breaking news
Kurnool
-
ఉపాధ్యాయుడైన జిల్లా కలెక్టర్
పత్తికొండ రూరల్: ఉపాధ్యాయుడిగా మారి జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పత్తికొండ మండల పరిధిలోని దూదేకొండ గ్రామంలో హైస్కూల్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రోత్సాహకాలు అందించారా, మెనూ ప్రకారంగా భోజనం అందుతుందా అనే విషయాలు తెలుసుకున్నారు. బోర్డు మీద కొన్ని ప్రశ్నలు రాసి విద్యార్థుల నుంచి జవాబులు రాబట్టారు. పాఠశాల ప్రాంగణంలో బండరాళ్లు, చెత్తా చెదారాన్ని తొలగించాలని ఆర్డీఓ భరత్‌నాయక్, ఎంఈఓ గాజుల రమేష్‌ను ఆదేశించారు. అంతకు ముందు గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్‌తో కలిసి పింఛన్‌ను అందజేశారు. కనకదిన్నె గ్రామంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటును, అలాగే పందికోన రిజర్వాయర్‌ను, పత్తికొండలోని ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలు.. పాఠశాల అప్‌గ్రేడ్ అయ్యిందని, అదనపు తరగతి గదుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లాకలెక్టర్‌కు సర్పంచ్ ముజుబుర్ రహిమాన్ తెలిపారు. వితంతు పింఛన్లు ఇవ్వాలని దూదేకొండ గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, సుశీలమ్మ, అరుణ, మాధవి కోరారు. పందికోన రిజర్వాయర్ కింద ఎడమ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి పొలాలకు నీరు అందించాలని రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. -
వైఎస్సార్సీపీ ‘మైనార్టీ’ విభాగం అధ్యక్షుడిగా హఫీజ్ ఖాన్
కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ సభ్యులుగా హఫీజ్‌ఖాన్ ఉన్నారు. జిల్లాకు కొత్తగా 3,502 వితంతు పింఛన్లు కర్నూలు(సెంట్రల్): జిల్లాకు కొత్తగా 3,502 వితంతు పెన్షన్లు మంజూరయ్యాయి. కాగా, భర్తలు చనిపోయిన వృద్ధులకు మాత్రమే కొత్తగా వితంతు పెన్షన్లను మంజూరు చేశారు. అయితే 60 ఏళ్లు దాటిన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడం గమనార్హం. కొత్తగా పెన్షన్లు మంజూరైన కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన కురువ అంజనమ్మ, బోయ లక్ష్మీదేవిలకు కలెక్టర్ తన చాంబర్లో పెన్షన్‌ను అందజేశారు. పీఆర్ ఎస్ఈగా మద్దన్న కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు (ఎఫ్ఏసీ)గా ఎస్సీఈ మద్దన్నకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ ఇంజనీరు ఇన్ చీఫ్ బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ ఎస్ఈగా విధులు నిర్వహించిన వి.రామచంద్రారెడ్డి జూలై 31న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు పీఆర్ ఈఈగా విధులు నిర్వహిస్తున్న మద్దన్నకు ఎఫ్ఏసీపై ఎస్ఈగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు డీఈఈ, ఏఈలు, కార్యాలయ సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.టెంకాయ రూ.20 ప్రకారం అమ్మాలి కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయం వద్ద ఒక టెంకాయ రూ.20 ప్రకారం విక్రయించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.20కే టెంకాయ అమ్మాలని పాటదారుడికి నోటీసు జారీ చేశామన్నారు. భక్తుల నుంచి ఫిర్యాదు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేరుగా అంబేద్కర్ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీ కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లను నేరుగా భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం కంబాలపాడు (బాలికలు), అరికెర (బాలురు) కళాశాలల్లో ఆర్ట్స్ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతిలో రెగ్యులర్, సప్లిమెంటరీగా ఉత్తీర్ణులైన వారు నేరుగా ప్రవేశాలకు అర్హులన్నారు. అరికెర బాలుర కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు 49, కంబాలపాడు బాలికల కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు నాలుగు సీట్లు, బైపీసీ జనరల్ విభాగంలో ఒక సీటు ఖాళీగా ఉందన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో 10వ తరగతిలో 24, సీనియర్ ఇంటర్మీడియట్లో 202, నంద్యాల జిల్లాలో 10వ తరగతిలో 16, సీనియర్ ఇంటర్మీడియట్లో 88 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత కలిగిన వారు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9866616633/ 9010070219 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఫైనాన్షియర్ ఇంట్లో పోలీసుల సోదాలు
ఆదోని అర్బన్: పట్టణంలోని టీజీఎల్ కాలనీలో నివాసముంటున్న యోగేష్ అనే ఫైనాన్షియర్ ఇంట్లో శుక్రవారం త్రీటౌన్ పోలీసులు సోదాలు చేశారు. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సాయిబాబానగర్‌కు చెందిన బసవరాజుకు మండిగిరి పరిధిలో 3 ఎకరాల భూమి ఉంది. ఆయన అవసరాలకు స్థానిక టీజీఎల్ కాలనీలో నివాసముంటున్న సురేష్ శివలాల్ ఫైనాన్షియర్‌తో మూడు ఎకరాలు మార్ట్గేజ్ చేసి 2019లో రూ.1.80 కోట్లు రుణం తీసుకున్నాడు. అయితే ఆరు నెలల క్రితం సురేష్ శివలాల్ మృతి చెందాడు. బసవరాజు తన పొలాన్ని విడిపించుకోవడానికి వెళ్తే తన తండ్రికి అప్పుడే అమ్మేశావు కదా అని సురేష్ శివలాల్ కుమారుడు యోగేష్ చెప్పాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యోగేష్‌పై ఈ ఏడాది జూన్ 3వ తేదీన త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బసవరాజ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నట్లు విచారణలో తేలడంతో శుక్రవారం డీఎస్పీ హేమలత అనుమతితో యోగేష్ ఇంట్లో తనిఖీ చేసినట్లు సీఐ తెలిపారు. యోగేష్ ఇంట్లో రిజిస్ట్రేషన్ పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలించామన్నారు. తనిఖీలో ఎస్ఐ రామస్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎనిమిది నెలలుగా జీతాలు లేవు
హొళగుంద: తమకు ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదని, చాలా ఇబ్బందులు ఉన్నాయని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి దృష్టికి గ్రీన్ అంబాసిడర్లు తీసుకెళ్లారు. గ్రామానికి వచ్చే నిధుల్లో ముందుగా గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వాలని సెక్రటరీకి, సర్పంచ్‌కు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని మార్లమడికి గ్రామంలో జెడ్పీ సీఈఓ పర్యటించారు. గ్రామంలో బళ్లారి రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి శిథిలావస్థకు చేరిన గదులను వాడొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. ఐవీఎస్ఆర్ కాల్స్‌లో గ్రామానికి జీరో శాతం రావడంతో పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని, పనులు ఎలా చేయాలని గ్రామ సర్పంచ్ తనయుడు రమేశ్ ప్రశ్నించారు. హొళగుంద ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయలలిత, ఈఓపీఆర్డీ చక్రవర్తి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో జెడ్పీ సీఈఓ సమీక్ష నిర్వహించారు. -
దర్జాగా ఇసుక దందా
● వాహన యజమానులకు టీడీపీ నేతల బెదిరింపులు ● టన్ను ఇసుక రూ. 500కే తమకివ్వాలని ఒప్పందం ● అక్రమంగా ఇసుక డంప్ చేసి వ్యాపారండోన్: ఇసుక ఉచితంగా అందిస్తామని.. భవన నిర్మాణ రంగాన్ని గాడిలో పెడతామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పడు దర్జాగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చి స్థానికంగా డంప్ చేసి అక్రమ వ్యాపారం చేస్తున్నా రు. ప్రతి నెల లక్షలాది రూపాయలు అక్రమార్జన చేస్తున్నారు. డోన్, బేతంచెర్ల చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లా పామిడి, తాడిపత్రితో పాటు నెల్లూరు జిల్లాకు వివిధ ఖనిజాలను లారీల్లో తరలిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో పెన్నా నది ఇసుకను టన్ను రూ.220 చొప్పున కొనుగోలు చేసి డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాల్లో టన్ను రూ.550 చొప్పున విక్రయిస్తుండేవారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల కళ్లు ఇసుక అక్రమ రవాణాపై పడింది. కొత్తబస్టాండ్ సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఇసుక రవాణా చేసే టిప్పర్, లారీ యజమానులందరినీ సమావేశ పరిచి టన్ను ఇసుక రూ.500 ప్రకారం తెచ్చి ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అదే ఇసుకను భవన నిర్మాణ యజమానులకు టన్ను రూ.900 చొప్పున అమ్ముకుంటామని లేదంటే, పోలీసుల ద్వారా వేధింపులు అధికం చేయడమే కాక ఆర్థికంగా నష్టపోయేట్లు చేస్తామని హెచ్చరించారు. దీంతో టిప్పర్, లారీ కిరాయి, డ్రైవర్ బత్తా, డీజల్ అన్ని కలిపి టన్ను ఇసుక రూ.550కు ఇచ్చేందుకు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక బట్టీల సెంటర్లోని ధర్మవరం రోడ్డులో మూతపడిన గ్రానైట్ ఫ్యాక్టరీ ఆవరణలో అధికార పార్టీ నేతలు ఇసుక డంప్ ఏర్పాటు చేసి దోపిడీకి రంగం సిద్ధం చేశారు. సామాన్యుడు తమ గృహ నిర్మాణాలకు ఎడ్లబండ్లు, ఆటోలలో ఇసుక తరలిస్తే పట్టుకొని వేధించే రెవెన్యూ, పోలీసు, ఏడీఎంఈ అధికారులు అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఇసుక డంప్ గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం ‘తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ముర్రుపాలు తప్పనిసరిగా బిడ్డకు పట్టించాలని సూచిస్తున్నాం. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లులకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణకు దోహదపడతాయని వివరిస్తున్నాం. –డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు తల్లిపాలతో బిడ్డకు అనుబంధం బిడ్డ జన్మించిన అరగంటలోపే తల్లికి పాలు వస్తాయి. ఈ ముర్రుపాలను బిడ్డకు తప్పనిసరిగా పట్టించాలి. ఇందులో బిడ్డకు అవసరమైన వ్యాధినిరోధక శక్తి ఉండి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఈ పాల ద్వారా బిడ్డకు అవసరమైనంత పోషకాలు, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్ అందుతాయి. లైఫేజ్ అనే ఎంజైమ్ వల్ల బిడ్డ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల వారిద్దరి మధ్య బాంధవ్యం బలపడుతుంది. – డాక్టర్ ఎం. విజయవాణి, చిన్నపిల్లల వైద్యనిపుణులు, కర్నూలు -
సంతెకూడ్లూరులో ఘర్షణ
ఆదోని అర్బన్: సంతెకూడ్లూరు గ్రామంలో టీడీపీ, బీజేపీ వర్గీయుల మధ్య బుక్ కీపర్ విషయంలో శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీకి చెందిన మహేష్ భార్య గాయత్రీ బుక్ కీపర్‌గా పనిచేస్తోంది. గత నెల నుంచి ఆమెను తీసివేసి టీడీపీకి చెందిన వీరేష్ భార్య సువార్తమ్మను నియమించారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన సువార్తమ్మ గ్రామంలో ఫేష్ యాప్ ద్వారా వివరాలు రికార్డు చేస్తున్నారు. బీజేపీకి చెందిన వారు ఎవరు ఫేష్ యాప్ చేసుకోవద్దని ప్రచారం చేసినట్లు తెలిసింది. ఇలా ప్రచారం చేయడం తెలుసుకున్న టీడీపీకి చెందిన వారు నేరుగా బీజేపీ వారిని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడిలో బీజేపీకి చెందిన మహేష్, టీడీపీకి చెందిన మదిరె వీరేష్‌కు గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
తల్లిపాలు.. అమృతధారలు
● శిశువు పుట్టిన గంటలోపేతల్లి పాలివ్వాలి ● ముర్రు పాలలో వ్యాధి నిరోధక శక్తి ● బిడ్డ ఎదుగుదలకు ఎంతో మేలు ● శిశువు ఆరు నెలల వరకు ఇవే ఇవ్వాలి ● జిల్లాలో ఏటా 48 వేలకు పైగా ప్రసవాలు ● అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): అప్పుడే జన్మించిన బిడ్డకు తల్లిపాలే ఆహారం. అది మనిషైనా...ఇతర ఏ జీవికైనా. జన్మించిన శిశువు తల్లిని తాకగానే ఆమెకు పాలు స్రవిస్తాయి. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఇతర పాలను బిడ్డకు పట్టిస్తే అటు బిడ్డకు.. ఇటుకు తల్లికి అనారోగ్యం. అందుకే బిడ్డకు రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలే పట్టించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది బిడ్డకు, తల్లికి ఇద్దరికీ మంచిదని సెలవిస్తున్నారు. తల్లిపాల ప్రాముఖ్యత పట్ల తల్లులకు, ఆమె కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగష్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొత్తగా మంజూరైన మరో 12 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇవేగాక ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 26 అర్బన్‌హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక బోధనాసుపత్రి ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో ప్రతి సంవత్సరం 48 వేలకు పైగా గర్భిణులు ప్రసవిస్తున్నారు. పుట్టిన బిడ్డకు ఎలా పాలను పట్టించాలనే విషయమై అక్కడి వైద్య సిబ్బంది బాలింతలకు సూచిస్తున్నారు. తల్లిపాల పట్ల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో విడుదలయ్యే ముర్రుపాలను బిడ్డకు పట్టిస్తే వ్యాధినిరోధక పెరిగి భవిష్యత్‌లో రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు. పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట తల్లులకు తమ బిడ్డకు పాలిచ్చేందుకు వీలు కల్పించాలి. అందుకు అందరూ సహకారం అందించాలి. ఈ మేరకు ఉన్నంతలో ఏర్పాట్లు చేయాలి. తల్లి పాలు బాగా రావాలంటే...! మహిళ గర్భధారణ అయినప్పటి నుంచే పోషకాలు కలిగిన పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అతిగా స్వీట్లను తినకూడదు. ఇవి తీసుకోరాదు బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి కొన్నింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదు. పాలిచ్చే సమయంలో కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానియాలు తీసుకోకూడదు ఇది శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ముర్రుపాలలో రోగ నిరోధక శక్తి గర్భిణి ప్రసవించిన అనంతరం మొదటి అరగంటలోపు తల్లికి వచ్చే పాలను ముర్రుపాలంటారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది అవగాహన లేకపోవడం వల్ల బిడ్డకు ముర్రుపాలను తాగించడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ పాలలో వ్యాధి నిరోధకశక్తిని పెంచే గుణం ఉంటుంది. సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. చాలా రకాల వ్యాధులు రాకుండా తల్లిపాలు కాపాడతాయి. తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు. తల్లిపాలు తాగే పిల్లల్లో ఆకస్మిక మరణాలు తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. ఎప్పుడు..ఎలా పాలివ్వాలంటే... ఉపయోగాలు శిశువుకు తల్లిపాలు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. ఇవి నాణ్యమైన ప్రొటీన్లు, ఒమెగా 3, ఒమెగా 6, ఒమెగా 9, విటమిన్లు ఉండి బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. లాక్టోజుతో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల రాకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండెవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలర్జి, ఆస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులూ రావు బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ. తల్లిపాలు ఎంతో స్వచ్ఛంగా, ఎలాంటి క్రిములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జి, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి బిడ్డలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. అందుకే బిడ్డ జన్మించిన గంటలోపు తల్లికి వచ్చే ముర్రుపాలు పట్టించాలి. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. రోజులో 8 నుంచి 10 సార్లు లేదా ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. -
హాస్టళ్లలో పురుగుల అన్నం.. నీళ్ల చారే గతి
కర్నూలు(సెంట్రల్): సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పురుగుల అన్నం, నీళ్ల చారే దిక్కు అయ్యిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్, రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు కటిక నేలపైనే నిద్రిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కర్నూలులోని కలెక్టరేట్ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మణిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్‌తో కలసి వారు మాట్లాడారు. ఇటీవల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టళ్లను సందర్శించి పలు సమస్యలను తెలుసుకున్నామన్నారు. విద్యార్థులకు ఇంతవరకు బెడ్ సీట్లు, ట్రంకు పెట్టెలు, భోజనం ప్లేట్లు ఇవ్వలేదన్నారు. ఎక్కడా కిటికీలకు డోర్లు లేవని, బాత్రూంలు తెరుచుకోవడం లేదని, మరుగుదొడ్లు పనిచేయడం లేదని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్లకు అనేక వసతులు కల్పించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ శివరాముడుకు వినతిపత్రం ఇచ్చారు. -
ఇక వార్షిక ఫాస్టాగ్
కర్నూలు: సొంత వాహనదారుల టోల్‌ప్లాజా కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీతో ముందుకొచ్చింది. జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వ్యక్తిగత వాహనదారుల ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గరిష్టంగా 200 ట్రిప్పులకు అనుమతిస్తూ వార్షిక ఫాస్టాగ్ ఆఫర్‌ను ఈ నెల 15 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి రానుంది. రూ.3 వేలు చెల్లింపుతో ప్రత్యే క టోల్ పాస్‌ను ఎవరైనా వ్యక్తిగత వాహనదారులు పొందవచ్చు. ఇది ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్రయాణాల వరకు వర్తిస్తుంది. జాతీ య రహదారుల టోల్ ప్లాజాలపై ఇది అమలు కానుంది. కావాలనుకున్న వాహనదారులు మా త్రమే వార్షిక పాస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వార్షిక పాస్ అనేది పూర్తిగా స్వచ్ఛందం. ఈ నెల 15 నుంచి అమలులోకి.. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఫాస్టాగ్ ఆఫర్ అందుబాటులోకి రానుంది. టోల్ ప్లాజా ను దాటిన ప్రతిసారి ఒక ట్రిప్పు గా లెక్క కడతా రు. ఉదాహరణకు మనం ప్రయాణంలో 4 టోల్ ప్లాజాలు దాటితే 4 ట్రిప్పులు పూర్తయినట్లు లెక్కిస్తారు. ఈ లెక్కన వార్షిక ఫాస్టాగ్ పాస్ అనే ది 200 సార్లు మాత్రమే పని చేస్తుంది. మొత్తం పూర్తి కాకపోతే ఏడాదంతా ఈ పాస్ పనిచేస్తుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా ముగిస్తే దానిని ఫాస్టాగ్‌కు తుది గడువుగా పరిగణిస్తారు. ఎవరికి వర్తిస్తుందంటే... ఫాస్టాగ్ ఉన్న వ్యక్తిగత వాహనదారులకు మాత్రమే వర్తిస్తుంది. టోల్ ఫీజు ఎంత ఉన్నా సంబంధం లేకుండా టోల్ ప్లాజా దాటవచ్చు. ప్రవేశం–నిష్క్రమణను ఒకే దాటుగా పరిగణిస్తారు. ఇది ప్రయాణ ఖర్చులను తగ్గించి వేగవంతమైన టోల్ క్లియరెన్స్‌కు దోహదపడుతుంది. పాస్‌ను టోల్ ప్లాజాలో లేదా ఆన్లైన్లో పొందవచ్చు. సొంత వాహనదారులకు కొత్త ప్లాన్ ధర రూ.3 వేలు.. గరిష్టంగా 200 ట్రిప్పులు టోల్ ప్లాజా ఎంట్రీ నుంచి ఎగ్జిట్‌కు ఒక ట్రిప్పుగా పరిగణన కర్నూలు–కడప హైవేలో వేలాది మందికి ఉపయోగం రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నిర్వహిస్తున్న కర్నూ లు నుంచి కడప వరకు 40వ నంబర్ జాతీయ రహదారిలో ప్రయాణించే వేల మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈ మార్గాన్ని వినియోగించే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా స్మార్ట్ మౌలిక సదుపాయాల లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. – వి.మదన్మోహన్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేటు లిమిటెడ్ ప్రాజెక్ట్ హెడ్ -
సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి పీఎల్ వరలక్ష్మి కర్నూలు(అర్బన్): పాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి ప్రభుత్వ విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి పీఎల్ వరలక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని ప్రకృతి వ్యవసాయ హాల్లో సమాచార హక్కు చట్టం –2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి, సీనియర్ కన్సల్టెంట్స్ లక్ష్మయ్య, రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడు తూ సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, సమాచారాన్ని పొందడం పౌరుల హక్కు అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వ్యవసాయ పంట కొత్త ప్రయోగానికి సంబంధించిన 32 కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లను ఉపయోగించుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంట ఉత్పత్తుల దిగుబడులను కచ్చితమైన దిగుబడిని అంచనా వేసేందుకు ఉపయోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీపీఎంయూ సిబ్బంది, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సందీప్‌కుమార్, లావణ్య, ఎన్ఎఫ్ఏస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి రాబట్టుకునేందుకు బాలుడి కిడ్నాప్
● 24 గంటల్లో ఛేదించిన పోలీసులు కర్నూలు: కర్నూలు రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామ శివారు స్కందాన్షి వెంచర్‌కు చెందిన బాలుడు మోక్షిత్ (10) అదృశ్యం కేసు తెర పడింది. తెలుగు సురేష్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు మోక్షిత్ లక్ష్మీపురంలోని రామకృష్ణ విద్యా మందిర్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. గురువారం స్కూల్ నుంచి ఇంటికి రాకపోవడంతో తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్ఐలు ధనుంజయ, శరత్ కుమార్ రెడ్డి తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా బాలుడు ఇంట్లోనే నివాసమున్న వెల్దుర్తి మండలం మల్లెంపల్లె గ్రామానికి చెందిన మనోహర్ నాయుడు బాలుడి కుటుంబ సభ్యులను భయపెట్టి డబ్బులు, ఆస్తిని రాబట్టుకునేందుకు కిడ్నాప్ చేసినట్లు బయటపడింది. మనోహర్ నాయుడు అదృశ్యమైన బాలుడు మోక్షిత్‌తో పాటు వెల్దుర్తి రైల్వే స్టేషన్ ఎదురుగా క్రిష్ణగిరి టర్నింగ్ వద్ద కర్నూలుకు వచ్చే దారిలో కారులో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా ఆస్తిని రాబట్టుకునేందుకు తానే కిడ్నాప్ చేసినట్లు మనోహర్ నాయుడు నేరాన్ని అంగీకరించాడు. శుక్రవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. సీఐ చంద్రబాబు నాయుడుతో కలసి డీఎస్పీ కిడ్నాప్ వ్యవహారం విషయాలను వెల్లడించారు. అదృశ్యమైన బాలుడిని 24 గంటల్లో వెతికిపట్టి తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. -
పట్ట పగలే చోరీ
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం విజయానికేతన్ పాఠశాల సమీపంలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల మద్దిలేటి డొంగు వద్ద ఉన్న హోటల్ వంట మాస్టర్‌గా పని చేస్తున్నారు. రోజులాగే తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు భార్యాభర్తలు హోటల్‌కు వెళ్లారు. ఆ సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి మూడు బీరువాలను పగులగొట్టి రూ. 60 వేలు నగదు, ఒక ఉంగరాన్ని అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగలు చోరీకి ఉపయోగించిన సుత్తి, ఇనుపరాడ్డును అక్కడే వదిలేయడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బీజేపీని వీడి సొంత గూటికి
ఆదోని రూరల్: మేజర్ గ్రామ పంచాయతీ మండిగిరికి చెందిన మాజీ విద్యాకమిటీ చైర్మన్ ఉలిగప్ప సొంతగూటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్ అభిమానిగా ఉన్న ఉలిగప్ప వైఎస్సార్సీపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగారన్నారు. విద్యాకమిటీ చైర్మన్‌గా ఐదేళ్లపాటు బాధ్యతలు కూడా నిర్వర్తించారన్నారు. పార్టీకి ఎన్నో సేవలు అందించారని, అయితే కొన్ని ప్రలోభాలకు తలొగ్గి బీజేపీలో చేరారన్నారు. అక్కడ పొందలేక తిరిగి వైఎస్సార్సీపీలోకి చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఉలిగప్ప మాట్లాడుతూ.. బీజేపీలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చానన్నారు. కార్యక్రమంలో ఉలిగప్ప అనుచరులు 50 మంది పాల్గొన్నారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన మాజీ విద్యాకమిటీ చైర్మన్ కండువా వేసి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి -
వచ్చే ఎన్నికల్లోనూ ఇదే విజయాన్ని సాధిద్దాం
కర్నూలు (టౌన్): స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వచ్చిన విజయాన్నే వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సాధిద్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. నగర పాలక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచి మునెమ్మ, షేక్ అహమ్మద్, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, నారాయణ రెడ్డి శుక్రవారం నియామక ధ్రువపత్రాలు అందుకున్నారు. అనంతరం వీరు ఎస్వీ కాంప్లెక్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని కలిశారు. వారికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభినందనలు తెలిపి మాట్లాడారు. నాలుగేళ్ల పాటు కర్నూలులో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినా గతేడాది నిర్వహించిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలిచారన్నారు. ఓటమి భయంతో ఈ ఏడాది ఎన్నికల్లో నిలబడేందుకు టీడీపీ సాహసించలేదన్నారు. ప్రజలతో మమేకమైన ఎనిమిది నెలల వ్యవధిలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విక్రమ సింహారెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, మల్లి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
ప్రమాదం వేలాడుతోంది
పత్తికొండ: నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడే ప్రమాదం మాటు వేసింది. కిందకు వేలాడుతూ భయపెడుతోంది. వెలుగులు ప్రవహించే విద్యుత్ తీగలు చీకట్లు నింపే ప్రమాదం నెలకొంది. అయినా విద్యుత్ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని కనిపిస్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. పత్తికొండ పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఇరువైపుల ఏర్పాటు చేసిన సర్వీస్ విద్యుత్ తీగలు చాలా ప్రమాదకరంగా మారాయి. వాహనాలకు తగిలే అంత ఎత్తులో ఉండటంతో ఏదో ఒక చోట తొగి కింద పడుతున్నాయి. త్రుటిలో ప్రజలు ప్రాణాలతో బయటపడుతున్నారు. గురువారం గుత్తిరోడ్డు సర్కిల్లో భారీ వాహనం తాకడంతో సర్వీస్ వైరు కిందికి పడిపోయింది. స్థానికులు విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో ట్రాన్సోకో సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై ఆటోనే ఆసారాగా చేసుకుని 45 నిమిషాలు పాటు ట్రాఫిక్ నిలిపివేసి తీగలను సరి చేశారు. దీంతో ఇరు వైపులా వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.ఆర్సీడీఎస్ రీజినల్ కోఆర్డినేటర్‌గా మండ్ల వెంకటసుబ్బారెడ్డికర్నూలు(అర్బన్): రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ(ఆర్సీడీఎస్) రీజినల్ కోఆర్డినేటర్(కర్నూలు, నంద్యాల, ప్రకాశం)గా బనగానపల్లెకు చెందిన డాక్టర్ మండ్ల వెంకటసుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్రరెడ్డి గురువారం నియామక పత్రాన్ని జారీ చేశారు. రెడ్డి జాతి శ్రేయస్సు, ఐక్యతకు పాటు పాడేందుకు గత జూలై 30వ తేది నుంచి తదు పరి ఉత్తర్వులు అందే వరకు మండ్ల వెంకట సుబ్బారెడ్డి రీజినల్ కోఆర్డినేటర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సొసై టీ నియమ నిబంధనలను అనుసరించి క్రమ శిక్షణతో అన్ని రెడ్డి సంఘాలను సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలన్నారు.2న చిత్రలేఖన పోటీలుకర్నూలు కల్చరల్: జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభల సందర్భంగా ఈనెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఓల్డ్‌బస్టాండ్ సమీపంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జేవీవీ జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. సీనియర్ విభాగంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ‘డార్విన్ జీవ పరిణామ సిద్ధ్దాంతం’, జూనియర్ విభాగంలో 6, 7 తరగతుల విద్యార్థులకు ’మొక్కల సంరక్షణ’ అనే అంశాలపై పోటీలు ఉంటాయని వెల్లడించారు.రేపు ఆట్యా–పాట్యా ఎంపిక పోటీలుకర్నూలు (టౌన్): పాణ్యం పట్టణంలోని విజయానికేతన్ పాఠశాల క్రీడా మైదానంలో ఆగస్టు 2న ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–15 బాలుర విభాగంలో ఆట్యా– పాట్యా ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరత్నమయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చాటిన క్రీడాకారులు వచ్చే నెల 8 నుంచి 10 వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
జూపాడుబంగ్లా: రైతు నుంచి రూ.40వేల లంచం తీసుకుంటూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సోమన్న, బాధిత రైతు ఈశ్వరయ్య తెలిపిన వివరాలివీ.. జూపాడుబంగ్లాకు చెందిన శంకరమ్మకు 80బన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 568/ఏలో 0.70 సెంట్లు, 568/సీలో 0.30సెంట్ల పొలం ఉంది. వీరు ఈ పొలాన్ని పూర్వం నుంచి అనుభవిస్తున్నారు. అయితే ఆన్లైన్ అడంగల్‌లో రెవెన్యూ అధికారులు జూపాడుబంగ్లాకు చెందిన లింగన్న పేరిట నమోదు చేశారు. తమకు వారసత్వంగా వస్తున్న రిజిష్టర్ భూమిని తిరిగి తమ పేరిట ఎక్కించాలని రైతు ఈశ్వరయ్య 2021 నుంచి జూపాడుబంగ్లా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్ఓఆర్ విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయానికి రెఫర్ చేశారు. అయితే పేరును చేర్చేందుకు రూ.70వేలు లంచం డిమాండ్ చేశారు. తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని రూ.30వేలు ఇస్తానని పేర్కొన్నట్లు బాధిత రైతు తెలిపాడు. చివరికి రూ.50వేలకు బేరం కుదిరింది. అందులో భాగంగా రూ.10వేల అడ్వాన్స్‌ను ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్‌కు ఇచ్చాడు. మిగిలిన రూ.40వేల నగదు రైతు ఈశ్వరయ్య వద్ద తీసుకొని తనకు ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశించినట్లు ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ రమేష్ ఏసీబీ అధికారులకు తెలిపాడు. రమేష్ ఒత్తిడి తాళలేక రైతు కర్నూలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వల పన్నిన ఏసీబీ ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు గురువారం ఈశ్వరయ్యకు రూ.40వేల నగదు ఇచ్చి పంపించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న సూచనల మేరకు రైతు ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్‌కు గురువారం ఫోన్‌చేసి డబ్బులు ఎక్కడకు తెచ్చిమ్మంటారని అడిగాడు. అందుకాయన తాను నందికొట్కూరు నుంచి ఏపీ 40 డీఏ 5036 నెంబర్ కారులో ఆత్మకూరుకు వెళ్తున్నానని, జూపాడుబంగ్లాకు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొంటానన్నాడు. జూపాడుబంగ్లా జంగాల పెద్దన్న ఇంటికి సమీపంలో ఈశ్వరయ్య వేచి చూస్తుండగా అక్కడకు కారులో వచ్చిన రమేష్ రైతు ఇచ్చిన రూ.40వేల నగదును తీసుకొని ఆత్మకూరుకు బయలుదేరాడు. డబ్బులు ఇచ్చిన వెంటనే ఈశ్వరయ్య ఏసీబీ అధికారులకు ఫోన్చేయటంతో వారు జూపాడుబంగ్లా బస్టాండు వద్ద రమేష్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అతని నుంచి రూ.40వేల నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. ఆర్డీఓ ఒత్తిడితోనే... ఏసీబీకి పట్టుబడిన రమేష్ మాట్లాడుతూ.. రైతు ఈశ్వరయ్య వద్ద డబ్బులు ఇప్పించుకొని రావాలని ఆర్డీఓ నాగజ్యోతి ఒత్తిడి చేయటంతో తాను డబ్బు తీసుకొన్నానని తెలిపాడు. లంచం ఇస్తేనే పని చేస్తానని రైతు ఈశ్వరయ్యపై ఆర్డీఓ ఒత్తిడి చేయటం వల్లే తానే ఏసీబీ వద్దకు వెళ్లాలని రైతుకు సలహా ఇచ్చినట్లు పేర్కొనటం గమనార్హం. ఇదిలాఉంటే ఆర్డీఓ విషయమై ఏసీబీ డీఎస్పీ సోమన్నను ‘సాక్షి’ ప్రశ్నించగా.. ఆర్డీఓ స్వయంగా లంచం డిమాండ్ చేసినట్లు తగిన ఆధారాలు లేవన్నారు. అందువల్ల ఆమైపె కేసు నమోదు చేయడం లేదని తెలిపారు. రైతు వద్ద రూ.40వేల లంచం డిమాండ్ ఆర్డీఓ చెప్పినందుకే తీసుకున్నట్లు సీనియర్ అసిస్టెంట్ వెల్లడి -
కుక్కను తప్పించబోయి..!
