breaking news
Andhra Pradesh
-
రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మఠం ప్రతినిధులు ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ని కలిసిన మఠం ప్రతినిధులు.. ఆహ్వాన పత్రాన్ని అందించారు.ఆగష్టు 8 నుంచి 14 వరకు రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు జరగనున్నాయి. వైఎస్ జగన్‌కు ఆహ్వాన పత్రిక, స్వామివారి జ్ఞాపికను రాఘవేంద్రస్వామి మఠం అసిస్టెంట్ మేనేజర్ నరసింహ స్వామి, ఆలయ సూపరింటెండెంట్ అనంత పురాణిక్ అందజేశారు. -
తప్పుడు సాక్ష్యాలతో కేసులు.. బాబు పాలనంతా అన్యాయమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం.. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ, తప్పుడు కేసుల్లో బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలన్నారు. న్యాయవాదుల సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు అంటూ హమీ ఇచ్చారు. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి అన్నిరకాలుగా తోడుగా, పెద్దన్నగా మీరు ఉంటున్నారు. అడకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. కోరకపోతే దేవుడైనా వరం ఇవ్వడు. పిటిషన్ వేయకపోతే, మీరు వాదనలు వినిపించకపోతే న్యాయం కూడా దక్కదు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారు. నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నాం.బెదిరింపులతో తప్పుడు కేసులు.. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు, ప్రతిష్టలతో ఆడుకోవడం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారు. ప్రలోభాలు పెట్టి, బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా కేవలం తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదులుగా మీ బాధ్యతలు మరింత పెరిగాయి. ఈ సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు. మన ప్రభుత్వం హయాంలో మనం అనేక రకాలుగా న్యాయవాదులకు తోడుగా నిలిచాం. లా నేస్తం పేరిట న్యాయవాదులకు అండగా ఉన్నాం. అట్టడుగు వర్గాలకు తోడుగా నిలిచాం.జీపీలు, ఏజీపీల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చాం. న్యాయవాదుల సంక్షేమ నిధికోసం రూ.100 కోట్లు కేటాయించాం. ఇన్సూరెన్స్ కోసం 1/3 వాటాగా మన ప్రభుత్వమే ఇచ్చింది. ఇన్ని రకాలుగా మనం న్యాయవాదులకు మేలు చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాదిరిగా న్యాయవాదులను కూడా మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానివి అన్నీ అబద్ధాలు, మోసాలే. అన్ని రంగాల్లో తిరోగమనమే. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. పురోగతి, అభివృద్ధి అన్నవి కనిపించడం లేదు. అవినీతి విచ్చలవిడిగా ఉంది.పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు..జగన్ 2.Oలో మీ అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకి పనిచేసే వారికి డేటాబేస్ పెడుతున్నాం. దీని ఆధారంగానే వీరికి గుర్తింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం ఎవరు పనిచేస్తారో, వారికి ప్రాధాన్యత ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో యాప్ కూడా విడుదల చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా.. ఆ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. తన దగ్గరున్న ఆధారాలను, సాక్ష్యాలను యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఆటోమేటిక్‌గా ఇవన్నీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తాయి. అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేయకపోయినా దెబ్బలు తింటున్న వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, అన్యాయంగా బాధ పెట్టించిన వ్యక్తికి కూడా అర్థం కావాలి.లిక్కర్లో భారీగా అవినీతి.. లిక్కర్లో అవినీతి విపరీతంగా ఉంది. ఎంఆర్పీ రేట్లకు మించి అమ్ముతున్నారు. ప్రతీ గ్రామంలోనూ వీధికి ఒక బెల్టుషాపు ఉంది. బెల్టుషాపులకూ వేలం వేస్తున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు. అక్కడ కూడా ఎమ్మార్పీ రేట్లు కన్నా అధికంగా అమ్ముతున్నారు. ఉచిత ఇసుక పేరిట దోపిడీ చేస్తున్నారు. ఉచిత ఇసుక ఎవరికి చేరుతోంది?. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. కొంతమంది పోలీసులు దగ్గరుండి పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు.అమరావతిలో కమీషన్ దందా..అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోంది. చదరపు అడుగుకు రూ.4వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయి. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10వేలు ఖర్చు చేస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారు. 10 శాతం ఇచ్చి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. మనం రూ. 2.49లకు పీపీఏ చేసుకుంటే, దానిపై విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రూ.4.60 పైసలకు పీపీఏ చేసుకుంటున్నారు. అవినీతికి అంతులేకుండా పోయింది. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, మైనింగ్, పరిశ్రమలు నడపాలన్నా.. కమీషన్లు ఇవ్వాల్సిందే. పోలీసులు దగ్గరుండి వీటికి సహకరిస్తున్నారు. కళ్ల ముందే కరప్షన్ కనిపిస్తోంది అని ఆరోపించారు. -
‘డబ్బుల్లేవ్.. అమరావతికి చందాలివ్వండి.. కూటమి క్యూఆర్ కోడ్’
సాక్షి, విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి అని ఎవరికి అడిగినా చెబుతారు. ఆయన మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదు. ఇది ఇప్పటికే ఎన్నోసారు నిరూపితమైంది. ఇక, తాజాగా మరోసారి చంద్రబాబు మాటల్లో మోసం రుజువైంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబు.. దీనికోసం ఇప్పటికే వేల కోట్ల అప్పులు తీసుకురాగా.. మళ్లీ చందాల సేకరణకు నడుం బిగించారు.చంద్రబాబు సర్కార్ అమరావతి కోసం మళ్ళీ చందాలు అనే ప్లాన్ ముందుకు తీసుకువచ్చింది. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాల సేకరణ చేపట్టింది. అమరావతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలంటూ చందాలు సేకరణ ప్రారంభించింది. విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సీఆర్డీఏ వెబ్సైట్ crda.ap.gov.in లో ఇందుకు ప్రత్యేకంగా ‘డొనేట్ ఫర్ అమరావతి’ అనే ఆప్షన్ ఇచ్చారు.ఇక, 2015లో కూడా రాజధాని నిర్మాణం కోసం ‘మై బ్రిక్..మై అమరావతి’ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరణ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో ఈ-ఇటుకను రూ.10 పేరుతో విరాళాల సేకరించారు. అప్పటి విరాళాలు ఏమయ్యాయో లెక్కను మాత్రం సీఆర్డీఏ ఇప్పటి వరకు చెప్పకపోవడం విశేషం. మళ్ళీ ఇప్పుడు విరాళాల సేకరణకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. కాగా, అమరావతికి అప్పులు పుట్టక చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరణ చేపడుతున్నట్టు పలువురు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. చంద్రబాబు ఇప్పటికే అమరావతి కోసం 31 వేల కోట్లు అప్పులు చేశారు. మరో 70వేల కోట్ల అప్పులు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.రైతులతో మంత్రి భేటీ..ఇదిలా ఉండగా.. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అమరావతి రైతు జేఏసీ నాయకులతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం అమరావతి రైతులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని జేఏసీ నేతలు బహిరంగ విమర్శలు చేసిన తర్వాత సమావేశం అవుతున్నారు. అమరావతిలో రైతులు కేటాయించిన ప్లాట్లు డెవలప్ చేయట్లేదని, భూముచ్చిన రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నాలుగు రోజుల ముందు అమరావతి జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అమరావతి రైతులు.. సీఆర్డీఏ కార్యాలయాల్లో రైతులను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని, పనిచేయాలంటే లంచాలు అడుగుతున్నారని బహిరంగ విమర్శ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. -
ప్రాణం తీసిన.. ఫస్ట్ నైట్
శ్రీ సత్యసాయి జిల్లా: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది.నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన గదిలోకి వెళ్లిన నవవధువు గది పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి యువతి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై ఎస్సై రమేశ్‌బాబు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఉద్యోగం ఇప్పిస్తామని టోకరా!
ఆదోని అర్బన్: సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని ఐదుగురితో ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున తీసుకుని, అడిగితే అంతు చూస్తానని బెదిరించిన ఇద్దరిపై 420 కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆదోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాట్లాడారు. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బంధువు గుమ్మనూరు నారాయణ, ఆమ్ఆద్మీ పార్టీ మాజీ ఇన్చార్జి నూర్‌అహ్మద్ చెప్పి, ఆదోనికి చెందిన వెంకటేశ్, ప్రశాంత్, అనంతపురానికి చెందిన భాస్కర్, అశోక్, ఇమ్రాన్ నుంచి రూ.5 లక్షలు తీసుకున్నారు. వీరిని నమ్మించి ఉద్యోగాలు వస్తే ఒక్కొక్కరు రూ.3 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. అడ్వాన్సుగా ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున రూ.5 లక్షలు వసూలు చేశారన్నారు. ఐదుగురిని నమ్మించేందుకు నూర్‌అహ్మద్, నారాయణ ఫోన్‌పేకు రూ.75 వేలు పంపాడని తెలిపారు. నారాయణకు డబ్బు ముట్టిందని, ఉద్యోగాలు కచ్చితంగా వస్తాయని ఆ ఐదుగురు నమ్మారు. తీరా ఉద్యోగాలు రాకపోవడంతో ఇచ్చిన డబ్బు అయినా తిరిగివ్వాలని కోరగా కాలయాపన చేశారన్నారు. గట్టిగా అడగడంతో ‘మీ అంతు చూస్తాం’ అని బెదిరించారని తెలిపారు. దీంతో ఐదుగురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుమ్మనూరు నారాయణ, నూర్అహ్మద్లపై 420 కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సీఐ వెల్లడించారు. -
వివాహేతర సంబంధం.. నాటు తుపాకీతో కాల్పులు
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెద మల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో భార్యాభర్తలపై ఓ వ్యక్తి నాటు తుపాకితో కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కాకర చంద్రబాబు, కుమారి భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఓకుర్తి గ్రామానికి చెందిన ముళ్ల మణికంఠకు, కుమారికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ఓకుర్తిలో సహజీవనం చేశారు. పెద్దల సమక్షంలో చర్చల అనంతరం కుమారి పది రోజుల కిందట భర్త, పిల్లల వద్దకు చేరుకుంది. మణికంఠ ఆదివారం అర్ధరాత్రి నాటు తుపాకితో శృంగధార గ్రామంలోని చంద్రబాబు ఇంట్లోకి ప్రవేశించాడు. భార్యాభర్తలపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో చంద్రబాబు, కుమారి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. -
విష జ్వరంతో దంపతులు మృతి
బాపట్ల జిల్లా: విషజ్వరాలతో దంపతులు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లాలో కలకలం రేపుతోంది. రేపల్లె నియోజకవర్గం నగరం మండలం ఈదుపల్లి గ్రామానికి చెందిన తుమ్మల సుబ్బారావు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందాడు. సుబ్బారావు అంత్యక్రియలు అయిన గంటల్లోనే అతని భార్య మహాలక్ష్మి జ్వరంతో సోమవారం కన్ను మూసింది. దీంతో ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు. కాగా, గ్రామాన్ని విష జ్వరం పట్టి పీడిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల నుంచి పరిస్థితి ఇలా ఉన్నా ఒక్క అధికారి కూడా గ్రామం వైపు కన్నెతి చూడలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై చిన్నమట్లపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పుష్పేంద్రకుమార్ మాట్లాడుతూ ఈదుపల్లిలో జ్వరంతో దంపతులు మృతి చెందడం తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించి జ్వరపీడితులను గుర్తించామన్నారు. నాలుగు డెంగీ కేసులు ఉన్నట్టు చెప్పారు. మంగళవారం నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మంత్రి మనోహర్‌కు మహిళల షాక్!
పాడేరు: ‘గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. కానీ రూ.1,050 చెల్లిస్తున్నాం. కొందరికి రాయితీ సిలిండర్ల నగదు అసలు జమ అవలేదు. ఎప్పుడు అవుతుంది. ఇప్పటివరకూ ఉచిత సిలిండర్ ఒకటి మాత్రమే ఇచ్చారు. ఉన్న పింఛన్లు ఊడగొట్టారు. జీసీసీ డిపోలో పంచదార, బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తారు?’ అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మహిళలు నిలదీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మినుములూరులో పలువురు మహిళలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసి రెండు నెలలు కావస్తున్నా కూలీ సొమ్ము జమ చేయడం లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తమ గ్రామంలో 15 మంది పింఛన్లు ఎందుకు తొలగించారని సర్పంచ్ లంకెల చిట్టమ్మ ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. జీసీసీ డిపోల్లో మరిన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుతామన్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీ అదనంగా నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కమాండర్ జీపుల సహాయంతో వృద్ధుల ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేస్తామన్నారు. అనంతరం ఆయన సుండ్రుపుట్టు డీఆర్ డిపోతో పాటు పాడేరు జీసీసీ గోదామును పరిశీలించారు. కాగా, మంత్రి నాదెండ్ల పర్యటనలో జీసీసీ చైర్మన్, టీడీపీ నేత కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. -
తమ్ముడూ.. రాఖీ కట్టలేనేమోరా!
ఉయ్యూరు(పెనమలూరు): వరకట్న వేధింపులకు నవవధువు బలైంది. భర్త, అత్తమామల హింస, వేధింపులు తాళలేక తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఉయ్యూరు పట్టణ పోలీసుల కథనం మేరకు.. ఉయ్యూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో నివాసం ఉంటున్న జూనియర్ కళాశాల లెక్చరర్ వర్రె శ్రీ విద్య(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివాహం అయినప్పటి నుంచీ.. మొవ్వ మండలం కొండవరానికి చెందిన శ్రీవిద్యకు కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌తో ఐదునెలల క్రితం వివాహం జరిగింది. అరుణ్‌కుమార్ కలవపాముల సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్నారు. వీరు ఉయ్యూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. శ్రీ విద్య ఉయ్యూరు పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. వివాహం అయిన నాటి నుంచి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. కట్నం తీసుకురమ్మంటూ, అందంగా లేవంటూ తన మాజీ ప్రియురాలి మాదిరిగా లేవంటూ అరుణ్‌కుమార్ హింసించటం మొదలుపెట్టాడు. భర్తతో పాటు అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. మరో మారు గొడవ.. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. అరుణ్‌కుమార్ హింసించటం, కొట్టడం చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీవిద్య ఇంట్లో గొడవ జరుగుతున్న విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి, ఉయ్యూరులోని సమీప బంధువును ఆ ఇంటికి పంపించారు. శ్రీవిద్య విగతజీవిగా కనిపించింది. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ రామారావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీవిద్య భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అల్లుడే చంపాడు.. శ్రీ విద్య ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు తమ అల్లుడు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ రోధించారు. ఈ మేరకు పోలీసులకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులకు శ్రీవిద్య బలైనట్లు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు. తమ్ముడూ.. రాఖీ కట్టలేనేమోరా!శ్రీవిద్య సూసైడ్ నోట్ కలకలం సృష్టిస్తోంది. భర్త, అత్తమామలు సాధించిన తీరును ఆ లేఖ తేటతెల్లం చేసింది. ‘అమ్మా.. నాన్నా.. నాకింక బతకాలని లేదు. తాగి వచ్చి.. నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు. తన ప్రియురాలిలా అందంగా లేనంటూ హింసిస్తూ, కొడుతున్నాడు. భరించలేకపోతున్నాను. మీరంటే ఇష్టం. తమ్ముడూ.. నీకు రాఖీ కట్టలేకపోవచ్చేమో? అమ్మా, నాన్నను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ శ్రీవిద్య రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో పనిచేసే సహచరులు, కుటుంబ సభ్యులు ఆ లేఖను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
‘ఆర్టీఈ అడ్మిషన్ల’తో సర్కారు ఆటలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. సకాలంలో ఒక్క నిర్ణయం తీసుకోకుండా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. ఇప్పటికే ఫీజుల ఖరారులో తీవ్ర జాప్యం చేసింది. ఆ సాకుతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్టీఈ కింద అడ్మిషన్లు నిరాకరించినా చోద్యం చూస్తోంది. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడంతో మరోసారి ఆర్టీఈ కింద అడ్మిషన్ల పేరుతో కొత్త నాటానికి తెరతీసింది. ఐదు కిలో మీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం నోటిఫికేషన్ ఇచి్చంది. జూన్‌లోనే పూర్తవ్వాల్సిన అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టులోనూ కొనసాగించడం గమనార్హం. నష్టం జరిగాక తీరిగ్గా ఫీజుల నిర్ణయం ఆర్టీఈ చట్టం–2009 కింద ప్రైవేటు స్కూళ్లల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ప్రతి విద్యా సంవత్సరం మే నెలలో నోటిఫికేషన్ ద్వారా ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హత గల విద్యార్థులకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తుంది. గత మూడు విద్యా సంవత్సరాలు సక్రమంగా జరిగిన ఈ ప్రక్రియ 2025–26లో మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అస్తవ్యస్తంగా మారింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెండు విడతల్లో 31,701 మంది పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతిలో సీట్లు కేటాయించారు.అయితే, ప్రభుత్వం చెల్లించే ఫీజులను సకాలంలో ఖరారు చేయలేదు. దీంతో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ఆర్టీఈ కింద అడ్మిషన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాయి. పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిపోవడంతో జూలైలో కొందరు పూర్తి ఫీజు చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నారు. ఆ తర్వాత తీరిగ్గా ప్రభుత్వం జూలై 24వ తేదీన ఫీజులు ఖరారు చేసింది. అప్పటికే విద్యార్థులకు నష్టం జరిగిపోయింది. మొత్తంమ్మీద 31,701 మందిలో సగం మందే ఆర్టీఈ కింద సీట్లు పొందినట్లు సమాచారం. ఇప్పుడు అడ్మిషన్లు ఇస్తాం.. ఫీజు కట్టుకోండి.. ఇప్పటి వరకు ఆర్టీఈ కింద సీట్లు పొందేందుకు విద్యార్థుల ఇళ్లకు 3 కి.మీ. పరిధిలోని ప్రైవేటు స్కూళ్లకే అవకాశం ఉంది. ఆ పరిధిని 5 కి.మీ. వరకు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐదు కిలో మీటర్ల పరిధిలోని ప్రైవేటు స్కూళ్లల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆసక్తి చూపేవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు ఆర్టీఈ కింద సీట్లు పొందేవారు ఫీజును స్వయంగా చెల్లించుకుంటామని రాసివ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వాస్తవానికి పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావొస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఆర్టీఈ ప్రవేశాలను పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. -
పనికిమాలినదానా... నీకు గంగజాతరే..
సాక్షి, అమరావతి: అధికారం మత్తులో టీడీపీ నాయకులు సభ్యత, సంస్కారం, విచక్షణ కోల్పోయి మహిళలను బూతులు తిడుతూ బెదిరిస్తున్నారు. తాజాగా చిత్తూరు నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు షణ్ముగం అదే నగరానికి చెందిన వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలికి ఫోన్‌చేసి తీవ్రంగా దుర్భాషలాడాడు. పనికిమాలినదానా.. నీకు గంగజాతరే.. అంటూ హెచ్చరించారు. ఆయన మాట్లాడిన మాటలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటనలో పాల్గొన్న వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.జైలులో ఉన్న వారిని శనివారం వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తదితరులు వెళ్లి పరామర్శించారు. దీనిపై టీడీపీ నాయకుడు షణ్ముగం విలేకరుల సమావేశం పెట్టి వైఎస్సార్సీపీ శ్రేణులపై ఆరోపణలు చేశారు. అతని ఆరోపణలను వైఎస్సార్సీపీ వారు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. అందులో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు కూడా ఉన్నారు. ఆమె ఖండించడాన్ని జీరి్ణంచుకోలేని టీడీపీ నేత షణ్ముగం ఫోన్‌చేసి పత్రికలో రాయలేని పదజాలంతో దూషించాడు. టీడీపీ నేత బూతుపురాణం ఇలా... షణ్ముగం: హలో.. ఏంటీ విషయం.. మహిళా నాయకురాలు: మీరు చెప్పాలి.. మమ్మల్ని అడుగుతున్నారు.. ఏంటీ విషయమని.. షణ్ముగం: ఏమీ ఎక్కువ పెడుతున్నావ్.. ఏం కథా.. మహిళ: మీరు ఎక్కువ పెట్టలేదా? భయపడాలా ఎట్లా.. ప్రశి్నంచాం. ధైర్యముంటే సమాధానం చెప్పాలి. మీరెవ్వరూ మా నాయకులు (మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి) గురించి మాట్లాడడానికి? షణ్ముగం: పత్రికలో రాయలేని భాషలో బూతుపురాణం అందుకున్నాడు. నీవు ఎలాంటి పనికిమాలినదానివో. ఎందుకు కౌంటర్ ఇచ్చావ్.. లం.. ముండవు నువ్వు. నీది బ్రోకర్ బతుకే. లం..దానివి. నీ బతుకంతా టూటౌన్ సీఐ చెబుతున్నాడు. లం.. నీ.. ఫోన్ పెట్టవే. నిన్నేమైనా మీ నాయకుడు.. అంటూ రాయలేని భాషలో బూతుపురాణం అందుకున్నాడు. మహిళ: నువ్వు ఎన్ని మాట్లాడినా వెంట్రుక కూడా పీకలేవ్. నీవెంతా...నీ బతుకెంతా. రెండో వాయిస్ రికార్డు షణ్ముగం: హలో..(మర్యాదగా) మహిళ: ఇంతసేపు ఎలా అలా మాట్లాడావ్.. నేను మిమ్మల్ని మీరు అని మాట్లాడాను. నన్ను ఎలా ఆ పదంతో మాట్లాడావ్. షణ్ముగం: వాట్సాప్‌లో గ్రూప్ ఎందుకు కౌంటర్ మెసేజ్‌లు ఎందుకు పెడుతావ్. మహిళ: టీడీపీలో నీకు సభ్యత్వం ఉందా. పార్టీలో నువ్వు ఉన్నావా. నువ్వు ఎందుకు మా నాయకుల పేరు ఎత్తుతావ్. మా నాయకుల దగ్గర డబ్బులు తీసుకోలేదా..? నీకేదైనా అయితే టీడీపీ వచ్చిందా? సంస్కారం అనేది మనిషిలో ఉండాలి. కూతురును పోగొట్టుకున్నావ్. ఇంకో ఆడబిడ్డ గురించి అలా ఎలా మాట్లాడుతావ్? నువ్వు నన్ను అంటే.. నేను నిన్ను అంటా. నువ్వు బూతులు మాట్లాడితే..నేను బూతులు మాట్లాడుతా. షణ్ముగం: టీడీపీకి నేను లైఫ్ టైం మెంబర్‌ను. వాళ్ల గురించి వీళ్ల గురించి ఎలా మాట్లాడుతావ్. మహిళ: అన్నీ కల్పించుకొని మాట్లాడొద్దు. మర్యాదగా సార్ అని వాట్సాప్‌లో సమాధానం ఇచ్చా. నీవు ఎలా ముండా.. ముండా.. అని రిప్లై ఇస్తావ్. వయస్సుకి మర్యాద ఇచ్చా. నిన్ను ప్రశ్నిస్తే ముండలా? షణ్ముగం: నీకు చిత్తూరు గంగజాతరే... మహిళ: చిత్తూరు గంగజాతరా కాదు. తిరునాళ్లు చేసుకో.. అంటుండగా షణ్ముగం ఫోన్ కట్ చేశాడు. -
స్కూల్లో కూలి పనులు చేయిస్తున్నారు
నరసాపురం/మైలవరం: ‘మా పాఠశాలలో ఫీజు మొత్తం ఒకేసారి కట్టినవారిని ఒకలా చూస్తున్నారు. విడతలవారీగా కట్టేవారిని మరోలా చూస్తూ కూలి పనులు చేయిస్తున్నారు...’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని పంజా సెంటర్లో ఉన్న నారాయణ స్కూల్ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పాఠశాల నిర్వాహకుల వేధింపులు అధికమయ్యాయంటూ విద్యార్థులు గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసి స్కూల్ వద్దకు పట్టణ ఎస్ఐ జయలక్ష్మి, పోలీసులు వచ్చారు.‘ఫీజులు కట్టకపోతే సిబ్బందికి జీతాలు ఎలా ఇస్తారు...’ అంటూ ఎస్ఐ స్కూల్ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఫీజులు చెల్లించకపోతే తల్లిదండ్రులను అడగాలి. మాతో చెత్త ఎత్తించడం, గ్రౌండ్లో మొక్కలు కోయించడం, బెంచీలు మోయించడం వంటి పనులు ఎందుకు చేయిస్తున్నారు? మంత్రి పాఠశాల కాబట్టి ఎస్ఐ వచ్చి యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడుతున్నారా?’ అని నిలదీశారు. అదే సమయంలో గేటుకు విద్యార్థులు వేసిన తాళాన్ని పాఠశాల సిబ్బంది రాడ్డుతో పగలగొట్టి కొందరు పిల్లలను లోపలికి పంపారు. వారిని ఆందోళన చేస్తున్న విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.దాదాపు రెండు గంటలపాటు విద్యార్థుల ఆందోళన అనంతరం పాఠశాల యాజమాన్యం తరఫు ప్రతినిధులు వచ్చి ఇకముందు విద్యార్థులకు ఎటువంటి పనులు చెప్పకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ రాజన్ క్షమాపణలు చెప్పారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఎస్ఎఫ్ఐ నాయకుడు ముచ్చర్ల త్రిమూర్తులు తదితరులు విద్యార్థులకు మద్దతు తెలిపారు. మైలవరంలో తల్లిదండ్రుల ఆందోళనఎన్టీఆర్ జిల్లా మైలవరం నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అర్హులైనా తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. పాఠశాలల నుంచి విద్యార్థుల డేటాను ఎంఈవో కార్యాలయానికి పంపడంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ నేత దౌర్జన్యం నుంచి రక్షించండి
చిత్తూరు కలెక్టరేట్ : టీడీపీ నేత నుంచి రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా వి.కోట మండలం నడమంత్రం గ్రామానికి చెందిన రైతు చౌడప్ప సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి అధికారులు, సిబ్బంది హతాశులయ్యారు. వెంటనే అక్కడే ఉన్న వైద్య సిబ్బంది రైతుకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనతో బాధితుడి భార్య శ్యామలమ్మ కన్నీరుమున్నీరయ్యారు. తమ గోడును విలేకరుల ఎదుట వెళ్లబోసుకున్నారు.ఆమె కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం నడమంత్రం గ్రామానికి చెందిన చౌడప్ప పేరుతో ఉన్న భూమిని రాసివ్వాలంటూ టీడీపీ నేత కృష్ణమూర్తిగౌడ్ అధికారబలంతో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఇప్పటికే రైతును ఏమార్చి రెండెకరాలు రాయించుకున్నాడు. చౌడప్పకు రెండెకరాల డీకేటీ భూమి ఉండగా అందులో కొంత పక్కవాళ్లకు చెందుతుంది. దీనిని సర్వే చేసి తమకు ఇవ్వాలని ఆన్లైన్లో చౌడప్ప నగదు చెల్లించారు. అయితే టీడీపీ నేత అధికారబలంతో సర్వే సిబ్బందిని రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు.న్యాయం చేయాలని తహసీల్దార్, కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పదిసార్లు వచి్చనా అధికారులు పట్టించుకోలేదు. చివరిసారిగా సోమవారం మరోమారు అర్జీ ఇద్దామని భార్యతో కలిసి చౌడప్ప వచ్చాడు. అయినా అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చౌడప్ప కలెక్టర్ ఎదుటే బ్యాగులో తెచ్చుకున్న పురుగుమందు డబ్బా తీసుకుని తాగేశాడు. ప్రస్తుతం చౌడప్ప చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
పోలీసుల ఓవరాక్షన్... తిరగబడ్డ గ్రామస్తులు
ఉదయగిరి/వరికుంటపాడు: మైనింగ్ మాఫియాకు మద్దతుగా పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్సై కె. రఘునాథ్ దురుసు ప్రవర్తనతో పోలీస్‌స్టేషన్ వద్ద రోజంతా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలివీ.. మండల కేంద్రం వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లిలోని పల్లతిప్పలో మైనింగ్‌కు వ్యతిరేకంగా, పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ ఏకమై వారం రోజులుగా పోరుబాట పట్టారు. ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీకి చెందిన బూత్ కన్వీనర్ షేక్ పీరయ్యను విచారణకు రమ్మంటూ మూడ్రోజులుగా పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు.ఈ క్రమంలో.. సోమవారం ఉ.6 గంటలకు ముగ్గురు కానిస్టేబుల్స్ వచ్చి పీరయ్య తన షాపులో ఉండగా బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న కొంతమంది పీరయ్యను అనుసరిస్తూ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, పోలీసులు పీరయ్యను ఒక్కడినే లోపలికి తీసుకెళ్లి, మిగతా వారిపై దురుసుగా ప్రవర్తించి పంపించివేశారు. ఎస్సై రçఘునాథ్ తెల్లకాగితంపై పీరయ్యతో సంతకం చేయించే విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో పీరయ్య గుండెపోటుకు గురై కుప్పకూలారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతనిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి ఒంగోలు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించారు.స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులుఇది తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు మొత్తం స్టేషన్ వద్దకు చేరుకుని జాతీయ రహదారిపై రాస్తారోకోకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. స్టేషన్ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ ఎస్సై గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకోవడంతో వారు స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం జోరు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో భారీగా పోలీసు బలగాలను దించారు.ఎస్సై క్షమాపణతో శాంతించిన గ్రామస్తులుపీరయ్యను ఎందుకు స్టేషన్‌కు బలవంతంగా తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు నిలదీయగా, ఎస్సై రఘునాథ్ వచ్చి ఉద్యమంలో ఉన్న ఎనిమిది మందిపై కేసు నమోదుచేశామని, అందులో భాగంగా విచారణ కోసం తీసుకొచ్చినట్లు చెప్పారు. అయినా శాంతించని గ్రామస్తులు రాత్రి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. చర్చలకు అçహ్వానం పంపినా, ఎస్సైను సస్పెండ్‌చేసే వరకు స్టేషన్ నుంచి కదలబోమని భీష్మించి కూర్చున్నారు. రాత్రి ఏడు గంటలకు ఎస్సై రఘునాథ్ వచ్చి గ్రామస్తులకు క్షమాపణ చెప్పడంతో వారు వెనుదిరిగారు. -
వివరణలోనూ ‘మస్కా’!
సాక్షి, అమరావతి: నావిగేషన్ ఛానల్ ముసుగులో కృష్ణా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై ‘ఇసుక మస్కా’ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో వివరణ ఇచ్చింది. అక్కడ జరుగుతున్న వందల కోట్ల ఇసుక దోపిడీపై కథనంలో ప్రస్తావించిన కీలకమైన అంశాలకు సమాధానం ఇవ్వకుండా, జిల్లా స్థాయి ఇసుక కమిటీ అనుమతి మేరకే కృష్ణా, గోదావరి వాటర్ వేస్, ఇన్‌ల్యాండ్ కార్గో మూవర్స్ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిపింది. టన్నుకు రూ.215 రేటును కమిటీయే నిర్ధారించినట్లు స్పష్టం చేసింది.ఈ మేరకు సోమవారం గనుల శాఖ గుంటూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. టన్నుకు రూ.215 రేటును నిర్ధారించామని, అందులో రూ.70 నది కట్ట నుంచి స్టాక్ పాయింట్లకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేయడానికి ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. అయితే, వాస్తవానికి ఈ రవాణాకు అసలు ట్రాక్టర్లే ఉపయోగించడం లేదు. నది వద్ద, స్టాక్ పాయింట్ల వద్ద పెద్ద లారీలు, టిప్పర్లు, డంపర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే స్టాక్ పాయింట్లో వినియోగదారుల వాహనాలకు ఇసుక లోడ్ చేసేందుకు టన్నుకు రూ.30 ఖర్చవుతుందని అంచనా వేసినా, ఇందుకు రూ.15 మాత్రమే ఖర్చవుతుందని బోట్స్‌మెన్ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.అన్ని రకాల చార్జీలు కలిపి టన్నుకు రూ.213.75 ఖర్చు అవుతుందని, దాన్ని రౌండ్ ఫిగర్ చేసి రూ.215గా నిర్ధారించినట్లు ప్రభుత్వ పేర్కొంది. రూ.213.75ను రౌండ్ ఫిగర్ చేస్తే రూ.214 అవుతుంది తప్ప రూ.215 ఎలా అవుతుందో గనుల శాఖకే తెలియాలి. దీన్నిబట్టి ఈ రేటు నిర్ధారణ మొత్తం కట్టుకథేనని, చినబాబు చెప్పిన రేటుకు కాంట్రాక్టు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.7.70 లక్షల టన్నుల ఇసుక తవ్వకానికి అనుమతిచ్చామని వివరణలో పేర్కొన్నా, ఇప్పటి వరకు ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు, ఏ స్టాక్ పాయింట్ నుంచి ఎంత ఇసుక తరలించారు.. రాజధాని పనులకు ఎంత ఇసుక సరఫరా చేశారు.. బయటి వారికి ఎంత ఇసుక విక్రయించారు.. ఇంకా ఎన్ని టన్నుల ఇసుక తవ్వాల్సి ఉంది.. వంటి వివరాలేవీ వివరణలో పేర్కొనక పోవడాన్ని బట్టి పరిమితికి మించి 15 లక్షల టన్నులకుపైగా ఇసుకను అడ్డగోలుగా తవ్వినట్లు గనుల శాఖ పరోక్షంగా అంగీకరించినట్లయింది. డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇచ్చిన కంపెనీకి ఉన్న అర్హతల గురించి కనీసం ప్రస్తావించక పోవడాన్ని బట్టి ఆ కంపెనీకి అర్హత లేదనే విషయం స్పష్టమవుతోంది. గనుల శాఖ ఇచ్చిన వివరణ ద్వారానే రూ.వందల కోట్ల విలువైన ‘ఇసుక మస్కా’ నిజమనే విషయం రూఢీ అవుతోంది. -
ఆ రూ.11 కోట్లను విడిగా భద్రపరచండి
సాక్షి, అమరావతి: హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్‌లో రూ.11 కోట్లు జప్తు పేరిట సిట్ ఆడిన డ్రామాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సిట్ జప్తు చేసిన నోట్ల కట్టల నిగ్గు తేల్చేందుకు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచిలో సిట్ అధికారులు రూ.11 కోట్లు డిపాజిట్ చేసిన సీసీ టీవీ వీడియో ఫుటేజీలను భద్రపరచమని ఆదేశించింది. ఆ రూ.11 కోట్లు ఇంకా బ్యాంకులోనే ఉన్నాయా.. లేక కరెన్సీ చెస్ట్‌కు తరలించారా.. అన్నది స్పష్టం చేయాలని పేర్కొంది.కరెన్సీ చెస్ట్‌కు తరలించినట్టయితే అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తేదీ, సమయం వివరాలతో సహా తెలియజేయాలని ఆదేశించింది. అందుకు సంబంధించిన స్టేట్మెంట్లు, లెడ్జర్లు, రికార్డులను కూడా న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొంది. తదనుగుణంగా తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో విస్పష్టంగా ప్రకటించింది. దీంతో సిట్ జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్ల హైడ్రామా కొత్త మలుపు తిరిగింది. సిట్ అధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయమన్నది స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. లేని కుంభకోణాన్ని ఉన్నట్లుగా చూపేందుకు..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపేందుకు సిట్ రూ.11 కోట్లు జప్తు చేసినట్టు కనికట్టు చేసింది. అందుకోసం వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి లొంగదీసుకుంది. వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా విజయేందర్ రెడ్డికి చెందిన హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్‌హౌస్‌లోకి తరలించారు. అనంతరం తనిఖీలో ఆ రూ.11 కోట్ల నగదును గుర్తించి జప్తు చేసినట్టు డ్రామా రక్తి కట్టించారు.ఆ నగదు అంతా రాజ్ కేసిరెడ్డిదేనని.. ఆయన 2024 జూన్‌లోనే అక్కడ ఆ నగదును ఉంచారని కట్టు కథ వినిపించారు. సిట్ కుతంత్రాన్ని రాజ్ కేసిరెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకుగానీ, తన కుటుంబానికిగానీ ఎటువంటి సంబంధం లేదని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. ఆ నగదుకు సంబంధించి వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ యజమాని విజయేందర్ రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు రాజ్ కేసిరెడ్డి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసినట్టు చెబుతున్న నోట్ల కట్టలపై ఉన్న ఆర్బీఐ బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఏసీబీ న్యాయస్థానం ఆ రూ.11 కోట్ల నగదు కట్టలను వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ అధికారులను శుక్రవారం ఆదేశించింది.ప్రభుత్వ పెద్దలు, సిట్ బెంబేలుఈ పరిణామాలతో అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు సిట్ అధికారులు బెంబేలెత్తిపోయారు. ఆ రూ.11 కోట్ల నోట్ల కట్టలను ఆర్బీఐ అధికారులు పరిశీలిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. అందుకే న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ మరో కుట్రకు తెరతీసింది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా విజయవాడ పోలీసులు బ్యాంకు ఖాతాలు నిర్వహించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో డిపాజిట్ చేసేయాలని ఎత్తుగడ వేసింది.సిట్ కుట్రపై ఉప్పందడంతో రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు సత్వరం స్పందించారు. జప్తు చేశామని చెబుతున్న రూ.11 కోట్లను సిట్ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. తద్వారా ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. ఎస్బీఐకి ఇప్పటికే సిట్ తరలించిన రూ.11 కోట్ల నోట్ల కట్టలను మార్చి వేసేందుకు అవకాశం ఉందని ఏసీబీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.కాబట్టి రూ.11 కోట్ల కట్టలను ఇతర నోట్లతో కలపకుండా, పూర్తి వీడియో ఆధారాలతోసహా భద్రపరచాలని సోమవారం వాదనలు వినిపించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఎస్బీఐ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి హక్కులను పరిరక్షించేందుకు, ఆయన లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ నోట్ల సీరియల్ నంబర్లు సహా నోట్ చేసి, విడిగా భద్రపరచాలని స్పష్టం చేసింది. తదనుగుణంగా తదుపరి చర్యలు చేపడతామని పేర్కొంది. -
సూత్రధారి చంద్రబాబే
సాక్షి, అమరావతి : ‘అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలే అన్నీ’ అని ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ పాపులర్ డైలాగ్ ఉంటుంది.. ‘స్వార్థం అన్నది నిజం.. నిస్వార్థం దాని కవచం’ అని కూడా చెబుతాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అక్రమ కేసు నాటకం అంతకు మించిన కుట్ర స్క్రిప్ట్‌తో సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు వివిధ పాత్రలు హఠాత్తుగా తెరపైకి వస్తున్నాయి. అన్నీనూ చంద్రబాబు తన అవసరాల కోసం ప్రవేశ పెడుతున్న పాత్రలే. హఠాత్తుగా నోట్ల కట్టలు ప్రత్యక్షం అవుతున్నాయి.. ఆడియోలు, వీడియోలు ఎల్లో మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కానీ న్యాయస్థానం క్రియాశీలత, అదే ఆడియో వీడియో ఆధారాలతో ఆ కుట్రలు బెడిసి కొడుతున్నాయి. ఈ రెడ్‌బుక్ కుట్ర నాటకంలో విలన్ మాత్రం కచ్చితంగా చంద్రబాబేనన్నది అంతిమంగా నిగ్గు తేలుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు వేధింపులు బెడిసి కొడుతున్నాయి. దాదాపు ఏడాదిగా సీఐడీ, సిట్లు దర్యాప్తు ముసుగులో వేధింపులకు పాల్పడుతున్నా, ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. దాంతో న్యాయస్థానాలు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సిట్ చేతులెత్తేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు తన రెడ్‌బుక్ కుట్ర నాటకంలో కొత్త పాత్రధారులను పక్కా పన్నాగంతో ప్రవేశ పెడుతున్నారు. టీడీపీ మూలాలు ఉన్న వారు, సీనియర్ టీడీపీ నేతల కుటుంబ సభ్యులు, తమ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా లబ్ధి పొందిన వారిని ఏరికోరి తెరపైకి తెస్తున్నారు. వారందరినీ వైఎస్సార్సీపీ నేతలకు సన్నిహితులుగా ముద్ర వేస్తూ.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. అందుకోసం టీడీపీ వీర విధేయ సిట్ అధికారులే స్వయంగా నోట్ల కట్టల జప్తు డ్రామాకు పాల్పడుతున్నారు. తద్వారా పాత్రధారులు టీడీపీ వర్గీయులే.. నోట్ల కట్టలు టీడీపీ వర్గీయులవే.. సిట్ అధికారులూ టీడీపీ వీర విధేయులే.. సూత్రధారి చంద్రబాబేనని స్పష్టమవుతోంది. అయితే ఇంత చేసినా, టీడీపీ కూటమి ప్రభుత్వ తాజా కుట్రలు కూడా బెడిసికొట్టాయి. సిట్ తాజాగా తెరపైకి తెచ్చిన వారందరూ చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలకు అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా బట్టబయలైన వైనం ఇలా ఉంది. టీడీపీ కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా దగ్గరివారే.. టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ, ఏలూరు ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌తో వెంకటేశ్ నాయుడు (ఫైల్) టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడే తీగల విజయేందర్‌రెడ్డి ⇒ మద్యం విధానంపై అక్రమ కేసులో ఏడాదిగా ఎలాంటి ఆధారాలు సేకరించని సీఐడీ, సిట్.. వారం రోజుల క్రితం ఒక్కసారిగా హడావుడి చేశాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్లు జప్తు చేసినట్టు కనికట్టు చేసింది. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఆ ఫామ్‌హౌస్‌లో 2024 జూన్‌లో ఆ నగదును దాచిపెట్టినట్టు చెప్పుకొచ్చింది. సిట్ అధికారులే ఆ రూ.11 కోట్లు తెప్పించి ఈ జప్తు కట్టుకథ వినిపించారు. ⇒ ఈ హైడ్రామాకు సిట్‌కు పూర్తిగా సహకరించింది వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజి యజమాని తీగల విజయేందర్ రెడ్డి. తమ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను అట్ట పెట్టెల్లో అదే కాలేజీకి ఎదురుగా ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో పెట్టించారు. అనంతరం ఆ నగదునే సిట్ జప్తు చేసినట్టు కథ నడిపించారు. ఇంతగా విజయేందర్ రెడ్డి ఈ కుట్రలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు సహకరించారని సందేహం రావచ్చు. ఎందుకంటే ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ తరఫున హైదరాబాద్ మేయర్‌గా, ఎమ్మెల్యేగా చేసిన తీగల కృష్ణా రెడ్డి సోదరుని కుమారుడు. ⇒ తీగల విజయేందర్ రెడ్డికి చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలతో, టీడీపీ అనుకూల మీడియా అధిపతులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ రెడ్‌బుక్ కుట్ర కేసు వీగిపోతోందన్న ప్రమాద ఘంటికలు మోగగానే చంద్రబాబు పక్కా పన్నాగంతో విజయేందర్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. ఆయన సహకారంతోనే రూ.11 కోట్ల నగదు జప్తు డ్రామాకు సిట్ పాల్పడింది. ⇒ కాగా, ఆ నగదును ఆర్బీఐతో తనిఖీ చేయించాలని రాజ్ కేసిరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటే ఆర్బీఐ అధికారులు వచ్చి తనిఖీ చేస్తే.. ఆ నోట్ల కట్టల మీద ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఏమిటన్నది వెల్లడవుతుంది. ఆ నోట్లను ఆర్బీఐ ఎప్పుడు ముద్రించింది.. వాటిని ఎవరు, ఎప్పుడు డ్రా చేశారు.. ఏ బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేశారన్న వివరాలు వెలుగులోకి వస్తాయి. ⇒ 2024 జూన్ తర్వాత ఆ నోట్ల కట్టలు అన్నీ గానీ, వాటిలో కొన్నిగానీ ముద్రించినట్టు వెల్లడైతే.. సిట్ చెప్పింది అంతా కట్టుకథేనని తేలి పోతుంది. ఆ నోట్లను 2024 జూన్ తర్వాత ఏదైనా బ్యాంకు నుంచి డ్రా చేశారని నిగ్గు తేలితే.. ఆ బ్యాంకు ఖాతాదారుడు ఎవరన్నది వెలుగులోకి వస్తుంది. దాంతో ఈ జప్తు కట్టుకథ వెనుక ఉన్న టీడీపీ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది.⇒ అందుకే ఆ నోట్ల కట్టలను న్యాయస్థానం అనుమతి లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో డిపాజిట్ చేసేయాలని సిట్ అధికారులు యత్నించారు. కాగా రాజ్ కేసిరెడ్డి పిటిషన్‌పై సత్వరం న్యాయస్థానం స్పందించడంతో సిట్ కుట్ర విఫలమైంది. ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని.. బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని.. మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో రూ.11 కోట్ల జప్తు హైడ్రామాతో కనికట్టు చేయాలన్న చంద్రబాబు కుట్ర పూర్తిగా బెడిసి కొట్టింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకటేశ్ నాయుడు (ఫైల్) లోకేశ్ బినామీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి⇒ లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే ఈ భేతాళ కుట్ర కథకు చంద్రబాబు పక్కాగా స్క్రిప్ట్ రచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా కేవలం రెండేళ్లపాటు చేసిన రాజ్ కేసిరెడ్డికి ముడి పెడుతూ ఈ అక్రమ కేసు నమోదు చేశారు. తాము చెప్పమన్నట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. విచారణలో రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు కూడా చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించారు. కానీ ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి తిరస్కరించారు. ఆ విషయాన్ని సిట్ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికే వెల్లడించింది. ⇒ అసలు రాజ్ కేసిరెడ్డిని ఈ కపట నాటకంలో ప్రధాన పాత్రధారిగా చేసుకోవాలని చంద్రబాబు ఎందుకు భావించారంటే.. రాజ్ కేసిరెడ్డి.. మంత్రి నారా లోకేశ్ బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి కనుక. కేశినేని చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. ⇒ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని ప్రస్తుతం సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామా(జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. ⇒ ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ ( accounts@wshanviinfraprojects. com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. లోకేశ్ తన బినామీ అయినందునే కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు. ⇒ కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. కేశినేని చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్‌కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. పారని బాబు తాజా పాచిక⇒ అయినా సరే పట్టు వదలని చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా మరో కట్టుకథను వ్యాప్తిలోకి తెచ్చారు. వెంకటేశ్ నాయుడు చార్టెడ్ విమానాల్లో ప్రయాణిస్తున్న ఫొటోలు, వీడియోలు, హీరోయిన్ తమన్నా పక్క సీట్లోనే కూర్చున్న ఫొటోలు ఎల్లో మీడియాకు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడిన డబ్బుతోనే వెంకటేశ్ నాయుడు ఇంతటి జల్సాలు చేశారని.. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారని రకరకాల కట్టు కథలను టీడీపీ సోషల్ మీడియాతోపాటు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా వినిపించింది. ⇒ కానీ ఈ కుట్ర పాచిక కూడా విఫలమైంది. ఎందుకంటే వెంకటేశ్ నాయుడు చంద్రబాబు, లోకేశ్‌లకు అత్యంత సన్నిహితుడన్నది ఫొటో ఆధారాలతోసహా బట్టబయలైంది. వారిద్దరికి ఆయన అత్యంత సన్నిహితుడనే నిజాన్ని ఆ ఫొటోలు బయటపెట్టాయి. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ తరఫున కేంద్ర మంత్రులుగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతోపాటు పలువురితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో మొత్తం కుట్ర డ్రామా బట్టబయలైంది. ⇒ వెంకటేశ్ నాయుడు ప్రయాణించిన చార్టెడ్ ఫ్లైట్ ఎవరిదో తెలుసా.. చంద్రబాబు బీజేపీలోకి పంపిన నేత, ప్రస్తుత ఎంపీ సీఎం రమేశ్ కంపెనీది. టీడీపీ నేతలతో కలిసే వెంకటేశ్నాయుడు ఆ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి చెన్నై, కోయంబత్తూరు తదితర నగరాలకు వెళ్లారు. హీరోయిన్ తమన్నా కూడా అదే ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. కానీ టీడీపీ నేతలతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు కాకుండా తమన్నా పక్క సీట్లో కూర్చున్న ఫొటోనే సిట్ విడుదల చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కానీ పూర్తి ఫొటోలు బయట పడటంతో సిట్ కుట్ర బెడిసి కొట్టింది.చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితుడే వెంకటేశ్ నాయుడు⇒ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్ల జప్తు హైడ్రామా విఫలమవడంతో చంద్రబాబు మరో దుష్ప్రచార కుతంత్రం రచించారు. ఈ కుట్ర కేసులో మరో పాత్రధారిగా వెంకటేశ్ నాయుడు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన హైదరాబాద్‌లో రూ.5 కోట్ల నగదును పరిశీలిస్తున్న వీడియోలను టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేశారు. ఆ రూ.5 కోట్లు నగదు అంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం డబ్బులేనని... 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకే హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధం చేసినవని ప్రజల్ని నమ్మించేందుకు యత్నించారు. ⇒ కాగా, ఆ రూ.5 కోట్లలో 2023 మే లోనే ఆర్బీఐ ఉపసంహరించిన రూ.2 వేల నోట్ల కట్టలు ఉండటాన్ని పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ఆ వీడియో 2023 మే కంటే ముందు తీసిందేనని స్పష్టమైంది. తద్వారా 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకు వైఎస్సార్సీపీ ఆ నోట్లను తరలించడం అంతా కనికట్టేనని తేటతెల్లమైంది. మరోవైపు వెంకటేశ్ నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాపార వ్యవహారాలకు చెందిన నగదును వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడిందన్నది బట్టబయలైంది. -
ఏం చేస్తాం.. వారికి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం.. అది మా తప్పే
సాక్షి, అమరావతి: ఎన్నిసార్లు చెప్పినా కూడా మేజిస్ట్రేట్లు తీరు మార్చుకోకపోతుండడంపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురైంది. ‘ఏం చేస్తాం.. వారికి మేం సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం.. అది మా తప్పే’.. అంటూ నిర్వేదం వ్యక్తంచేసింది. వైఎస్సార్సీపీ నేత తురకా కిషోర్ అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని.. అయినా మేజిస్ట్రేట్ కళ్లు మూసుకుని రిమాండ్ విధించారని హైకోర్టు ఆక్షేపించింది.ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, కోర్టు జారీచేసిన ఉత్తర్వులు, మీడియేటర్ రిపోర్ట్, సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ తదితరాలతో కూడిన పేపర్లను పిటిషనర్ (తురకా సురేఖ) తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి అందచేస్తుండగా, వాటిని తీసుకునేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది(ఎస్‌జీపీ) తిరస్కరించడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు ఏం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టులో తమ ముందే పేపర్లు తీసుకోవడానికి తిరస్కరిస్తారా అంటూ ఏజీపీపై హైకోర్టు ఫైర్ అయింది.పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ తిరస్కరించడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఇచ్చిన పేపర్లను ప్రభుత్వ న్యాయవాది తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో, ఆ పేపర్లను తీసుకుని సీల్డ్ కవర్లో ఉంచి వాటిని తమ ముందుంచాలని రిజి్రస్టార్ (జ్యుడీషియల్)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి (నేటికి) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తుటా చంద్రధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. పోలీసుల తీరుపై హైకోర్టుకు తురకా సురేఖ.. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్‌ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం అసలు తురకా కిషోర్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి.. వాటినెప్పుడు నమోదుచేశారు.. ఎప్పుడు, ఏ ఘటనలో అరెస్టుచేశారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేస్తే ఇప్పుడు అరెస్టా!? ఈ నేపథ్యంలో.. సురేఖ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. ప్రభుత్వ సహాయ న్యాయవాది స్పందిస్తూ.. కిషోర్‌పై పోలీసు కేసులకు సంబంధించి ఎస్పీ తయారుచేసిన వివరాలను ధర్మాసనం ముందుంచారు. అందులో కొన్ని కేసులను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తంచేసింది. ఇందులో.. రెండు, మూడేళ్ల క్రితం ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు తురకా కిషోర్‌ను అరెస్టుచేసినట్లు గమనించిన ధర్మాసనం దీనిపై పోలీసులను ప్రశ్నించింది. కిషోర్‌పై మొత్తం 16 కేసులు నమోదు చేశారని, ఇందులో మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసిన కేసులో ఇప్పుడు హడావుడిగా అరెస్టుచేయాల్సిన అవసరం ఏమొచి్చందని నిలదీసింది. కిషోర్‌తో బలవంత సంతకానికి యత్నం.. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి స్పందిస్తూ.. తురకా కిషోర్ విషయంలో పోలీసులు చట్ట నిబంధనలను అనుసరించలేదన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా వినలేదన్నారు. మేజిస్ట్రేట్ సైతం వాదనలు వినలేదని, దీనిపై అభ్యంతరం చెప్పడంతో అప్పుడు వాదనలు విన్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మేజి్రస్టేట్ యాంత్రికంగా రిమాండ్ విధించారన్నారు. అంతేకాక.. పోలీసులే నేరాంగీకార వాంగ్మూలాన్ని తయారుచేసి, దానిపై కిషోర్‌తో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారని, అయితే.. సంతకం చేసేందుకు అతను నిరాకరించారని తెలిపారు. -
రైతు పక్షాన 'వైఎస్సార్సీపీ' రణగర్జన
సాక్షి, అమరావతి: యూరియా తీవ్ర కొరత... ఎరువులు రాయితీపై దొరకక వెత.. క్యూలైన్లో నిల్చోలేక వ్యథ.. పంట దెబ్బతింటోందనే బాధ... సాగుకు యాతన పడుతుంటే ఆదుకోకుండా చేతులెత్తేసిన ప్రభుత్వం... దీంతో రైతన్న కదంతొక్కాడు... వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపందుకుని ఉద్యమించాడు... సర్కారు నిర్లక్ష్యంపై ఆక్రోశం వ్యక్తం చేశాడు... రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందాల ఆధ్వర్యంలో జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం సమర్పణ కార్యక్రమం విజయవంతమైంది. ప్రతిచోట పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. నాడు రైతే రాజు.. నేడు కష్టాల సాగు కలెక్టరేట్లలో వినతిపత్రాల సమర్పణ అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ... చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు అన్నదాతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతును రాజుగా చూడాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, విత్తనం మొదలు పంట ఉత్పత్తుల అమ్మకం వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపించిందని పేర్కొన్నారు. కానీ, చంద్రబాబు పాలనలో రైతులు ఎరువులు, పురుగు మందుల కోసం క్యూ లైన్లలో వేచి చూడాల్సి వస్తోందని విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్లపైగా అనుభవం ఉందని, సంపద సృష్టించడం తెలుసని మాయమాటలు చెప్పి, ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన చంద్రబాబు, చివరకు రైతులకు సరిపడా యూరియా కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 14 నెలల కాలంలో రాష్ట్రంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటేనే వ్యవసాయ రంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేశారో తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీకి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో అర్జీ అందజేశారు. తక్షణం రైతులకు ఎరువుల సమస్యలు లేకుండా చూడాలని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కోరారు. తిరుపతి కలెక్టరేట్లో భూమన, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు డీఆర్వో నరసింహులుకు వినతిపత్రం ఇచ్చారు. చిత్తూరులో పార్టీ నేతలు కేఆర్జే భరత్ సునీల్‌కుమార్, విజయాందరెడ్డి కలెక్టర్ సుమిత్ కుమార్ గాం«దీకి వినతిపత్రం అందజేశారు. ⇒ వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలతో కలిసి విజయవాడలో కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా మొవ్వలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు చుండూరు రవిబాబు, దద్దాల నారాయణ కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నాయకులు భీమవరంలోని కలెక్టరేట్‌కు తరలివెళ్లి ఇన్చార్జి కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఏలూరులో కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జిలు మేకా ప్రతాప్, కంభం విజయరాజు పాల్గొన్నారు. సాగు అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందించాలని, రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని, లేకుంటే పోరుబాట తప్పదని తూర్పుగోదావరి వైఎస్సార్ సీపీ నాయకులు స్పష్టం చేశారు. కలెక్టర్ పి.ప్రశాంతికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జక్కంపూడి రాజా తదితరులు వినతిపత్రం ఇచ్చారు. ⇒ ఎరువులు సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. ఆయన ఆధ్వర్యాన పార్టీ నేతలు వంగా గీత, తోట నరసింహం, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి వినతిపత్రం అందజేశారు. ⇒ రైతు సమస్యలు పరిష్కరించాలని అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. పార్లమెంటరీ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ పాల్గొన్నారు. ⇒ ఖరీఫ్‌లో వస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు తీసుకుంటున్నారని శ్రీకాకుళం వైఎస్సార్సీపీ నాయకులు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ఫిర్యాదు చేశారు. విజయనగరంలో కలెక్టర్ అంబేడ్కర్‌కు జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు కలెక్టరేట్లో వినతిపత్రాలు అందజేశారు. వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు కలెక్టర్ హరేందిరప్రసాద్‌కు, అనకాపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి.తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు కలెక్టరేట్ రెవెన్యూభవన్‌లో ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు కలెక్టరేట్లో గూడూరు, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జిలు మేరిగ మురళీధర్, ఆనం విజయకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజితలతో కలిసి జాయింట్ కలెక్టర్ కార్తీక్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అందించినది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ పథకమని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వై.ఆరంరెడ్డి దుయ్యబట్టారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జేసీకి వినతిపత్రం సమర్పించారు. -
చినబాబు బాధితుడే బ్లాక్‘మెయిలర్’
సాక్షి, అమరావతి: డ్యామిట్ కథ అడ్డం తిరిగిందంటే ఇదే.. సింగపూర్ ప్రభుత్వంలోని అందరికీ ఏపీతో ఒప్పందాలు చేసుకోవద్దంటూ మురళీకృష్ణ అనే వ్యక్తి ఈ–మెయిల్స్ పంపించాడని, అతను వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అని చినబాబు ఇటీవల శివాలెత్తిపోయారు. అయితే ఈ వ్యవహారంపై సింగపూర్ కంపెనీల ఫిర్యాదుతో పెదబాబు చేపట్టిన పోస్టుమార్టంలో నిర్ఘాంతపోయే వాస్తవాలు బట్టబయలయ్యాయి. ఈ–మెయిల్స్ పంపించి సింగపూర్‌లో రాష్ట్రం పరువు తీసింది చినబాబు బాధితుడేనని తేలింది. దీంతో పెదబాబు చినబాబుకు తలంటారు. అయితే అవన్నీ తనకు తెలీకుండా జరిగాయని తనయుడు చల్లగా జారుకోవడంతో సింగపూర్‌లో పరువుమొత్తం పోయిందంటూ పెదబాబు గగ్గోలు పెడుతున్నట్టు సమాచారం. పెదబాబు పోస్టుమార్టంలో తేలిందేమంటే..! చిలకలూరిపేటకు చెందిన మురళీకృష్ణ అమెరికాలో ఉంటారు. చిలకలూరి పేటలో తనకు ఉన్న భవనం సెటిల్మెంట్ కోసం ఆయన చినబాబు అపాయింట్మెంట్ కోసం యతి్నంచారు. మంత్రి ప్రైవేట్ బృందంలోని ఎ.వంశీని సంప్రదిస్తే అపాయింట్మెంట్కు రూ.38 లక్షలు, భవనం సెటిల్మెంట్కు రూ.కోటికి బేరసారాలు నడిపారు. దీంతో మురళీకృష్ణ అపాయింట్మెంట్ కోసం రూ.38 లక్షలు వంశీ ఖాతాకు జమ చేశారు. చివరకు చినబాబు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మురళీకృష్ణ కడుపు మండింది. ఆగ్రహంతో సింగపూర్ ప్రభుత్వానికి, కంపెనీలకు ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా ఈ–మెయిల్స్ పంపించారు. మెయిల్స్ చూపించి నిలదీసిన సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు అపాయింట్మెంట్లకూ లంచాలు తీసుకుంటారని మురళీకృష్ణచేసిన మెయిల్స్‌ను పెదబాబుకు చూపించి సింగపూర్ కంపెనీలు నిలదీశాయి. మీ పరిపాలన ఇలా ఉంటే ఎలాగని, పెట్టుబడులు పెట్టేందుకు తాము వస్తే తమకూ అపాయింట్మెంట్లు అమ్మరని గ్యారెంటీ ఏమిటని ప్రశి్నంచినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో పెదబాబు ఈ మెయిల్స్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని కూపీ లాగితే చినబాబు అవినీతి డొంక కదిలినట్టు సమాచారం. దీనిపై చినబాబుతోపాటు ఆయన ప్రైవేటు బృందానికీ పెదబాబు తలంటినట్టు తెలుస్తోంది. చినబాబు బాధితుడే బ్లాక్‘మెయిలర్’తొలి నుంచి చినబాబు చిల్లర టీమ్‌పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల మంత్రి అపాయింట్మెంట్ కోసం సంప్రదించిన పదిమంది పారిశ్రామికవేత్తల వద్ద కూడా అతని బృందం డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. చివరకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా చినబాబు బయటకు వెళ్లిపోవడంతో పారిశ్రామిక వేత్తలు కరకట్ట క్యాంపులో రచ్చరచ్చ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చినబాబు అపాయింట్మెంట్ లంచాల వ్యవహారం అధికారపార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీకి రూపకల్పన చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన అబ్కారీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా, కొత్త పాలసీలో లాటరీ పద్ధతి ద్వారా వీటికి అనుమతులు ఇవ్వనున్నారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే రూ.75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు పెట్టాలనే సూచన మంత్రివర్గ ఉప సంఘం నుంచి వచ్చింది.కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజ్, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్‌కు కనీసం 4 అప్లికేషన్లు రావాలనే నిబంధనను పెట్టనున్నారు. బార్ పాలసీలో గీత కులాలకు 10 శాతం బార్లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని లిక్కర్ షాపుల్లో సేల్స్ పెరిగాయని, పొరుగు రాష్ట్రాల్లో సేల్స్ తగ్గాయని అధికారులు తెలిపారు. ఇప్పుడెవరూ అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడం లేదని చెప్పారు. -
ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనం సాధ్యమేనా?
తిరుపతి మంగళం: సినిమాలలో ఏఐ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో గ్రాఫిక్స్ చేసినట్లుగా తిరుమలలో ఎంతమంది భక్తులు వచ్చినా రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తామంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పే మాటలు సాధ్యమేనా? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. సోమవారం సోమవారం తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఇదే అంశంపై అనుమానాలు వ్యక్తం చేశారు.ఇది సాధ్యం కాదన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. వెంటనే బీఆర్ నాయుడు స్పందిస్తూ గూగుల్, టీసీఎస్ సహకారంతో ఏఐ ద్వారా భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. ముందుచూపుతో ఆలోచన చేస్తున్నామన్న ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్ప ఏఐతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం అనేది అసాధ్యం.గూగుల్, టీసీఎస్ సహకారంతో తిరుమలలో ఏఐ టెక్నాలజీని తేవాలనుకుంటున్న చైర్మన్.. ఆ కంపెనీల వారికి టీటీడీ గెస్ట్‌హౌస్‌లు, తిరిగేందుకు కార్లను ఏర్పాటు చేయడం ఏమిటి? క్యూలైన్లలో కనీస వసతులు లేక భక్తులు పడుతున్న అవస్థలు కనిపించడం లేదా? ఏఐతో శ్రీవారి దర్శనం కల్పించడాన్ని భక్తులు హర్షించరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు. భక్తుల రద్దీ పెరిగిందని, మూడో క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు అవసరమని ఇటీవల పాలకమండలి సమావేశంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. శ్రీవారి భక్తులు, సనాతన ధర్మ పరిరక్షకులైన పీఠాధిపతుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ నాయుడు ఆలోచనలు, చర్యలు ఉన్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బాధ్యతలు చేపట్టాక.. 9 నెలల నుంచి టీటీడీలో అన్నీ అపచారాలే చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీకి ఆపాదిస్తారా? టీటీడీలో చోటు చేసుకుంటున్న అపచారాలను, విషయాలను ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వాటిని వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ మీ మీడియాల్లో ప్రచారం చేసుకుంటే ఉపయోగం లేదని భూమన పేర్కొన్నారు. ఇప్పటికైనా వాస్తవాన్ని శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోవాలని సూచించారు. ఉన్న పరిమితుల్లో అవగాహన చేసుకుని భక్తులకు మెరుగైన సేవలందించేందుకు ఆలోచనలు చేయాలని కోరారు. -
రూ.4,150 కోట్ల అంచనాతో విజయవాడ ‘మెట్రో’ తొలి దశ పనులు
సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులకు రూ.4,150 కోట్ల అంచనా వ్యయంతో సోమవారం ఏపీఎమ్మార్‌సీఎల్(ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో 30 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. బిడ్ దాఖలుకు సెప్టెంబర్ 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఫ్రీబిడ్ సమావేశాన్ని ఈ నెల 18న ఎపీఎమ్మార్సీఎల్ కార్యాలయంలో నిర్వహించనుంది.విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులను 38.40 కి.మీ. పొడవున వయాడక్ట్(ఇందులో 4.33 కి.మీ. పొడవున డబుల్ డెకర్ ఫోర్ లేన్ ఫ్లైఓవర్, మోట్రో వయాడక్ట్), ఒక అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వేస్టేషన్‌తో పాటు 32 స్టేషన్లను నిర్మించేలా పనులు చేపట్టింది. ఈ పనులను రెండు కారిడార్లుగా చేపట్టింది. మొదటి కారిడార్‌ను 25.9 కి.మీ పొడవున పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు, రెండో కారిడార్‌ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిమీల పొడవున మెట్రో రైల్ వయాడక్ట్, స్టేషన్లు నిర్మించనుంది.మెట్రో తొలిదశ కన్సల్టెన్సీలకు రూ.401.28 కోట్లువిశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనుల పర్యవేక్షణకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ కన్సల్టెన్సీలను ఎంపిక చేసింది. కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.401.28 కోట్లు చెల్లించనుంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ కన్సల్టెన్సీ బాధ్యతలను సిస్ట్రా సంస్థకు అప్పగించింది. ఆ సంస్థకు నాలుగేళ్లలో కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.212.40 కోట్లు చెల్లించనుంది. అలాగే, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశకు కన్సల్టెన్సీ బాధ్యతలను టెక్నికా వై ప్రొయెక్టాస్ ఎస్ఏ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థకు నాలుగేళ్లలో కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.188.88 కోట్లు చెల్లించనుంది.ఇక విశాఖపట్నంలో తొలిదశ కింద మూడు కారిడార్లలో 46.23 కి.మీ.ల పొడవున వయాడక్ట్ (ఇందులో 20.16 కి.మీ. పొడవున డబుల్ డెకర్ ఫోర్‌లేన్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్), 42 స్టేషన్లు నిర్మించేలా చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం, ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 24న రైల్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వనించింది. ఫీజుకింద రూ.212.40 కోట్లను చెల్లిస్తే కన్సల్టెన్సీగా సేవలు అందించేందుకు సిద్ధమంటూ సిస్ట్రా సంస్థ బిడ్ దాఖలు చేసింది.మరోవైపు.. విజయవాడలో తొలిదశ కింద 38.40 కిమీ పొడవున వయాడక్ట్ (ఇందులో 4.33 కిమీ డబుల్ డెకర్ ఫోర్‌లేన్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్), ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌తోపాటు మరో 32 స్టేషన్లు నిర్మించేలా చేపట్టే ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం, పనులు పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ కోసం ఏప్రిల్ 30న ఏపీఎమ్మార్‌సీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.188.88 కోట్లు చెల్లిస్తే కన్సల్టెన్సీగా సేవలు అందించేందుకు సిద్ధమంటూ టెక్నికా వై ప్రొయెక్టాస్ ఎస్ఏ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఈ రెండు టెండర్లను ఏపీఎమ్మార్‌సీఎల్ ఆమోదించి, కన్సల్టెన్సీలుగా ఆ సంస్థలను ఎంపిక చేసింది. కన్సల్టెన్సీ బాధ్యతలను ఆ సంస్థలకు అప్పగిస్తూ వాటితో ఒప్పందం చేసుకుంది. -
హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్‌కుమార్ ప్రమాణం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్‌కుమార్ గేదెల ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో తుహిన్‌కుమార్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు జస్టిస్ తుహిన్‌కుమార్ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం ఆయన మరో న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కలిసి ధర్మాసనంలో కేసులను విచారించారు. జస్టిస్ తుహిన్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. -
ఈ ఫోన్లు మాకొద్దు బాబోయ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సోమవారం నుంచి ప్రభుత్వంపై వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక యాప్‌లో డేటా అప్డేట్ చేసే భారాన్ని పెంచడంతో మొబైల్ ఫోన్ల స్పీడ్ సరిపోక నానా అవస్థలు పడుతున్నామని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శికి అనేకసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నిరసన చేపట్టామన్నారు. ‘యాప్‌ల భారం తగ్గించండి.. ఈ ఫోన్లు మాకొద్దు’ అంటూ తమ పరిధిలోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సీడీపీఓ)లకు వాటిని అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం తమ వద్ద మొబైల్ ఫోన్లను చక్కగా ప్యాక్‌చేసి సీడీపీఓలకు అందించారు. కొన్నిచోట్ల వాటిని తీసుకోగా, మరికొందరు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే, తమ మొబైల్ ఫోన్లను సీడీపీఓలు తీసుకున్నా తీసుకోకపోయినా మంగళవారం నుంచి డేటా అప్డేట్ చేసేదిలేదని అంగన్వాడీ వర్కర్లు తెగేసి చెబుతున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌కు అవస్థలు ఇక ప్రతి అంగనవాడీ కేంద్రం పరిధిలోను లబ్ధిదారులైన గర్భిణి, మూడేళ్లలోపు చిన్నారుల తల్లికి సంబంధించి నెలలో రెండుసార్లు ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నేషన్) చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పోషణ్ ట్రాకర్’ యాప్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘బాల సంజీవిని’ యాప్‌లలో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వాటిలో ఎఫ్ఆర్ఎస్, ఓటీపీ, ఈకేవైసీ, ఆధార్, మొబైల్ అప్డేట్ వంటి వాటిని రెండు యాప్ల్లోను నెలనెలా రెండేసిసార్లు చేయాలి.ఇందుకు తమ మొబైల్ ఫోన్ల స్పీడ్ సరిపోవడం లేదని, ఒక్కసారి పూర్తిచేయాలంటేనే 20 రోజులు పడుతోందని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెండు యాప్‌లను ఒక యాప్‌గా మార్చాలని.. 2జీబీ ర్యామ్ మొబైల్ ఫోన్ల స్థానంలో వేగంగా పనిచేసే వాటిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. దీంతో.. మొబైల్ ఫోన్లు ఇచ్చేసే నిరసన చేపట్టినట్లు అంగన్వాడీ వర్కర్లు చెబుతున్నారు.నేటి నుంచి మొబైల్ ఫోన్లు బంద్ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచకుండా కూటమి ప్రభుత్వం పనిభారం పెంచుతోంది. సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదు. యాప్‌ల భారం తగ్గించాలని అంగన్వాడీలకు చెందిన మూడు యూనియన్ల రాష్ట్ర నాయకుల బృందం కూటమి ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. అయినా, ఫలితం లేకపోవడంతో మొబైల్ ఫోన్ అప్పగింత ఆందోళన చేపట్టాం.అలాగే, మంగళవారం నుంచి మొబైల్ ఫోన్లను బంద్‌చేసి యాప్‌లలో ఎఫ్ఆర్ఎస్ చేయబోమని ఇప్పటికే అధికారులకు తేల్చిచెప్పాం. ఇక గౌరవ వేతనం బకాయిలు ఐదునెలలుగా పేరుకుపోయాయి. బిల్లులు, వేతనాలు నెలనెలా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సోనా మసూరి బియ్యం ఇచ్చి మెనూ ఛార్జీలు పెంచాలి. అంగన్వాడీలకు ఇతర యాప్‌లు, పథకాలకు సంబంధించిన భారాలను అప్పగించకూడదు. – జె.లలితమ్మ, ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ అసోసియేషన్ -
రూ. 11 కోట్ల నగదు స్వాధీనం కేసు.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
విజయవాడ: సిట్ జప్తు చేసిన రూ. 11 కోట్లు అంశానికి సంబంధించి నేడు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాచవరం ఎస్బీఐలో ఆ నగదును ఎప్పుడు డిపాజిట్ చేశారో తేదీ, సమయం తెలిపాలని కోర్టు ఆదేశించింది. నగదు జమ రశీదులకు సంబంధించి వీడియో, ఫోటో క్లిప్పింగ్స్ అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి చర్యల కోసం బ్యాంకుకు ఈ నగదు పంపించేముందు తీసిన ఫోటోలు లేదా పంచనామాలు కోర్టుకు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: బేతాళ కుట్రలో మరో అంకం -
‘ మేం బెదిరించి ఉంటే రికార్డింగ్ చూపించండి’
వైఎస్సార్ జిల్లా: ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. జగన్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ బీటెక్ రవి, శ్రీనివాసులురెడ్డి, ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్లో ఏవో మాట్లాడుతున్నారు. నిన్న పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. నేడు అతనితో మేము బెదిరించినట్లు పోలీసులకు పిర్యాదు చేయించారు. జగన్ గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదం. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తి వైఎస్ జగన్. నూటికి నూరు పాళ్లు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరగాలని కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్. ఉప మండలాధ్యక్షుడ్ని లోబరుచుకుని ఇలా చేస్తున్నారు. ఎవరు బెదిరించారు అనేది రికార్డింగ్ చేసింది చూపండి. మేము పదవి ఇచ్చిన వారు ఇతర పార్టీలోకి వెళ్తుంటే మాట్లాడటం తప్పేలా అవుతుంది. బెదిరింపు వేరు..బుజ్జగింపు వేరు. మా పార్టీ నేతను మా మేము బుజ్జగించే ప్రయత్నం చేశాము. నిజంగా బెదిరించి ఉంటే రికార్డింగ్ చూపండి. ఒక దురుద్దేశంతో ఇలా చేసి బెయిల్ పై ఉన్న వ్యక్తులపై ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చెప్తున్న ఉప మండలాధ్యక్షుడు మా అభ్యర్థి నామినేషన్ లో కూడా పాల్గొన్నాడు. మీరు అతన్ని లోబరుచుకుని ఇలా చేయడం మీ నైజానికి నిదర్శనం’ అని మండిపడ్డారు. -
ప్రచార ఆర్భాటం.. పనులేమో శూన్యం!.. టీటీడీ చైర్మన్‌పై భూమన ఫైర్
సాక్షి,తిరుపతి: తిరుమలలో ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేస్తున్నదంతా ప్రచార ఆర్భాటమేనని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.తిరుపతిలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అంటూ మాట్లాడుతున్న చైర్మన్ శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం ఉన్న రెండు క్యూ కాంప్లెక్స్‌లు సరిపోవడం లేదని మూడో క్యూ కాంప్లెక్స్‌కు పాలకమండిలో ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ఉచితంగా మాకు ఏఐ టెక్నాలజీని ఇచ్చేందుకు ముందుకు వచ్చారంటూ గూగూల్, టీసీఎస్‌కు చెందిన ప్రతినిధులకు కొండపైన గెస్ట్‌హౌస్‌లను కేటాయించడం, టీటీడీ వాహనాలను వాడుకునేందుకు అనుమతించడం, టీటీడీ సిబ్బందిని వారి కోసం కేటాయించడం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.ఆ సంస్థల ఉద్యోగులకు టీటీడీ ఖర్చుతో వాహనాలను ఎలా అందిస్తున్నారో చెప్పాలన్నారు. తొమ్మిది నెలలుగా ఏఐ టెక్నాలజీని తీసుకువస్తున్నామంటూ ఆయన పదవీ కాలం ముగిసే వారకు ఇదే చెబుతూ కాలక్షేపం చేస్తారా అని నిలదీశారు. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే టీటీడీలో భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన టీటీడీ చైర్మన్ తన ప్రచారం కోసం, పరస్పర విరుద్దమైన నిర్ణయాలను ఎలా తీసుకుంటారన్నారు.ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగానే భక్తుల దర్శన ఏర్పాట్లు ఉండాలే కానీ, ఏఐ పేరుతో కొత్త విధానాలను ఆలయంలో ప్రవేశపెట్టడంపై హైందవధర్మ పరిరక్షకుల సలహాలను ఎక్కడా తీసుకోలేదని మండిపడ్డారు. -
శిబూసోరెన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత శిబూ సోరెన్ మృతిపట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడైన శిబూ సోరెన్ మృతి దేశానికి తీరని లోటన్నారు వైఎస్ జగన్. గిరిజన సంక్షేమం కోసం శిబూ సోరెన్ చేసిన కృషి చిరస్మరణియమని కొనియాడారు. ఈ మేరకు శిబూ సోరెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు.The demise of veteran leader Sibu Soren ji is a great loss to the nation. His lifelong efforts for tribal welfare and justice will be remembered. My heartfelt condolences to his family and followers. May his soul rest in peace. pic.twitter.com/yCoAWbCZXH— YS Jagan Mohan Reddy (@ysjagan) August 4, 2025 జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూతడిషోమ్ గురు.. అందుకే ఆయన నవ్వడం మానేశారు! -
నేను నవ్వినందుకు కేసు పెట్టారు
సాక్షి,నెల్లూరు: నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డికు మద్దతు తెలిపేందుకు నాపై కేసు పెట్టారు.ప్రసన్న కుమార్‌తో కలిసి నన్ను ఏ2గా చేర్చారు. నేను నవ్వినందుకు కేసు పెట్టారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కూటమి ప్రభుత్వంలో వేదిక మీద నవ్విన నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చాయి. నవ్విన తప్పే అంటే ఇక ఏమి చేయాలి?. కూటమి నేతలు ఏ స్థాయికి దిగజారి పోయారో తెలుస్తోంది.36 ప్రశ్నలు అడిగారు, 10 నిమిషాల్లో సమాధానం రాసి ఇచ్చాను. నన్ను ఆరు గంటలు కూర్చోబెట్టారు, విచారణ చేశారు. బీసీ నాయకులను కూటమి ప్రభుత్వం కక్ష్య సాధిస్తోంది’అని ఆరోపించారు. కాగా,కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్‌పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. -
'ఆ మట్టి'..మెళియాపుట్టి..!
ఆ మట్టికి సాష్టాంగ నమస్కారాలు పెడతారు. అదే మట్టిని మండపంలో పెట్టి పూజలు చేస్తారు. ఫల పుష్పాదులు సమర్పించి పండగ చేస్తారు. ఆ మట్టి.. మెళియాపుట్టి. ఇక్కడ ఇరవై ఏళ్లుగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయక చవితి, దసరా సీజన్ వచ్చిందంటే ప్రతిమల కోసం అంతా ఈ ఊరికి క్యూ కడతారు. విగ్రహాలతో పాటు దీపాలు ఇతర మట్టి సామగ్రిని కూడా తయారు చేయడం వీరి ప్రత్యేకత. మెళియాపుట్టి: వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కా వడానికి ఇంకా కొద్దిరోజులే ఉంది. మెళియాపుట్టిలో అప్పుడే సందడి మొదలైపోయింది. ఇక్కడ మట్టితో విగ్రహాలు, పూజా సామగ్రి తయారుచేస్తూ కళాకారులు బిజీగా బిజీగా గడుపుతున్నారు. మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ ప్రాంతంలో నివాసముంటు న్న కొన్ని కుటుంబాలు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తాయి. ఏటా చిన్న విగ్రహాలతో పాటు పెద్ద పెద్ద విగ్రహాల తయారీలో వారికి మంచి పట్టుంది. వీరు తయారు చేసిన ప్రతిమలను చూస్తే ప్రతిభను కొనియాడకుండా ఉండలేం. చుట్టుపక్కల మండలాల నుంచి సైతం విగ్రహాలకు అడ్వాన్సులు ఇస్తూ విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. ధరలు తక్కువగా ఉండడంతో పాటు విగ్రహాలు కూడా అందంగా..రంగురంగుల్లో ఆకర్షణీ యంగా తయారు చేయడంతో ఎక్కువగా మెళియాపుట్టిలోనే విగ్రహాలు కొనుగోలు చేస్తామని కొనుగోలు దారులు చెబుతున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా మట్టి విగ్రహాలు తయా రు చేయడంతోనే వీరికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు. కొంత మంది యువత వారికి కావాల్సిన విధంగా గణపతి విగ్రహాలు తయారు చేయించుకుంటారని విక్రయదారులు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను వినియోగించి తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణకు భంగం కలుగుతుందని, అందుకే మట్టితోనే చేస్తున్నామని వారు చెబుతున్నారు. విగ్రహ తయారీలో కర్రలు, మట్టి, వరిగడ్డి, కొన్ని తాళ్లను మాత్రమే వారు వాడుతారు. 20 ఏళ్లుగా వీరు వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. ఏటా కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. ప్రభుత్వ సహకారం కావాలి మట్టితోనే విగ్రహాలు తయారు చేయడంతో సంతృప్తి చెందుతు న్నాం. మట్టితో విగ్రహాలు తయా రు చేయడం చాలా కష్టం. తయారు చేసిన తర్వాత చాలారోజులు ఉంచి అప్పుడు రంగులు వేయాలి. వాటిని భద్రపరచడారనికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నాం. రేకుల షెడ్లు వేసుకోవడానికి ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలి. – బూరగాన సవరయ్య, విగ్రహ తయారీ దారుడు, మెళియాపుట్టి గ్రామం మట్టి ప్రమిదలకు గిరాకీ ఎక్కువ మట్టి ప్రమిదలు నిత్యం తయా రుచేస్తూనే ఉంటాం. వినాయక ఉత్సవాలకు అత్యధిక మండపాల్లో దీపారాధన చేస్తారు. వేల సంఖ్యలో ప్రమిదలు కొనుగోలు చేస్తారు. వినాయక చవితి వస్తే ఇంటిల్లిపాదీ నిమగ్నమై పనులు చేస్తాం. – రేఖాన ఉమ, మెళియాపుట్టి గ్రామం (చదవండి: 'నాన్న' అని పిలవలేం ..! పాపం అంజలి, అవినాష్..) -
పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్.. ఐదుగురికి అస్వస్థత
పరవాడ: అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.కాగా,ప్రమాదంలో లూపిన్ ఫార్మా యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం తెల్లవారు జామున 4.00గంటలకు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిలో సాయి షిఫ్ట్ ఇంచార్జ్, గణేష్ కెమిస్ట్, రాఘవేంద్ర, నాయుడులను షీలా నగర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో నలుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
లిక్కర్ కేసు.. వెంకటేష్ నాయుడు పచ్చదొంగే!
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో సీహెచ్ వెంకటేష్ నాయుడి గురించి ఎల్లో మీడియా, ఆ పార్టీల అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు జరుపుతున్న ప్రచారం గురించి తెలిసిందే. అయితే అది విషప్రచారమని, అతను టీడీపీ మనిషేనన్న విషయం ఇప్పుడు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా లిక్కర్ డ్రామా బెడిసి కొడుతూనే ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో ఆ కేసు నిందితుడు(A-34) వెంకటేష్ నాయుడికి సాన్నిహిత్యం ఉందన్న విషయం బట్టబయలైంది. చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బావమరిది బాలకృష్ణతోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆదివారం నుంచి.. ఈ కేసులో కీలక నిందితుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు గడిపిన విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు మరికొన్ని విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫొటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అదే సమయంలో వెంకటేశ్‌కు వైఎస్సార్సీపీ నేతలతోనూ సంబంధాలు అంటగట్టేందుకు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా ఏపీలో లిక్కర్ కుంభకోణం డ్రామాను ఎంత రసవత్తరంగా సాగదీస్తున్నాయో తెలిసిందే. సిట్ ఏర్పాటు మొదలు.. నోట్ల కట్టలు వీడియో సృష్టించి వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లుతోంది చూస్తున్నదే. అయితే వెంకటేష్ నాయుడు పచ్చదొంగే అని నిరూపించే సాక్ష్యాలు బయటకు రావడంతో.. ఎల్లో మీడియా అడ్డంగా బుక్కైనట్లు స్పష్టం అవుతోంది.టీడీపీ నాయకులతోనే సంబంధాలువెంకటేశ్ నాయుడికి తొలి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధం ఉంది. గతంలో పలుమార్లు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో కలిసి వెంకటేష్ ఫొటోలు దిగాడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతోనూ దగ్గరి సంబంధాలు నడిపించినట్లు తెలుస్తోంది. -
‘ఈ ఎన్నిక పులివెందుల, చంద్రబాబు నీచత్వానికి మధ్య పోటీ’
సా క్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివపప్రసాద్ రెడ్డి. 1978లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు ప్రారంభించారని, అప్పటి నుంచీ ఏ ఎన్నికలో కూడా వారి కుటుంబం ఓడిపోలేదని తెలిపారు. పులివెందుల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఈ నియోజకవర్గాన్ని వాళ్ళు సొంత ఇల్లులా చూసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజవర్గంలో జరగని అభివృద్ధి ఇక్కడ జరిగిందని తెలిపారు.ఇప్పుడు జరిగేది 12 నెలల పదవి కలిగిన ఒక చిన్న మండల జడ్పీటీసీ ఉప ఎన్నిక అని శివప్రసాద్ రెడ్డి ్కొన్నారు. గత జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక జరుగుతోందని అన్నారు. సాధారణంగా పదవిలో మరణిస్తే మళ్ళీ సానుభూతితో వాళ్ళకే వదిలేసే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ చిన్న ఎన్నిక కోసం టిడీపీ పోటీకి దిగిందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా టీడీపీ పోటీ చేయాలి కానీ పోలీసులను నమ్ముకుని వారు పోటీలో దిగుతున్నారని మండిపడ్డారు.ఆయన ఇంకా మాట్లాడుతూ...‘ ఇక్కడ మీ బలం నామమాత్రమే అని మీకూ తెలుసు. ఈ మండలంలో 10,600 ఓట్లు ఉంటే గత 2024లో 3400 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయినా మీరు దంబికాలు పోతున్నారంటే మీరు ప్రజల్ని నమ్మి పోటీకి దిగలేదు. మేము ప్రజల్ని నమ్మి పోటీకి దిగాం. పులివెందుల ప్రజలు విశ్వాసానికి మారు పేరు. ప్రతిసారి వారు వైఎస్ కుటుంబ గౌరవాన్ని పెంచుతున్నారు. కానీ టీడీపీ డబ్బు, పోలీస్‌ను నమ్మి ఎన్నికల్లో దిగుతున్నారు.ఇప్పుడు పులివెందులలో నాయకులను కొనడానికి వ్యాపారం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టీ నాయకులను కొనేందుకు లావాదేవీలు చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడే కొద్దీ అక్రమ కేసులు, బైండోవర్ల పేరుతో పోలీస్‌లను వినియోగిస్తారు. స్పష్టంగా ఫ్రీ పోలింగ్ జరిగితే 4 వేలకు పైగా వైఎస్సార్సీపీకి మెజారిటీ వస్తుంది. వైఎస్ జగన్‌ను ఓడించాం అని జబ్బలు చరుచికోవడానికి తాపత్రయం పడుతున్నారుకానీ అది మీ వల్ల కాదు...ఈ పులివెందుల ప్రజలు చాలా తెలివైన వారు. ఈ ఎన్నిక పులివెందులకు, చంద్రబాబు నీచత్వానికి మధ్య పోటీ.ఏదో విధంగా జగన్‌కు అవమానం చేయాలని చంద్రబాబు ఆడుతున్న నీచ క్రీడ ఇది. అయినా పులివెందులే గెలుస్తుంది. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. అప్పుడే రేషన్ డీలర్లపై వేదింపులు ప్రారంభం అయ్యాయి. కాంట్రాక్టర్లకు బిల్లుల ఏర చూపుతున్నారు. నిజంగా మీది మంచి పాలన అయితే ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి. మీరు చేసింది శూన్యం కాబట్టి ధనం, పోలీసులను నమ్ముకుని పోటీకి దిగారు. మీరెన్ని చేసినా మేము శ్వాస వదిలే వరకు వైఎస్సార్సీపీ జెండా వీడేది లేదు’ అని పేర్కొన్నారు. -
‘లోకేశ్‌కు సీఎం పదవి.. చంద్రబాబు ఇంట్లో గొడవలు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తండ్రిని మించిన అవినీతిలో లోకేశ్ మునిగి పోయారని విమర్శలు చేశారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్ ఇంట్లో గొడవలు పెడుతున్నాడు. కుటుంబ కలహాలు పెరిగాయి. లోకేశ్‌ను అందుకే చంద్రబాబు పొగుడుతున్నారు. సరిగ్గా చదువుకోని లోకేశ్‌ను మంత్రిని చేశారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు లోకేశ్. చంద్రబాబు ప్రతీ విషయంలోనూ డ్రామాలు ఆడుతున్నారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు. ఢిల్లీలో పనిచేసే ఇతర దేశాల విలేకర్లకు నెలవారీ జీతాలు ఇస్తున్నారు. పాకిస్తాన్ జర్నలిస్టులకు కూడా చంద్రబాబు డబ్బులు పంపుతున్నారు. పదే పదే 90 దేశాలు అంటూ చంద్రబాబు మాట్లాడే మాటల వెనుక చాలా కథ ఉంది. అందుకే రామోజీకి భూమి.. చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించిందిఅందుకే ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం దూరం పెట్టింది. కుట్రలు పన్నటంలో చంద్రబాబును లోకేశ్ మించి పోయాడు. ఇప్పుడు లోకేశ్ భజన చేయటంలో ఎల్లో మీడియా పోటీ పడుతోంది. పత్రికలను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ మనుషులను పార్టీకి దూరం చేశారు. తనకు ఇష్టమైన వారిని దగ్గర చేర్చుకుని, ఎన్టీఆర్ టీమ్‌ని వెళ్లగొట్టారు. తాను అడిగిన వందలాది ఎకరాల భూమిని రామోజీరావుకు ఎన్టీఆర్ ఇవ్వలేదు. ఆ కోపంతో ఉన్న రామోజీరావుని చంద్రబాబు దగ్గరకు చేర్చుకున్నారు. ఆ తర్వాత నుండి చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెట్టారు. అన్నింటా బాబు మనుషులే..ఎన్టీఆర్ గెలుపు వెనుక నేను ఉన్నానని నాపై కుట్రలు పన్నారు. నన్ను రాజ్యాంగేతర శక్తి అంటూ నాపై ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బిల్‌గేట్స్‌ని మించిన ధనవంతుడ్ని కావాలని చంద్రబాబుకు కోరిక ఉండేది. అందుకే విపరీతమైన అవినీతి, అక్రమాలు, కుట్రలు చేస్తూ వస్తున్నారు. పరిపాలన చేతగాని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ బతుకుతున్నారు. తండ్రిని మించిన అవినీతిలో లోకేశ్ మునిగి పోయారు. ఇసుక, మద్యంలో తండ్రీ కొడుకుల అవినీతి తారాస్థాయికి చేరింది. ఇక్కడ సంపాదించిన డబ్బంతా సింగపూర్‌లో పెట్టుబడి పెడుతున్నారు. సీబీఐ, ఈడీ సహా అనేక న్యాయ వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారు. తాము దోచుకున్న డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఈ అవినీతి ప్రభుత్వం ఎంతోకాలం నిలవదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
నవ వధువు, శ్రీ చైతన్య లెక్చరర్ ఆత్మహత్య.. కారణం అదేనా?
సాక్షి, కృష్ణా: కుటుంబ కలహాల కారణంగా నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివాహం జరిగిన ఐదు నెలలకే తమ బిడ్డ చనిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్యతో అరుణ్ కుమార్ వివాహం జరిగింది. ఐదు నెలల క్రితమే ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. శ్రీవిద్య(24) ఉయ్యూరులోని శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. అరుణ్ కుమార్ కలాపాములు గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా ఉన్నారు. అయితే, వీరికి వివాహం జరిగిన నాటి నుంచే అత్తరింట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆమె.. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. ఇక, వివాహం జరిగిన ఐదు నెలలకే ఇలా తమ కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు.. కన్నీటి పర్యంతమవుతున్నారు. -
గోడకు కొట్టిన బంతిలా.. తిరగబడ్డ నెల్లూరు!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పి ఉండాలి. వైఎస్సార్సీపీ పార్టీకి కూడా ఇదో అనుభవం అని చెప్పాలి. పోలీసుల వ్యవస్థ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తే ప్రజల్లో వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా తెలియజేసినంది. ఒక నాయకుడి పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు (రోడ్లు) ధ్వంసం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు కూడా. ప్రజాస్వామ్యాన్ని ఇంతగా పరిహాసం చేసిన సందర్భం కూడా ఇంకోటి ఉండదు. వైఎస్ జగన్ తన మీడియా సమావేశంలో వ్యక్తిగత విమర్శలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, తను ఏ సందర్భంలో టూర్‌కు వచ్చిందీ, పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ కార్యకర్తల విధ్వంస కార్యక్రమాలు వాటి విపరిణామాలపై ఎక్కువ మాట్లాడారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన జమ్మలమడుగు పర్యటనలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. అసలు మినహా మిగిలిన సోదంతా వెళ్లబోసుకున్నారు. 👉జైల్లో ఉన్న మాజీ మంత్రి, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు, మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని టీడీపీ మూకలు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన్ను కూడా పలుకరించే ఉద్దేశంతో జగన్ నెల్లూరులో పర్యటనకు సంకల్పించారు. గత నెల మొదటిలోనే ఈ పర్యటన ఖరారైనా హెలిప్యాడ్ కోసం పోలీసులు ఒక అటవీ ప్రాంతాన్ని చూపించడంతో వాయిదా పడింది. ఆ ప్రదేశంలోనే ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకుని టూర్ తేదీలు నిర్ధారించుకున్నారు. అంతే! ఇక అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఆయన ప్రోగ్రాంను విఫలం చేయడానికి చాలా శ్రమ పడింది. చంద్రబాబు, లోకేశ్‌లకు వీర విధేయులైన పోలీసు అధికారులను ప్రయోగించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. జగన్ టూర్లో పాల్గొనడానికి వీల్లేదని శాసించే రీతిలో పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు నోటీసులు ఇచ్చారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులే కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు. జగన్ టూర్లో పాల్గొంటే ఏదో జరిగిపోతుందని, కేసులు పెడతారని ప్రచారం చేశారు. టూర్ జరిగే రోజున ప్రజలు, అభిమానులు ఎవరూ రాకుండా ఉండడం కోసం పోలీసులు జేసీబీలతో రోడ్లపై గోతులు తవ్వారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఎక్కడకక్కడ ఇనుప కంచెలు వేయడం, నెల్లూరు సందులలో నుంచి కూడా జనం రాకుండా చేయాలని యత్నించడం వల్ల ప్రజలు నానాపాట్లు పడ్డారు. చివరికి అంత్యక్రియల కోసం రేవుకు వెళ్లడం కూడా కష్టమైందని నెల్లూరు వాసి ఒకరు తెలిపారు. ఇన్ని నిర్బంధాల మధ్య ప్రజలు జగన్ టూర్‌కు రారేమో అని అందరకూ అనుకున్నారు. కానీ.. వేల మంది జనం పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ రోడ్లపైకి వచ్చి విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఈ అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. 👉ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి పార్టీని అణగదొక్కాలని అనుకుంటే అది అన్నిసార్లు అయ్యే పని కాదని నెల్లూరు ప్రజలు తెల్చి చెప్పారు. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కార్ విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ ఏ పట్టణానికి వెళ్లినా ఇలా జనం తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారో అర్థం కాక కూటమి నేతలు తల పట్టుకుంటున్నారు. ఒక పక్క జనం వస్తున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే ప్రజలు రాలేదని, సాక్షి టీవీలో బంగారు పాళ్యం ప్రోగ్రాం వీడియోలోని సన్నివేశాలు ప్రసారం చేశారని ఒక అసత్య ప్రచారం పెట్టారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి అలా మాట్లాడారంటే జగన్ టూర్‌పై వారు ఎంతగా కలవరపడుతున్నది అర్థం చేసుకోవచ్చు. బంగారుపాళ్యంలో జనం విశేషంగా వచ్చారని వారే స్వయంగా ఒప్పుకున్నట్ల అయ్యిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. ప్రభుత్వం దీనిని పరాభవంగా భావించి మరింత కక్షకు దిగకుండా ఇకనైనా ప్రజస్వామ్య పద్దతిలో జగన్ టూర్లకు సహకరించడం మంచిది. పోలీసులు ఎవరైనా ముఖ్యనేత వస్తుంటే ఆయనకు భద్రతకు కల్పించడం, జనం అధికంగా వస్తున్నారనుకుంటే దానికి తగ్గట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప, జనం ఆ ప్రోగ్రాంకు రాకుండా అడ్డుకోవడమే విధిగా పెట్టుకోరాదని ఈ ఘటన రుజువు చేసింది. 👉బంతిని ఎంత గట్టిగా కొడితే అది అంతగా పైకి లేస్తుందన్న విషయం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. జగన్, చంద్రబాబుల వ్యాఖ్యలను పరిశీలిద్దాం. పాలనలో విఫలం అయినందునే చంద్రబాబు భయంతో తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు. తన పార్టీ నేతలను కలవడానికి వస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. కాకాణి పై ఉన్న పలు అక్రమ కేసుల గురించి ప్రస్తావించి సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు, మీడియా సమావేశం వీడియోను పోస్టు చేసినందుకు కూడా కేసులు పెట్టారని వివరించారు. నిజంగానే ఇది చాలా శోచనీయం. రాజకీయ నేతలకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించాలి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి అమలుకాని వైనం, రైతుల కష్టాలు, ప్రభుత్వంలో అవినీతి, శాంతిభద్రతల వైఫల్యం రెడ్ బుక్ రాజ్యాంగం, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మొదలైన అంశాలను జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు వేసిన రెడ్ బుక్ విత్తు పెరిగి చెట్టు అవుతుందని, భవిష్యత్తులో అది వారికే ప్రమాదం అని హెచ్చరించారు.తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని,ఆ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని కూడా జగన్ పేర్కొన్నారు. జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు ఎక్కడా నేరుగా బదులు ఇచ్చినట్లు కనిపించలేదు. రాజకీయ ముసుగులో కొందరు అరాచకాలు సృష్టించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో కావాలన్నది ఆయన భావన. తన కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను నానా మాటలు అన్నప్పటికీ, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అన్నప్పుడు కాని అవేవి అరాచకంగా ఆయనకు కనిపించలేదు. స్వయంగా చంద్రబాబే పలుమార్లు పోలీసులను ధిక్కరించి హెచ్చరికలు చేయడం, టూర్లు సాగించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయి జగన్ టూర్‌ను అరాచకంగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కోసం జనం వస్తే తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం అసందర్భంగా అనిపిస్తుంది. రాజకీయ పాలన చేస్తానని చెప్పడం ద్వారా టీడీపీలో అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. మళ్లీ వస్తా.. అంతు తేలుస్తా అని జగన్ చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు దానిని విశ్వసిస్తుంటే జగన్ టూర్ లకు ఎందుకిన్ని ఆంక్షలు పెట్టడం అన్నదానికి మాత్రం జవాబు ఇవ్వరు. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా తన కుమారుడు, మంత్రి లోకేశ్ అనుభవ రాహిత్యంతో అమలు చేస్తున్న రెడ్ బుక్ వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టడం అవసరం. నెల్లూరు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ప్రభుత్వానికే మంచిది.లేకుంటే ప్రజలలో ఆయన ప్రభుత్వమే మరింత పలచన అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు.. డీఎస్పీ ఆఫీసుకు అనిల్ కుమార్
సాక్షి, నెల్లూరు: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్‌పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇదే సమయంలో అనిల్ కుమార్‌కు మద్దతు తెలుపుతూ డీఎస్పీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకున్నారు.వివరాల ప్రకారం.. కొవ్వూరులో వైఎస్సార్సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు, ప్రశాంతి రెడ్డి ఎపిసోడ్‌పై అనిల్ కుమార్ మాట్లాడినందుకు ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, అనిల్ కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. కాసేపట్లి క్రితమే నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసుకు అనిల్ వచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకున్నారు. అనంతరం, వారినివ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు
సాక్షి, విశాఖపట్నం: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపరితల ఆవర్తనం కాస్త ఉపశమనం కలిగించనుంది. ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై కనిపించనుంది.ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా.. ఉత్తరాంధ్రలో మాత్రం ఒకట్రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. తీరం వెంబడి 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం• అనంతపురం,శ్రీసత్యసాయి, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు-భారీ వర్షాలు • మన్యం,అల్లూరి,ఏలూరు, గుంటూరు,బాపట్ల,కర్నూలు, నంద్యాల,కడప,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తారు వర్షాలు,మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 3, 2025తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు.. అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి ఉంటాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. SOUTH TG ALERT ⛈️⛈️Heavy to Very Heavy Rainfall is expected across South TG districts during next 8-9 days #Telangana ‼️Hyderabad will get One or Two Heavy Spell in this period #Hyderabad pic.twitter.com/ZcMZGmXL5R— Weatherman Karthikk (@telangana_rains) August 4, 2025నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 5 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.గత 24 గంటల్లో నారాయణపేట జిల్లాలోని మాగనూరులో అత్యధికంగా 3.13 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో 2.74 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు ఎక్కువగా కేంద్రీకృతం కావడంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి గాలులు పొడిబారిపోవడం కూడా వర్షాలు తగ్గడానికి ఒక ముఖ్య కారణంగా నిపుణులు పేర్కొన్నారు.Telangana Rainfall – Last 24 HrsOvernight, Yadadri, Jangoan, Nalgonda (North), Suryapet (North), Mahabubabad, Khammam, Warangal, and Bhadradri districts experienced POWERFUL THUNDERSTORMS ⛈️.Valigonda (Yadadri) topped the charts with 107.8 mmIn HYDERABAD, Isolated spells… pic.twitter.com/0tiv9pkjXh— Hyderabad Rains (@Hyderabadrains) August 4, 2025 -
టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు..
