breaking news
Nalgonda
-
రైతుల యూరియా కష్టాలు తీరుస్తాం
నిడమనూరు : కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు నిడమనూరు మండలంలోని వెనిగండ్ల గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి దృష్టికి పలువురు రైతులు, కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత విషయం తీసుకువచ్చారు. మిర్యాలగూడ ర్యాక్ పాయింట్‌కు ఒకటి, రెండు రోజుల్లో యూరియా రానుందని, సాగర్ ఆయకట్టు రైతుల అవసరాలు తీర్చేవిధంగా యూరియా అందించి కష్టాలు తీరుస్తానని ఈ సందర్భంగా జానారెడ్డి వారికి చెప్పారు. వెనిగండ్ల గ్రామ సీలింగ్ భూ వివాదాలు కూడా జానారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఊట్కూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ నాయకుడు విజయ్‌కుమార్.. జానారెడ్డిని కోరారు. ఊట్కూరులో ప్రభుత్వ భూమి 12 ఎకరాలు ఉందని, మరో 8 ఎకరాలు సేకరిస్తే చాలని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమికోసం సర్వే చేసినట్టు జానారెడ్డికి తహసీల్దారు జంగాల కృష్ణయ్య వివరించారు. వెనిగండ్ల గ్రామానికి చెందిన కొప్పోలు మట్టపల్లిరావు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులను జానారెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకతి సత్యం, నర్సింగ్ విజయ్‌కుమార్, ముంగి శివమారయ్య, నందికొండ మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జానారెడ్డి -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
దేవరకొండ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.2.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు దేవరకొండ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన పిట్ల గంగాధర(అలియాస్) సాంబ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చదువు మధ్యలో ఆపేసి కూలి పనులు చేస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గంగాధర జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న దేవరకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాపోతు రమేష్ ఇంట్లో ప్రవేశించి రూ.6 లక్షల నగదు, 2.2 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ చేసిన నగదులో సగం డబ్బు దేవరకొండ పట్టణంలోని ఖిలా పార్క్ వద్ద గంగాధర దాచిపెట్టాడు. ఆ నగదును తిరిగి తీసుకునేందుకు గురువారం పట్టణానికి వచ్చిన గంగాధరను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చోరీ చేసిన విషయం ఒప్పుకున్నాడు. కాగా గంగాధరపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో సుమారు 100 పైచిలుకు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు చేధించిన దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐలు నారాయణరెడ్డి, మౌనికలతోపాటు సిబ్బంది సతీష్, అంజయ్య, సింహాద్రిలను ఏఎస్పీ అభినందించారు. ఫ రూ.2.5లక్షల నగదు స్వాధీనం -
చికిత్స పొందుతున్న ముగ్గురు మృతి
భూదాన్‌పోచంపల్లి : ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మండలం దంతూర్ గ్రామానికి చెందిన రైతు దోటి నాగార్జున (43) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది బుధవారం తన వ్యవసాయ బావి వద్ద గుళికల మందు తాగాడు. అనంతరం తాను క్రిమిసంహారక మందు తాగానని చిన్న కుమారుడైన శివకు ఫోన్ చేసి చెప్పాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. ఘటనా స్థలానికి చేరుకుని చూడగా నాగార్జున అపస్మారక స్థితిలో కిందపడి ఉన్నాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. గురువారం మృతుడి పెద్ద కుమారుడు శ్రీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. భాస్కర్‌రెడ్డి తెలిపారు. కాగా మృతుడికి భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పంచాయతీ కార్మికుడు.. మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెం గ్రామ పంచాయతీలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బుర్రా ఏడుకొండలు(49) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుకొండలు నాలుగురోజుల క్రితం బక్కమంతులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని త్రివేణినగర్ వద్ద గల వాటర్ ట్యాంకును లోపలి భాగంలో శుభ్రం చేసే క్రమంలో జారిపడ్డాడు. ట్యాంకులో నీరు లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుర్తు తెలియని మహిళ.. పెద్దఅడిశర్లపల్లి : చికిత్స పొందుతున్న గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6వ తేదీన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని నీలంనగర్ సమీపంలో జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని గుర్తించినట్లయితే గుడిపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
చోరీకి గురైన మొబైల్ ఫోన్లు అప్పగింత
సూర్యాపేటటౌన్ : మొబైల్ పోయినా, చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లాలో సెల్ఫోన్లను వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 100 మందికి, రికవరీ చేసి గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.నరసింహ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైందని, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫొటోలు ఫోనన్‌లో నిక్షిప్తం చేసుకుంటున్నామన్నారు. మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందన్నారు.ే నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్‌ను అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారన్నారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మొబైల్స్ ను రికవరీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ మొబైల్ పోయినా, చోరీకి గురైనా సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి ఫ సూర్యాపేట ఎస్పీ నరసింహ -
అమ్మ పేరుతో మొక్క
గుర్రంపోడు : అమ్మ.. మొక్క.. భూమాత.. మూడింటి మధ్య సారుప్యత ఉంటుంది. అమ్మ కుటుంబానికి బాధ్యత వహిస్తే, మొక్కలు పర్యావరణాన్ని కాపాడతాయి. భూమాత జీవ రాశులను, పర్యావరణాన్ని కాపాడుతుంది. ఈ మూడింటికి ముడి పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి పేరుతో మొక్క నాటితే శ్రద్ధ చూపుతారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం చేపట్టింది. పర్యావరణ దినోత్సవమైన జూన్ 5, 2024లో ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రతిఒక్కరూ తల్లి పేరుతో మొక్క నాటాలని విస్త్రృత ప్రచారం చేసి భారీ సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టారు. ఇటీవల ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినుల భాగస్వాములను చేసి, ప్రతి విద్యార్థి తన తల్లితో కలిసి మొక్కను నాటాలని నిర్ధేశించారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కను పాఠశాల ఆవరణలోగాని, పరిసరాల్లోగాని నాటి నాటి ఏకో క్లబ్ మిషన్ లైఫ్ అనే పోర్టల్‌లో ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ విడుదల చేసిన లింక్‌లో విద్యార్థిని పేరు, తల్లి పేరు, పాఠశాల డైస్ కోడ్ వివరాలు నమోదు చేసి ఫోన్ గ్యాలరీ నుంచి ఫొటోను తీసుకుని అప్లోడ్ చేయగానే వారి పేరిట ఆన్లైన్లోనే ప్రశంసాపత్రం లభిస్తుంది. నాటిన ప్రతి మొక్కకు ప్రశంసాపత్రం లభిస్తుంది. ప్రశంసాపత్రాన్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రశంసాపత్రం ఫోన్లో డౌన్లోడ్లోగాని మరెక్కడా కనిపించదు. వెబ్ పోర్టల్‌కు సంబంధించి లింక్‌ను కూడా విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేసింది. మండలానికి 4 వేల మొక్కల చొప్పున ఒక విద్యార్థిని ఎన్ని మొక్కలైనా, ఎక్కడైనా తల్లితో కలిసిగానీ, పాఠశాలలో అయితే మహిళా టీచర్‌తో కలిసి గానీ నాటాలి. జిల్లాకు లక్ష మొక్కలు నాటేలా లక్ష్యం నిర్ధేశించగా మండలానికి 4 వేల మొక్కలు నాటి ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలకు 70 ఫొటోలు లక్ష్యం నిర్ధేశించారు. వన మహోత్సవ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్నందున ఇందులోనే తల్లిలో కలిసి విద్యార్థిని ఫొటోలు తీయాల్సి ఉంటుంది. నాటిన ప్రతి మొక్కకు విద్యార్థినికి ప్రశంసాపత్రం లభిస్తుండడంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థినులు తమ ఇంటి పరిసరాల్లో మొక్కను నాటి పాఠశాల యూడైస్ కోడ్, ఇతర వివరాలు నమోదు చేసి సొంతంగా అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు.విద్యార్థినులు తమ తల్లితో కలిసి మొక్కలు నాటి ఫొటోలు అప్లోడ్ చేసేలా అన్ని పాఠశాల హెచ్ఎంలకు దిశానిర్ధేశం చేశాం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే అవసరాన్ని వివరించి విరివిగా మొక్కలు నాటిస్తాం. గ్రామస్థాయిలో వన నర్సరీల నుంచి మొక్కలు పొంది నాటాలని సూచిస్తున్నాం. పాఠశాలలో సరిపడా స్థలం లేని చోట విద్యార్థిని ఇంటి వద్దగాని, పరిసరాల్లో గాని మొక్కను నాటి సంరక్షించాలని వివరిస్తున్నాం. –నోముల యాదగిరి, గుర్రంపోడు మండల విద్యాధికారి ఫ నాటిన ప్రతి విద్యార్థినికి ప్రశంసాపత్రం ఫ మొక్కల పెంపకంలో భాగస్వామ్యం ఫ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేంద్ర ప్రభుత్వం -
చోరీకి గురైన వినికిడి యంత్రాలు
చౌటుప్పల్ : కన్న కూతురికి పుట్టుకతో చెవులు వినిపించవు. మాటలు కూడా రావు. ప్రస్తుతం ఐదేళ్ల వయస్సు ఉన్న ఆ చిన్నారి అవస్థలకు తల్లడిల్లిన తల్లిదండ్రులు గతేడాది ఆగస్టులో ఆపరేషన్ చేయించారు. అదేఏడాది అక్టోబర్ నెలలో చెవులకు ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. దాంతో వినికిడి సమస్యకు పరిష్కారం దొరికింది. అదేవిధంగా నోటి మాటలను రప్పించేందుకు కూడా పడరానిపాట్లు పడుతున్నారు. స్వగ్రామం నుంచి నిత్యం హైదరాబాద్‌కు కూతురును తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ చిన్నారికి చెందిన వినికిడి యంత్రాలు బస్సులో చోరీకి గురయ్యాయి. దీంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన ఏరుకొండ నాగమణి తన కూతురు హాద్వికకు బుధవారం హైదరాబాద్‌లో థెరపీ చేయించి తిరిగి మధ్యాహ్నం 12.40కి దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన బస్సులో చౌటుప్పల్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి నల్లగొండ డిపో బస్సు పల్లెవెలుగు ద్వారా 2.00గంటల ప్రాంతంలో మునుగోడులో దిగింది. అటు నుంచి నేరుగా ఇంటికి వెళ్లి తన వెంట తీసుకెళ్లిన బ్యాగును పక్కన పెట్టింది. మరుసటి రోజు ఉదయం సమయంలో తనకు వినికిడి ఇబ్బంది అవుతోందని కూతురు చెప్పడంతో కూతురు చెవికి ఉన్న పరికరానికి చార్జింగ్ పెట్టేందుకుగాను బ్యాగులో ఉన్న బాక్స్‌ను తెచ్చేందుకు వెళ్లింది. బ్యాగులో బాక్స్ కన్పించకపోవడంతో ఇళ్లంతా వెతికినా ఎక్కడా లభ్యమవ్వలేదు. తాను ప్రయాణం చేసే క్రమంలో బ్యాగు నుంచి ఆ బ్యాక్స్ చోరీకి గురైందని ఆమె ఆలస్యంగా గుర్తించింది. దీంతో రెండు రోజులుగా కనిపించిన వారినందరినీ ఆరా తీస్తోంది. రూ.1.50లక్షల విలువ చేసే వినికిడి పరికరాలు ఎవరికై నా దొరికితే ఇవ్వాలని వేడుకుంటోంది. ఫ రూ.1.50 లక్షల విలువ ఉంటుందన్న బాధితురాలు -
డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామ శివారులో కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ ఆర్టీసీ డిపోనకు చెందిన టీజీ 05 జెడ్ 0045 నంబర్ గల బస్సు గురువారం చండూరు నుంచి జనగాం మీదుగా చౌటుప్పల్‌కు వెళుతోంది. ఈ క్రమంలో జనగాం నుంచి సంస్థాన్ నారాయణపురం వెళ్లే దారిలో కారు ఒకేసారి రోడ్డుపైకి వచ్చింది. కారును తప్పించే క్రమంలో బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. బస్సు టైర్లు, ఇంజన్ భూమిలోకి దిగబడ్డాయి. బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ పక్కనే బొంగోల కుంట ఉంది. కొంత అజాగ్రత్తగా వ్యవహరించినట్లయితే బస్సు కుంటలోకి దూసుకెళ్లేది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో వర్షం కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తర్వాత వచ్చిన బస్సులో ప్రయాణికులను తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని సంఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఫ బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఫ అందరూ సురక్షితం -
హైవేపై లారీ బోల్తా
బీబీనగర్: జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గూడ్స్ లారీ భువనగిరి వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా పోలీస్‌స్టేషన్ దాటగానే బ్రిడ్జిపై అదుపు తప్పింది. లారీ పల్టీ కొట్టగానే డ్రైవర్ సుక్శాంత్ దావ్లే లారీలోనుంచి ఎగిరి బ్రిడ్జి కింద వాగులో పడిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన డ్రైవర్‌ను వాగులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. లారీ హైవేపై అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సర్వీస్ రోడ్డు గుండా వాహనాలను మళ్లించి క్రేన్‌తో లారీని పక్కకు తీయించారు. తండ్రిపై మమకారం.. వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరూపంఆత్మకూర్ (ఎస్) : కనిపెంచిన తండ్రి విలువను వారు వదులుకోలేదు. తమ నుంచి తండ్రి దూరమై ఏడాదైనా ఆ జ్ఞాపకాలను అలాగే నెమరవేసుకున్నారు. తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని తమ వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించుకుని ప్రేమను చాటుకున్నారు ఆ కుమారులు. ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గుండు అబ్బయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా తమ తండ్రి జ్ఞాపకార్థం ఆయన కుమారులు గుండు లింగయ్య, గుండు రమేష్.. అబ్బయ్య విగ్రహాన్ని తయారు చేయించారు. గురువారం అబ్బయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో స్థానిక సీపీఎం నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుండు చిన్న లింగయ్య, రాచకొండ రమేష్, మడ్డి రమేష్, బుర్ర సోమయ్య, దండంపెల్లి కృష్ణయ్య, బైరు వెంకన్న, శంకర్, గుండు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మారుస్తాం
నల్లగొండ : నల్లగొండను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టిందని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 207.056 కేజీల గంజాయిని, 118 గంజాయి చెట్లను, 173 మత్తు టాబ్లెట్లను కోర్టు ఉత్తర్వుల ప్రకారం నార్కట్‌పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో గురువారం డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712670266కు సమాచారం తెలపాలని సూచించారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఫ రూ.52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దహనం -
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
మిర్యాలగూడ : నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పూసి చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గురువారం మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో నిర్వహించిన వీరతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఆయన అమరవీరుల కుటుంబాలను సన్మానించి మాట్లాడారు. ఆనాడు భూస్వాములు, పెత్తందారులు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో సబ్బండవర్గాలు, కులమతాలకు అతీతంగా పోరాడాయని గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ లేదని, కానీ ఆ పోరాటం హిందు, ముస్లింల మధ్య జరిగినట్లు చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. ఆనాటి చరిత్రను ప్రజలకు వివరించి చైతన్య పరించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో గ్రామగ్రామాన సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఎర్రజెండానే భవిష్యత్ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందాలని, సమానంగా హక్కులు పొందాలని ఎర్రజెండా పోరాడుతుందన్నారు. ఈనెల 17న నల్లగొండలో వారోత్సవ సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, వనం నాగేశ్వర్రావు, తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, సయ్యద్హాశం, బండ శ్రీశైలం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, పాదూరి శశిధర్‌రెడ్డి, సీతారాములు, వరలక్ష్మి, వినోద్‌నాయక్, జగదీశ్ఛంద్ర, మల్లు గౌతంరెడ్డి, పాండు, కృష్ణయ్య పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
సైన్స్ సెమినార్లతో శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చు
నల్లగొండ : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను సైన్స్ సెమినార్ ద్వారా తెలుసుకుని శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించుకుని బాలశాస్త్ర వేత్తలుగా ఎదగవచ్చని జిల్లా సైన్స్‌అధికారి వనం లక్ష్మిపతి పేర్కొన్నారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు, ఎస్ఈఆర్టీ ఆదేశాల మేరకు గురువారం డైట్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి సెమినార్లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో న్యాయ నిర్నేతలుగా శ్రీనివాసరెడ్డి, నాగార్జున పాల్గొన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా అందరికీ విద్య రామగిరి(నల్లగొండ) : అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా అందరికీ విద్య అందుబాటులో ఉందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ అన్నారు. నల్లగొండలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ ఉపయోగపడేలా యూనివర్సిటీలో అనేక వినూత్న కోర్సులు ఉన్నాయన్నారు. గోండు, కోయ, చెండు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు ఎలాంటి ఫీజు లేకుండా చదువుకునేందుకు యూనివర్సిటీ అవకాశం కల్పించిందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, కో ఆర్డినేటర్ సుంకరి రాజా రాం, డాక్టర్ బి.అనిల్‌కుమార్, నగేష్, పద్మ, విజయ, ఉస్మానబాష, నరేందర్, రామ్‌రెడ్డి, మల్లికార్జున్, వీరన్న, ధనుజ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలినల్లగొండ టూటౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని గురువారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అన్ని మండలాల్లో సేవా పఖ్వాడా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని కోరారు. సమావేశంలో నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పోతెపాక లింగస్వామి, వెంకన్న, విద్యాసాగర్‌రెడ్డి, శాగ విద్యాసాగర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నర్సింహ, మోహన్‌రెడ్డి, అనిత, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీగా ఇబ్రహీంపేట హాలియా : హాలియా మున్సిపాలిటీలో విలీనమైన ఇబ్రహీంపేట గ్రామం తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 2018లో హాలియా మున్సిపాలిటీలో ఇబ్రహీంపేట గ్రామాన్ని విలీనం చేశారు. ఇబ్రహీంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అలీనగర్‌తో కలుపుకుని మొత్తం 3వేల జనాభా ఉంది. కాగా గతంలో ఇబ్రహీంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సాయి ప్రతాప్‌నగర్ కాలనీ హాలియా మున్సిపాలిటీలో యథాతధంగా కొనసాగుతుండగా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ ఇబ్రహీంపేటలో అలీనగర్ యథాతధంగా ఉండనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ రెండో సవరణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టగా బిల్లుపై గురువారం గవర్నర్ సంతకంతో గెజిట్ విడుదల చేయడంతో ఇబ్రహీంపేట నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం
అంద్రప్రదేశ్లో జర్నలిస్టులపై దాడులు అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి.. ఏ ప్రభుత్వాలు అయినా సరే జర్నలిస్టులను గౌరవించాలి. జర్నలిస్టులు వార్తలు రాయడం వల్ల దేశంలో ఏమూలన ఏం జరిగిందో ఇంట్లో ఉండి పేపర్ చదివి తెలుసుకుంటున్నాం. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఇవ్వాలి కానీ ఏపీలో జర్నలిస్టులపై కేసులు బనాయించడం, దాడులు చేయడం వంటి సంఘటనలు సరికాదు. వారి హక్కులను కాపాడాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అప్పట్లో కొన్ని పత్రిలు తప్పడు వార్తలు రాశాయి. కానీ ఆయన ఎవరి మీద దాడులు చేయవద్దని కార్యకర్తలు చెప్పారంటే జర్నలిస్టులపై ఆయన ఎంత ఔధార్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవాలి. ఏపీలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులను ఆపాలి. ఇది సమాజానికి మంచిది కాదు. – శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు ప్రజలు, ఉద్యోగుల తరపున ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంటుంది. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. అక్రమ కేసులు, భౌతికదాడులు, బెదిరింపులతో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. తమకు అనుకూలంగా వార్తలు రాయలేదనే కారణంతో నచ్చని మీడియా కార్యాలయాలపై దాడులకు దిగడాన్ని, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ తీరు మార్చుకోకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళన చేస్తాం. తప్పుడు కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – గార్లపాటి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీడియాపై దాడుల సంస్కృతి పరాకాష్టకు చేరింది. సాక్షి మీడియాపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి బెదిరించడం దుర్మార్గమైన చర్య. ఈ దాడుల సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లో మొదలై మెల్లగా తెలంగాణలోకి కూడా ప్రారంభం అవుతుంది. మీడియాలో కథనాలు వస్తే వాటిని ఖండించాలి తప్ప ప్రత్యక్ష దాడులు, అక్రమ కేసులు పెట్టడం స్వేచ్ఛను హరించడమే అవుతుంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తక్షణమే మానుకోవాలి. నచ్చని మీడియాపై దాడులు చేస్తే ప్రజలే సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఇచ్చిన వాగ్ధానాల అమలు కోసం కథనాలు రాస్తే మీడియాపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. – రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు -
మీడియా అణిచివేత దుర్మార్గం
ప్రజల వాణిని వినిపించే మీడియాను పాలకులు అక్రమ కేసులతో అణిచివేయాలని చూస్తే సమాజం నుంచి తిరుగుబాటు వస్తుంది. ఉద్యోగుల సమస్యల మీద మీడియా కథనాలు రాస్తే వారితోనే ఫిర్యాదు చేయించి కేసులు పెట్టే సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకురావడం దుర్మార్గమైన చర్య. తప్పుడు కథనాలు రాస్తే వాటిపై వివరణ తీసుకోవాలి.. తప్పితే పత్రిక ఎడిటర్ నుంచి రిపోర్టర్ల దాకా కేసులు బనాయిస్తే జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రజలతో కలిసి ఆందోళన చేస్తే ఏ ప్రభుత్వమైన దిగిరాక తప్పదు. అక్రమ కేసులు పెట్టి ప్రజల్లో పలచన అవుతారు తప్ప ఏపీ ప్రభుత్వం సాధించేది ఏమీ ఉండదు. – గుండగోని జయశంకర్‌గౌడ్, టీయూడబ్ల్యూజే (హెచ్–143) జిల్లా అధ్యక్షుడు -
సాకేందుకు పప్పీస్..!
నీలగిరి మున్సిపాలిటీలో కుక్కపిల్లల దత్తత ఫ వీధి కుక్కలకు రేబిస్ టీకాలు ఫ ఈ కార్యక్రమాలను 13నప్రారంభించనున్న మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ టూటౌన్ : జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్య పట్టణాలతో పాటు మండలాలు, గ్రామాల్లో కలిపి మొత్తం లక్ష వీధి కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క నల్లగొండ జిల్లా కేంద్రంలోనే వీధి కుక్కలు 20 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీధుల్లో తిరిగే కుక్క పిల్లలను దత్తతకు ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. మరోవైపు వీధి కుక్కలకు నిరంతరం రేబిస్ టీకాలు వేయాలని నిర్ణయించారు. నీలగిరి మున్సిపాలిటీ, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్ మున్సిపల్ పార్కులో ఈనెల 13న కుక్క పిల్లల దత్తత, కుక్కలకు నిరంతరం రేబిన్ టీకాల ప్రక్రియను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దత్తతకు ముందుకొచ్చిన 25 మంది నీలగిరి పట్టణంలో దత్తత ఇచ్చేందుకు 30 కుక్క పిల్లలను గుర్తించారు. కుక్క పిల్లలను దత్తత తీసుకోవడానికి జిల్లా అధికారులు 25 మంది ముందుకు వచ్చారు. దత్తత తీసుకున్న వారు వాటి బాగోగులు చూసుకోవడంతో పాటు సంతాన రహిత ఆపరేషన్లు చేయించనున్నారు. ఇది సక్సెస్ అయితే దత్తత తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. రేబిస్ టీకాలతో తప్పనున్న ప్రమాదం.. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కుక్కల సమస్య జఠిలంగా మారుతున్న విషయం తెలిసిందే. వాటిని నివారించ వద్దని కోర్టు తీర్పు ఉండడంతో నీలగిరి మున్సిపాలిటీలో సంతాన రహిత ఆపరేషన్లు చేసి వదిలేస్తున్నారు. మిగతా చోట్ల సంతాన రహిత ఆపరేషన్లు చేసే మిషన్లు, సిబ్బంది లేని కారణంగా అక్కడ కుక్కల సంఖ్య భారీగా పెరుగుతోంది. దాంతో జిల్లా వ్యాప్తంగా లక్ష వరకు వీధి కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటికీ ఒకేసారి సంతాన రహిత ఆపరేషన్లు చేయడం సాధ్యం కానందున కుక్కలకు రేబిన్ టీకాలు వేయనున్నారు. పొరపాటున కరిసినా కుక్కలకు రేబిన్ టీకా వేస్తున్నందున మనుషులకు ప్రమాదం తప్పనుంది. -
గవర్నర్ పర్యటనకు సిద్ధం చేయాలి
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి ఈనెల 15న రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ హాజరుకానున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి ఆమె మహాత్మాగాంధీ యూనివర్సిటీని సందర్శించారు. గవర్నర్ పాల్గొనే స్నాతకోత్సవ వేధికను పరిశీలించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ రాక సందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి బాధ్యతల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. అధికారులు ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆయా అంశాలను అందులో పర్యవేక్షించాలన్నారు. ఈనెల 15న ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ టీం, 108, 104, ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని, వేదిక వద్ద ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చూడాలన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ గవర్నర్ వస్తున్న సందర్భంగా యూనివర్సిటీలో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాటు చేస్తామని, తనిఖీలు ఉంటాయని, గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే ఆ రోజు లోపలికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యే వారి జాబితా ముందుగానే ఇవ్వాలని కోరారు. వైస్ ఛాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ స్నాతకోత్సవం సవ్యంగా జరిగేందుకు 12 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ మాతృనాయక్, ట్రాన్స్‌కో డీఈ నదీంఅహ్మద్, ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫ ఎస్పీతో ఎంజీయూలో ఏర్పాట్ల పరిశీలన -
చిట్టడవులను తలపించాలి
చిట్యాల : రసాయన పరిశ్రమల యజమాన్యాలు పర్యావరణ పరిరక్షణకుగాను తమకు అందుబాటులో ఉన్న భూముల్లో మియావాకి తరహాలో చిట్టడవుల పెంపంకం చేపట్టి అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని దశమి ల్యాబ్స్ రసాయన పరిశ్రమలో బుధవారం నిర్వహించిన వనమహోత్సవంలో కలెక్టర్ పాల్గొని మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొక్కలను నాటడంతోపాటు వాటికి నీటిని అందజేసి సంరక్షించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయ తనిఖీ.. చిట్యాలలోని తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై వచ్చిన ధరఖాస్తులు, రికార్డులు, పీఓబీ భూములకు సంబంధించిన కేసులను ఆమె పరిశీలించారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, పీఓబీ ఈఈ వెంకన్న, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ జానయ్య, తహసీల్దార్ కృష్ణనాయక్, ఎంపీడీఓ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
శాలిగౌరారం : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు వేగవంతం చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం శాలిగౌరారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించాలన్నారు. అనంతరం శాలిగౌరారం, వల్లాల గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఏపీఓ జంగమ్మ, ఏఈ భరత్ ఉన్నారు. ఫ జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు -
యూరియా ఇవ్వరూ..!
దరఖాస్తుల స్వీకరణతోనే సరి! వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతులు గ్రామ స్థాయిలో ఏఈఓలకు దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. అక్టోబర్ చివరి నాటికి పరికరాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం యూరియా ఇబ్బందులు ఉన్న కారణంగా లబ్ధిదారుల ఎంపికలో జాప్యం నెలకొంది. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి -
13న కుక్కలకు వ్యాక్సినేషన్
నల్లగొండ : కుక్కలకు ఈ నెల 13న వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. బుధవారం పశు సంవర్థక శాఖ అధికారి రమేష్‌తో కలిసి ఆయన రామగిరి మున్సిపల్ పార్కును సందర్శించి వ్యాక్సినేషన్‌కు అవసరమైన ఏర్పాట్ల పర్యవేక్షించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వీధి కుక్కల బారి నుంచి ప్రజలను రక్షించేందుకుగాను చర్యలు చేపట్టామన్నారు. 13వ తేదీన జరిగే కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరు కానున్నట్లు తెలిపారు. -
వీరవనిత ఐలమ్మ
నల్లగొండ : భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్లగొండలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేషన్ కాంగ్రెస్ నాయకులు ఇబ్రహీం, శ్రీనివాస్‌రెడ్డి, వంగాల అనిల్‌రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవీ.గోనారెడ్డి పాల్గొన్నారు. -
15 వరకు ‘ఇగ్నో’లో ప్రవేశాలు
రామగిరి(నల్లగొండ) : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో జూలై 2025 సెషన్‌కి సంబంధించిన వివిధ మాస్టర్, డిగ్రీ, పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రాముల దరఖాస్తులు చివరి తేదీ ఈ నెల 15 వరకు ఉందని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాజు బోల్లా తెలిపారు. బుధవారం నల్లగొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో జరిగిన ఇగ్నో అడ్మిషన్ల ప్రమోషనల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇగ్నో ప్రోగ్రాముల ద్వారా పలు ఉపాధి, విద్యా అవకాశాలు ఉన్నాయని, ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు www.ingnou.ac.in వెబ్సైట్ ద్వారా ప్రవేశాలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహారెడ్డి, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. పాఠశాల తనిఖీనార్కట్పల్లి : మండలంలోని ఎల్లారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ భిక్షపతి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎఫ్ఎల్ఎన్ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులకు వివరించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని విషయ పరిజ్ఞానాల్లో మెరుగుపరచాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో వెంకటేశం, బి.హిమజ, డి.రాములు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన పీపీఆర్ వ్యాక్సినేషన్నల్లగొండ అగ్రికల్చర్ : గొర్రెలు, మేకల్లో సోకే పారుడు వ్యాధిని నివారించేందుకు చేపట్టిన పీపీఆర్ టీకాల కార్యక్రమం బుధవారంతో ముగిసింది. గత నెల 26 నుంచి జిల్లా పశు వైద్య సంవర్థక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ వ్యాక్సినేషన్ చేశారు. ఇందుకోసం 54 బృందాలు రోజూ ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మందల వద్దకు వ్యాక్సిన్ వేశాయి. జిల్లాలోని 12 లక్షల 50 వేల మేకలు, గొర్రెలకు టీకాలు పూర్తి చేసి నూటికి నూరు శాతం లక్ష్యం సాధించారు. జిల్లాలో పీపీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందిని పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ జివి.రమేష్ అభినందించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలికేతేపల్లి : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. కేతేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహిస్తున్న, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న మందులు, వ్యాక్సిన్ నిల్వలు, ఇతర వైద్య పరికరాల వివరాలతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్‌రెడ్డి, వైద్యాధికారులు అర్చన, దివ్య, సిబ్బంది రవీందర్, యాదయ్య, నిర్మల, శశిరేఖ తదితరులు ఉన్నారు. -
మహిళా సంఘాలకు రుణాలు ఇస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : నాబార్డు ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బుధవారం డీసీసీబీలో నిర్వహించి నాబార్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 వేలకుపైగా కొత్త సంఘాలు ఉన్నాయని కొన్ని గ్రూప్‌లకు రుణాలు ఇచ్చేందుకు తమ బ్యాంకు సిద్ధంగా ఉందని తెలిపారు. డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త గ్రూపులకు సహకార బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తే సంఘాల్లోని మహిళలతోపాటు బ్యాంకు అభివృద్ధి చెందుతుందన్నారు. నాబార్డు సీజీఎం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ నాబార్డు ద్వారా మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాల వివరాలను వివరించారు. ఆప్కాబ్ జీఎం అశ్వని మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, బ్యాంకు మేనేజర్లు, నాబార్డు అధికారులు, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
సేవాలాల్ సేన కన్వీనర్‌గా అశోక్ నాయక్
హాలియా : సేవాలాల్ సేన జిల్లా కన్వీనర్‌గా అనుముల మండలం వీర్లగడ్డతండాకు చెందిన నేనావత్ అశోక్‌నాయక్ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆ సేన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అశోక్‌కు ఆ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబురావు నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అశోక్‌నాయక్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటికీ నల్లగొండ జిల్లాలో వేలాది మంది గిరిజనులు సరైన ఆహారం, ఇల్లు, వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు కేటాయించే నిధులను దారి మళ్లించకుండా ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబురావు నాయక్‌కు, రాష్ట్ర కమిటీ సభ్యులు, సేన ముఖ్య నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఎర్రబారుతున్న పత్తిచేలు
మునుగోడు: ఆరుకాలం శ్రమించి పంటలు సాగుచేస్తున్న రైతులకు పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేకుండా పోతోంది. ఈ ఏడాది భారీ వర్షాలు కురవకపోయినా మునుగోడు డివిజన్ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పత్తి పంట సాగు చేశారు. అడపాదడపా కురిసిన వర్షాలకు పత్తిచేలు ఏపుగా పెరిగాయి. దీంతో తాము ఆశించిన దిగుబడి వస్తుందని రైతన్నలు ఆనందపడుతున్న సమయంలోనే పత్తిచేలు ఎర్రబారుతూ ఆకులు రాలిపోతున్నాయి. చేలు ఎర్రబారకుండా ఉండేందుకు రకరకాల మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 1,56,104 ఎకరాల్లో పత్తి సాగు.. మునుగోడు డివిజన్లోని ఐదు మండలాల్లో ఈ ఏడాది రైతులు మొత్తం 1,56,104 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఇందులో మునుగోడు మండలంలో 39,657 ఎకరాలు, చండూరులో 31,408, మర్రిగూడ 23,940, నాంపల్లి 46,959, గట్టుప్పల్ మండల వ్యాప్తంగా 14,140 ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే పంట ఎదుగుదలకు అవసరమైన రసాయన ఎరువులతోపాటు చీడపీడల నివారణ మందులు పిచికారీ చేశారు. దీంతో ఎప్పుడూలేనంతగా మొక్కలు బలంగా ఏపుగా పెరిగాయి. ఎర్రనల్లి పురుగు బెడద గత పదిహేను రోజుల కాలంగా పత్తిచేలపై ఎర్రనల్లి పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో మొక్కల ఆకులు వాడిపోయి చేలంతా ఎర్రబడి పోయి రోజురోజుకు ఆకులు రాలిపోతున్నాయి. దీని నివారణకు రైతులు ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు, వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం వారంలో ఒకటి, రెండు మార్లు మందుల పిచికారీ చేశారు. అయినా పంట మాత్రం అలాగే ఎర్రబారి కనిపిస్తోంది. తెగుళ్ల నివారణ కోసం మందులు పిచికారీ చేస్తే పెట్టుబడులు పెరుగుతున్నాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. సంబంధిత వ్యవసాయ అధికారులు ఎర్రబారుతున్న పత్తి పంటలని పరిశీలించి దాని నివారణ చర్యలకు తగిన సూచనలు ఇవ్వాలని మునుగోడు డివిజన్ రైతులు వేడుకుంటున్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది పత్తిపంట చేతికి రాకముందే ఎర్రబారిపోతోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఏ మాత్రం చేను పచ్చబడడం లేదు. దీంతో పత్తి మొక్కలు ఎండిపోయి పూత, పిందె రావడం లేదు. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సలహాలు ఇస్తే బాగుంటుంది. – లింగారెడ్డి, రైతు, కొంపల్లి, మునుగోడు మండలం పదిహేను రోజులుగా వాతావరణంలో మార్పుల వల్ల వేడి పెరిగింది. దీంతో పత్తిచేలకు ఎర్రనల్లి పురుగుల బెడద ఎక్కువైంది. తద్వారా చేలు ఎర్రబారుతున్నాయి. ఎర్రనల్లి పురుగుల నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో స్పైరోమెసిఫెన్ 160 ఎంఎల్‌లు లేదా టోల్పెన్పైరాడ్ 300 ఎంఎల్‌లు లేదా అబామెక్టిన్ 200 ఎంఎల్‌లు ఏదైనా ఒక మందు పిచికారీ చేసుకోవాలి. వాతావరణం కాస్త చల్లబడితే ఎర్రనల్లి పూర్తిగా నశించిపోతుంది. – బి.వేణుగోపాల్, ఏడీఏ, మునుగోడు డివిజన్ ఫ వాతావరణంలో మార్పులతో ఎర్రనల్లి పురుగు ప్రభావం ఫ పదిహేను రోజులుగా రాలుతున్న ఆకులు ఫ మందులు పిచికారీ చేస్తున్నా ప్రయోజనం శూన్యం ఫ ఆందోళనలో రైతులు -
మర్రిగూడ ఆస్పత్రికి రోగుల తాకిడి
మర్రిగూడ : మర్రిగూడ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి రోజురోజుకూ రోగుల తాకిడి పెరిగిపోతోంది. ప్రస్తుతం సీజ నల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో 500 ఓపీ నమోదవుతోంది. ప్రభుత్వం ఇక్కడ పెరుగుతున్న ఓపీని దృష్టిలో ఉంచుకుని 30 పడకల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ వైద్యులను, సిబ్బందిని కేటాయించలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న వైద్యులకు, సిబ్బందికి పని భారమవుతోంది. సిబ్బందిని పెంచి సకాలంలో వైద్యసేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
యాదాద్రి ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా
నిడమనూరు : దామరచర్ల మండల పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి చౌటుప్పల్ వద్ద (92.378 కిలోమీటర్ల దూరం) ఉన్న విద్యుత్ టవర్లకు మంగళవారం కేబుల్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా ప్రారంభించినట్టు ట్రాన్స్‌కో ఏఈ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధికంగా నిడమనూరు మండల పరిధిలోని రైతులు వరిపొలాల మీదుగా వెళ్తున్న 400 కేవీ విద్యుత్ లైన్ తీగలను తాకవద్దని సూచించారు. ఈ లైన్ మొత్తం దామరచర్ల మండలంలో తిమ్మాపురం, వీర్లపాలెం, త్రిపురారం మండలంలో అంజనపల్లి, నీలాయిగూడెం, అన్నారావుక్యాంపు, రాగడప, నిడమనూరు మండలం నిడమనూరు, బంకాపురం, శాఖాపురం, పార్వతీపురం, రాజన్నగూడెం, నారమ్మగూడెం, వెనిగండ్ల, పనసయ్య క్యాంపు, తుమ్మడం, అనుముల మండలంలో మారేపల్లి, నారాయణపురం, యాచారం, కుపాసిపల్లి, పాలెం, రామడుగు, శ్రీనాథపురం, చింతగూడెం, గుర్రంపోడు మండలంలో కొప్పోలు, కనగల్ మండలంలో రేగట్టే, కుర్రంపల్లి, జీ ఎడవెల్లి, పొనుగోడు, కనగల్, గౌరారం, తుర్కపల్లి, లచ్చుగూడెం, చండూరు మండలంలోని ఉడుతలపల్లి, బోడంగిపర్తి, మునుగోడు మండలంలోని పాల్వాయి, కిష్టాపురం, ఇప్పర్తి, చీకటిమామిడి, మునుగోడు, కమ్మగూడెం, చొల్లేడు, సోలిపురం, కొరటికల్ నుంచి చిట్యాల మీదుగా చౌటుప్పల్ వరకు 92.378 కిలోమీటర్ల పొడవున ఉందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ టవర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, టవర్లను ఎక్కకూడదని, టవర్ల కింద ఏపుగా పెరిగే మొక్కలు నాటవద్దని పేర్కొన్నారు. ఫ 400కేవీ లైన్ ద్వారా చౌటుప్పల్ వద్ద టవర్లకు సరఫరా ప్రారంభం ఫ తీగలను తాకకుండా రైతులు జాగ్రత్తగా ఉండాలి ఫ ట్రాన్స్‌కో ఏఈ ప్రవీణ్‌కుమార్ సూచన -
నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలి
మిర్యాలగూడ అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లన రద్దుచేయాలని ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుడం అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడ మండలం యాదాగర్పల్లిలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు అమలు చేయాలన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ రూ.15 వేలు ఇవ్వాలని, విధి నిర్వహణలో మృతిచెందిన కార్మికులకు రూ.30లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలన్నారు. సంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ నెల 17 వరకు జరగనున్న వీరతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కర్ర దానయ్య, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, నాయకులు మోహన్‌నాయక్, జ్యోతి, శివ, ఆశీర్వాదం, వీరయ్య, కమలమ్మ, ఆదిలక్ష్మి, అనసూయ, సైదులు, నాగయ్య, మల్లేష్, రవి పాల్గొన్నారు. ఫ ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ -
రపాజెక్టుల పూర్తికి ప్రణాళికలు
సాక్షిప్రతినిధి నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు రూట్‌మ్యాప్ రూపొందించామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునరుద్ధరణలో భాగంగా ఎయిర్‌బోర్న్ హెలికాప్టర్ సర్వే నిర్వహించబోతున్నామన్నారు. పనుల పునరుద్ధరణపై ఇంజనీర్లు రూపొందించిన నివేదికపై ఈ నెల 15న మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించిన తర్వాత పనులు పునఃప్రారంభిస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని జలసౌధలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించి మాట్లాడారు. ఎస్ఎల్బీసీ సొరంగం–1, పెండ్లిపాకల రిజర్వాయర్, సొరంగం–2ను పూర్తి చేసి 25 కి.మీ. ప్రధాన కాల్వ ద్వారా హైలెవల్ కాల్వకు నీళ్లను తరలించి సాగునీరు అందిస్తామన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయితే హైలెవల్ కాల్వ కింద 2.2లక్షలు, ఉదయసముద్రం కింద లక్ష, లోలెవల్ కాల్వ కింద 80వేల ఎకరాలు కలిపి మొత్తం 4లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు మారుమూల గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఎనిమిది జలాశయాల కింద 3.61లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు పనులు కొనసాగుతున్నాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్ నుంచి దుందుభి వాగు వరకు నీళ్లను తరలించే ప్రాజెక్టు పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి చేపట్టామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, వీటితో 15వేల ఎకరాల స్థిరీకరణ, 14,506 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలను త్వరలో పూర్తిచేస్తామన్నారు. 93శాతం పూర్తయిన బస్వాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి 23వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గంధమల్ల రిజర్వాయర్ పరిధిలోని రావెల్ కోల్ లింక్ కెనాల్, ప్యాకేజ్–16, తుర్కపల్లి కెనాల్ పనులూ పూర్తి చేస్తామన్నారు. చివరి దశ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి :గుత్తా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పుట్టంగండి, నెల్లికల్, పిలాయిపల్లి కెనాల్, ధర్మారెడ్డిపల్లి కాల్వతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను వేగిరం చేసి త్వరగా పూర్తి చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. చివరి దశలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే పనులు పూర్తయి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 2027 నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి ఫ బ్రాహ్మణవెల్లెంల, డిండి, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని ప్రాజెక్టులూ పూర్తి చేస్తాం ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఫ చివరి దశలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరిన గుత్తా ఫ జిల్లాకు రూ.10వేల కోట్లు కేటాయించాలన్న మంత్రి కోమటిరెడ్డి రూ.3వేల కోట్లు కేటాయిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్లోరెడ్ ప్రభావిత నార్కట్‌పల్లి మండలంలో చేపట్టిన బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు రూ.300 కోట్ల కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు, మునుగోడు, నార్కట్‌పల్లిలో వర్షాభావంతో నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. తాగు, సాగునీటి అవసరాలకు ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి బ్రాహ్మణవెల్లెంలకు క్రమం తప్పకుండా నీళ్లను పంపింగ్ చేయాలని కోరారు. పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లను పంపింగ్ చేయాలని ప్రతీసారి అధికారులకు చెప్పాలా? అని ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టులకు రివైజ్డ్ టెండర్లు వేసినా, ఈ ప్రాజెక్టుకు వేయలేదన్నారు. రైతులకు సాగునీటి సరఫరాకు పైప్‌లైన్ కోసం రూ.30లక్షల సొంత నిధులను ఖర్చు చేశానన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ జిల్లాకు చెందిన వారే కావడంతో ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరిగిందన్నారు. 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టును పదేళ్లు పక్కనపెట్టిందన్నారు. 2027 నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం, మంత్రి ఉత్తమ్ హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సాగర్ జలాలు చివరి ఆయకట్టు వరకు అందేలా ఎడమ కాల్వ లైనింగ్ కోసం టెండర్లను ఆహ్వానించడం పట్ల మంత్రి ఉత్తమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమీక్షలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ పాల్గొన్నారు. -
రైతు వేదికల్లోనూ యూరియా
నల్లగొండ అగ్రికల్చర్: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెలరోజులుగా సహకార సంఘాలు, ఆగ్రో కేంద్రాలు, ఎండీసీఎంఎస్ సెంటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే బారులుదీరుతున్నారు. కొన్ని సెంటర్ల వద్ద రాత్రి అక్కడే నిద్రిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాలతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 36 రైతు వేదికల్లోనూ యూరియాను అందుబాటులో ఉంచి సహకార సంఘాల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో గురువారం నుంచి విక్రయించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకు రావాల్సిన యూరియా 12 వేల మెట్రిక్ టన్నులు జిల్లాలోని 36 రైతు వేదికల ద్వారా యూరియా విక్రయించాలని ప్రణాళిక సిద్ధమైంది. అయితే వానాకాలం సీజన్‌కు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటి వరకు 58 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసింది. మరో 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ప్రస్తుతం నాన్ ఆయకట్టు ప్రాంతంలో వరి, పత్తికి యూరియా అంతగా అవసరం ఉండదు. కేవలం నాన్ ఆయకట్టు ప్రాంతంలో ఆలస్యంగా వరి నాట్లు వేయడం వల్ల అక్కడ వరిచేలకు యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది. నాన్ ఆయకట్టు ప్రాంతంలో వరిచేలు ఈనే దశలో ఉండడంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కంకి దశలో ఉన్నాయి. అలాగే పత్తి చేలు కూడా కాయ దశలో ఉన్నందున నాన్ ఆయకట్టులో యూరియా వినియోగం అంతగా ఉండదు. అయినప్పటికీ ఆయకట్టుతో పాటు నాన్ ఆయకట్టు ప్రాంతంలో రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున బారులుదీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్న అన్ని రైతు వేదికల్లోనూ యూరియా విక్రయించాలని నిర్ణయించింది. కాగా బుధవారం జిల్లాకు వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తిచేలకు యూరియా అవసరం లేనందున వరిచేలకు మాత్రమే రైతులు కొనుగోలు చేయాలి. నిల్వలు పెట్టుకున్నప్పటికీ యూరియా పాడైపోయే ప్రమాదం ఉంది. యూరియా దశల వారీగా రానున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ అవసరం మేరకు యూరియా అందజేస్తాం. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓఫ రేపటి నుంచి విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధంఫ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశం ఫ అన్ని ఏర్పాట్లు చేస్తున్న వ్యవసాయ శాఖ ఫ జిల్లా వ్యాప్తంగా 36 రైతు వేదికలు -
నేటి నుంచి సాయుధ పోరాట వారోత్సవాలు
మిర్యాలగూడ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను బుధవారం నుంచి ఈనెల 17వరకు నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 11న మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో అమరవీరుల కుటుంబాల సన్మాన కా కార్యక్రమానికి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం హాజరువుతున్నట్లు తెలిపారు. ఈనెల 17న నల్లగొండలో నిర్వహించే ముగింపు సభకు పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ రానున్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, ముడావత్ రవినాయక్, అయూబ్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, గోవర్ధని, ఊర్మిల, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
మర్రిగూడ ఆస్పత్రికి రోగుల తాకిడి
మర్రిగూడ : మర్రిగూడ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి రోజురోజుకూ రోగుల తాకిడి పెరిగిపోతోంది. ప్రస్తుతం సీజ నల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో 500 ఓపీ నమోదవుతోంది. ప్రభుత్వం ఇక్కడ పెరుగుతున్న ఓపీని దృష్టిలో ఉంచుకుని 30 పడకల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ వైద్యులను, సిబ్బందిని కేటాయించలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న వైద్యులకు, సిబ్బందికి పని భారమవుతోంది. సిబ్బందిని పెంచి సకాలంలో వైద్యసేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
సైబర్ దోపిడీ..
జిల్లాపై సైబర్ పంజా విసురుతోంది. ఆధునీక పద్ధతుల్లో సైబర్ మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. వీరు, వారు అనే తేడా లేకుండా అందరినీ మోసగిస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. చివరికి పోలీసులను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. సైబర్ నేరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా ఆ కేసులను చేధించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసాల్లో తొలుత పెద్ద ఎత్తున నగదును పోగొట్టుకుని.. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండడం లేదు. గత ఏడాది మిర్యాలగూడకు చెందిన ఓ నాయకుడు కొందరి పేర్లతో ఖాతాలు తెరిపించి ముంబై, దుబాయ్‌లోని సైబర్ నేరగాళ్లకు ఆ ఖాతాల వివరాలు అందించి ఖాతాదారుల అకౌంట్లలో సైబర్ నేరాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయించాడు. కొంత మొత్తం ఖాతాదారులకు కమీషన్ ఇచ్చి కోట్ల రూపాయలను స్వాహా చేసినట్లు వెలుగులోకి రావడంతో ముంబై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులను పోగొట్టుకుని సులువుగా డబ్బులు సంపాదించాలని సైబర్ నేరాలకు పాల్పడుతూ జిల్లా పోలీసులకు చిక్కారు. వీరితోపాటు హైదరాబాద్‌కు చెందిన మరొకరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. సైబర్ మోసాల్లో బాధితులు కోట్ల రూపాయలను కోల్పోతున్నారు. డబ్బులు పోయాక పోలీసులను ఆశ్రయించినా, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చెసినా రికవరీ పెద్దగా ఉండడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.681కోట్లు బాధితులు నష్టపోగా కేవలం రూ.107కోట్లు మాత్రమే రికవరి అయినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 6,848 మంది బాధితులకు రూ.53.5కోట్లు తిరిగి ఇప్పించారు. మిర్యాలగూడ : జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి సైబర్ నేరగాళ్లు.. ఆన్లైన్లో చదువుకున్న వారిని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్, ఆధార్ నంబర్లు సేకరించి వారికి నేరుగా వాట్సప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. మొత్తంగా అమాయకులతోపాటు చదువుకున్న వారిని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారస్తులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన మోసాలు.. ● ఐదు రోజుల క్రితం మిర్యాలగూడ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాడు వాట్సప్ కాల్ చేసి మీపై ఫోక్సో కేసు నమోదు అయిందని, అంతర్జాతీయ క్రిమినల్స్‌తో మీకు సంబంధం ఉందని నమ్మించి బెదిరించాడు. సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించానని, దీనికి గాను రూ.30,70,719 చెల్లించాలని అది కూడా ఆర్టీజీఎస్ చేయాలని చెప్పాడు. అంత డబ్బు తన వద్ద లేవని తాను ఏ తప్పూ చేయలేదని ప్రాధేయపడినా చివరికి రూ.20లక్షలు చెల్లిస్తే.. మిగతావి నేను చెల్లిస్తానని నమ్మబలికి మూడు రోజులు మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో వారు ఓ మాజీ ఎమ్మెల్యే సహకారంతో ఎస్పీని ఆశ్రయించడంతో సైబర్ నేరమని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ● నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ రిటైర్డ్ ఉద్యోగిని ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని మీపై కేసు నమోదు అయిందని దాని నుంచి బెయిల్ రావాలంటే తక్షణమే రూ.35 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాడు బెదిరించారు. అది నమ్మిన బాధితుడు నగదు చెల్లించాడు. ఆ నగదు సరిపోదని ఇంకా కావాలని అడగంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదవ పెట్టేందుకు వెళ్తుండగా తెలిసిన కానిస్టేబుల్ కలవడంతో విషయం చెప్పాడు. వెంటనే బాధితుడ్ని క్రైం ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పడంతో సైబర్ నేరమని తేలింది. ● ఈ ఏడాది జనవరిలో జిల్లాకు చెందిన 57 ఏండ్ల ప్రభుత్వ ఉద్యోగికి ఓ వ్యక్తి పోలీసు అధికారిగా ఫోన్ చేసి రూ.2 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అతని ఆధార్‌కార్డును ఉపయోగించారని, వాట్సప్‌లో మొదటగా అరెస్ట్ వారెంట్, కోర్టు ఆర్డర్లు పంపి భయపెట్టి అతని వద్ద రూ.6.5లక్షలు కాజేశారు. ● ఈ ఏడాది మార్చి 29న నల్లగొండ జిల్లాలో సైబర్ కేసు నమోదైంది. అందులో హైదరాబాద్‌కు చెందిన 49 ఏండ్ల ఓ ప్రభుత్వ ఉద్యోగికి.. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ట్రాయ్ అధికారిగా వీడియో కాల్ చేసి బెదిరించి అతని వద్ద రూ.8.5లక్షలు కాజేశారు. ● ఏడాది మార్చిలో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా న్యూడ్ వీడియోకాల్ చేసి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. ● నార్కట్‌పల్లి మండలంలో సైబర్ మోసాలకు గురై ఒకరు రూ.30 లక్షలు పోగొట్టుకున్నారు. ● గత నెలలో వాడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో లోన్ యాప్‌ను ఓపెన్ చేయగా అతని ఖాతా నుంచి రూ.2 లక్షలకు పైగా మాయమయ్యాయి. ఈ విషయంపై వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫ కేసులు నమోదయ్యాయని వాట్సప్ కాల్ ద్వారా సైబర్ నేరగాళ్ల బెరింపులు ఫ రూ.లక్షలు పోగొట్టుకుంటున్న బాధితులు ఫ మోసపోయే వారిలో ఎక్కువగా ఉద్యోగులు, మేధావులే ఫ అవగాహన లోపమే కారణం ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరిట ఎవరూ ఫోన్లు, వాట్సప్ కాల్ చేయరు. తప్పుడు కేసులు, అరెస్ట్ వారెంట్ ఉందని బెదిరిస్తారు అలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో వ్యక్తిగత బ్యాంక్ వివరాలు, ఓటీపీ ఇవ్వకూడదు. అలాంటి ఫోన్‌కాల్స్‌కు భయపడవద్దు. అనుమానం వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లేదా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. – రాజశేఖర్‌రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ -
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నలుగురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. ముగ్గురికి ఉపాధ్యక్ష పదవులు దక్కగా, మరొకరికి రాష్ట్ర కార్యదర్శి పదవి లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆమోదంతో రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు సోమవారం ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, జరుప్లావత్ గోపి (కళ్యాణ్‌నాయక్)లను నియమించారు. రాష్ట్ర కార్యదర్శిగా తూటుపల్లి రవికుమార్‌కు అవకాశం కల్పించారు. ఆయన గతంలో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సంజయ్ అనుచరుడిగా ముద్ర పడినందుకేనా.. ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కార్యక్రమాల్లో నిత్యం చురుగ్గా వ్యవహరించే గంగిడి మనోహర్‌రెడ్డికి ఈసారి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కలేదు. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో అనేక సంవత్సరాలు పనిచేసిన ఆయన గతంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ బాధ్యతల్లో చాలా కాలం సేవలందించారు. కాగా, బండి సంజయ్ ప్రధాన అనుచరుడిగా మనోహర్‌రెడ్డి వ్యవహరించారాని, రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పించకుండా కొందరు ఎంపీలే నడ్డాపై ఒత్తిడి చేశారని అనుచరులు మండిపడుతున్నారు. దీనిపై మనోహర్‌రెడ్డి స్పందిస్తూ.. కార్యవర్గంలో తన పేరు లేకపోవడం వాస్తవమేనని, పార్టీ తన సేవలను మరో రకంగా ఉపయోగించుకుంటుందేమోనని పేర్కొన్నారు. క్రియాశీల కార్యకర్తగా ఎప్పుడూ పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. కాసం వెంకటేశ్వర్లు బూర నర్సయ్యగౌడ్ ఫ సీనియర్ నేత గంగిడి మనోహర్‌రెడ్డికి దక్కని స్థానం -
గోడు వినండి.. పరిష్కరించండి
నల్లగొండ : అమ్మా.. మా గోడు విని.. మా సమస్య పరిష్కరించాలని పలువురు బాధితులు గ్రీవెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి మొర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డేకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు పంపారు. అధికారులు పాఠశాలలను సందర్శించాలి మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం ఆమె అధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో జ్వరాలు ప్రత్యేకించి టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వివిధ శాఖల్లో పని చేస్తూ గ్రామ పాలన అధికారులుగా నియమించబడిన వారిని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ కోరారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ గ్రీవెన్స్ డేలో కలెక్టర్‌కు వినతుల వెల్లువ తమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డిప్యుటేషన్‌పై వేరే మండలానికి పంపడంతో.. తాము విద్యా పరంగా నష్టపోతున్నాంమని.. మా ప్రధానోపాధ్యాయురాలిని తిరిగి పంపాలని ఆ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ వారి సమస్య పరిష్కరిస్తానని చెప్పి వారికి చాక్లెట్లు ఇప్పి పంపించారు. – నాంపల్లి మండలం నర్సింహులగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు -
గరంథాలయాలకు నిధులు సమకూర్చుకోవాలి
రామగిరి(నల్లగొండ) : జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు నాగార్జునసాగర్, చందంపేట, మునుగోడు, దేవరకొండ ఇతర గ్రంథాలయ నిర్వహణకు నిధులు సమకూర్చుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంఏ హఫీజ్ ఖాన్ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. కలెక్టర్ అనుమతితో పాత టౌన్ హాల్ స్థలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని నిర్మించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. జిల్లా గ్రంథాలయంతోపాటు ఇతర గ్రంథాలయాల్లో పనిచేస్తున్న స్వీపర్ల చార్జీలు 25 శాతం పెంచాలని తీర్మానించారు. 10న సురవరం సంస్మరణ సభనల్లగొండ టౌన్ : సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభను ఈ నెల 10వ తేదీన పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల జీఎల్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్మరణ సభకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతారని తెలిపారు. సభకు అన్ని వర్గాల ప్రజలు హజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీల ప్రతినిధులతో జెడ్పీ సీఈఓ సమావేశంనల్లగొండ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటరు, పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభిప్రాయాల సేకరణ నిమిత్తం సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించారు. ఓటరు జాబితాలో మార్పు చేర్పులు చేసే అధికారం తమకు లేదని సంబంధిత ఆర్డీఓలు ఈఆర్వోల ద్వారా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ 353 ఎంపీటీసీలకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే తమకు ఇవ్వాలని, ఏ బూత్ ఏ గ్రామంలోకి వస్తుందో జాబితా ఇవ్వాలని విన్నవించారు. సమావేశంలో నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, లింగస్వామి, పి.మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ట్రిపుల్ఆర్ బాధితులకు అండగా నిలుస్తాంమునుగోడు : ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోపొతున్న రైతులకు తాము అండగా నిలిచి పోరాడుతామని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మునుగోడు సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు కోసం దక్షిణ భాగంలో భూ సేకరణలో అధికారులు చౌటుప్పల్‌లోని దివిస్ కంపెనీని కాపాడేందుకు అలైన్మెంట్లో మార్పు చేశారని ఆరోపించారు. దానివల్ల అనేక మంది పేదల భూములు కోల్పోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర కంటే అదనంగా 10 రెట్ల పరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సమావేశంలో నాయకులు గుర్జ రామచంద్రం, చాపల శ్రీను, బి.లాలు, రమేష్, దుబ్బ వెంకన్న, ఈదులకంటి కై లాస్, పాండు, వెంకన్న, సత్తమ్మ, దయాకర్, శంకర్, ముత్తయ్య పాల్గొన్నారు. -
12న అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరణ
శాలిగౌరారం : మండలంలోని వల్లాల గ్రామంలో నాటి నిజాం నిరంకుశత్వానికి బలైన అమరవీరుల జ్ఞాపకార్థ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు సొంత ఖర్చులు రూ.10 లక్షలతో నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని ఈనెల 12వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే మందులు సామేలు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ తెలిపారు. సోమవారం వారు వల్లాలకు వచ్చి సభావేదిక ఏర్పాటు, సౌకర్యాల కల్పన తదితర అంశాలపై కాంగ్రెస్‌పార్టీ మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతితులుగా హాజరుకానున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ తాళ్లూరి మురళి, వైస్‌చైర్మన్ నరిగె నర్సింహ్మ, బొల్లికొండ గణేశ్, తహసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, షేక్ ఇంతియాజ్, వెంకటేశ్వర్లు, యాదగిరి, అంజయ్య పాల్గొన్నారు. -
ఏఎన్ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలి
నల్లగొండ టౌన్ : ఏఎన్ఎంలపై పని ఒత్తిడిని తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆద్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఏఎన్ఎంలు వివిధ రకాల రికార్టులను ఆన్లైన్లో నమోదు కోసం రాత్రి వేళలో కూడా పనిచేయాల్సి వస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేఎస్‌రెడ్డి, విశ్వనాథుల లెనిన్, ఆర్.ఈతారాణి, ఎన్.పద్మ, సరిత, భవాని, హైమావతి, హరిత, భవాని, శారద, నిర్మల, శిల్ప, మాధురి, అనిత, సునీత, జ్యోతి పాల్గొన్నారు. -
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం
భూదాన్‌పోచంపల్లి: స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ఆర్టీఆర్ఐ)లో నిర్వహించే వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించుకొని, అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించి ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఎస్ఆర్టీఆర్ఐ చైర్మన్ డాక్టర్ కిషోర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, ఎస్ఆర్టీఆర్ఐ చైర్మన్ కిషోర్‌రెడ్డి సమక్షంలో అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, ఎస్ఆర్టీఆర్ఐ డైరెక్టర్ హరికృష్ణ అవగాహన పత్రాలపై సంతకాలు చేశారని పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్యయోజన పథకం ద్వారా అమలు చేస్తున్న వృత్తి విద్యా కోర్సులను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి, స్కిల్ డెవలప్మెంట్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, ఈఎంఆర్‌ఆర్‌సీ డైరెక్టర్ రవీంద్రనాథ్ సోలమన్, ఆయా విభాగాల డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో సిబ్బంది కొరత
మిర్యాలగూడ టౌన్ : అంగన్వాడీ కేంద్రాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. పెద్దసంఖ్యలో టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఖాళీ భర్తీకి రిజర్వేషన్ల ప్రక్రియ అడ్డొస్తోందని తెలుస్తోంది. 834 పోస్టులు ఖాళీ నల్లగొండ జిల్లాలో 9 ప్రాజెక్టుల పరిధిలో 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6 ఏళ్లలోపు పిల్లలు 75,819 మంది, గర్భిణులు 8,659, బాలింతలు 6,360 మంది నమోదై ఉన్నారు. ఆయా కేంద్రాల్లో 150 టీచర్లు, 684 ఆయాలు మొత్తం 834 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు అదనపు బాధ్యతలు ఒక అంగన్వాడీ కేంద్రంలో టీచరు పోస్టు ఖాళీగా ఉంటే సమీప కేంద్రంలోని వారికి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఒక్కో టీచరు రెండు కేంద్రాలకు ఇన్చార్జిగా ఉండడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందడం లేదు. అదే విధంగా ఆయాలు లేకపోవడంతో కొన్ని సెంటర్లల్లో టీచర్లకు అదనపు బాధ్యతలను అప్పగించారు. అక్కడ టీచర్లే భోజనం వండీ వడ్డించాల్సి వస్తోంది. టీచర్లు లేని సెంటర్లలో ఆయాలే అన్నింటినీ చూసుకుంటున్నారు. అయితే వారు ఒక కేంద్రంలో విధుల్లో ఉంటే మరో కేంద్రం మూసి వేయాల్సిన వస్తోంది. కొన్ని కేంద్రాలు తెరవకుండానే వారానికి ఒకసారి వెళ్లి సరుకులు పంపిణీ చేసి వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రిజర్వేషన్ల వర్తింపుతో జాప్యం అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచరు, ఒక హెల్పర్ విధిగా ఉండాలి. కానీ చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలను ఆ శాఖకు చెందిన అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా ప్రస్తుతం టీచర్లు, హెల్పర్లను మూడు గ్రూపులుగా గుర్తించి నివేదిక పంపారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో కొలువుల భర్తీపై సందిగ్ధం నెలకొంది. అయితే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల వర్తింపు జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు టీచర్లు ఆయాలు అనుముల 20 65 చింతపల్లి 24 73 దామరచర్ల 11 95 దేవరకొండ 34 99 కొండమల్లేపల్లి 21 66 మిర్యాలగూడ 16 58 మునుగోడు 06 51 నకిరేకల్ 10 87 నల్లగొండ 08 90 మొత్తం 150 684 జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలోని అంగన్వాడీ టీచర్లకు అదనపు బాధ్యతలను ఇచ్చి చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. పోస్టులు భర్తీ అయ్యేంత వరకు ఎలాంటి సమస్య రాకుండా చూస్తాం. – కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి, నల్లగొండ ఫ పెద్దసంఖ్యలో టీచర్లు, హెల్పర్ల పోస్టులు ఖాళీ ఫ ఉన్న వారికి అదనపు బాధ్యతలు ఫ అరకొరగా అందుతున్న సేవలు -
సీజనల్ విజృంభణ
నల్లగొండ టౌన్ : జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, డ్రెయినేజీల్లో నీటి నిల్వలు పేరుకుపోయిన కారణంగా దోమలు వ్యాప్తి పెరిగింది. దీనికి తోడు పట్టణాలు, పల్లెలో పారిశుద్ధ్యం లోపించింది. దీంతో ప్రజలు సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడుతున్నారు. రోజురోజుకు జ్వరాల బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు డెంగీ కేసులు 11, మలేరియా కేసులు 8 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా జిల్లాలో 63 వరకు డెంగీ, 27 వరకు మలేరియా కేసులు ఉన్నట్లు సమాచారం. దీంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జ్వరం, కీళ్లనొప్పులు, వంటి నొప్పులతో బాధపడుతూ జనం బారులుదీరుతున్నారు. ఆస్పత్రుల్లో పెరిగిన ఓపీ నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గతంలో రోజూ ఓపీ (అవుట్ పేషంట్) 300 వరకు ఉండేది. ప్రస్తుతం 450 వరకు ఓపీ నమోదువుతోంది. ఇన్‌పేషంట్లుగా గతంలో రోజూ 30 వరకు ఉండగా ప్రస్తుతం 50 వరకు చేరుతున్నారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నకిరేకల్ ఏరియా ఆస్పత్రులు, మర్రిగూడ సీహెచ్‌సీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంధ్రాలు, అర్బన్ హెల్త్సెంటర్లు, పల్లె దావాఖానాల్లో కూడా జ్వర బాధితుల సంఖ్య పెరిగింది. పడకేసిన పారిశుద్ధ్యం.. జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించింది. పాలకవర్గాలు లేకపోవడం, నిధులు లేమి కారణంగా వీధులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. గ్రామాల్లో అయితే సర్పంచ్‌లు లేకపోవడం, పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో పారిశుద్ధ్యాన్ని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. చెత్తాతెదారం పేరుకుపోయి దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయింది. సీజనల్ వ్యాధులు పెరగడానికి ఇది కూడా కారణంగా చెప్పవచ్చు. దోమల నివారణ కోసం మున్సిపల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని మలేరియా శాఖ పట్టణాలు, పల్లెల్లో ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ రెండు శాఖ ఫాగింగ్ చేయడాన్ని మరిచిపోయాయి. సిబ్బంది ఉన్నప్పటికీ పాగింగ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్‌లో పరీక్షల పేరుతో దగా.. జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రులకు వెలుతున్న బాధితుల నుంచి డెంగీ, మలేరియా ఇతర పరీక్షల పేరుతో ఆస్పత్రుల యాజమాన్యం దగా చేస్తోంది. వివిధ పరీక్షల పేరుతో వేలాది రూపాయలను దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డెంగీ పరీక్షలు కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రమే చేస్తారు. ఎలిసా పరీక్ష ద్వారానే డెంగీ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా డెంగీ పేరుతో అవసరం లేని పరీక్షలు చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో మందులు అందుబాటులో ఉంచాం. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు కూడా పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలి. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ ఫ పల్లెలు, పట్టణాల్లో పడకేసిన పారిశుద్ధ్యం ఫ అంతటా పెరిగిన దోమల వ్యాప్తి ఫ డెంగీ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడుతున్న జనం ఫ కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క ప్రాంతంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల ఈ ప్రాంతానికి చెందిన షరీఫ్ మలేరియా బారినపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి డెంగీ, మలేరియా, ఇతర రక్త పరీక్షలు చేసి రూ.3 వేలు తీసుకున్నారు. డాక్టర్ ఫీజు, మందులకు కలిపి మరో రెండు వేల రూపాయలు అయ్యాయి. షరీఫ్ కుటుంబంలో ఇద్దరికి మలేరియా సోకింది. ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపంతో జనం సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. -
పురుగులు, తుట్టెలు!
