Movie News
-
బీ కేర్‌ఫుల్...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం డేంజరస్ వాటర్స్ (Dangerous Waters)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.జీవితమన్నది క్షణభంగురం. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అప్రమత్తత అవసరం. ఈ నేపథ్యంలోనే రూ΄పొందిన హాలీవుడ్ సినిమా ‘డేంజరస్ వాటర్స్’(Dangerous Waters ). ఇదో పూర్తి థ్రిల్లర్ జోనర్ మూవీ. సినిమా మొత్తం ఓ మూడు పాత్రలతో 90 శాతం సముద్రంలోనే జరిగిన కథ. సినిమాలో ఉన్నది మూడు పాత్రలే అయినా మంచి స్క్రీన్‌ప్లేతో చూసే ప్రేక్షకులను మాత్రం కట్టిపడేసే ప్రయత్నం చేశారు దర్శకుడు జాన్ బర్.ఈ సినిమా లయన్స్ గేట్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఇది పెద్దవాళ్లు మాత్రమే చూసే సినిమా. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... అల్మా తన కూతురు కోసం ఓ సూపర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ డెరెక్‌తో కలిసి కూతురుతో పాటు బోట్లో బెర్ముడా వరకు ట్రావెల్ చేసి, సముద్రం మధ్యలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలన్నది ప్లాన్. దీనికి కూతురు రోజ్ అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ప్రయాణం మొదలైనపుడు అంతా బాగానే ఉంటుంది. దారి మధ్యలో వేరే ఒక బోట్ వీళ్లకు ఎదురుగా వచ్చి అల్మాను చంపేసి డెరెక్‌ను గాయపరుస్తారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో నడి సంద్రంలో రోజ్ ఒంటరిదైపోతుంది.దాడి చేయడానికి వచ్చినవాళ్లు బోట్లోని రేడియోను అలాగే బోట్ ఇంజన్‌ను ధ్వంసం చేసి వెళతారు. చుట్టూ నీళ్లు తప్ప ఏమీ లేని ఆ ప్రాంతం నుండి రోజ్ ఎలా బయటపడిందనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభమై, ఉత్కంఠభరితంగా సాగుతూ ఊహకందని క్లైమాక్స్ ట్విస్టులతో అద్భుతంగా ముగుస్తుంది. గంటా నలభై నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్లకి ఇదో సూపర్ సినిమా. మరింకేం... ఈ వీకెండ్ ‘డేంజరస్ వాటర్స్’లోకి మీరూ ట్రావెల్ చేయండి. – ఇంటూరు హరికృష్ణ -
అంతే తేడా!
‘ఇట్స్ ఓకే.. మూవ్ ఆన్ అవ్వాలిరా.. తప్పదు’ అంటూ అనంతిక సనీల్‌కుమార్ చెప్పిన డైలాగ్‌తో ‘8 వసంతాలు’ మూవీ టీజర్ ఆరంభమైంది. ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ ఇతర పాత్రలు పోషించారు.మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘ఎవరి తుఫాన్లు వారికి ఉంటాయి లోపల... కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు... అంతే తేడా’’ అంటూ కన్నా పసునూరితో అనంతిక సనీల్‌కుమార్ చెప్పే డైలాగ్స్ కూడా టీజర్లో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, కెమేరా: విశ్వనాథ్ రెడ్డి. -
టాక్సిక్‌లో ఫిక్స్
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి చిత్రాలతో రాఖీ భాయ్‌గా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు సొంతం చేసుకున్నారు యశ్. ఆ సినిమాల తర్వాత యశ్(Yash) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’. ఈ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కొన్నాళ్లుగా జరుగుతోంది. అయినప్పటికీ హీరోయిన్ ఎవరనే విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో కియారా అద్వానీ, కరీనా కపూర్, నయనతార వంటి హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా యశ్‌కి జోడీగా నయనతార(Nayanthara) నటిస్తున్నట్లు ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ మాటలతో స్పష్టత వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ ఒబెరాయ్ మాట్లాడుతూ– ‘‘యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా షూటింగ్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నాను. ఇందులో నయనతార కూడా భాగమయ్యారు. ఇంతకు మించి వివరాలను నేను ఇప్పుడే వెల్లడిస్తే బాగోదు కాబట్టి నన్ను ఎక్కువగా అడగకండి. త్వరలోనే గీతూ మోహన్‌దాస్ ఓ ప్రకటన చేస్తారు. అప్పటివరకు వేచి చూడండి’’ అని పేర్కొన్నారు. ఇక నయనతార గురించి దర్శక–నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
అఖండలో...
‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్తా మీనన్(Samyuktha Menon) ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మహా కుంభమేళాలో జరుగుతోంది. సినిమాలోని కీలక సీన్స్ షూట్ చేస్తు న్నారు. అయితే ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరు? అనే విషయంపై చిత్రబృందం ప్రకటించలేదు. తాజాగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా ఎంపిక అయినట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: సి. రాంప్రసాద్, సంతోష్ డి. -
వేసవిలో జాట్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఈ చిత్రాన్ని వేసవిలో ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించి, కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘భారీ యాక్షన్ మూవీగా ‘జాట్’ రూపొందింది. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ప్రదర్శితమైన ‘జాట్’ టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: రిషి పంజాబీ, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: బాబా సాయికుమార్ మామిడిపల్లి, జయ ప్రకాశ్ రావు (జేపీ). -
క్యాన్సర్‌తో నటి పోరాటం.. అమ్మతనాన్ని కాపాడుకున్నా.. ఇప్పుడు..!
