చేరుకోవడానికి , అక్కడ శాశ్వత నివాసం పొందే అసలైన లబ్ధిదారులను ప్రభావితం చేయనుందని నిపుణులు భావిస్తున్నారు.తాత్కాలిక విదేశీ వర్కర్ (TFW) ప్రోగ్రామ్‌లో సంస్కరణల్లో భాగంగా ఇది మొదటిసారిగా 2014లో ప్రవేశపెట్టారు. స్టీఫెన్ హార్పర్ ప్రభుత్వం "అర్హత కలిగిన కెనడియన్లు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన పూర్తి తీవ్రమైన కార్మికుల కొరతను నివారించేం పరిష్కారంగా" భావించింది. అంటే సాధారణంగా దేశంలోని వివిధ సంస్థలు నిపుణులైన, అర్హులైన ఉద్యోగులను అందుబాటులో లేనపుడు అప్పటికే శాశ్వత నివాసం ఉన్నవారిలో లేకపోతే విదేశీ వ్యక్తులను నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది. కెనడాలోని సంస్థలు ఒక విదేశీ ఉద్యోగిని నియమించుకోవాలనుకుంటే, వారు ముందుగా LMIA దరఖాస్తును పూర్తి చేయాలి. ఫెడరల్ ప్రభుత్వం అనుమతి పొందాలి. ఉద్యోగం చేయడానికి కెనడియన్లు లేదా ఇతర శాశ్వత నివాసితులు లేరని కూడా వారు ధృవీకరించాల్సి ఉంటుంది.అలా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎల్ఎంఏఐ) కింద దరఖాస్తు చేసుకుంటాయి. ఈ సందర్భంగా జాబ్ ఆఫర్ ద్వారా ఆయా వ్యక్తులకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పేరుతో 50 పాయింట్లు అదనంగా లభిస్తాయి. దీంతో.. ఆ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం లేదా తాత్కాలిక నివాసం కోరుకుంటే ఈ పాయింట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ పేరుతో పలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని, విదేశీ వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి.. శాశ్వత నివాసాలు పొందేందుకు అవకాశంకల్పిస్తున్నాయని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు జాబ్ ఆఫర్ల పేరిట మోసాలు జరుగు తున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. కొంతమంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు చట్టవిరుద్ధంగా LMIAలను వలసదారులకు లేదా శాశ్వత నివాసం పొందడానికి వారి CRS స్కోర్‌ను పెంచుకుంటోందన్న పలు నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. -
World Meditation Day : మెరుగైన సమాజం కోసం
ప్రస్తుతంపై మనస్సును లగ్నం చేయడాన్ని ధ్యానం అనవచ్చు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి అనేక సంస్కృతుల్లో భాగంగా కొనసాగుతోంది. వ్యక్తి గత శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ఇది ఉపయోగ పడుతుంది. అయితే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం మిళితమై కనిపిస్తాయి. అందుకే మన ప్రాచీన గ్రంథాలు కానీ, శిల్పాలు కానీ ధ్యాన ముద్రను ప్రతిబింబిస్తూ ఉంటాయి.జూన్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్స వంగా జరపాలని ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) నిర్ణయించడం ముదావహం. ధ్యానం యొక్క శక్తిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ధ్యానం మానసిక, భౌతిక శక్తి సామ ర్థ్యాలను వృద్ధి చేయడమే కాక మనస్సును ఒక విషయంపై లగ్నం చేయడానికి ఉపకరిస్తుంది. ఆధునిక కాలపు ఒత్తిడులను తట్టుకోవడానికి ధ్యానం ఇప్పుడు ప్రధాన సాధనం అయ్యింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనాలకన్నా సామూ హిక శ్రేయస్సుకు ఇది దోహదం చేస్తుంది. దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. యోగాకు ధ్యానాన్ని జోడిస్తే రక్తపోటు, స్థూల కాయం, ఆందోళన, నిద్రలేమి వంటి వాటి నుంచి బయటపడవచ్చు. అనా రోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ధ్యాన, యోగాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. మనస్సు– శరీరం మధ్య అవినాభావ సంబం«ధాన్ని మన ప్రాచీన యోగశాస్త్రం చెబుతుంది. కానీ ఆధునిక వైద్యులు మనస్సునూ, శరీరాన్నీ రెండు వేరువేరు విభాగాలుగా చూస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో కొంత మార్పు గమనించవచ్చు. ఆరోగ్యవంతమైన జనాభాను, సుస్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ధ్యానం ఒక మార్గంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.– జంగం పాండు; పరిశోధక విద్యార్థి, హైదరాబాద్(రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం) -
వీడని మలబార్ పునుగు పిల్లి పొడుపు కథ!