అప్పుడుప్రజా ఉద్యమాలకు సిద్ధమవుదాంహాస్టల్లో కనీస వసతులు కరువుఉద్యోగ విరమణ రోజే మృతి గుంతకల్లు రూరల్: వైద్య, ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీరస్గా పనిచేస్తు న్న వసుంధర గురువారం తన స్వగృహంలో మృతి చెందారు. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఆమె విడపనకల్లు పీహెచ్సీ, కర్నూలు జిల్లా పగిడిరాయి పీహెచ్సీలో పని చేశారు. ప్రస్తుతం పత్తికొండ మండలం పుచ్చకాలమాడ పీహెచ్సీలో పనిచేస్తున్నారు. సర్వీసు పూర్తి కావడంతో గురువారం ఆమె ఉద్యో గ విరమణ పొందాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వసుంధర.. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఇతర సిబ్బంది ఆమె ఇంటికి చేరుకుని పరామర్శించి వెళ్లారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1.30 గంటలకు కన్నుమూశారు. తాటి చెట్టు చెప్పెను.. వానల్లేవని! ఎందుకో.. ఏమో వరుణుడు మొహం చాటేశాడు. రోజూ ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులు వర్షిస్తాయని అనుకుంటుండగానే కాసేపటికే మాయమవుతున్నాయి. నీటి కోసం చెరువులు నోరెళ్లబెట్టాయి. వేసవిలో ఎండిన వాగులు, వంకలు కుంటలు నీళ్ల కోసం అర్రులు చాస్తున్నాయి. ఇందుకు తమ్మరాజుపల్లె గ్రామం వద్ద ఎస్ టర్నింగ్ వద్ద ఉన్న జాతీయ రహదారి పక్కన ఉన్న కుంటనే నిదర్శనం. గతేడాది జూలై మొదటి వారంలోనే ఈ కుంట నిండటంతో మూగజీవాల దాహార్తి తీరింది. ప్రస్తుతం ఎండిపోయిన కుంటలో ఎత్తైన తాటి చెట్టు వరుణుడు కరుణ కోసం ఆకాశం వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. – పాణ్యంఇప్పుడుడోన్ టౌన్: ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుదామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముపాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయు లు, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా రెండవ మహా సభలో భాగంగా రెండవ రోజు గురువారం మార్కెట్‌యార్డు సమీపంలోని క్రిష్టియన్ హాలులో జిల్లా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది పాలనలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయన్నా రు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడదామన్నారు. పేదలకు ఇంటి స్థలాలు వంకల్లో వాగుల్లో ఇస్తూ.. బడా బాబులకు పట్టణం నడిబోడ్డున, విలువైన భూములు అప్పనంగా అప్పజెబుతున్నారని ఆరోపించారు. నూతన కమిటీ: సమావేశం అనంతరం నంద్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా రంగనాయుడు రెండవ సారి ఎన్నికయ్యా రు. సహాయ కార్యదర్శిగా బాబా ఫకృద్ధీన్‌తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా 15 మందిని, జిల్లా సమితి సభ్యులుగా 40 మందిని ఎన్నుకున్నారు. ఇందులో డోన్‌కు చెందిన కౌన్సిలర్ సుంకయ్య, రాధాకృష్ణ, రఘురామమూర్తి, ప్రసాద్, భాస్కర్, నాగరాము డు, రమేష్, మోటా రాముడు, నారాయణ ఎన్నికయ్యారు. కర్నూలు సిటీ: నగర శివారులో జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ దంపతులు గాయపడ్డారు. కర్నూలు రూరల్ మండల పరిధిలోని పసుపుల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌గా ఇందిర పని చేస్తున్నారు. గురువారం ఉదయం ఆమె భర్త భాస్కర్‌తో కలసి బైక్‌పై పాఠశాలకు బయలుదేరారు. వెంకాయపల్లె సమీపంలోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ ఎదురుగా ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డువచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి భార్యాభర్తలు కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందిర తలకు తీవ్ర గాయాలు కావడంతో మాట్లాడలేని పరిస్థితులో ఉంది. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శ్యామూల్ పాల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు ఆసుపత్రికి చేరుకుని గాయపడిన దంపతులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను కోరారు. ఇందిర పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన భర్త భాస్కర్ జనరల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. మహిళా టీచర్ దంపతులకు గాయాలు -
ఈరన్నస్వామి క్షేత్రం.. భక్తజన సంద్రం
దేవాలయం వద్ద భక్తుల రద్దీ కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మొదటి గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రావణమాస ఉత్సవాల మొదటి గురువారం కావడంతో భక్తులు ఉదయం నుంచే స్వామి దర్శనానికి తరలిరావడంతో పుణ్యక్షేత్రం భక్త జనసంద్రంగా దర్శనమిచ్చింది. భక్తులు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామృతాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. స్వామి దర్శనం కోసం భక్తులు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. భక్తుల సౌక ర్యార్థం ఆలయ అధికారులు అతిశీఘ్ర దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం, శీఘ్రదర్శనం ఏర్పాటు చేశారు. -
ఊపిరిపై క్యాన్సర్ కాటు
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది క్యాన్సర్ కారకం.. అని బీడీ, సిగరెట్, చుట్టల పెట్టెలపై ముద్రిస్తున్నా జనం మారడం లేదు. వాటికి అలవాటుపడిన వారు వ్యసనాన్ని వదలడం లేదు. కానీ అలవాటు ఊపిరితిత్తులను పొగతో కమ్మేసి క్రమంగా క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతోంది. ధూమపానంతో వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే పొగ కాలుష్యంగా మారి మనిషి ప్రాణాలు తీస్తోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి గల కారణాలు, తీసుకునే చికిత్సలపై అవగాహన పెంచేందుకు ఏటా ఆగస్టు ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కథనం. – కర్నూలు(హాస్పిటల్)● పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు ● ధూమపానమే ప్రధాన కారణం ● వాతావరణ కాలుష్యం కూడా.. ● నేడు ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ ఇదో భయంకర మహమ్మారి. 50 ఏళ్ల క్రితం వరకు ఎక్కువగా ధనికులకు మాత్రం వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పేద, మధ్యతరగతి వర్గాలను వదలడం లేదు. ఏటా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వ్యాధి నిర్ధారణ అవకాశాలు సులభం కావడం కూడా సంఖ్య పెరగడానికి కారణమైంది. ఈ వ్యాధితో బాధపడిన వారు త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే మనగలుగుతున్నారు. చివరి దశలో బయటపడితే మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ప్రతిరోజూ నిర్వహించే ఓపీకి 30 మంది దాకా రోగులు వస్తున్నారు. ఇందులో 20 మంది కొత్త వారే ఉంటున్నారు. అంటే ప్రతి నెలా 500 నుంచి 600 మంది, ఏడాదికి 6వేలకు పైగా కొత్తరోగులు పుట్టుకొస్తున్నారు. వీరిలో 6 శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే వారిలో అధిక శాతం మూడవ దశ, నాల్గవ దశలలో చికిత్స కోసం వస్తుండగా ఎక్కువ మంది కోలుకోలేక మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్‌కు చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో ఇద్దరు సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు. వీరు ఊపిరితిత్తుల్లో ఏర్పడిన క్యాన్సర్ కణితులను తొలగించడం, దెబ్బతిన్న ఊపిరితిత్తిలోని కొంత భాగాన్ని తీసివేయడం చేసి అనంతరం కీమోథెరపి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రితో పాటు కర్నూలు నగరంలోని ఒమెగా హాస్పిటల్, విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్, అమీలియో క్యాన్సర్ హాస్పిటల్లలోనూ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లోనూ ప్రతిరోజూ కొత్త, పాత రోగులు 150 నుంచి 200 మంది చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ప్రాణాలు తోడేస్తున్న పొగ స్నేహితులతో సరదాగా మొదలయ్యే పొగతాగే అలవాటు క్రమంగా అలవాటుగా మారి ఆ తర్వాత బానిసను చేసుకుంటుంది. దీనిని వదిలించుకుందామన్నా వదలలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. కొందరు రోజుకు ఒక ప్యాకెట్/కట్ట తాగుతుండగా మరికొందరు నాలుగైదు పెట్టెలు కాల్చందే మనసు ఊరుకోని పరిస్థితి. ధూమపానం చేసేవారిలో చేయని వారికంటే ఊపరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 24 నుంచి 35 రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వారు వదిలిన గాలి పీల్చడం(పాసివ్ స్మోకింగ్) ద్వారా 3.5శాతం క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీంతో పాటు గాలి కాలుష్యం, గతంలో చేసిన రేడియేషన్ థెరపి, వంటచేసే సమయంలో ఉత్పత్తి అయ్యే రాడన్ గ్యాస్ పీల్చడం, ఆర్సెనిక్ క్రోమియం, నికెల్ ఆస్బెస్టాస్, ఇతర పదార్థాలు పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. వ్యాధి లక్షణాలు–సంకేతాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా దాని ప్రారంభ దశలలో సంకేతాలు, లక్షణాలను కలిగించదు. వ్యాధి తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ చికిత్సకు లొంగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. నిరంతర దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం, శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గిపోవడం, ఎముకల నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం లక్షణాలు ఉంటాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్స ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశమున్న వారు ఏడాదికి ఒకసారి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలను బట్టి వైద్యుల సూచనల మేరకు ఛాతి ఎక్స్‌రే, ఛాతి సీటీ స్కాన్, కఫం సైటోలజీ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ రకాన్ని గుర్తించేందుకు టిష్యూ బయాప్సీ అవసరం అవుతుంది. చికిత్స ఆ క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటుంది. ఈ క్యాన్సర్‌కు ప్రస్తుతం శస్త్రచికిత్స, కీమోథెరపి, రేడియోథెరపి విధానాల్లో చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ రకాలు స్మాల్‌సెల్ లంగ్ క్యాన్సర్: ఇది చిన్న కణాల ఊపిరితిత్తుల క్యాన్సర్, దాదాపుగా ఎక్కువగా ధూమపానం చేసేవారిలో ఇది సంభవిస్తుంది. నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్: ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్లలో వివిధ రకమైన క్యాన్సర్లు ఉంటాయి.(క్యామాసెల్ క్యాన్సర్, అడెనోకార్సినోమా, పెద్ద కణ క్యాన్సర్). -
పరిశ్రమల స్థాపనకు గడువులోపు అనుమతులు
కర్నూలు(సెంట్రల్): పరిశ్రమల స్థాపనకు వీలుగా ఆయా శాఖలు నిర్దేశించిన గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ డెస్కు పోర్టల్ ద్వారా మే 30 నుంచి జూలై 30వ తేదీ వరకు 870 పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా 858 దరఖాస్తులను ఆమోదించామన్నారు. పీఎం విశ్వకర్మకు సంబంధించి 1,234 దరఖాస్తులు రాగా, 989 యూనిట్లకు రుణాలు మంజూరైనట్లు చెప్పారు. ఉత్పత్తిలోకి వచ్చిన కొత్త పరిశ్రమలు ప్రభుత్వానికి ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా అని ఏపీఐఐసీ జెడ్ఎం, పరిశ్రమల శాఖ జీఎంలను ఆరా తీశారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లైతే బ్యాంకుల నుంచి రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రూ.26.22 లక్షల పారిశ్రామిక రాయితీ విడుదలకు ఆమోదం తెలిపారు. పేదరిక నిర్మూలన(పీ4)లో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
జర్మనీ భాష శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు
కర్నూలు(అర్బన్): జర్మనీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలకు వీలుగా జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల సహకారంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జర్మనీ భాషపై శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం డిగ్రీ అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 4లోగా dydir.sw.krnl@gmail.comకు పంపా లన్నారు. మరిన్ని వివరాలకు ఎం.శశికుమార్ (సెల్: 8121261727, 08518– 230790 )ను సంప్రదించాలన్నారు. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో మొత్తం 150 మంది మహిళలకు శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ముందుగా Naipunyam AP పోర్టల్‌లోని https://naipunyam.ap.gov.in/ user registration? pageprogaram regirtratio n, ఇందులో Traineeregistration ఎంపిక చేసి, ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం అందుబాటులో ఉన్న శిక్షణా ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 6వ తేదీలోగా పూర్తి చేసుకోవాలన్నారు. మూత‘బడి’ తుగ్గలి: మండలంలోని జాప్లాతండా ప్రాథమిక పాఠశాల మూతపడింది. గత విద్యా సంవత్సరం వరకు నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ముగ్గురు విద్యార్థులు పత్తికొండలో చేరగా రెండో తరగతి విద్యార్థిని ఒక్కరే మిగిలారు. దీంతో పాఠశాల మూతపడింది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు కూడా బదిలీపై వెళ్లారు. దీంతో ఉన్న ఒక్క విద్యార్థిని పక్కగ్రామమైన లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు చేర్పించారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే తిరిగి పాఠశాల తెరుచుకునే అవకాశం ఉందని ఎంఈవో–2 రామవెంకటేశ్వర్లు తెలిపారు. -
స్వర్ణ పల్లకీలో దివ్య తేజం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో గురువారం స్వర్ణ పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. తొలుత ఊంజల మంటపంలో సేవా భక్తులతో సంకల్పం చేయించి చామర్ల సేవ చేపట్టారు. అనంతరం స్వర్ణ పల్లకీలో శ్రీరాఘవేంద్రుల ప్రతిమను కొలువుంచి హారతులు పట్టారు. శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అశేష భక్తజన వాహిని మధ్య పల్లకీ సేవ నిర్వహించారు. పది పంపులతో హంద్రీనీవాకు నీరు కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగు నీటిని అందించేందుకు చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి భారీగా నీటిని ఎత్తిపోస్తుండడంతో కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. ఇప్పటి వరకు 9 పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేసిన ఇంజనీర్లు గురువారం రెండో పంపింగ్ స్టేషన్లో 10వ పంపును సైతం ఆన్ చేశారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం, విస్తరణ పనులు చేసిన తరువాత కాల్వ భద్రతను దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవా ఇంజనీర్లు పర్యవేక్షణను పెంచారు. ఎప్పటికప్పుడు నీటి ప్రవాహన్ని పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలను తక్కువ రోజుల్లో ఎక్కువ నీటిని తీసుకునేలా ప్రధాన కాలువను విస్తరించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ ఫలితాలు ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నాయి. జిల్లాలో కృష్ణగిరి రిజర్వాయర్, అనంతపురం జిల్లాలోని జీడీపల్లి రిజర్వాయర్ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో నీటిని పెన్నహోబిళం రిజర్వాయర్‌కు మళ్లిస్తున్నారు. అదే విధంగా కాలువలో నీటి ప్రవాహం ఉండడంతో 68 చెరువుల పథకానికి, 110 కి.మీ దగ్గర హంద్రీనీవా ప్రధాన కాలువకు ఏర్పాటు చేసిన స్లూయిజ్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు సైతం నీటిని విడుదల చేస్తుండటం విశేషం. నేడు పింఛన్ల పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆగస్టు నెల పంపిణీ కార్యక్రమం శుక్రవారం మొదలవనుంది. రెండు నెలలుగా ఊరిస్తున్న స్పౌస్ పింఛన్లు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. అరియర్స్ కింద జూన్, జులై నెల పింఛన్లు ఆగస్టు నెలతో కలిపి పంపిణీ చేస్తారని ఆశించిన మహిళలకు నిరాశే మిగులుతోంది. స్పౌస్ పింఛన్లు కర్నూలు జిల్లాలో 3,527, నంద్యాల జిల్లాలో 3,630 పంపిణీ చేయనున్నారు. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ మరణించిన భర్తల స్థానంలో వారి భార్యలకు వితంతు పింఛన్ మంజూరు చేసింది. కర్నూలు జిల్లాలో మొత్తం 2,39,491, నంద్యాల జిల్లాలో 2,15,708 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలవుతున్నా కొత్త పింఛన్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. మహిళ ప్రాణం తీసిన ఆర్ఎంపీ వైద్యం ● అబార్షన్ చేయడంతో తీవ్ర రక్తస్రావం నందికొట్కూరు: అనుభవం లేకుండా అనాలోచితంగా ఆర్ఎంపీ చేసిన వైద్యం ఒక మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ ఏఎస్ఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలంలోని గని గ్రామానికి చెందిన శివమ్మ కూమార్తె శ్రీవాణికి ఈ నెల 28వ తేదీన నందికొట్కూరు పట్టణంలోని గీతారాణి ఆర్ఎంపీ వద్ద శ్రీవాణి అబార్షన్ చేయించారు. అనంతరం 29వ తేదీన పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి వెళ్లారు. శ్రీవాణికి తీవ్ర రక్తస్రావం కావడంతో 30వ తేదీన బుధవారం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యులు చూసి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. రూరల్ సీఐ సుబ్రమణ్యం సంఘటనపై విచారణ చేపట్టారు. -
ఫేక్ ట్రైనర్‌పై విచారణ
ఆలూరు: అరికెర గ్రామ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలో స్కౌట్ అండ్ గైడ్స్ ట్రైనర్ పేరుతో ఇటీవల విద్యార్థులు, ఉపాధ్యాయులను మోసం చేసిన వైనంపై డీసీఓ శ్రీదేవి విచారణ చేపట్టారు. స్కౌట్ అండ్ గైడ్స్ ట్రైనర్ పేరుతో ఓ వ్యక్తి పాఠశాలలో వసూళ్లకు పాల్పడిన ఘటనపై సాక్షిలో ఈనెల 30వ తేదీన కథనం ప్రచురితమైయింది. ఈ మేరకు గురువారం ఆమె పాఠశాలను తనిఖీ చేసి ఈ విషయంపై ఆరా తీశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో విడివిడిగా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వారంలోగా రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియామకం జరుగుతుందన్నారు. విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఫేక్ ట్రైనర్ విషయంపై విచారణ జరుగుతుందన్నారు. -
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పెరిగిన రోగులు
కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్సిట్యూట్‌లో అన్ని సౌకర్యాలు, వసతులు సమకూర్చాక రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. పాత క్యాన్సర్ భవనంలో రోజుకు 10 నుంచి 15 రాగా ఇప్పుడు 25 నుంచి 30 మంది దాకా వస్తున్నారు. అందుబాటులో ఉన్న 120 పడకలు నిత్యం రోగులతో నిండిపోతున్నాయి. 80 శాతం మంది అడ్వాన్స్ (చివరి దశ)లో వస్తున్నారు. ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ చికిత్స సులభం అవుతుంది. – డాక్టర్ సీఎస్కే ప్రకాష్, క్యాన్సర్ విభాగం హెచ్‌వోడి, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధూమపానం, కాలుష్యం కారణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం, వాయు కాలుష్యం ప్రధాన కారణాలు. ధూమపానం మానేస్తే చాలా వరకు ఈ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. ధూమపాన నివారణ కోసం నికోటిన్ ఉత్పాదక స్థాపన ఉత్పత్తులు, మందులు, సహాయక సమూహాలు ఉన్నాయి. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న 50 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పెద్దలు ప్రతి సంవత్సరం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి. – డాక్టర్ సి. వాసురెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్టు, కర్నూలు -
ఫీజు భారమై ఉన్నత విద్యకు దూరమై!
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటికప్పుడు చెల్లిస్తామని మాట ఇచ్చారు. మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు అండగా ఉంటాని వాగ్దానం చేశారు, అయితే అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మరిచారు. గడిచిన విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు (మొత్తం ఆరు క్వార్టర్లు) బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.కర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో నిశ్చింతగా ఉన్న విద్యా రంగం కూటమి ప్రభుత్వంలో అతలాకుతలం అవుతోంది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆలవాలంగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకం కల్పిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు విడుదల చేయాల్సిన ఫీజు బకాయిలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను పీడిస్తున్నాయి. చాలా మంది పేద విద్యార్థులు ఫీజు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు.పెండింగ్‌లో మూడు క్వార్టర్ల ఫీజుప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2న మొదటి విడతగా జిల్లాలోని 35,618 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23.95 కోట్లను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జమ చేసింది. అంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన మూడు విడతల ఫీజును ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అలాగే 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు చెల్లించాల్సిన మూడు క్వార్టర్ల ఫీజును పెండింగ్‌లో పెట్టింది.రూ.133.17 కోట్ల బకాయిలుజిల్లాలో 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి దాదాపు రూ.133.17 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. 2023–24కు సంబంధించి 31,596 మంది విద్యార్థులకు మూడు నెలలకు రూ.61,86,61,526 కాగా, 2024–25 విద్యా సంవత్సరానికి 32,736 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు దాదాపు రూ.71,31,06,554లను ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. కాగా ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ఎస్టీ విద్యార్థులకు మొత్తం ఫీజును చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ చెల్లించకపోవడం శోచనీయం.ఐదేళ్లలో రూ.501.60 కోట్లు విడుదలఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.501.60 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచిన ఘనత వైఎస్ జగన్దేగతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల ఇంజినీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35 వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ, కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్ –1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చేది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కింది.వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019–20 విద్యా సంవత్సరంలో విడుదల చేసింది. అప్పట్లో జిల్లాలో 32,162 మంది విద్యార్థులకు సంబంధించిన అరియర్స్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే కుటుంబ వార్షిక ఆదాయాన్ని కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ. లక్షగా నిర్ధారిస్తే, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరాలనే సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేల ప్రకారం అందించింది.విద్యార్థుల జీవితాలతో చెలగాటంముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆరు నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో ఉంచడంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫీజు బకాయిలను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతాం.– కటికె గౌతమ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, రాష్ట్ర అధికార ప్రతినిధిప్రభుత్వమే బాధ్యత వహించాలిరాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజులను చెల్లించకపోవడంతో అనేక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాయి. ఫీజు గురించి విద్యార్థులను ప్రశ్నించకుండా కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి. ఫీజుకు సంబంధించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగితే అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది.– కాసారపు వెంకటేష్, మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
రక్షిత నీరు.. ‘లెస్’ టెండర్ తీరు
● 40 శాతం లెస్‌కు ఆర్డబ్ల్యూఎస్ ఓఅండ్ఎం టెండర్లు ● 12 స్కీంలకు తొలగిన అడ్డంకులు ● అగ్రిమెంట్ చేసుకొని పనుల నిర్వహణను చేపట్టిన కాంట్రాక్టర్లు ● నష్టానికి నీటి సరఫరాపై అనుమానాలు ● చివరి గ్రామాలకు రక్షిత నీరు ప్రశ్నార్థకమే!‘అడిషనల్’ డిపాజిట్ ఇవ్వాల్సిందే మంచి నీటి పథకాల నిర్వహణకు సంబంధించి 25 శాతం వరకు లెస్‌కు టెండర్లు వేసుకునే సౌలభ్యం ఉంది. అయితే 25 శాతం కంటే అధికంగా లెస్‌కు వెళ్తే సంబంధిత కాంట్రాక్టర్ నుంచి అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను చేయించుకుంటాం. అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు ఆయా స్కీంల నుంచి నిర్ణయించిన గ్రామాలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేయాల్సిందే. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. – బీ నాగేశ్వరరావు, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ కర్నూలు(అర్బన్): ఎవరైనా వ్యాపారం చేసేది లాభం కోసమే, కానీ జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో మాత్రం నష్టానికి నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. అధికారులు నిర్ణయించిన ధర కంటే 40 శాతానికి పైగా లెస్‌కు పనులను దక్కించుకున్నారంటే ఆయా పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకం అవుతోంది. 10 శాతం లెస్‌కు టెండర్లు వేసుకోవడం సహజం. అయితే 25 శాతం వరకు లెస్‌కు వేసుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే పలు పథకాలకు ఏకంగా 40 శాతానికి పైగా లెస్‌కు టెండర్లు వేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్రస్తుతానికి పనులు దక్కించుకొని అధికార పార్టీ నేతల అండదండలతో ఏదో ఒక విధంగా మేనేజ్ చేయవచ్చనే ఆలోచనలతోనే కాంట్రాక్టర్లు అధిక శాతం లెస్‌కు వెళ్లి ఉంటారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల ఆశ్చర్యం జిల్లాలోని 351 గ్రామాలకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో 33 మంచి నీటి పథకాల ద్వారా రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. ఈ స్కీంల నిర్వహణకు ప్రతి ఏటా రూ.49.29 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తాగునీటి పథకాల నిర్వహణ, తాత్కాలిక మరమ్మతులు, సిబ్బంది జీతభత్యాలకు ఈ నిధులను వెచ్చించుకునే సౌలభ్యం ఉంది. ఈ పథకాలకు సంబంధించి టెండర్ విధానం ద్వారా కాంట్రాక్టర్లకు పనులను అప్పగిస్తున్నారు. అయితే ఆదోని డివిజన్లోని 16 మంచి నీటి పథకాల నిర్వహణకు సంబంధించి పలువురు టెండర్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందులో 12 రిట్ పిటిషన్లకు సంబంధించి నామినేషన్ పద్ధతిన పనులను అప్పగించరాదని, టెండర్లు నిర్వహించిన వాటికి అగ్రిమెంట్ చేసుకుంటే తాము అడ్డుపడమని న్యాయ స్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 12 స్కీంలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పనులకు సంబంధించి ఒకటి, రెండు మినహా మిగిలిన అన్ని పనులకు 25 శాతానికంటే అధికంగా లెస్‌కు వెళ్లి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. 40 శాతం లెస్‌కు పనులు దక్కించుకోవడంపై ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకు ఆయా స్కీంల నుంచి నిర్దేశించిన గ్రామాలకు రక్షిత నీటిని అందించగలరా? అనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొన్ని గ్రామాలకు రెండు నుంచి నాలుగు రోజులకు ఒకసారి, మరి కొన్ని గ్రామాలకు ఆయా గ్రామాల్లోని సోర్సులను అనుసరించి వారానికి ఒకసారి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంజినీర్లే చెప్పడం గమనార్హం. చివరి గ్రామాలకు రక్షిత నీరు ప్రశ్నార్థకమే! అంచనా విలువ కన్నా 40 శాతం లెస్‌కు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో ఆయా స్కీంలను నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకమేనని ఆ శాఖకు చెందిన ఇంజినీర్లే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. లెస్‌కు అగ్రిమెంట్ చేసుకున్న నీటి పథకాలకు సంబంధించి దాదాపు 120కి పైగా గ్రామాల ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. అయితే అయితే అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి చేతులు దులుపుకుంటారేమో అనే అనుమానాలను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏ గ్రామానికి ఎంత నీరు సరఫరా చేశారో, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎం బుక్ రికార్డ్ చేసి బిల్లులను చేయాల్సి ఉంది. ఇందులో పారదర్శకత లోపిస్తే లెస్ టెండర్లకు ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విరుపాపురం స్కీం నుంచి 13 గ్రామాలకు రక్షిత నీటిని అందించేందుకు అంచనా విలువ రూ.21.60 లక్షలు కాగా, ఈ పనులను కూడా 31.76 శాతం లెస్‌కు దక్కించుకున్నారు. అలాగే కుప్పగల్ (40 శాతం), హెబ్బటం (40.15 శాతం), కౌతాళం (40.01 శాతం), సాతనూరు (40.01 శాతం), మండగిరి (40.01 శాతం) ఆస్పరి (35.46 శాతం), అల్వాల (36.90 శాతం), హానవాళు (28.59 శాతం) లెస్‌కు కాంట్రాక్టులను దక్కించుకున్నారు. కాగా.. రూ.114.46 లక్షల అంచనాతో 26 గ్రామాలకు నీరు అందించే బాపురం నీటి పథకం పనులను మాత్రం 23 శాతం లెస్‌కు దక్కించుకున్నారు. ఆదోని డివిజన్లోని పెసలబండ స్కీం నుంచి 21 గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించాల్సి ఉంది. ఏడాది పాటు ఆయా గ్రామాలకు రక్షిత నీరు అందించేందుకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కింద రూ.81.21 లక్షలు వ్యయం అవుతుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంచనాలు రూపొందించి టెండర్లను ఆహ్వానించారు. అయితే ఓ కాంట్రాక్టర్ 40 శాతం లెస్‌కు ఈ పనులను దక్కించుకున్నారు. పనుల్లో నాణ్యత ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏడాది పాటు చివరి గ్రామాల వరకు రక్షిత తాగునీటిని సరఫరా చేస్తారా? అనే అనుమానాలను ఇంజినీర్లే వ్యక్తం చేస్తున్నారు. -
కోలాటం.. సంబరం
చాలా ఆనందంగా ఉంది మా ఊర్లో అందరూ కోలాటం నేర్చుకుంటుంటే నేను నేర్చుకుంటానని మా అమ్మ, నాన్నను అడిగాను. వాళ్లు నాకు కోలాటం నేర్చుకునేందుకు మరింత ప్రోత్సాహం అందించారు. రోజూ ఇక్కడికి వచ్చి కోలాటం నేర్చుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. – రిషిత, ఒకటో తరగతి, బుక్కాపురం మహానంది: పండుగలు, జాతరలు వస్తే గ్రామాల్లో సందడి కనిపిస్తుంది. పండుగలైనా, ప్రతిష్టలైనా జరిగితే కోలాటం నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అందులో ప్రధానంగా వినిపించే ‘బుజ్జి బుజ్జి గణపయ్యా.. బొజ్జ గణపయ్యా’, ‘శివుడే దేవుడని నేనంటే.. శివుడే దేవుడు కాదంటారు’. ‘రఘుకులతిలకా రారా..నిన్నెత్తీ ముద్దులాడెదరా’. ఇలా ఆధ్యాత్మిక పాటలతో భక్తిభావం, ‘వస్తానంటివో పోతానంటివో వగలు పలుకుతావే’, ‘కట్టమీద పోయే అలకల సిలకా భలేగుంది బాలా’, ‘బాగుందమ్మ.. బాగుందమ్మ ఆరుబయటా’ అనే సినీ, జానపద, సంప్రదాయ పాటలు వింటే మనసుకు ఆనందం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదే ఆ పాటలకు చిన్నారుల కోలాటం నృత్యాలు తోడైతే మనసుకు ఎంతో హాయి కలిగిస్తుంది. ఆధునికి కాలంలో తీరిక దొరికితే చాలు చేతిలో మొబైల్ పట్టుకుని గేమ్స్ ఆడుతూ కాలాన్ని వృథా చేసే వాళ్లను ఎంతో మందిని చూస్తున్నాం. వాటి వల్ల సమయం వృథాతో పాటు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పులలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ నృత్యాల వైపు చిన్నారులు మొగ్గు చూపుతున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు కూచిపూడి, భరతనాట్యం, డ్యాన్స్‌తో పాటు కోలాటం, జడకోపు నృత్యాలు నేర్పిస్తున్నారు. వీటి వల్ల పిల్లలకు ఆరోగ్యం, మానసిక స్థైర్యం కలుగుతూ రాణిస్తున్నారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో సుమారు 40 మంది చిన్నారులు ప్రతి రోజూ రాత్రి రెండు గంటలకు పైగా సమయం కేటాయించి కోలాటం నేర్చుకుంటున్న తీరు స్థానికులను ఆకట్టుకుంటుంది. చిన్నారుల బుజ్జి బుజ్జి స్టెప్పులు గ్రామస్తులను అలరిస్తున్నాయి. 40 రోజుల శిక్షణ వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన ఎస్.శివరామిరెడ్డి చిన్నారులతో పాటు పెద్దలకు కోలాటం నృత్యం నేర్పిస్తున్నారు. అందులో భాగంగా బుక్కాపురం గ్రామానికి చెందిన 40 మంది చిన్నారులతో పాటు కొందరు మహిళలు కోలాటం నేర్చుకుంటున్నారు. ప్రతి రోజూ గ్రామంలోని కాశినాయన ఆలయం వద్ద రాత్రి రెండు గంటల పాటు కోలాటం సాధన చేస్తారు. కోలాటంతో పాటు ఇటీవల ప్రాచుర్యం పొందిన జడకోపు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సమయం దొరికితే టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోయే తమ పిల్లలు సంప్రదాయ కోలాటం నేర్చుకోవడం ఆనందం కలిగిస్తుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు రెండు చేతులతో కోలాటం కర్రలు పట్టుకొని లయ, సంగీతానికి అనుగుణంగా ఏకకాలంలో కర్రల శబ్ధం చేస్తూ నృత్యం చేస్తుండటం కనువిందుగా ఉందని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. గ్రామాల్లో చిన్నారులు, మహిళల ఆసక్తి 40 రోజుల పాటు శిక్షణ కోలాటం, జడకోపు వైపు మొగ్గు అంతరించిపోతున్న కళలకు ప్రాణం మొదట్లో భయం.. ఇప్పుడు ఆనందం ప్రతి రోజూ రాత్రి రెండు గంటల పాటు సమయం కేటాయించి కోలాటం నేర్పిస్తున్నారు. మంచి దేవుడి పాటలకు కోలాటం నృత్యం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ, నాన్నల సహకారంతో గురువు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో కోలాటం నేర్చుకుంటున్నాను. మొదట్లో కాస్త భయం, బిడియం ఉండేది. ఇప్పుడు కోలాటం నృత్యం బాగా చేస్తున్నాను. – కె.ష్ణవి, ఐదో తరగతి కోలాటం నేర్పుతూ ఉపాధి గత కొన్నేళ్లుగా కోలాటం, జడకోపు నేర్చుకున్నాను. పండుగలు, జాతరలు, ఉత్సవాలు జరిగితే అక్కడికి వెళ్లి ప్రదర్శనలు ఇస్తాము. ఇటీవల సంప్రదాయ నృత్యాలకు మంచి ఆదరణ కనిపిస్తోంది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు 1200 మందికి కోలాటం నేర్పించాను. గ్రూపులో 40 మంది సభ్యులు ఉంటే కోలాటం నేర్పిస్తాను. ఇదే కోలాటం నృత్యం మా లాంటి ఎంతో మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తుంది. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా 96769 95547 సంప్రదించవచ్చు. – ఎస్.శివరామిరెడ్డి, బోయరేవుల -
విద్యుత్ సమస్యలతో పరేషాన్
బనగానపల్లె: పట్టణ సమీపంలోని రవ్వలకొండపై ఉన్న ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహానికి విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. తరచుగా నెలకొంటున్న విద్యుత్ సమస్యలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు వంద మంది విద్యార్థినులు ఆశ్రయం పొందుతున్నారు. మోడల్ స్కూల్ పక్కనున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి సుమారు 120 మీటర్ల మేర అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్ ద్వారా హాస్టల్‌కు విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. భూమి లోపలి భాగంలో వైర్ తరచూ పాడైపోతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో హాస్టల్లోని విద్యార్థినులు అంధకారంలో ఉండాల్సి వస్తోంది. ఇటీవల 15 రోజుల పాటు విద్యుత్ సరఫరా లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత నేలను తవ్వి కేబుల్ వైర్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ పరిస్థితులు ఎన్నాళ్లంటూ విద్యార్థినుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అలాగే విద్యుత్ లోఓల్టేజీ, హైఓల్టేజీ వల్ల హాస్టల్ గదుల్లోని సీలింగ్ ఫ్యాన్లు పాడైపోయాయి. వీటిని రిపేరుకు ఇచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ నెల 23న ఇక్కడి హాస్టల్ వార్డెన్‌ను వెలుగోడుకు బదిలీ చేయగా, ఇక్కడికి మాత్రం ఎవరినీ నియమించలేదు. ఇక్కడ పనిచేసే ట్యూటరే పగలు, రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామలక్ష్మిని వివరణ కోరగా బాలికల హాస్టల్‌కు విద్యుత్ సమస్య ఉన్నది వాస్తవమేనన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించామన్నారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి హాస్టల్ వరకు స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారుల ఎస్టిమేషన్ మేరకు రూ.2 లక్షల నిధులు మంజురయ్యాయి. ఈ నిధులు క్రెడిట్ కాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినుల ఇక్కట్లు అండర్ గ్రౌండ్ కేబుల్ కావడంతో మరమ్మతుల్లో తీవ్ర జాప్యం -
హత్యకేసు నిందితుడికి జీవితఖైదు
నంద్యాల(వ్యవసాయం): బనగానపల్లెకు చెందిన న్యాయవాది హత్యకేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ బుధవారం తీర్పు వెల్లడించారని మహానంది పోలీసులు తెలిపారు. 2018లో న్యాయవాది బసవరాజు హత్యకేసులో నలుగురి ప్రమేయం ఉండగా మొదటి వ్యక్తి అనారోగ్యంతో హాజరు కాకపోవడం, నాలుగో వ్యక్తి చనిపోవడంతో మిగిలిన రెండవ నిందితుడు నాగరాజుకు జీవితకాలం జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా, మూడో నిందితుడు నాగేంద్రకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. న్యాయవాది బసవరాజుకు ఒక కేసు విషయంలో బొడ్డు సుజాత అనే మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నేళ్లకు వారి మధ్య సంబంధం బెడిసికొట్టింది. ఈ క్రమంలో 2015లో సుజాత నంద్యాలకు వెళ్దామని బసవరాజును పిలిపించగా బనగానపల్లె నుంచి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో పాణ్యం వద్ద నాగరాజు సాయంతో కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించడంతో బసవరాజు మృతి చెందాడు. అదే కారులో నంద్యాలకు వచ్చి బి.కోడూరుకు చెందిన నాగేంద్ర సాయంతో మహానంది మండలం గోపవరం సమీపంలో మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ ఘటనపై మరుసటి రోజు వీఆర్ఓకు సమాచారం అందడంతో మహానంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసు బుధవారం తుది విచారణకు రాగా జడ్జి విచారణ జరిపి నేరం రుజువు కావడంతో ఇద్దరికీ జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. సహకరించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష -
ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసం
కర్నూలు: ‘ ఇది ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. మీకు రూ.50 వేలు రాయితీ’ అంటూ ఆకర్షించి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల ఓటీపీలు చెబితే మోసపోతారని హెచ్చరించారు. పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్య ఘర్, అమ్మఒడి తదితర పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఆయా పథకాలకు దరఖాస్తులు చేసుకునే వారిని ఎంచుకుని బురిడీ కొట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయా పథకాల పేరుతో మొబైల్‌కు వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు చెబితే కూడా మోసపోయే అవకాశముందని హెచ్చరించారు. సూచనలు ఇవీ... ● ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. ● వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ● అపరిచిత కాల్స్ వస్తే 1930 నెంబర్‌కు కాల్ చేయాలి. ● అలాగే www.cybercrime.gov.inల లో ఫిర్యాదు చేయాలి. ● ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in,nic.in లాంటి అధికారిక డొమైన్లను మాత్రమే ఉపయోగించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
అట్టహాసంగా సీపీఐ జిల్లా మహా సభలు
డోన్ టౌన్: డోన్ పట్టణంలో బుధవారం సీపీఐ నంద్యాల జిల్లా రెండవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు డప్పు, కోళాటం, ప్రజా నాట్యమండలి కళాకారులతో నృత్య ప్రదర్శనలు, జానపద గేయాలతో వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు ఎర్రదుస్తులు, జెండాలతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సీపీఐ జెండా తోరణాలతో పట్టణం ఎరుపు మయంగా మారింది. అనంతరం బుగ్గన మార్గ్‌లోని రైల్వే స్టేషన్ వంద అడుగుల రోడ్డులో బహిరంగ సమావేశం నిర్వహించారు. 11 ఏళ్ల పాలనలో మోదీ చేసింది శూన్యం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలనల్లో ప్రజలకు చేసింది శూన్యం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులను ఆదుకుంటానని చెప్పి విస్మరించారన్నారు. గణాంకాల ప్రకారం 55 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారని వివరించారు. పంటలకు గిట్టుబాటు ధర, ఉద్యోగాల కల్పన, బ్లాక్ మనీ వెనక్కు తెప్పిస్తామని చెప్పడం అన్నీ బూటకమని విమర్శించారు. సీఎం సింగపూర్‌లో.. డీసీఎం సినిమాల్లో.. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరమల్లు సినిమా పనుల్లో బీజీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో లేనప్పుడు కమ్యూనిస్టు పార్టీ చెప్పిన సిద్దాంతాలు నిజం అంటూ గెలిచిన తరువాత సింగపూర్, డల్లాస్, లండన్ పర్యటనలు తప్పా చేసింది ఏమి లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ డబుల్ అప్పులు చేశారని దుయ్యబట్టారు. ఏడాది పాలనలో 21 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశారని, రైతులకు నేటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే వరకు కూటమి ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్న సీపీఐ వంద వసంతాలు పూర్తి చేసుకుందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, రామచంద్రయ్య, భీమలింగప్ప, బాబా ఫకృద్ధీన్, నబిరసూల్, అవులశేఖర్, రజిత, లక్ష్మీదేవి, జిల్లా నాయకులు సుంకయ్య, రాధకృష్ణ, ప్రభాకర్ తదితరులు -
భర్త చేతిలో భార్య హతం
కోసిగి: మండల పరిధిలోని చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన బోయ దుద్ది రామలక్ష్మి (45)ను ఆమె భర్త నరసింహులు రోకలిబండతో తలపై కొట్టి హత్య చేశాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రామలక్ష్మి దంపతులు పిల్లలతో కలిసి బెంగళూరుకు వలస వెళ్లి జీవనం సాగించేవారు. నరసింహులకు కొద్దికాలంగా ఆరోగ్యం, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇటీవల మొహర్రం పండుగకు గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. క్రమంగా నరసింహులు పరిస్థితి దిగజారి ఇతరులతో మతిస్థిమితం లేకుండా ప్రవర్తించేవాడు. ఈ స్థితిలో బుధవారం సాయంత్రం రామలక్ష్మి ఇంటి ముందు వంట పాత్రలు తోముతుండగా నరసింహులు వెనుక నుంచి వచ్చి ఇంట్లో ఉన్న రోకలి బండతో తలపై కొట్టాడు. ఆమె తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు పరిక్షించేలోపే ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు ఆదోని రూరల్: మండలంలోని పాండవగల్లు–కుప్పగల్లు గ్రామాల మధ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా బొమ్మనహళ్లి మండలం కురువళ్లికి చెందిన శ్రీనివాసరెడ్డి, లక్ష్మి దంపతులు గాయపడ్డారు. వారు బైకుపై మంత్రాలయం మండలం సింగరాజనపల్లికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వెనుక నుంచి తాకడంతో బైకు లారీని ఢీకొట్టి కింద పడ్డారు. ప్రమాదంలో భార్యాభర్తలిద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆటోలో నుంచి కింద పడి..: మండలంలోని బైచిగేరి వద్ద ఆటోలో వెళ్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజు తాకూర్ ఆటోలో నుంచి కింద పడి గాయపడినట్లు తాలూకా ఎస్ఐ రామాంజనేయులు బుధవారం తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
దొర్నిపాడు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని భాగ్యనగరం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. భాగ్యనగరం గ్రామానికి చెందిన రామాంజనేయులు (40), భార్య ప్రభావతమ్మ నిత్యం గొడవలు పడేవారు. రోజులాగే మంగళవారం రాత్రి వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరు కొడుకులను వెంట పెట్టుకొని ప్రభావతమ్మ వేరే ఇంటికి వెళ్లిపోయింది. ఈ స్థితిలో అతని తమ్ముడు నాగాంజనేయులు ఇంటికి వెళ్లి చూసేసరికి రామాంజనేయులు రక్తగాయాలతో మృతి చెంది పడి ఉండటం చూసి భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్ఐ వరప్రసాద్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నాగాంజనేయులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ వెల్లడించారు. -
జవానుకు అశ్రునివాళి
చాగలమర్రి: మండలంలోని పెద్దవంగలి గ్రామానికి చెందిన జవాను పోతినేని అశోక్‌కుమార్ భౌతిక కాయానికి బుధవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. ఆయన శ్రీనగర్‌లోని అనంతనాగ్‌లో ప్రత్యేక దళంలో ఎస్పీఆర్ ర్యాంకులో జవానుగా విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుకు గురై మృతిచెందిన విషయం విదితమే. ఆయన భౌతిక కాయం బుధవారం ఉదయం చాగలమర్రికి చేరుకోగా మండల ప్రజలు స్థానిక టోల్‌ప్లాజా నుంచి మోటార్ సైకిళ్లపై జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీగా స్వగ్రామమైన పెద్దవంగలికి తీసుకొచ్చారు. మృతదేహం ఇంటి వద్దకు చేరుకోగానే తల్లిదండ్రులైన పోతినేని శేఖర్, రామలక్ష్మీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. తండ్రి పోతినేని శేఖర్ ఆర్మీలో పనిచేస్తుండగానే కుమారుడు మృతి చెందడం అందరినీ కలిచివేసింది. అనంతరం 203 ఇంజినీరింగ్ రెజిమేంట్కు చెందిన సుబేదార్ ఎం.కె.రెడ్డి, హవల్దార్ దర్గారెడ్డి, ఏపీఆర్ శుభాష్, అలాగే 30(ఏ) ఎన్సీసీ బీఎన్ కడప జిల్లాకు చెందిన సూబేదార్ సునిల్మాలిక్, హవల్దార్ సీఎల్ రెడ్డి, వీకే చైతన్య జవాను భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి వందనాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక దళ సిబ్బందిచే అంతిమ యాత్ర చేపట్టారు. శ్మశాన వాటికలో మృతదేహంపై జాతీయ జెండాను కప్పి గౌరవ వందనాలు సమర్పించారు. స్థానిక ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఏఆర్ ఏఎస్ఐ మూర్తితో పాటు ఐదుగురు సిబ్బంది పాల్గొని పరేడ్ నిర్వహించి గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు -
దగాపడిన రైతన్న
కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవ పథకం రైతులతో దోబూచులాడుతోంది. పెట్టుబడి కష్టాలతో అల్లాడుతున్న రైతులను కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినా ఆదుకోలేకపోతోంది. ఇప్పటికే ఒక సంవత్సరం పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పినా అన్నదాతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో అర్హత కలిగిన రైతుల సంఖ్యను భారీగా కుదించడం ఆందోళన కలిగిస్తోంది. అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు ఆన్లైన్ ద్వారా గ్రీవెన్స్ అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ చర్యలు నామమాత్రమే. 1418 గ్రీవెన్స్‌కు దిక్కే లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే అరకొర రుణమాఫీతో మమ అనిపించారు. ఈ సారి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమోనని రైతులు చర్చ జరుగుతోంది. 23,574 మంది రైతులకు మొండిచేయి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద తాజాగా అర్హత పొందిన రైతుల జాబితాలను విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో పెట్టుబడి సాయానికి అర్హత పొందిన రైతులు 2,75,749 మంది మాత్రమే ఉన్నారు. 1,829 మంది రైతులతో ఈ–కేవైసీ చేయించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. అన్నదాత సుఖీభవ కింద అర్హత పొందినప్పటికీ ఈ–కేవైసీ తిరస్కరణకు గురికావడంతో 2,896 మంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. వైఎస్ఆర్సీపీ పాలనలో వైఎసార్ రైతుభరోసా కింద 2023–24 సంవత్సరంలో పెట్టుబడిసాయం పొందిన రైతుల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు 23,574 మంది రైతులకు మొండిచేయి చూపుతుండటం గమనార్హం. కౌలుదారులకు అన్నదాత సుఖీభవ లేనట్లే.. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కౌలు రైతులు, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, అటవీ భూముల (ఆర్వోఎఫ్ఆర్)ను అనుభవిస్తున్న రైతులందరికీ వైఎసార్ రైతుభరోసా అమలు చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం కౌలు రైతులు, ప్రభుత్వ భూములు, ఎండోమెంటు భూములు, అటవీ భూముల (ఆర్వోఎఫ్ఆర్)ను అనుభవిస్తున్న రైతులందరికీ మొండిచేయి చూపుతోంది. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25వేల సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 10 వేల వరకు సీసీఆర్సీ కార్డులు జారీ అయ్యాయి. అన్నదాత సుఖీభవ కింద ఒక్క కౌలుదారుకు కూడా పెట్టుబడి సాయం అందని పరిస్థితి. కొత్త రైతులకు అందని పీఎం కిసాన్ సాయం ఐదేళ్లలో వేలాది మంది కొత్త రైతులు వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. భూములను కొనుగోలు చేయడం ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలు కూడా జారీ అయ్యాయి. అయితే వీరికి పీఎం కిసాన్ సాయం అందని పరిస్థితి. 2019 ఫిబ్రవరి 1లోపు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సాయం అందుతోంది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత కనీసం 50 వేల మంది భూములు కొనుగోలు చేయడం ద్వారా వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. వీరంతా తమకు కూడా పీఎం కిసాన్ సాయం వర్తింపజేయాలని కోరుతున్నారు.పీఎం కిసాన్‌లో భారీగా కోతఊరిస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ అడ్డగోలు కోతలతో వేలాది మందికి మొండిచేయి 2023–24లో 2,94,598 మందికి వైఎసార్ రైతుభరోసా అన్నదాత సుఖీభవ 2,71,024 మందికే పరిమితం పెట్టుబడి సాయానికి నోచుకోని కౌలురైతులు పీఎం కిసాన్ లబ్ధిదారుల్లోనూ భారీగా కోత 2024 ఎన్నికల సమయంలో పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేల పెట్టుబడిసాయం అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు పీఎం కిసాన్తో కలిపి ఇస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబంలో ఎంతమందికి భూములు ఉంటే అందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని రైతులను మభ్యపెట్టారు. ఇప్పుడు కుటుంబం యూనిట్‌గా అమలు చేస్తుండటం చంద్రబాబు రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) కింద కేంద్రం రైతులకు 19వ విడత ఆర్థిక సాయాన్ని ఆగస్టు 2న రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయనుంది. 18వ విడతతో పోలిస్తే 19వ విడతలో ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య తగ్గింది. 19వ విడతతో పోలిస్తే 20వ విడతలో లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 18వ విడతలో 2,45,252 మంది రైతులకు లబ్ధి చేకూరగా.. 19వ విడతలో ఆ సంఖ్య 2,42,934కు తగ్గింది. 20వ విడతలో ఏకంగా 2,38,693కు తగ్గిపోవడం గమనార్హం. మొత్తం 4,241 మంది రైతులకు మొండిచేయి చూపడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఉరుకుందలో 8న వరలక్ష్మీ వ్రతం
కౌతాళం: ఉరుకుంద ఈరన్న (నరసింహ) స్వామి క్షేత్రంలో ఆగస్టు 8న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఉదయం 9 గంటలకు చేపడుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు తెలిపారు. దేవస్థాన తూర్పు రాజగోపురం ఎదుట లక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రూ. వె య్యి చెల్లించి వ్రతంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వ్రతంలో పాల్గొనే ప్రతి మహిళకు దేవస్థానం పూజా సామగ్రి ఇస్తుందని చెప్పారు. శేషవస్త్రం, ఒక రవిక, గాజులు, పసుపు–కుంకుమ, తమలపాకులతో కూడిన కిట్‌ను దేవస్థానం తరఫున ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఆగస్టు 1న సుదర్శన హోమం, ఆగస్టు 18న సోమవారం స్వామివారి పల్లకీ ఉత్సవ సేవ, ఆగస్టు 19న రుద్ర హోమం ఉంటుందని తెలిపారు. సిల్వర్‌జూబ్లీ కళాశాలలో అత్యుత్తమ బోధన కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాస్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. కాలేజీలో అత్యుత్తమ విద్యార్హతలు కలిగిన అధ్యాపకులతో బోధన సాగుతోందన్నారు. విద్యార్థులకు క్రమ శిక్షణతో పాటు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సిల్వర్సెట్లో రెండో ర్యాంకు సాధించిన విద్యార్థి జాహ్నవికి రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ చేతుల మీదుగా సీటు కేటాయింపు పత్రాన్ని అందజేశారు. మొదటి రోజు 120 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారన్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున కౌన్సెలింగ్‌కు పిలిచామని సిల్వర్ సెట్ కన్వీనర్ డాక్టర్ వాయిజ్ తెలిపారు. గురువారం బీఏస్సీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ జి.ప్రసాద్ రెడ్డి, అధ్యాపకులు ఎల్లా కృష్ణ, ఫామీదా బేగం, ఓబులేసు, రాజశేఖర్, నాగన్న, నరేంద్ర బాబు, తదితరులు పాల్గొన్నారు. శ్రీమఠంలో నంద్యాల జిల్లా కలెక్టర్ మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రాలయానికి వచ్చారు. జిల్లా కలెక్టర్‌కు శ్రీమఠం అధికారులు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు జిల్లా కలెక్టర్‌కు ఫలపూలమంత్రాక్షింతలతో ఆశీర్వచనం చేశారు. ఈ–నామ్లో సమూల మార్పులు కర్నూలు(అగ్రికల్చర్): ఈ–నామ్లో సమూలమైన మార్పులకు కేంద్రం చర్యలు చేపట్టింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో క్రయవిక్రయాలన్నీ ప్రస్తుతం ఈ–నామ్లోనే జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ల్లో దాదాపు అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు చేపడుతున్నారు. పత్తికొండ మార్కెట్లో టమాట, నంద్యాలలో మిర్చి క్రయవిక్రయాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ–నామ్ సేవలను 2.0 వర్షన్‌తో అమలు చేయడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణయూర్తి తెలిపారు. కొత్త వర్షన్‌తో ఈ–నామ్ ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నుంచి అమలవుతుందన్నారు. ఈ–నామ్ కొత్త వర్షన్‌తో వేర్ హౌసింగ్ గోదాముల్లో కూడా వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుపుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు కర్నూలులో 2.0 వర్షన్‌పై శిక్షణా కార్యక్రమం పూర్తి అయిందని, గురువారం ఆదోనిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకోండి
కర్నూలు: జిల్లాలోని అన్ని బ్యాంకులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాల్లో హైవే పక్కన ఉన్న బ్యాంకుల్లో జరిగిన దొంగతనాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం మాట్లాడుతూ బ్యాంకు లోపల, బయట మన్నిక కలిగిన సెన్సర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బ్యాంకుల్లో దొంగలు పడిన వెంటనే బ్యాంకు వారికి మెసేజ్‌లు, అలర్ట్స్ వచ్చేలా భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి బ్యాంకులో సెక్యూరిటీ గార్డు ఉండాలన్నారు. కొందరి ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో లావాదేవీలు జరిగినప్పుడు బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరగాళ్ల గురించి ఖాతాదారులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులందరూ బ్యాంకులను సందర్శించి సెక్యూరిటీ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించాలన్నారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, ఎస్బీఐ మేనేజర్ అబ్దుల్ రవూఫ్, కరూర్ వైశ్య బ్యాంక్ అధికారి పీరయ్య, సీఐలు తేజమూర్తి, రామయ్య నాయుడు, నాగరాజ రావు, శ్రీధర్, విక్రమ సింహ, చంద్రబాబు నాయుడు, మన్సూరుద్దీన్, నాగశేఖర్, సైబర్ ల్యాబ్ అధికారి వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంకర్లకు ఎస్పీ సూచన -
అహోబిలేశుడి సేవలో జైళ్ల శాఖ డీజీపీ
ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహ స్వామివార్లను జైళ్ల శాఖ డీజీపీ అంజనీకుమార్ బుధవారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదల్లో భాగంగా ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అహోబిలం క్షేత్రంలోని లక్ష్మీనరసింహ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు అందించారు. రేపు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో ఆగస్టు 1న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్బరత్నాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ చాటిన క్రీడాకారులు వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సౌత్‌జోన్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని వివరాలకు 89194 09232 సెల్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య కోవెలకుంట్ల: పట్టణంలోని నాగులకట్ట వీధిలో నివాసం ఉంటున్న పవన్‌నాయక్ (25) అనే యువకుడు కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బుధవారం ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లితండాకు చెందిన పవన్‌నాయక్ పట్టణంలోని శ్రీరాంచిట్స్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రసవ నిమిత్తం పుట్టింటికి వెళ్లిన భార్య ఇరవై రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ కలహాలతో పవన్‌కుమార్ విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు బాలస్వామినాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఎట్టకేలకు చిక్కిన కొండముచ్చు ప్యాపిలి: జలదుర్గం గ్రామంలో గత వారం రోజులుగా హడలెత్తించిన కొండముచ్చు ఎట్టకేలకు పట్టుబడింది. బుధవారం గ్రామాన్ని సందర్శించిన డీఎఫ్ఓ నాగమనేశ్వరి రెస్క్యూ టీం వారిని రప్పించారు. రాత్రి 10 గంటల సమయంలో చెట్టుపై ఉన్న కొండముచ్చును గుర్తించిన రెస్క్యూ టీం, అటవీశాఖ అధికారులు చాకచక్యంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. కొద్దిసేపటికే కొండముచ్చు చెట్టుపై నుంచి కిందపడింది. వెంటనే బోనులో బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. దాదాపు 20 మందిని కరిచిన కొండముచ్చు కథ సుఖాంతం కావడంతో జలదుర్గం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గ్రామంలో మరో కొండముచ్చు ప్రజలపై దాడి చేసి గాయపర్చినట్లు గురువారం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని ఖండించారు. అనవసరంగా వదంతులు సృష్టిస్తే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తే గుణపాఠం తప్పదు
ఓర్వకల్లు: పేద విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్సీపీ విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ హెచ్చరించారు. పార్టీ ఆదేశాల మేరకు ‘సంక్షేమ హాస్టళ్ల బాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలోని వసతి గృహాన్ని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులతో కలసి ఆయన సందర్శించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేష్ యాదవ్ మాట్లాడుతూ.. వసతి గృహంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేవన్నారు. పలు సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్లు కరోనా పోగా, మిగతా మూడేళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారన్నారు. నాడు–నేడుతో శాశ్వత పరిష్కారం చూపారని గుర్తుచేశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయు డు గొప్పలు చెప్పుకోవడమే గానీ విద్యార్థులను పట్టించుకొన్న పాపాన పోలేదని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు సకాలంలో అందేవని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఏమి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే కుట్రపన్నుతున్న కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు వుండవని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి పాయి, జిల్లా నాయకులు తిరుమలేష్, కర్నూలు మండల అధ్యక్షులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘కొండంత’ వినాయకుడు!
