వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘టిక్‌టాక్’ను కాపాడుతానని అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్‌టాక్‌కు తాను రక్షకుడిని అవుతానని ఉద్ఘాటించారు. టిక్‌టాక్ కావాలని కోరుకునేవారంతా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
అమెరికాలో తన ప్రత్యర్థి వర్గం టిక్‌టాక్‌ను మూసివేయడానికి కుట్ర పన్నుతోందని పరోక్షంగా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆరోపణలు గుప్పించారు. టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయిండానికి దాని మాతృ సంస్థపై ఒత్తిడి పెంచేలా లేదా అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేలా జో బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ బిల్లుపై సంతకం చేసింది. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో టిక్‌టాక్‌పై నిషేధం విధించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment