
ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎందరో వచ్చారు. వారిలో హాలీవుడ్ సెన్సేషన్ కర్దాషియన్స్ సిస్టర్స్ కూడా వచ్చారు. నటి, మోడల్ కిమ్ కర్దాషియన్ (Kim Kardashian)తో పాటు సోదరి ఖ్లోయె కర్దాషియన్ (Khloé Kardashian).. అనంత్-రాధిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో హాజరై సందడి చేశారు. తాజాగా ద కర్దాషియన్స్ ఎపిసోడ్‌లో కిమ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
నా ఫ్రెండ్ మాటల్లో తెలిసింది..
ఆమె మాట్లాడుతూ.. ఈ అంబానీలెవరో నాకు తెలియదు. కాకపోతే మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. జ్యువెలరీ డిజైనర్ లారైన్ స్క్వార్ట్జ్ నాకు మంచి స్నేహితురాలు. తనకు అంబానీ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆ కుటుంబంలోని వారికి పలురకాల ఆభరణాలు తయారు చేసిస్తూ ఉంటుంది. తను అంబానీ పెళ్లికి వెళ్తున్నట్లు నాతో చెప్పింది. అంతేకాకుండా అంబానీ కుటుంబం.. నన్ను, నా సోదరిని ఆ పెళ్లికి ఆహ్వానించాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. అది వినగానే తప్పకుండా వస్తామని చెప్పాను.
అదిరిపోయిన ఆహ్వానం.. రాకుండా ఊరుకుంటామా?
తను చెప్పినట్లుగానే ఆహ్వానం అందింది. వారు పంపించిన ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ బరువు దాదాపు 20 కిలోలుంటుంది. అందులోనుంచి ఒకరకమైన సంగీతం కూడా వచ్చింది. అది మాకు విపరీతంగా నచ్చేసింది. అది చూశాక ఇలాంటివాటికి నో చెప్పే ప్రసక్తే లేదనుకున్నాం.. కచ్చితంగా పెళ్లికి వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చింది. కాగా అనంత్- రాధిక 2024 జూలై 12న పెళ్లి చేసుకున్నారు.
చదవండి: అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్‌బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..!
Comments
Please login to add a commentAdd a comment