breaking news
Warangal
-
వరంగల్‌లో మూగబోయిన పోలీస్ సైరన్
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని జన్మభూమి జంక్షన్ వద్ద ఆకతాయిల వీరంగం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. నడిరోడ్డుపై బీర్ సీసాలతో హంగామా చేస్తూ కొంతమంది వ్యక్తులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. గంజాయి మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో వారిని అదుపు చేయడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో నివసించే వారు ప్రాణాలు గుపిట్లో పెట్టుకొని తమ గృహాలకు చేరుతున్న పరిస్థితి నెలకొంది. రోజురోజుకి ఆకతాయిల అల్లర్లు పెరుగుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవడం మాకు భయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు పెట్రోలింగ్ పెంచి గొడవలను అదుపులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఒగ్గు పదం.. డోలు పాదం
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్‌లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్‌లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్‌పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్‌లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్‌లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25వ తేదీ వరకు రిహార్సల్స్ -
నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలి : డీసీపీ
ఎల్కతుర్తి: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను డీసీపీ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీకి ఎస్సై ప్రవీణ్‌కుమార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఠాణాలో రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్స్‌ను ఆమె ప రిశీలించారు. అనంతరం కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినందుకు సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను ఆమె అభినందించారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 7వ తేదీన సబ్‌జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్, ఊర యుగేంధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–8, 10, 12, 14, 20 విభాగాల్లో ఎంపికై న వారికి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 18వ తేదీన ఆదిలాబాద్‌లో జరిగే 11వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. జిల్లాస్థాయిలో పాల్గొనే అథ్లెట్లు 7న ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రంలో జేఎన్ఎస్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు 98665 64422 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. విద్యారణ్యపురి: తెలంగాణ టీచర్ ఎలిజిలిటీ టెస్ట్ (టీజీ టెట్) హనుమకొండ జిల్లాలో ఏడు కేంద్రాల్లో శనివారం ప్రారంభమైంది. రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగింది. డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్, రెండు ఫ్లయింగ్స్క్వాడ్లు, 10 మంది అబ్జర్వర్లు పరీక్షల తీరును పరిశీలించారు. ఈనెల 11 వరకు ఆతర్వాత 19, 20 తేదీల్లో టెట్ కొనసాగనుంది. హసన్‌పర్తి: గ్రేటర్ వరంగల్ నగరంలో అర్బన్ మావోయిస్ట్ కార్యకలాపాలు చాప కింద నీరులా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్బన్ మావోయిస్టు కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న దార సారయ్య అలియాస్ శేఖర్ లొంగిపోయినట్లు డీజీపీ శనివారం ప్రకటించారు. సారయ్యది హసన్‌పర్తి మండలం మునిపల్లి. గతంలో ఈయన మావోయిస్ట్ నేత దామోదర్‌కు కొరియర్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన బుర్ర రాకేశ్.. దార సారయ్యకు మేనల్లుడు. గతంలో సారయ్యను ములుగు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఆరునెలలు జైలులో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా, సారయ్య జన జీవనంలో సంచరిస్తూనే మావోయిస్ట్ కార్యకలాపాలు కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. నిత్యం పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఖాకీలకు ఇన్నాళ్లు చిక్కలేదు. తెల్లవారుజామున, రాత్రి వేళ ప్రయాణించొద్దుపోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వరంగల్‌క్రైం: పొగమంచు తీవ్రత అధికంగా ఉన్న కారణంగా తెల్లవారుజామున, రాత్రి ఫ్రయాణం చేయొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చేవాహనాలు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున, రాత్రి ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించొద్దని, ఎదురుగా వెళ్లే వాహనాలను అనుసరించడం ట్రాఫిక్ ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకోవాలని సీపీ కోరారు. -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
● అధికారులకు అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశం ● ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ముందుగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం చేసి పూజారులు శాలువాతో సత్కరించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. తాగునీరు, డ్రెస్సింగ్ రూంలు, పారిశుద్ధ్యం తదితర పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధారణ, ఆర్జిత సేవలు, వీఐపీ క్యూలైన్లను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, తహసీల్దార్ విక్రమ్‌కుమార్, ఎంపీడీఓ నర్మద, ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి కిరణ్‌కుమార్, ఆర్ఐ రాణి, ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే జయంతి
ఉత్తమ టీచర్లకు అవార్డులు హన్మకొండ అర్బన్: సావిత్రిబాయి పూలే జయంతిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రి బాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, విద్యా బోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ సత్కరించి ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వైవీ గణేశ్, డీఈఓ గిరిరాజ్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ను వేగంగా పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులు, బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 2002 ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చే (మ్యాపింగ్) ప్రక్రియను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి అధికారులు, బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి జాబితాను సరిచేయాలని సూచించిన కలెక్టర్, 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్ఐఆర్కు సంబంధించిన ఎన్నికల కమిషన్ నిబంధనలను బీఎల్ఓలకు వివరించారు. హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఇతర అధికారులు, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
టీబీ నిర్మూలనే లక్ష్యం : డీఎంహెచ్ఓ
కమలాపూర్: టీబీ నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా జూన్ రెండో తేదీ నుంచి ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భీంపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం పరిధి కన్నూరులో హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే మిషన్‌తో నిర్వహిస్తున్న స్క్రీనింగ్, ఎక్స్‌రే పరీక్షలను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో టీబీ సోకడానికి అవకాశం ఉన్న 1.98 లక్షల మందికి వల్నరేబుల్ పాపులేషన్‌ను స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,67,700 (84 శాతం) మందికి స్క్రీనింగ్, 62,250 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఇటీవల భారత ప్రభుత్వం పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్‌ను జిల్లాకు అందించిందని, పీహెచ్‌సీల వారీగా షెడ్యూల్ తయారు చేసి పీహెచ్‌సీల్లోనే ఎక్స్‌రే తీస్తున్నట్లు తెలిపారు. డయాబెటిస్, బీపీ, 60 ఏళ్లు పైబడినవారు, టీబీ సోకి ఐదేళ్లు పూర్తయిన వారు, టీబీ కాంటాక్ట్స్, టీబీ లక్షణాలు కనిపించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హైపో గ్లసీమియాతో బాధపడుతూ.. 108లో వచ్చిన లింగంపల్లి వరలక్ష్మిని పరిశీలించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం శనిగరంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని పరిశీలించారు. ఉప్పల్ పీహెచ్సీ వైద్యాధికారి పద్మశ్రీ, పల్లె దవాఖాన వైద్యాధికారులు సంయుక్త, రేణుక, రేడియోగ్రాఫర్లు మహేశ్, భాస్కర్, హెల్త్ సూపర్వైజర్ కనకలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్లు ప్రభాకర్, గోవర్ధన్, శివశంకర్ పాల్గొన్నారు. -
మెస్ బిల్లుల్లో అవకతవకలపై విచారణకు కమిటీ
కేయూ క్యాంపస్: కేయూ కామన్‌మెస్‌లోని 10 నెలల మెస్ బిల్లుల్లో అవకతవకలపై విచారణకు కమిటీ వేశామని రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కామన్మెస్లో శనివారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్ నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్ వినియోగించని రోజులకు కూడా గ్యాస్ బిల్లులు వేశారని విద్యార్థులు ఆరోపించారు. నాన్ బోర్డర్లు కూడా రాకుండా చూడాలని, కేర్‌టేకర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. తాము సమస్యలపై అడుగుతుంటే పోలీసులను పిలిపించడం సరికాదని పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ బిల్లులు అధికంగా ఎందుకు వచ్చాయో పరిశీలన చేయిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. నాన్‌బోర్డర్లు రాకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం విద్యార్థ్ధులతో కలిసి రిజిస్ట్రార్ రామచంద్రం, డైరెక్టర్ రాజ్‌కుమార్ తదితరులు భోజనం చేశారు. కేయూ స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, కేయూ అభివృద్ధి అఽధికారి ఎన్.వాసుదేవరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు. -
జీడబ్ల్యూఎంసీలో డివిజన్లు పెంచండి
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యేలు, మేయర్ వినతి హన్మకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 66 డివిజన్ల సంఖ్యను జనాభా, విస్తీర్ణం ఆధారంగా మరిన్ని పెంచాలని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లోని సెక్రెటేరియెట్‌లో వారు సీఎం రేవంత్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా డివిజన్ల పెంపు, కాజీపేట బస్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూకేటాయింపు ప్రక్రియను రైల్వేశాఖ ద్వారా వేగవంతం చేయాలని కోరారు. రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే అధికారులు సర్వే నిర్వహించారని, తదుపరి చర్యలు త్వరితగతిన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. భద్రకాళీ ఆలయ అభివృద్ధి అంశాన్ని వివరించారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి వరంగల్‌కు రావాలని కోరారు. కాగా, వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా కల్పించినట్లు తెలిపారు. -
‘టెట్’కు సర్వం సిద్ధం
హనుమకొండ జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు విద్యారణ్యపురి: ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న టెట్ పరీక్షకు హనుమకొండ జిల్లాలో అధికారులు ఏడు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఆయాన్ డిజిటల్ జోన్ వడ్డేపల్లి, అయాన్ డిజిటల్ ఎర్రగట్టుగుట్ట, భీమారంలోని మోక్షిత కంప్యూటర్స్, హసన్‌పర్తి బిసైడ్్ హైవే ప్రాంతంలోని నోబుల్ టెక్నాలజీ సొల్యూషన్స్, కాజీపేట సోమిడిలోని తాళ్లపద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, ములుగు రోడ్డులోని గాయత్రి డిగ్రీ కళాశాల, హసన్‌పర్తిలోని భీమారం ప్రాంతంలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఉన్నాయి. ప్రతీ రోజు మొదటి సెషన్, రెండో సెషన్లో టెట్ ఉంటుంది. పరీక్ష రాయనున్న 19,699 మంది.. అన్ని పరీక్ష కేంద్రాలు కలిపి 19,699 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఈ టెట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటలనుంచి ఉదయం 11:30 గంటల వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఏడు పరీక్ష కేంద్రాలకు 10 మంది అబ్జర్వర్లను హెచ్ఎంలను నియమించారు. రెండు టీంలు ఫ్లయింగ్స్క్వాడ్లను నియమించారు. ఒక్కో టీంలో ఇద్దరు చొప్పున హెడ్మాస్టర్లు ఉన్నారు. టెట్ నిర్వహణలో హనుమకొండ జిల్లా ఇన్చార్జ్గా డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ వ్యవహరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో అబ్జర్వర్లతో, ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందంతో సమావేశం నిర్వహించి టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కాగా, టెట్ పరీక్షను కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా రాస్తున్నారు. -
పాత నేరస్తులపై నిఘా పెట్టండి
రామన్నపేట: గతంలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలపై నిఘా ఉంచాలని సీసీఎస్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా.. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిటీ క్రైంస్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. సీసీఎస్‌కు చేరుకున్న సీపీకి అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పాత నేరస్తుల ఫొటోలు, స్టేషన్ రికార్డులు పరిశీలించి చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చోరీల నియంత్రణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలను అధికారులకు సూచించారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. చోరీ కేసుల్లో జైలు నుంచి విడుదలైన నిందితుల సమాచారం సేకరించాలని, ఇతర రాష్ట్రాల్లో చోరీ కేసుల్లో పట్టుబడిన వారి వివరాలు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. తనిఖీల్లో క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. స్పందించిన ఎంజీఎం పరిపాలనాధికారులు ఎంజీఎం : వరంగల్ కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగంలోని క్యాథ్లాబ్ పరికరం శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. గత మూడు రోజులుగా పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో హృద్రోగులకు అంజియోగ్రామ్, స్టంట్ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీలో అంజియోగ్రామ్ సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసిన సుమారు 30మంది రోగులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సహకారంతో గురువారం రాత్రి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం క్యాథ్‌ల్యాబ్ సేవలు అందించేందుకు సదరు కంపెనీకి 18 నెలల నుంచి మరమ్మతుల బిల్లులు సుమారు రూ.42లక్షల వరకు చెల్లించకపోవడంతో మూడు రోజులుగా ఆ కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రతినిధులతో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి మాట్లాడారు. బిల్లులు చెల్లింపు జరిగేలా రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడతామని సర్దిచెప్పారు. దీంతో ప్రతినిధులు క్యాథ్‌ల్యాబ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో తిరిగి హృద్రోగులకు అంజియో, స్టంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ● సీపీ సన్‌ప్రీత్ సింగ్ ● సిటీ క్రైం స్టేషన్ తనిఖీ -
నగరంపై పొగమంచు దుప్పటి
వరంగల్ మహానగరంపై పొగమంచు దుప్పటేసింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల వరకు వీడలేదు. పక్కపక్కనే ఉన్నా మనిషికి మనిషి కనిపించనంత మేర దట్టంగా పొగమంచు కురిసింది. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లలోనూ వెలుతురు సరిగ్గా లేక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. ఖిలావరంగల్ శిల్పాల ప్రాంగణం, ఖుష్‌మహల్, వేయిస్తంభాల గుడి, శ్రీభద్రకాళి దేవాలయం తదితర ప్రదేశాల్లో పొగమంచు దృశ్యాలను నగరవాసులు ఫొటోలు తీసుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ/వరంగల్ -
ఐనవోలు ఆలయ హుండీ లెక్కింపు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కించారు. 2025 అక్టోబర్ 10 నుంచి 1 జనవరి 2026 వరకు రూ.14,98,808, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.90,54,847 రాగా.. మొత్తం రూ.1,05,53,655 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలో వేసి సీల్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకులు డి.అనిల్‌కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ లెక్కింపులో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, సర్పంచ్ గడ్డం రఘువంశీ, ఉప సర్పంచ్ బరిగెల భాస్కర్, ధర్మకర్తలు, కానిస్టేబుల్ రమేశ్, గ్రామస్థాయి అధికారులు, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
గత డిసెంబర్ 31తో ముగిసిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల గడువు
వరంగల్ అర్బన్: ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త ఆవిష్కరణలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు గడువు గత డిసెంబర్ 31న ముగిసింది. దీంతో గ్రేటర్ వరంగల్ పరిధి పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. కేవలం కొద్ది ఆవిష్కరణలతో సరిపెట్టుకుని సాధారణ పనులకే ప్రాధాన్యం కల్పించి, అధికారులు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ప్రాజెక్టులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాకపోవడం, ఆలస్యంగా మొదలు పెట్టడం, అంచనాలు పెరగడం, కాంట్రాక్టర్ల అశ్రద్ధ ఇందుకు కారణమని తెలుస్తోంది. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు నగర స్మార్ట్‌సిటీ పనుల జాప్యానికి ఇలా అనేక కారణాలున్నాయి. ఏదేమైనా కీలకమైన ఈ ప్రాజెక్టులపై గ్రేటర్ వరంగల్ పాలకవర్గం, అధికార యంత్రాంగం అడగుడునా నిర్లక్ష్యం వహించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2016లో స్మార్సిటీకి ఎంపిక గ్రేటర్ వరంగల్.. 2016 సప్లిమెంటరీ స్మార్ట్‌సిటీ పథకంలో ఎంపికైంది. తొలుత రూ.2,376 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. అనంతరం వివిధ ప్రాజెక్టులతో కలిసి ప్రతిపాదనలు రూపొందించారు. చివరగా రూ. 931 కోట్లతో 97 ప్రాజెక్టులు చేపట్టారు. 2017 నవంబర్ మూడో వారంలో అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదిగో ఇదిగో అంటూ ఇలా సాగదీస్తూ ఐదేళ్ల ప్రాజెక్టులు కాస్త తొమ్మిదిన్నరేళ్లు గడిచినా ఇంకా పెండింగ్‌లో ఉండడం పాలకులు, అధికారుల చిత్తశుద్ధి స్పష్టమైంది. నగర పరిధిలో 97 పనులను రూ.603.87 కోట్లతో పూర్తి చేశామని, 11 ప్రాజెక్టులకు సంబంధించి రూ.327 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ, బల్దియా ఇంజనీరింగ్, స్మార్ట్‌సిటీ అధికారులు మాత్రం కేవలం రూ.15 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, 10 పనులు పురోగతిలో ఉన్నాయని చెబుతుండడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఇలా.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను ఐదేళ్ల గడువులోగా పూర్తి చేయాలి. అందుకు కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఏడాదికి ఒకమారు నిధులు మంజూరు చేయాలి. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.346 కోట్లు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం రూ.403 కోట్ల నిధులు విడుదల చేశాయి. మిగిలిన నిధులపై ఆశలు లేనట్టే. కొన్ని స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను పరిశీలిస్తే నత్తతో పోటీ పడుతున్నట్లు చెప్పవచ్చు. నవ్వితే నాంకేటి అన్నట్లు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సభ్యులు, ఇంజనీర్లు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. పురోగతిలో ఉన్న స్మార్ట్‌సిటీ పనులు భద్రకాళి బండ్‌కు రూ.84.20 కోట్లు కేటాయించగా అందులో 80 శాతం పనులు పూర్తయ్యాయి. వడ్డేపల్లి బండ్ అభివృద్ధికి రూ.34.05 కోట్లు కేటాయించగా అందులో 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. భద్రకాళి నాలా చెరువు నుంచి అలంకార్ జంక్షన్ వరకు నాలా విస్తరణ, అభివృద్ధికి రూ.84.20 కోట్లతో ప్రతిపాదించగా కేవలం 70 శాతం పనులు పూర్తయ్యాయి. నగరం నలువైపులా గ్రాండ్ ఎంట్రెన్స్‌లు, అండర్ రైల్వే గేట్‌లోని దసరా రోడ్డు, కరీమాబాద్ రోడ్డు, వరంగల్ తూర్పులోని ప్రధాన రహదారిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రేటర్ వరంగల్‌లో పురోగతిలో ఉన్న పనుల నిలిపివేత నగరంలో కానరాని నూతన ఆవిష్కరణలు పాలకవర్గం, అధికార యంత్రాగం నిర్లక్ష్యమేనన్న విమర్శలువరంగల్ స్మార్ట్‌సిటీ పథకం డిసెంబర్ 31తో ముగిసింది. ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఈ పథకాన్ని నిలిపేసి, పురోగతిలో ఉన్న పనులు చేపట్టాలని ఆదేశించింది. మరో 10 ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి రూ.15 కోట్లు రావాల్సి ఉంది. – సత్యనారాయణ, ఎస్ఈ, గ్రేటర్ వరంగల్ -
పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
వరంగల్: వరంగల్ మండలం పైడిపల్లి దర్గాను కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ శుక్రవారం సందర్శించారు. ఉర్సును పురస్కరించుకుని వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి హజరత్ నూరొద్దీన్బాబాను దర్శించుకున్నారు. దర్గా విశిష్టతను మత పెద్దలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు చాదర్ సమర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘సృజనాత్మక రచన, కథ’ అంశంపై సర్టిఫికెట్ కోర్సును ముఖ్య అతిథిగా హైదరాబాద్ ప్రెస్ బ్యూరో డైరెక్టర్ కోటేశ్వర్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథలు మానవ జీవితాన్ని ప్రతిబింబింపజేస్తాయన్నారు. కార్యక్రమంలో ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రమౌళి, తెలుగు విభాగాధిపతి ఎస్.మధు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామా రత్నమాల, సునీత, రామాకృష్ణారెడ్డి, మాధవి, యుగేంధర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రివిజన్ ఇలా ఉంటుందా? ● ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ అసహనం ● ఎంజేపీ విద్యాలయం సందర్శనహసన్పర్తి: ‘ఉపాధ్యాయులు ఏమీ చెప్పకుండా విద్యార్థులే కూర్చుని చదవడాన్ని రివిజన్ అంటున్నారు.. అసలు రివిజన్ ఇలా ఉంటుందా’ అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హసన్‌పర్తి మండల కేంద్రంలో కొనసాగుతున్న మహాత్మాజ్యోతి రావు పూలే(కాజీపేట) విద్యాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. విద్యార్థులు రౌండ్‌గా కూర్చుని చదువుతుండగా కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా రివిజన్ అని చెప్పారు. కలెక్టర్ ఇలా చేస్తే రివిజన్ అవుతుందా? అంటూ అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలిని మందలించారు. ప్రతీ రోజు ఒక్కో చాప్టర్ చొప్పున ఉపాధ్యాయులే రివిజన్ చేయాలని సూచించారు. ప్రతీ తరగతిలో ఇలాగే కొనసాగించాలని చెప్పారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేయగా సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరితో బోర్డుపై పదాలు రాయించారు. సరిగ్గా రాయకపోవడంతో ఉపాధ్యాయుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్ఐలు ఫాజిల్, రాజేంద్రప్రసాద్, ఎంజేపీ ఆర్సీఓ రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ ప్రపుల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పీఏసీఎస్ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం ఎంజేపీ నుంచి కలెక్టర్ నేరుగా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వెళ్లారు. రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు అప్డేట్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలేనప్పుడు ఇంతమంది సిబ్బంది కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీఓ సంజీవరెడ్డి, తహసీల్దార్ కిరణ్‌కుమార్, సొసైటీ ఇన్చార్జ్ అధికారి జగన్మోహన్రావు, ఆర్ఐలు ఫాజిల్, రాజేంద్రప్రసాద్, ఏఓ అనురాధ పాల్గొన్నారు. -
టికెట్ల జారీలో ఆగని అవినీతి !
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో మరోసారి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆలయ సిబ్బంది నకిలీ టికెట్ విక్రయించి రూ.లక్షల్లో కాజేసిన విషయం తెలిసిందే.. నకిలీ టికెట్ల జారీని అరికట్టడానికి ఆన్లైన్ టికెట్లు జారీ చేయకుండా మ్యాన్యువల్ టికెట్లు ఇస్తామని దేవాలయ అధికారులు గతంలో ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం వరకు రద్దీ ఎక్కుగా ఉండడంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని చూసిన ఆలయ సిబ్బంది మరోసారి ఆన్లైన్ ద్వారా టికెట్లు ద్వారా విక్రయించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 శుక్రవారం వరకు సిబ్బంది టికెట్ జారీ చేయకుండా లడ్డూ, పులిహోర విక్రయించడం ఏంటని భక్తులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ అధికారుల నిఘాలోపంతోనే సిబ్బంది చేతివాటం మరింత పెరిగిందని కొంత మంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆలయ పరిపాలన విభాగాధికారుల పర్యవేక్షణ వైఫల్యంతోనే సిబ్బంది చేతివాటం పెరిగిందనే ఆరోపణలున్నాయి. ఆలయ పూజారులు సైతం భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ పూజారులు కొల్లగొడుతున్నట్లుగా విమర్శలున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో దేవుడి బొట్టు పెట్టి అక్షింతలు వేయాలన్నా.. అమ్మవారి గాజులు కావాలన్నా.. ఆశీర్వదించాలన్నా.. చేతిలో సంభావన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీతను వివరణ కోరగా.. అవినీతి జరగలేదని, సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలు ఆరోపణలు మాత్రమేనన్నారు. గురువారం మొత్తం తొమ్మిది లక్షలపై చిలుకు ఆదాయం సమకూరగా.. అందులో ప్రసాదాల అమ్మకం ద్వా రా సుమారు రూ.3.40 లక్షల ఆదాయం సమకూరిందని, అవినీతి జరగలేదని ఆమె వివరణ ఇ చ్చారు. పూజల అనంతరం భక్తులు సంతోషంగా ఇ చ్చే సంభావన తీసుకోవాలి తప్ప పూజారులు డి మాండ్ చేయవద్దని ఆదేశించినట్లు తెలిపారు. భద్రకాళి ఆలయ ఘటనపై సోషల్ మీడియాలో హల్చల్ ఎక్కడా అవినీతి జరగలేదు: అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత -
రోడ్డు ఆక్రమించి ఇంటి నిర్మాణం
నల్లబెల్లి: రోడ్డును ఆక్రమించుకుని ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న వ్యక్తిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రుద్రగూడెంలో బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామానికి చెందిన గంగారపు లింగయ్య తన కుమార్తె జ్యోతి, చెల్లె విజయతో వాటర్ ట్యాంకు ఎక్కి పురుగుల మందు డబ్బా పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ అధికారులతో కుమ్మక్కై ఎల్లపల్లి రాజు (చింటు) రోడ్డును కబ్జాచేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాడని ఆరోపించారు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే వచ్చి రోడ్డు ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్య తీసుకోకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతామని హెచ్చరించారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్సై గోవర్ధన్ సంఘటనా స్థలానికి పోలీస్ సిబ్బందితో చేరుకున్నారు. ఆందోళన విరమించాలని గంగారపు లింగయ్య, కుటుంబ సభ్యులను కోరారు. నర్సంపేట ఆర్డీఓ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించి దిగివచ్చేదిలేదని వారు భీష్మించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎస్సై తీసుకువెళ్లారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తాహసీల్దార్ కృష్ణ ఆందోళన చేస్తున్న లింగయ్యతో ఫోన్లో మాట్లాడారు. గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కబ్జాదారుడిపై అధికారులు చర్య తీసుకోవాలి వాటర్ ట్యాంక్ ఎక్కి బాధితుల డిమాండ్ రుద్రగూడెంలో ఉద్రిక్తత.. పోలీసుల రంగప్రవేశంవాటర్ ట్యాంకు దిగేందుకు ఇబ్బంది వాటర్ ట్యాంక్‌పై లింగయ్య సుమారు రెండు గంటలపాటు ఆందోళన చేశారు. ఆందోళన విరమించి కిందికి దిగేందుకు ప్రయత్నించగా ఆరోగ్యం సహకరించలేదు. ఎస్సై గోవర్ధన్, ఫైర్‌స్టేషన్ సిబ్బంది అక్బర్ తదితరులు లింగయ్యను సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. -
నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ రాయపర్తి: బంధనపల్లిలో శివాజీ విగ్రహానికి నిప్పుపెట్టి ధ్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఆయన గ్రామంలోని శివాజీ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్, నాయకులు మాచర్ల దీన్‌దయాళ్, గడల కుమార్, గోకె వెంకటేశ్, కూచన క్రాంతి, ఎనగందుల శ్రావణ్‌కుమార్, బైరి నాగరాజు, నోముల రతన్, మహ్మద్ రఫీ, చింతం రాజు, వంచనగిరి రాజ్‌కుమార్, మామిడాల సతీశ్, బొడకుంట్ల శివశంకర్, వడ్లకొండ రవి, గణేశ్, సందీప్, సుమన్, మహంత్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
జీడబ్ల్యూఎంసీలో డివిజన్లు పెంచండి
● సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలు, మేయర్ వినతిహన్మకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్ల సంఖ్యను జనాభా, విస్తీర్ణం ఆధారంగా మరిన్ని పెంచాలని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లోని సెక్రటేరిఝెట్లో వారు సీఎం రేవంత్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా డివిజన్ల పెంపు, కాజీపేట బస్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూకేటాయింపు ప్రక్రియను రైల్వేశాఖ ద్వారా వేగవంతం చేయాలని కోరారు. రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే అధికారులు సర్వే నిర్వహించారని, తదుపరి చర్యలు త్వరితగతిన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి అంశాన్ని వివరించారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి వరంగల్‌కు రావాలని కోరారు. కాగా, వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా కల్పించినట్లు తెలిపారు. -
కమ్మేసిన పొగమంచు
ఖిలా వరంగల్‌లోని ఖుష్‌మహల్‌ను కమ్మేసిన పొగమంచుసాక్షి, వరంగల్: జిల్లాలో చలి తగ్గి, పొగమంచు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు పొగమంచుతో ప్రధాన, అంతర్గత రహదారుల్లో వెలుతురు సరిగా లేక (జీరో విజిబులిటీ) వాహనాలు నడిపేవారు అనేకపాట్లు పడ్డారు. కొన్నిచోట్ల వెలుతురు లేక డివైడర్లకు ఢీకొని వాహనదారులు కిందపడిపోగా, మరికొన్ని చోట్ల ఎదురుగా, ముందున్న వాహనాలను ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. రోజురోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్నా.. గాలిలో తేమశాతం పెరగడంతో పొగమంచు ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. మరో మూడు నుంచి నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, జాతీయ రహదారులు, ఔటర్‌రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సూచిస్తున్నారు. వరంగల్‌లో 14.9 డిగ్రీ సెల్సియస్, హనుమకొండలో 15.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10.30 గంటల వరకు పొగమంచు.. సాధారణంగా శీతాకాలం సూర్యకిరణాలు ఆలస్యంగా వస్తాయి. దీంతో గాలిలో ఎక్కువగా ఉన్న తేమ శాతం పొగమంచులా కనిపిస్తుంది. గాలిలో ఉష్ణోగ్రత తగ్గితే.. గాలిలో ఎక్కువగా ఉన్న తేమ సూక్ష్మ బిందువుల రూపంలో ఘనీభవిస్తుంది. ఈ సూక్ష్మ బిందువులపై పడే కాంతి వివర్తనం చెంది అన్ని వైపులకు ప్రసరించి పొగమంచులా ఏర్పడుతుంది. ఇలా వరంగల్‌లో హ్యూమిడిటీ శుక్రవారం జీరోకు పడిపోవడంతోనే ఒక్కసారిగా విచిత్ర వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ, సిమ్లా, ఊటీ మాదిరిగా పొగమంచు కురవడంతో ప్రజలు ఖిలా వరంగల్ ఫోర్ట్‌కు క్యూ కట్టారు. ఈ చారిత్రక మైదానంలో వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫొటోలతో సెల్ఫీలు దిగారు. ఎత్తయిన భవనాల పైనుంచి పొగమంచు దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించారు. భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో కూడా పొగమంచు కప్పేసింది. ఉదయం 10.30 గంటల వరకు రహదారులపై మొత్తం మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఉదయం 10.30 గంటల వరకు విచిత్ర వాతావరణం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిలో వాహనదారుల తిప్పలు జాగ్రత్తలు పాటించాలని వరంగల్ కమిషనరేట్ పోలీసుల సూచనజనవరి, డిసెంబర్ నెలల్లో పొగమంచుతో ప్రమాదాలు..వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 జనవరిలో పొగమంచుతో 112 రోడ్డు ప్రమాదాలు జరిగి 43 మంది మృతిచెందారు. 116 మంది గాయపడ్డారు. అదేవిధంగా గత సంవత్సరం మొత్తం 1,424 రోడ్డు ప్రమాదాలు జరిగి 430 మంది మృతి చెందారు. 1446 మంది గాయపడ్డారు. మార్చిలో ఎక్కువగా జరిగిన 52 ప్రమాదాల్లో 53 మంది మృతి చెందగా.. ఆ తర్వాత డిసెంబర్ నెలలోనే అత్యధికంగా 126 రోడ్డు ప్రమాదాలు జరిగి 39 మంది మృతి చెందారు. 115 మంది గాయపడ్డారు. పొగమంచుతోనే జనవరి, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈరెండు నెలల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. చీకటి, జీరో విజిబిలిటీతో ముందు ఉండే వాహనాలు కనిపించకపోవడం, అప్పటికే రోడ్డుపై నిలిపిన వాహనాలను వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వరంగల్ నగరంలో శుక్రవారం కురిసిన పొగమంచుతో పలుచోట్ల వాహనదారులు ప్రమాదాలబారిన పడి గాయపడ్డారు. పార్కింగ్ లైట్లు వేసుకోవాలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. వాహనదారులు ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలి. ఏ వాహనమైనా పార్కింగ్ లైట్లు వేసుకుంటే ప్రమాదాలు జరగవు. అత్యవసర పని ఉంటే తప్ప ఉదయం వాహనదారులు రోడ్డెక్కవద్దు. ఒకవేళ తప్పనిసరి అయితే పార్కింగ్ లైట్లు వేసుకోవాలి. – సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
సరిపడా యురియా నిల్వలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద నర్సంపేట రూరల్: జిల్లాలో పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, అర్హులైన రైతులకు యూరియా బస్తాలు అందిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ఎరువుల పంపిణీ కేంద్రం, చెన్నారావుపేట మండలంలోని లింగగిరి గ్రామంలో ఎరువుల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. యూరియా నిల్వలు, యూరియా టోకెన్ల పంపిణీ విధానంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా పంపిణీ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంట విస్తీర్ణం ఆధారంగా మాత్రమే ఎకరాకు ఒక బస్తా యూరియా తీసుకోవాలని, ప్రస్తుతం మొక్కజొన్న పంట వేసిన రైతులు మాత్రమే యూరియా తీసుకోవాలని కోరారు. నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో 430, రామవరం 420, బాంజీపేటలో 170, చంద్రయ్యపల్లిలో 170 బస్తాలు, జగన్నాథపల్లిలో 80 బస్తాలు పంపిణీ, చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో 444 బస్తాలు, జల్లిలో 444 బస్తాలు, అక్కల్‌చెడలో 4,444 బస్తాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గోదాంలో 5,500 మెట్రిక్ టన్నుల యూరియ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, జిల్లా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిల్వ ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాపోటీల్లో విద్యార్థినుల ప్రతిభ
పర్వతగిరి: మండల కేంద్రంలోని టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీ (జీ) కళాశాల విద్యార్థినులు పలు క్రీడాపోటీల్లో రాణించారని ప్రిన్సిపాల్ ఎ.శైలజారాణి శుక్రవారం తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో ఇటీవల జరిగిన 69వ సెపక్ తక్రా జాతీయ క్రీడాపోటీల్లో (అండర్–19 విభాగం) వి.దివ్య ప్రతిభ కనబర్చింది. అదేవిధంగా 72వ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ సీనియర్ మహిళా విభాగం పోటీల్లో వరంగల్ మూడో స్థానంలో నిలిచింది. ఎల్.స్రవంతి, బి.నాగేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి కబ డ్డీ పోటీలకు ఎంపికయ్యారు. కాగా, విద్యార్థినులను ప్రిన్సిపాల్ ఎ.శైలజారాణి, వైస్ ప్రిన్సిపాల్ పి.శారద, పీడీ అపర్ణ అభినందించారు. జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అనుకావ్యాంజలి వర్ధన్నపేట: జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సుర అనుకావ్యాంజలి ఎంపికైనట్లు కోచ్ జలగం రఘువీర్ శుక్రవారం తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 14 నుంచి 16 వరకు మేడ్చల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె జిల్లా జట్టు తరఫున పాల్గొంది. జట్టును ద్వితీయ స్థానంలో నిలిపి జాతీయస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణంలో ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో ఆమె పాల్గొననుంది. ప్రస్తుతం అనుకావ్యాంజలి కేయూలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ శిక్షణలో ఉంది. గతంలో 8సార్లు వివిధ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. అనుకావ్యాంజలిని ఉప్పరపల్లి పీఈటీ వీరస్వామి, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్వీ హన్మంతరెడ్డి, కోశాధికారి కృష్ణప్రసాద్, గ్రామ సర్పంచ్ సీనపల్లి రాజు అభినందించారు. 108 వాహనంలో ప్రసవం రాయపర్తి: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ 108 వాహనంలో ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొలన్‌పల్లి గ్రామానికి చెందిన జోగు నవ్య శుక్రవారం పురిటినొప్పులతో బాధపడుతుండగా భర్త ప్రశాంత్ 108కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది గ్రామానికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా కొండూరు గ్రామ శివారులోకి రాగానే పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ శ్రీకాంత్, పైలట్ రామకృష్ణ ఆమెకు వాహనంలోనే పురుడు పోయగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బందికి నవ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పాత నేరస్తులపై నిఘా పెట్టండి రామన్నపేట: గతంలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలపై నిఘా ఉంచాలని సీసీఎస్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా.. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిటీ క్రైం స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. సీసీఎస్‌కు చేరుకున్న సీపీకి అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పాత నేరస్తుల ఫొటోలు, స్టేషన్ రికార్డులు పరిశీలించి చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చోరీల నియంత్రణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలను అధికారులకు సూచించారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి తిరిగి విడుదలైన నిందితుల సమాచారం సేకరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
● జిల్లా ఉద్యానశాఖాధికారి ఆర్.శ్రీనివాసరావురాయపర్తి: రైతులు మెళకువలు పాటించి ఆయిల్‌పామ్ సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖాధికారి ఆర్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. పన్యానాయక్తండాలో రైతు భూక్యా దేవ్లానాయక్ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు రైతులనుద్దేశించి మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగు చేసి లాభాలు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువులు వేసుకోవాలని సూచించారు. 30 ఏళ్లపాటు లాభాలను గడించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ సాగుచేసి దిగుబడి సాధిస్తున్న దేవ్లానాయక్ను ఆయన సన్మానించారు. సర్పంచ్ హిరాని కిషన్‌నాయక్, వరంగల్ ఉద్యానశాఖాధికారి తిరుపతి, నర్సంపేట ఉద్యానశాఖాధికారి జ్యోతిరెడ్డి, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ మేనేజర్ సతీశ్నారాయణ్, అధికారులు రాజర్షి, క్రాంతికుమార్, ఆయిల్‌పామ్ ఫీల్డ్ ఆఫీసర్లు శివమణి, వినోద్, రైతులు రూపిరెడ్డి గోపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారించాలి
● రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌భాస్కర్ గీసుకొండ: యాసంగి మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలని రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త ఎ.విజయ్‌భాస్కర్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని కొమ్మాల, మచ్చాపూర్, గంగదేవిపల్లి గ్రామాల్లో మొక్కజొన్న, మిరప, కూరగాయల పంటలను పరిశీలించి రైతులకు పలు సూచలను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తెర పురుగు నివారణకు ఐదు మిల్లీలీటర్ల వేపనూనె(1500 పీపీఎం)ను లీటరు నీటిని కలుపుకుని పిచికారీ చేయాలన్నారు. పురుగు తీవ్రత అధికంగా ఉంటే ఎకరానికి నాలుగు కిలోల క్లోరాంట్రానిల్ప్రోల్ గుళికలను మొవ్వులో వేయాలని, లేదంటే 60 మిల్లీలీటర్ల అదే మందును ఎకరం చేనులో పిచికారీ చేయాలన్నారు. మిరపలో వేరుకుళ్లు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుకు మూడు లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేయాలన్నారు. వరి నాట్లను జనవరి 20 లోపు వేసుకోవాలనిచ నారుమళ్లలో సాయంత్రం కొత్త నీరు పెట్టి ఉదయం తీసివేయాలని కోరారు. ఆయన వెంట రైతులు, ఆర్ఏడబ్ల్యూఈపీ విద్యార్థులు ఉన్నారు. -
యూరియా కోసం రైతుల జాగారం
దుగ్గొండి: యాసంగి పంటలకు యూరియా కొరత ఏర్పడింది. ప్రస్తుతం పంటలు 20 నుంచి 40 రోజుల వయస్సులో ఉన్నాయి. ఈ సమయంలో తప్పనిసరిగా వేయాల్సిన యూరియా కోసం రైతులు జాగారం చేస్తున్నారు. మండలానికి గురువారం 2,660 బస్తాల యూరియా వచ్చింది. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏఈఓలు యూరియా అందిస్తున్నారనే సమాచారంతో రాత్రి 12 గంటల నుంచే వారు క్యూలో ఉన్నారు. కొందరు రైతులు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్‌తో పాటు చెప్పులను లైన్లో ఉంచారు. రాజ్యతండా, అడవిరంగాపురం, తిమ్మంపేట, నారాయణతండా, మహ్మదాపురం, మర్రిపల్లి, మల్లంపల్లి, చంద్రయ్యపల్లి, బొబ్బరోనిపల్లి, వెంకటాపురం, తొగర్రాయి, రేకంపల్లి, చలపర్తి గ్రామాలకు చెందిన రైతులకు ఒక్కొక్కరికి ఒక యూరియాబస్తా చొప్పున శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అందించారు. ఒకబస్తా కోసం గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చిందని, పరిస్థితి ఇలాగే ఉంటే యాసంగి పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చలిలోనూ బారులు.. ఖానాపురం: యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. గోదాంలు, గ్రామ పంచాయతీల వద్ద తెల్లవారుజాము నుంచే చలిలోనూ బారులు తీరుతున్నారు. మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో దట్టమైన పొగమంచును సైతం లెక్కచేయకుండా శుక్రవారం రైతులు క్యూలో నిల్చున్నారు. యూరియా తీసుకున్న వారే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సై రఘుపతి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల, లోక్‌సత్తా సంయుక్తంగా కలెక్టరేట్ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌పై కలెక్టర్ స్నేహ శబరీష్ తొలి సంతకం చేసి అవినీతికి పాల్పడనంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తున్నామని, అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్‌సత్తా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ప్రతిపనికి లంచం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరులకు శిక్షపడేలా పౌరులను చైతన్యం చేస్తామని, నిజాయితీ గల ఉత్తమ అధికారులను ప్రతి ఏటా సన్మానిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, ఎల్బీ కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ముండ్రాతి సదానందం, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్, లోక్ సత్తా – జ్వాల సభ్యులు బుర్రి కృష్ణమూర్తి, పొట్లపల్లి వీరభద్రరావు, కామిడి సతీశ్‌రెడ్డి, బుద్దె సురేశ్, శశిధర్‌రెడ్డి, ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
● వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 433 కేసులు ● పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ముందస్తు చర్యలతో సత్ఫలితాలువరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. బుధవారం సాయత్రం నుంచే ప్రధాన కూడళ్ల దగ్గర గస్తీ నిర్వహించారు. రాత్రి 9 గంటల తర్వాత వరంగల్ నగరంలో అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన 433 మందిపై కేసులు నమోదు చేశారు. 13 చెకింగ్ పాయింట్ల ఏర్పాటు వరంగల్‌లోని మూడు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో 13 చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఈస్ట్‌జోన్ పరిధిలో 68 కేసులు, వెస్ట్‌జోన్ పరిధిలో 96 కేసులు, సెంట్రల్ జోన్ పరిధిలో 53 కేసులు.. మొత్తం కమిషనరేట్ పరిధిలో 433 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపి.. ప్రమాదాల బారినపడకుండా సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులు బందోబస్తు విధులతోపాటు ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఎంజీఎం, బూడిదగడ్డ, పోచమ్మమైదాన్, తెలంగాణ జంక్షన్, హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు సీపీఓ జంక్షన్, అశోకా జంక్షన్, బస్టాండ్, ములుగురోడ్డు, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు కడిపికొండ, కాజీపేట, అదాలత్ లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. -
సమగ్రశిక్షలో అధికారి ఇష్టారాజ్యం!
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తన బాధ్యతల పరిధి దాటి జిల్లా విద్యాశాఖ కార్యాలయ వ్యవహారాల్లోనూ దూరిపోతున్నారని, తాను చెప్పినట్లు వింటేనే బిల్లులు పాస్ అవుతాయని, లేదంటే కొర్రీలు పెట్టడంతో ‘మధుసూదనా’ఇది మీకు తగునా.. అంటూ బాధితులు నిట్టూరుస్తున్నారు. సదరు అధికారి ముడుపులు తీసుకోవడంలోనూ చాలా ‘తెలివి’గా వ్యవహరిస్తారన్న టాక్ వినిపిస్తోంది. తను ఎక్కడా ఇరక్కుండా సంబంధిత సిబ్బందిచేత చేయించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి 10 గంటల వరకు సిబ్బంది కార్యాలయంలోనే ఉంచుతూ, తాను బిల్లులు పరిశీలించేవరకు పక్కన నిలబడాల్సి ఉండాలని హుకుం జారీ చేయడం ఈయన ప్రత్యేకత. అంతేగాకుండా తనకు అనుకూలంగా కేజీబీవీలకు సంబంధించిన ఒకరిద్దరి సిబ్బందిని మార్చుకొని వారితో ఇతర కేజీబీవీల ఎస్ఓలు, అకౌంటెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఈయన వేధింపులు భరించలేక పలువురు బాధితులు డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డీఈఓకు డీటీఎఫ్ బాధ్యుల ఫిర్యాదు.. హనుమకొండ జిల్లా విద్యాశాఖలోని సమగ్రశిక్షణలో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్‌గా పారిన్ డిప్యుటేషన్‌పై బాధ్యతలు నిర్వర్తిస్తున్న మధుసూదన్‌పై పలు ఆరోపణలు చేస్తూ డిసెంబర్ 23న జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్కు డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. మధుసూదన్ తీరుతో కేజీబీవీల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, అకౌంటెంట్ ఉద్యోగినులు తీవ్ర భయం, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నెలవారీగా డైట్ చార్జీలు, ఇతరత్రా బిల్లులు తీసుకొస్తే, వాటిని తాను చెప్పినట్లుగా మార్చాలని ఒత్తిడిచేసి ముడుపులువచ్చేలా పాస్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఫర్నిచర్, క్రీడా సామగ్రి, ల్యాబ్ మెటీరియల్స్, స్టేషనరీ, లైబ్రరీ పుస్తకాలు తదితర ఽవాటివి నిజమైన ధర తెలుసుకోవాల్సిన అవసరం లేదని బెదిరించి ఇష్టం వచ్చిన ధర కోట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆ అధికారిపై విచారణ కమిటీవేసిన డీఈఓ ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ మధుసూదన్‌పై వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో డీఈఓ ఇటీవల విచారణ కమిటీని నియమించారు. సదరు కమిటీ జిల్లాలోని 9 కేజీబీవీల ఎస్ఓలు, అకౌంటెంట్ ఉద్యోగినులను వేర్వేరుగా పిలిపించి విచారణ జరిపారు. తాము ఫైనాన్స్ అకౌంటింగ్ ఆఫీసర్ నుంచి ఎలాంటి ఇబ్బందులకు గురయ్యామో తెలియజేశారని, లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లు సమాచారం. మరికొందరు కమిటీ ముందు కన్నీటిపర్యంతమైనట్లు తెలిసింది. కాగా, అధికారి మధుసూదన్‌ని విచారణకు రావాలని కమిటీ సమాచారం ఇచ్చినా హాజరుకాలేదని తెలుస్తోంది. ఆయనపై రెండు మూడు రోజుల్లో విచారణ కమిటీ డీఈఓకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. నాపై విచారణ జరపాలంటే కమిటీలో గెజిటెడ్ ఆఫీసర్లు ఉండాలి సమగ్రశిక్షలో నేను గెజిటెడ్ ఆఫీసర్ని. నాపై విచారణ జరపాలంటే కమిటీలో గెజిటెడ్ ఆఫీసర్లు అయి ఉండాలి. అదేవిధంగా సమగ్రశిక్షకు సంబంధించిన ఆడిటర్ కూడా ఉండాలి. కానీ కమిటీలో వీరు లేరు. అందుకే హాజరుకాలేదు. ఇదే విషయమై డీఈఓకు లిఖితపూర్వకంగా తెలియజేశా. నేను సమగ్రశిక్షలో, కేజీబీవీల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. – జిల్లా సమగ్రశిక్ష ఫైనాన్స్ అకౌంటెంట్ ఆఫీసర్ మధుసూదన్ హనుమకొండ జిల్లా విద్యాశాఖ పరిధిలో 45 ప్రీప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. వాటికి అవసరమైన వస్తువుల కొనుగోలుకు రూ.52.50లక్షల నిధులు మంజూరయ్యాయి. విద్యాశాఖలో సమగ్రశిక్ష కోఆర్డినేటర్ పర్యవేక్షణలోనే టెండర్ పిలిచి వర్క్ఆర్డర్ ఇవ్వాల్సి ఉండగా, ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్.. ఆ కోఆర్డినేటర్‌కు తెలియజేయకుండానే గత ఇన్చార్జ్ డీఈఓకు చెప్పి వర్క్ ఆర్డర్స్‌ను టెండర్‌దారులకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. కాగా, వర్క్ ఆర్డర్స్ తన ప్రమేయం లేకుండానే ఇచ్చారని సమగ్రశిక్ష కోఆర్డినేటర్ ఇటీవల వచ్చిన డీఈఓ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. సమగ్రశిక్షలో నలుగురు కోఆర్డినేటర్లు ఉండగా, వీరికి రావాల్సిన టీఏ,డీఏ బిల్లులు కూడా చెల్లించడం లేదని వారే చెబుతుండడం గమనార్హం. ఓ కోఆర్డినేటర్ ఇటీవల బిల్లు పెట్టుకోగా కొర్రీపెట్టి నిలిపివేసినట్లు చెబుతున్నారు. సమగ్రశిక్షలో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ తీరుపై సిబ్బంది ఆవేదన ఆయన ఎప్పుడు రమ్మంటే సిబ్బంది అప్పుడే కార్యాలయానికి రావాలి రాత్రివేళ ఆఫీస్‌లో బిల్లులు పరిశీలించడం ఈయన ప్రత్యేకత డీటీఎఫ్ బాధ్యులు, బాధితులు డీఈఓకు వరుస ఫిర్యాదులు విచారణ కమిటీ వేసిన డీఈఓ.. మూడు రోజులపాటు కొనసాగిన విచారణ -
నూతన సంవత్సర వేడుకల్లో ఫుల్ జోష్
● ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.48.73 కోట్ల మద్యం అమ్మకాలు ● ఆబ్కారీశాఖకు కాసుల పంట.. రికార్డు బ్రేక్ చేసిన మద్యం ప్రియులుకాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆబ్కారీశాఖ కాసుల పంట పండింది. 2025 డిసెంబర్ 31కి వీడ్కోలు పలికి.. 2026 జనవరి 1కి మందుబాబులు స్వాగతం పలికి రికార్డు స్థాయిలో మద్యం తాగారు. అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉ న్నాయి. సంతోషంతో మందు కొడుతూ నూ తన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. హనుమకొండ జిల్లాలో రూ.16.40 కోట్ల మద్యం, ఉమ్మడి జిల్లాలో రూ.48.73 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇళ్లు, ఫంక్షన్‌హాళ్లు, రిసార్టుల్లో.. నూతన సంవత్సర వేడుకలను ఓరుగల్లు వాసులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. న్యూ ఇయర్ కేక్‌లకు ఎంత క్రేజ్ ఉందో అంతకు మించి మద్యానికి ఉండడం కనిపించింది. ఇళ్లు, ఫంక్షన్‌హాళ్లు, రిసార్టుల్లో ఎంజాయ్ చేశారు. ఇందుకోసం ఎకై ్సజ్ శాఖ నుంచి ఈవెంట్ పర్మిషన్ తీసుకున్నారు. ఈవెంట్స్‌కు రూ.9 వేల నుంచి రూ.50 వేల వరకు రుసుము చెల్లించడంతో ఎక్సైజ్ శాఖకు మరింత ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలో 295 వైన్స్, 134 బార్లు.. ఉమ్మడి జిల్లాలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మందుబాబులు చీర్స్ కొడుతూ రూ.48.73 కోట్ల విలువైన మద్యం తాగారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 295 వైన్స్, 134 బార్లు ఉన్నాయి. కాగా, 2024లో రూ.39.50 కోట్లు, 2025లో రికార్డు బ్రేక్ చేస్తూ రూ. 48.73 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.హనుమకొండ జిల్లాలో మద్యం విక్రయాల వివరాలు.. సంవత్సరం విక్రయాలు 2023 రూ.6 కోట్లు 2024 రూ.14.7 కోట్లు 2025 రూ.16.40 కోట్లు -
ఆటోలు, బైక్‌ను ఢీకొట్టిన కారు
9 మందికి తీవ్ర గాయాలు కొత్తగట్టు శివారులో ఘటన ఆత్మకూరు: అతివేగంగా వెళ్తున్న కారు రెండు ఆటోలు, బైక్‌ను ఢీకొనడంతో 9 మందికి తీవ్ర గాయాలైన సంఘటన కొత్తగట్టు శివారులోని ఎన్‌హెచ్–353సీపై గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని అక్కంపేటకు చెందిన సిలువేరు ప్రసాద్, సిలువేరు కవిత ఆటోలో పరకాల మండలం వెల్లంపల్లిలో బంధువు మృతిచెందగా వెళ్తున్నారు. కొత్తగట్టు సమీపంలో ఎదురుగా నిర్లక్ష్యంగా అతివేగంగా వస్తున్న కారు బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో కారు ఎదురుగా పరకాల వైపు వెళ్తున్న మరో ఆటోను ఢీకొనడంతో ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ఉన్న కురుసపల్లి పరమేశ్, శరణ్య, అనిత, శివరాం, హేతు ప్రభాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, ఇదే కారు మరో బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న బాదావత్ నరేశ్, నవ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు వెంటనే 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి దామెర క్రాస్‌రోడ్డు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సిలువేరు ప్రదీప్ ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వేగిరం చేయాల్సిందే..
