breaking news
Cricket
-
IND Vs NZ: భారత్‌కు షాక్.. నాలుగో టీ20లో ఓటమి
సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. కానీ 18.4 ఓవర్లలోనే టీమిండియా 165 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలొ శివమ్ దూబె 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రింకు సింగ్ 39, సంజు శాంసన్ 24 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ డకౌటవ్వగా సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు, హార్దిక్ పాండ్య 2 పరుగులు మాత్రమే చేశారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు తీయగా, జాకబ్ డఫీ , ఇష్ సోధి చెరో రెండు వికెట్లు, మ్యాట్ హెన్రీ, జాక్ ఫౌక్స్ చెరో వికెట్ పడగొట్టారు.తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో డారిల్ మిచెల్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-2), కుల్దీప్ యాదవ్ (4-0-39-2), బుమ్రా (4-0-38-1) కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా (4-0-54-0), రవి బిష్ణోయ్ (4-0-49-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. -
ఇంగ్లండ్ కోచ్‌గా బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, ఇంగ్లండ్-ఏ జట్టు (ఇంగ్లండ్ లయన్స్) కోచ్‌గా మారాడు. అతనితో పాటు మరో ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ కూడా లయన్స్ కోచింగ్ టీమ్‌లో చేరాడు. వచ్చే నెలలో పాకిస్తాన్-ఏతో (పాకిస్తాన్ షాహీన్స్) జరుగబోయే వైట్ బాల్ సిరీస్ కోసం ఈ ఇద్దరూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యువ ఆటగాళ్లకు మెళకువలు నేర్పించడం కోసం స్టోక్స్-మొయిన్ కోచ్ అవతరామెత్తారు. లయన్స్ తమ చివరి యూత్ టీ20ని 2018లో.. చివరి యూత్ వన్డేను 2023లో ఆడింది. లయన్స్‌లో ఈ గ్యాప్‌ను కవర్ చేసేందుకే స్టోక్స్-మొయిన్ కోచింగ్ బాట పట్టారు. వీరిద్దరు ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి లయన్స్ కోచింగ్ బృందంలో పని చేస్తారు. స్టోక్స్-ఫ్లింటాఫ్ గత ఎడిషన్ హండ్రెడ్ లీగ్‌లో కూడా కలిసి పని చేశారు. స్టోక్స్ నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఫ్లింటాఫ్ ఆ ఫ్రాంచైజీకి మెంటార్‌గా పని చేశాడు.ఇటీవల యాషెస్ సిరీస్ చివరి టెస్ట్ సందర్భంగా గాయపడిన స్టోక్స్ ఈ కోచింగ్ అనుభవాన్ని రిహాబ్గా ఉపయోగించుకుంటాడు. మొయిన్ విషయానికొస్తే.. ఇతను తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని, దేశవాలీ టీ20 టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యార్క్‌షైర్ టీమ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆటగాడిగా కెరీర్ చరమాంకంలో ఉన్న మొయిన్ ఈ కోచింగ్ అనుభవాన్ని తన కోచింగ్ కెరీర్‌కు పునాదిగా మలుచుకోనున్నాడు. పాకిస్తాన్-ఏ సిరీస్‌కు స్టోక్స్, మొయిన్‌తో పాటు మరికొంతమంది మాజీలు కూడా కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. వీరి కోచింగ్ బృందంలో నీల్ మెక్కెంజీ, సారా టేలర్, నీల్ కిల్లెన్, అమర్ రషీద్, ట్రాయ్ కూలీ ఉన్నారు.ఇంగ్లండ్ లయన్స్ జట్టు యూఏఈ వేదికగా పాక్-ఏతో మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. స్టోక్స్, మొయిన్‌కు యూఏఈలో ఆడిన అనుభవం ఉండటం కూడా వారిని కోచ్‌లుగా ఎంపిక చేసేలా చేసింది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు జోర్డన్ కాక్స్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో జేమ్స్ కోల్స్, సాకిబ్ మహమూద్ లాంటి టీ20 స్పెషలిస్ట్‌లు ఉన్నారు.ఇంగ్లండ్ లయన్స్ టీ20 జట్టు: సోనీ బేకర్, లూక్ బెంకెన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్ (కెప్టెన్), స్కాట్ క్యూరీ, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, సాకిబ్ మహమూద్, బెన్ మెకిన్నీ, టామ్ మూర్స్, డాన్ మౌస్లీ, మాట్ రెవిస్, విల్ స్మీడ్, నాథన్ సౌటర్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్వన్డే జట్టు: సోనీ బేకర్, లూక్ బెంకెన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, స్కాట్ క్యూరీ, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ (కెప్టెన్), లియామ్ ప్యాటర్సన్-వైట్, మాథ్యూ పాట్స్, మాట్ రెవిస్, జేమ్స్ రెవ్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్, జేమ్స్ వార్టన్. -
నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్
వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో డారిల్ మిచెల్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.సీఫర్ట్, కాన్వే ధాటికి న్యూజిలాండ్ 8.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. సీఫర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20ల్లో భారత్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాడిగా రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో కాన్వే కూడా జోరును ప్రదర్శించాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు.వీరిద్దరు ఔటైన తర్వాత న్యూజిలాండ్ మధ్యలో కాస్త తడబడింది. రచిన్ రవీంద్ర (2), మార్క్ చాప్మన్ (9) త్వరితగతిన ఔటయ్యారు. ఈ మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో డారిల్ మిచెల్ బ్యాట్ ఝులిపించడంతో న్యూజిలాండ్ 200 పరుగుల మార్కును దాటింది. సాంట్నర్ (11), ఫౌల్క్స్ (13) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. సాంట్నర్‌ను హార్దిక్ పాండ్యా అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. మిచెల్‌తో పాటు మ్యాట్ హెన్రీ (6) అజేయంగా నిలిచాడు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-2), కుల్దీప్ యాదవ్ (4-0-39-2), బుమ్రా (4-0-38-1) కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా (4-0-54-0), రవి బిష్ణోయ్ (4-0-49-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. -
ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్.. మరో జట్టుగా..!
జూన్ 12 నుంచి ఇంగ్లండ్ మరియు వేల్స్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. నేపాల్‌లో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ప్రపంచకప్ క్వాలిఫయర్) థాయ్‌లాండ్‌పై 39 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.మరోవైపు నెదర్లాండ్స్ జట్టు తొలిసారి మహిళల టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, థాయ్‌లాండ్, నేపాల్, జింబాబ్వేపై వరుస విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించిన నెదర్లాండ్స్.. టాప్-4లో (సూపర్ సిక్స్‌లో) బంగ్లాదేశ్ తర్వాత రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా.. సూపర్-6 దశలో టాప్-4లో నిలిచే జట్లు ప్రపంచకప్ బెర్త్‌లను దక్కించుకుంటాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ టికెట్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం పోటీలు జరుగనున్నాయి. ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి.కాగా, జూన్ 12న బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి టైటిల్. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది. -
ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఎంపికైన ఐపీఎల్ స్టార్లు
గత ఎడిషన్ ఐపీఎల్ స్టార్లు ఆయుశ్ బదోని, ప్రియాంశ్ ఆర్య లక్కీ ఛాన్స్‌లు కొట్టేశారు. టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా జరిగే వార్మప్ మ్యాచ్‌ల కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యారు. వీరద్దరు ఫిబ్రవరి 2న నవీ ముంబైలో యూఎస్‌తో జరిగే మ్యాచ్‌లో, ఫిబ్రవరి 6న బెంగళూరులో నమీబియాతో జరిగే మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ పాల్గొననున్నారు. ఐపీఎల్లో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడే బదోని (లక్నో), ఆర్య (పంజాబ్) దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ జట్టుకు ఆడతారు. భారత-ఏ జట్టుకు ఎంపిక కావడంతో వీరిద్దరు ఢిల్లీ రంజీ జట్టు నుంచి విడుదలయ్యారు. బదోని ఢిల్లీ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.బదోని, ఆర్య భారత-ఏ జట్టుకు ఎంపిక కావడంతో వారి స్థానాలను ఇతరులతో భర్తీ చేయనున్నారు. బదోని స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఆయుశ్ దోసేజా బాధ్యతలు చేపడతాడు. ప్రస్తుత ఎడిషన్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ ఎలైట్ గ్రూప్-డిలో ఆరో స్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేక, ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇప్పుడు స్టార్ ఆటగాళ్లు బదోని, ఆర్య కూడా దూరం కావడంతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.బదోని ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో భారత వన్డే జట్టుకు కూడా ఎంపికయ్యాడు. బదోని ఎంపిక అనూహ్యంగా జరిగినప్పటికీ.. అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. బదోని 2025 ఐపీఎల్ సీజన్లో అంచనాలకు మించి ఆకట్టుకున్నాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 148.20 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు.ప్రియాంశ్ ఆర్య విషయానికొస్తే.. ఇతను కూడా గత ఐపీఎల్ ఎడిషన్‌లో చెలరేగిపోయాడు. 166.48 స్ట్రయిక్‌రేట్‌తో 303 పరుగులు చేసి, దూకుడు ప్రదర్శించాడు. తాజాగా ముగిసిన విజయ్ హజారే వన్డే టోర్నీలోనూ ఆర్య ఇదే జోరును కొనసాగించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 344 పరుగులతో సత్తా చాటాడు.ఇదిలా ఉంటే, ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. అది ఫిబ్రవరి 4న నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగనుంది. ఫిబ్రవరి 6న వార్మప్ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ మెయిన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది.వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్.. ఫిబ్రవరి 2ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)కెనడా వర్సెస్ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 3శ్రీలంక-ఏ వర్సెస్ ఒమన్ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)నెదర్లాండ్స్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)నేపాల్ వర్సెస్ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)ఫిబ్రవరి 4నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 5ఒమన్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)కెనడా వర్సెస్ నేపాల్ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 6ఇటలీ వర్సెస్ యూఎస్ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు) -
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
వైజాగ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టింది. గత మ్యాచ్‌లో అతను స్వల్ప గాయానికి గురయ్యాడు. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఓ మార్పుతో బరలోకి దిగింది. జేమీసన్ స్థానంలో ఫౌల్క్స్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక ఖరారైనట్లు తెలుస్తుంది. దిగ్గజ వికెట్‌కీపర్-బ్యాటర్ అలైస్సా హీలీ రిటైర్మెంట్ (ఫిబ్రవరి-మార్చిలో జరిగే భారత్ సిరీస్ తర్వాత) ప్రకటించడంతో, ఆమె స్థానంలో సోఫీ మోలినెక్స్ను కొత్త ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. మోలినెక్స్కు పట్టం కట్టడం దాదాపుగా ఖరారైనట్లు ఆసీస్ మీడియా వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకు రేసులో లేని మోలినెక్స్ అనూహ్యంగా కెప్టెన్సీని దక్కించుకుందని కథనాలు వెలువడుతున్నాయి. అందులోనూ ఆమెను ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. హీలీ తర్వాత కెప్టెన్సీ రేసులో ఎల్లిస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్ పేర్లు ప్రధానంగా వినిపించినా, క్రికెట్ ఆస్ట్రేలియా మోలినెక్స్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. 28 ఏళ్ల మోలినెక్స్ 2018లో భారత్‌తో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌తో ఆసీస్ తరఫున అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు ఆమె 3 టెస్ట్‌లు, 17 వన్డేలు, 38 టీ20లు ఆడింది. లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్‌గా 76 అంతర్జాతీయ వికెట్లు సాధించిన ఆమె, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా చాలా ఉపయోగకరమైన ప్రదర్శనలు చేసింది. హీలీ నాయకత్వం వహించిన జట్టులో మోలినెక్స్ కీలక పాత్ర పోషించింది. 2018, 2020 టీ20 వరల్డ్ కప్‌లలో ఆస్ట్రేలియా విజయాల్లో భాగమైంది. ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లోనూ ఎనిమిది వికెట్లు తీసి సత్తా చాటింది. మోలినెక్స్ ఎంపిక ఆసీస్‌కు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యత తీసుకొస్తుంది. -
రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న ఇంగ్లండ్ స్టార్
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మరోసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. 2021లో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, తిరిగి 2023 యాషెస్ సిరీస్ కోసం బరిలోకి దిగిన అతను.. తాజాగా తన దేశవాలీ రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్ తీసుకున్నాడు.2025లో ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్ నుంచి తప్పుకున్న మొయిన్.. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, దేశవాలీ క్రికెట్లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే తన పాత జట్టును కాదని కొత్త జట్టుతో (యార్క్‌షైర్) ఒప్పందం చేసుకొని టీ20 బ్లాస్ట్, ద హండ్రెడ్ లీగ్‌ల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు.మిగతా దేశాల ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు మొయిన్ అప్పట్లో దేశవాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా ఆ రూల్స్ సవరించబడటంతో, దేశవాలీ టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.మొయిన్ రిటైర్మెంట్ యూటర్న్ నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న ఇలాంటి ఉదంతాలపై ఓ లుక్కేద్దాం. క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, అనేక మంది రిటైర్మెంట్ ప్రకటించి, తిరిగి మైదానంలోకి వచ్చారు. కొందరు అంతర్జాతీయ కెరీర్లలో ఇలా చేస్తే, మరికొందరు ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొనేందుకు రిటైర్మెంట్ను ఉపసంహరించుకున్నారు. ఇలాంటి వారిలో టాప్-10 ఆటగాళ్లను పరిశీలిద్దాం.ముందుగా అంతర్జాతీయ రిటైర్మెంట్ యూటర్న్‌ను తీసుకుంటే.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆ జట్టు వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 1987లో రిటైర్మెంట్ ప్రకటించి, ఆ దేశ ప్రభుత్వం అభ్యర్థన మేరకు 1988లో దాన్ని ఉపసంహరించుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత ప్రభావవంతమైన యూటర్న్. ఎందుకంటే ఇమ్రాన్ రిటైర్మెంట్ను వెనక్కు తీసుకొని పాక్‌ను వన్డే ప్రపంచకప్ గెలిపించాడు.ఆతర్వాత అదే దేశానికి చెందిన జావిద్ మియాందాద్ 1993లో ఆటకు వీడ్కోలు పలికి, మూడేళ్ల తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నాడు. 1996 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు అతను ఈ పని చేశాడు. రిటైర్మెంట్ ఉపసంహరించుకొని ఆ ప్రపంచకప్ బరిలోకి దిగినా మియాందాద్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.కార్ల్ హూపర్ (వెస్టిండీస్)రిటైర్మెంట్: 1999ఉపసంహరణ: 2001, రీఎంట్రీలో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడుప్రభావం: హూపర్ రీఎంట్రీతో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్లో సిర్థరత్వం వచ్చింది.షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్)రిటైర్మెంట్: అనేకసార్లు (2010, 2011, 2016)ఉపసంహరణ: మూడు సార్లుబ్రెండన్ టేలర్ (జింబాబ్వే)రిటైర్మెంట్: 2015ఉపసంహరణ: 2017మొహమ్మద్ ఆమీర్ (పాకిస్తాన్)రిటైర్మెంట్: 2020ఉపసంహరణ: 2024మొయిన్ అలీ (ఇంగ్లండ్)రిటైర్మెంట్: 2021 (టెస్ట్ క్రికెట్)రీఎంట్రీ: 2023 యాషెస్ సిరీస్తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)రిటైర్మెంట్: 2023ఉపసంహరణ: దేశ ప్రధాని జోక్యంతో మరుసటి రోజేఇమాద్ వసీమ్ (పాకిస్తాన్)రిటైర్మెంట్: 2023రీఎంట్రీ: 2024క్రికెట్‌కు ఓవరాల్‌గా రిటైర్మెంట్ ప్రకటించి ప్రైవేట్ టీ20ల్లో ఆడిన ఆటగాళ్లు..ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)రిటైర్మెంట్: 2018ఐపీఎల్లో రీఎంట్రీకెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)రిటైర్మెంట్: 2012ఐపీఎల్, కౌంటీ క్రికెట్లోకి రీఎంట్రీబ్రెండన్ మెక్కల్లమ్ (న్యూజిలాండ్)రిటైర్మెంట్: 2016ఐపీఎల్ సహా మిగతా టీ20 లీగ్‌ల్లో రీఎంట్రీవీరే కాక ప్రొఫెషనల్ క్రికెట్ మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించి ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లో, దేశవాలీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. -
టీమిండియా ఆటగాళ్ల దూకుడు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా బ్యాటర్లు భారీ ఎత్తున లాభపడ్డారు. న్యూజిలాండ్ సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్-10లోకి దూసుకొచ్చాడు. స్కై 717 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకాడు. కొంతకాలంగా అగ్రపీఠంపై తీష్ట వేసిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ రేటింగ్ పాయింట్లను మరింత పెంచుకొని, ఎవరికీ అందని ఎత్తుకు ఎదుగుతున్నాడు. అభిషేక్ ప్రస్తుతం 929 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 2, శివమ్ దూబే 9, రింకూ సింగ్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 53, 59, 68 స్థానాలకు ఎగబాకారు. గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్నా తిలక్ వర్మ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు.మిగతా దేశాలకు చెందిన బ్యాటర్లలో మార్క్రమ్ (9 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి), బ్రాండన్ కింగ్ (15 స్థానాలు ఎగబాకి 35వ స్థానానికి), గ్లెన్ ఫిలిప్స్ (18 స్థానాలు ఎగబాకి 44వ స్థానానికి), సెదిఖుల్లా అటల్ (13 స్థానాలు ఎగబాకి 65), ర్యాన్ రికెల్టన్ (12 స్థానాలు ఎగబాకి 82), దర్విష్ రసూల్ (29 స్థానాలు ఎగబాకి 88), హెట్‌మైర్ (27 స్థానాలు ఎగబాకి 93) భారీగా లబ్ది పొందారు.బౌలర్ల విషయానికొస్తే.. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 4 స్థానాలు ఎగబాకి 13కు, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19కి, హార్దిక్ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరారు. వరుణ్ చక్రవర్తి మినహా టాప్-10లో మరో భారత బౌలర్ లేడు. రషీద్ ఖాన్, హసరంగ 2,3 స్థానాలు నిలబెట్టుకున్నారు. మిగతా భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 16, కుల్దీప్ యాదవ్ 25 స్థానాల్లో కొనసాగుతున్నారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఒకటి, 6 స్థానాలు మెరుగుపర్చుకొని 3, 12 స్థానాలకు ఎగబాకారు. టాప్-2గా సికందర్ రజా, సైమ్ అయూబ్ కొనసాగుతున్నారు. -
వరల్డ్‌కప్‌లో అభిషేక్ శర్మ జోడీగా ఇషాన్ కిషన్?!
సంజూ శాంసన్.. గత కొన్నేళ్లుగా భారత క్రీడా వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశంగా ఉంది. ప్రతిభ ఉన్నా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు తగినన్ని అవకాశాలు రావడం లేదని అతడి అభిమానులతో పాటు కొంతమంది మాజీ క్రికెటర్ల వాదన. అయితే, టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న సమయంలో.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనేది విశ్లేషకుల మాట.పేలవ ప్రదర్శనఆటలో నిలకడలేమి కారణంగానే సంజూను యాజమాన్యం నమ్మదగిన ఆటగాడిగా చూడటం లేదని ఇంకొంతమంది అభిప్రాయం. తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనలే ఇందుకు కారణం. నిజానికి గతేడాది కాలంగా భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా ఈ కేరళ ఆటగాడు కొనసాగుతున్నాడు.సెంచరీలతో సత్తా చాటి విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు జోడీగా సంజూ విదేశీ గడ్డలపై సెంచరీలతో సత్తా చాటాడు. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీకి ముందు వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తిరిగిరావడంతో సంజూపై వేటు పడింది. బ్యాటింగ్ ఆర్డర్లో తనకంటూ ఓ స్థానం లేకుండా పోయింది.వికెట్ కీపర్ కోటాలోనూ సంజూకు జితేశ్ శర్మ పోటీగా రావడంతో.. తుదిజట్టులో అతడు స్థానం కోల్పోయిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో టీ20 ఓపెనర్‌గా గిల్ విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది. ఫలితంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా తిరిగి ఓపెనర్‌గా అతడికి అవకాశం దక్కింది. అంతేకాదు.. ప్రపంచకప్ టోర్నీ-2026కు కూడా ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ ఎంపికయ్యాడు.10, 6, 0.. పొంచి ఉన్న ఇషాన్ ముప్పుఅయితే, కివీస్‌తో సిరీస్ సందర్భంగా సంజూ తొలి మూడు టీ20లలోనూ తేలిపోయాడు. మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు 10, 6, 0. మరోవైపు.. దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు.వరల్డ్‌కప్‌లో అభిషేక్ జోడీగా ఇషాన్ కిషన్?!తిలక్ వర్మ గాయపడిన కారణంగా ఇషాన్ ప్రస్తుతం మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. నిజానికి అతడు కూడా ఓపెనింగ్ బ్యాటర్. సంజూ వైఫల్యం కారణంగా ఈ జార్ఖండ్ డైనమైట్ ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే తిలక్ వర్మ టీ20 ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమవుతున్నాడని బీసీసీఐ ప్రకటించింది.నిజానికి తిలక్ గాయం వల్ల కివీస్‌తో మిగిలిన రెండు టీ20లకు కూడా దూరం కావడంతోనే సంజూ వేటు నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి న్యూజిలాండ్‌తో నాలుగు, ఐదో టీ20 మ్యాచ్‌లు అతడికి అత్యంత కీలకంగా మారాయి.ఈ సందర్భంగా ఫామ్‌లోకి వస్తేనే వరల్డ్‌కప్‌లో సంజూ ఓపెనర్‌గా కొనసాగగలడు. లేదంటే.. అతడి స్థానాన్ని మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ భర్తీ చేయడం ఖాయం. ప్రస్తుతానికి టీమిండియా యాజమాన్యం సంజూకు మద్దతుగా నిలవడం అతడికి ఊరటనిచ్చే అంశం.అండగా మేనేజ్మెంట్సంజూ వైఫల్యాలలపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందిస్తూ.. ‘‘సంజూ తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఒకే ఒక్క ఇన్నింగ్స్ అవసరం. ఫలితంగా అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన సమయంలో ఆటగాళ్లు పుంజుకునేలా చేసి.. ప్రపంచకప్ టోర్నీకి వారిని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడమే మా మొదటి ప్రాధాన్యం.సంజూ శ్రద్ధగా శిక్షణలో పాల్గొంటున్నాడు. నెట్స్‌లో ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడు’’ అని ధీమా వ్యక్తం చేశాడు. మోర్కెల్ చెప్పినట్లు సంజూ తిరిగి పుంజుకుంటే సరి.. లేదంటే అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీగా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ భర్తీ చేయడం లాంఛనమే అవుతుంది.చదవండి: ICC: పాకిస్తాన్ స్థానంలో ఉగాండా!.. ట్వీట్ వైరల్ -
దంచికొట్టిన మార్క్రమ్.. విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
టీ20 ప్రపంచకప్ 2026కి ముందు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టంది. పార్ల్ వేదికగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వికెట్ల పరంగా సౌతాఫ్రికా టీ20 చరిత్రలో విండీస్‌పై ఇదే భారీ విజయం. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో, ఆతర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటింది. బౌలింగ్‌లో జార్జ్ లిండే (4-0-25-3), కార్బిన్ బాష్ (4-0-35-2), కేశవ్ మహారాజ్ (4-0-44-2), రబాడ (4-0-35-0), మఫాకా (4-0-30-0) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. హెట్‌మైర్ (48), రోవ్‌మన్ పావెల్ (29 నాటౌట్), బ్రాండన్ కింగ్ (27), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (22) తలో చేయి వేయడంతో ఈ స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో జాన్సన్ ఛార్ల్స్ 13, మాథ్యూ ఫోర్డ్ 16, రూథర్‌ఫోర్డ్ 6, జేసన్ హోల్డర్ ఒక్క పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా సునాయాసంగా విజయతీరాలకు చేరింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (86 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించాడు. అతని ప్రిటోరియస్ (44), రికెల్టన్ (40 నాటౌట్) సహకరించారు. ఫలితంగా సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా కోల్పోయిన ఏకైక వికెట్ రోస్టన్ ఛేజ్కు దక్కింది. ఈ సిరీస్‌లోని రెండో టీ20 జనవరి 29న సెంచూరియన్ వేదికగా జరుగనుంది. -
టీమిండియాకు అతడే కీలకం: అనిల్ కుంబ్లే
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వరుణ్.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో స్పిన్ దళానికి నాయకుడిగా ఉంటాడని పేర్కొన్నాడు. మంచు ప్రభావం అతడి బౌలింగ్‌పై ప్రభావం చూపబోదని.. తడిచిన బంతితోనూ వరుణ్ (Varun Chakravarthy) అనుకున్న ఫలితం రాబట్టలగడని పేర్కొన్నాడు.మంచు ప్రభావంభారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు జరుగనుంది. ఇందుకు ఆఖరి సన్నాహకంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీగా ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 3-0తో గెలిచి.. సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మూడు మ్యాచ్‌లలోనూ మంచు ప్రభావం కనిపించింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటుతారని.. తేమ ప్రభావం వల్ల మనవాళ్లకు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లకు కష్టమే.. కానీజియోహాట్స్టార్లో మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వరల్డ్‌కప్ జరగనుంది. రాత్రి పూట మంచు ప్రభావం ఉండటం సహజం. కాబట్టి.. తడిసిన బంతితో బౌలింగ్ చేయడం స్పిన్నర్లకు కష్టమే.అయితే భారత స్పిన్నర్లకు ఇది పెద్ద ఇబ్బందేం కాకపోవచ్చు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు ఆడాడు. తడిచిన బంతితోనూ ప్రభావం చూపగల సత్తా అతడికి ఉంది. అక్షర్ పటేల్‌కు కూడా ఇదేమీ పెద్ద కష్టం కాబోదు. కుల్దీప్ ఇబ్బంది పడే అవకాశంఅయితే మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం.. తన బౌలింగ్ శైలి కారణంగా తేమ కారణంగా కాస్త ఇబ్బంది పడవచ్చు. అయినా పరిస్థితులకు తగ్గట్లు ఎలా బౌలింగ్ చేయాలో కుల్దీప్‌నకు తెలుసు’ అని కుంబ్లే అన్నాడు.టీమిండియాకు ఆ సత్తా ఉందిఅదే విధంగా.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా... వరల్డ్‌కప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తుందని కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘టీ20 ఫార్మాట్లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలవడం అంత సులువైన విషయం కాదు. ఇప్పటి వరకు ఏ జట్టూ ఆ ఫీట్ నమోదు చేయలేదు. అయితే టీమిండియాకు ఆ సత్తా ఉంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేంత బలంగా ఉంది’’ అని కుంబ్లే పేర్కొన్నాడు. చదవండి: ICC: పాకిస్తాన్ స్థానంలో ఉగాండా!.. ట్వీట్ వైరల్ -
జెమీమా రోడ్రిగ్స్‌కు భారీ షాక్
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళా జట్టు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో సారథిగా ప్రమోషన్ పొందిన ఈ టీమిండియా స్టార్.. కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోతోంది. ఇప్పటికే జెమీమా సారథ్యంలో ఈ సీజన్లో వరుస పరాజయాలు చవిచూసిన ఢిల్లీ.. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది.వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. మూడు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. మరో ఎదురుదెబ్బఇక గుజరాత్ చేతిలో ఓటమితో డీలా పడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఆమెకు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఇందుకు సంబంధించి WPL అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారీ జరిమానా‘‘వడోదరలోని బీసీఏ స్టేడియంలో మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీ రోడ్రిగ్స్‌కు జరిమానా విధించడమైనది.ఈ సీజన్లో ఇదే ఆమె మొదటి తప్పిదం కావున.. డబ్ల్యూపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టాము’’ అని WPL యాజమాన్యం పేర్కొంది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది.బ్యాటర్‌గా ఫెయిల్ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 171 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా మూడు పరుగుల తేడాతో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జెమీమా (16) నిరాశపరచగా.. నికీ ప్రసాద్ (24 బంతుల్లో 47) ఢిల్లీ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచింది.చదవండి: శుబ్‌మన్ గిల్‌కు బాగానే అర్థమైంది: రాహుల్ ద్రవిడ్ -
ICC: పాకిస్తాన్ స్థానంలో ఉగాండా!.. ట్వీట్ వైరల్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై ఐస్లాండ్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే రీతిలో పీసీబీ నాన్చుడు వ్యవహారానికి కౌంటర్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే విషయంపై త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని.. అదే సమయంలో తమను దృష్టిలో పెట్టుకోవాలంటూ సెటైరికల్‌గా విజ్ఞప్తి చేసింది.బంగ్లాదేశ్ అవుట్అసలేం జరిగిందంటే.. భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదంటూ.. తమ వేదికను మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ పంతం పట్టింది. ఇందుకు నిరాకరించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బంగ్లాదేశ్‌ను తప్పించి.. ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకువచ్చింది.ఇక బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఓటు వేసిన పాక్ బోర్డు.. తాము కూడా టోర్నీ నుంచి వైదొలుతామని బెదిరింపు ధోరణి అవలంబించింది. ఇప్పటికే పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసినా.. బంగ్లా కోసమంటూ పీసీబీ అతి చేస్తోంది. ఒకవేళ పాక్ ఇలాగే ఓవరాక్షన్ చేస్తే.. ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.పీసీబీ మేకపోతు గాంభీర్యంఅందుకే ఫిబ్రవరి 2 వరకు తమ నిర్ణయం చెబుతామంటూ పీసీబీ మరోసారి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఐస్లాండ్ క్రికెట్ సెటైరికల్ ట్వీట్‌తో ముందుకు వచ్చింది. ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్ వైరల్‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటారా? లేదా? అన్న అంశంపై పాకిస్తాన్ ఫిబ్రవరి 2 వరకు నిర్ణయం తీసుకునేలా కనిపించడం లేదు. నిజంగా ఇది చాలా అన్యాయం. ఇందులో దాచడానికి ఇంకేముంది. ఇంకా రహస్యంగా ఉంచడం సబబేనా? మా జట్టుకు పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు.ఒకవేళ మీరు ఇప్పటికే నిర్ణయం చెప్పి ఉంటే.. మా జట్టు పూర్తిస్థాయిలో సన్నాహకాలు మొదలుపెట్టేది. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శ్రమించేది. అసలే మా కెప్టెన్ ప్రొఫెషనల్ బేకర్’’ అని ఐస్లాండ్ క్రికెట్ పీసీబీని టీజ్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుండగా.. పాక్ నెటిజన్లు మాత్రం ఐస్లాండ్ క్రికెట్‌కు ఇలాంటి పోస్టులు తప్ప ఆట చేతకాదంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంఇందుకు బదులుగా తమ కెప్టెన్ ‘బేకర్’ అని.. తమ జట్టు హెడ్‌కోచ్ స్టార్టప్‌లలో ఇన్వెస్టర్ అని.. అదే విధంగా తమ చైర్మన్ షిప్ కెప్టెన్ అని.. తమ జట్టులో భిన్నత్వంలో ఏకత్వం ఉందని కౌంటర్ ఇచ్చింది.అదే జరిగితే పాకిస్తాన్ స్థానంలో ఉగాండాఇక టీమిండియా అభిమానులు మాత్రం ఐస్లాండ్ క్రికెట్‌కు మద్దతుగా.. ‘‘పాక్ కచ్చితంగా టోర్నీలో ఆడుతుంది. లేదంటే వాళ్లకు ఆర్థికంగా కష్టాలు తప్పవు. పాక్ క్రికెట్ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడుతుంది. ఇదంతా తెలిసినా కూడా తమ గురించి చర్చ జరగాలనే ఉద్దేశంతోనే పీసీబీ ఇలా నాటకాలు ఆడుతోంది’’ అని ఏకిపారేస్తున్నారు. కాగా ఒకవేళ పాక్ తప్పుకొన్నా.. ర్యాంకింగ్ ఆధారంగా ఉగాండా ఆ జట్టును భర్తీ చేస్తుంది. ఐస్లాండ్ క్రికెట్ అసలు ఐసీసీలో సభ్యదేశమే కాదు. అయితే, ఫన్నీ, సెటైరికల్ ట్వీట్లతో ఇలా అలరిస్తూ ఉంటుంది.చదవండి: టీ20 వరల్డ్‌కప్-2026: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే! -
గిల్‌కు బాగానే అర్థమైంది: రాహుల్ ద్రవిడ్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయర్‌గా ఇప్పటికైనా గిల్‌కు అందులోని కష్టం అర్థమైందని పేర్కొన్నాడు. టెస్టు ప్రాధాన్యత ఏమిటో అతడికి తెలిసివచ్చిందని.. అందుకే ఆ దిశగా మార్పుల కోసం గొంతు విప్పాడని ద్రవిడ్ అన్నాడు.ఘోర పరాభవాలుగత రెండేళ్ల కాలంలో సొంతగడ్డపై టీమిండియాకు రెండు ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత్.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలోనూ పాతికేళ్ల విరామం తర్వాత తొలిసారి 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.అందుకే ఈ చేదు అనుభవాలుఈ పరిణామాల నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్ (Shubman Gill)కు సైతం సఫారీల చేతిలో వైట్‌వాష్ రూపంలో పీడకల మిగిలింది. విరామం లేకుండా వరుస సిరీస్‌లు ఆడటం.. సరైన విధంగా సన్నద్ధం కాకపోవడం వల్లే టెస్టుల్లో చేదు అనుభవం మిగిలిందని గిల్ భావించాడు.బీసీసీఐకి ఓ విజ్ఞప్తిఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్‌కు ముందు కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని గిల్.. బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తాజాగా స్పందించాడు. బెంగళూరులో ఓ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ..గిల్‌కు బాగానే అర్థమైంది‘‘టెస్టు సన్నద్ధత గురించి శుబ్‌మన్ ఇటీవలే ఓ కీలక సలహా ఇచ్చినట్లు తెలిసింది. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా అతడికి ఈ విషయంలో అవగాహన ఉంది. ఇటీవల కాలంలో అతడు మూడు ఫార్మాట్లు ఆడుతూ బిజీగా గడిపాడు.ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్‌కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశం అతడికి ఇప్పటికి బాగా అర్థమై ఉంటుంది. సంప్రదాయ క్రికెట్లో ఉన్న కష్టం ఏమిటో అతడికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు.మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు.. వెనువెంటనే ఒక ఫార్మాట్ నుంచి మరొకదానికి మారటం కాస్త కష్టంగానే ఉంటుంది. టెస్టు సిరీస్‌కు నాలుగు రోజుల ముందు కూడా మ్యాచ్ ఆడాల్సి ఉంటే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అసలు టెస్టు మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే సమయమే దొరకదు.ప్రాక్టీస్‌తో పాటు నైపుణ్యం అవసరంగత నాలుగైదు నెలల క్రితం జరిగిన రెడ్‌బాల్ మ్యాచ్‌ల ఆధారంగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వచ్చిన విషయాన్ని గమనించాలి. ఇదే అతిపెద్ద సవాలు. టర్నింగ్ ట్రాక్స్, లేదంటే సీమింగ్ పిచ్‌ల మీద గంటల తరబడి బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ఇందుకు ప్రాక్టీస్‌తో పాటు నైపుణ్యం అవసరం’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్‌కప్-2026: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే! -
IND vs NZ: తుదిజట్టులో శ్రేయస్ అయ్యర్!
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది టీమిండియా. మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్‌లలోనూ గెలిచి.. ప్రపంచకప్ టోర్నీకి ముందు మరోసారి సత్తా చాటాలని సూర్య సేన పట్టుదలగా ఉంది.మరోవైపు.. ఐసీసీ ఈవెంట్‌కు ముందు టీమిండియాను ఒక్కసారైన నిలువరించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా బుధవారం ఇరుజట్లు నాలుగో టీ20 (IND vs NZ 4th T20I)లో తలపడనున్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా ఈ సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో.. వరల్డ్‌కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.హార్దిక్ పాండ్యా స్థానంలో..ఈ క్రమంలో చాన్నాళ్లుగా టీమిండియా తరఫున టీ20లలో పునరాగమనం చేయాలన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కల నెరవేరే అవకాశం లేకపోలేదు. హార్దిక్ పాండ్యా స్థానంలో అతడు తుదిజట్టులోకి వస్తాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైనా సంజూ శాంసన్‌కు మరొక్క అవకాశం దక్కనుంది.సంజూ కూడా సేఫ్వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం ఇటు సంజూకు.. అటు శ్రేయస్‌కు సానుకూలాంశంగా మారింది. తిలక్ స్థానంలో శ్రేయస్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఓపెనర్‌గా సంజూ విఫలం కావడం.. అదే సమయంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఆట తీరుతో ఆకట్టుకోవడంతో సంజూ స్థానం ప్రమాదంలో పడింది.ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే..ఒకవేళ తిలక్ నాలుగో టీ20తో తిరిగి వస్తే ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసి సంజూను తుదిజట్టు నుంచి తప్పించే అవకాశం ఉండేది. అయితే, ఇప్పటికి ఆ ప్రమాదం తప్పింది. తిలక్ లేకపోవడం వల్ల ఇలా సంజూ సేఫ్ కాగా.. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చే శ్రేయస్ అయ్యర్‌కు బ్యాట్ పట్టే అవకాశం రావొచ్చు.ఇక రొటేషన్‌లో భాగంగా బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుదిజట్టులోకి రావొచ్చు. అదే విధంగా.. అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకుని కుల్దీప్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా/శ్రేయస్ అయ్యర్, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా/అర్ష్‌దీప్ సింగ్.చదవండి: T20 WC 2026: పాక్ క్రికెట్‌ని నాశనం చేస్తారా?: పీసీబీపై మాజీల ఫైర్ -
T20 WC 2026: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే!
పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్లో ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి.నాలుగు గ్రూపులుగ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా (India), పాకిస్తాన్ (Pakistan), అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా (Australia), ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్-సిలో ఇంగ్లండ్ (England), వెస్టిండీస్, నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్ ఉన్నాయి. బంగ్లాదేశ్ నిష్క్రమణతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ వచ్చి చేరింది.ఇక గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై మాజీ క్రికెటర్లు తమ అంచనా తెలియజేస్తున్నారు.ఈసారి భారత్- ఆస్ట్రేలియా ఫైనల్ చేరతాయని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. తాజాగా సెమీ ఫైనలిస్టుల గురించి భారత మాజీ క్రికెటర్లు స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా తమ అంచనాలను తెలిపారు. సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే!ఇందులో భాగంగా 2007 టీ20 ప్రపంచకప్ విన్నర్ రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. టీమిండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ టాప్-4లో నిలుస్తాయని అభిప్రాయపడ్డాడు.పాకిస్తాన్ కూడా వస్తుందిఇక టీ20 వరల్డ్‌కప్-2007 విజేత ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. తన అభిప్రాయం ప్రకారం ఈసారి టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత సాధిస్తుందని పేర్కొన్నాడు. మరోవైపు.. భారత మాజీ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా.. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరతాయని జోస్యం చెప్పాడు.గత ఎడిషన్ విజేత టీమిండియాఅదే విధంగా.. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పూజారా అభిప్రాయంతో ఏకీభవించాడు. కాగా గత వరల్డ్‌కప్ ఎడిషన్ (2024)లో భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. అయితే తొలి సెమీ ఫైనల్లో అఫ్గన్‌ను సౌతాఫ్రికా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
పాక్ క్రికెట్‌ని నాశనం చేస్తారా?: పీసీబీపై మాజీల ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చి కష్టాలు కొని తెచ్చుకొంటోంది. బంగ్లాదేశ్‌కు మద్దతు పలికే క్రమంలో తమ జట్టు ప్రయోజనాలను కూడా పణంగా పెట్టేందుకు సిద్ధమైంది. వెరసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో పీసీబీ సంబంధాలు చెడిపోయే ప్రమాదం తలెత్తింది. ఐసీసీతో పెట్టుకోవద్దని వార్నింగ్ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్లేయర్లు, క్రీడాపాలకులు పీసీబీ తీరును విమర్శిస్తున్నారు. ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఫిబ్రవరి 7- మార్చి 8న మధ్య టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను తప్పించింది. బంగ్లాను తప్పిస్తూ కఠిన నిర్ణయం భారత్‌లో తమకు భద్రత లేదంటూ ఆరోపణలు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. ఐసీసీ పరిశీలనా బృందం అదేమీ లేదని తేల్చినా పంతం వీడలేదు. ఫలితంగా బంగ్లాను తప్పిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ స్థానంలో స్కాట్లాండ్ను వరల్డ్‌కప్ టోర్నీలో చేర్చింది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందని.. తాము కూడా వరల్డ్‌కప్‌లో ఆడేదీ లేనిది ఈ వారంలోగా వెల్లడిస్తామని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్ నుంచి వైదొలగాల్సిన అవసరమైతే లేదని ఆ దేశ మాజీలు అంటున్నారు. చెడగొట్టుకోవద్దు‘బంగ్లాదేశ్‌కు అండగా నిలవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వరల్డ్‌కప్‌నకు జట్టును పంపకపోవడానికి కారణమేముంది. అనవసరంగా ఐసీసీతో సంబంధాలను చెడగొట్టుకోవద్దు’ అని పీసీబీ మాజీ కార్యదర్శి ఆరిఫ్ అలీ అన్నారు.‘వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించడానికి ముందు జరిగిన సమావేశంలో బంగ్లా బోర్డుకు కేవలం పాకిస్తాన్ మాత్రమే మద్దతు తెలిపింది. అయితే బంగ్లా ప్రతిపాదనను తిరస్కరించిన ఐసీసీ వరల్డ్‌కప్ నుంచి తప్పించింది’ అని పీసీబీ మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ తెలిపారు.పాక్ క్రికెట్ తీవ్రంగా నష్టపోతుందిపాక్ మాజీ చీఫ్ సెలెక్టర్ మొహసిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘మనకు భారత్‌తో విబేధాలు ఉన్నాయి. కానీ మనం ఆడనున్న మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు వరల్డ్‌కప్ కోసం జట్టును పంపకపోవడానికి కారణమేముంది. అదే జరిగిన పాక్ క్రికెట్ తీవ్రంగా నష్టపోతుంది’ అని అన్నాడు. మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ... ‘పాకిస్తాన్ వరల్డ్‌కప్‌లో ఆడాలని కోరుకుంటున్నా. మన దగ్గర మంచి ప్లేయర్లు ఉన్నారు. మన జట్టు ప్రపంచకప్ వంటి పెద్ద వేదికలపై మెరుగైన ప్రదర్శన చేస్తుంటే చూడటం బాగుంటుంది’ అని అన్నాడు.పాకిస్తాన్ కోసంకాగా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తటస్థ వేదికలపై ఇరు జట్లు ఐసీసీ ఈవెంట్లలో తలపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆతిథ్యం ఇస్తున్నా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను మరో వేదికగా ఎంపిక చేసింది ఐసీసీ. అయితే, పీసీబీ మాత్రం ఐసీసీ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా.. బంగ్లాదేశ్ కోసమంటూ టోర్నీ నుంచి వైదొలుతామంటూ అతి చేస్తోంది. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
SL Vs ENG: హ్యారీ బ్రూక్ విధ్వంసం.. శతక్కొట్టిన రూట్
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 53 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. తద్వారా 2–1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. 2023 తర్వాత ఇదే తొలిసారికాగా 2023 తర్వాత ఇంగ్లండ్ జట్టుకు ఇదే తొలి విదేశీ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (66 బంతుల్లో 136 నాటౌట్; 11 ఫోర్లు, 9 సిక్స్‌లు), మాజీ కెప్టెన్ జో రూట్ (108 బంతుల్లో 111 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీలతో కదంతొక్కారు. జేకబ్ బెథెల్ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బెన్ డకెట్ (7), రేహాన్ అహ్మద్ (24) విఫలమవడంతో ఇంగ్లండ్ జట్టు 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా... మూడో వికెట్‌కు బెథెల్‌తో కలిసి రూట్ 126 పరుగులు జోడించాడు. 57 బంతుల్లోనే శతకంఅయితే, బ్రూక్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న పరుగుల ప్రవాహం ఒక్కసారిగా రాకెట్ వేగాన్ని అందుకుంది. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు రూట్‌తో కలిసి బ్రూక్ 113 బంతుల్లోనే 191 పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో 40 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న బ్రూక్... 57 బంతుల్లోనే శతకం ఖాతాలో వేసుకున్నాడు. శతక్కొట్టిన రూట్ మరోవైపు.. రూట్ 100 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, ధనంజయ, వండర్సే తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. పవన్ రత్నాయకే (115 బంతుల్లో 121; 12 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి పోరాటం కనబర్చాడు. 8వ ఓవర్లో క్రీజులోకి వచి్చన అతడు చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. మెరుపు అర్ధశతకంఓపెనర్ పాథుమ్ నిసాంక (25 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకంతో జట్టుకు శుభారంభం ఇవ్వగా... పవన్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. అయితే అతడికి సహచరుల నుంచి తగినంత సహకారం లభించలేదు. కమిల్ మిశ్రా (22), కుషాల్ మెండిస్ (20), కెప్టెన్ చరిత అసలంక (13), జనిత్ లియనాగె (22), దునిత్ వెల్లలాగె (22) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్, డాసన్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. బ్రూక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, రూట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: World Cup 2026: టీమిండియా ఘన విజయం -
చిచ్చర పిడుగు.. అశ్విన్ సూరజ్..
హైదరాబాద్‌కు చెందిన వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ పుల్ల అశ్విన్ సూరజ్ ఇంగ్లాండ్ పిచ్‌పై రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ క్రికెట్ సీజన్–2025లో హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో వాట్ఫోర్డ్ టౌన్ క్రికెట్ క్లబ్ తరపున 579 పరుగులు సాధించి ‘ఉత్తమ బ్యాట్స్‌మన్’ అవార్డు గెలుచుకున్నాడు. సెలవులపై స్వస్థలానికి వచ్చిన అశ్విన్ కు నగరంలోని హాట్‌స్పాట్ క్రికెట్ గ్రౌండ్లో ఘనంగా సత్కారం జరిగింది. 2017 నుంచి 2021 వరకు నోబుల్ క్రికెట్ క్లబ్‌కు కెపె్టన్‌గా వ్యవహరిస్తూ క్రమశిక్షణ, ఫిట్నెస్, నాయకత్వ లక్షణాలను తన లైఫ్ స్టైల్లో భాగం చేసుకున్నానని సూరజ్ తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఏ–డివిజన్ వన్డే లీగ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అశి్వన్, అనంతరం సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ క్రికెట్ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. సూరజ్ ఎప్పుడూ ఆటలో ప్రతిభ చూపుతూ ముందుంటూ నాయకత్వం వహిస్తాడని మెంటార్ డా.ఫహీమ్ ఉద్దిన్ ఖాజా తెలిపారు. -
విశాఖలో భారత్‌ను ఆపతరమా!
న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత భారత్ ఆ కసినంతా టి20ల్లో చూపిస్తోంది. ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయి ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకుంది. అయినా సరే ఉదాసీనతకు తావు ఇవ్వకుండా అదే జోరు కొనసాగించాలని జట్టు భావిస్తోంది. వరల్డ్ కప్‌కు ముందు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తమ బలాన్ని మరోసారి ప్రదర్శించుకునేందుకు జట్టు సిద్ధమైంది. మరోవైపు సిరీస్‌లో ఒక్క విజయంతోనైనా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తున్న కివీస్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్‌లో మరో పోరుకు రంగం సిద్ధమైంది. వైజాగ్‌లోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నేడు ఇరు జట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. సిరీస్ భారత్ సొంతమైన నేపథ్యంలో ఫలితం పరంగా ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. అయితే మరోసారి చెలరేగి ఆధిక్యాన్ని 4–0కు పెంచుకోవాలని సూర్య బృందం పట్టుదలగా ఉంది. వన్డేల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన కివీస్ టి20ల్లో పూర్తిగా చేతులెత్తేసింది. వరల్డ్ కప్‌కు ముందు ఇది ఆందోళన కలిగిస్తుండటంతో తమ లోపాలు సరిదిద్దుకోవడంపై జట్టు దృష్టి పెట్టింది. సామ్సన్‌కు చివరి చాన్స్! తొలి మూడు టి20ల్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే జట్టులో లోపాలేమీ కనిపించడం లేదు. వరల్డ్ కప్‌కు ముందు టీమ్ కూర్పుపై కూడా చాలా స్పష్టత వచ్చింది. అయితే ఓపెనర్ సంజు సామ్సన్ ఫామ్ మాత్రమే ఆందోళన కలిగిస్తోంది. గిల్‌పై వేటు వేయడంతో ఓపెనర్‌గా వరల్డ్ కప్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న సామ్సన్ తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 10, 6, 0 పరుగుల తర్వాత అతనిపై తీవ్ర ఒత్తిడి ఉంది. తిలక్ వర్మ గాయంతో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్‌లలో చెలరేగిపోయాడు. తిలక్ తిరిగి వస్తే ఇషాన్ ఓపెనర్‌గా వెళితే సామ్సన్‌పై వేటు వేయడం ఖాయం. అదృష్టవశాత్తూ తిలక్ కోలుకోకపోవడంతో సామ్సన్‌కు మరో రెండు అవకాశాలు దక్కుతున్నాయి కాబట్టి అతను దీనిని వాడుకొని భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మరోవైపు అభిషేక్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌ను నిలువరించడం కివీస్ వల్ల కావడం లేదు. భారత అభిమానుల కోణంలో చూస్తే అభిషేక్ ఇంకా ఎంతగా విధ్వంసం సృష్టిస్తాడనేదే ప్రస్తుతం చర్చనీయాంశం. గత మ్యాచ్‌లో అతనితో పాటు సూర్య కూడా చెలరేగిపోవడంతో అతి సులువుగా భారత్ గెలిచింది. పాండ్యా, దూబే, రింకూ తమ స్థాయిలో సత్తా చాటుతుండటంతో భారత్ తిరుగులేని జట్టుగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో రొటేషన్‌లో ఆటగాళ్లను ప్రయతి్నంచే క్రమంలో మరోసారి బుమ్రాకు విశ్రాంతిచ్చే అవకాశం ఉంది. బుమ్రా, బిష్ణోయ్ స్థానాల్లో అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి రావడం ఖాయం. రెండు మార్పులతో... న్యూజిలాండ్ పరిస్థితి చూస్తే ఏ ఆటగాడు కూడా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించేలా కనిపించడం లేదు. ఒక్కో మ్యాచ్‌కు జట్టు ప్రదర్శన మరింత పేలవంగా మారుతూ వచ్చింది. తొలి పోరులో 190 పరుగులు చేసి కాస్త పోటీనిచ్చినట్లు కనిపించినా...ఆ తర్వాత భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో... 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించడం కివీస్ పరిస్థితిని చూపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమ్‌లో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాబిన్సన్, క్లార్క్ స్థానాల్లో పేసర్ ఫెర్గూసన్, ఆల్‌రౌండర్ నీషమ్ తుది జట్టులోకి వస్తారు. గాయం నుంచి కోలుకున్న తమ ప్రధాన పేసర్ ఫెర్గూసన్ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగలడని కివీస్ ఆశిస్తోంది. మూడు మ్యాచ్‌లలో కలిపి జట్టు నుంచి ఒకే ఒక అర్ధసెంచరీ నమోదైంది. ఫిలిప్స్ మాత్రమే ఫర్వాలేదనిపించగా, వన్డేల్లో చెలరేగిన మిచెల్ ఇక్కడ ప్రభావం చూపలేకపోతున్నాడు. కెపె్టన్ సాంట్నర్ కూడా విఫలమయ్యాడు. శుభారంభాలు లేకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. టీమ్ బౌలింగ్ చెత్తగా కనిపిస్తోంది. టీమ్‌లో ఒక బౌలర్ నమోదు చేసిన అతి తక్కువ ఎకానమీ 10 ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితి నుంచి కివీస్ ఎలా కోలుకుంటుందనేది కీలకం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, దూబే, రింకూ, హర్షిత్, కుల్దీప్, అర్ష్ దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), సీఫెర్ట్, కాన్వే, రచిన్, ఫిలిప్స్, మిచెల్, చాప్మన్, నీషమ్, హెన్రీ, ఫెర్గూసన్, సోధి. పిచ్, వాతావరణంబ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌తో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావం కూడా కాస్త ఉండవచ్చు. ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్ 3 గెలిచి ఒకటి ఓడింది. 2023 నవంబర్‌లో ఆఖరి మ్యాచ్ జరగ్గా... ఆసీస్‌పై 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో ఛేదించింది. -
గుజరాత్‌ను గెలిపించిన సోఫీ డివైన్
వడోదర: అప్పుడు ముంబైలో... ఇప్పుడు వడోదరలో... ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్‌ల మధ్య ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన పోరులో గుజరాతే పైచేయి సాధించింది. ఈ రెండు సందర్భాల్లోనూ సోఫీ డివైన్ చివరి ఓవరే గెలవాల్సిన ఢిల్లీని ఓడించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జెయింట్స్ 3 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (58; 7 ఫోర్లు) రాణించింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి (4/31) తిప్పేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడింది. ఢిల్లీ విజయానికి ఆఖరి 24 బంతుల్లో 60 పరుగులు కావాల్సిన దశలో నికీ ప్రసాద్ (24 బంతుల్లో 47; 9 ఫోర్లు), స్నేహ్ రాణా (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. డివైన్ 17వ ఓవర్లో 23 పరుగులు, గార్డ్నర్ 19వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. దాంతో ఢిల్లీ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాలి. కానీ సోఫీ డివైన్ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నికీ, స్నేహ్‌లను అవుట్ చేయడంతో గుజరాత్ ఓటమి కోరల్లోంచి బయటపడి గెలిచింది. నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టుతో యూపీ వారియర్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) జెమీమా (బి) నందిని 58; సోఫీ డివైన్ (బి) కాప్ 13; అనుష్క (సి) మిన్నుమణి (బి) శ్రీచరణి 39; గార్డ్నర్ (సి) స్నేహ్ రాణా (బి) మిన్నుమణి 2; వేర్హమ్ (బి) శ్రీచరణి 11; భారతి (బి) చినెల్లి హెన్రీ 3; కనిక (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 4; కాశ్వీ (బి) శ్రీచరణి 2; తనూజ (సి) శ్రీచరణి (బి) చినెల్లి హెన్రీ 21; రేణుక (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–19, 2–73, 3–96, 4–128, 5–131, 6–135, 7–139, 8–151, 9–174. బౌలింగ్: కాప్ 4–0–34–1, చినెల్లి 4–0–38–2, నందిని 4–0– 26–1, శ్రీచరణి 4–0–31–4, స్నేహ్ రాణా 1–0– 11–0, మిన్ను మణి 3–0–23–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) గార్డ్నర్ (బి) రాజేశ్వరి 14; లిజెల్లీ (సి) గార్డ్నర్ (బి) సోఫీ 11; వోల్వార్డ్ (బి) రాజేశ్వరి 24; జెమీమా (బి) సోఫీ 16; కాప్ (బి) గార్డ్నర్ 0; చినెల్లి (సి) గార్డ్నర్ (బి) రాజేశ్వరి 9; నికీ ప్రసాద్ (సి) గార్డ్నర్ (బి) డివైన్ 47; స్నేహ్ రాణా (సి) వేర్హమ్ (బి) సోఫీ 29; మిన్ను మణి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–26, 2–51, 3–82, 4–83, 5–85, 6–100, 7–170, 8–171. బౌలింగ్: రేణుక 1–0–16–0, కాశ్వీ గౌతమ్ 2–0–18–0, రాజేశ్వరి 4–0–20–3, సోఫీ డివైన్ 4–0–37–4, తనూజ 4–0–26–0, ఆష్లే గార్డ్నర్ 4–0–37–1, వేర్హమ్ 1–0–12–0. -
World Cup 2026: టీమిండియా ఘన విజయం
అండర్ 19 ప్రపంచకప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ సిక్స్‌కు చేరిన యంగ్ ఇండియా.. ఈ దశలోనూ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.బులవాయో వేదికగా ఇవాళ (జనవరి 27) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 204 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఒడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విహాన్ మల్హోత్రా (109 నాటౌట్) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది.చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు. ఆఖర్లో ఖిలన్ పటేల్ (12 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 350 పరుగుల మార్కును దాటింది.మిగతా ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుశ్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్, కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్ పటేల్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో 37.4 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. లీరాయ్ (62), కియాన్ బ్లిగ్నాట్ (37), టటెండ చిముగోరో (29) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఉధవ్ మోహన్, ఆయుశ్ మాత్రే తలో 3 వికెట్లు పడగొట్టగా.. అంబ్రిష్ 2, హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ చెరో వికెట్ తీశారు. సూపర్ సిక్స్‌లో భారత్ నెక్స్ట్ టార్గెట్ దాయాది పాకిస్తాన్. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా జరుగనుంది. -
టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్
మద్యం మత్తులో కారు యాక్సిడెంట్ చేసిన కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ జేకబ్ మార్టిన్ అరెస్ట్ అయ్యాడు. ఇవాళ (జనవరి 27) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతను వడోదర నగరంలో మూడు వాహనాలను ఢీకొట్టాడు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో జేకబ్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు.జేకబ్ తన ఎంజీ హెక్టార్ కారుతో హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సిలేరియో, కియా సెల్టోస్ కార్లను ఢీకొట్టాడు. మద్యంపై ఉండటంతో నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు కేసు కట్టారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.పోలీసులు జేకబ్ను అదుపులోకి తీసుకొని, భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటర్ వెహికిల్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. కొద్ది గంట్లోనే జేకబ్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. కానీ, కారు పోలీసుల ఆధీనంలోనే ఉంది.53 ఏళ్ల జేకబ్ మార్టిన్ 1999-2001 మధ్యలో భారత్ తరఫున 10 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా, దేశీయ క్రికెట్లో (బరోడా, రైల్వేస్, అస్సాం) అతనికి మంచి రికార్డు ఉంది. 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23 శతకాల సాయంతో 9192 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలోనూ 2948 పరుగులు (3 సెంచరీలు) చేశాడు. జేకబ్ బరోడా కెప్టెన్‌గా కూడా సేవలందించాడు.కుడి చేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ కమ్ ఆఫ్ స్పిన్నర్ కూడా అయిన జేకబ్ దేశవాలీ కెరీర్లో 19 వికెట్లు తీశాడు. క్రికెటర్‌గా కెరీర్ ముగిసిన తర్వాత జేకబ్ జీవితం వివాదాలు, ప్రమాదాలతో నిండిపోయింది. 2011లో అక్రమ ఇమ్మిగ్రేషన్ రాకెట్ కేసులో అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతని ఊపిరితిత్తులు, కాలేయానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో జేకబ్ కుటుంబానికి బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, కృనాల్ పాండ్యా వంటి వారు ఆర్థిక సహాయం చేశారు. -
వన్డేల్లోనూ కొనసాగుతున్న రూట్ సెంచరీల పర్వం
ఈ జనరేషన్లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరని అడిగితే.. కొద్ది రోజుల కిందటి వరకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు క్రికెట్ అభిమానులు ఇబ్బంది పడేవారు. ఎందుకంటే, ఫాబ్ ఫోర్‌గా పిలువబడే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ మధ్య అత్యుత్తమ బ్యాటర్ అనిపించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉండేది. వీరంతా ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ, ఏ ఒక్కరికీ అత్యుత్తమ బ్యాటర్ అనే కీర్తి దక్కకుండా పోటీపడేవారు.అయితే గత కొద్ది రోజులగా ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. అత్యుత్తమ బ్యాటర్ అనిపించుకునేందుకు జో రూట్ సోలోగా ముందుకొస్తున్నాడు. సహచరులు విరాట్, స్టీవ్, కేన్‌ను వెనక్కు నెడుతూ తానే అత్యుత్తమ బ్యాటర్‌నంటూ బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు. విరాట్ (37), స్టీవ్ (36), కేన్ (35) వయసు మీద పడటంతో ఏదో ఒక ఫార్మాట్‌కు/ఫార్మాట్లకు పరిమితం కాగా.. రూట్ (35) కూడా వారి ఏజ్ గ్రూప్‌లోనే ఉన్నా, మూడు ఫార్మాట్లలో కొనసాగుతూ టెస్ట్, వన్డే ఫార్మాట్లలో అత్యుత్తమంగా సత్తా చాటుతున్నాడు. రూట్ మినహా ఫాబ్‌లోని మిగతా ముగ్గురు ఏదో ఒక ఫార్మాట్లో మాత్రమే రాణిస్తున్నారు.టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ వన్డేల్లో దూసుకుపోతుండగా.. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్ టెస్ట్‌ల్లో మాత్రమే సత్తా చాటుతున్నాడు. కేన్ విషయానికొస్తే.. ఇటీవలికాలంలో ఫాబ్-4లో బాగా వెనుకపడిపోయింది ఇతనే. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్.. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతున్నా, ఏ ఒక్క ఫార్మాట్‌కు న్యాయం చేయలేకపోతున్నాడు.రూట్ పరిస్థితి మాత్రం పై ముగ్గురికి భిన్నంగా ఉంది. ఇతను ఏ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండా మూడు ఫార్మాట్లలోనూ కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్, వన్డే ఫార్మాట్లలో అకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో యంగస్టర్లకు సైతం పోటీగా మారాడు.ఇటీవలికాలంలో టెస్ట్, వన్డేల్లో రూట్ ప్రదర్శనలు చూస్తే ఔరా అనక మానదు. గత ఆరేడేళ్ల కాలంలో అతను పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఫాబ్-4లోని మిగతా ముగ్గురికి అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్‌ల్లో రూట్‌కు కల్లెం వేయడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఈ మధ్యకాలంలో అతను ఏకంగా 22 సెంచరీలు బాదాడు. వన్డేల్లో కెరీర్ ముగిసిందనుకున్న దశలో ఈ ఫార్మాట్లోనూ రూట్ మెరుపులు ప్రారంభమయ్యాయి. చాలాకాలం సైలెంట్‌గా ఉన్న అతను.. ఈ మధ్యకాలంలో ఈ ఫార్మాట్లోనూ మూడు, నాలుగు సెంచరీలు చేశాడు.తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రూట్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలతో సర్దుకున్న అతను.. ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సూపర్ సెంచరీతో మెరిశాడు. రూట్‌కు వన్డేల్లో ఇది 20వ సెంచరీ. ఓవరాల్‌గా 61వది. ప్రస్తుత తరం బ్యాటర్లలో విరాట్ కోహ్లి (85) మాత్రమే రూట్ కంటే ముందున్నాడు.వాస్తవానికి విరాట్, స్టీవ్, కేన్ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు రూట్ చాలా వెనుకపడి ఉండేవాడు. వారికి రూట్‌కు పదుల సంఖ్యలో సెంచరీల వ్యత్యాసం ఉండేది. వారంతా రూట్ కంటే చాలా ముందుండే వారు. అయితే ఐదేళ్లలో సీన్ మొత్తం తలకిందులైంది. అతను స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌ను వెనక్కు నెట్టి విరాట్‌తో పోటీపడుతున్నాడు. వాస్తవానికి విరాట్ కూడా టెస్ట్‌ల్లో రూట్ ముందు దిగదుడుపే. నంబర్ల విషయంలో అతన్ని రూట్ ఎప్పుడో దాటేశాడు. ఇక టెస్ట్‌ల్లో రూట్ ముందున్న ఏకైక టార్గెట్ సచిన్ టెండూల్కర్ మాత్రమే. రూట్ తర్వలోనే సచిన్ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వన్డేల్లోనూ రూట్ జోరు ఇలాగే కొనసాగితే విరాట్ సెంచరీల సంఖ్య దాటడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
కనికరం లేని బ్రూక్.. లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు..!
కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 27) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదాడు. మరో ఎండ్‌లో జో రూట్ కూడా బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. వీరిద్దరి ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది.జేకబ్ బేతెల్ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) ఔటయ్యాక 31.1వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్ తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు. పడ్డ బంతిని పడ్డట్టు బౌండరీ లేదా సిక్సర్‌కు తరలించాడు. బ్రూక్ విధ్వంసాన్ని తట్టుకోలేక లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓ పక్క బ్రూక్ చెలరేగుతుంటే రూట్ నిదానంగా తన 20వ వన్డే శతకాన్ని (100 బంతుల్లో), 61వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేశాడు.కఠినమైన పిచ్‌పై వీరిద్దరు నాలుగో వికెట్‌కు 113 బంతుల్లో అజేయమైన 191 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 42 ఓవర్ల తర్వాత 38 పరుగులుగా (32 బంతుల్లో) ఉండిన బ్రూక్ స్కోర్ 50 ఓవర్ ముగిసే సరికి 66 బంతుల్లో అజేయమైన 136 పరుగులైంది. దీన్ని బట్టి చూస్తే బ్రూక్ విధ్వంసం ఏ రేంజ్లో కొనసాగిందో అర్దమవుతుంది. చివరి 8 ఓవర్లలో బ్రూక్ 34 బంతులు ఎదుర్కొని ఏకంగా 98 పరుగులు బాదాడు. బ్రూక్ ఇన్నింగ్స్‌లో మొత్తం 11 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.మరోవైపు బాధ్యతాయుతంగా సెంచరీ పూర్తి చేసిన రూట్.. జోరు మీదున్న బ్రూక్‌కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తూ అజేయమైన 111 పరుగుల వద్ద (108 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్) ఇన్నింగ్స్‌ను ముగించాడు. మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లలో రెహాన్ అహ్మద్ 24, బెన్ డకెట్ 7 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, హసరంగ, వాండర్సే తలో వికెట్ తీశారు. వెల్లాలగే (10-0-49-0), లియనగే (3-1-7-0) మినహా మిగతా లంక బౌలర్లందరినీ బ్రూక్ ఆటాడుకున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే శ్రీలంక గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
World Cup 2026: టీమిండియా భారీ స్కోర్
జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్-2026లో ఇవాళ (జనవరి 27) యంగ్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్, ఆతిథ్య జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్ (352-8) చేసింది.మిడిలార్డర్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా బాధ్యతాయుతమైన సెంచరీతో (107 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు) చెలరేగగా.. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు.ఆఖర్లో ఖిలన్ పటేల్ (12 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 350 పరుగుల మార్కును దాటింది. మిగతా ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుశ్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్, కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్ పటేల్ ఓ వికెట్ తీశారు.కాగా, గ్రూప్ దశలో భారత్ వరుసగా యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించింది. సూపర్ సిక్స్‌లో భాగంగానే భారత్ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్ దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
విండీస్ వీరుడి విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే శతకం
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ పేరిట భారత్‌లో అరంగేట్రం చేసిన ఈ లీగ్.. నిన్ననే (జనవరి 26) మొదలైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.పది రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఢిల్లీ వారియర్స్‌కు ఆడుతున్న విండీస్ ఆటగాడు చాడ్విక్ వాల్టన్ కేవలం 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఫలితంగా అతని జట్టు దుబాయ్ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. పీటర్ ట్రెగో (60), కిర్క్ ఎడ్వర్డ్స్ (41), అంబటి రాయుడు (36), కెప్టెన్ శిఖర్ ధవన్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూసఫ్ పఠాన్ (2), రిషి ధవన్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వారియర్స్ బౌలర్లలో సుభోత్ భాటి 3, హర్భజన్ సింగ్ 2, ఇసురు ఉడాన ఓ వికెట్ తీశారు.అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ సునాయాసంగా ఛేదించింది. చాడ్విక్ వాల్టన్ (62 బంతుల్లో 128; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో వారియర్స్‌ను కేవలం 16.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఓపెనర్ శ్రీవట్స్ గోస్వామి (56) సహకరించాడు. వారియర్స్ కోల్పోయిన ఏకైక వికెట్ పియుశ్ చావ్లాకు దక్కింది. -
ఆ మరుక్షణమే రిటైర్మెంట్: కేఎల్ రాహుల్
టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్పై తొలిసారి నోరు విప్పాడు. గతంలో చాలాసార్లు ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచన వచ్చిందని.. తన విషయంలో రిటైర్మెంట్ కష్టతరంగా ఉండబోదని వ్యాఖ్యానించాడు. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్.. 2014లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇప్పటి వరకు 67 టెస్టులు, 94 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్.. టెస్టుల్లో 4053, వన్డేల్లో 3360, టీ20లలో 2265 పరుగులు సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో టెస్టుల్లో 11 సెంచరీలు, వన్డేల్లో 8 శతకాలు, టీ20లలో రెండు సెంచరీలు ఉన్నాయి.వికెట్ కీపర్గానూటీమిండియా తరఫున ప్రస్తుతం టెస్టు, వన్డే జట్లలో కీలకంగా ఉన్న 33 ఏళ్ల కేఎల్ రాహుల్ (KL Rahul).. యాభై ఓవర్ల ఫార్మాట్లో వికెట్ కీపర్‌గానూ సేవలు అందిస్తున్నాడు. అయితే, గతంలో ఈ మంగళూరు ప్లేయర్ చాలాసార్లు గాయాల బారిన పడ్డాడు. అదే విధంగా.. నిలకడలేమి ఆట తీరు కారణంగా ఓపెనర్‌గా ఉన్న అతడు మిడిలార్డర్‌కు డిమోట్ అయ్యాడు. మరికొన్నిసార్లు తిరిగి ఓపెనర్‌గా వచ్చాడు.మరుక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తాప్రస్తుతానికి జట్టులో కేఎల్ రాహుల్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీలేదు. అయితే, తన అవసరం టీమ్‌కు లేదని భావించిన మరుక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తానంటూ తాజాగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ముచ్చటిస్తూ..‘‘రిటైర్మెంట్ (Retirement) గురించి నేనెప్పుడో ఆలోచించాను. నా విషయంలో ఇది మరీ అంత కష్టంగా ఉండబోదు. మన పట్ల నిజాయితీగా ఉంటే.. రిటైర్మెంట్కు సరైన సమయం ఏమిటో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా నాన్చాల్సిన పని ఉండదు.ఇంకాస్త సమయం ఉందినేనైతే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నా రిటైర్మెంట్కు ఇంకాస్త సమయం ఉంది. అయితే, ఆటను వదిలేయాలని అనిపించినపుడు ఆ దిశగా నిర్ణయం తీసుకోవడమే మంచిది.క్రికెట్ ఒక్కటే జీవితం కాదు. మనకంటూ ఓ కుటుంబం ఉంటుంది. నాకు కూతురు పుట్టిన తర్వాత ఒక్కసారిగా నా దృష్టి కోణం మారిపోయింది. జీవితంలో మరెన్నో ముఖ్య విషయాలు ఉంటాయి. ఏదేమైనా ఆటకు నా అవసరం లేదని అనిపించిన మరుక్షణం నేను తప్పుకొంటా.నేను లేకపోయినా దేశంలో, ప్రపంచంలో క్రికెట్ కొనసాగుతూనే ఉంటుంది. గతంలో నేను చాలాసార్లు గాయపడ్డాను అప్పుడు మనతో మనం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఫిజియో, సర్జన్ల వల్ల మన శరీరానికి నొప్పి కలగవచ్చు.మానసిక స్థితి బలహీనపడుతుందిఅయితే, ఆ సమయంలో మన మానసిక స్థితి బలహీనపడిపోతుంది. ఇంకెన్నాళ్లు ఇలా.. ఇక చాలు అని మెదడు చెబుతుంది. అదృష్టవశాత్తూ క్రికెట్ వల్ల మనం ఎక్కువగా డబ్బు సంపాదించగలం. కాబట్టి ఆటను వదిలినా పెద్దగా నష్టమేమీ లేదు.. ఇంకొన్నాళ్లు జీవితం సాఫీగా సాగించవచ్చు అని సంకేతాలు ఇస్తుంది. ఇలాంటి మానసిక స్థితిని అధిగమిస్తేనే మళ్లీ మనం మైదానంలోకి దిగగలము’’ అని కేఎల్ రాహుల్ తన మనసులోని భావాలను వెల్లడించాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కేఎల్ రాహుల్ చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!An Incredibly Honest KL Rahul On Retirement 💭 pic.twitter.com/8LJcxVLpnG— The Switch | Kevin Pietersen (@kptheswitch) January 26, 2026 -
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
2026 టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం వంటి గందరగోళాల మధ్య షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న గత ఎడిషన్ రన్నరప్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత-ఏ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుండటం విశేషం. చిన్న జట్లు యూఎస్ఏ, నమీబియాకు ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. ఫిబ్రవరి 2న భారత-ఏ జట్టు నవీ ముంబై వేదికగా యూఎస్ఏతో తలపడనుంది. 6న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో నమీబియాను ఢీకొట్టనుంది. మొత్తంగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు 16 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఫిబ్రవరి 2ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)కెనడా వర్సెస్ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 3శ్రీలంక-ఏ వర్సెస్ ఒమన్ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)నెదర్లాండ్స్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)నేపాల్ వర్సెస్ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)ఫిబ్రవరి 4నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 5ఒమన్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)కెనడా వర్సెస్ నేపాల్ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 6ఇటలీ వర్సెస్ యూఎస్ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)ఈ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ మెయిన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ 34 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. 2008-09 సీజన్లో లిస్ట్-ఏ మ్యాచ్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రిచర్డ్సన్, 2013లో శ్రీలంకతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి 25 వన్డేలు, 36 టీ20లు ఆడి మొత్తంగా 84 వికెట్లు పడగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా తమ తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించడంతో రిచర్డ్సన్ భాగస్వామ్యం ప్రత్యేకంగా గుర్తించదగ్గది.అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే రిచర్డ్సన్కు బిగ్‌బాష్ లీగ్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్ ప్రతి ఎడిషన్‌లోనూ ఆడిన అతి తక్కువ మంది (అరుగురు) ఆటగాళ్లలో రిచర్డ్సన్ ఒకరు. మొదట ఆడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆరు సీజన్లు ఆడిన ఆయన, 2017-18లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌కి మారి ఎనిమిది సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చివరిగా 2025-26 సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాడు. బీబీఎల్ కెరీర్లో 142 వికెట్లు తీసిన రిచర్డ్సన్.. లీగ్ చరిత్రలో ఐదో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు.రిచర్డ్సన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు, బిగ్‌బాష్ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ ఆయన తన ప్రతిభను (15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు) చూపించాడు. డెత్ ఓవర్లలో తన వేరియేషన్స్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్‌గా రిచర్డ్సన్కు మంచి గుర్తింపు ఉంది. -
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ-2026లో భారత జట్టు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో భాగంగా యూఏఈపై రెండు పరుగులే చేసి విఫలమైన ఈ లెఫ్టాండర్.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్ (72)తో ఫామ్‌లోకి వచ్చాడు.తొలుత బ్యాటింగ్చివరగా న్యూజిలాండ్‌పై 23 బంతుల్లో 40 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. తాజాగా జింబాబ్వేపై ప్రతాపం చూపాడు. బులవాయో వేదికగా మంగళవారం నాటి వన్డేలో టాస్ ఓడిన భారత్... ఆతిథ్య జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.వైభవ్ ధనాధన్‌ఈ క్రమంలో భారత ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే, ఆరోన్ 16 బంతుల్లో 23 పరుగులు చేసి జోరు మీదున్న వేళ జింబాబ్వే పేసర్ పనాషే మజాయ్ షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్ బాదే క్రమంలో ఆరోన్.. సింబరెషెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.దీంతో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను వైభవ్ సూర్యవంశీ తీసుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో.. కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ పద్నాలుగేళ్ల బ్యాటర్. 52 పరుగులు చేసిమొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 52 పరుగులు చేసి నిష్క్రమించాడు. టటెండ చిముగొరొ బౌలింగ్‌లో సింబరెషెకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా ఆయుశ్ మాత్రే (21) రూపంలో జింబాబ్వే రెండో వికెట్ దక్కించుకుంది. కాగా ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన భారత్‌కు.. సూపర్ సిక్స్ దశలో ఇదే తొలి మ్యాచ్. తుదిజట్లుభారత్ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, కనిష్క్ చౌహాన్, ఆర్ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, ఉద్ధవ్ మోహన్.జింబాబ్వేనథానియల్ హ్లబంగానా (వికెట్ కీపర్), టకుడ్జ్వా మకోని, కియాన్ బ్లిగ్నాట్, వెబ్‌స్టర్ మధిధి, ధ్రువ్ పటేల్, లీరోయ్ చివౌలా, సింబరెషె మడ్జెంగెరెరే (కెప్టెన్), బ్రాండన్ సెంజెర్, మైఖేల్ బ్లిగ్నాట్, టాటెండ చిముగోరో, పనాషే మజాయ్.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!𝙒𝙞𝙙𝙩𝙝 𝙤𝙣 𝙤𝙛𝙛𝙚𝙧, & Vaibhav Sooryavanshi accepted it with interest! 🤌Team India are off to a flying start💥#ICCMensU19WC | #INDvZIM 👉 LIVE NOW ➡️ https://t.co/ty11gF03Wh pic.twitter.com/tEXWCDWeuA— Star Sports (@StarSportsIndia) January 27, 2026 -
స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టుకు మరో ఓటమి ఎదురైంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి ముందుగానే ప్లే ఆఫ్స్ చేరిన స్మృతి మంధాన సేన జోరుకు ఆ తర్వాత బ్రేక్ పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో తొలి ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలోనూ పరాజయం పాలైది.రిచా ఘోష్ భేష్‌ఈ నేపథ్యంలో ఓటమి స్పందిస్తూ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఆటను మేమంతా ఆస్వాదించాము. నదైన్ డిక్లెర్క్ కూడా తన వంతు ప్రయత్నం చేసింది. నాట్ వరల్డ్‌క్లాస్ ప్లేయర్. ఒకచోట పడిన బంతిని మూడు వేర్వేరు విధాలుగా షాట్లు బాదగల సత్తా ఆమెకు ఉంది.నాట్ మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పేసింది. అద్భుతంగా ఆడి జట్టును గెలిపించుకుంది. అయితే, ఈ రోజు మా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. తొలి ఐదు మ్యాచ్‌లలో మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. కానీ రోజు మా వాళ్లు సరైన రీతిలో బౌలింగ్ చేయలేదు. టీ20 క్రికెట్లో ఇలాంటివి సహజమే.మా బౌలర్లు విఫలమయ్యారుకొన్నిసార్లు మన వ్యూహాలు బెడిసికొడతాయి. ఏదేమైనా లారెన్ బెల్ కొత్త బంతితో అద్బుతంగా ఆడింది. ఆ తర్వాత తిరిగి వచ్చి కూడా తన వంతు సహకారం అందించింది. కానీ మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా ఈరోజు సరిగ్గా ఆడలేదు. నదైన్ మాత్రం రెండు కష్టతరమైన ఓవర్లను అద్భుతంగా వేసింది’’ అని పేర్కొంది. ముంబై చేతిలో తమ ఓటమికి బౌలర్లే కారణమని స్మృతి మంధాన విశ్లేషించింది.కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ నాట్ సివర్ బ్రంట్ (57 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు శతకం బాదింది. తద్వారా వడోదరలో సోమవారం జరిగిన పోరులో ముంబై 15 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఓడింది. రిచా ఘోష్ (50 బంతుల్లో 90; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మాత్రమే చివరి వరకు వీరోచిత పోరాటం చేసింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటైంది. చదవండి: WPL 2026: చరిత్ర సృష్టించిన నాట్ సివర్ బ్రంట్.. తొలి ప్లేయర్‌గా -
ICC: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగేలా మరో షాక్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మొండి వైఖరి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండుసార్లు అవకాశం ఇచ్చినా తీరు మార్చుకోని కారణంగా.. బంగ్లా జట్టును టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి తప్పించారు.ఆటగాళ్లతో పాటు వారికీ సెగబంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ నిర్ణయాల కారణంగా ప్రపంచకప్ ఆడాలన్న ఆటగాళ్ల కల ఈసారికి దూరమైంది. అంతేకాదు.. ఆ సెగ బంగ్లాదేశ్ జర్నలిస్టులకు కూడా తగిలినట్లు తెలుస్తోంది. భారత్- శ్రీలంక (India- Sri Lanka)వేదికలుగా జరిగే వరల్డ్‌కప్ టోర్నీ కవరేజ్ కోసం వంద మందికి పైగా జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.అయితే, ఐసీసీ మాత్రం వీరి దరఖాస్తులు, అభ్యర్థనలను తిరస్కరించినట్లు (Were Denied visa and Accreditation) సమాచారం. దీంతో ఈసారి బంగ్లా జర్నలిస్టులు ఈ టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఆజ్‌కర్ ప్రతిక స్పోర్ట్స్ ఎడిటర్ రానా అబ్బాస్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.చాలా బాధగా ఉంది‘‘బంగ్లాదేశ్‌లో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటన జరుగలేదు. 1999లో బంగ్లా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఆడేకంటే ముందు నుంచే బంగ్లాదేశీ జర్నలిస్టులు ఈ ఈవెంట్‌ను కవర్ చేస్తున్నారు. భారత్- పాకిస్తాన్ వంటి కీలక మ్యాచ్‌లు.. ముఖ్యంగా భారత్‌లో జరిగిన మ్యాచ్‌లను కూడా కవర్ చేశారు.గతంలో ఎప్పుడూ ఇలా అందరు కరస్పాండెంట్ల దరఖాస్తులను తిరస్కరించిన దాఖలాలు లేవు. ఇదొక దురదృష్టకర ఘటన. నాకైతే చాలా బాధగా ఉంది’’ అని రానా అబ్బాస్ విచారం వ్యక్తం చేశాడు.దెబ్బ అదుర్స్ కదూ!ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ ఐసీసీ అధికారి స్పందన కోరగా.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత్‌లో తమ వాళ్లకు రక్షణ ఉండదని బంగ్లాదేశ్ ప్రభుత్వం పదే పదే వాదించింది. అందుకే వాళ్లకు వీసాలు, అక్రిడేషన్లు ఇవ్వలేదు’’ అంటూ ఇచ్చిపడేశారు సదరు అధికారి. అయితే, నిబంధనల ప్రకారం నలభై మందికి మించకుండా అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.చెప్పినా వినలేదుకాగా తమ ఆటగాళ్లకు భారత్ సురక్షితం కాదని.. వేదికను శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీని ఆశ్రయించింది. అయితే, పరిశీలనా బృందం నివేదిక మేరకు భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చింది ఐసీసీ. అయితే, బీసీబీ మాత్రం పట్టువీడలేదు. వేదిక మార్చకుంటే టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.ఈ నేపథ్యంలో ఆఖరి అవకాశం ఇచ్చినా బీసీబీ తీరు మారకపోవడంతో.. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. తాజాగా బీసీబీ చెప్పిన సాకునే కారణంగా చూపుతూ జర్నలిస్టులకు వీసాలు నిరాకరించినట్లు సమాచారం.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
T20 WC: పాపం బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ సానుభూతి
అనూహ్య పరిస్థితుల్లో స్కాట్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం స్కాట్లాండ్ పాలిట వరంగా మారింది. ర్యాంకుల ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ జట్టును ప్రపంచకప్ టోర్నీలో చేర్చింది.రిచీ బెరింగ్టన్ సారథ్యంలోఈ నేపథ్యంలో స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్ టోర్నీ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రిచీ బెరింగ్టన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జైనుల్లా ఎహ్సాన్కు తొలిసారి జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్‌లో జన్మించిన ఈ ఫాస్ట్‌బౌలర్ ఇటీవలే స్కాట్లాండ్ తరఫున ఆడేందుకు అర్హత సాధించాడు.న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైతంఅంతేకాకుండా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు టామ్ బ్రూస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. అతడి రాకతో స్కాటిష్ జట్టు బ్యాటింగ్ లైనప్ బలపడినట్లయింది. 34 ఏళ్ల టామ్ న్యూజిలాండ్ తరఫున 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.ఇదిలా ఉంటే.. స్కాట్లాండ్ టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగం కానుండటం ఇది ఏడోసారి. అయితే, ఈసారి ఈ యూరోపియన్ జట్టు నేరుగా అర్హత సాధించకుండా.. బంగ్లాదేశ్‌ను ఐసీసీ తొలగించడం ద్వారా తమ ర్యాంకు ఆధారంగా క్వాలిఫై అయింది.బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల సానుభూతిఈ విషయంపై క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్బ్లేడ్ స్పందించారు. బంగ్లాదేశ్ జట్టు పట్ల తమకు సానుభూతి ఉందని ఆమె తెలిపారు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఈ విధంగా వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొనాలని మేము అనుకోలేదు.క్వాలిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఈవెంట్లో అడుగుపెట్టాలని భావించాము. అయితే, అనుకోని విధంగా మాకు ఆహ్వానం వచ్చింది. ఏదేమైనా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల మాకు సానుభూతి ఉంది. వారి విషయంలో జరిగిన దానికి మేము చింతిస్తున్నాం’’ అని ట్రూడీ తెలిపారు.మేమేమీ తక్కువ కాదుఅయితే, తమ జట్టు కూడా తక్కువేమీ కాదని.. ప్రపంచంలో తాము పద్నాలుగో ర్యాంకులో ఉన్నట్లు ట్రూడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టం లేకుండానే తాము టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్నామంటూ వస్తున్న విమర్శలు సరికావని.. గత కొన్నేళ్లుగా తాము అద్భుత విజయాలు సాధిస్తూ ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు.కాగా భారత్‌తో తమకు భద్రత లేదంటూ.. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ పట్టు పట్టింది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ.. బంగ్లాను టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్తో ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి స్కాట్లాండ్ జట్టురిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఎహ్సాన్, మైకేల్ జోన్స్, మైకేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెకల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.ట్రావెలింగ్ రిజర్వ్‌లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
IND vs NZ: న్యూజిలాండ్ జట్టులో కీలక మార్పులు
టీమిండియాతో టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ హ్యాట్రిక్ విజయాలతో 3-0తో కివీస్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లలోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు తమకు మిగిలిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో మిగిలిన రెండు టీ20లకు సంబంధించి తమ జట్టులో కీలక మార్పులు చేసింది.ఆ ఇద్దరిపై వేటుయువ ఫాస్ట్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్లను జట్టు నుంచి తొలగించిన కివీస్. వారి స్థానాల్లో జేమ్స్ నీషమ్, లాకీ ఫెర్గూసన్‌లను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా టిమ్ సీఫర్ట్ కూడా జట్టుతో చేరినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇక ఐదో టీ20 కోసం టాపార్డర్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా జట్టుతో చేరతాడని బ్లాక్‌క్యాప్స్ తెలిపింది.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది న్యూజిలాండ్ క్రికెట్ జట్టు. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ 2-1తో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించిన కివీస్.. టీ20 సిరీస్‌లో మాత్రం వరుస వైఫల్యాలతో ఓటమిపాలైంది. ఇక భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నాలుగో టీ20, శనివారం ఐదో టీ20 జరుగనున్నాయి. ఇందుకు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలు.భారత్‌తో మిగిలిన రెండు టీ20లకు న్యూజిలాండ్ జట్టు (అప్డేటెడ్)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జేకబ్ డఫీ, జేమ్స్ నీషమ్, కైల్ జెమీసన్, మైకేల్ బ్రేస్‌వెల్, బెవాన్ జేకబ్స్, ఫిన్ అలెన్ (5వ టీ20కి మాత్రమే).చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి క్రికెట్ మజాను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, అంతకంటే ముందుగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ల మధ్య వ్యవహారం ఈ ఐసీసీ ఈవెంట్‌పై మరింత చర్చకు దారితీసింది.భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని.. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడించాలని బీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీఅయితే, భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన ఐసీసీ.. తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీసీబీకి గడువు ఇచ్చింది. అయితే, బీసీబీ మాత్రం మొండిపట్టు పట్టింది. తమ ప్రభుత్వం చెప్పినట్లుగానే తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని స్పష్టం చేసింది. ఇందుకు స్పందనగా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేరుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.పీసీబీ ఓవరాక్షన్ఈ ఎపిసోడ్ మొత్తంలో బీసీబీ కంటే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అతి చేసింది. బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందంటూ.. బోర్డు మొత్తం ఒకవైపు ఉంటే.. పాక్ మాత్రం బంగ్లాకు అనుకూలంగా ఓటు వేసింది. అంతేకాదు బంగ్లాదేశ్‌ను ఆడించకపోతే తామూ టోర్నీ బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగింది. నిజానికి ముందుగా అనుకున్న ఒప్పందం (భారత్- పాక్ వేదికల హైబ్రిడ్ మోడల్) ప్రకారం.. పాక్‌కు ఇప్పటికే తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ.అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు వత్తాసు పలుకుతూ భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని పాక్ బోర్డుపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఈ శుక్రవారం లేదంటే వచ్చే సోమవారం నాటికి టోర్నీలో ఆడే విషయంపై నిర్ణయం వెల్లడిస్తామంటూ పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ సోమవారం ట్వీట్ చేశాడు.ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ స్థానంలో బంగ్లాదేశ్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం..ఊహించని ట్విస్టు‘‘ఒకవేళ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని భావిస్తే.. గ్రూప్-ఎలో ఆ జట్టు స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేసే అవకాశం ఉంది. పాక్ తప్పుకొంటే... బీసీబీ ముందు నుంచి కోరినట్లుగా పాక్ స్థానంలో బంగ్లాదేశ్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడేందుకు వీలు కలుగుతుంది. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని సమస్యలు తలెత్తినా అంతిమంగా ఓ పరిష్కారం అయితే దొరుకుతుంది’’ అని ఐసీసీ సన్నిహిత వర్గాలు విశ్లేషించాయి.ఒప్పందం అతిక్రమిస్తే.అంతేకాదు.. ‘‘ఇప్పటికే భారత్- పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మ్యాచ్‌లకు తటస్థ వేదికలను ఐసీసీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు కూడా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు బదులు శ్రీలంకలో పాక్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు.అయినప్పటికీ పాక్ తప్పుకొంటే.. ఒప్పందాన్ని పాక్ బోర్డు ఉల్లంఘించినట్లే అవుతుంది. కాబట్టి వారికి మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఏదో చేయబోతే ఇంకేదో అయింది అన్నట్లు.. బీసీసీఐ మీదకు బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నంలో తమ నెత్తి మీద తామే పిడుగు వేసుకున్నట్లు పాక్ పరిస్థితి మారిందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. బీసీబీ- పీసీబీ.. ఈ రెండింటిలో భస్మాసురహస్తం ఎవరిదో అంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు. మరోవైపు.. పాక్‌ది మేకపోతు గాంభీర్యం మాత్రమేనని.. ఏదో ఓవరాక్షన్ చేసినా అంతిమంగా టోర్నీలో ఆడేందుకు మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోముICC vs Bangladesh: అసలేం జరిగింది.. కథనాల కోసం క్లిక్ చేయండి -
T20 WC 2026: టీమిండియాకు శుభవార్త
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్డేట్ అందించింది. అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఈ హైదరాబాదీ బ్యాటర్ పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు తిలక్ వర్మ కూడా దూరమైనట్లు వెల్లడించింది.ఓ శుభవార్త కూడాఅదే సమయంలో టీ20 వరల్డ్ కప్-2026 టోర్నీకి మాత్రం తిలక్ అందుబాటులోకి రానున్నట్లు బీసీసీఐ తెలిపింది. వన్‌డౌన్‌లో నిలకడైన ఆట తీరుతో పరుగులు రాబడుతూ కీలకంగా మారిన తిలక్ వర్మ (Tilak Varma) అందుబాటులోకి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడటం ఖాయం. టీమిండియాకు ఇది సానుకూలాంశంగా మారనుంది.కాగా తిలక్ ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిట్నెస్ను అందుకొని మెగా టోర్నీ ప్రారంభానికి ముందు తిలక్ వర్మ టీమిండియాతో చేరనున్నాడు. జట్టుతోనే శ్రేయస్ అయ్యర్ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ... ఫిబ్రవరి 3న భారత బృందంతో తిలక్ కలుస్తాడని బీసీసీఐ ప్రకటించింది. తిలక్ గైర్హాజరులో కివీస్‌తో తొలి మూడు టీ20ల కోసం ఎంపికైన శ్రేయస్ అయ్యర్ సిరీస్ ముగిసే వరకు జట్టుతో కొనసాగనున్నాడు. కాగా కివీస్‌తో తొలి మూడు టీ20లో గెలిచి ఇప్పటికే టీమిండియా సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.చదవండి: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్.. కలకలం రేపుతున్న పీసీబీ చీఫ్ నఖ్వీ ట్వీట్ -
చరిత్ర సృష్టించిన నాట్ స్కివర్ బ్రంట్.. తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ నాట్ స్కివర్ బ్రంట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా నాట్ స్కివర్ రికార్డులెక్కింది. డబ్ల్యూపీఎల్-2026లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్కివర్ ఈ అరుదైన ఫీట్ సాధించింది. నాట్ స్కివర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. 57 బంతులు ఎదుర్కొన్న స్కివర్ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. గతంలో సోఫీ డివైన్, జార్జియా వోల్ వంటి వారు 99 పరుగుల వద్ద ఆగిపోయినప్పటికి.. స్కివర్ మాత్రం సెంచరీ మార్క్‌ను అందుకుని తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.ముంబై ఘన విజయం..ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 15 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపునుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో నాట్ స్కివర్‌తో పాటు హేలీ మాథ్యూస్ (39 బంతుల్లో 56; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఓడింది. రిచా ఘోష్ (50 బంతుల్లో 90; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మాత్రమే చివరి వరకు వీరోచిత పోరాటం చేసింది. 35/5 నుంచి ఆమె జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లినా ఆమె శ్రమ వృథా అయింది. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. -
రిచా మెరుపులు వృథా.. ఆర్సీబీపై ముంబై విజయం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో వరుసగా మూడు పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ గెలుపు బాట పట్టింది. సోమవారం వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. దీంతో హర్మన్ సేన తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్ బ్రంట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా స్కివర్ రికార్డులెక్కింది. 57 బంతులు ఎదుర్కొన్న స్కివర్ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీలీ మాథ్యూస్(56) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు, శ్రేయంకా పాటిల్, ఎన్డి క్లార్క్ తలా వికెట్ సాధించారు.రిచా విధ్వంసం..అనంతరం భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి రిచా ఘోష్ మాత్రం విధ్వంసం సృష్టించింది. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90 పరుగులు చేసింది. సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లలో మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్మాయిల్, అమీలియా కేర్ తలా రెండు వికెట్లు సాధించారు. -
టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్ జట్టు ప్రకటన.. సంచలన ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం
భారత్, శ్రీలంక వేదికగా త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్ హోప్ కొనసాగనుండగా.. సంచలన ఫాస్ట్ బౌలర్ షమార్ జోసఫ్, 25 ఏళ్ల గయానీస్ బ్యాటర్ క్వెంటిన్ సాంప్సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.మాజీ కెప్టెన్లు జేసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కడం విశేషం. పేసర్లుగా ఫోర్డ్, సీల్స్ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. స్పిన్ విభాగంలో ఆకీల్ హొసేన్, రోస్టన్ చేజ్, గుడకేశ్ మోటీ, ఆల్‌రౌండర్ విభాగంలో విధ్వంసకర బ్యాటర్ రొమారియో షెపర్డ్ అవకాశాలు దక్కించుకున్నారు. గాయాల కారణంగా ఎవిన్ లూయిస్, అల్జరీ జోసఫ్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. మొత్తంగా గత ఎడిషన్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా, ప్రపంచకప్‌లో వెస్టిండీస్ గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో మిగతా జట్లుగా ఇంగ్లండ్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ ఉన్నాయి. విండీస్ ఫిబ్రవరి 7న స్కాట్లాండ్పై తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఇదే వేదికపై వారు చివరిసారి వరల్డ్‌కప్ గెలిచారు. టీ20 ప్రపంచకప్ 2026 కోసం విండీస్ జట్టు..షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, క్వెంటిన్ సాంప్సన్, అకేల్ హోసిన్, గుడకేష్ మోటీ, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్ -
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్.. కలకలం రేపుతున్న పీసీబీ చీఫ్ నఖ్వీ ట్వీట్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026లో దాయాది పాకిస్తాన్ పాల్గొనడంపై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐసీసీకి ధిక్కారస్వరం వినిపించి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ బాటలోనే పాక్ కూడా నడుస్తుందని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, దేశ ప్రధాని అనుమతి లభించాకే తుది నిర్ణయం వెలువడుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు.ఈ నేపథ్యంలో నఖ్వీ ఇవాళ (జనవరి 26) వారి ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను అతను ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే నఖ్వీ చేసిన ఈ ట్వీట్లో ఓ పెద్ద తప్పిందం దొర్లడం, ప్రస్తుతం కలకలం రేపుతుంది. నఖ్వీ తన ట్వీట్లో ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరుకు బదులు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించాడు. నఖ్వీ చేసిన ఈ తప్పిదం వివాదాస్పదంగా మారింది.ఇంతకీ నఖ్వీ చేసిన ట్వీట్లో ఏముందంటే.. ప్రధానమంత్రి మియాన్ మహ్మద్ నవాజ్ షరీఫ్‌తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఐసీసీ అంశంపై వారికి వివరించాను. అన్ని అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని పేర్కొన్నారు.దేశ అధ్యక్షుడి పేరు తప్పుగా ప్రస్తావించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ ట్వీట్‌తో టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ పాల్గొనడంపై త్వరలో స్పష్టత రాబోతోందన్న విషయంపై సంకేతాలు వెలువడ్డాయి. పాక్ ప్రభుత్వం సూచనప్రాయంగా పాక్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో పాక్ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతుంది.వివాదం ఎలా మొదలైందంటే..? బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించారు. దీన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో తమ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడబోమని మొండిపట్టు పట్టింది. ఈమేరకు ఐసీసీకి పలు మార్లు విజ్ఞప్తి చేసింది.బీసీబీ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ఐసీసీ భద్రతా బృందం భారత్‌లో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అయినా మొండిపట్టు వీడని బీసీబీ, చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. దీంతో స్కాట్లాండ్ బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతు ఇస్తూ వచ్చింది. ఓ దశలో బంగ్లా బాటలోనే తాము కూడా నడుస్తామని చెప్పింది. చివరికి సమస్య పెద్దదిగా మారుతుండటంతో పీసీబీ బంగ్లాదేశ్‌ను మధ్యలోనే వదిలేసి యూటర్న్ తీసుకుంది. -
చరిత్ర సృష్టించిన బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ
బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ పెర్త్ స్కార్చర్స్ ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ల చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025-26 ఎడిషన్ విజేతగా నిలవడం ద్వారా ఆరోసారి బీబీఎల్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన ఈ ఫ్రాంచైజీ.. ఓ టీ20 లీగ్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. తాజా టైటిల్‌కు ముందు స్కార్చర్స్ ఐదు టైటిళ్లతో ఐపీఎల్ ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో సమంగా ఉండింది. సీఎస్కే 2010, 2011, 2018, 2021, 2023 ఎడిషన్ల ఐపీఎల్ టైటిళ్లు సాధించగా.. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఐపీఎల్ టైటిళ్లు ఎగరేసుకుపోయింది.స్కార్చర్స్ విషయానికొస్తే.. తాజా బీబీఎల్ టైటిల్‌తో ఈ ఫ్రాంచైజీ గుర్తింపు పొందిన టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో బీబీఎల్ టైటిళ్లు సాధించింది. జనవరి 25 జరిగిన ఫైనల్లో స్కార్చర్స్ సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలు పెర్త్ స్కార్చర్స్ (బిగ్‌బాష్ లీగ్)- 6ముంబై ఇండియన్స్, సీఎస్కే (ఐపీఎల్)- 5కొమిలా విక్టోరియన్స్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్)- 4జాఫ్నా కింగ్స్ (లంక ప్రీమియర్ లీగ్)- 4ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ (పాకిస్తాన్ సూపర్ లీగ్)- 3ఓవల్ ఇన్విన్సిబుల్స్ (హండ్రెడ్ లీగ్)- 3సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ (సౌతాఫ్రికా టీ20 లీగ్)- 3ముంబై ఇండియన్స్, సీఎస్కే (ఛాంపియన్స్ లీగ్ టీ20)- 2ఎంఐ న్యూయార్క్ (మేజర్ లీగ్ క్రికెట్)- 2బిగ్‌బాష్ లీగ్ 2025-26 ఫైనల్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్.. జై రిచర్డ్స్ (4-0-32-3), డేవిడ్ పేన్ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్ (4-0-29-2), ఆరోన్ హార్డీ (3-0-16-1), కూపర్ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్, జోష్ ఫిలిప్, కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ తలో 24 పరుగులు చేయగా.. జోయల్ డేవిస్ 19, లచ్లాన్ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (44), ఫిన్ అలెన్ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్ ఇంగ్లిస్ (29 నాటౌట్) పూర్తి చేశాడు. ఇంగ్లిస్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్ బౌలర్లలో సీన్ అబాట్ (4-0-19-2), మిచెల్ స్టార్క్ (4-0-33-1), జాక్ ఎడ్వర్డ్స్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. -
అభిషేక్ శర్మకు యువరాజ్ సవాల్!
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ జోరు కొనసాగిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో గువాహటిలో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లపై ఓ రేంజ్లో విరుచుకుపడి పరుగుల సునామీ సృష్టించాడు. అభిషేక్‌కు తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా దంచుకొట్టుడు కొట్టడంతో 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు. బంతితో బుమ్రా నిప్పులు చెరగడంతో 8 వికెట్ల తేడాతో కివీస్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది.ఈ సిరీస్‌లో రెండో అర్ధసెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ.. మరో ఘనత సాధించాడు. గువాహటి మ్యాచ్‌లో 14 బంతులోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. దీంతో ఇంటర్నేషనల్ టి20ల్లో తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా 7వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. మొత్తం 20 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 340 స్ట్రైక్‌రేట్‌తో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. నాగ్‌పూర్‌లో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 84 పరుగులు; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) కొట్టాడు. ఎప్పుడు బ్రేక్ చేస్తావ్?అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌పై మాజీ ఆటగాళ్లు, సీనియర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి గురువు యువరాజ్ సింగ్ తన శిష్యుడికి సవాల్ విసిరాడు. తన పేరిట రికార్డ్‌ను ఎప్పుడు బ్రేక్ చేస్తావంటూ ఆట పట్టించాడు. ''ఇంకా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావా?'' అంటూ ఎక్స్‌లో కామెంట్ పెట్టాడు. ''బాగా ఆడావు, ఇదే జోరు కొనసాగించాల''ని ఎంకరేజ్ చేశాడు. కాగా, టీమిండియా తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు 19 ఏళ్లుగా యువీ పేరిటే ఉంది. 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లోనే అతడు అర్ధశతకం సాధించి రికార్డు నెలకొల్పాడు.నెటిజన్ల స్పందనకాగా, అభిషేక్ శర్మను మోడ్రన్ యువరాజ్ సింగ్‌గా వర్ణిస్తూ.. గురువును రికార్డును అధిగమించే సత్తా శిష్యుడికే ఉందని నెటిజనులు అంటున్నారు. అభిషేక్ శర్మ ఇదే హై కొనసాగిస్తే త్వరలోనే యూవీ రికార్డు బ్రేక్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కుర్రాడిని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది నెటిజనులు అంటే.. శిష్యుడిని ఉత్సాహపరిచేందుకే యువీ సవాల్ విసిరాడని ఇంకొంత మంది అంటున్నారు. ఏదేమైనా రానున్న టి20 వరల్డ్‌కప్‌లోనూ అభిషేక్ శర్మ ఇదే జోరు కొనసాగించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: రోహిత్‌శర్మపై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలుభారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ ఈ నెల 26న విశాఖపట్నంలో జరుగుతుంది. చివరి మ్యాచ్ ఈ నెల 31న తిరువనంతపురంలో జరగనుంది. చూడాలి మరి.. ఈ రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ గురువు రికార్డును బ్రేక్ చేస్తాడో, లేదో!Still can’t get a 50 off 12 balls, can you? 🤪 Well played - keep going strong! 💪🏻 @OfficialAbhi04 #IndVSNz pic.twitter.com/6MQe1p6sx4— Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2026 -
దేవదత్ పడిక్కల్‌కు ప్రమోషన్
కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్‌కు ప్రమోషన్ లభించింది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతన్ని (725 పరుగులు 90.62 సగటుతో) కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తమ రంజీ కెప్టెన్‌గా నియమించింది. ఈనెల 29 నుంచి పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో పడిక్కల్ కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గ్రూప్ దశలో కర్ణాటకకు ఇదే చివరి మ్యాచ్. కీలకమైన ఈ మ్యాచ్‌కు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కేవలం రెండు మ్యాచ్‌ల అనుభవమున్న పడిక్కల్‌కు కెప్టెన్‌గా అవకాశమిచ్చి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రెడ్ బాల్ ఫార్మాట్లో పడిక్కల్ కెప్టెన్సీ చేపట్టడం ఇదే తొలిసారి. 2023లో అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పెద్దగా ఫామ్‌లో లేని మయాంక్ అగర్వాల్‌ను తప్పించి పడిక్కల్‌కు రంజీ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చారు.పంజాబ్‌తో మ్యాచ్‌కు ప్రకటించిన జట్టులో మరిన్ని ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం టీమిండియా విధులు లేకపోవడంతో వీరిద్దరూ రంజీ బాట పట్టారు.మరో స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ కరుణ్ స్థానాన్ని నికిన్ జోస్ భర్తీ చేశాడు. మరో స్టార్ ఆటగాడు అభినవ్ మనోహర్‌పై వేటు పడింది. మనోహర్ గత కొంతకాలంగా ఫామ్‌లో లేడు. మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించినా సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు.కీలక పోరాటం గ్రూప్ బి పాయింట్ల పట్టికలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముందంజలో ఉండగా, సౌరాష్ట్ర వెనుక నుంచి (నాలుగో స్థానం) ఒత్తిడి పెంచుతోంది. క్వార్టర్ ఫైనల్ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్ కర్ణాటకకు అత్యంత కీలకంగా మారింది. కర్ణాటక జట్టు (పంజాబ్ మ్యాచ్ కోసం) - మయాంక్ అగర్వాల్ - కేఎల్ రాహుల్ - అనీష్ KV - దేవదత్ పడిక్కల్ (కెప్టెన్) - స్మరణ్ R - శ్రేయస్ గోపాల్ - కృతిక్ కృష్ణ (wk) - వెంకటేష్ M - విద్యాధర్ పటిల్ - విద్యవత్ కావేరప్ప - ప్రసిద్ధ్ కృష్ణ - మొహ్సిన్ ఖాన్ - శిఖర్ శెట్టి - శ్రీజిత్ (wk) - ధ్రువ్ ప్రభాకర్ -
విరాట్ కోహ్లి సరసన సంజూ శాంసన్
గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 25) జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓ అవమానకర రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే ఔట్) శాంసన్.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్, శాంసన్ భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడు సార్లు గోల్డెన్ డకౌట్లు అయ్యారు. విరాట్ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్‌లు తీసుకుంటే, శాంసన్ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో మరో దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ తన 151 మ్యాచ్‌ల అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఏకంగా 12 సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్స్- 12 – రోహిత్ శర్మ (151 మ్యాచ్‌లు) - 7 – సంజు సాంసన్ (47 మ్యాచ్‌లు)* - 7 – విరాట్ కోహ్లీ (117 మ్యాచ్‌లు) - 6 – సూర్యకుమార్ యాదవ్ (96 మ్యాచ్‌లు) - 5 – కేఎల్ రాహుల్ (68 మ్యాచ్‌లు) మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలనే ఛేదించిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. న్యూజిలాండ్‌ను 153 పరుగులకే (9 వికెట్లకు) కట్టడి చేసింది. బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-18-2), హార్దిక్ (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. చాప్మన్ (32), సాంట్నర్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత గెలుపును ఆదిలోనే ఖరారు చేశారు. వీరిద్దరూ ప్రతి బంతిని బౌండరీ, సిక్సర్‌గా తరలించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడారు. ఇషాన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అభిషేక్, ఇషాన్ విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరి ధాటికి భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులు.. స్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసి టీమిండియాకు మెరుపు విజయాన్ని అందించారు.శాంసన్ ఫామ్‌పై ఆందోళనలు ఈ సిరీస్‌లో శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 10, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా సిరీస్‌లోనూ శాంసన్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయినా అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది. వరస వైఫల్యాల నేపథ్యంలో శాంసన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతనికి పోటీగా ఇషాన్ కిషన్ దూసుకొస్తున్నాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శాంసన్ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇషాన్ కాకపోయినా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరును సెలెక్టర్లు పరిశీలించవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
యువ సంచలనం.. మరో హార్దిక్ పాండ్యా అవుతాడా?
జింబాబ్వే వేదికగా అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్-2026లో భారత యువ జట్టు వరుస విజయాలతో జోరు మీద ఉంది. తొలి మ్యాచ్‌లో అమెరికా జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ఆయుశ్ మాత్రే సేన.. తదుపరి బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది.చివరగా శనివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడ్డ యువ భారత్.. డీఎల్ఎస్ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. కివీస్ యవ జట్టుతో మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీశ్ (RS Ambrish) కీలక పాత్ర పోషించాడు.నాలుగు వికెట్లతో సత్తా చాటిఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటి న్యూజిలాండ్ అండర్-19 జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో అంబరీశ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పద్దెమినిదేళ్ల ఈ కుర్రాడు ఇలాగే అద్భుత ప్రదర్శనలతో ముందుకు సాగితే టీమిండియాకు మరో హార్దిక్ పాండ్యా దొరికినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరో హార్దిక్ పాండ్యా అవుతాడా?హార్దిక్ మాదిరి ఆరో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడంతో పాటు.. కొత్త బంతితో బౌలింగ్ చేయగల సత్తా కలిగి ఉండటం ఇందుకు కారణం. తమిళనాడుకు చెందిన ఆర్ఎస్ అంబరీశ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అతడు.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.తండ్రి కల నెరవేరుస్తున్న తనయుడుకూచ్ బెహర్ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబరీశ్.. 33 ఏళ్ల నిరీక్షణ తర్వాత జూనియర్ రెడ్‌బాల్ క్రికెట్లో జట్టుకు ట్రోఫీని అందించాడు. అతడి తండ్రి ఆర్. సుకుమార్ కూడా క్రికెటరే. జూనియర్ క్రికెట్లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత రైల్వేస్ జట్టుకు మారిన సుకుమార్ సీనియర్ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.రైల్వేస్‌లో సెక్యూరిటీగా ఆ తర్వాత రైల్వేస్‌లో సెక్యూరిటీ జాబ్ పొందిన సుకుమార్.. తన కలను కుమారుడి ద్వారా నెరవేర్చుకోవాలని భావించాడు. అందుకు తగ్గట్లే చిన్ననాటి నుంచే అంబరీశ్ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి ఆశయాన్ని తాను నెరవేరుస్తున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన అంబరీశ్.. భారత అండర్-19 జట్టులోనూ ఎంట్రీ ఇచ్చాడు.గతేడాది జూన్‌లో ఇంగ్లండ్ గడ్డ మీద యూత్ వన్డేల ద్వారా యాభై ఓవర్ల ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చిన అంబరీశ్.. అప్పటి నుంచి భారత అండర్-19 తుది జట్టులో కీలక సభ్యునిగా మారాడు. ఇప్పటి వరకు వరల్డ్‌కప్ టోర్నీలో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ ఆల్‌రౌండర్ ఐదు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఉన్న అంబరీశ్ మెరుగ్గా రాణిస్తే.. టీమిండియాలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తాడనటం అతిశయోక్తి కాదు. చదవండి: యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయము! -
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కన్నుమూత
భారత క్రికెట్ పరిపాలనలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరైన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇందర్జిత్ సింగ్ బింద్రా (ఐఎస్ బింద్రా) వయోభారంతో (84 ఏళ్లు) ఆదివారం కన్నుమూశారు. బింద్రా 1993 నుండి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 1978 నుండి 2014 వరకు 36 సంవత్సరాల పాటు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.బింద్రా మరణం భారత క్రికెట్ చరిత్రలో ఒక శకానికి ముగింపు పలికింది. పరిపాలకుడిగా తన దూరదృష్టి, సాహసోపేతమైన నిర్ణయాలతో బింద్రా భారత క్రికెట్‌ను ప్రపంచ వేదికపై తిరుగులేని శక్తిగా నిలిపారు. 1987 వరల్డ్‌కప్‌ను భారత ఉపఖండానికి తీసుకురావడంలో బింద్రా కీలక పాత్ర పోషించారు. ఇది మొదటిసారి ఇంగ్లండ్ వెలుపల జరిగిన వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించిన బింద్రా.. భారత క్రికెట్ ఆర్థికస్థితిగతుల రూపురేఖల్ని మార్చారు. అనంతరం బింద్రా ప్రోద్భలంతోనే 1996 వరల్డ్‌కప్ కూడా భారత ఉపఖండంలో జరిగింది. ఈ ప్రపంచకప్ నిర్వహణ ప్రపంచ క్రికెట్లో భారత్ కేంద్రస్థానంగా మారడానికి దోహదపడింది. ప్రపంచకప్ లాంటి ఐసీసీ మెగా టోర్నీలను భారత్‌కు తీసుకురావడంలో సఫలీకృతుడైన బింద్రా.. ప్రసార హక్కుల విషయంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు. 1994లో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించి, దూరదర్శన్ ఏకాధికారాన్ని సవాలు చేశారు. ఆ తీర్పుతో ప్రైవేట్ మరియు అంతర్జాతీయ ప్రసార సంస్థలు భారత క్రికెట్లోకి ప్రవేశించాయి. ESPN, TWI వంటి సంస్థలు మార్కెట్లోకి రావడంతో టెలివిజన్ ద్వారా క్రికెట్ భారత దేశ నలుమూలకు చేరింది. దీంతో ఆదాయాలు పెరిగి, భారత క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ మార్కెట్‌గా మారింది. ఈ ఆర్థిక బలమే బీసీసీఐని స్వతంత్రంగా, శక్తివంతంగా నిలబెట్టింది. -
శ్రేయస్ అయ్యర్‌కు మరో ఛాన్స్
న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్ వర్మకు ప్రత్యామ్నాయంగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌కు మరో లక్కీ ఛాన్స్ దక్కింది. తిలక్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ను చివరి రెండు టీ20లకు కూడా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించారు. ప్రపంచకప్‌కు ముందు శ్రేయస్ తనను తాను నిరూపించుకునేందుకు ఇది సువర్ణావకాశం. శ్రేయస్ భారత్ తరఫున టీ20లు ఆడక చాలా కాలమైంది.న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు అతను ఎంపికైనా, తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో చేజిక్కించుకోవడంతో శ్రేయస్‌కు చివరి రెండు టీ20ల్లో అవకాశం దక్కవచ్చు. ఈ అవకాశాన్ని శ్రేయస్ సద్వినియోగం చేసుకోగలిగితే, ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.ప్రపంచకప్‌కు ఎంపికైన వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం గాయంతో బాధపడుతూ న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఒకవేళ సుందర్ ప్రపంచకప్‌కు దూరమైతే అతని స్థానాన్ని శ్రేయస్‌తో భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇది అంత సులువుగా జరిగే విషయం అయితే కాదు. ఎందుకంటే, సుందర్ స్థానానికి ఇప్పటికే గట్టి పోటీ ఉంది.సుందర్‌కు ప్రత్యామ్నాయంగా న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన రవి బిష్ణోయ్ ప్రధాన పోటీదారుగా మారాడు. బిష్ణోయ్ చాలాకాలం తర్వాత లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మూడో టీ20లో సత్తా చాటాడు. ప్రపంచకప్ భారత ఉపఖండంలో జరుగుతుంది కాబట్టి, సెలెక్టర్లు సుందర్ లాంటి ఆల్‌రౌండర్ కాకపోయినా, బిష్ణోయ్ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌తో అడ్జస్ట్ కావచ్చు.సుందర్ స్థానానికి మరో ప్రధాన పోటీదారుడు రియాన్ పరాగ్. పరాగ్ సుందర్ లాగే స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాబట్టి, సెలెక్టర్లు అతనివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పరాగ్ సైతం చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్నా, ఐపీఎల్ 2025 సత్తా చాటడం అతనికి కలిసొచ్చే అంశం.ఈ లెక్కన వాషింగ్టన్ సుందర్ ప్రపంచకప్‌కు దూరమైతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్ రేసులో ఉంటారు. వీరిలో బిష్ణోయ్ ఇదివరకే (మూడో టీ20) తనను నిరూపించుకున్నాడు. శ్రేయస్‌కు ఒకవేళ చివరి రెండు టీ20ల్లో అవకాశం వచ్చి, అతను కూడా సత్తా చాటితే, సుందర్ స్థానానికి ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, శ్రేయస్ చివరి రెండు టీ20లకు కొనసాగనుండటంతో, న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ వర్మ అందుబాటులో ఉండడనే విషయం స్పష్టమవుతుంది. విజయ్ హజారే ట్రోఫీలో గాయపడిన తిలక్‌ను న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు మాత్రమే ఎంపిక చేయలేదు. అతను చివరి రెండు టీ20లకు అందుబాటులో వస్తాడని సెలెక్టర్లు ఆశించారు. అయితే అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రేయస్ చివరి రెండు మ్యాచ్‌లకు కూడా కొనసాగనున్నాడు. తిలక్ న్యూజిలాండ్ సిరీస్ మొత్తానికి దూరమైనా ప్రపంచకప్‌కు అందుబాటులోకి వస్తాడని కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా జనవరి 28, 31 తేదీల్లో జరుగనున్నాయి. -
యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయము!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అతడి పట్ల ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గుర్రుగా ఉంది. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేని సమయంలో దేశీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే.ఇందుకు అనుగుణంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) సైతం ఈసారి వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగారు. కోహ్లి ఢిల్లీ తరఫున.. రోహిత్ ముంబైకి ఆడి సత్తా చాటారు. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం సొంతజట్టు ముంబై తరఫున ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడాడు.రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లుప్రస్తుతం ముంబై జట్టు రంజీ ట్రోఫీ రెండో దశ (Ranji Trophy 2025-26) మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌తో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నాకౌట్ దశకు అర్హత సాధించింది. తదుపరి సొంత మైదానంలో ఢిల్లీ జట్టుతో ముంబై తలపడనుంది.కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సహా వెటరన్ స్టార్ అజింక్య రహానే వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పటికే జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంసీఏ సెలక్టర్లు.. ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయమై యశస్వి జైస్వాల్‌ను సంప్రదించారు. అయితే, అతడి నుంచి ఎలాంటి స్పందనా లేదని తెలుస్తోంది. దీంతో జైసూను ఎంపిక చేయబోమని ఎంసీఏ వర్గాలు స్పష్టం చేశాయి.స్పందన కరువు.. ఈ విషయం గురించి MCA అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. “హైదరాబాద్‌తో మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలోనూ అతడిని సంప్రదించాము. అయితే, అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. తనకు నచ్చినపుడు నచ్చిన మ్యాచ్‌లలో మాత్రమే అతడు ఆడాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయము!తదుపరి మ్యాచ్ కోసం అందుబాటులో ఉంటాడా? లేదా? అని అడిగినపుడు కూడా అతడి నుంచి స్పందన లేదు. అందుకే ఢిల్లీతో మ్యాచ్‌కు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. అతడిని ఎంపిక చేయడం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీతో మ్యాచ్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంసీఏ ఆదివారం ప్రకటించింది. సిద్దేశ్ లాడ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి స్టార్లు ఉన్నారు.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
BCCI: ప్రపంచకప్ జట్టులోకి ఊహించని ఆటగాడు!