నల్లగొండ : రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అంతకుముందు రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన దొడ్డుబియ్యం ఐదు నెలలుగా వృథాగా ఉంటున్నాయి. దీంతో చాలా చోట్ల ఈ బియ్యం పురుగులు పట్టి, తుట్టెలు కడుతున్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆయా చోట్లనుంచి ఖాళీ చేయకుండానే సన్న బియ్యం స్టాక్ పెట్టింది. దీంతో అప్పటికే నిల్వ ఉన్న దొడ్డుబియ్యం నుంచి పురుగులు సన్న బియ్యానికి పడుతున్నాయి. పేరుకుపోయిన దొడ్డుబియ్యం నిల్వలు జిల్లాలోని రేషన్‌దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాముల్లో ఆరువేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యాన్ని పంపిణీ చేసే క్రమంలో రేషన్ షాపుల నుంచి మిగిలిఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం సేకరించలేదు. దీంతో డీలర్లు రేషన్ షాపులోనే ఒక మూలన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బియ్యం పురుగులు, తుట్టెలు పట్టి పనికి రాకుండా పోతుంది. ఒక పక్క రేషన్‌షాపులు చిన్నగా ఉండటంతో దొడ్డు బియ్యం నిల్వలతో సగం షాపులు నిండిపోవడంతో సన్నబియ్యం కోటా రావడంతో షాపుల్లో స్థలం సరిపోక చాలా ప్రాంతాల్లో రేషన్‌డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు దొడ్డు బియ్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో 997 రేషన్ షాపులు జిల్లాలో 997 రేషన్ షాపులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలలో సన్న బియ్యం పంపిణీకి ముందు ఆయా రేషన్‌షాపుల్లో మొత్తం 1500 మెట్రిక్ టన్నుల పైచి లుకు దొడ్డు బియ్యం ఉన్నట్లు అంచనా. అయితే బియ్యం కేటాయింపు నిల్వలంతా రాష్ట్రస్థాయి నుంచే ఆన్లైన్ విధానంలో కొనసాగుతుంది. సన్న బియ్యం పంపిణీ సందర్భంలో దొడ్డు బియ్యం నిల్వకు సంబంధించిన ఆన్లైన్ నిలిపివేసి.. సన్న బియ్యానికి సంబంధించిన ఆన్లైన్ విధానం అమలు చేశారు. దీంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల వద్ద ఏ రేషన్ షాపుల్లో ఎంత దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయో తేలియడం లేదు. దొడ్డు బియ్యంపై పట్టింపేది..జిల్లాలో గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 6 వేల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏమి చేయాలో తెలియక రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల నుంచి వెనక్కు తీసుకుని వాటిని వేలం ద్వారా అమ్మడమా.. లేక ఇతర ప్రాంతాలకు తరలించడమా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. రేషన్‌షాపుల్లో ముక్కిపోతున్న దొడ్డుబియ్యం ఫ ఐదు నెలలుగా ఏ నిర్ణయం తీసుకోని అధికారులు ఫ సన్న బియ్యానికి చేరుతున్న పురుగులు ఫ ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లు బఫర్ గోదాముల్లో 4,322.057 మెట్రిక్ టన్నులు ఏప్రిల్ నుంచి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. మా వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని ఇప్పటి వరకు తీసుకోలేదు. రేషన్‌షాపులో స్థలం లేక ఇబ్బంది కలుగుతోంది. దానికి తోడు దొడ్డు బియ్యానికి పురుగు వస్తుంది. అది సన్న బియ్యానికి కూడా అంటుకునే ప్రమాదం ఉంది. వెంటనే దొడ్డు బియ్యం నిల్వలను తరలించాలి. – అశోక్‌రెడ్డి, డీలర్, నల్లగొండ -
సినిమాల్లో నటించాలనేది నా కోరిక: నాగదుర్గ
చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యంపై మక్కువ. యూకేజీ చదివే సమయంలోనే తల్లిదండ్రులు కూచిపూడి శిక్షణ ఇప్పించారు. ఆ నాటి నుంచి మొదలైన ఆమె డ్యాన్స్ ప్రయాణం తన అందం.. అభినయంతో నేడు వందల జానపద పాటల్లో రాణిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది నల్లగొండ పట్టణానికి చెందిన గుత్తా నాగదుర్గ. అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాగదుర్గను శనివారం ‘సాక్షి’ పలకరించగా.. ఆమె తన కేరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. రామగిరి (నల్లగొండ) : మా స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగూడూరు. ఉద్యోగరీత్యా మా అమ్మానాన్న గుత్తా చలపతిరావు, వాసవి నల్లగొండలో స్థిరపడ్డారు. నేను పదో తరగతి వరకు నల్లగొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నాను. హైదరాబాద్‌లో ఇంటర్, బీఏ జర్నలిజం పూర్తి చేశాను. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూచిపూడిలో పీజీ చేశాను. మా అమ్మకు నాట్యం అంటే ఇష్టం. తను నేర్చుకోవాలకుంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు. నేను చిన్ననాటి నుంచి డాన్స్ బాగా వేసే దాన్ని. అమ్మ గుర్తించి కూచిపూడి నేర్పించింది. పాలబిందెల బాలు మాస్టారు వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. అనేక సందర్భాల్లో స్టేజీ ప్రోగ్రాముల్లో కూచిపూడి నాట్యం చేశాను. అప్పుడు వచ్చిన ప్రశంసలు నాకు ప్రేరణ కలిగించాయి. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నాను. కానీ డాన్స్ పైనా ఎక్కువ శ్రద్ద పెట్టాను. పేరిణి లాస్యంలో కూడా శిక్షణ తీసుకున్నాను. ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి మంజుభార్గవి వద్ద కూచిపూడి వర్క్‌షాపుకు హాజరయ్యాను. నల్లగొండకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ వద్ద రీ రికారి్డంగ్లో పనిచేశాను. ఆ తర్వాత జానదప పాటల్లో నటించే అవకాశం లభించింది.2021లో మొదటి అవకాశం2021లో సై టీవీ రూపొందించిన ‘తిన్నాతీరం పడతలే’ అనే పాటలో మొదటిసారి నటించాను. ఆ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. నాలుగు సంవత్సరాల్లో 300 వరకు జానపద పాటల్లో నటించాను. చాలా అవకాశాలు వస్తున్నా.. అందులో మంచివి మాత్రమే ఎంచుకుంటాను. ఫోక్ పాటలకు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ లభించింది. యూట్యూబ్‌లో 100 మిలియన్ బేంచ్ మార్క్‌కు చేరింది. శాస్త్రీయ నాట్యం నుంచి జానపదానికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా జానపద పాటల్లో ప్రారంభమైన నటన నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చింది. సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘కలివి వనం’ అనే సినిమాలో నటించాను. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కూచిపూడిలో పీహెచ్డీ చేస్తా..చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నా. అనేక వర్క్‌షాపులకు హాజరయ్యా. డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేశా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో కూచిపూడిలో మాస్టర్స్ డిగ్రీ చదివాను. అయినప్పటికీ కూచిపూడిలో పరిశోధన చేసి పీహెచ్డీ చేయాలనేది నా లక్ష్యం. అంతే కాదు నేను నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలని భావించాను. నల్లగొండలో మాకు సొంత ఇల్లు ఉంది. అవకాశాల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాం. నేను నేర్చుకున్న కళ పది మందికి నేర్పించాలనేది నా కోరిక. నల్లగొండలో నాగదుర్గ నాట్యాలయం పేరుతో కూచిపూడి శిక్షణ కేంద్రం నడిపిస్తున్నా. 60 మంది వరకు విద్యార్థులు శిక్షణకు వస్తున్నారు. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి శని, ఆదివారం నల్లగొండకు వస్తాం. -
మళ్లీ రెవెన్యూ శాఖలోకి..
సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం జీపీఓలకు వారి ర్యాంకులను బట్టి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ పోసింగ్‌లు పొందిన వారంతా విధుల్లో చేరాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పోస్టింగ్ ప్రాంతాలను కేటాయిస్తున్నందున పైరవీలు చేయవద్దన్నారు. అనంతరం కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ పొందిన వారికి ఉత్తర్వులను అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్ఓ అశోక్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ : వీఆర్ఏలు, వీఆర్ఓలు తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చారు. ప్రభుత్వం వారిని గ్రామపాలనాధికారులుగా (జీపీఓ) కొత్తగా నియమించింది. పరీక్షల్లో ఎంపికై న వారికి శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక ఉత్తర్వులు అందజేశారు. శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి కౌన్సిలింగ్ నిర్వహించి క్లస్టర్లను కేటాచించారు. 275 క్లస్టర్లు.. 276 మంది ఎంపిక గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో వీఆర్ఓలను, ఆగస్టు 2023లో వీఆర్ఏల వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రద్దు చేసి ఆ స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. ఆ సందర్భంలో రెవెన్యూ ఉద్యోగులను తిరిగి తీసుకొస్తామని చెప్పింది. ఇతర శాఖల్లో ఉన్న పూర్త వీఆర్ఓ, వీఆర్ఏల్లో జీపీఓగా పని చేయాలనుకునే వారి నుంచి రెండు విడతలుగా దరఖాస్తులు తీసుకుంది. వారికి పరీక్షలు నిర్వహించింది. జిల్లాలో 275 క్లస్టర్లు ఉంటే 276 మంది జీపీఓలుగా ఎంపిక చేసింది. కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్‌లు.. 276 మంది జీపీఓలకు శనివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో కౌన్సిలింగ్ ద్వారా క్లస్టర్లను కేటాయించారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో పాసైన వారికి స్టేట్ ర్యాంకు కేటాయించారు. ఆ ర్యాంకు ప్రకారం మొదట కౌన్సిలింగ్లో వారికే అవకాశం కల్పించారు. రెండోసారి పరీక్ష రాసి పాసైన వారికి రెండో విడత కౌన్సిలింగ్లో అవకాశం కల్పించారు. జిల్లాలోని 275 రెవెన్యూ క్లస్టర్ల పరిధిలో ఉన్న గ్రామాల జాబితాను వారికి ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. పీహెచ్సీ, విడో, మెడికల్ గ్రౌండ్స్‌తో పాటు స్పౌజ్ ఉన్న వారికి ప్రత్యేక కేటగిరిలో పోస్టింగ్ ఇచ్చారు. వారికి సొంత మండలం గాకుండా పక్కన మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. మిగతా వారికి సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇవ్వలేదు. మొత్తం 276 మంది ఎంపిక కాగా.. ఐదుగురు కౌన్సిలింగ్లో పోస్టింగ్ తీసుకోలేదు. వారు ప్రస్తుతం పని చేస్తున్న శాఖలోనే వెళ్తామని పేర్కొన్నారు. ఆ అంశం సీసీఎల్ఏ పరిధిలో ఉందని.. రిటర్న్ వెళ్లాలంటే సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకోవాలని కౌన్సిలింగ్ అధికారులు సూచించారు. జీపీఓలుగా 276 మంది పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల నియామకం ఫ కౌన్సిలింగ్ ద్వారా క్లస్టర్ల కేటాయింపు ఫ సోమవారం విధుల్లో చేరాలని ఆదేశాలు -
స్థానిక సంస్థల ముసాయిదా జాబితాల ప్రకటన
నల్లగొండ : త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల నోటీస్ బోర్డులపై జాబితాలను ఉంచారు. మొత్తం 33 జెడ్పీటీసీలు, 353 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటి పరిధిలో గతంలో 1,925 పోలింగ్ స్టేషన్లు ఉండేవి.. ప్రస్తుతం ముసాయిదా జాబితాలో వాటిని 1,956కు పెంచారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల జాబితానే తీసుకుని స్థానిక సంస్థల ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించారు. దీని ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 10,73,506 మంది ఉండగా అందులో పురుషులు 5,30,860 మంది, మహిళలు 5,42,589 మంది, ఇతరులు 57 మంది ఉన్నట్లు ముసాయిదాను ప్రకటించారు. 9న అప్రెంటిస్‌షిప్ మేళానల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐలో ఐటీఐ అభ్యర్థులకు ఈ నెల 9న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీరాములు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ మేళాకు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాప్టుమెన్ సివిల్, మెషినిస్టు, స్టెనోగ్రఫీ, డ్రస్కీ మేకింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని ఆయన తెలిపారు. ఆసక్తి, అర్హత గల వారు పూర్తి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో నేరుగా ఐటీఐ కాలేజీ వద్దకు హాజరు కావాలని సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంపెద్దవూర : పదో తరగతి ఫలితాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులను శనివారం మున్ననూర్ ఐటీడీఏ పరిధిలోని అచ్చంపేటలో సన్మానించారు. పదవ తరగతి విద్యార్థులకు బోధించిన అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులను గిరిజన సంక్షేమ శాఖ డీడీ చందనా సర్పే, నాగర్‌కర్నూల్ జిల్లా డీటీడీఓ ఫిరంగి శాలువాలు, పూలమాలలతో సత్కరించి మెమోంటో, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏసీఎంఓ డీ.వీ.నాయక్ పాల్గొన్నారు. సన్మానం పొందిన వారిలో పెద్దవూర పాఠశాల హెచ్ఎం డి.బాలోజీ, ఉపాధ్యాయులు కూన్‌రెడ్డి రాంరెడ్డి, బి.కృష్ణ, ఎండీ.షబ్బీర్, సంధ్యా, శ్రీనునాయక్, షాహీన్‌బేగం ఉన్నారు. రాష్ట్రస్థాయి క్రీడలకు 85 మంది ఎంపికనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల్లో శనివారం నిర్వహించిన ఆలిండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్ (19 విభాగాల్లో) 135 మంది వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొనగా 85 మంది రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎండీ.అక్బర్అలీ తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. -
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి
రామగిరి(నల్లగొండ) : చిన్నారులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ అన్నారు. శనివారం అయన నల్లగొండ సమీపంలోని పానగల్ చారుమతి చైల్డ్‌కేర్ సెంటర్‌ను ఆయన కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితం ఘర్షణలతో కూడుకొని ఉంటుందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివితేనే ముందుకు వెళ్తారని పేర్కొన్నారు. గొప్పవారు కావాలనే పట్టుదల, సంకల్పంతో చదువుకోవాలని.. ఎవరి భవిష్యత్ వారి చేతుల్లోనే ఉంటుందన్నారు. దాతల సహకారంతో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్‌ను నడిపిస్తున్న నాగసేనారెడ్డిని అభినందించారు. ఈ కేంద్రం ద్వారా 500 మందిని చదివించడం, 43 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా చైల్డ్‌కేర్ సెంటర్లో పని చేస్తున్న వారిని ఆయన సన్మానించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కృష్ణ, కృష్ణవేణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, కట్ట వెంకటరెడ్డి, వెంకన్న, గణేష్, నిర్మల, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ -
కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించం
ఫ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి నల్లగొండ : నల్లగొండ కోమటిరెడ్డి అడ్డా అని.. ఇక్కడి నుంచి ఐదు గెలిచారని.. అలాంటి నాయకుడిని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రిని వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదన్నారు. వినాయక శోభాయాత్ర సందర్భంగా 1వ వినాయక విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడితోపాటు మాజీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. మంత్రి మాట్లాడుతుండగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిని పిలువడంలేదనే అక్కసుతో అక్కడ ఘర్షణ వాతావరనం సృష్టించారని విమర్శించారు. రాజకీయ కనీస అవగాహన లేని బీజేపీ అధ్యక్షుడు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి అభివృద్ధే ద్యేయంగా, పేదల సంక్షేమం కోసం 25 ఏళ్లుగా పని చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ కార్యకర్తల చేత దాడులు చేయించుకుని.. గన్మెన్లను ఏర్పాటు చేయించుకోవాలని ప్రయత్ని స్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో నాయకులు కత్తుల కోటి, కూసుకుంట్ల రాజిరెడ్డి, దుబ్బ రూప, బొజ్జ శంకర్, సురిగి వెంకన్నగౌడ్, మామిడి కార్తిక్, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్‌రెడ్డి, ఇటికాల శ్రీనివాస్, పిల్లి యాదగిరియాదవ్, పాండు, సుజాత, స్వరూపారెడ్డి, రమేష్‌యాదవ్ పాల్గొన్నారు. -
12,740 దరఖాస్తులు
పది రోజుల్లో సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జాతీయ కుటుంబ సంక్షేమ పథకం (ఎన్ఎఫ్బీఎస్) కింద ఆర్థిక సహాయం కోసం పది రోజుల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పేద కుటుంబాలకు చెందిన ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు, సహజంగా మరణించినా ఆ ఇంటికి రూ.20 వేల తక్షణ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పెద్ద ఎత్తున అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ప్రజల నుంచి అదేస్థాయిలో స్పందన వస్తోంది. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని, ముఖ్యంగా మండల స్థాయి అధికారులను భాగస్వాములను చేయడంతో పాటు కలెక్టర్ స్వయంగా మండలాలతోపాటు డివిజన్ కేంద్రాల్లో ఈ పథకం అమలుపై సమీక్షలు నిర్వహించారు. దీంతో పది రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 12,740 దరఖాస్తులు వచ్చాయి. నల్లగొండ డివిజన్లో అధికంగా దరఖాస్తులు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు ఆన్‌లైన్‌తోపాటు ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో ఒక్క నందికొండ మున్సిపాలిటీ మినహా ప్రతి మండలంలో 150కి పైగానే దరఖాస్తులు వచ్చాయి. డివిజన్ల వారీగా చూస్తే నల్లగొండ డివిజన్‌లోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. నల్లగొండ డివిజన్ పరిఽధిలో ఈనెల 1వ తేదీ వరకే 4,306 దరఖాస్తులు రాగా, మిర్యాలగూడ డివిజన్లో 4,066 కుటుంబాలకు చెందిన పేదలు దరఖాస్తు చేసుకున్నారు. దేవరకొండ డివిజన్లో 2,737 మంది దరఖాస్తు చేసుకోగా, చండూరు డివిజన్లో 1,631 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 12,740 దరఖాస్తులు రాగా, కొన్ని మండలాల్లో ఆరేడు వందల దరఖాస్తులు రావడం గమనార్హం. ఇన్నాళ్లూ అవగాహన కరువు ఎన్ఎఫ్బీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఇన్నాళ్లూ ప్రజలు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో 2017 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 42 వేల మంది మరణించినట్లు జిల్లా యంత్రాంగం తమ వద్ద ఉన్న లెక్కల ప్రకారం తేల్చింది. అర్హులైన వారు తమ కుటుంబ పెద్ద చనిపోయినట్లు ఆధారాలతో దరఖాస్తు చేసుకునేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు. వెంటవెంటనే ప్రాసెసింగ్.. ఈ పథకం కోసం వస్తున్న దరఖాస్తులను వెంటవెంటనే ప్రాసెస్ చేసేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ, తహసీల్దార్‌ను, ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండల కార్యాలయాల్లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ప్రాసెస్ ఆర్డీఓకు పంపించాలని, అక్కడి నుంచి డీఆర్ఓ, తనకు పంపిస్తే నిబంధనల ప్రకారం ఉన్న వాటికి అప్రూవల్ ఇస్తామని స్పష్టం చేశారు. ఆరు వేల కుటుంబాలకు మంజూరు జిల్లాలో పేదల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేసి కలెక్టర్‌కు వచ్చిన దాదాపు ఆరు వేల అర్హులైన కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు కలెక్టర్ ఓకే చెప్పారు. అందులో ఇప్పటికే 2,723 మందికి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కలెక్టర్ ప్రభుత్వానికి ఫైల్ పంపించారు. మరో సగానికిపైగా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. మున్సిపాలిటీ దరఖాస్తులు చండూరు 131 దేవరకొండ 210 హాలియా 183 మిర్యాలగూడ 796 నందికొండ 60 చిట్యాల 153 నకిరేకల్ 309 నల్లగొండ 959 మండలం దరఖాస్తులు చండూరు 301 గట్టుప్పల్ 163 మర్రిగూడ 311 మునుగోడు 430 నాంపల్లి 295 చందంపేట 330 చింతపల్లి 379 దేవరకొండ 276 గుడిపల్లి 119 డిండి 559 గుర్రంపోడు 183 కొండమల్లేపల్లి 202 నేరెడుగొమ్ము 194 పీఏపల్లి 285 అడవిదేవులపల్లి 180 అనుముల 208 దామరచర్ల 248 మాడుగులపల్లి 332 మిర్యాలగూడ 446 నిడమనూరు 280 పెద్దవూర 348 తిరుమలగిరిసాగర్ 315 త్రిపురారం 305 వేములపల్లి 345 చిట్యాల 184 కనగల్ 333 కట్టంగూర్ 500 కేతేపల్లి 374 నకిరేకల్ 304 నల్లగొండ 187 నార్కట్‌పల్లి 362 శాలిగౌరారం 364 తిప్పర్తి 277 మొత్తం 12,740 కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఎక్కువ దరఖాస్తులు స్వీకరించేలా అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె వివిధ అంశాలపై టెల3ఈ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జాతీయ కుటుంబం ప్రయోజన పథకం కింద పేదరకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేసిన ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఈ నెల 13న సన్మానిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉందని వాటిని పెంచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్‌ఎఫ్‌బీఎస్‌కు అనూహ్య స్పందన ఫ కలెక్టర్ చొరవతో పెద్ద ఎత్తున మందుకొస్తున్న బాధిత కుటుంబాలు ఫ పథకం నిరంతరం అమల్లో ఉంటుందని ప్రకటన ఫ 6 వేల కుటుంబాలకు ఆర్థిక సాయం మంజూరు జాతీయ కుటుంబ సంక్షేమ పథకం నిరంతం కొనసాగుతుంది. పేద కుటుంబాలకు చెందిన ఇంటి పెద్ద మరణిస్తే ఆయా కుటుంబాలు తక్షణ సాయం కోసం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు ఆరు వేల కుటుంబాలకు పథకాన్ని మంజూరు చేశాం. వచ్చే వారం రోజుల్లో దాదాపు 10 వేల కుటుంబాలకు మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ పథకం అమలులో భాగంగా ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులతో ఈనెల 13వ తేదీన సెర్ప్ సీఈఓ సమావేశం కానున్నారు. – కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మెరిసేదంతా బంగారం కాదు!
మిర్యాలగూడ : కల్తీ బంగారం అమ్మకాలకు మిర్యాలగూడ కేంద్రంగా మారింది. వంద గ్రాముల బిస్కెట్ బంగారంలో ఇరిడియం రెండున్నర గ్రాములు కలిపి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బంగారాన్ని వస్తు రూపంలో తయారు చేసేందుకు కరగదీసే క్రమంలో ఇరిడియం వైబ్రేట్ కావడంతో దుకాణాదారులకు నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రతి వంద గ్రాములకు సుమారు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు నష్టం వస్తున్నట్లు వాపోతున్నారు. మిర్యాలగూడ పట్టణంలో ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ రోజుకు రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు కల్తీ వ్యాపారం దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మిర్యాలగూడలో యంత్రం ద్వారా బిస్కెట్‌ను తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతనెల 23న స్వర్ణకారులు, రిటైల్ బంగారు వ్యాపారులు కల్తీ బంగారాన్ని ఎవరూ కొనరాదని, కల్తీ బంగారం అమ్మితే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని తీర్మానం చేసుకున్నారు. అక్రమంగా బంగారం రవాణా.. దొంగ బంగారాన్ని మిర్యాలగూడకు ప్రధాన కేంద్రాలైన కేరళ, తమిళనాడు, నెల్లూరు ప్రాంతాల నుంచి కిలోల కొద్దీ తీసుకొస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా మహిళలతో సరఫరా చేయిస్తున్నారని, లేదా ప్రత్యేకంగా గుమస్తాలను నియమించుకుని వారికి నెలవారి జీతాలు ఇస్తున్నారని సమాచారం. వీళ్లు ప్రధానంగా రైళ్లు, బస్సులు, కొన్ని సందర్భాల్లో స్కూటీలపై కూడా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగారం తీసుకుని బయలుదేరితే ఎక్కడ దిగాలో తామే మధ్యలో చెప్తామని, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా విద్యార్థుల స్కూల్ బ్యాగులు, మహిళలైతే హ్యాండ్‌బ్యాగ్‌లను సిద్ధం చేసి వారికి ఫోన్లు ఇచ్చి పంపుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో కేరళ నుంచి రైలులో బంగారం తీసుకొస్తుండగా నల్లగొండ రైల్వే పోలీసులు రూ.కోటిన్నర విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారం వ్యాపారం పూర్తిగా హవాలా ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ మిర్యాలగూడలో కల్తీ బంగారం దందా ఫ హోల్‌సేల్ వ్యాపారులు.. ఇరిడియం కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు ఫ రోజూ రూ.కోట్లలో కల్తీ వ్యాపారం ఫ నష్టపోతున్న వినియోగదారులు మిర్యాలగూడకు ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి ట్యాక్స్‌లు చెల్లించకుండా బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకువచ్చి వ్యాపారులకు, హోల్సేల్దారులకు మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్ముతున్నారు. ఉదాహరణకు ఆన్లైన్లో పది గ్రాముల బంగారం ధర రూ.1.02లక్షలు ఉంటే బ్లాక్ మార్కెట్లో రూ.98,500కే విక్రయిస్తుంటారు. దీనికి జీఎస్టీ, సేల్ ట్యాక్స్, సంబంధిత టాక్స్‌లను రూ.కోట్లలో ఎగవేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ నకిలీ బంగారంపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
హైదరాబాద్ వెళ్లిన గ్రామ పాలనాధికారులు
నల్లగొండ : గ్రామ పాలనాధికారులుగా ఎంపికైన వారు శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకునేందుకు నల్లగొండ నుంచి మూడు బస్సుల్లో తరలివెళ్లారు. ఈ బస్సులను ఎన్జీ కళాశాల మైదానం వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి పంపించారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, నల్లగొండ తహసీల్దార్ పరుశురాములు తదితరులు పాల్గొన్నారు. ‘నవాబుపేట’తో గుండాల సస్యశ్యామలంగుండాల: నవాబుపేట రిజర్వాయర్ నీటితో గుండాల మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శుక్రవారం నవాబుపేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సాగునీటిని విడుదల చేశారు. గంగమ్మకు పసుపు, కుంకుమలు పూలు సమర్పించి కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని చెరువులను నింపి ప్రతి ఎకరాకు నీరందిస్తామన్నారు. కాల్వలకు మరమ్మతులు చేపడతామన్నారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. అప్పుల పాలు చేసి రైతులపై భారం మోపిందన్నారు. ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, యాదగిరిగౌడ్, ద్యాప కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సమాజంలో గురువు స్థానం గొప్పది
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నల్లగొండ : అమ్మానాన్న తర్వాత స్థానం గురువులకే ఇచ్చారని.. సమాజంలో గురువుకున్న స్థానం గొప్పదని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని చిన్నవెంకట్‌రెడ్డి పంక్షన్ హాల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల గొప్పతనాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి చాటి చెప్పారన్నారు. గురువు.. మనలోని అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని బోధించే వ్యక్తి అన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి భావిబారత పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర గొప్పదన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ఒక్కో నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభించుకున్నామని తెలిపారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించి మెరుగైన బోధనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజానికి మంచి పౌరులను అందించడంలో గురువుల పాత్ర ముఖ్యమన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులు వెచ్చించి వాటిని బాగుచేయడం గొప్ప విషయమన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అందిస్తే పిల్లలు మరిచిపోరని వారిని గుండెల్లో పెట్టుకుంటారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం కంటే ప్రస్తుతం 12 శాతం విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. అదే విధంగా భవిత కేంద్రాలు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవరకొండ ప్రాంతం నుంచే ఎక్కువ మంది డిప్యుటేషన్ అడుగుతున్నారని అలాంటప్పుడు అక్కడి విద్యార్థులకు విద్య అందడం ఎలా.. వారికి అన్యాయం జరగకండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, డీఈఓ భిక్షపతి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు. -
గంగ ఒడికి గణపయ్య
నల్లగొండ పాతబస్తీ వినాయకుడి విగ్రహం వద్ద లడ్డూ వేలం పాటలో రూ.5,00.116 పలికింది. పాతబస్తీకి చెందిన బొడ్డుపల్లి సతీష్ వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. అయితే గతేడాది ఇక్కడ విగ్రహం వద్ద లడ్డూ రూ.13 లక్షల 50 వేలు పలికింది. కానీ ఈసారి జరిగిన వేలం పాటలో తక్కువ మంది పాల్గొనడంతో వేలంలో తక్కువ ధర పలకడంతో నిర్వాహకులు నిరుత్సాహానికి గురయ్యారు. ఫ కనులపండువగా గణేష్ శోభాయాత్ర ఫ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు ఫ తీనార్మర్ స్టెప్పులు, కోలాటాలతో అలరించిన యువత ఫ రాత్రి వరకు కొనసాగిన నిమజ్జనాలు రామగిరి (నల్లగొండ) : నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. వెళ్లిరావయ్య గణపయ్య అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో గణేష్ నిమజ్జనం నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై వినాయక విగ్రహాలను ఉంచి మహిళల కోలాటాలు, వాహనాలకు మైకులు, డ్రమ్స్‌తో యువత తీన్మార్ స్టెప్పులతో గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే నిమజ్జనం సందడి కనిపించింది. మొదట తొమ్మిది రోజుల పాటు గణపయ్య చేతులో ఉంచిన లడ్డూలకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు పలువురు పాల్గొని రూ.లక్షల్లో వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. పలు చోట్ల లక్కీ డ్రా తీసి డ్రాలో వచ్చిన టోకెన్ ఆధారంగా భక్తులకు లడ్డూలు అందజేశారు. జిల్లా కేంద్రంలో ఘనంగా శోభాయాత్ర.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ హనుమాన్‌నగర్ ఒకటవ నెంబర్ విగ్రహం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టణంలోని విగ్రహాలు క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నాయి. వాటిలో పది అడుగుల లోపు ఉన్న విగ్రహాలను నల్లగొండ పట్టణ సమీపంలోని వల్లభరావు చెరువులో, పది అడుగులలోపు విగ్రహాలను 14వ మైలు వద్ద నిమజ్జనం చేశారు. శోభాయాత్ర సందర్భంగా పట్టణంలో ప్రాధాన వీధులు కిక్కిరిశాయి. నిఘా నీడన శోభాయాత్ర.. గణేష్ నిమజ్జన శోభాయాత్ర పోలీసుల నిఘా నీడన సాగింది. పోలీసు శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పీ పర్యవేక్షణలో ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 850 మందికి పైగా ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుల్స్, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్,డాగ్ స్క్వాడ్, ఏర్ సిబ్బంది స్పెషల్పార్టీతో కలిపి మొత్తం 950 బందోబస్తు విధులు నిర్వహించారు. నల్లగొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ వంటి ప్రధాన పట్టణాల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్రను 24/7 జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షించింది. నల్లగొండ సమీపంలో వల్లభరావు చెరువులో గణపయ్య నిమజ్జనంవినాయక నిమజ్జనంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాటఫ నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడి మధ్య వాగ్వావాదంరామగిరి(నల్లగొండ): గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నల్లగొండ పాతబస్తీ హనుమాన్ ఒకటవ నెంబర్ వినాయకుడి వద్ద శుక్రవారం జరిగిన కార్యక్రమంలో స్వల్ప ఘర్షణ జరిగింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరై వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నల్లగొండ నగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అడ్డుకున్నారు. దేవుడి వద్ద జరుగుతున్న సమావేశంలో రాజకీయ ప్రసంగాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగడంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వర్షిత్‌రెడ్డి అడ్డుకుని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. మంత్రి కోమటిరెడ్డి అంతటితో ప్రసంగాన్ని ముగించేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని విడుదల చేయాలని గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. చివరకు వర్షిత్‌రెడ్డి విడుదల చేయడంతో నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 5,984 విగ్రహాలను ప్రతిష్టించగా.. సుమారు 4 వేల విగ్రహాల నిమజ్జనం శుక్రవారం పూర్తయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో కొంత మంది శనివారం కూడా నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్లగొండలోని వల్లభరావు చెరువు, మూసీ రిజర్వాయర్, 14వ మైలు రాయి, మిర్యాలగూడ, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, దేవరకొండ, కొండబీమనపల్లి, డిండి వద్ద పెద్ద సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. -
క్రీడా నైపుణ్యాల వెలికితీత
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జెడ్పీ హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మల జ్యోతి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఎంత కృషి చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఈ పాఠశాల నుంచి ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. -
బోధన వినూత్నం.. వరించిన పురస్కారం
ఫ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు ఎంపిక ఫ నేడు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అవార్డులు ప్రదానం సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఈఐఎస్ విభాగంలో సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల కళాశాలకు చెందిన అర్థశాస్త్రం అధ్యాపకురాలు కొండ కవిత రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. కవిత 1996లో కాలేజీ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ ఆధ్యాపకురాలుగా ఎంపికై సర్వేల్ గురుకుల బాలుర కళాశాలలో చేరారు. ఇక్కడ పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత హసనపర్తి, హైదరాబాద్‌లోని నాగోల్ మైనార్టీ కళాశాలో విధులు నిర్వహించారు. 2004లో బదిలీపై తిరిగి సర్వేల్ గురుకుల కళాశాలకు వచ్చారు. తన 29 ఏళ్ల సర్వీస్‌లో తాను బోధిస్తున్న అర్థశాస్త్రం సబ్జెక్ట్‌లో విద్యార్థులు ప్రతి సంవత్సరం 100 శాతం ఫలితాలు సాధిస్తూ వచ్చారు. చదువులో వెనకబడిన విద్యార్థులను ముందజలో ఉంచడంలో ఆమెకు ఆమె సాటి. ఆమె శిష్యుల్లో 50మందికి పైగా సీఏ పనిచేస్తున్నారు. -
గ్రామాధికారులొస్తున్నారు!