సాక్షి, వరంగల్: హైదరాబాద్‌లో జరిగే అభివృద్ధి వరంగల్ నగరంలోనూ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నెలక్రితం నర్సంపేట పర్యటనలో హామీ ఇచ్చిన మేరకు అధికారులు వేగిరం చేస్తే వరంగల్‌కు శ్రీకొత్తశ్రీ వెలుగులు రానున్నాయి. ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను ఈ ఏడాది మార్చి 31 లోపు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులు వరంగల్ నగరానికి కీలకం కావడంతో ఇవీ పూర్తయితే వరంగల్ రూపురేఖలే మారే అవకాశముంది. ఏళ్లుగా కలలు కంటున్న మామునూరు విమానాశ్రయం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.295 కోట్లు కేటాయించడంతో 253 ఎకరాల భూసేకరణ పూర్తి కావొచ్చింది. ప్రధాని మోదీ అపాయింట్మెంట్కు అనుగుణంగా ఈ విమానాశ్రయ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మార్చిలోగా ప్రారంభమయ్యే అవకాశముంది. నిర్మాణానికి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించడంతో నిర్మాణ పనులు వేగంగా సాగితే సాధ్యమైనంత తొందరగా వరంగల్‌లో విమానాలు ఎగిరే అవకాశం కనబడుతోంది. 40 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతోపాటు గ్రేటర్ వరంగల్ నగరానికి అత్యవసరమైన భూగర్భ డ్రెయినేజీకి రూ.4,170 కోట్ల నిధులతో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో వరంగల్ నగరం వరదల్లో మునిగిపోతుండడంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే వరంగల్ వాసులకు ఎంతో ఊరట కలుగుతుంది. తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు వరంగల్ చుట్టూ 69 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రాంపూర్ నుంచి ఆరెపల్లి వరకు 29 కిలోమీటర్ల జాతీయరహదారి నిర్మించి ఉంది. మిగిలిన 40 కిలోమీటర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.669 కోట్ల నిధులు కేటాయించింది. జాతీయ రహదారుల శాఖ కూడా ఓఆర్ఆర్ నుంచి ఖమ్మం ప్రధాన రహదారిని నిర్మించే ప్రతిపాదనల్లో ఉంది. ఈ ఏడాది మార్చిలో ఔటర్ రింగ్ రోడ్డు పట్టాలెక్కే అవకాశముంది. అలాగే రూ.107 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల్లో వేగిరం పెరిగితే వరంగల్ నగరానికి ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. విజయవాడ నుంచి నాగపూర్‌కి నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నాలుగు లేన్ల రహదారి ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, తిమ్మాపూర్, ఏనుగల్లు, పర్వతగిరి, నెక్కొండలో జరుగుతున్న నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా అధికారులు చూడాలి. ఇలా 2026లో కొత్త రహదారులు అందుబాటులోకి వస్తుండడంతో ప్రయాణం మరింత సులభతరం కానుంది. అలాగే గీసుకొండ, సంగెం మండలాల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును కేంద్రం పీఎం మిత్ర పథకంలో చేర్చడంతో అక్కడి నుంచి రూ.200 కోట్లు వస్తే మౌలికవసతుల అభివృద్ధికి ఉపయోగపడనుంది. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన సమయంలోనే ఈ పనులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశముంది. ప్రత్యేక దృష్టి సారించాల్సిందే.. వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021 జూన్‌లో ప్రారంభమయ్యాయి. 2024లోనే ఇదీ అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. గతేడాది డిసెంబర్ ఆఖరు వరకు నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా నింపాది పనులతో ఈ ఏడాది మార్చి వరకు పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా, అక్కడ మరో 500 పడకలు (కార్డియాలజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) ఏర్పాటు వల్ల రెండువేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాధ్యమైనంత తొందరగా అధికారులు దీనిపై దృష్టి సారించి అందుబాటులోకి తీసుకువస్తే వేలాది మందికి కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ వైద్య సేవలు అందే అవకాశముంది. కొలిక్కివచ్చిన ఎయిర్పోర్ట్ భూసేకరణ ప్రక్రియ ఓరుగల్లులో విమానాలు ఎగిరే అవకాశం భూగర్భ డ్రెయినేజీ పనులకు ఇప్పటికే డీపీఆర్ మిగిలిన ఔటర్ రింగ్ రోడ్డు పనులు పట్టాలెక్కే ఛాన్స్ మార్చిలో భూమిపూజ చేస్తానని సీఎం హామీ -
ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలి
కాళోజీ సెంటర్ : నూతన సంవత్సర వేడుకలను పురష్కరించుకొని జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (డీఆర్డీఏ) కార్యాలయంలో గురువారం ఇన్చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి.. ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. 2025 సంవత్సరం వైఫల్యాలను సమీక్షించుకొని నూతన సంవత్సరంలో విజయాలు సాధించేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అనంతరం ఉద్యోగులు రాంరెడ్డికి బొకేలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ రేణుకా దేవి, జి.కొమురయ్య, సారయ్య, ఉద్యోగులు మర్రిదాసు అనిల్ కుమార్, రేవతి, వరలక్ష్మి, సుధాకర్, శ్రీనివాస్, లవకుమార్, వనమ్మ, రంగు కిరణ్, సుధాకర్, రమేష్, రాజీరు, ఏలియా, శ్యాంసన్, మోహన్, బాబు, రాజయ్య, రాజు, రమేష్, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల వర్ధన్నపేట/నర్సంపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ను గురువారం వర్ధన్నపేట మున్సిపాలిటీలో కమిషనర్ సుధీర్‌కుమార్, నర్సంపేటలో కమిషనర్ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డులకు, నర్సంపేట పట్టణంలోని 30 వార్డులకు సంబంధించి ముసాయిదా జాబితాను తయారు చేసి కార్యాలయం నోటీసు బోర్డులపై ఏర్పాటు చేశారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీ లోపు తెలియజేయాలని సూచించారు. గుట్టపైకి చేరిన స్వామి గీసుకొండ: గీసుకొండ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి గీసుకొండ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి స్వామివారు, అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకిపై ప్రధాన వీధుల్లో ఊరేగిస్తూ గుట్టపైకి తరలించి అర్చకులు పూజలను నిర్వహించారు. ఈ నెల 3 నుంచి మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగుల సుధాకర్‌రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్తలు వేదాంత మురళీకృష్ణమాచార్యులు, వెంకట నర్సింహాచార్యులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పాకాలలో పర్యాటకుల సందడి ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో గురువారం పర్యాటకుల సందడి నెలకొంది. నూతన సంవత్సరం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. లీకేజీ నీటిలో జళకాలాడుతూ సందడి చేశారు. బోటింగ్ వద్ద పర్యాటకుల తాకిడి నెలకొంది. -
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
● కలెక్టర్ సత్య శారదన్యూశాయంపేట: 2026 సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువా రం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు, వివి ధ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, టవల్స్ బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, బుక్స్ పెన్నులు, వాటర్ బాటి ల్స్, పూల బొకేలు అందజేస్తూ కలెక్టర్ సత్య శారదకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ నూతన ఉత్సాహంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంత రం టీజీఓ, టీఎన్జీఓ, ట్రస్సా యూనియన్ల క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరె డ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, టీఎన్జీఓ ప్రెసిడెంట్ బోనాల కిషన్, ఆర్డీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఫణి కుమార్ పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
● డీఈఓ రంగయ్య నాయుడు కాళోజీ సెంటర్ : ఉపాధ్యాయులుగా పాఠశాలల్లో బాధ్యతగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రంగయ్య నాయుడు అన్నారు. గురువారం తన చాంబర్లో 2026 సంవత్సరం టీపీటీఎఫ్ రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విద్యాబోధన చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ మాట్లాడుతూ.. టీపీటీఎఫ్ సంఘానికి 8 దశాబ్దాల చరిత్ర ఉందని, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఫలితాలు సాధించిన చరిత్ర సంఘానికి ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల వీరస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు జే.స్వామి, జిల్లా కార్యదర్శి సురేష్, బాబు, బైరి స్వామి, పూర్వ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లంకొండ రమేష్, పూర్వ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్, మండల నాయకులు డోరం రమేష్, బి.సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పర్వతగిరి: క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని వర్ధన్నపేట ఎమ్మె ల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మండల పరిధిలోని అన్నారంలో పల్లవి మోడల్ స్కూల్లో వరంగల్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 44వ తెలంగాణ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు గురువారం ముగిశాయి. 1,200 మంది క్రీడాకారులు పాల్గొనగా వంద మంది టెక్నికల్ సహాయకులు సేవలందించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య తెలిపారు. మహిళా విభాగంలో నల్గొండ జట్టు మొదటి స్థానంలో నిలువగా.. రెండో స్థానంలో మహబూబాబాద్ టీమ్, మూడో స్థానంలో నారాయణపేట జట్టు విజయం సాధించాయి. పురుషుల విభాగంలో యాదాద్రి భువనగిరి జట్టు మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో సంగారెడ్డి, మూడో స్థానంలో హైదరాబాద్ జట్టు నిలి చాయి. విజేతలు మహారాష్ట్రలో జరగబోయే జాతీ యస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. అంత కుముందు ఎమ్మెల్యే నాగరాజుకు అసోసియేషన్ సభ్యులు.. ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేసి మాట్లాడారు. షూటింగ్ బాల్ వంటి గ్రామీణ క్రీడలకు రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ పోటీల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి కీర్తి తెచ్చేలా క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్‌నాయక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌గౌడ్, సర్పంచ్‌లు గాడిపెల్లి మహేందర్, తక్కళ్లపల్లి శ్రీనివాస్, తొర్రి పద్మ, చీదురు శంకర్, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోకచారి, డైరెక్టర్లు గంజి మహేందర్, కోటగిరి రమేష్, క్రీడా ఇన్చార్జ్, హెచ్ఓడీ ఆకుల రాజు, ఏఓ బైరి అశోక్, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
అగ్రంపహాడ్ జాతర పనులు వేగిరం చేయాలి
ఆత్మకూరు: అగ్రంపహాడ్ జాతర పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ స్నేహశబరీష్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో బుధవారం జాతర పనులపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కలెక్టర్ స్నేహశబరీష్తో కలిసి సమీక్షించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ స్నేహశబరీష్ జాతరలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జాతరలో భక్తుల సౌకర్యార్థం తాగునీరు, స్నానాలకు సౌకర్యం కల్పించాలన్నారు. పంచాయతీ రాజ్ అధికారులు జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ఎక్సైజ్ అధికారులు జాతర పరిసరాల్లో ఎక్కడా గుడుంబా విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు జాతరలో రోడ్ల వెంట లైటింగ్ ఉండేలా చూడాలని 24గంటలు విద్యుత్ సౌకర్యం ఉండాలన్నారు. అలాగే భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమన్వయంతో విజయవంతం చేయాలి అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. జాతరలో అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సౌకర్యాలు కల్పించాలన్నారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేసి దానికి తగినట్లుగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, ఆర్డీఓ నారాయణ, ఎండోమెంట్ ఏసీ సునీత, ఏసీపీ సతీశ్‌బాబు, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ నాగేశ్వర్రావు, పూజారులు సాంబశివరావు, సారంగపాణి, వెంకన్న, సర్పంచ్‌లు మహేందర్, సాంబయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, కాంగ్రెస్ నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, బోరిగం స్వామి తదితరులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్ -
క్రమశిక్షణ అవశ్యం
సచిన్ టెండూల్క ర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. -
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హన్మకొండ చౌరస్తా: నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025వ సంవత్సరం జిల్లావ్యాప్తంగా అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంతోపాటు మౌలిక వసతుల కల్పనలో ముందున్నామని తెలిపారు. 2026 కొత్త సంవత్సరం ప్రతీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. హనుమకొండ కలెక్టర్.. హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తోడ్పాటు అందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు నూతన సంవత్సరంలోనూ సహకరించాలని కోరారు. మేయర్ శుభాకాంక్షలు వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నిండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) ఎన్.రవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవి ఇంతకాలం భూపాలపల్లి డీఆర్ఓగా పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. కీసర, నల్లగొండ ప్రాంతాల్లో ఆర్డీఓగా పని చేశారు. హనుమకొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇటీవల ఏసీబీకి పట్టుబడడంతో పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి డీఆర్ఓగా ఉన్న రవిని హనుమకొండకు బదిలీ చేయడంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న పోరిక హరికృష్ణకు కేటాయించారు. కాజీపేట అర్బన్ : మడికొండ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తనిఖీ చేశారు. పీఎస్‌లో మూడేళ్ల నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పోలీస్ ఇమేజ్ పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్‌కుమార్, రామ్మోహన్ పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పతకాలను ప్రకటించింది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్, ట్రాన్స్‌కో విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌కు మహోన్నత సేవా పతకం, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఏఎస్సై వేణుగోపాల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్‌బాబుకు ఉత్తమ సేవా పతకం, ఎస్సై కనక చంద్రం, ఏస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, శ్యామ్ సుందర్‌రెడ్డి, స్వర్ణలత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా వారికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు. -
కొత్తకొండ ఆలయ హుండీ లెక్కింపు
● ఐదు నెలల ఆదాయం రూ.8,68,742 ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కించారు. ఐదు నెలల హుండీ ఆదాయం రూ.8,68,742 వచ్చినట్లు ఆలయ ఈఓ కిషన్‌రావు తెలిపారు. ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ హనుకొండ డివిజన్ పరిశీలకులు అనిల్, గ్రామ సర్పంచ్ సిద్ధమల్ల రమా రమేశ్, కార్యక్రమంలో అర్చకులు రాంబాబు, రవిశర్మ, రవీందర్, శ్రీధర్, రాజు, పాలకవర్గ సభ్యులు, రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, వరంగల్: కొత్త ఏడాదిలో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. సంక్రాంతి నాటికి ఏఏఐకి భూముల అప్పగింత పూర్తవుతుంది. కలెక్టరేట్ నిర్మాణ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూసి ప్రభుత్వ విభాగాలను అక్కడికి తరలిస్తాం. ముఖ్యంగా 24 అంతస్తులతో కూడిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యేలా చూసి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తాం. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. – సత్యశారద, కలెక్టర్, వరంగల్స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలివరంగల్ క్రైం: నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రతిఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి. కొత్త ఆలోచనలు గొప్పగా ఉండాలి. గడిచిన ఏడాదిలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని అధిగమించటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. సమయం విలువ కచ్చితంగా గుర్తించి ముందుకు సాగితే తప్ప విజయం వరించదు. విద్యార్థులు, యువతీయువకులు పెట్టుకున్న టార్గెట్‌ను చేరుకోవడానికి నిరంతరం శ్రమను నమ్ముకోవాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – దార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ -
కుటుంబ సభ్యులతో గడపండి
వరంగల్ క్రైం: ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సైలు జె.విల్సన్, పి.ప్రకాశ్‌రెడ్డి, ఆర్ఎస్సై కె.ప్రభాకర్, ఏఆర్ఎస్సైలు అబ్దుల్ రఫీక్, యం.రవి ఉన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, శ్రీనివాస్, ఏసీపీ, సురేంద్ర, ఆర్ఐ సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్‌కుమార్‌తో పాటు, ఇతర పోలీస్ సిబ్బంది, ఉద్యోగ విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం -
అధ్యయనం అత్యవసరం
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం. -
రైల్వేశాఖ వరాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం (క్రూ లాబీ) కేంద్రంగా పని చేస్తున్న రన్నింగ్ స్టాఫ్ లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు న్యూ ఇయర్ కానుకగా వరాలు కురింపించారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి కొత్తగా 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల సంఖ్యను పెంచుతూ మంజూరు చేసినట్లు బుధవారం రైల్వే అధికారులు, రైల్వే నాయకులు తెలిపారు. 16 మందికి గూడ్స్ లోకో పైలెట్ల నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వీరిలో ఏడుగురికి ప్యాసింజర్ లోకో పైలెట్‌గా పదోన్నతి కల్పిస్తూ 9 మందిని సికింద్రాబాద్ నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్‌గా కాజీపేటకు బదిలీ చేసినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం నుంచి పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ లోకో పైలెట్ల పోస్టుల ఇండెంట్ మంజూరు చేయాలని 3 ఏళ్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి వినతి పత్రాలు అందజేసినట్లు రైల్వే నాయకులు తెలిపారు. గతంలో కాజీపేట నుంచి విజయవాడకు తరలించిన క్రూ లింక్‌లను లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లను తిరిగి కాజీపేటకు తీసుకురావాలని అనేక సార్లు డీఆర్ఎం, జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆశించినట్లుగా లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల కేటాయింపు జరగలేదని రైల్వే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట రైల్వే క్రూ లాబీలో ఉన్న ఖాళీ పోస్టులను మంజూరు చేయాలని అనేకసార్లు రైల్వే సికింద్రాబాద్ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. కాజీపేటలో డ్యూటీ చేసే వారికి కాజీపేటలోనే పదోన్నతి కల్పించాలి. బదిలీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలి. ఖాళీలను భర్తీ చేయాలి. – పాక రాజ్‌కుమార్, కాజీపేట రైల్వే సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టులు మంజూరు 16 మందికి పదోన్నతులు 3 ఏళ్ల ఎదురు చూపులకు దక్కిన బదిలీల ఫలితం ఆనందంలో రైల్వే లోకో పైలెట్ల స్టాఫ్ -
క్రమశిక్షణ అవశ్యం
సచిన్ టెండూల్క ర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. -
అధ్యయనం అత్యవసరం
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం. -
యూరియా కోసం పడిగాపులు
నర్సంపేట రూరల్: గ్రామాల్లోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సొసైటీ గోదాముల ఎదుట బారులుదీరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నారావుపేట సొసైటీ గోదాంకు 444 యూరియా బస్తాలు, ఎల్లాయగూడెం గ్రామానికి 444 బస్తాలు, ఉప్పరపల్లి సొసైటీకి 444 బస్తాలు, ఖాదర్‌పేటకు 444 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు మంగళవారం అర్ధరాత్రి నుంచే చలిలో పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం వ్యవసాయ విస్తీర్ణాధికారులు టోకెన్లు అందించి యూరియా బస్తాలు పంపిణీ చేశారు. యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరిగారు. -
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, వరంగల్: కొత్త ఏడాదిలో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. సంక్రాంతి నాటికి ఏఏఐకి భూముల అప్పగింత పూర్తవుతుంది. కలెక్టరేట్ నిర్మాణ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూసి ప్రభుత్వ విభాగాలను అక్కడికి తరలిస్తాం. ముఖ్యంగా 24 అంతస్తులతో కూడిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యేలా చూసి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తాం. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. – సత్యశారద, కలెక్టర్స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలివరంగల్ క్రైం: నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రతిఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి. కొత్త ఆలోచనలు గొప్పగా ఉండాలి. గడిచిన ఏడాదిలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని అధిగమించటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. సమయం విలువ కచ్చితంగా గుర్తించి ముందుకు సాగితే తప్ప విజయం వరించదు. విద్యార్థులు, యువతీయువకులు పెట్టుకున్న టార్గెట్‌ను చేరుకోవడానికి నిరంతరం శ్రమను నమ్ముకోవాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – దార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ -
మామిడిలో కానరాని పూత
గీసుకొండ: మామిడి తోటలు సాగుచేస్తున్న రైతులకు ప్రస్తుత సీజన్ నిరాశాజనకమనే చెప్పవచ్చు. డిసెంబర్ నెల చివరి నాటికి తోటలు విరగపూసి పిందె దశకు చేరుకోవాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అలాంటిదేం కనిపించడం లేదని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితికి ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం, చలి అధికంగా ఉండడమే కారణం అంటున్నారు ఉద్యానశాఖ అధికారులు. ఈ ఏడాది అక్టోబర్ నెల చివరి వరకు వర్షాలు కురవడంతో మామిడి తోటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని చెబుతున్నారు. పలు మామిడి చెట్లకు పూతకు బదులు చిగుర్లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి మామిడి కాయల దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. సహజంగా మామిడి తోటల్లో నవంబర్ నుంచి మొదటి దశ, డిసెంబర్లో రెండో దశ పూత వస్తుంది. ఈసారి అధికవర్షాలతోనే పూత రావడం ఆలస్యమైందని తెలుస్తోంది. పూత త్వరగా వచ్చి నిలిస్తే మామిడి కాయలు ఏపుగా ఎదిగి దిగుబడి అధికంగా వస్తుంది. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సమయంలో కాత చేతికి రాదు. జిల్లా నుంచి ముందుగా వచ్చే మామిడి కాయలు, పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పూత, కాత ఆలస్యంగా వస్తే రైతులకు లాభాలకు బదులు నష్టాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా వచ్చే దిగుబడి సమయానికి కాకుండా నెల ఆలస్యంగా వస్తే వర్షాలు పడి కాయ ల అమ్మకంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని రైతులు అంటున్నారు. అయితే, జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి, ఫిబ్రవరిలో పూత, పిందె దశ వస్తుందని,, మామిడి రైతులు దిగులుపడొద్దని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 1,622 మంది మామిడి రైతులు జిల్లాలో సుమారు 1,622 మంది రైతులు 5,769 ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ఎ క్కువగా పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేటలో, ఓ మోస్తరుగా చెన్నారావుపేట, గీసుకొండ, నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, ఖిలా వరంగల్, సంగెం మండలాల్లో సాగు చేస్తున్నారు. తోటలకు నీరు పెట్టొద్దు.. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితిలో మామిడి తోటలకు పూత కొంత ఆలస్యంగా వస్తుంది. కొద్ది పాటి పూత వస్తే రైతులు దిగులు చెందొద్దు. మరో నెలలో పూత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో తోటలకు నీరు పెట్టడం, దున్నడం చేయవద్దు. భూ మి బెట్టుగా ఉంటేనే పూత వచ్చే అవకాశం ఉంటుంది. 50 నుంచి 60 శాతం వచ్చిన పూత విచ్చుకుని, పిందె దశలో ఉన్నప్పుడు నీరు పెట్టాలి. పూత రావడానికి 130045 మల్టీకే/పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. –డాక్టర్ ఎం.తిరుపతి, వరంగల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి 10 శాతంలోపే పూతపూసిన తోటలు అధిక వర్షాలు, తీవ్ర చలి ప్రభావమే కారణం ఆలస్యంగా వస్తుందంటున్న ఉద్యానశాఖ అధికారులు జిల్లాలో 5,761 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు -
ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు
రాయపర్తి: ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పంటించి ధ్వంసం చేసిన సంఘటన బంధనపల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో శివాజీ విగ్రహం ఆవిష్కరించకుండా ముసుగు కప్పి ఉంది. గమనించిన దుండగులు మంగళవారం రాత్రి విగ్రహానికి నిప్పంటించగా స్వల్పంగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ, వివిధ సంఘాల నాయకులు బుధవారం గ్రామానికి చేరుకుని దుండగులను గుర్తించి శిక్షించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మాట్లాడుతూ శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు నూనె అనిల్, నాయకులు ఎనగందుల శ్రావణ్, బూరుగు నవీన్, నిమ్మల అనిల్, పెండ్యాల గణేశ్, గోరంట్ల ప్రభాకర్, మంచాల సుమన్, కొంగ అశోక్, కుమారస్వామితోపాటు బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, సర్పంచ్ అక్రినాయక్, నాయకులు కౌడగాని నర్సింగరావు, దీప్లానాయక్, సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
నల్లబెల్లి: నాగరాజుపల్లిలోని మద్దిమేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్‌రావు విద్యుత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జాతరను సందర్శించి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం జాతరలో చేపడుతున్న విద్యుత్ లైన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో డీఈ హార్జినాయక్, ఏడీఈ జానకీరామ్, సర్పంచ్‌లు లలిత, సరోజ, రవి చిన్న, రాజు, ఆలయ కమిటీ చైర్మన్ చిట్యాల ఉపేందర్‌రెడ్డి, ఆలయ ప్రధాన పూజా రి దురిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉర్సును వైభవంగా నిర్వహించాలి పర్వతగిరి: అన్నారం షరీఫ్ ఉర్సును వైభవంగా నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ మేరకు హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉర్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 5వ తేదీన గంధం, 6న దీపారాధన, 7న ఖత్మేఖురాన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్మహమ్మద్, అన్నారం గ్రామ సర్పంచ్ గాడిపల్లి మహేందర్, గ్రామ అధ్యక్షుడు గొడుగు రమేశ్, యూత్ అధ్యక్షుడు గొడుగు వినయ్, వార్డు సభ్యులు రాజబాబు, రామకృష్ణ, పవన్‌కల్యాణ్, రవి, మధు, రామ్మూర్తి, అఖిల్, భార్గవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు అధికారులకు పతకాలు వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పతకాలను ప్రకటించింది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్, ట్రాన్స్‌కో విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌కు మహోన్నత సేవా పతకం, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఏఎస్సై వేణుగోపాల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్‌బాబుకు ఉత్తమ సేవా పతకం, ఎస్సై కనక చంద్రం, ఏస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, శ్యామ్ సుందర్‌రెడ్డి, స్వర్ణలత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా వారికి వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు. సాగునీటి విడుదల నర్సంపేట రూరల్: మండలంలోని మాదన్నపేట చెరువు పెద్ద కాల్వ నుంచి సాగునీటిని బుధవారం నీటిపారుదల శాఖ ఏఈ నితిన్, రైతులు విడుదల చేశారు. చెరువు కింద యాసంగి తైబందీ ఇటీవల 1,020 ఎకరాలకు ఖరారు చేశారు. వరి నార్లు, నాట్ల కోసం రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మత్స్యకారుల వలలో చిక్కిన కొండచిలువ వర్ధన్నపేట: మండలంలోని కట్య్రాల గ్రామ ఊర చెరువులో మత్స్యకారులకు బుధవారం కొండచిలువ చిక్కింది. చేపల వేట కోసం మత్స్యకారులు చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో వల వేయగా కొండచిలువ చిక్కడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామంలోని స్నేక్ క్యాచర్‌ను పిలిపించి కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలారు. దీంతో వారు ఊపిరి పిల్చుకున్నారు. మధుసూదన్ సదయ్య సుధాకర్ -
సంతోషాలతో వేడుకలు నిర్వహించుకుందాం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల్లోపు ముగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
గీసుకొండ బ్రహ్మోత్సవాలకు వేళాయె..
గీసుకొండ: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారంగా గీసుకొండ లక్ష్మీనర్సింహస్వామి ప్రతీతి. గీసుకొండ మండల కేంద్రం శివారులో నల్లరాతి గుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. గీసుకొండ గ్రామంలోని ప్రసిద్ధ వేణుగోపాలస్వామి ఆలయం నుంచి స్వామివారిని వేదమంత్రాలు, బాజాభజంత్రీలతో సాయంత్రం ఐదు గంటలకు గుట్టపైకి తోడ్కొని వెళ్లి ఆలయ ప్రవేశం చేయిస్తామని ఆలయ వంశపారంపర్య వ్యవస్థాపక ధర్మకర్తలు వేదాంత మురళీకృష్ణమాచార్యులు, వెంకట నర్సింహాచార్యులు తెలిపారు. శుక్రవారం ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాలు ఉంటాయిని, మూడో తేదీన జాతర ప్రారంభమై ఐదో తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. చివరిరోజు సాయంత్రం స్వామివారిని ఊరేగింపుతో గీసుకొండ వేణుగోపాలస్వామి ఆలయ ప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుందని వారు తెలిపారు. భక్తులకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గుట్ట వద్ద రెయిలింగ్, మెట్లు, దిగవన ఆలయ నిర్మాణం తదితర అభివృద్ధి పనులను పలువురు దాతలు ముందుకు వచ్చి చేపట్టారు. ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు సాక్ష్యం.. గుట్టచుట్టూ సుమారు 70 ఎకరాల ప్రాంతంలో మధ్యశిలా యుగం మొదలుకొని శాతవాహనుల కాలానికి సంబంధించిన ఎన్నో చారిత్రక ఆధారాలు బయల్పడ్డాయి. 2001లో తొలిసారిగా గీసుకొండకు చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు ముత్తినేని రాధాకృష్ణ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. మధ్య రాతియుగానికి సంబంధించిన సూక్ష్మరాతి పనిముట్లు, నవీన శిలా యుగానికి సంబంధించిన గొడ్డళ్లు, నూరే రాళ్లు, మట్టి పెంకులు, బృహత్ శిలాయుగపు సమాధులు (మెగాలిథిక్ బరియల్స్) వెలుగుచూశాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన పురావస్తుశాఖ వారు పరిశీలన కోసం నాలుగు ట్రెంచ్‌లను తవ్వడంతో మరిన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి ట్రెంచ్‌లో బౌద్ధానికి సంబంధించిన స్తూపం బయటపడింది. అందులోనే బోధిసత్వుడి తెల్లని ప్రతిమ బయటపడటంతో జిల్లాలోనే మొదటి బుద్ధిస్ట్ సైట్‌గా దీన్ని గుర్తించారు. శాతవాహనుల నాణెం కూడా లభించింది. ఈ విషయం గతంలో పార్లమెంట్లో చర్చకు వచ్చింది. ఇక్కడ లభ్యమైన వస్తువులను వరంగల్ పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచారు. గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి, మరింత లోతుగా పరిశోధనలు చేస్తే చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.. లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నిర్వాహకుల ఏర్పాట్లు జనవరి ఒకటిన సాయంత్రం గుట్టపైకి చేరనున్న స్వామివారు మూడు నుంచి జాతర.. తరలిరానున్న వేలాది మంది భక్తులు గుట్ట దిగువ భాగంలో బయల్పడిన ఎన్నో చారిత్రక ఆధారాలుగుట్టతోనే ‘గీసుకొండకు’ ఆ పేరు సుమారు 400 అడుగుల ఎత్తులో ఉన్న నల్లరాతి గుట్ట ఆధారంగానే సమీపంలో ఏర్పడిన గీసుకొండ గ్రామానికి ఆ పేరు వచ్చి ఉంటుందని అంటున్నారు. ‘గీసు’ అంటే నల్లని అని, నల్లని కొండ కావడంతో గీసుకొండ అని పేరు వచ్చిందని కొందరు చెబుతున్నారు. శిలాయుగంలో ఆయుధాలకు పదు ను పెట్టడానికి కొండను గీసే వారని, అందువల్లే ‘గీసుడు–కొండ’ అని పేరు వచ్చిందని.. కాలక్రమేణా గీసుకొండగా మారి ఉంటుందని హైదరాబాద్ పురావస్తుశాఖ నిపుణులు అభిప్రాయపడ్డారు. భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం..జాతరకు వచ్చే భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గుట్టపైన భక్తులు కూర్చోవడానికి గద్దెలు, కింది భాగంలో చలువ పందిళ్లు వేశాం. దిగువన ఉన్న స్వామి వారి ఆలయం వద్ద భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. – ఏనుగుల సాంబరెడ్డి, ఆలయ చైర్మన్ -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
నర్సంపేట రూరల్: పోలీసులు విధుల్లో అలసత్వ వహిస్తే చర్యలు తప్పవని నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారి నుంచి ఫిర్యాదులను తీసుకుని, కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆదేశించారు. నిరంతరరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100 ఫోన్ రాగానే పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట నెక్కొండ సీఐ శ్రీనివాస్, చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి, ఏఎస్సై లక్ష్మణ మూర్తి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యాప్ నుంచి ఎరువులను బుక్ చేసుకోవాలి
దుగ్గొండి: రైతుల అవసరాల మేరకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని తొగర్రాయి గ్రామంలో మంగళవారం ఆయన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాన్ని పరిశీలించారు. యూరియా టోకెన్ల పంపిణీ, సరఫరా విధానాన్ని సమీక్షించి మాట్లాడారు. యూరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాస రమ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యాప్ ద్వారా ఎరువులను బుకింగ్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్‌పై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయాధికారి అనురాధ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. మండలాలకు అవసరమైన యూరియా సరఫరా చేశామని తెలిపారు. ప్రతి రైతు తన ఆరోగ్యదీపిక కార్డులో పంటల వివరాలను నమోదుచేసి యూరియా తీసుకోవాలని సూచించారు. నర్సంపేట, వర్ధన్నపేట వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్‌రెడ్డి, గజ్జల నర్సింగం, ఏఓ గాజుల శ్యాం, ఏఈఓ విజయ్‌నాయక్, ఉపసర్పంచ్ బుస్సాని రాజు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్ -
ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
నర్సంపేట: నర్సంపేటలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. ఇన్స్పెక్టర్లు కృష్ణమూర్తి, మౌనిక, ల్యాబ్ టెక్నీషియన్ నరేశ్, నర్సంపేట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, ఎన్విరాన్మెంట్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో హోటల్స్, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు, కిరాణా షాపులు, జనరల్ స్టోర్స్, బిర్యానీ సెంటర్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు గిరగాని సుదర్శన్‌గౌడ్, విజిలెన్స్ కమిటీ మెంబర్స్ నాగెల్లి సారంగం, మైస వసంత, జిల్లా ఎస్సీ, ఎస్టీ కన్వీనర్ బోయిన వెంకటస్వామి పాల్గొన్నారు. యాసంగికి సరిపడా యూరియా నిల్వలున్యూశాయంపేట: జిల్లాలో యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అన్ని యూరియా విక్రయ కేంద్రాలు తెరిచి ఉంటాయని, అదనపు యూరియా కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. మౌలిక వసతులపై దృష్టి పెట్టండి..జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. . రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు షురూపర్వతగిరి: మండలంలోని అన్నారం పల్లవి మోడల్ స్కూల్లో రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎంఈఓ అల్లందాసు భిక్షపతి, సర్పంచ్ గాడిపల్లి మహేందర్ హాజరై అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ శ్రీనివాసులు, కార్యదర్శి సీహెచ్ ఐలయ్యతో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లవి పాఠశాల చైర్మన్ రాచకొండ అశోకాచారి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ షూటింగ్ బాల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అసోసియేషన్‌ను అభినందించారు. తహసీల్దార్ వెంకటస్వామి, కల్లెడ పీఏసీఎస్ మాజీ చైర్మన్ మోటపోతుల మనోజ్‌గౌడ్, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ రమేశ్, స్పోర్ట్స్ హెచ్ఓడీ రాజు, ఏఓ బైరి అశోక్, అకౌంటెంట్ వర్మ, ఉపాధ్యాయులు జయంతి, రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. సామాజిక తనిఖీ ప్రజావేదికపర్వతగిరి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. పలువురికి జరిమానా విధించారు. డీఆర్డీఓ రాంరెడ్డి, ఏపీడీ శ్రీవాణి, జిల్లా విజిలెన్స్ అధికారి అలివేలు, ఎంపీడీఓ శంకర్‌నాయక్, ఎస్టీఎం అజయ్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ రమేశ్, ఎస్సారెస్పీ అధికారి గంగరాజు పాల్గొన్నారు. ఇరువర్గాలపై కేసుగీసుకొండ: మండల కేంద్రానికి చెందిన ఇరువర్గాలు గొడవపడగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గీసుకొండకు చెందిన మేకల రమేశ్‌ను అదే గ్రామానికి చెందిన మేకల జీవన్‌తోపాటు కొందరు దుర్భాషలాడగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. అలాగే, మేకల జీవన్ తన తల్లి మరియను బైక్‌పై ఎక్కించుకుని వెళ్తుండగా పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని దౌడు సునీల్, బాబు అడ్డగించారు. ఇష్టం వచ్చినట్లు కొట్టి దుర్భాషలాడి చంపుతామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
వైరెటీ థీమ్స్.. ఈవెంట్స్
గ్రేటర్ వరంగల్‌లో థర్టీ ఫస్ట్ వేడుకలకు ఏర్పాట్లుసాక్షి, వరంగల్: నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్ గ్రౌండ్లు, భద్రకాళి ట్యాంకుబండ్ నయా జోష్‌కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జోష్‌లో వరంగల్ తేలిపోనుంది. రారమ్మంటున్న కార్యక్ర మాలు.. విభిన్న థీమ్స్‌తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇలా రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. వెబ్సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. వరంగల్‌లోని గ్రీన్వుడ్ హైస్కూల్ డే స్కాలర్ ప్రాంగణంలో రాక్ మ్యూజిక్ స్టార్ రోల్ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంకు బండ్ వద్ద బిగ్‌బాస్ ఫేమ్ ఫోక్ సింగర్ రాంరాథోడ్ లైవ్ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బబుల్ థీమ్, ఫుడ్ స్టాల్స్‌తో థర్టీ ఫస్ట్ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్ సెంటర్లోనూ ఫుడ్‌తోపాటు ఆల్కాహాల్ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ బిగ్గెస్ట్ హిప్ హప్ అండ్ ఫోక్ నైట్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సౌండ్ అండ్ లైటింగ్, వీఐపీ జోన్లు, టేబుల్ సర్వీస్ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్ల లు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్ వేడుకల్లో జోష్ ఉండనుంది. లైవ్ మ్యూజిక్, స్టెప్పులతో సెలబ్రెటీల సందడి అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ ప్యాకేజీలకు డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈసారి ఫుల్‌జోష్.. పంచాయతీ ఎన్నికలతో సందడిగా మారిన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు డిసెంబర్ థర్డీ ఫస్ట్ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెలిచిన ఉత్సాహంలో ఉన్న సర్పంచ్‌లు తమ అనుచరుల కోసం ఇప్పటికే చికెన్, మటన్, మద్యం కొనుగోలు చేశారు. డీజే సిస్టం కూడా సమకూర్చుకుంటున్నారు. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండనుండడంతో ఆ పదవులు ఆశించే నాయకులు ఇప్పటి నుంచే తమ బలగం కోసం వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఈ నయాసాల్ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
వైభవంగా వైకుంఠ ఏకాదశి
జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ప్రజలు మంగళవారం వైభవంగా జరుపుకున్నారు. బ్రహ్మ ముహూర్తంలో భక్తులు వైష్ణవాలయాలను సందర్శించి, ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఆలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. శ్రీమహా విష్ణువు ముక్కోటి దేవతలతో గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చాడు గనుక ముక్కోటి ఏకాదశి అంటారని అర్చకులు తెలిపారు. – సాక్షి, నెట్వర్క్వరంగల్లో బాలానగర వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న మంత్రి కొండా సురేఖవైష్ణవాలయాల్లో మార్మోగిన గోవింద నామస్మరణ ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్న భక్తులు -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
నేటినుంచి యాసంగి పంటలకు సాగునీరు ● ఎల్ఎండీ నుంచి సరఫరాకు నీటిపారుదల శాఖ సన్నద్ధం ● వారబందీ పద్ధతి అమలుకు అధికారుల ఏర్పాట్లుసాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు బుధవారం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్‌లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు ఎల్ఎండీ నుంచి... ఉమ్మడి వరంగల్‌లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్‌లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ‘స్కివం’ షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నీటి విడుదలఈ నెల 3న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతోంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. – పి.రమేశ్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్ -
రారమ్మంటున్న కార్యక్రమాలు..
విభిన్న థీమ్స్‌తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. వెబ్సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. వరంగల్‌లోని గ్రీన్వుడ్ హైస్కూల్ డే స్కాలర్ ప్రాంగణంలో రాక్ మ్యూజిక్ స్టార్ రోల్ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంక్ బండ్ వద్ద బిగ్‌బాస్ ఫేమ్ ఫోక్ సింగర్ రాంరాథోడ్ లైవ్ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బబుల్ థీమ్, ఫుడ్ స్టాల్స్‌తో థర్టీ ఫస్ట్ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్ సెంటర్లోనూ ఫుడ్‌తోపాటు ఆల్కహాల్ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ బిగ్గెస్ట్ హిప్ హాప్ అండ్ ఫోక్ నైట్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సౌండ్ అండ్ లైటింగ్, వీఐపీ జోన్లు, టేబుల్ సర్వీస్ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్లలు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్ వేడుకల్లో జోష్ ఉండనుంది. -
వార్డుల పునర్విభజనలో అన్యాయం
పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్‌కు సీతారాంపూర్వాసుల వినతి పరకాల: గతంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డుల పునర్విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందని సీతారాంపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు సీతారాంపూర్‌లోని మూడు వార్డులు (6, 7, 9) ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా యాదవకాలనీ ప్రజలు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో వార్డులతో సమస్యలు ఉండేవి కాదని, కానీ, పరకాల మున్సిపాలిటీలో విలీనం తర్వాత ఇష్టానుసారంగా వార్డులను పునర్విభజన చేయడంతో సీతారాంపూర్ అభివృద్ధిలో వెనుకబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉడుత చిరంజీవి, ఉడుత సంపత్, ఇష్టబోయిన తిరుపతి, జాంకాజువ్వ మహేందర్, మహేశ్, నూకల రాజకోమురు, నూనెటి సురేశ్, ఉడుత రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వైరెటీ థీమ్స్.. ఈవెంట్స్
సాక్షి, వరంగల్/వరంగల్ క్రైం : నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్ గ్రౌండ్లు, భద్రకాళి బండ్ నయా జోష్‌కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మ్యూజిక్ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జోష్‌లో వరంగల్ తేలిపోనుంది. సంతోషాలతో వేడుకలు నిర్వహించుకుందాం..సీపీ సన్‌ప్రీత్ సింగ్ సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల్లోపు ముగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రజల దృష్టికి వస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సీపీ కోరారు. గ్రేటర్ వరంగల్‌లో థర్టీ ఫస్ట్ వేడుకలకు ఏర్పాట్లు లైవ్ మ్యూజిక్, స్టెప్పులతో సెలబ్రెటీల సందడి అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ ప్యాకేజీలకు డిమాండ్ -
అసమానతలు తొలగించాలి
● అర్చక ఉద్యోగుల కోసం చట్ట సవరణ చేయాలి ● తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఎల్కతుర్తి: దేవాదాయ శాఖలో కొనసాగుతున్న వేతన అసమానతలను వెంటనే తొలగించి, ధూప–దీప నైవేద్య అర్చకులను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ డిమాండ్ చేశారు. మంగళవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఆలయ ఉప ప్రధాన అర్చకుడు రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధూప–దీప నైవేద్య అర్చకుల కోసం ప్రత్యేకంగా చట్టసవరణ చేసి వారిని దేవాదాయ శాఖలో భాగం చేయాలని కోరారు. మూడు కేటగిరీల దేవాలయాల్లో పని చేస్తూ ఇప్పటికీ రెగ్యులర్ కాకుండా ఉన్న అర్చక ఉద్యోగులు 8 వేల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారి హక్కుల సాధన కోసమే పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 121ఈవోను రద్దు చేసి దేవాలయాల్లో ఐదేళ్లు సేవ పూర్తి చేసిన తాత్కాలిక అర్చకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ చొరవ తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈనెల 2న మడికొండలో నిర్వహించనున్న వరంగల్ ఉమ్మడి జిల్లా అర్చక ఉద్యోగ సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అర్చకులు రాంబాబు, శ్రీకాంత్‌శర్మ, వినయ్, సందీప్, రమేశ్, శరత్చంద్ర, శివకుమార్, శ్రావణ్, సిబ్బంది భిక్షపతి, రాజేందర్, కళ్యాణి, రాజు, కవిత తదితరులు పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంలో అభివృద్ధి పనులు ఆగుతూ సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకే కార్పొరేట్ తరహాలో వైద్య సేవలందించేందుకు ఉద్దేశించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు అనుకున్నంత వేగంగా ముందుకుసాగడం లేదు. వరంగల్ నగర ట్రాఫిక్ సమస్యను తీర్చే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లోనూ నిర్లక్ష్యం కనబడుతోంది. వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాన్ని చేర్చే వేదికై న వరంగల్ ఆధునిక బస్టాండ్ నిర్మాణ పనులు నింపాదిగా జరుగుతున్నాయి. ఇక వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకోగా, ఏళ్లుగా కలలు కంటున్న మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణ చివరి దశకు చేరుకుంది. వచ్చే మార్చికల్లా ఏఏఐ అధికారులు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే, రూ.వందల కోట్ల వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు నగరంలో స్మార్ట్ సిటీ పనుల్లో ఆలస్యం, అండర్ గ్రౌ ండ్ డ్రెయినేజీ పనులు ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. ‘సూపర్ ఆస్పత్రి’ ఇంకా ఆలస్యమే.. వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021 జూన్‌లో ప్రారంభమయ్యాయి. 2024లోనే ఇది అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు వరకు నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా నింపాది పనులతో వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా అక్కడ మరో 500 పడకలు (కార్డియాలజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) పెంచి రెండువేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆధునీకరించిన రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద రూ.25.41 కోట్ల నిధులతో వరంగల్ రైల్వే స్టేషన్‌ను కార్పొరేట్ సదుపాయాలతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా అధికారులు తీర్చిదిద్దారు. ఈ ఏడాది అక్టోబర్‌లో పూర్తిస్థాయి హంగులతో అది అందుబాటులోకి వచ్చింది. కాకతీయుల తోరణం, రెండు స్తంభాలపై రెండు ఏనుగులు, విశాలమైన ఫుట్ఓవర్ బ్రిడ్జి, శిల్పకళా సంపద ఉట్టిపడేలా ఎలివేషన్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ర్యాంపులు, ల్యాండ్ స్కేపింగ్, టికెట్ కౌంటర్, ప్లాట్‌ఫాంలతో పాటు గోడలకు ఇరువైపులా కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా కళాకృతులు, నూతన హంగులతో వెయిటింగ్ హాళ్లను తీర్చిదిద్దారు. 5 రూపాయలకే సురక్షిత తాగునీరు, ఇంటర్నెట్ కోసం వైఫై.. ఇలా అధునాతన సౌకర్యాలతో రూపుదిద్దుకున్న రైల్వే స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు.జిల్లాలో అభివృద్ధి పనుల తీరిది నింపాదిగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో నత్తనడక ఆలస్యంగా ప్రారంభమై తుది దశలో జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న మామూనూరు విమానాశ్రయ భూసేకరణ అత్యాధునిక వసతులతో ఆధునీకరించిన రైల్వే స్టేషన్నింపాది పనులతో తప్పనితిప్పలు వరంగల్ పాత ఆజంజాహి మిల్లు మైదానంలో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పనులు ఇప్పటికే పూర్తికావాల్సి ఉండగా, తాజాగా గోడలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఈపాటికే ఈ పనులు పూర్తై అన్ని విభాగాలు ఇక్కడకు రావాల్సి ఉన్నా కొత్త సంవత్సరంలో ఈ కొత్త భవనంలోకి అన్ని తరలనున్నాయి. మూడెకరాల్లో ఐదొంతస్తుల ప్రణాళికతో కుడా పర్యవేక్షణలో సరికొత్త హంగులతో నిర్మితమవుతున్న వరంగల్ మోడ్రన్ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం కనబడుతోంది. నెలలు గడుస్తున్నా ఇంకా ఆరంభ దశలోనే పనులు ఉండడంతో అటువైపుగా వచ్చే ప్రయాణికులకు తాత్కాలిక బస్టాండ్‌తో తిప్పలు తప్పడం లేదు. అలాగే వరంగల్, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు, భూనిర్వాసితులకు పరిహారం సకాలంలో అందక ఆలస్యమవుతోంది.జెట్‌స్పీడ్‌లా ఎయిర్‌పోర్టు భూసేకరణ మామునూరు విమానాశ్రయానికి 223 ఎకరాల భూసేకరణ కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు, అక్టోబర్ 17న మరో రూ.90 కోట్ల మంజూరుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అధికారులు భూసేకరణను వేగవంతం చేశారు. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని 253 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది. 223 ఎకరాల్లో ఇప్పటివరకు 180 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి భూనిర్వాసితుల ఖాతాల్లో రూ.220 కోట్లను రెవెన్యూ అధికారులు జమచేశారు. మరో రూ.40 కోట్లు బిల్లులను చెల్లింపునకు సిద్ధంగా ఉంచారు. కోర్టు వివాదాల్లో 15 ఎకరాలుండగా ఆ మేరకు డబ్బులను జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు. అలాగే, సాదాబైనామాకు సంబంధించి భూమి ఐదెకరాలు ఉండడంతో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉందనే వివరాలపై క్షేత్రస్థాయిలో అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే, మరో పదెకరాల పట్టా పాస్‌బుక్కులు, 12 మంది ఇంటి యజమానుల వివరాలను పరిశీలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల ఇసుక రీచ్‌ల నుంచి సరఫరా చేసేందుకు టీజీఎండీసీ కేటాయించిందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన సాండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో సోమవారం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా అంశంపై అధికారులతో ఆమె చర్చించారు. ఇసుక అవసరాల వివరాలతో భూపాలపల్లి కలెక్టర్‌కు లేఖ రాయాలని పీడీ హౌసింగ్ అధికారిని ఆమె ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుక పరిమాణాన్ని ఇంజనీరింగ్ విభాగాల వారీగా తెలియజేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, ఇన్చార్జ్ పీడీ, హౌసింగ్ అధికారి శ్రీవాణి, మైనింగ్ ఏడీ రవికుమార్, తహసీల్దార్లు విజయ్‌సాగర్, శ్రీనివాస్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు. యూరియాపై కలెక్టర్ సమీక్ష ఖిలా వరంగల్: కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కలిసి యూరియాపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సీజన్ 2025 –26లో జిల్లావ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 1,12,345 ఎకరాల్లో సాగువుతున్నాయని తెలిపారు. గత యాసంగి 2024, డిసెంబర్ 28 వరకు 12,543 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగా, ఈసారి 2025, డిసెంబర్ 28వ తేదీ వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం జిల్లాలో డీలర్ల షాపుల్లో 434 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం 1,65,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదనపు యూరియా కౌంటర్లు ఏర్పాటుచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేసేలా చూడాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ అనురాధ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఏఈఓ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాంఅభివృద్ధి.. ఆకట్టుకునేలా! పాకాల.. పచ్చందాలకు నెలవు. ఆహ్లాదకర వాతావరణానికి నిలయం. పక్షుల కిలకిలరావాలు, సరస్సులోని నీటి అలల సవ్వడి, చిలకలగుట్ట అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్నా.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి (అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని ఆమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవంతో భావన, మేఘనరాణి అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం తెల్ల వారుజామున మీ అమ్మాయిలు మృతిచెందారని అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చర్యలు
● ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ హాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం దరఖాస్తులు 151 వచ్చాయి. వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 82, జీడబ్ల్యూఎంసీకి 30, ఇతర శాఖలకు సంబంధించినవి 39 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్రమ పట్టాను రద్దు చేయాలి మా కోడలు మా భూమిని అక్రమంగా పట్టా చేసుకుంది. దాన్ని రద్దు చేయాలి. మా కుమారుడు చనిపోవడంతో ఆయన ఉద్యోగాన్ని అనుభవిస్తూ మా బాగోగులు చూసుకోకుండా మా భూమిని పట్టా చేసుకుంది. – అయిలయ్య దంపతులు, గుండ్రపల్లి, నెక్కొండ -
మెరుగైన వైద్యసేవలే మా లక్ష్యం
ఎంజీఎం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. చలికాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు వస్తున్న న్యూమోనియా వంటి వ్యాధులకు పిల్లల విభాగంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. వైద్యులు, వైద్య సిబ్బంది రోస్టర్‌పై ప్రత్యేక దృష్టి సారించి జనవరి ఒకటో తేదీ నుంచి కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టుబోతున్నామని పేర్కొన్నారు. కిందిస్థాయి సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యంపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంజీఎం ఆస్పత్రిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వైద్య సేవలను మెరుగుపరుస్తున్నామని వివరించారు. ఎంజీఎం ఆస్పత్రిలో అందుతున్న సేవలు, నెలకొన్న సమస్యలపై సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజల సందేహాలకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి సమాధానమిచ్చారు. ప్రశ్న: చలికాలంలో చిన్నపిల్లల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – మహేందర్, నల్లబెల్లి సూపరింటెండెంట్: చలికాలంలో చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారు చలిబారిన పడకుండా స్వెటర్, మఫ్లర్, ఉన్ని దుస్తులు ధరించేలా చూడాలి. అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు తీసుకెళ్లకూడదు. చలికాలంలో వచ్చే జలుబు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్న: జలుబు, దగ్గుకు ఏ చికిత్స తీసుకోవాలి?– రాజ్‌యాదవ్, వేలేరు, వీరేందర్, శాయంపేట సూపరింటెండెంట్: సాధారణంగా చలికాలంలో జలుబు, దగ్గువంటి వాటిపై చిన్నపిల్లలు, వృద్ధులు అశ్రద్ధ వహించకూడదు. జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియాగా మారే ప్రమాదం ఉంది. తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్యుడి సూచనల మేరకు ఔషధాలు వాడాలి. ప్రశ్న: ఎంజీఎంలో మెరుగైన సేవల కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? – స్వరూప్‌రెడ్డి, సుబేదారి సూపరింటెండెంట్: ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వైద్యుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించాం. వైద్య సిబ్బంది, పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది రోస్టర్ల మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. సిబ్బంది అవినీతిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: గురక, ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స అందిస్తారా? – శ్రవణ్, కాశిబుగ్గ సూపరింటెండెంట్: గురక, ఊపిరితిత్తుల సమస్యల చికిత్స కోసం టీవీ ఆస్పత్రిని సంప్రదించాలి. హనుమకొండలోని కేయూ క్రాస్ రోడ్డు వద్ద ప్రభుత్వ పరిధిలో ప్రత్యేక టీబీ ఆస్పత్రి ఉంది. ఇలాంటి వ్యాధులకు కావాల్సిన ఎంఆర్ఐ, సీటి స్కాన్ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంజీఎం ఆస్పత్రిలో చేస్తాం. ప్రశ్న: కొండనాలుక వాపునకు ఏం చేయాలి? – కుమార్, నల్లబెల్లి సూపరింటెండెంట్: ఎంజీఎంలోని ఈఎన్టీ విభాగంలో ఇలాంటి నొప్పులకు చికిత్స అందిస్తాం. ఆస్పత్రిలో ఓపీ విభాగం సేవలను మెరుగుపర్చాం. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈఎన్టీ వైద్యుల వద్ద చికిత్స పొందవచ్చు. ప్రశ్న: ఈసీజీ సేవలు అందుబాటులో ఉన్నాయి? – శివాజీ, ఖిలా వరంగల్ సూపరింటెండెంట్: ఆస్పత్రిలో సాంకేతిక లోపంతో మరమ్మతులకు గురైన పరికరాలపై దృష్టి సారించాం. వారం రోజుల్లో మరో ఆరు ఈసీజీ పరికరాలు అందుబాటులోకి వస్తాయి. క్యాజువాలిటీతో పాటు కీలక విభాగాల్లో ఈసీజీ సేవలను అందించేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేశాం. ప్రశ్న: ఎంజీఎంలో సేవలపై ప్రజల్లో ఉన్న అపోహలను ఎలా తొలగిస్తారు? – సరిత, కరీమాబాద్ సూపరింటెండెంట్: ఎంజీఎంలో వైద్య సేవలను మెరుగుపరుస్తూ రోగులను సంతృప్తి పరుస్తాం. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాం. సమస్య తిరిగి పునరావృత్తం కాకుండా శాశ్వత కోణంలో పరిష్కారానికి శ్రీకారం చుడుతున్నాం. పిల్లలకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నాం చలికాలంలో జాగ్రత్తలు తప్పనిసరి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం వైద్యుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించాం సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 167 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్‌ది ప్రత్యేక స్థానం. హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన మహానగరమిది. ఈ జిల్లాలో గడిచిన ఏడాదికాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయి.. వస్తున్నాయి. వచ్చినవాటిలో కొన్ని ఆగగా, మరికొన్ని పనులు సాగుతున్నాయి. మరింత ముందడుగు పడి.. పనుల్లో వేగం, పారదర్శకత పెరిగితే 2026లో ఓరుగల్లు తెలంగాణ సిగలో మెరవనుంది. ‘గ్రేటర్’లో పనుల సందడి హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది ఒకేసారి రూ.4,962.47 కోట్లు కేటాయించింది. ఇందులో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ (రూ. 4,170 కోట్లు), మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ (రూ. 205 కోట్లు) వంటివి ఉన్నాయి. పద్మాక్షిగుట్ట, ఎన్జీఓస్ కాలనీల్లో లైటింగ్, గ్రీనరీ, డ్రెయినేజీ పనులు ఉన్నాయి, ముఖ్యంగా గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి ఆలయ అభివృద్ధికి దశల వారీగా సుమారు రూ.40 కోట్ల వరకు కేటాయించారు. భద్రకాళి ఆలయానికి కొత్తశోభ వచ్చేలా మధురై తరహాలో మాఢవీధుల నిర్మాణం పనులకు డిజైన్ చేశారు. డీపీఆర్ దశలో యూజీడీ వరంగల్ నగరంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ (యూజీడీ) ఏర్పాటు కీలక ప్రాజెక్ట్. ప్రభుత్వం ఇప్పటికే రూ.4,170 కోట్ల నిధులను కేటాయించగా, పనులకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. యూజీడీ పూర్తయితే నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం, వరద నియంత్రణ, జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుంది. దీనికి సంబంధించి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతుండగా.. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఊసే లేని మెట్రో రైలు... 2025లో ఓరుగల్లు మెట్రోరైలు ఊసే రాలేదు. కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ మహానగరంలో మెట్రో నియోరైలు తీసుక రావడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కూడా 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేరింది. ఏటా బడ్జెట్ సమయంలో తెరమీదకు వచ్చే ఈ ప్రాజెక్టు పేరు ఈ ఏడాది అసలే లేదు. ఔటర్ రింగ్‌రోడ్డు త్వరలోనే.... వరంగల్ నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంది. దీనికి రూ. 669 కోట్లను మంజూరు చేశారు. ఔటర్ రింగు రోడ్డు పనులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు. టెక్స్టైల్ పార్కు స్థలంలోనే ఈ శిలాఫలకం కూడా వేశారు. ఆ తర్వాత చాలాకాలం పనులు నిలిచిపోగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులపై మళ్లీ దృష్టి సారించింది. ఐటీలో అనుకున్నంత లేని ఊపు.. 2016లో ఐటీ పార్కును మడికొండ (రాంపూర్)లో ఏర్పాటు చేసింది. దీంతో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చాయి. సయాంట్, జెన్‌ప్యాక్ట్, క్వాడ్రంట్ రిసోర్సెస్‌తో పాటు సాఫ్ట్‌పాత్ వంటి సంస్థలు ఓరుగల్లులో తమ బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నాయి. ప్రముఖ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ సిఫీతో పాటు మరో రెండు.. ఏడాది క్రితం ఎంఓయూ కుదుర్చుకున్నా.. గతంలో తెరిచిన సంస్థలు తప్ప కొత్తగా వచ్చింది లేదు. హనుమకొండ జిల్లాలో అభివృద్ధి పనులు.. హనుమకొండ జిల్లాలో రైల్వే లైన్ విస్తరణ, స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయి. అనేక కొత్త ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ● ముఖ్యంగా హసన్‌పర్తి–వరంగల్ మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం, వరంగల్ ట్రై సిటీ అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ● కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ● కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో భూముల వేలం, రియల్ ఎస్టేట్ ప్లాట్ల అమ్మకం, జంక్షన్లు, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ● భీమదేవరపల్లి మండలం వంగరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు వేగంగా నడుస్తున్నాయి. ● దామెర మండలం ఊరుగొండ మీదుగా హనుమకొండ జిల్లాలో ఎన్‌హెచ్ 163ఎలో 4–లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ పనులు సాగుతున్నాయి.మడికొండలోని ఐటీ హబ్ఇంటర్నల్ రింగ్ రోడ్డుకొనసాగుతున్న వరంగల్ నూతన బస్టాండ్ పనులుఏడాదికాలంలో తడబడుతూ.. పరిగెడుతూ.. ‘గ్రేటర్’ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ‘స్మార్ట్‌సిటీ’, ‘అమృత్’తో పనులు సుందరనగరం కోసం పరుగులు.. ‘కుడా’, జీడబ్ల్యూఎంసీ నిధులు డీపీఆర్ దశలో యూజీడీ.. ‘ఔటర్’ పూర్తయితే మహర్దశ పారదర్శకత, పనుల్లో వేగం పెరిగితే 2026లో మరింత పురోగతి -
ఇంకా ఆలస్యమే..