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే హ్యాట్రిక్ విజయాలతో 3-0తో సత్తా చాటింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా సాగుతున్న ఈ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేయాలని సూర్యుకుమార్ సేన పట్టుదలగా ఉంది.అయితే, మెగా టోర్నీకి ముందు గాయాల బెడద టీమిండియాకు ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) సైతం వేలునొప్పితో బాధపడుతున్నాడు.రేసులోకి ఊహించని ఆటగాడుఇక వాషీ కోలుకునేందుకు ఇంకా రెండు వారాలకు పైగానే పట్టవచ్చని బీసీసీఐ (BCCI) వర్గాలు ఇప్పటికే జాతీయ మీడియాకు వెల్లడించాయి. దీనిని బట్టి అతడు వరల్డ్‌కప్ టోర్నీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం రియాన్ పరాగ్ (Riyan Parag)ను రేసులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.భుజం నొప్పిఅసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. భుజం నొప్పితో బాధపడుతున్న అతడు గత మూడు వారాలుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు. గతేడాది డిసెంబరు 6న చివరగా అసోం తరఫున దేశీ క్రికెట్ ఆడిన ఈ ఆల్‌రౌండర్.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు.రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లకు కూడా రియాన్ పరాగ్ అందుబాటులో లేడు. అయితే, ప్రస్తుతం అతడు వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తున్నప్పటికీ నొప్పి లేకపోవడం సానుకూలాంశంగా పరిణమించింది. జనవరి 28, 30 తేదీల్లో అతడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.ఈ క్రమంలో జనవరి 31న రియాన్ పరాగ్ ఫిట్‌నెస్‌కు సంబంధించి క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ అయ్యే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ పరిస్థితి గురించి ఆరా తీసిన బీసీసీఐ.. ఫిబ్రవరి 2న టీమిండియాతో పాటు స్టాండ్‌బై ప్లేయర్‌గా అతడిని ముంబైకి పిలిచినట్లు సమాచారం.వాషీ దూరమైతేఒకవేళ వాషింగ్టన్ సుందర్ కోలుకోకపోతే.. అతడి స్థానంలో రియాన్ పరాగ్‌ను వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా గువాహటికి చెందిన 24 ఏళ్ల రియాన్ పరాగ్.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతి వాటం గల బ్యాటర్ అయిన ఈ యువ ఆటగాడు.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా!జింబాబ్వేతో 2024 నాటి టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్.. చివరగా శ్రీలంక పర్యటనలో వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 9 టీ20లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 106 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు వికెట్లు తీశాడు. ఒకే ఒక్క వన్డేలో 15 రన్స్ చేసిన పరాగ్.. మూడు వికెట్లు పడగొట్టాడు.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
T20 WC 2026: సంజూ శాంసన్‌పై వేటు!?
భారత టీ20 జట్టు ఓపెనర్లుగా గత కొంతకాలంగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడీ కొనసాగుతోంది. ఆసియా టీ20 కప్ సందర్భంగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) టీమ్‌లోకి తిరిగి రావడంతో కొన్నాళ్లపాటు సంజూ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే, గిల్ కూడా ఓపెనర్‌గా విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కూడా సంజూ శాంసన్‌కే ఓపెనర్‌గా అవకాశం దక్కింది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ అయిన గిల్‌పై వేటు వేసి మరీ.. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు మరో అవకాశం ఇచ్చింది యాజమాన్యం.సెలక్టర్ల వమ్ము చేస్తున్న సంజూఅయితే, సంజూ మాత్రం సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నాడు. కివీస్‌తో మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు (10, 6, 0) ఇందుకు నిదర్శనం. మరోవైపు.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో దుమ్ములేపుతున్నాడు.పేలుతున్న జార్ఖండ్ డైనమైట్న్యూజిలాండ్తో తొలి మ్యాచ్‌లో విఫలమైనా (8).. రెండో టీ20లో 32 బంతుల్లో 76, మూడో టీ20లో 13 బంతుల్లో 28 పరుగులతో సత్తా చాటాడు ఇషాన్. తద్వారా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు ఈ జార్ఖండ్ డైనమైట్.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ వైఫల్యాలు కొనసాగితే.. వరల్డ్‌కప్ టోర్నీలో భారత తుదిజట్టు నుంచి అతడిని తప్పించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ కిషన్‌ను జట్టు నుంచి ఎవరూ తప్పించలేరని పేర్కొన్నాడు.ఇషాన్‌ను తుదిజట్టు నుంచి తప్పించలేరు"ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే సెలక్టర్లు ఇషాన్‌ను తుదిజట్టు నుంచి తప్పించలేరు. ఇందుకు అవకాశమే లేదు. సంజూ శాంసన్ కంటే అతడు ఎంతో మెరుగ్గా ఆడుతున్నాడు. సంజూను చూస్తుంటే బాధగా ఉంది.పరుగులు చేయాలనే కసి అతడిలో కనిపిస్తోంది. కానీ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. గత మ్యాచ్‌లో కనీసం నామమాత్రపు స్కోరైనా చేసి ఉండాల్సింది. నిలకడలేని ఆట తీరే సంజూకు ప్రధాన సమస్య. ఏడాదిన్నర క్రితం సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇదే తంతు కొనసాగుతోంది.సంజూపై వేటు తప్పదుఏదేమైనా సంజూ దురదృష్టవంతుడనే చెప్పాలి. అతడికి గట్టి పోటీ ఉంది. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. అభిషేక్ శర్మను ఎవరూ కదిలించలేరు. ఇషాన్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్ డేంజరస్ ఫామ్‌లో ఉన్నపుడు సంజూ తుదిజట్టులో చోటు కోల్పోయే అవకాశాలే ఎక్కువ’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. ఓపెనర్‌గా ఇషాన్ సంజూ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోముIshan-daar. Jabardast. Zindabaad. 🔥Started with a 2nd-ball six & Ishan Kishan is straightaway showing his intent in this run chase! 💪He is certainly on a mission to DEFEAT HISTORY! 🎯Watch Bhojpuri commentary on JioHotstar #INDvNZ, 3rd T20I | LIVE NOW 👉… pic.twitter.com/YY3fnv3WvD— Star Sports (@StarSportsIndia) January 25, 2026 -
అలా అయితే వరల్డ్‌కప్ ఆడే ప్రసక్తే లేదు: పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి ధిక్కార స్వరం వినిపించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చెప్పినట్లు తాము నడుచుకోమని.. ప్రభుత్వం చెప్పినట్లు మాత్రమే వింటామంటూ అతి చేసింది. ఈ నేపథ్యంలో అసలు తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చడమే కాకుండా.. ఐసీసీని కావాలనే చికాకు పెట్టే చర్యలకు పూనుకుంటోందని ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా బోర్డు (BCB) తాము భారత్‌లో ఆడలేమని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. కానీ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భారత్‌లో తమకు భద్రత లేదన్న బంగ్లా వాదనను కొట్టిపారేసింది. అంతేకాదు తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు కూడా ఇచ్చింది.బంగ్లాదేశ్‌కు అండగా పాక్అయితే, బంగ్లాదేశ్ మాత్రం తమ ప్రభుత్వం నిర్ణయానుగుణంగా టోర్నీ నుంచి వైదొలిగేందుకే మొగ్గుచూపింది. ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్‌కు అండగా నిలిచిన పాక్.. తాము కూడా టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి అవలంబించింది. నిజానికి భారత్- పాక్ ఉద్రిక్తతల కారణంగానే తటస్థ వేదికలపై ఇరు దేశాల జట్లు ఐసీసీ ఈవెంట్లలో ముఖాముఖి తలపడుతున్నాయి.ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాకిస్తాన్ (Pakistan)కు శ్రీలంకను తటస్థ వేదికగా నిర్ణయించారు. తమకు అనుకూలంగానే నిర్ణయం ఉన్నా.. బంగ్లాదేశ్ కోసమంటూ పాకిస్తాన్ కొత్త రాగం ఎత్తుకుంది. ఈ క్రమంలోనే బంగ్లా మాదిరే పాక్‌ను కూడా టోర్నీ నుంచి తప్పించేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పాక్ తమ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించింది.వరల్డ్‌కప్‌లో ఆడతామని చెప్పలేదుఫలితంగా ఈ ఐసీసీ (ICC) ఈవెంట్లో పాక్ పాల్గొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందిస్తూ.. తాము జట్టును ప్రకటించినంత మాత్రాన వరల్డ్‌కప్‌లో ఆడతామని చెప్పినట్లు కాదని ఓవరాక్షన్ చేశాడు."ఈ విషయం గురించి మా ఆటగాళ్లతో చర్చించాము. బోర్డు, ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోదాఢ్యమని మా ఆటగాళ్లు కుండబద్దలు కొట్టారు. టోర్నీలో పాల్గొనే విషయంలో ప్రభుత్వ సలహా కోసమే మేము ఎదురుచూస్తున్నాం.అలా అయితే బహిష్కరిస్తాంప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటాము. ఒకవేళ వారు మమ్మల్ని వరల్డ్‌కప్ టోర్నీలో ఆడవద్దని చెబితే అలాగే చేస్తాము’’ అని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే టీమిండియా మాదిరే తమకూ వెసలుబాటు కావాలని పాక్ కోరినట్లుగా ఐసీసీ శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పీసీబీ బంగ్లాదేశ్ విషయంలో రాద్దాంతం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ సైతం పాక్ పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా బంగ్లాదేశ్ మొండివైఖరి నేపథ్యంలో ఆ జట్టును తప్పించిన ఐసీసీ.. స్కాట్లాండ్ను టోర్నీలో చేర్చింది. మొత్తం 20 జట్లు వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొననున్నాయి. చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్ తేడాతో..
సాక్షి, హైదరాబాద్: యువ బౌలర్ ధ్రుతి కేసరి ఐదు వికెట్లతో సత్తా చాటినా... హైదరాబాద్ జట్టుకు పరాజయం తప్పలేదు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం ఏఓసీ సెంటర్లో జరిగిన హోరాహోరీ వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ జట్టు 1 వికెట్ తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట హైదరాబాద్ 44.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. సంధ్య గోర (50; 9 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరాఖండ్ జట్టు 37 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. నందిని కశ్యప్ (63 బంతుల్లో 39; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్ కేసరి ధ్రుతి 10 ఓవర్లలో 44 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ధ్రుతి ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఉత్తరాఖండ్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని అతికష్టంపై ఛేదించి గెలిచింది. ఇదీ చదవండి: అనాహత్ ఓటమి న్యూఢిల్లీ: భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ న్యూయర్క్ వేదికగా జరిగిన ‘స్పోర్ట్ టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’ రెండో రౌండ్లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 31వ ర్యాంకర్ అనాహత్ 11–6, 11–6, 2–11, 8–11, 6–11తో ప్రపంచ ఏడో ర్యాంకర్ సతోమి వటనాబె (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు గేమ్‌ల్లో అది్వతీయ ప్రదర్శనతో సంచలనం నమోదు చేసేలా కనిపించిన 17 ఏళ్ల అనాహత్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది. -
T20 WC 2026: టీమిండియాకు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఐసీసీ ఈవెంట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా మెగా టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.3-0తో కైవసం ఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. అయితే, ఈ సిరీస్ ఆరంభానికి ముందు నుంచే టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ తొలి మూడు టీ20లకు దూరం కాగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.తిలక్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).. వాషింగ్టన్ స్థానంలో స్పిన్నర్ రవి బిష్ణోయి (Ravi Bishnoi) జట్టులోకి వచ్చారు. ఇక తిలక్ వేగంగా కోలుకుంటుండగా.. వాషీ మాత్రం ఇప్పట్లో మ్యాచ్ ఫిట్నెస్ సాధించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..ఇంకో రెండు వారాలు‘‘అతడు పూర్తిగా ఫిట్‌గా మారడానికి ఇంకో రెండు వారాల సమయం పట్టొచ్చు. టీ20 ప్రపంచకప్ జట్టుతో అతడిని కొనసాగించాలా? లేదంటే మరో ఆటగాడితో వాషీ స్థానం భర్తీ చేయాలా? అన్న విషయం గురించి సీనియర్ సెలక్షన్ కమిటీ, జట్టు యాజమాన్యం ఆలోచిస్తోంది’’ అని పేర్కొన్నాయి.కాగా ఒకవేళ వాషీ గనుక వరల్డ్‌కప్ టోర్నీకి దూరమైతే భారత తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. పవర్‌ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు లెఫ్టాండర్లకు బ్యాటింగ్ చేయడంలో అతడు సేవలు అందించగలడు.అక్షర్ సైతం అయితే, స్పిన్ విభాగంలో ఇప్పటికే మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లతో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు. కాకపోతే అక్షర్ సైతం గాయం వల్ల కివీస్‌తో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో వాషీ సైతం దూరమైతే పరిస్థితి గందరగోళంగా మారుతుంది.ఇక కివీస్‌తో సిరీస్‌లో ఆడుతున్న రవి బిష్ణోయి.. వాషీ స్థానంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి కూడా వచ్చే అవకాశం ఉంది. కాగా న్యూజిలాండ్‌తో మూడో టీ20తో తుదిజట్టులోకి వచ్చిన బిష్ణోయి.. రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
తిరుగులేని సన్‌రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ తమకు తిరుగులేదని నిరూపించింది. ముచ్చటగా మూడోసారి చాంపియన్‌గా అవతరించింది. కేప్‌టౌన్ వేదికగా ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి.. ట్రోఫీని ముద్దాడింది.ట్రిస్టన్ స్టబ్స్ సారథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్-2026 బరిలో దిగింది సన్‌రైజర్స్. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది. ఈ క్రమంలోనే టైటిల్ పోరుకు అర్హత సాధించిన సన్‌రైజర్స్.. తుదిమ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఢీకొట్టింది. న్యూలాండ్స్ మైదానంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బ్రెవిస్ విధ్వంసకర శతకంఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగుల నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ బ్రైస్ పార్సన్స్ (30) ఓ మోస్తరుగా రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసకర శతకం (56 బంతుల్లో 101)తో విరుచుకుపడ్డాడు. దీంతో క్యాపిటల్స్‌కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది.సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్కో యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూతో సిపామ్లా, అన్రిచ్ నోర్జే తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. 19.2 ఓవర్లలో పని పూర్తి చేసింది.దంచికొట్టిన బ్రీట్జ్కే, స్టబ్స్ఓపెనర్లలో క్వింటన్ డికాక్ (18) నిరాశపరచగా.. జానీ బెయర్‌స్టో (0) పూర్తిగా విఫలమయ్యాడు. జోర్డాన్ హెర్మాన్ (3), జేమ్స్ కోల్స్ (1) కూడా వైఫల్యం చెందగా.. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 68 పరుగులతో అజేయంగా నిలిచాడు.మాథ్యూకు తోడుగా కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ (41 బంతుల్లో 63) ధనాధన్ దంచికొట్టాడు. వీరిద్దరు కలిసి 64 బంతుల్లో 114 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ 162 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.ముచ్చటగా మూడోసారిఫైనల్లో రాణించిన డెవాల్డ్ బ్రెవిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న డికాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. కాగా సౌతాఫ్రికా టీ20లీగ్‌లో సన్‌రైజర్స్‌కు తిరుగులేదు. అరంగేట్ర ఎడిషన్‌లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. ఆ మరుసటి ఏడాది కూడా టైటిల్ సాధించింది.తాజాగా మూడోసారి ట్రోఫీ (2023, 2024, 2026)ని కైవసం చేసుకుంది. ఇప్పటికి నాలుగు సీజన్లు పూర్తి కాగా. నాలుగుసార్లు ఈ జట్టు ఫైనల్ చేరడం విశేషం. రెండుసార్లు ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో ట్రోఫీ గెలిచిన సన్‌రైజర్స్‌కు ఇప్పుడు స్టబ్స్ టైటిల్ అందించాడు. కాగా గతేడాది ముంబై కేప్‌టౌన్ ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించింది.చదవండి: వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా: సూర్యకుమార్It's time for that massive celebration, Coach Adi 🤩 pic.twitter.com/KssLRr7IQk— Sunrisers Eastern Cape (@SunrisersEC) January 25, 2026 -
T20 WC 2026: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్
టీ20 ప్రపంచకప్-2026 నుంచి తమ జట్టును తప్పించడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సవాలు చేయబోవడం లేదు. ఈ మేరకు బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ అంజాద్ హుస్సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. డీఆర్సీని సంప్రదించినా..వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బంగ్లాదేశ్‌ను తప్పించింది. బంగ్లాదేశ్ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై బంగ్లా బోర్డు ఐసీసీ వివాద పరిష్కారాల కమిటీ (డీఆర్సీ)ని సంప్రదించినా ఫలితం లేకపోయింది. అంగీకరిస్తున్నాంఈ క్రమంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS)కు వెళ్లాలని ముందు అనుకున్న బీసీబీ... ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు విరమించుకుంది. ‘ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. ముందు నుంచి భారత్‌లో ఆడబోమని చెబుతూనే ఉన్నాం. అయినా మా వాదన వినిపించుకోలేదు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లే ఉద్దేశం లేదు’ అని అంజాద్ అన్నారు. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నామని... ఇది తమ ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. ‘ఐసీసీ బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత మంత్రివర్గ భేటీలో వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం భారత్‌లో పర్యటించే అంశంపై చర్చ జరిగింది. భారత్‌లో ఆడేందుకు క్యాబినెట్ అంగీకరించలేదు. అదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాం’ అని అంజాద్ వివరించారు. ICC vs Bangladesh: అసలేం జరిగింది.. కథనాల కోసం క్లిక్ చేయండి చదవండి: హరీస్ రవూఫ్‌పై వేటు -
వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా: సూర్యకుమార్
వన్డేల్లో న్యూజిలాండ్‌తో చేతిలో ఎదురైన పరభావానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం గౌహతి వేదికగా కివీస్‌తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే 3-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బౌలింగ్‌లో పర్యాటక జట్టును కేవలం 153 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపింది. ఓపెనర్ అభిషేక్ శర్మ( 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.ఫలితంగా 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మురళీ కార్తీక్ నుంచి కెప్టెన్ సూర్యకుమార్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలానే ఆధిపత్యాన్ని చెలాయించావా? అని కార్తీక్ ప్రశ్నించాడు."మా స్కూల్ ప్రిన్సిపాల్ , టీచర్లు క్రికెట్ ఆడేందుకు నాకు చాలా సమయం ఇచ్చేవారు. పరీక్షల సమయం, స్కూల్ టైమ్‌లో కూడా నాకు చాలా సెలవులు ఇచ్చారు. గ్రౌండ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడని. అక్కడే నేను ఆటలోని మెలకువలన్నీ నేర్చుకున్నాను. ఈ లక్ష్య చేధన గురించి మేం ముందే మాట్లాడుకున్నాం. మేము మొదట బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఒకే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాము.ఒకవేళ రేపు మ్యాచ్‌లో 20 పరుగులకే 3 వికెట్లు లేదా 40 పరుగులకే 4 వికెట్లు పడినా, పరిస్థితికి తగ్గట్టు ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు తెలుసు. మా జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. ఇక మా టాప్ 2-3 బ్యాటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు నా పనిని సులభం చేస్తున్నారు. ఇక బిష్ణోయ్ తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. బిష్ణోయ్ తన రోల్‌పై ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. అతడికి తన బలాలు ఏంటో తెలుసు. క్లిష్ట సమయాల్లో వికెట్లు అందించడం అతడిప్రత్యేకత. రవి చాలా జట్టులో ఉండడం మాకు ప్లస్ పాయింట్" అని సూర్య పేర్కొన్నాడు. కాగా భారత జట్టును కెప్టెన్‌గా సూర్యకుమార్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో 41 మ్యాచ్‌లు ఆడిన భారత్ 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. -
మెరిసిన షమీ
కోల్‌కతా: రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. గ్రూప్ ‘సి’లో భాగంగా బెంగాల్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో సర్వీసెస్‌ను మట్టికరిపించి బోనస్ పాయింట్ ఖాతాలో వేసుకుంది. బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగులు చేయగా... సర్వీసెస్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే ఆలౌటైన సర్వీసెస్...‘ఫాలోఆన్’ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 287 పరుగులకు పరిమితమైంది. ఓవర్‌నైట్ స్కోరు 231/8తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సర్వీసెస్ కాస్త ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. జయంత్ (68 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో పారాడాడు. బెంగాల్ బౌలర్లలో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ 51 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ‘డబుల్ సెంచరీ’ సాధించిన సుదీప్ చటర్జీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్ దశలో 6 మ్యాచ్‌లాడిన బెంగాల్ 4 విజయాలు, 2 ‘డ్రా’లతో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
ఆంధ్ర అదుర్స్
సాక్షి, అనంతపురం: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీలో కీలక విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం ముగిసిన పోరులో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ జట్టుపై ఘనవిజయం అందుకుంది. 259 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 93/1తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 56.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షేక్ రషీద్ (144 బంతుల్లో 132 నాటౌట్; 21 ఫోర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. కెపె్టన్ రికీ భుయ్ (92 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో వికెట్‌కు శ్రీకర్ భరత్ (89 బంతుల్లో 43; 5 ఫోర్లు)తో కలిసి 99 పరుగులు జోడించిన రషీద్... అబేధ్యమైన మూడో వికెట్‌కు రికీ భుయ్‌తో కలిసి 145 పరుగులు జతచేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో విజేతగా నిలిచిన విదర్భ జట్టు... ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు నిలువలేకపోయింది. ఆ జట్టు బౌలర్లలో నచికేత్ రెండు వికెట్లు పడగొట్టాడు. 6 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర జట్టు 4 విజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసింది. 28 పాయింట్లతో ఆంధ్ర గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. జార్ఖండ్, విదర్భ జట్లు చెరో 25 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్ దశలో భాగంగా తమ చివరి మ్యాచ్‌లో గురువారం నుంచి నాగాలాండ్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. -
హైదరాబాద్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు మరో పరాజయం మూటగట్టుకుంది. ఆదివారం గ్రూప్ ‘డి’లో భాగంగా ఉప్పల్ వేదికగా ముగిసిన పోరులో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల తేడాతో 42 సార్లు చాంపియన్ ముంబై చేతిలో ఓడింది. ఈ విజయంతో బోనస్ పాయింట్ ఖాతాలో వేసుకున్న ముంబై జట్టు 30 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓవర్‌నైట్ స్కోరు 166/7తో ఆదివారం నాలుగోరోజు ‘ఫాలోఆన్’ కొనసాగించిన హైదరాబాద్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 69.5 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. సీవీ మిలింద్ (128 బంతుల్లో 85; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడగా... అతడికి నితిన్ సాయి యాదవ్ (32; 6 ఫోర్లు), కెప్టెన్ సిరాజ్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్) సహకారం అందించారు. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ 5 వికెట్లు... మోహిత్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 10 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై జట్టు 3.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 12 పరుగులు చేసి గెలిచింది. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 560 పరుగులు చేయగా... హైదరాబాద్ 267 పరుగులకు పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్ దశలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక విజయం, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్ జట్టు గ్రూప్‌లో ఐదో స్థానంలో ఉంది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గురువారం నుంచి ఛత్తీస్గఢ్తోహైదరాబాద్ తలపడనుంది. -
హరీస్ రవూఫ్‌పై వేటు
లాహోర్: వచ్చే నెలలో భారత్–శ్రీలంక వేదికగా జరిగే పురుషుల టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్టాన్ జట్టును ఆదివారం ప్రకటించారు. 15 మంది సభ్యుల పాక్ జట్టుకు సల్మాన్ అలీ ఆఘా నాయకత్వం వహిస్తాడు. గతేడాది ఆసియా కప్ ఫైనల్ ఆడిన పేసర్ హరీస్ రవూఫ్‌పై సెలక్టర్లు వేటు వేయడం గమనార్హం. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన బిగ్‌బాష్ టి20 లీగ్‌లో హరీస్ రవూఫ్ 20 వికెట్లతో లీగ్ ‘టాపర్’గా నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (94 మ్యాచ్‌ల్లో 133 వికెట్లు) తీసిన పాక్ బౌలర్‌గానూ గుర్తింపు పొందాడు. ‘పాక్ తరఫున రవూఫ్ చాలా క్రికెట్ ఆడాడు. శ్రీలంకలో పిచ్ పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేశాం’ అని వివరించాడు. మెగా టోర్నీలో ఆడటం, ఆడకపోవడం అనేది పాక్ ప్రభుత్వం చూసుకుంటుందని జావేద్ అన్నాడు. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్ నుంచి తప్పించగానే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ తమ దేశ ప్రధానమంత్రి అదేశాల మేరకే నడుచుకుంటామని, ఐసీసీ ప్రకారం కాదని చెప్పారు. పాక్ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఈ మెగా ఈవెంట్లో పాక్ ఆడుతుందని నఖ్వీ తెలిపారు. ఆతిథ్య భారత్ ఉన్న గ్రూప్ ‘ఎ’లో పాకిస్తాన్ ఉంది. ఇందులో నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా ఇతర జట్లు. వచ్చేనెల 7 నుంచి జరిగే ప్రపంచకప్‌లో పాక్, నెదర్లాండ్స్‌ల మధ్యే తొలి మ్యాచ్ జరుగనుంది. పాకిస్తాన్ టి20 జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్ ), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నాఫే, మొహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీఖ్. -
బెంగళూరు గెలిస్తే నేరుగా ఫైనల్‌కు... నేడు ముంబై ఇండియన్స్‌తో ‘ఢీ’
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుస విజయాలకు బ్రేక్ పడినప్పటికీ నేరుగా ఫైనల్ చేరే అవకాశాలైతే బోలెడున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 5 విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ జట్టు... డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఎంచక్కా టైటిల్ పోరుకే అర్హత సాధిస్తుంది. ఐదు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్‌లో పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ నిలకడలేని ప్రదర్శనతో అగచాట్లు పడుతోంది. ఈ మ్యాచ్ ఆర్సీబీ కంటే ముంబైకే కీలకం కానుంది. ఇది కూడా ఓడితే ఓ రకంగా ప్లేఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ బృందం స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరుకు వరుసగా మరో పరాజయాన్ని రుచి చూపించేందుకు బరిలోకి దిగుతోంది.రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియో హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. -
లక్ష్యం 154... 60 బంతుల్లోనే ఉఫ్...
గువాహటి: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా... ఐదు టి20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన మూడో టి20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ 8 వికెట్లతో కివీస్‌పై గెలుపొందింది. 3–0తో సిరీస్‌ను వశం చేసుకుంది. టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చాప్మన్ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ సాంట్నర్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. ప్రపంచకప్‌కు ముందు ప్రీమియం బౌలర్ బుమ్రా (3/17) తన పేస్ వాడి ఏంటో నిలకడగా చూపించాడు. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.అనంతరం భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ సూర్యకుమార్ (26 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ షోతో స్టేడియాన్ని ఊపేశారు. బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ బుధవారం విశాఖపట్నంలో జరుగుతుంది. అభి‘షో’... 14 బంతుల్లో ఫిఫ్టీ! తొలి బంతికే సామ్సన్ (0) క్లీన్‌బౌల్డ్... ఈ మ్యాచ్‌లో కివీస్ శిబిరం సంతోషించిన క్షణమిదే! తర్వాత గడిచిన క్షణాలు... పడిన బంతులు... వేసిన బౌలర్లు... పడిన పాట్లు... అన్ని ఇన్నీ కావు మరి! ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో బంతికి సిక్స్‌తో మొదలుపెట్టిన విధ్వంసం... అతను అవుటైనా కూడా ప్రతి ఓవర్లోనూ కొనసాగింది. ఓపెనర్ అభిషేక్, కెప్టెన్ సూర్యకుమార్ ‘హైలైట్స్’నే ఇన్నింగ్స్ అసాంతం చూపించారు. అభి, ఇషాన్, సూర్య ముగ్గురు కలిసి 10 సిక్స్‌లు బాదారు. అంటే సగటున ఓవర్‌కు ఒక్కోటి వచ్చింది. బౌండరీలైతే 16! ఎంత సులువుగా వచ్చాయంటే! ప్రత్యర్థి ఫీల్డర్లు, బౌలర్లు మొత్తం 20 ఓవర్లు కష్టపడకుండానే సగం ఓవర్లతోనే ముగించేలా బౌండరీల భరతం పట్టారు భారత బ్యాటర్లు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 14 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. సూర్య 25 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు అబేధ్యమైన మూడో వికెట్‌కు కేవలం 40 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం. 3.1 ఓవర్లో 50 దాటిన భారత్ స్కోరు 6.3 ఓవర్లలో వందకు చేరుకుంది. 9.5 ఓవర్లలో 150ని సైతం అధిగమించింది.స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్ 1; సీఫర్ట్ (బి) బుమ్రా 12; రచిన్ (సి) బిష్ణోయ్ (బి) పాండ్యా 4; ఫిలిప్స్ (సి) ఇషాన్ (బి) బిష్ణోయ్ 48; చాప్మన్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 32; మిచెల్ (సి) ఇషాన్ (బి) పాండ్యా 14; సాంట్నర్ (సి) అభిషేక్ (బి) బుమ్రా 27; జేమీసన్ (బి) బుమ్రా 3; హెన్రీ (రనౌట్) 1; ఇష్ సోధి (నాటౌట్) 2; డఫీ (నాటౌట్) 4: ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–2, 2–13, 3–34, 4–86, 5–112, 6–112, 7–132, 8–134, 9–144. బౌలింగ్: హర్షిత్ రాణా 4–0–35–1, హార్దిక్ పాండ్యా 3–0–23–2, రవి బిష్ణోయ్ 4–0–18–2, బుమ్రా 4–0–17–3, కుల్దీప్ 3–0–32–0, శివమ్ దూబే 2–0–24–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) హెన్రీ 0; అభిషేక్ శర్మ (నాటౌట్) 68; ఇషాన్ (సి) చాప్మన్ (బి) సోధి 28; సూర్యకుమార్ (నాటౌట్) 57; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (10 ఓవర్లలో 2 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–53. బౌలింగ్: హెన్రీ 2–0–28–1, డఫీ 2–0–38–0, జేమీసన్ 1–0–17–0, ఇష్ సోధి 2–0–28–1, సాంట్నర్ 2–0–28–0, ఫిలిప్స్ 1–0–16–0. -
అభిషేక్ అదరహో.. మూడో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ
గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే 3-0 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. కివీస్ నిర్ధేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 10 ఓవర్లలోనే ఊదిపడేసింది.ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించాడు. బర్సపారా క్రికెట్ స్టేడియంలో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్) వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28)సైతం దూకుడుగా ఆడాడు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ తలా వికెట్ సాధించారు.బుమ్రా మ్యాజిక్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్(48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాప్మన్ (32), సాంట్నర్ (27) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, బిష్ణోయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: ప్రపంచకప్‌కు ముందే సౌతాఫ్రికాతో భారత్ 'ఢీ' -
అభిషేక్ శర్మ విధ్వంసకాండ.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని, ఓవరాల్‌గా ఏడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఎయిరీ పేరిట ఉంది. దీపేంద్ర 2023 ఏషియన్ గేమ్స్‌లో మంగోలియాపై కేవలం 9 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తుంది. అభిషేక్ విధ్వంసం ధాటికి భారత్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. సంజూ శాంసన్ (0), ఇషాన్ కిషన్ (28) ఔట్ కాగా.. అభిషేక్ శర్మ (67), సూర్యకుమార్ యాదవ్ (42) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 66 బంతుల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేయాలి.అంతకుముందు బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-17-3), హార్దిక్ పాండ్యా (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. చాప్మన్ (32), సాంట్నర్ (27), డారిల్ మిచెల్ (14), సీఫర్ట్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్ (4), జేమీసన్ (3), హెన్రీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
రెచ్చిపోయిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన న్యూజిలాండ్
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 153 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం బుమ్రా మహోగ్రరూపం దాల్చాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీటిలో టిమ్ సీఫర్ట్, కైల్ జేమీసన్ వికెట్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరిని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్లీన్ బౌల్డ్ అంటే ఏదో సాదాసీదా కాదు. బుమ్రా బౌలింగ్ వేగానికి వికెట్లు గాల్లో నాట్యం చేశాయి. మరో బౌలర్ రవి బిష్ణోయ్ కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా, బిష్ణోయ్.. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తికి ప్రత్యామ్నాంగా వచ్చి చెలరేగడం విశేషం.న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేయడంలో మరో ఇద్దరు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషించారు. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి కీలకమైన డెవాన్ కాన్వే వికెట్ తీయగా.. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3-0-32-0), శివమ్ దూబే (2-0-24-0) వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. చాప్మన్ (32), సాంట్నర్ (27), డారిల్ మిచెల్ (14), సీఫర్ట్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్ (4), జేమీసన్ (3), హెన్రీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
ఇదేం బౌలింగ్ సామీ.. నిప్పులు చెరిగిన బుమ్రా
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ స్థానంలో బరిలోకి దిగిన బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ న్యూజిలాండ్‌ను ఇబ్బంది పెడుతోంది. 14.4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 112 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయింది. కాన్వే (1), సీఫర్ట్ (12), రచిన్ రవీంద్ర (4), చాప్మన్ (32), డారిల్ మిచెల్ (14) ఔట్ కాగా.. గ్లెన్ ఫిలిప్స్ (48), సాంట్నర్ క్రీజ్‌లో ఉన్నారు.భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, బిష్ణోయ్, బుమ్రా తలో వికెట్ తీశారు. వీరిలో బిష్ణోయ్, బుమ్రా అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా.. మిగతా వారు పర్వాలేదనిపిస్తున్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన దాంట్లో కుల్దీప్ యాదవ్ (3-0-32-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దూబే కూడా ఓ ఓవర్ వేసి 13 పరుగులిచ్చాడు.గాల్లో నాట్యంఇన్నింగ్స్ 6వ ఓవర్ తొలి బంతికి బుమ్రా అద్భుతం చేశాడు. ఫుల్ లెంగ్త్ బంతిని డిఫెండ్ చేసుకునే క్రమంలో సీఫర్ట్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి సీఫర్ట్ బ్యాట్‌ను ఆఫ్ స్టంప్‌ను గిరాటు వేసింది. బుమ్రా సంధించిన వేగానికి వికెట్ కాసేపే గాల్లో నాట్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.A PEACH FROM THE BEST BOWLER OF GENERATION - BUMRAH 😍 pic.twitter.com/QyUNGzYLS1— Johns. (@CricCrazyJohns) January 25, 2026రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్ స్థానంలో కైల్ జేమీసన్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా -
ప్రపంచకప్‌కు ముందే సౌతాఫ్రికాతో భారత్ 'ఢీ'
టీ20 ప్రపంచకప్‌కు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా గతేడాది రన్నరప్ సౌతాఫ్రికాతో తలపడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పోరు రెగ్యులర్ మ్యాచ్‌లా కాకుండా వార్మప్ మ్యాచ్‌గా జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు ఇదొక్కటే వార్మప్ మ్యాచ్ అని సమాచారం.వాస్తవానికి ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలకు ముందు వార్మప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే బంగ్లాదేశ్ కిరికిరి ఉండటంతో ఫైనల్ షెడ్యూల్ ఆలస్యమైంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ప్రపంచకప్‌లో ఆడనుండటంతో షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది.భారత్-సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఫిబ్రవరి 3న ముంబైలో కలుస్తుంది. సౌతాఫ్రికాతో వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ ఫిబ్రవరి 4న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగనున్నట్లు సమాచారం.ప్రపంచకప్ మెయిన్ షెడ్యూల్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. కొలొంబో వేదికగా జరిగే పాకిస్తాన్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా యూఎస్ఏతో ఆడనుంది.భారత్.. యూఎస్ఏ, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియాతో పాటు గ్రూప్-ఏలో ఉంది. మిగతా గ్రూప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 12 (నమీబియాతో ఢిల్లీలో), 15 (పాకిస్తాన్‌తో కొలొంబోలో), 18 (నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో) తేదీల్లో జరుగనున్నాయి.దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, యూఏఈలతో కలిసి గ్రూప్-డిలో ఉంది. దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌లో కెనడాతో ఆడనుంది. -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టాస్ గెలిచిన సూర్యకుమార్
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగనున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్ స్థానంలో కైల్ జేమీసన్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా -
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డు
2026 పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ఇవాళ (జనవరి 25) ప్రకటించింది. మొత్తం 131 మంది ఈ అవార్డులకు ఎంపిక కాగా.. ఇందులో 113 మందికి పద్మశ్రీ, 13 మంది పద్మభూషణ్, ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. ఇందులో క్రీడారంగానికి సంబంధించి ఎనిమిది మందికి పద్మ అవార్డులు లభించగా.. వీరిలో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్‌కు పద్మవిభూషణ్, భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్, భారత సీనియర్ మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవిత పూనియా సహా మరో ముగ్గురికి (బల్దేవ్ సింగ్, భగవాన్‌దాస్ రైక్వార్, కే పజనివేల్) పద్మశ్రీ అవార్డులు లభించాయి. -
బిగ్‌బాష్ లీగ్ 2025-26 విజేత స్కార్చర్స్
2025-26 ఎడిషన్ బిగ్‌బాష్ లీగ్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ అవతరించింది. ఇవాళ (జనవరి 25) జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. స్కార్చర్స్ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో టైటిళ్లు సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో స్కార్చర్స్‌కు టైటిల్ అందించిన ఆష్టన్ టర్నర్ గతంలో మరో రెండు టైటిళ్లు (కెప్టెన్) అందించాడు. తద్వారా లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. బీబీఎల్ నిర్వహకులు ఈ ఎడిషన్‌లో కొత్త ఆనవాయితీకి తెరలేపారు. విజేతలను అందించే మెడల్స్‌ను చిన్నారుల చేత ఇప్పించారు. స్కార్చర్స్ కెప్టెన్ టర్నర్ తన విన్నింగ్ మెడల్‌ను తన ముగ్గురు సంతానం చేతుల మీదుగా అందుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్.. జై రిచర్డ్స్ (4-0-32-3), డేవిడ్ పేన్ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్ (4-0-29-2), ఆరోన్ హార్డీ (3-0-16-1), కూపర్ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్, జోష్ ఫిలిప్, కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ తలో 24 పరుగులు చేయగా.. జోయల్ డేవిస్ 19, లచ్లాన్ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (44), ఫిన్ అలెన్ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్ ఇంగ్లిస్ (29 నాటౌట్) పూర్తి చేశాడు. ఇంగ్లిస్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్ బౌలర్లలో సీన్ అబాట్ (4-0-19-2), మిచెల్ స్టార్క్ (4-0-33-1), జాక్ ఎడ్వర్డ్స్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. -
చరిత్రలో ఐసీసీ టోర్నీలను బహిష్కరించిన జట్లు ఇవే..!
క్రికెట్‌కు సంబంధించి ఏ జట్టుకైనా ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడమనేది చాలా ముఖ్యం. కేవలం మైదానంలో లభించే గుర్తింపు కోసమే కాకుండా, ఆదాయాన్ని సమీకరించుకునే విషయంలోనూ ఇది చాలా కీలకం. అందుకే ప్రతి జట్టు ఐసీసీ టోర్నీల్లో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.అయితే, క్రికెట్ చరిత్రలో కొన్ని జట్లు ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు నిరాకరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా బంగ్లాదేశ్ చేరింది. ఈ జట్టు త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నుండి వైదొలిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ ఈవెంట్లను బహిష్కరించిన జట్లపై ఓ లుక్కేద్దాం.చరిత్ర చూస్తే.. రాజకీయ కారణాలు, భద్రతా సమస్యలు లేదా అంతర్జాతీయ సంబంధాల కారణంగా కొన్ని జట్లు ఐసీసీ టోర్నీలను బహిష్కరించాయి. ఇందులో ముందుగా జింబాబ్వే పేరు వస్తుంది.జింబాబ్వే రాజకీయ ఉద్రిక్తతలు, ఆటగాళ్లకు వీసా సమస్యల కారణంగా ఇంగ్లండ్‌లో జరిగిన 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20ని (అప్పట్లో టీ20 ప్రపంచకప్‌ను అలా పిలిచేవారు) బహిష్కరించింది. జింబాబ్వే ఇలా చేయడానికి బీజం 2003లో పడింది. ఆయేడు జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జింబాబ్వేలో ఆడటానికి నిరాకరించింది. ఇందుకు కారణం నాటి జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేతో యూకేకు ఉండిన రాజకీయ విభేదాలు.అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపడకపోవడంతో జింబాబ్వే 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంది. జింబాబ్వేకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్కు టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కింది.ఇలాంటి ఉదంతమే 2016 అండర్ 19 వరల్డ్‌కప్‌లోనూ జరిగింది. ఆయేడు బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా వైదొలిగింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ యువ ఆసీస్ జట్టు మెగా టోర్నీని బహిష్కరించింది. అప్పుడు ఆసీస్‌కు ప్రత్యామ్నాయంగా ఐర్లాండ్‌కు అవకాశం లభించింది. పై రెండు ఉదంతాల తర్వాత ఓ జట్టు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే బహిష్కరించడం ఇదే ఏడాది జరిగింది. రాజకీయ ఉద్రిక్తతలు, ఐపీఎల్ 2026లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొలగింపు, భద్రతా కారణాల చేత భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. దీంతో ఆ జట్టుకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్కు ప్రపంచకప్ బెర్త్ దక్కింది.పైన పేర్కొన్న ఉదంతాల్లో ఆయా జట్లు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే రద్దు చేసుకోగా.. కొన్ని జట్లు పలు మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.1996 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకలో జరగాల్సిన మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు బాయ్‌కాట్ చేశాయి. లంకలో అంతర్యుద్దం, భద్రతా కారణాల చేత ఆ జట్లు తమ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను రద్దు చేసుకున్నాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్ లభించింది. ఆ టోర్నీలో శ్రీలంకనే ఛాంపియన్‌గా నిలవడం కొసమెరుపు.2003 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు కూడా ఓ మ్యాచ్‌ను ఆడేందుకు నిరాకరించింది. ఆయేడు ప్రపంచకప్ టోర్నీకి జింబాబ్వేతో పాటు కెన్యా కూడా ఆతిథ్యమిచ్చింది. మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ నైరోబీలో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌ను భద్రతా కారణాల చేత న్యూజిలాండ్ బాయ్‌కాట్ చేయాలనుకుంది. -
చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ కెరీర్లో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. నిన్న (జనవరి 24) శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో (2.3-0-13-2, ఓ క్యాచ్, (90 బంతుల్లో 72; 5 ఫోర్లు)) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు గెలుచుకున్న అతడు.. ఇంగ్లండ్ తరఫున అత్యధిక POTM అవార్డులు (383 మ్యాచ్‌ల్లో 27) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో కెవిన్ పీటర్సన్ (277 మ్యాచ్‌ల్లో 26) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో రూట్, కేపీ తర్వాత జోస్ బట్లర్ (24), ఇయాన్ మోర్గాన్ (23) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రూట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 27న కొలొంబో వేదికగానే జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య పల్లెకెలె వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ తర్వాత శ్రీలంకతో పాటు భారత్‌లో ప్రపంచకప్ మొదలవుతుంది.ఎనిమిది మందితో ప్రయోగంటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించింది. తలో చేయి వేయడంతో శ్రీలంక 49.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ఓవర్టన్, ఆదిల్ రషీద్, రూట్ తలో 2 వికెట్లు తీయగా.. డాసన్, జాక్స్, రెహాన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వ (40), అసలంక (45) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.రాణించిన రూట్అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. రూట్ (75), బ్రూక్ (42), డకెట్ (39), బట్లర్ (33 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును గెలిపించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, వాండర్సే తలో 2, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. -
టీ20 వరల్డ్‌కప్‌కు పాక్ జట్టు ప్రకటన.. కీలక మార్పులు
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడంపై ఆనిశ్చితి కొనసాగుతుండగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జనవరి 25) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది ఆసియా కప్ జట్టులో లేని బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు తిరిగి రావడం పాకిస్తాన్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కెప్టెన్‌గా సల్మాన్ అలీ అఘా కొనసాగుతుండగా.. పలువుర స్టార్ ఆటగాళ్లపై వేటు పడింది. హరీస్ రౌఫ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, హసన్ అలీ, హుస్సైన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ హరీస్, సుఫియాన్ ముఖీమ్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్ తారిక్ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టు..సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (wk), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (wk), ఉస్మాన్ తారిక్మా పని మేము చేశాం.. మిగతాదంతా ప్రభుత్వం చూసుకుంటుంది..!ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, పాక్ టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ అనుమతి లేనిదే ప్రపంచకప్‌లో పాల్గొనబోమని పాక్ సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పీసీబీ, పాక్ జట్టు హెడ్ కోచ్ గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నారు. “మేము సెలెక్టర్లం. మా పని జట్టును ఎంపిక చేయడం. పాల్గొనడం ప్రభుత్వ నిర్ణయం” అని సెలెక్టర్లు అన్నారు.నెదర్లాండ్స్‌తో ఢీఅన్నీ కుదిరితే పాక్ ఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దీనికి ముందు పాక్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.ఇదిలా ఉంటే, భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్‌గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్‌లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్‌గా ఉండలేము.పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్‌లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని పీసీబీ చీఫ్ నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.తదనంతర పరిణామాల్లో.. టీ20 వరల్డ్‌కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.నేపథ్యంభారత్-బంగ్లాదేశ్ మధ్య పంచాయితీ (బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, తదనంతర పరిణామాల్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడం) నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకొని ఓవరాక్షన్ చేస్తుంది. -
ప్రతీకకు టెస్టు పిలుపు
న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన ప్రతీక రావల్... తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకుంది. ప్రతీకతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ, మీడియం పేసర్ క్రాంతి గౌడ్ కూడా మొదటిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. మార్చి 6 నుంచి పెర్త్ వేదికగా ఆ్రస్టేలియాతో జరగనున్న ఏకైక టెస్టు కోసం సెలెక్షన్ కమిటీ శనివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈ పర్యటనలో భాగంగా ఆసీస్‌తో 3 టి20లు, 3 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. పరిమిత ఓవర్ల కోసం ఇప్పటికే జట్లను ప్రకటించగా... తాజాగా టెస్టు జట్టును ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌కు ముందు గాయంతో జట్టుకు దూరమైన ప్రతీక ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకుంది. ఇక అండర్–19 ప్రపంచకప్ మెరుపులతో భారత టి20 జట్టులోకి వచి్చన వైష్ణవి ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్లో చోటు దక్కించుకుంది. ఇక వన్డే, టి20 సిరీస్‌లకు ఎంపికైన వికెట్ కీపర్ కమలిని గాయపడటంతో ఆమె స్థానంలో ఉమఛెత్రీకి అవకాశం దక్కింది. భారత మహిళల టెస్టు జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జ్యోత్ కౌర్, రిచా ఘోష్, ఉమా ఛెత్రీ, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుక ఠాకూర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, సయాలి సత్గరే. ఆ్రస్టేలియాతో ఏకైక టెస్టుకు భారత మహిళల జట్టు ప్రకటన -
నేడూ టీ–20 మ్యాచ్ టికెట్ల విక్రయం
విశాఖ స్పోర్ట్స్: వైజాగ్ వేదికగా జరగనున్న భారత్–న్యూజిలాండ్ టీ–20 మ్యాచ్‌కు సంబంధించి రెండో దశ టికెట్లను ఆదివారం సాయంత్రం 5 గంటలకు విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. కనిష్టంగా రూ.1,200 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు వివిధ డినామినేషన్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోని మొత్తం 18 స్టాండ్లతో పాటు కార్పొరేట్ బాక్స్ టికెట్లను కూడా ఈ విడతలో విక్రయించనున్నారు. స్టేడియం మొత్తం సామర్థ్యం 27,251 కాగా, ఇప్పటికే ఈ నెల 23న జరిగిన తొలి దశ విక్రయాల్లో చాలా వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. కాగా.. టీ–20 సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ ఆడేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు ఈ నెల 26న విశాఖ చేరుకోనున్నాయి. 27న ఇరు జట్లు వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుండగా, 28వ తేదీ రాత్రి 7 గంటలకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్ ప్రారంభం కానుంది. -
టీ20 వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ కూడా ఔట్?
అంతా ఊహించిందే జరిగింది. టీ20 వరల్డ్‌కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.పొట్టి ప్రపంచకప్‌ను బహిష్కరించే అవకాశం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చాడు. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడిన తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై పీసీబీ నిర్ణయం తీసుకుంటుందని నఖ్వీ తెలిపాడు. బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని నఖ్వీ ఆరోపించాడు.కాగా భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్‌గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్‌లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్‌గా ఉండలేము.పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్‌లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. -
సిరీస్‌పై గురి...
గువాహటి: సొంతగడ్డపై టి20 ప్రపంచకప్‌నకు ముందు ఆడుతున్న చివరి దైపాక్షిక సిరీస్‌లో టీమిండియా జోరు కనబరుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడిన రెండు టి20ల్లోనూ గెలిచిన సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు నేడు న్యూజిలాండ్‌తో మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. గత రెండు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... అదే జోష్‌లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఇక్కడే సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరో వైపు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ జట్టు... టి20ల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతోంది. ముఖ్యంగా టీమిండియా హిట్టర్లను కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు విఫలమవుతున్నారు. మరి సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించనుండగా... మంచు ప్రభావం ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపనుంది. సంజూ రాణించేనా..! ఐసీసీ టి20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా... బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. మెగాటోర్నీలో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడనుకుంటున్న సంజూ సామ్సన్ గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచాడు. అదే సమయంలో రెండో టి20ల్లో ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా సంజూ స్థాయికి తగ్గ ప్రద్రర్శన చేస్తాడా చూడాలి. ముఖ్యంగా సామ్సన్ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. దాన్ని అధిగమించకపోతే... మెగా టోర్నీలో తిలక్ వర్మ వస్తే సామ్సన్ స్థానాన్ని ఇషాన్ భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అభిషేక్ గత మ్యాచ్‌లో ‘గోల్డెన్ డకౌట్’ అయినా... అతడి దూకుడుపై ఎవరికీ సందేహాలు లేవు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేసుకునే అభిõÙక్ నుంచి అభిమానులు అలాంటి సుడిగాలి ఇన్నింగ్స్‌లే ఆశిస్తున్నారు. ఇక సుదీర్ఘ కాలం తర్వాత సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వరల్డ్‌కప్‌నకు ముందు ఇది జట్టుకు శుభపరిణామం కాగా... మిడిలార్డర్లో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ రూపంలో ధాటిగా ఆడగల సమర్థులు ఉన్నారు. వీరంతా కలిసికట్టుగా కదం తొక్కితే... మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు ఖాయమే. బౌలింగ్‌లో అర్ష్ దీప్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నారు. గత మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి వస్తే హర్షిత్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. డరైల్ మిచెల్‌పై ఆశలు టీమిండియాతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన డారిల్ మిచెల్‌పై న్యూజిలాండ్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వన్డేల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన అతడు టి20ల్లో మాత్రం పెద్దగా మెరవడం లేదు. దీంతో కివీస్ గెలుపుబాట పట్టలేకపోతోంది. ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్ జట్టుకు మెరుపు ఆరంభాలను ఇచ్చినట్లే కనిపిస్తున్నా... ఈ జంట ఎక్కువసేపు నిలవలేకపోతుండటంతో మిడిలార్డర్‌పై భారం పడుతోంది. గత మ్యాచ్‌లో చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రచిన్ రవీంద్ర అదే జోరు కొనసాగించాలని చూస్తుండగా... గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, సాంట్నర్ కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. కెపె్టన్ సాంట్నర్ గత మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆకట్టుకున్నా... బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఫౌల్క్స్ బంతులనైతే టీమిండియా బ్యాటర్లు చీల్చి చెండాడారు. మూడు ఓవర్లలోనే 67 పరుగులు సమర్పించుకున్న అతడు కివీస్ పరాజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని కివీస్ సమష్టిగా సత్తా చాటాలని భావిస్తోంది. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్, దూబే, హార్దిక్, రింకూ సింగ్, హర్షిత్/ బుమ్రా, కుల్దీప్, అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), కాన్వే, సైఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, డరైల్ మిచెల్, చాప్మన్, ఫౌల్క్స్, హెన్రీ, సోధి, డఫీ. -
బంగ్లాదేశ్ ఖేల్ ఖతం!
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లా టీమ్‌ను వరల్డ్ కప్‌నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మంకు పట్టు వీడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్‌పై ఐసీసీ వేటు వేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ ఈ టోర్నమెంట్లో బంగ్లా స్థానంలో బరిలోకి దిగుతుంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు మద్దతు పలికింది. దాంతో వేటు లాంఛనంగానే మారింది. టీమ్‌ను వరల్డ్ కప్‌ను తొలగిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ శుక్రవారం బీసీబీకి తెలియజేసింది. ఐసీసీలోని ఇతర సభ్య దేశాలకు కూడా ఈ సమాచారం అందించింది. టోర్నీకి దూరం కావడం బంగ్లా బోర్డుపై ఆరి్థ కపరంగా కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు ఇచ్చే 5 లక్షల డాలర్లతో పాటు ఐసీసీనుంచి ప్రతీ ఏటా అందే 27 మిలియన్ డాలర్లు కోల్పోనుంది. బంగ్లా నిష్క్రమణ నేపథ్యమిదీ... తాజా పరిణామాలను బట్టి చూస్తే వరల్డ్ కప్‌కు దూరం కావడం బంగ్లా స్వయంకృతమే. ఐపీఎల్ వేలంలో బంగ్లా పేసర్ ముస్తఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 9.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆటగాడిని ఐపీఎల్లో ఆడించాలనే ఆలోచనపై భారత్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వీటికి స్పందిస్తూ కేకేఆర్ యాజమాన్యం ముస్తఫిజుర్‌ను లీగ్ నుంచి తప్పించింది. తమ ఆటగాడిని అర్ధాంతరంగా తొలగించడం బీసీబీకి నచ్చలేదు. దీనిని ఆ దేశ బోర్డు ఒక రకమైన అవమానంగా భావించింది. దాంతో భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ కొత్త విషయాన్ని ముందుకు తెచ్చింది. టి20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ అంశంపై స్పందించిన ఐసీసీ బంగ్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. టోర్నీకి చాలా తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో ఆ దేశపు ఆటగాళ్లు, మీడియా, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్య రాకుండా అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. -
ఆర్సీబీకి తొలి ఓటమి.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని నామమాత్రపు స్కోరే పరిమితం చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, కాప్, మిన్ను మని తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వడర్ట్(42), కాప్(19) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు, రాధా యాదవ్ ఓ వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
న్యూజిలాండ్ చిత్తు చిత్తు.. భారత్ హ్యాట్రిక్ విజయం
బులావాయో:: ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం నమోదు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దాంతో ఈ వరల్డ్‌కప్‌లో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆపై 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 13.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌లో విజేతను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్ణయించారు. ఫలితంగా భారత్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయాన్ని అందుకుంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 17 ఓవర్లలో 90 పరుగులు చేస్తే విజయం సాధించినట్లు. దాంతో భారత్ అప్పటికే ముందంజలో ఉండటంతో విజయం అడ్డుకోవడానికి కివీస్‌కు ఎటువంటి చాన్స్ లేకుండా పోయింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(40: 23 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి విజృంభించి ఆడాడు. అతనికి జతగా కెప్టెన్ ఆయుష్(53: 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో భారత్ స్కోరు 9.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటేసింది. అంతకుముందు భారత బౌలర్లలో అంబ్రిష్ నాలుగు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా, హెనిల్ పటేల్ మూడు వికెట్లతో మెరిశాడు. -
'హిట్‌మాన్'పై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మపై యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మాన్ అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పాడు. టి20 పవర్ ప్లేలో రోహిత్ శర్మలా ఆడటానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. తనపై హిట్‌మాన్ ప్రభావం గురించి జియోస్టార్‌తో మాట్లాడుతూ.. "రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. పవర్‌ప్లేలో అతడు ఇచ్చే ప్రారంభాల కారణంగా ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుందని అన్నాడు. రోహిత్ శర్మ పాత్ర పోషించాలని కోచ్ గౌతమ్ గంభీర్ తనకు సూచించినట్టు వెల్లడించాడు.గంభీర్‌తో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రోత్సహంతో తాను రోహిత్ శర్మ ఫార్ములాను అనుసరిస్తున్నానని అభిషేక్ తెలిపాడు. "నేను జట్టులోకి వచ్చినప్పుడు.. కోచ్, కెప్టెన్ నా నుంచి అదే ఆశించారు. తొలి బంతి నుంచే విరుచుకుపడడం నాకు ఇష్టం కాబట్టి.. అది నా శైలికి కూడా సరిపోతుందని భావించాను. రోహిత్ భాయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. టీమిండియా తరపున ఇలా ఆడుతూ రాణించడం నాకు నిజంగా సంతోషంగా ఉంద''ని అన్నాడు.దూకుడుగా ఆడటమే నా పనితన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటానని అభిషేక్ శర్మ చెప్పాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి.. జట్టు భారీస్కోరుకు బాటలు వేయాలని భావిస్తానని చెప్పాడు. "నేను ఇంకా పూర్తిగా పరిణతి చెందానని చెప్పను, ఎందుకంటే ఎల్లప్పుడూ మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా క్రికెట్ ఆడటమే నా పని అని భావిస్తున్నాను. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంచి ఆరంభం ఇస్తే జట్టు ఆ ఊపును అనుసరించగలదని నాకు తెలుసు. అందుకే జట్టుకు ఆరంభం ఇవ్వాలని ప్రతిసారి అనుకుంటాన''ని ఈ డాషింగ్ ఓపెనర్ పేర్కొన్నాడు.వారితో ప్రాక్టీస్ చేస్తాటి20 ప్రపంచకప్‌కు సన్నద్ధత కోసం మాట్లాడుతూ.. తన దూకుడుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తానని, మ్యాచ్‌లకు ముందు తానెప్పుడూ ఇదే ఫాలో అవుతానని అన్నాడు. ''నాకు వారం లేదా 10 రోజులు సమయం దొరికినప్పుడు, తదుపరి సిరీస్ లేదా మ్యాచ్‌లలో నేను ఎదుర్కొనబోయే బౌలర్లను గుర్తుంచుకుంటాను. వారిలా బౌలింగ్ చేసే వారితో ప్రాక్టీస్ చేస్తాను. కొత్త బంతితో అవుట్-స్వింగర్లు, ఇన్-స్వింగర్లు వేయమని చెప్పి బ్యాటింగ్ చేస్తుంటాను. టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా దేశవ్యాప్తంగా భిన్నమైన పరిస్థిల్లో వేర్వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ చాలా ముఖ్యమ''ని అభిషేక్ అభిప్రాయపడ్డాడు.పవర్ హిట్టింగ్తో హిట్2024, జూలైలో టి20లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్తో తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే నంబర్‌వన్ బ్యాటర్ ఎదిగాడు. ఇప్పటివరకు 34 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 190.92 స్ట్రైక్ రేట్‌తో 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 7 నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌లోనూ తన జోరును కొనసాగించాలని ఈ ఎడంచేతి వాటం ఓపెనర్ ఉవ్విళ్లూరుతున్నాడు. చదవండి: ప్రధాని తర్వాత కష్టమైన జాబ్.. గంభీర్‌పై ప్రశంసలు -
దిగ్గజాలకు షాక్!.. అది నిజమే: బీసీసీఐ
ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు గ్రేడ్లలో మార్పులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. A+ గ్రేడ్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ధ్రువీకరించారు.బోర్డు సంతృప్తితో లేదు‘‘A+ గ్రేడ్‌ను తొలగించే విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు కాకుండా.. కేవలం ఒకే ఒక్క ఫార్మాట్ ఆడేందుకు సుముఖంగా ఉన్నారు. A+ గ్రేడ్‌లో కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు ఎవరూ కలిగిలేరు. ఈ విషయంలో బోర్డు సంతృప్తితో లేదు.ఈ గ్రేడ్‌లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడవద్దని నిర్ణయించుకున్నారు. మా నిబంధనలకు అనుగుణంగా ఎవరూ లేరు కాబట్టి ఈ గ్రేడ్‌ను తీసివేయాలని ఫిక్సయిపోయాం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్‌స్టార్‌తో పేర్కొన్నారు.రో-కో వన్డేలలో మాత్రమేకాగా గతేడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులలో బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలతో పాటు.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా మాత్రమే A+ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.మరోవైపు.. జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. ఇక బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతున్నా పనిభారం తగ్గించుకునే క్రమంలో అతడు ఎక్కువసార్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే, టెక్నికల్‌గా మాత్రం మూడు ఫార్మాట్లు ఆడుతున్నట్లే లెక్క.బుమ్రాకు మాత్రం ఏడు కోట్లు?ఈ క్రమంలో రో-కోలతో పాటు జడ్డూకు వార్షిక తగ్గించే విషయంలో నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ.. బుమ్రాకు A+ గ్రేడ్ మాదిరే మాత్రం రూ. 7 కోట్లు జీతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా A గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు. అదే విధంగా C గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి వార్షిక జీతంగా చెల్లిస్తోంది బీసీసీఐ.చదవండి: RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్! -
ICC: బై.. బై.. బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ వచ్చేసింది
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌కు ఉద్వాసన తప్పలేదు. భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమంటూ పంతం పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గట్టిషాకిచ్చింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ప్రస్తుత టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు ఐసీసీ ఈ అవకాశం ఇచ్చింది.కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడి నుంచి మొదలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను (Mustafizur Rahman) ఐపీఎల్ నుంచి తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేసింది.ఈ పరిణామాల క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమని బీసీబీ.. ఐసీసీకి తెలియజేసింది. భద్రతాపరమైన ముప్పులు ఉన్నందున తమ వేదికను శ్రీలంకకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పరిశీలనా బృందం నుంచి వివరాలు తీసుకున్న ఐసీసీ. భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీలేదని తేల్చింది.మొండి వైఖరి అయితే, బీసీబీ మాత్రం మొండి వైఖరి అవలంబించింది. తాము భారత్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని పంతం పట్టింది. ఐసీసీ గడువు ఇచ్చినప్పటికీ తమ నిర్ణయం ఇదేనంటూ సవాలు విసిరినట్లుగా మాట్లాడింది. అంతేకాదు ఆఖరి ప్రయత్నంగా వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది.ముందుగా హెచ్చరించినట్లుగానేతాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది. అయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేకపోయింది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఐసీసీ.. ముందుగా హెచ్చరించినట్లుగానే బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్తో భర్తీ చేసినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయం గురించి బీసీబీకి ఐసీసీ లేఖ కూడా రాసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ఈసారి ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా. గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీలతో కలిసి ఉంది బంగ్లాదేశ్. ఇప్పుడు ఆ స్థానంలో స్కాట్లాండ్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఉన్న క్రేజే వేరు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఈ జట్టులో భాగం కావడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, ప్రతి ఏడాది.. ‘‘ఈసారి కప్ మనదే’’ అనుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేసే ఆర్సీబీ అభిమానులకు పదిహేడేళ్లపాటు చేదు అనుభవమే మిగిలింది.పద్దెనిమిదేళ్లకుఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది రజత్ పాటిదార్ (Rajat Patidar) కెప్టెన్సీలోని ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. లీగ్ మొదలైన (2008) నాటి నుంచి జట్టుతోనే ఉన్న కోహ్లి.. పద్దెనిమిదేళ్లకు తర్వాత తొలిసారి ట్రోఫీని ముద్దాడి ఉద్వేగానికి లోనయ్యాడు.చేతులు మారనున్న యాజమాన్యంఈ క్రమంలో విజయోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆర్సీబీ, ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోవాల్సి వచ్చింది. తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నుంచి ఆర్సీబీ మ్యాచ్‌లు తరలిపోనున్నాయి. ఇందుకు తోడు ఆర్సీబీ యాజమాన్యం కూడా చేతులు మారనుంది.ఆదార్ పూనావాలా ఆసక్తిఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్ డియాజియో ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. విపరీతమైన ఆదరణ కలిగి ఉన్న ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆదార్ పూనావాలా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి.‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్!తాజా సమాచారం ప్రకారం.. ఆర్సీబీలో వాటాలు కొనేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ ఆర్సీబీలో మూడు శాతం వాటా కోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.మరోవైపు.. రణ్‌బీర్ కపూర్ సైతం రెండు శాతం వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ విలువ పెరగడంలో కోహ్లిది కీలక పాత్ర. అలాంటి ఫ్రాంఛైజీలోకి కోహ్లి జీవిత భాగస్వామి పెట్టుబడిదారుగా రావడాన్ని బీసీసీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ద్వంద్వ ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు వీలుగా ఐపీఎల్ జట్లలో ఆటగాళ్లు (యాక్టివ్) ఎలాంటి వాటాలు కొనుగోలు చేయకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. చదవండి: ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన -
మాజీ క్రికెటర్‌తో హార్దిక్ పాండ్యా గొడవ!?.. వీడియో వైరల్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియాలో పునరాగమనం చేశాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన అతడు పూర్తిగా కోలుకుని దేశీ క్రికెట్లో సొంత జట్టు బరోడా తరఫున బరిలో దిగినప్పటికీ.. కివీస్‌తో వన్డే సిరీస్ నుంచి మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చింది.మొత్తంగా రెండు వికెట్లుఈ క్రమంలో నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్ తీశాడు. తాజాగా రాయ్‌పూర్‌లో శుక్రవారం నాటి రెండో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టిన ఈ పేస్ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్).. ఆల్‌రౌండర్ శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) ధనాధన్ దంచికొట్టడంతో భారత్ 15.2 ఓవర్లలోనే కివీస్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.మురళీ కార్తిక్‌తో గొడవ?ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో టీ20కి ముందు అతడు.. మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్‌తో హార్దిక్ మైదానంలోకి వస్తుండగా.. మురళీ కార్తిక్ అతడిని పలకరించాడు.ఇంతలోనే కోపోద్రిక్తుడైన హార్దిక్ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మురళీ కార్తిక్ వివరించే ప్రయత్నం చేయగా.. హార్దిక్ మాత్రం మాటల బాణాలు వదులుతూనే ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వీరిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు? అసలేం జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు. హార్దిక్ అభిమానులు మాత్రం మురళీ కార్తిక్ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే ఇలా రియాక్ట్ అయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్🚨 Hardik Pandya angry at Murali Kartik – Hardik Pandya had an argument with Murali Kartik before the IND vs NZ 2nd ODI in Raipur. pic.twitter.com/axpjLykXfY— Sonu (@Cricket_live247) January 23, 2026 -
అతడొక అటాకింగ్ ప్లేయర్: సెలక్టర్లపై అజారుద్దీన్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ విమర్శించాడు. కొంతమంది ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా వారికి అవకాశాలు ఇస్తున్న యాజమాన్యం.. సర్ఫరాజ్ ఖాన్ వంటి అద్భుత ఆటగాడిని మాత్రం పక్కనపెట్టిందన్నాడు.కాగా గత కొంతకాలంగా సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ టీ20, వన్డే టోర్నీలలో శతక్కొట్టిన ఈ ముంబై బ్యాటర్.. తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో మెరిశాడు. ఉప్పల్‌లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ద్విశతకం పూర్తి చేసుకుని ముంబైకి భారీ స్కోరు అందించాడు. మొత్తంగా 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 227 పరుగులు సాధించాడు.ఐదో డబుల్ సెంచరీ ఫలితంగా హైదరాబాద్‌తో జట్టుతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 332/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 123.2 ఓవర్లలో 560 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఐదో డబుల్ సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సువేద్ పార్కర్ (98 బంతుల్లో 75; 11 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో అతడికి అండగా నిలిచాడు.ఈ సీజన్లో సర్ఫరాజ్ విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో గోవాపై (157)పై సెంచరీ... ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీపై అస్సాంపై (100 నాటౌట్) సెంచరీ సాధించాడు. ఇక హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అజారుద్దీన్‌కు క్రెడిట్ ఇచ్చాడు.ఎలా ఆడాలో చూపించారు‘‘నా కెరీర్లో పెద్దగా రివర్స్ స్వింగ్ షాట్లు ఆడలేదు. అజర్ సర్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆయనతో క్రికెట్ గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఇప్పటికి ఇది సాధ్యమైంది. ఆయన ఆఫీసుకు వెళ్లాను.ఇక్కడ (ఉప్పల్) ఆరంభంలోనే ఎక్కువ రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అజర్ సర్ చెప్పారు. ఇన్‌స్వింగ్ ఎలా రాబట్టాలో వివరించారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. కుర్చీ నుంచి లేచి నిలబడి మరీ వివిధ రకాల షాట్లు ఎలా ఆడాలో చూపించారు. దాదాపు రెండు గంటల పాటు మా సంభాషణ కొనసాగింది’’ అని సర్ఫరాజ్ ఖాన్ అజారుద్దీన్ పట్ల కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నాడు.అతడొక అటాకింగ్ బ్యాటర్ఇక ఇందుకు స్పందనగా.. ‘‘డబుల్ సెంచరీ విషయంలో క్రెడిట్ మొత్తం సర్ఫరాజ్‌కే దక్కాలి. తను నా ఆఫీస్‌కు వచ్చి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. నేనూ కొన్ని విషయాలు అతడికి చెప్పాను. అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్‌కు శుభాకాంక్షలు.అతడు గొప్పగా ఆడాడు. టీమిండియాకు అతడిని మళ్లీ ఎంపిక చేయాలి. సర్ఫరాజ్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదు. అతడొక అటాకింగ్ బ్యాటర్. మిగిలిన ప్లేయర్లకు ఇచ్చినట్లు అతడికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని టీమిండియా సెలక్టర్ల తీరును అజారుద్దీన్ విమర్శించాడు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్ -
ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా గతేడాది మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌లలో విజయాలు సాధించింది.ఆస్ట్రేలియా పర్యటనప్రస్తుతం జాతీయ జట్టులోని కీలక ప్లేయర్లంతా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026తో బిజీగా ఉన్నారు. జనవరి 9న మొదలైన ఈ టీ20 లీగ్.. ఫిబ్రవరి 5న ఫైనల్‌తో ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటన (India Women Tour Of Australia)కు వెళ్లనుంది. ఫిబ్రవరి 15 నుంచి మర్చి 6 మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు.. ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది.ప్రతీకా రావల్‌కూ చోటుఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టెస్టు జట్టును కూడా అనౌన్స్ చేసింది. ఈ జట్టులో ప్రతీకా రావల్‌కు కూడా చోటు దక్కడం విశేషం. కాగా వరల్డ్‌కప్ టోర్నీలో స్మృతి మంధానకు ఓపెనింగ్ జోడీగా రాణించిన ప్రతీకా.. అనూహ్య రీతిలో గాయపడి కీలక మ్యాచ్‌లకు దూరమైంది.అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ప్రతీకా త్వరలోనే జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు తాజాగా స్పష్టమైంది. ఇక మరో ఓపెనింగ్ బ్యాటర్ షఫాలీ వర్మకు కూడా టెస్టు జట్టులో సెలక్టర్లు స్థానం కల్పించారు.ఆస్ట్రేలియా వుమెన్‌తో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ శర్మ, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, సయాలి సత్గరే. చదవండి: ప్రత్యేకంగా ఏమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది: ఇషాన్ కిషన్ -
‘నేనేమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది’
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు సంజూ శాంసన్ (6), అభిషేక్ శర్మ (0) విఫలమైన వేళ ఈ వన్‌డౌన్ బ్యాటర్ జట్టును ఆదుకున్నాడు.ఇషాన్ ధనాధన్కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్.. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని ఏకంగా 76 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. సూర్య, దూబే మెరుపులుఇక ఇషాన్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అజేయ అర్ధ శతకం (37 బంతుల్లో 82)తో రాణించగా.. శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) కూడా అదరగొట్టాడు. ఫలితంగా రాయ్‌పూర్ వేదికగా కేవలం మూడు వికెట్లు నష్టపోయి టీమిండియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదుఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సూర్య భాయ్ అనుకున్నట్లు మధ్యాహ్న భోజనంలో నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదు. సాధారణ భోజనమే తిన్నాను. ఏదేమైనా ఈరోజు మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాలనే సంకల్పంతోనే మైదానంలో అడుగుపెట్టాను.ఒక్కోసారి మనం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాం అనుకుంటాం. అలాంటపుడు బంతిని చూస్తూ.. మనకు అనువైన, మంచి షాట్లు మాత్రమే ఆడాలి. నేను ఈరోజు అదే పని చేశాను. రిస్క్ తీసుకోకుండానే పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని గట్టిగా అనుకున్నాను.పవర్‌ప్లే అత్యంత ముఖ్యంముఖ్యంగా టీ20లలో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్‌ప్లే అత్యంత ముఖ్యమైనదిగా మారుతుంది. పవర్‌ప్లేలో.. మధ్య ఓవర్లలో నేను బాగా ఆడాను. నాకు నేనే వెన్నుతట్టుకున్నా. మంచి షాట్లు ఆడి జట్టును గెలిపించాలని భావించాను.దేశవాళీ క్రికెట్లో నేను విరివిగా పరుగులు రాబట్టాను. తద్వారా టీమిండియాకు ఆడగల సత్తా నాలో ఇంకా మిగిలే ఉందని నాకు నేనే సమాధానం చెప్పుకోగలిగాను. జార్ఖండ్ తరఫున కెప్టెన్‌గా టీ20 టోర్నీ ట్రోఫీ కూడా గెలిచాను. పునరాగమనంలో నేను ఇది చేయగలనా? అని సందేహం వచ్చింది.సరైన సమాధానం దొరికిందిఅయితే, ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు సరైన సమాధానం దొరికింది. మంచి షాట్లు ఆడితే అనుకున్న ఫలితం రాబట్టగలము. ఈ క్రమంలో ఒకవేళ నేను అవుట్ అయినా చింతించాల్సిన అవసరం ఉండదు’’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.కాగా క్రమశిక్షణా రాహిత్యంతో దాదాపుగా మూడేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మళ్లీ పిలుపునిచ్చిన సెలక్టర్లు.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఏకంగా ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఆధిక్యంలో టీమిండియాఅయితే, పునరాగమనంలో అంటే కివీస్‌తో తొలి టీ20లో మాత్రం ఇషాన్ (5 బంతుల్లో 8) విఫలమయ్యాడు. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో చితక్కొట్టి తన విలువను చాటుకున్నాడు. ఇక తొలి టీ20లోనూ గెలిచిన టీమిండియా.. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యం సంపాదించింది.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్𝟓𝟎 𝐢𝐧 𝐚 𝐟𝐥𝐚𝐬𝐡 ⚡#IshanKishan slams the fastest T20I half-century in just 21 balls for India v NZ. 😮💨#INDvNZ, 2nd T20I | LIVE NOW 👉 https://t.co/Be1n2FWbLQ pic.twitter.com/UbpqrgpcTm— Star Sports (@StarSportsIndia) January 23, 2026 -
ఆమెతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన పలాష్.. చితకబాదిన క్రికెటర్లు?!
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకుని స్మృతి మంచి పని చేసిందని.. లేదంటే మోసగాడి చేతిలో బలైపోయి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నవంబరు 23నఅసలేం జరిగిందంటే.. వన్డే వరల్డ్‌కప్-2025లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి మంధాన సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్‌తో నవంబరు 23న ఆమె వివాహానికి ముహూర్తం ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత తమ వివాహం రద్దైనట్లు స్మృతి- పలాష్ విడివిడిగా అధికారిక ప్రకటన చేశారు.కాగా తనతో ప్రైవేట్‌గా చాట్ చేశాడంటూ పలాష్ ముచ్చల్ గురించి ఓ మహిళ సోషల్ మీడియాలో స్క్రీన్షాట్లు షేర్ చేసింది. అందులో స్మృతిని కించపరిచినట్లుగా అతడి మాటలు ఉన్నాయి. అంతేకాదు పెళ్లికి కొన్ని గంటల ముందు పలాష్ వేరే మహిళతో గదిలో ఉన్నాడనే వదంతులూ వచ్చాయి.ఒకే మంచం మీద వేరే మహిళతో ఇప్పుడు ఆ రూమర్లు నిజమే అనేలా స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడిగా చెప్పుకొంటున్న నటుడు- నిర్మాత విద్యాన్ మానే వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్ సిటీతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు స్మృతి పెళ్లి వేడుకల్లో నేనూ ఉన్నాను. గదిలో ఒకే మంచం మీద వేరే మహిళతో అతడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.అతడిని కొట్టారుఅప్పుడు పరిస్థితి మొత్తం గంభీరంగా.. భయానకంగా మారిపోయింది. స్మృతి సహచర క్రికెటర్లు అతడిని కొట్టారు. ముచ్చల్ కుటుంబం మొత్తం దొంగబుద్ధి కలవారే!.. అతడు స్మృతిని పెళ్లి చేసుకుని సాంగ్లిలో సెటిల్ అవుతాడని నేను అనుకున్నా. కానీ అంతా తలకిందులైపోయింది’’ అని విద్యాన్ మానే చెప్పుకొచ్చాడు. కాగా స్మృతి పెళ్లి సంగీత్, మెహందీ, హల్దీ వేడుకల్లో క్రికెటర్లు శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్ సందడి చేశారు. ఈ నలుగురు ఆమె ప్రాణ స్నేహితులు. మోసం చేశాడుకాగా ఫిలిం ఫైనాన్సర్‌గా ఉన్న తన దగ్గరకు వచ్చిన పలాష్.. నజరియా అనే సినిమా తీస్తున్నానని.. ఇందుకు పెట్టుబడి పెట్టమని కోరినట్లు విద్యాన్ మానే ఈ సందర్భంగా తెలిపాడు. ఇందుకోసం విడతల వారీగా డబ్బు ఇచ్చానని.. అయితే, సినిమా పనులు మొదలుకాకపోగా.. ఆ తర్వాత పలాష్ ఫోన్ ఎత్తడం కూడా మానేశాడని ఆరోపించాడు. నిరాధార ఆరోపణలుఈ క్రమంలోనే అతడిపై చీటింగ్ కేసు పెట్టినట్లు వెల్లడించాడు. అయితే, పలాష్ మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేశాడు. తన లాయర్ ద్వారా చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించాడు.ఇదిలా ఉంటే.. పెళ్లి రద్దు తర్వాత ఆటపైనే పూర్తిగా దృష్టి సారించింది స్మృతి. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపీఎల్)-2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీని నిలిపింది. చదవండి: ఎవరినీ నమ్మను.. ఆమెకు బ్రేకప్ చెప్పిన టీమిండియా స్టార్!.. పోస్ట్ వైరల్ -
ఐసీసీపై ‘ఫిర్యాదు’.. బంగ్లాదేశ్‌కు మరో షాక్ తప్పదు!
టీ20 ప్రపంచకప్-2026లో తమ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో బంగ్లాదేశ్ ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో తెలిపింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని.. ఇక్కడే తమ మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది.అయినప్పటికీ పంతం వీడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమ విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి పట్టించుకోకపోవడంతో వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది. తాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది.అది కుదరని పనిఅయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం డీఆర్సీకి లేదు. ఇక్కడా తమకు సానుకూల స్పందన లభించకపోతే చివరగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు వెళ్లాలని కూడా బంగ్లాదేశ్ యోచిస్తోంది.మరోవైపు.. తమ జట్టు భారత్‌లో మ్యాచ్ ఆడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఐసీసీకీ చెప్పకుండా బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లామ్ మీడియా ముందు ప్రకటించడం కూడా ఐసీసీకి ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్‌ను తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అండర్–19 వరల్డ్ కప్ జరుగుతున్న నమీబియాలో ఉన్న ఐసీసీ చైర్మన్ జై షా బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ స్కాట్లాండ్కు అవకాశం ఇస్తున్నట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్ -
పాక్ టి20 జట్టులో షాహిన్, బాబర్
కరాచీ: పాకిస్తాన్ సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరిగే టి20 సిరీస్ కోసం షాహిన్ అఫ్రిదిని ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకోవడంతో అతనికి ఎప్పట్లాగే రెగ్యులర్ జట్టులో చోటు ఇచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా ఇటీవల శ్రీలంకతో ఆడిన పాకిస్తాన్ జట్టే... త్వరలో ఆస్ట్రేలియాతోనూ మూడు టి20ల ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడుతుంది. ఆ్రస్టేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ఆడిన బాబర్ ఆజమ్ కూడా పాక్ జట్టులోకి వచ్చాడు. భారత్, శ్రీలంకలో జరగబోయే మెగా ఈవెంట్‌కు ముందు పాక్, ఆసీస్‌లకు ఇది చివరి సన్నాహక టోర్నీ! 3 మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియమే ఆతిథ్యమిస్తుంది. ఈ నెల 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఆస్ట్రేలియా ఈ నెల 28న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. పాకిస్తాన్ జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెపె్టన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్, మొహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ వసీమ్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్. -
ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అదరగొట్టింది. బౌలింగ్‌లో విఫలమైనప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ములేపింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో చేధించింది.తద్వారా న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తన రీఎంట్రీ మ్యాచ్‌లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రాయ్‌పూర్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కిషాన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 76 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన కిషన్‌పై సూర్యకుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్‌ప్లేలో అతడు ఆడిన తీరు అద్భుతమని సూర్యకొనియాడాడు. "ఇషాన్ లంచ్‌లో ఏం తిన్నాడో, మ్యాచ్‌కు ముందు ఏ 'ప్రీ-వర్కౌట్' డ్రింక్ తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అతడి బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. పవర్‌ప్లేలో తొలి రెండు ఓవర్లలో మాకు కేవలం 8 పరుగులకే వచ్చాయి. అటువంటిది పవర్‌ప్లేను 75 పరుగులతో ముగించడం నిజంగా గ్రేట్. ఆ క్రెడిట్ మొత్తం కిషన్‌కే దక్కాలి. 200 పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు బ్యాటర్ల నుంచి ఇటువంటి ఇన్నింగ్స్‌లే మేము ఆశిస్తాము. ప్రతీ ఒక్కరూ పూర్తి స్వేచ్చగా ఆడుతూ తమను తాము నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఇషాన్ సరిగ్గా అదే చేశాడు.పవర్‌ప్లేలో ఇషాన్ స్ట్రైక్ అస్సలు నాకు ఇవ్వలేదు, అందుకు కోపంగా ఉన్నాను(నవ్వుతూ). అయితే కిషాన్ దూకుడుగా ఆడడంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు సమయం దొరికింది. చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. గత మూడు వారాల నుంచి నెట్స్‌లో ఎక్కువగా గడిపాను. వాటి ఫలితం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కన్పించింది.ఒకానొక దశలో న్యూజిలాండ్ 230 పరుగులు చేసేలా కనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్, వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని కట్టడి చేశారు. దూబే కూడా కీలక ఓవర్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. రాబోయో మ్యాచ్‌లలో ఇదే బ్రాండ్ ఆఫ్ కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. -
సూర్య, ఇషాన్ విధ్వంసం
టి20ల్లో భారత్ ఆధిపత్య ప్రదర్శన కొనసాగుతోంది. సిరీస్ తొలి పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా మరో ఏకపక్ష గెలుపును అందుకొని 2–0తో పైచేయి సాధించింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వేళ 209 పరుగుల లక్ష్యం పెద్దదిగా అనిపించినా... భారత్ అలవోకగా 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. ఓపెనర్లు విఫలమైన చోట ఈసారి నేనున్నానంటూ ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, ఎట్టకేలకు తన స్థాయిని చూపిస్తూ కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ 23 ఇన్నింగ్స్‌ల తర్వాత ఈ ఫార్మాట్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో బౌండరీల (21 ఫోర్లు, 12 సిక్స్‌లు) ద్వారానే 156 పరుగులు వచ్చాయి. రాయ్‌పూర్: భారత జట్టు దూకుడైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌పై వరుసగా రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (27 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 49 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. ఆ తర్వాత సూర్య, శివమ్ దూబే (18 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో అభేద్యంగా 81 పరుగులు జత చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. గాయం కారణంగా అక్షర్ పటేల్ ఆడలేదు. వీరిద్దరి స్థానాల్లో హర్షిత్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం గువాహటిలో జరుగుతుంది. హాఫ్ సెంచరీ లేకుండానే... న్యూజిలాండ్ జట్టు బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించిన 7 ఓవర్లలో కలిపి 120 పరుగులు రాగా... భారత బౌలర్లు కట్టడి చేసిన మిగతా 13 ఓవర్లలో 88 పరుగులే లభించాయి. ఓపెనర్లు కాన్వే (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్), సీఫెర్ట్ (13 బంతుల్లో 24; 5 ఫోర్లు) కలిసి 20 బంతుల్లోనే 43 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే కాన్వే 3 ఫోర్లు, 1 సిక్స్ బాది 18 పరుగులు రాబట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్ వరుసగా 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఓపెనర్లిద్దరూ ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. హర్షిత్ తన తొలి ఓవర్‌ను ‘మెయిడిన్’గా వేసినా... అతని తర్వాతి ఓవర్లో రచిన్ 2 భారీ సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. వరుణ్ ఓవర్లోనూ రెండు సిక్స్‌లతో రచిన్ జోరు కొనసాగించగా... కుల్దీప్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టిన గ్లెన్ ఫిలిప్స్ (19) అదే ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మిచెల్ (18), రచిన్ పెవిలియన్ చేరడంతో కివీస్ స్కోరు వేగం మందగించింది. చాప్మన్ (10) కూడా విఫలమైనా, చివర్లో సాంట్నర్, ఫోక్స్ (15 నాటౌట్) ధాటిగా ఆడటంతో స్కోరు 200 దాటింది. చివరి 3 ఓవర్లలో వీరిద్దరు కలిసి 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో మొత్తం 47 పరుగులు రాబట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అభిషేక్ శర్మ ‘డకౌట్’ ఇన్నింగ్స్ రెండో బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా దానిని ఉపయోగించుకోలేక సామ్సన్ (6) తొలి ఓవర్లోనే నిష్క్రమించాడు. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన అభిషేక్ శర్మ (0) ఈసారి మొదటి బంతికే అవుటయ్యాడు. అయితే ఇషాన్ మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్య ఛేదన సులువుగా మారిపోయింది. ఫోక్స్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిన ఇషాన్... సాంట్నర్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత హెన్రీ ఓవర్లోనూ వరుసగా 6, 4, 4 బాది 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ చేసిన తొలి 100 పరుగుల్లో 76 అతని బ్యాట్ నుంచే వచ్చాయి. ఇషాన్ వెనుదిరిగిన తర్వాత సూర్య బాధ్యత తీసుకున్నాడు. భారత కెపె్టన్ చాలా కాలం తర్వాత అంచనాలకు తగిన ఆటను ప్రదర్శించాడు. ఫోక్స్ ఓవర్లో అతను వరుసగా 4, (వైడ్), 4, 4, 4, 6 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న సూర్య ఆ తర్వాత అదే ధాటిని చివరి వరకు కొనసాగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్ 19; సీఫెర్ట్ (సి) ఇషాన్ (బి) వరుణ్ 24; రచిన్ (సి) అర్ష్ దీప్ (బి) కుల్దీప్ 44; ఫిలిప్స్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 19; మిచెల్ (సి) పాండ్యా (బి) దూబే 18; చాప్మన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 10; సాంట్నర్ (నాటౌట్) 47; ఫోక్స్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–43, 2–43, 3–98, 4–125, 5–129, 6–161. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–53–0, పాండ్యా 3–0–25–1, హర్షిత్ 3–1–35–1, వరుణ్ 4–0–35–1, కుల్దీప్ 4–0–35–2, అభిషేక్ 1–0–12–0, దూబే 1–0–7–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రచిన్ (బి) హెన్రీ 6; అభిషేక్ (సి) కాన్వే (బి) డఫీ 0; ఇషాన్ కిషన్ (సి) హెన్రీ (బి) సోధి 76; సూర్యకుమార్ (నాటౌట్) 82; శివమ్ దూబే (నాటౌట్) 36; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.2 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–128. బౌలింగ్: హెన్రీ 3–0–41–1, డఫీ 4–0–38–1, ఫోక్స్ 3–0–67–0, సాంట్నర్ 2–0–27–0, సోధి 3–0–34–1, మిచెల్ 0.2–0–2–0. -
పార్థ్, ధర్మేంద్ర మాయాజాలం
రాజ్‌కోట్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో పంజాబ్ జట్టుపై సౌరాష్ట్ర విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా రెండు రోజుల్లోనే ముగిసిన పోరులో సౌరాష్ట్ర 194 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. ఓవర్‌నైట్ స్కోరు 24/3తో శుక్రవారం రెండో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర... చివరకు 58.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (41 బంతుల్లో 56; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (44 బంతుల్లో 46; 4 ఫోర్లు), హేత్విక్ కొటక్ (39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పార్థ్ భట్ (37 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 5 వికెట్లు పడగొట్టగా... జస్సిందర్ సింగ్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ప్రత్యర్థి ముందు 320 పరుగుల లక్ష్యం నిలవగా... పంజాబ్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. భారీ ఆశలు పెట్టుకున్న శుబ్‌మన్ గిల్ (32 బంతుల్లో 14; 1 ఫోర్) విఫలమవడంతో పంజాబ్ చివరకు 39 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఉదయ్ శరణ్ (71 బంతుల్లో 31; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా చేతులెత్తేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ పార్థ్ భట్, ధర్మేంద్ర జడేజా చెరో 5 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో గిల్ సహా ఐదు వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పార్థ్ భట్... రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్‌ను పార్థ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేయగా... పంజాబ్ 139 పరుగులు చేసింది. ఈ విజయంతో సౌరాష్ట్ర పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి నాకౌట్ అవకాశాలను మెరుగు పరుచుకోగా... పంజాబ్ మూడో ఓటమితో క్వార్టర్స్ రేసుకు దూరమైంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరుగుతున్న మరో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులకు ఆలౌట్ కాగా... కర్ణాటక 58 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. మహారాష్ట్రతో మ్యాచ్‌లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ కాగా... మహారాష్ట్ర 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కేరళతో మ్యాచ్‌లో చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా... కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 5.5 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. -
ఇషాన్, సూర్య విధ్వంసం.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. లక్ష్య చేధనలో 7 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లను భారత్ కోల్పోయింది.అయితే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం కిషన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. కిషన్ ఔటయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన సూర్య.. క్రీజులో సెటిల్ అయ్యాక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో ఏడాది తర్వాత తన హాఫ్ సెంచరీ మార్క్‌ను సూర్య అందుకున్నాడు. ఓవరాల్‌గా 37 బంతులు ఎదుర్కొన్న స్కై.. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే (18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ, డఫీ తలా వికెట్ సాధించారు. టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇదే అత్యధిక విజయవంతమైన రన్ చేజ్ కావడం విశేషం.Let me tell to today's Generation, Ishan Kishan was our Abhishek Sharma before Abhishek Sharma existed. pic.twitter.com/wtwZ7D4bVu— Selfless⁴⁵ (@SelflessCricket) January 23, 2026కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. -
IND VS NZ 2nd T20I: న్యూజిలాండ్ భారీ స్కోర్
రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఈ స్కోర్ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. కాన్వే (19), సీఫర్ట్ (24), ఫిలిప్స్ (19), డారిల్ మిచెల్ (18), మార్క్ చాప్మన్ (10), జకరీ ఫౌల్క్స్ (15 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నంతసేపు బ్యాట్ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్, ఫౌల్క్స్ క్యామియో న్యూజిలాండ్‌ను 200 పరుగుల మార్కును దాటించింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్‌లో తెచ్చారు.మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
టెస్ట్ క్రికెట్లోకి విరాట్ కోహ్లి రీఎంట్రీ..?
టీమిండియాకు సంబంధించిన ఓ సంచలన వార్త ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్‌కప్-2026 తర్వాత ఈ విషయం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీసీసీఐ అధికారులు కోహ్లిని మళ్లీ టెస్ట్‌ల్లో ఆడమని సంప్రదించారు. ఈ విషయంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకునే విషయంలో కోహ్లి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే భారత క్రికెట్లో పెను సంచలనంగా మారుతుంది.కోహ్లి గతేడాది మే 12న అనూహ్యంగా 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. సరిగ్గా ఐదు రోజుల ముందే నాటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఐదు రోజుల వ్యవధిలో టెస్ట్‌ల నుంచి తప్పుకోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకోవడం వెనుక భారత క్రికెట్లో ఓ కీలక వ్యక్తి హస్తం ఉందని టాక్ నడిచింది.సదరు వ్యక్తితో విభేదాల కారణంగా రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రో-కో అప్పటికే టీ20ల నుంచి వైదొలిగారు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత వారిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం రో-కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా భారత్ టెస్ట్‌ల్లో ఆశాజనకమైన ప్రదర్శన చేయకపోవడంతో కోహ్లి తిరిగి రావాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ చొరవ తీసుకొని కోహ్లితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగి కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇస్తే.. ప్రస్తుత ఫామ్ ప్రకారం అతను అతి త్వరలోనే 10000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం కోహ్లి 123 టెస్ట్‌ల్లో 30 శతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 9230 పరుగులు చేశాడు. అతను మరో 770 పరుగులు చేస్తే అరుదైన 10000 క్లబ్లో చేరతాడు. కోహ్లి టెస్ట్ రీఎంట్రీపై సానుకూల వార్తలు ఎన్ని వినిపిస్తున్నా, ఇది అంత ఈజీ విషయమైతే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల వయసులో కోహ్లి టెస్ట్‌ల్లోకి తిరిగి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. శారీకంగా అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ.. మెంటల్ ఫిట్నెస్ సాధించడం అంత సులువు కాదు. కోహ్లి లాంటి వ్యక్తికి ఇది అసాధ్యం కాకపోయినా, రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవడం లాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవలికాలంలో కోహ్లి బహిరంగా చేసిన వ్యాఖ్యలను అనలైజ్ చేస్తే, అతని ఫోకస్ అంతా కేవలం 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నట్లు సుస్పష్టమవుతుంది. ఈ ప్రణాళిక ఉన్న కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇచ్చి తన లాంగ్ టర్మ్ ప్లానింగ్‌ను డిస్టర్బ్ చేసుకోకపోవచ్చు. ఏదిఏమైనా టీ20 ప్రపంచకప్ పూర్తయ్యేలోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్‌లో తెచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
పాకిస్తాన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో పాక్ 8 వికెట్ల తేడాతో, 181 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 35.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 26.2 ఓవర్లలో ఛేదించింది. వాస్తవానికి పాక్ ఈ లక్ష్యాన్ని 20 ఓవర్లలోపే ఛేదించి ఉండవచ్చు. ఇలా జరిగితే జింబాబ్వే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించి, స్కాట్లాండ్ తదుపరి దశకు అర్హత సాధించేది.అయితే, ఇలా జరగడం పాక్‌కు వ్యూహాత్మకంగా కరెక్ట్ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకి లబ్ది చేకూర్చి, వారు కూడా లబ్ది పొందారు. 16వ ఓవర్లోనే 96 పరుగులు చేసిన పాక్.. 16 నుంచి 25 ఓవర్ల మధ్యలో ఏకంగా 50 డాట్ బాల్స్ ఆడి, విజయాన్ని ఆలస్యం చేసింది.పాక్‌కు కలిగే లబ్ది ఏంటి.. టోర్నీ నియమాల ప్రకారం సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన జట్టు, అదే గ్రూప్ నుంచి సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన మిగతా జట్లపై సాధించిన పాయింట్లు, నెట్ రన్‌రేట్‌ను మాత్రమే సూపర్ సిక్స్‌కి తీసుకెళ్లుంది.ఈ లెక్కన జింబాబ్వేతో పోలిస్తే స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తే పాక్‌కు రన్‌రేట్ కాస్త తక్కువవుతుంది. అందుకనే చాకచక్యంగా స్కాట్లాండ్ను సైడ్ చేసి, జింబాబ్వేకు, తమకు లబ్ది చేక్చూకుంది.పాక్ చేసిన ఈ పని అవినీతి కిందికి రాకపోయిన ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రక్రియ కిందికి వస్తుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చి, నెట్ రన్‌రేట్‌ను ప్రభావితం చేస్తే కెప్టెన్‌పై చర్యలు తీసుకోవచ్చు. పై ఉదంతంలో పాక్ చేసింది అవినీతి కిందికి రాకపోయినా, ఆట ఆత్మను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల పాకిస్తాన్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, గ్రూప్-సి నుంచి పాక్, జింబాబ్వేతో పాటు ఇంగ్లండ్ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో పాక్ భారత్‌తో తలపడనుంది. భారత్ జనవరి 24న జింబాబ్వేపై గెలిస్తే, ఫిబ్రవరి 1న బులావయోలో పాకిస్తాన్–భారత్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్స్ అర్హతను నిర్ణయించే కీలక పోరాటంగా భావిస్తున్నారు. -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ
టీ20 వరల్డ్‌కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 23) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్ అఘా కొనసాగనున్నాడు. ఈ సిరీస్‌తో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది రీఎంట్రీ ఇచ్చారు.వీరిద్దరు ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉండి, బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొన్నారు. మరో స్టార్ పేసర్ హరీస్ రౌఫ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ విభాగంలో అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్కు చోటు దక్కింది.లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో జరుగబోయే ఈ సిరీస్ కోసం పాక్ జట్టు శనివారం (జనవరి 24) లాహోర్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌లు జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగనున్నాయి. పాక్ గడ్డపై ఆస్ట్రేలియా ఆడబోతున్న రెండో టీ20 సిరీస్ ఇది. చివరిగా ఆసీస్ 2022లో పాక్‌లో పర్యటించి, ఏకైక టీ20 ఆడింది.ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. ఈ సిరీస్ ముగిసిన వారం రోజుల్లోపే ప్రపంచకప్ మొదలవుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో పాక్ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, భారత్ మిగతా జట్లుగా ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఐర్లాండ్, ఒమాన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టుసల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, మొహమ్మద్ వసీమ్ జూనియర్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ -
WC 2027: రోహిత్ శర్మ వరల్డ్‌కప్ ఆడకుండా కుట్ర!?
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. హిట్‌మ్యాన్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను భారత్ కైవసం చేసుకుంది.అయితే, కోరుకున్నట్లుగానే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. అనూహ్య రీతిలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వన్డే కెప్టెన్సీ నుంచి మేనేజ్మెంట్ అతడిని తొలగించింది.అగార్కర్ అలారోహిత్ శర్మ స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు వన్డే పగ్గాలూ అప్పగించగా.. వరుసగా రెండు సిరీస్‌లలో టీమిండియా ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2027లో రోహిత్ ఆడే విషయంపై స్పష్టత లేనందనే అతడిని కెప్టెన్‌గా తప్పించామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు.ఆస్ట్రేలియా గడ్డ మీద హిట్ఈ క్రమంలో.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద రోహిత్ శర్మ అదరగొట్టాడు. సెంచరీ చేసి మరీ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగి అక్కడా శతక్కొట్టాడు.అయితే, తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మాత్రం రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. మూడు వన్డేలలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన స్కోర్లు వరుసగా.. 26, 24, 11. ఈ నేపథ్యంలో రోహిత్ ఆట తీరుపై విమర్శలు రాగా.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే కూడా ఇందుకు మద్దతు ఇచ్చినట్లుగానే వ్యాఖ్యలు చేశాడు.డష్కాటే కామెంట్స్‘‘తొలి వన్డేలో రోహిత్ స్థాయికి తగినట్లు ఆడలేదు. ఆ తర్వాతి మ్యాచ్‌లూ అతడికి సవాలుగా మారాయి. ఈ సిరీస్‌కు ముందు పెద్దగా క్రికెట్ ఆడకపోవడం వల్లే ఇలా జరిగింది’’ అని డష్కాటే పేర్కొన్నాడు. నిజానికి ఆసీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన రోహిత్.. దేశీ క్రికెట్లోనూ ఆడాడు. అయినప్పటికీ డష్కాటే ఇలా వ్యాఖ్యానించాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి డష్కాటే తీరును ఎండగట్టాడు. కోచ్ చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆటగాళ్ల మానసిక స్థితి ప్రభావితం అవుతుందని.. అతడిని ఒత్తిడిలోకి నెట్టివేయాలనే ప్రయత్నం తగదని చురకలు అంటించాడు.కోచ్‌కు ఇచ్చిపడేసిన మనోజ్ తివారిటీమిండియా సహాయక సిబ్బందిలో భాగమై ఉండి ఇలా మాట్లాడటం సరికాదని మనోజ్ తివారి డష్కాటేను విమర్శించాడు. రోహిత్‌తో నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయిస్తూనే.. మీడియా ముందుకు వచ్చి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని మండిపడ్డాడు. రోహిత్ ఫామ్ గురించి అడిగినపుడు నోరు మూసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.మరోవైపు.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను వన్డే జట్టులోకి తీసుకుని.. వరల్డ్‌కప్-2027లోనూ ఆడిస్తే బాగుంటుందని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. అతడి కంటే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ముందు వరుసలో ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ప్రస్తుతం గిల్- రోహిత్ ఓపెనర్లుగా ఉన్నారు.వరల్డ్‌కప్ ఆడకుండా కుట్ర!?ఓవైపు అగార్కర్, డష్కాటే కామెంట్స్.. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ అంచనాలు.. వీటన్నింటిని చూసి రోహిత్ శర్మ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు. హిట్‌మ్యాన్‌ను వన్డే వరల్డ్‌కప్-2027 ఆడకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లి విషయంలోనూ అగార్కర్ ఇలాగే మాట్లాడాడని.. అయితే, అతడు వరుస సెంచరీలు చేయడంతో ఇప్పట్లో అతడికి జోలికి వెళ్లరని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డష్కాటేకు మనోజ్ తివారి చివాట్లు పెట్టిన తీరు బాగుందని.. దిగ్గజ ఆటగాడి పట్ల ఒక కోచ్ ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నారు.చదవండి: IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు! -
500 వికెట్లు.. 7000కు పైగా పరుగులు
భారత క్రికెట్లో అత్యంత అన్ లక్కీ ఆటగాళ్లలో మధ్యప్రదేశ్‌కు చెందిన జలజ్ సక్సేనా ఒకరు. 39 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ (ఆఫ్ స్పిన్) ఆల్ రౌండర్ దేశవాలీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నా, ఒక్కసారి కూడా టీమిండియా తలుపులు తట్టలేకపోయాడు.20 ఏళ్లకు పైగా స్థిరంగా రాణిస్తున్నా జలజ్‌ను టీమిండియా సెలెక్టర్లు ఏనాడూ గుర్తించలేదు. జలజ్ కంటే తక్కువ స్థాయి ప్రదర్శనలు చేసిన చాలామంది ఆటగాళ్లు టీమిండియా ఛాన్స్‌లు కొట్టి, కెరీర్లు మలచుకున్నారు. కానీ జలజ్ మాత్రం దేశవాలీ క్రికెట్లో పరిమితమయ్యాడు.టెస్ట్ ఫార్మాట్లో జలజ్ సూపర్‌గా సెట్ అయ్యే ఆటగాడు. అతని కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్.. మిడిలార్డర్ బ్యాటింగ్ టీమిండియాకు చాలా ఉపయోగపడి ఉండేది. రవీంద్ర జడేజా జట్టులో నాటుకు పోయినందుకో లేక ఇతరత్రా కారణాలో తెలియదు కానీ, జలజ్‌కు ఏనాడూ టీమిండియా అవకాశానికి నోచుకోలేకపోయాడు.2005లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన జలజ్.. ఇప్పటివరకు 150 మ్యాచ్‌ల్లో 500 వికెట్లు తీసి, 7000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు సహా 35 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 10 పది వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. జలజ్‌కు లిస్ట్-ఏ ఫార్మాట్లోనూ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో 109 మ్యాచ్‌ల్లో 2000కు పైగా పరుగులు (3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు) చేసి, 123 వికెట్లు తీశాడు. జలజ్ టీ20 ఫార్మాట్లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్లో 73 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు (2 ఐదు వికెట్ల ప్రదర్శనలు) తీసి, 688 పరుగులు చేశాడు.మూడు ఫార్మాట్లలో ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్నా జలజ్ భారత-ఏ జట్టు స్థాయి వరకే వెళ్లగలిగాడు. అక్కడు కూడా స్థిరమైన ప్రదర్శనలు చేసినా, భారత సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. 2013లో జలజ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్-ఏ జట్లపై అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనలు చేశాడు.జలజ్ అరంగేట్రం నుంచి దాదాపు ప్రతి రంజీ సీజన్లో స్థిరమైన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. 39 ఏళ్ల వయసులోనే జలజ్ ఏమాత్రం తగ్గడం లేదు.ప్రస్తుత రంజీ సీజన్‌కు ముందే కేరళ నుంచి మహారాష్ట్రకు మారిన జలజ్.. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటడు. ఈ క్రమంలోనే జలజ్ ఓ చారిత్రక మైలురాయిని తాకాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 500 వికెట్లు పూర్తి చేసుకొని, అత్యంత అరుదైన జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.జలజ్ కెరీర్లో అత్యుత్తమ రికార్డులు..రంజీ ట్రోఫీ చరిత్రలో 6000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడుఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు, 8 వికెట్లు తీసిన తొలి భారతీయుడుగోవా-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. జలజ్ చెలరేగడంతో (34-6-79-6) తొలుత బ్యాటింగ్ చేసిన గోవా 209 పరుగులకే ఆలౌటైంది. జలజ్‌తో పాటు రామకృష్ణ ఘోష్ (15.1-4-34-2), విక్కీ ఓస్వాల్ (22-5-47-2) కూడా రాణించారు. గోవా ఇన్నింగ్సలో కెప్టెన్ స్నేహల్ కౌతాంకర్ (73) ఒక్కడే రాణించాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 67 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రుతరాజ్ గైక్వాడ్ (66) అర్ద సెంచరీతో రాణించి మహారాష్ట్రను ఆదుకున్నాడు. ప్రస్తుతం సౌరభ్ నవలే (46), జలజ్ సక్సేనా (4) క్రీజ్‌లో ఉన్నారు. లలిత్ యాదవ్ 3 వికెట్లతో మహారాష్ట్రను దెబ్బతీశాడు. -
టీమిండియాలో చోటిస్తారా? లేదా?.. సెలక్టర్లకు వార్నింగ్!
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. తద్వారా టెస్టు జట్టు నుంచి తనను తప్పించిన సెలక్టర్లకు మరోసారి బ్యాట్ ద్వారానే గట్టి హెచ్చరికలు జారీ చేశాడు.కాగా ఫార్మాట్లకు అతీతంగా సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) దేశీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవల టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా డిసెంబరు 2న శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 31న మరోసారి సెంచరీ బాదాడు.ఈసారి ద్విశతకంతో తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగాడు సర్ఫరాజ్ ఖాన్. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా గురువారం హైదరాబాద్- ముంబై మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సిరాజ్ సేన.. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.227 పరుగులుఈ క్రమంలో తొలిరోజు శతక్కొట్టిన సర్ఫరాజ్.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 219 బంతులు ఎదుర్కొన్న అతడు 227 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, రక్షణ్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో సర్ఫరాజ్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.ఇక సర్ఫరాజ్‌కు తోడు కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (104) శతక్కొట్టాడు. సువేద్ పార్కర్ 75, అథర్వ అంకోలేకర్ 35 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 560 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రోహిత్ రాయుడు రెండు, నితిన్ సాయి యాదవ్, కొడిమెల హిమతేజ, కెప్టెన్ మొహమ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.టీమిండియాలో పునరాగమనం చేసేనా?దేశీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి సత్తా చాటాడు. అయితే, చివరగా 2024లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన సర్ఫరాజ్‌ను సెలక్టర్లు మళ్లీ జట్టుకు ఎంపిక చేయలేదు.ఈ క్రమంలో దేశీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రాణిస్తూ సర్ఫరాజ్ సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. కాగా ఇప్పటి వరకు అతడు టీమిండియా తరఫున టెస్టులు మాత్రమే ఆడాడు. వన్డే, టీ20 జట్లలో అరంగేట్రం చేయలేదు.ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఐపీఎల్-2026తో బిజీ కానున్నారు భారత ఆటగాళ్లు. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్ పర్యటనతో మళ్లీ టీమిండియా విధుల్లో చేరతారు. చదవండి: ODI WC 2027: ‘గిల్‌పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ’ -
నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్, జపాన్‌పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్ (ఏ) మ్యాచ్‌లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం విజయాన్ని సొంతం చేసింది.విండ్హోక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. పేసర్ విల్ బైరోమ్ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్‌కు జతగా ఛార్లెస్ లచ్మండ్ (5-1-19-2), కేసీ బార్టన్ (4-0-13-2), హేడెన్ ష్కిల్లర్ (3-0-11-1) కూడా రాణించారు. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ దిమంత మహావితన డకౌట్ కాగా.. మరో ఓపెనర్ విరాన్ చముదిత, దుల్నిత్ సిగెరా, ఆడమ్ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్ విమత్ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్ రింసర, కుగథాస్ మథులాన్ తలో 6 పరుగులు చేశారు. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో జపాన్, ఐర్లాండ్‌పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. -
షమార్ హ్యాట్రిక్.. విండీస్ ఘన విజయం
దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ కంటితుడుపు విజయాన్ని సాధించింది. నిన్న (జనవరి 22) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్ ఫలితం తేలిపోయింది. తొలి రెండు టీ20ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో తలో పిడికెడు పరుగులు చేశారు. బ్రాండన్ కింగ్ 47, జాన్సన్ ఛార్లెస్ 17, కీసీ కార్తీ 10, జస్టిన్ గ్రీవ్స్ 12, షిమ్రోన్ హెట్‌మైర్ 13, క్వెన్టిన్ శాంప్సన్ 3, మాథ్యూ ఫోర్డ్ 27, షమార్ స్ప్రింగర్ 16 (నాటౌట్), మోటీ 2 (నాటౌట్) పరుగులు చేశారు.ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రహ్మాన్ షరీఫి, రషీద్ ఖాన్, అహ్మద్జాయ్ తలో 2 వికెట్లు తీయగా.. షాహిదుల్లా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్లు రహానుల్లా గుర్బాజ్ (71), ఇబ్రహీం జద్రాన్ (28) శుభారంభాన్ని అందించారు. అయితే వీరి తర్వాత వచ్చిన వారు ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. షమార్ స్ప్రింగర్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. షమార్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు, ఫోర్డ్, పియెర్రీ, సైమండ్స్ తలో వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్, జద్రాన్ మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. -
T20 WC 2026: ఫైనల్ చేరేది ఆ జట్లే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఐదు జట్లను చేర్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). ఇక ఈ దఫా ఇటలీ తొలిసారిగా క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించడం విశేషం.ఏ గ్రూప్‌లో ఏ జట్లు?గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్‌లతో కలిసి ఉంది ఇటలీ. ఇక గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.అదే విధంగా గ్రూప్-ఢిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వనకు ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ ఈసారి కూడా ఒకే గ్రూపులో ఉండటం క్రికెట్ ప్రేమికులను ఆకర్షిస్తోంది. దాయాదుల మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరుగనుంది. ఇందుకు కొలంబో వేదిక. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.పాక్‌కు ఓటమి తప్పదు‘‘ఈ పోరు ఉత్కంఠగా సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే, సుదీర్ఘకాలంగా టీమిండియా పాకిస్తాన్‌ను ఓడిస్తూనే వస్తోంది. భారత జట్టుకు పాక్ దరిదాపుల్లో కూడా లేదు. టీమిండియాతో మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తేనే పాక్ సానుకూల ఫలితం రాబట్టగలదు’’ అని క్లార్క్ పేర్కొన్నాడు.ఫైనల్ చేరేది ఆ జట్లే!ఇక ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్-2026 ఫైనలిస్టులను కూడా మైకేల్ క్లార్క్ అంచనా వేశాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయని జోస్యం చెప్పాడు. కాగా టీ20 ఫార్మాట్లో 2007లో మొదలైన ప్రపంచకప్ టోర్నీలో ధోని సారథ్యంలోని టీమిండియా విజయం సాధించింది.ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరోసారి పొట్టి ప్రపంచకప్ టోర్నీ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇక వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లలో ఆధిపత్యం కనబరిచే ఆస్ట్రేలియా టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ట్రోఫీ గెలిచింది. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో 2021 ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్ రెండో ర్యాంకులో ఉంది. చదవండి: ODI WC 2027: ‘గిల్‌పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ’ -
చెలరేగిన ఆంధ్ర బౌలర్.. అద్భుత ప్రదర్శన
డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ కలిదిండి నరసింహ (కేఎస్ఎన్) రాజు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టును నామమాత్రపు స్కోరకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు గురువారం మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-ఎలో భాగమైన విజయనగరం వేదికగా ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ చేసింది.యశ్ రాథోడ్ శతకంమ్యాచ్ ఆరంభం నుంచే ఆంధ్ర బౌలర్లు కట్టిపడేయడంతో విదర్భ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే, యశ్ రాథోడ్ (Yash Rathod- 104 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ శతకంతో ఆదుకున్నాడు. మరోవైపు.. ఈ సీజన్లో దంచి కొడుతున్న అమన్ మోఖడే (21), దానిశ్ మాలేవర్ (0), అథర్వ తైడె (13), సమర్థ్ (9)లను కేఎస్ఎన్ రాజు తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీంతో విదర్భ ఒక దశలో 45/4తో కష్టాల్లో పడింది.ఈ సమయంలో యశ్ రాథోడ్ గొప్ప సంయమనం కనబర్చాడు. మొదట రోహిత్‌తో ఐదో వికెట్‌కు 93 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ అండతో జట్టును ముందుకు నడిపాడు. ఫలితంగా గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.మరో 28 పరుగులు జతచేసి ఈ క్రమంలో 267/7 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన విదర్భ మరో 28 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. ఆంధ్ర బౌలర్లలో రాజు ఐదు వికెట్లు (5/62) కూల్చగా.. కావూరి సాయితేజ యశ్ రాథోడ్ (115), రోహిత్ బింకర్ (37) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పార్థ్ రేఖడే వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక టీమిండియా స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లు ఆడి 295 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఆంధ్ర జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది.చదవండి: IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు! -
‘గిల్‌పై వేటు.. వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్ శర్మనే’
టీమిండియా వన్డే కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్ గిల్‌కు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.అనంతరం తాజాగా న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లోనూ టీమిండియాకు పరాభవం ఎదురైంది. స్వదేశంలో మొట్టమొదటి సారి కివీస్‌కు భారత్ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. తొలి వన్డేలో విజయం సాధించిన గిల్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండో వన్డేల్లోనూ ఓటమిపాలైంది. అయితే, ఈ సిరీస్‌లో కివీస్ తమ ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడటం గమనార్హం.గిల్‌పై వేటు.. రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వండిఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిల్‌పై వేటు వేసి వన్డే కెప్టెన్సీని తిరిగి రోహిత్ శర్మ (Rohit Sharma)కు అప్పగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.ఈ మేరకు.. ‘‘ఇప్పటికీ సమయం మించిపోలేదు. తప్పును సరిచేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఇదేదో ద్వైపాక్షిక సిరీస్ గురించి కాదు. ముందుంది వరల్డ్‌కప్ టోర్నీ. ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రయోగాలు అవసరం లేదు.అసలు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ కివీస్‌తో సిరీస్‌లో గనుక రోహిత్ కెప్టెన్‌గా ఉండి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. అతడి సారథ్యంలోనే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయాన్ని మర్చిపోకూడదు.రోహిత్ కెప్టెన్‌గా ఉంటేఅప్పుడే జట్టు సరైన దిశలో వెళ్తోందని నాకు అనిపించింది. గిల్ కంటే రోహిత్ ఎన్నోరెట్లు గొప్ప కెప్టెన్. అతడొక విజయవంతమైన సారథి. గిల్ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు ఉండవచ్చు. అయితే, రోహిత్ కెప్టెన్‌గా ఉంటే జట్టు కచ్చితంగా చాంపియన్‌గా నిలుస్తుంది. ఇందుకు 85- 90 శాతం అవకాశం ఉంది’’ అని ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మనోజ్ తివారి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథికాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2027లోనూ భారత జట్టును ముందుకు నడిపించాలని రోహిత్ భావించగా.. బీసీసీఐ అనూహ్య రీతిలో అతడిపై వేటు వేసింది. ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రోహిత్‌ను తప్పించి గిల్‌కు వన్డే పగ్గాలు అప్పగించింది.ఇక అంతకుముందే రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకగా.. అతడి స్థానంలో గిల్ సారథిగా నియమితుడయ్యాడు. మరోవైపు.. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. సారథిగా సూర్య అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. చదవండి: వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
మీ కెప్టెన్ హిందువు: బంగ్లాదేశ్‌కు భారత మాజీ క్రికెటర్ సలహా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం దాదాపుగా ఖాయమైనట్లే కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాటను లెక్కచేయకుండా పంతానికి పోయినందుకు బంగ్లా టోర్నీలో ఆడే అవకాశం కోల్పోవడం లాంఛనమే అనిపిస్తోంది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలుగతంలో తమకు చేదోడువాదోడుగా నిలిచిన భారత్‌పై కొంతమంది బంగ్లాదేశ్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తప్పించింది.ఐసీసీ మాట వినని బీసీబీఈ విషయాన్ని సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోడమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లకు అక్కడ భద్రత ఉండదంటూ కొత్తగా రాగం ఎత్తుకుంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ఐసీసీ తమ పట్ల న్యాయంగా వ్యవహరించాలని.. ఏదేమైనా తాము భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ గురువారమే తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ బీసీబీకి ఓ సలహా ఇచ్చాడు.మీ కెప్టెన్ ఓ హిందువువార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఐసీసీకి ఇదొక పీడకలలాంటిది. చాన్నాళ్ల క్రితమే టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. టోర్నీ ఆరంభానికి సమయం కూడా ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఇలా చేయడం సరికాదు.భారత్‌లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. అసలు ఇక్కడ గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. మీ కెప్టెన్ (Litton Das) ఓ హిందువు.ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తమకు సానుకూలంగా మలచుకోవచ్చే. టోర్నీలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు’’ అని అతుల్ వాసన్ బంగ్లాదేశ్‌కు హితవు పలికాడు. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బంగ్లాదేశ్ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఇమోన్, తౌహిద్ హృదోయ్, షమీమ్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, మహ్మద్ షైపుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం. చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు!
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా మరో విజయంపై కన్నేసింది. రాయ్‌పూర్ వేదికగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.ఆడతాడా? లేదా?నాగ్‌పూర్‌లో కివీస్‌తో తొలి టీ20 సందర్భంగా వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Injured) గాయపడిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ వేసిన అక్షర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ ఆడగా.. బంతిని ఆపే క్రమంలో అక్షర్ ఎడమచేతికి గాయమైంది. చూపుడు వేలు చిట్లి రక్తం వచ్చింది. దీంతో అతడు మధ్యలోనే మైదానం వీడాడు.అయితే, అక్షర్ పటేల్ గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో కివీస్‌తో రెండో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్నది తేలలేదు. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టులో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ ఆల్‌రౌండర్ అక్షర్ స్థానాన్ని.. మరో లెఫ్టాండర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భర్తీ చేసే అవకాశం ఉంది.కుల్దీప్ వైపు మొగ్గున్యూజిలాండ్తో వన్డే సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ అంతంత మాత్రంగానే రాణించినా.. టీ20లలో అతడికి అపార అనుభవం ఉంది. కాబట్టిరవి బిష్ణోయిని కాదని కుల్దీప్ వైపు యాజమాన్యం మొగ్గుచూపవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.బ్రేస్‌వెల్ వస్తాడా?కాగా కుల్దీప్ యాదవ్ ఇప్పటికి టీమిండియా తరఫున 50 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. న్యూజిలాండ్ జట్టుకు శుభవార్త అందినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. అతడు తుదిజట్టులోకి వస్తే యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్‌పై వేటు పడే అవకాశం ఉంది.ఇక రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా ఇరుజట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. నాగ్‌పూర్‌లో 48 పరుగులు తేడాతో గెలిచి ఆధిక్యంలో నిలిచింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 తుదిజట్లు అంచనాభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.న్యూజిలాండ్మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రాబిన్సన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, క్రిస్టియన్ క్లార్క్/ మైకేల్ బ్రేస్‌వెల్, కైలీ జేమీసన్, ఇష్ సోధి, జేకబ్ డఫీ.UPDATE: తుదిజట్టులో రెండు మార్పులు.. సూర్య, ఇషాన్ విధ్వంసంచదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
న్యూజిలాండ్‌కు భారీ షాక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ ఆడం మిల్నే గాయపడ్డాడు. ఫలితంగా ఐసీసీ టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని శుక్రవారం ధ్రువీకరించింది. తొడ కండరాల గాయంతో మిల్నే వరల్డ్‌కప్ జట్టుకు దూరమైనట్లు తెలిపింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్లో భాగంగా మిల్నే సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డాడు.మిల్నే స్థానంలో అతడేఇక ఆడం మిల్నే (Adam Milne) స్థానాన్ని బ్లాక్‌క్యాప్స్.. కైలీ జెమీషన్ (Kyle Jamieson)తో భర్తీ చేసింది. రిజర్వు ప్లేయర్‌గా ఉన్న అతడిని ప్రధాన జట్టులోకి చేర్చింది. జెమీషన్ స్థానంలో మరో ట్రావెలింగ్ రిజర్వును త్వరలోనే ఎంపిక చేయనున్నారు. కాగా కివీస్ జట్టును గాయాల బెడద వేధిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే విలియమ్ ఒరూర్కీ, బ్లేయర్ టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సియర్స్ వంటి ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇక కెప్టెన్ మిచెల్ సాంట్నర్, మార్క్ చాప్మన్, మ్యాట్ హెన్రీ తదితరులు ఇటీవలే గాయాల నుంచి కోలుకున్నారు. వీరంతా ప్రస్తుతం టీమిండియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నారు.ఫెర్గూసన్ సైతంఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ జట్టులో భాగమైన లాకీ ఫెర్గూసన్ పిక్కల్లో నొప్పి కారణంగా టీమిండియాతో సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఒకవేళ వరల్డ్‌కప్ నాటికి అతడు కోలుకోకపోతే జట్టుకు దూరమయ్యే పరిస్థితి.కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. కాగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. తొలి టీ20లో టీమిండియా గెలవగా.. ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి రాయ్‌పూర్ వేదిక.టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీకి న్యూజిలాండ్ అప్డేటెడ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీరు మారలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడబోమని గురువారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని విమర్శించాడు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందనేలా ఆరోపణలు చేశాడు.భద్రతాపరమైన కారణాలతో వేదికలు మార్చడం గతంలో చాలాసార్లు జరిగిందని, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లోనే ఆడేలా భారత్‌కు అనుమతి ఇచ్చారని బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ గుర్తు చేశాడు. పాక్‌లో ఆడబోమని భారత్ చెబితే..‘ఐసీసీ ఎప్పుడో 1996, 2003లో జట్లు కొన్ని వేదికల్లో ఆడటానికి ఇష్టపడక పాయింట్లు చేజార్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఎప్పటి మాటలో ఎందుకు?2025 చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో ఆడబోమని భారత్ చెబితే వారి మ్యాచ్‌లను తరలించలేదా? అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై ఆడి, ఒకే హోటల్లో జట్టు బస చేయడం వారికి కల్పించిన ప్రత్యేక సౌకర్యం కాదా? మేం పోరాడతాంశ్రీలంక పేరుకే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది కానీ ఒక జట్టు కోసమే (పాకిస్తాన్) హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు అక్కడ పెట్టారు. ఐసీసీ స్థాయి సంస్థ 24 గంటల గడువు ఇవ్వడం అనేది అర్థరహితం. ఈ విషయంలో మేం పోరాడతాం’ అని అమీనుల్ స్పష్టం చేశాడు. కాగా గతంలో పాకిస్తాన్లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విదేశీ జట్లు అక్కడ పర్యటించడం మానేశాయి. పాక్‌లో పరిస్థితి వేరు.. వితండవాదంఇటీవలి కాలంలో మళ్లీ పర్యటనలు మొదలుపెట్టాయి. అయితే, బీసీసీఐ మాత్రం భద్రతా కారణాలతో టీమిండియాను అక్కడకు పంపడం లేదు. అందుకే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి తటస్థ వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున శ్రీలంకలో పాక్ మ్యాచ్‌లు ఆడిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరిన నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఏమాత్రం ముప్పులేదని పరిశీలన బృందం చెప్పినా బంగ్లాదేశ్ ఇలా వితండవాదానికి దిగడం గమనార్హం. లాంఛనమేకాగా టీ20 వరల్డ్ కప్‌నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది! ఒకరోజు సమయమిచ్చి తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఐసీసీ చేసిన హెచ్చరికను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పునరుద్ఘాటించారు.‘ఇది మా దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. భద్రత విషయంలో మా భయం వాస్తవం. ఐసీసీ నుంచి మాకు ఇప్పటి వరకైతే న్యాయం దక్కలేదు. మా ఆందోళనను వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని నజ్రుల్ వ్యాఖ్యానించాడు.చదవండి: వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
ఒకే రోజు 23 వికెట్లు
రాజ్‌కోట్: టీమిండియా వన్డే, టెస్టు జట్ల సారథి శుబ్‌మన్ గిల్... దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ప్రభావం చూపలేకపోయాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన పోరులో పంజాబ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన గిల్ (0) రెండు బంతులు ఎదుర్కొని పార్థ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇరు జట్ల బ్యాటర్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమవడంతో ఈ మ్యాచ్ తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. మొదట సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. జయ్ గోహిల్ (117 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (7) నిరాశ పర్చగా.. హార్విక్ దేశాయ్ (13), చిరాగ్ జానీ (8), అర్పిత్ (2), సమర్ (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుసకట్టారు. ప్రేరక్ మన్కడ్ (32) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 38 పరుగులిచ్చి 6 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ తీవ్రంగా తడబడింది. 40.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. గిల్‌తో పాటు హర్నూర్ సింగ్ (0), నేహల్ వధేరా (6), ప్రేరిత్ దత్తా (11), ఉదయ్ శరణ్ (23) విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, ధర్మేంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (6), చిరాగ్ జానీ (5), జయ్ గోహిల్ (8) అవుటయ్యారు. చేతిలో 7 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర ఓవరాల్‌గా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. ధర్మేంద్ర జడేజా (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 82.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 90 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. చండీగఢ్‌తో మ్యాచ్‌లో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. చండీగఢ్ 34 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. -
SL vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక
కొలంబో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన శ్రీలంక జట్టు తొలి వన్డేలో 19 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (117 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోగా... జనిత్ లియనాగె (53 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తలా కొన్ని పరుగులు చేయడంతో లంక మంచి స్కోరు చేయగలిగింది. కమిల్ మిశ్రా (27), నిసాంక (21), కెపె్టన్ అసలంక (17), దునిత్ వెల్లలాగె (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (90 బంతుల్లో 61; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు. ఈ ఇద్దరూ రాణించడంతో ఒక దశలో 129/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (6), జాక్ క్రాలీ (6), జోస్ బట్లర్ (19), సామ్ కరన్ (5) విఫలమయ్యారు. జేమీ ఓవర్టన్ (17 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రేహాన్ అహ్మద్ (27; 5 ఫోర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. లంక బౌలర్లలో ప్రమోద్ 3 వికెట్లు పడగొట్టగా... దునిత్, జెఫ్రీ వండర్సె చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన దునిత్ వెల్లలాగెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. -
ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు...
రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో తొలి టి20లో ఘన విజయం తర్వాత భారత్ మరో విజయంపై గురి పెట్టింది. గత పోరులో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన జట్టు 2–0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు న్యూజిలాండ్ కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సామ్సన్, ఇషాన్‌లపై దృష్టి... తొలి టి20లో భారత బ్యాటర్లలో అభిõÙక్ శర్మ చెలరేగగా, సూర్యకుమార్ కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు పాండ్యా ప్రభావం చూపించగా... ఫినిషర్‌గా రింకూ సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు. అయితే సామ్సన్, ఇషాన్ కిషన్ మాత్రమే ప్రభావం చూపలేకపోయారు. గిల్‌ను తప్పించడంతో టి20 టీమ్‌లో ఓపెనర్‌గా తన స్థానం చేసుకున్న సామ్సన్ అంచనాలకు తగినట్లుగా ఆడాల్సి ఉంది. అదే విధంగా వరల్డ్ కప్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్‌పై నమ్మకంతో మేనేజ్మెంట్ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. ఒక్క మ్యాచ్‌లో వైఫల్యం సమస్య కాకపోయినా... చెత్త షాట్లతో వీరు వికెట్లు సమర్పించుకున్నారు. ఈసారి తప్పులు దిద్దుకునే అవకాశం వీరికి ఉంది. పేస్ బౌలింగ్‌లో మరోసారి అర్‡్షదీప్, బుమ్రా ప్రదర్శనపై జట్టు ఆధారపడి ఉండగా, పాండ్యా కూడా కీలక పాత్ర పోషిస్తాడు. స్పిన్నర్లుగా వరుణ్, అక్షర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించగలరు. అయితే తొలి మ్యాచ్‌లో చేతికి గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్న అక్షర్ ఆడకపోతే మరో స్పిన్నర్ బిష్ణోయ్‌కు చోటు లభించవచ్చు. తుది జట్టులోకి బ్రేస్‌వెల్! భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి సిరీస్‌ను సమం చేయాలని జట్టు ఆశిస్తోంది. టాప్–3 విఫలం కావడంతో జట్టును దెబ్బ తీసింది. వన్డే సిరీస్‌లో కూడా ఘోరంగా విఫలమైన కాన్వే ఇప్పటికైనా రాణించాలని టీమ్ కోరుకుంటోంది. రచిన్‌పై కూడా ప్రధాన బాధ్యత ఉండగా, రాబిన్సన్ దూకుడుగా ఆడగల సమర్థుడు. ఫిలిప్స్, చాప్మన్ మరోసారి కీలకం కానుండగా, వన్డే ఫామ్‌ను కొనసాగిస్తున్న మిచెల్ ఈ సారైనా జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు. గాయంతో ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్ గత మ్యాచ్‌కు దూరం కావడం కివీస్‌ను బలహీనపర్చింది. అతను కోలుకొని ఈ సారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లలో క్లార్క్‌ను తప్పించి బ్రేస్‌వెల్‌ను ఆడించవచ్చు. ఇతర స్పిన్నర్లు సాంట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చూడాలి.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, దూబే, రింకూ సింగ్, అక్షర్/బిష్ణోయ్, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), కాన్వే, రాబిన్సన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, క్లార్క్/బ్రేస్‌వెల్, జేమీసన్, సోధి, డఫీ.పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్. ఈ మైదానంలో రెండేళ్ల క్రితం జరిగిన ఏకైక టి20లో ఆ్రస్టేలియాపై భారత్ గెలిచింది. మంచు ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఛేదన సులువు. ఇటీవల భారత్‌పై వన్డేలో దక్షిణాఫ్రికా 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
సోఫీ డివైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా మూడు పరాజయాల తర్వాత గుజరాత్ జెయింట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆరు మ్యాచ్‌ల తర్వాత మూడో విజయంతో ఆ జట్టు ప్రస్తుతం రెండో స్థానానికి చేరింది. గురువారం జరిగిన పోరులో గుజరాత్ 45 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (42 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ నమోదు చేసింది. అనంతరం యూపీ 17.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది.రాజేశ్వరి (3/16) ప్రత్యర్థిని పడగొట్టగా ... సోఫీ డివైన్, రేణుకా సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లకు విరామం. శనివారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది.స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) నవ్‌గిరే (బి) ఎకెల్‌స్టోన్ 38; డానీ వ్యాట్ (బి) క్రాంతి 14; అనుష్క (సి) శ్వేత (బి) క్రాంతి 14; గార్డ్నర్ (బి) దీప్తి 5; సోఫీ డివైన్ (నాటౌట్) 50; భారతి (రనౌట్) 5; కనిక (సి) నవ్‌గిరే (బి) ట్రయాన్ 6; కాశ్వీ (బి) ఎకెల్‌స్టోన్ 11; రేణుక (రనౌట్) 1; హ్యాపీ కుమారి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–23, 2–43, 3–65, 4–93, 5–105, 6–115, 7–131, 8–145. బౌలింగ్: క్రాంతి 4–0–18–2, శిఖ 4–0–53–0, దీప్తి 2–0–16–1, ఎకెల్‌స్టోన్ 4–0–22–2, ట్రయాన్ 4–0–32–1, శోభన 2–0–11–0. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) కాశ్వీ 14; నవ్‌గిరే (స్టంప్డ్) మూనీ (బి) రేణుక 0; లిచ్‌ఫీల్డ్ (సి) రేణుక (బి) గార్డ్నర్ 32; హర్లీన్ (సి) గార్డ్నర్ (బి) రేణుక 3; ట్రయాన్ (నాటౌట్) 30; దీప్తి (ఎల్బీ) (బి) రాజేశ్వరి 4; శ్వేత (స్టంప్డ్) మూనీ (బి) రాజేశ్వరి 3; శోభన (సి) గార్డ్నర్ (బి) రాజేశ్వరి 7; ఎకెల్‌స్టోన్ (సి అండ్ బి) డివైన్ 1; శిఖ (రనౌట్) 1; క్రాంతి (బి) డివైన్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–57, 4–59, 5–67, 6–79, 7–93, 8–94, 9–97, 10–108. బౌలింగ్: రేణుక 4–0–20–2, కాశ్వీ 3–0–31–1, డివైన్ 3.3–0–16–2, గార్డ్నర్ 3–0–23–1, రాజేశ్వరి 4–0–16–3. -
సర్ఫరాజ్, సిద్ధేశ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: సర్ఫరాజ్ ఖాన్ (142 బ్యాటింగ్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (104; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘శత’క్కొట్టారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఓపెనర్లు అఖిల్ (27), ఆకాశ్ ఆనంద్ (35)లతో పాటు ముషీర్ ఖాన్ (11) విఫలమయ్యారు. 82/3తో కష్టాల్లో పడ్డ ముంబైను సిద్ధేశ్, సర్ఫరాజ్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 249 పరుగులు జత చేశారు. తొలి రోజు ఆట ముగుస్తుందనగా సిద్ధేశ్ అవుటయ్యాడు. హిమాన్షు (0 బ్యాటింగ్)తో కలిసి సర్ఫరాజ్ క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు రెండు వికెట్లు పడగొట్టగా... సిరాజ్, నితిన్ సాయి యాదవ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. -
సౌతాఫ్రికా జట్టులోకి డేంజరస్ ప్లేయర్లు
టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్ వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చారు.ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. టోనీ డి జోర్జి విషయానికి వస్తే.. గతేడాది ఆఖరిలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడికి కుడి కాలికి గాయమైంది. అతడు వరల్డ్‌కప్ సమయానికి కోలుకుంటాడని ప్రోటీస్ సెలక్టర్లు భావించారు. కానీ టోనీ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పడుతోంది. ఈ క్రమంలోనే అతడు పొట్టి ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో ఫెరీరా గాయపడ్డాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెరీరా(జోబర్గ్ సూపర్ కింగ్స్) భుజం ఎముక విరిగింది. దీంతో అతడు కూడా ఈ మెగా టోర్నీకి అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రికెల్టన్, స్టబ్స్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.అదేవిధంగా ఈ మెగా టోర్నీ విధ్వంసకర ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మిల్లర్ ప్రస్తుతం కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో వరల్డ్‌కప్ ముందు వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మిల్లర్ దూరమయ్యాడు. అతడిస్ధానంలో రూబెన్ హెర్మన్‌కు చోటు ఇచ్చారు. టీ20 ప్రపంచకప్-2026కు సౌతాఫ్రికా జట్టుఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.వెస్టిండీస్‌తో టీ20లకు ప్రోటీస్ జట్టుఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, హెర్మన్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్. -
ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!
టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్.1199 పరుగులుఈ మ్యాచ్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 190.93 కావడం విశేషం.వరల్డ్‌కప్ -2027 జట్టులోనూ ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్‌కప్ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్‌ప్లేలోనూ అభిషేక్ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.రోహిత్- గిల్ జోడీఇక వన్డేల్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ప్రస్తుత సారథి శుబ్‌మన్ గిల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అభిషేక్ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఈసారి కూడా హాట్ ఫేవరెట్‌గా వరల్డ్‌కప్ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
ICC: మా తుది నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ పంతం వీడలేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 ఆడే విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని మరోసారి పునరుద్ఘాటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తమ విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది.శ్రీలంకకు మార్చాలని కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ.. బంగ్లాదేశ్ తమ ప్లేయర్లను భారత్‌కు పంపడానికి నిరాకరిస్తోంది. భారత్‌కు బదులు తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లాదేశ్ చెప్పినట్లు భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది.కుండబద్దలు బద్దలు కొట్టిన ఐసీసీమరో 24 గంటల సమయం ఇస్తున్నామని.. ఒకవేళ వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగానుకుంటే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఆడిస్తామని ఐసీసీ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాడు.తాజా సమాచారం ప్రకారం.. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడవద్దని బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లా జాతీయ జట్టు ఆటగాళ్లు, దేశ క్రీడా, యువజన శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్‌తో సమావేశం అనంతరం బోర్డు తమ వైఖరిని వెల్లడించింది.నమ్మకాన్ని కోల్పోవడం లేదుఈ మేరకు మీడియా సమావేశంలో నజ్రుల్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేందుకు మా క్రికెటర్లు ఎంతగానో కష్టపడ్డారు. అయితే, ఇండియాలో మా భద్రతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఏవో కొన్ని పరిశీలన (ఐసీసీ)లు చేసి ముప్పు లేదనే నిర్ణయానికి రాకూడదు.ఇప్పటికీ మేము నమ్మకాన్ని కోల్పోవడం లేదు. టోర్నీకి మా జట్టు సిద్ధంగా ఉంది. ఐసీసీ మా అభ్యర్థనను మన్నించి.. న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మమ్మల్ని శ్రీలంకలో ఆడేందుకు అనుమతిస్తారని ఆశాభావంతో ఉన్నాము’’ అని పేర్కొన్నాడు.కచ్చితంగా ఐసీసీ వైఫల్యమేఇక బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ‘‘మేము ఐసీసీతో మరోసారి చర్చలు జరుపుతాము. వరల్డ్‌కప్‌లో ఆడాలని మాకు ఉంది. కానీ భారత్‌లో మాత్రం ఆడబోము. ఈ విషయంపై పోరాటం చేస్తాం. ఐసీసీ బోర్డు మీటింగ్‌లో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు విషయం చిన్నదేమీ కాదు. మా మ్యాచ్‌ల విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం అన్నట్లుగా వ్యవహారం ఉంది. భారత్‌లో ఆడలేమని అంటే మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఒలింపిక్స్ వరకు ఈ క్రీడ వెళ్లింది. కానీ మేము మాత్రం ఇక్కడే ఉండిపోయాము. ఇది కచ్చితంగా ఐసీసీ వైఫల్యమే’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
శుబ్‌మన్ గిల్ ఫెయిల్.. జడ్డూ విఫలమైనా..
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ఇటీవల వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా పంజాబ్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడాడు గిల్. అనంతరం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో బిజీ అయ్యాడు.ఈ సిరీస్‌లో గిల్ సేన కివీస్ చేతిలో 2-1తో ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక కివీస్‌తో టీ20 సిరీస్, టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి సెలక్టర్లు గిల్ (Shubman Gill)ను తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్‌పై దృష్టి సారించిన అతడు.. పంజాబ్ కెప్టెన్‌గా రంజీ సెకండ్ లీగ్ బరిలో దిగాడు.పంజాబ్ తొలుత బౌలింగ్రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. హర్‌ప్రీత్ బ్రార్ (Harpreet Brar) ఆరు వికెట్లతో చెలరేగగా.. జసిందర్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, ప్రేరిత్ దత్తా చెరో వికెట్‌తో సత్తా చాటారు. ఫలితంగా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ అయింది.జడ్డూ విఫలంసౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ జై గోహిల్ 82 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. ప్రేరక్ మన్కడ్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (7) సహా మిగిలిన వారంతా విఫలమయ్యారు.ఈ క్రమంలో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే పంజాబ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. సౌరాష్ట్ర పేసర్, కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ దెబ్బకు పంజాబ్ ఓపెనర్ హర్నూర్ సింగ్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (44) నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా అతడితో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ ఉదయ్ సహారన్ (23)ను ధర్మేంద్రసిన్హ జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ నేహాల్ వధేరా (6)ను పార్థ్ భూట్ అవుట్ చేశాడు.గిల్ డకౌట్ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ను సైతం పార్థ్ వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్‌లో రెండు బంతులు ఎదుర్కొన్న గిల్ లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా పెవిలియన్ చేరాడు. ఇలా రీఎంట్రీలో గిల్‌కు చేదు అనుభవమే మిగిలింది. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా.. పంజాబ్ తరఫున గిల్ బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొనగా ఇద్దరూ నిరాశపరచడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.పంజాబ్ ఆలౌట్.. సౌరాష్ట్రకుకు ఆధిక్యంకాగా పంజాబ్ తరఫున ప్రభ్‌సిమ్రన్ (44), అన్మోల్ప్రీత్ సింగ్ (35) రాణించారు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 139 పరుగులకే ఆలౌట్ అయింది. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ ఐదు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా, ధర్మేంద్రసిన్హ జడేజా చెరో రెండు.. ఉనాద్కట్ ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సౌరాష్ట్రకు 33 పరుగుల ఆధిక్యం లభించింది. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన జడ్డూ బౌలింగ్‌లో మాత్రం ఫర్వాలేదనిపించాడు.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!During today’s Ranji match, Shubman Gill was actually not out. It was clearly bat first, but since there is no DRS in domestic matches, he was given out. BCCI, if you can’t provide DRS or even a proper live stream, then don’t conduct tournaments like this. pic.twitter.com/0LEZFFANgd— MARCUS (@MARCUS907935) January 22, 2026 -
BCCI: మీ సమస్య ఏంటి?: సుప్రీంకోర్టు ఆగ్రహం
భారత క్రికెట్ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్‌కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.పూర్వాపరాలు ఇవేప్రైవేట్ సంస్థ అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు.టీమిండియా అనకూడదుప్రసార్ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్ కన్సాల్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.మీ సమస్య ఏమిటి?ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్‌లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్‌ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
అతడికి ఎక్కడున్నా అదే ఆలోచన.. సంతోషంగా ఉంది: సూర్య
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. నాగ్‌పూర్ వేదికగా తొలి టీ20లో 48 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంలో కీలక పాత్ర భారత ఓపెనర్ అభిషేక్ శర్మదే.అతిపెద్ద సానుకూలాంశంఇక అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు.. బౌలర్లు కూడా రాణించడంతో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలుత బ్యాటింగ్ చేయడం మాకు ఎల్లప్పుడూ సంతోషమే.మంచు ప్రభావం కూడా ఉంది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాకు అతిపెద్ద సానుకూలాంశం అదే. పవర్ ప్లేలో వికెట్లు (25-2) కోల్పోయినా మేము పుంజుకున్న తీరు అద్భుతం. 15 ఓవర్ వరకు మా ఆట కొనసాగుతూనే ఉంది. ఎక్కడా మాకు అలుపు రాలేదు. మా జట్టు చాలా బాగా ఆడింది.సరైన సమయంలో క్రీజులోకివ్యక్తిగతంగా నా బ్యాటింగ్ పట్ల కూడా తృప్తిగానే ఉంది. సరైన సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. నెట్స్‌లో నేను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మైదానంలోనూ అదే పునరావృతం చేశాను. గత 2-3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది.ఎక్కడున్నా అదే ఆలోచనఇక అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ కోసం అతడు సన్నద్ధమయ్యే తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హోటల్లో.. టీమ్ బస్‌లో.. ఇలా ఎక్కడ ఉన్నా సరే తన గ్లేమ్ ప్లాన్ గురించే ఆలోచిస్తాడు. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారిస్తాడు. అందుకు తగ్గ ఫలాలను అతడు పొందుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాము’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు.238 పరుగులుకాగా నాగ్‌పూర్‌లో బుధవారం నాటి తొలి టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 238 పరుగులు చేసింది. అయితే, కివీస్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది 32 పరుగులు చేయగలిగాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది’ మ్యాచ్ అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 84)తో దుమ్ములేపాడు. భారత్- కివీస్ మధ్య శుక్రవారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు రాయ్‌పూర్ వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డుA thumping win! 👏🏻🇮🇳Shivam Dube finishes off the proceedings & after putting up a mammoth total, Team India bowlers combine to restrict the Kiwi batters to go 1-0 up! 👌🏻Watch #INDvNZ | 2nd T20I 👉 FRI, 23rd JAN, 6 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/WTK7BuF1Nv— Star Sports (@StarSportsIndia) January 21, 2026 -
ఆమెకు బ్రేకప్ చెప్పిన టీమిండియా స్టార్!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్వశ్తో చహల్‌కు విభేదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం. కొరియోగ్రాఫర్, యూట్యూబర్ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చహల్.అయితే, వివాహమైన కొన్ని నెలలకే తమ మధ్య గొడవలు జరిగాయని.. విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించినట్లు కోర్టును ఆశ్రయించింది ఈ జంట. గతేడాది అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.ఆర్జేతో చెట్టాపట్టాల్‌కానీ అంతకంటే ముందు నుంచే చహల్.. ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా ఆమెతో కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు షేర్ చేసి తమ మధ్య స్నేహ బంధం ఉందని చహల్ స్పష్టం చేశాడు.కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకే చహల్- ధనశ్రీలకు విడాకులు మంజూరు కావడంతో.. అప్పటిదాకా ధనశ్రీని తిట్టినవారంతా ఆర్జే మహ్వశ్పై దృష్టి సారించారు. చహల్ కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. భార్యభర్తల మధ్య దూరి విడాకులకు కారణమైందని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.మరోవైపు.. చహల్‌కు మద్దతుగా పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ మహ్వశ్ సైతం పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు మరోసారి ‘‘హోం బ్రేకర్’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల చహల్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు వదంతులు వ్యాప్తి చేస్తారు.ఏడుస్తూ కూర్చోలేము కదా!అంతమాత్రాన మేము ఏడుస్తూ కూర్చోలేము కదా!.. జనాలు ఏమనుకుంటున్నారో అదే అనుకోనివ్వండి. మాకేం తేడా ఉండదు. మా కాపురాన్ని కూల్చిందని ఆమెను ఆడిపోసుకున్నారు. ఇంకా ఎన్నెన్నో మాటలు అన్నారు. ఓ మహిళను ఎన్ని రకాలుగా కించపరచవచ్చో అన్ని రకాలుగా మాట్లాడారు.యుజీ ఆమెతో ఎందుకు ఉన్నాడని చాలా మంది అన్నారు. కష్టకాలంలో నాకు సహాయంగా నిలబడ్డ నా స్నేహితురాలిని అలా నిందించడం నాకు బాధ కలిగించింది. ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్లినా మా ఫొటోలు మాత్రమే క్రాప్ చేసి రూమర్స్ వ్యాప్తి చేశారు. అందుకే కలిసి బయటకు వెళ్లడం కూడా మానేశాము’’ అని చెప్పుకొచ్చాడు.ఒకరినొకరు అన్‌ఫాలోమరోవైపు.. ఆర్జే మహ్వశ్ సైతం అబ్బాయితో కలిసి బయటకు వెళ్తే చాలు డేటింగ్ అంటున్నారని.. అసలు మనం ఏ కాలంలో ఉన్నామంటూ మండిపడింది. పరోక్షంగా చహల్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అయితే, తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం.నేను ఎవరినీ నమ్మనుదీంతో చహల్- మహ్వశ్ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చహల్ ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘నేను ఎవరినీ నమ్మను’’ అని పోస్ట్ పెట్టడం ఇందుకు బలమిచ్చింది. మరో స్టోరీలో ‘‘బాధ, ఆశల వలయంలో చిక్కుకుపోకుండా.. బంధాల్లో మునిగిపోకుండా.. కోపం, భయాన్ని వదిలేసి ముందుకు సాగేవాడే తెలివైన మనిషి’’ అన్న భవద్గీత పంక్తులను కూడా చహల్ షేర్ చేయడం విశేషం.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి! -
ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్ మాక్స్వెల్
టీ20 క్రికెట్లో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్న దేశవాళీ లీగ్‌లలో మరో కొత్త టోర్నీ చేరింది. ‘యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్’ (ఈటీపీఎల్) పేరుతో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ‘రూల్స్ గ్లోబల్’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఈ లీగ్‌ను నిర్వహిస్తుంది.అభిషేక్ బచ్చన్ సైతంప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో పాటు పలువురు ఇతర వ్యాపారవేత్తలు ‘రూల్స్ గ్లోబల్’లో భాగస్వాములుగా ఉన్నారు. లీగ్‌కు సంబంధించి ఇప్పటికే మూడు జట్ల కొనుగోలు పూర్తయింది. దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా ఆమ్స్టర్డామ్ ఫ్రాంచైజీకి యజమాని కాగా... మూడు ఒలింపిక్ పతకాలు, రెండుసార్లు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడైన ఆ్రస్టేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్ కూడా స్టీవ్‌వాతో పాటు సహ యజమానిగా ఈ జట్టుతో చేతులు కలపడం విశేషం.యజమానిగా గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ఇక ఎడిన్బర్గ్ టీమ్‌ను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు నాథన్ మెకల్లమ్, కైల్ మిల్స్ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్ఫాస్ట్ టీమ్‌కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో లీగ్ జరుగుతుంది. ఇటీవలి కాలంలో యూరోప్‌లో కూడా క్రికెట్ బాగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్ విజయవంతం అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
ఎన్నికల ప్రకటన తర్వాతే... ఐపీఎల్ షెడ్యూల్: రాజీవ్ శుక్లా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-19వ సీజన్ షెడ్యూల్‌కు కసరత్తులు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ జరగనుండగా... దానికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాతేఈ వేసవిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఎన్నికల తేదీలు ఖరారు చేసిన అనంతరం షెడ్యూల్ రూపొందించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎదురుచూస్తోంది.పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యమవుతోందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) వెల్లడించారు. రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీలు ఈ వారంలోనే తమ ‘హోం గ్రౌండ్’ను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.అపుడే షెడ్యూల్ విడుదల‘ఐపీఎల్ షెడ్యూల్ రూపొందించే పనిలో ఉన్నాం. అయితే ఎన్నికల తేదీలపై ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నాం. అది విడుదలైన వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తాం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తాం. బెంగళూరు, రాజస్తాన్ జట్లకు తమ ‘హోమ్ గ్రౌండ్’ను నిర్ణయించుకునే అవకాశం ఇస్తున్నాం. వీలైనంత త్వరగా వివరాలు అందిస్తే... దానికి తగ్గట్లు మ్యాచ్‌లను షెడ్యూల్ చేస్తాం’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందించాడు. ఏదో ఒక అద్భుతం జరిగి ఐసీసీ తమ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదే సమయంలో మరోసారి భారత్ గురించి అవాకులు చెవాకులు పేలాడు.కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్-2026లో తమ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రాబోమని బంగ్లా బోర్డు (BCB) ఐసీసీకి తెలిపింది. తమ వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసింది.ఆడితే ఆడండి.. లేకపోతే పొండిఈ విషయంపై చర్చించిన ఐసీసీ బుధవారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్ నుంచి మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని... వరల్డ్ కప్‌లో ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం గురువారం నాటికి తుది గడువు విధించింది.ఒకవేళ బంగ్లాదేశ్ తమ పంతం వీడకపోతే ఆ జట్టును వరల్డ్ కప్ నుంచి తప్పిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ జట్టును బంగ్లాదేశ్ స్థానంలో ఆడించాలని కూడా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో దీనికి మద్దతుగా అత్యధిక డైరెక్టర్లు ఓటు వేశారు.ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు బీసీసీఐ తరఫున దేవజిత్ సైకియా ఇందులో పాల్గొన్నారు. 15 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాగా, ఒక్క పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్‌కు అండగా నిలిచింది. ఇప్పటికే బంగ్లా డిమాండ్‌కు మద్దతు ప్రకటించిన పాకిస్తాన్ తమ దేశంలో ఆ జట్టు మ్యాచ్‌లను నిర్వహిస్తామని కూడా ప్రతిపాదించింది.ఎలాంటి ప్రమాదం లేదు..అయితే ఇవన్నీ సాధ్యం కాదని ఐసీసీ కొట్టిపారేసింది. ‘భద్రతాపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. భారత్‌లోని ఏ వేదికపైన కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులకు ఎలాంటి ప్రమాదం లేదు.టోర్నీ చేరువైన సమయంలో షెడ్యూల్ మార్పు ఏమాత్రం సాధ్యం కాదు. భద్రతా పరమైన కారణం అంటూ ఈసారి అలా చేస్తే ఇది చెడు సాంప్రదాయానికి దారి తీస్తూ ఐసీసీ ఈవెంట్లకు చెడ్డపేరు వస్తుంది. బంగ్లా బోర్డుకు ఇప్పటికే ఇవన్నీ పూర్తిగా వివరించాం.అయితే ఎంత చెప్పినా వరల్డ్ కప్‌తో ఏమాత్రం సంబంధం లేని ఒక దేశవాళీ లీగ్‌లో జరిగిన ఘటనను చూపిస్తూ బంగ్లా తమ డిమాండ్‌ను కొనసాగించింది. ఎన్నో అంశాలను బట్టి వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలు ప్రకటిస్తాం. ఇప్పుడు ఎలాంటి మార్పులూ చేయలేం’ అని ఐసీసీ తమ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇండియా మాకు భద్రం కాదుఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. ‘‘మా ప్రభుత్వంతో చర్చించేందుకు నాకు కొంత గడువు కావాలని ఐసీసీ బోర్డును అడిగాను. చివరి అవకాశం ఇమ్మని కోరాను. ఇది సరైనదేనని వారు భావించారు. 24 నుంచి 48 గంటలలోపు మా నిర్ణయం చెప్పాలన్నారు.అయితే, ఈ విషయంలో నేను మా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టదలచుకోలేదు. ఏదేమైనా ఇండియా మాకు భద్రమైన దేశం కాదు. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడేందుకే మేము కట్టుబడి ఉన్నాము. ఐసీసీ మా అభ్యర్థనను తిరస్కరించిందని తెలుసు.అద్భుతం జరుగుతుందిప్రభుత్వంతో చర్చించిన తర్వాతే మా తుది నిర్ణయం వెల్లడిస్తాం. ఐసీసీ మా విషయంలో అద్భుతం చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్ టోర్నీలో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు!.. బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా ఐసీసీ ఈవెంట్లో ఆడాలని కోరుకుంటున్నారు.బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా బంగ్లా క్రికెట్ జట్టు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలని ఆశిస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు భారత్ మా ఆటగాళ్లకు సురక్షిత ప్రదేశం కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అంటూ ఓవైపు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడాలనే కోరిక ఉందంటూనే.. మరోవైపు భారత్ గురించి అతిగా మాట్లాడాడు. కాగా అంతకుముందు తమ అభ్యర్థనను తిరస్కరిస్తే వరల్డ్‌కప్ బహిష్కరిస్తామంటూ బంగ్లా హెచ్చులకు పోయింది. ఇప్పుడు మాత్రం తమకు ఆడాలని ఉందంటూ తమదంతా మేకపోతు గాంభీర్యమేనని నిరూపించుకుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికలుగా ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనుంది. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్ -
అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో కేవలం 22 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని.. కివీస్ మీద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ స్టార్ ఫిల్ సాల్ట్ (Phil Salt) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అభిషేక్ శర్మ ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- న్యూజిలాండ్ (IND vs NZ 1st T20I) బుధవారం తొలి టీ20లో తలపడ్డాయి.నాగ్‌పూర్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson- 10), టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (8) పూర్తిగా నిరాశపరిచారు.ఆకాశమే హద్దుఅయితే మరో ఓపెనర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 84 పరుగులు సాధించాడు. ఇష్ సోధి బౌలింగ్‌లో జెమీషన్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మిగతా వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 238 పరుగులు సాధించింది.కివీస్ ఓటమిభారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు ఫిఫ్టీలు బాదిన క్రికెటర్లు వీరే🏏అభిషేక్ శర్మ- ఎనిమిది సార్లు🏏ఫిల్ సాల్ట్- ఏడుసార్లు🏏సూర్యకుమార్ యాదవ్- ఏడుసార్లు🏏ఎవిన్ లూయీస్- ఏడుసార్లు.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్ You keep on counting, he keeps on hitting! 🤩😍𝗠𝗿. 𝗠𝗔𝗫𝗜𝗠𝗨𝗠, Abhishek Sharma, is taking bowlers to the cleaners as he smashes his 5th SIX of the innings! 🔥👏🏻#INDvNZ | 1st T20I | LIVE NOW 👉 https://t.co/o7KbRwpZwK pic.twitter.com/1MyyCmbcP6— Star Sports (@StarSportsIndia) January 21, 2026 -
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ కోచ్‌గా యాజ్ఞిక్
కోల్‌కతా: వికెట్ కీపర్ బ్యాటర్ దిశాంత్ యాజ్ఞిక్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫీల్డింగ్ కోచ్‌గా నియమించుకుంది. దేశవాళీలతో పాటు... ఐపీఎల్ అనుభవం ఉన్న ఈ రాజస్తాన్ ప్లేయర్ రాకతో తమ శిక్షణ బృందం బలం మరింత పెరుగుతుందని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది. ‘యాజ్ఞిక్‌కు అపార అనుభవం ఉంది. అది జట్టుకు ఉపకరించనుంది. ఈసారి ఐపీఎల్‌కు కొత్త సపోర్టింగ్ స్టాఫ్‌తో బరిలోకి దిగనున్నాం. హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్, మెంటార్‌గా డ్వేన్ బ్రావో, అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్, బౌలింగ్ కోచ్‌గా టిమ్ సౌతీ, పవర్ కోచ్‌గా ఆండ్రీ రసెల్ వ్యవరిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో యాజ్ఞిక్ చేరుతున్నాడు. అతడి కోచింగ్ జర్నీలో ఇది ప్రత్యేకంగా నిలవడం ఖాయం’ అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీల్లో రాజస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యాజ్ఞిక్... 2011 నుంచి 2014 మధ్య 25 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం వివిధ జట్లకు శిక్షణనిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది. -
టీమిండియాకు భారీ షాక్
టీ20 ప్రపంచకప్ టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే వాషింగ్టన్ సందర్, తిలక్ వర్మ గాయాల బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేరాడు. నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో అక్షర్ గాయపడ్డాడు.కివీస్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మూడో బంతిని డారిల్ మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్రమంలో అక్షర్ చేతి వేలికి గాయమైంది. బంతి బలంగా తగలడంతో అక్షర్ ఎడమ చేతి చూపుడు వేలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.మిగిలిన ఓవర్‌ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అక్షర్ గాయం తీవ్రమైనది కానట్లుగా తెలుస్తోంది. వేలు పైన మాత్రమే చిట్లడం వల్ల రక్త స్రవమైందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ శుక్రవారం జరగనున్న రెండో టీ20కు మాత్రం అక్షర్ దూరమయ్యే అవకాశముంది.ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(44) రాణించాడు. అనంతరం కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: అటు గిల్... ఇటు జడేజా -
అటు గిల్... ఇటు జడేజా
రాజ్‌కోట్: రెండు నెలల విరామం అనంతరం దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఒకవైపు భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడుతుండగా... ఈ ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని టాప్ ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్... పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సిరాజ్ హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు. వీరితో పాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి ఇలా పలువురు టీమిండియా ప్లేయర్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. నవంబర్ రెండో వారంలో చివరగా రంజీ మ్యాచ్‌లు జరగగా... రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. రంజీ ట్రోఫీకి విరామం ఇచ్చిన సమయంలో ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ జరిగాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మాజీ విజేత విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అనంతపురం వేదిక కానుంది. తొలి అంచె పోటీల్లో 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, 2 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. విదర్భ 25 పాయింట్లతో ‘టాప్’లో కొనసాగుతోంది. మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించగా... ఇప్పటి వరకు ఒక్కో జట్లు ఐదేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇక లీగ్ దశలో రెండేసి మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా... ఒక్కో గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర, విదర్భ పోరు మరింత ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్న పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. శ్రీకర్ భరత్, రికీ భుయ్, షేక్ రషీద్‌లతో ఆంధ్ర జట్టు బలంగా ఉండగా... విదర్భ జట్టు ఇటీవలే విజయ్ హజారే వన్డే ట్రోఫీ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉంది. సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోగా... ఆ వెంటనే శుబ్‌మన్ గిల్ పంజాబ్ జట్టుతో చేరాడు. నేటి నుంచి సౌరాష్ట్రతో జరగనున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో గిల్ పంజాబ్ జట్టును నడిపించనున్నాడు. మరోవైపు సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, బెంగాల్ తరఫున మొహమ్మద్ షమీ కూడా మ్యాచ్‌లకు సిద్ధమయ్యారు. -
హైదరాబాద్ x ముంబై
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానుండగా... 42 సార్లు చాంపియన్ ముంబై జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ తలపడనుంది. గ్రూప్ ‘డి’లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమి, మూడు ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్ నాలుగో స్థానంలో... పరాజయం ఎరగని ముంబై 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా... ఈ రెండింట్లో మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్ భావిస్తోంది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అందుబాటులో లేకపోగా... టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అజింక్యా రహానే అందుబాటులో లేకపోయినా... శార్దుల్ ఠాకూర్ సారథ్యంలోని ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, సిద్ధేశ్ లాడ్‌లతో పటిష్టంగా ఉంది. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
అదరగొట్టిన అభిషేక్
ఎప్పటిలాగే తనదైన శైలిలో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్... సూర్యకుమార్, రింకూ సింగ్ దూకుడు... ఆపై బౌలర్ల ప్రతాపం... వెరసి న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. ముందుగా కేవలం బౌండరీల ద్వారానే 168 పరుగులు రాబట్టి భారీ స్కోరుతో చెలరేగిన టీమిండియా... అనంతరం ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమైంది. కివీస్ కొంత పోరాడినా లక్ష్యానికి దూరంలో నిలిచిపోయింది. నాగ్‌పూర్: న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్ టి20 సిరీస్ తొలి మ్యాచ్‌లో నెగ్గి 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన ఈ పోరులో భారత్ 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (35 బంతుల్లో 84; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్ల వర్షం కురిపించగా... రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్ ) ధాటిగా ఆడారు. అభిషేక్, సూర్యకుమార్ మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 99 పరుగులు జోడించారు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), మార్క్ చాప్మన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. రెండో టి20 శుక్రవారం రాయ్‌పూర్‌లో జరుగుతుంది. సమష్టి ప్రదర్శన 14 సిక్సర్లతో 84 పరుగులు... 21 ఫోర్లతో 84 పరుగులు... భారత్ జోరు బౌండరీలతో ఈ తరహాలో సాగింది. ముందుగా అభిషేక్, మధ్యలో సూర్య, పాండ్యా, చివర్లో రింకూ చెలరేగి భారత్‌కు భారీ స్కోరును అందించారు. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. సంజు సామ్సన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు), ఇషాన్ కిషన్ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు) ఆరంభంలోనే వెనుదిరిగినా... మరోవైపు అభిషేక్ సిక్స్‌తో దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. జేమీసన్, క్లార్క్ వేసిన వరుస ఓవర్లలో అతను రెండేసి సిక్స్‌లు బాదాడు. దాంతో పవర్‌ప్లేలో భారత్ 68 పరుగులు చేసింది. ఫిలిప్స్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్ 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సోధి ఓవర్లో సూర్య వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 117కు చేరింది. సూర్య అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) అదే ధాటిని ప్రదర్శించాడు. సోధి ఓవర్లో వరుసగా 4, 6, 6 బాది సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ వెనుదిరిగాడు. తక్కువ వ్యవధిలో శివమ్ దూబే (4 బంతుల్లో 9; 1 సిక్స్), పాండ్యా, అక్షర్ పటేల్ (5) అవుటైన తర్వాత ఆఖర్లో రింకూ చెలరేగిపోయాడు. క్లార్క్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి స్కోరును 200 దాటించిన అతను... మిచెల్ వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ఫిలిప్స్ అర్ధ సెంచరీ న్యూజిలాండ్ ఛేదన పేలవంగా ప్రారంభమైంది. రెండో బంతికే కాన్వే (0) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో రచిన్ (1) కూడా అవుటయ్యాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాబిన్సన్ (21) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. ఇలాంటి స్థితిలో ఫిలిప్స్, చాప్మన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఫిలిప్స్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు భారీ సిక్స్‌లు బాదాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి ఫిలిప్స్ అవుట్ కావడంతో 79 పరుగుల (42 బంతుల్లో) నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్లో చాప్‌మన్‌ను వరుణ్ అవుట్ చేయడంతో కివీస్ ఆశలు కోల్పోయింది. ఈ దశలో విజయానికి చివరి 5 ఓవర్లలో 95 పరుగులు చేయాల్సిన జట్టు చివరకు 46 పరుగులే చేయగలిగింది. డరైల్ మిచెల్ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు), సాంట్నర్ (13 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రచిన్ (బి) జేమీసన్ 10; అభిషేక్ (సి) జేమీసన్ (బి) సోధి 84; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) డఫీ 8; సూర్యకుమార్ (సి) రాబిన్సన్ (బి) సాంట్నర్ 32; పాండ్యా (సి) చాప్మన్ (బి) డఫీ 25; దూబే (సి అండ్ బి) జేమీసన్ 9; రింకూ సింగ్ (నాటౌట్) 44; అక్షర్ (సి) మిచెల్ (బి) క్లార్క్ 5; అర్ష్ దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–126, 4–149, 5–166, 6–185, 7–209. బౌలింగ్: డఫీ 4–0–27–2, జేమీసన్ 4–0–54–2, క్లార్క్ 4–0–40–1, సోధి 3–0–38–1, ఫిలిప్స్ 1–0–20–0, సాంట్నర్ 3–0–37–1, మిచెల్ 1–0–21–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; రాబిన్సన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; రచిన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; ఫిలిప్స్ (సి) దూబే (బి) అక్షర్ 78; చాప్మన్ (సి) అభిషేక్ (బి) వరుణ్ 39; మిచెల్ (సి) (సబ్) బిష్ణోయ్ (బి) దూబే 28; సాంట్నర్ (నాటౌట్) 20; క్లార్క్ (సి) రింకూ (బి) దూబే 0; జేమీసన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–52, 4–131, 5–143, 6–189, 7–189. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–31–1, పాండ్యా 2–0–20–1, బుమ్రా 3–0–29–0, అక్షర్ పటేల్ 3.3–0–42–1, వరుణ్ 4–0–37–2, దూబే 3–0–28–2, అభిషేక్ 0.3–0–3–0. -
తొలి టీ20లో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌ను 48 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించిందిఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైనప్పటికి అభిషేక్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లుతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్(24 బంతుల్లో 44 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, జాకబ్ డఫ్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్, సోధీ, క్లార్క్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఫిలిప్స్ కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు చాప్మన్(39)రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం(జనవరి 23) జరగనుంది.చదవండి: అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్ -
అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 32 పరుగులు చేసిన సూర్య భాయ్.. పొట్టి క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా అత్యంత వేగంగా (321 ఇన్నింగ్స్‌లు) ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఈ జాబితాలో విరాట్ కోహ్లి (271 ఇన్నింగ్స్‌లు), శిఖర్ ధవన్ (308) సూర్య కంటే ముందున్నారు. ప్రపంచం మొత్తంలో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ పేరిట ఉంది. బాబర్ కేవలం 245 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ విధ్వంసం (35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు), రింకూ సింగ్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు) మెరుపుల కారణంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అతి భారీ స్కోర్ (238/7) చేసింది.మిగతా బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. సూర్య భాయ్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది 100వ మ్యాచ్.ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (10), ఇషాన్ కిషన్ (8), శివమ్ దూబే (9), అక్షర్ పటేల్ (5) నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో 2.. క్రిస్టియన్ క్లార్క్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే చేదు అనుభవం ఎదురైంది. రెండో బంతికే అర్షదీప్ డెవాన్ కాన్వేను (0) ఔట్ చేశాడు. రెండో ఓవర్లో న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా రచిన్ రవీంద్రను (1) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 39-2గా ఉంది. రాబిన్సన్ (19), గ్లెన్ ఫిలిప్స్ (18) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 200 పరుగులు చేయాలి. -
అభిషేక్ విధ్వంసం, రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్ (238/7) చేసింది. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి బంతి నుంచి ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్‌కు జతగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. అతని తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) కూడా సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ చేసింది.మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ 10, ఇషాన్ కిషన్ 8, శివమ్ దూబే 9, అక్షర్ పటేల్ 5, అర్షదీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో 2.. క్రిస్టియన్ క్లార్క్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. -
అభిషేక్ శర్మ ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే..!
నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌పై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 2020లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.అభిషేక్‌కు టీ20ల్లో ఇది ఏడో హాఫ్ సెంచరీ. దీంతో అతను మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు (8) పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తర్వాతి స్థానాల్లో ఫిల్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్ ఉన్నారు. వీరంతా తలో ఏడు సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఐష్ సోధి బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి జేమీసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఇన్నింగ్స్‌లో అభిషేక్ టీ20ల్లో 5000 పరుగుల మార్కును తాకాడు. అభిషేక్ తన స్వల్ప అంతర్జాతీయ టీ20 కెరీర్లో (33 ఇన్నింగ్స్‌లు) 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో, 190.92 స్ట్రయిక్‌రేట్‌తో, 37.46 సగటున 1199 పరుగులు చేశాడు. ఇందులో 112 ఫోర్లు, 81 సిక్సర్లు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు) స్వల్ప స్కోర్‌కే ఔటైనా అభిషేక్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (8) సైతం నిరాశపర్చినా, అభిషేక్ మెరుపులు ఆగలేదు. ఇంకా చెప్పాలంటే ఇషాన్ ఔటయ్యాక శృతి మించాయి.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన శివమ్ దూబే (9) భారీ షాట్లు ఆడే క్రమంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న హార్దిక్ (14 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనికి జతగా రింకూ సింగ్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. 15.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 185/5గా ఉంది. -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. బీసీబీ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్‌ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.ఇవాళ (జనవరి 21) జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో ఓటింగ్ ద్వారా ఈమేరకు నిర్ణయించింది. మొత్తం 16 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు.భరోసా ఇచ్చినా..!భద్రతను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినా ఆ దేశ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి, బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.ముస్తాఫిజుర్ ఉదంతంతో సంబంధమే లేదు భారత్‌లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చూపుతున్న సాకులకు, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ పేర్కొంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని హితవు పలికింది. స్కాట్లాండ్కు అవకాశం ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే, వారి స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు ఎంపికవుతుంది.మరో 24 గంటల డెడ్లైన్ఇది జరగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్ మరో 24 గంటల్లో ఏ విషయం తేల్చాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈలోపు కూడా బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చకపోతే డీఫాల్ట్‌గా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్.. వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి గ్రూప్-సిలో ఉంది. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్‌ను ముంబైలో ఆడేలా షెడ్యూల్ ఉంది. -
భారత్‌తో తొలి టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. నాగ్‌పూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌తో క్రిస్టియన్ క్లార్క్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు పేసర్లుగా జేమీసన్, డఫీ ఉన్నారు.మరోవైపు భారత్ ముందుగా చెప్పినట్లుగానే శ్రేయస్‌ను కాదని వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చింది. హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్‌లను బెంచ్‌కే పరిమితం చేసింది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ యువ బ్యాటర్
ఇంగ్లండ్ యువ బ్యాటర్ బెన్ మేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో భాగంగా స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌లో మేస్ కేవలం 65 బంతుల్లో శతక్కొట్టి, మొత్తంగా 117 బంతుల్లో 191 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మేస్ మరో రెండు పరుగులు చేసుంటే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు తరఫున అయిన అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించి ఉండేవాడు. ఈ ప్రపంచ రికార్డు శ్రీలంక ఆటగాడు విరాన్ చముదిత పేరిట ఉంది. విరాన్ ఇదే ఎడిషన్‌లో జపాన్‌పై 192 పరుగుల చేశాడు. మేస్.. మరో శ్రీలంక ఆటగాడు హసిత బోయగోడాతో కలిసి ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. హసిత కూడా మేస్ లాగే 191 పరుగుల వద్ద ఆగిపోయాడు.మ్యాచ్ విషయానికొస్తే.. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేస్ భారీ శతకంతో పాటు ఓపెనర్ జోసఫ్ మూర్స్ (81) అర్ద సెంచరీతో రాణించాడు. లోయర్ మిడిలార్డర్ ఆటగాడు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 400 పరుగుల మైలురాయిని తాకింది. కెప్టన్ థామస్ రూ 22, కాలెబ్ ఫాల్క్‌నర్ 32, రాల్ఫీ ఆల్బర్ట్ 13, ఫర్హాన్ అహ్మద్ 15 (నాటౌట్), సెబాస్టియన్ మోర్గాన్ 24 (నాటౌట్) పరుగులు చేశారు. మరో ఓపెనర్ బెన్ డాకిన్స్ 5 పరుగులకే ఔటయ్యాడు.స్కాట్లాండ్ బౌలర్లలో జేక్ వుడ్‌హౌస్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫిన్లే జోన్స్ 2, మ్యాక్స్ ఛాప్లిన్ ఓ వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ తడబడుతుంది. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 48 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. మనూ సరస్వత్ (6), మ్యాక్స్ ఛాప్లిన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్, లూక్ హ్యాండ్స్, ఫర్హాన్ అహ్మద్‌కు తలో వికెట్ దక్కింది.కాగా, ప్రస్తుత ఎడిషన్ ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. మరోవైపు స్కాట్లాండ్.. జింబాబ్వేతో ఆడాల్సిన తమ తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. రెండో మ్యాచ్‌లో ఆ జట్టు పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. -
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇవాళ (జనవరి 21) ఓ చారిత్రక మైలురాయిని తాకనున్నాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడిన స్కై.. న్యూజిలాండ్‌తో నేడు జరుగబోయే మ్యాచ్‌తో మ్యాచ్‌ల సెంచరీని పూర్తి చేయనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు.భారత క్రికెట్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ (159), విరాట్ కోహ్లి (125), హార్దిక్ పాండ్యా (124) మాత్రమే 100 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని తాకారు.మరో చారిత్రక మైలురాయి దిశగా..మ్యాచ్‌ల సెంచరీతో పాటు సూర్య మరో చారిత్రక మైలురాయి దిశగా కూడా అడుగులు వేస్తాడు. మొత్తం టీ20 కెరీర్లో ఇప్పటివరకు 346 మ్యాచ్‌ల్లో 395 సిక్సర్లు కొట్టిన స్కై, మరో ఐదు సిక్సర్లు కొడితే 400 సిక్సర్ల క్లబ్‌లోకి ప్రవేశిస్తాడు. ఈ ఘనతను భారత క్రికెట్లో ఇప్పటివరకు కేవలం రోహిత్ శర్మ (547), విరాట్ కోహ్లి (435) మాత్రమే సాధించారు.పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సూర్యనేటి మ్యాచ్‌లో చారిత్రక మైలురాయిని అందుకోబోతున్న సూర్య గత ఏడాది కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. గతేడాది అతను 21 మ్యాచ్‌ల్లో కేవలం 12.62 సగటున 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కనీసం ఒక్క అర్ధశతకం కూడా లేదు. టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో ప్రస్తుతం సూర్యపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కెప్టెన్‌గా సఫలమవుతున్నప్పటికీ.. చెత్త ప్రదర్శన కారణంగా అతను ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. స్కై ఇదే ఫామ్‌ను ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే అతని కెరీర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదముంది.ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. నాగ్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్‌గా టీమిండియా బరిలో దిగనుంది. సొంతగడ్డపై ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం సూర్యకుమార్ సేనకు మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా టోర్నీకి సన్నాహకంగా న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ పాల్గొననుంది.ఇదిలా ఉంటే.. కివీస్‌తో పాటు ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టు నుంచి సెలక్టర్లు శుబ్‌మన్ గిల్‌ను తప్పించిన విషయం తెలిసిందే. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న గిల్.. చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి తిరిగి వచ్చి వరుసగా విఫలం కావడమే ఇందుకు కారణం.అద్భుతమైన ఆటగాడుఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత గిల్ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్ కూడా అవుతాడని అంచనా వేశాడు. ఈ సందర్భంగా గిల్ అద్భుతమైన ఆటగాడు అని క్లార్క్ ప్రశంసలు కురిపించాడు.ఫామ్‌లేమి కారణంగానేబియాండ్23క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ అతడు పోటీలోనే ఉన్నాడు. ప్రస్తుతం జట్టుకు అవసరమైన రీతిలో అతడు బ్యాటింగ్ చేయడం లేదన్న కారణంగా పక్కనపెట్టారు. అంతేకాదు.. టీమిండియాకు లెక్కకు మిక్కిలి ఓపెనింగ్ బ్యాటర్ ఆప్షన్లు ఉన్నాయి.ప్రస్తుతం అతడు కెప్టెన్ కూడా కాదు. అందుకే వరల్డ్‌కప్ జట్టు నుంచి అతడిని తొలగించే సాహసం చేశారు. ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఫామ్‌లేమి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదుఅయితే, ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత గిల్ జట్టులోకి తిరిగి రావడమే కాదు.. కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడొక అద్భుతమైన ప్లేయర్. ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేకపోవచ్చు. అయితే, కెప్టెన్ అయ్యేందుకు అతడికి అర్హత ఉంది. ప్రస్తుతానికి వరల్డ్‌కప్ టోర్నీ మీద దృష్టి పెట్టినందు వల్లే మేనేజ్మెంట్ అతడిని తప్పించింది’’ అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.రోహిత్ స్థానంలో సూర్య, గిల్ కాగా రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టు సారథిగా అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక టెస్టుల్లో రోహిత్ రిటైర్మెంట్ తర్వాత శుబ్‌మన్ గిల్ పగ్గాలు చేపట్టగా.. గతేడాది వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. అయితే, క్లార్క్ అభిప్రాయపడినట్లు వరల్డ్‌కప్ తర్వాత గిల్ సూర్య స్థానాన్ని భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: సూర్యకుమార్ యాదవ్‌కు రోహిత్ శర్మ వార్నింగ్ -
చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ విల్ మలాజ్చుక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న (జనవరి 20) గ్రూప్-ఏలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ పేరిట ఉండేది. ఖాసిమ్ 2022 ఎడిషన్‌లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఖాసిమ్ తర్వాత మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాడు రాజ్ బవా పేరిట ఉంది. బవా 2022 ఎడిషన్‌లోనే ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.మలాజ్చుక్ విషయానికొస్తే.. ఇతగాడు జపాన్‌పై మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్ పసికూన జపాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఇది వరసగా రెండో విజయం. అంతకుముందు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను కూడా 8 వికెట్ల తేడాతోనే చిత్తు చేసింది.ఆసీస్‌తో మ్యాచ్‌లో జపాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ హ్యూగో కెల్లీ (79 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెల్లీకి నిహార్ పర్మార్ (33), చార్లెస్ హింజ్ (24), హర హింజ్ (29) ఓ మోస్తరు సహాకారాలను అందించారు. ఆసీస్ బౌలర్లలో కూరే 3, విల్ బైరోమ్ 2, ఆర్యన్ శర్మ, కేసీ బార్టన్ తలో వికెట్ తీశారు.అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. మలాజ్చుక్ మెరుపు సెంచరీకి మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ (60 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ తోడవ్వడంతో ఆసీస్ 29.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి
ఐసీసీ తాజాగా (జనవరి 21) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉండిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. అప్పటిదాకా నంబర్-2గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ సరికొత్త వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు.తాజాగా భారత్‌పై ఓ అర్ద సెంచరీ సహా వరుసగా రెండు సెంచరీలు (84, 131 నాటౌట్, 137) చేయడంతో డారిల్ రేటింగ్ పాయింట్లు అమాంతం పెరిగాయి. అప్పటిదాకా టాప్ ప్లేస్‌లో ఉండిన విరాట్‌పై డారిల్ ఏకంగా 50 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. ప్రస్తుతం డారిల్ ఖాతాలో 845 రేటింగ్ పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 795 పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో డారిల్ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. భారత్‌తో సిరీస్‌లో డారిల్ చారిత్రక ప్రదర్శన చేసి, తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని (2-1) అందించాడు.మరోవైపు రెండు వారాల కిందట టాప్ ర్యాంక్‌లో ఉండిన మరో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో మరో స్థానం దిగజారి నాలుగో స్థానానికి పడిపోయాడు. గత వారం నాలుగో స్థానంలో ఉండిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మూడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో సూపర్ సెంచరీతో అదరగొట్టిన మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ టాప్-10లోకి (10వ స్థానం) ప్రవేశించాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్, విండీస్ ప్లేయర్ షాయ్ హోప్, శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో కొనసాగుతున్నారు.తాజాగా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్‌తో మూడో వన్డేలో సూపర్ సెంచరీతో అలరించిన ఫిలిప్స్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరాడు.బౌలర్ల విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 710 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ, దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్, నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్-5లో ఉన్నారు. న్యూజిలాండ్ సిరీస్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. భారత్‌తో సిరీస్‌లో బరిలోకి దిగని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం 3 స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 50వ స్థానానికి చేరాడు. మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ 15 స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరాడు. భారత్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన మైఖేల్ బ్రేస్‌వెల్ 6 స్థానాలు మెరుగుపర్చుకొని 33వ స్థానానికి ఎగబాకాడు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్, జింబాబ్వే సికందర్ రజా, ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మహ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతున్నారు. -
IND vs NZ: అతడే మమ్మల్ని గెలిపిస్తాడు: కివీస్ కెప్టెన్
భారత్ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచి కొత్త ఏడాదిలో శుభారంభం అందుకుంది న్యూజిలాండ్. టీ20 సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు పటిష్ట, నంబర్ వన్ జట్టును ఓడించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది.ఇదేమీ అంత కష్టం కాదంటున్నాడు కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner), డారిల్ మిచెల్ జోరు కొనసాగిస్తే తాము సులువుగానే టీ20 సిరీస్‌నూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది న్యూజిలాండ్.డారిల్దే కీలక పాత్రఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. కివీస్ భారత్‌ను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్‌ది కీలక పాత్ర. ఈ సిరీస్‌లో అతడు సాధించిన పరుగులు వరుసగా.. 84, 131 నాటౌట్, 137.గతంలో స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డ డారిల్ మిచెల్ (Daryl Mitchell).. ఈసారి మాత్రం ఆ అవరోధాన్ని అధిగమించాడు. ముఖ్యంగా భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) బౌలింగ్‌లో అతడు చితక్కొట్టడం ఇందుకు నిదర్శనం. వన్డే ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని.. టీ20 సిరీస్‌లోనూ మిచెల్ అద్భుతాలు చేస్తాడని కివీస్ గట్టిగా నమ్ముతోంది.ఆరంభంలో ఇబ్బంది పడ్డాడుఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లో బుధవారం నాటి తొలి టీ20కి ముందు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ‘‘కెరీర్ ఆరంభంలో డారిల్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక చాలా ఇబ్బందిపడ్డాడు. అయితే, ఆ లోపాన్ని సరిచేసుకునేందుకు అతడు కఠినంగా శ్రమించాడు.అందుకు తగ్గ ఫలితాలు, ఫలాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అతడు స్పిన్‌ను సమర్థవంతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్న తీరు అద్భుతం. టీ20 సిరీస్‌లోనూ అదే స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆశిస్తున్నాం’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.ఇక్కడా గెలుస్తాంఇక ఇటీవలి కాలంలో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాను వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్.. తాజాగా వన్డే సిరీస్‌లో తొలిసారి గెలుపు రుచిచూసింది. ఈ నేపథ్యంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ఆడటం మాకెంతో ఇష్టం. అలాంటిది ఇక్కడ చారిత్రాత్మక విజయాలతో ముందుకు సాగడం మరింత సంతోషం.ఇప్పటికే రెండు ఫార్మాట్లలో అనుకున్న ఫలితం రాబట్టాము. ఇప్పుడు కూడా అదే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాము. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదొక మంచి సన్నాహకంగా ఉంటుంది’’ అని సాంట్నర్ తెలిపాడు. చదవండి: భారత్‌లో మ్యాచ్‌లు.. బంగ్లాదేశ్ కెప్టెన్ స్పందన వైరల్ -
IND vs NZ: అతడిపై వేటు.. భారత తుదిజట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ఆఖరి సన్నాహకంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి సిరీస్ ఆరంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా తొలి టీ20 సందర్భంగా టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తమ స్థానాలు పదిలం చేసుకోగా.. గాయపడిన వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) స్థానంలో ఇషాన్ కిషన్ మూడో స్థానంలో వస్తాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.శ్రేయస్ అయ్యర్‌కు నిరాశేఫలితంగా టీ20లలో రీఎంట్రీ ఇవ్వాలన్న వన్డే స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మరోసారి నిరాశ తప్పదు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య బరిలోకి దిగుతాడని తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే సిద్ధంగా ఉన్నారు. ఏడు ఎనిమిది స్థానాల్లో శివం దూబేతో కలిసి హిట్టింగ్ ఆడే క్రమంలో రింకూ సింగ్‌కు కూడా తుదిజట్టులో చోటు ఖాయమే.వరుణ్ చక్రవర్తికే ఓటుస్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌ను కాదని వరుణ్ చక్రవర్తి వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇక పేసర్ల విభాగంలో ప్రధాన బౌలర్ బుమ్రాతో పాటు టీ20 వికెట్ల వీరుడు అర్ష్‌దీప్ సింగ్ స్థానం దక్కించుకోవడం సహజమే.కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, బుమ్రాలకు విశ్రాంతినివ్వగా.. ఈ ఇద్దరి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఆడారు. ఆఖరిదైన మూడో వన్డేల్లో నితీశ్ (53), హర్షిత్ (52) అర్ధ శతకాలతో అలరించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడినా విరాట్ కోహ్లి (124)తో కలిసి కాస్తైనా పరువు నిలిచేలా చేశారు.అతడిపై వేటు తప్పదుఅయితే, టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్, బుమ్రా తిరిగి వచ్చారు. పాండ్యా ఉన్నాడు కాబట్టి నితీశ్ రెడ్డిని టీ20లకు ఎంపిక చేయలేదు. ఇక బుమ్రా కూడా వచ్చాడు కాబట్టి తొలి టీ20 సందర్భంగా హర్షిత్ రాణాపై వేటు పడక తప్పదని తెలుస్తోంది. ఒకవేళ లోయర్ ఆర్డర్లో హర్షిత్ బ్యాటింగ్‌కు ఉపయోగపడతాడని భావించినా.. టాపార్డర్ పటిష్టంగానే ఉన్న కారణంగా ఎక్స్ట్రా బ్యాటర్‌గా అతడి అవసరం ఉండకపోవచ్చు. అందుకే బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్ రంగంలోకి దిగుతాడని తెలుస్తోంది.న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు (అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: T20 WC: సూర్యకుమార్ యాదవ్‌కు రోహిత్ శర్మ వార్నింగ్ -
BCCI: బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్.. వాళ్లకి ప్రమోషన్లు!
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వార్షిక వేతనంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు పేర్కొన్నాయి. మూడు ఫార్మాట్లు ఆడుతున్న కారణంగా సెంట్రల్ కాంట్రాక్టులో అతడిని అత్యుత్తమ గ్రేడ్‌లోనే కొనసాగిస్తామని సంకేతాలు ఇచ్చాయి. ఏటా రూ. 7 కోట్లుకాగా జాతీయ జట్టు ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను క్రమబద్దీకరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలోని ఆటగాళ్లను ఎ+, ఎ, బి, సి అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వార్షిక ఫీజులు చెల్లిస్తున్న బోర్డు... ఇక మీద ‘ఎ+’ కేటగిరీని తొలగించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ‘ఎ+’ కేటగిరీలో ఉండగా... వీరికి ఏటా రూ. 7 కోట్లు చెల్లిస్తున్నారు.రో-కోలతో పాటు జడ్డూను తొలగిస్తారు!మరోవైపు.. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి రూ. 5 కోట్లు... ‘బి’ కేటగిరీలోని ప్లేయర్లకు రూ. 3 కోట్లు... ‘సి’ కేటగిరీలోని ప్లేయర్లకు కోటి రూపాయలు ఇస్తున్నారు. అయితే కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.మరోవైపు.. టీ20లకు స్వస్తి పలికిన జడేజా కూడా టెస్టు, వన్డే ఫార్మాట్లలోనే ఆడుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు ఎ+ గ్రేడ్‌లో ఉన్న బుమ్రా ఒక్కడే అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. దీంతో 2025–26 కోసం ప్రకటించనున్న జాబితాలో ‘ఎ+’ కేటగిరీని తొలగించాలని బోర్డు భావిస్తోంది.బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్.. వాళ్లకి ప్రమోషన్లు!అయితే బుమ్రాకు ఇస్తున్న వేతనంలో ఎలాంటి మార్పు చేసే అవకాశాలైతే లేవు. 2018 సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ‘ఎ+’ జాబితాను ప్రవేశపెట్టింది. కోహ్లి, రోహిత్ ఒక్క ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండటంతో వారికి ‘బి’ కేటగిరీలో చోటు దక్కనుంది. ఇక ప్రస్తుతం ‘బి’ కేటగిరీలో ఉన్న అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి వారికి ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయి.త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీలో కొత్త కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. ‘కాంట్రాక్టుల విధానాన్ని సరళీకరించే ప్రయత్నమే ఇది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాళ్లు తక్కువ మందే ఉన్నారు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న బుమ్రా అత్యుత్తమ కేటగిరీలోనే ఉంటాడు. అతడి వేతనంలో ఎలాంటి కోత ఉండదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా ఇప్పటికే పలు కీలక మ్యాచ్‌లు.. టోర్నీలకు దూరమయ్యాడు. అయినప్పటికీ జట్టులో అతడి ప్రాధాన్యం దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్ -
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్‌కు భారీ షాక్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ లీజెల్లి లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఆమెకు జరిమానా పడింది. అంతేకాదు లీజెల్లి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ కూడా చేరింది.మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MIW vs DCW) మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. వడోదర వేదికగా టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది.నట్ సీవర్, హర్మన్ మెరుపులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ నట్ సీవర్- బ్రంట్ (45 బంతుల్లో 65 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur- 33 బంతుల్లో 41) రాణించడంతో ఈ మేర స్కోరు సాధ్యమైంది.లీజెల్లి లీ ధనాధన్ఢిల్లీ బౌలర్లలో నల్లపురెడ్డి శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టగా.. మరిజానే కాప్, నందిని శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లలో షఫాలీ వర్మ (29) ఫర్వాలేదనిపించగా.. లీజెల్లి లీ ధనాధన్ దంచికొట్టింది. 28 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 46 పరుగులు చేసింది.అయితే, అర్ధ శతకానికి చేరువైన వేళ లీ పొరపాటుతో మూల్యం చెల్లించుకుంది. అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి లీ విఫలం కాగా.. వికెట్ కీపర్ రాహిలా ఫిర్దోజ్ చక్కటి స్టంపౌట్‌తో ఆమెను పెవిలియన్‌కు పంపింది. రివ్యూలోనూ లీజెల్లి లీదే తప్పని తేలడంతో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆమె బ్యాట్‌ను కొట్టినట్లు కనిపించింది.జరిమానా, డీమెరిట్ పాయింట్ఈ నేపథ్యంలో లీజెల్లి లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్లు డబ్ల్యూపీఎల్ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.2 నిబంధన ప్రకారం.. లీ లెవల్ 1 తప్పిదానికి పాల్పడింది. క్రికెట్ పరికరాలను డ్యామేజ్ చేసే రీతిలో వ్యవహరించినందుకు గానూ ఈ నిబంధన ప్రకారం చర్యలు ఉంటాయి.లెవల్ 1 తప్పిదం కాబట్టి లీ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం’’ అని డబ్ల్యూపీఎల్ పేర్కొంది. గెలిపించిన జెమీమాఇక ఈ మ్యాచ్‌లో లీతో పాటు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 51 నాటౌట్) దంచికొట్టడంతో ఢిల్లీ విజయతీరాలకు చేరింది. 19 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 155 పరుగులు చేసి.. ముంబైపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇక ఈ సీజన్లో ఢిల్లీ ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇది రెండో విజయం కాగా.. ముంబై ఆరింట రెండు మాత్రమే గెలిచి నాలుగు ఓడిపోయింది. మరోవైపు.. ఇప్పటిదాకా ఓటమన్నదే ఎరుగక ఐదింటికి ఐదు గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చదవండి: భారత్‌లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్