బిల్డింగ్ చుట్టూ ఉన్న ఏనుగుల కందకంలో ఫారెస్ట్ గార్డ్ రాత్రి భోజనంలో మిగిలిపోగా పారేసిన కోడి ఎముకలను పటపటా నవులుతున్నాయి ఆ రెండు పెద్ద పునుగు పిల్లులు. అవి చిన్న భారత పునుగు పిల్లుల కంటే చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి. మా శక్తివంతమైన లైట్లను మెరుగైన దృష్టికోణంతో చూడటానికి అవి మధ్య మధ్యలో వాటి వెనక కాళ్లపై నుంచుంటున్నాయి. మా అందరికి ఒకటే ఆలోచన వచ్చింది: మలబార్ పునుగు పిల్లి, ఎవరికీ అంతుచిక్కని పాలిచ్చే భారతీయ జంతువు. అవి పారిపోతాయేమోనన్న భయానికి మేము కెమెరా తీసుకు వచ్చే ప్రయత్నం చెయ్యలేదు. దానికి బదులుగా మేము చీకట్లోనే దాని లక్షణాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాము.దెగ్గర దెగ్గర ఆరు దశాబ్దాల క్రితం హై వేవీ మౌంటెన్స్ తెయ్యాకు ఎస్టేట్‌లోని తెయ్యాకు రైతు అయిన ఆంగస్ హటన్ మలబార్ పునుగు పిల్లి చాలా విరివిగా కనిపించే జంతువని వ్రాసి పెట్టారు., కానీ ఆయన చిన్న భారతీయ పునుగు పిల్లిని చూసి అలా పొరపాటు పడ్డారేమో అనేది ఒక ప్రఘాడ అనుమానం. 1939 కల్లా మలబార్ పునుగు పిల్లి అరుదై, అంతరించిపోవడానికి దెగ్గరగా ఉందేమోనని జంతు శాస్త్రవేత్తలు భయపడ్డారు. మేము ఎంతో ఉత్సాహంగా, రెండు మలబార్ పునుగువ పిల్లులని చూశామని సందర్శకుల పుస్తకంలో రాశాము.మలబార్ పునుగు పిల్లిని లోగోగా పెట్టుకున్న సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్ సంస్థలో అజిత్ కుమార్ గారు మేము మలబార్ పునుగు పిల్లిని చూశామని విశ్వసించలేదు. చిన్న భారతీయ పునుగు పిల్లి ఎంతో విసతృతంగా రకరకాల నివాసాలలో, ఎత్తులలో, ఆక్షాంసాలలో, చాలా విభిన్న లక్షణాలు, శరీర ఆకృతి, పరిమాణాలు కలిగి ఉంటుందని ఆయన సూచించారు.ఒక జీవశాస్త్రవేత్త, మేము చూసిన పునుగు పిల్లికి సింహం వంటి జూలు ఉందా అని అడిగారు. కానీ మేము అది గమనించలేదు. మెడ పొడవునా మూడు చారలూ? అటువంటిదేదో చూశామని మేము అనుకున్నాం. దాని తోక చుట్టూ కట్లు గమనించామా అని ఇంకొకరు అడిగారు. ఏమో, అప్పుడు చాలా చీకటిగా ఉంది. వాటి తోక చివర నల్లగా ఉందా? దృరదృష్టవశాత్తు ఈ లక్షణాల కోసం చూడాలని మాకు తెలియలేదు.పాలిచ్చే చిన్న జంతువుల మీద నిపుణులైన నందిని రాజమణి మారియు దివ్య ముదప్పా, ఇంగ్లాండ్‌లో మారియు ఇండియాలో ఉన్న రకరకాల మ్యూసియంలలో భద్రపరచిన మలబార్ పునుగు పిల్లులకి సంబంధించిన ఆరు చార్మాలూ ఇంకా మూడు కాపలాలు పరీక్షించారు. అంతే కాక 1800లు మొదలుకుని పునుగు పిల్లుల మీద రాయబడ్డ ప్రతీదీ చదివేసారు.నివేదిక ప్రకారం మలబార్ పునుగు పిల్లి పడమర కానుముల లోతట్టు తీరప్రాంత అడవులలోని కర్వార్, ఉత్తర కర్ణాటక నుంచి కేరళలోని త్రివేండ్రమ్ వరకూ కనిపిస్తాయి. కొద్ది సార్లు అవి తిరుణలవెలి లోపల బిలిగిరి రంగస్వామి కోవెల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోనూ, హై వేవీ కొండలంలోనూ కనిపించాయి. కానీ అవి ఎక్కువగా కోజికోడ్ చుట్టుపక్కలే కనిపించాయి. ఆసియాలో మరి ఏ పునుగు పిల్లి ఇంత పరిమిత పరిధిలో ఉండదు.పేరుగాంచిన మలబార్ పునుగు పిల్లి యొక్క మస్క్ కోసం దాన్ని వేటడడం వల్ల అవి అరుదైపోయి ఉండడానికి అవకాశం ఉండవచ్చని నందిని, దివ్య ఒప్పుకున్నారు. కానీ, వేరే పునుగు పిల్లులు చక్కగా అభివృద్ధి చెందుతుంటే, ఈ జంతువు వాటి నివాసమైన అడవులను పొలాలుగా మారిస్తే తట్టుకోలేనంత సున్నితమైనవా?మ్యూసియం నమూనాలా మూలం సరిగా తెలియనందువల్ల, ఇంకా పాలిచ్చే జంతువుల నిపుణుల మధ్య బేధభిప్రాయాలవల్ల, మలబార్ పునుగు పిల్లి రూపం పట్లా, లక్షణాల పట్లా నిజమైన స్పష్టత లేదు. ఇది చాలదన్నట్టు దక్షిణ ఆసియాలోని పెద్ద-చుక్కల పునుగు పిల్లులు మారియు మలబార్ పునుగు పిల్లులు దెగ్గర దెగ్గర ఒకే పోలికలతో ఉంటాయి. ఈ విషయం ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయం సూచిస్తుంది: మలబార్ పునుగు పిల్లులు ఎన్నడూ ఉనికిలోనే లేవు!మందుల తయారిలో, సుగంధ ద్రవ్యాలా తయారిలో, ఇంకా పూజలలో ఉపయోగించే పునుగు పిల్లుల మస్క్ గ్రంధిలోని సివిటోన్ కోసం వేల ఏళ్లుగా ఇథియోపియా, దక్షిణ ఆసియా ఇంకా భారతదేశం మధ్య వ్యాపారం సాగుతోంది. ఈ రోజుకి కూడా మస్క్ తియ్యటంకోసం, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చిన్న పునుగు పిల్లులను ఫార్మ్ లో పెంచుతారు. ఈ మధ్యకాలంలో అతి ఎక్కువగా మలబార్ పునుగు పిల్లి కనిపించిన స్థలమైన కోజికోడ్ పూర్వ కాలం నుంచీ పునుగు పిల్లుల వ్యాపార కేంద్రం. దక్షిణ ఆసియా నుంచి తెచ్చిన పెద్ద-చుక్కల పునుగు పిల్లులు చెర నుంచి తప్పించుకు పారిపోవడంతో అప్పుడప్పుడు అడవిలో పునుగు పిల్లులు కనిపించడానికి అవకాశం ఇచ్చివుంటుందా అని నందిని, దివ్య ఆలోచించారు. ఇదేమంత అసంభవం కాదు, ఎందుకంటే చిన్న భారత పునుగు పిల్లులు తప్పించుకుని మాడగాస్కర్, ఫిలిప్పీన్స్ మారియు ఇతర దక్షిణ ఆసియా దీవులలో వాటినవి స్థాపించుకున్నాయి. అందువల్ల మలబార్ పునుగు పిల్లి, పెద్ద- చుక్కల పునుగు పిల్లి కంటే పెద్ద ప్రత్యేకత కలిగిందేమి కాకపోవచ్చు అనడానికి ఎంతో అవకాశం ఉండీ. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో జన్యు పరీక్ష ఇంకొక ముందంజ వేస్తుంది. అసల మలబార్ పునుగు పిల్లులు నిజమైనవేనా? కానీ పురాతన నమూనాల నుంచి తీసిన డిఎన్ఏ మరీ సిధిలం అయిపొయింది. అందువల్ల మలబార్ పునుగు పిల్లిని గురించిన పొడుపు కథ ఇంకా వీడలేదు.Author: జానకి లెనిన్Translator: రోహిణి చింతా -
'సోలో ట్రిప్సే సో బెటర్'..! అంటున్న నిపుణులు..