సాక్షి టాస్క్‌ఫోర్స్: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ (టీడీపీ) ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ వ్యవహరించిన తీరు తేటతెల్లమైంది.అయితే, సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్చేసి మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే నసీర్, ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ రకంగా రాసలీలలు చేస్తున్న ఎమ్మెల్యే నసీర్ తీరుపై మహిళా లోకం దుమ్మెత్తి పోస్తోంది. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. -
చిరుత 'పల్లె' కరింపు
ఆత్మకూరురూరల్: చిరుత పులి ఎలాంటి ప్రాంతంలోనైనా ఉండగలదు. దట్టమైన నల్లమలలలోను, చిట్టడవులు మాత్రమే ఉన్న ఎర్రమలలోను, కంప చెట్లు, రాతి కొండలు ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లా పశి్చమ ప్రాంలో హాయిగా బతికేస్తున్నాయి. అలాగే హైదరాబాదు, బెంగళూరు, ముంబయ్ లాంటి నగరాల శివార్లలోనూ జీవించ గలుగుతున్నాయి. ఇక గ్రామాల సంగతి చెప్పనవసరం లేదు. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల చిరుతల సంచారం కనిపించడం, ప్రజల్లో కొంత ఆందోళన కలగడం జరుగుతోంది ఆహారం కోసమే..గ్రామాల పరిసరాల్లో చిరుతలు సంచరించడం సహజమైనదే. చిన్నపాటి దాక్కునే ప్రదేశం ఉన్నా చిరుతలు తమనుతాము దాచుకుని ఎవరికి కనిపించకుండా మనుగడ సాగించగలవు. పంట పొలాల్లో ఉండే కుందేళ్ళు, అడవి పందుల పిల్లల వంటి వన్యప్రాణులతో పాటు గ్రామాల్లోని కుక్కలను ఆహారంగా తీసుకుంటాయి. ఇటీవలి కాలంలో రాళ్ల కొండల్లో, పొదల్లో చిరుతల ఆహారం తగ్గి పోవడంతో అనివార్యంగా గ్రామాల వైపు చిరుతలు వస్తూ జనం కంట పడుతున్నాయి. గొర్ల మందల వద్ద ఉన్న కుక్కలను, ఆవుల మందల్లో ఉండే దూడలను లక్ష్యంగా చేసుకుని చిరుతలు ఆహార సేకరణ చేస్తుంటాయి.ఇదీ కారణం.. శ్రీశైలం మహాక్షేత్రంలో ఇటీవల చిరుత పులులు కాలనీల్లోని ఇళ్లలోకి కూడా వచ్చాయి. దీన్ని సునిశితంగా పరిశీలించిన అటవీ శాఖ అధికారులకు దీనికి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ సంబంధిత వ్యాధి కారణమని తేల్చారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్ పందులలో సంక్రమిస్తుంది. సున్నిపెంటలో కొందరు నడుపుతున్న పందుల ఫాంలోకి బెంగళూరు నుంచి తెచ్చిన పందుల వల్ల ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ చేరింది. ఈ పందులనుంచి ఆ వైరస్ అడవి పందులపై ప్రభావం చూపడంతో పెద్ద సంఖ్యలో అడవి పందులు మరణించాయి.పంది పిల్లలే ముఖ్య ఆహారంగా తీసుకునే చిరుతలకు దీనివల్ల ఆహారం కొరత ఏర్పడింది. దీంతో చిరుతలు అనివార్యంగా కుక్కలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని శ్రీశైలంలోకి తరుచూ వచ్చేవి. శ్రీశైలం దేవస్థానం వారు చిరుత ఆహారపు కొరతను గమనించకుండా పుణ్యక్షేత్రంలో సంచరించే కుక్కలను పట్టి వేరే ప్రాంతంలో వదిలారు. దీంతో చిరుతలు సున్నిపెంటల్లో ఇళ్లలో పెంచుకునే పెట్ డాగ్స్, ఇతర పెంపుడు జంతువులకోసం ఏకంగా ఇళ్ళలో ప్రవేశించ సాగాయి. రైతులకు ఎంతో మేలుచిరుత పులులు అడవి పందులను తిని రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అడవి పందులు తమ సంతతిని విపరీతంగా పెంచుకుని మైదాన ప్రాంతాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇవి రైతుల పంటలను సర్వ నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అయితే అడవి పంది పిల్లలను అమిత ఇష్టంగా వేటాడి తినడం చిరుత ప్రత్యేకత. అందుకే చిరుత పులులు రైతుల పొలాల వెంట సంచరిస్తూ పంది పిల్లల కోసం మాటు వేస్తుంటాయి. అలా పందులసంఖ్యను నియత్రించడం ద్వారా చిరుతలు రైతులకు మేలు చేస్తుంటాయి. కాగా.. చిరుత పులి తన ఆహార జంతువుల జాబితాలో మనిíÙని ఎంచుకోలేదు. రెండు కాళ్ల జంతువులు పులుల ఆహారపు మెనూలోనే లేవు. కోసిగి ప్రాంతంలో ఇటీవల ఒక చిరుత పంట పొలాల్లో మత్తుగా పడి ఉండడం స్థానికులు గమనించారు. దాన్ని వెంటాడి బంధించే ప్రయత్నం చేశారు. ఆ చిరుత పులి ఆ తరువాత మరణించింది. దాన్ని పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు తేలి్చన సత్యం ఏమిటంటే అది ఏదో జంతువును వేటాడినపుడు ఎముక ఒకటి దాని పేగులకు పొడుచుకుని ఇన్ఫెక్షన్కు గురైంది. అది పడుకుని ఉండగా బంధించే యత్నం చేయడంతో ఆ జంతువు ఆందోళనకు గురై హృదయ స్పందన ఆగి మృతిచెందింది. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. అడవిలో ఆహారపు కొరతతోనే అవి గ్రామాలవైపు వస్తున్నాయి.కర్నూలు జిల్లా కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ శివారులో ఒక చిరుత కొబ్బరి చెట్టు ఎక్కడం ఇటీవల సంచలనం రేపింది. తాను వేటాడిన ఆహారాన్ని దాచుకునేందుకు చిరుతలు చెట్లు ఎక్కుతుంటాయి. అలాగే ఇతర జంతువుల నుంచి ప్రాణ భయం ఉన్నప్పుడు కూడా చెట్లు ఎక్కుతుంటాయి. అయితే తిప్పలదొడ్డి వద్ద ప్రజల సందడికి భయపడి రక్షణ కోసం చిరుత కొబ్బరి చెట్టు ఎక్కింది. -
జనసేన ఎమ్మెల్యేపై ‘ఆడియో’ దుమారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/బుట్టాయగూడెం: తనపై జరిగిన ఆడియో సంభాషణ టీడీపీ కుట్రతోనే లీక్ అయిందని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. అవినీతి లేకపోతే సంభాషణే జరిగేది కాదని టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మీద వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని వామపక్షాలు.. సచీ్ఛలత నిరూపించుకోవాలంటే ఎమ్మెల్యేనే దర్యాప్తు సంస్థతో విచారణ చేయించుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్.. ఇదీ పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన ఆడియోపై స్పందనలు. ఎమ్మెల్యే ఏడాదిలోనే రూ.వంద కోట్లు సంపాదించాడని టీడీపీ కూటమి పార్టీలోని కీలక నేతలే మాట్లాడిన ఆడియో అటు జనసేన పార్టీతో పాటు జిల్లాలోనూ తీవ్ర కలకలం రేపింది.అన్ని పార్టీల్లోనూ ఇదే హాట్‌టాపిక్..పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ.వంద కోట్లు సంపాదించాడని, ఆయన ఘనతను యూట్యూబ్‌లో చూశానంటూ టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ.. జనసేన ముఖ్యనేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా.. ఇందుకు సంబంధించిన కథనం శనివారం ‘సాక్షి’లో ప్రముఖంగా రావడంతో పోలవరం నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. చిర్రి బాలరాజు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉండటంతో పాటు ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. మద్యం సిండికేట్, బెల్టుషాపులు, ఉద్యోగుల బదిలీలు, ఇసుక అక్రమాలు, ఆర్ అండ్ ఆర్‌లో అవినీతి.. ఇలా ప్రతి అంశంలో ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ టీడీపీ, జనసేన కేడరే తరుచూ సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు గుప్పించుకోవడంతో నిత్యం నియోజకవర్గ రాజకీయం హాట్ హాట్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. సదరు ఎమ్మెల్యే గత ఏడాది కాలంలో రూ.వంద కోట్లు సంపాదించాడన్న ఒక వీడియోను ప్రస్తావిస్తూ టీడీపీ నేత దేవినేని ఉమ అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఫోన్ నుండి కరాటం రాంబాబుకు ఫోన్‌చేసి మాట్లాడారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎలా బయటకు వచి్చందనే దానిపైనే తీవ్రంగా చర్చ జరుగుతోంది.ఎమ్మెల్యే విచారణ జరిపించుకోవాలి: తెల్లం బాలరాజుమరోవైపు.. రూ.వంద కోట్ల అవినీతి దేశంలోనే రోల్ మోడల్ వ్యవహారమంటూ సాగిన ఆ ఫోన్ సంభాషణ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే తన నిజాయితీని నిరూపించుకోవాలంటే ఏదైనా దర్యాప్తు సంస్థతో విచారణ చేయించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని పోలవరం నియోజకవర్గానికి మంచి పేరుందని, చిర్రి బాలరాజు దాన్ని పాడుచేస్తున్నారని మండిపడ్డారు.సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి : సీపీఎంఎమ్మెల్యే మీద వచ్చిన ఆరో పణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. రవి డిమాండ్ చేశారు. గతంలో ఇసుక, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, వైన్‌షాపుల విషయంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయని.. వీటిపై వార్తలు రాసిన అనేకమంది విలేకరులపై కేసులు పెట్టారని.. వీటన్నింటిపైన సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.నేను అవినీతికి పాల్పడలేదు: ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతనపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుడైన తాను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, పాల్పడబోనన్నారు. తన నుంచి ఆరి్థక లబ్ధిని ఆశించి, అందుకు నిరాకరించడంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేసి రూ.100 కోట్లు ఆర్జించానంటూ ప్రచారం చేసిన మీడియా సంస్థలపై, నాయకులపై న్యాయస్థానంలో కేసులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీనిపై ఓ నివేదికను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కూడా సమరి్పస్తానన్నారు. రూ.100 కోట్ల సంపాదన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య
సామర్లకోట: వివాహిత, ఇద్దరు బాలికలు దారుణంగా హత్యకు గురైన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కథనం మేరకు.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న సీతారామ కాలనీలో ములపర్తి ధనుప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. ధనుప్రసాద్ స్థానిక ఏడీబీ రోడ్డు కాంట్రాక్టు పనులకు సంబంధించిన లారీకి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు.ఎంత కొట్టినా కుటుంబ సభ్యులు తలుపులు తెరవలేదు. ఏసీ పని చేస్తూనే ఉంది. దీంతో, అతడు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే అతడి భార్య మాధురి (30), కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన (6) చనిపోయి ఉన్నారు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు కృష్ణభగవాన్, శ్రీనివాస్, తదితరులు ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి, ఆధారాలు సేకరించారు. హతురాలు మాధురి తల నుజ్జునుజ్జయ్యింది. తలపై కొట్టడంతో పలు కోణాల్లో దర్యాప్తుఈ హత్యలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ధనుప్రసాద్ ఇంటి వెనుక తలుపు నుంచి గోడ దూకి సమీపంలో ఉన్న కాలనీ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో హంతకుడు ఇంటి వెనుక తలుపు తీసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వద్ద ఉండాల్సిన 2 ఉంగరాలు, 2 సెల్ ఫోన్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ధనుప్రసాద్ రాత్రంతా రోడ్డు పనిలోనే ఉన్నట్లు సూపర్వైజర్ చెప్పారని సమాచారం. ఈ హత్యలు వివాహేతర సంబంధం కారణంగా జరిగిందా లేక భర్త చేసి ఉంటాడా లేదా దొంగలు చేసిన పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. -
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఐక్య ఉద్యమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని, విజయవాడ ఆర్టీసీ స్థలాన్ని లులు సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈనెల 6న విజయవాడలో పౌర వేదిక తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు.చంద్రబాబుకు భూదాహం..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ.. విజయవాడలో అత్యంత చారిత్రక నేపథ్యంతోపాటు రూ.400 కోట్ల విలువైన 4.15 ఎకరాల పాత బస్టాండ్ స్థలాన్ని, విశాఖపట్నంలో 13.7 ఎకరాలను బహుళజాతి సంస్థకు అçప్పగించే ప్రభుత్వ చర్యలు సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి భూదాహం పట్టుకుందని, అమరావతిలో మరోమారు భూ సమీకరణకు సిద్ధమయ్యారని మండిపడ్డారు.ఐక్య ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలివైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ పాలకులు ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాల పేరుతో యథేచ్ఛగా భూసంతర్పణ చేయడం ఆక్షేపణీయమన్నారు.సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దోనేపూడి కాశీనాథ్ (సీపీఎం), నరహరశెట్టి నరసింహరావు (కాంగ్రెస్), దోనేపూడి శంకర్ (సీపీఐ), పి. ప్రసాద్ (సీపీఐ–ఎంఎల్ న్యూ డెమోక్రసీ), హరనాథ్ (సీపీఐ ఎంఎల్ లిబరేషన్)లతోపాటు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎండీ ప్రసాద్, జోనల్ కార్యదర్శి వైఎస్ రావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్ అంజనేయులు తదితరులు మాట్లాడుతూ.. ఆర్టీసీ స్థలాన్ని అన్యాక్రాంతం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని, జీఓ నెంబర్ 137ను రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఆ రైతులు ఏం పాపం చేశారు?
‘పేదల పొట్టకొట్టడం, వారికి జీవనోపాధి లేకుండా చేయడం, వాళ్ల ప్రాణాల మీద అవినీతి మేడలు కట్టడమే మీ అనుభవమా?’ అంటూ సీఎం చంద్రబాబు తీరుపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు దఫాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి విజన్ ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే భూములు ఇచ్చిన కంపెనీకి, మళ్లీ వాటిని మార్చి కరేడులో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.కరేడు రైతులు ఏం పాపం చేసుకున్నారు? మీ విధానం చూస్తుంటే రైతులపై మీకు వ్యక్తిగతంగా ఏదైనా కక్ష ఉందా?’ అని అనుమానం కలుగుతోందన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని కేఎల్ రావు భవన్లో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో ‘అభివృద్ధి పేరుతో భూ పందేరం’ అంశంపై ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. అవసరానికి మించి మూడు పంటలు పండే భూములు సేకరించడం, వాటిని వినియోగించకపోవడం, అక్కడ ఏ అభివృద్ధీ చేయకపోవడం, రైతులను నిరాశ్రయులను చేయడం వంటి చర్యలతో ఒక విజన్, దార్శనికత లేకుండా ఈ ప్రభుత్వం చరు. ప్రజలు ఐకమత్యంగా ఉన్నప్పుడే ఇలాంటి నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పగలుగుతామన్నారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం సాష్టాంగ పడుతోందని ఎద్దేవాచేశారు.ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. పోలవరం విషయంలో ఎంతసేపూ రాతి కట్టడం ఎంతవరకు వచ్చిందనే అంశంపై సమీక్షలు చేస్తున్నారేగానీ, అక్కడ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు జరిగిందా లేదా అని ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. అలాగే, భూసేకరణ ప్రజాప్రయోజనాల కోసమా లేక ప్రైవేటు కోసమా అనేది కూడా చట్టంలో స్పష్టంచేశారని విజయ్‌కుమార్ వివరించారు. ప్రైవేటు సంస్థల కోసమైతే గ్రామంలో 80 శాతానికి పైగా రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలని చట్టం స్పష్టం చేస్తోందన్నారు. – గాందీనగర్ (విజయవాడ సెంట్రల్)చట్టాలను ఉల్లంఘించి భూసేకరణమాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అభివృద్ధి, పరిశ్రమలు, సెజ్‌ల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం వేల ఎకరాలు తీసుకుంటోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో భూమి తీసుకున్నారంటే కొంతమేర అర్థం ఉందని.. కానీ, చట్టాలను ఉల్లంఘిస్తూ నిర్బంధంగా రైతుల నుంచి భూములు సేకరిస్తోందని మండిపడ్డారు. ఏదైనా ఉద్దేశంతో భూమి తీసుకుని ఐదేళ్ల పాటు వినియోగించకపోతే ఆ భూమిని తిరిగి రైతుకు ఇవ్వాలని చట్టం స్పష్టంచేస్తోందన్నారు. ఒకవేళ అదే భూమిని ఇతర అవసరాలకు వినియోగించేటట్లయితే మార్కెట్ విలువలో 40 శాతం రైతుకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అది కూడా చేయడంలేదని వడ్డే అన్నారు.కార్పొరేట్లకు సామాజిక వనరులుఇక ప్రభుత్వం రైతుల భూములనే కాదు.. సామాజిక వనరులను కూడా కార్పొరేట్లకు కట్టబెడుతోందని న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. దీన్ని సామాజిక సమస్యగానే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పేదలు, రైతుల భూములను కొట్టేసి కార్పొరేట్లకు చేతుల్లో పెట్టడం అభివృద్ధా అని ప్రశ్నించారు. ఎంత భూమిని సేకరించారు? ఎంత భూమిని కార్పొరేట్లకు ఇచ్చారు? ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? వీటన్నిటిపై శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. భూముల కేటాయింపులకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ప్రజా పోరాటానికి ప్రాధాన్యమివ్వాలని, దానితో పాటు న్యాయపోరాటం చేయాలని సూచించారు.సామాజికవేత్త వసుంధర మాట్లాడుతూ.. కరేడు రైతు ఉద్యమం దేశానికే దిక్సూచి కావాలన్నారు. అనంతరం.. అభివృద్ధి సాకుతో పంట పొలాలను లాక్కొవద్దు, నిరూపయోగంగా ఉన్న భూముల్లో పరిశ్రమలు పెట్టాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రఘురాజు, రైతు సంఘాల నాయకులు కె. బాబ్జీ, కొల్లా రాజమోహన్, వీవీఎస్ మహదేవ్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కేశవరావు, ప్రభాకరరెడ్డి, అక్కినేని భవానిప్రసాద్, జమలయ్య, కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తప్పులతడకగా డీఎస్సీ ఫైనల్ ‘కీ’
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 తుది ‘కీ’లో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎస్ఏ పీఈ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పేపర్లలో ఈ తప్పులు దొర్లినట్టు చెబుతున్నారు. అందుకు ఆధారాలను సైతం చూపుతున్నారు. వాస్తవానికి ఆయా పరీక్షలు పూర్తయిన తర్వాత డీఎస్సీ పరీక్షల విభాగం ప్రాథమిక ‘కీ’లను విడుదల చేసింది. వాటిపై ఏమైనా తప్పులుంటే సరైన ఆధారాలతో వెబ్సైట్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా అభ్యర్థనల్ని పంపించారు. అయితే, తాము తెలిపిన అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, తీరా తుది ‘కీ’లో తాము పేర్కొన్న అంశాలపై కాకుండా సరిగా ఉన్న వాటిని మార్పులు చేసినట్టు కనిపిస్తోందని వాపోతున్నారు. డీఎస్సీలో అర మార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లో రెండు తప్పులు ⇒ జూన్ 29న ప్రిన్సిపల్ పోస్టులకు నిర్వహించిన డీఎస్సీ పేపర్–2(మెయిన్)లోని ప్రశ్న (ఐడీ నం: 39226620890).. ‘10వ పంచవర్ష ప్రణాళికలో సమగ్ర శిక్షాభియాన్‌లో రాష్ట్రం– కేంద్రం వాటా ఎంత?’ అన్న దానికి నాలుగు ఆప్షన్లు (1. 15:85, 2. 25:75, 3. 50:50, 4. 40:60) ఇచ్చారు. దీనికి జవాబుగా ఫైనల్ ‘కీ’లో ఆన్సర్ (3)గా పేర్కొన్నారు.కానీ ఈ ప్రశ్న స్థాయిని (ఎలిమెంటరీ/హైస్కూల్) పేర్కొనకపోవడంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. పదో పంచవర్ష ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు అమలులో ఉంది. సమగ్ర శిక్షాభియాన్ 2018లో ప్రారంభమైంది. ఇందులో అడిగిన ప్రశ్నే తప్పుగా వచ్చినట్టు చెబుతున్నారు. ⇒ ఇదే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన మరో ప్రశ్న (ఐడీ నం.39226620910) కూడా అసంపూర్ణంగాను, సందిగ్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ అడిగిన ప్రశ్న ‘ఏ’ గ్రేడ్‌కు మార్కుల శాతం ఎంత? అని అడిగారు.ఈ ప్రశ్న ఏ స్థాయిలోదో (ప్రాథమిక/ఉన్నత/హైసూ్కల్ ప్లస్) చెప్పలేదు. ఇచ్చిన జవాబుల్లో ఆప్షన్–3 (71 నుంచి 90) అనేది సరైన సమాధానంగా ‘కీ’లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ గ్రేడింగ్ ఎస్సీఈఆరీ్ట, ఎన్సీఈఆర్టీ గ్రేడింగ్ ప్రకారం తప్పు. కాబట్టి, ఈ ప్రశ్నను రద్దు చేయాలని లేదా ప్రశ్నలోని సందిగ్ధత కారణంగా మలీ్టపుల్ ఆప్షన్స్‌ను ఆమోదించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్జీటీ పేపర్లోనూ తప్పులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు నిర్వహించిన పరీక్ష పేపర్లో సైతం నాలుగు తప్పులు ఉన్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు. జూన్ 17న జరిగిన పేపర్లో రెండు ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఇచ్చారని, కీలో సైతం మార్పులు చేయలేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఇందులో చంద్రకళలు (ఐడీ నం.39226611122), దండాయస్కాంతం (ఐడీ నం.39226611126) ప్రశ్నలకు ప్రాథమిక కీలో సరిగా ఇచ్చి, తుది కీలో తప్పుగా ఇచ్చారంటున్నారు. జూలై 2న జరిగిన పరీక్షలో ప్రశ్న (ఐడీ నం.39226624089), జూన్ 18న జరిగిన పరీక్షలో ఓ ప్రశ్న (ఐడీ నం.39226414035) సైతం తప్పుగా ఇచ్చారని చెబుతున్నారు. ఫైనల్ కీలో తప్పులపై ఫిర్యాదులు మెగా డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ శుక్రవారం రాత్రి విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని డీఎస్సీ కనీ్వనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఫైనల్ కీలో వచ్చిన తప్పులపై విద్యాభవన్ హెల్ప్‌లైన్ నంబర్లకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విషయాన్ని డీఎస్సీ కనీ్వనర్ కృష్ణారెడ్డి సైతం ధ్రువీకరించారు. ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవని ‘సాక్షి’కి తెలిపారు. వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఎస్ఏపీఈ పేపర్లో 12 తప్పులున్నా..స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎస్ఏ పీఈ) పేపర్‌కు సంబంధించి ప్రాథమిక కీలో దొర్లిన తప్పులను సరిచేసినటప్పటికీ ఫైనల్ కీలో కొన్నింటికి తప్పు జవాబులకు మార్కులు ఇచ్చినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. అలాంటి వాటికి సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలిపినా మార్పులు చేయలేదంటున్నారు.‘ఈ కింద్రి వాటిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేది’ (ఐడీ నం.3922663174) ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్‌లో 1. సేంద్రీయ ఎరువుల వాడకం, 2. మురుగు నీరు ఉపయోగించడం, 3. సౌండ్స్ సిస్టమ్స్–ఎకో స్టిక్స్ ఉపయోగించుట, 4. ప్రజారవాణా వ్యవస్థ ఉపయోగించుట అని ఇచ్చారు. వాస్తవానికి ఇందులో సరైన సమాధానం నాలుగోది. అయినప్పటికీ ఒకటో ఆప్షన్‌కు కూడా మార్కు కేటాయించడంపై అభ్యర్థులు అభ్యంతరం చెబుతున్నారు. ‘పూర్తి సంకోచంతో నిరోధకతను అధిగమించే సామర్థ్యం (ఐడీ నం.3922663234) ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో 2, 3 సరైన సమాధానాలు అయితే కేవలం మూడో ఆప్షన్‌కి మాత్రమే మార్కు ఇచ్చారు. మరో ప్రశ్నను పీఈటీ సిలబస్ నుంచి తెచ్చి పీఈ పేపర్లో (ఐడీ నం.3922663193) ఇచ్చారని, ఈ ప్రశ్నకు మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ‘సర్క్యూట్ ట్రైనింగ్నందు ప్రతి ఎక్సర్‌సైజుకు మధ్య గల రికవరీ సమయం’ (ఐడీ నం.3922663229) ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్స్‌లో 3, 4 సరైనవే అయినప్పటికీ కేవలం 3వ ఆప్షన్‌కు మాత్రమే సరైనదిగా పేర్కొన్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్లో మొత్తం 12 తప్పులపై ఆధారాలతో సహా పంపిస్తే కేవలం నాలుగు ప్రశ్నలకు మాత్రమే సరిచేశారంటున్నారు. -
నిరుడు వద్దని.. ఇప్పుడు తామే సాధించామని..
సాక్షి, అమరావతి: ముస్లిం సోదరుల పవిత్ర హజ్ యాత్రపై కూటమి ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను రద్దు చేసేందుకు నిరుడు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. ఈ ఏడాది దాన్ని కొత్తగా సాధించినట్లు గొప్పలు చెబుతోంది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కూడా ఏపీకి చెందిన హాజీలు హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల (ఎంబార్కేషన్ పాయింట్) నుంచి వెళ్లేవారు. ఏపీ వారు గన్నవరం విమానాశ్రయం నుంచే వెళ్లేందుకు వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపారు.కేంద్రం నుంచి హజ్–2023 యాత్రకు ఎంబార్కేషన్ పాయింట్ సాధించారు. 2023, 2024లో గన్నవరం నుంచి దాదాపు 2,495 మంది హజ్ యాత్రకు వెళ్లారు. 2023లో గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే హాజీలపై విమాన చార్జీల అదనపు భారాన్ని సైతం భరిస్తూ రూ.14.50 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే అందించింది. 2024లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ నేపథ్యంలో హజ్ యాత్రికులకు రూ.14.04 కోట్లను ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక హాజీలకు చెల్లించాల్సిన రూ.9.40 కోట్లు ఇవ్వకుండా దగా చేసింది.రూ.లక్ష ఎగ్గొట్టేందుకు ఎంబార్కేషన్ రద్దుకు ఊతంహజ్ యాత్రికులకు ఆరి్థక సాయాన్ని పెంచి రూ.లక్ష చొప్పున అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయకుండా దగా చేశారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విజయవాడ నుంచి వెళ్లేవారికే అంటూ మెలికపెట్టారు. దీన్ని కూడా ఎగ్గొట్టేందుకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు కేంద్రానికి లేఖ ఇచ్చారు.గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు 101 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నందున దాని రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ లేఖ ఇచ్చిందని, ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరుఫ్ బర్మన్ నిరుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్సింగ్కు లేఖ రాశారు. ఏపీ హజ్ కమిటీ వచ్చిన వినతి మేరకు రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.చివరి దశలో సాధించినట్టు కూటమి కొత్త డ్రామా..హజ్–2026కు కేంద్ర హజ్ కమిటీ ఇచ్చిన ఆన్లైన్ దరఖాస్తుల గడువు జూలై 31తో ముగిసింది. దీనికి ఒకరోజు ముందు అంటే జూలై 30న విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌కు కేంద్రం నుంచి అనుమతి సాధించినట్టు కూటమి నేతలు గొప్పలు చెప్పుకున్నారు. హజ్ యాత్రకు షెడ్యూల్ ప్రకటించినప్పుడే విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్‌గా ప్రకటించి ఉంటే రాష్ట్రానికి చెందినవారు విజయవాడ విమానాశ్రయం నుంచి కూడా హజ్ యాత్రకు వెళ్లడానికి అవకాశం ఉండేది.అయితే హజ్ యాత్రకు దరఖాస్తుకు ఒక రోజు ముందు మాత్రమే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఉంటుందని ప్రకటించారు. కానీ అప్పటికే రాష్ట్రానికి చెందిన 1,700 మందికిపైగా హైదరాబాద్, బెంగళూరు నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ముందే విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్‌గా ప్రకటించి ఉంటే ఈ 1,700 మంది విజయవాడ నుంచే వెళ్లడానికి ఆస్కారం ఉండేది. ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల 1,700 మంది వ్యయప్రయాసలు, దూరాభారం భరించి హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.ముస్లిం సమాజాన్ని ఎంతకాలం మోసం చేస్తారు?కూటమి నేతలు ముస్లిం సమాజాన్ని ఎంతకాలం మోసం చేస్తారు? 2024లో హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ నిధులు మంజూరు చేసినా.. కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికల ముందు హజ్ యాత్రికులకు రూ.లక్ష చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ఈసారి దరఖాస్తుకు ముందు విజయవాడ నుంచి వెళ్లేవారికే రూ.లక్ష ఇస్తామని చెబితే ఎక్కువమంది వెళ్లేవారు. కానీ, ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేయించి ఇస్తామన్న రూ.లక్ష ఎగ్గొట్టడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు హజ్‌కు అందరూ దరఖాస్తు చేసుకున్నాక ఎంబార్కేషన్ పాయింట్‌ను పునరుద్ధరించినట్టు చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి.? పథకం ప్రకారం ముస్లింలను ఏమార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, సలహాదారు షరీఫ్ తందాన తాన అంటారా? వారికి ముస్లిం సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే హాజీలకు బకాయిలు చెల్లించడంతో పాటు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.లక్ష చొప్పున సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. –షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్కూటమి ప్రభుత్వం ముందే ఎందుకు స్పందించలేదు?విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ విషయంలో కూటమి ప్రభుత్వం తీరు సరిగ్గా లేదు. వైఎస్ జగన్ సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను నిలబెట్టుకునేలా ఎందుకు కృషి చేయలేదు? కనీసం ఇప్పుడైనా హజ్ షెడ్యూల్ ప్రకటించకముందే ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకుని ఉంటే విజయవాడ నుంచి వెళ్లేందుకు ఆన్లైన్ ఆప్షన్ పెట్టుకునే వెసులుబాటు కలిగేది.అన్లైన్ దరఖాస్తుల గడువు ముగిసే చివరి దశలో ఎంబార్కేషన్ పాయింట్ ఇస్తే ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే తప్ప హాజీలకు ఉపయోగమేమి లేదని తెలియదా? టీడీపీ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు విమానయాన మంత్రిగా ఉన్నప్పటికీ, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి అవకాశాలను ఉపయోగించుకోకుండా ఎంబార్కేషన్ పాయింట్ విషయంలో చంద్రబాబు డబుల్ గేమ్ ఆడడం ముస్లింలను మోసం చేయడమే. –షేక్ మునీర్ అహ్మద్, ఏపీ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ -
జీఎస్టీలో చిన్నబోయిన ఏపీ
సాక్షి, అమరావతి: జీఎస్టీ చెల్లింపుదారుల వాటా ఆంధ్రప్రదేశ్‌లో మరీ తక్కువగా ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. పెద్దరాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో జీఎస్టీ చెల్లింపుదారుల వాటా తక్కువగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని నివేదిక వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో జీఎస్టీ చెల్లింపుదారుల సామర్థ్యం ఇంకా ఉందని అధ్యయనం సూచిస్తోందని నివేదిక తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో జీఎస్టీ చెల్లింపుదారులు వాటాతో పాటు జీఎస్‌డీపీలోని వాటాలను రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశంలో మొత్తం జీఎస్టీ చెల్లింపుదారుల్లో ఐదు రాష్ట్రాల్లోనే 50 శాతం ఉన్నారని తేల్చింది.దేశం మొత్తం జీఎస్టీ చెల్లింపుదారుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 2.8 శాతమే ఉందని స్పష్టం చేసింది. జీఎస్డీపీలో ఏపీ జీఎస్టీ చెల్లింపుదారుల వాటా 4.7 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. జీఎస్టీ చెల్లింపుదారుల విషయంలో కేరళ సైతం ఏపీ తరహాలోనే తక్కువ వాటాను కలిగి ఉండగా.. ఏపీతో పోలిస్తే తెలంగాణ కొంత నయమనిపిస్తోందని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో జీఎస్డీపీలో వాటా కన్నా జీఎస్టీ చెల్లింపుదారుల వాటా ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. -
టీడీపీ ఎమ్మెల్యే నసీర్ రాసలీలలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ (టీడీపీ) ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ వ్యవహరించిన తీరు తేటతెల్లమైంది. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్చేసి మాట్లాడినట్టు స్పష్టమవుతోంది.ఎమ్మెల్యే నసీర్, ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ రకంగా రాసలీలలు చేస్తున్న ఎమ్మెల్యే నసీర్ తీరుపై మహిళా లోకం దుమ్మెత్తి పోస్తోంది. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. -
కల్లుగీతకు బెల్టుదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుండటం ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో వీధివీధినా తెరుచుకున్న మద్యం బెల్టుషాపుల దెబ్బకు కల్లుగీత వృత్తి కుదేలైంది. ఫోన్ చేయగానే మద్యం డోర్ డెలివరీ చేస్తుండటంతో గీతవృత్తికి కష్టకాలం దాపురించింది. అంతేకాదు.. యానాం, గోవా నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం పోటెత్తడం, రాష్ట్రంలోనే నేరుగా నకిలీ మద్యం తయారీతో అంతంత మాత్రంగా ఉన్న కల్లుగీత కార్మికుల ఉపాధి ఘోరంగా దెబ్బతింది.మద్యం షాపులు 3,396.. బెల్టు షాపులు 75 వేలురాష్ట్రంలో ప్రభుత్వం 3,396 మద్యం షాపులకు లైసెన్స్ ఇచ్చింది. వీటికి అనుబంధంగా పట్టణాలు, గ్రామాలనే భేదం లేకుండా వీధివీధినా బెల్టు షాపులు తెరుచుకున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లోని సిండికేట్ల పర్యవేక్షణలోనే 75 వేల బెల్టుషాపులు నడుస్తున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుండటంతో కల్లు అమ్మకాలు పడిపోయాయి. దీంతో తాటిచెట్ల నుంచి కల్లును సేకరించే వృత్తిపై ఆధారపడిన గీత కార్మికుల బతుకుదెరువు దెబ్బతింటోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కల్లుగీత వృత్తి మనుగడ ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో 2,400 సొసైటీలు, 2,100 కల్లుగీత సంఘాల పరిధిలో లక్షలాది మంది కల్లుగీత కార్మికులు కల్లు అమ్మకాలు లేక ఆందోళన చెందుతున్నారు.‘పశ్చిమ’లో సమర శంఖంరాష్ట్రంలో కల్లుగీత వృత్తి దెబ్బతినడంతో తక్షణ చర్యల కోసం గీత కార్మికులు ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన 75 వేల అనధికార మద్యం బెల్టు షాపులను తొలగించి తమ వృత్తి పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఇప్పటికే పశ్చిమగోదావరి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి సెపె్టంబర్ 30వ తేదీ వరకు 58 రోజులపాటు పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కారి్మక సంఘం తీర్మానించింది.డిమాండ్లు ఇవీ..⇒ ఉద్యమ కార్యాచరణలో భాగంగా కల్లుగీత కార్మిక సంఘం పలు డిమాండ్లను తెరపైకి తెచ్చింది. లైసెన్స్ కలిగిన మద్యం షాపులు, బార్లకు నిర్దేశించిన వేళలు కచ్చితంగా పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.⇒ సిండికేట్ల పర్యవేక్షణలోని అనధికార బెల్టుషాపులను అరికట్టాలి. అనధికార మద్యం విక్రయాలు, మద్యం తయారీని నిరోధించాలి.⇒ కేరళ, తెలంగాణ తరహాలో కల్లుగీత వృత్తిని ప్రోత్సహించి ఏపీలోని కల్లుగీత కార్మికులకు ఉపాధి పెంచి ఆదుకోవాలి.⇒ ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలతో తయారయ్యే బీరు, బ్రాందీ, విస్కీలను ప్రోత్సహించకుండా ఔషధ గుణాలున్న తాటికల్లు సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.⇒ ప్రతి జిల్లాలో నీరా కేంద్రాలు పెట్టాలి.⇒ తాటిచెట్ల నుంచి పడి చనిపోతున్న గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.⇒ కల్లు గీత కార్మిక కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి.⇒ కల్లుగీత వృత్తిదారులకు రక్షణ చట్టం తీసుకు రావాలి.⇒ 200 యూనిట్లు ఉచిత విద్యుత్, అన్నివృత్తుల వారికీ 50 ఏళ్లకే పింఛన్, అధునాతన పరికరాలు ఇవ్వాలి.⇒ వృత్తిదారుల పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పూర్తి సబ్సిడీతో కూడిన ఉపాధి రుణాలు ఇవ్వాలి. -
ఇసుకలో మస్కా!
ఓచేత్తో ఉచిత ఇసుక అంటూ ప్రజలను మాయ చేస్తూ... మరోచేత్తో భారీ దందాను ప్రోత్సహిస్తూ జేబులు నింపుకొంటున్నారు పెదబాబు, చినబాబు. అర్హత లేని సంస్థను అడ్డుపెట్టుకుని.. అనుమతుల్లేని తవ్వకాలతో రోజుకు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఈ దోపిడీతో కృష్ణా నదీ గర్భం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ఇదంతా సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో బల్లకట్టు నావిగేషన్ చానల్ ముసుగులో సాగుతున్న భారీ దందా.సాక్షి, అమరావతి: పెదబాబు, చినబాబు అండదండలే అర్హతగా... కృష్ణా నదిలో బల్లకట్టు నావిగేషన్ చానల్ పూడికతీత పనుల కాంట్రాక్టు చేజిక్కించుకుంది కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ. ఇది పైకి మాత్రమే. చేస్తున్నది మాత్రం నిత్యం వేలాది టన్నుల ఇసుక అక్రమ తవ్వకం.. తరలింపు. రాజధాని పనులకు ఇసుక, నావిగేషన్ చానల్ పేరిట అడ్డగోలుగా తవ్వి రోజుకు దాదాపు రూ.4 కోట్లు మింగేస్తోంది. ⇒ కృష్ణా నది మీదుగా గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాకపోకలకు ఇబ్రహీంపట్నం–వైకుంఠపురం మధ్య బల్లకట్టు దారి ఉంది. దీనిలో ఇసుక మేటలను తొలగించేందుకు కృష్ణా, గోదావరి వాటర్ వేస్ సంస్థ డిసెంబరులో కాంట్రాక్టు పొందింది. ఇసుక తవ్వకంలో ఎలాంటి అర్హత లేకున్నా కేవలం చినబాబు సన్నిహితులంతా కలిసి దీనికి కాంట్రాక్టు ఇప్పించారు. తాము చెప్పినట్టల్లా సంతకం పెట్టే ఇరిగేషన్ అధికారిని గుంటూరు జిల్లాలో నియమించి అనుమతులు తీసుకున్నారు. నావిగేషన్ చానల్ పరిధిలో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీయాలనేది కాంట్రాక్టు. టన్నుకు రూ.215 చొప్పున చెల్లిస్తోంది. వాస్తవానికి టన్ను ఇసుక తవ్వేందుకు రూ.50, లోడింగ్‌కు రూ.15 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, అంతా సొంతవాళ్లే కావడంతో ప్రభుత్వ పెద్దలు అదనంగా రూ.150 కలిపి కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. దీంట్లోనే.. కాంట్రాక్టు సంస్థకు నిర్దేశిత 7 లక్షల టన్నులకు రూ.10.5 కోట్లు అప్పనంగా ఇచ్చినట్లయింది. ⇒ ఇప్పటికే 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేసినట్లు స్థానిక బోట్స్‌మెన్ సంఘాలు చెబుతున్నాయి. రాజధాని పనుల కోసమని చెబుతూ రోజుకు 30 వేల టన్నుల ఇసుకను తోడుతున్నారు. ఇందులో సగానికి పైగా హైదరాబాద్, తదితర నగరాలు, పట్టణాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి రాజధాని పనుల కాంట్రాక్టు సంస్థలకు టన్ను రూ.130కే ఇసుక సరఫరా చేయాలని మొదట ఒప్పుకొన్నారు. కానీ, కాంట్రాక్టు రూ.215కు తీసుకున్నాం కాబట్టి అంతే ఇవ్వాలని వసూలు చేస్తున్నారు. ఇందులోనూ టన్నుకు రూ.85 మిగుల్చుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌కు తరలించే ఇసుకను టన్ను రూ.2,500తో అమ్ముతున్నారు. మొత్తంగా రోజుకు 30 వేల టన్నుల మీద సుమారు రూ.4 కోట్లు.. నెలకు రూ.100–120 కోట్లు అక్రమంగా అర్జిస్తున్నారు. ఈ లెక్కన మార్చి నుంచి ఇప్పటి వరకు.. అంటే ఐదు నెలల్లో రూ.580 కోట్లకు పైగా దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దందా చూస్తుంటే... బల్లకట్టు కోసం కానే కాదు.. చినబాబు మూటల కోసమేనని స్పష్టమవుతోంది. అంతా ఆ తాను ముక్కలే...కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ తాతినేని వంశీది చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎన్ఆర్ఐ డాక్టర్ కీలక పాత్ర అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న కీలక అనుయాయుడు కేఆర్కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ తాతినేని వంశీ అనే వ్యక్తికి చెందినది. కరకట్టపైనే నివాసం ఉండే, చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్, మరికొందరు కలిసి దీన్ని నడిపిస్తున్నారు. వీరికి చినబాబు తరఫున ప్రతినిధిగా ఆయన కీలక అనుయాయుడు కేఆర్ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. అందరూ ముఠాగా ఏర్పడి ఇసుక అక్రమ తవ్వకాలతో రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు ప్రకాశం బ్యారేజీ పూడికతీత పనుల్లోనూ రెట్టింపు మొత్తం దండుకునేందుకు స్కెచ్ వేశారు. రాజధాని పనులు చేస్తున్న బడా కంపెనీల తరఫున ఇదే కంపెనీతో టెండర్లు వేయించి, దాన్ని కూడా సిండికేట్‌గా దక్కించుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా త్వరలో రూ.286 కోట్ల విలువతో టెండర్ పిలిచేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కాంట్రాక్టు కూడా కృష్ణా–గోదావరి వాటర్ వేస్‌కు ఇచ్చేలా చినబాబు స్కెచ్ వేశారు. అందుకుతగ్గట్టుగానే టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.అర్హత, అనుభవం లేని సంస్థకు కట్టబెట్టేసి...చినబాబు జేబు సంస్థకు అడ్డగోలుగా అనుమతులులారీలు ఆపితే పేషీ నుంచి వెంటనే ఫోన్లుఅడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకిగత ప్రభుత్వంలో పక్కనపెట్టినా.. కూటమి వచ్చాక పచ్చజెండాకృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థకు ఇసుక తవ్వే అర్హతలు ఏమాత్రం లేవని బోట్స్‌మెన్ సంఘాలు చెబుతున్నాయి. డ్రెడ్జింగ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించేలా ఉందని వాపోతున్నాయి. తమ ఉపాధి పోతోందని, నదీ గర్భం కుంగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకునేవారే లేరని బోట్స్‌మెన్ సంఘాల వారు వాపోతున్నారు. వాస్తవానికి డ్రెడ్జింగ్‌కు అవసరమైన రిజిస్ట్రేషన్లు, బోట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, సరంగు లైసెన్స్‌లతో పాటు ఇతర చట్టపరమైన అర్హతలు ఏవీ లేవని తేలడంతో గత ప్రభుత్వంలో ఈ సంస్థకు ఏ పనీ ఇవ్వలేదు. ఇప్పుడు చినబాబు బినామీగా మారడంతో కాంట్రాక్టులు సులభంగా వచ్చేస్తున్నాయి. పేరు ఆ కంపెనీదైనా వ్యవహారాలన్నీ చినబాబు మనుషులే చూసుకుంటున్నారు. అడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకి దిగి సర్దుబాటు చేస్తున్నారు. కంపెనీ లారీలు, వ్యవహారాలను ఎవరైనా ఆపితే వెంటనే చినబాబు పేషీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. నావిగేషన్ చానల్, డ్రెడ్జింగ్ పేరుతో తమ ఇంటి పక్క నుంచే రూ.కోట్లు కురిపించే ఇసుక చానల్‌ను పెదబాబు, చినబాబు తయారు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రభుత్వ పెద్దల ఆశీస్సులే అర్హత
సాక్షి, అమరావతి: దోచుకో పంచుకో తినుకో(డీపీటీ) సిద్ధాంతంతో పెదబాబు, చినబాబు, అమాత్యులు రెచ్చిపోతున్నారు. అయినవాళ్లకు, అడిగినంత కమీషన్ ఇచ్చినవాళ్లకు ఎడాపెడా కాంట్రాక్టులు కట్టబెట్టేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్ నిర్వహణ టెండర్లలోను అదే విధానం అవలంబిస్తున్నారు. కీలకనేత తరఫున వైద్యశాఖలో అక్రమార్జన వ్యవహారాలను చక్కబెడుతున్న నరసింహారెడ్డి ప్రస్తుతం శానిటేషన్ టెండర్లలోనూ రింగ్‌మాస్టర్‌గా మారినట్టు సమాచారం. కీలకనేత వైద్యశాఖ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సెక్యూరిటీ, శానిటేషన్, మందుల సరఫరా, వైద్యపరీక్షలు.. ఇలా వివిధ సేవల నిర్వహణలో వసూళ్ల వ్యవహారాలను నరసింహారెడ్డి చూస్తున్నారు.ప్రభుత్వాస్పత్రుల్లో జన్–ఔషధి మందుల సరఫరా, కొద్దినెలల కిందట నిర్వహించిన సెక్యూరిటీ టెండర్లలోను ఇతడిని ప్రసన్నం చేసుకున్న వారికి నిబంధనలు అతిక్రమించినా కాంట్రాక్టులు దక్కాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ వేసిన, పొరుగు రాష్ట్రాల్లో బ్లాక్‌చేసిన సంస్థలకు సెక్యూరిటీ కాంట్రాక్టు కట్టబెట్టడానికి పెద్దమొత్తంలో నరసింహారెడ్డి ద్వారా కీలకనేతకు ముట్టాయి. బిల్లు చెల్లించిన ప్రతిసారి సదరు సంస్థలు 7 శాతం మేర కమీషన్ ముట్టజెప్పేలా అప్పట్లో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.దీంతో ప్రస్తుతం సదరు సంస్థలు కాంట్రాక్ట్ నిబంధనలను అతిక్రమిస్తున్నా చూసీచూడనట్టు వదిలేయాలంటూ కీలకనేత కార్యాలయం నుంచి వైద్యశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలున్నట్టు తెలిసింది. రూ.800 కోట్ల విలువైన శానిటేషన్ టెండర్లలోను అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు కొంత, అనంతరం బిల్లుచేసిన ప్రతిసారి కమీషన్ కింద మరికొంత ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పేలా డీల్ కుదిరినట్టు ప్రచారం నడుస్తోంది. రూ.30 కోట్లు దోచేసిన సంస్థకు అర్హత శానిటేషన్ టెండర్లకు దాఖలైన బిడ్ల పరిశీలన అనంతరం ప్రస్తుతం కోస్తాంధ్రలో సేవలు అందిస్తున్న ఒక సంస్థ బిడ్‌ను ఆమోదించినట్టు ఏపీఎంఎస్ఐడీసీ ప్రకటించింది. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. కొద్దినెలల కిందట శానిటేషన్ సేవలకు టెండర్లు పిలిచి తుదిదశలో రద్దుచేశారు. అప్పట్లో సదరు సంస్థపై నిధుల దురి్వనియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు అందాయి. రూ.30 కోట్ల మేర నిధులు దండుకున్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. దీంతో అప్పట్లో ఆ సంస్థను పక్కన పెట్టేశారు. తాజా టెండర్లలో ఈ సంస్థ బిడ్లు ఆరు ప్యాకేజీల్లో ఆమోదించినట్టు అధికారులు ప్రకటించడం గమనార్హం.కీలకనేత ఎలా చెబితే అలా చేస్తామంటూ సదరు సంస్థ యాజమాన్యం హామీ ఇవ్వడంతో ప్రజాధనాన్ని అక్రమంగా దోచేసిన ఆరోపణలున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శలొస్తున్నాయి. మరో సంస్థ విషయంలో నరసింహారెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నట్టు వెల్లడైంది. ఈ సంస్థకు సెక్యూరిటీ టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసినా కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పుడు ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా బిడ్ వేసినా ఆమోదించారు. ఆ సంస్థకు పోటీవస్తున్నాయని కొన్ని పెద్దసంస్థలను సైతం తప్పించినట్టు ఫిర్యాదులున్నాయి. పెద్దలను ప్రసన్నం చేసుకున్న సంస్థలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి.నిబంధనలు అతిక్రమించినా.. టెండర్ నిబంధనల ప్రకారం అర్హత ఉండి, పొరుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పనులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేని సంస్థల బిడ్లను తిరస్కరిస్తున్నట్లు విమర్శలున్నాయి. అదే అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించినప్పటికీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులే అర్హతగా పలుసంస్థల బిడ్లు ఆమోదించేశారని అధికారికవర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం బంధువు సంస్థ కోసమే రెండోసారి ప్రభుత్వం టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. ఈ దఫా సదరు సంస్థకు ఎలాగైనా కాంట్రాక్టు కట్టబెట్టాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.లేదంటే తమకు ఊస్టింగ్ తప్పదనే ఆందోళనలో ఉన్నారు. హౌస్‌కీపింగ్, శానిటేషన్ విభాగంలో పనిచేసిన అనుభవం, ఆరి్థక టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని.. అయితే సీఎం బంధువు సంస్థ సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్, ఇతర సేవల అనుభవం, టర్నోవర్‌ను క్లెయిమ్ చేసిందని తెలిసింది. హౌస్‌కీపింగ్, శానిటేషన్ టర్నోవర్ ఆధారంగా పనులు దక్కే పరిస్థితి లేదని, అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. -
గుండెలు చెది‘రాయి’ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం
బల్లికురవ/నరసరావుపేట టౌన్/సాక్షి, అమరావతి: గ్రానైట్ క్వారీలో రాయి తీస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. రాయి మీద పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం ఈర్లకొండ వద్ద ఉన్న సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి పనిచేస్తున్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందారు.పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ వద్ద సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ ఉంది. ఈ క్వారీలో ముడి రాయిని తీసి ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో క్వారీలో రాయి తీసేందుకు తొమ్మిది మంది కూలీలు జాకీలతో పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి తీసే రాయికి పై భాగంలో ఉన్న రాయి దొర్లి కార్మికుల మీద పడింది. దీంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన టుకున దలాయ్ (37), బనమల చెహ్రు (30), భాస్కర్ బిషోయ్ (40), సంతోస్ గౌడ్ (36) అక్కడికక్కడే మృతిచెందారు. ఎం.సుదర్శన్, కె.నాయక్, శివాగౌడ, దండా బడత్యా (48), ముస్సా జనా (43) తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో దండా బడత్యా, ముస్సా జనా మృతిచెందారు. మిగిలిన ముగ్గురు నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, మైనింగ్ డీడీ రాజశేఖర్, ఏడీ రామచంద్ర పరిశీలించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నాలుగు మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, రెండు మృతదేహాలు నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. వీఆర్వో అశోక్ ఫిర్యాదు మేరకు బల్లికురవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్యపై అనుమానాలు? క్వారీలో ప్రమాదం జరిగిన సమయంలో ఆరు జాకీలతో జాకీకి ముగ్గురు వంతున డ్రిల్లింగ్ పనులు చేస్తున్నట్లు సమాచారం. కానీ అధికారులు మాత్రం అక్కడ పనిచేస్తున్నది తొమ్మిది మంది మాత్రమేనని, అందులో ఆరుగురు మృతిచెందారని ప్రకటిస్తున్న నేపథ్యంలో మిగిలిన కార్మికులు ఏమయ్యారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మృతుల సంఖ్య విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణకు సీఎం ఆదేశం క్వారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై బాపట్ల జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. న్యాయ విచారణ చేయాలి: సీపీఎం ప్రమాదంపై సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర ది్రగ్భాంతి వ్యక్తం చేసింది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి గల కారణాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి సరైన వైద్యంతోపాటు రూ.10 లక్షల సహాయం అందించాలని కోరారు. క్వారీలో సరైన భద్రతా చర్యలు చేపట్టని యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ క్వారీ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి లేదన్న వార్తలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయన్నారు.మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల చొప్పున పరిహారం గ్రానైట్ క్వారీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్టు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి చెప్పారు. క్వారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు క్వారీలో మొత్తం 16 మంది ఒడిశా రాష్ట్ర కూలీలు పనిచేస్తున్నారని తెలిపారు.వర్షం పడడం వల్ల ప్రమాదం జరిగిందని వివరించారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృత్యువాత పడ్డారని, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారని కలెక్టర్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.14లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.పదిలక్షల చొప్పున పరిహారం క్వారీ యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని వెల్లడించారు. స్వల్పంగా గాయపడిన వారికీ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున క్వారీ నిర్వాహకుల నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. ఘటనపై విచారణకు మైనింగ్ శాఖను ఆదేశించినట్టు వెల్లడించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరించనున్నట్టు వివరించారు. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మదనపల్లె సిటీ/ములకలచెరువు: ఆర్టీసీ బస్సు మోటార్‌బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన విషాద ఘటన ఇది. వీరు ముగ్గురు చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలు. అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం, వేపూరికోట పంచాయతీ, పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వేపూరికోట పంచాయతీ కూటగుళ్లోపల్లికి చెందిన వేమనారాయణ, శ్యామల కుమారుడు కె.తరుణ్ (24), చంద్రప్ప, నాగరత్నమ్మల కుమారుడు కె.వెంకటేష్ (20), ఓబులేసు, కవితమ్మల కుమారుడు కె.మనోజ్ (19) మోటార్‌బైక్‌పై ములకలచెరువుకు బయలుదేరారు. ఆ ఊరిలో ఉండే వెంకటేష్ మిత్రుడు స్నేహితుల దినోత్సవం కేక్ కట్ చేసుకుందామని పిలవడంతో ములకలచెరువు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో పెద్దపాలెం ఫ్లైవర్ వద్ద ములకలచెరువు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తరుణ్ బెంగుళూరులో సిగ్విలో డెలివరీ బాయ్‌గా, వెంకటేష్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు.మనోజ్ కాలేజీలో చదువుకుంటున్నాడు. వీరు బెంగళూరులో రూము అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ముగ్గురు అవివాహితులు. స్వగ్రామానికి శనివారం వచ్చారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ములకలచెరువు ఎస్.ఐ నరసింహుడు, సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కూటగుల్లోపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. -
క్రికెట్లోనూ కూటమి సి‘ఫార్సు’
సాక్షి, అమరావతి: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్నికల్లో రాజకీయ సిఫార్సుల పర్వం నడుస్తోంది. ఏసీఏ పీఠాన్ని తమవారికి ఏకగ్రీవంగా కట్టబెట్టేందుకు కూటమి సర్కార్ పాచిక వేసింది. ఇందులో భాగంగానే గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం నామినేషన్ల పర్వం నడిపించింది. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఏసీఏ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవులకు నామినేషన్లు సమర్పించారు.చంద్రబాబు తనయుడు లోకేశ్ కనుసన్నల్లో పాత అపెక్స్ కౌన్సిల్ సభ్యులే మరోసారి ఏసీఏ పీఠంపై కూర్చునేందుకు మార్గం సుగమం చేశారు. ముందుగా ఊహించినట్టే అధ్యక్ష, కార్యదర్శులకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పేరుతో ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. గతంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును పక్కన పెట్టేసినట్టు సమాచారం.ఆయన ఈసారి ఎలాగైనా తనకే ఉపాధ్యక్ష పదవి కావాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా.. ఉన్న పోస్టును కూడా ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. సంయుక్త కార్యదర్శి ఎన్నికకు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఏసీఏ మాజీ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు అనుచరుడు బి.శ్రీనివాసరాజు, ప్రస్తుత పాలకమండలి ప్రోద్బలంతో బి.విజయ్‌కుమార్ నామినేషన్లు వేశారు. డిప్యూటీ సీఎం కోటాలో ఉపాధ్యక్షుడి భర్తీ ఏసీఏ ఉపాధ్యక్షుడిగా ఇంతకాలం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కుమారుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అల్లుడు వెంకటరామ ప్రశాంత్ కొనసాగుతున్నారు. ఈ పదవిని డిప్యూటీ సీఎం పవన్ తమ అనుచరుడికి ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. అందుకే బండారు నరసింహారావుతో నామినేషన్ వేయించారు. మరోవైపు తనకు ఎలాగైనా ఉపాధ్యక్ష పదవి కావాలని ప్రశాంత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ పదవిని ప్రశాంత్‌కు ఇవ్వొద్దని పవన్ కరాఖండిగా చెప్పినట్టు సమాచారం.వీరితో పాటు కౌన్సిలర్‌కు పాత వ్యక్తి దంతు గౌరువిష్ణ తేజ, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్ మాత్రమే నామినేషన్ వేశారు. ఈ నెల 16న ఏసీఏ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జూన్‌లోనే వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసినప్పుడు.. 16న మరోసారి ఎలా వార్షిక సమావేశం నిర్వహించి ఎలా ఎన్నికలు జరుపుతారని కోర్టుల్లోను, బీసీసీఐలోను పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతోపాటు ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకమే తప్పంటూ క్రికెట్ అభిమానులు కేసులు వేయడం గమనార్హం. -
ఉన్నోళ్లకు ‘ఉపాధి’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా కూటమి పార్టీల నేతలకు దోచి పెడుతోందా? నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులిస్తోందా? కూలీలతో చేయించాల్సిన పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందా? పంచాయతీల ప్రమేయం లేకుండానే అంతా తానై కానిచ్చేస్తోందా? రోడ్డు వసతి లేని చోట కాకుండా కొందరికే మేలు కలిగేలా పనులు చేయిస్తోందా..? ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ‘అవును’ అని సమాధానం ఇస్తోంది.రాష్ట్రంలో ఇష్టానుసారంగా సాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది. ఉపాధి ముసుగులో భారీ అవినీతికి పాల్పడటాన్ని ఎత్తి చూపుతోంది. రాష్ట్రంలో ఏడాదిగా సిమెంట్ రోడ్డు నిర్మాణాల పేరుతో ఉపాధి హామీ పథకంలో భారీగా నిబంధనల ఉల్లంఘనలతో పాటు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు కాంట్రాక్టరు వ్యవస్థకు తావులేని ఈ పథకంలో కాంట్రాక్టర్ల ద్వారా పనులు జరుగుతున్నాయని తప్పు పట్టింది.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై తనిఖీలు చేసేందుకు జూన్ 17–21వ తేదీల మధ్య కేంద్ర పరిశీలక బృందాలను తిరుపతి, కాకినాడ, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయిలో అవకతవకలను నిగ్గు తేల్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పాటు కేంద్రం గుర్తించిన ఎన్జీవోలకు సంబంధించి ఇద్దరేసి సభ్యులతో ఆయా బృందాలు ఆయా జిల్లాల్లో పర్యటించాయి. ఒక్కో జిల్లాలో రెండు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో పనులను ఆ బృందాలు పరిశీలించాయి. ప్రతిచోటా అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి. అక్రమాలను పేర్కొంటూ వాటికి తగిన వివరణలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. దిక్కుతోచక మల్లగుల్లాలు‘ఉపాధి’లో విచ్చలవిడిగా అవకతవకలు చోటుచేసుకున్నాయన్నది ఊరూరా తెలిసిన వాస్తవం. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించుకుని వివరణ కోరడంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిబంధనల ఉల్లంఘనపై కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వీటికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా నివేదికలు కోరినట్టు సమాచారం. నెపాన్ని కొందరు అధికారులపైకి నెట్టి తమకు క్లీన్ చిట్ ఇచ్చుకునేలా ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. రూ.3 వేల కోట్లు హాంఫట్రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే గ్రామీణ ప్రాంతాల్లో ‘ఉపాధి’ కింద 26 వేలకు పైగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తదితర పనులకు అనుమతులిచ్చింది. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనులలో కాంట్రాక్టర్ల విధానమే ఉండదు. గ్రామ పంచాయతీలు లేదంటే ప్రభుత్వం నిర్ధారించిన శాఖ ఆధ్వర్యంలోనే ఆయా పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా గ్రామాల్లో టీడీపీ నేతలే అనధికారికంగా ఆయా పనులను దక్కించుకున్నారు. ఆయా గ్రామాల్లో టీడీపీ నేతలు సూచించిన పేర్లను వెండర్లుగా నమోదు చేసి, వాళ్లు కొనుగోలు చేసినట్టు పేర్కొన్న ధరల మేరకు బిల్లుల చెల్లింపు జరిగింది.ఇలా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,900 కోట్లు, ఈ ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు మరో రూ.1,080 కోట్లు.. మొత్తంగా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేశారు. మెటీరియల్ కేటగిరిగా పేర్కొనే పనులకు బిల్లుల చెల్లింపులో తీవ్ర స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఆయా పనులకు అవసరమయ్యే సిమెంట్ తదితర రకరకాల మెటిరీయల్స్‌ను టెండరు విధానంలో ఎవరు తక్కువ ధరకు సరఫరా చేస్తారో వారి జాబితాను మండల స్థాయిలో నిర్ధారించాల్సి ఉంటుంది.ఆపై ఆయా పంచాయతీల్లో పనుల సంఖ్య ఆధారంగా ఏ రకమైన మెటీరియల్ ఎంత అవసరముంటుందో.. ఎవరెవరి వద్ద దొరుకుతుందో ఎంపీడీవో నిర్ధారించాలి. ఆయా వెండర్ల నుంచే ఆ మెటీరియల్‌ను నిర్ధారించిన ధరకే తీసుకోవాలి. ఆ మేరకు ఆన్లైన్లో నమోదు చేస్తే.. కేంద్రమే నేరుగా ఆ వెండరుకు బిల్లు చెల్లిస్తుంది. ఇలాంటి ప్రక్రియ ఏదీ లేకుండా నేరుగా టీడీపీ నేతలు సూచించిన వారి పేర్లను వెండర్లుగా నమోదు చేసి నిధులు కాజేశారు. ఈ విధానాన్ని కేంద్రం తీవ్రంగా తప్పు పట్టింది.కేంద్రం తప్పుపట్టింది వీటినే..⇒ తగిన రోడ్డు వసతి లేని గ్రామీణ ప్రాంతాలకు కొత్తగా సిమెంట్ రోడ్డు వేసేందుకు ఉపాధి హామీ పథకం నిబంధనలు అనుమతిస్తుండగా, వాటిని వదిలేసి.. రాష్ట్రంలో పలుచోట్ల సెమీ–అర్బన్ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించారు. ⇒ రెండు మూడు అంతస్తుల ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేశారు. ⇒ అధికారికంగా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు కాకుండా స్థానిక కాంట్రాక్టర్లతో పనులు చేయించారు.⇒ ఆయా పనులకు అవసరమైన వస్తువులు, సామగ్రి (సిమెంట్, కంకర.. తదితరాలు)ని గ్రామ పంచాయతీ లేదా మండల, జిల్లా పరిషత్‌ల వంటి స్థానిక ప్రభుత్వాలు/ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసినవి కాకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారం కొనుగోలు చేశారు.⇒ ఆయా గ్రామ పంచాయతీల పర్యవేక్షణలో పనులు సాగలేదు. ⇒ వంద, రెండు వందల మీటర్ల పొడవున్న రోడ్డు పనులను కూడా రెండు మూడు భాగాలుగా విభజించి పనులు చేపట్టారు. ⇒ ప్రజాప్రయోజనాన్ని, మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించి ఎవరికో ఉపయోగ పడేలా పనులు చేపట్టారు. ⇒ ఏటా ఒకే ప్రాంతంలో.. చేసిన చోటే మళ్లీ మళ్లీ మట్టి పనులు చేస్తున్నారు. అలా ఎందుకు చేయాల్సి వస్తుందో సమగ్ర పరిశీలన లేనేలేదు. ⇒ బిల్లుల చెల్లింపు ఇష్టారాజ్యంగా సాగింది. ఎక్కడా నిబంధనలు పాటించలేదు. -
రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 4న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు లేదా సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలుగకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని ముఖ్యాంశాలు... ⇒ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ⇒ సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ⇒ 5న పవిత్రాల ప్రతిష్ట, 6న పవిత్ర సమర్పణ, 7న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ⇒ పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ⇒ అదేవిధంగా 5వతేదీన అష్టదళ పాద పద్మారాధన సేవ, 7న తిరుప్పావడ సేవతో పాటు 5 నుండి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. -
బేతాళ కుట్రలో మరో అంకం
సాక్షి, అమరావతి: నయా బేతాళ కుట్రలో చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా కలసికట్టుగా మరో అంకాన్ని సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ పెద్దలు, సిట్‌కు దిమ్మతిరిగిపోయింది. వెంటనే ఏదో ఒకటి చేసి.. ఈ విషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించకపోతే ఇది పూర్తిగా తప్పుడు కేసేనని తెలిసిపోతుందని అప్పటికప్పుడు ఓ వీడియోను ఎల్లో మీడియాకు లీక్ చేశారు.తద్వారా ఆ వీడియోకు విపరీత ప్రచారం కల్పించారు. ఆ వీడియోలో వెంకటేశ్ నాయుడు కరెన్సీ నోట్ల పక్కన ఉన్న ఫొటోను ఎల్లో మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు. వీళ్లు చెప్పినట్లు వినేవారిని ముందు పెట్టి సరికొత్త నాటకానికి తెరతీశారు. చెల్లని నోట్లతో కట్టుకథ చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు పంపిణీ చేస్తున్న డబ్బుగా దానిని చిత్రీకరించారు. ఆ ఫొటోలు, వీడియోల్లో రూ.2 వేల నోట్లు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో రూ.2 వేల నోట్ల చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19న ఆర్బీఐ చివరి సారిగా ప్రకటించింది. కానీ 2024 ఎన్నికల సమయంలో మద్యం సొమ్ము అక్రమంగా తరలించారని చెవిరెడ్డిని అరెస్టు చేశారు.దీనిని బట్టి అర్థం కావడం లేదూ ఇదంతా కట్టుకథ అని. ఇదే వెంకటేశ్ నాయుడికి టీడీపీ నేతలతోనే సంబంధాలున్నాయని సోషల్ మీడియా సాక్షిగా బైటపడింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని, ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌లతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ డబ్బు వారందరిదీ అని కూడా అనుకోవచ్చు కదా. వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న ఫొటో పక్కన వీరి ఫొటోలు కూడా పెట్టి.. ఇది వీరి డబ్బే అని చెప్పగలరా? తాము చెప్పినట్టు వినేవాళ్లను రంగంలోకి దించి కట్టుకథ అల్లుతున్నారనేందుకు ఇదే ప్రబల నిదర్శనం.ఇదేవిషయం గతంలోనూ వెల్లడయ్యింది ఇపుడూ నిరూపితమయింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు, సిట్, ఎల్లో మీడియా కూడబలుక్కుని సమష్టిగా ఆడుతున్న నాటకం అని ఇట్టే తెలిసిపోతోంది. ఎలాగైనా సరే మద్యం అక్రమ కేసును సక్రమం అని నిరూపించడమే లక్ష్యంగా సిట్ బరితెగించి వ్యవహరిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్లో పరువు పోగొట్టుకున్న సిట్.. మరో సరికొత్త ఎపిసోడ్ ద్వారా బేతాళ కథను రక్తి కట్టించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. -
అన్నీ గుర్తు పెట్టుకుంటాం: అంబటి రాంబాబు
సాక్షి, బాపట్ల: రేపల్లె ఆసుపత్రిలో వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్‌బాబు దీక్ష కొనసాగుతోంది. ఆయన్ను ఆదివారం.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ‘‘రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారు. మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘వేమూరు నియోజకవర్గంలో రైతులంతా కలిసి కాలువలో గుర్రపు డెక్కతో తమ పడుతున్న ఇబ్బందిని అశోక్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కాలువలో గుర్రపు డెక్క తొలగించాలంటూ రెండు రోజులు పాటు అక్కడే దీక్ష చేశారు. అధికారులు స్పందించట్లేదు. కనీసం కాలువల్లో గుర్రపు డెక్క కూడా తీయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాలువలో గుర్రపు డెక్క ప్రభుత్వం తొలగించాలి. ప్రభుత్వానికి చేతకాకపోతే గుర్రపు డెక్క తొలగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు అన్నారు.రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు.. అశోక్‌బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అశోక్‌బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన అధికారులను కచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
గ్రానైట్ క్వారీ ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఒడిశాకు చెందిన కార్మికులు,పొట్టకూటి కోసం వచ్చి మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఆదివారం దయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
‘ప్రపంచంలో ఎక్కడైనా రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో ఉందా?’
విజయవాడ: చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒక రకంగా ఉంటాడు.. అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోతాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అసలు చంద్రబాబుకి ఆర్టీసీ స్థలం లూలుకి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందని ప్రశ్నించారాయన. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 3వ తేదీ) విజయవాడ నుంచి మాట్లాడిన రామకృష్ణ.. ‘వందల కోట్ల ఆర్టీసీ భూమి 99 ఏళ్లు లీజుకివ్వడమేంటి?, విశాఖలోనూ వందల కోట్ల భూమి లూలుకి కట్టబెట్టారు. విదేశాల్లో మూతబడిన లూలుకి ఇక్కడ ప్రభుత్వ భూములివ్వడం దేనికి?, కనీసం చర్చ కూడా లేకుండా చంద్రబాబు, నారాయణ లూలుకు ఆర్టీసి భూములిచ్చేశారు. గన్నవరంలో విమానాశ్రయం ఉంటే మళ్లీ అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పెట్టాల్సిన అవసరం ఏముంది?, విమానాశ్రయాలు కడితే సరిపోదు...విమానాలు నడవాలి కదా. అమరావతిలో 1500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ పెడతాననడం హాస్యాస్పదం. ప్రపంచంలో ఎక్కడైనా రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో ఉందా? అని ప్రశ్నించారు రామకృష్ణ. -
కూటమి కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా: ఏపీలో వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా చంద్రబాబు కూటమి సర్కార్ అక్రమ కేసులో పెడుతోంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఐటీ యాక్ట్ కింద కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నానికి నోటీసులు ఇచ్చారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ 2024లో విశాఖ-3 టౌన్ పోలీసు స్టేషన్లో విశాఖకు చెందిన అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు.. కొడాలి నానిపై U/S353(2),352,351(4), 196(1) BNS 467, IT Act కింద కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొడాలి నానికి 41ఏ కింద విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. -
బీఆర్ నాయుడు డైరెక్షన్.. తిరుమలలో మఠాలపై బాబు, పవన్ దాడి: భూమన
సాక్షి, తిరుపతి: హైందవ ధర్మ పరిరక్షణకు పాటు పడే మఠాలపై కూటమి సర్కార్ దాడి చేస్తోందని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలపై హిందూ సంస్థలు స్పందించాల్సి ఉందన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో విశిష్ట అద్వైత మఠం, శృంగేరి, పెజావర్ పీఠం, వైఖానస మఠం, అహోబిల మఠం, చినజీయర్ మఠం, మంత్రాలయం మఠం నెలకొల్పారు. హైందవ పరిరక్షణ కోసమే మఠాలు ఉన్నాయి. సంప్రదాయాలు, మఠాల నిర్వహణ సత్ సంకల్పంతో నిర్వహించాలని, శ్రీ మహావిష్ణువు వెలసిన దివ్య క్షేత్రంలో స్వామి వారి వైభవం విశ్వవ్యాప్తం చేయడానికి ఉన్నాయి. అటువంటి మఠాలకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పీఠాధిపతులను కూటమి ప్రభుత్వం అవమానిస్తోంది. హైందవ మఠాలపై కూటమి దాడి సరికాదు.కూటమి ప్రభుత్వం దాదాపు 32 మఠాలకు నోటీసులు జారీ చేసింది. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి?. పవిత్రమైన మఠాధిపతుల అధీనంలో ఉన్న మఠాలకు ఏవిధమైన నోటీసులు ఇచ్చారో చెప్పాలి. హైందవ మఠాలపై చేస్తున్న దాడి ఇది. హిందూ సంస్థలు వెంటనే స్పందించాల్సి ఉంది. ఇదంతా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోనే జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి మూల మూర్తి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టేలా ఉన్నారు. విద్వేష పూరితమైన ఆలోచన ఇది. మఠాధిపతులు మేల్కొవాలి. మఠాలపై దాడిని ఖండించాలి. సనాతన ధర్మం పట్ల గొడ్డలి వేటు ఇది. సనాతన ధర్మం కావడమే నా లక్ష్యం అంటున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 03-10)
-
లోకేశ్.. తప్పుడు ప్రచారం వద్దు, కచ్చితంగా నిలదీస్తాం: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో తామేదో.. రెచ్చగొడుతున్న లోకేశ్ మాట్లాడటం సరికాదన్నారు. ఆయన ముందుగా.. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి తెలుసుకుంటే మంచిది అంటూ హితవు పలికారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘ఏపీ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు. నికర జలాలు, మిగులు జలాల సంగతి తేలాక వరద జలాల గురించి ఆలోచించాలి. ఆయన ముందుగా.. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి తెలుసుకుంటే మంచిది. తెలంగాణ ప్రాజెక్టుల పైనున్న ప్రాజెక్టుల్లో నీటి వినియోగం పూర్తైన తర్వాత వరద జలాల గురించి ఆలోచన చేయాలి. అవేమీ తెలియకుండా లోకేశ్.. ఏపీ ప్రజలను మభ్యపెట్టి, తప్పుదోవ పట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ట్రిబ్యునల్స్ చెప్పినదాని ప్రకారం ఒక్క చుక్క నీటిని కూడా తెలంగాణ వదులుకోదు.సీనియర్ నాయకుడిగా చంద్రబాబు ఇలాంటి నీటి వాటాలపై ఘర్షణ పూరిత వాతావరణానికి ఇరు రాష్ట్రాల మధ్య తెర లేపొద్దు. వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరూ కోరుకోరు.. మీరు వాటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరమూ ఉండదు. కానీ, మా కోటా, మా వాటా పూర్తి కాకుండా నీటిని తరలిస్తామంటే మా హక్కులపై కచ్చితంగా నిలదీస్తాం, అడ్డుకుంటాం. మా రైతుల హక్కుల కోసం కచ్చితంగా మాట్లాడతాం. దానికి మేమేదో ప్రాంతీయ అసమానతలను రెచ్చగొడుతున్నట్టు లోకేశ్ వక్రీకరించడం సరికాదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీలు ఏపీకి ఇచ్చిన తరువాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. మా రాష్ట్ర హక్కులు మేము కాపాడుకుంటాం.. మీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోండి. అంతే కానీ ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వకండి అంటూ హితవు పలికారు. -
జెడ్పీటీసీ ఎన్నికలు.. పులివెందులలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అధికార కూటమి సర్కార్ పాలనలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల ఏవైనా కూటమి నేతలకు ప్రలోభాలకు, బెదిరింపులకు దిగుతున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పోలీసుల సాయంతో లా అండ్ ఆర్డర్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇక, తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి.. వైఎస్సార్సీపీ మద్దతుదారులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించింది.వివరాల ప్రకారం.. పులివెందుల మండలం అచ్చవెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడు, రేషన్ డీలర్ జనార్దన్ రెడ్డిపై రెవెన్యూ అధికారులు అక్రమ కేసు పెట్టారు. జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేసేందుకు అధికారుల ద్వారా జనార్దన్ రెడ్డి రేషన్ షాపును తనిఖీ చేయించారు. అన్నీ సక్రమంగా ఉన్నా కూడా రెండు కేజీలు బియ్యం తక్కువగా ఉన్నాయని కేసు నమోదు చేశారు. అయితే, టీడీపీ నేతల ఒత్తిడి మేరకే రేషన్ షాపును తనిఖీ చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా.. వైఎస్సార్ జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు వివిధ జిల్లాల్లోని మూడు ఎంపీటీసీ స్థానాలు, రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు, మణీంద్రం, వేపకంపల్లి, విడవలూరు–1 ఎంపీటీసీ స్థానాలకు 12న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు. -
తండ్రి కోరికను నెరవేర్చిన కుమార్తె
రిజ్వర్ బ్యాంక్‌లో ఉద్యోగం...ఆరు అంకెల జీతం.. మెట్రో నగరాల్లో జీవితం..ఇంతకుమించి ఇంకేం కావాలనుకుంటారు ఎవరైనా..! కానీ ఇవేవి ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు...ప్రజా సరీ్వసుల్లో తన కూతురుని చూడాలన్న తండ్రి ఆశయం ముందు.! అందకే ఆమె ఓ వైపు కుటుంబాన్ని, మరోవైపు ఉద్యోగం నిర్వహిస్తూనే సివిల్ సరీ్వసెస్‌కు సన్నద్ధమయ్యారు. కఠోర శ్రమతో గ్రూప్–1 పరీక్షలో సత్తా చాటి తండ్రి కల నేరవేర్చారు ఎం.ఎన్. భార్గవి. ఎమ్మిగనూరు డీఎస్పీగా తొలి పోస్టింగ్‌ను అందుకుని, విధుల్లో చేరిన ఆమె ప్రయాణం యువతరానికి స్ఫూర్తిదాయకం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ఉద్యోగాలను వద్దనుకుని తన కల నెరువేర్చుకున్నారు ఇటీవల ఎమ్మిగనూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎం.ఎన్ భార్గవి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందిన జానార్దన్‌రావు, లలిత దంపతులకు ఎంఎన్. భార్గవి, దివ్య, మురళీకృష్ణ సంతానం. జానార్దన్‌రావు జనరల్ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. తల్లి లలిత గృహిణి. వీరి మొదటి కుమార్తె ఎంఎన్.భార్గవి 10వ తరగతి వరకు తాడెపల్లిగూడెంలో, ఇంటర్ విజయవాడలో చదువుకున్నారు. ఆ తర్వాత వరంగల్‌లో ఈసీబీటీసీ (ఎన్ఐటీ)లో పూర్తి చేశారు. తన చెల్లెలు డాక్టర్ దివ్య హైదరాబాద్‌లో హోమియో ఎండీగా పనిచేస్తుండగా, తమ్ముడు డాక్టర్ మురళీకృష్ణ గ్యాస్టో ఎండీగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. చెల్లి, తమ్ముడు డాక్టర్లు అయినా తను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా తన లక్ష్యం గ్రూప్స్‌పైనే ఉండేది. వరంగల్‌లో ఈసీబీటీసీ చదువతుండగానే క్యాంపస్ సెలెక్షన్లో మోటో సెల్ ఫోన్ కంపెనీలో ఉద్యోగం పొంది హైదరాబాద్‌లో ఒక సంవత్సరం చేశారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతూ బ్యాంక్ ఉద్యోగాలకు పరీక్ష రాయగా ఓరియంటెల్ బ్యాంక్‌లో ఉద్యోగం సాధించి 8 నెలలు పని చేశారు. ఆ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ముంబాయిలోని రిజర్వ్ బ్యాంక్‌లో నాలుగున్నరేళ్లు పనిచేసి హైదరాబాద్ ఆర్బీఐకు బదిలీపై వచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తూనే సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికై ఐఆర్టీసీ (రైల్వేశాఖ)లో ఉద్యోగం వచ్చినా అందులో చేరలేదు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలి ఎవరైనా అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే పట్టుదలతో చదవాలి. నేను గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అప్పుడు మాకు లేవు.. ఉన్న దాంట్లో కష్టపడి చదివాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నా లక్ష్యాన్ని చేరుకున్నా. డీఎస్పీగా బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా. – ఎం.ఎన్. భార్గవి, డీఎస్పీ, ఎమ్మిగనూరుఓ వైపు కుటుంబం, మరో వైపు ఉద్యోగం.. అయినా.. బ్యాంక్ జాబ్ చేస్తున్నా తన తండ్రి జనార్దనరావు ఆశయాన్ని నెరవేర్చాలని గ్రూప్స్‌ను మాత్రం వదల్లేదు. బ్యాంక్ జాబ్ చేస్తుండగానే గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ మురళీకృష్ణతో వివాహమైంది. వీరికి కుమారుడు శ్రేయస్ (3), రెండున్నర ఏళ్ల కుమార్తె మనోజ్ఞ ఉన్నారు. కాగా భర్త హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండగా, భార్గవి ఆర్బీఐలో పని చేసేవారు. ఓ వైపు బ్యాంక్ ఉద్యోగం చేస్తూ, మరో వైపు కుటుంబాన్ని చూసుకుంటూ తన లక్ష్యాన్ని మాత్రం మరవలేదు. పట్టుదలతో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో విజయాన్ని సొంతం చేసుకొని డీఎస్పీగా ఎంపికయ్యారు. అనంతపురం పోలీస్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది ఎమ్మిగనూరు డీఎస్పీగా మొదటి పోస్టింగ్‌లో చేరారు. మహిళా డీఎస్పీగా విధుల్లో చేరి యువతి, యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. -
బియ్యం లేవట.. డబ్బులు తీసుకోవాలట..!
తర్లుపాడు: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చౌకబియ్యం దళారులు, అధికార కూటమి నేతలకు ఆదాయ వనరుగా మారింది. 1న కార్డుదారులకు అందుబాటులో ఉండి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల్సిన డీలర్ ఇంటింటికీ తిరిగి బయోమెట్రిక్ థంబ్ వేయించుకుని ‘రేషన్ లేదు.. డబ్బులు తీస్కోండి’ అంటూ కార్డుదారులపై మండిపడటం.. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది.మండలంలోని కేతగుడిపి పంచాయతీలో సుమారు 1100 మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ 1న రేషన్ అందించాల్సిన డీలర్ తన కుమారుడు ద్వారా బియ్యం లేవంటూ కార్డుదారుల నుంచి థంబ్ వేయించుకుని కిలోకు రూ.10 చొప్పున డబ్బు చెల్లించారు. ఇదేమని అడిగేందుకు సాహసించని కార్డుదారులు ఇచి్చనకాడికి తీసుకొన్నారు. గతంలో రేషన్ బియ్యాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కార్డుదారుల ఇళ్లకు వెళ్లి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రేషన్ డీలర్లే అధికార పార్టీ నేతల అండతో బియ్యం ఇవ్వకుండా నేరుగా మార్కెట్‌కు తరలిస్తుండటం గమనార్హం. -
ఫ్రీ బస్ ఎక్కేసి పుట్టింటికి వెళ్లిపోండి..
ద్వారకాతిరుమల: ఇదివరకటి లాగా ఇంట్లో భర్త విసుక్కున్నా.. కసురుకున్నా ఎవరూ పడాల్సిన పని లేదని, హ్యాపీగా ఫ్రీ బస్ ఎక్కేసి పుట్టింటికి వెళ్లి పోతే, భర్తే వచ్చి తీసుకువెళతారని గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన స్పౌజ్ పెన్షన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొని పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళలను రెచ్చగొట్టేలా ఉన్నాయని కొందరు మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
స్మార్ట్ షాక్
సాక్షి, అమలాపురం: తమపై విద్యుత్ భారం పడుతుందని వినియోగదారులు.. తమ ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని అని మీటర్ రీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఏపీఈపీడీసీఎల్ వెనక్కు తగ్గడం లేదు. ఎంత మంది వేడుకున్నా, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో స్మార్ట్ మీటర్ల బిగింపును వేగవంతం చేశారు. దీనితో ఈ నెల 5వ తేదీ నుంచి ఆందోళనలకు ప్రజా సంఘాలకు సిద్ధమవుతున్నాయి. 49,325 సర్వీసులకు ఏర్పాటు కోనసీమ జిల్లాలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వినియోగదారులు గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ క్యాటగిరీలలో 6.32 లక్షల విద్యుత్ సర్విసులున్నాయి. తొలి విడతలో క్యాటగిరీ–2 పరిధిలో ఉన్న షాపులు, పరిశ్రమలు, సినిమా హాళ్లు, ఎక్కువ విద్యుత్తు వినియోగించే వ్యాపార సంస్థలకు సర్విసులకు స్మార్ట్ మీటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 63,686 సర్విసులు క్యాటగిరి– 2 పరిధిలో ఉండగా, ఇంత వరకు 49,325 విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు వేయడం పూర్తి చేశారు.ఈ మీటర్ల ఏర్పాటుపై వ్యాపార సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు వెనకడుగు వేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మీటర్లు వేయవద్దని అడ్డుకుంటున్నా లెక్క చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 5,43,481 సర్విసులు క్యాటగిరీ –1లో ఉన్నాయి. వీటికి స్మార్ట్ మీటర్లు వేసేది లేదని అధికారులు చెబుతున్నా వినియోగదారులలో నమ్మకం కలగడం లేదు. ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక కార్పొరేట్ సంస్థకు మేలు చేయాలనే బలమైన సంకల్పంతో ఉండడం వల్ల కేటగిరీ–1లో ఉన్న గృహాలకు కూడా రెండో దశలో స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాలు ఇవే స్మార్ట్ మీటర్ల బిగింపు భారం వినియోగదారులపై ఉండదని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. అయితే ఆ భారం ఏదో ఒక రూపంలో తమపై వేస్తారని వినియోగదారుల ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ మీటర్ ఖర్చు సింగిల్ ఫేజ్‌కు రూ.9 వేలు, త్రీఫేజ్‌కు రూ.17 వేల చొప్పున మొత్తం 93 నెలల్లో వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుంచే వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందన సర్దుబాటు చార్జీల పేరుతో వినియోగదారుల నడ్డి విరుస్తున్న విషయాన్ని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు. ⇒ ఏదైనా కారణాల వల్ల స్మార్ట్ మీటర్ పాడైపోతే సొమ్ములు చెల్లించి కొత్త మీటర్ మార్చుకోవాలి. ⇒ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత గంట గంటకూ రీడింగ్ తీస్తారు. పగలు కంటే రాత్రి వాడే కరెంటుకు అధిక బిల్లులు వేస్తారు. వేసవి కాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేస్తారని వినియోగదారుల అనుమానం. ⇒ విద్యుత్ బిల్లులలో తప్పులకు సమాధానం చెప్పే నాథుడే ఉండడు. ఈ మీటర్లతో ప్రజల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం ఏర్పడుతుందనే అనుమానాలున్నాయి. 5న సబ్ స్టేషన్ల ముట్టడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వైపు విద్యుత్ చార్జీల బాదుడు, మరో వైపు స్మార్ట్ మీటర్ల భారంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. దీనిపై ఈ నెల 5వ తేదీన విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. బలవంతంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజావేదిక ఆధ్వర్యంలో అమలాపురం సీఐటీయూ కార్యాలయంలో ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన విసయం తెలిసిందే. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గా ప్రసాద్, ఏఐటీయూసీ నాయకుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, వ్యవసాయ కారి్మక సంఘం, కౌలు రైతు సంఘం తదితర ప్రజా సంఘాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఉపాధికి ఎసరు స్మార్ట్ మీటర్ల వల్ల తాము ఉపాధి కోల్పోతామనే ఆందోళనలో మీటర్ రీడర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది వరకు ఉండగా కోనసీమ జిల్లాలో సుమారు 180 మంది వరకు ఉన్నారని అంచనా. వీరికి నెలకు సగటున రూ.పది వేల వరకు వస్తోంది. స్మార్ట్ మీటర్ల వల్ల తమ ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. వీరందరూ పొట్టకూటి కోసం పోరుబాట పట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల వినియోగదారులకు భవిష్యత్తులో పలు రకాల ఇబ్బందులు రానున్నాయి. ఇది వినియోగదారులకు మోయలేని భారంగా మారనుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిరసనగా ఈనెల 5న చేపట్టే ఆందోళనకు అన్నివర్గాల ప్రజలు ముందుకు రావాలి.– కొప్పుల సత్తిబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు అపోహలొద్దు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై అపోహలు వద్దు. వినియోగదారులపై ఎలాంటి అదనపు చార్జీల భారం ఉండదు. పాత మీటర్లతో పోలిస్తే స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవస్థలో పారదర్శక పెరుగుతుంది. స్మార్ట్ మీటర్ కన్సూ్యమర్ యాప్ ద్వారా 247కు కనెక్ట్ అయి ఉంటాయని, ఫలితంగా వినియోగదారులు తమ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. – బి రాజేశ్వరి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ, కోనసీమ -
యనమల.. సలసల!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమకాలీకుడైన యనమల రామకృష్ణుడు పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలతో రగిలిపోతున్నారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ తనపట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఏమాత్రం జీర్జించుకోలేకపోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకి గవర్నర్ పదవి రావడంతో యనమలలో అసంతృప్తి తారస్థాయికి చేరింది.తనకి కాకుండా అశోక్‌కి చంద్రబాబు గవర్నర్ పదవి ఇప్పించడం ఆయనకు అస్సలు నచ్చకపోగా పెద్ద అవమానంగా భావిస్తున్నారు. గవర్నర్ పదవికి తాను ఎందుకు అర్హుడిని కానని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. చంద్రబాబు ఈ స్థాయికి రావడానికి అన్ని విధాలా సహకరించడంతోపాటు రాజ్యాంగపరమైన సమస్యలు, ఇబ్బందులు వచి్చనప్పుడు కూడా అవన్నీ తన భుజానే వేసుకుని పరిష్కరించే వాడినని.. అలాంటి తనను కాదని అశోక్‌కి పదవి ఇవ్వడం అన్యాయమని యనమల మథనపడుతున్నారు. ప్రతీ అవసరానికి వాడుకున్నారు.. టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కే పరిస్థితి లేకపోవడం, భవిష్యత్తులోనూ అలాంటి అవకాశాలు వస్తాయో లేదో తెలీని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. యనమల తాను గౌరవప్రదమైన పదవిని పొంది ఆ తర్వాత రాజకీయాల నుంచి ని్రష్కమించే అవకాశం లేకుండా చేశారని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అన్ని అవసరాలకు చంద్రబాబు తనను వాడుకుని ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేశారని, రాజకీయాల నుంచిఅవమానకరంగా రిటైర్ అయ్యేలా చేశారని ఆయన మండిపడుతున్నారు.ఇటీవల తన ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసినా రెన్యువల్ చేయకుండా ఇబ్బందికరంగా పక్కకు తప్పించి జూనియర్లు, కొత్తగా వచి్చన వారికి అవకాశం ఇవ్వడం తనను అవమానించడమేనని ఆయన చెబుతున్నట్లు సమాచారం. చంద్రబాబు రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగడానికి.. టీడీపీ నిలబడడానికి తాను కూడా కారణమనే విషయాన్ని మరచిపోయి ఇప్పుడు తన పట్ల ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని ఆయన కారాలుమిరియాలు నూరుతున్నారు. వెన్నుపోటు ఎపిసోడ్లో నేను లేకపోతే ఏమయ్యేది? ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని ఆయన చేతుల్లో నుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చేలా చేయడంలో యనమల రామకృష్ణుడిది అత్యంత కీలకపాత్ర. అప్పట్లో అసెంబ్లీ స్పీకర్‌గా ఉండి సభలో ఎన్టీఆర్‌కు కనీసం మాట్లాడ్డానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ ఎపిసోడ్లో అన్ని విధాలా సహకరించడంతో చంద్రబాబు సీఎంతో పాటు టీడీపీ సారథి అయ్యారు. ఈ మొత్తం ఉదంతంలో యనమల ఆయన వెన్నంటే ఉండి సహకరించారు.ఆ తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలు రాజ్యాంగపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు తనను ఉపయోగించుకున్నారని గుర్తుచేస్తున్నారు. అలాంటి తాను రాజకీయాల నుంచి హుందాగా రిటైర్ అయ్యే ఉద్దేశంతో 2014–19 మధ్య రాజ్యసభకు పంపాలని అడిగితే మంత్రి బాద్యతలు అప్పగించారని చెబుతున్నారు. కనీసం ఇప్పుడైనా రాజ్యసభ ఇవ్వాలని అడిగినా పట్టించుకోకపోగా కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా రెన్యువల్ చేయలేదని వాపోతున్నారు. గవర్నర్ పదవి అడిగితే బాబు స్పందించలేదు.. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో కలిసి ఉండడంతో ఈసారి కచి్చతంగా టీడీపీకి ఒక గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉండడంతో అది తనకు ఇప్పించాలని యనమల కొద్దిరోజుల క్రితం నోరుతెరిచి అడిగినా చంద్రబాబు స్పందించలేదని సమాచారం. చంద్రబాబు దృష్టి అశోక్‌పై ఉండడంతో ఆయనకు పదవి ఇచ్చి తనను అవమానించారని యనమల భావిస్తున్నారు. అశోక్ కంటే తాను ఎందులో తక్కువని, పార్టీకి తాను చేసిన సేవలు, అశోక్ చేసిన సేవలు పోల్చి చూస్తే ఎవరు ఎక్కువ చేశారో తెలుస్తుందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.బీసీల పార్టీ అని చెప్పుకుంటూ పార్టీలో అత్యంత సీనియర్ బీసీ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడిని అవమానించడంపై టీడీపీలోని బీసీ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీ రావుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక దాన్ని ప్రశ్నిస్తూ ఆయన చంద్రబాబుకు లేఖ రాసినప్పుడు ఆయనపై ఎదురుదాడి చేయించారు.చంద్రబాబు తెలివిగా పార్టీలోని బీసీ నేతలతోనే ఆయనపై ఆరోపణలు, విమర్శలు చేయించడంతోపాటు సోషల్ మీడియాలో ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేసేలా చేశారు. అప్పటి నుంచి చంద్రబాబుకు, యనమలకు గ్యాప్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఇప్పుడు గవర్నర్ పదవి అశోక్‌గజపతిరాజుకు ఇవ్వడంతో ఇక పార్టీలో తనకు తలుపులు మూసుకుపోయినట్లేనని, ఇది తనకు తీరని అవమానమని యనమల కుమిలిపోతున్నట్లు సమాచారం. -
మోసపోయాం.. డబ్బులు ఇప్పించండి
చిలకలపూడి/కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ఉద్యోగాలు ఇప్పిస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరిట ఆయన పీఏనే నిరుద్యోగులను మోసగించిన ఉదంతం శనివారం వెలుగుచూసింది. ఎంపీ బాలశౌరి కార్యాలయ పీఏ గోపాల్‌సింగ్ సుమారు 60 మంది నిరుద్యోగులను నకిలీ నియామక పత్రాలతో బురిడీ కొట్టించి దాదాపు రూ.కోటి వసూలు చేసినట్టు తెలుస్తోంది.అతడి చేతిలో మోసపోయిన బాధితులంతా శనివారం ఎంపీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీనిపై ఎంపీ బాలశౌరి గాని, ఎంపీ కార్యాలయ ప్రతినిధులు గాని వివరణ ఇవ్వకపోవటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఎంపీ బాలశౌరి కార్యాలయ పీఏ గోపాల్‌సింగ్ ఎంపీ కోటాలో ఉద్యోగాలు ఉంటాయని.. వాటిని ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్క నిరుద్యోగి నుంచి రూ.లక్షన్నర, రూ.2 లక్షల చొప్పున వసూలు చేశాడు. అనంతరం కృష్ణా యూనివర్సిటీ, డీఎంహెచ్ఓ, విద్యుత్ శాఖల పేరుతో నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. ఆ పత్రాలు తీసుకుని నిరుద్యోగులు ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా ఉండేందుకు రోజూ వారికి అందుబాటులో ఉంటూ ఇంకా చాలామందికి నియామకాలు ఇచ్చారని, వారితో కలిపి మీరు కూడా ఒకేరోజు జాయిన్ కావాల్సి ఉంటుందని చెబుతూ వచ్చాడు.నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతో..డబ్బులు ఇచ్చిన నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎదురవటంతో జూలై 29న వారందరినీ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో రిపోర్టు చేయాలని, అక్కడ పోస్టింగ్ ఇస్తారని గోపాల్‌సింగ్ పంపించాడు. వారంతా ఆ హోటల్‌కు వెళ్లగా.. అలాంటి కార్యక్రమం ఏమీ లేదని హోటల్ ప్రతినిధులు చెప్పటంతో అవాక్కయ్యారు. వారంతా గోపాల్‌సింగ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.అనంతరం బాధితులు విజయవాడలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి జరిగిన మోసాన్ని వివరించారు. గోపాల్‌సింగ్ మచిలీపట్నంలో ఉంటాడని అక్కడ సంప్రదించాలని అక్కడివారు చెప్పగా.. బాధితులు మచిలీపట్నంలోని గోపాల్‌సింగ్ ఇంటికి వెళ్లారు. గోపాల్‌సింగ్ ఇంట్లో లేకపోవడంతో అతని భార్య, అత్త, మామను నిలదీశారు. రెండు రోజుల నుంచి గోపాల్‌సింగ్ ఇంటికి రావటం లేదని అతని భార్య చెప్పింది.ఆమెతో కలిసి బాధితులు అదేరోజు మచిలీపట్నంలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి అక్కడి వారికి విషయం చెప్పారు. ఎంపీ అనుచరులు రెండు రోజుల సమయం కావాలని, సొమ్ము తిరిగి ఇప్పిస్తామని హామీ ఇవ్వటంతో బాధితులు వెళ్లిపోయారు. శనివారం మరోసారి ఎంపీ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి తాళాలు వేసి ఉండటంతో ఎంపీ అనుచరుడిని ఫోన్‌ద్వారా సంప్రదించగా.. గోపాల్‌సింగ్‌ను చిలకలపూడి పోలీసులు అరెస్టు చేశారని అక్కడకు వెళ్లాలని సూచించడంతో బాధితులంతా నిరసనకు దిగారు.ఇంకెవరి హస్తమైనా ఉందా!ఉద్యోగాలు పేరిట మోసగించిన ఘటనకు గోపాల్‌సింగ్ ఒక్కడే బాధ్యుడా లేక కార్యాలయానికి సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ బాలశౌరి లెటర్ హెడ్‌పై ఉద్యోగాలకు రికమెండ్ చేస్తూ లెటర్లు ఇవ్వటం చూస్తుంటే ఈ వ్యవహారం వెనుక మరికొందరి హస్తం ఉండి ఉంటుందని బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇంగ్లిష్‌లో జాయినింగ్ లెటర్లు ఇచ్చేంత విద్యార్హత గోపాల్‌సింగ్‌కు లేదని బాధితులు పేర్కొంటున్నారు.గోపాల్‌సింగ్‌పై కేసు నమోదుఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో పీఏగా పనిచేస్తున్న గోపాల్‌సింగ్‌పై చిలకలపూడి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎంపీకి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోపాల్‌సింగ్ జిల్లాలోని అవనిగడ్డ, గుడివాడ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి ప్రాంతాలకు చెందిన నిరుద్యోగుల డబ్బులు కాజేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు గోపాల్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎస్కే నబీ తెలిపారు.పోలీసులపై నమ్మకం లేదుభర్త లేకపోయినప్పటికీ స్వశక్తితో పిల్లలను చదివిస్తున్నాను. నా కుమారుడికి ఉద్యోగం వస్తే అండగా ఉంటాడని భావించి గోపాల్‌సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలకడంతో అప్పులు తెచ్చి డబ్బులు కట్టాం. ఆ డబ్బులు ఉంటే మా అమ్మాయికి మూడు సంవత్సరాల ఇంజినీరింగ్ ఫీజుకు ఉపయోగపడేవి. ఇప్పుడు నా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోలీసులకు ఫిర్యాదులు చేస్తే అతని వద్ద డబ్బులు ఉంటే రికవరీ చేసి ఇప్పిస్తామంటున్నారు. మాకు పోలీసులపై నమ్మకంలేదు. ఎంపీ బాలశౌరి న్యాయం చేయాలి. – సాయిలత, బాధితురాలు, గుడివాడ -
సిట్ మరో అడ్డగోలు బరితెగింపు
సాక్షి, అమరావతి: నిమిషానికో అబద్ధం... అరగంటకో ఎల్లో మీడియా లీక్... గంటకో కట్టుకథ..! మొత్తానికి రోజుకో భేతాళ విక్రమార్క కథ..! మద్యం అక్రమ కేసులో సిట్ బరితెగింపు ఇది. అరాచకంలో రోజురోజుకు అంచనాలను మించుతూ, అడ్డగోలుతనంలో పీహెచ్డీ చేస్తోంది దర్యాప్తు సంస్థ. అక్రమ కేసులో ఆరు నెలలుగా డ్రామాలతో రక్తి కట్టిస్తున్న సిట్.. శనివారం మరోసారి బరితెగించింది. ‘‘ఇంతకంటే దిగజారడం ఉండదని ఊహించిన ప్రతిసారి నా అంచనా తప్పని రుజువు చేస్తున్నావ్’’ అని అదేదో సినిమాలో చెప్పినట్లు.. భేతాళ విక్రమార్క కట్టుకథల్లో అన్ని రికార్డులను దాటేస్తోంది సిట్.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. గత బుధవారం హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని విజయేందర్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్లు పట్టుబడినట్లు.. ఇదంతా మద్యం అక్రమ కేసు సొమ్మేనంటూ సిట్ ఓ కట్టుకథను తెరపైకి తెచ్చింది. ఈ నగదు జప్తు పేరిట సాగించిన హైడ్రామా విజయవాడ ఏసీబీ కోర్టులో తేలిపోయింది. మూడో కంటికి తెలియకుండా బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్ పన్నిన కుయుక్తి బెడిసికొట్టింది. మద్యం అక్రమ కేసు నిందితుడు రాజ్ కేసిరెడ్డి అభ్యర్థన మేరకు... రూ.11 కోట్లను ప్రత్యేకంగా భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్ల వివరాలను నమోదు చేస్తూ పంచనామా నిర్వహించాలని తేల్చి చెప్పింది.మొత్తం ప్రక్రియను వీడియో తీయించాలని స్పష్టం చేసింది. కాగా ఈ నగదును రాజ్ కేసిరెడ్డి 2024 జూన్ నుంచే ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు సిట్ పేర్కొంది. కానీ, ఆర్బీఐ అధికారులు ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నోట్లు అన్నిగానీ వాటిలో కొన్నిగానీ 2024 జూన్ తరువాత ముద్రించినవి అని నిర్ధారణ అయితే సిట్ చెప్పిన జప్తు వ్యవహారం అంతా కట్టుకథేనని స్పష్టమవుతుంది. దీంతో సిట్ బండారం బట్టబయలవుతుంది. మొత్తానికి ఏసీబీ కోర్టు... సిట్‌కు చెంపపెట్టు లాంటి ఆదేశాలు జారీ చేసింది. అంతే... దీన్ని కప్పిపుచ్చేందుకు శనివారం సాయంత్రానికి సిట్‌తో పాటు ఎల్లో మీడియా రంగంలోకి దిగాయి. పన్నాగంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సన్నిహితుడు వెంకటేష్‌నాయుడు సెల్‌ఫోన్ నుంచి రిట్రీవ్ చేసినట్లుగా ఓ వీడియోను సిట్ తెరపైకి తెచ్చింది.ఇదిగో కట్టుకథకు నిలువెత్తు సాక్ష్యం..సిట్ తాజా కట్టుకథ ప్రకారం విడుదల చేసిన వీడియోలో... రూ.35 కోట్లు రిసీవ్ చేసుకున్నట్లు వెంకటేష్ నాయుడు వీడియో తీసుకున్నారు. ఈ డబ్బునే గత ఏడాది (2024) ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చు కోసం చెవిరెడ్డి వినియోగించారని సిట్ కట్టుకథలతో ఎల్లో మీడియా రంగప్రవేశం చేసింది. ఇది ఎంత డొల్ల వాదన అనేది ఇక్కడే బయటపడింది. ఎలాగంటే.. వెంకటేష్ నాయుడికి చెందిన నోట్ల కట్టలుగా చెబుతూ సిట్ విడుదల చేసిన వీడియోలో రూ.2 వేల నోట్లు ఉన్నాయి. కానీ, రూ.2 వేల నోటును 2023 మే 19నే రిజర్వ్ బ్యాంక్ వెనక్కుతీసుకుంది.అంటే... ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే రూ.2 వేల నోటు చెలామణి లేదు. ఏడాది ముందుగానే చెలామణి ఆగిపోయిన నోట్లను ఎన్నికల సమయంలో ఎలా పంపిణీ చేశారనేది ప్రశ్నార్థకం. ఇదంతా చూస్తుంటే.. హైదరాబాద్‌లో రూ.11 కోట్ల జప్తు భేతాళ విక్రమార్క కథలు బెడిసికొట్టడంతో సిట్ రూ.35 కోట్ల డ్రామాను ముందుకుతెచ్చిందని స్పష్టం అవుతోంది.⇒ కాగా, వెంకటేష్‌నాయుడు రియల్టర్. తన వ్యాపార లావాదేవీల్లో భాగమైన నగదును మద్యం అక్రమ కేసుకు సిట్ ముడిపెడుతోందని తేలుతోంది. కోర్టులో చెంపపెట్టులాంటి ఆదేశాలతో ప్రజల ను తప్పుదారి పట్టించేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. వెంకటేష్ నాయుడు అరెస్టు సమయంలో డబ్బుల కట్టల వీడియో ప్రస్తావనే లేదు. రిమాండ్ రిపోర్టు సమయంలోనూ ఈ విషయం రివీల్ చేయలేదు. కానీ, రూ.11 కోట్ల కుట్ర కథ ఫెయిల్‌తో హడావుడిగా వక్రీకరణలకు దిగిందనే విషయం తేటతెల్లం అవుతోంది. -
తిమ్మిని బమ్మి చేయబోయి..
సాక్షి, అమరావతి: రాజకీయ మాయల ఫకీర్ చంద్రబాబు నోట్ల కట్టల మాటున సాగించిన మహా కుట్ర బెడిసికొట్టింది. రెడ్‌బుక్ కుట్రలో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ సిట్ పన్నాగం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని మద్యం కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించేందుకు పన్నిన తాజా కుతంత్రం విఫలమైంది. ఏకంగా న్యాయస్థానాన్నే బురిడీ కొట్టించేందుకు తెగించిన ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల బరితెగింపు బయటపడింది. ఈ అక్రమ కేసులో రూ.11 కోట్ల నగదు జప్తు పేరిట సాగించిన హైడ్రామాను కప్పిపుచ్చే సిట్ ఎత్తుగడ చిత్తయింది.హైదరాబాద్ శివారులో పట్టుకున్నట్టు చెప్పిన నగదును గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్ తాజా కుయుక్తి పన్నింది. తద్వారా... ఈ కేసులో సాక్షులను బెదిరించి, ఆ నగదును తామే తెప్పించి జప్తు చేసినట్టు ఆడిన హైడ్రామాను కప్పిపుచ్చాలని యత్నించింది. కాగా, సిట్ తాజా కుట్రపై ఉప్పందడంతో అక్రమ కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు శనివారం వెంటనే విజయవాడ ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను బ్యాంక్‌లో డిపాజిట్ చేయకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని, వాటిపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.దీన్ని విచారించిన కోర్టు... రూ.11 కోట్లను ప్రత్యేకంగా భద్రపరచాలని ఆదేశించింది. అంతేకాదు, ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్ల వివరాలను నమోదు చేస్తూ పంచనామా నిర్వహించాలని విస్పష్టంగా పేర్కొంది. న్యాయస్థానం ఉత్తర్వుల కాపీని పిటిషనర్ తరపు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి ఎస్బీఐ అధికారులకు అందజేశారు. నగదును ప్రత్యేకంగా భద్రపరచాలన్న కోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు. దీంతో రూ.11 కోట్ల జప్తు పేరిట సాగించిన కుట్రను తొక్కిపెట్టాలన్న సిట్ పన్నాగం బెడిసికొట్టింది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ సాగించిన కుట్ర... కోర్టు సత్వర స్పందనతో బట్టబయలైన వైనం ఇదిగో ఇలా ఉంది.లేని ఆధారాలు సృష్టించేందుకు జప్తు డ్రామామద్యం అక్రమ కేసులో ఏదో విధంగా భారీగా నగదు జప్తు చేసినట్టు చూపించాలని సిట్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. తద్వారా నిందితుల బెయిల్‌ను అడ్డుకోవడమే ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల పన్నాగం. అందుకే సిట్ రూ.11 కోట్లు పట్టివేత కనికట్టు చేసింది. హైదరాబాద్ శివారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ కేంద్ర బిందువుగా కపట నాటకానికి తెరతీసింది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి బెంబేలెత్తించింది. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి భార్య దివ్యారెడ్డి హైదరాబాద్‌లోని ఎరేట్ హాస్పిటల్లో మైనర్ వాటాతో డైరెక్టర్‌గా ఉన్నారు.హైదరాబాద్‌కు చెందిన తీగల విజయేందర్‌రెడ్డి కూడా ఈ హాస్పిటల్లో భాగస్వామి. ఆయనకు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ రూ.వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. అయితే, వర్ధమాన్ కాలేజీతో గానీ విజయేందర్‌రెడ్డి ఇతర వ్యాపారాలతోగానీ రాజ్ కేసిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ, లేని ఆధారాలు సృష్టించేందుకు విజయేందర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సిట్ వేధించింది. రాజ్ కేసిరెడ్డికి చెందిన నగదును జప్తు చేసినట్టు చూపించే తమ కుట్రకు సహకరించాలని పోలీసు మార్కు బెదిరింపులకు పాల్పడింది. దాంతో విజయేందర్‌రెడ్డి సిట్ అధికారుల ఒత్తిడికి తలొగ్గినట్టు తెలుస్తోంది.తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్‌ను సిట్ అమలు చేసింది. అందులో భాగంగా వర్ధమాన్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను ఎవరికీ తెలియకుండా విజయేందర్‌రెడ్డికి చెందిన హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ కాలేజీకి సరిగ్గా ఎదురుగానే ఉండే సులోచన ఫామ్‌హౌస్‌లోకి తరలించారు. ఈ పనికూడా ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బందితోనే చేయించినట్టు తెలుస్తోంది. సిట్ పోలీసులే ఆ అట్టపెట్టెలు తీసుకెళ్తే ఎవరైనా ఫోన్లతో వీడియోలు తీస్తారేమోనని సందేహించి జాగ్రత్తపడ్డారు. నగదును ఫామ్‌హౌస్‌కు చేర్చిన తర్వాత... సిట్ అధికారులు ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేసినట్టు... రూ.11 కోట్లను గుర్తించి జప్తు చేసినట్టు డ్రామా రక్తి కట్టించారు. ఆ నగదంతా రాజ్ కేసిరెడ్డిదేనని... 2024 జూన్ నుంచి అక్కడ ఉంచారని కట్టు కథ వినిపించారు.న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాజ్ కేసిరెడ్డిరూ.11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుతంత్రాన్ని రాజ్ కేసిరెడ్డి తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకు గానీ తన కుటుంబానికిగానీ ఏ సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. విజయేందర్‌రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈమేరకు రాజ్ కేసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎరేట్ హాస్పిటల్లో తన భార్య కేవలం మైనర్ వాటాతో డైరెక్టర్‌గా ఉన్నారని, విజయేందర్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఇతర వ్యాపార సంస్థలతో తమకు సంబంధం లేదన్నారు. సిట్ జప్తు చేసింది ఆ వ్యాపార సంస్థలకు చెందిన నగదే కావచ్చని చెప్పారు.దీనికితోడు సిట్ జప్తు చేసినట్టు చెబుతున్న నోట్ల కట్టలపై ఉన్న ఆర్బీఐ బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయాలని రాజ్ కేసిరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ నగదును పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆర్బీఐని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆ రూ.11 కోట్ల నగదు కట్టలను వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది. కుట్ర కప్పిపుచ్చే కుతంత్రంన్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ మరో కుట్రకు తెరతీసింది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా విజయవాడ పోలీసుల బ్యాంకు ఖాతాలు నిర్వహించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిపాజిట్ చేసేయాలని ఎత్తుగడ వేసింది. అలా చేస్తే బ్యాంకులో ఉండే ఇతర నగదుతో పాటు ఈ రూ.11 కోట్లను కలిపేస్తారు.ఆ నగదు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి సిట్‌కు ఓ డిపాజిట్ పత్రం ఇస్తారు. అంటే నగదు రూపంలో ఉన్న రూ.11 కోట్లు డిపాజిట్ పత్రం రూపంలోకి మారిపోతాయి. బ్యాంకు ఆ నగదును వివిధ అవసరాలకు వాడుకుంటుంది కూడా. అలా ఆ నోట్లు మిగతా నోట్లతో కలిసి మార్కెట్లోకి చెలామణిలోకి వెళ్లిపోతాయి. సిట్ అధికారులు హైదరాబాద్‌లో జప్తు చేసిన నోట్ల కట్టలు ఏవీ అంటే ఎవరూ చెప్పలేరు. ఇదీ సిట్ పన్నాగం...! ఇందుకోసం సిట్ అధికారులు శుక్రవారం రాత్రే రంగంలోకి దిగారు.శుక్రవారం రాత్రి నుంచే హైడ్రామా...శుక్రవారం రాత్రే విజయవాడ ఎస్బీఐ పటమటలోని సీసీఎస్ బ్రాంచి, మాచవరం బ్రాంచి అధికారులను సంప్రదించారు. అంత భారీ నగదును డిపాజిట్‌గా స్వీకరించాలంటే ముందుగా రెండుసార్లు నోట్ల కట్టలను డినామినేషన్ చేసి పరిశీలించాల్సి ఉంటుంది. అందుకు చాలా సమయం పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆ ప్రక్రియ నిర్వహించడం గమనార్హం. మొదటి దశ కింద డినామినేషన్ పూర్తి చేసినట్టు సమాచారం. రెండో దశ డినామినేషన్ శనివారం మధ్యాహ్నం లోపు పూర్తి చేయాలని భావించారు. న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్..సిట్ కుట్రను పసిగట్టిన రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు సత్వరం స్పందించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో అత్యవసర పటిషన్ దాఖలు చేశారు. జప్తు చేశామని చెబుతున్న రూ.11 నోట్ల కట్టలను సిట్ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఓ సారి జప్తు చేసినట్టు న్యాయస్థానానికి నివేదించిన నగదు, ఇతర ఆస్తులపై పూర్తి అధికారం కోర్టుకే ఉంటుంది.అటువంటిది కోర్టు అనుమతి లేకుండానే ఆ నగదును డిపాజిట్ చేయడం ద్వారా సిట్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని నివేదించారు. తద్వారా ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. ఆ రూ.11 కోట్లను డిపాజిట్ చేయకుండా సిట్‌ను ఆదేశించాలని కోరారు. అప్పటికే చేస్తే వాటిని ఎస్బీఐలోని ఇతర నోట్లతో కలపకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని సిట్‌తో పాటు ఎస్బీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం శనివారం విచారించింది. ఈ సందర్భంగా సిట్ విచారణ అధికారి ఏకంగా కోర్టునే తప్పుదారి పట్టించేందుకు యత్నించడం గమనార్హం. రూ.11 కోట్లు ఎక్కడ ఉన్నాయని సిట్ దర్యాప్తు అధికారిని ప్రశ్నించగా.. అప్పటికే ఎస్బీఐలో డిపాజిట్ చేసేశామని ఆయన చెప్పారు. దీనిపై రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ నగదును ఇంకా డిపాజిట్ చేయలేదన్నారు. చేసి ఉంటే బ్యాంకు కౌంటర్ ఫాయిల్ చూపించాలన్నారు. ఈ ప్రశ్నకు సిట్ అధికారి సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ నగదు డిపాజిట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో సోమవారం అఫిడవిట్ సమర్పిస్తామని చెప్పారు. అందుకు దుష్యంత్‌రెడ్డి సమ్మతించ లేదు. తమకు సిట్‌పై ఏమాత్రం నమ్మకం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలో సిట్ పావుగా మారిందన్నారు. రూ.11 కోట్లకు సంబంధించిన బ్యాంకు కౌంటర్ ఫాయిల్ ఫొటోను వాట్సాప్ ద్వారా తెప్పించుకుని అయినా చూపించమని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పరిణామంతో తనకు సమయం కావాలన్న సిట్ అధికారి దాదాపు గంట వరకు పత్తా లేకుండాపోవడం గమనార్హం. రూ.11కోట్లను ప్రత్యేకంగా భద్రపరచండిరాజ్ కేసిరెడ్డి పిటిషన్‌ను విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం విస్పష్టమైన తీర్పునిచ్చింది. రూ.11 కోట్లను విడిగా భద్రపరచాలని సిట్ అధికారులు, ఎస్బీఐ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే డిపాజిట్ స్వీకరించి ఉంటే బ్యాంకులోని ఇతర నగదుతో కలపకుండా ప్రత్యేకంగా భద్ర పరచాలని స్పష్టం చేసింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని సిట్‌ను ఆదేశించింది. మొత్తం ప్రక్రియను వీడియో తీయించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి హక్కులను పరిరక్షించేందుకు, ఆయన లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని తేల్చి చెప్పింది. దాంతో సిట్ కుట్ర బెడిసికొట్టింది.ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు బెంబేలుఈ పరిణామాలతో అటు ప్రభుత్వ పెద్దలు ఇటు సిట్ అధికారులు బెంబేలెత్తారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను ఆర్బీఐ అధికారులు పరిశీలిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ నగదు కట్టలను రాజ్ కేసిరెడ్డి 2024 జూన్ నుంచే ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు సిట్ పేర్కొంది. కానీ, ఆర్బీఐ అధికారులు ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నోట్లు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024 జూన్ తరువాత ముద్రించినవి అని నిర్ధారణ అయితే సిట్ చెప్పిన జప్తు వ్యవహారం అంతా కట్టుకథేనని స్పష్టమవుతుంది.అంతేకాదు, ఆ నోట్ల కట్టలను ఏ ఏ తేదీల్లో బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేశారన్నది కూడా ఆర్బీఐ అధికారులు పరిశీలించి వెల్లడిస్తారు. ఆ నోట్ల కట్టలు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024, జూన్ తరువాత బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసినట్టు వెల్లడైతే సిట్ బండారం బట్టబయలవుతుంది. చివరకు కోర్టును తప్పుదారి పట్టించిన సిట్ అధికారులపై న్యాయస్థానం తీవ్రమైన చర్యలకు ఆదేశించవచ్చు. ఆపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన ఈ అక్రమ కేసు కుట్ర బెడిసికొడుతుంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు హడలిపోయారు.విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అడ్డగోలు వాదనజప్తు చేసిన ఆస్తుల విషయంలో చేయాల్సింది ఇలా...పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు తాము జప్తు చేసే స్థిర, చర ఆస్తులకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలను న్యాయ వ్యవస్థ విస్పష్టంగా పేర్కొంది. అవి ఏమిటంటే...⇒ జప్తు చేసిన నగదు, స్థిర, చర ఆస్తులను మధ్యవర్తుల సమక్షంలో రికార్డు చేయాలి. ⇒అనంతరం పంచనామా చేయాలి. అంటే ఆ స్థిర, చర ఆస్తుల పరిమాణం, స్వరూప స్వభావాలను స్పష్టంగా పేర్కొనాలి. నగదు కాబట్టి.. ఆ నోట్లపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు, మొత్తం విలువ, వాటిని ఎందులో భద్రపరిచింది? మొదలైన వివరాలతో పంచ నామా చేయాలి. ⇒ జప్తు చేసిన నోట్ల కట్టలను ప్యాకింగ్ చేసి న్యాయస్థానంలో ప్రదర్శించాలి. ప్యాకింగ్ తెరచి మరీ న్యాయస్థానానికి చూపించాలి. ⇒ అనంతరం న్యాయస్థానం అనుమతితో ఆ నగదును ప్రభుత్వ ట్రెజరీలో భద్ర పరచాలి. కోర్టు కోరితే ఎప్పుడైనా సరే వాటిని మరోసారి తీసుకొచ్చేందుకు వీలుగా ట్రెజరీలోనే ఉంచాలి. ⇒ కోర్టు అనుమతి ఇచ్చిన తరువాతే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయాలి.కానీ, సిట్ ఏం చేసిందంటే..⇒హైదరాబాద్ శివారు ఫామ్‌హౌస్‌లో రూ.11కోట్లు జప్తు చేసినట్టు ప్రకటించింది. ⇒జప్తు చేసిన నోట్ల కట్టలను న్యాయస్థానానికి చూపించనే లేదు. జప్తు చేసినట్టు కేవలం ఓ నోట్ సమర్పించి చేతులు దులుపుకొంది.⇒ ఆ రూ.11 కోట్లను ప్రభుత్వ ట్రెజరీలో భద్రపరచలేదు.⇒ కోర్టు అనుమతి లేకుండానే ఆ రూ.11కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యత్నించింది. తద్వారా బ్యాంకులోని ఇతర నోట్ల కట్టలతో వాటిని కలిపేయాలన్నది సిట్ కుట్ర. తద్వారా జప్తు పేరిట తమ కుట్ర బయటపడకుండా ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.నోట్ల కట్టలన్నిటికీ బ్యాంక్ పిన్, సీల్స్⇒ వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది⇒ మరి రూ.11 కోట్లని ఎలా నిర్ధారించారు?⇒ లెక్కపెట్టే యంత్రాలను ఎక్కడా చూపలేదు..⇒ అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారు⇒ కానీ, ఇక్కడే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామాసిట్ కపట నాటకంలో మరో అంకం ఇది.. అది జప్తు చూపించిన డబ్బు అంతా కట్టలకు బ్యాంక్ పిన్, సీల్స్‌తో ఉంది. దీన్నిబట్టి కనీసం వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది. అలాగైతే.. ఆ మొత్తం రూ.11కోట్లని ఎలా నిర్ధారించారు? అనేది సమాధానం చెప్పాలి. పైగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా ఎక్కడా చూపలేదు. అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారని స్పష్టం అవుతోంది. కానీ, ఫామ్‌హౌస్‌లోనే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామా నడిపించింది.నోట్ల నంబర్లు రికార్డు చేస్తే సిట్ బండారం బట్టబయలునోట్ల నంబర్లు రికార్డు చేస్తే ఏ బ్యాంకు ద్వారా ఎప్పుడు డ్రా చేశారు? ఎవరి బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేశారు? ఏ టైమ్‌లో డ్రా చేశారు? అనేది స్పష్టంగా తేలిపోతుంది. అందుకే అది తెలియకుండా ఉండేందుకు బహుశా ప్రపంచంలో ఏ విచారణ సంస్థ కూడా చేయని విధంగా సిట్ బరితెగించింది. భారీ స్కెచ్ వేసింది. స్వయంగా డబ్బు తానే పెట్టి.. జప్తు పేరిట కపట నాటకం ఆడింది. ఇదంతా బయటపడకుండా ఉండేందుకు బ్యాంకులోని మిగతా డబ్బులో కలిపేసే కుతంత్రానికి తెరతీసింది. -
అడ్డంగా దొరికిన సిట్!
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి చెందిన డబ్బు అంటూ సిట్ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో జప్తు చేసిన రూ.11 కోట్లపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఏసీబీ కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఆ రూ.11 కోట్లకు పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నెంబర్‌ను రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ డబ్బును సిట్ ఇప్పటికే డిపాజిట్ చేసి ఉంటే, ఆ మొత్తాన్ని ఇతర కరెన్సీ నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్‌ను కోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ నోట్లను వేరుగానే ఉంచాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి రూ.11 కోట్ల జప్తు వ్యవహారంలో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఈ డబ్బు కేసిరెడ్డిదేనని సిట్ చెప్పగా, ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక 2024 ఎన్నికలకు ముందే ఈ రూ.11 కోట్లను దాచిపెట్టినట్లు సిట్ చెబుతోందని, ఆ కరెన్సీ నోట్లు ఏ సంవత్సరానివో నిగ్గు తేలాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రికార్డులను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. రూ.11 కోట్ల కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను రికార్డ్ చేసేందుకు ఓ అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించాలని కోరుతూ రాజ్ కేసిరెడ్డి తాజాగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు శనివారం విచారణ జరిపింది. బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఉంటే స్లిప్ చూపమనండి..కేసిరెడ్డి తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆ కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను వీడియోగ్రఫీ చేసి, దాని ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తమకున్న సమాచారం మేరకు ఆ రూ.11 కోట్లను సిట్ ఇప్పటి వరకు బ్యాంకులో జమ చేయలేదన్నారు. ఆ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్ల విషయంలో పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ నోట్లను సిట్ తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. సిట్‌పై తమకు ఏ విధమైన నమ్మకమూ లేదన్నారు. దీంతో డబ్బు డిపాజిట్ చేశారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు కోర్టు సిట్ దర్యాప్తు అధికారి (ఐవో)ని పిలిపించింది. కోర్టు ముందు హాజరైన దర్యాప్తు అధికారి తాము రూ.11 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేశామని చెప్పారు. ఈ సమయంలో దుష్యంత్ జోక్యం చేసుకుంటూ, సిట్‌ను నమ్మలేమని, ఒకవేళ రూ.11 కోట్లను డిపాజిట్ చేసి ఉంటే డిపాజిట్‌కు సంబంధించిన బ్యాంక్ స్లిప్పును చూపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బ్యాంక్ స్లిప్పును 5 నిమిషాల్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకోవచ్చన్నారు. డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచేలా బ్యాంకును ఆదేశించాలని ఆయన కోరారు. దీంతో దర్యాప్తు అధికారి అర్ధగంటలో డిపాజిట్ స్లిప్పును తీసుకొస్తానని వెళ్లారు. గంటలు గడిచినా కూడా ఆ అధికారి తిరిగి రాలేదు. ఆయన పత్తా లేకుండా పోవడంతో కోర్టు ఈ మొత్తం వ్యవహారంలో ఏదో తేడా ఉందన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. దర్యాప్తు అధికారి రాకపోవడంతో డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ అధికారులను ఆదేశించింది. అలాగే డిపాజిట్ చేసిన నోట్ల పంచనామా చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. -
రూ.10 వేలు కట్టండి.. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులకు అప్పుడే ఆర్థిక భారం మొదలైంది. ఈఏపీసెట్ తొలి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు తరగతులు ప్రారంభమయ్యే రోజే(ఆగస్టు 4న) రూ.10 వేలు ఫీజు కట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు హుకుం జారీ చేశాయి. వాస్తవానికి కాలేజీల బోధన సామర్థ్యాలను పరిశీలించి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నిర్ణయిస్తుంటుంది. ఆ ప్రకారమే ఫీజులపై ప్రభుత్వం జీవోలు విడుదల చేయాలి. కానీ, కొత్తగా చేరే విద్యార్థుల నుంచి వివిధ రకాల ఫీజుల పేర్లు చెప్పి కాలేజీలు అదనంగా రూ.10 వేలు వసూలు చేస్తున్నాయి.అలాగే విద్యార్థుల నుంచి బలవంతంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అందుకే విద్యార్థుల నుంచి ఏదో రకంగా వసూలు చేయకతప్పట్లేదని కాలేజీల యాజమాన్యాలు చెబుతుండడం గమనార్హం. సీఎస్ఏబీ, ఈఏపీసెట్ మధ్య నలిగిపోతున్న విద్యార్థులు! ఇదిలా ఉండగా, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్ఐటీల్లో మిగులు సీట్లకు ఎన్ఐటీ రూర్కెలా ఆధ్వర్యంలో సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(సీఎస్ఏబీ) నిర్వహిస్తున్న ప్రత్యేక కౌన్సెలింగ్ కంటే ముందే.. ఈఏపీసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ముగుస్తుండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 4న ఈఏపీసెట్ రెండో దశ సీట్లు కేటాయింపు చేయనుంది. 8వ తేదీలోగా విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. రాష్ట్రంలోని కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. కానీ, సీఎస్ఏబీ కౌన్సెలింగ్ ఆగస్టు 19 వరకు కొనసాగనుంది.ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ రెండో కౌన్సెలింగ్‌లో సీటు పొంది కాలేజీల్లో చేరిన తర్వాత.. సీఎస్‌ఏబీలో సీటు వస్తే విద్యార్థుల వద్ద సర్టిఫికెట్లు ఉండవు. సీటు రద్దు చేసుకోవాలంటే కాలేజీలు అడిగినంత ఇవ్వాలి. లేదంటే జాతీయ విద్యా సంస్థల్లో సీటును వదులుకోవాలి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. -
సుఖీభవ పేరుతో సెట్టింగ్ డ్రామా
ఒంగోలు సిటీ: ‘పంజాబీ దాబాలాంటి సెట్టింగ్ వేసి.. 50 నుంచి 60 నులక మంచాలపై మహిళలు, రైతులను కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు వెనుక గడ్డివాము, ఒక ట్రాక్టర్ పెట్టి.. చుట్టూ పచ్చగా ఉండేలా భారీ సెట్టింగ్ వేసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఓ డ్రామా తరహాలో నిర్వహించారు’ అని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించకుండా అన్నదాతా సుఖీభవ పేరుతో షూటింగ్ చేసుకుని వెళ్లిపోయారని మండిపడ్డారు.శనివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పరిపాలనలో ఏటా 53.58 లక్షల మంది లబ్ధిదారులకు రైతు భరోసా అందేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్యను భారీగా కుదించారని దుయ్యబట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 46.87 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇస్తున్నారని, మిగిలిన 7 లక్షల మంది రైతులు ఏమి అన్యాయం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. మొదటి ఏడాది రైతులకు సాయం ఎగ్గొట్టి, ఇప్పుడు కేంద్రం వాటా కలుపుకుని రూ.7 వేలు ఇవ్వడం దగా చేయడమేనన్నారు. బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు ఎంత కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించరు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి పంటకు క్వింటాల్‌కు రూ.27 వేలు నుంచి రూ.28 వేలు ధర లభిస్తే.. చందరబాబు హయాంలో క్వింటాల్ ధర రూ.6 వేలకు పడిపోయిందని శివప్రసాద్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మిర్చి, పొగాకు, శనగ, వరి, పత్తి ఇలా అన్ని పంటల రైతులు గిట్టుబాటు ధరలు రాక అవస్థలు పడుతున్నారన్నారు. దర్శిలో కార్యక్రమం ఎవరి కోసం.. సీఎం చంద్రబాబు దర్శిలో నిర్వహించిన కార్యక్రమం ఎవరి కోసమో చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మిర్చి రైతుల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిర్చి యార్డుకు వెళ్లిన తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖరాసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పొదిలికి జగన్మోహన్రెడ్డి వస్తే వేలాది మంది రైతులు, కార్యకర్తలు తరలివచ్చారని, వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారన్నారు. -
చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు.. ఉండబోదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/దర్శి : ‘చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్..’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయట పెట్టారు. రైతులంటే తనకు ఎంత చిన్నచూపో మరోమారు స్పష్టం చేశారు. గతంలో ఉచిత విద్యుత్ ఇస్తానన్న వైఎస్ రాజశేఖరరెడ్డి మాటలను తప్పుపట్టి.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు, వ్యవసాయం దండగ.. రైతులు మరో పని చూసుకోవాలని కూడా చెప్పిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో శనివారం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. అన్నదాతల పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. ఈ పథకం కింద రూ.5 వేలు వేస్తూ రూ.7 వేలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాను చూసుకోండి తమ్ముళ్లూ.. అనటంతో రైతులు అవాక్కయ్యారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.85 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3,174 కోట్ల నగదు జమ చేశానని చెప్పారు.కరోనా సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే చంద్రబాబు మాత్రం తన ప్రసంగంలో ‘తుపాను వచ్చినా, నష్టపోయినా, ఏ రైతూ వ్యవసాయం మానలేదు. భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్డౌన్ ఇచ్చాం. కానీ రైతులకు మాత్రం లాక్ డౌన్ లేకుండా చేశాను’ అని చెప్పడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. గత ఏడాది పంటలకు ఉచిత పంటల బీమాను ఇవ్వకపోయినా, ఇచ్చామని మరో అబద్ధం చెప్పారు. దేశంలో డ్రిప్ ఇరిగేషన్‌ను తానే ప్రవేశ పెట్టానని చెప్పుకొచ్చారు.సీఎం ప్రసంగంలో ఎక్కువ భాగం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కార్యకర్తలను సైతం రెచ్చగొట్టారు. ఇచ్చిన హామీల గురించి మాట్లాడే ప్రయత్నమే చేయలేదు. తనను ఆశీర్వదించాలని పదే పదే అడిగారు. సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాశారని మండిపడ్డారు. మీరు సాక్షి పేపర్ చూస్తారా? అని ప్రశి్నంచారు. ముఖం చాటేసిన రైతులు రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి వీరాయపాలెం గ్రామంలోని రైతులు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. సభా ప్రాంగణంలో ఎటువంటి టెంట్లు వేయలేదు. నులక, నవారు మంచాలు వేయించి వచ్చిన కొద్దిమంది రైతులను పొలంలో ఎర్రటి ఎండలో వాటిపైనే కూర్చోబెట్టారు. ప్రాంగణంలోకి రైతులు మాత్రమే వెళ్లాలని నిబంధనలు పెట్టారు. సామాన్య రైతులు రాక పోవడంతో ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో కార్యకర్తలు పసుపు కండువాలు తీసేసి ఆకు పచ్చ కండువాలు వేసుకుని మంచాలపై కూర్చున్నారు.ఉదయం 10 గంటల నుంచి చంద్రబాబు సభ అయిపోయే వరకు ఎండ వేడిమి భరించలేక వచ్చిన వారిలో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు. చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు మంచాల పైకెక్కి వాటిని విరగ్గొట్టారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఎల్ఈడీ ద్వారా చాలా సేపు చూపించారు. ఎండ వేడిమికి తాళలేక చాలా మంది సొమ్మసిల్లి పోయే పరిస్థితిలో చంద్రబాబు మాట్లాడటం మొదలు పెట్టారు. సభను రక్తి కట్టించేందుకు ఆ ప్రాంగణం అంతా అధికారులు, టీడీపీ నాయకులు హంగామా చేశారు. చంద్రబాబు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. సీఎం ప్రసంగం పూర్తి కాకముందే వెనుక భాగంలోని మంచాలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఇంతటి అట్టర్ ఫ్లాప్ షో ఎప్పుడూ చూడలేదని టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకోవడం కనిపించింది. అసంతృప్తితో బాబు తిరుగు ప్రయాణం చంద్రబాబు తన సభను రక్తి కట్టించాలని ఎంత ప్రయత్నించినా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో అసంతృప్తితో వెనుతిరిగారు. సభ పూర్తయిన తర్వాత ఏసీ బస్‌లోకి ఎక్కిన బాబు.. అరగంటకు పైగా లోపలే కూర్చుండిపోయారు. ‘సీఎం బస్సు దిగి కిందకు వస్తారు.. వరి నాట్లు వేస్తారు’ అని అధికారులు సభా ప్రాంగణం ముందు నాట్లు వేయించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే డ్రోన్ కెమెరాలు ప్రారంభించే కార్యక్రమంలోనూ సీఎం పాల్గొనలేదు. ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం కూడా రద్దు చేసుకుని వెళ్లిపోయారు.కాగా, తూర్పు వీరాయపాలెం గ్రామంలోని ఇళ్లల్లో ఉన్న మంచాలన్నీ చంద్రబాబు కార్యక్రమానికి తరలించారు. ఈ కార్యక్రమానికి అరకొరగా హాజరైన వారిలో అధికారులు, ఉద్యోగులు 80 శాతం, రైతులు.. ప్రజలు 20 శాతం ఉన్నారు. వీరిలో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు. ‘నేను మీ కోసం ఇంతటి ఎండలో ఉన్నాను.. మరి మీరు ఉండరా..’ అని చంద్రబాబు అడిగినా ఎవరూ వినిపించుకోలేదు. కార్యక్రమం ముగిశాక విరిగిపోయిన మంచాలను చూసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగున్న వాటిని ఎవరివి వాళ్లు తీసుకెళ్లారు. -
AP: రండి.. దోచుకోండి!
తమకు కావాల్సిన వారికి విలువైన భూములను కూటమి ప్రభుత్వం ఎలాంటి జంకు లేకుండా ధారాదత్తం చేస్తోంది. రూ.వేల కోట్ల విలువైన భూములను పప్పుబెల్లాలకు ఇచ్చేస్తోంది. ఎకరం కోట్ల రూపాయలు చేసే భూములను కారు చౌకగా ఇవ్వడం తగదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చెవికెక్కించుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు ఏపీఐఐసీ సేకరించిన భూములను సైతం తన బినామీ రియల్ ఎస్టేట్ సంస్థలు, రహస్య భాగస్వాములకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. ఇంతగా బరితెగించి భూముల పందేరం సాగించడం ఇదివరకెన్నడూ చూడలేదని అధికార వర్గాలు విస్తుపోతున్నాయి.సాక్షి, అమరావతి : పారిశ్రామిక అవసరాల కోసం పేదల నుంచి కారు చౌకగా సేకరించిన భూములను పారిశ్రామిక పార్కుల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాల్సిన ఏపీఐఐసీ.. ఆ పని వదిలేసి, రియల్ ఎస్టేట్ సంస్థల అడుగులకు మడుగులు వత్తుతోంది. ఇప్పటికే ఐటీ పార్కుల ముసుగులో విశాఖలో వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేసిన విషయం తెలిసిందే.తాజాగాఏపీ ప్రైవేటు ఇండ్రస్టియల్ పార్క్స్ విత్ ప్లంగ్ అండ్ ప్లే ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ 2024–29 పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలకు భూములు అప్పగిస్తోంది. తొలి విడతలో 31 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పేరిట 5,221.09 ఎకరాలను, కావాల్సిన వారికి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. 100 ఎకరాలు పైబడిన వాటిని లార్జ్ పార్కులుగా, 100 ఎకరాల లోపు వాటిని ఎంఎస్ఎంఈ పార్కులుగా వర్గీకరించి.. ఆ మేరకు పార్కులను డిజైన్ చేసి, నిర్మించి నిర్వహించడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది.మొత్తం 13 లార్జ్ పార్కుల కింద 4,737.86 ఎకరాలు, 16 ఎంఎస్ఎంఈ పార్కుల కింద 483.23 ఎకరాలను కట్టబెట్టనుంది. అంతేకాకుండా ప్రైవేటు ఇండ్రస్టియల్ పార్కుల పాలసీ కింద ఎకరానికి రూ.3 లక్షల క్యాపిటల్ సబ్సిడీతో పాటు అనేక రాయితీలు ఇవ్వనుంది. పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేసిన వారే కాకుండా వాణిజ్య భవనాలు, గృహ సముదాయాలు, గిడ్డంగులు వంటి నిర్మాణాలు చేపట్టిన రియల్ ఎస్టేట్ సంస్థలూ పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో పాలుపంచుకోవచ్చని నిర్ణయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారుప్రైవేటు పార్కుల పాలసీ ముసుగులో తమకు కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడమే ఈ నిబంధనల ఉద్దేశమని వారు స్పష్టం చేస్తున్నారు. పారిశ్రామిక పార్కుల్లో కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సముదాయాలు, ఆస్పత్రులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్ల నిర్మాణానికి అనుమతిస్తున్నారంటే దీని వెనుక ఉన్న ‘రియల్’ ఉద్దేశాలు అర్థం చేసుకోవచ్చని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కొత్తచోట్ల కాకుండా ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించి అభివృద్ధి చేయడం ద్వారా రూ.వేల కోట్లు పలుకుతున్న జయంతిపురం, రాంబల్లి, కోసల నగరం, రౌతుసురమాల, తిమ్మసముద్రం, సంతబొమ్మాళి వంటి చోట్ల ప్రైవేటు వ్యక్తులకు భూమి కేటాయింపులు చేయడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతమెంతో ఘన చరిత్ర ఏపీ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ)కు దేశ వ్యాప్తంగా మంచి పేరుంది. ఎటువంటి కన్సల్టెన్సీల ప్రమేయం లేకుండానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఫార్మా, బయో టెక్నాలజీ పార్కులను ఈ సంస్థ నిరి్మంచింది. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ భూమి సేకరిస్తోందంటే.. తమ బిడ్డలతోపాటు ఇరుగు పొరుగు వారికి ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో ఎంతో మంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ తీరు పూర్తిగా మారిపోయింది.547 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్న సంస్థ.. కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయలేమంటూ చేతులెత్తేసింది. పేదల నుంచి సేకరించిన రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు, రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడానికి ఉత్సాహం చూపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జపిస్తున్న పీ–4.. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్ షిప్ విధానంలో కాకుండా పీ–3.. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ షిప్ విధానంలో పారిశ్రామిక పార్కులను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయనుంది. పీ–4 విధానంలో అయితే భూములు ఇచి్చన రైతులూ భాగస్వామ్యం అవుతారు. దీంతో దాన్ని పక్కకు పెట్టి పీ–3 విధానంలో 5,221.09 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది.కాగా, దళితులు, గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమిని కేటాయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటు పార్కుల ఏర్పాటుతో ఆ రిజర్వేషన్‌కు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. దీంతో దళిత పారిశ్రామిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. -
టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా
తిరువూరు: ఆంధ్ర నుంచి తెలంగాణకు టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమంగా తరలిపోతోందని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణాతో టీడీపీ నేతలు అక్రమార్జనకు పాల్పడుతున్నారని విమర్శించారు. శుక్రవారం అర్ధరాత్రి తిరువూరు మండలంలోని పెద్దవరం వద్ద తెలంగాణ సరిహద్దుల్లో ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు ఇసుక అక్రమంగా నిల్వ చేసి అమ్ముతున్నారని సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కొలికపూడి, ఆ గ్రామం వెళ్లి డంపింగ్ చేసిన ఇసుకను పరిశీలించారు.ఒకే వ్యక్తి పేరుతో ఇసుక నమోదు చేసి తెలంగాణకు తరలిస్తున్నారని, ఈ అక్రమ రవాణాను పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ఏసీపీ ప్రసాదరావుపై ఫోనులోనే విరుచుకుపడ్డారు. ఇటీవల తిరువూరులో ఘర్షణకు పాల్పడిన గంజాయి బ్యాచ్ ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని, పోలీసులు నేరాల అదుపులో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్ట నిఘా ఉంచామని, నేరాలు అదుపు చేస్తామని చెబుతున్న పోలీసులు అవసరమైన చోట సీసీ కెమెరాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారని ఎద్దేవా చేశారు. -
నాటి చంద్రబాబు సర్కారు నిర్వాకం.. 15 మందిపై అవినీతి కేసులు కొట్టివేత
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ తీరుతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులు కేసుల నుంచి తప్పించుకున్నారు. విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)ను పోలీస్‌స్టేషన్‌గా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ పునరి్వభజన చట్టం కింద నోటిఫై చేయకపోవడంతో ఆ అధికారులపై ఏసీబీ నమోదు చేసిన కేసులను హైకోర్టు తాజాగా కొట్టేసింది. సీఐయూను పోలీస్‌స్టేషన్‌గా నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని హైకోర్టు గుర్తుచేసింది. 2022లో నోటిఫై చేసిందని తెలిపింది. ఈ నేపథ్యంలో.. 2016–2022 మధ్య కాలంలో నమోదైన కేసులకు చట్టబద్ధత లేదని తేలి్చంది. దీంతో.. అవినీతి ఆరోపణల కింద 15 మంది అధికారులపై నమోదైన కేసులను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కేసులు కొట్టేయాలంటూ పిటిషన్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వివిధ శాఖలకు చెందిన 15 మంది అధికారులపై 2016–19 మధ్య కాలంలో విజయవాడలోని ఏసీబీ సీఐయూ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేశారు. వీటిని కొట్టేయాలని కోరుతూ వారు 2020, 21, 23 సంవత్సరాల్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమపై కేసులు నమోదుచేసే నాటికి విజయవాడ ఏసీబీ సీఐయూని సీఆర్పీసీ కింద పోలీస్‌స్టేషన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదని.. అందువల్ల తమపై కేసుల నమోదు చెల్లదని ఆ అధికారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. నోటిఫై చేయకుండా కేసుల నమోదు చెల్లదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లపై ఏసీబీ ఆరోపణలు నిరాధారమైనవని, కేసులు నమోదుచేసే నాటికి ఏసీబీ సీఐయూ పోలీసుస్టేషన్ కాదన్నారు. పోలీస్‌స్టేషన్‌గా నోటిఫై చేయకుండా కేసుల నమోదు చెల్లదని స్పష్టంచేశారు. 2003లో రాష్ట్రంలో పలు ఏసీబీ కార్యాలయాలను పోలీస్స్టేషన్లుగా నమోదుచేస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ ఇచి్చందన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత నాటి ఏపీ ప్రభుత్వం ఏసీబీ కార్యాలయాలను పోలీస్స్టేషన్లుగా నోటిఫై చేయలేదని ఆయన చెప్పారు.ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు సమాచార హక్కు చట్టం కింద ధ్రువీకరించారని రామారావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషనే ఉనికిలో లేనప్పుడు కేసుల నమోదే చెల్లదని.. అందువల్ల సోదాలు, జప్తులు, వారెంట్ల జారీ తదితరాలను కోరుతూ ఏసీబీ దాఖలు చేసే దరఖాస్తులను ఏసీబీ ప్రత్యేక కోర్టులు విచారించడానికి వీల్లేదన్నారు. అన్నీ అన్వయించుకున్నట్లే భావించాలి : ఏజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర విభజన తరువాత అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో అమలైన అన్ని చట్టాలు, సర్క్యులర్లు, మెమోలు పునరి్వభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్వయింప చేసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. 2003లో రాష్ట్రంలో పలు ఏసీబీ కార్యాలయాలను పోలీస్స్టేషన్లుగా నమోదుచేస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు.అందువల్ల రాష్ట్ర విభజన తరువాత ఆ జీఓ అమల్లో ఉన్నట్లేనన్నారు. 2022లో ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్‌గా నోటిఫై చేసినప్పటికీ అంతకుముందు కేసులు నమోదు చేసేందుకు ఏసీబీకి అధికారం ఉందన్నారు. పిటిషనర్లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయని, వారిపై కేసులను కొట్టేయవద్దని ఆయన కోర్టును అభ్యరి్థంచారు. ప్రాథమిక తప్పుని ఆ తరువాత సరిదిద్దలేరు : న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ తీర్పునిస్తూ.. పిటిషనర్లపై కేసులు పెట్టిన విజయవాడ ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్‌గా నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఎలాంటి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. అందువల్ల నోటిఫై కాని పోలీసుస్టేషన్‌కు ఇన్చార్జ్ అధికారిగా పోలీసు అధికారి వ్యవహరించజాలరని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. 2022లో జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రాథమిక తప్పుని సరిచేయలేరన్నారు. ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్‌గా ప్రభుత్వం నోటిఫై చేయడానికి ముందే పిటిషనర్లపై కేసులు నమోదయ్యాయి కాబట్టి అవి చెల్లవని, వాటిని కొట్టేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. -
మీ మోసం ఇవాళ మరోసారి నిజమైంది: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మీ హామీ ఒక మోసం.. మీ ష్యూరిటీ ఇంకో మోసం.. మీ బాండ్లు మరో మోసం.. మీ గ్యారెంటీ పచ్చి మోసం’ అన్నది మరోసారి దర్శి సభ సాక్షిగా నిజమైందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా.. ఏటా రూ.20 వేలు ఇస్తానన్న హామీని చంద్రబాబు మంటగలిపారని మండిపడ్డారు.ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5 వేలేనని.. అది కూడా ఎంత మందికి చేరిందో తెలియదన్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే.. మీరు ఉద్దేశ పూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి ఏడు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టి అన్యాయం చేశారు.హామీల అమల్లో మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ మండిపడ్డారు. అందుకే ప్రజలను మభ్య పెట్టడానికి దర్శిలో మోసపూరిత కార్యక్రమాన్ని సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని జనం గమనిస్తూనే ఉన్నారని ఎత్తిచూపారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమే కాదు.. వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు. నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్–6, సూపర్–7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతు భరోసా పథకాన్ని దారుణంగా దెబ్బ తీశారు. మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే. ⇒ ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంత వరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవం. ⇒ చంద్రబాబూ.. మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, 2019 అక్టోబర్‌లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించాం. ఆ ఐదేళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి, సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచాం. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించేవాళ్లం. కానీ, మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు. ⇒ మా 2019 మేనిఫెస్టోలో 4 ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే, దానికంటే మిన్నగా.. మరో రూ.1,000 పెంచి వరుసగా ఐదేళ్లు ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించి రికార్డు సృష్టించాం.⇒ కానీ చంద్రబాబూ.. మీరు కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మీరు ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5 వేలు. అది కూడా ఎంత మందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారుల వైపు, ప్రైవేటు అప్పుల వైపు మళ్లించారు.⇒ మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు ఉద్దేశ పూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి, రైతులకు అన్యాయం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధి లేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్య పెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ⇒ చంద్రబాబూ.. వైఎస్సార్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకు ముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు. ⇒ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేం ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ, మీరు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు. ⇒ రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశారు.⇒ మేం ప్రవేశపెట్టి, అమలు చేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాది కూడా మీరు బీమా సొమ్ములు కట్టక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ⇒ ఆర్బీకేలనమీ–క్రాప్‌ను, టెస్టింగ్ ల్యాబులను నిర్వీర్యం చేశారు.⇒ ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మేం అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారు. ⇒ రాష్ట్ర వ్యాప్తంగా 250 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోక పోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం. -
ఆ నోట్ల కట్టలు నోళ్లు తెరిస్తే..?
చాలా విషయాలు బయటకొస్తాయి. ఆ నోట్ల కట్టలపై నిజాయితీగా విచారణ జరిగితే మద్యం కేసు కడుపులో దాక్కున్న గుట్టు రట్టవుతుంది. కట్టు కథలు ఎవరు చెబుతున్నారో, పుక్కిటి పురాణాలను ఎవరు వల్లెవేస్తున్నారో తేలిపోతుంది. అంతేకాదు, అపవిత్ర రాజకీయ మైత్రీబంధాల బండారం కూడా బద్దలు కావచ్చు. పన్నెండు అట్టపెట్టెల్లోని 11 కోట్ల సంగతి ఇది.ఆంధ్రప్రదేశ్ పోలీసుల సిట్ బృందం చెప్పిన లెక్క. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో కుంభ కోణం ఉన్నదని దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించి ఏడాది పూర్తయింది. ‘సిట్’ రంగప్రవేశం చేసి ఆరు నెలలయింది. ఈ మధ్యనే ఒక అసంపూర్ణ ఛార్జిషీట్ వేశారు. ఆయన చెప్పాడని ఈయన పేరు, ఈయన చెప్పాడని ఆయన పేరు చొప్పున ఓ నలభై ఎనిమిది మందిని ఇందులో నిందితులుగా చేర్చారు.త్వరలో ఇంకో చార్జిషీట్‌ను వేస్తారట! అందులో ఇంకొంత మందిని చేరుస్తారేమో! ఈ కుంభకోణం ద్వారా ఆనాటి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడిందని సిట్ ఆరోపిస్తున్నది. నిందితులుగా నమోదైన వారిలో కొందరి చేత నయానో భయానో తమ స్క్రిప్టుకు అనుకూలంగా చెప్పించుకుంటున్నారనీ, కొందరు చెప్పిన వాఙ్మూలాలకు విరుద్ధంగా రాసుకొని బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారనీ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రకమైన వాఙ్మూలాల మీదనే కథ నడిపిస్తున్నారు తప్ప ఇంతవరకూ తమ ఆరోపణలకు బలం చేకూర్చే వస్తుగతమైన, సాంకేతికమైన, లిఖిత పూర్వకమైన ఆధారాలేవీ సిట్ సంపాదించలేక పోయిందనేది యథార్థం. ఇక తుది ఛార్జిషీట్‌ను వేయవలసిన దశలో 12 అట్టపెట్టెలు, 11 కోట్ల నోట్ల కట్టలు అనే వృత్తాంతాన్ని ముందుకు తెచ్చింది.వరుణ్ అనే నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో ప్రధాన నిందితు డైన రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో దాచిపెట్టిన 11 కోట్ల రూపాయలను గత బుధవారం సీజ్ చేసినట్టు న్యాయస్థానానికి సిట్ చెప్పింది. 2024 జూన్‌లోనే తాము ఈ డబ్బును అక్కడ పెట్టి నట్టు కూడా వరుణ్ చెప్పినట్టు సిట్ తెలియజేసింది. ఈ 11 కోట్లు కూడా లిక్కర్ కుంభకోణం డబ్బేనని సిట్ వాదన. దీనిపై స్పందిస్తూ రాజ్ కేసిరెడ్డి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సిట్ సీజ్ చేసినట్టు చెబుతున్న ఫామ్‌హౌస్ తీగల విజయేందర్‌రెడ్డి అనే వ్యాపారవేత్తదని, ఆయన టర్నోవర్ కోట్ల రూపాయల్లో ఉంటుందని కూడా కేసిరెడ్డి తన పిటిషన్లో తెలిపారు. విజయేందర్‌రెడ్డికి చెందిన ఒక ఆస్పత్రిలో తన భార్య చిన్న భాగస్వామి మాత్రమేనని, అంతకుమించి ఆ ఫామ్‌హౌస్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వాదించారు. సీజ్ చేసిన సొమ్ముకూ, తనకూ ఎటువంటి సంబంధం లేదని చెబుతూ 2024 జూన్ నుంచి ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు చెబుతున్న నోట్లను వీడియో తీయించాలని, ఆ సీరియల్ నెంబర్ల ఆధారంగా ఆ నోట్లను ఎప్పుడు విడుదల చేశారో రిజర్వు బ్యాంకు ద్వారా సమాచారం తెప్పించుకోవాలని ఆయన అభ్యర్థించారు. 2024 జూన్ తర్వాత విడుదల చేసినట్టు తేలితే ప్రాసిక్యూషన్ కథనం తేలిపోతుందనీ, తనకు న్యాయం జరుగుతుందనీ ఆయన వాదించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ ఆ నోట్ల కట్టలను ఫోటోలు తీయించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. ఫోటోలు, వీడియోలు తీయకుండానే ఆ నోట్ల కట్టలను సిట్ బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నదని, దాన్ని అడ్డుకోవాలని, కోర్టు కమిషన్ ఆధ్వర్యంలో వీడియో తీయించాలని కేసిరెడ్డి న్యాయవాదులు శనివారం నాడు మరో పిటిషన్ వేశారు. తాము అప్పటికే కోర్టులో నగదు డిపాజిట్ చేశామని దర్యాప్తు అధికారి కోర్టుకు చెప్పారు. అలా చేసి వుంటే ఆ లావాదేవీ తాలూకు కౌంటర్ ఫాయిల్ చూపెట్టాలని కేసిరెడ్డి న్యాయవాదులు డిమాండ్ చేశారు. దర్యాప్తు అధికారి ఇప్పుడు తన దగ్గర లేదన్నారు. కనీసం వాట్సాప్‌లోనైనా పంపించాలని వారు కోరారు. చాలాసేపటి వరకు ఎటువంటి వాట్సాప్ సమాచారం రాలేదు. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయకుండానే చేసినట్టు కోర్టులో సిట్ చెప్పి ఉండాలి. పిటిషన్ విచారించిన జడ్జి కీలకమైన ఆదేశాలను సిట్‌కు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు జారీ చేశారు. సదరు 11 కోట్లను ప్రత్యేకంగా ఉంచాలనీ, మిగతా డబ్బుతో కలపొద్దనీ చెప్పారు. అలాగే పంచనామా చేసి ఆ నోట్ల సీరియల్ నంబర్లను నమోదు చేయాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని సిట్‌కు ప్రత్యేకంగా తెలిపారు.ఆ నోట్లను వీడియో తీయాలని ముందురోజు జడ్జి చెప్పినప్పటికీ, లెక్క చేయకుండా ఆ నోట్లను హడావిడిగా బ్యాంకులో డిపాజిట్ చేశామని ఎందుకు చెప్పినట్టు? ఒకసారి బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత, ఆ సొమ్ము మిగతా డబ్బులో కలిసిన తర్వాత దానిపై విచారణ కుదరదనే ఎత్తుగడను వేశారని అనుకోవాలా? సిట్ వ్యవహరించిన తీరు పారదర్శకంగా లేదు. న్యాయబద్ధంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా లేదు. ఈ కేసులో ఇంతవరకూ ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయారని కోర్టు అక్షింతలు వేసినందువల్లనే ఈ గూడుపుఠాణీ జరిపినట్టు నిందితులు ఆరోపిస్తే దాన్ని పూర్వ పక్షం చేయగలరా? దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా పని చేస్తున్నట్టయితే, కోర్టు కమిషన్ సమక్షంలో రిజర్వు బ్యాంకు ప్రతినిధుల సమక్షంలోనే వీడియో తీసి, నోట్ల సీరియల్ నెంబర్లను నమోదు చేసి అనంతరం బ్యాంకులో డిపాజిట్ చేసి ఉండేవారు. ఎవరూ అడగనవసరం లేదు. అది వారి కనీస బాధ్యత. ఈ నోట్ల కట్టల వ్యవహారంలో ఆది నుంచి అంతంవరకూ సిట్ వ్యవహారం తీరు పారదర్శకంగా లేదు. ‘విశ్వసనీయ’ సమాచారం మేరకు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి డబ్బు సీజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడమో, వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడమో చేసి ఉండవలసింది. లేదంటే సీబీఐ లేదా ఈడీ వంటి కేంద్ర సంస్థలకు సమాచారం అందించి ఉండవలసింది. దొరికింది నల్లధనం కనుక ఆదాయం పన్ను శాఖకు కూడా సమాచారం ఇచ్చి ఉండవలసింది. దొరికిన నల్లడబ్బు ఒక పెద్ద కేసులో సాక్ష్యంగా చూపెడుతున్నారు కనుక ఈమాత్రం పారదర్శకత లేకపోతే అదొక కుట్రపూరిత వ్యవహారంగానే జనం భావిస్తారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు తాజా ఆదేశాల తర్వాత సిట్ వారి స్క్రిప్టు ఏ మలుపులు తిరుగుతుందో చూడవలసి ఉన్నది.పొరుగు రాష్ట్రానికి వెళ్లి కుట్రపూరిత వ్యవహారాలకు పురుడు పోయాలంటే అదీ, ఒక వాణిజ్య ప్రముఖుని ఫామ్‌హౌజ్ కేంద్రంగా జరిపించాలంటే స్థానిక వ్యవస్థల సహకారం లేకుండా సాధ్యపడుతుందనేది అనుమానమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల మధ్య సహకార ధోరణి బాగా ఉన్నట్టే చెబుతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే మంచిదే. కానీ ఒక ప్రభుత్వ స్వార్థ రాజకీయాలకు సాయపడే విధంగా వ్యవహరించడం, ఒక ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తికి మేలు చేయడం కోసం ఒట్టు తీసి గట్టున పెట్టడం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ‘పుష్ప’ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు వగైరాలు తాజా సంఘటనలే. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ప్రతిజ్ఞ చేశారు. తాను సీఎం కుర్చీలో కూర్చున్నంతకాలం సినిమా టిక్కెట్ల ధరలు పెంచడానికి, స్పెషల్ షోలు వేయడానికి అనుమతించబోనని ఖండితంగా చెప్పారు. జనం కూడా హర్షించారు. నాయకుడంటే ఈమాత్రం పట్టుదల ఉండాలని అభినందించారు. కానీ ఆరు నెలలు తిరిగే సరికి ఆ పట్టుదల పట్టు తప్పింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. ఆ సినిమా హీరో పక్కరాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ, వ్యక్తిగత సహకా రాలపై పొలిటికల్ సర్కిల్స్‌లోనే కాదు, బ్యూరోక్రాట్లు, వ్యాపార వర్గాలు కూడా మాట్లాడుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించుకున్న దగ్గర నుంచి ఈ పార్టీల బంధం కొనసాగుతున్నది. ఆయన మీద కేసులు వేయడం, జైలుకు పంపించడంలోనూ కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం – యెల్లో మీడియాలు సమష్టిగానే పనిచేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెసు పార్టీ తన విజయావకాశాలను కాలదన్నుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ క్షేత్రస్థాయిలో కేసీఆర్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతున్నదని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్‌ను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఏపీ మాదిరిగానే టీడీపీ, జనసేనలు బీజేపీ కూటమి (ఎన్డీఏ)గా పోటీ చేస్తే ప్రయోజనమా? లేక బీజేపీని ఒక్కదాన్నే పోటీలో నిలిపి తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రయోజనమా అనే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ విభాగం ఆచరణలో ఎన్డీఏలో నాలుగో పార్టీగా వ్యవహరిస్తున్నదనే భావన సామాన్య ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉన్నది. ఒకపక్క రాహుల్‌గాంధీ ఎన్డీఏపై రాజీలేని పోరాటానికి కసరత్తులు చేస్తు న్నారు. ఢిల్లీ గద్దె కోసం నాలుగో పానిపట్టు యుద్ధానికి సిద్ధమవు తున్నారు. బీజేపీపై సైద్ధాంతిక పోరాటాన్ని కూడా ప్రారంభించి అస్త్రశస్త్రాలను ఆవాహన చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ముసుగులో ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ ముఖ్య మంత్రికి మద్దతుగా రంగంలోకి దిగి రెచ్చి పోవడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విషయమైతే కాదు. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్‌కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 16 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చాడని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఆరోపించారు. దాన్ని ఖండించడానికి, వివరణ ఇచ్చుకోవడానికి సిఎం రమేశ్‌కు ఉన్న హక్కును ఎవరూ కాదనలేరు.కానీ, ఆయన అంతటితో ఆగిపోకుండా బీఆర్ఎస్ బండారం బయటపెడతానని హెచ్చరించడం, బీజేపీలో తమ పార్టీని విలీనం చేయడానికి కేటీఆర్ తన సహాయాన్ని అర్థించాడని చెప్పడం బూమెరాంగయింది. కేసీఆర్ స్థాయి నేత తన పార్టీని ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావిస్తే సీఎం రమేశ్ లాంటి వాళ్ల సహాయం అవసరమా? ఇటువంటి నాసిరకం ఆరోపణను ఎవరూ విశ్వసించకపోగా ఒకరకంగా బీఆర్ఎస్కు మేలు చేసింది. బీజేపీ – బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉన్నదని నమ్మించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు రమేశ్ ప్రకటన గండి కొట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి: చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
తాడేపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేయకండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు చంద్రబాబు హామీల మోసాన్ని ‘ఎక్స్’ వేదికగా ఎండగట్టారు వైఎస్ జగన్ 1, చంద్రబాబు గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 2. మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతుభరోసా పథకాన్ని దారుణంగా దెబ్బతీశారు. మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే.3. ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంతవరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవమే. 4. చంద్రబాబుగారూ మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, అక్టోబరు, 2019లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించి ఆ ఐదేళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి, సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచింది. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించేవాళ్లం. కాని, మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 5. మా 2019, మేనిఫెస్టోలో 4 ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 వేలు చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే, దానికంటే మిన్నగా, మరో రూ.1000 పెంచి వరుసగా 5 ఏళ్లు ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించి రికార్డు సృష్టించాం.1.@ncbn గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 20256. కాని, చంద్రబాబుగారూ మీరు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా, మీరు ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5వేలు. అదికూడా ఎంతమందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారులవైపు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారు.7. మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి, రైతులకు అన్యాయం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధిలేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్యపెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని, సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.8. చంద్రబాబుగారూ…, వైయస్సార్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు.9. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేం ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800కోట్లు ఖర్చుచేసి రైతులను ఆదుకున్నాం. కాని, మీరు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు.10. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు.11. మేం ప్రవేశపెట్టి, అమలుచేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. ఇన్సూరెన్స్‌కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాదికూడా మీరు బీమా సొమ్ములు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. .12.ఆర్బీకేలను, ఇ-క్రాప్‌ను, టెస్టింగ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు.13. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మేం అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారు.14 .రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్యచేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం. -
తిరువూరు టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తిరువూరు తమ్ముళ్ల తిరుగుబాటు జెండా ఎగురవేశారు. టీడీపీ పార్టీని, ప్రభుత్వాన్ని, ఎంపీని ఎమ్మెల్యే కొలికపూడి అల్లరి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యే.. పార్టీని, ఎంపీని బదనాం చేస్తున్నారు.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎమ్మెల్యేకి కనిపించడం లేదు.. ఎమ్మెల్యే వైఖరిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ మండిపడ్డారు.‘‘ఒక పథకం ప్రకారమే ఎమ్మెల్యే కొలికపూడి ఇలా చేస్తున్నారు. కొలికపూడితో వివాదాలన్నీ టీడీపీ వారితోనే. ఎమ్మెల్యే కొలికపూడి వల్ల టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది. కొలికపూడిని ఎంపీ కేశినేని చిన్ని కోట్లు ఖర్చుపెట్టి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి పార్టీకి, ఎంపీకి నమ్మకంగా ఉండాలి. ఏవైనా మనస్పర్థలు ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. తిరువూరులో పార్టీ, ప్రభుత్వం, ఎంపీ అల్లరవుతున్నారు తప్ప.. ఏం అభివృద్ధి జరిగింది’’ అంటూ తిరువూరు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.కాగా, తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం. -
‘ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు సమాధానం చెప్పాలి’
విజయవాడ: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో శనివారం(ఆగస్టు 2) బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాల్లాది విష్ణుతో పాటు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ పథకాలిస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్ రూ.13 వేలు రైతు భరోసా కింద రైతులకు అందించారు. ఐదేళ్లలో రూ. 34,288 కోట్లు రైతులకు ఇచ్చారు. చంద్రబాబు 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు కేంద్రం ఇచ్చినదాంతో కలిపి ఏడు వేలు మాత్రమే ఇచ్చారు. జగన్ ఐదేళ్లూ రైతు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడు లక్షల మంది రైతులకు కోత పెట్టింది. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని కబుర్లు చెప్పారు. ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేస్తున్నారు’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. -
‘అదే జరిగితే నిజాలు బయటకు.. సిట్ అధికారుల్లో కలవరం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న రూ.11 కోట్లు స్వాధీనం విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సొమ్ముకు, లిక్కర్ స్కాంకు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్‌ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.లేని స్కాంలో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంక్‌లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..హైదరాబాద్‌లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 జూన్‌లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు. పట్టుబడిన నగదును కోర్ట్‌కు సమర్పించారు. సిట్ ఆరోపణలపై ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ సొమ్ము తనకు చెందినది కాదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు.సదరు ఫాం హౌస్ యజమానులుగా ఉన్న తీగల విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, దేశ వ్యాప్తంగా డయాగ్నసిస్ సెంటర్లు, హాస్పటల్స్ ఉన్నాయి. వారికి వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి. వారు తనకు బినామీలు అని సిట్ ఆరోపించడం అన్యాయమంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నలబై అయిదేళ్ళకు పైగా వారు వ్యాపారాలు నిర్వహిస్తుంటే, నలబై ఏళ్ళ వయస్సు ఉన్న నాకు వారు బినామీలు అని చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. వారి ఆస్తులను కూడా నావిగా చిత్రీకరించడం బాధాకరణమని తన ఆవేదనను న్యాయస్థానం ముందుంచారు.సిట్ బృందం నిబంధనలను పాటించలేదు:హైదరాబాద్‌లో పట్టుబడిన రూ.11 కోట్లు కూడా వరుణ్‌కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై 23.9.2024న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వరుణ్ కుమార్ అనే వ్యక్తిపై 21.12.2024న కేసు నమోదు చేశారు. విట్నెస్ కింద నోటీస్ ఇచ్చి వాగ్మూలం నమోదు చేశారు. దీనినే కోర్ట్‌కు సమర్పించారు. దీనిలో తీగల విజయేందర్‌రెడ్డి, తీగల బాల్ రెడ్డిని కూడా 17.4.2025న సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు విచారించిన దర్యాప్తు అధికారులే నేటికీ సిట్‌లో కొనసాగుతున్నారు. ఆనాడు విచారణ సందర్భంగా ఈ డబ్బు విషయం ఎక్కడా సిట్ రికార్డుల్లో ప్రస్తావించలేదు.అదే దర్యాప్తు అధికారి వరుణ్ కుమార్‌ను విచారిస్తే ఈ సొమ్ము బయటపడిందని తాజాగా చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. గతంలో అదే వ్యక్తులను విచారించినప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు రాలేదు.? హటాత్తుగా రాజ్ కసిరెడ్డి బెయిల్ విచారణ దశలో ఉండగా ఎలా బయటపడింది? పద్నాలుగు ఏ4 కాగితాలు పెట్టే బాక్స్‌ల్లో కొత్త కొత్త నోట్లతో ఈ సొమ్ము దొరికింది. ఏసీబీ కేసుల్లో ఎవరినైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోట్‌పైనా ఉన్న నెంబర్‌ను రికార్డు చేస్తారు.వాటిని కోర్ట్‌కు సమర్పిస్తారు. కానీ ఈ కేసులో పట్టుబడిన పదకొండు కోట్ల రూపాయలకు చెందిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయలేదు? వీడియో ఫుటేజీని ఎందుకు రికార్డు చేయలేదు? అలాగే సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 నుంచి సిసి కెమేరా ఫుటేజీని ఎందుకు సేకరించలేదు? దీనిపైన ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్ రానివ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆ కరెన్సీ విషయంలో సిట్ ఎందుకు కంగారు పడుతోంది..?విజయేందర్ రెడ్డిని బెదిరించి వారికి చెందిన వ్యాపార సంస్థల నుంచి తెచ్చిన డబ్బును పట్టుకున్నారా లేక ప్రభుత్వమే ఒక ప్లాన్ ప్రకారం ఆ సొమ్మును సమకూర్చి కేసును పక్కదోవ పట్టిస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి కోర్ట్‌లో మాట్లాడుతూ ఆ పదకొండు కోట్లు నేనే నా చేతితో ఇచ్చాను అని చెబుతున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్‌ను రికార్డు చేయండి. ఆ కరెన్సీ ఏ సమయంలో ఆర్బీఐ ముద్రించారో దాని నెంబర్లపై దర్యాప్తు చేయించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ప్రతి కరెన్సీ నోట్‌ను గుర్తించి పంచనామా నివేదికలో రికార్డు చేయాలని ఆదేశించింది. బ్యాంకుకు జమ చేసి ఉంటే, మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని కూడా ఆదేశించింది. బ్యాంక్ వద్ద పోలీసులు రాత్రి నుంచే భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. రాత్రే బ్యాంకుకు జమ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కరెన్సీపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు కంగారు పడుతున్నారా? వాటి విషయంలో సిట్ బృందం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. -
స్కూల్లో క్షుద్రపూజలు?.. వారి పనేనా?
కాకినాడ జిల్లా(సామర్లకోట): స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్లో క్షుద్రపూజలు జరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయానికి పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసిన విషయాన్ని గుర్తించారు. దాంతో అప్పటికే పాఠశాలకు వచ్చిన కొంతమంది విద్యార్థులు ఈ రోజు పాఠశాల లేదు అంటూ ఇళ్లకు వెళ్లి పోవడం ప్రారంభించారు. దాంతో విషయాన్ని గమనించిన సైన్సు ఉపాధ్యాయురాలు ఏఎల్‌వీ కుమారి ఆవరణలో ఉన్న నిమ్మకాయలను తీసి వేసి ముగ్గులను చెరిపించారు.విద్యార్థులను క్లాసు రూములకు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. హెచ్ఎం కె.శ్రీదేవి వచ్చిన తరువాత విషయం తెలుసుకొని ఎదురుగా షాపులో ఉన్న సీసీ కెమెరాలో గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దృశ్యాలను పరిశీలించారు. ఆ దృశ్యాలలో పాఠశాల ఆవరణలోకి ఎవరూ వచ్చినట్లు కనిపించలేదు. దాంతో ఉపాధ్యాయులు ఉపిరి పీల్చుకున్నారు.ఈ మేరకు పాఠశాల హెచ్ఎం శ్రీదేవి మాట్లాడుతూ పాఠశాలలోని ఆకతాయి విద్యార్థులు చేసిన పనిగా అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం సమయంలో విద్యార్థులు ఈ పని చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులకు సీఐ ఎ కృష్ణ భగవాన్‌తో కౌన్సెలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఉండటానికి ఇటువంటి పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హెచ్ఎం తెలిపారు. -
వైఎస్సార్సీపీ నేత అశోక్‌బాబుకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్‌బాబును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అశోక్‌పై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచిన అశోక్‌పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్‌ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. రైతుల తరుపున పోరాడుతూ, వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అణిచివేయాలని చూశారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం అశోక్ చేయడం అభినందనీయం. ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అశోక్‌బాబుకు అన్నివిధాలా పార్టీ అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.కాగా, సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై పోలీసులు దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్‌కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు.వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్‌బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు.అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్‌బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. -
జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కృష్ణాజిల్లా: జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాననని మోసం చేసిన ఘటనపై బాధితులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులను నిండా ముంచేసిన బాలశౌరి పీఏ గోపాల్ సింగ్.. కోటిన్నర రూపాయలు వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 60 మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేశారు గోపాల్ సింగ్.గతంలో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన ఎంపీ పీఏ గోపాల్‌సింగ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అపాయింట్మెంట్ లెటర్ల గడువు ముగిశాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విజయవాడలోని నోవాటెల్‌కు వస్తే మళ్లీ కొత్తగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తానని నమ్మించాడు గోపాల్ సింగ్.దాంతో నిన్న (శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) నోవాటెల్ హోటల్‌కు బాధితులు వెళ్లగా, అక్కడకు గోపాల్ సింగ్ రాలేదు. ఈ నేపథ్యంలో మోసపోయామని గుర్తించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎంపీ కార్యాలయం వద్ద ఆందోళన చేయకూడదని వారిని పోలీసులు బెదిరింపులకు దిగారు. -
పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అమరావతి: పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.భారతదేశ జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/lqErkr2l3P— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2025 -
బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారు?: పొన్నవోలు
సాక్షి, విజయవాడ: రూ.11 కోట్ల విషయంలో సిట్ కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీరియల్ నంబర్స్ వీడియోగ్రఫి చేయాలని కోర్టు ఆదేశించినా కానీ.. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారంటూ ఆయన ప్రశ్నించారు. నోట్లు వెరిఫై చేస్తే ఎవరు విత్ డ్రా చేశారో తెలుస్తుందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.కాగా, ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్లు రూపాయలు సీరియల్ నెంబర్లు వీడియో గ్రఫి చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. రూ.11 కోట్లు ఎస్బీఐ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి సిట్ సన్నాహాలు చేస్తుండగా.. రూ. 11 కోట్లను కచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో గ్రఫి చేయాలని పిటిషన్లో పేర్కొన్న న్యాయవాది.. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతుందన్నారు. -
అక్కడ ఎంపీటీసీ ఎన్నిక వాయిదా వేయాలి.. ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: ఏపీలో రామకుప్పం ఎంపీటీసీ ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నారాయణ మూర్తి వినతి పత్నం అందజేశారు.అనంతరం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘రెండు జడ్పీటీసీ, మూడు ఎంపీటీసీలకు నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్ల స్క్రూట్నీ జరుగుతోంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్నాడు. మహిళలపై గౌరవం ఉన్నట్లు పదేపదే మాట్లాడతారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే దళిత మహిళ నామినేషన్‌ను అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను లాక్కుంటుంటే పోలీసులు కనీసం అడ్డుకోలేకపోయారు. స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే తీసుకోవడం లేదు. ఇక బాధితులు ఎవరికి చెప్పుకోవాలి. ప్రజాస్వామ్య విలువలు లేవు. కేసులు తీసుకునే పరిస్థితులు లేవు. కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ మెట్లు ఎక్కుతూ దిగుతున్నాం. ఎన్నికల కమిషన్ తన విస్తృతమైన అధికారాలు వినియోగించాలి. మేం ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకూ సీసీ కెమెరాలు పర్యవేక్షణ చేయాలన్నాం. ఆన్ లైన్ నామినేషన్లు స్వీకరణకు అనుమతించాలని కోరాం.బీహార్ తరహా పరస్థితులు ఏపీలో నెలకొన్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పార్టీలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అధికారులు శాశ్వతం. అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తే వారికి ఇదే మా హెచ్చరిక. మేమూ డిజిటల్ లైబ్రరీ పెట్టాం. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వారి పేర్లు డిజిటల్ లైబ్రరీలో చేర్చుతున్నాం. మేం అధికారంలోకి వచ్చాక వారందరినీ చట్టం ముందు నిలబెడతాం. రామకుప్పం ఎంపీటీసీ ఎన్నిక వాయిదా వేయాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపాలి. లేకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘స్థానిక సంస్థలు జరిగే చోట జాగ్రత్తలు తీసుకోవాలని గతంలోనే మేం కోరాం. ఈ ప్రభుత్వం సజావుగా ఎన్నికలు జరిపించేలా లేదని మేం ముందుగానే చెప్పాం. రామకుప్పం ఎంపీటీసీ అభ్యర్ధి, దళిత మహిళ శ్రీదేవిని నామినేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమె వద్ద బ్యాగ్ లాక్కున్నారు. విలువైన డాక్యుమెంట్లు, నామినేషన్ పత్రాలు లాక్కున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. రాష్ట్రంలో రూల్స్ ప్రకారం పాలన సాగడం లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదన్నారు.దళితులు, మహిళలకు భద్రత ఏది?. దౌర్జన్యం జరుగుతున్నా పోలీసులు కళ్లప్పగించి చూడటం తప్పు. ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా తీసుకునే పరిస్థితి లేకపోతే ఎలా?. ఏపీలో ఎమర్జన్సీ పాలన జరుగుతోంది. దళిత మహిళపై జరిగిన దాడికి ప్రభుత్వం.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. రామకుప్పం ఎన్నికను వాయిదా వేయాలి. ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఎన్నిక వాయిదా వేయకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు.మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..‘ఎస్సీ మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తేనే భయపడుతున్నారు. ఎందుకు అంత భయం. ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణమా?. దీనికి సీఎం ఏం సమాధానం చెబుతారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. ఏదో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రామకుప్పం ఎంపీటీసీ ఎన్నిక వాయిదా వేయాలి. శ్రీదేవి నామినేషన్ స్వీకరించాలి. లేకపోతే పోరాటం ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. -
నేనున్నంత వరకు రైతుకు భరోసా లేదు: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయటపెట్టారు. తాను ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పైగా ఇది నా ప్రామిస్ అంటూ నొక్కి మరీ చెప్పారు.‘‘చంద్రన్న ఉన్నంత వరకు రైతు భరోసా లేదు.. ఉండదు.. రాబోదు’’ అంటూ చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అర్థమైన రైతులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బాబు నిజస్వరూపం బయటపెట్టారంటూ చర్చ మొదలు పెట్టారు. శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే టంగ్ స్లిప్ అయ్యారో ఏమోగానీ.. తన మనసులో మాటే ఆయన బయటపెట్టారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు .. ఉండదు.. ఉండబోదు🤣🤣#ChandraBabu #ChandraBabuFailedCM #APNotInSafeHands #AndhraPradesh pic.twitter.com/qcbRpArzju— Jaganaithene Chesthadu (@Jaganaithene) August 2, 2025 -
‘కూటమి వెన్నుపోటు.. అన్నదాత సుఖీభవలో మరో మోసం’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో వెన్నుపోటు రాజకీయానికి తెర తీసిందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో ఏడు లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఎగొట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచి 20 వేలకు మాత్రమే పరిమితం చేసిందని విమర్శలు చేశారు.మాజీ మంత్రి కారుమూరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అన్నదాత సుఖీభవలో కూటమి మరో మోసం చేస్తోంది. 26వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి.. ఎన్నికలైన 14 నెలల తర్వాత ప్రజలను మోసం చేసే కార్యక్రమం ప్రారంభించారు. 10,716 కోట్లు గత ఏడాది రైతులకు ఎగొట్టారు. ఏడు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వడం లేదు. దర్శిలో సినిమా సెట్టింగ్ వేసి మంచాలకు కూడా పచ్చ రంగు వేసి ఈ కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం మరో వెన్నుపోటు రాజకీయానికి తెర తీసింది.రైతులను నట్టేట ముంచి 20వేలకు మాత్రమే పరిమితం చేసింది. ఐదేళ్లలో వైఎస్ జగన్ రైతులకు 67,500 అందించారు. తల్లికి వందనం కోతలు లేకుండా ఇస్తామని చెప్పి 13వేలు ఇచ్చారు. అందులో కూడా లక్షలాది మందికి పంగనామం పెట్టారు. రైతు గురించి పూర్తిగా ఆలోచించడం మానేశారు. రైతులను పూర్తిగా గాలికి వదిలేశారు. 5,500 రూపాయలకు కోకో పంట టన్నుకు ఇప్పిస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు రైతులను దారుణంగా మోసం చేశారు. మామిడికాయ కిలోకు 19 రూపాయలు ఇస్తామని చెప్పి రెండు రూపాయలకు పరిమితం చేశారు. రైతులు అన్యాయం అయిపోయారు.మిర్చి రైతుల గురించి కేంద్రానికి లేఖ రాసి మమ అనిపించారు. పొగాకు రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. మూడు నెలలకు కూడా డబ్బులు వేయలేదు. వైఎస్ జగన్ హయాంలో సున్నా వడ్డీతో రుణాలు ఇప్పించారు. రైతు పంట పండించకపోతే ఏ ప్రజాప్రతినిధి మనుగడ సాధించలేరు. వ్యవసాయం అవసరం లేకపోతే మీరు ఆకలికి ట్యాబ్లెట్ కనిపెట్టండి. గతేడాది అన్నదాత సుఖీభవ సొమ్ముతో కలిపి లబ్ధిదారులకు చెల్లించాలి. రోజుకు 450 కోట్లు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అని విమర్శలు చేశారు. -
చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు
వైఎస్ఆర్ కడప జిల్లా: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండేళ్ళకు కలిపి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రూ.40 వేలని అన్నారు. కానీ ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన దానిలో మొదటి విడత కింద ఇస్తున్నది కేవలం రూ.5 వేలు మాత్రమే, దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాను ప్రకటించి రైతులకు పెట్టుబడి సాయంను అందించడం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాని పేరు అన్నదాత సుఖీభవ అంటూ మార్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతి రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా ఈ రాష్ట్ర ఖజానా నుంచి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ రైతుల కోసం రైతుభరోసా కాకుండా ఏమైతే ఇచ్చారో అవి కూడా కొనసాగిస్తామని కూడా చెప్పారు.చిత్తశుద్ది ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండిఈ రోజు అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద దర్శిలో సీఎం చంద్రబాబు చేతుల మీదిగా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఈ పథకం కింద ప్రతి రైతుకు రాష్ట్ర ఖజానా నుంచి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, ఎందుకు రూ.14 వేలు మాత్రమే ఇస్తున్నారో చంద్రబాబు చెప్పాలి. మిగిలిన ఆరు వేల రూపాయలను ఎందుకు ఎగ్గొడుతున్నారో సమాధానం చెప్పాలి. గత ఏడాది ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయం రైతు భరోసా రూ.20 వేలు ఎందుకు ఇవ్వలేదు..? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్ళపాటు రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందించాం. కానీ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టారో చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 53 లక్షల మంది అర్హులైన రైతులను గుర్తించి ఏటా రూ.13,500 చొప్పున రైతుభరోసాను అందించారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 46 లక్షల మంది రైతులకే ఈ పథకాన్ని ఇస్తోంది. అంటే దాదాపు 7 లక్షల మంది రైతులకు కోత విధించారు.కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన మేలు ఏదీ..?కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటి వరకు రైతులకు చేసిన మేలు ఏమిటో చెప్పాలి. 2024 నుంచి రబీ, ఖరీఫ్ సీజన్లలో పంట నష్టాలను చెల్లించారా..? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైఫరీత్యాల వల్ల జరిగే ప్రతి పంట నష్టానికి కేవలం 30 రోజుల్లో పరిహారాన్ని చెల్లించాం. ఉచిత పంటల బీమా కింద రైతుల పక్షాన ప్రీమియంను ప్రభుత్వమే భరించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పధకాన్నే ఏత్తేసింది. కనీసం రైతులే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకున్నా కూడా వారికి జరిగిన పంటనష్టం బీమాను కూడా చెల్లించకపోవడం దారుణం కాదా..? విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించారా..? కనీసం వ్యవసాయ పనిముట్లను అయినా అందుబాటులోకి తెచ్చారా.? వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కడైనా గిట్టుబాటు ధర కల్పించారా.? వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను సక్రమంగా నిర్వహిస్తున్నారా.? ఎందుకు రైతులు గిట్టుబాటు రేటు కోసం రోడ్డెక్కుతున్నారు.? ఎందుకు రాష్ట్రంలో మళ్ళీ రైతు ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. -
పదవులొచ్చాయి.. పరువు పోయింది
ఎలా ఉండేవాళ్ళు ఎలా అయ్యారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నపుడు వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు ఎంతో గౌరవంతో ఉండేవారు.. ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఉంటూ దేశంలోని పలుచోట్ల శ్రీవారి ఆలయాల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.. ఇంటా బయటా గౌరవం.. గుర్తింపుతో ఉండేవారు.నాడు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఒక జంటిల్మెన్ అనే ట్యాగ్ లైన్‌తో ఉండేవారు.. వైఎస్ జగన్‌తో పాటు పార్టీ నేతలు.. సభ్యులు.. సహచర ఎంపీలు.. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రభాకర్ రెడ్డికి ఎనలేని గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఆయన టీడీపీలో చేరి నెల్లూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంట్లో భార్యాభర్తలకు రెండు పదవులు రావడం వరకూ సంతోషమే కానీ.. పదవులు రావడం.. వారికి ఇది వరకు సమాజంలో ఉన్న గౌరవం పోవడం ఒకేసారి జరిగిపోయింది.పదవులు వచ్చినంత త్వరగా గౌరవమర్యాదలు పోవడం మొదలైంది. సంపన్నులైన వేమిరెడ్డి దంపతులు ప్రజా జీవితంలో ఉంటే తమకు మంచి లాభం అని భావించిన టీడీపీ జనసేన నేతలు వారు గెలవగానే ఇప్పుడు నిజరూపం చూపిస్తున్నారు. ప్రశాంతి పేరు చెప్పి టీడీపీ జనసేన నేతలు కోవూరులో రౌడీయిజం చేయడం మొదలెట్టారు. ఎక్కడికక్కడ దందాలు.. సెటిల్మెంట్లు.. గూండాగిరితో సమాజాన్ని హడలెత్తిస్తున్నారు. అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిమీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్లకు వాళ్ళు సమర్థించుకున్నా కానీ వేమిరెడ్డి ఫ్యామిలీకి బాగా డ్యామేజ్ చేసింది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అంత మాత్రానికే ఇంటి మీదకు వెళ్లి రౌడీయిజం చేయడమా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇసుక.. మద్యం.. గ్రావెల్ అంటూ ఆమె అనుచరులు దందా చేస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.దీంతోబాటు నెల్లూరులో క్వార్ట్జ్ ఖనిజం పేరిట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీలు చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. దేశ విదేశాలకు లక్షల టన్నుల ఖనిజం ఎగుమతి చేయడం.. ఇందులో చాలావరకు అక్రమంగా తవ్వింది ఉందని తేటతెల్లం అవడంతో ఆయన సైతం సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభాకర్ రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీలు అడ్డగోలుగా ఖనిజాలు తవ్వేస్తూ వనరులను కొల్లగొడుతున్నట్లు ప్రభుత్వం వద్ద కూడా రికార్డులు ఉన్నాయి. పైగా మైనింగ్ శాఖ కూడా లోలోన ఇదే రిపోర్ట్ పంపింది. మొత్తానికి డబ్బు.. పదవి వచ్చినంత వేగంగా వేమిరెడ్డి పరపతి దిగజారిపోయింది.ఇక జనంలో విమర్శలు.. వైఎస్సార్సీపీ నాయకుల పోరాటాలు చూసి వేమిరెడ్డి ఏమనుకున్నారో ఏమో ఇక తానూ మైనింగ్ వ్యాపారం నిలిపివేస్తాను అని ప్రకటించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు ముందురోజే ఆయన మీడియాతో మాట్లాడుతూ తానింకా వ్యాపారం చేయలేనని అన్నారు. వ్యాపారాలు మూసేస్తున్నానని ప్రకటించారు. గౌరవం సైతం చిల్లుకుండలోని నీరులా రోజురోజుకూ తగ్గిపోతోంది.. గతంలో గౌరవంగా ఉండే వేమిరెడ్డి కుటుంబం ఇప్పుడు పరువు.. పరపతి కోల్పోయి అవమానకర పరిస్థితుల్లో పదవుల్లో కొనసాగుతున్నారని నెల్లూరు జనం చెప్పుకుంటున్నారు..-సిమ్మాదిరప్పన్న. -
11 నెలలు నీటిలో ఒక్క నెల మాత్రమే బయట ఈ శివాలయం గురించి తెలుసా? (ఫొటోలు)
-
లిక్కర్ కేసు.. ఆ రూ. 11 కోట్లను ఇతర నోట్లతో కలపొద్దు: ఏసీబీ కోర్టు
లిక్కర్ కేసు.. సిట్ కుట్ర.. కేసిరెడ్డి పిటిషన్ అప్డేట్స్.. విజయవాడఅక్రమ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డి మెమోపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలువీడియోగ్రఫీ చేయకుండానే నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ కెసిరెడ్డి మెమోకెసిరెడ్డి మెమో పై కోర్టు కీలక ఆదేశాలురూ.11 కోట్లను ఇతర డబ్బుతో కలపొద్దని ఏసిబి కోర్టు ఆదేశాలురూ.11 కోట్లను విడిగా ఉంచాలని సిట్ , మాచవరం ఎస్.బిఐ బ్యాంకుకు ఆదేశండిపాజిట్ చేసే ముందు సీరియల్ నెంబర్లు నమోదు చేయాలని ఆదేశండీటెయిల్డ్ పంచనామా కోర్టుకు సమర్పించాలని సిట్ కు ఆదేశం👉ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్ల సీరియల్ నెంబర్ వీడియోగ్రఫీ చేయాలని పిటిషన్లో కోరారు. రూ.11 కోట్లను ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తోందన్నారు. 11 కోట్లను ఖచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ చేయాలని లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతోందని న్యాయవాది తెలిపారు. 👉ఏపీ మద్యం అక్రమ కేసులో సిట్ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేస్తోందంటూ రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. నోట్ల కట్టలను కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాలను సిట్ బృందం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.👉అక్రమ మద్యం కేసులో కేసిరెడ్డి తరఫు లాయర్లు తాజాగా మాట్లాడుతూ.. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కోర్టు అనుమతి లేకుండానే డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్దంగా రూ.11 కోట్లను ఆగమేఘాలపై బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిట్ బృందం రాత్రి నుంచే ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వెరిఫై చేస్తే సిట్ తప్పు దొరికిపోతుంది. తమ తప్పు దొరికిపోతుందనే భయంతోనే వెరిఫై చేయించకుండా కుట్ర చేస్తున్నారు.👉నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వీడియోగ్రఫీ చేయాలంటూ నిన్న సిట్‌కు జడ్జి చెప్పారు కదా. ఏ బ్యాంకు నుంచి నోట్ల కట్టలు వచ్చాయో వీడియో తీయాలంటూ నిన్న సిట్‌కు ఏసీబీ కోర్టు చెప్పినప్పటికీ డిపాజిట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ కుట్రలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు చెప్పుకొచ్చారు. నాకు సంబంధమే లేదు: కేసిరెడ్డి👉ఇక, అంతకుముందు.. అక్రమ మద్యం కేసులో ‘సిట్’ అధికారులు హైదరాబాద్‌లో సీజ్ చేసిన రూ.11 కోట్ల నగదుతో తనకెలాంటి సంబంధంలేదని రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. తనకు సంబంధం లేకున్నా సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని ‘సిట్’ లింకులు పెడుతోందన్నారు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవేనని అంటున్నారన్నారు. 2014లోనే తాను ఆ డబ్బును వరుణ్‌కు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డు చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయని అన్నారు. ఆ నగదు తన స్వహస్తాలతోనే ఇచ్చానని చెబుతున్నారని, వాటిపై తన వేలిముద్రలు ఉన్నాయో లేదో చెక్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. 👉తన వయసు 43 ఏళ్లని, 45 ఏళ్ల కిందటి ఫామ్‌హౌస్‌కు తాను బినామీ అని చెబుతున్నారని, తాను పుట్టకముందే బినామీ ఆస్తులుంటాయా? అని ప్రశ్నించారు. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బులతో కొనుగోలు చేసినట్లు ‘సిట్’ చెబుతోందన్నారు. తనను అక్రమంగా కేసులో ఇరికించారని, తన బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ అబద్ధాలు చెబుతోందంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడిపెట్టారు. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు కీలక ఆదేశాలిచ్చారు. సీజ్ చేసిన రూ.11 కోట్లను ఫొటోలు తీయాలని ‘సిట్’ను ఆదేశించారు. -
‘అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్‌కు చంద్రబాబు’
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అమర్నాథ్ అన్నారాయన. శనివారం ఉదయం విశాఖపట్నంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారాయన. శనివారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు 30 ఏళ్లలో 58 సార్లు సింగపూర్‌కు వెళ్లారు. అక్రమంగా సంపాదించిందంతా దాచుకోవడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అందుకే ఆయన అక్కడికి వెళ్లి సాధించింది ఏమిటో చెప్పుకోలేకపోతున్నారు.... ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటి?. సాధించింది ఏమీ లేకే వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అదానీ డేటా సెంటర్ గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అది ఏర్పాటైంది వైఎస్సార్సీపీ హయాం. సముద్ర జలాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్‌లకు ఎప్పుడైనా అనిపించిందా?. లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీకి అంకురార్పణ జరిగింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. కేవలం ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రధానమైన మూడు పోర్టులను పూర్తి చేశారు.... భూములను ఉద్యోగాలు కల్పించే నాణ్యమైన కంపెనీలకు అప్పగిస్తే ఫర్వాలేదు. కానీ, విశాఖలో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టారు. 99 పైసల చొప్పున.. రూ.1,350 కోట్ల విలువైన భూమిని అప్పన్నంగా అప్పగించారు. లులు సంస్థకు కారుచౌకగా భూములను, ఉర్సాకు 60 ఎకరాల భూమి ఇచ్చారు. ఎక్కడా పారదర్శకత లేకుండా భూములు కేటాయించారు. కంచె చేను మేసినట్లుగా ఉంది ఈ ప్రభుత్వ పరిస్థితి’’ అని అమర్నాథ్ మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ యాప్‌తో పోలీసు జులుంకు చెక్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్‌లో భద్రంగా ఉంటాయి. 2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్‌లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్సీపీ ఆవేదన. తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్‌పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్‌కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం. రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్సీపీ కేడర్‌ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్‌లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది. పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్‌లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్‌లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం. 2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్సీపీ యాప్‌లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చిన్ని Vs కొలికిపూడి.. టీడీపీలో కోల్డ్ వార్!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ ఇసుక రవాణా పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కింది. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం.వివరాల ప్రకారం.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుల కనుసన్నల్లో ఇసుక అక్రమంగా ఏపీ బోర్డర్ దాటేస్తోంది. అనంతరం, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు గ్రామం పెద్దవరం వద్ద ఇసుక డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణకు ఇసుక తరలించి ఎంపీ అనుచరులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎంపీ మనుషులు గండ్ర హరినాథ్, నన్నపనేని సాయికృష్ణ పగలూ రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమ వెనుక ఎంపీ ముఖ్య అనుచరుడు మాదాల హరిచరణ్ కిట్టు ఉన్నాడంటూ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో, అక్రమ ఇసుక వ్యవహారం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.మరోవైపు.. పెద్దవరంలో నిల్వచేసిన ఇసుక డంపింగ్లను గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందన్నారు. పోలీసులే దగ్గరుండి సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆరోపించారురు. అందుకే బోర్డర్లో సీసీ కెమెరాలు పెట్టలేదన్నారు. ఈ క్రమంలో ఏసీపీతో ఫోన్లో మాట్లాడిన కొలికపూడి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో తిరువూరుకు చెందిన గంజాయి బ్యాచ్‌కు ఇసుక అక్రమ రవాణాకు సంబంధం ఉందన్నారు. ఆ గంజాయి బ్యాచ్‌కు పోలీసులు సహకరిస్తున్నారు. ఒకే వ్యక్తి పేరుతో ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. -
ట్యూబెక్టమీ చేస్తే ప్రాణాలు పోయాయి
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో ట్యూబెక్టమీ (కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స) చేయించుకున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే, కాకినాడ జగన్నాథపురానికి చెందిన పలపాల సుధారాణి(21)ని సోమవారం కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. మంగళవారం ఆమెకు ట్యూబెక్టమీ నిర్వహించారు. అనంతరం ఆమెను జీఐసీయూకి తరలించారు. ఆ సమయంలో పల్మనరీ ఎడీమా సంభవించి ఉదరం నుంచి పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి చేరాయి. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై అనుసంధానం చేశారు. రెండు రోజుల పాటు వైద్యులు ఆమెను రక్షించేందుకు శ్రమించగా శుక్రవారం ఉదయం 6.53 సమయానికి కార్డియాక్ అరెస్ట్ సంభవించి ప్రాణాలు కోల్పోయింది. కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే సుధారాణి ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు.కూతురికి పేరు పెట్టకుండానే...సుధారాణికి దుర్గాప్రసాద్‌తో 2017లో వివాహం అయింది. దుర్గాప్రసాద్ కార్పెంటర్ కాగా అతడికి చేదోడు వాదోడుగా సుధారాణి పలుచోట్ల పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకురావడంతో తోడుగా నిలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్ల బాబు వీర లోకేష్ కాగా, నెలన్నర క్రితం పుట్టిన కుమార్తెకు కనీసం పేరు కూడా పెట్టలేదు. తన కుమార్తెకు మంచి పేరు పెట్టాలని సుధారాణి అందరినీ అడిగిందని, మంచి పేరు సూచించాలని కోరిందని, పండంటి బిడ్డకి పేరు పెట్టకుండానే ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణం వివాదాస్పదమైన తరుణంలో వాస్తవాలను వెలికి తీసేందుకు త్రి సభ్య కమిటీని నియమించారు. సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ పి.నరేష్కుమార్, పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుజీవ స్వప్న, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రాజేష్‌కుమార్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. సుధారాణి మృతదేహానికి శుక్రవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. అంతకుముందు జీఐసీయూలో సుధారాణి మృతదేహాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డీసీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ మెహర్ పరిశీలించారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,353 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.65 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 4 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
రియల్ ఎస్టేట్ సంస్థలకు.. భూ సమర్పయామి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఖరీదైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టడంపై అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైనా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటిని ఖేఖాతరు చేస్తోంది. కొన్ని సంస్థలకు భూములు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. ఐటీ కంపెనీల ముసుగులో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టింది.👉బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూపునకు మధురవాడ హిల్ నెంబర్–4లో 30 ఎకరాలను ఎకరా రూ.1.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో 50 శాతం ఐటీ అవసరాలకు వినియోగించుకుని మిగిలిన 50 శాతం రిటైల్, గృహ నిర్మాణం వంటి రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకో వచ్చని, ఇందుకు విశాఖపట్నం మెట్రోపా లిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ రూపాందించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.👉ఇదే విధంగా కపిల్ చిట్స్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎండాడ వద్ద 10 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది. ఇందులో 40 శాతం భూమిని అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే.. అసోసియేట్ ఇన్ఫ్రా పేరిట ఉద్యోగులకు గృహ సముదాయాలు, రిటైల్, వినోదం, మెడికల్, ఎడ్యుకేషన్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది.ఏఎన్‌ఎస్‌ఆర్‌కు 99 పైసలకే 10.29 ఎకరాలు..👉ఇక బెంగళూరుకు చెందిన మరో సంస్థ ఏఎన్‌ఎస్‌ఆర్‌కు మధురవాడ హిల్ నెంబర్–3లో 2.5 ఎకరాలు, హిల్ నెంబర్–4లో 7.79 ఎకరాలు మొత్తం 10.29 ఎకరాలను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాక.. ఐటీ ఇన్ఫ్రా డెవలపర్ కేటగిరీ కింద పలు రాయి తీలు కల్పించనున్నట్లు అందులో పేర్కొన్నారు.👉సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్‌కు మధురవాడ హిల్ నెంబర్–3లో ఎకరా కోటి రూపాయల చొప్పున 3.6 ఎకరాలతో పాటు పరదేశీపాలం వద్ద ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వును జారీచేసింది.👉అలాగే, ఫినోమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో 0.45 ఎకరాలు, రుషికొండ హిల్ నెంబర్–4లో మరో నాలుగు ఎకరాలను ఎకరా రూ.4.05 కోట్లు చొప్పున కేటాయించింది. వీటితో పాటు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని విడుదల చేస్తూ కాటంనేని భాస్కర్ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో సుఖీభవకు కోత, అన్నదాతకు వాత... పెట్టుబడి సాయం ఎగ్గొడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
-
‘వరికూటి’పై పోలీసుల దాడి
రేపల్లె/బాపట్ల/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి ఆశోక్‌బాబుపై రేపల్లె పట్టణ పోలీసులు దౌర్జన్యం చేశారు. సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్‌కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు. వరికూటి అశోక్‌బాబుపై రేపల్లె పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగాయి. పోలీసు అధికారులు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చేపట్టాయి. పోలీసుల దాడిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. రైతుల పక్షాన పోరాడుతున్న అశోక్‌బాబుపై పోలీసులు దౌర్జన్యానికి దిగడంపై వేమూరు, రేపల్లె వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండిపడుతున్నాయి.రైతులకు మద్దతిచ్చినందుకు కక్షగట్టి..వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్‌బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు. అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్‌బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు అంబులెన్స్‌లో వరికూటిని ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు స్వయంగా క్షమాపణ చెప్పాలంటూ పార్టీ శ్రేణులు ఆస్పత్రి ఎదుట సైతం ఆందోళనకు దిగాయి. చివరకు రేపల్లె పట్టణ ఎస్ఐ జోక్యంతో పార్టీ శ్రేణులు ఆందోళన విరమించాయి. వెన్ను, నడుముపై పిడిగుద్దులు గుద్దారు..రైతాంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా అని ఈ సందర్భంగా అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించి తన వెన్నుపూస, నడుముపై పిడిగుద్దులు గుద్ది గాయపరిచారన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. రైతులకు అండగా తన ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. కాగా, వరికూటి అశోక్ బాబుపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ అధిష్టానం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుందన్నారు. పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావులు ఖండించారు. రైతులకు అండగా నిలిచినందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన పోలీసులు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది తుహిన్ కుమార్ గేదెల నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ కుమార్ పేరును సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 2న తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసుకు రాష్ట్రపతి తాజాగా ఆమోదముద్ర వేశారు. తుహిన్ కుమార్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ వచ్చే వారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.ఇదీ తుహిన్ నేపథ్యం..తుహిన్ కుమార్‌ది పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామం. తల్లిదండ్రులు.. సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్, విశాఖ ఎన్‌బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000–2004 మధ్య ఆయన హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. -
విద్యుత్ చార్జీల 'వీర బాదుడు'
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఏదైనా ఉందంటే అది కరెంటు బిల్లు మాత్రమే. సామాన్యుల నడ్డి విరిచేలా ఏడాది నుంచి ఏ నెలకానెల విద్యుత్ చార్జీల భారం పెరుగుతూనే ఉంది. ఓవైపు ‘సూపర్ సిక్స్’ అంటూ హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విద్యుత్ చార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వాడకంతో సమానంగా అదనపు చార్జీలను వడ్డిస్తోంది. అది చాలదన్నట్లు తాజాగా రూ.12,771 కోట్ల చార్జీలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.ఇదేనా బాబు సంపద సృష్టి?వెన్నుపోటు పొడవడంలో పేటెంట్ తీసుకున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పారు. కానీ, తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టారు. అందులో గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్లను జోడించారు. ఇది చాలదన్నట్లు ఇటీవల మరో రూ.3629.36 కోట్ల చార్జీల బాదుడుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి... అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) రూ.2,376.94 కోట్లుగా డిస్కంలు లెక్కగట్టాయి. దీనిని వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.40 చొప్పున వేసి వసూలు చేయడం కూడా కూటమి అధికారంలోకి రాగానే మొదలుపెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకు రూ.2,787.19 కోట్లు జనం నుంచి వసూలు చేసేశారు. మొత్తం రూ.410.25 కోట్లు ఎక్కువ వసూలు చేయడం గమనార్హ. మరో రూ.842.17 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీని అనుమతి కోరగా, దానిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయసేకరణ జరుగుతోంది. ఇవన్నీ కలిపితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.19,114.72 కోట్ల భారం ప్రజల నెత్తిన మోపినట్లైంది. ఈ నేపథ్యంలోనే ‘‘ఇదేనా సంపద సృష్టి’’ అని ప్రజలు నిలదీస్తున్నారు.జనం సొమ్ముతో రూ.12,771 కోట్ల లోటు భర్తీఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్ రూ.7,790.16 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ రూ.1,935.29 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,046.51 కోట్ల చొప్పున లోటులో ఉన్నట్లు ఏపీఈఆర్సీకి తాజాగా సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి విధించి, వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతివ్వాలని కమిషన్‌ను కోరాయి. డిస్కంల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్ ప్రజలు తమ అభ్యంతరాలను ఆగస్టు 14వ తేదీలోగా ఈ మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించింది. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 29లోగా డిస్కంలు బదులివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కనికరం లేకుండా ప్రభుత్వం చార్జీలు పెంచుతూనే ఉంది. నిజానికి డిస్కంల లోటు ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించడం పరిపాటి. కానీ, దానిని కూడా ప్రజల సొమ్ముతోనే భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుండడం అన్యాయమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్మార్గ చార్జీలపై వ్యతిరేకంగా పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. -
సుఖీభవకు కోత.. అన్నదాతకు వాత
సాక్షి, అమరావతి: హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా ఎగ్గొట్టడం.. ఒకటీ అరా అరకొరగా అమలు చేసి అంతా చేసేశామని చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రమే సాధ్యమని రాష్ట్రంలో విస్తృత చర్చ నడుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇటీవల తల్లికి వందనం పథకమైనా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకమైనా కోతల మయమేనని స్పష్టమవుతోంది. అధికారంలోకి రాగానే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏటా ప్రతీ రైతుకు తామే రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు, లోకేశ్ సహా కూటమి నేతలంతా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సొమ్ము రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే సాయం అంటూ నాలుక మడతేశారు. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది అమలుకు సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారుల్లో కోతలు విధిస్తూ ఆపసోపాలు పడుతోంది. అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం రూ.5 వేలు పీఎం కిసాన్ 20వ విడత సాయం రూ.2 వేలతో కలిపి శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హామీకి తూట్లుఎన్నికల హామీ మేరకు పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఏటా రూ.26 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఆ లెక్కన 2023–24లో అర్హత పొందిన 53.58 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,716 కోట్లు అవసరం. కానీ 2024–25లో ఇదిగో.. అదిగో అంటూ తొలి ఏడాది ఇవ్వాల్సిన రూ.10,716 కోట్ల పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది. గతేడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది రూ.21,432 కోట్లు జమ చేస్తుందని రైతులు భావించారు. ఆ మేరకు బడ్జెట్ కేటాయిస్తుందని భావించారు. కనీసం ఈ ఏడాది రూ.20 వేలు చొప్పున ఇవ్వాలన్నా రూ.10,716 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. కానీ 2025–26 బడ్జెట్లో ఈ పథకానికి కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టింది. దీంతో వడపోత అనంతరం 46.86 లక్షల మందిని అర్హులుగా తేల్చింది. అంటే వైఎస్సార్సీపీ హయాంతో పోల్చుకుంటే 6.72 లక్షల మందికి కోత పెట్టారు. కాగా, అర్హత పొందిన వారికి పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున రూ.831.51 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లు కలిపి రూ.3,174.43 కోట్లు తొలి విడత సాయం జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. పైగా ఎన్నికల హామీకి విరుద్ధంగా మూడు విడతల్లో జమ చేస్తామని చెప్పింది. తొలి విడత సాయం ఏప్రిల్‌లో, మే లో అంటూ తుదకు ఆగస్టులో అరకొరగా అదీ పీఎం కిసాన్తో ముడిపెట్టి నేడు జమ చేసేందుకు సన్నద్ధమైంది. కాగా, స్థానిక ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాంతాల్లో కేవలం పీఎం కిసాన్ సొమ్ము మాత్రమే జమ అవుతుంది. అన్నదాత సుఖీభవ సొమ్మును ఎన్నికల కోడ్ ముగిశాక ఇస్తారు.కౌలు రైతులకు ఇస్తారో.. ఇవ్వరో..భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనర్టీ కౌలుదారులకు 2019–23 మధ్య ఏటా వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించేది. ఏటా సగటున 1.64 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగు దారులైన కౌలు రైతులందరికీ భూ యజమానులతో పాటు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి పెద్దలు ఎన్నికల్లో గొప్పగా ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి సీసీఆర్సీ కార్డులతో పాటు ఈ పంట నమోదు తప్పనిసరి అని మెలిక పెట్టారు. ఏటా ఏప్రిల్–మే నెలల్లోనే ప్రత్యేక మేళాల ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేసేవారు. కానీ ఈ ఏడాది జూన్ మూడో వారంలో కానీ ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది 10 లక్షల కార్డుల జారీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3 లక్షల మందికి మించి కార్డులివ్వలేదు. సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో? ఎప్పుడు సాయం అందిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదేళ్లూ క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం తాము అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి రాగానే అన్నదాతలను మరింత ఉదారంగా ఆదుకోవాలన్న సంకల్పంతో హామీ కంటే మిన్నగా రూ,12,500కు బదులు రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని ప్రకటించారు. ఆ మేరకు తొలి ఏడాది నుంచి రూ,13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో ఏటా సగటున 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు సాయం చేశారు. భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సొంతంగా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులందరికీ పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచారు. ఏటా 1.64 లక్షల మంది కౌలుదారులతో పాటు 94 వేల మంది అటవీ సాగుదారులకు కూడా పెట్టుబడి సాయం అందించి తన పెద్దమనసును చాటుకున్నారు. నాడు వెబ్‌ల్యాండ్ పరిధిలో లేని వారితో పాటు వివిధ కారణాలతో ఈకేవైసీ చేయించుకోలేని వారు, ఈ కేవైసీ రిజక్ట్ అయిన వారు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ వారు, తప్పుడు ఆధార్ సీడింగ్ అయిన వారు, కుటుంబంలో పన్ను చెల్లింపుదారులున్న సాగుదారులు, చనిపోయిన వారి కుటుంబాలలో నామినీలకు.. ఇలా అర్హత ఉన్న ప్రతి రైతుకూ వైఎస్సార్ రైతు భరోసా లబ్ధి చేకూర్చారు. -
ఏసీఏ ఎన్నికల క్రీజులో బైలా డకౌట్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రాజకీయ రంగు పులుముకుని భ్రష్టు పట్టింది. క్రికెట్ అభివృద్ధికి, పారదర్శకతకు నిలువునా పాతరేయడంతో దశాబ్దాల ఏసీఏ ప్రతిష్ట మంటగలిసింది. కూటమి నేతలు చట్టాలకు తూట్లు పొడవడంతో ఎన్నికల క్రీజులో బైలా డకౌటైంది. క్రికెట్‌తో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఏసీఏ వెళ్లిపోవడంతో భావి క్రికెటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అనుబంధంగా కొనసాగుతున్న ఏసీఏలో.. కార్యవర్గం పదవీ కాలం గరిష్టంగా మూడేళ్లు. ఆ గడువు ఈ ఏడాది చివరితో ముగియనుంది. అయితే, బీసీసీఐను అనుసరించి ఏసీఏ రాసుకున్న బైలాస్ ప్రకారం ఏటా సెపె్టంబర్ 30లోగా వార్షిక జనరల్ బాడీ మీటింగ్(ఏజీఎం) నిర్వహించాలి. ఇందులోనే అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవాలి. దీనిలో ప్రధానమైనది ఏసీఏ అపెక్స్ కౌన్సిల్, అఫీస్ బేరర్ల ఎన్నిక. ఏజీఎంలో తప్పితే మరే సమయంలోనూ పదవీ కాలం పూర్తయిన తర్వాత మరో కొత్త కార్యవర్గాన్ని ఎన్నికోవడానికి బైలాలోని నిబంధనలు అంగీకరించవు. కానీ, కూటమి ప్రభుత్వంలో ఏసీఏ పాలక వర్గం ‘వార్షిక జనరల్ బాడీ మీటింగ్’ అర్థాన్నే మార్చేసింది. ఏడాదికి ఒక సారి మాత్రమే నిర్వహించే ఏజీఎంను రెండోసారి నిర్వహించేందుకు అందులో కొత్త కార్యవర్గ కోసం ఎన్నికలు చేపట్టేందుకు సమాయత్తమవుతుండడం, దీనికోసం నోటిఫికేషన్ సైతం విడుదల చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. హడావుడిగా ఏజీఎం.. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏసీఏ కూటమి నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. మంత్రి లోకేశ్ అండతో గత ప్రభుత్వంలో ఏర్పడిన ఏసీఏ కార్యవర్గాన్ని బలవంతంగా రాజీనామా చేయించి ఆ పదవుల్లోకి కూటమి నేతలు దూరిపోయారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రీమియర్ లీగ్(ఏపీఎల్) ఫ్రాంచైజీలనూ చేజిక్కించుకునే కుట్ర పన్నారు. ఇందులో భాగంగా పాత ఫ్రాంచైజీలకు గడువు ఉన్నా.. వారిని తొలగిస్తూ కొత్త ఫ్రాంచైజీల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, ఇక్కడే ఏపీఎల్ నిర్వహణకు గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. దీని కోసం సెపె్టంబర్‌లోగా నిర్వహించాల్సిన ఏజీఎంను ముందుకు జరిపేశారు. జూన్1 ఏజీఎం నిర్వహిస్తున్నట్టు ఈ ఏడాది మే 12న ఏసీఏ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం జూన్‌లో ఏసీఏ కార్యవర్గం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ పూర్తయింది. కానీ, అప్పుడు ఎన్నికల అంశం అజెండాలోకి రాలేదు. ఈ ఎన్నిక చెల్లుబాటేనా? వాస్తవానికి ఏసీఏ బైలా ప్రకారం ఏడాదికి ఒక సారి మాత్రే వార్షిక జనరల్ బాడీ మీటింగ్(ఏజీఎం) నిర్వహించాలి. ఇది జూన్‌లోనే ముగిసింది. ఒక వేళ అది ఏజీఎం కానప్పుడు ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్‌గా గుర్తించాలి. కానీ, ఏసీఏ సెక్రటరీ తన సర్క్యులర్‌లో స్పష్టంగా ఏజీఎం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. ఏజీఎంలో మాత్రమే ఎన్నికలకు అవకాశం ఉండగా.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఏసీఏ ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికలు బీసీసీఐ రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ పైగా ఏసీఏ ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికే సక్రమం కాదంటూ కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి ఏజీఎంకు నాలుగు వారాల ముందు ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఎన్నికల అధికారిని నియమించుకుని.. ఏజీఎంలో దానిని రాటిఫై చేసుకోవాలి. ఇక్కడ అదేమీ జరగలేదు. జూన్‌లో అసలు ఎన్నికల అధికారి నియామకం అజెండానే పెట్టలేదు. కానీ, జూలైలో అపెక్స్ కౌన్సిల్ కూర్చుని ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్‌ను నియమించినట్టు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్ని గందరగోళాల మధ్య ఎన్నికలు జరిపితే ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా, బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌ను ఫిర్యాదు చేసినా ఎన్నికలు చెల్లుబాటు కావని క్రీడానిపుణులు హెచ్చరిస్తున్నారు. నచ్చనోళ్ల ఓట్ల తొలగింపు.. ఈ నెల 3న ఏసీఏ ఎన్నికలకు నామినేషన్లు వేయాలని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ నోటిఫికేషన్ ఇచ్చారు. 6న పరిశీలన, 7న అర్హత పొందిన నామినేషన్ల జాబితా విడుదల, 11 వరకు ఉపసంహరణ, 16న ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే, గత కార్యవర్గమే మరోసారి పీఠంపై కూర్చునే కుట్రతో తమకు వ్యతిరేకంగా గళం విప్పిన వారి ఓట్లను తొలగించింది. పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో ఏసీఏ మాజీ అధ్యక్షుడు మనవడిని ఏసీఏ సస్పెండ్ చేసింది. అయితే, కోర్టుకు వెళ్లడంతో ఓటు తిరిగి పొందారు. కానీ, ఎన్నికల్లో పోటీకి మాత్రం అర్హత లేకుండా పోవడం గమనార్హం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఉన్న వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవడం ఒక్క కూటమి పాలనలోనే చెల్లుతోంది. దీనికి తోడు ఏసీఏ దోపిడీలను ప్రశ్నిస్తున్న గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్‌నూ అబయన్స్‌లో పెట్టి ఓటు లేకుండా చేశారు. ఒక ప్రాంత వ్యక్తిని మరో జిల్లాలో సభ్యుడిగా చూపించి ఓటు కల్పించారు. ఇలా తమకు నచ్చినోళ్లకు ఓటు హక్కు కల్పించి నచ్చనోళ్లను తొలగించారు. వ్యతిరేకులు ఎవరూ నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓట్ల కోసమే..ఓ మూడు జిల్లాల క్రికెట్ అసోసియేషన్ సభ్యులను ప్రలోభపెట్టి ఏసీఏ నుంచి పనులు ఇచ్చి నిధులు దోచిపెడుతున్నారు. -
యాంత్రిక రిమాండ్లపై శాఖాపరమైన చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి : యాంత్రిక రిమాండ్ల విషయంలో మేస్ట్రేట్లకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ గత నెల 5న జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొంత మేర సవరించింది. యాంత్రికంగా రిమాండ్లు ఇస్తున్న మేజి్రస్టేట్లపై కోర్టు ధిక్కార చర్యలు కాకుండా, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు రిజి్రస్టార్ జ్యుడీషియల్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. కేవలం సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లే కాకుండా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే అన్ని కేసుల్లో కూడా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పక అమలు చేసి తీరాల్సిందేనని మేజిస్ట్రేట్లను ఆదేశించింది.‘ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మూడు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే, విచారణకు స్వీకరించదగ్గ నేరాల్లో పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3)ను అనుసరించేలా చూడాలి. ఏడేళ్ల వరకు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ ఉత్తర్వులు వెలువరించే ముందు మేజిస్ట్రేట్‌లందరూ.. పోలీసులు అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించారా? లేదా? అన్నది పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేయాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఇదే విషయానికి సంబంధించి గతంలో జారీ చేసిన సర్క్యులర్‌ను కఠినంగా అమలు చేసి తీరాల్సిందే. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారు’ అని తేల్చి చెప్పింది. గతంలో జారీ చేసిన సర్క్యులర్‌లో తమ ఆదేశాలను పాటించకుంటే దానిని చాలా తీవ్రంగా పరిగణించి, కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామన్న వాక్యాన్ని తొలగించింది. ధిక్కార చర్యలు సరికాదంటూ పిటిషన్ జూన్ 5న హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌లో తమ ఆదేశాలను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తప్పవని పేర్కొనడాన్ని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది జయంతి ఎస్సీ శేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్క్యులర్‌లోని పదజాలం మేజి్రస్టేట్లను బెదిరించేలా ఉందని ఆయన అందులో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడం కూడా సరికాదన్నారు. ఈ వ్యాజ్యంపై గత నెల 9న విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హైకోర్టు రిజిస్ట్రార్ గత సర్క్యులర్‌ను కొంత మేర సవరించారు. -
కొత్తవి ఇస్తామంటూ.. పాత పింఛన్ల కోత
సాక్షి, అమరావతి: పింఛన్ల సంఖ్యను తగ్గించడానికి కూటమి సర్కారు కొత్తపుంతలు తొక్కుతోంది. కొత్తవి ఇస్తామంటూ పాతవాటికి కోత వేస్తోంది. దివ్యాంగులందరికీ పింఛను నిధులు విడుదల చేశామని ప్రకటిస్తూనే.. వేలాదిమందికి పంపిణీ చేయవద్దని అధికారులను ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పేదలు పింఛను మంజూరుకు కొత్తగా అర్హత వచ్చినా కనీసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే, అతడి భార్యకు స్పౌజ్ కేటగిరిలో కొత్తగా పింఛను ఇవ్వాలంటే.. ఉన్న పింఛనుదారులకు కోత పెట్టడం ద్వారా భారం తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చే పింఛన్లు దాదాపు ఐదులక్షలు తగ్గిపోగా.. స్పౌజ్ కేటగిరిలో మూడు, నాలుగు నెలలుగా ఇదిగో ఇస్తున్నామంటూ ఊరించి, ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేసేందుకు 1.09 లక్షల మందికి కొత్తగా మంజూరు చేసింది. వాటిని అలా మంజూరు చేసిందో లేదో.. ఇప్పటివరకు ఏళ్ల తరబడి పింఛను తీసుకుంటున్న దివ్యాంగులు, మంచం నుంచి కదల్లేని స్థితిలోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కేటగిరిలో ఉన్నవారికి వేలసంఖ్యలో పింఛన్లు నిలిపేసింది. నోటీసులకు స్పందించలేదనే సాకు చెబుతోంది. సంఖ్యపరంగా గొప్పగా చెప్పుకోవడానికి ఆగస్టులో పంపిణీ చేయకూడదని నిలిపివేసిన వారితో కలిపి అందరికీ డబ్బులు విడుదల చేసినట్టు ప్రకటించారు. కానీ వారికి పంపిణీ చేయవద్దని జిల్లా అధికారులు, పంపిణీ సిబ్బందికి ఉన్నతాధికారులు ముందే ఆదేశించారు. కదలలేని స్థితిలోనో లేదంటే మంచానికే పరిమితమై ఉండే పెరాలసిస్, తీవ్ర కండరాల బలహీనత తరహా రోగులతోపాటు దివ్యాంగులు ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్లు తీసుకుంటున్నారు.రాష్ట్రంలో ఈ తరహా పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,900 మంది అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆరేడు నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ పరిశీలనకు రాలేదని వేలాదిమందికి ఈ నెలలో పింఛను ఇవ్వవద్దని అధికారులను ఆదేశించింది. ఎంతమందికి పింఛన్లు ఆపేశారన్నది అధికారికంగా చెప్పకపోయినా ఈ సంఖ్య 50 వేలకు పైనే ఉంటుందని అనధికారిక సమాచారం.1.09 లక్షల పింఛన్లు మంజూరు చేస్తే.. ఆ మేరకు సంఖ్య పెరగలేదే? ఈ నెల ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,09,155 మందికి కొత్తగా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ నెలకు ప్రభుత్వం విడుదల చేసినట్టు ప్రకటించిన మొత్తం పింఛన్ల సంఖ్యలో మాత్రం ఆ మేరకు పెరుగుదల కనిపించలేదు. జూలై నెలలో జరిగిన పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం 62.81 లక్షల మందికి డబ్బులు విడుదల చేయగా 61.24 లక్షల మందికే పంపిణీ చేశారు. గత నెలలో ప్రభుత్వం విడుదల చేసిన 62.81 లక్షల పింఛన్లకు ఇప్పుడు కొత్తగా మంజూరు చేసినట్టు ప్రకటించిన 1.09 లక్షల పింఛన్లను కూడ కలిపితే ఈ నెలలో 63.90 లక్షల మందికి డబ్బులు విడుదల కావాలి. కానీ.. ప్రభుత్వం 63.71 లక్షల మందికి మాత్రమే డబ్బులు విడుదల చేసింది.పింఛన్ల సొమ్ము రూ.15.59 లక్షలు స్వాహానలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఒక పంచాయతీ కార్యదర్శి చేతివాటంప్రత్తిపాడు: లబ్దిదారులకు ప్రతి నెలా పంపిణీ కాకుండా మిగిలిన పింఛన్ల సొమ్మును నలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఒక పంచాయతీ కార్యదర్శి కాజేశారు. రూ.15,59,750 మెక్కేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఈ బాగోతం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన బదిలీల సందర్భంగా ఉద్యోగుల బకాయిలు పరిశీలిస్తున్న క్రమంలో ఈ వ్యవహారం బయట పడింది. మండలంలోని గోకవరం, చినశంకర్లపూడి, గజ్జనపూడి, ధర్మవరం గ్రామ సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఒమ్మంగి పంచాయతీ కార్యదర్శి ఈ అవినీతికి పాల్పడ్డారు.గ్రామాల్లో పింఛన్లు బట్వాడా చేయగా మిగిలిన సొమ్మును ఏ నెలకు ఆ నెల డీఆర్డీఏ (డి్రస్టిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ)కు జమ చేయాలి. జమ చేశారో లేదో ఆయా గ్రామాల కార్యదర్శులు పర్యవేక్షించాలి. కానీ ఇప్పటి వరకూ కార్యదర్శులు దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. డీఆర్డీఏలో పింఛన్ల విభాగానికి చెందిన సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) అధికారుల నిర్లిప్తత, ఆడిట్ అధికారులు పట్టించుకోకపోవడాన్ని అవకాశంగా తీసుకుని చినశంకర్లపూడి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గొంప శివాజీ (ప్రస్తుతం ఏలేశ్వరం మండలం భద్రవరం పంచాయతీకి బదిలీ అయ్యారు) అత్యధికంగా రూ.7,46,250 స్వాహా చేశారు. గోకవరం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈపీ వెంకటేశ్ (ఈయన ఏలేశ్వరం మండలం పేరవరం పంచాయతీకి బదిలీ అయ్యారు) రూ.2,03,250, ధర్మవరం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎం.విజయ్ కుమార్ రూ.1,90,250, గజ్జనపూడి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ముదర సూరిబాబు (ఇదే మండలం చినశంకర్లపూడి పంచాయతీకి బదిలీ అయ్యారు) రూ.45 వేలు, ఒమ్మంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి దడాల నాగ మహేశ్ రూ.3.75 లక్షలు మెక్కేశారు. అందరూ కలిపి మొత్తం రూ.15,59,750 స్వాహా చేశారు. వీరికి నోటీసులు జారీ చేశామని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఎంవీఆర్ కుమార్‌బాబు చెప్పారు. -
చెప్పినట్టు వినకపోతే... ట్రాక్టర్లతో తొక్కి చంపేస్తాం
పొదిలి రూరల్: అధికార మదంతో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. పట్టా భూముల్లో సాగు చేసిన కంది పంటను దౌర్జన్యంగా ట్రాక్టర్‌తో ధ్వంసం చేసి దున్నేశారు. ఇది తమ ప్రభుత్వమని, చెప్పినట్టు వినకపోతే ట్రాక్టర్లుతో తొక్కి చంపేస్తాం అని బెదిరించారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని అన్నవరం గ్రామ పరిధి సర్వే నంబరు 75లో 40 ఎకరాల బీడు భూమి ఉంది. గ్రామ పెద్దలు ఆ భూమిని రెండు భాగాలుగా విడగొట్టి 20 ఎకరాలు వైఎస్సార్సీపీ వారికి, మరో 20 ఎకరాలు టీడీపీ వాళ్లకు సమానంగా పంచి ఇద్దరికి ఒప్పందం చేసి సాగు చేసుకోమన్నారు. 2018లో ఆ భూమికి వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన 16 మంది రైతులకు అధికారులు పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చారు. సర్వేనంబరు 75లో కొత్తపులి రమణమ్మ, కొత్తపులి రమణయ్య, కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి వెంకటేశ్వర్లు, కొత్తపులి కోటిరెడ్డి, లక్కు వెంకట లక్షి్మ, కొత్తపులి పరమేశ్వరమ్మ, కొత్తపులి సులోచన, కొత్తపులి ఓబులురెడ్డి(ఓబులేసు), కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (అచ్చిరెడ్డి), కొత్తపులి పెదవెంకటేశ్వర్లు, కొత్తపులి రమణమ్మ (మాలకొండయ్య), పులిబాల కోటిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (ఓబులురెడ్డి), ఇతరులు ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత కొందరు టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై తమకూ ఈ భూముల్లో వాటా ఉందంటూ దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం టీడీపీకి చెందిన పులి చిన నాగిరెడ్డి, వెన్నపూస చిన సుబ్బారెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి, యర్రంరెడ్డి రమణయ్య, యర్రంరెడ్డి నాగిరెడ్డి, దమ్మిడి చెన్నయ్య ట్రాక్టర్లుతో వచ్చి సర్వేనంబరు 75లో మాకు ఇంకా 10 ఎకరాల భూమి ఉందంటూ వాదనకు దిగారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వారి పట్టా భూముల్లో కొత్తపులి వెంకటరెడ్డి సాగు చేసుకున్న 4 ఎకరాల కంది పంటను నాశనం చేశారు. విషయం తెలుసుకున్న ఈసర్వే నంబరులోని మిగిలిన రైతులు అక్కడికి వచ్చారు. తమ భూమిని ఆక్రమించుకొని టీడీపీ వర్గీయులు భయభ్రాంతులకు గురి చేశారని, అడ్డం వచి్చన వాళ్లను చంపేస్తామని బెదిరించి అసభ్యంగా దూషించినట్టు బాధిత రైతులు వాపోయారు. తమకు పట్టాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
రిక్త హస్తాలతో సింగపూర్ నుంచి..
సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు అన్న సామెతను నిజం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన సాగింది. భారీ బృందంతో వెళ్లి రిక్తహస్తాలతో తిరిగొచి్చంది. సీఎం చంద్రబాబు , మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్, పలువురు సీనియర్ అధికారుల బృందంతో ఐదు రోజుల పాటు విహార యాత్రలాగా పర్యటన చేశారే కానీ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక్క కీలక ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటికే అనేకసార్లు చూసిన సింగపూర్‌కు మళ్లీ వెళ్లి అవే పోర్టులు, భవనాలను చూసి ఆ దేశ వైభవం గురించి 2014–19 మధ్య చెప్పినట్టే ఇప్పుడూ అమరావతిని సింగపూర్ చేస్తాను, రివర్‌ఫ్రంట్ నగరం కడతాను అంటూ కబుర్లతో కాలక్షేపం చేశారు. సాధారణంగా ఏదైనా దేశ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ వివరాలను సుదీర్ఘంగా వివరించడం చంద్రబాబుకు అలవాటు. అలాంటిది ఈసారి విలేకరుల సమావేశం పెట్టకుండా సమీక్షలతో సరిపెడుతూ ముఖం చాటేశారు. దీన్నిబట్టే సింగపూర్ పర్యటన ఎంత ఘోరంగా జరిగిందో అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. – సాక్షి, అమరావతిమీకో నమస్కారం.. కలిసి పనిచేయలేం..రాష్ట్ర ప్రభుత్వంతో అధికారికంగా ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోమని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మీతో స్నేహం చేసిన తర్వాత మా దేశ మంత్రి ఏకంగా అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని, అలాంటివారితో ఇక తాము కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పింది. అతిథిలాగా గౌరవించి ముఖస్తుతి కోసం మీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారే కానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చివరకు చంద్రబాబు చేసేది ఏమీ లేక నవంబరులో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు రండి అంటూ ఆహ్వానించి మెల్లగా జారుకున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఎప్పటిలాగానే తన అనుకూల మీడియాలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం, ఏపీ బ్రాండ్‌ను చంద్రబాబు పునరుద్ధరిస్తున్నారంటూ పేజీల పేజీల కొద్దీ కథనాలు వండివార్చి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు.బాబూ ఇదేమి చిత్రం చిత్రం, జయం, నిజం వంటి పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగువాడైన తేజతో ఐటీ శాఖ మంత్రి లోకేశ్ సింగపూర్‌లో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అక్కడి కంపెనీలు ముందుకురాకపోవడంతో తేజ డైరెక్టర్‌గా ఉన్న టెజారాక్ట్ యూఎస్ ఐఎన్సీతో కంటెంట్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కాగా, సీఎం బృందం సింగపూర్ పర్యటనలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్ సింగపూర్ యూనిట్లో తెలుగు అమ్మాయి ఏఐ క్లౌడ్ టీమ్‌లో ఉద్యోగం చేస్తోంది. ప్రవాసాంధ్రుల ముఖాముఖిలో ఆమె మాట్లాడుతూ రోల్స్ రాయిస్‌ను ఏపీకి తెచ్చే విధంగా కంపెనీ ప్రధాన కార్యాలయంతో మాట్లాడతానని చెప్పడం, ఆ విషయాన్ని ఇక్కడి పత్రికలు రోల్స్ రాయిస్ ఏపీకి వచ్చేస్తున్నట్లు కథనాలు ప్రచురించడం గమనర్హం. ఇదంతా సరిపోయారు ఇద్దరకు ఇద్దరు అన్న చందంగా ఉందంటూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. రోల్స్ రాయిస్ వంటి ప్రసిద్ధ సంస్థ ఒక రాష్ట్రంలో పెట్టే పెట్టుబడిపై ఒక సాధారణ ఉద్యోగి మాట్లాడే అవకాశం ఉంటుందా? కానీ, అలాంటి వ్యాఖ్యలకు కూడా పచ్చ మీడియాలో భారీ ప్రచారం కల్పించారంటే తమ వాళ్ల ప్రచార పిచ్చికి అది పరాకాష్ఠ అని టీడీపీ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు. దావోస్ సదస్సుకు ముందు సైతం పెట్టుబడుల కోసం వేట అంటూ ప్రచారం కల్పించారని, ఇప్పుడు కూడా సింగపూర్ పర్యటనపై ఊదరగొట్టారని పేర్కొన్నారు. తీరా చూస్తే అప్పటిలాగానే ఖాళీ చేతులతో తిరిగిరావడంతో కూటమి నేతలు నైరాశ్యంలోకి జారిపోయారని వివరించారు. కాగా, సింగపూర్ పర్యటనపై మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్‌లో పోర్టులు, రియల్ ఎసేŠట్ట్, భవనాలు, డేటా సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పడం కొసమెరుపు. -
సంకల్పానికి ‘సెల్యూట్’
సాక్షి, అమరావతి/అచ్యుతాపురం/దత్తిరాజేరు: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామక పరీక్షల్లో విశాఖపట్నానికి చెందిన గండి నానాజీ 168 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. విజయనగరానికి చెందిన జి.రమ్యమాధురి 159 మార్కులతో రెండో స్థానంలో, రాజమహేంద్రవరానికి చెందిన మెరుగు అచ్యుతరావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో 3,580 సివిల్ కానిస్టేబుల్, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ మొత్తం.. 6,100 పోస్టుల భర్తీ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా ప్రిలిమినరీ, దేహదారుఢ్య, మెయిన్స్ పరీక్షల అనంతరం తుది ఫలితాలను పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటించింది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత తుది ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 5.03 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ప్రిలిమినరీ పరీక్షకు 4.59 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వారిలో అర్హత సాధించిన 38,914 మందికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా.. 33,921 మంది అర్హత సాధించారు. రిజర్వేషన్ల వారీగా ఎంపికైన 6,100 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 3,580 సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 1,063 మంది మహిళలున్నారు. కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పోలీసు నియామక మండలి వెబ్సైట్ www.slprb.ap. gov.in లో అందుబాటులో ఉంచారు. వివరాల కోసం అభ్యర్థులు 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించాలని, లేదా slprb@ap.gov.in కు మెయిల్ చేయాలని అధికారులు సూచించింది. ఇదిలా ఉండగా, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని హోం మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎంపికైన కానిస్టేబుళ్లకు సెపె్టంబర్ నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, పోలీస్ నియామక మండలి చైర్మన్ ఆర్కే మీనా, అదనపు డీజీ ఎన్.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేకల కాపరి కుమారుడికి స్టేట్ ఫస్ట్ మేకలు కాస్తూ తండ్రి అయ్యబాబు పడుతున్న కష్టాన్ని చూసి ఆ యువకుడు మధనపడేవాడు. ఏదో ఒకటి సాధించి తీరాలని తపన పడేవాడు. చివరికి అనుకున్నది సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామానికి చెందిన గండి నానాజీ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. తల్లి జయమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ పరీక్షకు శిక్షణ ఇప్పించింది. భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నతోద్యోగం సాధించి తీరతానని నానాజీ చెప్పాడు. అదరగొట్టిన ‘ఆశా’ కుమార్తె విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన గొర్లె రమ్యమాధురి 159 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. రమ్యమాధురి తండ్రి రమణ తన చిన్నతనంలోనే మృతి చెందగా.. ఆశా కార్యకర్త అయిన తల్లి జయమ్మ, పూల దుకాణంలో పనిచేసే అన్నయ్య గౌరీశంకర్ ఆమెను చదివించారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పోలీస్ కావాలన్న లక్ష్యంతో కాకినాడలోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నానని, అత్యధిక మార్కులతో లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉన్నట్టు రమ్యమాధురి చెప్పింది. -
వీఆర్ కూడా పోస్టింగేనా.. జీతాలేవి మరి..!
సాక్షి, అమరావతి: ‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉండటం కూడా పోస్టింగే. వీఆర్ అన్నది శాంక్షన్ పోస్టే’ అని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేసిన వ్యాఖ్యలపై ఆ శాఖ సిబ్బంది, అధికారులు వారి కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ‘వీఆర్‌లో ఉండటం కూడా పోస్టింగే అయితే... మరి జీతాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలతో దేశ చరిత్రలోనే ఎన్నడూలేని రీతిలో భారీగా ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడాన్ని అత్యున్నతాధికారి అయిన డీజీపీ గుప్తా బహిరంగంగా సమరి్థంచడంపై మండిపడుతున్నారు. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మల్లా పనిచేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం డీజీపీ గుప్తా వ్యాఖ్యలు ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారాయి.వేధించడం ఏవిధంగా సమర్థనీయం డీజీపీ..!?పోలీసుల సంక్షేమం, గౌరవాన్ని పరిరక్షించాల్సిన డీజీపీ గుప్తా మాత్రం చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రను వెనకేసుకురావడంపై పోలీసువర్గాలు గళం విప్పుతున్నాయి. వీఆర్ శాంక్షన్ పోస్టే అయితే వారికి ప్రతినెలా జీతం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నాయి. కనీసం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఈ ఐదు నెలల్లో అయినా వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులకు జీతాలు చెల్లించారా.. అని సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రభుత్వంలో ఏ ఇతర శాఖలో లేని రీతిలో భారీ సంఖ్యలో అధికారులను వెయిటింగ్లో ఉంచడం, జీతాలు చెల్లించకుండా వేధించడం ఏవిధంగా సమర్థనీయమో డీజీపీ గుప్తానే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల చేతుల్లో పావుగా మారిన డీజీపీ కనీసం ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయకుండా ఉండాల్సిందని, పోలీసులు కీలు బొమ్మలు కాదని అభిప్రాయపడుతున్నాయి. వీఆర్‌లో పోలీసు అధికారులకు పోస్టింగులు ఇప్పించే బాధ్యత తీసుకోలేకపోయినా కనీసం వారికి నైతిక మద్దతు కూడా ఇవ్వకపోవడం డీజీపీ స్థాయి అధికారికి తగదని విమర్శిస్తున్నాయి. 199 మంది పోలీసు అధికారులకు వీఆర్!దేశ చరిత్రలోనే ఎన్నడూలేని స్థాయిలో వేధింపులు గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులతోపాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి మొత్తం మీద 199 మందికి పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ సంఖ్యలో పోలీసు అధికారులను వీఆర్‌లో ఉంచలేదు. నెలల తరబడి పోలీసు అధికారులను అవమానానికి గురి చేసింది. వారికి జీతాలు చెల్లింపు నిలిపివేసింది. అంతే కాదు వీఆర్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు డీజీపీ కార్యాలయంలో సంతకం చేయాలని, వెయిటింగ్ హాల్లో రోజంతా నిరీక్షించి సాయంత్రం 5 గంటలకు సంతకం చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం విభ్రాంతి కలిగించింది. ఇప్పటికీ ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామ్‌రెడ్డి, వై.రవిశంకర్‌రెడ్డి, పి.జాషువా, వై.రిషాంత్ రెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు వీఆర్‌లోనే ఉన్నారు. పోలీసు అధికారులను దీర్ఘకాలం వీఆర్‌లో ఉంచొద్దని రాజస్థాన్ హైకోర్టు కూడా ఇటీవల తీర్పు/నిచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రతో వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తోంది. -
మెడి'కిల్స్'
మీకు తల నొప్పి వస్తుందా?.. తరచూ జ్వరం బారినపడుతున్నారా?.. కడుపు, ఒళ్లు నొప్పులతో భరించ లేకపోతున్నారా?.. నిద్ర పట్టడం లేదా?.. మీకు భయమేమీ లేదు.. అనారోగ్య సమస్య గురించి చెబితే చాలు.. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో అన్నిరకాల మందులు ఇచ్చేస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా విక్రయిస్తారు. ఏ మందు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్ని రోజులు వాడాలో కూడా వారే సూచిస్తారు. ఇలా చిత్తూరు జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అధికారులు ఏదో ఓ సారి తనిఖీ చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపు కోవడం విమర్శలకు తావిస్తోంది.చిత్తూరు రూరల్ (కాణిపాకం): డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. సేమ్ ఫార్ములా.. కంపెనీ మాత్రమే వేరు.. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది.. అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. జిల్లాలో సుమారు 1,500 వరకు రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులున్నాయి. అలాగే చాలామంది క్లినిక్‌లోనే మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ప్రతి చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.5 వేల నుంచి రూ.లక్ష దాకా వ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారం ఇష్టానుసారంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తారుమారు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్టు– 1940, ఫార్మసీ యాక్టు– 1948 ప్రకారంగా బీ ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ పూర్తిచేసిన వారే మెడికల్ షాపులు నిర్వహించాలి. షాపు పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత ఫార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తి గత గుర్తింపుకార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో జతచేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమర్పించాలి. అనుమతి మంజూరైన తర్వాతే షాపులు నిర్వహించాలి. జిల్లాలో మెడికల్ షాపులు చాలామంది బినామీలే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితోనే దుకాణాలను నిర్వహించాలి. చాలామంది తక్కువ వేతనంతో యువకులను పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్‌పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదోరకమైన దందా.. జనరిక్, నాన్ జనరిక్ తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. యాంటీబయాటిక్ మందులను డాక్టర్ల సూచనల మేరకు ఇవ్వాలి. కానీ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అనవసరంగా యాంటీబయాటిక్ మందులు వాడిన వారు సైడ్ ఎఫెక్ట్‌తో కొత్తరోగాల బారిన పడుతున్నారు. ఇక బెంగళూరు నుంచి పలు రకాల బ్రాండ్ల పేరుతో అనధికారికంగా మందులు, మాత్రలు సరఫరా అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇవీ తక్కువ రేటుకు ఇస్తుండడంతో మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాలతో రెండు నెలలకు క్రితం చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడివీధిలోని రెండు మెడికల్ షాపులపై డ్రగ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో విక్రయానికి అనుమతి లేని మందులను గుర్తించారు. మందులు, మాత్రల విక్రయాలకు సంబంధించిన వివరాలు సక్రమంగా లేవని తెలుసుకున్నారు. దీంతో ఆ షాపును సీజ్ చేయగా..మరో షాపునకు నోటీసులు ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు.. ఇలా వందల సంఖ్యలో మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. -
సాగర్ సొగసు చూడతరమా..!
విజయపురిసౌత్: నాగార్జున సాగర్‌కు కొత్తనీరు వచ్చి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో జలాశయం కొత్త అందాలను సంతరించుకుంది. గత మూడు రోజులుగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్లు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. అంతేకాకుండా నిండుకుండలా కనపడుతున్న సాగర్‌లో జలాశయం మీదుగా లాంచీలో నాగార్జునకొండకు వెళ్లటం పర్యాటకులకు మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. దీంతో నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఈ నేప«థ్యంలో సాగర్ చుట్టుపక్కల సందర్శినీయ స్థలాలపై ప్రత్యేక కథనం.. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఇది సాగర్ ప్రధాన డ్యాం దిగువ ప్రాంతంలో ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఉంటుంది. ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని సాగర్ జెన్కో ఎస్ఈ అనుమతి తీసుకొని సందర్శించాల్సి ఉంటుంది. చరిత్రకు ప్రతిరూపం నాగార్జునకొండ నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్‌లోని లాంచీస్టేషన్ నుంచి 14 కి.మీ.దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్‌లో లాంచీస్టేషన్ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, పిల్లలకు రూ 150, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, మ్యూజియం సందర్శనకు 15 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. విజ్ఞాన విహార యాత్రకు గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీ టిక్కెట్‌పై 15 శాతం రాయితీ పర్యాటకశాఖ ఇస్తుంది. అలాగే పార్టీలకు, పంక్షన్లకు శాంతిసిరి గంటకు రూ.10,000లు, అగస్త్య లాంచీ గంటకు రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్‌ను సంప్రదించవచ్చు. గత ఆనవాళ్లకు చిరునామా అనుపు నాగార్జునసాగర్ 7కి.మీ. దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ ఆనాటి నాగార్జున విశ్వ విద్యాలయం, ఇక్షా్వకుల కాలం నాటి యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణానది లోయలో లభించిన రంగనాథస్వామి దేవాలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణానది తీరంలో నిర్మించటం విశేషం. భక్తుల కోర్కెలు తీర్చేసాగర్మాత విజయపురిసౌత్‌లోని కృష్ణానది తీరంలో వేంచేసియున్న సాగర్మాత దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే చల్లనితల్లిగా సాగర్‌మాతకు విశిష్టమైన పేరు ఉంది. ఇక్కడ నెలకొల్సిన జపమాల క్షేత్రం రాష్ట్రంలోనే ప్రత్యేకతను నెలకొంది. -
అశోక్‌బాబుపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన వైయస్సార్సీపీ
తాడేపల్లి: వైయస్సార్సీపీ దళిత నేత వరికూటి అశోక్‌బాబుపై రేపల్లె పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం.బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయి, సాగు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ, అక్కడి మా పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆందోళన చేస్తే, రేపల్లె పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం. రైతుల మేలు కోసం రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి అశోక్ బాబు ధర్నా చేస్తే, ఆయన పట్ల స్థానిక పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లడంతో నడుం పట్టిన ఆయన ఇప్పుడు తీవ్ర అవస్థ పడుతున్నారు.రైతుల మేలు కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా, అంత దౌర్జన్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు..? అశోక్‌బాబును దారుణంగా పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లడంతో, ఆయన నడుం పట్టేసింది. దీంతో ఆయన లేవలేకపోతున్నారు. కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. రేపల్లెలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వారు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం అంటూ వైయస్సార్సీపీ నాయకులు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్‌బాబు, జూపూడి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. -
జనసేన ఎమ్మెల్యే అవినీతిపై.. టీడీపీ నేతల ఫోన్‌కాల్ సంభాషణ వైరల్
సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.ఇరువురి సంభాషణలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏడాదిలోనే రూ.100 కోట్లు దోచేశారని దేవినేని ఉమా ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇవన్నీ తెలుసా? అని రాంబాబును ఉమ ప్రశ్నించారు. అందుకు రాంబాబు స్పందిస్తూ .. ఇప్పటివరకు పవన్ నాకు ఫోన్ చేయలేదని అన్నారు. -
యువతిని మోసం చేసిన కేసు.. టీడీపీ నేత తనయుడి అరెస్ట్
కృష్ణాజిల్లా: యువతిని మోసం చేసేన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని మోసం చేసి పెళ్లికి మొహం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాలుగు రోజులుగా దీనిపై హైడ్రామా నడిపారు జిల్లా టీడీపీ పెద్దలు. రాజీ కుదిర్చే యత్నం చేసి అభివన్‌ను తండ్రి పల్లపాటి సుబ్రహ్మణ్యంను కాపాడేయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లిదండ్రలు.. తమ కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధం కావడంతో అభినవ్‌ను అరెస్టు చేసిన చిలకలపూడి పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. అభినవ్‌కు 14 రోజులు రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి.. -
అన్నదాతలకు మరోసారి చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి,విజయవాడ: అన్నదాతలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. అన్నదాత సుఖీభవం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది. రేపు(శనివారం, ఆగస్టు 2) పథకం అమలులో భాగంగా రూ.40 వేలకు గాను రూ.5 వేలు మాత్రమే ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో గత ఏడాది ఖరీఫ్, రబీ డబ్బులు మొత్తం ఎగనామం పెట్టింది. రూ.7 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా కోత విధించింది.వైఎస్ జగన్ ప్రభుత్వంలో 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చగా.. చంద్రబాబు మాత్రం 46.85 లక్షలకు లబ్ధిదారులను తగ్గించేశారు. గత ఏడాది పూర్తిగా రూ.20 వేలు ఎగనామం పెట్టారు. ఈ ఏడాది కేవలం 5 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు సిద్ధమైంది. రూ. 20 వేలు ప్రతీ రైతు కుటుంబానికి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయంతో రూ.20 వేలు ఇస్తామని మెలికపెట్టారు. ఇలా గత ఏడాది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.10,800 కోట్లు ఎగ్గొట్టింది. ఈ ఏడాది కేవలం 2,342 కోట్లు మాత్రమే విడుదల చేయనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టిన ప్రస్తుత సీఎం చంద్రబాబు.. పేరు మార్చి అన్నదాత సుఖీభవ అంటూ 14 నెలలుగా పథకాన్ని అమలు చేయకుండా రైతుల పొట్టకొడుతూ వచ్చారు. ఈ అంశాన్ని ఎత్తి చూపుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం కావడంతో ఆగస్టు 2 నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేల మాత్రమే రైతుల ఖాతాలో జమ చేయనుండడంతో కూటమి ప్రభుత్వంపై రైతన్నలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
‘ మేం నిరూపిస్తే.. మీరు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?’
విశాఖ: తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో కూటమి నేతలు అనిత, ప్రశాంత రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ‘జనాలు రాలేదని అనిత మాట్లాడుతున్నారు. జనాలు వచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి అనిత రాజీనామా చేస్తారా?, జగన్ కాలు గోటికి అనితా సరిపోదు. సంస్కారహీనురాలు, మానసిక రోగి అనిత. జగన్ పర్యటనకు జనాలు రాకుండా 3 వేల మంది పోలీసులను పెట్టారు. రోడ్లు మీద గుంతలు తవ్వి, ఇనుప కంచెలు పెట్టారు. అయినా జనాలను రాకుండా అడ్డుకోలేక పోయారు.అనితా తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అనితా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అసమర్థ హోమ్ మంత్రి అనిత అని పవన్ కళ్యాణ్ చెప్పారు’ అని వరుదు కళ్యాణి కౌంటరిచ్చారు. -
‘జగన్‌ని ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు’
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళితే టీడీపీ నేతలు వణికిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రోడ్లు తవ్వి, ముళ్ల కంచెలు వేసి నానా హంగామా చేసినా జగన్ పర్యటన విజయవంతమైందన్నారు. అసలు ఒక పార్టీ అధినేత పర్యటనలకు వెళితే ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఇబ్బందులు పెడుతున్నారు. ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్టి త్రిపాఠి నెల్లూరులోనే కూర్చొని జనం రాకుండా చేయాలని చూశారు. జగన్ కోసం జనం తండోపతండాలుగా వస్తున్నారు’ అని పేర్కొన్నారు.సింగపూర్‌కు వెళ్లి ఏమి సాధించారు?ఇప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 55సార్లు సింగపూర్‌కు ఎళ్లారని, మరి రాష్ట్రానికి ఏమి పెట్టుబడులు తెచ్చారో ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అంబటి. తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ని పరామర్శించటానికే వెళ్లారని ఎద్దేవా చేశారు. సింగపూర్‌కు వెళ్లి ఏమీ సాధించలేకపోవడంతో అది కూడా మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఏపీలో పెట్టుబడి పెట్టేది లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దానికి కారణం వైఎస్సార్సీపీ నేతలంటూ ఆరోపణలు చేస్తున్నారు. మురళీకృష్ణచౌదరి అనే టీడీపీ వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్ చేశారని తేలింది. అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జా చేశారన్న కారణంతో ఈ-మెయిల్ చేశారట. అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా ఎలా చిత్రీకరిస్తారు?, చంద్రబాబు ప్రభుత్వానికి శని పట్టింది. అందుకే పరిపాలనను వదిలేసి జగన్ పర్యటనను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఏం చేసినా జగన్‌ని ఆపటం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు. హోంమంత్రి అనిత అదేపనిగా జగన్‌ని తిట్టటమే పనిగా పెట్టుకుంది. జగన్‌ని తిడితే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపిఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. లోకేష్ హైక్యాష్ గా మారిపోయారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి మా నాయకుడు వెళ్తే టీడీపీకి ఇబ్బంది ఏంటి?, పెట్టుబడులపై చిట్టినాయుడు పిట్టకథలు చెప్తున్నారు. చంద్రబాబు తోకని చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు.. చిట్టినాయుడు తోకని జనం కట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయటమే చంద్రబాబు లక్ష్యం. కేసులు పెట్టటానికి ఇప్పుడు మళ్ళీ ఇసుక కేసు అంటున్నారు. చిట్టినాయుడు కథలు రాస్తుంటే పోలీసులు డ్రామా ప్లే చేస్తున్నారు. ఈ కేసులేవీ చట్టం ముందు నిలపడవు’ అని అంబటి పేర్కొన్నారు. -
స్వతంత్ర్య అభ్యర్ధి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు!
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ ఉప ఎన్నికలు సందర్భంగా నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర్య అభ్యర్థి పట్ల టీడీపీ నేతలు రౌడీయిజం సృష్టించారు. శ్రీదేవి అనే స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి రాగా, ఆమెను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆమె నామినేషన్ వేయకుండా చేసేందుకు నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిపోయారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన క్రమంలో ఆమెను టీడీపీ నాయకుడు ఆనంద్‌రెడ్డి తన అనుచరులతో చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలోనే ఆమె వద్దనున్న నామినేషన్ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, రూ. 5వేల నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి , ఇలా రౌడీయిజం చేసి కాదు. నామినేషన్ పత్రాలను, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, 5వేల నగదు ఎత్తుకు వెళ్లారు. ఎస్.ఐ దగ్గర ఉన్నా, మాపై దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోలేదు’ అని ఆమె విమర్శించారు. -
కుళ్లిన చికెన్, గడ్డ కట్టిన చేపలు, మాగిపోయిన పీతలు!!
కుళ్లిన చికెన్, గట్టిన చేపలు, మాగిపోయిన పీతలు, ముద్దగా మారిన రొయ్యలు, 15 రోజులకు పైగా నిల్వ ఉంచిన మసాలా ముద్దలు.. చదువుతుంటే ఎలా ఉంది?. కానీ, ఈ వీటితో తయారు చేసిన వంటకాలనే విశాఖపట్నంలోని ప్రముఖ రెస్టారెంట్లలో వడ్డిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. విశాఖలో ఇవాళ ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాలను ఉపయోగిస్తున్నారు. పైగా వాటిల్లో వాడే మసాలాలు నిల్వతో బూజుపట్టి ఉండడం గమనించారు. ఈ క్రమంలో.. క్వాలిటీలేని ఫుడ్‌ను విక్రయిస్తున్న వాళ్లపై అధికారుల సీరియస్ అయినట్లు సమాచారం.జగదాంబ జంక్షన్ లోని ఆల్ఫా హోటల్ లో తనిఖీలు చేస్తున్న స్టేట్ ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, సిబ్బంది సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘ఇవాళ 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో తనిఖీలు చేస్తున్నాం. ఈ హోటల్లో ఫ్రీజ్ చేసిన ఫుడ్‌ని గుర్తించాం. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారు. కిచెన్‌లో పరిశుభ్రత పాటించడం లేదు. ఇక్కడి ఫుడ్‌ని టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపిస్తున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తాం. ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయి. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటాం. పాయిజన్ ఫుడ్‌తో ప్రజల ఆరోగ్యాలతో చెలాగాటమాడేవాళ్లను క్షమించేది లేదు’’ అని హెచ్చరించారాయన. -
ప్రైవేటీకరణ బాటలోనే విశాఖ స్టీల్ ప్లాంట్
ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి తాము వెనక్కి తగ్గే యోచనలో లేమనే విషయాన్ని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 100 శాతం పెట్టబడుల ఉపసంహరణ ఉంటుందన్న క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌న సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటివరకూ 1017 మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. ఆర్ఐఎన్ఎల్కు రూ. 11,140 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను ఇప్పటివరకూ రూ. 984 కోట్లను విడుదల చేశాం’ అని మంత్రి తెలిపారు. -
చింతమనేని వర్గం హల్చల్.. అబ్బయ్య చౌదరి హెచ్చరిక
సాక్షి, పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని భయానక వాతావరణ సృష్టించారని అన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. చింతమనేని ప్రభాకర్ బెదిరింపులకు భయపడేవాడెవారు ఎవరూ లేరు.. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే, దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టార్గెట్‌గా చింతమనేని రాక్షస క్రీడకు తెరలేపారు. అబ్బయ్య చౌదరికి చెందిన పంట పొలాలను పచ్చ మూకలు ధ్వంసం చేసి.. వక్క చెట్లను నరుక్కు పోయారు. అంతటితో ఆగకుండా.. అబ్బయ్య చౌదరి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు వంటావార్పుకి పిలుపునిచ్చారు. దీంతో, దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అబ్బయ్యచౌదరి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకున్నారు. ఈ క్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దెందులూరు నియోజకవర్గంలోకి అబ్బయ్య చౌదరి వచ్చాడంటే చాలు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీ నేతలకు అధికారం ఇచ్చింది దేనికి?. ప్రజలకు మంచి చేయడానికా లేక అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేయడానికా?. దెందులూరులో వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని మేము చేసిన అభివృద్ధిలో సంక్షేమంతో పోటీ పడండి.. అంతేకానీ కక్షపూరిత రాజకీయాలు కాదు.దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని భయానక వాతావరణ సృష్టించారు. చింతమనేని బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి భయపెట్టాలని చూస్తున్నారు. మాజీ శాసనసభ్యుడి ఇంటి ముందు ఇలా చేయడం ఏంటి?. మేము ఎక్కడికి పారిపోవటం లేదు ఇక్కడే ఉన్నాం.. ఏం చేస్తారో చేయండి?. దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర లేపారు. మా తోటలో వక్క చెట్లు నరుక్కుని పోయే బ్యాచులు తయారయ్యారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
లోకేష్.. అది మీ నాన్నను అడిగి తెలుసుకోండి
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు.బనకచర్ల కట్టి తీరతామని నారా లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇంతదాకా స్పందించలేదు. సీఎం, మంత్రులు సహా ఎవరూ ఖండించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్ మాట్లాడుతున్నారు. మీకు తెలియకుంటే మీ నాన్నను అడిగి తెలుసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ నాన్న చంద్రబాబు ఏడు లేఖలు కేంద్రానికి రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయి. కావాలంటే మీకు అన్ని ఆధారాలు పంపిస్తాం.కేంద్రం, రేవంత్ బలం చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ ఆటలు సాగనివ్వం. బనకచర్లను అడ్డుకుని తీరతాం అని హరీష్‌రావు హెచ్చరికలు జారీ చేశారు. -
‘లిక్కర్ స్కాంలో రోజుకో పిట్ట కథ’
సాక్షి, విజయవాడ: ఏపీలో లిక్కర్ స్కాంలో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కాంను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తుంది. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. స్కాం ఎక్కడో ఇప్పటికీ తెలియడం లేదు. లిక్కర్ స్కాం డబ్బులు గల్ఫ్ అంటారు.. ఆఫ్రికా అంటారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అన్నారు. రోజూ ఏదో ఒక పిట్టకథ చెప్తున్నారు. లేని.. జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కాం పేరుతో ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేసుల పేరు చెప్పు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారు ఏపీలో ఒక ECM ఇద్దరు DCM లు ఉన్నారు. ఇద్దరు DCMలలో ఒకరు డిప్యూటీ సీఎం అయితే, మరొకరు డీఫ్యాక్టో సీఎం. వీరు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. లిక్కర్ కేసులో అరెస్టులు ఎందుకు చేస్తున్నారు.. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా. లిక్కర్ స్కాంలో అసలు దొంగ చంద్రబాబే. 2019-2024 మద్యం స్కాం జరగలేదు. 2014-2019 మధ్య జరిగింది అసలైన లిక్కర్ స్కాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చంద్రబాబు గండి కొట్టారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా?. లిక్కర్ డోర్ డెలివరీ చేసి బలవంతం తాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 11 కోట్లు సీజ్ చేశారు.. అవి ఎవరివి?. అతని స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా?. కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే అక్కడే ఉంటుందా?. లిక్కర్ స్కాం జరగలేదు మిథున్ రెడ్డి ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. నెల్లూరు ఏమైనా కంచుకోటా.. కంచె వేసి అడ్డుకోవడం ఏమిటి?. మెయిల్స్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీ మాదిరి దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్స్ ముందు మేం సరితూగం’ అని కామెంట్స్ చేశారు. -
సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కామ్‌కు చెందిందిగా చెబుతూ సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్(తెలంగాణ)లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఇది రాజ్ కేసిరెడ్డిదేనని సిట్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. సీజ్ చేసిన ఆ రూ. 11 కోట్ల నగదును ఫొటోగ్రాఫ్ తీయాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇవాళ నిందితుల రిమాండ్ ముగియడం.. బెయిల్ పిటిషన్లపై కోర్టు వాదనలు వింది. ఆ సమయంలో.. ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతమైన రాజ్ కేసిరెడ్డి.. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్ డబ్బులేనని చూపుతున్నారన్నారు. రూ.11 కోట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘‘సిట్ అధికారులు అవి నావేనని అబద్ధం చెప్తున్నారు. 2024 జూన్‌లో నేను వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. నేను పుట్టకముందు ఆస్తులను కూడా నా బినామీలుగా చూపిస్తున్నారు. నా వయస్సు 43 ఏళ్లు. 45 ఏళ్ల కిందటి ఫామ్ హౌస్‌కి నేను బినామీ అని చూపిస్తున్నారు. నేను పుట్టకముందే నాకు బినామీ ఆస్తులుంటాయా..?’’ అంటూ కేసిరెడ్డి ప్రశ్నించారు.‘‘ఆ రూ.11 కోట్లు నేనే నా చేత్తో ఇచ్చానని చెబుతున్నారు. ఆ డబ్బులపైనా వేలిముద్రలు చెక్ చేయాలని కోరుతున్నాను. 2024 జూన్‌లో ఆ డబ్బు వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముందించిందో తనిఖీ చేయాలి. ఆ నోట్లపై నంబర్లు రికార్డ్ చేయాలని కోరుతున్నాను. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను అటాచ్ చేశారు. వారసత్వ ఆస్తులను కూడా లిక్కర్ డబ్బులతో కొన్నట్టు చూపిస్తున్నారు. నా బెయిల్ అడ్డుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారు’’ అంటూ ఏసీబీ న్యాయమూర్తి ముందు రాజ్ కేసిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరుణంలోనే ఆ డబ్బులను ఫోటోగ్రాఫ్ తీయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. -
నేనో సిట్టింగ్ ఎంపీని.. జడ్జి ఎదుట మిథున్‌రెడ్డి రిక్వెస్ట్
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో అరెస్టైన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఇవాళ ఓ విన్నపం చేశారు. శుక్రవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ‘‘నేను మూడుసార్లు ఎంపీగా చేశా. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా. నేను ఎలాంటి స్కాం చేయలేదు. ఇది ఒక అక్రమ కేసు. నేనేం దేశం విడిచి ఎక్కడికీ పారిపోను. నాకు బెయిల్ మంజూరు చేయాలి’’ అని కోరారాయన. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనే అభియోగాల మీద వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారీయన. జులై 20వ తేదీన సిట్ విచారణకు హాజరైన మిథున్‌రెడ్డిని.. ఏడుగంటల పాటు అధికారులు విచారించారు. ఆపై రాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1 దాకా రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది.ఇదిలా ఉంటే.. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. జరగని స్కామ్ జరిగినట్లుగా తప్పుడు ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలతో తమ కీలక నేతలను వేధింపులకు గురి చేస్తోందని కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది. -
న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు తనవేనని సిట్ అధికారులు లింకు పెడుతున్నారంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రూ. 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని ఆయన కోరారు.‘‘నేను 2024 జూన్‌లో ఆ డబ్బు వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని కేసిరెడ్డి కోరారు. ‘‘45 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్‌కు బినామీ అంటున్నారు. నా వయసు 43 ఏళ్లు. నేను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ ఎలా అయ్యాను’’ అంటూ కోర్టు ఎదుట కేసిరెడ్డి కంటతడి పెట్టారు. -
అది నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా: అనిల్
సాక్షి, నెల్లూరు: తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని స్పష్టం చేశారు. ‘‘గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి. నా దగ్గర రూ.వేల కోట్ల ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’’ అంటూ అనిల్ సవాల్ విసిరారు.తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా చెప్పించారు. అనిల్‌కి, కాకాణికి పడదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మైనింగ్ చేశామని ఆరోపిస్తున్నారు’’ అంటూ అనిల్ మండిపడ్డారు.‘‘గూడూరు, నాయుడుపేటలో నేను, శ్రీకాంత్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇసుక రవాణాని ఏజెన్సీకీ ఇచ్చాం. నేను ఇసుక అక్రమ రవాణా చేసానని ఆరోపిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నా ఆస్తి 1000 కోట్లు అంటున్నారు.. చంద్రబాబు విచారణ జరిపి అందులో 950 కోట్లు అమరావతి అభివృద్ధికి తీసుకుని, నాకు రూ.50 కోట్లు ఇస్తే చాలు. అవసరమైతే చంద్రబాబుకి లేఖ రాస్తాను. 2022 నుంచి ఇప్పటి వరకు ఎవరు మైన్ నుంచి రవాణా జరిగిందో ఈడీ ద్వారా విచారణ జరపండి.. నేనే కోర్టులో పిటిషన్ వేస్తాను’’ అని అనిల్ పేర్కొన్నారు. -
నెల్లూరులో హైటెన్షన్.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఆఫీస్‌పై దాడికి యత్నం
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆఫీస్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ శ్రేణలు అడ్డుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతల ప్రెస్‌మీట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో అసహనంగా ఉన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్ కార్యాలయంపైకి మహిళలను పంపించారు. పోలీసులు రావడంతో ప్రశాంతిరెడ్డి అనుచరులు పారిపోయారు.కూటమిలో కలవరం నిన్న(గురువారం) వైఎస్ జగన్ రాకతో సింహపురి జన ఝరిగా మారిన సంగతి తెలిసిందే. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు పుట్టించింది.జననేత పర్యటనను అడ్డుకునేందుకు ఊరూరా ఆంక్షలు విధించినా.. పెద్ద సంఖ్యలో చెక్‌పోస్ట్‌లు.. అడుగడుగునా బారికేడ్లు.. ముళ్ల, ఇనుప కంచెలను నెలకొల్పినా.. రహదారులను ధ్వంసం చేసినా, ఇవేవీ పార్టీ అభిమానులను అడ్డుకోలేకపోయాయి. వారిని నిర్బంధించలేకపోయాయి. పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకు అనేక అడ్డంకులు సృష్టించినా.. ఖాకీలు లాఠీలను ఝళిపించినా.. ఊహించని స్థాయిలో పోటెత్తారు. -
ఐటీ డెవలప్మెంట్ పేరిట విశాఖలో దోపిడీ: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం హత్యలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో కన్నా.. ఈ ఒక్క ఏడాదిలో కాలంలోనే క్రైమ్ రేటు ఎంతో పెరిగింది. కూటమి నేతల్లో అసహనం పెరిగిపోతోంది. మంత్రులు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్తే.. కార్యకర్లు రాకుండా రోడ్లు తవ్వారు అని అన్నారాయన.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దక్కులేదు. కానీ.. కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటి?. లులు సంస్థకు భూముల విషయంలో లాలూచీ పడ్డారు. రూ.1,500 కోట్ల విలువైన స్థలాన్ని ఆ కంపెనీకి 99 ఏళ్లకు అప్పగిస్తున్నారు. కానీ, అందులో సగం పెట్టుబడి కూడా రాదు. అసలు కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉందా?. అలాగే టీసీఎస్‌కు అప్పన్నంగా భూములు కట్టబెడుతున్నారు. డేటా సెంటర్ మేం పెట్టలేదా?. వైజాగ్‌లో ఐటీ సెంటర్‌ను ప్రొత్సహించింది డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విశాఖలో దోపిడీ జరుగుతోంది అని అన్నారాయన. చట్టానికి వ్యతిరేకంగా ఎవరిని మేం సమర్థించబోం. రోజా గురించి ఎలా మాట్లాడారో అంతా చూశారు. కానీ, కూటమి నుంచి తప్పని ఎవరైనా అన్నారా? అని బొత్స నిలదీశారు. -
చంద్రబాబూ.. మీ భుజాలు మీరే చరచుకుంటే ఎట్లా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్లో చేసిన ప్రసంగాలు రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేవేనా? నిజానికి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్, మరో మంత్రి నారాయణ తదితరులు ఆరు రోజుల సింగపూర్ పర్యటన పెట్టుకోవడమే ఆశ్చర్యం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడం వరకూ ఓకే కానీ.. ఆ సింగపూరే సర్వస్వం అన్నట్లు మాట్లాడటం వారికి క్షమాపణలు చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నదని, దాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమనడం మరీ అతిగా అనిపించింది. సింగపూర్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నారట. తాను జైలులో ఉన్నప్పుడు డెబ్బై, ఎనభై, తొంభై దేశాలలో తెలుగు వారు తమ పనులు మానుకుని నిరసనలు తెలిపారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన ఏ కేసులో అరెస్టు అయింది మాత్రం వివరించలేదు. సింగపూర్ అత్యంత నీతివంతమైన దేశం అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఆ దేశ మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన ఈశ్వరన్ అవినీతి కేసులోనే జైలుకు వెళ్లిన విషయాన్ని విస్మరిస్తే సరిపోతుందా!.సింగపూర్ అవినీతి బాగా తక్కువ ఉన్న దేశం కావచ్చు. కానీ, ఇతర దేశాల అవినీతి డబ్బుకు కేంద్రం అన్న పేరు కూడా ఉంది. సింగపూర్ కంపెనీలు అమరావతికి ఎంతవరకు వస్తాయో డౌటే అంటూనే.. సంప్రదింపులతో పాత ఒప్పందాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని చంద్రబాబు ఈ టూర్‌కు ముందు చెప్పారు. అంటే మళ్లీ సింగపూర్ కంపెనీలకు 1700 ఎకరాలు కట్టబెట్టి, ఆ భూమి అభివృద్ది కోసం ప్రభుత్వమే రూ.5500 కోట్లు వెచ్చించి, ఆ ప్లాట్ల అమ్మకానికి వారికి అప్పగిస్తారా? తద్వారా వచ్చే ఆదాయంలో 58 శాతం వారికే ఇస్తారా?. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, హౌసింగ్ ప్రాజెక్టుల కోసం సింగపూర్ కంపెనీలతో పనేముంది?. ఏపీకి సంబంధించిన పలు సంస్థలు ఈ వ్యాపారంలో ఉన్నాయి కదా!. ప్రస్తుతం అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులు దేశీ సంస్థలకే ఇచ్చారు కదా!. అందులో తెలుగువారి కంపెనీలు కూడా ఉన్నాయి కదా. వారు చేయలేని పని ఏదో సింగపూర్ కంపెనీలు చేస్తాయన్నట్లు చంద్రబాబు వంటి సీనియర్ నేత మాట్లాడడమే ఏపీకి పరువు తక్కువ. ఆ దేశ మంత్రితో చంద్రబాబు చర్చలు కూడా జరిపారు. అమరావతి కోసం కన్సార్షియం ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టం చేశారు కూడా. సాంకేతిక సాయం అందిస్తామని మాట వరసకు అన్నట్లు అనిపిస్తుంది. సింగపూర్ అయినా, మరో దేశం అయినా ఇక్కడ జరిగే నిర్మాణాలలో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటే గౌరవం కాని, మనం వెళ్లి పిలిస్తే లోకువ అవడం లేదా!. దీనిని పక్కనబెడితే సింగపూర్ వెళ్లి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటి?. అది ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీయడం కాదా!. నిజానికి ఏపీలో ఏడాదిన్నర కాలంగా జరిగిన పరిణామాలు రాష్ట్ర పరువును దెబ్బతీశాయి. ప్రతి నిత్యం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ టూర్‌కు వెళ్లినా ఆంక్షలు పెట్టడం, రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా!. ఈ తరహా నియంతృత్వం ఏపీకి పేరు తెస్తుందా?. అపకీర్తి తెస్తుందా?. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న దందాలు, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న స్కాంలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్న తీరు.. ఇవి కదా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేది?. వాటిపై వివరణ ఇవ్వకుండా, జగన్‌పై ఆరోపణలు చేస్తే ఏమి లాభం?.జగన్ టైమ్‌లో విధ్వంసం జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు కదా!. ఈ 14 నెలల కాలంలో అది ఏంటో ఎన్నడైనా చెప్పారా?. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. ఆధారాలు చూపారా?. పైగా కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి రావడం అప్రతిష్ట కాదా!. అప్పులు పుట్టడం లేదంటూనే సుమారు రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత చంద్రబాబు సర్కార్‌ది. ఆ విషయం సింగపూర్ లేదా ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారికి తెలియదన్న నమ్మకంతో మాట్లాడుతున్నారా?. జగన్ తీసుకు వచ్చిన ఓడరేవులు, వైద్య కళాశాలలు, ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా తదితర సంస్థల భవనాల నిర్మాణం వంటివి ఏపీకి ఉపయోగమా? కాదా?. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓడరేవులు ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు?. ఏపీకి వచ్చిన వైద్య కళాశాలల సీట్లను కూటమి ప్రభుత్వం ఎందుకు వదలుకుంది?.జగన్ టైమ్‌లో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటికి రెట్టింపు ఇస్తామని చెప్పి, ఇప్పుడు నోరు వెళ్లబెట్టడం, లేదా అన్నీ చేసేశాం కదా అని దబాయించడం ఏపీకి వన్నె తెచ్చిందా?. ప్రతి ప్రభుత్వం కొన్ని విధానాలు నిర్ణయించుకుంటుంది. ఆ ప్రకారం ముందుకు వెళుతుంది. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసింది అందరికీ తెలుసు. మరి చంద్రబాబు తన మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఇన్ని హామీలను ఇలా అమలు చేసి ప్రజల ముందు గర్వంగా నిలబడ్డామని చెప్పుకునే పరిస్థితి ఉందా?. అసలు పెన్షన్ రూ.1000 పెంచడం, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన వాగ్ధానాలన్నిటిని ఏడాది ఎగవేసిన విషయం వాస్తవం కాదా?. అది చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిష్ట తెచ్చిందా? తన మీద కేసులు లేనట్లు, ఎదుటి వారిపైనే నిందారోపణలు చేయడం ఎంతవరకు పద్దతి అన్నది ఆలోచించుకోవాలి.సింగపూర్ అయినా మరోచోటికి వెళ్లినా, ఏపీకి ఉన్న సానుకూల అంశాలు పెట్టుబడులు పెడితే ప్రభుత్వపరంగా లభించే సహకారం మొదలైన అంశాలు తక్కువ మాట్లాడి, ఎక్కువ భాగం జగన్ దూషణకు కేటాయిస్తే ఎల్లో మీడియాలో బ్యానర్లుగా పనికి రావచ్చేమో కానీ.. ఏపీ ప్రజలకు మాత్రం ఉపయోగపడవు. సింగపూర్‌లో తెలుగు వారు తన వల్లే ఉద్యోగాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం, అంతకన్నా మించి ఆయన తనయుడు లోకేశ్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు శాసిస్తున్నారంటే అది చంద్రబాబు ఘనతేనని పొగుడుకోవడం ఎబ్బెట్టుగా ఉన్నాయి. తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడు కోవడం వల్ల అక్కడ ఉన్న అభిమానులు చప్పట్లు కొట్టవచ్చేమో కానీ, ఆ తర్వాత ఇలా వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారేంటి అన్న ఆలోచన వచ్చి అవహేళనకు గురవుతారని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఇలాంటివి అనుభవమైనా ఈ ధోరణి మారడం లేదు. తల్లికి వందనం స్కీంను లోకేశ్ కనిపెట్టారని చంద్రబాబు చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారు. దానికి కారణం జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు ఇది కాపీ కావడమే.ఇటీవల ఆయా మీటింగ్‌లో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా క్వాంటం కంప్యూటర్ను అమరావతిలో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు, లోకేశ్‌లు ప్రకటించగా ఎలా నవ్వులపాలైంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చెబుతున్నాయి. కర్ణాటక మంత్రి బోసు రాజు ఒక ట్వీట్ చేస్తూ ఇప్పటికే కర్ణాటకలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటైందని, ఏపీలో తలపెట్టిన దానికన్నా మూడు రెట్లు శక్తిమంతమైందని, ప్రచారం చేసుకోవడానికి ముందు వాస్తవం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ వల్ల చంద్రబాబుకు అపఖ్యాతి వచ్చిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే అబద్దమైనా, నిజమైనా తన గొప్ప తానే ఒకటికి వందసార్లు చెప్పుకుంటే జనం నమ్ముతారన్నది బాబు నమ్మిక. దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో ఎట్టకేలకు పోలీసు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఈ మేరకు ఫలితాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. పోలీస్ శాఖలో ఉన్న తీవ్ర సిబ్బంది కొరతను అధిగమించేందుకు 2022లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్‌లో నోటిఫికేషన్, 2023లో ప్రిలిమినరీ పరీక్ష, 2024 డిసెంబర్లో ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. అయితే.. రిజల్ట్ కోసం క్లిక్ చేయండి👉 https://slprb.ap.gov.in/PCFWTRES/FWEPCRESULTS.aspxPETలో అర్హత సాధించిన 37,600 మంది అభ్యర్థులకు ఈ ఏడాది జూన్ 1వ తేదీన మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించారు. అటుపై ఓఎంఆర్ షీట్లు జూలై 12, 2025 వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచారు. ఫలితాల విడుదల న్యాయపరమైన చిక్కులు ఎదురైనట్లు SLPRB చెబుతూ వచ్చింది. ఈ తరుణంలో జూలై 30న విడుదల చేయాల్సిన ఫలితాలు.. ఆలస్యంగా ఇవాళ(ఆగస్టు 1న) విడుదలయ్యాయి. -
హిజ్రాలకు టీడీపీ నేతల టోకరా
సాక్షి, అనంతపురం: ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు హిజ్రాలను మోసం చేశారు. నగరంలోని లెక్చరర్స్ కాలనీ వెనుక ఉండే ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాలు, పలువురు బాధితులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న సదరు స్థలంలో ఇప్పటికే 120 మంది గుడిసెలు వేసుకుని నివాసముంటున్నామన్నారు.ఈ క్రమంలో తమకు పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ బి.హనుమంతరాయుడు, బండారు చంద్ర, నీలకంఠ, సూరి, కిరణ్, మహబూబ్‌బాషా, బాబు వసూలు చేశారని, పట్టాలు ఇప్పించకపోగా, నగదు వెనక్కి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన డబ్బు వెనక్కు చెల్లించమంటే బతకలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి పట్టాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హిజ్రాలు నగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన చేశారు. దీంతో మోసం చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మొదలైన అక్రమ కేసుల పర్వం
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై అక్రమ కేసుల పర్వం మొదలైంది. వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డితో పాటు మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.ప్రసన్న ఇంటికి సమీపంలో వైఎస్ జగన్ కోసం ఎదురుచూస్తున్న పార్టీ శేణ్రులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో ప్రసన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ మేరకు ఆయనపై మొదటి కేసు నమోదుగా కాగా.. అభిమానులను అడ్డుకునే క్రమంలో కావలి స్పెషల్ బ్రాంచ్ హెచ్‌సీ మాలకొండయ్య కిందపడడంతో ఆయన చేయి విరిగిందని.. ప్రసన్నకుమార్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌యాదవ్, మరికొందరిపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ కొందరు యువకులపైనా కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.కాగా, వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వస్తారని తెలియడంతో వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి హడావుడి చేయకుండా వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రశాంతంగా నిరీక్షిస్తున్నారు.ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు తన ఇంటికి వంద మీటర్ల దూరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ ప్రాంతానికి చేరుకున్నారు. అంతలో పోలీసులు జోక్యం చేసుకుంటూ.. అక్కడి నుంచి ముందుకెళ్లాలని చెప్పడంతో వారి మాటను గౌరవించి వారు చెప్పిన చోటుకు వెళ్లారు. అదే సమయంలో దర్గామిట్ట సీఐ రోశయ్య, కొందరు పొలీస్ సిబ్బంది అకారణంగా ప్రసన్నతోపాటు పార్టీ కేడర్‌పై లాఠీచార్జ్ చేసి నెట్టేశారు. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి చేతికి గాయమైంది. పోలీసులు నెట్టేయడంతో ఆయన కిందపడబోయారు. కార్యకర్తలు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.పోలీసుల తీరుతో ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మా అధినేత వైఎస్ జగన్ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా.. పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోండి.. అరెస్ట్ చేస్తారా.. చేయండి’ అంటూ రోడ్డుపై బైఠాయించారు. మధ్యాహ్నం 1.15 గంటల (వైఎస్ జగన్ అక్కడికి చేరుకునే వరకు) వరకు మండుటెండలో నడిరోడ్డుపైనే కూర్చున్నారు. పోలీసులు ఓ దశలో ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు వ్యాన్ తీసుకొచ్చారు. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని భావించి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. -
ఆర్టీసీ స్థలం ఇవ్వడం తప్పుకాదు: నారా లోకేశ్
సాక్షి, అమరావతి: పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోవడం వ్యర్థమని.. నేరుగా జీఓలే ఇచ్చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. సింగపూర్ పర్యటన అనంతరం గురువారం ఆయన ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. లులుకు ఆర్టీసీ స్థలం ఇవ్వడంలోగానీ.. అలాగే, 99 పైసలకే భూమి కేటాయింపు చేయడంలోగానీ తప్పులేదన్నారు. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్ధాంతం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. -
తహసీల్దార్.. మహిళా వీఆర్వో పరస్పర ఫిర్యాదులు
సాక్షి టాస్క్‌పోర్స్: మహిళా వీఆర్వో హనీట్రాప్‌లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్‌గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్‌గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్‌కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు. -
మీ ఇంటి ఆడపిల్లకు ఇలాగే న్యాయం చేస్తారా?: వరుదు కల్యాణి
చిలకలపూడి(మచిలీపట్నం): టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేస్తే మంత్రి కొల్లు రవీంద్ర రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీ ఇంటి ఆడపిల్లకు కూడా ఇలాగే న్యాయం చేస్తారా?’ అని మంత్రిని ఆమె ప్రశ్నించారు. మచిలీపటా్ననికి చెందిన ఓ యువతిని టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో గోవా తీసుకువెళ్లి మోసం చేసిన విషయం తెలిసిందే. తమ బిడ్డకు న్యాయం జరగదనే వేదనతో ఆ యువతి తల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను గురువారం వరుదు కల్యాణి పరామర్శించారు. అనంతరం వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ బాధితులను హైదరాబాద్‌కు మంత్రి పిలిపించుకుని రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. బాధిత యువతిని ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడనీయకుండా హోమ్‌లో నిర్బంధించడం దుర్మార్గమన్నారు. తాము ఏం చేసినా మంత్రులు, ఎమ్మెల్యేలు చూసుకుంటారనే ధైర్యంతో టీడీపీ మూకలు చెలరేగిపోతున్నాయని, ఇందుకు రాప్తాడు, రాజమండ్రి, తిరుపతి ఘటనలతోపాటు తాజాగా మచిలీపట్నం ఉదంతమే నిదర్శనమని మండిపడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, చిటికిన వెంకటేశ్వరమ్మ, పేర్ని కిట్టు పాల్గొన్నారు. మచిలీపట్నం టీడీపీ నేత కుమారుడిపై కేసుకోనేరు సెంటర్ (మచిలీపట్నం): ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతిని బలవంతంగా తీసుకువెళ్లిన టీడీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్‌పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. స్థానిక పీకేఎం కాలనీకి చెందిన యువతిని అభినవ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి గోవా తీసుకెళ్లి నాలుగు రోజులు గడిపాడు. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుమారుడిని కాపాడేందుకు సుబ్రహ్మణ్యం విశ్వప్రయత్నాలు చేశారు. యువతిని బెదిరించి వెనక్కితగ్గేలా చేసేందుకు ప్రయత్నించారు. అది ఫలించకపోవటంతో రెండేళ్ల తరువాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తానంటూ మాట మార్చారు. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమె సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, జనసేన నేతలను స్టేషన్‌కు పంపి పంచాయితీ పెట్టించి బెదిరించాలని చూశారు. పోలీసులనూ పావుగా వాడుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చేసేది లేక ఏకంగా స్టేషన్ బయటనే యువతి కుటుంబసభ్యులను మరింత బెదిరించేందుకు ప్రయత్నించారు. బిడ్డ జీవితం నాశనం అవుతుందని ఆందోళన చెందిన యువతి తల్లి స్టేషన్ ఎదుట పురుగుమందు తాగింది. వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలు, యువతి పక్షాన నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలు, యువతి స్టేట్మెంట్ మేరకు అభినవ్‌పై సెక్షన్లు మారుస్తూ చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిపై అభినవ్ గోవాలో లైంగికదాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అభినవ్‌పై పోలీసులు కేసు నమోదు చేయటం పట్ల మచిలీపట్నం కాపు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
పాలనలో విఫలం.. బాబులో భయం: వైఎస్ జగన్
నా పర్యటనలో ఎందుకిన్ని ఆంక్షలు పెట్టారని చంద్రబాబును, ఆయన అడుగులకు మడుగులొత్తే పోలీసులను అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా? అలా కలవడం తప్పా? ఎందుకు ఇంతగా ఆంక్షలు విధిస్తున్నారు? నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారొస్తే తప్పేమిటి? సందుల్లోంచి టూ వీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు. ఇంత అధ్వాన పరిస్థితిని సృష్టించిన ఘనత బహుశా ప్రపంచంలో ఒక్క చంద్రబాబునాయుడికి తప్ప మరే రాజకీయ నాయకుడికీ ఉండదేమో. తన పాలన చూసి తనే ఇంతగా భయపడుతున్నాడు. అందుకే ఈ నిర్బంధాలు, అక్రమ కేసులు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదు. -వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే తన పాలన చూసి తానే భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదన్నారు. ఎవరైనా బ్రహ్మాండమైన పాలన అందించి, ప్రజల మన్ననలు, ఆశీస్సులు పొందాల్సింది పోయి.. పాలన మొదలైనప్పటి నుంచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదని, పాలనంతా అబద్ధాలు మోసాలేనని నిప్పులు చెరిగారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేముందని, ఇన్ని ఆంక్షలేంటని నిలదీశారు. గురువారం ఆయన నెల్లూరు పర్యటనలో తొలుత అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారింట్లో జరిగిన దారుణ విధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు, అనేక ఘటనలు ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయన్నారు. ‘నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు బావిలో దూకాలి. ప్రతిపక్ష నాయకుడిని చూసేందుకు వస్తున్న ఆయన అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్లను తవ్విన చరిత్ర ఒక్క చంద్రబాబునాయుడికే దక్కుతుంది. ఈ రోజు 2 వేలకు పైగా పోలీసులు, లెక్కలేనంత మంది డీఎస్పీలను పెట్టారు. డీఐజీ కూడా ఇక్కడే తిష్ట వేశాడట. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు.. నా అభిమానులను ఆపడం కోసం వారంతా పని చేస్తున్నారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..గొంతు నొక్కేందుకే రెడ్‌బుక్ ⇒ వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. స్కూళ్లు నాశనం అయిపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఆరు క్వార్టర్ల విద్యా దీవెన పెండింగ్. ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. నాడు–నేడు ఆగిపోయింది. నాడు గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇచ్చాం. ఈ రోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. ⇒ మా ప్రభుత్వ హయాంలో ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ క్లాసులు పెడితే వాటిని ఎత్తేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెలకు రూ.300 కోట్లు కావాలి. దాదాపు రూ.4,200 కోట్లు బకాయి పెట్టాడు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదు. ⇒ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా లేదు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. వారికి రైతు భరోసా అందడం లేదు. దాన్ని చంద్రబాబు ఖూనీ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా వ్యవసాయం మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లూ మోసాలయ్యాయి. జగ¯Œ పథకాలన్నీ రద్దు చేయడంతో పేదలు అల్లాడుతున్నారు. ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక, వారు ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం.వైఎస్సార్సీపీ అభిమానులపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు.. కిందపడిపోయిన మహిళ వీటికేం చెబుతారు? ⇒ చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడారో చూడండి. నిన్నగాక మొన్న నగరిలో మాజీ మంత్రి రోజమ్మ గురించి మీ ఎమ్మెల్యే ఎంత హేయంగా మాట్లాడారు? ఎంత నీచంగా మాట్లాడారు? చెప్పడానికి సిగ్గు పడేలా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారు?⇒ మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కారుపై ఎంత దారుణంగా దాడి చేశారు? కారులో ఆమె, ఆమె భర్త ఉండగానే వారిని తిడుతూ దాడి చేయడాన్ని ఏమంటారు? కారు అద్దాలు పగలగొట్టారు. కర్రలతో దాడి చేసి, దుర్భాషలాడారు. అన్యాయంగా తిట్టారు. దానికి మీ డిక్షనరీలో అర్థం ఏమిటి? మా మాజీ మంత్రి రజినమ్మపై ఎంత దారుణంగా మాట్లాడారు? దానికి ఏం చెబుతారు?అంతులేని అవినీతి, ఎక్కడికక్కడ దోపిడీ ⇒ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. అంతటా లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలే అందులో ఉంటున్నారు. వారే అక్కడ లిక్కర్ మాఫియా బాస్‌గా ఉన్నారు. వేలం పాట పాడి మరీ బెల్టు షాప్‌లు కేటాయిస్తున్నారు. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లతో లిక్కర్ అమ్ముతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు.. ఇలా లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అంటూ పంచుకుంటున్నారు.⇒ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా, క్వార్ట్ ్జ యథేచ్చగా దోచుకుంటున్నారు. సిలికా ఓనర్లంతా కోర్టుకెళ్లారు. ఇక్కడ లోకల్ లీడర్ వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి) ద్వారానే సిలికా అమ్మాలంట! ఎవరికీ కూడా మైనింగ్ పర్మిట్ ఇవ్వడం లేదు. ఇందులో నారా లోకేశ్, చంద్రబాబుకు వీపీఆర్ లంచాలు పంపిస్తున్నాడు. ప్రతి మై¯Œన్లో కూడా ఎమ్మెల్యేను కలవాలి. కొంత పోలీసులకు ఇవ్వాలి. ⇒ ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే పేకాట క్లబ్‌లకే కోటి రూపాయలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఎమ్మెల్యేకు, పోలీసులకు డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే మనుషులను పంపించి పరిశ్రమల ఉత్పత్తి ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. ఇంకా విచ్చలవిడిగా భూములను పప్పు బెల్లాలకు అమ్మినట్లు.. ఏకంగా 30 ఏళ్లు, 40 ఏళ్లు కాంట్రాక్ట్ అంటూ రూపాయికే ఎకరం భూమి కట్టబెడుతున్నారు. మా హయాంలో యూనిట్ విద్యుత్‌ను రూ.2.47తో కొనుగోలు చేస్తే.. ఇదే మనుషులు నానా రచ్చ చేశారు. వీరేమో రూ.4.50తో కొనుగోలు చేస్తున్నారు. మీ విత్తనమే రేపు వృక్షం అవుతుంది.. ⇒ అయ్యా చంద్రబాబూ.. నీవు ఒక తప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపు పొద్దున వృక్షం అవుతుంది. నీవు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. మరో మూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు ఇదే చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తిన తప్పుడు అధికారులు.. ఎవరైతే అన్యాయాలు చేశారో, తప్పులు చేశారో అందరి లెక్కలు తీస్తాం. అందరినీ చట్టం ముందు నిలబెడతాం. మీరు విత్తిన విత్తనం మాదిరిగానే రెండింతలుగా మీకు రాబోయే రోజుల్లో జరుగుతుంది.⇒ ఇప్పటికైనా మేలుకోమని చెబుతున్నా. మీ నైజం, మీ వైఖరి మార్చుకోమని కోరుతున్నా. అలా చేయకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం కచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులొత్తే అధికారులందరికీ చెబుతున్నాను.⇒ కొంత మంది అధికారులు రిటైర్ అవుతాం.. లేదా వీఆర్ఎస్ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం. ప్రతి ఒక్కరినీ పిలిపించి, మీరు చేసిన ప్రతి పనికి సంబంధించి చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడతాయి.మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసన్న ఇంటిపై దాడి చేసి.. ఆయనపైనే కేసా?నా పక్కనే ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఎవరైనా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎదుటి వారు విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడూ చూస్తుంటాం. కానీ, గతంలో ఏనాడూ జరగని విధంగా, మనుషులను చంపడానికి ఏకంగా 80–100 మందిని ప్రసన్న ఇంటి మీదకు పంపించారు. వారంతా తప్ప తాగి రాడ్లతో, కర్రలు, మారణాయుధాలతో ఇంటిపై దాడి చేశారు. కారును తిప్పి పడేశారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి.. 83 ఏళ్ల మహిళనూ బెదిరించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే, ఆయన్ను చంపేసి ఉండేవారు. ఇంతగా దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.కాకాణిపై చిత్ర విచిత్ర కేసులు ⇒ నా పక్కనే గోవర్ధన్‌రెడ్డి కూతురు ఉంది. ఏం తప్పు చేశాడని గోవర్ధన్‌రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయనపై ఏకంగా 14 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెడుతున్నారు. ఆయన్ను 64 రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన మీద ఎంత అన్యాయమైన కేసులు పెట్టారో ఒక్కసారి చూడండి. ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆయన న్యూస్ ఐటెమ్ మీడియాలో వస్తే, దాన్ని వాట్సప్‌లో ఫార్వార్డ్ చేస్తే, అది కేసు.⇒ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెడితే, దానికి సంబంధించిన వీడియోను ఫార్వార్డ్ చేశాడని మరో కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పింది. కానీ ఉచితంగా ఎక్కడిస్తున్నారు? మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరో వైపు ఉచిత ఇసుక ఇవ్వడం లేదు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తే, దానికి గోవర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారని మరో కేసు పెట్టారు. ఎంత దారుణం?⇒ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శేషయ్య మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే, దాన్ని నిరసిస్తూ గోవర్ధన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడాడని కేసు పెట్టారు. ఇది ఎంత దారుణం? కావలి నియోజకవర్గం కోళ్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేస్తే, బాధితులను పరామర్శించి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టితే దానిపైనా కేసు పెట్టారు. ⇒ 2024 ఎన్నికల సమయంలో లిక్కర్ పంచారని కేసు పెట్టారు. నిజానికి అప్పుడు రాష్ట్రం ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంది. వారి ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. అప్పుడు పెట్టిన కేసుకు సంబంధించి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్‌షీట్ కూడా వేశారు. ఏడాది తర్వాత తప్పుడు వాంగ్మూలాలతో మళ్లీ చార్జ్షీట్లోకి వెళ్లి, గోవర్ధన్‌రెడ్డిని ఇరికిస్తున్నారు. ఎంత దారుణం? ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?⇒ అక్రమంగా క్వార్ట్ ్జతవ్వకాలు జరిపారని కేసు పెట్టారు. ఆయన ఒక మంత్రిగా పని చేశారు. ఆ కేసులో పస లేదని కోర్టు నిర్ధారించి, ఆ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి ముందస్తు బెయిల్ ఇచ్చారు. అలాంటి కేసులో గోవర్ధన్‌రెడ్డి ఏ–4. కానీ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే.. అందులో ఇక్కడ తాటిపర్తి అనే గ్రామంలో ఎలాంటి క్వారీ తవ్వకాలు గత నాలుగేళ్లుగా జరగడం లేదని వీఆర్వో సిద్ధం పుల్లయ్య చెప్పాడని ఆ రిపోర్టులో రాశారు. దీంతో ఆ కేసులో పస లేదని, ఏకంగా మైనింగ్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. చంద్రబాబునాయుడిలో శాడిజమ్ అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.⇒ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనే ఎంపీ.. ఆయనకు తెలియకుండా ఎవరో ఫోర్జరీ సంతకాలు పెట్టి, చట్టవిరుద్ధంగా మైనింగ్ చేశాడని మా ప్రభుత్వ హయాంలోనే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ చేశాం. ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తి చవ్వా చంద్రబాబునాయుడు. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి. కానీ ఆయన మీద కేసు పెట్టకుండా, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. అప్పుడు మేము పెట్టిన కేసుకు సంబం«ధించి, మీరు వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, చవ్వా చంద్రబాబునాయుడిపై కేసు పెట్టకుండా, ఆయన సాక్ష్యంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద కేసు పెట్టడం ఏమిటి? ఎంత దారుణం?⇒ గోవర్ధన్‌రెడ్డి అన్న ఇల్లు రూ.100 కోట్ల రాజ భవనం అని తప్పుడు ఆరోపణలు చేశారు. మరి అదే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టులో ఆ ఇంటి విలువ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇలాంటివి మొత్తం 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు పెడుతున్నారు.మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను కూడా పంపించి ఇప్పుడు మీరు చేస్తున్న మాదిరిగా దాడి చేయించే కార్యక్రమం మొదలు పెడితే రేప్పొద్దున రాజ్యాంగం బతుకుతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా? చంద్రబాబూ.. నీవు చేస్తున్న పనులకు, నీవు వేస్తున్న బీజాలకు సిగ్గుతో తల దించుకోవాలి. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటు వైపు, అటు వైపు స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు. అవి నచ్చకపోతే, ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అత్యంత హేయం. వైఎస్సార్సీపీ నాయకులపై కేసుల పర్వం ⇒ ఇన్ని జరుగుతున్నా ప్రజల తరఫున ఏ గొంతూ వినిపించకూడదని ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపించారు. ఎంపీగా పని చేసిన దళిత నేత నందిగం సురేష్‌ను 190 రోజులు జైల్లో పెట్టారు. మంత్రిగా పని చేసిన బీసీ నాయకుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను జైలుకు పంపించారు. వల్లభనేని వంశీని ఒక కేసు అయిన తర్వాత మరో కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు.⇒ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాడని చెప్పి, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపించాడు. చిన్నప్పుడు జరిగిన ఘటనను గుర్తు పెట్టుకొని ఎంత శాడిస్ట్‌గా వ్యవహరించాడో గమనించాలి. ఇన్నేళ్ల తర్వాత పెద్దిరెడ్డన్న కొడుకును జైల్లో పెట్టించాడంటే ఈ మనిషిలో విషం, రాక్షసత్వం ఎంతగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన తప్పు ఏంటో తెలియదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యే కావడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా జైల్లో పెట్టించారు. ఇదే చంద్రబాబు 1983లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17 వేల మెజారిటీతో ఓడిపోయారు. మళ్లీ 1989లో మామ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరి కుప్పం నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి తన చేతుల్లో నుంచి జారిపోయిందని భాస్కర్‌ను వేధించడం మొదలు పెట్టాడు. చివరకు భాస్కర్ కొడుకు మొన్ననే లండన్ నుంచి వచ్చాడు. ఆ పిల్లోడిపై కూడా కేసు పెట్టాడు.⇒ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పేర్ని నాని భార్యపై కూడా కేసులు పెట్టి చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్‌ను కూడా దొంగ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే.. ఆ కేసుల్లో దొంగ స్టేట్మెంట్లు తీసుకున్నారని సాక్షి.. జడ్జి ముందు చెప్పాడంటే ఎంత దారుణంగా దొంగ కేసులు పెడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.⇒ మరో బీసీ నాయకుడు జోగి రమేష్, మా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డిని కూడా వదలడం లేదు. వేధిస్తున్నారు. మా పార్టీ మరో సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు విక్రాంత్రెడ్డినీ వదలడం లేదు. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్, మరో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, అబ్బయ్య చౌదరి, గోరంట్ల మాధవ్, సుధీర్, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పాల రాము, మొండితోక అరుణ్, ఇలా నాయకులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టారు. ఇవి కాకుండా తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారినీ వదలకుండా వేల కేసులు పెట్టి వేధిస్తున్నారు. ధైర్యంగా ఉండండి..సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ములాఖత్ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. సుమారు అరగంట పాటు కాకాణితో ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే 14 అక్రమ కేసులు నమోదు చేసిన విషయంపై చర్చించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని కాకాణికి సూచించారు. జగన్ వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు ఉన్నారు. అనంతరం సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి జగన్ చేరుకున్నారు. మీకు మరో కొడుకుగా నేనున్నా.. ‘అధికార కూటమి నేతల దాడులకు భయపడాల్సిన పని లేదు. మీకు మరో కొడుకు లాగా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ జగన్.. ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా పలకరించారు. టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసంపై, ఆనాటి పరిస్థితులను ప్రసన్నను, ఆయన తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారు ఆ రోజు జరిగిన ఘటనను పూసగుచ్చినట్లు వివరించడంతో వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. కేవలం విమర్శలను తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన రౌడీలు ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికం అన్నారు. విధ్వంసం జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. రానున్న రోజుల్లో తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని ప్రసన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. -
'నకిలీ మద్యం' చెన్నై To విశాఖ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : 1000 ఎంఎల్.. ఫుల్ బాటిల్.. అంటే మద్యం ప్రియులకు పండగే. అందులోనూ డిఫెన్స్ బాటిల్ అంటే ఎంత ధర అయినా కొనుగోలు చేద్దామనే ఆలోచన!. ఇంట్లో పార్టీ ఉన్నా.. పండగ ఉన్నా... ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే డిఫెన్స్ బాటిల్ ఇచ్చి ఖుషీ చేద్దామనుకుంటారు.. సరిగ్గా దీన్నే పక్కాగా క్యాష్ చేసుకుంటోంది విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంకు చెందిన వెంకటేష్ పిళ్లై టీం. చెన్నైలోని బర్మాకాలనీకి చెందిన ఓ టీం ఖరీదైన బ్రాండ్ మద్యం ఖాళీ సీసాలను సేకరించి.. అందులో మాములు బ్రాండ్ మద్యాన్ని నింపి.. ఖరీదైన మద్యంగా సరఫరా చేస్తోంది. వీరితో సంబంధాలు నెరుపుకుంటూ అక్కడ నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటూ విశాఖలో డిఫెన్స్ మద్యం పేరుతో విక్రయించి భారీగా దండుకుంటోంది వెంకటేష్ పిళ్లై బృందం. చెన్నై నుంచి ట్రావెల్స్ ద్వారా ఈ మద్యాన్ని తరలిస్తుండడం విశేషం. లావాదేవీలన్నీ ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిర్వహిస్తుండటం గమనార్హం. ఇందులో ఇప్పటికే చెన్నైకు చెందిన ముగ్గురిలో ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ పిళ్లైను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. లోతుగా విచారించేందుకు నేటి నుంచి వెంకటేష్ పిళ్లైను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బాటిలింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేసుకొని.. చెన్నైలోని బర్మా కాలనీకి చెందిన ముఠా సభ్యులు పలు ప్రాంతాల నుంచి ఖరీదైన బ్రాండ్ మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ప్రీమియం బ్రాండ్ ఖాళీ సీసాలను అక్కడకు తరలిస్తున్నారు. అనంతరం పాండిచ్చేరి నుంచి తక్కువ ధరకు లభించే మద్యాన్ని (సాధారణ ఇతర బ్రాండ్లు) తీసుకొచ్చి ఈ ఖాళీ సీసాల్లో నింపేస్తున్నారు. ఇందుకోసం బాటిలింగ్ యూనిట్‌ను అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆర్డర్లకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన వెంకటేష్ పిళ్లై.. ఈ ముఠాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఈ మద్యాన్ని ఇక్కడకు తరలిస్తున్నారు. అయితే వెంకటేష్ పిళ్లై గత 20 సంవత్సరాలుగా అక్కయ్యపాలెంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. అంతేకాకుండా అక్కడి నుంచి నకిలీ మద్యాన్ని తెచ్చిన తర్వాత.. కొన్నింటిలో నీటిని కూడా నింపి యథావిధిగా సీల్ వేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు కోయంబత్తూరు నుంచి విశాఖకు 20 ఏళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ పిళ్లై మొదటి నుంచీ ఈ నకిలీ మద్యం సరఫరాలో ఆరితేరారు. గతంలోనూ ఇతనిపై పలుసార్లు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు చెందిన ఇషాక్, మహమ్మద్ నిస్సార్ అహమ్మద్‌తో పాటు మహమ్మద్ సాధిక్ భాష ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఈ వ్యాపారం చేసే వారితో సంబంధాలు పెట్టుకుని.. చెన్నైలోని బర్మా కాలనీకి చెందిన తమకే విక్రయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఖరీదైన మద్యం పేరుతో నింపిన బాటిల్స్‌ను తమకు వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా ట్రావెల్స్ ద్వారా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్డర్లకు అనుగుణంగా తమకు రావాల్సిన మొత్తాన్ని ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రూ.వెయ్యి తగ్గించామని కలరింగ్ ఇస్తూ.. 1000 ఎంఎల్ బాటిల్‌ను రూ.500కే తయారుచేస్తున్న ఈ ముఠా రూ.4 వేలు చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా బయట మార్కెట్లో రూ.5 వేల విలువ చేసే బాటిల్‌ను రూ.4 వేలకే విక్రయిస్తున్నామంటూ నకిలీ మద్యాన్ని ఖరీదైన మద్యంగా అంటగడుతున్నారు. బయటి మార్కెట్ కంటే రూ.వెయ్యి ధర తగ్గడమే కాకుండా.. అంత సులువుగా దొరకని డిఫెన్స్ మద్యం తమకు వస్తోందని భావిస్తున్న కొందరు వెంకటేష్ పిళ్లై నుంచి ఆర్డర్లు పెట్టి మరీ తీసుకుంటుండటం గమనార్హం. తాజాగా అక్కయ్యపాలెంలో పట్టుబడిన ఈ మద్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపగా.. ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పదార్థాలు కూడా ఇందులో కలిసి ఉన్నట్టు ల్యాబ్ నివేదికలో తేలింది. ఇందులో పాండిచ్చేరి మద్యంతో పాటు ఇంకా ఏమైనా రసాయనాలు కలుపుతున్నారా? అనేది కూడా తేలాల్సి ఉంది. -
వాటిని తెరిస్తే తంటాలే..!
సోంపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి వారం రోజుల కిందట ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్. ఏపీకే అనే లింకు వాట్సాప్ ద్వారా వచ్చింది. దీంతో క్లిక్ చేసి అన్ని లాంఛనాలు పూర్తి చేసి లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాక ఓటీపీ అడగడం, ఓటీపీ ఎంటర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తన ఫోన్ సిమ్ పనిచేయకపోవడం.. కొన్ని గంటల్లోనే తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము మాయమవ్వడం చకచకా జరిగిపోయాయి. దాదాపు రూ.7లక్షలు పోయినట్లు తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. కాశీబుగ్గకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ఇదే లింకుపై క్లిక్ చేశాడు. అంతే పై మాదిరిగానే సైబర్ కేటుగాళ్లు రూ.10 లక్షలకు పైగా తన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును లాగేసుకున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే.. శ్రీకాకుళం జిల్లాను దాదాపు నెల రోజులుగా వణికిస్తున్న లింకు ఇది. బండిపై ఎంత చలానా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ యాప్‌లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారో.. ఇక అంతే.. ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే గత 20 రోజుల్లో దాదాపు 12 కేసులు దీనిపైనే నమోదయ్యాయి. పైగా దీని బాధితులంతా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం. మోసపోతున్నారిలా.. » ముందుగా ‘ఆర్టీఓ టిఆర్ఏఎఫ్ఎఫ్ఐసి సిహెచ్ఏఎల్ఎల్ఏఎన్.ఎపికె’ ఫైల్ మెసేజ్ లింక్ రూపంలో వస్తుంది. » మనం క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని వస్తుంది. అయ్యాక వెంటనే ఓటీపీ అడుగుతుంది. » ఓటీపీ ఎంటర్ చేశామా ఇక అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల మెసేజ్ ఇన్‌బాక్స్‌లో మన ఫోన్ నంబర్ చేరుతుంది. » వెంటనే మన ఫోన్ నంబర్ ఉన్న సిమ్‌ను అదే నంబర్‌తో ఎలక్ట్రానిక్ సిమ్గా మార్చుతారు. » మన ఫోన్‌పై ఉన్న స్క్రీన్ వారి ఆ«దీనంలోకి వెళ్లిపోతుంది. » మన ఫోన్ పనిచేయక తికమక పడుతున్న ఆ క్షణాల్లోనే సిమ్ అప్డేట్ అవ్వాలంటే మన మెయిల్ అడ్రస్ యాడ్ చేయాలని అందులో వస్తుంది. » మనం మెయిల్ అడ్రస్ యాడ్ చేసిన వెంటనే సిమ్ ఛేంజెస్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఐదు, పదినిమిషాల్లో ఓ క్యూఆర్‌కోడ్ రావడం.. మన ఫోన్ నంబర్‌తో ఉన్న సిమ్‌కార్డు సైబర్ నేరస్తుడి మొబైల్ నుంచి యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. » వెంటనే సైబర్ నేరగాడు ఎమ్.ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి మన ఫోన్ నంబరే కావడంతో వచ్చే ఓటీపీలను ఎంటర్ చేసి బయోయెట్రిక్ లాక్ చేసేస్తాడు. దాంతో మనం సిమ్ కొనాలని షాపులకు వెళ్లినా.. ఆధార్ అవసరంతో బ్యాంకు, రిజి్రస్టేషన్, ఇతర ఏ పనుల్లో మనం బయెమెట్రిక్కు థంబ్ వేయాలని అనుకున్నా అది లాక్ చేయడంతో కుదరదు. ఇక మనకు సిమ్ దొరకదు. » ఈ లోగా సైబర్ నేరగాడు మన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌తో ఇంటర్నెట్ త్రూ డెబిట్ కార్డ్ లోన్స్, లోన్ యాప్స్, పేయింగ్ యాప్స్ (ఫ్లిప్‌కా ర్ట్, అమెజాన్, మీషో, పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే) తదితర మార్గాల్లో వస్తువులు కొనేయ డం,డబ్బులు మాయంచేసి మన బ్యాంకు ఖాతా లను కొల్లగొట్టేయడమే కాక రూ.లక్షల్లో లోన్లు వాడేసి మనకు రుణ భారాన్ని మిగుల్చుతారు. » ఇదే తరహాలో సోంపేట ఉపాధ్యాయునికి జరగడం, చాలా రోజుల వరకు తన నంబర్ ఉన్న సిమ్ రాకపోవడంతో తన వేలి ముద్రలు పనిచేయడం లేదని పాత (మాన్యువల్) పద్ధతిలోనే సిమ్‌ను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటువంటి మోసాలు అత్యధికంగా కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురంలోనే జరిగాయని, చేసే సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులకే బురిడీసైబర్ మోసాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసుల్ని సైతం ఇదే తరహా లింక్‌తో సైబర్‌కేటుగాళ్లు మోసం చేశారు. జిల్లాలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్ఐలకు ఈ అనుభవం ఎదురైంది. జేబులు కూడా ఖాళీ అయినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గానే తీసుకుంది.ఎం.పరివాహన్ యాప్‌లోనే కట్టాలి.. వాహన దారులు సామాజిక మాధ్యమాల్లో ఇలా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. జిల్లా పోలీసు కార్యాలయం ఆదీనంలో ఉండే ఈ–చలానా యాప్ అనేది ట్రాఫిక్ పోలీసులకు, ఆ పరిధి పోలీస్‌స్టేషన్‌లో ఉండే పోలీసుల మొబైళ్లకు అనుసంధానంగా ఉంటుంది. ప్లేస్టోర్‌లో దొరకదు. సాధారణ ప్రజల వద్ద ఉండదు. దాని ద్వారా పోలీసులు ఫైన్లు వేశాక మీసేవలో గాని సొంత మొబైల్ ఫోన్లో గాని ఎం.పరివాహన్ యాప్ ద్వారానే కట్టాలి. ఎం.పరివాహన్ యాప్ అనేది ప్లేస్టోర్‌లో ఉంటుంది. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్ -
విద్యార్థులకు రవాణా చార్జీలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం ప్రకారం ఇంటినుంచి దూరంగా ఉన్న బడులకు వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపినట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ తెలిపారు. పాఠశాలలు లేని ఆవాసాలు, కొండ ప్రాంతాలు, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి ప్రాథమిక, ఉన్నత, మాధ్యమిక స్థాయి పిల్లలకు రవాణా భత్యం చెల్లింపునకు మార్గదర్శకాలను సర్వశిక్ష రాష్ట్ర విభాగం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీఈ చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి ఒక కి.మీ. పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, 5 కి.మీ. పరిధిలో ఉన్నత పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ పరిధి దాటి విద్యార్థులు బడికి వెళ్లాల్సి వస్తే రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మోడల్ విద్యావిధానం పేరుతో పలు ప్రభుత్వ స్కూళ్లను, తరగతులను మరో పాఠశాలలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 79,860 మంది విద్యార్థులు ఆ పరిధి దాటి బడులకు వెళుతున్నట్టు సమగ్ర శిక్ష అధికారులు గుర్తించారు. ఇందులో 41,697 మంది ఎలిమెంటరీ, 38,163 సెకండరీ స్కూళ్ల విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యారి్థకి నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రూ.6 వేలు చెల్లించనున్నారు. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ రూ.47.91 కోట్ల బడ్జెట్ ఆమోదించింది. ఈ మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే వర్తిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ స్పష్టం చేశారు. క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్ సంబంధిత విద్యార్థుల వివరాలను లీప్ యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. -
అడ్డుకోలేని ఆంక్షలు.. ఇనుప కంచెలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనలో పార్టీ శ్రేణులను, అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఊరూరా ఆంక్షలు, పెద్ద సంఖ్యలో చెక్‌పోస్టులు, అడుగడుగునా బారికేడ్లు, ముళ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు తుదకు రహదారులను తవ్వి.. ధ్వంసం చేసినా ప్రభుత్వ పెద్దల లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇవేవీ కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలను అడ్డుకోలేకపోయాయి. జగన్‌ను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొందరు నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి ప్రభుత్వ పెద్దలను మెప్పించే ప్రయత్నాలు చేశారు. ఇంత చేసినా ఊహించని స్థాయిలో జనం రావడంతో నెల్లూరు నగరం జన సునామీగా మారింది. వైఎస్ జగన్ గురువారం నాటి పర్యటనకు 110 మందికి మించి పాల్గొన కూడదంటూ ఆంక్షలు విధించిన ఇన్చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల నుంచి 2వేల∙మందికిపైగా పోలీసులను మోహరించారు. పర్యటనకు ఎవరూ రాకూడదంటూ, వస్తే కేసులు నమోదు చేస్తామంటూ నిర్బంధాలకు తెర లేపారు. అర్ధరాత్రి, అపరాత్రి తేడాలేకుండా వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు సైతం హెచ్చరికలు చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నెల్లూరు సరిహద్దుల్లో పదుల సంఖ్యలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, బయట ప్రాంతాల నుంచి ఎవరూ నగరంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రోడ్లపైకి వచ్చి తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజలు పనుల నిమిత్తం నెల్లూరు నగరానికి వెళుతున్నామని చెప్పినప్పటికీ వినకుండా బలవంతంగా వెనక్కి పంపారు. ఇనుప కంచెలతో బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులను తవ్వేశారు. చెముడుగుంటలోని హెలిప్యాడ్ వద్ద నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. డీటీసీకి వెళ్లే రహదారిలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆ ప్రాంతం వారు ఎవరూ ఇల్లు విడిచి బయటకు రాకుండా నిర్బంధించారు. కర్ఫ్యూ వాతావరణంకేంద్ర కారాగారం చుట్టూ బారికేడ్లు పెట్టారు. దానికి ముందు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అనుకూల మీడియా మినహా ఇతరులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు వెళుతున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరుల పట్ల కూడా పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. నెల్లూరు నగరం అంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. విధుల్లో ఉన్న పోలీసులంతా వైఎస్ జగన్ భద్రత కోసం కాకుండా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు జగన్ వద్దకు వెళ్లకుండా నిలువరించడానికే పని చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ సమీపంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించి భయానక వాతావరణం కల్పించారు. నెల్లూరు నగరంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సిద్దిఖ్, 42వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మస్తాన్, కుక్కలగుంటకు చెందిన ఆవుల నాగేంద్రను చిన్నబజారు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.పలువురికి సెక్షన్ 170 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ తుదకు వైఎస్ జగన్ కేంద్ర కారాగారానికి వచ్చే సమయానికి వేల మంది అభిమానులు అక్కడికి చేరుకుని జై జగన్... అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి జగన్ పర్యటన ముగిసే వరకు కనుచూపు మేర జనం పోటెత్తారు. ఆంక్షలను లెక్క చేయక జగన్ పర్యటనలో పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు.