breaking news
Tirupati
-
అనుమతి ఎక్కడో?
కాలేజీ ఇక్కడ.. జిల్లాలోని జూనియర్ కళాశాలల వివరాలు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 109 ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 5,475 అనుమతులు ఉన్న కళాశాలలు 77 అనుమతి లేకుండా బ్రాంచీల పేరుతో నడుస్తున్న కళాశాలలు 32 అనుమతుల లేని కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు 21 వేలు నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కలిగిన కళాశాలలు 35 ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు లేని కళాశాలలు 97 జిల్లాలో అనుమతి లేని ప్రైవేటు కళాశాలలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. అనుమతి ఒకచోట తీసుకొని..చదువు ఒక చోట ..నిర్వహణ మరోచోట చేస్తూ కొన్ని ప్రైవేటు కళాశాలలు దందా సాగిస్తున్నాయి. ఆకర్షణీయమైన బ్రోచర్లతో ప్రైవేటు కాలేజీలు తల్లిదండ్రులను బురిడీ కొట్టించి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. పర్యవేక్షించాల్సిన ఇంటర్ మీడియట్ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. నిబంధనలు లేకున్నా అనుమతులు ఇచ్చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుండడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.తిరుపతి సిటీ : తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ ప్రలోభాలతో అధికారులను లొంగదీసుకుని వారికి అవసరమైన అనుమతులను పొందుతున్నారు. ఇందులో ప్రధానంగా తిరుపతి నగరంలో ప్రైవేటు యాజమాన్యాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి వారు ఆదేశించిన ప్రకారం అధికారులు తలవంచేలా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కొన్ని కళాశాలకు అనుమతులు ఒక చోట పొంది మరొక చోట తరగతులు చెబుతున్నారు. అలాగే అనుమతి ఒక కళాశాల పొంది రెండు, మూడు బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ తతంగం సాగుతున్న విషయం ఇంటర్మీడియట్ అధికారులకు తెలిసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనుమతి లేని ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. మంత్రి కళాశాలలు నిబంధనలకు చెల్లుచీటీ జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఇంటర్ కళాశాలలను అనుమతి లేకుండా నడుపుతున్నారని విద్యార్థి సంఘాలు, మేథావులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారపార్టీకి చెందిన ఓ మంత్రికి చెందిన కళాశాలలు తిరుపతి జిల్లాలో అనుమతి పొందినవి కేవలం 4 మాత్రమే. కానీ బ్రాంచీల పేరుతో నడుపుతున్న కళాశాలలు సుమారు 11 వరకు ఉన్నాయని విద్యార్థి సంఘాలు అధికారులకు విన్నవించాయి. కానీ ఇంటర్ విద్యాశాఖాధికారులు మంత్రి కళాశాలలపై కన్నెత్తి చూడకపోవడం దారుణం. కళాశాల బ్రాండ్ పేరుతో ఒక చోట అనుమతి పొంది అదే అనుమతులతో సుమారు 3 నుంచి 4 బ్రాంచ్‌లను నడుపుతూ వ్యాపారం చేసుకుంటున్నా అధికారులు అటు వైపు చూసిన దాఖలాలు లేవు ఇరుకై న అపార్ట్మెంట్లలో తరగతులు జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కళాశాలకు సైతం పూర్తి స్థాయి మౌలిక వసతులు లేకపోవడం దారుణం. ఇంటర్ విద్యామండలి నింబధనల ప్రకారం విశాలంగా, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా తరగతి గదులు ఉండాలి. కానీ జనవాసాల మధ్య ఇరుకై న అపార్ట్మెంట్లనే తరగతి గదులుగా చూపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు అపార్ట్మెంట్లలో నిర్వహించే కళాశాలలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జూనియర్ కళాశాల అనుమతులు పొందాలంటే 8 వేల చదరపు అడుగులు స్లాబ్ ఏరియా కచ్చితంగా ఉండాలి. అలాంటి నిర్మాణానికి అనుమతులు ఉండాలంటే స్థానిక పాలన నియమాల ప్రకారం సెట్ బ్యాక్ కింద కాంపౌండ్ వాల్, ఫ్రంట్ స్పేస్, వెంటిలేషన్ కింద స్థలం వదలాల్సి ఉంటుంది. విద్యార్థులకు, అధ్యాపకులకు పార్కింగ్ స్థలం చూపాలి. వీటన్నింటికి మించి ఫైర్ ఇంజిన్ ఏర్పాట్లు, ప్రమాదాన్ని నివారించే వెసులుబాటు ముఖ్యంగా ఉండాలి. ఇలాంటి నిబంధనలు కేవలం తూతూమంత్రంగా చూపిస్తూ మామూళ్లు ముట్టజెప్పి అనుమతులు పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 5 శాతం కళాశాలలు సైతం గ్రౌండ్ (క్రీడామైదానం) లేని దుస్థితి నెలకొంది. అయినప్పటికీ కళాశాలలు నిర్వహిస్తున్నారు. నిబంధనల మేరకు పురపాలక పరిధిలో రెండెకరాలు, కార్పొరేషన్ పరిధిలో ఒక ఎకరా కనీస ప్లే గ్రౌండ్ చూపించాలి. ఆ స్థాయి స్థలం విలువ లక్ష లు, కోట్లల్లో ఉండేటప్పటికీ స్థలం ఉన్న భూ యజమానిని తమ సొసైటీలో సభ్యుడిగా చూపించి, సదరు వ్యక్తి స్థలాన్ని ప్లే గ్రౌండ్ గా చూపిస్తుండటం ప్రైవేట్ కళాశాలల తెలివి తేటలకు నిదర్శనం.ఇవ న్నీ అధికారులకు తెలిసినా అనుమతులు ఇచ్చేస్తున్నారు. -
మొక్కుబడిగా పెట్టుబడిదారుల సదస్సు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి తాజ్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు (రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్) మొక్కుబడిగా సాగింది. ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి హాజరయ్యారు. కాగా వేదికపై ప్రత్యేకంగా ఆహ్వానించిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల ప్రసంగాలకే అధిక సమయం కేటాయించారు. మధ్యాహ్న భోజన సమయంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగంలో పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహాన్ని వివరించే ప్రయత్నం కాస్త పక్కదారి పట్టింది. ఇన్వెస్టర్స్‌తో, హోమ్ స్టే ఆపరేటర్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతామంటూ కార్యక్రమాన్ని మమ అనిపించారు. అనంతరం కూటమి నాయకులు మంత్రిని సన్మానించేందుకు అత్యుత్సాహం చూపారు. అనంతరం మీడియా ముందుకు మంత్రి కందుల దుర్గేష్ వచ్చారు. ఏపీలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. కూటమి పాలనలో పర్యాటక రంగానికి ఏమి చేస్తామనే అంశాలను దాటవేస్తూ గత పాలనపై విమర్శలు గుప్పించారు. ఆహ్వానం లేదంటూ సీఆర్ రాజన్ మండిపాటు టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు హాజరయ్యారు. అయితే రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్‌ను పిలువలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ప్రొటోకాల్ మేరకు పిలవాలనే జ్ఞానం లేదా అంటూ జిల్లా పర్యాటకశాఖ అధికారిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎంతో పాటు ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానంటూ మండిపడ్డారు. సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి దుర్గేష్ ఇన్వెస్టర్లలో ఒక్కరిగా మూలన ఆసీనులైన సీఆర్ రాజన్ -
మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి వైఎస్సార్ కడపకు బదిలీ
తిరుపతి అర్బన్ : మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి సతీష్ వైఎస్సార్ కడప జిలా ఉద్యానశాఖ డిప్యూ టీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన మూడేళ్లుగా మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారిగా పనిచేశారు. అలాగే విజయనగరంలో పనిచేస్తున్న చిన్నరెడ్డెప్పను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారంలో సతీష్ జిల్లా నుంచి రిలీవ్ కానున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్ మెంట్లు అన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వర కు 66,312 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 27,728 మంది తలనీలా లు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమ ర్పించారు. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తుల కు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో స్వామివారి దర్శ నం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. డిగ్రీ అడ్మిషన్ల గందరగోళానికి తెర తిరుపతి సిటీ : డిగ్రీ అడ్మిషన్ల విషయంలో ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు, అధ్యాపకులను గందరగోళానికి గురి చేసిన ఉన్నత విద్యామండలి అధికారులు ఎట్టకేలకు సందిగ్ధానికి తెర దించారు. శనివారం సాయంత్రం వరకు ఇప్పటికే ఓఏఎమ్‌డీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ధ్రువీకరణ పత్రాల సమర్పణలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. ఆదివారం విద్యార్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయించి విద్యార్థుల మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపించనున్నట్లు కళాశాల యాజమాన్యాలకు సమాచారం అందించారు. సీట్లు సాధించిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలలో సోమవారం రిపోర్టు చేసి అడ్మిషన్లు పొందాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 17న తడలో జాబ్‌మేళా తిరుపతి అర్బన్ : ఈనెల 17న తడలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీసిటితో పాటు తిరుపతి, చైన్నె ప్రాంతాల్లో ఉద్యోగాల ఎంపికకు ఈమేళా జరుగుతోందని చెప్పారు. పదో తరగతితో పాటు ఆ పైన చదువుకున్న విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు నైపుణ్యం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 91216 46661, 99888 53335 నంబర్లను సంప్రదించాలని కోరారు. 16 నుంచి అప్పలాయగుంట పవిత్రోత్సవాలు వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీవాణి తెలిపారు. దోషాల నివృత్తితో ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. 16న అంకురార్పణ, 17న పవిత్ర ప్రతిష్ట, 18న పవిత్ర సమర్పణ, 19న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. పవిత్సోవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అమ్మవారి ఆలయంలో.. 22 నుంచి నవరాత్రి ఉత్సవాలు చంద్రగిరి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 2వ తేదీ విజయ దశమి సందర్భంగా అమ్మవారు గజ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు అధికారులు చెప్పారు. -
ఎస్పీడబ్ల్యూలో గుజరాత్ అధ్యాపకులు
తిరుపతి సిటీ : శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలను గుజరాత్ రాష్ట్రంలోని వడాలి ప్రభుత్వ కామర్స్ కళాశాల అధ్యాపకుల బృందం శుక్రవారం సందర్శించింది. పద్మావతి కళాశాల అటానమస్ సాఽధించిన తీరు, మౌలిక వసతుల కల్పనపై వారు కళాశాల అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ గుజరాత్ అధ్యాపక బృందానికి కళాశాలలో నడుస్తున్న కోర్సులు, మౌలిక వసతులపై సమాచారాన్ని అందించారు. అధ్యాపకులు డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ ఉమాదేవి, గుజరాత్ కళాశాలకు చెందిన ప్రిన్సిపల్ డాక్టర్ కేసరిసింగ్ ఎస్ పర్మార్ పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. పాత్రికేయులకు స్వేచ్ఛ ఇవ్వాలి. నిజాలను నిర్భయంగా రాసే వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. నాయకులు తెలియజేసిన విషయాలను కూడా పేపర్లలో రాయడం నేరమనడం హాస్యాస్పదం. అలాగే పొలీసు వ్యవస్థలో లోటుపాట్ల గురించి వాస్తవాలు రాస్తే పత్రికా యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ‘సాక్షి’పై కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. –జ్ఞానేంద్రరెడ్డి, మాజీ ఎంపీ, చిత్తూరు -
పోలేరమ్మ తల్లికి బంగారు ఆభరణం బహూకరణ
వెంకటగిరి (సైదాపురం) : శక్తిస్వరూపిణి వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లికి వెంకటగిరి రాజా వారసులు, ఏపీ క్రికెట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నేత వీవీకే సర్వజ్ఞకుమార కృష్ణయాచేంద్ర బంగారు ఆభరణాన్ని పోలేరమ్మ తల్లికి బహూకరించారు. జన జాతరను పురస్కరించుకుని స్వయంగా అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఇంటి ఇలవేల్పతో పాటు మీ ఇంటి ఆడపడుచుకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. తరతరాలుగా వెంకటగిరి ప్రజలను నిత్యం పోలేరమ్మ కాపాడుతోందన్నారు. -
ప్రజాస్వామ్యానికి ముప్పు
వాస్తవాలను వెలికితీసే పత్రికలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం, వేధించడం ప్రజాస్వామ్యానికి ముప్పు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేట్‌మెట్లు, ప్రసంగాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేయడం, పత్రిక, ఎడిటర్, సిబ్బందిని నిందితులుగా చూపడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా పత్రికలపై కేసులు పెట్టి, వేధించడం దారుణం. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికలు నిర్వీర్యమైపోతాయి. బలమున్నవాడికే జీవించే హక్కు లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికై న ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – రెడ్డెప్ప, మాజీ ఎంపీ -
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఎంవీ రమణ
చంద్రగిరి : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా ఎంవీ రమ ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై వర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. వ్యవసాయ వర్సిటీలో వివిధ హోదాలలో 34 ఏళ్లుగా బోధన, పరిశోధన రంగాలలో సుదీర్ఘ సేవలు అందించారు. 2013లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుతో పాటు 2015లో యూనివర్సిటీ స్థాయిలో ఏవీ కృష్ణయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. రిజిస్ట్రార్ పదవికి మరింత వన్నె తెచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. -
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులా?
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా, మట్టి, ఇసుక, గ్రానైట్ వంటి ప్రకృతి సంపదను దోచుకుంటున్న పచ్చనేతలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాస్వామ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణగదొక్కుతోంది. నిజాలను వెలికితీసే పత్రికలపైనా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడంలేదు. కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోంది. పత్రికల గొంతునొక్కి, జర్నలిస్టులను మానసికంగా ఇబ్బంది పెట్టి , భయపెట్టేందుకే ఇలాంటి చేతగాని రాజకీయాలు చేస్తున్నారు. నిజాలను ప్రచురించే పత్రికలపై కేసులు పెట్టడం దుర్మార్గం. – కళత్తూరు నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి -
జాతీయ మహిళా సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: జాతీయ మహిళా సాధికారిత సదస్సు నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం లైజన్ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి శాసనమండలి సభ్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాలో జరగనున్న మహిళా జాతీయ సాధికారి సదస్సుకు విచ్చేస్తున్న వీఐపీలకు అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. తిరుపతి రాహుల్ కన్వెనన్ సెంటర్లో సదస్సు ఉంటుందని, 300 మంది సచివాలయ ఉద్యోగులతో పాటు పలువురు జిల్లా, డివిజన్, మండల అధికారులకు డ్యూటీలు వేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఒక రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఉంటుందన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, ఆర్డీఓ రామ్మోహన్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శివరాం నాయక్, జిల్లా అధికారులు, లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు. -
డిప్లొమా కోర్సులకు గడువు పొడిగింపు
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో రెండేళ్ల కాలవ్యవధితో అలైడ్ అండ్ హెల్త్ కేర్ పారామెడికల్ ప్రొఫెషనల్ కోర్సులకు ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులన్నారు. ఇందులో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీలో 30 సీట్లు, డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9440879943 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేడు శ్రీవారిని దర్శించుకోనున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా గురువారం తిరుమలకు చేరుకున్న ఆమెకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు దర్శనం ఏర్పాట్లు చేశారు. విద్యుత్ షాక్‌తో ఆవులు మృతి కోట: విద్యుత్‌షాక్‌తో నాలుగు ఆవులు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని వావిళ్లదొరువులో చోటుచేసుకుంది. గోవిందపల్లికి చెందిన కరిముల్లా, వెంకటయ్య ఆవులు తోలుకుని వాటిని మేపేందుకు వావిళ్లదొరువు అటవీ ప్రాంతానికి వెళ్తున్నారు. అదే సమయంలో 11కేవీ విద్యుత్ వైర్లు తెగి పడి ఉండడంతో ఆ వైర్లు తగిలి ఆవులు షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాయి. -
రైతులను క్షోభ పెట్టడం మంచిది కాదు
పాకాల : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారని.. సీఎంగా చంద్రబాబునాయుడు ఎక్కిన రోజు నుంచి వ్యవసాయానికి గ్రహణం పట్టిందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఇంత క్షోభ పెట్టడం మంచి కాదని రైతులు ఆరోపించారు. పాకాల మండలం దామలచెరువు మన గ్రోమోర్ సెంటర్ వద్ద మండుటెండలోనే రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం సాగు చేసే పంటలకు యూరియా అవసరమని.. గంటల తరబడి క్యూలో నిలుచుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం ఏఓ హరితకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం 230 బ్యాగులు (12.2 టన్నుల) యూరియా వచ్చిందని, ఒక్కో రైతుకు ఒక బ్యాగు (40కేజీలు) చొప్పున అందించామని తెలిపారు. క్యూలైన్లో ఉన్న రైతులకు టోకెన్లు జారీ చేసి సాయంత్రం వరకు యూరియా సరఫరా చేశామని వివరించారు. -
భక్తులకు నాణ్యమైన సేవలు అందించండి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ పరిపాలనా భవనంలోని పలు విభాగాలను గురువారం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం సందర్శించారు. మొదట అకౌంట్లు, అన్నదానం, బోర్డు సెల్, ఐటీ, సోషల్ మీడియా, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ తదితర కార్యాలయాలను పరిశీలించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పని తీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు. ముందుగా బాధ్యతలు చేపట్టిన తరువాత టీటీడీ పరిపాలనా భవనానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం నుంచి వచ్చిన వేద పండితులు చాంబర్లో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు వేదాశీర్వచనం చేశారు. ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, అదనపు ఎఫ్ఏసీఏఓ రవిప్రసాద్, చీఫ్ ఇంజినీర్ టీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 22 కంపార్టుమెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 70,086 మంది స్వామివారిని దర్శించుకోగా 28,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. 16న అంకురార్పణ తిరుపతి అన్నమయ్యసర్కిల్: బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఈ నెల 16వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. గృహస్తులు (ఇద్దరు) రూ.1,000 టికెట్ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, వడ, ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా ఈ నెల 19న అభిషేకం (ఏకాంతం), 20న కల్యాణోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేసింది. నియామకం చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ సంయుక్త కార్యదర్శిగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీ.వెంకటేష్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి తిరుపతి అర్బన్: ఫర్నీచర్ సెక్టార్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఈ నెల 22 నుంచి ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పిస్తున్నట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన యువతి యువకులతో పాటు ఆ పైన చదివిన వారు అర్హులన్నారు. స్కిల్ ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతం సమీపంలో ఎఫ్ఎఫ్ఎస్సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎన్ఎస్టీఐ వద్ద మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం కంపెనీల్లో 6 నెలలు పాటు అప్రెంటిషిష్ స్కీమ్ తర్వాత ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. సమాచారం కోసం 7673976699 నంబర్లో సంప్రదించాలని చెప్పారు. డిగ్రీ ప్రవేశాలపై వీడని సందిగ్ధత తిరుపతి సిటీ: ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యానికి విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. 10వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామన్న అధికారులు ఇప్పటి వరకు ఊసే ఎత్తకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయోమయంలో పడ్డారు. కనీసం డిగ్రీ అడ్మిషన్లు సక్రమంగా చేపట్టలేని కూటమి సర్కార్ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తోందని వాపోతున్నారు. గత నాలుగు నెలలుగా డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురు చూసిన విద్యార్థులకు ఇప్పటికీ ప్రవేశాలు, సీట్ల కేటాయింపుపై స్పష్టత రాకపోవడంపై మండిపడుతున్నారు. -
వేదపారాయణదారుల ఇంటర్వ్యూల రద్దు సరికాదు
● టీటీడీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఆపారు ● మీడియా సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీలో వేదపారాయణదారుల నియామకానికి సంబంధించి జరగాల్సిన ఇంటర్వ్యూలను ఉన్నఫలంగా రద్దు చేయడం సమంజసం కాదని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. గురువారం తిరుపతిలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం వేదపారాయణదారుల అవసరం ఎంతో ఉందనే విషయాన్ని గుర్తించి గతంలో తాను పాలకమండలి చైర్మన్‌గా ఉన్నపుడు 700 పోస్టులను క్రియేట్ చేశామన్నారు. నియామకాలకు సంబంధించి గురువారం నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను ఉద్దేశపూర్వకంగా ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఆపినట్టుగా బయట చర్చ జరుగుతోందన్నారు. ఈ వేదపారాయణ ఇంటర్వ్యూలకు సంబంధించి ఉన్నతమైన సంస్కారం కలిగిన వ్యక్తి అన్ని విషయాల పట్ల కూలంకుషంగా చర్చ చేసి నిజ నిర్ధారణ వచ్చిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారి డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవిందరాజన్ ఆధ్వర్యంలో కృష్ణ యజుర్వేదం విభాగం అధ్యాపకుడైన ఫణియజ్ఞేశ్వరయాజులు నేతృత్వంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారనే విషయం అందరికీ తెలిసిందేదారులను టీటీడీ తీసుకుంటే ఎంతో మేలు జరిగేదన్నారు. కాగా చెర్మన్ ఉద్దేశపూర్వకంగా ప్రతిభావంతుడైన గోవిందరాజన్ను పక్కన పెట్టాలనే ఈ ఇంటర్వ్యూలను ఆపడం అభ్యంతకర విషయంగా భావించాల్సి ఉందన్నారు. తనకు కావలసిన వాళ్లను వేదపారాయణదారులుగా తీసుకోవాలనే కుట్ర తప్ప మరొక్కటి లేదన్నారు. గోవిందరాజన్ను తప్పించడం చాలా పెద్ద తప్పిదమన్నారు. -
పార్థసారథి భట్టాచార్యుల జీవితం ఆదర్శనీయం
తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీ వైఖానస ఆగమ విభాగంలో రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ప్రముఖ వైఖానస ఆగమ పండితులు టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీమాన్ రొంపిచర్ల పార్థసారథి భట్టాచార్యుల 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అకడమిక్ డీన్ ఆచార్య గోలి సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరికి చెందిన ప్రముఖ వైఖానస ఆగమ పండితులు దీవి శ్రీనివాసాచార్యులు, పార్థసారథి భట్టాచార్యులు కుమారులు శత్రుఘ్నాచార్యులు, తిరుమల వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పార్థసారథి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో తిరుగుతూ ఆ ప్రాంతాల్లోని గ్రంథాలను సంకలనం చేయడం, అనేక గ్రంథాలను పరిశీలించి వాటిని తెలుగులో ప్రచురించారని కొనియాడారు. అనంతరం శత్రుఘ్నాచార్యులు మాట్లాడుతూ తన తండ్రి సేవలు కేవలం దక్షిణ భారతదేశంలో కాదు గయాలో కూడా వారి ఫొటో పెట్టి పూజిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాఘవ దీక్షితులు, దివి శ్రీనివాస దీక్షితులు, డాక్టర్ రాజేష్, ప్రవ్వా రామకృష్ణ , సూర్యనారాయణ మూర్తి, పురుషోత్తమాచార్యులు, పరాశరం భావనారాయణాచార్యులు, పీఆర్ఓ డాక్టర్ బ్రహ్మాచార్యులు, పాల్గొన్నారు. -
పోలేరమ్మా
వేవేల దండాలు తల్లీ..అమ్మా.. పోలేరూ తల్లీ.. కరుణించమ్మా.. కాపాడరావమ్మ పోలేరమ్మా అంటూ భక్తుల జయజయధ్వానాల నడుమ జాతర ముగిసింది. అయితే ఈ ఏడాది జాతర సంప్రదాయాలకు కూటమి నేతలు స్వస్తి పలికారు. అంతటా వారి పెత్తనమే ఎక్కువగా కనిపించింది. జాతర వేళ రెండు రోజుల పాటు పూర్తిగా మద్యం అమ్మకాలను నిలిపివేయడం మొద టి నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే 48 గంటల పాటు కాకుండా కేవలం 24 గంటలు మాత్రమే నిషేధించారు. ఆపై మద్యం ఏరులై పారింది. రాజాలకు కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా కూటమి నేతలు అడుగడుగునా అడ్డు తగిలారు. మరోవైపు తాగునీటి కోసం భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సైదాపురం/వెంకటగిరి రూరల్ : కోరిన కోర్కెలు తీర్చే తల్లీ..పోలేరమ్మా.. కాపాడగరావమ్మా.. అంటూ భక్తజనం పోలేరమ్మ ఎదుట ప్రణమిల్లారు. జాతర సందర్భంగా వెంకటగిరి పురవీధులన్నీ స్వర్ణకాంతులతో దేదీప్య మానంగా కాంతులీనాయి. అమ్మవారి ప్రతి రూపాన్ని తనివితీరా దర్శించుకున్న భక్తులు పులకించారు. జిల్లా నలుమూలలే కాకుండా దేశవిదేశాల నుంచి కూడా పోలేరమ్మ జాతరకు విచ్చేయడంతో దారులన్నీ వెంకటగిరివైపే మళ్లాయి. సారె సమర్పణ.. వెంకటగిరి రాజా కుటుంబీకుల సర్వజ్ఞకుమార కృష్ణ యాచేంద్రతోపాటు పలువురు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలతో కూడిన సారెను అందించారు. అంతకుముందు నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్సీపీ నేత బి.మస్తాన్‌యాదవ్, నాయకులు దర్శించుకున్నారు. జాతరకు భద్రత.. జాతర రాష్ట్ర పండుగ కావడంతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు అధికారులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆనందోత్సాహాల నడుమ నగరోత్సవం.. భక్తజన సందోహం నడుమ నగరోత్సవం ప్రారంభం కాగా భక్తులు పెద్దఎత్తున వీక్షించారు. బుధవారం అర్ధరాత్రి అమ్మవారి మెట్టునిల్లు అయిన జీనుగులవారి వీధి నుంచి వేకువజామున నాలుగు గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో అధిష్టించారు. తెల్లవారుజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. అయితే భక్తులకు నామమాత్రంగా ఓ గంట పాటు వాటర్, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. దున్నపోతు బలితో ముగింపు జాతర సంప్రదాయ ప్రకారం అమ్మవారికి దున్నపోతు బలి కార్యక్రమం జరిగింది. బలి పూర్తి కాగానే గ్రామ పొలిమేరల్లో నాలుగుదిక్కులా పొలి చల్లారు. పట్టువస్త్రాల సమర్పణ జాతర సందర్భంగా దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా మేళతాళలతో పట్టువస్త్రాలను సమర్పించారు. దేవదాయ కమిషనర్ రామచంద్రయ్య, ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోవూరు ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, చైర్మన్ నక్కా భానుప్రియ హాజరయ్యారు. జాతరలో ప్రత్యేకతలు -
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
చంద్రగిరి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్– 257 జిల్లా గౌరవ సలహాదారు వెంకటముని డిమాండ్ చేశారు. పాఠశాల సమయానంతరం ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గురువారం తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ ప్రకటించాలని, ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం మండల కేంద్రాల్లో నిరసన, 13, 14న ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ, 15న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 17న సీఎం, సీఎస్‌లకు మెయిల్, వాట్సాప్‌లలో వినతులు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దళిత ద్రోహి చంద్రబాబు
తిరుపతి మంగళం: దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని దళితులను హేళనగా మాట్లాడిన దళిత ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర ఆధ్వర్యంలో పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీజేఆర్ సుధాకర్‌బాబు, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావుతో పాటు ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, లలితా థామస్, నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, దళిత మహిళలపై ఆత్యాచారాలు అధికమయ్యాయన్నారు. ఎన్నికల ముందు మహిళలకు అండగా ఉంటా మహిళల జోలికి వస్తే తాటతీస్తానంటూ ప్రగల్భాలు పలికిన పవన్‌కల్యాణ్‌కు దళిత మహిళ ఆత్యాచారాలు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి దళితులంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సైనికుల్లా పని చేద్దామన్నారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడు తూ ఎనభై ఏళ్ల క్రితమే దళిత కుటుంబంతో వివాహ బంధం ఏర్పరుచుకుని దళితులతో బాంధవ్యాన్ని కలుపుకున్న కుటుంబం వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని గుర్తు చేశారు. అనంతరం భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు రూ.2.80 లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో అందించిన గొప్ప నాయకుడు జగనన్న అన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు సునీల్‌కుమార్, నూకతోటి రాజేష్ మాట్లాడుతూ జగనన్న అధికారంలో ఉంటే బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు ఉంటాయన్నారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్‌కుమార్, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ నల్లానిబాబు, కార్పొరేటర్లు కోటూరు ఆంజినేయులు, బోకం అనీల్కుమర్, పుణీతమ్మ, ఎస్సీ విభాగం నగర అధ్యక్షులు చేజర్ల మురళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
ప్రభుత్వం కక్ష సాధింపు
జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి భారతదేశం బలమైన రాజ్యాంగ రక్షణ కల్పించింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని కాలరాసే ప్రయత్నం చేస్తోంది. పత్రికలు, జర్నలిస్టులపైన కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. స్టేట్మెంట్లు ఇచ్చినా కేసులు పెడతారా? ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. వాస్తవాలు భయటపెట్టే పత్రికలపై కేసులు పెట్టడం మాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. – ఆర్ కే రోజా, మాజీ మంత్రి -
రేణిగుంట చేరుకున్న నేపాలీ బాధితులు
రేణిగుంట: నేపాల్‌లో చిక్కుకున్న రాయలసీమకు చెందిన 40 మంది ప్రత్యేక విమానంలో సురక్షితంగా గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరారు. వీరిలో తిరుపతి జిల్లాకు చెందిన 9 మంది, వైఎస్సార్ కడపకు చెందిన 19, నెల్లూరు 5, నంద్యాల 2, అన్నమయ్య జిల్లా 3, అనంతపురం 2 మొత్తం 40 మంది పర్యాటకులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు స్వాగతం పలికి ప్రభుత్వ వాహనాల్లో స్వగ్రామాలకు తరలించారు. శానిటరీ టెండర్‌తో ముక్కంటి హుండీకి ఎసరు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్టును అర్ధంతరంగా రద్దుచేసి, కొత్త కాంట్రాక్టరుకు అధిక మొత్తానికి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆలయ మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముక్కంటి ఆలయంలో గడువుకు ఏడాదికి ముందే టెండర్‌ను రద్దుచేసి కొత్త ఏజెన్సీకి టెండర్‌ను అధిక మొత్తానికి అప్పగించడం ంఏంటన్నారు. శానిటరీ టెండర్ విభాగంలో జరుగుతున్న దోపిడీ విధానాన్ని పరిశీలిస్తే గతంలో శానిటరీ టెండర్‌ను యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ నెలకు రూ.36.99 లక్షలకు టెండర్ దక్కించుకొని పనులు చేశారని, వీరికి వచ్చే ఆగస్టు 26 వరకు గడువు ఉందని గుర్తుచేశారు. అయితే ఈఓ బాపిరెడ్డి శానిటరీ టెండరును పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.76.66 లక్షలకు ఖరారు చేయడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. దీనికి 18 శాతం జీఎస్టీ కలుపుకుంటే ఒక నెలకు రూ.94.51 లక్షలు శానిటరీ టెండర్లోనే దేవస్థానం నిధులు వెచ్చించాల్సి వస్తుందన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆదాయాలను గండి కొట్టే విధానాలను అందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. -
పత్రికల గొంతునొక్కేందుకే తప్పుడు కేసులు
వార్తలు రాస్తే కేసులు పెడతారా? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ? తప్పుడు కేసులు నమోదుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సాక్షి పత్రికలో ప్రెస్మీట్లు, స్టేట్మెంట్లు ప్రచురించినందుకు పత్రికపైన , ఎడిటర్‌పైన , సంబంధిత రిపోర్టర్లపైన కూటమి ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించడం, కార్యాలయాలు, ఇళ్లు సోదాలు చేయడం దుర్మార్గం. పత్రికల గొంతునొక్కేందుకు తప్పుడు కేసులు నమోదు చేసి, భయబ్రాంతులకు గురిచేయడం వికృతచేష్టలకు నిదర్శనం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా , ఆ తప్పులను ఎత్తి చూపుతున్న సాక్షిపై ప్రభుత్వం క్షక్ష సాధిస్తోంది. – మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక అలంకరణలో పోలేరమ్మ అమ్మవారు -
15మంది స్మగ్లర్ల అరెస్ట్
తిరుపతి మంగళం : అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీప్రాంతంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 15 మంది స్మగ్లర్లతో పాటు 15 ఎర్రచందనం దుంగలను గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి స్మగ్లింగ్‌కు ఉపయోగించిన రెండు కార్లను సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. అన్నమయ్య జిల్లా సానిపాయ, వీరబల్లి ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధ వారం కూంబింగ్ చేపట్టారు. అప్పయ్యగారిపల్లి అటవీ ప్రాంతంలో వద్ద రెండు కార్లు కనిపించాయి. వాటిని సమీపించడంతో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను కార్లలోకి లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టగా పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి 15 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేయగా 15 ఎరచ్రందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. దుంగలతో సహా పట్టుబడిన వారిని తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించగా డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 22 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 70,086 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమల పవిత్రతను కాపాడేది ఇలాగేనా!