సోలో లైఫే సో బెటరూ.. అన్నట్లుగా సోలో ట్రిప్పే సో బెటర్ అంటున్నారు మానసిక నిపుణులు. ఇది మన వ్యక్తిగత వృద్ధికి, మంచి సంబంధాలను నెరపడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. పెళ్లైనా..అప్పుడప్పుడూ సోలోగా ట్రావెల్ చేస్తే..మనస్సుకు ఒక విధమైన రిఫ్రెష్నెస్ వస్తుందట. అంతేగాదు మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అదేంటి కుటుంబంతో వెళ్తేనే కదా ఆనందం! మరి ఇలా ఎలా? అనే కదా..!నిజానికి పెళ్లయ్యాక ఒంటరిగా జర్నీ అంటే..సమాజం ఒక విధమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇలా సోలో ట్రిప్ చేసే అవకాశం కాదు కదా..ఆ ఆలోచనకే తిట్టిపోస్తారు పెద్దవాళ్లు. కానీ ప్రస్తుత యూత్‌లో ఆ ధోరణి మారింది. పెళ్లైనా..మహిళలు/ పురుషులు సోలోగా ట్రిప్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మానసికి నిపుణులు కూడా దీనికే మద్దతిస్తున్నారు. ఇదే మంచిదని నొక్కి చెబుతున్నారు. ఎందుకు మంచిదంటే..కుటుంబ సమేతంగానే ఇంట్లో ట్రావెల్‌ని ప్లాన్ చేస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా సోలోగా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మరింత జోష్‌ఫుల్‌గా ఉంటామని మాననసిక నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ.. కుటుంబం, పిల్లలు బాధ్యతలతో తలామునకలైపోయి ఉంటాం. మన వ్యక్తిగత అభిరుచిలు, ఇష్టాలు తెలిసి తెలియకుండానే పక్కన పెట్టేస్తాం. ఇలా చిన్నపాటి జర్నీ మనకు నచ్చినట్లుగా ఉండేలా ట్రావెల్ చేయడం మంచిదట. కుటుంబ సమేతంగా వెళ్లినప్పుడు బడ్జెట్ అనుసారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆయా పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తాం. వాళ్ల రక్షణ బాధ్యత కూమా మీదే అవుతుంది. ఈ టెన్షన్ల నడుమ పూర్తిగా ఎంజాయ్ చేయడం కష్టమైనా..అది కూడా ఓ ఆనందం అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా కుటుంబాన్ని ఫలానా ట్రిప్‌కి తీసుకెళ్లి ఈ మంచి ఫీల్ ఇచ్చాననే ఆనందం మాటలకందనిది. అయితే వ్యక్తిగతంగా అప్పడప్పుడూ సోలోగా టూర్‌కి వెళ్లడం చాలా మంచిదట. దీనివల్ల తమను తాము అనుభవించగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. స్వీయ ఆనందం పొందేందుకు వీలుపడుతుంది. అలాగే ఒక విధమైన స్వేచ్ఛ లభించనట్లుగా ఉంటుంది. దీంతోపాటు స్వీయ సంరక్షణ గురించి కూడా తెలుస్తుంది. కలిగే ప్రయోజనాలు..సోలో పర్యటన వల్ల మానసిక ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది. అదికూడా వ్యక్తిగతంగా ఒక మంచి స్పేస్ దొరికనట్లు అనిపిస్తుంది. అలాగే భాగస్వామి నమ్మకాన్ని బలపరుస్తుంది. వ్యక్తిగత ఆనందాలను, అభిరుచులను గౌరవించుకోవడం వల్ల భద్రతగా ఉన్నామనే ఫీల్ భార్యభర్తలిరువురికి కలుగుతుంది. మహిళలకైతే సాధికారత భావాన్ని అందిస్తుంది. కానీ ఇలా సోలోగా పర్యటనలు చేసేవాళ్లు సురక్షితంగా తిరిగొచ్చేలా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం ముఖ్యం.(చదవండి: ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్టీ వంటకాలను అందించే దేశాలివే..భారత స్థానం ఇది..!) -
జీవితాల్ని మార్చే జీవన'గీత'!
అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని, సర్వులకు ప్రతినిధిగా భావించి, సకల మానవాళికి.. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినిపించిన కర్తవ్య బోధ. అర్జునుడిని కార్యోన్ముఖుణ్ని చేసిన మహా ఉపదేశం ఇది. జీవితమనే యుద్ధంలో జయాలు, అపజయాలు, కష్టాలు, కన్నీళ్లు, మోదం, ఖేదం తప్పవనీ.. అన్నిటినీ ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే అనే జీవితపాఠాన్ని నేర్పే కార్యనిర్వాహక గ్రంథం ఇది. రాక్షస స్వభావాన్ని అంతం చేసే నిప్పుకణిక ఈ గ్రంథం. మానవాళి మొత్తానికి జీవనాడి ఈ గ్రంథం. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహాగ్రంథం భగవద్గీత. మన జీవితాలను మార్చే మహామంత్రం.మార్గశిర శుద్ధ ఏకాదశి రోజుని 'గీతా జయంతి'గా జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా.. భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. ఇందులో అన్ని వయసుల వారూ జీవితంలో విజయాలు సాధించడానికి దోహదపడే మార్గదర్శకాలు ఉన్నాయి. నిత్య జీవితాన్ని నడపడానికి తెలుసుకోవాల్సిన విషయాలెన్నో భగవద్గీతలో ఉన్నాయి.బుద్ధి వికాసానికి...మన జీవన పయనం సాఫీగా సాగాలంటే, ఎత్తుపల్లాలను అధిగమించాలంటే, జీవితంలో అనుకున్నవి సాధించాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే ‘భగవద్గీత’ అనే క్షీర సాగరంలో మునగాలి’’ అన్నాడు అమెరికన్ రచయిత హెన్రీ డేపిట్ థోరో. ప్రతి శ్లోకాన్నీ పఠించి, అర్థం చేసుకుంటే బుద్ధి శుద్ధి అవుతుందని చెప్పారు. ఆధునిక విజ్ఞానం జనాన్ని వేగంగా గమ్యాన్ని చేరుకునేలా ఉరకలు పెట్టిస్తుందే తప్ప..కింద పడితే మళ్లీ లేచి పుంజుకోవడం ఎలా అనేది నేర్పించడం లేదు. దీన్ని గీత నేర్పిస్తుంది. ఆరోగ్య గీత...ఆరోగ్యపరంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీత ఆరో అధ్యాయం వివరించింది. ఎలాంటి ఆహారం తినాలో పదిహేడో అధ్యాయంలో ఉంది.. ఆహార విషయంలో సయమనం పాటించకపోవడం వల్లే రోగాల పాలవుతున్నామని నొక్కి చెప్పింది. మనసును ఉద్రేకపరచని, రుచికరమైన, బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందగలమనేది గీతోపదేశం.మనోధైర్యం..శరీరం దృఢంగా ఉన్నా మనోబలం లోపిస్తే చేసే పనిలో ఫలితం సాధించలేం. ఈ విషయాన్నే భగవద్గీత రెండో అధ్యాయం మూడో శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు మహా బలవంతుడు. కానీ మనోదౌర్బల్యం కారణంగా యుద్ధం చెయ్యనన్నాడు. కృష్ణుడు అది గమనించి, అర్జునుణ్ణి ఉత్తేజపరచి, అతనిలోని అంతర్గత శక్తిని ప్రేరేపించి, కార్యోన్ముఖుణ్ణి చేశాడు. వైఫల్యాన్ని అధిగమించాలంటే..ఒక వ్యక్తి జీవితంలో సరిగ్గా స్థిరపడకపోతే, దానికి కారణం ఇతరులేనని ఆరోపిస్తాడు. తన వైఫల్యాలకు తనే కారణం అని గుర్తించడు. మనస్సునూ, ఇంద్రియాలనూ తన ఆధీనంలో ఉంచుకుంటే తనకు తానే మిత్రుడు. అలా కానినాడు తనకు తానే శత్రువు. కాబట్టి మనస్సును నిగ్రహించుకోవడం అత్యావశ్యకం.దీనికి క్రమశిక్షణతో కూడిన అభ్యాసం అవసరం. మనసు వశమైతే సాధించలేని కార్యం ఏదీ ఉండదు. ఆధ్యాత్మిక గీత...శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందినా... ఆధ్యాత్మిక వికాసం లేకపోతే మానవ జన్మకు సార్థకత లేదు. పరిపూర్ణత సిద్ధించదు. రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, భేద బుద్ధి తొలగాలంటే ఆధ్యాత్మిక వికాసం పొందాల్సిందే. చైతన్యం కలగాలి. సమదృష్టి పెంపొందాలి. భగవంతుడు ఉన్నాడనీ, అతడే జగన్నాటక సూత్రధారి అనీ గ్రహించాలి. ఇలా భగవద్గీతను నిత్య జీవితంలో భాగం చేసుకున్నట్లయితే(ఆచరిస్తే) ‘జీవనగీత’గా దారి చూపిస్తుంది.(చదవండి: మహిమాన్వితమైన సూగూరేశ్వర ఆలయం!..ఎక్కడ లేని విధంగా రథోత్సవం..) -
అవసరం : తాత్వికథ
ఆయన ఓ తాత్విక గురువు. జ్ఞాని. ఆయన మానవ అవసరాలకు సంబంధించి, తత్వాల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను తన ప్రసంగాల ద్వారా చెప్పిన వ్యక్తి. ఓసారి ధనవంతుడొకడు ఆయనను చూడ్డానికి వచ్చాడు. ఆ గురువుకు దణ్ణంపెట్టి చేతిలో ఉన్న ఓ సంచి ఆయనకు ఇచ్చాడు.గురువు ఆ సంచీని తీసుకుని దానివంక నవ్వుతూ చూశారు.‘‘ఏమిటిది’’ అని అడిగారు గురువు.‘‘మీ ఆశ్రమానికి నా వల్ల చేతనైన విరాళం ఇవ్వాలనిపించింది’’ అని అన్నాడు ధనవంతుడు.‘‘ఇందులో ఏముంది’’ అన్నారు గురువు.‘‘వెయ్యి బంగారు నాణాలు స్వామీ!’’ చెప్పాడు ధనవంతుడు.‘సంతోషం’ అంటూనే ధనవంతుడి వంక చూసి‘‘మీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ బంగారు నాణాలు ఉండే ఉంటాయి కదూ...’’ అని అడిగారు గురువు.‘‘అవునండీ ఉన్నాయి’’ అన్నాడు ధనవంతుడు.‘‘అవన్నీ మీకు చాలినంతగానే ఉన్నాయా’’ అని గురువు ప్రశ్నించారు.ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు.కాస్సేపు తర్వాత ధనవంతుడు ‘‘లేదు స్వామీ, ఇంకా కూడా కావలసి వస్తోంది. అందుకే కదండీ రాత్రీ పగలూ అని చూసుకోకుండా శ్రమిస్తున్నానండీ’’ అన్నాడు ధనవంతుడు.గురువు ఆ మాటలు విని తన చేతిలో ఉన్న డబ్బుసంచీని తిరిగి ధనవంతుడికే ఇచ్చేశారు. ‘‘ఈ నాణాల అవసరం నాకన్నా మీకే ఎక్కువగా ఉంది... ఇదిగో ఈ సంచీ మీ దగ్గరే ఉంచుకోండి‘‘ అన్నారు గురువు.మనిషికి డబ్బు అవసరమే. అది తీరని ఆశ. ఎంతున్నా చాలదు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా వారిలో ఇస్తున్నప్పుడు ఆనందముండదు. లోలోపల ఏదో తరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. కనుక ఉన్న దానితో తృప్తి పడే మనసున్నప్పుడే ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది.– యామిజాల జగదీశ్ ఇదీ చదవండి : అహం బ్రహ్మాస్మి హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు -
హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు
హలేబీడు ఈ ప్రదేశాన్ని ఒకటిగా పలకడం పర్యాటకరంగానికి అలవాటు ఉండదు. బేలూరు– హలేబీడు అని పలుకుతారు. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం 17కిలోమీటర్లు. ఈ రెండు ప్రదేశాల్లోని నిర్మాణాలు ఒకేరీతిలో ఉంటాయి. ఒకే రాజవంశానికి చెందిన కట్టడాలు. హొయసల రాజవంశం దక్షిణభారతదేశాన్ని దాదాపు 200 ఏళ్లు పాలించింది. యుద్ధాలు లేని ప్రశాంత సమయంలో ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. హొయసలుల ఆలయాలన్నీ మహాభారతం, రామాయణం, భాగవత గ్రంథాలకు శిల్పరూపాలు. వేదవ్యాసుడు, వాల్మీకి రాసిన గ్రంథాలను శిలల్లో ఆకర్షణీయంగా చెక్కిన శిల్పులు కూడా అంతటి మహోన్నతులే అని చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. పదకొండవ శతాబ్దంలో ఈ స్థాయిలో విరాజిల్లిన ప్రదేశం ఆ తర్వాత రాజకీయ సంక్లిష్టతల దుష్ప్రభావాన్ని ఎదుర్కొన్నది. ఇప్పుడు కనిపిస్తున్నది 14 శతాబ్దంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ తుగ్లక్‌ల దాడిలో విధ్వంసం అయిన తర్వాత మిగిలిన రూపాలే. ఆ విగ్రహాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మెరుగులు దిద్దుతోంది.కళకు శిలాసాక్ష్యాలుహొయసల రాజవంశం కళాభిరుచికి ప్రతీకలు ఆలయాలు. వీటిని హొయసల టెంపుల్స్‌గా వ్యవహరిస్తారు. హలేబీడులో హొయసలేశ్వర ఆలయంతోపాటు కేదారేశ్వరాలయం, జైన్ ఆలయాలు ప్రసిద్ధం. హొయసలుల ఆలయ నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. వేస్మెంట్ నక్షత్రం ఆకారంలో ఉంటుంది. హొయసలేశ్వర ఆలయం ట్విన్ టెంపుల్. శైవంతోపాటు వైష్ణం, శాక్తేయంతోపాటు వేదాలన్నింటికీ ప్రతిరూపం. దేవతల విగ్రహాలు, మునుల విగ్రహాలతోపాటు ఏనుగులు, సింహాలు, గుర్రాలు, పూలతీగలు అడవిలో చెట్టును అల్లుకున్నట్లు రాతిలో సజీవరూపంలో ఉంటాయి. ఈ నిర్మాణాల్లో రాణి కేతలాదేవి చొరవ ప్రశంసనీయం. ఇక జైన ఆలయాల్లో పార్శ్వనాథుడు, శాంతినాథ, ఆదినాథ ఆలయాలున్నాయి. హొయసలేశ్వర ఆలయం ఆవరణలో బాహుబలి ప్రతిరూపాన్ని కూడా చూడవచ్చు. అసలు బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం శ్రావణబెళగొళ లోని వింధ్యగిరి కొండల్లో ఉంది.మెట్లబావి కూడా ఉందిబెంగళూరు నుంచి 200 కిమీల దూరంలో ఉంది హలేబీడు. ఈ టూర్లో బేలూరులోని చెన్నకేశవాలయాన్ని కూడా కవర్ చేయవచ్చు. హలేబీడుకు కిలోమీటరు దూరంలో హులికెరె అనే గ్రామంలో స్టెప్‌వెల్ ఉంది. రాణీకీవావ్, అదాలజ్ వావ్ వంటి గొప్ప స్టెప్వెల్స్కి గుజరాత్ ప్రసిద్ధి. ఢిల్లీలో కూడా అగ్రసేన్ కీ బావోలీ ఉంది. ఐదేళ్ల కిందట తెలంగాణ జిల్లాల్లో కూడా స్టెప్‌వెల్‌లు బయటపడ్డాయి. కర్నాటకలో మెట్లబావుల సంస్కృతి తక్కువే. కానీ చూడాల్సిన ప్రదేశం. నిర్మాణ శైలిలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికీ ఉన్న తేడాలను అర్థం చేసుకోవాలంటే చూసి తీరాలి. టూర్ ఆపరేటర్లను ముందుగా అడిగి ఇవన్నీ కవర్ చేసేలా మాట్లాడుకోవాలి. ఆభరణాల నందిటెంపుల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మ్యూజియంలో 15 వందలకు పైగా శిల్పాలు, ఇతర కళా రూపాలున్నాయి. నంది విగ్రహం ధరించిన ఆభరణాలను నిశితంగా పరిశీలించడానికి కనీసం పది నిమిషాల సమయం పడుతుంది. సాధారణంగా శివాలయాల్లో శిల్ప సౌందర్యానికి అద్దం పట్టేది నంది విగ్రహమే. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, తెలంగాణలోని రామప్ప ఆలయాల్లో కూడా నంది విగ్రహాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత గొప్పగా ఉంటాయి. శిల్పులు తమ నైపుణ్యాన్ని శివలింగాన్ని చెక్కడంలో వ్యక్తం చేయడానికి ఏమీ ఉండదు. అందుకే నంది విగ్రహం, ఆ విగ్రహానికి ఆభరణాల కోసం ఉలికి పని చెప్తారు. దాంతో ఆ శిల్పి చాతుర్యం అంతా నందిలో కనిపిస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మహిమాన్వితమైన సూగూరేశ్వర ఆలయం!..ఎక్కడ లేని విధంగా రథోత్సవం..