మానవత్వం చచ్చిపోయిందంటోంది బుల్లితెర నటి చవీ మిట్టల్ (Chhavi Mittal). క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టు కోల్పోతున్న తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా ట్రోల్ చేయడం బాధగా ఉందని పేర్కొంది. తనపై వచ్చిన అసభ్య కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.మానవత్వం చచ్చిపోయిందిమానవత్వం చచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ రోజు మరోసారి చూశాను. క్యాన్సర్ చికిత్స వల్ల నేను జుట్టు కోల్పోతుంటే మీరేమో ట్రోల్ చేస్తున్నారు. 2022 నుంచి రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనికి పదేళ్లపాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌తో నా హార్మోన్ చికిత్సకు మూడేళ్లవుతాయి. ఈ ట్రీట్మెంట్ వల్ల ఎన్నో దుష్ప్రభావాలున్నాయి. చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బరువు సరిగా లేకపోవడం, మూడ్ స్వింగ్స్, తిమ్మిర్లు.. ఇలా వీటన్నింటితోపాటు జుట్టు కూడా ఊడిపోతుంది. ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారుఅమ్మాయిలకు జుట్టు అంటే ఎంతిష్టమో నేను మాటల్లో చెప్పలేను. మొదటగా అమ్మతనానికి అవసరమైన రొమ్ము నిలుపుకోవడానికి పోరాడాను. ఇప్పుడు జుట్టు కోసం! ఇలాంటి సమయంలో మీరు చేసే నెగెటివ్ కామెంట్లు నన్ను మరింత కుంగదీస్తున్నాయి. ఇప్పుడీ పోస్ట్ పెట్టడానికి ప్రధాన కారణం.. కొందరు నన్ను ఇష్టపడి నా అకౌంట్ ఫాలో అవడం లేదు. కేవలం ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారు. జుట్టు రాలిపోతున్న క్యాన్సర్ వారియర్‌ను ట్రోల్ చేయడానికి మీ మనసెలా అంగీకరించిందో అర్థం కావట్లేదు.నా ఆత్మస్థైర్యాన్ని చూడుమీకు తలనిండా వెంట్రుకలు, క్యాన్సర్ లేని జీవితం, నీచమైన విమర్శలు లేని జీవితం ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, కష్టపడి నా శరీరాన్ని ఫిట్‌గా ఎలా ఉంచుకున్నానో చూడు అని రాసుకొచ్చింది. కాగా చవీ మిట్టల్.. తుమ్హారీ దిశ, ట్వింకిల్ బ్యూటీ పార్లర్, ఘర్ కీ లక్ష్మీ బేటియాన్, నాగిన్, బందిని, ఏక్ చుట్కి ఆస్మాన్, కృష్ణదాసి వంటి సీరియల్స్‌లో మెరిసింది. ఏక్ వివాహ్.. ఐసా భీ, పాల్ పాల్ దిల్కే సాత్ చిత్రాలు చేసింది. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) చదవండి: అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ.. -
రెండు నెలలుగా ఆస్పత్రిలో.. కన్నుమూసిన నటుడు
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు జయశీలన్ (40) అనారోగ్యంతో మరణించారు. రెండు నెలల క్రితం కామెర్ల వ్యాధితో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జయశీలన్.. విజయ్‌తో బిగిల్, తేరి, ధనుష్‌తో పుదుపేట్టై, విజయ్ సేతుపతితో విక్రమ్ వేద సినిమాల్లో నటించారు.తన కెరీర్లో వందకు పైగా సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలన్న కోరికతో చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పోయారు. కానీ ఆయన టాలెంట్‌కు తగ్గ గుర్తింపు రాలేదు. ఈయన విజయ్ సేతుపతికి మంచి స్నేహితుడని తెలుస్తోంది.చదవండి: హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్ -
మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న హీరోయిన్
హీరోయిన్ మమత కులకర్ణి (Mamta Kulkarni) సన్యాసం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించానలుకున్న ఆమె ఫిబ్రవరి వరకు కుంభమేళాలో ఉంటానని పేర్కొంది. జనవరి 24న కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది.సాధ్విగా మారిపోయిన హీరోయిన్కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షతో, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో ఆమె నిజమైన సాధ్విగా మారిపోయింది. 25 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ఆమె ఇలా సాధ్విగా మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మమత కులకర్ణి సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగొందింది. కరణ్ అర్జున్, దిల్బర్, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) చదవండి: అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ.. -
అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ..
బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar).. ఇటీవలే హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడింది. ఈ విషయాన్ని శిల్ప శిరోద్కర్ స్వయంగా వెల్లడించింది. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నమ్రతతో గొడవైందని.. రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్‌లో నమ్రత రావాలని కోరుకుంది.పట్టించుకోలేదా?కానీ నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్‌బాస్‌కు వెళ్లింది. ఇకపోతే శిల్పకు సపోర్ట్‌గా ఆమె అక్కాబావ నమ్రత- మహేశ్‌బాబు తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. షో నుంచి వచ్చిన వెంటనే శిల్ప ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. నమ్రత ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. తను కచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని చెప్పను. ఇలాంటివి మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. తను నాకు మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా తనేంటో నాకు తెలుసు.. నేనేంటో తనకు తెలుసు అని చెప్పింది.బర్త్‌డే విషెస్తాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్‌లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్‌డే సందర్భంగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్‌డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మహేశ్- నమ్రత దంపతులు.. శిల్పకు సపోర్ట్‌గా లేరు, పట్టించుకోవట్లేదన్న రూమర్లకు ఈ పోస్ట్‌తో చెక్ పడినట్లైంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..! -
సొంతూరు వెళ్లిపోయిన 'మోనాలిసా'.. కారణం ఇదే
