video
-
భీమిలిలో దారుణం.. బాలిక వీడియో చిత్రీకరించి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలిలో దారుణం జరిగింది. బాలిక న్యూడ్ వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కామాంధుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. బాలిక దుస్తులు మార్చుకుంటుండగా గాజువాకకు చెందిన సమీప బంధువు జానకిరామ్ (53).. నగ్న వీడియోలు తీసి తల్లిని బెదిరించాడు. కుమార్తె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసిన జానకిరామ్.. వివాహిత నుండి పలుమార్లు లక్షల్లో వసూలు చేశాడు. దీంతో భీమిలి పోలీసులను బాధిత మహిళ ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.చిట్టివలసలో తల్లి, కూతురు ఆత్మహత్యమరో ఘటనలో భీమిలిజోన్ చిట్టివలసలో తల్లి, ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి, ఒక కుమార్తె మృతి చెందారు. భర్త రామకృష్ణ దివీస్ ఉద్యోగి. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరి పిల్లలకు పురుగుల మందు తాగించిన తల్లి.. తాను తాగింది. తల్లి మాధవి(25), కూతురు రితిక్ష (2) మృతి చెందారు. మరో కుమార్తె ఇషిత (5) హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. -
ఇజ్రాయెల్ టీనేజర్ బందీ వీడియో...విడుదల చేసిన హమాస్
జెరూసలేం: ఏడాదికి పైగా బందీగా ఉన్న 19 ఏళ్ల ఇజ్రాయెల్ సైనికురాలి వీడియోను హమాస్ విడుదల చేసింది. మూడున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అల్బాగ్ హిబ్రూ భాషలో మాట్లాడారు. తనను 450 రోజులకు పైగా నిర్బంధించారని, ఇజ్రాయెల్తనను, ఇతర బందీలను మరిచిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన వయసు 19 ఏళ్లని, కానీ ఇప్పుడు జీవితం మొత్తం తన కళ్లముందుందని చెప్పారు. వీడియో తమ గుండెను ముక్కలు చేసిందని అల్బాగ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. కూతురు వీడియో చూసిన అనంతరం వారు ఓ వీడియో ప్రకటన చేశారు. తమ కూతురు తీవ్ర మానసిక క్షోభను అనుభవించినట్లు కనిపిస్తోందన్నారు. ఆమె క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు విజ్ఞప్తి చేశారు. బందీల కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అల్బాగ్ కుటుంబ ప్రకటనపై ప్రధాని స్పందించారు. బం«దీలను స్వదేశానికి రప్పించేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. బందీలకు హాని తలపెట్టే సాహసం చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుటుంబం అనుమతితో... సాధారణంగా కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా హమాస్ విడుదల చేసే బందీల ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ మీడియా ప్రచురించదు. వీడియోను విడుదల చేయడానికి అల్ బాగ్ కుటుంబం తొలుత నిరాకరించినా.. తరువాత అంగీకరించింది. బందీల ఫొటోలు, వీడియోలను హమాస్ ప్రచురించడాన్ని ఇజ్రాయెల్ గతంలో ఖండించింది. "Liri, if you're hearing us, tell the others that all the families are moving heaven and earth. We will fight until all hostages are returned"Eli and Shira Albag , Liri Albag's Parents, called the Prime Minister and Defense Minister, after watching her video from captivity,… pic.twitter.com/Y9xAh47W7O— Bring Them Home Now (@bringhomenow) January 4, 2025హమాస్ చెరలో 96 మంది.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి సమయంలో 250 మందిని బందీలుగా గాజాకు తరలించారు. వారిలో కొందరిని రక్షించారు. 34 మంది మరణించారు. ప్రస్తుతం హమాస్ చెరలో 96 మంది మిగిలారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)లో నిఘా సైనికురాలిగా ఉన్న లిరీ అల్బాగ్ను గాజా సరిహద్దులోని నహల్ ఓజ్ సైనిక స్థావరంలో ఉండగా హమాస్ ఉగ్రవాదులు పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సైతం బంధించారు. వీరిలో ఒకరిని రక్షించగా, మరొకరు హత్యకు గురయ్యారు. అల్బాగ్తోపాటు నలుగురు బందీలుగా మిగిలారు. చర్చల నేపథ్యంలో వీడియో.. ఖతార్‌లో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కాల్పుల విరమణ చర్చలు పునఃప్రారంభమయ్యాయి. చర్చల్లో మధ్యవర్తులుగా ఖతార్, ఈజిప్‌్ట, అమెరికాలు ఉన్నాయి. ఒప్పందం కోసం నెలల తరబడిగా చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. తాజాగా శుక్రవారం నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో హమాస్ లిరీ వీడియోను విడుదల చేసింది. ఇదీ చదవండి: గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు -
ఎంటర్టైన్మెంట్ ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్: ప్రభాస్
డ్రగ్స్ నిర్మూలనకు టాలీవుడ్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తన స్వరం కలిపారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. లైఫ్‌లో మనకు బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయని ప్రభాస్ అన్నారు. మనల్ని ప్రేమించే వారు, మనకోసం బతికే మనవాళ్లు ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? అని ప్రభాస్ ప్రశ్నించారు. సే నో టూ డ్రగ్స్ అంటూ అభిమానులను, సినీ ప్రియులను ప్రభాస్ కోరారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 8712671111 నెంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్తుకు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీడియోలో ప్రభాస్ మాట్లాడారు. -
పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియో
సూపర్ స్టార్ 'రజనీ కాంత్' రోబో సినిమా వచ్చిన తరువాత.. బహుశా రోబోలు ఇలాగే ఉంటాయేమో అని చాలామంది భావించారు. అయితే ఇటీవల టెస్లా రూపొందించిన నడిచే రోబోకు సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు చైనా కంపెనీ ఏకంగా పరుగెత్తే రోబోను తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.చైనీస్ కంపెనీ ‘రోబో ఎరా’ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ‘స్టార్1’ పేరుతో రూపొందించిన ఈ రోబో శరవేగంగా పరుగులు తీయగలదు. ఇది గంటకు 8 మైళ్లు (12.98 కి.మీ.) వేగంతో పరుగెడుతోంది. ఈ రోబోకు హైటార్క్ మోటార్లు, ఏఐ సెన్సార్లు అమర్చడం వల్ల.. ఇది ఎలాంటి ఎగుడు దిగుడు దారుల్లోనైనా అదే వేగంతో పరుగెతూనే దాటేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు‘రోబో ఎరా’ చూడటానికి సగటు మనిషి పరిమాణంలోనే 5.6 అడుగుల ఎత్తు, 64.86 కేజీల బరువుతో ఉంటుంది. ఇలాంటి పరుగుల రోబోలను ‘టెస్లా’ కంపెనీ ‘ఆప్టిమస్’ పేరుతోను, ‘బోస్టన్ డైనమిక్స్’ కంపెనీ ‘అట్లాస్’ పేరుతోను రూపొందించాయి. అయితే, ‘రోబో ఎరా’ తాజాగా రూపొందించిన ‘స్టార్ 1’ వాటి కంటే వేగంగా పరుగులు తీయగలగడంతో, అత్యంత వేగవంతమైన రోబోగా రికార్డు సాధించింది. -
Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు చూశారా?
-
26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా జరిగింది!
ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఓ పాత వీడియోను షేర్ చేశారు. ఇందులో ఇంటర్నెట్ అనేది.. మీడియాలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని పేర్కొన్నారు. 1998లో చెప్పిన ఆ మాటలే నేడు నిజమయ్యాయి.26 సంవత్సరాల క్రితం 1998లో 'మస్క్'ను ఒక ఇంటర్వ్యూయర్ ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ''ఇంటర్నెట్ అన్ని మీడియాల సూపర్‌సెట్ అని నేను భావిస్తున్నాను" అని మస్క్ పేర్కొంటూ.. మీడియాకు ఇంధనం ఇంటర్నెట్ అని వివరించారు.ఇంటర్నెట్.. వినియోగదారులు తాము చూడాలనుకుంటున్న వాటిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇది తప్పకుండా సాంప్రదాయ మీడియాలను విప్లవాత్మకంగా మారుస్తుందని మస్క్ స్పష్టం చేశారు. అప్పుడు నేను చెప్పిన మాటలకు చాలామంది నన్ను వెర్రివాడిగా భావించారని మస్క్ లేటెస్ట్ ట్వీట్లో పేర్కొన్నారు.స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ఇలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించాలని లక్ష్యంతో స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ప్రారభించారు. అపరిమిత డేటా మాత్రమే కాకుండా.. రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సర్వీస్ అందించడమే దీని లక్ష్యం. భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఇది రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా మారుతుంది.ఇదీ చదవండి: తండ్రి బిలియనీర్.. భార్య మిస్ ఇండియా.. అతడెవరో తెలుసా?ఏఐపై మస్క్ వ్యాఖ్యలుఇంటర్నెట్ గురించి మాత్రమే కాకుండా కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా మస్క్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందని అంచనా వేశారు. భవిష్యత్తులో బహుశా ఎవరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చని అన్నారు. ఏఐ, రోబోలు ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు.. సేవలను అందజేస్తాయని ఆయన విశ్వసించారు.The crazy thing is that they thought I was crazy for stating this super obvious predictionpic.twitter.com/OK0akTRj3E— Elon Musk (@elonmusk) December 10, 2024 -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ.. వీడియో షేర్ చేసిన చెర్రీ!
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. మేకర్స్ వరుస అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించారు.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ పంచుకున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్రబృందంతో షూటింగ్లో పాల్గొన్న క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవలే 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పించగా.. టీజర్‌కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.#Gamechanger #JaanaHairaanSa @shankarshanmugh @advani_kiara @BoscoMartis @DOP_Tirru @MusicThaman @AalimHakim @ManishMalhotra pic.twitter.com/Ei3mMAgPHF— Ram Charan (@AlwaysRamCharan) December 10, 2024 -
అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్‌కు యువతి రీల్..
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్‌కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024 -
‘ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం.. మమ్మల్ని కాపాడండి’
టెల్అవీవ్: ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కిరావడం ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ యువకుడు ఎడాన్ అలెగ్జాండర్ వీడియోను హమాస్ తాజాగా విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ విడుదలకు ప్రయత్నించాలని బందీగా ఉన్న యువకుడు వీడియోలో ఏడుస్తూ మొర పెట్టుకున్నారు. తామంతా ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా,ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే హమాస్ మిలిటరీ విభాగం అల్ కస్సామ్ బ్రిగేడ్ ఈ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. Well, atleast he looks healthy an clean. Idan Alexander, held hostage because of Netanyahu #Israel pic.twitter.com/J42O2yGsRg— Steven Markussen (@DALAX) November 30, 2024ఈ వీడియోపై ఎడాన్ తల్లి యేల్ స్పందించారు. తన కుమారుడి వీడియో తనను కలవరపరిచిందని, హమాస్ వద్ద ఉన్న బందీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది తెలియజేస్తోందన్నారు. ఈ వీడియోపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు కార్యాలయం స్పందించింది. ఇలాంటి హమాస్ వ్యూహాలు ఇజ్రాయెల్ లక్ష్యాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. హమాస్ వద్ద ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకొస్తామని తెలిపింది. గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని తమతోపాటు పాలస్తీనాలోని గాజాకు తీసుకెళ్లింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 43వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
థ్యాంక్స్ గివింగ్ : వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పెషల్ మీల్
అంతరిక్షంలో థాంక్స్ గివింగ్ జరుపుకునేందుకు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక మీల్‌తో థ్యాంక్స్ గివింగ్ సందర్భాన్ని జరుపుకోనున్నారు. ఈ మేరకు బుధవారం సునీతా విలియమ్స్ సందేశంతో కూడిన ఒక వీడియోను నాసా విడుదల చేసింది.“ఇక్కడ ఉన్న మా సిబ్బంది భూమిపై ఉన్న మా స్నేహితులు,కుటుంబ సభ్యులందరికీ అలాగే మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ హ్యాపీ థాంక్స్ గివింగ్ చెప్పాలనుకుంటున్నారు” అని విలియమ్స్ తన వీడియో సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నాసా తమకు బటర్నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డినెస్ (చేపలు), స్మోక్డ్ టర్కీ(బేక్చేసిన చికెన్) వంటి ఆహార పదార్థాలను అందించిందని వ్యోమగాములు పంచుకున్నారు. ప్రతీ ఏడాది నవంబరు నాలుగో గురువారం అమెరికాలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు."We have much to be thankful for."From the @Space_Station, our crew of @NASA_Astronauts share their #Thanksgiving greetings—and show off the menu for their holiday meal. pic.twitter.com/j8YUVy6Lzf— NASA (@NASA) November 27, 2024 కాగా 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్‌లైనర్ రాకెట్‌లోని ప్రొపల్షన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబరులో దీపావళిని కూడా అంతరిక్షంలోనే జరుపుకున్నారు సునీత. వారిద్దరినీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకువచ్చేందుకు నాసా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
'ఇటు రావే నా గాజు బొమ్మ'.. ఆ పాటతో తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక!
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలుస వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన మరో వీడియోను అలేఖ్య తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. 'ఇటు రావే నా గాజు బొమ్మ' అనే సాంగ్‌ను ఈ వీడియోకు జతచేశారు. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలోని ఈ పాట తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమను తెలిపేలా ఉంది. తన కూతురి కోసం ఒక తండ్రి పడే తపనను ఈ ఒక్క పాటలో చూపించారు. తన ముద్దుల కూతురిని తలచుకుని అలేఖ్య ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కుమార్తెను ముద్దాడింది.తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.తారకరత్న జర్నీకాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
హమాస్ చీఫ్ బంకర్ చూస్తే షాక్ అవాల్సిందే.. భారీగా డబ్బు..
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఉన్న ఈ బంకర్లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి సిన్వార్ సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్లోనే కొన్నిరోజులు గడిపినట్లు తెలుసోంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్‌ను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో సిన్వార్ మృతి చెందారు.Hamas' eliminated leader Yahya Sinwar was hiding in this underground tunnel months ago:Surrounded by UNRWA bags of humanitarian aid, weapons and millions of dollars in cash.He hid like a coward underground, using the civilians of Gaza as human shields. pic.twitter.com/0ylVjTCv7H— Israel ישראל (@Israel) October 20, 2024 ‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్‌లో వీడియోను విడుదల చేసింది.Hamas leader Yahya Sinwar’s wife reportedly spotted with $32,000 Birkin bag as she went into hiding https://t.co/Dwqf0h7nTQ pic.twitter.com/JHZ5eMrYiZ— New York Post (@nypost) October 20, 2024 ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.చదవండి: అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. -
HYD: మియాపూర్‌లో చిరుత.. భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్: అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం(అక్టోబర్ 18)మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరతు సంచరించింది. స్థానికుల సమాచారంతో చిరుత సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చిరుత కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న వీడియోను స్థానికులు ఫోన్లో బందించారు. -
దసరా పండుగ ఉత్సవాల్లో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం
సాక్షి,సూర్యాపేట : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం, బేతవోలులో జరిగిన దసరా ఉత్సవాల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన కానిస్టేబుల్ వీరకుమార్ ఆలయంలో మాజీ సర్పంచ్ నాగయ్యను కాలితో తన్ని దాడికి దిగాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లుపై కూడా దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడే ఉన్న కోదాడ పట్టణ సీఐ రాము ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశాడు.మాజీ సర్పంచ్ నాగయ్య ఆలయం భయట మూత్ర విసర్జన చేస్తుండగా.. కొందరు వీడియోలు తీసి వాట్సప్‌లో షేర్ చేయడంతో గొడవ తలెత్తింది. ఇదికాస్తా ఘర్షణకు దారితీయడంతో నలుగురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ ఏఆర్ కానిస్టేబుల్ వీరకుమార్పై చిలుకూరు పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్సై రజితారెడ్డి తెలిపారు -
రతన్ టాటా మళ్లీ బతికొస్తే..!
రతన టాటాను ఒక పారిశ్రామికవేత్తగా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా, అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం కాంక్షించిన వ్యక్తిగా అందరూ గుర్తుంచుకుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి మనందరికీ దూరమయ్యారు. ఆయన మళ్లీ బతికొస్తే బావుండు అని అనుకోనివారుండరు.అలా భావించిన ఒక వ్యక్తి రతన్ టాటాపై ఏఐ సహాయంతో ఓ అద్భుతమైన వీడియో రూపొందించారు. తన సారథ్యంలోని టాటా గ్రూపు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో దేశ ప్రజల శ్రేయస్సు గురించే రతన్ టాటా ఆలోచించేవారు. అలా ఆయన అభివృద్ధి చేసిన పలు వ్యాపారాలను గుర్తు చేస్తున్నట్టుగా రతన్ టాటా ఈ వీడియోలో కనిపించారు.రతన్ టాటా దూరమయ్యారని దేశమంతా బాధాతప్తులైన వేళ టాటా మళ్లీ బతికొచ్చి ‘చింతించకండి.. నేను లేకపోయినా నా జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి‘ అని అంటున్న విధంగా రూపొందించిన ఈ ఏఐ వీడియో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.Best use of ‘AI’ ❤️ pic.twitter.com/FLreHPZr0I— Yash Gowda (@yash_gowdaa) October 11, 2024 -
ఇది మెట్రోనా లేక నవరాత్రుల మండపమా?
కోల్‌కతా: ప్రతీయేటా నవరాత్రులలో కోల్‌కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో తొలుత అండర్ వాటర్ మెట్రో లోపల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత అద్భుత దృశ్యం కనిపిస్తుంది. నిజానికి ఇది మెట్రో కాదు. నీటి అడుగున మెట్రో థీమ్‌తో రూపొందించిన దుర్గాపూజా మండపం. వీడియో చివరిలో దుర్గమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . పలువురు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను చూసినవారంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో @ChapraZila అనే పేజీ నుండి పోస్ట్ అయ్యింది. దాని క్యాప్షన్‌గా 'కోల్‌కతాలోని మెట్రో మార్గంలో నిర్మించిన దుర్గామాత మండపం’ అని రాసివుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 36 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. कोलकाता में मेट्रो की तर्ज पर बना मां दुर्गा का पंडाल 👏❤️ pic.twitter.com/YFYb3D2xAF— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 8, 2024ఇది కూడా చదవండి: బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు -
గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూత
సీతాపూర్: దేశంలో దేవీనవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రుల వేళ విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి జాగరణలో కార్యక్రమంలో పాల్గొన్న ఒక యూట్యూబర్ ఆనందంగా నృత్యం చేస్తూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రి కార్యక్రమాలను చిత్రీకరించేందుకు వచ్చిన వికాస్ అనే యూట్యూబర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వికాస్ కుప్పకూలగానే అక్కడ ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. వికాస్ స్నేహితులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, గుండెపోటుతో మృతిచెందాడని ధృవీకరించారు. వికాస్ మృతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో వికాస్ హఠాత్తుగా కిందపడిపోవడం, తరువాత అతని స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించడం కనిపిస్తుంది. వికాస్ షార్ట్ వీడియోలు తీస్తూ ఫేమస్ అయ్యాడు. ఫాలోవర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దుర్గా జాగృతి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్నేహితులతో పాటు వచ్చిన వికాస్ డీజే ట్యూన్స్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అక్కడే కుప్పుకూలిపోయాడు. వెంటనే అతని స్నేహితులు అతనిని దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వికాస్ చనిపోయినట్లు నిర్ధారించారు. వికాస్ మృతిపై పోలీసులకు తెలియజేయకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు -
కాంగ్రెస్ మహిళా నేతకు వేధింపులు.. వీడియోతో బయటపెట్టిన బీజేపీ
కాంగ్రెస్‌ను మహిళ వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. అందరూ చూస్తుండగానే స్టేజ్ మీ ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్‌పై. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది కాషాయపార్టీ. హర్యానా కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, ఇతర నేతల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని మండిపడింది.ఇంతకీ ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ నేత దీపిందర్ సింగ్, ఇతర నేతలు ఉన్న వేదికపై ఉన్నప్పుడే ఓ మహిళ వేధింపులు ఎదుర్కొన్నట్లు కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా దీపేందర్ హుడా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇలాంటి వారి అసభ్య ప్రవర్తన కారణంగా ఎంతోమంది మహిళా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారని ఆరోపించారు. చాలా అవమానకరమైన వీడియో బయటపడింది. కొన్ని దృశ్యాలు సిగ్గుపడేలా ఉన్నాయి. ఇది మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని కాగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా ధృవీకరించారు. పట్టపగలు, దీపేందర్ హుడా సమక్షంలో వేదికపై ఒక మహిళా నేతకు పార్టీకి చెందిన వ్యక్తి నుంచే వేధింపులు ఎదురయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలకు భద్రత లేకపోతే.. ఇక రాష్ట్రంలోని మహిళలు ఎలా భద్రంగా ఉంటారు?.. ఇది మహిళా వ్యతిరేక పార్టీ. ఈ హుడా మద్దతుదారులపై ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు.Most shocking 😮 A woman congress leader was molested in stage in presence of Deependra Hooda by congress leaders Confirmed by news reports and even Kumari Selja If women are not safe in Congress meetings in full public view during the daytime - can they be safe if Congress… pic.twitter.com/yIw46gl91t— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) October 5, 2024మరోవైపు మహిళలు, పేదలు, దళితులను గౌరవించకపోవడం కాంగ్రెస్ సంస్కృతి, డీఎన్ఏలో ఉందనంటూ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ సైనీ విమర్శించారు. ఈ విషయంలో మాకు ఫిర్యాదు వస్తే.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టద్దని చెప్పారు.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జా సైతం ఈ ఘటనను ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘బాధితురాలితో నేను మాట్లాడాను. తనపై వేధింపులు జరిగాయని ఆమె తెలిపింది. రాజకీయాల్లో ఎదిగేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తోన్న ఓ మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం తీవ్రంగా ఖండించదగినది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మెట్రోలో వర్షం.. కంగుతిన్న ప్రయాణికులు
ముంబై: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం పలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.ప్రయాణీకులతో నిండిన ముంబై మెట్రోలోని ఒక కోచ్‌లో అకస్మాత్తుగా వర్షం పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.కోచ్‌లో ఉన్న ఏసీ వెంట్ నుంచి అకస్మాత్తుగా నీరు బయటకు రావడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ దృశ్యాన్ని అక్కడున్న పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వైరల్ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ఇదే రేంజ్లో ముంబై మెట్రో వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన కొందరు.. ‘మెట్రోలో ప్రయాణించేందుకు వారు టికెట్ తీసుకున్నారని, అయితే ఇప్పుడు వారంతా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నట్లుందని కామెంట్ చేశారు. ఈ ఘటనపై కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా, మరికొందరు మెట్రో పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. మెట్రో యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు యూజర్లు కోరుతున్నారు. Life in a metro ❌Rain in a metro ✅#Mumbai #MumbaiRain pic.twitter.com/B2m90FsbuW— Miss Ordinaari (@shivangisahu05) September 24, 2024ఇది కూడా చదవండి: నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు -
న్యూస్ చదువుతుండగా లెబనాన్ జర్నలిస్ట్‌పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి
బీరూట్ : లెబనాన్ దేశంలో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఈ దాడితో రెండ్రోజుల వ్యవధిలో సుమారు 550 మందికి పైగా మరణించారని, 1,800 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేక కథనాల్ని ప్రసారం చేస్తున్నారనే నెపంతో లెబనాన్ టీవీ ఛానెల్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడి చేసింది.ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా దళాల మధ్య వైమానిక దాడులపై మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ న్యూస్ రూమ్‌లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్‌పై అప్పటికే సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ.. న్యూస్ రూమ్‌లో న్యూస్ ప్రసారం చేస్తున్న మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ ఎడిటర్–ఇన్–చీఫ్ జర్నలిస్ట్ ఫాది బౌడియాపై రాకెట్ దాడి చేసింది. ఫాది బౌడియా ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన వెనుక నుంచి రాకెట్ దూసుకొచ్చింది. ఈ దాడిలో బౌడియాకు తీవ్ర గాయాలయ్యాయి. ఫుటేజీలో, బౌడియా పేలుడు తీవ్రతతో అరుస్తూ.. హాహాకారాలు వ్యక్తం చేస్తూ ప్రాణ భయంతో భీతిల్లిపోయారు. ఏమి జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. పేలుడు కారణంగా అతనికి గాయాలైనట్లు నివేదికలు ధృవీకరించాయి.A video shows journalist Fadi Boudiya being thrown off balance while he was live on air in Lebanon. Boudiya is the editor-in-chief of Miraya International Network and has reportedly been injured in the attack.Video Credit: @eye.on.palestine#thecurrent #lebanon pic.twitter.com/YdHQNoyxk9— The Current (@TheCurrentPK) September 24, 2024చదవండి : హిబ్జుల్లా కమాండర్ హతం -
నిద్రలో నడుస్తూ అడవిలోకి...!
అమెరికాలో లూసియానా రాష్ట్రంలోని వెబ్‌స్టర్ పారిస్‌కు చెందిన ఓ పాపకు నిద్రలో నడిచే అలవాటుంది. శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న బాలిక మరునాడు ఉదయం ఇంట్లో కనిపించలేదు. నిద్రలో నడుస్తూ కాస్త దూరం ఎటైనా వెళ్లిందేమోనని తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో మర్నాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి చుక్కపక్కల సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టారు. కనీసం బూట్లు లేకుండా బాలిక సమీపంలోని అడవుల్లోకి నడిచి వెళ్తూ ఓ కెమెరాకు చిక్కింది. వెంటనే గాలింపు చేపట్టారు. చిన్నారి నడిచి వెళ్లిన ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ట్రాకింగ్ డాగ్స్, డ్రోన్లతో పాటు చివరికి హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. విషయం తెలిసి వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెదుకులాటకు దిగారు. పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. చివరకు రాత్రి 11 గంటల వేళ రోడ్డుకు సమీపంలో అడవిలో చిన్నారిని ఓ డ్రోన్ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కనిపెట్టింది. అప్పటికి ఒక రోజు గడిచినా చిన్నారి ఇంకా గాఢనిద్రలోనే ఉండటం విశేషం! పోలీసులు, తల్లిదండ్రుల పిలుపులతో ఉలిక్కిపడి లేచింది. నెమ్మదిగా ఏడుపందుకుంది. తల్లిదండ్రులు ఊరడించడంతో మెల్లిగా తేరుకుంది. ఈ దృశ్యాలు అందరినీ కదిలించాయి. ‘అడవిలో, వణికించే చలిలో ఆ చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతూ దొరికిన క్షణాలు హృదయాలను కదిలించాయి. సాంకేతిక పరిజ్ఞానం ఇలా సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడటం నిజంగా బాగుంది’ అంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు. -
తిరగలి పట్టిన మాజీ సీఎం రబ్రీదేవి
పట్నా: బీహార్‌లో ఆసక్తికర రాజకీయాలు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జేడీ నేత లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తన తల్లి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రబ్రీదేవి సాధారణ బీహారీ మహిళగా కనిపిస్తున్నారు. గోధుమలను తిరగలి పడుతూ, వాటిని జల్లెడ పడుతూ, శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తేజస్వి యాదవ్ ‘జీవితాన్ని నడిపించేది తల్లి.. ఆశ, నమ్మకం, ప్రేమలకు ప్రతిబింబం తల్లి’ అని రాశారు.ఈ వీడియోను చూసిన రవి ఆనంద్ అనే యూజర్.. ‘కుటుంబం, అధికారం రెండింటినీ ఎలా నడపవచ్చో ప్రపంచానికి చాటిచెప్పిన తల్లి ఆమె’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు బీహార్ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ఏకకాలంలో చూపించారని’ రాశారు. जीवन का संबल है माँ! जीवन का आस-विश्वास, सार-प्यार, प्रतिमान और आर्शीवचन है माँ! #motherslove #mothers #trending pic.twitter.com/j7fYUwfvOE— Tejashwi Yadav (@yadavtejashwi) September 22, 2024ఇది కూడా చదవండి: ‘అహ్మద్‌కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్‌పై పోలీసులకు ఫిర్యాదు -
మహిళా పీఈటీ అకృత్యం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటలకు పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థినులు మీడియాకు తమగోడు వెళ్లబోసుకుంటూ.. ఐదేళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతోందన్నా రు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్రూమ్లలో స్నానం చేస్తుండగా ప్రార్థన సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారని ఆగ్రహంతో బాత్రూమ్ల తలుపులు పగులగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్లో వీడియో తీయడంతోపాటు కర్ర తో చితకబాదారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూ రల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేయగా.. బాలికలు మరోసారి పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు. రంగంలోకి కలెక్టర్.. పీఈటీ సస్పెన్షన్ గిరిజన బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌తో మాట్లాడి అప్పటికప్పుడు పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. పీఈటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ పద్మను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పీఈటీ జ్యోత్స్నపై కేసు నమోదైంది. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయమై హెచ్ఎంను వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని విద్యార్థినులు తన దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. -
‘రాహుల్ గాంధీ.. మీకూ మీ నాన్నమ్మ గతే పడుతుంది’
న్యూఢిల్లీ: సిక్కులకు సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. భారతదేశంలో సిక్కులకు మత స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో బీజేపీలోని సిక్కు నేతలు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఈ నేపద్యంలో కాంగ్రెస్ తాజాగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వకు చెందిన వీడియోను షేర్ చేసింది. దానిలో తర్విందర్.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఎదురైన విధి రాహుల్‌కు కూడా ఎదురవుతుందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ వీడియోను షేర్ చేస్తూ, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీని కోరింది.. అలాగే.. ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, తర్విందర్ సింగ్ మార్వా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘రాహుల్ గాంధీ.. ఆగండి.. లేకపోతే భవిష్యత్తులో మీ నాన్నమ్మకు పట్టిన గతే మీకూ పడుతుందని’ అన్నారని, ఈ బీజేపీ నేత బహిరంగంగా చంపేస్తానని బెదిరించారని, మీ పార్టీలోని ద్వేషం కారణంగానే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయని’ ప్రధాని మోదీకి కాంగ్రెస్ విన్నవించింది. కాగా అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘భారత్‌లోని సిక్కులు.. తమకు తలపాగా, కంకణం ధరించడానికి అనుమతి ఉంటుందో ఉండదోననే ఆందోళనలో ఉన్నారు. ఇది ఒక సిక్కులకే కాదు, అన్ని మతాల ప్రజలకు సంబంధించినది’ అని వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా రెండేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. 2022 జూలైలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. दिल्ली BJP का नेता और पूर्व विधायक, तरविंदर सिंह मारवाह ने आज प्रदर्शन के दौरान कहा: “राहुल गांधी बाज आ जा, नहीं तो आने वाले टाइम में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ”BJP का ये नेता खुलेआम देश के नेता प्रतिपक्ष की हत्या की धमकी दे रहा है.@narendramodi जी, अपने… pic.twitter.com/tGisA5dfNu— Congress (@INCIndia) September 11, 2024ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రచారానికి వాల్మీకి స్కామ్ డబ్బు -
గెలిపిస్తే టిక్‌టాక్‌ను కాపాడుతా: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘టిక్‌టాక్’ను కాపాడుతానని అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్‌టాక్‌కు తాను రక్షకుడిని అవుతానని ఉద్ఘాటించారు. టిక్‌టాక్ కావాలని కోరుకునేవారంతా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అమెరికాలో తన ప్రత్యర్థి వర్గం టిక్‌టాక్‌ను మూసివేయడానికి కుట్ర పన్నుతోందని పరోక్షంగా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆరోపణలు గుప్పించారు. టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయిండానికి దాని మాతృ సంస్థపై ఒత్తిడి పెంచేలా లేదా అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేలా జో బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ బిల్లుపై సంతకం చేసింది. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో టిక్‌టాక్‌పై నిషేధం విధించడం గమనార్హం.