కర్ణాటక రాష్ట్రం శైవాలయాలకు, శివభక్తులకు పుట్టినిల్లు. ఏ మారుమూల గ్రామాలకెళ్లిన శివాలయాలు దర్శనమిస్తాయి. రాయచూరు నుంచి 20 కి.మీ దూరంలో సూగూరేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందింది. కృష్ణా నది పక్కనే 11వ శతాబ్దంలో వెలిశాయని శిలా శాసనాలు చెబుతున్నాయి. శివుని కొడుకుగా పిలువబడే వీరభద్రేశ్వరుడు వెలిశాడు. విజయనగర సామ్రాజ్యాధిపతులైన ప్రౌఢ దేవరాయలు గుడి నిర్మాణం చేపట్టారు. ప్రభువు అసర వీర ప్రతాప దేవరాయలు పూర్తి చేశారు. కొల్హాపుర దేవస్థాన రాజవంశస్థుడైన బసవంతు ప్రభు కుష్టు రోగంతో బాధపడుతుండగా సూగూరేశ్వరుడు ప్రభు కలలో కనిపించి తనను దర్శించుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆజ్ఞాపించారు. రోగం నయం కావడంతో ప్రభు గర్భగుడిని నిర్మించారు. పిల్లలు పుట్టని దంపతులు దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం గట్టిగా నెలకొంది. దేవాలయం ప్రవేశ ద్వారంలో దక్షిణామూర్తిగా వెలసిన శాంత మూర్తిగా దర్శనమివ్వడం భక్తులను ఆకట్టుకుంది. ధ్యాన మండపంలో విజ్ఞాలు కలగకుండా విఘ్నేశ్వరాలయం ఉంది. ప్రతి నిత్యం త్రికాల పూజలు స్వామి జాతర, రథోత్సవాలు రెండున్నాయి. దక్షిణ, తూర్పు, పడమరల్లో వెలసిన గోపురాల్లో దేవుళ్లను ఏర్పాటు చేయడం ఆకర్షణగా ఉంది. పడమరలో గోపురం వెలిస్తే దేవాలయం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం ఉంది. ఉదయం 5, మధ్యాహ్నం 11, రాత్రి 8 గంటలకు ప్రత్యేక త్రికాల పూజలు చేస్తారు. ప్రతి సోమ, గురువారం బెల్లం తేరులో ఊరేగింపు, పల్లకీ సేవలు నిర్వహిస్తారు.అభిషేకంతో పాటు మహా, కాశీ, నంద, ఆకుల, పువ్వుల, అక్షర, పల్లకీ, ఊయల పూజలు చేస్తారు. ప్రతి నిత్యం రెండు వందల మందికి ఉచిత ప్రసాదం, సోమ, గురువారం అమావాస్య రోజున 1000 మందికి భోజనం ఏర్పాటు దేవాలయం కమిటీ నిర్దారించారు. పెళ్లి చేసుకోవడానికి దాస సాహిత్య మండపం ఉంది. పేదలకు ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా కేటాయిస్తామని అధికారి సురేష్ వర్మ తెలిపారు.7న జోడు రథోత్సవాలు: శనివారం దేవసూగూరు సూగురేశ్వరుడి జోడు రథోత్సవాలు జరుగుతాయని దేవాలయ కమిటీ అధికారి అసిస్టెంట్ కమిషనర్ గజానన తెలిపారు. జోడు రథోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ముంబై, తమిళనాడుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. రథోత్సవానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారి చంద్రశేఖర్ వివరించారు.(చదవండి: మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు పిలుస్తారు..? ఈ పండుగ విశిష్టత) -
శోభిత-నాగ చైతన్య పెళ్లి : అప్పుడు అలా.. ఇపుడు ఇలా!
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్ల వేడుకతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లికి వధువు శోభితా ధూళిపాళ సింపుల్ మేకప్, టెంపుల్ జ్యుయల్లరీతో బంగారు రంగు కంజీవరం ప్యూర్ గోల్డ్ జరీ చీరలో అందంగా ముస్తాబైంది. వరుడు నాగచైతన్య టెంపుల్ బోర్డర్ఉన్న పంచె (మధుపర్కం) కట్టుకొని ఎలిగెంట్ లుక్‌లో అలరించాడు. అయితే కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ, తన జీవితంలో కీలకమైన శుభకార్యానికి తాతగారి పంచెను కట్టుకున్నాడంటూ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య శోభిత ధూళిపాళతో తన పెళ్లికి తన తాత పంచెను ధరించాడుట. కుర్తా-పైజామాతో పాటు ముహూర్తం సమయానికి తనతాత టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంతగ అక్కినేని నాగేశ్వరావు తెల్లటి పంచెను ఎంచుకున్నాడట. అలా అక్కినేని కుటుంబ వారసత్వాన్ని పాటించాడు అంటున్నారు ఫ్యాన్స్. (మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం)తాజాగా సోషల్‌మీడియాలో వీరి పెళ్లి ఫోటోలతో పాటు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాతో చైతన్య మొదటి పెళ్లినాటి ఫోటోలు, సమంత ఎంగేజ్మెంట్కు, పెళ్లికి కట్టుకున్న చీర వివరాలు కూడా మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడు సమంతా అమ్మమ్మ చీరను మురిపెంగా కట్టుకుంటే, ఇపుడు చైతన్య తాత పంచెను కట్టుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కాగా నాగ చైతన్యతో పెళ్లి సందర్బంగా సమంత ‘చే’ అమ్మమ్మ చీరను ప్రత్యేకంగా రీడిజైన్ చేయించుకుంది. అలాగే చే, సామ్ లవ్ స్టోరీతో ఆధారంగా వారి ఎంగేజ్మెంట్ చీరను తీర్చిదిద్దుకున్న సంగతి తెలిసిందే. -
మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు పిలుస్తారు..?
మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. కుమారస్వామి సర్పరూపంలో భూలోకంలోకి అడుగిడిన రోజుకే సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు. అదేవిధంగా దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజును ‘శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి‘ గా వ్యవహరిస్తారు.ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. ఏం చేయాలంటే..? ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. జాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం (చదవండి: మహిమాన్వితం మార్గశిర లక్ష్మీవార వ్రతం) -
మహిమాన్వితం మార్గశిర లక్ష్మీవార వ్రతం
లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.వ్రత విధానం ముందుగా పొద్దున్నే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ‘ ‘ఓం మహాలక్ష్మైచ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ ‘అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి.అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. గురువారం నాడు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోసౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.నైవేద్యాలు : 1 వ గురువారం పులగం 2 వ గురువారం అట్లు, తిమ్మనం3 వ గురువారం అప్పాలు, పరమాన్నము4 వ గురువారం –చిత్రాన్నం, గారెలు , 5 వ గురువారం పూర్ణం బూరెలు నియమనిష్ఠలు కీలకంగురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసన్నంగా మార్చుకోవచ్చు.(చదవండి: అక్కడ కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్ ..!) -
ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్.. ఇండిగో స్థానం ఇది!
విమానంలో ప్రయాణించాలంటే ఏ విమానయాన సంస్థ బెటర్ అనేది తెలుసుండాలి. అలాగే కేబిన్లు, సేవల నాణ్యత తోపాటు..విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీ ప్రతి ఏటా దీనికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఏడాది మెత్తంలో ఎన్ని సార్లు ఆలస్యంగా కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చింది, సౌకర్యం, సేవలు, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమమైనవి, చెత్త సర్వీస్ అందించిన ఎయిర్‌లైన్స్‌గా జాబితా చేసి ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది మాత్రం కస్టమర్ ఫీడ్‌బ్యాక్, కార్యచరణ సామర్థ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్లకు ర్యాంకుల ఇచ్చింది.ఇందులో జనవరి నుంచి అక్టోబర్ వరకు గల డేటాను బేస్ చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహించడమేనని ఎయిర్ హెల్ప్ సీఈవో టామ్జ్ పౌల్జిన్ చెబుతున్నారు.2024 సంవత్త్సరానికి అత్యంత చెత్త విమానయాన సంస్థలు..100. స్కై ఎక్స్‌ప్రెస్101.ఎయిర్ మారిషస్102. తారోమ్103. ఇండిగో104. పెగాసస్ ఎయిర్‌లైన్స్105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్106. బల్గేరియా ఎయిర్107. నౌవెలైర్108. బజ్109. తునిసైర్2024 సంవత్సరానికి అత్యుత్తమ విమానయాన సంస్థలు..10. ఎయిర్ సెర్బియా9. వైడెరో8. ఎయిర్ అరేబియా7. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్6. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్5. ప్లే (ఐస్లాండ్)4. అమెరికన్ ఎయిర్‌లైన్స్3. యునైటెడ్ ఎయిర్‌లైన్స్2. ఖతార్ ఎయిర్వేస్1. బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ఈసారి బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించి.. ఖతార్ ఎయిర్వేస్ను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఈ ఏడాది గణనీయమైన కార్యాచరణ అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ..మంచి పనితీరును కొనసాగించి మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్‌బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది.ఇండిగో స్పందన:భారత్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వే ఫలితాలపై స్పందించింది. సదరు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ ఇచ్చిన ర్యాంక్‌ని ఖండిచింది. తమ సంస్థ కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని స్పష్టం చేసింది. కస్టమర్ పిర్యాదులు కూడా తక్కువేనని పేర్కొంది ఇండిగో. భారత ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకారం..తొమ్మిది నెలల కాలంలో 7.25 కోట్లకు పైగా ప్రయాణికులను తీసుకెళ్లడమే గాక 61.3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. అంతేగాక నెలవారీగా కస్టమర్ పిర్యాదులను, సమయాపాలన డేటాను ప్రచురిస్తామని కూడా ఇండిగో స్పష్టం చేసింది. గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ విశ్వసనీయత లేని విధంగా ర్యాంకులు ఇచ్చిందని, తమ విమానయాన సంస్థ డేటాని పరిగణలోనికి తీసుకుని ఇచ్చిన ర్యాంకు మాత్రం కాదని ఆరోపించింది. (చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
ఇది సిమ్లా యాపిల్ కాదు... కల్పా యాపిల్
యాపిల్ చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది? మనం మామిడి చెట్టును చూస్తాం, జామచెట్టును చూసి ఉంటాం. కానీ యాపిల్ చెట్టుతో మనకు పరిచయం ఉండదు. యాపిల్ కోసం సిమ్లాకే కాదు... కల్పాకు కూడా వెళ్లవచ్చు. అందుకే ఓసారి హిమాచల్ ప్రదేశ్‌లోని ‘కల్పా’ బాట పడదాం. మన పక్కనే ఉన్నట్లుండే హిమాలయాలను చూస్తూ విస్తారమైన యాపిల్ తోటల్లో విహరిద్దాం. ‘రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్టర్‌ను చూడాల్సిన అవసరమే ఉండదు’ అని యాపిల్‌లో ఉండే ఆరోగ్య లక్షణాలను ఒక్కమాటలో చెప్తుంటాం. కల్పా గ్రామంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తారు. అస్సాం టీ తోటల్లో మహిళలు వీపుకు బుట్టలు కట్టుకుని ఆకు కోస్తున్న దృశ్యాలు కళ్ల ముందు మెదలుతాయి. యాపిల్ తోటల్లో అమ్మాయిలు బుట్టను చెట్టు కొమ్మల మధ్య పెట్టి యాపిల్ కాయలు కోస్తుంటారు. కిన్నౌర్ కైలాస్ పర్వత శ్రేణుల దగ్గర విస్తరించిన గ్రామం కల్పా. యాపిల్ పండుని చెట్టు నుంచి కోసుకుని తింటూ రంగులు మార్చే హిమాలయాలను చూడడం ఈ ట్రిప్‌లోనే సాధ్యమయ్యే అనుభూతి. తెల్లటి మంచు పర్వత శిఖరాల్లో కొన్ని ఉదయం ఎర్రగా కనిపిస్తాయి. మధ్యాహ్నానికి ఆ శిఖరం తెల్లగానూ మరో శిఖరం ఎరుపురంగులోకి మారుతుంది. సూర్యుడి కిరణాలు పడిన పర్వత శిఖరం ఎర్రగా మెరుస్తుంటుంది.సాయంత్రానికి అన్నీ తెల్లగా మంచుముత్యాల్లా ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రకృతి ఇంతే సౌందర్యంగా ఉంటుంది. మంచుకొండలు చేసే మాయాజాలాన్ని చూడాలంటే శీతాకాలమే సరైన సమయం. గోరువెచ్చని వాతావరణంలో విహరించాలంటే మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లాలి. కల్పా చాలా చిన్న గ్రామం. సిమ్లా టూర్లో భాగంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత చిన్న కల్పా గ్రామంలో ప్రాచీన దేవాలయాలున్నాయి. బౌద్ధవిహారాలు కూడా ఉన్నాయి. (చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
తోట కాని తోట : చిరస్థాయిగా నిలిచిపోయే తోట!
అరటి గెల, గుమ్మడికాయలు, పనస, పైనాపిల్... ఇవన్నీ తోటలో పండుతాయి. డిజైనర్ జెంజుమ్ ఇత్తడి నమూనాలతో ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉండే పండ్లను, కూరగాయలను సృష్టించాడు. ‘ప్రకృతికి, అతని తల్లికి, తన జీవితానికి గుర్తుగా వీటిని సృష్టించాను’ అని చెబుతాడు జెంజుమ్. అరుణాచల్ ప్రదేశ్‌లోని టిర్బిన్ అనే చిన్న గ్రామంలో జన్మించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జెంజుమ్. తన చిన్ననాటి జ్ఞాపకాలను బతికించుకోవాలన్నది అతని తాపత్రయం. వినోదం అందుబాటులో లేని ప్రదేశంలో పెరిగినందున, 1980లలో చిన్న పిల్లవాడిగా అతని తీరిక పనిలో చెట్లు ఎక్కడం, తేనెటీగలను వెంబడించడం, నదుల్లో ఈత కొట్టడం, చేపలు పట్టడం, పర్వతాలలో హైకింగ్ చేయడం వంటివి ఉన్నాయి. ప్రకృతి అతని ఏకైక ఆట స్థలం. ఇప్పుడు ఆ ప్రకృతినే తన తొలి ఆర్ట్ షో ‘అపాసే’ను ప్రదర్శనకు పెట్టాడు, ఇది బెంజుమ్ స్థానిక గాలో మాండలికంలో అక్షరాలా ’వివిధ రకాల పండ్లు’ అని అర్ధం.జ్ఞాపకాల తోట‘‘మా ఊరిలో ప్రతి ఇంటికీ తోట ఉంటుంది. పువ్వులకు బదులుగా వాటిలో కూరగాయలు, పండ్లు పండిస్తాం. రైతు అయిన నా తల్లి ఎప్పుడూ గ్రామంలోనే ఉంటూ తన జీవితమంతా మా తోటలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఉండేది. వాటికి విత్తనాలు నిల్వచేసేది. అక్కడ సమయం గడపడం నా సృజనాత్మక పనిని లోతుగా ప్రభావితం చేసింది. ప్రకృతితో ఈ కనెక్షన్ ఇప్పుడు నా డిజైన్లలోకి విస్తరించింది. ఆ జ్ఞాపకాలను మళ్లీ పునశ్చరణ చేసి, వాటికి ఒక సాక్షాత్కార రూపం ఇవ్వాలన్న నా ప్రయత్నమే ‘అపాసే’’’ అని బెంజుమ్ చెబుతారు. ఇత్తడి ఫ్రూట్స్ఇత్తడితో రూపొందించిన 16 త్రీ–డైమెన్షనల్ ఫ్రూట్ మోడల్ అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కళారూపం బెంజుమ్ తల్లి తోట నుండి ఒక పండు, కూరగాయలను సూచిస్తుంది. ఈ డిజైన్స్‌తో బెంజుమ్ ప్రదర్శన కూడా నిర్వహించాడు. 12, 44 అంగుళాల అరటి గెల, పైనాపిల్స్, బొప్పాయిలు, జాక్‌ఫ్రూట్స్, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, దానిమ్మపండ్లు – కళాకారుడి పనితీరును వెలుగులోకి తెచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని రూపా అనే చిన్న గ్రామంలో టిబెటన్ మఠాల కోసం సాంప్రదాయ ఇత్తడి వస్తువులను రూ పొందించడంలో నైపుణ్యం కలిగిన స్థానిక కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని పశ్చిమాన ఉన్న తవాంగ్, ఆసియాలో అతి ప్రాచీనమైన, రెండవ అతిపెద్ద బౌద్ధ ఆశ్రమానికి నిలయం ఉంది. ఆ ఆశ్రమాలను సందర్శించిన బెంజుమ్ నిజమైన పండ్లను అచ్చులుగా ఉపయోగించడం, వాటిని శాశ్వతమైన ఇత్తడి ప్రదర్శనలుగా మార్చడంపై ఆసక్తిని పెంచింది. బెంజూమ్ ఢిల్లీలో నివసిస్తున్నాడు. తన ఢిల్లీ తోటలో బెంజుమ్ మామిడి, బొ΄్పాయి, అవకాడో, సీతాఫలం, అరటి, నిమ్మకాయలు వంటి వివిధ రకాల పండ్లను సీజన్‌ను బట్టి పండిస్తాడు. అయితే అతనికి ఇష్టమైనది నారింజ. ‘‘నారింజ చెట్లు సాధారణంగా ముళ్లతో ఉంటాయి, కానీ చెట్ల వయస్సు పెరిగే కొద్దీ ముళ్ళు తగ్గిపోతాయి. నారింజ పండ్లను కోయడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, ముళ్ల నుండి వచ్చిన కొద్దిపాటి గాయాలను తీర్చే పండ్ల మాధుర్యం నాకు చిన్ననాటి జ్ఞాపకాలుగా ఉన్నాయి’’ అని బెంజుమ్ గుర్తు చేసుకుంటాడు. కళను బతికించాలి..ఈశాన్య ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే కొద్దిమంది డిజైనర్లు, కళాకారులలో బెంజుమ్ ఒకరు. ‘ప్రక్రియ నెమ్మదిగా ఉంది, కానీ మొత్తానికి ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ప్రాంతం నుండి కొత్త తరం యువ కళాకారులు ఉద్భవించడాన్ని నేను గమనించాను. వారిలో ఈ కళ పట్ల అవగాహన పెంచాలి, సృజనాత్మకతను మెరుగుపరచాలి’ అని వివరిస్తాడు బెంజుమ్. బెంజుమ్ ప్రతిభ బట్టలు డిజైన్ చేయడం, సినిమాల్లో నటించడం వరకే కాదు ఇప్పుడు ఈ కళారూపాలతో బిజీ అయిపోతే తిరిగి పెద్ద స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామని అక్కడి వారు అడుగుతుంటారు. బెంజుమ్ నవ్వుతూ ‘ముందు చేస్తున్న పనిపైనే సంపూర్ణ దృష్టి పెడుతున్నాను’ అంటారు జెంజుమ్. -
గోదారమ్మ పుట్టింటికి వెళ్లొద్దామా?
