breaking news
Reality
-
ఇల్లు.. ఇక కొందామా.. తొలగిన డైలమా!
కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జనలో పడేశాయి. 2025లో ఈ ఊగిసలాటకు తెరపడింది. స్థిరాస్తి మార్కెట్లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి ఈ ఏడాదితో తొలగిపోవడంతో కొనుగోలుదారుల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేయడంలో వేగం పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల కార్యాచరణలో వేగంగా అడుగులు వేయడంతో ఈ రంగంలో సానుకూల అడుగులు వేసేందుకు ప్రధానంగా ఊతమిచ్చాయి.భూముల ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఇది. మరి అలాంటప్పుడు కొనడానికి ఎందుకు ఊగిసలాట అనే సందేహం సహజం. గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధరకంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు.. ఇవి పెరగకపోగా.. అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగోలుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే డిమాండ్ పడి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే అభివృద్ధి నిలకడగా ఉండటం, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు ఇంధనంగా పనిచేస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తోంది. నగరంలో ఐటీ, ఫార్మాలతో పాటు విమానయాన, ఎల్రక్టానిక్స్ తదితర రంగాలలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. తద్వారా సహజంగానే ఇళ్ల నిర్మాణానికీ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి చుట్టుపక్కల స్థిరాస్తి రంగం వృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది.నలువైపులా అభివృద్ధి.. నగరం ఒకవైపే అభివృద్ధి కాకుండా నలువైపులా విస్తరించేలా ఆధ్యాత్మిక, ఐటీ, ఉత్పత్తి, ఫార్మా కారిడార్ల ప్రణాళికలు నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల దిశగా స్థిరాస్తి మార్కెట్ అడుగులు పడేందుకు ఇవి దోహదం చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సరళతరం చేసింది. నిధులు లేక సతమతమవుతున్న నిర్మాణ పరిశ్రమలో ఈ నిర్ణయంతో ఆశలు చిగురించాయి. పెద్ద ప్రాజెక్ట్‌లకే కాదు చిన్న ప్రాజెక్ట్‌లకూ ఆర్థిక అండ లభించింది. తద్వారా హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లోకి మరిన్ని పెట్టుబడులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది. టౌన్‌షిప్‌ల అభివృద్ధి, గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి నిధులు సమకూరాయి.ఇది చదివారా? ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..రెరాతో జవాబుదారితనం.. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుతో మార్కెట్‌పై సామాన్యుల్లో భరోసా పెరిగింది. దీంతో డెవలపర్లు, కొనుగోలుదారుల్లో సానుకూలత ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యి కొనుగోలుదారులకు అప్పగించాక ఐదేళ్లలో ఏదైనా లోపాలుంటే నిర్మాణదారుడిదే బాధ్యత వహించాలనేది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. నిర్మాణం మొదలుపెట్టాక ప్లాన్‌ను మార్చడానికి వీల్లేకుండా కొన్ని మంచి నిబంధనలలూ ఇందులో పొందుపరిచారు. వీటిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలతో స్థిరాస్తి మార్కెట్లో జవాబుదారితనం పెరిగింది. -
ఇళ్ల ధరలు 5 శాతం అప్
న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుకు పటిష్టమైన డిమాండ్ నెలకొనడంతో వచ్చే ఏడాదిలో (2026) ఇళ్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఈ పెరుగుదల 5 శాతం పైగా ఉంటుందని దాదాపు 70 శాతం రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్, డిసెంబర్ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 647 మంది డెవలపర్లు పాల్గొన్నారు. క్రెడాయ్ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం వచ్చే క్యాలెండర్ సంవత్సరంలో ఇళ్ల ధరలు 5 శాతానికి మించి పెరుగుతాయని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు. పెరుగుదల 25 శాతానికి మించి ఉంటుందని 1 శాతం మంది, 15–25 శాతం మధ్య ఉంటుందని 3 శాతం మంది అంచనా వేశారు. ఇక ఇళ్ల ధరలు 10–15 శాతం మధ్యలో పెరుగుతాయని 18 శాతం మంది, 5–10 శాతం మేర పెరుగుతాయని 46 శాతం మంది పేర్కొన్నారు. రేట్లు తగ్గుతాయని 8 శాతం మంది మాత్రమే తెలపగా, ధరల పెరుగుదల 5 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సుమారు 25 శాతం మంది వివరించారు. స్పెక్యులేషన్ కన్నా డిమాండ్‌కే ప్రాధాన్యం.. 2026 క్యాలెండర్ సంవత్సరంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్ సానుకూలంగా ఉంటుందని మూడింట రెండొంతుల మంది డెవలపర్లు అంచనా వేస్తున్నారు. గృహాలకు డిమాండ్ 5 శాతం మేర పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రియల్ ఎస్టేట్ రంగ వృద్ధి ప్రధానంగా వినియోగదారుల డిమాండ్‌ను బట్టే ఉంటుందే తప్ప స్పెక్యులేషన్ ఆధారితమైనదిగా ఉండదని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ జి. పటేల్ తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో ఖర్చులను తగ్గించి, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపరీ్టలను అందించడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు. ఈ వృద్ధి గతిని నిలబెట్టుకోవాలంటే వేగవంతమైన అనుమతులు, రెగ్యులేటరీపరంగా మరింత స్పష్టత అవసరమవుతుందని పటేల్ వివరించారు. క్లియరెన్స్‌లను క్రమబదీ్ధకరిస్తే వివిధ మార్కెట్లవ్యాప్తంగా కొత్త గృహాల సరఫరా పెరుగుతుందని, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాలు పర్యావరణహితంగా, సమంగా అభివృద్ధి చెందగలవని చెప్పారు. డిమాండ్ స్థిరంగా ఉండబోతోందని, ఒక పద్ధతి ప్రకారమే కొత్త గృహాల సరఫరా పెరగబోతోందని నివేదిక తెలియజేస్తోందని సీఆర్ఈ మ్యాట్రిక్స్ సీఈవో అభిõÙక్ కిరణ్ గుప్తా తెలిపారు. హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల పాలసీని సమీక్షిస్తాం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలిచ్చే విషయంలో తమ పాలసీని పునఃసమీక్షించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో అలాంటి రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో జవాబుదారీతనం, పారదర్శకత కీలకాంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. చాలా సంస్థలు గతంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి రుణాల విషయంలో దూకుడుగా వెళ్లి, చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టుల రుణాల్లో ఎస్బీఐ వాటా చాలా తక్కువే ఉంటోంది. అయితే, కమర్షియల్ రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ విభాగానికి రుణాలను క్రమంగా పెంచుకుంటోంది. ‘ప్రాజెక్టు నిర్వహణ, రిస్కు మేనేజ్మెంటు, పారదర్శకత విషయాల్లో స్థిరత్వం ఉంటే కాస్త నమ్మకం కలుగుతుంది. అలాగే జవాబుదారీతనం కూడా మాలాంటి బ్యాంకులకు కీలకంగా ఉంటుంది. అప్పుడు (పరిశ్రమ) తక్కువ వడ్డీ రేటుకే కన్స్ట్రక్షన్ రుణాలను పొందేందుకు వీలుంటుంది‘ అని క్రెడాయ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శెట్టి చెప్పారు. హౌసింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) నిర్వహణ వ్యయాలను తగ్గించుకుంటే, తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు అందించేందుకు వీలవుతుందని శెట్టి సూచించారు. -
కొత్త ఏడాదిపై రియల్ ఎస్టేట్ గంపెడాశలు
2025లో.. ఔటర్ వరకూ గ్రేటర్ పరిధి విస్తరణ..భారత్ ఫ్యూచర్ సిటీతో నగరంలో నాలుగో నగరి అవతరణ..మూసీకి పునరుజ్జీవంతో నైట్ ఎకానమీ ఆవిష్కరణ..మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ల ప్రణాళికలతో కొంగొత్త ఉత్సాహం....హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చే ఈ మెగా ప్రాజెక్ట్‌లకు శ్రీకారం పడింది. ఇక, వీటి కార్యాచరణతో కొత్త ఏడాదిలో నగర స్థిరాస్తి రంగం దూసుకెళ్లడం ఖాయమని నిర్మాణ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో రియల్ అభివృద్ధికి ఢోకా లేదని భావిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల రాకతో ఐటీ నిపుణులు, సంస్థలు హైదరాబాద్ వైపు దృష్టిసారిస్తున్నారు.స్థిరాస్తి రంగానికి మెరుగైన మౌలిక వసతులే జవసత్వాలు. రహదారులు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలు వంటి సామాజిక వసతులు ఉన్న చోట స్థిరాస్తి రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి, కోకాపేట, నార్సింగి వంటి ప్రాంతాలే ఇందుకు ఉదాహరణ. ఆయా ప్రాంతాలలో ప్రభుత్వాలు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో నిర్మాణ సంస్థలు పోటీపడీ మరీ నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించాయి. దీంతో ఎకరం వందల కోట్లు పలికే రికార్డ్ స్థాయికి ఆయా ఏరియాలు అభివృద్ధి చెందాయి. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్క చదరపు అడుగు(చ.అ.) కార్యాలయ స్థలం లావాదేవీ జరిగితే.. 10 చ.అ. నివాస స్థలానికి డిమాండ్ ఏర్పడుతుందని అంటారు. ఆఫీసు స్పేస్ అభివృద్ధితో నివాస, వాణిజ్య సముదాయాల అవసరం ఏర్పడుతుంది. రెండేళ్ల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. మన భాగ్యనగరం బెంగళూరు, చెన్నై వంటి ఐటీ హబ్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, అందుబాటు ధరలు, నిపుణుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి రకరకాల కారణాలతో బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో కంపెనీల ఏర్పాటుకు, పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.ఔటర్ గ్రేటర్.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని విస్తరించిన సంగతి తెలిసిందే. 27 నగర, పురపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా జీహెచ్ఎంసీ అవతరించింది. రెండు వేల చ.కి.మీకు పైగా విస్తరించిన జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్ ఏర్పాటు కావడంతో కొత్త ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి. బహుళ స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుతో సమర్థవంతమైన పరిపాలన, సమాంతర అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులను వేగవంతమవుతాయి. పట్టణీకరణ సవాళ్లు, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం సులువు అవుతుంది. పాత మున్సిపాలిటీల్లోనూ మెరుగైన మౌలిక వసతులు రావడంతో రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ ఏర్పడటం ఖాయం. బహుళ అంతస్తుల భవనాలు, భారీ వెంచర్లకు నిర్మాణ సంస్థలు, డెవలపర్లు ముందుకొస్తారు.మెట్రో బూమ్..హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాగోల్–శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గం–కోకాపేట, ఎంజీబీఎస్ – చాంద్రయాణగుట్ట, మియాపూర్– పటాన్చెరు, జేబీఎస్–మేడ్చల్/శామీర్‌పేట వంటి కీలక మార్గాలలో మెట్రో పరుగులు పెట్టనుంది. సుమారు 76–86 కి.మీ. మేర మెట్రో కొత్త లైన్ రానుంది. మెట్రో విస్తరణతో శివారు ప్రాంతాలు ప్రధాన నగరంతో అనుసంధానమవుతాయి. ప్రీమియం గృహాలకు డిమాండ్ ఏర్పడుతుంది. కోకాపేట, గచ్చిబౌలి, ఉప్పల్ వంటి విమానాశ్రయంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారతాయి. మెట్రో లైన్లలోని ఆస్తి విలువలు 10–20 శాతం మేర పెరుగుతాయి. కొత్త స్టేషన్ల చుట్టూ 2–3 కి.మీ. వరకూ బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య సముదాయాలు వస్తాయి.ఫ్యూచర్ బెటర్ఏటేటా మహా నగరం విస్తరిస్తోంది. విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం రకరకాల కారణాలతో నగరంలో వలసలు పెరుగుతున్నాయి. శరవేగంగా పట్టణీకరణ జరుగుతుండటంతో ప్రధాన నగరంలో జనసాంద్రత పెరుగుతోంది. మౌలిక వసతులపై ఒత్తిడి పడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారుల మధ్యలో మీర్ఖాన్పేటలో సుమారు 30 వేల ఎకరాలలో ఫోర్త్ సిటీ నిర్మాణానికి పునాదులు వేసిన సంగతి తెలిసిందే. ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ ఏడు మండలాల్లోని 56 గ్రామాలను కలుపుతూ ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో రహదారులు, భూగర్భ విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ గ్రామాలలో భూములకు రెక్కలొచ్చాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్–2047ను కూడా నిర్వహించింది. రెండు రోజుల సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి.మూసీ అభివృద్ధికేసి..భాగ్యనగరం నడిబొడ్డున వడ్డాణం మాదిరిగా అందంగా పొదిగిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మూసీ నదిని కేవలం నదీ తీర ప్రాంతంగా మాత్రమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖలా నిలిచేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నైట్ ఎకానమీకి మూసీని కేరాఫ్ మూసీ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. మూసీ నదిని బ్లూ, గ్రీన్ అని రెండు భాగాలుగా అభివృద్ధి చేయనున్నారు. బ్లూ మాస్టర్ ప్లాన్‌లో వరద నీటి నివారణ, వంతెనల నిర్మాణం తదితర అంశాలుంటే.. గ్రీన్ మాస్టర్ ప్లాన్‌లో నదీ తీరంలో గ్రీనరీ, రవాణా ఆధారిత అభివృద్ధి తదితర అంశాలుంటాయి.మూసీ నదీ తీర పునరుజ్జీవం, ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తూర్పు–పశ్చిమ నదీ తీరాన్ని కలుపుతూ 35–40 కి.మీ. కారిడార్‌ను అభివృద్ధి చేస్తారు. మూసీ నదీ తీరాన్ని రవాణా ఆధారిత అభివృద్ధిగా కలిపి డెవలప్ చేయాలని ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నది తీరం వెంబడి ప్రజా స్థలాలు, వినోద కేంద్రాలు, విహార ప్రదేశాలు, సాంస్కృతిక వేదికలు, విహార ప్రదేశాలు, ఉద్యానవనాలు, సాంస్కృతిక కేంద్రాలు, సైకిల్, వాకింగ్ ట్రాక్స్ వంటి స్థిరమైన రవాణా ఏర్పాట్లు వంటివి ఏర్పాట్లు చేయనున్నారు. వరదల నిరోధకత, జీవ వైవిధ్యం, సమ్మిళిత రూపకల్పనపై దృష్టిసారించనున్నారు. అలాగే ఆగ్యుమేటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్) ఆధారిత స్టోరీ టెల్లింగ్ జోన్లు, కల్చరల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తారు.త్రిబుల్ ఆర్ రయ్.. ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త ప్రాంతాలలో అభివృద్ధి విస్తరణకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30–50 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ (త్రిబుల్ ఆర్)కు ప్రణాళికలు చేసింది. హైదరాబాద్ చుట్టూ 340 కి.మీ. ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ ఇదీ. త్రిబుల్ ఆర్తో రాష్ట్ర మొత్తం కనెక్టివిటీ మెరుగవుతుంది. ఇంటర్ ఛేంజ్‌లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధితో కొత్త ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. పారిశ్రామిక గిడ్డంగులు, శాటిలైట్ టౌన్షిప్లకు ఆస్కారం ఉంటుంది. -
Real Estate: రిటైల్ పెట్టుబడులకు క్యూ..
పొద్దున లేస్తే ఆన్లైన్లో ఒక్కసారైనా క్లిక్‌మనిపించాల్సిందే. షాపింగ్, ఫుడ్, లైఫ్‌స్టైల్.. ప్రతీది ఈ–కామర్స్‌లో కొనేందుకే నేటి యువత మొగ్గు చూపిస్తోంది. అయితే ఈ–కామర్స్ ఎంత పెరుగుతున్నా.. నేటికీ షాపింగ్ మాల్స్‌కు ఆదరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. పాశ్చాత్య దేశాల్లో రిటైల్ స్థలం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే.. మన దేశంలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఇండియాలో మాల్స్ కేవలం షాపింగ్ కేంద్రాలే కాదు వినోదం, ఆహారం వంటి సామాజిక అవసరాలను కూడా తీర్చే కేంద్రాలుగా మారాయి. దీంతో మన దేశంలో ఏటేటా రిటైల్ స్పేస్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇండియాలో రిటైల్ రంగం వృద్ధిని సాధిస్తుంటే.. అమెరికాలో పతనం అవుతున్నాయి.మన దేశంలో 600 కంటే ఎక్కువ ఆపరేషనల్ మాల్స్ ఉన్నాయి. అయితే ఇందులో వంద కంటే తక్కువ మాల్స్ మాత్రమే గ్లోబల్ ఫండ్స్‌ను ఆకర్షించే సంస్థాగత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కొరతే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు దేశీయ మాల్స్‌లో పెట్టుబడులకు ప్రధాన కారణం. అధిక రాబడి, యువ వినియోగదారుల డిమాండ్, సంస్థాగత పెట్టుబడిదారుల్లో విశ్వాసం కారణంగా భారత రిటైల్ రంగంలో జోరు పెరిగింది. పరిమిత స్థాయిలో వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్, సరళమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) విధానాలు, విదేశీ బ్రాండ్లు, పెట్టుబడిదారులు రిటైల్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో దేశీయ రిటైల్ రంగం 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందని అనరాక్ గ్రూప్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.పాశ్చాత్య దేశాల్లో పతనం.. పాశ్చాత్య దేశాలలో మాల్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొత్త మాల్స్ స్టోర్లలో 78 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. 2020 నుంచి నికర మాల్ స్టోర్ మూసివేతలు పెరుగుతున్నాయి. అమెరికాలో రికార్డ్ స్థాయిలో 1,200 మాల్స్ మూతపడ్డాయి. ఉన్న మాల్స్‌లో దాదాపు 40 శాతం ఖాళీలు ఉన్నాయి. అదే మన దేశంలో 2021 నుంచి ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల మధ్యకాలంలో 88కు పైగా విదేశీ బ్రాండ్లు భారత రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. గ్రేడ్–ఏ మాల్స్ కోసం మరిన్ని అన్వేషణలో ఉన్నాయి. దాదాపు పూర్తి ఆక్యుపెన్సీలో ఉన్న గ్రేడ్–ఏ మాల్స్‌లో 95–100 శాతం లీజులు పూర్తయ్యాయి. కీలక జోన్లో రిటైల్ స్థలం కోసం దుకాణదారులు ఎదురుచూస్తున్నారు.తలసరి రిటైల్ స్పేస్.. మన దేశంలో తలసరి రిటైల్ స్టాక్ ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. భారత తలసరి రిటైల్ స్టాక్ ప్రథమ శ్రేణి నగరాల్లో కేవలం 4–6 చదరపు అడుగులుగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 2–3 చ.అ.లుగా ఉంది. ఇక, గ్రేడ్–ఏ మాల్స్‌లో తలసరి స్థలం కేవలం 0.6 చ.అ.గా ఉంది. అదే అమెరికాలో సగటు తలసరి రిటైల్ స్థలం 23 చ.అ., చైనాలో 6 చ.అ.లుగా ఉన్నాయి.రిటైల్‌లో రాబడి.. యువ జనాభా, పెరుగుతున్న ఆదాయాలు, వేగవంతమైన పట్టణ విస్తరణ కారణంగా భారతదేశం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల వినియోగ స్థాయిని చేరుకునే దిశగా పయనిస్తోంది. దేశంలో గ్రేడ్–ఏ రిటైల్ ప్రాపర్టీలు ఏటా 14–18 శాతం రాబడి అందిస్తాయి. అదే పాశ్చాత్య దేశాలలో ఈ రాబడి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంటుంది. మన దేశంలో నాణ్యమైన రిటైల్ స్థలం కొరతే డిమాండ్‌కు ప్రధాన కారణం. మన దేశంలో రోజుకు మాల్స్ ఫుట్‌ఫాల్స్ సగటున 20 వేలకంటే ఎక్కువగా ఉంటాయి. వీకెండ్లో అయితే 40 వేల కంటే అధికంగా ఉంటాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎంటర్టైన్మెంట్ స్పేస్‌లలో ఫుట్ ఫాల్స్ 30–35 శాతం వాటాలను కలిగి ఉంటాయి. దీంతో ఆన్లైన్ రిటైల్ ప్రభావం భౌతిక మాల్స్‌పై ప్రభావం లేదు.ఫిజికల్ స్టోర్లు.. మన దేశంలో రిటైల్ స్టోర్లు ‘ఫిజికల్’గా మారుతున్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్లు కస్టమర్లకు అనుభూతిని, విశ్వాసాన్ని పెంచే కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు డిమాండ్‌ను పెంచుతున్నాయి. మన దేశంలో ప్రముఖ డైరెక్ట్ టు కన్జ్యూమర్(డీ టూ సీ) బ్రాండ్లు ఆన్లైన్ కంటే ఆఫ్‌లైన్ విక్రయాలను అధికంగా చేస్తుండటమే ఇందుకు ఉదాహరణ. అయితే మన దేశంలో ఈ–కామర్స్ వాటా 8 శాతంగా ఉంది. అదే చైనా, అమెరికాలో 20 శాతం కంటే అధికం. -
అబ్బే.. రూ.అరకోటి ఇళ్లా!! మారిన డిమాండ్
నాలుగు గోడలు, పైకప్పుతో ఉండే సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ప్రైవసీ, ఆధునిక వసతులు ఉండే విలాసవంతమైన ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఏడాది కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు అమ్ముడుపోగా.. ఇందులో రూ.10–20 కోట్ల ధర ఉండే లగ్జరీ యూనిట్ల విక్రయాలు 170 శాతం వృద్ధి చెందగా.. రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ అమ్మకాలు 16 శాతం తగ్గాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టే డెవలపర్లు కూడా ప్రీమియం ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ.. స్థిరమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా భారత ఆర్థిక దృక్పథం స్థిరంగా ఉంది. కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ పెరిగింది. విస్తీర్ణమైన గదులు, ఆధునిక వసతులు, గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి కారణంగా లగ్జరీ గృహాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని విలాసవంతమైన ఇళ్లలో 45 శాతం ఐదేళ్లలో వచ్చినవే..పర్యావరణ అనుకూలమైన, ఇంధన సమర్థవంతమైన నివాసాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇవే స్థిరాస్తి రంగంలో స్థిరమైన అభివృద్ధికి కీలకంగా మారాయి. దేశంలోని లగ్జరీ గృహ విక్రయాలలో 10 శాతం వాటాతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నైల కంటే భాగ్యనగరంలోనే విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉండటం గమనార్హంఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్.. లగ్జరీ గృహ విక్రయాలకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కోకాపేట, నియోపోలిస్ ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారాయి. ఆయా ప్రాంతాల్లో రూ.20–40 కోట్ల మధ్య ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు సైతం నమోదవుతుండటం దీనికి ఉదాహరణ. -
కో–లివింగ్.. ఇన్వెస్ట్‌మెంటే!
ఒకప్పుడు సింగిల్‌గా అద్దెకుండే వారికి సింగిల్ రూమ్‌లు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. అయితే సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలి. ఇపుడు అవీ దొరకటం లేదు. ఇక డబుల్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకుంటే అద్దెలు తడిసి మోపెడవుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లోనైతే కో–లివింగ్ లేదా షేర్డ్ రెంటల్ ఇళ్లు బాగా దొరుకుతాయి. అంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ను మూడు బెడ్రూమ్లుగా విభజించి... కిచెన్, హాల్ వంటివి కామన్‌గా వినియోగించుకోవటమన్న మాట. ఆ సింగిల్ బెడ్రూమ్లో ఒక్కరే గానీ, ఇద్దరు గానీ ఉండొచ్చు. దాన్ని బట్టే అద్దె ఉంటుంది. అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కో–లివింగ్ రెంటల్ హౌసింగ్ విధానం ఇపుడు ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఈ సంస్కృతి ఇపుడిపుడే ప్రాచుర్యం అందుకుంటోంది. అటు ప్రొఫెషనల్స్‌తో పాటు ఇటు పెట్టుబడులపై అధిక రాబడులనిచ్చే కొత్త మార్గాలను అన్వేíÙస్తున్న ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. నాస్కామ్ తాజా నివేదిక ప్రకారం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాలు కొత్త టెక్నాలజీ, ఎడ్యుకేషన్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. దీనితో ఆయా ప్రాంతాలకు యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు బాగా వస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటూనే, తక్కువ అద్దెకు లభించే వసతి సదుపాయాల కోసం వారు వెతుక్కుంటున్నారు. ఫలితంగా... అలాంటి సౌకర్యాలను అందిస్తున్న కో–లివింగ్ ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. సింగిల్ బెడ్రూమ్ అద్దెకన్నా సుమారు 35 శాతం చౌకగా, సరళతరమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు వై–ఫై, క్లీనింగ్, కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉంటుండటంతో జెన్ జెడ్ వీటివైపు మొగ్గు చూపుతోంది. నిర్వహణ బాదరబందీ లేకుండా... ఇలాంటి ప్రాపర్టీలను కో–లివింగ్ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానులకు నిర్వహణ బాధ్యతలను గానీ, కిరాయిదార్లతో డీల్ చేయటం వంటి బాధ్యతలు గానీ లేకుండా వాటన్నిటినీ తామే చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు చాలా వస్తున్నాయి. నెస్ట్ అవే, స్టాంజా లివింగ్, కోలివ్, యువర్‌స్పేస్ లాంటి కంపెనీలు రకరకాల విధానాల్లో నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. కిరాయిదారుకు అద్దెకివ్వడం నుంచి గదుల మెయింటెనెన్స్, ఫరి్నíÙంగ్, అద్దెల వసూళ్లు మొదలైన పనులన్నీ ఓనర్ల ప్రమేయం లేకుండా అవే చూసుకుంటాయి. ఫలితంగా నిర్వహణ బాదరబందీ లేకుండా యజమానులకు స్థిరంగా నెలకి ఇంత చొప్పున అద్దె లభిస్తుంది. సాధారణ ఫ్లాటు కాస్త అధిక రాబడి అందించే సాధనంగా మారుతుంది. లాభసాటి ఇన్వెస్ట్మెంట్ కూడా... ఓనరు ఏమాత్రం కలుగజేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వసతి సదుపాయాలను మేనేజ్ చేసే సంస్థలిపుడు చాలా వస్తున్నాయి. వాటి కారణంగా ఇలాంటి ప్రాపర్టీలు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఉదాహరణకు వైజాగ్‌లో సాధారణ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు రూ.18,000 ఉందనుకుంటే, ఆ ఇంటినే కో–లివింగ్ కింద (మూడు వేర్వేరు గదులుగా) మారిస్తే రూ. 24,000– రూ. 30,000 వరకు వస్తోంది. అంటే దాదాపు 35–40 శాతం మేర అధికంగా రాబడి వచి్చనట్లే. సంప్రదాయ రెంటల్ విధానమైతే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3 శాతం మేర నికరంగా రాబడి లభిస్తుంటే... ఈ కో–లివింగ్ విధానంలో 5 నుంచి 7 శాతం రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సెంటర్లకు దగ్గర్లో ఉన్నవైతే కొన్ని సందర్భాల్లో 8 శాతం వరకు రాబడి ఉంటోంది. అంటే బ్యాంకు వడ్డీతో సమానంగా వస్తున్నట్లే. పైపెచ్చు దీర్ఘకాలంలో విలువ పెరగటం లాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులకు ఉండే పెరుగుదల ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. ఖాళీగా ఉండేది తక్కువే.. సాధారణంగా విద్యార్థులు, జూనియర్ ఐటీ ఉద్యోగులు కొంత సమయం పాటు వచ్చి వెళ్లిపోతుంటారు. ఫలితంగా కో–లివింగ్ ప్రాపరీ్టలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. వైజాగ్‌లోని మధురవాడ, విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లాంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా 90– 95 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటున్నట్లు కన్సలి్టంగ్ సంస్థల చెబుతున్నాయి.రిస్క్ లు తెలుసుకోవాలి.. షరా మామూలుగా ఏ పెట్టుబడి సాధనంలోనైనా ఎంతో కొంత రిస్క్ లు ఉంటాయి. కో–లివింగ్‌లోనూ అలాంటివి కొన్ని ఉంటాయి. కిరాయిదారులు తరచుగా మారుతుండటం వల్ల ప్రాపర్టీ పాతబడిపోతుంటుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతుంటాయి. వివాదాలు తలెత్తవచ్చు. ప్రమాదాలు, డ్యామేజ్లకు ఆస్కారం ఉండటం వల్ల ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇవి కాకుండా జోనింగ్ పరిమితుల్లాంటి రెగ్యులేటరీ నిబంధనల అవరోధాలు, పరస్పరం సంబంధంలేని కిరాయిదార్లు, స్వల్పకాలిక రెంటల్ నిబంధనలపరంగా ఏవైనా వివాదాలు తలెత్తడంలాంటి సమస్యలు రావచ్చు. అయితే, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిస్క్ లతో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువన్నది నిపుణుల మాట. -
రీసేల్..ఈజీ డీల్..
కొంత కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రీసేల్ మార్కెట్ అంటూ ప్రత్యేకమైన ఒరవడిని సృష్టిస్తోంది. కొత్త కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులతో పాటు రీసేల్ మార్కెట్ అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగంగా మారింది. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయని భావించి ఈ రంగంలోకి అనేక మంది ప్రవేశిస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోలు, విక్రయాల్లో వినియోగదారులు, ఇన్వెస్టర్లు, బ్రోకర్లకు సమానంగా లాభాలు అందించడంలో ఈ రీసేల్ సెగ్మెంట్ కీలకపాత్ర పోషిస్తోంది. అదే సమయంలో నగర జీవనశైలిపై కూడా స్పష్టమైన ప్రభావం చూపుతోంది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగావకాశాలు పెరిగే కొద్దీ, వలసలు పెరుగుతున్నాయి. దీంతో స్థిరమైన నివాసాల కోసం డిమాండ్ వేగంగా పెరిగింది. చాలా మంది రెడీ టు మూవ్ ఇళ్లు, వెంటనే ఉపయోగించుకునే ఫ్లాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త కన్స్ట్రక్షన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడటం కంటే రీసెల్ ప్రాపర్టీ తీసుకోవడం సౌకర్యంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.సులభంగా బ్యాంక్ లోన్లు.. రీసేల్‌లో ప్రధానంగా పెట్టుబడి తక్కువ. కొత్త వెంచర్లు వంటి భారీ ఖర్చులు, మార్కెటింగ్ వ్యయాలు, ప్రీలాంచ్ ప్రకటనలు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వంటి ఖర్చులు ఉండవు. ఇప్పటికే ఉన్న ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం వల్ల రిస్క్ కూడా తక్కువ. రీసేల్ ప్రాపర్టీలకు సాధారణంగా రెడీ డాక్యుమెంటేషన్ ఉండటం, బ్యాంక్ లోన్లు సులభంగా లభించడం, వాస్తు/ప్రాంతీయ వివరాలు ఇప్పటికే తెలిసి ఉండటం కొనుగోలుదారులకు అదనపు నమ్మకాన్ని ఇస్తుంది.ఇదే కారణంగా ఈ రంగంలో ఇన్వెస్టర్లు కూడా వేగంగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ రంగంలో ఏజెంట్లకు భారీ కమీషన్లు ఇచ్చే వ్యవస్థ తగ్గిపోతోంది. డిజిటల్ ప్లాట్ఫార్మ్లు, రియల్ ఎస్టేట్ లిస్టింగ్ యాప్‌లు, సోషల్ మీడియా మార్కెటింగ్‌తో ప్రాపర్టీ యజమానులు నేరుగా కస్టమర్లతో మాట్లాడే అవకాశం పెరిగింది. ప్రధానంగా మధ్యవర్తి ఖర్చులు తగ్గి, విక్రేతలకు ఎక్కువ లాభం, కొనుగోలుదారులకు తక్కువ ధరకు లభిస్తోంది. ఈ మార్పు రియల్ ఎస్టేట్ లావాదేవీలను మరింత పారదర్శకంగా చేస్తోంది.రెడీ ఇళ్లకు అధిక డిమాండ్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు.. శంషాబాద్, షాద్‌నగర్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లోని ప్లాట్లు, వెంచర్లు.. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, మణికొండ, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో రీసెల్ మార్కెట్ చురుగ్గా మారింది. ఐటీ ఉద్యోగస్తులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాల్లో రెడీ ఇళ్లకు డిమాండ్ నిరంతరం ఉంటుంది. ఇక అపార్ట్మెంట్లతో పాటు విల్లాలు, సొంత గృహాలు, జీ ప్లస్–1, జీ ప్లస్–2 హౌసింగ్ యూనిట్లు కూడా పెద్ద సంఖ్యలో రీసేల్ అవుతున్నాయి.లైఫ్‌స్టైల్ కోణం నుంచి చూస్తే రీసేల్ మార్కెట్ నగర జీవనశైలిలో కొత్త అనుభవాన్ని తెచ్చింది. ఉద్యోగ మార్పులు, నగరాల మధ్య తరలింపు, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ విస్తరణ.. వంటివి వేగంగా జరిగే ఈతరం వెంటనే మకాం మార్చుకునేందుకు వీలైన ఇళ్లు ప్రధాన అవసరంగా మారాయి. ఈ అవసరాన్ని తీర్చడంలో రీసేల్ సెగ్మెంట్ కీలక పాత్ర పోషిస్తోంది. భద్రత, రవాణా సౌకర్యాలు, స్కూళ్లు, హాస్పిటల్స్, మార్కెట్లు తదితర వాటిని చూసుకునే ఇంటిని నిర్మించుకుంటారు. దీంతో వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన వారికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.భవిష్యత్‌లో మరింత బలపడే అవకాశంప్రస్తుత మాంద్యం పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే, రెంటల్ ఇన్కమ్ కోసం ఇళ్లు కొనుగోలు చేసే వారికి రీసేల్ ప్రాపరీ్టలు తక్షణ లాభం అందిస్తున్నాయి. నగర వృద్ధి వేగం పెరగడంతో భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రీసేల్ విభాగం సంప్రదాయ కొనుగోలు, అమ్మకాల నమూనాను మార్చి, కొత్త తరానికి అనుగుణంగా జీవన శైలిని ప్రతిబింబించే ట్రెండ్‌గా ఎదుగుతోంది. ఈ వినూత్న మార్పులు, తక్కువ రిస్క్, ఎక్కువ లాభాలు, స్మార్ట్ లివింగ్ అవసరాల కలయికగా ఈ రంగాన్ని రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యంతో ముందుకు నడిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..
నిర్మాణ రంగంలో ముఖ్యంగా గృహ నిర్మాణంలో అనేక కొత్త కొత్త టెక్నిక్‌లు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా ఐఐటీ తిరుచ్చి ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఇలా గతంలో అనేక ఉన్నత విద్యా సంస్థల నుంచి కూడా పలు కొత్త నిర్మాణ నిర్మాణ పద్ధతులు తెరమీదకు వచ్చాయి. అవి ఏవి.. వాటిలో ఏవి విజయవంతమై క్షేత్ర స్థాయిలో వినియోగంలో ఉన్నాయి.. చూద్దాం ఈ కథనంలో..నెల రోజుల్లో నిర్మాణంఎన్ఐటీ తిరుచ్చి తాజాగా మరో కొత్త నిర్మాణ టెక్నిక్‌ను అభివృద్ధి చేసింది. నిర్మాణ సమయం, సిమెంట్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు భవనం ధృడంగా ఉండేలా రూపొందించిన కొత్త కోల్డ్ ఫార్మడ్ స్టీల్ (CFS)-కాంక్రీట్-బ్రిక్ కాంపోజిట్ హౌసింగ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రోటోటైప్ భవనం 'సెంటినెల్'ను ఆవిష్కరించింది సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ అండ్ ఇంక్యుబేషన్ (సీఈడీఐ) అధ్యాపకుల నేతృత్వంలోని స్టార్టప్.కాంక్రీట్ వినియోగాన్ని 40-50% తగ్గించడంతోపాటు భూకంపానికి తట్టుకునే సామర్థ్యం కూడా ఈ నిర్మాణానికి మెరుగ్గా ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు. ఈ 400 చదరపు అడుగుల సింగిల్-బీహెచ్‌కే యూనిట్ కోసం మొత్తం సివిల్ పని కేవలం 25 పని దినాల్లో పూర్తయింది. సాధారణంగా ఇదే పరిమాణంలో సాంప్రదాయ ఆర్సీసీ భవనం నిర్మించాలంటే 2-3 నెలలు పడుతుంది.గతంలో వచ్చిన టెక్నిక్లుదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన అనేక నిర్మాణ సాంకేతికతలు క్రమంగా ప్రయోగశాలలు, పైలట్ ప్రాజెక్టుల నుండి వాస్తవ ప్రపంచ వినియోగంలోకి మారుతున్నాయి. ప్రీకాస్ట్ నిర్మాణం, కోల్డ్-ఫార్మ్డ్ స్టీల్ సిస్టమ్స్, జియోపాలిమర్ కాంక్రీట్ ఇప్పటివరకు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన నిర్మాణ టెక్నిక్‌లు.వీటిలో, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, ఎస్పీఏ ఢిల్లీ వంటి సంస్థలు రూపొందించిన ప్రీకాస్ట్, మాడ్యులర్ నిర్మాణానికి విస్తృత ఆమోదం లభించింది. సైట్లో అసెంబుల్ చేసిన ఫ్యాక్టరీ-మేడ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్లను ఇప్పుడు సాధారణంగా పట్టణ హౌసింగ్, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ హౌసింగ్ పథకాలలో ఉపయోగిస్తున్నారు.అదే విధంగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన విస్తృత పరిశోధనల ద్వారా అభివృద్ధి చెందిన జియోపాలిమర్ కాంక్రీట్ ప్రయోగాత్మక దశను దాటి ప్రాయోగిక వినియోగానికి చేరుకుంటోంది. ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలతో తయారయ్యే ఈ పదార్థం ప్రస్తుతం రహదారి పేవ్మెంట్లు, ప్రీకాస్ట్ విడిభాగాలు, పారిశ్రామిక నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు.అయితే, అన్ని ఆవిష్కరణలు ఇంకా క్షేత్రస్థాయిలోకి ప్రవేశించడం లేదు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌లు ప్రదర్శించిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నిక్.. అధిక పరికర వ్యయం, నైపుణ్యం కలిగిన ఆపరేటర్ల అవసరం కారణంగా ఇప్పటికీ పైలట్ హౌసింగ్ ప్రాజెక్టులు, క్యాంపస్ స్థాయి నిర్మాణాలకే పరిమితమై ఉంది.అలాగే, వెదురు మిశ్రమాలు, కంప్రెస్డ్ ఎర్త్ బ్లాక్స్ వంటి బయో-ఆధారిత నిర్మాణ పదార్థాలను ఎక్కువగా గ్రామీణ లేదా ప్రాంత-నిర్దిష్ట అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఏఐ, ఐఓటీ ఆధారిత స్మార్ట్ నిర్మాణ సాంకేతికతలు ప్రధానంగా నిర్మాణ పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కోసం పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఓ ఎంపికగా మాత్రమే అమలు చేస్తున్నారు. -
గ్లోబల్ సమ్మిట్‌తో రియల్ మార్కెట్ రైజింగ్
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రూపాయి పతనం, ఉద్యోగాల తొలగింపు, స్థిరమైన వడ్డీ రేట్లు వంటి రకరకాల కారణంగా కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉంది. ఇటీవల రాయదుర్గం, నియోపొలిస్ భూముల వేలంలో రూ.వందల కోట్ల బిడ్డింగ్‌తో నగర స్థిరాస్తి మార్కెట్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్–2025తో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. సమ్మిట్‌లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047తో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు పెరిగాయి. విద్యా, వైద్యం, తయారీ, క్రీడలు, పర్యాటకం, నివాసం, పరిశ్రమలు.. అన్ని రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో.. స్థానిక స్థిరాస్తి రంగంలో సానుకూల దృక్పథం ఏర్పడింది. ప్రధానంగా సామాన్య, మధ్యతరగతి గృహాలు, పర్యాటకం, గిడ్డంగులు, డేటా సెంటర్లలో రియల్టీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. – సాక్షి, సిటీబ్యూరోఅంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ రూపంలో ప్రభుత్వం తీసుకున్న చొరవ ప్రశంసనీయం. రియల్ ఎస్టేట్‌కు జీవం.. ఉపాధి.. ప్రస్తుతం తరుణంలో ఈ ప్రాథమిక అంశంపై ప్రభుత్వం దృష్టిసారించడం కీలకం. విజన్ డాక్యుమెంట్‌తో ప్రభుత్వ దీర్ఘకాల విజన్‌పై స్పష్టత ఇవ్వడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంటోంది. జాయింట్ వెంచర్లు, విదేశీ పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్ట్‌లు, అనుమతుల్లో వేగం, పాలసీలతో సెంటిమెంట్ బలపడుతుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో తయారీ, ఐటీ, ఫార్మా వంటి రంగాలే కాదు సినిమా, క్రీడలు, సెమీ కండక్టర్లు, అంతరిక్షం, జీవ ఉత్పత్తులు, జీవ వైవిధ్యం వంటి అన్ని రంగాలతో సమగ్రంగా ఉంది. దీంతో నివాస, ఆఫీసు స్పేస్‌లోనే పర్యాటకం, క్రీడలు, గిడ్డంగులు, డేటా సెంటర్ల వంటి ఇతర రియల్టీ మాధ్యమాలలో కూడా పెట్టుబడి అవకాశాలు ఏర్పడ్డాయి.వెస్ట్ టు సౌత్..నగర రియల్టీ మార్కెట్లో ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్‌దే ఆధిపత్యం. బహుళ జాతి ఐటీ, ఆర్థిక సంస్థలు, డేటా సెంటర్లు పశి్చమంలో కేంద్రీకృతమై ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఈ ప్రాంతానికి శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్‌కు సులువైన కనెక్టివిటీతో పాటు విశాలమైన రహదారులు, మెరుగైన మురుగునీటి వ్యవస్థ, తాగునీరు, నిరంతరం విద్యుత్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయి. దీంతో బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య సముదాయాలు, అంతర్జాతీయ విద్యా, వైద్యం, వినోద సంస్థలకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా రాయదుర్గం, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి వెస్ట్ హైదరాబాద్‌లో భూములు హాట్‌కేక్‌లుగా మారాయి.ప్రభుత్వం నిర్వహించే వేలంలోనే ఎకరం రూ.వందల కోట్లు పలుకుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఖరీదైన ప్రాంతంలో సామాన్య, మధ్యతరగతికి సొంతిల్లు కలే. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కొత్త ప్రాంతానికి అభివృద్ధిని విస్తరించడం హర్షించదగిన పరిణామం. నగరానికి దక్షిణ భాగమైన శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. దీంతో గ్రీన్‌ఫీల్డ్ నెట్ జీరో సిటీ పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులు మెరుగవుతాయి. ఫలితంగా నివాస, వాణిజ్య సముదాయాలు వెలుస్తాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు అందుబాటు ధరల్లోనే సొంతింటి కలను సాకారం చేసుకునే వీలు ఏర్పడుతుంది.మాస్టర్ ప్లాన్స్‌పై స్పష్టత వస్తేనే..ఏ ప్రాజెక్ట్‌కైనా బృహత్ ప్రణాళిక(మాస్టర్ ప్లాన్) కీలకం. రాష్ట్రాభివృద్ధిని మార్చే కీలక ప్రాజెక్ట్‌లలో భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం కీలకమని పదే పదే ప్రభుత్వం చెబుతోంది. అలాంటి కీలకమైన ప్రాజెక్ట్‌లకు మాస్టర్ ప్లాన్ వస్తేనే పెట్టుబడులపై స్పష్టత వస్తుంది. డెవలపర్లు, పెట్టుబడిదారులు ఎవరికైనా సరే మాస్టర్ ప్లాన్‌లో ఏ జోన్ ఎక్కడ వస్తుంది? బహుళ వినియోగ జోన్ ఏరియా ఎంత? వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకొనే ముందడుగు వేస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం బృహత్తర ప్రాజెక్ట్‌ల సమగ్ర మాస్టర్ ప్లాన్ విడుదల అయితేనే ఆయా ప్రాంతాలలో పెట్టుబడి అవకాశాలపై స్పష్టత వస్తుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు.కార్యరూపం దాలిస్తేనే ఫలాలు..‘అన్ని రహదారులు రోమ్కు దారితీస్తాయి’ విస్తృతమైన రోడ్ నెట్‌వర్క్‌ను దాని రాజధానికి అనుసంధానించే క్రమంలో ఉద్భవించిన ప్రాచీన రోమ్ నానుడి లాగే.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా రియల్ ఎస్టేట్‌కు ఊతమిస్తుంది. రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో పాక్షికంగా కార్యరూపంలోకి వచ్చినా రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రమే మారిపోతుంది.పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయి. దీంతో రియల్టీలో పెట్టుబడులు పెరుగుతాయి. అసలు సమస్య ఏంటంటే.. ఫ్యాబ్ సిటీ, ఎల్రక్టానిక్ సిటీ, ఫార్మా సిటీ.. ఇలా ఏ పేరుతోనైనా ఏ ప్రభుత్వమైనా భూములు సమీకరించడం సర్వ సాధారణమే. కానీ, అవి కార్యరూపం దాలిస్తేనే అభివృద్ధి. లేకపోతే ఇతర రాష్ట్రాలు నిర్వహించే సాధారణ సమ్మిట్ మాదిరిగానే ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా వారం, నెల రోజుల్లో మరుగునపడిపోతుంది. స్థానిక అవసరాలు, బలాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ రూపొందిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. -
సామాన్యుడి కల.. 29 లక్షల ఇళ్లు అవసరం!
హైదరాబాద్‌లో సామాన్యుడికి సొంతిల్లు కలే. దీన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి. నిజం చెప్పాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలోనే సామాన్య, మధ్యతరగతి ఇళ్ల సరఫరా పెరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో ప్రైవేట్ సంస్థలను ఆకర్షించాల్సి ఉంటుందని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. కొరతను అధిగమించేందుకు చిన్న, తక్కువ ధరల ఇళ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సిటీ అభివృద్ధి ఔటర్ దాటింది. కనెక్టివిటీ, సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. దీంతో సామాన్యులకు గృహాలు కొనగలుగుతారు. – సాక్షి, సిటీబ్యూరోరాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో ఇళ్ల డిమాండ్‌పై రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో మధ్యతరగతి వర్గాలకు 20.30 లక్షలు, పేద వర్గాలకు 8.70 లక్షల ఇళ్లు కలిపి.. మొత్తం 29 లక్షల ఇళ్ల డిమాండ్ ఉందని తేలింది. ఈ కొరతను అధిగమించాలంటే పీపీపీ విధానం మేలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) మధ్య పీపీపీ విధానంలో సరసమైన గృహాలను నిర్మించే యోచన చేస్తున్నట్లు ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో పేద, మధ్యతరగతి ప్రజలకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.మౌలిక వసతుల కల్పన..అందుబాటు గృహాలను నిర్మించాలంటే నగరంలో స్థలం కొరత. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ముందుగా శివారుల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక వసతులను కల్పించాలి. అలా చేస్తే అందుబాటు గృహాల నిర్మాణాలు ఊపందుకుంటాయి.ప్రభుత్వం ఉచితంగా స్థలాలను కేటాయించి.. జాయింట్ వెంచర్‌గా అందుబాటు గృహాలను నిర్మిస్తే విజయవంతం అవుతాయి. ఎలాగంటే.. ప్రైవేట్ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాయి కనుక నిర్మాణంలో నాణ్యతతో పాటూ వారికి దక్కే వాటా ఫ్లాట్లు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించుకుంటారు. దీంతో ప్రాజెక్ట్‌లో భిన్నమైన సంస్కృతి వస్తుంది. నిర్వహణ కూడా బాగుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి.ముచ్చటగా మూడు పద్ధతులు➤ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం రాష్ట్రాన్ని మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తుంది.➤కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్)లో మురికివాడలను యథాస్థితిలో పునరాభివృద్ధి చేయనున్నారు. ఐటీ కారిడార్లలో అందుబాటు ధరల్లో అద్దె గృహాల విధానాన్ని తీసుకురానున్నారు.➤పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్) పరిధిలో బహుళ అంతస్తుల గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే పారిశ్రామిక క్లస్టర్ల వద్ద కార్మికులకు సరసమైన ధరలకు గృహాలు నిర్మించడంపై దృష్టిపెడతారు.➤మిగిలిన ప్రాంతం పరిధిలో చిన్న, మధ్య తరహా టౌన్íÙప్లు, పారిశ్రామిక పార్క్‌లు, లాజిస్టిక్ హబ్‌లతో గృహ నిర్మాణ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. -
కోకాపేటలో ఎకరం రూ.151 కోట్లు..!
1 కోకాపేట్ మరోసారి రియల్ ప్రకంపనలను సృష్టించింది. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) గత నవంబర్, ఈ డిసెంబర్ నెలల్లో మూడు దఫాలుగా నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో 29 ఎకరాలపైన రూ.3,862 కోట్ల ఆదాయం లభించింది. మొదటి నుంచి ఇక్కడ భూమి హాట్కేక్లాగే అమ్ముడు కావడం విశేషం. ఫార్చ్యూన్ 500 కంపెనీలు కొలువుదీరిన పడమటి ప్రాంతం కార్పొరేట్ సంస్థలకు కొంగు బంగారంగా మారింది. కోకాపేట్ నియోపోలిస్ లే అవుట్లో 2021లో మొదటి దశ 64 ఎకరాలను విక్రయించారు. అప్పట్లో ఈ భూములపై సుమారు రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. 2023 ఆగస్టులో నిర్వహించిన రెండో దశ బిడ్డింగ్‌లో 45.33 ఎకరాలను విక్రయించగా, రూ.3,300 కోట్లు లభించాయి. ఈసారి 29 ఎకరాలపైన రూ.3,862 కోట్లు లభించింది. 2023లో ఎకరం గరిష్టంగా రూ.100.75 కోట్లకు విక్రయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.151 కోట్లు పలికింది. రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి ఇంతటి భారీ స్థాయిలో స్పందన లభించడంతో ఇదే ప్రాంతంలో ఉన్న మరో 70 ఎకరాలను విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమవుతోంది.2 ఒకేచోట సకల సదుపాయాలు.. ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం వరకు కేవలం 5 కిలో మీటర్ల పరిధిలోనే వందలాది కార్పొరేట్ దిగ్గజ సంస్థలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వర్గాలు రూ.కోట్లలో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు అన్ని రకాల సదుపాయాలతో నియోపోలిస్ లే అవుట్‌ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. సుమారు 200 మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు, బడా రియల్టర్లు, డెవలపర్లు మొదటి నుంచీ నియోపోలిస్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మొదటి దశలో ఒకటి నుంచి 5 వరకు ఉన్న ప్లాట్లను విక్రయించగా రెండో దశలో 6 నుంచి 14 వరకు ఉన్న ప్లాట్లను విక్రయించారు. మూడో దశలో 15 నుంచి 20 వరకు ఉన్న భూములకు బిడ్డింగ్ నిర్వహించారు. 3 రూ.7వేల కోట్లు లక్ష్యంగారియల్ ఎస్టేట్ రంగంలో చోటుచేసుకున్న ఈ స్పీడ్‌ను ఇలాగే కొనసాగించేందుకు కొత్త సంవత్సరంలో మరో 70 ఎకరాలను విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. దీని ద్వారా సుమారు రూ.7 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఎకరం సగటున రూ.100 కోట్ల చొప్పున విక్రయించినా నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రైజింగ్–47లో భాగంగా భారీ ఎత్తున ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.కోకాపేట్ ప్రత్యేకతలు.. కోకాపేట్ నియోపోలిస్ సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉంది. సుమారు రూ.300 కోట్లతో హెచ్ఎండీఏ ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు తదితర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్లు వెడల్పుతో అంతర్గత రోడ్లను నిర్మించారు. నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తులైనా హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించుకోవచ్చు. ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్‌సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనే విధంగా రోడ్డు నెట్వర్క్ అందుబాటులో ఉంది. -
భారత్‌లో పెరుగుతున్న ‘ఘోస్ట్ మాల్స్’
దేశంలో రీటెయిల్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. వీధికో షాపింగ్ మాల్ వెలుస్తోంది. అయితే.. అన్ని షాపింగ్ మాల్స్ నిండుగా ఉంటున్నాయా? ఊహూ లేదు. చాలా వాటిల్లో షాపులు పెట్టుకునే స్థలాలుంటున్నాయి కానీ.. ఎవరూ అద్దె/ లీజుకు తీసుకోవడం లేదు. ఫలితంగా దేశంలో ఏటికేడాదీ ఘోస్ట్మాల్స్ పెరిగిపోతున్నాయి!ఘోస్ట్మాల్స్ అంటే ఏమిటని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ ఏ మాల్‌లోనైనా సగం కంటే ఎక్కువ స్పేస్ మూడేళ్లపాటు ఖాళీగా ఉందంటే దాన్ని ఘోస్ట్మాల్ అంటారు. ప్రస్తుతం భారత్‌లోని 32 నగరాల్లో మొత్తం 72 మాల్స్ ఈ స్థితికి చేరుకున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ లెక్కకట్టింది. మొత్తం 365 షాపింగ్ సెంటర్స్‌లో 13.4 కోట్ల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంటే.. కోటీ యాభైఐదు లక్షల చదరపు అడుగులు (15.4 శాతం) ఖాళీగా ఉన్నట్లు ఈ సంస్థ ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2025 – వాల్యూ క్యాప్చర్: అన్లాకింగ్ పొటెన్షియల్’ పేరుతో విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.నైట్ ఫ్రాంక్ ఇండియా ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2025 – వాల్యూ క్యాప్చర్: అన్లాకింగ్ పొటెన్షియల్’ నివేదిక ప్రకారం భారతదేశంలోని రిటైల్ రంగంలో ఖాళీ స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. దేశంలోని 32 ప్రధాన నగరాల్లో ఉన్న 365 షాపింగ్ సెంటర్లలో మొత్తం 134 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో 15.4% అంటే 15.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది.మూడేళ్లుగా మాల్స్ల్లో 40% కంటే ఎక్కువ స్థలాలు ఖాళీగా ఉంటే వాటిని ఘోస్ట్ మాల్స్‌గా పరిగణిస్తారు. ఈ 74 ఘోస్ట్ మాల్స్‌లు మొత్తం రిటైల్ స్థలాల్లో 20% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇవి ప్రధానంగా టైర్-2 నగరాల్లో (ఉదా: నాగ్‌పూర్, అమృత్సర్, జలంధర్) ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా మైసూరు, వదోదర వంటి నగరాల్లో 2-6% మాత్రమే ఖాళీగా ఉన్నాయి.ఘోస్ట్ మాల్స్‌కు దారి తీస్తున్న కొన్ని కారణాలు..మాల్స్ల్లో ప్రధానంగా టెనెంట్ మిక్స్, మాల్స్ నాణ్యత ఖాళీ స్థలాలకు కారణంగా ఉంది. చాలా మాల్స్ బలమైన ఆంకర్ టెనెంట్స్ (హైపర్‌మార్కెట్స్, మల్టిప్లెక్స్‌లు వంటివి) లేకుండా ప్రారంభమవుతున్నాయి. ఆంకర్ టెనెంట్స్ కస్టమర్లను ఆకర్షించి చిన్న షాపులకు మద్దతు ఇస్తాయి. వీటి లేమి కారణంగా కస్టమర్ ఫుట్‌ఫాల్ తగ్గుతుంది.గ్రేడ్-సీ మాల్స్‌లో ఖాళీ 36% వరకు ఉంది. వీటిలో చాలా వరకు డిజైన్, లేఅవుట్‌ల్లో ఆధునిక అవసరాలకు దూరంగా ఉన్నాయి (ఉదాహరణకు, మురికిపడిన కారిడార్లు, బ్యాడ్ లైటింగ్, అన్ఫ్రెండ్లీ లేఅవుట్లు).కొన్ని నగరాల్లో (ముఖ్యంగా టైర్-2) డిమాండ్‌కు మించి అధిక స్థలాలు అందుబాటులో ఉండటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.సైట్ లొకేషన్ సెలక్షన్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్నాయి.ఆన్లైన్ షాపింగ్ఆధునిక కస్టమర్ షాపింగ్ అలవాట్లలో వచ్చిన మార్పు, ప్రత్యేకించి ఈ-కామర్స్ పెరుగుదల, మాల్స్‌కు తీవ్రమైన సవాలుగా మారింది. భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ 2023లో 883 బిలియన్ డాలర్ల నుండి 2025 నాటికి 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లు అందించే సౌకర్యాల కారణంగా కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్‌ను ఎంచుకుంటున్నారు. కొవిడ్ తర్వాత గ్లోబల్‌గా మాల్ విజిటర్లు 42% తగ్గారు. ఇది భారతదేశంలోనూ చిన్న మాల్స్‌లను తీవ్రంగా ప్రభావితం చేసింది.అద్దెలు, నిర్వహణ ఖర్చులుహై-క్వాలిటీ మాల్ స్థలాలకు డిమాండ్ పెరగడంతో అద్దెలు పెరిగాయి. పాత, తక్కువ నాణ్యత గల మాల్స్ అద్దెలు తగ్గినప్పటికీ, అవి ఆధునిక మాల్స్‌తో పోటీపడలేకపోతున్నాయి. ఫలితంగా టెనెంట్స్ వాటిని వదిలి వెళ్తున్నారు.పరిష్కారాలు.. భవిష్యత్తు అవకాశాలుఘోస్ట్ మాల్స్‌గా మారినప్పటికీ ఈ ఖాళీ స్థలాలను అవకాశాలుగా మార్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఖాళీ స్థలాలను కో-వర్కింగ్ స్పేస్‌లు, సర్వీస్ అపార్ట్మెంట్లు లేదా హెల్త్ సెంటర్లు వంటి ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. మాల్ డిజైన్, లేఅవుట్, లైటింగ్‌ను ఆధునీకరించడం ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచవచ్చు. మొత్తంగా భారతదేశంలో ఘోస్ట్ మాల్స్ సమస్య రిటైల్ రంగంలో జరుగుతున్న డిజిటల్, భౌతిక మార్పులను ప్రతిబింబిస్తోంది. సరైన వ్యూహాలు, పునరుద్ధరణ ద్వారా ఈ ఖాళీ స్థలాలను తిరిగి ఉత్పాదక ఆస్తులుగా మార్చవచ్చు.ఇదీ చదవండి: జీవిత బీమాపై అపోహలు తగ్గాలి -
ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆఫీస్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటైన ఐస్ప్రౌట్ టాటా క్యాపిటల్ నుంచి డెట్ ఫండింగ్ ద్వారా రూ.60 కోట్లు సేకరించింది. తాజా మూలధనం ప్రధాన భారతీయ మెట్రోల్లో కంపెనీ వృద్ధి వ్యూహానికి తోడ్పడుతుందని కంపెనీ చెప్పింది. ఇది ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తుందని, వేగంగా విస్తరిస్తున్న మేనేజ్డ్ ఆఫీస్ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది.మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేషన్ అనేది కార్యాలయాల సాంప్రదాయ లీజు, కో-వర్కింగ్ స్పేస్ లక్షణాలను మిళితం చేసే విధానం. ఒక కంపెనీ తరఫున థర్డ్ పార్టీ ఆపరేటర్ కార్యాలయ నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. సాంప్రదాయ లీజు మాదిరిగా ఒప్పందాలు, రోజువారీ నిర్వహణ, యుటిలిటీ బిల్లులు వంటివి ఈ మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు చూసుకుంటాయి. అద్దె, యుటిలిటీలు, ఫర్నిచర్, ఐటీ మౌలిక సదుపాయాలు, భద్రత, నిర్వహణతో సహా అన్ని సర్వీసుల కోసం ఒకేసారి ప్యాకేజీ తీసుకుంటాయి.ఈ ఆపరేటర్లు కంపెనీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వారి బ్రాండ్‌ను ప్రతిబింబించే ప్రైవేట్ కార్యాలయాన్ని అందిస్తాయి. అద్దె నుంచి మెయింటెనెన్స్ వరకు అన్నీ అందులో కవర్ అవుతాయి. ఇవి సాంప్రదాయ లీజుల కంటే తక్కువ కాలానికి (ఉదాహరణకు 6 నెలల నుంచి 2 సంవత్సరాలు) ఒప్పందాలు చేసుకోవచ్చు.భారత్‌లో అభివృద్ధిభారతదేశంలో మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేటింగ్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య రియల్ ఎస్టేట్ విభాగాలలో ఒకటి. ముఖ్యంగా 2021 నుంచి ఈ రంగం ఎంతో వృద్ధిని కనబరిచింది. కొవిడ్-19 అనంతర పరిణామాలతో కంపెనీలు హైబ్రిడ్ పని విధానాన్ని ఎక్కువగా అవలంబిస్తున్నాయి. దీనికి అనుగుణంగా సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్య పెరిగినా లేదా తగ్గినా సులభంగా సర్దుబాటు చేసుకోగలిగేలా ఫ్లెక్సిబుల్ స్పేస్‌ల కోసం చూస్తున్నాయి.గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్బహుళజాతి సంస్థలకు చెందిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) భారతదేశంలో విస్తరించడం ఈ డిమాండ్‌ను పెంచే ప్రధాన అంశం. బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి దక్షిణ భారతదేశ నగరాలు ఈ వృద్ధికి కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్టప్‌లు, మధ్య తరహా సంస్థలు భారీ ప్రారంభ పెట్టుబడులు లేకుండా స్థిరమైన నిర్వహణ ఖర్చులతో కార్యాలయాలను ప్రారంభించడానికి ఈ మోడల్‌ను ఎంచుకుంటున్నాయి.ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు -
‘తాజ్ బంజారా’ను కొనేసిన అరబిందో
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెద్ద సంచలనం.. ప్రసిద్ధ స్టార్ హోటల్ ‘తాజ్ బంజారా’ చేతులు మారింది. అరోబిందో గ్రూప్‌కి చెందిన ఆరో రియాల్టీ తాజ్ బంజారా హోటల్‌ను రూ.315 కోట్లకు అధికారికంగా కొనుగోలు చేసింది.గత అక్టోబర్ 31న పూర్తైన ఈ లావాదేవీ బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతంలో జరిగిన అత్యంత ముఖ్యమైన డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సుమారు 3.5 ఎకరాల్లో ఉన్న తాజ్ బంజారా మొత్తం విస్తీర్ణం 16,645 చదరపు గజాలు. ఇందులో బిల్ట్-అప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు. ఈ హోటల్లో మొత్తం 270పైగా గదులు ఉన్నాయి.ఐకానిక్ తాజ్ బంజారాఒకప్పుడు తాజ్ గ్రూప్‌కి చెందిన ఫ్లాగ్షిప్ లగ్జరీ హోటల్‌గా తాజ్ బంజారా ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన హోటల్‌గా నిలిచింది. అయితే గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ సమస్యలు, జీహెచ్ఎంసీ నుంచి క్లోజర్ నోటీసులు అందుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఈ కొనుగోలు తర్వాత ఆ ప్రాపర్టీ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయి.ఆరో రియాల్టీ ఏం చేస్తుందో..హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న ఆరొ రియాల్టీ, రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్-యూజ్ సెగ్మెంట్‌ల్లో నిరంతరం పెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పుడు తాజ్ బంజారా కొనుగోలు ఆ విస్తరణలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. కాగా దీంతో ఆతిథ్య రంగంలోకి ప్రవేశించి తాజ్ బంజారా హోటల్‌ను కొనసాగిస్తుందా.. లేదా కూల్చేసి హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌కు తెరతీస్తుందా అన్నది చూడాలి. -
హైదరాబాద్‌లో ఎకరా రూ.151.25 కోట్లు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’ డెవలపర్లు చారిత్రక విజయాన్ని సాధించారు. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాల్టీ కన్సార్టియం తెలంగాణలో రెండో అత్యధిక ల్యాండ్ బిడ్‌ను గెలుచుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన 3వ ఫేజ్ వేలంలో ఈ కన్సార్టియం నియోపోలిస్ ప్లాట్ 15ను దక్కించుకుంది. ఈ మేరకు 4.03 ఎకరాల కోసం డెవలపర్లు ఎకరానికి రూ.151.25 కోట్లు రికార్డు స్థాయిలో బిడ్ వేశారు.ఇది తెలంగాణలో ఇప్పటివరకు ఎకరాకు నమోదైన రెండో అత్యధిక వేలంగా నిలిచింది. రాష్ట్రంలో అత్యధిక బిడ్ అక్టోబర్ 2025లో రాయదుర్గ్‌లోని నాలెడ్జ్ సిటీలో నమోదైంది. అక్కడ భూమి ఎకరానికి రూ.177 కోట్లు పలికింది. ఈ భారీ పెట్టుబడి నియోపోలిస్‌ను హైదరాబాద్ అత్యంత ప్రతిష్టాత్మక, వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలప్మెంట్ కారిడార్‌గా సూచిస్తుంది.నియోపోలిస్‌లో కన్సార్టియం దృష్టిఈ తాజా బిడ్ నియోపోలిస్‌లో కన్సార్టియం ప్రాబల్యాన్ని బలోపేతం చేస్తుంది. ది కాస్కేడ్స్ నియోపోలిస్‌ను జూన్ 2025లో ఆవిష్కరించారు. ఇది రూ.3169 కోట్ల లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇందులో 217 మీటర్ల వరకు ఎత్తు ఉన్న ఐదు 63 అంతస్తుల టవర్లు ఉంటాయని కన్సార్టియం తెలిసింది.ఇదీ చదవండి: క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే.. -
ఇంటి కంటే స్పీడ్‌గా ఇంటీరియర్..