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 'మోనాలిసా'(16) అనే యువతి అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేసింది. దీంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోటోలు, రీల్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమెతో ఫోటోలు దిగాలిని, దగ్గరగా చూడాలని చాలామంది ఎగబడుతున్నారు. కనీసం మెనాలిసా అన్నం తినేందుకు కూడా అవకాశం లేకుండా అక్కడి వారు చేస్తుండటంతో ఆమె తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.రుద్రాక్షలు, పూసలు అమ్ముకుందామని మహా కుంభమేళాకు మెనాలిసా కుటుంబం వచ్చింది. ఇప్పుడు ఆమె అందమే తన కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది. వారి వ్యాపారాన్ని పక్కన పెట్టేసి కూతురుని కాపాడుకునే పనిలో తండ్రి ఉన్నాడు. దీంతో ఆమెను తమ స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పంపించారు. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఒక వీడియో ద్వారా ఇలా పంచుకుంది. 'రుద్రాక్షలు, పూసల దండలు అమ్మేందుకే ఇక్కడకు వచ్చాను, నా వల్ల మహా కుంభమేళాలో కాస్త అసౌకర్య వాతావరణం నెలకొంది. ఆపై నా కుటుంబంతో పాటు నాకు కూడా రక్షణ లేదు. మా ఫ్యామిలీ కొంతమేరకు ఇబ్బంది పడుతుంది. దీంతో ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్లిపోతున్నా. అవకాశం ఉంటే మహా కుంభమేళా చివరన వచ్చి ఇక్కడ పుణ్యస్నానం చేస్తా. నాపై మీరు చూపిన ప్రేమ, మద్దతు ఎప్పటికీ మరిచిపోను. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.' అని చెప్పింది. ప్రయాగరాజ్‌లో నిన్న కొందరు దుండగులు మెనాలిసా కుటుంబం పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఆమె తమ గ్రామానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.మధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. परिवार और अपनी सुरक्षा के लिए मुझे बापस इंदौर जाना पड़ रहा है, हो सका तो अगले साही स्नान तक बापस मिलते हैं, प्रयागराज महाकुंभ में।सभी के सहयोग और प्यार के लिए दिल से धन्यवाद 🙏 pic.twitter.com/GiRDmfSsDu— Monalisa Bhosle (@MonalisaIndb) January 23, 2025 -
‘వెంకటలచ్చిమి’గా అలరించబోతున్న పాయల్
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలురేపి, ‘మంగళవారం’ మూవీతో మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput).. ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’(Venkatalachimi Movie)గా ఎంట్రీ ఇవ్వబోతోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘వెంకటలచ్చిమి’ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ సందర్బంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ.. ‘‘వెంకటలచ్చిమి’గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిగ్గా సరిపోతారనిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయం’’ అని అన్నారు.హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘‘మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. నచ్చక రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ముని గారు ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది.’’ అని అన్నారు.యూత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్. ఈసారి డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్‌తో ఈ పాన్ ఇండియా సినిమా చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. -
‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ మూవీ రివ్యూ
భారత దేశంలో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చాయి. కానీ 31 ఏళ్ల క్రితం జపాన్ వాళ్లు ఇండియన్ టీమ్‌తో కలిసి రామాయణాన్ని యానిమేషన్ రూపంలో తెరకెక్కించారు. ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’(Ramayana: The Legend Of Prince Rama Movie) పేరుతో తెరకెక్కిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. నేడు(జనవరి 24) ఇండియాలో రిలీజైంది. మరి ఈ జపనీస్ రామాయణం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. రాముడి జననం గురించి మొదట వాయిస్ ఓవర్లో చెప్పి, ఆయనకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కథను ప్రారంభించారు.రామ లక్ష్మణులు తాటకిని చంపి ఋషులను కాపాడటం మొదలు.. సీతా పరిణయం, ఆరణ్యవాసంలో సీతారామ లక్ష్మణుల వనవాసం, సీతాపహారణం, రామ, రావణల యుద్దం వరకు ఈ చిత్రంలో చూపించారు(Ramayana: The Legend Of Prince Rama Movie Review)విశ్లేషణరాముడి గురించి, రామాయణం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో బోలెడు సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమా ప్రత్యేక ఏంటి? అంటే టెక్నాలజీని ఉపయోగించి కార్టూన్ వర్క్ పరంగా ఈ సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దారు. క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గకుండా.. చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. కాకపోతే తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే.. నిజంగానే కార్టూన్ వెర్షన్లో మాస్టర్ పీస్ అయి ఉండేదనిపించింది.రాముడి ఎంట్రీతో పాటు హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోతాయి. యానిమేషన్ చిత్రమే అయినా నిజంగా కథ జరుగుతున్నంత ఎమోషన్ ని పండించగలిగారు. చిన్నపిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫి, మోషన్ పిక్చర్ క్యాప్చర్ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా సినిమాకు పాజిటివ్‌గా మారింది. ఈ సినిమా కోసం సుమారుగా 450 మంది ఆర్టిస్టులు పనిచేయగా.. సుమారుగా 1 లక్షలకు పైగా హ్యాండ్ డ్రాయింగ్స్‌ను చిత్రించారు.1993 లో తీసినా ఇప్పుడు 4K HD క్వాలిటీ అనుగుణంగా సినిమా పిక్చరైజేషన్ చాలా క్లారిటీగా ఉండేలా మార్చారు. జపనీస్ యానిమేషన్ స్టైల్లో తెరకెక్కించినప్పటికీ ఈ తరం పిల్లలు చూడాల్సిన సినిమా ఇది. -
ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..!
జార్ఖండ్ బ్యూటీ 'శ్వేతా బసు ప్రసాద్'(Shweta Basu Prasad) నటించిన బోల్డ్ మూవీ 'ఊప్స్ అబ్ క్యా' (Oops Ab Kya) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు తాజాగా అడల్ట్ రేటెడ్ డైలాగ్స్‌తో ఒక టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. పెళ్లికాని ఒక యువతి అనారోగ్యంగా కారణంగా ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్స్ చేసిన చిన్న పొరపాటుతో ఆమె ప్రెగ్నెట్ అవుతుంది. ఇంతకూ ఆస్పత్రిలో జరిగిన సంఘటన ఏంటి..? అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఊప్స్ అబ్ క్యా చిత్రం రానుంది. అయితే, ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది.కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు వారికి దగ్గరైన శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఊప్స్ అబ్ క్యా చిత్రం డైరెక్ట్‌గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో(Disney+ Hotstar) స్ట్రీమింగ్ కానుంది. సినిమా చాన్స్‌లు తగ్గిన తర్వాత శ్వేతా పలు బోల్డ్ వెబ్ సిరీస్‌లలో నటించింది. ఈ క్రమంలో ఆమె నుంచి వస్తున్న చిత్రం కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ప్రస్తుతం హిందీ వర్షన్లో మాత్రమే రిలీజ్ కానుంది. అయితే, తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.( ఇదీ చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ అమ్మాయి అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే పరిస్థితి ఏంటి..? అనే బోల్డ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ వస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే కాస్త ఆసక్తిగా, సరికొత్త కథతో మేకర్స్ తెరకెక్కించారని తెలుస్తోంది. టీజర్ ప్రారంభంలోనే ఒక పెద్దావిడ తన మనవరాలికి శీలం గురించి చెబుతుంది. పిగ్గీ బ్యాంక్‌లా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తుంది. ఇంతలో ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అని తేలుతుంది. అయితే, ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉండటం వల్ల ఇదంతా జరిగింది ఏమో అనుకుంటారు. కానీ, తమ మధ్య ఎలాంటి పొరపాటు జరగలేదని ఆ యువతి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అయితే, అసలు తప్పు డాక్టర్ దగ్గర జరిగిందని తర్వాత ఆమె తెలుస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం వెళ్లిన ఆ అమ్మాయికి డాక్టర్ పొరపాటును మరొకరి స్పెర్మ్ ఇన్సర్ట్ చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న మరో అమ్మాయికి అందించాల్సిన చికిత్స పొరపాటున తనకు చేసినట్లు డాక్టర్ చెప్పడంతో ఖంగుతింటుంది. అయితే, ఆ ప్రెగ్నెన్సీని ఆమె కొనసాగించాలని నిర్ణయించుకుంటుంది. అందుకు కారణాలు ఎంటి..? ఆ తర్వాత కథలో అనేక మలుపులు. చివరకు ఏం జరిగిందన్నది తెలియాలంటే ఫిబ్రవరి 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూసేయండి. -
సైఫ్‌పై దాడి కేసులో నా కుమారుడిని ఇరికించారు: నిందితుడి తండ్రి
'పొట్టకూటి కోసం వచ్చిన నా కొడుకు నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి చేయలేదు. కావాలనే అతడ్ని ఈ కేసులో ఇరికించారు' అంటున్నాడు నిందితుడి తండ్రి. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించిన విషయం తెలిసిందే! నిందితుడిని బంగ్లాదేశ్ వాసిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. జనవరి 29వరకు పోలీసుల కస్టడీకి ముంబై కోర్టు అనుమతిచ్చింది.తిరిగి వచ్చేయాలనుకున్నాడుఈ క్రమంలో నిందితుడి తండ్రి మహ్మద్ రుహుల్ అమీన్ ఫకీర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియాతో ఫోన్‌కాల్‌లో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు బాగోలేనందున నా కుమారుడు మధ్యవర్తి సాయంతో ఇండియాకు వచ్చేశాడు. ఉద్యోగావకాశాల కోసం గతేడాది ఏప్రిల్‌లో భారత్‌లో ప్రవేశించాడు. కావాల్సినంత సంపాదించుకున్నాక తిరిగి బంగ్లాకు వచ్చేయాలనుకున్నాడు.ముంబైలో ఎందుకంటే?ముందుగా పశ్చిమ బెంగాల్‌లోని ఓ హోటల్లో పని చేశాడు. బెంగాల్ కంటే ముంబై రెస్టారెంట్లలో ఎక్కువ జీతం కావడంతో తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. తరచూ మాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చివరిసారిగా శుక్రవారం నాతో ఫోన్లో మాట్లాడాడు. ప్రతి నెల పదో తారీఖున అతడికి జీతం పడుతుంది. అలా నాకు రూ.10 వేలు పంపాడు. తన ఖర్చుల కోసం రూ.3 వేలు ఉంచుకున్నాడు. మేము పేదవాళ్లమే కానీ నేరస్తులం కాదు. బంగ్లాదేశ్‌లో అతడు బైక్ టాక్సీ నడిపేవాడు.అన్యాయంగా ఇరికిస్తున్నారునా కొడుకును అరెస్ట్ చేశారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది నా కొడుకు కాదు. మీరంతా పొరబడుతున్నారు. అతడెప్పుడూ తన జుట్టు అంత పొడవుగా ఉంచుకునేవాడు కాదు. ఎవరో కావాలనే ఈ కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు. అధికారులు నా కొడుకే నిందితుడు అని పొరబడుతున్నారు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇండియాలో మాకు తెలిసినవారెవరూ లేరు. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నా కొడుకు నిర్దోషిగా వస్తాడని ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.సైఫ్‌పై దాడికాగా జనవరి 16న ముంబైలోని ఇంట్లో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్ చిన్న కుమారుడు జెహంగీర్ గదిలో చొరబడ్డాడు. అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో అతడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్.. కుమారుడు తైమూర్‌తో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సైతం రక్తంతో తడిసిన సైఫ్‌ను చూసి రూపాయి కూడా తీసుకోలేదు. తీవ్రగాయాలపాలైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. వెన్నెముకలో విరిగిన 2.5 అంగుళాల కత్తి మొనను సర్జరీ చేసి తొలగించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్.. బిజోయ్ దాస్‌గా పేరు మార్చుకుని భారత్‌లో అక్రమంగా చొరబడ్డాడని గుర్తించారు.చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష -
ఎస్వీసీ ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, ఆఫీసులలో నాలుగోరోజు కూడా ఐటీ సోదాలు(Income Tax Officer) జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీస్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకెళ్లారు.దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళా అధికారి సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం నుంచి వారు తాజాగా సాగర్ సొసైటీలోని తన ఎస్వీసీ కార్యాలయానికి వెళ్లారు. తమ వాహనంలోనే దిల్ రాజును వారు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్వీసీ ఆఫీస్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. వారు నిర్మించిన పలు సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైడ్స్ గురించి అధికారులు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. -
పుష్ప-2 రికార్డ్స్ బద్దలు కొడతా : యానిమల్ హీరో
-
సాలార్ 2, దేవర 2 దాటుతాయా....
-
మ్యాడ్ బ్యూటీ '8 వసంతాలు' టీజర్ రిలీజ్
మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మొదటి విడుదలైన గ్లింప్స్‌లో అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు హీరోయిన్ ఎలివేషన్‌తో చూపిస్తే.. ఇప్పుడు టీజర్లో మంచి కంటెంట్ ఉన్న లైన్‌తో ఎమోషనల్‌గా చూపించారు ఈ చిత్రాన్ని ఫణింద్ర(Phanindra Narsetti) తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్)'8 వసంతాలు'(8 Vasantalu) చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. మ్యాడ్ మూవీలో జెన్నీ పాత్రలో అనంతిక సనీల్‌కుమార్ అదరగొట్టింది. ఇప్పుడు ఆమె మ్యాడ్ సిక్వెల్లో కూడా నటిస్తుంది. ఈ మూవీతో ఆమె చాలామంది యూత్‌కు క్రష్‌గా మారిపోయింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమకు రాకముందిఅనంతిక సనీల్‌కుమార్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ వివిధ రకాల కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేస్తుండేది. అలా గుర్తింపు రావడంతో తెలుగులో మొదట రోజ్ మిల్క్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, మ్యాడ్ సినిమాతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అనంతికకు కర్రసాముతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చు. -
విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష
సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో సంచలనాలకు చిరునామా నటి త్రిష(Trisha Krishnan) అంటారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమెకు సంబంధించి ఏ వార్త వచ్చినా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. 41 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ పడుతూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ భారీ హిట్లు కొడుతుంది. నటిగా 22 ఏళ్ల కెరీర్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ మొదలగు ఐదు భాషల్లో కథానాయకిగా సత్తా చాటుతుంది. ఇప్పటికీ అజిత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయకిగానే కొనసాగుతుంది. ఇన్ని అర్హతలు కలిగిన ఈ చైన్నె సుందరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈమె గురించి వదంతులు చాలా కాలంగానే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల నటుడు విజయ్‌తో (Vijay) కలుపుతూ రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఈమె మాత్రం విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ పలు వేదికల మీద తెలిపింది. అయితే, త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం(Political Entry) చేయబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదేవిధంగా ఈమె చాలా కాలం క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉందని పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా నటుడు విజయ్ పార్టీలో చేరనున్నారు అనే ప్రచారం బలంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష తన అభిమానులకు త్వరలో ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతుందని వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికీ అగ్ర కథానాయకిగా నటిస్తూ బిజీగా ఉన్న త్రిష నటనకు స్వస్తి చెబుతారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే నటుడు విజయ్ కూడా కెరీర్ పరంగా మంచి పీక్‌లో ఉండగానే నటనకు స్వస్తి చెబుతూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాగా త్రిష ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్త ఎంతవరకు నిజం అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో ఆమె ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, త్రిష పాలిటిక్స్‌లోకి తప్పకుండా ఎంట్రీ ఇస్తుందని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
230 కోట్లు అనేది బోనస్.. ఇంతకంటే ఏం కావాలి: వెంకటేశ్
‘‘సంక్రాంతి పండగకి నిజాయతీగా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనుకున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరించారు. హిట్ కాదు... ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. మా సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైంది. గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకటేశ్(Venkatesh) మాట్లాడుతూ– ‘‘అనిల్‌తో నేనో ఫ్రెండ్‌లానే ఉంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం.. అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్‌గా ఉంటుంది. ఐశ్వర్య అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తనకి మంచి రోల్ దొరికింది. తను చాలా అనుభవం వున్న నటి. ఈ జోనర్ చేయడం తనకి కొత్త. అనిల్ చాలా చక్కని పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. ఇక నా సినిమా ఇన్ని కోట్లు వసూలు చేయాలని నేనెప్పుడూ అడగను... వచ్చింది తీసుకోవాలి. ఇప్పటికే మా సినిమా రూ. 230 కోట్లు వసూలు చేయడం అనేది బోనస్.. ఇంతకంటే ఏం కావాలి’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ–‘‘సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం థియేటర్‌కి రావడం ఆనందంగా ఉంది. రెవెన్యూ సైడ్ కూడా మేం ఊహించినదానికంటే అద్భుతంగా రావడం హ్యాపీ’’ అని చె΄్పారు. ‘‘వెంకటేశ్‌గారి ‘కలిసుందాం రా’ సినిమా పాటలని ప్రేక్షకులు ఎంత గుండెల్లో పెట్టుకున్నారో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాంగ్స్‌ని కూడా అదే స్థాయిలో ఆస్వాదించడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ అన్నారు. -
‘లైలా’గా రెడీ కావడానికి రెండు గంటలు పట్టేది : విశ్వక్ సేన్
‘‘నా కెరీర్లో యాక్షన్ టచ్‌తో రూపొందిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫ్యామిలీ ఫిల్మ్ ‘లైలా’. చాలా క్లీన్‌గా ఉంటుంది. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం లైలాగా రెడీ కావడానికి రెండు గంటలు పట్టేది. నిజంగా అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి’’ అని హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) అన్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’( Laila). సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఇచ్చుకుందాం బేబీ...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని ఆదిత్య ఆర్కే, ఎంఎం మానసి ఆలపించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘లైలా’లో మోడల్ సోనూ, లైలా అనే రెండు పాత్రల్లో నటించా. వాలెంటైన్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డే కి మీకు లైలా ఉంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ వున్నాడు.(నవ్వుతూ). మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 14కి కలుద్దాం’ అన్నారు. ‘‘లైలా’ కథ ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి ఉంటేనే చేయగలరు. అలాంటి పిచ్చి ఉన్న విశ్వక్ దొరికారు’’ అని రామ్ నారాయణ్ చెప్పారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. రామ్ కథ చెప్పిన తర్వాత కొందరు హీరోలకు అప్రోచ్ అయ్యాను. లేడి క్యారెక్టర్ ని చేయగలుగుతామా లేదా అనుకునే టైంలో విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ కోసం తను ఎదురుచూస్తున్నాని చెప్పి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది మంచి క్యారెక్టర్ గా తన కెరీర్ లో నిలిచిపోతుంది. యూత్ ట్యాలెంట్ తో ఈ సినిమా కోసం పని చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.లిరిక్ రైటర్ పూర్ణచారి మాట్లాడుతూ... ధమ్కి లో ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ నేనే రాశాను, అది వంద మిలియన్స్ కొట్టింది. ఇప్పుడీ ఈ సాంగ్ కి రెండు వందల మిలియన్స్ కి మించి రావాలని కోరుకుంటున్నాను. ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి, నిర్మాత సాహు గారికి, డైరెక్టర్ రామ్ గారికి థాంక్ యూ. ఈ సినిమాని పెద్ద చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు -
హైలెస్సో హైలెస్సా
‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ ఆడి పాడేస్తున్నారు నాగచైతన్య (Naga Chaitanya) , సాయిపల్లవి. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘హైలెస్సో హైలెస్సా... నీవైపే తెరచాపని తిప్పేసా...’ అంటూ సాగే మూడో పాటని గురువారం రిలీజ్ చేశారు.శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటని శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ పాడారు. ‘‘మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి..’, ‘నమో నమః శివాయ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. వండర్ఫుల్ మెలోడీస్‌ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ‘హైలెస్సో హైలెస్సా..’ అంటూ సాగే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రాయడం గేమ్ చేంజర్ లా మారింది: సమంత
‘‘నేను గత రెండేళ్లుగా డైరీ రాస్తున్నాను. నా జీవితంలో డైరీ రాయడం ఓ గేమ్ చేంజర్లా మారింది. మీరూ రాయడానికి ప్రయత్నించండి’’ అంటున్నారు హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) . కాగా విజయ్ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో నటించలేదు సమంత. అయితే గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు సమంత.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారామె. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు సమంత. ఇందులో భాగంగా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.‘‘డైరీ రాయడం అనేది పాత పద్ధతే. కానీ, రాస్తే మాత్రం మనకు ఓ తీయని జ్ఞాపకంగా ఉంటుంది. నేను గత రెండేళ్లుగా డైరీ రాసే ఆచారాన్ని పాటిస్తున్నాను. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఏం రాయాలో అర్థం కాదు.కానీ, ఎంత చిన్న విషయమైనా సరే అందులో రాస్తే... మెల్లిగా అదొక అలవాటుగా మారుతుంది. మనలో చాలా మార్పులు వస్తాయి. నేను కూడా నాకు కష్టమైన, కష్టం అనిపించిన క్షణాల్లో కొన్నింటిని డైరీలో రాశాను. డైరీ రాయడం అనేది నా కష్టతరమైన క్షణాల నుంచి ఉపశమనం కలగడానికి చాలా ఉపయోగపడింది. చెప్పాలంటే డైరీ రాయడం నాకో గేమ్ చేంజర్లా మారింది. అందరూ రాయడం ప్రయత్నించండి... ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం’’ అంటూ పోస్ట్ చేశారు సమంత. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. -
హీరోల వయసు గురించి ఎందుకు మాట్లాడరో?
చిత్ర పరిశ్రమలో వయసనేది పెద్ద సమస్యే కాదని నటి మనీషా కొయిరాలా(Manisha Koirala) అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు చేసే అవకాశం ఇవ్వాలి. వయసు, వృద్ధాప్యం అనేది సినిమా ఇండస్ట్రీలో పెద్ద సమస్య కాదు. కానీ, ఇది పరిష్కరించాల్సిన సామాజిక సమస్య.ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోల వయసు గురించి ఎవరూ మాట్లాడరు. హీరోల ఏజ్‌పై కామెంట్స్ చేయడం నేనిప్పటి వరకూ వినలేదు. ఏజ్ విషయంలో కేవలం నటీమణులను మాత్రమే ఎందుకు ట్రోల్ చేస్తారో అర్థం కావడం లేదు. సీనియర్లకు తల్లి పాత్రలో లేక సోదరి పాత్రలో ఇద్దామనుకుంటున్నారు. మహిళలు ఎలాంటి పాత్రలైనా చేయగలరు. యాక్షన్ పాత్రలని కూడా సులభంగా చేయగలరు.గతంలో ఎంతో మంది సీనియర్ నటీమణులు ఈ విషయాన్ని నిరూపించారు. నేను కూడా ఇప్పటికీ ఎలాంటి పాత్ర అయినా సవాల్‌గా స్వీకరిస్తాను. కొత్త పాత్రలు చేసి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే. యాభై సంవత్సరాలు దాటినా మంచి జీవితాన్ని గడపగలం. అసలు వయసనేది సమస్య కాదని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈ విషయంలో భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలవాలి. నేను జీవించి ఉన్నంత వరకు ఆరోగ్యంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలనుకుంటున్నా.. ఇదే ఆశయంతో జీవిస్తున్నాను’’ అన్నారు. -
కోలీవుడ్‌లో సీక్వెల్ సందడి