నల్లగొండ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామపాలన అధికారులు వచ్చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 1న వీఆర్ఓ, ఆగస్టు 10న వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఆ ఉద్యోగులను ఇతర శాఖలకు బదలాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేయడంతోపాటు గతంలోని వీఆర్ఏ, వీఆర్ఓలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడంతోపాటు వారికి పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేశారు. వీరిని గ్రామ పాలన అధికారులుగా పిలవనున్నారు. వీరికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నియామకపత్రాలు అందజేయనున్నారు. జిల్లా నుంచి 276 మంది.. జిల్లా నుంచి గ్రామ పాలనాధికారులుగా 276 మంది ఎంపికయ్యారు. రెండు విడతలుగా రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖలకు వెళ్లిన వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణులైన 276 మందిని ఎంపిక చేశారు. క్లస్టర్‌కు ఒకరి చొప్పున... రెవెన్యూ పాలన పరంగా రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. జిల్లాలో 275 క్లస్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎంపికై న 276 మంది జీపీఓలు ఆయా క్లస్టర్లలో నియామకం కానున్నారు. తీరనున్న ఇబ్బందులు.. ఇతర శాఖల్లోకి బదలాయించిన రెవెన్యూ ఉద్యోగులను ప్రస్తుతం తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటుండడంతో ఆ శాఖలో ఇబ్బందులు తొలగనున్నాయి. గ్రామ స్థాయిలో వీఆర్ఏ, వీఆర్ఓలు లేక ఆర్ఐలపైన భారం పడేది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంలో, ఇతర సర్టిఫికెట్ల జారీ, విచారణ విషయంలోనూ ఇబ్బందుల ఎదురయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో ప్రభుత్వం గ్రామ పాలన అధికారులను నియమిస్తుండడంతో ఇబ్బందులు తొలగనున్నాయి. గ్రామ పాలన అఽధికారులు(జీపీఓలు)గా నియామకమైన 276 మందిని శుక్రవారం హైదరాబాద్‌కు తీసుకువెళ్లేందుకు అధికారులు ఐదు బస్సులు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రం నంచి మూడు బస్సులు, దేవరకొండ, మిర్యాలగూడ నుంచి ఒక్కో బస్సు చొప్పున మొత్తం ఐదు బస్సుల్లో జీపీఓలను అధికారులు హైదరాబాద్‌కు తీసుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం వారికి కలెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఆ ఉత్తర్హుల ఆధారంగా కేటాయించిన స్థానాల్లో వారు విధుల్లో చేరనున్నారు. జిల్లాలో 276 మంది జీపీఓల నియామకం ఫ నేడు హైదరాబాద్‌లో సీఎం చేతులమీదుగా నియామకపత్రాల పంపిణీ ఫ రెవెన్యూ శాఖలో తొలగనున్న ఇబ్బందులు -
నలుగురు లెక్చరర్లకు అవార్డులు
రామగిరి (నల్లగొండ) : ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు అధ్యాపకులు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. నల్లగొండ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు అంగోతు హేమ్ల నాయక్ (కెమిస్ట్రీ), ఎన్.ధనమ్మ (ఫిజిక్స్), బి.బాలాజీ (ఇంగ్లిష్), నేరేడుచర్ల జూనియర్ కళాశాల లెక్చరర్ పి.వెంకటరమణ(జువాలజీ) ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో వీరు అవార్డులు అందుకోనున్నారు. ఇంటింటికీ తిరిగి.. ప్రవేశాలు పెంచి.. నేరేడుచర్ల: నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల జువాలజీ లెక్చరర్, ఇన్చార్జి ప్రిన్సిపల్ పి.వెంకటరమణ తనదైన శైలిలో బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. కళాశాలకు రాని విద్యార్థులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పి తిరిగిహాజరయ్యేలా చేశారు. ఆయన చేసిన కృషికి విద్యార్థుల సంఖ్య 60 నుంచి 260కి చేరింది. దాతల సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని సైతం ఏర్పాటు చేయించారు. సొంత ఖర్చులతో ఎంసెట్, జేఈఈ, నీట్ పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు కూడా కృషి చేస్తున్నారు. -
చెర్వుగట్టు పంచాయతీ రికార్డుల పరిశీలన
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పనులు చేయకున్నా చేసినట్లుగా.. రూ.33 లక్షలు స్వాహా చేసినట్లు వస్తున్న ఆరోపణలపై సాక్షి దినపత్రికలో ‘స్వామి పేర సొమ్ము స్వాహా’ శీర్షికన గురువారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు జిల్లా అధికారులు స్పందించారు. చెర్వుగట్టు గ్రామ పంచాయతీకి చెందిన రికార్డులను డీఎల్పీఓ వెంకటేశ్వర రావు గురువారం తనిఖీ చేశారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి సమక్షంలో పంచాయతీరాజ్ డీఈ మహేష్, ఎంపీడీఓ, చెర్వుగట్టు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఉమేష్, ఎంపీఓ సుధాకర్ సమక్షంలో రికార్డులను పూర్తిగా పరిశీలించారు. గతంలో చేసిన పనులపై పంచాయతీరాజ్ ఏఈ భరత్, బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వహించిన కార్యదర్శి గీతాంజలిని వివిధ అంశాలపై విచారించారు. అనంతరం రికార్డులను స్వాధీనం చేసుకొని నల్లగొండ కార్యాలయానికి పంపించారు. ఫిర్యాదు చేసిన అంశాలన్నింటిపై రికార్డులను పరిశీలించి తుది నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు డీఎల్పీఓ తెలిపారు. వీరి వెంట ప్రస్తుత జీపీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి ఉన్నారు. -
పొడిగింపునకు నో!
27 సంఘాల పదవీకాలం రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రామగిరి(నల్లగొండ): వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాలను 10 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ పనులు తిరిగి ప్రారంభించాలన్నారు. రైతులకు నష్టపరిహారం కింద నిధులు విడుదల చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సుధాకర్ రెడ్డి, ఐలయ్య, మల్లేశం, శ్రీశైలం, నాగార్జున, కందాల ప్రమీల పాల్గొన్నారు. సహకార సంఘాల పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 22, 2025లో ముగిసింది. ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా ఆరునెలల పాటు పర్సన్న్ ఇంచార్జ్‌లుగా పాలక వర్గాలను కొనసాగించింది. ఆగస్టు 14తో ఆరు నెలల పదవీకాలం ముగిసింది. మరోసారి పాలక వర్గాలను ప్రభుత్వం పొడిగించింది. అయితే ఆరోపణలున్నా సొసైటీల పాలకవర్గాలను పక్కన బెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కొంతమేరకు ఆలస్యం అయ్యింది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 99 సొసైటీల పాలక వర్గాలను పొడిగిస్తూ సహకార అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సంఘాల పరిపాలన, ఆర్థిక లావాదేవీలపై సహకార శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండనుంది. సాక్షి యాదాద్రి : ఉమ్మడి జిల్లాలో 26 సహకార సంఘాల పాలకవర్గాల పొడిగింపు నిలిచిపోయింది.ఆయా సొసైటీల్లో నిధులు దుర్వినియోగం అయినట్లు తేలడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరిలో 21 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా.. ఇందలో చందుపట్ల, వలిగొండ, చౌటుప్పల్, జూలురు పాలకవర్గాలపై ఆరోపణలున్నాయి. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో 43 సొసైటీలు ఉండగా నాలుగు సంఘాలపై, నల్లగొండలో 43 సొసైటీలకు గాను 19 సంఘాలపై ఆర్థికపరమైన ఆరోపణలున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి.. సహకార సంఘాల బైలాను కాలదన్ని నిబంధనలను విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడం, దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. సహకార సంఘాల సొసైటీ అధ్యక్షులు, పాలకవర్గాల సభ్యులు సహకారం చట్టానికి విరుద్ధంగా తమ పేరున తీర్మానాలు చేసుకుని తప్పుడు బిల్లులతో లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. విచారణ జరిపిన సహకార శాఖ అధికారులు.. రాష్ట్ర శాఖకు పంపిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఫ సహకార సంఘాల్లో అవినీతి ఆరోపణలు ఫ చట్ట విరుద్ధంగా తీర్మానాలు ఫ తప్పుడు బిల్లులు సృష్టించి రూ.లక్షలు స్వాహా ఫ 27 సొసైటీల పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు నిలిపివేత ఫ సహకార శాఖ ఉత్తర్వులు -
ఉత్తమ విద్యాప్రమాణాల పెంపునకు గుర్తింపు
గరిడేపల్లి: గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పానుగోతు ఛత్రునాయక్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. నల్ల గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆయన 1996 డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. 2003లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందారు. చిలుకూరు, వేములపల్లి, మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడులో మండల విద్యాధికారిగా సేవలు అందించారు. ఎంఈఓగా విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేశారు. పనిచేసిన ప్రతి పాఠశాలలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారు. మఠంపల్లి పాఠశాలలో 680 మొక్కలు, గరిడేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 500లకు పైగా మొక్కలు నాటించారు. ఆయన పనిచేసిన చోట పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేశారు. క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నారు. ఆకస్మిక సెలవులు తప్పా ఎలాంటి ఇతర సెలవులను ఆయన ఉద్యోగ జీవితంలో వాడుకోలేదు. -
ఓటింగ్ యంత్రాల పరిశీలన
నల్లగొండ: కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాంను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. బందోబస్తు, భద్రత విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాంకు సీల్ వేయించారు. కలెక్టర్ వెంట కాంగ్రెస్ నుంచి అశోక్, బీఆర్ఎస్ నుంచి పిచ్చయ్య, బీఎస్పీ నుంచి యాదగిరి, బీజేపీ నుంచి లింగస్వామి, సీపీఎం నుంచి నర్సిరెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అన్సారీ, టీడీపీ నుంచి మల్లికార్జున్, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కృష్ణమూర్తి తదితరులున్నారు. సిజేరియన్ల సంఖ్య తగ్గించాలి జిల్లాలో శిశు మరణాలతో పాటు, సిజేరియన్ల సంఖ్య తగ్గించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శిశు మరణాలపై గురువారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ వందన, డాక్టర్ అరుణకుమారి, జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు 208 మంది నల్లగొండ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 208 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గురువారం తెలిపారు. వారిలో గెజిటెడ్ హెడ్మాస్టర్లు 16 మంది, స్కూల్ అసిస్టెంట్లు సమాన హోదా కలిగిన వారు 94, ఎస్జీటీలు, సమాన హోదా కలిగిన ఉపాధ్యాయులు 93 మంది, సీఆర్పీలు ఇద్దరు, ఒకేషనల్ విభాగంలో ముగ్గురిని ఎంపిక అయ్యారని పేర్కొన్నారు. వీరికి శుక్రవారం చిన వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్లో అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్యలకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు నల్లగొండ: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్రస్థాయిలో సోమవారం నుంచి టోల్ ఫ్రీ నంబర్ 18005995991 అందుబాటులోకి వస్తుందని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ గురువారం తెలిపారు. లబ్ధిదారులు తమ ఇంటి బిల్లుల పరిస్థితి, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని స్టేటస్‌ను పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు. ఫొటో క్యాప్చర్ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు సృష్టిస్తే లబ్ధిదారులు వారే తమ ఇళ్ల నిర్మాణ ఫొటోలను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయొచ్చని తెలిపారు. -
గణేష్ నిమజ్జనానికి రెడీ
నల్లగొండ టూటౌన్: గణేష్ నిమజ్జనానికి నల్లగొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం పాతబస్తీలోని ఒకటవ నంబర్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. అదే విధంగా పెద్ద గడియారం సెంటర్లో వేదిక ఏర్పాటు చేశారు. పాత బస్తీ విగ్రహాలన్నీ పెద్ద గడియారం సెంటర్ వరకు వచ్చి అనుముల మండలంలోని 14వ మైలు వద్ద నిమజ్జనానికి వెళ్లనున్నాయి. 10 ఫీట్లలోపు గణపతి విగ్రహాలను వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బారికేడ్ల ఏర్పాటుతో పాటు విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రెండు క్రేన్లు అందుబాటులో ఉంచారు. పట్టణంలోని పెద్ద విగ్రహాలను వాహనాల్లోకి ఎక్కించడానికి నాలుగు భారీ క్రేన్లు వినియోగిస్తున్నారు. పెద్ద గడియారం సెంటర్, డీఈఓ ఆఫీస్ సర్కిల్, ఎన్జీ కాలేజీ జంక్షన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు. శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్ నల్లగొండ: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారు 950 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన ప్రదేశంలో విధులు నిర్వర్తించాలన్నారు. శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మసీదులు, దర్గాలు, చర్చీల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఊరేగింపులో డీజేలకు అనుమతిలేదని, ఎవరైనా డీజేలు వినియోగిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఫ పాతబస్తీలోని ఒకటవ నంబర్ విగ్రహం నుంచి శోభాయాత్ర ప్రారంభం -
సేవాదృక్పథం.. ఆయన సొంతం
అర్వపల్లి: వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ టీచర్ దండుగుల యల్లయ్య. 1998 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికై న ఆయన ఎంఎన్ఓగా, సెక్టోరియల్ అధికారిగా, రిసోర్స్ పర్సన్‌గా వివిధ పదవులను సమర్థంగా నిర్వర్తించారు. గతంలో కాసర్లపహాడ్ జెడ్పీహెచ్ఎస్లో కేవలం 31మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు 60మంది వచ్చేలా కృషిచేశారు. బడికి సక్రమంగా రాని పిల్లల ఇళ్లకు వెళ్లి తన బైక్‌పై తీసుక వస్తుంటారు. ఈ పాఠశాల చెరువు సమీపంలో ఉండటంతో వర్షాలు పడినప్పుడు మునుగుతుంది. ప్రజాప్రతినిధుల సహకారంతో 200 ట్రాక్టర్ల మట్టిని తోలించి ఇబ్బందులను తొలగించారు. దాతల సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయించారు. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నారు. -
స్కూల్ బస్సు కింద నలిగి.. నల్లగొండ టౌన్లో విషాదం
సాక్షి, నల్గొండ: పట్టణంలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందింది. దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సును రివర్స్ చేస్తుండగా.. డ్రైవర్ చిన్నారిని గమనించుకోలేదని తేలింది. మృతిచెందిన బాలికను జస్మిత (4)గా గుర్తించారు. చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. -
భూ వివాదంపై సబ్‌కలెక్టర్ విచారణ
పెద్దవూర : మండలంలోని పోతునూరు గ్రామంలో భూ వివాదంపై మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బుధవారం విచారణ చేపట్టారు. పోతునూరు స్టేజీ వద్ద ఎన్‌హెచ్–161 పక్కన సర్వే నంబర్ 290లో గ్రామానికి చెందిన పలువురు దళితులు పూరి గుడిసెలు వేసుకున్నారు. దీంతో అదే గ్రామానికి చెందిన మేడారం యాదయ్య 290 సర్వేనంబర్‌లో తనపేరు మీద 1.12 ఎకరాల భూమి పట్టా ఉందని.. తన భూమిలో గుడిసెలు వేసుకున్నారని పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఆశ్రయించాడు. దీంతో బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్పీ కె.రాజశేఖర్‌రాజు పోతునూరు స్టేజీ వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. పూరి గుడిసెలు వేసుకున్న వారితో మాట్లాడారు. 2023 అక్టోబర్ 4వ తేదీన 298 సర్వే నంబర్లో గ్రామానికి చెందిన 58 మందికి 80 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారని, ప్లాట్ నంబర్లు ఇస్తామని చెప్పి నాటి తహసీల్దార్ తమ నుంచి పట్టాలను తీసుకున్నారని తెలిపారు. కానీ ఎన్నిసార్లు అడిగినా పట్టాలు తిరిగి ఇవ్వడం లేదని వివరించారు. దీనిపై తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని అడగా.. సర్వేనంబర్ 298లో 58 మందికి పట్టాలు ఇచ్చింది వాస్తవమేనని, ప్లాటింగ్ చేసి ఇస్తామని చెప్పిన పట్టాలు తీసుకున్నామని తెలిపారు. తహసీల్దార్‌ను భూమి వివరాలు అడుగగా 2020లో సర్వే చేశారని.. 290 సర్వే నంబర్లో 10.17 ఎకరాల భూమి ఉండగా 2.30 ఎకరాలు ఎస్ఎల్బీసీ కాలువకు, 0.33 ఎకరాలు వాటర్ పైప్‌లైన్‌కు, 1.31 ఎకరాల భూమి పోతునూరు, పులిచర్ల రోడ్డుకు, 3.30 ఎకరాలలో నివాస గృహాలు, 1.12 ఎకరాలు మేడారం యాదయ్య పేరుమీద ఉన్నట్లు, 0.5 గుంటలు ఎన్‌హెచ్–161 రోడ్డుకు, మరో 0.16 గుంటలు ఆక్రమణకు గురైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకున్న సబ్ కలెక్టర్ గురువారం పెద్దవూర తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని గుడిసెలు వేసుకున్న వారికి సూచించారు. అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే.. కోర్టుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వివాదం సద్దుమణిగే వరకు తమ గుడిసెల జోలికి ఎవరూ రావద్దని సబ్ కలెక్టర్‌కు వారు విన్నవించారు. ఆయన వెంట తహసీల్దార్ శాంతిలాల్, డీటీ శ్రీదేవి, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్ఐలు ప్రసాద్, ముత్తయ్య, ఆర్ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ధర్నా
సంస్థాన్ నారాయణపురం : హెచ్ఎండీఏ ప్రకటించిన రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాలకు రైతులు, నిర్వాసితులు బుధవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏళ్ళగా తరబడి సాగు చేసుకుంటున్న భూములు తీసుకొని తమ పొట్టకొట్టొదన్నారు. ఈ అలైన్మెంట్తో తీవ్రంగా నష్టం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు భూమి తీసుకుంటే మార్కెట్ విలువ ఆధారంగా డబ్బులు చెల్లించాలని, లేదా భూమికి భూమి ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పల్లె పుష్పారెడ్డి, శేఖర్‌రెడ్డి, నర్రి నర్సింహ్మ, చిలువేరు అంజయ్య, దోనూరి నర్సిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, నెల్లికంటి రాములు తదితరులు సంఘీభావం తెలిపారు. -
44,099 కార్డులకు తొలిసారిగా..
నల్లగొండ : సెప్టెంబర్ నెలకు సంబందించి సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 75 శాతం బియ్యం గోదాముల నుంచి రేషన్‌షాపులకు చేరింది. ఈ నెల నుంచి కొత్తగా 44,099 కార్డులకు బియ్యం అందనుంది. 5,550 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా ప్రభుత్వం జూన్‌లోనే మూడు మాసాలకు(జూన్, జూల్, ఆగస్టు) సంబంధించిన బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్ పోర్టబులిటీ విధానం అమలులో ఉన్నందున అందుబాటులో ఉన్న షాపుల్లో కార్డుదారులు వేలిముద్ర వేసి బియ్యం తీసుకుంటున్నారు. వారి కార్డు ఉన్న షాపుల్లో బియ్యం కోటా మిగులుతుంది. ఇలా చాలా చోట్ల షాపుల్లో జూన్ నెలలో సరఫరా చేసిన బియ్యం నిల్వ ఉంది. దీంతో ఈమాసం లో ఏఏ షాపుల్లో ఎంత సన్న బియ్యం మిగిలాయో వివరాలు తెలుసుకుని వారి కార్డులకు అనుగుణంగా పౌర సరఫరాల అధికారులు బియ్యం పంపిస్తున్నారు. జిల్లాలో 5,28,303 రేషన్‌కార్డులు ఉండగా.. వీటికి సంబంధించి ఇప్పటి వరకు 5,550 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని రేషన్ షాపులకు తరలించారు. నీలగిరిలో రెండు రోజులు ఆలస్యంగా.. సెప్టెంబర్ నెలకు సంబంధించి గ్రామాల్లోని రేషన్‌దుకాణాలకు ఆగస్టు చివరికే బియ్యం సరఫరా చేశారు. పట్టణ ప్రాంతంలో కొన్ని షాపుల్లో పాత నిల్వ ఉండడంతో రవాణాలో కొంత జాప్యం జరిగింది. కానీ పాత నిల్వను కూడా పంపిణీ చేసేందుకు 1వ తేదీ నుంచి దుకాణాలు తెరవాల్సి ఉన్నా.. నల్లగొండలో కొందరు డీలర్లు దుకాణాలు తెరవలేదు. కొందరు 2వ తేదీన, మరికొందరు 3వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు కొంత ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో కొత్తగా 65,749 రేషన్ కార్డులను మంజూరు చేసింది. వాటిలో జూన్కంటే ముందే కార్డులు పొందిన 21,649 కార్డుదారులు జూన్‌లోనే మూడు నెలల బియ్యం తీసుకున్నారు. ఈ సెప్టెంబరు నుంచి జిల్లాలో 44,099 కుటుంబాలు మొదటిసారి సన్న బియ్యం తీసుకోనున్నారు. ఫ రేషన్ దుకాణాల్లో సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యం పంపిణీ ఫ ఇప్పటికే షాపులకు చేరిన 75 శాతం బియ్యం -
సా్వమి పేర.. సొమ్ము స్వాహా!
నార్కట్‌పల్లి : చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. ఈ వేడుకలకు ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తారు. అయితే ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో రోడ్ల మరమ్మతు పనులు చేయకున్నా చేసినట్లుగా.. ఇతర పనులకు సంబంధించిన రూ.33 లక్షలు అధికారులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రామస్తులు గత నెల 8న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో చెర్వుగట్టు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అయిన ఎంపీడీఓకు, పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. పనులను పరిశీలించకుండా ఎంబీలు చేసిన పంచాయతీ రాజ్ శాఖ ఏఈ, డీఈకి మాత్రం ఇవ్వలేదు. ఆ నిధుల స్వాహాపై సమగ్ర విచారణ జపాలని కోరుతున్నారు. రోడ్లకు మరమ్మతు చేయకుండానే.. చెర్వుగట్టులో ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించే సమయంలో గ్రామంలోకి వచ్చే రోడ్లకు మరమ్మతు చేస్తారు. చెర్వుగట్టు నుంచి ఎల్లారెడ్డిగూడెం, నందుల రోడ్డు, కామినేని రోడ్డు, ఏపీ లింగోటం రోడ్డు, గుమ్మాలబావి రోడ్ల మరమ్మతు చేపడతారు. కానీ.. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు సమయంలో కేవలం చెర్వుగట్టు నుంచి ఎల్లారెడ్డిగూడెం, నందుల రోడ్లను మాత్రమే మరమ్మతు చేశారు. మిగలిన రోడ్లును వది లేశారు. కానీ.. అన్ని రోడ్ల పనులు చేసినట్లు పంచా యతీ రాజ్ ఏఈ ఎంబీ చేయడంతో పంచాయతీ కా ర్యదర్శి రూ.20 లక్షల వరకు డ్రా చేసినట్లు తెలిసింది. కార్మికులకు జీతాలు ఇవ్వలే.. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ ద్వారా గ్రామ పంచాయతీకి రూ.12.50 లక్షలు రెండు విడతలుగా వచ్చాయి. ఆ డబ్బులో కేవలం రూ.6.51 లక్షలు మాత్రమే ఎస్టీఓలో చేశారు. మిగతా డబ్బు టీఎస్ బీపాస్‌లో జమ చేసి వ్యక్తి గతంగా డ్రా చేసి స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, పంచాయతీ కార్మికుల జీతాల కోసం రూ.6 లక్షలు వస్తే ఆ డబ్బును టీఎస్ బీపాస్‌లో జమ చేసి డ్రా చేశారని తెలిసింది. కార్మికులకు మాత్రం ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. 2025లో గ్రామ పంచాయతీ దుకాణాల వేలం పాట ద్వారా రూ.48.51 లక్షలు పంచాయతీకి వచ్చాయి. ఆ డబ్బులను కూడా ఎస్టీఓలో జమ చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2024 జూన్‌లో పంచాయతీకి చెందిన 9వ నంబర్ షాపు దక్కించుకున్న వ్యక్తి వేలంలో రూ.లక్ష డిపాజిట్ కోల్పోయాడు. ఆ మొత్తం కూడా ఎస్టీఓలో జమ చేయలేదని తెలుస్తోంది. ఇలా పంచాయతీ నిధులు సుమారు రూ.33 లక్షలు స్వాహా చేసిన విషయంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, నాయకులు కోరుతున్నారు. చెర్వుగట్టు చుట్టూ రోడ్ల మరమ్మతుపనులు చేయకుండానే ఎంబీలు ఫ పంచాయతీ నిధులు రూ.33 లక్షలు నొక్కేసినట్లు ఆరోపణలు ఫ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నాయకులు, గ్రామస్తులు ఫ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు ఫ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న గామ్రస్తులుచెర్వుగట్టు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పర్యవేక్షణలో పనులు చేశారు. ఆ పనుల్లో అవినీతి జరిగినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. అయితే పనుల విషయంలో పూర్తి సమాచారం ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఏఈ, డీఈకి నోటీసులు ఇవ్వలేదు. కేవలం పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారికి మాత్రమే ఇచ్చారు. పంచాయతీ రాజ్ ఏఈ ఎంబీ చేయడం వల్లే నేను సంతకం చేశా. – ఉమేష్, ఎంపీడీఓ, చెర్వుగట్టు పంచాయతీ ప్రత్యేకాధికారిచెర్వుగట్టు గ్రామపంచాయతీలో బ్రహ్మోత్సవాల సమయంలో అవినీతి జరినట్లు ఫిర్యాదు వచ్చింది వాస్తవమే. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా నలగొండ డీఎల్పీఓను నియమించాం. నోటీసులు ఎంతమందికి ఇచ్చారనే విషయం నాకు తెలియదు. విచారణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. – వెంకయ్య, డీపీఓ -
అధిక వర్షాలు.. ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
గుర్రంపోడు: గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పండ్లు, పూలు, కూరగాయల తోటల్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. వరుస వర్షాలతో ఆశించే వ్యాధికారక శిలీంధ్రాలు, చీడపీడలను తగ్గించడానికి రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు టి. సురేష్‌రెడ్డి చెబుతున్నారు. ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఆయన మాటల్లోనే.. పండ్ల తోటల్లో.. అధిక వర్షాలకు కుంటలు, కాల్వలు, వరి సాగు ఉన్న చోట నీరు ఉబికి పండ్ల తోటల్లోకి రాకుండా చుట్టూ గాడి తవ్వుకోవాలి. చనిపోయిన మొక్కలను తొలగించి కొత్తవి నాటుకోవడం, వాలిపోయిన మొక్కలను సరిచేసి మొదలుకు మట్టిని ఎగదోసి కర్రతో ఊతమివ్వాలి. తర్వాత 19:19:19 నీటిలో కరిగే పాలీఫీడ్ ఎరువును ఐదు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మొక్క చుట్టూ మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని నేలలో ఇంకేలా పోయాలి. గాలులకు విరిగిపోయిన చెట్ల కొమ్మలను కత్తిరించి చివర్లకు కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను పూయాలి లేదా మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని లీటరు నీటికి చొప్పున కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. మామిడిలో చీడపీడల ఉధృతిని తగ్గించడానికి ఒక గ్రాము కార్భండిజమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగుల నివారణకు ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటరును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 10 గ్రాముల మల్టీకే మందును మరియు బోరాన్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో.. పడిపోయిన కూరగాయ మొక్కల చుట్టూ మట్టిని ఎగదోసి నిలబెట్టాలి. మొక్కలు ఆకులు, కొమ్మలతో ఏపుగా ఉంటే 0.3 శాతం 13:0:45 నీటిలో కరిగే మల్టీకే లేదా రెండు శాతం యూరియా ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి. ఆయా కూరగాయల రకాలను బట్టి అవసరమైన పురుగు నివారణ మందులు పిచికారీ చేయాలి. మిరుప తోటల్లో.. వర్షాకాలంలో మిరుపలో వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు లీటరు నీటికి కలిపి నారుమడి మొత్తం పిచికారీ చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్భండింజమ్ ఒక గ్రామును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి. మొక్కలు ఏపుగా పెరిగి ఉంటే 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పూల తోటల్లో.. మొక్కలపై ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రాఫికొనజోల్ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 1–2 పర్యాయాలు పిచికారీ చేయాలి. కోతకు వచ్చిన పూలను వెంటనే కోయాలి. గాలి, వెలుతురు ఉన్న ప్రదేశంలో పూలను నిల్వ చేయాలి. -
కేసీఆర్‌ను బదనాం చేయడానికి కుట్ర
రామన్నపేట: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం కమీషన్, సీబీఐ విచారణ పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌ను బదనాం చేయడానికి కుట్ర పన్నుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణంపై సీబీఐతో విచారణ చేయాలని తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం రామన్నపేటలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. పాత బస్టాండ్ నుంచి సుభాష్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి చిట్యాల–భువనగిరి రోడ్డుపై ధర్నా చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని చిరుమర్తి లింగయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం చిరుమర్తి విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారన్నారు. రైతులకు యూరియా సరఫరా చేయకుండా, నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడవని, అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొంటారని చెప్పారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకకుండా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, నీల దయాకర్, కమ్మంపాటి శ్రీనివాస్, బొక్క మాధవరెడ్డి, బద్దుల ఉమారమేష్, వేమవరపు సుధీర్‌బాబు, దోమల సతీష్, సాల్వేరు అశోక్, బందెల యాదయ్య, ఎండీ ఆమేర్, ఎస్కే చాంద్, కన్నెబోయిన బలరాం, బత్తుల వెంకటేష్, మిర్యాల మల్లేశం, బొడ్డు అల్లయ్య, గర్దాసు విక్రం, మామిండ్ల అశోక్, బుర్ర శ్రీశైలం, గంగుల రాఘవరెడ్డి, పున్న వెంకటేశం, ధర్నె భాస్కర్, ఎడ్ల రామచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, జంగిలి నర్సింహ పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
వాంగ్మూలం ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
సాక్షి,యాదాద్రి: బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని, ఆమె సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా ఐదుగురు కలిసి దోచుకున్నారని, అందులో కవిత కూడా ఉందని ఆరోపించారు. హరీష్‌రావు, సంతోష్‌రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ ఎట్లా అవుతుందని కవిత చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. కవిత ఆరోపించినట్లు హరీష్‌రావు, ఈటల రాజేందర్, సంతోష్‌రావు అవినీతి చేస్తుంటే చూస్తున్న కేసీఆర్ కూడా అవినీతిపరుడే కదా అని ప్రశ్నించారు. దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో పంచాయితీతోనే కవిత బయటకు వచ్చారని ఆరోపించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ త్వరితగతిన పూర్తిచేసేలా చొరవ చూపాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావును కాపాడే ఉద్దేశం ఉంటే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంకై ్వరీ ఎందుకు వేస్తాడని ఎంపీ అన్నారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. హరీష్‌రావు, సంతోష్‌రావు అవినీతి చేశారని చెప్పేందుకు కవితనే మొదటి ఎవిడెనన్స్ అని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐ ఎంకై ్వరీ వేయడాన్ని అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలు ముక్తకంఠంతో సమర్ధించాయని, కానీ బీజేపీ మాత్రం సమర్ధించలేదని ఆరోపించారు. అనంతరం భువనగిరి పట్టణంలో జరుగుతున్న ఎంఎంటీఎస్ పనులను వారు పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఎంటీఎస్ నిర్మాణానికి కేంద్రం రూ.420 కోట్లు నిధులు మంజూరు చేసిందని, త్వరగా పూర్తయితే యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఫ కల్వకుంట్ల కవితకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచన -
గణేష్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు
నల్లగొండ : గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఆయన వివరించారు. ఈ నెల 5 నుంచి నిర్వహించే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో అన్ని రకాల ముందస్తు భద్రతా ఏర్పాటు చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలోని అన్ని గణేష్ విగ్రహాలు, మండపాలకు జియో ట్యాగింగ్ చేసి తమకు కేటాయించిన నంబర్లతో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. భద్రత కోసం 950 మంది సిబ్బంది.. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 850 మందికి పైగా ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఏఆర్ సిబ్బంది స్పెషల్ పార్టీతో కలిపి మొత్తం 950 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులు, ప్రధాన పట్టణాల్లో గణేష్ నిమజ్జన శోభయాత్రను 24 గంటలు జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. పోలీస్ శాఖ తరఫున, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఏర్పాటు చేసిన సుమారు 1500 సీసీటీవీ కెమెరాలను ఆయా పోలీస్స్టేషన్లకు అనుసంధానం చేశామన్నారు. ఫ 1500 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఫ నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు నిబంధనలు ఇలా.. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని ప్రజలు గమనించాలి. గణపతి విగ్రహాల్ని తీసుకెళ్లే వాహనాలను చెకప్ చేయించుకోవాలి. మద్యం తాగి వాహనాలను నడపొద్దు. డీజేలకు అనుమతి లేదు. టపాకాయలు కాల్చొద్దు. చిన్న పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి. వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలైన చెరువుల, కాలవల వద్ద చిన్న పిల్లలకు అనుమతి లేదు. నిమజ్జన సమయంలో యువకులు సంయమనం పాటించాలి. జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్లగొండలోని వల్లభరావు చెరువు, మూసీ రిజర్వాయర్, 14వ మైలు రాయి, మిర్యాలగూడ, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, దేవరకొండ, కొండబీమనపల్లి, డిండి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో ఏ ప్రాంతానికి అయినా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో పెట్రో వాహనాలు, బ్లూకోట్స్, సంబంధిత పోలీసు అధికారులు చేరుకునేలా ఆన్లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గణేష్ నిమజ్జనం రోజున జిల్లా కేంద్రంలో ప్రజలు, వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తామన్నారు. -
ప్రభుత్వాలు హామీలు అమలు చేయాలి
నల్లగొండ టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య తెలిపారు. నల్లగొండలో బుధవారం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించి రోజువారీ వేతనం రూ.700 ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీల్లో కూడా ఉపాధి హామీ పథకం విస్తరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేసి వ్యవసాయ కార్మిక కుటుంబాలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లొడంగి శ్రావణ్ కుమార్, బొలుగురి నరసింహ, సీహెచ్ ఉషయ్య, ఎం.వెంగళయ్య, వేముల బుచ్చయ్య, ఎండీ జాన్మియా, ఉప్పునూతల రమేష్ శంకర్‌నాయక్, లాలయ్య, ఇంజమూరు నరసింహ, వల్లపు పెంటయ్య జి పెద్ద నరసింహ, దోటి భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధన పరిభాష తరగతి గదుల్లో ప్రతిధ్వనించాలి
నల్లగొండ టూటౌన్: పరిశోధన పరిభాష తరగతి గదుల్లో ప్రతిధ్వనించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం ఎంజీయూలో గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మ్యాథమెటికల్ అప్లికేషన్స్‌పై నిర్వహించిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.గణితశాస్త్రం నిత్య జీవితంలో మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధునిక సమాజ నిర్మాణంలో గణితం పాత్ర విడదీయరానిదని అన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ.. సమాజ దశ దిశను నిర్దేశించగల శక్తి ఉన్నత విద్యకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, డి. శ్రీనివాసచార్య, పద్మనాభరెడ్డి, చందూలాల్, మద్దిలేటి, ప్రేమ్‌సాగర్, అన్నపూర్ణ, ఉపేందర్‌రెడ్డి, హైమావతి, విజయ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం
నార్కట్‌పల్లి : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్ అన్నారు. బుధవారం నార్కట్‌పల్లి మండలంలోని హైస్కూల్‌ను ఆయన సందర్శించి పాఠశాల పురోగతిపై మాట్లాడారు. రాష్ట్రంలో 30 శాతం మంది ప్రభుత్వ 70 శాతం మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థపై దృష్టి పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సమస్యలను 90 శాతం పరిష్కరించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో టీపీఎస్ పద్ధతిలో నాలుగు పాఠశాలలు కొనసాగుతున్నాయని వాటిలో నాగర్ కర్నూల్ జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2 ఉన్నాయని తెలిపారు. త్వరలో నార్కట్‌పల్లి హైస్కూల్‌ను కూడా టీపీఎస్ పద్ధతిలో అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. టీపీఎస్ పద్ధతి గల పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధన ఉంటుందని పేర్కొనఆనరు. ఈ సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని హెచ్ఎం రాములు ఆయనకు వివరించారు. తెలుగు బయోకెమిస్ట్రీ ఉపాధ్యాయుడు లేడని.. తెలపగా.. వెంటనే భర్తీ చేయాలని సంబంధిత అధికారిని ఫోన్లో ఆదేశించారు. ఆయన వెంట డీఈఓ భిక్షపతి, ఎంఈఓ నరసింహ, వి.నాగరాజు, మహేష్, జానీ తదితరులు పాల్గొన్నారు. -
అంతుచిక్కని వ్యాధి.. అంతులేని వ్యఽథ
అడవిదేవులపల్లి: సజావుగా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా కుదేలైంది. భార్యాపిల్లలతో ఆనందంగా గడుతున్న ఆ కుటుంబ పెద్దకు అంతుచిక్కని వ్యాధి సోకి మంచానికే పరిమితమయ్యాడు. అప్పు చేసి మరీ వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం పూట గడవడమే కష్టంగా మారింది. వివరాలు.. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి కలకండ చినసైదులు, మౌనిక భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు హర్షవర్ధన్, అనిర్యణ్య సంతానం. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2023 ఆగస్టులో చినసైదులుకు కుడి చేతి బొటనవేలికి వాపు వచ్చింది. దీంతో స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. రోజుల వ్యవధిలోనే వాపు చేతికి మొత్తం పాకింది. వెంటనే మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడు. అయినా వాపు తగ్గకపోగా.. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. చేతులు, కాళ్లు పనిచేయకపోవడంతో నడవలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నాడు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. అప్పులపాలైన కుటుంబం.. రెండేళ్లుగా అంతుచిక్కని వ్యాధితో చినసైదులు పెద్దాస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. అతడికి మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు రూ.10లక్షల వరకు అప్పు చేశారు. తమకున్న ఎకరం పొలం, ఇంటి స్థలాన్ని కూడా అమ్ముకున్నారు. ఒక వైపు తెచ్చిన అప్పులు తీర్చలేక, మరో వైపు కుటుంబం గడవడం కష్టంగా మారిందని చినసైదులు భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లలను అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ.. ఇంటి వద్దనే ఉంటూ భర్తకు సేవలు చేస్తోంది మౌనిక . సదరం సర్టిఫికెట్లో 82శాతం దివ్యాంగుడని ధ్రువీకరించినా ప్రభుత్వం చినసైదులుకు పింఛన్ మంజూరు చేయలేదని అతడి భార్య వాపోయింది. దయార్ధ హృదయులు స్పందించి ఆర్థిక సాయం చేస్తే తన భర్త ఆరోగ్యం బాగుపడుతుందని, తమ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కుతుందని చినసైదులు భార్య మౌనిక వేడుకుంటోంది. ఫ మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద ఫ అన్నీ తానై చూసుకుంటున్న భార్య ఫ అప్పు చేసి వైద్యం చేయించినా కోలుకోని వైనం ఫ ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు -
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
నార్కట్‌పల్లి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి నుంచి మునుగోడు వెళ్తున్న కారు మార్గమధ్యలో బ్రాహ్మణ వెల్లంల గ్రామ శివారులో రోడ్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు. మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ఫ్లోకేతేపల్లి: ఎగువ ప్రాంతాల నుంచి మూసీ ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం వరకు 1,971 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అధికారులు మూడు క్రస్టు గేట్లను పైకెత్తి 2,340 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 312 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 643.60 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు అఽధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఉపాధ్యాయురాలి సస్పెన్షన్
చిట్యాల : చిట్యాల పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో గతంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహించి ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గోగికార్ మాధవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం డీఈఓ భిక్షపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు చిట్యాల ఎంఈఓ పానుగోతు సైదానాయక్ తెలిపారు. గతంలో చిట్యాల జెడ్పీహెచ్ఎస్ ఇన్చార్జి హెచ్ఎంగా మాధవి పని చేసిన సమయంలో పాఠశాలకు మంజూరైన పీఎంశ్రీ నిధుల దుర్వినియోగానికి గురైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. డీఈఓ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టగా వారిపై మాధవి దురుసగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగింది. దీంతో సంబంధిత విచారణ అధికారులు జిల్లా అకౌంట్స్ అండ్ పైనాన్స్ అధికారి సిహెచ్.యోగేంద్రనాథ్, చిట్యాల ఎంఈఓ సైదానాయక్ ఈ సంఘటనపై డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో శాఖా పరమైన చర్యల్లో భాగంగా డీఈఓ భిక్షపతి మాధవిని ఉద్యోగ సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దుకొండమల్లేపల్లి (చింతపల్లి) : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని వెంకటేశ్వరనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పోలేపల్లి రాంనగర్‌లోని పల్లె దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయాలని, మలేరియా, డెంగీ తనిఖీ పరీక్షల కోసం అందుబాటులో ఉన్న ఆర్డీటీ నిల్వలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఉప వైద్యాధికారి కళ్యాణ్‌చక్రవర్తి, మండల వైద్యాధికారి వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ : నల్లగొండ శివారులోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీ ణ నిరుద్యోగ పురుషులకు ఏసీ, రిఫ్రిజిరేటర్ మెకానిక్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ సంచాలకుడు రఘుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని పేర్కొన్నారు. పదవ తరగతి పాసైన 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు గల నల్లగొండ, సూర్యాపేట, యదాద్రి భువనగిరి జిల్లాల వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు సంస్థ ఆఫీసులో సెప్టెంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 970100 9265 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అధికారుల సూచనలు పాటించాలి భువనగిరి : పంటల సాగులో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాకాద్రి రైతులకు సూచించారు. భువనగిరి మండలం వీరవెల్లి, కూనూరు గ్రామాల్లో బుధవారం ఆయన వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఆయా పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ యే పంటలు సాగు చేశారు. పంటల పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, రైతులు ఉన్నారు. -
కారు ఢీకొని యువకుడి దుర్మరణం
ఫ మరొకరికి గాయాలు చిట్యాల: యూటర్న్ తీసుకుంటున్న బైక్‌ను కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిట్యాల ఎస్ఐ మామిడి రవికుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన దేశపాక శ్రీశాంత్(20), చిట్యాల పట్ట ణానికి చెందిన శివకార్తీక్ మంగళవారం రాత్రి బైక్‌పై చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గల చెరువు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా.. హైదరాబాద్ నుంచి చిట్యాల వైపు అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీశాంత్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శివకార్తీక్ను నార్కట్‌పల్లిలోని కామి నేని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఉమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నల్లబెల్లం, పటిక పట్టివేత డిండి: అక్రమంగా నల్లబెల్లం, పటిక తరలిస్తున్న వాహనాన్ని బుధవారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరిధిలోని చెర్కుపల్లి నుంచి తవక్లాపూర్ వెళ్లే మార్గంలో ఇండికా కారులో 450 కేజీల నల్లబెల్లం, 30 కేజీల పటికను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి కారును పట్టుకున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐలు నర్సింహ, వీరబాబు, సిబ్బంది పాల్గొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీభువనగిరిటౌన్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వెండి వస్తువులు, నగదు అపహరించారు. ఈ ఘటన భువనగిరి పట్టణంలోని ఎల్బీనగర్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. బాధితులు ఫిర్యాదు మేరకు భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా భువనగిరి పట్టణంలోని రాంగనర్ కాలనీ సమీపంలోని సెల్ టవర్ వద్ద బ్యాటరీ, ఇతర వైర్లు చోరీకి గురైనట్లు నిర్వాహకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పల్లె ఓటర్లు
లక్షలు10 పంచాయతీ ఓటరు తుది జాబితా విడుదల సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల సంఖ్య 10 లక్షలు దాటింది. మంగళవారం విడుదల చేసిన పంచాయతీ ఓటరు తుది జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో 10,73,506 ఓటర్లు ఉన్నట్లు తేలింది. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో జిల్లాలోని 31 మండలాల్లో 9,30,205 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత జాబితాలో 1,43,301 మంది ఓటర్లు పెరిగారు. ఈ జాబితాతోనే త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమవుతోంది. 869 పంచాయతీల్లో.. 7,494 వార్డులు జిల్లా యంత్రాంగం సిద్ధం చేసిన గ్రామాలు, వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను, పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసేందుకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌తో కూడిన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 28వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్ కార్యాలయాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించారు. ఆగస్టు 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వాటిపై అభ్యంతరాలు స్వీకరించారు. 29వ తేదీన ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లపై జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీ నాయకులతో ఎంపీడీఓలు, తహసీల్దార్లు సమావేశం నిర్వహించారు. 30వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను 31వ తేదీన పరిశీలించారు. మంగళవారం తుది జాబితాను ప్రకటించారు. గ్రామ పంచాయతీలతోపాటు మండల పరిషత్ కార్యాలయాల్లో వాటిని ప్రదర్శించారు. జిల్లాలోని 33 మండలాల్లో ప్రస్తుతం 869 గ్రామ పంచాయతీలు ఉండగా 7,494 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డు పరిధిలో ఒక్కో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేలా అధికారులు పోలింగ్ కేంద్రాలను కూడా ఖరారు చేశారు. పురుషుల కంటే మహిళలు అధికం.. గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 5,42,589 మహిళా ఓటర్లు ఉండగా, 5,30,860 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇతరులు 57 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,729 మంది అధికంగా ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల సమయంలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రభుత్వం కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఈసారి వాటి సంఖ్య 869కి చేరింది.మండలం పంచాయతీల పోలింగ్ మొత్తం సంఖ్య స్టేషన్లు ఓటర్లు అడవిదేవులపల్లి 13 108 16,674 అనుముల 24 202 23,796 చందంపేట 30 250 30,679 చండూరు 19 166 24,323 చింతపల్లి 36 294 45,054 చిట్యాల 18 180 35,735 దామరచర్ల 35 302 40,914 దేవరకొండ 41 316 35,716 గట్టుప్పల్ 7 68 15,617 గుడిపల్లి 12 104 12,271 గుండ్లపల్లి 39 326 41,525 గుర్రంపోడు 38 314 38,571 కనగల్ 31 262 36,892 కట్టంగూర్ 22 206 37,362 కేతేపల్లి 16 160 31,084 కొండమల్లేపల్లి 27 216 29,599 మాడ్గులపల్లి 28 238 30,523 మర్రిగూడ 18 170 30,785 మిర్యాలగూడ 46 394 55,180 మునుగోడు 28 244 38,038 నకిరేకల్ 17 160 26,843 నల్లగొండ 31 270 39,231 నాంపల్లి 32 276 36,411 నార్కట్‌పల్లి 29 262 43,772 నేరడుగొమ్ము 21 170 20,262 నిడమనూరు 29 256 36,094 పీఏపల్లి 25 216 27,644 పెద్దవూర 28 244 34,494 శాలిగౌరారం 24 230 40,388 తిప్పర్తి 26 216 27,688 త్రిపురారం 32 270 36,698 తిరుమలగిరి సాగర్ 35 288 35,075 వేములపల్లి 12 116 20,568 మొత్తం 869 7,494 10,73,506ఫ ప్రస్తుత జాబితా ప్రకారం 10,73,506 మంది ఓటర్లు ఫ గత ఎన్నికల కంటే పెరిగిన 1,43,301 ఓట్లు ఫ వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు కూడా ఖరారు ఫ ఈ జాబితాతోనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లనున్న యంత్రాంగం -
నిమజ్జనానికి సిద్ధంగా..
ఫ 5వ తేదీన నీలగిరిలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం ఫ 10 ఫీట్లలోపు విగ్రహాలు వల్లభరావు చెరువులో, పెద్దవి 14వ మైలు వద్ద.. ఫ ఒకటవ నంబర్ విగ్రహం నుంచి శోభాయాత్ర ప్రారంభం ఫ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన మున్సిపల్ యంత్రాంగం నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలోని వినాయక విగ్రహాల నిమజ్జనానికి మున్సిపల్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 5వతేదీన అన్ని విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో పెద్ద విగ్రహాలు 715 ఉన్నాయి. ఐదు ఫీట్ల వరకు ఉండే విగ్రహాలు కూడా లెక్కలోకి తీసుకుంటే వెయ్యి వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 10 ఫీట్లలోపు విగ్రహాలను ఆర్జాలబావి సమీపంలోని వల్లభరావు చెరువులో, అంతకంటే ఎత్తు ఉన్న విగ్రహాలను అనుముల మండలం 14వ మైలు వద్ద ఎడమకాల్వలో నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన ప్రదేశాల్లో భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. పాతబస్తీ నుంచి శోభాయాత్ర పాతబస్తీ హనుమాన్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఒకటో నంబర్ వినాయక విగ్రహం వద్ద మంత్రి, కలెక్టర్‌తో, ఉత్సవ సమితి పెద్దలు ప్రత్యేక పూజలు చేసిన తరువాత నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి మొదలయ్యే శోభాయాత్ర రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్ద గడియారం సెంటర్‌కు చేరుకోనుంది. భారీ విగ్రహాలను ట్రాక్టర్లు, లారీల్లో ఎక్కించడానికి మున్సిపాలిటీ అధికారులు నాలుగు క్రేన్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. మూడు చోట్ల వేదికలు, లైటింగ్ గణేష్ శోభాయాత్ర సందర్భంగా నల్లగొండ పట్టణంలోని ఒకటో నంబర్ విగ్రహం, పెద్ద గడియారం సెంటర్, వల్లభరావు చెరువు వద్ద మూడు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలను విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ యంత్రాంగం 500 మంది ఉద్యోగులను విధుల్లో ఉంచుతుంది. వల్లభరావు చెరువు వద్ద మూడు షిఫ్ట్‌ల్లో కార్మికులు విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే వల్లభరావు చెరువులో గుర్రపు డెక్క తొలగించి చెరువు వద్ద చెత్త, చెదారం తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. రామగిరి(నల్లగొండ) : నల్లగొండ సమీపంలోని వల్లభరావు చెరువులో నిమజ్జనం జరిగే ప్రాంతంలో ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి.. ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 5న గణేష్ నిమజ్జనం జరగనున్న దృష్ట్యా వల్లభరావు చెరువుతోపాటు, హాలియా సమీపంలోని 14వ మైలు వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్రేన్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, లైటింగ్, తాగునీరు, బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఉన్నారు. ఈనెల 5వతేదీనే అన్ని విగ్రహాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించాం. గ్రహణం కారణంగా గణేష్ మండపాల నిర్వాహకులకు విషయాన్ని తెలియజేశాం. ప్రశాంత వాతవరణంలో శోభాయాత్ర, నిమజ్జనం పూర్తి చేస్తాం. – కర్నాటి యాదగిరి, ఉత్సవ సమితి అధ్యక్షుడు -
ప్రజల త్యాగాలపై గౌరవం లేదు
చిట్యాల : నిజాం సర్కార్‌కు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజల త్యాగాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గౌరవం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా మంగళవారం చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నిజాం వదిలి వెళ్లిన ఎంఐఎం పార్టీ నాయకులకు మద్దతుగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తమ పార్టీ కార్యాలయాల్లో నిర్వహించుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఇకనైనా ఓటు బ్యాంకు రాజకీయాలు వీడి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉత్సవాలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అథితిగా హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చామనే బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. ఓట్ చోర్ అనే ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓటు చోర్ చేశాడని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లింలను కలిపితే సహించేది లేదన్నారు. అనంతరం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి కుటుంబసభ్యులను సత్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్‌రెడ్డి, తాడూరి శ్రీనివాస్, గూడూరు నారాయణరెడ్డి, పాదూరి కరుణ, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పాల్వాయి భాస్కర్‌రావు, నర్సింహ, పీక వెంకన్న, బొడిగె లక్ష్మయ్యగౌడ్, చికిలంమెట్ల అశోక్, గుండాల నరేష్‌గౌడ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఫ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు -
ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తులు స్వీకరించాలి
దేవరకొండ : తహసీల్దార్లు, ఎంపీడీఓలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్) దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించినసమావేశంలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, ఇందిరమ్మ ఇళ్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైనా తాత్కాలికంగా పోలింగ్ కేంద్రాల అవసరం ఉంటే వెంటనే ప్రతిపాదించాలని సూచించారు. ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తులను తహసీల్దార్లు, ఎంపీడీఓలు పరిశీలించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రమణారెడ్డి, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి డిండి : రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సంఖ్యకనుగునంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మంగళవారం డిండి ఎంపీడీఓ కార్యాలయంలో రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయ అధికారులతో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల విషయంపై దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డితో కలిసి ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హలంతా దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.20 వేలు ఆ కుటుంబానికి అందుతాయన్నారు. అనంతరం స్థానిక కేజీబీవీని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీఓ వెంకన్న, కేజీబీవీ ప్రిన్సిపాల్ లక్ష్మి ఉన్నారు.దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
మునుగోడు : విద్యార్థులు ఎలాంటి సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని డీఈఓ భిక్షపతి సూచించారు. మంగళవారం మునుగోడు మండలంలోని కిష్టాపురం, పలివెల ఉన్నత పాఠశాలలు, మునుగోడు కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. మధ్యాహ్న భోజనాని, పాఠశాలల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు వెంకటయ్య, తాటి శ్రీనివాసులు, బొల్లం మోహన్, ఎస్ఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత
నాగార్జునసాగర్ : ఎగువ నుచి వరద తగ్గుముఖం పట్టడంతో సాగర్ క్రస్ట్ గేట్లను మంగళవారం రాత్రి మూసివేశారు. ఎగువన గల శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదనతో కేవలం 51,635 క్యూసెక్కులు మాత్రమే సాగర్‌లోకి వస్తోంది. దీంతో అంతే నీటిని నాగార్జునసాగర్ నుంచి విద్యుత్ ఉత్పాదన, ఆయకట్టు అవసరాలకు విడుదల చేస్తున్నారు. రేబిస్ వ్యాధిపై అవగాహన ఉండాలిమిర్యాలగూడ టౌన్ : రేబిన్ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశు వైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి జీవి.రమేష్ అన్నారు. మంగళవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘వీధి కుక్కుల నివారణ’పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జంతువులను ప్రేమ, దయ, కరుణతో చూడాలన్నారు. కుక్కలను హింసించవద్దని, అవి పరుగెత్తుకుంటూ వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు కుక్కకాటుకు గురి అయితే వెంటనే సంబంధిత ప్రభుత్వ ఆస్పత్రులో యాంటీ రేబిస్ టీకాలు చేయించుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాస్ డాక్టర్ జె.వెంకట్‌రెడ్డి, డాక్టర్ శంకర్రావు, హెచ్ఎం విజయకుమారి, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, పర్యావరణ ఇంజనీర్ శ్వేతారెడ్డి, రవి తదితరులున్నారు. మానసిక సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి భూదాన్‌పోచంపల్లి : పిల్లల్లో మానసిక సామర్థ్యాలను గుర్తించి వారిని పోత్సహిస్తే వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మైండ్పవర్ స్పెషలిస్ట్, ప్రముఖ సైకలాజిస్ట్ డాక్టర్ ఎం.ఏ కరీం అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లిలో మనో వైజ్ఞానిక, మానసిక వికాసంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అభ్యసన వైకల్యాల నిరోధానికి వారి మనస్సును మెప్పించే వినోదంతో కూడిన చదువును అందించాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మెజీషియన్ రామకృష్ణ నిర్వహించిన మ్యాజిక్ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం మెమొరీ కాంటెస్ట్‌లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలిమిర్యాలగూడ : కోదాడ– జడ్చర్ల హైవే విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌తో కలిసి ఆయన రోడ్డు విస్తరణ కోసం ఏర్పాటు చేసిన గుర్తులను పరిశీలించారు. భవన యజమానులను నష్టపరిహారం అందిందా లేదా అని అడిగి తెలుసుకుని మాట్లాడారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టిన రోడ్డు విస్తరణకు యజమానులు సహకరించాలన్నారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఎదుట అంబేద్కర్ భవనం కోసం గుర్తించిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు వాటర్ ఫౌంటేయిన్ నిర్మిస్తామన్నారు. సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ మాట్లాడుతూ నష్ట పరిహారం పొందిన భవనాల యజమానులు ఆర్అండ్బీ నిబంధనల మేరకు సెట్ బ్యాక్ వదిలి కొత్త నిర్మాణాలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ఐ ఠాకూర్, సర్వేయర్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చన యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో స్వామివారిని సింధూరంతోపాటు, పాలతో అభిషేకించారు. అనంతరం నాగవల్లి దళార్చన చేపట్టారు. -
ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
నల్లగొండ టౌన్ : విద్యార్థులకు పెండింగ్ పీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర సైదానాయక్, కుంచం కావ్య, బుడిగ వెంకటేశ్, కోరె రమేష్, రవీందర్, రవి, కిరణ్, స్పందన, జగన్నాయక్, జగదీష్, రాములు, వీరన్ననాయక్, నవదీప్, రాకేష్, రమేష్, హరికృష్ణ, ప్రణీత్, కళ్యాణి, తులసి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
రవాణా శాఖ వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించాలి
కోదాడరూరల్ : రవాణాశాఖ నూతనంగా తీసుకువచ్చిన వెబ్సైట్ www.ttransport.gov.in పై వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఉమ్మడి జిల్లా రవాణా శాఖ అధికారి డీటీఓ వాణి సూచించారు. ఆదివారం రాత్రి కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల శివారులో ఉన్న అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టును ఆమె తనిఖీ చేశారు. టెంపరరీ పర్మిట్, వలంటరీ ట్యాక్స్, స్పెషల్ పర్మిట్‌పై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానంతో సిబ్బందికి పనిభారం తగ్గడంతో పాటు వాహనదారులకు సమయం ఆదా అవుతుందన్నారు. ఆమె వెంట నల్లగొండ డీటీఓలు కొండయ్య, సూర్యాపేట డీటీఓ జయప్రకాష్‌రెడ్డి, ఎంవీఐలు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్, ఏఎంవీఐలు సాయిప్రసాద్, లావణ్య, సిబ్బంది ఉన్నారు. రవాణా శాఖ అధికారి వాణి -
అమ్మలా ఆదరించి.. ఆదుకుంటానని భరోసా ఇచ్చి..
మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన చొల్లేటి సోని మానసిక దివ్యాంగురాలు. తల్లితో కలిసి గ్రీవెన్స్ హాల్ వద్దకు వచ్చింది. గ్రీవెన్స్ హాల్ ముందు సోని పడుకుంది. గ్రీవెన్స్ హాల్‌కు వస్తున్న కలెక్టర్ ఆ బాలికను చూసి తల్లిని వివరాలు అడిగింది. ఇప్పటి వరకు తన కూతురుకు పింఛన్ వచ్చేదని.. ఐరిష్, తంబ్ రాకపోవడం వల్ల ఇప్పుడు ఇవ్వనంటున్నారని.. కలెక్టర్‌కు వివరించింది. స్పందించిన కలెక్టర్ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లండని.. తహసీల్దార్ వచ్చి మీ వివరాలు తెలుసుకుని మీ సమస్య పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. బాలికకు వైద్య పరమైన సహాయం అందించాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ వారికి కొంత ఆర్థిక సాయం అందజేశారు. -
యాదగిరీశుడి కల్యాణం అద్భుతం
● శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కెనడా ప్రధాని ప్రశంస యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, నిర్వాహకులను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందిస్తూ ఆదివారం రాత్రి లేఖ పంపారు. ఆలయ పూజారులు, అర్చకులు కెనడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత నెలలో ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ అధికారి గజివెల్లి రఘు ఆధ్వర్యంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం జరిపించారు. ఆగస్టు 23న విండ్సర్, 24వ తేదీన టొరంటో నగరంలో, 30న ఒట్టావా నగరంలో కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై టెంపుల్ బోర్డును అభినందించారు. కెనడాలోని ఒట్టవా నగరంలో గల శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఇటీవల స్వామి వారి కల్యాణం జరిగిన తీరుతెన్నులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వారి కళ్యాణం చాలా ఘనంగా, వైభవముగా, అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. హిందూ సంస్కృతిలోని విభిన్నత, ఆధ్యాత్మికత, ఐక్యతను ప్రశంసించారు. కాగా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకటరావు హర్షం వ్యక్తం చేశారు. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోశ్రీ మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. అనంతరం మహానివేదనగావించారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
నల్లగొండ టౌన్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉగ్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి జే.శేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదు నల్ల చొక్కాలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్‌కు సంబంధించి వేతనంలో కట్ చేసిన ఉద్యోగుల వాటాకు, ప్రభుత్వ వాటాను జమ చేయకపోవడం దారుణమన్నారు. సీపీఎస్ ద్వారా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, హెల్త్ కార్డులను అమలు చేయాలని, పెండింగ్ సమస్యలను పరిస్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్లు వెంకటేశ్వర్లు, రాజశేఖర్, తరాల పరమేష్, అలీం, వెంకులు, శ్రీనివాస్, భిక్షమయ్య, జనార్దన్, సందీప్‌రెడ్డి, చరితరెడ్డి, కృష్ణమూర్తి, శ్రీశైలం, వెంకట్రామ్రెడ్డి, చేపూరి నర్సింహాచారి, రాంబాబు, ఆకునూరి లక్ష్మయ్య, వెంకట్‌రెడ్డి, మనోజ్‌కుమార్, ప్రవీణ్, సైదులు, సత్యనారాయణ, కాశీం, మధు, రమాదేవి, నరేష్, రమ్యసుధ, శ్రీనివాస్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మురళి ఫ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం
నల్లగొండ టూటౌన్: కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో తిప్పికొడతామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం బీఆర్ఎస్ నాయకులు నల్లగొండలోని గడియారం సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు పన్ని కేసీఆర్, హరీష్‌రావును బదనాం చేయాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రజల మద్దతు కోల్పోయిందని ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని.. ప్రజల దృష్టి మళ్లించడానికే కాళేశ్వరం నాటకం అడుతోందని ధ్వజమెత్తారు. రాస్తారోకో చేస్తున్న కంచర్ల భూపాల్‌రెడ్డిని, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ సంతకాలు తీసుకుని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో బండా నరేందర్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, మాలే శరణ్యారెడ్డి, నాగార్జున, బక్క పిచ్చయ్య, యుగంధర్ రెడ్డి, బోనగిరి దేవేందర్, చీరా పంకజ్ యాదవ్, , రేగట్టే మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి : చిరుమర్తి నకిరేకల్ : ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్‌ను ఎత్తి వేయాలని కోరుతూ నకిరేకల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సాగర్ నీళ్లు ఆంధ్రాకు పోతుంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇచ్చే సోయి మరిచి బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ కాళ్లు పట్టుకుని.. కాళేశ్వరంపై కేసులు వేయిస్తూ కేసీఆర్‌ను అణిచి వేయాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే కేసులును ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీలు తలారి బలారం, మాద ధనలక్ష్మీనగేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, నాయకులు పెండెం సదానందం, రాచకొండ వెంకన్నగౌడ్, సామ శ్రీనివాస్‌రెడ్డి, పల్లె విజయ్, పల్రెడ్డి మహిందర్‌రెడ్డి, వంటల చేతన్, గోర్ల వీరయ్య, యానాల లింగారెడ్డి, పేర్ల శ్రీకాంత్, నోముల కేశవరాజు, రావిరాల మల్లయ్య పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఫ కాళేశ్వరంపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నల్లగొండలో బైక్‌ర్యాలీ, రాస్తారోకో -
బంగారం, నగదు చోరీ
హుజూర్నగర్ : ఓ వ్యక్తి తన భార్యను తీసుకువచ్చేందుకు అత్తగారింటికి వెళ్లి రెండు రోజుల తర్వాత వచ్చే సరికి ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు, నగదు ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సంఘటన హుజూర్నగర్ మండలంలోని గోపాలపురంలో సోమవారం వెలుగుచూసింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన పేరూరి భాగ్యరాజు గత నెల 28న తన భార్యను తీసుకురావడానికి అత్తగారి ఊరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపరెడ్డిపల్లి మండలం ఎరగ్రుంట గ్రామానికి వెళ్లాడు. అక్కడ రెండు రోజులు ఉండి సోమవారం స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడేసి ఉన్నాయి. బీరువాను పరిశీలించగా.. అందులోని సుమారు 10 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ.5 లక్షల నగదు అపహరణకు గురైంది. విషయం తెలుసుకున్న సీఐ చరమందరాజు, ఎస్ఐ మోహన్‌బాబు సంఘటనా స్థలాన్ని క్యూస్ టీంతో సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్‌బాబు తెలిపారు. -
టీబీని పసిగడుతుంది..
నల్లగొండ : టీబీ వ్యాధి లక్షణాలను ముందుగానే పసిగట్టే పరికరాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆవిష్కరించారు. రూ.20 లక్షల విలువ చేసే ఈ పరికరాన్ని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందించింది. రోగిలో టీబీ లక్షణాలను ముందుగా కనిపెట్టడం ఈ పరికరం ప్రత్యేకత. కార్యక్రమం అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పౌరసరఫరాల అధికారి వెంకటేష్, మేనేజర్ హరీష్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి నారాయణ, ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, వెంకటరమణ చౌదరి, గంట సంతోష్‌రెడ్డి, చిల్లంచర్ల శ్రీనివాస్, పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
యూరియా ఏది?
అదును దాటుతోంది..సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యూరియా కోసం రైతులు తంటాలు పడుతున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవడంతో పత్తి, వరి, పండ్ల తోటలకు యూరియా పెట్టుకునేందుకు ఇదే సరైన అదును. నాన్ ఆయకట్టు ప్రాంతంలో వరితోపాటు పత్తికి యూరియా వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయకట్టు ప్రాంతంలో ప్రస్తుతం వరి నాట్లు వేస్తుండటంతో యూరియా అవసరం అధికంగా ఉంది. అందరికీ ఒకేసారి యూరియా అవసరం రావడం.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. చివరకు అర్ధరాత్రులు యూరియా కోసం పీఏసీఎస్ కేంద్రాల వద్దే పడుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆందోళన, ధర్నాలు.. ప్రస్తుతం పంటలకు అవసరమైన యూరియా కోసం రైతులు పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులు దీరుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నిత్యం ఏదో ఒక మండలంలో రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. సోమవారం నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు చివరకు నార్కట్‌పల్లి–అద్దంకి జాతీయ రహదారిపై రస్తారోకో చేపట్టారు. ఇక పెద్దవూర, నిడమనూరు మండల కేంద్రాల్లోనూ రైతులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. తిప్పర్తి, శాలిగౌరారం, హాలియా మండలంలోనూ యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దవూర, హాలియాలోలోని కొత్తపల్లి పీఏసీఎస్‌ల వద్ద యూరియా కోసం రాత్రి వేళల్లోనూ అక్కడే నిద్రిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా నడిగూడెంలో, ఆత్మకూరు(ఎస్) మండలాల్లో యూరియా కోసం ఆందోళన నిర్వహించగా, మద్దిరాల తదితర మండలాల్లో పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులుదీరారు. అవసరానికి సరిపడా అందని యూరియా.. ● నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 10.73 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. ప్రధానంగా 5,64,585 ఎకరాల్లో పత్తి, 5,05,160 ఎకరాల్లో వరి, 156 ఎకరాల్లో జొన్న, 2951 కంది, 310 పెసర, ఇతర పంటలను సాగు చేశారు. జిల్లాలొ వానాకాలం సీజన్ పంటలకు సెప్టెంబర్ వరకు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 53 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ● సూర్యాపేట జిల్లాలో 5,73,006 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. అందులో వరి 4.82 లక్షల ఎకరాల్లో, 84 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆయా పంటలకు జిల్లాలకు 60,734 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది. అయితే ఇప్పటివరకు 42 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. మరోవైపు ప్రభుత్వం ప్రతి ట్రిప్‌లో జిల్లాకు కేవలం 2 నుంచి 3 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో వచ్చిన యూరియా వచ్చినట్లు అయిపోతోంది. మరోవైపు రైతులకు కేవలం ఒకటి, రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు పీఏసీఎస్, ఆగ్రోస్ సేవా కేంద్రాలు, ఎన్డీసీఎంఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి.. పెట్టిన పెట్టుబడులు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు పెంటబోయిన వెంకటేశ్వర్లు. ఈయనది తిరుమలగిరి(సాగర్) మండలంలోని రాజవరం. నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేసి 15 రోజులు కావస్తో్ంది. ఇప్పటి వరకు యూరియా లభించకపోవడంతో చల్లలేదు. మూడు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా ఒక్కటీ లభించలేదు. దీంతో యూరియా లేక, పంట ఎదుగుదుల తగ్గిపోయి, దిగుబడి కోల్పోయే ప్రమాదం ఉందని, పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న రైతు పేరు వడ్లపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి. ఇతనిది పెద్దవూర మండలం ఏనేమీదిగూడెం. వానాకాలం సీజన్లో 25 ఎకరాలలో వరి సాగు చేశాడు. ఎకరాలకు బస్తా చొప్పున ప్రస్తుతం 25 బస్తాల యూరియా కావాలి. తొలి విడతలో ఫర్టిలైజర్‌లో ఎక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా దొరకడం లేదు. దీంతో వ్యవసాయ పనులను వదులుకుని మూడు రోజులుగా పెద్దవూర పీఏసీఎస్‌కు తెల్లవారక ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నాడు. రెండు రోజులు రెండు బస్తాల చొప్పున నాలుగు బస్తాలు, సోమవారం ఒక బస్తా మాత్రమే లభించింది. ఇంకా 20 వస్తాలు కావాలంటే.. ఇలా ఎన్ని రోజులు వేచి ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మాకున్న ఏడెకరాలతోపాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశా. రెండు వారాలుగా సహకార సొసైటీ చుట్టూ తిరుగుతున్నా 5 బస్తాల యూరియా మాత్రమే దొరికింది. మరో 7 బస్తాల యూరియా కావాలి. కూలీల కొరతతో కలుపు నివారణకు రసాయన మందుల వాడకం పెరిగింది. దీంతో మొక్క ఎండు బారి, పెరుగుదల లోపిస్తోంది. దీంతో యూరియా వేయడం తప్పనిసరి అవుతోంది. యూరియా లేకపోవడంతో దిగుబడి తగ్గుతుంది. – బుసిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, నిడమనూరు మాది సోమవారిగూడెం చెరువు, ఏఎమ్మార్పీ సాగు నీటితో మూడు ఎకరాలు వరి సాగు చేశాను. నాటేసి నెలరోజులవుతోంది. ఒక్క దఫా కూడా యూరియా వేయలేదు. పంటను చూస్తే దుఃఖం వస్తోంది. సకాలంలో యూరియా వేస్తేనే వరి దుబ్బు, పిలకలు వచ్చి, దిగుబడి వస్తుంది. – సింగం రామలింగయ్య, సోమవారిగూడెం, నిడమనూరు మండలం నేను 11ఎకరాల్లో వరి సాగు చేశా. యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నా. అయినా దొరకడం లేదు. అదును దాటిపోతోంది. యూరియా వేయపోవడంతో పొలం ఎదుగుదల లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – ఎం.సత్తయ్య, రైతు, రాయినిగూడం, తిప్పర్తి వానాకాలం సీజన్లో తన భూమితో పాటు కౌలుకు తీసుకుని 14 ఎకరాలలో వరి నాట్లు వేశాను. ప్రస్తుతం యూరియా అవసరం ఏర్పడింది. ఒక్కరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. సోమవారం రెండు లారీల యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో ఇంట్లోని ముగ్గురం తెల్లవారక ముందే పీఏసీఎస్‌కు వచ్చాం. క్యూలో నిల్చుంటే ఒకొక్కరికి ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. రోజు ఒక బస్తా ఇస్తే ఎన్నిరోజులు తిరగాలి. – కొలుపుల సంతు, పోతునూరు, పెద్దవూర మండలం ఫ వరి, పత్తి, పండ్ల తోటలకు ఒకేసారి ఎరువులు అవసరం ఫ ఈ సమయంలోనే దొరకని యూరియా ఫ దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతుల ఆందోళనఫ రోజుల తరబడి తప్పని ఎదురుచూపులు ఫ అర్ధరాత్రి కూడా పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు -
పంట తొలిదశలోనే తెగుళ్లను నివారిదా్దం
గరిడేపల్లి: వివిధ దశల్లో ఉన్న వరి పైర్లకు అగ్గి తెగులు (ఆకుమచ్చ దశ) ఆశించే అవకాశం ఉన్నందున రైతులు తొలిదశలోనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని గడ్డిపల్లి కేవీకే మృత్తిక శాస్త్రవేత్త కిరణ్ సూచించారు. వివిధ పంటల్లో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. ● వరిలో అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ మ్యాంకోజెబ్ 2.5గ్రా లేదా ఐసోప్రోథయోలేన్ 1.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ప్రధాన పొలాన్ని పొడి దుక్కి దున్ని, నీరు పెట్టి 3–4రోజులు ఉంచి.. వారం రోజులలోపు రోటవేటర్‌తో దమ్ము చేసుకొని నాట్లు వేసుకోవాలి. ఎకరానికి 50కిలోల డీఏపీ దమ్ము తర్వాత మరియు 25కిలోల యూరియా 14కిలోల యూరియా 14కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నాట్లు వేసే ముందు వేసుకోవాలి. ● నత్రజని ఎరువును 3–4దఫాలుగా వేయాలి. దమ్ములోనూ, పంట బాగా దుబ్బు చేసే దశలో (25–30 కిలోల యూరియా) మరియు అంకురం తొడిగే దశలోనూ (25–30కిలోలు) బురద పనులో వెదజల్లి 36–48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. ● రేగడి నేలల్లో పొటాష్ ఎరువును ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలిక భూముల్లో ఆఖరి దమ్ములో సగం (14కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్), అంకురం ఏర్పడే దశలో (14కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) మిగతా సగాన్ని వేయాలి. ● నాట్లు వేసేటప్పుడు ప్రతి 2మీటర్లకు 2అడుగు కాలిబాటలు తీసుకోవాలి. దమ్ము చేయకుండా నేరుగా విత్తినప్పుడు 25శాతం ఎరువును నాటు పద్ధతి కన్నా అధికంగా వేయాలి. మూడు సమాన భాగాలుగా నత్రజని ఎరువును విత్తిన 15–20రోజులకు, పిలక, చిరుపొట్ట దశలో వేయాలి. ఈ పద్ధతిలో 45రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. ● ప్రధాన పొలంలో కలుపు మొక్కల నివారణకు ఎకరానికి 4కిలోల బెన్సల్ఫూరాన్ మిథైల్ 0.6శాతం జిఆర్, ప్రెటిలాక్లోర్ 6శాతం జిఆర్ గుళికలను నాటిన 3–5రోజుల్లోపు 20కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నేరుగా వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేసే రైతులు ఎకరానికి ప్రెటిలాక్లోర్, సాపనర్ 600–800మి.లీ 3–5రోజుల్లోపు 20కిలోల ఇసుకతో కలిపి చల్లాలి. ● ప్రధాన పొలంలో నాటిన 18–20రోజుల తర్వాత కాండం తొలిచే పురుగు నివారణకు కార్బోఫ్యూరాన్ 3సిజీ 10కిలోలు లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4 సీజీ 8కిలోలు ఇసుకలో కలుపుకొని చల్లాలి. ● వరినాట్లు ఆలస్యమైతే ఉల్లికోడు ఆశించే అవకాశం ఉన్నందున దాని నివారణగా రైతులు కార్బోఫ్యూరాన్ 3సిజీ 10కిలోలు ఒక ఎకరానికి చల్లాలి. పత్తి, కంది సస్యరక్షణ చర్యలు● పత్తి చేను బెట్ట లేదా అధిక వర్షాలకు గురైనప్పుడు 19–19–19 లేదా 13ః0ః45లాంటి పోషకాలను లీటరు నీటికి 10గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ● అధిక సాంద్రతలో పత్తిని సాగు చేస్తున్న రైతులు మొక్క పెరుగుదలను, శాఖీయ కొమ్మల పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి. పెరుగుదల నియంత్రణకు మొక్కల 40–50 రోజుల దశలో ఉన్నప్పుడు మెపిక్పాట్క్లోరైడ్ మందును లీటరు నీటికి 1.2మి.లీ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తద్వారా పత్తికాయ సైజు కూడా సమానంగా ఉంటుంది. పత్తిలో తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా థయోమిథాక్సామ్ 0.2గ్రా. లేదా ఫిప్రోనిల్ 2.0మి.లీ లేదా ఫ్లోనికామిడ్ 0.3గ్రా. లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.25మి.లీ లేదా డైఫెన్ థయూరాన్ 1.22గ్రా. లేదా స్పైనోటోదమ్ 0.9 మి.లీ లేదా లోక్సాఫ్లోర్ 1గ్రా. లేదా ఎసిఫేట్, ఇమిడాక్లోప్రిడ్ 2గ్రా. లేదా డైనోటోఫ్యూరాన్ 0.4గ్రా. లీటరు నీటికి కలుపుకొని మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ● తెల్లదోమ నివారణకు సల్ఫోక్సాఫ్లోర్ 0.6గ్రా. లేదా డైఫెన్థయూరాన్ 1.25గ్రా. లేదా బైఫెన్ డైఫెన్థయూరాన్ 1.25 గ్రా. మందులను లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ● గులాబీ రంగు పురుగు నివారణకు పంట పూత దశ నుండే లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 నుంచి 8 వరకు పెట్టుకోవాలి. గుడ్డి పూలను ఎరివేయాలి. పురుగు తాకిడిని బట్టి మొదటగా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ వేప కషాయం లేదా వేపనూనె 5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ● కంది పంటలో అంతరకృషి చేసి కలుపును నివారించి భూమిని గుల్లబారేలా చేస్తే భూమిలో తేమ బాగా నిలిచి బెట్టను కొంత వరకు తట్టుకోగలదు. అంతర కృషి సాధ్యం కాని పరిస్థితుల్లో కలుపు నివారణకు విత్తిన 20రోజులకు ఇమాజితా ఫిర్ 300మి.లీ ఎకరానికి అనగా 1.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే గడ్డి, వెడల్పాకు కలుపును నివారించవచ్చు. బెట్ట పరిస్థితుల్లో పేనుబంక ఆశించి మొక్కలు పాలిపోతాయి. దీని నివారణకు 20గ్రా. యూరియా ద్రావణం లేదా 10గ్రాముల మల్టీ కె లేదా పాలిఫీడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త కిరణ్ సూచనలు -
నిడమనూరు మార్కెట్‌ను సందర్శించిన విద్యార్థులు
నిడమనూరు : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కంపాసాగర్‌కు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు సోమవారం నిడమనూరు వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. విద్యార్థులు మార్కెట్ పరిధిలోని వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెట్ సౌకర్యాలను పరిశీలించారు. కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను మార్కెట్ చైర్మన్ అంకతి సత్యంను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ ద్వారా పశువులకు వైద్యశిబిరాలు కల్పించి రైతులకు పశుపోషణలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి చందర్రావు, వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. -
అమ్మా.. మా గోడు వినండి!
నల్లగొండ : అమ్మా.. మా గోడు విని.. మా సమస్య పరిష్కరించండి అంటూ పలువురు బాధితులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కలెక్టరేట్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మొఒత్తం 99 మంది కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులకు వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 69.. ఇతర ఫిర్యాదులు 30 ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా శాఖలకు పంపారు. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఉన్నారు. ఫ గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు బాధితుల విన్నపం ఫ వినతులు స్వీకరించి భరోసా ఇచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
‘పరిషత్’ జాబితాకు నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణతో పాటు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తుది ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేసింది. జిల్లాలో అందుకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దృష్టి సారించారు. 6న ముసాయిదా జాబితాల విడుదలఈ నెల 6వ తేదీన ఎంపీడీఓ, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రచురించనున్నారు. 8వ తేదీన జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల, పోలింగ్ కేంద్రాల జాబితాపై సమావేశం నిర్వహించి వారి నుంచి సూచనలు తీసుకోనున్నారు. అదే రోజు మండల స్థాయిలో కూడా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలను ఇతర సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చిన ఫిర్యాదులను 9వ తేదీన పరిష్కరిస్తారు. 10వ తేదీన తుది ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. ఎన్నికలకు సిద్ధంగా.. ఉమ్మడి జిల్లాలో 716 ఎంపీటీసీ, 73 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఈ ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టనుంది. నల్లగొండ జిల్లాలో 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జెడ్పీటీసీ స్థానాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 178 ఎంపీటీసీ స్థానాలు, 17 జెడ్పీటీసీ స్థానాలు, సూర్యాపేట జిల్లాలో 186 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను, పోలింగ్ స్టేషన్లను జిల్లాల అధికారులు ఖరారు చేయనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండేలా ఈ చర్యలు చేపడుతున్నారు. ఫ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల ఫ ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ ఫ ఉమ్మడి జిల్లాలో 716 ఎంపీటీసీ, 73 జెడ్పీటీసీ స్థానాలు -
సెల్‌ఫోన్ వదిలితేనే సీ్టరింగ్
మిర్యాలగూడ టౌన్ : కొంత మంది ఆర్టీసీ డ్రైవర్లు సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు నడుపుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్యూటీ సమయంలో బస్సు డ్రైవర్లు సెల్‌ఫోన్ వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. ముందుగానే సెల్ఫోన్లను డిపోలోని సెక్యూరిటీ అధికారి కార్యాలయంలో డిపాజిట్ చేసి విధులకు వెళ్లాలని సూచించింది. ఆయా డిపోల్లో సర్వే నిర్వహించిన ఆర్టీసీ ఉమ్మడి జిల్లాలో దేవరకొండ, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ డిపోలు ఉండగా గత నెలలో ఆయా డిపోల్లో ఇతర జిల్లాలకు సంబంధించిన ఆర్టీసీ సిబ్బందిని ఒక్కో డిపోకు ఐదుగురు చొప్పున కేటాయించి ఆర్టీసీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఒక్క మిర్యాలగూడ డిపోలో 162 మంది డ్రైవర్లు ఉండగా వీరిలో సుమారు 90 మంది వరకు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నట్లు సర్వేలో వెల్ల డైంది. దీంతో నల్ల గొండ రీజియన్‌లో మిర్యాలగూడ ఆర్టీసీ డిపోను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. రాష్ట్రంలో 11 డిపోల్లో ఈ నిర్ణయం తీసుకోగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ డిపోలో సోమవారం నుంచి అమలు చేసింది. డిపోలో మొత్తం 162 మంది డ్రైవర్లు ఉండగా ప్రతి రోజు 70 నుంచి 100 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే విధి నిర్వహణలో భాగంగా తొలి రోజు డ్యూటీకి వెళ్లి 38 మంది విధుల్లో చేరే ముందు తన సెల్ఫోన్లను డిపోలోని సెక్యూరిటీ అధికారి కార్యాలయంలో డిపాజిట్ చేశారు. విధులు ముగించుకున్న తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు వీటిని తీసుకువెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. సెల్ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా సంచులను తయారు చేయించారు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో బస్సులోని సంబంధిత కండక్టర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే డ్రైవర్ ఫోన్ మాట్లాడేందుకు అవకాశం కల్పించనున్నారు. కాగా.. మిర్యాలగూడ డిపో నుంచి కాకినాడ, తిరుపతికి వెళ్లే బస్సులకు సంబంధించి 12 మంది డ్రైవర్లు ఉండగా దూరపు ప్రయాణంతో పాటు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటుండటంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ డ్రైవర్లకు ఈ నిబంధన మినహాయించారు. ప్రయాణికుల రక్షణ కోసమే ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని బస్సు డ్రైవర్లు కూడా స్వాగతిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా డ్యూటీకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ కార్యాలయంలో డిపాజిట్ చేస్తున్నారు. ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చాలనేది ఆర్టీసీ లక్ష్యం. అయితే చాలా మంది కూడా తమ సెల్ఫోన్లు ఇంటి వద్దనే ఉంచుతుండగా కొంత మంది డిపో వద్ద డిపాజిట్ చేసి డ్యూటీ దిగి వెళ్లిపోయే సమయంలో తీసుకెళ్తున్నారు. ఏదైనా అత్యవసరమని అనుకుంటే తాము ఆ బస్సు కండక్టర్‌కు ఫోన్ చేసి ఆ డ్రైవర్‌తో మాట్లాడిస్తాం. – రాంమోహన్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం, మిర్యాలగూడ బస్సు నడిపే సమయంలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం సెక్యూరిటీ కార్యాలయం వద్ద అప్పగించాకే విధులకు వెళ్లాలని సూచన పైలట్ ప్రాజెక్టు కింద మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎంపిక సోమవారం నుంచి అమలులోకి వచ్చిన నిర్ణయం -
గర్భిణి మృతి కేసులో మరో ముగ్గురు అరెస్టు
సూర్యాపేటటౌన్ : అబార్షన్ చేయడంతో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందిన కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలి పారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఐదు నెలల గర్భిణి బయ్య అనూష మృతి చెందిన కేసులో సూర్యాపేట పట్టణంలోని ఒమేగా హాస్పిటల్లో అబార్షన్‌కు ఏర్పాట్లు చేసిన హాస్పిటల్ నిర్వాహకుడు ఏ1 గోరంట్ల సంజీవ, సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఏ2 జాల జానయ్యను, ఒమెగా ఆస్పత్రి మేనేజ్మెంట్ ఏ6 వేణును సూర్యాపేటలోని ఓ హోటల్ వద్ద అరెస్టు చేశారు. మూడోసారి ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బయ్య నగేష్‌కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్య అనూష మూడోసారి ప్రెగ్నెంట్ కాగా.. లింగ నిర్ధారణ పరీక్ష చేసేందుకు తన దగ్గరి బంధువైన అదే గ్రామానికి చెందిన ఏ8 ఉప్పల సందీప్ ద్వారా టేకుమట్ల గ్రామంలో ఆర్ఎంపీగా పని చేస్తున్న ఏ2 జాల జానయ్యను సంప్రదించాడు. నకిరేకల్‌కు చెందిన ఆర్ఎంపీ ఏ3 బాత్క యాదగిరి వద్ద మే 17న అల్ట్రా సౌండ్ స్కానింగ్ నిర్వహించి గర్భంలో ఉంది ఆడ శిశువు అని తెలుసుకున్నారు. స్కానింగ్ చేయించినందుకు ఆర్ఎంపీ జానయ్య ఏ9 బయ్య నగేష్ వద్ద రూ.12వేలు తీసుకున్నాడు. అబార్షన్ చేయించేందుకు జిల్లా కేంద్రంలోని ఒమేగా హాస్పిటల్(సంజీవిని హాస్పిటల్) నిర్వాహకులు గోరెంట్ల సంజీవ, వీరబోయిన వేణును సంప్రదించి కూసుమంచికి చెందిన నాగరాజు, అర్వపల్లికి చెందిన చెవుగోని గణేష్‌లతో అబార్షన్ చేయించారు. గర్భిణీకి వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్ష చేసిన వైద్యులు అనూష అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి కార్యాలయం వారు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి కేసులో మొత్తం 10 మంది నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే నలుగురు రిమాండ్ఈ కేసులో ఇప్పటికే ఏ8 అయిన ఉప్పల సందీప్‌ను, అబార్షన్ చేసిన చెవుగోని గణేష్‌ను మే 29న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా నకిరేకల్‌లో గర్భిణికి స్కానింగ్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ బాత్క యాదగిరిని ఆగస్టు 8న అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే మరో మైనర్ వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసన్నకుమార్ -
ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ పోటీలు
భువనగిరి : భువనగిరి పట్టణంలోని సువాలి ఎస్టేట్‌లో గల న్యూ డైమెన్షన్ స్కూల్ ఆవరణంలో కొనసాగుతున్న అండర్–18 జూనియర్స్ బాలబాలికల అంతర్జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు శనివారం ముగిశాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఆరు రోజుల పాటు పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ముగింపు రోజున జరిగిన ఫైనల్స్‌లో గెలుపొందిన వారికి మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ అకాడమీ ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్, తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ మేనేజర్ వైభవ్ పటేల్, ,జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దిడ్డి బాలాజీ, ప్రధాన కార్యదర్శి కలీం అహ్మద్, సంయుక్త కార్యదర్శి పరమేష్‌కుమార్, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. విజేతలు ఎవరంటే.. బాలుర సింగిల్స్ ఫైనల్లో వ్రజ్ గోహిల్(ఇండియా), డెవ్ విఫుల్ పటేట్ (ఇండియా)పై 6–1, 6–4 తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో స్నిగ్ధకాంత (ఇండియా), ఐశ్వర్య జాదవ్(ఇండియా)పై 5–7, 6–2,6–0 గెలుపొందింది. బాలుర డబుల్స్ ఫైనల్లో ఽథామస్, కాప్పి (ఫ్రాన్స్), ప్రణవ్ మహేష్ సరవణకుమార్ (ఇండియా)లు, హృథిక్ కాటకం(ఇండియా), ప్రకాష్ సారణ్(ఇండియా)పై 6–4, 6–0తేడాతో విజయం సాధించారు. బాలికల విభాగంలో నైనికా నరేందర్‌రెడ్డి బేండ్రం(ఇండియా), స్నిగ్ధ కాంత(ఇండియా)లు, శ్రీనిత్తి చౌదరి(ఇండియా), హర్షకార్తిక ఊరగంటి(ఇండియా)పై 5–1 తేడాతో రిటైర్డ్ మ్యాచ్‌లో విజయం సాధించారు. -
భద్రతా లోపం వల్లే ప్రమాదాలు
నకిరేకల్ : ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ కార్యాలయాల్లో భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్ జెడ్పీ బాలికల పాఠశాలలో చెత్త శుభ్రం చేస్తూ విద్యుత్ షాక్‌కు గురై నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు మున్సిపల్ కార్మికులు శోభ, వంటెపాక నాగరాజు, సబితను శనివారం ఆయన పరమర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. ఇలాంటి ప్రమాదాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు పునరావతం కాకుండా చూడాలన్నారు. ఆయన వెంట నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ప్రగడపు నవీన్‌రావు, పల్లె విజయ్, రాచకొండ వెంకన్నగౌడ్, గొర్ల వీరయ్య, గుర్రం గణేష్ తదితరులు ఉన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
శ్రీవాణి తరహాలోనే గరుడ ట్రస్టు
యాదగిరిగుట్ట: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసిన విధంగానే యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం శ్రీగరుడ ట్రస్టును ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన విధి విధానాలను శనివారం ఆలయ ఈఓ వెంకట్రావు వెల్లడించారు. గరుడ స్కీంకు వచ్చే విరాళాలలను గరుడ ట్రస్టు పేరుతో అకౌంట్ ప్రారంభించి విద్య, వైద్యం, ప్రసాద వితరణ నిర్వహణకు వినియోగించనున్నారు. ఈ ట్రస్టును ఈ నెల 15న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించగా.. 29వ తేదీన విధి విధానాలను రెవెన్యూ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పరిశీలించి విడుదల చేశారు. మూడు స్లాట్లు.. ప్రత్యేక కూపన్లు.. గరుడ ట్రస్టును మూడు స్లాట్లుగా ఏర్పాటు చేశారు. విరాళాలుగా చెల్లించిన భక్తులకు వసతి కూపన్స్, దర్శనం కూపన్స్ అందజేసి దర్శన సదుపాయాలను కల్పించడంతో పాటు బాండ్ సైతం అందజేయనున్నారు. గరుడ స్కీంలో విరాళాలు సమర్పించే భక్తులు దేవస్థానం సెల్లో విరాళాలు సమర్పించి బాండ్, కూపన్స్‌ను పొందాలని ఆలయాధికారులు సూచిస్తున్నారు. స్కీం వివరాలు ఇలా.. ఫ రూ.50వేలు విరాళం చెల్లించిన భక్తులకు రూ.300 బ్రేక్ దర్శనాన్ని సంవత్సరంలో రెండు సార్లు ఆరుగురు చొప్పున లైఫ్‌టైమ్ ఇవ్వనున్నారు. రూ.150 ప్రత్యేక దర్శనం టిక్కెట్‌పై సంవత్సరంలో రెండు సార్లు ఆరుగురికి లైఫ్ టైమ్ ఉంటుంది. విరాళం చెల్లించిన మొదటిసారి శ్రీస్వామి వారి అభిషేకం లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం (కల్యాణ శెల్లా, కనుము) అందజేస్తారు. ఫ రూ.లక్ష విరాళం చెల్లించిన భక్తులకు రూ.300 బ్రేక్ దర్శనాన్ని సంవత్సరంలో నాలుగు సార్లు ఆరుగురు చొప్పున లైఫ్‌టైమ్ ఇవ్వనున్నారు. రూ.150 ప్రత్యేక దర్శనం టిక్కెట్ పై సంవత్సరంలో నాలుగు సార్లు ఆరుగురు చొప్పున లైఫ్‌టైమ్ ఉంటుంది. విరాళం చెల్లించిన మొదటి సారి శ్రీస్వామి వారి అభిషేకం లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం అందజేస్తారు. ఫ రూ.2లక్షల విరాళం చెల్లించిన భక్తులకు రూ.300 బ్రేక్ దర్శనాన్ని సంవత్సరంలో మూడు సార్లు ఎనిమిది మంది చొప్పున లైఫ్‌టైమ్ ఇవ్వనున్నారు. రూ.150 ప్రత్యేక దర్శనం టిక్కెట్ పై సంవత్సరంలో 8 సార్లు ఆరుగురికి దర్శనం ఉంటుంది. అంతే కాకుండా కొండ కింద యాదరుషి నిలయంలో డబుల్ బెడ్రూం గదిని సైతం కేటాయిస్తారు. వీటితో పాటు విరాళం చెల్లించిన మొదటి సారి శ్రీస్వామి వారి అభిషేకం లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం బహూకరిస్తారు. ఫ ట్రస్టు ద్వారా వచ్చిన సొమ్ము విద్య, వైద్యం, ప్రసాద వితరణకు వినియోగం ఫ దాతలకు ప్రత్యేక దర్శన భాగ్యం ఫ విధివిధానాలు విడుదల చేసిన ఆలయ ఈఓ -
ఓటరు జాబితా.. తప్పులతడక!
నల్లగొండ : గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా తప్పులతడకగా మారింది. ఒక గ్రామంలోని ఓట్లు మరొక గ్రామం జాబితాలో చేరగా.. ఒక గ్రామంలో ఒక్కరికే ఐదు, నాలుగు, రెండు ఓట్ల చొప్పున జాబితాలో దర్శనమిచ్చాయి. కాగా ఒక కుటుంబంలోని ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉన్నాయి. దీంతో శనివారం ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన పార్టీల సమావేశంలో నాయకులు అభ్యంతాలు వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను ఈ నెల 28న ప్రకటించింది. ఓటర్ల జాబితాపై శనివారం అభ్యంతరాలు స్వీకరించారు. శుక్రవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా.. జాబితాలో తప్పులు ఉన్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం మండలస్థాయిలో ఎంపీడీఓలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున పొరపాట్లు జరిగినట్టుగా బయటపడింది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫ అభ్యంతరం తెలిపిన నాయకులు మా ఊరిలో జనాభా కంటే ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 371 జనాభా ఉంది. 2019 ఎన్నికల్లో 370 మంది ఓటర్లు ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 400కు పెరిగారు. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 476కు పెరిగింది. ఇళ్లు పెరగలేదు కానీ ఓటర్లు పెరిగారు. పక్క గ్రామమైన చందనపల్లికి చెందిన 30 మంది ఓట్లు ఈ గ్రామం ఓటర్లు జాబితాలో చేరాయి. –శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్, రెడ్డికాలనీ, నల్లగొండ మండలం -
కల్తీదాణా తయారు చేస్తున్న ఇద్దరి అరెస్ట్
కేతేపల్లి: కల్తీ దాణాను తయారు చేసి కోళ్ల ఫామ్స్ యజమానులకు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను శనివారం కేతేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి వివరాలను శనివారం కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి వెల్లడించారు. కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామానికి చెందిన ఆల్దాసు సతీష్, బుద్దె కృష్ణలు సూర్యాపేట పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని రైస్ మిల్లుల నుంచి నూకలు, తవుడు సేకరించి కోళ్ల ఫారాలకు దాణాను విక్రయిస్తున్నారు. వ్యాపార నిర్వహణ కోసం కేతేపల్లిలోని పడావుగా ఉన్న పాత రైస్‌మిల్ గోదామును కిరాయికి తీసుకున్నారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నూకలు, తవుడుతో కూడిన దాణాలో 30శాతం ఇసుకను కలిపి కల్తీ దాణాను తయారు చేసే దందాకు తెరలేపారు. తయారు చేసిన కల్తీ దాణాను డీసీఎంలో లోడ్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. కోళ్ల కల్తీ దాణా తయారీ దందాపై స్థానిక పంచాయతీ కార్యదర్శి సయ్యద్‌బాబా చేసిన ఫిర్యాదు మేరకు కేతేపల్లి ఎస్ఐ సతీష్ శనివారం తన సిబ్బందితో కలిసి గోదాముపై దాడి చేశారు. తనిఖీలో గోదాములో నిల్వ ఉన్న రూ.3.30 లక్షల విలువైన 245 బ్యాగుల కల్తీ కోళ్ల దాణా (122.5 క్వింటాళ్లు), 8 టన్నుల ఇసుకను పోలీసులు సీజ్ చేశారు. ఈ దాణా తిన్న కోళ్లతోపాటు వాటిని తిన్న మనుషుల ఆరోగ్యాలకు కూడా ముప్పు పొంచి ఉందని సీఐ తెలిపారు. విచారణ అనంతరం కల్తీ దాణా తయారు చేస్తున్న సతీష్, కృష్ణలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు. వారినుంచి డీసీఎం, టాటా నెక్సాన్ కారు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సమావేశంలో కేతేపల్లి ఎస్ఐ యు.సతీష్, సిబ్బంది అనిల్‌రెడ్డి, సతీష్, సైదులు, రాంబాబు పాల్గొన్నారు. -
మూసీలో చిక్కుకున్న యువకుడు సురక్షితం
రామన్నపేట : ప్రమాదవశాత్తు మూసీనదిలో పడి వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుడు కానుకుంట్ల మత్స్యగిరిని ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది శనివారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మత్స్యగిరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో గ్రామం సమీపంలోని మూసీ వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు మూసీనదిలో పడిపోయాడు. వరద ప్రవాహానికి సుమారు మూడువందల మీటర్ల దూరం వరకు కొట్టుకుపోయాడు. అదృష్ట వశాత్తు చెట్టును ఆసరా చేసుకొని పెద్ద మట్టిదిబ్బపైకి చేరాడు. అక్కడ ఉన్న వారు గమనించి వెంటనే పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. తహసీల్దార్ లాల్‌బహదూర్‌శాస్త్రి, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు యాదగిరిగుట్ట నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించారు. యువకుడిని రక్షించేందుకు నదిలోకి పడవలో వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందంలోని ఒక సభ్యుడు నదిలో పడిపోగా మిగిలిన సభ్యులు అతడిని చాకచక్యంగా రక్షించారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు మత్స్యగిరి ఉన్న ప్రదేశానికి చేరుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. చీకటిగా ఉండడం, నది ప్రవాహం ఉధృతంగా పారుతుండడంతో అతడి వద్దకు చేరుకోలేక పోయారు. రాత్రి 12 గంటల తరువాత సహాయక చర్యలు నిలిపివేశారు. రాతంత్రా వంతెనపైనే కాపాలా.. మత్స్యగిరికి వెలుతురు కనిపించేలా అధికారులు అర్ధరాత్రి ట్రాక్టర్ లైట్లు ఏర్పాటు చేశారు. కుటుంబసభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక యువకులు వంతెనపైనే రాత్రంగా అతడిని గమనిస్తూ కాపాలా కాశారు. స్థానిక గ్రామ పంచాయతీ భవనంలోనే సేదదీరిన ఎస్డీఆర్ఎఫ్ బృందం శనివారం తెల్లవారుజామున 5గంటలకే సహాయక చర్యలను మొదలు పెట్టారు. ఉదయం 6:45 గంటలకు మత్స్యగిరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మత్స్యగిరిని కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ హనుమంతరావు రాత్రంతా సహాయక చర్యలను పర్యవేక్షించారు. బయటకు వచ్చిన మత్స్యగిరి కలెక్టర్ ఫోన్లో పరామర్శించారు. ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, డీఎఫ్ఓ మధుసూదన్‌రావు, ఎస్ఎఫ్ఓ మధుసూదన్‌రెడ్డిలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. సీఐ ఎన్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యలో ఎస్ఐలు డి.నాగరాజు, యుగంధర్‌లు సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా బందోబసు ఏర్పాటు చేశారు. ఫ రాత్రంతా నదిలోనే మట్టిదిబ్బపై ఉన్న బాధితుడు మత్స్యగిరి ఫ శనివారం తెల్లవారుజామున ఒడ్డుకు చేర్చిన ఎస్డీఆర్ఎఫ్ బృందం -
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
రామగిరి(నల్లగొండ) : యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సమాజంలో మంచి మనుషులుగా ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ఎన్జీ కళాశాలలోని సాంస్కృతిక విభాగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి నాగరాజు ర్యాగింగ్, డ్రగ్స్, గిరిజనుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు నేరాలు, వ్యసనాలను లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం రాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిరంతరం చదివి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.దుర్గావ్రసాద్ లీగల్ సెల్ కార్యదర్శి, జడ్జి వి.వురుషోత్తమరావు, సీఐ బి.ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి చత్రునాయక్, ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మద్దిలేటి, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కె.అనంతరెడ్డి, సుదర్శన్, వైస్ ప్రిన్సిపాల్స్ పి.రవికుమార్, శ్రీనివాస్, శ్రీధర్, ఎన్సిసి ఆఫీసర్ సుధాకర్, బి.అనిల్‌కుమార్, వెంకటరెడ్డి, ఏ.మల్లేశం, కోటయ్య, శివరాణి, సావిత్రి, అధ్యాపకులు మునిస్వామి, ఎం.అనిల్‌కుమార్, రాంబాబు, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి
చివ్వెంల : అతి వేగంగా వస్తున్న డీసీఎం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం శివారులోని సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆత్మకూర్(ఎస్) మండల ఏనుబాముల గ్రామానికి చెందిన కలకోట్ల శ్రీను (47) సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా అస్సాంలో పనిచేస్తున్నారు. ఇటీవలే సెలవులపై వచ్చిన ఆయన శనివారం సూర్యాపేటలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో బీబీగూడెం గ్రామ శివారులో ఖమ్మం నుంచి సూర్యాపేటకు వస్తున్న డీసీఎం బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. దీంతో శ్రీను తలకు తీవ్రగాయమైంది. అతడిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. మృతుడి కుమారుడు రాకేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
లక్కుంటే.. పట్టుచీర
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లిలోని కొండాలక్ష్మణ్ బాపూజీ వీవర్స్ మార్కెట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో భక్తులను ఆకర్షించేందుకు నిర్వాహకులు లక్కీ డ్రా కూపన్లు పెట్టారు. రూ.100 చెల్లించి కూపన్ తీసుకొంటే గణేష్ నిమజ్జనం రోజున లక్కీ డ్రా ద్వారా మొదటి బహుమతి కింద రూ.22వేల పోచంపల్లి ఇక్కత్ పట్టుచీర, రెండవ బహుమతి రూ.15వేల పట్టుచీర, మూడవ బహుమతి రూ.7,800 పట్టుచీరతో పాటు మరో 20 మందికి రూ.2వేల విలువ చేసే మస్రైజ్డ్ చీరలను అందజేస్తామని ఏకేఎల్బీ వీవర్స్ మార్కెట్ అధ్యక్షుడు గుండు శ్రీరాములు తెలిపారు. -
రేషన్ కమీషన్ విడుదల
నల్లగొండ : రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ విడుదల చేసింది. జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 997 డీలర్లకు రూ.2 కోట్ల కమీషన్‌ను శనివారం విడుదల చేసింది. జిల్లాలో 997 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా 5,28,309 కుటుంబాలకు రేషన్ అందుతోంది. రేషన్ పంపిణీ చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.90, కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.50 మొత్తం రూ.140 కమీషన్ రూపంలో డీలర్‌కు అందుతుంది. అయితే శనివారం రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ విడుదల చేయగా.. కేంద్రం నుంచి రావాల్సిన కమీషన్ ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉంది. జూన్‌లోనే మూడు నెలల రేషన్.. జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి ప్రభుత్వం జూన్ మాసంలోనే పేదలకు బియ్యం పంపిణీ చేసింది. అయితే మూడు నెలల కమీషన్ ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుండడంతో ఆగస్టు చివరి నాటికి కమీషన్ ఇవ్వకపోతే సెప్టెంబర్ నుంచి రేషన్ షాపులు బంద్ పెట్టి సమ్మె బాట పడతామని డీలర్లు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వెంటనే కమీషన్‌ను విడుదల చేయాలని విన్నవించారు. రాష్ట్ర కమీషన్ విడుదల.. రేషన్ డీలర్లంతా సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయమని చెప్పడంతో ప్రభుత్వం స్పందించిన ప్రభుత్వం శనివారం జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన రేషన్ డీలర్ల కమీషన్ రూ.2 కోట్లు విడుదల చేసింది. కానీ, కేంద్రం నుంచి రావాల్సిన కమీషన్ ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా కమీషన్ విడుదల చేసి ఆదుకోవాలని డీలర్లు కోరుతున్నారు. ఫ డీలర్లకు మూడు నెలల కమీషన్ రూ.2 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫ కేంద్రం నుంచి రావాల్సిన కమీషన్ ఐదు నెలలుగా పెండింగ్ -
కుక్కల బారిన పడొద్దు
దేవరకొండ : కుక్కల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలకు స్టెరిలైజేషన్, కుక్కల దత్తత కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే కుక్కల బారిన పడకుండా ఉంటామని తెలిపారు. ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయడంతో వీధి కుక్కలు, కోతులు, పిల్లులు వంటివి పెరిగిపోయే అవకాశం ఉందన్నారు. ఇటీవలి కాలంలో వీధి కుక్కల బారిన పడి చాలా మంది గాయాల పాలవుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కుక్కలకు స్టెరిలైజేషన్ చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ మధుసాదన్రెడ్డి, ఎంపీడీఓ డానియల్, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ఉన్నారు. ఈకేవైసీ, టీహెచ్ఆర్లో నమోదు చేయాలినల్లగొండ టౌన్ : అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు ఈ కేవైసీ, టీహెచ్ఆర్(టేక్ హోం రేషన్)లో నూరు శాతం పూర్తి చేయాలని, దానికి అనుగుణంగానే వచ్చే నెల పౌష్టికాహార ఇండెంట్ వస్తుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి కృష్ణవేణి తెలిపారు. శనివారం నల్లగొండలో చర్లపల్లి సెక్టార్ అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ప్రభుత్వం ఈ కేవైసీ టీహెచ్ఆర్ ప్రకారంగానే నిధులు విడుదల చేస్తామని ప్రకటించిందని, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం ఈ కేవైసీలు 96 శాతం ఉందని దాన్ని రేపటిలోగా నూరు శాతం చేయాలని, టీహెచ్ఆర్ లు 66 శాతం మాత్రమే ఉన్నాయని దాన్ని రేపటిలోగా 90 శాతానికి పెంచితేనే వచ్చే నెలకు సంబంధించిన ఇండెంట్ వస్తుందని తెలిపారు. టీచర్లు అధికారులు సమన్వయంతో పని చేస్తూ వాటిని నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. నీలగిరిలో ట్రాఫిక్ పరిశీలననల్లగొండ : నీలగిరిలో ట్రాఫిక్ సమస్య ఎదురయ్యే ప్రాంతాలను ఎస్పీ శరత్చంద్ర పవార్ శనివారం పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకురాగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, ట్రాపిక్ సీఐ లక్షయ్య తదితరులు ఉన్నారు. -
బత్తాయి పంట కాపాడుతాం
నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ జిల్లాలో బత్తాయి పంటలను కాపాడేందుకు ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ నివేదిస్తామని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం ఉదయాదిత్య భవన్లో బత్తాయి రైతులు, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుందామని రైతుల సమస్యలు, అభిప్రాయాలను క్రోడికరించి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. బత్తాయి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని.. మార్కెట్లో దళారీ వ్యవస్థ, సౌకర్యాలు లేకపోవడం, నిర్వహణ లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. బత్తాయి మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందన్నారు. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏ రకంగా బత్తాయి మార్కెట్‌ను కాపాడవచ్చో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతు కమిషన్ ఆదేశాల మేరకు బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. బత్తాయి రైతులకు లాభం చేకూర్చేలా శాసీ్త్రయమైన పద్ధతిలో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. బత్తాయిని పాఠశాలలు, వసతి గృహాలకు, ఆసుపత్రులకు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కొండమల్లేపల్లిలోని ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషన్ సభ్యుడు భూమి సునీల్ మాట్లాడుతూ బత్తాయి రైతులను కాపాడేందుకు రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థిక చేయూత అందిస్తే బాగుంటుందన్నారు. మరో సభ్యురాలు భవాని మాట్లాడుతూ రైతులు ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రైవేట్‌గా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై ఆలోచించాలన్నారు. సభ్యులు వెంకన్న యాదవ్, కెవిఎన్.రెడ్డి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆప్ రీసెర్చ్ సురేష్‌రెడ్డి, రైతులు నంద్యాల నర్సింహారెడ్డి, కర్నాటి లింగారెడ్డి, నూకల వెంకటరెడ్డి, అశోక్‌రెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజు, సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ బాబు, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, ఉద్యాన ఉప సంచాలకులు సుబాషిని, జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్, ఛాయాదేవి, గోపాల్, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, ఉద్యాన అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ పలు సూచనలతో ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం ఫ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
పత్తిచేలు వర్షార్పణం
ఫ జాలు పట్టి ఎర్రబారిన పత్తి మొక్కలు ఫ నకిరేకల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని 3వేల ఎకరాల్లో నష్టం నకిరేకల్ శివారులో మూసీ రోడ్డులో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. ఎకరానికి రూ.13 వేల చొప్పును కౌలుకు చెల్లించాను. సూమారు రూ.5లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 12 ఎకరాల్లో.. 10 ఎకరాలు వర్షంతో జాలు పట్టింది. పత్తి చేను కళ్ల ముందు వాడిపోయి ఎర్రబారుతోంది. వర్షాలతో నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలి. – వీరబోయిన రమేష్, రైతు, కేతేపల్లి వర్షాల వచ్చిన సమయంలో పత్తి చేలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. చేలలోకి వచ్చిన నీరు వెంటనే తీసివేయాలి. తెగుళ్ల నివారణకు వ్యవసాయాధికారుల సలహల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. – ఎండీ.జానిమియా, ఏడీఏ, నకిరేకల్ నకిరేకల్ : ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి చేలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. చేలలో నీరు నిలిచి మొక్కలు ఎర్రబారాయి. నకిరేకల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూరు, శాలిగౌరారం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల పత్తి చేలు జాలు పట్టి దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో పంట దెబ్బతినడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా భుమిలో కలిసిపోయందని వాపోతున్నారు. 70,332 ఎకరాల్లో పత్తి సాగు నకిరేకల్ వ్యవసాయ డివిజన్ వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 1,15,954 ఎకరాల్లో వరి, 70,332 ఎకరాల్లో పత్తి, కంది, పెసర, జిలుగు, వేరుశనగ తదితర పంటలు 3,820 ఎకరాల్లో సాగు చేశారు. ఆయా మండలాల్లో ఇటీవల కురిసిన ముసురు వర్షాలతో నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. నకిరేకల్ మండలంలోని నోముల, తాటికల్, ఓగోడు, పాలెం, వల్లాబాపురం, నడిగూడెం, కేతేపల్లి మండం గుడివాడ, కాసనగోడు, బొప్పారం, కొత్తపేట, శాలిగౌరారం మండలం ఊట్కురు, వల్లాల, అడ్లూరు, చిత్తలూరు, ఇటుకులపహాడ్, వంగమర్తి, ఆకారం, కట్టంగూరు మండలం ఈదూలురు, బొల్లేపల్లి, మునుకుంట్ల, పరడ, కురుమర్తి తదితర గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నాయి. పత్తి చేలు వదిలేయాల్సిందే.. ఈ ఏడాది అదునుకు వర్షాలు కురవడంతో ఎంతో ఆశతో రైతులు పత్తిసాగుకు పూనుకున్నుఆరు. రెండు నెలల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టారు. ముసురు వర్షాలతో పత్తిచేలలో నీరు నిలిచి జాలు పట్టడంతోపాటు తెగుళ్లుతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లరేగడి భూముల్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఆ భూముల్లో సాగు అయిన పత్తి చేలు వాడు పట్టి ఎండిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో రైతులు చేలను వదిలివేయాల్సిన వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
2న గుండ్రాంపల్లిలో బీజేపీ సభ
చిట్యాల : రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెలన 2వ తేదీన చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తెలిపారు. గుండ్రాంపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఆ పార్టీ జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం రజాకార్ల సైన్యానికి ఎదురొడ్డి పోరాడిని చేసిన గుండ్రాంపల్లిలోనే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న బహిరంగ సభలో రెండు వేల మంది పాల్గొంటారని తెలిపారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హాజరవుతున్నారని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీబాత్ 125వ ఏపిసోడ్‌ను వీక్షించారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరేల్లి చంద్రశేఖర్, నూకల వెంకటనారాయణరెడ్డి, మండల వెంకన్న, విద్యాసాగర్‌రెడ్డి, మైల నర్సింహ, చంద్రశేఖర్‌రెడ్డి, మైల పరమేష్, సోమగోని నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలి
నల్లగొండ టౌన్ : దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఎస్బీఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన చేయూత పింఛన్‌దారుల సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మోసం చేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కనీసం మాట్లాడడం లేదన్నారు. తాను గుడిసెలో పుట్టిన బిడ్డగా పింఛన్‌దారుల పక్షాన పోరాటానికి ముందుకొచ్చానని తెలిపారు. పింఛన్ల మొత్తం పెరిగేంత వరకు పోరాటం ఆగదన్నారు. ఈ నెల 3న హైదరాబాద్‌లో జరిగే చేయూత పింఛన్‌దారుల మహా గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్నయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుముల జలంధర్, గడ్డం కాశీం, పెరిక శ్రీనివాస్, బకరం శ్రీనివాస్, ఇరిగి శ్రీశైలం, దాసరి లక్ష్మమ్మ, రెడ్డిమాస్ ఇంద్రచౌదరి, అహ్మద్‌ఖాన్, సైదులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
బత్తాయి రైతులకు పరిహారం చెల్లించాలి
జిల్లాలో తిరుపతి యూనివర్సిటీ నాసిరకం అంటు మొక్కలతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌ను రైతు కమిషన్ ముందు ఉంచాం. ఆయా రైతులకు ఉచితంగా బత్తాయి మొక్కలు అందించడంతోపాటు డ్రిప్ సౌకర్యం కూడా ఉచితంగా అందించాలి. కాపుకు వచ్చే నాలుగేళ్ల వరకు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే చెల్లించాలి. జిల్లాలో బత్తాయి రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన మార్కెట్, తదితర అన్ని రకాల చర్యలను తీసుకోవాలి. – శ్రీనివాస్‌రెడ్డి, బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు -
స్థానిక సమస్యలపై నేడు, రేపు ధర్నాలు
మిర్యాలగూడ : స్థానిక సమస్యల పరిష్కారం కోసం సోమ, మంగళవారాల్లో ఉమ్మడి జిల్లాలోని అని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో అధ్యయన యాత్రలు నిర్వహించామని యాత్రలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో జరిగే ధర్నాలకు అన్నివర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. పీడిత ప్రజల కోసం నాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి బీజేపీ రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు. నాడు జరిగిన పోరాట వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ఈనెల 10 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, వినోద్‌నాయక్, రెమిడాల పరుశురాములు, అయూబ్, పాల్వాయి రాంరెడ్డి, కరీమున్నిసా, దయానంద, బక్క శ్రీనివాస్‌చారి, రమణారెడ్డి, లక్ష్మీనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి -
జీవన తాత్వికత తెలిసిన కవి మునాసు వెంకట్
రామగిరి(నల్లగొండ) : ప్రకృతితో మమేకమై జీవన తాత్వికతను తన కవిత్వంలో నేర్పుగా ఆవిష్కరించగల కవి మునాసు వెంకట్ అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. సృజన సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసంలో నల్లగొండకు చెందిన ప్రముఖ కవి మునాసు వెంకట్ రచించిన దాపు కవితా సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గోరటి వెంకన్న మాట్లాడారు. అస్తిత్వ ఉద్యమాల్లో దళిత బహుజన కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవుల్లో మునాసు వెంకట్ ముందు వరుసలో ఉంటాన్నారని అభిప్రాయపడ్డారు. దాపు కవిత్వ పుస్తకాన్ని డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి ఆవిష్కరించారు. డాక్టర్ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు అంబటి సురేంద్రరాజు, గుంటూరు లక్ష్మీనరసయ్య, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సిద్ధార్థ, బైరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, భానుశ్రీకొత్వాల్, పెరుమాళ్ల ఆనంద్, అంబటి వెంకన్న, తుల శ్రీనివాస్, మేరెడ్డి యాదగిరిరెడ్డి, శీలం భద్రయ్య, బోధనం నర్సిరెడ్డి, పగడాల నాగేందర్, భూతం ముత్యాలు, సాగర్ల సత్తయ్య, కస్తూరి ప్రభాకర్, మాదగాని శంకరయ్య, బండారు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
కట్టంగూర్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.105 కోట్ల నిధులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. గతంలో మంజూరైన పనులను మార్చకుండా అక్కడే ఖర్చు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లు వినియోగంలో లేకుండా పోవటంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కట్టంగూర్‌లో పెద్దవాగుపై రెండు బ్రిడ్జిలు నిర్మించేందుకు రూ.4కోట్లు మంజూరు చేయించానని ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, పోగుల నర్సింహ, గడుసు కోటిరెడ్డి, చెవుగోని జనార్దన్, బెల్లి సుధాకర్, గుండగోని రాములు, మేడిరాములు, దాసరి సంజయ్, మునుగోటి ఉత్తరయ్య పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ఉద్యాన పంటల సంరక్షణకు కృషి
నిడమనూరు : సంప్రదాయ, ఉద్యానవన పంటల సంరక్షణకు చేస్తున్నామని రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం నిడమనూరు మండలంలోని గుంటిపల్లి, ఎర్రబెల్లి, జంగాలవారిగూడెంలో బత్తాయి తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంప్రదాయ పంటలకు దూరం కాకుండా ప్రభుత్వం సబ్సిడీ, మార్కెటింగ్ వంటి సౌకర్యాలు కల్పించేలా రైతు కమిషన్ కృషి చేస్తుందన్నారు. నల్లగొండ జిల్లాలో పదేళ్ల క్రితం 1.32 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండగా.. ఇప్పుడు 42 వేల ఎకరాలకు తగ్గాయన్నారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర అధికంగా ఉండాలని, మద్దతు ధర విషయంలో సాగు వ్యయం కంటే అధనంగా 50 శాతం ఇవ్వాలని చెప్పినట్లు వివరించారు. ఈ సందర్భంగా గుర్రంపోడు, నిడమనూరు, త్రిపురారం, మాడ్గులపల్లి, పీఏ పల్లి, పెద్దవూర మండలాల రైతులు తిరుపతిలోని బత్తాయి పరిశోధన కేంద్రం నుంచి 2018లో 42 మంది రైతులు 418 ఎకరాల్లో సాగు చేయగా, నేటికీ కాత, పిందె లేదని, తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకునేలా చూడాలని కమిషన్‌కు విన్నవించారు. బత్తాయి రైతు సమస్యలను నల్లగొండ కలెక్టరేట్లో శనివారం చర్చించి పూర్తిస్థాయి నివేదికతో ముఖ్యమంత్రిని కలిసి నివేదిస్తామని కోదండరెడ్డి వెల్లడించారు. ఆయన వెంట భూమి సునీల్, కేవీఎన్ రెడ్డి, వెంకన్నయాదవ్, భవాని, ప్రసాదరావు, బాబు, ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సుభాషిణి, వ్యవసాయ ఉప సంచాలకులు సరితా, ఏఓ ముని కృష్ణయ్య, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, ఉద్యానవన అధికారులు అనంతరెడ్డి, మురళి, రిషిత, శ్వేత తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన పరిశోధన కేంద్రం సందర్శన కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామపంచాయతీలోని కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం రైతు కమిషన్ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్, భవాని సందర్శించారు. ఈ సందర్భంగా సిట్రస్ (సుమధుర నారింజ), ఇతర ఉద్యాన పంటల పరిశోధన, వాటి భవిష్యత్ అవకాశాలపై సీనియర్ సైంటిస్ట్ రాజాగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నారింజ, నిమ్మ, పామాయిల్ వంటి ఉద్యాన పంటల సమస్యలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల రైతు సత్యనారాయణరెడ్డి పరిశోధన కేంద్రం అభివృద్ధిని వివరించారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నిడమనూరు మండలంలో బత్తాయి తోటల పరిశీలన -
కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వానిది దుష్ప్రచారం
రామగిరి(నల్లగొండ): కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలల కింద వచ్చిన కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు. అబద్దాలు మాట్లాడి ప్రతిపక్షాలపై దుష్ప్రచారాలు చేయొద్దని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన వైనాన్ని ఎండగతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మూడు నెలల గడువు ఇస్తే రెండు నెలలుగా ప్రభుత్వం నిద్రపోయిందన్నారు. ఒక వైపు భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎన్నికల సంఘం హడావుడిగా ఓటరు లిస్టు ప్రదర్శించడం దుర్మార్గమన్నారు. ఓటర్ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని ప్రజలంతా లిస్టును చూసుకునేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాపై ఇక్కడి మంత్రులకు పట్టింపు లేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి -
బంగారం చోరీ కేసులో మరోవ్యక్తి అరెస్టు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయిసంతోషి జ్యుయలరీ షాపులో గత నెల 21న అర్ధరాత్రి జరిగిన భారీ దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. నిందితుడి నుంచి 25తులాల బంగారం, రూ.4,84,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ల ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి సాంకేతిక ఆధారాలు, నమ్మదగిన సమాచారంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లాకు చెందిన ఏ5 జషిముద్దీన్ను ఈ నెల 26 మాల్దా జిల్లా, రత్వా పోలీస్ స్టేషన్ పరిధి, ఒకేరా చాంద్పరా మండలం అందారు గ్రామంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 25తులాల బంగారు ఆభరణాలు, రూ.4,84,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ చాచల్ కోర్టులో న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టి 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి తీసుకుని నిందితుల రాష్ట్రాల బదిలీ (ట్రాన్సిట్) నిబంధనల ప్రకారం సూర్యాపేటకు తీసుకువచ్చారు. నిందితుడిని జషిముద్దీన్ను విచారించగా నేపాల్‌కు చెందిన ఏ1 ప్రకాశ్ అనిల్ కుమార్, ఏ2 కడక్ సింగ్ అహుల్ వాలియ, ఏ3 పురన్ ప్రసాద్ జోషి, పశ్చిమబెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లాకు చెందిన ఏ4 మాలిక్ మొల్లతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెక్కీ నిర్వహించి సాయి సంతోషి జ్యువెలరీ షాప్‌లో బంగారం, నగదు దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. అనంతరం కిరాయికి తీసుకున్న ఇంటికి వెళ్లి దొంగతనం చేసిన సొత్తును 5 భాగాలుగా పంచుకొని ఈ దొంగతనంలో సహకరించిన ఏ7 యశోద, ఏ6 అమర్ బట్లకు ఖర్చుల కోసం కొంత బంగారం, డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయినట్లు విచారణలో పేర్కొన్నాడు. ఏ6 నిందితుడైన అమర్ బట్ వాటాకు వచ్చిన బంగారం ఏ1 ప్రకాష్ అనిల్ కుమార్ వద్ద ఉంచి ఆ బంగారాన్ని నేపాల్‌లో తీసుకునేటట్లుగా అనుకున్నారని విచారణలో నిందితుడు పోలీసులకు తెలిపాడు. నలుగురు దొంగలు అరెస్టు బంగారం దొంగతనం కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మొదట అరెస్ట్ చేసిన ఏ7 నిందితురాలు యశోద నుంచి 14 తులాల బంగారం, ఈ నెల 11న వెస్ట్ బెంగాల్లో ఏ4 నిందితుడు మాలిక్ మొల్ల నుంచి సుమారు రూ,55 లక్షల విలువైన 554 (అరకిలో) గ్రాముల బంగారం, రూ.87 వేల నగదు, ఖమ్మంలో అరెస్ట్ చేసిన ఏ6 నిందితుడు అమర్ బట్ నుంచి రూ. శ్రీ5 వేల నగదు, ఏ5 నిందితుడు జషిముద్దీన్ నుంచి రూ.25 లక్షల విలువైన 25 తులాల బంగారం, రూ.4,84,500 నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ సీఐ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ సూర్యాపేట జ్యుయలరీ షాపులో జరిగిన చోరీ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ ఫ ఏ5 నిందితుడి వద్ద 25తులాల బంగారం, రూ.4.80లక్షల నగదు స్వాధీనం -
గణేష్ మండపం వద్ద.. విద్యుదాఘాతంతో బాలుడు మృతి
హాలియా : గణేష్ నవరాత్రి ఉత్సవాల మండపం వద్ద విషాదం చోటుచేసుకుంది. వినాయక మండపం వద్ద భక్తి పాటలు పెట్టేందుకు యాంపిల్ ఫ్లేయర్ వైరును విద్యుత్ బోర్డులో పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పదకొండేళ్ళ బాలుడు మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని కేవీ కాలనీకి చెందిన దండెం మహేందర్–మౌనిక దంపతుల కుమారుడు మణికంఠ(11) 5వ తరగతి చదువుతున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేవీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భక్తి పాటలు పెట్టేందుకు శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో దండెం మణికంఠ మండపం వద్దకు వెళ్లాడు. యాంపిల్ ఫ్లేయర్ వైర్‌ను విద్యుత్ బోర్డులో పెట్టేందుకు యత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న వయసులోనే నీకు నూరేళ్ళు నిండాయా నాయన అంటూ కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు. ఘటనా స్థలానికి సీఐ సతీష్‌రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ చేరుకొని వినాయక మండపాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు. హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదురామగిరి(నల్లగొండ): మామను హత్య చేసిన కేసులో కోడలికి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ మహిళా కోర్టు జడ్జి కవిత శుక్రవారం తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన బొబ్బలి పద్మ అదే గ్రామానికి చెందిన ఆవుల వేణు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పద్మ భర్త లింగయ్యకు తెలియడంతో మందలించాడు. మరోసారి జరగనివ్వమని పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నారు. 2017 ఆగస్టు 3న పద్మ మామ భిక్షమయ్య వ్యవసాయ పొలం నుంచి ఇంటి వచ్చే సమయానికి పద్మ తన ప్రియుడు వేణుతో కలిసి ఉంది. దీంతో భిక్షమయ్య ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పద్మ, వేణు ఇద్దరు కలిసి భిక్షమయ్యపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో భిక్షమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పద్మ భర్త లింగయ్య నకిరేకల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ సుబ్బరామిరెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరిపి ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరమణారెడ్డి వాదనలతో ఏకీభవించిన జడ్జి కవిత ఇద్దరు నిందితులు బొబ్బలి పద్మ, ఆవుల వేణుకు జీవిత ఖైదు, రూ.4 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు కానిస్టేబుల్ సుధాకర్, లైజన్ ఆఫీసర్లు నరేందర్, మల్లిఖార్జునన్ లు కోర్టుకు సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంలో సహకరించారు. -
గృహం.. ఆలస్యం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో ఆలస్యమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టే విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 600 చదరపు అడుగులకు మించి నిర్మాణం చేస్తే బిల్లులు ఇచ్చే అవకాశం లేకపోవడం, ఇళ్ల నిర్మాణాలకు ముందుగా ప్రజలే డబ్బులు వెచ్చించాల్సి రావడం, దశల వారీగా (బేస్మెంట్, రూఫ్, స్లాబ్ తదితర లెవల్స్) బిల్లులను మంజూరు చేయాలన్న నిబంధనల నేపథ్యంలో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఇప్పటివరకు ముగ్గుపోసిన నిళ్లలో సగం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. 18,048 ఇళ్లు మంజూరు జిల్లాకు మంజూరైన ఇళ్లలో ఇప్పటివరకు 35.62 శాతం ఇళ్ల నిర్మాణాలే ప్రారంభమయ్యాయి. జిల్లాకు 18,048 ఇళ్లు మంజూరైతే అందులో 12,865 ఇళ్లకు ముగ్గు పోశారు. వాటిల్లో 6,427 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే నిర్మాణ పనులు మిర్యాలగూడ (43.07 శాతం), మునుగోడు (43.02 శాతం) నియోజకవర్గాల్లో ఎక్కువశాతం ప్రారంభమయ్యాయి. ఆ తరువాత స్థానంలో నల్లగొండ (38.50 శాతం), దేవరకొండ (38.28 శాతం) నియోజకవర్గాలు నిలిచాయి. నకిరేకల్‌లో మాత్రం తక్కువ (15.25 శాతం) ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. యాదాద్రి జిల్లాలో 81.42 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆగస్టు నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజలో ఉంది. యాదాద్రి జిల్లాకు 9,495మిళ్లు మంజూరైతే, అందులో ఇప్పటివరకు 7,730 ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. అంటే 81.42 శాతం ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయి. నల్లగొండ జిల్లాలో మాత్రం 35.62 శాతమే ప్రారంభం కావడం గమనార్హం. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తున్నా.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డబ్బుల్లేక నిరుపేదలు ఇళ్లను నిర్మించుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రహించారు. వారికి మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాలను సంప్రదించే పేదలకు రుణాలు ఇప్పించే బాధ్యతను డీఆర్డీఓకు అప్పగించారు. ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ దృష్టి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మెటీరియల్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఇటీవల కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లకు అవసరమైన ఇసుక విషయంలో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నల్లగొండ నియోజకవర్గంలో గృహనిర్మాణ శాఖ అధికారులు, తహసీల్దార్లతో ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అలాగే మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాలపైనా ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సమీక్షలు నిర్వహించి, ఇళ్ల నిర్మాణాలను వేగవేంతం చేసేలా చర్యలు చేపడుతున్నారు.ముగ్గు పోసిన ఇందిరమ్మఇళ్లలో సగమే ప్రారంభం ఫ ఇళ్ల నిర్మాణానికి అడ్డంకిగా నిబంధనలు ఫ మంజూరు చేసిన వాటిల్లో ప్రారంభమైనవి 35.62 శాతమే.. ఫ రాష్ట్రంలోనే మొదట స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఫ నల్లగొండలో ఇళ్ల గ్రౌండింగ్‌పై కలెక్టర్ ప్రత్యేక దృష్టి ఫ నిర్మాణాల్లో వెనుకబడిన నియోజకవర్గాల్లో సమీక్షలు జిల్లాకు మంజూరైన ఇళ్లలో ప్రారంభమైన వాటి వివరాలు.. నియోజకవర్గం మంజూరు ముగ్గుపోసినవి ప్రారంభం శాతం నల్లగొండ 3380 2390 1301 38.50 మిర్యాలగూడ 3042 2079 1310 43.07 నకిరేకల్ 2702 1985 412 15.25 దేవరకొండ 2696 1940 1032 38.28 నాగార్జునసాగర్ 3517 2432 1315 37.39 మునుగోడు 2176 1621 936 43.02 తుంగతుర్తి 535 418 121 22.61 (శాలిగౌరారం) మొత్తం 18048 12865 6427 35.62 -
మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : బత్తాయి మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు. శుక్రవారం నల్లగొండలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్‌ను పరిశీలించి మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ నిర్వహణ సరిగా లేదని, దీనిని పటిష్టం చేస్తామని తెలిపారు. స్థానిక మార్కెట్లో దళారుల జోక్యం ఎక్కువగా ఉండడం, రైతుల కన్నా ఇతరులే ఎక్కువగా బత్తాయి అమ్ముతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు కలిసి వారి సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో సునీల్ కుమార్, మరికంటి భవాని, చెవిటి వెంకన్నయాదవ్, గోపాల్, హరివెంకటప్రసాద్, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు, మార్కెట్ చైర్మన్ రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, శ్రీనాథరాజు, సుభాషిని, అనంతరెడ్డి పాల్గొన్నారు. -
హత్య కేసును ఛేదించిన పోలీసులు
నల్లగొండ: నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి కళాశాల వద్ద బుధవారం రాత్రి ఓ వ్యక్తి హత్యకు గురికాగా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన షేక్ సిరాజ్ అనే వ్యక్తి హుస్సేన్ దగ్గర లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. నెల క్రితం లారీలో లోడ్‌తో నల్లగొండ నుంచి వెళ్తున్న క్రమంలో హుస్సేన్‌తో షేక్ సిరాజ్ గొడవ పడ్డాడు. దీంతో సిరాజ్‌ను డ్రైవర్ లారీ నుంచి దింపేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సిరాజ్ నల్లగొండ పట్టణంలో ఉంటూ అన్నపూర్ణ క్యాంటిన్ వద్ద రూ.5 భోజనం చేస్తూ చుట్టుపక్కల భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి సమయంలో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి కళాశాల వద్ద నిద్రపోయేవాడు. దూషించాడన్న కక్షతో.. 15 సంవత్సరాల క్రితం నల్లగొండకు వలస వచ్చి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్ (40) మద్యం మత్తులో ఈనెల 27న రాత్రి సమయంలో సిరాజ్ పడుకునే స్థలం వద్దకు వచ్చాడు. సిరాజ్ నిద్రపోయేందుకు వేసుకున్న పట్టాలో రమేష్ నిద్రించాడు. ఇక్కడ ఎందుకు నిద్రిస్తున్నావని సిరాజ్ అతడిని అడగగా.. రమేష్ మద్యం మత్తులో దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. దీంతో చంపేస్తానని రమేష్‌ను సిరాజ్ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత వచ్చి చూడగా.. రమేష్ అక్కడే నిద్రపోయి ఉండడంతో పక్కనే ఉన్న గ్రనైట్ రాయి తీసుకుని అతడి తలపై కొట్టాడు. రాయి దొరకకుండా కళాశాల గోడ వెనుక పడేసి అక్కడ నుంచి పరారయ్యాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని గురువారం ఉదయం పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి, 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు నల్లగొండలోని రహమాన్బాగ్లో నిద్రిస్తున్న సిరాజ్‌ను వన్‌టౌన్ పోలీసులు పట్టుకుని విచారణ చేయగా తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రాయిని చూపించగా దానిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు వెంకటనారాయణ, ఏఎస్ఐ వెంకట్‌యాదవ్, సిబ్బంది రబ్బాని, షకీల్, శ్రీకాంత్, శంకర్, జానకిరాములు, సైదులు, తదితరులు పాల్గొన్నారు. ఫ తను నిద్రించే స్థలంలో వేరే వ్యక్తి వచ్చి నిద్రపోవడంతో తలెత్తిన వివాదం ఫ దుర్భాషలాడాడన్న కోపంతో రాయితో కొట్టి హత్య -
‘దివీస్’తో కుమ్మక్కై అలైన్మెంట్ మార్చారు
చౌటుప్పల్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివీస్ పరిశ్రమతో కుమ్మక్కై రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. చౌటుప్పల్ మున్సిపాలిటీకి దూరంగా వెళ్లాల్సిన ట్రిపుల్ ఆర్‌ను నాటి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కలిసి మున్సిపాలిటీలోకి తీసుకువచ్చారని ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతులు, నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరతరాలుగా భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలని, భూమికి భూమి లేదంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారంగా పరిహారం ఇప్పించాలని నిర్వాసితులు వేడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలైన్‌మెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా మార్చి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. రైతులకు, నిర్వాసితులకు అన్యాయం చేసిన వ్యక్తులే ఇప్పుడు వారిని రెచ్చగొడుతూ ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసగాళ్లు ఎవరో, మోసం చేసినవారు ఎవరో, మొసలి కన్నీరు కారుస్తున్నవారెవరో తనకు పూర్తిగా తెలుసన్నారు. ఏ ఒక్క శాతం అవకాశం ఉన్నా అలైన్‌మెంట్‌ను మార్పిస్తానని, లేనిపక్షంలో అధిక మ్తొతంలో పరిహారాన్ని ఇప్పించేందుకు కృషిచేస్తానని అన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్గరీతో స్వయంగా మాట్లాడి సమస్యపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆర్డీవోకు శేఖర్‌రెడ్డిని ఫోన్లో అడిగారు. రైతులు అంగీకరిస్తే పరిహారం వారి అకౌంట్లలో జమ అవుతాయని ఆర్డీవో చెప్పారు. పరిహారం విషయం తేలనందున ప్రస్తుతం అన్ని రకాల ప్రక్రియలను ఆపాలని ఆర్డీవోను ఎమ్మెల్యే ఆదేశించారు. ట్రిపుల్ఆర్ సమస్య తనతో పరిష్కారం కాకుంటే.. దేవుడితో కూడా అవ్వదన్నారు. కొందరి మాటలు నమ్మి తనపై అపోహలకు పోవద్దని, తాను ప్రజలందరికీ ఎమ్మెల్యేనన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తాను భరించలేనన్నారు.సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పబ్బు రాజుగౌడ్, ఆకుల ఇంద్రసేనారెడ్డి, వెల్గ రాజశేఖర్‌రెడ్డి, సుర్వి నర్సింహ, మొగుదాల రమేష్, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎండి.హన్నుభాయ్, బొంగు జంగయ్య, నిర్వాసితులు రాములు, ప్రకాష్‌రెడ్డి, మల్లేష్‌గౌడ్, ఉపేందర్‌రెడ్డి, జాల శ్రీశైలం, నాగెల్లి దశరథ, జాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభ్యంతరాలు స్వీకరిస్తాం : కలెక్టర్
నల్లగొండ : గ్రామపంచాయతీ ముసాయిదా ఓటరు జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే.. 30వ తేదీ (శనివారం) వరకు స్వీకరిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 869 గ్రామ పంచాయతీల్లో.. 7,494 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 10,73,506 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 28న ఎంపీడీఓల ద్వారా మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించామన్నారు. ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలను ఈ నెల 30వ తేదీలోగా సమర్పించవచ్చని తెలిపారు. అభ్యంతరాలను ఈనెల 31న పరిశీలించి, పరిష్కరిస్తామన్నారు. సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు. శనివారం మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, చీర పంకజ్‌యాదవ్, పిచ్చయ్య, లింగస్వామి, యాదగిరి, రఫీక్, నర్సిరెడ్డి, సైదిరెడ్డి, అన్సారి, అద్దంకి రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుల వినతి ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఓటర్ల జాబితాను సవరించాలని కోరారు. అయితే.. ఓటరు జాబితాపై సమావేశం నిర్వహిస్తున్నామని.. ఇది గ్రీవెన్స్ కాదని కలెక్టర్ అనడంతో సమావేశం నుంచి భాస్కర్‌రావు వెళ్లిపోయినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. -
సాగర్‌కు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్ : సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 2,88,545 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం వద్ద 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా మొత్తం 2,77,316 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి, కాల్వలకు 11,229 క్యూసెక్కులు మొత్తం 2,88,545 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదవుతోంది. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 587.50 అడుగులు (305.8030టీఎంసీలు)గా ఉంది. డిండి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ప్రాజెక్టులోకి 10,100 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోందని ఇరిగేషన్ శాఖా ఏఈ పరమేష్ తెలిపారు. అలుగు మీద నుంచి దుముకుతున్న జలాలు చూపరులకు కనువింధు చేస్తున్నాయి. మత్తడి దుంకుతున్న డిండి -
జిల్లా కోర్టులో ఐ డోనేషన్ సెంటర్ ప్రారంభం
రామగిరి(నల్లగొండ) : నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా కోర్టులో ఐ డోనేషన్ సెంటర్‌ను జిల్లా జడ్జి ఎం.నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదానం చేసేందుకు మృతుల కుటుంబాలు ముందుకు రావాని కోరారు. అంతకుముందు నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులకు నూతనంగా ఏర్పాటు చేసిన లాకర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, ఎం.నగేష్, న్యాయవాదులు, లయన్స్ క్లబ్ చారిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని హంగులతో కలెక్టరేట్ నిర్మాణం
నల్లగొండ : సకల సౌకర్యాలు, హంగులతో నల్లగొండ కొత్త కలెక్టరేట్ నిర్మాణాన్ని 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. నల్లగొండ పాత కలెక్టరేట్ వెనుక వెపున నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ భవనంలో పూర్తిగా రెవెన్యూ విభాగం, కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మంత్రి ఛాంబర్ ఉండేలా చూడాలని సూచించారు. పాత కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. కొత్త భవనంలో మీటింగ్ హాల్‌ను ఫాల్ సీలింగ్, ఎల్ఈడీ స్క్రీన్లతో నిర్మించాలన్నారు. భవన నిర్మాణ పనులు, నాణ్యతపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ను కోరారు. ఈ భవనం పూర్తయితే బయట ఉన్న డీఈఓ, డీఎంహెచ్ఓ కార్యాలయాలను ఇక్కడికి తీసుకొస్తామన్నారు. అనంతరం బ్రహ్మంగారిగుట్ట, లతీఫ్సాబ్ దర్గాపైకి నిర్మిస్తున్న ఘాట్ రోడ్ల నిర్మాణ పనులపై సమీక్షించారు. ఇప్పటివరకు 5 కిలోమీటర్ల రోడ్డు పూర్తయిందని ఆర్అండ్బీ అధికారులు మంత్రికి వివరించారు. ఆయన వెంట కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్అండ్బీ ఎస్ఈ వెంకటేశ్వరరావు, శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, రామ్‌ప్రసాద్ పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
మెరుగైన సౌకర్యాలపై దృష్టి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దృష్టి కేంద్రీకరించామని దేవాదాయ, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. శుక్రవారం యాదగిరి కొండపైన గల అతిథి గృహంలో వైటీడీఏ సీఈఓ, వీసీ కిషన్‌రావు, ఈఓ వెంకట్రావ్, కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులు, టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్ ఏరియా ఫైనలైజేషన్‌కు సంబంధించి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో శ్రీస్వామి వారి క్షేత్ర మహత్యానికి సంబంధించిన బొమ్మల పుస్తకాన్ని, మాడ వీధిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌ను ప్రారంభించారు. గరుఢ ట్రస్టుకు సంబంధించిన ప్రాథమిక విధివిధానాల్లో భాగంగా ఏర్పాటు చేసిన లిస్టును సైతం తెలిపారు. రూ.50వేలకు పైనా విరాళం గరుఢ ట్రస్టుకు ఇస్తే రూ.300 టికెట్‌పై సంవత్సరంలో ఆరుగురు చొప్పున 2 పర్యాయాలు బ్రేక్ దర్శనం, రూ.150 టికెట్‌పై ఆరుగురు చొప్పున 2 పర్యాయాలు బ్రేక్ దర్శనం సదుపాయం కల్పించనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్‌కు ఈఓ తెలిపారు. అంతే కాకుండా రూ.లక్షకు పైగా గరుఢ ట్రస్ట్‌కు చెల్లిస్తే బ్రేక్ దర్శనం రూ.300 టిక్కెట్‌పై ఆరుగురు చొప్పున 4 పర్యాయాలు, రూ.150 బ్రేక్ దర్శనంపై ఆరుగురు 4 పర్యాయాలు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇక రూ.2లక్షలపైన చెల్లిస్తే రూ.300 బ్రేక్ దర్శనంపై ఆరుగురు చొప్పున 8 పర్యాయాలు, కొండ కింద గల యాదరుషి నిలయంలో డబుల్ బెడ్ రూంను కేటాయించనున్నట్లు వివరించారు. తరువాత దేవస్థానం పరిధిలోని గోశాల, లక్ష్మీ పుష్కరిణితో పాటు, వేద పాఠశాల నిర్మాణం పనులను పరిశీలించారు. అంతకు ముందు శ్రీస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, దేవాదాయశాఖ ఉప కమిషనర్లు వినోద్‌రెడ్డి, కృష్ణ ప్రసాద్, వెంకటేష్, తహసీల్దార్ గణేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి పాల్గొన్నారు. ఫ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఫ యాదాద్రి ఆలయాభివృద్ధి, టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్ ఏరియా ఫైనలైజేషన్పై సమీక్ష -
బెస్ట్ యూనివర్సిటీతో ఎన్జీ కళాశాల ఎంఓయూ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల అనంతపురం జిల్లా బెస్ట్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకుంది. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నాగజ్యోతి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ శుక్రవారం ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉపేందర్ మాట్లాడుతూ ఈ ఎంఓయూ 2030 వరకు కొనసాగుతుందన్నారు. పరస్పర ఉపన్యాసాలతో పాటు పరిశోధన రంగంలో సహకారం ఉంటుందన్నారు. మునిస్వామి, జ్యోత్న్స, ఎం.అనిల్‌కుమార్, వైవిఆర్. ప్రసన్నకుమార్‌కు యూనివర్సిటీ ద్వారా పీహెచ్డీ గైడ్షిప్ లభించిందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.రవికుమార్, కృష్ణ పాల్గొన్నారు.‘కోడింగ్, కృత్రిమ మేధ’ బోధించాలినల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కోడింగ్, కృత్రిమ మేధ సబ్జెక్టులను అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని డైట్ కళాశాలలో భౌతిక, గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పైథాన్ లాంగ్వేజీలోని కోడింగ్, కృత్రిమ మేధ అంశాలపై పాఠ్యాంశాలను ప్రత్యేక పుస్తకం ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ రామచంద్రయ్య, ఆర్పీలు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, జగన్ పాల్గొన్నారు.15న ఎంజీయూ స్నాతకోత్సవంనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించి శుక్రవారం యూనివర్సిటీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై పలు సూచనలు చేశారు. ముఖ్య అతిథులుగా ఛాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరవుతారని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో పీజీ విద్యార్థులకు 57 గోల్డ్ మెడల్స్, 22 మందికి పీహెచ్డీ పట్టాలను అందించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఈఓ ఉపేందర్‌రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.మోడల్ స్కూల్లో మిగిలిన సీట్లకు అడ్మిషన్లునల్లగొండ : జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2025–26 విద్యా సంవత్సరంలో 6 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్లో మిగిలిన సీట్లలో నేరుగా ప్రవేశాలు జరుగుతాయని డీఈఓ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థుల, తల్లిదండ్రులు సంబంధిత మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని తెలిపారు. -
ఉన్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ టూటౌన్: ఉన్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన మూడు కిలోమీటర్ల పరుగు పందెంలో 70 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. క్రీడాకారులు మరింత రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీకి గుర్తింపు తేవాలని విజేతలకు సూచించారు. అనంతరం స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసిన క్యాలెండర్, పోస్టర్లను వీసీ విడుదల చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, హరీష్ కుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, మురళి, శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ శివశంకర్ పాల్గొన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపుఅనంతగిరి: గోండ్రియాల వద్ద పాలేరు వాగులో గురువారం గల్లంతైన కిన్నెర ఉపేందర్ మృతదేహం కోసం శుక్రవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోండ్రియాల నుంచి కొత్తగూడెం చెక్‌డ్యాం వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వాగులో భారీ రాళ్లు ఉన్న కారణంగా రెస్క్యూ టీం పడవలు వెళ్లలేక కొంత ఇబ్బందులు రావడంతో స్థానిక గజ ఈతగాళ్ల సహకారంతో గాలిస్తున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట కోదాడ రూరల్‌సీఐ ప్రతాప్ లింగం, అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్, కోదాడ ఫైర్ ఆఫీసర్ ముత్తినేని శ్రీనివాస్, తహసీల్దార్ హిమబిందు, ఆర్ఐ వెంకట నగేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
భువనగిరి జిల్లాను ముంచెత్తిన వరద
సాక్షి,యాదాద్రి : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భువనగిరిలోని జంఖానగూడెం, ఆలేరు, మోత్కూరు, చౌటుప్పల్‌లోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజానీకం ఇబ్బందులకు గురైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాన్ ఆయకట్టులో చెరువులు అలుగుపోస్తున్నాయి. ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి భువనగిరి నియోజకవర్గంలో.. భువనగిరి–చిట్యాల(ఎన్‌హెచ్– 161 ఏఏ) మధ్య నాగిరెడ్డిపల్లి వద్ద లోలెవల్ వంతెన పైనుంచి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో పోలీసులు బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం రాకపోకలు నిలిపివేశారు. గురువారం సాయంత్రం నుంచి అనుమతించారు. ● భువనగిరి మండలం అనాజిపురం–బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామాల మధ్య చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచిపోయాయి. ● మూసీ బ్రిడ్జిలు సంగెం, రుద్రవెల్లి వద్ద రాకపోకలను బుధవారం నిలిపివేసి గురువారం పునరుద్ధరించారు. ఆలేరు నియోజకవర్గ పరిధిలో.. ● ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో గండి చెరువు అలుగుపోస్తోంది. అధికారులు చెరువు గేట్లు ఎత్తి యాదగిరిపల్లి ఎస్సీ కాలనీ పక్క నుంచి వంగపల్లి వాగులోకి నీటిని పంపుతున్నారు. ● వర్షం కారణంగా యాదగిరి క్షేత్రానికి భక్తుల రాక తగ్గింది. ఆలేరు పట్టణంలో పెద్ద వాగు నిండుగా ప్రవహిస్తుంది. ఫ పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఫ భువనగిరి–చిట్యాల మార్గంలో నిలిచిన రాకపోకలు -
టైలరింగ్, మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ
నల్లగొండ: నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) లో టైలరింగ్, కంప్యూటర్, మగ్గం వర్క్‌లో మహిళలకు సెప్టెంబర్ 6 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని జిల్లా మేనేజర్ ఎ.అనిత ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న ిమహిళలకు ఒక్కో కోర్సులో రెండు నెలల పాటు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 76600 22517 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులు నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువకులకు నల్లగొండ పట్టణ పరిధిలోని రామ్‌నగర్‌లో గల ఎస్బీఐ శిక్షణ కేంద్రంలో ఏసీ, రిఫ్రిజిరేటర్ రిపేరులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ ఇ.రఘుపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణతోపాటు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 3వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, పూర్తి వివరాలకు 97010 09265 నంబర్లో సంప్రదించాలని కోరారు. చెర్వుగట్టు ఆలయ రికార్డులు తనిఖీనార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గురువారం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ టెండర్లు, అన్నదానం, రోజువారి టికెట్ల ఆదాయానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రికార్డులను తనిఖీ చేసినట్లు తెలిపారు. వారి వెంట నల్లగొండ ఏసీ భాస్కర్, ఈఓలు రుద్ర వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. ‘పీఎం సురక్ష’లో చేర్పించాలినల్లగొండ: ఉపాధిహామీ పథకంలో పనిచేసే వేతనదారులందరినీ పీఎం సురక్ష బీమా పథకంలో చేర్పించాలని డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో మండల స్థాయి సిబ్బందిని కోరారు. 18 నుంచి 75 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరూ అర్హులనని పేర్కొన్నారు. ఏడాది కాల పరిమితి కలిగిన ఈ బీమాలో చేరితో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని, పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.లక్ష నగదు అందుతాయని తెలిపారు. సెప్టెంబర్ 4 వరకు పింఛన్ల పంపిణీ జిల్లాలో గురువారం నుంచి చేయూత పింఛన్ల పంపిణీ ప్రారంభమైందని, సెప్టెంబర్ 4వ తేదీ వరకు లబ్ధిదారులకు ముఖ గుర్తింపు సాప్టువేర్ ద్వారా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్టు డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్‌దారులంతా రూ.16 చిల్లరను కూడా అడిగి తీసుకోవాలని పేర్కొన్నారు. నేటి నుంచి ఎంజీయూలో క్రీడా పోటీలునల్లగొండ టూటౌన్: భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 6గంటలకు మూడు కిలోమీటర్ల పరుగు పందెం ఉంటుందని తెలిపారు. -
పాఠశాలలను ప్రతిరోజూ సందర్శించాలి
నల్లగొండ: మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలను క్షేత్రస్థాయిలో నిరంతరం సందర్శించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పెంపునకు కృషిచేస్తూనే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి, వివిధ మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో సమావేశం పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించడంపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లో రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలి శాలిగౌరారం: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్) దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శాలిగౌరారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో ఎన్ఎఫ్బీఎస్ కింద దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీల తుది ఓటరు జాబితా ప్రచురణకు తీసుకుంటున్న చర్యలపై ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ శాలిగౌరారం–మాధారంకలాన్ ఆర్అండ్బీ రోడ్డుపై ఊట్కూరు గ్రామ సమీపంలో వరదనీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారిన లోలెవల్ కాజ్‌వేను పరిశీలించారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్‌చేసి కాజ్‌వేను పరిశీలించి బ్రిడ్జి నిర్మాణానికి అంచనా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అదేవిధంగా వరదనీటితో కోతకు గురైన ఊట్కూరు–బండమీదిగూడెం రోడ్డును పరిశీలించి నివేదిక అందజేయాలని తహసీల్దార్, ఎంపీడీఓలను ఆదేశించారు. ఫ ఎంఈఓలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన -
సాదాబైనామా.. హక్కులపై ధీమా
జిల్లాలో 33,294 సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వం సాదాబైనామాలు పరిష్కరించేందుకు పూనుకున్నప్పటికీ అది ఆచరణలో అమలుకు నోచుకోలేదు. దాంతో రైతుల ఆశలు నెరవేరలేదు. పట్టాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలకు అర్హత లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తామని చెప్పడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సాదాబైనామాతో భూములను కొనుగోలు చేసిన రైతులు.. ఆ భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. దీనిపై ఎట్టకేలకు పరిష్కారం చూపేందుకు అడుగులు పడుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాదాబైనామాలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ధరణి పోర్టల్‌లో వాటి పరి ష్కారానికి అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను తీసుకువచ్చింది. అందులో భాగంగా సాదాబైనామాల పరిష్కారానికి ప్రభుత్వం మూడురోజుల కిందట నిర్ణయం తీసుకోవడంతో.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 33,294 సాదాబైనామాల పరిష్కారంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సాగులో ఉన్నా.. హక్కుల్లేవు గ్రామాల్లో సాదా కాగితాలపై రాసుకొని భూములు కొనుగోలు చేసి కబ్జాలో ఉంటున్న రైతులు వేలల్లో ఉన్నారు. వారు ఆ భూములను పట్టా చేసుకోకుండానే కబ్జాలో ఉంటున్నారు. అధికారికంగా హక్కులు లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో (ధరణిలో) సాదాబైనామాలపై భూములు కొన్న వారికి చుక్కెదురైంది. భూములను కొనుగోలు చేసి, సాధారణ పేపర్లపై రాసుకొని, కబ్జాలో ఉన్న వారికి కాకుండా ఆన్లైన్లో ఎవరి పేరు మీద భూమి ఉందో వారికే పాస్‌బుక్‌లు రావడంతో ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదే కాకుండా ధరణి వచ్చిన తరువాత తలెత్తిన అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. ఆ తరువాత టీఎం33 మాడ్యుల్ ద్వారా కొంతవరకు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జరిగింది. అయితే సాదాబైనామాలకు మాత్రం పరిష్కారం లభించలేదు. సాదాబైనామాలను ప్రత్యేకంగా పరిష్కరిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్నినా ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సమస్య పక్కన పడింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు ధరణి పోర్టల్ కారణమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంది. ధరణి రద్దు చేసి, కొత్త చట్టం తెస్తామని ప్రకటించింది. అందులో భాగంగా సాదాబైనామాలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చింది. గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ఇతర శాఖలకు బదిలీ అయిన వీఆర్ఏ, వీఆర్వోలను కూడా తిరిగి మాతృ శాఖకు తీసుకుంటోంది. అలాగే సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది.పెండింగ్‌లో ఉన్న మండలాల వారీగా సాదాబైనామా దరఖాస్తులివే..ఫ ఏళ్ల తరబడి ఎదురుచూపులకు కలగనున్న మోక్షం ఫ ధరణిలోనూ సాదాబైనామా రైతులకు ఇబ్బందులే.. ఫ భూభారతి వచ్చాకే హక్కుల కల్పనపై దృష్టి ఫ జిల్లాలో 33 వేల దరఖాస్తులు పెండింగ్ మండలం దరఖాస్తులు చండూరు 334 గట్టుప్పల్ 97 మర్రిగూడ 398 మునుగోడు 1248 నాంపల్లి 663 చందంపేట 175 చింతపల్లి 451 దేవరకొండ 238 గుడిపల్లి 168 గుండ్లపల్లి 311 గుర్రంపోడు 764 కొండమల్లేపల్లి 155 నేరడుగొమ్ము 144 పీఏపల్లి 203 అడవిదేవులపల్లి 458 అనుముల 813 దామరచర్ల 1306 మాడ్గులపల్లి 2228 మిర్యాలగూడ 3068 నిడమనూరు 654 పెద్దవూర 875 తిరుమలగిరిసాగర్ 2071 త్రిపురారం 1458 వేములపల్లి 1710 చిట్యాల 617 కనగల్ 805 కట్టంగూర్ 1769 కేతేపల్లి 2168 నకిరేకల్ 2098 నల్లగొండ 1680 నార్కట్‌పల్లి 665 శాలిగౌరారం 1913 తిప్పర్తి 1589 -
సాక్షి ఫొటోగ్రాఫర్ భజరంగ్ ప్రసాద్‌కు మంత్రి సన్మానం
నల్లగొండ టౌన్ : ఫొటోగ్రఫీ పోటీల్లో జాతీయస్థాయిలో భజరంగ్ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇటీవల జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన సాక్షి సీనియర్ ఫొటో గ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్‌ను మంగళవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించి మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అదేవిధంగా సుంకరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భజరంగ్‌ను సన్మానించారు. ఫౌండేషన్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, అబ్బగోని రమేష్‌గౌడ్, గాదె వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ది దుర్మార్గపు పాలన
నార్కట్‌పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టే దుర్మార్గపు పాలన తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మంగళవారం నార్కట్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్దకు రైతులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న చిరుమర్తి రైతుల సమస్యలను తెలుసుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక మంత్రి యూరియా కొరత లేదని చెబుతుంటే, మరో మంత్రి నిల్వలు లేవని అంటున్నారని మండిపడ్డారు. రైతులు ఇన్ని ఇబ్బందులు ముఖ్యమంత్రి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ హయాలో యూరియా కొరత రాలేదని.. 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు అండగా నిలిచిందన్నారు. ఇప్పుడు రైతులకు యూరియా సరఫరా చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇప్పటికై నా అధికారులు, మంత్రులు స్పందించి యూరియా తెప్పించి రైతులను అదుకోవాలన్నారు. ఆయన వెంట యానాల అశోక్‌రెడ్డి, దుబ్బాక శ్రీదర్, కర్నాటి ఉపేందర్ ఉన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
డిసెంబర్‌లోగా ట్యాంకుల నిర్మాణం పూర్తిచేయాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాకు చేపట్టిన ట్యాంకు నిర్మాణ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ మున్సిపల్ సమావేశ మందిరంలో తాగునీరు, రోడ్లు, మురుగుకాల్వలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై మున్సిపల్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద రూ.56.75 కోట్లతో చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు డిసెంబర్‌లోగా పూర్తిచేసి ప్రజలకు తాగునీరు అందించాలని ఆదేశించారు. రూ.109 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిపై ప్రతి మంగళవారం తాను సమీక్షిస్తానని తెలిపారు. అంతకుముందు మంత్రి మున్సిపాలిటీలోని ఆయా విభాగాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, డీఈలు కార్తీక్, అశోక్, శ్రీధర్‌రెడ్డి, ఏఈలు దిలీప్, ప్రవీణ్, అసింబాబా, ఏసీపీ కృష్ణవేణి పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పనులు వేగవంతం అయ్యాయి. ఓటర్ల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. అందుకు అనుగుణంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వార్డుల వారీగా కొత్త ఓటర్ల జాబితాలను గత నెలలోనే గ్రామ పంచాయతీ లాగిన్ ద్వారా రూపొందించారు. ఆ ప్రక్రియను ఇటీవలే పూర్తి చేశారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నేపథ్యంలో వాటిని మరొకసారి సరిచూసుకుని, వాటిపై అభ్యంతరాలు ఆహ్వానించి, వాటిని పరిష్కరించి తుది జాబితాలను ప్రకటించనున్నారు. షెడ్యూల్ ఇలా.. ఈ నెల 28వ తేదీన గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను నోటీసు బోర్డుల్లో పెడతారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రదర్శిస్తారు. 29వ తేదీన జిల్లా అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 30వ తేదీన ఎంపీడీఓలు మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 28 నుంచి 30వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో ఆ అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరిస్తారు. వచ్చే నెల 2వ తేదీన 868 గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.ఫ పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా ఖరారుకు నోటిఫికేషన్ ఫ షెడ్యూల్ జారీ చేసిన కలెక్టర్ ఫ వచ్చే నెల 2న పోలింగ్ కేంద్రాలు, ఓటరు తుది జాబితా ప్రకటన -
ఏ పంట.. ఎంత విస్తీర్ణం
అక్టోబరు చివరి నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో టల నమోదు పూర్తవుతుంది. నమోదు చేసిన వివరాలను ఆయా గ్రామ పంచాయతీ భవనాల వద్ద ఏఈఓలు ప్రదర్శిస్తారు. అందులో తప్పులు ఉంటే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. నవంబరు 13వ తేదీ వరకు పక్కాగా జాబితా తయారవుతుంది. – శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ నల్లగొండ అగ్రికల్చర్ : పంటల సాగు లెక్క పక్కాగా ఉండేందుకు ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాలో సాగు చేసిన పంటల వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఆన్లైన్లో పంటల నమోదును ప్రారంభించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 7 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటల వరకు పంటల న మోదు ప్రక్రియను చేపట్టనున్నారు. రైతు పేరు, సర్వే నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం, పోన్ నంబర్‌తో పాటు ఏఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో తెలుసుకుని ఆ వివరాలను ఆన్లైన్లో పంటల నమోదు కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. తప్పులకు ఆస్కారం లేకుండా పక్కాగా నమోదు చేస్తున్నారు. దీంతో జిల్లాలో వానాకాలం సీజన్లో రైతులు ఏఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారన్న సమాచారం పక్కాగా తేలనుంది. 9,90,502 ఎకరాల్లో సాగు.. ప్రస్తుత వానాకాలంలో 11,00,500 ఎకరాల్లో వివిధ పంటల సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటి వరకు 9,90,502 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అత్యధికంగా పత్తి 5,64,585 ఎకరాల్లో సాగు చేయగా వరి 4,44,932 ఎకరాల్లో వేశారు. వీటన్నింటిని వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో నమోదు చేయనున్నారు. ఫ పంటల నమోదు ప్రక్రియ ప్రారంభం ఫ క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న ఏఈఓలు -
14 క్రస్ట్‌గేట్ల నుంచి వరద
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో వరుసగా గేట్లను మూసివేస్తున్నారు. 26 రేడియల్ క్రస్ట్‌గేట్లకు గాను 12 క్రస్గేట్లను మూసి వేశారు. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,61,971 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి దిగువ కృష్ణానదిలోకి స్పిల్‌వే మీదుగా 1,07,338 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,739 క్యూసెక్కులు మొత్తం 1,41,077 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. -
మరణం ఏదైనా.. ఆర్థిక చేయూత
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులైన పేద కుటుంబాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు చేయూత అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ సాయం ఆయా కుటుంబాల తమ ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. – కలెక్టర్ ఇలా త్రిపాఠి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన కుటుంబ పెద్ద మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) కింద కుటుంబ తక్షణ అవసరాల కోసం రూ.20 వేలు అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 3,500 కుటుంబాలకు రూ.7 కోట్ల ఆర్థికసాయం అందించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈనెల 30వ తేదీలోగా కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలా మరణించినా.. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న పేద కుటుంబాల్లోని 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయస్సు కలిగిన కుటుంబ పెద్ద (మహిళ లేదా పురుషుడు) గడిచిన రెండేళ్లలో చనిపోయి ఉంటే ఈ పథకం కింద ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రమాదవశాత్తు లేదా సహజంగా మరణించినా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. అంత్యోదయ అన్న బీమా యోజన, జన శ్రీ బీమా యోజన పథకాల కింద లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులు. తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయవచ్చు. దరఖాస్తుతో పాటు మరణ ధ్రువీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు పత్రం, అడ్రస్ రుజువు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు తెలిపే రేషన్‌కార్డు లేదా ధ్రువపత్రం జతచేయాలి. సహాయం పొందేందుకు దరఖాస్తు చేసిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు పత్రం, అడ్రస్, వయస్సు, కుటుంబ సభ్యుడి ధ్రువపత్రం, ఆధార్ కార్డు లింక్ చేసిన బ్యాంకు ఖాతా లేదా పోస్టాఫీస్ ఖాతా వివరాలతో పాటు, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. గ్రామ కార్యదర్శులకు ఆదేశాలు గ్రామాల్లో 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు మరణించిన వారికి సంబంధించిన వివరాలను గ్రామ పంచాయతీల్లోని జనన, మరణ రిజిస్టర్ల ఆధారంగా వెంటనే ఎంపీడీఓలకు పంపించాలని గ్రామ కార్యదర్శులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎంపీడీఓలు వాటిని పరిశీలించి, ఆ జాబితాలను తహసీల్దార్లకు అందజేయాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు ఆయా జాబితాను పంపించాలనివివరించారు. తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్ఎఫ్బీఎస్ పథకం దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులుఇంటి పెద్ద మరణిస్తే రూ.20 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం ఫ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధి ఫ జిల్లాలో 3500 మందికి ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఫ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రయోజనం ఫ మరణించిన రెండేళ్లలో దరఖాస్తు చేసుకునే వెసలుబాటు ఫ ఈనెల 30వ తేదీ వరకు గడువు ఫ ఇప్పటివరకు వచ్చింది 2070 దరఖాస్తులే..ఈ పథకం కింద జిల్లాలో మొత్తంగా 3,500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2,070 కుటుంబాలకు చెందిన పేదలు దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధి చేకూర్చే వారి సంఖ్య కంటే దరఖాస్తులు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ పథకంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అర్హులైన నిరుపేదలు దరఖాస్తు చేసుకునేలా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, గ్రామ సమాఖ్య సంఘాలతోనూ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, మండల ప్రత్యేక అధికారులు ఈ పథకంపై సమన్వయ సమావేశం నిర్వహించి, పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈనెల 30వ తేదీ వరకు వచ్చే దరఖాస్తులపై తహసీల్దార్లు పూర్తి విచారణ జరిపి, ఆర్డీఓలకు పంపించాలని, ఆర్డీఓలు ఆన్లైన్ ద్వారా డీఆర్ఓకు, తనకు పంపించాలని వివరించారు. -
బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి
కొండమల్లేపల్లి: రోడ్డు దాటుతున్న బాలికను బొలేరో వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఈ ఘటన కొండమల్ల్లేపల్లి మండలం కొల్ముంతల్పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్‌ముంతలపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్‌కి చెందిన పీట్ల రాజు, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. రాజు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం కుటుంబంతో కలిసి రాజు స్వగ్రామం బాపూజీనగర్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం రాజు కుమార్తె అక్షర(4) తన నానయమ్మ సుగుణమ్మతో కలిసి బాపూజీనగర్‌లో రోడ్డు దాటుతుండగా.. దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వేగంగా వస్తున్న బొలేరో వాహనం అక్షరను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అక్షరను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
విహారం కావొద్దు విషాదం
● సాగర్ సందర్శనకు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని సూచన ● జలాశయంలోకి దిగొద్దని హెచ్చరిక ● సూచిక బోర్డులు, ట్రంచ్‌ల ఏర్పాటునాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు, యువత భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సాగర్ పరిసర ప్రాంతాల్లో, దయ్యాలగండి పుష్కర ఘాట్ వద్ద జలాశయంలోకి దిగడం వంటివి చేస్తున్నారు. అదేవిధంగా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా కాలు జారి నీటిలో పడితే బయటకు రావడం కష్టమని రక్షణ సిబ్బంది చెబుతున్నారు. గతంలో పలువురు యువకులు నీటిలో ఈత కొడుతూ, ఫొటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు, సెల్ఫీలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో యువత జలాశయం నీటిలో దూకుతూ, లోతైన ప్రదేశాల్లో ఈత కొడుతూ వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్‌గా మారింది. అనుకోని ఘటన జరిగితే ప్రాణాలనే ప్రమాదమని గుర్తించాలని స్థానికులు, అధికారులు సూచిస్తున్నారు. అధికారుల ఏర్పాట్లు.. పర్యాటకుల భద్రత కోసం సాగర్ తీరం వెంట అధికారులు, పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దయ్యాలగండి వద్ద గల పుష్కర ఘాట్ వద్దకు వెళ్లకుండా రోడ్డు వెంట లోతైన ట్రంచ్ కొట్టారు. కొన్ని చోట్ల పోలీసులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఆ సూచనలను పట్టించుకోవడం లేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పవిత్ర మేడమ్ స్ఫూర్తితో..
బోధన తీరుతో స్ఫూర్తి పొందా.. సూర్యాపేటలోని ఎంఎస్ఆర్ బీఈడీ కళాశాలలో చదువుతున్నప్పుడు పవిత్ర మేడమ్ ప్రైవేట్ లెక్చరర్‌గా మాకు పాఠాలు బోధించేది. ఆమె బోధనా తీరు, ప్రేరణతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలనే లక్ష్యంతో కష్టపడి చదివి ఉద్యోగం టీచర్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం చండూరు మండలం దానుపాముల జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. – రాసమళ్ల సికిందర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, దానుపాముల, చండూరు పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు. మారం పవిత్ర స్ఫూర్తితో ఆమె చదువు చెప్పిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆమె కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా.. తమలోని భయాలను తొలగించించేందుకు కృషిచేసేదని, చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు వారిలోని ఇతర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేదని విద్యార్థులు చెబుతున్నారు.స్కాలర్షిప్కు ఎంపికయ్యా.. నేను గరిడేపల్లి మండలం గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదువుతున్నాను. పవిత్ర టీచర్ ఇచ్చిన శిక్షణతోనే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం ప్రతి సంవత్సరం అకౌంట్లో రూ.12వేలు జమవుతున్నాయి. విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్ ఎంతగానో దోహదపడుతుంది. – ఎ. వైష్ణవి, 10వ తరగతి, గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ టీచర్లు, లెక్చరర్లుగా పలువురి ఎంపిక జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లలో పాల్గొని సత్తాచాటుతున్న విద్యార్థులుసంతోషంగా ఉంది ఆంధ్ర, తెలంగాణ అగస్త్య జిజ్ఞాస పోటీల్లో మొదటి బహుమతి రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో పాటు రూ.1500 ప్రైజ్‌మనీ పొందాను. జీవశాస్త్ర టీచర్ పవిత్ర మేడమ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. – ఎం. మేఘన 10వ తరగతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ ప్రాక్టికల్ విధానంలో బోధన చూసి.. మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ఎస్లో ఉన్నప్పుడు పవిత్ర టీచర్ ప్రాక్టికల్ విధానంలో సైన్స్ బోధించడం చూసి.. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కులీ కుతుబ్‌షా పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. విద్యార్థులతో ఎలా ఉండాలనే విషయాన్ని పవిత్ర టీచర్ నుంచే నేర్చుకున్నాను. – ప్రవీణ్‌కుమార్, పాలిటెక్నికల్ లెక్చరర్జిల్లాస్థాయిలో గుర్తింపు లభించింది పవిత్ర గైడెన్స్‌లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో వీడర్ అండ్ సీడర్ ప్రాజెక్టు ప్రదర్శించడంతో జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. – బి. శ్రీశాంత్, 10వ తరగతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా సైన్స్ ఫెయిర్‌లో అవార్డు దక్కింది నేను తయారు చేసిన క్రాప్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆన్సీజనల్ రెయిన్స్ ప్రాజెక్టుకు జిల్లా సైన్స్‌ఫెయిర్‌లో అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. – శ్వేత 10వ తరగతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ -
కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలి
కోదాడ: కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పకొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఈశ్వరరావు కోరారు. మంగళవారం కోదాడలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్కోడ్లను తీసుకొచ్చిందని, వీటి వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, రాధాకృష్ణ, శ్రీలం శ్రీను, చెరుకు ఏకలక్ష్మి, సోమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు -
వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
గుండాల: ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుండాల మండలం అంబాల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రగూడెం గ్రామానికి చెందిన చిర్ర బాలరాజు(55) కొంతకాలంగా హైదరాబాద్‌లోని నేరేడ్మెట్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య గతంలోనే మృతిచెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాలరాజు తన అత్తగారి ఊరైన ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో మైసమ్మ పండుగకు హాజరయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి మోత్కూరులో దిగాడు. అక్కడి నుంచి పారుపల్లి గ్రామంలోని తన అత్తగారి వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడెం, గుండాల మండలం అంబాల గ్రామ శివారులోని బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వాగులో జారిపడి కొట్టుకుపోయాడు. మంగళవారం అంబాల గ్రామ శివారులో బిక్కేరు వాగు ఒడ్డున బాలరాజు మృతదేహాన్ని స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తేజమ్‌రెడ్డి తెలిపారు. -
మేకలు అపహరిస్తున్న ముఠా అరెస్ట్
నల్లగొండ: కార్లలో మేకలు అపహరిస్తున్న 16 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి శాలిగౌరారం సమీపంలోని బైరవోని బండ ఎక్స్ రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా కారులో వచ్చిన వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో అనుముల మండలం అలీనగర్‌కు చెందిన సంపంగి వెంకటేష్, సంపంగి శారద, మునుగోడు మండలం గూడపూర్‌కు చెందిన వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నిడమనూరుకు చెందిన దాసర్ల వినోద్‌కుమార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయగా వారిపై గతంలో మేకలు చోరీ చేసిన కేసు ఉన్నట్లు తేలింది. పట్టుబడిన నలుగురిని విచారించి.. వారితో పాటు మేకలు చోరీ చేస్తున్న మర్రిగూడ మండలం శివన్నగూడేనికి చెందిన వరికుప్పల రవి, రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన గండికోట శివకుమార్, ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం ఎస్సీ కాలనీకి చెందిన అమ్ములూరి విజయ్, హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన లింగాల అశోక్, ఉండం కళ్యాణి, భువనగిరి హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన వల్లెపు ప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం పెద్దాయిపల్లికి చెందిన మద్యాల సహదేవ్, సూర్యాపేట జిల్లా మోతెకు చెందిన కోడిసె వంశీకృష్ణ, కంపాటి హుస్సేన్, కంపాటి అజయ్‌కుమార్, మట్టి సురేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరంతా కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడి కార్లలో పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళ మేకలను కార్లలో వేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. వీరు నల్లగొండ జిల్లాలో 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌ర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకలు అపహరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దొంగలించిన మేకలను సంతలలో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఎస్పీ వివరించారు. వారి నుంచి రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలోని కోటేష్, కనుకుల బేబీ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆద్వర్యంలో నిందితులను పట్టుకున్న నల్లగొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్‌రెడ్డి, ఎం. నాగభూషణ్, కె. కొండల్‌రెడ్డి, శాలిగౌరారం ఎస్ఐ, నార్కట్‌పల్లి సీఐ, పోలీస్ సిబ్బంది, సీసీఎస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి రివార్డు ప్రకటించారు. రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్