నాసిక్ త్రయంబకం ఈ రెండింటినీ కలిపి పలుకుతారు. కానీ ఈ రెండింటికీ మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉంది. త్రయంబకం జ్యోతిర్లింగం. ఇక్కడ పానవట్టం మీద మూడు చిన్న చిన్న శివలింగాలుంటాయి. నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీటిని చేత్తో తీసి బయట ΄ోస్తుంటారు పూజారులు. ఆ నీరు బ్రహ్మగిరి కొండల్లో నుంచి ఉబికి వస్తున్న గోదావరి నీరని చెబుతారు. త్రయంబకం ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. గ్రానైట్ రాయిలో చెక్కిన గోపురం, ఆ గోపురంలో చెక్కిన శిల్పాల సౌందర్యం కనువిందు చేస్తుంది. శిల్పకారులకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఆలయంలో నాలుగు వైపులా ద్వారాలుంటాయి. స్పెషల్ దర్శనం కోసం ఆలయ సంస్థానం నిర్వహిస్తున్న దర్శనం కౌంటర్ ఉంటుంది. కానీ సమాంతరంగా స్థానికులు అవినీతిని ప్రోత్సహిస్తుంటారు. టికెట్ తీసుకోకుండా వాళ్ల చేతికి డబ్బిస్తే మరో ద్వారం నుంచి ఆలయంలో ప్రవేశపెడతారు. ఈ అవినీతిపరులు పర్యాటకులను మిస్లీడ్ చేస్తూ కౌంటర్ దగ్గరకు వెళ్లనివ్వకుండా దారి మళ్లిస్తుంటారు. ఆలయ కౌంటర్ నిడివి పెంచితే అవినీతి తగ్గుతుంది, ఆలయ గౌరవం పెరుగుతుంది. ఆలయం లోపల మాత్రం గంభీరమైన వాతావరణం, మనసును శివుడి మీద లగ్నం చేస్తుంది. త్రయంబకేశ్వరుడి దర్శనం తర్వాత ఎదురుగా కనిపిస్తున్న గుట్ట మీద అమ్మవారి ఆలయం ఉంది. త్రయంబకేశ్వరుడి ఆలయం పూర్తిగా నల్లగా ఉంటే అమ్మవారి విగ్రహంతోపాటు ఆలయం నేల నుంచి శిఖరం వరకు మొత్తం పాలరాతి నిర్మాణం. కొండ మీద గోదావరి త్రయంబకం తర్వాత బ్రహ్మగిరి కొండల వైపు సాగాలి. గోదావరి నది పుట్టిన ప్రదేశాన్ని చూడాలంటే నిట్టనిలువుగా ఉన్న కొండను నడిచి ఎక్కాల్సిందే. రెండు కొండల మధ్య ఇరుకు మెట్ల మీద పైకి వెళ్తుంటే నది పాయలు పర్యాటకులను పలకరించడానికి ఎదురు వచ్చినట్లు తల మీదకు జాలువారుతుంటాయి. కర్రసాయంతో కొండ ఎక్కడమే మంచిది. మెట్లెక్కి కొండ మీదకు చేరిన తర్వాత తెలుస్తుంది అది ఒక కొండ కాదని. విశాలంగా విస్తరించిన పశ్చిమ కనుమల శిఖరాల నుంచి ధారలు జలజలమని శబ్దం చేస్తూ కొండల మధ్య విశాలమైన ప్రదేశంలోకి చేరతాయి. అదే గోదావరి కుండ్. భక్తులు ఆ నీటిలో పుణ్యస్నానాలు చేస్తుంటారు. గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూసిన తర్వాత తిరుగు ప్రయాణంలో నాసిక్‌లో ఆగాలి. పంచవటి, సీతాగుహ, కాలారామ్ మందిర్ ప్రధానమైనవి. సీతాగుహలోకి వెళ్లి రావడం ఆసక్తిగా ఉంటుంది. కానీ రద్దీ చాలా ఎక్కువ. క్యూలైన్లోనే ఎక్కువ టైమ్ అయిపోతుంది. కాలారామ్ ఆలయంలో రాముడి విగ్రహం అందంగా ఉంటుంది. ఆలయ నిర్మాణం ఉత్తర దక్షిణాది శైలి సమ్మేళనంగా ఉంటుంది. నాసిక్‌లో నాణేల ముద్రణాలయం ఉంది. ఎత్తైన కాంపౌండ్ వాల్‌ను మాత్రమే చూడగలం. టూర్ ఆపరేటర్ని అడిగితే ఆ రోడ్డులో తీసుకువెళ్తారు. షిరిడీ ప్రయాణంలో నాసిక్, త్రయంబకాలను కలుపుకోవచ్చు. షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత మొదట ముక్తిధామ్ వస్తుంది. ఈ పాలరాతి ఆలయంలో కృష్ణుడితోపాటు శివుడు... ఇంకా చాలామంది దేవతల రాజస్థాన్ మార్బుల్ విగ్రహాలుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాల నమూనాలుంటాయి. త్రయంబకేశ్వరుడిని కూడా చూడవచ్చు. షిరిడీ టూర్ ఆపరేటర్లు నిర్వహించే కంబైండ్ ప్యాకేజ్‌లలో బ్రహ్మగిరి ఉండదు. విడిగా వాహనం మాట్లాడుకోవాలి. కొండ మీదకు ట్రెకింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రీ టైమ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక నాసిక్‌లో సీతాగుహలోకి వెళ్లడం కంటే క్యూలో మనవంతు కోసం వెయిట్ చేయడమే కష్టం. ఇక్కడ టోకెన్ సిస్టమ్ పెడితే బాగుంటుంది. పర్యాటకులు టోకెన్ తీసుకుని తమ వంతు వచ్చే వరకు ఎదరుగా ఉన్న ఇతర ఆలయాలు, పంచవటి వృక్షాలను చూస్తూ, తినుబండారాలతో కాలక్షేపం చేయవచ్చు. ఇంత సిస్టమాటిక్‌గా ఏమీ ఉండకపోవడంతో పర్యాటకులే స్వయంగా తమ వెనుక వారికి చెప్పి క్యూ లైన్ నుంచి బయటకు వచ్చి టీ స్టాల్లో టీ తాగి, స్నాక్స్ తిని మళ్లీ క్యూలో చేరుతుంటారు.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అక్కడ కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్..!
హిందూవుల అత్యంత పవర్ఫుల్ దేవత కాళీమాత. ఆమె పూజ విధానం, ఆచారా వ్యవహారాలు అత్యంత విభిన్నంగా ఉంటాయి. అలాంటి శక్తిమంతమైన దేవత కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెట్టడం గురించి విన్నారా..? అది కూడా శక్తి పీఠాల్లో ఒకటిగా అలరారుతున్న కోల్‌కతాలోనే ఓ మామూల ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉంది. అయితే ఆ దేవతను ఎవరూ కొలుస్తున్నారో వింటే ఆశ్చర్యపోతారు.కలకత్తాలోని చైనీస్ టౌన్‌గా పిలిచే టాంగ్రా ప్రాంతంలో ఈ కాళిమాత ఆలయం ఉంది. రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టు వద్ద ఉంది. ఈ అమ్మవారిని తొలుత స్థానిక హిందువులు పూజించేవారు. ఆ తర్వాత అక్కడే నివశించే చైనా కమ్యూనిటీవారిచే పూజలు అందుకోవడమే గాక వారే ఆ చెట్టు వద్ద చిన్నగా ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించి వారి ఆచార వ్యవహారంలో నిర్మించారు. అలా క్రమంగా ఆ ఆలయం పేరు చైనీస్ కాళీమందిరంగా ఏర్పడింది. ఈ గుడికి సంబంధించి ఓ ఆసక్తికర కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే..ఒక చైనీస బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యలు అతడిపై ఆశ వదిలేసుకోవాలని చెప్పడంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఈ కాళీ మందిరానికి తీసుకువచ్చి..భక్తితో పూజించడం ప్రారంభించారు. అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే ఆ బాలుడు కోలుకోవటం ప్రారంభించాడు. అప్పటి నుంచి అక్కడ ఉండే చైనా వాళ్లే ఈ అమ్మవారిని భక్తిగా కొలవడం ప్రారంభించారు. ఈ ఆలయ బాగోగులు చూసుకునేది కూడా ఓ చైనీస్ వ్యక్తే. అతడు తనను తాను చైనీస్ హిందువుగా పేర్కొనడం వివేషం. అంతేగాదు ఈ చైనీస్ కాళీ మందిరంలో అమ్మవారికి న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెడతారట. దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారట. ఇలా ఎన్నో ఏళ్లుగా న్యూడిల్స్నే కాళీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఆ ఆలయం కూడా చైనీస్ డ్రాగన్ పెయింట్‌తో ఉంటుంది. ఆ విగ్రహ వెనకాల ఓం గుర్తుల తోపాటు చైనా మూలాంశాలతో కూడిన గుర్తులు కూడా ఉంటాయి. ఈ మాతను దర్శించుకునేందుకు సుదూరప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడం విశేషం. (చదవండి: కోడిపుంజులాంటి హోటల్..!)