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రీవారి ఆలయంలో అనేక అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం గ్రిల్ గేట్‌వద్ద టీవీ–5 ఉద్యోగి శ్యామ్‌నాయుడు చిల్లర వేషాలు వేశారు. ‘అంతా విష్ణుమాయ’ అంటూ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయానికి తాను తాళాలు వేస్తున్న ఫొటో, వీడియో శ్యామ్‌నాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.కాగా, తానేదో టీటీడీ ఉద్యోగస్తుడైనట్టు.. టీటీడీకి బీఆర్ నాయుడే రాజుగా వ్యవహరిస్తున్నట్టున్న వారి ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఇదేం పనులు అంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటమేమిటని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం గ్రిల్ గేట్ తాళాలు టీవీ–5 రిపోర్టర్ చేతికి ఎలా వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.టీవీ–5 చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత తిరుమల కొండపై టీవీ–5 సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల కొండపై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేస్తున్న టీటీడీ అధికారులు తాజా ఘటనపై నోరెత్తకపోవడం కూడా చర్చనీయాంశమైంది. కేవలం టీవీ–5 ఉద్యోగి కావడం వల్లే శ్యామ్నాయుడుపై కేసు నమోదు చేయలేదని, ఇంత పెద్ద తప్పు చేసినా బీఆర్ నాయుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంపై భక్తులు మండిపడుతున్నారు.తిరుమల ఆలయం మీ సొంత ఇల్లు అనుకుంటున్నారా?#AndhraPradesh #viral #trending pic.twitter.com/jtnwFwJvX3— Andhra Insights (@AndhraInsights) September 10, 2025 -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇలాంటి విధానాల వల్ల సమన్యాయం, అభివృద్ధి, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఆందోళనకరంగా మారుతుంది. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, భద్రత లాంటివి రేపటి సమ సమాజ స్థాపనకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఉండాలే కానీ, గొంతు నొక్కేలా వ్యవహరించకూడదు. అలా నిజాల్ని మరుగునపరిచే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తు తరం పాలకవర్గాలను క్షమించదన్న విషయం గమనించుకోవాలి. పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని గతంలోకి లక్నోకి చెందిన కేసులో సుప్రీం కోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ పట్ల సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కుల గురించి స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నాలు చేయరు. -
భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థ తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నమయ్యభవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కేవలం 2వారాలే ఉన్నాయని, నిర్దేశిత గడువులోపు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించాలని కోరారు. ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు మరింతగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యుల ఫీడ్ బ్యాక్‌తోపాటు డయల్‌యువర్ ఈఓ, ఐవీఆర్ఎస్, వాట్సాప్ ద్వారా భక్తుల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. తక్షణం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. విధానపరమైన నిర్ణయాలలో టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమష్టిగా భాగస్వాములు కావాలన్నారు. అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వసతి, అన్నప్రసాదాలు, డొనేషన్ తదితర శాఖలలో విధానపరమైన వ్యవస్థలను తీసుకువచ్చామని తెలిపారు. ఇతర శాఖల్లోనూ ఇదే విధానం ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జేఈఓ వి.వీరబ్రహ్మం మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ, అలిపిరి టోల్ గేట్ ఆధునికీకరణ చేపట్టినట్లు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 19 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 70,828 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,296 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.07 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేనివారికి 19 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం శ్రీకాళహస్తి: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం 69వ ఉమ్మడి చిత్తూరు జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. జిల్లాస్థాయి క్రీడాకారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు తీగల వెంకటయ్య, ఎంఈఓలు బాలయ్య, భువనేశ్వరమ్మ, కిషోర్ పాల్గొన్నారు. ఐసీడీఎస్‌లో ఉద్యోగాలు తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్ పరిధిలోని మిషన్ వాత్సల్య స్కీమ్‌కు సంబందించి డీసీపీయూ,ఎస్ఏఏ యూనిట్ పరిధిలో ఖాళీ పోస్టులకు దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీడీ వసంతబాయి బుధవారం తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తులను పోస్టల్ ద్వారా లేదా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని సూచించారు. ఎంపికై న వారికి రూ.7,944 నుంచి రూ.10వేల వరకు నెలవారీ వేతనం ఉంటుందని వివరించారు. ఓసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలని తెలిపారు. తిరుపతి.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నట్లు వెల్లడించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం తిరుపతి మంగళం : ౖవెఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. ఈ మేరకు జిల్లాకు చెందిన కేతం జయచంద్రారెడ్డి(తిరుపతి), ఆరె. అజయ్‌కుమార్(తిరుపతి), కేవీ భాస్కర్‌నాయుడు(సత్యవేడు), టి. హరిచంద్రన్ (సత్యవేడు), కేవీ నిరంజన్‌రెడ్డి(సత్యవేడు)ని నియమిస్తున్నట్లు పేర్కొంది. రేపటి నుంచి జాతీయ స్థాయి నృత్య పోటీలు తిరుపతి కల్చరల్ : రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవాల్లో భాగంగా నేటి నుంచి మహతి కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు జాతీయ స్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్‌రెడ్డి, గౌరవ సలహాదారు కీర్తి వెంకయ్య తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శాసీ్త్రయ, జానపద నృత్య పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే నాట్య గురువులు, నృత్య కళాపోషకులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో రంగస్థలి కార్యదర్శి కేఎన్.రాజా, కళాకారులు జేజీరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, మస్తాన్, రవిప్రసాద్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మహిమాన్వితం.. మహారూపం
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తల్లి దీవెనల కోసం పట్టణం భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. జిల్లా నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి వెంకటగిరీయులు స్వగృహాలకు చేరుకున్నారు.వైభవంగా రథోత్సవంకుమ్మరివీధిలోని అమ్మవారి పుట్టింటిలో పోలేరమ్మ ప్రతిమను తయారు చేశారు. విగ్రహానికి నేత్రాలను అమర్చకుండా బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో కొలువుదీర్చారు. అమ్మవారి ప్రతిమను తయారు చేసిన వెంటనే దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పోలేరమ్మను సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారిని రథంపై కొలువుదీర్చి జీనిగలవారి వీధికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అశేష భక్తజనం నడుమ రథోత్సవం వైభవంగా సాగింది. అక్కడ పోలేరమ్మ ప్రతిమను ప్రతిష్టించి సంపరదాయబద్ధంగా గాలి గంగులకు పూజలు నిర్వహించారు. అనంతరం బలి కార్యక్రమం ముగిసిన తర్వాత అమ్మవారికి కళ్లు అమర్చారు. బుగ్గ చుక్కను తీర్చిదిద్దారు. దివ్యతేజస్సుతో అలరారుతున్న పోలేరమ్మ దివ్యరూపాన్ని రథంపై ఊరేగిస్తూ.. పాతకోట మీదుగా అమ్మవారి ఆలయానికి చేర్చారు. అక్కడ వేప మండలతో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో మహిమాన్విత ప్రతిమను ప్రతిష్టించారు. గురువారం వేకువజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనానికి పోటెత్తారు.నేడు నిష్క్రమణంజాతరలో భాగంగా గురువారం అమ్మవారి నిలుపు కార్యక్రమం మొదలవుతుంది. పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక మండపంలో అమ్మవారు కొలువుదీరుతారు. సాయంత్రం వరకు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వైభవంగా పోలేరమ్మ నగరోత్సవం నిర్వహిస్తారు. విరూపమండపం వద్ద అమ్మవారి నిష్క్రమణ కార్యక్రమం పూర్తి చేస్తారు. దీంతో జాతర ఘట్టం పరిపూర్ణమవుతుంది. -
నేడు వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగ సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి పద్మావతీపురంలోని పార్టీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీ విభాగం నేత లు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర మీడియాతో మాట్లాడారు. సమావేశానికి వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని వివరించారు. -
పడిగాపుల ప్రయాణ ం
తిరుపతి అర్బన్ : ప్రజల అవస్థలను కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేస్తూ లబ్ధిదారులను నిరాశకు గురిచేస్తోంది. అక్కడితో ఆగకుండా తమ సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ హిట్ అంటూ డబ్బా కొట్టుకుంటోంది. పోనీలే అనుకుంటూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రజలను వివిధ రూపాల్లో ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం అనంతపురంలో నిర్వహిస్తున్న చంద్రబాబు సభకు జిల్లాను 364 బస్సులను తరలించేసింది. దీంతో రెండు రోజులుగా జిల్లావాసులు నానా ఇక్కట్టు ఎదుర్కొంటున్నారు. బాబుగారి సేవకు ఆర్టీసీ బస్సులు వెళ్లిపోవడంతో రాకపోకలకు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌లో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. గంటకో.. రెండు గంటలకో ఓ బస్సు రావడంతో ఎక్కేందుకు పోటీపడుతున్నారు. సీటు సంగతి దేముడెరుగు, నిలబడేందుకు చోటు దొరికితే చాలు అనుకుంటూ బస్సు పైకి ఎగబడుతున్నారు. ముఖ్యమంత్రి సభకు ఇక్కడ నుంచి బస్సులను తరలించడమేంటని మండిపడుతున్నారు. దీనిపై ముందస్తుగా ప్రకటన విడుదల చేసుంటే, తమ ప్రయాణం వాయిదా అయినా వేసుకునే వాళ్లమని వాపోతున్నారు. అయితే గురువారం ఆర్టీసీ బస్సులు తిరిగి వస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు. -
ఉపాధి పనులు.. అవకతవక వేతనాలు
వరదయ్యపాళెం : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పనులు ల్పించడమే ఉపాధి హామీ పథకం లక్ష్యం. అయితే కొందరు అవినీతి పరుల కారణంగా పథకం నీరుగారిపోతోంది. అనర్హులు సైతం ఉపాధి కూలీలుగా నమోదు చేసుకుని వేతనాలు స్వాహా చేస్తున్న ఘటన బుధవారం వరదయ్యపాళెం ఎండీపీఓ కార్యాలయం వద్ద చేపట్టిన సామాజిక తనిఖీలో వెల్లడైంది. డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో పలువురు వీఆర్ఏలు, అంగన్వాడీలు, దివ్యాంగ పింఛన్ పొందుతున్నవారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, చివరకు మంచానికే పరిమితమయ్యామని రూ.15వేల పింఛన్ అందుకుంటున్నవారు సైతం ఉపాధి కూలీల అవతారమెత్తి వేతనాలు పొందిన వైనం వెలుగు చూసింది. దీనిపై డ్వామా పీడీ విచారణ ఆదేశించారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీఎం గణేష్ తీరుపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించి కొలతల్లో తేడాలు రావడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారు. ఈ అవకతవకలపై ఉపాధి సిబ్బంది నుంచి రూ. 1.30లక్షలను రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే రూ. 25వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, ఏపీడీ సరిత, ఎస్టీఎం కోనయ్య, ఎస్ఆర్పీ లోకేష్ పాల్గొన్నారు. -
సులభతరంగా ‘అమ్మ’ దర్శనం
పోలేరమ్మతల్లిని భక్తులు సులభతరంగా దర్శించుకునేలా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణమండపంలో జాతర బందోబస్తుపై అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పోలేరమ్మ జాతరకు పకడ్బందీ బందోబస్తు కల్పించినట్లు వెల్లడించారు. సుమారు వెయ్యిమంది పోలీసులతో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తుల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలని, నిమజ్జనం, ఊరేగింపులో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర పండుగ పోలేరమ్మతల్లి జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే వెంకటగిరి పోలీసు స్టేషన్లో ప్రత్యేక కమాండ్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ గీతాకుమారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ ఏవీ రమణ పాల్గొన్నారు. -
13న బాక్సింగ్, లాన్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుచానూరు జెడ్పీ హైస్కూల్, తిరుపతి బైరాగిపట్టెడలోని ప్రోయేస్ టెన్నిస్ అకాడమీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో బాక్సింగ్, లాన్ టెన్నిస్ ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌కుమార్, మహిళా కార్యదర్శి ఎల్.భార్గవి తెలిపారు. అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. పోటీలకు హాజరయ్యే వారు సొంత క్రీడా సామగ్రిని వెంట తెచ్చుకోవాలని, అలాగే వయసు ధ్రువీకరణపత్రం, ఇంటర్ విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ మార్కులు జాబితా తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాలకు బాక్సింగ్‌కు సంబంధించి 98491 59147, 94418 91874, అలాగే లాన్ టెన్నిస్‌కు సంబంధించి 97007 78867నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మిలటరీ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు తిరుపతి సిటీ : రాష్ట్రీయ మిలటరీ స్కూళ్లలో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు అక్టోబర్ 9వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ స్కూల్, లేదా 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఐటీలో విప్లవాత్మక మార్పులు తిరుపతి రూరల్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రవేశపెట్టారని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం పద్మావతి మహిళా వర్సిటీలోని ధృతి ఆడిటోరియంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్–2025 సెమీఫైనల్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మహిళా వర్సిటీలో హ్యాకథాన్ సెమీస్ చేపట్టడం శుభపరిణామమన్నారు. ఐటీ నిపుణులుగా ఇతర దేశాల్లో స్థిరపడిన మన వాళ్లు తమ మేధస్సును స్వదేశంలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని వెల్లడించారు. వీసీ వి.ఉమ, రిజిస్ట్రార్ రజని, ఎస్‌ఎస్‌ఐఐఈ సీఈఓ సూర్యకుమార్ పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
గూడూరురూరల్ : పట్టణంలోని గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక టిడ్కో ఇళ్లలో నివాసముండే షేక్ రహీద్(35) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన రహీద్ బుధవారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కత్తిపోట్ల కారణంగా రహీద్ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ గీతాకుమారి ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్‌బాషా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబీకులు, బంధువులు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
డేటా సైన్స్ సెంటర్ ప్రారంభం
తిరుపతి రూరల్ : మండలంలోని తుమ్మలగుంట పంచాయతీ నలందానగర్‌లో ఇండియన్ సొసైటీ ఫర్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ (ఐఎస్‌పీఎస్) డేటా సైన్స్ సెంటర్‌ను కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ గణాంక వేత్త డాక్టర్ సీఆర్‌రావు 105వ జయంతి సందర్భంగా డేటా సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆధునిక ప్రయోగశాల, డిజిటల్ క్లాస్ రూములు, లైబ్రరీ అందుబాటులో ఉంటాయి. గణాంక శాస్త్రం, మెషీన్ లెర్నింగ్, కృత్తిమ మేధస్సు (ఏఐ) రంగాలలో పరిశోధన, శిక్షణ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా డేటా సెంటర్‌ను అభివృద్ధి చేసినట్లు వివరించారు. అనంతరం ఐఎస్ఐ మాజీ డైరెక్టర్ బీఎల్ఎస్ ప్రకాశరావు, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణలతో కలిసి సీఆర్‌రావు సెమినార్ హాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. సెల్ప్ స్టడీ లైబ్రరీ, రూఫ్ గార్డెన్‌ను సందర్శించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. డేటా సైన్స్ సెంటర్ విద్యార్థులకు, ప్రభుత్వ ప్రాజెక్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ సీఆర్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఐఎస్‌పీఎస్ గౌరవ అధ్యక్షుడు పి.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ డేటా సైన్స్ సెంటర్ భవన నిర్మాణం, వసతులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారాలను వివరించారు. ఐఎస్‌పీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పీజీ శంకరన్, ప్రొఫెసర్ ఆర్ఎల్ షిండే, ప్రొఫెసర్ సోమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
వైన్‌షాప్ పెడితే సహించం!
తిరుపతి రూరల్ : మండలంలోని గాంధీపురం గ్రామానికి చెందిన మహిళలతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనగర్ కాలనీ వాసులు బుధవారం రోడ్డెక్కారు. తమ ప్రాంతంలో వైన్‌షాపును ఏర్పాటు చేయవద్దని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో బార్ పెట్టొద్దని గతంలో పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. కాపురాలున్న చోట మందుబాబులను అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టి తాగించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు సైతం నానా అవస్థలు పడేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బార్ మూసేశారని, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, ఇంతలోనే అదే చోట వైన్‌షాపు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కాలేజీలు, పాఠశాలలకు పిల్లలను పంపించాలంటే ఈ మద్యం దుకాణం ముందు నిలబడి విద్యాసంస్థల బస్సులు ఎక్కించాల్సి వస్తుందని వాపోయారు. ప్రభుత్వానికి డబ్బులే కావాలనుకుంటే మరోచోట మద్యం దుకాణం పెట్టించుకోవాలని, ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకుంటే ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అడ్డుకుంటాం గతంలో బార్ పెట్టినపుడు నిరసనను వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఎన్ని పోరాటాలు చేసినా బార్‌ను మూసివేయించలేకపోయాం. ఇప్పుడు గత నాలుగు రోజులుగా బార్ మూత వేశారు. బార్ లేకపోవడంతో ప్రశాంతంగా ఉంది. రెండు రోజుల్లో మద్యం దుకాణం పెడతామని చెబుతున్నారు. వైన్‌షాప్ పెడితే కచ్చితంగా అడ్డుకుంటాం. ఎకై ్సజ్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. – యశోద, గాంధీపురం -
చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు
తిరుపతి అర్బన్ : జిల్లాలోని చెరువుల అభివృద్ధి పనులకు సంబంధించి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 181 చెరువుల పరిధిలో 30,081 హెక్టర్లు సాగు భూమి ఉందన్నారు. ఈ చెరువుల అభివృద్ధికి రూ.515 కోట్ల మేర ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చెరువులను బలోపేతం చేయాలని కోరారు. ఇరిగేషన్ తిరుపతి ఎస్ఈ రాధాకృష్ణ, చిత్తూరు ఎస్ఈ వెంకటేశ్వరరాజు, నెల్లూరు ఎస్ఈ దేశినాయక్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, భూగర్భజలవనరులశాఖ డీడీ శోభనబాబు పాల్గొన్నారు. ఆరోగ్య లక్ష్యాల సాధనకు కృషి జాతీయ ఆరోగ్య లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యబృందంతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేస్తేనే గ్రామీణులకు వైద్యులపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో పకడ్బందీగా వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, వైద్యాధికారులు శైలజ, మురళీకృష్ణ, శ్రీనివాసరావు, శాంతకుమారి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
కక్ష సాధింపులకు మూల్యం చెల్లించుకోక తప్పదు
రాష్ట్రంలో పరిస్థితులు దారణంగా తయారయ్యాయి. ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు వస్తే తమకు మింగుడుపడని పక్షంలో ఖండించాలి తప్ప కక్ష సాఽధింపు చర్యలకు దిగడంతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు బనాయించి నోటీసులు జారీచేయడం మేధావి వర్గాలు, జర్నలిస్టులు ఆలోచించాల్సిన విషయం. వ్యవస్థలను తమ చేతులోకి తీసుకుని ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తే అందుకు తగిన మూల్యం భారీ స్థాయిలో చెల్లించుకోక తప్పదు. ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగాలి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనబడలేదు. ఇకనైనా పత్రికల యాజమాన్యాలపైన, జర్నలిస్టులపైనా కేసులు పెట్టే సంస్కృతి మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వ దృష్టి సారించాలి -
అది శ్రీవారి ఆలయమా?.. టీవీ5 కార్యాలయమా?: భూమన
సాక్షి,తిరుపతి: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి అన్నీ వివాదాలే నెలకొంటున్నాయని.. తప్పులను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనునిత్యం ఏదో ఒకటి అపచారం జరుగుతున్నాయి. ప్రశ్నించి మాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. చంద్ర గ్రహణం రోజున మహాద్వారం మూసి వేసిన తర్వాత ఇత్తడి గ్రిల్ గేటు తాళాలు వేస్తున్నారు. టీవీ5 శ్రీవారి ఆలయమా..టీవీ5 కార్యాలయమా?.బీఆర్ నాయుడు సైన్యంలో ఒకరు తాళం వేస్తున్నారు. ఇది దేనికి సంకేతం.ఇది చాలా తప్పిదం. బోర్డు సభ్యుడు మహాద్వారం వద్ద పెద్ద గొడవ జరిగింది.మీ సైన్యంలో ముఖ్యుడు శ్రీవారి ఆలయంలో కులశేఖర పడి వద్ద ఆలయ డిప్యూటి ఈవో పని చేస్తున్నాడనే ఫిర్యాదులందాయి. టీడీపీ కార్యకర్తగా టివీ5 ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బీఆర్ నాయుడు ఉన్నారనే ధైర్యంతో ఈ బరితెగింపు బయటపడింది. ఆలయం లోపల మరోముఖ్యుడు చేస్తున్నవి బయటకు రాలేదు.శ్రీవారి కల్యాణాలు జరపాలని తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్ళు తరపున రవి కుమార్ వేమూరి కోరారు. సెప్టెంబర్ ఆరు నుంచి 16 చోట్ల శ్రీవారి కల్యాణాలు జరపాలని కోరారు. బీఆర్ నాయుడు తన బలంతో ఒకే చేశారు..ప్రొసీడింగ్స్ ఇచ్చారు. శ్రీవారి కల్యాణాలు మొట్ట మొదటిగా మా హయంలో సూళ్లూరుపేట దళితవాడలో ప్రారంభించాం. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాలు హాంబర్గ్‌లో కళ్యాణోత్సవాలుకు టికెట్ ధర 116 యూరోలు , జంటగా కల్యాణోత్సవం 81 యూరోలు, విశేష కళ్యాణానికి 515 యూరోలు పేరుతో టికెట్లు పెట్టడం జరిగింది. టీడీపీ ఎన్నికల ఫండ్స్ ఇచ్చిన వారికి సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారా..? టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు అనుమతితో జరుగుతోంది. ధనవంతులు ఇళ్లలో లక్ష్మి పూజలు మీ అనుగ్రహంతోనే జరుగుతున్నాయి. మీరు చేసిన బ్లాక్ మెయిల్ చేసినవి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నాం. మీరు చేస్తున్న అవినీతిపై మా పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు. -
నేడే పోలేరమ్మ జాతర
విద్యుద్దీప కాంతులతో ఆర్చివిద్యుత్ కాంతులతో అమ్మవారి ఆలయం వెంకటగిరి (సైదాపురం): వెంకటగిరి పట్టణం జాతరకు సిద్ధమైంది. పోలేరమ్మ ఆలయం వేడుకలకు ముస్తాబైంది. అమ్మవారి సేవకు భక్తజనం తరలివస్తోంది. బుధవారం రాత్రి నగరోత్సవానికి ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ప్రత్యేక రథంపై కొలువుదీరనున్న అమ్మలగన్న అమ్మను కనులారా వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు. బుధ, గురువారాల్లో అత్యంత వైభవంగా జరిగే జాతరకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది. వెంకటగిరి పట్టణమంతా విద్యుత్ దీపకాంతులతో శోభిల్లుత్తోంది. పోలేరమ్మ తల్లి బుధవారం రాత్రి జీనుగుల వారి వీధి నుంచి ప్రత్యేక రథంపై నగరోత్సవంగా అమ్మవారి ఆలయం వద్ద చేరుకొని కొలువుదీరనున్నారు. అనంతరం భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్ర పండుగ హోదాలో జాతరను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీన, డీఎస్పీ గీతాకుమారి అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లనున్న పోలేరమ్మ తల్లి జాతర సంప్రదాయాలకు అనుగుణంగా కుమ్మరింట పోలేరమ్మ తల్లిని ఆడపడుచుగా భావిస్తారు. బుధవారం రాత్రి కుమ్మరులు పుట్ట మట్టిని తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమను తయారు చేసి మొదటి పూజ అక్కడే చేస్తారు. ఆ రోజు రాత్రి భక్తుల దర్శనార్థం రాత్రి 10.30 గంటల వరకు ఉంచుతారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతారు. అనంతరం కాంపాళెంలోని గాలిగంగుల వద్ద తొలుత పూజలు చేసి అమ్మవారిని కుమ్మరింట నుంచి మెట్టినిల్లు అయిన జీనుగుల వారి వీధికి తీసుకెళ్తారు. అక్కడ రజకులు పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మెట్టినింటికి ఆహ్వానం పలుకుతారు. అమ్మవారి ప్రతిమకు కళ్లు, దిష్టి చుక్క పెట్టి బంగారు ఆభరణాలు అలంకరిస్తారు. అనంతరం రథంపై అమ్మవారిని ఆలయం వద్దకు చేర్చి కొలువు దీరుస్తారు. (నిలుపు) ఈ తంతు మొత్తం బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కొనసాగుతుంది. అనంతరం అమ్మవారిని భక్తులకు దర్శనం కల్పిస్తారు. ప్రతి ఇంటా పూజలు వెంకటగిరి రూరల్: బుధవారం ఉదయం నుంచే ప్రతి వీధిలో ‘‘పోలేరమ్మకు మడి బిక్షం పెట్టండి. పోతురాజుకు టెంకాయ కొట్టండి’’ అంటూ భక్తుల నినాదాలతో హోరెత్తనుంది. ప్రతి ఇంట్లో పసుపు ప్రతిమను తయారుచేసి పూజలు చేస్తారు. అంబలిని నైవేద్యం సమర్పిస్తారు. పోలేరమ్మతల్లి దర్శనార్థం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఉచితంతోపాటు రూ.100, రూ.300 టికెట్ల క్యూలను ఏర్పాటు చేశారు. వెంకటగిరి జన జాతరకు బుధ, గురువారాల్లో లక్షలాది మంది తరలిరానున్నారు. -
సూళ్లూరుపేటలో ఫ్లెక్సీలు చించివేసిన పోలీసులు
తిరుపతిలో నిరసన ర్యాలీగా వస్తున్న భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, మేయర్ శిరీష, చంద్రమౌళిరెడ్డి పాటు రైతులు, పార్టీ శ్రేణులు (ఇన్సెట్) వరి పైరు, యూరియా మూటలతో ర్యాలీగా వస్తున్న పార్టీ శ్రేణులు, రైతులు సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జిల్లాలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి కదం తొక్కారు. ఎరువుల బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నియంత్రించాలని డిమాండ్ చేశారు. వేరుశనగ విత్తనాలు, వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, పంటలకు ఉచిత బీమా అమలు చేయాలంటూ మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రాలు సమర్పించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాళ్లు పట్టుకుంటాం.. సమస్యలు పరిష్కరించండయ్యా తిరుపతి నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద వినూత్న తరహాలో నిరసన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు వరి కంకులు, యూరియా బస్తాల ఫ్లెక్సీలు చేతపట్టి అన్నమయ్య కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో రైతు భరోసా కేంద్రం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఖాళీగా కూర్చుంటే ఎరువు, విత్తనాల కోసం రైతులు వారి కాళ్లుపట్టుకుని వేడుకుంటారు. అయితే ఎరువులు, విత్తనాలు, పథకాలు లేవంటూ అధికారుల వేషధారణలో ఉన్న వారు సమాధానం ఇస్తే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించి రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ విన్నవించారు. కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు సమస్యలు పరిష్కరించండి శ్రీకాళహస్తిలో తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, సత్యవేడు నియోజక వర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాళహస్తి, సత్యవేడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల, రైతులు శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న అధికారిణికి వినతి పత్రం సమర్పించారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యల గురించి భూమన కరుణాకరరెడ్డి ఆమెకు వివరించారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, సత్యవేడుకు చెందిన బీరేంద్రవర్మ, మాధవి పాల్గొన్నారు. అడుగడుగునా అడ్డంకులు గూడూరు, వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు మెరుగ మురళీధర్, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరుకు రైతులు భారీగా తరలివచ్చారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు గూడూరు టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతుండటంతో అంతాకలిసి నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవటంతో కార్యాలయ ఏవోకు వినతి పత్రం ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఎవరికి వారు హోలీ క్రాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని ఫ్లెక్సీలను చించివేశారు. ఆ సమయంలో కొంత సేపు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. రైతు సమస్యలపై ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు : కలెక్టర్
తిరుపతి అర్బన్ : జిల్లాలో ఏదైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే తప్పుడు నివేదికలు కాకుండా వాస్తవ సమాచారంతో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో పీజీఆర్‌ఎస్‌తోపాటు పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. జేసీ శుభం బన్సల్‌తోపాటు తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ మౌర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అలాగే సంఘటనలకు సంబంధించి నిర్లక్ష్యంగా తప్పుడు నివేదికలు ఇస్తే తక్షణమే చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రేణిగుంట మండలంలో డయేరియాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన నేపథ్యంలో రేణిగుంట ఈవోపీఆర్డీని సస్పెండ్ చేయాలని డీపీవో సుశీలాదేవిని ఆదేశించారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఈఈ నరేంద్రను ఆదేశించారు. స్థానిక వీఆర్వోపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డిని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్‌ఎంలతోపాటు వైద్య బృందం నుంచి శుక్రవారం లోపు నివేదిక పంపాలని ఆదేశించారు, అలాగే ఈ– క్రాప్ వేగవంతం చేయాలని, యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలని డీఏవో ప్రసాద్‌రావును ఆదేశించారు. -
తీర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత కల్పించండి
తిరుపతి అర్బన్ : సముద్రతీర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుగ్గిరాజుపట్నం కోస్టల్ పోలీస్‌స్టేషన్ మరమ్మత్తులు, కాంపౌండ్ వాల్ తదితర చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ అధికారి వెంకటరమణ, డిప్యూటీ ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ బాలిరెడ్డి, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ తిరుపతి అసిస్టెంట్ కమీషనర్ విజయ కుమార్, కోస్ట్ గార్డ్ అధికారి సురేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, మైరెన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రెండిళ్లలో చోరీ పాకాల : తాళాలు వేసిన ఇంటిని పసిగట్టి రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగలు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని పెద్దరామాపురం పంచాయతీ యనమలవారిపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి, నాగేంద్రబాబు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగుల గొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. నాగలక్ష్మి ఇంటిలో వెండి 60 గ్రాములు, 1 గ్రాము బంగారం, నాగేంద్ర ఇంటిలో 4 గ్రాముల బంగారం, 140 గ్రాముల వెండి నగలు అపహరించారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సుదర్శన ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై దాడులు నాగలాపురం : రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. మండలంలోని మలిమేలు కండ్రిగ వద్ద అరణియార్ నదిలో సోమవారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ సునీల్ సిబ్బందితో ఇసుక అక్రమ రవాణాదారులపై మెరుపు దాడి నిర్వహించి, ట్రాక్టర్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై రాత్రి వేళలో ఇసుక తరలించిన ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. -
గ్రావెల్ లారీ అడ్డగింత
పెళ్లకూరు : మండలంలోని శిరసనంబేడులో మంగళవారం గ్రావెల్ తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని సర్వే నంబరు 287–2పీలో వేలూరు శ్రీనివాసులురెడ్డి, వేలూరు రాధాకృష్ణారెడ్డి, వేలూరు ప్రభాకర్‌రెడ్డికి 8 ఎకరాల పట్టా భూములున్నాయి. అయితే ఇక్కడి భూములను మెగా కంపెనీకి రోడ్డు అభివృద్ధి పనుల కోసం లీజుకు కేటాయించారు. పనులు పూర్తి కావడంతో లీజు సమయం ముగించుకొని కంపెనీ యంత్రాలు తీసుకెళ్లిపోయారు. అయితే గ్రామానికి చెందిన ఓ నాయకుడు అక్కడ మిగిలిపోయిన స్క్రాప్‌తో పాటు సంబంధిత భూముల్లో గ్రావెల్ తవ్వకాలు చేపట్టి లారీలతో తరలిస్తున్నారు. దాంతో భూయజమానులు, గ్రామస్తులు కలిసి గ్రావెల్ లారీలను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకొని స్వల్ప దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీలను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళలు రేణిగుంట : మండలంలోని పిల్లపాల్యం సమీపంలో రెండు మూడు నెలలుగా రాత్రీ, పగలు తేడా లేకుండా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై విసుగెత్తిపోన పిల్లపాల్యం మహిళలు మంగళవారం ఉదయం రోడ్డెక్కారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఆపాలని ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఇంతలో కూటమి నాయకులు ఉలిక్కిపడి ఎక్కడ పెద్ద ఇష్యూ అవుతుందేమోనని గ్రామంలోని పెద్ద మనుషులతో చర్చించి హుటాహుటిన మహిళలను వెనక్కి పిలిపించారు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పి మహిళలను పంపించి వేశారు. విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. బార్ వద్దు..భద్రత కావాలని మహిళల నిరసన తొట్టంబేడు : శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ ఆర్చీ కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని (బార్) వద్దు అంటూ స్థానికంగా ఉన్న మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం వద్దు.. మహిళలకు రక్షణ కావాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ...ఈ ప్రాంతంలో మద్యం దుకాణం (బార్) ఏర్పాటు చేస్తే మహిళలకు రక్షణ కరువుతుందని, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.. ఈ దుకాణం రద్దు చేసే వరకు ప్రతిరోజు నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. -
శ్రీకాళహస్తిలో పోలీసుల ఆంక్షలు
శ్రీకాళహస్తి: వైఎస్సార్సీపీ రైతు పోరుబాట సందర్భంగా మంగళవారం ఉదయమే వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లకూడదని 30 యాక్టు అమల్లో ఉందని పోలీసులు హడావుడి చేశారు. సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు పోలీసుల అనుమతి కోరారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి అందరినీ పిలిచిన తరువాత రాత్రి 9 గంటలకు పోలీసులు తీరిగ్గా ర్యాలీ నిర్వహించకూడదని నేరుగా ఆర్డీవో కార్యాలయానికి రావాలని అనేక ఆంక్షలు పెట్టారు. రెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన జనం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లడానికి అనుమతి లేదని ఆటంకాలు కల్పించారు. అత్యధిక సంఖ్యలో వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు, రైతులు కిలోమీటరు దూరం కూడా లేని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లడానికి అడ్డువపడ్డారు. అడుగడుగునా పోలీసులు డ్రోన్లు, కెమెరాలు, ఫోన్లలో వైఎస్సార్పీ నాయకులను ఫొటోలు, వీడియోలో తీస్తూ ఇబ్బందులకు గురిచేశారు. స్థానిక టీడీపీ నాయకులకు వాటిని చేరవేశారు. -
ప్రయాణికుల కష్టాలు
తిరుపతి అర్బన్ : సూపర్‌సిక్స్ విజయోత్సవ సభ బుధవారం అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు జిల్లా నుంచి 364 బస్సులను మంగళవారం తెల్లవారు జామున తరలించారు. జిల్లాలో 762 ఆర్టీసీ బస్సులు ఉంటే అందులో 50 శాతం సర్వీసులను అనంతపురంలో నిర్వహిస్తున్న సీఎం సభకు తరలించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. జిల్లాలోని 11 డిపోల నుంచి బస్సులను అనంతపురానికి పంపించారు. ఒక్కో డిపో నుంచి 30 నుంచి 70 సర్వీసులను సభకు తరలించారు. సాధారణంగా తిరుమల బస్సులను ఏ సమావేశానికి ఎప్పుడూ పంపించిన సందర్భాలు లేవు. అయితే అనంతపురం సభకు తిరుమలకు వెళుతున్న 70 బస్సులను తరలించారు. తిరిగీ ఈ సర్వీసులు జిల్లాకు గురువారం వస్తాయని అధికారులు చెబుతున్నారు. సీఎం మీటింగ్ నేపథ్యంలో ప్రయాణికులకు మూడు రోజుల పాటు కష్టాలు తప్పడంలేదు. . తిరుపతి బస్టాండ్‌లో మంగళవారం బస్సుల కోసం గంటల కొద్ది ప్రయాణికులు వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ అధికారులు ఇలా అడ్డదిడ్డంగా మీటింగుల పేరుతో బస్సులను పక్క జిల్లాకు తరలించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
జాతీయ సదస్సు విజయవంతానికి కృషి
తిరుపతి అర్బన్ : తిరుపతి వేదికగా తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సును విజయవంతం చేయడానికి సకల వసతులు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం 300 మంది సచివాలయ ఉద్యోగులకు సదస్సులో చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి లైజన్ అధికారులకు సదస్సు నిర్వహణకు చెందిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులు లైజన్ అధికారులకు వ్యవహరించాల్సి ఉంటుందని...14,15 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు చైర్మన్‌గా దగ్గుపాటి పురంధేశ్వరి వ్యవహరిస్తారని చెప్పారు. హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్ అప్పగించారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ప్రోటోకాల్) శివశంకర్ నాయక్, సచివాలయ ఉద్యోగులు (లైజన్) పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలపై కన్నెర్ర
తిరుపతి సిటీ : కూటమి ప్రభుత్వంపై ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ కన్నెర్ర చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక భరించలేం.. తాడో పేడో తేల్చుకుంటామంటూ అల్టిమేటం జారీ చేసింది. రెండేళ్లుగా జిల్లాలోని సుమారు 108 ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఇప్పటి వరకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఒక్క రూపాయి అందకపోవడంతో యాజమాన్యాలు ప్రభుత్వంపై తుది పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ప్రైవేటు యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో తుది పోరుకు సిద్ధమవుతూ మంగళవారం అన్ని కళాశాల యాజమాన్యాలను అప్రమత్తం చేశాయి. కళాశాలలను మూత వేయమంటారా...! జిల్లాలోని ప్రైవేటు కళాశాలలకు ఇప్పటి వరకు సుమారు రూ.650 కోట్లు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాల్సి ఉందని యాజమాన్యాలు వాపోతున్నాయి. అంటే ఒక్కో కళాశాలకు సుమారు రూ. 3కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ డిమాండ్లు ఇవే.... 2023 నుంచి 2025 ఏడాది వరకు పెండింగ్ ఆర్టీఎఫ్ నిధులు వెంటనే విడుదల చేయాలి డిగ్రీ ఫీజులను సవరించి, కొత్త ఫీజుల విధానాన్ని వర్సిటీలకు అప్పగించాలి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలి కళాశాలలకు అఫ్లియేషన్ 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాలి ప్రతి ఏడాది అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసి అమలు చేయాలి రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో కామన్ అఫిలియేషన్ అమలు చేయాలి కళాశాల మనుగడ ప్రశ్నార్థకమే జిల్లాలో ప్రైవేటు కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కోట్లలో బకాయిలు ఉండటంతో కళాశాల నిర్వహణ భారమవుతోంది. అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో జిల్లాలోని వందల కళాశాల యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. అడ్మిషన్ల విషయంలో ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం వహించడంతో ప్రవేశాలు 50శాతం సైతం దాటడం లేదు. సాధారణ కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. తక్షణం ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆదుకోవాలి. లేదంటే రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధర్వంలో తుది పోరుకు సిద్ధమవుతాం. – పట్నం సురేంద్రరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ -
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తాం
రాపూరు : రాష్ట్రంలోని ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు అన్నారు. రాపూరు ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉత్తమ ఉద్యోగుల సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండుల్లో ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీ లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో కార్గో సర్వీసులో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్ధానంలో ఉందన్నారు. కార్గో సర్వీసును ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. బస్సుల్లో 100 మంది కంటే ఎక్కువ మందిని ఎక్కించవద్దని ఆదేశించారు. రాష్ట్రానికి కొత్తగా ఎలక్టికల్ బస్సులు రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1050 బస్సులు ఉన్నాయని మరో 300 బస్సులు వస్తాయని, అవికాక మరో 1500 బస్సులు అవసరమని ఆయన చెప్పారు. బస్సులు ఎక్కడా ఆగకుండా కొత్త టైర్లు, అవసరమైన సామాగ్రిని అందించాలని మెకానిక్‌లు బస్సును కండీషన్లో పంపాలని సూచించారు, అనంతరం రాపూరు ఆర్టీసీ డిపోలో అత్యధికంగా మైలేజ్ తీసుకొచ్చిన డ్రైవరు నరసింహులు, కరిముల్లాను , కండక్లర్లు వెంకటేశ్వర్లు, సంపూర్ణను అభినందించి నగదు , ప్రశంసా పత్రాలను అందించారు. అలాగే మెకానిక్ సుధాకర్, చాన్‌భాషా, ఆర్టీసీ ఆఫీస్ సిబ్బంది రహీం, హరిబాబుకు ప్రసంసాపత్రాలు , నగదును అందించారు.అనంతరం ఆర్టీసీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సురేష్‌రెడ్డి, ఈడీ నాగేంద్రప్రసాద్, ఆర్ఎం షమీం, డీఎం అనిల్‌కుమార్, ఆర్టీసీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
104 వాహన డ్రైవర్ సస్పెన్షన్
డక్కిలి : డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తిరుపతి జిల్లా ఎయిడ్స్, లెప్రసీ అండ్ టీబీ అధికారి , జిల్లా అదనపు డీఎం అండ్ హెచ్ఓ అధికారిణి డాక్టర్ శైలజ మంగళవారం విచారణ చేపట్టారు. ఈనెల 9న మంగళవారం అర్ధరాత్రి మందులు మాయం అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. దీనిపై జిల్లా డీఎంహెచ్ఓ ఆదేశాలు మేరకు అదనపు డీఎంహెచ్ఓ పీహెచ్సీలో వైద్యాధికారులతో విచారణ చేపట్టారు. పీహెచ్సీ ఆవరణలోని గోడౌన్లో ఉన్న మందులు కేవలం 104కి మాత్రమే చెందినవని, డక్కిలి పీహెచ్‌సీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.104 వాహన డ్రైవర్ కాలం చెల్లిన మందులను ట్రాక్టర్లో తీసుకెళ్లడం ఆదివారం జరిగిందన్నారు. ఈ మందులను ఆదివారం 6–30 గంటల సమయంలో తీసుకెళ్లడంతో సిబ్బందికి ఎవ్వరికీ తెలియదన్నారు. ఇటువంటి సంఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా వైద్యాధికారులు , సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. విచారణ పూర్తయ్యే వరకు 104 వాహన డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లుగా 104 జిల్లా మేనేజర్ రాజేష్ వివరించారు. జరిగిన ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి , విచారణ నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం మందుల తరలింపుపై వైధ్యాధికారులతో వివరించగా విచారణ జరిపారు. విచారణ నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యఖాధికారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ విచారణలో వైద్యాధికారులు శ్రీహరి, బిందు ప్రియాంక, వైద్య సిబ్బంది ఉన్నారు. -
అమ్మకానికి 'ఎర్రబంగారం'
ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన దుంగలను కేంద్రీయ ఎర్రచందనం డిపోలో భద్రపరుస్తారు. వాటికి వేలం పాట నిర్వహించనున్నారు. రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వం నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అటవీశాఖ ఎర్రచందనం నిల్వలపై దృష్టి సారించింది. కేంద్రీయ డిపో(తిరుపతి)లో ఉన్న ఎర్రచందనం అమ్మేందుకు అన్ని చర్యలను తీసుకుంది. శేషాచలం అటవీ పరిధిలో ఎక్కడ ఎర్రచందనం లభ్యమైనా సెంట్రల్‌డిపోకు తరలిస్తున్నారు. రాజంపేట, కపిలతీర్ధంలో కూడా ఎర్రచందనం డిపోలు ఉన్నాయి. వీటి నిల్వల విషయంలో సీఆర్ఎస్ ప్రధానంగా వ్యవహారిస్తోంది. ప్రస్తుతానికి 135 టన్నులు వేలానికి సిద్ధం చేశారు. ఈ విషయాన్ని సీఆర్ఎస్ సంబంధిత అధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో శేషాచలం, వెలుగొండలో మాత్రమే అధికంగా ఎర్రచందనం పెరుగుతోంది. ఈ కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాపైట్, కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తులో ఉన్నాయి. రాజంపేట ఎర్రబంగారానికే డిమాండ్జీవవైవి«ధ్యఅటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తింపు పొందిన శేషాచలం ఎర్రచందనం చెట్లతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయమార్కెట్లో డిమాండ్ ఉంది. ఇందులో రాజంపేట ఎర్రచందనానికి ఎక్కువ డిమాండ్ ఉంది. వైఎస్సార్‌జిల్లాలో 3.2 మిలియన్లు హెక్టార్లలో, అన్నమయ్య జిల్లాలో 2.8 మిలియన్ల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఎర్రచందనం అనే పేరు ఎలా.. ఎర్రచందనాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. టెరోకార్పస్‌సాంటలైనస్ అనేది దీని శాస్త్రీయనామం. టెరో అనే గ్రీకు మాటకు ఉడ్(కర్ర) అని అర్థం. కార్పస్ అంటే పండు. దాని కాయ చాలాగట్టిగా ఉంటుంది. సాధారణంగా అది మొలకెత్తదు. అది మొక్క రావాలంటే ఏడాది పడుతుంది. దీనినే ఎర్రచందనం, రక్తచందనం, శాంటాలం. ఎర్రబంగారం అని కూడా అంటారు. రాజంపేట, రైల్వేకోడూరు పరిధిలో.. రాజంపేట, రైల్వేకోడూరు రేంజ్ పరిధిలో 50 వేల హెక్టారలో శేషాచల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో అధికంగా ఎర్రచందనం ఉంది. ఈ అడువులను జీవావరణ రిజర్వుగా కేంద్రం ప్రకటించింది. ఐదువేల వృక్షజాతులు మొక్కలు కలిగిన శేషాచల అడవులకు బయోస్పియర్ రిజర్వుగా ప్రకటించారు. ఈ అడవులో 1700పైగా పుష్పించే జాతి మొక్కలు ఉన్నాయి. దుంగలన్నీ ఒకచోటికి.. స్మగ్లర్ల అక్రమరవాణా నేపథ్యంలో ఎల్లలు దాటిన ఎర్రచందనాన్ని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్మగ్లర్లు అక్రమంగా నిల్వ చేసిన ఎర్రదుంగలను , అటవీ, పోలీసు,కస్టమ్స్‌శాఖల వద్ద వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఒకేచోటికి రప్పించి భద్రపరిచే పనులకు నాలుగేళ్ల క్రితం అటవీశాఖ శ్రీకారం చుట్టింది. టెండర్ల ద్వారా విక్రయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏర్పాట్లు చేసింది. తిరుపతి కేంద్రీయ ఎర్రచందనం డిపోకు జిల్లాలోని డిపోలో నిల్వ ఉంచిన వాటిని తరిలిస్తారు. అక్కడే వేలంపాట నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. డిమాండ్ ఎందుకు.. చైనా, జపాన్లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలుకూడా ఎర్రచందనంతో తయారు చేసినవి వాడుతుంటారు. సంగీతవాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు. రష్యా వాళ్లు కూడా ఎర్రచందనం కొనుగోలు చేస్తుంటారు. అందులో ఔషధగుణాలు ఉన్నాయి. వయగ్రా, కాస్మెటిక్, ఫేస్ క్రీమ్ లాంటి వాటిలో వీటిని వాడతారు. అల్సర్‌ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. » విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ స్మగ్లర్స్ టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ చెట్లను నరకకుండా అడ్డుకుంటోంది. 2015లో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్‌లో పోలీసు, ఫారెస్టు, ఏపీఎస్పీ, సివిల్ పోలీసు డిపార్టుమెంట్ల సిబ్బంది ఉంటారు. తిరుపతి హెడ్‌క్వార్టర్‌గా పనిచేస్తోంది. గత 15 సంవత్సరాల్లో 15 లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోయింది. » సీఆర్ఎస్ డిపోలోని నిల్వ ఉన్న మూడు రకాల ఎర్రబంగారం వేలంపాటకు సిద్ధమైంది. ఈ–సేల్ ద్వారా అమ్మకాలు సాగించనున్నారు. ఈనెల 22 నుంచి వచ్చేనెల 6 వరకు ఎర్రబంగారు కొనుగోలు దారులు డిపో సందర్శించే అవకాశం కల్పించారు. చిప్స్, బటన్స్, రూట్స్ రకాలను వేలంపాటలో అమ్మకానికి సిద్ధం చేశారు. రేట్ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయనుంది.అటవీప్రాంతం: శేషాచలం(బయోస్పెయిర్) అన్నమయ్య జిల్లా: 2.8 మిలియన్ల హెక్టార్లు వైఎస్సార్ జిల్లా: 3.2 మిలియన్ల హెక్టార్లు -
నగల దుకాణంలో చోరీ యత్నం
నాయుడుపేటటౌన్ : పట్టణంలోని దర్గా వీధిలోని ఓ నగల దుకాణంలో ఇద్దరు మహిళలు చోరీకి యత్నించారు. షాపు యజమాని కనిపెట్టడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. స్థానికులు వెంబడించి ఓ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చోరీకి యత్నించిన మహిళలకు తిరుపతికి చెందిన వారుగా గుర్తించారు. పాము కాటుకు మహిళ మృతి కేవీబీపురం : మండలంలోని మిద్దికండ్రిగలో సోమవారం పాముకాటుకు ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన మంగమ్మ (44) సజ్జ కోతకు వెళ్లింది. పంట కోస్తున్న సమయంలో గుడ్డి పింజరి పాము కరిచింది. తోటి కూలీలు వెంటనే ఆమెను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మంగమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అర్ధరాత్రి మందులు మాయం!
డక్కిలి : ప్రజారోగ్య రక్షణకు వినియోగించాల్సిన మందులను ఆదివారం అర్ధరాత్రి మాయం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 104 డ్రైవర్ అక్రమంగా మందులను ట్రాక్టర్ తరలించిన వ్యవహారం సోమవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలకు 104 వాహనం ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ మేరకు పీహెచ్సీ గోడౌన్లో మందులను నిల్వ చేస్తుంటారు. అయితే 104 డ్రైవర్ వెంకటరమణ ఎవరికీ చెప్పకుండా, వైద్యాధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా మందులను ట్రాక్టర్ ట్రాలీలో లోడ్ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయం గమనించిన స్థానిక యువకులు ట్రాక్టర్‌ను వెంబడించారు. మందులను ఎక్కడకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. అవి కాలం చెల్లిన మందులని, నిమ్మ చెట్లకు చల్లేందుకు తీసుకెళుతున్నానని డ్రైవర్ సమాధానమివ్వడంతో కంగుతిన్నారు. పక్కదారి పట్టిన సేవలు? మందుల అక్రమ రవాణాపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లగా 104 సిబ్బంది అవసరం లేకపోయినా రూ.లక్షలు విలువైన మందులను ఓ కంపెనీ నుంచి ఆర్డర్ ద్వారా తెప్పిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి పీహెచ్‌సీకి కావాల్సిన మందులను ఇండెంట్ పెట్టుకుని వైద్యాధికారి అనుమతులతో తీసుకురావాల్సి ఉంటుంది. కానీ, ఈ పీహెచ్సీ సిబ్బంది మాత్రం నిబంధనలకు గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరాలకు మించి మందులు తెప్పిస్తున్నట్లు తెలిసింది. దీంతో వచ్చిన మందుల్లో ఎక్కువ శాతం ప్రజలకు చేరకుండానే కాలం చెల్లుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 104 డ్రైవర్ తరలించిన మందుల్లో అయితే కొన్ని బాక్సులు కనీసం సీల్ కూడా తీయలేదని వెల్లడిస్తున్నారు. మొత్తం వ్యవహారం గమనిస్తే.. వైద్యాధికారి పర్యవేక్షణలో సాగాల్సిన 104 సేవలు పూర్తిగా పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది.ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న మందులు ఇవే.. -
ఎర్రమట్టి..కొల్లగొట్టి!
పాలసముద్రం: మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు కొల్లగొడుతోంది. అందినకాడికి ఎర్ర గావెల్‌ను తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. దీనిపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి అండతో మరింత రెచ్చిపోతోంది. మండలంలోని వనదుర్గాపురం రెవెన్యూ లేక్కదాఖాల జగనన్న కాలనీ సమీపంలోని గుట్టపై కన్నేసింది. తలసిందే తడువుగా హిటాచీలు దించేసింది. పదుల సంఖ్యలో ఎర్రగ్రావెల్ను నింపి లారీలను సరిహద్దు దాటించింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే! మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ, జగనన్న కాలనీకి ఆనుకుని గుట్టలున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ఈ గుట్టల్లోని మట్టిని తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ గ్రావెల్‌ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. వాహనాలు సీజ్ వనదుర్గాపురం గుట్టలో ఎర్రమట్టి తీసుకెళ్తున్నట్టు సమాచారం అందుకున్న తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తవ్వకాలు, వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడంతో తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేశారు. తమిళనాడు టిప్పర్లకు అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలని ఎస్ఐ తెలిపారు. -
కలెక్టరేట్‌కు వెల్లువెత్తిన వినతులు
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు వినతులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై 238 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు హాజరై వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వినతులను నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం విభిన్నప్రతిభావంతులు శ్రీదేవి, రాజమ్మ, మునికృష్ణారెడ్డికి మూడు చక్రాల సైకిళ్లు, టి.సుచీంద్రకు ట్రైసైకిల్, మురళికి కర్రలను పంపిణీ చేశారు. గౌరవ వేతనం కోసం నిరసన వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం జోనల్ అధ్యక్షుడు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇమామ్‌కు రూ.10వేలు,మౌజన్‌కు రూ.5వేలు ప్రతినెల క్రమం తప్పకుండా ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వంలో 12 నెలలుగా మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు అధికారులకు వినతిపత్రం అందించారు. మైనారిటీ విభాగం నేతలు షేక్ కాసిమ్, షేక్ ఖాదర్ బాషా, పఠాన్ ఫరీద్, చాంద్ బాషా, ఇమ్రాన్ బాషా,, షేక్ గపూర్, మస్తాన్, వహీద్, షర్మిల షేక్, సనాల్లాహ్ షేక్, అమీర్ భాయ్, షేర్ ఖాన్,సలీం పాల్గొన్నారు. పింఛన్ పెంచండి ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో మృత్యువుతో పోరాటం చేస్తున్నామని...తమకు రూ.4 వేల నుంచి రూ.15 వేలకు పింఛన్ నగదు పెంచాలని పలువురు దివ్యాంగులు కోరారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. -
అడుగడుగునా జల్లెడ
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకండా తిరుమలలోని వివిధ శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా సోమవారం స్టెరిలైజేషన్, ఎకై ్సజ్, జాయింట్ టీమ్ ఇన్స్పెక్షన్కు శ్రీకారం చుట్టారు. పోలీసులు, విజిలెన్స్, బాంబ్‌స్క్వాడ్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్, ఎలక్ట్రికల్, హెల్త్ అధికారులు రంగంలోకి దిగారు. సుమారు 38 మంది రెండు బృందాలు విడిపోయి ఉదయం 7.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. జీఎంసీ టోల్గేట్ నుంచి అలిపిరి వైపుగా 9 కిలోమీటర్ల మేర అడుగడుగునా జల్లెడ పట్టారు. ఆయా మార్గాల్లో మొత్తం 150 షాపులను తనిఖీ చేశారు. దుకాణాల్లో సీసీ కెమెరాలను, తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. షాపుల్లో పనిచేసే సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో తెలపాలన్నారు. అనధికార హాకర్లను తిరుపతికి తరలించారు. అలాగే నడకమార్గంలోని మరుగుదొడ్లు, డస్ట్బిన్లు, కల్వర్టులను బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు స్టెరిలైజేషన్ బృందాలు అప్రమత్తంగా పనిచేస్తుంటాయని అధికారులు వెల్లడించారు. కొండపై క్యూల పరిశీలన తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తనిఖీలు నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్‌లోని ఆక్టోపస్ సర్కిల్ నుంచి ఈఎస్ఐ వన్ గేట్ వరకు క్యూలను పరిశీలించారు. గరుడ సేవ రోజున భక్తులకు ఇబ్బందులు లేకుండా పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా సాగేలా ప్రతి విభాగం పని చేయాలని ఆదేశించారు. తిరుపతికి మూడు జాగిలాలు నూతనంగా మూడు జాగిలాలు పది నెలలపాటు ట్రైనింగ్ తీసుకుని జిల్లాకు చేరుకున్నాయి. వీటిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం పరిశీలించారు. జోన, వేగ, సిరి పేర్లు ఈ జాగిలాలు డ్యూయల్ ట్రైనింగ్, సబ్జెక్ట్, నార్కోటెక్స్, గంజాయి ట్రాకింగ్‌లో పూర్తిస్థాయిలో శిక్షణ పొందినట్లు ఎస్పీ వెల్లడించారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జనంద కుమార్, ఏఆర్పీసీలు తిమ్మయ్య, రావణ్ వర్మ, రెడ్డి ప్రకాష్, శ్రీనివాసులు హ్యాండ్లరుగా ఉన్నారని వివరించారు. ఈ జాగిలాల సేవలను శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తులో భాగంగా వినియోగించనున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఎయిడ్పై శిక్షణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ , సీపీఆర్ చేసే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించారు. -
పీజీ అడ్మిషన్లకు ఆన్లైన్ అవస్థలు
తిరుపతి సిటీ : పీజీసెట్–2025 కౌన్సిలింగ్ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించినట్లు ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. దీంతో జిల్లాలోని అన్ని నెట్ సెంటర్ల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు బారులు తీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసినా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి అధికారుల వ్యవహారశైలిపై మండిపడ్డారు. జిల్లాలో పీజీ అడ్మిషన్లకు సంబంధించి సోమవారం కనీసం 120 మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్ కూడా కాకపోవడం గమనార్హం.గుండెపోటుతో భక్తుడి మృతిశ్రీకాళహస్తి : ముక్కంటి ఆలయంలో సోమవారం ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. హైదరాబాద్ కు చెందిన మధుబాబు(52) ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఉపవాసం ఆచరించి సోమవారం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయం నుంచి బయటకు వస్తూ ప్రసాదాల కౌంటర్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.అధికారులు వెంటనే స్పందించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధుబాబు మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ గోపి వెల్లడించారు.శ్రీవారి సేవలో ఆర్మీ అధికారితిరుమల : తిరుమల శ్రీవారిని సోమవారం ఆర్మీ లెఫ్టినెంట్ కమాండర్ ధీరజ్‌సేథ్ సేవించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. -
తుస్సుమన్న పంట బీమా
కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. దేశానికి వెన్నెముకను నిర్దాక్షిణ్యంగా విరిచేస్తోంది. ఆరుగాలం కష్టించే అన్నదాతను నిలువునా దగా చేస్తోంది. వ్యవసాయం దండగ అనుకునే దుస్థితిలోకి రైతులను నెట్టేస్తోంది. కనీసం మాత్రం కనికరం లేకుండా అడుగడుగునా అవస్థల పాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సకాలంలో పెట్టుబడి సాయం అందించకుండా కాలయాపన చేసింది. వేరుశనగ విత్తనాలను అప్పనంగా పచ్చమూకకు పంచిపెట్టింది. అరకొరగా యూరియాను సరఫరా చేసి కర్షకులను ఇబ్బందులకు గురిచేసింది. ఎరువుల కోసం బారులు తీరే దయనీయ పరిస్థితి తీసుకువచ్చింది. చివరకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో సైతం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ మేరకు కూటమి సర్కార్ వైఖరిపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. వ్యవసాయానికి బాసటగా నిలిచేందుకు రంగంలోకి దూకింది. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ‘అన్నదాత పోరు’ కింద మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి అర్బన్ : ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. అధికారుల లెక్కలు ప్రకారం జిల్లావ్యాప్తంగా 5.5లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. ఈ సీజన్లో వరి 80వేల ఎకరాలు, మరో 20వేల ఎకరాల్లో వేరుశనగ, సజ్జ, రాగి, మినుములు, జొన్నలు ఇతరత్రా పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యానశాఖ పరిధిలో మామిడి, నిమ్మ, మిరప, కూరగాయల తోటలు ఉన్నాయి. ప్రస్తుతం మామిడికి యూరియా అవసరం ఉండదు. మిగిలిన పంటలకు యూరియా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరి పంటకు మాత్రమే 50వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం 35వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం సరఫరా చేసినట్లు వెల్లడిస్తున్నారు. ఈ యూరియా పంపిణీలో సైతం భారీగా గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పాస్‌పుస్తకాలు చూపిన వారికే యూరియా ఇవ్వాల్సి ఉంది. అయితే కూటమి నేతలు ఆధార్ కార్డులు చూపించి అవసరానికి మించి యూరియాను పట్టుకెళ్లినట్లు ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అలా తీసుకెళ్లిన యూరియాను బ్లాక్‌లో విక్రయించి సొమ్ముచేసుకున్నారని ఆరోపించారు. సకాలంలో అదునుకు యూరియా వేయకపోవడంతో వరి దిగుబడి కూడా తగ్గినట్లు రైతులు వాపోతున్నారు. పాడి రైతులు పశుగ్రాసం కోసం యూరియా కావాలని ప్రాధేయపడినా కూటమి నేతలు కనికరించలేదని మండిపడుతున్నారు. కూటమి నేతలకే ‘రాయితీ’ ప్రభుత్వం ప్రతి సీజన్లో రాయితీపై విత్తనాలు అందిస్తుంది. ప్రధానంగా వేరుశనగతోపాటు పచ్చిరొట్ట విత్తనాల్లో ప్రధానంగా జీలగలు, జనుములు, పిల్లిపెసర అందించేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లోను సక్రమంగా పంపిణీ చేశారు. రైతుల అవసరాల మేరకు స్టాక్‌ను అందుబాటులో ఉంచేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఖరీప్ సీజన్‌కు సంబందించి కేవలం చంద్రగిరి నియోజక వర్గానికి మాత్రం 3,270 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు ఇచ్చారు. అవి కూడా కూటమి నేతలకు మాత్రమే. ఆ నేతలు విత్తనాలను తీసుకుని చమురు ఆడించుకునేందుకు వినియోగించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 36 డ్రోన్లు సైతం తమ వారికే.. అగ్రికల్చర్ చదువుకున్న వారికి 2023లో డ్రోన్ల వాడకంపై గుంటూరులో శిక్షణ ఇచ్చారు. వారికే 90శాతం రాయితీలో డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గతంలో శిక్షణ పొందిన వారికి కాకుండా, చదువుతో సంబంధం లేకుండా 36 డ్రోన్లు 80శాతం సబ్సిడీతో అధికార పార్టీ అనుయాయులకే కట్టబెట్టినట్లు సమాచారం. గతంలో శిక్షణ పొందిన వారికి మొండిచేయి చూపించారు. శిక్షణ పొందా.. డ్రోన్ ఇవ్వలేదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023 మే 16వ తేదీన డ్రోన్ ఫైలెట్‌గా పనిచేయడానికి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో 12 రోజులు శిక్షణ ఇచ్చారు. ఆ మేరకు సర్టిఫికెట్ అందించారు. డ్రోన్లు నడపడానికి పూర్తిస్థాయిలో తర్ఫీదు పొందా. 90శాతం రాయితీతో నాకు డ్రోన్ వస్తుందని ఆశపడ్డా. 10 శాతం నగదును కూడా సిద్ధం చేసుకున్నా. అయితే కూటమి ప్రభుత్వం వేరే వాళ్లకు ఇచ్చింది. నాతోపాటు శిక్షణ పొందిన వారికి కూడా మొండిచేయి చూపింది. – నక్కా శోభనబాబు, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం సేవలు దూరం గతంలో రైతు భరోసా కేంద్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. విత్తనాలు, ఎరువులతోపాటు పంటల సాగుపై సలహాలు సైతం అందించేవారు. కూటమి సర్కార్‌లో రైతు సేవాకేంద్రాలు మార్చారు. మళ్లీ రేషన్లైజేషన్ పేరుతో 50శాతం కేంద్రాలను తగ్గించారు.వాటిలో కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్లను మరో 50శాతం తగ్గించారు. రెండు రైతు సేవా కేంద్రాలను ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్‌కు అప్పగించారు. దీంతో సేవలు దూరం అవుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగు భూములు సైతం బీడు భూములుగా మారుతున్నాయి. – మధురెడ్డి, రైతు, చిల్లకూరు మండలం ఆదుకోవడం లేదు యూరియా కొరత అంశం ఒక్కటే కాదు. రైతులకు అవసరం అయిన మేరకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు. దీంతో అధిక ధరలు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అవి నాణ్యత లేకపోవడంతో మొలకలు రావడం లేదు. వేరుశనగ కాయలను మాకు చూపించడం కూడా లేదు. కూటమి నేతలు సిఫార్సు చేసిన వారికే పంపిణీ చేస్తున్నారు. కనీసం పచ్చిరొట్ట విత్తనాలను రాయితీల్లో ఇవ్వకపోవడం బాధాకరం. వేల సంఖ్యలో రైతులు ఉంటే నామమాత్రంగా కొందికే ఇచ్చి పంపించేస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదు. – వెంకటయ్య, రైతు, వెంకటగిరి నియోజకవర్గం పనిముట్లతో సరిపెట్టి.. కూటమి సర్కార్ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు రైతులకు ఒక్క ట్రాక్టర్, వరికోత యంత్రాన్ని కూడా రాయితీతో ఇవ్వలేకపోయింది. అక్కడక్కడ అదీ తమ పార్టీ కార్యకర్తలకు మాత్రం కేవలం 8 రకాల చిన్న చిన్న పనిముట్లు పంపిణీ చేసి సరిపెట్టేసింది. దీంతో వేలాది మంది రైతులు రాయితీ పనిముట్లపై ఆశలు వదులుకున్నారు. రైతులను ముంచేసిన ప్రభుత్వం రామచంద్రాపురం : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం కుదేలైందని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆర్సీపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయిలో రైతులను కలుసుకున్నారు. ఎరువుల కొరత, గిట్టుబాటు ధర లేకపోవడం, సాగు ఖర్చులు భరించలేక పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని, బస్తాను రూ.400 నుంచి రూ.600 విక్రయిస్తున్నారని రైతులు వాపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులే మిగులుతున్నాయని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన భూమన మాట్లాడుతూ రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్నదాత సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యతని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టే అన్నదాత పోరులో ఈ సమస్యలను బలంగా వినిపిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. అనంతరం రైతులతో కలసి బస్తాల్లో ధాన్యం నింపారు. అన్నదాత ఆర్థికాభివృద్ధే జగనన్న లక్ష్యమని, ఆ మేరకు వైఎస్సార్సీపీ సైనికులుగా చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. కూటమి సర్కార్ ఉచిత పంట బీమాను రద్దు చేసింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు, ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల మేరకు బీమా చెల్లించాలంటే రైతులే ముందుగా పంటను బట్టి నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఖరీప్ సీజన్లో వరి, సజ్జ, నిమ్మ, వేరుశనగ పంటలకు, రబీ సీజన్లో వరి, వేరుశనగ, మామిడి పంటలు సాగుచేసిన రైతులు వాళ్లే బీమా చేసుకోవాలని సర్కారు స్పష్టం చేసింది. -
పకడ్బందీగా ‘మిషన్ శక్తి’
తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మిషన్ శక్తి పథకంపై ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్నిశాఖల సమన్వయంతో పటిష్టంగా మిషన్ శక్తిని అమలు చేయాలని కోరారు. సమాజంలో ఆడబిడ్డలపై సాగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలు, బాలికల సాధికారతే లక్ష్యంగా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా 12వ తేదీ వరకు మిషన్ శక్తి చేపట్టాలని స్పష్టం చేశారు. డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్ కృష్ణ మంజరి, నోడల్ ఆఫీసర్ వాసంతి పాల్గొన్నారు. -
పటిష్టంగా 20సూత్రాల అమలు
తిరుపతి అర్బన్ : స్వర్ణాంధ్ర–2047లో భాగంగా 20 సూత్రాలను పటిష్టంగా అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్ఓ నరసింహులుతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జలజీవన్ మిషన్, అమృత 1.0, విద్యా, వైద్య, ఉపాధిహామీ శాఖలకు సంబంధించి చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి లక్ష్యం వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష స్వర్ణాంధ్ర–2047 నెరవేర్చే దిశగా పనిచేయాలని సూచించారు. అమృత పథకంలో భాగంగా పట్టణాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం మంజూరైన నగదును సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు. -
డప్పు కళాకారుల సంక్షేమమే లక్ష్యం
తిరుపతి కల్చరల్ : డప్పు కళాకారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దళిత డప్పు కళాకారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కుమార్‌రెడ్డి, మారెళ్ల శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఏపీ ఫౌండేషన్ కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల డప్పు కళాకారలు సంఘం నేతలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం డప్పు కళాకారులను ప్రత్యేకంగా గుర్తించి 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసిందని, ఇప్పుడు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం అవి చెల్లవంటూ ఇబ్బంది పెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని డప్పు, డ్రమ్స్, పంబ, జముకులు, తీన్మార్ వంటి 18 నుంచి 70 ఏళ్ల వరకు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డప్పు కళాకారులకు కూడా పింఛన్‌ను రూ.5 వేలకు పెంచాలని కోరారు. డిసెంబర్లో రాష్ట్ర స్థాయి మహాసభ ఏర్పాటు చేసి డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి పరసారత్నం, నేతలు మురగారెడ్డి, పి.రెడ్డెప్ప, అంజయ్య, మురళి, సహదేవయ్య, వెంకటేష్, రామయ్య పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారిపై విచారణకు ఆదేశం
తిరుపతి తుడా : తిరుపతి కార్పొరేషన్లో సుమారు 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారిగా కొనసాగుతున్న సేతుమాధవ్పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సేతుమాధవ్కు ఉద్యోగోన్నతి వచ్చినా రెవెన్యూ ఆఫీసర్ పోస్టును వదలకుండా ఉండడంపై ఇప్పటికే పలు పత్రికల్లో ఆరోపణలతో కథనాలు ప్రచురితమైనట్లు పేర్కొన్నారు. అలాగే తిరుపతి మున్సిపల్ అధికారి కేఎల్ వర్మ సైతం సేతుమాధవ్పై ఫిర్యాదు చేసిన విషయాన్ని కమిషనర్ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మొత్తం వ్యవహారంపై సమగ్రంగా విచారణ పూర్తి చేసి నివేదికను త్వరితగతిన పంపించాలని కమిషనర్‌ను ఆదేశించారు. అడుగడుగునా అలసత్వం తిరుపతి సిటీ : ఉన్నత విద్యామండలి అధికారులు అడుగడుగునా అలసత్వం వహిస్తున్నారు. డిగ్రీ అడ్మిషన్ల విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశారు. ఎట్టకేలకు ప్రకియ పూర్తి చేసి విద్యార్థులకు ఆదివారం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. సోమవారం ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఫోన్లకు ఎప్పుడు మెసేజ్ వస్తుందా అని పడిగాపులు కాశారు. విద్యామండలి అధికారులు మాత్రం నింపాదిగా సోమవారం రాత్రి సీట్లు కేటాయిస్తూ సమాచారం అందించారు. దీంతో సీట్లు పొందిన విద్యార్థులు మంగళవారం కళాశాలల్లో అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. అయితే రెండు రోజులుగా సెల్ఫోన్లను చేతపట్టుకుని మెసేజ్ కోసం ఎదురుచూస్తూ మానసిక ఒత్తిడికి గురయ్యామని విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌కు సంబంధించిన అంశాల్లో అయినా అధికారులు అలసత్వం వీడాలని సూచిస్తున్నారు. ‘అన్నదాత’కు బాసటగా.. ‘పోరు’బాట చంద్రగిరి : కూటమి ప్రభుత్వ నిర్వాకంతో అవస్థలు పడుతున్న అన్నదాతలకు బాసటగా వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందని పార్టీ వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లం చంద్రమౌళిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారన్నారు. టమాట, ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో నష్టాలపాలవుతున్నారని వెల్లడించారు. కర్షకులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు అభినయ్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హర్షిత్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 27,410 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 9,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈక్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. ఆర్చరీ జిల్లా జట్ల ఎంపిక రేపు తిరుపతి ఎడ్యుకేషన్ : శ్రీకాళహస్తిలోని ఎస్వీ ఎస్వీ డిగ్రీ బాలుర కళాశాల ఆవరణలో బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్చరీ అండర్–11, 14, 17, 19 బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. మంగళవారం ఈ మేరకు శ్రీకాళహస్తి జెడ్పీ హైస్కూల్ పీడీ వెంకటరమణ తెలిపారు. పోటీలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన వయసు నిర్ధారణ పత్రాలను తీసుకురావాలని, ఇంటర్ విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ మార్కుల లిస్ట్ తీసుకురావాలని కోరారు. వివరాలకు 92905 02041, 70135 82801 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఘటోత్సవ వైభవం
వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి గ్రామదేవత పోలేరమ్మ జన జాతర అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమైంది. ఘటోత్సవంతో అమ్మవారి సంబరం అంబరాన్నంటింది. ఘటోత్సవం చూసేందుకు తరలివచ్చిన అశేష భక్త జనంతో వెంకటగిరి పట్టణ పుర వీధులు కిక్కిరిశాయి. పోలేరమ్మ తల్లీ చల్లగా చూడాలమ్మా అంటూ వేడుకున్నారు. ఘటం కుండలకు అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించి ఆధ్యాత్మికతను చాటుకున్నారు. ఘటం కుండలతో ఇంట్లో పూజలు చేస్తే సాక్షాత్తు పోలేరమ్మ తల్లే ఇంట్లో కొలువై ఉంటుందన్న విశ్వాసం. దీంతో అమ్మవారి ఘటోత్సవానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకున్నారు. ఘటోత్సవంలో అత్యుత్సాహం వెంకటగిరి (సైదాపురం) : రాష్ట్ర పండుగ వెంకటగిరి పోలేరమ్మతల్లి జాతర సందర్భంగా ఆదివారం ఘటోత్సవంలో సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్త విధానాలకు తెరలేపడంతో భక్తుల ఆగ్రహంతో పాత పద్ధతిలోనే కొనసాగించారు. వివరాలు ఇలా.. ఆదివారం నిర్వహించిన ఘటోత్సవంలో సంప్రదాయాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. వాస్తవానికి ఘటోత్సవం జీనుగుల వారి వీధిలోని మెట్టినింటి మండపం వద్ద నుంచి రాజా ప్యాలెస్‌కు నడక మార్గంలో ఘటం కుండలను ఊరేగించడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాలను ఈ ఏడాది పక్కన పెట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘటం కుండలను ఊరేగించేందుకు ప్రత్యేక వాహనంలో జీనుగుల వారి వీధిలోని అమ్మ మెట్టి నింటి మండపం వద్ద ఎక్కించేశారు. ఘటం కుండలు నడకమార్గం గుండా రాకపోవడంతో స్థానికంగా ఉన్న పట్టణ ప్రముఖులు ఆగ్రహించారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య యథావిధిగా కాలి నడక ద్వారా సాగించారు. -
అటవీ భూములపై రాబందులు
సెంటు భూమి ఆన్లైన్ చేసుకునేందుకు రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. నిలువ నీడలేని పేదలు ఇంటి స్థలాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాలలో గుట్టలుగా పడి ఉన్నాయి. దేశసేవ చేసిన జవాన్లకు భూమి ఇవ్వాలంటే అధికారులకు చేతులు రావట్లేదు. అలాంటిది కూటమి ప్రభుత్వంలో కూటమి నేతలు వందల ఎకరాల ప్రభుత్వ అటవీ భూములను యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తిరుపతికి సమీపంలోని రామచంద్రాపురం మండలానికి విశాలసమైన అటవీ ప్రాంతం ఉంది. తుడా పరిధిలో ఈ మండలం కలిసి ఉండటంతో ఇక్కడ భూములకు మంచి డిమాండ్ ఉంది. దీని దృష్ట్యా కూటమి రాబందులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఖాళీగా కనిపించే అటవీ భూములను తన్నుకుపోతున్నారు. మార్కెట్లో భూమి ధరలు విపరీతంగా ఉండటంతో కొందరు కూటమి నాయకులు పక్కా ప్రణాళికతో అదును చూసుకుని అటవీ భూములను చదును చేయడం, హద్దులు గీసుకొని ఇనుప కంచెలు వేసుకొని దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఆపై భూములకు హద్దురాళ్లు పెట్టుకొని ఉపాధి హామీ నిధులతో యథేచ్ఛగా మామిడి తోటలను పెంచుకోవడం కొసమెరుపు. అక్రమణదారులకు అండగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తొత్తులుగా మారిపోవడంతో ఇష్జారాజ్యంగా సర్వే నంబర్లు సృష్టించడం, దొంగ పట్టాలను రూపొందించడం, అధికార బలంతో ఆన్లైన్ ప్రక్రియలు చేస్తున్నారంటూ ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీనిపై కొంత మంది రెవెన్యూ అధికారులు హస్తం ఉందని మండలంలో జోరుగా చర్చ సాగుతోంది. ఆక్రమణలు ఎక్కడంటే.. మండంలోని అనుప్పల్లి సర్వే నంబరు 411 నుంచి 480 వరకు సర్వే నంబర్లను సృష్టించుకుని సుమారు 100 ఎకరాలకు పైగా అటవీ భూమిని ఆక్రమించేశారు. పుల్లమనాయుడు కండ్రిగకు చెందిన ఓ ఎస్టీ మహిళకు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2 ఎకరాల భూమికి సంబంధించి పట్టాను అందజేశారు. అయితే అదే పట్టాతో సమీప గ్రామంలో అగ్రకులానికి చెందిన ఓ నేత 10 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించేశాడు. ఆపై ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద పనులు సైతం చేయించుకుని, ప్రస్తుతం వాటి ఆనవాళ్లు లేకుండా చెరిపేశారు. రాయలచెరువు సర్వే నంబరు 410/1, 410/6, 409/1ఎలో నాలుగు ఎకరాలు ఉన్నట్లు పత్రాలు సృష్టించుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో 20 ఎకరాలకు పైగా ఆక్రమించుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. బోగస్ సర్వే నంబర్లతో ఆక్రమణలు.. అనుప్పల్లి, రాయలచెరువు, పుల్లమనాయుడు కండ్రిగలో వందల ఎకరాల ఆక్రమణలోని పత్రాల్లో నమోదు చేసిన సర్వే నంబర్లు పూర్తిగా బోగస్ నంబర్లేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో 2019లో అటవీ భూముల ఆక్రమణలపై అధికారులు అడ్డుకున్నారు. ఇక్కడ ఎలాంటి పనులు చేయకూడదంటూ స్పష్టం చేశారు. దీంతో గత ప్రభుత్వంలో ఆక్రమణలకు చెక్ పడింది. అటవీ భూముల వెనుక ఆ నేత అభయం రామచంద్రాపురం మండలంలో గత ఏడాదిన్నర కాలంలో జరిగిన వందల ఎకరాలు అన్యాక్రాంతం వెనుక నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు సంపూర్ణ సహకారం ఉందన్న చర్చ మండలంలో జోరుగా సాగుతోంది. గత వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన స్థానిక నేత ఒకరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులతో డీల్ చేసినట్లుగా ఆ పార్టీ నేతలో బహిరంగంగా విమర్శిస్తున్నారు. వందల ఎకరాలను కూటమి నేతలు వశం చేసుకోవడానికి, సుమారు రూ.40 లక్షలకు పైగా ముడుపులు అందించినట్లు విశ్వసనీయ సమాచారం.ప్రేక్షకపాత్ర వహిస్తున్న రెవెన్యూ అధికారులు రామచంద్రాపురం మండలంలో కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటిని రక్షించాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు మౌనంగా ఉండడంపై ప్రజలు మండిపడుతున్నారు. 2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అటవీ భూముల దోపిడీపై జిల్లా అధికారులు సైతం చర్యలు చేపట్టారు. వారి వద్ద ఉన్న పత్రాలు, సర్వే నంబర్లు బోగస్ అని అధికారులు అప్పట్లోనే తేల్చేశారు. అయితే ప్రస్తుతం మరోసారి కూటమి అధికారంలోకి రావడంతో రెక్కలు విప్పుకుని అటవీ భూములపై వాలిపోతున్నారు. విలువైన భూములను పరిరక్షించాల్సింది పోయి, రెవెన్యూ అధికారులు వారితో చేతులు కలపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి అటవీ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు. -
ఎస్వీయూ నిరాకరణ!
తిరుపతి సిటీ : పీజీ సెట్–25 అడ్మిషన్ల ప్రక్రియపై ఉన్నత విద్యామండలి వ్యవహారశైలిపై ఎస్వీయూ అసహనం వ్యక్తం చేసి నిరాకరించింది. దీంతో ఆ బాధ్యతలను నాగార్జున వర్సిటీకి అప్పగించారు. ఆ యూనివర్సిటీ సైతం తాము చేపట్టలేమని తెగేసి చెప్పినా కాళ్లవేళ్లా పడటంతో ఎట్టకేలకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాగార్జున వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రవికుమార్‌కు కౌన్సెలింగ్ కన్వీనర్‌గా నియమించారు. పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన విధంగా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఉమ్మడి పద్ధతిలోనే ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. ఎట్టకేలకు పీజీ ప్రవేశాల ప్రక్రియకు సన్నద్ధమయ్యారు. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసి పదిరోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది నోటిఫికేషన్ విడుదల వివరాలు పీజీసెట్–2025 అడ్మిషన్ల ప్రక్రియకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు పీజీ కోర్సులకు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉండనుంది. సీట్లు పొందిన విద్యార్థులు 22 నుంచి 24వ తేదీలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. -
ప్రశాంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు
తిరుపతి అర్బన్ : ప్రశాంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఆదివారం తిరుపతిలోని ఆరు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో నిర్వహించామని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్, బీట్, సెక్షన్ ఆఫీసర్లకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు చేపట్టామని వెల్లడించారు. ఉదయం పరీక్షల్లో 10,493 మంది అభ్యర్థులకు 8,670 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. 1823 మంది హాజరు కాలేదని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం పరీక్షల్లో 1690 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 1335 మంది మాత్రమే వచ్చారని చెప్పారు. 358 మంది హాజరు కాలేదని వివరించారు. చంటి బిడ్డలతో హాజరైన మహిళలు తిరుపతి అర్బన్ : తిరుపతి నగరంలో ఆదివారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో పరీక్షలను రాయడానికి పలువురు మహిళా అభ్యర్థులు తమ చంటి బిడ్డలతో పరీక్షలకు హాజరయ్యారు. -
ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ఫో
తిరుపతి కల్చరల్ : క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో డీబీఆర్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఈనెల 5,6,7 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రదర్శించిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ప్రదర్శన ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులు, వివిధ గృహ సుందరీకరణ వస్తువులు, ప్లాట్లు, అపార్ట్మెంట్, రుణ సదుపాయాలు, అధునాతన కార్లు వంటి వాటిని ఒకే వేదికపైకి తెచ్చి సుమారు 60 స్టాల్స్‌తో ప్రజల కలలు సాకారం చేసే దిశగా కృషి చేసిన క్రెడాయ్ ప్రతినిధులను వారు అభినందించారు. అనంతరం క్రెడాయ్ చైర్మన్ గోపినాథ్, అధ్యక్షుడు రాంప్రసాద్ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు తాము ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆదరించి విజయవంతం చేసిన ప్రజలకు, సహకరించిన కంపెనీల ప్రతినిధులకు కృతజ్ఞతులు తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షుడు రాజేష్‌బాబు, కోశాధికారి హరికృష్ణ, సహాయ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
● ఆలయ ‘గ్రహణం’
కాణిపాకం, పెంచలకోన ఆలయాల తలుపులు మూసివేస్తున్న అధికారులుసంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలు మూతపడ్డాయి. రాత్రి 9.57 నుంచి గ్రహణ సమయం మొదలవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచే ఆలయాలను మూసివేశారు. ఈ క్రమంలోనే తిరుమల, తిరుపతి, కాణిపాకం, పెంచలకోన, బోయకొండ, మొగిలిలో సంప్రదాయబద్ధంగా మహద్వారాలు మూతపడ్డాయి. అయితే రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదిదంపతులకు శాంతి అభిషేకం నిర్వహించారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేశారు. సంప్రోక్షణ, పుణ్యాహవచనం తర్వాత భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతించారు. – తిరుమల/శ్రీకాళహస్తి/కాణిపాకం -
బస్సును ఢీకొన్న ట్రాక్టర్ ఇద్దరికి గాయాలు
దొరవారిసత్రం: జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ప్రైవేటు బస్సును ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, టపాయిండ్లు గ్రామానికి చెందిన రమేష్, కల్లూరుకు చెందిన సురేంద్ర ట్రాక్టర్‌ను సర్వీస్ చేసుకునేందుకు సూళ్లూరుపేటకు బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపు తప్పిన ట్రాక్టర్ ముందు వెళుతున్న ప్రైవేట బస్సును ఢీకొని బోల్తా పడింది. దీంతో డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న ప్లాజా అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్ఐ అజయ్‌కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరిపంట కొనుగోలే లేదు
పుంగనూరు : పుంగనూరులో వరిపంట కొనుగోలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖరీఫ్ పంట పండించిన రైతులు వరి ధాన్యాన్ని తమకు నచ్చిన రీతిలో క్వింటా రూ.2,200తో విక్రయాలు చేసుకున్నారు. కాగా పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సోమల , సదుం, రొంపిచెర్లం, పులిచెర్ల మండలాలతో పాటు పంజాణి, గంగవరం మండలాల్లో సుమారు 5,200 హెక్టార్లలో సాగు చేశారు. ప్రస్తుతం రబీ సాగు 2.50 హెక్టార్లలో మాత్రమే సాగు అవుతోంది. ఈ సారైన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి
తిరుపతి క్రైం : తిరుమలలో ఈనెల 24వ తేదీ నుంచి జరగబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. ఆదివారం పోలీస్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని ఈసారి కూడా అదే తరహాలో జరగాలని కోరారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించాలన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలన్నారు. తిరుమలలోని బాలాజీ నగర్‌తో పాటు పాప వినాశనం ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ఆటో డ్రైవర్లు, జీపు డ్రైవర్లు భక్తులతో ఏ విధంగా వ్యవహరించాలో అవగాహన కల్పించాలన్నారు. తిరుమలలో పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్ నిర్వహించాలని ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. 400 మంది సిబ్బందితో క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలనే దానిపైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని ఆర్మ్డ్ అడిషనల్ ఎస్పీకి సూచించారు. మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు తిరుమలలో ఏ రూట్లో వెళ్లాలి.. అనే విషయం ఇప్పటికే నిర్ధారించుకోవాలన్నారు. ఇంటిగ్రేట్ చెక్ పోస్టులు కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి, తిరుమలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు. అలిపిరి , శ్రీవారి మెట్టు మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సెక్టార్లో సీసీ కెమెరాలతో పాటు సోలార్‌తో పనిచేసే కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల దర్శనం అనంతరం ఎలా వెళ్లాలి అనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రవి మనోహర్ ఆచారీ, శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటనారాయణ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. మూల విరాట్‌కు పవిత్ర మాలధారణతో విశేష పూజలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్రమాలలు విశేష పూజా ద్రవ్యాలను శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓ బాపిరెడ్డి, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయకుడికి పవిత్రమాల సమర్పించారు. అనంతరం వినాయకుడు, జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి పవిత్రమాలల సమర్పణ వేడుకగా చేపట్టారు. యాగశాలలో శాంతి హోమ పూజలు, చండికేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయన్నారు. మహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన చేపట్టారు. అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై ఊరేగింపుగా పద్మ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. దీంతో పవిత్రోత్సవాలను పరిసమాప్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజు, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పెంచలకోన క్షేత్రంలో... రాపూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిలు శేష వాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై కొలువుతీర్చి క్షేత్రోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి వారి అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శాంతి హోమం, పూర్ణాహుతి , నివేదన, మహాకుంభప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి మాట్లాడుతూ.. మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయన్నారు. -
జాతరకూ గుంతలే రోడ్లే
వెంకటగిరి (సైదాపురం) : రాష్ట్ర పండుగగా జరుగుతున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరకు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు మీదుగా వెంకటగిరికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్న విషయాన్ని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆ శాఖ ఆఽధికారులను రోడ్డు బాగు చేయాలని ఆదేశించారు. జాతర ఆదివారం ఘటోత్సవంతో ప్రారంభమై మరో మూడు రోజుల్లో ముగియనుంది. కాని రోడ్డు మరమ్మతులు మాత్రం మొక్కుబడిగా సాగుతున్నాయి. జాతర సమయంలో వేల మంది ఈ మార్గం గుండా ప్రయాణాలు సాగిస్తారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
శోత్రియ భూముల్లో ఆక్రమణలు చేపడితే జైలే
వరదయ్యపాళెం : మండలంలోని చిన్న పాండూరు పంచాయతీ పాదిరికుప్పం రెవెన్యూలోని శోత్రియ భూముల్లో ఆక్రమణలు చేపట్టడం, దుక్కి దున్నకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మండల తహసీల్దార్ సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల కొందరు అక్రమార్కులు కొద్ది రోజులుగా ట్రాక్టర్ల ద్వారా దుక్కి దున్నకాలు చేపడుతున్నారు. దీనిపై శనివారం శోత్రియ భూముల్లో దొంగలు పడ్డారు అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహసీల్దార్ సుధీర్ రెడ్డి శోత్రియ భూములు సందర్శించి అక్రమంగా చేపట్టిన దుక్కి దున్నకాలను పరిశీలించారు. తక్షణమే శోత్రియ భూముల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకపై ఎవరైనా దుక్కి దున్నకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అక్రమార్కులను హెచ్చరించారు. స్థానిక వీఆర్వో, వీఆర్ఏలను ఈ విషయమై గట్టిగా మందలించి చిన్నపాటి ఆక్రమణలు జరిగినా తన దృష్టికి తక్షణమే తీసుకురావాలని ఆదేశించారు. శోత్రియ భూములపై నిఘా ఉంచాలని సూచించారు. ఆయన వెంట వీఆర్వో చలపతి, విలేజ్ సర్వేయర్ రాఘవ ఉన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
రేణిగుంట : గత పదేళ్లుగా వంద ఇళ్లలలో తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న తమిళనాడుకు తుత్తుకూడి జిల్లాకు చెందిన తంగ ముత్తు అనే అంతర్రాష్ట్ర దొంగను గాజులమండ్యం పోలీసులు అరెస్టు చేసి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 350 గ్రాముల వెండి స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో శనివారం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. రేణిగుంట మండలంలో రాత్రిపూట తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసే వ్యక్తిని పట్టుకునే ఉద్దేశంతో నిఘా పెట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిపై ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. తమిళనాడు ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో వెళ్లి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టివేతలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించి నగదు రివార్డును అందించారు. సమావేశంలో సిబ్బంది గోపి, వేణుగోపాల్ , మణి వాసు, రాజేష్, సుబ్రమణ్యం, మురళీ పాల్గొన్నారు. -
డిగ్రీ డీలా!
●తిరుపతి సిటీ : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో 2025–26కు సంబంధించి ప్రవేశాలు నాలుగు నెలలు జాప్యం కావడంతో అడ్మిషన్ల దరఖాస్తులు కనీసం 40 శాతం కూడా దాటకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యామండలి దరఖాస్తుల గడువును మూడుసార్లు పొడిగించినా దరఖాస్తులు పెరగకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది 50 శాతానికి పైగా ప్రవేశాలు తగ్గుముఖం పట్టనున్నట్లు స్పష్టమైన సంకేతాలు రావడంతో ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల పరిస్థితి దారుణంగా తయారైంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో పాటు ఈ ఏడాది డిగ్రీలో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కళాశాలలను ఎలా నడపాలో అర్థం కావడం లేదంటూ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ కళాశాలలపై తగ్గని ఆదరణ డిగ్రీ ప్రవేశాల కోసం సుదీర్ఘ కాలం నిరీక్షించిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వైపు మొగ్గు చూపడం లేదు. జిల్లాలోని సుమారు 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనీసం 30 శాతం దరఖాస్తులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న ఎస్పీడబ్లూ, ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలల్లో 90 శాతానికి మించి దరఖాస్తులు రావడం గమనార్హం. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓరియెంటల్, సికింద్రాబాద్ కళాశాలలో 25 శాతం కూడా దరఖాస్తులు రాకపోవడంతో ఆయా కళాశాలల యాజమాన్యాల పరిస్థితి అయోమయానికి గురిచేస్తోంది. నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల కోసం నాలుగు నెలలుగా ఎదురు చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నత విద్యామండలి నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానం అంటూ విద్యార్థులను తికమక పెట్టించి నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యా విధానాన్ని నిర్వీర్యం చేసిందని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేందుకే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి నిర్ణయాన్ని మేధావులు విద్యావంతులు తప్పుపడుతున్నారు. రూ.కోట్లలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు ప్రైవేటు డిగ్రీ యాజమాన్యాలు కళాశాలలను నడపలేని పరిస్థితికి చేరుకున్నాయి. రెండేళ్లుగా జిల్లాలో సుమారు రూ.650 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఒక్కో కళాశాలకు సుమారు రూ.కోటి నుంచి 2 కోట్ల వరకు చెల్లించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో కళాశాలలను నడపలేని స్థితిలో యాజమాన్యాలు నరకయాతన పడుతున్నాయి. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం పడనుంది. కనీసం 25శాతం సైతం అడ్మిషన్లు జరిగే పరిస్థితి లేదంటూ యాజమాన్యాలు వాపోతున్నాయి. డిగ్రీ ప్రైవేటు కళాశాల పరిస్థితి అయోమయంలో పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేడు సీట్ల కేటాయింపు సంక్షిప్త సందేశాలు ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆదివారం విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ మేరకు ఓఏఎమ్‌డీసీ పోర్టల్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల, మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సమాచారం అందించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో సోమవారం రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల టీటీడీ విద్యాసంస్థల వివరాలు కళాశాల అందుబాటులో వచ్చిన ఉన్న సీట్లు దరఖాస్తులు పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల 1550 1697 ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల 1068 1457 ఎస్వీ ఆర్ట్స్ కళాశాల 1417 1679 ఎస్వీ ఓరియెంటల్ కళాశాల 300 189 సికింద్రాబాద్ ఎస్వీవీవీఎస్ 60 57ఎప్పుడూ చూడలేదు.. గ్రామీణ పేద విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురు చూసిన డిగ్రీ అడ్మిషన్లు కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ఇంటర్ ఫలితాలు విడుదల చేసి నాలుగు నుంచి 5 నెలలు గడిచినా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కళాశాలలో కనీసం 20శాతం సైతం ప్రవేశాలు జరిగే పరిస్థితి లేదు. తిరుపతి నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లో మాత్రమే కాస్త మెరుగ్గా దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఏపీ చరిత్రలో డిగ్రీ అడ్మిషన్లపై ఇలాంటి పరిస్థితి చూడలేదు. – ఎస్వీయూ పరిధిలోని డిగ్రీ రిటైర్డ్ అధ్యాపకుడు, తిరుపతి -
శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం 11.30 గంటల నుంచి పవిత్ర సమర్పణ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో ఆరాధన, హోమాలు, నివేదన, తీర్థప్రసాద గోష్టి తదితర వైదిక కార్యక్రమాలను చేపట్టారు. ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి 11.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మఖ మండపంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం చేపట్టనున్నారు. అటు తర్వాత పలు వైదిక కార్యక్రమాల తర్వాత ఆదివారం చంద్రగ్రహణంలో భాగంగా మధ్యాహ్నం 02.15 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజు, ఆలయ అర్చకులు, సూపరింటెండెంట్ రమేశ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. -
గుజరాత్ యాత్రకు ప్రత్యేక రైలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీకి తొలిసారిగా పర్యాటక ప్రదేశాల సందర్శనార్థం 10 ప్రత్యేక రైళ్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్రను నిర్వహించనున్నట్లు తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చన్నారు. ద్వారక, నాగేశ్వర్ ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, సూర్య దేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నదీ తీరం, యునెస్కో వారసత్వ స్థలం, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన యాత్రికులు సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు రేణిగుంట నుంచి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట జంక్షన్‌కు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులకు భోజనవసతి కల్పిస్తారన్నారు. స్లీపర్ ధర రూ. 18,400 కాగా 3 టైర్ ఏసీ ధర రూ. 30,200 కాగా 2టైర్ ఏసీ ధర రూ. 39,900గా నిర్ణయించినట్లు తెలిపారు. యాత్రికులు 92814 95853 , 82879 32313 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నానం
తిరుమల: అనంత పద్మనాభవ్రతం సందర్భంగా తిరుమలలో శనివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకాలు చేశారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఉక్కుపాదం మోపుతాం
ఆర్ఎంపీలు, పీఎంపీలే యాంటీబయోటిక్ మందులు, మాత్రలు, సరఫరా చేస్తున్నారు. వీళ్లే చికిత్సలు చేస్తున్నారు. జాయింట్లకు కూడా సూదులు వేస్తున్నారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అనధికారిక క్లినిక్‌లపై తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటి వరకు వందకు పైగా క్లినిక్‌లను తనిఖీ చేస్తే 43 దాకా సీజ్ చేశాం. వాటి వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపుతున్నాం. వారి ఆదేశాలతో తదుపరి చర్యలు ఉంటాయి. నకిలీ వైద్యంపై ఉక్కుపాదం మోపుతాం. వదలిపెట్టే ప్రసక్తే లేదు. – డాక్టర్ సుధారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు -
మెడికల్ కళాశాలలపై కూటమి నిర్లక్ష్యం
తిరుపతి రూరల్ : మెడికల్ కళాశాలలపై కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంటలోని పార్టీ కార్యాలయంలో శనివారం మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడేందుకు శనివారం విద్యార్థి సంఘం నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో మొత్తం 17 మెడికల్ కళాశాలల్లో 5 ప్రారంభం కాగా మరో 7 కాలేజీలు ఎన్నికలు జరిగే సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆ తరువాత మరో 5 కాలేజీలను ప్రారంభించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా దృష్టిపెట్టక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మొత్తం 12 మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని బయటకు కనబడకుండా చేయడానికి పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2360 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా జగనన్న ప్రభుత్వంలో తెచ్చిన 12 కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 2550 సీట్లు పెరిగేవన్నారు. వైద్య విద్యలో ప్రభుత్వం పేద విద్యార్థులకు చేసిన మోసాన్ని బయట పెట్టడానికి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్టు వివరించారు. సమావేశంలో విద్యార్థి విభాగం నేతలు ఓబుల్ రెడ్డి, చెంగల్ రెడ్డి, గూడూరు రఫీ, యశ్వంత్ రెడ్డి, వినోద్ కుమార్, నక్క హరినాథ్, హరీష్, భానుప్రకాష్‌రెడ్డి, నరేశ్, వెంకట రమణ నాయక్, శేషారెడ్డి, రెడ్డి నాయక్ , కరుణాకర్ పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
తిరుపతి సిటీ : శారీరక , మానసిక ఉల్లాసానికి క్రీడలు అత్యవసరమని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ ఆధ్వర్యంలో ఎస్వీయూ స్టేడియంలో శనివారం జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడుతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగులలో స్నేహ భావం కల్పించడంతో పాటు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి క్రీడలు అవసరమన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జట్టుతో పాటు టీటీడీ ఉద్యోగులు జట్టు, ఎస్వీయూ ఉద్యోగుల జట్టు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఎన్ఎస్యూ, అమరరాజ జట్లు క్రికెట్ పోటీలలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మురళి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ ముత్తు, టీటీడీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ నారాయణ, ఆర్గనైజర్ యుగంధర్, చంద్రు, 12 జట్ల కెప్టెన్లు , క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభ మ్యాచ్ కలెక్టర్ జట్టుకు, ఎస్వీయూ జట్ల మధ్య జరిగిందని నిర్వాహకులు తెలిపారు. పోలేరమ్మ జాతర కమిటీ ఏర్పాటు వెంకటగిరిరూరల్ : ఈనెల 10,11వ తేదీల్లో జరగనున్న శ్రీ పోలేరమ్మతల్లి జాతరకు సంబంఽధించి జాతర కమిటీని పట్టణంలోని వీరయ్య కల్యాణ మండపంలో శనివారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి పాలవర్గం వర్గం పేర్లను చదివి వినిపించారు. మురళీకృష్ణ, చంద్రశేఖర్, శివప్రసాద్, టీవీ కృష్ణ, యామిని, జగదీశ్వరి, కలపాటి నాగమణి, రామారావు అనీల్, తిరుపతిరావు, మదనపల్లి సావిత్రమ్మ, సత్య కిరణ్మయి, ప్రసాద్‌తో కమిటీని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 6న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమావేశం తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమావేశాన్ని అక్టోబర్ 6న (సోమవారం) సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ విభాగానికి చెందిన తిరుపతి జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రతీత్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కమిటీ అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని వివరించారు. గ్రహణం రోజున ముక్కంటికి ప్రత్యేక అభిషేకాలు శ్రీకాళహస్తి : చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేకమైన గ్రహణ కాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఈనెలలో రెండు గ్రహణాలు రానున్నాయి. ఆదివారం పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం, 21న సూర్య గ్రహణం. ఈ రెండు భారత దేశంలో దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలో గ్రహణాలకు అతీతంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాంతి అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆదివారం చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై 8వ తేదీ వేకువజామున 1.26 గంటలకు ముగుస్తుందని శ్రీకాళహస్తీశ్వరాలయంలోని పండితులు వివరించారు. 7వ తేదీ రాత్రి 11.42 గంటలకు చంద్రుడు పూర్తిగా కనబడడని తెలిపారు. ముల్లోకాలను ఏలే ముక్కంటీశుడు తనకు అలంకరించే కవచంలో తొమ్మిది గ్రహాలను 27 నక్షత్రాలను పొందు పరుచుకున్నారు కాబట్టి ఆ స్వామికి శాంతి అభిషేకాలు నిర్వహిస్తారని తెలిపారు. పలువురికి పదవులు చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురికి పదవులు వరించాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలువురిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా(పార్లమెంటు) నియమించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వీరికి పదవులు కేటాయించినట్లు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన దయాసాగర్‌రెడ్డికి నగరి, చంద్రగిరి, ఎం.కృష్ణమూర్తికి కుప్పం, పూతలపట్టు, వెంకట్రెడ్డియాదవ్కు పలమనేరు, చిత్తూరు, అనీషారెడ్డికి పుంగనూరు, మదనపల్లె, రాకేష్‌రెడ్డికి జీడీనెల్లూరు, తంబళ్లపల్లెను కేటాయించారు. తిరుపతి జిల్లాకు చెందిన బీరేంద్రవర్మకు గుడూరు, సూళ్లూరుపేట, ఓ.గిరిధర్‌రెడ్డికి శ్రీకాళహస్తి, తిరుపతి, కే.కల్పలతరెడ్డికి వెంకటగిరి, సత్యవేడును కేటాయించారు. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ, సంబంధిత రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించనున్నారు. -
మహిళా సాధికారతపై జాతీయ సదస్సు
తిరుపతి అర్బన్ : తిరుపతి వేదికగా మహిళా సాధికారత జాతీయ సదస్సును చేపట్టనున్న నేపథ్యంలో సమష్టిగా విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో సదస్సు ఉంటుందని వెల్లడించారు. ఆ మేరకు ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌తో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యతో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలన చేపట్టారు. ముందుగా సదస్సు చేపట్టనున్న రాహుల్ కన్వెన్షన్ హాల్‌తో పాటు చంద్రగిరి కోటను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సదస్సుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి జాతీయ మహిళా సాధికారిత కమిటీ సభ్యులు రానున్నారని చెప్పారు. ప్రధానంగా లోకసభ, శాసన సభ స్పీకర్లు, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు , ఇతర ప్రముఖులు రానున్నారని స్పష్టం చేశారు. చంద్రగిరి కోటను అన్ని హంగులతో సిద్ధం చేయాలని ఆదేశించారు. కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ లైట్ అండ్ సౌండ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే చంద్రగిరి కోటకు చేరుకునే మార్గంలో అప్రోచ్ రోడ్లు, తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, ప్రొటోకాల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివశంకర్ నాయక్, అడిషినల్ ఎస్పీ రవిమనోహరాచారి, డీపీఓ సుశీలాదేవి, తిరుపతి, చంద్రగిరి డీఎస్పీలు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేందర్ నాయుడు, టూరిజం ఆర్డీ రమణ ప్రసాద్, గురుస్వామి శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
దసరా ఆర్జిత సేవా టికెట్ల రుసుము ఖరారు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈనెల 22 నుంచి 11 రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఆర్జిత సేవా టికెట్ల రుసుంను దేవస్థాన అధికారులు ఖరారు చేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ.5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ.3వేలు, మూలా నక్షత్రం రోజున రూ.5వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక శ్రీచక్రనవావరణార్చనకు రూ. 3 వేలు, ప్రత్యేక చండీహోమంకు రూ.4 వేలు ఖరారు చేశారు. ప్రత్యేక శ్రీచక్రనవావరణార్చన ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చండీహోమం యాగశాలలో నిర్వహిస్తారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజున మాత్రం ప్రత్యేక కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షిప్టు మాత్రమే నిర్వహిస్తారు. ఇక ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పరోక్ష సేవకు రూ.1,500: ఉత్సవాలలో నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీహోమాలను పరోక్షంగా జరిపించుకునే అవకాశాన్ని కూడా దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఒకరోజు పరోక్ష సేవకు రూ.1,500గా, ఇక 11 రోజుల పాటు సేవకు రూ. 11,116గా నిర్ణయించినట్లు సమాచారం. పరోక్ష సేవలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఉత్సవాల అనంతరం అమ్మవారి ప్రసాదాలను పోస్టు ద్వారా భక్తులు తెలిపిన అడ్రస్సుకు పంపుతామని ఆలయ సిబ్బంది తెలిపారు. -
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: నేడు సెప్టెంబరు7న చంద్రగ్రహణం సందర్భంగా నేడు శ్రీవారి ఆలయం మూసివెయనున్న టిటిడి. సెప్టెంబరు 7 సాయంత్రం 3:30 నుండి 8 వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టంబర్ 8న సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. ⇒ గ్రహణానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ⇒ తిరుమలకు వచ్చే భక్తులు గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని రావాలని టిటిడి సూచన⇒ గ్రహణం సమయంలో అన్నప్రసాద వితరణ రద్దుచంద్ర గ్రహణం కారణంగా తిరుమలలో పౌర్ణమి గరుడసేవ రద్దుసెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది.అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది. -
శోత్రియ భూముల్లో దొంగలు పడ్డారు!
వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు పంచాయతీ వీకేఆర్‌వైకాలనీ ఆక్రమణలకు అడ్డాగా మారింది. పరిసర ప్రాంతాల్లో భారీగా పరిశ్రమలు రావడంతో ఈ ప్రాంతంలోని పొలాలకు ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. డీకేటీ భూమి సైతం ఎకరా రూ.కోట్లలో పలుకుతోంది. ఒక్కసారిగా ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ఆ భూములపై కన్నేశారు. కాలనీలో గిరిజనులకు కేటాయించిన ఇంటి స్థలాలను దర్జాగా కొనుగోళ్ల పేరుతో కబ్జా చేసేశారు. అక్కడితో ఆగకుండా నాలుగురోజులగా దున్నకాలు చేపట్టారు. సాగు పేరుతో పూర్తిగా సొంతం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. వరదయ్యపాళెం : మండలంలోని చిన్నపాండూరు పరిధి పాదిరికుప్పం రెవెన్యూలోని 1,056 ఎకరాల శోత్రియ భూముల్లో అక్రమార్కులు పాగా వేస్తున్నారు. నాలుగు రోజులుగా శోత్రియ భూముల్లో ఓవైపు పొలం దన్నకాలు చేపట్టి ఆక్రమణ దశగా పావులు కదుపుతున్నారు. ఈ భూములు సత్యవేడు–చిన్న పాండూరు ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉండడంతో ఆక్రమణకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు షికారీలు ఆక్రమించుకుని, ఆ భూమి తమ పూర్వీకులకు చెందినదిగా బుకాయిస్తూ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగే కొనసాగితే శోత్రియ భూములు పూర్తిగా కబ్జాలోకి వెళ్లిపోయే ప్రమాదముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోద్యం చూస్తున్న రెవెన్యూ శోత్రియ భూముల ఆక్రమణలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతంగా ఉన్న శోత్రియ భూముల్లో ఓవైపు దుక్కి దున్నకాలు, మరోవైపు గ్రావెల్ అక్రమ రవాణా, షికారీల గుడిసెలు ఇలా ఇష్టారాజ్యంగా కబ్జాల పర్వం కొనసాగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రధాన రోడ్డుకు రెండు వైపులా ఆక్రమణలు చిన్న పాండూరు–సత్యవేడు ప్రధాన రోడ్డు మార్గంలోని వీకేఆర్‌వైకాలనీ సమీపంలో రోడ్డుకు తూర్పు, పడమర రెండు వైపుల సుమారు 100 ఎకరాల్లో దున్నకాలు చేపట్టి ఆక్రమణకు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఎకరా రూ. 10కోట్లకు పైగా విలువ కలిగిన ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమణల పాలవుతున్నా అధికారులు స్పందించడం లేదు. -
అమ్మవారి సేవలో తెలంగాణ సీజే
చంద్రగిరి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, శాంతారాం స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని, అనంతరం అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
విజయవాడ: గురుపూజోత్సవం సందర్భంగా తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు.వరసిద్ధుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన భాగ్యం కల్పించి ఆలయ మర్యాదలు చేశారు. అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రేష్, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, రాష్ట్ర గ్రీన్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ దర్శించుకున్నారు. -
శ్రీసిటీలో ‘స్మైల్ ఎకో’ ప్రారంభం
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు (శానిటరీ న్యాప్కిన్స్) తయారు చేసే ‘స్మైల్ ఎకో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన పరిశ్రమ శుక్రవారం శ్రీసిటీలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీఎస్ఎన్ఎల్ మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు, పద్మశ్రీ డాక్టర్ టి.హనుమాన్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున పరుచూరి సమక్షంలో లాంఛనంగా పరిశ్రమను ప్రారంభించారు. రూ.20 కోట్ల పెట్టుబడితో స్థాపించబడిన ఈ ప్లాంట్ ఏడాదికి 259.2 మిలియన్ల శానిటరీ న్యాప్కిన్లను తయారు చేస్తుందన్నారు. దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. దీని ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు ఎగుమతులు చేస్తారన్నారు. నాడు ఉద్యోగి, నేడు పారిశ్రామికవేత్త స్థానికుడైన మల్లికార్జున్ నాడు శ్రీసిటీ ఉద్యోగి కాగా నేడు పారిశ్రామికవేత్తగా మారి స్మైల్ ఎకో’ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎండీ మల్లికార్జునను ఈ సందర్భంగా డాక్టర్ సన్నారెడ్డి అభినందించారు. మల్లికార్జున పయనం స్థానిక యువతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ టెలికాం సంస్కరణలలో ప్రముఖ పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి హనుమాన్ చౌదరి చేత ఈ పరిశ్రమ ప్రారంభం కావడం అత్యంత శుభపరిణామం అన్నారు. అనువైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థతో 240 పైచిలుకు పరిశ్రమల స్థాపనతో పాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక ప్రగతికి చొరవ చూపుతున్న శ్రీసిటీ యాజమాన్య కృషిని డాక్టర్ హనుమాన్ చౌదరి ప్రశంసించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీసిటీలోని పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అన్నదాతపై అలుసెందుకు బాబు?
తిరుపతి మంగళం : అన్నదాతపై ఎందుకంత చిన్నచూపు చంద్రబాబు అని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల రైతు విభాగం అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డితో కలసి రైతులతో సమావేశం నిర్వహించారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేలా రైతు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అభినయ్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగానే హామీలను గాలికి వదిలేసిన ప్రజా, రైతు ద్రోహి చంద్రబాబు అన్నారు. రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా ఇవ్వలేకపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువుల కష్టాలు, బస్తా యూరియా కోసం రోజుల తరబడి క్యూలో నిలబడే దారుణ పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్ల జగనన్న పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? అని, ఈ రోజు రైతులు కష్టాలు పడుతున్నారంటే ప్రభుత్వ వైఫల్యం కాదా? అని అభినయరెడ్డి ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు యూరియా, ఎరువులను టీడీపీ, జనసేన నాయకులు దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించుకుంటున్నారని భూమన అభినయ్‌రెడ్డి ఆరోపించారు. బస్తా యూరియా ధర రూ.267 అయితే బ్లాక్ మార్కెట్లో రూ. 500కు విక్రయించుకుంటున్నారన్నారు. జగనన్న పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన ఎరువులు, యూరియా, సబ్సిడీ వేరుశెనగ వంటివి సకాలంలో అందించామని గుర్తు చేశారు. టీడీపీ నాయకుల జేబులు నింపేందుకు రైతుల కడుపుకొడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా పంటల ధరలు పతనమవుతున్నాయని, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుము, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు, అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారన్నారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమేనని, అందులో కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారన్నారు.డబుల్ డెక్కర్ బస్సు తిప్పిన ఘనత మాదే... దేశంలో బాంబే తర్వాత తిరుపతి నగరంలో వైస్సార్సీపీ పాలనలో డబుల్ డెక్కర్ బస్సును తిప్పిన ఘనత మాదేనని భూమన అభినయ్‌రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్ష పూరిత రాజకీయాలతో డబుల్ డెక్కర్ బస్సును మూలన పడవేసిన ఘనత కూటమి నేతలకే దక్కుతుందన్నారు. అయితే వైజాగ్‌లో చంద్రబాబు, లోకేష్ డబుల్ డెక్కర్ బస్సును కొత్తగా వారే రాష్ట్రానికి మొదటి సారిగా తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఆ విషయాన్ని ఎల్లో పత్రికలో అహో ఒహో అంటూ రాతలు రాయడం వారికే చెల్లిందన్నారు. తిరుపతిలో ఓ దిక్కూ మొక్కులేని నాయకుడు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మళ్లీ ఫేమ్‌లోకి రావాలని ఆరాట పడుతున్నాడని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినా మళ్లీ ఆ పార్టీ పేరు చెప్పుకుని తిరుగుతూ దళారీ వ్యాపారాలు చేసుకుంటున్న దళారి మా వ్యక్తిగత విషయాలు మాట్లాడే అర్హత నీకుందా అని ప్రశ్నించారు. నీచమైన వ్యక్తిత్వం కలిగిన ఆ వ్యక్తి పేరు కూడా చెప్పడం తనకు ఇష్టం లేదన్నారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రమౌళిరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
8న ఎస్వీయూలో జాబ్‌మేళా
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 8వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయాధికారి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, డీ, బీ, ఎం, ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 95338 89902, 79898 10194 సంప్రదించాలని సూచించారు. ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు పెళ్లకూరు : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి స్వగ్రామమైన పుల్లూరులో శుక్రవారం గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాల్లో భాగంగా అక్రమంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి త్వరలో విడుదల కావాలని గ్రామ దేవతకు పూజలు చేసినట్లు చెప్పారు. అమ్మవారికి కుంకుమార్చన, పుష్పయాగం చేసి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పూజలు చేశారు. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేకుండా ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి బెయిల్ రాకుండా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్‌రెడ్డి, మణినాయుడు, వెంకటాచలం, వీరాస్వామిరెడ్డి, రమణయ్య, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 8వ తేదీన డిగ్రీ సీట్ల కేటాయింపు తిరుపతి సిటీ: జిల్లాలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఈనెల 3వ తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించిన ఉన్నత విద్యామండలి జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలలో ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన సోమవారం సీట్లు కేటాయించనుంది. అదేరోజు సంబంధిత కళాశాలల్లో సీట్లు సాధించి విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 9వ తేదీన కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. 6 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి అర్బన్ : ఆదాయ వనరు నేపథ్యంలో మద్యం బార్ల కేటాయింపులో జాప్యం లేకుండా కూటమి సర్కారు చకచకా కేటాయింపులు చేస్తున్నారు. జిల్లాలో 32 బార్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో గత నెల 30న 26 బార్లను లాటరీ పద్ధతిలో కేటాయింపు చేశారు. మిగిలిన 6 బార్లను భర్తీ చేయడానికి ఈనెల 14 సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని ఎకై ్సజ్ జిల్లా అధికారి నాగమలేశ్వర్రెడ్డి శుక్రవారం వెల్లడించారు. 15న కలెక్టరేట్లో ఉదయం 8 గంటలకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో బార్ల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఓపెన్ కేటగిరికి చెందిన ఆరు బార్లలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, వెంకటగిరి పట్టణ పరిధిలో ఒకటి, గూడూరు మున్సిపాలిటీ పరిధిలో రెండు, సూళ్లూరు పేట పరిధిలో రెండు బార్ల ఉన్నాయని చెప్పారు. మూడేళ్లపాటు మాత్రమే లైసెన్స్ ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్‌తో పాటు హైబ్రిడ్, ఆఫ్లైన్లోనూ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు ఉంటుందని చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని బార్లకు అయినా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బార్లు వచ్చినా నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. 21 ఏళ్లు దాటిన వారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు నిండాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,834 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
బ్రహ్మాండం!
బ్రహ్మోత్సవం..త్రిశూలానికి క్షీరాభిషేకం చేస్తున్న పండితులు హోమపూజలు చేస్తున్న దృశ్యం కాణిపాకం: కాణిపాక స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. ఉదయం ఆలయ పుష్కరిణిలో త్రిశూలానికి శాస్త్రోక్తంగా పవిత్ర స్నానం చేయించారు. ముందుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సిద్ధి, బుద్ధి, సమేత శ్రీవినాయకస్వామి ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని పురవీధుల్లో ఊరేగించి పుష్క రిణి వద్దకు చేరుకున్నారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 108 కలశాలలోని తీర్థాలను పుష్కరిణిలో కలిపారు. అనంతరం త్రిశూలానికి పవిత్ర స్నానం చేయించారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వసంతోత్సవం నిర్వహించారు. శ్రీసిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్స వమూర్తులను మంగళ వాయిద్యాల నడుమున దేవ స్థానం సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు రంగు నీళ్లు చల్లుకుంటూ కోలాహలంగా ఊరేగించారు. తదుపరి యుగశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ యాగమూర్తికి భక్తితో ముగింపు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణంలో భాగంగా ఆలయంలోని స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహించారు. భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ధ్వజ స్తంభంపై నుంచి మూషక చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా అవరోహణ చేశారు. వైభవంగా వడాయత్తు ఉత్సవం రాత్రి స్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి మూలవిగ్రహానికి భక్తితో అభిషేకం నిర్వహించి, పెసర పప్పు పాయసం, ఉద్ది వడలు నైవేద్యంగా సమర్పించి వడాయత్తు ఉత్సవాన్ని చేపట్టారు. అనంతరం స్వామివారికి ఏకాంత సేవను చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ పాల్గొన్నారు. -
సమాజ జాగృతిలో గురువులే కీలకం
తిరుపతి కల్చరల్ : సమాజ జాగృతిలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధతో వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కచ్చపి ఆడిటోరియంలో శుక్రవారం గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు వృత్తిపరంగా కాకుండా విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ ఉన్నప్పుడే వారి మధ్య బంధం పెరుగుతుందని, వారి సమస్యలను చెప్పుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, 50 కోట్ల బడ్జెట్ కేవలం విద్యాభివృద్ధి కోసం ఖర్చు పెడుతోందని తెలిపారు. ఉపాధ్యాయులందరూ కష్టపడి పని చేస్తున్నారని, విద్యార్థులకు రోల్ మోడల్‌గా ఉండాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, భానుప్రకాష్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపాధ్యాయులే మార్గదర్శకులన్నారు. అనంతరం శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం మాట్లాడారు. ఈ సందర్భంగా 68 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులగా అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్లు, జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్.కుమార్, అడిషనల్ కో ఆర్డినేటర్ గౌరీ శంకర్రావు, సమగ్ర శిక్ష సీఎంవో సురేష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
డయేరియా వ్యాప్తిపై పరస్పర ఆరోపణలు
రేణిగుంట : అయిదు రోజులుగా గ్రామంలో డయేరియాకు తాగునీరే కారణమని చెప్పిన అధికారులు ల్యాబ్ రిపోర్ట్స్ రాగానే తాగునీరు సురక్షితంగా ఉందని డయేరియాకు కారణం తాగునీరు కాదని చెబుతున్నారు. కానీ డయేరియా ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు అధికారులు సమాధానం దాటవేస్తుండడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లిలో డయేరియాతో 40 మంది ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. మరికొంత మంది వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. డయేరియాతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. షిరిడిలో మృతి చెందిన మునిరాజా మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. మండలంలోని ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందరూ గ్రామానికి చేరుకొని ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, బాలాజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 23 మందిలో పది మంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారని వైద్యాధికారులు చెప్పారు. మిగిలిన 13 మంది చికిత్స పొందుతున్నారన్నారు. గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతున్నట్లు చెప్పారు. మండల వైద్యాధికారి చక్రపాణి రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో ప్రభురావు తమ సిబ్బందితో గ్రామంలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయిదు రోజులు గడిచినా ఇంత వరకు డయేరియా కలకలానికి కారణం తెలపకుండా అధికారులు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ కాలం గడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో మూడవ రోజైన శుక్రవారం పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను సరిచేసేందుకు ఈ పూజలు చేస్తారు. అందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి పలు రకాల అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
ప్రమాణాలు పెంచేందుకు సంస్కరణలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీవారి సేవకులకు సంబంధించి గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్‌పై ఈఓ శ్యామ ల రావు శుక్రవారం తిరుపతిలో ని టీటీడీ పరిపాలనా భవనంలో ఏపీ ప్లానింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర రావు, జేఈఓ వీరబ్రహ్మంలతో, వర్చువల్‌గా ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన ప్రొఫెసర్లు విశ్వనాథ్, రామమోహన్, అడిషనల్ ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరితో సమీక్ష నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ శ్రీవారి సేవా ప్రమాణాలను మరింత పెంపొందించాలనే దిశ గా పలు సంస్కరణలు చేపట్టినట్టు తెలిపారు. సీపీఆర్ఓ టి.రవి, డీఎఫ్ఓ జీఎం (ఐటీ ఇన్చార్జ్) ఫణికుమార్ నాయుడు, శ్వేత డైరెక్టర్ రాజగోపాల్ పాల్గొన్నారు. -
శెట్టిపల్లి సమస్య మళ్లీ వాయిదా!
తిరుపతి అర్బన్ : శెట్టిపల్లి భూ సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా మూడు నెలలకు ఓసారి ఇదిగో అదిగో అంటూ 15 నెలలుగా వాయిదాలు వేస్తూనే ఉన్నారు. తాజాగా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ 40 రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని వెల్లడించారు. లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేబినెట్లోనూ చర్చ జరిగినట్లు వెల్లడించారు. ప్రధానంగా శెట్టిపల్లి హౌస్ హోల్డ్ ఓనర్స్‌కి 50 : 50 నిష్పత్తిలో అంటే 50 శాతం తుడాకు, 50శాతం హక్కుదారుడికి, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్స్‌కి 30 :70 నిష్పత్తిలో హక్కులు కల్పించడం జరుగుతుందన్నారు. 30 శాతం తుడా, 70శాతం రైతుకు ఇవ్వనున్నట్లు చెప్పారు. మొత్తంగా తుడాకు 65 ఎకరాలు, ప్రభుత్వానికి 90 ఎకరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. శెట్టిపల్లి భూములు తిరిగీ తుడా పరిధిలోకి మార్పు చేశారని చెప్పారు. తుడా రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను 225 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 1300 మందికి రెండు సెంట్ల స్థలం వచ్చే అవకాశం ఉందని, మిగిలిన వారికి కూడా రెండు సెంట్లు కేటాయింపు చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. శెట్టిపల్లి గ్రామ ప్రజలకు అన్ని వసతులతో కూడిన లే అవుట్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
రెండిళ్లలో చోరీ
చంద్రగిరి : మండలంలో దొంగలు రెచ్చిపోతుండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి పట్టణ సమీపంలోని దిగువరెడ్డివారిపల్లిలో గురువారం రాత్రి రెండు తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరిగాయి. ఈ చోరీలో రూ.40 వేల నగదు, 20 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి అపహరించారని తెలిసింది. ఈ మేరకు బాధితులు గీతా, ఈశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు చెక్కుల పంపిణీ తిరుపతి అన్నమయ్యసర్కిల్/తిరుపతి కల్చరల్ : ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో నాదస్వర, డోలు విభాగాలకు సంబంధించి ఆరేళ్ల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు శుక్రవారం కళాశాలలో 46.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ప్రతిష్టించిన శ్రీవారి విగ్రహానికి అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం పూర్వ విద్యార్థులు నాదాంజలి సమర్పించారు. కార్యక్రమంలో టీటీడీ డీఈఓ కార్యాలయం సూపరిటెండెంట్ శివకుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఉమా ముద్దుబాల, నాదస్వర పాఠశాల హెడ్ బి.లక్ష్మీసువర్ణ పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు తిరుమల : తిరుమలలోని మాడ వీధులను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు శుక్రవారం పరిశీలించారు. వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు, ఆస్థాన మండపం, బేడీ ఆంజనేయస్వామి, అఖిలాండం తదితర ప్రాంతాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పకడ్బందీ బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బారికేడ్లు పెట్టాలని సూచించారు. 75 బస్తాల బియ్యం స్వాధీనం వడమాలపేట (పుత్తూరు): ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, 75 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. గురువారం రాత్రి వడమాలపేట మండలం, తడుకు రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించారు. బొలేరో లగేజ్ వెహికల్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో 50 కేజీల బరువు గల 75 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం మండలం, బీరకుప్పం గ్రామానికి చెందిన దినేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
ప్రశ్నిస్తే.. నాలుక మందం అంట: భూమన అభినయ్
సాక్షి తిరుపతి: అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చే చంద్రబాబు.. ఇప్పుడు కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని గాలికొదిలేశారు. సూపర్ సిక్స్ హామీలు గురించి అడిగితే అన్ని అమలు చేసేశామని అంటున్నారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో మార్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సాయం రూ. 7 వేలు మాత్రమే అందించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న రైతులు.. ఇప్పుడు యూరియా కొరతతోనూ అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో యూరియాను విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే నాలుక మందం అంటారు. చంద్రబాబు దీనంతటికి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి యురియా అందుబాటులో తెవాలి. లేకుంటే తగిన బుద్ధి చెప్తాం.. రైతుల కోసం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ డివిజన్ అర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పిస్తాం. తిరుపతి పరిధిలో అన్నమయ్య సర్కిల్ నుండి ర్యాలీ చేపడతాం అని భూమన తెలిపారు. కిరణ్ రాయల్ తాజాగా ప్రెస్మీట్లో భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలపైనా అభియన్ తీవ్రంగా స్పందించారు. అసలు కిరణ్ రాయల్ ఏ పార్టీనో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. ‘‘కిరణ్ రాయల్ ను గతంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ చెప్పింది. రాజకీయాలలో దిగజారి మాట్లాడటం సబబు కాదు’’ అభినయ్ అన్నారు. -
మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
నాగలాపురం : రాజకీయ కుట్రతో లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడం అక్రమమని సత్యవేడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పేర్కొన్నారు. గురువారం పిచ్చాటూరు బైపాస్ రోడ్డులో నిరసన తెలిపారు. అనంతరం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నూకతోటి రాజేష్ మండల నేతలతో కలిసి మిథున్ రెడ్డి త్వరగా జైలు నుంచి విడుదల కావాలని పూజలు చేశారు. ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో అరెస్టు చేస్తే పార్టీ శ్రేణులు భయపడే కాలం చెల్లిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం దాటినా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా జగనన్న ప్రారంభించి, పూర్తి చేసిన పనులు తామే చేసినట్లు కాలం వెలిబుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చలపతిరాజు, సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి, ఎంపీపీ మోహన్, రమేష్ రాజు, మండల ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, సూరి బాబు రెడ్డి, నాయకులు త్యాగరాజన్, మోహన్ రెడ్డి, ఏసు దాసు, ఆరుముగం రెడ్డి, విశ్వనాథం, వాసు , చెంచు బాబు, శేఖర్, గోవింద్, చంద్ర, సుబ్బరాజు పాల్గొన్నారు. -
గురువులే మార్గనిర్ధేశకులు
తిరుపతి సిటీ : భావి భారతావనికి మార్గనిర్దేశకులు గురువులేనని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు కొనియాడారు. ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆయన ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొంది గురుతర బాధ్యతను దేశం గర్విచేలా నిర్వహించిన మహనీయులన్నారు. అబ్దుల్ కలాం ఉపాధ్యాయుడిని క్యాండిల్ వెలుగుతో పోల్చారని, తాను కరుగుతున్నా వెలుగునిచ్చేది గురువేనని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. వర్సిటీ సాంకేతికత పరంగా వృద్ధి చెందిందని, కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీతో మరింత అభివృద్ధి పథంలో నడిచేందుకు అడుగులు వేస్తోందన్నారు. రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ.. గురువులు నిత్య విద్యా దాతలని, గురువును దేవుడిగా సమాజం భావిస్తుందన్నారు. అనంతరం 2025 సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న అధ్యాపకులు ఆచార్య ప్రయాగ, ఆచార్య చంద్రశేఖరయ్య, ఆచార్య నారాయణ, డాక్టర్ పద్మజ, డాక్టర్ సునీత, ఆచార్య చంద్రాయుడు, ఆచార్య జ్యోతి, ఆచార్య సరోజమ్మ, ఆచార్య నాగజ్యోతి, డాక్టర్ హేమలత రుద్రమదేవి, డాక్టర్ స్వరూప రాణి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ విజయలక్ష్మి, ఆచార్య సుబ్బారావు, ఆచార్య రమశ్రీ, ఆచార్య సుధారాణి, ఆచార్య హేమ, ఆచార్య అఖిల స్వతంత్రకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ సుధారాణి, ఓవీఎస్రెడ్డి, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వితంతుల వేదన పెంఛెన్ !
తిరుపతి అర్బన్ : ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటున్న భర్త మృతి చెందితే..ఆ కుటుంబంలోని భార్యతో పాటు బిడ్డలు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ కష్టాన్ని గుర్తించిన దివంగత నేత వైఎస్ఆర్ వితంతులైన వారికి 40 నుంచి 60 రోజుల్లో పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చారు. ప్రధానంగా వితంతుల పింఛన్లకు మాత్రం ప్రత్యేక మినహాయింపు ఇచ్చి రెండు నెలల వ్యవధిలో పింఛన్లు మంజూరు చేస్తూ వస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలుగా ఒక్కటంటే ఒక్క వితంతు పింఛన్ మంజూరు చేయలేదు. ఈ అంశంపై వితంతులు అధికారుల చుట్టూ పింఛన్ మంజూరు చేయాలని తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదని అధికారులు సమాధానం ఇస్తున్నారు. జిల్లాలో 11,320 మంది వితంతులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి. ఏడాదిన్నరగా ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఆరు నెలలుగా పలువురు వితంతులు కలెక్టరేట్లో గ్రీవెన్స్ సందర్భంగా పింఛన్ల కోసం విన్నపాలు ఇస్తున్నా ప్రయోజనం చేకూరక ఇక్కట్లు పడుతున్నారు. న్యాయం చేయాలని కలెక్టర్‌లో విన్నపాలు భర్త చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన వితంతులు తమ బిడ్డలను ఇంటి వద్ద చూసుకునే వారు లేకపోవడంతో వారితో కలిసి కలెక్టరేట్లో అర్జీలను అందిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని తమ గోడును కనిపించిన అధికారికల్లా విన్నవిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. ప్రతి సోమవారం పదుల సంఖ్యలో వితంతులు పింఛన్ల కోసం అర్జీలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీఓల వద్ద మొరపెట్టుకున్నా ఉపయోగం లేకపోవడంతో ఇటీవల కాలంలో అంతా కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. అయితే అధికారులు మాత్రం అర్జీలను తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావాలని చెబుతున్నారు. ఎప్పుడు అనుమతి వస్తాయో తెలియడం లేదు. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఏ కేటగిరిలోనైనా పింఛన్లు తీసుకుంటూ భర్త మృతి చెందితే మాత్రమే వారి సతీమణులకు పింఛన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వారు 6 వేల మందికి పైగా ఉంటే అందులో 4 వేల మందికి మాత్రమే అందించారు. అందులోనూ మెలిక పెట్టడంతో ఎందరో పింఛన్లు రాక బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. పింఛన్ ఇప్పించి ఆదుకోండి ఈమె పేరు రేణుక. భర్త మోహన్‌రాజ్ గుండెపోటుతో పది నెలల కిందట మృతి చెందాడు. ఇద్దరు బిడ్డలున్నారు. తిరుపతి నగరంలోని ఎస్బీఐ కాలనీలో చిన్నపాటి అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. ఆమెకు కన్న (13) అనే కుమారుడు, చామంతి(8) అనే కుమార్తె ఉన్నారు. అంతేకాకుండా ఆమెతో పాటు తమ తల్లి విజయమ్మ ఉంటోంది. నలుగురు జీవనం సాగించాల్సి ఉంది. ఏ ఆధారం లేదు. ఆమెకు వితంతు పింఛన్ ఇవ్వకపోవడంతో తమ బిడ్డలతో కలిసి పదే పదే కలెక్టరేట్లో అర్జీలు ఇస్తున్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బతుకు ప్రశ్నార్థకంగా మారింది. – తమ ఇద్దరు బిడ్డలతో కలెక్టరేట్లో రేణుక, తిరుపతి సాయం చేయండి ఈమె పేరు షబినా, శ్రీకాళహస్తి పట్టణంలోని కుమారస్వామి వీధి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. భర్త మృతి చెందాడు. తమ చిన్న బిడ్డతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి వితంతు పింఛన్ ఇప్పించండి అంటూ తిరుగుతున్నారు. తమకు ఏ ఆధారం లేకపోవడంతో ఇటు పింఛన్ లేకపోవడంతో కష్టాలు పడుతున్నానంటూ తమ గోడును వినిపిస్తోంది. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదంటూ చెప్పి పంపేస్తున్నారు. – పురిటి బిడ్డతో కలెక్టరేట్లో షబినా, శ్రీకాళహస్తి పట్టణం ఇద్దర బిడ్డల పోషణ భారంగా ఉంది ఈమె పేరు ఉయ్యాల ధనమ్మ, ఓజిలి మండలం కరబల్లవోలు గ్రామం. ఆమె భర్త అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. ఆమెకు దీక్షిత, అకిరా నందన్ అనే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. గ్రామానికి వచ్చి విచారణ చేపట్టండి. అన్ని విధాల పింఛన్‌కు అర్హురాలును అంటూ విలపిస్తోంది. ఏ ఆధారం లేదు. వితంతు పింఛన్ ఇప్పిస్తే ఆ డబ్బులతో ఇద్దరి బిడ్డలను పోషించుకుంటానని గురువారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్‌ను కలవడానికి తమ ఇద్దరి బిడ్డలతో వచ్చి తమ గోడు వినిపించారు. – తమ ఇద్దరు బిడ్డలతో కలెక్టరేట్లో ఉయ్యాల ధనమ్మ, ఓజిలి మండలం, కరబల్లవోలు గ్రామం -
సిట్ విచారణకు అన్నివిధాలా సహకరించాం
తిరుపతి రూరల్: ‘‘సిట్ అధికారులు అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పాను. విచారణకు అన్నివిధాలుగా సహకరించాం.. ఇప్పుడే కాదు.. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తాం. దయచేసి పత్రికలు, టీవీ చానెళ్లలో జరగనది జరిగినట్టు అవాస్తవాలు ప్రచురించకండి. రాజకీయాల్లో మా నాన్న ఇరవై ఏళ్లు ప్రజలకు మంచిచేసి తెచ్చుకున్న పేరును చెరపాలని చూసినపుడు బాధ కలుగుతోంది.. దయచేసి అర్థం చేసుకోండి’’ అంటూ తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. తుమ్మలగుంట గ్రామంలోని చెవిరెడ్డి ఇంటి వద్ద గురువారం జరిగిన సిట్, విజిలెన్స్ అధికారుల విచారణ ముగిసిన తరువాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్, విజిలెన్స్ అధికారులు బుధవారం తమ ఇంటికి వచ్చారని, వాళ్లు వస్తారన్న సమాచారం తమకు లేనందున ఆ సమయంలో ఇంటికి తాళం వేసుకుని తాము విజయవాడ కోర్టుకు వెళ్లామని చెప్పారు. గురువారం తాము ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే సిట్ అధికారులు వచ్చారని, సెర్చ్ ప్రాసెస్ పూర్తిచేసుకుని తనను విచారించారని తెలిపారు. సిట్ అధికారులు అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పానని, విచారణకు అన్ని విధాలుగా సహకరించినట్టు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్పారు. ఆయన అన్ని విధాలుగా సహకరించారు సిట్ అధికారులతో కలిసి తాము చేసిన విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరించారని విచారణ అధికారులతో కలిసి వచ్చిన తిరుపతి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ మీడియాకు వివరించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని, వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకుని వెళుతున్నామని తెలిపారు. -
శ్రీకాళహస్తిలో వైభవంగా పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలను రెండవ రోజు గురువారం వైభవంగా నిర్వహించారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను సరిచేసేందుకు ఈ పూజలు చేస్తారు. అందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి పలు రకాల అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కష్టాల్లో రైతులు
నగరి : ప్రస్తుత పాలనలో రాష్ట్ర వ్యాప్తకంగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. రైతులు పడుతున్న కష్టాలపై గురువారం నగరిలోని తన నివాసం వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎరువులకు, యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు చెప్పనలవికావన్నారు. సరిచెయ్యాల్సిన ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి వారి చేతకాని తనాన్ని వాస్తవాలు బయటపెట్టే సాక్షిపై చూపిస్తున్నారన్నారు. క్యాబినేట్ మీటింగ్ పెట్టుకొని ఫేక్‌ల పనిపడతాం అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. సాక్షిలో కథనం వచ్చిన రోజునే పచ్చ పత్రికల్లో యూరియా ఏదయ్యా, యూరియా వెతలు అంటూ కథనాలు వచ్చాయని ఇది అవాస్తవమైతే ఆ పత్రికలపై ఎందుకు కేసులు పెట్టడం లేదన్నారు. కుప్పం, పిఠాపురం నియోజకవర్గంల్లోనూ రైతులు ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారని, దీనికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సిగ్గుపడాలన్నారు. రైతులకు రూ.25 వేలు ఇస్తానని చెప్పిన మీరు 15 నెలల పాలనలో ఇచ్చింది రూ.5 వేలే అన్నారు. ఇది రైతులను మోసం చేయడం కాదా అన్నారు. -
మహిళా వర్సిటీ అధ్యాపకులకు ఉత్తమ పురస్కారాలు
తిరుపతి రూరల్ : తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన అయిదుగురు అధ్యాపకులు ఉత్తమ బోధకుల పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రొఫెసర్ వెంకటకృష్ణ (ఎంసీఏ), ప్రొఫెసర్ వై.ఎస్. శారద (ఇంగ్లీష్), ప్రొఫెసర్ జోత్సన (జీవ సాంకేతికశాస్త్రం), ప్రొఫెసర్ అరుణ (హోమ్ సైన్స్), ప్రొఫెసర్ రమ్య కుబేర్ (ఫార్మసీ) ఆ గౌరవాన్ని అందుకోనున్నారు. ఆ పురస్కారాన్ని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా అందుకోనున్నారు. వీరి విజయం బోధన, పరిశోధన, విద్యార్థుల మార్గదర్శనంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపు లభించినట్టు వీసీ ఆచార్య ఉమ అభినందించారు. సుబ్రహ్మణ్యంకు ఉత్తమ పురస్కారం చంద్రగిరి : ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలోని అగ్రోనమీ విభాగం ప్రొఫెసర్ డా.డి.సుబ్రహ్మణ్యానికి ఉత్తమ అధ్యాపకుల పురస్కారం లభించింది. బోధన, పరిశోధన, విస్తరణ విభాగాలలో ఆయన చేసిన కృషికి గాను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు, యూనివర్శిటీ అధికారులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
రేణిగుంట : మూడు జిల్లాల్లో పదేళ్లుగా బైక్ దొంగతనాలు చేస్తూ 63 కేసుల్లో నిందితుడిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన దొడ్డ సంతోష్‌ను రేణిగుంట అర్బన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లు రేణిగుంట, చంద్రగిరి, అలిపిరి, తిరుచానూరు, భాకరాపేట, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించినవిగా తెలిపారు. ఎక్కువగా బైక్ దొంగతనం కేసులు ప్రస్తుతం వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయని అన్నారు. అంతర్ జిల్లా దొంగను సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసిన అర్బన్ పోలీసులను అభినందించారు. దొంగను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డును అందించారు. సమావేశంలో ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐలు నాగరాజు, సుధాకర్, ట్రైనీ ఎస్ఐ స్వాతి, రాజశేఖర్, బారుషా, గౌరీ నాయుడు, శీను పాల్గొన్నారు. -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
కలువాయి (సైదాపురం) : మండలంలోని వెంకటరెడ్డిపల్లి నేషనల్ హైవే ఆనుకొని జంక్షన్ వద్ద రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొందరు కూటమి నేతలు దర్జాగా కబ్జా చేశారు. కళ్ల ముందు ఫారెస్టు భూమి నుంచి అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్నా అటవీ అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నా.. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నా.. ఫారెస్టు, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.30 లక్షల విలువైన ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూములను కూటమి నాయకులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఇటీవల కోటూరుపల్లి ప్రభుత్వ భూమి ఆక్రమించిన విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తాజాగా నేషనల్ హైవే ఆనుకున్న ఉన్న భూమి ముందు ప్రభుత్వ భూమి అని, వెనుక పట్టా అని రెవెన్యూ అధికారులు కొత్త కథలు చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల చేతివాటంతో రూ.30 లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కూటమి నేతలు ఆక్రమిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం నేషనల్ హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హైవే జంక్షన్ వద్ద తూర్పు , పడమర 40 నుంచి 50 మీటర్లు విస్తీర్ణం కలిగి ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఆ భూములకు నేషనల్ హైవే అథారిటీ పరిహారం ఇచ్చారు. ఆక్రమణదారులు దర్జాగా హైవే పక్కన భూములు ఆక్రమిస్తున్నా వీరికి తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఇన్చార్జి తహశీల్దార్ వెంకటేశ్వర్లు వివరణ ఇస్తూ..వెంకటరెడ్డిపల్లి జంక్షన్ వద్ద నేషనల్ హైవే ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 360 కొంత ప్రభుత్వ భూమి ఉన్న మాట వాస్తవమేన్నారు. ప్రభుత్వ భూమి వెనుక వైపు పట్టా భూమి అని తెలిపారు. ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. మరి అక్రమంగా మట్టి తోలుతున్న విషయంపై చర్యలపై అడగగా సమాధానం దాటవేశారు. -
ఎస్వీయూకు ఐఎస్ఓ సర్టిఫికేషన్
తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)కు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు లభించింది. గురువారం ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో ఐఎస్ఓ బృందం వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడుకు ధ్రువపత్రాలను అందజేసింది. విద్యా నైపుణ్యం, స్థిరత్వం, సమగ్రాభివృద్ధి, నిబద్ధత వంటి అంశాలపై ప్రగతి సాధించిన వర్సిటీగా అంతర్జాతీయ గుర్తింపు పొంది ఉన్నత శిఖరాలను అధిరోహించిందని వర్సిటీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. వర్సిటీ ఈ స్థాయికి చేరుకోవడంలో బోధన, బోధనేతర సిబ్బంది కృషి ఎనలేనిదని కొనియాడారు. పర్యావరణ ప్రోత్సాహకంలో ఐఎస్ఓ 14001, ఇంధన పొదుపు పద్ధతుల నిర్వహణలో ఐఎస్ఓ 50001, నాణ్యమైన విద్యాసేవలకు ఐఎస్ఓ 21001, అతిథి సేవలు, ఆహార భద్రత విషయంలో ఐఎస్ఓ 22000 గుర్తింపు లభించిందని వర్సిటీ అధికారులు తెలిపారు. అధ్యాపకులే దేశ నిర్మాతలు తిరుపతి సిటీ : అధ్యాపకులు దేశ నిర్మాతలని, వారే దేశ సంపదని ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో గురువారం సాంకేతిక విద్యతో విద్యావ్యవస్థ బలోపేతం అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు గురువారం ముగిసింది. అనంతరం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ–క్రాప్ నమోదులో వెనుకబాటు తిరుపతి అర్బన్ : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ–క్రాప్ నమోదు చేయడంలో బాగా వెనుకబడి ఉన్నారని, వేగవంతం చేయాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో వ్యవసాయశాఖ జిల్లా అధికారి ప్రసాద్‌రావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, జిల్లా పశువైద్యాధికారి రవికుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండలాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 13.48 లక్షల సర్వే నంబర్లకు చెందిన భూముల్లో ఈ–క్రాప్ నమోదు చేయాల్సి ఉందని చెప్పారు. పంట సాగు చేసి ఉంటే చేశారని, చేయకుంటే చేయలేదని వివరాలతో పాటు పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. జూలై 15 నుంచి ఈ–క్రాప్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం 1.72 లక్షల సర్వే నంబర్లకు చెందిన భూముల్లో మాత్రమే ఈ–క్రాప్ పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన 11.76 లక్షల సర్వే నంబర్లలో ఈ–క్రాప్‌ను ఈనెల 30 లోపు పూర్తి చేయాలని వెల్లడించారు. కేవలం 25 రోజుల గడువు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని పూర్తిగా రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో చేపట్టాలని వివరించారు. అలాగే ప్రకృతి వ్యవసాయం సాగును మరింత విస్తరించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో 291 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేసినప్పటికీ, కొత్తగా మరో 726 పంచాయతీలను ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. ఒక్కో పంచాయితీలో 125 మంది రైతులతో 50 హెక్టార్లల్లో ప్రకృతి వ్యవసాయం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శోభనబాబు, మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి సతీష్, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ షణ్ముగం పాల్గొన్నారు. -
రాష్ట్రానికి డబుల్ డెక్కర్ బస్సు తీసుకొచ్చిన ఘనత అభినయ్‌దే..
తిరుపతి మంగళం : తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఉండి 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి సాధ్యం కాని విధంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి డబుల్ డెక్కర్ బస్సును మొదటిగా తీసుకొచ్చిన ఘనత భూమన అభినయ్‌రెడ్డిదేనని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్ తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. బాంబే తర్వాత డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి నగరానికి 2023 సంవత్సరంలోనే భూమన అభినయ్‌రెడ్డి తీసుకొచ్చారన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను సైతం కనువిందు చేసేలా డబుల్ డెక్కర్ బస్సు తిరుపతి పుర వీధుల్లో తిప్పారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2.5 కోట్లను భూమన అభినయ్‌రెడ్డి దుర్వినియోగం చేశారంటూ పచ్చపత్రికల్లో విషపు రాతలు రాశారన్నారు. ఆ తర్వాత డబుల్ డెక్కర్ బస్సును డంపింగ్ యార్డ్‌లోని చెత్త కుప్పల వద్ద కూటమి నేతలు పడేశారన్నారు. అప్పుడు తిరుపతికి శోభ రాలేదా? కూటమి నేతలు చేసింది పచ్చ పత్రికలకు కనపడలేదా? అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు వైజాగ్‌లో డబుల్ డెక్కర్ బస్సును చంద్రబాబు, లోకేష్ ప్రారంభిస్తే అదేదో పెద్ద గొప్ప అన్నట్లుగా వైజాగ్‌కు డబుల్ డెక్కర్ బస్సుతో కొత్త శోభ వచ్చిందని అదే పచ్చపత్రికల్లో రాయడం వారి నీచపు రాతలకు నిదర్శనమన్నారు. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా, పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు రాసినా తిరుపతిని రాష్ట్రానికే ఆదర్శంగా అభివృద్ధి చేసిన ఘనత మాత్రం భూమన అభినయ్రెడ్డిదేననే విషయం అందరికీ తెలుసునన్నారు. -
రైతు భూములపైన రాబందులు
ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లిలో ఓ సామాన్య రైతు సాగు చేసుకుంటున్న పొలం దురాక్రమణకు అధికార పార్టీ అండతో ఓ వ్యక్తి ప్రయత్నించారు. జేసీబీ సాయంతో పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, పొలంలో ఉన్న రేకుల షెడ్డు, వ్యవసాయ బోరు మోటారును ధ్వంసం చేశాడు. బాధితుని కథనం మేరకు.. గుంటకిందపల్లికి చెందిన పరమేశ్వరి, దేవి, వాణిశ్రీ అనే మహిళల పేరుతో సర్వే నంబరు 8లోని 6.1 ఎకరాల పొలాన్ని 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు భూపంపిణీ కింద ఇచ్చారు. అప్పటి నుంచి ముగ్గురు మహిళలు ఆ పొలానికి చుట్టూ ఫెన్సింగ్, లోపల రేకుల షెడ్డు, బోరుమోటారు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమి తనదంటూ ఆనంద్ అనే టీడీపీకి చెందిన నేత గురువారం ఎవరూ లేని సమయంలో పొలం వద్దకు చేరుకుని జేసీబీ తీసుకొచ్చి పొలంలోని రేకుల షెడ్డు, బోరుమోటారును కూల్చివేసి ధ్వంసం చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 70,472 మంది స్వామివారిని దర్శించుకోగా 25,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.85 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 4 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
● వార్తలు రాస్తే కేసులా? ● పోలీసులకు జరిగిన అన్యాయాన్ని ప్రచురిస్తే నిర్భందమా? ● తిరుపతి పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల నిరసన ● సాక్షి ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
తిరుపతి అర్బన్ : ఇదేమి రాజ్యం.. పత్రికల్లో వార్తలు ప్రచురిస్తే కేసులు పెట్టి.. జర్నలిస్టులను భయపెట్టడం ఎంటీ సార్.. రాష్ట్ర చరిత్రలో ఓ వార్త ప్రచురించారని ఏకంగా ఎడిటర్‌పై కేసు పెట్టడం ఇప్పటివరకు జరగలేదు అంటూ తిరుపతి పాత్రికేయులు కూటమి ప్రభుత్వం వ్యవహారంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తంచేశారు. పోలీస్ విభాగానికి సంబంధించి డీఎస్పీల పదోన్నతి అంశంలో జరుగుతున్న లోటుపాట్లతో పోలీస్ అధికారులకు జరుగుతున్న అన్యాయాన్ని సాక్షి పత్రికలో ఓ కథనం ప్రచురిస్తే.. అదే పోలీస్‌లతో అర్ధరాత్రి సమయంలో విచారణ చేపట్టడంతో పాటు ఏకంగా సాక్షి ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డితో పాటు సాక్షి పాత్రికేయులపై కేసులు పెట్టడంపై పాత్రికేయ సంఘాలు మండిపడ్డాయి. ఆ మేరకు బుధవారం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ వద్ద పలు సంఘాల ప్రతినిధులు అక్రమ కేసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వృత్తి సమాజంలో జరుగుతున్న మంచితోపాటు చెడును తెలియజేయడం ద్వారా అధికార యంత్రాంగం తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పత్రికలు పనిచేస్తున్నాయని సంఘాల నేతలు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ ఆలోచన మాత్రం దురుద్దేశపూర్వకంగా ఉందని విమర్శించారు. తప్పిదాలు చోటు చేసుకున్నా, అవినీతి అక్రమాలు కొనసాగుతున్న వాటిని ప్రజలకు తెలియజేయకుండా... తప్పొప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి భజన చేయాలని భావించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మీడియాపై కక్ష సాధింపులకు పాల్పడిన ఏ ప్రభుత్వానికి మనుగడ లేకుండా పోయిందని హెచ్చరించారు. సాక్షి ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఈస్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీనివాసులకు అక్రమ కేసుల అంశాన్ని వివరించారు. పోలీసులకు మద్దతుగా కథనాలు రాస్తే.. అదే పోలీసును ఎడిటర్‌పై కేసులు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. ఆ మేరకు ఓ వినతిపత్రాన్ని ఆయనకు అందించారు. ఈ కార్యక్రమంలో సాక్షి పత్రిక బృందంతో పాటు తిరుపతి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆర్.మురళి, కార్యదర్శి పి.బాలచంద్ర, ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.గిరిబాబు, ఏపీ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కల్లుపల్లి సురేంద్రరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు మబ్బు నారాయణరెడ్డి, జర్నలిస్ట్ సంఘం నేతలు హేమంత్, ప్రసాద్ మోహన్, సుబ్రమణ్యం, చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతలకు అండగా..
సాక్షి ప్రతినిధి, తిరుపతి : అన్నదాతలకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న తిరుపతి, చిత్తూరు జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఆ మేరకు బుధవారం తిరుపతిలోని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, భూమన అభినయరెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, వెంకటేగౌడ్, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, తిరుపతి నగర పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి సమావేశమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మామిడి దిగుబడులకు గుజ్జు పరిశ్రమల వారు కిలో మామిడికి రూ.8, ప్రభుత్వం రూ.4 చెల్లించాల్సి ఉంది. మామిడి దిగుబడులు విక్రయించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించకపోవటాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇంకా రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవటం, యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలపై చర్చించారు. రైతు సమస్యల పరిష్కారం ఈనెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ నేతలు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పలమనేరులో రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, శ్రీకాళహస్తిలో తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్, కుప్పంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, తిరుపతిలో నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
ఔషధ నియంత్రణ అధికారుల దాడులు
తిరపతి తుడా : తిరుచానూరులోని పద్మావతి ఇంటిగ్రేటెడ్ పోలీ హాస్పిటల్ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి ఫార్మసీపై ఔషధ నియంత్రణ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఫార్మసీలో అబార్షన్ మందులు, సరైన కొనుగోలు రికార్డులు లేకుండా పలు రకాల ఔషధాలు నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేశారు. దీంతో పాటు తదుపరి విచారణలో డాక్టర్ శైలజ (హోమియోపతి వైద్యురాలు) తన వద్దకు వచ్చిన రోగులపై అబార్షన్ మందులను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం పై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దాడి సమయంలో 15 ఇన్వాయిస్లు, 18 రకాల మందులు కొనుగోలు ఇన్వాయిస్ లేకుండా నిల్వ ఉంచిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ హరిప్రసాద్, తిరుపతి గ్రామీణ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు పాల్గొన్నారు. -
జాతర ఏర్పాట్లపై దిశా నిర్దేశం
వెంకటగిరి (సైదాపురం) : ప్రసిద్ధి చెందిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మతల్లి జాతర ఏర్పాట్లపై బుధవారం అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు.ఈనెల 10, 11 తేదీలలో వెంకటగిరిలో జరగనున్న పోలేరమ్మ జాతర మహోత్సవానికి సంబంధించి పట్టణంలో పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 40 లక్షలు నిధులు మంజూరు చేసిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. మహిళలకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. జాతర విజయవంతం అయ్యేందుకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీన ప్రత్యేక బాధ్యత తీసుకుంటారన్నారు. గత పొరపాట్లు పునరావృతం కాకుండా నిర్వహణ గత ఏడాది జరిగిన పోలేరమ్మ జాతరలో పొరపాట్లు పునరావృతం కాకుండా ఈ ఏడాది సమర్థవంతంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. పట్టణంలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది వీఐపీ దర్శన క్యూలైన్లు రద్దు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం అమ్మవారి జాతరకు సంబంధించి గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ గీతాకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. కల్యాణ మండపానికి రూ.1.65 కోట్లు మంజూరు వెంకటగిరి రూరల్ : వెంకటగిరి పోలేరమ్మతల్లికి సంబంధించి ఆలయ పరిపాలన భవనం, కల్యాణ మండపం, వాణిజ్య సముదాయానికి సంబంధించి రూ. 1.65 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలోని పీవీ మెస్ పక్కన ఉన్న స్థలాన్ని బుధవారం స్ధానిక ఎమ్మెల్యే, దేవాదాయశాఖ , మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. వెంకటగిరి పోలేరమ్మతల్లికి సంబంధించి పట్టణంలో కమర్షియల్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం, పరిపాలన భవనం నిర్మాణానికి దేవాదాయశాఖ నుంచి రూ. 1.10 కోట్లు , పోలేరమ్మతల్లి దేవస్థానం నుంచి రూ. 40 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీన, తహసీల్దార్ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. పోలేరమ్మతల్లి జాతర రెండో చాటింపు వెంకటగిరి రూరల్ : వెంకటగిరి శ్రీ పోలేరమ్మతల్లి జాతర సందర్భంగా బుధవారం అర్ధరాత్రి దేవాదాయశాఖ అధికారులు , అమ్మవారి సేవకుల సమక్షంలో పట్టణంలోని కాంపాళెం కామాక్షమ్మ గుడి వద్ద రెండో చాటింపు వైభవంగా జరిగింది. అమ్మవారి జాతర వచ్చే బుధవారం జరుగుతుందంటూ తప్పెట్లు, కిలారింపు అరుపులతో కోలాహలంగా నిర్వహించారు. -
రథోత్సవం
రమణీయం..కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం రమణీయంగా రథోత్సవం చేపట్టారు. సిద్ధి..బుద్ధి సమేతంగా స్వామివారిని రథంపై కొలువుదీర్చారు. కళాకారులు నృత్యప్రదర్శనలు.. కోలాటాలు.. మంగళవాయిద్యాల నడుమ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. అశేష భక్తజనులు హాజరై గణనాథుని రథంపై మిరియాలు చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా పండ్ల పరిశ్రమ సంఘం.. ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ వారు అందించిన మామిడి జ్యూస్‌ను భక్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం తిరు కల్యాణం.. రాత్రి అశ్వవాహన సేవ నిర్వహించనున్నట్లు ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. – కాణిపాకం -
ప్రభుత్వ వైఫల్యంతో డయేరియా విజృంభణ
రేణిగుంట : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డయేరియా విలయ తాండవం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లిలో ఇప్పటి వరకు 70 మందికి డయేరియా వ్యాపించగా అందులో ఒకరు మృతి చెందారు. బాలాజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు పండ్లు, ఓఆర్ఎస్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ప్రతి ఇంటికి వైద్యుడిని పంపించి జగనన్న చికిత్స అందించారని గుర్తు చేశారు. డాక్టర్, సీహెచ్ఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసేవారని తెలిపారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ఎక్కడ చూసినా విష జ్వరాలు, ఆరోగ్య సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కోలుకునే విధంగా కలెక్టర్, వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందని జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని మరొక గ్రామంలో ఈ విధంగా జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ సిద్ధ గుంట సుధాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సింగల్ విండో అధ్యక్షుడు గణేష్ రెడ్డి, సర్పంచ్ మంజుల, సీనియర్ నాయకులు గంగయ్య, యోగేశ్వర్ రెడ్డి, గుణశేఖర్ రెడ్డి, రేణిగుంట సర్పంచ్ నగేషం, ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు రఫీ ఉల్లా, మునిరెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలి
తిరుపతి కల్చరల్ : అధికారులు నిబద్ధతతో పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పి.సత్యనారాయణ పిలుపు నిచ్చారు. తుడా కార్యాలయం ఆవరణలోని ఆడిటోరియంలో బుధవారం రాయలసీమ జిల్లాలు తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సంక్షేమ అధికారులు వసతి గృహ విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం పాటు పడాలన్నారు. వసతి గృహాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సంక్షేమ అధికారులను కోరారు. అనంతరం బీసీ సంక్షేమ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. వసతి గృహాల్లో ట్యూటర్లను నియమించి మంచి ఫలితాలు సాధించాలన్నారు. సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ డి.చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ.. ప్రతివారం పరీక్షలు నిర్వహించి మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పద్మావతి మహిళా కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలు పెంపొందించాలన్నారు. స్విమ్స్ వైద్య కళాశాల గుండె వైద్య నిపుణురాలు ప్రొఫెసర్ వనజ మాట్లాడుతూ.. యోగా, ధ్యానం, ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాఘవేంద్ర మీరా, జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి ఎం.భరత్ కుమార్‌రెడ్డి, రాయలసీమ జిల్లాల వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. -
టింబర్ ఉడ్ ప్లాంటేషన్‌పై దృష్టిసారించండి
తిరుపతి మంగళం : సాధారణ వ్యవసాయం తరహాలోనే టింబర్ ఉడ్ ఆధారిత ప్లాంటేషన్‌పై దృష్టి సారించి, లాభదాయకంగా మార్చుకోవాలని అటవీశాఖ తిరుపతి సర్కిల్ పీసీఎఫ్ సెల్వం రైతులకు సూచించారు. తిరుపతిలోని బయోట్రిమ్ కార్యాలయంలో బుధవారం బెంగళూరుకు చెందిన ఐసీఎఫ్ఆర్ఈ– ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్‌సైన్స్ టెక్నాలజీ సహకారంతో తిరుపతి అటవీశాఖ జిల్లా రైతులకు నర్సరీల ఏర్పాటు, వెదురు, శ్రీగంధం, ఎర్రచందనం మొక్కల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, చిత్తూరు పరిధిలో ఎర్రచందనం పెంపకంపై దృష్టిసారించినా, అమ్మకాల్లో అంతర్జాతీయ డిమాండుకు తగ్గట్టు లాభాలు రావడంలేదనో, కటింగ్ పర్మిషన్ ఇబ్బందనో, కొనేందుకు బయ్యర్స్ ముందుకు రావడంలేదనో ఎక్కువగా రైతులు అటువైపు మొగ్గు చూపడంలేదన్నారు. ఎర్రచందనాన్ని కూడా ఒక సాధారణ టింబర్ ఉడ్గా భావించి పెంచితే సాధారణ ఉడ్ ట్రీల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. అయితే వెదురు, శ్రీగంధం పెంపకం చేపట్టినా లాభదాయకంగా ఉంటాయన్నారు. ఏటా 5 కోట్ల మొక్కలను నాటించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు అందిపుచ్చుకుంటే టింబర్ ఉడ్ మొక్కల పెంపకంలో లాభాలను చూడవచ్చునని తెలిపారు. బయోట్రిమ్ స్టేట్ సిల్వికల్చరిస్ట్ నరేందిరన్ మాట్లాడుతూ.. ఏనుగుల వలన నష్టంలేని ఉడ్ బేస్డ్ వెదురు పెంపకాన్ని రైతులు చేపడితే లాభాలు గడించవచ్చునని చెప్పారు. సినిమాలు చూసి ఎర్రచందనం రేటును ఊహించుకుని రైతులు నష్టపోతున్నారన్నారు. జిల్లా హార్టికల్పరల్ అధికారి దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వెదురు పెంపకంపై రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, హెక్టారుకు రూ.32 వేలు రాయితీ రైతులకు అందజేస్తామన్నారు. జిల్లాలో 12 హెక్టార్లలో వెదురు పెంపకం లక్ష్యంగా ఉండేదని ఆసక్తి ఉన్న రైతులు ముందుకు రావాలని సూచించారు. సదస్సులో అసిస్టెంట్ స్టేట్ సిల్వికల్చరిస్ట్ పవన్కుమార్రావు, సబ్ డీఎఫ్‌వో నాగభూషణం, ఐడబ్ల్యుటీ శాస్త్రవేత్త లక్ష్మీనరసింహమూర్తిదొరై, ఏసీఎఫ్ సోమశేఖర్, రేంజర్లు లక్ష్మీపతి, లక్ష్మప్ప, రైతులు పాల్గొన్నారు. -
11న వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 11న తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి మల్లారపు వాసు తెలిపారు. ఈ మేరకు బుధవారం తిరుపతి మారుతీనగర్‌లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం వద్ద పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కె. రోజా, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేగౌడ్, డాక్టర్ సునీల్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, మేయర్ డాక్టర్ శిరీషను కలిసి ఆహ్వానించారు. ఈ సమావేశానికి పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టిజెఆర్. సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు పాల్గొంటారని రాజేంద్ర తెలిపారు. సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ విభాగం నాయకులు తరలిరావాలని కోరారు. -
అయ్యోర్ల అయోమయం !
తిరుపతి సిటీ : గురువు అనే పదానికి అర్థమిచ్చేలా జిల్లా అధికారులు ప్రవర్తించాలి అంటూ తిరుపతి జిల్లాలోని ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. రాజకీయ, కుల, సామాజిక వర్గాలకు అతీతంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని కోరుతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత విద్యను విద్యార్థులకు అందించే నేపథ్యంలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఏటా సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జన్మదినం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో 2025–26 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక రాజకీయ, కుల సమీకరణాలతో ముడిపడుతున్నట్లు ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జిల్లా నుంచి ఇన్చార్జి మంత్రి, స్థానిక నాయకుల పర్యవేక్షణలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూరైనట్లు సమాచారం. అర్హులకు మొండిచెయ్యేనా ! ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ఈ ఏడాదైనా సక్రమంగా జరిగేనా అంటూ ఎదురు చూసిన గురువులకు నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల కోసం జిల్లా నుంచి సుమారు 49 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 8 మందిని మాత్రమే జిల్లా విద్యాశాఖ రెఫర్ చేసింది. ఇందులో అధికార పార్టీ అనుచరులైన అదే సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు ఉపాధ్యాయుల నుంచి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అలాగే గతేడాది సుమారు 75 మందిని ఎంపిక చేసిన జిల్లా విద్యాశాఖాధికారులు అందులో అధికారిక పార్టీకి చెందిన వారే సుమారు 80శాతం ఉన్నారు. ఈ ఏడాది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం సుమారు 120 మంది దరఖాస్తు చేసుకోగా అందులో సామాజిక సమీకరణాలు, రాజకీయ నాయకులు ఒత్తిడితోనే పూర్తి స్థాయి ఎంపికలు జరిగినట్లు సమాచారం. దరఖాస్తు చేసుకోనివారు వెయ్యి మందిపైనే... జిల్లాలో కుల ప్రాతిపదికన, అధికార పార్టీకి అనుచరులుగా గుర్తింపు పొందిన వారిని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నారని, అందుకే తాము కనీసం దరఖాస్తు చేసుకోలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటపడి స్వరం వినిపిస్తే దారుణంగా వ్యవహరిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతారనే భయంతో తాము చెప్పుకోవడలేదని వాపోతున్నారు. దీంతో సుమారు అర్హులైన వెయ్యి మంది ఉపాధ్యాయలు ఉత్తమ అవార్డులకు దరఖాస్తు చేసుకోలేక మధనపడుతున్నారు. ఉత్తమ అవార్డులలోనూ రాజకీయమా ? విద్యార్థుల ఔన్నత్యానికి పాటుపడిన ఉపాధ్యాయులను విస్మరించి, రాజకీయ రంగు పులుముకున్న వారికి అవార్డులు ఇస్తూ గురువు అనే పదానికే అర్థం మార్చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు 75 మందికి పైగా ఉత్తములంటూ అవార్డులు ప్రభుత్వ ప్రకటించడం దారుణం. ఇందులో కనీసం 56 మంది రాజకీయ నాయకులు ప్రోత్సాహంతో ఉత్తములుగా అవార్డులు పొందారు. ఇంత దారుణంగా గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ ఏడాదైనా అర్హులను గుర్తించి ప్రభుత్వం ఉత్తములుగా అవార్డులు అందిస్తుందని ఆశిస్తున్నాం. – ఉపాధ్యాయ సంఘాలు, తిరుపతి జిల్లా పారదర్శకంగానే ఉత్తమల ఎంపిక జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. జిల్లాలో అర్హులైన ప్రతి ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని కోరాం. ఆ విధంగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేసి ఉత్తమ అవార్డులకు అర్హులైన ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వానికి పంపాం. ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. – కేవీఎన్ కుమార్, డీఈఓ, తిరుపతి జిల్లా -
కాపర్ తీగల చోరీలో నిందితుల అరెస్టు
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీ పారిశ్రామికవాడలోని సియోన్ పరిశ్రమలో ఇటీవల జరిగిన కాపర్ తీగల చోరీలో ఐదుగురు నిందితులతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అరుణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 29న సియోన్ పరిశ్రమలో ఎలక్ట్రిక్ తీగలను వేరు చేసి అందులోని కాపర్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్ఐ అరుణ్‌కుమార్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఆ మేరకు బుధవారం సత్యవేడు మండలం మల్లవారిపాళెం ఈస్ట్‌కు చెందిన వెట్టి శరవణ, మల్లవారిపాళెం టౌన్‌షిప్‌కు చెందిన ఎం.రాజేష్, ఇరుగుళం గ్రామానికి చెందిన జి.జానకిరామన్, తడ మండలం వేనాడు గ్రామానికి చెందిన కుదిరి పోతయ్య అలియాస్ నాగరాజు, సూళ్లూరుపేట మండలం పేర్నాడుకు చెందిన నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి వద్ద ఉన్న రూ.2 లక్షలు విలువైన 200 కాపర్ వైర్లు, మూడు మోటారు బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం వారిని సత్యవేడు కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. కేసు ఛేదించడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది ముత్తు, మునిశేఖర్, హరిబాబు, రాజశేఖర్, రాజును జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
కొండపై తట్టకోసమేనా ఈ ఆరాటం
తిరుపతి మంగళం : కొండపైన తట్ట కోసం, దర్శనాల టిక్కెట్ల కోసం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మెప్పు పొందేందుకు కరుణాకర్ అన్నపై అవాకులు చవాకులు మర్యాదగా ఉండదని కిరణ్‌రాయల్‌ను వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్ హెచ్చరించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తిరుపతిలో సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు, కొండ దర్శనం టికెట్లు అమ్ముకున్న దళారీ బతుకును మరిచావా కిరణ్ రాయల్. తిరుపతి బఫున్, జోకర్, దళారీ వంటి సంఘాల అధ్యక్షుడు, వీటికి అంబాసిడర్ కిరణ్ రాయల్ అని చెప్పవచ్చు. వీటితోపాటు దుబాయ్, సింగపూర్ ముఠాలతో సంబంధాలున్నట్లు రాష్ట్రమంతా కోడై కూస్తోంది. భూమన కరుణాకర రెడ్డి అన్నను విమర్శించే స్థాయి నీదా? కొండపైన బ్లాక్ టికెట్లు అమ్ముతూ పోలీసులకు దొరికితే విడిపించమని కరుణన్నను కాళ్లు పట్టుకుని ప్రాథేయపడిన సంగతి మరిచావా? 2017లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సుగాలి ప్రీతి చనిపోతే ఆ సంఘటనను మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అని మాట్లాడడం సిగ్గుచేటు. జగనన్న అధికారంలోకి వచ్చాకే సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల పొలం, ఐదు సెంట్ల ఇంటి స్థలం, రెవెన్యూలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పించిన గొప్ప వ్యక్తి జగనన్న. కరుణాకర్ అన్న లాంటి పెద్దవాళ్లను విమర్శించి ఫేమస్ అవ్వాలనుకుంటే తిరుపతి ప్రజలే పళ్లు రాలగొడతారు. జనసేన పార్టీ నుంచి నిన్ను బహిష్కరించినా సిగ్గు లేకుండా జనసేన కార్యకర్త అని చెప్పుకుని మైకుల ముందు నోటికొచ్చినట్లు మాట్లాడడం సిగ్గు చేటు’’ అంటూ వాసు యాదవ్ ధ్వజమెత్తారు. -
కూటమి అరాచకాలకు చరమగీతం పాడుదాం
రాపూరు/సైదాపురం : కూటమి అరాచకాలకు రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోతున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాపూరులోని బత్తిన పట్టాభిరామిరెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాకాణి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టే దిశగా కూటమి ప్రభుత్వ కుట్రలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా అరాచకాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. యూరియా కోసం రైతులు క్యూలైన్లో ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యను పరిష్కరించాల్సిన ఆశాఖ మంత్రి అచ్చెం నాయుడు రైతులను అవహేళనగా మాట్లాడం సమంజసం కాదని ఆరోపించారు. 2027 జమిలీ ఎన్నికల్లో రామ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెంకటగిరి నుంచే గెలుపు ఆరంభం కానున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కాకాణి పూజిత, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేతలు బత్తినపట్ల పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా అరెస్టు చేయరా?
తిరుపతి రూరల్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని, ముఖ్యంగా దుర్గసముద్రంలోని దళితవాడపై అగ్రకులాల దాడి ఘటనపై ఆమె స్పందించాలని జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేంద్ర డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామంలోని దళితవాడలో బుధవారం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ విభాగం నేతలు పర్యటించారు. ముందుగా అగ్ర కులాలకు చెందిన వారు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన వారిని పరామర్శించి గ్రామంలో ధ్వంసమైన ఇళ్లను పరిశీలించారు. అనంతరం అక్కడే పికెట్ నిర్వహిస్తున్న పోలీసులతో మాట్లాడి దళితులకు రక్షణగా నిలబడాలని, అగ్ర కులాలపై చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకుండా వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలన్నారు. అంతకు ముందు బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు ఎస్సీసెల్ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ.. తాము గ్రామంలో తాగునీరు పట్టుకునేందుకు వెళ్లినా కులం పేరిట అవమానాలకు గురిచేస్తున్నారని, దూరంగా ఉండాలని, తమను మానసికంగా హింసిస్తున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన ఎస్సీ సెల్ నేతలు ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడుతూ.. దళితవాడపై టీడీపీ సానుభూతి పరులైన అగ్రకులాలకు చెందిన వారు కర్రలు, రాడ్లు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడులు చేసి గాయపరిస్తే పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారన్నారు. ఆ కేసులో నిందితులు కళ్లముందే తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయడం లేదన్నారు. దాడిలో భాగస్వాములైన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి దళితులకు రక్షణ కల్పిస్తూ న్యాయం చేయాలన్నారు. అలా చేయని పక్షంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాడుల్లో గాయపడిన బాధితులకు అండగా నిలబడతామన్నారు. పర్యటనలో ఎస్సీ సెల్ నేతలు శెల్వం, మల్లారపు వాసు, శివలతో పాటు అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత జ్యోతి రెడ్డిలు వున్నారు. -
కొనసాగుతున్న కక్ష.. చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు
సాక్షి, తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లిక్కర్ అక్రమ కేసులో భాగంగా దాదాపు 20 మంది బృందంతో వచ్చిన సిట్.. తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు చేపట్టింది. లిక్కర్ కేసులో A 37 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు పెడుతోంది. చిత్తూరులో వైఎస్సార్సీపీ నేత విజయనందరెడ్డి ఇంట్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బీవీ రెడ్డి కాలనీ, నలంద నగర్లో విజయనందరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.చంద్రబాబు సర్కార్.. పోలీసులతో బెదిరింపులకు దిగుతోంది. చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డితో పాటు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సిట్ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి11 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 64,925 మంది స్వామివారిని దర్శించుకోగా 21,338 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 11 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఉచిత బస్సా..మజాకా!
● కండక్టర్, డ్రైవర్‌ను వేడుకున్నా నిలపని వైనం ● బస్సు దిగి 2 కి.మీ నడుచుకుంటూ ఊరికి వెళ్లిన మహిళ చిల్లకూరు : ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసింది. అయితే ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎక్కిన మహిళలకు వారు దిగాల్సిన స్టేజీలో కాకుండా ఎంపిక చేసిన స్టేజీలోనే బస్సును నిలుపుతున్నారు. దీంతో మంగళవారం ఓ మహిళ బస్సు దిగి తన గ్రామానికి 2 కి.మీ. దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గూడూరు మండలం నెర్నూరుకు చెందిన విజయమ్మ వెంకటగిరి డిపో బస్సు గూడూరులో ఎక్కి నెర్నూరుకు టికెట్ తీసుకుంది. స్టేజీ వచ్చిన సమయంలో డ్రైవర్‌కు తాను దిగాలని కోరితే పక్క స్టేజీలో నిలుపుతామని చెప్పి వేగంగా బస్సును తీసుకుని వెళ్లాడు. దీంతో ఆమె బస్సు దిగి తన ఊరికి సుమారు 2.కి.మీ దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఉచిత బస్సు ఎక్కి ప్రయాణం చేస్తే రెండు కి.మీ నడిపించారని ఉచితం అంటే ఇలానే ఉంటుందా అని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలు తాము ఎక్కడి దిగాలని అనుకుంటారో అక్కడే నిలిపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. నేడు పోలేరమ్మతల్లి జాతర రెండో చాటింపు వెంకటగిరి రూరల్ : పోలేరమ్మ తల్లి జాతరకు సంబంధించి బుధవారం రెండో చాటింపు నిర్వహించనున్నారు. కాంపాళెంలోని కామాక్షమ్మ ఆలయం నుంచి పట్టణ పుర వీధుల్లో చాటింపు నిర్వహించనున్నారు. 7న ఘటోత్సవం, 10న అమ్మవారి ఉత్సవం, 11న నిలుపు, నగరోత్సవం, నిష్రమణం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
‘తెల్ల’బోయే దోపిడీ
సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ ఆగినట్లే ఆగి..మళ్లీ యథేచ్ఛగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనూ పలుచోట్ల వర్ధంతి నిర్వహించారు. ప్రధానంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధిలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, తొట్టంబేడు పార్టీ మండల నాయకుడు ఉన్నం వాసు నాయుడు ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు, అలాగే రేణిగుంటలో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పాల్గొన్నారు. అక్షయ క్షేత్రంలో పండ్లు, స్నాక్స్ పంపిణీ చేశారు. స్థానిక నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు హాజరయ్యారు. -
మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
నారాయణవనం : రాజకీయ కుట్రతో లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమమని సత్యవేడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పేర్కొన్నారు. మంగళవారం నారాయణవనం బైపాస్ వైఎస్సార్ సర్కిల్ నుంచి వినాయకస్వామి ఆలయం వరకు ఫ్లకార్డులతో నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అక్రమ కేసు నుంచి క్లీన్చిట్ రావాలని వినాయకస్వామికి అర్చనలు చేసి 108 కొబ్బరి కాయలను కొట్టారు. ఈ సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాదరణ ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ కేసులతో అరెస్ట్ చేస్తే పార్టీ శ్రేణులు భయపడే కాలం చెల్లిపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా జగనన్న ప్రారంభించి, పూర్తి చేసిన పనులు తామే చేసినట్లు కాలం వెలిబుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు. నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రరాజు, మండల కన్వీనర్ సొరకాయలు, ఎంపీపీ దివాకర్‌రెడ్డి, ముఖ్య నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, అన్నాదొరై, రాకేష్ కిరణ్, వైస్ ఎంపీపీ శివశంకర్, ఎంపీటీసీ సభ్యులు రవి, పొన్నుస్వామి, శంకరయ్య, సర్పంచ్‌లు సాయిరవి, తుంబూరు నాగూరు, సుబ్రమణ్యంరెడ్డి, తిరువట్యం నాగూరు, గుణశేఖర్, మురళి, నాయకులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు అప్రజాస్వామికం!
చిత్తూరు అర్బన్: అధికారులకు అనుకూలంగా పత్రికల్లో వార్త రాయకుంటే కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని పాత్రికేయులు ప్రశ్నించారు. పత్రికల్లో ప్రచురితమైన వార్త తమకు నచ్చలేదనే కారణంతో.. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరశిస్తూ చిత్తూరులో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరులో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.లోకనాథన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పలువురు డీఎస్పీలకు పదోన్నతులు రావాల్సి ఉండగా, ఆలస్యం చేయడం వెనుక అక్రమాలు జరిగాయనే కోణంలో ‘సాక్షి’ పత్రికలో వార్త ప్రచురితమైందన్నారు. ఈ వార్తలో ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉంటే అధికారులు ఖండించాల్సిం ఉందన్నారు. అలా కాదని ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనన్నారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే పలు కేసుల్లో స్పష్టత కూడా ఇచ్చిందన్నారు. భావ వ్యక్తీకరణను తెలియచేసే పత్రికల నిర్వాహకులపై కేసులు పెట్టడం సమాజానికి మంచిది కాదన్నారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్ కార్యదర్శి వై.కాలేశ్వరరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెఎం.అశోక్‌కుమార్ మాట్లాడుతూ నిజాలు రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య పాత్రికేయులు వారధిలా పనిచేస్తున్నారన్నారు. నిజాలను పత్రికల ద్వారా ఎత్తి చూపినపుడు వాటిని సరిదిద్దుకోవాల్సిందిపోయి.. తప్పుడు కేసులు పెట్టడం తగదన్నారు. ‘సాక్షి’ ఎడిటర్‌పై నమోదు చేసిన అక్రమ కేసును ఎత్తివేయాలని చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వరకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు శివప్రసాద్, కార్యవర్గ సభ్యులు బాలసుందరం, చంద్రశేఖర్, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు సురేష్, చంద్రప్రకాష్, హరీష్, శ్రీనివాసులు, చిరంజీవి, ప్రవీణ్‌సాయి, జయకుమార్ పాల్గొన్నారు. -
పొదుపు సంఘాలకు రుణాలు
తిరుపతి అర్బన్ : సంవత్సరంలో ఎంత అప్పు కావాల్సి ఉందో పొదుపు సంఘం సభ్యుల నుంచే ముందే సమాచారం తీసుకుంటారని సెర్ప్ సీఈవో వాకాటి కరుణ వెల్లడించారు. మంగళవారం ఆమె తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో పొదుపు సంఘం సభ్యులతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పొదుపు సంఘం లీడర్లతో పాటు డీఆర్డీఏ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలకు తావు లేకుండా మొబైల్ యాప్‌ను సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి పొదుపు సభ్యురాలును లక్షాధికారిగా తయారు చేయడానికి మహిళలు వ్యాపార రంగంలోనూ రాణించాలని చెప్పారు. 2025–25 ఆర్థిక సంవత్సరంలో ఒక్క తిరుపతి జిల్లాలోనే సెర్ప్ వార్షిక రుణ ప్రణాళిక ద్వారా సుమారు రూ.3,200 కోట్లకు పైగా మహిళా సంఘం సభ్యులు వివిధ రుణాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. మరోవైపు కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, పశుసంవర్ధక , ఉద్యానవన , పరిశ్రమలు, చేనేత, హ్యాండీ క్రాఫ్ట్స్ తదితర శాఖల అనుసంధానంతో బ్యాంకు వారి సహకారంతో జీవనోపాధుల కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని డీఆర్డీఏ పీడీ శోభనబాబును ఆదేశించారు. మండలాల వారీగా బ్యాంకు మేనేజర్లు, అనుబంధ శాఖలు, మండల స్థాయి అధికారులు, సెర్ప్ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి మహిళా సంఘం సభ్యుల జీవనోపాధుల పెంపునకు తోడ్పాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శోభనబాబు, అడిషన్ పీడీ ప్రభావతి, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. -
ఎస్వీయూ లక్ష్య సాధనకు కృషి
తిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ స్థాపన లక్ష్యాలను నెరవేర్చే దిశగా కృషి చేద్దామని వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్టార్ ఆచార్య భూపతి నాయుడు పేర్కొన్నారు. మంగళవారం వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 71వ వ్యవస్థాపక దినోత్సవ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉద్యోగ బృందంతో కలిసి ప్రాంగణంలోని టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, మహాత్మా గాంధీ, ఆచార్య గోవిందరాజులు, బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు శ్రీనివాస ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వీసీ ఆచార్య అప్పారావు మాట్లాడుతూ.. వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక గల ఎంతో మంది మహనీయుల కలల్ని నెరవేర్చడానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎస్వీయూ వరల్డ్, ఆసియా ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం పొందిందన్నారు. క్వాంటం టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు ఎంతో ఉన్నత లక్ష్యంతో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీని స్థాపించారని తెలిపారు. యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. రిటైర్డ్ ఉద్యోగి విజయ్ కుమార్ మిమిక్రీ తో అందరినీ అలరించారు. మరో ఉద్యోగి అన్నమయ్య వేషధారణతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ రిజిస్ట్రార్ చంద్రయ్య, నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుర్రంకొండ శ్రీధర్, నెల్లూరు సుబ్రహ్మణ్యం, పలువురు ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. -
ట్రాన్స్ఫార్మర్ల దొంగల అరెస్టు
గూడూరు రూరల్ : పొలాల వద్ద ఉండే ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి రాగి వైర్లను చోరీ చేసే ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 135 కిలోల రాగి తీగలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ కిషోర్‌బాబు తెలిపారు. గూడూరు రూరల్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఓజిలి మండలం ఆర్మేనిపాడు గ్రామానికి చెందిన చిన్నబ్బయ్య, పోలయ్య గూడూరు రూరల్, బాలాయపల్లి, డక్కిలి, చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 24 ట్రాన్ఫార్మర్లను పగులగొట్టి రాగి తీగలను దొంగిలించారు. ఈ మేరకు గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 65 కేజీల రాగి తీగలు, బాలాయపల్లిలో 70 కిలోల రాగి తీగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగలను ఛేదించడంలో రూరల్ ఎస్ఐ మనోజ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణయ్య, శ్రీనివాసరావును అభినందించారు. -
తాళం పడిందా.. గొళ్లెం విరగాల్సిందే!
తిరుపతి క్రైమ్ : నగరంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు గజ దొంగలను మంగళవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్యాం సుందరం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. గత నెల 14వ తేదీన బైరాగిపట్టెడిలో నివాసం ఉన్న టీటీడీ సూపరింటెండెంట్ శ్రీనివాసులు సొంత పనులు నిమిత్తం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. అయితే 18వ తేదీ తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. మంగళవారం ఉదయం మంగళం రోడ్డులోని బొంతాలమ్మ గుడి వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఆటోలో ఉండడం గమనించి వారిని అరెస్టు చేశామన్నారు. తిరుపతికి చెందిన అక్కుర్తి నవీన్, డేరంగుల జగదీష్ ఇరువురు ముఠాగా ఏర్పడ్డారన్నారు. మొదటి నిందితుడు నవీన్ తన అనుచరులతో కలిసి 2019 నుంచి 23 వ సంవత్సరం వరకు సుమారు 21 దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తిరుపతి, ఎంఆర్ పల్లి, అలిపిరి, బైరవ, పట్టిన వంటి ప్రాంతాలలోనే కాకుండా శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ పాల్పడే వారిని తెలిపారు. ఇదే క్రమంలో నవీన్‌కు జగదీష్ పరిచయం కావడంతో ఇద్దరూ కలిసి విలాసాల కోసం దొంగతనాలకు పాల్పడేవారు. బైరాగి పట్టడి లో కూడా దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారని తెలిపారు. వీరి వద్ద మొత్తం 12.50 లక్షలు విలువ చేసే 151 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో వెస్ట్ పోలీస్ స్టేషన్‌లోని ఓ కేసులో 15 గ్రాములు మరో కేసులో 13 గ్రామాలతో పాటు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 123 గ్రాముల బంగారు కేసులో రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ కేసును ఛేదించడంలో సీఐలు చిన్న పెద్దయ్య, ప్రకాష్, శివ కుమార్ రెడ్డి , ఎస్ఐలు ప్రదీప్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ ఎంతగానో కృషి చేశారన్నారు. -
కలుషిత నీటితో కలకలం
రేణిగుంట : మండలంలోని గుత్తివారిపల్లిలో డయేరియా వ్యాప్తి చెంది గ్రామస్తులు ఆసుపత్రి పాలైన తర్వాత అన్ని శాఖల అధికారులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి, పారిశుద్ధ్య పనులు చేసి, బ్లీచింగ్ వేయడం చూసి రోగాలు వస్తేనే అధికారులకు గ్రామాలు గుర్తుకొస్తాయా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గుత్తివారిపల్లిలో సోమవారం నుంచి సుమారు 30 మంది దాకా విరేచనాలు, వాంతులు రావడంతో మంగళవారం ఉదయం వైద్యాధికారులు గ్రామంలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో వైద్య శిబిరం నిర్వహించారు. డయేరియాకు కలుషిత నీరే ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి హాస్పిటల్లో బాధితులను పరామర్శించి వైద్యుల ద్వారా ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు గ్రామంలో పారిశుద్ధ్య లోపం ఉన్నా ఇన్ని రోజులు పట్టించుకోని అధికారులు డయేరియా వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చి శానిటేషన్ పనులు చేయించారు. ఆదుకున్న విలేజ్ క్లినిక్ వైఎస్సార్పీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నిర్మించిన వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఆపదలో ఉన్న సమయంలో ఆదుకుంది. విలేజ్ క్లినిక్‌లో మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రథమ చికిత్సను అందించారు. మాజీ సీఎం ముందు చూపుతో నిర్మించిన విలేజ్ క్లినిక్ ఆపదలో ఉపయోగపడిందని గ్రామస్తులు చర్చించుకోవడం విశేషం.25మందికి డయేరియా రేణిగుంట : మండలంలోని గుత్తివారిపల్లిలో 25 మంది డయేరియా బారిన పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు వైద్యాధికారులు మంగళవారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్సలు అందిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి బాలకృష్ణ నాయక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని గ్రామాన్ని సందర్శించారు. ఇన్చార్జి ఎంపీడీఓ ప్రభురావు గ్రామంలో శానిటేషన్ పనులు చేయించారు. కలుషిత నీటి వల్లే స్థానికులు డయేరియా బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. -
ఫెర్టిలైజర్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
వరదయ్యపాళెం : మండల కేంద్రమైన వరదయ్యపాళెం, చిన్న పాండూరు ప్రాంతాల్లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఏఓ రామాంజనేయ రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ వ్యవసాయశాఖ సిబ్బందితో కలసి దుకాణాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి బిల్లులు లేకుండా అనధికారికంగా నిల్వ ఉంచిన యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఎరువులకు సంబంధించి 15 రోజుల లోపు బిల్లుల వివరాలను తమ దృష్టికి తీసుకువచ్చిన తర్వాతే వాటిని విక్రయాలకు అనుమతులు కల్పిస్తామని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు తప్పనిసరిగా ఎంఆర్పీ ధరలకే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించాలని సూచించారు. ప్రతి దుకాణం వద్ద రైతులకు తెలిసే విధంగా ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. వారి వెంట మండల వ్యవసాయశాఖ అధికారిణి గౌరి, ఏఈఓ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
స్కిల్స్ కాంపిటీషన్ పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ చేతుల మీదుగా ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–25 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి 16–25 ఏళ్ల యువత అర్హులుగా జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం తెలిపారు. ఈనెల 30లోపు ఈకేవైసీ ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందని వెల్లడించారు. స్కిల్ ఇండియా డిజిటల్ హాబ్లో ఎస్ఐడీహెచ్ పొర్టల్లో ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసుకుని ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని వివరించారు. అదనపు సమాచారం కోసం 99666 01867, 72073 89948 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ పోటీల్లో విజేతలకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డును అందిస్తారు. అంతే కాకుండా స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఈ పోటీలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగులు గణేష్, సురేష్, దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఎంబీయూలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు చంద్రగిరి : రెండు రోజుల పాటు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ)లో డేటా సైన్స్ విభాగం, స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ ఆధ్వర్యంలో ఐఈఈఈ–2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ (ఐసీఏసీటీ 2025) కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సదస్సులో కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఎల్ఓటి), సస్టైనబుల్ కంప్యూటింగ్‌లపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక కంప్యూటింగ్ వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారం, డిజిటల్ రూపాంతరానికి మార్గదర్శకంగా ఉండటంలో ప్రాముఖ్యంపై చర్చించారు. ఈ సదస్సు ద్వారా యువ పరిశోధకులు, విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను ప్రదర్శించి, గ్లోబల్ నిపుణులతో చర్చించే వేదికను పొందారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఐఈఈఈకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలకు బస్సుల ఒప్పందం తిరుపతి అర్బన్: తిరమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బస్సుల రాకపోకలపై తమిళనాడు– తిరుపతి జిల్లా ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంగళవారం నగరంలోని డీపీటీఓ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ నెల 23 నుంచి ఆక్టోబర్ 6 వరకు బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. తమిళనాడు నుంచి 150 బస్సులు, తిరుపతి జిల్లా నుంచి 150 బస్సులను తమిళనాడుకు నడపాలని నిర్ణయించారు.డీపీటీఓ జగదీష్, డిప్యూటీ చీప్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాధం, డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజినీర్ బాలాజీ, , తమిళనాడు ఆర్టీసీ అధికారులు మోహన్, గుణశేఖరన్, సేలం పాల్గొన్నారు. -
దుర్గసముద్రంలో కొనసాగుతున్న పికెట్
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో దళితవాడపైకి అగ్రకులానికి చెందిన వారు దాడి చేసిన ఘటనలో గాయపడిన వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడంతో మంగళవారం పోలీసులు పికెట్ కొనసాగించారు. దళితవాడను సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవ్వరినీ రానీయకుండా కట్టడి చేశారు. దాడులు చేసిన ఓ సామాజిక వర్గానికి చెందిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి దళితవాడ వైపు కన్నెత్తి చూడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. సీఐ చిన్న గోవిందు తమ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండగా డీఎస్పీ ప్రసాద్ పికెట్‌ను పర్యవేక్షిస్తున్నారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన చిరంజీవి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఓ సామాజిక వర్గానికి చెందిన మునిప్రసాద్, మాకా హరీష్, జగదీష్, విజయ్, బాలాజీ, గాజుల రవి, పి.భరత్, శ్రీకాంత్, ఎం.లోకేష్, ఎం.శాంతికుమార్, మాకా మహేష్ అను 11 మంది యువకులపై ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. కాగా గ్రామంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, గ్రామాలపై ఎవ్వరు దాడులు చేసినా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. -
క్వారీకి అనుమతులు ఇవ్వొద్దని వినతి
తొట్టంబేడు : తొట్టంబేడు సమీపంలో ఎంఎస్ఆర్ క్రషర్స్ వారి క్వారీకి అనుమతులు మంజూరు చేయవద్దని స్థానికులు కోరారు. సోమవారం బీడీకాలనీ, జగనన్న కాలనీ, న్యూసన్రైజ్ సిటీ లేఅవుట్లోని 75 ప్లాట్ల యజమానులు ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం తమ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి శుద్ధి కేంద్రం, కొత్తగా నిర్మి స్తున్న గిరిజన సంక్షేమ వసతిగృహం ఉన్నాయన్నారు. పదేళ్ల క్రితం క్వారీ మూతపడిందని, ఇప్పుడు మళ్లీ క్రషర్స్ నిర్వాహకులు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆందోళ న వ్యక్తం చేశారు. అయితే ఎన్ఓసీని జారీ చేయవద్దని కోరారు. -
ఎన్నిసార్లు తిరగాలో..
నాకు 70 ఏళ్ల. సరిగా నడవలేను. గుండెకు ఆపరేషన్ కూడా అయ్యింది. నాకు వంశపారంపర్యంగా వికృతమాలలోని సర్వే నంబర్ 182/1లో 88 సెంట్ల భూమి ఉంది. నా ప్రమేయం లేకుండా కొంతమంది పంచాయతీ తీర్మానం చేయించి రాస్ సేవా సమితికి అప్పగించేశారు. దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కింద కలెక్టరేట్లో అర్జీ ఇచ్చా. ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు 9 పర్యాయాలు వినతులు సమర్పించా. సమస్య పరిష్కరించినట్లు మాత్రం మెసేజ్ వచ్చింది. అయితే నా భూమి మాత్రం దక్కలేదు. ఇంకా ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరగాలో తెలియడం లేదు. – ప్రకాష్, పాపానాయుడుపేట, ఏర్పేడు మండలం -
పదహారేళ్లు.. చెరగని జ్ఞాపకాలు
పేదల దేవుడు నువ్వుఅభాగ్యుల ఆరాధ్యదైవం నువ్వుజల ప్రదాతవి నువ్వుఆరోగ్య రక్షకుడివి నువ్వుచదువుల రేడువి నువ్వుసంక్షేమ సారధివి నువ్వునవ సంకల్పానికి నాందివి నువ్వుజవసత్వానికి పునాదివి నువ్వుమమ్మేలిన ‘మహా నేతవి’ నువ్వు16 ఏళ్ల నీ జ్ఞాపకాలు.. అభివృద్ధికి చెరగని సంతకాలునిన్ను ఎలా మరిచేది రాజన్నా.. అంటూ జిల్లా ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలను స్మరించుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : మనసున్నవాడు పాలన సాగిస్తే ఎంత జనరంజకంగా ఉంటుందో.. ప్రజలను ఓటర్లుగా కాకుండా తన వాళ్లుగా చూసే నాయకుడు గద్దెనెక్కితే రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుందో దేశానికి చాటి చెప్పిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువారి గుండెల్లో సంక్షేమ సంతకం చేసి చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయారు. నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం.నాటి ఉమ్మడి జిల్లాలోని మదనపల్లెలో మూతపడిన విజయాడెయిరీని 2008లో పునఃప్రారంభించారు. 5వేల లీటర్లతో ప్రారంభమైన డెయిరీని 70వేల లీటర్ల స్థాయికి పెంచారు. తిరుపతిలో ప్రధాన కూడళ్లను ఏర్పాటు చేసి మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీకృష్ణదేవరాయలు, శంకరంబాడి, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాల స్థాపనకు శ్రీకారం చుట్టారు.తిరుపతి ముఖద్వారంలో పూర్ణకుంభం ఏర్పాటు చేశారు. అలాగే తెలుగుతల్లి విగ్రహం నెలకొల్పారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ సైతం ఆయన హయాంలోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో దేశ, విదేశాలకు చెందిన 2వేల మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు.జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 2006లో శ్రీసిటీ సెజ్‌కు అనుమతులు మంజూరు చేశారు. 2008లో 8 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వందలాది పరిశ్రమలతో శ్రీసిటీ రాష్ట్రానికే తలమానికంగా నిలిచింది. సుమారు రూ.60వేలకు పైగా పెట్టుబడులతో 27 దేశాలకు చెందిన పరిశ్రమలు ఏర్పడ్డాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను తరలించి సాగు, తాగునీరు అందించేందుకు 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 70శాతం పనులు పూర్తి చేశారు. నగరి నియోజకవర్గంలో చేనేతల సంక్షేమానికి చర్య లు చేపట్టారు. రసాయన నీటిని శుభ్రపరిచే కామన్ ఈటీపీ ప్లాంటు ఏర్పాటుకు అనుమతులతోపాటు రూ. 14 కోట్లు మంజూరు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే రోజా ప్లాంటు ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకువచ్చారు. నగరిలో రూ.15 కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పాలకులు ఆ ఆస్పత్రిని 60 పడకలకే పరిమితం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద రూ.5కోట్లతో అభివృద్ధి చేశారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ వారు అదనపు పడకలు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని వితరణగా అందించారు. నగరి మున్సిపల్ పరిధి సత్రవాడ శివారులో రూ.36 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించారు. తదనంతర కాలంలో గాలేరు నగరి ప్రాజెక్టును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఆ ట్యాంక్ ద్వారానే నగరి ప్రజల దాహార్తి తీరుతోంది. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభించారు. 2004 నుంచి 2008 వరకు ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్ చేశారు. వ్యవసాయం దండగని చంద్రబాబు అంటే.. కాదు వ్యవసాయం పండగని వైఎస్సార్ నిరూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 6.40 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలకు సంబంధించి వారి కుటుంబాలకు తక్షణం ఆర్థిక సాయం చేశారు. చంద్రబాబు హయాంలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలకు రూ.50 కోట్లు కేటాయించి పునఃప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో 3.15 లక్షల మందికి గూడు కల్పించారు. శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్ కాలనీ ఏర్పాటు చేసి 11వేల మందికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు.రాజన్నా.. రచ్చబండే సాక్షిచిత్తూరు అర్బన్: ‘రచ్చబండ సాక్షిగా నిను మరువలేం రాజన్నా.. అంటూ అనుప్పల్లె గ్రామస్తులతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు నేటికీ కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు. నీ జ్ఞాపకాలు తలుచుకుని.. తీపి గురుతులు నెమరువు వేసుకుని ఆవేదనకు లోనవుతూనే ఉన్నారు. 2009, సెప్టెంబరు 2న సీఎం స్థాయి వ్యక్తి నేరుగా ప్రజలను కలిసి, వ్యక్తిగత–మౌలిక అవసరాలు గుర్తించి తెలుసుకుని.. వాటి పరిష్కరించే వినూత్న కార్యక్రమానికి నడుంబిగించారు. చిత్తూరులో చేపట్టిన ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే .. రాష్ట్ర మొత్తం అమలు చేయాలని రాజశేఖరరెడ్డి ఆలోచన. ముఖ్యమంత్రి హోదాలో రచ్చబండకు వస్తున్న వైఎస్.రాజశేఖర రెడ్డికి స్వాగతం పలికేందుకు కట్టమంచిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ అందరూ నిరీక్షిస్తున్నారు. సమయం ఉదయం 9.30 గంటలైనా చాపర్ చేరుకోలేదు. పదయినా ఆచూకీ రాలేదు. సమయం దాటుతున్న కొద్దీ సామాన్యుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. రాజన్న అచూకీ లేదనే విషయం ఆలస్యంగా గుర్తించారు. ప్రత్యేకించి ఆ రోజు అనుప్పల్లె గ్రామమంతా వైఎస్సార్ గురించి ఏదైనా తెలుస్తుందేమోనని టీవీలకు అతుక్కుపోయారు. తీరా మరుసటి రోజున చాపర్ పావురాలగుట్ట వద్ద ప్రమాదానికి గురై రాజన్న కన్నుమూశారన్న విషాద వార్తను వినాల్సి వచ్చింది. రాజన్న కూర్చుంటారని ఆశించి భంగపడ్డ రచ్చబండ మూగబోయింది. ఊరు ఊరంతా ఆ మహనీయుడి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. అనుప్పల్లె రావిచెట్టు కిందున్న రచ్చబండ వైఎస్సార్‌ను స్పర్శించలేకపో యానని మథనపడుతూనే ఉంది. రాజన్న వర్ధంతికి ఒకరోజు ముందుగానే గ్రామస్తులు రచ్చబండ వద్దకు చేరుకుని కుమిలిపోవడం కనిపించింది.● కుప్పం నియోజకవర్గంలో సైతం వైఎస్సార్ పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పేదల సంక్షేమానికి కృషి చేశారు. అందులో భాగంగా రూ.69.03 కోట్ల విద్యుత్ బకాయిల మాఫీతో పాటు 23,144 మంది రైతులకు చెందిన రూ.60.24 కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేశారు. మరో5వేల మందికి రూ.5వేల వంతున ప్రోత్సాహకాలను అందజేశారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి రూ.55 కోట్లు నిధులు కేటాయించారు. కుప్పం నియోజకవర్గంలో 36 వేల పైగా ఇళ్లను పేదలకు మంజూరు చేశారు. 26 వేల రేషన్, ఆర్యోగశ్రీ కార్డులు అందజేశారు. ద్రవిడ యూనివర్సిటీకి నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. 14 కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అబకలదొడ్డి వద్ద ఐటీఐ ఏర్పాటు చేశారు. శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లె, కుప్పంలో కస్తూర్భాగాంధీ పాఠశాలలను ప్రారంభించారు. నియోజకవర్గంలో 5 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ● తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వైఎస్సార్ మానసపుత్రికగా నిలిచిపోయింది. 2004 సెప్టెంబర్ 30న వర్సిటీ ఏర్పాటుకు బీజం పడింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతి వెటర్నరీ కళాశాల స్వర్ణత్సోవాలకు ముఖ్యతిధిగా హాజరయ్యారు. కళాశాలను యూనివర్సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. 2005 జూలై 15న వర్సిటీ గుర్తింపునిచ్చారు. రూ.145 కోట్లు కేటాయించి అభివృద్ధికి బాటలు వేశారు. ప్రస్తుతం ఈ వర్సిటీ పరిధిలో 35 కళాశాలు ఉన్నాయి. 3వేల పైగా విద్యార్థులు చదువుతున్నారు. 305 మంది అధ్యాపకులు, 2,545 మంది బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సత్యవేడులో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, ఒక తమిళ మీడియం స్కూలు ఏర్పాటు చేశారు. ఉబ్బలమడుగు, భూవతేశ్వరకోన, రాళ్లవాగు నీటి ప్రాజెక్టులను చేపట్టారు. రూ.5.50 కోట్లతో భూపతేశ్వరకోన ప్రాజెక్టు, రూ.19 కోట్లతో ఉబ్బలమడుగు ప్రాజెక్టు నిర్మించారు. తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి చెరువులకు నీటిని నింపేందుకు రూ.100 కోట్లతో ఉపకాలువలు నిర్మించారు. సోమశిల–స్వర్ణముఖి కాలువకు 2009లో శ్రీకారం చుట్టారు. వెంకటగిరి నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. మరో 10 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో 30 వేల ఎకరాల సాగు నీరు అందించేలా ప్రాజెక్టుకు లక్ష్యాలను నిర్దేశించారు. -
వ్యవసాయం.. అభివృద్ధే లక్ష్యం
చంద్రగిరి : వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జయలక్ష్మీదేవి స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలు బ్లాక్‌లను ప్రారంభించారు. అనంతరం స్వర్ణముఖి అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులకు మంచి చేస్తూ, సాగును సంబరంగా మార్చేందుకే ఎన్జీ రంగా వర్సిటీ ఏర్పాటైందన్నారు. అందులో భాగంగా వివిధ పరిశోధనలు చేపట్టినట్లు, కొత్త ప్రాజెక్టులను అమలులోకి తీసుకువసున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే వ్యవసాయ కళాశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్, డీన్ ఆఫ్ అగ్రి ఇంజినీరింగ్, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, డీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, డీన్ స్టూడెంట్ అఫైర్స్ వంటి కీలక పదవులను నియమించినట్లు వివరించారు. వర్సిటీ నెలకొల్పి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాపట్ల, తిరుపతి వ్యవసాయ కళాశాలల్లో బాలికల వసతి గృహాల నిర్మాణానికి రూ. 3 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు వెల్లడించారు. -
ఎరచ్రందనం కేసులో ఒకరికి జైలు
తిరుపతి లీగల్ : ఎర్రచందనం కేసులో తమిళనాడుకు చెందిన కె.అన్బుకు ఐదేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి ఎరచ్రందనం కేసుల న్యాయమూర్తి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. 2016 డిసెంబర్ 8వ తేదీ శేషాచలం అటవీ ప్రాంతంలో ఎరచ్రందనం దుంగలను తరలిస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.రోడ్డు ప్రమాదంలో టీటీడీ ఉద్యోగి మృతిఏర్పేడు : మండలంలోని వికృతమాల వద్ద సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మడిబాక పంచాయతీ రాజుల కండ్రికకు చెందిన పి.మునీంద్ర బాబు (59) మృతి చెందాడు . ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి కథనం మేరకు.. టీటీడీలో పనిచేస్తున్న మునీంద్రబాబు ద్విచక్రవాహనంపై వెళుతుండగా పంది అడ్డురావడంతో అదుపు తప్పి పడిపోయి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కోట:మండలంలోని తిమ్మనాయుడుపాళెంలో సోమవారం విద్యుదాఘాతంతో వరికోత మిషన్ ఆపరేటర్ మృతి చెందాడు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా గుడుగులదిన్నె గ్రామానికి చెందిన రవి(23) వరికోత మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తిమ్మనాయుడుపాళెం వద్ద పంట కోసేందుకు వెళుతుండగా మిషన్‌కు విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. ఎస్ఐ పవన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్వేయర్‌కు తప్పిన ప్రమాదం సూళ్లూరుపేట : సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహించే భవనం పెచ్చులూడుతోంది. సోమవారం ఓ గదిలో పెచ్చులూడి పడడంతో సర్వేయర్ కుర్చీ విరిగిపోయింది. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ గోపీనాథ్‌రెడ్డి అక్కడకు చేరుకుని సర్వేయర్ గదిని పరిశీలించారు. ఆ గదికి తాళం వేసేసి మరోచోట కూర్చోవాలని సర్వేయర్‌ను ఆదేశించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. -
సర్వర్ పని చేయక పింఛను లబ్ధిదారుల ఇక్కట్లు
చిల్లకూరు: గూడూరు నియోజకవర్గంలో సచివాలయ, మండల పరిషత్ సిబ్బంది సోమవారం పింఛను పంపిణీ కోసం ఆయా గ్రామాలకు వెళ్లారు. ఉదయం 11 గంటల వరకు సర్వర్ పనిచేయక పోవడంతో లబ్ధిదారులు ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా కూర్చుని పడిగాపులు పడాల్సి వచ్చింది. ఒక లబ్ధిదారునికి పింఛను ఇచ్చేందుకు 45 నిమిషాలు పట్టడంతో మిగిలిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూడూరులోని కోనేటి మిట్ట, వాముల మిట్టలలోని లబ్ధిదారులు ఒక చోటకు రావడంతో సచివాలయ సిబ్బందిని చుట్టు ముట్టి పింఛను తొందరగా పంపిణీ చేయాలని వేడుకోవడం కనిపించింది. -
పొదుపు మహిళల ఆవేదన
పొదుపు డబ్బులను మెప్మాలోని కొందరు రిసోర్స్ పర్సన్లు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని సంజీవ్‌గాంధీ కాలనీకి చెందిన ఆర్పీ నౌహీరా రూ.70 లక్షలు పొదుపు నగదును స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తమకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌కు మొరపెట్టుకున్నారు. పింఛన్ కోసం నేను దివ్యాంగురాలిని. గతంలో నాకు వైకల్యం 88శాతంగా నమోదు చేశారు. రీవెరిఫికేషన్లో 85శాతం చేశారు. అలాగే నా కుమారుడు దేదీప్ కూడా దివ్యాంగుడు. గతంలో 100శాతం వైకల్యం ఇచ్చారు. రీవెరిఫికేషన్లో 90శాతంగా తగ్గించారు. మేము రూ.15వేల పింఛన్‌కు అర్హులం. అయితే మాకు రూ.6వేలే వస్తున్నాయి. మాకు న్యాయం చేయండి. – లక్ష్మిప్రియ, దేదీప్, తిమ్మినాయుడుపాళెం, తిరుపతి -
చిచ్చు పెట్టిన నిమజ్జనం
తిరుపతి రూరల్ : వినాయక నిమజ్జనం దుర్గసముద్రం గ్రామంలో చిచ్చు పెట్టింది. గణపతి విగ్రహంతో వచ్చా రని దళితులపై టీడీపీ స్థానిక నేతలు సోమవారం ఉదయం గొడవకు దిగారు. అక్కడితో ఆగకుండా దళితుల ఇళ్లలోకి దూరి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలనే తేడా లేకుండా బండరాళ్లు విసురుతూ భయానక వాతావరణం సృష్టించారు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ చిన్నగోవిందు హుటాహుటిన గ్రామానికి వెళ్లి పచ్చమూకను చెదరగొట్టారు. గాయపడిన దళితులను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఆగ్రహం ఘటనాస్థలానికి వచ్చిన టీడీపీ నేత మునిశేఖర్‌ను దళితులు నిలదీశారు. ఇదేనా టీడీపీ ప్రభుత్వంలో మీరు చేస్తున్న మంచి అంటూ మండిపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. పోలీసుల అదుపులో నిందితులు దళితవాడపై జరిగిన దాడిలో ప్రధాన కారకులైన ఒంటెల గణేష్, మాకా హరీష్, మాకా మహేష్, విజయ్, భరత్, శ్రీకాంత్, గాజుల రవి ప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరితో పాటు తిరుపతి నగరం నుంచి దాడిలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తే తమకు సమాచారం అందించాలని దళితవాడ వాసులకు సూచించారు. పోలీస్ పికెటింగ్ దళితవాడలో ఘర్షణల నేపధ్యంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు. బాధితుల స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు. అలాగే ఘర్షణలకు పాల్పడిన వారి పేర్లును నమోదు చేసుకుని త్వరలో అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.