ప్రకృతిని ఆస్వాదించాలే కానీ ప్రతీది మనసుకు హత్తుకుంటుంది. శిలలపై శిల్పాలు చెక్కినారని గొప్పగా పాడుకోవడమే కాదు.. నిశితంగా పరిశీలిస్తే కనిపించే ప్రతి రాయిలోనూ ఏదో ఒక రూపం సాక్షాత్కరిస్తుంది. పేరులోనే కొండను దాచుకున్న పత్తికొండ పరిసర ప్రాంతాల్లో ఎత్తయిన కొండలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎవరో పేర్చినట్లుగా ఉండే ఈ కొండలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. తుగ్గలి మండలం కోతికొండ గ్రామ సమీపంలోని ఓ కొండ అచ్చం వినాయక రూపాన్ని పోలి ఉండటంస్థానికులతో పాటు ఆ దారిన వచ్చివెళ్లే ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. – డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
రానున్న ఐదు రోజులు ఎండ, గాలులే!
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజులు జిల్లాలో ఎండలతో పాటు గాలుల తీవ్రతతో పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో ఆగస్టు నెల 3వ తేదీ వరకు వర్షపాత సూచనలు లేవని అనంతపురం వ్యవసాయ వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35–36 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గంటకు 12–13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. జూలై మాసంలో చాలా వరకు అంతంతమాత్రం తేలికపాటి వర్షాలు పడటంతో పంటల పరిస్థితి నిరాశజనకంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే ఐదు రోజుల్లో వర్షాల సూచన లేనందున ఆగస్టు నెలలో ఎర్ర నేలల్లో ప్రత్యామ్నాయ పంటలు కంది, జొన్న, కొర్ర, సజ్జ అలసంద, ఉలువ, ఆముదం, పెసర, అనుములు వంటి పంటలు వేసుకోవచ్చని అధికారులు సూచించారు. నేరాల నియంత్రణకు గస్తీలు పెంచండి కర్నూలు: నేరాల నియంత్రణకు గస్తీని పటిష్టం చేసి రాత్రివేళల్లో తనిఖీలు విస్తృతం చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని నిర్వాహకులకు సూచించారు. లాడ్జిల్లో సమాచారం సక్రమంగా చెప్పని వారి వివరాలు ఆరా తీసి చిరునామాలు సేకరించారు. లాడ్జిలలో రాత్రి బస చేసే వ్యక్తుల గుర్తింపు కార్డులను తీసుకుని రిజిస్టర్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని లాడ్జి యజమానులకు పోలీసులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా మంగళవారం జిల్లా అంతటా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రత, రక్షణలో భాగంగా జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, రహదారులపై సంచరిస్తూ, పెట్రోలింగ్ చేస్తూ గస్తీ చేపట్టారు. రోడ్డు సేఫ్టీ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. కొత్తూరులో విజిలెన్స్ ఎస్పీ పూజలు పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణేశ్వర్యస్వామి ఆలయంలో ఉమ్మడి జిల్లా విజిలెన్స్ ఎస్పీ చాముండేశ్వరి పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజ లు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అలాగే ఆల యచరిత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతం ఆలయ మర్యాదలతో ఆమెకు శేషావస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
ఫేక్ ట్రైనర్ కుచ్చు టోపి
● స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో విద్యార్థులను మోసం చేసిన వైనం ఆలూరు: స్కౌట్‌ను నేర్పించేందుకు తనను ప్రభుత్వం నియమించిందని ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒక ఫేక్ ట్రైనర్ బురిడీ కొట్టించాడు. అరికెర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలురు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి నగదు వసూళ్లు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో దాదాపు 548 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎన్సీసీ శిక్షణకు తనను ప్రభుత్వం నియమించిందని ఐదు రోజుల క్రితం రాజు అనే వ్యక్తి పాఠశాలకు చేరుకున్నారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికా రులు నియమాకపత్రం ఇచ్చినట్లు ఫేక్ పత్రాలు చూయించి పాఠశాలలో చేరాడు. అయితే శిక్షణ ఇస్తూ విద్యార్థుల నుంచి దరఖాస్తు ఫీజు రూ. 460, డ్రస్‌కు రూ. 2,500.. ఇలా దాదాపు 30 మంది నుంచి నగదు వసూలు చేశాడు. ఈ విషయంపై ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతను ఫేక్ ట్రైనర్ అని వెలుగు చూసింది. రెండు రోజులు నుంచి అతను పాఠశాలకు రావడం లేదు. ఈ విషయంపై ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహులను సాక్షి వివరణ కోరగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేస్తున్నారన్నారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
● ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య కర్నూలు(సెంట్రల్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాతో కలసి ఆయన స్టాక్ హోల్డర్స్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు, నగరాల్లో అధిక జనాభాతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం అధికమైందని, స్టాక్ హోల్డర్లు, అధికారులు సమన్వయంతో పని చేసి అడ్డుకట్ట వేయాలన్నారు. గతంలో గుడ్డ సంచులు, వైర్ బ్యాగులను మార్కెట్‌కు తీసుకెళ్లేవారమని, ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులతో ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, దేవాలయాలు, హోట ళ్లు, చికెన్ షాపుల్లో ఎక్కువగా జ్యూట్ బ్యాగులు, బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులను అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించేలా పంచాయతీల్లో అవగాహన కల్పించాలని డీపీఓను ఆదేశించారు. ఎంఎస్ఎంఈ పరిశ్రల్లో భాగంగా జూట్, డిగ్రేడబుల్ బ్యాగులు తయారు చేసే వారికి ప్రోత్సాహం ఇవ్వా లని చెప్పారు. కలెక్టర్ పి.రంజిత్‌బాషా మాట్లాడుతూ.. జిల్లాలో అక్టోబర్ 2వ తేదీనాటికీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమలో పీసీబీ ఈఈ కిశోర్‌రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, గనుల శాఖ డీడీ రవిచంద్, డీఎస్ఓ రఘువీర్, డీపీఓ భాస్కర్, డీటీసీ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డ నిధి లేనట్లే..
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 నేరుగా మీ ఖాతాలో జమచేస్తాం. మీ ఇంటిలో ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా ఈ మొత్తాన్ని అందిస్తాం. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేస్తాం.’’ అంటూ 2024 మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో అన్ని ప్రచార సభల్లోనూ కూటమి నేతలు హోరెత్తించారు. నీకు.. నీకు.. నీకు అంటూ వేలితో చూపించి మీ అకౌంటుకు నెలకు రూ.1,500 ప్రకారం వేస్తామని ఊరూవాడా నమ్మబలికారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 14 నెలలు అవుతోంది. ఇంతవరకు ఆడబిడ్డనిధి జాడ లేకుండాపోయింది. కూటమి నేతల వైఖరి చూస్తే ఆడబిడ్డ నిధిని గంగలో కలిపినట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించేందుకు పీ–4 కార్యక్రమాన్ని తెరమీదకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దాతల దయాదాక్షిణ్యాల మీద బతికే దుస్థితి తీసుకురావడం పట్ల మహిళల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో రైస్‌కార్డులు కలిగిన కుటుంబాలు దాదాపు 16 లక్షల వరకు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవే. అయితే బంగారు కుటుంబాలుగా కర్నూలు జిల్లాలో 64,178, నంద్యాల జిల్లాలో 43,021 కుటుంబాలను మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం. బలవంతపు దత్తత ఆడబిడ్డ నిధి సహా వివిధ ఎన్నికల హామీలకు మంగళం పలుకుతున్న కూటమి ప్రభుత్వం మహిళల దృష్టి మళ్లించేందుకు పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్(పీ4)ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకొని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలి. దాతల దయాదాక్షిణ్యాల మీద ఈ కుటుంబాలు బతికే దుస్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 64,178, నంద్యాల జిల్లాలో 43,021 కుటుంబాలను అత్యంత నిరుపేద కుటుంబాలుగా ఆయా జిల్లాల యంత్రాంగం ఎంపిక చేసింది. ఇందులో కర్నూలు జిల్లాలో 34,385, నంద్యాల జిల్లాలో 40,231 కుటుంబాలను దాతలు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం కర్నూలు జిల్లాలో 4,443, నంద్యాల జిల్లాలో 5,150 మంది మార్గదర్శలను ఎంపిక చేశారు. బలవంతంగా మార్గదర్శకులను ఎంపిక చేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవంతంగా వైఎస్ఆర్ చేయూత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 18–59 ఏళ్ల వయస్సు మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేసింది. ఒక్కో మహిళకు ఏడాదికి రూ.18,870 ప్రకారం విడుదల చేసిది. నాలుగేళ్లలో వైఎసార్ చేయూత కింద రూ.1,954.92 కోట్లు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం విశేషం. వైఎసార్ చేయూత పథకాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధిగా మార్పు చేశారు. 18–59 ఏళ్ల వయస్సు మహిళలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ నెలకు రూ.1,500 ప్రకారం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి నమ్మించడం గమనార్హం. 2024 ఎన్నికల సమయంలో ఊరూవాడ మారుమోగిన ఆడబిడ్డ నిధి పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళం పలికినట్లేనని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని ఇటీవల వ్యవసాయ అనుబంధ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొనడం పట్ల మహిళల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని 2024–25లో ఎగ్గొట్టి.. 2025–26లో అరకొరగా అమలు చేసింది. ఆడబిడ్డ నిధికి పూర్తిగా మంగళం పలుకుతుండటం పట్ల మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
అటకెక్కిన ‘ఆడబిడ్డ నిధి’
● 2024 ఎన్నికల సమయంలో ఊరూవాడా మారుమోగిన హామీ ● రూ.1,500 చొప్పున ఖాతాల్లో జమచేస్తామని ప్రచారం ● 14 నెలలు గడిచినా ఆ ఊసెత్తని కూటమి నేతలు ● ఇప్పుడు అమలుపై మాట మార్చిన సీఎం చంద్రబాబు ● ఆడబిడ్డల దృష్టి మళ్లించేందుకు తెరపైకి పీ–4 ● దాతల దయాదాక్షిణ్యాలు మాకొద్దని మహిళల ఆగ్రహం ఉపాధ్యాయులను మినహాయించండి ఆదోని సెంట్రల్: ప్రభుత్వం పీ–4 పథకం బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాల ని ఎస్టీయూ రాష్ట్ర పురపాలక కన్వీనర్ జి.వీరచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబాలను సంపన్న వర్గాల కు చెందిన వారు దత్తత తీసుకొని వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించే కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వాములు కావాలనడం సరికాదన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఐదు కుటుంబాలు, ప్రతి ఉపాధ్యాయుడు రెండు కుటుంబాలను దత్తత తీసుకొని మార్గదర్శులుగా నమో దు చేసుకోవాలని బలవంతం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జీతం మీద ఆధారపడిన ఉద్యోగులకు అంతస్థాయి ఎక్కడిదన్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతం అవుతున్నామని, ఈ నేపథ్యంలోనే మరింత వేధింపులకు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. -
దాతల దయాదాక్షిణ్యాలు వద్దు
ఆడబిడ్డనిధి పథకాన్ని పక్కన పెట్టి పీ4 పేరిట ముఖ్యమంత్రి మహిళలను మోసం చేస్తున్నారు. పీ4 కింద ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. దాతల దయాదాక్షిణ్యాల మీద బతికే పరిస్థితిని ముఖ్యమంత్రి తీసుకరావడం దారుణం. మాకు పీ–4 వద్దు.. ఆడబిడ్డ నిధి అమలు చేయాలి. – ఆవుల ఆదిలక్ష్మి, జ్యోతి గ్రూపు, కడమకుంట్ల, తుగ్గలి మండలం అప్పుల ఊబిలో కూరుకుపోయాం పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణా లు అమలు చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే కరువైంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మహిళా సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. – బి.రమాదేవి, పొదుపు మహిళ, రామకృష్ణాపురం, క్రిష్ణగిరి మండలం -
సారా మానేస్తే ప్రత్యామ్నాయ ఉపాధి
కర్నూలు: నాటుసారా తయారీ, విక్రయాలను వదిలేస్తే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మితం తండాలో నాటుసారా తయారీని పూర్తిగా మానుకున్న వారికి ఉపాధి మార్గాల్లో భాగంగా మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హనుమంతరావుతో పాటు జిల్లా ఎకై ్సజ్ అధికారి (ఈఎస్) ఎం.సుధీర్ బాబు, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ నాటుసారా తయారీ, విక్రయాలు మానేసిన కుటుంబాలందరినీ గ్రూపులుగా ఏర్పాటు చేసి డీఆర్డీఏ తరఫున ఉపాధి మార్గాలు, అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎవరికి తగిన ఉపాధి మార్గాన్ని వారు ఎంచుకుని తదనుగుణంగా శిక్షణకు సిద్ధం కావాలని సూచించారు. సారా మానేసిన వ్యాపారులంతా గ్రూపులుగా తయారై పొదుపు సంఘాల తరహాలో ఏర్పాటై శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. తండాను నాటుసారా రహిత గ్రామంగా ప్రకటించేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్, ఎస్ఐ నవీన్ బాబు, డీఆర్డీఏ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సోమన్న తదితరులు పాల్గొన్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ -
యువత..హృదయ వేదన!
కర్నూలు నగరంలోని ఆదిత్యనగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ అనే పాతికేళ్ల యువకునికి గత నెలలో గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశాడు. చేతికి వచ్చిన కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. కల్లూరుకు చెందిన శివకుమార్ అనే 30 ఏళ్ల యువకునికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈ నెల మొదటి వారంలో అతనికి అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు ప్రాణం తీసింది. దీంతో ఆయన భార్యతో పాటు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పత్తికొండ మండలం దూదెకొండ గ్రామంలో ఈ నెల 5న పీర్ల ఊరేగింపులో నాట్యం చేస్తుండగా గ్రామానికి చెందిన రామాంజనేయులు(42) గుండెపోటుకు గురయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అతని కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.కర్నూలు(హాస్పిటల్): గుండెపోటు అంటే ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయస్సు వారికీ వస్తోంది. ఇటీవల కాలంలో పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో యువత గుండెపోటుతో మృతి చెందుతున్నారు. జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన ఆహారపు అలవాట్లు, దురవాట్లే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో 5 శాతం యువత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీకి ఇటీవల గుండెపోటుతో చికిత్సకు వచ్చేవారి సంఖ్య ఎక్కువైంది. ఇందులో కొందరు ఆసుపత్రికి వచ్చేలోపు, మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందుతున్నారు. ఇంకొందరు కార్డియాలజీ విభాగానికి ఆపరేషన్‌కు వెళ్తున్నారు. ఇలా కార్డియాలజీ విభాగానికి గత సంవత్సరం రోజుల్లో ఓపీకి 22,325 మంది గుండెజబ్బులతో చికిత్సకు రాగా 4,281 మంది విభాగంలో చేరారు. వీరిలో 1,235 మందికి యాంజియోగ్రామ్, 433 మందికి యాంజియోప్లాస్టీ(స్టెంట్) వేశారు. ఇందులో 125 మంది 25 నుంచి 40 ఏళ్ల వయస్సు వారే ఉండటం గమనార్హం. ఇదే పరిస్థితి నగరంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నెలకొంది. ఆయా ఆసుపత్రులకు ఒక్కో దానికి ప్రతిరోజూ రోజుకు సగటున 10 మంది గుండెజబ్బులతో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 10 శాతం మంది ప్రజలు గుండెజబ్బులతో బాధపడుతున్నట్లు గతంలో నిర్వహించిన ఓ సర్వేలో నిర్ధారణ అయ్యింది.ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తున్న వారిలో 5 శాతం మంది యువతే ఉంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. మారిన ఆహారపు అలవాట్లు ప్రతి ఒక్కరికీ పోషకాహారం తీసుకుని మరింత ఆరోగ్యంగా ఉండాలన్న ఉత్సుకత అధికమైంది. ఈ క్రమంలో తీసుకోవాల్సిన దానికన్నా అధికంగా ఆహారాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో మాంసాహార సేవనం అధికమైంది. డ్రైఫ్రూట్స్ వాడకం పెంచేశారు. అందుకుతగ్గ వ్యాయామం చేయడం లేదు. దీంతో శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతోంది. రక్తనాళాల్లో ఎక్కడికక్కడ బ్లాక్‌లు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉన్న ఫలంగా గుండెపోటు, పక్షవాతం కేసులు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు కార్పొరేట్ సంస్కృతితో ఇతర దేశాలు, రాష్ట్రాల్లో లభించే ఆహారాన్ని సైతం ఇక్కడి వారు ఎక్కువ తీసుకుంటున్నారు. సాధారణంగా ఏ ప్రాంతం వాతావరణానికి తగ్గట్లు అక్కడి ప్రజలు ఆహారం తీసుకుంటారు. ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.. అక్కడి వారు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటారు. దక్షిణాదిలో వాతావరణం వేడిగా ఉంటుంది పెద్దలు చెప్పిన ఆహార నియమాలను పాటించాలి. అయితే ప్రాంతీయ భేదం లేకుండా అన్ని ఆహార పదార్థాలను ప్రజలు రుచి చూస్తున్నారు. దీనివల్లే జీవన విధానంలో మార్పులు వచ్చి ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పాటు ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు కావడంతో అధికబరువున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ కారణంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి అనేక అనారోగ్య సమస్యలు పలకరిస్తున్నాయి.నిద్రలేమి, మానసిక ఒత్తిడి కారణం ఇటీవల కాలంలో చాలా మంది యువకుల్లోనూ గుండెపోటు వస్తోంది. ఆసుపత్రికి వచ్చే వారిలో 30 శాతానికి పైగా వీరుంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి, అనియత జీవనశైలి, నిద్రలేమి, పొగతాగడం, మద్యంసేవనం అలవాట్లు చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణం. కొందరు యువత శారీరక దారుఢ్యం కోసం అధికంగా వర్కవుట్స్ చేయడం కూడా గుండెపై ఒత్తిడి పెంచుతోంది. –డాక్టర్ బి.కిరణ్‌కుమార్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాలజీ విభాగం, జీజీహెచ్, కర్నూలు -
AP: టమాటా పొలంలో భారీ వజ్రం లభ్యం..!
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం దిగువచింతలకొండలో ఓ యువతి టమాటా పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం లభించింది. దాన్ని ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఆదివారం రాత్రి పలువురు వ్యాపారులు వజ్రం కొనుగోలుకు ప్రయత్నించినా బేరం కుదరలేదు. ఎనిమిది క్యారెట్లు ఉన్న ఈ వజ్రాన్ని సోమవారం చెన్నంపల్లికి చెందిన వ్యాపారి రూ.13.50 లక్షలకు కొన్నాడు. 24 రోజుల క్రితం పెండేకల్లులో రూ.6.80లక్షలు, ఇప్పుడు డీసీకొండలో రూ.13.50లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవడం చాలా అరుదు. -
ఖాతాదారులకు సేవలు మరింత చేరువ చేస్తాం
కర్నూలు(అగ్రికల్చర్): భారతీయ స్టేట్ బ్యాంకు సేవలను మరింత సులభతరం చేస్తున్నట్లు అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్ పటేల్ తెలిపారు. సోమవారం గాయత్రీ ఎస్టేట్ సమీపంలోని ఎస్బీఐకి చెందిన దాదాపు 4.50 ఎకరాల భూమిలో వివిధ విభాగాలు ఒకే సముదాయంలో ఉండేలా రూ.13 కోట్లతో నిర్మించే భారీ భవన నిర్మాణానికి ఆయన తన సతీమణి సప్నా పటేల్‌తో కలసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఎస్బీఐ మౌలిక వసతుల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలు రాయి వంటిదన్నారు. ఈ భవన సముదాయంలో పరిపాలన విభాగం, రీజినల్ బిజినెస్ సెంటర్, ప్రాసెసింగ్ సెంటర్, ఆర్ఏఎస్ఎంఈసీసీ, ఏఎంసీసీ, ఎస్ఎంఈ బ్రాంచీలతో పాటు ప్రస్తుతం గాయత్రీ ఎస్టేట్‌లో ఉన్న టిఫ్ బ్రాంచ్ కూడా ఉంటాయన్నారు. ఈ భవన నిర్మాణ పనులు 15 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అమరావతి సర్కిల్ (ఎన్‌డబ్ల్యూ–3) జనరల్ మేనేజర్ అమ్రేంద్రకుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు పంకజ్‌కుమార్, హేమా, రీజినల్ మేనేజర్లు, కర్నూలులోని వివిధ బ్రాంచీల అధికారులు పాల్గొన్నారు. -
దుప్పిని వేటాడి.. మాంసాన్ని విక్రయించి!
ఆళ్లగడ్డ: నిషేధిత ఆయుధాలతో అడవిలోకి ప్రవేశించిన వేటగాళ్లు దుప్పిని వేటాడి, దాని మాంసాన్ని విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారి మూర్తుజావలి తెలిపిన వివరాల మేరకు.. అహోబిలం గ్రామానికి చెందిన కొందరు వేటగాళ్లు 27వ తేదీ అహోబిలం నార్త్ బీటులోని నూతల బావి రస్తా సమీపంలో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అందులో ముగ్గురు పరారీ కాగా ఒకరు పట్టుబడ్డాడు. అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడిన ప్రభాకర్‌ను సోమవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు. పారిపోయిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామ న్నారు. కాగా అహోబిలం గ్రామం సమీపంలోని టేకు ప్లాట్‌లో శనివారం అహోబిలం గ్రామానికి చెందిన నలుగురు వేటగాళ్లు తుపాకులతో దుప్పిని వేటాడి దా ని మాంసాన్ని మరో వ్యక్తి (వణ్య ప్రాణుల మాంసం బ్రోకర్) ద్వారా అహోబిలం, బాచేపల్లి, ఆలమూరు గ్రామాల్లో విక్రయించినట్లు సమాచారం. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి రావడంతో ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం అంతా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ నలుగురు వేటగాళ్లు ఎవరు ? మాంసం విక్రయించిన బ్రోకర్ ఎవరు అన్న ది కూడా అధికారులకు తెలిసినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులుగా చెప్పడంతో పాటు అడవిలో కనిపించినందుకే అరెస్ట్ చేశామని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టబడిన ఇద్దరిలో ఒకరిని మాత్రమే అరెస్ట్ చూపించడం, ఒక తుపాకీ మాత్రమే దొరికింది. మిగతా ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నామని అధికారులు ప్రకటించడంపై పలు వ్యవక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారు లు కేసును నీరుగార్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకరు అరెస్ట్, నాటు తుపాకీ స్వాధీనం నిందితులను తప్పించేందుకు యత్నం -
ఆకతాయిలపై డ్రోన్ నిఘా
కర్నూలు: కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడే ఆకతాయిలపై నిఘా కోసం పోలీసులు డ్రోన్ కెమెరా సేవలను వినియోగిస్తున్నారు. సోమవారం నగరంలోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్న కేవీఆర్ కళాశాల, మౌర్యా ఇన్ వద్ద ఉన్న చైతన్య కళాశాల సమీపంలో ఆకతాయిల ఆట కట్టించేందుకు శక్తి టీమ్ పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా పటిష్టం చేశారు. శక్తి టీమ్ సీఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బాలికలు, మహిళలకు భద్రతపై భరోసా కల్పిస్తూ అత్యాధునిక డ్రోన్ కెమెరాలు వినియోగిస్తూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే పోలీసు బృందాలతో విద్యాసంస్థల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుంకేసులను సందర్శించిన ఎస్ఈ కర్నూలు (సిటీ): టీబీ డ్యాం నుంచి విడుదల చేస్తున్న 1.19 లక్షల క్యూసెక్కుల నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుకుంటోంది. దీంతో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ) బాలచంద్రారెడ్డి సోమవారం సుంకేసులను సందర్శించారు. బ్యారేజీకి వస్తున్న ఇన్‌ఫ్లో, బయటకు వదులుతున్న ఔట్‌ఫ్లో వివరాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వరదనీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలని ఇంజినీర్లకు సూచించారు. బ్యారేజీ నుంచి 1,03,437 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
నదీతీరంలో శ్రీమఠం పీఠాధిపతి పర్యటన
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదీ తీరంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సోమవారం పర్యటించారు. రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు సమీపిస్తుండటంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. నదీ పరివాహక ప్రాంతంలో స్నానాలకు ఏర్పాటు చేసిన షవర్లను పరిశీలించారు. నదీ తీరంలో భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. మునిగిన స్నానపు ఘాట్లు మంత్రాలయం రూరల్: వరద నీరు పోటెత్తడంతో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయంలో స్నానపు ఘాట్లు మునిగిపోయాయి. నదీతీర ప్రాంతంలో లోతట్టు పంట పొలాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. -
రోడ్డెక్కని మహిళల ఉచిత బస్సు!
ఆత్మకూరు: పక్కన ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళల కోసం ఉచిత బస్సులను నడుపుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పినా మంత్రులతో, టీడీపీ నేతలతో రకరకాల వ్యాఖ్యాలు చేయిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లా వరకే పరిమితం అనే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు లేవని, మహిళలకు ఉచిత బస్సు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారమవుతుందని టీడీపీ అనూకూల మీడియాలు వార్తా కథనాలు ప్రచురిస్తూ రకరకాల అపోహలను సృష్టిస్తున్నాయి. దీంతో మహిళలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉచిత హామీ ఇవ్వడం ఎందుకు.. అధికారంలోకి వచ్చాక ఆలస్యం చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. జిల్లాకే పరిమితం అయితే ఇవీ కష్టాలు.. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం చేస్తామని చేస్తున్న ప్రకటనలపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● నంద్యాలకు చెందిన బ్రాహ్మణకొట్కూరు గ్రామం నుంచి కర్నూలు జిల్లా పరిధిలోని గార్గేయపురం గ్రామానికి వెళ్లాలంటే కేవలం ఆరు కి.మీ. దూరం మాత్రమే ఉంది. దాదాపు టికెట్ రూ.10 ఉంది. ఈ మార్గంలో ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదు. ● బ్రాహ్మణకొట్కూరు మహిళలు కర్నూలుకు వెళ్లాలంటే చార్జీ చెల్లించాలి. కేవలం కర్నూలు 15 కి.మీ. దూరంలో ఉన్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కరువే. ● నంద్యాల జిల్లా పరిధిలోని ఆత్మకూరు నుంచి ప్రకాశం జిల్లాలోని దోర్నాల వెళ్లాలంటే 60 కి.మీ. దూరం ఉంది. టికెట్ మాత్రం రూ.120. ఆత్మకూరు నుంచి దోర్నాకు వెళ్లేందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాదు. ● శ్రీశైలం నంద్యాల జిల్లాలో ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా పరిధిలోని దోర్నాల మీదుగా వెళ్లాలి. మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కితే కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ● నంద్యాల జిల్లా పరిధిలోని చాగలమర్రి నుంచి మైదుకూరుకు 20 కి.మీ. దూరంలోనే ఉంది. ఆర్టీసీ బస్సులో ఎక్కితే రూ.30 చార్జీ చెల్లించాల్సి ఉంది. అన్నీ అబద్ధాలేనా? ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లా వరకే కల్పిస్తామని చెప్పడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు అని ఆరోపిస్తున్నారు. పూర్తిస్థాయితో ఉచిత బస్సు సర్వీసు కల్పిస్తే మహానంది, శ్రీశైలం, అహోబిలం, ద్రాక్షారామం, అన్నవరం, తిరుమల, శ్రీకాళహస్తి, మంత్రాలయం దర్శించుకోవచ్చని, భక్తిభావం పెరుగుతుందని మహిళలు చెబుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరగేవిధంగా జీవో ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకే కాకుండా సూపర్ లగ్జరీ, నాన్ఏసీ బస్సుల్లో కూడా మహిళలే ఉచితంగా ప్రయాణం చేసే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ 20 నుంచి 30 వేల మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. అమలు చేస్తారో లేదో అధికారం కోసం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి యేడాదిన్నర్ర అయినా ఇంతవరకు ఊసే లేదు. ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తారో లేదో చూడాలి – దర్గమ్మ, ఆత్మకూరు మోసగించడం సరికాదు ఉచిత బస్సు సర్వీసు పేరుతో కూటమి ప్రభుత్వం ఆశ కల్పించింది. ఇప్పుడు నిబంధనలు విధించడం సరికాదు. సొంత జిల్లాకే ప్రయాణం సరిచేస్తే చాలా కష్టాలు వస్తాయి. ఇలా చేస్తే కూటమి ప్రభుత్వం మహిళలను మోసగించినట్లు అవుతుంది. ఇప్పటికై నా ఉచిత బస్సు హామీని రాష్ట్రమంతా అమలు చేయాలి. – పార్వతి, ఆత్మకూరు ఇప్పటి వరకు అమలు కాని చంద్రబాబు హామీ ఆగస్టు 15న అమలు చేస్తామని ఆర్భాట ప్రకటన జిల్లా వరకే పరిమితం అంటూ ప్రచారాలు బస్సులు లేవు.. భారమవుతుందని అనుకూల మీడియాలో ప్రచారం -
పులుల లెక్కింపు ఇలా..