దేశంలో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ, ఇంటీరియర్స్‌పై చేసే ఖర్చుల పెరుగుదల వేగం మరింత అధికంగా ఉంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న ఇంటీరియర్స్ మార్కెట్, గృహ ధరల వృద్ధిని మించిన వేగంతో ముందుకు సాగుతోంది.భారతదేశ హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2024లోని రూ.1.27 లక్షల కోట్ల నుండి 2030 నాటికి ఇది రూ.2.75 లక్షల కోట్ల స్థాయిని చేరుకోనుందని మ్యాజిక్‌బ్రిక్స్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వృద్ధికి ప్రధానంగా ప్రేరణనివ్వబోతున్నవి టైర్-2 నగరాలు. ఇవి 19% వార్షిక వృద్ధితో పెరుగుతాయని, టైర్-1 నగరాల (12%) కంటే దాదాపు రెట్టింపు వేగమని అధ్యయనం చెబుతోంది.2024లో రూ.25,536 కోట్లుగా ఉన్న టైర్-2 మార్కెట్ విలువ, 2030 నాటికి దాదాపు రూ.72,500 కోట్లకు పెరగనుంది. ఇక్కడి ఇంటీరియర్ డిమాండ్‌లో 82% రీసేల్ ఇళ్ల నుంచే వస్తోంది. కొత్త తరహా మాడ్యులర్ ఫర్నిచర్, స్మార్ట్ స్టోరేజ్, ఆధునిక డిజైన్ల వైపు గృహయజమానులు మరింతగా ఆకర్షితులవుతున్నారు. టైర్-2 నగరాల్లో ఒక్క ఇంటికి సగటు ఇంటీరియర్ ఖర్చు రూ.3.9 లక్షలు, ఇది టైర్-1 సరాసరి ఖర్చులో 74 శాతానికి సమానం.మ్యాజిక్‌బ్రిక్స్ సీఎంవో ప్రసూన్ కుమార్ మాట్లాడుతూ, “టైర్-2 నగరాల్లో హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా పెరగడం భారత వినియోగదారుల అభిరుచుల్లో పెద్ద మార్పునకు సంకేతం. ఇళ్లు మరింత వ్యక్తిగతీకరణ, ఫంక్షనల్, డిజైన్ ఆధారితంగా మారుతున్నాయి” అని అన్నారు.వేగవంతమైన నగరీకరణ, పెరిగిన ఆదాయాలు, మారుతున్న జీవన శైలి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం ప్రధాన వృద్ధి కారకాలు. బెడ్రూమ్లు, లివింగ్ రూమ్‌లు ఖర్చులో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. లక్నో, జైపూర్, గోవా, కొచ్చి వంటి నగరాలు ఇంటీరియర్ డిమాండ్‌లో ముందంజలో ఉన్నాయి.జాతీయ స్థాయిలో ఫర్నిచర్, మాడ్యులర్ భాగాలు మొత్తం ఇంటీరియర్ వ్యయంలో 45 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఆన్లైన్ ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా టైర్-2 నగరాలలో వేగంగా పెరుగుతున్నాయి. -
ఇంటి విలువను పెంచే మెట్లు..
కుర్చీని మడత పెట్టినట్టుగానే ఇంటి పైకప్పునకు ఎక్కేందుకు ఉపయోగించే మెట్లు ఉంటే ఎంత బాగుంటుందో కదూ.. అవును.. ఫోల్డబుల్ స్టేర్కేస్లు మార్కెట్లోకి వచ్చేశాయి. తక్కువ స్థలంలో, అందంగా ఇమిడిపోవడం వీటి ప్రత్యేకత. తక్కువ స్థలం ఉన్న ఇళ్లకు, బాల్కనీలోకి వెళ్లేందుకు, చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్లకు ఈ మడత పెట్టే మెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.మడతపెట్టే మెట్లు సురక్షితంగానే ఉంటాయి కానీ వీటిని సరిగ్గా బిగించాలి.. లేకపోతే ప్రమాదకరం. ఈ మెట్ల మీదుగా ఎక్కేటప్పుడు ఇరువైపులా హ్యాండ్ రెయిల్స్, యాంటీ స్లిప్ రింగ్‌లు వంటివి ఉండేలా చూసుకోవాలి. లేకపోతే పిల్లలు, వృద్ధులు కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది.ఇంటి విలువను పెంచే మెట్లు.. నిరంతరం, రోజువారి అవసరాలకు వినియోగించే మెట్ల స్థానంలో ఈ మడతపెట్టే మెట్లు అంత శ్రేయస్కరం కాదు. స్టోర్ రూమ్‌లు, చిన్న స్థలం ఉండే ఇళ్లు, బాల్కనీలోకి ఎక్కేందుకు, అప్పుడప్పుడు వినియోగించే ప్రాంతాలలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి విలువను పెంచడంలో మెట్లు కూడా భాగస్వామ్యమే. కాబట్టి చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్ ఇళ్లలో ఈ మడత పెట్టే మెట్లను వినియోగించేటప్పుడు ఇంటీరియర్, రంగులకు అనుగుణంగా ఈ మెట్లను ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ఇంటి అందం దెబ్బతింటుంది.నాణ్యమైన కలప లేదా అల్యూమీనియంతో ఈ మడతపెట్టే మెట్లను తయారు చేస్తారు. పిల్లల గది, చిన్న హాల్లో, ఇరుకైన స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి నిచ్చెనలు పాదాల కింద స్థిరంగా ఉండవు కాబట్టి బరువైన వస్తువులను మోసుకెళ్తూ ఈ మెట్లను ఎక్కకూడదు. సంప్రదాయ మెట్లతో పోలిస్తే ఇవి చౌక ధరల్లోనే లభిస్తాయి. -
ఇంటి కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ..
పిల్లలు లొట్టలేసుకొని తినే వంటకాలను రెడీ చేస్తుంది.. అత్తామామలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని వడ్డిస్తుంది.. శ్రీవారిని పసందైన వంటలతో కట్టిపడేస్తుంది.. ..స్మార్ట్ ఇల్లాలి రహస్యం కాదండీ ఇదీ. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్–ఏఐ) వంటగది మహత్యం. అవును.. స్మార్ట్ కస్టమర్ల అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా కిచెన్స్ కూడా ఏఐ అవతారమెత్తాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలలో డెవలపర్లు ఈ స్మార్ట్ వంటగదులనే అందిస్తున్నారు. మెట్రో నగరాలలో ఏఐ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. వంట గది అమ్మకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ అవసరమైన, ఆరోగ్యకరమైన ప్రాంతంగా మారిపోయింది. వినియోగదారుల ఆరోగ్య డేటా, వెల్నెస్ లక్ష్యాలను క్రోడీకరించి ఆహార పరిమితులను విశ్లేషించి భోజన ప్రణాళికలను రూపొందించడమే ఈ ఏఐ కిచెన్స్ ప్రత్యేకత. వినియోగదారుల ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా పోషకాహారాలు, వంటకాలను కూడా సూచిస్తుంది.వంటలో సహాయం.. కృత్రిమ మేధ సాంకేతికతతో కూరగాయల్ని కోయడం, వాటిని వంట పాత్రలో వేయడం, గరిటె తిప్పడం, మంట, వేడి ఉష్ణోగ్రతలను నియంత్రించడం వంటి పనులను ఏఐ ఉపకరణాలు చేస్తాయి. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాల గడువు తేదీలను గుర్తించి, ముందుగానే హెచ్చరించడం, వ్యర్థాలను తగ్గించడం, సమయాన్ని ఆదా చేస్తుంది కూడా.. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య సముదాయాలలో ప్రొఫెషనల్ కిచెన్‌లో హెడ్ చెఫ్‌కు రోజువారీ కార్యకలాపాలలో సహాయం చేసే ‘సౌస్ చెఫ్’ సిబ్బంది మాదిరిగా.. ఏఐ కూడా వంట గదిలో మనకు సహాయపడుతుంది. ప్రోగ్రామ్ చేసిన వంటకాలు లేదా వినియోగదారుల ఇన్పుట్ ఆధారంగా కూరగాయలు కత్తిరించడం, వేయించడం, తిప్పడం, ముద్దగా పిసుకుతూ కలపడం వంటి పనులు చేస్తాయి. అలాగే కొందరు కుటుంబ వంటకాలను అనుకరిస్తుంది కూడా.ఆహార వ్యర్థాల తగ్గుదల.. స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు: ఏఐ ఆధారిత రిఫ్రిజిరేటర్లు అందులోని ఆహార పదార్థాల గడువు తేదీలను ట్రాక్ చేస్తుంది. అందుబాటులో ఉన్న పదార్థాల ఆధారంగా వంటకాలను సూచిస్తుంది. ఆహార వ్యర్థాలు, శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏఐ ఆధారిత ఓవెన్లు, ఇండక్షన్ కుక్‌టాప్‌లలో ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేయడానికి సెన్సార్లు ఉంటాయి. దీంతో వంటకాలు మాడిపోకుండా, తక్కువ ఉడకకుండా ఉంటుంది. సవాళ్లున్నాయ్.. ఏఐ కిచెన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఈ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. స్మార్ట్ ఉపకరణాల ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు వినియోగదారుల డేటా గోప్యత, భద్రతలపై ఆందోళనలు ఉన్నాయి. కంపెనీలు బలమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను రూపొందించడంతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు డేటా నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో ఏఐ ఉపకరణాలు.. వంట గదిలో ఆటోమేటెడ్ కుకింగ్ అసిస్టెంట్లు, స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు, ఎయిర్ ఫ్రైయర్లు వంటి వంట ఉపకరణాల ఏఐతో పనిచేస్తాయి. ఇవి అలెక్సా, సిరి, గూగుల్ హోమ్ వంటి వాయిస్ అసిస్టెంట్లతో అనుసంధానమై ఉంటాయి. సమయం, లైటింగ్‌లను సర్దుబాటు చేస్తూ శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వంట గది వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. శామ్సంగ్, ఎల్జీ, జీఈ వంటి కంపెనీలకు చెందిన వాయిస్ బేస్డ్, విజువల్ గైడ్లు ఏఐ కిచెన్ ఉపకరణాలను విస్తృత శ్రేణి వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి. -
లగ్జరీ హౌసింగ్ మార్కెట్ రయ్.. రయ్..
భారత లగ్జరీ మార్కెట్ గతేడాది 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి 103 బిలియన్ డాలర్లకు చేరుతుందని మ్యాజిక్ బ్రిక్స్ అంచనా వేసింది. ప్రీమియం వ్యయాలకు కస్టమర్లు ఏమాత్రం వెనుకడుగు వేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భారత లగ్జరీ హౌసింగ్ మార్కెట్ పరిపక్వత దశకు చేరుకుందని, సంప్రదాయ మెట్రో కేంద్రాల నుంచి కొత్త భౌగోళిక ప్రాంతాలు, శివార్లకు లగ్జరీ గృహ విపణి విస్తరిస్తుందని పేర్కొంది.ప్రధాన నగరాల్లో లగ్జరీ ప్రైజ్ ఇండెక్స్(ఎల్పీఐ) 2021లో 2.32గా ఉండగా.. 2025 నాటికి 2.27కి తగ్గింది. ఇదే కాలంలో కొత్త ప్రాంతాలు, శివార్లలో ఎల్పీఐ 1.00 నుంచి 1.44కి పెరగడమే దీనికి సూచన అని వివరించింది. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, టౌన్‌షిప్‌ల అభివృద్ధితో శివార్లలో లగ్జరీ గృహాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. మధ్యస్థ లగ్జరీ గృహాల ధరలు ముంబైలో అత్యధికంగా రూ.9.66 కోట్లుగా ఉండగా.. గుర్గావ్లో రూ.5.46 కోట్లు, బెంగళూరులో రూ.2.91 కోట్లు, హైదరాబాద్‌లో రూ.2.20 కోట్లు, చెన్నైలో రూ.2 కోట్లు, పుణెలో రూ.1.97 కోట్లు, కోల్‌కతాలో రూ.1.50 కోట్లుగా ఉన్నాయి. లగ్జరీ యూనిట్లకు ఆసక్తి.. 2021 నుంచి దేశంలో లగ్జరీ హౌసింగ్ గణనీయంగా విస్తరిస్తోంది. డెవలపర్లు పెద్ద లేఅవుట్లు, ప్రీమియం వసతులు, ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్ సౌకర్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో లగ్జరీ గృహాల సరఫరా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం ఇళ్ల సప్లయిలో లగ్జరీ యూనిట్ల వాటా 27 శాతంగా ఉంది. 2021లో ఈ విభాగం వాటా 16 శాతంగా ఉండేది. అద్భుతమైన డిజైన్, సౌలభ్యం, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు 14 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. -
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అఫర్డబుల్ జోన్..
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల.. ఎకరం రూ.100 కోట్లు పలుకుతున్న హైదరాబాద్‌లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల సాకారం కావాలంటే ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్ హౌసింగ్(చౌక ధరల ఇళ్లు) తగ్గుముఖం పట్టాయి.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నగరానికి దక్షిణ భాగంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫోర్త్ సిటీలో అఫర్డబుల్ హౌసింగ్‌కు కూడా ప్రత్యేకంగా జోన్ కేటాయించాలని డెవలపర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సంస్థలకు, క్రీడలకు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకు ఎలాగైతే ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తున్నారో.. చౌక గృహాల నిర్మాణాలకు కూడా స్థలాలను కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందనేది నిపుణుల అభిప్రాయం.ఆకాశాన్నంటిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు కొనలేని విధంగా తయారైంది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ ఏర్పడింది. డబ్బు ఉండి, ఇల్లు ఉన్నవారు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. వేతనజీవులు తమ సంపాదనలో 40–45 శాతం అద్దెలకే చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ములో ఇల్లు, సంసారం గడపడం గగనమైపోయింది. మార్కెట్లో గృహ యజమానులు ఎక్కువ, అద్దెదారులు తక్కువగా ఉంటేనే సమత్యులత. లేకపోతే అద్దెలు విపరీతంగా పెరిగి, జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ని తీసుకురావడం అత్యవసరం.రీ–డెవలప్మెంట్ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్‌లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపులతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. అయితే ఈ తగ్గింపులతో ప్రభుత్వానికి ప్రత్యక్ష రాబడి తగ్గినా.. నిర్మాణ సామగ్రి కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరగడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి వాటితో పరోక్షంగా అంతకు రెట్టింపు ఆదాయమే సమకూరుతుంది.ఫ్యూచర్ సిటీలో అఫర్డబుల్ జోన్.. కో–ఆపరేటివ్ సొసైటీ, ఎంప్లాయిస్ యూనియన్లుగా ముందుకు రావాలి. భారత్ ఫ్యూచర్ సిటీలో సామాన్య, మధ్యతరగతికి స్థలాలను కేటాయించాలి. కమ్యూనిటీ లివింగ్‌కు ప్రత్యేకంగా జోన్ కేటాయించాలి. ప్రభుత్వ భూములను మ్యాపింగ్ చేసి, అఫర్డబుల్ హౌసింగ్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక అవసరాలను కల్పిస్తే చాలు.. అందుబాటు ధరల్లో డెవలపర్లకు భూములను అందిస్తే అఫర్డబుల్ హౌసింగ్‌లను నిర్మించే వీలుంటుంది. పెరీ అర్బన్ ఏరియాలో భూమారి్పడి, కన్వర్షన్ల ప్రక్రియను సులభతరం చేయాలి. అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ, తొలిసారి ఇల్లు కొనుక్కునేవారికి స్టాంప్ డ్యూటీలో రాయితీ అందించాలి. అఫర్డబుల్ ప్రాజెక్ట్‌లను నిర్మించే డెవలపర్లకు పన్ను రాయితీలను అందజేయాలి.నిర్మాణ అనుమతుల్లో వేగం.. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటిస్తూ.. ప్రీ–ప్యాబ్, త్రీడీ ప్రింటింగ్, మాడ్యులర్ టెక్నాలజీలతో ఇళ్లను నిర్మిస్తే త్వరితగతిన పూర్తవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్లేస్కూళ్లు, పార్క్‌లు, కమ్యూనిటీ స్పేస్‌లు వంటి సదుపాయాలను అందించాలి. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే మున్సిపల్, ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్.. ఇలా 15 విభాగాలు, 170 డెస్క్‌ల ద్వారా వెళ్లాలి. ఇదే అనుమతుల జారీలో జాప్యానికి ప్రధాన కారణం.అలాకాకుండా అన్ని కీలక విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో 45 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లకు స్టాంప్ డ్యూటీని, మహిళా కస్టమర్లకు ప్రత్యేక రిబేట్‌ను అందించాలి. క్లబ్‌హౌస్, ఎస్టీపీ, డబ్ల్యూటీపీ, లిఫ్ట్‌లు వంటివి కూడా నివాస జీవనంలో భాగమే. అందుకే వీటికి వాణిజ్య విద్యుత్ సుంకాల భారం నుంచి మినహాయించాలి. -
చిన్న ఇళ్లు చవకైపోయాయ్..!!
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూ.. విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. విశాలమైన స్థలం, ఆధునిక వసతులు, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్లకు ఆదరణ వృద్ధి చెందుతోంది.2022 నుంచి 2025 మధ్యకాలంలో లగ్జరీ ఇళ్ల ధరలు 40 శాతం మేర పెరగగా.. చౌక గృహాల రేట్లు 26 శాతం మేర క్షీణించాయి. 2022లో రూ.40 లక్షలోపు ధర ఉండే అఫర్డబుల్ ఇళ్ల ధరలు చ.అ.కు రూ.4,229గా ఉండగా.. 2025 నాటికి 26 శాతం వృద్ధి రేటుతో రూ.5,299లకు చేరింది.అదే రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే మిడ్ ప్రీమియం గృహాల ధరలు 2022లో చ.అ.కు రూ.6,880గా ఉండగా.. ఇప్పుడది 39 శాతం వృద్ధి రేటుతో రూ.9,537కు పెరిగింది. ఇక, రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ యూనిట్ల ధర 2022లో చ.అ.కు రూ.14,530లుగా పలకగా.. ఇప్పుడది 40 శాతం వృద్ధి రేటుతో రూ.20,300లకు ఎగబాకింది. -
ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..
దేశంలో అద్దె గృహాల విభాగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచడం, యజమానులు-అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడం లక్ష్యంగా మార్పులు ప్రతిపాదించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్ (MTA) 2025’ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించారు.ఈ ఎంటీఏ 2025 అనేది చట్టబద్ధమైన కేంద్ర చట్టం కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రస్తుత అద్దె నియంత్రణ చట్టాలను సవరించడానికి లేదా కొత్త చట్టాలను రూపొందించడానికి ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. భూమి, ఆస్తి, అద్దె వ్యవహారాలు రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా (ఎంట్రీ 18) పరిధిలోకి వస్తాయి కాబట్టి, రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా మాత్రమే ఈ మార్గదర్శకాలు చట్ట రూపం దాలుస్తాయని గుర్తుంచుకోవాలి.మార్గదర్శకాల్లోని వివరాలునివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాలను సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్‌తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా సాధారణ స్టాంప్ పేపర్ ఒప్పందాలు మాత్రమే ఉండేవి. దీనివల్ల మోసాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. దీన్ని కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది.ఒప్పందాన్ని నమోదు చేయడంలో విఫలమైతే భూస్వామికి రూ.5,000 వరకు జరిమానా విధించే వీలుంది.ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారులు 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్‌గా చెల్లించాల్సిన భారం ఉంది. ఎంటీఏ 2025 ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్‌పై కచ్చితమైన పరిమితిని విధించింది.నివాస గృహాలకు గరిష్ఠంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవచ్చు.వాణిజ్య ఆస్తులకు గరిష్ఠంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది.ఆకస్మికంగా లేదా అతిగా అద్దె పెంచే విధానానికి కొత్త చట్టం అడ్డుకట్ట వేస్తుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు తప్పనిసరిగా ఇవ్వాలి.రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారునైనా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం.ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు లాకౌట్ (తాళం వేయడం), విద్యుత్/నీటి సరఫరాను నిలిపివేయడం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హమైన నేరాలు.అవసరమైన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయించుకునే వెసులుబాటు ఉంది.అద్దెదారులు తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.రాష్ట్రాల స్పందన, అమలుపై అంచనాలు..కేంద్రం రాష్ట్రాలను తమ డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసుకోవాలని కోరింది. ఇప్పటివరకు ఒడిషా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, త్రిపుర వంటి 10కి పైగా రాష్ట్రాలు ఇప్పటికే ఎంటీఏ మార్గదర్శకాల ఆధారంగా తమ అద్దె చట్టాలను సవరించాయి. అందులో కొన్ని కొత్త చట్టాలను రూపొందించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా 2026 నాటికి ఈ కొత్త నియమాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ -
ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశంలోని 15 ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 4% పెరిగి రూ.37,409 కోట్లకు చేరినట్లు స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. వార్షిక ప్రాతిపదికన గృహ విక్రయాల సంఖ్య (వాల్యూమ్స్ పరంగా) 4% తగ్గి 39,201 యూనిట్లకు పరిమితమైనట్లు నివేదిక పేర్కొంది. ఇక కొత్తగా మార్కెట్లోకి వచి్చన హౌసింగ్ యూనిట్ల సంఖ్య(కొత్త సప్లై) 10% క్షీణించి 28,721కు దిగివచి్చంది. ⇒ అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదర, జైపూర్, నాసిక్, నాగ్‌పూర్, మొహాలి, భువనేశ్వర్, లక్నో, భూపాల్, కొయంబత్తూర్, గోవా త్రివేండ్రం, కొచి్చ.... ఈ 15 నగరాల్లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్ అహ్మదాబాద్‌లో వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు 6% తగ్గి 13,021 యూనిట్లకు పరిమితమయ్యాయి. సూరత్‌లో విక్రయాలు 8% క్షీణించి 4,936 యూనిట్లకు దిగివచ్చాయి. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ, అమ్మకాల్లో 60% గుజరాత్‌లోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదరల్లో నమోదయ్యాయి. ⇒ భారత ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన శక్తి కేంద్రాలుగా టైర్–2 నగరాలు ఎదుగుతున్నాయని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్, సీఈఓ సమీర్ జసుజా తెలిపారు. ఉద్యోగ అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంతాల మధ్య మెరుగుతున్న అనుసంధానం(కనెక్టివిటీ) అంశాలు రియల్ ఎస్టేట్ విభాగాల్లో డిమాండ్‌ను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ⇒ సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త గృహ ప్రాజెక్టుల లాంచింగ్ క్షీణించడమనేది మందగమనానికి సంకేతంగా కాకుండా, రియల్ ఎస్టేట్ డెవలపర్లు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు కీర్తి చిలుకూరి తెలిపారు. -
గృహ రుణానికి ముందే గుడ్‌బై
ఇల్లు, కారు, బైక్, ఫర్నీచర్... ఇలా ఏదైనా కానీండి. చాలామందికి బడ్జెట్‌తో పోరాటం తప్పనిసరి. చేతిలో ఉన్న సొమ్ముకు... కావాలనుకుంటున్న వస్తువుకు తేడా ఉంటూనే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ పెట్టి కావాలనుకుంటున్న వస్తువు సొంతం చేసుకుంటారు. కొందరు ఉన్నదానికి తగ్గదే కొనుక్కుని సర్దుకుపోతారు. మరికొందరైతే ఇటు సర్దుకుపోలేక... అటు కావాలనుకున్నది కొనలేక తరువాత చూద్దామని వాయిదా వేసుకుంటుంటారు. కానీ... ‘తరువాత’ అనేది రావటం కష్టం. ఎందుకంటే మనం అప్‌గ్రేడ్ అయ్యేసరికి మన కోరిక, లేకపోతే ఆ వస్తువు ధర కూడా అప్‌గ్రేడ్ అవుతాయి కదా? ఇదంతా ఎందుకంటే... ఆ మొదటి కేటగిరీ గురించి. ఇంకాస్త ఎక్కువపెట్టి ముందుకెళ్లే వారి గురించి. వారు మొదట్లో కొంత ఇబ్బంది పడినా... తాను అనుకున్నది చేశామనే సంతృప్తి ఉంటుంది కదా! అది ఆర్థికంగానూ లాభాన్నే ఇస్తుంది. గృహ రుణం చెల్లింపుల్లో అలా ఇంకాస్త ఎక్కువ పెట్టే వారి గురించే ఈ ప్రత్యేక కథనం...ప్రతి ఒక్కరికీ సొంతిల్లు కలే. ఒకప్పుడు రిటైర్మెంట్ తరువాతే సొంతిల్లు. ఈజీ రుణాల కారణంగా... ఈ తరం మాత్రం ఉద్యోగంలో చేరిన మొదట్లోనే సొంతింటికి ఓటేస్తున్నారు. 20–30 ఏళ్ల పాటు రుణ చెల్లింపులకు గడువు పెట్టుకున్నా... వీలైనంత త్వరగా తీర్చేయడానికి కష్టపడుతున్నారు. మరి మీకు తెలుసా ఒక 5వేల రూపాయలు ఎంత మ్యాజిక్ చేస్తుందో? నెలనెలా చెల్లించే ఈఎంఐకి అదనంగా రూ.5వేలు గనక చెల్లిస్తే... 20 ఏళ్లలో ఏకంగా రూ.11.5 లక్షల వడ్డీ ఆదా అవుతుంది. పైపెచ్చు ఈఎంఐలు చెల్లించాల్సిన కాలమూ తగ్గుతుంది. అదెలాగంటే...రూ.5,000 చేసే మ్యాజిక్ ఇదీ...ఉదాహరణకు శ్రీకర్ రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నాడు. 20 ఏళ్ల కాలానికి నెలకు రూ.40వేలు ఈఎంఐ చెల్లించడానికి ముందే మానసికంగా సిద్ధపడ్డాడు. కానీ మరో రూ.5వేలు అదనంగా చెల్లిస్తే..? ఏం జరుగుతుందో చూద్దాం... → శ్రీకర్ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతం. ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ,.43,500 → 20 ఏళ్లలో రూ.50 లక్షల అసలుతో పాటు మరో రూ.54 లక్షలు వడ్డీ కింద చెల్లించాలి. → కానీ ప్రతినెలా రూ.43,500 కాకుండా దానికి రూ.5వేలు జోడించి రూ.48,500 చెల్లిస్తే.... → 20 ఏళ్ల రుణం కాస్తా 16 ఏళ్ల 6 నెలల్లో తీరిపోతుంది. వడ్డీ రూపంలో ఏకంగా రూ.11.5 లక్షలు ఆదా అవుతుంది. → ఒకవేళ రూ.10,000 అదనంగా (రూ.53,500 చొప్పున) చెల్లిస్తే... రుణం 13 ఏళ్లకే తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.20 లక్షలు మిగులుతుంది. → ఇలా స్మార్ట్ చెల్లింపులతో 20 ఏళ్ల రుణ బంధాన్ని 12–13 ఏళ్లకే తీర్చుకోవచ్చు.ఒకే విడతా లేక నెలవారీనా..?→ వేతన జీవులు ప్రతి నెలా ఈఎంఐకి కొంత అదనంగా చెల్లిస్తూ వెళ్లడమే మంచి మార్గం → దీనివల్ల ప్రతి నెలా అసలు కాస్త తగ్గుతూ వెళుతుంది. ఈ అదనపు చెల్లింపుల వల్ల ఇతర ఖర్చులపైనా నియంత్రణ వస్తుంది → బోనస్ లాంటివి వచి్చనపుడు ఆ మొత్తాన్ని గృహ రుణం ముందస్తు చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. → అయితే ఎక్కువ మొత్తం ఒకేసారి చెల్లిస్తున్నపుడు... గృహ రుణం వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ వచ్చే మార్గాలేవైనా ఉన్నాయేమో చూడాలి. → అలాంటి మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని పరిశీలించాకే గృహ రుణం సంగతి చూడాలి. ఎందుకంటే గృహరుణాలపై వడ్డీ తక్కువ.అంత ఆదా సాధ్యమా?→ గృహ రుణంపై బ్యాంకులు ప్రతి నెలా చివర్లో మిగిలే నికర బకాయిపైనే వడ్డీ విధిస్తాయి. → ప్రతి నెలా చెల్లించే అదనపు మొత్తం నేరుగా అసలులో జమవుతుంది. తదుపరి నెలలో ఆ మేరకు అసలుపై వడ్డీ మిగులుతుంది. → ఈఎంఐకి అదనంగా ఇలా ఎంత అదనంగా చెల్లిస్తారో... అంత మేర వడ్డీ భారాన్ని, కాల వ్యవధిని తగ్గించుకోవచ్చు. → రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలో వీలైనంత అదనంగా చెల్లిస్తే... వడ్డీ– కాలవ్యవధిని అంత గణనీయంగా తగ్గుతాయి. → ఒకవేళ బ్యాంక్ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్ ఇస్తే.. అంగీకరించొద్దు. ఫ్లోటింగ్ – ఫిక్స్డ్ రేటు రుణం→ ఫ్లోటింగ్ రేటుపై తీసుకున్న గృహ రుణం అయితే ముందస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ పడదు. → ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకున్న వారు ముందుగా చేసే చెల్లింపులపై 1– 3 శాతం మేర పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. → ప్రస్తుతం బ్యాంక్‌లు/ ఎన్బీఎఫ్సీలు ఫ్లోటింగ్ రేటునే అనుసరిస్తున్నాయి. ఫిక్స్డ్ రేటుపై, పెనాల్టీ లేని ముందస్తు చెల్లింపులకు అవకాశం ఉంటే దాన్ని పరిశీలించొచ్చు. → ఒకవేళ బ్యాంక్ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్ ఇస్తే.. అంగీకరించొద్దు. -
కోట్లు గుమ్మరించి 10 ఆఫీసులు కొన్న హృతిక్ రోషన్
సెలబ్రిటీలు తమకు ఇష్టమైన కార్లు, బైకులు కొనుగోలు చేయడంతో పాటు.. రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో భాగంగానే.. నటుడు హృతిక్ రోషన్.. అతని తల్లిదండ్రులు రాకేష్ రోషన్ & ప్రమీలా రోషన్లతో కలిసి అంధేరీ వెస్ట్‌లో 10 ఆఫీస్ యూనిట్లను రూ.28 కోట్లకు కొనుగోలు చేశారు.హృతిక్ రోషన్.. యురా బిజినెస్ పార్క్ 3వ, 4వ అంతస్తులలో ఉన్న 10 ఆఫీస్ యూనిట్లను రెండు కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. వీటిని హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ, ఫిల్మ్‌కుంజ్ (బాంబే) ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.మొత్తం 10 ఆఫీసులలో.. ఐదు ఆఫీసులను హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ కొనుగోలు చేసినట్లు, ఫిల్మ్‌కుంజ్ (బాంబే) ప్రైవేట్ లిమిటెడ్ మిగిలిన ఐదు ఆఫీసులను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన లావాదేవీలు 2025 నవంబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది.మొత్తం ఆఫీస్ స్థలం 6968 చదరపు అడుగులు. ఒక్కో యూనిట్ పరిమాణం 769 చదరపు అడుగుల నుంచి 852 చదరపు అడుగుల వరకు ఉంటుంది. విక్రేత పేరు యురా బిజినెస్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (పెకాన్ అండ్ ట్రాన్స్‌కాన్ గ్రూప్) అని తెలుస్తోంది..హృతిక్ రోషన్ కుటుంబం.. నవంబర్ 19, 2025న అంధేరీలో రూ.19.68 కోట్ల విలువైన ఐదు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ డాక్యుమెంట్స్ ప్రకారం, వీటిని వైద్య స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశారు. ఆ తరువాత నవంబర్ 24 హృతిక్ సోదరి సునైనా రోషన్ కూడా అంధేరీ ఈస్ట్‌లో రెండు ఆఫీస్ యూనిట్లను రూ. 6.42 కోట్లకు కొనుగోలు చేసింది. -
ఇల్లే ప్రపంచం.. అందుకే వీటికి డిమాండ్!
కరోనా కంటే ముందు ఇల్లు అంటే నాలుగు గోడల భవనం. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేద తీరాలనుకునే గూడు. కానీ, కరోనా తర్వాత నుంచి ఇల్లే ప్రపంచమైపోయింది. తినడం, పడుకోవటం మాత్రమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ.. ఇంటి నుంచే ఫలితంగా కోవిడ్ కంటే ముందు హాట్ కేకుల్లాంటి స్టూడియో అపార్ట్మెంట్లకు.. క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంలో విస్తీర్ణమైన గృహాలకు గిరాకీ పెరిగింది.బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటాని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. 2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్మెంట్ల ట్రెండ్ క్రమంగా పెరుగుతూ వచ్చాయి.2013లో 7 ప్రధాన నగరాలలో 2,102 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లున్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్‌లు లాంచింగ్ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లే..లొకేషన్ ముఖ్యం..స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచ్లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాలు చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణే నగరాలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ నడుస్తోంది. -
ప్రపంచ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్!
బ్రాండ్ హైదరాబాద్‌కు పునాదులు బలంగా పడుతున్నాయి. ప్రపంచ నగరాలతో పోటీపడుతున్న విశ్వనగరికి రాచబాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) వెలుపల ఔటర్ రింగ్ రోడ్ వరకూ, దాని ఆనుకొని ఉన్న 27 పురపాలికలను విలీనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు దాదాపు 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ.. దాదాపు 2 వేల చ.కి.మీ. మేర పెరగనుంది. కార్పొరేషన్ విస్తీర్ణం పెరుగుదలతో ఏకీకృత పాలన, నగరం నలువైపులా సమాంతర అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనాణ్యమైన సేవలు.. శివారు మున్సిపాలిటీల విలీనంతో ప్రణాళికాబద్ధమైన మెట్రోపాలిటన్ విస్తరిస్తుంది. హైదరాబాద్ మెగా పొలిస్ ఇమేజ్ ఏర్పడుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, ఏకీకృత పాలనకు అవకాశం ఉంటుంది. వ్యూహాత్మక అమలు, బలమైన ఆర్థిక ప్రణాళిక, సమర్థవంతమైన పాలనతో సమాన వనరుల కేటాయింపు, నాణ్యమైన, వేగవంతమైన మున్సిపల్ సేవలను అందుకోవచ్చు. రోడ్లు, వీధి దీపాలు, మురుగు నీటి వ్యవస్థలు, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాలలో పౌర సేవల, నాణ్యమైన సేవలు అందుతాయి. వేగవంతమైన అనుమతులు, ప్రాజెక్ట్‌ల అమలుకు వీలు కలుగుతుంది.ఏకీకృత నగర ప్రణాళిక..రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్ నీటి వనరుల పరిరక్షణ, ప్రజా రవాణా వంటి అంశాలలో సమగ్ర ప్రణాళిక చేయడం సులభమవుతుంది. భవన అనుమతులు, జోనింగ్ రూల్స్ వంటి విషయాల్లో స్పష్టమైన, సమర్థవంతంగా అమలవుతాయి. శివార్లలో కూడా విస్తృత రహదారులు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, పార్క్‌లు, చెత్త నిర్వహణ వంటి సౌకర్యాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, మొబలిటీ కారిడార్లు వంటి ప్రాజెక్ట్‌లు సులభంగా అమలవుతాయి. పురపాలక సంఘాల మధ్య ఉండే అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం తగ్గుతుంది. మెగా జీహెచ్ఎంసీతో కేంద్రం నిధులు, ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు పొందడం సులభమవుతుంది. జీహెచ్ఎంసీ పరిధి విస్తరించడంతో భూముల విలువ పెరుగుతుంది. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, డెవలపర్లు, పెట్టుబడులకు ముందుకు వస్తారు.ట్రాఫిక్ నిర్వహణ..మెగా నగరంలో ప్రజా రవాణాకు భారీ పునరుర్ధరణ అవసరం. అలాగే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌ను సమీక్షించాలి. ట్రాఫిక్ నిర్వహణ అతిపెద్ద సవాలు. ట్రాఫిక్ పరిపాలన, ప్రణాళికలో భారీ సంస్కరణలు అవసరం. మెట్రో, ఎంఎంటీఎస్‌తో లాస్ట్ మైల్ కనెక్టివిటీని వేగవంతం చేయాలి. విచి్ఛన్నమైన అభివృద్ధిని నివారిస్తుంది. మెట్రో ప్రాంతమంతటా స్థిరమైన పట్టణ ప్రమాణాలను సృష్టిస్తుంది. రోడ్లు, డ్రైనేజ్, నీటి సరఫరా, రవాణా వంటి జోనింగ్ కోసం సమగ్ర మాస్టర్ ప్లానింగ్‌కు అవసరం.సిబ్బంది సవాలే..జీహెచ్ఎంసీ ఇప్పటికే సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది. పరిమిత సిబ్బందితో మెగా మెట్రోకు పౌర సేవలను అందించడం అతిపెద్ద సవాలు. సిబ్బందిని, వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయకపోతే మున్సిపాలి టీల విలీనం వ్యర్థమే. కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు తక్కువగా ఉంటాయి. ఆయా మున్సిపాలిటీలను అప్‌గ్రేడ్ చేయాలంటే జీహెచ్ఎంసీ బడ్జెట్ కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న మున్సిపాలిటీలలో తక్కువ పన్నులు, జీహెచ్ఎంసీ రేట్లకు పెరగడంతో గృహ యజమానులకు అదనపు భారం పడుతుంది.విలీనమైన మున్సిపాలిటీలివీ.. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్ రంగారెడ్డి జిల్లా: బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మణికొండ, ఆదిబట్ల, తుక్కుగూడ. సంగారెడ్డి జిల్లా: బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్. -
హాస్టల్, కో-లివింగ్ మధ్య తేడాలివే!
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులు, ఉద్యోగులు, ప్రవాసులు ఎవరైనా సరే వేరే నగరానికి వెళ్తే ముందుగా వెతికేది, ఉండేందుకు మంచి వసతి ఎక్కడుందనే! అందుబాటు ధరల్లో ఎక్కడ దొరకుతాయని ఎంత మంది వెతుకుతారో.. అంతకు రెట్టింపు జనాలు అద్దె కాస్త ఎక్కువైనా పర్వాలేదు అంతర్జాతీయ వసతులతో కూడిన అపార్ట్మెంట్ల కోసం శోధిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే డెవలపర్లు కో–లివింగ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు.హాస్టల్స్ – కో లివింగ్ మధ్య తేడా ఏంటంటే..సాధారణంగా మనం చూసే హాస్టల్స్‌లో ఒకే రూమ్‌లు రెండు, మూడు బెడ్స్‌ను వేసి వాటిని అద్దెకు ఇస్తుంటారు. భోజన ఏర్పాట్లు హాస్టల్స్ నిర్వాహకులే చూసుకుంటారు. ఒకవేళ భార్య భర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఒకటే హాస్టల్లో ఉండటం కుదరదు. మగవాళ్లకు, ఆడ వాళ్లకు వేర్వేరుగా వసతి గృహాలుంటాయి. అదే కో లివింగ్‌లో అయితే ఎవరైనా ఉండొచ్చు. సాధారణ హాస్టల్స్ మాదిరిగానే కో లివింగ్‌లో కూడా బెడ్‌కు ఇంతని ధర ఉంటుంది. గంట, రోజులు, నెల, సంవత్సరాల వారీగా గదులను అద్దెకు తీసుకోవచ్చు. నేటి యువతరం జీవన శైలికి అవసరమైన అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. కాబట్టి వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి.సాధారణ ప్రజలూ వినియోగం..కో లివింగ్ ప్రాజెక్ట్‌లలో స్విమ్మింగ్ పూల్, జిమ్, రెస్టారెంట్లు, బార్, సెలూన్, స్పా, యాంపి థియేటర్ వంటి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తారు. ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా 24 గంటలు హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత, రక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు, సాంకేతిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.విశాలమైన పార్కింగ్, అందులో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు ఉంటాయి. 24 గంటలు వైద్య సదుపాయాలు, ఫార్మసీ అందుబాటులో ఉంటాయి. ప్రతీరోజూ కల్చరల్, మోటివేషన్ కార్యక్రమాలుంటాయి. వారాంతాల్లో నైట్ బజార్, ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటాయి. వీటిని కోలివింగ్ నివాసితులతో పాటు సాధారణ ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు. -
ఫ్లెక్సిబుల్ ఆఫీస్‌లకు డిమాండ్: కారణం ఇదే!
దేశంలో ఆఫీసు స్పేస్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 8 ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్ స్టాక్ 100 కోట్ల చ.అ.లను దాటింది. ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన ఇండియా.. నేడు గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లకు ప్రధాన కేంద్రంగా మారింది.ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు, తక్కువ జీవన వ్యయం, అందుబాటులో స్థిరాస్తి ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు కారణంగా బహుళ జాతి సంస్థలు జీసీసీల ఏర్పాటుకు ఇండియాను ఎంచుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్)విస్తరణ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), ఫ్లెక్సిబుల్ ఆఫీస్‌లకు ప్రాధాన్యత పెరుగుతుండటమే ఈ డిమాండ్‌కు కారణం.కాస్త తడబడి..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సప్లయి చెయిన్‌లో నష్టాలు, ఇంధన వ్యయాలు, మూలధన ప్రవాహాలను ప్రభావితం చేయడంతో కార్యాలయ విభాగం కాస్త తడబడింది. 2025 క్యూ3లో 1.78 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరిగాయి. వార్షిక ప్రాతిపదికన 6 శాతం క్షీణించినప్పటికీ.. 2024 క్యూ3తో పోలిస్తే అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు, ఎన్సీఆర్, ముంబై లావాదేవీలలో సగం వాటాలను కలిగి ఉన్నాయి. 42 లక్షల చ.అ.లతో బెంగళూరు ముందంజలో ఉంది. ఈ త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలు వ్యాల్యూమ్ వృద్ధిలో అత్యధిక వాటాలను కలిగి ఉన్నాయి. హైదరాబాద్ 45 శాతం, చెన్నై 51 శాతం వాల్యూమ్లను కలిగి ఉన్నాయి. -
ఇళ్ల ధరలు: మూడేళ్లలోనే ఎంత మార్పు?
దేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఏటేటా పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థ అనరాక్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఇతర అన్ని రెసిడెన్సియల్ కేటగిరీలను అధిగమించింది. రూ.1.5 కోట్లకు పైబడి ధర కలిగిన గృహాలు దేశంలోని టాప్ ఏడు నగరాల్లో సగటున 40% ధరల పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ప్రాంతం (NCR) 72% ఎదుగుదలతో అత్యధిక ధరల పెరుగుదల నమోదు చేసింది. ఈ విభాగంలో ఇక్కడ 2022లో చదరపు అడుగు సగటు ధర రూ. 13,450 ఉండగా 2025 నాటికి రూ. 23,100 లకు పెరిగింది.ఈ బడ్జెట్ విభాగంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) 43 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, బెంగళూరు 42 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది. మన భాగ్య నగరం హైదరాబాద్ ఈ ర్యాలీలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. 2022–2025 మధ్య లగ్జరీ సెగ్మెంట్లో 41% పెరుగుదలను నమోదు చేసి, ధరల పెరుగుదల పరంగా టాప్ పెర్ఫార్మర్లలో ఒకటిగా నిలిచింది.హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఇలా..ప్రస్తుతం హైదరాబాద్‌లో వివిధ కేటగిరీలలో ఇళ్ల సగటు ధరలు ఇలా ఉన్నాయి. లగ్జరీ హౌసింగ్ విభాగంలో చదరపు అడుగుకు రూ.14,200 గా ఉంది. మిడ్-రేంజ్ / ప్రీమియం కేటగిరిలో చదరపు అడుగుకు సగటున రూ.8,420 ధర నడుస్తోంది. ఇక అఫోర్డబుల్ విభాగంలో చదరపు అడుగు ధర రూ.5,235 వద్ద ఉంది.ధరల పెరుగుదల పరంగా భాగ్య నగరం బలమైన పనితీరు చూపుతున్నప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా, అందుబాటు ధరలు కలిగినదిగానే ఉంది. -
ఇల్లా.. స్థలమా.. !
ఫ్లాటా... ప్లాటా? ఇల్లా... స్థలమా? కొనేటప్పుడు చాలామందిని ఈ సందేహం వేధిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లాటో, ప్లాటో కొన్న తరువాత బాధ పడటమూ సహజం. అయ్యో.. ఇక్కడ ఫ్లాట్ బదులు అక్కడ స్థలం కొని ఉండాల్సిందే... లేకపోతే ఈ స్థలం బదులు అక్కడ ఫ్లాట్ కొనుక్కుని ఉండాల్సిందే... అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయంటే మనం కొందామనుకున్నది బాగా పెరిగి... కొన్నది అంతగా పెరగనప్పుడు!!. మరి ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఏది కొంటే బెటర్? దీనిపై అవగాహన కోసమే ఈ కథనం.. – సాక్షి, వెల్త్ డెస్క్నగరాల్లోనైనా, శివార్లలోనైనా, ఊళ్లల్లోనైనా ఎక్కడ చూసినా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ జోరుగానే ఉంది. స్థలాలు, ఫ్లాట్లని తేడా లేకుండా అన్నింటి రేట్లూ ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కొన్న కొద్ది సంవత్సరాలకే విలువ భారీగా పెరిగిపోతోంది కూడా. అనరాక్లాంటి మార్కెట్ వర్గాల గణాంకాలను బట్టి అయిదారేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కోకాపేట్లో ఫ్లాట్ల రేటు చ.అ.కు సగటున రూ.4,750గా ఉండగా గతేడాది ప్రథమార్ధంలో రెట్టింపై ఏకంగా రూ.9,000కు ఎగిసింది. మరికొన్ని మార్కెట్ వర్గాల ప్రకారం ఇదే వ్యవధిలో విశాఖపట్నంలోని మధురవాడలో రూ. 3,800–4,300గా ఉన్న ధర రూ. 5,2,00–6,200 స్థాయికి చేరింది. అదే మధురవాడ ప్రాంతంలో స్థలాల రేట్లు 2019లో దాదాపుగా గజం 40వేల వరకూ ఉండి... గతేడాది రూ.75000 దాటేశాయి. ఇక హైదరాబాద్‌లో ఇదే కాలంలో చూస్తే ఫ్లాట్ల ధరలు రెట్టింపయ్యాయేమో కానీ... స్థలాల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. కొన్నిచోట్ల ఇంకా ఎక్కువే పెరిగాయి. ఈ లెక్కన చూసినపుడు రెండూ పెరుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి స్థలాలు ఇంకాస్త ఎక్కువ పెరుగుతున్నాయి. మరి ఎంచుకోవటం ఎలా? అవసరానికే పెద్ద పీట... స్థలమైనా, ఫ్లాటైనా... మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటే తరువాత రేట్లు పెరగకపోయినా, పెరిగినా పెద్దగా బాధపడాల్సిన పని ఉండదు. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కొత్త ప్రాజెక్టులొస్తూ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి అక్కడ డిమాండ్ పెరగటం, దానికి తగ్గట్లే రేటూ పెరగటం సహజం. స్థలం ఉంటే అవకాశాలెక్కువ. ఇక ఫ్లాట్ల విషయానికొస్తే అపార్ట్మెంట్ పరిమాణం పరిమితం. పైపెచ్చు పాతబడిపోతూ ఉంటుంది. పెచ్చులూడిపోవడం, పెయింట్లు వెలిసిపోవడం, పైపులు లీక్ కావడం, కామన్ ఏరియాలు పాడైపోవడంలాంటి సవాళ్లుంటాయి. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందినా, స్థలం మాదిరిగా ఫ్లాట్ విలువ పెరగదు. కాబట్టి ఇన్వెస్టరు కోణంలో ఆలోచించే ఎవరికైనా ఫ్లాట్ కన్నా స్థలం అర్ధవంతంగా ఉంటుంది. స్థలం కొనుక్కుని కాస్త 5–10 ఏళ్లు ఆగితే దాని విలువ రెండు రెట్లు, మూడు రెట్లు, అంతకు మించి కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే స్థలంపై చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ను సరైన పెట్టుబడిగా చెబుతారు.స్థలం కొనేముందు జాగ్రత్తలెన్నో.... సాధారణంగా ఫ్లాట్లనేవి కొన్ని సందర్భాలు మినహా చాలా మటుకు చట్టపరమైన అన్ని అనుమతులతో లభిస్తాయి. అదే పేరున్న బిల్డర్ దగ్గర్నుంచి కొంటున్నారంటే లీగల్ విషయాల గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అయితే, రెరా రిజిస్ట్రేషన్, ఆక్యుపెన్సీ సర్టి ఫికెట్ వంటివి తప్పనిసరిగా చూడాల్సి ఉన్నా... ఓవరాల్‌గా రిస్కు తక్కువే ఉంటుంది. స్థలం విషయానికొచ్చే సరికి మాత్రం చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి. టైటిల్ ఓనర్íÙప్ ఎవరి పేరిట ఉంది? రెసిడెన్షియలా లేక వ్యవసాయ భూమా? కన్వర్షన్ పరిస్థితి ఏంటి? లీగల్ వివాదాలేవైనా ఉన్నాయా? లే అవుట్‌కి ఆ ప్రాంత డెవలప్మెంట్ అథారిటినీ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయా? ఇలాంటి విషయాలెన్నీ నిశితంగా చూసి తీరాలి. వీటిల్లో ఏ చిన్న తేడా జరిగినా, మీరు కొనుక్కున్న స్థలాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తవచ్చు. లేదా అది పూర్తిగా చేయి జారిపోనూ వచ్చు. కాబట్టి, స్థలంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదే అయినప్పటికీ పేపర్‌వర్క్ 100 శాతం కరెక్ట్‌గా ఉన్నప్పుడే మంచిదవుతుంది. ఇక మెయింటెనెన్స్ విషయంలో ఫ్లాట్‌తో పోలిస్తే ప్లాట్దే పైచేయి. ఫ్లాట్ కొంటే మనం ఉన్నా... అద్దెకు ఇచ్చినా ప్రతి నెలా లిఫ్టులు, సెక్యూరిటీ, క్లీనింగ్ ఇలాంటివాటన్నింటికీ సంబంధించి మెయింటెనెన్స్ బిల్లు భారం ఉంటుంది. స్విమ్మింగ్ పూళ్లు.. జిమ్ములు గట్రా మీరు వాడకపోయినా కచి్చతంగా కట్టాల్సిందే. అదే స్థలం విషయానికొస్తే.. ప్రాపర్టీ ట్యాక్స్ తప్ప ప్రతి నెలా కచి్చతంగా ఇంత చెల్లించాలనే బాదరబందీ ఉండదు. ఒకవేళ అందులో మీరు కట్టుకున్న నిర్మాణాన్ని బట్టి ఏవైనా మెయింటెనెన్స్ ఉండొచ్చు. ఫ్లాట్లకు రుణాలు సులభం .. స్థలాలతో పోలిస్తే.. ఫ్లాట్లకు రుణాలు ఈజీగా దొరుకుతాయి. ప్రాపర్టీ విలువలో దాదాపు 80–90 శాతం వరకు బ్యాంకులు రుణాలిస్తుంటాయి. రీపేమెంట్ వ్యవధి కూడా సుదీర్ఘంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే ఆ ప్రయోజనాలూ ఉంటాయి. అదే మీరు స్థలం కొనుక్కోవడానికి రుణం తీసుకోవాలంటే మాత్రం బోలెడు రూల్సు, పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత కూడా స్థలం విలువలో 60–70 శాతమే రుణం ఇవ్వొచ్చు. ఇక రుణాన్ని తీర్చేందుకు కాలవ్యవధి కూడా ఫ్లాట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చాలా మటుకు బ్యాంకులు 15 ఏళ్ల వరకే లోన్లు ఇస్తాయి. పైపెచ్చు స్థలం కొన్నాక నిరీ్ణత వ్యవధిలో ఇల్లు కట్టుకోవాలనే షరతులు పెడతాయి. ఏరియా బాగుండి, రేటు రీజనబుల్‌గా ఉంటే ఫ్లాట్లు ఇట్టే అమ్ముడవుతాయి. కానీ బాగా డిమాండ్ ఉన్న ప్రాంతమైతే తప్ప స్థలాలు అంత వేగంగా అమ్ముడు కావు. కానీ కాస్త ఓపిక పడితే, సమయం వచి్చనప్పుడు మాత్రం మంచి రేటుకే అమ్ముడవుతాయి.ఫ్లాట్ కొనటం, అమ్మటం కాస్త ఈజీ నివసించడం కోసమైతే ఫ్లాట్లను కొనుక్కోవడం సరైన నిర్ణయమని చెప్పాలి. కొనటం కూడా చాలా సులువు. కొనుక్కుని, పేపర్‌వర్క్ పూర్తి చేసి, షిఫ్టింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఒకవేళ నిర్మాణ దశలో ఉన్నదైతే, ఎప్పటికల్లా పూర్తవుతుందనేది ముందే తెలుస్తుంది. అదే స్థలం విషయానికొస్తే కేవలం ప్లాట్ చేతికి వస్తుంది. ఆ తర్వాత ఇల్లు కట్టుకుని, అందులోకి మారాలంటే చాలా సమయం పడుతుంది. అంతా సవ్యంగా సాగి, ఎలాంటి జాప్యాలు జరగకుండా ఉంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. కానీ ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి, సత్వరం నివసించేందుకు ఇల్లు కావాలంటే ఫ్లాట్‌ను ఎంచుకోవచ్చు. అదే కొ న్నాళ్ల తరవాత మారాలనుకుంటే ప్లాట్ ఎంచుకోవచ్చు. -
ఇవి బిగించుకునే ఇళ్లు..
కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యకరమైన జీవితంపై శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎంపికలో రిస్క్ తీసుకోవట్లేదు. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, పచ్చని ప్రకృతిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. ఫలితంగా ఫామ్ ప్లాట్లకు, ఫామ్‌హౌస్‌లకు డిమాండ్ పెరిగింది. కనీసం ఇంటి చుట్లూ కనీస నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. మరి, ఫామ్ ప్లాట్లలో భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. దీంతో కంటైనర్ హోమ్స్‌కు గిరాకీ పెరిగింది. ఫ్యాక్టరీలో తయారు చేయడం, లారీలో తీసికొచ్చి బిగించేయడం వీటి ప్రత్యేకత. శామీర్‌పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్ వంటి శివారు ప్రాంతాలలోని ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో కంటైనర్ హోమ్స్ ఎక్కువ డిమాండ్ ఉంది. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్మాత్రిక ప్రాంతాలలో ఈ తరహావే ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. 111 జీవోలో నిర్మాణాలకు అనుమతులు లేకపోవటంతో పలువురు ఈ కంటైనర్ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి ఆయా హోమ్స్‌లో సరదాగా గడుపుతున్నారు. ఎలా తయారు చేస్తారంటే.. కంటైనర్ హోమ్స్‌ను గ్యాల్వనైజింగ్ స్టీల్స్(జీఏ) షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్ బోర్డ్ వేస్తారు. దానిపైన పాలీ వినైల్ ఫ్లోర్(పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్ బోర్డ్ మీద టైల్స్ కూడా వేసుకోవచ్చు.ఇంటి బీమ్‌లు, ఫౌండేషన్ స్ట్రక్చర్లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్ పూతతో ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్ ప్యానల్స్లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ఫినిష్డ్ వ్యాల్యుమెట్రిక్ కన్స్ట్రక్షన్(పీపీవీసీ)లతో రూపొందిస్తారు. తలుపులు, కిటికీలు ఇంపాక్ట్ రెసిస్టెంట్ గ్లాస్‌లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్ వుడ్ కాంపోజిట్, సిమెంట్ బోర్డ్‌లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్ ఇన్యులేషన్తో వాల్ ప్యానెల్ క్లాడింగ్లను ఏర్పాటు చేస్తారు. దీంతో అగ్ని, వేడి ఇంటిలోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల ఉష్ణోగత కంటైనర్ హోమ్‌లో తక్కువగా ఉంటుంది. ధరలు ఎలా ఉంటాయంటే?విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్ హోమ్స్ ధరలు ఉంటాయి. ప్రారంభ ధర చదరపు అడుగు (చ.అ)కు రూ.1,300. ఉదాహరణకు 600 చ.అ. మాడ్యులర్ హోమ్‌కు రూ.7.80 లక్షలు. క్రేన్, రవాణా చార్జీలు కూడా కలిపితే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మాడ్యులర్ హోమ్‌లో హాల్లోనే ఓపెన్ కిచెన్, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. దీని నిర్మాణానికి 4–5 మంది కలిసి 45 రోజుల్లో పూర్తి చేస్తారు.కంటైనర్ హోమ్స్‌లో మన అభిరుచుల మేరకు హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏ వసతులను ఏర్పాటు చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు.మన్నిక ఎన్నేళ్లంటే? ఈ కంటైనర్ హోమ్స్ స్ట్రక్చరల్ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో సాధారణ అపార్ట్‌మెంట్‌కు ఎలాగైతే నిర్వహణ చేసుకుంటామో ఈ కంటైనర్ హోమ్స్‌కు కూడా ఐదారేళ్లకొకసారి రంగులు, పాలిష్ చేసుకోవాలి. 1,000 చ.అ. బిల్డింగ్‌కు వార్షిక నిర్వహణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుంది. ఈ కంటైనర్ హోమ్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. మెటల్‌తోనే వీటిని తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తాయి. ఎక్కువ నష్టం జరగదు.ఇదీ చదవండి: ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు! -
ఏ రంగమైనా.. హైదరాబాద్ టాప్!
ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్.. రంగమేదైనా సరే.. హైదరాబాదే టాప్ లీడర్. అవునండీ.. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ, ముంబైని దాటేసి బహుళ జాతి సంస్థలు హైదరాబాద్‌లో జీసీసీల ఏర్పాటుకు జై కొడుతున్నాయి. కొత్త జీసీసీల ఏర్పాటే గానీ ఇప్పటికే ఉన్న జీసీసీల విస్తీర్ణంలో గానీ భాగ్యనగరాన్నే తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయి.అందుబాటు ధరలు, తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్య కార్మికుల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కాస్మోపాలిటన్ కల్చర్ వంటివి ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య కాలంలో దేశంలో 88 జీసీసీలు ఏర్పాటు, విస్తరణ కాగా.. ఇందులో 46 శాతం వాటాతో భాగ్యనగరం తొలి స్థానంలో నిలిచింది. మన తర్వాతే 33 శాతం వాటాతో బెంగళూరు నగరం రెండో స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది ముగింపు నాటికి రాష్ట్రంలో 120 జీసీసీలు, 1.2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీసీసీ - ఉమెన్తెలంగాణలోని మొత్తం జీసీసీ నైపుణ్య కార్మికులలో 59 శాతం మంది, అంటే సుమారు 1.82 లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నారు. బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, తయారీ రంగాల జీసీసీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. జీసీసీ నిపుణులలో మహిళలు 33 శాతం మంది ఉండగా.. 19 శాతం మంది నాయకత్వ ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. రాష్ట్రంలోని మొత్తం జీసీసీ ఉపాధిలో ఇంజనీరింగ్, ఐటీ రంగాలు 57 శాతం వాటాతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. -
ఇదిగో ఇల్లు కొనాల్సింది ఇప్పుడే..
రాష్ట్రంలో కొంతకాలం వరకూ స్థిరాస్తి మార్కెట్ స్తబ్దుగా ఉంది. ఇటీవల ప్రభుత్వ పోత్సాహకర నిర్ణయాలు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు తదితరాలతో మార్కెట్ మళ్లీ గాడిలో పడుతోంది. ఇలాంటి సమయంలో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలంటే వేగవంతంగా విధానపరమైన నిర్ణయాలతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, క్రయవిక్రయాలు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రతికూల వాతావరణంలోనే ధరలు, వసతుల విషయంలో కస్టమర్లకు బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. నగదు లభ్యత కావాలి కాబట్టి డెవలపర్లూ అంగీకరించే వీలుంటుంది. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడి దారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్బుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.ఢోకా లేదు.. హైదరాబాద్‌లోని భౌగోళిక వాతావరణం, వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ, విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌కు ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్‌లో గృహాల ధరలు, అద్దెలు, భూముల రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం వంటివి నగరానికి అదనపు అంశాలు. దీంతో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏమాత్రం అలసత్వం ఉండదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు ఢోకా ఉండదు.ఇదీ చదవండి: ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు! -
ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!
‘మూడేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి దాదాపు 100 కి.మీ. దూరంలో ఉన్న జహీరాబాద్‌లో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్ చేసింది. నిమ్జ్‌కు సమీపంలో ఉండటంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఆశ పెట్టడంతో ఓ ప్రైవేట్ ఉద్యోగి గజం రూ.8 వేలు చొప్పున 150 గజాల స్థలాన్ని కొన్నాడు. కొడుకు పైచదువుల కోసమని ఏడాది క్రితం నుంచి ప్లాట్ అమ్మకానికి పెడితే పోవడం లేదు. రెట్టింపు ధర కాకపోయిన కనీసం బ్యాంకు వడ్డీ చొప్పున ధర కలిసొచ్చినా విక్రయిద్దామని చూసినా లాభం లేకుండా పోయింది. దీంతో ప్లాట్ కొన్న కంపెనీ ఆఫీసుకు వెళ్లి తన ప్లాట్ విక్రయించి పెట్టమని చెబితే.. ఇప్పుడక్కడ మార్కెట్ బాగాలేదని, మరో ఏడాది పాటు ఆగాలని సర్దిచెప్పి పంపించేశారు... ఇదీ రీసేల్ ప్లాట్ల పరిస్థితి. – సాక్షి, సిటీబ్యూరోఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు? పిల్లల చదువుకోసమో, అమ్మాయి పెళ్లి కోసమో, ఇతర భవిష్యత్తు అవసరాల కోసం అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్ ప్లాట్లకు గిరాకీ ఉండటం లేదు. కుప్పలు తెప్పలుగా వెంచర్లు రావడం, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ప్రభుత్వ ప్రతికూల విధానాలతో స్థిరాస్తి మార్కెట్ మందగించింది. దీంతో రీసేల్ ప్లాట్లకు గిరాకీ పూర్తిగా తగ్గింది.నగరం చుట్టూ ఇదే పరిస్థితి.. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్టైల్స్ పార్క్, ఇండ్రస్టియల్ పార్క్, ఐటీ హబ్‌లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్ట్‌లు వచ్చేస్తున్నాయంటూ హైదరాబాద్ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు. యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్‌నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల వంటి ప్రాంతాలలో ఫామ్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్ హోమ్స్ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. ప్లాట్ కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతుంది. స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా, ఎలాంటి మౌలిక వసతులను కల్పించకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లను విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.రెరాలో నమోదు లేకుండానే.. నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా టీఎస్–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లను విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíÙయా, దుబాయ్, బ్యాంకాక్ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తున్నాయి. ప్రతి ఆదివారం నుంచి బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నాయి. వీకెండ్ వస్తే చాలు వెంచర్ల వద్ద టెంట్లు, ఏసీ గదులను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌ల గురించి వివరిస్తున్నాయి. కొనుగోలుదారులకు మందు, విందు అందిస్తున్నాయి.ఇదీ చదవండి: ఇక్కడ అద్దె కన్నా సొంతిల్లు చవక!అమ్ముకోలేక అగచాట్లు.. కొన్ని ప్రాంతాల్లో బిల్డర్లు నిర్మానుశ్య ప్రాంతాలు, జంగిల్లలో కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాలలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరం అయితే అమ్ముకోలేక అగచాట్లు పడుతున్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్‌ను తీసుకోవడానికి వెనకంజ వేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్లాట్‌పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. అలాంటి వారంతా రెండు, మూడేళ్లుగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే అమ్ముడుపోవడం లేదు. -
ఇక్కడ అద్దె కన్నా సొంతిల్లు చవక!
రియల్ ఎస్టేట్ మార్కెట్లో సాధారణంగా ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటం చవక. కానీ అమెరికా నగరం పిట్స్బర్గ్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఇక్కడ ఇల్లు కొనడం నిజంగా అద్దె కంటే చవకగా మారింది. అందుకే కొత్త గృహ కొనుగోలుదారులకు ఇది ఆకర్షణీయ గమ్యస్థానం అవుతోంది.రియల్టర్.కామ్ (Realtor.com) సీనియర్ ఎకనామిక్ రీసెర్చ్ విశ్లేషకురాలు హన్నా జోన్స్ వివరాల ప్రకారం.. అక్టోబర్‌లో పిట్స్బర్గ్, అమెరికాలో అత్యంత చవకైన ప్రధాన హౌసింగ్ మార్కెట్‌గా ర్యాంకయింది. ఇక్కడ ఇళ్ల సగటు లిస్టింగ్ ధర 2.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు) ఇది జాతీయ సగటు కంటే 1.5 లక్షల (సుమారు రూ.1.25 కోట్లు) డాలర్లపైగానే తక్కువ. ఈ నగరంలో ఐదు సంవత్సరాల క్రితం ఇళ్ల సగటు ధర 234,900 డాలర్లు ఉండగా, ఇప్పటి ధరలు కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. మిగతా పెద్ద నగరాలతో పోలిస్తే ఇది చాలా స్థిరమైన పెరుగుదల.ఇంకా ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ ఒకటి వేసవిలో ఇచ్చిన వివరాల ప్రకారం..ప్రధాన యూఎస్ మెట్రో నగరాల్లో అద్దె కంటే ఇల్లు కొనడం మరింత చవకగా ఉన్న ఏకైక నగరం పిట్స్బర్గ్.30% స్థోమత నియమం ప్రకారం కూడా మధ్యస్థ ఆదాయ కుటుంబాలు ఇక్కడ ఇల్లు కొనగలగడం చాలా సులభం.జూలైలో పిట్స్బర్గ్ మాత్రమే మధ్యస్థ ఆదాయ కుటుంబం మార్కెట్లో ఉన్న ఇళ్లలో 50% కంటే ఎక్కువను భరించగల మెట్రోగా నిలిచింది.యూఎస్ వ్యాప్తంగా ఇళ్ల ధరలు అందుబాటులో లేకుండా పోతున్నా, పిట్స్బర్గ్ మాత్రం ఇప్పటికీ చాలా కుటుంబాలకు అరుదైన అవకాశాన్ని అందిస్తోంది.రియల్టర్.కామ్ ప్రకారం.. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో 5,842 ఇళ్లు ఉన్నాయి. అంటే ప్రతిఒక్కరి బడ్జెట్‌కీ అనువుగా ఇక్కడ ఇల్లు లభిస్తుంది. ఇంకా మంచి వార్త ఏమిటంటే ఈ నగరం మొదటిసారి ఇల్లు కొనుగోలు దారులకు గ్రాంట్లు వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. -
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం: తొలిరోజే 59 ప్లాట్ల సేల్
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధ్వర్వంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు మరోసారి మంచి స్పందన వచ్చింది. నగర శివారు ఓఆర్ఆర్కు సమీపంలోని తొర్రూర్, కుర్మల్ గూడ, బహదూర్ పల్లి ప్రాంతాలలోని 163 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించారు.రెండు రోజుల పాటు జరిగే ఈ బహిరంగ వేలంలో తొలి రోజున తొర్రూరులోని 59 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ విక్రయాల్లో అత్యధికంగా చదరపు గజానికి రూ. 39 వేల ధర పలికింది. మొత్తం మీద ఈ ప్రాంతంలో చదరపు గజానికి సగటున రూ. 28,700 ధర పలికింది. ఇక్కడి భూములకు కనీస ధర రూ. 25 వేలుగా నిర్ధారించి వేలం నిర్వహించారు.సోమవారం నాటి విక్రయాల ద్వారా మొత్తం రూ. 46 కోట్ల మేర ఆదాయం వచ్చిందని స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ వేలం పాటలో 110 మంది బిడ్డర్లు పాల్గొన్నారన్నారు. కాగా తొర్రూర్ ప్రాంతంలోని మిగిలిన 65 ప్లాట్లకు, కుర్మల్ గూడలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలోని 13 ప్లాట్లకు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
40 ఏళ్లు వచ్చాక ఇల్లు కొంటుంటే..
సొంతిల్లు.. దాదాపు ప్రతి ఒక్కరికీ జీవిత ఆశయం. కొంత మంది తక్కువ వయస్సులోనే సొంతిల్లు సమకూర్చుకుంటారు. కానీ చాలా మంది 40 ఏళ్లు వచ్చాక కూడా దీని కోసమే పోరాడుతుంటారు. ఉద్యోగం, వ్యాపారంలో కుదురుకోవడం, పెళ్లి, పిల్లలు ఇలా అన్నీ అయ్యాక సొంతింటి పని పడతారు. అయితే 40ల వయసులో ఇల్లు కొనేవాళ్లు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..40లలో ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా స్థిరంగా పెరుగుతాయి. పిల్లల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యయాలు కచ్చితంగా ఉంటాయి. అందుకే గృహ రుణం ఈ వాస్తవాలకు సరిపోయేలా ఉండాలి. ఈఎంఐలు మీ రిటైర్మెంట్ పొదుపులను తగ్గించకూడదు. నిత్య ఖర్చులకు క్రెడిట్ కార్డులపై ఆధారపడేలా చేయకూడదు.ఎలాంటి ప్రాపర్టీ కొనాలి?40ల్లో ప్రాధాన్యతలు మారతాయి. ఇప్పుడు ‘హాట్’ లొకేషన్ కంటే రోజువారీ సౌలభ్యం ముఖ్యం. అంటే ప్రయాణ సమయం తక్కువ ఉండటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పాఠశాలలు, ఆసుపత్రులు అందుబాటులో ఉండే ప్రాపర్టీని ఎంచుకోవాలి. తెలిసిన ప్రాంతమైతే మరీ మంచిది. రెడీ-టు-మూవ్ అంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఉత్తమం. ఇవి నిర్మాణ ఆలస్యం రిస్క్‌ను తగ్గిస్తాయి. క్యాష్ ఫ్లో ప్రణాళికను సులభతరం చేస్తాయి. అయితే కొనుగోలు ముందు రెరా (RERA) వివరాలు, కంప్లీషన్ సర్టిఫికేట్లు, సొసైటీ నిబంధనలు, పెండింగ్ బకాయిలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.40ల తర్వాత హోమ్ లోన్ తీసుకుంటే..సాధారణంగా బ్యాంకులు కానీ, రుణ సంస్థలు కానీ తామిచ్చే లోన్లను రుణగ్రహీత రిటైర్ అయ్యేలోపు రికవరీ అయ్యేలా చూసుకుంటాయి. అందులో భాగంగా రుణ చెల్లింపు వ్యవధి తక్కువ ఉంటుంది. ఫలితంగా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ భారం పెరుగుతుంది. దీన్ని సమతుల్యం చేయడానికి చాలా మంది దంపతులు జాయింట్ లోన్ తీసుకుంటారు. డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తారు. తద్వారా ఈఎంఐ చెల్లించదగిన స్థాయిలో ఉంటుంది.రిటైర్మెంట్ ప్రణాళికను దెబ్బతీయకూడదుమంచి ఇల్లు కొనాలన్న ఉత్సాహం రిటైర్మెంట్ సేవింగ్స్‌ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఈపీఎఫ్, వీపీఎఫ్, ఎన్పీఎస్, దీర్ఘకాల సిప్‌లు వంటి పొదుపులపై ప్రభావం లేకుండా చూసుకోవాలి. దీని కోసం ఒక సింపుల్ పరీక్ష ఉంది. అదేంటంటే.. ఇంటి ఈఎంఐ కారణంగా మీ రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్లను రెండు మూడు నెలలకు పైగా నిలిపివేయాల్సి వచ్చేలా ఉంటే ఆ ఇంటి కొనుగోలు ప్లాన్ మార్చుకుని చిన్న ఇల్లు కొనడమో లేదా డౌన్ పేమెంట్ ఇంకాస్త పెంచుకోవడమో చేయాలి.ఎక్కువ డౌన్ పేమెంట్ మేలుడౌన్ పేమెంట్ ఎంత ఎక్కువైతే అంత మేలు. ఏళ్లుగా పోగుచేసుకున్న డబ్బుతో డౌన్ పేమెంట్ కాస్త ఎక్కువగా పెట్టగలిగితే నెల నెలా ఈఎంఐ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. తద్వారా మీ అత్యవసర నిధికి ఎలాంటి డోకా ఉండదు. ప్రతినెలా పెద్దగా ఒత్తిడి లేకుండా మనశ్శాంతిగా ఉండొచ్చు.ఇన్సూరెన్సులూ ముఖ్యమే..హోమ్ లోన్ మీ ఫైనాన్షియల్ రిస్క్‌ను పెంచుతుంది. అందుకే రుణ బకాయికి కనీసం సరిపడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసరం. ఇవి లేకపోతే కుటుంబ రుణ సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. -
విల్లాలకు దీటుగా హైరైజ్ అపార్ట్మెంట్లు
అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న హైదరాబాద్ మహా నగరంలో ఆకాశహర్మ్యాలే నగరవాసుల కలల సౌధాలుగా అవతరిస్తున్నాయి. పది అంతస్తులపైన నివసించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సిటీజనుల హైడ్రీమ్స్ను ప్రతిబింబించే విధంగా హైరైజ్ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలకు దీటుగా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.నగరవాసుల అభిరుచికి తగినట్లు నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) గడిచిన 9 నెలల కాలంలో 77 హైరైజ్ బిల్డింగ్‌లకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సుమారు 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైరైజ్ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.ఇప్పటికే న్యూయార్క్ వంటి నగరాలను తలపించే విధంగా కనిపిస్తున్న పడమటి ప్రాంతంలో మరిన్ని ఆకాశ సౌధాలు అందుబాటులోకి రానున్నాయి. రెండేళ్ల క్రితం 37.03 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 55 హైరైజ్ భవనాలకు అనుమతి ఇవ్వగా ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లోనే అంతకు రెట్టింపు సంఖ్యలో అందజేసినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మరోవైపు కోకాపేట్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో బహుళ వినియోగ జోన్లు, బహుళ అసంతస్తుల భవనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీఏ మరోసారి భూముల వేలానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కోకాపేట్ నియోపోలిస్‌లో రెండు విడతలుగా స్థలాలను విక్రయించగా అనూహ్యమైన స్పందన లభించింది. ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. ఈ క్రమంలో ఈ నెల 24, 26 తేదీల్లో మరోసారి ఆన్లైన్ బిడ్డింగ్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుతం కోకాపేట్లో అత్యధికంగా 63 అంతస్తుల వరకు హెచ్ఎండీఏ నిర్మాణ అనుమతులను అందజేసింది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరిన్ని అంతస్తుల నిర్మాణాలకు సైతం అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.‘అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు అందుబాటులో ఉండే నివాస సముదాయాలకు డిమాండ్ భారీగా ఉంది. ఇందుకు అనుగుణంగా హైరైజ్ భవనాల నిర్మాణం క్రమంగా ఊపందుకుంటోంది.’ అని ఒక హెచ్ఎండీఏ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం కోకాపేట్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో 49 అంతస్తుల నుంచి 63 అంతస్తుల భవనాల వరకు నిర్మాణ అనుమతులను అందజేశారు.హోదాగా భావిస్తున్నారు.. ప్రపంచదేశాల్లోని పలు నగరాల్లో వంద అంతస్తులకు పైగా నివాస భవనాలు ఉన్నాయి. అంతస్తులు పెరుగుతున్న కొద్దీ ఆకాశంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్న అనుభూతి లభిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అత్యంత ఎత్తు నుంచి వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది. పైగా వాహనకాలుష్యం, శబ్దకాలుష్యం వంటి సమస్యలకు హైరైజ్ భవనాలను పరిష్కారంగా భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా హైరైజ్ భవనాల్లో నివసించడాన్ని కొంతమంది ఉన్నత హోదాగా భావిస్తున్నారు. దీంతో ఇది ఒక ట్రెండ్‌గా మారిందని నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు సమీపంలో, సకల వసతులతో, పార్కింగ్ సదుపాయాలతో ఉండే ఈ భవనాల్లో పటిష్ట భద్రతా వ్యవస్థ కూడా ఉంటుంది. ఇలాంటి సానుకూలమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎన్ఆర్ఐలు హైరైజ్ భవనాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే సాఫ్ట్వేర్ నిపుణులు సైతం హైరైజ్నే ఎంపిక చేసుకుంటున్నారు. యూఎస్, కెనడా, యూరోప్ వంటి దేశాల్లో చాలాకాలంగా బహుళ అంతస్తుల భవనాలే నివాస సముదాయాలుగా కొనసాగుతుండగా హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి నగరాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అభివృద్ధి చెందుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు 88.15 లక్షల చ.మీ.ల నిర్మాణాలు మరోవైపు నిర్మాణ రంగ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. దీంతో ఈ ఏడాది సుమారు 88.15 లక్షల చదరపు మీటర్లకు పైగా భవన నిర్మాణాలకు అనుమతులను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇళ్లు, లేఅవుట్లు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, తదితర నిర్మాణాల కోసం 3,677 దరఖాస్తులు హెచ్ఎండీఏకు అందాయి. వాటిలో 2,887 దరఖాస్తులను పరిష్కరించి అనుమతులు మంజూరు చేశారు. దీంతో గతేడాది కంటే 79 శాతం ఆమోద రేటును సాధించినట్లు ఇది 2024లో 38 శాతం కావడం గమనార్హం.గతేడాది 3,209 దరఖాస్తుల్లో 1,216 మాత్రమే పరిష్కారమయ్యాయి. పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి కాల పరిమితి తగ్గించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఫైళ్లను పరిష్కరించేందుకు అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. పర్మిట్ ఫీజుల రూపంలో ఈ ఏడాది రూ.1,225 కోట్లు లభించాయి. గతేడాది పర్మిట్ ఫీజులపై మొదటి 9 నెలల కాలానికి రూ.355 కోట్లు మాత్రమే లభించడం గమనార్హం. బిల్డ్‌నౌ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థ కూడా నిర్మాణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో 22,345 యూనిట్లు సేల్
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక అస్థిరత, అధిక ధరలు వంటి ప్రతికూల మార్కెట్లో ఇండియాలో గృహ విక్రయాలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లు కుదుటపడుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఇళ్ల అమ్మకాలు రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తుందని అనరాక్ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్–25 నుంచి మార్చి–26)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.6.65 లక్షల కోట్ల విలువ చేసే ఇళ్లు అమ్ముడువుతాయని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాలు 19 శాతం పెరగొచ్చని అనరాక్ రీసెర్చ్ అంచనా వేసింది.హైదరాబాద్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.30,646 కోట్ల విలువ చేసే 22,345 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.59,243 కోట్ల విలువ చేసే 48,980 యూనిట్లను విక్రయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో విక్రయమైన ఇళ్ల విలువలో అత్యధికంగా 74 శాతంతో ఎన్సీఆర్–ఢిల్లీ, 71 శాతంతో చెన్నైలు అగ్రస్థానంలో నిలిచాయి. 45 శాతంతో ముంబై అత్యల్ప స్థానంలో నిలిచింది. లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దీంతో డెవలపర్లు కూడా కొనుగోలుదారుల అభిరుచుల మేరకు విలాసవంతమైన భవన నిర్మాణాలనే ప్రారంభిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో లాంచింగ్ అయిన ప్రాజెక్ట్‌లలో 42 శాతం లగ్జరీ గృహాలే కావడమే ఇందుకు ఉదాహరణ.ఇప్పటికే 53 శాతం..గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.59 లక్షల కోట్లు విలువ చేసే 4,22,765 ఇళ్లు విక్రయమయ్యాయి. అయితే అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇళ్ల విక్రయాలు 14 శాతం మేర క్షీణించగా.. వాటి విలువ మాత్రం 6 శాతం మేర పెరిగింది. మెట్రో నగరాలలో విక్రయాలు స్థిరంగానే ఉంటాయని, 4 శాతానికి మించి వృద్ధి రేటును నమోదు కాదని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలోని విక్రయమైన ఇళ్ల విలువలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే ఇప్పటికే 53 శాతం సాధించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ హెచ్1లో 2.98 లక్షల కోట్ల విలువ చేసే 1.93 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. -
ఆ రియల్ ఎస్టేట్ స్కీమ్‌లకు ఆశపడితే..
ప్రీలాంచ్, బైబ్యాక్, యూడీఎస్, అన్‌లాకబుల్ స్పేస్, రెంటల్ స్కీమ్.. పేర్లు ఏమైనా ఇవన్నీ కొనుగోలుదారుల జేబులు ఖాళీ చేసే స్కీమ్లే. నివాస, వాణిజ్య సముదాయాలలో ఆఫర్ల పేరిట కొనుగోలుదారులకు ఎర వేస్తున్న నిర్మాణ సంస్థలు అనేకం.. సెంటు భూమి లేకుండానే ఆకాశంలో మేడలు కడుతున్నామని నమ్మించి నట్టేట ముంచేస్తున్నాయి.ఏ కంపెనీలు ఏ తరహా మోసాలకు పాల్పడుతున్నాయనే ప్రస్తావన కాసేపు పక్కన పెడితే.. అసలు ప్రీలాంచ్ మోసాలకు కారణం ఎవరు? చిన్న వస్తువు కొంటేనే బ్రాండ్, ధర, ఎక్స్పైరీ వంటి వివరాలన్నీ తెలుసుకునే కొనుగోలుదారులు.. జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలులో ఎందుకు పునఃపరిశీలన చేసుకోవడం లేదు? సగం ధరకే ఫ్లాట్ అనగానే నమ్మేసి కష్టార్జితాన్నంతా బిల్డర్ చేతిలో పెట్టేయడం ఎంత వరకు కరెక్ట్?భవన నిర్మాణ రంగానికి పునాది నమ్మకం. ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించేటప్పుడు అందులోని ఫ్లాట్లన్నింటినీ అమ్మగలననే నమ్మకం బిల్డర్‌కు, ఆ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేసి అందించగలడనే నమ్మకం కొనుగోలుదారుడికి ఉండాలి. అప్పుడే ప్రతికూల సమయంలోనూ బిల్డర్, కస్టమర్లు ఇద్దరూ ఆనందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో నమ్మకమే కొరవడింది. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే బిల్డర్లు, స్వలాభం చూసే భూయజమానులు, సగం ధరకే సొంతిల్లు కావాలనుకునే కస్టమర్లు.. ఇలా అత్యాశతో పరిశ్రమకు మచ్చ తెస్తున్నారు.నిధుల మళ్లింపుతో.. వ్యాపారంలో షార్ట్‌కర్ట్ దురుద్దేశంతో కొంతమంది బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో సగం ధరకే ఫ్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేస్తూ హోమ్ బయ్యర్లను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా సమీకరించిన సొమ్మును బిల్డర్లు ఇతర ప్రాజెక్ట్‌లకు, వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారు. సగం ధరకే అమ్మిన సొమ్ముతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేక చతికిలపడిపోతున్నారు. అత్యాశ కలిగిన బిల్డర్లు పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారు. విలువలతో కూడిన వ్యాపారం చేసే డెవలపర్లకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు.అధ్యయనం చేయకుండానే.. ప్రీలాంచ్, యూడీఎస్ స్కీమ్‌ల పేరిట కస్టమర్లను మోసం చేసేందుకు వందలాది మంది బిల్డర్లు పుట్టుకొస్తున్నారు. కొంత మంది కొనుగోలుదారులు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సగం ధరకే ఫ్లాట్ అనగానే నమ్మేసి, అత్యాశకు పోయి బిల్డర్లకు సొమ్ము సమర్పిస్తుండటంతో ప్రీలాంచ్ మోసాలు జరుగుతూనే ఉంటాయి. ప్రీలాంచ్ పేరిట డబ్బులు వసూలు చేసే బిల్డర్లను కఠినంగా శిక్షించాలి. కస్టమర్లు ఇలాంటి ఆఫర్లతో మోసపోకుండా జాగ్రత్తపడాలి. కొనేముందు గమనించాల్సినవి ఇవే..నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి.ప్రాజెక్ట్ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి.డెవలపర్ ప్రొఫైల్, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి.గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి.పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదా తెలుసుకోవాలి.ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి.డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి. -
ఇప్పుడు డిమాండంతా ఇలాంటి ఇళ్లకే..
కరోనా మహమ్మారి తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,300 చ.అ.ల్లోని 2 బీహెచ్‌కే, 1,500 చ.అ. నుంచి 2,500 చ.అ.ల్లోని 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లకు డిమాండ్ ఏర్పడిందని ఓ సంస్థ తన సర్వేలో వెల్లడించింది.నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పాజెక్ట్‌ల గురించి విచారణ పెరిగింది. అలాగే ఆ ఏరియాల్లోనే కొత్త ప్రాజెక్ట్‌లు ఎక్కువగా లాంచింగ్స్ జరుగుతున్నాయి. మణికొండ, కూకట్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.చందానగర్‌లో అద్దెల వృద్ధి 3.54 శాతం, టోలిచౌకీలో 3.42 శాతం, మియాపూర్‌లో 3.10 శాతం, మణికొండలో 3.34 శాతం, కూకట్‌పల్లిలో 3.04 శాతం, గచ్చిబౌలిలో 2.98 శాతం, కొండాపూర్‌లో 3.11 శాతం, హైటెక్‌సిటీలో 3.15 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 12 వేల ఇన్వెంటరీ ఉంది. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో గృహాల ధరలు పెరిగాయి. -
సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!
గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి అని చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?, ఎలా కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?, అనే విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం వల్ల.. ఇళ్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇల్లు కొనడం అనేది ఒక సవాలుగా మారిపోయింది. ఈ సమయంలో ఇల్లు కొనాలంటే అప్పు చేసి (బ్యాంక్ లోన్) కొనమంటున్నారు కియోసాకి. పర్సనల్ ఫైనాన్స్ యూట్యూబర్ శరణ్ హెగ్డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఇల్లు కొనడంలో తప్పు లేదు. కానీ జీతంతో, లేదా మీరు చేసిన పొదుపుతో ఇల్లు కొనాలని చూస్తే మాత్రం అప్పులపాలైపోతారని కియోసాకి పేర్కొన్నారు. లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేసి.. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించాలి. ఆలా వచ్చిన డబ్బు ద్వారా లోన్ చెల్లించాలి. ఇలా చేస్తూ ఉంటే.. చివరికి ఇల్లు మీ సొంతం అవుతుందని ఆయన చెబుతారు. ఇక్కడ మీ చేతి నుంచి చెల్లించిన డబ్బు ఏమీ ఉండదు. అయితే చివరికి ఆస్తి మీదవుతుంది. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని కియోసాకి చెబుతారు.తనకు చాలా ఇల్లు ఉన్నట్లు కియోసాకి ఇంటర్వ్యూలో కియోసాకి పేర్కొన్నారు. ఆ ఇళ్లను అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదిస్తాను అని కూడా ఆయన వెల్లడించారు. 2025 రెండవ త్రైమాసికంలో USలో సగటు ఇంటి ధర 4,10,800 డాలర్లు అని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ తెలిపిందని కియోసాకి వివరించారు.డబ్బు మీ కోసం పనిచేయాలిరాబర్ట్ కియోసాకి తన ఆర్ధిక సూత్రాలలో కూడా డబ్బు కోసం మీరు పనిచేయకండి, డబ్బు మీ కోసం పనిచేసేలా చేయండి అని చెబుతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది, నెలవారీ బిల్లులు చెల్లిస్తారు. మిగిలిన డబ్బు ఖర్చు చేస్తారు. ఇదే జీవితాంతం కొనసాగుతుంది. ఇదే డబ్బు కోసం పనిచేయడం అన్నమాట.ఇదీ చదవండి: ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకిడబ్బు మీ కోసం పనిచేయడం అంటే.. ఒక ఇల్లు కొంటారు, దాన్ని అద్దెకు ఇస్తారు. మీకు ప్రతి నెలా డబ్బు వస్తుంది. మీరు షేర్లలో పెట్టుబడి పెడితే, కంపెనీ లాభాల్లో భాగంగా డివిడెండ్ వస్తుంది. ఏదైనా వ్యాపారం ఉంటే.. మీరు పని చేయకపోయినా వ్యాపారమే మీకు డబ్బు సంపాదిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మీరు ఒక బుక్ రాశినా, సాఫ్ట్వేర్ రూపొందించినా, మ్యూజిక్ క్రియేట్ చేసినా అవి అమ్ముడవుతాయి. తద్వారా మీకు డబ్బు వస్తుంది. -
పిల్లల పేరు మీద ప్రాపర్టీ కొంటున్నారా?
తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించాలని ప్రతి తల్లిదండ్రులు ఆరాటపడతారు. వారి కోసం డబ్బులు పోగుచేస్తారు. చాలా మంది ఆస్తులు సైతం కొంటుంటారు. అయితే పిల్లల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేస్తే చట్టపరమైన హక్కులు, వారసత్వం, పన్నులు, సంరక్షణ వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీలునామా, గార్డియన్షిప్, పన్ను నిబంధనలు స్పష్టంగా ఉండాలి.పిల్లల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి బాలల దినోత్సవం (Children's Day) సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం.. చట్టపరమైన హక్కులుపిల్లల పేరు మీద ఆస్తి కొంటే, ఆ ఆస్తి పిల్లలకే హక్కుగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆ ఆస్తికి కేవలం సంరక్షకులుగా (Guardians) మాత్రమే ఉండగలరు. పిల్లలు పెద్దవారయ్యాక (18 ఏళ్లు పూర్తయ్యాక) ఆ ఆస్తిపై పూర్తి హక్కు పొందుతారు.వీలునామా అవసరంతల్లిదండ్రులు వీలునామా రాయకపోతే, హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఆస్తి వారసత్వంగా ఇతర పిల్లలకు కూడా పంచబడే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆస్తి ఎవరికీ చెందాలో స్పష్టంగా చెప్పే వీలునామా రాయడం చాలా అవసరం.పన్నులుపిల్లల పేరు మీద ఆస్తి కొనుగోలు చేసినా, ఆ ఆస్తి నుండి వచ్చే ఆదాయం అంటే అద్దెలు, వడ్డీలు వంటివి తల్లిదండ్రుల ఆదాయంలో కలిపి చూస్తారు. ఆ మేరకు పన్ను వర్తిస్తుంది. పిల్లలు పెద్దవారయ్యాక మాత్రమే ఆ ఆదాయం వారి పేరుతో పరిగణించబడుతుంది.గార్డియన్షిప్పిల్లలు మైనర్‌గా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఆస్తిని నిర్వహించాలి. ఆస్తి అమ్మకం, లీజ్, లేదా మార్పిడి చేయాలంటే కోర్టు అనుమతి అవసరం.భవిష్యత్ సమస్యలు రాకుండా జాగ్రత్తలుఆస్తి కొనుగోలు సమయంలో అన్ని పత్రాలు పిల్లల పేరుతో సరిగా నమోదు చేయాలి. భవిష్యత్‌లో తోబుట్టువుల మధ్య వివాదాలు రాకుండా వీలునామా తప్పనిసరిగా ఉండాలి. ఆదాయం, పన్నులు, వారసత్వం విషయంలో ముందుగానే ప్రణాళిక అవసరం. -
లగ్జరీ అపార్ట్మెంట్ : గోడకు పెన్సిల్‌తో రంధ్రం?! వైరల్ వీడియో
ఇల్లు కొనాలంటే మాటలు కాదు. ఇంటి నాణ్యత, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు గురించి కచ్చితంగా తనిఖీ చేసుకుంటాం. ఒకటిరెండు సార్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదోనని చెక్ చేసుకుని మరీ ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలా లేదా అని నిర్ణయం తీసుకుంటాం కదా. మరి కోటిన్నర రూపాయలు పెట్టి కొన్న ఒక అపార్ట్మెంట్ గోడ ఒక్క పెన్సిల్ మొనకే రంధ్రం పడితే.. గుండె గుభిల్లు మనదూ.. అలాంటి వీడియో ఒకటి నెట్టింట సంచలనంగా మారింది. నోయిడాకు చెందిన వ్యక్తి రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ గోడకు పెన్సిల్‌తో రంధ్రం చేయడం చర్చనీయాంశమైంది. నోయిడా నివాసి తన రూ.1.5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ గోడకు చెక్క పెన్సిల్‌తో రంధ్రం చేశాడు.ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని ఖరీదైన గృహనిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించే భద్రత , సామగ్రి గురించి ఆందోళనలను రేకెత్తించింది.kabeer.unfiltered' అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేసిన వీడియోలో, తన ప్రీమియం అపార్ట్మెంట్ గోడలోకి చెక్క పెన్సిల్‌ను సుత్తితో కొట్టడాన్ని చూడొచ్చు. కేవలం పెన్సీల్‌తో గోడకు సుత్తి సాయంతో రంధ్రం చేశానని తెలిపాడు. మొదట డ్రిల్‌ను ఉపయోచాలని చూశా. కానీ డ్రిల్ కూడా అవసరం లేకుండానే, పెన్సిల్ నేరుగా గోడలోకి దిగిపోయింది. ఇది మనం పాఠశాలలో వాడే గ్రాఫైట్ పెన్సిలే. ఈ ఇల్లు అంత బలంగా ఉంది అని రాసుకొచ్చాడు.దీనిపై చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోవడం బాధాకరం అంటూ వాపోయారు. మరికొందరు భిన్నమైన దృక్పథాన్ని అందించారు. AAC (ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్) గోడలు అని, ఈ తేలికైన గోడలను ఎత్తైన నిర్మాణంలో ఉపయోగిస్తారని, భూకంపాల సమయంలో ఇది సురక్షితంగా, మరింత స్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ గోడలు భారాన్ని మోసేవి కావు , సాంప్రదాయ ఇటుక, మోర్టార్ గోడల మాదిరిగా ఉండవని వివరణ ఇచ్చారు. పేరు తగ్గట్టే ఏఏసీ గోడలు. ఇవి డ్రిల్లింగ్కు ఈజీగా ఉంటాయ్.. అందుకే తెలుసుకొని మాట్లాడాలి అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Kabeer.Unfiltered (@kabeer.unfiltered) కాగా ఈ వీడియో ప్రామాణికత, గోడ నాణ్యత లాంటి విషయాలపై క్లారిటీ లేదు. ఈ వీడియోలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా తన వ్యక్తిగత అనుభవాలు ,పరిశీలనల ఆధారంతో రాసింది . ఈ కంటెంట్ ఏ వ్యక్తిని, కంపెనీని లేదా సంస్థను కించపరచడానికి ఉద్దేశించింది కాదంటూ డిస్క్లైమర్ కూడా ఇచ్చాడు. ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ (AAC) బ్లాక్‌లు తేలికైన, ప్రీకాస్ట్ నిర్మాణ సామగ్రి. వీటితో ఖర్చు తక్కువ. తేలికైనవి, సౌకర్యవంతమైనవి, మన్నికైనవి కూడా. అద్భుతమైన ఇన్సులేషన్ లక్షణాలను కలిగి ఉంటాయి.వీటి వలన భవనం చల్లగా ఉంటుంది. అగ్ని, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. చెద లాంటి సమస్యలు కూడా ఉండవు. ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద -
ఇళ్ల అమ్మకాలు @ రూ.2.98 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఇళ్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) సంఖ్యా పరంగా తక్కువ నమోదు కాగా, విలువ పరంగా వృద్ధి కనిపించింది. అమ్మకాలు 1.93 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 2.27 లక్షల యూనిట్లతో పోల్చి చూస్తే 15 శాతం తగ్గాయి. కానీ, ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2.98 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల విలువ రూ.2.79 లక్షల కోట్లుగా ఉంది. అంటే విలువ పరంగా 7 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద విక్రయాల విలువ క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 19 శాతం అధికంగా రూ.6.65 లక్షల కోట్లుగా ఉండొచ్చని అనారక్ ఈడీ ప్రశాంత్ ఠాకూర్ అంచనా వేశారు. సగటు ధరలు, అపార్ట్మెంట్ సగటు పరిమాణం ఆధారంగా ఈ అంచనా వ్యక్తం చేశారు. 2024–25లో దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 4,22,765 యూనిట్లు కాగా, వీటి విలువ రూ.5.59 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. 2023–24లో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరిన అనంతరం ఎన్నో ప్రతికూలతల మధ్య ఆ తర్వాత కొంత నెమ్మదించినట్టు పేర్కొన్నారు. ధరల పెరుగుదల వల్లే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాల విలువ అధికంగా నమోదు కావడం వెనుక ధరలు పెరగడాన్ని కారణంగా అనరాక్ నివేదిక పేర్కొంది. అలాగే, ప్రీమియం అపార్ట్మెంట్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. స్పెక్యులేటివ్ కొనుగోళ్లకు బదులు వాస్తవ, వినియోగ ఆధారిత కొనుగోళ్ల డిమాండ్ ప్రస్తుతం కొనసాగుతున్నట్టు సర్వమ్ ప్రాపరీ్టస్ సహ వ్యవస్థాపకుడు ధావల్ హెమానీ తెలిపారు. రియల్ ఎస్టేట్‌లో తదుపరి వృద్ధి అమ్మకాల పరిమాణం కంటే విలువ ఆధారితంగానే ఉంటుందని రియల్ స్టేట్ రంగ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ‘గోల్డెన్ గ్రోత్ ఫండ్’ సీఈవో అంకుర్ జైన్ తెలిపారు. డెవలపర్లు ఎక్కువ ప్రాజెక్టుల కంటే.. నాణ్యత, సకాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పంగించడంపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. -
రియల్ ఎస్టేట్ సంస్థకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.46.86 నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం భారీ తగ్గడం ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు కంపెనీ తెలిపింది. గతేడాది క్యూ2లో రూ.4.15 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం విశేషం.వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.777.42 కోట్ల నుంచి రూ.372.51 కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.12.42 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా రూ.1,205.40 నుంచి రూ.1,270.86 కోట్లకు పెరిగింది.గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,290 కోట్ల ప్రాపర్టీస్ విక్రయించింది. దీంతో సేల్స్ పరంగా దేశంలో అయిదవ అతిపెద్ద లిస్టెడ్ రియల్టీ కంపెనీగా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.12,500 కోట్ల ముందస్తు బుకింగ్స్ లక్ష్యంగా పెట్టుకుంది.👉 ఇదీ చదవండి: ఇల్లు కొనే ముందు జాగ్రత్త.. ఇవి తప్పనిసరి! -
ఇల్లు కొనే ముందు జాగ్రత్త.. ఇవి తప్పనిసరి!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. పొదుపు, రుణం, పెట్టుబడులతో కూడుకున్న అంశం. జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా లేకుంటే అటు ఆర్థికంగా ఇటు మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యో.. ఈ ఇల్లు కొని తప్పు చేశానే.. అని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.రియల్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఎన్నో చట్టాలు, నిబంధనలు ఉన్నా.. సామాన్యుడి సొంతింటి కలను క్యాష్ చేసుకోవాలనే అక్రమార్కులు కనిపిస్తూనే ఉన్నారు. ప్రీలాంచ్ మోసాలతో పాటు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి, వాటిని విక్రయించడం వంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇల్లు కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు సూచిస్తున్న పలు జాగ్రత్తలివీ..టైటిల్ డీడ్డెవలపర్కు కన్వేయన్స్ రూపంలో భూమికి స్పష్టమైన, మార్కెట్ చేయదగిన టైటిల్ ఉండాలి. గృహ కొనుగోలుదారులు దీని కోసం అడగాలి. స్థానిక సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లి సదరు భూమిపై ఎలాంటి వివాదాలు, లిటిగేషన్లు లేవని నిర్ధారించుకోవాలి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ రసీదుల వంటి ఇతర కీలక పత్రాలను కూడా పరిశీలించాలి.అనుమతులుప్రాజెక్ట్ లేఅవుట్, భవన నిర్మాణ ప్రణాళికకు మున్సిపల్ అధికారుల ఆమోదం ఉండాలి. ఇవి లేకుంటే అది అక్రమ నిర్మాణం కిందే లెక్క. ఈ నేపథ్యంలో ఇళ్ల కొనుగోలుదారులు సదరు ప్రాజెక్ట్‌కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేవో క్రాస్ చెక్ చేసుకోవాలి.సర్టిఫికెట్లుప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించి కమెన్స్ సర్టిఫికెట్, అది పూర్తయ్యాక కంప్లీషన్ సర్టిఫికెట్ చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారమే నిర్మించిందని చెప్పడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. అలాగే ప్రతీ ప్రాజెక్ట్‌కు అగ్నిమాపక, పర్యావరణం, నీటి సరఫరా, విద్యుత్ సహా బహుళ విభాగాల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్ఓసీ) సరి్టఫికెట్లు అవసరం. ఇవన్నీ పునఃపరిశీలించిన తర్వాతే గృహ కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.రిజిస్ట్రేషన్రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టం కింద ప్రతీ ప్రాజెక్ట్‌ను నమోదు చేయాలి. రెరా ఆమోదం పొందకుండా ప్రాజెక్ట్ నిర్మాణం, అమ్మకం వంటివి చేయకూడదు. అందువల్ల ఆయా ప్రాజెక్ట్‌కు రెరా అనుమతి ఉందా లేదా అనేది తనిఖీ చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పెరుగుతున్న హౌసింగ్ ఇన్వెంటరీ -
10 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్!
సిటీలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 50 లక్షలైనా అవుతుంది. కానీ 10 లక్షల రూపాయలకే రెండు పడకల ఫ్లాట్.. అది కూడా నగరంలో అంటే ఆశ్చర్యం కలగమానదు. ఇంత తక్కువకి ఎక్కడ అమ్ముతున్నారని అనుకుంటున్నారా? ప్రభుత్వమే కట్టించి, ముఖ్యమంత్రే స్వయంగా మీకు ఇంటి తాళాలు అప్పగిస్తే..! ఏంటి నమ్మడం లేదా? అయితే పదండి.. ఆ వివరాలు తెలుసుకుందాం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణివేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఇలాంటి చర్యల్లో భాగంగా మాఫియా నాయకుడు ముఖ్తార్ అన్సారీ.. లక్నోలోని దాలిబాగ్ ప్రాంతంలో ఆక్రమించిన సుమారు 2,322 చదరపు మీటర్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో పేదలకు ఇళ్లు నిర్మించింది.సర్దార్ వల్లభాయ్ పటేల్ హౌసింగ్ స్కీమ్ (Sardar Vallabhbhai Patel Housing Scheme) కింద లక్నో డెవలప్మెంట్ అథారిటీ (LDA) ఈ ఫ్లాట్లను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌లో మూడు G+3 బ్లాక్‌లలో 72 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కొ ఫ్లాట్ 36.65 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో ఫ్లాట్ ధర ₹10.70 లక్షలు. ఈ గృహ సముదాయంలో స్వచ్ఛమైన నీరు, విద్యుత్, సెక్యురిటీ, ద్విచక్ర వాహన పార్కింగ్ ,రోడ్లు, పార్కులు వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి.అక్రమార్కుల ఆటలు సాగవుకార్తీక పౌర్ణమి రోజున సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ గృహ సముదాయం ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా ఇంటి తాళాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను చెరబట్టిన అక్రమార్కుల ఆట కట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. "ఇది కేవలం ఇళ్ల పంపిణీ కార్యక్రమం కాదు, ఒకప్పుడు మాఫియా ఆక్రమించిన భూమిలో ఇప్పుడు పేదలు ఇళ్లు దక్కాయనే సందేశం ఇది. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ పేదలను దోపిడీ చేసే వారి ఆటలు ఉత్తరప్రదేశ్‌లో ఇకపై సాగబోవు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడటానికి మా ప్రభుత్వం గట్టిగా నిలబడుతుంది. ఇది నూతన భారతదేశం, ఉత్తరప్రదేశ్ యొక్క గుర్తింపు. ఇక్కడ విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలతో కలిసి అభివృద్ధి నడుస్తుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన లక్నోలో మాఫియా లేని భూమిలో లబ్ధిదారులకు గృహాలను అందించడం నిజంగా గర్వకారణమ''ని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.చదవండి: బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంఒక్కో ఫ్లాట్ విలువ రూ. కోటి!గృహ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా బహుమతులు పంపిణీ చేశారు. నివాసితుల పిల్లలతో అప్యాయంగా మాట్లాడారు. వారికి చాక్లెట్లు పంచారు. నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. కాగా, లక్నోలోని ప్రైమ్ ఏరియాలో నిర్మించిన ఈ ఫ్లాట్లను దక్కించుకునేందుకు 8,000 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 5,700 మంది అర్హులని గుర్తించారు. వీరిలో 72 మంది ఫ్లాట్లను దక్కించుకున్నారు. ఒక్కో ఫ్లాట్ విలువ మార్కెట్ ధర ప్రకారం దాదాపు కోటి రూపాయలకు వరకు ఉంటుందని సీఎం యోగి చెప్పారు. संदेश स्पष्ट है...अगर गरीबों की व किसी सार्वजनिक भूमि पर कब्जा कर समाज को धमकाने का कार्य करोगे तो लेने के देने पड़ जाएंगे।आज लखनऊ में माफिया से मुक्त कराई गई भूमि पर दुर्बल आय वर्ग के 72 परिवारों के लिए निर्मित फ्लैट के आवंटन-पत्र का वितरण किया। इस अवसर पर सरदार वल्लभ भाई… pic.twitter.com/gNmE1FXvzT— Yogi Adityanath (@myogiadityanath) November 5, 2025 -
ఇంటి అందాన్ని పెంచేవి.. ఇవే!
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు కనిపిస్తుంటే ఇల్లు అందవికారంగా కనిపించడమే కాదు ఇంటి యజమానిపై ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడతాయి. అందుకే అందమైన ఇంటీరియర్‌తో ఇంటికి వచి్చన అతిథులకు స్వాగతం పలుకుతున్నారు నేటి గృహ కొనుగోలుదారులు. ఇంటీరియర్‌లో అల్మారాలది ప్రత్యేక స్థానం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇవి సామాగ్రిని భద్రపర్చడానికి మాత్రమే కాకుండా ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో కీలకమైన అల్మారాలతో ఆధునిక డిజైన్లతో గృహ శోభను రెట్టింపు చేస్తాయి.స్లైండింగ్ డోర్ కబోర్డ్స్, వాక్ ఇన్ వార్డ్రోబ్స్, మిర్రర్ ఫినిష్, కార్నర్ కబోర్డ్స్, ఫ్లోర్ టు సీలింగ్ కబోర్డ్స్ వంటి ఎన్నో రకాల డిజైన్లు, రంగులతో అల్మారాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటితో పాటు చెక్క అల్మారాలు, ప్లైవుడ్, లామినేటెడ్, గ్లాస్, మెటల్‌తో కూడా అల్మారాలు ఉన్నాయి. తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో లామినేట్, మెటల్ ఫినిషింగ్ అల్మారాలు వినియోగించడం ఉత్తమం. చెదల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ అవసరం. -
హైదరాబాద్‌లో పెరుగుతున్న హౌసింగ్ ఇన్వెంటరీ
‘ఆదిభట్లలో ఓ నిర్మాణ సంస్థ రెండేళ్ల క్రితం భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు వంద అపార్ట్మెంట్లను కూడా విక్రయించలేకపోయింది. దీంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసి, ఆఫీసును తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులను కూడా భరించలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రస్తుతం బిల్డర్ కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నాడు.’ ..ఒకరిద్దరు కాదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా మంది పరిస్థితి ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడం, అపరిమిత సరఫరా, వడ్డీ రేట్లు, అధిక ధరలు, ప్రభుత్వ ప్రతికూల విధానాలు వంటి రకరకాల కారణాలతో అపార్ట్మెంట్ల విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో నగరంలో ఇన్వెంటరీ పెరిగిపోయింది. కస్టమర్ల వాకిన్స్ లేకపోవడంతో అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనిర్ధిష్ట కాలంలో మార్కెట్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లను ఇన్వెంటరీగా పరిగణిస్తుంటారు. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలలో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 5,61,756 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. ఇందులో అత్యధికంగా ముంబైలో 1.76 లక్షల యూనిట్లుండగా.. రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రస్తుతం నగరంలో 95,331 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఏకంగా లక్షకుపైగా ఇన్వెంటరీ ఉండగా.. ప్రస్తుతం కొంతమేర తగ్గాయి. అయితే దక్షిణాది నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఇన్వెంటరీ అత్యధికంగా ఉంది. బెంగళూరులో 59,244, చెన్నైలో 32,379 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి.పశ్చిమంలోనే ఎక్కువ..దేశంలో భవనాల ఎత్తుపై ఆంక్షలు లేని ఏకైక నగరం హైదరాబాదే. ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడంతో డెవలపర్లు పోటీపడుతూ హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఎకరం, రెండెకరాల స్థలంలోనే రెండు వేలు, మూడు వేల అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. దీంతో ప్రతికూల సమయంలో విక్రయాలు లేక అపార్ట్మెంట్లు ఖాళీగా ఉంటున్నాయి. నగరంలో సగానికి పైగా ఇన్వెంటరీ పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉంది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, మణికొండ వంటి ప్రాంతాలలో డిమాండ్‌కు మించి అపార్ట్మెంట్ల సరఫరా రావడమే ఇందకు ప్రధాన కారణం.నాలాలు, చెరువులంటే భయం..నాలాలు, చెరువులకు సమీపంలో ప్రాజెక్ట్‌ల పేరు వింటేనే కస్టమర్లు జంకుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నా సరే లేక్ వ్యూ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు వెనకడుగేస్తున్నారు. ఎందుకంటే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ ఏ కారణంతో ఎప్పుడు కూలుస్తారో? అక్రమ నిర్మాణం అంటారోనని గృహ కొనుగోలుదారులు వెనుకడుగేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందనో, ఆహ్లాదకర వాతావరణం ఉంటుందనో ధైర్యం చేసి అపార్ట్మెంట్ కొని, బ్యాంక్ ఈఎంఐ భారం భరించడం కంటే లేక్ వ్యూలకు దూరంగా ఉండటమే ఉత్తమమనే అభిప్రాయం కస్టమర్లలో నెలకొంది. దీంతో గతంలో లేక్‌వ్యూ అంటే ఎగబడి కొన్న జనం.. నేడు విక్రయాలు లేక ప్రాజెక్ట్‌లు విలవిల్లాడుతున్నాయి.లేఆఫ్‌లు కూడా కారణమే..స్థిరాస్తి రంగంలో సగానికి పైగా కొనుగోళ్లు ఐటీ సెక్టార్ నుంచే జరుగుతుంటాయి. కృత్రిమ మేధస్సు(ఏఐ) శరవేగంగా దూసుకొస్తుండటంతో ఐటీ విభాగంలో లే ఆఫ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రాపర్టీ విక్రయాలు మందగించాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని అయోమయంలో ఐటీ ఉద్యోగులు అపార్ట్మెంట్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.ఎక్కువ లగ్జరీ ఇళ్ల ఇన్వెంటరీ..రూ.2–3 కోట్ల ధర ఉన్న లగ్జరీ ప్రాజెక్ట్‌లలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉంది. విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు వేచి చూసే ధోరణిలో ఉండటంతో ఈ విభాగంలో ఇన్వెంటరీ పెరిగింది. కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరగడంతో బిల్డర్లు కూడా లగ్జరీ ప్రాజెక్ట్‌లను ఇబ్బడిముబ్బడిగా ప్రారంభించారు. ఇది కూడా ఇన్వెంటరీ పెరిగేందుకు కారణమే. పెరిగిన భూముల ధరల నేపథ్యంలో రూ.60 లక్షల లోపు ధర ఉండే మధ్య తరగతి ఇళ్లను నిర్మించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిమిత సరఫరా కారణంగా ఈ విభాగంలో ఇన్వెంటరీ ఎక్కువగా లేదు. లగ్జరీ సెగ్మెంట్లో డెవలపర్లు పోటీపడి మరీ ప్రాజెక్ట్‌లను చేపట్టడంతో ప్రస్తుతం విక్రయాలు లేక అపార్ట్మెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. -
అదరగొట్టిన ఆఫీస్ స్పేస్.. అందుకే అంత డిమాండ్
దేశంలో ఆఫీసు స్పేస్ లీజింగ్‌లు అదరగొట్టాయి. టారిఫ్‌లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఐటీ, ఐటీఈఎస్ రంగాలలో తొలగింపులు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీసు స్పేస్ డిమాండ్ బలంగానే ఉంది.2025 తొలి తొమ్మిది నెలల్లో దేశంలోని ఏడు నగరాలలో ఆఫీసు స్పేస్ వినియోగ రేటు 4.2 కోట్ల చ.అ.లను అధిగమించింది. గతేడాదితో పోలిస్తే ఇది 34 శాతం అధికం. ప్రధానంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), టెక్ ఆధారిత కంపెనీలు ఇందుకు దోహదపడ్డాయి.ఆఫీసు స్పేస్ వినియోగంలో 99.5 లక్షల చ.అ.లతో బెంగళూరు టాప్‌లో నిలిచింది. తర్వాత ఢిల్లీ–ఎన్సీఆర్లో 82 లక్షల చ.అ., ముంబై 66 లక్షల చ.అ.లతో ఉన్నాయి. మొత్తం లీజింగ్‌లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల 27 శాతం వాటాతో ఆఫీసు స్పేస్ డిమాండ్‌లో అగ్రగామిగా కొనసాగుతుండగా.. కో–వర్కింగ్ స్పేస్‌లు 23 శాతం, బీఎఫ్ఎస్ఐ 18 శాతం వాటాలతో ఉన్నాయి.గతేడాదితో పోలిస్తే ఐటీ రంగంలో ఒక శాతం తగ్గుదల నమోదైంది. జీసీసీలు కీలకమైన డిమాండ్ డ్రైవర్లుగా ఉద్భవించాయి. 2025లో ఇప్పటి వరకు స్థూల లీజింగ్ కార్యకలాపాలలో 40 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు డిమాండ్ అధికంగా ఉంది.డేటా సెంటర్ల సామర్థ్యం పెరుగుదలదేశంలో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 2027 నాటికి రెట్టింపు కానుంది. ప్రాజెక్ట్‌లను వేగవంతం చేస్తే 2030 నాటికి ఐదు రెట్లకు పెరుగుతుందని మెక్వారీ ఈక్విటీ రీసెర్చ్ వెల్లడించింది.డేటా లొకేలైజేషన్ చట్టాలు, సానుకూల నియంత్రణ విధానాలు, ప్రభుత్వ సబ్సిడీలు, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 1.4 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యం ఉండగా.. మరో 1.4 గిగావాట్ల ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయని, నాలుగు గిగావాట్ల ప్రాజెక్ట్‌లు ప్రణాళిక దశలో ఉన్నాయని తెలిపింది. -
ఇళ్ల ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: బలమైన డిమాండ్ నేపథ్యంలో ఇళ్ల ధరలు వచ్చే రెండు దశాబ్దాలపాటు ఏటా 5–10 శాతం మేర పెరుగుతాయని సీఐఐ, కొలియర్స్ ఇండియా సంయక్త నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం వార్షికంగా ఇళ్ల అమ్మకాలు 3–4 లక్షల యూనిట్ల స్థాయిలో ఉండగా, 2047 నాటికి 10 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరతాయని పేర్కొంది. అంటే 2047 నాటికి రెట్టింపు కానున్నట్టు అంచనా వేసింది. పరిశ్రమల మండలి సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా తమ నివేదికను తాజాగా విడుదల చేశాయి. పెరుగుతున్న ఆదాయం, ఇళ్లకు సంబంధించి సానుకూల విధానాలు, పట్టణాలకు వలసలు, ప్రీమియం ఇళ్ల పట్ల ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచి్చస్తుండడం, కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలను సైతం ప్రస్తావించింది. ఇప్పటికే పేరొందిన ముఖ్య నివాస మార్కెట్లకు అదనంగా, టైర్ 2, 3 పట్టణాలు, ఆధ్యాతి్మక కేంద్రాల్లో ఇళ్లకు వచ్చే దశాబ్ద కాలం పాటు డిమాండ్ స్థిరంగా పెరుగుతుందని అంచనా వేసింది. 10 ట్రిలియన్ డాలర్లు.. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం ప్రస్తుతం 0.3 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, 2047 నాటికి 5–10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని సీఐఐ, కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ‘‘మౌలిక వసతుల విస్తరణ రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ రూపురేఖలను మార్చేయనుంది. కొత్త మార్కెట్ల వృద్ధికి అవకాశాలు కలి్పంచనుంది. టైర్–2, 3 పట్టణాలనూ మార్చనుంది. బహుళ ట్రిలియన్ డాలర్ల రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రపంచస్థాయి నిర్మాణాలు, సమగ్ర రవాణా కేంద్రాలు, బలమైన రవాణా పరిష్కారాలు ఇవన్నీ మరింత ప్రముఖంగా మారనున్నాయి’’అని ఈ నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర రవాణా, రహదారుల శాఖ డిప్యూటీ సెక్రటరీ హర్లీన్ కౌర్ పేర్కొన్నారు. మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్ రంగం ఒకదానికి మరొకటి ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘‘ఎక్స్‌ప్రెస్ రహదారులు, పారిశ్రామిక కారిడార్ల అనుసంధానతను పెంచుతాయి. పట్టణాభివృద్దికి దారితీస్తాయి’’అని చెప్పారు. స్థిరమైన వృద్ధికి వీలుగా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా రంగాల్లో టెక్నాలజీ అనుసరణను పెంచాలని సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. -
ఇంటికి వాస్తు బాగుంటేనే సరిపోదు..
సాక్షి, సిటీబ్యూరో: వాస్తు.. ఇంటి ఎంపికలో కీలకం. వాస్తును విశ్వసించేవారు అన్నీ అనుకూలంగా ఉంటే తప్ప కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా నిర్ణయానికి రారు. అయితే ఇంటికి వాస్తు బాగుంటేనే సరిపోదని, పరిసరాల ప్రభావం కూడా ఇంటిపై, అందులోని నివాసితులపై ప్రభావం చూపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇంటి చుట్టుపక్కల, సమీపంలో శ్మశానం, ఆస్పత్రులు ఉంటే కొందరిలో మానసిక ఆందోళనలకు దారితీయవచ్చు. ఏదో రూపంలో ఏదో ఒక సమయంలో మనసుపై ప్రభావం చూపే వీలుంది. లేనిపోని భయాందోళనలకు గురవుతుంటారు. ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే మురుగు కాల్వలు, భారీ శబ్ధాలు చేసే కాలుష్య కర్మాగారాలు వంటివి కూడా నివాసితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకూ వీటికి దూరంగా ఉండటమే ఉత్తమమని చెబుతుంటారు. -
ఇరుకు ఇళ్లకు ఇదే కిటుకు..!
ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గ ఫర్నిచర్‌ను సమకూర్చుకోకుండా ఉండలేం కదా? ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇందుకు పరిష్కారం. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. తలుపు తీయగానే పెద్దపెద్ద వస్తువులు కనిపిస్తే.. మీ ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి.లివింగ్ రూమ్‌కు ఉన్న ద్వారాల మధ్య తిరగడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. అంటే.. మధ్యలో కుర్చీలు ఉంటే వాటి చుట్టూ తిరిగి వెళ్లడం లాంటివి అన్నమాట.సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికోటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి పది అడుగుల దూరంతో ఉంటే బాగుంటుంది. బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యత దెబ్బతింటుంది. కాఫీ టేబుల్, సెంటర్ టేబుల్ వాడకం లివింగ్ రూమ్‌లో సాధారణమే. మ్యాగజైన్లు, వార్త పత్రికలు పెట్టుకునేందుకు వీలుగా వీటికోసం ప్రత్యేకంగా షెల్ఫ్ ఉండే టేబుళ్లను ఎంచుకోండి. లివింగ్‌రూమ్‌లో ఉపయోగించే టేబుళ్లు ఒకదాంట్లో మరోటి అమరిపోయే విధంగా ఉంటే మంచిది. గదిని పెద్దదిగా కన్పించేలా చేయడంలో అద్దాన్ని మించిన సాధనం మరోటి లేదు. వెనకవైపు పచ్చని మొక్కలున్న కిటికీకి ఎదురుగా అద్దం అమరిస్తే.. ఇంటి వెలుపుల ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని లోపలికి తీసుకువస్తున్న భావన కలుగుతుంది. టేబుల్ కింద ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా.. షెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటే, ఏవైనా పెట్టుకోవడానికి అక్కరకొస్తుంది. అవి బయటకు కన్పించకుండా పైన ఓ టేబుల్ క్లాత్ వేయండి.గది చిన్నదిగా ఉంటే పార్టిషన్ జోలికి వెళ్లకండి. ఇలా చేస్తే మరింత చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్‌లో మడిచిపెట్టడానికి అనువుగా ఉండే కుర్చీలు, టేబుళ్లు, సోఫాకమ్ బెడ్, బీన్ బ్యాగ్‌లు వంటి ఫర్నిచర్ నప్పుతాయి.ఇదీ చదవండి: ఇంటి విలువ పెరగాలంటే.. -
ఇంటి విలువ పెరగాలంటే..
గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు.. గ్రేటర్ నగరానికే వన్నె తెచ్చాయి. వేల చదరపు అడుగుల్లో ఉండే క్లబ్‌హౌస్, ఏసీ జిమ్, స్విమ్మింగ్‌పూల్ వంటి సౌకర్యాల్ని సక్రమంగా నిర్వహించడం కత్తిమీద సామే. అయితే నగరానికి చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల్ని స్వయంగా నిర్వహిస్తే.. మరికొన్నేమో.. సదుపాయాల నిర్వహణ సంస్థలకు అప్పగిస్తున్నాయి. నిర్వహణ పక్కాగా ఉండటం వల్ల ఫ్లాట్ల రేట్లు రెట్టింపవుతున్నాయి.నెలసరి నిర్వహణ సక్రమంగా ఉంటేనే ఫ్లాటు విలువ పెరుగుతుంది. క్లబ్‌హౌస్‌లోని జిమ్, టెన్నిస్ వంటి సదుపాయాల కోసం విడిగా రుసుముల్ని చెల్లించాలి. హౌస్‌కీపింగ్, భద్రత, పార్కింగ్, కామన్ ఏరియాలు, విద్యుత్తు, లిఫ్టులు, తాగునీరు వంటి నిర్వహణ పనుల్ని నిర్వహణ సంస్థలే నిర్వహిస్తాయి.ఆధునిక సదుపాయాలు.. ఆహ్లాదకర వాతావరణం.. చిన్నారులు, పెద్దలు, మహిళలు, అందరికీ కావల్సిన అన్ని సౌకర్యాల్ని ఏర్పాటు చేయగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. 2006లో జీవో నం.86 అందుబాటులోకి వచ్చాక నగరంలో ఆకాశహర్మ్యాల సంఖ్య పెరిగింది. ఇవి పూర్తవ్వడానికి మరో మూడేళ్లు పట్టింది.కొన్ని ప్రాజెక్టుల్లో ఆయా సంస్థలు సదుపాయాలు, సౌకర్యాల నిర్వహణను చూసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. నగరంలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవల్ని పక్కగా అందించే సంస్థలు పెద్దగా లేకపోవడమే. అయితే ఇలాంటి సంస్థలకు నిర్వహణ బాధ్యతను అప్పచెబితే నివాసితులపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో కొంతమంది బిల్డర్లే నిర్వహణ బాధ్యతల్ని చేపట్టారు. -
కొత్త ఇంటికి ఏం రంగులేద్దాం.. ఉందిగా ట్రెండింగ్ కలర్!
ఇంటికి రంగులు వేయడం ఒక కళ. జీవితకాలం కష్టపడి సొంతం చేసుకునే సొంతింటికి రంగుల ఎంపిక ఆషామాషీ వ్యవహారం కాదు. కలర్స్ ఇంటికి అందాన్ని, అనుభూతిని తీసుకురావడమే కాదు యజమాని అభిరుచిని, మానసిక స్థితిని తెలియజేసేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.కంటికి, మనసుకు ఆహ్లాదకరమైన రంగులతో రోజువారీ జీవితం రంగులమయం అవుతుంది. మనిషి ఇంద్రియాలు రంగులతో కనెక్ట్ అవుతాయి. స్పర్శ, రుచి, సువాసనలు మనలో భావోద్వేగాలను కలిగిస్తాయి. అందుకే ఇంటీరియర్‌లో రంగులు, వాటి ఎంపికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రకృతి, ఆహార్యం, సువాసన, మృదుత్వం, ప్రకాశవంతం వంటి వాటితో రంగులు నివాసితులు, చూపరులకు సరికొత్త అనుభూతులను అందిస్తుంది.సోలార్ ఎల్లో.. సోలార్ ఎల్లోగా పిలవబడే ఈ రంగు ప్రస్తుతం ఇంటీరియర్‌లో ట్రెండ్‌గా మారింది. సూర్యుని నిజమైన రంగు తెలుపు. కానీ, మన వాతావరణం, దాని కాంతిని వెదజల్లే విధానం కారణంగా భూమి నుంచి చూస్తే సూర్యుని రంగు పసుపు, నారింజ, ఎరుపు రంగులలో కనిపిస్తుంది. అలాగే సోలార్ ఎల్లో రంగు కూడా వాతావరణాన్ని బట్టి రంగులు మారుతున్న అనుభూతిని కల్పిస్తుంది.స్వచ్ఛమైన కాంతి, ప్రకాశవంతంగా ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. లక్కర్డ్ ఫర్నిచర్, గాజు ఫినిషింగ్‌తో కఠినమైన, కాంతిని ప్రతిబింబించే ఉపరితలంగా సోలార్ ఎల్లో అందంగా ఉంటుంది. దీని మెరుపులు, మృదుత్వం ఉల్లాసభరితంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్! -
ఆర్థిక అనిశ్చితి.. స్థిరాస్తి రంగంపై ప్రభావం!
సాక్షి, సిటీబ్యూరో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు, పలు దేశాల నడుమ యుద్ధాలు, ముడి చమురు, బంగారం ధరలు వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. దీని ప్రభావం భారత స్థిరాస్తి రంగంపై పడింది. దేశీయ రియల్టీ రంగంలో విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గాయని వెస్టియాన్ నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయ రియల్టీలోకి 1.76 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అయితే 2025 క్యూ2లోని 1.80 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లతో పోలిస్తే ఇది 2 శాతం తగ్గుదల కాగా.. గతేడాది క్యూ3లోని 0.96 బిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్ మెంట్స్‌తో పోలిస్తే మాత్రం 83 శాతం అధికం.2025 క్యూ3లోని సంస్థాగత పెట్టుబడులలో అత్యధికం వాణిజ్య సముదాయంలోకి వచ్చాయి. 79 శాతం వాటాతో ఈ విభాగంలోకి 1,397.21 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇక, 11 శాతం వాటాతో నివాస సముదాయంలోకి 191.67 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి 85.79 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో డైవర్సివైడ్ విభాగంలోకి 84.82 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. -
రియల్టీకి గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది!
‘ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలేదు. వచ్చింది’ ఇది ఓ పాపులర్ సినిమా డైలాగ్. ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం! ప్రతీ ఆరేడేళ్లకు రియల్టీకి విరామ దశ సాధారణమే. తెలంగాణ ఉద్యమం, సత్యం స్కామ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లెమాన్ బ్రదర్స్ కుప్పకూలడం వంటి వాటితో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో 2007లో మొదలైన హైదరాబాద్ స్థిరాస్తి రంగ పతనం.. 2014 వరకూ కొనసాగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం వరకూ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది. కొత్త రాష్ట్రం, ప్రభుత్వ విధానాలు, కార్యచరణ లపై అస్పష్టత వంటి కారణాలనేకం. ఆ తర్వాత 2015 ప్రారంభంలో మొదలైన రియల్ బూమ్ 2022 వరకూ కొనసాగింది.ఈ మధ్యకాలంలో మార్కెట్లో ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 2023లో ఎన్నికలతో స్థిరాస్తి రంగంలో మొదలైన సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్‌లు, అపరిమిత సరఫరా, ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేకపోవడం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ ప్రతికూల విధానాల వంటి కారణంగా వచ్చే మూడేళ్ల వరకూ విరామ దశలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రియల్టీ రంగంలో ఈ విరామం మంచిదే అంటున్నారు. బిల్డర్లతో రాయితీలు, ఆఫర్లు వంటి బేరసారాలకు అవకాశం ఉంటుందంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇప్పుడు కొనుడే కరెక్ట్పడేటప్పుడు కొంటేనే తక్కువ రేటుకు వస్తుంది. షేర్లలో పెట్టుబడులకు వర్తించే ఈ సూత్రం రియల్టీకి వర్క్ఔట్ అవుతుందని ఓ బడా బిల్డర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్కెట్ బాగాలేనప్పుడు గృహ కొనుగోలుదారులకు మంచి సమయం. బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. మాడ్యులర్ కిచెన్, ఫర్నీచర్, కార్లు వంటి ఆఫర్లు, ఉచిత రిజిస్ట్రేషన్, ధరలో రాయితీలు వంటివి అందుకునే వీలుంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో రెండు రకాల కస్టమర్లు ఉంటారు. ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), పెట్టుబడిదారులైన మొదటి రకంలో వీళ్లంతా పెద్దస్థాయిలో భూములు, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోళ్లు చేస్తుంటారు.ఇక, రెండో రకం రిటైల్ కస్టమర్లు. వీళ్లు సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేస్తుంటారు. మొదటి రకం కొనుగోలుదారులేమో మార్కెట్ బాగాలేనప్పుడు కొనుగోలు చేసి, బాగున్నప్పుడు ఎక్కువ ధరకు విక్రయించేసుకుంటారు. రెండో రకమేమో మార్కెట్ బాగాలేనప్పుడు ధరలు తగ్గుతాయేమోనని భ్రమలో వేచి చూసి, మార్కెట్ బాగున్నప్పుడు ఎక్కువ ధర పెట్టి మరీ కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి స్థిరాస్తి మార్కెట్లో లాభాలు అర్జించాలంటే మొదటి రకాన్ని ఫాలో అవడమే కరెక్ట్. అందుకే ప్రస్తుత సందిగ్ధ వాతావరణంలో గృహాలను కొనుగోలు చేయడమే మంచి నిర్ణయం. ఇలాంటి ప్రతికూల మార్కెట్లోనే ధర, వసతుల విషయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశాలుంటాయి.కొత్త ప్రాజెక్ట్‌లపై పునరాలోచన..విక్రయాలు అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొని పెట్టుకోవడం, నిర్మాణ అనుమతులు తీసుకోవడం చేస్తున్నారే తప్ప ప్రాజెక్ట్ లాంచింగ్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఊహాజనిత మార్కెట్లో భూముల ధరలు పెరుగుతాయే తప్ప అపార్ట్మెంట్ల చ.అ. రేట్లు పెరగవు. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీ ఉంది. నిర్మాణంలో ఉన్న, రెడీగా ఉన్న ఇన్వెంటరీ పోతేగానీ కొత్త యూనిట్లకు అవకాశం ఉండదు. అలాగే ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు కూడా భూముల రేట్లు పెరగడానికి కారణమే. ఎప్పుడైనా సరే స్థిరాస్తి ధరలు స్థిరంగా పెరగాలే తప్ప అమాంతం పెరగకూడదు. రాత్రికి రాత్రే పెరిగే ధరలు గాలిబుడగ వంటివే. ఎప్పటికైనా పడిపోవాల్సిందే లేకపోతే తుది కొనుగోలుదారుల మీద అదనపు భారం తప్పదు.వేలంతో సామాన్యుడిపైనే భారం..హైదరాబాద్‌లో సొంతంగా భూమి కొనుగోలు చేసి, భవన నిర్మాణాలు చేపట్టే డెవలపర్లు చాలా తక్కువ. భూయజమానితో ఒప్పందం చేసుకొని చేపట్టే జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లే ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రాజెక్ట్‌కైనా విక్రయాలు చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని డెవలపర్లు తమ జేబులోంచి వెచ్చించరు. ప్రాజెక్ట్ రుణం, కొనుగోలుదారులకు అపార్ట్మెంట్ల విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతోనే నిర్మాణ పనులు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ మార్కెట్లో 50 వేల యూనిట్ల అపార్ట్మెంట్లు అవసరం ఉంటాయి. సొంత నిధులతో స్థలం భూమి కొనుగోలు చేసి ప్రాజెక్ట్‌లు చేపట్టే వాళ్లు ఎంత వరకు సప్లై చేయగలరు. ఎక్కువ రేటుకు భూములు కొన్నవారు ఆ మేరకు లాభాలపైనే ఫోకస్ చేస్తారు. వేలం వెర్రిగా భూముల వేలంతో మార్కెట్లో సానుకూలత ఏర్పడినా అంతిమంగా ఆ భారం గృహ కొనుగోలుదారులపైనే పడుతోంది. సామాన్య, మధ్యతరగతికి ఇళ్లు అందుబాటులో ఉండవు.ప్రభుత్వం ఏం చేయాలంటే?ఏ పట్టణ ప్రాంతం అభివృద్ధికైనా కావాల్సింది విద్యా, వైద్యం, వినోదం, ఉద్యోగ అవకాశాలు. నగరవాసుల నాణ్యమైన జీవితాన్ని నిర్ణయించేవి ఈ నాలుగే. వీటిల్లో భాగ్యనగరం కేంద్ర బిందువనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్ టూరిజం, ఎడ్యుకేషనల్ హబ్, ఎంటర్టైన్మెంట్ జోన్లకు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి ఉన్న మరో అద్భుతమైన అవకాశం మెరుగైన మౌలిక వసతులున్న అపారమైన భూముల లభ్యత, ఔటర్, మెట్రోలతో కనెక్టివిటీ. దీంతో నగర రియల్టీ మార్కెట్‌కు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి. -
ఆఫీసు అద్దెలు పెరిగాయ్.. ఖాళీలు తగ్గాయ్..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల అద్దెలు 6 శాతం మేర పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో అద్దె చ.అ.కు రూ.85గా ఉండగా.. ఇప్పుడది రూ.90కి చేరింది. అత్యధికంగా బెంగళూరులో 9 శాతం మేర ఆఫీసు అద్దెలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఆఫీసు వేకన్సీలు గతేడాది 16.70 శాతంగా ఉండగా.. ఇప్పుడది 16.20 శాతానికి తగ్గింది.ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ తొమ్మిది నెలల్లో ఏడు నగరాల్లో 4.2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలోని 3.1 కోట్ల చ.అ. లీజులతో పోలిస్తే 34 శాతం అధికం. అలాగే కొత్తగా ఏడు నగరాల్లో 3.9 కోట్ల చ.అ. ఆఫీసు నిర్మాణం పూర్తయింది. గతేడాది 9 నెలల కాలంలోని 3.4 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ.ఐటీ హబ్ హైదరాబాద్‌లో..ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్ లీజులు బాగానే ఉన్నా కొత్త నిర్మాణాలలో క్షీణత నమోదైంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో నగరంలో 57 లక్షల ఆఫీసు లావాదేవీలు జరిగాయి. గతేడాది 9 నెలల్లో 44.2 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే 29 శాతం అధికం. అలాగే భాగ్యనగరంలో కొత్తగా 59 లక్షల చ.అ. ఆఫీసు నిర్మాణాలు పూర్తయ్యాయి. గతేడాది ఇదే కాలంలో పూర్తయిన 96.8 లక్షల చ.అ.లతో పోలిస్తే 39 శాతం క్షీణించింది. ప్రస్తుతం నగరంలో ఆఫీసు వేకెన్సీ 26.50 శాతంగా ఉంది. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. యమా స్పీడు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అపార్ట్మెంట్ల విక్రయాలు, లాంచింగ్స్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని ప్రాప్‌టైగర్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (క్యూ3)లో నగరంలో 17,658 యూనిట్లు అమ్ముడుపోయాయని, గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయమైన 11,564 యూనిట్లతో పోలిస్తే ఇది 52.7 శాతం పెరుగుదల అని పేర్కొంది.అలాగే ఈ క్యూ3లో 12,530 యూనిట్లు లాంచింగ్ అయ్యాయని, గతేడాది ఇదే కాలంలో 8,546 ఫ్లాట్ల లాంచింగ్స్‌తో పోలిస్తే ఇది 46.6 శాతం ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం నగరంలో అపార్ట్మెంట్ల చ.అ. ధర సగటున రూ.7,750గా ఉంది. 2024 క్యూలో ఇది రూ.6,858గా ఉంది.భవిష్యత్తు ఆశాజనకంగా..హైదరాబాద్ స్థిరాస్తి రంగ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని ప్రాప్‌టైగర్ సర్వే అభిప్రాయపడింది. బలమైన, స్థిరమైన ఆర్థిక పునాదులు, ఐటీ రంగ వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి చోదకాలుగా నిలుస్తున్నాయని వివరించింది.అలాగే డిజిటలైజ్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విధానంతో పారదర్శకత, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతున్నాయని పేర్కొంది. అలాగే పాత బస్తీ మెట్రో కారిడార్, రీజినల్ రింగ్ రోడ్లతో భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. -
ట్రాక్ రికార్డును చూశాకే ‘రెరా’ అనుమతి
న్యూఢిల్లీ: బిల్డర్ల (ఇళ్ల ప్రాజెక్టులు నిర్మించే వారు) ట్రాక్ రికార్డును (గత చరిత్ర) పరిశీలించిన తర్వాతే కొత్త ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేసేందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ రెరా చట్టంలో సవరణలు తీసుకురావాలని గృహ కొనుగోలుదారుల సంఘం (ఎఫ్‌పీసీఈ) డిమాండ్ చేసింది.ప్రాపర్టీ కొనుగోలుదారులు యూనిట్ కొనుగోలును రద్దు చేసుకుంటే తిరిగి చెల్లించేందుకు ఏకీకృత నిబంధనను తీసుకురావాలని కోరుతూ ఎఫ్‌పీసీఈ ప్రెసిడెంట్ అభయ్ ఉపాధ్యాయ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. హామీ మేరకు సదుపాయాలు కలి్పంచడంలో బిల్డర్లు విఫలమైతే తగిన పరిష్కారం ఉండాలని కోరారు.ఇదీ చదవండి: రాజీపడితేనే సొంతిల్లు.. లేదంటే సవాలే! -
ఇల్లా, ఫ్లాటా.. వాణిజ్య భవనాల్లో స్థలమా?
ఇల్లా, ఫ్లాటా.. లేక వాణిజ్య భవనాల్లో స్థలమా? దేంట్లో తీసుకుంటే భవిష్యత్తులో ధర పెరగడానికి ఆస్కారముంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఎందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి అందుకోవచ్చు? నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే పెట్టుబడి అనేసరికి, నేటికీ అధికశాతం మంది నివాస గృహాలపై దృష్టి సారిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరోఅందుబాటు ప్రాంతాలిక్కడే.. నివాసమైనా.. వాణిజ్యమైనా.. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతంలో భవనాల్ని చేపడితే.. కొనుగోలుదారులు ముందువరసలో ఉంటారనే విషయం నిర్మాణ సంస్థలకు తెలుసు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల్ని ఎక్కువగా చేపడుతున్నారు. విస్తీర్ణం తక్కువ గల స్థలంలో మదుపు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది.పక్కాగా చూడాలి నగరంలో మొదటి రకం వాణిజ్య సముదాయాల సంఖ్య తక్కువ ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల నుంచి ఇందులో స్థలాలను కొనుగోలు చేయవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టాక వచ్చే అద్దెలపై 30 శాతం రాయితీ లభిస్తుంది. ప్రాపర్టీ మేనేజర్లు గల వాణిజ్య భవనాల్లో కొనడం ఉత్తమం. అప్పుడే ఆదాయానికి ఢోకా ఉండదు. భవిష్యత్తులో ధర పెరుగుదలా ఎక్కువే ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆరు నెలల తర్వాతనైనా వాణిజ్య ఆఫీసు సముదాయాలు అద్దెదారులతో నిండుతాయి. సుమారు ఆరేడేళ్లలోపు వంద శాతం పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశముంది.వాణిజ్య సముదాయాలా? పెట్టుబడి కోణంలో చూసేవారు.. మంచి రాబడిని అందుకోవడానికి.. రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకవని గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోలిస్తే వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టేవారికి, నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది. అయితే ధర మాత్రం కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం అధికంగా ఉంటుంది.ఉదాహరణకు, నివాస సముదాయాల ధర చదరపు అడుగుకి రూ.3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ.5,250 దాకా పెట్టాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉంటాయి. వాణిజ్య నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాలంటే దాదాపు యాభై శాతం సొమ్మును చేతిలో పెట్టుకుంటేనే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గృహరుణాలతో పోలి్చతే వాణిజ్య సముదాయాలను కొనడానికిచ్చే రుణాలపై రెండు నుంచి నాలుగు శాతం దాకా వడ్డీ అధికంగా ఉంటుంది. అలాగని కనిపించిన ప్రతి వాణిజ్య సముదాయంలో పెట్టుబడి పెట్టకూడదు. నివాస సముదాయాలా? మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారు ఎవరైనా.. ముందుగా నివాస సముదాయాన్ని కొనుగోలు చేయాలి. ఆరంభంలో 20 శాతం సొమ్ము కడితే చాలు.. 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. 20–25 ఏళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని చెల్లించే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. విడతలవారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. 20 శాతం సొమ్ముతో ఇల్లు కొనుక్కుంటే చాలు.. ఆరేళ్లలో ఆయా ఇంటి విలువ రెట్టింపవుతుంది. ఏడు లేదా ఎనిమిదేళ్లలో అప్పు మొత్తం తీరిపోయే అవకాశముంది.నివాస సముదాయాల రంగంలో ఏటా 12–15 శాతం ఇంటి విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రాంతంలో.. టైటిల్ క్లియర్‌గా ఉండి, సంబంధిత నివాస సంఘం ప్రాజెక్టును సమర్థంగా నిర్వహిస్తేనే విలువ పెరుగుతుంది. అంతే తప్ప, సంఘ సభ్యులు గొడవపడి, నిర్వహణ గురించి పట్టించుకోకపోతే అంతే సంగతులు. ప్రాజెక్టును సంఘానికి అప్పగించాక నిర్వహణ మెరుగ్గా జరపాలి.ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్! -
ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్!
శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కనిపించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. అనేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూసేందుకు చక్కగా కనిపించడం.. తదితర కారణాలతో వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరోరెండు రకాలు.. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథేన్ కోటింగ్ వేస్తారు. ధర ఎంత? ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీంతో ఇంటిని అలంకరించాలంటే.. చదరపు అడుగుకి రూ.200–రూ.350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ 100 చదరపు అడుగుల గదికి సుమారు రూ.20 వేలు అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కు చదరపు అడుగుకి రూ.300 దాకా అవుతుంది. వెదురు కలప ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ.15 దాకా తీసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్‌ను సులువుగా వేసుకోవచ్చు. ఒక్కరోజులో పని పూర్తవుతుంది. ఈ గచ్చు ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. దీనిపై గీతలు కనిపించవు. కాలిపోవడమంటూ ఉండదు. కొన్నాళ్ల తర్వాత రంగు వెలిసిపోతుందన్న దిగులు అక్కరలేదు. నిర్వహణలో శ్రమపడక్కర్లేదు. బుడతల గదికి ప్రత్యేకం.. సిరాను పీల్చుకునే గుణం వెదురు గచ్చుకి ఉండటం వల్ల.. చాలామంది తమ బుడతల గదుల్లో వాడుతున్నారు. చిన్నారులు కిందపడినా దెబ్బలు తగలవు. హోమ్ థియేటర్లు, పడక గదుల్లోనూ ఈ తరహా గచ్చును కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. సంపన్న గృహాల్లోని బయటి ప్రాంతాల్లోనూ ఈ రకం కలపతో అలంకరిస్తున్నారు. ఉద్యానవనాలు, బాల్కనీలు, స్విమ్మింగ్‌పూల్, పోర్టికోల వద్ద విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం చదరపు అడుగుకి రూ.400 వరకూ అవుతుంది. అన్నిరకాల వాతావరణానికి ఎదురొడ్డి నిలబడం వల్ల వెదురు గచ్చు మీద ప్రత్యేక మక్కువ పెరుగుతోంది. -
రియల్ కదలిక!.. పెరిగిన రిజిస్ట్రేషన్లు
రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్ రంగంలో మళ్లీ కదలిక మొదలైంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ, 2024లో లోక్‌సభ ఎన్నికలకు తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం.. తర్వాత చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేతలతో భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గినప్పటికీ ఇటీవల మళ్లీ ఊపందుకోవడం రియల్ రంగానికి కొంత ఊరటనిస్తోంది.2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 2,48,189 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.3,893.26 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,41,297 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి ద్వారా రూ.3,911.87 కోట్ల ఆదాయం వచ్చింది. 2025 జనవరి నుంచి అక్టోబర్ 20 వరకు 1,98,766 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వానికి రూ.3,381.12 కోట్ల ఆదాయం సమకూరింది.రాయదుర్గం భూముల వేలంతో..రాయదుర్గంలోని పలు భూములకు ఇటీవల హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఆర్థికమాంద్యం కారణంగా ఇప్పటి వరకు ఇక్కడ పెట్టుబడులకు కొంత వెనుకాడిన రియల్ సంస్థలు తాజా వేలంతో మళ్లీ జిల్లాపై దృష్టి సారించాయి.ఇదే సమయంలో ప్రభుత్వం మీర్ఖాన్పేట కేంద్రంగా 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి రూపకల్పన చేయడం, పరిశ్రమలకు అనువైన వా తావరణం కల్పిస్తుండటం తెలిసిందే. ప్రతిష్టాత్మక 550 బడా కంపెనీలను ఇక్కడికి తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించడం, రేడియల్ రోడ్లు, రింగు రోడ్లకు భూ సేకరణ ప్రక్రియను చేపట్టి, ఇప్పటికే ఆయా పనులకు శంకుస్థాపనలు చేయడంతో ఆయా పరిసరాల్లో భూముల కొనుగోళ్లకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ-వేలం: ఇదిగో ఫుల్ డీటెయిల్స్భవిష్యత్తులో ఇక్కడ భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో బడా రియల్టర్లే కాదు సాధారణ ప్రజలు కూడా తమ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ముందే ప్లాట్లు, ఖాళీ స్థలాలు కొనిపెడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ జూలై, ఆగస్టు, సెపె్టంబర్లో రిజి్రస్టేషన్ల సంఖ్య కొంత పెరగడమే ఇందుకు నిదర్శనమని రిజి్రస్టేషన్స్ అండ్ స్టాంప్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. -
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ-వేలం: ఇదిగో ఫుల్ డీటెయిల్స్
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేని నివాసయోగ్యమైన ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం ద్వారా నిర్వహించడానికి తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించేందుకు అనువుగా ఉన్న స్థలాలను (ప్లాట్లను) కొనుగోలు చేయడానికి ఇది మరో చక్కటి అవకాశం అని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వి.పి. గౌతం తెలిపారు.రంగారెడ్డి జిల్లాలోని కుర్మల్ గుడ, తొర్రూర్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతాల్లోని మొత్తం 167 ప్లాట్లకు అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ-వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు. తొర్రూర్‌లో 200-500 చదరపు గజాల విస్తీర్ణంలోని 120 ప్లాట్లకు, కుర్మల్ గుడలో 200-300 చ. గజాల విస్తీర్ణంలోని 29 ప్లాట్లు, అలాగే బహదూర్ పల్లిలో 200 -1000 చ. గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయిస్తున్నామన్నారు.ప్రజలకు చక్కటి వసతులతో కూడిన నివాస భూములను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో భాగంగా పూర్తి పారదర్శకమైన విధానంలో ఈ-వేలం ద్వారా వీటిని విక్రయిస్తున్నామని గౌతం వివరించారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లకు గతంలో బహిరంగ వేలం నిర్వహించగా, ప్రస్తుతం ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ వేలం ద్వారా స్థలాలను కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా ఆన్లైన్లో MSTC పోర్టల్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వేలం పాటల్లో పాల్గొంటున్న బిడ్డర్ల వివరాలు, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఎవరికీ తెలియవని, అందువల్ల కొనుగోలు దారులు స్వేఛ్చగా వేలం ప్రక్రియలో పాల్గొని నచ్చిన ధరకు స్థలాలను కొనుగోలు చేయవచ్చు.ఈ ప్లాట్లన్నీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించబడిన, అభివృద్ధి చెందిన లే అవుట్లలో ఉన్నాయి. తొర్రూర్‌లో సుమారు 100 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి గతంలో నిర్వహించిన వేలం ప్రక్రియలో చదరపు గజం భూమి ధర గరిష్టంగా రూ. 67,500 వేల వరకు పలికి ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయినప్పటికీ ప్రస్తుత నోటిఫికేషన్లో చదరపు గజానికి కనీస ధర రూ.25 వేలు ఉండనుంది.కుర్మల్ గుడలో సైతం గతంలో చదరపు గజానికి సుమారు రూ.29 వేల ధర పలికినప్పటికీ, ప్రస్తుత కనీస ధర రూ.20 వేలుగా నిర్ధారించారు. బహదూర్ పలిల్లో సైతం గతంలో ఆఫ్సెట్ ధర కంటే చాలా అధికంగా రూ.47 వేల వరకు చదరపు గజం ధర పలికినా గతంలోని కనీస ధరలకే (కార్నర్ ప్లాట్లు రూ.30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు) ప్రస్తుతం కూడా విక్రయిస్తున్నట్లు ప్రకటించారు.ఈ-వేలం షెడ్యూల్ కుర్మల్ గుడ, బహదూర్ పల్లిలోని ఫ్లాట్లకు MSTC పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబరు 27. కాగా అక్టోబరు 28వ తేదీ ఉదయం కుర్మల్ గుడలోని 29 ప్లాట్లకు, మధ్యాహ్నం బహదూర్ పల్లిలోని 18 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహిస్తారు. అలాగే తొర్రూర్‌లోని 120 ప్లాట్ల కొనుగోలు దారులు 28వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి 29, 30 తేదీల్లో ఒక్కో సెషన్లో30 ప్లాట్లు చొప్పున మొత్తం నాలుగు సెషన్లలో వేలం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.ఇదీ చదవండి: 2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!: అనరాక్ రీసెర్చ్ -
విల్లాలకు అమ్మకాల కళ.. ఫ్లాట్స్ కంటే డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: కొంత కాలంగా అపార్ట్మెంట్లోని ఫ్లాట్లకంటే విల్లాలు, వ్యక్తిగత గృహాలకు ఆదరణ పెరిగింది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం మూలంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయని అనరాక్ గ్రూప్ సర్వే వెల్లడించింది. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయని పేర్కొంది.పశ్చిమంలోనూ హవా..హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోపశ్చిమాది ప్రాంతాల హవా కొనసాగుతోంది. మూడు త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి. వెస్ట్ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.ఇదీ చదవండి: 2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!: అనరాక్ రీసెర్చ్ -
రాజీపడితేనే సొంతిల్లు.. లేదంటే సవాలే!
విషయం ఏదైనా సరే.. కోరుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. ఇళ్ల కొనుగోలుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బడ్జెట్, చిక్కుల్లేని యాజమాన్య హక్కు, ప్రాంతం, వాస్తు, నీరు, విద్యుత్తు సరఫరా అంశాలు ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే వీటిలో కొన్ని అంశాలు మనం ఆశించినట్లు ఉండకపోవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే సొంతింటి స్వప్నం ఓ పెద్ద సవాలే అవుతుంది. అలాగనీ ముఖ్యమైన అంశాల్లోనూ రాజీ పడాలని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఒకటి, రెండు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏయే విషయాల్లో రాజీ పడొచ్చు.. ఎక్కడ పడకూడదో స్పష్టత ఏర్పర్చుకోవాలి. – సాక్షి, సిటీబ్యూరోఇల్లు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అది కూడా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అనుకుంటున్నారా? ఇక్కడ వీలవ్వకపోతే మియాపూర్, మదీనాగూడ, మణికొండ, ఓయూ కాలనీ తదితర ప్రాంతాల్లో.. కొంచెం తక్కువ ధరలో దొరికే ప్రాంతాలపై దృష్టి పెడతారు అవునా? ప్రస్తుత రియల్టీ మార్కెట్లో సంపన్నులకే కాదు మధ్యతరగతి, సామాన్యులు.. ఇలా వివిధ వర్గాల వారికి స్థోమతకు తగ్గ బడ్జెట్లో నగరం చుట్టూ గృహసముదాయాలు వస్తున్నాయి. మీరు కొంచెం కసరత్తు చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్ని అన్వేషిస్తే చాలు, మీకు అందుబాటు ధరలో ఇళ్లు ఎక్కడ దొరికేది ఇట్టే తెలిసిపోతుంది.సదుపాయాల సంగతేంటి?నిర్మాణాల విషయంలో డెవలపర్ల వ్యూహం మారింది. సకల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇల్లు కొనాలన్న నిర్ణయానికొచ్చాక సదుపాయాల సంగతి కూడా ఆలోచించాలి. క్లబ్‌హౌజ్, జిమ్ అవసరమా? వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఈ సదుపాయాలు అక్కర్లేదా? అన్నది తేల్చుకోవాలి. జీవనశైలి, బడ్జెట్ తదితర అంశాలు మీ నిర్ణయంపై ప్రభావితం చేస్తాయి. కాబట్టి సదుపాయాల విషయంలో స్పష్టత ఉండాలి. బిల్డర్‌కు మంచి పేరుందా? స్థిరాస్తి కొనేటప్పుడు బిల్డర్ గురించి కూడా ఆరా తీయాలి. మార్కెట్లో పేరున్న బిల్డర్లు నిర్మించే ఇళ్లకే ప్రాధాన్యమివ్వాలి. గతంలో అతను నిర్మించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయా? నిర్మాణం ఎలా ఉంది? ఒప్పందం మేరకు కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పించాడా? కార్పస్ ఫండ్ బదిలీలో ఇబ్బందులేమైనా సృష్టించాడా? అన్న విషయాల్ని తెలుసుకోవాలి. నిర్మాణాల్లో మంచి చరిత్ర లేని బిల్డర్లకు దూరంగా ఉండటమే మేలు. అలాగనీ మార్కెట్లో పేరున్న బిల్డర్ల ప్రాజెక్టులకే పరిమితం కానక్కర్లేదు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఒప్పందానికి కట్టుబడి ఉండేవారిని ఎంచుకోవచ్చు.పరిసరాలెలా ఉన్నాయి?ఇంటి ముందు పచ్చటి తోటతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరేమో ఇలాంటి హంగులు లేకున్నా సర్దుకుపోతారు. బాల్కనీని పచ్చగా, అందంగా అలంకరించుకుంటే గార్డెన్‌కు ధీటుగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీ దృక్పథం ఏమిటో నిర్ణయించుకోవాలి. -
2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!: అనరాక్ రీసెర్చ్
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్) పెట్టుబడులలో కార్యాలయ విభాగం అగ్రగామిగా ఉంటుంది. అయితే కొంత కాలంగా రీట్స్ ఇన్వెస్ట్మెంట్స్ క్రమంగా రిటైల్ విభాగంలో కూడా వెల్లువెత్తుతున్నాయి. షాపింగ్ మాల్స్, సెంటర్లు, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్ట్‌లలో రీట్స్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. నాణ్యమైన రిటైల్ స్పేస్ అందుబాటులోకి వస్తుండటం, కొనుగోలుదారుల వ్యయం పెరగడం, పట్టణ ప్రాంతాల్లో ఆదాయ వృద్ధి, స్థిరమైన ఆదాయ వనరుగా మారడం వంటివి రిటైల్ రంగంలో రీట్స్ పెట్టుబడులకు ప్రధాన కారణాలని అనరాక్ రీసెర్చ్ నివేదిక తెలిపింది.దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్) పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. 2030 నాటికి దేశీయ రిట్స్ రూ.2 లక్షల కోట్లకు చేరుతాయని అనరాక్ రీసెర్చ్ అంచనా వేసింది. ఇందులో 30-40 శాతం వాటా రిటైల్ రంగానిదే ఉంటుందని తెలిపింది. 2030 నాటికి రిటైల్ రీట్స్ రూ.60–80 వేల కోట్లుగా ఉంటాయని పేర్కొంది.ఆదాయ వనరుగా..గ్రేడ్–ఏ షాపింగ్ మాల్స్ స్థిరమైన ఆదాయ వనరుగా మారడంతో పెట్టుబడిదారులు రిటైల్ విభాగంలో రీట్స్ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే 3–5 ఏళ్లలో 2–3 రిటైల్ రీట్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఐదు రిటైల్ రీట్స్ నమోదు కాగా.. ఇందులో నెక్సస్ ఒక్కటే రిటైల్ కేంద్రీకృత రీట్స్ కాగా.. మిగిలిన నాలుగు కార్యాలయ కేంద్రీకృత రీట్స్. కొత్త షాపింగ్ మాల్స్‌లో సగానికి పైగా స్థలం రిటైల్ కేంద్రాలే ఉంటున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలలో సంస్థాగత పెట్టుబడులు వస్తుండటంతో రీట్స్ పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఫీనిక్స్ మైల్స్, ప్రెస్టిజ్ ఎస్టేట్స్, నెక్సస్ మాల్స్ వంటి ప్రధాన సంస్థలు ఇండోర్, కోయంబత్తూరు, సూరత్, భువనేశ్వర్, చంఢీఘడ్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. -
భారత్‌లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో..
ఒక దేశంలో అధిక ఇళ్లు ఉండి.. కొనుగోలుదారులు లేక సంక్షోభంలో కూరుకుపోతుంటే, మరో దేశంలో కోట్లాదిమందికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. చైనాలో దాదాపు 90 శాతం మంది ప్రజలకు సొంత ఇళ్లు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. భారతదేశంలో మాత్రం 31 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలకు ఇంకా సొంత గూడు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మన దేశ గృహనిర్మాణ రంగాన్ని, దాని చుట్టూ అల్లుకున్న సవాళ్లకు ఇది అద్ద పడుతుంది. అసలు చైనాలో ఇంత అధిక సంఖ్యలో ప్రజలకు సొంతిల్లు ఉండటానికి కారణాలేమిటి? అదే సమయంలో భారత్‌లో సొంతింటి కల ఎందుకు సాకారం కావడం లేదో కారణాలను పరిశీలిద్దాం.చైనాలో సొంతిల్లు ఉండటానికి కారణాలుగత ప్రభుత్వ విధానాలు, మార్కెట్ సంస్కరణలు1998కు ముందు చైనాలో పట్టణ గృహనిర్మాణ రంగం దాదాపు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. 1998లో ప్రభుత్వం గృహనిర్మాణ సంస్కరణలను చేపట్టి ప్రజలు ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. అంతకుముందు ఉన్న ఇళ్లను అతి తక్కువ ధరలకు ఇతరులకు విక్రయించారు. దాంతో పెద్దమొత్తంలో సొంతింటి కల నెరవేరింది.సంపద పోగుచేసుకోవడంలో..చైనాలో ప్రజలు సంపదను పోగుచేయడానికి ఇళ్లను అత్యంత సురక్షితమైన, ప్రధాన సాధనంగా భావిస్తారు. విదేశీ పెట్టుబడులకు ఇతర మార్గాలు పరిమితంగా ఉన్నప్పుడు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ఒక సాంప్రదాయక పద్ధతిగా మారింది. ఇది ఇళ్ల కొనుగోలుకు ఉన్న డిమాండ్‌ను భారీగా పెంచింది.పట్టణీకరణవేగవంతమైన పట్టణీకరణ కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు తరలివచ్చారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి స్థానిక ప్రభుత్వాలు భూమిని స్థిరాస్తి డెవలపర్లకు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకున్నాయి. డెవలపర్లు భారీ స్థాయిలో గృహ నిర్మాణాలను చేపట్టారు. కొన్ని సందర్భాల్లో ఇది జనాభా అవసరాల కంటే అధిక సంఖ్యలో ఇళ్లను నిర్మించడానికి దారితీసింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో అధిక గృహ లభ్యత ఏర్పడింది.Breaking🇨🇳90% of people in China now own their own homes.Most Homeless People (2025)🇮🇳 India – 3.1M+🇺🇸 United States – 580K+🇳🇬 Nigeria – 500K+🇷🇺 Russia – 440K+🇵🇭 Philippines – 420K+🇧🇷 Brazil – 390K+🇮🇩 Indonesia – 380K+🇲🇽 Mexico – 320K+🇿🇦 South Africa – 280K+🇫🇷… pic.twitter.com/ZykA0EBKMX— World updates (@itswpceo) October 22, 2025భారత్‌లో ఇలా..స్థిరాస్తి ధరలు అధికం, ఆదాయాలు తక్కువపట్టణ ప్రాంతాల్లో భూమి, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయ వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో సిటీలు, టైర్-1 నగరాల్లో ఇది ప్రధాన సమస్య.బ్యాంక్ రుణాలు, ఫైనాన్సింగ్ సవాళ్లుగృహ రుణాలు అందుబాటులో ఉన్నప్పటికీ రుణం కోసం అవసరమయ్యే భారీ డౌన్ పేమెంట్‌ను చెల్లించలేని పరిస్థితులున్నాయి. తక్కువ ఆదాయ వర్గాల వారికి బ్యాంకు రుణాలు పొందడంలో కఠినమైన షరతులు, క్రెడిట్ హిస్టరీ లేకపోవడం అడ్డంకులుగా మారుతున్నాయి.భూమి కొరత, భూ సేకరణ సమస్యలుపెరుగుతున్న జనాభాకు సరిపడా భూమి లభ్యత లేదు. పట్టణ ప్రాంతాల్లో భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది గృహనిర్మాణ ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతున్నాయి. భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివాదాలు కూడా ప్రాజెక్టుల ఆలస్యానికి, ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.సామాజిక కారణాలుపట్టణ వలస, మురికివాడలుమెరుగైన ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిరంతరం నగరాలకు వలస వస్తున్నారు. ఈ వలసలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యత, మౌలిక వసతులు లేకపోవడం వల్ల మురికివాడలు (స్లమ్స్) ఏర్పడుతున్నాయి. ఈ వర్గాలకు సొంతింటి కల సుదూరంగానే ఉంటోంది.ప్రభుత్వ పథకాల అమలు సవాళ్లుకేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)’ వంటి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లబ్ధిదారులను గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఇది పథకాల అమలు ఆలస్యం అవ్వడానికి కారణమవుతోంది.మౌలిక వసతుల లేమిప్రభుత్వం నిర్మించే తక్కువ ధర గృహాలు కొన్నిసార్లు నగరాలకు దూరంగా ఉంటున్నాయి. చాలావరకు కనీస మౌలిక వసతులు (రవాణా, నీరు, విద్యుత్) అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు.భారత్‌లో సొంతింటి కలను సాకారం చేయాలంటే ప్రభుత్వాలు తక్కువ ఆదాయ వర్గాలకు తగినంత ఫైనాన్సింగ్ సహాయం అందించాలి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడం, పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యతను పెంచడం వంటివి చేయాలి. భూమి ధరల పెరుగుదలను నియంత్రించడం వంటి సమగ్ర విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: 400 సెల్ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా? -
ఇండిపెండెంట్ ఇల్లు Vs అపార్ట్మెంట్లో ఫ్లాట్
సొంత ఇల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలను నెరవేర్చుకునే క్రమంలో చాలా మంది వ్యక్తిగత ఆర్థిక స్థోమతను, భవిష్యత్తు అవసరాలను పక్కన పెడుతున్నారు. సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానంగా లేదంటే సామాజంలో హోదాను పెంచుకోవాలనే ఆరటంలో ఇండిపెండెంట్ ఇంటి (Individual House) కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సరైన ఆర్థిక స్థోమత లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. భారీ ఈఎంఐలు, నిర్వహణ ఖర్చులు భరించలేక చివరికి ఆ ఇల్లు ఒక ‘ఖరీదైన అప్పు’గా మారి అభద్రతను మిగులుస్తుంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించుకోవడానికి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయడం ఒక ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.1. కొనుగోలు వ్యయం, అప్పుల భారంఅంశంఇండిపెండెంట్ ఇల్లు (ప్లాట్ + నిర్మాణం)అపార్ట్మెంట్ ఫ్లాట్ప్రారంభ వ్యయంసాధారణంగా చాలా ఎక్కువ. స్థలం కొనుగోలు, నిర్మాణ వ్యయం, అనుమతులు, ఇతర ఖర్చులు.ఇండిపెండెంట్ ఇంటి కంటే వ్యయం తక్కువ. నిర్మాణ వ్యయం ఇందులో భాగమవుతుంది.అప్పుల భారంఅధిక వ్యయం కారణంగా గృహ రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఇది దశాబ్దాల పాటు ఆర్థిక స్వేచ్ఛను అడ్డుకుంటుంది.తక్కువ వ్యయం కాబట్టి తక్కువ రుణం సరిపోతుంది. EMIలు తక్కువగా ఉంటాయి.నిర్మాణ సమయంసొంతంగా నిర్మాణం చేపట్టాలి కాబట్టి, సమయం, శ్రమ, ఒత్తిడి అధికం.నిర్మాణం పూర్తైన ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తే ఒత్తిడి ఉండదు. 2. నిర్వహణ, జీవనశైలి వ్యయంఅంశంఇండిపెండెంట్ ఇల్లుఅపార్ట్మెంట్ ఫ్లాట్నిర్వహణభవనం, పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి అన్ని బాధ్యతలు ఉంటాయి.సాధారణ నిర్వహణ అనేది అపార్ట్మెంట్ అసోసియేషన్ చూసుకుంటుంది. నెలవారీ ఛార్జీ తక్కువగా ఉంటుంది.భద్రతసొంతంగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి (CCTV, వాచ్మెన్ మొదలైనవి).సామూహిక భద్రత (సెక్యూరిటీ గార్డులు) ఉంటుంది.సౌకర్యాలుసౌకర్యాలు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి (బోర్, జనరేటర్ మొదలైనవి).సామూహిక సౌకర్యాలు (జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, జనరేటర్ బ్యాకప్) తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఇంటి కొనుగోలు అనేది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు. అది ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం. ఇండిపెండెంట్ ఇల్లు అనేది వ్యక్తిగత గౌరవాన్ని పెంచినా అది ఆర్థికంగా కొన్నిసార్లు భారం అవ్వొచ్చు. ఆర్థికంగా బలహీనపడి సొంత ఇంటికి వాచ్‌మెన్‌గా మారడం కంటే స్థోమతకు తగ్గ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఆర్థికంగా స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించడమే అత్యంత ఆచరణాత్మకమైన నిర్ణయం అనేది కొందరి అభిప్రాయం.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
రాయదుర్గ్‌లో భూముల వేలం.. కాసుల వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని రాయదుర్గ్‌లో భూముల వేలం కాసుల వర్షం కురిపిస్తుండటంతో మరిన్ని భూముల వేలానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల మొదటి వారంలో రెండు ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలంలో ఎకరా ధర గరిష్టంగా రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. సుమారు 19 ఎకరాలకు నిర్వహించిన ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.3,135 కోట్లు సమకూరాయి.ఈ నేపథ్యంలో రాయదుర్గ్‌లోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ లే ఔట్లో వచ్చే నెల 10న సుమారు ఎకరా భూమిని వేలం వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేసింది. వేలం ప్రక్రియ, ఇతర అంశాలపై ఔత్సాహిక కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న రాయదుర్గ్‌లోని టీ హబ్‌లో (t-hub) ప్రీబిడ్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లించేందుకు నవంబర్ 4ను గడువుగా నిర్దేశించారు.ఎకరా రూ.200 కోట్లు? రాయదుర్గ్ (Raidurg) పాన్మక్తాలోని సర్వే నంబరు 83/1లోని 14ఏ/1, 14బీ/1 ప్లాట్లను టీజీఐఐసీ వేలం వేస్తోంది. ఈ రెండు ప్లాట్ల విస్తీర్ణం కలుపుకుని 4,718.22 చదరపు గజాలు (సుమారు ఎకరా విస్తీర్ణం) కాగా, ఒక్కో చదరపు గజం అప్సెట్ ధరను (వేలం ప్రారంభ ధర)ను రూ.3.10 లక్షలుగా, ఎకరా ధరను సుమారు రూ.146 కోట్లుగా నిర్ణయించింది. వేలం పాటలో ఎకరా ధర రూ.200 కోట్ల మార్క్‌ను అధిగమించే అవకాశముందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇటీవలి వేలంలో 17 మంది బిడ్డర్లు పోటీ పడిన నేపథ్యంలో తాజా వేలానికి కూడా భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రాయదుర్గ్‌లో టీజీఐఐసీ (TGIIC) అదీనంలో 470 ఎకరాలు ఉండగా, గడిచిన దశాబ్ద కాలంలో 200 ఎకరాలకుపైగా విక్రయించారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో మరో పది ఎకరాల మేర వేలానికి సిద్ధంగా ఉండగా, 50 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో కోర్టు వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా టీజీఐఐసీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.చదవండి: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్ -
రియల్టీలో బ్లాక్‌మనీ చక్కర్లు.. ఎలాగంటే..
రియల్ ఎస్టేట్ రంగాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. అయినప్పటికీ ఈ రంగం దశాబ్దాలుగా నల్లధనం (Black Money) లేదా లెక్కల్లో చూపని ధనం ప్రవాహానికి ప్రధాన వేదికగా మారిందనే వాదనలున్నాయి. ఇక్కడ జరిగే కొనుగోళ్లు, అమ్మకాలు, పెట్టుబడుల్లో గణనీయమైన భాగం నగదు రూపంలోనే జరుగుతుండటం దీనికి ముఖ్య కారణం. డిజిటలైజేషన్ అని చెప్పుకుంటున్న, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు వచ్చినా ఈ విభాగంలో ఇప్పటికీ చాలా వరకు నగదు రూపంలోనే లావాదేవీలు జరుగుతున్నాయనేది వాస్తవం. రియల్టీ రంగంలో నల్లధనం ఎలా ప్రవహిస్తుంది, అందుకు గల కారణాలు, దాని ప్రభావాలను విశ్లేషిద్దాం.నల్లధనం ప్రవాహం ఎలా జరుగుతుంది?సాధారణంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు రెండు రకాలుగా విభజిస్తారు. అధికారిక లావాదేవీలు.. ఇది బ్యాంక్ ద్వారా చెక్, ఆన్లైన్ బదిలీ (RTGS/NEFT) రూపంలో చెల్లిస్తారు. ఈ మొత్తం ప్రభుత్వ రికార్డులలో నమోదు చేయబడి, దీనిపై కొనుగోలుదారు, విక్రేత పన్నులు చెల్లిస్తారు. డాక్యుమెంట్లలో, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చూపించే ధర ఇదే.నగదు లావాదేవీఇది అధికారిక పత్రాల్లో చూపకుండా కొనుగోలుదారు నేరుగా విక్రేతకు నగదు రూపంలో ఇచ్చే మొత్తం. ఈ లావాదేవీ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు లేదా ప్రభుత్వానికి తెలియజేయరు. మార్కెట్ ధర, డాక్యుమెంట్ ధర మధ్య ఉన్న వ్యత్యాసం ఈ నల్లధనం.ప్రవాహ విధానంకొనుగోలు దశ: ఒక కొనుగోలుదారు తాను దాచుకున్న నల్లధనాన్ని ఉపయోగించి ఒక ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఆస్తి యజమానికి డాక్యుమెంట్లో ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తాన్ని (అదనపు నగదు) చెల్లిస్తారు. ఈ అదనపు మొత్తం కొనుగోలుదారు నల్లధనంగా ఉంటుంది. ఇదే తర్వాత కాలంలో ఆస్తి యజమానికి సైతం నల్లధనంగా మారుతుంది.అమ్మకం దశ: కొనుగోలుదారు ఆస్తిని అమ్మే సమయానికి ఆ ఆస్తి విలువ పెరిగి ఉంటుంది. అప్పుడు అతను కొత్త కొనుగోలుదారు నుంచి మార్కెట్ విలువ ప్రకారం ధరను తీసుకుంటాడు. ఇందులో కొంత భాగం అధికారికంగా లెక్క చూపినా పెరిగిన విలువలో ఎక్కువ భాగం నగదు రూపంలో (నల్లధనం) తీసుకునేందుకు మొగ్గు చూపుతాడు. ఆస్తి అమ్మే సమయానికి పన్ను ఎగవేత కోసం ఇది నల్లధనంగా మారుతుంది.నిర్మాణం/డెవలప్మెంట్: రియల్ ఎస్టేట్ డెవలపర్లు భూమి కొనుగోలు, నిర్మాణ సామగ్రి, కార్మికుల వేతనాలు వంటి వాటిలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహిస్తారు. ఇది వారికి లెక్కల్లో చూపని ఆదాయం (నల్లధనం) సృష్టించడానికి అవకాశం ఇస్తుంది.ప్రధాన కారణాలుఅధిక స్టాంప్ డ్యూటీ, పన్నులుఆస్తుల రిజిస్ట్రేషన్, అమ్మకాలపై ప్రభుత్వాలు విధించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) చాలా ఎక్కువగా ఉండటం. ఈ అధిక పన్నులను తప్పించుకోవడానికి కొనుగోలుదారులు, విక్రేతలు ఇద్దరూ డాక్యుమెంట్లలో ఆస్తి విలువను తక్కువగా చూపించి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో లావాదేవీ చేస్తారు.ధరల్లో వ్యత్యాసంప్రభుత్వం నిర్ణయించిన సర్కిల్ రేటు కంటే మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉండటం. విక్రేత మార్కెట్ ధరను డిమాండ్ చేసినప్పుడు కొనుగోలుదారు స్టాంప్ డ్యూటీని ఆదా చేసుకోవడానికి సర్కిల్ రేటుకు మాత్రమే డాక్యుమెంట్ చేయించి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తాడు.దాచుకునే అవకాశంనల్లధనం (లెక్కల్లో చూపని ఆదాయం) ఉన్న వ్యక్తులకు ఆ డబ్బును సులభంగా, సురక్షితంగా దాచుకోవడానికి రియల్ ఎస్టేట్ ఒక ఉత్తమ మార్గంగా కనిపిస్తుంది. నల్లధనాన్ని ఆస్తి రూపంలోకి మార్చడం ద్వారా వారు దానిపై వడ్డీ లేదా పన్ను చెల్లించకుండా తప్పించుకుంటారు.రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత లేకపోవడం. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) వంటి వ్యవస్థలు ఉన్నా పాత లేదా వ్యక్తిగత ఆస్తుల కొనుగోలు, అమ్మకాలలో నగదు ప్రవాహాన్ని నియంత్రించే యంత్రాంగం బలహీనంగా ఉందనే వాదనలున్నాయి. రియల్ ఎస్టేట్‌లో తరచుగా ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ఈ లాభాలపై పన్నులు కట్టకుండా ఉండటానికి విక్రేతలు నగదు రూపంలో అమ్మకాలు జరపడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.పరిణామాలు ఇలా..రియల్ ఎస్టేట్‌లో నల్లధనం ప్రవాహం అనేక ఆర్థిక, సామాజిక సమస్యలకు దారితీస్తుంది. నల్లధనం వల్ల వాస్తవ మార్కెట్ ధర కృత్రిమంగా పెరుగుతుంది. మధ్యతరగతి, పేద ప్రజలకు ఇల్లు కొనుగోలు చేయడం కష్టమవుతుంది. పన్ను ఎగవేత కారణంగా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మూలధన లాభాల పన్ను రూపంలో రావాల్సిన ఆదాయం కోల్పోతుంది. నల్లధనం ప్రవాహం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ రంగంలోని అధికారులకు లంచాలు ఇచ్చి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటి అవినీతి కార్యకలాపాలకు ఇది ఆజ్యం పోస్తుంది.ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే.. -
తేలికగా, దృఢంగా, వేగంగా, ఖర్చు తక్కువగా..
ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే నిరంతరం పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు సామాన్యులకు ఒక సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టేందుకు అనుసరించే సంప్రదాయ పద్ధతులు, ఖర్చు తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలు, కొత్త సాంకేతికతలపై సమగ్ర అవగాహన అవసరం.సంప్రదాయ విధానంభారతదేశంలో ఇళ్లు కట్టడానికి శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులు ప్రధానంగా స్థానికంగా లభించే వస్తువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. కాల్చిన ఎర్ర ఇటుకలు, సిమెంటు, ఇసుక మిశ్రమంతో (మోర్టార్) గోడలను నిర్మించడం.. దీనిపై కాంక్రీటు (RCC) స్లాబ్‌తో పైకప్పు వేయడం సాధారణంగా వస్తున్న ఆనవాయితి. ఇది దృఢమైన, మన్నికైన పద్ధతి. ఇటుక గోడలు ఉష్ణ బంధకాన్ని (Thermal Insulation) అందించి వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. అయితే దీని నిర్మాణం శ్రమతో కూడుకుంది. సమయం ఎక్కువ పడుతుంది. పునాది ఖర్చు ఎక్కువ. ఇటుకల తయారీ పర్యావరణంపై ప్రభావం చూపుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో మట్టి, గడ్డి, వెదురు, కలప, రాళ్లను ఉపయోగించి ఇళ్లను నిర్మించేవారు. కచ్చా ఇళ్లుగా పిలిచే ఈ విధానంలో ‘కాబ్’ (మట్టి, గడ్డి మిశ్రమం), ‘అడోబ్’(ఎండబెట్టిన మట్టి ఇటుకలు) వంటి పద్ధతులను వాడేవారు. వీటికి ఖర్చు తక్కువ. వీటి వల్ల పర్యావరణహితం, ఉష్ణ నియంత్రణ (Thermal Regulation) ఉంటుంది. అయితే వీటి మన్నిక తక్కువ. తరచుగా మరమ్మత్తులు అవసరం. భారీ వర్షాలకు అంతగా నిలబడవు.రాతి నిర్మాణంస్థానికంగా లభించే రాళ్లను సున్నం లేదా మట్టి మోర్టార్తో కలిపి గోడలు కట్టేవారు. ఇవి దృఢమైనవి. దీర్ఘకాల మన్నిక, సహజ ఉష్ణ బంధక సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటి నిర్మాణానికి ఎక్కువ శ్రమ అవసరం. ఎక్కువ సమయం పడుతుంది.ఇంటి నిర్మాణ వ్యయం తగ్గించే పద్ధతులునిర్మాణ సాంకేతికతలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఖర్చును తగ్గించి, సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి.ప్రిఫ్యాబ్రికేషన్, మాడ్యులర్ నిర్మాణంగోడలు, పైకప్పు స్లాబులు, కిటికీలు వంటి భవన భాగాలను ఫ్యాక్టరీలో ముందుగా తయారు చేయించి ఆపై నిర్మాణ స్థలంలో వాటిని నేరుగా బిగించవచ్చు. దీంతో నిర్మాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. శ్రమ తక్కువ. నాణ్యతలో స్థిరత్వం ఉంటుంది. వ్యర్థాలు తగ్గుతాయి.ఇన్సులేటెడ్ కాంక్రీట్ ఫారమ్లుఇది థర్మాకోల్ లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్‌తో చేసిన బోలు బ్లాకులను ఉపయోగించి గోడలను నిర్మించే విధానం. ఈ బోలు బ్లాకుల మధ్య తర్వాత కాంక్రీటు పోస్తారు. దీని వల్ల గోడలకు అధిక ఇన్సులేషన్ (ఉష్ణ బంధకం) లభిస్తుంది. ఇంట్లో ఉష్ణోగ్రత నియంత్రణ సులభమై ఎయిర్ కండీషనర్ల వినియోగం, తద్వారా విద్యుత్ బిల్లులు తగ్గుతాయి.స్టీల్ ఫ్రేమ్ నిర్మాణంస్టీల్ కాలమ్స్, బీమ్‌లను ఉపయోగించి భవనానికి ప్రధాన ఫ్రేమ్‌ను నిర్మించే విధానం. ఈ నిర్మాణం తేలికగా, దృఢంగా ఉంటుంది. భూకంపాలను తట్టుకోగలదు. నిర్మాణ సమయం తక్కువ.ఫ్లై యాష్ ఆధారిత ఇటుకలు/ బ్లాకులుథర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వ్యర్థ పదార్థం (ఫ్లై యాష్), ఇతర బైండర్లను ఉపయోగించి ఇటుకలు, బ్లాక్‌లను తయారు చేసే విధానం. ఉదాహరణకు ఏఏసీ బ్లాక్‌లు. ఇవి సాంప్రదాయ ఇటుకల కంటే తేలికైనవి. మెరుగైన ఉష్ణ బంధకాన్ని అందిస్తాయి. సిమెంట్ వినియోగాన్ని తగ్గిస్తాయి. పర్యావరణహితమైనవి.ఇంటి నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కేవలం వస్తువుల ధరలు మాత్రమే కాకుండా నిర్మాణ ప్రణాళిక, డిజైన్, సాంకేతికతలో మార్పులు తీసుకురావడం ముఖ్యం. సంప్రదాయ నిర్మాణ పద్ధతుల్లోని మన్నికను, స్థానిక వస్తువుల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూనే ప్రిఫ్యాబ్రికేషన్, ఏఏసీ బ్లాక్‌లు, సమర్థవంతమైన డిజైన్ వంటి ఆధునిక, తక్కువ ఖర్చు పద్ధతులను అనుసరించడం ద్వారా కలల ఇంటిని నిర్మించుకోవచ్చు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
ఇల్లు కొనాలంటే.. చుట్టుపక్కల ఇవి ఉండాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణలోకి తీసుకున్నారు. నేటి యువతరం ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు.అత్యవసరంలో ఎంత సమయంలో ఆసుపత్రికి చేరుకోవచ్చు? ఎంత సమీపంలో వైద్య సదుపాయాలు ఉన్నాయనేది ఆరా తీస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట.పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే ఇష్టపడుతున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు.వీకెండ్ ఎంజాయ్..వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్‌హౌస్‌లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రాధామ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్..
విలాసవంతమైన గృహాలే కానీ, అందుబాటు ధరల్లో..! ఇదీ ఇప్పుడు హైదరాబాద్ నగర రియల్టీ మార్కెట్లో కొత్త ట్రెండ్. ఆడంబరాల కంటే గృహ కొనుగోలుదారుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దడమే ఈ అఫర్డబుల్ లగ్జరీ యూనిట్ల ప్రత్యేకత. సాధ్యమైనంత వరకూ నిర్మాణ, నిర్వహణ వ్యయాలను అదుపులో పెట్టుకుంటూ.. ధరలు అందుబాటు ఉండేలా చేసే అధిక సాంద్రత ప్రాజెక్ట్‌లతో ఇది సాధ్యమేనంటున్నారు రియల్టీ పరిశ్రమ నిపుణులు. - సాక్షి, సిటీబ్యూరోదేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని కరోనాకు ముందు, తర్వాత అని విభజించక తప్పదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి కాలంలో ఇంటి అవసరం తెలిసొచి్చంది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌లు రకరకాల కారణాలతో ఇంట్లో గడిపే సమయం పెరిగింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో ఇంట్లో ప్రత్యేకంగా గది, వ్యాయామం, యోగా వంటి ఆరోగ్య అవసరాల కోసం ప్రత్యేక స్థలం అవసరమైంది. దీంతో క్రమంగా నాలుగు గోడల చౌక గృహాలకు బదులుగా విశాలమైన లగ్జరీ ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది.ప్రాంతం, వసతులు, నాణ్యత, గడువు కంటే ఇప్పటికీ గృహ కొనుగోళ్లలో కస్టమర్ల తొలి ప్రాధాన్యత ధరకే.. అందుకే ధరను బ్యాలెన్స్ చేస్తూ కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ గృహాలు, స్థోమత మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తుండటంతో నగరంలో సరసమైన లగ్జరీ హౌసింగ్ భావన ఊపందుకుంది. అఫర్డబుల్ లగ్జరీ గృహ విభాగం ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. డెవలపర్లు గృహ కొనుగోలుదారుల సంపూర్ణ అవసరాలను పరిగణలోకి తీసుకోవడమే. ప్రాజెక్ట్‌ను హైప్ చేయడానికి ఫ్యాన్సీ ఆడంబరాలు, అలంకరణలను జోడించడానికి బదులుగా ఖర్చులను ఆదా చేస్తూ కస్టమర్లకు అవసరమైన వసతులు, సౌకర్యాలను అందించడానికి ప్రయతి్నస్తారు.యువ కస్టమర్ల ఆసక్తి..ఈ విలాసవంతమైన ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా యువ కస్టమర్ల నుంచే ఆదరణ ఎక్కువగా ఉంది. మీలినియల్స్, అధిక సంపాదన ఆర్జించే జెన్–జెడ్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వంటి కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ హబ్ నగరాలలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ తరహా గృహ కొనుగోలుదారులు తమ ఆదాయ స్థాయిలకు సరిపోయే ధర, ఎక్కువ వసతులు ఉండే నివాస సముదాయాలను కోరుకుంటున్నారు.అధిక అద్దెలు కూడా కారణమే..గృహాల అద్దెలు పెరగడం కూడా విలాసవంతమైన ఇళ్ల డిమాండ్‌కు కారణమే. ఐటీ హబ్ నగరాలలో ఏటా అద్దెలు 9–15 శాతం మేర పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడులపై అధిక రాబడి ఆర్జిస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు సరసమైన లగ్జరీ ప్రాపర్టీలను ఆర్థికంగా చురుకైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా పరిగణిస్తున్నారు. అద్దె ఆదాయంతో నెలవారీ వాయిదా(ఈఎంఐ) చెల్లింపులతో భర్తీ చేయాలని భావిస్తుండటంతో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.అత్యాధునిక నిర్మాణ పద్ధతులుభూముల ధరలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి పట్టణాలు, ప్రాంతాలలో అధిక సాంద్రత కలిగిన ప్రాజెక్ట్‌లను నిర్మించడం ఒక కీలకమైన వ్యూహం. అలాగే డెవలపర్లు ఖర్చులను తగ్గించడానికి అత్యాధునిక నిర్మాణ పద్ధతులు, స్మార్ట్ డిజైన్లను అవలంభిస్తున్నారు. సాంకేతికత వినియోగంతో దీర్ఘకాలిక నిర్వహణ వ్యయాలనునియంత్రిస్తున్నారు. దీంతో నివాస సముదాయాలు పర్యావరణహితంగానే కాకుండా బడ్జెట్ అనుకూలంగా మారుస్తుంది. వ్యవస్థీకృతమైన ఆప్టిమైజ్ లే–అవుట్లతో సమర్థవంతమైన యూనిట్ పరిణామాలను అందించడంతో తక్కువ ధరకే లగ్జరీ వసతులను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది.లగ్జరీ ఫీలింగ్..డెవలపర్లు కార్పెట్ ప్రాంతాన్ని పెంచడానికి స్మార్ట్ డిజైన్ లేఅవుట్లను ఎంపిక చేస్తారు. కాంక్రీట్‌ను సాధ్యమైనంత తక్కువ ఉపయోగించడంతో పాటు విశాలమైన, విలాసవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద సైజు కిటికీలు, తలుపులను ఏర్పాటు చేస్తున్నారు. ఎత్తయిన సీలింగ్‌తో ప్రవేశ ద్వారాన్ని సెవెన్ స్టార్ హోటల్ మాదిరి గా లగ్జరీ ఆంబియెన్స్ను కల్పిస్తున్నారు. వేగవంతమైన డెలివరీ, నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు మాడ్యులర్ నిర్మాణ పద్ధతులను అమలు చేస్తున్నారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, వెల్నెస్ ఫీచర్లు, స్థిరమైన పద్ధతులతో నివాస సముదాయాల విలువలను పెంచుతున్నారు.నిర్మాణ, నిర్వహణ వ్యయాలు..డెవలపర్లు ఉపయోగిస్తున్న మరో విధానం స్థిరత్వం. ఈ తరహా నిర్మాణాలు ఖర్చు, సమర్థవంతమైన ముందస్తు వ్యయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పర్యావరణంపై తక్కువ ప్రభావం ఉండేలా చేస్తుంది. ఈ నిర్మాణాలను తక్కువ ఆర్థిక భారం, పన్ను ప్రయోజనాలతో నిర్మించడంలో సహాయపడుతుంది. స్థిరమైన పద్ధతులను అవలంభించడం వల్ల దీర్ఘకాలిక కార్యాచరణ వ్యయాలు తగ్గుతాయి. అలాగే పర్యావరణ స్పృహ ఉన్న కస్టమర్లను ఆకర్షిస్తాయి. పర్యావరణ అనుకూలమైన నిర్మాణ సామగ్రి, శక్తి సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వాడకం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుంది.వెల్నెస్, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యంకరోనా తర్వాత నుంచి ప్రజల్లో ఆరోగ్యం, పర్యావరణ స్పృహపై అవగాహన పెరిగింది. దీంతో సస్టెనబులిటీ, గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చే నివాసాల కొనుగోళ్లు, పెట్టుబడులకు కీలక అంశంగా మారింది. అఫర్డబుల్ లగ్జరీ ఇళ్లకు యువ కస్టమర్ల నుంచి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మిలీనియల్స్, జెన్–జెడ్ గృహ కొనుగోలుదారులు బహుళ ప్రయోజనాలు ఉండే ప్రాపరీ్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెల్నెస్, ఫిట్నెస్ సౌకర్యాలు, సోషలైజింగ్ కోసం కమ్యూనిల్ ప్రాంతాలు, బహుళ ఈ–కామర్స్ డెలివరీలు, ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు, పాయింట్లు వంటి అనుకూలమైన మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు. ఆటోమేటిక్ లైటింగ్ ఏర్పాట్లు, అధునాతన భద్రత వ్యవస్థ, తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఉపకరణాలు వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీలు ప్రామాణికంగా మారుతున్నాయి.బయోఫిలిక్ డిజైన్లు..బయోఫిలిక్ డిజైన్ అనేది నివాస, వాణిజ్య నిర్మాణ రంగంలో పెరుగుతున్న ధోరణి. సమృద్ధిగా సహజ కాంతి, ఇండోర్ మొక్కలు, కమ్యూనిటీ గార్డెన్లు వంటి వివిధ అంశాల ద్వారా పచ్చని, ప్రకృతిని సృష్టించడం. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవన పరిస్థితులు. స్థానిక జంతుజాలం, పచ్చని ప్రదేశాలు, స్థానిక మొక్కలతో మార్గాలను ఏకీకృతం చేస్తాయి. కలప, రాయి, టెర్రకోట వంటి సహజ పదార్థాలను ఫ్లోరింగ్, అలంకరణలో ఉపయోగిస్తారు. అలాగే ఆకుపచ్చ, నీలం, మట్టి రంగుల పాలెట్‌తో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. చిన్న ఇండోర్ ఫౌంటేన్లు, టేబుల్ టాప్ వాటర్ ఫౌంటేన్ల వంటివి ఏర్పాటు చేస్తారు. పెద్ద కిటికీలతో సహజ కాంతికి ప్రాధాన్యత ఇస్తారు. గాలి నాణ్యత, నివాసితుల మానసిక స్థితిని మెరుగుపర్చడానికి గాలి వీచేందుకు ప్రోత్సహిస్తారు.యాంత్రిక వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఉపకరణాలను వాడతారు. ఈ తరహా ప్రాజెక్ట్‌ల కొనుగోలుదారులు మృదువైన ఫినిషింగ్, ఆధునిక డిజైన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే లగ్జరీ, సౌందర్యంపై ఏమాత్రం రాజీపడరు. కొనుగోలుదారుల కార్యచరణ ఖర్చులను తగ్గించే శక్తి సామర్థ్యం, స్థిరమైన లక్షణాలు ఉండే పర్యావరణ అనుకూల ఎంపికలను కోరుకుంటారు. ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ప్రాంతం, కనెక్టివిటీకి కూడా ముఖ్యమే. హైవేలు, మెట్రో లైన్లతో మంచి కనెక్టివిటీలతో పాటు సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోని ప్రాపరీ్టలకు నివాసితులకు కోరుకుంటున్నారు. -
ఈవీ ఉంటే.. ఇంటి ధర పెంచుడే..
ఇంధన వనరుల ధరలు రోజుకు ఒకలా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోజిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగం (రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయిస్తాయని అంచనా.ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి కనుక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు.ఆఫీస్ స్పేస్‌లలో కూడా..ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవిన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవడమే అసలైన సవాలు.ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
రియల్ ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీ పడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్ అండ్ ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.వర్క్ ఫ్రం హోమ్ ఇతరత్రా అవసరాల కోసం బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరున్న డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తామ ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
రియల్టీలోకి పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 819మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 967 బిలియన్ డాలర్లతో పోలిస్తే 15 శాతం తగ్గాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ అనుబంధ సంస్థ అనరాక్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక 2025–26 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో పీఈ పెట్టుబడులు 2.6 బిలియన్ డాలర్ల నుంచి 15 శాతం క్షీణించి 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వచి్చన మొత్తం ఇన్వెస్ట్మెంట్లలో విదేశీ పెట్టుబడుల వాటా 73 శాతంగా ఉంది. తొలి త్రైమాసికంలో కాస్త ఆశావహ ధోరమి కనిపించినప్పటికీ అది కొన్నాళ్ల ముచ్చటే అయిందని, రెండో త్రైమాసికంలో కార్యకలాపాలు నెమ్మదించాయని అనరాక్ క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ తెలిపారు. పూర్తి సంవత్సరం ప్రాతిపదికన చూస్తే పీఈ పెట్టుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 6.4 బిలియన్ డాలర్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ సెగ్మెంట్లో అమ్మకాల జోరు.. రెసిడెన్షియల్ విభాగంలో రియల్ ఎస్టేట్ అమ్మకాల పరిమాణం భారీగా ఉందని, దీంతో డెవలపర్లకు నగదు ప్రవాహం గణనీయంగా మెరుగుపడిందని అగర్వాల్ తెలిపారు. దీనితో వారు ఖరీదైన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)పై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే బ్యాంకుల వద్ద కూడా పుష్కలంగా నిధులు ఉండటంతో, గతానికి భిన్నంగా, అవి రియల్టికి రుణాలిచ్చేందుకు మరింత సానుకూలంగా ఉన్నాయని ఆయన వివరించారు. అటు కమర్షియల్ రియల్ ఎస్టేట్ విషయం తీసుకుంటే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం చాలా అనిశ్చితి నెలకొన్నట్లు చెప్పారు. దీనితో ద్రవ్యోల్బణంతో పాటు అంతర్జాతీయంగా ఇతరత్రా స్థూల ఆర్థిక అనిశ్చితి కూడా పెరుగుతోందని వివరించారు. ‘అందుకే విదేశీ పెట్టుబడుల ప్రవాహం నెమ్మదించంది. భారత్ గణనీయంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గానే కాకుండా పెట్టుబడులు వృద్ధి చెందేందుకు ఆస్కారమున్న అతి తక్కువ దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది కాబట్టి ఇది తాత్కాలిక ధోరణే కావొచ్చు. అనిశ్చితులు తొలగిపోయి, స్పష్టత వచి్చందంటే చాలు కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లోకి పీఈ పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటాయి‘ అని అగర్వాల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ విభాగంలోకి పీఈ పెట్టుబడులు అసలు రాలేదు. రిటైల్, మిక్సిడ్–యూజ్, కమర్షియల్ అసెట్స్ విభాగంలో గణనీయంగా వచ్చాయి. హోటల్స్, డేటా సెంటర్లలోకి కూడా పెట్టుబడులు మెరుగ్గానే వచి్చనట్లు అనరాక్ క్యాపిటల్ తెలిపింది.జోరుగా ఈక్విటీ పెట్టుబడులుసెపె్టంబర్ త్రైమాసికంలో 3.8 బిలియన్ డాలర్లున్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడుల రాక సెపె్టంబర్ త్రైమాసికంలో బలంగా నమోదైంది. 48 శాతం అధికంగా 3.8 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చినట్టు సీబీఆర్ఈ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈక్విటీ పెట్టుబడుల రాక 2.6 బిలియన్ డాలర్లుగానే ఉంది. ప్రధానంగా భూ సమీకరణ, అభివృద్ధి, ఆఫీస్/రిటైల్ ఆస్తుల నిర్మాణంపై ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మరించారు. ఇక ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఈక్విటీ పెట్టుబడులు 14 శాతం ఎగసి 10.2 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 8.9 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. 2024 సంవత్సరం మొత్తం మీద వచి్చన ఈక్విటీ పెట్టుబడులు 11.4 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ‘‘వేగవంతమైన వృద్ధి దశలోకి రియట్ ఎసేŠట్ట్ రంగం అడుగుపెట్టింది. ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన విశ్వాసం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. రానున్న త్రైమాసికాల్లో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల అభివృద్ధికి బలమైన డిమాండ్ ఉంటుంది. ఇళ్లు, ఆఫీస్, మిశ్రమ వినియోగ వసతులు, డేటా సెంటర్లు, పారిశ్రామిక, రవాణా వసతుల వ్యాప్తంగా సమతూకం ఉంటుంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. పెట్టుబడుల్లో మరింత వైవిధ్యం ఉన్నట్టు, నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ఆస్తుల్లోకి పెట్టుబడులు వస్తున్నట్టు సీబీఆర్ఈ ఎండీ గౌరవ్ కుమార్ పేర్కొన్నారు. -
వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేటే..
‘2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 11.97 శాతం వృద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.80వేల కోట్లకు పైగా సమకూర్చింది. స్టేట్ సర్వీసెస్ జీఎస్డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉంది’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలెప్ మెంట్ కౌన్సిల్(నారెడ్కో) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్ లో నిర్వహిస్తున్న ‘15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’లో ఆయన ఆదివారం పాల్గొని ప్రసంగించారు.‘హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో 2024 సెప్టెంబర్ లో రూ.2820 కోట్ల విలువైన 4903 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.4804 కోట్ల విలువైన 6612 ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇది 35 శాతం అధికం. విలువలో వార్షిక వృద్ధి 70 శాతంగా నమోదయ్యింది. ఇవి కేవలం గణాంకాలు కాదు... రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలయ్యిందంటూ మాపై దుష్ర్పచారం చేస్తున్న వారికి ధీటైన సమాధానాలు’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.‘ఈ సెప్టెంబర్ లో రూ.కోటిపైన విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 151 శాతం పెరుగుదల ఉంది. మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వాటానే 53 శాతం’ అని చెప్పారు. ‘భారత్ లో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అయితే... అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో స్థిరాస్తి రంగ వాటా సగటున 10 శాతం 15 శాతం కాగా... చైనాలో అత్యధికంగా 23 శాతం నుంచి 25 శాతం వరకుంది. మన దేశంలో ఇది 6 శాతం నుంచి 8 శాతమే. ఇది మరింత పెరగాల్సిన అవసరముంది’ అని అభిప్రాయపడ్డారు.‘ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో ఫేజ్ – 2, భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు తదితర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. డిసెంబర్ నాటికి ‘ఫ్యూచర్ సిటీ’లో జోనలైజేషన్ ప్రక్రియను పట్టలెక్కించాలనే పట్టుదలతో ఉన్నాం. అక్కడే 200 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్న ఏఐ సిటీకి రెండు, మూడు నెలల్లోనే భూమి పూజ చేయబోతున్నాం’ అని వివరించారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు విజయసాయి మేక, కాళీ ప్రసాద్ దామెర, డా.లయన్ కిరణ్, కె.శ్రీధర్ రెడ్డి, ఆర్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఆఫీస్ వసతులకు డిమాండ్
న్యూఢిల్లీ: హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో బలమైన డిమాండ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 2.9 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) లీజింగ్ నమోదైంది. ఈ ఏ డాది మొదటి తొమ్మిది నెలల్లో లీజింగ్ 8.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్-8 పట్టణాల్లో సెపె్టంబర్ క్వార్టర్లో ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చిచూస్తే 6% తగ్గి 17.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ నగరాల్లో స్థూల లీజింగ్ మాత్రం 24 శాతం పెరిగి 66.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరిందని, పూర్తి ఏడాదికి రికా ర్డు స్థాయిలో 85 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా..బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ సెప్టెంబర్ క్వార్టర్లో 21 శాతం క్షీణించి 4.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.చెన్నై మార్కెట్లో ఆఫీసు వసతుల లీజింగ్ 9% పెరిగి 2.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం సెప్టెంబర్ త్రైమాసికంలో 15 శాతం తగ్గి 2.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.పుణెలో 9 శాతం తగ్గి 2.3 మిలియన్ ఎస్ఎఫ్టీకి ఆఫీస్ లీజింగ్ పరిమితమైంది.ముంబైలో సెప్టెంబర్ క్వార్టర్లో లీజింగ్ 27 శాతం తగ్గి 1.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. తొమ్మిది నెలల కాలంలో చూసినా 12 శాతం తగ్గి 7.4 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.కోల్‌కతాలో ఆఫీస్ లీజింగ్ సెప్టెంబర్ క్వార్టర్లో 190 శాతం పెరిగి 0.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.అహ్మదాబాద్ మార్కెట్లో 13 శాతం పెరిగి సెప్టెంబర్ త్రైమాసికంలో 0.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.ఇదీ చదవండి: ఈ టెక్నాలజీ చూడు.. ఇల్లు కట్టుకోవడానికి సరైన తోడు! -
ఈ టెక్నాలజీ చూడు.. ఇల్లు కట్టుకోవడానికి సరైన తోడు!
ఇప్పటివరకు మనం ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎలా ఎంపిక చేసుకోవాలి?, ల్యాండ్ డాక్యుమెంట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?, ఇంటి నిర్మాణం కోసం కావలసిన మెటీరియల్స్ వంటి వివరాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే టెక్నాలజీ గురించి తెలుసుకుందాం.టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్ని రంగాల్లోనూ దీనిని ఉపయోగించుకోవచ్చు. అయితే మీరెలా ఉపయోగించుకోగలుతున్నారు? అనేదే ప్రశ్న. సరిగ్గా ఉపయోగించుకుంటే.. సమయాన్ని, ఖర్చుకు కూడా తగ్గించుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ విషయానికి వస్తే..ప్రీఫ్యాబ్రికేషన్ టెక్నాలజీసాధారణంగా ఒకప్పటి నుంచి వస్తున్న పద్దతిలో ఇల్లు కట్టాలంటే.. గోడలు కట్టి నిర్మాణం చేయాల్సిందే. అయితే ప్రీఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ ద్వారా గోడలను లేదా ఇంటి భాగాలను ఫ్యాక్టరీలో తయారుచేసి.. మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. ఈ విధానం ద్వారా వేస్ట్, డస్ట్ పొల్యూషన్ వంటివి చాలా వరకు తగ్గుతాయి.3డీ ప్రింటింగ్ టెక్నాలజీఈ పేరును చాలామంది వినే ఉంటారు. అయితే దీనిని ఇంటి నిర్మాణంలో కూడా ఉపయోగించుకోవచ్చనే విషయం బహుశా కొందరికి మాత్రమే తెలిసి ఉంటుంది. కంప్యూటర్లో డిజైన్ చేసి.. ఇంటి నమూనాను, కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలుగా వేసి నిర్మించడానికి ఈ 3డీ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కేవలం గంటల వ్యవధిలోనే మీరు ఇంటిని ధృఢంగా నిర్మించుకోవచ్చు. కార్మిక ఖర్చు తగ్గడమే కాకుండా.. మెటీరియల్ కూడా పెద్దగా వృధా అయ్యే అవకాశం లేదు.కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది.. ఇంటి నిర్మాణం కోసం ప్రాజెక్ట్ ప్లానింగ్, ఖర్చు తగ్గించుకోవడం, మెటీరియల్ మేనేజ్మెంట్, సైట్ మానిటరింగ్ కోసం ఉపయోగించే డిజిటల్ టూల్స్. ఇల్లు కట్టుకోక ముందే.. కట్టుకోబోయే ఇల్లు ఎలా ఉంటుందో దీని ద్వారా చూడవచ్చు. ఈ టెక్నాలజీ సాయంతో ముందుగానే బడ్జెట్ అంచనా వేయవచ్చు.గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీగ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ ద్వారా.. పర్యావరణానికి అనుకూలంగా ఇంటి నిర్మాణం చేయవచ్చు. ప్రకృతి వనరులను సంరక్షించుకుంటూ.. సోలార్ పానెల్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటివి నిర్మించుకోవచ్చు. అంతే కాకుండా.. మీరు నిర్మించుకునే ఇంటిలోకి సహజంగా కాంతి, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ టెక్నాలజీ ఉపయోగించి కార్బన్ ఉద్గారాలను చాలావరకు తగ్గించుకోవచ్చు.ఏఐ & స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ఈ రోజుల్లో ఇలాంటి టెక్నాలజీ చాలా అవసరం, అందరూ ఇష్టపడతారు కారు. ఇంట్లో ఉండే లైట్స్, ఫ్యాన్స్, టీవీ, ఏసీ, డోర్ లాక్స్, సీసీటీవీ కెమరాలు అన్ని కూడా ఏఐ ఆధారంగా.. ఆటోమేటెడ్‌గా పనిచేసేలా చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు ఇంట్లో లేకపోయినా, అవసరం అనుకుంటే, లైట్స్ ఆన్ చేయడం.. లేదా ఆఫ్ చేయడం, డోర్ బెల్స్ మోగినప్పుడు సీసీటీవీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారో ముందుగానే చూడటానికి ఏఐ ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ఇల్లు కట్టుకోవడానికి కావలసిన మెటీరియల్స్ -
హైదరాబాద్‌లో పెరుగుతున్న కొత్త షాపింగ్ మాల్స్
సాక్షి, సిటీబ్యూరో: ఏటేటా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వస్తువులు, సేవలను విక్రయించే వాణిజ్య స్థలం(రిటైల్ స్పేస్) పెరుగుతోంది. దీంతో నగరంలో తలసరి రిటైల్ స్పేస్ 3.6 లక్షల చ.అ.లకు చేరింది. ప్రస్తుతం భాగ్యనగరంలో గ్రేడ్–ఏ, బీ షాపింగ్ మాల్స్ స్టాక్ 35.1 లక్షల చ.అ.లుగా ఉండగా.. ఇందులో వేకెన్సీ 1.85 శాతంగా ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ∙నగరంలో ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో 5.1 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 9.3 శాతం ఎక్కువ. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నగరంలో 20.4 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజుకు పోయింది. గ్రేడ్–ఏ మాల్స్ సరఫరా పరిమితంగా కారణంగా ఈ త్రైమాసికంలో ఎక్కువ లీజులు హైస్ట్రీట్ ప్రాంతాలలో జరిగాయి.మొత్తం లీజులలో 42 శాతం కొంపల్లి, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి సబర్బన్ కారిడార్లలో జరిగాయి. బంజారాహిల్స్, పంజగుట్ట, హిమాయత్‌నగర్ వంటి కోర్ సిటీలో 32 శాతం, సుచిత్ర, బోడుప్పల్ వంటి శివార్లలో 26 శాతం లీజులు జరిగాయి. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బేవరేజెస్, యాక్ససరీస్ కేటగిరీల్లో రిటైల్ స్పేస్ లీజులు అధికంగా జరిగాయి. లైఫ్ స్టయిల్ విభాగం 16 శాతం, ఫరీ్నచర్ 10 శాతం, హెల్త్ కేటగిరీలో 10 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మొత్తం లీజుల్లో దేశీయ బ్రాండ్లు 88 శాతం, అంతర్జాతీయ బ్రాండ్లు 12 శాతం వాటాలున్నాయి.కొత్త మాల్స్.. ప్రస్తుతం నగరంలో 28 లక్షల చ.అ. కొత్త షాపింగ్ మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇవి 2027 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది నాల్గో త్రైమాసికం నాటికి 17 లక్షల చ.అ. గ్రేడ్–ఏ మాల్స్ స్థలం డెలివరీ అవుతుంది. కొంపల్లి, శంషాబాద్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో నివాసితులు వినోద అవసరాలను తీర్చేందుకు ఈ మాల్స్, రిటైల్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొంపల్లి, ఎంజీ రోడ్, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్, అబిడ్స్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, మాదాపూర్, నల్లగండ్ల, హబ్సిగూడ, కోకాపేట, మణికొండ వంటి ప్రాంతాలలో రిటైల్ స్పేస్ అద్దె నెలకు చ.అ.కు రూ.135–250 వరకు ఉన్నాయి. -
రీసేల్ ప్రాపర్టీ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు అవసరం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఏ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయాలన్నా.. కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వెచ్చించాల్సిందే. అదే ఐటీ హబ్ పరిసరాలు, సిటీలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఇల్లు కొనాలంటే మాత్రం కనీసం రూ.కోటిన్నరకు పైగా ఖర్చు చేయాల్సిందే. ఇక గేటెడ్ కమ్యూనిటీలు, ప్రీమియం ప్రాజెక్ట్‌లలో అయితే కోట్లు ఖర్చు చేయాల్సిందే. అందుకే చాలా మంది మధ్యతరగతి వారికి హైదరాబాద్‌లో సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. ఇటువంటి సమయంలో చాలా మంది పాత ఇళ్ల కొనుగోలుపై దృష్టిసారించారు. అందులోనూ పాత అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.సెకండ్ సేల్స్ ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చిక్కులు ఎదుర్కోక తప్పదని రియల్టీ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెకండ్ సేల్స్ ఫ్లాట్స్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డబ్బులను ఆదా చేసుకోవడంతో పాటు న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.మార్కెట్ రేటు కనుక్కోండి..రీసేల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసే ప్రాంతంలో అసలు ఆ ప్రాంతంలో చ.అ. ధరలు ఎంత ఉన్నాయో ముందుగానే తెలుసుకుంటే మీరు ఆ ప్రాంతంలోని ధరను బట్టి బేరం ఆడుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్రాండ్ న్యూ ఫ్లాట్ ధరతో పోలిస్తే పాత అపార్ట్మెట్లలోని ఫ్లాట్ ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. చ.అ.కు ప్రాంతాన్ని బట్టి కనీసం 20-40 శాతం వరకు వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలో ఫ్లాట్స్ ధరలను తెలుసుకుని బేరమాడి తక్కువ ధరకు ఫ్లాట్ కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.డాక్యుమెంట్లను పరిశీలించాలిపాత అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ కొనుగోలు సమయంలో డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించాలి. అవసరమైన న్యాయ నిపుణులను సంప్రదించాలి. యాజమాన్య హక్కులు, ప్రభుత్వ రంగ ఏజెన్సీల అనుమతులు, బ్యాంక్ రుణాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా బ్యాంక్‌లలో ఫ్లాట్‌లో ఎంత రుణం నేరుగా సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించి కనుక్కోవాలి. కొనుగోలుకు ముందే అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కమ్యూనిటీ నిబంధనలు తెలుసుకోవడం వల్ల నివాసిత సంఘంతో చిక్కులు లేకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. బ్రోకర్లపై ఆధారపడొద్దు..ఫ్లాట్ కొనుగోలు కోసం బ్రోకర్లపై ఆధారపడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా ఫ్లాట్ ఓనర్‌తో మాట్లాడుకొని డీల్ కుదుర్చుకుంటే ధర తగ్గే అవకాశం ఉంటుంది. -
ఇలాంటి ఇళ్ల కొనుగోలుకు కస్టమర్ల ఆసక్తి!
సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ప్రైవసీ, ఆధునిక వసతులు ఉండే విలాసవంతమైన వాటికే ఆదరణ పెరుగుతోంది. ఏడాది కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు అమ్ముడుపోగా.. ఇందులో రూ.10–20 కోట్ల ధర ఉండే లగ్జరీ యూనిట్ల విక్రయాలు 170 శాతం వృద్ధి చెందగా.. రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ అమ్మకాలు 16 శాతం తగ్గాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టే డెవలపర్లు కూడా ప్రీమియం ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ.. స్థిరమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా భారత ఆర్థిక దృక్పథం స్థిరంగా ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను 7.8 శాతం వద్ద అధిగమించింది. స్థిరమైన దేశీయ పెట్టుబడులు, జీఎస్టీ సవరణలు, వడ్డీ రేట్ల తగ్గింపులతో దేశంలో స్థిరాస్తి విక్రయాలు ఆశాజనంగానే ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం (జులై–సెప్టెంబర్, క్యూ3)లో ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు సేల్ కాగా.. 88,655 యూనిట్లు లాంచ్ అయినట్లు నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది.పెరుగుతున్న ఇన్వెంటరీ..2025 క్యూ3లో 87,603 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. పుణె మినహా అన్ని నగరాలలో విక్రయాలు స్థిరంగానే ఉన్నాయి. ముంబైలో అత్యధికంగా 24,706 యూనిట్లు అమ్ముడుపోయాయి. అమ్మకాల వృద్ధి స్థిరంగానే ఉన్నప్పటికీ అమ్ముడుపోని ఇన్వెంటరీ 2020 నుంచి స్థిరంగా పెరుగుతూనే ఉంది. విక్రయాల కంటే సరఫరా మించిపోతున్నాయి. ఈ ఏడాది క్యూ3 నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇన్వెంటరీ 5,06429 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 5.8 త్రైమాసికాల సమయం పడుతుంది. వీటిల్లో అత్యధికంగా రూ.50 లక్షలలోపు ధర ఉన్న ఇళ్లు 1,8,0616 ఉన్నాయి. హైదరాబాద్‌లో..హైదరాబాద్‌లో ఈ క్యూ3లో 9,601 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. అలాగే ఈ క్యూ3లో 9,764 యూనిట్లు లాంచ్ అయ్యాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 10 శాతం ఎక్కువ. నగరంలో ఏడాదితో ఇళ్ల ధరలు 13 శాతం మేర పెరిగాయి.ఆఫీసు అధరహో..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సప్లయి చెయిన్‌లో నష్టాలు, ఇంధన వ్యయాలు, మూలధన ప్రవాహాలను ప్రభావితం చేయడంతో కార్యాలయ విభాగం కాస్త తడబడింది. 2025 క్యూ3లో 1.78 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరిగాయి. వార్షిక ప్రాతిపదికన 6 శాతం క్షీణించినప్పటికీ.. 2024 క్యూ3తో పోలిస్తే మాత్రం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు, ముంబై, ఎన్సీఆర్లు లావాదేవీలలో సగం వాటాలను కలిగి ఉన్నాయి. 42 లక్షల చ.అ.లతో బెంగళూరు ముందంజలో ఉంది. ఈ త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలు వ్యాల్యూమ్ వృద్ధిలో అత్యధిక వాటాలను కలిగి ఉన్నాయి. హైదరాబాద్ 45 శాతం, చెన్నై 51 శాతం వాల్యూమ్లను కలిగి ఉన్నాయి.బ్యాక్ ఆఫీసు టు జీసీసీ..ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన ఇండియా.. నేడు గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రతిభ, నైపుణ్యం కలిగిన కారి్మకులు, తక్కువ జీవన వ్యయం, అందుబాటులో స్థిరాస్తి ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు కారణంగా బహుళ జాతి సంస్థలు జీసీసీల ఏర్పాటుకు ఇండియాను ఎంచుకుంటున్నాయి. 2025 క్యూ3లో లీజుకు తీసుకున్న వ్యాల్యూమ్‌లో గ్రేడ్–ఏ ఆఫీసు లావాదేవీలు 88 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్) విస్తరణ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), ఫ్లెక్సిబుల్ ఆఫీస్‌లకు ప్రాధాన్యత పెరుగుతుండటమే ఈ డిమాండ్‌కు ప్రధాన కారణం. ఈ క్యూ3లో జీసీసీలు 57 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకోగా. ఆ తర్వాత థర్డ్ పారీ్ట/ఐటీ సరీ్వస్ ప్రొవైడర్లు 32 లక్షల చ.అ., ఫ్లెక్సిబుల్ ఆఫీసు స్పేస్ 38 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి.100 కోట్ల చ.అ. స్టాక్..ప్రస్తుతం 8 ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్ స్టాక్ 100 కోట్ల చ.అ.లను దాటింది. ఈ క్యూ3లో 1.24 కోట్ల చ.అ. కార్యాలయ స్థలం పూర్తయ్యింది. ఈ త్రైమాసికంలో డెలివరీ అయిన కార్యాలయ స్థలంలో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఈ నగరంలో 59 లక్షల చ.అ. స్థలంతో 48 శాతం వాటాను కలిగి ఉంది. అత్యధికంగా కోల్‌కతాలో 14 శాతం, ముంబైలో 11 శాతం, ఎన్సీఆర్(న్యూఢిల్లీ)లో 9 శాతం, బెంగళూరులో 6 శాతం మేర ఆఫీసు స్పేస్ అద్దెలు పెరిగాయి.ఇదీ చదవండి: నిర్మాణ సామగ్రిపై తగ్గిన జీఎస్టీ.. గృహాలకు పెరగనున్న డిమాండ్నగరంలో.. హైదరాబాద్‌లో ఈ క్యూ3లో 29 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 33 శాతం అధికం. అయితే 2025 క్యూ2లో 19 లక్షల చ.అ., క్యూ1లో 40 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. అలాగే నగరంలో ఈ క్యూ3లో 16 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ డెలివరీ అయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 61 శాతం ఎక్కువ. నగరంలో ఈ క్యూ3లో ఆఫీసు స్పేస్ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి. -
ఎకరం భూమి రూ.177 కోట్లు!: పాన్ ఇండియా రియల్టీగా హైదరాబాద్
హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశంలోకి దూసుకుపోయాయి. కోకాపేట, రాయదుర్గం వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2017లో రాయదుర్గంలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరం రూ.42.59 కోట్లకు గౌరా వెంచర్స్ దక్కించుకోగా.. తాజాగా నాలెడ్జ్ సిటీలో ఎంఎస్ఎన్ సంస్థ ఏకంగా రూ.177 కోట్లు వెచ్చించింది. కేవలం 8 ఏళ్లలో రాయదుర్గంలో భూముల ధరలు 320 శాతం మేర పెరిగాయి. ఇది కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదు ఇది అభివృద్ధికి సంకేతం. నగర మౌలిక సదుపాయాలు, వాణిజ్య సాంద్రత, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై సంస్థాగత, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. – సాక్షి, సిటీబ్యూరోపాన్ ఇండియా మూవీ లాగే..బాహుబలి నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఎలాగైతే పాన్ ఇండియా స్థాయి మొదలైందో.. అలాగే గత ప్రభుత్వ హయాంలో కోకాపేట భూముల వేలంలో ఎకరం రూ.100 కోట్లు పలకడంతో మొదలైంది. అగ్రశ్రేణి జాతీయ డెవలపర్లు నగరంలో భూములను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. నగరంలోని మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థలు ముంబై, బెంగళూరు కంటే మెరుగ్గా ఉన్నాయి. రాయదుర్గం వేలంతో మన నగరం దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోటీ పడటం దాటి ముందుకు దూసుకుపోతుందనే సంకేతాన్ని అందిస్తోంది. పట్టణ విలువలను పునరి్నర్వచిస్తుంది.అర్బన్ బ్రాండింగ్పారదర్శక వేలం, విధాన స్థిరత్వంతో హైదరాబాద్ ఇప్పుడు ప్రాంతీయ పవర్‌హౌస్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. నాలెడ్జ్ సిటీ ప్రాంతం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్, ఇన్నోవేషన్ కారిడార్. ఇది హెటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు చేరువలో ఉండటం అదనపు అడ్వాంటేజ్. గత ఆర్థిక సంవత్సరంలో నగరంలో 1.2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను నమోదు చేసింది. ఐటీ, ఐటీఈఎస్‌లో 52 శాతం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగంలో 18 శాతం, రిటైల్, హాస్పిటాలిటీలో 12 శాతం ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇది రియల్టీ రంగానికి వైవిధ్యభరితమైన గ్రోత్ ఇంజిన్.విశ్వాసం పెరుగుతోందివేలంలో రికార్డ్ ధర పలకడం స్థానిక రియల్ ఎస్టేట్ సామర్థ్యానికి, పెట్టుబడి దారుల్లో విశ్వాసానికి సూచిక. అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ), క్లియర్ ల్యాండ్ టైటిల్స్, ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో కూడిన ప్రైమ్ ల్యాండ్స్‌కు బడా నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తుంటాయి. టెక్ సంస్థలు, కార్పొరేట్, సంస్థాగత పెట్టుబడిదారులు నుంచి నిరంతర డిమాండ్‌ను ముందుగానే అంచనా వేస్తున్నారనేది సూచిస్తుంది. రాయదుర్గంలో భూమి విలువ వృద్ధితో మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది.➤ అధిక ధరలకు భూములను కొనుగోలు చేసే ధోరణి దీర్ఘకాలంలో స్థిరాస్తి రంగానికి ఏమాత్రం మంచిది కాదు. 95 శాతం బిల్డర్లు, తుది వినియోగదారులు(ప్లాట్లు లేదా వాణిజ్య స్థల కొనుగోలుదారులు) ప్రతికూలమే. భూమి విలువలు స్థిరంగా పెరగాలే తప్ప రాత్రికి రాత్రే పెరిగితే తుది కొనుగోలుదారులకు అఫర్డబులిటీ ఉండదు. నగరం శివార్లకు విస్తరించే బదులుగా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ట్రాఫిక్ జామ్‌లు, మౌలిక సదుపాయాలపై ఒత్తిడికి దారి తీస్తుంది.➤ ఏ ఉత్పత్తి ధర అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. డిమాండ్, సరఫరా అనేది ఇందులో అత్యంత కీలకం. రియల్ ఎస్టేట్ విషయానికొస్తే అతి ముఖ్యమైనది ప్రాంతం. అందుకే దేశ ఆర్థిక రాజధానిలో దక్షిణ ముంబైలో ఫ్లాట్ కొనుగోలుకు అత్యధిక ధర చెల్లిస్తుంటారు. అక్కడ 10 నుంచి 45 నిమిషాల ప్రయాణ దూరంలోనే భారీ భూమి లభ్యత ఉన్నప్పటికీ, అనేక సమాంతర రోడ్లు అభివృద్ధి చేసినా, మురికివాడలు కొత్త రూపు సంతరించుకుంటున్నా, కొత్త విమానాశ్రయం వచ్చినా.. దక్షిణ ముంబైలోని ప్రాపరీ్టలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దేశంలోని అన్ని మెట్రో నగరాలదీ ఇదే కథ. సేమ్ అలాగే మన నగరంలో పశ్చిమ హైదరాబాద్ పరిస్థితి. మన దగ్గర భారీ మూలధనాన్ని సేకరించగల డెవలపర్లు చాలా తక్కువ. ధరలు అసాధారణంగా పెరిగి భారీ మూలధనం అవసరమైతే అది ధనవంతులైన కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో స్థిరమైన డెవలపర్లు కూడా మార్కెట్ నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడుతుంది.ఇదీ చదవండి: ఇలాంటి ఇళ్ల కొనుగోలుకు కస్టమర్ల ఆసక్తి!➤ అపార్ట్మెంట్లో రూ.3-4 కోట్లతో ఫ్లాట్ కొనాలంటే మధ్యతరగతి ఉద్యోగులు జీవితకాలం ఈఎంఐ చెల్లించే పరిస్థితి. వేలం మధ్యతరగతి ప్రజలకు మంచిది కాదు. కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డ్ తరహాలో ప్రభుత్వమే మహేశ్వరం, శామీర్‌పేట, మేడ్చల్, సంగారెడ్డి, కొత్తూరు, శంషాబాద్ ప్రాంతాలలో వెంచర్లను అభివృద్ధి చేయాలి. ల్యాండ్ పూలింగ్ విధానంతో ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు స్కీమ్‌లలో భారీ లేఅవుట్‌ను వేయాలి. -
రెరా ఉన్నా 10 శాతం మార్టగేజ్ క్లాజ్ అవసరమా?
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అపారమైన వృద్ధిని సాధిస్తోంది. అయితే రియల్ ఎస్టేట్ బిల్డర్లు, డెవలపర్లు, కస్టమర్లను ప్రభావితం చేసే కొన్ని నియంత్రణలు, విధానాలు అమలులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే 10 శాతం మార్టగేజ్ (కుదవపెట్టడం) క్లాజ్ కీలకంగా ఉంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) వంటి పకడ్బందీ నియంత్రణ సంస్థల ఉనికి ఉన్నా ఈ క్లాజ్ అమలుపై విభిన్న వాదనలున్నాయి.10 శాతం మార్టగేజ్ క్లాజ్ అంటే ఏమిటి?తెలంగాణ ప్రభుత్వం అధీనంలో మార్టగేజ్ క్లాజ్(Mortgage Clause) బిల్డింగ్/లేఅవుట్ అనుమతుల జారీ కోసం ప్రభుత్వానికి 10 శాతం చెల్లించే మొత్తం. ప్రాజెక్ట్ నిర్మించే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించకుండా నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లకు లేఅవుట్ లేదా భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేటప్పుడు మొత్తం ప్రాజెక్ట్ స్థలంలో 10 శాతం భాగాన్ని ప్రభుత్వానికి ‘కుదవ’ (mortgage) పెట్టాలని డిమాండ్ చేస్తుంది.ఎందుకోసం అంటే..భవన నిర్మాణంలో అనుమతి పొందిన ప్లాన్ల నుంచి బిల్డర్లు తప్పుకోకుండా (deviation) నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకవేళ బిల్డర్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ కుదవ పెట్టిన 10 శాతం స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.RERA ఉన్నప్పటికీ ఈ క్లాజ్ అవసరమా?రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం RERA (Real Estate Regulatory Authority) చట్టాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణలో కూడా TG-RERA పటిష్టంగా అమలులో ఉంది. రెరా చట్టం కింద బిల్డర్ ప్రాజెక్టును తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో 70 శాతం ప్రత్యేక ఖాతాలో ఉంచాలి. అలాగే ప్రాజెక్టు ప్లాన్లలో ఎలాంటి మార్పులు చేయకూడదు. రెరా ఉల్లంఘనలకు జరిమానాలు, శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి.వ్యతిరేకత ఎందుకు?బిల్డర్ల సమాఖ్య (TBF - Telangana Builders Federation) వంటి సంస్థలు రెరా చట్టం పకడ్బందీగా ఉన్నందున 10 శాతం స్థలాన్ని కుదవపెట్టే (Mortgage Clause) నిబంధన అనవసరం అని వాదిస్తున్నాయి. ఎందుకంటే రెరా అనేది భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనను సమర్థవంతంగా నియంత్రించగలదని భావిస్తోంది.బిల్డర్లు, ప్రాజెక్ట్ డెవలపర్లపై ప్రభావం10 శాతం మార్టగేజ్ క్లాజ్ వల్ల రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రాజెక్ట్ డెవలపర్లపై కొంత ప్రభావం ఉంటుంది. బిల్డర్లు తమ ప్రాజెక్ట్‌లో 10% స్థలాన్ని ఉపయోగించుకోలేరు. అంటే ఆ 10% స్థలాన్ని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని వారు కోల్పోతారు. ఇది వారి ఆర్థిక లభ్యత (cash flow)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్లాక్ చేసిన 10 శాతం స్థలంపై నిర్వహణ ఖర్చులు, పన్నులు వంటి అదనపు భారం పడుతుంది. ఇది మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని (Project Cost) పెంచుతుంది. అనుమతుల ప్రక్రియలో ఆలస్యం లేదా క్లాజ్ అమలులో సమస్యలు ప్రాజెక్ట్ డెలివరీలో ఆలస్యం కావడానికి దారితీయవచ్చు.రియల్టీ కస్టమర్లపై ప్రభావంనిర్మాణ వ్యయం పెరిగినప్పుడు, బిల్డర్లు ఆ భారాన్ని సర్దుబాటు చేయడానికి ఫ్లాట్లు లేదా నివాస స్థలాల ధరలను పెంచే అవకాశం ఉంది. 10 శాతం స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాజెక్టులో అమ్మకానికి ఉండే యూనిట్ల సంఖ్య తగ్గిపోతుంది. సానుకూల కోణం నుంచి చూస్తే బిల్డర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కస్టమర్ల ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం వద్ద ఒక ఆస్తి (10% స్థలం) హామీగా ఉంటుంది.క్లాజ్ తొలగిస్తే ప్రభుత్వంపై ప్రభావం ఎంత?తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (TBF) వంటి రియల్ ఎస్టేట్ సంఘాలు రెరా ఉన్నందున 10 శాతం మార్టగేజ్ క్లాజ్‌ను రద్దు చేయాలని కోరుతున్నాయి. లేదా రెరా కింద రిజిస్టర్ అయిన ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ 10 శాతం క్లాజ్ అనేది ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని (revenue) ఇచ్చే పన్ను కాదు. ఇది ఒక నియంత్రణ సాధనం (Regulatory Tool)గా పని చేస్తుంది. దీన్ని తొలగిస్తే భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించేందుకు ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రధాన సాధనం కోల్పోతుంది. రెరా ఉన్నప్పటికీ ఈ స్థల హామీ అనేది స్థానిక సంస్థలకు (GHMC వంటివి) తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ ఈ నిబంధన తొలగిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో నిర్మాణం, అమ్మకాలు పెరిగి, రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ, ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వానికి పరోక్షంగా మరింత ఆదాయం రావడానికి అవకాశం కూడా ఉందని ఇంకొందరు అంటున్నారు.ఇదీ చదవండి: రుణమే.. బంగారమాయెనే! -
రియల్టీ బూమ్ నిజంగా తగ్గిపోయిందా?
రాష్ట్రంలో చాలా కొద్దిమంది భావిస్తున్నట్లు రియల్టీ బూమ్ తగ్గిపోయిందనే వాదనల్లో ఏమాత్రం నిజం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో రియల్టీ రంగం కీలకం ఉందని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ‘నారెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో’ను ప్రారంభించిన ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ప్రాపర్టీ షోను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘రాష్ట్రం రియల్టీ రంగంలో దూసుకుపోతుంది. చాలా కొద్దిమంది భావిస్తున్నట్లు రాష్ట్రంలో రియల్టీ బూమ్ తగ్గిపోయిందనే వాదనల్లో ఏమాత్రం నిజం లేదు. సామాన్యులు నగరంలో ఉన్న చాలా ప్రాపర్టీ వెంచర్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించడం కొంత వ్యయప్రయాసలతో కూడుకుంది. ఏటా నారెడ్కో ఆధ్వర్యంలోని ఇలాంటి ప్రాపర్టీ షోల వల్ల వందల కంపెనీలు ఒకే గొడుగు కిందకు వస్తున్నాయి. దాంతో గృహ కొనుగోలుదారులు మెరుగైన ప్రాపర్టీని ఎంచుకోవడం సులువవుతుంది. నారెడ్కో హైదరాబాద్ అభివృద్ధి గురించి దేశవ్యాప్తంగా తెలియజేసేందుకు ఇదో అవకాశం. ప్రభుత్వం నగరంలోని మౌలిక సదుపాయాల వృద్ధికి ఎంతో కృషిచేస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో సిటీ మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ బస్సుల ఏర్పాటు, ట్యాక్స్ రాయితీలివ్వడం, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లను ఏర్పాటు చేస్తోంది. త్రాగునీరు కల్పన, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. హైడ్రా వంటి చట్టాలు వచ్చిన మొదట్లో స్థానికంగా కొంత వ్యతిరేకత వచ్చినా నెమ్మదిగా ప్రజలు దాని ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. నారెడ్కో, రియల్టీ సంస్థలు కూడా స్పందించి కమర్షియల్ కోణంతోపాటు సామాజిక బాధ్యత కింద సీఎస్ఆర్ నిధులను వివిధ కార్యక్రమాలకు వెచ్చించాలి’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయసాయి మేక మాట్లాడుతూ..‘ప్రీమియం, లగ్జరీ ప్రాపర్టీ విభాగాల్లో బలమైన డిమాండ్ ఉంది. ఇది వృద్ధికి దోహదపడుతోంది. కొనుగోలుదారులు ప్రధాన ప్రదేశాల్లో తమ జీవనశైలి ఆధారిత గృహాల కోసం ఎక్కువగా చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, వేతవంతమైన పట్టణీకరణతో హైదరాబాద్ నివాస మార్కెట్ జాతీయంగా మెరుగైన పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది’ అన్నారు. ఈ సందర్భంగా రెరా వంటి పకడ్బందీ రెగ్యులేటర్లు ఉండగా ప్రభుత్వం డెవలపర్ల నుంచి 10 శాతం మార్టగేజ్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోందని గుర్తుచేస్తూ దీన్ని వెంటనే తొలగించాలని కోరారు. దీనిపై బట్టి విక్రమార్క స్పందిస్తూ..‘ప్రభుత్వం అందరి అభివృద్ధికి తోడ్పడుతుంది. బిల్డర్లు, రియల్టీ డెవలపర్లు సంబంధిత ప్రతిపాదనలతో వస్తే తప్పకుండా దీనిపై సమాలోచనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ కె.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో టెక్నాలజీ కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ప్రపంచ వ్యాపార సంస్థలకు కేంద్రంగా హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతాన్ని ప్రముఖంగా నిలుపుతున్నాయి. నగరంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు, అనుకూలమైన దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ వాతావరణం ఉంది. దాంతో నగరాన్ని నివాస, వాణిజ్య పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మార్చుకోవాలని భావిస్తున్నారు’ అని అన్నారు.ఇదీ చదవండి: మార్పు మంచిదే! ఎవరిపై ఎంత ప్రభావం? -
రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్‌దే ప్రధాన పాత్ర
రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్ నిర్వంహించిన ''నారెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో''ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. దేశంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పురోగమక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని వివరించారు.రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇటీవల ఎకరం స్థలం రూ.177 కోట్లకు అమ్ముడు పోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు లభించడం పెట్టుబడిదారులు, రియల్టర్ల విశ్వాసాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, పర్యాటక రంగాలు పరస్పరం మద్దతుగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, నారెడ్కో ప్రెసిడెంట్ విజయ్ సాయి మేక, జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, కిరణ్, నారేడ్కో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పీఎస్ రెడ్డి, ఎం. వెంకయ్య చౌదరి, పి.రవిరెడ్డి, స్వామీనాథన్, కాళీప్రసాద్, వెంకటేష్, హరిబాబు, దశరథ్ రెడ్డి, కిరణ్ ఇతర బిల్డర్లు, ప్రమోటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల ధరలు ఎంత పెరిగాయంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 18 ప్రముఖ నగరాలకు సంబంధించి ఇళ్ల ధరల సూచీ (హెచ్పీఐ) 3.6 శాతం పెరిగింది. 18 నగరాల్లో ఇళ్ల కొనుగోలు/విక్రయ లావాదేవీల వివరాలను రిస్ట్రేషన్ విభాగాల నుంచి సమీకరించి, ఆర్బీఐ ప్రతీ త్రైమాసికానికి సంబంధించి హెచ్‌పీఐని విడుదల చేస్తుంటుంది. 2022–23 మూల సంవత్సరం (బేస్ ఇయర్)గా ఆర్బీఐ 2025–26 క్యూ1 హెచ్‌పీఐని ప్రకటించింది. ఇంతకుముందు వరకు 2010–11 బేస్ సంవత్సరంగా ఉంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఇళ్ల ధరల పెరుగుదల 3.6 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది.క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పెరుగుదల 7.6 శాతంగా ఉంది. నాగ్‌పూర్, చండీగఢ్, చెన్నై, కోచిలో ధరల వృద్ధి ఎక్కువగా ఉంది. ఇక త్రైమాసికం వారీగా పోల్చి చూస్తే (మార్చి క్వార్టర్ నుంచి) సూచీ 2 శాతం పెరిగింది. హైదరాబాద్, తిరువనంతపురం, పుణె, ఘజియాబాద్, థానే, గౌతమ్ బుద్ధ నగర్, చండీగఢ్, నాగ్‌పూర్‌ను ప్రస్తుత 10 నగరాలకు అదనంగా సూచీలో ఆర్బీఐ చేర్చింది. ఇవి కాకుండా ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, కాన్పూర్, కోచి పట్టణాలు ఈ సూచీలో భాగంగా ఉన్నాయి. ఈ నగరాల్లో ధరల తీరు తెన్నులను సూచీ ప్రతిఫలిస్తుంటుంది. -
మెట్రోల్లో ఇళ్ల అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 87,603 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఒక శాతం పెరిగినట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ఎలాంటి మందగమనం ఛాయలు లేవంటూ, రానున్న కాలంలో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనాను వ్యక్తం చేసింది. ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలతో దీనిపై స్పష్టత ఏర్పడుతుందని పేర్కొంది. వడ్డీ రేట్లు తగ్గడం, జీడీపీ అధిక వృద్ధి, బడ్జెట్లో కల్పించిన పన్ను ప్రయోజనాలతో అమ్మకాలు బలంగా కొనసాగినట్టు తెలిపింది. రెపో రేటు 100 బేసిస్ పాయింట్ల మేర రేట్ల తగ్గింపు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్ను తగ్గింపు (జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ) నేపథ్యంలో పెరిగిన వినియోగ విశ్వాసం ఇళ్ల అమ్మకాలపై ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉందని పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో టాప్–8 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2,57,804 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఒక శాతం తగ్గినట్టు వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ గణాంకాలు ఇందులో కలసి ఉన్నాయి. సంస్థాగత పెట్టుబడులు 11 శాతం అప్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు సెప్టెంబర్ త్రైమాసికంలో 11 శాతం పెరిగి 1.27 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ఆఫీస్ వసతుల్లోకి మెరుగైన పెట్టుబడుల రాక ఇందుకు దోహదం చేసింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో 1.15 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు పేర్కొంది. 780 మిలియన్ డాలర్లు ఆఫీస్ వసతుల్లోకి రాగా, 320 మిలియన్ డాలర్లు నివాస గృహ ప్రాజెక్టుల్లోకి వచ్చాయి. భారత ఆరి్థక వ్యవస్థ మూలాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలపై ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్యాజ్ఞిక్ తెలిపారు. 1.27 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 60 శాతం దేశీ ఇన్వెస్టర్ల రూపంలో రాగా, మిగిలిన మొత్తం విదేశీ ఇన్వెస్టర్లు సమకూర్చారు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 51 శాతం పెరగ్గా, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 21 శాతం తగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లలో అప్రమత్త ధోరణి నెలకొన్నప్పటికీ, రానున్న రోజుల్లోనూ ఈ రంగంలోకి సంస్థాగత పెట్టుబడుల రాక బలంగా కొనసాగుతుందని యాజి్ఞక్ అంచనా వేశారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆటో మోడ్‌లో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 15 ఏళ్లుగా స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని, ప్రస్తుతం ఇతర అంశాల సహాకారం లేకుండా కూడా నిర్దిష్టమైన వృద్ధిని నమోదు చేసే ఆటో మోడ్‌లో ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO, నరెడ్కో) అధ్యక్షుడు మేకా విజయ సాయి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నరెడ్కోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఆర్ఈడీఏ అని పిలిచేవారు. నరెడ్కో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాపర్టీ షో వివరాలు తెలిపేందుకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకా విజయ సాయి మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తీర్ణం ఇప్పుడు ఏకంగా 1,28,000 చదరపు కిలోమీటర్ల వరకూ ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి టారిఫ్‌లు, ఐటీ ఉద్యోగాల్లో అనిశ్చితి వంటివి ఒడిదుడుకులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఈ రంగం స్థిరమైన అభివృద్ధిని నమోదు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రీజనల్ రింగ్ రోడ్డు వంటివి ఇందుకు దోహదపడతాయని అన్నారు. వృద్ధి విషయంలో హైదరాబాద్, ముంబైను దాటిపోయిందన్నారు. హైదరాబాద్‌లో భూమి అందుబాటులో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం ఇందుకు కారణమని తెలిపారు. గత ఏడాది జూలై సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకం ధరలు ఎనిమిది శాతం వరకూ పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల నాలుగు నుంచి 24 శాతం వరకూ ఉందన్నారు.ఐటీ అనిశ్చితి, ట్రంప్ విధానాలు ఒక రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టే్ట్ రంగానికి ఉపయోగపడేవని అభిప్రాయపడ్డారు. అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి పెంచుకుంటున్నారని తెలిపారు.అమ్మకాలపై నెగటివ్ ప్రచారం..హైదరాబాద్‌లో లక్ష వరకూ రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయని ఇటీవల వచ్చిన వార్తలను మేకా విజయ సాయి ఖండించారు. నగరంలో ఎన్ని యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి? ఎన్ని అమ్ముడుపోయాయి? ఎన్ని కాదు? అన్నది తెలుసుకునేందుకు తగిన శాస్త్రీయ సమాచారం ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. ప్రభుత్వ సంస్థల నుంచి భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతుల ఆధారంగా కొందరు రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడుపోవడం లేదన్న వార్తలు సృష్టించారని చెప్పారు. తమకున్న సమచారం మేరకు డెవలపర్లు స్థిరంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. నగరంలో అపార్ట్మెంట్ల ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయన్న విమర్శకు ఆయన బదులిస్తూ.... 600 - 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన అపార్ట్మెంట్లు చాలా వరకూ అమ్ముడుపోవడం లేదని, దీన్నిబట్టి ప్రజలు మరింత విశాలమైన ఆపార్ట్మెంట్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోందని అన్నారు.ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్: కె.శ్రీధర్ రెడ్డినరెడ్కో 15వ ప్రాపర్టీ షో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుందని సంస్థ ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్ రెడ్డి తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో 74 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరితోపాటు బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆరు, సరఫరాదారులు ఐదుగురు, పర్యాటక రంగానికి చెందిన రెండు, భవన నిర్మాణ సామాగ్రీ, టెక్నాలజీలకు సంబంధించిన ఎనిమిది స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని వివరించారు. ఈ ప్రదర్శనలో రియల్ ఎస్టేట్ యూనిట్ కొనుగోలుదారులు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్‌లో ప్రత్యేక రాయితీ అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నరెడ్కో ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్, కోశాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ‘పార్కింగ్’ దందా..
‘గ్రోహె–హురన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇది. హైదరాబాద్‌లోని ఓ ప్రాజెక్ట్‌లో ద్విచక్ర వాహనం కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని.. కార్గా ఏమార్చి కొనుగోలుదారునికి విక్రయించి సొమ్ము చేసుకుంది. భవన నిర్మాణ అనుమతి పత్రంలో బైక్ పార్కింగ్ స్థలాన్ని డ్రాయింగ్‌లో కారు బొమ్మగా మార్చారని ఆరోపిస్తూ ఓ ఫిర్యాదుదారుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా)ను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన టీజీ–రెరా అప్రూవల్ ప్లాన్‌ను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు’.. గృహ కొనుగోలుదారులకు పార్కింగ్ స్థలం విక్రయంలో పేరు మోసిన నిర్మాణ సంస్థ తీరే ఇలా ఉంటే చిన్నాచితక డెవలపర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య కాలంలో బిల్డర్ల అక్రమ పార్కింగ్ విక్రయాలపై టీజీ–రెరాకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోజీవో నంబరు 168 ప్రకారం 2 వేల గజాలపైన నిర్మించే నివాస భవన నిర్మాణాలలో 33 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్‌కు కేటాయించాలి. ఇందులో 30 శాతం ఆ భవనంలోని నివాసితులకు, 3 శాతం సందర్శకుల కోసం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య భవన నిర్మాణాలలో అయితే 44 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో 40 శాతం రిటైల్ స్టోర్లకు, 4 శాతం సందర్శకులకు కేటాయించాలి. 2.5/4.5 మీటర్ల పొడవు, వెడల్పుతో కారు పార్కింగ్‌ను కేటాయించాలి. దీనికంటే తక్కువ ఉండకూడదు. కానీ, ప్రస్తుతం ఈ నిబంధనలను తూ.చ. తప్పకుండా అనుసరించే డెవలపర్లు చాలా తక్కువే.లాటరీ పద్ధతిలో పార్కింగ్ ప్లేస్.. ఏ గృహ కొనుగోలుదారుడికి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ కేటాయించాలనే అంశంపై కూడా నిబంధనలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) వచ్చిన మూడు నెలలలోపు అసోసియేషన్ ఏర్పాటు కావాలి. నివాసితులకు పార్కింగ్ ప్లేస్‌ల కేటాయింపు కోసం ఆఫీస్ బేరర్స్ సమక్షంలో లాటరీ పద్ధతిలో కేటాయించాలి. 600 గజాలలోపు నిర్మించే స్టిల్ట్+5 అంతస్తుల భవనాలకైతే డీమ్డ్ టు సాటిస్ఫై ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాలలో అక్రమ పార్కింగ్ విక్రయాలపై సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.టీడీఆర్తోనూ పార్కింగ్ సమస్యలే.. సాధారణంగా డెవలపర్లు అనుమతి ఉన్న దాని కంటే అదనంగా పార్కింగ్ ప్లేస్‌లను విక్రయిస్తుంటారు. ఉదాహరణకు అప్రూవల్ డ్రాయింగ్‌లో 450 కార్ల పార్కింగ్ ప్లేస్‌లకు అనుమతి లభిస్తే.. 600ల పార్కింగ్ ప్లేస్‌లుగా మార్చి విక్రయిస్తుంటారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో కారు పార్కింగ్‌ను రూ.1–5 లక్షల చొప్పున అమ్ముకుంటుంటారు. కొందరు డెవలపర్లు స్టిల్+4 అంతస్తులకు నిర్మాణ అనుమతులు తీసుకొని, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) తీసుకొని ఇంకో అంతస్తు నిర్మిస్తున్నారు. 400 గజాల్లో 8 అపార్ట్మెంట్లు వస్తే.. టీడీఆర్ తీసుకొని ఇంకో అదనపు అంతస్తులో రెండు ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. దీంతో యూనిట్ల సంఖ్య పెరిగి, పార్కింగ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.డ్రైవ్ వేలు కూడా పార్కింగ్గానే.. ఆరు నెలల్లో 10–12 అక్రమ పార్కింగ్ విక్రయ ఫిర్యాదులే వచ్చాయి. కొందరు డెవలపర్లు డ్రైవ్ వేలను కూడా పార్కింగ్ ప్లేస్‌గా మార్చి విక్రయిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులలో అప్రూవ్డ్ డ్రాయింగ్ ప్లాన్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాం. – కే.శ్రీనివాసరావు, సభ్యులు, టీజీ–రెరా -
పునాది నుంచే పొదుపు.. తక్కువ ఖర్చుతో సొంతిల్లు
గత దశాబ్దంలో గృహ నిర్మాణ వ్యయం (house construction) రెండింతలు పెరిగింది. ముఖ్యంగా పునాది నిర్మాణంలో అవసరమైన మెటీరియల్స్ (construction material) ధరలు గణనీయంగా పెరిగాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సొంతిల్లు కలను నెరవేర్చుకోవాలంటే ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరైంది.ఈ నేపథ్యంలో, సంప్రదాయ మెటీరియల్స్‌కు ప్రత్యామ్నాయంగా చౌకగా, మన్నికగా, పర్యావరణ హితంగా ఉండే కొత్త మేటీరియల్స్ ఇప్పుడు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. తక్కువ ఖర్చుతోనే నిర్మాణ నాణ్యతను కోరుకునే వారికి ఇవి వరంగా మారుతున్నాయి.మెటీరియల్సంప్రదాయ ఎంపికలుకొత్త/చౌకైన ప్రత్యామ్నాయాలువిశేషాలుసిమెంట్ఓపీసీ, పీపీసీజియోపాలిమర్ సిమెంట్, స్లాగ్ బేస్డ్ సిమెంట్తక్కువ ఉద్గారాలు, శాశ్వతత ఎక్కువఇసుకనది ఇసుకఎం-సాండ్, రోబో సాండ్తక్కువ ధర, నది పరిరక్షణరాళ్లు20ఎంఎం, 40ఎంఎం మిక్స్రీసైకిల్ అగ్రిగేట్వ్యర్థాలను ఉపయోగించి తయారీస్టీల్ (TMT)Fe500, Fe550బసాల్ట్ రీబార్తక్కువ బరువు, తక్కువ ఖర్చు, ఎక్కువ సంవత్సరాలు మన్నికబీమ్ & ఫౌండేషన్సైట్లలో తయారు చేసే బీమ్లుప్రికాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్వేగంగా నిర్మాణం, శ్రమ ఆదాకొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీలు, మెటీరియల్స్రోబో సాండ్ – ఇసుకకు ఉత్తమ ప్రత్యామ్నాయం* మేనుఫ్యాక్చర్డ్ శాండ్ (M-Sand) కన్నా మెరుగైన గుణాత్మకత కలిగిన రోబో సాండ్, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉంది.* ధర నది ఇసుక కంటే 25-30% తక్కువ.* గృహ నిర్మాణానికి సరైన పైనెస్ మోడ్యూలస్ (Fineness modulus) కలిగి ఉంటుంది.జియోపాలిమర్ సిమెంట్ – పర్యావరణ హితమైన కొత్త పరిష్కారం* జియోపాలిమర్ సిమెంట్ తయారీలో లైమ్ వినియోగం తక్కువగా ఉంటుంది.* OPC కంటే 60% తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేస్తుంది.* పునాది స్థాయిలోనే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌ను అమలుపరచవచ్చు.ప్రికాస్ట్ బ్లాక్స్ – వేగంగా నిర్మాణం* ఫౌండేషన్, పిలర్స్, వాల్ సెక్షన్లను ముందే తయారు చేసి సైటులో ఫిక్స్ చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది.* ఒక సాధారణ 1000 చ.అ. ఇంటికి 15 రోజుల పని, 5–6 రోజుల్లో పూర్తవుతుంది.బసాల్ట్ రీబార్ – స్టీల్‌కు ఆధునిక ప్రత్యామ్నాయం* బసాల్ట్ ఫైబర్‌తో తయారవుతుంది.* తక్కువ బరువు, తక్కువ ఖర్చు.* తేమ, ఉప్పు వల్ల తుడుపుకు గురికాకపోవడం దీని ప్రత్యేకత.నిర్మాణ ఖర్చు తగ్గాలంటే.. ఇంజినీర్లు, నిపుణుల సలహాలు* స్థలానికి దగ్గరగా లభించే మెటీరియల్స్‌ను ప్రాధాన్యత ఇవ్వాలి.* పునాది నిర్మాణానికి ముందు సైట్ సొయిల్స్ టెస్టింగ్ తప్పనిసరిగా చేయించాలి. తద్వారా అవసరమైన మెటీరియల్స్‌ను సరిగ్గా అంచనా వేయవచ్చు.* సామూహిక కొనుగోలు లేదా గ్రామీణ కాంట్రాక్టర్లతో పనిచేయడం ద్వారా మెటీరియల్ ధరకులను తగ్గించవచ్చు.* ప్రికాస్ట్ టెక్నాలజీని అనుసరించడం వల్ల పని వేగంగా పూర్తవుతుంది, లేబర్ ఖర్చు తగ్గుతుంది.చివరగా..పునాది నుంచే చౌకగా, మన్నికగా, పర్యావరణహితంగా నిర్మించగలిగితే ఇంటి మొత్తం నిర్మాణ వ్యయం మీద సగటున 15 నుంచి 20 శాతం వరకు ఆదా చేయవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
మూడు నెలల్లో 97,080 ఇళ్ల అమ్మకం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు కొనసాగుతున్నప్పటికీ.. మన దేశంలో నివాస విభాగం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, గృహ యజమానుల అభిరుచులతో గృహాల కొనుగోళ్లు స్థిరంగానే ఉంటున్నాయి.దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో 97,080 ఇళ్లు అమ్ముడుపోయాయి. గతేడాది క్యూ3లో విక్రయమైన 1,07,060 యూనిట్లతో పోలిస్తే 9 శాతం తగ్గగా.. ఈ ఏడాది క్యూ2లో సేల్ అయిన 96,290 నివాసాలతో పోలిస్తే 1 శాతం వృద్ధి చెందాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.ఇక, 2025 క్యూ3లో 96,690 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో సరఫరా అయిన 98,630 యూనిట్లతో పోలిస్తే 2 శాతం క్షీణించగా.. గతేడాది క్యూ3లో సప్లయ్ అయిన 93,750 యూనిట్లతో పోలిస్తే మాత్రం 3 శాతం పెరిగాయి. అయితే ఇళ్ల అమ్మకాలు తగ్గినప్పటికీ వాటి విలువ మాత్రం 14 శాతం పెరిగింది. గతేడాది క్యూ3లో అమ్ముడైన ఇళ్ల విలువ రూ.1.33 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది క్యూ3లో విక్రయమైన గృహాల విలువ రూ.1.52 లక్షల కోట్లుగా ఉంది.లగ్జరీ ఇళ్లదే హవా..ఇళ్ల విక్రయాలు, లాంచింగ్స్‌లో ముంబైలో అత్యధికంగా జరిగాయి. దేశ ఆర్థిక రాజధానిలో 2025 క్యూ3లో 30,260 గృహాలు అమ్ముడుపోగా.. 29,565 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పుణెలో 16,620 ఇళ్లు విక్రయం కాగా.. 19,375 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. లాంచింగ్స్‌లో అత్యధికంగా లగ్జరీ గృహాలదే ఆధిపత్యం కొనసాగుతుంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్న విలాసవంతమైన ఇళ్ల వాటా 38 శాతంగా ఉండగా.. అందుబాటు గృహాల వాటా 16 శాతంగా ఉంది. రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 24 శాతం, రూ.40–80 లక్షల ధర ఉన్న మధ్యతరగతి ఇళ్ల వాటా 23 శాతంగా ఉంది.5.64 లక్షల ఇన్వెంటరీ..అమ్మకానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) యూనిట్ల సంఖ్య గతేడాది క్యూ3లో 5.64 లక్షలుగా ఉండగా.. ఈ క్యూ3 నాటికి 5.61 లక్షలకు తగ్గాయి. ఏడాదిలో ప్రాపరీ్టల ధరలు 9 శాతం పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా ఎన్సీఆర్లో ధరలు 24 శాతం పెరగగా.. బెంగళూరులో 10 శాతం వృద్ధి చెందాయి.హైదరాబాద్‌లో..ఈ ఏడాది మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో 8,630 గృహాలు లాంచింగ్ అయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ప్రారంభమైన 13,890 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ. ఏడాది కాలంలో నగరంలో లాంచింగ్స్ 22 శాతం మేర తగ్గాయి. నగరంలో ప్రీమియం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాల డిమాండ్ కొనసాగుతోంది. అందుకే ఈ క్యూ3లో లాంచింగ్ అయిన యూనిట్లలో రూ.80 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా ఏకంగా 87 శాతంగా ఉంది. ఇక, 2025 క్యూ3లో నగరంలో 11,305 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయమైన 12,735 ఇళ్లతో పోలిస్తే ఇది 11 శాతం తక్కువ.ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
ఇల్లు కొనేవాళ్లకు భరోసా.. అక్రమ డెవలపర్లకు కొరడా!
ప్రీలాంచ్‌లు, సాఫ్ట్ లాంచ్‌ల పేరుతో ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయకముందే కస్టమర్లు నుంచి ముందస్తుగా డిపాజిట్లు సేకరించడం, వసూలు చేసిన సొమ్ము వ్యక్తిగత అవసరాలకు మళ్లించడం, న్యాయపరమైన చిక్కులతో నిర్మాణ అనుమతులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా నిర్మాణ వ్యయ భారంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేయడం, సంవత్సరాల కొద్దీ నిర్మాణ పనులు కొనసాగిస్తుండటం.. ఇలా ఒకట్రెండు కాదు సొంతింటి కలకు సవాలక్ష సవాళ్లు. కానీ, ఇవన్నీ రెరా కంటే ముందు మాట. దేశంలో రెరా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత డెవలపర్లలో స్థిరాస్తి రంగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. దీంతో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంది. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో 2016లో అమలులోకి వచ్చిన రెరా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కీలకమైన ఘట్టం. దశాబ్దాలుగా అనిశ్చితి దేశీయ స్థిరాస్తి రంగాన్ని సంఘటితంగా, పారదర్శక, జవాబుదారీతనంగా మార్చింది మాత్రం రెరానే. విక్రయాలు, ప్రాజెక్ట్ డెలివరీ, స్థిరమైన ధరల పెరుగుదలను తీసుకురావడంతో పాటు రియల్టీలోకి సంస్థాగత, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు అవకాశాలను కల్పించిందని నైట్‌ఫ్రాంక్, నరెడ్కో సంయుక్త నివేదిక వెల్లడించింది. అయితే రెరా అమలు అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా లేకపోయినప్పటికీ.. చట్టం ప్రధాన ఉద్దేశం మాత్రం విప్లవాత్మకమైనదే. దేశం పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెరా స్థిరమైన, సమానమైన అమలు సాగడం అత్యవసరం.1.50 లక్షల ప్రాజెక్ట్‌ల నమోదు..ఇప్పటి వరకు మన దేశంలో నాగాలాండ్ మినహా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో రెరా నోటిఫై అయ్యింది. దేశవ్యాప్తంగా రెరాలో 1.50 లక్షలకు పైగా ప్రాజెక్ట్‌లు, లక్ష కంటే ఎక్కువ మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటి వరకు 1.50 లక్షలకుపైగా ఫిర్యాదులు పరిష్కృతమయ్యాయి.ఎస్క్రో అకౌంట్..దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 648 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 52 శాతం వాటా ఉన్న నివాస సముదాయం విభాగంలో పారదర్శకత అత్యవసరం. కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతా తెరిచి అందులో వేయాలి. ఆయా సొమ్మును కేవలం నిర్ధిష్ట ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం మాత్రమే వెచ్చించాలి.తెలంగాణ రాష్ట్రంలో..2016లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) ముందంజలో ఉంది. పారదర్శకత, సామర్థ్యం, చురుకైన అమలుతో దేశంలో అత్యధిక ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల నమోదులో ఇతర రాష్ట్రాల కంటే తొలిస్థానంలో నిలిచింది. మహా రెరాలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు, 52 వేల మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం టీజీ రెరాలో 10,123 ప్రాజెక్ట్‌లు, 4516 ఏజెంట్లు రిజిస్టరయ్యారు. 2,340 ఫిర్యాదులు అందగా.. 1,566 పరిష్కృతమయ్యాయి.రెరా ఎందుకొచ్చిందంటే?గత దశాబ్దంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ రియల్ ఎస్టేట్ రంగంలో వేగవంతమైన విస్తరణకు కారణమైంది. రెరా కంటే ముందు రియల్టీ పరిశ్రమలో అనిశ్చితి ఉంది. ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అంటూ లేదు. డెవలపర్లను, లావాదేవీలను నియంత్రించడానికి నిర్ధిష్టమైన చట్టాలు లేవు. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన మెట్రో ప్రాంతాలలోనే రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పెద్దగా రియల్టీ మార్కెట్ ఉండేది కాదు. డెవలపర్లు తరచూ ఊహాజనిత పెట్టుబడులపై ఆధారపడేవారు. లావాదేవీలలో పారదర్శకత లోపించేది. దీంతో అధిక పరపతి, విస్తృత రుణ డిఫాల్ట్‌లు, ప్రాజెక్ట్ డెలివరీలో తీవ్ర జాప్యం, వ్యయాల పెరుగుదల, గృహ కొనుగోలుదారుల నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వంటివి జరిగేవి. ఈ వ్యవస్థాగత వైఫల్యాలతో అనేక ప్రాజెక్ట్‌లు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారుల విశ్వాసం దెబ్బతింది. లక్షలాది మంది కస్టమర్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. స్థిరాస్తి మార్కెట్ కార్యకలాపాలు క్షీణించాయి.దీంతో విధానపరమైన జోక్యం, కఠిన నిబంధనల అమలు అత్యవసరమయ్యాయి. 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ మరియు అభివృద్ధి చట్టం(రెరా)కు దారి తీసింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమబదీ్ధకరణతో పాటు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు ఆర్థిక భరోసా కల్పిచడమే లక్ష్యంగా రెరా అమలులోకి వచ్చింది.ఏ దేశంలో ఏ రకమైన నిర్మాణ రంగం చట్టాలంటే?1920: దక్షిణాఫ్రికా, ది హౌసింగ్ యాక్ట్1937: అమెరికా, యునైటెడ్ స్టేట్స్ హౌసింగ్ యాక్ట్1960: సింగపూర్, హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్(హెచ్డీబీ)1965: యూఎస్ఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (హెచ్యూడీ)1985: యూకే, హౌసింగ్ యాక్ట్1994: చైనా, అర్బన్ రియల్ ఎస్టేట్ అడ్మినిస్ట్రేషన్ లా2007: దుబాయ్, యూఏఈ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ(రెరా)2016: ఇండియా, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా..
పండగ అంటే ప్రతి ఇంటా ఆనందమే.. ఫెస్టివల్ సీజన్ (Festive Season) వస్తుందంటే చాలు మార్కెట్లు కళకళలాడుతుంటాయి. దీనికి స్థిరాస్తి రంగం మినహాయింపు కాదు. తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితితో ఆరంభమయ్యే పండగ సీజన్ హోలీ వరకూ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో కేంద్రం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచింది. దీంతో ఈసారి పండగ ప్రాపర్టీ కొనుగోలుదారులకు డబుల్ ధమాకాగా మారింది. - సాక్షి, సిటీబ్యూరోదీంతో ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు 25–30 శాతం అధికంగాఉంటాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. డెవలపర్లలో నూతనోత్తేజం నెలకొంది. పండగ సీజన్లో రియల్ రంగానికి (Real Estate) పండగే. కాకపోతే ఈసారి కొనుగోలుదారులకే సిసలైన పండగ అని చెప్పాలి. ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గృహ రుణాలపై వడ్డీ భారం తగ్గుముఖం పట్టింది. జీఎస్టీ భారం తగ్గింది. అందుకే ఈ పండగ సీజన్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి డబుల్ ధమాకాగా చెప్పొచ్చు.హైదరాబాద్‌లో ఏడాదిన్నరగా ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలతో అడుగులు ముందుకు వేస్తుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరుగుతోంది. కాకపోతే ఇళ్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాలని కొందరు ఎదురుచూస్తుండగా.. మార్కెట్ మెరుగ్గా లేని తరుణంలో కొంటేనే మెరుగని, ఒకసారి అమ్మకాలు పెరిగితే కొనుగోలు చేయడం కష్టమని భావించిన కొందరు కస్టమర్లు నచ్చిన ప్రాజెక్ట్‌లలో ఫ్లాట్లను కొనేందుకు ముందుకొస్తున్నారని పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు.ఔత్సాహిక బయ్యర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ.. కోకాపేట, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, నియోపొలిస్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లను ఎంచుకోవడానికి కొనుగోలుదారులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిమిత సంఖ్యలో ఉన్న ఫ్లాట్లను ఇప్పుడు కొనకపోతే మరెప్పుడూ కొనలేమనే ఆలోచన బయ్యర్లలో ఏర్పడింది. అందుకే ఆయా ప్రాంతాలలో ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించినా కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. -
ఈ చిన్న టెక్నిక్స్‌తో నిర్మాణ సామగ్రి ఖర్చు సేవ్
ఇల్లు నిర్మించడం అనేది ప్రతివ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక, భావోద్వేగ పెట్టుబడుల్లో ఒకటి. కానీ, నిర్మాణ ఖర్చులు క్రమంగా పెరుగుతున్న కాలంలో మెటీరియల్ ధరలు, ద్రవ్యోల్బణం, కార్మిక కొరత సవాళ్లుగా మారుతున్నాయి. అయినప్పటికీ సొంతింటి నిర్మాణంలో నాణ్యత విషయంలో గృహ యజమానులు రాజీపడడం లేదు. అందుకోసం తెలివైన, మరింత సమర్థవంతమైన మార్గాల కోసం చూస్తున్నారు. అందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి మెటీరియల్ కొనుగోలు విషయంలో డబ్బులు మిగుల్చుకునే మార్గాలు ఏమిటో.. నిర్మాణదశలో కొత్త టెక్నాలజీలు ఏమున్నాయో తెలుసుకుందాం.డబ్బు మిగిలే మార్గాలు..బల్క్ ఆర్డర్లుపెద్ద మొత్తంలో మెటీరియల్స్ కొనుగోలు చేయడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సరఫరాదారులు తరచుగా సిమెంట్, స్టీల్, ఇటుకలు, టైల్స్ బల్క్ ఆర్డర్లపై రాయితీ ఇస్తారు. నిత్యం చిన్నమొత్తంలో కొనుగోలు చేయడం కంటే బల్క్‌గా కొంటే రిటైలర్‌తో బేరమాడి తక్కువ ధరకే పొందవచ్చు.సీజనల్ కొనుగోలుమెటీరియల్ ధరలు సీజన్‌ను అనుసరించి మారుతుంటాయి. మార్కెట్ డిమాండ్‌తో ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించాలి. ఉదాహరణకు, వర్షాకాలంలో ఉక్కు, సిమెంట్ ధరలు చౌకగా ఉండే అవకాశం ఉంటుంది.ప్రత్యామ్నాయ మెటీరియల్ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రిని ఎంచుకోవడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. ఫ్లై యాష్ ఇటుకలు, ఏఏసీ బ్లాక్స్ వంటివి తక్కువ ధరతో ఎక్కువ మన్నికనిస్తాయి. ఈ మెటీరియల్స్ నిర్మాణ, రవాణా ఖర్చులను కూడా తగ్గిస్తాయి.పునర్వినియోగంపాత భవనాలు లేదా కూల్చివేసిన సైట్ల నుంచి కిటికీలు, తలుపులు, శానిటరీవేర్ లేదా టైల్స్ వంటి సెకండ్ హ్యాండ్ మెటీరియల్స్‌ను తిరిగి వాడుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఇలా రీయూజబుల్ మెటీరియల్‌ను అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వాటి గురించి తెలుసుకొని అవసరమైతే కొనుగోలు చేసుకోవచ్చు.ప్రభుత్వ పథకాలుప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. భవనాలకు కావాల్సిన మెటీరియల్స్‌పై తగ్గించిన జీఎస్టీ రేట్లు, సరసమైన గృహాలకు సబ్సిడీలు (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటివి), పన్ను మినహాయింపులు ఇవన్నీ మొత్తం నిర్మాణ వ్యయాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి.టెక్నాలజీలునిర్మాణంలో 3డీ ప్రింటింగ్టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 3డీ-ప్రింటెడ్ గృహాలు నిర్మాణం ఎక్కువైంది. టెక్నాలజీ ఆధారంతో ఎలాంటి డిజైనింగ్ ఇళ్లు కావాలనేదానిపై ముందుగానే అంచనాలు ఏర్పరుచుకొని ఖర్చు తగ్గించుకునేలా 3డీ ప్రింటెడ్ గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగంలో కొన్ని స్టార్టప్‌లు తక్కువ సమయంలోనే గృహాలను నిర్మిస్తున్నాయి. దీనివల్ల సమయం, కార్మిక ఖర్చులు రెండింటినీ మిగుల్చుకోవచ్చు.ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ప్రీ-కాస్ట్ గోడలు(ముందుగానే కట్టిన గోడలు), ఫ్లోర్ ప్యానెల్స్, పైకప్పులు బయట ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారు. ఇంటి అవసరానికి తగినట్లుగా నిర్దిష్ట కొలతలతో అసెంబ్లింగ్ కోసం నిర్మాణ స్థలానికి రవాణా చేస్తున్నారు. ఇది ఆన్-సైట్ వ్యర్థాలను తగ్గిస్తుంది. నిర్మాణ సమయాన్ని 50% వరకు తగ్గించగలదు.బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్(బీఐఎం)బీఐఎం వాస్తుశిల్పులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు భాగస్వామ్య 3D మోడల్‌ను ఉపయోగించి వారికి సహకరిస్తుంది. ఇది కచ్చితమైన పదార్థ అంచనాను నిర్ధారిస్తుంది. డిజైనింగ్ అవరోధాలను నిరోధిస్తుంది. సరళంగా చెప్పాలంటే బీఐఎం అనేది కట్టే ఇంటికి నమూనాలాంటిది.ఏఐ-ఆధారిత ఎస్టిమేటర్లుకృత్రిమ మేధ సాధనాలు డిజైన్ బ్లూప్రింట్లను విశ్లేషించగలవు. కచ్చితమైన మెటీరియల్ అంచనాలను అందించగలవు. ఇది అధిక ఆర్డర్లు, తక్కువ వినియోగం లేదా చివరి నిమిషంలో మెటీరియల్ కోసం కంగారు పడడం వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది.గ్రీన్ కాంక్రీట్ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థ ఉత్పత్తుల నుంచి తయారైన జియోపాలిమర్ కాంక్రీట్ సాంప్రదాయ సిమెంట్‌కు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ మెటీరియల్ మన్నికగా ఉంటూ పర్యావరణ కాలుష్యాన్ని కట్టడి చేయడంలో తోడ్పడుతుంది.డ్రోన్ ఆధారిత సైట్ సర్వేలుహై-రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లతో కూడిన డ్రోన్లు వివరణాత్మక టోపోగ్రాఫిక్ మ్యాప్‌లు అందిస్తాయి. భారీ నిర్మాణ సైట్‌ల్లో డెవలప్మెంట్ను ట్రాక్ చేసేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది.ఇదీ చదవండి: ‘నా తండ్రి మందు తాగి భూమి అమ్మాడు’ -
ఇళ్ల అమ్మకాలు డీలా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 9 శాతం మేర తక్కువగా ఉంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ అంచనా వేసింది. 97,080 యూనిట్ల విక్రయాలు నమోదు కావొచ్చంటూ క్యూ2పై ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ఆధారంగా ఒక నివేదికను విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,07,060 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, విలువ పరంగా 1.52 లక్షల కోట్ల విక్రయాలు ఉంటాయని, క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాల విలువ రూ.1.33 లక్షల కోట్లతో పోల్చి చూస్తే ఇది 14 శాతం అధికమని పేర్కొంది. ప్రీమియం, లగ్జరీ ఇళ్ల విభాగంలో లావాదేవీలు పెరగడం మొత్తం మీద సెప్టెంబర్ త్రైమాసికంలో విక్రయాల విలువ వృద్ధికి కారణమని అనరాక్ నివేదిక తెలిపింది. సరఫరా కంటే విక్రయాలే అధికంగా ఉన్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలి పారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో పరిస్థితి సానుకూలంగా ఉన్నట్టుగా ఇది తెలియజేస్తోందన్నారు. హైదరాబాద్‌లో 11,305 యూనిట్లు → హైదరాబాద్ మార్కెట్లో సెపె్టంబర్ త్రైమాసికంలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తగ్గి 11,305 యూనిట్లుగా ఉంటాయన్నది అనరాక్ అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో 12,735 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. → బెంగళూరులో ఒక శాతం తక్కువగా 14,835 యూనిట్ల విక్రయాలు జరగొచ్చు. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 13,920 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తక్కువ. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 16 శాతం తగ్గి 30,260 యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో 36,915 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → పుణెలో 16 శాతం క్షీణతతో 16,620 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. కోల్‌కతాలో 4,130 యూనిట్ల విక్రయాలు జరగొచ్చన్నది అనరాక్ వేసిన అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇక్కడ 3,980 యూనిట్ల అమ్మకాలతో పోల్చి చూస్తే 4 శాతం అధికం. → చెన్నైలోనూ 33 శాతం అధికంగా 6,010 యూనిట్ల అమ్మకాలు ఉంటాయని అనరాక్ నివేదిక పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ డౌన్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఆఫీసు లీజింగ్ (కిరాయికి ఇవ్వడం) సెపె్టంబర్ త్రైమాసికంలో ఢీలా పడింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 48 శాతం తక్కువగా 15 లక్షల చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) ఉంటుందని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 29 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో మాత్రం ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఫ్లాట్ పనితీరు చూపించింది. 172 లక్షల చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ)గా ఉంటుందని.. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లో డిమాండ్ తగ్గినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏడు నగరాల్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 174 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. లీజు పునరుద్ధరణ లావాదేవీలు ఇందులో కలసి లేవు. ఈ మేరకు సెపె్టంబర్ త్రైమాసికంపై తన అంచనాలను కొలియర్స్ ఇండియా విడుదల చేసింది. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో లీజింగ్ 16 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చన్నది కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ పరిమాణం 24 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → బెంగళూరులోనూ లీజింగ్ 25 శాతం తగ్గి 47 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంటుంది. → కోల్‌కతాలో ఎలాంటి వృద్ధి లేకుండా లక్ష చదరపు అడుగులుగా ఉండొచ్చు. → చెన్నై మార్కెట్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 86 శాతం మేర పెరిగి 26 లక్షల ఎస్ఎఫ్టీకి చేరుకుంటుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ పరిమాణం 14 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → ముంబైలోనూ 76 శాతం వృద్ధితో 30 లక్షల చదరపు అడుగుల మేర లీజింగ్ నమోదు కానుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 17 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → పుణెలో 37 లక్షల ఎస్ఎఫ్టీ మేర లీజింగ్ ఉండొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 42 శాతం అధికంగా నమోదు కానుంది. → అన్ని రకాల ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ను గమనిస్తే 8 శాతం పెరిగి 509 లక్షల చదరపు అడుగులుగా ఉంటుందన్నది అంచనా. బలమైన పనితీరు.. ‘‘భారత ఆఫీస్ మార్కెట్ బలమైన పనితీరును కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య పరమైన అనిశి్చతులు నెలకొన్నప్పటికీ ఈ ఏడాది తొమ్మిది నెలల్లో లీజింగ్ 50 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించింది. ఏడు నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు ఇప్పటికే 20 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్‌ను నమోదు చేశాయి. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వీటి వాటా 40 శాతానికి చేరింది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా తెలిపారు. -
లగ్జరీ సౌకర్యాలతో హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్ట్
హైదరబాద్‌లో లగ్జరీ ప్రాపర్టీల మార్కెట్లో కొత్త ప్రమాణాలను సృష్టించడమే లక్ష్యంగా కొన్ని ప్రాజెక్ట్‌లు వెలుస్తున్నట్లు మకుటా డెవలపర్స్ ఛైర్మన్ జనార్ధన్ కొంపల్లి అన్నారు. ‘మకుటా తరంగ’ పేరుతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్ట్‌లు ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. మెట్రో కనెక్టివిటీ, రిటైల్ అవుట్లెట్లు, విద్యా సంస్థలు, ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నందుకు ఇలాంటి ప్రాజెక్ట్‌లకు ఆదరణ పెరుగుతున్నట్లు తెలిపారు. ఇదే అదనుగా ప్రీమియం రెసిడెన్షియల్ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.40,000 లోపు ల్యాప్‌టాప్‌ల లిస్ట్ ఇదే.. -
రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే..
సాక్షి, సిటీబ్యూరో: దసరా, దీపావళి (Dasara - Diwali) వరుస పండుగలతో సందడి మొదలైంది. షాపింగ్, వాహనాల కొనుగోళ్లతో ఇల్లంతా హడావుడిగా తయారవుతోంది. పండగ సీజన్ ప్రారంభం కావడంతో ఇంటికి రంగుల్ని వేయించడం అందరికీ కుదరకపోవచ్చు. రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే శుభ్రం చేయడం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. హడావుడి లేకుండానే ఓ పద్ధతి ప్రకారం ఇంటిని అలంకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అందనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే.. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూలను బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక మీ ఫ్లోరింగ్ మెరిసిపోతుంది.కార్పెట్లు: ఇవి దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. తరచూ వ్యాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాల్సిందే.. దుమ్ముతో కార్పెట్ కళావిహీనంగా కనిపించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తేనె, సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరకలు తొలిగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యుమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి.గోడలు: గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. బూజు, సాలెగూడు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్లతో శుభ్రం చేయాలి. గోడల్ని గట్టిగా రుద్దవద్దు.వంటింట్లో: బాత్ ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్‌పూతతో వస్తున్నాయి. స్నానాల గదిలో, వంటిట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కాహాల్‌తో తుడవాలి. నల్లాపై మరకల్ని టూత్‌పేస్టుతో తుడిచి తొలగించవచ్చు.ఇదీ చదవండి: మన రియల్‌ఎస్టేట్‌కు కలిసిరానున్న ట్రంప్ నిర్ణయం -
మన రియల్‌ఎస్టేట్‌కు కలిసిరానున్న ట్రంప్ నిర్ణయం
పీఠం ఎక్కిన తొలి రోజు నుంచీ భారత్‌పై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం.. దేశీయ స్థిరాస్తి రంగానికి ఊతమివ్వనుంది. ప్రత్యేకించి కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ను కల్పించనుంది. వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్1బీ వీసా రుసుముల పెంపు నిర్ణయంతో.. దేశీయంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు అపార అవకాశాలు ఏర్పడతాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే బహుళ జాతి సంస్థల జీసీసీలకు హాట్ ఫేవరేట్ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌లకు ఇదొక వరంగా మారనుంది. అందుబాటులో అద్దెలు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ జీసీసీలకు హబ్‌గా మారే అవకాశాలున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోజీసీసీలకు ఇండియా కేంద్రంగా అభివృద్ధిచెందడంతో బహుళ జాతి కంపెనీలు ఇక దేశీయంగానే జీసీసీల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తాయి. దీంతో హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై వంటి టెక్నాలజీ హబ్ మెట్రోల్లోని ఆఫీసు స్పేస్‌లకు ఆదరణ ఏర్పడనుంది. ప్రస్తుతం దేశంలో 1700లకు పైగా జీసీసీలు ఉండగా.. వీటిల్లో 19 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 64 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఉంది. 2030 నాటికి 2,400 జీసీసీలకు, 25–30 లక్షల మంది ఉద్యోగులకు, అలాగే వంద బిలియన్ డాలర్ల మార్కెట్‌కు విస్తరిస్తుందని కొల్లియర్స్ నివేదిక అంచనా వేసింది.ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకత..జీసీసీలు అనేవి బహుళ జాతి సంస్థల ఆఫ్‌షోర్ యూనిట్లు. ఇవి ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలను ఏకీకృతం చేసి కేంద్రాలు. దేశంలోని మెట్రో నగరాలు ఒక్కో రంగంలో కీలక హబ్‌లుగా ఉన్నాయి. బెంగళూరు ఐటీ, పరిశోధనాభివృద్ధికి, ముంబై బీఎఫ్‌ఎస్‌ఐకి, హైదరాబాద్ ఫార్మా, ఐటీ, కృత్రిమ మేధస్సుకు, పుణె ఇంజనీరింగ్‌కు, ఢిల్లీ–ఎన్సీఆర్ ఈ–కామర్స్, చెన్నై తయారీ రంగాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఖర్చును ఆదా చేసే కేంద్రాల నుంచి ఆవిష్కరణ, విలువ ఆధారిత సేవలకు వ్యూహాత్మక కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దేశంలోని జీసీసీలు కృత్రిమ మేధస్సు(ఏఐ), మెషిన్ లెరి్నంగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి.అమెరికా కంపెనీలే ఎక్కువ..భారత్‌లో జీసీసీల ఏర్పాటుకు అమెరికాకు చెందిన కంపెనీలే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. 2021 నుంచి ఇండియాలో జరిగిన జీసీసీ లీజులలో యూఎస్ కంపెనీల వాటా ఏకంగా 70 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఫార్చ్యూన్ –500 కంపెనీలు, గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఈ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో యూకే, యూరప్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా(ఈఎంఈఏ), ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) దేశాల జీసీసీలు కూడా ఇండియాలో జీసీసీలను విస్తరిస్తున్నాయి. 2025లో జరిగిన 2.8 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలలో జపాన్, ఆ్రస్టేలియా, సింగపూర్ వంటి ఏపీఏసీ దేశాల వాటా 10 శాతంగా ఉంది.జీసీసీ స్పేస్ 10 కోట్ల చ.అ.నాలుగేళ్లలో ఇండియాలోని ఏడు ప్రధాన నగరాలలో 10 కోట్ల చ.అ. స్థలాలను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. ఇది మొత్తం ఆఫీసు స్పేస్ డిమాండ్‌లో 36 శాతం. జీసీసీ లీజింగ్‌లలో టెక్నాలజీ రంగం ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. 37 శాతం లావాదేవీలలో ఐటీ రంగం తొలి స్థానంలో నిలవగా.. బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్, తయారీ రంగాలు 40 శాతం స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అలాగే 2026లో 7–7.5 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలలో 2.9–3.2 కోట్ల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకుంటాయని ‘కొల్లియర్స్’ అంచనా వేసింది. అలాగే 2027లో 7.5–8.5 కోట్ల కార్యాలయ స్థల లావాదేవీలలో జీసీసీల వాటా 3.2–3.4 కోట్లతో, ఏటా 40 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరుబహుళ జాతి సంస్థల జీసీసీలకు దక్షిణాది నగరాలు హాట్ ఫేవరెట్‌గా ఉన్నాయి. ప్రత్యేకించి ఐటీ హబ్‌లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు నగరాలు బహుళ జాతి సంస్థల జీసీసీలను ఆకర్షించడంలో తీవ్రపోటీపడుతున్నాయి. 2021–25 మధ్యకాలంలో ఈ రెండు నగరాలు మొత్తం జీసీసీ డిమాండ్‌లో 60 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.2021తో పోలిస్తే 2025లో చెన్నైలో జీసీసీ లీజులు 5.3 రెట్లు పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్ 2021 నుంచి జీసీసీ లీజింగ్‌లలో 60 శాతం వాటాను నమోదు చేస్తున్నాయి. బెంగళూరులోని ఓఆర్ఆర్, హైదరాబాద్‌లోని సెకండరీ బిజినెస్ డి్రస్టిక్ట్(ఎస్‌బీడీ) ప్రాంతాలు ఎక్కువ డిమాండ్ ఉంది. ఫార్చ్యూన్–500 కంపెనీలు ఈ కారిడార్లలో జీసీసీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2021 నుంచి దేశంలోని జీసీసీ లీజులలో ఈ కారిడార్ల వాటా ఏకంగా 37 శాతంగా ఉంది.నగరంలో 355 జీసీసీలు..ప్రస్తుతం హైదరాబాద్‌లో 355కు పైగా జీసీసీ సెంటర్లున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, సౌత్ కొరియా దేశాలకు చెందిన జీసీసీలు నగరంలో కొలువుదీరాయి. మెక్ డొనాల్డ్స్, వాన్గార్డ్, సిటిజెన్ బ్యాంక్, హీనెకెన్, బారీకేల్బాట్, డై–ఇచి, హెచ్‌సీఏ హెల్త్‌కేర్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2021లో నగరంలో 37 లక్షల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకోగా.. 2025 నాటికి 52 చ.అ.లకు చేరాయి.5.09 కోట్ల ఆఫీసు స్పేస్..దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్యకాలంలో 5.09 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 4.73 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. అలాగే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 7 నగరాలలో కొత్తగా 4.14 కోట్ల గ్రేడ్–ఏ కార్యాలయ స్థలం సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంలో సప్లయి అయిన 3.78 కోట్ల చ.అ. స్పేస్‌తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే.. -
ప్రతీ రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) సాంకేతికతను మరింత బలోపేతం చేయనుంది. గృహ కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు పారదర్శక, వేగవంతమైన సేవలను అందించేందుకు సాంకేతికతను వినియోగించనుంది. ఇందులో భాగంగా టీజీ రెరా కార్యాలయంలో కియోస్క్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎలాగైతే బ్యాంకింగ్ రంగంలో కియోస్క్‌లు చిన్నపాటి బ్యాంక్ అవుట్లెట్ లాగా పనిచేస్తాయో.. అదే తరహాలో కస్టమర్లు టీజీ రెరా సేవలన్నీ ఈ కియోస్క్ ద్వారా పొందే వీలుంటుంది. గృహ కొనుగోలుదారులు టీజీ రెరా కార్యాలయాన్ని నేరుగా సందర్శించే అవసరం లేకుండా టీజీ రెరా (TG RERA) ప్రాథమిక సేవలన్నీ ఈ కియోస్క్ ద్వారా అందుకోవచ్చని ఓ టీజీ రెరా అధికారి తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో రెరా కియోస్క్ ఏర్పాటు చేసిన తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.టీజీ రెరా యాప్ కూడా.. టీజీ రెరా మొబైల్ అప్లికేషన్ (యాప్)ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని, ఏప్రిల్‌లో యాప్ అందుబాటులోకి వస్తుందని ఓ అధికారి తెలిపారు. దీంతో పాటు క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని టీజీ రెరా అధికారులు నిర్ణయించారు. నిర్దిష్ట ప్రాజెక్ట్ సమాచారమంతా ఈ క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తమై ఉంటుంది.ప్రాజెక్ట్‌కు బయట వీక్షకులకు కనిపించేలా క్యూఆర్ కోడ్‌ను (QR Code) డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు ప్రాజెక్ట్ డెవలపర్, ప్రమోటర్, అపార్ట్మెంట్ల సంఖ్య, అనుమతులు.. ఇలా ప్రాజెక్ట్ గురించి సమస్త సమాచారం ఇట్టే తెలిసిపోతుంది. డెవలపర్లు ప్రాజెక్ట్ ప్రమోషన్, అడ్వర్టయిజింగ్ సందర్భాలలో క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మహారాష్ట్రలో 2023 ఆగస్టులో మహా రెరా ఈ క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టింది.చదవండి: మా నాన్న మందుకొట్టి స్థలం అమ్మేశాడు.. న్యాయం చేయండి10,043 ప్రాజెక్ట్‌ల నమోదు.. 2017 జులైలో మొదలైన టీజీ రెరాలో ఇప్పటివరకు 10,043 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. 4463 మంది స్థిరాస్తి మధ్యవర్తులు, ఏజెంట్లు రిజిస్టరయ్యారు. అలాగే ఇప్పటివరకు టీజీ రెరాకు 2,340 ఫిర్యాదులు అందగా.. ఇందులో 1,566 ఫిర్యాదులను పరిష్కృతమయ్యాయి. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైవీఆర్ కన్స్ట్రక్షన్స్, సత్యనారాయణ మూల, శ్రీఅమేయా కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస్ కాకర్ల ఏడుగురు ప్రమోటర్లు/ ఏజెంట్లను డిఫాల్టర్లుగా గుర్తించారు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిరి్మంచే నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లతో పాటు 8, అంతకంటే ఎక్కువ అపార్ట్మెంట్లు, నిర్మాణాలను టీజీ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. -
‘నా తండ్రి మందు తాగి భూమి అమ్మాడు’
కుమార్తె పెళ్లి కోసం ఓ తండ్రి 1995లో భూమి అమ్మాడు. అయితే తన పెద్ద కుమారుడు తండ్రిపై చేసిన ఆరోపణను సుప్రీంకోర్టు కొట్టేసి.. హిందూ అవిభాజ్య చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ తీర్పును వెలువరించింది. అసలు కుమారుడు తండ్రిపై చేసిన ఆరోపణ ఏమిటో.. కోర్టు ఏం చెప్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.అసలు కేసేంటి..?శరణప్ప అనే వ్యక్తికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. తన కుమార్తె వివాహ ఖర్చుల నిమిత్తం కుటుంబానికి చెందిన భూమికి తానే యజమానిగా ఉండడంతో 1995లో ఓ వ్యక్తికి అమ్మేశాడు. అయితే ఈ సంఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత అంటే 1999లో అతని పెద్ద కుమారుడికి విషయం తెలిసి ఈ అమ్మకాన్ని కోర్టులో సవాలు చేశాడు. తన తండ్రి శరణప్ప మద్యపానానికి బానిసై, వృథా ఖర్చుల కోసం ఈమేరకు అమ్మకం చేశాడని, తిరిగి ఆ భూమిని తమకు ఇప్పించాలని కోర్టులో దావా వేశాడు.కోర్టు తీర్పుకొనుగోలు దారుడు అప్పటికే పక్కాగా ధ్రువపత్రాలను సిద్ధం చేసుకున్నాడు. కుమారుడు వేసిన దావా కారణంగా 2000 సంవత్సరం నుంచి వివిధ కోర్టుల్లో, వివిధ దశల్లో వాదోపవాదాలు జరిగాయి. చివరగా ఈ కేసు కిందిస్థాయి కోర్టుల నుంచి సుప్రీంకోర్టు చేరింది. ఇటీవల హిందూ అవిభాజ్య కుటుంబ(హెచ్‌యూఎఫ్) చట్టంలోని అంశాలను ప్రస్థావిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ‘కుటుంబంలోని వ్యక్తుల వివాహ ఖర్చుల కోసం యజమానికి చెందిన భూమిని తాను అమ్మే హక్కు ఉంటుంది. హెచ్‌యూఎఫ్ ప్రకారం కుటుంబ కర్తగా తండ్రి ఉంటాడు. నిజమైన కుటుంబ అవసరాల కోసం ఆస్తిని అమ్మే సర్వహక్కులు శరణప్పకు ఉన్నాయి. అందుకు ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం తెలిపింది. తండ్రి మద్యపానం సేవించి ఈ లావాదేవీ చేశాడు అనడానికి ఎలాంటి రుజువులు చూపకపోవడంతో కుమారుడి దావాను కోర్టు కొట్టేసింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ జాయ్యాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: వర్షంలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ‘రెయిన్ ఫీజు’పై జీఎస్టీ -
ఇల్లు కట్టుకోవడానికి కావలసిన మెటీరియల్స్
ఇదివరకు మనం ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం ఎంచుకోవాలి?, ల్యాండ్ కొనేముందు.. గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి? అనే విషయాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కథనంలో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏవి అనే విషయాన్ని పరిశీలిద్దాం..ఇల్లు కట్టుకోవడానికి ఏ మెటీరియల్స్ కావాలనే విషయం బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది అవగాహన కోసం ఒకసారి పరిశీలిస్తే.. సిమెంట్, ఇసుక, ఇటుకలు, కంకర, ఇనుము, వాటర్ ప్రూఫ్ మెటీరియన్స్ అవసరమవుతాయి. ఇవి కాకుండా వైరింగ్ కోసం, ప్లంబింగ్ కోసం మెటీరియల్స్, టైల్స్ / మార్బుల్ / గ్రానైట్, ఉడ్, గ్లాస్ వంటివి అవసరం అవుతాయి. ఇంటీరియర్ డిజైన్ కోసం మీ అభిరుచిని బట్టి ఎలాంటి మెటీరియల్స్ కావాలనేది మీ ఛాయిస్.మెటీరియల్స్ ధరల విషయానికి వస్తే..ఇల్లు నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్ ధరలు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ధరలు గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా.. నగరాల్లో ఇంకోలా ఉంటాయి. అయితే ధరలు ఎలా ఉన్నా.. జీఎస్టీ సవరణల కారణంగా అధిక ధరల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దీంతో ఖర్చులు కొంత తగ్గుముఖం పడతాయి.ఇదీ చదవండి: ఇంటి నిర్మాణం కోసం ఓ మంచి స్థలం: ఎంపిక చేయండిలా..నిర్మాణ సామగ్రిపై కొత్త జీఎస్టీ➤సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్(ఆర్ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది.➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.➤మార్బుల్, గ్రానైట్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.రానున్న రోజుల్లో ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించవచ్చు?, వేగంగా ఇల్లు కట్టుకోవడం ఎలా?, ఇల్లు కట్టుకునేటప్పుడు ఖర్చులను తగ్గించుకునే మార్గాలు? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. -
ఇంటిపైనే కరెంటు.. వాడుకోవచ్చు.. అమ్ముకోవచ్చు
హైదరాబాద్‌లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీగా గుర్తింపు పొందిన మాదాపూర్‌లోని ఫార్చూన్ టవర్స్‌పై నిర్వాహకులు 250 కిలోవాట్స్ సోలార్ రూఫ్ టాప్ పలకను ఏర్పాటు చేసుకున్నారు. రోజుకు సగటున వెయ్యి యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నెలకు సగటున రూ.3 లక్షల వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్వాహకులు పెట్టిన పెట్టుబడి అంతా మరో ఐదేళ్లలో తీరిపోతోంది. ఆ తర్వాత వారికి పూర్తిగా సోలార్ విద్యుత్ ఉచితంగా అందనుంది. ఇలా వీరొక్కరే కాదు గ్రేటర్లో సుమారు 3,500 మంది వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుని, సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నారు.ఇంటిపై ఉత్పత్తి అయిన విద్యుత్‌తో సొంత అవసరాలు తీర్చుకుంటూ.. మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపే లక్ష్యంతో తాజాగా కేంద్రం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రేషన్‌కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి నెలకు సగటున 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఉచితంగా అందించే కార్యక్రమంలో భాగంగా కొత్తగా రూఫ్‌టాప్ సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి పలు ప్రోత్సాహకాలు అందజేస్తుంది. –సాక్షి, సిటీబ్యూరోఇంటిపై మూడు కిలోవాట్ల సౌరపలకలు ఏర్పాటు చేయాలంటే 225 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. ఒక కిలోవాట్ సౌరపలక రోజుకు సగటున 4 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న పలకలు ఏర్పాటు చేసుకుంటే నెలకు సగటున 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 4,320 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలు నెలకు 200 యూనిట్లు పోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించుకోవచ్చు. ఇందుకు ప్రస్తుత ధర ప్రకారం యూనిట్‌కు రూ.5.05 చెల్లిస్తుంది. మూడు కిలోవాట్లకు రూ.1.80 లక్షలు ఖర్చవుతుంది. గతంలో రాయితీ కిలోవాట్‌కు రూ.14 వేల చొప్పున మూడు కిలోవాట్లకు రూ.42 వేలు లభించేది. దీంతో చాలామంది విముఖత చూపేవారు. ప్రస్తుతం ఈ సబ్సిడీని రూ.78 వేలకు పెంచింది.అంతేకాదు మిగిలిన మొత్తం చెల్లింపునకు రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా కేంద్రం ఏర్పాటు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే పైసా ఖర్చు లేకుండా యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్పిత్తి అయిన విద్యుత్‌లో ఇంటి అవసరాలు పోగా, మిగిలిన విద్యుత్‌ను నెట్‌మీటరింగ్ ద్వారా డిస్కంకు విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో బ్యాంకు రుణం తీర్చవచ్చు. 40 మందికిపైగా దరఖాస్తు సౌరపలకల జీవితకాలం 25 ఏళ్లను పరిగణలోకి తీసుకుంటే 5.32 సంవత్సరాల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి వస్తుందని చెబుతున్నారు. మిగిలిన కాలానికి ఉచితంగా విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. సౌర విద్యుత్‌తో పర్యావరణ ప్రయోజనాలు లేకపోలేదు. మూడు కిలోవాట్ల సోలార్ ప్యానల్ల ఏర్పాటుతో 25 ఏళ్లలో 85 టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించిన వారవుతారు. ఇదిలా ఉంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు కేంద్రం జాతీయ స్థాయిలో ‘పీఎం సూర్య ఘర్’ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే గ్రేటర్ జిల్లాల నుంచి 40 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఔత్సాహికులు టీఎస్ఎస్పీడీపీఎల్ వెబ్సైట్లోకి వెళ్లి డిస్కం పేరు, కరెంట్ కనెక్షన్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆధార్ నంబర్ వంటి వివరాలను పీఎం సూర్యఘర్ పోర్టల్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. ఎంపిక చేసిన కంపెనీల సోలార్ పలకలు, రాయితీపై రుణాలు ఇచ్చే బ్యాంకులు, టెక్నిషియన్ల్ల వివరాలు ఉంటాయి. పలకల ఇన్స్టాలేషన్ తర్వాత నెట్‌మీటరింగ్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. -
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో భారత్ టాప్
న్యూఢిల్లీ: భారత కో–వర్కింగ్ స్పేస్ మార్కెట్ అంతర్జాతీయ మెచ్యూరిటీ సూచీలో మొదటి స్థానంలో నిలిచినట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. యూకే, ఫ్రాన్స్, యూఎస్, జపాన్, సింగపూర్ మార్కెట్లను భారత్ వెనక్కి నెట్టేయడం గమనార్హం. ‘ఫ్లెక్సిబుల్ ఆఫీస్‌లో ప్రపంచ ధోరణలు, 2025’ పేరుతో ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలోని మొత్తం ఆఫీస్ స్పేస్‌లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ భిన్నంగా ఉంది. కొన్ని అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ పెద్ద స్థాయిలో లేదు. అదే కొన్ని వర్ధమాన మార్కెట్లలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ ప్రొవైడర్లు బలమైన ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు’’అని తెలిపింది. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ మెచ్యూరిటీ ఇండెక్స్‌లో భారత్ 100 స్కోరు సాధించింది. ప్రపంచంలో పేరొందిన ఆఫీస్ మార్కెట్లు అయిన యూకే 98, ఫ్రాన్స్ 97, యూఎస్ 81, జపా న్, సింగపూర్ 77% స్కోరుతో భారత్ కంటే వెనుకునే ఉన్నాయి. మొత్తం ఆఫీస్ స్పేస్ పరిమాణంలో ఫ్లెక్సిబుల్ స్పేస్ (అన్ని వసతులతో, కోరుకున్నన్ని రోజులకు అద్దెకు లభించేది) ఎంతుంది? ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ల సంఖ్య ఆధారంగా కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఈ నివేదికను రూపొందించింది. 79.7 మిలియన్ ఎస్ఎఫ్టీ భారత్‌లోని టాప్–8 నగరాల్లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ 79.7 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ‘‘భారత ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ రంగం ప్రపంచంలో పేస్సెట్టర్ (విస్తరణ వేగం పరంగా కొత్త ధోరణి)గా నిలిచింది. పరిపక్వత, కార్యాక లాపాల్లో వైవిధ్యం, డిమాండ్‌కు అనుగుణంగా సామర్థ్యం పెంచుకోవడం భారత మార్కెట్‌ను ప్రత్యేకంగా నిలిపింది’’అని పేర్కొంది. -
అధునాతన మార్పులతో ఆఫీస్‌లకు నయాలుక్
ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన జీవనశైలికి అనుగుణంగా భాగ్యనగరం తన వైవిధ్యాన్ని మార్చుకుంటోంది. సహజత్వం మొదలు సాంకేతికత వరకు నిత్య జీవనశైలిలో తన గుర్తింపును సుస్థిరపరుచుకుంటోంది. ప్రధానంగా ఆధునిక కార్యాలయాలు, ఉత్పాదకత, శ్రేయస్సుకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, కార్పొరేట్ కార్యాలయాలన్నీ నయాలుక్ సంతరించుకుంటున్నాయి. ఆఫీస్ అందంగా, అత్యాధునికంగా ఉండాలనే స్థాయి నుంచి ఉద్యోగుల పని సామర్థ్యం పెంచగలిగేలా ఆఫీస్ స్పేస్ డిజైన్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపాతకాలపు క్యాబిన్ డెస్క్‌లు, క్లోస్డ్ క్యాబిన్ స్పేస్‌లు తీసేసి వాటి స్థానంలో ఉద్యోగుల శ్రేయస్సు, సృజనాత్మకత, జట్టు సహకారం పెరిగే విధంగా డిజైన్ చేయబడిన క్రియేటివ్ స్పేస్‌లు వచ్చాయి. 2025లో మనం చూస్తున్న కార్యాలయాలు ఒకవైపు అధునాతన సౌకర్యాలతో పాటు మరోవైపు ప్రకృతి, సహజత్వాన్ని సమ్మేళనంగా అందిస్తున్నాయి. ఈ కల్చర్ భవిష్యత్ వర్క్ కల్చర్‌ను సరికొత్త దారిలోకి తీసుకెళ్లనుంది.ఓపెన్ ఫ్లోర్ లేఔట్.. ఆఫీస్ లోపల గోడలు లేకుండా ఓపెన్‌గా ఉన్న సీటింగ్, క్యాబిన్లు ఉద్యోగుల మధ్య సంభాషణలు పెంచుతాయి. అడ్డంకులు లేకపోవడంతో అవసరమైన చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, సాంకేతిక సమస్యలపై కలిసి పనిచేయడం మంచి ఫలితాలను అందిస్తోందని సరికొత్త కార్యాలయాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వాతావరణం టీమ్ స్పిరిట్‌ను పెంచుతోంది.ఫర్నీచర్ సౌకర్యవంతంగా.. ఈ తరం గ్లోబల్ ట్రెండ్‌లో ఆఫీస్‌లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. వీటికి అనువైన ఫర్నీచర్ కూడా సౌకర్యవంతంగా ఉండాలి. ఎత్తు మార్చుకునే డెస్క్‌లు, మడతపెట్టే టేబుల్స్, ఎక్కడికైనా మార్చుకోగలిగే కురీ్చలు.. పైగా ఇవి సరికొత్త డిజైనింగ్‌తో ఆకర్షణీయంగా ఉండటంతో పాటు స్టోరేజ్ సదుపాయంతో ఉండే డెస్క్‌లు వంటి వినూత్న మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగా వైట్ బోర్డ్‌లు, డిజిటల్ స్క్రీన్లు, మాడ్యులర్ ఫరి్నచర్‌తో మోడ్రన్ ఇంటీరియర్ స్పేస్ ఏర్పాటు చేస్తారు. ఇలా విభిన్న అవసరాలకు అనువైన ప్రదేశాలు ఉండటంతో ఉద్యోగులందరికీ సౌకర్యంగా ఉంటుంది.సహజమైన కాంతి వచ్చేలా.. ప్రకృతి, సహజత్వం మన ఆరోగ్యం, మనసుకు హాయి, ఆహ్లాదం అందిస్తుంది. అందుకే ఇప్పుడు కార్యాలయాల్లో కూడా బయోఫిలిక్ డిజైన్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్, వాటర్ ఫౌంటెయిన్లు, ఉడ్ డిజైనింగ్, పెద్ద పెద్ద కిటికీలు లేదా విశాలమైన ఓపెన్ గ్లాస్ విండోస్‌తో సహజ కాంతి రావడం వంటి అంశాలు ట్రెండ్‌గా మారాయి. గోడలపై గ్రీన్ ప్లాంట్ ఇన్స్టాలేషన్లు ఇతర సహజ పద్ధతులు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. -
కమర్షియల్ ప్రాపర్టీ కొనేందుకు ఇదే సరైన సమయం!
సాక్షి, సిటీబ్యూరో: వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటయితే.. ఇళ్లపై రాబడి రెండు నుంచి నాలుగు శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. రానున్న ఐదేళ్లలో ఎంతలేదన్నా 2కోట్ల చ.అ. వాణిజ్య భవనాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఇప్పటికే కొన్ని నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికిదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అంశాలేమిటో ఓ సారి చూద్దాం.వాణిజ్య సముదాయాల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. కాకపోతే అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి.ఇవే కీలకం.. వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని బేరీజు వేయాలి. భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కారం ఉందా? అక్కడ జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడ ఉంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది. -
రియల్ ఎస్టేస్లో ఫస్ట్ టైమ్.. ‘త్రీడీ రిసార్ట్’
సాక్షి, సిటీబ్యూరో: నిర్మాణ రంగంలో త్రీడీ ప్రింటింగ్ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుంది. హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సంస్థ రిధిర గ్రూప్ త్రీడీ ముద్రణ సాంకేతికతను వినియోగించింది. ప్రపంచంలోనే తొలిసారిగా కమ్యూనిటీ లివింగ్ ‘రిధిర జెన్’ రిసార్ట్‌ను త్రీడీలో ముద్రించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రీసైకిల్ చేసిన, స్థానిక వనరులతో అవసరమైన మెటీరియల్స్ మాత్రమే త్రీడీలో ముద్రించే వీలు కలుగుతుందని, దీంతో వ్యర్థాల విడుదల గణనీయంగా తగ్గుతుందని సంస్థ ఎండీ రితేష్ మస్తిపురం తెలిపారు. భారీ యంత్రాలు, కార్మికుల వినియోగంతో పాటు కర్బన ఉద్ఘారాల విడుదల 50 శాతం వరకు తగ్గుతుందని పేర్కొన్నారు. -
ఇప్పుడు ఇల్లు కొనేవాళ్ల ఇష్టాలివే..
గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం, నిర్మాణంలో నాణ్యత, ఇంట్లోకి సహజ కాంతి వచ్చేలా ఏర్పాట్లు.. గృహ కొనుగోలుదారుల ప్రధాన డిమాండ్లు ఇవే. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన సాధనం స్థిరాస్తి రంగమేనని అనరాక్ గ్రూప్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. 63 శాతం మంది ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు 22 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఈ విభాగంలో పెట్టుబడులకు 7 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా టారిఫ్‌లు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తదితర కారణాలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు వెనుకాడుతున్నారని వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరోఈ ఏడాది తొలి అర్ధభాగంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సుమారు 2 లక్షల యూనిట్లను లాంచ్ చేశాయి. గతేడాది ఇదే కాలంలో 2.28 లక్షల కొత్త ఇళ్లను ప్రారంభించాయి. గడువులోగా నిర్మాణాల పూర్తి, డెలివరీ, నాణ్యత కారణంగా డిమాండ్, సప్లయి సమానంగా ఉంటున్నాయి. పెట్టుబడి కోసం, భవిష్యత్తు అవసరాల కోసం కంటే సొంతంగా తాము నివాసం ఉండేందుకే ఇళ్లు కొంటున్నారు. నాణ్యమైన నిర్మాణాలు, మంచి లొకేషన్, వినూత్న డిజైన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 65 శాతం మంది సొంత వినియోగానికే గృహాలను కొనుగోలు చేస్తుంటే.. 35 శాతం మంది పెట్టుబడుల రీత్యా కొంటున్నారు. ప్రీమియం ఇళ్లకు ఆదరణ.. ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. రూ.45 లక్షలలోపు ధర ఉన్న అందుబాటు గృహాల విభాగంపై కొనుగోలుదారుల ఆసక్తి క్షీణించింది. 2020 హెచ్1లో ఈ విభాగం వాటా 36 శాతంగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 17 శాతానికి తగ్గింది. ప్రాంతం, డిజైన్, యూనిట్ సైజ్ చిన్నగా ఉండటమే ఆఫర్డబుల్ గృహాలకు డిమాండ్ తగ్గటానికి ప్రధాన కారణం. 36 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉన్న ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. 25 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.90 లక్షలు, 17 శాతం మంది రూ.45 లక్షలలోపు, 12 శాతం మంది రూ.1.50–రూ.2.50 కోట్ల మధ్య, 10 శాతం మంది రూ.2.50 కోట్లకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.లాంచింగ్ ప్రాజెక్టులపై ఆసక్తి.. సిద్ధంగా ఉన్న ఇళ్లకంటే లాంచింగ్ యూనిట్లకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద, లిస్టెడ్ డెవలపర్లు భారీ ఎత్తున లాంచింగ్స్ చేస్తుండటమే ఈ ఆసక్తికి ప్రధాన కారణం. పేరున్న డెవలపర్లయితే గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం, నిర్మాణంలో నాణ్యత పాటిస్తారని కస్టమర్లు భావిస్తున్నారు. గతేడాది హెచ్1లో రెడీ టు హోమ్స్, న్యూ లాంచింగ్స్ నిష్పత్తి 20:25గా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 16:29గా ఉంది.త్రీ బీహెచ్‌కే ఇళ్లకే మొగ్గు.. టాప్–7 నగరాల్లో కస్టమర్లు పెద్ద సైజు గృహాలకు ఆసక్తి చూపిస్తున్నారు. 45 శాతం మంది త్రీ బీహెచ్‌కేలకు మొగ్గు చూపిస్తుండగా.. 40 శాతం మంది టూ బీహెచ్కేకు జై కొడుతున్నారు. మూడేళ్ల క్రితం ఫోర్ బీహెచ్‌కేలకు 4 శాతం మంది ఆసక్తి చూపించగా.. 2025 హెచ్1 నాటికిది 7 శాతానికి పెరిగింది. 8 శాతం మంది వన్ బీహెచ్‌కేలకు ఇంట్రెస్ట్ ఉన్నారు. హైదరాబాద్‌లో చూస్తే.. 55 శాతం మంది త్రీ బీహెచ్‌కేలకు, 38 శాతం మంది టూ బీహెచ్‌కే, 5 శాతం వన్ బీహెచ్‌కే, 2 శాతం మంది ఫోర్ బీహెచ్‌కే, ఆపైన విస్తీర్ణమైన ఇళ్లకు మొగ్గు చూపిస్తున్నారు. -
‘రియల్ఎస్టేట్’ పెట్టుబడుల్లో రాబడి ఎక్కువే..
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్స్) పెట్టుబడులు 6–7 శాతం రాబడిని అందిస్తున్నాయని అనరాక్–క్రెడాయ్ సంయుక్త నివేదిక వెల్లడించింది. దేశంలో 2019లో మొదలైన తొలి రీట్ లిస్టింగ్ నుంచి ఈ రంగం ఊపందుకుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో రీట్స్ 18 బిలియన్ డాలర్లకు చేరింది. 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.దేశీయ సంస్థాగత రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో రీట్స్ వాటా కేవలం 20 శాతం మాత్రమే. అమెరికాలో 96 శాతం, సింగపూర్‌లో 55 శాతం, జపాన్‌లో 51 శాతం వంటి ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో రీట్స్ పెట్టుబడులు తక్కువే. డేటా సెంటర్లు, రిటైల్, పారిశ్రామిక వంటి వైవిధ్యభరితమైన స్థిరాస్తి విభాగాలలో రీట్స్ పెట్టుబడులు పెడుతుంటారు.గతేడాది ప్రపంచవ్యాప్తంగా 250 బిలియన్ డాలర్ల విలువైన డేటా సెంటర్ల రీట్స్ పెట్టుబడులు రాగా.. వచ్చే ఏడేళ్లలో ఇవి రెట్టింపు అవతాయని అంచనా. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 520 మిలియన్ చ.అ. ఆఫీసు స్థలంలో.. కేవలం 32 శాతం 166 మిలియన్ చ.అ. రీట్స్‌లో లిస్టయ్యాయి. యూఎస్, సింగపూర్, జపాన్ వంటి దేశాలతో పోలిస్తే ఇది తక్కువైనప్పటికీ ఇండియాలో రీట్స్ రాబడులు ఆకర్షణీయంగా ఉంటుంది. -
హైదరాబాద్ రియల్టీ మార్కెట్ వృద్ధి
రియల్టీ మార్కెట్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అపార్ట్మెంట్లు, విల్లాలు, విభిన్న రియల్టీ ప్రాజెక్ట్‌లపై చర్చించడానికి, పెట్టుబడులను ప్రేరేపించడానికి, కొనుగోలుదారులకు కనెక్ట్ అవ్వడానికి ప్రాపర్టీ షోలు సహకరిస్తాయని తెలిపారు.ఇటీవల హైదరాబాద్‌లో 25కు పైగా రియల్టీ డెవలపర్లు నిర్వహించిన ఓ ప్రాపర్టీ షోలో మంత్రి హాజరయ్యారు. ప్రముఖ డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. గృహ రుణాలు, ఫైనాన్సింగ్, ఆస్తి నిబంధనలపై మార్గదర్శకత్వాలను చర్చించారు. ఇందులో ఆర్థిక సలహాదారులు, ఆస్తులకు సంబంధించిన న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నారు.ఇదీ చదవండి: ‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’ -
జీఎస్టీ తోడు.. ఇక ఇల్లు కట్టొచ్చు చూడు!
కేంద్రం ప్రభుత్వం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని సవరించింది. జీఎస్టీ సంస్కరణలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధానమైన సానుకూల మార్పు కానున్నాయి. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ 2.0 నిర్మాణ రంగానికి పెద్ద ఉపశమనమే కలిగిస్తుంది. సామాన్యుల సొంతింటి కల సాకారానికి కాస్త సాయం చేయనుంది.నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగులు వంటి పలు నిర్మాణ సామగ్రి ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది.ఏ నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ ఎంతంటే?➤సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్(ఆర్ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది.➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.➤మార్బుల్, గ్రానైట్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.➤సహజ ఇసుక: 5 శాతం ఉండగా.. సున్నా శాతానికి తగ్గింది.➤స్టోన్ ఇన్లే వర్క్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.➤వుడెన్ ఫ్లోరింగ్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.➤వెదురు ఫ్లోరింగ్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.➤సానిటరీవేర్: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.➤పీవీసీ, యూపీవీసీ పైపులు, ఫిట్టింగ్‌లు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.➤ఇనుము, ఉక్కు ఉత్పత్తులు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.➤వాల్పేపర్లు: 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది➤కరెంట్ వైర్లు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.➤ప్లైవుడ్, పార్టికల్, ఫైబర్ బోర్డులు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.➤హ్యుండ్మేడ్ కార్పెట్లు, ఫ్లోర్ కార్వింగ్‌లు: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది. -
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సకల సదుపాయాలు
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ భారతదేశపు అత్యంత డైనమిక్ పట్టణ పర్యావరణ వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నట్లు ఏఎస్బీఎల్ వ్యవస్థాపక సీఈఓ అజితీష్ కోరుపోల్ అన్నారు. వాణిజ్య వృద్ధికి మించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పట్టణ జీవనాన్ని పునర్నిర్వచిస్తోందన్నారు. ఇక్కడ 1,700 చదరపు అడుగుల 3బీహెచ్‌కే 2,000 చదరపు అడుగుల యూనిట్‌కు సమానమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుందని చెప్పారు.ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కార్పొరేట్ కార్యాలయాల సమీపంలో నివసిస్తూ వాక్-టు-వర్క్ జీవనశైలి పెరుగుతోందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న అద్దె మార్కెట్, సాంకేతికతతో ఈ ప్రాంతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కనెక్టివిటీ, సమీప కార్యాలయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, అద్దె రాబడి, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఈ ప్రాంతం కీలకంగా మారిందని చెప్పారు. కేపీహెచ్‌బీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను అనుసంధానించే మెట్రో రాబోయే రెండో దశతో ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులు అందుతాయని అంచనా వేశారు.హైదరాబాద్ ఓవైపు కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగి వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతోపాటు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మౌలిక సదుపాయాలు, జీవనశైలి ప్రయోజనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. ఏఎస్బీఎల్ లాఫ్ట్ ప్రాజెక్ట్ గురించి అజితీష్ మాట్లాడుతూ ఎమర్జింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మైక్రో మార్కెట్‌కు సరిపోయేలా అన్ని మౌలిక సదుపాయాలతో 5 ఎకరాల పరిధిలో ఇది విస్తరించి ఉందన్నారు. ఏఎస్బీఎల్ లోఫ్ట్లో 45 అంతస్తులతో రెండు టవర్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 894 యూనిట్లతో 1700 చదరపు అడుగుల నుంచి 1900 చదరపు అడుగుల చొప్పున ఉన్నాయని తెలిపారు. -
గృహ నిర్మాణ పరిశ్రమ @ రూ. 31 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: గృహ నిర్మాణ పరిశ్రమ 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.31 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఇందులో ఒక్క బిల్డింగ్ మెటీరియల్స్ (నిర్మాణంలోని వినియోగించే ముడి పదార్థాలు) విభాగమే ప్రస్తుతమున్న 105 బిలియన్ డాలర్ల నుంచి ఏటా 9.6 శాతం వృద్ధితో 2030 నాటికి 166 బిలియన్ డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని పేర్కొంది. ఆదాయం పెరుగుతుండడం, పట్టణీకర వేగాన్ని అందుకోవడం, ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది. భారత దేశ నిర్మాణరంగం, నిర్మాణ రంగ మెటీరియల్స్ పరిశ్రమ కీలక మలుపు వద్ద ఉన్నట్టు డెలాయిట్ నివేదిక పేర్కొంది.కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ 18.5 బిలియన్ డాలర్లు‘‘వైర్లు, కేబుళ్లు, ఫ్యాన్లు, లైట్లు, స్విచ్‌లు, ఫ్యూజ్‌లు, స్విచ్గేర్లతో కూడిన కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ పరిశ్రమ పరిమాణం 2030 మార్చి నాటికి 18.5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణీకరణ అనుకూలిస్తుంది. ఇంధన ఆదా ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండడం, విధాన పరమైన మద్దతు ఈ విభాగాన్ని ముందుకు నడిపిస్తాయి. 2023 నాటికి కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ అమ్మకాల్లో బ్రాండెడ్ ఉత్పత్తుల వాటా 76 శాతంగా ఉండగా, 2027 నాటికి 82 శాతానికి చేరుకుంటుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది.62 బిలియన్ డాలర్లకు హోమ్ ఫర్నిచర్ఇళ్లలో వినియోగించే ఫరి్నచర్, డెకరేటివ్స్ మార్కెట్ విలువ ప్రస్తుతమున్న 38 బిలియన్ డాలర్ల నుంచి 62 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనేది డెలాయిట్ ఇండియా అంచనా. ‘‘ఈ విభాగం బలమైన వృద్ధి క్రమంలో ఉంది. పట్టణీకరణకు తోడు ఆదాయాలు పెరుగుతుండడంతో ఆధునికత, వినూత్నతకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని డెలాయిట్ తెలిపింది.గృహ రక్షణ ఉత్పత్తులకూ డిమాండ్సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ లాక్‌లు, డోర్ ఫోన్లు, డోర్‌బెల్ కెమెరాలు, మోషన్ సెన్సార్లు, ప్రమాదాలను నివారించే డివైజ్లతో కూడిన హోమ్ సెక్యూరిటీ మార్కెట్ ఏటా 18 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఇక పెయింట్స్, కన్స్ట్రక్షన్ కెమికల్స్ పరిశ్రమ 2030 మార్చి నాటికి 15.3 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందుతుందని తెలిపింది. ఫ్లోరింగ్ మార్కెట్ (సిరామిక్ టైల్స్, వినైల్ ఫ్లోరింగ్, మార్బుల్ తదితర) పరిమాణం ప్రస్తుతమున్న 10.7 బిలియన్ డాలర్ల నుంచి 2030 మార్చి నాటికి 16.2 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని డెలాయిట్ తెలిపింది. -
ఏ ప్రాంతం ఏ జోన్‌లోనో..?
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ వరకు భవన నిర్మాణాలు, లే అవుట్ల కోసం హెచ్ఎండీఏ అనుమతులను అందజేస్తోంది. కానీ ఈ అనుమతులపైన నిర్మాణసంస్థలు, ‘రియల్’ వర్గాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.‘మాస్టర్‌ప్లాన్–2050 ’రూపొందించకుండానే ఇస్తున్న అనుమతుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటే ఆర్థికంగా భారీగా నష్టపోవలసి రావచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అందజేస్తున్న అనుమతులకు భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని, కొత్తగా తయారుచేస్తున్న మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే అనుమతులను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా జోన్ల మార్పుపైన వివిధ వర్గాల నుంచి ఆందోళన వెల్లువెత్తుతోంది. అప్పటి మాస్టర్‌ప్లాన్ అమల్లోకి రావడానికి ముందే కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా భావించి అపార్ట్మెంట్లు, భవన నిర్మాణ లే అవుట్లకు అనుమతులను ఇచ్చారు. కానీ ఆ తరువాత వివిధ ప్రాంతాల్లోని నివాసిత స్థలాలు కన్జర్వేషన్ జోన్లోకి మారాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పటి మాస్టర్‌ప్లాన్ ప్రకారం నివాసిత మండలాల జాబితా లోంచి కన్జర్వేషన్ జోన్లోకి మారిన ప్రాంతాలను తిరిగి నివాసిత జోన్లోకి మార్చేందుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చిందని,ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్–2050 అమల్లోకి రాకుండానే ఇప్పుడు ఇచ్చే అనుమతుల వల్ల మరోసారి అలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకీ సమస్య.. మాస్టర్‌ప్లాన్–2050కి అనుగుణంగానే ప్రస్తుతం అనుమతులను అందజేస్తున్నట్లు అధికారులు భరోసాను ఇస్తున్నారు. కానీ వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశంపైన కొంత గందరగోళం నెలకొంది. అప్పట్లో రంగారెడ్డి జిల్లా పులిమామిడి ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఓ బడా నిర్మాణ సంస్థ వేసిన లే అవుట్లకు హెచ్ఎండీఏ అనుమతులను అందజేసింది. కానీ ఆ తరువాత అమల్లోకి వచ్చిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఆ ప్రాంతమంతా కన్జర్వేషన్ జోన్లోకి మారిపోయింది. దీంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. కన్జర్వేషన్ నుంచి మరోసారి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చుకొనేందుకు స్థలాల కొనుగోలుదార్లు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చింది. ఒక్క పులిమామిడి ప్రాంతంలోనే కాకుండా అనేక చోట్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయి. చాలా ప్రాంతాల్లో అప్పటి మాస్టర్‌ప్లాన్‌లోని లోపాలపైన ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చెరువులు, కుంటలు, తదితర జలవనరులకు సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ జోన్లలోని స్థలాల మార్పు కోసం హెచ్ఎండీఏ అధికారులు దిద్దుబాటు చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల జలవనరులు ఉన్న ప్రాంతాలు కూడా నివాసిత మండలాల జాబితాలోకి మారిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్–2030 స్థానంలో కొత్తగా రానున్న మాస్టర్‌ప్లాన్–2050 నేపథ్యంలో హెచ్ఎండీఏ అనుమతులపైన గందరగోళం నెలకొంది. మాస్టర్‌ప్లాన్ లక్ష్యం ఏంటి.. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం రాబోయే ఇరువై ఐదు సంవత్సరాలను లక్ష్యంగా చేసుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) కోసం మాస్టర్‌ప్లాన్–2050 ను రూపొందిస్తున్నారు. హైదరాబాద్నగరాన్ని ప్రపంచంలోని 10 అగ్రగామి గ్లోబల్నగరాల పక్కన నిలిపే లక్ష్యంతో రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధికి అనుగుణంగా మెగామాస్టర్ప్లాన్కు కసరత్తు చేపట్టారు. హైదరాబాద్ మహానగర పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలోనిర్మించనున్న రీజనల్రింగ్రోడ్డు వరకు అభివృద్ధి ప్రణాళికల కోసం హెచ్ఎండీఏ ఈ కసరత్తు చేపట్టింది. ఈ మెగామాస్టర్‌ప్లాన్ మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటిది ఆర్థికమండళ్లు, పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ బహుళ జాతి సంస్థల వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం ఆర్థికాభివృద్ధి ప్రణాళిక (ఎకనమిక్ డెవలప్మెంట్ ప్లాన్) కాగా, రెండోది హైదరాబాద్ మెట్రో ఏరియా వరకు రహదారులు, మౌలిక సదుపాయలు, ప్రజారవాణా సదుపాయాల విస్తరణ కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్, జలనరులు, అర్బన్ఫారెస్ట్లు, పచ్చదనం అభివృద్ధి లక్ష్యంగా మూడో ప్రణాళిక బ్లూగ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతం ఈ మూడు వివిధ దశల్లో ఉన్నాయి. అనుమతులు తారుమారైతే ఎలా..‘వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న కొత్త మాస్టర్‌ప్లాన్ ప్రకారమే ఇప్పుడు అనుమతులను ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ అనుమతులు తారుమారైతే పరిష్కారమేంటనే దానిపైన మాత్రం స్పష్టత లేదు.’ అని షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు తెలిపారు. ఇటీవల తాము 10 ఎకరాల్లో లే అవుట్ అనుమతులు తీసుకున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఏ జోన్లోకి మారుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రాంతం ఆర్ధిక మండలాల జాబితాలోకి, లేదా బ్లూగ్రీన్ జోన్లోకి మారినా తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. అడవులు, జలవనరుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 3.5 కోట్లు దాటే అవకాశం ఉంటుందనే అంచనాలతో ఈ విస్తరణ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడిస్తోన్న నిర్మాణరంగ అనుమతులపైన మరింత స్పష్టత రావలసి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అమెరికాలో ముఖేష్ అంబానీ భారీ కొనుగోలు!
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ విదేశాల్లో భారీ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. రియల్ డీల్ నివేదిక ప్రకారం.. న్యూయార్క్‌లోని ట్రిబెకా ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని ఆయన 17.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.145 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నారు.ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన ఈ భవనం ట్రిబెకాలోని 11 హ్యూబర్ట్ స్ట్రీట్ లో ఉంది. టెక్ బిలియనీర్, యుబిక్విటి చైర్మన్, సీఈవో రాబర్ట్ పెరా 2018లో 20 మిలియన్ డాలర్లకు ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. తర్వాత దీన్ని చిన్నపాటి మాన్షన్‌గా మార్చాలని అనుకున్నా కుదరలేదు. దీంతో ఈ భవంతి దాదాపు పదేళ్లుగా ఎటువంటి వినియోగం లేకుండా ఖాళీగా ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికన్ అనుబంధ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. రాబర్ట్ పెరా కొన్న ధర కంటే తక్కువకు దీన్ని విక్రయించడం గమనార్హం.2023 ఆగస్టులో ముఖేష్ అంబానీ మాన్హాటన్ లోని వెస్ట్ విలేజ్ లో ఉన్న తన 9 మిలియన్ డాలర్ల నివాసాన్ని విక్రయించారు. ఆ తర్వాత రెండేళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు న్యూయార్క్‌లో భవంతిని కొనుగోలు చేయడం విశేషం. పెరా ఈ భవనాన్ని 2021లోనే 25 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టారు. కానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ 17.4 మిలియన్ డాలర్లకే దీన్ని దక్కించుకున్నారు.ఇదీ చదవండి: ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు! -
ఇంటి స్థలం రెడీ.. ఇక పునాది పనులు ప్రారంభించండీ..
ఇంటి స్థలం ఎలా ఎంచుకోవాలి.. నిర్మాణానికి ముందు ప్లాటును ఎలా పరీక్షించుకోవాలన్నది ఇదివరకటి కథనాల్లో చూశాం.. ఇప్పుడు పునాదికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఇంటి నిర్మాణం అనేది కేవలం ఒక ఆస్తి నిర్మాణం మాత్రమే కాదు.. ఇది తరాల వారసత్వానికి బలమైన ఆధారం. ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన దశ ఫౌండేషన్. పునాది బలంగా లేకపోతే, ఎంత అందమైన నిర్మాణమైనా కాలక్రమంలో బీటలు పడే ప్రమాదం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో భౌగోళిక పరిస్థితులు, మట్టి స్వభావం, నీటి మట్టం వంటి అంశాలు ఫౌండేషన్ ఎంపికపై ప్రభావం చూపుతాయి. అందుకే, ప్రతి ఇంటి నిర్మాణానికి ముందు మట్టి పరీక్ష (soil test) చేయడం తప్పనిసరి. ఇది భవనం బరువును మట్టి తట్టుకోగలదా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.సాంప్రదాయ ఫౌండేషన్ పద్ధతులుఇప్పటికీ చాలా మంది ఇండివిడ్యువల్ ఫుటింగ్ లేదా స్ట్రిప్ ఫౌండేషన్ వంటి సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇవి చిన్న స్థాయి గృహాలకు అనువైనవి. ఇండివిడ్యువల్ ఫుటింగ్ పద్ధతిలో ప్రతి పిల్లర్ కింద ప్రత్యేకంగా ఫుటింగ్ వేసి, భవన బరువును సమంగా పంపిణీ చేస్తారు. స్ట్రిప్ ఫౌండేషన్ పద్ధతిలో గోడల వెంట కాంక్రీట్ స్ట్రిప్ వేసి, గోడల బరువును మట్టిలోకి పంపిస్తారు.అయితే, మట్టి బలహీనంగా ఉన్న చోట రాఫ్ట్ ఫౌండేషన్ లేదా పైల్ ఫౌండేషన్ అవసరం అవుతుంది. రాఫ్ట్ ఫౌండేషన్‌లో మొత్తం భవనానికి ఒకే పెద్ద ఆర్సీసీ స్లాబ్ వేసి, బరువును సమంగా పంపిస్తారు. పైల్ ఫౌండేషన్‌లో లోతైన కాంక్రీట్ పైల్స్ వేసి, భారం లోతుగా ఉన్న బలమైన మట్టికి చేరేలా చేస్తారు. ఇవి ఖర్చుతో కూడుకున్నవే అయినా, భద్రతకు మిన్న.కొత్త పద్ధతులుఇటీవల కాలంలో ప్రీకాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్ అనే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫ్యాక్టరీలో తయారైన ఫౌండేషన్ బ్లాక్స్‌ను నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి అమర్చడం వల్ల నిర్మాణ వేగం పెరుగుతుంది. కార్మిక వ్యయం తగ్గుతుంది. మెటీరియల్స్ వేస్టేజ్ తగ్గుతుంది. మరో కొత్త పరిష్కారం జియోపాలిమర్ కాంక్రీట్ ఫౌండేషన్. ఇది సాంప్రదాయ సిమెంట్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్లై యాష్, స్లగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాల ఆధారంగా తయారవుతుంది. ఇది తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. పర్యావరణానికి మేలు చేస్తుంది. పట్టణ ప్రాంతల్లో రెట్రోఫిట్ అవసరమైన చోట మైక్రోపైల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇది చిన్న వ్యాసం గల పైల్స్ ద్వారా భవనాన్ని రీఇన్ఫోర్స్ చేయడం ద్వారా భద్రతను పెంచుతుంది.ఖర్చుల అంచనాఒక సాధారణ 1000 చ.అ.ఇంటి నిర్మాణానికి ఫౌండేషన్ ఖర్చు రూ.3.7 లక్షల నుండి రూ.5.9 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో మెటీరియల్స్, కార్మికుల వ్యయం, సాయిల్ టెస్టింగ్, నిర్మాణ డిజైన్ ఖర్చులు ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో ఒక బ్యాగు సిమెంట్ ధరలు రూ.350–రూ.400, స్టీల్ కేజీ రూ.60–రూ.70, ఇసుక ఇక క్యూబిక్ అడుగుకు రూ.40–రూ.60 మధ్య ఉన్నాయి. ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. అందుకే, నిర్మాణానికి ముందు స్థానిక కనస్ట్రక్టర్ లేదా స్ట్రక్చరల్ ఇంజినీర్ సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: ప్లాటుకు పరీక్ష.. పాస్ అయితేనే ఇల్లు!ఇంటిని నిర్మించడం అంటే భద్రత, మన్నిక, అందం అన్నీ మిళితమైన ప్రక్రియ. పునాది పద్ధతులు కూడా ఈ మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయి. పర్యావరణ అనుకూలత, నిర్మాణ వేగం, ఖర్చు తగ్గింపు వంటి అంశాలు కొత్త పద్ధతుల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. భవిష్యత్తులో త్రీడీ ప్రింటెడ్ ఫౌండేషన్లు, స్మార్ట్ సెన్సర్లతో సాయిల్ మానిటరింగ్ వంటి సాంకేతికతలు కూడా అందుబాటులోకి రావొచ్చు. -
జోరుమీదునున్న రియల్ ఎస్టేట్: 15 ఏళ్లలో..
గత పదిహేనేళ్లలో భారత రియల్టీ రంగంలో 80 బిలియన్ డాలర్ల(రూ.7 లక్షల కోట్లకుపైగా) పెట్టుబడులు ప్రవహించినట్లు క్రెడాయ్, కొలియర్స్ ఇక్కడ విడుదల చేసిన సంయుక్త నివేదిక వెల్లడించింది. 2010 నుంచి దేశీ రియల్టీ రంగం సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేసింది. గత దశాబ్దన్నర కాలం పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్లు 57 శాతం సమకూర్చినట్లు నివేదిక పేర్కొంది.దేశీ రియల్టీ సమాఖ్య క్రెడాయ్, రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. క్రెడాయ్ నిర్వహించిన వార్షిక జాతీయ సదస్సు(నాట్కన్)లో ‘భారత రియాల్టీ: ఈక్విటీ పురోభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతం’ పేరిట నివేదికను వెలువరించాయి.కోవిడ్ మహమ్మారి తదుపరి దేశీ పెట్టుబడులు సైతం పుంజుకున్నట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్ గ్రూప్‌లు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ప్రయివేట్ ఈక్విటీ, విదేశీ పెట్టుబడులున్న ఎన్బీఎఫ్సీలు, రీట్లు, సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉన్నట్లు నివేదిక వివరించింది.దేశీ రియల్టీ మార్కెట్ పరిమాణం 2047కల్లా 5-10 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. 2047కల్లా దేశీ రియల్టీ రంగాన్ని కేవలం చదరపు అడుగులు లేదా ఆస్తుల విలువ ద్వారా కాకుండా కోట్లమంది ప్రజల కోసం సృష్టించిన నాణ్యమైన జీవనం ద్వారా మదింపు చేయవలసి ఉంటుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ వ్యాఖ్యానించారు. -
నిర్మాణ సామగ్రిపై తగ్గిన జీఎస్టీ.. గృహాలకు పెరగనున్న డిమాండ్
కేంద్రం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని సవరించింది. జీఎస్టీ సంస్కరణలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధానమైన సానుకూల మార్పు. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ 2.0 నిర్మాణ రంగానికి పెద్ద ఉపశమనమే. గృహ, కార్యాలయ, రిటైల్ విభాగాల వృద్ధికి దోహదపడటంతో పాటు సరళీకృత పన్ను విధానంతో పారదర్శకత, స్థిరాస్తి కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరుగుతోంది. అయితే నిర్మాణ సామగ్రిపై తగ్గే జీఎస్టీ భారాన్ని.. ఆమేరకు డెవలపర్లు ప్రాపర్టీ కొనుగోలుదారులకు బదలాయిస్తే గనక రానున్న దసరా, దీపావళి పండుగ సీజన్ కస్టమర్లలో రెట్టింపు జోష్ నిండుకుంటుంది.నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపు..నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగులు వంటి పలు నిర్మాణ సామగ్రి ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో డెవలపర్‌కు 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. అయితే ఈ తగ్గింపును డెవలపర్లు గృహ కొనుగోలుదారులకు బదలాయిస్తారా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.నిర్మాణ పనులు వేగవంతం..జీఎస్టీ గతంలో మాదిరిగా ఐదు పన్ను శ్లాబులతో గందరగోళంగా లేకుండా రెండు రకాల ట్యాక్స్ ఫ్రేమ్‌వర్క్‌లను కేంద్రం తీసుకొచ్చింది. దీంతో ప్రాపర్టీ కొనుగోలుదారుల్లో పన్ను చిక్కులు తొలుగుతాయి. స్థిరాస్తి రంగంలోకి మరిన్ని సంస్థాగత పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇన్పుట్ ఖర్చులు తగ్గుతుండటంతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతమవడంతో పాటు కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్కు డెవలపర్లు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం దేశంలో పట్టణ మార్కెట్లలో దాదాపు కోటి బడ్జెట్ గృహాల కొరత ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య 2.5 కోట్లకు చేరుతుంది. ఇలాంటి సమయంలో కేంద్రం జీఎస్టీ తగ్గింపు చేయడం బడ్జెట్ గృహాలకు పెద్ద ఉపశమనం.ఏ విభాగంలో ఎంత ప్రయోజనమంటే? గృహ విభాగం: సిమెంట్‌పై జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ ఖర్చులు 3–5 శాతం మేర తగ్గుతాయి. ముఖ్యంగా రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే చౌక గృహాలను నిర్మిస్తున్న డెవలపర్లకు నగదు ప్రవాహం, మార్జిన్లు పెరుగుతాయి. దీంతో ఈ విభాగంలోని బిల్డర్లకు గణనీయమైన ఉపశమనం కలుగుతుంది. ఇప్పటి వరకు నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ భారం కారణంగా అందుబాటు గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ఆసక్తి చూపించలేదు. దీంతో మొత్తం కొత్త గృహాల సరఫరాలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 2019లో 40 శాతంగా ఉండగా.. 2025 తొలి అర్ధభాగం నాటికి ఏకంగా 12 శాతానికి పడిపోయింది. అలాగే విక్రయాలలో ఈ విభాగం వాటా 2019లో 40 శాతంగా ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది. తాజాగా కేంద్రం జీఎస్టీ సవరణతో నిర్మాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అయితే ఈ తగ్గింపు వ్యయాలను డెవలపర్లు గృహ కొనుగోలుదారులకు బదలాయిస్తే గనక అందబాటు గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.కార్యాలయ విభాగం: ప్రస్తుతం కార్యాలయ విభాగం 12 శాతం జీఎస్టీ ఉంది. ఇన్పుట్ క్రెడిట్(ఐటీసీ) కూడా అందుకోవచ్చు. అయితే ఇటీవల పరిణామాలు పరిస్థితిని కొంచెం క్లిష్టతరం చేశాయి. వాణిజ్య ఆస్తుల లీజులపై ఐటీసీని తొలగించారు. దీంతో డెవలపర్లు ఇకపై ప్రాజెక్ట్ సంబంధిత వ్యయాలపై ఐటీసీని క్లెయిమ్ చేయలేరు. దీంతో కార్యాలయ స్థలాలు, ఇతర వాణిజ్య ఆస్తుల కార్యాచరణ ఖర్చులు, అద్దె ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే రిజిస్టర్ చేయని వాణిజ్య ఆస్తుల అద్దెలు రివర్స్ ఛార్జ్ మెకానిజం(ఆర్సీఎం) ప్రకారం అద్దెదారులు 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాణిజ్య ప్రాపర్టీలను అద్దెకు తీసుకునేవారికి ఇది అదనపు భారమే.రిటైల్ విభాగం: నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపు డెవలపర్లకు ఇన్పుట్ ఖర్చులను తగ్గిస్తుంది. దీంతో షాపింగ్ మాల్స్, రిటైల్ కాంప్లెక్స్‌ల నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి రిటైల్ ప్రాజెక్ట్‌ల సరఫరా పెరగడంతో పాటు రిటైల్ అద్దెలలో పోటీ పెరుగుతుంది. జీఎస్టీ సవరణ లాజిస్టిక్ ఖర్చులను కూడా తగ్గిస్తుంది. సరఫరా గొలుసులను క్రమబదీ్ధకరించడంలో సహాయపడుతుంది. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే రిటైల్ ప్రాపరీ్టల అద్దె ఆదాయంపై మాత్రం జీఎస్టీ 18 శాతం చెల్లించాల్సిందే. ఇది ఆయా అద్దెదారులకు కాసింత ఇబ్బందే..ఏ నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ ఎంతంటే? ➤సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్(ఆర్ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది. ➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. ➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది. ➤మార్బుల్, గ్రానైట్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది. -
క్వాలిటీ ఉంటే చాలు.. ఇల్లు కొనేందుకు సిద్ధం!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు.. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు.. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం.. అందుబాటు ధరతో పాటు నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు నగరంలో ఇల్లు కొనేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్‌లను నిర్మించాలని సూచించింది.మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయి. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టారు.నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, కొంపల్లి, శామీర్‌పేట వంటి పలు ప్రాంతాల్లో రూ.45 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టిసారిస్తున్నారు. -
జీఎస్టీ కోతతో ఇళ్లకు డిమాండ్
పలు ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఇది ఇళ్లకు డిమాండ్‌ను పెంచుతుందని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య ‘క్రెడాయ్’ అంచనా వేసింది. సిమెంట్, మరికొన్ని బిల్డింగ్ మెటీరియల్స్‌పై జీఎస్టీని తగ్గించడం వల్ల నిర్మాణ వ్యయం దిగొస్తుందని పేర్కొంది. సింగపూర్‌లో నిర్వహించిన క్రెడాయ్–నాట్కాన్ వార్షిక సమావేశం సందర్భంగా దీనిపై ప్రకటన చేసింది.జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు తప్పకుండా వినియోదారులకు బదిలీ కావాలంటూ.. సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీలు రేట్లను తగ్గించాలని డిమాండ్ చేసింది. జీఎస్టీలో 12 శాతం, 28 శాతం శ్లాబులను ఎత్తివేస్తూ, ఇందులోని వస్తు, సేవలను 5 శాతం, 18 శాతం కిందకు మారుస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోగా, ఈ నెల 22 నుంచి ఇది అమల్లోకి రానుండడం తెలిసిందే.సానుకూల సెంటిమెంట్జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోదారుల్లో సానుకూల సెంటిమెంట్ నెలకొన్నట్టు క్రెడాయ్ చైర్మన్ బొమన్ ఇరానీ తెలిపారు. పండుగల సీజన్‌కు ముందు ఇది మంచి సంకేతంగా పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతోపాటు బడ్జెట్లో పన్ను మినహాయింపులు, రెపో రేట్ల తగ్గింపు హౌసింగ్ డిమాండ్‌కు ప్రేరణనిస్తాయని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు విలువ పరంగా పెరిగినప్పటికీ.. సంఖ్యా పరంగా (యూనిట్లు) తగ్గినట్టు చెప్పారు. అయితే జూన్ త్రైమాసికంలో జీడీపీ బలమైన వృద్ధిని నమోదు చేయడం, విధానపరమైన చర్యల ఫలితంగా రానున్న నెలల్లో ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుబాటు ధరల ఇళ్లకు ఉన్న రూ.45 లక్షల పరిమితిని సవరించాలన్న డిమాండ్‌ను మరోసారి ప్రస్తావించారు. రూ.45 లక్షల వరకు ఉన్న ఇళ్లపై జీఎస్టీ ఒక శాతం కాగా, అంతకుమించితే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పన్నుల భారం తగ్గించాలి..రియల్ ఎస్టేట్ రంగంపై కేంద్రం, రాష్ట్రాలు కలిపి 35–45 శాతం వరకు పన్నులు విధిస్తున్నాయని.. ఈ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని శేఖర్ పటేల్ పేర్కొన్నారు. పన్నులు తగ్గించడం వల్ల ప్రాపర్టీల ధరలు దిగొస్తాయన్నారు. క్రెడాయ్‌లో దేశవ్యాప్తంగా 13,000 మంది డెవలపర్లు సభ్యులుగా ఉన్నారు.ఇదీ చదవండి: ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు! -
హైదరాబాద్ 4.0 దిశగా శరవేగంగా అడుగులు
నిజాం కాలంలో 1591లో పురుడు పోసుకున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి ప్రస్థానం నేడు శరవేగంగా సాగుతోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 1998లో ఐటీ రాకతో హైదరాబాద్ వేగం మరింత పుంజుకుంది. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్లకే పరిమితమైన అభివృద్ధి సైబరాబాద్‌కు విస్తరించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, మెట్రోల ఏర్పాటుతో నగర రూపురేఖలే మారిపోయాయి. అంతర్జాతీయ మౌలిక వసతులు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దిగ్గజసంస్థలు నగరంలో కొలువుదీరాయి. అయితే గ్రేటర్‌పై ఒత్తిడి పెరగడంతో దానికి అనుబంధంగా నాలుగో నగరం అనివార్యమైపోయింది. ప్రధాన నగరంలో రద్దీని తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు తప్పనిసరైంది. –సాక్షి, సిటీబ్యూరోప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆరి్థక, ఉద్యోగ కేంద్రాలు కూడా. 146 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు.మహానగరం మనదే.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లు అని చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నగరాలదే. ఉత్పాదకత, ఆవిష్కరణ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో నగరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలు 4,308 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నగరాలు ఏకంగా 2,136 చ.కి.మీ. విస్తరించాయి. గత మూడు దశాబ్దాల్లో విస్తీర్ణాలు 98 శాతం పెరిగాయి. ఇందులో అత్యధిక విస్తీర్ణం హైదరాబాద్‌దే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ 7,257 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.వృద్ధి ఎక్కడ్నుంచి ఎక్కడికి.. 1990 చివర్లో హైదరాబాద్‌లో ఫార్మాతోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అప్‌గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశి్చమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నైపుణ్య కారి్మకులకు నగరం వేదికైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆరి్థక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశి్చమం వైపు నుంచి దక్షిణం దిశగా విస్తరించింది.గ్రేటరే..7,257 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ. 1995లో 267 చ.కి.మీ.లుగా ఉన్న నగర అర్బన్ ఏరియా 2005లో 319 చ.కి.మీ. 2015లో 407 చ.కి.మీ.లకు విస్తరించింది. గత మూడు దశాబ్దాల్లో గ్రేటర్ పట్టణ ప్రాంతం 252 చ.కి.మీ. పెరిగింది. 95 శాతం మేర వృద్ధి చెందింది. 1995లో 49 లక్షలుగా ఉన్న గ్రేటర్ జనాభా 2015 నాటికి 87 లక్షలు, ఇప్పుడు 1.13 కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో జనాభా 131 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, టూరిజం ఇదే నగరాభివృద్ధికి చోదకాలు.హెచ్ఎంఆర్ దిశగా.. దేశానికే తలమానికంగా నిలిచేలా తెలంగాణలో ఒక ప్రధాన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్ఎంఆర్)ను ప్రతిపాదించింది. 10,472.723 చ.కి.మీ. మేర విస్తరించి ఉండే హెచ్ఎంఆర్.. రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉంటుంది. దీంతో హైదరాబాద్‌తోపాటు పొరుగు జిల్లాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.మాస్టర్ ప్లాన్ తప్పనిసరి ఏ నగరానికైనా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరం. మౌలిక వసతుల కల్పనతోపాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే మాస్టర్‌ప్లాన్ ప్రకారమే అభివృద్ధి జరగాలి. సిటికీ వలసలు పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతం విస్తరిస్తుంది. – కె.విద్యాధర్, డైరెక్టర్, హెచ్ఎండీఏఉద్యోగ అవకాశాల గని ఉద్యోగ, ఉపాధి అవకాశాల పుష్కలంగా ఉండటమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం. పటిష్టమైన లా అండ్ ఆర్డర్, నైపుణ్య కార్మికుల లభ్యత, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి వాటితో నగరంలోకి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి.–కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబై మెట్రో కార్పొరేషన్‌కు చెందిన నారిమన్ పాయింట్‌లోని టోనీ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4.16 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీనికోసం ఆర్బీఐ ఏకంగా రూ. 3472 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ భూమిని ఎందుకు కొనుగోలు చేసిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.ముంబైలోని నారిమన్ పాయింట్ అనేది దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం. దీనిని ప్రీమియం వ్యాపార కేంద్రంగా పరిగణిస్తారు. ఇలాంటి ప్రదేశంలో ఆర్బీఐ భూమిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది ఒకటి కావడంతో.. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఈ ఏడాది జరిగిన అతిపెద్ద భూమి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనించదగ్గ విషయం.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరి రెండు రోజులే.. జాబ్ నుంచి తీసేసారురియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన సీఆర్ఈ మ్యాట్రిక్స్ నుంచి సేకరించిన ఆస్తి లావాదేవీ డేటా ప్రకారం.. ఆర్బీఐ కొనుగోలు చేసిన భూమి కోసం రూ. 208 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఈ ఒప్పందం సెప్టెంబర్ 5న రిజిస్టర్ అయింది. రిజర్వ్ బ్యాంక్ తన హెడ్‌క్వార్టర్స్‌ను విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే ఈ భూమిని కొనుగోలు చేసింది. -
వేగవంతమైన బుకింగ్స్ కోసం.. ఈడెన్ హోమ్‌స్టే వెబ్సైట్
హైదరాబాద్‌లో ప్రయాణించే దేశీయ, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సులభమైన, వేగవంతమైన సౌకర్యవంతమైన బుకింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా.. ఈడెన్ హోమ్‌స్టే కంపెనీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ ప్రారంభించింది. ఇది మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్‌లలో కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పర్యాటకులు ఈ వెబ్సైట్ ద్వారా గదుల లభ్యతతో పాటు, లేటెస్ట్ ఫోటోలను బ్రౌజ్ చేస్తూ.. వివరణాత్మక సమాచారం పొందవచ్చు. అంతే కాకుండా వేగంగా బుకింగ్స్ పూర్తి చేసుకోవచ్చు.ముఖ్యమైన ఫీచర్లు..➢రియల్-టైమ్ బుకింగ్ సిస్టమ్: తక్షణ ధృవీకరణ➢మల్టీ-కరెన్సీ సపోర్ట్: విదేశీ అతిథుల కోసం➢స్పష్టమైన ధరల సమాచారం: దేశీయ & అంతర్జాతీయ అతిథుల కోసం➢రివార్డ్ పాయింట్స్ సిస్టమ్: తదుపరి బుకింగ్‌లో ఉపయోగించుకోడానికి➢గిఫ్ట్ కార్డ్స్: కొనుగోలు, రీడెంప్షన్ కోసం➢ఇంటిగ్రేటెడ్ గూగుల్ మ్యాప్స్: సులభ నావిగేషన్ కోసం➢ఆథెంటిక్ గెస్ట్ రివ్యూలు: సరైన నిర్ణయం తీసుకోవడానికి➢256-బిట్ ఎన్క్రిప్షన్తో సెక్యూర్ పేమెంట్స్➢మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసంప్రాపర్టీ ఓనర్లకు కొత్తఅవకాశాలుహైదరాబాద్లో పాటు భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కంపెనీ ఈ వెబ్సైట్ తీర్చిదిద్దింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా హోస్ట్ తమ స్టేలను లిస్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా స్థానికంగా ఉపాధిఅవకాశాలు మెరుగుపడతాయి.దీని గురించి ఈడెన్ హోమ్‌స్టే ప్రతినిధి మాట్లాడుతూ.. స్టేలో లభించే సౌకర్యం, ఆత్మీయతలాగే బుకింగ్ అనుభవం కూడా సులభంగా, సౌకర్యవంతంగా ఉండాలని మేము కోరుకున్నాము. ఈ అప్‌గ్రేడ్ మా అతిథులందరికీ నాణ్యత, ఆత్మీయత, సౌలభ్యం అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం అని అన్నారు. -
ఖరీదైన అపార్ట్మెంట్లు.. బాలీవుడ్ నటులకు భారీ లాభాలు
ముంబైలోని ఖరీదైన అపార్ట్మెంట్లు బాలీవుడ్ నటులకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ నటి మలైకా అరోరా ముంబైలోని అంధేరీ వెస్ట్ లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను రూ.5.30 కోట్లకు అమ్మేసింది. ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. ఈ లావాదేవీ 2025 ఆగస్టులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వద్ద నమోదైంది. అంధేరి వెస్ట్ లోని లోఖండ్ వాలాలో ఉన్న రన్వాల్ ఎలిగంటే అనే హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఈ ప్రాపర్టీ ఉంది.రూ.2.04 కోట్ల లాభంమలైకా ఈ అపార్ట్‌మెంట్‌ను 2018 మార్చిలో రూ.3.26 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే ఆమె దీనిపై 62 శాతం రూ.2.04 కోట్ల లాభాన్ని ఆర్జించారు. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 1,369 చదరపు అడుగులు, బిల్టప్ ఏరియా 152.68 చదరపు మీటర్లు. ఈ సేల్ లో ఒక కారు పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. స్టాంప్ డ్యూటీ కింద రూ.31.08 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.30 వేలు చెల్లించారు.స్క్వేర్ యార్డ్స్ డేటా ప్రకారం.. 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఆగస్టు మధ్య రన్వాల్ ఎలిగెంట్ ప్రాజెక్టులో మొత్తం రూ.109 కోట్ల విలువైన 22 రిజిస్టర్డ్ ప్రాపర్టీ లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో సగటు ప్రాపర్టీ ధర చదరపు అడుగుకు రూ.33,150గా ఉంది. అంధేరి వెస్ట్ ముంబైలో అత్యంత డిమాండ్ ఉన్న నివాస ప్రాంతాలలో ఒకటి. లగ్జరీ అపార్ట్మెంట్లు, ఎంటర్టైన్మెంట్ హబ్‌లకు ఇది ప్రసిద్ధిగాంచిది.టైగర్ ష్రాఫ్‌కు రూ.3.98 కోట్ల లాభంమరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ముంబైలోని ఖర్ లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను విక్రయించాడు. (Tiger Shroff sells Mumbai apartment) 2025 సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ అపార్ట్ మెంట్ అత్యాధునిక రుస్తుంజీ పారామౌంట్ ప్రాజెక్టులో భాగం. దీని కార్పెట్ ఏరియా 1,989.72 చదరపు మీటర్లు, బిల్టప్ ఏరియా 2,189 చదరపు మీటర్లు. ఈ ఫ్లాట్ లో మూడు కార్ పార్కింగ్ స్థలాలు ఉండటం గమనార్హం.2018లో టైగర్ ఈ ప్రాపర్టీని రూ.11.62 కోట్లకు కొనుగోలు చేశాడు. 2025లో రూ.15.60 కోట్లకు విక్రయించి రూ.3.98 కోట్ల లాభం, పెట్టుబడిపై 34.25 శాతం రాబడి వచ్చింది. ఈ లావాదేవీకి రూ.93.60 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ అపార్ట్మెంట్ వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే, రాబోయే మెట్రో మార్గాలతో బాగా అనుసంధానమై ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, లోయర్ పరేల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రదేశాలకు ఇది దగ్గరగా ఉంది.ఇదీ చదవండి: ఓయో కంపెనీ పేరు మారింది.. ఐపీఓ ముంగిట కీలక మార్పు -
ఇంటి నిర్మాణానికి ప్లాట్ ఎంచుకునేముందు..
ఇల్లు కట్టుకోవడం చాలా మంది కల. ప్రాథమికంగా ఇది సరైన ప్లాట్‌ను, సరైన ప్రదేశంలో ఎంచుకోవడంతో ప్రారంభమవువుతుంది. అందుకు ఎంపిక చేసుకునే ప్లాట్ నాణ్యత, భవిష్యత్తులో ఆ ఆస్తి విలువ పెరుగుదల, సమీపంలోని మౌలిక సదుపాయాలు వంటివి ఎంతో ప్రభావితం చేస్తాయి. ఎలాంటి సదుపాయాలు లేని ప్రదేశంలో తక్కువ ధరకు ప్లాట్ లభిస్తుంది కదా అని తొందరపడి కొనుగోలు చేశారంటే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మంచి ప్లాట్‌ను ఎన్నుకునేటప్పుడు పరిగణించవలసిన కీలక అంశాలను కింద తెలుసుకుందాం.ప్రదేశంకొనుగోలు చేయాల్సిన ప్లాట్ పని ప్రదేశానికి లేదా వ్యాపార కేంద్రాలకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ప్రధాన రహదారులు లేదా ప్రజా రవాణా ద్వారా సులువుగా ప్రయాణించే వీలుండాలి. భద్రత పరంగా మెరుగైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. భవిష్యత్తులో వాణిజ్యంగా, ఇతర పరామితుల దృష్ట్యా అభివృద్ధి చెందే అవకాశం ఉండాలి.మౌలిక సదుపాయాల లభ్యతహైటెక్ ఇల్లు కట్టుకున్నా అత్యవసర సేవల విషయంలో రాజీ పడడం సరికాదు. కనీస మౌలిక సదుపాయాలు ముఖ్యం. విద్యుత్తు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ, వీధి దీపాలు, రవాణా సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి.అత్యవసర సేవలుముఖ్యంగా విద్య, వైద్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. కొనుగోలు చేయాలనుకునే ప్లాట్‌కు 2-5 కిలోమీటర్ల లోపు పాఠశాలలు ఉండేలా చూసుకోవాలి. సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్లినిక్ లేదా ఆసుపత్రి ఉండడం చాలా అవసరం. ఫార్మసీలు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు ఉండేలా తనిఖీ చేసుకోవాలి. ప్లాట్‌కు 5-10 కిలోమీటర్ల పరిధిలో 24/7 ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ఉండటం కీలకం. అత్యవసర సమయాల్లో పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు.భూమి నాణ్యతప్లాట్ కొనుగోలు చేయడానికి ముందు నేల నాణ్యత, స్థలాకృతిని అంచనా వేయాలి. ఇవి నిర్మాణ వ్యయాన్ని, భద్రతను ప్రభావితం చేస్తాయి. నీరు నిలవకుండా ఉండటానికి డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉందనేది పరిశీలించాలి. తప్పకుండా భూసార పరీక్షలు చేసి నిపుణుల సలహా మేరకు నిర్మాణం ప్రారంభించాలి.పరిసరాలు, సమాజంఇల్లు అంటే కేవలం ఒక భవనం మాత్రమే కాదు. ఇక్కడే మీ జీవితం సాగుతుంది. చుట్టూ పార్కులు, ఆటస్థలాలు ఉండేలా గమనించాలి. కమ్యూనిటీ కల్చర్ (ఫ్యామిలీ ఫ్రెండ్లీ) ఎలా ఉందో గమనించి, అవసరమైతే సమీపంలోని వారితో మాట్లాడి ప్లాట్ కొనుగోలు చేయాలి.ఇదీ చదవండి: చిటికేసినంత సులువుగా ఇల్లు కొనేస్తున్నారు.. -
రెరా ఏందయా?.. వెబ్సైట్లో ‘లాస్ట్ అప్డేట్ కాలమ్’ తొలగింపు
గృహ కొనుగోలుదారులకు భద్రత, భరోసా కల్పించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా) గందరగోళంగా మారింది. కస్టమర్లకు తమ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలకమైన సమాచారం ‘లాస్ట్ అప్డేట్ కాలమ్’ను టీజీ–రెరా వెబ్సైట్ నుంచి తొలగించింది. దీంతో ప్రాజెక్ట్ పురోగతి సమాచారం తెలియక, గృహ కొనుగోలుదారులలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు టీజీ–రెరాలో 9,990 ప్రాజెక్ట్‌లు, 4,436 మంది ఏజెంట్లు నమోదయ్యారు. 2,266 ఫిర్యాదులు అందగా.. 1,302 కేసులను పరిష్కరించారు. -సాక్షి, సిటీబ్యూరోరెరా చట్టంలోని సెక్షన్–11 ప్రకారం మూడు నెలలకు (త్రైమాసికం) ఒకసారి తమ ప్రాజెక్ట్ పురోగతి, విక్రయాలు, ఖాళీలు తదితర వివరాలను టీజీ–రెరా వెబ్సైట్లో నమోదు చేయాలి. దీంతో బిల్డర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన త్రైమాసిక సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారో లేదో కస్టమర్లు సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. బిల్డర్ ఒక ప్రాజెక్ట్ వివరాలను చివరగా ఎప్పుడు అప్డేట్ చేశారో లేదా అప్లోడ్ చేశారో ఈ కాలమ్ చూపిస్తుంది. ‘‘గతంలో టీజీ–రెరా వెబ్సైట్లో నా ప్రాజెక్ట్‌ను తనిఖీ చేస్తున్నప్పుడు, బిల్డర్ క్రమంతప్పకుండా అప్డేట్ చేస్తున్నాడో తెలుసుకోవడం సులభంగా ఉండేది. కానీ, ఇప్పుడు తేదీ లేకుండా, అది ఎప్పుడు అప్డేట్ చేశారో తెలియడం లేదు. ప్రస్తుతం ఉన్న వివరాలు తాజావా లేక పాతవా అనే సమాచారం తెలియడం లేదని’’ ఓ గృహ కొనుగోలుదారుడు వాపోయారు.బహుళ పత్రాలను పరిశీలించాల్సిందే..టీజీ–రెరా వెబ్సైట్ నుంచి ‘లాస్ట్ అప్డేట్ కాలమ్’ను తొలగించడం వల్ల టీజీ–రెరా నియమాలు, 2017 రూల్–16 ప్రకారం ప్రతి త్రైమాసికంలో డెవలపర్లు ప్రాజెక్ట్ వివరాలను అప్టేట్ చేస్తున్నారో లేదో ట్రాక్ చేయడం కష్టతరమైందని ఓ న్యాయవాది అన్నారు. గతంలో లాస్ట్ అప్టేడ్ కాలమ్‌తో ప్రాజెక్ట్ పురోగతి సమాచారం సులభంగా తెలుసుకునే వీలుండేది, కానీ, ఇప్పుడు బహుళ పత్రాలను పరిశీలిస్తే గానీ సమాచారంపై స్పష్టత రావడం లేదు. ఈ కాలమ్‌ను తొలగించడంతో డెవలపర్లలో కూడా ‘లాస్ట్ అప్డేట్’ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. దీంతో రెరా ఉద్ధేశించిన పారదర్శకత లోపించడంతో పాటు అమలు సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. అయితే ఈ విషయమైన ఓ టీజీ–రెరా అధికారిని సంప్రదించగా.. వైబ్సైట్లో పలు సాంకేతిక మార్పులలో భాగంగా తాత్కాలిక కాలం పాటు ఈ కాలమ్‌ను తొలగించామని, పునరుద్ధరణ తర్వాత తిరిగి ఈ ఫీచర్ తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. -
గ్రోత్ కారిడార్లలో భూమి బంగారమే.. 3 రెట్లు పెరిగిన ధరలు
రేపటి అర్బన్ ఇండియా విజనే భారత్ ఫ్యూచర్ సిటీ. కృత్రిమ మేధస్సు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ తయారీ, పర్యాటకం, స్పోర్ట్స్, చలనచిత్ర నిర్మాణం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తూ.. రేపటి తరాలకు పర్యావరణ హితమైన నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే పదేళ్లలో సుమారు 10 లక్షల ఉద్యోగులు పనిచేయనున్న ఈ ఫోర్త్ సిటీలో ఈ మేరకు హౌసింగ్ డిమాండ్ ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు కొత్త మనోహర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు దక్షిణం వైపున 765 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చెందనున్న ఈ సమగ్ర పట్టణ ప్రాంతం భారత్‌కే తలమానికంగా నిలుస్తుందని తెలిపారు. –సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే ఫేజ్–1లో 14 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 30 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో రహదారుల నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. పనుల ప్రారంభమైతే ఆయా ప్రాంతాల్లోని భూమి బంగారంగా మారుతుంది. వచ్చే రెండేళ్లలో ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాలలో భూముల ధరలు మూడు రెట్లు పెరగడం ఖాయం. మీర్ఖాన్పేట, ముచ్చర్ల, గుమ్మడవల్లి, లేమూరు, యాచారం, కందుకూరు, నందివనపర్తి, కడ్తాల్, ఆమన్‌గల్ ప్రాంతాల్లో అభివృద్ధి జోరుగా ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ఎకరం రూ.2–5 కోట్లు ఉండగా.. వచ్చే రెండేళ్లలో రూ.10–15 కోట్లకు చేరుతుంది.గ్రోత్ కారిడార్‌లో బంగారమే.. ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితమైంది. కానీ, రీజినల్ రింగ్ రోడ్డు, దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్‌లతో సగం తెలంగాణ ప్రాంతం అభివృద్ధి నెక్ట్స్ లెవల్‌కు చేరుతుంది. ఇప్పటికే ఆయా కీలక ప్రాజెక్ట్‌లపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఔటర్‌కు ఇరువైపులా గ్రోత్ కారిడార్ కిలో మీటర వరకే కేటాయించారు. దీంతో మల్టీ పర్పస్ జోన్‌గా మారిన ఆ ప్రాంతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు వచ్చాయి. ఇక, ఇరువైపులా 5 కి.మీ. వరకూ గ్రోత్ కారిడార్‌గా పరిగణించనున్న ట్రిబుల్ ఆర్ ప్రాంతంలో అభివృద్ధి ఇంతకు రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఈ కారిడార్లలో ఎక్కడ భూమి కొన్నా బంగారంగా మారడం ఖాయం.శంషాబాద్ మెయిన్ సిటీ.. బేగంపేట విమానాశ్రయం ప్రారంభించిన తొలినాళ్లలో హైదరాబాద్‌కు శివారు ప్రాంతమది. కానీ, ఇప్పుడు సిటీకి మెయిన్ సెంటర్‌గా అభివృద్ధి చెందింది. ఇదే తరహాలో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డుల అభివృద్ధితో సమీప భవిష్యత్తులో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కూడా ప్రధాన నగరంగా మారుతుంది. ఫోర్త్ సిటీ నుంచి శంషాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గమంతా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. హైటెక్ సిటీలతో ఐటీ కంపెనీల రాకతో గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ఎలాగైతే అభివృద్ధి చెందాయో అంతకు రెట్టింపు వేగంతో మహేశ్వరం అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎయిరో స్పేస్ కంపెనీల రాకతో రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. బెంగళూరు హైవే, ఫ్యూచర్ సిటీలతో అనుసంధానమై ఉండటం అదనపు అంశాలు.అనుమతులు వేగం.. గత ప్రభుత్వంలో ఎలాగైతే టీఎస్–బీపాస్ ద్వారా 21 రోజుల్లోనే పారిశ్రామిక పెట్టుబడులు, సంస్థలకు అనుమతులు ఇచ్చారో.. అదే తరహాలో హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు టైం లైన్ పెట్టి అనుమతులను ఇవ్వాలి. దీంతో ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బిల్డర్లు ముందుకు రావడంతో పాటు పన్నులు, ఫీజుల రూపంలో ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం సమకూరుతుంది. కొత్త మనోహర్‌రెడ్డి, రియల్ ఎస్టేట్ నిపుణులు -
వెస్ట్ హైదరాబాద్ తప్ప అంతా ‘అందుబాటు’లోనే..
గ్రేటర్లో సామాన్యుల సొంతింటి కల రోజురోజుకూ దూరమవుతున్న నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు వాటిని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి, కార్మికుల వ్యయాల భారమవడం వంటి పలు కారణాలతో నగరంలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా పలు నిర్మాణ సంస్థలు ఇప్పటికీ పశ్చిమ హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతికి అందుబాటు ధరల్లో గృహాలను నిర్మిస్తున్నాయి. తక్కువ ధర అనో, ప్రీలాంచ్లోనో కొనుగోలు చేసి మోసపోకుండా.. కాస్త జాగ్రత్త వహిస్తే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. -సాక్షి, సిటీబ్యూరోరెండు బెడ్ రూములు, కిచెన్, హాల్, టాయిలెట్స్‌తో 700–800 చ.అ. విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ హోమ్స్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేపథ్యంలో హైదరాబాద్‌లో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు గిరాకీ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఎక్కువగానే ఉన్నారు. వీరు తమ సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్‌తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే సొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి కాన్సెప్ట్. దీంతో రూ.60 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలకు డిమాండ్ పెరిగింది.బిల్డర్లలో ధరల పోటీ.. 2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే గృహాల ధరలు అందుబాటులో ఉండేవి. కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లు, ఆధునిక వసతుల కల్పనలో బిల్డర్లు పోటీ పడుతుండటంతో రూ.కోట్లు వెచ్చిస్తేగానీ సొంతింటి కల సాకారం కాని పరిస్థితి. మాదాపూర్, నార్సింగి, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.60 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి.ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే.. ఇబ్రహీంపట్నం, నాగార్జున్‌సాగర్ రోడ్, హయత్‌నగర్, పోచారం, ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.కొనే ముందు వీటిని పరిశీలించాలిజీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందో లేదో పరిశీలించాలి. రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్ హోమ్స్ ప్రాజెక్ట్‌లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం బెటర్. -
మెరిసేవన్నీ ఇటాలియన్ మార్బుల్స్ కావు..
అందమైన సొంతింటి కల.. కల కాకూడదంటే ఇంటి నిర్మాణ సమయంలో మనం వేసే అడుగులు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఇంటి అందాన్ని తళుక్కుమనిపించే ఇటాలియన్ మార్బుల్స్ విషయంలో తప్పటడుగులు వేసి నిట్టూర్చే కన్నా దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ అందమైన ఇల్లు జిగేల్మంటూ మెరిసిపోవడం ఖాయం. – శంషాబాద్ విదేశీ మార్బుల్ దిగుమతిలో ప్రథమస్థానం ఇటలీ నుంచి వచ్చే ఇటాలియన్ మార్బుల్దే.. ప్రస్తుతం మార్కెట్లో అనేక దేశాల మార్బుల్స్‌ను ఇటాలియన్ పేరుతో విక్రయిస్తున్నారు. అందుకే ఇటాలియన్లో ఉన్న ప్రధాన రకాల గుర్తించి తెలుసుకోవాలి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నవి సత్వారియో ఇందులో(తెలుపు, గ్రే), కరారా, వెనటినో, గ్రేవిలియం వీటితో పాటు పాత రకాలైన డైనా, పర్లాటో, బోటోచినోతో పాటు ఔట్‌సైడ్ ఎలివేషన్‌కు మాత్రమే ఉపయోగపడే ట్రావెటైన్ రకాలున్నాయి. నాణ్యత గుర్తించడం ఎలా..? ఇంటికి కచ్చితంగా ప్రీమియం బ్రాండ్ ఎంచుకోవడమే ఉత్తమం.. ప్రీమియం బ్రాండ్‌లో కొనుగోలు చేసే ముందు తీసుకునే మార్బుల్ కచ్చితంగా స్క్వార్ ఆకారంలోనే ఉండాలి. అంతేకాకుండా 18ఎంఎం–20ఎంఎం మందం ఉండాలి. రాయికి నాలుగు వైపులా వ్యాకూమ్ చేసిన దాన్ని ఎంచుకోవాలి. రాయి ప్రాసెస్‌లో రెగ్జిన్‌తో చేసిందా లేదా అపాక్సితో చేసిందా అనే విషయం కూడా తెలుసుకోవాలి. సాఫ్ట్ రాయి కంటే హార్డ్ ఉన్న రాయినే ఎంచుకోవాలి. రాయిలో కెమికల్ ఫిల్లింగ్ ఉంటే కచ్చితంగా తక్కువ క్వాలిటీదిగా గుర్తించాలి. ఇటాలియన్ మార్బుల్స్‌లో కనిష్టంగా రూ.300 ఫీట్ మొదలుకొని గరిష్టంగా రూ.5 వేల వరకు హైదరాబాద్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోటీగా ఉన్నవి ఇవే.. మార్కెట్లో ఇటాలియన్తో సమానంగా స్పెయిన్ మార్బుల్స్ పోటీలో ఉన్నాయి. ఇందులో బెల్లాచినో, హర్మానివైట్, గ్రేకార్నికో, స్పానిషన్బెజ్, స్పానిష్ బ్రౌన్, పోర్చుగల్‌కు చెందిన మెకలాంజిలో మార్బుల్స్ అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. వీటితో పాటు గ్రీస్‌కు చెందిన ఒలకాస్, గోర్టెన్ ఇన్స్పైడర్, థాసోస్వైట్ కూడా ఉన్నాయి. వియత్నాంకు చెందిన వైట్ మార్బుల్స్ కూడా ప్రత్యేకంగా పూజ గదులకు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక బ్రెజిల్‌కు చెందిన క్వార్టజైట్ రాళ్లు టేబుల్ టాప్, కిచెన్, క్లాడింగ్, ఎలివేషన్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. వీటితో పాటు మార్కెట్లో ఇరాన్, ఇరాక్, తునేషియా సంబంధిత దేశాల మార్బుల్స్ కూడా ఉన్నాయి.చైనా.. టర్కీ.. చైనా వివిధ దేశాల మార్బుల్స్‌ను దిగుమతి చేసుకుని తిరిగి ప్రాసెస్ చేసి విక్రయించే రకాలు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. ఇందులో ప్రీమియంతో పాటు మీడియం క్వాలిటీ రకాలు కూడా ఉన్నాయి. టర్కీ నుంచి వచ్చే మార్బుల్స్ కొంత తక్కువ నాణ్యతతో ఉంటున్నాయి. క్రాక్ ఫిల్లింగ్, అధికంగా కెమికల్ ప్రాసెస్ చేసిన మార్బుల్స్ ఉంటాయి. వీటి రీ పాలిష్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో.. సొంతింటిలో మీ అడుగులు అందమైన మార్బుల్స్‌పై వేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.. ఆల్ ది బెస్ట్..! -
గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక వర్క్ స్పేస్
సాక్షి, సిటీబ్యూరో: గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగులకు నిర్మాణ సంస్థలు సరికొత్త సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నాయి. కరోనాతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇప్పటికీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.అయితే ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్‌ను ఆఫీస్ కోసం వినియోగిస్తే గృహ కొనుగోలుదారులు ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వచ్చినప్పుడు హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇబ్బందికరంగా ఉంటోందని ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో నిర్మాణ సంస్థలు గేటెడ్ కమ్యూనిటీల్లోని క్లబ్హౌస్ల్లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంచుతున్నాయి.హై నెట్వర్క్ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నాయి. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయాల్లో వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులందరూ ఒకేచోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు. వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ అర్బన్ జంగిల్‌గా మారిపోతుంది. దీంతో ఆ ఉద్యోగులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర వరకూ పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగు మందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతుంది. దీంతో సేంద్రియ, సస్టయినబుల్ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. సువాసన, అకర్షణీయమైన పువ్వుల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వేలు, డెక్‌లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది. -
చిటికేసినంత సులువుగా ఇల్లు కొనేస్తున్నారు..
సాధారణంగా ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు.. ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత సలువుగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనంలో వెల్లడైంది. –సాక్షి, సిటీబ్యూరోఆర్థికంగా సన్నద్ధమయ్యాకే.. మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా మార్కెట్లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల సరఫరా పెరిగింది. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కరోనా మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.వసతులకే ప్రాధాన్యం.. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, నేటి యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువ సమయం అంటే కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.కోటి –3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు 30 రోజులు సమయం తీసుకుంటున్నారు. -
'నగరంలో సొంత ఇల్లు.. మీరు చేసే పెద్ద తప్పు'
నగరంలో సొంత ఇల్లు కట్టుకోవాలనుకోవడం లేదా కొనుగోలు చేయాలనుకుకోవడం చాలామంది కల. ఈ కల నెరవేర్చుకోవడానికి ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే కొందరు మాత్రం సొంత ఇల్లు ఉండాలా?, అద్దె ఇంట్లోనే ఉండాలా? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడంలోనే మునిగిపోతారు. ఈ ప్రశ్నకు చాన్నాళ్ల నుంచే వాదోపవాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై తాజాగా ఫిన్‌ఫ్లూయెన్సర్ 'అక్షత్ శ్రీవత్సవ' స్పందించారు.''భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇళ్లు కొనడం అంటేనే.. మీరు చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి. ఎందుకంటే ఈ మార్కెట్ మొత్తం బిల్డర్ల నియంత్రణలోనే ఉంటుంది.. కాబట్టి ఇల్లు కొనాలంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మౌలిక సదుపాయాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మీరు ఆ ఇల్లును అమ్మడం కూడా ఒక పెద్ద సవాలు. కాబట్టి అద్దెకు తీసుకోండి, ప్రశాంతంగా జీవించండి'' అని అక్షత్ శ్రీవత్సవ అన్నారు. ఒకవేళా ఇల్లు కొనాలంటే.. తప్పకుండా 30 ఏళ్లు నివసించడానికి ఉండే దాన్ని కొనండి అని సూచించారు.ప్రస్తుతం శ్రీవత్సవ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఇంటిని సొంతం చేసుకోవడం వల్ల గణనీయమైన రాబడి వస్తుందని చెబుతున్నారు. సొంత ఇల్లు ఉంటె అద్దె వంటివి తగ్గుతాయని ఇంకొందరు చెబుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఇల్లు కొనడం దీర్ఘకాలిక సంపదను పెంచుతుందని.. స్థిరత్వాన్ని అందిస్తుందని వాదించారు.Buying a property in an Indian Metro is going to be one of your worst mistakes: ---1) Entire market is builder controlled (so you buy very expensive)2) Overdevelopment is causing infrastructure issues (so the cities are becoming unlivable)3) With constant new developments,…— Akshat Shrivastava (@Akshat_World) September 2, 2025 -
ఢిల్లీలో రూ.1100 కోట్ల డీల్.. జవహర్లాల్ నెహ్రూ బంగ్లా సేల్
భారతదేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నివసించిన ఢిల్లీలోని అత్యంత ఐకానిక్ హెరిటేజ్ ప్రాపర్టీలలో ఒకటైన బంగ్లా అమ్ముడుపోయింది. భారతదేశ చరిత్రలో దీన్ని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ డీల్‌గా భావిస్తున్నారు. లుటియన్స్ ఢిల్లీ నడిబొడ్డున ఉన్న 17 మోతీలాల్ నెహ్రూ మార్గ్ (గతంలో యార్క్ రోడ్)లో ఉన్న ఈ విశాలమైన బంగ్లాను ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త సుమారు రూ.1,100 కోట్లకు కొనుగోలు చేశారు.వారసత్వానికి శాశ్వత చిహ్నంఈ బంగ్లా కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న తొలినాళ్లలో ఇది ఆయన అధికారిక నివాసంగా ఉండేది. కాలక్రమేణా, ఇది భారతదేశ రాజకీయ, నిర్మాణ వారసత్వానికి శాశ్వత చిహ్నంగా మారింది.14,973 చదరపు మీటర్లు (సుమారు 3.7 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీ 1912- 1930 మధ్య ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించిన ప్రత్యేకమైన లుటియన్స్ బంగ్లా జోన్ (ఎల్బిజెడ్) లో ఉంది. ప్రధానంగా కేంద్రమంత్రులు, సీనియర్ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు నివసిస్తున్న సుమారు 3,000 బంగ్లాలకు నిలయంగా ఉన్న ఎల్బీజెడ్ రాజధానిలో అత్యంత ఉన్నత ప్రాంతంగా పరిగణించబడుతుంది.రికార్డ్ బ్రేక్ డీల్..ఈ బంగ్లాకు తొలుత రూ.1,400 కోట్లు ధర చెప్పినట్లు సమాచారం. అయితే చర్చల అనంతరం ఈ డీల్ రూ.1,100 కోట్లకు ఖరారు అయింది. అయినప్పటికీ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాపర్టీ డీల్ ఇదే కావడం గమనార్హం.ఈ ప్రాపర్టీలో దాదాపు 24,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉంది. చుట్టూ పచ్చని తోటలు, బహిరంగ ప్రదేశాలు ఉన్నాయి. ఇది లుటియన్స్ ఢిల్లీ గ్రాండ్ డిజైన్ నైతికతకు విలక్షణమైనది.కొన్నదెవరు?ఈ బంగ్లాకు ప్రస్తుత యజమానులు రాజకుమారి కక్కర్, బీనా రాణి రాజస్థానీ రాజకుటుంబానికి చెందిన వారసులని భావిస్తున్నారు. న్యాయ, ఆర్థిక మధ్యవర్తుల ద్వారా ఈ విక్రయాన్ని నడిపించారు. ఒక ప్రముఖ న్యాయ సంస్థ యాజమాన్య బదిలీని పర్యవేక్షిస్తోంది.అయితే ఈ బంగ్లాను ఎవరు కొన్నారన్నది బహిరంగంగా వెల్లడించనప్పటికీ, కొన్నది బేవరేజ్ పరిశ్రమకు చెందిన వ్యాపారవేత్త అని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ లీగల్ క్లియరెన్స్ చివరి దశలో ఉందని, ఆ తర్వాత అధికారికంగా బదిలీ పూర్తవుతుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: Real Estate Alert: 18న బాచుపల్లి ప్లాట్ల ఈ–వేలం -
18న బాచుపల్లి ప్లాట్ల ఈ–వేలం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) బాచుపల్లి లే అవుట్‌లోని 70 ఖాళీ ప్లాట్లకు ఈ నెల 18న ఈ–వేలం వేయనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం లే అవుట్లో ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించింది. ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి వేలంపాట ప్రక్రియ గురించి వివరించారు.ఎంఎస్‌టీఎస్ ప్రతినిధులు ఈ–వేలం పాట విధానం గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేపీఎంజీ ప్రతినిధులు ఈ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాధాన్యతలు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్నవారి నుంచి వచ్చిన సందేహాలకు ఆయా విభాగాల అధికారులు నివృతి చేశారు.సమావేశంలో హెచ్ఎండీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యప్రసాద్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కె.శ్రీకాంత్‌రెడ్డి, ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఈ వేలంలో పాల్గొనాలనుకుంటే, హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్లో ఆక్షన్ గైడ్, ప్లాట్ వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూడవచ్చు. -
గృహ రుణాల్లో ప్రభుత్వ బ్యాంకుల పైచేయి
ముంబై: గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం చివరికి మొత్తం గృహ రుణాల్లో 46.2 శాతం వాటాతో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందున్నాయి. 2024 జూన్ చివరికి ఇది 37.6 శాతంగా ఉంది. ఇదే కాలంలో ప్రైవేటు బ్యాంకుల వాటా 35.2 శాతం నుంచి 28.2 శాతానికి పడిపోయింది. ఈ వివరాలను క్రెడిట్ బ్యూరో సంస్థ క్రిఫ్ హైమార్క్ విడుదల చేసింది. రిటైల్ రుణాల్లో గృహ రుణాల వాటాయే పెద్ద మొత్తంలో ఉంటోంది. ఎందుకంటే ఇతర రుణాలతో పోల్చి చూస్తే ఒక్కో గృహ రుణం పరిమాణం అధిక మొత్తంలో ఉండడం, పైగా ఇది సెక్యూర్డ్ లోన్ కావడంతో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఈ మార్కెట్లో గట్టిగా పోడీపడుతుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల గృహ రుణాల్లో 31–90 రోజుల వరకు చెల్లింపులు లేని రుణాలు 2.85 శాతానికి చేరినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. అదే ప్రైవేటు రంగ బ్యాంకుల గృహ రుణాల్లో ఇలాంటి వసూలు కాని రుణాలు 1.04 శాతమే ఉన్నట్టు వెల్లడించింది. ప్రైవేటు బ్యాంకులు రిస్క్‌ను ముందుగా గుర్తించడం, బలమైన అండర్‌రైటింగ్ (రుణ అర్హతలు, రుణ గ్రహీత చెల్లింపు సామర్థ్యాలను విశ్లేíÙంచడం) ప్రమాణాలను పాటించడం దీనికి కారణంగా పేర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.35 లక్షల్లోపు రుణాల్లోనే చెల్లింపులు నిలిచిపోయినవి ఎక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. పెద్ద మొత్తంలో రుణాల పట్ల ఆసక్తి బ్యాంకులు చిన్న రుణాల కంటే పెద్ద పరిమాణంలో గృహ రుణాల మంజూరు పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. రూ.75 లక్షలకు పైబడిన రుణాల (ఒక్కోటీ) మంజూరు 38 శాతానికి చేరగా, క్రితం ఏడాది దే కాలంలో ఇది 33.6 శాతంగా ఉన్నట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. ఇక రూ.5–55 లక్షల్లోపు గృహ రుణాల మంజూరు 34.7 శాతం నుంచి 31.2 శాతానికి తగ్గాయి. కొత్త క్రెడిట్ కార్డుల్లో స్తబ్దత కొత్త క్రెడిట్ కార్డుల మంజూరు జూన్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 28 శాతం తగ్గి 40.6 లక్షలుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆర్బీఐ నియంత్రణలను కఠినతరం చేయడం, బ్యాంకుల రిస్క్ ధోరణి తగ్గడం, రుణ ఆస్తుల పటిష్టతపై దృష్టి సారించడం కారణాలుగా పేర్కొంది. జూన్ త్రైమాసికంలో కొత్త క్రెడిట్ కార్డుల మంజూరులో ప్రైవేటు బ్యాంకుల వాటా ఏడాది క్రితం ఉన్న 71 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది. -
ఒక్కో కంపెనీ నెలకు ఎన్ని కోట్లు కడుతున్నాయో తెలుసా?
హైదరాబాద్..! ప్రపంచ దేశాల్లో కేవలం ఒక ప్రముఖ నగరం మాత్రమే కాదు.. కాలాతీతంగా మారుతున్న జీవనశైలి, అంతర్జాతీయ ఆర్థిక, ఆధునిక, విజ్ఞాన, వ్యాపార అంశాల్లో ఎప్పటికప్పుడు తన ప్రశస్తిని చాటుతున్న గ్లోబల్ సిటీ. నగరంలోని పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు, ఆయా సంస్థలు చెల్లిస్తున్న అద్దెలే ఇందుకు తార్కాణం.. పలు గ్లోబల్ సంస్థలు నగర కేంద్రంగా లక్షల చదరపు అడుగుల వీస్తీర్ణంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే కాదు.. ఆ స్థలాలకు ప్రతి నెలా కోట్ల రూపాయల్లో అద్దె చెల్లిస్తున్నాయి. ఆయా గ్లోబల్ సంస్థల వింతలు, విశేషాలు.. – సాక్షి, సిటీబ్యూరోమైక్రోసాఫ్ట్ (ఆర్ అండ్ డీ): ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్ సెంచురస్ భవనంలో 2.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జూలై 2025 నుంచి కార్యాలయాన్ని లీజుకు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి నెల రూ. 5.4 కోట్ల అద్దె చెల్లిస్తోంది. ఐదేళ్ల లీజ్ ఒప్పందంలో భాగంగా ఈ ఆఫీస్ స్పేస్ కోసం నగరంలో అత్యధిక అద్దె చెల్లిస్తున్న సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రమే.క్వాల్కమ్: ఈ సంస్థ కార్యాలయం హై‑టెక్ సిటీలోని ది స్కై వ్యూ భవనంలో 4.14 లక్షల చదరపు అడుగులకు దాదాపు 3.15 కోట్ల భారీ అద్దెను చెల్లిస్తుంది. ఇది అత్యంత అధిక అద్దె తీసుకునే లీజుల్లో ఒకటి. ఈ సంస్థ కుదుర్చుకున్న ఐదేళ్ల లీజ్‌లో మొదటి ఏడాది తరువాత ఈ అద్దె 7 శాతం పెరుగనుంది. అంతేకాకుండా మూడేళ్ల తరువాత మరో 15 శాతం పెరిగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.టీసీఎస్: శేరిలింగంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రాజ్‌పుష్ప భవనంలో అంతర్జాతీయ సేవలందిస్తున్న టీసీఎస్.. సుమారు 10.18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి రూ.4.3 కోట్ల నెలవారి అద్దె కడుతోంది. 15 ఏళ్లకుగాను కుదుర్చుకున్న ఈ లీజ్ నగరంలో అత్యధిక అద్దె కడుతున్న సంస్థల్లో మరొక ప్రధాన సంస్థగా నిలిచింది.ఫేస్బుక్ (మెటా): ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫేస్బుక్ (మెటా) హైదరాబాద్ నగరంలో 3.7 లక్షల చదరపు అడుగుల స్థలం కోసం దాదాపు 2.8 కోట్ల నెలవారీ అద్దెతో లీజును నవీకరించింది. రానున్న ఏడాది 2026 జనవరిలో ఈ అద్దె 15 శాతం పెరగనుంది.ఎస్ అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా: ఈ సంస్థ నగరంలో 2.41 లక్షల చదరపు అడుగులకు ప్రతి నెలా రూ.1.77 కోట్లు చెల్లిస్తోంది. 2024 నుంచి ఐదేళ్లకు కుదుర్చుకున్న ఈ లీజ్ రెండేళ్ల తరువాత 15 శాతం పెరుగనుంది.ఎల్టీఐ మైండ్ ట్రీ: హైటెక్ సిటీలోని స్కై వ్యూ 10లో ఎల్టీఐ మైండ్ ట్రీ సంస్థ సుమారు 1.09 లక్షల చదరపు అడుగులకు 89.18 లక్షలు అద్దెగా చెల్లిస్తూ.. ఐటీ దిగ్గజాల సరసన నిలిచింది.ఐబీఎం ఇండియా: గచ్చిబౌలిలోని దివ్య శ్రీ ఓరియన్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐబీఎం ఇండియా తమ లీజులో భాగంగా 1.06 లక్షల చదరపు అడుగుల స్థలానికి ప్రతి నెలా రూ.70.23 లక్షలు చెల్లిస్తోంది. 2024లో మొదలైన ఈ లీజ్ ప్రతి ఐదేళ్లకు 4 శాతం పెరగనుంది.50 శాతం టెక్ లీజింగ్..సిటీలో 2025లో నూతనంగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ సరఫరా గణనీయంగా తగ్గడంతో వేకెన్సీ ధర విపరీతంగా పెరిగింది. దీనివల్ల అద్దె చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయని ఓ గ్లోబల్ సంస్థ ప్రతినిధి తెలిపారు. దీనికి తోడు ఇక్కడ లభించే సేవల సమగ్రత, దీనికి స్థానిక ప్రభుత్వ మద్దతు.. అంతకు మించి తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు అందిస్తున్న ప్రోత్సాహం.. అత్యాధునిక ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఇవన్నీ కలిపి హైదరాబాద్‌ను యూనివర్సల్ హబ్‌గా మార్చేసింది.మోడ్రన్ లైఫ్‌స్టైల్..ఈ అంశాలే కాకుండా విలాసవంతమైన అధునాతన జీవనవిధానం, ఈ గ్లోబల్ కంపెనీలకు అనువైన డిజైన్‌తో కూడిన భవనాలు, సురక్షిత పార్కింగ్, ఆధునిక భవన లీఫ్ట్ సౌకర్యాలు, రెగ్యులర్ పవర్ బ్యాకప్ వంటివి తోడ్పాటును అందిస్తున్నాయి. కేవలం ఆఫీసు అధికారిక కార్యకలాపాల్లో భాగంగా పనిచేయడమే కాకుండా సమీపంలోని మోడ్రన్ లైఫ్‌స్టైల్ అలవాట్లు, కాంటినెంటల్ ఫుడ్, ఫిట్నెస్ సేవలు ఆ కంపెనీల ఉద్యోగులకు గ్లోబల్ లెవెల్ లైఫ్‌స్టైల్ అందిస్తున్నాయి. ఫ్యామిలీ–ఫ్రెండ్లీ వాతావరణం, ఉద్యోగులకు కుటుంబంతో ఉండేందుకు సరైన నివాస, విద్య, వినోదం వంటివి స్థానికంగానే అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం.ఇన్నోవేటివ్ సెంటర్..నగరంలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థలు ఇంత భారీ స్థాయిలో అద్దెలు చెల్లించడానికి ప్రధాన కారణం.. భాగ్యనగరం భారతీయ ఐటీ, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ (జీసీసీ) హబ్‌గా, ప్రతిష్టాత్మక ఇన్నోవేటివ్ కేంద్రంగా ఎదగడమేనని నిపుణులు చెబుతున్న మాట. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ అధునాతన జీవన శైలికి అనుగుణమైన లైఫ్‌స్టైల్ పర్యావరణాన్ని రోజు రోజుకు అభివృద్ధి చేసుకుంటుంది. ముఖ్యంగా హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు సమృద్ధిగా కెఫేలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇంటర్నెట్, క్యాంపస్ మోడ్రన్ వాతావరణంతో అద్భుత జీవన విధానాన్ని అందజేస్తున్నాయి. -
ప్లాటుకు పరీక్ష.. పాస్ అయితేనే ఇల్లు!
ఇల్లు కట్టే కలను సాకారం చేసుకోవాలంటే, ముందుగా భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని (ప్లాటు) ఎంపిక చేసుకోవడం అత్యంత కీలకం. ఇది కేవలం ఆస్తి పెట్టుబడి మాత్రమే కాదు. మీ కుటుంబ భద్రత, ఆరోగ్యం, జీవనశైలి అన్నీ దీనిపై ఆధారపడి ఉంటాయి. భూమి బలహీనంగా ఉంటే, ఎంత ఖరీదైన నిర్మాణమైనా భవిష్యత్తులో ప్రమాదమే. అందుకే, భవన నిర్మాణానికి ముందు భూమి స్వరూపాన్ని శాస్త్రీయంగా పరీక్షించుకోవడం తప్పనిసరి. సాయిల్ టెస్టింగ్ (Soil Testing) ద్వారా భూమి బలాన్ని, నీటి నిల్వ సామర్థ్యాన్ని, నిర్మాణానికి అనువైనదేనా అనే విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో వచ్చే నిర్మాణ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఈ అంశాలు కీలకంతెలుగు రాష్ట్రాల్లో భూమి స్వరూపం ప్రాంతానుసారంగా మారుతుంది. ఎర్ర మట్టి (Red Soil) బలమైన నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. నల్ల మట్టి (Black Cotton Soil) తేమను ఎక్కువగా పీల్చుకుంటుంది, కదలికలతో భవనానికి ప్రమాదం కలిగించవచ్చు. ఇసుక నేలలో (Sandy Soil ) నీటి పారుదల బాగుంటుంది కానీ నిర్మాణానికి పనికిరాదు. భౌగోళిక స్థితి కూడా కీలకం. తక్కువ ఎత్తులో ఉండే ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాలు భద్రతకు మంచివైనా, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అందువల్ల, స్థలం ఎంపికలో మట్టి స్వరూపం, నీటి ప్రవాహం, పరిసరాల భద్రత.. ఇలా అన్ని అంశాలూ కీలకం.ఇవిగో ఇవీ పరీక్షలుభూమి బలాన్ని, నిర్మాణానికి అనువైనదేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు కొన్ని ముఖ్యమైన సాయిల్ టెస్టులు ఉన్నాయి. బేరింగ్ కెపాసిటీ టెస్ట్ (Bearing Capacity Test) ద్వారా భూమి ఎంత బరువు మోయగలదో తెలుసుకోవచ్చు. మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ (Moisture Content Test) మట్టిలో తేమ శాతం ఎంత ఉందో తెలియజేస్తుంది. అట్టెర్బర్గ్ లిమిట్స్ (Atterberg Limits) పరీక్ష ద్వారా మట్టి ద్రవ, ప్లాస్టిక్ లక్షణాలు అంచనా వేయవచ్చు. కంపాక్షన్ టెస్ట్ (Compaction Test) ద్వారా భూమిని ఎంత గట్టిగా పాకబెట్టవచ్చో తెలుసుకోవచ్చు. పీహెచ్ టెస్ట్ (pH Test) ద్వారా మట్టి ఆమ్లత/క్షారత స్థాయిని తెలుసుకోవచ్చు. గ్రెయిన్ సైజ్ అనాలిసిస్ (Grain Size Analysis) ద్వారా మట్టి కణాల పరిమాణం, నిర్మాణానికి అనువైనదేనా అనే విషయం అర్థమవుతుంది. ఈ పరీక్షల ఆధారంగా ఇంటికి ఎలాంటి పునాది వేయాలి.. పిల్లర్లు ఎంత లోతు నుంచి నిర్మించాలి అనే విషయాలను ఇంజినీర్లు నిర్ణయిస్తారు.ఎక్కడ చేస్తారీ పరీక్షలు?తెలంగాణలో సాయిల్ టెస్టింగ్ సేవలు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేటు టెస్టింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా భూమి శాస్త్రీయ విశ్లేషణ పొందవచ్చు. అలాగే, ప్రభుత్వ వ్యవసాయ శాఖ ద్వారా కూడా కొన్ని ప్రాంతాల్లో సాయిల్ టెస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన కేంద్రాలు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, శ్రీకాకులంలలో ఉన్నాయి. ఈ ల్యాబ్స్ ద్వారా భూమి పరీక్షలు చేయించుకుని, నివేదిక ఆధారంగా పునాది, నిర్మాణ సామగ్రి, నీటి పారుదల వంటి అంశాలు నిర్ణయించుకోవచ్చు. జియోటెక్నికల్ నివేదిక తీసుకోవడం, ఫౌండేషన్ ప్లానింగ్ చేయడం, డ్రైనేజ్ డిజైన్ రూపొందించడం భవన నిర్మాణానికి ముందు అనుసరించాల్సిన చర్యలు.సాధారణంగా డెవలప్ చేసిన వెంచర్లలో ప్లాటు తీసుకుంటుంటే ఈ పరీక్షలన్నీ డెవలపర్లే చేయిస్తారు. కానీ స్థలం కొంటున్నవారు కూడా టెస్ట్ చేయిస్తే మంచిది. నిపుణులు చెబుతున్న సూచన ప్రకారం, స్థలం ఎంపిక చేసిన వెంటనే సాయిల్ టెస్టింగ్ చేయించాలి. ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్స్ లేదా సివిల్ ఇంజినీర్ల ద్వారా నివేదిక పొందాలి. నివేదిక ఆధారంగా నిర్మాణ పునాది, నిర్మాణ పదార్థాలు, డ్రైనేజీ వంటి అంశాలు నిర్ణయించాలి. ఇది భవిష్యత్తులో వచ్చే నిర్మాణ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాయిల్ టెస్టింగ్ ఖర్చు కాదు.. ఇది భద్రతకు పెట్టుబడి.ఇదీ చదవండి: కోటి రూపాయలు లేకపోతే సొంతిల్లు కష్టమే.. -
అందుబాటు ధరల ఇళ్ల కొరత
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో అందుబాటు ధరల విభాగంలో (రూ.50 లక్షల్లోపు) 94 లక్షల యూనిట్ల ఇళ్ల కొరత నెలకొంది. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ మొదటి ఆరు నెలల్లో (జనవరి – జూన్) తగ్గుముఖం పట్టిందని.. ఈ కాలంలో అందుబాటు ధరల ఇళ్ల యూనిట్ల విక్రయాలతో పోలి్చతే కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ నిష్పత్తి 0.36 శాతంగా ఉన్నట్టు నరెడ్కో–నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. 2019 మొదటి ఆరు నెలల్లో ఇది 1.05గా ఉంటే, 2020 మొదటి ఆరు నెలల్లో 1.30గా ఉన్నట్టు తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ నివేదికను నరెడ్కో, నైట్ ఫ్రాంక్ సంయుక్తంగా విడుదల చేశాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో సరఫరా పరంగా సవాళ్లు నెలకొన్నట్టు ఈ నివేదిక తెలిపింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్ గణాంకాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ మద్దతు అవసరం.. అందుబాటు ధరల ఇళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ నివేదిక తెలియజేస్తుందని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. ఈ విభాగంలో 94 లక్షల యూనిట్ల కొరత ఉందంటూ.. 2030 నాటికి 3 కోట్ల యూనిట్లకు పెరుగుతుందన్నారు. ‘‘ఈ విభాగంలో కొత్త సరఫరా గణనీయంగా తగ్గింది. అదే సమయంలో డిమాండ్ పెరుగుతుండడం ఆందోళనకరం. ప్రైవేటు రంగం పెట్టుబడులు పరిమితంగానే ఉండడం ఈ అంతరాన్ని మరింత పెంచుతోంది. కనుక సరఫరాను పెంచేందుకు సంస్కరణలు అవసరం. ఇళ్ల నిర్మాణానికి వీలుగా ప్రభుత్వ భూములను అందుబాటులోకి తీసుకురావాలి. ఎఫ్ఎస్ఐ నిబంధనలను క్రమబద్దీకరించాలి. నిర్మాణ కోసం రుణాలను రాయితీపై అందించాలి’’అని హరిబాబు కోరారు. డిమాండ్ పెంచేందుకు విధానపరమైన మద్దతు ప్రశంసనీయమేనని, అదే సమయంలో సరఫరా పరంగా ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ కోరారు. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. -
స్వదేశానికి తిరిగొస్తున్న ప్రవాసులు.. ఎందుకంటే?
ప్రపంచ సాంకేతికత, ఆవిష్కరణలకు కేంద్రమైన సిలికాన్ వ్యాలీ నుంచి మల్టి నేషనల్ కంపెనీలు సైబరాబాద్ వైపు దృష్టి మళ్లిస్తున్నాయి. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపిస్తుంటే.. నగరంలో స్థిరాస్తి కొనుగోళ్లు, పెట్టుబడులకు ప్రవాసులూ మొగ్గు చూపిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ పెట్టుబడులు సిలికాన్ వ్యాలీ నుంచి సైబరాబాద్‌కు వలస వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ప్రవాసుల వాటా 30 శాతం వరకు ఉంటుంది. ప్రధానంగా డల్లాస్, బూస్టన్, కాలిఫోర్నియా వంటి నగరాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా ప్రవాసులు ఉంటారు. భౌగోళిక రాజకీయ అస్థిరత, పెరుగుతున్న సుంకాలు, ఉద్యోగ విపణిలో అనిశ్చితులు వంటి అమెరికా, యూరప్ దేశాలలో నెలకొన్న అనిశ్చితి వాతావరణం నగర స్థిరాస్తి మార్కెట్‌కు బాగా కలిసి వస్తోంది. ప్రపంచదేశాల్లోని ప్రవాసులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. కేవలం కుటుంబం కోసమే కాదు.. అవకాశాలు, పెట్టుబడుల కోసం కూడా.. ఈ పరివర్తనకు హైదరాబాద్ కేంద్రంగా ఉద్భవిస్తోంది. ఏడాది కాలంలోనే ఐదు ప్రధాన అమెరికా ఆధారిత కంపెనీలు ఇండియాలో జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఇందుకు ఉదాహరణ.జీసీసీలకు కేంద్రం..జీసీసీల విస్తరణ కేవలం సాంకేతికతకు మాత్రమే సంబంధించినది కాదు.. ఇది ప్రతిభ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా సూచిస్తుంది. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఇంటెలెక్చువల్ క్యాపిటల్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది జూన్ నాటికి హైదరాబాద్‌లో 350కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) పనిచేస్తున్నాయి. ఫైనాన్షియల్, రిటైల్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్(క్యూఎస్ఆర్), హెల్త్‌కేర్, టెక్నాలజీ రంగాలలో 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎలి లిల్లీ, మెక్ డొనాల్డ్స్ వంటి కంపెనీలు నగరంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. దేశంలోని 2 వేలకు పైగా జీసీసీలు ఉండగా.. ఇందులో హైదరాబాద్ వాటా దాదాపు 15 శాతం.ప్రవాసులే లక్ష్యంగా..డెవలపర్లు కూడా ప్రవాసులను లక్ష్యంగా చేసుకొని హైఎండ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట్ వంటి ప్రాంతాలకు చేరువలోని గేటెడ్ కమ్యూనిటీలు, స్మార్ట్ హోమ్ ప్రాజెక్ట్‌లకు ప్రవాసులకు అనుకూలం. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్, కో–వర్కింగ్ హబ్‌లు, డేటా సెంటర్లలో పెట్టుబడులకు బహుళ జాతి సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి. చట్టపరమైన డాక్యుమెంటేషన్, ఇంటీరియర్ డిజైన్ వంటి స్థానిక సేవలను అందించే మధ్యవర్తులు, నాణ్యమైన ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. -
గోడౌన్లకు పీక్ డిమాండ్.. ఆల్‌టైం హైకి వేర్‌హౌస్ మార్కెట్
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో వేర్‌హౌస్ మార్కెట్ ఆల్‌టైం హైకి చేరుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో పారిశ్రామిక గోడౌన్లలో దాదాపు 20 మిలియన్ చ.అ. లీజు లావాదేవీలు జరిగాయి. వార్షిక ప్రాతిపదికన 33 శాతం వృద్ధి నమోదైందని కొలియర్స్ నివేదిక వెల్లడించింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఢిల్లీ, చెన్నై వేర్‌హౌస్ మార్కెట్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. మొత్తం లీజింగ్‌లో సగం వాటా ఈ రెండు నగరాలదే..గ్రేడ్–ఏ గిడ్డంగులు, పారిశ్రామిక షెడ్లకు సంబంధించిన స్థల సేకరణలో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్(త్రీపీఎల్) కీలకంగా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వచ్చిన డిమాండ్‌లో దాదాపు 32 శాతం వీరిదే.. ఒక్క త్రీపీఎల్ కాకుండా ఇంజనీరింగ్, ఈ–కామర్స్, ఆటోమొబైల్స్, రిటైల్ సంస్థలతో సహా చాలా విభాగాల నుంచి డిమాండ్ పెరిగింది.2025 రెండో త్రైమాసికంలో పారిశ్రామిక, గిడ్డంగుల రంగం టాప్–8 నగరాల్లో దాదాపు 11 మిలియన్ చ.అ. డిమాండ్‌ను చూసింది. ఇది సంవత్సరానికి 52 శాతం పెరుగుదల. ఇందులో 60 శాతం వాటాతో ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలు దేశీయ పారిశ్రామిక గిడ్డంగుల రంగాన్ని ముందుకు నడిపించాయి. -
కోటి రూపాయలు లేకపోతే సొంతిల్లు కష్టమే..
కోటి రూపాయలు వెచ్చించకపోతే హైదరాబాద్ నగరంలో సొంతిల్లు కష్టమే.. నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వ్యయాలు పెరుగుతుండటంతో ఆ మేరకు డెవలపర్లు కూడా ఇళ్ల ధరలు పెంచేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతికి సొంతింటి కల మరింత దూరమవుతుంది. అయితే ఒకవైపు ధరలు ఏ రేంజ్లో వృద్ధి చెందుతున్నాయో.. అంతకు రెట్టింపు స్థాయిలో లగ్జరీ గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. సిటీలో రూ.కోటి ఖర్చు పెడితే ఏ ప్రాంతంలో ఎన్ని చదరపు అడుగుల ఫ్లాట్ కొనొచ్చో సీఆర్ఈ మ్యాట్రిక్స్ అధ్యయనం చేసింది. ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్‌తో పాటు సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే ప్రీమియం ప్రాంతం జూబ్లీహిల్స్‌లో రూ.కోటి ఖర్చు చేస్తే కేవలం 480 చ.అ.లు మాత్రమే కొనగలం. ఇస్నాపూర్ వంటి శివారు ప్రాంతాల్లో అయితే అదే రూ.కోటికి 1,448 చ.అ. అపార్ట్మెంట్ సొంతం అవుతుంది. – సాక్షి, సిటీబ్యూరోమెరుగైన మౌలిక వసతులు, ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండే ఏరియాలకు అధిక డిమాండ్ ఉంది. మెట్రో కారిడార్లు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకు సమీపంలోని ప్రాంతాల్లోని ప్రాపరీ్టలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో స్థలాల కొరతకారణంగా గృహాల సరఫరా పరిమితంగానే ఉన్నప్పటికీ కస్టమర్ల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. ఐటీ కారిడార్లలో.. కోకాపేట, నానక్‌రాంగూడ వంటి అధిక డిమాండ్ ఉన్న ఐటీ కారిడార్లలో కొనుగోలుదారులు రూ.కోటి పెడితే 617, 698 చ.అ.లను మాత్రమే కొనగలరు. నార్సింగి, తెల్లాపూర్ వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో చూస్తే.. నార్సింగిలో 772 చ.అ., శేరిలింగంపల్లిలో 764 చ.అ., ఉస్మాన్‌సాగర్‌లో 815 చ.అ., కూకట్‌పల్లిలో 842 చ.అ., రాజేంద్రనగర్‌లో 933 చ.అ., తెల్లాపూర్ లో 983 చ.అ., మియాపూర్‌లో 1,009 చ.అ.ఫ్లాట్ సొంతమవుతుంది.విస్తారమైన ఇల్లు.. ఇక విశాలమైన ఇల్లు కావాలనుకునే కొనుగోలుదారులు మాత్రం ప్రధాన నగరం నుంచి కాస్త దూరంగా, మెరుగైన మౌలిక వసతులు ఉన్న శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిందే. రూ.కోటి వెచ్చిస్తే నిజాంపేటలో 1,024 చ.అ., బాచుపల్లిలో 1,059 చ.అ., పటాన్చెరులో 1,140 చ.అ., పోచారంలో 1,330 చ.అ., అపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి.సెలబ్రిటీలతో ధరల వృద్ధి.. మెరుగైన మౌలిక వసతులు, ఐటీ కారిడార్లకు చేరువలో ఉండటంతో పాటు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉంటుండంతో ఆయా ప్రాంతాలకు అధిక డిమాండ్ ఉంది. అలాగే అంతర్జాతీయ షాపింగ్ మాల్స్, వాణిజ్య స్థలాలు ఉండటంతో ఆయా ప్రాంతాలలో ప్రీమియం అద్దెలు చెల్లించేందుకు కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రధాన ప్రాంతాలలో ధరలు ఎక్కువగానే ఉన్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న తూర్పు శివారు ప్రాంతాలలో ఇప్పటికీ వృద్ధి అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. స్థిరమైన అభివృద్ధి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, కార్యకలాపాలపై ఈ డిమాండ్ ఆధారపడి ఉంటుంది. -
ఇంటి నిర్మాణం కోసం ఓ మంచి స్థలం: ఎంపిక చేయండిలా..
పేదవారికైనా, ధనవంతులకైనా సొంతంగా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కల. ఆ కల కోసం చాలా కష్టాలు పడి డబ్బు పోగు చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలనుకోవడం మంచి ఆలోచనే.. కానీ ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం ఎంపిక చేసుకోవాలి?, దానికి అయ్యే బడ్జెట్ ఎంత అనేదానికి సంబంధించిన విషయాలపై కూడా ఓ అవగాహన ఉండాలి.ఇల్లు కట్టుకోవడానికి.. ఓ మంచి స్థలం ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇల్లు ఒక్కసారే ఇష్టపడి కట్టుకుంటారు. కాబట్టి మీ జీవనశైలికి తగిన విధంగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. అందుబాటులో ఉన్న వనరుల గురించి తెలుసుకుని స్థలం ఎంచుకోవాలి.స్థలం ఎంచుకోవడానికి ముందు గమనించాల్సిన విషయాలుచేతిలో డబ్బు ఉంది, ఇల్లు కట్టుకుంటాం.. అనుకుంటే సరిపోదు. ఆలా అని తక్కువ ధరలో.. ఎక్కడో మారుమూల ప్రాంతంలో స్థలం కొని ఇల్లు కట్టుకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొనే స్థలానికి దగ్గరలో.. స్కూల్, హాస్పిటల్, మార్కెట్స్, రవాణా సదుపాయాలు మొదలైనవి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.స్వచ్ఛమైన వాతావరణం ఉండే ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటే.. ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శబ్దాలు లేకుండా.. స్వచ్ఛమైన గాలి అందుబాటులో వుండే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడం మంచిది. మీరు ఉన్న ప్రాంతంలో సెక్యూరిటీ ఉందా?, లేదా? అనేది కూడా ముందుగానే పరిశీలించాలి.ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎంచుకోవడానికి ముందు.. అది భూకంప ప్రభావానికి గురైన ప్రాంతమా?, వరదలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా?, అనే విషయాలతో పాటు.. మంచినీటి వసతి, డ్రైనేజీ సదుపాయాలు మొదలైనవి ఉన్నాయా? లేదా అని ముందుగానే తెలుసుకోవాలి.బడ్జెట్ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుగోలు చేయాలనుకున్నప్పుడే.. ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే ప్రశ్న తెలెత్తుతుంది. స్థలం కోసమే ఎక్కువ డబ్బు వెచ్చిస్తే.. ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేసి.. దాన్ని తీర్చడానికి మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని, ప్రణాళికను దెబ్బతీస్తుంది.ఉదాహరణకు.. ఇంటి స్థలం కోసం రూ.10 లక్షలు కేటాయించాలి అని ప్లాన్ వేసుకున్నప్పుడు, ఆ బడ్జెట్లో లభించే స్థలం కోసం వేచి చూడాలి. మీ బడ్జెట్‌కు స్థలం లభించిన తరువాత ముందడుగు వేయాలి. ఇక్కడ కూడా మీకు కావలసిన సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..ప్రస్తుతం స్థలాల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ధరలు నగరాల్లో ఒకలా.. నగరాలకు కొంత దూరంలో ఇంకోలా ఉన్నాయి. ఈ విషయాలను ముందుగా తెలుసుకోవాలి. దీనికి నిపుణుల సలహాలు తీసుకోవాలి. కొంతమంది మధ్యవర్తులు మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు కట్టుకోవడం అంటే.. గోడలు కట్టి, పైకప్పు వేసుకోవడం కాదు, అది మనసుకు నచ్చేలా.. ప్రశాంతతను ఇచ్చేలా ఉండాలి. ఇది మొత్తం మీ ఎంపిక మీదనే ఆధారపడి ఉంటుందనే విషయం మాత్రం మరచిపోకూడదు. -
టీసీఎస్ బెంగళూరులో కొత్త ఆఫీస్.. రూ.2,130 కోట్లు రెంటు!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బెంగళూరులో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. అందుకు నగరంలోనే అతిపెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లో ఒకటైన డీల్‌ను కుదుర్చుకుంది. 14 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని 15 ఏళ్లకుగాను రూ.2,130 కోట్లకు లీజుకు తీసుకుంది. బెంగళూరులోని సౌత్ ఐటీ కారిడార్ ఎలక్ట్రానిక్ సిటీలోని 360 బిజినెస్ పార్కులో టవర్స్ 5ఏ, 5బీలో ఈ ఆఫీస్ స్పేస్ విస్తరించి ఉంది. టవర్ 5ఏలో 6.8 లక్షల చదరపు అడుగులు, టవర్ 5బీలో 7.2 లక్షల చదరపు అడుగులకు ఏకీకృత నెలవారీ అద్దె రూ.9.31 కోట్లుగా ఉంది. దీనికోసం టీసీఎస్ రూ.112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇచ్చినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి.ఈ ప్రాపర్టీ డెవలపర్ ల్యాబ్జోన్ ఎలక్ట్రానిక్స్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రతి మూడేళ్లకోసారి 12 శాతం అద్దె పెంపుతో 15 ఏళ్ల కాలానికి లీజుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పత్రాల్లో పేర్కొన్నారు. లీజు కాలంలో మొత్తం అద్దె సుమారు రూ.2,130 కోట్లుగా అంచనా వేశారు. ఇదిలాఉండగా, ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్ తన ‘అనంత క్యాంపస్’ను బెంగళూరులో ప్రారంభించింది. మహదేవపురలో 16 లక్షల చదరపు అడుగులమేర దీన్ని ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో కంపెనీ అతిపెద్ద కార్యాలయం. 2024లో మోర్గాన్ స్టాన్లీ ముంబైలో 1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని తొమ్మిదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో బెంగళూరులో జరిగిన టీసీఎస్ లీజు ఒప్పందం అతిపెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు.టీసీఎస్ గత కార్యాలయ లీజులుచెన్నైలోని ఓజోన్ టెక్నో పార్కులోని 6.3 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని టీసీఎస్ మార్చిలో రూ.2.8 కోట్లకు లీజుకు తీసుకుంది. నవులూరులో ఉన్న ఈ ప్రాపర్టీ ఏడు అంతస్తుల్లో విస్తరించి ఉంది. 2025 మార్చి 15న అద్దె ప్రారంభమైందని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అంతకుముందు ఏప్రిల్‌లో హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శేరిలింగంపల్లి మండలంలోని ఐటీ శివారులో 10.18 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని టీసీఎస్ నెలకు రూ.4.3 కోట్లకు లీజుకు తీసుకుంది. రాజపుష్పలో ఉన్న ఈ కార్యాలయ స్థలం 18 అంతస్తుల్లో విస్తరించి ఉంది.ఇదీ చదవండి: ఏపీవైలో 50 లక్షల మంది స్వనిధి లబ్ధిదారులు -
ఇంతలా పెరిగితే.. ఇక చౌక ఇళ్లు అంతే!
సొంతిల్లు ప్రతిఒక్కరి కల.. సామాన్య, మధ్యతరగతి వాసుల కల సాకారం చేసే చౌక గృహాలకు నిర్మాణ వ్యయం భారంగా మారుతోంది. దేశంలో దశాబ్ద కాలంలో నిర్మాణ వ్యయాలు బాగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, నైపుణ్య కార్మికుల జీతభత్యాలు, లాజిస్టిక్స్ కొరత, ఇంధన ధరల పెరుగుదల, ముడి పదార్థాల సరఫరాలో అంతరాయాలు, మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక ఒడిదుడుకులు, ప్రభుత్వ విధానాలు వంటి కారణాలతో 2021 నుంచి కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలతో గృహాల ధరలు వృద్ధి చెందడంతో పాటు అందుబాటు, మధ్యశ్రేణి గృహాల సరఫరా, డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, సిటీబ్యూరో2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లలో గృహ నిర్మాణ వ్యయాలు దాదాపు 40 శాతం మేర పెరిగాయి. మూడేళ్లలోనే ఏకంగా 27.3 శాతం పెరిగాయి. 2021 అక్టోబర్‌లో ప్రథమ శ్రేణి నగరాలలో గ్రేడ్–ఏ ప్రాజెక్ట్‌ల సగటు నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,200లుగా ఉండగా.. 2024 అక్టోబర్ నాటికి రూ.2,800లకు పెరిగిందని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో అఫర్డబుల్ హౌసింగ్ నిర్మాణానికి చ.అ.కు రూ.1,500– 2,000, మధ్య శ్రేణి గృహాల నిర్మాణానికి చ.అ.కు రూ.2,000–2,800 మధ్య ఖర్చు అవుతుంది. ఇక, లగ్జరీ గృహాల నిర్మాణం చేపట్టాలంటే చ.అ.కు రూ.4–5 వేల మధ్య ఖర్చవుతుంది.విభాగాల వారీగా చూస్తే.. స్టాడర్డ్ మెటీరియల్స్, బేసిక్ ఫినిషింగ్‌లతో కూడిన చౌక గృహాల నిర్మాణానికి చ.అ.కు రూ.1,500– రూ.2 వేల మధ్య వ్యయం అవుతుంది. హైగ్రేడ్ మెటీరియల్స్, బ్రాండెడ్ ఫిట్టింగ్స్‌తో కూడిన మధ్యశ్రేణి ఇళ్ల కన్స్ట్రక్షన్కు చ.అ.కు రూ.2 వేల నుంచి రూ.2,800 మధ్య వ్యయమైతే.. విదేశీ ఉత్పత్తులు, హైఎండ్ ఆర్కిటెక్చర్, ఆధునిక వసతులు ఉండే లగ్జరీ గృహాల నిర్మాణానికి చ.అ.కు రూ.3 వేల నుంచి రూ.5 వేలు అంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది.వ్యయాల పెరుగుదల ఎందుకంటే? ముడి పదార్థాలు: సిమెంట్, ఉక్కు, రాగి, అల్యూమీనియం వంటి నిర్మాణ సామగ్రి ధరలు స్థిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే సిమెంట్ ధరలు 15 శాతం మేర తగ్గితే.. ఉక్కు ధరలు 1 శాతం మాత్రమే తగ్గాయి. కానీ, ఐదేళ్లలో ఈ రెండు ముడి పదార్థాల ధరలు ఏకంగా 30–57 శాతం మేర పెరిగాయి. రాగి, అల్యూమీనియం ధరలూ ఇంచుమించుగా ఇదే రీతిలో పెరిగాయి. రాగి ధరలు ఏడాది కాలంలో 19 శాతం, ఐదేళ్లలో (2019–24) 91 శాతం వృద్ధి చెందాయి.కార్మికుల వ్యయాలు: నిర్మాణ వ్యయాలు పెరగడానికి ప్రధాన కారణం నైపుణ్య కారి్మకుల కొరతే. దీంతో అందుబాటులో ఉన్న కార్మికులకు అధిక జీతభత్యాలు చెల్లించక తప్పని పరిస్థితి. గతేడాదితో పోలిస్తే కార్మికుల వ్యయాలు 25 శాతం, 2019తో పోలిస్తే ఏకంగా 150 శాతం మేర పెరిగాయి.అనుమతులు: నిర్మాణ అనుమతుల ఆలస్యం, లాజిస్టిక్స్ ఖర్చులు కూడా నిర్మాణ వ్యయాల పెరుగుదలకు కారణాలే. ఇంధన ధరల పెరుగుదల, కార్యాలయ నిర్వహణ వ్యయాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి.కస్టమర్ల మీదే భారం.. చాలా మంది డెవలపర్లు పెరిగిన ఇన్పుట్ ఖర్చులను పాక్షికంగా లేదా పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేస్తారు. ఇన్పుట్ ఖర్చుల కారణంగా ఏటా గృహాల ధరలు 9–12 శాతం మేర పెరుగుతున్నాయి. చౌక గృహాల ధరలు చ.అ.కు రూ.500–800లు పెరిగినా కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ప్రీమియం, లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేసే వారితో పోలిస్తే రూ.5 లక్షల పెరుగుదల కస్టమర్లకు భారీ అదనపు భారమే అవుతుంది. ఇప్పటికే అఫర్డబుల్ హౌసింగ్ చేపట్టే డెవలపర్లు తక్కువ మార్జిన్ల కారణంగా కొత్త ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లడం లేదు. అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం.. 2019లో చౌక గృహాల లాంచింగ్స్ 40 శాతంగా ఉండగా.. 2025 తొలి అర్ధభాగం నాటికి ఏకంగా 12 శాతానికి తగ్గింది. విక్రయాలో 2019లో సరసమైన గృహాల వాటా 38 శాతంగా ఉండగా.. 18 శాతానికి పడిపోయింది.సుంకాల పెరుగుదల.. అమెరికా, చైనా, యూరప్ వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమీనియం, ఇతర నిర్మాణ సామగ్రిలపై సుంకాల పెరుగుదల కూడా నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపిస్తుంది. 25 శాతం సుంకాలు పెరిగితే దిగుమతులపై ఆధారపడే ప్రాజెక్ట్‌ల నిర్మాణ ఖర్చులు ప్రస్తుత స్థాయి కంటే 1.5–2.5 శాతం మేర పెరగవచ్చు. ఒకవేళ 50 శాతం మేర సుంకం విధించినట్లయితే నిర్మాణ వ్యయాలు 5 శాతం, అంతకంటే ఎక్కువే పెరుగుతాయి. దీంతో దిగుమతులపై ఆధారపడే లగ్జరీ, వాణిజ్య ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు కాస్త ఆలస్యమవుతాయి.జీఎస్టీ సవరణ మేలు.. ప్రభుత్వం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సవరణ ప్రతిపాదనలు నిర్మాణ రంగానికి భారీ ఉపశమనాన్ని కలిగిస్తాయి. జీఎస్టీలో కేవలం 5, 18 శాతం అనే రెండు రేట్లు మాత్రమే ఉంటాయని, అలాగే సిమెంట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించింది. ఇది కీలకమైన ఇన్పుట్ ఖర్చులపై మొత్తం పన్ను భారాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ తగ్గింపులు ఇప్పటికే 1 శాతం పన్ను విధిస్తున్న చౌక గృహాలపై తగ్గింపు పరిమితంగానే ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను పునరుద్ధరిస్తే ధరలు 2–4 శాతం వరకు తగ్గుతాయి. మధ్యశ్రేణి గృహ విభాగంలో జీఎస్టీ 5–3 శాతం మేర తగ్గిస్తే.. ధరలు 2–4 శాతం తగ్గుతాయి. అయితే లగ్జరీ గృహ విభాగంలో ఇన్పుట్ ఖర్చులు తగ్గినప్పటికీ.. ఆయా ప్రాజెక్ట్‌లలో వినియోగించే ప్రీమియం, బ్రాండెడ్ నిర్మాణ సామగ్రితో ధరల తగ్గింపు పెద్దగా ఉండకపోవచ్చు.ఇదీ చదవండి: ఇల్లు కొనాలంటే ఇలాంటి ప్లాన్ అవసరం -
ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..
ఇల్లు కట్టుకోవడం సామాన్యుడి కల. ప్రాథమిక దశలో అందుకోసం ప్లాట్‌ను ఎంచుకోవడం నుంచి చివరకు గృహప్రవేశం వరకు ఎన్నో ఆలోచిస్తారు. ముందుగా ఇల్లు నిర్మించాలనుకునేవారు సరైన ప్లాట్‌ను ఎంచుకోవడం అత్యంత కీలకమైన దశ. ఇది ప్లాట్ ధర లేదా దాని పరిమాణం గురించి మాత్రమే కాదు.. ఒకవేళ అనుకోని కారణాలతో ప్లాట్ తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోకపోయినా దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించేందుకు ప్లాట్ కొనుగోలు చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.ప్రదేశంప్లాట్ కొనేప్పుడు సమీప పరిసరాల్లో కనీస మౌలిక సదుపాయాలుండేలా చూసుకోవాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, కిరాణా దుకాణాలు, ప్రజా రవాణా వంటి నిత్యావసరాలకు దగ్గరగా ఉండాలి. సజావుగా ప్రయాణించడానికి ప్రధాన రహదారులు లేదా రహదారి కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్తులో ఇన్ఫ్రా ప్రాజెక్టులు రాబోయే ప్రాంతాలు ఆస్తి విలువను పెంచుతాయి.ప్లాట్ ఆకారం, పరిమాణంకొనుగోలు చేసే ప్లాట్ ఆకారం చివరవందరగా, తక్కువ పరిమాణంలో ఉంటే ఇల్లు నిర్మించడం కష్టం అవుతుంది. చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకార ప్లాట్లు సరళమైన డిజైనింగ్, నిర్మాణానికి అనువైనవని గుర్తించాలి. సరైన ఆకారం లేని ప్లాట్లు నిర్మాణ ప్రణాళికను క్లిష్టతరం చేస్తాయి. ఖర్చులను పెంచుతాయి. ఇవి సాధారణ ప్లాట్ల కంటే తక్కువ ధరకే లభించవచ్చు. అయితే అన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్లాట్ పరిమాణం ప్రస్తుత భవన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే భవిష్యత్తు విస్తరణకు అవకాశం ఉంటే మరీ మంచిది.నేల నాణ్యత, భూగర్భ జలాలుమట్టి నాణ్యతను పరీక్షించడంలో నిర్లక్ష్యం చేస్తే తర్వాత కాలంలో నిర్మాణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. నిర్దిష్ట ప్రదేశంలోని ల్యాండ్ ‘లోడ్ బేరింగ్ సామర్థ్యం(ఎంత బరువును తట్టుకుంటుందని తెసుకుపోవడం)’ను అంచనా వేయడానికి భూసార పరీక్ష నిర్వహించాలి. వదులుగా ఉన్న భూమి లేదా బంకమట్టి ఉంటే ఇది పునాదిని దెబ్బతీస్తుంది. భూగర్భజలాల లభ్యత, నీటి మట్టం లోతును తనిఖీ చేసుకోవాలి.లీగల్ వెరిఫికేషన్భూమిపై పెట్టుబడి పెట్టేటప్పుడు చట్టపరంగా ప్లాట్‌కు స్పష్టమైన టైటిల్ ఉండేలా చూసుకోవాలి. ఆ ల్యాండ్ వివాదరహితంగా ఉండాలి. న్యాయపరమైన వివాదాలు లేకుండా చూసుకోవాలి. స్థానిక మున్సిపల్ అండ్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉండేలా జాగ్రత్తపడాలి.వాస్తువాస్తు తప్పనిసరి కానప్పటికీ, భారతదేశంలో చాలా మంది కొనుగోలుదారులు వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉండేలా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. తూర్పు లేదా ఉత్తరం వైపు ఫేసింగ్ ఉన్న ప్లాట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. శ్మశానవాటికలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు లేదా శబ్దం చేసే పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంలో ప్లాట్లకు డిమాండ్ తక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా? -
రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటోంది..
రాష్ట్రాభివృద్ధి కసం ప్రభుత్వం చేసే పనులు, అవలంభించే విధానాలు ప్రజలకు తెలిస్తేనే మరింత సక్సెస్ అవుతాయి. రాబోయే తరాల భవిష్యత్తును మార్చేసే అలాంటి కీలక ప్రాజెక్ట్‌లకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైటెక్ సిటీ, ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్‌లతో సుమారు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారిపోయిందో అంతకు రెట్టింపు స్థాయిలో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్లతో తెలంగాణ దశదిశలు మారిపోతాయి. ఎయిర్‌పోర్ట్‌తో హైదరాబాద్ నుంచి ప్రపంచం మొత్తానికి తలుపు తెరిచినట్టే.. ఔటర్తో తెలంగాణ మొత్తానికి కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడిదే స్థాయిలో ప్రపంచ దేశాలను ఆకర్షించే ఈ మూడు గేమ్ చేంజర్ ప్రాజెక్ట్‌లు రాష్ట్రాభివృద్ధిని మార్చనున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ కే.ఇంద్రసేనారెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోవరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు వంటి హనీమూన్ పీరియడ్ ముగిసింది. దీంతో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. 18 నెలల్లో నగరంలో 2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడమే ఇందుకు ఉదాహరణ. వంద చ.అ.కు ఒక జాబ్ చొప్పున 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీంతో గృహాలకు డిమాండ్ ఏర్పడింది. పాత ప్రభుత్వాలు కేవలం పశ్చిమ హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీలో మెట్రో విస్తరణ, దక్షిణ హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్.. ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి ప్రణాళికలు చేస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, ఓఆర్ఆర్– ట్రిపుల్ ఆర్ మధ్య కొత్త ప్రాంతాలలో భూములు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార అవకాశాలూ పెరుగుతాయి. రోడ్లను వెడల్పు చేస్తే కార్ల సంఖ్య పెరగడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. మెట్రో విస్తరణ దూరాలు దగ్గరవుతాయి. ప్రజా రవాణా పెంచితేనే సిటీ అభివృద్ధి, దూరం పెరుగుతుంది. దీంతో కస్టమర్లు ఎక్కడికక్కడ ఇళ్లు కొనుగోలు చేయవచ్చు.హైడ్రా లాగే రెరా.. ప్రస్తుతం దేశంలో సుమారు 1.10 లక్షల మంది బిల్డర్లు ఉన్నారు. నిర్మాణ రంగంలో అసంఘటిత బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. నకిలీ బిల్డర్లు, మధ్యవర్తుల మాయమాటలు నమ్మి, తక్కువ ధరకు వస్తుందనే ఆశతో వారి చేతిలో కస్టమర్లు మోసపోతున్నారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, వారి పెట్టుబడులకు భద్రత కల్పించే పదునైనా అస్త్రం రెరా. దీన్ని గత ప్రభుత్వం విస్మరించింది. దీంతో ప్రీలాంచ్, సాఫ్ట్లాంచ్ల పేరుతో అమాయక కస్టమర్ల కష్టార్జితాన్ని కాజేశారు. కస్టమర్లు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా, రూపాయి పన్ను చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే నకిలీ బిల్డర్లను హైడ్రా తరహాలో కఠినంగా వ్యవహరించాలి. ఈమేరకు రెరాను మరింత బలోపేతం చేయాలి.ఏటా లక్ష కార్మికులకు నైపుణ్య శిక్షణ.. దేశీయ నిర్మాణ రంగంలో వచ్చే పదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం. ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది కార్మికులు తెలంగాణ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది నైపుణ్య కార్మికులు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదిస్తున్నారు. కొడంగల్, నిజామాబాద్, పరిగి, కరీంనగర్, వరంగల్ వంటి మన తెలంగాణ నుంచి యువత ముంబై, ఎన్సీఆర్–ఢిల్లీ, దుబాయ్, గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. నెలకు రూ.25–రూ.30 వేలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు వెయ్యి ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఆయా విద్యా సంస్థలు అకడమిక్ స్థాయిలో బాగానే ఉన్నా ఆన్సైట్ ప్రాక్టికల్ శిక్షణలో వెనుకబడి ఉన్నాయి. 12 తరగతిలోపు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 180 రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. 90 రోజుల పాటు క్లాస్రూమ్ శిక్షణ, 90 రోజులు ఆన్సైట్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే జరగనున్న క్రెడాయ్ స్టేట్‌కాన్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించనున్నాం.త్వరలోనే ఫ్యూచర్ సిటీ చాప్టర్..ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో 15 చాప్టర్లు, వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వీటిని 25 చాప్టర్లకు విస్తరించాలన్నది లక్ష్యం. త్వరలోనే ఫ్యూచర్ సిటీ క్రెడాయ్ చాప్టర్‌ను ప్రారంభించనున్నాం. కనీసం ఒక్క ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందిన, నాణ్యమైన 30 మంది సభ్యులతో ఈ చాప్టర్‌ను తెరవనున్నాం. కోడ్ ఆఫ్ కండక్ట్ విధిగా పాటించే సభ్యులతో ఆ తర్వాత సంగారెడ్డి, జహీరాబాబాద్ చాప్టర్లు కూడా రానున్నాయి. ప్రభుత్వం, బిల్డర్లకు మధ్య క్రెడాయ్ వారధిలా పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీలు, పన్నులు తదితరాలపై బిల్డర్లకు అవగాహన కల్పిస్తుంది.