సాక్షి, వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. ఇది పూర్తయితే ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా అక్కడ మరో 500 పడకలతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ మామునూరు విమానాశ్రయానికి 223 ఎకరాల భూసేకరణ కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు, అక్టోబర్ 17న మరో రూ.90 కోట్ల మంజూరుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అధికారులు భూసేకరణను వేగవంతం చేశారు. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని 253 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది. నింపాది పనులతో తప్పనితిప్పలు వరంగల్ పాత ఆజంజాహీ మిల్లు మైదానంలో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ● మూడెకరాల్లో ఐదంతస్తుల ప్రణాళికతో ‘కుడా’ పర్యవేక్షణలో సరికొత్త హంగులతో నిర్మితమవుతున్న వరంగల్ మోడ్రన్ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ● అమృత్ భారత్ పథకం కింద రూ.25.41 కోట్ల నిధులతో వరంగల్ రైల్వే స్టేషన్‌ను కార్పొరేట్ సదుపాయాలతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా అధికారులు తీర్చిదిద్దారు. నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి -
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్న.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని అమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవడంతో భావన, మేఘన రా ణి అక్కడికక్కడే మృతిచెందారు. మీ అమ్మాయిలు మృతిచెందారని సోమవారం తెల్లవారుజామున అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత.. గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ, వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు హనుమకొండ కలెక్టరేట్లో.. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్నపేట: కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ నగరానికి చెందిన బలభక్తుల శ్రీహరి మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాశ్వత ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్‌గౌడ్, ట్రెజరర్ లక్ష్మి, కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. బలభక్తుల శ్రీహరి ప్రస్తుతం బాలసముద్రంలోని ఎల్ఐసీ డివిజనల్ ఆఫీస్‌లో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్ఐసీ జోనల్, ఆలిండియా పోటీలలో కూడా శ్రీహరి అనేక పతకాలు సాధించారు. రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో హైదరాబాద్ భగవాన్ మహావీర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ ఆదివారం ముగిసిందని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో (శని, ఆదివారం) శిబిరం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 200 మందికి పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్లు, వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
మిమిక్రీ కళను చాటిన నేరెళ్ల
హన్మకొండ కల్చరల్: మిమిక్రీ అనే ఒక కళ ఉందని చాటి చెప్పిన మహానుభావుడు నేరెళ్ల వేణుమాధవ్ అని సినీ, మిమిక్రీ కళాకారుడు ఫన్స్టార్ శివారెడ్డి అన్నారు. వేణుమాధవ్ రాసిన మిమిక్రీ కళ వ్యాకరణం పుస్తకంతో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్వన్యనుకరణ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతిని ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించారు. వేణుమాధవ్ కళాప్రాంగణంలో స్మారక ప్రతిభా పురస్కార ప్రదానం, మిమిక్రీ కళాకారుల స్వరార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి, కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, జబర్దస్త్ ఫేమ్, సినీనటుడు రాకింగ్ రాకేశ్, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ నిర్వాహకురాలు నేరెళ్ల శోభావతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్‌కు చెందిన కవి, కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళిని శాలువా, జ్ఞాపికతో సన్మానించి పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడుతూ నేరెళ్ల వేణుమాధవ్ ప్రతిభా పురస్కారం ప్రతిష్టాత్మకమైందని పేర్కొన్నారు. వేణుమాధవ్ శిష్యుల మిమిక్రీ ప్రదర్శన ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనాఽథ్, నేరెళ్ల రాధాకృష్ణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.సినీ, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి -
రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు
రైతులు సాంకేతికతను, మార్కెట్ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఎఆర్ఎస్) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్ ద్వారా హైబ్రిడ్ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్ పాండల్స్, మల్చింగ్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. -
ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివని వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి కొనియాడారు. నాడు నిధుల లేమి ఉన్నప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకొని పరిశోధనలు జరిగాయని పేర్కొన్నారు. నాటి విద్యార్థులు దేశవిదేశాల్లోని ఫార్మసీ రంగంలో స్థిరపడి యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టను పెంచారని పేర్కొన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ కూడా గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగిడిందని పేర్కొన్నారు. ప్రముఖ ఫార్మసీ సంస్థ అరబిందో లిమిటెడ్ ఫార్మసీ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, ఇంటర్న్‌షిప్‌లు, ఇండస్ట్రియల్ విజిట్‌కు అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఫార్మసీ పూర్వ విద్యార్థులు నాలుగు ఎండో మెంట్లెక్చర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్ట్ ఉండాలి.. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల తమకు జీవితాన్ని నేర్పిందని, అభ్యాసనలో క్రమశిక్షణ అవసరమని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి, అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి అన్నారు. రోగి దృక్పథంతో ఆలోచించాలని, పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్టు ఉండాలని, డ్రగ్ తయారీలో క్రిటికల్‌గా అంచనా వేయాలని సూచించారు. మెడికేషన్‌లో నూతన పోకడలు మెడికేషన్‌లో నూతన పోకడలు వచ్చాయని, డ్రగ్ లోపాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో పార్మసీ డీన్ డాక్టర్ మన్సూర్ఖాన్ అన్నారు. గొప్ప డ్రగ్స్ యూనివర్సిటీ ల్యాబ్‌ల్లో తయారైనవేనని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ కొలాబరేషన్ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఉపయోగపడుతుందన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాల కన్వీనర్, ప్రవాస భారతీయుడు డాక్టర్ సాంబారెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి ఫార్మసీకి ఉందన్నారు. పూర్వవిద్యార్థులు తోట రాజు, జె.రాజమౌళి మాట్లాడుతూ సమాజహితంగా సైన్స్ ఉండాలని, మార్కెటింగ్‌పై పట్టుపెంచుకుని ఉత్పాదనపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సునీతారెడ్డి, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, ఆచార్యులు వై.నర్సింహారెడ్డి, వి.కిషన్, వి.మల్లారెడ్డి, స్వరూపారాణి, నాగరాజు, షాయోదా, పూర్వ విద్యార్థులు డాక్టర్ సూర్యకుమార్, చక్రవర్తి, హరీశ్చంద్ర పాల్గొన్నారు. కేయూను సందర్శించిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం కేయూను ఫార్మసీ పూర్వవిద్యార్థులు సందర్శించారు. వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి ముగిసిన ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు -
చట్టసభల్లో ప్రస్తావించాలి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్)లో యువతకు ఉద్యోగాలివ్వాలని శని, ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుళ్లపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డిని కలిసి ఉమ్మడి జిల్లాకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రైల్వే యాక్ట్ అప్రెంటీస్ పూర్తి చేసిన పిల్లలకు, తెలంగాణ నిరుద్యోగులకు 35 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై శనివారం రాజకీయ పార్టీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ అంశాలను ప్రస్తావించాలని కోరారు. ముఖ్యమంత్రితో రైల్వే మంత్రికి ఉత్తరం రాయించేలా ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరారు. వినతి పత్రాలు ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌యాదవ్, విజయశ్రీ రజాలి, జలగం రంజిత్‌రావు, సంపత్‌రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, సీపీఐ నాయకులు మద్దెల మల్లేశం, వెంకటరాజ్యం, వివిధ పార్టీల నాయకులు, అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చిన రైల్వే జేఏసీ బృందం -
వేతన వెతలు
దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి ప్రతిఒక్కరికీ ఆహార కొరత లేకుండా చూడాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. దీంతో వలసలు తగ్గిపోవడంతో పాటు ప్రతీ కుటుంబం కొంత ఆర్థిక ప్రగతి సాధించింది. జిల్లాలోని 11 గ్రామీణ మండలాలు 325 గ్రామాల్లో 1.19 లక్షల జాబ్ కార్డులు ఉండగా 2.37 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. వీరిలో 75 వేల జాబ్‌కార్డులకు చెందిన 1.26లక్షల మంది పనులు చేస్తున్నారు. వీరికి పని కల్పించడంతో పాటు పనులు చేయించడం, వేతన బిల్లులు అందించడానికి ఉపాధి సిబ్బంది పని చేస్తున్నారు. రూ.1.22కోట్ల బకాయిలు.. జిల్లా వ్యాప్తంగా 172 మంది ఫీల్డు అసిస్టెంట్‌ట్లు, 11 మంది ఏపీఓలు, 10 మంది ఈసీలు, 36 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 23 మంది సీఓలు పనిచేస్తున్నారు. వీరందరికి గత మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ. 10వేల వేతనం కాగా రూ. 51.60 లక్షలు, ఏపీఓలకు రూ.13.20 లక్షలు, ఈసీలకు రూ. 15 లక్షలు, టీఏలకు రూ.25.92 లక్షలు, సీఓలకు రూ.16.56 లక్షలు ఇలా మొత్తంగా రూ.1.22 కోట్లకుపై వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. చాలీచాలని వేతనమైన వెట్టిచాకిరి చేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు పూటగడవక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు అయినా వేతనాలు రాకపోతాయా అని ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉపాధి సిబ్బందికి అందని వేతనాలు పూట గడవక ఇబ్బందులు జిల్లాలో రూ.1.22 కోట్ల బకాయిలుభవిష్యత్పై ఆశతో పనిచేస్తున్నాం.. గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం ప్రతీ నెల వేతనం అందించాలి. ఇచ్చే వేతనం చాలా తక్కువ అయినా.. భవిష్యత్ బాగుంటుందనే ఆశతో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యక్రమమైన తాము పాల్గొని ప్రజల్లోకి చేరవేస్తున్నాం. ప్రభుత్వం వచ్చే సంక్రాంతి పండుగ వరకై న వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి. – కేలోతు స్వామిచౌహాన్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రతీ నెలా వేతనాలు చెల్లించాలి.. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న ఎఫ్‌ఏలు, టీఏలు అందరూ వచ్చే వేతనంతోనే కుటుంబం గడుస్తుంది. అలాంటిది ప్రభుత్వం ప్రతీ నెల వేతనం అందించకపోవడంతో ఇల్లు గడవటం, పిల్లల ఫీజలు చెల్లించలేని పరిస్థితి ఉంది. పలు కుటుంబాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు, అధికారులు స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయాలి. – ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
జూలై వరకు లోటు వర్షపాతం..
ఉమ్మడి వరంగల్‌లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. -
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైంది
● ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి సంగెం: ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని, తరగతి గదుల్లోనే దేశభవిష్యత్‌ను తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం సంగెం మండలంలోని లోహిత జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన నూకల అంజివర్ధన్రెడ్డి ఆత్మీయ సన్మానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు విధి నిర్వహణను అంకితభావంతో పనిచేస్తే విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. ఉద్యోగ విరమణ పొందిన అంజివర్ధన్రెడ్డిని ఘనంగా సన్మానించారు. విధుల్లో ఉన్నప్పుడు చేసిన పనులే గుర్తింపునిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ వరంగల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రవీందర్‌రెడ్డి, మహేందర్, యాకూబ్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, గాఫార్, విజయ్‌కుమార్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో నేడు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించవచ్చు. తేదీ: 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 97044 58273 -
సాగు హుషారు.. ‘మోంథా’తో బేజారు!
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా వరి దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్రంగా నిరాశ పర్చింది. వానాకాలం సీజన్లో 10,39,815 మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్‌సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 24 నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. తేమ పేరిట కనీస మద్దతు ధరలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ఎకరానికి పత్తి దిగుబడి 10–15 క్వింటాళ్లు వస్తుందని భావించగా ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించారు. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 చెల్లించినట్లు రైతులు వాపోయారు. -
యాప్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. యాప్ నిర్వహణలో వ్యవసాయ శాఖ, ఎరువుల డీలర్ల పాత్రను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. సొంత భూమిలో సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, తదితర రైతులు తమ సెల్‌ఫోన్, ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయి యాసింగి–2025–26లో సాగు చేయనున్న పంట వివరాలను నమోదు చేయాలి. పంట వివరాలు నమోదు చేసిన అనంతరం జిల్లాలోని ఎరువుల డీలర్ల వద్ద జాబితా, వారి వద్ద అందుబాటులో ఉన్న యూరియా బస్తాల వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. సాగుకు అవసరమైన యూరియాను దఫాల వారీగా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. యూరియా బుకింగ్ అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడీనంబర్ వస్తుందని, ఆ ఐడీ నంబర్‌తో పాటు ఆధార్, పట్టాదారు పాస్‌బుక్ తీసుకుని సమీప డీలర్ వద్ద యూరియా పొందవచ్చన్నారు. అయితే యూరియా స్లాట్ బుకింగ్‌కు సంబంధించి బుకింగ్ ఐడీ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు.యాప్ ద్వారా యూరియా స్లాట్ బుకింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
తగ్గిన దిగుబడి.. దక్కని మద్దతు ధర
ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా వరి దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్రంగా నిరాశ పర్చింది. వానాకాలం సీజన్లో 10,39,815 మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్‌సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 24 నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. తేమ పేరిట కనీస మద్దతు ధరలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ఎకరానికి పత్తి దిగుబడి 10–15 క్వింటాళ్లు వస్తుందని భావించగా ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించారు. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 చెల్లించినట్లు రైతులు వాపోయారు. -
వరంగల్
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025తల్లులకు తనివితీరా మొక్కులు మేడారం సమ్మక్క, సారలమ్మలకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆదివారం వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, కందులు తదితర పంటలను విరివిగా పండిస్తారు. ప్రభుత్వం ఆధునికీకరణ, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తరచూ నష్టపోతున్నారు. సాగు సమయంలో వర్షాలు.. గోదావరి జలాల కోసం ఎదురుచూశారు. వానాకాలం, యాసంగిలో ఎరువుల కొరత వెంటాడింది. రోజుల తరబడి ఎరువుల దుకాణాల ఎదుట ‘క్యూ’ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు చేతికందే సమయంలో ‘మోంథా’ తుపాను కాటేసింది. పంటలు వేసే సమయంలో భరోసా దొరకని రైతులకు దెబ్బతిన్న పంటలపై ధీ(బీ)మా దొరకలేదు. కాస్త చేతికందిన పంటలకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకలేదు. ఫలితంగా రైతులు 2025లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. దుగ్గొండి మండలం నాచినపల్లిలో మోంథా తుపాను ప్రభావంతో మొలకలు వచ్చిన దూదిపింజలు (ఫైల్) ఖానాపురం మండలం రంగాపురంలో నేలవాలిన వరి (ఫైల్) తేదీ 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 9704458273 -
రేపు వైకుంఠ ఏకాదశి
● వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ● ఊకల్‌లో శ్రీరంగనాథుడిగా నాగసుబ్రహ్మణ్యుడి దర్శనం గీసుకొండ: జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేవతామూర్తులను ఉత్తర ద్వార దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గీసుకొండ మండలంలోని ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు ఆదివారం తెలిపారు. విష్ణుమూర్తి మేనల్లుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడన్నారు. ఉత్తర ద్వార దర్శనంతో సర్వపాపాలు తొలుగుతాయన్నారు. గర్భాలయంలో శేషపాన్పు (సర్పం)పై పడుకుని నిద్రిస్తున్నట్లు భక్తులకు దర్శనం ఇస్తాడన్నారు. దీనికి సంబంధించిన విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ఆలయంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవాలన్నారు. -
సింహగర్జన సభను విజయవంతం చేయాలి
నర్సంపేట: ఓసీ సింహగర్జన బహిరంగ సభకు రెడ్డి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు రెడ్డి సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘం అధ్యక్షుడు కంది గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ, నూతన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహ్మదాపురం, మధిర, బుధరావుపేట, గోపాలపురం, చెన్నారావుపేట, ముదిగొండ గ్రామాల సర్పంచ్‌లుగా ఎన్నికై న వారిని జైపాల్‌రెడ్డితో పాటు జగిత్యాల జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మొట్ల వెంకటరమణారెడ్డి, నర్సంపేట అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ పున్నం రవీందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అండ్రు రాజేంద్రప్రసాద్రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 11వ తేదీన నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది గోపాల్‌రెడ్డి, ఎర్ర యాకుబ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, మొట్ల లావణ్య, గోగుల శ్రీనివాస్రెడ్డికోమల, కటుకూరి వీరారెడ్డి, పరుపాటి పద్మారఘుపతిరెడ్డి, శ్వేతాచైతన్యరెడ్డి, పొన్నం రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో 25వ మండల పూజ ముగింపు వైభవంగా నిర్వహించారు. ఈ పడిపూజలో ఇరుకు కోటేశ్వర్రావు, సాగర్, బండారుపల్లి చెంచారావు, రాజేంద్ర, త్రివేణి, నాగేశ్వర్, కుసుమ కుమారి పాల్గొనగా బ్రహ్మశ్రీ శ్రీమాన్ కె.పద్మనాభనమోద్రి కేరళ వాస్తవ్యులు తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాలధార స్వాములు, భక్తులు పాల్గొనగా పదునెట్టాంబడిపై మాలధార స్వాములు ఇరుముడితో దర్శనం చేసుకోగా దివ్య పడిపూజ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, ఆలయ అధ్యక్షుడు సైఫా సురేష్, దొడ్డ రవీందర్, అర్చకులు, స్వాములు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిన్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం నర్సంపేట రూరల్: చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి సబ్ స్టేషన్లో 33/11కేవీలో విద్యుత్ మరమ్మతు కారణంగా నేడు (సోమవారం) ఉదయం 9 నుండి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని నర్సంపేట డీఈ తిరుపతి, నెక్కొండ ఏడీఈ శ్రీధర్, చెన్నారావుపేట ఏఈ సంపత్‌లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నారావుపేట మండల ప్రజలు సహకరించాలని కోరారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికఖానాపురం: మండలంలోని సైనిక్‌స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఆదివారం ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లోని జమాల్‌పూర్‌లో ఈనెల 23 నుంచి 28 వరకు నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ అండర్–19 ఖోఖో పోటీల్లో సైనిక్‌స్కూల్ విద్యార్థి చందు ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపిౖకైనట్లు తెలిపా రు. అలాగే ఇటీవల ములుగులో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ కరాటే పోటీల్లో అండర్–19 విభా గంలో రామ్ చరణ్ ప్రథమ బహుమతి సాధించి జాతీయస్థాయిలకు ఎంపికయ్యారన్నారు. డై రెక్టర్ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు బట్టల షాపు దగ్ధంనర్సంపేట రూరల్: ప్రమాదవశాత్తు అగ్ని ప్ర మాదం చోటు చేసుకుని బట్టల షాపు దగ్ధమైన సంఘటన చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో ఆదివారం చోటుచేసుకుంది. బూ ర్ణం స్వర్ణలత టైలర్షాపుతోపాటు బట్టల షాపు నడిపిస్తుంది. ఆదివారం ఉదయం షాపులో దే వుడి వద్ద దీపం వెలిగించి పని నిమిత్తం బయటకు వెళ్లింది. దీంతో ప్రమాదవశాత్తు మంట లు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రభు త్వం ఆదుకోవాలనిబాధితురాలు కోరుతుంది. -
నాణ్యమైన భోజనం అందించాలి
వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు అన్నారు. ఆదివారం మండలంలోని ఇల్లంద కస్తూర్భాగాంధీ పాఠశాలలో పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వంట కార్మికులకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి దుగ్గొండి మండలం రూ.1,500, రెండో బహుమతి వర్ధన్నపేట మండలం రూ.1,000, మూడో బహుమతి పర్వతగిరి మండలం రూ.500 బహుమతులు గెలుచుకున్నట్లు డీఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని నిత్యం పరిశీలిస్తూ నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలన్నారు. గతంలో కంటే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కరుణశ్రీ,, వివిధ మండలాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు -
ఎరువుల కోసం తండ్లాట!
సాగు సమయంలో పంటలకు సరిపడా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు లభించక రైతులు రోజుల తరబడి దుకాణాల చుట్టూ ఎరువుల కోసం తిరిగారు. ఎన్నో ఇబ్బందులు పడి ఎరువులు దక్కించుకుని తెగుళ్లు, కలుపు భారం నుంచి బయటపడ్డ రైతులను పంట చేతికందే సమయంలో ‘మోంథా’ ముంచేసింది. కల్లాలకు తరలించిన ధాన్యం కొట్టుకుపోయింది. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, వారికి ఎలాంటి బీమా దక్కకపోగా, ఆ మేరకు పరిహారం అందలేదని పలు సందర్భాల్లో రైతులు వెల్లడించారు. -
ఇన్నర్ రింగ్‌రోడ్ పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్‌రోడ్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. రింగ్ రోడ్ పనుల పురోగతిపై బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టరేట్లో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా ఖిలా వరంగల్, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా నిర్మాణంలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్‌రోడ్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు సమగ్ర నగరాభివృద్ధికి జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సుమ, కుడా పీఓ అజిత్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. మద్ది మేడారం జాతరపై సమీక్ష నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28 నుంచి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో జాతర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతర కాలంలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. రోడ్ల అభివృద్ధి, ఆలయ పరిసరాల పరిశుభ్రత, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వైద్యసేవలు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలు, వాహనాల రద్దీ నివారణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాల కేటాయింపు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. జాతరలోపు పనులు పూర్తియ్యేలా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, రోడ్డు భవనాల శాఖాధికారి రాజేందర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఇజ్జగిరి, డీపీఓ కల్పన, ప్రధాన పూజారి నాగరాజు, రెవె న్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తాం..
దుగ్గొండి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా చాలాచోట్ల 10లోపు ఓట్ల తేడాతో వెలువడిన ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి, తిమ్మంపేట, మహ్మదాపురం, మర్రిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఓటమి పాలైన యార మోహన్‌రెడ్డి, ఓడేటి వనిత తిరుపతిరెడ్డి, అక్కపెల్లి సుజాత, ఆడెపు రాజు, పెండ్లి ఉమాదేవి, కందిపల్లి నవనీతను పరామర్శించి, అధైర్య పడవద్దని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు, అధికారులు తమ పార్టీ బలపిర్చన అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేసి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి, మాజీ ఎంపీపీ కాట్ల భద్రయ్య, నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజుకుమార్, బొబ్బరోనిపల్లి సర్పంచ్ శంకేసి కమలాకర్, తదితరులు పాల్గొన్నారు. -
నియంత్రణలో నేరాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రజలకు ఇబ్బంది కలిగించే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు, ఇది మనం రక్షించడానికి ప్రమాణం చేసిన సమాజంలో సమష్టి ధృఢ సంకల్పం, భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నియంత్రణలో నేరాలు ఉన్నాయని తెలిపారు. నేరాల అదుపు, కేసుల పరిశోధనలో కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిలలోని పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని నూతన విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ సీపీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక – 2025 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా శాంతిభద్రతలకు సంబంధించి నివేదికలోని వివరాలను వెల్లడిస్తూ గత ఏడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల పెరిగిందని గత ఏడాది 14,412 కేసులు నమోదు కాగా ప్రస్తుత సంవత్సరం 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. రాబోవు 2026 నూతన సంవత్సరంలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సహకారం నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శాంతి భద్రతల పరిరక్షణే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్‌లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం కమిషనరేట్ పోలీసుల పనితీరు సంతృప్తికరం 2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడి వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక–2025 ఆవిష్కరణ -
యూరియా కోసం బారులు
● తోపులాటలో గాయపడిన మహిళ రైతు నెక్కొండ: యాసంగి సాగు చేస్తున్న రైతులు.. యూరియా బస్తాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని నెక్కొండ, రెడ్లవాడ రైతు వేదికల్లో యూరియా వచ్చిందన్న సమాచారం మేరకు శనివారం తెల్లవారుజామున, ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా రైతులు చేరుకున్నారు. రెడ్లవాడ పీఏసీఎస్‌కు కేటాయించిన యూరియా బస్తాలు రైతు వేదికకు రావడంతో రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రెడ్లవాడ శివారు మూడెత్తుల తండాకు చెందిన మహిళ రైతు మూడు విజయ కిందపడిపోగా, ఆమె కాలుకు గాయమైంది. విజయను నెక్కొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆమె భర్త సుమన్ తరలించాడు. కాగా, పీఏసీఎస్‌లు, హాకా సెంటర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు యూరియా పంపిణీ చేస్తున్నా అవి రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. మొక్కజొన్న పంటకు మొదటి, రెండో దఫాల్లో ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో వారికి ఎదురుచూపులు తప్పడంలేదు. ఈ క్రమంలో ఒకటి, రెండు బస్తాలు మాత్రమే అందించి అధికారులు చేతులెత్తేస్తున్నారు. -
సరిపడా యూరియా ఉంది
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ నెక్కొండ: సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు యూరియా అందిస్తామని, సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ అన్నారు. మండల కేంద్రంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 87,508 ఎకరాలు కాగా, అందుకు సరిపడా యూరియా అక్టోబర్‌లో 3,776 మెట్రిక్ టన్నులు, నవంబర్‌లో 2,769 మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 438 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు వివరించారు. ఇంకా 5,400 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈనెల 26న జిల్లాలోని అన్ని పీఏసీఎస్ కేంద్రాలకు 720 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు చెప్పారు. యాసంగి సీజన్లో రైతులకు కావాల్సిన యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు అవసరం మేర యూరియా వాడుకోవాలని, అవసరానికి మించి యూరియా వినియోగిస్తే భూసారం క్షీణిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఏఓ నాగరాజు, ఏఈఓ వసంత, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
వర్ధన్నపేట: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. ముంపునకు గురవుతున్న మండలంలోని కట్య్రాల గ్రామాన్ని శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలం ఉండి అర్హులైన వారికి, స్థలం లేని కుటుంబాలకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా కాలనీ వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు కారణమవుతున్న మైనార్టీ కాలనీలో ఇళ్ల మీదుగా వెళ్తున్న 11కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించి, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తి పనులను త్వరగా పూర్తిచేయాలిసంగెం / గీసుకొండ: ఉపాధి హామీ పనులు ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న పనులన్నింటిని త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులను జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి ఆదేశించారు. సంగెం, గీసుకొండ మండలాల్లో పశువుల పాక, నిర్మాణంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు, నర్సరీలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలకు అవసరమైన మట్టి, విత్తనాలను తెప్పించుకుని ఆయా గ్రామాల్లో ఉపయోగకరమైన మొక్కలు పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో వీఓఏగా పనిచేస్తూ రాజీనామా చేసి కుంటపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన పెంతల సువర్ణను ఆయన అభినందించారు. గీసుకొండ మండలంలోని కొనాయమాకుల, ఊకల్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను రాంరెడ్డి పరిశీలించారు. నర్సరీల్లోని బ్యాగులను ఎర్రమట్టితో నింపి విత్తనాలు పెట్టాలన్నారు. అనంతరం గ్రామాల్లో ఔషధ, నీడనిచ్చే, పూల మొక్కలను నాటాలని సూచించారు. పశువుల షెడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పేర్ల లలిత, సువర్ణ, వజ్ర రాజు, కక్కెర్ల సుభాష్, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓలు గణేష్, చంద్రకాంత్, పంచాయతీ కార్యదర్శులు రవీందర్, వాజీద్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలుకేయూ క్యాంపస్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం కాకతీయ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.విజయచందర్‌రెడ్డి, రాష్ట్ర బాధ్యులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ యువత కోసం తెలంగాణ గోల్డ్‌కప్ క్రికెట్–2025 (ఈస్ట్‌జోన్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల జట్లు ఈటోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. -
రైతు వేదిక వద్ద హృదయ విదారక దృశ్యం
ఖిలా వరంగల్/నర్సింహులపేట: వరంగల్ నగరం ఫోర్ట్ రోడ్డులోని పీఏసీఎస్ కార్యాలయ భవనం వద్ద శనివారం రైతులు యూరి యా కోసం బారులుదీరారు. పీఏసీఎస్‌కు 440 బస్తాల యూరియా రాగా, క్యూలైన్లో సుమారు 600 మంది రైతులు గంటలకొద్దీ నిరీక్షించారు. రైతులు క్యూలైన్లో ఉండగానే యూరియా అయిపోవడంతో అంతసేపు క్యూలో నిల్చున్న రైతులు అందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారి విజ్ఞాన్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపగా సాయంత్రానికి మరో 440 బస్తాల యూరియా వచి్చంది. ఆదివారం ఉదయం యూరియా పంపిణీ చేయనున్నట్లు సొసైటీ సిబ్బంది తెలిపారు. అధికారి కాళ్లపైపడ్డ రైతు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద బస్తారాం తండాకు చెందిన రాజు అనే రైతు మొక్కజొన్న చేనుకు యారియా కోసం శనివారం రెండు గంటలపాటు క్యూలో నిలబడినా దొరకలేదు. తన పంట నష్టపోతుందని వేడుకుంటూ అదే సమయంలో బయటికి వెళ్తున్న ఏఓ కాళ్లపై పడి యూరియా కోసం విజ్ఞప్తి చేశాడు. -
రేపు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో రేపు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించవచ్చు. తేదీ 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్లు 97044 58273 -
రేపటి నుంచి సైన్స్ కార్నివాల్
విద్యారణ్యపురి: హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఈ నెల 29, 30 తేదీల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హడుప్సా జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చి బాబు, జనరల్ సెక్రటరీ ఎం.సంతోశ్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా) ఆధ్వర్యంలో సైన్స్ కార్నివాల్–25 పేరిట నిర్వహించనున్న ఈ సైన్స్‌ఫెయిర్‌కు సంబంధించిన పోస్టర్‌ను శనివారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఆవిష్కరించారు. కడిపికొండలోని విశ్వశాంతి హైస్కూల్లో ‘వాటర్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఎ నర్జీ కన్సర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ అల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్, రిక్రేషన్ మేథమెటికల్ మోడలింగ్, సస్టెయినబుల్ అగ్రికల్చర్’ అనే అంశాలపై ఎగ్జిబిట్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణలో హడుప్సా అధ్యక్షుడు బుచ్చిబాబు, అకడమిక్ కన్వీనర్ వీసీ రామారావు, ట్రెజరర్ డి.శంకర్, బాధ్యులు బి.వెంకటరెడ్డి, ఎం.సంపత్‌రెడ్డి, వై.వెంకటేశ్వర్రావు, కె.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
నియంత్రణలో నేరాలు!
● గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం ● కమిషనరేట్ పోలీసుల పనితీరు సంతృప్తికరం ● 2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడిసాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024తో పోలిస్తే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు. శాంతిభద్రతల రక్షణకు భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నేరాలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కమిషనరేట్ పరిధి వివిధ స్థాయిల పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక –25 సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని వివరాలు వెల్లడిస్తూ గతేడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల సంఖ్య పెరిగిందని గతేడాది 14,412 కేసులు నమోదు కాగా, 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో సమన్వయంతో పనిచేస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సీపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్‌లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. -
ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు
● టీసీఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ● కేయూలో ఈస్ట్ జోన్ గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్ షురూకేయూ క్యాంపస్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం కాకతీయ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.విజయచందర్‌రెడ్డి, రాష్ట్ర బాధ్యులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ యువత కోసం తెలంగాణ గోల్డ్‌కప్ క్రికెట్–2025 (ఈస్ట్‌జోన్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాలకు సంబంధించిన జట్లు ఈటోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. 20 ఓవర్ల మ్యాచ్‌గా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపెల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అలీముద్దీన్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చిలువేరు రాజ్‌కుమార్, బాధ్యులు సామిఅక్మల్, దాసరి శ్రీనివాస్, విష్ణుదాస్, శశాంక్, మరింగంటి నవరాసన్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మ్యాచ్‌లు ఇలా.. హనుమకొండ, ఖమ్మం జిల్లా క్రికెట్ జట్లు మధ్య తొలి మ్యాచ్ నిర్వహించారు. ఇందులో ఖమ్మం జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులకు ఆల్ఔట్ కాగా, తదుపరి బ్యాటింగ్ చేసిన హనుమకొండ జట్టు 102 పరుగులకు ఆల్ఔట్ అయ్యింది. ఖమ్మం జట్టు విజయం సాధించింది. అనంతరం మహబూబాబాద్, ములుగు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహబూబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. జనవరి 1వ తేదీ వరకు ఈక్రికెట్ పోటీలు కొనసాగుతాయి. -
దివ్యాంగులకు ధైర్యం కల్పించాలి
రామన్నపేట: దివ్యాంగుల్లో ధైర్యం నింపడం మన అందరి బాధ్యత అని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో ఐఏఎస్ పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. భగవాన్ మహావీర్ ట్రస్ట్, హైదాబాద్ వారి సహకారంతో శనివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అందించడమంటే వారు తిరిగి నడిచే ధైర్యం కల్పించడమేనని పేర్కొన్నారు. అనంతరం ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఏఎస్ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ.. దివ్యాంగులు ఇతరుల దయపై ఆధారపడే వ్యక్తులు కారని, వారికి సరైన అవకాశాలు అందితే గౌరవంగా, స్వావలంబనతో జీవించగలరన్నారు. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొని శిబిరాన్ని సందర్శించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. శిబిరంలో ఉమ్మడి వరంగల్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 150 మందికిపైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, అవసరాన్ని బట్టి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మహావీర్ ట్రస్ట్ బాధ్యులు ఇంద్రజన్, ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్‌బాబు, అడిషనల్ సీఈఓ రాజేంద్రకుమార్, కీర్తి నాగార్జున, వరంగల్ ఇన్చార్జ్ పరికిపండ్ల వేణు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, నాయకులు కుసుమ సతీశ్, వన్నాల వెంకటరమణ, చిప్ప వెంకటేశ్వర్లు, గాజుల సంపత్, బొజ్జపల్లి సుభాశ్, లింగమూర్తి, ఎలగం చిన్న కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ల పంపిణీ -
లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వే పూర్తి చేయండి
డీఎంహెచ్ఓ అప్పయ్య వేలేరు: లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మల్లికుదుర్ల ఆరోగ్య ఉపకేంద్రం, గుండ్లసాగర్లో నిర్వహిస్తున్న ఔట్ రీచ్ ఇమ్యునైజేషన్ సెషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి నాలుగు ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న లెప్రసీ కేసుల డిటెక్షన్ సర్వే వివరాలు, పీహెచ్‌సీలోని రిజిస్టర్, రికార్డులు, మందులు పరిశీలించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మండలంలో 21,900 మంది జనాభాకు గాను 11 వేల మందికి టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో జనవరి 3లోగా సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గుండ్లసాగర్లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ ఔట్ రీచ్ సెషన్‌ను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు పిల్లలందరికీ పోషకాహారం అందించడంలో టీకాలు ఇప్పించడంలో గర్భిణుల సంరక్షణలో కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ మెడికల్ ఆఫీసర్ నవీన్‌కుమార్, హెల్త్ సూపర్వైజర్ కుమారస్వామి, ప్రభావతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం కాజీపేట: రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయాలని కార్పొరేటర్ విజయశ్రీ రజాలీ అన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో శనివారం తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సహకరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈమేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారయణ మాట్లాడుతూ.. భవిష్యత్ పోరాటంలో యువతను భాగస్వాములను చేయాలన్నారు. జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఒక మంచి లక్ష్యంతో సాగుతున్న ఉద్యమానికి అందరూ మనస్ఫూర్తిగా సహకరించడానికి మరింతగా ముందుకు రావాలని కోరారు. జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, మాజీ కార్పొరేటర్ ఎండీ అబూబక్కర్, నార్లగిరి రమేశ్, కాటపురం రాజు, బి.రంజిత్‌కుమార్, సందెల విజయ్, పి.శివకుమార సుంచు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎన్సీసీ కేడెట్ల ఎంపిక
విద్యారణ్యపురి: న్యూఢిల్లీలో జనవరి 26న జరగనున్న ఆర్డీ (రిపబ్లిక్ డే) పరేడ్‌కు హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్సీసీ కేడెట్స్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి తెలిపారు. జి.వెంకటలక్ష్మి (బీఎస్సీ ఎంపీసీసీఎస్ ఫైనల్ ఇయర్), బి.త్రిష (బీఎస్సీ బీజెడ్సీ ఫైనల్ ఇయర్), ఎ.భార్గవి (బీఎస్సీ ఎంపీసీఎస్ ద్వితీయ సంవత్సరం) ఉన్నారు. రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎంపికై న వీరు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ చంద్రమౌళి, ఎన్సీసీ ఆఫీసర్ సువర్ణ, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఎన్సీసీ విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు. -
మహిళా.. ఏలుకో!
జిల్లాలో 316 పంచాయతీల్లో 158 మంది మహిళా సర్పంచ్‌లు..సంగెం: పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు.. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఎక్కువ స్థానాల్లో మహిళలు సర్పంచ్‌లుగా పోటీ చేసి గెలుపొందారు. జిల్లాలో 317 గ్రామ పంచాయతీలు ఉండగా వంజరపల్లి మినహా 316 జీపీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఇందుల్లో 158 మంది మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం సర్పంచ్‌లుగా ఎన్నికై న మహిళలకు పాలన కత్తి మీద సాముగా మారనుంది. సంగెం మండలంలో 32 పంచాయతీల్లో 16 మంది మహిళలు సర్పంచ్‌లుగా, 281 వార్డుల్లో 141 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. గెలిచిన సర్పంచ్‌లందరూ రాజకీయాలకు కొత్తవారే. పాలనపై పట్టులేకపోవడం, ఇంటిలో భర్త, కొడుకును కాదనలేని పరిస్థితి. వీటన్నింటిని అధిగమించి కుటుంబాన్ని సక్కదిద్దుకుంటూనే గ్రామాన్ని మరో కుటుంబంగా అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధిస్తామని మహిళా సర్పంచ్‌లు దీమా వ్యక్తం చేస్తున్నారు. పతుల పెత్తనం కుదరదు గ్రామపంచాయతీ పాలనలో పతుల పెత్తనానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. సర్పంచ్‌లుగా సతుల విధుల్లో పతులతో పాటుగా కుమారుడు తదితర కుటుంబసభ్యుల జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. గతంలో మహిళా సర్పంచ్‌లను వంటింటికే పరిమితం చేస్తూ వారికి బదులుగా భర్తలు, కుమారులు, కుటుంబసభ్యులు సర్పంచ్‌లుగా పిలువబడుతూ అధికారం చెలాయించడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి మెమో నంబరు–3, 292 పేరిట పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీలకు సైతం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబ సభ్యుల పెత్తనా న్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గతంలో పలు ఉత్తర్వుల ను జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లాస్థాయి అధికారులు, మండలస్థాయి అ ధికారులు సైతం సతులకు బదులుగా పతులకే ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా భర్తలనే సర్పంచ్‌లుగా పిలుస్తుండడంతో వారి పెత్తనం మరింతగా పెరిగింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, చివరికి 90 రోజులకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ భార్యలకు బదులుగా భర్తలే సంతకాలు చేసి పనులు చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వులతో మార్పు వస్తుందా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు సతులకు బదులు పతుల పెత్తనంపై కఠినంగా వ్యవహరించినప్పుడే భర్తల పెత్తనం తగ్గిపోయి పల్లెపాలనలో మహిళా ప్రజాప్రతినిధుల ముద్ర కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూతనంగా ఎన్నికై న మహిళా సర్పంచ్‌లు పురుషులకు దీటుగా పల్లెపాలన సాగిస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు కుటుంబం.. మరోవైపు గ్రామం.. రెండింటికీ సమన్యాయం చేయాల్సిందే.. సతుల స్థానంలో పతుల పెత్తనం కుదరదు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
వరంగల్
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కథాశివిర్కు ఓరుగల్లు విద్యార్థులు యువతలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు రూపొందించిన రాష్ట్రీయ కథాశివిర్కు ఉమ్మడి జిల్లా నుంచి 20 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్‌ఎస్‌తాడ్వాయి -
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
కాజీపేట: స్థానిక యువతకు రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కాజీపేట చౌరస్తాలో భూనిర్వాసితులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు మల్లేశం, వీరన్న, భిక్షపతి, ప్రదీప్ పాల్గొన్నారు. నేడు కాజీపేటలో రౌండ్‌టేబుల్ సమావేశం కాజీపేట రైల్వే కమ్యూనిటీహాల్లో శనివారం ఉదయం 10 గంటలకు రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పట్టణంలోని ఆరు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, ఆయా పార్టీల డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతున్నారు. ఉద్యోగాల కల్పనపై సమావేశంలో చర్చించనున్నట్లు జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు తెలిపారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
నర్సంపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఐ పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పంజాల రమేశ్ అన్నారు. శుక్రవారం సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఎగుర వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీ ఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసి 101 సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టి సమస్యలు పరిష్కరించిందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు అయితే యాకోబు, అక్కపెల్లి రమేశ్, జిల్లా సమితి సబ్యులు మియాపురం గోవర్ధన్, గుంపెల్లి మునీశ్వర్, నాయకులు బాధబోయిన యాదగిరి, సాంబయ్య పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానంనర్సంపేట రూరల్: సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులు జనవరి 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, ఎంపికై న విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఉచిత భోజన వసతితో పాటు విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొక్కజొన్న పంట ధ్వంసంసంగెం: మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన గాయపు వీరారెడ్డి తన తల్లిదండ్రులు పంచి ఇచ్చిన 2.18 ఎకరాల్లో పట్టా చేయించుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన అన్న కుమారుడు గాయపు రవీందర్‌రెడ్డి గతేడాది నుంచి పంట వేయనియకుండా అడ్డుకుంటున్నాడని, ఈనెల 25న ట్రాక్టర్‌తో 20 గుంటల భూమిలోని మొక్కజొన్న పంటను దున్ని ధ్వంసం చేశాడని వీరారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవీందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మొసలి లభ్యంనర్సంపేట రూరల్: మొసలి లభ్యమైన సంఘటన నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామశివారులోని శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఫారెస్టు రేంజర్ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామానికి చెందిన రైతు సూర్యకు చెందిన వ్యవసాయ భూమిలో మొసలి సంచరిస్తుందని సమాచారం ఫారెస్టు అధికారులకు అందించారు. వెంటనే ఫారెస్టు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ మొసలిని పట్టుకొని పాకాల చెరువులో విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ యోగి, వెంకన్న, బేస్ క్యాంప్ చందు తదితరలు పాల్గొన్నారు. -
ధరణి నవల ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: చెలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక వరంగల్ శాఖ, కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టు రవీందర్ రాసిన ‘ధరణి’ నవల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమకొండ నక్కలగుట్టలోని కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ భవనంలో చెలిమి వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు రవీందర్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, విశిష్ట అతిథులుగా ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుప్పాల బాలరాజు, ఆర్‌సీటీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రచయిత ఈ నవలలో కళ్లకు కట్టినట్లుగా రాశారని ప్రశంసించారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, రామిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..
కాజీపేట: భూనిర్వాసితులతోపాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే నినాదం క్రమేణా ఊపందుకుంటోంది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామ శివారులో శరవేగంగా సాగుతున్న రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టనున్నారు. నియామకాల్లో జిల్లా నిరుద్యోగ యువతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే నినాదం మొదలైంది. దాదాపు 40 ఏళ్లు పోరాట ఫలితంగా రెల్వే కోచ్ అండ్ వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రైతులు 128 ఎకరాలకు పైగా భూములను ౖఅతి తక్కువ పరిహారంతో రెల్వే శాఖకు అప్పగించారు. భూనిర్వాసితులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని భూసేకరణ సమయంలో అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆ ఊసే లేకపోవడంతో తెలంగాణ రైల్వే జేఏసీ సహకారంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో భూనిర్వాసితులు, జిల్లా నిరుద్యోగులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఏకమవుతున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్వాసుల చిరకాల వాంఛను హైదరాబాద్ నుంచి ఢిల్లీస్థాయిలో వినిపించడానికి సమాయత్తమవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, సంబంధిత మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించాలని తీర్మానించారు. ఉద్యోగాలు ఇవ్వాలి.. తాత, ముత్తాతల కాలం నుంచి దున్నుకుని బతుకుతున్న భూములను ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాగ్యం చేశాం. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేనిపక్షంలో పోరాటాలను ఉదృతం చేయాల్సి ఉంటుంది. – గాదె యాదగిరి, బాధితుడు, అయోధ్యపురం ప్రత్యేక జీఓ తీసుకురావాలి.. గతంలో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తాలలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో భూనిర్వాసితులకు 38 శాతం, జిల్లాస్థాయిలో నిరుద్యోగ యువతకు 44 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇక్కడ అదేస్థాయిలో ప్రత్యేక జీఓతో ఉద్యోగాలు ఇవ్వాలి. – దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే పోరాటాలకు విలువ లేనట్టే.. పోరాటాల ఫలితంగా ఏర్పడిన రైల్వే మ్యాన్‌ఫాక్చరింగ్ యూనిట్లో స్థానిక యువత, భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేనిపక్షంలో ఎన్నో ఏళ్లు చేసిన పోరాటాలకు విలువ లేనట్లే. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానం ద్వారా ప్రత్యేక జీఓ జారీ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి. – కోండ్ర నర్సింగరావు, తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులు, భూనిర్వాసితులకు ఉద్యోగవకాశాలు కల్పించాలి రాజకీయ, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ రైల్వే జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పోరుబాటు -
యువత చూపు.. ఎర్రజెండా వైపు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఖిలా వరంగల్: పెట్టుబడి దారి వ్యవస్థకు కాలం చెల్లిందని, కమ్యూనిజమే ప్రత్యామ్నాయంగా ఎర్రజెండా వైపు ప్రపంచ యువత చూస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం వరంగల్ నగరంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ భాష్మియా ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ అనేక త్యాగాలు చేసిందని, ఎంతో మంది అమరవీరులను అందించిన చరిత్ర సీపీఐ దేనని చెప్పారు. అంతకుముందు బాష్మియాతో కలిసి జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, మేకల రవి, దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్, గన్నారపు రమేష్, బద్రి, రమేష్, చంద్రకళ, రవీందర్, చెన్నకేశవులు పాల్గొన్నారు. హనుమకొండలో..న్యూశాయంపేట: సీపీఐ వంద సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు హనుమకొండ బాలసముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నాయకులు కర్రె భిక్షపతి, ఆదరి శ్రీనివాస్, తోట భిక్షపతి, ఎల్లేష్, రాములు, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు. -
గంగదేవిపల్లిని సందర్శించిన ప్రతినిధులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించా రు. రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్, ఉపసర్పంచ్లు మూలగుండ్ల లావణ్యశ్రీనివాస్‌రెడ్డి, బ త్తుల శ్రీధర్, యువకులు, రైతులు, మహిళా సంఘా ల సభ్యులు, రఘునాథధపల్లి మండలం ఖిలా షాపురం సర్పంచ్ శాగ కవిత, అశోక్, వార్డు సభ్యులు సందర్శించి అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వా రా ఆదర్శంగా నిలిచి దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందిన తీరును గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వివరించారు. సర్పంచ్ కూ సం స్వరూప, కాంగ్రెస్ నాయకుడు కూసం రమేశ్, అభివృద్ధి కమిటీల ప్రతినిఽధి కూసం లింగయ్య, డీటీఎం కరుణాకర్ పాల్గొన్నారు. -
మేడారం, వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: జాతర, పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. మేడారం జాతర, వేములవాడకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కనీసం 30 మంది ప్రయాణికులు ఉండాలన్నారు. 2026 జనవరి నుంచి ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డీఎం పేర్కొన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని వెల్స్ యూనివర్సిటీలోఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న 108వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సుకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీధర్‌కుమార్‌లోథ్ హాజరుకానున్నారు. సదస్సులో ‘రోల్ ఆఫ్ ట్రైబల్ ఉమెన్ ఇన్ అగ్రికల్చ ర్ యాక్టివిటీస్ ఆన్ ఎంపిరికల్ ఇన్వెస్టిగేషన్’ అంశంపై శ్రీధర్‌కుమార్‌లోథ్ పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. కేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 28 నుంచి 30 వరకు 50వ అఖిల భారత సోషియాలజీ సదస్సు నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ కుంట అయిలయ్య సదస్సుకు హాజరుకానున్నారు. ‘మొబిలిటీస్ అండ్ ఇన్ క్వాలిటీస్ షిఫ్టింగ్ కాంటెక్ట్స్ చేంజింగ్ పారాడిగ్మ్స్’ అంశంపై నిర్వహించనున్న ఒక సెషన్‌కు ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే ‘ఎ స్టడీ ఆన్ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ ఇన్ రిలేషన్ ఇన్ సోషల్ చేంజ్ అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటను శుక్రవారం స్విట్జర్లాండ్ దేశస్తులు సందర్శించారు. ఈసందర్భంగా వారు కాకతీయుల కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదను వీక్షించారు. ఆతర్వాత ఖుష్‌మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిలగుట్ట, శృంగారపు బావిని తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ గైడ్ రవియాదవ్ వివరించారు. కోటను సందర్శించడం తాము అదృష్టంగా భావిస్తున్నామని విదేశీయులు పేర్కొన్నారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్ ఉన్నారు. -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్‌ఎస్‌తాడ్వాయి -
ఆగుతూ.. సాగుతూ!
వరంగల్: ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులు ఆగుతూ.. సాగుతున్నాయి. నిధులు విడుదలై టెండర్లు నిర్వహించినా పనులు గ్రౌండింగ్ చేయడంలో తీవ్ర జాప్యమవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతగా పనులు చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ.46 కోట్లతో వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుంచి పోచమ్మమైదాన్ మీదుగా ఎంజీఎం జంక్షన్ వరకు ఐదేళ్ల క్రితం చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు పాలకవర్గం గడువు పూర్తికావొస్తున్నా పూర్తి కాలేదు. ఈరహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించేందుకు భవనాల ఎదుట అధికారులు ఆక్రమణలు తొలగించారు. నేటికి ఫుట్‌పాత్‌లు పూర్తి చేయకపోవడంతో పలు షాపుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం డీమార్ట్ ఎదుట ప్రారంభించిన పనులు పూర్తికాలేదు. స్మార్ట్‌రోడ్డులో భాగంగా రహదారిపై బీటీ లేయర్లు అసంపూర్తిగా వేశారు. అవి స్పీడ్‌బ్రేకర్లుగా మారడంతో దిచక్రవాహనదారులకు పాట్లు తప్పడం లేదు. ఇబ్బందులకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో భవనాల యజమానులు అడ్డుకోవడంతో రహదారి విస్తరణ పనులు జాప్యమవుతున్నాయి. స్మార్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు గ్రేటర్ వరంగల్ మేయర్, కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేయించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులే అడ్డు.. ● కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు అడ్డుగా మారుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపాలస్వామిగుడి జంక్షన్ సమీపంలోని రోడ్డు విస్తరణకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అడ్డుపడడం, భవన యజమాని కోర్టుకు వెళ్లడంతో అక్కడ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ రహదారికి ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం వేసిన పైపులతో జలమయంగా మారుతోంది. ● పోలీస్ కమిషనరేట్ జంక్షన్ నుంచి ములుగు రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు సైతం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అప్పటి ప్రజాప్రతినిఽధి అడ్డుపడినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్డు పనులు అసంపూర్తిగా మారాయి. డ్రెయినేజీతోపాటు వెడల్పు జరిగితే ఈ రోడ్డుపై వాహనాలు వెళ్లేందుకు సులువుగా ఉండేది. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన నాయకుడు సైతం రోడ్డు వెడల్పునకు జంకుతున్నట్లు సమాచారం. ● కాజీపేట డీజిల్ కాలనీ నుంచి వరంగల్ ములుగురోడ్డు వరకు చేపట్టిన స్మార్ట్‌సిటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ములుగురోడ్డు వరకు రహదారి వెంట ఉన్న వ్యాపారులే ఇందుకు కారణమని, ప్రజాప్రతినిధులు సహరించకపోవడంతో పనులు పెండింగ్ పడినట్లు సమాచారం. ● వెంకట్రామ జంక్షన్ నుంచి ములుగురోడ్డు జంక్షన్ వరకు చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. అదేవిధంగా కాశిబుగ్గ, పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తాలో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించడం లేదు. ● పోచమ్మమైదాన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు నిర్మించిన సీసీ రోడ్డులో నాణ్యత లేకపోవడంతో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ స్మార్ట్‌రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అప్పటి తూర్పు ప్రజాప్రతినిధి వ్యాపారుల కోసం డివైడర్ స్థానంలో సిమెంట్ కాంక్రీట్ పోయించడంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. అభివృద్ధి పనుల్లో కానరాని నాణ్యతాప్రమాణాలు నిధులు విడుదలైనా గ్రౌండింగ్‌లో జాప్యం పట్టించుకోని గ్రేటర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు -
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
నెక్కొండ: రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.సోమయ్య డిమాండ్ చేశారు. పెన్షన్ డేను పురస్కరించుకొని మండల కేంద్రంలోని పెన్షన్ భవనంలో శుక్రవారం నకారా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెక్కొండ శాఖ యూనిట్ అధ్యక్షుడు గటిక మల్లయ్య అధ్యక్షతన జరిగిన స మావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ పెండింగ్ బి ల్లులు, కరువు భత్యం, హెల్త్ కార్డులు అందించాలన్నారు. నకారా చేసిన పోరాటంతోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, సంక్షేమం పథకాలు అందుతున్నాయన్నారు. పెన్షన్‌దారులు సంఘటితంగా పోరాడి తమ హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. అనంతరం ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఐలయ్య రిటైర్డ్ ఉద్యోగుల కు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో నెక్కొండ యూనిట్ గౌరవ అధ్యక్షుడు ఇనుగాల ఉ పేందర్‌రెడ్డి, కార్యదర్శి ఎస్ఏ మొహినోద్దీన్, ఆర్థిక కార్యదర్శి కె.శ్రీహరి, కార్యవర్గ సభ్యులు బి. రత్న య్య, వి. పరమేశ్వరయ్య, పెన్షనర్లు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సోమయ్య -
మరో చాన్స్ ప్లీజ్!
నర్సంపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు ‘మరో చాన్స్ ప్లీజ్’ అంటూ తమ పార్టీ నేతలను వేడుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన వారు ప్రత్యామ్నాయ ప్రయత్నంపై దృష్టి సారించారు. జిల్లాలో 11 జెడ్పీటీసీ, 130 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి సర్పంచ్‌గా గెలుపొందాలని ఆశపడి భంగపడ్డ నేతలు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఓడిపోయిన వ్యక్తులు తమ బలాబలాలను అంచనా చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపొందే పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. సర్పంచ్‌గా పోటీ చేసి పరాజయం పాలైన అభ్యర్థులే రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తే సానుభూతితో పాటు ఓడిపోయిన స్థానంలోనే గెలుపొందవచ్చని అంచనా వేసుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్థులు రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలుపొందాలని ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకోసం అన్ని వర్గాల ఓటర్లను మద్దతు కూడగట్టుకొని ముందుకు సాగుతున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందడానికి ఏఏ వర్గాలు, సంఘాల సభ్యులు ఓట్లు వేశాయి, ఎవరు ఓట్లు వేయలేదు, ఎక్కడ లెక్క తప్పిందనే అంచనాలను వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగవచ్చని అంచనా వేసుకుంటూ తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీలకు చెందిన అధినేతల వద్ద తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటూ టికెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీటుపైఆశావహుల గురి సర్పంచ్‌గా ఓటమి పాలైన అభ్యర్థుల ముమ్మర ప్రయత్నాలు సానుభూతి కలిసి వస్తుందని ముందడుగు జిల్లాలో 11 జెడ్పీటీసీ, 130 ఎంపీటీసీ స్థానాలుసానుభూతి కలిసివస్తుందని.. జిల్లాలో 130 ఎంపీటీసీ స్థానాలు, 11 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం రెండు నెలల నుంచి సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోగా తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశావహులు పోటీ చేశారు. అయినప్పటికీ ఓటమి పాలైన వ్యక్తులు మండల స్థాయిలో రాజకీయ పలుకుబడితో గెలిచే అవకాశం ఉన్న వారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి టికెట్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని, అందులో ఎలాగైన గెలుపొందాలని ఉద్దేశంతో రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేసేందుకు కసరత్తు మొదలపెట్టారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
వారసత్వ సంపదను కాపాడుకోవాలి
హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హన్మకొండ కల్చరల్: కాకతీయుల శిల్పకళ, వారసత్వ సంపదను కాపాడుకోవాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చారిత్రక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సుదర్శన్‌రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్ వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. సుదర్శన్‌రెడ్డి దంపతులు శ్రీరుద్రేశ్వరస్వామి వారికి లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. సూర్య, విష్ణు దేవాలయాల చరిత్ర, నాట్యమండపం, స్తంభాల్లో వెంటుక్ర పట్టేంత రంధ్రాలు, తలకిందుల చాప, మనిషి, అష్ట దిక్పాలకులు, కల్యామండపం విశిష్టతను వారికి వివరించారు. కార్యక్రమంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, సిబ్బంది మధుకర్, రజిత, రామకృష్ణ పాల్గొన్నారు. -
వెక్కిరిస్తున్నాయి..
ఎత్తిపోతలను త్వరగా పూర్తిచేయాలి కొనాయమాకుల ఎత్తిపోతల పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. రైతులు ఈ పథకం ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అవసరమైన నిధులు మంజూరయ్యే విధంగా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి. – సిరిసె శ్రీకాంత్, కొనాయమాకుల పిల్లర్ల దశలోనే వదిలేశారు.. గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం భవనాన్ని మంజూరు చేసింది. కొమ్మాల అంగడిలో దీన్ని పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. కాంట్రాక్టర్‌ను అడిగితే నిధులు మంజూరు చేయడం లేదన్నారు. మూడేళ్ల నుంచి పనులు ముందుకు సాగటం లేదు. త్వరగా నిధులను మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టాలి. – ఆంగోతు వీరన్న, హర్జ్యతండా సర్పంచ్ గీసుకొండ: జిల్లాలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని పనులు నిధుల లేమితో నిలిచిపోయాయి. నిర్మాణ దశలో ఉన్న జిల్లా స్థాయి భవనాల నిర్మాణం సైతం మధ్యలోనే ఆగిపోయి దిష్టిబొమ్మల్లా వెక్కిరిస్తున్నాయి. వరంగల్ నగరానికి గీసుకొండ మండలం సమీపంలో ఉండటంతో ఇక్కడ పలు జిల్లా భవనాలను నిర్మించడానికి పనులను చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత భవనాల నిర్మాణ పనులు పూర్తి కావడంలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొనాయమాకుల ఎత్తిపోతల పథకం ఏళ్లు గడుస్తున్నా.. రైతులకు సాగు నీరు అందించని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి నత్తనడకే.. మండలంలోని కొనాయమాకుల వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ ప్రధాన కాల్వ నీటిని పైకెత్తి పోసి రైతుల చేలకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టారు. 2017లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకం పనులకు శంకుస్థాపన చేయగా అప్పటి నుంచి ఎందుకో ఏదో ఓ సమస్యతో పనులు పూర్తికావడం లేదు. దీంతో రైతులకు 18 ఏళ్లుగా సాగినీటి కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రాజెక్టు పూర్తయితే గీసుకొండ మండలానికి 7,446, దుగ్గొండి 4,509, సంగెం మండలంలో 2,166 ఎకరాల (మొత్తంగా 14వేలు) భూములకు సాగు నీరు అందే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పలుమార్లు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తామన్నారు. అయినా ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించడం లేదని రైతులు నిరాశతో ఉన్నారు. బాలల భవన నిర్మాణం అంతే.. మండలంలోని కొనాయమాకుల గ్రామం వద్ద మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా 2022 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, గత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు రూ. 87.45 లక్షల అంచనా వ్యయంతో బాలల భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. తల్లిదండ్రులను కోల్పో యి అనాథలుగా మిగిలిని వారికి, బస్టాండు, రైల్వేస్టేషన్లలో తప్పిపోయిన చిన్నారులకు ఆశ్రయం ఇవ్వడానికి ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు నిధులలేమితో మధ్యలోనే నిలిచిపోయాయి. త్వరగా నిధులు మంజూరు చేయించి ఉపయోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైన ఉంది. గిరిజన భవన నిర్మాణ పరిస్థితి దారుణం.. మండలంలోని కొమ్మాల అంగడి వద్ద చేపట్టిన గిరిజన భవన నిర్మాణం పనులు తొలి దశలోనే నిలిచిపోయాయి. గత ప్రభుత్వం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో గిరిజన భవనాన్ని నియోజకవర్గ స్థాయిలో మంజూరు చేసింది. నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ. 50 లక్షల మేర ఖర్చు చేసి పిల్లర్ల దశ మేరకు నిర్మాణం పనులను చేపట్టారు. బిల్లుల కోసం అధికారుల వద్దకు వెళితే నియోజకవర్గ కేంద్రంలో భవనాన్ని నిర్మించాల్సి ఉండగా ఇక్కడెందుకు చేపట్టారని చెప్పడంతో వివాదం నెలకొని పనులు నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తికాని కొనాయమాకుల ఎత్తిపోతల పథకం, జిల్లా బాలల, గిరిజన భవనాల నిర్మాణం ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7నగరంలో అంబరాన్నంటిన వేడుకలు ● చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు నగరంలో క్రిస్మస్ వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని చర్చిలకు ఉదయమే క్రైస్తవులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. మతపెద్దలు క్రీస్తు జననం గురించి తెలిపి, క్రీస్తు సందేశం ఇచ్చారు. వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండలోని సీబీసీలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వాహకులు చర్చిలను అందంగా అలంకరించారు. – సాక్షి, స్టాఫ్ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ, వరంగల్ప్రార్థనల అనంతరం హనుమకొండ సీబీసీ నుంచి బయటికి వస్తున్న క్రైస్తవులు (ఇన్సెట్లో) ప్రసంగిస్తున్న ఫాదర్ నిరంజన్బాబువరంగల్ జాన్‌పాకలోని మన్న చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు, వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సీబీసీలో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ, హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు -
మల్లన్న ఆలయంలో జాతర ఏర్పాట్ల పరిశీలన
ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర ఏర్పాట్లను గురువారం ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, తాగునీరు, లైటింగ్, సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చైర్మన్ కార్యాలయంలో సమావేశమై జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సహకరించాలని చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, ఆలయ ఈఓ కందుల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్మద, మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఏఈ రవి కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సురేశ్‌కుమార్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
జెట్‌స్పీడ్‌లో ‘మామునూరు’
తుది అంకంలో 223 ఎకరాల భూసేకరణసాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణ పనులు జెట్‌స్పీడ్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని మరో 253 ఎకరాల భూసేకరణ చివరిదశకు చేరుకుంది. ఈ 253 ఎకరాల్లో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, 223 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములున్నాయి. ఇందులో ఇప్పటివరకు 180 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి సంబంధించిన వారి ఖాతాల్లో రూ.220 కోట్లు జమచేశారు. మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధంగా ఉంచారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూమి 15 ఎకరాలు ఉండగా ఈ మేరకు ఆ డబ్బులను జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు. అలాగే సాదాబైనామాకు సంబంధించి ఐదు ఎకరాలు ఉండడంతో ఆ భూమి ఎక్కడినుంచి వచ్చింది, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉందనే వివరాలను పరిశీలిస్తూనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి సర్వే చేసి క్లియర్ చేస్తున్నారు. మరో 10 ఎకరాల భూమి ఉన్న రైతుల నుంచి పట్టా పాస్‌బుక్‌లు, అలాగే 12 మంది ఇళ్లు ఉన్నవారి వివరాలు సేకరించి.. క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 330 మంది భూనిర్వాసితులు ఉంటే 260 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మరో 40 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు బిల్లులు రెడీ అయ్యాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అవార్డు పాసైన రోజుల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు దశలవారీగా భూమిని రిజిస్ట్రేషన్ చేసి బదిలీ చేసే ప్రక్రియ మొదలైంది. ఇలా ఇప్పటివరకు సేకరించిన 213 ఎకరాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తోంది. అధికారుల సమన్వయంతో.. ఎయిర్‌పోర్టుకు సంబంధించి వివిధ విభాగాల అ ధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నా రు. కొందరికి పట్టాపాస్ పుస్తకాలు లేకపోవడం, సర్వే నంబర్ల మిస్ మ్యాచ్, కొన్ని భూములపై మా ర్ట్గేజ్ లోన్లు, సాదాబైనామా భూముల ద్వారా కాస్త ఆలస్యమైనా.. భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు భూమి సరిహద్దుల స్థిరీకరణకు ఇప్పటికే ఏఏఐ బిడ్లు పిలిచిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు. మరో రెండేళ్లలో మామునూరులో విమానాశ్రయ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.220 కోట్లు రైతుల ఖాతాల్లో జమ మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధం -
రేవంత్‌రెడ్డి అధికారం మూడేళ్లే
హన్మకొండ: సీఎం రేవంత్‌రెడ్డి భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్‌ను ఆధికారంలోకి రానివ్వనని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి అధి కారంలో ఉండేది మూడేళ్లేనని హితవు పలి కారు. ఆయన బజారు బాష మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. రేవంత్‌రెడ్డి పరాన్నజీవి అయితే, కేసీఆర్ స్వయం ప్రకాశమైన నాయకుడన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే అజెండా ద్వేషమే తప్ప అభివృద్ధి కాదని రుజువైందని దుయ్యబట్టారు. యూరి యా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలపై ధ్యాసే లేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి..రాష్ట్రంలో జరుగుతున్న అనేక అరాచకాలను ప్రశ్ని స్తున్న హరీశ్‌రావు, కేటీఆర్‌పై కూడా దిగజారుడు భాషే మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణకు నంబర్‌వన్ ద్రోహి రేవంత్‌రెడ్డి అని అన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, నాయకులు చింతం సదానందం, చెన్నం మధు, జోరిక రమేష్, పులి రజినీకాంత్, శోభన్, నయీముద్దీన్, రామ్మూర్తి, బుద్దె వెంకన్న, వినీల్‌రావు, మూటిక రాజుయాదవ్, గండ్రకోట రాకేశ్‌యాదవ్, చాగంటి రమేశ్, సంపతి రఘు, దేవమ్మ, జేకే, మునుకుంట్ల వెంకటేశ్ పాల్గొన్నారు. ఆయన భాషను ఈసడించుకుంటున్న ప్రజలు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
సర్కిల్.. క్రిటికల్!
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్‌లోని పలు డివిజన్ల ప్రజలు సేవల కోసం వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అమలు కావడం లేదు. అందుబాటులో లేని సర్కిల్ కార్యాలయాలతో ఇక్కట్లకు గురవుతున్నారు. సుపరిపాలన కోసం గత ప్రభుత్వం 2017 అక్టోబర్ 13న 267 జీఓ విడుదల చేసింది. కాశిబుగ్గ, కాజీపేట రెండుగా ఉన్న సర్కిల్ కార్యాలయాలను విభజించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. 8 ఏళ్లు గడిచినా అడుగు ముందుకుపడకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దూరంలో సర్కిల్ కార్యాలయాలు.. జనన, మరణ, నూతన భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రాలు, కొత్త ఇంటి నంబర్లు, ఆస్తుల విభజన, పేరు మార్పిడి, నల్లా కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్స్, మార్టిగేజ్ రిలీజ్, ఇతర అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే బల్దియా సర్కిల్ కార్యాలయాలను ప్రజలు ఆశ్రయించాల్సిందే. కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కిల్ కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు. 2013 మార్చి 19న 42 విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 110 కిలోమీటర్లు ఉన్న నగరం 407.8 కిలోమీటర్లకు చేరింది. జనాభా 9 లక్షలకు చేరడంతో 53 డివిజన్లు 58కి చేరాయి. 2014లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2020–21 సంవత్సరంలో 58 డివిజన్లను డీలిమిటేషన్లో 66కు పెంచారు. ప్రస్తుతం నగర జనాభా 13 లక్షలకు చేరింది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న 66 డివిజన్లను 88 డివిజన్లుగా డీలిమిటేషన్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆ దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 8 ఏళ్లుగా కాగితాలకే సర్కిల్ కార్యాలయాలు వ్యయప్రయాసాలకు గురవుతున్న డివిజన్ల ప్రజలు పట్టించుకోని గ్రేటర్ పాలకవర్గం, ఉన్నతాధికారులు అధికారులు, సిబ్బంది కొరతే కారణం.. గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 4 సర్కిళ్ల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. కానీ, బల్దియా పాలకవర్గం, ఉన్నతధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో సర్కిళ్లను ఏర్పాటు చేయలేకపోతున్నామని పేర్కొంటున్నారు. దూరభారం భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియాకు అధికారులు, సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 2 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని రంగశాయిపేటలో లేదా ఉర్సు సీఆర్సీ సెంటర్, హనుమకొండ నయీంనగర్‌లో లేదా నక్కలగుట్టలో సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సేవలు మరింత అందుబాటులో ఉంటాయనే డిమాండ్ ఉంది. డివిజన్ల పునర్విభజనతోపాటు అదనపు సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి
గీసుకొండ: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని బీజేపీ జిల్లా ఇన్చార్జ్ కొండపెల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గురువారం మండలంలోని ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో భారత రత్న, దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి వేడుకలు, సర్పంచ్ల సన్మాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి, రవికుమార్‌లు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కారు గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. అంతకుముందు వాజ్‌పేయి శత జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరబ్రెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, పుల్లారావు, సమ్మిరెడ్డి, అశోక్ రెడ్డి, హరిశంకర్, తిరుపతి రెడ్డి, రాణా ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు వడ్డీ వాపస్
నల్లబెల్లి: మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలం చెల్లించిన మహిళ స్వయం సహా యక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ డబ్బులు వాపస్ చేసింది. వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం ఇటీవల జిల్లాలోని 11 మండలాలకు రూ. 6.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మండలాల వారీగా వివరాలు అందించి ఆయా ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లో జమ చేసింది. అయితే 2025–2026 సంబంధించిన రుణాలు తీసుకున్న రుణాలు తీసుకున్న సంఘాలకు సంబంధించి వడ్డీని ప్రభుత్వం సంఘాలకు తిరిగి చెల్లించింది. జిల్లా వ్యాప్తంగా 7,540 సంఘాలకు మహిళలకు వడ్డీ డబ్బులను మండలాల వారీగా ఇటీవల పంపిణీ చేశారు. ఈ డబ్బులను సంఘాల ఖాతాల్లో జమచేశారు. జిల్లాలో అత్యధికంగా సంగెం మండలంలో వడ్డీ రూ.79,52,538 వాపస్ రాగా, అతి తక్కువగా నెక్కొండ మండలంలో రూ.76,958 మాత్రమే వడ్డీ వాపస్ వచ్చింది. వడ్డీను ప్రభుత్వం తిరిగి చెల్లించడంతో మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికి భరోసా జిల్లాలో 11 మండలాల పరిధిలో 7,540 ఎస్‌హెచ్‌జీ సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేసింది. వీటిని సకాలంలో సకాలంలో వడ్డీతో సహా చెల్లించిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తిరిగి వడ్డీ రాయితీని వారి ఖాతాల్లో జమచేసింది. జిల్లాలో ప్రభుత్వం చెల్లించిన వడ్డీ నిధులు, సంఘాల వివరాలుమండలం ఎస్‌హెచ్‌జీలు వడ్డీ(రూ.లల్లో..) చెన్నారావుపేట 707 66,12,744 దుగ్గొండి 500 35,34,507 ఖానాపురం 537 43,25,633 నల్లబెల్లి 576 48,32,289 నర్సంపేట 861 69,33,272 నెక్కొండ 825 76,958 రాయపర్తి 878 56,77,709 గీసుగొండ 674 68,34,282 సంగెం 816 79,52,538 పర్వతగిరి 651 60,03,816 వర్ధన్నపేట 515 46,73,562 జిల్లాలో ఎస్‌హెచ్‌జీలకు రూ.6.50 కోట్లు విడుదల 7,540 మహిళా సంఘాలకు లబ్ధి -
62.36%
ధాన్యం సేకరణసాక్షిప్రతినిధి, వరంగల్ : వానాకాలం సేద్యం రైతులకు అచ్చి రాలేదు. పరిస్థితులు అనుకూలించి అధిక దిగుబడి వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పంట వేసింది మొదలు చేతికందే వరకు వరుస వర్షాలు కురవడం, పైరుకు తెగుళ్లు సోకడంతో ఈ సీజన్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్ర నిరాశపరుస్తున్నది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు అంచనాల మేరకు ధాన్యం రాలేదు. కేంద్రాలు మూసివేసే దశకు చేరినా.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నాటికి ధాన్యం సేకరణ 62.36 శాతానికే చేరింది. 10.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికీ 6.48 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించారు. ధాన్యం సేకరణ అంచనాలు తారుమారు.. వానాకాలంలో సీజన్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 15.83 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 8,78,376 ఎకరాల్లో వరి వేస్తారని భావించగా, ఎనిమిది లక్షల ఎకరాల వరకు సాగైనట్లు అధికారులు ప్రకటించారు. 10,39,815 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్‌సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాలశాఖ ప్రతిపాదించింది. కొనుగోలు సీజన్ ప్రారంభం కాగానే ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో 1,360 కేంద్రాలను తెరిచారు. కొనుగోళ్లు మందకొడిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకుంటాయని భావించారు. కానీ, ఈ నెల 24వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతులనుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 85.59 శాతం సేకరణ జరగ్గా, అత్యల్పంగా జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 40.42 శాతంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరసన నిలిచే ఉమ్మడి వరంగల్‌లో ఈసారి ధాన్యం దిగుబడి, సేకరణ గణనీయంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. దిగుబడిపై అకాలవర్షాలు, తెగుళ్ల ప్రభావం.. వానాకాలం ధాన్యం దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు అకాల వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు, పంటలకు సోకిన తెగుళ్లు (కాటుక), యూరియా కొరతగా రైతులు చెబుతున్నారు. వీటి వల్ల వరి పంట నీట మునగడం, మొలకెత్తడం, గింజ రాలిపోవడం వంటి సమస్యలతో దిగుబడి గణనీయంగా తగ్గిందని, రైతులు నష్టపోయారని అధికారులు సైతం అంటున్నారు. ఇదే సమయంలో పైరుకు ‘కాటుక’ వంటి తెగుళ్లు సోకడం వల్ల మొత్తంగా ఉత్పత్తి 40 శాతం వరకు తగ్గిందని, ఇందుకు కొన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చిన నివేదికలే ఉదాహరణగా చెబుతున్నారు. మోంథా తుపాను నిండా ముంచింది మోంథా తుపాను ప్రభావంతో వరి ఈసారి ఆశించినంత దిగుబడి రాలేదు. సకాలంలో యూరియా కూడా అందకపోవడం పంట దిగుబడిపై ప్రభావం చూపించింది. నాకున్న ఐదు ఎకరాల్లో వరినాటు వేస్తే 78 బస్తాలు వడ్లు పండాయి. వర్షాలతో వరి నేలకొరగడంతో చేను కోయడానికే మిషన్ ఖర్చులు రూ.24 వేలు అయ్యాయి. దీనికితోడు పొలం దున్నడం, నాటు, ఎరువులకు, ఇతరత్రా ఖర్చులు పోను ఏమీ మిగల్లేదు. – హింగే మనోహర్, రైతు, పీచర, వేలేరు సగానికి సగం దిగుబడి తగ్గిందిపోయిన వానాకాలం నాకున్న రెండెకరాలకు తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి పంటేసిన. ఎకరానికి 30 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అనుకున్న. కానీ పంట చేతికొచ్చే దశలో కురిసిన అకాల, భారీ వర్షాల కారణంగా దిగుబడి సగానికి సగం తగ్గిపోయి ఎకరానికి సుమారు 15 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చింది. పంట చేతికొచ్చే దశలో కురిసిన వర్షాలు రైతులను ఆగం చేశాయి. – వడ్డె వీరయ్య, కమలాపూర్ రైతుజిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ ఇలా..(ధాన్యం మెట్రిక్ టన్నుల్లో) జిల్లా సేకరించాల్సిన కేంద్రాల కేంద్రాల కొనుగోలు రైతుల విలువ ధాన్యం ప్రతిపాదన ప్రారంభం ధాన్యం సంఖ్య (రూ.కోట్లలో) హనుమకొండ 1,80,355 157 157 1,03,154 25754 246.39 వరంగల్ 1,95,141 260 260 1,15,440 28604 275.77 జనగామ 1,69,662 294 294 1,45,206 36274 346.87 మహబూబాబాద్ 2,24,688 260 260 1,54,520 31334 369.06 భూపాలపల్లి 1,22,543 204 204 49,356 9616 117.89 ములుగు 1,47,426 185 185 80,702 11775 192.21 ఉమ్మడి జిల్లా రైతులకు అచ్చిరాని వానాకాలం సాగు 10.40 లక్షల టన్నులు సేకరణ లక్ష్యం.. 1,360 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకు వచ్చింది 6.48 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు కేంద్రాలకు తగ్గిన ధాన్యం.. దిగుబడి తగ్గడమే కారణం రైతులను ముంచిన అకాలవర్షం.. మొదలైన యాసంగి సీజన్ -
స్థల పరిశీలన
పర్వతగిరి: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలోని పల్లవి మోడల్ పాఠశాలలో త్వరలో నిర్వహించనున్న 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు అవసరమైన స్థలం, గదులను గురువారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. పాఠశాల చైర్మన్ రాచకొండ అశోకచారిను వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు అనుకూల వాతావరణం ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్‌నాయక్, సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, నాయకులు పాల్గొన్నారు. -
అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్‌గుప్తా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుకుల్ల మహాలక్ష్మిశంకరమ్మ, శ్రీనివాస్రజిత దయాకర్, సాయితేజ, స్వాతిలు పడిపూజ బాధ్యులుగా పాల్గొనగా ప్రధాన అర్చకులు దేవిష్మిశ్రా తాంత్రిక పూజ విధానంలో అయ్యప్పస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అచల్ దేవిష్మిశ్రా, కేతుడి భవాని, అశోక్‌రెడ్డి, ఎర్ర జగన్మోహన్రెడ్డిర్మిల, లింగాల అమృతవంశీధర్రెడ్డి, పబ్బ దీప్తి, సదాశివుడు, గుట్టం వినిత్, వంశీకృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్షలు వాయిదాకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 27నుంచి నిర్వహించాల్సిన ఎంబీఏ, ఎంసీఏ మూడవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. యూజీసీనెట్, టీజీసెట్, టీజీటెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం మార్పునర్సంపేట: నర్సంపేట ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ (కరెంటు బిల్లులు చెల్లించే కార్యాలయం) నెక్కొండ రోడ్డు నుంచి మల్లంపల్లికి రోడ్డులోని సబ్‌స్టేషన్ దగ్గర డివిజన్ ఆఫీస్‌లోకి మార్చినట్లు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఆకవరపు మధుసూదన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులు ఈ మార్పును గమనించి వల్లబ్‌నగర్ సబ్‌స్టేషన్ దగ్గర ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్‌లో బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. ‘నేరెళ్ల’ పురస్కారానికి రామా చంద్రమౌళి ఎంపిక హన్మకొండ కల్చరల్: నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారానికి వరంగల్‌కు చెందిన కవి, నవలా రచయిత రామా చంద్రమౌళిని ఎంపిక చేసినట్లు నేరెళ్ల వేణుమాధవ్ కల్చ రల్ ట్రస్ట్ అధ్యక్షురాలు నేరెళ్ల శోభావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో జరిగే ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతి కార్యక్రమంలో రామా చంద్రమౌళికి పురస్కారం అందజేస్తామని శోభావతి పేర్కొన్నారు. -
క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి గీసుకొండ: గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో కాక వెంకటస్వామి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీఎంహెచ్ఓ అప్పయ్య ● పీహెచ్సీ తనిఖీ శాయంపేట: ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చూడాలని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. టీబీ ముక్త్ భారత్, ఎన్ సీడీ కార్యక్రమాలపై వైద్యులకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. మండలంలో మగవారి కంటే ఆడవారి జననాల రేటు తక్కువగా ఉందని పెరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. గర్భిణులు నార్మల్ ప్రసవాలు జరిగేలా చూస్తూ ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగేలా చూడాలన్నారు. సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని, సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అప్పయ్య హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
మీచేతుల్లోనే పంచాయతీ సమాచారం
సాక్షి, వరంగల్: మీ ఊరిలో చెత్త సమస్య ఉందా.. రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదా.. డ్రెయినేజీ నిండిపోయిందా.. అయినా పంచాయతీ సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదా.. ఇన్నాళ్లూ సమస్యలు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తేనే పరిష్కారం అవుతాయనే అపోహ ఉండేది. ఇప్పుడు మీరే ఆ సమస్య పరిష్కరించవచ్చు. అందుకే మీరు చేయాల్సిందల్లా మీ సెల్ఫోన్లో ఆ సమస్య తీవ్రతను తెలిపే ఫొటో తీసి ‘మేరీ పంచాయతీ’ యాప్‌లో కంప్లయింట్ సిస్టం అనే ఫీచర్లో జియో ట్యాగ్ వివరాలతో నిక్షిప్తం చేస్తే చాలు.. ఆ సమస్యను అక్కడున్న పంచాయతీ సిబ్బంది పరిష్కరిస్తారు. లేదంటే ఉన్నతాధికారులు ఇలా వచ్చే ఫిర్యాదులను పట్టించుకోని సిబ్బందిపై వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో పాలన పారదర్శకత కోసం 2019లోనే కేంద్రం ఈ మేరీ పంచాయతీ యాప్ తీసుకొచ్చింది. ఇటీవల నుంచే పూర్తిస్థాయిలో యాప్ పనిచేస్తోంది. ఆయా పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పంచాయతీల ఆదాయం, ఖర్చు వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ యాప్‌లో వివరాల నమోదు సమయంలోనే జీపీఎస్ ద్వారా గుర్తించే అవకాశముంది. ఇతర చోట్ల పనులకు కేటాయించిన నిధులను వినియోగించినా తెలుసుకోవచ్చు. ఇలా చేయడంతో పాలకులు సైతం తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రశ్నించడానికి వీలుంటుంది. అయితే ఈ యాప్‌పై ప్రజలకు అవగాహన కలిగించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామాల్లో చాలా వరకు చదువుకున్న యువతకు తప్ప మరొకరికి ఈ యాప్ ఉన్నట్లు తెలియదు. ఈ యాప్‌పై పంచాయతీ అధికారులు జాగృతి కల్పించాల్సిన అవసరముంది. ఇటీవల జిల్లాలో 316 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. మీ ఊరి చిట్టా మీ చేతుల్లోనే.. మేరీ పంచాయతీ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్‌కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ కావాలి. వెంటనే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు, పిన్‌కోడ్ ఎంచుకోవాలి. అనంతరం గ్రామపంచాయతీ పూర్తి వివరాలు ఇందులో కనిపిస్తాయి. ఈ యాప్ ద్వారా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, పంచాయతీ ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం మంజూరు చేసే నిధులు, పనులు ఏ దశలో ఉన్నాయి, దేనికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు నమోదై ఉంటాయి. నిధుల్లో సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు కూడా యాప్‌లో నమోదు చేస్తారు. వచ్చే సంవత్సరంలో అంచనా వ్యయాల నమోదుతోపాటు గ్రామసభల వివరాలు సైతం అందుబాటులో ఉంటాయి. దీనిలో నిధుల వినియోగంలో ఎన్ని లోపాలున్నా, అక్రమాలు జరిగినా తెలుసుకోవడమే కాకుండా సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఊరు వదిలి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం తమ ఊరిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని పంచాయతీ సిబ్బంది అంటున్నారు. ఇలా పంచాయతీ పాలనను ఎక్కడినుంచైనా తెలుసుకోవచ్చు. అందుబాటులో ‘మేరీ పంచాయతీ’ యాప్ ఫొటో తీసి అప్లోడ్ చేస్తే సమస్య పరిష్కారం గడువులోగా సిబ్బంది పరిష్కరించకపోతే చర్యలు జిల్లాలో 316 గ్రామపంచాయతీలు -
క్లెయిమ్ చేయని ఆస్తులు పొందొచ్చు
హన్మకొండ అర్బన్: క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను హక్కుదారులు తమ బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలను సంప్రదించి నిధులు తిరిగి పొందొచ్చని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. కలెక్టరేట్లో ‘మీ డబ్బు–మీ హక్కు’ అంశంపై బుధవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గణేశ్ మాట్లాడుతూ.. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ఆదాయాలు, తది తర ఆస్తులు తిరిగి పొందొచ్చని సూచించారు. ఎస్ బీఐ రీజినల్ మేనేజర్ షేక్ అ బ్దుల్ రహీం, ఆర్బీఐ ఏజీఎం ఎం.జెడ్. రెహమాన్, ఎస్బీఐ ఎస్ఎల్బీసీ మేనేజర్ కాళీప్రకాశ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్ పాల్గొన్నారు. హక్కులపై అవగాహన కల్పించాలి.. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. వినియోగదారులు ఎక్కువగా తూకాలతో నష్టపోతున్నారని, దీని నివారణకు తూనికలు కొలతల శాఖ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. వినియోగదారుల ఫోరం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీసీఎస్ఓ వాజీద్ అలీ, తూనికలు కొలతల శాఖ అధికారి వెంకటేశ్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రతన్ సింగ్ ఠాగూర్, కార్యదర్శి సూరజ్, ఓరుగల్లు వినియోగదారుల ఫోరం సభ్యులు దండు యుగేందర్, బండ వివేకానంద, శోభ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ ‘మీ డబ్బు – మీ హక్కు’ అంశంపై శిబిరం -
పల్లెల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణ
నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్కాజీపేట అర్బన్: గ్రామీణ స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు పాడి రైతులకు నగదు లావాదేవీలను సులభతరం చేయడానికి మైక్రో ఏటీఎంలు ఉపయోగపడతాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బుధవారం డీసీసీబీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాబార్డ్ సీజీఎం ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. బ్యాంకు నిర్వాహణ పని తీరు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎంలు చంద్రశేఖర్, రవి, జీఎం ఉష శ్రీ, డీజీఎం అశోక్ పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల పడిగాపులు
● అమల్లోకి రాని మొబైల్ యాప్ దుగ్గొండి/గీసుకొండ: యాసంగిలో మొక్కజొన్న, కూరగాయలు, ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. యాప్‌పై ఇటీవల రైతులకు అవగాహన కల్పించారు. ఈ నెల 22 నుంచి మొబైల్ యాప్ ద్వారా బుక్‌చేసుకున్న రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. యాప్ అమల్లోకి రాకపోవడంతో రైతులు పాత పద్ధతిలోనే యూరియా కోసం బారులుతీరాల్సిన పరిస్థితి నెలకొంది. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట పీఏసీఎస్ గోడౌన్‌కు యూరియా వచ్చిందని తెలుసుకున్న వందలాది మంది రైతులు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి క్యూ కట్టారు. అనంతరం సొసైటీ సిబ్బంది ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అందించారు. మధ్యాహ్నం వరకు తిండి తిప్పలు లేకుండా క్యూలో ఉంటే ఒకేబస్తా వచ్చిందని రైతులు నిట్టూర్చారు. అదేవిధంగా గీసుకొండ మండలం కొనాయమాకుల రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులు బారులుదీరి కనిపించారు. -
‘పది’పై ప్రత్యేక దృష్టి సారించండి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రణాళికతో ముందుకెళ్లేలా పర్యవేక్షించాలని డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఎంఈఓలను ఆదేశించారు. బుధవారం డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, జిల్లాలోని పాఠశాలలను తనిఖీ చేయాలని, పాఠశాలల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో 5వ తరగతినుంచి 10వ తరగతివరకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అర్హులైన విద్యార్థులతో ఇ–పాస్ ద్వారా దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, సాంఘిక సంక్షేమ జిల్లా సహాయగణాంక అధికారి జి.రాహుల్, ఎంఈఓలు జి.నెహ్రూనాయక్, బి.మనోజ్‌కుమార్, ఎ.శ్రీనివాస్, ఎస్.విజయ్‌కుమార్, ఎం.చంద్రమౌళి, పి.ఆనందం, ఎల్. రాజేశ్‌కుమార్, కె.శ్రీధర్, భిక్షపతి పాల్గొన్నారు. డీఈఓ గిరిరాజ్‌గౌడ్ ఎంఈఓలతో సమీక్ష -
స.హ.. కహా?
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్‌లో సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిష్కారం అథమ స్థాయిలో ఉంది. పౌరులు అడిగిన సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దశాబ్దాల క్రితం అమల్లోకి తెచ్చింది. నిబంధన ప్రకారం దరఖాస్తు చేసిన పౌరులకు నిర్దేఽశిత కాలంలో అడిగిన సమాచారాన్ని అందించాలి. కానీ, గ్రేటర్ వరంగల్‌లో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి. సమాచారం కోసం దరఖాస్తుదారులు బల్దియా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలు ఇవీ.. సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో దరఖాస్తుదారుడికి అందించాలి. లేకపోతే సంబంధిత అధికారి అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సమాచారం ఇవ్వడంలో జాప్యం వంద రోజులు దాటితే సంబంధిత అధికారి రూ.25 వేల వరకు అపరాధ రుసుం చెల్లించాలి. దరఖాస్తు ఏ విభాగానికి చెందినదో ఆ విభాగ అధికారి ఇందుకు బాధ్యత వహించాల్సి ఉండగా.. మహా నగర పాలక సంస్థలో కొన్ని దరఖాస్తులకు తూతూమంత్రంగా సమాచారం అందిస్తూ, మరి కొ న్నింటికి సమాచారం లేదని రాత పూర్వకంగా అందిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వం.. బల్దియాలో పౌరులు సమాచారం కావాలని దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా అడిగిన సమాచారం అందడం లేదు. ప్రశ్నలు అడిగే తీరులో లోపాలు పట్టుకుని సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు. సూటిగా, స్పష్టంగా ఇవ్వకుండా తెలుగులో దరఖాస్తు చేస్తే ఇంగ్లిష్‌లో సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెలుగు మాత్రమే తెలిసిన వారికి ఇంగ్లిష్ సమాచారం ఎలా అర్థమవుతుందనేది అధికారులకే తెలియాలి. అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అప్పీళ్లపై సహేతుకంగా విచారణలు నిర్వహించి, చర్యలు తీసుకునే విధానం తగ్గిపోయింది. దీంతో దరఖాస్తుదారులు చేసేదేం లేక మళ్లీ దరఖాస్తులు పెడుతున్నా కోరిన సమాచారం రావడం లేదంటూ ఫిర్యాదుదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ పరిధి ప్రధాన కార్యాలయంలో, కాశిబుగ్గ, కాజీపేట ఏ సర్కిల్లో సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో సమాచార హక్కు చట్టం ద్వారా 320 పైచిలుకు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం నిర్వీర్యం అమలులో ‘గ్రేటర్’ అధికారుల నిర్లిప్తత కాళ్లరిగేలా అర్జీదారుల ప్రదక్షిణలు సమావేశాలు, సమీక్షలు కరువు గ్రేటర్ వరంగల్‌లో అధ్వాన పరిస్థితి కొరవడిన జవాబుదారీతనం సమాచార హక్కు చట్టం అమలులో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ఆది నుంచి అలసత్వం వహిస్తున్నారు. విభాగాల వారీగా ఎన్ని దరఖాస్తులు అందాయి? నిర్ణీత గడువులోగా ఎన్నింటికి సమాచారం అందించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? అనే అంశాలపై సమీక్షలు జరగడం లేదు. దీంతో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో పడిపోతున్నాయి. వాస్తవానికి వారానికోసారి సమీక్షలు నిర్వహించాలి. సకాలంలో సమాచారం అందించని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. -
పీఆర్సీని ప్రకటించాలి
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ము ఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై న ఆరునెలలలోపు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం శోఛనీయమన్నారు. ఐదు డీఏలు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్‌రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్‌కుమార్, ఆల్ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు సీతారాం, జిల్లా కార్యదర్శులు సీహెచ్.లింగారావు, మోజెస్, చంద్రయ్య, ప్రసన్నానంద్, కె.సదానందం, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రాజారాం, ఎస్.జ్యోతి, గురుకుల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టెట్ నుంచి టీచర్లను మినహాయించాలి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి -
వినియోగదారులు చైతన్యం కలిగి ఉండాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి సంగెం: వినియోగదారులు చైతన్యం కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివియోగదారుల హక్కులు.. బాధ్యతలు.. పరిష్కార మార్గాలు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ స్థానం కేజీబీవీ విద్యార్థిని బి.రక్షిత, ద్వితీయస్థానం సంగెం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి పెరుమాండ్ల చరణ్ సాధించారు. బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి చేతుల మీదుగా వారు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వినియోగదారుల చట్టం అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్టినేటర్ పులి రాజశేఖర్, గైడ్ టీచర్ తాటిపాముల రమేశ్, కేజీబీవీ పీఈటీ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఈసారి పెద్ద చెరువుల్లోనే!
చేపపిల్లలను విడుదల చేసిన మత్స్యశాఖ అధికారులుగీసుకొండ: జిల్లాలోని చెరువుల్లో ఉచిత చేపపిల్ల లను వదిలే కార్యక్రమం ప్రహసనంలా మారింది. చేపపిల్లలను పెద్ద చెరువుల్లో విడుదల చేసి చిన్న చెరువులకు పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్, అక్టోబర్‌లోపు ప్రతి ఏడాది చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా.. గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతో మరింత జాప్యమైంది. ఎట్టకేలకు ఈ ఏడాది నవంబర్‌లో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 71 పెద్ద (పెరినియల్) చెరువులు ఉండగా ఇప్పటి వరకు 63 చెరువుల్లో సుమారు 71.43 లక్షల చేపపిల్లలు వదిలారు. ఇంకా మిగిలిన పెద్ద చెరువుల్లో 18.82 లక్షల చేపపిల్లలను పోయాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. 635 చిన్న (సీజనల్) చెరువుల్లో ఒక్క చెరువులో కూడా చేపపిల్లలను పోయలేదని చెబుతున్నారు. ఈఏడాది చేపపిల్లల పంపిణీ టెండర్‌ను పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ వారు దక్కించుకున్నారు. చాలా ఆసల్యంగా టెండర్ల ప్రక్రియ ముగియడం, పంపిణీలో జాప్యం కావడంతో చిన్న చెరువులకు చేపపిల్లలను అందించలేమని వారు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలించినా.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. నవంబర్ మొదటి వారం వరకు వర్షాలు కురవడంతో చెరువులు మత్తడి పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా చేపపిల్లల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించడంతో తాము నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మత్స్య సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సగం మేరకు చేపపిల్లలను పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ ఏడాది మత్స్యసంఘాల వారు సొంత డబ్బులతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. చిన్న చెరువులకు చేపపిల్లలను పంపిణీ చేయలేకపోయినా తమకు నగదు బదిలీ చేయాలని మత్స్య సంఘాల వారు కోరుతున్నారు. నీలకంఠ రొయ్య పిల్లల పంపిణీ లేనట్లే.. జిల్లాలోని పలు జలాశయాల్లో కొంతకాలంగా మత్స్యకారులకు లాభదాయకంగా ఉండే నీలకంఠ రొయ్య పిల్లలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా పంపిణీ చేస్తారని అనుకుంటే వారికి నిరాశే మిగిలింది. గతంలో సంగెం మండలం ఎలుగూరు రంగంపేట చెరువు, రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్, వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట చెరువు, నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు తదితర జలాశయాల్లో 10 లక్షల వరకు రొయ్యపిల్లలను పంపిణీ చేశారు. ఇవి మంచినీటి జలాశయాలు కావడంతో మత్స్యకారులు పెరిగిన రొయ్యలను వలలతో పట్టి అధిక ఆదాయం పొందేవారు. ఈ ఏడాది రొయ్య పిల్లల పంపిణీ ఉంటుందని అనుకున్నాం అదేం లేదని అధికారులు చెబుతున్నారు. మత్స్య సంఘాలు 189రిజర్వాయర్ మైలారం మొత్తం చెరువులు 706మత్స్య సంఘాల్లో సభ్యులు 15,821 చిన్నచెరువులకు పంపిణీ చేయబోమని చెప్పిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఇలాగైతే తీవ్రంగా నష్టపోతామంటున్న మత్స్య సంఘాల బాధ్యులు జిల్లాలో 635 చిన్న, 71 పెద్దచెరువులు.. 1.93 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యంరాష్ట్ర అధికారులకు నివేదించాం చిన్న చెరువులకు చేపపిల్లలను పంపిణీ చేయలేమని జస్వంత ఆక్వా కంపెనీ వారు చెప్పారు. ఈ విషయాన్ని తాము రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు ఇప్పటికే నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. జిల్లాలో ఇంకా చేపపిల్లలను పంపిణీ చేయని పెద్ద జలాశయాలకు ఈ నెల 31లోపు పంపిణీ పూర్తి చేస్తాం. – పిల్లి శ్రీపతిరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి -
ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు
నర్సంపేట రూరల్: ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారిని అర్చకులు భిక్షమయ్యశాస్త్రి, సాయిశాస్త్రి, గణేశ్శాస్త్రి ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పాకాల తైబందీ ఖరారునర్సంపేట: ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు ఆయకట్టు రబీ తైబందీని నీటి పారుదలశాఖ అధికారులు, రైతుల సమక్షంలో బుధవారం ఖరారు చేసినట్లు ఈఈ సుదర్శన్‌రావు తెలిపారు. పాకాలలో ప్రస్తుతం 28.6 ఫీట్ల నీటిమట్టం ఉందని పేర్కొన్నారు. సంగెం కాల్వ కింద 10 వేల ఎకరాలు, జాలుబంధం కాల్వ కింద 3,515, తుంగబంధం కాల్వ కింద 1,100 ఎకరాలు(లంబాడీ లచ్చమ్మ బుర్ర వరకు), పసునూరి కాల్వ కింద 1457, మాటు వీరారం కింద 900 ఎకరాలు నిర్ణయించారు. పాకాల ఆయకట్టు కింద మొత్తం 18,193 ఎకరాలకు 16,972 ఎకరాలకు నీరు అందించనున్నట్లు ఈఈ సుదర్శన్‌రావు పేర్కొన్నారు జనవరి మొదటి వారంలో నీటిని విడుదల చేస్తామని, మొదటి వారంలోనే నార్లు పోసుకుని ఏప్రిల్ 30 లోపు కోతలు పూర్తిచేసుకునే విధంగా రైతులు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. మాదన్నపేట చెరువు 1,020 ఎకరాలు.. నర్సంపేట రూరల్: మాదన్నపేట పెద్ద చెరువు యాసంగి తైబందీ రైతుల సమక్షంలో ఖరారు చేసినట్లు డీఈ సామ్యానాయక్ తెలిపారు. ఈ మేరకు నర్సంపేట నీటి పారుదల శాఖ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ సామ్యానాయక్ మాట్లాడుతూ మాదన్నపేట చెరువు మొదటి నుంచి చిమ్మినేని బుర్ర వరకు (మాదన్నపేట శివారు) 220 ఎకరాలు, వైఎస్ఆర్ రోడ్డు నుంచి గొల్లె కన్నయ్య వరకు 500 ఎకరాలు, దుబ్బ కాల్వ చెరువు మొదటి నుంచి కుమ్మరిగడ్డ బుర్ర వరకు 300 ఎకరాలు మొత్తం 1,020 ఎకరాలకు తైబందీ ఖరారు చేసినట్లు తెలిపారు. ఏఈ నితిన్, రైతులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలిఖిలా వరంగల్: మహిళలు వ్యాపారరంగాల్లో ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ్ భాస్కర్ సూచించారు. మహిళా స్వయం సహాయ సంఘం సభ్యులకు నైపుణ్యత, సూక్ష్మ వ్యాపారాల ప్రోత్సాహం(ఎం–సువిధ)పై వరంగల్ శంభునిపేటలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ నాబార్డ్ ఎప్పటికప్పుడు మహిళల నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటునిస్తుందని, శిక్షణలతోపాటు నాణ్యమైన ఉత్పత్తులు, మార్కెటింగ్ పద్ధతులు కూడా మహిళలకు నేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు ఆన్లైన్, డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ పొందాలని, అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ మహిళలు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాబార్డ్ వరంగల్ అభివృద్ధి మేనేజర్ శ్రీ చైతన్య రవి, డీజీఎం బొల్లా శ్రీనివాస్, ఏజీఎం చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, కార్పొరేటర్ పోశాల పద్మ, గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ చైతన్యకుమార్, యూనియన్ బ్యాంకు డీజీఎం కమలాకర్, చింతల అన్వేశ్ పాల్గొన్నారు. -
ఆరంభంలోనే అవస్థలు
కమలాపూర్: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా తిప్పలు మొదలయ్యాయి. యూరియా వచ్చిందని తెలియగానే రైతులు పనులన్నీ వదులుకుని గంటల తరబడి క్యూ కడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులు తొలగించడానికి యాప్‌ను ప్రవేశపెట్టినప్పటికీ అది పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి రాలేదు. దీంతో కమలాపూర్ పీఏసీఎస్‌కు ఇటీవల నాలుగు లారీల్లో 1,776 బస్తాల యూరియా రాగా, వాటిని మంగళవారం కొందరు రైతులకు పంపిణీ చేశారు. పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో బుధవారం ఉదయం 6:30 గంటల నుంచే మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పీఏసీఎస్ వద్ద బారులుదీరారు. మరి కొందరు రైతులు క్యూలైన్లో చెప్పులు ఉంచారు. యూరియా పంపిణీ సమయంలో ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున పంపిణీ చేస్తుండగా, మంగళవారం ఒక్కో రైతుకు 5 బస్తాల చొప్పున పంపిణీ చేసి ఇప్పుడు తమకు 3 బస్తాలే ఎందుకు పంపిణీ చేస్తున్నారంటూ రైతులు పీఏసీఎస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ హరికృష్ణ సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడకు వెళ్లి రైతులకు నచ్చజెప్పారు. పోలీసు పహారాలో రైతులకు యూరియా పంపిణీ చేయించారు. అయినప్పటికీ పలువురు రైతులు యూరియా బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిగిరి వెళ్లిపోయారు. యాసంగి సీజన్ ఆరంభంలోనే యూరియా బస్తాల కోసం వ్యవసాయ పనులన్నీ వదులుకుని కుటుంబ సమేతంగా క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోందని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా నేరుగా గ్రామాలకే సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఏఓ వేణు మాట్లాడుతూ.. మండలంలో యాసంగి పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. మరో రెండు రోజుల్లో మరింత స్టాక్ రానుందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. యాసంగిలో రైతులకు తప్పని యూరియా తిప్పలు పోలీస్ పహారాలో పంపిణీ -
మద్దిమేడారం జాతరకు ఏర్పాట్లు చేయాలి
● అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద నల్లబెల్లి: అధికారులు సమన్వయంతో పనిచేసి నాగరాజుపల్లి మద్దిమేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అధికారులతో కలిసి మద్దిమేడారం జాతరను కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఆలయ ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజు స్వాగతం పలికారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జనవరి 28, 29, 30, 31 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్ల మరమ్మతు, విద్యుత్ సరఫరా, లైట్ల ఏర్పాటు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య పనులు, వాహనాల పార్కింగ్‌కు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజుతో మాట్లాడి జాతర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై సమగ్ర నివేదిక పంపించాలని తహసీల్దార్ ముప్పు కృష్ణను ఆదేశించారు. జాతరలో ప్లాస్టిక్‌ను వినియోగించొద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ భక్తులను కోరారు. పీఆర్ జిల్లా అధికారి ఇజ్జగిరి, ఎంపీడీఓ డాక్టర్ శుభనివాస్, సర్పంచ్‌లు ఎరుకలి లలిత, ఎరుకల సరోజన, ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, విష్ణు పాల్గొన్నారు. మేడారం భక్తులకు వసతులు కల్పించాలి.. న్యూశాయంపేట: ములుగు జిల్లా మేడారం జాతరకు వెళ్లే సమక్క–సారలమ్మ భక్తులకు వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం భక్తుల కోసం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటును క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఆర్అండ్బీ అధికారి రాజేందర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఈఈ సునీత తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్స్పాట్లు) గుర్తించి నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి, ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శోభన్‌బాబు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఇజ్జగిరి, ఎన్‌హెచ్ అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్ ఏర్పాటు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీ సైన్స్‌లో దివంగత బండారి చంద్రశేఖర్, దివంగత బండారి రమణిరత్నం పేర గోల్డ్‌మెడల్, స్వాతంత్య్ర సమర యోధులు, జనధర్మ, వరంగల్‌వాణి పత్రికల వ్యవస్థాపకులు దివంగత ఎంఎస్ ఆచార్య, దివంగత రంగనాయకమ్మ స్మారకార్థం జర్నలిజం విభాగంలో మరో గోల్డ్‌మెడల్ ఏర్పాటు చేశారు. గోల్డ్మెడల్కింద ఆయా విభాగాల్లో రూ.3లక్షల చొప్పున జమ చేశారు. అధిక మార్కులు పొందిన విద్యార్థికి ఆ నగదు (గోల్డ్‌మెడల్) అందజేయనున్నారు. ఆయా ఉత్తర్వులను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి బుధవారం జారీ చేశారు. విభాగాల అధిపతులు డాక్టర్ బి.రాధికారాణి, ఎం.రాజగోపాలచారి బి.వెంకట్రామ్రెడ్డి, డాక్టర్ సంగని మల్లేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైక్రోబయాలజీలో రెండు, కంప్యూటర్ సైన్స్‌లో రెండు, తెలుగు సబ్జెక్టులో ఒక వేకన్సీ ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల27 సాయంత్రం వరకు కేడీసీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీజీతోపాటు పీహెచ్డీ, నెట్ లేదా సెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మౌఖిక పరీక్షలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగతా వివరాలకు పీజీ కోర్సుల కో–ఆర్డినేటర్ డాక్టర్ వాసం శ్రీనివాస్ 98850 59533లో సంప్రదించాలని ఆయన కోరారు. శిల్ప కళా సౌందర్యం అద్భుతం ఖిలా వరంగల్: కాకతీయుల కట్టడాలు, ఆనాటి నిర్మాణ శైలి, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జడ్జి నసీమా అన్నారు. బుధవారం వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ మధ్యకోటను జడ్జి నసీమా తన కుటుంబంతో కలిసి సందర్శించారు. శిల్పాల ప్రాంగణంలోని శిల్ప కళా సంపదను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవియాదవ్.. జడ్జి కుటుంబానికి వివరించారు. జడ్జి వెంట ఎస్సై శ్రావణ, టీజీ టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది ఉన్నారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని అమీట్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ పురుషుల టోర్నమెంటుకు కేయూ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు బుధవారం స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో కె.శ్రీసాయివర్ధన్, ఎన్.యశ్వంత్ రెడ్డి, బి.చింతేశ్వర్రెడ్డి, ఎస్.ప్రేమ్దినకర్, కె.దీపక్‌బాబు ఉన్నట్లు పేర్కొన్నారు. నరేశ్ కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహస్తారని తెలిపారు. టెన్నిస్ మెన్, ఉమెన్ జట్ల ఎంపిక..బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28 వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ మెన్ అండ్ ఉమెన్ జట్లను ఎంపిక చేసినట్లు వెంకయ్య తెలిపారు. టెన్నిస్ పురుషుల జట్టులో బి.మనోజ్‌కుమార్, కె.విశాల్ ఆదిత్య, ఎన్.గౌతమ్, ఎం.రామకృష్ణ, కె.శ్రావణ్ ఉన్నారు. ఉమెన్స్ జట్టులో డి.ప్రదీప్త, టి.సింధు, హెచ్.సంయుక్త, డి.అఖిల ఉన్నారు. ఎస్.మహేశ్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరించనున్నారు. -
బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి
● శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ న్యూశాయంపేట: లింకేజీ రుణాల మంజూరుకు బ్యాంకులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం బ్యాంకర్లతో జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ మీటింగ్ (డీసీసీ సమావేశం)లో ఆయన మాట్లాడారు. బ్యాంకులు సామాజిక బాధ్యతగా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై బ్యాంకర్లు దృష్టి సారించి విజయవంతం చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,274 కోట్లు లక్ష్యంగా ఎంచుకోగా.. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 7,169 కోట్ల రుణాలు ఇచ్చి 77.30 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్డీఎం హవేలీ రాజు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, యూనియన్ బ్యాంకు ఆర్‌హెచ్ కమలాకర్, ఆర్బీఐ ఏజీఎం రహమాన్, నాబార్డ్ ఏజీఎం రవి పాల్గొన్నారు. -
200 ఏళ్లపాటు నిలిచేలా ‘మేడారం’ పనులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు, మనోభావాలు దెబ్బతినకుండా అనుకున్న సమయానికే మేడారం జాతర పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సు«దీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాలతో కలిసి మంత్రి పొంగులేటి మంగళవారం మేడారంలో సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణ, రాత్రి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్, గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్ల పనులను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, ఇతర పనులను జనవరి 5లోగా ముగించాలని ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, వాటర్ ట్యాంకుల నిర్మాణం తదితర పనులను అధికారులు విభజించుకొని గడువులోపు పూర్తి చేయాలన్నారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలతో పునరుద్ధరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులను చేపట్టామని, పాలరాతి శిల్పాలపై గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొందిస్తున్నామని, అమ్మవార్ల దయతో సకాలంలో పనులు సకాలంలో పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. నేడు వనదేవతల దర్శనం నిలిపివేత ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మల దర్శనానికి భక్తుల రాకను బుధవారం నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఈఓ వీరస్వామి, పూజారులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల నూతన గద్దెలపై ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న సందర్భంగా అమ్మవార్ల దర్శనాలను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పూజాకార్యక్రమాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం నుంచి యథావిధిగా అమ్మవార్లను భక్తులు దర్శించుకోవచ్చన్నారు. ఈ విషయంలో భక్తులు తమకు సహకరించి దర్శనాలను బుధవారం వాయిదా వేసుకోవాలని కోరారు. -
వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ఆత్మకూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా క్లినిక్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆరోగ్య సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యాధికారులను సంప్రదించాలని కోరారు. ఇక్కడ నుంచి ఎవరినైనా రెఫర్ చేసినప్పుడు తగిన ఫాలోఅప్ సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సంవత్సరం 1,560 మహిళలను పరిశీలించి 350 మందికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, 82 మందిని రెఫర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రెఫర్ చేసిన వారికి తగిన ఫాలోఅప్ సేవలందించాలని డాక్టర్ స్పందనను ఆదేశించారు. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన కలిగించాలని పేర్కొన్నారు లెప్రసీ నిర్ధారణ సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ స్పందన, డాక్టర్ పుష్పలీల, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజల ఆశీర్వాదం ఉంటేనే గెలుపు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కమలాపూర్: ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడే గెలుపు వరిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ మద్దతుతో ఇటీవల గెలుపొందిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను మంగళవారం కమలాపూర్‌లో ఆయన సన్మానించి మాట్లాడారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలతో ఉన్న సత్సంబంధాలే బలమన్నారు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా మన వాళ్లేనని, కలిసి పనిచేస్తేనే విజయం సాధిస్తామన్నారు. 2021కి పూర్వం పార్టీలపరంగా కొట్లాటలు లేని ఏకైక నియోజకవర్గం హుజూరా బాద్ అని, ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయని స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా రాజేందర్ అన్నతో ఉండే బంధమే ఎక్కువని ఇతర పార్టీల్లో గెలిచిన వారు తన దగ్గరకు వస్తున్నారని, ప్రేమతో ఉండే వాళ్లు మనతో ఉంటారని, ఆఽశపడే వాళ్లు ఎన్నటికీ మన వాళ్లు కాదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, పార్టీ గుర్తులు ఉండవని, చెక్ పవర్ ఉన్న ఒకే ఒక్క పదవి సర్పంచ్ అని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కన్నా వార్డు మెంబర్, సర్పంచ్‌గా గెలవడమే కష్టమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో తట్టెడు మట్టి అయినా తీశాడా అని ప్రశ్నిస్తున్న వారిని ప్రజలు పట్టించుకోరని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సీఎంనైనా కలుస్తానని, పంచాయతీలకు నిధులు ఆగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే వారందరిని గెలిపించుకునే బాధ్యత తనదన్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ నాయకులు రాజయ్యయాదవ్, మాడ గౌతంరెడ్డి, ఎర్రబెల్లి సంపత్‌రావు, శీలం శ్రీనివాస్, శ్రీరాం శ్యాం, సురేందర్‌రాజు, తిరుపతిరెడ్డి, తుమ్మ శోభన్, కళాధర్ పాల్గొన్నారు. -
రెండేళ్లు.. 11 ప్రమాదాలు
హసన్‌పర్తి: వడ్డేపల్లి–ఉనికిచర్ల రోడ్డును రెండేళ్ల క్రితం డబుల్‌గా విస్తరించారు. ఈ మార్గంలోని సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంపు మలుపు ప్రమాదకరంగా మారింది. రెండేళ్లలో ఇక్కడ 11 ప్రమాదాలు జరిగి పలువురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. మంగళవారం జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. పెట్రోల్ బంకు సమీపంలో ఇసుక లారీ ఢీకొని దేవన్నపేట గ్రామానికి చెందిన చరత్కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ యువకుడు, ధర్మసాగర్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి మహేశ్, ముప్పారానికి చెందిన మాచర్ల రాజు, శాయంపేటకు చెందిన రాజు, ఉనికిచర్లకు చెందిన సందెల రమేశ్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. రోడ్డు ప్రమాదాలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన వారందరూ 40 ఏళ్ల లోపు వారేనని వారు తెలిపారు. మలుపు వద్ద ఏదైనా అదృశ్య శక్తి ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకలారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సుబ్బయ్యపల్లి పెట్రోల్‌బంకు మలుపు వద్ద ప్రమాదాలు జరుగకుండా హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
మేడారం.. ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టూ ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్‌ఎస్‌తాడ్వాయి ఆలోగా మేడారం జాతర పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
పోరు..!?
ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలుసాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందను కున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్‌ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు.. 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. 9 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉన్న 9 మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్‌కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. జనవరి చివరి వారంలో షెడ్యూల్‌కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుఉమ్మడి వరంగల్‌లో మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు.. మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు మున్సిపాలిటీ జనాభా వార్డులుములుగు 16,535 20 స్టేషన్‌ఘన్‌పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16