పచ్చని అడవుల్లో బంగారు శరీర ఛాయపై నల్లటి చారలతో పెద్ద పులి గాండ్రిస్తోంది. అనుకూల వాతావరణంతో ‘పులి’కించిపోయి పదేళ్లలో తన వర్గాన్ని రెట్టింపు చేసుకుని నల్లమల నాదేనంటూ మీసం మిలేస్తోంది. కలిసొచ్చిన కాలంతో అభయారణ్యంలో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ షం‘షేర్’ అంటూ పంజా విసురుతోంది. అత్యాధునిక రక్షణ ఛట్రంలో తాను క్షేమంటూ శ్రీశైలం నుంచి శేషాచలం వైపు అడుగులు వేస్తున్న పెద్దపులి రాజసాన్ని ఇన్ఫ్రా రెడ్ కెమెరాలు కిసక్మంటూ బంధిస్తున్నాయి. జూలై 29 ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. – ఆత్మకూరురూరల్ దశాబ్ద కాలం వెనక్కు వెళ్తే నల్లమల అడవుల్లో ఎక్కడ చూసినా.. కలప కోసం వెళ్లే మనుషులు, వారి ఎద్దుల బండ్లు, సైకిళ్ల వరుసలు కనిపించేవి. గొడ్డలి మోతలతో అడవి దద్దరిల్లేది. జాతీయ పులుల సంరక్షణాసాధికార సంస్థ తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పక పాటించిన స్థానిక అధికారులు అడవిలో మానవ సంచారాన్ని పూర్తి స్థాయిలో నిరోధించారు. ప్రస్తుతం ఆదిమ గిరిజనులైన చెంచులు, అటవీ సిబ్బంది తప్ప అడవుల్లో తిరిగే వారే లేరు. ఇది పులుల సంరక్షణకు ఎంతో కలసివచ్చింది. పులుల సంచారానికి, సంయోగానికి ఆటంకం లేని పరిస్థితులతో వాటి సంఖ్య పెరగడానికి దోహదపడిందని చెప్పవచ్చు. నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం యావత్ భారత దేశంలోనే విస్తీర్ణం రీత్యా అతి పెద్ద పెద్దపులుల అభయారణ్యం. సుమారు 3500 చ.కిమీ పరిధిలో విస్తరించిన ఈ అభయారణ్యంలో ఆత్మకూరు అటవీ డివిజన్ అత్యంత కీలకమైనది. ఎన్‌ఎస్‌టీఆర్‌లో 2015 నాటికి 37 పెద్దపులులు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. కాగా 2025 నాటికి ఈ సంఖ్య 87కు చేరుకుంది. అలాగే పులుల గణనలో మూడేళ్ల లోపు కూనలను లెక్కింపులోకి తీసుకోరు. దశాబ్ద కాలంలో ఎన్‌ఎస్‌టీఆర్‌లో పెద్దపులుల సంఖ్య ఏకంగా 87కు చేరుకుని దాదాపు 50 పులులు మేర పెరగడం పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఆత్మకూరు అటవీ డివిజన్లోని శ్రీశైలం, నాగలూటి, బైర్లూటీ రేంజ్‌లు పులుల ప్రవర్దనానికి స్వర్గధామం. వాటి సంరక్షణా పద్ధతుల్లో అధికారులు తీసుకున్న చర్యలతో పాటు సహజ ఆవాసపు నాణ్యత కూడా కారణాలు అని చెప్పవచ్చు. పులి చాలా సిగ్గరి జంతువు. పులుల సంగమ సమయంలో మనిషి అలికిడి విన్నాచాలు అవి వెంటనే సమాగం నుంచి దూరమవుతాయి. లేత గర్భంతో ఉన్న ఆడపులులకు మానవ కలకలం వినపడినా సరే బెదురుతో గర్భస్రావం అవుతుంది. పులి విహారానికి ఆటంకం జరగకుండా అడవుల్లో మానవ ప్రవేశాన్ని సంచారాన్ని నియంత్రిస్తున్నారు. వైల్డ్‌లైఫ్ క్లినిక్ ఎన్ఎస్టీఆర్ పరిధిలో పని చేసేందుకు ఆత్మకూరు అటవీ డివిజన్ కేంద్రంగా బైర్లూటీలో ఒక వైల్డ్‌లైఫ్ క్లినిక్ ఏర్పాటు అయ్యింది. ఇందులో ఇద్దరు వన్యప్రాణి వైద్య నిపుణులు పని చేస్తున్నారు. వీరికి సహాయకారిగా ఒక అనిమల్ రెస్క్యూ వాహనం కూడా ఉంటోంది. పులులతో పాటు ఏ ఇతర వన్య ప్రాణులు గాయపడినప్పుడు సత్వర చికిత్స అందించేందుకు ఈ క్లినిక్ ఎంతో ఉపయుక్తంగా ఉంది. అలాగే ఒక స్నిఫర్ డాగ్ కూడా ఉంది. ఇది ఇద్దరు సంరక్షకుల శిక్షణతో పని చేస్తోంది. శేషాచలం వైపు అడుగులు నల్లమలలోని శ్రీశైలం నుంచి శేషాచలం అడవుల వరకు పెద్దపులి ప్రస్థానం కొనసాగాలని ఆకాంక్షించిన అటవీ అధికారులు ఆదిశగా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, గుండ్ల బ్రహ్మేశ్వరం, నంద్యాల అటవీ డివిజన్, రుద్రవరం రేంజ్, వైఎస్సార్ జిల్లా లంకమల వరకు పెద్దపులుల ప్రస్థానం కొనసాగింది. ఈ నేపథ్యంలో పులులు స్వేఛ్ఛగా సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడానికి తగిన వసతులు కల్పించడమే శ్రీశైలం – శేషాచలం పెద్దపులుల కారిడార్ ఆలోచనకు నాంది అయ్యింది. ఇటీవల ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఒక పెద్దపులి ఏకంగా అడవిని దాటి పూర్తిగా మైదాన ప్రాంతంలో 25 కిమీ సంచరించి తిరిగి అడవిలోకి వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో పులి కారిడార్‌పై కొత్త ఆశలు చిగురించాయి. ఎలాంటి పచ్చదనం లేక పోయినా పులి ముందుకు వెళ్లగలుగుతుందనే నమ్మకం ఏర్పడింది. ఇక కేవలం పులికి, మనిషికి ఏర్పడే సంఘర్షణ నివారణ చర్యలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని గుర్తించారు. పెద్ద పులుల పాద ముద్రలు సేకరించి వాటి ఆధారంగా పులుల సంఖ్యను అంచనా వేయడాన్నే స్టాండర్డ్ ఫగ్‌మార్క్ ఎన్యూమరేషన్ పద్ధతిగా పిలుస్తారు. పులుల సంచారాన్ని గుర్తించడం, అవి సంచరించే దారుల్లో రోజు సాయంత్రం మెత్తటి ఇసుక, మట్టితో నియమిత ప్రమాణంలో చదును చేస్తారు. వీటినే ఫగ్ ఇంప్రెషన్ ప్యాడ్స్‌గా పిలుస్తారు. పులులు ఆ ప్యాడ్స్ మీద నడిచినప్పుడు వాటిపై ఏర్పడిన పాదముద్రలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో అచ్చులుగా మారుస్తారు. ఇలా సేకరించిన అచ్చులను ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించి పులుల సంఖ్యపై ఓ అంచనాకు వస్తారు. అలాగే అడవుల్ల ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిల్లో పడే చిత్రాల ఆధారంగా పులుల చారలను విశ్లేషిస్తారు. పులి చారలు మనుషుల వేలిముద్రలలాగే దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. పులి పెంటను సేకరించి వాటి డీఎన్ఏ మ్యాప్‌లను సేకరిస్తారు. పులుల స్వర్గధామం... ఆత్మకూరు అభయారణ్యం దశాబ్దకాలంలో రెండింతల పెరుగుదల శ్రీశైలం – శేషాచలం కారిడార్‌కు ప్రయత్నాలు నేడు అంతర్జాతీయ పెద్దపులుల దినోత్సవం -
వికసించని ‘ఉద్యాన’ సాగు
2019–20 నుంచి 2024–25 వరకు ఉద్యాన పంటల సాగు, ఉత్పాదకత వివరాలు.. సంవత్సరం ఉద్యానపంటల సాగు ఉద్యానపంటల ఉత్పాదకత (హెక్టార్లలో) (టన్నుల్లో) 2019-20 1,17,889 20,55,819 2020-21 1,11,919 19,28,549 2021-22 1,04,733 17,64,261 2022-23 91,059 11,36,950 2023-24 90,780 6,01,228 (ఈ ఏడాది కరువు) 2024-25 71,630 7,83,552 ● ప్రోత్సాహకాలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ● 2023–24లో కరువు వచ్చినప్పటికీ 90,780 హెక్టార్లలో సాగు ● కూటమి ప్రభుత్వం వచ్చాక 71,630 హెక్టార్లకు పడిపోయిన వైనం ● 20.55 లక్షల నుంచి 7.83 లక్షల టన్నులకు తగ్గిన ఉత్పాదకత ● క్షేత్రస్థాయిలో కనిపించని పండ్లతోటల అభివృద్ధికర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ఉద్యాన పంటల సాగు వికసించడం లేదు. మామిడి, అరటి, జామ, సపోట, చినీ, నిమ్మ, దానిమ్మ, మల్లె, సన్నజాజి, మునగ తదితర పంటలు సాగు క్రమంగా తగ్గుతోంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెంచేందుకు ఉద్యాన పంటలు కీలకపాత్ర వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యాన పంటల సాగు పురోగమనంలో ఉండి, ఉత్పాదకత భారీగా వచ్చేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉద్యాన పంటల సాగు తిరోగమనం అయ్యింది. ఉత్పాదకత కూడా డీలాపడిపోయింది. వైఎస్సార్సీపీ పాలనలో ఇలా.. కర్నూలు జిల్లాలో 2019–20 నుంచి 2023–24 వరకు ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరిగింది. 2023–24లో వర్షాభావ పరిస్థితులతో కరువు ఏర్పడినా ఉత్పాదకత తగ్గలేదు. గత వైఎసార్సీపీ ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించింది. ‘ఉపాధి’ నిధులతో 100 శాతం సబ్సిడీతో పండ్లతోటల అభివృద్ధికి అవకాశం కల్పించింది. సుగంధద్రవ్యాల పంట ఉత్పత్తులకు రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. వర్షాలు ఆశాజనకంగా పడటం, ప్రతి ఏటా హంద్రీ–నీవా కాలువకు నీరు రావడంతో ఉద్యాన పంటల సాగు భారీగా పెరిగింది. 2019–20లో రికార్డు స్థాయిలో 1,17,889 హెక్టార్లలో పంటలు సాగు కాగా... ఉత్పాదతక 20.55 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. 2023–24లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో కరువు మండలాలను ప్రకటించినా ఉద్యాన పంటల సాగు ఆశాజనకంగానే కనిపించింది. ‘కూటమి’లో సబ్సిడీలకు సున్నా! కూటమి ప్రభుత్వ ఆధినేత నారాచంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం అంటూ మాటల్లో తప్ప చేతల్లో చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2024–25లో ఉద్యాన పంటల సాగు పడిపోవడాన్నే చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం, ఉద్యాన పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో సాగుపై రైతుల్లో విముఖత ఏర్పడింది. జిల్లాలో ప్రధాన ఉద్యాన పంటలైన మామిడి, అరటి సాగు తగ్గిపోయంది. జామ, సపోట, చినీ, నిమ్మ తదితర పంటలు సాగు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లాలో 2023–24లో 90,780 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. అయితే 2024–25లో మాత్రం సాగు 71,630 హెక్టార్లకు పడిపోయింది. ఎంఐడీహెచ్, ఆర్కేవీవై కింద యాక్షన్ ప్లాన్ ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2024–25లో కూరగాయల సాగుకు ఎలాంటి సబ్సిడీలు లేవు. ఆ‘ధర’ణ లేక! 2022–23 నుంచి సుగంధ ద్రవ్యాలకు చెందిన మిర్చి పంటకు రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. ఏకంగా క్వింటాల్‌కు గరిష్టంగా రూ.53వేలకుపైగా ధర లభించింది. దీంతో 2023–24లో రికార్డు స్థాయిలో సాగు చేశారు. ఈ ఏడాది కూడా మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు లభించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జిల్లాలో మిర్చి 95 వేల ఎకరాల్లో సాగు అయ్యింది. నల్లతామర, వైరస్ తెగుళ్ల కారణంగా దిగుబడులు పడిపోయాయి. సాగు తగ్గి దిగుబడులు పడిపోయినప్పటికీ ధరలు అట్టడుగుకు పోయాయి. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.10 వేలు కూడా లభించిన దాఖలాలు లేవు. మద్దతు ధరతో కొంటామని ఊరించిన కూటమి ప్రభుత్వం చివరికి మిర్చి రైతులను నట్టేట ముంచింది.ప్ర‘గతి’ తప్పి! వేలాది ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించని పరిస్థితి. ఇందుకు ఈ–క్రాప్‌లో నమోదవున్న లెక్కలే నిదర్శనం. 2023–24లో ఈ–క్రాప్ ప్రకారం 4,155 హెక్టార్ల(10,387ఎకరాలు)లో పండ్లతోటలు ఉన్నాయి. 2024–25లో ఉపాధి నిధులతో 4,150 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసినట్లు లెక్కలు ఉన్నాయి. 2024–25లో ఉద్యాన శాఖ కూడా 1,000 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసినట్లు చెబుతోంది. ఈ ప్రకారం 2024–25లో పండ్లతోటల సాగు భారీగా పెరగాలి. ఈ–క్రాప్ ప్రకారం 2024–25లో (4660 హెక్టార్ల(11650 ఎకరాలు)లో పండ్లతోటల సాగు ఉన్నట్లు తేలింది. 2023–24తో పోలిస్తే 2024–25లో కేవలం 505 హెక్టార్ల(1262 ఎకరాలు)లో మాత్రమే పండ్లతోటల సాగు పెరిగింది. ఉపాధి నిధులతో చేపడుతున్న పండ్లతోటల సాగు ఆన్లైన్లో మాత్రమే కనిపిస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
కర్నూలులో అక్రమ రిజిస్ట్రేషన్లు
కర్నూలు కల్చరల్: జిల్లా కేంద్రమైన కర్నూలులో కొన్ని స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, రామప్రియనగర్లో ఇది ఎక్కువగా ఉందని, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాకు ప్రజలు అర్జీ ఇచ్చారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జేసీ డాక్టర్ బి.నవ్య ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటికి తగు పరిష్కారాలు చూపాలని అధికారులను ఆదేశించారు. కృష్ణానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర నుంచి ఐటీసీ సర్కిల్ వరకు ఉన్న రోడ్లు గుంతలు ఏర్పడి, రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, అధికారులు స్పందించాలని ప్రజలు అర్జీ ఇచ్చారు. అలాగే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభించి, జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని, నాణ్యత, పరిశుభ్రం పాటించని హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రాలు అందజేశారు. అర్జీల స్వీకరణ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడారు. లాగిన్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చిన ప్రజలు -
బాబోయ్.. కొండముచ్చులు
ప్యాపిలి: జలదుర్గం గ్రామ ప్రజలకు గత వారం రోజులుగా కంటి మీద కునుకు కరువైంది. గత కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారు ప్రాంతంలో కొండముచ్చు కోతులను వదిలి వెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి గ్రామంలోకి వచ్చిన కోతులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ గుంపులోని ఓ కొండముచ్చు కోతి పగలు, రాత్రి అని తేడా లేకుండా గ్రామస్తులపై దాడికి పాల్పడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైగా ఈ కొండముచ్చు బారిన పడి గాయపడ్డారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన కొండ ముచ్చు గాఢనిద్రలో ఉన్న మీనిగ లక్ష్మీదేవి అనే మహిళ తలపై కరిచింది. దీంతో ఆమె తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొండముచ్చు ఆగడాలతో గ్రామస్తులు ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులపై కూడా కొండముచ్చులు దాడి చేయడంతో గత రెండు రోజులుగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. కొండముచ్చుల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంటికి తలుపులు వేసుకుని గ్రామస్తులు ఇళ్లలోనే బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు గత వారం రోజులుగా జలదుర్గం గ్రామంలో కొండముచ్చు మూక స్వైర విహారం చేస్తుండటంతో ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు స్పందించారు. పలు చోట్లు బోన్లు, వలలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క కొండముచ్చు కూడా బోన్లో చిక్కలేదు. కాగా అధికారులు సోషల్ మీడియా, దండోరా ద్వారా గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటే తగు జాగ్రత్తలతోనే బయటకు రావాలన్నారు. రాత్రి వేళల్లో మిద్దెలపై, ఆరు బయట నిద్రించకూడదన్నారు. బజార్లలో గుంపులుగా గుమికూడదని వీఆర్ఓ సునీల్ ప్రజలను అప్రమత్తం చేశారు. చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపరాదన్నారు. జలదుర్గంలో ఆగని కొండముచ్చు దాడులు బయటకు వచ్చేందుకు జంకుతున్న గ్రామస్తులు బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు -
డీపీఓలో ఇద్దరు అధికారుల బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పోలీసు కార్యాలయంలో ఇద్దరు అధికారులు అయ్యారు. ఈ మేరకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. గ్రేహౌండ్స్ విభాగంలో ఏఓగా పనిచేస్తున్న ఎస్.విజయలక్ష్మిని జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓగా బదిలీ చేశారు. కడప జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న జ్యోతిని కర్నూలు డీపీసీఏ ఏఓగా బదిలీ చేశారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య కర్నూలు: కుటుంబ కలహాలతో షేక్ జాకియా (35) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె భర్త షేక్ డిరాంశ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఇంట్లో అత్తతో గొడవపడి షేక్ జాకియా ఉరి వేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమెకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు సంతానం. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నాయకుల స్వలాభాపేక్షడోన్: ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా స్వలాభపేక్ష కోసం టీడీపీ నాయకులు డోన్ పట్టణ శివారులోని ఎంకె టౌన్షిప్ వద్ద ఏర్పాటు చేసిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా రేకుల షెడ్లు వేశారు. దీంతో ఆ స్థలం ఇరుకుగా మారడంతో దస్తాజులేఖరులతో పాటు ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఒకవైపు టీడీపీ నాయకుని షాపింగ్ కాంప్లెక్స్, ఎదురుగా ఏర్పాటు చేసిన అద్దెరేకుల దుకాణాల కారణంగా స్థలం లేకుండాపోయింది. మరో రెండు వైపులు వంకలు ఉండటంతో ప్రజలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. కేవలం స్వలాభపేక్ష కోసం ప్రజలకు సౌకర్యాలు లేకుండా చేయడం టీడీపీ నాయకులకు తగదని ప్రజలు వాపోతున్నారు. రిటైర్డ్ డీఎస్పీపై దాడి ఆదోని అర్బన్: పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ డీఎస్పీ రఘునాథ్చారిపై ముగ్గురి వ్యక్తులు దాడి చేశారు. టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కొన్ని రోజుల క్రితం రిటైర్డ్ డీఎస్పీకి ప్లాటు ఇస్తానని బిల్డర్ రాఘవేంద్రరెడ్డి అనే వ్యక్తి డబ్బు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ప్లాట్ ఇవ్వకపోవడంతో సోమవారం రిటైర్డ్ డీఎస్పీ డబ్బు తిరిగి అడిగినందుకు రాఘవేంద్రరెడ్డితో పాటు మరో ఇద్దరు దాడి చేశారు. రిటైర్డ్ డీఎస్పీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రకృతి రక్షణ అందరి బాధ్యత నంద్యాల(న్యూటౌన్): ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ఫారెస్ట్ అధికారి అనురాగ్‌మీనా పేర్కొన్నారు. ప్రపంచ ప్రకృతి సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ ప్రకృతి వనరులైన అడవులు, నీరు, గాలి, భూమి ఇతర జీవ సంపదను సంరక్షించాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రకృతి సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అనంతరం రామకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ ప్రగతిరెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్బయ్య పాల్గొన్నారు. -
జీడీపీలోకి ‘హంద్రీ–నీవా’ నీరు
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కు ఆదివారం రాత్రి నుంచి హంద్రీ– నీవా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఏఈ మహమ్మద్ ఆలీ మాట్లాడుతూ.. హంద్రీ– నీవా కాలువ నుంచి 60, ఎల్లెల్సీ నుంచి 60 క్యూసెక్కుల నీరు నీరు జీడీపీలోకి వచ్చి చేరుతోందన్నారు. జీడీపీ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా.. సోమవారం సాయంత్రానికి 1 టీఎంసీలకు చేరిందన్నారు. కోడుమూరు పట్టణానికి తాగునీటి కోసమని జీడీపీ ఎడమ కాలువ ద్వారా 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. పింఛన్ల పంపిణీకి రూ.196.7 కోట్లు కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఆగస్టు నెలకు ఉమ్మడి జిల్లాలో 4,55,491 పింఛన్లకు రూ.196.7 కోట్లు మంజూరయ్యాయి. రెండు నెలలుగా ఊరిస్తున్న స్పౌజ్ పింఛన్లను కూడా ఆగస్టు నెలలో ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కారణంగా పింఛన్ల సంఖ్య కొంత మేర పెరిగింది. ఈ నెల 31న పింఛన్ల నిధులు బ్యాంకులకు విడుదల కానున్నాయి. అహోబిలంలో వైభవంగా తిరువాడిప్పూరం ఉత్సవం ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తిరువాడిప్పూరం ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సోమవారం వేకువ జామునే దిగువ అహోబిలంలో కొలువైన మూలవిరాట్ శాంతమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్ల్లతో పాటు గోదాదేవి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను, గోదాదేవి అమ్మవారికి ఎదురుగా కొలువుంచారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశ స్థాపన, అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టువస్త్రాలు, మేనిమి ఆభరణాలతో అలంకరించి కొలువుంచా రు. రాత్రి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో శ్రీ గోదాదేవి, ప్రహ్లాదవరదుల కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత పల్లకీలో కొలువుంచి గ్రామోత్సవం చేపట్టారు. ముద్రకర్త కీడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్, అర్చకులు ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. శ్రీగిరి కిటకిట శ్రీశైలంటెంపుల్: శ్రావణమాస తొలి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మల్లన్న దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచి త, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నా రు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. -
పెద్దపులి సంరక్షణలో ముందడుగు
పెద్దపులి సంరక్షణ కోసం అన్నిరకాల చర్యలు చేపట్టడంలో ముందడుగులో ఉన్నాము. పులి ఆహార జంతువులకు ఆహార కొరత లేకుండా 200 హెక్టార్లలో గడ్డి మైదానాలను అభివృద్ధి పరుస్తున్నాం. నీటి కొరత లేకుండా నీటి వనరుల పర్యవేక్షణ జరుగుతోంది. ఎన్ఎస్టీఆర్ పరిధిలో 80 నీటి కుంటల్లో పూడిక తీయించాం. పులుల సంఖ్య పెరుగుతున్నందువల్ల వాటి ఆహార జంతువుల నిష్పత్తి తగ్గకుండా బయటి ప్రాంతాల్లోంచి చుక్కల దుప్పులు, కణుతులను పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అడవిలో వదులుతున్నాం. ఇప్పటికే కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారం వారి సంరక్షణలో ఉన్న దుప్పులను, కణుతులను, సత్యసాయిబాబా ట్రస్ట్ పరిధిలో ఉన్న హరిణి వనాల్లోని జింకలు అడవుల్లో వదలడానికి సిద్ధం చేశాం. – వి సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, పాజెక్ట్ టైగర్, ఆత్మకూరు● -
శ్రావణ ఉత్సవం.. భక్తిపారవశ్యం
శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామృతాభిషేకం తదితర పూజల అనంతరం భక్తులను స్వామి దర్శనానికి వదిలారు. ఇంటి దేవుడిని దర్శించుకునేందుకు మన రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక సూదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం అతిశీఘ్ర, ప్రత్యేక, శీఘ్ర దర్శనం ఏర్పాట్లు చేశారు. ఫుట్వేర్బ్రిడ్జీల ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లలో వచ్చి స్వామిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కౌతాళం సీఐ అశోక్‌కుమార్ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. – కౌతాళం -
వన్యప్రాణి కనిపిస్తే క్లిక్
అటవీ సంరక్షణ మొత్తం కను సన్నల్లో సాగుతోంది అంటే అతిశయోక్తి కాదు. ప్రధానమైన ప్రాంతాల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైంది. ఏ జీవమున్న కదలిక కెమెరాల ముందు జరిగితే చాలు కెమెరా ట్రిగ్గర్ అయి క్లిక్‌మని ఫొటోలు తీస్తుంది. అంతే కాక ఇవి ఆన్లైన్లో వెంటనే చూసే అవకాశం కూడా ఉంది. దీనితో వన్యప్రాణుల స్థితిగతులు, వాటిని వేటాడే వ్యక్తుల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఉచ్చులకు చిక్కిన పులులను కూడా ఇలాగే గుర్తించి సంరక్షించిన ఘటనలు కూడా ఉన్నాయి. -
ఉద్యోగాల పేరుతో మోసం
కర్నూలు: ఉద్యోగాల పేరుతో మోసం చేశారన్న వారే ఎక్కువ మంది ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కలసి తమ బాధను చెప్పుకున్నారు. డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, పోటీ పరీక్షల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని ఎస్పీ వారికి సూచించారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 104 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ జరిపి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా పీజీఆర్ఎస్లో పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కర్నూలుకు చెందిన వీరస్వామి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.8 లక్షలు డబ్బులు, 5 తులాల బంగారం తీసుకుని మోసం చేశాడని నాగరాజు ఫిర్యాదు చేశారు. ● రైల్వే డిపార్ట్మెంట్లో క్యాడర్ కోర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వెల్దుర్తికి చెందిన ప్రశాంత్ బాబు రూ.12.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని శ్రీనగర్ కాలనీకి చెందిన రవిబాబు ఫిర్యాదు చేశారు. ● బీటెక్ చేసిన తనకు హైదరాబాదుకు చెందిన షణ్ముఖ్ సుదర్శన్ అనే వ్యక్తి కన్సల్టెన్సీ పేరుతో గచ్చిబౌలిలో ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశాడని జొహరాపురంకు చెందిన గుణశేఖర్ ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు పీజీఆర్ఎస్కు 104 ఫిర్యాదులు -
మీ అభిమానం ‘పచ్చగుండ’!
వైఎస్సార్సీపీ పట్ల, ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల చెరగని అభిమానానికి ఈ దృశ్యం అద్దం పడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆ రూపం ఎంత పదిలంగా ఉందో ఈ సామాన్య రైతును కదిలిస్తే అర్థమవుతుంది. పత్తికొండ నియోజకవర్గంలోని చక్రాళ్ల గ్రామ సమీప పొలాల్లో పని చేసుకుంటున్న ఇతని పేరు రంగ నాయుడు. పార్టీ అధికారంలో లేకపోయినా అభిమాన నాయకుడి రూపంతో కూడిన టీ షర్ట్ ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘ రాజు బలవంతుడైనప్పుడే శత్రువులంతా ఏకమవుతారు..’ అనే కొటేషన్‌తో కూడిన టీ షర్ట్ తన అభిమాన నేత గురించి ఆ నిరుపేద రైతు మనసులోని అభిమానం స్థాయిని చాటుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి
కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయా పోలీసు స్టేషన్లలో పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటు సారా తరలిస్తూ ఇద్దరు అరెస్టు నవోదయం కార్యక్రమంలో భాగంగా ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం కల్లూరు మండలం ఉల్లిందకొండ నుండి డోన్ వైపు వెళ్లే రహదారి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. కొల్లం పల్లి తండాకు చెందిన భూక్య గోపాల్ నాయక్, బస్తి పాడు గ్రామానికి చెందిన పురుషోత్తంలు ద్విచక్రవాహనంపై 20 లీటర్ల నాటు సారా తరలిస్తూ పట్టుబడ్డారని ఎకై ్సజ్ అధికారులు రాజేంద్ర ప్రసాద్, నవీన్ బాబు వెల్లడించారు. వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
బలహీన వర్గాల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక
కర్నూలు(అర్బన్): బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నికై ంది. ఆదివారం స్థానిక రాముల దేవాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ రాష్ట్ర చైర్మన్‌గా ఎన్డీ కృష్ణోజీరావు, వైస్ చైర్మన్‌గా బేతం కృష్ణుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నాగప్ప, మాదన్న, పీ వెంకటేశ్వర్లు, కే వెంకటేశ్వర్లు, శేషిరెడ్డి, ఈరాబాయి ఎన్నికయ్యారు. అలాగే జిల్లా అధ్యక్షులుగా జీ పుల్లంరాజు, ఉపాధ్యక్షులుగా మోహిద్దీన్‌బాషా, కార్యవర్గ సభ్యులుగా ఎస్ఎస్ రావు, పీ వసంతరావు, గఫూర్, వెంకటరమణ, శ్రీనివాసులు, బుజ్జిబాబు, నరసింహులును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ కృష్ణోజీరావు మాట్లాడుతూ.. తమ సంఘం ఆధ్వర్యంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. గత కొంత కాలంగా రాష్ట్ర కార్యవర్గం లేని కారణంగా సంఘం కార్యకలాపాలు స్తబ్దుగా ఉన్నాయని, ఇక నుంచి తరచూ సమావేశాలను నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాలను చేపడతామన్నారు. -
ఆధునిక వైద్యంపై అవగాహన పెంచుకోవాలి
గోస్పాడు: ఆధునిక వైద్య పరిణామాలపై ప్రతి వైద్యుడు మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు అన్నారు. ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ జి.నందకిశోర్ అధ్యక్షతన ఆదివారం నంద్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో రాయలసీమ స్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, తొలి భారత వైద్య పితామహుడు డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి. శ్రీహరి రావు మాట్లాడుతూ ప్రతి వైద్యుడు 5 సంవత్సరాలకు ఒకసారి మెడికల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. వైద్యులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం, రెన్యువల్ చేసుకోవడానికి విజయవాడ కౌన్సిల్ ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేకుండా జిల్లాలలోనే చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఎటువంటి వైద్య అర్హతలు లేని వారు, ప్రాథమిక చికిత్సకు అనుమతి ఉన్నవారు తమ పరిధి దాటి వైద్యం చేసి రోగులకు నష్టం కలిగిస్తే కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ● ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న నూతన పరిణామాలపై వైద్యులు అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. ● రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 100 ఐఎంఏ శాఖల ద్వారా సా మాజిక సేవలను చేపట్టామని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ● సదస్సు నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతీయ వైద్య సదస్సును నిర్వహించడంతో ఈ ప్రాంతంలోని వైద్యులకు ఆధునిక వైద్య పరిణామాలపై అవగాహన పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. ● అనంతరం డాక్టర్లు రవీంద్ర, సురేష్, అశోక్, రాహుల్, రామేశ్వర్ రెడ్డి, మణిదీప్, హర్షవర్ధన్ రెడ్డి, సహదేవుడు వివిధ అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రసాద్, కిశోర్, విజయభాస్కర్ రెడ్డి, భార్గవర్దన్‌రెడ్డి, అనిల్ కుమార్, శ్రీదేవి, హేమలత, పనిల్ కుమార్, రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భార్యను చూడటానికి వస్తూ మృత్యు ఒడికి!
ఆస్పరి: తొమ్మిది నెలల గర్భవతి అయిన భార్యను చూడటానికి బైక్‌పై వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటన మండలంలోని కైరుప్పల గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పరి సీఐ మస్తాన్‌వలి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు.. కై రుప్పల గ్రామానికి చెందిన శ్రీనివాసులు (31) నగరూరు గ్రామానికి చెందిన పూజను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కూతురు సౌమ్య ఉంది. ప్రస్తుతం పూజ తొమ్మిది నెలలు గర్భిణి. శ్రీనివాసులు నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి ఆత్మకూరు నుంచి భార్యను చూడటానికి స్కూటర్‌పై నగరూరు గ్రామానికి బయలు దేరారు. శనివారం రాత్రి మండలంలోని అట్టెకల్లు గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున అట్టెకల్లు గ్రామానికి చెందిన రైతులు పొలాలకు వెళ్తూ ఈ సంఘటనను చూసి బంధువులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లి భార్య, కూతురు, కుటుంబ సభ్యులు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం -
కుందూనదికి పోటెత్తిన వరద
కోవెలకుంట్ల: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కుందూనదికి భారీగా నీటిని విడుదల చేయడంతో కుందూనదికి వరదనీరు పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద చేరింది. నదితీర గ్రామాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇటీవల కుందూకు నీటిని విడుదల చేశారు. కోవెలకుంట్ల, వల్లంపాడు, గుళ్లదూర్తి, కలుగొట్ల సమీపాల్లో కుందూనది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు నది పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. -
ఉల్లినారు అ‘ధర’హో
ప్యాలకుర్తి వద్ద బోరు కింద ఉల్లి నారుమడితుఫాన్ ప్రభావంతో మోస్తరుగా వర్షాలు కురుస్తుండటంతో ఉల్లినారుకు డిమాండ్ పెరిగింది. నాలుగైదు రోజుల కిందటి వరకు ఒక్కో బెడ్డు ఉల్లి నారు రూ.1500 నుంచి రూ.2000 వరకు పలికింది. ప్రస్తుతం ఒక్కో బెడ్డు ఉల్లినారును రూ.2500 నుంచి రూ.3000 వరకు అమ్ముతున్నారు. ఒక ఎకరా ఉల్లి నాటాలంటే సుమారు 6 నుంచి 7 బెడ్ల ఉల్లినారు అవసరమవుతుంది. కోడుమూరు, గూడూరు మండలాల్లో రైతులు వర్షాధారం కింద ఉల్లినాట్లు వేస్తున్నారు. కోడుమూరు, వెంకటగిరి గ్రామాల్లో 1,500పైగా ఎకరాల్లో ఉల్లినాట్లు సాగుతున్నాయి. – కోడుమూరు రూరల్ -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
కర్నూలు(అర్బన్): గృహ నిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ఆ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీ హనుమన్న కోరారు. ఆదివారం స్థానిక సంక్షేమభవన్‌లోని హౌసింగ్ ఈఈ కార్యాలయ ఆవరణలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన హౌసింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమన్న మాట్లాడుతూ,, 20 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐసీ, ఏఈ, ఐటీ మేనేజర్ తదితర కేడర్లలో ఉన్న వారందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. అలాగే ఫీల్డ్‌లో పనిచేసే వారికి ఎఫ్‌టీఏ కూడా ఇవ్వడం లేదని, అనేక మంది ఉద్యోగులకు సొంత గృహాలు కూడా లేవన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు ప్రభుత్వం ఇస్తున్న జీతం ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.16,411లు ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువులకు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో తమకు అవకాశం కల్పించాలని కోరారు. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు హౌసింగ్ విధుల నుంచి తప్పించి హౌసింగ్ వర్క్ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలన్నారు. సీనియారిటీ వర్క్ఇన్స్పెక్టర్లకు ఎంఐసీ, ఏఈలుగా పదోన్నతి కల్పించాలని, డీఈఓలను జూనియర్ అసిస్టెంట్లుగా మార్చాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు నేనావత్ రామునాయక్, నాయకులు ఎండీ యాసిన్, అఫ్రోజ్, ఉస్మాన్, దస్తగిరి, రామేశ్వరి, షాకీరా, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్యామ్యాల’ అనుబంధం!
ఎన్సీటీఈ పీఏఆర్ నోటీస్ల ఇచ్చిన కళాశాలలు 13 అఫ్లియేషన్‌కు ఫీజు కట్టిన కళాశాలలు 43 విత్ డ్రా (రద్దు చేసిన) చేసిన కళాశాలలు 8 కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ అనుబంధ గుర్తింపునకు కొన్ని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు అమ్యామ్యాలు ఇచ్చి అఫ్లియేషన్ ఫీజులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో అఫ్లియేషన్ కమిటీలు, వర్సిటీ అధికారులు అందరూ ఒకటై కళాశాలల యాజమాన్యాల లాబీంగ్కు, అమ్యామ్యాలకు తలొగ్గి బీఈడీ కళాశాలలను తూతూ మంత్రంగా సందర్శించి మమ అనిపించేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వర్సిటీ అధికారులు బీఈడీ కళాశాలలను సందర్శించేందుకు అఫ్లియేషన్ కమిటీలను నియమించారు. ఈ కమిటీ సభ్యులు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు కళాశాలలను సందర్శించనున్నారు. నిబంధనల మేరకు కళాశాలల నిర్వహణ ఉందా లేదా అని పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. దీని ఆధారంగానే వర్సిటీ కళాశాలలకు అఫ్లియేషన్ ఇస్తుంది. అయితే వర్సిటీ పాలనను గాడిలో పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పుకుంటున్న ఆర్యూ ఉన్నతాధికారులు మరి నిబంధనల మేరకు అన్ని వసతులు ఉన్న కళాశాలలకు అఫ్లియేషన్ ఇస్తారో లేదో తేలనుంది. బీఈడీ కళాశాలలు ఎన్సీటీఈ అనుమతి కోసం పొందు పరిచిన అడ్రస్‌లో కాకుండా మరో చోట కళాశాలలను చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని అఫ్లియేషన్ కమిటీలు చూసీచూడనట్లు వ్యవహరిస్తారా గుర్తిస్తారో చూడాలి. అనుమానాలు.. క్లియరెన్స్ పట్టించుకోకుండా వర్సిటీ అధికారులు అన్ని కళాశాలలకు (సుమారు 43) అఫ్లియేషన్ ఫీజు కట్టించుకున్నారు. అయితే ఎన్సీటీఈ కొన్ని కళాశాలలకు ఫర్ఫామెన్స్ అప్రైజల్ రిపోర్ట్ (పీఏఆర్) నోటీస్‌లు ఇవ్వడం, నోటీస్ల వివరణకు సంతృప్తి చెందక ఎన్సీటీఈ నుంచి విత్ డ్రా (కళాశాలల రద్దు) చేసింది. మరి వర్సిటీ అధికారులకు ఈ విషయాలు తెలుసో తెలియదో కానీ అన్ని కళాశాలలకు మాత్రం అఫ్లియేషన్ ఫీజు కట్టించుకున్నారు. మరి అఫ్లియేషన్ కమిటీలు అఫ్లియేషన్ ఫీజు చెల్లించిన అన్ని కళాశాలలను సందర్శిస్తారా లేదంటే ఎన్సీటీఈ క్లియరెన్స్ ఉన్న వాటినే సందర్శిస్తారా అనేది వేచి చూడాల్సిందే! ఇదీ వాస్తవం.. ● మనుగడలో ఉన్న 13 బీఈడీ కళాశాలలకు ఎన్సీటీఈ పర్ఫామెన్స్ అప్రైజల్ రిపోర్ట్ (పీఏఆర్) నోటీస్‌లు ఇచ్చింది. అయితే ఎన్సీటీ క్లియరెన్స్ లేకున్నా ఆర్యూ అధికారులు అఫ్లియేషన్ ఫీజులు కట్టించుకున్నారు. ● ఎన్సీటీఈ 460, 461 ఈసీ మీటింగ్‌లలో ఆర్యూ పరిధిలో మనుగడలో ఉన్న 8 కళాశాలలకు పీఏఆర్ నోటీస్‌లకు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందక 2025 విద్యా సంవత్సరానికి గాను వాటిని విత్‌డ్రా (రద్దు) చేయడం చేసింది. రద్దు చేయబడిన కళాశాలలకు ఎన్సీటీఈ అనుమతి లేకుండానే వర్సిటీ అధికారులు అఫ్లియేషన్ ఫీజులు కట్టించుకున్నారు. అఫ్లియేషన్ కమిటీలు పరిశీలించాల్సినవి .. ● ఎన్సీటీఈ కొన్ని కళాశాలలకు ఇన్‌టేక్ 50 సీట్లకే అనుమతి ఇస్తే వారేమో 100 సీట్లు ఉన్నట్లు చెప్పుకొని అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ● కళాశాల పేరు మీద 50 సీట్లు ఉంటే రూ. 6 లక్షలు, 100 సీట్లు ఉంటే రూ.12 లక్షలు బ్యాంక్‌లలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాలి. ఫిక్స్‌డ్‌డిపాజిట్ల ఒరిజినల్ బాండ్లు ఉన్నాయో లేదో చూడాలి. కొన్ని యాజమాన్యాలు జిరాక్స్ కాపీలను మాత్రమే చూపుతున్నారు. ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉండవు. ఒకవేళ ఉన్నా ఎన్ఓసీ తీసుకొని లోన్ తీసుకుంటున్నారు. బ్యాంక్‌లో చెక్ చేయాలి. ● బిల్డింగ్, లీజ్ బిల్డింగ్ అయితే లీజ్ అగ్రిమెంట్ లైవ్‌లో ఉందా లేదా (కొన్ని కళాశాలల బిల్డింగ్స్ లీజ్ పూర్తి అయినట్లు సమాచారం), స్టాఫ్ జీతాలు ఆన్లైన్ బ్యాంక్ స్టేట్మెంట్, ల్యాబ్, లైబ్రరీ ఉన్నాయా లేదా చూడాల్సి ఉంది. కొన్ని కళాశాలలు మల్టీ పర్పస్ బిల్డింగ్స్‌లో ఉన్నాయి. ● గతంలో బిల్డింగ్ ట్యాక్స్, శానిటరీ, బిల్డింగ్ స్ట్రక్షరల్ అండ్ సౌండ్ ,ఫైర్ సర్టిఫికెట్లు పరిశీలించారు. ఇందులో ఫైర్, శానిటరీ సర్టిఫికెట్లు ఫోర్జరీ సర్టిఫికెట్లు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ● ప్రతి సంవత్సరం అఫ్లియేషన్ కమిటీలో కళాశాలలో ఉన్న డిపీసెన్సీ లిస్ట్ ఇస్తారు. వచ్చే సంవత్సరానికి వాటిని ఫుల్ ఫిల్ చేయాలి. కానీ చాలా కళాశాలల వాటిని పట్టించుకోవు. ● కొన్ని కళాశాలల వారు బిల్డింగ్స్ లేకుండానే కేవలం అడ్మిషన్లు చేసుకొని నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. భవనాలు లేకపోయినా కోర్టు ఆర్డర్ తెచ్చుకొని కొనసాగిస్తున్నారు. కోర్టుకు వెళ్లాలనే ఉచిత సలహాను వర్సిటీలోని అధికారులే ఇస్తారనే ప్రచారం ఉంది. ● ప్రతి కళాశాలకు జియోట్యాగింగ్ ఉండాలి. చాలా కళాశాలలకు ఈ వ్యవస్థ లేదు. 42 కళాశాలలకు అఫ్లియేషన్ ఫీజు కట్టారు ఆర్యూ అఫ్లియేషన్‌కు 42 కళాశాలలకు అఫ్లియేషన్ ఫీజు కట్టారు. ఎన్సీటీఈ నుంచి పీఏఆర్ నోటీస్, విత్ డ్రా లిస్ట్ మాకు వచ్చింది. ఒక వేళ అఫ్లియేషన్ ఫీజు కట్టినా ఎన్సీటీఈ పీఏఆర్ నోటీస్, విత్ డ్రా ఉన్న కళాశాలలకు అఫ్లియేషన్ కమిటీలు విజిట్ చేయవు. – డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు, రిజిస్ట్రార్, ఆర్యూఆర్యూ పరిధిలో ఉన్న బీఈడీ కళాశాలలు 43 బీఈడీ కళాశాలల అఫ్లియేషన్‌కు ఎన్సీటీఈ నిబంధనలు నిలిచేనా? కొన్ని బీఈడీ కళాశాలలకు పీఏఆర్ నోటీస్ ఇచ్చిన ఎన్సీటీఈ మరి కొన్ని కళాశాలలను విత్‌డ్రా చేసిన ఎన్సీటీఈ ఇవేమీ పట్టించుకోకుండా అఫ్లియేషన్ ఫీజు కట్టించుకున్న ఆర్యూ అధికారులు నేటి నుంచి బీఈడీ కళాశాలలను సందర్శించనున్న అఫ్లియేషన్ కమిటీలు -
యూరియా కొరత
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఎక్కడా యూరియా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలకు 2023–24 వరకు యూరియాతో సహా రసాయన ఎరువులు ఇచ్చేవారు. ఆర్బీకేలను గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు నిర్వహిస్తుండటంతో ఎరువుల పంపిణీ సాఫీగా సాగేంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్బీకే పేరును మార్చి కుదించింది. ఉమ్మడి జిల్లాలో 877 ఆర్బీకేలు ఉండగా 188 మూతపడి 689 మాత్రమే ఉన్నాయి. వీటికి యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు ఇవ్వకుండా పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లకు సరఫరాల చేస్తున్నారు. పీఏసీసీఎస్లు, డీసీఎంఎస్‌లు ‘కూటమి’ పార్టీల నేతల చేతుల్లో ఉండటంతో వీటికి సరఫరా అవుతున్న యూరియా పలుకుబడి ఉన్న వారికే వెళ్లిపోతోంది. రైతులకు అందడం లేదు. రసాయన ఎరువుల్లో రాజీయం మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్లకే రసాయన ఎరువులు ఎక్కువ ఇస్తుండమే పెద్ద సమస్యగా మారిందని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఏడీఏ, ఏవోలు చెబుతున్నారు. ఇవి రాజకీయ నేతల చేతుల్లో ఉండటంతో యూరియా కొంతమందికి మాత్రమే అందుతోంది. సమాన్య, మధ్య తరగతి రైతులకు లభించని పరిస్థితి ఏర్పడిందని అధికారులే పేర్కొంటున్నారు. ఆర్బీకేలకు అంతంతమాత్రం కేటాయించిన యూరియా కూడా టీడీపీ నేతలకే వెళ్లిపోతోంది. ఇదీ వాస్తవం మార్క్‌ఫెడ్‌లో 268 టన్నులు, రైతు సేవా కేంద్రాల్లో 185 టన్నులు, రీటైల్ డీలర్ల దగ్గర 693 టన్నులు, హోల్‌సేల్ డీలర్ల దగ్గర 2.5 టన్నులు, సహకార సంఘాలు, డీసీఎంఎస్ దగ్గర 10.12 టన్నుల యూరియా ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ప్రయివేటు డీలర్ల దగ్గర 693 టన్నుల యూరియా ఉందని చెబుతున్నారు. అయితే ఏ డీలరు కూడా తమ దగ్గర యూరియా ఉందని విక్రయిస్తున్న దాఖలాలు లేవు. ఆదివారం వందలాది మంది రైతులు డీలర్ల దగ్గరికి వెళ్లి యూరియా అడగగా.. స్టాక్ లేదని వెనక్కు పంపారు. యూరియా సమస్య వ్యవసాయ శాఖకు చెందిన ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు డివిజన్లలో ఎక్కువగా ఉంది. ఆర్బీకేలకు వెళ్లిన యూరియా గుట్టుచప్పడు కాకుండా ప్రయివేటు డీలర్ల వద్దకు చేరుతున్నట్లు సమాచారం. డీలర్లు బ్లాక్‌లో విక్రయిస్తూరనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క బస్తా కూడా లభించని వైనం ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు డివిజన్లలో సమస్య తీవ్రం -
ఉద్యోగం రాక.. పొలం పనులు చేయలేక..
