Hollywood
-
హకునా.. మటాటా... మరో నెలరోజులే అంటోన్న మహేశ్ బాబు!
ది లయన్ కింగ్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ముఫాసా. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ లయన్ కింగ్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. అయితే సూపర్ హిట్ అయిన చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించారు. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీ తెలుగు ఫైనల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో హకునా.. మటాటా..ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించింది. Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024 -
మనుషులను తినే వైరస్.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
టైటిల్: అపోకాలిప్స్ జెడ్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్డైరెక్టర్: కార్లెస్ టోరెన్స్విడుదల తే:దీ 05 అక్టోబర్ 2024ఓటీటీ: అమెజాన్ ప్రైమ్నిడివి: 119 నిమిషాలుఇప్పుడంతా ఓటీటీల హవానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెరెకెక్కించిన చిత్రాలు సైతం మన ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నాం. ఈ డిజిటల్ యుగంలో మనకు నచ్చిన సినిమాను వీలైన టైమ్‌లో చూసే అవకాశం ఉంది. కంటెంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ని రకాల జోనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన భయపెట్టే జాంబీ యాక్షన్ థ్రిల్లర్ అపోకలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. స్పానిష్‌లో తెరకెక్కించిన మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.స్పానిష్ ప్రజలు ఓ మహమ్మారి వైరస్ బారిన పడతారు. ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. దీంతో ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, నగరాలను వదిలిపారిపోతారు. ఇంతకీ ఆ వైరస్ ఏంటి? అలా తప్పిపోయిన తన ఫ్యామిలీని కలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసమే అసలు కథ.ఇలాంటి జాంబీ యాక్షన్ చిత్రాలు గతంలోనూ చాలా వచ్చాయి. కాకపోతే ఈ మూవీ కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా కథనం సాగుతుంది. అంతుచిక్కని వైరస్ బారిన పడినవారు.. కనపడిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ సైతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి హెచ్చరికలు జారీచేస్తుంది. అలా వాటిని పట్టించుకోకుండా బయటికెళ్లిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో అతనితో పాటు పిల్లి కూడా ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే యాక్షన్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. హారర్, యాక్షన్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ ట్రై చేయొచ్చు. కాకపోతే కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్‌తో చూసేయాల్సిందే. -
OTT: ‘ల్యాండ్ ఆఫ్ బ్యాడ్’ మూవీ రివ్యూ
సైనికుడి ప్రయాణం ప్రతి మలుపూ ప్రమాదభరితం అన్న లైన్ తో ముడిపడున్న సినిమా ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. అప్పట్లో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యోధుడు గ్లాడియేటర్. ఆ గ్లాడియేటర్ పాత్రధారి రస్సెల్ క్రోవ్ నటించిన సినిమా ఈ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. ఈ సినిమాని దర్శకులు విలియమ్ యూబ్యాంక్ రూపొందించారు. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ సినిమా ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా లభ్యమవుతుంది.ఇక సినిమా కథ విషయానికొస్తే యూఎస్ డెల్టా ఫోర్స్ ఓ పెద్ద ఆపరేషన్ చేపడుతుంది. సౌత్ ఫిలిప్పీన్స్ లో తీవ్రవాదులచే బందీగా వున్న సిఐఎ సిబ్బందిని రక్షించడం ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ఈ ఆపరేషన్ కు స్టాఫ్ సార్జెంట్ నియా బ్రాన్సన్ సారధ్యంలో ఓ టీం వెళుతుంది. ఆఖరి నిమిషంలో ఈ టీం కు కొత్తగా యంగ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసరైన కెన్నీ జాయిన్ అవుతాడు. ఈ కెన్నీయే మన సినిమాకు కథానాయకుడు. కెన్నీ పాత్రలో వర్ధమాన నటుడు లియామ్ హెమ్స్ వర్త్ నటించారు.ఇక పోతే ఈ టీం కు రీపర్ గ్రిమ్ డ్రోన్ సపోర్ట్ గా వ్యవహరిస్తాడు. ఈ రీపర్ కథలో మరో ముఖ్య పాత్రధారి. రీపర్ పాత్రలో ప్రముఖ నటుడు రస్సెల్ క్రోవ్ నటించి మెప్పించాడు. నాడు గ్లాడియేటర్ గా నేడు రీపర్ గా రస్సెల్ క్రోవ్ నటన నభూతో నభవిష్యతి. యూఎస్ డెల్టా ఫోర్స్ టీం ఫిలిప్పీన్స్ ఆపరేషన్ కోసం బయలుదేరడంతో ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ కథ మొదలవుతుంది. టీం లో కెన్నీ కొత్తవాడవడం ఆ పై ఇది మొదటి ఆపరేషన్ అవడంతో టీం లోని మిగతావారు అతనిని ఆట పట్టిస్తుంటారు.జాగ్రత్తగా వ్యవహరించమని సలహాలిస్తుంటారు. ఈ ఆపరేషన్ లో భాగంగా టీంలోని మిగతా సభ్యులందరూ ఓ సమయంలో గాయపడతారు. ఆపరేషన్ కొత్త అయినా, ఎవరూ తోడు లేకున్నా కెన్నీ తనకున్న ధైర్యంతో రీపర్ సాయంతో ఆపరేషన్ ఎలా ముగించాడన్నదే ఈ సినిమా కథ. సాధారణంగా టెర్రరిస్ట్ ఎలిమినేషన్ ఆపరేషన్ అంటే గన్ ఫైట్ తప్ప ఇంకేమీ వుండదని అనుకుంటాం. కానీ సున్నితమైన సెంటిమెంటల్ లైన్ తో చక్కటి గ్రప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా చూసే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. వర్త్ టూ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. - ఇంటూరు హరికృష్ణ -
వాస్తవ ఘటనతో ఆఫ్టర్ మాత్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఆఫ్టర్ మాత్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో తరచూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ సంఘటనల్లో కొన్ని మాత్రం మనల్ని అనునిత్యం వెంటాడుతుంటాయి. ఆ సంఘటనకు, మనకు సంబంధం లేకపోయినా వాటి బాధితుల బాధను మనమూ అనుభవిస్తాం. కొంతమంది ఆ బాధను అలా భరిస్తూనే ఉంటారు, మరికొంతమంది ఇంకోలా వ్యక్తపరుస్తూ ఉంటారు. అలా 2004లో జరిగిన ఓ వాస్తవ ఘటనకు సినిమా రూపమిచ్చారు హాలీవుడ్ దర్శకుడు ఎలియట్ లెస్టర్. 2004లో ఓ రష్యా ఆర్కిటెక్ తన కుటుంబాన్ని ఘోర విమాన ప్రమాదంలో ΄పోగొట్టుకున్నాడు.దానికి ప్రతిగా ఎయిర్ లైన్ ట్రాఫిక్ సిబ్బందిని హత్య చేశాడు. ఈ ఘటన ఆధారంగా ‘ఆఫ్టర్ మాత్’ సినిమా తీశారు. ఈ సినిమా కథపరంగా రోమన్ ఓ కన్స్ట్రక్షన్ వర్కర్. ఫ్లైట్‌లో వస్తున్న తన కుటుంబాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ ΄కోర్టుకి బయలుదేరడంతో ప్రారంభం అవుతుంది సినిమా. ఎయిర్ ΄కోర్టులో అడుగుపెట్టగానే తన భార్య, కూతురు విమాన ప్రమాదంలో మరణించారని రోమన్‌కి తెలుస్తుంది. దాంతో అతను కుంగిపోతాడు. అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయం తెలుసుకునే క్రమంలో ఆ ప్రమాదం వెనక ఉన్నది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జేక్ బనోస్ అనే విషయం రోమన్‌కి తెలుస్తుంది.ఎలాగైనా సరే రోమన్ జేక్ బనోస్ని కలవాలని ప్రయత్నిస్తాడు. జేక్‌ని కలిశాక రోమన్ ఏం చేశాడన్నదే ‘ఆఫ్టర్ మాత్’ సినిమా. ఈ సినిమా ఓ ఎమోషనల్ రోలర్ కోస్టర్. తన కుటుంబం మొత్తాన్ని ΄పోగొట్టుకుని దానికి కారణమైన వారి మీద పోరాటమన్నది అంత చిన్న విషయం కాదు. ఎన్నో భావావేశాలతో కూడుకున్న చిత్రం ఇది. ముఖ్యంగా రోమన్ ΄పాత్రలో ఓ విశిష్ట నటుడు మనకు కనిపిస్తాడు. దాదాపు రెండు తరాల నుండి హాలీవుడ్ యాక్షన్ రారాజుగా పిలవబడే ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ రోమన్ పాత్రను చేశారు. ఆర్నాల్డ్ ఆ పాత్రను చేశారనే కన్నా జీవించారని చెప్పవచ్చు. సినిమా మొత్తం కాస్త స్లోగా ఉన్నా సినిమా అయిపోయాక కొన్ని గంటలు మనం రోమన్ పాత్రతోనే ప్రయాణం చేస్తాం. ‘లయన్స్ గేట్’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎమోష నల్ రోలర్ కోస్టర్‌ని చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
Mufasa: The Lion King Trailer: లయన్ కింగ్ ఒక్కటే ఉండాలి!
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది డిసెంబరు 20న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ తెలుగు ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.కాగా తాజాగా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఇంగ్లీష్ ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ‘‘ఈ కథ స్కార్ అనే ప్రిన్స్‌కి, ఓ అనాథ అయిన ముఫాసాకి చెందినది. వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఓ కొత్త సామ్రాజ్యం కోసం ఓ ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు, నా పేరు ముఫాసా, లయన్ కింగ్ అనేది ఒక్కటే ఉండాలి, మనల్ని ట్రాప్ చేశారు.. ఇప్పుడు ఏం చేయాలి’’ అంటూ అర్థం వచ్చే ఇంగ్లీష్ డైలాగ్స్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా ఇంగ్లీష్ ట్రైలర్లో ఉన్నాయి.ఇక ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమాలోని ప్రధాన పాత్రధారులు అయిన ముఫాసాకు హాలీవుడ్ నటుడు అరోన్ పియర్, టాకా (ఈ పాత్ర ఆ తర్వాత స్కార్గా మారుతుంది)కు కెల్విన్ హరిసన్ జూనియర్ వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. ఇక ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్ లో ముఫాసా పాత్రకు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. -
OTT: యానిమేటెడ్ సిరీస్ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ
మామూలు మూవీస్ లో సూపర్ కారెక్టర్స్ చెయ్యాలంటే చాలా ఖర్చు, కష్టం తో కూడుకున్న పని. కాని అదే యానిమేటడ్ కారెక్టర్స్ అయితే అంత ఖర్చు, కష్టం రెండూ ఉండవు. అంతేనా ఇప్పటి జెనరేషన్ కి బాగా నచ్చుతుంది కూడా. అందుకేనేమో రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కి డిమాండ్ & మార్కెట్ రెండూ ఎక్కువే. కాబట్టే ఒక్కో కారెక్టర్ సీరిస్ రూపేణా బోలెడన్ని పార్ట్స్ లో వస్తున్నాయి. అదే రేంజ్ లో ఇటీవల రిలీజ్ అయిన సినిమా డిస్పెకబుల్ మి 4. జియో సినిమా ఓటిటి వేదికగా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ లభ్యమవుతోంది. డిస్పెకబుల్ సీరిస్ లో ఇది 5వ సినిమా. క్రిస్ రేనాడ్ దర్శకత్వం వహించిన సినిమా అనుకున్నట్టుగానే సూపర్ రివ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ ఫాలో అవుతున్నవాళ్ళకి దీనిలో కారెక్టర్స్ తో పాటు కథ కూడా సులువుగా అర్ధమవుతుంది. దీనిలో మెయిన్ కారెక్టర్ గ్రూ. ఇక గ్రూతో పాటు ఫిల్, రోన్ మరియు రఫ్ అనే మీనియన్స్. ఈ డిస్పెకబుల్ మి 4 కథాంశానికొస్తే గ్రూ కి ఒక కొత్త ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. కాని ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గర బానే వుంటాడు కాని గ్రూకి మాత్రం విసుగు పుట్టిస్తుంటాడు. కాని గ్రూ కి ఆ బాబంటే ఎంతో ఇష్టం. మరో పక్క తన ఎనిమీ అయిన మాక్స్ మీ లీమాల్ జైలు నుండి తప్పించుకుని గ్రూ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన గ్రూ ఫ్యామిలీ సేఫ్ హౌస్ కి వెళుతుంది. ఇక అక్కడ నుండి గ్రూ మాక్స్ మీ లీమాల్ ను ఎలా ఎదుర్కుంటుందన్నదే మిగతా సినిమా. పైన చెప్పుకున్నట్టు రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కథను మరో లెవల్ కు తీసుకువెళతాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మీనియన్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సినిమా బ్యానర్ నేమ్ నుండే ఆ అల్లరి ప్రారంభమవుతుంది. గ్రూ చేసే సాహస విన్యాసాలు, మాక్సిమల్ క్రియేట్ చేసిన ఎక్సట్రార్డినరీ వెహికల్ సూపర్ గా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఈ వీకెండ్ కు మస్ట్ వాచ్ బుల్ మూవీ డిస్పెకబుల్ మి 4. జీయో సినిమా వేదికగా ఉంది చూసేయండి. - ఇంటూరు హరికృష్ణ. -
హాలీవుడ్ మూవీ ‘డోన్ట్ మూవ్’ రివ్యూ
ప్రేక్షకులు సినిమాని చూస్తారు. కాని అదే దర్శకుడు సినిమాని సృష్టిస్తాడు. ఇక్కడ దర్శకుడు తన సృష్టి తో పాటు ఆ సినిమాని మానసికంగా అనుభూతి పొందుతాడు. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ అమెరికన్ థ్రిల్లర్ డోన్ట్ మూవ్. ఆడమ్ బ్రియో తో కలిసి రూపొందించిన ఈ సినిమా కాన్సెప్ట్ మిమ్మల్ని కన్నార్పనివ్వదు. డేవిడ్ వైట్ అందించిన కథకు వీరిరువురు ప్రాణం పోయగా, లీడ్ రోల్ లో ఐరిస్ పాత్రలో నటించిన కెల్సీ ఈ చిత్రానికి ఊపిరూదింది. సినిమా మొత్తం మనకు కెల్సీ కనిపించదు. ఐరిస్ మాత్రమే మన కళ్ళముందు కదలాడుతుంది. ఈ సినిమా లో పెద్ద కథాంశం లేదు కాని తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం అదరహో అని చెప్పవచ్చు. ఐరిస్ హైకింగ్ లో తన కొడుకును పోగొట్టుకున్న బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడి నుండే సినిమా ప్రారంభమవుతుంది. అప్పుడే అక్కడ తనని తాను రిచర్డ్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి ఐరిస్ మీద ఓ ఇంజెక్షన్ తో దాడి చేస్తాడు. ఆ ఇంజెక్షన్ వల్ల 20 నిమిషాలలో శరీరంలోని ఒక్కో అవయవం పని చేయకుండా పోతుందని రిచర్డ్ చెప్పి ఐరిస్ ని బందీగా చేసుకుని తనతో పాటు కారు లో తీసుకువెళుతుంటాడు. ఇంజెక్షన్ వల్ల ఒక్క కళ్ళు తప్ప ఎటూ కదలలేని ఐరిస్ రిచర్డ్ బారి నుండి తప్పించుకోలిగిందా లేదా అన్నది మాత్రం డోన్ట్ మూవ్ సినిమాలోనే చూడాలి. ఒక్కసారి ఆలోచించండి మన శరీరంలో ఏ కాలో, చెయ్యో ఇబ్బంది కలిగితేనే తట్టుకోలేము అలాంటిది దాదాపుగా అన్ని అవయవాలు పని చేయడం మానేసి ఓ నరరూప రాక్షసుడి చేతిలో బందీ అవడం అంటే అంతకన్నా దారుణం ఏముంటుంది. పైన చెప్పినట్టు దర్శకులు ఈ సినిమాని ఎలా సృష్టించారో అర్ధమవదు కాని వారి ఆలోచనా పటిమకు మాత్రం ప్రేక్షకులుగా మనం హాట్సాఫ్ చెప్పి తీరాలి. ఈ సినిమా మనం చూస్తున్నంతసేపు కదలలేము, వదలలేము ఎందుకంటే ఈ సినిమా పేరు డోన్ట్ మూవ్ కాబట్టి. ఎ మస్ట్ వాచ్ థ్రిల్లర్.-ఇంటూరు హరికృష్ణ -
OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రాఫిక్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వెకేషన్ అంటే ఆనందంగా... సరదాగా అందరితో గడిపే కాన్సెప్ట్. కానీ అదే వెకేషన్ ఊహకందని, ఊహించలేని నైట్ మేర్ అయితే... ఈ లైన్‌ను ఆధారంగా చేసుకునే హాలీవుడ్ దర్శకుడు డీన్ టేలర్ ‘ట్రాఫిక్’ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుంది. ఇది పెద్దల సినిమా. ΄ûలా పాట్టన్, ఒమర్ ఆప్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు లీడ్ రోల్స్‌లో నటించారు.ఇక సినిమా కథ ప్రకారం... బ్రీ కాలిఫోర్నియాలోని ఓ దినపత్రికలో పని చేసే జర్నలిస్ట్. తాను రాసే కథనాలు సరిగ్గా పత్రికలో రావడం లేదని తపన పడుతూ ఉంటుంది. ఈ దశలో బ్రీ తన ప్రియుడు జాన్‌తో కలిసి అతని స్నేహితుడి డారెన్ గెస్ట్ హౌస్‌కి వెకేషన్‌కి వెళతారు. ఈ వెకేషన్ లొకేషన్ శాక్రిమెంటోలోని కొండ లోయల ప్రాంతంలో దూరంగా ఉంటుంది. ఈ వెకేషన్‌కి వెళ్లే సమయంలో బ్రీ, జాన్‌కు ఓ గ్యాస్ స్టేషన్లో కాలిఫోర్నియా బైకర్స్‌తో చిన్నపాటి ఘర్షణ జరుగుతుంది.ఇదే కథకు మలుపు. ఆ ఘర్షణతో బైకర్స్ వీళ్ళ కారును వెంబడిస్తారు. బ్రీ వాళ్ళు గెస్ట్ హౌస్‌కి వెళ్లిన తరువాత బైకర్స్ ఏం చేశారు? వాళ్లను బ్రీ ఎలా ఎదుర్కొంది? ఆ సంఘటన తర్వాత తన జర్నలిస్ట్ కెరీర్లో బ్రీ సాధించిన గొప్ప అంశమేంటి? అన్న విషయాలన్నీ లయన్స్ గేట్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రాఫిక్’లో చూడాల్సిందే. రోజు వారీ ట్రాఫిక్ కష్టాలతో సతమతమయ్యేవారు ఈ వీకెండ్ ‘ట్రాఫిక్’ సినిమాతో థ్రిల్లింగ్ వెకేషన్ అనుభూతి పొందుతారనేది నిజం. సో... ఎంజాయ్ ది ‘ట్రాఫిక్’. – ఇంటూరు హరికృష్ణ -
'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్!
ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది.ఈ వెబ్ సిరీస్ దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీకి భారీ యాక్షన్ చిత్రం.. తెలుగులో ఉచితంగా స్ట్రీమింగ్!
హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఎక్కడైనా సరే ఫ్యాన్ క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమానే ఇండియన్ ఫ్యాన్స్‌కు అందుబాటులోకి రానుంది. గత జూలై 26న బాక్సాఫీస్ వద్ద రిలీజైన డెడ్‌పూల్ అండ్ వాల్వరైన్ భారీగా వసూళ్లు రాబట్టింది. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించిన ఈ సినిమా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీప్లస్, వుడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ సినిమా నవంబర్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఇండియాలో ఇంగ్లష్తో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తన వీడియోను షేర్ చేస్తూ వెల్లడించింది. ఈ సినిమాను ఉచితంగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి షాన్ లెవీ దర్శకత్వం వహించారు. -
దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఫౌజా నచ్చుతుంది: దర్శకుడు ప్రమోద్ కుమార్
‘‘డబ్బులిచ్చి బ్రాండెడ్ బట్టలు కొన్నంత సులువుగా ఆర్మీ యూనిఫామ్‌ని కొనలేం. కష్టంతో, ఇష్టంతో సాధించుకోవాలి. దేశభక్తి ఉంటేనే అది సాధించగలం. దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ మా ‘ఫౌజా’ నచ్చుతుంది. త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తాం’’ అని ప్రమోద్ కుమార్ పున్హానా అన్నారు. కార్తీక్ దమ్ము, పవన్ మల్హోత్రా, ఐశ్వర్యా సింగ్ ముఖ్య తారలుగా ప్రమోద్ కుమార్ పున్హానా దర్శకత్వంలో అజిత్ దాల్మియా నిర్మించిన హిందీ చిత్రం ‘ఫౌజా’.ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ఫౌజా’ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన వారిలో హీరో విజయ్ ధరన్ దాట్ల, ఏపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ దమ్ము మురళీమోహన్, హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ డా. డి. సురేష్, కాంతి డి. సురేష్ తదితరులు ఉన్నారు. ‘‘ఫౌజీ’లాంటి చిత్రానికి భాషతో సంబంధం ఉండదు’’ అని ఈ సందర్భంగా హీరో కార్తీక్ చెప్పారు. ‘‘హిందీలో మా చిత్రానికి మంచి ఆదరణ లభించింది. తెలుగు ప్రేక్షకులూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని అజిత్ దాల్మియా అన్నారు. -
షాషాంక్ రెడింప్షన్ సినిమా రివ్యూ
ఆశ.. చిన్నదో, పెద్దదో ప్రతి మనిషికీ ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఒకరోజు అవి గట్టెక్కపోవన్న ఆశ.. సంతోషాల్లో ఉన్నవానికి ఎప్పటికైనా ఈ సంతోషం తనతోనే ఉండిపోవాలన్న ఆశ! ఈ ఆశే మనిషిని బతికిస్తుంది. చుట్టూ గాఢాంధాకారలు కమ్ముకున్నా వెలుగు వైపు నడిపిస్తుంది. అలాంటి సినిమానే ద శశాంక్ రెడింప్షన్.ఈ సినిమా ఇప్పటిది కాదు. 1994లో వచ్చింది. స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. చేయని తప్పుకు నిందిస్తేనే కయ్యిమని లేస్తాం. అలాంటిది చేయని నేరానికి రెండు జీవితకాలాల జైలుశిక్ష విధిస్తే..? ఈ సీన్‌తోనే కథ మొదలవుతుంది.బ్యాంకర్ ఆండీ (టిమ్ రాబిన్స్).. భార్య తనను వదిలేసి ప్రియుడే కావాలనుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు. ఆమెను చంపడానికి పూటుగా తాగి గన్ లోడ్ చేసుకుని వెళ్తాడు. కానీ మనసొప్పక తిరిగొచ్చేస్తాడు. అయితే అక్కడ నిజంగానే హత్య జరుగుతుంది. హీరో భార్య, ప్రియుడు ఇద్దరూ చనిపోతాడు. అక్కడ దొరికిన ఆనవాళ్ల ఆధారంగా ఆండీని జైల్లో వేస్తారు. చంపాలనుకున్నమాట వాస్తవమే కానీ చంపలేదని చెప్తే ఎవరూ నమ్మరు. తాను నిర్దోషినని చెప్తే ఎగతాళి చేస్తారు. తన మాట ఎవరూ లెక్కచేయరని తెలసుకున్న అతడు నాలుగుగోడల మధ్య ఇమిడేందుకు అలవాటుపడతాడు. ఒంటరిని అన్న భావం దగ్గరకు రాకూడదని ఫ్రెండ్స్‌ను ఏర్పరుచుకుంటాడు. అయితే ఎప్పటికైనా బయటకు వెళ్లి ప్రశాంతమైన జీవితం గడపాలన్నది తన కోరిక. అది చూసి ఇతరులు నవ్వుకున్నా తను మాత్రం ఆశ చంపుకోలేదు. ఆ ఆశే అతడిని జైలు నుంచి పారిపోయేలా చేస్తుంది. అతడి స్నేహితుడు ఆత్మహత్య వైపు అడుగులు వేయకుండా స్వేచ్ఛా జీవితం కోసం తపించేలా చేస్తుంది. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. జైల్లో ఉన్నవారిదే కాక అక్కడి నుంచి బయటకు వచ్చినవారి మానసిక స్థితి ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించారు. ఏళ్లు గడుస్తున్నా వారి జీవనవిధానంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ సినిమా హత్య, హింస, తిరుగుబాటును చూపించలేదు.. కేవలం విముక్తి, ఆశ చుట్టూ మాత్రమే తిరిగింది. అలాగే నిజమైన స్నేహం ఎలా ఉంటుందనేది ఆకట్టుకునేలా ఆవిష్కరించారు. రెండు జీవితకాలాల జైలుశిక్ష పడ్డా కుంగిపోకుండా స్వేచ్ఛ కోసం హీరో పడే తపన చూస్తుంటే ముచ్చటేయక మానదు. సినిమా ముగిసినప్పుడు మనకూ జీవితం మీద కొత్త ఆశలు చిగురించిన భావన కలుగుతుంది. డైరెక్టర్ ఫ్రాంక్ డారాబాంట్ ఈ చిత్రాన్ని అద్భుత కళాఖండంగా మలిచాడు. ఈ మూవీని అందరికీ ఒక ఫిలాసఫీగా అందించాడు. -
IF Movie Review: ఇఫ్ మూవీ రివ్యూ.. మన ఊహే నిజమైతే!
ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల తరువాత మనకు నియర్ అండ్ డియర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే మన ఫ్రెండ్స్. పిల్లల్లో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అద్భుతంగా ఊహించుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేని ఫ్రెండ్స్ గురించి గొప్పగా ఊహించుకుంటారు. అంటే ఆ ఊహలోని ఫ్రెండ్స్ కి గొప్ప పవర్స్, పవర్ ఫుల్ మేకోవర్ ఉంటాయి. మరి అలాంటి ఊహలు నిజమైతే...అలాంటి థాట్ లోంచి వచ్చిన సినిమానే ఇఫ్ చిత్రం. ఇదో ఫాంటసీ కామెడీ మూవీ. దీనిని జాన్ క్రసింస్కీ తీశారు. ప్రముఖ నటులు రేయాన్ రెనాల్డ్స్ తో పాటు కాలే ఫ్లెమ్మింగ్ తమ పాత్రలకు అద్భుతమైన న్యాయం చేశారు.ఇఫ్ సినిమా కథేంటంటే...పన్నెండేళ్ళ బీ తన డాడీ ఆపరేషన్ వల్ల గ్రాండ్ మదర్ మార్గరేట్ అపార్ట్ మెంట్ కు వస్తుంది. బీ మమ్మీ చిన్నప్పుడే చనిపోతుంది. ఓ రోజు రాత్రి బీ తనకు బిల్డింగ్ లో ఎవరో రేర్ క్రియేచర్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తరువాత రోజు కూడా ఆ క్రియేచర్ ఓ మనిషితో పాటు వెళ్తున్నట్టు మళ్ళీ కనిపిస్తుంది. ఆ మనిషి ఎవరో కాదు తన గ్రాండ్ మదర్ బిల్డింగ్ చివరి పై ఫ్లోర్ లో వున్న కాల్ అని తెలుస్తుంది. కాల్ తో వున్న క్రియేచర్ బ్లూ. కాని ఈ సారి బ్లూ తో పాటు సీతాకోకచిలుక రూపంలో వున్న బ్లాసమ్ ని చూడగానే బీ మూర్ఛపోతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు బీ కాల్ తో కలిసి ఈ క్రియేచర్స్ అన్ని ఉన్న చోటికి వెళ్ళి తన ఇమేజినేషన్ తో వాటన్నిటిని తనకు నచ్చిన విధంగా మార్చి చూసుకుని ముచ్చటపడుతుంది. అసలు బీకి కనిపించిన ఈ క్రియేచర్స్ ఏంటి, తన ఇమేజినేషన్ తో సృష్టించుకున్న క్రియేచర్స్ తో బీ ఇంకెన్ని మాజిక్స్ చేసిందో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఇఫ్ చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమా మొత్తంలో గ్రాఫిక్స్ చాలా బావుంటాయి. మనకు కనిపించే క్రియేచర్స్ ని చాలా బాగా చూపించారు. ఇట్స్ ఎ వర్త్ మూవీ ఫర్ కిడ్స్. - ఇంటూరు హరికృష్ణ -
OTT: హాలీవుడ్ మూవీ ‘ట్రబుల్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రబుల్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వినోదానికి భాష, ప్రాంతం ముఖ్యం కాదు. ప్రాంతాల సరి హద్దులు చెరిపేసి, భాషల హద్దులు మరిచి నవరసాల్లో హాస్యరసానికి పెద్ద పీట వేసే దర్శకులు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అందుకే వారు రూపొందించిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువ. స్వీడిష్ దర్శకుడు జాన్ హాంబర్గ్ ఇటీవల తీసిన ‘ట్రబుల్’ సినిమా ఇందుకు ఓ ఉదాహరణ. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. ఒక ఎలక్ట్రానిక్స్ షాపులో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్న కాణీకి సంబంధించిన కథ ఈ ‘ట్రబుల్’. కాణీకి ఒక్కటే కూతురు. భార్య విడాకులిచ్చింది. కాణీకి సాధారణంగా సమస్యలు రావు, అయితే సమస్యలను తానే కొని తెచ్చుకునే కన్ఫ్యూజ్డ్ పర్సన్. కానీ కాణీ మంచి తెలివైనవాడు. ఓ టీవీని అమర్చేందుకు ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు ఇతగాడి అత్యుత్సాహం ఓ హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. జైల్లో వేరేవాళ్లు తవ్విన సొరంగం గుండా బయటపడి తన సమస్యను ఎలా అధిగమించుకుంటాడో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రబుల్’లోనే చూడాలి. ఈ సినిమాలో కాణీ పాత్రకు ప్రముఖ నటుడు ఫిలిప్ బర్గ్ ప్రాణం పోశారు. తన కన్ఫ్యూజింగ్ భావాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తాడు. అలాగే హీరోయిన్ ప్రాత్రలో ఎమీ, విలన్ పాత్రలో ఇవా తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. పైన చెప్పినట్టు పేరుకు స్వీడిష్ సినిమా అయినా చక్కగా మన తెలుగులో డబ్ అయి ఉంది. వీకెండ్ మూవీ వాచర్స్‌కు మంచి హ్యూమరస్ మూవీ ఇది. ఈ ‘ట్రబుల్’ చూసి కాసేపు మీ ట్రబుల్స్ మరిచిపోకండి. – ఇంటూరు హరికృష్ణ -
హాలీవుడ్ టార్జాన్ రాన్ ఎలీ ఇకలేరు
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ (86) ఇకలేరు. ఆయన మరణించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాన్ ఎలీ కుమార్తె క్రిస్టెన్ వెల్లడించారు. ‘‘ఓ గొప్ప వ్యక్తి ఈ ప్రపంచానికి దూరమయ్యారు. అలాగే నేను నా తండ్రిని కోల్పోయాను. నటుడిగా, రచయితగా, కుటుంబంలోని వ్యక్తిగా, కోచ్‌గా, గురువుగా, నాయకుడిగా ఆయన రాణించారు’’ అని క్రిస్టెన్ పేర్కొన్నారు. ఇక అమెరికాలోని టెక్సాస్‌లో 1938లో జన్మించారు రాన్ ఎలీ. కెరీర్ ఆరంభంలో ‘సౌత్ పెసిఫిక్’, ‘ది ఫిన్డ్ హూ వాక్డ్ ది వెస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన తర్వాత టెలివిజన్ సిరీస్ ‘టార్జాన్’లో నటించే అవకాశం రాన్ ఎలీకి దక్కింది. టార్జాన్‌గా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రాన్ ఎలీకి విపరీతమైనపాపులారిటీ వచ్చింది.ఇంకా ‘ప్లే హౌస్ 90, థ్రిల్లర్, ఫేస్ ది మ్యూజిక్’ వంటి సిరీస్‌లలో నటించారు రాన్. అలాగే ‘డాక్ సావేజ్: ది మ్యాన్ ఆఫ్ బ్రాంజ్, వన్స్ బిఫోర్ ఐ డై’ వంటి చిత్రాల్లోనూ నటించారాయన. ‘షీనా’ సిరీస్ తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్న రాన్ ‘ఎక్స్‌పెక్టింగ్ ఆమిష్’ (2014) అనే సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు. ఇదే ఆయనకు చివరి సినిమా. ఈ సంగతి ఇలా ఉంచితే... రాన్ ఎలీ ఎప్పుడు మరణించారనే విషయంపై క్రిస్టెన్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన కొన్ని రోజుల క్రితమే మరణించారని, మరణ వార్తను క్రిస్టెన్ కాస్త ఆలస్యంగా బయటపెట్టారని వార్తలు వస్తున్నాయి. -
'టార్జాన్' హీరో కన్నుమూత.. నెల రోజులకు ప్రకటించిన కుమార్తె
హాలీవుడ్ ప్రముఖ నటుడు రాన్ ఎలీ (86) అనారోగ్యంతో మరణించారు. 1966 నుంచి 1968 సమయంలో టార్జాన్ షో NBC టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం అయింది. ఈ షో అప్పట్లో భారీగా పాపులర్ కావడంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. టార్జాన్ చిత్రంలో తన పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అయిపోయారు. అయితే, రాన్ ఎలీ మరణించారని ఆయన కుమార్తె కిర్‌స్టెన్ ఎలీ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.తన తండ్రి మరణంతో ఆమె ఒక పోస్ట్‌ను కూడా పెట్టారు. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆమె పేర్కొన్నారు. ' నా తండ్రి ఒక రోల్‌మోడల్.. ఆయన్నూ అందరూ హీరోగా పిలుస్తారు. నటుడిగా, రచయితగా, కోచ్‌గా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతో కష్టపడి తన చుట్టూ ఒక బలమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరణం మాకు తీరని లోటుగా ఎప్పటికీ ఉండిపోతుంది.' అని ఆమె తెలపింది.2001లో తన నటనకు గుడ్‌బై చెప్పిన రాన్ ఎలీ ఆపై రచయితగా మారారు. ఈ క్రమంలో రెండు మిస్టరీ నవలలను ఆయన రాశారు. తన కెరియర్లో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1938లో అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించిన ఎలీ.., 1959లో తన స్కూల్మెట్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. సెప్టెంబరు 29న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని లాస్ అలమోస్లోని తన ఇంట్లో ఎలీ మరణించారు. అయితే, ఈ విషయాన్ని ఆయన కుమార్తె చాలా ఆలస్యంగా ప్రపంచానికి తెలిపారు. -
స్వీయ వివాహం చేసుకున్న హాలీవుడ్ పాప్ సింగర్
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీస్పియర్స్ 42 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి తనను తానే పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ రోజు నాతో నాకే పెళ్లి జరిగింది. మీకిది తెలివి తక్కువ పనిలా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం ఇప్పటివరకు నేను చేసినవాటిలో ఇదొక గొప్ప విషయం అని భావిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. స్వీయ వివాహం చేసుకున్న బ్రిట్నీస్పియర్ను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.మూడు పెళ్లిళ్లు పెటాకులుకాగా బ్రిట్నీస్పియర్స్ మొదటగా చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను పెళ్లాడింది. 2004లో వీరి వివాహం జరగ్గా కొద్ది రోజులకే విడిపోయారు. తర్వాత అదే ఏడాది డ్యాన్సర్, నటుడు కెవిన్ ఫెడెర్‌లైన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే ఈ దాంపత్యం కూడా సజావుగా సాగలేదు. దీంతో 2007లో విడిపోయారు. అనంతరం బ్రిట్నీ.. 2016లో నటుడు సామ్ అస్గారితో డేటింగ్ చేసింది. 2022లో వీరు పెళ్లి చేసుకోగా గతేడాది విడిపోయారు. ఈ మధ్యే విడాకులు సైతం మంజూరయ్యాయి.చదవండి: అప్పుడేమో సినిమాలతో బిజీ.. ఇప్పుడేమో పిల్లలుంటే బాగుండని ఫీలవుతున్న నటుడు -
ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రం 'ప్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్' చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సుమారు ఆరు నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ప్యూరి రోడ్ చిత్ర ప్రాంచైజీలో భాగంగా ఐదో చిత్రంగా తెరకెక్కింది. గత చిత్రాల దర్శకుడు జార్జ్ మిల్లర్నే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటికంటే భారీగా అదే సమయంలో ఒరిజినల్ కథతో రూపొందించారు.'ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా' ఓటీటీ విడుదల ప్రకటన రావడంతో ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు. అక్టోబర్ 23నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు జియో సినిమా వెల్లడించింది. తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ,కన్నడ, తమిళం,బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని జియో పేర్కొంది. ఇందులో అన్యటైలర్ జాయ్ ఒక యువ మహిళా యోధుని పాత్రలో నటించారు. నటుడు క్రిస్ హేమ్స్ వర్త్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థతో కలిసి మిల్లర్ ఆయన చిరకాల భాగస్వామి, ఆస్కార్ నామినేటెడ్ నిర్మాత డౌగ్ మిథ్చల్ ఆ్రస్టేలియా బేస్డ్ కెన్నడీ మిల్లర్ మిచ్చల్ పతాకంపై నిర్మించారు. -
ఇండియన్ స్క్రీన్స్‌కి ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’
‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం ఇండియాలో విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. కనికా కస్రుతి, దివ్య ప్రభ లీడ్ రోల్స్‌లో, ఛాయా కందం ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాల నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రం ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై, గ్రాండ్ ప్రీ అవార్డును గెలుచుకుంది. 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలించిన సినిమాల జాబితాలోనూ ఈ చిత్రానికి చోటు దక్కింది. తాజాగా ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. నవంబరు 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రానా సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబైలో ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఊహించని ఓ ఘటన వీరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నదే ఈ చిత్రకథ. -
ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్'ను మించిన సినిమా.. క్షణక్షణం ఉత్కంఠ
యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' దీనిని నిరూపించింది. అయితే, అలాంటి సంఘటనే 2018లో థాయ్‌లాండ్‌లో జరిగింది. 12మంది ఫుట్‌బాల్ టీమ్ పిల్లలతో 'థామ్ లువాంగ్' గుహలోకి కోచ్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనతో వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన 'థర్టీన్ లైవ్స్' పేరుతో సినిమాగా వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రోన్ హోవార్డ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యథార్థ ఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈచిత్రం కథ తెలుసుకుందాం.కథేంటంటేథాయ్లాండ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన 'థామ్ లువాంగ్' గుహలను చూసేందుకు 12 మంది ఫుట్‌బాల్ జూనియర్ టీమ్ సభ్యులతోపాటు కోచ్ కూడా వెళ్తాడు. వారు గుహ లోపలికి వెళ్లిన కొంత సమయం గడిచాక ఆ పర్వత ప్రాంతమంతా విపరీతమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తుంది. దీంతో గుహ ప్రారంభం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పిల్లలందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలికి వెళ్లిపోతారు. తిరిగి బయటకొచ్చే దారి వారికి కనిపించదు. అలా వారందరూ అక్కడ చిక్కుకుపోతారు. భారీ వర్షం వల్ల గుహ లోపలికి వెళ్లే దారి నీటితో పూర్తిగా మూసుకుపోతుంది. ఇదే సమయంలో చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతుంటారు. బయటి ప్రంపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేని ఆ ప్రాంతంలో చిన్నారులు చిక్కుకుపోయారని అందరికీ ఎలా తెలిసింది..? సుమారు 18 రోజుల పాటు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఛాలెంజింగ్‌గా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించిందా..? పది కిలోమీటర్ల పొడవైన గుహ మొత్తం నిళ్లతో నిండిపోతే ఆ రెస్క్యూ టీమ్ ఎలా వెళ్లింది..? చిన్నారులందరూ అన్నిరోజుల పాటు సజీవంగా ఎలా ఉండగలిగారు..? అన్నది తెలియాలంటే 'థర్టీన్ లైవ్స్' సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే..2018లో థాయ్ గుహల్లో చిన్నారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచదేశాల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారులను కాపాడేందుకు దాదాపు పదిహేడు దేశాలకు చెందిన ఐదు వేల మంది రెస్క్యూ టీమ్ ఆ ఆపరేషన్ కోసం థాయ్‌లాండ్ చేరుకుంటారు. ఈ ఆపరేషన్‌లో బ్రిటీష్ రెస్క్యూ టీమ్ రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్ ప్రాణాలకు తెగించి ఆ పిల్లలను కాపాడటానికి ఎలా ప్రయత్నాలు చేశారనేది చాలా సాహసంతో కూడుకొని ఉంటుంది. సుమారు 18 రోజుల తర్వాత ఆ చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చాలా ఉద్వేగంతో ఫీల్ అయ్యారు. ఆ సమయంలో పిల్లలు క్షేమంగా తిరిగిరావాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించారు. అవన్నీ ఫలించాయి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ ఘటనను తెరకెక్కించడంలో దర్శకుడు రాన్ హోవర్డ్ విజయం సాధించారు.సినిమా ప్రారభంమే కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులు గుహ చూద్దామని అక్కడికి చేరుకోవడంతో స్టోరీ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే భారీ వర్షం.. చిన్నారుల్లో భయం.. అలా ఒక్కో సీన్ ప్రేక్షకులకు చూపుతూ దర్శకుడు ఆసక్తి పెంచుతాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ గుహ మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల వారు ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే, వారిని ఎలా కనిపెడుతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుమారు 9 రోజుల తర్వాత సీడైవింగ్లో నిష్ణాతులైన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు (రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్) ఎంతో శ్రమించి చిన్నారులను కనిపెట్టినప్పుడు వాళ్లు ఎంత సంతోష పడ్డారో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అంతే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు బయట జోరు వాన.. పిల్లలను రక్షించుకొందామనుకుంటే ఆ నీరు అంతా మళ్లీ గుహలోకే వెళ్తుంది. దీంతో ఆ నీటిని పంట పొలాల్లోకి మళ్లిస్తారు. అక్కడి రైతులు కూడా అందుకు సహకరిస్తారు. ఆ సీన్ అందరి కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇలాంటి సీన్లు అన్నీ చాలా ఉద్విగ్నంగా ఉంటాయి.పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టారు సరే.. సుమారు 10 కిలోమీటర్లు దూరం పాటు చాలా లోతుగా ఉన్న నీటిలో నుంచి వారిని ఎలా రక్షించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎదురుగా నీటి ప్రవాహం వస్తుంటే.. దానిని అదిగమించి చిన్నారులను బయటకు చేర్చాలి. అప్పటికే 18 రోజులు కావడంతో వారందరూ మరణించి ఉంటారని కనీసం తమ బిడ్డల శవాలు అయినా తీసుకొస్తే చాలు అని వారి తల్లిదండ్రులు గుహ బయటే కన్నీటితో ఎదురుచూస్తున్నారు. అలాంటి సీన్లు ప్రేక్షకుల చేత కన్నీరు తెప్పిస్తాయి. ఎంతో సాహసంతో కూడుకున్న ఈ కథ ఎలా ముగిసిందో తెలుసుకున్నాక ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి మజానే ఈ 'థర్టీన్ లైవ్స్' తప్పకుండా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.ఎవరెలా చేశారంటేసినిమా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో తెలిసిన నటుడు ఒక్కరూ లేరు. అయినా ప్రతి పాత్ర మనకు కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక విభాగం ప్రధాన్ ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ చాలా చక్కగా తీశారు. రియల్ ఇన్సిడెంట్ కళ్ల తెరపైన చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా సినిమా సాగుతుంది. ఇందులో ఫైట్స్ వంటివి లేకున్నా చాలా సన్నివేశాల్లో విజిల్స్ వేసేలా ఉంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు రాన్ హోవర్డ్.. ఈ కథను ఉత్కంఠభరితంగా చెప్పడమే కాకుండా.. ఎంతో భావోద్వేగభరితంగా ప్రేక్షకులకు చూపించారు. -
వేలకోట్లు ఉండి ఏం లాభం? సాయం చేసేందుకు చేతులే రావట్లేదుగా!
హాలీవుడ్ పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ మంచి చేయబోయి విమర్శలపాలైంది. న్యూయార్క్‌లో తను కారు ఎక్కేముందు ఓ వ్యక్తి తనకు దానం చేయమని కోరాడు. తలదాచుకోవడానికి నిలువ నీడ కూడా లేని అతడికి కేవలం 20 డాలర్లు దానం చేసి బాగా భోజనం చేయు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.పాప్ సింగర్‌పై ట్రోలింగ్ఇంకేముంది, నెటిజన్లు ఆమెపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దాదాపు పదివేల కోట్ల సామ్రాజ్యానికి మహారాణివి, ఇల్లు లేని వ్యక్తికి కేవలం రూ.1600 చిల్లర (20 డాలర్లు) ఇస్తావా? నువ్వు తల్చుకుంటే నిరాశ్రయుడైన వ్యక్తికి ఏకంగా ఒక ఇల్లే కొనివ్వచ్చు, కానీ మరీ చిల్లర ఇవ్వడం బాగోలేదు, అంత డబ్బు ఏమాత్రం సరిపోతాయో.. అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం.. తను ఆ మాత్రమైనా చేసిందని వెనకేసుకొస్తున్నారు. హడావుడిగా వెళ్లిపోకుండా ఆగి మరీ తనకు తోచింది సాయం చేయడం గొప్ప విషయమేనని చెప్తున్నారు.చదవండి: రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్ -
OTT: ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’ మూవీ రివ్యూ
అద్భుతమైన ఒక ఫాంటసీ సినిమా చూస్తారా? దాని పేరు ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’. యానిమేటెడ్ ఫిల్మ్. ఈ కథ పీటర్ అనే ఓ అనాథది. పీటర్ చిన్నప్పుడే తన ఫ్యామిలీతో పాటు తను ఎంతగానో ఇష్టపడే చెల్లెలిని కోల్పోతాడు. అప్పటి నుండి పీటర్‌ను ఓ మాజీ సైనికుడు పెంచుతూ ఉంటాడు. అనకోకుండా పీటర్ ఓ మహిళా మెజీషియన్‌ను కలుస్తాడు. ఆ మెజీషియన్ పీటర్ చెల్లెలు బతికే వుందని, కాకపోతే ఓ ఎలిఫెంట్ ద్వారా పీటర్‌కు ఆ చెల్లెలు దొరుకుతుందని చెబుతుంది.పీటర్ ఉండేది బాల్టీసి రాజ్యంలో. ఆ రాజ్యంలో ఇప్పటి దాకా తను ఏ ఎలిఫెంట్‌ను చూడలేదు, ఇప్పుడెలాగబ్బా అని అనుకుంటుంటే మేజిక్ షోలో పీటర్‌కు ఓ ఎలిఫెంట్ కనిపిస్తుంది. ఆ ఎలిఫెంట్‌ను తనతో తీసుకువెళదామనుకుంటే ఆ దేశపు తిక్కరాజు పీటర్‌కు మూడు కఠినమైన టాస్కులు పెడతాడు. వాటిలో పీటర్ నెగ్గితే ఎలిఫెంట్‌ను తీసుకువెళ్ళవచ్చని కండిషన్ పెడతాడు. రాజు పెట్టిన ఆ మూడు కండిషన్లు ఏమిటి, పీటర్ ఎలిఫెంట్‌ను గెలుచుకుంటాడా లేదా, పీటర్ చివరికి తన చెల్లెలిని కలుసుకుంటాడా అన్నది మాత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఉన్న ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’ను చూడాల్సిందే. వెండీ రాజర్స్ అనే దర్శకుడు తీసిన ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ముఖ్యంగా రాజు ఇచ్చిన టాస్కులు కాని, ఎలిఫెంట్ చేసే ఫీట్లుగాని సూపర్‌గా వుంటాయి. సో దిస్ వీకెండ్ పిల్లలకు, పెద్దలకు కాదు కాదు మొత్తం ఫ్యామిలీకి సూపర్ ఛాయిస్ ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’.– ఇంటూరు హరికృష్ణ -
Gladiator 2 Trailer: నాకు ఆ రోజు జ్ఞాపకం ఉంది.. అది మరచిపోలేదు
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హాలీవుడ్ చిత్రం ‘గ్లాడియేటర్’. రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2000లో వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ‘గ్లాడియేటర్ 2’కి కూడా రిడ్లీ స్కాట్యే దర్శకత్వం వహించారు. పాల్ మెస్కల్, డెంజెల్ వాషింగ్టన్, పెడ్రో పాస్కల్, కొన్నే నిల్సన్, జోసెఫ్ క్విన్ వంటివారు నటించారు. ఈ చిత్రం నవంబరు 15న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 4డీఎక్స్ మరియు ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానుంది. ఇక ‘నాకు ఆ రోజు జ్ఞాపకం ఉంది.. నేను అది మరచిపోలేదు.. ఒక బానిస రాజుపై ప్రతీకారం తీర్చుకున్న క్షణం’ వంటి డైలాగ్స్ ‘గ్లాడియేటర్ 2’ ట్రైలర్లో ఉన్నాయి. -
బిగ్ రియాలిటీ షో విన్నర్‌కు రూ.6 కోట్ల ప్రైజ్‌మనీ
బిగ్ బ్రదర్.. ఈ షోకు జిరాక్స్ కాపీయే బిగ్‌బాస్ రియాలిటీ షో. 1999లో పుట్టిన సంచాలనాత్మక టెలివిజన్ షో బిగ్ బ్రదర్. ఇప్పటివరకు 25 సీజన్లు కంప్లీట్ అవగా తాజాగా 26వ సీజన్ విజయవంతంగా పూర్తయింది. డైరెక్టర్ చెల్సీ బాహం విజేతగా నిలిచి 6 కోట్ల 30 లక్షల పైచిలుకు రూపాయలు (7,50,000 డాలర్లు) ప్రైజ్‌మనీగా గెలుచుకుంది.టైటిల్ విన్నర్ చెల్సీ బాహంరన్నరప్ ఎవరంటే?రెండో స్థానంలో ఉన్న కన్స్టక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ మకెన్సీ మన్బెక్ దాదాపు రూ.63 లక్షలు (75 వేల డాలర్లు) అందుకుంది. థెరపిస్ట్ కామ్ సలైవన్ బ్రౌన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అమెరికా ఫేవరెట్ ప్లేయర్‌గా మోడల్ టుకర్ డెస్ లూరియర్స్ రూ.42 లక్షల మేర (50 వేల డాలర్లు) గెలుచుకున్నాడు. ఇకపోతే బిగ్ బ్రదర్ 26వ సీజన్ జూలై 17న ప్రారంభమైంది. 16 కంటెస్టెంట్లు హౌస్‌లో పాల్గొన్నారు. వీరి ప్రతి కదలికను రికార్డ్ చేసేందుకు హౌస్‌లో 90 కెమెరాలు, 100 మైక్రోఫోన్లు అమర్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా?
టైటిల్: ఇమ్మాక్యూలేట్దర్శకత్వం: మైఖేల్ మోహన్లీడ్ రోల్: సిడ్నీ స్వీనినిడివి: 90 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్విడుదల తేదీ: మార్చి 22, 2024ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్‌లోనూ ఇటీవల ఆ జోనర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే హాలీవుడ్లో అయితే ఈ చిత్రాలకు కొదువే లేదు. హాలీవుడ్ చిత్రాలు అత్యంత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది.గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ కథ మొత్తం నన్ల చుట్టు తిరుగుతుంది. నన్‌గా మారేందుకు అమెరికా నుంచి ఇటలీకి వచ్చిన ఓ యువతి కథ. ఇందులో నన్ పాత్రలో సిడ్నీ స్వీనీ నటించారు. సిసిలియో అనే యువతిగా కనిపించారు. వృద్ధ నన్స్‌కు సేవలందించేందుకు వచ్చిన యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే అసలు కథ.నన్ నేపథ్యంలో వచ్చిన కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. హారర్ సినిమా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేలా స్క్రీన్ ప్లే నడిపించారు. అత్యంత భయానక దృశ్యాలు ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగించేలా కూడా ఉన్నాయి. నన్లను ట్రీట్ చేసే విధానం.. వారిని వేధింపులకు గురిచేయడం లాంటి అత్యంత దారుణమైన సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేస్తాయి. ఒక నన్ జీవితం ఇంత దారుణంగా ఉంటుందో ఈ సినిమాలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. హారర్ చిత్రమే అయినా.. ఎక్కడా కూడా దెయ్యం అనే కాన్సెప్ట్ లేకుండానే తెరకెక్కించాడు. ఈ కథలో సిసిలియో యువతిదే కీ రోల్. ఈ హారర్ మూవీకి ఆమె నటనే బలం. ఎక్కువగా హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అయితే కొన్ని సీన్స్ అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు లేనప్పుడు ఈ సినిమా చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.