కోలీవుడ్‌లో సీక్వెల్ హవా బాగా వీస్తోంది. కోలీవుడ్ హీరోలందరూ సీక్వెల్ జపం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో పదికి పైగా సీక్వెల్స్ సినిమాలు ఉండటమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి... ఈ సీక్వెల్స్, ఫ్రాంచైజీ చిత్రాలతో బిజీగా ఉన్న తమిళ హీరోలు ఎవరో తెలుసుకుందాం...జైలర్ తిరిగి వస్తున్నాడురజనీకాంత్ హీరోగా చేసిన ‘జైలర్’ (2023) మూవీ బ్లాక్‌బస్టర్ హిట్. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రజనీ కొత్త తరహా స్టైల్, స్వాగ్, మేనరిజమ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. వీటికి అనిరు«ధ్ రవిచందర్ మ్యూజిక్, ఆర్ఆర్ ప్లస్ అయ్యాయి. దీంతో ‘జైలర్’ మూవీ రజనీ ఖాతాలో ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా మూవీ రిలీజ్ తర్వాత ‘జైలర్ 2’ ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాలను నిజం చేస్తూ నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవలే ‘జైలర్ 2’ సినిమాను ప్రకటించారు. రజనీకాంత్ హీరోగా చేయనున్న ‘జైలర్ 2’ చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో రమ్యకృష్ణ, మీర్నా మీనన్ కీ రోల్స్‌లో, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్‌లో నటించారు. వీరందరి పాత్రలు ‘జైలర్ 2’లోనూ కొనసాగుతాయని కోలీవుడ్ టాక్. అంతే కాదు... బాలకృష్ణ, ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘జైలర్ 2’లో యాడ్ అవుతారట. ఈ సీక్వెల్ 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.వీర శేఖరన్ పోరాటంహీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) మూవీ 1996లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. 28 సంవత్సరాల తర్వాత కమల్, శంకర్ కాంబినేషన్లోనే 2024లో విడుదలైన ‘ఇండియన్ 2’ సినిమా మాత్రం ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ‘ఇండియన్ 2’ సినిమా తీస్తున్న సమయంలోనే ‘ఇండియన్ 3’ చిత్రీకరణను కూడా దాదాపు పూర్తి చేశారు దర్శకుడు శంకర్.ఈ ఏడాదే ‘ఇండియన్ 3’ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ పేర్కొన్నారు. ‘ఇండియన్, ఇండియన్ 2’ చిత్రాల్లో సేనాపతిగా కనిపించారు కమల్‌హాసన్. కానీ ‘ఇండియన్ 3’ మాత్రం సేనాపతి తండ్రి వీరశేఖరన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథనం ఉంటుంది. స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లతో వీరశేఖరన్ ఏ విధంగా పోరాడారు? అన్నది ‘ఇండియన్ 3’ స్టోరీ అని కోలీవుడ్ సమాచారం. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో వీరశేఖరన్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఇండియన్ 3’కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఇటు సర్దార్... అటు ఖైదీతండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన స్పై యాక్షన్ మూవీ ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ 2022లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ‘సర్దార్’ సినిమా క్లైమాక్స్‌లో ‘మిషన్ కంబోడియా’ అంటూ ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ను కన్ఫార్మ్ చేశారు పీఎస్ మిత్రన్. అలాగే జూలైలో ‘సర్దార్’కు సీక్వెల్‌గా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లోనే ‘సర్దార్ 2’ ప్రారంభమైంది.కార్తీ హీరోగా ఎస్జే సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ప్రధాన తారాగణంగా నటిస్తారని ఆల్రెడీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్‌లో చూడొచ్చు. అప్పుడు మిషన్ కంబోడియా వివరాలు కూడా తెరపైన కనిపిస్తాయి. ఇక ‘ఖైదీ’లో కార్తీ చేసిన దిల్లీ రోల్‌ను మర్చిపోరు ఆడియన్స్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం 2019లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో వెంటనే కార్తీతో ‘ఖైదీ 2’ చేయాలని లోకేశ్ ప్లాన్ చేశారు. కానీ లోకేశ్‌కు కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాల ఆఫర్స్ రావడంతో ‘ఖైదీ’ సీక్వెల్ షూటింగ్‌ను కాస్త ఆలస్యం చేశారు. రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. దీంతో లోకేశ్ నెక్ట్స్ మూవీ కార్తీ ‘ఖైదీ 2’నే ఉండొచ్చు. ఇలా రెండు సీక్వెల్స్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు కార్తీ.రెండు దశాబ్దాల తర్వాత..!‘7/జీ రెయిన్బో కాలనీ’ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ‘7/జీ బృందావన కాలనీ’ అంటే మాత్రం చాలామంది తెలుగు ఆడియన్స్‌కు ఈ సినిమా గుర్తొస్తుంది. 2004లో సెల్వ రాఘవన్ డైరెక్షన్లో రూపొందిన ‘7/జీ రెయిన్బో కాలనీ’ తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’గా అనువాదమై, సూపర్‌హిట్‌గా నిలి చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించారు. ఏఎమ్ రత్నం నిర్మించారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ‘7/జీ బృందావన కాలనీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా తీస్తున్నారు దర్శకుడు సెల్వ రాఘవన్.తొలి భాగంలో నటించిన రవికృష్ణనే మలి భాగంలోనూ హీరోగా చేస్తుండగా, అనశ్వర రాజన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. ఇక సెల్వ రాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) సినిమా గుర్తుండే ఉంటుంది.కార్తీ, రీమా సేన్, పార్తీబన్, ఆండ్రియా లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ 2010లో విడుదలై, బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సినిమాను 2021 జనవరి 1న ప్రకటించారు సెల్వ రాఘవన్. ఈ సీక్వెల్లో ధనుష్‌ను హీరోగా ప్రకటించారు. ఈ చిత్రం 2024లో రిలీజ్ అవుతుందని, అప్పట్లో ధనుష్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. ఇక ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సీక్వెల్ గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.అమ్మోరు తల్లినయనతార నటించిన ‘ముకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) 2020 నవంబరులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ముక్కుత్తి అమ్మన్ 2’ను ప్రకటించింది వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ. ‘ముక్కుత్తి అమ్మన్’లో నటించిన నయనతారనే సీక్వెల్లోనూ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘ముక్కుత్తి అమ్మన్’కు నటుడు ఆర్జే బాలాజీ–ఎన్జే శరవణన్ దర్శకత్వం వహించగా, ‘ముకుత్తి అమ్మన్ 2’ను మాత్రం నటుడు–దర్శకుడు సుందర్ .సి తెరకెక్కించనున్నారు. సుందర్.సి నేతృత్వంలోని మరో ఫ్రాంచైజీ ‘కలగలప్పు’లోని ‘కలగలప్పు 3’ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కామెడీ డ్రామాగా ‘కలగలప్పు’కు తమిళ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది.హారర్ ఎఫెక్ట్!ఇవే కాదు... కమల్‌హాసన్ ‘విక్రమ్ 2’, ధనుష్ ‘వడ చెన్నై 2’ వంటి చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాల సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉంది.ఈసారి హారర్ జానర్ సీక్వెల్స్ కోలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి. రాఘవా లారెన్స్ ఆధ్వర్యంలో ఆడియన్స్‌ను అలరిస్తున్న ‘కాంచన’ సిరీస్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో మరో చిత్రంగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘కాంచన 4’ రానుందని కోలీవుడ్ సమాచారం. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కాంచన 4’లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి... ‘కాంచన 4’లో ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక సుందర్ .సి సారథ్యంలో నడుస్తున్న హారర్ ఫ్రాంచైజీ ‘అరణ్మణై’ గురించి చెప్పుకోవాలి. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘డాకు’) ఆడియన్స్‌ను మెప్పించింది. దీంతో ఈ ఏడాదిలోనే ‘అరణ్మణై 5’ను కూడా తీయాలని సుందర్ .సి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. అలాగే హారర్ జానర్లో సంతానం చేస్తున్న హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘డీడీ’ నుంచి నాలుగో మూవీగా ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రం రానుంది. ఎస్. ప్రేమ్ ఆనంద్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ మేలో రిలీజ్ కానుంది. ఇక 2014లో మిస్కిన్ డైరెక్షన్లో వచ్చిన ‘పిశాసు’ (తెలుగులో ‘పిశాచి’) చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పిశాసు’ సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాసు 2’ తీస్తున్నారు మిస్కిన్. సీక్వెల్లో ఆండ్రియా మెయిన్ లీడ్ రోల్ చేశారు. మార్చిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘డీమాంటి కాలనీ’ ఫ్రాంచైజీ గురించి హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి తెలిసే ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘డీమాంటి కాలనీ 2’ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేసింది. కాగా ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ దర్శకుడు అజయ్.ఆర్ జ్ఞానముత్తు ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 3’ని ఆల్రెడీ ప్రకటించారు. ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. రిలీజ్ మాత్రం 2026లో ఉండొచ్చు.ప్రకటించారు... కానీ..!కోలీవుడ్‌లో కొన్ని హిట్ ఫిల్మ్స్‌కు సీక్వెల్స్ ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమాలు ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ సినిమాలేవో చదవండి.విదేశాల్లో డిటెక్టివ్ విశాల్ కెరీర్‌లోని వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌లో ‘తుప్పరివాలన్’ ఒకటి. మిస్కిన్ డైరెక్షన్‌లోని ఈ మూవీ తెలుగులో ‘డిటెక్టివ్’గా విడుదలై, ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్నుంచే ఈ మూవీకి సీక్వెల్ తీయానులనుకున్నారు విశాల్. మిస్కిన్ డైరెక్షన్లోనే ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు విశాల్. అయితే కథ విషయంలో మిస్కిన్కు, విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. ఆ తర్వాత ‘డిటెక్టివ్ 2’కి తానే దర్శకత్వం వహించాలనుకున్నారు విశాల్.తన స్టైల్ ఆఫ్ ‘డిటెక్టివ్ 2’తో తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నానని, ఇది తన పాతికేళ్ల కల అని, ఇందుకోసం లండన్, అజర్ బైజాన్, మాల్తా వంటి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నానని గత ఏడాది మార్చిలో విశాల్ పేర్కొన్నారు. కానీ ‘డిటెక్టివ్ 2’ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదని తెలుస్తోంది. ఇలా విశాల్ నుంచి ‘డిటెక్టివ్ 2’ అప్డేట్ రావాల్సి ఉంది. అలాగే విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇరంబుదురై’ మూవీ 2018లో రిలీజై, హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందనే టాక్ వినిపిస్తోంది. బాక్సింగ్ రౌండ్ 2 నాలుగు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ‘సార్పట్టై పరంబర’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. పా. రంజిత్ డైరెక్షన్‌లోని ఈ మూవీకి వీక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ‘సార్పట్టై పరంబర’ సినిమా సీక్వెల్‌ను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని పా. రంజిత్ భావించారు. 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర’ సినిమాకు సీక్వెల్‌గా ‘సార్పట్టై రౌండ్ 2’ ప్రకటించారు. అయితే ఈ మూవీపై మరో అప్డేట్ రావాల్సి ఉంది.తని ఒరువన్ 2 రవి మోహన్ (‘జయం’ రవి తన పేరును ఇటీవల రవి మోహన్‌గా మార్చుకున్నారు) హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో వచ్చిన ‘తని ఒరువన్’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2015లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘తని ఒరువన్ 2’ని ప్రకటించారు మోహన్ రాజా. అయితే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్’తో రవి మోహన్ బిజీగా ఉండటం వల్ల ‘తని ఒరువన్ 2’ చేయడానికి వీలు పడలేదు. ఈ ఏడాది ఈ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లే సాధ్యసాధ్యాలను రవి మోహన్ పరిశీలిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాని కూడా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇక ‘తన్ ఒరువన్’ మూవీ తెలుగులో ‘ధృవ’ (రామ్ చరణ్ హీరోగా నటించారు)గా రీమేక్ అయి, విజయం సాధించిన సంగతి తెలిసిందే. – ముసిమి శివాంజనేయులు