ఎమ్మిగనూరురూరల్: ఆ యువకుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం ఏమీ రాలేదు. ఊరిలో వ్యవసాయ పనులు చేయలేక మనస్తాపం చెందాడు. బనవాసి వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ వెనక భాగంలో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం గుడేకల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. వీరారెడ్డి, సుశీల కుమారుడైన బోయ ప్రవీణ్(24) ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. తల్లిదండ్రులు ఆదే గ్రామానికి చెందిన తులసితో కుమారుడికి వివాహం జరిపించారు. వీరికి రక్షిత చిన్నారి ఉంది. పొలం పని చేయలేక కొన్ని నెలలుగా ప్రవీణ్ ఇంటి వద్దే ఉండటంతో కొన్ని దురలవాట్లు వచ్చాయి. శనివారం సాయంత్రం తండ్రి వద్ద రూ. 600 డబ్బులు తీసుకొని బయటకు వెళ్లి రాత్రి ఇంటికి రాలేదు. స్నేహితులతో కలసి ఎక్కడికైనా వెళ్లి ఉంటాడనని తల్లిదండ్రులు అనుకున్నారు. ఆదివారం ఉదయం తండ్రి వీరారెడ్డి కుమారుడి విషయంపై స్నేహితుల వద్ద ఆరా తీయగా వారు తాము చూడలేదని చెప్పటంతో ఆందోళన చెందారు. బనవాసి ఫారెస్ట్‌లో బోయ ప్రవీణ్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూసి గొర్రెలు మేపే వారు ఫోన్లో ఫొటో తీశారు. ఈ విషయం రూరల్ పోలీసులకు తెలవడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని దించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కుమారుడి మృతదేహం చూసి తల్లి, భార్య, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు ప్రభుత్వాసుపత్రికి చేరు కున్నారు తండ్రి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య -
తుంగభద్రకు భారీ వరద
కర్నూలు (సిటీ): తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వస్తోంది. కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద ఉన్న టీబీ డ్యాం నుంచి ఆదివారం ఉదయం 90,893 కూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో పెరగడంతో 1.20 లక్షల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. అర్ధరాత్రి తరువాత డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉండడంతో 1.40 లక్షల క్యూసెక్కులకు పెంచనున్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. నదికి భారీగా నీటిని విడుదల చేస్తుండడంతో జల వనరుల శాఖతో పాటు, ఏపీ విపత్తుల విభాగం అధికారులను సైతం తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. నదిలోకి ప్రయాణాలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర నదితో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్యలో ఉన్న వేదావతి నదిలో సైతం కొంత వరద నీరు ప్రవహిస్తోంది. సుంకేసుల నుంచి 91 టీఎంసీల నీరు దిగువకు.. తుంగభద్ర నది ప్రవాహం పెరడంతో కేసీ ఇంజినీర్లు అప్రమత్తం అయ్యారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని ఎప్పటికప్పుడు డీఈఓ ఎన్.ప్రసాద్ రావు సుంకేసుల బ్యారేజీ దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. బ్యారేజీకి రెగ్యులర్ ఏఈఈ లేకపోవడంతో ఇంచార్జీ ఏఈఈ మహేంద్రరెడ్డితో డీఈఈ సమీక్షిస్తూ గేట్ల పనితీరును పరిశీలించారు. ఎగువ నుంచి వచ్చే నీటిని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేసుకోని వచ్చే నీటినంతా దిగువకు విడుదల చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏఈఈకి సూచించారు. సుంకేసుల బ్యారేజీకి సాయంత్రం 6 గంటలకు 50 వేల క్యుసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 52,682 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్‌కు 1,847 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రాత్రికి సుంకేసుల బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరగనుండడంతో ఇంజినీర్లు అప్రమత్తమయ్యారు. టీబీ డ్యామ్ నుంచి 1.20 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల నేడు 1.40 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం -
నిద్రలేమి, మానసిక ఒత్తిడి కారణం
కర్నూలు(హాస్పిటల్): గుండెపోటు అంటే ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయస్సు వారికీ వస్తోంది. ఇటీవల కాలంలో పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో యువత గుండెపోటుతో మృతి చెందుతున్నారు. జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన ఆహారపు అలవాట్లు, దురవాట్లే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో 5 శాతం యువత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీకి ఇటీవల గుండెపోటుతో చికిత్సకు వచ్చేవారి సంఖ్య ఎక్కువైంది. ఇందులో కొందరు ఆసుపత్రికి వచ్చేలోపు, మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందుతున్నారు. ఇంకొందరు కార్డియాలజీ విభాగానికి ఆపరేషన్‌కు వెళ్తున్నారు. ఇలా కార్డియాలజీ విభాగానికి గత సంవత్సరం రోజుల్లో ఓపీకి 22,325 మంది గుండెజబ్బులతో చికిత్సకు రాగా 4,281 మంది విభాగంలో చేరారు. వీరిలో 1,235 మందికి యాంజియోగ్రామ్, 433 మందికి యాంజియోప్లాస్టీ(స్టెంట్) వేశారు. ఇందులో 125 మంది 25 నుంచి 40 ఏళ్ల వయస్సు వారే ఉండటం గమనార్హం. ఇదే పరిస్థితి నగరంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నెలకొంది. ఆయా ఆసుపత్రులకు ఒక్కో దానికి ప్రతిరోజూ రోజుకు సగటున 10 మంది గుండెజబ్బులతో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 10 శాతం మంది ప్రజలు గుండెజబ్బులతో బాధపడుతున్నట్లు గతంలో నిర్వహించిన ఓ సర్వేలో నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తున్న వారిలో 5 శాతం మంది యువతే ఉంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. మారిన ఆహారపు అలవాట్లు ప్రతి ఒక్కరికీ పోషకాహారం తీసుకుని మరింత ఆరోగ్యంగా ఉండాలన్న ఉత్సుకత అధికమైంది. ఈ క్రమంలో తీసుకోవాల్సిన దానికన్నా అధికంగా ఆహారాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో మాంసాహార సేవనం అధికమైంది. డ్రైఫ్రూట్స్ వాడకం పెంచేశారు. అందుకుతగ్గ వ్యాయామం చేయడం లేదు. దీంతో శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతోంది. రక్తనాళాల్లో ఎక్కడికక్కడ బ్లాక్‌లు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉన్న ఫలంగా గుండెపోటు, పక్షవాతం కేసులు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు కార్పొరేట్ సంస్కృతితో ఇతర దేశాలు, రాష్ట్రాల్లో లభించే ఆహారాన్ని సైతం ఇక్కడి వారు ఎక్కువ తీసుకుంటున్నారు. సాధారణంగా ఏ ప్రాంతం వాతావరణానికి తగ్గట్లు అక్కడి ప్రజలు ఆహారం తీసుకుంటారు. ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.. అక్కడి వారు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటారు. దక్షిణాదిలో వాతావరణం వేడిగా ఉంటుంది పెద్దలు చెప్పిన ఆహార నియమాలను పాటించాలి. అయితే ప్రాంతీయ భేదం లేకుండా అన్ని ఆహార పదార్థాలను ప్రజలు రుచి చూస్తున్నారు. దీనివల్లే జీవన విధానంలో మార్పులు వచ్చి ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పాటు ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు కావడంతో అధికబరువున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ కారణంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి అనేక అనారోగ్య సమస్యలు పలకరిస్తున్నాయి. అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటివి కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు రావడానికి ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది యువకుల్లోనూ గుండెపోటు వస్తోంది. ఆసుపత్రికి వచ్చే వారిలో 30 శాతానికి పైగా వీరుంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి, అనియత జీవనశైలి, నిద్రలేమి, పొగతాగడం, మద్యంసేవనం అలవాట్లు చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణం. కొందరు యువత శారీరక దారుఢ్యం కోసం అధికంగా వర్కవుట్స్ చేయడం కూడా గుండైపె ఒత్తిడి పెంచుతోంది. – డాక్టర్ బి.కిరణ్‌కుమార్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాలజీ విభాగం, జీజీహెచ్, కర్నూలు -
అదును దాటుతోంది.. ఆందోళన మొలకెత్తుతోంది!
కమ్ముకుంటున్న మేఘాలు వర్షించడం లేదు. సాగుకు సిద్ధం చేసిన భూములు పదునెక్కడం లేదు. రైతుల్లో ఆందోళన మొలకెత్తుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వానల్లేక పోవడంతో వ్యవసాయం మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే విత్తనం, నాట్లు పూర్తయి సేద్యం పనులు ఊపందుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 30 శాతం కూడా సాగు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పత్తి, మిరప, మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతులు నాట్లు వేసి ఎదురు చూస్తున్నారు. కొందరు వరుణుడిపై భారం వేసి చిన్నపాటి వర్షాలకే నాట్లు వేస్తున్నారు. – ఉయ్యాలవాడ -
ఉప ప్రధానార్చకుడి ఆత్మహత్యపై విచారణ
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పూజన్నస్వామి ఆత్మహత్యపై ఆదివారం రాత్రి శ్రీశైలం ఈఓ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ముందుగా ఆయన పూజన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పూజన్న ఆత్మహత్యపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాలయ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ విజయరాజును, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామిని, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామిలతో పాటు అర్చకులందరినీ పిలిచి విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు బీపీ, షూగర్ ఉండడంతో సమాయానికి మందులు తీసుకోక పోవడంతో పూజన్నస్వామి మృతి చెందారన్నారు. దేవాలయంలో పని చేస్తున్న ప్రతి అధికారి ఇచ్చిన సమాచారాన్ని నివేదిక రూపంలో రాష్ట్ర కమిషనర్‌కు పంపిస్తామన్నారు. దేవాలయంలో అర్చకులు వర్గాలుగా విడిపోయారా, పూజల్లో ఏమైనా మార్పులు జరిగాయా, డిప్యూటీ కమిషనర్ ఏమైనా ఇబ్బందులకు గురి చేశాడా అన్న విషయాలపై కూడా విచారణ చేపట్టామన్నారు.డిపార్టుమెంటల్ పరీక్షలు ప్రారంభం కర్నూలు(సెంట్రల్): ఉద్యోగుల పదోన్నతుల నిమిత్తం నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు ఆదివారం కర్నూలులోని ఆయాన్ డిటల్ కేంద్రంలో ప్రారంభం అయ్యాయి. షిఫ్టు–1లో 296 మందికిగాను 249 హాజరవ్వగా 47 మంది గైర్హాజరయ్యారు. షిఫ్టు–2లో 221మందికిగాను 187 హాజరవ్వగా 34 మంది పరీక్షలు రాయలేకపోయారు. పరీక్ష కేంద్రాన్ని డిపార్టుమెంటల్ పరీక్షల సమన్వయాధికారి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పరిశీలించారు. యువతికి వజ్రం లభ్యం తుగ్గలి: టమాట పొలంలో కలుపు తీస్తుండగా ఆదివారం మండలంలోని దిగువచింతలకొండకు చెందిన ఓ యువతికి వజ్రం లభ్యమైనట్లు సమాచారం. వజ్రాల వ్యాపారులు వజ్రం కొనుగోలుకు బేరం సాగిస్తుతున్నట్లు తెలిసింది. శ్రీగిరిలో భక్తుల సందడి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం తోలి ఆదివారాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఇసాక్‌బాషా నంద్యాల: ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ ఇసాక్బాషాను నియమిస్తున్నట్లు ఏపీ శాసన వ్యవస్థ జనరల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ఆదివారం ప్రకటించారు. స్పీకర్, శాసన మండలి చైర్మన్లు 2025–26 సంవత్సరానికి శాసన సభ, శాసన మండలి సంయుక్త కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఇసాక్బాషాను నియమించారు. -
కక్షసాధింపు భరించలేకపోతున్నా.. కర్నూలులో అర్చకుడి ఆత్మహత్య
సాక్షి, మంత్రాలయం: ఆలయ ఈవో విజయరాజు చులకన భావం, ప్రధాన అర్చకుడు జె.ఈరప్ప, వేద పండిట్ మోహన్‌శర్మ పెత్తనం భరించలేక ఉప ప్రధాన అర్చకుడు పూజన్న స్వామి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో సంచలనంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉరుకుందకు చెందిన పూజన్న స్వామి 2002లో శ్రీ ఈరన్న స్వామి ఆలయంలో శాశ్వత అర్చకుడిగా నియమితులయ్యారు. వంశపారంపర్య హక్కుతో ఆలయంలో సేవలు అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఉప ప్రధాన అర్చకుడిగా పదోన్నతి పొందారు. వీరి పూర్వీకుల పొలాల్లోనే ఈరన్న స్వామి కొలువుదీరడం గమనార్హం. మూడేళ్ల క్రితం రూ.50 లక్షల విలువైన 4 గదుల సముదాయాన్ని కూడా పూజన్న ఆలయానికి విరాళంగా ఇచ్చారు. శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రించిన పూజన్న స్వామి, ఆదివారం వేకువజామున తన ఇంటి పైగదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఎంతకూ ఆయన లేవకపోవడంతో, కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూడడంతో అప్పటికే ఆయన మృతిచెందినట్టు గుర్తించారు.మృతుడు రాసిన సూసైడ్ నోట్లో ఆలయ ఈవో విజయరాజుపై, ప్రధాన అర్చకుడు జె.ఈరప్ప, వేద పండిట్ మోహన్శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన అర్చకుడు, వేద పండిట్ కలిసి ఆలయంలోని ఇతర అర్చకులపై అధికారం చెలాయిస్తూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వంశపారంపర్య అర్చకులమన్న గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భాలయంలో సీసీ కెమెరాలు పెట్టి అర్చకులను దురుద్దేశంతో చూస్తున్నారని వాపోయారు. దేవాలయంలో అనేక వాస్తవ విరుద్ధాలు జరుగుతున్నా ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. ఈవో వారిద్దరిని మద్దతు ఇస్తుండడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మృతుడికి భార్య జయమ్మ, కుమార్తెలు శ్రావణి, శ్రీలత, కుమారుడు వీరయోగీంద్ర మణికంఠ ఉన్నారు.నేను చులకనగా చూడలేదు: ఆలయ ఈవో విజయరాజునేను అర్చకులను ఎవ్వరినీ చులకనగా చూడలేదు. శాఖాపరంగా ఆలయంలో తీసుకోవాల్సిన సంస్థాగత మార్పులు మాత్రమే చేశాను. సీసీ కెమెరాలు విషయం శాఖాపరంగా జరిగింది. పూజన్న స్వామి పట్ల ఏనాడూ నేను దురుసుగా ప్రవర్తించలేదు. ఆయన సూసైడ్ నోట్లో ఎందుకు అలా రాశారో అర్థం కావడం లేదు. ఎవ్వరిపైనా నాకు ప్రత్యేక ద్వేషం లేదు. -
ఘనంగా స్నాతకోత్సవం
కర్నూలు సిటీ: స్థానిక జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో నాల్గొవ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య హెచ్.సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2021–25 బ్యాచ్ బీటెక్, 2023–25 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థిని, విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను వీసీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నప్పటికీ తల్లిదండ్రుల త్యాగాలను విస్మరించకూడదన్నారు. బీటెక్‌లో ఏ బ్రాంచ్‌లో చదివినా విషయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే ఏదైనా సాధిస్తారని సూచించారు. కృత్రిమ మేధా కన్నా మానవ మేధనే గొప్పదన్నారు. క్వాంటం కంప్యూటరింగ్ రాబోయే రోజుల్లో అన్ని బ్రాంచ్‌ల్లో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆసియాలోనే మొట్టమొదటిసారి అమరావతిలో నెలకొల్పబోతుందన్నారు. జేఎన్టీయూ పరిధిలో జి.పుల్లయ్య కాలేజీ అత్యుత్తమ విద్యను అందిస్తుందన్నారు. రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి.పుల్లయ్య మాట్లాడుతూ.. జీవితానికి పునాదులు పడే కాలేజీ దశలో శ్రద్ధగా చదువు కోవాలన్నారు. అనంతరం రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్ మాట్లాడారు. కాలేజీలో వివిధ బ్రాంచ్‌ల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. కార్యక్రమంలో ఆ కాలేజీలోని అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కూలీల శ్రమను దోచుకోవడం దారుణం
కొలిమిగుండ్ల: ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల శ్రమను దోచుకోవడం దారుణమని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఫీల్డ్ అసిస్టెంట్ తమ సంతకాన్ని ఫోర్జరీ చేశారని బి ఉప్పులూరు సర్పంచ్ ఈశ్వరయ్య సభలో ప్రస్తావించగా..జెడ్పీచైర్మన్ స్పందించారు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై విచారణ చేసి, కేసు నమోదు చేయాలని ఏపీఓకు సూచించారు. రబీ సీజన్లో కొలిమిగుండ్లను కరువు మండలంగా గుర్తించినా రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంపై జెడ్పీచైర్మన్ ఆరాతీశారు. చాలా మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు రూ.8 వేలు, రూ.9వేలు మాత్రమే జమ అయ్యాయని కొందరు చెప్పగా.. తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఎంఈఓ అనడంతో జెడ్పీచైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సూచించారు. ముందస్తు ప్రణాళిక లేకనే నీటి సమస్య వస్తోందని, తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లూఎస్ ఏఈని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో యూరియా,మందులు రావడం లేదని, తిమ్మనాయినపేట వద్ద దేవదాయ మాన్యం భూముల్లో మట్టిని తవ్వుకొని తీసుకెళ్తున్నారని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా సరిహద్దు నుంచి 544–డీ జాతీయ రహదారి ఎలైన్మెంట్ విషయంలో రెండు చోట్ల మార్పులు చేయాల్సి ఉందని కోరారు. సభ్యులతో తీర్మాణం చేసి ఎన్‌హెచ్ అధికారులకు పంపాలని ఎంపీడీఓ ప్రసాదరెడ్డికి జెడ్పీ చైర్మన్ సూచించారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి -
స్పెషల్ డ్రైవ్‌లో 15 వాహనాలు సీజ్
కర్నూలు: మైనర్ డ్రైవింగ్‌పై నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కళాశాల వదిలే సమయంలో ఒక్కొక్క వాహనంపై ఇద్దరు ముగ్గురు మైనర్లు వెళ్తున్నట్లు గమనించి శనివారం ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ముఖ్య కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాజ్‌విహార్ సర్కిల్లో కళాశాలల నుంచి బైకులపై ఇళ్లకు వెళ్తూ 15 మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో ఎక్కువ మంది 10వ తరగతి, ఇంటర్ చదువుతున్నవారే కావడం గమనార్హం. వీళ్లు నడుపుతున్న బైకుల బరువు కూడా లేని విద్యార్థులను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. వాహనాలతో పాటు మైనర్లను ట్రాఫిక్ స్టేషన్‌కు తీసుకెళ్లి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. స్వాతంత్య్ర వేడుకలకు చదువుల సుజాతమ్మ ● ప్రత్యేక అతిథుల్లో ఒకరుగా ఢిల్లీకి ఆహ్వానం కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామ సర్పంచ్ చదువుల సుజాతమ్మకు అరుదైన అవకాశం లభించింది. ఢిల్లీలో ఆగస్టు 15న నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని ఆమెకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆహ్వానం అందింది. పాలకొలను గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పథకాలను సంపూర్ణంగా అమలు చేయడం పట్ల ఆ గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎంపికై ంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ సుజాతమ్మతో పాటు ఆమె భర్త చదువుల నాగ సుధాకర్‌రెడ్డికి కూడా ఢిల్లీ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం లభించింది. ఈ మేరకు రాష్ట్ర పీఆర్అండ్ఆర్డీ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో 10 మంది సర్పంచులను ఎంపిక చేయగా, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పాలకొలను సర్పంచు సుజాతమ్మ ఒకరు కావడం విశేషం. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీరిస్తారన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం 1100 నెంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్యూలైన్ల ఏర్పాటు పరిశీలన మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలో వచ్చే నెల 8 నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధన వేడుకలు జరగనున్నాయి. లక్షలాదిగా భక్తులు ఆరాధన ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా నూతనంగా క్యూలైన్ల ఏర్పాటు చేపట్టారు. నేరుగా శ్రీమఠంలోకి వెళ్లడంతో ప్రాంగణంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటం సమస్యగా ఉంది. సమస్యను అధిగమించేందుకు శ్రీమఠం ప్రాకారం పైభాగంలో ప్రత్యేక క్యూలైన్లు నెలకొల్పారు. శనివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు క్యూలైన్ల ఏర్పాటును పరిశీలించారు. క్యూలైన్ల ఏర్పాటుతో భక్తుల దర్శన విధానాలను తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దారులు ఏర్పాటు చేయాలని శ్రీమఠం అధికారులకు పీఠాధిపతి సూచించారు. పర్యవేక్షణలో శ్రీమఠం ఈఈ సురేష్ కోనాపూర్, ఇతర సిబ్బంది ఉన్నారు. బానకచెర్ల నుంచి నీరు విడుదల పాములపాడు: బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి 30,000 క్యూసెక్కుల నీటిని తెలుగుగంగకాల్వకు, కేసీసీ సెస్కేప్ చానల్‌కు, జీఎన్ఎస్ఎస్కు విడుదల చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర శనివారం తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నుంచి 30వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉందన్నారు. ఆ నీటినంతా దిగువ కాలువలకు విడుదల చేస్తున్నామన్నారు. -
కొండ ముచ్చుల దాడి
ప్యాపిలి: జలదుర్గం గ్రామంలో శనివారం కొండముచ్చులు గ్రామస్తులపై దాడి చేశాయి. గత కొద్ది రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో కొండముచ్చులను వదిలివెళ్లారు. అప్పటి నుంచి గ్రామంలో కొండముచ్చులు స్వైరవిహారం చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం గ్రామానికి చెందిన రంగనాయకులు, మల్లేశ్వరయ్య, ఓబులేసు, కంబయ్య, బాషా తదితరులపై దాడి చేసి గాయపర్చాయి. గాయపడిన వారిని స్థానిక పీహెచ్సీలో చికిత్స అందించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కొండముచ్చులను బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జిల్లాలో హాస్టళ్ల వివరాలు
శిథిలావస్థలో ఉన్న ఆలూరు ఎస్సీ బాలికల హాస్టల్ వంట గదిలద్దగిరి బీసీ హాస్టల్లో పెట్టెల మధ్య నిద్రిస్తున్న విద్యార్థులుకోడుమూరు మండలం అమడగుంట్ల బీసీ బాలుర హాస్టల్‌ను కూడా ‘సాక్షి’ బృందం పరిశీలించింది. పొలాలను అనుకొని ఉన్న ఈ హాస్టల్‌కు కనీసం కాంపౌండ్ వాల్ కూడా లేదు. క్రిమి కీటకాలు, పాములు, తేళ్లు సంచరించే ప్రమాదం పొంచి ఉంది. ఈ హాస్టల్లో 107 మంది విద్యార్థులకు 10 స్నానపు గదులు, 10 టాయ్లెట్లు ఉండగా వాటికి నీటి సౌకర్యం లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. విద్యార్థులందరూ మల మూత్రాలను విసర్జించేందుకు పక్కనే పొలాల్లోకి వెళ్తున్నారు. రాత్రి సమయంలో హాస్టల్ పరిసరాల్లో చిమ్మచీకటిగా ఉంది. విద్యార్థులు భోజనం చేసే స్థలం అంతా బండపరుపు లేక వర్షంతో బురదమయంగా మారింది. కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా మరాయి. మెనూ సంగతి దేవుడెరుగు, కనీసం మౌలిక వసతులను కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందుల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. నీటి సౌకర్యం లేక వసతి గృహాల్లో స్నానపు, మరుగుదొడ్ల గదులు, అలంకార ప్రాయంగా మారాయి. అనేక చోట్ల ఫ్యాన్లు పనిచేయడం లేదు. ప్రహరీలు లేకపోవడంతో విద్యార్థులు భోజనాలు చేసే ప్రాంతంలో కుక్కలు, పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. పలు వసతి గృహాల్లో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లోనే చిన్నారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వసతులు పొందుతున్నారు. అటకెక్కిన నిధులు! రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పెన్సిబులిటీ కింద జిల్లాలోని 24 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అనేక రకాల పనులను చేపట్టింది. ఈ పనులను పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎస్డబ్ల్యూఐడీసీ శాఖలకు అప్పగించింది. ఒక్కో శాఖ ఆధ్వర్యంలో 8 హాస్టళ్లలో పనులు ప్రారంభించారు. అయితే ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు దాదాపు 80 శాతం వరకు పూర్తి అయినా, నేటికి నయాపైసా నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా పనులను నిలిపివేసినట్లు, మరి కొన్ని హాస్టళ్లలో పనుల్లో జాప్యం నెలకొన్నట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ కరువు జిల్లాలోని ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లో పర్యవేక్షణ కరువైంది. ముఖ్యంగా వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నందున ఒక్కో వసతి గృహ సంక్షేమాధికారి వన్ ప్లస్ వన్ ఆఫర్లా ఇన్చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ శాఖకు సంబంధించి మొత్తం ( ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ కలిపి ) 47 వసతి గృహాలు ఉండగా, 18 వసతి గృహాలు ఇన్చార్జ్ హెచ్డబ్ల్యూల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. బాలిక వసతి గృహాల్లో అసౌకర్యాలు జిల్లాలోని అనేక బాలికల వసతి గృహాల్లోను సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కలెక్టరేట్‌కు సమీపంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాల సముదాయంలో కనీసం విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవు. బాలికలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మూడు వసతి గృహాల్లో మొత్తం 500 మందికి పైగా విద్యార్థినులు వసతి పొందుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన రెండు వసతి గృహాల్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నా, బీసీ బాలికల వసతి గృహానికి మినరల్ వాటర్ ప్లాంట్ లేదు. పైగా ఈ వసతి గృహంలో టాయ్లెట్ల సమస్య అధికంగా ఉంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం కూడా ఎక్కడికక్కడ పెచ్చులూడి పడుతోంది. డైట్ చార్జీలను పెంచిన మాజీ సీఎం వైఎస్ జగన్ పెరిగిన నిత్యావసర సరుకులకు ధరలకు అనుగుణంగా సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్ చార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వసతి గృహ సంక్షేమాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో జీఓ నంబర్: 8, తేదీ 20/02/2023 మేరకు డైట్ చార్జీలను పెంచారని వారు గుర్తు చేస్తున్నారు. 3, 4 తరగతుల విద్యార్థులకు గతంలో నెలకు రూ.1000 ఉండగా, వైఎస్ జగన్ ఈ మొత్తాన్ని రూ.1,150కి పెంచారని, 5 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ.1,250 నుంచి రూ.1,400లకు పెంచారని, అలాగే ఇంటర్మీడియట్ ఆపై తరగతుల వారికి రూ.1,400 నుంచి రూ.1,600లకు పెంచారిన చెబుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచకుండా పాత రేట్ల ప్రకారమే మెనూను అమలు చేయాలని చెప్పడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు. శాఖ మొత్తం హాస్టళ్లు విద్యార్థుల (ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్) సంఖ్య బీసీ సంక్షేమం 47 8063 సాంఘిక సంక్షేమం 37 7214 గిరిజన సంక్షేమం 07 2174 (ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు) -
గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
పాణ్యం: గురకుల పాఠశాలలో సౌకర్యాలు కల్పించకుండా గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మండిపడ్డారు. పాణ్యం మండలం నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజిన గురుకుల(బాలుర)పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ అక్కడికి వెళ్లారు. ప్రిన్సిపాల్ క్రిస్ణానాయక్తో మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. పాఠశాలలో 228 మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి సురక్షిత మంచినీరు అందించాల్సిన ఆర్ఓ ప్లాంట్ మూలనపడిందన్నారు. నిధులు లేక మరమ్మతులు చేయలేదన్నారు. డైనింగ్‌హాల్ లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట బురదలో నిలబడి భోజనం చేయాల్సి వస్తోందన్నారు. వంట గదిలో ఒక్కరు కూడా పర్మినెంట్ వర్కర్ లేరని, ఇతర హోటల్లో వంట చేయిస్తున్నారన్నారు. పాఠశాలలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరని, మాత్రలు కూడా లేవన్నారు. సౌకర్యాలు కల్పించకుండా గిరిజన విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగామాడుతోందని విమర్శించారు. ఇదిలా ఉండగా పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్బీ వెంకటాద్రి, ఎన్ఎస్యూఐ ప్రతాప్, ఎఐవైఎల్ చిరంజీవి, ఎపీఎస్ఎఫ్ సురేంద్ర, ఆర్విఎఫ్ రవీంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా -
మాజీ సైనికులకు సన్మానం
కర్నూలు(అర్బన్): కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులను స్మరించుకుంటూ మాజీ సైనికులను సన్మానించారు. శనివారం స్థానిక సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్ఆర్ రత్నరూత్ మాట్లాడుతూ.. 1999 కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నేపథ్యంలో 26వ వార్షికోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటున్నామన్నారు. జమ్ము కాశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి శత్రు సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించినప్పుడు మే 1999లో కార్గిల్ యుద్ధం ప్రారంభమైందన్నారు. అప్పట్లో ఈ యుద్ధాన్ని ఆపరేషన్ విజయ్‌గా ప్రకటించారన్నారు. ఈ యుద్ధంలో అమరులైన వీర సైనికుల జ్ఞాపకార్థం ఆపరేషన్ విజయ్‌లో పాల్గొన్న మాజీ సైనికులను శాలువాలు, మొమెంటోలతో సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షకురాలు మహేశ్వరమ్మ, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య, కార్యదర్శి ఎం సుధాకర్, కోశాధికారి నజీర్ అహమ్మద్, రాముడు, సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
గాయపడినా గప్‌చుప్!
కర్నూలుకు కూత వేటు దూరంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో ఈ నెల 23వ తేదిన రాత్రి చరణ్‌తేజ (8వ తరగతి) అనే విద్యార్థికి ఫ్యాన్ రెక్క తగిలి తలకు గాయమైంది. వెంటనే హాస్టల్లో పనిచేస్తున్న వర్కరు వసతి గృహ సంక్షేమాధికారికి సమాచారం అందించి ఆమె సూచన మేరకు విద్యార్థి చరణ్‌తేజను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్సను చేయించారు. ఫ్యాన్ రెక్క తగలడంతో విద్యార్థి తలకు నాలుగు కుట్లు పడ్డాయి. అయితే విద్యార్థి తలకు తగిలిన గాయం గురించి సంబంధిత అధికారులు ఎవరు వాకబు చేయకపోవడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు జిల్లాలోని పలు వసతి గృహాల్లో జరుగుతున్నా, ఎక్కడికక్కడ గప్‌చుప్‌గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
4.25 కిలోల బరువుతో మగ శిశువు జననం
కోడుమూరు రూరల్: కోడుమూరు ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ సాధారణ కాన్పులో 4.25 కిలోల బరువు ఉన్న పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. గోనెగండ్ల మండలం వెముగోడు గ్రామానికి చెందిన భారతి, నల్లన్న దంపతులకు ఇది వరకే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మూడో కాన్పు నిమిత్తం శనివారం తెల్లవారుజామున కోడుమూరు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరీక్షలు చేసిన గైనకాలజిస్ట్ పుష్పలత ఆ మహిళకు సాధారణ కాన్పు చేయగా 4.25 కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు. అప్పుడే శిశువులు మూడున్నర కిలోల వరకు బరువు ఉండటం సహజం కానీ.. ఈ శిశువు ఏకంగా 4.25 కిలోల బరువు ఉండడం విశేషమని వైద్యాధికారి డాక్టర్ నాగరాజు అన్నారు. ఉపాధ్యాయుల ఆందోళన కర్నూలు (సిటీ): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నవీన్ పాటి, జిల్లా ఉపాధ్యక్షులు హేమంత్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. గత నెలలో విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు అయిన వారికి ఇంతవరకు వేతనాలు రాలేదన్నారు. తక్షణమే టీచర్ల పొజిషన్ ఐడీలు ఇచ్చి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గిస్తామని చెప్పారని, కానీ ఆ భారం మరింత పెంచేలా ప్రస్తుత యాప్ ఉందని, వెంటనే ఆ యాప్‌లన్నింటినీ రద్దు చేసి ఉపాధ్యాయులను కేవలం బోధనలకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించుకోకుండా ఆ పనులు చేసేందుకు కావలసిన సిబ్బందిని విద్యాశాఖ నియామకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఇబ్రహీం, బాబు, సర్వేశ్వర రెడ్డి, మనుమంతు, కిషోర్, షఫీవుల్లా, కాంతారావు, రాముడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
గుంటికంటి రంగస్వామికి జలాభిషేకం
ఎమ్మిగనూరు పురపాలక సంఘ పరిధిలోని వెంకటాపురంలో స్వయంభూగా వెలసిన గుంటి రంగస్వామికి జలాభిషేకం చేశారు. ఏటా శ్రావణ మాసంలో గుంటి రంగస్వామికి తుంగా జలాలతో అభిషేక ం చేయడం ఆనవాయతీగా వస్తోంది. ఈ మేరకు శ్రావణమాసం మొదటి శనివారం వెయ్యి మందికిపైగా 25 కిలో మీటర్ల దూరంలోని తుంగభద్ర నదికి పాదయాత్రగా వెళ్లారు. అక్కడ పూజలు చేసి తుంగా జలాలతో గోవింద నామస్మరణ చేసుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలో గ్రామంలో ఆలయం వరకు నేలపై పడుకున్న మహిళా భక్తులపై నుంచి తుంగా జలాలు తీసుకొచ్చిన వారు మంగళవాయిద్యాలతో నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వయంభూ విగ్రహ రూపంలో ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజతో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బజారి, గ్రామ పెద్దలు నీలకంఠారెడ్డి, మేసీ్త్ర నాగన్న, పాండురంగ, ఈరన్న, ఆనంద్‌తో పాటు పెద్దలు పాల్గొన్నారు. – ఎమ్మిగనూరు -
గులాబీ రంగు పురుగు ఉద్ధృతిని నివారించాలి
నంద్యాల(అర్బన్): పత్తి పంటను ఆశించిన గులాబీరంగు పురుగు ఉద్ధృతిని నివారించాలని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్ తెలిపారు. ఎకరాకు నాలుగు లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేయడమే కాకుండా క్లోరిపైరీపాస్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. స్థానిక కార్యాలయంలో శనివారం శిక్షణ, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్‌లో పంటల సాగు, ప్రస్తుతం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో చర్చించారు. అనంతరం ఏడీఆర్ జాన్సన్ మాట్లాడుతూ.. ప్రస్తు తం కురుస్తున్న వర్షాలు పంటలు తీవ్రంగా నష్టపరిచే అవకాశం ఉందని, పొలాల్లో నీరు లేకుండా సాఫీగా వెళ్లేలా చూడాలన్నారు. కార్యక్రమంలో శాస్త్ర వేత్తలు డాక్టర్ అశోక్‌కుమార్, శివరామకృష్ణ, వెంకటరమణ, డీడీఏ మద్దిలేటి, కర్నూలు ఏడీఏ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో ఇద్దరు మాజీ సైనికుల మృతి
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు మాజీ సైనికులు అనారోగ్యంతో మృతి చెందినట్లు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నంద్యాల ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటు ఎస్బీఐలో ఉద్యోగం చేస్తున్న శశికుమార్ (55) గుండెపోటుతో మృతి చెందారన్నారు. ఈయన మద్రాసు 28 రెజిమెంట్‌లో నాయక్ ర్యాంక్‌లో 20 సంవత్సరాలు విధులు నిర్వహించారన్నారు. అలాగే ... కర్నూలు మాధవీనగర్ మహావీర్ కాలనీలో నివాసం ఉంటున్న నాయక్ వి. దేవదానం కూడా అనారోగ్యంతో మృతి చెందారన్నారు. ఈయన మద్రాస్ రెజిమెంట్ 5లో 17 ఏళ్లు విధులు నిర్వహించారన్నారు. మృతి చెందిన ఇద్దరు మాజీ సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. వీరి కుటుంబ సభ్యులకు సంఘం ఎల్లప్పడు అండగా ఉంటుందని తెలిపారు. -
చెరువులకు నీరిచ్చే పనులన్నీ అప్పుడే పూర్తి చేశాం
పత్తికొండ: నియోజకవర్గంలో 64 చెరువులకు నీరందించే పనులన్నీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. బాబు షూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం పత్తికొండ పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఆమె పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రిందట క్రిష్ణగిరి మండలంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎవరో ఇచ్చిన స్క్రిప్టును చెదువుతూ అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. చెరువులకు నీరు అందించే పనులు ఎప్పుడు పూర్తయ్యాయో మైనర్ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకోవాలని మంత్రికి సూచించారు. మద్దికెర–బురుజుల రహదారి టెండరు, అగ్రిమెంట్ పూర్తయి పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వలేదని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో అనే హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారన్నారు. కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ నాగరత్నమ్మ, రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, సర్పంచ్ కొమ్ముదీపిక, ఉపసర్పంచ్ పల్లె కళావతి, ఎంపీపీ నారాయణదాస్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌నాయక్, వైఎస్సార్సీపీ నాయకులు కారం నాగరా జు, బాబుల్‌రెడ్డి, బనగాని శ్రీనివాసులు, వాసుదేవనాయుడు, రవిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పినవన్నీ అబద్ధాలే పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి -
‘సాక్షి’పై మరో అక్రమ కేసు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘సాక్షి’పై ప్రభుత్వ కక్షసాధింపు, పోలీసుల అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే అక్రమ కేసులు నమోదుచేస్తామని పత్రికలను, మీడియాను బెదిరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ‘రాయలసీమలో అనకొండ ఐపీఎస్’ పేరుతో ఓ ఐపీఎస్‌పై ‘సాక్షి’ శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. అదే రోజు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశం నిర్వహించి తనపైనే కథనం రాశారని.. తాను నిజాయితీపరుడినని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం కర్నూలు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’పై సెక్షన్ 132, 308 (3), 353 (1)(బి), 356 (3), రెడ్‌విత్ 61(2) బీఎన్ఎస్ ప్రకారం అక్రమ కేసు నమోదుచేశారు. డీఐజీ సీసీ రత్నప్రకాశ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీఐ శేషయ్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్లో ఏ–1గా సాక్షి అమరావతి బ్యూరో, ఏ2గా సాక్షి మేనేజ్మెంట్, పబ్లిషర్ పేరును చేర్చినట్లు తెలుస్తోంది. డీఐజీ సీసీ ఫిర్యాదు చేయడమేంటి? ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంలో ఓ ఐపీఎస్ అని మినహా అందులో పేరులేదు. డీఐజీ కోయ ప్రవీణ్ తనపైనే వార్త రాశారని విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. డీఐజీ చెప్పినట్లు ఆయనపైనే వార్త రాస్తే, ఆయన పరువుకు నష్టం వాటిల్లిందని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ, డీఐజీ సీసీ రత్నప్రకాశ్ బాధితుడు ఎలా అవుతారు? అతనెలా ఫిర్యాదు చేస్తారు? అతని ఫిర్యాదు మేరకు కేసు ఎలా నమోదుచేస్తారు? అనేది పోలీసులే చెప్పాలి. నిజానికి.. ప్రభుత్వం, అధికారులు చేసే మంచిని పత్రికలు ఎలా ప్రచురిస్తాయో, తప్పొప్పులు, లోటుపాట్లు, అవినీతి ఆరోపణలు ఉన్నా అలాగే ప్రచురిస్తాయి. ఇది పత్రికలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇదే భావప్రకటనా స్వేచ్ఛ. దీనిపై బాధితులకు అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. గతంలో అభ్యంతరాలున్న వారు కోర్టులను ఆశ్రయించేవారు. కానీ, కర్నూలు పోలీసులు కొత్త పంథాను అవలంభిస్తున్నారు. తప్పుడు కేసులు నమోదుచేస్తున్నారు. పత్రికలు వార్తలు రాస్తే కేసులు నమోదుచేయడం ఏంటని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు పలుమార్లు ఖండించినా, ఆందోళనలు నిర్వహించినా పోలీసుల్లో మార్పులేదు.గతంలోనూ తప్పుడు కేసు నమోదు.. ఇక గతేడాది డిసెంబరు 22న కర్నూలులో మునీర్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారు. తన భూమిని మరొకరికి కట్టబెట్టాలని పోలీసులు బెదిరిస్తున్నారని, తాను పనిచేస్తున్న స్కూలుకు పోలీసులు వచ్చి తనను కిడ్నాప్ చేశారని, డీఐజీ కోయ ప్రవీణ్ సూచనలతోనే ఈ వ్యవహారం జరిగిందని.. పలుమార్లు డీఐజీ పిలిపించి కోర్టులతో పనిలేదు, సెటిల్ చేసుకోవాలని చెప్పారని మునీర్ విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించగా.. వివిధ ఛానెళ్లూ ప్రసారం చేశాయి. కానీ, అప్పుడు కూడా ‘సాక్షి’పై మాత్రమే కేసు నమోదుచేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ‘సాక్షి’ కథనం రాస్తే త్రీటౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విధులకు సాక్షి విలేకరి ఆటంకం కల్గించారని తప్పుడు కేసు నమోదుచేశారు. కిందిస్థాయి పోలీసులు తప్పుడు కేసులు నమోదుచేస్తే డీఎస్పీ, ఎస్పీలను కలిసి బాధితులు విన్నవిస్తారు. కానీ, ఐపీఎస్ అధికారుల సూచనల మేరకే తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఇలా పత్రికలపై తప్పుడు కేసులు కడుతుంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో.. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఏ స్థాయిలో తొక్కేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
ఆ చేయి ఎవరిది?
డోన్ టౌన్: డోన్ రైల్వే స్టేషన్లో రెండో ప్లాట్‌ఫామ్ ట్రాక్‌పై శుక్రవారం ఉదయం తెగిపడిన ఎడమ చేయి భాగం కనిపించడం కలకలం సృష్టించింది. ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని ప్రయాణికుడి చేయి తెగిపడితే రైల్వే అధికారులకు సమాచారం అందేది. ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎవ్వరినైన హత్య చేసి అచూకీ లభించకుండ నిందితులు హతుడి శరీర భాగాలను రైలు మార్గంలో అక్కడక్కడ పడేస్తూ వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు స్టేషన్‌కు ఇరువైపులా గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి క్లూ లభించలేదు. రైల్వే పోలీసు ఎస్ఐ బింధు మాధవి మాట్లాడుతూ.. ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఎడమ చేయి భాగం లభ్యమైందని, ఇతర ఏ శరీరం భాగాలు కనపించలేదన్నారు. లభించిన చేయి భాగాన్ని కర్నూలు ఫోరోనిక్స్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ముగిసిన ‘స్టాండింగ్’ నామినేషన్ల పరిశీలన
కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీ చేసిన ఏడుగురు కార్పొరేటర్లు ఈ. నారాయణ రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, సి.హెచ్. సాంబశివరావు, కురబ మునెమ్మ, షేక్ అహమ్మద్, దండు లక్ష్మీకాంతా రెడ్డి, పి. షాషా వలీల నామినేషన్లను వారి సమక్షంలోనే నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవీ క్రిష్ణ పరిశీలించారు. వాటిని ధ్రువీకరించారు. ఈనెల 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. వచ్చే నెల 1వ తేదీ ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కించి, విజయం సాధించిన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఆరాధనోత్సవాలకు ఆహ్వానంమంత్రాలయం రూరల్: అధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఆగస్టు 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శ్రీమఠం అధికారులు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా కర్నూలులో జిల్లా కలెక్టర్ రజింత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు శ్రీమఠం అధికారులు ఆహ్వాన పత్రికలతో పాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో మఠం అధికారులు ఏఏఓ ఎల్. మాధవశెట్టి, మఠం మేనేజర్ ఎస్కే. శ్రీనివాసరావు, సూపరిండెంట్ అనంతపురానిక్ పాల్గొన్నారు.నిరాశాజనకంగా పంటల ధరలు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మరింత తగ్గిపోయాయి. గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఎంతో ఆశతో వచ్చిన రైతులకు నిరాశే మిగులుతోంది. వాము ధర పూర్తిగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కనిష్ట ధర రూ.6,506, గరిష్ట ధర రూ.10,606 లభించింది. ఉల్లిగడ్డలు ఇద్దరు రైతులు మాత్రమే 57 క్వింటాళ్లు తీసుకొచ్చారు. కనిష్టంగా రూ.685, గరిష్టంగా రూ.760 పలికింది. మార్కెట్‌కు వేరుశనగ ఒక మోస్తరుగా వస్తోంది. కనిష్ట ధర రూ.3,033, గరిష్ట రూ.6,880 లభించగా.. సగటు ధర రూ.4,682 నమోదైంది. కందుల ధర మరింత దయనీయంగా ఉంటోంది. కనిష్ట ధర రూ.4,083 లభించగా.. గరిష్ట ధర రూ.6,350 పలికింది. కొర్రలు, మినుములు, సజ్జలు, ఆముదం పంటలకు కూడా ధరలు ఆశించిన విధంగా లేకపోవడం గమనార్హం. 28న కౌలు రైతు సమస్యలపై ధర్నాలు కర్నూలు(సెంట్రల్): కౌలు రైతులపై కూటమి సర్కార్ తీరుకు నిరసనగా ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కౌలు రైతులకు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ కారణంగా బ్యాంకుల్లో పంటరుణాలు మంజూరు చేయడం లేదని.. ఎరువులు, పురుగు మందులు అందివ్వడంలోనూ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కౌలు రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలుకర్నూలు (హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వం బీడీ, సున్నపు రాయి, డోలమైట్ గని కార్మికుల పిల్లలు, విద్యార్థినీ, విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి గాను ఉపకార వేతనాలు అందజేస్తోందని బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపకార వేతనాల కోసం కార్మికుల పిల్లలు ఆన్లైన్లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (scholarships. gov.in)లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వంతో గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులు దీనికి అర్హులని తెలిపారు. 10 వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులు ఆగస్టు 31 లోగా, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 0120–6619540, 040–29561297, స్థానిక బీక్యాంప్‌లోని బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీలో సంప్రదించి సమాచారం తెలుసుకోవాలన్నారు. -
సబ్సిడీలకు తిలోదకాలు
కర్నూలు(అగ్రికల్చర్): అగ్గిపెట్టెలో పట్టే విధంగా పట్టు చీరలు నేసిన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. అయితే పట్టు పరిశ్రమకు, మల్బరీ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం రెట్టింపు అవుతున్నా రైతులకు సబ్సిడీలు అందడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పట్టుగూళ్ల మార్కెటింగ్ సదుపాయం లేదు. నష్టాలు ఎక్కువగా ఉండటంతో రైతులు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు. గతేడాది (2024–25లో) మల్బరీ సాగు తగ్గిపోగా.. ఈ ఏడాది మరింత అధ్వాన స్థితికి చేరింది. అరకొరగా మల్బరీ సాగు 2025–26లో కర్నూలు జిల్లాలో 150, నంద్యాల జిల్లాలో 200 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 350 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాలనేది లక్ష్యం. ఖరీఫ్ సీజన్ మొదలై దాదాపు 50 రోజులవుతున్నా మల్బరీ సాగులో పురోగతి కనిపించడం లేదు. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 18 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 4 ఎకరాల్లో మాత్రమే మల్బరీ ప్లాంటేషన్ జరిగినట్లు తెలుస్తోంది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 350 ఎకరాల్లో మల్బరీ ప్లాంటేషన్ చేపట్టాలనేది లక్ష్యం. అయితే 200 ఎకరాల్లో మాత్రమే జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి మరింత తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికీ మల్బరీ సాగుపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించడానికి చర్యలు తీసుకోలేదు. రాయితీలు తగ్గించడంతో రైతులు పట్టు సాగుపై నిర్లిప్తతతో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఉపాధి’ తొలగింపు మల్బరీ సాగు చేసే రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక రాయితీలు లభించేవి. షెడ్ల నిర్మాణానికి ‘ఉపాధి’ నిధుల నుంచి సబ్సిడీలు ఆశాజనకంగా ఉండేవి. ఒక షెడ్‌కు రూ.3.50 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చేవారు. 2024–25 నుంచి షెడ్ల నిర్మాణానికి ‘ఉపాధి’ నుంచి రాయితీలు లేవు. కేవలం ప్లాంటేషన్‌లో మాత్రం అరకొర సబ్సిడీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఒక్క రైతుకు కూడా ‘ఉపాధి’ నుంచి ప్లాంటేషన్‌కు రాయితీలు ఇవ్వలేదు. ప్రోత్సాహం కరువై! ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో 1,500 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్ల ఉత్పత్తి జరిగేది. 2024–25లో కేవలం 500 టన్నులకు పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో ఉత్పత్తి చేసిన పట్టుగూళ్లను హిందూపురం మార్కెట్‌కు తరలించాల్సి వస్తోంది. మార్కెట్లో పట్టుగూళ్లకు లభించిన ధరకు అదనంగా కిలోకు రూ.50 రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్సివ్ పేరుతో ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చేది. కూటమి ప్రభుత్వం ఇంటెన్సివ్ ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023–24 వరకు మల్బరీ సాగును ప్రోత్సహించాయి. కేంద్ర ప్రభుత్వం యథాతథంగా రాయితీలు ఇస్తుండగా 2024–25 నుంచి కూటమి ప్రభుత్వం సబ్సిడీలకు తిలోదకాలు ఇచ్చింది. పట్టుపురుగుల పెంపకం కోసం రైతులు విధిగా షెడ్డు నిర్మించుకోవాల్సి ఉంది. షెడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.25 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,12,500 సబ్సిడీ ఇస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద రూ.1,12,500 సబ్సిడీ ఇవ్వడం లేదు. దీన్ని కూడా రైతు భరించాల్సి వస్తోంది. మల్బరీ మొక్కలు నాటుకోవడంలో (ప్లాంటేషన్) ఎకరాకు యూనిట్ కాస్ట్ రూ.30 వేలు ఉంది. ఇందులో కేంద్రం ప్రభుత్వం రూ.15,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇవ్వాల్సి ఉంది. రైతు రూ.7,500 భరించాల్సి ఉంది. అయితే మొక్కలు నాటుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదు. పరికరాలకు యూనిట్ కాస్ట్ రూ.75 వేలు ఉండగా..రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా రాయితీలకు ఎగనామం పెట్టింది. మల్బరీ సాగు చేసే రైతులకు బ్రష్ కట్టర్, పవర్ స్ప్రేయర్లు, సికేచర్ వంటివి కూడా రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అయితే వీటిని కూడా ఇవ్వడం లేదు. -
హంద్రీనీవాలో పెరిగిన నీటి ప్రవాహం
కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శుక్రవారం ఎనిమిది పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేశారు. ఒక్కో పంపు నుంచి 337.6 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,700 క్యుసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండడంతో కాలువలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ నెల చివరిలోపు 12 పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేసే యోచనలో ఇంజనీర్లు ఉన్నారు. అదే విధంగా కాలువలో నీటి ప్రవాహం ఉండడంతో 68 చెరువుల పథకానికి నీటిని విడుదల చేశారు. దీంతో పాటు 110 కి.మీ దగ్గర హంద్రీనీవా ప్రధాన కాలువకు ఏర్పాటు చేసిన స్లూయిజ్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు సైతం నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్ఈ పాండురంగయ్య తెలిపారు. ‘హంద్రీ–నీవా’ పిల్ల కాలువకు గండి దేవనకొండ: మండలంలోని తువ్వదొడ్డి గ్రామ సమీపంలో హంద్రీ–నీవా పిల్ల కాలువకు గురువారం రాత్రి గండి పడింది. సమాచారాన్ని గ్రామస్తులు హంద్రీ–నీవా అధికారులకు తెలిపారు. అధికారులు స్పందించి జేసీబీలతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పనులు మొదలుపెట్టారు. ఈ గండి నుంచి ప్రవహించే నీరు సమీపంలోని వంకల్లోకి పారడంతో ఎటువంటి పంట నష్టం జరగలేదు. ఈ కాలువ నుంచి తువ్వదొడ్డి, నునుసరాళ్ల, పందెర్లపల్లి, బొందిమడుగుల గ్రామాలకు సంబంధించిన 600 ఎకరాల పొలాలకు నీరు వెళ్తుంది. -
ఈరన్న స్వామి.. నమోనమామి!
● ఉరుకుందలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహామంగళ హారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రాత్రి 8 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. గోవు పూజ అనంతరం ఆలయ గోపురంపై స్వామి జెండాను ఆవిష్కరించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ‘ఈరన్న స్వామి.. నమోనమామి’ అని వేడుకున్నారు. శ్రావణ మాస ఉత్సవాలు ఆగస్టు 23 వరకు కొనసాగుతాయని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, పర్యవేక్షకులు వెంకటేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి శుక్రవారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పెద్దపాడు రోడ్డులోని సెయింట్ క్లారెట్ ఇంగ్లిషు మీడియం పరీక్ష కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ నవ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులతో ఆమె మాట్లాడారు. మొత్తం 192 మంది విద్యార్థులు 6, 7, 8, 9వ తరగతుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్, జీసీడీఓ స్నేహలత పాల్గొన్నారు. -
నెలకే ‘తారు’మారు
● నాసిరకంగా బూజునూరు–గడివేముల రోడ్డుదెబ్బతిన్న బూజునూరు – గడివేముల రహదారిరోడ్లు వేశాం.. గుంతలు పూడ్చామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఒక సారి ఆ దారుల్లో ప్రయాణించాలని ప్రజలు వాపోతున్నారు. కొత్తగా నిర్మించిన రహదారి నెలకే ఛిద్రమైతే ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కమీషన్లకు నాణ్యత చెదిరిపోయి, మళ్లీ గుంతలు దర్శనమిస్తున్నాయని చెప్పేందుకు బూజునూరు – గడివేముల రహదారే నిదర్శనం. బూజునూరు నుంచి గడివేముల మీదుగా మంచాలకట్ట వరకు రూ.కోట్లు ఖర్చు చేసి నూతన రోడ్డు నిర్మించారు. రోడ్డు పనులు పూర్తయ్యాయి. అయితే గడివేముల సొసైటీ సమీపంలో రోడ్డు దెబ్బతిని గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించి నిధులు కాజేశారనే ఆరోపణలున్నాయి. – గడివేముల -
మహిళలు, బాలికలే లక్ష్యంగా నేరాలు
కర్నూలు: ఇంటర్నెట్, మొబైల్ డేటా అందుబాటులోకి వచ్చాక మహిళలు, యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకుని నేరాలు పెరిగిపోతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. కర్నూలు శివారులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మహిళలు, పిల్లల భద్రతపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలను అరికట్టేందుకు మహిళా సంక్షేమం, భద్రత, మహిళా సాధికారత అనే అంశాలపై జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా భద్రతకు పటిష్టమైన చట్టాలు, శక్తి టీమ్, శక్తి యాప్ లాంటివి ఉన్నాయన్నారు. ఎవరైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే శక్తి వాట్సప్ నంబర్ 7993485111, డయల్ 100, 112, కర్నూలు శక్తి వాట్సప్ 7777877700, చైల్డ్ మ్యారెజెస్ 1098, సైబర్ క్రైం 1930లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి, పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ దేవకీ దేవి, సీఐలు శ్రీధర్, విజయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉండాలి ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
ప్రతి హాస్టల్లో ఫిర్యాదుల బాక్స్
కర్నూలు(అర్బన్): ప్రతి హాస్టల్లో కచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో పాటు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బి.రాధిక ఆదేశించారు. శుక్రవారం స్థానిక సంక్షేమభవన్‌లోని తన చాంబర్లో ఆమె జిల్లాలోని సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహాయ సంక్షేమాధికారులు తనిఖీలకు వచ్చిన సందర్భాల్లో ఆయా బాక్స్‌లను ఓపెన్ చేసి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద జిల్లాలోని అనేక వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లతో మాట్లాడి వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల రక్షణకు సంబంధించి తమ పరిధిలోని పోలీస్ అధికారులను సంప్రదించి హాస్టల్ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. పీహెచ్సీ డాక్టర్లను సంప్రదించి హాస్టళ్లలో ప్రతి నెలా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా వసతి గృహాల్లోని బోర్ల నీటిని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ద్వారా పరీక్ష చేయించాలన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలపై ఇప్పటి నుంచే దృష్టి సారించి ట్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, ఎస్.లీలావతి, బి.మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
మహిళ బలవన్మరణం
పెద్దకడబూరు/మంత్రాలయం రూరల్: ఒంటరితనం భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శివాంజల్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం వగరూరు గ్రామానికి చెందిన కురువ పద్మావతి(36)కి పెద్దకడబూరు మండలం కంబలదిన్ని గ్రామానికి చెందిన కురువ నాగేంద్రతో కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. అయితే భర్త కురువ నాగేంద్ర 12ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమహిళ ఒంటిరిగా తన పుట్టినిల్లు అయిన వగరూరు గ్రామంలోనే నివాసం ఉండేది. ఏడు నెలల క్రితం పద్మావతికి పక్షవాతం వచ్చి కుడిచెయ్యి పని చేయకుండా అయ్యింది. దీంతో ఒంటరితనం భరించలేక, చెయ్యి కూడా పని చేయకపోవడంతో మానస్తాపం చెంది ఈనెల 23న ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. వగరూరు చెరువులో పడి చనిపోయినట్లు శుక్రవారం గ్రామస్తులు గుర్తించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. పద్మావతి అన్న కురువ మల్లేష్ ఫ్యిరాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మంత్రాలయం ఎస్ఐ శివాంజల్ తెలిపారు. మళ్లీ గ్రామాల్లో చిరుత పులి సంచారం గోనెగండ్ల: మండలంలోని ఎన్నెకండ్ల, గంజిహళ్లి గ్రామాల్లో చిరుత పులి గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున మళ్లీ సంచరించింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయం..భయంగా ఉన్నారు. ఫారెస్టు సిబ్బంది రవి కుమార్, పశువైద్యులు నిర్మల దేవి శుక్రవారం ఆయా గ్రామాల్లో తిరిగారు. పొలాల్లో చిరుత పాదముద్రలను పరిశీలించారు. దున్నపోతు కళేబరం దగ్గరకు వచ్చి చిరుత పులి మాంసంను తిన్నట్లు గుర్తించారు. కారుమంచి కొండల్లో నుంచి చిరుత పులి వచ్చి ఉంటుందని, మళ్లీ అక్కడికే వెళ్లి ఉంటుందని ఫారెస్టు సిబ్బంది తెలిపారు. -
208 రైతు సేవా కేంద్రాల మూత
‘మయూర’ నాట్యంనల్లమల అడవుల నుంచి వచ్చిన నెమళ్లు శుక్రవారం కర్నూలు జొహరాపురంలోని క్రికెట్ స్టేడియంలో సందడి చేశాయి. అటూ ఇటూ తిరుగుతూ పురి విప్పి నాట్యమాడుతూ కనువిందు చేశాయి. జాతీయ పక్షులను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుపురి విప్పిన నెమలికర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 208 రైతు సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. నంద్యాల జిల్లాలో 411 ఉండగా రేషనలైజేషన్ కారణంగా 294కు తగ్గిపోయాయి. మొత్తం 117 రైతు సేవా కేంద్రాలు మూతపడ్డాయి. కర్నూలు జిల్లాలో 466 ఉండగా రేషనలైజేషన్ ప్రక్రియతో 71 మూతపడి 395 మిగిలాయి. అస్తవ్యస్త బదిలీల కారణంగా వీఏఏలు లేక మరో 20కిపైగా మూతపడిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మ్తొతం రైతు సేవా కేంద్రాల 877 నుంచి 669కి తగ్గిపోయాయి. నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులను (వీఏఏలను) కర్నూలు జిల్లాలోని ఆదోని, పెద్దకడుబూరు, కోసిగి, ఆలూరు, చిప్పగిరి వంటి మండలాలకు బదిలీ చేశారు. బదిలీల్లో సీనియారిటీని పట్టించుకోకపోవడం, స్పౌజ్ ఇతర ప్రత్యేక కేటగిరీలను నిర్లక్ష్యం చేయడం, టీడీపీ నాయకుల సిఫార్సు లేఖలకు, ముడుపులకు పెద్దపీట వేయడం తదితర కారణాలతో పలువురు వీఏఏలు హైకోర్టును ఆశ్రయించారు. యథాస్థితిని కొసాగించాలని హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ రావడంతో వీఏఏలు అంతకు ముందు పనిచేస్తున్న రైతు సేవా కేంద్రాల్లోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడం, ఎరువులు, విత్తనాల అవసరం రావడం, రైతు సేవా కేంద్రాలు మూతపడి ఉండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పిల్లల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షలు
కర్నూలు: పిల్లల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ కార్యక్రమంలో భాగంగా కోనేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఎస్పీ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు న్యాయపరమైన హక్కులు చాలా ముఖ్యమన్నారు. బాల కార్మికులను, బాల్య వివాహాలను, పిల్లల అక్రమ రవాణాను, బాల భిక్షాటన వంటి వాటిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరహా ఘటనలు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, 112, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారమివ్వాలని కోరారు. పిల్లల అక్రమ రవాణాలో పాల్గొనేవా రికి కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. బాలుర సంక్షేమ సమితి సభ్యుడు మధు సుధాకర్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ జిల్లా కోఆర్డినేటర్ మౌనిక, ఏరియా కోఆర్డినేటర్ మునుస్వామి, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సుంకన్న తదితరులు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలి
కర్నూలు(సెంట్రల్): న్యాయవాదులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం తేవాలని ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ అసోసియేషన్(ఐఎల్ఏ) డిమాండ్ చేసింది. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బార్ అసోసియేషన్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బార్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ పి.రవిగువేరా, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ఐఎల్ఏ జిల్లా నాయకులు బి.చంద్రుడు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సుబ్బయ్య, ఓంకార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్‌ను రూ.6లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు రూ.4 లక్షలు ఉండాలన్నారు. న్యాయవాదులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచాలన్నారు.అంతేకాక న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రంగనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బీఎస్ రవికాంత్ప్రసాదు, కోశాధికారి పి.దస్తగిరి, జిల్లా ఉపాధ్యక్షులు షఫీ పాల్గొన్నారు. ఐఎల్ఎల్ డిమాండ్ -
జంట ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె: ఉపాధి అవకాశాలు దక్కకపోవడంతో ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. కదులుతున్న రైలు నుంచి దూకి వివాహిత మృతి చెందగా.. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని స్థానికుల సాయంతో పోలీసులు కాపాడారు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా అయ్యలూరుకు చెందిన మహేష్ బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ అప్పటికే వివాహమై భర్త మృతిచెంది ఒంటరిగా జీవిస్తున్న దీపిక పరిచయమైంది. ఇద్దరూ కలసి సహజీనం సాగించేవారు. ఈ క్రమంలో పని కోసం వారం రోజుల క్రితం ఇద్దరూ గుంటూరుకు వెళ్లారు. అక్కడ పని దొరక్కపోవడంతో గుంతకల్లు మీదుగా గురువారం అనంతపురానికి చేరుకున్నారు. అక్కడ కూడా పని దొరక్కపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమై అదే రోజు రాత్రి కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. మార్గమధ్యంలో దీపిక కదులుతున్న రైలు నుంచి కిందకు దూకేసింది. పక్క స్టేషన్లో రైలు ఆగగానే కిందకు దిగిన మహేష్ రోడ్డు మార్గంలో గార్లదిన్నె మండలం ఎగువపల్లి సమీపంలోకి శుక్రవారం తెల్లవారుజాముకు చేరుకున్నాడు. జాతీయ రహదారి పక్కన వాకింగ్ చేస్తున్న స్థానికులను కలసి రైల్వే స్టేషన్‌కు మార్గాన్ని అడిగి, అటుగా కాకుండా నేరుగా రైల్వే ట్రాక్‌పై చేరుకుని పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో గార్లదిన్నె ఎస్ఐ గౌస్ మహమ్మద్‌బాషా, సిబ్బంది అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తన భార్య రైలు నుంచి దూకిందని, తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడినట్లు వివరించాడు. దీంతో విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు గార్ల దిన్నె – కల్లూరు మధ్య ట్రాక్‌పై పరిశీలన చేపట్టారు. కల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో రామ్‌దాస్‌పేట వద్ద పట్టాలపై యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని దీపికగా మహేష్ నిర్ధారించాడు. ఘటనపై రైల్వే ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, యువతి మృతిపై అనుమానాలు ఉన్నట్లుగా పోలీసులు పేర్కొనడం గమనార్హం. -
శ్రీమఠానికి నీటిశుద్ధి ప్లాంట్ విరాళం
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నీటి శుద్ధి ప్లాంట్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అందజేశారు. శుక్రవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు చేతుల మీదుగా పూజలు చేసి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్‌కు రాఘవేంద్ర జల ప్రసాద అనే పేరు పెట్టారు. ఎల్ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్‌ను అంక్షితలు వేసి శ్రీమఠం పీఠాధిపతి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మఠం అధికారులు, ఎల్ఐసీ అధికారులు పాల్గొన్నారు. -
పనుల్లేక.. చెట్టు కింద ఆట!
చేద్దామంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు లేవు.. మోస్తరుగా వర్షాలు కురుస్తుండటంతో సేద్యాలు సాగడం లేదు.. పొలాల్లో కలుపు తీయడానికి, విత్తనం వేయడానికి ఎవరూ పిలవడం లేదు. దీంతో తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో శుక్రవారం రైతులు, వ్యవసాయ కూలీలు ఓ చెట్టు కింద చేరి ‘పులి–మేక’ ఆటతో కాలక్షేపం చేస్తూ కనిపించారు. పులి నుంచి మేకలను ఎలా కాపాడాలో.. పులిని ఎలా బంధించాలో చాలా తెలివిగా ఆట ఆడారు. బాలులు, యువకులు సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారని, వారు ఇలాంటి ఆటలు ఆడి జ్ఞానాన్ని పొందవచ్చని గ్రామ పెద్దలు తెలిపారు. పాలన సరిగ్గా లేని సమయంలో పాలకుల ఆట ఎలా కట్టించవచ్చో కూడా ఆలోచనలు వస్తాయని చెప్పారు. – తుగ్గలి -
భాగవతం అమృత భాండం
కొత్తపల్లి: భాగవతం మనిషికి అమృతతత్వాన్ని ప్రసాదించే అమృత భాండమని తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు మల్లు వెంకట రెడ్డి అన్నారు. నందికుంట గ్రామంలోని పురాతన నందీశ్వరాలయంలో శుక్రవారం ధర్మ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వమాత సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగవతాన్ని ప్రతి ఒక్కరూ అవ పోషణ పడితే మంచి ప్రవర్తన, సద్గుణాలు, మానవత్వం అలవడుతుందన్నారు. నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టారు. ఇస్కాన్ ధర్మ ప్రచారకులు కీర్తి రాజదాసు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై చేసిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో పురోహితులు లక్ష్మీనారాయణ చారి, గ్రామ సర్పంచ్ పైరెడ్డి నిత్యలక్ష్మి, నారాయణరెడ్డి, గ్రామ పెద్దలు టి.మధుసూదన రెడ్డి, స్థానిక భజన బృందం సభ్యులు నారాయణ, శివన్న, పుల్లయ్య, దత్తు శివన్న, మహేష్, ప్రవీణ్, హేమంత్ సాయి, బాణ రామిరెడ్డితో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు. -
డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం సక్సెస్
దేశ రక్షణ సామర్థ్యాలకు మరింత ఊతమిస్తూ డీఆర్డీఓ చేపట్టిన యూఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (యూఎల్‌పీజీఎం–వీ3) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (ఎన్ఓఏఆర్)లో డీఆర్డీఓ మానవ రహిత డ్రోన్ వైమానిక వాహనం ద్వారా శుక్రవారం ఈ క్షిపణి ప్రయోగం చేపట్టింది. గతంలో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యూఎల్‌పీజీఎం–వీ2 అధునాతన వెర్షన్ ఇది. యూఎల్‌పీజీఎం–వీ3 అనేక రకాల లక్ష్యాలను ఛేదించగలిగిన హై డెíఫినిషన్ డ్యూయల్ చానల్ సీకర్‌తో అమర్చబడి ఉంటుంది. దీనిద్వారా మైదానం, అధిక ఎత్తు ప్రాంతాల నుంచి ప్రయోగించొచ్చు. ఇది పగలు, రాత్రి పనిచేసే సామార్థ్యాన్ని కలిగి ఉంటుంది. లక్ష్యం, లక్ష్య పాయింట్ నవీకరణకు రెండు మార్గాల డేటా లింక్‌ను కలిగి ఉంటుంది. - సాక్షి, న్యూఢిల్లీ/కర్నూలు (సెంట్రల్)/ఓర్వకల్క్షిపణుల ప్రయోగాలకుకేంద్రంగా ఎన్ఓఏఆర్.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో ఉన్న డీఆర్డీఓకు చెందిన నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (ఎన్ఓఏఆర్) క్షిపణుల ప్రయోగాలకు కేంద్రంగా మారింది. గతంలో కూడా డీఆర్డీఓ యూఎల్‌పీజీఎం–వీ2 క్షిపణి పరీక్ష కోసం ఎన్ఓఏఆర్ వేదికనే వినియోగించింది. ప్రస్తుతం ప్రయోగించిన యూఎల్‌పీజీఎం–వీ3 క్షిపణి ప్రయోగానికి కూడా అదే వేదికైంది. ఈ ఆయుధం మానవ రహిత విమానాలను కూల్చేందుకు వినియోగిస్తారు. ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలతో భారత డ్రోన్ యుద్ధతంత్రంలో ముందంజ వేస్తోంది. దాదాపు 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రేంజ్. దీనిని 2016–17లో ప్రారంభించారు. సాధారణంగా.. ఇండోర్‌లో పరీక్షించే ఈడబ్ల్యూ ఆయుధాలు అందుబాటులోకి రావాలంటే ఏడాది నుంచి రెండేళ్లు సమయం పడుతుంది. కానీ, బాహ్య ప్రదేశాల్లో పరిరక్షించేవి వేగంగా దళాల్లోకి చేరే అవకాశం ఉంటుంది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాల ఛేదన కోసం.. ఇక్కడ పరీక్షించే ఆయుధాల్లో రాడార్లు, ట్రాన్స్మీటర్లు, యాంటెనాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలతోపాటు డైరెక్ట్ ఎనరీ (లేర్) వెపన్స్ కూడా ఉంటున్నాయి. యూఎల్‌పీజీఎం శ్రేణి ఆయుధాలను తపస్ బీహెచ్, అర్చర్ ఎన్ఈ యూఏపీల కోసం అభివృద్ధి చేశారు. వీటిని చాలా తక్కువ ధరతో ఉత్పత్తి అవుతాయి. ఈ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. అత్యంత సమీపం నుంచి జరిగే పోరాటాల్లో ఫైర్ అండ్ ఫర్గెట్ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. రక్షణ మంత్రి అభినందనలు.. యూఏవీ లాంచ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతం కావడంతో రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డీఆర్డీఓను అభినందించారు. కీలక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను భారత్ అందిపుచ్చుకుని ఉత్పత్తిచేసే స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం విజయవంతం కోసం ఎంఎస్‌ఏఈ, స్టార్టప్‌లను కూడా ఆయన అభినందించారు. -
హోటల్ ఉద్యోగికి రూ. 4.60 కోట్ల జీఎస్టీ
కర్నూలు (హాస్పిటల్): అతను ఓ గ్రామీణ యువకుడు. జీవితంలో స్థిర పడాలని పొగాకు వ్యాపారం ప్రారంభించాడు. జీఎస్టీ నెంబర్ తీసుకుని ప్రభుత్వానికి పన్ను చెల్లించాడు. వ్యాపారం కలిసి రాక మధ్యలో ఆపేసి ఓ హోటల్లో పనికి కుదిరాడు. మూడేళ్ల తర్వాత రూ.4.60 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లించాలని మెసేజ్ రావడంతో కంగుతిన్నాడు. దీనిపై విచారణ చేసిన జీఎస్టీ అధికారులు సైతం అతను మోసపోయిన విధానాన్ని చూసి నివ్వెరపోయారు. ఏపీలోని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పైపాలెం గ్రామానికి చెందిన మల్లెం నవీన్‌కుమార్‌రెడ్డి 2017–18లో ఆర్యన్ ట్రేడర్స్ పేరిట పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించాడు. మూడేళ్ల పాటు చేసిన రూ.30 లక్షల వ్యాపారానికి రూ.9 లక్షల జీఎస్టీని 2018–19 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాడు. ఆ తర్వాత 2019–20లో మరో రూ.7.5 లక్షలు, 2020–21లో రూ.1.25 లక్షలు జీఎస్టీ కట్టాడు. అనంతరం వ్యాపారం బాగోలేక మధ్యలో ఆపేసి హైదరాబాద్ వెళ్లి ఓ రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కూడా అతను ప్రతి నెలా జీఎస్టీ రిటర్న్స్‌ను రెగ్యులర్‌గా దాఖలు చేస్తూ వచ్చాడు. ఇందుకోసం ఓ వ్యక్తికి రూ.300 నుంచి రూ.500 దాకా ఫీజు చెల్లించేవాడు. ఈ నేపథ్యంలో జీఎస్టీ రిటర్న్స్‌ను ఉచితంగా దాఖలు చేస్తామని ఓ గోడపై ఉన్న ప్రకటనకు ఆకర్షితుడై అందులో ఉన్న నితిన్ గుప్తా అనే వ్యక్తి నెంబర్‌కు ఫోన్ చేశాడు. అతడు నవీన్ రెగ్యులర్‌గా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసే యూజర్ ఐడీ, పాస్వర్డ్, మెయిల్, జీఎస్టీ నంబర్ తీసుకున్నాడు. కొద్ది కాలం పాటు నెలనెలా జీరో రిటర్న్స్ దాఖలు చేస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత అతని నుంచి నవీన్ కుమార్ రెడ్డికి ఫోన్ రాలేదు. నువైనా కట్టు.. లేదా అతనితో కట్టించు 2023 జూలైలో వైజాగ్ నుంచి సెంట్రల్ జీఎస్టీ అధికారులు నవీన్ వద్దకు వచ్చారు. అతను చేస్తున్న ఉద్యోగాన్ని చూసి విస్తుపోయారు. మీ జీఎస్టీ నెంబర్‌తో రూ.140 కోట్లకు పైగా బంగారం వ్యాపారం చేశారని, అందుకు ఇప్పటి దాకా జీఎస్టీ చెల్లించలేదని చెప్పారు. తాను అలాంటి వ్యాపారమేదీ చేయలేదని నవీన్‌కుమార్ రెడ్డి వారికి వివరించాడు. తన వివరాలు ఎవరికిచ్చాడో చెబుతూ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించి, జరిగిన విషయాన్ని తెలిపాడు. దీంతో నవీన్‌కుమార్ రెడ్డి మోసపోయాడని గ్రహించి, వారు అతనితో వాంగ్మూలం తీసుకుని వెళ్లిపోయారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ అధికారుల నుంచి పిలుపు వస్తే వెళ్లి కలిశాడు. ‘రూ.4.60 కోట్లకు పైగా జీఎస్టీని నీవైనా కట్టు.. లేదా నీ వివరాలు ఇచ్చిన వారితోనైనా కట్టించు’అని అధికారులు చెప్పి పంపించారు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేయడానికి మిడుతూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ప్రస్తుతం పని చేసేది హైదరాబాద్‌లో కాబట్టి, అక్కడికి వెళ్లమని చెప్పారు. హైదరాబాదులో ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ చిరునామా మిడుతూరు కాబట్టి, అక్కడే ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక న్యాయ నిపుణుల సలహాతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు సిద్ధమయ్యాడు. -
వేధింపులు లేవు.. విభేదాలు తొలగాయి
● జిల్లా అధికారుల విచారణలో వెలుగు చూసిన వాస్తవాలుమద్దికెర: తన కుమారుడికి తల్లి అన్నం పెట్టడం లేదు.. అవ్వాతాతలు నిద్ర పోనియ్యడం లేదు.. అని మూడు నెలల క్రితం తండ్రి చరణ్‌కుమార్ జాతీయ బాలల పరిరక్షణ కమిషన్‌కు మెయిల్లో ఫిర్యాదు చేశారు. దీంతో శిశు సంక్షేమశాఖ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ టి.శారద, లీగల్ కం ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గురువారం మండల కేంద్రమైన మద్దికెరకు వచ్చారు. బాలుడి అవ్వతాతలు, చుట్టుపక్కల వారిని విచారించగా.. బాలుడికి వేధింపులు లేవని తేలింది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగాయని తెలిసింది. వివరాలు.. మద్దికెర గ్రామానికి చెందిన వరలక్ష్మిని గుంతకల్లు పట్టణానికి చెందిన చరణ్‌కుమార్‌కు ఇచ్చి 2021లో వివాహం చేశారు. రెండేళ్లకు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భార్య కాన్పుకు పుట్టింటికి వచ్చి కుమారుడికి జన్మనిచ్చింది. రేండేళ్ల పాటు పుట్టింట్లో ఉన్నా భర్త పట్టించుకోలేదు. అయతే తన కుమారుడిని వేధిస్తున్నారని బాలుని తండ్రి చరణ్‌కుమార్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భార్యాభర్తలకు సర్దిచెప్పారు. మూడు నెలల కిందట చేసిన ఫిర్యాదుకు సంబంధించి జిల్లా అధికారులను విచారణకు వచ్చారు. అయితే భార్యాభర్తలు కలిసి పోయారని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతో అధికారులు వెంటనే ఫిర్యాదుదారుడిని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తెలియజేశారు. వీరి వెంట తహసీల్దార్ గుండాల నాయక్, సీడీపీఓ లలిత ఉన్నారు. -
విష గుళికలు చల్లుతూ..
● 11 మంది కూలీలకు అస్వస్థత ఆదోని అర్బన్: హొళగుంద మండలం చిన్నగోనేహాల్ గ్రామంలో మొక్క జొన్న పంటకు విష గుళికలు చల్లుతూ గురువారం 11 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు.. చిన్నగోనేహాల్ గ్రామంలో 10 ఎకరాల మొక్కజొన్న పంటకు 11 మంది కూలీలు విషగుళికలు చల్లుతుండగా అందులో రంగస్వామి, నాగరాజులు వాటి వాసన పీల్చి వాంతులు అయ్యి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మిగతా 9 మందికి కూడా వాటి వాసనకు గురవుతారని తెలుసుకుని వెంటనే వారిద్దరితో పాటు మరో 9 మందిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత శ్రీకాళహస్తి: సెల్‌ఫోన్ కొని ఇవ్వలేదని 15 రోజుల క్రితం ఇంటి పారిపోయిన కిరణ్(15)ను పోలీసులు గురువారం అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. శ్రీకాళహస్తి రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. డోన్‌కు చెందిన కిరణ్ అనే బాలుడు సెల్‌ఫోన్ కొని ఇవ్వలేదన్న కోపంతో ఇంటి నుంచి 15 రోజుల క్రితం వచ్చేశాడు. రెండు రోజుల క్రితం అదిలాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఓ టీవీ రిపోర్టర్ గుర్తించి, అతడి వద్ద వివరాలు ఆరా తీసింది. దీంతో శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులకు గురువారం అప్పగించాడు. పోలీసులు విచారణ జరిపి డోన్‌కు చెందిన బాలుడిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, వారిని పిలిపించి, విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించారు. -
శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది
కర్నూలు కల్చరల్/కోవెలకుంట్ల/గడివేముల: శ్రావణ మాసం శుభదాయకమైంది. ప్రతి రోజు అత్యంత ప్రవిత్రమైందే. అత్యఽధిక పండుగలను ఈ మాసంలోనే జరుపుకుంటాం. నాగులచవితి, వరలక్ష్మీ వ్రతం, రాఖీపౌర్ణమి, శ్రీకృష్ణాష్ఠమి ఇలా హిందువులకు అత్యంత ముఖ్యమైన ఈ పండుగలు బంధాలు, భాందవ్యాలను తెలుపుతాయి. శ్రావణ మాసం అంటే చంద్రుడు శ్రావణా నక్షత్రంలోకి అడుగు పెట్టిన మాసం. నక్షత్రాల్లో శ్రావణా నక్షత్రం చాలా శుభదాయకం. అలాగే మాసాల్లో శ్రావణ మాసం మహా మహిమాన్వితం. ఎందుకంటే మిగతా మాసాల్లో కొన్ని తిఽథులు మాత్రమే శుభకరమైనవి. కావున శ్రావణ మాసంలో అన్ని తిథులు పవిత్రమైనవని చెప్పవచ్చు. విష్ణుమూర్తి నక్షత్రం కూడా శ్రవణా నక్షత్రమే. ఈనెలలో విష్ణుమూర్తి నక్షత్ర మండలంలో కొలువుదీరి ఉండటాన నభోమాసం అంటారు. శ్రావణ మాసం ఎంతో ఉత్కృష్టమైంది. మన సంస్కృతి సంప్రదాయాల్లో ఈనెల ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రుతువులలో మూడోదైన వర్ష రుతువు ఈమాసంతోనే ప్రారంభమవుతుంది. వ్యవసాయ పరంగా కూడా ఈమాసం ప్రాముఖ్యం పొందింది. శ్రావణంలో గృహ నిర్మాణాన్ని ప్రారంభించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని మత్స్య పురాణం చెబుతోంది. శ్రావణ మాసం శుక్రవారం ప్రారంభం కానుంది. శ్రావణ మాసంలో వచ్చే పండుగలు.. ● శ్రావణ మాసంలో ఆచారించాల్సిన వ్రతాల్లో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైంది. ఈ రోజున (ఈనెల 28, ఆగస్టు 4, 11, 18 తేదీలు) శివుని ప్రీత్యర్థం ఉపవాసం ఆచరించడంతో మంచి ఫలితాలను పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు. ● ఈ మాసంలో మరొక విశేషం ఏమిటంటే కొత్తగా పైళ్లెన సీ్త్రలు ప్రతి మంగళవారం (29, ఆగస్టు 5, 12, 19 తేదీలు) మంగళ గౌరి వ్రతాన్ని నోచుకుంటారు. ఒక రాజకుమార్తె తన వైధవ్యాన్ని తొలగించుకోడానికి ఈ వ్రతము ఆచరించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ● శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ పూజకు అత్యంత ముఖ్యమైనవి. ● శావణ మాసంలోని మొదటి పండుగ నాగుల చవితి. దక్షప్రజాపతికి చిన్న భార్య అయిన కద్రువకు జన్మించిన సంతతే నాగజాతి. సుబ్రహ్మణ్య స్వామి ప్రతి రూపాలు. ఈ జాతిని పూజిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇది పున్నమి ముందు అనగా శ్రావణమాసం ప్రార ంభమైన (28వ తేదీ) నాలుగవ రోజు వస్తుంది. ● మరుసటి రోజు ఆగస్టు (29వ తేదీ) గరుడ పంచమి. అనగా వినత కుమారుడు గరుత్మంతుడు తన తల్లి దాస్యము బాపుటకు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి కద్రువ సంతానమైన పాములకు పోసి దాస్య విముక్తి చేస్తాడు. గరుత్ముంతుని జన్మదినమైన గరుడ పంచమి నోమును నోచుకుంటారు. పార్వతీదేవిని ‘ఫణిగౌరి’తో పోల్చుకుని నోచుకొని తమ సోదరుల వద్దకు వెళ్లి వారి ఆశీస్సులు అందుకుంటారు. ● ఈ మాసంలో అతి ముఖ్యమైన పండుగ ‘వరలక్ష్మి వ్రతం’. ఆగస్టు 8వ తేదీ ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని పార్వతీ దేవికి పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడని శివపురాణం ద్వారా తెలుస్తుంది. ఈ వ్రతం శ్రావణ మాసం రెండవ శుక్రవారం వస్తుంది. ● తరువాత ముఖ్య మైంది ‘శ్రావణ పూర్ణిమ’. దీనినే ‘రాఖీ పూర్ణిమా’ అంటారు. 9వ తేదీన రక్షా బంధన్ జరుపుకుంటారు. ఇదే రోజు హయగ్రీవ జయంతిని నిర్వహిస్తారు. ● మరొక ముఖ్యమైన పండుగ కృష్ణాష్టమి. ఇది శ్రావణమాసం కృష్ణ పక్షంలో అష్టమి రోజు (16వ తేదీ) వస్తుంది. శ్రీకృష్ణుడు దేవకీ, వసుదేవులకు అష్టమ గర్భంగా అర్ధ్దరాత్రి జన్మించిన పర్వదినం. గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణపరమాత్ముని జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఈ పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. శ్రావణ మాసం అత్యంత పవిత్రం శ్రావణ మాసం అత్యంత పవిత్రం, శుభకరం. ఈ మాసంలో ప్రతిరోజు పండుగే. సకలదేవతారాధనకు అనుకూలమైంది. మహిళలు ఈ మాసంలో ఉపవాసం ఉండి వివిధ రకాల నోములు, వ్రతాలు ఆచరిస్తారు. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల బంధాన్ని బలోపేతం చేసే రాఖీ పౌర్ణమి, శుక్రవారాల్లో లక్ష్మీ దేవిని సేవిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని నోమి సకల సుఖాలు కలగాలని వేడుకుంటారు. అత్తలు తమ కొత్త కోడళ్ల ఇంటికెళ్లి కొబ్బరి బెల్లం, నువ్వులు, ప్యాలపిండిని ఇచ్చి యోగ క్షేమాలు తెలుసుకుంటారు. – అగ్రహారం రాఘవేంద్ర ఆచార్యులు, పండితులు నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం పండుగల సమాహారంతో ఆధ్యాత్మిక శోభ శ్రీశైలం, ఉరుకుంద క్షేత్రాల్లో ప్రత్యేక ఉత్సవాలు కొనసాగనున్న సామూహిక వ్రతాలు శ్రీశైలంలో.. శ్రావణ మాసంలో శ్రీశైల మహా క్షేత్రంలో 25వ తేదీ నుంచి నెలంతా విశేష పూజాధికాలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. శ్రావణ సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు, ఏకాదఽశులు, శ్రావణ పౌర్ణమి, మాసశివరాత్రి, తదితర కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉరుకుందలో.. ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో నెలంతా శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి. సోమ, గురువారాలు స్వామివారికి ప్రత్యేక రోజులు కావున ఆయా రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. నాల్గవ సోమవారం 18వ తేదీన స్వామివారికి పల్లకి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కర్నూలు ఓల్డ్ సిటీలోని చిన్న అమ్మవారి శాల, పెద్ద అమ్మవారి శాల, లలితా పీఠం, నిమిషాంబదేవి ఆలయం, కాళికాంబ ఆలయం, వీఆర్ కాలనీ, కృష్ణానగర్, సంకల్ బాగ్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. -
ఎంపీఈడీ సెమిస్టర్ ఫలితాల విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జనవరి నెలలో జరిగిన ఎంపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 82 మందికి గాను 67 మంది పరీక్షలు రాయగా 58 మంది ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు 20 మంది హాజరు కాగా 15 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. డీసీసీబీలో పోస్టులకు 44 మంది ఎంపిక కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు (డీసీసీబీ)లో స్టాఫ్ అసిస్టెంటు పోస్టులకు 44 మంది ఎంపికయ్యారు. గత ఏడాది డీసీసీబీలో 50 స్టాఫ్ అసిస్టెంటు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 37 పోస్టులు డైరెక్ట్, 13 పోస్టులు పీఏసీఎస్‌ల నుంచి భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఈ పోస్టుల భర్తీకి ముంబాయికి చెందిన ఐబీపీఎస్ఈ ఏడాది ఆన్లైన్ పరీక్ష నిర్వహించింది. రోస్టర్ వారిగా ఎంపికై న వారి వివరాలను ఐబీపీఎస్ డీసీసీబీకి పంపింది. డైరెక్ట్‌గా భర్తీ చేసే 37 పోస్టులకు 35 మందిని, పీఏసీఎస్‌ల నుంచి భర్తీ చేసే 13 పోస్టులకు 9 మంది ప్రకారం 44 మంది ఎంపిక అయ్యారు. డైరెక్ట్ పోస్టుల్లో 1 ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పోస్టు, ఎక్స్ సర్వీస్‌మెన్ పోస్టుకు అర్హులు లభించలేదు. పీఏసీఎస్‌ల నుంచి భర్తీ చేస్తున్న వాటిలో నాలుగు పోస్టులకు అర్హులు లభించలేదు. ఆగస్టు 5న పీఏసీఎస్‌ల నుంచి ఎంపికై న 9 మందికి, ఆగష్టు 6న డైరెక్ట్‌గా ఎంపికై న 35 మంది అభ్యర్ధుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ సారి పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ లేకపోవడం విశేషం. పొలాల్లో చిరుత సంచారం గోనెగండ్ల: మండలంలోని ఎన్నెకండ్ల, గంజిహళ్లి గ్రామ శివారులో మూడు రోజులుగా చిరుత పులి సంచారిస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పశువులను పొలాల్లో వేసుకున్న షెడ్లు, గుడిసెల్లో కట్టివేసి రాత్రి ఇంటికి వెళ్తున్నారు. మంగళవారం రోజు రాత్రి ఎన్నెకండ్ల గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర తన పొలంలో వేసిన షెడ్డు దగ్గర రెండు గేదేలు, రెండు దున్నపోతులను కట్టివేసి ఉంచాడు. బుధవారం ఉదయం వెళ్లి చూడగా అందులో ఒక దున్నపోతు లేదు. నాగేంద్రతో పాటు పాడి రైతులు కొండ ప్రాంతంలో వెతకగా.. దున్నపోతు కళేబరం కనిపించింది. ఆ ప్రాంతంలో చిరుత అడుగు జాడలు కనిపించడంతో దున్నపోతును చిరుత దాడి చేసి తినిందని గుర్తించారు. గురువారం సాయంత్రం గంజిహళ్లి గ్రామ శివారులో చిరుత కనిపించడంతో గ్రామస్తులు తెలిపారు. దీంతో రాత్రి పూట పొలాల్లో ఉండేందుకు రైతులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత పులిని బంధించి అడవిలో వదిలి వేయాలని వైఎస్సార్సీపీ నాయకుడు తోలు రాముడు కోరారు. -
ఆర్థ్ధిక లావాదేవీలతో హత్య
● మిస్టరీ వీడిన బెల్ట్షాప్లో వ్యక్తి హత్య కేసు ● పది మంది నిందితుల అరెస్ట్ ● నిందితుల్లో నలుగురు మైనర్లు ● రెండు పిడిబాకులు, మచ్చు కత్తి, సుత్తి, ఇనుప రాడ్ స్వాధీనం పాణ్యం: ఐదు రోజుల క్రితం పాణ్యం గోరుకల్లు రస్తాలోని బెల్ట్షాప్లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. ఆర్థ్ధికలావాదేవీల మధ్య నెలకొన్న వివాదంతోనే హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, అందులో నలుగురు మైనర్ బాలురు ఉన్నారు. గురువారం పాణ్యం సర్కిల్ కార్యాలయంలో సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన అశోక్‌చౌదరి పాణ్యం గ్రామానికి చెందిన బెల్ట్‌షాప్ నిర్వాహకుడు ముసుగు సుబ్బయ్యకు రూ. 48 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ మొత్తంలో రూ. 26 లక్షలు సుబ్బయ్య తిరిగి చెల్లించాడు. ఇంకా రూ. 22 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఆ డబ్బుల కోసం సుబ్బయ్యపై పదేపదే ఒత్తిడి తెచ్చాడు. దీంతో అశోక్చౌదరిని అంతమొందించాలని సుబ్బయ్య కుట్ర పన్నాడు. ఈ మేరకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని అశోక్చౌదరికి ఫోన్ చేయడంతో ఈనెల 20వ తేదీ రాత్రి 7.30 గంటలకు సుబ్బయ్య షాప్ వద్దకు చేరుకున్నాడు. కాగా పథకం ప్రకారం అశోక్‌చౌదరి కళ్లలో కారంచల్లి, తలపై సుత్తితో కొట్టి ఆపై కత్తితో ఛాతి, కడుపు, వీపున కత్తులతో పొడవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. బెల్డ్షాప్ నిర్వాహకుడు ముసుగు సుబ్బయ్య, అతని కుమారుడు ముసుగు సురేష్, తెలుగుపేటకు చెందిన సల్కాపురం రమేష్, నూలుమిల్లు కాలనీకి చెందిన యనకండ్ల బాలకృష్ణ, మేకలబండకు చెందిన మండ్ల మణికుమార్, గోడన్చెలు కాలనీకి చెందిన అనుపూరు మాబుఉసేన్తో పాటు నలుగురు మైనర్ బాలురు ఈఽ హత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. 13 –15 వయస్సులోపు ఉండే మైనట్లు చదువు మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ తిరిగేవారని, వీరిని ముసుగు సురేష్ వరుసగా రెండు రోజులు విందు ఇచ్చి మచ్చిక చేసుకుని, హత్యలో పాల్గొనేలా చేసినట్లు తెలిసింది. హత్యకు పాల్పడిన 10 మంది నిందితులను పిన్నాపురం రోడ్డులోని ఏరాసు ప్రతాప్‌రెడ్డి తోట వద్ద ఉండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. మైనర్లను బాలనేరస్తుల కారాగానికి తరలించినట్లు చెప్పారు. నిందితుల నుంచి రెండు పిడిబాకులు, మచ్చుకత్తి, ఇనుపరాడ్డు, సుత్తి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. -
శుభ ముహూర్తాలు
ఈ నెలలో 26, 30, 31 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల 31వ తేదీన పెద్ద ముహూర్తం కావడంతో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 18, 14, 17 తేదీల్లో ముహూర్తాలున్నాయి. అలాగే, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకూ భాద్రపదమాసం. ఇది శూన్యమాసం కావడంతో ముహూర్తాలు లేవు. వ్రతాల వెనుక ఆరోగ్య రహస్యాలు వరలక్ష్మి వ్రతం రోజు వాయనంగా ఇచ్చే మొలకెత్తిన శనగలు పోషక నిలయాలు. వీటిలో మాంసకృతులు తక్షణ శక్తిని ఇస్తాయి. నైవేద్యంగా ఆరగించే చలివిడి పండి చలువ చేస్తుంది. చలివిడి గర్భాధారణ అవరోధాలను తొలగిస్తుంది. అలాగే వర్షకాలం పాదాలు ఎక్కువ సేపు తడిగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ కలుగుతుంటాయి. ఇలా ఇన్ఫెక్షన్కు గురవ్వకుండా ఉండటం కోసమే కాళ్లకు పసుపు పూసుకోవటాన్ని ఈ వ్రతాల్లో భాగం చేస్తారు. ఆవు నెయ్యితో వెలిగించే దీపాల ద్వారా విడుదలయ్యే ధూపం వాయు కాలుష్యాన్ని హరిస్తుంది. -
మోగనున్న కల్యాణ వీణ..
శ్రావణమాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటంతో పలు జంటలు వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచి జీవితాన్ని పంచుకునే శుభ ఘడియలు దగ్గరయ్యాయి. రెండు నెలల తర్వాత తిరిగి శుభ ముహూర్తాలు రావడంతో ఈ నెల 26వ తేదీ నుంచి కల్యాణ వీణ మోగనుంది. మాంగల్యం తంతునా..మమజీవనం హేతునా.. కంఠేభద్మామి సుభగే..త్వంజీవశరశరం.. అంటూ పెళ్లిలో వినిపించే మంత్రాలు మార్మోగనున్నాయి. జిల్లాలోని మహానంది, యాగంటి, నయనాలప్ప, అహోబిలం, ఓంకారం, భోగేశ్వరం, శ్రీశైలం, బుగ్గరామేశ్వరం, తదితర పుణ్యక్షేత్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇదే సమయంలో వస్త్ర, బంగారునగలు, తదితర పెళ్లి సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఒక పెళ్లి ఎందరికో ఉపాధి చూపుతోంది. వస్త్ర, బంగారు దుకాణాలతోపాటు పెళ్లి మండపాలు, ట్రావెల్స్, పురోహితులు, ఫొటోలు, వీడియో గ్రాఫర్స్, సాంస్కృతిక కళాకారులు, క్యాటరింగ్, ఎలక్ట్రీషియన్స్, బ్యాండుమేళం, పూలఅంగళ్లు, ఇలా ఎందరికో చేతి నిండి పని దొరుకుతోంది. ఆయా ముహూర్తాల్లో ఆయా కేటగిరిలకు చెందిన వారికి డిమాండ్ ఉండనుంది. బంగారు వ్యాపారం పెరగవచ్చు శ్రావణమాసం ప్రారంభంతో పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో తప్పకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉంగరం మొదలుకుని అన్ని రకాల నగలు కొనుగోలుకు ఆర్డర్లు ఇస్తున్నారు. తులం బంగారం ధర రూ. లక్షకు చేరువైనా కొందరు తమ స్థాయికి తగ్గట్టు కొనుగోలు చేస్తున్నారు. – పెండేకంటి సుబ్రహ్మణ్యం, బంగారు నగల వ్యాపారి, కోవెలకుంట్ల అడ్వాన్స్ బుక్ చేసేశారు శ్రావణ మాసంలో ఏటా అధిక పెళ్లిళ్లు జరుగుతుండటంతో ఫంక్షన్హళ్లనును ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారు. జూలై నెలలో మూడు, ఆగస్టు నెలలో 12 శుభమూహుర్తాలు ఉండటంతో ఆయా తేదీలకు సంబంధించి ఫంక్షన్‌హాల్స్‌కు అడ్వాన్స్ చెల్లించి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. చాలా మందికి ఉపాధి లభించనుంది. క్యాటరింగ్, కెమెరా, డెకరేషన్ తదితర రంగాల వారికి డిమాండ్ ఉండనుంది. – శ్రీరాముల సుబ్బారెడ్డి, ఫంక్షన్‌హాలు యజమాని, కోవెలకుంట్ల -
మంత్రి ఇలాకాలో రెండోసారి విజయం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిమంత్రి టీజీ భరత్ ఉన్న కర్నూలులో రెండోసారి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విరమించుకుందన్నారు. గురువారం సాయంత్రం కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద మహానేత విగ్రహానికి పూల మాలలు వేశారు. ఘనంగా నివాళ్లు అర్పించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం దాదాపు ఖరారు కావడంతో పెద్ద ఎత్తున్న బాణా సంచా కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. స్టాండింగ్ కమిటీకి పోటీ చేసిన మునెమ్మ, షేక్ అహమ్మద్, నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్లు, సాంబ శివరావులను పార్టీ జిల్లా అధ్యక్షులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. మేయర్ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, మాజీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. మంత్రి నియోజకవర్గంలో రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సునాయసంగా గెలిచారన్నారు. గత ఏడాది అధికార పార్టీ ఎన్నో కుయుక్తులు, డబ్బు ఎర వేసిన వైస్సార్సీపీ అభ్యర్థులే గెలిచారని గుర్తు చేశారు. పార్టీ మరింత బలిష్టంగా ఉందని రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు నిర్వహించినా వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు. తమ విజయానికి పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి కృషి చేశారని, వారికి కార్ప్పొరేటర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు కతృజ్ఞతలు తెలిపారు. -
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం
కర్నూలు (టౌన్): యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని తన చాంబర్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు 1,500 టన్నుల యూరియా వస్తే 50 శాతం మార్కెఫెడ్‌కు, 50 శాతం ప్రెవేటు డీలర్లకు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే జిల్లాకు వచ్చిన మొత్తం యూరియాను ప్రెవేటు డీలర్లకు ఇవ్వడంతో వారు బ్లాక్ మార్కెట్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. వివిధ పంటలు సాగు చేసిన రైతులు యూరియా దొరకక ధర్నాలు చేయాల్సి వసోందన్నారు. నెల్లూరు నుంచి లారీల్లో యూరియాను తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా రైతులు సైతం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను నష్టాల్లో ముంచుతోందన్నారు. అమరావతి తప్ప ఏమీ కనిపించవా? కూటమి ప్రభుత్వానికి అమరావతి నిధులు రూ.లక్ష కోట్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదా అని ఎస్వీ ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం అమరావతి జపం చేస్తున్నారని విమర్శించారు. రూ. లక్ష కోట్లలో 7 వేల కోట్లు కమీషన్ వస్తుందన్న కారణంతోనే ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారనే అనుమానాలు వస్తున్నాయన్నారు. అన్నదాతలకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా పర్యటించరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. రైతులతో కలిసి పోరాటం చేస్తాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
‘స్టాండింగ్’ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం!
కర్నూలు (టౌన్): కర్నూలు కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం దాదాపు పూర్తయ్యింది. ఇక ఎన్నిక లాంఛనమే అయ్యింది. స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నామినేషన్ల పర్వం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. గడువు ముగిసిన నాటికి వైఎస్సార్సీపీ చెందిన కార్పొరేటర్లు ఈ. నారాయణ రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, సీహెచ్ సాంబశివరావు, కురుబ మునెమ్మ, షేక్ అహమ్మద్, దండు లక్ష్మీకాంతా రెడ్డి, పి.షాషావలీ తమ నామినేషన్లు దాఖలు చేశారు. స్టాండింగ్ కమిటికీ ఐదుగురు సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. అయితే వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు మద్దతుగా తమ నామినేషన్లు సమర్పించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణకు స్టాండింగ్ కమిటీకి పోటీచేసే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తమ నామినేషన్లు సమర్పించారు. డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, వైఎస్సార్సీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, కార్పొరేటర్లు చిట్టెమ్మ, రాజేశ్వర రెడ్డి, క్రిష్ణ కాంత్, విక్రమసింహారెడ్డి, నాగలక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్లను ఈనెల 25న పరిశీలిస్తారు. అదే రోజు స్టాండింగ్ కమిటీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈనెల 28 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఆగస్టు 1వ తేదీ ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు విజయం సాధించిన అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారు. టీడీపీకి ఓటమి భయం నాలుగు సంవత్సరాల పాటు స్టాండింగ్ కమిటీలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తూ వచ్చింది. టీడీపీకి 8 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఒక ఇండిపెండెంట్, మరో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడంతో కౌన్సిల్లో వారి బలం 20 కి చేరుకుంది. దీంతో గత ఏడాది జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లను బరిలోకి దించింది. వీరికి మంత్రి టీజీ భరత్, పాణ్యం, కోడుమూరు అర్బన్ ప్రజా ప్రతినిధులు అండగా నిలిచినా ఓటమి పాలయ్యారు. ఓటమి భయంతో ఇద్దరు కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీలో నిలపాలని నిర్ణయించారు. నామినేషన్లు వేసేందుకు టీడీపీ కార్పొరేటర్లు పరమేష్, అబ్బాస్, ఫరాజ్ ఖాన్, కై పా పద్మాలతారెడ్డి తరలి వచ్చారు. ఇద్దరితో దరఖాస్తు పూర్తి చేయగా.. ఓ నేత ఫోన్ చేసి వద్దంటూ వారించారు. దీంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవం స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. బరిలో ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు పరిచారు. పోటీ చేస్తున్నట్లు హడావుడి చేసిన తెలుగుదేశం పార్టీ బరిలో నుంచి ఉపసంహరించుకుంది. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవం కానున్నారు. కర్నూలు కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ముగిసిన నామినేషన్ల పర్వం నామినేషన్లు వేసిన ఏడుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఓటమి భయంతో దూరంగా టీడీపీ -
స్టేషన్లలోనే న్యాయం చేయాలి
కర్నూలు: పోలీస్స్టేషన్లలో న్యాయం జరిగితే బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించే అవకాశం ఉండదని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సీరియస్‌గా పనిచేస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఉండదని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలసి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లలో సాంకేతికతను వినియోగించి నేర నియంత్రణకు గట్టిగా పనిచేయాలని క్షేత్రస్థాయి అధికారులను డీఐజీ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్త పెండింగ్ కేసులను ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు బాగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, యాంటీ ఈవ్ టీజింగ్ తనిఖీలతో పాటు డ్రోన్ కెమెరాలతో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలన్నారు. ఆయా కేసులలో నిందితుల వేలి ముద్రలను సేకరించి కేసులను ఛేదించాలన్నారు. గత ఆరు నెలలుగా చోటు చేసుకున్న నేరాల విశ్లేషణ, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, శ్రీనివాసాచారి, ఉపేంద్ర బాబు, హేమలత, ఏఆర్ డీఎస్పీ భాస్కర్‌రావు, సీఐలు, ఎస్ఐలు, ఈగల్ టీమ్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. -
ఆస్పరి పీహెచ్సీలో సౌకర్యాలు లేవు
ఆస్పరి పీహెచ్సీలో రోగులకు కనీస సౌకర్యాలు లేవు. కనీసం గర్భిణులకు పడకలు కూడా సరిపోవడం లేదు. ఆస్పరి మండలంలోని దాదాపు 25 గ్రామాల నుంచే గాకుండా దేవనకొండ, ఆలూరు, పత్తికొండ మండలాలకు చెందిన గ్రామాల వారు సైతం పలు వ్యాధులకు చికిత్స కోసం, ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారు. గర్భిణులకు పరీక్షల ల్యాబ్ లేకపోవడంతో ఆదోనికి వెళ్తున్నారు. వారికి ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేయాలి. – రామాంజనమ్మ, చిరుమాన్‌దొడ్డి, ఆస్పరి మండలం అవగాహన కల్పిస్తున్నాం వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, సచివాలయాలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో మలేరియా వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. మలేరియా/డెంగీ నిర్ధారణ అయితే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. మలేరియా, డెంగీ జ్వరాలు రాకుండా ఉండేందుకు ఇళ్లు, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. –నూకరాజు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు ● -
పీఎంఏజీవై గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టండి
కర్నూలు(సెంట్రల్): పీఎంఏజీవై(ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన) పథకం కింద ఎంపికై న గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పీఎంఏజీవై అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫేజ్–2 కింద ఎంపిక చేసిన గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రతిపాదించాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీల మరమ్మతులు, తాగునీటికి సంబంధిచి ఫిల్డర్ బెడ్లు, పీఆర్‌కు సంబంధించి రోడ్లు, మౌలిక వసతులు తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో జేడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాధిక, ఇరిగేషన్ ఎస్ఈ ఈ.బాలచంద్రారెడ్డి, ఐసీడీఎస్ పీడీ నిర్మల, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, విద్యుత్ ఎస్ఈ ఉమాపతి, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భాస్కరరాజు పాల్గొన్నారు. ఉరుకుందలో ‘నవో’దయం ● ప్రారంభమైన 9 వారాలు, 9 ప్రదక్షిణలు కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలో శుక్రవారం నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయంలో గురువారం ప్రత్యేకంగా 9 వారాలు, 9 ప్రదక్షిణల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆధ్వర్యంలో లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం అమావాస్య, ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శాస్త్రోకంగా సారెను సమర్పించారు. పిండివంటలతో స్వామికి నైవేద్యం సమర్పించారు. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప ఆర్టీసీ డిపోలవారు ప్రత్యేక బస్సులను నడిపారు. జిల్లాలో 1,930 మెట్రిక్ టన్నుల యూరియా కర్నూలు(సెంట్రల్): జిల్లాలో 1,930 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యతలో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ బి.నవ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కుఫెడ్ వద్ద 491.4 మెట్రిక్ టన్నులు, రైతు సేవా కేంద్రాల వద్ద 399.67 మెట్రిక్ టన్నులు, రిటైలర్స్ దగ్గర 984 మెట్రిక్ టన్నులు, సహకార సంఘాలు, మార్కెటింగ్ సొసైటీల దగ్గర 54.535 మెట్రిక్ టన్నుల యూరియా ఉందన్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ వర్షపాతం 401.1 మి.మీ కాగా ఇప్పటి వరకు 141.3 మి.మీ., వర్షపాతం నమోదైందన్నారు. ఖరీఫ్–2025లో సాధారణ పంట విస్తీర్ణం 4,22,510 హెక్టార్లు కాగా.. పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న, వరి, మినుము, ఉల్లి, మిరప తదితర ప్రధాన పంటలు సాగు చేస్తారన్నారు. అయితే ఇప్పటి వరకు 2,19,875 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయని, ఇందులో ప్రధానంగా పత్తి 1,63,792 హెక్టార్లలో సాగైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు చిప్పగిరి, ఆలూరు, హొళగుంద, హాలహర్వి మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తంగా సగటున 8 మి.మీ వర్షం కురిసింది. జూలై నెల సాధారణ వర్షపాతం 90.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 75 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల్లో వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
సాక్షి,కర్నూలు: మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సత్తా చాటారు. దీంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.నేడు నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి పోటీ లేకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలే ఏక గ్రీవమయ్యారు. ఓటమి భయంతో టీడీపీ కార్పోరేటర్లు పోటీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాని రెండవసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘నీ అంతు చూస్తా.. విధుల నుంచి తొలగిస్తా’
కౌతాళం: ‘నీ అంతు చూస్తా.. నిన్ను విధుల నుంచి తొలగిస్తా’ అని ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తనను కించపరిచేలా మాట్లాడారని ట్రాన్స్‌కో ఏఈ నర్సన్న ఆదోని సబ్ కలెక్టర్‌కు మౌర్య భరద్వాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నర్సన్న విలేకరులతో మాట్లాడుతూ.. ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం విద్యుత్ పనులు చేపడుతున్నామన్నారు. అయితే ఈఓ చులకనగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించా రు. ఈఓపై కౌతాళం పోలీసులకు ఫిర్యా దు చేసేందుకు వెళితే కేసు తీసుకోలేదన్నారు. జరిగిన ఘటనను తమ శాఖ అధికారులకు తెలిపి తమశాఖ అధికారులతో కలిసి ఆదోని సబ్‌కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కళ్యాణ కట్ట వద్ద విద్యుత్ స్తంభాలను మార్చాలని ఈఓ ఆదేశించారని, ఆ స్తంభాలు మార్చాలంటే ఎస్టిమేట్ వేయాలని తెలిపినా వినిపించుకోకుండా అనుచితంగా ప్రవర్తించారన్నారు. ఆలయ ఈఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కించపరిచేలా మాట్లాడిన ఉరుకుంద ఆలయ ఈఓ సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ట్రాన్స్‌కో ఏఈ -
కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాం
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న యూరియా కొరత ● మార్క్‌ఫెడ్‌లో బఫర్ స్టాక్ పశ్చిమ ప్రాంతానికే తరలింపు ● పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లపై కూటమి నేతల పెత్తనం ● నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేట్ డీలర్లకు కేటాయింపులు ● బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం ● కర్నూలు ర్యాక్ పాయింట్ యూరియా నంద్యాలకు.. ● మండల కేంద్రాల్లో రైతుల పడిగాపులు మాకు 30 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికే పత్తి, కంది సజ్జ తదితర పంటలు వేశాం. ఇటీవల వర్షాలు పడటంతో పత్తికి యూరియా అత్యవసరం. కాల్వలకు నీళ్లు వదలడం వల్ల వరి సాగుకు కూడా సిద్ధమవుతున్నాం. అయితే యూరియా దొరకని పరిస్థితి. జూలై నెలలో ఒక్క బస్తా కూడా అందుబాటులో లేదు. హొళగుంద మండలంలో ఏ ఒక్క ఆర్బీకేలో కూడా యూరియా లేదు. కర్ణాటకకు వెళ్లి రూ.400 ప్రకారం యూరియా తెచ్చుకుంటున్నాం. – మలిగిరి మల్లికార్జున, మాజీ సింగిల్‌విండో చైర్మన్, హొళగుంద కాల్వలకు నీళ్లు వదలడంతో వరి సాగుకు సిద్ధమవుతున్నాం. 9 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఇంతవరకు వర్షాలు లేవు. ఇటీవలనే వర్షం కురిసింది. ఈ సమయంలో యూరియా వేస్తేనే పంట బాగా వస్తుంది. పది రోజులుగా యూరియా కోసం చేయని ప్రయత్నం లేదు. సొసైటీలకు వస్తున్న ఎరువులను పలుకుబడి కలిగిన వారు తరలించుకుపోతున్నారు. నాలాంటి సామాన్య రైతులు అన్ని పనులు వదులుకొని రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నాం. – మహబూబ్‌బాషా, మల్యాల గ్రామం, నందికొట్కూరు మండలం కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వచ్చిన యూరియాలో 50 శాతం టీడీపీ నేతలు, మద్దతుదారుల తరలించుకుపోగా.. మిగిలిన అరకొర యూరియాను దక్కించుకునేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నారు. కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ వ్యయప్రయాసలకోర్చి మండల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కుతున్నా ఫలితం లేకపోతోంది. కూటమి ప్రభుత్వంలో రైతుల దీనావస్థలకు యూరియా కొరత అద్దం పడుతోంది. కర్నూలు జిల్లాకు సంబంధించి మార్కఫెడ్లో 5వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్‌లో ఉండాలి. ఇలా ఉంటే ఏ ప్రాంతంలో కొరత ఉంటే అక్కడకు సరఫరా చేసే వీలుంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్క్‌ఫెడ్‌లో యూరియా బఫర్ అనేది లేకుండా పోయింది. ఇప్పటి వరకు బఫర్‌లో ఉన్న యూరియాను వ్యవసాయ శాఖ ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు డివిజన్లకు ఇస్తున్నారు. మార్క్‌ఫెడ్‌లోని బఫర్ స్టాక్ మొత్తం పశ్చిమ ప్రాంతానికి తరలించినప్పటికీ కొరత కొనసాగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు రోజుల తరబడి ఆర్బీకేలు, డీసీఎంఎస్, పీఏసీఎస్‌లకు చుట్టు తిరగాల్సి వస్తోంది. ఆదోని, కౌతాళం, ఆలూరు, హొళగుంద, పెద్దకడుబూరు, దేవనకొండ, ఎమ్మిగనూరు, హాలహర్వి మండలాల్లో యూరియా కోసం నిత్యం రైతులు రోడ్డెక్కుతున్నారు. తుంగభద్ర తీరం వెంట వరి సాగు మొదలవుతుండటం వల్ల యూరియాకు డిమాండ్ ఏర్పడింది. అయితే మార్క్‌ఫెడ్‌లో యూరియా అనేదే లేకపోవడంతో రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రం కానుంది. నంద్యాల జిల్లాకు సంబంధించి మార్క్‌ఫెడ్‌లో జూలై మొదట్లో 9వేల టన్నుల యూరియా నేడు 1500 టన్నులకు పడిపోయింది. నంద్యాల జిల్లాకు జూలై నెలలో ఒక్క ర్యాక్ కూడా రాలేదు. ఇందువల్ల మార్క్‌ఫెడ్‌లో ఉన్న యూరియా క్రమంగా ఖాళీ అవుతోంది. యూరియా కోసం నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడుతూరు, ఆత్మకూరు, కొత్తపల్లి, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో కొద్ది రోజులుగా రైతులు పోరాటం చేయాల్సి వస్తోంది. నిబంధనలకు పాతర జిల్లాకు వచ్చే యూరియా సహా అన్ని రకాల రసాయన ఎరువుల్లో నిబంధనల ప్రకారం 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, 50 శాతం ప్రయివేటు డీలర్లకు ఇవ్వాల్సి ఉంది. అలా చేసినప్పుడే అత్యవసరం ఉన్న ప్రాంతాలకు కేటాయింపులు చేపట్టి కొరతను నివారించవచ్చు. ఇటీవల ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన 1500 టన్నుల యూరియా కర్నూలు ర్యాక్పాయింట్కు వచ్చింది. ఇందులో 50 శాతం మార్కఫెడ్కు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క టన్ను కూడా ఇవ్వలేదు. మొత్తం 1500 టన్నుల యూరియాను వ్యవసాయ యంత్రాంగం ప్రయివేటు డీలర్లేకే ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ప్రయివేటు డీలర్లకు కేటాయించిన విషయం కూడా బయటకు పొక్కనివ్వకపోవడం గమనార్హం. ఈ యూరియా మొత్తాన్ని ప్రయివేటు డీలర్లు బ్లాక్‌లో సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. పడిగాపులు కాస్తున్నాం -
రెండో రోజూ ముగ్గురే!
కర్నూలు(అర్బన్): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన మహిళా జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణకు రెండో రోజైన బుధవారం కూడా ముచ్చటగా ముగ్గురే హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమకు మండలాల్లో తమకు ఎలాంటి విలువను ఇవ్వడం లేదని, 19 నెలలుగా గౌరవ వేతనాలను కూడా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచారని జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేఫథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ‘ మహిళా నాయకత్వంలో మార్పు – స్థానిక స్వపరిపాలనలో సాధికారత ’ అనే అంశంపై మూడు రోజుల శిక్షణను స్థానిక జిల్లా పరిషత్‌లోని డీపీఆర్సీ భవనంలో ప్రారంభించారు. మొదటి రోజున ముగ్గురు మహిళా జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాగా, 2వ రోజు శిక్షణకు కూడా ముగ్గురే ( జెడ్పీ వైస్ చైర్మన్, హొళగుంద జెడ్పీటీసీ సభ్యురాలు కురువ బుజ్జమ్మ, గోస్పాడు నుంచి పీ జగదీశ్వరమ్మ, బండి ఆత్మకూరు నుంచి రామతులశమ్మ ) మాత్రమే హాజరయ్యారు. హాజరైన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులకు రిసోర్స్ పర్సన్స్ జీ నగేష్, కే రవికిశోర్ పలు అంశాలను వివరించారు. -
కర్నూలుకు నీటి సమస్య తలెత్తనీయొద్దు
కల్లూరు: కర్నూలు నగరానికి నీటి సమస్య తలెత్తకుండా హంద్రీ– నీవా ప్రధాన కాల్వ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని హెచ్ఎన్ఎస్ఎస్ డీఈని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద హంద్రీ–నీవా కాలువ విస్తరణ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. నీటి విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా హంద్రీ–నీవా కాలువ నీటితో 68 చెరువులను నింపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్‌తో పాటు అన్ని తూముల ద్వారా ఆయకట్టుకు నీటిని ఇవ్వాలన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ ఇన్చార్జ్ ఈఈ ప్రసాద్‌రావు, డీఈఈ కొండన్న, చెన్నయ్య, తహసీల్దార్ ఆంజనేయులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా -
జిల్లాలో పెరిగిన ఈదురు గాలుల తీవ్రత
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాలు అంతంతమాత్రం పడుతుండగా ఈదురు గాలుల తీవ్రత పెరిగింది. చలితో కూడిన ఈదురు గాలులతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 9 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చిప్పగిరిలో 18.6 మి.మీ., హాలహర్విలో 16.4, హొళగుందలో 7.4, మద్దికెరలో 7.2, ఆలూరులో 4.6, పత్తికొండలో 3.2, ఆదోనిలో 1,6, కౌతాళంలో 0.8, తుగ్గలిలో 0.4 మి.మీ ప్రకారం వర్షం కురిసింది. జూలై నెల సాధారణ వర్షపాతం 90.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 67 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న నాలుగైదు రోజుల్లో కూడా ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 2.19 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వర్షాలు అంతంతమాత్రం కావడంతో పంటల్లో ఎదుగుదల లోపించింది. 2న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఆగస్టు 2న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఈ సమావేశాలను ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య , వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష చేపడతామన్నారు. సమావేశాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు తమకు కేటాయించిన సమయానికి హాజరు కావాలని సీఈఓ కోరారు. ఐదు పంపులతో ‘హంద్రీ–నీవా’కు నీరు కర్నూలు సిటీ: హంద్రీ– నీవా సుజల స్రవంతి పథకం కాలువకు నీటి విడుదలను బుధవారం పెంచారు. మల్యాల నుంచి ఐదు పంపులతో కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ నెల 17న సీఎం చంద్రబాబు నాయుడు మల్యాల దగ్గర మోటర్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఆ రోజున మొదటగా 3 పంపులు ద్వారా 1013 క్యుసెక్కుల నీటిని పంపింగ్ చేశారు. మంగళవారం మరో మోటర్‌ను పెంచి అదనంగా 337 క్యుసెక్కుల నీటిని పెంచి, బుధవారం మరో మోటర్‌ను ఆన్ చేసి, మొత్తం 5 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. కృష్ణా జలాలు బుధవారం రాత్రికి అనంతపురం జిల్లాలోని జీడీపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్నట్లు హంద్రీనీవా ఇంజినీర్లు తెలిపారు. సెప్టెంబర్ 4న గణేశ్ నిమజ్జనోత్సవం కర్నూలు కల్చరల్: వినాయక చవితి ఉత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని గణేష్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.వేణుగోపాల్, గోరంట్ల రమణ తెలిపారు. కర్నూలు నగరంలో 9వ రోజు సెప్టెంబర్ 4వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం ఉంటుందని పేర్కొన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, గూడూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లో 5వ రోజు ఆగస్టు 31వ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. స్థానిక ఉత్సవ సమితుల కార్యకర్తలు గమనించాలని విజ్ఙప్తి చేశారు. ‘డీబీటీకి ప్రత్యేక ఖాతాలు అవసరం లేదు’ కర్నూలు(అగ్రికల్చర్): డీబీటీ కోసం మళ్లీ బ్యాంకుల్లో ఖాతా తెరవాల్సిన అవసరం లేదని ఎల్డీఎం రామచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ బ్యాంకులోనైనా ఇప్పటికే ఖాతా ఉన్న వారు తమ ఆధార్‌ను ఎన్పీసీఐలో మ్యాపింగ్ చేయించుకుంటే సరిపోతుందన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంక్ శాఖల్లో ఆధార్ నెంబర్‌తో ఎన్పీసీఐ మ్యాపింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను లింక్ చేయించుకొని డీబీటీ ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చన్నారు. కొంతమంది ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వాటిని నమ్మవద్దని పేర్కొన్నారు. -
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయండి
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాల ప్రారంభం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన మంగళవారం ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజుతో కలిసి ఆలయ ఆవరణలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని, అన్ని శాఖల అధికారులతో పాటు గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల వారు సహాయ సహకారం అందించాలని కోరారు. ఉరుకుందకు వచ్చే నాలుగు వైపులా రోడ్లకు మరమ్మతులు చేశారా? అని ఆర్అండ్బీ ఏఈ సాయిసురేష్ను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలని డీసీని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ కట్టను పరిశీలించి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. తాగునీటి ఏర్పాట్లపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. సీఐ అశోక్‌కుమార్, డిప్యూటీ కమిషనర్‌తో కలిసి నాలుగు వైపులా పార్కింగ్ స్థలాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. భక్తుల స్నానాల ఘాట్లను పరిశీలించారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తహసీల్దారు రజినీకాంత్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ముఖ్య అర్చకులు, ఆయాశాఖల అధికారులు, గ్రామపెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
8 నెలలుగా ఎదురుచూపులే..
ఉపాధ్యాయుడుగా కర్నూలు మండలం అంబేడ్కర్ పీఎస్హెచ్గా గత ఏడాది అక్టోబర్‌లో పదవీ విరమణ పొందాను. ఎనిమిది నెలలు గడచిపోయినా పూర్తి స్థాయిలో బెనిఫిట్స్ రాలేదు. ఇప్పటికీ గ్రాట్యూటీ రూ.16 లక్షలు పెండింగ్‌లో ఉంది. హాఫ్ పే లీవ్స్ బకాయిలు రూ.9 లక్షలు ఇవ్వాలి. వీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఇలా వేధించడం సరికాదు. – జయరాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు, మాజీ జనరల్ సెక్రటరీ, యూటీఎఫ్ -
కోలుకోలేక రైతు మృతి
చిప్పగిరి: పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయ త్నించిన రైతు చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని దౌల్తాపురం గ్రామానికి చెందిన కావలి రామాంజనేయలు (55)కు భార్య పుల్లమ్మ, కుమారుడు మహేష్‌తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు రామాంజనేయులు కుటుంబ సభ్యులకు తెలియకుండా తమకున్న 15 ఎకరాల్లో మూడెకరాలను చిప్పగిరికి చెందిన వారికి రూ.15 లక్షలకు విక్రయ అగ్రిమెంటు రాసి ఇచ్చి అడ్వాన్సుగా రూ.5 లక్షలు తీసుకున్నాడు. పొలం అమ్మడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడం, క్రయవిక్రయాల్లో తేడాలు రావడంతో మనస్థాపానికి గురై ఆదివారం పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా పురుగు మందు తాగినట్లు గుర్తించి గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు తెలిపారు. కూతురిని వేధిస్తున్నారని కత్తితో దాడి నంద్యాల: కూతురి వెంట పడుతూ వేధిస్తున్నారని ఇద్దరు మైనర్ బాలురుపై తండ్రి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నంద్యాలలో మంగళవారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన మైనర్ బాలికను విశ్వనగర్‌కు చెందిన ఇద్దరు మైనర్ బాలురులు గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. బాలిక వెంట పడటం, తరచూ ఇంటి వద్ద తిరుగుతూ అల్లరి పట్టిస్తుండటంతో విషయాన్ని కూతురు తన తండ్రికి తెలిపింది. గత కొన్ని రోజులుగా వారి ఆకతాయి చేష్టలను గమనిస్తూ వస్తున్న తండ్రి మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు తిరుగుతున్న ఇద్దరు మైనర్ బాలురులపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో ఇద్దరు మైనర్ బాలురులకు తీవ్ర గాయాలయ్యాయి. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మోదీ భజన తప్ప ప్రజా సంక్షేమం ఏదీ?
● ప్రభుత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్న నంద్యాల(న్యూటౌన్): రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోదీకి భజన చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. నంద్యాల పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం.. డోన్‌లో జరిగే సీపీఐ నంద్యాల జిల్లా రెండవ మహాసభ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, రామాంజనేయులు, సుంకన్న, బాబాఫకృద్దీన్, ప్రసాద్, రాధాకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈనెల 30, 31 తేదీల్లో డోన్‌లో జరిగే సీపీఐ మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈనెల 24, 25వ తేదీల్లో వివిధ దేశాల నుంచి కమ్యూనిస్టు నాయకులతో విజయవాడలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను అదానీ కాంట్రాక్టర్లతో ప్రజలకు అంటగట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టత లేదని, సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలగనూరు రిజర్వాయర్‌కు నిధులను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు శ్రీనివాసులు, నాగరాముడు, సోమన్న, తదితరులు పాల్గొన్నారు. -
డ్రిప్ పరికరాలు సత్వరం సరఫరా చేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు సకాలంలో సూక్ష్మసేద్యం పరికరాలు సరఫరా చేయడంతో పాటు వాటిని వెంటనే అమర్చాలని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసులు డ్రిప్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కర్నూలులోని ఉద్యానభవన్‌లో డ్రిప్ కంపెనీల జిల్లా కో–ఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26లో 7వేల హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 591 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజక వర్గాలకు ఫిబ్రవరిలోపు 2500 హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అమర్చాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన పరికరాలు, మెటీరియల్ సరఫరా చేయాలని సూచించారు. ఈ ఏడాది ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ మంజూరు చేస్తామన్నారు. ఏపీఎంఐపీ అదనపు పీడీ పిరోజ్‌ఖాన్ మాట్లాడుతూ అన్ని కంపెనీలు నాణ్యమైన పరికరాలు ఇచ్చి సహకరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఉద్యాన అధికారులు మదన్‌మోహన్‌గౌడు, నరేష్‌కుమార్‌రెడ్డి, ఎంఐ ఇంజనీర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
● మొదటి సారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పెన్షనర్లు ● కమిటేషన్ పేరుతో దోపిడీ చేస్తుండటంపై రగిలిపోతున్న పెన్షనర్లు ● ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కొమ్ముకాస్తుండటం పట్ల ఆందోళన ● రూ.20వేల లోపు వేతనాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందని సంక్షేమ పథకాలు ● ఐదు డీఏలు పెండింగ్, పీఆర్సీ లేదు, ఐఆర్ ఊసే కరువు బయటకు చెప్పుకోలేక.. మోసాన్ని భరించలేక! కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కక్కలేక, మింగలేక సతమతం అవుతున్నారు. ఉద్యోగుల పక్షాన పోరాటం చేసి ఆర్థిక ప్రయోజనాలు సాధించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దల కు కొమ్ముకాస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెన్షనర్లు (విశ్రాంత ఉద్యోగులు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పటై 13 నెలలు గడుస్తోంది. అయితే ఇప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పక్షాన ఏపీఎన్జీఓ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పోరాడాల్సి ఉంది. అయితే సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుండటం పట్ల ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్లను సాధించుకోవడంలో పెన్షనర్లను చూసి నేర్చుకోవాలని ఆయా సంఘాల నేతలకు ఉద్యోగులు సూచిస్తుండటం గమనార్హం. కమిటేషన్ పేరుతో దోపిడీ కమిటేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను దోపిడీ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కమిటేషన్ తీసుకుంటారు. దీనిని అసలు, వడ్డీ సహా 15 ఏళ్లలో రికవరీ చేయాల్సి ఉంది. 11 ఏళ్ల 3 నెలల్లో ఈ మొత్తం రికవరీ పూర్తవుతుంది. అయితే 15 ఏళ్ల పాటు రికవరీ చేస్తుండటం పట్ల ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై కొన్ని నెలల క్రితం సుప్రీం కోర్టు కమిటేషన్ రికవరీ 11 ఏళ్ల 3 నెలలకే పూర్తి అవుతున్నందున 15 ఏళ్లు రికవరీ చేయరాదని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్డు ఆదేశాల తర్వాత ఐదారు నెలల పాటు కమిటేషన్ రికవరీని నిలుపుదల చేసింది. రెండు నెలలుగా ప్రతి ఉద్యోగి నుంచి స్థాయిని బట్టి రూ.4500 నుంచి రూ.8 వేల వరకు మళ్లీ రికవరీ చేస్తుండటం పట్ల పెన్షనర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. అరకొర బకాయిలే విడుదల కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్నా ఉద్యోగుల బకాయిలకు ఒకసారి రూ.1300 కోట్లు, మరోసారి రూ.7200 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇప్పటికీ దాదాపు రాష్ట్రం మొత్తం మీద బకాయిలు రూ.28 వేల కోట్ల వరకు ఉండిపోయాయి. ఇప్పటి వరకు విడుదల చేసింది మొత్తం బకాయిలో 10 శాతం మాత్రమే. ఈ మాత్రం దానికే ఉద్యోగ సంఘాల నేతలు మహదానంద పడిపోతుండటం పట్ల ఉద్యోగుల్లో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు 27 శాతం మధ్యంతర భృతి చెల్లించారు. ఇవీ సమస్యలు.. కూటమి ప్రభుత్వం ఏర్పటై 13 నెలలు గడిచినప్పటికీ ఒక్క డీఏ కూడా చెల్లించని పరిస్థితి. 2024 మార్చి నాటికి ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పటి వరకు మధ్యంతర భృతి(ఐఆర్) ఊసే లేదు. 12వ పీఆర్సీ జాడ లేకుండా పోయింది. ఉద్యోగులు మరణించినప్పుడు మట్టి ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లిస్తారు. కూటమి ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఏపీజీఎల్ఐ చెల్లింపులు నిలిచిపోయాయి. జీపీఎఫ్, పీఎఫ్ ఊసే లేకుండా పోయింది. సరెండర్ లీవ్ బకాయిలు భారీగా పెండింగ్‌లో ఉండిపోయాయి. కనీసం మెడికల్ రీయింబర్స్‌మెంటు బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి. రూ.20 వేల లోపు వేతనాలు తీసుకుంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే హామీ ఇచ్చి విస్మరించారు. 2024 జాన్ తర్వాత పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ మినహా ఇతరత్రా ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. 10 నెలల గ్రాట్యూటీ, కమిటేషన్ తదితరాలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. పదవీ విరమణ పొందిన ఒక్కో ఉద్యోగికి సగటున రూ.40 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
ఆదాయ లక్ష్య సాధనపై దృష్టి పెట్టండి
కర్నూలు: జిల్లా రవాణా శాఖకు కేటాయించిన ఆదాయ లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి జిల్లా రవాణా శాఖ అధికారులకు సూచించారు. త్రైమాసిక తనిఖీలో భా గంగా మంగళవారం ఆమె జిల్లా పర్యటనకు వచ్చారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ శివారులో ఉన్న ఉప కమిషనర్ కార్యాలయానికి చేరుకోగానే డీటీసీ ఎస్.శాంతకుమారి,ఆర్టీఓ ఎల్.భరత్ చవాన్, ఏఓ వెంకట కుమార్ తది తరులు ఆమెకు పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో అధికారులతో సమావేశమై రవాణా శాఖ పురోగతిపై చర్చించారు. రికార్డులను పరిశీలించి లక్ష్యసాధనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలు సుకున్నారు. పన్ను వసూళ్లు, వాహనాల అమ్మకాలు, ఎన్ఫోర్స్మెంట్ తదతరా ల ద్వారా ఎంత ఆదాయం సమకూరింది, త్రైమాసిక పన్నులు సక్రమంగా వసూలయ్యాయా? పన్నులు చెల్లించకుండా తిప్పుతున్న వాహనదారులకు ఎంతమందికి నోటీసులు జారీ చేశారు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారు తదితర అంశాలపై కూలంకుశంగా చర్చించారు. అలాగే రోడ్డు భద్రతపై శాఖాపరంగా తీసుకుంటు న్న చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎంవీఐలు రవీంద్ర కుమార్, సుధాక ర్‌రెడ్డి, ఏఎంవీఐలు బాబు కిషోర్, గణేష్ బాబు సమావేశంలో పాల్గొన్నారు. నేడు నంద్యాల... జిల్లాలో ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉండగా.. మొదటి రోజు కర్నూలు, ఆదోని కార్యాలయాల్లో ఆమె తనిఖీలు పూర్తి చేశారు. నంద్యాలలో ఆర్టీఓ కార్యాలయం, డోన్, ఆత్మకూరులో ఎంవీఐ కార్యాలయాలు ఉన్నాయి. బుధవారం ఆయా కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
షూటింగ్ సందడి
బేతంచెర్ల: మండల పరిధిలోని కనుమ కింది కొట్టాల గ్రామ సమీపాన ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన బిళ్ల సర్గం గుహల వద్ద మంగళవారం సినిమా షూటింగ్‌తో సందడి నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన సినిమా బృందం సత్యదేవ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంఽధించి చిత్రీకరణ జరుపుతోంది. ఇందుకోసం వేసిన సెట్టింగ్‌లు, తాత్కాలిక గుడిసెలు, నటీనటుల మేకప్, సినీ సరంజామా, ఆర్టిస్టులు, పర్యాటకులతో సందడి నెలకొంది. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిళ్ల సర్గం గుహల అభివృద్ధికి పర్యాటక శాఖ తరఫున రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో గుహలలో ఫుట్‌పాత్ వే తో పాటు లైటింగ్, రెస్టారెంట్, టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. పనులు పూర్తయిన తర్వాత 2024 జనవరి 29 నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో పర్యాటకుల సంఖ్య పెరగడమే గాకుండా సినిమా షూటింగ్‌లకు సైతం అనుకూలంగా మారింది. గతేడాది రాచరికం సినిమా, ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ జరుగుతుండటంతో బిళ్ల సర్గం గుహల వద్ద సందడి నెలకొంది. -
కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారిద్దాం
● నగరంలో ఏడాది కాలంగా అభివృద్ధి పనుల్లేవు ● కల్లూరు, పాతబస్తీలో సమస్యల దరువు ● వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీ, కాటసాని కర్నూలు (టౌన్): మరో ఎనిమిది నెలల వ్యవధిలో వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్పొరేటర్లకు పిలుపు నిచ్చారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో నగర మేయర్ బీవై రామయ్యతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 24వ తేదీన ముగియనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై చర్చించారు. నాలుగు సంవత్సరాలుగా ఐదుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగారని, ఇప్పుడు కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్వీ, కాటసాని మాట్లాడుతూ.. నగర నూతన పాలక మండలి 2021లో కొలువు తీరిందన్నారు. నాలుగు సంవత్సరాలుగా నగరంలోని కర్నూలు అర్బన్, కల్లూరు అర్బన్, కోడుమూరు అర్బన్ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామ న్నారు. మౌలిక సదుపాయాలతో పాటు నగరాన్ని ఆకర్షించే విధంగా థీమ్ పార్కులు, రహదారులు, డ్రైనేజీలు, డివైడర్లు, ఇండోర్ స్టేడియాలు, క్రికెట్ స్టేడియం, టెన్నిస్ కోర్టు ఇలా.. ఎన్నో చేపట్టామన్నారు. రూ.28 కోట్లతో నగరపాలక సంస్థ నూతన భవనం నిర్మాణాన్ని 80 శాతం మేర పూర్తి చేశామని, రూ.2.50 కోట్లు వెచ్చించి టర్ఫ్ స్టేడియాలు నిర్వహిస్తే నిర్వహణ లేక పిచ్చిమొక్కలు పెరిగాయన్నారు. ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా... ఈ పరిస్థితులు కర్నూలు కార్పొరేషన్లో కనిపించడం దారుణమన్నారు. ఏడాది దాటినా ... అభివృద్ధి పనులేవీ.? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్నూలు నగర పాలక పరిధిలో కనీసం టెండర్లు నిర్వహించలేని పరిస్థితి ఉందని ఎస్వీ, కాటసాని విమర్శించారు. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. నేతల ఒత్తిడి తట్టుకొలేక కమిషనర్ బదిలీ వెళ్లిపోయారన్నారు. కల్లూరులో వర్షాకాలంలోనూ మంచినీటి సమస్య నెలకొందన్నారు. పాతబస్తీలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందన్నా రు. కాలనీలు కంపు కొడుతూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వచ్చే 8 నెలల్లో కార్పొరేషన్లో ఎన్నికల హడావుడి ప్రారంభమవుతుందన్నారు. కూటమి వైఫల్యాలపై ప్రజలకు వివరిద్దామని పిలుపు నిచ్చారు. పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో విశ్వాసంలో ఉందని, కలిసికట్టుగా ప్రజల పక్షాన నిలిచి ప్రజా పోరాటాలు చేద్దామన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుకా, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
● ఒట్టి పొలాల్లోనే ఉల్లి నాట్లు
కోడుమూరులో ఒట్టి పొలంలో ఉల్లి నాట్లు వేస్తున కూలీలు ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నకు నేడు అన్నీ కష్టాలే. ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన వానలే తప్ప మళ్లీ వరుణుడి జాడలేకపోవడంతో పంటల సాగు భారమవుతోంది. ఉల్లి సాగుకు సమయమైనా, తగిన వానల్లేక రైతులు దిగాలు చెందుతున్నారు. అయితే మండలంలోని కోడుమూరు, వెంకటగిరి గ్రామాల్లోని రైతులు వరుణుడిపైనే భారమేసి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎలాంటి తేమలేని ఒట్టిపోయిన పొలాల్లో ఉల్లినాట్లు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సమయానికల్లా రైతులు వర్షాధారంగా ఉల్లి పంటను సాగు చేసేవారు. ఈ ఏడాది వానల్లేక భూమిలో తేమ లేకుండాపోయింది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అదను దాటిపోతుందన్న ఆందోళన, ఉల్లి నారు వృథా అవుతుందనే భయంతో రైతులు నాట్లకు సిద్ధమయ్యారు. ఎకరా ఉల్లి సాగుకు నారు కొనేందుకు రూ.15వేలకు పైనే ఖర్చవుతుంది. నాట్లు వేసేందుకు కూలీలకు ఎకరాకు రూ.10వేలకు పైనే వెచ్చించాలి. వాన కురిస్తే సరేసరి.. లేదంటే రెండు మూడు రోజుల్లో కష్టమంతా మట్టిపాలేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కోడుమూరు రూరల్ భారమంతా వరుణుడిపైనే! -
చాతుర్మాస దీక్షలో పీఠాధిపతి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు 13వ చాతుర్మాస దీక్ష స్వీకరించారు. మంగళవారం ఉదయం పూజామందిరంలో వేద మంత్రోచ్ఛారణలు, విశిష్ట పూజోత్సవాలు మధ్య దీక్ష చేపట్టారు. ముందుగా రాఘవేంద్రుల మూల బృందావనంతో దీక్ష పదార్థాలకు పూజలు గావించారు. రాములోరి సంస్థాన పూజ చేపట్టి శాస్త్రోక్తంగా దీక్షబూనారు. మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోన్నాపూర్ దీక్ష క్రతువులో పాల్గొన్నారు. అనంతరం దీక్ష ప్రశస్థిపై పీఠాధిపతి ప్రవచించారు. 49 రోజుల పాటు స్వామిజీ దీక్షలో కొనసాగనున్నారు. ఆనవాయితీలో భాగంగా దీక్ష సమయంలో నియమావళి ప్రకారం ఆహారం, ఫలాలు, కూరగాయలు స్వీకరిస్తారు. నేడు ‘డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ’ ● ఫోన్ చేయవలసిన నెంబర్ 73826 14308 కర్నూలు(అగ్రికల్చర్): ‘డయల్ యువర్ విద్యు త్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ఎం.ఉమాపతి తెలిపారు. బుధవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం నిర్వ హిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడు దల చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయా లు, లో వోల్టేజీ, విద్యుత్ సిబ్బంది పనితీరు, ఇతరత్రా విద్యుత్ సమస్యలపై డయల్ యువ ర్ ఎస్ఈకి వినియోగదారులు 73826 14308 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. విద్యార్థులకు కంటి పరీక్షలు కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు ప్రారంభించినట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ సంధ్యారెడ్డి చెప్పారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 21 నుంచి అక్టోబర్ 31వ తేది వరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 6 నుంచి 18 సంవత్సరాల్లోపు వయస్సు విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉంటే ఉచితంగా చికిత్సలు, కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న పారామెడికల్ ఆఫ్తాల్మిక్ ఆఫీసర్లు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించండి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.రామంజనేయులు కంపెనీల ప్రతినిధులకు సూచించారు. 2025–26లో 550 హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 86 హెక్టార్లలో ప్లాంటేషన్ పూర్తయిందన్నారు. కలెక్టరేట్లోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆయిల్‌పామ్ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 13 మండలాల్లో ఆయిల్‌పామ్ సాగుకు అవకాశం ఉందని, సెప్టెంబర్ 15 వరకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కొనసాగుతుందని, ఆలోపు కనీస లక్ష్యంలో 50 శాతం ప్లాంటేషన్ పూర్తి కావాలన్నారు. నీటి వసతి కలిగిన రైతులకు అవగాహన కల్పించాలన్నారు. హెక్టారుకు ప్లాంటేషన్‌కు రూ.29 వేలు, నిర్వహణకు రూ.5250, అంతరపంటల సాగుకు రూ.5250 సబ్సిడీ వస్తుందన్నారు. సమావేశంలో సాంకేతిక ఉద్యాన అధికారి అనూష తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక
కల్లూరు: పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామంలో టీడీపీకి చెందిన పది కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మంగళవారం తమ్మరాజు పల్లె వైఎస్సార్సీపీ నాయకులు కోడె శేషయ్య ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సమక్షంలో పది కుటుంబాల సభ్యులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కాటసాని కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గోవర్దన్, ఎం. మహేంద్ర, హరిష్, వేణు, శ్రీధర్, కేశవ, మద్దిలేటి, రాజేష్, మహేంద్ర, షేక్షా హుస్సేన్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం కావడంతో పార్టీ వీడి వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. -
కూటమి ప్రభుత్వంలో మాకు విలువ ఎక్కడిది?
● మూడు రోజులు శిక్షణ తీసుకున్నా ఫలితం శూన్యం ● మహిళా జెడ్పీటీసీల ఆందోళన ● 27 మంది మహిళా జెడ్పీటీసీలలో ముగ్గురే హాజరు కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మండలాల్లో తమకు ఎలాంటి విలువ లేకుండా పోయిందని జెడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కూటమి నేతలు చెప్పిందే వేదంగా మండల స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తున్నా రని వారంటున్నారు. తమకు విలువ లేని సమయంలో ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ తీసుకున్నా, ఉపయోగం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. శిక్షణలో తెలుసుకున్న పలు అంశాలను మండలాల్లో అమలు చేసేందుకు అధికారుల నుంచి సరైన సహకారం లేకపోవడంతో శిక్షణ తీసుకొని ఏమి ఉపయోగమని వారంటున్నారు. అందుకే శిక్షణకు హాజరు కాలేకపోతున్నామని చెబుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు స్థానిక జిల్లా పరిషత్‌లోని డీపీఆర్సీ భవనంలో ‘మార్పు ద్వారా విజేతలు – సాధికారతతో సుపరిపాలన సాధ్యం’ అనే అంశంపై ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహిళా జెడ్పీటీసీలకు శిక్షణా తరగతులను ప్రారంభించారు. మొదటి రోజైన మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డితో ముగ్గురు మహిళా జెడ్పీటీసీలు (పగిడ్యాల నుంచి పి దివ్య, కృష్ణగిరి నుంచి కేఈ సుభాషిణి, నందికొట్కూరు నుంచి షేక్ కలీమున్సీసా) మాత్రమే హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్‌తో కలిపి మొత్తం 53 మంది జెడ్పీటీసీలు ఉండగా, ఇందులో 27 మంది మహిళలు ఉన్నారు. వీరిలో తొలి రోజు శిక్షణకు కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షణను కొనసాగించాల్సి ఉన్నందున .. జ్యోతి ప్రజ్వలన చేసి డా.బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి శిక్షణను ‘మమ’ అనిపించారు. హాజరైన ముగ్గురు జెడ్పీటీసీలకు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులావాణి, రిసోర్స్ పర్సన్స్ కే రవికిశోర్, జీ నగేష్, టీ రాముడు పలు విషయాలపై కొద్ది సేపు అవగాహన కల్పించి శిక్షణా తరగతులను ముగించారు. అందని గౌరవ వేతనాలపైనా పెదవి విరుపు ... నిధులు లేకపోవడం, విధుల నిర్వహణలో అడ్డంకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీలకు ఇచ్చే గౌరవ వేతనాలను కూడా పెండింగ్‌లో పెట్టడం వల్ల కూడా జెడ్పీటీసీలు శిక్షణా తరగతులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనట్లు తెలుస్తోంది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 19 నెలలుగా జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఒక్కో జెడ్పీటీసీకి నెలకు రూ.6 వేల ప్రకారం 19 నెలలకు రూ.1.14 లక్షలను ప్రభుత్వం బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్మన్‌ను మినహాయించి మిగిలిన 52 మంది జెడ్పీటీసీలకు ఈ నెలతో కలిసి రూ.59.28 లక్షలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలాగే మరో ఏడాది మాత్రమే పదవీ కాలం ఉన్నందున ఇప్పుడు శిక్షణ తీసుకొని ఉపయోగమేంటనే భావనను కూడా పలువురు జెడ్పీటీసీలు వ్యక్తం చేస్తున్నారు. -
అవినీతి కేంద్రం.. ఆర్టీఏ కార్యాలయం
● ప్రతి పనికీ రేటుకట్టి అదనపు వసూళ్లు ● ఇతర రాష్ట్రాల వాహనాల బదిలీకి ప్రత్యేక ‘ధరలు’ ● లంచాల వసూళ్లకు ప్రైవేటు సైన్యం ● కార్యాలయం వద్ద ఒకరు.. పాత ఆర్టీఓ ఆఫీసు వద్ద మరొకరు ● ఆలిండియా పర్మిట్ చలానాకూ పైసలదే పైచేయి ● ఏజెంటు ద్వారా వెళితే ఎలాంటి సమస్యకై నా పరిష్కారం ● నేరుగా వెళితే చుక్కలు చూపుతున్న ఉద్యోగులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుముతోనే అందించాల్సిన సేవలకు అదనంగా ముట్టజెబితే కానీ పని జరగని పరిస్థితి. ఆఫీసులోనే ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వాహనదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వస్తే వివిధ కారణాలను సాకుగా చూపి అర్జీని వారం, పది రోజులు పరిశీలనలో పెట్టి తిప్పుకోవడం పరిపాటిగా మారింది. రవాణా కార్యాలయానికి దళారులు రాకూడదు. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులకు స్థానం లేదు. నేరుగా కార్యాలయానికి వచ్చి పనులు చేయించుకునే విధానం అమలులో ఉంది. మా ఉద్యోగులే సహాయకులుగా అన్ని పనులూ చేసిపెడతారు. సీసీ కెమెరాల నిఘాలో కార్యాలయం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకుని పనులు పూర్తి చేసుకోవచ్చు. కర్నూలు: రవాణా శాఖ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్కడా అధికారులు, ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. ప్రైవేటు వ్యక్తులే అంతా చక్కబెట్టుతున్నారు. కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసిన మామూళ్ల సమాచారం ఓ కీలక ఉద్యోగికి ప్రైవేటు వ్యక్తి ‘సత్యం’ వెళ్లి లెక్కలు చక్కబెబుతాడు. చేసిన పనిని బట్టి ఏజెంట్ల నుంచి తమకు రావాల్సిన వాటా డబ్బులు పాత ఆర్టీఓ ఆఫీసు వద్ద మరో ప్రైవేటు వ్యక్తి ‘హరూన్’ ద్వారా రాబట్టుకుంటున్నారు. అధికారుల తరఫున ఈ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం సాగుతోంది. ఏజెంట్లు, అధికారుల మధ్య ప్రయివేట్ వ్యక్తులు వారధులు ఈ అవినీతి బాగోతం సాగుతోంది. కార్యాలయ అధికారులు వస్తుంటారు, బదిలీపై వెళ్తుంటారు, కానీ ఇక్కడ వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు మాత్రం శాశ్వతం. ఒక్కొక్కరు 15 నుంచి 20 ఏళ్ల దాకా రవాణా శాఖలో అనధికారికంగా ఉంటూ వసూళ్లను చక్కబెడుతున్నారు. రవాణా శాఖలో ప్రతి అధికారికి వాహన వెసులుబాటు కల్పించడంతో.. వాటికి డ్రైవర్లుగా తమకు కావలసిన ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారి ద్వారా అవినీతి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పేరుకే ఆన్లైన్.. ఆఫ్‌లైన్ ముడుపులే! రవాణా శాఖలో వాహనాలకు సంబంధించిన సేవలు ఆన్లైన్లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలకు అదనంగా ముట్టజెబితే కానీ పని జరగని పరిస్థితి. ఆఫీసులోనే ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వాహనదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లో కట్టిన చలానాల ద్వారానే కార్యాలయంలో పనులు చేయాలి. అయితే దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో (జిరాక్స్ కాపీలు) సమర్పించి ముడుపులు ముట్టజెబితే తప్ప పనులు కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల బండ్లు వెరిఫికేషన్ కోసం రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు మామూళ్లు దండుకుంటున్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా డబ్బులు ముట్టజెప్పాల్సిందే. క్రూజర్లు, ఆటోరిక్షాలు, స్కూల్ బస్సులు, హెవీ గూడ్స్ వాహనాల వెరిఫికేషన్ తదితర సేవలకు కూడా వాహనదారులు ముడుపులు సమర్పించుకోవాల్సిందే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా వసూళ్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కార్యాలయ సిబ్బంది ప్రతి పనికి ‘అదనపు ధర’ నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి తంతుపై మరోసారి ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇవీ వసూళ్లు.. నాన్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ అప్రూవల్‌కు మామూళ్లు ఇవ్వాల్సిందే. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ఓసీపై వచ్చిన వాహనాల బదిలీకి, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు బదిలీ చేయడానికి అదనం డబ్బు వసూలు చేస్తున్నారు. కొత్త లారీలు రిజిస్ట్రేషన్‌కు సపరేటు ధర ఉంటుంది. లారీలకు ఆలిండియా పర్మిట్ చలానాకు మామూళ్లు ఇవ్వాల్సిందే! హెవీ ఎల్ఎల్ఆర్ ఎండార్స్‌మెంట్‌కు, షోరూమ్ నుంచి వచ్చిన ఓమ్నీ బస్సులను స్కూల్ బస్సులుగా మార్పు చేసేందుకు అధికంగా డబ్బు చెల్లించాల్సిందే! అధికారులు చెప్పే మాటలు ఇవీ... వాస్తవంలో జరుగుతోంది ఇలా.. ఏసీబీ అధికారులు హెచ్చరించినా కనిపించని మార్పు రవాణా శాఖ కార్యాలయానికి నిత్యం వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. వందలో కనీసం ఐదారుగురు కూడా నేరుగా రావడం లేదు. ఒకవేళ ఎవరైనా నేరుగా వస్తే పలు కారణాలు చూపి అతని అర్జీని పరిశీలనలో పెట్టి వారం, పది రోజులు తిప్పుకుంటున్నారు. సమయం వృథాతో పాటు కార్యాలయంలో తలెత్తే ఇబ్బందిని చూసి దరఖాస్తుదారులు కూడా ఏజెంట్ల వద్దకు వెళ్తున్నారు. ఈ కార్యాలయంలో అధికారులు మారినా వారి తీరు మారడం లేదు. గతంలో ఏసీబీ అధికారులు కార్యాలయంతో పాటు ఆర్టీఏ చెక్‌పోస్టులో తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు అందించే సేవల్లో మార్పు రావాలని హెచ్చరించారు. అయినా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఒకరిద్దరు మినహా మిగతా అధికారులంతా కొత్తగా వచ్చారు. ప్రతి పనికి ఇక్కడ పైసలదే పైచేయి అవుతోంది. ‘అసలు ఫీజు’తో పాటు ‘కొసరు ఫీజు’ను కూడా వాహనదారులు చెల్లించుకోవాల్సి వస్తోంది. -
‘ఫ్రీజింగ్’తో ముప్పుతిప్పలు
పాత వాహనానికి యజమాని వివరాలు మార్పు చేయాలన్నా ఇక్కడ డబ్బులు ముట్టజెప్పాల్సిందే. వాహనం ఇతర జిల్లాలకు అమ్మిన సమయంలో ఇచ్చే క్లియరెన్స్ సర్టిఫికెట్లు (అనుమతి పత్రాలు)కు కూడా ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేదంటే వారం, రెండు వారాల పాటు తిప్పుకుంటూ ఆన్లైన్లో ‘ఫ్రీజింగ్’లో పెట్టి దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వాహన యాజమాన్యం హక్కుల మార్పు, అనుమతుల పొడిగింపు, ఈ–కేవైసీ, మండల మ్యాపింగ్, టెలిఫోన్ నెంబర్ అప్డేషన్ తదితర వాటికి కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. -
ఉన్నత స్థాయికి చేరుకోవాలి
నంద్యాల(అర్బన్): వసతి గృహంలోని బాలికలందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగ వయోవృద్ధులు, సచివాలయ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రి సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి స్థానిక గిరినాథ్ సెంటర్లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహం 1–2ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో గదులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమాన్ని అందిపుచ్చుకొని పేద విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదల సంక్షేమం, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను అర్హులైన పేద వినియోగం సద్వినియోగం చేసుకోవాన్నారు. అనంతరం వసతి గృహంలోని బాలికలతో కలిసి మంత్రి,, కలెక్టర్ భోజనం చేసి ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ● సోమవారం రాత్రి కలెక్టరేట్లో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్, గ్రామ, వార్డు సచివాలయాల అంశాలపై మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వేల్పనూరు, వెంకటాపురం, శ్రీశైలం, ఆత్మకూరు, నందికొట్కూర్, డోన్, బనగానపల్లె, నంద్యాల, కోవెలకుంట్ల వసతి గృహాల్లో తక్కువ శాతం అడ్మిషన్లు ఉన్నారని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, రాధిక, రయిజ్ ఫాతిమా, డీసీఓ శ్రీదేవి, ఖాదర్ బాషా, పాల్గొన్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి -
వాటర్ ఏటీఎంలు.. ఎనీ టైం మూత!
తుగ్గలి: ప్రజలకు శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు మూతపడ్డాయి. నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలక ధనం వృథా అవుతోంది. పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి మండలాల్లో రూ.9.62 కోట్లు ఖర్చు చేసి మదర్ప్లాంట్లు, ఆర్డీ యూనిట్లు ఏర్పాటు చేయాలని 2018 చివర్లో పనులు ప్రారంభించారు. అయితే సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తిచేసి ప్రజలకు రెండేళ్ల పాటు తక్కువ ధరకు శుద్ధజలం అందించింది. తుగ్గలి మండలంలో ఉప్పర్లపల్లి, కృష్ణగిరి మండలం కంబాలపాడు, వెల్దుర్తిలో మదర్ప్లాంట్లు ఏర్పాట్లు చేశారు. ఈ మదర్ ప్లాంట్ల ద్వారా తుగ్గలి మండలంలో 22 గ్రామాలకు కృష్ణగిరి మండలంలో 18 గ్రామాలకు వెల్దుర్తి మండలంలో 21 గ్రామాలకు శుద్ధజలం సరఫరా చేసేవారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్డీ యూనిట్లలో ప్రజలు ఏటీఎం కార్డుల ద్వారా రూ. 4 చొప్పున చెల్లించి 20 లీటర్ల మినరల్‌వాటర్‌ను తీసుకెళ్లే వారు. రెండేళ్ల పాటు శుద్ధజలం సక్రమంగా సరఫరా చేశారు. అయితే ట్రాక్టర్ల నిర్వహణ బిల్లులు, సిబ్బంది వేతనాలు కాంట్రాక్టర్ సరిగా చెల్లించక పోవడంతో ఆ తర్వాత నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోయింది. ప్రస్తుతం వాటర్ ప్లాంట్లు, వాటర్ ఏటీఎంలలోని పరికరాలు తుప్పు పట్టి పాడైపోతున్నాయి. కోట్లాదిసొమ్ము వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుద్ధజలం సరఫరా లేక జనం మళ్లీ బోర్లు, కుళాయి నీటిని తాగి ఫ్లోరైడ్ బారిన పడి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. పాలకులు, అధికారులు స్పందించి ప్లాంట్లు వినియోగంలోకి తీసుకొచ్చి శుద్ధజలం అందించాలని ప్రజలు కోరుతున్నారు. తుప్పుపడుతున్న పరికరాలు రూ.9.62 కోట్ల ప్రజాధనం వృథా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందని శుద్ధ జలం -
పౌష్టికాహారం ఇవ్వడం లేదు
● ఎంపీడీఓ కార్యాలయం వద్ద బాలింత నిరసన గోనెగండ్ల: తాను బాలింతను అయినా అంగన్వాడీ టీచర్ పౌష్టికాహారం ఇవ్వడం లేదని చిన్నమరివీడు గ్రామానికి చెందిన బండారి తేజ, ఆమె తల్లిదండ్రులు సుశాంతి, బతకన్నలు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. బాలింత తేజ 23 రోజుల చిన్నారిని ఎత్తుకొని తల్లిదండ్రులతో కలిసి సోమవారం ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చారు. ఎంపీడీఓ మణి మంజరికి తమ సమస్యను వివరించారు. తాను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్ నుంచి పౌష్టికాహారం అందడం లేదని ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ వర్కర్ దురుసుగా మాట్లాడుతున్నారని, తనకు ప్రసవం జరిగి 23 రోజులు అయిన తరువాత కూడా పౌష్టికాహారం ఇవ్వడం లేదన్నారు. తన తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పోషిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు.