breaking news
Chittoor
-
వ్యక్తి ఆత్మహత్య!
పలమనేరు: మండలంలోని కాలువపల్లి కౌండిన్య జలాశయంలో గుర్తుతెలియని 40 ఏళ్లకు పైనున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగుచూసింది. నీటిపై తేలిన శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు బట్ట తల, గడ్డం కలిగి, మంచి దుస్తులు ధరించి, ఖరీదైన వాచ్, వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని ఉన్నాడు. మెడలో కరుగంళిమాలను సైతం ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతనికి సంబంధించిన వివరాలు తెలిస్తే స్థానిక స్టేషన్లో సంప్రదించాలని ఇక్కడి పోలీసులు తెలిపారు. ఇద్దరు దొంగలు అరెస్టు ఏడు బైకుల స్వాధీనం చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న జయకుమార్ (26), లోకనాథన్ (18) అనే ఇద్దరు నిందితులను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి దాదాపు రూ.3.5 లక్షల విలువ చేసే ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం చిత్తూరులోని టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐలు మహేశ్వర, నెట్టింకంటయ్య కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇటీవల నగరంలో మోటారు సైకిళ్లు వరుసగా చోరీకి గురయ్యాయని, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. చిత్తూరు–వేలూరు రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు తమిళనాడులోని వేలూరుకు చెందిన జయకుమార్, లోకనాథన్ ఇద్దరు అనుమానితులు కనిపించారని తెలిపారు. వీళ్లను విచారించగా మోటారు సైకిళ్లను చోరీ చేసినట్లు అంగీకరించినట్టు వెల్లడించారు. నిందితులు దాచి ఉంచిన ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. పారిపోయిన సయ్యద్ నస్రుల్లా అనే నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ రమేష్ బాబు, సిబ్బంది బాబు, నరేష్, మునస్వామి, రఫుల్లా పాల్గొన్నారు. అది దుర్మార్గం పాలసముద్రం : గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం దుర్మార్గమని జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగనన్న హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి, రూ 8,450 కోట్లతో పూర్తిచేయాలని సంకల్పించారని, ఇందులో భాగంగానే మొదటి దశలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల ముందు మరో మూడు కాలేజీలు పూర్త య్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రయివేటు పరం చేస్తోందన్నారు. -
వంచనగురూ!
తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసిన సమాజం మనది. గురువులను సమాజనిర్దేశకులంటారు. ఎక్కడైతే మంచి గురువు ఉంటాడో అక్కడి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. గతంలో ఉన్న గురువులు ఎంతో నిజాయితీతో పనిచేసేవారు. అందుకే వారికి ఇప్పటికీ సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో కొందరు టీచర్ల తీరు మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకే మాయని మచ్చని తెచ్చిపెడుతోంది. ఎలాగూ సర్కారు కొలువు.. నెలకి మంచి జీతం.. పిల్లలు ఎలా పోతే మాకేంటి.. మా పిల్లలు కార్పొరేట్ బడుల్లో చదువుకుంటున్నారనే భావన, వృత్తిపై నిర్లక్ష్యాన్ని, వికృత చేష్టల వైపు ఉసిగొల్పుతోంది. ఇంతకీ ఆ గురువంచన ఏందో మీరే చదవండి..! పలమనేరు: నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం, దేవదొడ్డి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ టీచర్ (45) బడిలోని పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, తాకరానిచోట తాకడం, ఎవరైనా చెప్పారంటే తాటతీస్తానంటూ బెదిరించడం అలవాటుగా చేసుకున్నారు. తాజాగా శుక్రవారం ఆ బడి పిల్లలే ఆ విషయాలు చెప్పడంతో వెలుగుచూసింది. గ్రామస్తులంతా ఏకమై ఆ పంతులు గారికి దేహశుద్ధి చేశారు. ఇలాంటి కీచక గురువుల కారణంగా నిజాయితీగా పనిచేసే గురువులకు సమాజంలో గుర్తింపులేకుండా పోతోంది. ఎంతసేపూ సంపాదనే పలమనేరు నియోజకవర్గంలోని కొందరు టీచర్లు గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్‌లో స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉండేవారు. కానీ ఈ మధ్య వారే రంగంలోకి దిగి వెంచర్లు వేయడం, ప్లాట్లను అమ్మడం లాంటి కార్యక్రమాల్లో బిజీగా కనిపిస్తున్నారు. వీరితోపాటు ఎందరో టీచర్లను ఇందులోకి చేర్చి వారికి సైట్లను అమ్మడం లేదా వారిని భాగస్వాములుగా చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. నెలవారీ చీటీల గోల మరికొందరు టీచర్లు నెలవారీ చీటీలు, ఫైనాన్స్ వ్యాపారాల్లో తలమునకలైపోయారు. వీరికి బడితో పనిలేదు. కేవలం నెలవారీ చీటీలు, కొత్త సభ్యులు, చీటీల సొమ్ము వసూలు చూసుకుంటూ ఎప్పుడో తూతూమంత్రంగా విధులు నిర్వహించడం పరిపాటిగా మారింది. మహిళా టీచర్లు సైతం చీరల వ్యాపారాలు, చైన్‌లింగ్ వ్యాపారాలు, సన్నబడే మందులు, టానిక్‌ల వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు. అదనపు సంపాదనపై చూపుతున్న శ్రద్ధ పిల్లల చదువు పట్ల లేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. నీతిగా, నిజాయితీగా పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా పనిచేస్తున్న గురువులకు ఇలాంటి వారి కారణంగా సమాజంలో మర్యాదలేకుండా పోతోంది.ఉపాధ్యాయ వృత్తికే కళంకం దేవదొడ్డి ఘటనతో చాలాబాధపడ్డాను. ఇలాంటి గురువుల ప్రవర్తక కారణంగా మొత్తం వ్యవస్థపైనే చెడు భావం కలుగుతుంది. మంచి సమాజాన్ని నిర్మించాల్సిన గురుతర బాధ్యత గురువులపై ఉంది. కానీ కొందరి కారణంగా సమాజంలో టీచర్లు తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. – సోమచంద్రారెడ్డి, మాజీ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి మా బిడ్డలను మీ పిల్లలుగా చూసుకుంటారనే నమ్మకంతో బడికి పంపుతాం. కానీ టీచర్లే ఇలా కీచకులుగా మారి వికృతంగా ప్రవర్తిస్తే వీరినేమనాలి. ఇలాంటి టీచర్ల కారణంగా అందరూ టీచర్లకు చెడ్డపేరు ఎందుకు రాదు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – ఈశ్వర, పేరెంట్, దేవదొడ్డి గ్రామం -
మొక్కుబడిగా పెట్టుబడీదారుల సదస్సు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి తాజ్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు (రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్) మొక్కుబడిగా సాగింది. ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట హాజరయ్యారు. కాగా వేదికపై ప్రత్యేకంగా ఆహ్వానించిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల ప్రసంగాలకే అధిక సమయం కేటాయించారు. మధ్యాహ్న భోజన సమయంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగంలో పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహాన్ని వివరించే ప్రయత్నం కాస్త పక్కదారి పట్టింది. వినేవారు లేకపోవడంతో ఇన్వెస్టర్స్‌తో, హోమ్ స్టే ఆపరేటర్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతామంటూ కార్యక్రమాన్ని మమ అనిపించారు. అనంతరం కూటమి నాయకులు మంత్రిని సన్మానించేందుకు అత్యుత్సాహం చూపారు. సన్మాన, సత్కారాల అనంతరం మీడియా ముందుకు మంత్రి కందుల దుర్గేష్ వచ్చారు. ఏపీలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. కూటమి పాలనలో పర్యాటక రంగానికి ఏమి చేస్తామనే అంశాలను దాటవేస్తూ గత వైఎస్సార్సీపీ పాలనలో పర్యాటక రంగం అభివృద్ధి జరగలేదనే విష పూరిత వ్యాఖ్యలతో ప్రభుత్వ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆహ్వానం లేదంటూ సీఆర్ రాజన్ మండిపాటు రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఆ శాఖ అధికారుల పిలుపు మేరకు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు హాజరయ్యారు. వారందరిని ప్రత్యేకంగా వేదికపైకి ఆహ్వానించారు. అయితే అక్కడే ఉన్న రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్‌ను పిలువలేదు. దీంతో ఆయన తీవ్ర మసస్తాపానికి గురయ్యారు. ఇతరులు చెబితే తెలుసుకుని ఇక్కడికి వస్తే ప్రొటోకాల్ మేరకు పిలవాలనే జ్ఞానం లేదా అంటూ ఆయనకు ఎదురుపడ్డ జిల్లా పర్యాటకశాఖ అధికారి జనార్దన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో పాటు ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానంటూ మండిపడ్డారు. ఆహ్వానించడం అనే విషయం తన పరిధిలో కాదని తన పై అధికారులంటూ నచ్చజెప్పే ప్రయత్నం జనార్దన్ రెడ్డి చేశారు. అయితే సీఆర్ రాజన్ ఆ మాటలు పట్టించుకోకుండా తనతో వచ్చిన అనుచరులతో బయటకు వెళ్లిపోయారు. -
అక్కడ ఇసుక తవ్వకాలు నిషేధం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషేధిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 45,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నట్టు తెలిపారు. జిల్లాలో ఇసుక తవ్వేందుకు ఎక్కడైనా యంత్రాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా పక్క రాష్ట్రాలకు ఇసుక తరలించనా సహించేది లేదన్నారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఆర్డీవో శ్రీనివాసులు, మైన్స్ డీడీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ బ్యాటరీ వాహనం విరాళం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి శుక్రవారం కెనరా బ్యాంక్ ఎలక్ట్రికల్ బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందించింది. రూ.5.5 లక్షల విలువ చేసే ఈ వాహనాన్ని దివ్యాంగుల నిమిత్తం అందజేసినట్లు బ్యాంకు అధికారులు నాగేశ్వరారవు, అనురాధ, పాండురంగ తెలిపారు. -
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఎంవీ రమణ
చంద్రగిరి : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా ఎంవీ రమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై వర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. వ్యవసాయ వర్సిటీలో వివిధ హోదాలలో 34 ఏళ్లుగా బోధన, పరిశోధన రంగాలలో సుదీర్ఘ సేవలు అందించారు. 2013లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుతో పాటు 2015లో యూనివర్సిటీ స్థాయిలో ఏవీ కృష్ణయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. రిజిస్ట్రార్ పదవికి మరింత వన్నె తెచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. -
అడ్మిషన్లు ఒక చోట... హాజరు మరోచోట
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు పలు అక్రమాలకు తెరలేపుతున్నారు. తప్పుడు ప్రచారాలతో అడ్మిషన్లు చేసుకుని విద్యార్థులను ముప్పుతిప్పలకు గురిచేస్తున్నారు. కొందరు పేరొందిన కళాశాలల కంటే తాము 30 నుంచి 40 శాతం వరకు తక్కువ ఫీజుతో బోధన అందిస్తామని, ఐఐటీ, జేఈఈ, నీట్ క్లాసులను ప్రత్యేకంగా నిర్వహిస్తామని మాయమాటలతో అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఆ కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌ను ఇతర కళాశాలలకు పంపడం, పాస్ అయిన తర్వాత టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లను మరొక కళాశాల నుంచి ఇప్పించడం వంటివి చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలో ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా మోసం చేస్తున్నారు. ఇలాంటి అవకతవకల వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ ఫీజులు అని అడ్మిషన్ల సమయంలో చెప్పి చేర్పించిన తర్వాత అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు మరొక చోట పిల్లల సర్టిఫికెట్లు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిత్తూరు నగరంలోని మురుగానపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలకు మించి ఆ కళాశాలలో విద్యార్థులు ఉండడంతో అడ్మిషన్లు అక్కడే చేయించుకుని, అటెండెన్స్ మరొకచోట వేస్తున్నారు. ప్రతి విద్యాసంవత్సరం ఇదే తంతు కొనసాగుతోంది. చిత్తూరు నగరంలోని మురుగానపల్లిలో ఉండే మరో ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఏకంగా అడ్మిషన్లు, ఫీజులు ఆ కళాశాలలో చేయించుకుంటూ ఉత్తమ ర్యాంకుల కోసం సమీప మండలాల్లోని మరో ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్నట్లు రికార్డుల్లో రాయిస్తున్నారు. పబ్లిక్ పరీక్షల సమయంలో సమీప మండలంలో ఒకే పరీక్ష కేంద్రం ఉండడం వల్ల మాల్ ప్రాక్టీస్‌కు ఎక్కువ అవకాశాలుంటాయని వారి భావన. విద్యాశాఖ విఫలం జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ అధికారులు ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలు చేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒక వేళ కొన్ని కళాశాలలకు వెళ్లినా పరిసర ప్రాంతాలను పరిశీలించి... చాయ్ బిస్కెట్ తినేసి వచ్చేస్తున్నారనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎంత మంది ? అడ్మిషన్ రిజిస్టర్లు రాస్తున్నారా? సరైన రికార్డులు అమలు చేస్తున్నారా ? పలు విషయాలను తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పట్టించుకుంటే ఒట్టు జిల్లాలో చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరిలో ఉండే పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇష్టానుసారంగా విద్యార్థులను అడ్మిషన్ చేసుకున్నాయి. దీనిపై సంబంధిత జిల్లా అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులున్న కళాశాలలను వదిలేసి ఫిర్యాదులు లేని కళాశాలలను తనిఖీ చేస్తున్నారు. అధిక సంఖ్యలో అడ్మిషన్లు చేయించుకున్న కళాశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా -
ఆపద్బాంధవులవుదాం.. రండి!
చిత్తూరు కలెక్టరేట్ : ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు, సమాజంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు స్పందించి సహాయ కార్యక్రమాలు చేడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా ప్రజలకు సేవలందిస్తుంటారు. అలాగే విపత్తు సమయాల్లో ఏం చేయాలి? అనే దానిపై అవగాహన కల్పిస్తుంటారు. అలాంటి వాటిలో పౌరరక్షణ దళం ఏర్పాటు చేయాలని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ భావించింది. యువ ఆపదమిత్ర పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం నిర్వహణ బాధ్యతలను జాతీయ విపత్తు సంస్థ, మేరా యువ భారత్‌కు అప్పగించింది. ఆపద వేళ ఆదుకునేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు జిల్లాలో అర్హత ఉన్న వలంటీర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆపద మిత్ర పట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి దరఖాస్తులు చేయించేందుకు నెహ్రూ యువ కేంద్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 140 దరఖాస్తులు అందినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. శిబిరం, చేయాల్సిన విధులుఅర్హులు ఎవరంటే దరఖాస్తుకు సెప్టెంబర్ 20 వరకు గడువు జిల్లాలో ఆపద మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు నెహ్రూ యువ కేంద్ర అధికారులు వెల్లడించారు. దరఖాస్తులను చిత్తూరు జిల్లా కేంద్రం గిరింపేట వద్ద ఉన్న పగడమాను వీధిలో నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 8368866411 నంబర్లో సంప్రదించవచ్చు. ఈ పథకంలో ఎంపికయ్యే వారికి వారం పాటు ఉచితంగా శిక్షణ ఉంటుంది. భూకంపాలు, వరదలు, కరువు, కరోనా, ప్రమాదాలు సంభవించినప్పుడు, అల్లర్లు చోటు చేసుకున్నప్పుడు ప్రజలను రక్షించడం. భద్రతా దళాలకు అండగా ఉంటూ సహాయం చేయడం. గాయపడిన వారికి ప్రథమ చికిత్సలు చేయడం, పరిస్థితి విషమంగా ఉంటే దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించడం. ట్రాఫిక్ నిర్వహణ వల్ల జన సముదాయాలను నియంత్రించడం. విపత్తుల వేళ ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లడం శిక్షణను విజయవంతంగా పూర్తిచేసే యువతకు ఆపత్కాలంలో ఉపయోగపడే కిట్, సర్టిఫికెట్ అందజేస్తారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. పాత్రికేయులకు స్వేచ్ఛ ఇవ్వాలి. నిజాలను నిర్భయంగా రాసే వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. నాయకులు తెలియజేసిన విషయాలను కూడా పేపర్లలో రాయడం నేరమనడం హాస్యాస్పదం. అలాగే పొలీసు వ్యవస్థలో లోటుపాట్ల గురించి వాస్తవాలు రాస్తే పత్రికా యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ‘సాక్షి’పై కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. –జ్ఞానేంద్రరెడ్డి, మాజీ ఎంపీ, చిత్తూరు -
16 నుంచి అప్పలాయగుంట పవిత్రోత్సవాలు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీవాణి తెలిపారు. దోషాల నివృత్తితో ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. 16న అంకురార్పణ, 17న పవిత్ర ప్రతిష్ట, 18న పవిత్ర సమర్పణ, 19న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. పవిత్సోవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మందులు, మాత్రలపై విచారణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): మందులు, మాత్రల కొరతపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సాక్షి దినపత్రికలో గురువారం ‘మందుల్లేవ్’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి మందులు, మాత్రల కొరతపై ఆరా తీశారు. పలు పీహెచ్సీ డాక్టర్లను విచారించారు. స్టాక్ విషయాలను తెలుసుకున్నారు. లేని మందులు, మాత్రల వివరాలను తెలుసుకుని డ్రగ్స్‌స్టోర్‌కు నివేదికలు పంపారు. అలాగే డ్రగ్స్‌స్టోర్‌కు సైతం లోటును భర్తీ చేశారు. కళా ఉత్సవ్‌లో ప్రతిభ చిత్తూరు కలెక్టరేట్ : కళా ఉత్సవ్ పోటీల్లో డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటినట్టు ఆ కళాశాల హెచ్ఎం హసన్‌బాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11, 12 తేదీల్లో కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలలో జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న తమ పాఠశాల విద్యార్థులు 2 డీ డ్రాయింగ్ వ్యక్తిగత విభాగంలో మితేష్, జంబూ వాయిద్యంలో మల్లేష్ కుమార్‌లు ప్రతిభచాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు వెల్లడించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన గైడ్ టీచర్ పాపయ్యను, గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. నేడు జాతీయ లోక్ అదాలత్ చిత్తూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తిరుపతి, చిత్తూరు డివిజన్లలో ఇందుకోసం ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమే లక్ష్యంగా అదాలత్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రాజీ చేసుకోదగ్గ కేసులను అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. మరోమారు గడువు పొడిగింపు చిత్తూరు అర్బన్: జిల్లాలో మద్యం బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగిస్తున్నట్టు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధిరాని శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరులో 5, పలమనేరులో ఓ బార్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి తొలుత ఈనెల 14 వరకు గడువు విధించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించడానికి ఈనెల 18వ తేదీ ఉదయం 8 గంటలకు చిత్తూరు కలెక్టరేట్లో లక్కీడిప్ నిర్వహిస్తామన్నారు. వైభవం.. విమానోత్సవం కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిద్ధి బుద్ధి వినాయకస్వామి విమాన సేవను నేత్ర పర్వంగా జరిపించారు. వేకువజామున మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేశారు. రాత్రి అలంకార మండపంలో ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం చేశారు. ప్రత్యేక పూజలనంతరం ఊరేగింపుగా విమాన వాహన సేవపై కొలువుదీర్చారు. తర్వాత విమానసేవ కన్నుల పండువగా సాగింది. -
ప్రజాస్వామ్యానికి ముప్పు
వాస్తవాలను వెలికితీసే పత్రికలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం, వేధించడం ప్రజాస్వామ్యానికి ముప్పు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేట్‌మెట్లు, ప్రసంగాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేయడం, పత్రిక, ఎడిటర్, సిబ్బందిని నిందితులుగా చూపడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా పత్రికలపై కేసులు పెట్టి, వేధించడం దారుణం. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికలు నిర్వీర్యమైపోతాయి. బలమున్నవాడికే జీవించే హక్కు లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికై న ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – రెడ్డెప్ప, మాజీ ఎంపీ -
ఆశలు నేలమట్టం.. అందదా పరిహారం
జిల్లాలో వ్యవసాయరంగం కుదేలవుతోంది. పంటలపై ప్రకృతి విరుచుకుపడుతోంది. వరుస విపత్తులతో పంట మొత్తం దెబ్బతింటోంది. వేరుశనగ పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. రైతుల పెట్టుబడి మట్టికొట్టుకుపోయింది. నష్టం అంచనా పరిశీలనకే పరిమితమైంది. ఏడాదిలో పరిహారం చెల్లింపు విషయమై జాప్యం జరుగుతోంది. మామిడికి మద్దతు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. సాగుపై రైతులు ముఖం చాటేయాల్సి వస్తోంది. అయినా కూటమి ప్రభుత్వం అన్నదాత విషయంలో చిన్నచూపు చూస్తోంది. కాణిపాకం: జిల్లాలో వ్యవసాయరంగంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. వరి, మామిడి, కూరగాయలు, పండ్ల తోటలపై అధికంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే ప్రకృతి సహకరించక వీరి బతుకులు అతలాకుతలమవుతున్నాయి. సాగులో ఉన్న పంటలను భారీ వర్షాలు మింగేస్తున్నాయి. లేకుంటే అదునుకు వర్షాలు కురవక మట్టిపాలు చేస్తున్నాయి. దీంతో రైతులు కంటతడి పెడుతున్నారు. వేరుశనగ నేలమట్టం గతేడాది ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 43,174 హెక్టార్లు కాగా 13,044 హెక్టార్లలో పంట సాగు చేశారు. అదునుకు వర్షాలు లేక 9 వేల హెక్టార్లల్లో పంట దెబ్బతింది. వీటిని వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. పంట నష్టం విలువ రూ.15.42 కోట్లుగా అంచనా వేశారు. యాదమరి, గుడిపాల, పెనుమూరు మండలాలను అత్యంత కరువుల మండలాలుగా ప్రకటించారు. మరో 13 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. దీనిపై కేంద్ర కరువు బృందం యాదమరి, గుడిపాల మండలాల్లో పర్యటించి పరిశీలన చేపట్టింది. అయినా ఇంత వరకు పంట నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు గొగ్గోలు పెడుతున్నారు. మామిడికి ఏదీ మద్దతు ఈ సారి మామిడి పంట తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. పండిన ఫలాలను అమ్ముకోవడానికి రైతులు పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. తీరా ఆ ఫలానికి తగ్గ ప్రతిఫలం కూడా ఇంతవరకు చేతికి అందలేదు. 31 ఫ్యాక్టరీలు 49,350 మంది రైతుల నుంచి 2.31 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను కొనుగోలు చేశాయి. అలాగే ర్యాంపులు 30,600 మంది రైతుల నుంచి 1.44లక్షల మెట్రిక్ టన్నుల కాయలను తీసుకున్నాయి. అవీ ఇంత వరకు రైతులకు డబ్బులు ఇవ్వలేదు. కార్వేటినగరంలోని ఫ్యాక్టరీ మాత్రం తోతాపురి కేజీకి రూ.4.90 చొప్పున్న చెల్లించింది. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర మరుగున పడింది. ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఉద్యాన పంటల నష్టం ఇలా.. గతేడాదితో పాటు..ఈ సారి కురిసిన వర్షాలకు ఉద్యాన పంటలు 52.31 హెక్టార్లల్లో దెబ్బతిన్నాయి. మామిడి 46.60 హెక్టార్లు, టమాటా 1.96 హెక్టార్లు, కాకరకాయ 0.90 హెక్టార్లు, కీరకాయ 0.45 హెక్టార్లు, చామంతి 0.20 హెక్టార్లు, బొప్పాయి 2.00 హెక్టార్లు, బీరకాయ 0.20 హెక్టారల్లో నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మొత్తం రైతులు 115 మంది నష్టపోగా.. రూ.34.23 లక్షలు నష్టం జరిగినట్లు లెక్కగట్టారు. అయితే ఇంత వరకు పంట నష్టపరిహారం రాకపోవడంతో రైతులు మండిపోతున్నారు. తుపాను దెబ్బకు ఇలా... గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాను దంచి కొట్టింది. దీని ధాటికి వరి, రాగి 66.18 హెక్టార్లల్లో దెబ్బతింది. ఈ పంట సాగులో 194 మంది రైతులు నష్టపోగా...పంట నష్టం విలువ రూ.11.21 లక్షలుగా లెక్కగట్టారు. ఈ నివేదికలు ప్రభుత్వానికి చేరగా.. నష్ట పరిహారం కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. -
పేదలను దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం
వెదురుకుప్పం: గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో కూటమి దోపిడీ పెచ్చుమీరుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. శుక్రవారం పుత్తూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మట్టి, గ్రావెల్, ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఇక్కడి నుంచి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా పాలసముద్రం మండలంలో ఉన్న కొండలు, గుట్టలను తవ్వి అక్రమంగా తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో నడుస్తున్న సుమారు 33 క్వారీలల్లో కూటమి నాయకులు నియమించుకున్న వసూలు రాజాలు ముక్కుపిండి దందాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. కూటమి నాయకులు చేస్తున్న పాపాలను వైఎస్సార్సీపీ నేతలకు అంటగట్టేందుకు ప్రయత్నించడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ఒక్కో క్వారీ యజమాని నుంచి రూ.3 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. తాజాగా వెదురుకుప్పం మండలం, బందార్ల పల్లె గ్రామ సమీపంలో ఎద్దల బండపై క్వారీ నడిపే ప్రయత్నంలో టీడీపీకి చెందిన రౌడీ మూకలు గ్రామస్తులపై దాడులకు దిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
అవినీతి ఆరోపణలు
అంతర్గత కుమ్ములాటలు.. సమన్వయ లోపం.. కూటమి నేతల పెత్తనం వెరసి చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని మెప్మా పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇక్కడ పనిచేయాలంటేనే అధికారులు, సిబ్బంది వణికిపోవాల్సి వస్తోంది. తొమ్మిది నెలల్లోనే ఇద్దరు సీఎంఎంలను సరెండర్ చేయడం ఇక్కడి వేధింపులకు నిదర్శనంగా మారింది. చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లోని పట్టణ దారిద్య్ర నిర్మూలనా విభాగం అంటే కాస్త అర్థం కాకపోవచ్చు. మెప్మా విభాగమంటే తెలియని వాళ్లు ఉండరు. గత తొమ్మిది నెలల కాలంలో ఇద్దరు సిటీ మిషన్ మేనేజర్ (సీఎంఎం)లను సరెండర్ చేయడం చర్చనీయాంశమవుతోంది. జన సమీకరణ ఒత్తిడి ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలకు మహిళా సంఘాలను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొందరు ఆర్పీలు జన సమీకరణ సమయాల్లో మహిళా సంఘాలను ఫోన్లలో బెదిరింపులకు గురిచేయడం, సంక్షేమ పథకాలు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని సభలకు పది వేల మంది రావాలని, ఇంకొన్ని సార్లు 15 వేల మంది రావాలంటూ కూటమి నేతలు మెప్మా సీఎంఎంలపై ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలున్నాయి. ఆశించిన స్థాయిలో మహిళలు హాజరుకాకపోవడంతో అధికారులపై ఫైర్ అవుతుండడంతో కొందరు సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. మరికొందరిని సరెండర్ చేస్తున్నారు. ఒక్కసారి సీఎంఎం బదిలీపై వస్తే దాదాపు మూడేళ్లకు పైనే పనిచేస్తారు. కానీ ఇక్కడ మాత్రం తొమ్మిది నెలల్లో ఇద్దరు సీఎంఎంలు బదిలీ అవడం పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏ అధికారి ఇక్కడ పనిచేయడానికి వచ్చే అవకాశం ఉండదు. ఎవరిదారి వారిది? చిత్తూరు కార్పొరేషన్లో 3,340 వరకు మహిళా సంఘాలు మెప్మా పరిధిలో ఉన్నాయి. 34 వేల మందికి పైగా మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీళ్లను పర్యవేక్షించడానికి 111 మంది రిసోర్సు పర్సన్లు, పది మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు, 111 ఎస్ఎల్ఎఫ్లు ఉన్నాయి. వీళ్లందరి పర్యవేక్షణ సీఎంఎం చూసుకోవాలి. కానీ ఇక్కడ ఒకరికి మరొకరికి సమన్వయం ఉండడంలేదు. ఆర్పీలపై సీఎంఎం ఒత్తిడి చేయడం, ఎస్ఎల్ఎఫ్లు తమ గుప్పెట్లో ఉండాలని తాపత్రయపడడం అంతర్గత కుమ్ములాటకు ఆజ్యం పోస్తోంది. గతంలో పనిచేసిన అధికారుల ఏం అవినీతి చేశారు..? ఎందులో ఎవరిని ఇరికిద్దామని గూఢచార్యం చేయడం మెప్మా విభాగంలో సర్వసాధారణమైపోయింది. మహిళా సంఘాలకు ప్రధానంగా బ్యాంకు రుణాలు ఇప్పించి, వారి ఆర్థిక స్థితి గతులను మార్చడమే మెప్మా లక్ష్యం. కానీ కొందరు మహిళలు వారికున్న వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి బ్యాంకు రుణాలు ఇప్పించి కమీషన్లు దండుకుంటున్నారు. వీటికి తోడు అనధికారింగా రూ.లక్షల విలువ చేసే చీటీలు వేయడం, అందులో మహిళా సంఘ సభ్యులు చేరాల్సిందేనంటూ తప్పనిసరి చేస్తున్నారు. తీరా చీటీలు ఎత్తిన తరువాత డబ్బు ఇవ్వకుంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఇంకొందరు ఏకంగా మీడియా సమావేశాలు నిర్వహించి అధికారులు అసభ్య ప్రవర్తనపై బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు. గాడి తప్పిన మెప్మా విభాగాన్ని సరిదిద్దడానికి ఇటు కమిషనర్, అటు అర్బన్ పీడీ దృష్టి సారిస్తే తప్ప.. సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. -
వికలత్వంపై మరోసారి పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఇటీవల నోటీసులు అందుకున్న దివ్యాంగుల వికలత్వాన్ని మరోసారి పరిశీలించనున్నట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించి అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హత ఉన్న దివ్యాంగులందరికీ పింఛన్ అందజేస్తామన్నారు. నోటీసులందిన వారందరూ మరోమారు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. జిల్లా లో త్వరలో రీ అసెస్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పాటు ఇతర అధికారులను నియమిస్తామన్నారు. పరిశీలన చేసే సమయంలో ఫొటో గ్రాఫర్, వీడియోగ్రాఫర్లను నియమించి పరిశీలన చేయిస్తామని తెలిపారు. జిల్లాలో పింఛన్ రీ అసెస్మెంట్కు ఇప్పటి వరకు 4 వేల దరఖాస్తులు అందినట్లు చెప్పారు. అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, డీఎంహెచ్‌వో సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, దివ్యాంగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి పాల్గొన్నారు. -
ఎక్సైజ్ కుర్చీకి ఎసరు?
చిత్తూరు అర్బన్ : జిల్లాలో మద్యం బార్ల వ్యవహారం ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి కుర్చీకి ఎసరు తెచ్చిపెట్టనుందా? నిర్ణీత గడువులోపు బార్లకు దరఖాస్తులు రాకుంటే ఆ అధికారిపై బదిలీ వేటు తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మద్యం బార్లకు దరఖాస్తులు కూడా వేయించనివాళ్లు, ఏం పనిచేస్తారని ఇప్పటికే రెండు జిల్లాల్లోని ఎక్సైజ్ అధికారులపై బదిలీ వేటు పడటం ఇక్కడి అధికారులను కలవరానికి గురిచేస్తోంది.రెండు రోజులే గడువుజిల్లాలో 12 మద్యం బార్లకు గతనెల నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇందులో చిత్తూరులో 8, కుప్పం, నగరి, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీల్లో ఒక్కో మద్యం బారు ఏర్పాటు చేయాలని నోటిఫై చేశారు. కుప్పం, పుంగనూరు, నగరితో పాటు చిత్తూరులో మూడు (ఒకటి గీత సామాజిక వర్గాలకు) బార్లకు దరఖాస్తులు రావడంతో లైసెన్సులు కేటాయించారు. పలమనేరు, చిత్తూరులోని మరో అయిదు బార్లకు దరఖాస్తులు రాకపోవడంతో వీటికి రీ–నోటిఫికేషన్ విడుదల చేశారు. వాస్తవానికి చిత్తూరు నగరంలో మెజారిటీ మద్యం బార్లు కూటమి నేతల చేతుల్లోనే ఉండేది. ప్రభుత్వం సూచించిన లైసెన్సు ఫీజులు, నాలుగు దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనలు నచ్చకపోవడంతో నిర్వాహకులు గతంలో సిండికేట్‌గా ఏర్పడ్డట్లు తెలుస్తోంది. అందరూ మాట్లాడుకుని అయిదు బార్లకు దరఖాస్తులు వేయలేదని సమాచారం. ఈనెల 14వ తేదీ సాయంత్రంలోపు ఆరు బార్లకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుగా నిర్ణయించారు.దరఖాస్తులు రాకపోతే..మద్యం బార్‌కు దరఖాస్తులు కూడా వేయించలేని అధికారులు, పనిచేయడం దండగ అనే కోణంలో బాపట్ల, కోనసీమ జిల్లాల్లోని ఇద్దరు ఎక్సైజ్ జిల్లా అధికారులపై బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోనూ ఇదే భయం పట్టుకుంది. నాటు సారా నిర్మూలన, నవోదయం 2.0తో పాటు మద్యం దుకాణాల టెండర్లు, అధికారులకు ప్రొటోకాల్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటే ఇప్పుడు మెడపై కత్తి పెట్టి మద్యం బార్ల అంశాన్ని తీసుకొచ్చారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బార్లకు దరఖాస్తులు రాకుంటే బదిలీ వేటు తప్పదనే నేపథ్యంలో అధికారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. పనితీరు బాగోలేకుంటే బదిలీ చేయొచ్చు. ప్రభుత్వ పాలసీ నచ్చకుండా నిర్వాహకులు ముందుకు రాకుంటే తమను బలి పశువు చేయడం ఎంత వరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దళిత ద్రోహి చంద్రబాబు
తిరుపతి మంగళం: దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని దళితులను హేళనగా మాట్లాడిన దళిత ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర ఆధ్వర్యంలో పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీజేఆర్ సుధాకర్‌బాబు, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావుతో పాటు ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, లలితా థామస్, నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, దళిత మహిళలపై ఆత్యాచారాలు అధికమయ్యాయన్నారు. ఎన్నికల ముందు మహిళలకు అండగా ఉంటా మహిళల జోలికి వస్తే తాటతీస్తానంటూ ప్రగల్భాలు పలికిన పవన్‌కల్యాణ్‌కు దళిత మహిళ ఆత్యాచారాలు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి దళితులంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. సమాజంలో దళితులకు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవులను కల్పించిన ఏకై క నాయకుడు జగనన్న మాత్రమేనని.. అలాంటి గొప్ప నాయకున్ని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సైనికుల్లా పని చేద్దామన్నారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఎనభై ఏళ్ల క్రితమే దళిత కుటుంబంతో వివాహ బంధం ఏర్పరుచుకుని దళితులతో బాంధవ్యాన్ని కలుపుకున్న కుటుంబం వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని గుర్తు చేశారు. అనంతరం భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు రూ.2.80 లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో అందించిన గొప్ప నాయకుడు జగనన్న అన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు సునీల్‌కుమార్, నూకతోటి రాజేష్ మాట్లాడుతూ జగనన్న అధికారంలో ఉంటే బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు ఉంటాయన్నారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్‌కుమార్, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ నల్లాని బాబు, కార్పొరేటర్లు కోటూరు ఆంజినేయులు, బోకం అనిల్‌కుమర్, పుణీతమ్మ, ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు చేజర్ల మురళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
ప్రభుత్వం కక్ష సాధింపు
జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి భారతదేశం బలమైన రాజ్యాంగ రక్షణ కల్పించింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని కాలరాసే ప్రయత్నం చేస్తోంది. పత్రికలు, జర్నలిస్టులపైన కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. స్టేట్మెంట్లు ఇచ్చినా కేసులు పెడతారా? ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. వాస్తవాలు భయటపెట్టే పత్రికలపై కేసులు పెట్టడం మాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. – ఆర్ కే రోజా, మాజీ మంత్రి -
ఆకట్టుకున్న శోభాయాత్ర
పుంగనూరు : హరిహరపురం మఠాధిపతి శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచే పట్టణంలో తొలిసారిగా హిందూ శోభాయాత్ర నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆయన పుంగనూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హిందువులు ఏకమై స్వామి వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారు శ్రీచక్రన వారణ పూజా కార్యక్రమాలు సాయంత్రం ని ర్వహించి, భక్తులకు ఉపదేశం ఇచ్చారు. హిందువులు ఐకమత్యంతో ఉండాలని, శాంతి భా వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.నియామకంచిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ సంయుక్త కార్యదర్శిగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీ.వెంకటేష్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.ఆభా ఐడీ విధిగా నమోదు చేయాలిచిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆభా (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) ఐడీని విధిగా నమోదు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం డాకర్లు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లకు డిజిటల్ మిషన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆభా ఐడీ ప్రతి ఒక్కరికీ నమోదు చేయి ంచాలన్నారు. తద్వారా వైద్య సేవలు ఆన్లైన్లో పొందుపరుస్తారన్నారు. ప్రస్తుతం కుప్పంలో నర్వ్ సెంటర్ నడుస్తోందన్నారు. అలాగే చిత్తూరులో కూడా సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆభా ఐడీ నమోదులో అలసత్వం వద్దని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంఓ ప్రవీణ, వైద్యులు అనూష, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.రేపు జాతీయ లోక్ అదాలత్చిత్తూరు అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 13వ తేదీన జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమే లక్ష్యంగా అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. రాజీ చేసుకోదగ్గ కేసులను అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని.. వివరాలకు చిత్తూరు కోర్టులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలన్నారు.15 నుంచి ఇంటర్ త్రైమాసిక పరీక్షలుచిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ త్రైమాసిక పరీక్షలు ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అబ్ధుల్ మజీద్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నియమ, నిబంధనల మేరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఉత్తర్వులు అందాయన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఈనెల 15 నుంచి అక్టోబర్ 10 లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారని ప్రిన్సిపల్ వెల్లడించారు.డిమాండ్ల పరిష్కారానికి నిరసనలుచిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం టీచర్ల డిమాండ్లను పరిష్కరించి, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు నిరసనలు చేపట్టారు. ఆ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. తమ నిరసనలు ఈ నెల 17 వరకు కొనసాగుతాయని వెల్లడించారు. -
సూపర్ సిక్స్ సభ అట్టర్ ఫ్లాప్
పాలసముద్రం : అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సభకు ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన లేదన్నారు. సభ విజయవంతం కాకపోవడంతో కూటమి నాయకులు షాక్‌కు గురయ్యారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ సభకు బలవంతంగా జన సమీకరణ చేశారన్నారు. ప్రతి మహిళా సంఘం నుంచి ఐదుగురు సభ్యులు ఈ సభకు రావాలని అధికారులు ఒత్తిడి చేయడంతో మహిళలు తప్పని పరిస్థితిలో సభకు వెళ్లారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయకుండానే సూపర్‌హిట్ సభ నిర్వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి సభను నిర్వహించినా ప్రజల్లో స్పందన కరువైందన్నారు. బలవంతపు విజయోత్సవాలు చేసుకోవడం దేశంలోనే చంద్రబాబుకు మాత్రమే సాధ్యమేని విమర్శించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని గుట్టలో ఎర్రమట్టి తమిళనాడుకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఎన్నడు లేని విధంగా గుట్టలు మాయమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 25 లోపు మామిడి రైతుల ఖాతాల్లో సబ్సిడీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి సబ్సిడీ నగదును ఈ నెల 20 నుంచి 25వ తేదీలోపు సంబంధిత మామిడి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో మామిడి సీజన్లో 4.1 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిన 37 వేల మంది రైతులకు సబ్సిడీని జమచేయనున్నట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.160 కోట్ల మేర జమచేస్తామన్నారు. గత కొద్ది రోజులుగా అర్హుల నివేదికలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున రైతులకు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ రాయితీ అందజేస్తోందన్నారు. ఒక్కొక్క రైతుకు రాయితీ రూపంలో దాదాపు రూ.40 వేలు జమవుతుందని తెలిపారు. మామిడి పరిశ్రమల ఆధ్వర్యంలో 2.35 లక్షల మెట్రిక్ టన్నులు, ర్యాంపులు, మండీల నుంచి 1.65 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడిసాగుకు రూ.10 కోట్లు ఖర్చు చేశామన్నారు. త్వరలో కృష్ణగిరి నుంచి రెండు కొత్త పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెదురుకుప్పం మండలంలో విధుల పట్ల అలసత్వం వహించిన ఇద్దరు వీఆర్వోలను ఇటీవల సస్పెండ్ చేశామన్నారు. -
జాతరలో ప్రత్యేకతలు
పట్టువస్త్రాల సమర్పణ జాతర సందర్భంగా దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా మేళతాళలతో పట్టువస్త్రాలను సమర్పించారు. దేవదాయ కమిషనర్ రామచంద్రయ్య, ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోవూరు ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, చైర్మన్ నక్కా భానుప్రియ హాజరయ్యారు. 0000వెంకటగిరి(సైదాపురం) : కోరిన కోర్కెలు తీర్చే తల్లీ..పోలేరమ్మా.. కాపాడగరావమ్మా.. అంటూ భక్తజనం పోలేరమ్మ ఎదుట ప్రణమిల్లారు. జాతర సందర్భంగా వెంకటగిరి పురవీధులన్నీ స్వర్ణకాంతులతో దేదీప్యమానంగా కాంతులీనాయి. అమ్మవారి ప్రతిరూపాన్ని తనివితీరా దర్శించుకున్న భక్తులు పులకించారు. అమ్మలుగన్న అమ్మా.. పోలేరమ్మా తల్లీ అంటూ పట్టణ పురవీధుల్లో ప్రతిధ్వనించాయి. వెంకటగిరి పట్టణమంతా జైపోలేరూ.. జైజై పోలేరూ తల్లీ అంటూ మార్మోగింది. జిల్లా నలుమూలలే కాకుండా దేశవిదేశాల నుంచి కూడా పోలేరమ్మ జాతరకు విచ్చేయడంతో దారులన్నీ వెంకటగిరివైపే మళ్లాయి. దీంతో ఎక్కడ చూసినా జనమే దర్శనమిచ్చారు. సారె సమర్పణ.. వెంకటగిరి రాజా కుటుంబీకుల సర్వజ్ఞకుమార కృష్ణ యాచేంద్రతోపాటు పలువురు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారెను సమర్పించారు. ఆలయ మహద్వారం నుంచి పసుపు కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలతో కూడిన సారెను అందించారు. అంతకుముందు నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్సీపీ నేత బొలిగర్ల మస్తాన్‌యాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరకు భద్రత.. పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ కావడంతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు అధికారులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అయితే అనుకున్న మేర ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆనందోత్సాహాల నడుమ నగరోత్సవం.. భక్తజన సందోహం నడుమ నగరోత్సవం ప్రారంభం కాగా భక్తులు పెద్దఎత్తున వీక్షించారు. బుధవారం అర్ధరాత్రి అమ్మవారి మెట్టునిల్లు అయిన జీనుగులవారి వీధి నుంచి వేకువజామున నాలుగు గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో అధిష్టించారు. తెల్లవారుజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. అయితే భక్తులకు నామమాత్రంగా ఓ గంట పాటు వాటర్, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఉచిత దర్శనం, రూ.100, రూ.300 టికెట్లను కొనుగోలు చేసిన భక్తుల కోసం పాతబస్టాండ్ మీదుగా కొత్తగా క్యూలైన్‌ను పొడిగించారు. అమ్మవారి సాంగెం పోలీసు బందోబస్తు నడుమ రాజా భవనం నుంచి అమ్మవారి ఆలయం వద్ద తీసుకురావాల్సి ఉండగా అవేవీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది కూటమి నేతల కనుసన్నల్లో జాతర జరిగింది. గతంలో ఉన్న వీఐపీ క్యూలైన్ పూర్తిగా ఎత్తేసి ప్రోటోకాల్ ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక దర్శనమని ప్రకటించారు. కానీ అదంతా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. దున్నపోతు బలితో.. జాతర సంప్రదాయ ప్రకారం అమ్మవారికి దున్నపోతు బలి కార్యక్రమం జరిగింది. అమ్మవారి నిమజ్జనం పూర్తయ్యే వరకు గండదీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బలి పూర్తి కాగానే గ్రామ పొలిమేరల్లో నాలుగుదిక్కులా పొలి చల్లారు. -
ద్విచక్ర వాహనం డీకొని వ్యక్తి మృతి
వి.కోట: బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వి.కోట –పెర్నంబట్ జాతీయ రహదారిలోని ఏడుచుట్లకొట్ల గ్రామం వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని చింతమాకులపల్లి గ్రామానికి చెందిన చిన్న బిడ్డప్ప కుమారుడు శ్రీనివాసులు(65) కూలి పనులు ముగించుకుని ఏడుచుట్ల గ్రామం వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన వ్యక్తి బైక్‌పై వి.కోట నుంచి పెర్నంబట్టు వైపు వెళ్తున్న శ్రీనివాసులును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తలకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ీప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు అప్పటికే మృతిచెందిన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ సోమశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పేకాట ఆడుతున్న 24 మంది అరెస్టు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 24 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ నెట్టింకటయ్య కథనం మేరకు.. గంగనపల్లెలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సీఐ నెట్టికంటయ్య తన సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. ఇక్కడ పేకాట ఆడుతున్న కెఎస్.మధు (57), పి.జగదీష్ (39), ఎంజి.ఆనంద్‌బాబు (38), ఐ.రియాజ్ భాష (40), పికె.ఆసీఫ్ (29), ఎండి.షరీఫ్ (33), ఎస్.హసీఫ్ (30), ఎం.లోకేష్ (37), డి.ధనుష్ (21), జె.ఉమాపతి (28), ఆర్.మణికంఠ (29), కె.మోహన్‌బాబు (36), ఎంఆర్.జయప్రకాష్ (51), వి.ఏలుమలై (52), పి.సదాశివ (58), కె.శివ (47), పి.బషీర్ (52), పి.స్వాతికిరణ్ (43), ఎన్.జ్యోతీశ్వరన్ (44), ఎ.రాజ్కుట్టి (35), ఎస్.రాజా (36), జి.షాన్వాజ్ (40), ఎస్కె.మున్నా (40)ను అరెస్టు చేసి, ఆపై 41 నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. నిందితుల వద్ద రూ.37,160 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా పోలీసులకు చిక్కిన నిందితుల్లో కూటమి పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి పదవుల్లోని వాళ్లూ ఉన్నారు.విద్యాలయంలో మందుబాబుల ఆగడాలుచిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని వన్నియర్ బ్లాక్‌లో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మందుబాబుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. విద్యాలయంలో రాత్రి సమయాల్లో మందుబాబులు మద్యం సేవించి బాటిళ్లను పాఠశాల ఆవరణలో పడేస్తున్నారు. అదే విధంగా ఆ పాఠశాలలో ఉండే ఓవర్ హెడ్ ట్యాంక్ నిచ్చెన మెట్లు మరమ్మతులకు లోనుకావడంతో ప్రమాదకరంగా మారింది. చిన్నారులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాల వద్ద రాత్రి సమయాల్లో పోలీసుల గస్తీ పెంచి వాచ్‌మన్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పత్రికల గొంతునొక్కేందుకే తప్పుడు కేసులు
వార్తలు రాస్తే కేసులు పెడతారా? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ? తప్పుడు కేసులు నమోదుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సాక్షి పత్రికలో ప్రెస్మీట్లు, స్టేట్మెంట్లు ప్రచురించినందుకు పత్రికపైన , ఎడిటర్‌పైన , సంబంధిత రిపోర్టర్లపైన కూటమి ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించడం, కార్యాలయాలు, ఇళ్లు సోదాలు చేయడం దుర్మార్గం. పత్రికల గొంతునొక్కేందుకు తప్పుడు కేసులు నమోదు చేసి, భయబ్రాంతులకు గురిచేయడం వికృతచేష్టలకు నిదర్శనం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా , ఆ తప్పులను ఎత్తి చూపుతున్న సాక్షిపై ప్రభుత్వం క్షక్ష సాధిస్తోంది. – మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
ఎర్రమట్టి రవాణాలో తమ్ముళ్ల కుమ్ములాట
పాలసముద్రం : గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్, టీడీపీ రాష్ట్ర నాయకుడు చిట్టిబాబునాయుడు మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమంటోందని కొంత మంది టీడీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఇలా వారిద్దరి మధ్య విభేదాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఎర్రమట్టి గ్రావెల్ క్వారీలో అక్రమంగా తమిళనాడుకు తలిస్తున్నారు. వీటిని అడ్డుకట్ట వేసేందుకు చిట్టిబాబు నాయుడు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అయినా అక్రమ ఎర్రమట్టి గ్రావెల్ తమిళనాడుకు తరలిపోతూనే ఉంది. అధికారులు కూడా ఎర్రమట్టి గ్రావెల్ ఆపితే ఎమ్మెల్యే ఏమంటారోనని.. ఆపకపోతే రాష్ట్ర టీడీపీ నేత చిట్టిబాబు నాయుడు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తారని భయాందోళన చెందుతున్నారు. ఇలా ఎమ్మెల్యే వర్గం.. రాష్ట్ర టీడీపీ నేత చిట్టిబాబు వర్గం ఎర్రమట్టి రవాణాలో ఎవ్వరికి వారే యమునా తీరేలా వ్వవహరిస్తున్నారు. -
మామిడి రైతులకు రూ.8 చెల్లించాల్సిందే !
గంగాధర నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు చెప్పిన మాట ప్రకారం కొనుగోలు ధర 8 రూపాయలు చెల్లించాల్సిందేనని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు జిల్లాల కలెక్టర్లు రైతులు, సంఘాల నాయకులు పరిశ్రమ యజమానులు సమావేశం ఏర్పాటు చేసి తోతాపూరి ధర 12 రూపాయలుగా నిర్ణయించగా ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యాలు నాలుగు, ఐదు రూపాయలే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు ధర 8 రూపాయలు, సబ్సిడీ ధర 4 రూపాయలను వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పరిశ్రమల ముందు మామిడి రైతులు బిచ్చగాళ్లలాగా పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 15వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు మ్యాంగో యార్డు నుంచి కలెక్టరేట్ వరకు మామిడి రైతుల ట్రాక్టర్ వాహన మహా ర్యాలీలో రైతులు పాల్గొని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మామిడి రైతుల సంక్షేమ గౌరవాధ్యక్షుడు జయరాం రెడ్డి, అధ్యక్షుడు త్యాగరాజ రెడ్డి, రైతు నాయకులు వెంకటేశులు ప్రభాకర్ , పురుషోత్తం, గుణశేఖర్ రెడ్డి, ప్రకాష్ , చిట్టిబాబు మామిడి రైతులు పాల్గొన్నారు. -
గజరాజుల బీభత్సం
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని ఆవుల పెద్దిరెడ్డిగారిపల్లె, కురవపల్లె, గౌరిశెట్టిగారి పల్లెల్లో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి బీభత్సం సృస్టించాయి. వరుస దాడులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆవుల పెద్దిరెడ్డిగారి పల్లెలో రైతు వీరయ్య పొలంలో వరి పంటను ధ్వంసం చేశాయి. అలాగే మిగిలిన ప్రాంతాల్లో టమోటా, అరటి, కొబ్బరి చెట్లను తొక్కి నాశనం చేశాయి. అటవీశాఖ అధికారులు ఏనుగులను పొలాల్లోకి రాకుండా కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో అశ్విక (32) అనే వివాహిత గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. వన్‌టౌన్ సీఐ మహేశ్వర కథనం.. గుడిపాలలోని 190–రామాపురానికి చెందిన అశ్విక, గంగాధరనెల్లూరుకు చెందిన అరుణ్‌కుమార్‌కు పదేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల చదువురీత్యా దంపతులు ఇద్దరూ చిత్తూరులోని మిట్టూరులో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి ఒకే గదిలో పడుకున్న దంపతులు.. తెల్లవారి చూసేసరికి పడకపై అశ్విక అచేతనంగా పడి ఉంది. ఆమె చనిపోయిందని తెలుసుకున్న భర్త గంగాధరనెల్లూరులోని ఆరిమాకులపల్లెకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని, మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. ‘అఖిల దేవతా కృతి’ పాట ఆవిష్కరణ కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో గురువారం పలమనేరుకు చెందిన వాసుదేవన్ రచించిన అఖిల దేవతా కృతి అనే పాటను ఆవిష్కరించారు. ఈఓ పెంచల కిషోర్ చేతుల మీదుగా పాటను ఆవిష్కరించగా పలువురు వాసుదేవన్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఏఈఓ ధనపాల్, సినీ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులా?
వైభవంగా కలశ ఊరేగింపు కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం కలశాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా, మట్టి, ఇసుక, గ్రానైట్ వంటి ప్రకృతి సంపదను దోచుకుంటున్న పచ్చనేతలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాస్వామ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణగదొక్కుతోంది. నిజాలను వెలికితీసే పత్రికలపైనా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడంలేదు. కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోంది. పత్రికల గొంతునొక్కి, జర్నలిస్టులను మానసికంగా ఇబ్బంది పెట్టి , భయపెట్టేందుకే ఇలాంటి చేతగాని రాజకీయాలు చేస్తున్నారు. నిజాలను ప్రచురించే పత్రికలపై కేసులు పెట్టడం దుర్మార్గం. – కళత్తూరు నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి -
వైభవంగా కలశ ఊరేగింపు
కాణిపాకం : వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్షవాహన సేవను పురస్కరించుకుని కాణిపాకంలోని దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం కలశంతో భారీ ఊరేగింపు నిర్వహించారు. శివాలయం నుంచి 501 కలశాలతో పురవీధుల్లో కోలాటలు, కేరళ వాయిద్యం, తప్పెటగుండ్లు నడుమ అత్యంత వైభవంగా కలశాలతో ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఏఈఓలు ఆలయ అధికారులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్పవృక్షవాహన సేవలో భాగంగా ఆలయాన్ని శోభయామానంగా తీర్చిదిద్దారు. -
ఆటో అదుపు తప్పి .. గాయాలు
చౌడేపల్లె : అయ్యో.. పొట్టనింపుకోవడానికి కూలీ పనుల కోసం వచ్చి పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా దుర్గసముద్రం వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలపైకి తెచ్చుకొన్న ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం గౌదమాకులపల్లెకు చెందిన కొందరు ఆటోలో చౌడేపల్లె మండలం ఎర్రప్పల్లె వద్ద టమోటా తోటలో కూలీ పనుల కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో దుర్గసముద్రం వద్ద వెళ్తుండగా గుత్తివారిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ విశ్వనాథ్ (38)కు ఫిట్స్ రావడంతో వాహనంను రోడ్డు పక్కనే ఉన్న శంకరప్ప ఇంటిలోకి ఆటో వేగంగా దూసుకెళ్తు ఎదురుగా ఉన్న రాతి కూసాలు, గోడను ఢీకొని ఆటో ఆగింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్నహేమశ్రీ (32)మంజుల (35)హారతి (18) టి.మంజుల(40)లక్ష్మమ్మ(45) సుబ్బమ్మ(52) లతో పాటు మరో ఇద్దరికి గాయాలైయ్యాయి.స్థానికులు ప్రవేటు వాహనంలో చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వీరిలో మంజుల, హారతి, హేమశ్రీల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మదనపల్లెకు రెఫర్ చేశారు. సుమారు గంట సేపు 108 వాహనం కోసం క్షతగాత్రులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎదురుగా వాహనంను ఢీకొని ఉంటే పెద్ద ప్రాణ నష్టం సంభవించేదని కూలీలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకొన్న ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : తమ దృష్టిలో సూపర్‌సిక్స్ హిట్ కాదని... సూపర్ ఫ్లాప్ అని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ర50 లక్షల మంది నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని..ఇంత వరకు ఇవ్వలేదన్నారు. అలాగే 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని..ప్రైవేటు కంపెనీల ఒప్పందం పేరుతో హడావుడి చేస్తోందన్నారు. ఎన్నికలప్పుడు అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6వేలు కలిపి రూ. 20వేలు ఇస్తున్నారని, పలు రకాల కారణాలు చెబుతూ పథకంలో కోతలు పెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామమని...అమలుపై నోరెత్తడం లేదన్నారు. మానవత్వం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులకు అడ్డగోలుగా పింఛన్లను తొలగించారన్నారు. వితంతులకు పింఛన్లు లేవన్నారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటప్పుడు సూపర్‌సిక్స్ విజయవంత సభల నిర్వహించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విభజన హామీలపై కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు మోదీకి తాకట్టుపెట్టారన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, కిల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
గుడిపాల : పంచాయతీల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకంగా ఉండాలని జెడ్పీ సీఈఓ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయతీలకు జమ చేయడం జరిగిందని వాటిని ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటికి ఉపయోగించుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుడిపాల మండలంలోని ఎస్సీలు అధికంగా ఉన్న పశుమంద, వెంగమాంబపురం, కొత్తపల్లె, శ్రీరంగంపల్లె, మరకాలకుప్పం గ్రామాలకు రూ.20 లక్షలు మంజూరైందని వీటిని సీసీ రోడ్లు మినహా మిగతా పనులను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన వారికి తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో కుమార్, డిప్యూటీ ఎంపీడీవో కృష్ణప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్నాయుడులు , తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇలాంటి విధానాల వల్ల సమన్యాయం, అభివృద్ధి, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఆందోళనకరంగా మారుతుంది. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, భద్రత లాంటివి రేపటి సమ సమాజ స్థాపనకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఉండాలే కానీ, గొంతు నొక్కేలా వ్యవహరించకూడదు. అలా నిజాల్ని మరుగునపరిచే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తు తరం పాలకవర్గాలను క్షమించదన్న విషయం గమనించుకోవాలి. పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని గతంలోకి లక్నోకి చెందిన కేసులో సుప్రీం కోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ పట్ల సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కుల గురించి స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నాలు చేయరు. -
డ్రాపౌట్స్ తగ్గింపునకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బడి బయట పిల్లలు (డ్రాపౌట్స్) తగ్గింపునకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బడిబయట పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలో జూలై 2025 నాటికి 4202 మంది విద్యార్థులను బడిబయట పిల్లలుగా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1997 మంది విద్యార్థులను తిరిగి వివిధ పాఠశాలల్లో చేర్పించారన్నారు. పాఠశాలల్లో చేరిన బడిబయట విద్యార్థుల వివరాలను ఎంఈవోలు పాఠశాల వారీగా ప్రత్యేక ఫ్రొఫార్మాలో వివరాలు అందజేయాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా మెనూ ప్రకారం అమలు చేయాలని తెలిపారు. నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, విద్యాశాఖ ఏడీ–1 సుకుమార్, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు
పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టలో కూటమి నేతలకు ఎర్రమట్టి గ్రావెల్ మంజూరైంది. కానీ బుధవారం అనుమతి పేరుతో ఎక్కడ ఎర్రమట్టి బాగుందో అక్కడ కూటమి నాయకులు హిటాచీతో ఎర్రమట్టిని టిప్పర్లలో తమిళనాడుకు తరలించి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుకున్న గ్రామస్తులు తహసీల్దార్ అరుణ కుమారి , ఎస్ఐ చిన్నరెడ్డప్పకు వివరించారు. వారు సంఘటన స్థలానికి చేరుకునే లోగానే వారికి మంజూరైన ప్రదేశానికి హిటాచీలను, టిప్పర్ని తరలించారు. వారికి మంజూరైన చోటులో సర్వేయర్ సహాయంతో హద్దులు చూపించారు. ఇందులో చుట్టు పక్కల 30 అడుగులు వదిలేసి మిగిలిన చోటనే మట్టిని తీసుకోవాలన్నారు. అలా కాకుండా ఇష్టానుసారం మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పంచాయతీ ఇచ్చిన తీర్మానంలో 2.95 హెక్టార్లకు క్వారీకి అనుమతి ఇచ్చినట్టు ఉంది. కాగా మైనింగ్ అధికారులు ఇచ్చిన అనుమతిలో 4.900 హెక్టార్లలో క్వారీకి అనుమతి ఇచ్చినట్లు పరస్పర విరుద్ధంగా అనుమతులు ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
చంద్రప్రభపై వరసిద్ధుడు
కాణిపాకం : ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి బుధవారం చంద్రప్రభ వాహనంపై కటాక్షించారు. తొలుత మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం చేశారు. చందన అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి వారి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ మాడ వీధుల్లో ఊరేగించారు. చంద్రప్రభ వాహన సేవలో భాగంగా ఉభయదారులు క్షీర కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన ఆలయ కల్యాణ వేదికలో ఉత్సవమూర్తి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నేడు కల్పవృక్షవాహనం కాణిపాక ఉత్సవంలో భాగంగా గురువారం స్వామివారు కల్పవృక్ష వాహనంలో ప్రత్యక్షమవనున్నారని ఈవో పెంచలకిషోర్ తెలిపారు. రాత్రి కల్పవృక్షవాహన సేవ ఉంటుందన్నారు. -
కక్ష సాధింపులకు మూల్యం చెల్లించుకోక తప్పదు
రాష్ట్రంలో పరిస్థితులు దారణంగా తయారయ్యాయి. ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు వస్తే తమకు మింగుడుపడని పక్షంలో ఖండించాలి తప్ప కక్ష సాఽధింపు చర్యలకు దిగడంతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు బనాయించి నోటీసులు జారీచేయడం మేధావి వర్గాలు, జర్నలిస్టులు ఆలోచించాల్సిన విషయం. వ్యవస్థలను తమ చేతులోకి తీసుకుని ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తే అందుకు తగిన మూల్యం భారీ స్థాయిలో చెల్లించుకోక తప్పదు. ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగాలి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనబడలేదు. ఇకనైనా పత్రికల యాజమాన్యాలపైన, జర్నలిస్టులపైనా కేసులు పెట్టే సంస్కృతి మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వ దృష్టి సారించాలి -
ఈనెల 15 వరకు ఇన్స్పైర్ మనక్ గడువు
చిత్తూరు కలెక్టరేట్ : ఇన్స్పైర్ మనక్ 2025–26లో విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించారని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ కు దరఖాస్తు చేసుకునేలా హెడ్మాస్టర్లు చర్యలు చేపట్టాలని డీఈవో ఆదేశించారు. ఉద్యోగ మేళాకు స్పందన కార్వేటినగరం : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, సీడాప్ ఏపీ ఎస్.ఎస్.డి.సి సంయుక్తంగా శనివారం కార్వేటినగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టరేట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఆనంద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి , సీడాప్ – ఏపీఎస్ఎస్డీసీ అధికారులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. మొత్తం 178 మంది అభ్యర్థులు పాల్గొనగా వారిలో 86 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. నేడు వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగ సమావేశం తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి పద్మావతీపురంలోని పార్టీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీ విభాగం నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర మీడియాతో మాట్లాడారు. సమావేశానికి వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని వివరించారు. భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బుధవారం సంకటహర చతుర్థి గణపత్రి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తులతో జరిపించారు. స్వర్ణరథంపై స్వామివారు... స్వయంభు శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి శనివారం రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై కటాక్షించారు. ప్రధాన ఆలయంలో సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చక, వేద పండితులు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణ రథంలో కొలువుదీర్చి ఊరేగించారు. మిలటరీ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు తిరుపతి సిటీ : రాష్ట్రీయ మిలటరీ స్కూళ్లలో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు అక్టోబర్ 9వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ స్కూల్, లేదా 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
విద్యుత్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
గంగాధర నెల్లూరు : ప్రత్యేక విద్యుత్ అదాలత్‌ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి పిలుపు నిచ్చారు. గంగాధర నెల్లూరు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో బుధవారం విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి అధ్యక్షతన ప్రత్యేక విద్యుత్ అదాలత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడినప్పుడు సకాలంలో సంబంధిత సిబ్బంది పరిష్కరించి వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ సాంకేతిక ఆర్థిక సభ్యులు మధుకుమార్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి , విద్యుత్ శాఖ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈ. సురేష్ కుమార్, డీఈలు శేషాద్రి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చంద్రబాబు, గంగాధర నెల్లూరు , ఆవలకొండ విద్యుత్ శాఖ ఏఈలు వరదరాజులు, తనిగవేలు పలువురు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం సేవలో ఆర్టీసీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : సీఎం చంద్రబాబు వివిధ ప్రాంతాల్లో పర్యటించే ప్రతిసారీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సీఎం పాల్గొనే సభలను విజయవంతం చేసే ప్రయత్నంలో భాగంగా ఆర్టీసీ బస్సులను వాడుకుంటున్నారు. ఈ విషయం ముందస్తుగా తెలియక పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాతో పాటు ఇతర జిల్లాలో జరిగే సీఎం చంద్రబాబు పర్యటనకు ఆర్టీసీ బస్సులు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం అనంతపురం జిల్లాలో జరిగే సభకు జిల్లాలోని బస్సులను తరలించారు. అక్కడ సభను విజయవంతం చేసేందుకు జిల్లా బస్సులను పంపించేశారు. మంగళవారమే బస్సులన్నీ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో బుధవారం ఉదయం నుంచి జిల్లాలో బస్సుల కొరత వేధించింది. బస్సుల్లేక ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో 426 బస్సులుంటే 300 బస్సులను సభకు పంపించేశారు. ఇందులో తిరుపతి, వేలూరు, బెంగుళూరు మార్గాల్లో తిరిగే బస్సులు అధికంగా ఉన్నాయి. పల్లె వెలుగు బస్సులను సైతం వదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా.. ఆర్టీసీ బస్సులను సీఎం సభకు తరలిస్తారనే ముందస్తు సమాచారం లేకపోవడంతో బుధవారం ఉదయం నుంచే ప్రయాణికులు బస్టాండుకు వచ్చి షాక్‌కు గురయ్యారు. గమ్యం చేరుకోవడానికి పడిగావులు పడ్డారు. డొక్కు బస్సులు తప్ప మిగిలిన సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగుతో సహా సభకు తరలించారు. ఫలితంగా గ్రామాలు, మండల కేంద్రాలకు రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలే దిక్కు.. గంటల తరబడి బస్టాండుకు బస్సులు రాకపోయే సరికి ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. బస్సులను సభకు పంపిన విషయంపై సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వాహనాదారు లు రెచ్చిపోయారు. ఏకంగా చిత్తూరు ఆర్టీసీ బస్టాండుకే వాహనాలను తీసుకొచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లారు. ప్రయాణికులపై చార్జీల మోత వేశారు. పట్టించుకోని అధికారులు ఆర్టీసీ ఇష్టానుసారంగా బస్సులను సీఎం సభలకు మళ్లించి. జిల్లా పర్యటనతో పాటు ఏ జిల్లాలో సభ జరిగినా ఆర్టీసీ అధికారులు అప్పన్నంగా బస్సులను పంపుతున్నారు. ప్రయాణికుల కష్టాలను పట్టించుకోకుండా ఎప్పడు పడితే అప్పుడు బస్సులను మళ్లించడం ఆర్టీసీకి పరిపాటిగా మారిందని పలువురు ప్రయాణికులు మండిపడుతున్నారు. చిత్తూరు బస్టాండ్‌లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు -
పీహెచ్‌సీల్లో మందుల్లేవ్!
జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రతి ఇంటా జ్వరంతో ఇద్దరూ, ముగ్గురూ మంచం పట్టారు. పీహెచ్‌సీల్లో మందుల్లేక వైద్యం మొక్కుబడిగా మారింది. జ్వరానికి సైతం మాత్రలు, మందుల్లేక బయట కొనుక్కోవాల్సి రావడం రోగులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికీ వెళ్లి నాడీపట్టి మందులు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో నేడు ఆసుపత్రికి వెళ్లినా మందుల్లేక విలవిల్లాడిపోతున్నారు.కాణిపాకం : తరచూ కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పుల కారణాలతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి గ్రామంలో జ్వర పీడితులు ఉన్నారు. పేదలు వైద్యం కోసం పీహెచ్‌సీలకు వెళ్తే ఒకటి, రెండు మాత్రలు మినహా అత్యవసరమైన ఔషధాలు లభించడం లేదు. ఆరోగ్య కేంద్రాల్లో మందులు, మాత్రలు లేక వెలవెలబోతున్నాయి. కేంద్రాల నుంచి ఇండెంట్ పెట్టి నెలలు గడస్తున్నా సరఫరా విషయంలో జాప్యం నెలకొంది.జిల్లా వ్యాప్తంగా 50 పీహెచ్‌సీలున్నాయి. ప్రతి పీహెచ్‌సీకి నిత్యం 100–200 వరకు ఓపీలొస్తున్నాయి. 50–75 మంది వరకు దీర్ఘకాలిక వ్యాధులతో ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రస్తుతం మలేరియా, డెంగీ, టైఫా యిడ్తో పాటు, విష జ్వరం, రోగాలు వ్యాపిస్తున్నాయి. ఇటీవల పీహెచ్‌సీలకు జ్వరం కేసులు అధికమయ్యాయి. దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఇతర లక్షణాలతో క్యూ కడుతున్నారు. వీరికి వైద్య సేవలను అటు ఉంచితే...మందు బిల్లలూ కరువయ్యాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీహెచ్సీలో మందులు, మాత్రలు ఫుల్‌గా ఉండేవి. కొరత వచ్చిన వెంటనే వాటిని అప్పటికప్పుడే భర్తీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మందులు, మాత్రల కొరత వేధిస్తోంది. నెలల తరబడి మందులు, మాత్రల కొరత ఉన్నా పట్టించుకోవడంలేదు. సెంట్రల్ డ్రగ్స్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు.ప్రబలుతున్నా నిర్లక్ష్యమేజిల్లాలో జ్వరాలు తాండవిస్తున్నాయి. చిత్తూరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో జ్వరాల కేసులు పెరిగిపోతున్నాయి. ఊరురా జ్వరాలు ప్రబలుతున్నాయి. అయితే జ్వరాలతో పీహెచ్‌సీలకు వెళ్తే తగ్గడం లేదని బాధితులు చెబుతున్నారు. పీహెచ్‌సీలకు నిర్లక్ష్య జబ్బు అంటుకుంటోంది. జ్వరానికి మందులు, మాత్రలు లేని దుస్థితి ఏర్పడింది.బయటకొనుక్కోండిఆరోగ్య కేంద్రాల్లో మందు బిల్లలు లేక పల్లె ప్రజలు అవస్థలు పడుతున్నారు. జ్వరం, ఇతర నొప్పులతో ఆస్పత్రికి వస్తే...గంటల కొద్ది క్యూలో వేచి ఉంటున్నారు. ఆ తర్వాత ఏంటీ సమస్య అని అడిగి మందులు, మాత్రలు రాయిస్తున్నారు. ఈ చీటీని మందులు, మాత్రలు ఇచ్చే సిబ్బంది దగ్గరికి తీసుకెళ్తే ఇవీ లేవని బయటే తీసుకోవాలని చెప్పి పంపించేస్తున్నారు. డబ్బులు లేక వచ్చే వారు బయట మాత్రలు తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల, నొప్పులు, కండరాలు, శ్వాస సంబంధిత మాత్రలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.వారంలో కేసుల వివరాలు కేసు రకం; పరీక్ష చేసినవారి సంఖ్య; నమోదైన కేసులుజ్వరం; 0; 0టైపాయిడ్; 384; 30మలేరియా; 2540; 1డెంగీ; 423; 8పీహెచ్సీ ఓపీల సంఖ్యనెల; ఓపీ సంఖ్యఏప్రిల్; 1,95,587మే; 2,19,915జూన్; 2,20,556జూలై; 1,96,665ఆగష్టు; 1,92,513మాత్రలు బయట కొనమంటున్నారు..మోకాళ్ల నొప్పుల సమస్యలతో కొన్నేళ్లుగా బాధపడుతున్నా.. మందుల కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి పోతే స్టాక్ లేదంటున్నారు. మాత్రలు బయటకొనమని చీటీలు రాస్తున్నారు. రూ.వందల్లో ఖర్చు అవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకునే స్తోమత లేకనే ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ కూడా మందులు బయటకు రాస్తున్నారు. మాలాంటి వాళ్లు ఏం చేయాలి. – శ్రీనివాసులు, ఐరాలసెంట్రల్ డ్రగ్స్‌కు నివేదిక పంపాంమందుల కొరత ఉందని మా దృష్టికి వచ్చింది. వెంటనే సెంట్రల్ డ్రగ్స్‌కు నివేదిక పంపాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారులకు సూచించారు. వారిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించాం. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తాం. – సుధారాణి, డీఎంహెచ్ఓ, చిత్తూరుకొన్ని రోజులుగా ఇలానే ఉంది..విష జ్వరాలు వస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కొరత ఉంది. ఏ రోగానికి వెళ్లినా మందులు లేవని ఉన్నవాటితో సర్దుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఇలానే ఉంది. జ్వరానికి మందులు, మాత్రలు లేవంటే మాలాంటి వాళ్లు ఇబ్బందులు పడక తప్పదు. ప్రభుత్వం స్పందించి మందులు, మాత్రలు ఇవ్వాలి. –ధనపాల్, ఆముదాల, పాలసముద్రం మండలంపడిపోతున్న ఓపీనిర్వహణలోపం, డాక్టర్ల అలసత్వం కారణంగా పీహెచ్సీలో ఓపీల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. పీహెచ్‌సీల్లో డాక్టర్లు సమయానికి రావడంలేదనే విషయం లోతుగా పాతుకుపోయింది. వచ్చిన తళుక్కుమని మాయమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మధ్యాహ్నం వరకు ఉండి..ఆపై మీటింగ్, ఇతర కారణాలు చెప్పి విధులకు డుమ్మా కొట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో పల్లె వైద్యం పడకేసింది. సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నా వైద్యులు కానరావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మందులు, మాత్రలు దొరక్కపోవడంతో ఓపీ సంఖ్య ఇంకాస్త తగ్గుముఖం పట్టింది.ఇవీలేవు...పీహెచ్‌సీల్లో చాలా వరకు మాత్రల కొరత అధికంగా ఉన్నాయి. పారాసెటమాల్ 500 ఎంజీ, 650 ఎంజీ(జ్వరం, తలనొప్పి), డైక్లోఫెనాక్(కీళ్లు సంబంధిత వ్యాధులకు), రాంటాక్ (కడుపునకు సంబంధించినవి), పాంటాప్ (గ్యాస్ట్రిక్), యాంటీబయాటిక్లతో పాటు మరో 10 రకాల మాత్రలు లేవు. అలాగే పారా సెటమాల్, అంబ్రోక్స్ (గొంతు, తదితర సమస్యలకు), సీపీఎం(అలర్జీ) సిరఫ్‌లు ఖాళీ అయ్యాయి. దీంతో పాటు పారాసెటమాల్ ఇంజెక్షన్, రాంటాక్, వోవెరాన్(కండరాలు, కీళ్లు), గాంటామిసిన్(యాంటీబయాటిక్), అమికాసిన్(చర్మం, ఊపిరితిత్తులు, తదితర వ్యాధులకు) అనే ఇంజెక్షన్లు కరువయ్యాయి. నెలల తరబడి ఇవీ సరఫరా కాకపోవడంతో పల్లె జనానికి ప్రాథమిక ఆరోగ్యం దూరమైంది.ప్రైవేటు ఆస్పత్రులే దిక్కుపీహెచ్సీలు గాడితప్పడం, మందులు, మాత్రలు దొరక్కపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పల్లె ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కుగా మారుతున్నాయి. మండల కేంద్రం, పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. లేకుంటే ఆర్ఎంపీల వద్ద చూపించుకుంటున్నారు. ఇందుకు రవాణా ఛార్జీలు, ఆస్పత్రి ఫీజులతో జేబులు ఖాళీఅవుతున్నాయి. జ్వరానికి ప్రైవేటు ఆస్పత్రికి వెళితే రూ.600 నుంచి రూ.2 వేల వరకు ఖర్చువుతోంది. డెంగీ, టైపాయిడ్ జ్వరమంటే రూ. 5 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చువుతోంది. ల్యాబ్ టెస్టులు అదనంగా మారింది. -
క్రీడాకారులకు కలెక్టర్ అభినందన
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి లేజర్ రన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ సాధించిన చిత్తూరు క్రీడాకారులను కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఆ క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. బీహార్ రాష్ట్రం బెంగుసారాలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన 9వ జాతీయ స్థాయి లేజర్ రన్ పోటీల్లో చిత్తూరు విద్యార్థులు ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో అర్హత పొంది అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థి సాయి భార్గవ్‌ను అభినందించారు. ఈ విద్యార్థి దేశం తరపున సౌత్ ఆఫ్రికాలో డిసెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్, మెడల్స్ అందజేసి అభినందించారు. -
మదమెక్కిన భీ'కరి'!
కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య ఇప్పట్లో తీరేలా లేదు. మదపుటేనుగుల మేటింగ్ సీజన్ మొదలు కావడంతో జనానికి ముప్పు తప్పేలాలేదు. అక్టోబర్ నుంచి జనవరి వరకు మదమెక్కిన గజరాజులకు పట్టపగ్గాలే ఉండవు. అలవి కాని ఆగ్రహంతో రెచ్చిపోయే భీ‘కరి’ నుంచి తోటి జంతువులతోపాటు మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుంది. మేటింగ్ సీజన్ ముగిసే వరకు అటవీ సమీప ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎలిఫెంట్ శాంచురీని దాటి బయటకొచ్చే మదపుటేనుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పలమనేరు : రాష్ట్రంలోని కుప్పం, చిత్తూరు, పలమనేరు ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులతోపాటు అటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, కృష్ణగిరి, కావేరిపట్నం, కర్ణాటకలోని హోసూర్, బన్నేర్‌గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే ఏనుగులున్నాయి. స్థానికంగా ఉన్న గుంపుల్లో మొత్తం 12 మగ ఏనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు (మదపుటేనుగులు) మాత్రం ఉన్నాయి. గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా సంచరిస్తున్నాయి. ఒక్కో మదపుటేనుగు ఎంపిక చేసుకున్న ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. జనం కనిపిస్తే దాడులు చేస్తుంటాయి. వీటి చేష్టలు, గుర్తులను బట్టి స్థానికంగా వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో రౌడీ ఏనుగు, రాముడు, భీముడు, ఒంటి దంతం ఏనుగు, ఒంటికన్ను ఏనుగు ఇలా వీటికి పేర్లు పెట్టారు. ఇవి తమ ఉనికి కోసం రౌడీల్లా ప్రవర్తిస్తుంటాయి. మిగిలిన ఆడ ఏనుగులు, గున్నలకు భయమెక్కువ, దీంతో ఇవి గుంపులోనే ఉంటూ జనాన్ని చూసి వెనక్కు వెళుతుంటాయి. కానీమదపుటేనుగులు ఏమాత్రం భయపడవు, ఎదురు దాడులకు దిగుతుంటాయి. ప్రస్తుతం ఆరు మాత్రమే.. కౌండిన్యలోని 12 మదపుటేనుగుల్లో ప్రస్తుతం ఆరు మాత్రమే ఉన్నాయి. బంగారుపాళెం మండలం మొగిలివారిపల్లెలో రౌడీ ఏనుగుగా చెప్పుకునే మదపుటేనుగు కరెంటు తీగలకు బలైంది. గంగవరం మండలం మన్నారునాయనిపల్లె సమీపంలో పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటుకు మరో మదపుటేనుగు బలైంది. అంతకుముందు కాలువపల్లె, మొసలి మడుగు వద్ద రాముడు, భీముడు అనే రెండు మదపుటేనుగులు చనిపోయాయి. మూడేళ్ల క్రితం పలమనేరు మండలంలోని బేరుపల్లె, గాంధీనగర్‌ల వద్ద రెండు మదపుటేనుగులు కరెంట్ షాక్‌తో కన్నుమూశాయి. ఇవి బతికున్నప్పుడు మనుషులు, పశువులు, కుక్కలను తరమి తరిమి చంపేవి. ఇప్పుడున్న ఆరు మదపుటేనుగుల్లో గుడ్డి కన్ను ఏనుగు గత మేటింగ్ సీజన్లో యాదమరి మండలం దిగువకనతల చెరవువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్ ను చంపిన విషయం తెలిసిందే. మొసలిమడుగు రౌడీగా పిలవబడే మరో ఏనుగు కౌండిన్యలోని వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్‌ను తొండంతో విసిరేసింది. ఊసరపెంట మదపుటేనుగు తరచూ ఆ గ్రామంలోకి వచ్చి రాత్రంతా ఉండి వెళ్లడం దీని ప్రత్యేకత. మిగిలిన రెండు మదపుటేనుగులు వేర్వేరుగా కౌండిన్యలో సంబంధిత ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఈ నాలుగు నెలలు ప్రమాదమే.. ముఖ్యంగా మదపుటేనుగులు అక్టోబరు నుంచి జనవరి వరకు ఆడ ఏనుగుల సాంగత్యం కోసం మత్తులో ఉంటాయి (మేటింగ్ సీజన్). దీంతో తిక్కతిక్కగా ప్రవర్తించడం, మనుషులను చూస్తే ఆగ్రహంతో ఊగిపోతుంటాయి. తన పరిధితోపాటు అడవిలో ఆడ ఏనుగుల కోసం చాలాదూరం అన్వేషిస్తుంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో మనషులు, జంతువులపై దాడులు ఎక్కువగా ఉంటాయి. ఆడ ఏనుగులు వీటి మాట వినకపోవడం లేదా అక్కడ జరిగే రభసతో ఇప్పటిదాకా ఆరు ఆడ ఏనుగులు మృతిచెందాయి. ఏదేమైనా ఈ నాలుగునెలలు మదపుటేనుగుల కారణంగా ప్రమాదాలు పొంచిఉన్నాయి. కాబట్టి అడవుల్లోకి ఎవరూ వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. ఆగ్రహంతో ఊగిపోతూ... మదపుటేనుగులపై జనం రాళ్లు విసరడం, టపాకాయలను పేల్చడం, టైర్లు కాల్చి వాటి పైకి విసరడం లాంటి చర్యలతో మగ ఏనుగులు జనంపై కసి పెంచుకున్నాయి. ఆడ ఏనుగులుకున్నంత సహనం వీటికి ఉండదు. ఇప్పటిదాకా పరిశీలిస్తే యాదమరి మండలం దిగువకనతల చెరువువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్ ను, వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్‌ను తొండంతో విసరడం, పందేరుపల్లి వద్ద రైతును, కాలువపల్లి వద్ద యువకుడిని తొండంతో కొట్టి చంపడం చేసింది మదపుటేనుగులే. పెద్దపంజాణిమండలం పెనుగొలకలకు చెందిన బంగారప్పను, కాలువపల్లి వద్ద రైతు సుబ్రమణ్యను చంపింది మదపుటేనుగులే. కుప్పంలోనూ దాడులు చేసింది ఇవే. పదిరోజుల క్రితం పెద్దపంజాణి మండలంలో రైతును తొక్కి చంపిందే మదపుటేనుగే. గుడిపాల మండలంలో దంపతులను చంపిందే మదపుటేనుగే. మదపుటేనుగులకు కోపం ఎక్కువ గుంపులనుంచి వేరుగా ఉంటూ ఒంటరిగా సంచరించే మదపుటేనుగులు చాలా కోపంగా ఉంటాయి. వీటి బారినుంచి తప్పించుకోవాలంటే ఏనుగు తరిమినప్పుడు మనిషి నేరుగా కా కుండా ఎస్ ఆకారంలో వెళ్లాలి. ఒంటిపై ఉన్న బ ట్టలను తీసి ఏనుగు ముందు వేస్తే అది కాసేపు దాన్ని వాసన చూస్తు తొక్కుతుండగా ఆ గ్యాప్‌లో తప్పించునే అవకాశముంటుంది. మేటింగ్ సీజన్లో మరింత ఆగ్రహంగా ఉంటాయి. కాబట్టి అ టవీ సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. – భరణి, డీఎఫ్‌ఆర్‌ఓ, చిత్తూరు కౌండిన్య పరిధిలోనిమొత్తం ఏనుగులు : సుమారు 100 ఇప్పటి వరకు గజ దాడుల్లో మృతుల సంఖ్య : 15 గాయపడినవారు : 36 ఇప్పటిదాకా మృతి చెందినఏనుగుల సంఖ్య : 19 -
డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేస్తాం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ ప్రైవే ట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం అసో సియేషన్ ఉపాధ్యక్షులు పట్నం సురేంద్రరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామన్నారు. అయితే ఎటువంటి స్పందనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర సంవత్సరంగా కరస్పాండెంట్లు అప్పులు చేసి కళాశాలలు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్కాలర్‌షిప్‌ల కోసం ప్రతి నెలా ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 2023–24, 2024–25 విద్యాసంవత్సరాల పెండింగ్ ఆర్టీఎఫ్ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. డిగ్రీ కోర్సు ఫీజులను సవరించి కొత్త ఫీజు విధానం ఆయా యూనివర్సిటీలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. -
అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్’అయిపోతారు!
జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు నియోజకవర్గం గ్రూపుల సంఖ్య చిత్తూరు 500 గంగాధరనెల్లూరు 1,881 కుప్పం 2,171 నగరి 1,404 పలమనేరు 2,475 పుంగనూరు 1,791 పూతలపట్టు 2,316 మొత్తం 11,538చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పొదుపు సంఘాల్లో నిత్యం ఏదో ఒక చోట అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పొదుపు సంఘాలు అక్రమాలకు పాల్పడి నగదు కొట్టేస్తున్న ఘటనలు తలెత్తుతున్నాయి. ఇలా అక్రమాలకు పాల్పడే పొదుపు సంఘాలపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అటువంటి పొదుపు సంఘాల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, స్వయం సహాయక సంఘాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. మొబైల్ బుక్ కీపింగ్ యాప్ (మన డబ్బులు–మన లెక్కలు) పేరుతో యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను డీఆర్డీఏ శాఖ జిల్లాలోని పొదుపు సంఘాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి నుంచి పుస్తకాల్లోనే వివరాలు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపులో చేరినప్పటి నుంచి పుస్తకాల్లోనే వివరాలను నమోదు చేస్తున్నారు. ఇకపై అలాంటి పద్ధతికి అవకాశం లేకుండా యాప్‌లో నగదు లావాదేవీలన్నీ నమోదు చేసేలా అవకాశం కల్పించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్‌లో సభ్యులు పొదుపులో చేరినప్పటి నుంచి పుస్తకాల్లో నమోదు చేసిన సమగ్ర వివరాలను నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ప్రయోజనాలు ఇలా..! పొదుపు సంఘాలకు ప్రత్యేక యాప్ చిత్రం, పొదుపు సంఘాల గ్రూపు నిర్వహణ అభ్యంతరాలకు అవకాశం ఈ ఏడాది మార్చి 31 వరకు సంఘాలు, వాటిలోని సభ్యుల పొ దుపు, బ్యాంకుల నుంచి పొంది న రుణాలు, సీ్త్రనిధి, ఉన్నతి వివరాలన్నీ యాప్‌లోనే నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలు సైతం యాప్‌లో కనిపిస్తాయి. ఇందులో ఏవైనా అ భ్యంతరాలుంటే యాప్‌లోనే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. – శ్రీదేవి, డీఆర్డీఏ పీడీ, చిత్తూరు జిల్లా -
రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలు సీజ్
పుంగనూరు: టపాకాయల నిల్వలపై చిత్తూరు ఎస్బీ అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి, సుమారు రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టపాకాయల వ్యాపారి డీష్బాబు, శ్రీధర్‌గుప్తా, రాఘవేంద్ర సప్లయర్స్ వారు అనుమతులు లేకుండా సుమారు రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలను నిల్వ చేసి ఉండడంపై ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. సీఐ సుబ్బరాయుడు, పోలీసులతో కలసి దాడులు చేసి, టపాకాయలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. చిత్తూరులో బాణసంచా సీజ్ – ఇద్దరి అరెస్ట్ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో అనుమతుల్లేకుండా తరలుతున్న బాణసంచా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. మంగళవారం సాయంత్రం చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారిపై టూటౌన్ సీఐ నెట్టింకటయ్య ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ మినీ లారీని తనిఖీ చేయగా.. తమిళనాడులోని శివకాశి నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలకు 70 బాక్సుల్లో బాణసంచా తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు గుర్తించారు. బాణసంచాతో పాటు వీటిని తరలిస్తున్న మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఎం.రవికుమార్, యాదమరికి చెందిన మణిగండన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో సిబ్బంది సుధీర్, బాబురెడ్డి, బాబు, రాజేష్, సుబ్రమణ్యం, బాషా, నాగరాజు ఉన్నారు. -
11 నుంచి డైట్లో కళా ఉత్సవ పోటీలు
కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో 11, 12 తేదీల్లో భారతీయ సంస్కృతి, సంప్రయాల వారసత్వ కళలపై (కళాఉత్సవ్) పోటీలు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ బీ.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం డైట్ కళాశాల ఆవరణలో ఉళాఉత్సవ్ పోటీల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ నెల 11, 12 తేదీలలో 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు సంస్కృతి కళలపై కళాఉత్సవ్ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన వచ్చన్నారు. అనంతరం కళాఉత్సవ్ ఇన్చార్జి ఎస్.రంజిత్‌కుమార్ మాట్లాడతూ 11న గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం నృత్యం విభాగాలలో పోటీలు ఉంటాయని తెలిపారు. 12న థియేటర్స్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ సంప్రదాయ కథకథనం విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులు 10వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా 8801718082 నంబర్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డీకే దామోదర్‌రావు, మోహన్‌రెడ్డి, నాగరాజునాయక్, సూపరింటెండెంట్ కృపావతి పాల్గొన్నారు. -
పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి
పూతలపట్టు(యాదమరి): పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పూతలపట్టు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నాగరాజు ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి(2.0)పై సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన వనరులను అన్వేషించాలన్నారు. పొడి, తడి చెత్తను వేరు చేసి అందులో నుంచి వర్మీకంపోస్టును తయారు చేసి, వాటిని రైతులకు విక్రయించాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఈఓపీఆర్డీ శ్రీనివాసులు -
ఆరోపణల వెనుక కుట్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరపాలక సంస్థ మెప్మా అధికారిగా పనిచేసిన రమణ పోద్బలంతో మహిళా సంఘాల సభ్యుల పేరిట భువనేశ్వరి, ఉషారాణి అనే ఇద్దరు మహిళలు తనపై నిరాధార ఆరోపణలు చేశారని చిత్తూరు నగర పాలక సంస్థ రిసోర్స్ పర్సన్ బేబీ శ్వేత ఆరోపించారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను 38 గ్రూపులకు ఆర్పీగా పనిచేశానని, తమ గ్రూపులోని సభ్యులు ఎవరూ ఆరోపణ చేయలేదన్నారు. సభ్యులు కాని వారు ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర ఉందన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మెప్మా అధికారి రమణ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు కక్ష సాధింపుగా ఇలా లేనిపోని ఆరోపణలను చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. తన భర్తకు ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనతో తమ పిల్లలు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ‘నిరసన వారం’ చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై ఏపీటీఎఫ్ ‘నిరసన వారం’ కార్యక్రమాన్ని చేపడుతోందని ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్, ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు వివిధ విధానాల్లో నిరసనలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. -
గ్రామంలో లేని మహిళకు ఆశా కార్యకర్త పోస్టు
చౌడేపల్లె: మండలంలోని పెద్ద యల్లకుంట్ల పంచాయతీ పరిధిలో గ్రామంలోని మహిళను ఆశా కార్యకర్తగా నియమించడంపై గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులందరూ కలిసి మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యురాలు మోనాను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో ఆశ కార్యకర్తగా ఉన్న లక్ష్మీదేవి మృతిచెందడంతో ఆ పోస్టుకు ఆరుగురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అయితే నిబంధనలు పాటించకుండా పక్క పంచాయతీలో నివాసమున్న మహిళకు పోస్టు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 11 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందికి రూ.1.1 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.1 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అంతర్జాతీయ క్రీడల్లో విద్యార్థులు రాణించాలి కుప్పం: ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. అంతర్జాతీయ క్రీడలకు మంగళవారం ఎంపికై న విద్యార్థులను అభినందించారు. నేపాల్‌లో నిర్వహించే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. పీఈఎస్ విద్యార్థికి బహుమతి గుడుపల్లె: మండలంలోని పీఈఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న సాయి జాహ్నవికి విశిష్ట బహుమతి లభించింది. హెల్త్ యూనివర్సిటీ 2023లో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. ఇందుకు గాను ప్రతిష్టాత్మక కవూరి హైమావతి, కవూరి చలపతిరావు బహు మతి జాహ్నవికి లభించింది. విజయవాడలో మంగళవారం నిర్వహించిన హెల్త్ యూనివర్సిటీ వార్షికోత్సవంలో విద్యార్థి సాయిజాహ్నవికి బహుమతి ప్రదానం చేశారు. టెట్‌పై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి అని ఆదేశించిన సుప్రీం తీర్పుపై కూటమి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో సీనియర్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు మరింత క్లిష్టమవుతాయన్నారు. 20 ఏళ్లకు పైగా పనిచేసిన టీచర్లు ఇప్పుడు టెట్ అర్హత సాధించడం అన్యాయమని, కష్టతరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన దసరా సెలవుల్లో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలి చిత్తూరు కార్పొరేషన్: కూటమి నాయకుల అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరులో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దోపిడీకి అడ్డులేకుండా పోతోందన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆరోపించారు. పలువురు తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్రమంగా క్వారీల నిర్వహణ, గ్రావెల్, ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని చెప్పారు. వీటిపై పత్రికలు, మీడియాలో కథనాలు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. -
ఏ.కొత్తకోటలోనే రైతుసేవా కేంద్రం కొనసాగించాలి
చౌడేపల్లె: మండలంలోని ఏ.కొత్తకోట గ్రామంలోనే రైతుసేవా కేంద్రాన్ని కొనసాగించాలని రైతులు ఏవో మోహన్‌కుమార్‌ను వేడుకున్నారు. గత ప్రభుత్వంలో రైతుల శ్రేయస్సు కోసం తమ గ్రామంలోనే రైతుభరోసా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో ఇటీవల దుర్గసముద్రం రైతుసేవా కేంద్రానికి ఏ.కొత్తకోటను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్ చేయడం తగదన్నారు. రెండు రోజుల క్రితం ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న దుర్గసముద్రం రైతు సేవా కేంద్రానికి వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. రైతులు విజయ్‌కుమార్‌రెడ్డి, షఫీ, మునిరాజ, మల్లికార్జున పాల్గొన్నారు. సకాలంలో వైద్యం అందించాలి పుంగనూరు: ఏరియా ఆస్పత్రిలో గ్రామీణ ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ వైద్యులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, వైద్యులు, నర్సుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ హరగోపాల్, డాక్టర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు ప్రజలకు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఫొటో, వీడియోగ్రఫీలపై ఉచిత శిక్షణ చంద్రగిరి : యూనియన్ బ్యాంక్ , గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి 31 రోజుల పాటు పురుషులు, మహిళలకు ఫొటో, వీడియోగ్రఫీపై ఉచితంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్ , రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సంస్థకు వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 79896 80587, 94949 51289 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఆంక్షలు.. అడుగడుగునా ఆటంకాలు
కుప్పం: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చాలని వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు కుప్పంలో నిర్వహించిన అన్నదాత పోరుకు పోలీసులు ఆంక్షలతోపాటు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గంలో ర్యాలీలకు అనుమతులు లేవని, ఆర్టీఓకు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతిస్తున్నట్టు కుప్పం డీఎస్పీ పార్థసారథి సోమవారమే తేల్చారు. భారీగా పోలీసుల మోహరింపు అన్నదాత పోరు కార్యక్రమాన్ని అడ్డుకునేందకు ఎమ్మెల్సీ, కుప్పం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ భరత్ క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మెహరించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పోలీసులు ప్యాలెస్ రోడ్డు, క్యాంపు కార్యాయలం వద్ద మోహరించారు. వైఎస్సార్ సీపీ కేడర్‌ను రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ క్యాంపు ఆఫీసు వద్ద కుప్పం అర్బన్ సీఐ, ఇద్దురు ఎస్ఐలు, పోలీసు యంత్రాంగం తిష్టవేసింది. దారి పోడువునా అడ్డగింత కుప్పం నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులను దారి పోడవునా పోలీసులు అడ్డగించారు. అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ అర్బన్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ హఫీజ్, మోహన్ రామ్‌ను శెట్టిపల్లి వద్ద నిలిపి వేశారు. అదేవిధంగా గుడుపల్లె మండలం, కుప్పిగానిపల్లి సర్పంచ్ రామూర్తిని వంద పడకల అస్పత్రి సర్కిల్ వద్ద నిలిపివేశారు. -
ఆ సంస్థకే యూరియా కేటాయించాలి
చౌడేపల్లె: రైతు ఉత్పత్తిదారుల సంస్థకే యూరియా కేటాయించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రైతు ఉత్పత్తిదారుల సంఘ మండల అధ్యక్షుడు వెంకటరమణ కోరారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో రైతులు, డైరెక్టర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఉత్పత్తిదారుల సంఘం పరిధిలో 2,315 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, వరి, గడ్డి సేద్యం సాగుకోసం ప్రతి రైతుకూ యూరియా అవసరమని చెప్పారు. ప్రభుత్వం రైతుసేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న యూరియాలో కొంతమేరకు మాత్రమే సరిపోతోందని, ఇంకనూ యూరియా అవసరం ఉందని సమావేశంలో తీర్మానించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా యూరియా కొనుగోలుకు ముందస్తుగానే సొమ్ము చెల్లిస్తామని, ఉన్నతాధికారులు స్పందించి యూరియా మంజూరుచేస్తే రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తామని చెప్పారు. సమావేశంలో డైరక్టర్లు కృపాకర్‌రెడ్డి, కృష్ణప్ప పాల్గొన్నారు. -
బాబొస్తే కన్నీరే
పలమనేరు ఆర్డీవోకు వినతి పత్రం అందజేస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పీచైర్మన్, మాజీ ఎమ్మెల్యేపలమనేరులో ర్యాలీగా వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడసాక్షి ప్రతినిధి, తిరుపతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అన్నదాతలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. సరైన విత్తనాలు.. చాలినంత ఎరువులు అందక అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా యూరియా కొరత మెడకు చుట్టుకోవడంతో గిజగిజా కొట్టుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎర్రటి ఎండనూ లెక్కచేయక ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా కూటమి నేతలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై అన్నదాతలు రగిలిపోతున్నారు. వీరికి అండగా వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’కు పిలుపునిచ్చింది. మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పలమనేరు, కుప్పం, చిత్తూరు, నగరి ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. రెవెన్యూ డివిజనల్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. వేరుశనగ, వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, పంటలకు ఉచిత బీమా అమలు చేయాలని సూచించారు. కుప్పంలో ఆంక్షల జోరు ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రైతు సమస్యలను పరిష్కరించాలని అధికారికి వినతి పత్రం సమర్పించారు. పార్టీ శ్రేణులు, రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. 30 యాక్ట్ అమలులో ఉందని, ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని సోమవారం రాత్రే ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీచేశారు. కేవలం ఐదుగురు.. లేదా ఆరుగురితో ఆర్డీఓ కార్యాలయాలకి చేరుకుని వినతి పత్రం సమర్పించాలని హుకుం జారీచేశారు. ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. చిత్తూరులో అడ్డగింపులు చిత్తూరులో ర్యాలీలు, నిరసన చేపట్టకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టేందుకు పూనుకున్నారు. మాజీ మంత్రి నారాయణస్వామి, చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, కృపాలక్ష్మి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి పాల్గొని అన్నదాతలకు మద్దతుగా నిలిచారు. అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా గంగినేని చెరువు నుంచి చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. నిరసనలతో గర్జించిన నగరి నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యర్తలు, రైతులు కలిసి ర్యాలీ నిర్వహించారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు, అన్నదాతలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. హోరెత్తిన పలమనేరు పలమనేరులో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సిల్క్ ఫాం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణుల నినాదాలతో పలమనేరు పట్టణం హోరెత్తింది. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. సమస్యలపై కదంతొక్కిన రైతన్నలు జిల్లాలో అన్నదాతలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. ఏడాదిన్నరగా ఎదర్కొంటున్న సమస్యలపై నిరసనలు మిన్నంటించారు. వరి, వేరుశనగ, మామిడి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి నేతలు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కొరతతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చిన ఎరువులను కొందరు నేతలు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ‘కక్ష సాధింపు మానుకో.. గిట్టుబాటు ధరలిచ్చుకో..!,’ ‘నాటకాలు ఆపు..ఎరువులివ్వు బాబూ’! అంటూ నినాదాలు మిన్నటించారు. అనంతరం ఆర్డీఓలకు వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గడిచిన నాలుగు దఫాలు ఎప్పుడైనా రైతులు సంతోషంగా ఉన్నారా..?. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వారికి కన్నీళ్లే. పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండదు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఊసేలేదు. కనీసం యూరియా దిక్కులేని పాలన కేవలం చంద్రబాబుకే దక్కింది. యూరియా బ్లాక్‌మార్కెట్‌కు తరలించిన ఘనత కూటమి సర్కార్కే చెల్లుతుంది. యూరియా ఎక్కువ వాడితే భూసారం దెబ్బతింటుందని చంద్రబాబు ఉచిత సలహాలు ఎవరికోసం గుప్పిస్తున్నాడో రైతులు గుర్తించాలి. కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులకు గిట్టుబాటు ధరలేక పలువురు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురైంది. ఈ ప్రాంతంలో టమాటాకు రేట్లు లేక రోడ్డుపాలు చేసిన ఘటనలు చూశాం గానీ ఎప్పుడైనా మామిడిని రోడ్డుపై పడేశారా..?. గత ప్రభుత్వంలో కోవిడ్‌లాంటి కష్ట సమయంలోనూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కింది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే -
పలుకుబడి ఉన్నోళ్లకే యూరియా
యాదమరి: ‘మీరిచ్చే ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్నాం. కానీ మీరేమో గుట్టుచప్పుడు కాకుండా రాజకీయంగా పలుకుబడి ఉన్నోళ్లకే బినామీ టోకెన్లు జారీచేసి ఇచ్చేస్తున్నారు. అడిగితే స్టాకు లేదని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం’ అని పలువురు రైతులు రైతు సేవా కేంద్రంలోని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ ఘటన మంగళవారం మోర్దానపల్లి రైతు సేవా కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం మండల పరిధిలోని మోర్దానపల్లి రైతు సేవా కేంద్రానికి 300 బస్తాల యూరియా వచ్చింది. దీని కోసం రైతులు ఉదయం 7 నుంచే క్యూలో వేచి ఉన్నారు. అయితే ఎప్పటిలాగే ఆర్ఎస్కే సిబ్బంది 11 గంటలకు వచ్చారు. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న అన్నదాతలు సిబ్బంది ధోరణిపై అసహనానికి గురయ్యారు. రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లకి దొడ్డిదారిన యూరియా అందించడంతో, ఇది గమనించిన రైతులు ఓ మహిళా సిబ్బందిని ప్రశ్నించారు. ఒకానొక దశలో ఆ మహిళా ఉద్యోగితో తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. మండలంలో రెండు నెలల కిందట వేరుశనగ విత్తనాల పంపిణీ సమయంలో కూడా ఆ మహిళా ఉద్యోగి రైతులపై దురుసుగా ప్రవర్తించినట్టు అక్కడి రైతులు పేర్కొన్నారు. కాగా వచ్చిన 300 బస్తాల యూరియాలో మోర్దానపల్లి, యాదమరి, కీనాటంపల్లి, వరదరాజులుపల్లి, 14కండ్రిగ, కోనాపల్లి పచాయతీల నుంచి 222 మంది అన్నదాతలకు ఒక్కో బస్తా చొప్పున అందించారు. మిగిలిన 78 బస్తాలను బుధవారం మాధవరం, జంగాలపల్లి పంచాయతీలోని రైతులకు పంపిణీ చేయనున్నట్లు ఏఓ దీప చెప్పారు. -
నేడు రెడ్ రన్ మారథాన్
చిత్తూరు రూరల్(కాణిపాకం): ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ.. బుధవారం చిత్తూరులో రెడ్ రన్ మారథాన్‌ను నిర్వహించనున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఉదయం 6 గంటలకు మెసానికల్ మైదానం నుంచి ఈ రన్ ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్, డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులు అర్హులని, రన్లో ప్రతిభ కనబరచిన వారికి నగదు బహుమతి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు మెసానికల్ మైదానం వద్దకు చేరుకుని పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పంటలు ధ్వంసం పులిచెర్ల(కల్లూరు): మండలంలోని చల్లావారిపల్లె, పాతపేట పంచాయతీల్లో మంగళవారం తెల్ల వారు జామున ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి ధ్వంసం చేసింది. పది రోజులుగా వరస బెట్టి ఒకే ప్రాంతంలో ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. చల్లావారిపల్లెలో మొక్కజొన్న పంటను తిని తొక్కి నాశనం చేశాయి. అలాగే పనస, మామిడి, అరటి, వేరుశనగ పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల బారినుంచి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. యూరియా పంపిణీ పరిశీలన పెద్దపంజాణి: మండలంలోని పెద్దపంజాణి, కొళత్తూరు, వీరప్పల్లి రైతు సేవా కేంద్రాలలో యూరియా పంపిణీని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ–కేవైసీ, బయోమెట్రిక్‌తో డీబీటీ పద్ధతిలో పారదర్శకంగా రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు మరొక బస్తా పంపిణీకి చర్యలు చేపడతామన్నారు. అవసరమైన చోట 20 రోజుల తర్వాత మరో విడత యూరియా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, ఏడీఏ శివకుమార్, ఎంపీడీఓ బాలాజీ, ఏఓ హేమలత, సచివాలయ సిబ్బంది ఉన్నారు. యూరియా కొరత లేదు పుంగనూరు: ప్రస్తుతం ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులందరికీ సరఫరా చేస్తున్నామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన పట్టణంలోని యూరియా గోడౌనును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో చర్చించారు. లక్ష్యాన్ని మించి యూరియాను సరఫరా చేస్తున్నామని, వ్యవసాయాధికారుల సూచనల మేరకే యూరియా వినియోగించాలని సూచించారు. కలెక్టర్ వెంట జేడీ మురళీకృష్ణ, ఏడీ శివకుమార్ ఉన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవం జరగాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి ఆదేశించారు. చిత్తూరు నగరం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో మంగళవారం జననీ సురక్ష యోజన పథకంపై వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. హైరిస్క్ కేసులకు అందించే వైద్య సేఓవల విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. ప్రతి కాన్పు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరికీ జననీ సురక్ష కింద అర్బన్ ప్రాంతాల వారికి రూ.800, రూరల్‌కు రూ.1000 చొప్పున్న డీబీటీ ద్వారా ఇవ్వాలన్నారు. అలాగే ఎన్హెచ్ఎం ఫండ్స్‌పై చర్చించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, వైద్యులు రోజారాణి, రామ్మోహన్, వైద్యులు పాల్గొన్నారు. డీఎఫ్ఓ భరణి బదిలీ చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్ఎస్ల బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా డీఎఫ్ఓ భరణి బదిలీ అయ్యా రు. ఈమేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భరణిని శాప్ ఎండీగా బదిలీ చేయగా.. ఆమె స్థానంలో జిల్లాకు 2022 బ్యాచ్‌కు చెందిన కోడూరు సబ్డీఎఫ్ఓగా ఉన్న సుబ్బురాజును నియమించారు. -
సూర్యప్రభపై అభయం
కాణిపాకం: ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి మంగళవారం సూర్యప్రభ వాహనంపై అభయమిచ్చారు. ఉదయం స్వామికి ప్రత్యేక అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి ఉత్సవ మూర్తునలు ప్రత్యేకంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం స్వామిని మంగళవాయిద్యాల నడుమ మూడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు చంద్రప్రభ వాహన సేవ కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ మూర్తులు బుధవారం చంద్ర ప్రభ వాహనంపై ఊరేగుతూ కటాక్షించనున్నారు. ఉదయం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందని ఆలయ ఈవో పెంచలకిషోర్ తెలిపారు. అలరించిన నాట్యం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. నాటక, గీతాలపానలు, కూచిపూడి, భరతనాట్యం కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ధార్మికోపనాస్యం, హరికథ ఆకట్టుకుంది. సూర్యప్రభ వాహనంపై స్వామివారు అలరించిన కళాకారిణి -
వరిపంట కొనుగోలే లేదు
పుంగనూరు : పుంగనూరులో వరిపంట కొనుగోలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖరీఫ్ పంట పండించిన రైతులు వరి ధాన్యాన్ని తమకు నచ్చిన రీతిలో క్వింటా రూ.2,200 లతో విక్రయాలు చేసుకున్నారు. కాగా పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సోమల , సదుం, రొంపిచెర్లం, పులిచెర్ల మండలాలతో పాటు పంజాణి, గంగవరం మండలాల్లో సుమారు 5,200 హెక్టార్లలో సాగు చేశారు. ప్రస్తుతం రబీ సాగు 2.50 హెక్టార్లలో మాత్రమే సాగు అవుతోంది. ఈ సారైన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. -
‘ఎద్దల బండ’పై గద్దలు!
కూటమి ప్రభుత్వంలో పచ్చమూక రెచ్చిపోతోంది. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకుంటోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు ఇష్టారాజ్యంగా అక్రమార్జనకు పాల్పడుతోంది. అందులో భాగంగానే బందార్లపల్లె సమీపంలోని ఎద్దల బండపై కన్నేసింది. కొండను పగులగొట్టి కాసులు పోగేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారుల అండతో క్వారీ నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే స్థానికుల అడ్డుతొలగించుకునేందుకు దాడులకు పాల్పడుతోంది. పోలీసులను సైతం ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేస్తోంది. వెదురుకుప్పం : మండలంలోని కొమనగుంట పంచాయతీ బందార్లపల్లె గ్రామానికి సమీపంలో ఎద్దలబండ ఉంది. సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలోని ఈ కొండపై క్వారీ నడిపేందుకు టీడీపీ నేతలు యుగంధర్‌నాయుడు, తదితరులు సన్నాహాలు సాగిస్తున్నాడు. అధికారులను మామూళ్ల మత్తులో జోకొట్టి అనుమతులు సైతం తీసేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతంలో క్వారీ ప్రారంభమైతే సమీపంలోని తమ పంట పొలాలు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదం ఎద్దల బండపై క్వారీ నడిపితే పేలుళ్ల కారణంగా వచ్చే దుమ్ముధూళితో వాతావరణ కలుషితమవుతుందని బందార్లపల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో దుమ్ము పేరుకుపోయి పంటలు పండే ఆస్కారం ఉండదని వాపోతున్నారు. వాయుకాలుష్యం కారణంగా దీర్ఘకాలిక రోగాలు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని ఆరోపిస్తున్నారు. అలాగే క్వారీ పేలుళ్లతో గ్రామంపై రాళ్లు పడి స్థానికుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే దుస్థితి దాపురిస్తుందని మండిపడుతున్నారు. పేలుళ్ల శబ్దాలకు ఇళ్లు సైతం బీటలువారే ప్రమాదముందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన గాలితో ప్రశాంతంగా తమ గ్రామం ఉంటుందని, క్వారీ కారణంగా పూర్తిగా నాశనమవుతుందని వాపోతున్నారు. పట్టించుకోని అధికారులు సుమారు రెండు నెలలుగా క్వారీ విషయం గందరగోళంగా మారినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాంబూలం ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. క్వారీకి అనుమతులు మంజూరు చేసి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా సదరు క్వారీ యజమాని సుమారు 20 మంది రౌడీలను తీసుకువచ్చి తమపై దాడి చేయించినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పోలీసులు కూడా అక్రమార్కులకే వంతపాడుతున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రశాంతమైన తమ ఊరును కాపాడాలని విన్నవిస్తున్నారు.అడ్డు పడితే అంతే.. బందార్లపల్లె వాసుల సమస్యలను గుర్తించకుండా కేవలం ధన దాహంతో క్వారీ యజమాని పనులు చేపడుతున్నాడు. క్వారీ కారణంగా తలెత్తే అనర్థాలను పక్కన పెట్టి ఎలాగైనా బండను కొల్లగొట్టేందుకే అభ్యంతరాలను ఖాతరు చేయడం లేదు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూండాలను సైతం రంగంలోకి దింపి దాడులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇది మా ప్రభుత్వం.. మా ఎమ్మెల్యే.. ఇక్కడ అధికారం మాది అంటూ ముప్పతిప్పలు పెడుతున్నాడని ఆవేదన చెందుతున్నారు. బీడు పెట్టుకోవాల్సిందే.. ఎద్దలబండపై క్వారీ నిర్వహిస్తే సమీపంలోని 20 ఎకరాలను బీడు పెట్టుకోవాల్సిందే. భూములు సాగుకు పనికిరాకుండా పోతాయి. క్వారీ వద్దని అభ్యంతరం చెబితే మహిళలని కూడా చూడడం లేదు. విచక్షణా రహితంగా దాడి చేస్తున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. – ధనలక్ష్మి, బందార్లపల్లెఊరొదిలి వెళ్లాల్సిందే.. ఎద్దల బండపై క్వారీ మొదలైతే అందరం ఊరొదిలి వెళ్లిపోవాల్సిందే. ఇళ్లు, పొలాలు నాశనమవుతాయి. ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడతాయి. మేత కరువై పశువుల పెంపకం కష్టతరంగా మారుతుంది. ఇప్పుడు ఎద్దల బండపై పంట నూర్పిళ్లు కూడా చేసుకుంటున్నాం. టీడీపీ నేతలు మా కష్టాలను గమనించి కనికరించాలి. – జయంత్ రెడ్డి, బందార్లపల్లె -
ఆలయ ‘గ్రహణం’
కాణిపాకం, పెంచలకోన ఆలయాల తలుపులు మూసివేస్తున్న అధికారులుసంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలు మూతపడ్డాయి. రాత్రి 9.57 నుంచి గ్రహణ సమయం మొదలవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచే ఆలయాలను మూసివేశారు. ఈ క్రమంలోనే తిరుమల, తిరుపతి, కాణిపాకం, పెంచలకోన, బోయకొండ, మొగిలిలో సంప్రదాయబద్ధంగా మహద్వారాలు మూతపడ్డాయి. అయితే రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదిదంపతులకు శాంతి అభిషేకం నిర్వహించారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేశారు. సంప్రోక్షణ, పుణ్యాహవచనం తర్వాత భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతించారు. – తిరుమల/శ్రీకాళహస్తి/కాణిపాకం/రాపూరు -
నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.పోలీస్ కార్యాలయంలో..చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. ప్రజలు వారి సమస్యలను నేరుగా తనను కలిసి తెలియజేయవచ్చని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.బస్సుల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలుగుడిపాల : తమిళనాడుకు వెళుతున్న బస్సులను ఆదివారం గుడిపాల పోలీసుల సహకారంతో తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం కూలీలను తిరుపతికి తరలించారు.ఎంపీడీఓలకు ఉద్యోగోన్నతిచిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పలువురు ఎంపీడీఓలకు డీడీఓలుగా ఉద్యోగోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46 మంది ఎంపీడీఓలను డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు(డీడీఓ)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఐరాల ఎంపీడీఓ ధనలక్ష్మిని డ్వామా ఏపీఓ (ఎంఅండ్‌ఈ)చిత్తూరు, నెల్లూరు డ్వామా ఏపీఓ(ఎంఅండ్‌ఈ) ఎం.ధనలక్ష్మిని డ్వామా పలమనేరు, తిరుపతి ఎంపీడీఓ రామచంద్రను డీడీఓ పలమనేరు, వైఎస్సార్ జిల్లా సంపేపల్లె ఎంపీడీఓ ఎన్.రామచంద్రను కుప్పం డీడీఓగా నియమించారు. శ్రీకాళహస్తి వెటర్నరీ ఆఫీసర్ అమర్నాథ్ను అక్కడే కొనసాగించేలా ఆదేశాల్లో పేర్కొన్నారు.నేడు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ధర్నాచిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు దివ్యాంగుల జేఏసీ నేతలు కొణతం చంద్రశేఖర్, మురళి వెల్లడించారు. ఆదివారం వారు మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగుల్లో ఒక్కొక్కరికి రూ.1.07 లక్షల విలువ చేసే మూడు చక్రాల స్కూటర్ పంపిణీ చేయనున్నారన్నారు. ఇందులో వైకల్య శాతం 70 శాతం కంటే ఎక్కువ ఉంటేనే స్కూటర్ అందిస్తామని నిబంధన విధించడం సరికాదన్నారు. సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్లో చాలా మంది దివ్యాంగుల వైకల్యశాతం తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్టోబర్‌లో పంపిణీ చేసే పింఛన్లపై సైతం స్పష్టత లేదన్నారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగనున్నట్లు వివరించారు. జిల్లాలోని దివ్యాంగులు ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ వద్దకు రావాలని పిలుపునిచ్చారు. -
కుంటలో పడి చిరు వ్యాపారి మృతి
బంగారుపాళెం: మండలంలోని 65 వెంకటాపురం సమీపంలో సోమవారం కుంటలో పడి చిరువ్యాపారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు పట్టణం మంగసముద్రం హౌసింగ్ కాలనీకి చెందిన ముస్తఫా(44) పాతసామాన్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం వ్యాపారం కోసం స్కూటీపై బంగారుపాళెం మండలానికి వచ్చాడు. మంగళపల్లె పంచాయతీ 65 వెంకటాపురం –సంక్రాతిపల్లె రహదారి పక్కన గల నీటి కుంటలో ద్విచక్ర వాహనంతో పాటు పడి మృతి చెందాడు. ఈ విషయాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తిని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. డబ్బు వసూలు చేయడం అన్యాయం చిత్తూరు కలెక్టరేట్ : పీసీఆర్ పాఠశాలలో విద్యార్థుల వద్ద టీసీ మంజూరుకు డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఉమ్మడి చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు కందాటి విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీసీ మంజూరుకు డబ్బులు వసూలుకు పాల్పడటం బాధాకరమన్నారు. టీసీ కోసం వచ్చే విద్యార్థుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడం నేరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పిపోయిన వ్యక్తి ప్రత్యక్షం.. ఆపై మాయం పలమనేరు: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి ప్రత్యక్షమై.. మళ్లీ కనిపించకుండా పోయిన ఘటన ఆదివారం పలమనేరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని బోయవీధికి చెందిన అస్లాం 15 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. అప్పట్లో కుటుంబీకులు వెదికినా దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని వినాయక నిమజ్జనంలో అతను ఉన్న ఓ వీడియో లోకల్ యూట్యూబ్ చానెల్లో కనిపించింది. అతన్ని గుర్తుపట్టిన కుటుంబీకులు సంతోషంతో అక్కడికెళ్లి చూడగా ఆ ప్రాంతంలో అతను కనిపించలేదు. అతను పట్టణంలోనే ఉన్నాడని భావించి గాలించడం మొదలు పెట్టారు. సరెండర్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందిపై ఫిర్యాదులు వెలువెత్తడంతో కలెక్టరేట్‌కు సరెండర్ చేశారు. ఇటీవల చేపట్టిన ఏఎన్ఎంల బదిలీల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ సిబ్బందిపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిగింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టి కలెక్టరేట్‌కు సరెండర్ చేసినట్టు డీఎంఅండ్హెచ్ సుధారాణి తెలిపారు. అలాగే అక్రమ లింగనిర్థారణ విషయంలో చేతులు కలిపిన ఆశ వర్కర్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. టపాకాయలు సీజ్ పెనుమూరు(కార్వేటినగరం): అక్రమంగా తరలిస్తున్న రూ.1.6 లక్షల విలువ జేసే టపాకాయాలు సీజ్ చేసిన ఘటన చిత్తూరు–పెనుమూరు రోడ్డు మార్గంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటనరసింహ కథనం... పెనుమూరు–చిత్తూరు మార్గంలో సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పీలేరుకు చెందిన కె.నవ్యకాంత్ ఏపీ 39 టీహెచ్1738 నంబరు గల టెంపో వాహనంలో రూ.1.6 లక్షల విలువ జేసే టపాకాయలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో వాహనాన్ని అందుపులోకి తీసుకుని, టపాకాయలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
చిత్తూరు కలెక్టరేట్ సోమవారం ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లింది. సమస్యల పరిష్కారం కోసం పలువురు క్యూకట్టారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి వెట్టిచాకిరీ నుంచి ఓ కుటుంబానికి అధికారులు విముక్తి కలిగించిన ఘటన జీడీనెల్లూరు మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025చౌడేపల్లె మండలం, దుర్గసముద్రం రైతుసేవా కేంద్రం వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులు గంగవరం: మండలంలోని (గుండుగల్లు, పసుపత్తూరు) క్లస్టర్‌కు 200 బస్తాలు, (దండపల్లి, మారేడుపల్లి) క్లస్టర్‌కు 200, జీడిమాకులపల్లికి 150, కొత్తపల్లికి 200, గంగవరం 1, 2 క్లస్టర్‌కు 200, గండ్రాజుపల్లి 1, 2 క్లస్టర్‌కు 200, మామడుగుకి 200 బస్తాల యూరియా వచ్చింది. వ్యవసాయాధికారి రఖీబా, రైతు సేవా సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం పంపిణీని ప్రారంభించారు. అయితే ఒక్కో సచివాలయ పరిధిలో వేల మంది రైతులు క్యూలో బారులు తీరారు. ముందుగా టోకెన్లు పొందిన రైతులకు యూరియా బస్తాలు సరిపోగా.. వెనుకబడిన రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఎదురైంది. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన క్లస్టర్లకు యూరియా రాకపోవడంతో రైతులు గందరగోళానికి గురయ్యారు. తీరని యూరియా కష్టాలు పెద్దపంజాణి: యూరియా కోసం అన్నదాతలు మండలంలోని శంకర్రాయలపేట, రాజుపల్లి, బట్టందొడ్డి, తుర్లపల్లి, కొళత్తూరు, లింగాపురం, పెద్దపంజాణి రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టారు. ప్రస్తుతం వరి పంటకు యూరియా ఎంతో అవసరం. అదును దాటితే ఎంత వేసినా ప్రయోజం శూన్యం. దీంతో ఉదయమే ఆర్ఎస్కేల వద్దకు చేరుకున్నారు. అన్ని పనులు వదిలేసి క్యూలో నిలబడితే ఒకేఒక్క బస్తా యూరియా ఇవ్వడంతో ఆవేదనకు లోనయ్యారు. అదికూడా సగం మందికి కూడా ఇవ్వలేదని రైతులు వాపోయారు. రోజంతా పడిగాపులు కాసినా ఒక్క బస్తా యూరియా దొరకండం లేదని వాపోయారు. నువ్వు ముందా..నేను ముందా? చౌడేపల్లె: మండలంలోని 12 రైతుసేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తారని ప్రకటించడంతో అధిక సంఖ్యలో రైతుసేవా కేంద్రాల వద్దకు రైతులు చేరుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్‌లు చేతపట్టుకొని ఉదయం నుంచే పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు. కూటమి నేతలు కొందరు పంపిణీ కేంద్రాల వద్ద చేతివాటం ప్రదర్శించి తమవారికే ముందు యూరియా ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచారు. దుర్గసముద్రం సచివాలయం వద్ద అగ్రికల్చర్ అసిస్టెంట్ రమణమ్మ, వెల్ఫేర్ అసిస్టెంట్ రియాజ్ తప్ప ఎవరూ సకాలంలో విధులకు రాలేదు. అప్పటికే అక్కడకు వందల మంది రైతులు చేరుకోవడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు చేరుకొని రైతులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. లద్దిగం రైతుసేవాకేంద్రం వద్ద రైతులు గుంపులు గుంపులుగా వెళ్లడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక్కో కేంద్రం వద్ద 150 బస్తాల యూరియా మాత్రమే స్టాకు ఉండడంతో నువ్వుముందా..నేను ముందా..? అనే ఆతృతతో రైతులు పోటీపడ్డారు. చివరికి సీఐ రాంభూపాల్, వ్యవసాయశాఖ ఏడీఏ శివకుమార్, ఎస్ఐ నాగేశ్వరరావు, ఏఓ మోహన్ రైతులతో మాట్లాడారు. ఉన్న స్టాకును పంపిణీ చేయగా మిగిలిన రైతులకు టోకన్లు జారీ చేశామని, త్వరలో వారందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే రైతులు దానికి సంతృప్తి చెందలేదు. అదునుదాటాక యూరియా ఇస్తే ఏం లాభం అంటూ పెద విరవడం కనిపించింది. ప్రత్యేక విద్యుత్ అదాలత్ రేపు చిత్తూరు కార్పొరేషన్: ప్రత్యేక విద్యుత్ అదాలత్‌ను బుధవారం జీడీనెల్లూరు డీఈ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో రూరల్ ఈఈ సురేష్ తెలిపారు. విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు మధుకుమార్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి కార్యక్రమానికి హాజరుకానున్నట్టు వెల్లడించారు. పెనుమూరు, ఆవులకొండ, జీడీనెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం, నగరి, పన్నూరు, నిండ్ర సెక్షన్ల పరిధిలోని వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే ప్రగతి సాధ్యం చిత్తూరు కలెక్టరేట్ : సంపూర్ణ అక్షరాస్యతతోనే ప్రగతి సాధ్యమని జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ మహమ్మద్ ఆజాద్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని బీఎస్ కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ అక్షరాస్యులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. నిరక్షరాస్యతను రూపుమాపేందుకు అనేక పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం జిల్లాలో అమలువుతోందన్నారు. జిల్లాలోని 76,410 మందిని ఉల్లాస్ కార్యక్రమంలో గుర్తించి అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కోమల పాల్గొన్నారు. నేడు అన్నదాతపోరు చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాతపోరు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు స్థానిక గంగినేని చెరువు వద్ద నుంచి 9.30 గంటలకు ర్యాలీగా బయలుదేరుతామని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందజేస్తామన్నారు. తమతో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, పార్టీ నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ర్యాలీపై పోలీసుల ఆంక్షలు చిత్తూరు అర్బన్: రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ తలపెట్టిన ధర్నాపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఆంక్షలు విధించింది. చిత్తూరులో రైతులకు యూరియా పంపిణీ ఇప్పటికే ప్రారంభించారని, కావలసిన అంత స్టాకు కూడా ఉందని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. యూరియా కొరత ఉందని రైతులను రెచ్చగొట్టొద్దని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరు ఆర్డీవో కార్యాలయం వద్ద కేవలం పది మంది పార్టీ నాయకులకు మాత్రమే అనుమతుందని, ర్యాలీలు, నిరసనలు తెలియజేయడానికి వీల్లేదంటూ తెలిపారు. దీనికి తోడు చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీసు యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకటించారు. చిత్తూరులోని మూడు నియోజకవర్గాల్లో ర్యాలీలు ఊరేగింపులు నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు. ప్రజాసమస్యపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కడానికి పోలీసు శాఖ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వద్దు చిత్తూరు అర్బన్: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దన్ని ఏఎస్పీ రాజశేఖరరాజు చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఏఆర్ పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ సాయినాథ్తో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్‌క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 37 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. యూరియా.. బ్లాక్ మార్కెట్‌కు తరలుతోందా?బైరెడ్డిపల్లె: యూరియా కోసం బారులు తీరిన రైతులు పెద్దపంజాణి: యూరియా కోసం గుమికూడిన రైతులుయాదమరి : యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులుగంగవరం: గుండుగల్లు రైతు సేవా కేంద్రం వద్ద రైతుల తంటాలు పంట పొలాలపై ఏనుగుల దాడి పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. తాజాగా సోమవారం పూరేడువారిపల్లె, కల్లూరు, కొంగరవారిపల్లెల్లోని పంట పొలాలను సర్వనాశనం చేశాయి. వరి, కొబ్బరి పంటలను ధ్వంసం చేశాయి. ఇనుపగేట్లు, మామిడి చెట్ల కొమ్మలను విరిచివేశాయి. మండేగుండెలు!చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పాల్గొన్న దివ్యాంగురాలు రిహానా తండ్రి ‘మేమేమి చేశాము పాపం. మాకెందుకింత శిక్ష వేస్తున్నారు. మాపై కక్ష సాధింపులెందుకు..? పాలకులారా.. మా బిడ్డల గోడు తగలకుండా పోదు.. మా బాధ మిమ్మల్ని క్షోభించకుండా వదలదు..’ అంటూ అవిటివారైన తమ బిడ్డలనెత్తుకుని న్యాయం చేయాలంటూ మండుటెండలో తల్లిదండ్రులు గంటలకొద్దీ నిరీక్షించడం చూపరులను కదిలించింది. మా బాధ ఆలకించండి మహాప్రభో అంటూ..! కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ కలచివేసింది. ఈ ఘటన సోమవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట కనిపించింది. చిత్తూరు జిల్లా, ఐరాల మండల కేంద్రంలో నివాసముంటున్న షేక్ అల్తాఫ్, ముక్తియార్ కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. వారి కుమార్తె రిహానా అవిటితనంతో జన్మించింది. ప్రస్తుతం బాలికకు 14 ఏళ్లు. నడవలేదు. కాళ్లు చేతులు చచ్చుబడ్డాయి. కనీసం కూర్చోలేని పరిస్థితి. అన్నం కూడా స్వతహాగా తినలేదు. తల్లిదండ్రులే సపర్యలు చేయాల్సిన దుస్థితి. బిడ్డ బాగోగుల కోసం ఉన్నదంతా అమ్మి ఆస్పత్రులకు పెట్టేశారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. కూలీనాలి చేసి బిడ్డను పోషించడం కష్టతరంగా మారింది. తన కుమార్తెకు దివ్యాంగ పింఛన్ రూ.15 వేలు ఇప్పించాలని మొదట ఐరాల మండల అధికారులను అభ్యర్థించారు. ఆపై న్యాయం జరగకపోవడంతో ప్రతి సోమవారం అక్కడి నుంచి ఆటో పెట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇలా ఇప్పటికి 12 సార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు హాజరయ్యారు. బిడ్డను చేతిలో పెట్టుకుని న్యాయం చేయాలంటూ మండుటెండలో గంటల కొద్దీ నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మనసు లేని అధికారులు ఇప్పటికై నా కనికరిస్తారో.. లేదా తమ కఠినత్వం ఇందేనని మరోమారు రుజువు చేస్తారో వేచి చూడాలి మరి!. – చిత్తూరు కలెక్టరేట్ న్యాయం కోసం తండ్రి పడుతున్న ఆరాటం, అద్దె ఆటోలో రిహానాను కలెక్టరేట్‌కు తీసుకొస్తూ..‘ఏం ప్రభుత్వమో ఏమో..! పొద్దుపొడవక ముందే సద్ది కూడా తినకుండా వచ్చేశాం. ఎర్రటి ఎండలో.. నోరు పిడసగట్టుకుపోతున్నా రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టాం. అందరికన్నా ముందు ఉంటే ఒక బస్తా యూరియా అన్నా దొరుకుతుందని ఆశపడ్డాం. మేమొచ్చే లోపే క్యూకట్టేశారు. ఇంకేం చేయలేక.. కాళ్లు పీకేస్తున్నా ఇక్కడే ఉండిపోయాం. యాడికిపోయినా యూరియా లేదంటున్నారు. ఇప్పుడీ రైతు సేవా కేంద్రాలకొచ్చినా క్యూలో ముందున్న వారికి ఒక్కో బస్తా యూరియా ఇచ్చి పంపించేశారు.. కొందరు యూరియా కోసం కొట్లాట వరకు దిగేశారు. ఇలాంటి పరిస్థితి మేమెప్పుడూ చూడలేదు.. ఇక మాపరిస్థితి ఏందో తెలియడం లేదు’ అంటూ సోమవారం రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన రైతులు చర్చించుకోవడం కనిపించింది. ఒక్క బస్తా కోసం.. యాదమరి: మండలంలోని బోదగుట్టపల్లి, 184గొల్లపల్లి రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులకు పోలీసు బందోబస్తు నడుమ మండల వ్యవసాయాధికారులు యూరియా సరఫరా చేశారు. ఎన్నో ఆశలతో యూరియా కోసం రైతన్నలు ఉదయం నుంచి గంటల తరబడి నిరీక్షించినా చివరికి నిరాశే ఎదురైంది. మండలానికి కేవలం 300 బస్తాలు యూరియా మాత్రమే రావడంతో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఒక్క బస్తా యూరియాతో పంటను ఎలా కాపాడుకోవాలని రైతులు నిలదీశారు. త్వరలోనే మరింత యూరియా వస్తుందని తహసీల్దార్ పార్థసారథి, ఏఓ దీప రైతులకు భరోసా ఇచ్చారు. కాగా నేడు మండలంలోని మోర్దానపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ చేయనున్నట్టు ఏఓ తెలిపారు. జిల్లాలో దయనీయంగా యూరియా నిల్వలు కాణిపాకం: జిల్లాలో ఎప్పుడూ లేన్నంతగా గత ఏడాదిన్నర కాలంలోనే యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. యూరియా పక్కదారి పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరఫరా అవుతున్న యూరియా మొత్తం కొన్ని ప్రైవేటు దుకాణాలకు కేటాయించడంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అక్కడి నుంచి యూరియాను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతు భరోసా కేంద్రాలుండగా.. ప్రైవేటు షాపులకు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇచ్చి..అలా బ్లాక్ మార్కెట్‌కు తరలించి.. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మండిపడుతున్నారు. తర్వాత సిఫార్సులతో కొంత మందికి యూరియాను కావాల్సినంత ఇవ్వడం సమంజసం కాదంటున్నారు. ఆర్బీకేల ద్వారా ఎందుకివ్వరు? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేసింది. రైతులకు అవరసరమైన విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు అందిస్తూ వచ్చింది. రైతులకు కావాల్సినంత మేరకు యూరియాను అందజేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్బీకేలను నీరుగార్చింది. రైతు సేవలను దూరం చేస్తోంది. కేవలం మండల కేంద్రంలోని సొసైటీలు, ప్రైవేటు దుకాణాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. అవస్థలు ఎన్నో..! యూరియా క్షేత్ర స్థాయిలో అందకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. మండల స్థాయిలోని ప్రైవేటు దుకాణాలకు యూరియా పంపిణీ బాధ్యతలు ఇవ్వడంతో రైతులు పడిగావులు కాయాల్సి వస్తోంది. రైతులు పనులు మానుకుని పంపిణీ కేంద్రం వద్ద గంటలకొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి. తొక్కిసలాట.. తోపులాటలో నలిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. విధిలేక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్తా యూరియా రూ.260 నుంచి రూ.280 ఉండగా.. బ్లాక్ మార్కెట్లో అదనంగా రూ.450కి కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. బారులు తీరిన రైతులు బైరెడ్డిపల్లె : ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం క్యూలో వేచి ఉన్నా కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని 7 రైతు సేవా కేంద్రాల్లో సోమవారం 2,250 బస్తాల యూరియాను పంపిణీ చేశారు. అయితే ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే పంపిణీ చేశారు. దీనికోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన దుస్థితి వచ్చిందని పలువురు వాపోయారు. -
ఎర్రమట్టి..కొల్లగొట్టి!
పాలసముద్రం: మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు కొల్లగొడుతోంది. అందినకాడికి ఎర్ర గావెల్‌ను తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. దీనిపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి అండతో మరింత రెచ్చిపోతోంది. మండలంలోని వనదుర్గాపురం రెవెన్యూ లేక్కదాఖాల జగనన్న కాలనీ సమీపంలోని గుట్టపై కన్నేసింది. తలసిందే తడువుగా హిటాచీలు దించేసింది. పదుల సంఖ్యలో ఎర్రగ్రావెల్ను నింపి లారీలను సరిహద్దు దాటించింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే! మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ, జగనన్న కాలనీకి ఆనుకుని గుట్టలున్నాయి. ఇవి తమిళనాడు హైవేకి కిలో మీటరు దూరంలో ఉండడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ గుట్టల్లోని విలువైన ఖనిజ సంపదను దోచుకుంటున్నారు. గ్రావెల్, మట్టిని తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడులో ఒక్కో టిప్పర్ గ్రావెల్‌ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోరే? తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఇదే అదునుగా అక్రమార్కులు అందినకాడికి అడ్డంగా తోడేస్తున్నారు. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో అక్రమార్కులకు ఎదురు లేకుండా పోతోంది. మండలంలోని గుట్టలు, కొండలను కరింగించేస్తున్నారు. గతంలో అనుమతి లేకుండా ఎర్రమట్టి తీసుకెళ్తున్న టిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. వాటిని రెండు రోజుల క్రితమే అక్రమార్కులు పన్నులు చెల్లించి తీసుకెళ్లారు. మళ్లీ ఇప్పుడు వనదుర్గాపురం పంచాయతీ, జగనన్న కాలనీ సమీపంలోని గుట్టలో తవ్వకాలు ప్రారంభించారు. తమకడ్డొచ్చిన అధికారులను కూడా బెదిరించినట్టు సమాచారం. వాహనాలు సీజ్ వనదుర్గాపురం గుట్టలో ఎర్రమట్టి తీసుకెళ్తున్నట్టు సమాచారం అందుకున్న తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తవ్వకాలు, వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడంతో తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేశారు. తమిళనాడు టిప్పర్లకు అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలని ఎస్ఐ తెలిపారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
చిత్తూరు కలెక్టరేట్ : వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ధర్నాలు నిర్వహించడంతో కలెక్టరేట్ దద్దరిల్లింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ధర్నాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేదల ఇళ్లపై దౌర్జన్యం 60 ఏళ్లుగా నివాసముంటున్న 93 కుటుంబాల ఇళ్లను కూల్చేసి ఆ భూమిని ఆక్రమించుకునేందుకు సతీష్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు పెనుమూరు మండలం, దాసరపల్లె గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు ఆ గ్రామానికి చెందిన ప్రజల అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు విచ్చేసి ధర్నా నిర్వహించారు. వారి ధర్నాకు సీపీఎం నేతలు మద్దతు పలికారు. గ్రామస్తులు మాట్లాడుతూ దాసరపల్లిలో సర్వే నం.7లో గత 60 ఏళ్లుగా 93 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలిపారు. తమ గ్రామంలో రెండు బోరు మోటార్లు, ప్రభుత్వ పాఠశాల, నీళ్ల ట్యాంకు, ఆలయంతో పాటు 93 కుటుంబాలు ఉన్నట్టు తెలిపారు. ఆ ఇళ్లను ప్రస్తుతం కూల్చేసి భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నామని, అయినా ఇళ్లను కూల్చేసేందుకు నోటీసులు పంపి బెదిరిస్తున్నారన్నారు. గతంలో సర్వే నం.7లో మేత బీడు పోరంబోకుగా ఉండేదన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ భూమిని మేత భూమి నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు సైతం ఇచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం పెనుమూరు తహసీల్దార్ మొత్తం భూమిని స్వాధీనం చేయాలంటూ ఆదేశాలివ్వడం దారుణమన్నారు. తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో గ్రామస్తులు రాజారెడ్డి, రామకృష్ణారెడ్డి, మునిలక్ష్మి, విజయ, సుజాత, రాణి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులను అవమానిస్తూ..అపహేళన చేస్తూ! కూటమి ప్రభుత్వం దివ్యాంగులను అవమానిస్తూ.. అపహేళన చేస్తూ కించపరుస్తోందని ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మురళి ఆరోపించారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిస్సహాయులైన దివ్యాంగులపై చేస్తున్న దాడికి ప్రతిరూపమే రీ వెరిఫికేషన్ ప్రక్రియ అని అభివర్ణించారు. రీ వెరిఫికేషన్‌లో వికలత్వ శాతం తగ్గించి దివ్యాంగుల పొట్ట కొట్టడం అన్యాయమన్నారు. దివ్యాంగులను ద్వేషిస్తూ, కించపరుస్తూ, వికలత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. పూర్తిగా మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితమైన దివ్యాంగులను రూ.15 వేల పింఛన్‌కు అర్హులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండాలనే నిబంధన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు సుమతి, నేతలు చిరంజీవి, సుబ్రహ్మణ్యం, లీలాపతినాయుడు, రమేష్ పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ భవనం ఎదుట మండుటెండలో బైఠాయించిన వెదురుకుప్పం మండలం, బందార్లపల్లె గ్రామస్తులు, ధర్నాను అడ్డుకుంటున్న పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం ధర్నా నిర్వహిస్తున్న దాసరపల్లె గ్రామస్తులుదివ్యాంగుల ధర్నా జీతాలు లేక అలమటిస్తున్నా.. కూటమి ప్రభుత్వంలో గ్రీన్ అంబాసిడర్లు జీతాలు లేక అలమటిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 25 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గ్రీన్ అంబాసిడర్ల జీతాలను వెంటనే మంజూరు చేయాలన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, సీపీఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డిలు మాట్లాడుతూ కార్మికుల పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పటికీ వారి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారికి ప్రతి నెలా ఇచ్చే రూ.6 వేలు సైతం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ధర్నాలో నగర కార్యదర్శి దాసరిచంద్ర, నాయకులు రమాదేవి, కవిత, రాజేంద్రన్, గోవిందస్వామి పాల్గొన్నారు. న్యాయం చేసే వరకు కదిలేదే లేదు తమకు న్యాయం చేసే వరకు కదిలేదే లేదు అంటూ వెదురుకుప్పం మండలం బందార్లపల్లె గ్రామస్తులు పీజీఆర్ఎస్ భవనం ముందు ధర్నా నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు విచ్చేసి టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎండగట్టారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గంటల తరబడి పీజీఆర్ఎస్ భవనం ఎదుట బైఠాయించారు. ఆ గ్రామస్తులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా స్వల్ప వాగ్వాదం నెలకుంది. ఈ ధర్నాలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సొంత తమ్ముడు నిది గ్రామస్తులకు మద్దతుగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామస్తులు మాట్లాడుతూ బందార్లపల్లె గ్రామానికి సమీపంలో ఎద్దలబండ వద్ద టీడీపీ నేత యుగంధర్‌నాయుడు తదితరులు క్వారీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఆ క్వారీ ప్రారంభమైతే తమ పంట పొలాలు నాశనమవుతాయన్నారు. క్వారీ ప్రారంభించకూడదని ప్రశ్నించినందుకు తమ పై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందిస్తూ క్వారీ ఆపివేసేలా ఆదేశిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. -
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
గంగాధర నెల్లూరు: వెట్టి చాకిరీ నుంచి ఓ కుటుంబానికి అధికారులు విముక్తి కల్పించారు. వివరాలు.. పెనుమూరు మండలం, పూనేపల్లి గ్రామానికి చెందిన నందిని కుటుంబ సభ్యులు జీడీ నెల్లూరు మండలం, కోటగరం పంచాయతీ, ఎట్టెరి గ్రామానికి చెందిన ఓ సిమెంట్ ఇటుకల వ్యాపారి వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు. దీనికి బదులుగా గత ఏడాది పాటు తా కుటుంబాన్ని పెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. ఈ విషయం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా నందిని కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీనివాసులు సోమవారం బాధితులను కలిసి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సదరు యజమానితో మాట్లాడి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఏఎస్ఐ మురళి పాల్గొన్నారు. బాలికపై లైంగిక వేధింపులు – నిందితుడికి జైలు, జరిమానా చిత్తూరు లీగల్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ లోకేష్ (30) అనే నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. కార్వేటినగరానికి చెందిన లోకేష్ 2021లో ఓ మైనర్ బాలికను తనతో ఫోన్లో మాట్లాడాలని బలవంతం చేసేవాడు. ఓ రోజు బాలికను బెదిరించి తన ఇంటికి పిలిపించుకుని, ఆమెకు అశ్లీల వీడియోలు చూపించి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు చేయడంతో బాలిక, జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఓ రోజు బాలికతో పాటు ఆమె తల్లి గన్నేరు పప్పు తిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. విషయం పోలీసులకు తెలియడంతో విచారించి, లోకేష్‌పై పోక్సో కింద కేసు నమోదుచేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శంకరరావు తీర్పునిచ్చారు. బాధిత బాలిక కుటుంబానికి రూ.50 వేలు పరిహారం అందజేయాలని చిత్తూరు ఆర్డీఓను జడ్జి ఆదేశించారు. -
మండలంలో లేకుండా చేస్తాం..
పాలసముద్రం: అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు, పొక్లెయిన్‌ను తహసీల్దార్, ఎస్ఐ అడ్డుకుని వాటిని సీజ్ చేసినందుకు వారిని మండలంలో లేకుండా చేస్తామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడు ఒకరు బెదిరించాడు. పైగా.. ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..పాలసముద్రం మండలం నుంచి టీడీపీ కూటమి నాయకులు మూడు, నాలుగు నెలలుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డప్పకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. సోమవారం వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టల్లో నుంచి అనుమతుల్లేకుండా తమిళనాడుకు ఎర్రమట్టి తరలిస్తున్న సంఘటన వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని తొమ్మిది టిప్పర్లు, రెండు పొక్లెయిన్లను సీజ్‌చేశారు. ఇలా ఎర్రమట్టిని అక్రమంగా తరలించకూడదని ఎస్ఐ రెడ్డప్ప వాహనాలను పోలీస్‌స్టేషన్‌కి తరలిస్తుంటే టీడీపీ కూటమి నాయకులు వారిపై గొడవకు దిగారు. అధికారులకు వేలు చూపిస్తూ హెచ్చరికలు..: ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడు, చెన్నైకి చెందిన శరవణ అక్కడకు చేరుకున్నాడు. టిప్పర్ల యజమానులతో కలిసి ఆయన తహసీల్దార్ అరుణకుమారిని, ఎస్ఐ రెడ్డప్పను ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది. త్వరలో మిమ్మల్ని మండలంలో లేకుండా చేస్తా’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. ఇదే సమయంలో అక్కడ ఫొటోలు తీస్తున్న సాక్షి విలేకరిని ‘నువ్వెవరు ఫొటోలు తీయడానికి.. నీ అంతుచూస్తా’.. అంటూ బెదిరిస్తూ పైపైకి దాడి చేయడానికి వస్తూ దూషించాడు. తోటి విలేకరులు రావడంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు. -
అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ
కార్వేటినగరం : అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన చేపడుతున్నామని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఆదివారం పుత్తూరులోని తన నివాసంలో అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు. నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదాతల అవసరాలకు అనుగుణంగా రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులను అందించామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం యూరియా పంపిణీలో సైతం కోతలు విధిస్తోందని విమర్శించారు. మామిడి రైతులకు ఫ్యాక్టరీల ద్వారా రూ.8, ప్రభుత్వం రూ.4 చెల్లిస్తామని చంద్రబాబు ఊదరగొట్టారని, వాస్తవానికి ఫ్యాక్టరీలు రూ.5 మాత్రమే చెల్లించినా పట్టించుకోలేదని మండిపడ్డారు.ఇక ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ.4లకు అతీగతీ లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్సీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తి వైఫల్యం చెందిందని విమర్శించారు. -
అక్రమ కేసులకు భయపడం
కార్వేటినగరం : కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. ఆదివారం పుత్తూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి పేదలు అవసరం లేదని, పెత్తందారులే ప్రధానమని ఆరోపించారు. అందుకే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసిందని మండిపడ్డారు. వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకే కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏకంగా 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చామని వెల్లడించారు. నేడు కేంద్ర ప్రభుత్వం చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారారని, వారిని ఎదిరించే దమ్ము, ధైర్యం లేక మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేద విద్యార్థులపై వివక్ష చూపుతారని విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే.. స్కామ్ జరిగిందని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. పైసా అవినీతి లేని లిక్కర్ కేసులో దాదాపు 39 మందిని కక్ష పూరితంగా కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో రెండు నుంచి మూడు బెల్టు షాపులు పెట్టి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారని,ఈ ప్రభుత్వంలోనే కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వమే వస్తుందని, జనరంజకంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. -
వరసిద్ధుని వైభవం
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం మూలవిరాట్‌కు పంచామృతి అభిషేకం నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. రాత్రి ఈ మేరకు రావణబ్రహ్మ వాహనంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వైభవంగా ఊరేగించారు. భక్తులు కర్పూరహారతులతో మొక్కులు చెల్లించుకున్నారు. అలరించిన నృత్యం ఆలయంలోని ఆస్థాన మండపంలో నిర్వహించిన కూచిపూడి, భరత నాట్యం అలరించాయి. అలాగే గీతాలపాలనలు భక్తులను హృదయాలను రంజింపజేశాయి. ఈ సందర్భంగా కళాకారులను ఈఓ పెంచలకిషోర్ సత్కరించారు. నేడు యాళివాహన సేవ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి యాళివాహన సేవ నిర్వహించనున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. -
మదమెక్కిన భీకరి!
కౌండిన్య అడవిలో సంచరించే మదపుటేనుగులు (ఫైల్) కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య ఇప్పట్లో తీరేలా లేదు. మదపుటేనుగుల మేటింగ్ సీజన్ మొదలు కావడంతో జనానికి ముప్పు తప్పేలాలేదు. అక్టోబర్ నుంచి జనవరి వరకు మదమెక్కిన గజరాజులకు పట్టపగ్గాలే ఉండవు. అలవి కాని ఆగ్రహంతో రెచ్చిపోయే భీ‘కరి’ నుంచి తోటి జంతువులతోపాటు మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుంది. మేటింగ్ సీజన్ ముగిసే వరకు అటవీ సమీప ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎలిఫెంట్ శాంచురీని దాటి బయటకొచ్చే మదపుటేనుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పలమనేరు : కుప్పం, చిత్తూరు, పలమనేరు ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులతోపాటు అటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, కృష్ణగిరి, కావేరిపట్నం , కర్ణాటకలోని హోసూర్, బన్నేర్‌గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే ఏనుగులున్నాయి. స్థానికంగా ఉన్న గుంపుల్లో మొత్తం 12 మగ ఏనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు ( మదపుటేనుగులు) మాత్రం ఉన్నాయి. గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా సంచరిస్తున్నాయి. ఒక్కో మదపుటేనుగు ఎంపిక చేసుకున్న ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. జనం కనిపిస్తే దాడులు చేయడం, లేదా తరమడం చేస్తుంటాయి. వీటి చేష్టలు, గుర్తులను బట్టి స్థానికంగా వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో రౌడీ ఏనుగు, రాముడు, భీముడు, ఒంటి దంతం ఏనుగు, ఒంటికన్ను ఏనుగు ఇలా వీటికి పేర్లు పెట్టారు. ఇవి తమ ఉనికి కోసం రౌడీల్లా ప్రవర్తిస్తుంటాయి. మిగిలిన ఆడ ఏనుగులు, గున్నలకు భయమెక్కువ, దీంతో ఇవి గుంపులోనే ఉంటూ జనాన్ని చూసి వెనక్కు వెళుతుంటాయి. కానీమదపుటేనుగులు ఏమాత్రం భయపడవు, ఎదురు దాడులకు దిగుతుంటాయి. ప్రస్తుతం ఆరు మాత్రమే.. కౌండిన్యలోని 12 మదపుటేనుగుల్లో ప్రస్తుతం ఆరు మాత్రమే ఉన్నాయి. బంగారుపాళెం మండలం మొగిలివారిపల్లెలో రౌడీ ఏనుగుగా చెప్పుకునే మదపుటేనుగు కరెంటు తీగలకు బలైంది. గంగవరం మండలం మన్నారునాయనిపల్లె సమీపంలో పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటుకు మరో మదపుటేనుగు బలైంది. అంతకుముందు కాలువపల్లె, మొసలి మడుగు వద్ద రాముడు, భీముడు అనే రెండు మదపుటేనుగులు చనిపోయాయి. మూడేళ్ల క్రితం పలమనేరు మండలంలోని బేరుపల్లె, గాంధీనగర్‌ల వద్ద రెండు మదపుటేనుగులు కరెంట్ షాక్‌తో కన్నుమూశాయి. ఇవి బతికున్నప్పుడు మనుషులు, పశువులు, కుక్కలను తరమి తరిమి చంపేవి. ఇప్పుడున్న ఆరు మదపుటేనుగుల్లో గుడ్డి కన్ను ఏనుగు గత మేటింగ్ సీజన్లో యాదమరి మండలం దిగువకనతల చెరవువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్‌ను చంపిన విషయం తెలిసిందే. మొసలిమడుగు రౌడీగా పిలవబడే మరో ఏనుగు కౌండిన్యలోని వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్‌ను తొండంతో విసిరేసింది. ఊసరపెంట మదపుటేనుగు తరచూ ఆ గ్రామంలోకి వచ్చి రాత్రంతా ఉండి వెళ్లడం దీని ప్రత్యేకత. మిగిలిన రెండు మదపుటేనుగులు వేర్వేరుగా కౌండిన్యలో సంబంధిత ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఆగ్రహంతో ఊగిపోతూ... మదపుటేనుగులపై జనం రాళ్లు విసరడం, టపాకాయలను పేల్చడం, టైర్లు కాల్చి వాటి పైకి విసరడం లాంటి చర్యలతో మగ ఏనుగులు జనంపై కసి పెంచుకున్నాయి. ఆడ ఏనుగులుకున్నంత సహనం వీటికి ఉండదు. ఇప్పటిదాకా పరిశీలిస్తే యాదమరి మండలం దిగువకనతల చెరువువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్‌ను, వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్‌ను తొండంతో విసరడం, పందేరుపల్లి వద్ద రైతును, కాలువపల్లి వద్ద యువకుడిని తొండంతో కొట్టి చంపడం చేసింది మదపుటేనుగులే. పెద్దపంజాణిమండలం పెనుగొలకలకు చెందిన బంగారప్పను, కాలువపల్లి వద్ద రైతు సుబ్రమణ్యను చంపింది మదపుటేనుగులే. కుప్పంలోనూ దాడులు చేసింది ఇవే. పదిరోజుల క్రితం పెద్దపంజాణి మండలంలో రైతును తొక్కి చంపిందే మదపుటేనుగే. గుడిపాల మండలంలో దంపతులను చంపిందే మదపుటేనుగే. ఏనుగుల ఉనికిని పసిగట్టి రక్షణకోసం చెట్లపై ఏర్పాటు చేసుకున్న అటక(ఫైల్)మదపుటేనుగుల జాడకోసం నిత్యం శ్రమించే ఎలిఫెంట్ ట్రాకర్లు కౌండిన్య పరిధిలోని మొత్తం ఏనుగులు : సుమారు 100 ఇప్పటి వరకు గజ దాడుల్లో మృతుల సంఖ్య : 15 గాయపడినవారు : 36 ఇప్పటిదాకా మృతి చెందిన ఏనుగుల సంఖ్య : 19 ఈ నాలుగునెలలు ప్రమాదమే.. ముఖ్యంగా మదపుటేనుగులు అక్టోబరు నుంచి జనవరి వరకు ఆడ ఏనుగుల సాంగత్యం కోసం మత్తులో ఉంటాయి (మేటింగ్ సీజన్). దీంతో తిక్కతిక్కగా ప్రవర్తించడం, మనుషులను చూస్తే ఆగ్రహంతో ఊగిపోతుంటాయి. తన పరిధితోపాటు అడవిలో ఆడ ఏనుగుల కోసం చాలాదూరం అన్వేషిస్తుంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో మనషులు, జంతువులపై దాడులు ఎక్కువగా ఉంటాయి. ఆడ ఏనుగులు వీటి మాట వినకపోవడం లేదా అక్కడ జరిగే రభసతో ఇప్పటిదాకా ఆరు ఆడ ఏనుగులు మృతిచెందాయి. ఏదేమైనా ఈ నాలుగునెలలు మదపుటేనుగుల కారణంగా ప్రమాదాలు పొంచిఉన్నాయి. కాబట్టి అడవుల్లోకి ఎవరూ వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. -
వేడుకగా విశ్వరూప పాదయాత్ర
తిరుపతి కల్చరల్: కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, సత్యచంద్ర సరస్వతి స్వామివార్ల విశ్వావసు నామ సంవత్సరం చాతుర్మాష్య దీక్ష విరమణ సందర్భంగా కంచి మఠ స్వామీజీల ఆధ్వర్యంలో మఠ భక్తులు ఆదివారం సాయంత్రం నగరంలో విశ్వరూప యాత్ర వేడుకగా చేపట్టారు. కంచి మఠం మహాపాదుకా మండపం నుంచి దివ్యారామం ఉద్యానవనం వరకు ఈ విశ్వరూప పాదయాత్ర సాగింది. అనంతరం అక్కడ కంచి మఠాధిపతులు శ్రీభగవద్గీతలోని విశ్వరూప దర్శనయోగ అధ్యాయనాన్ని పఠించారు. అనంతరం స్వామివారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి జీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ ఉపకులపతి రాణి సదాశివమూర్తి, నగరంలోని పలువురు ప్రముఖులు, మఠం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. -
అమ్మవారి శిరస్సు చోరీ
ఐరాల : పురాతనమైన పాలేటమ్మ ఆలయంలో అమ్మవారి శిరస్సును చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఐరాలకు చెందిన శ్రీరాములు, కురప్పపల్లెకు చెందిన హరి, వైఎస్ గేటుకు చెందిన జయరామ్‌తోపాటు, పాకాల మండలం గానుగపెంటకు చెందిన నీల అనే మహిళ ఆలయంలో పూజలు నిర్వహించే సాకుతో ప్రవేశించారు. ఎవరూ లేని సమయం చూసి అమ్మవారి శిరస్సును అపహరించారు. హరి, శ్రీరాములు ముందుగా అక్కడి నుంచి పరారయ్యారు. శిరస్సు ఉంచిన బ్యాగులో నీల, జయరామ్ ద్విచక్రవాహనంలో చిత్తూరు వైపు వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత పూజ చేసేందుకు వచ్చిన భక్తులు అమ్మవారి శిరస్సు కనిపించకపోవడంతోఆలయ వంశపార్యంపర ధర్మకర్త బాలాజీకి సమాచారం అందించారు. ఆయన ఆలయానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా చింతగుప్పలపల్లె వద్ద ద్విచక్రవాహనంలో అమ్మవారి శిరస్సుతో వెళుతున్న జయరామ్, నీల పట్టుబడ్డారు. అనంతరం శ్రీరాములు, హరిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి ప్రధాన సూత్రధారి శ్రీరాములుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆలయంలో ప్రత్యేక పూజలుపాలేటమ్మ ఆలయంలో చోరీకి గురైన అమ్మవారి శిరస్సు తిరిగి అదే స్థానంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రోక్షణ, అభిషేకాలు చేపట్టారు. -
ఉత్తమ ప్రతిభకు ఉపకార వేతనం
చిత్తూరు కలెక్టరేట్ : ఉత్తమ ప్రతిభ కనబరచిన పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందించేందుకు కేంద్రప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. అలాగే సంబంధిత విద్యార్థులు కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోపు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులు ఈ పరీక్ష రాసేందుకు అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికై న వారికి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేలు చొప్పున స్కాలర్షిప్ అందుతుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సినవి ఇవే.. ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి ఫొటో, సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కుల, ఆదాయ, విద్యా ధ్రువీకరణపత్రాలు ప్రస్తుతం లేకపోయినప్పటికీ పరీక్ష రాసే సమయానికి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు www.bre.ap.gov.in వెబ్సైట్లో పాఠశాల డీఐఎస్ఈ నంబర్‌తో లాగిన్ కావాలి. తర్వాత ఆధార్‌కార్డు మేరకు వివరాలను అప్లోడ్ చేయాలి. అనంతరం అదే లాగిన్‌లో ఆన్లైన్ లో పరీక్ష ఫీజు చెల్లించాలి. -
టీడీపీ రౌడీ మూకల దాడి
వెదురుకుప్పం: అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చమాఫియా రెచ్చిపోతోంది. ప్రజలకు జరిగే నష్టాన్ని పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా కొండలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది. అడ్డుపడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ కండకావరం ప్రదర్శిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం బందార్లపల్లె గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన అక్రమ క్వారీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఈ క్వారీని అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసుల సహకారంతో యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. అనంతరం క్వారీ యాజమాన్యం ఐదు వాహనాల్లో 20 మందికిపైగా రౌడీమూకలను దింపింది. వారు ఇనుపరాడ్లతో గ్రామస్తులపై దాడికి యతి్నంచారు. దీంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా ప్రతిఘటించారు. అసలేం జరిగిందంటే.. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కొమరగుంట పంచాయతీ పరిధిలోని బందార్లపల్లె గ్రామానికి సమీపంలో సుమారు 7ఎకరాల విస్తీర్ణంలో ఎద్దల బండను క్వారీ నిర్వహణ కోసం అధికారులు అనుమతిచ్చారు. రెండు నెలలుగా టీడీపీకి చెందిన యుగంధర్ నాయుడు క్వారీ నిర్వహణ పనులు చేస్తున్నాడు. ఎద్దల బండకు ఆనుకుని సుమారు 20 ఎకరాల పంటపొలాలు ఉన్నాయి. అయితే అక్కడ క్వారీ పనులు చేపడితే అన్ని విధాలా నష్టం జరుగుతుందని భావించిన గ్రామస్తులు క్వారీ పనులను అడ్డుకున్నారు.గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో శనివారం కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్ఐ వెంకటసుబ్బయ్య క్వారీ వద్దకు వెళ్లి పనులను అడ్డుకుంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడతారని గ్రామస్తులను బెదిరించారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తే రేషన్ కార్డులు, ఫింఛన్లు కట్ చేస్తామంటూ పోలీసులే బెదిరింపులకు దిగారు. అయినా క్వారీ నిర్వహణ సాగనివ్వబోమని గ్రామస్తులు చెప్పడంతో 13 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఆదివారం ఎద్దలబండ వద్దకు వెళ్లారు.గమనించిన క్వారీ యాజమాన్యం ఐదు వాహనాల్లో సుమారు 20 మంది అనుచరులను రంగంలోకి దింపింది. వారు ఇనుప రాడ్లతో వచ్చి గ్రామస్తులపై దాడి చేయడంతో బద్రి, ధనలక్షి్మ, ప్రమీలమ్మ, శాంతమ్మ, జయంత్‌రెడ్డి, వరప్రసాద్‌లకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఎమ్మెల్యే థామస్ అండ చూసుకుని క్వారీ యాజమాన్యం రెచ్చిపోతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు ఇళ్లపైకి వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు.గ్రామస్తులకు నారాయణస్వామి భరోసా గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ సుకుమార్ ఉన్నారు. -
గురువుపై బరువు
●కార్వేటినగరం: పాఠాలు చెప్పి విద్యార్థులను ఉన్నంతగా తీర్చిదద్దే ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం భారం మోపుతోంది. మూల్యాంకనంలో తీసుకొచ్చిన అసెస్మెంట్ బుక్లెట్ విధానం గుదిబండగా మారింది. వాస్తవానికి ఫార్మేటీవ్, సమ్మెటీవ్ పరీక్షలు ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన జవాబు పత్రాలు, ఓఎమ్మార్ షీట్లను అసెస్మెంట్ బుక్‌లెట్‌లో పొందుపర్చాలి. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని మార్కులను ఇందులోనే నమోదు చేయాలి. ఒక్కో పరీక్షకు సంబంధించి 100 జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంది. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గురుపై బరువెందుకు బాబూ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదీ లెక్క! నిజానికి విద్యార్థులకు ఏడాదిలో నాలుగు ఫార్మేటీవ్లు, రెండు సమ్మేటీవ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ షీట్ఽను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. జవాబు పత్రాలను విద్యార్థులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీటిని టీచర్లు మూల్యాంకనం చేసి మార్కులను ఓఎమ్మార్ షీట్లలో పొందుపర్చేవారు. ఆపై జిల్లా అధికారులు స్కానింగ్ చేసి భద్రపరిచేవారు. మూల్యాంకనాన్ని మూడు రోజుల్లో పూర్తిచేయాలనే నిబంధన ఉండేది. దీంతో బోధించేందుకు ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం ఉండేది. కొత్తగా ఇలా.. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి పరీక్షల విధానంలో నూతన సంస్కరణలను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫార్మేటీవ్, సమ్మేటీవ్ పరీక్షల కోసం అసెస్మెంట్ బుక్‌లెట్‌ను ప్రవేశపెట్టింది. పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు, ఓఎమ్మార్ టీష్లను ఇందులో పొందుపరిచాలి. టెస్ట్ సమయంలో విద్యార్థులకు అసెస్మెంట్ బుక్‌లెట్‌ను ఇచ్చి అందులో జవాబులు రాయించాలి. ఇందులో వచ్చిన మార్కులను ఓఎమ్మార్ షీట్లో పొందుపరచడంతో పాటు స్కానింగ్‌ను కూడా ఉపాధ్యాయులే చేయించాలి. ఈ బుక్‌లెట్‌లో విద్యార్థి ఆధార్, యూడైస్, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్లనూ వీరే నమోదు చేయాలి. ఈ రకంగా ఏడాదిలో సబ్జెక్టుకు 6, 7 తరగతులకు 36, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 42 ఓ ఎమ్మార్ షీట్లుంటారయి. విద్యాసంవత్సరం ముగిసేంత వరకు జవాబు పత్రాలు, వారికొచ్చిన మార్కులను ఇందులో నమోదు చేయాలి. వీటిని పాఠశాలల్లోనే భద్రపరచాలి. ఇంటికి తీసుకెళ్లకూడదు. పెరిగిన ఒత్తిడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీప్ యాప్‌లో ఐఎమ్మెమ్మెస్, స్టూడెంట్స్ కిట్స్, మోగా పేటీఎంలను ఉంచారు. దీంతో పాటు పాఠశాలకు ప్రతి నెలా అందిన బియ్యం, బస్తాలపై క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి అందులోని నాణ్యతను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలి. ఈ క్రమంలో ప్రభుత్వం పునరాలోచించి అసెస్మెంట్ విధానానికి స్వస్థి పలికి పాత పద్ధతినే కొనసాగించాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘనాయకులు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలకు కూటమి ప్రభుత్వం అందించిన అసెస్మెంట్ బుక్లెట్ అనాలోచిత నిర్ణయం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో అసెస్మెంట్ విధానం పిల్లలనే కాకుండా ఉపాధ్యాయులనూ పరిక్షించే విధంగా మారింది. దీని వల్ల బోధనకు వారం పాటు దూరంగా ఉండాల్సి వస్తొంది. ప్రాజెక్టుల పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారు. తరగతికి మించిన స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటోంది. ఇలాంటి పనులతో ఉపాధ్యాయులు బోధనకు దూరంగా ఉంటున్నారు. – కిరణ్, ఏపీటీఎఫ్1938 చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, కార్వేటినగరం అసెస్మెంట్ విధానాన్ని తొలగించాలి అసెస్మెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలి. ఈ ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. బోధనేతర పనుల భారాన్ని మోపడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూల్యాంకనంలో పాత విధానాన్నే కొనసాగించాలి. – చలపతిరావు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా సీపీఎస్సీ అధ్యక్షుడు, కార్వేటినగరం -
తప్పుకదా ‘గురూ’!
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ పోస్టులను కై వసం చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. ఎలాగైన కొలువులు కొట్టేదామని భావించారు. అయితే అధికారుల పరిశీలనలో అభ్యర్థులు సమర్పించిన వివరాలు, సర్టిఫికెట్లలో తప్పిదాలను గుర్తించారు. దీంతో పలువురు అభ్యర్థుల పై అనర్హత వేటు వేశారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలనలో ఒకటికంటే ఎక్కువ పోస్టులకు ఎంపికై న వారిని ఆప్షన్ మేరకు ఒక పోస్టుకు పరిమితం చేశారు. ఇతర స్థానాల్లో ఉన్న తదుపరి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. బోగస్ సర్టిఫికెట్లతో మోసం మెగా డీఎస్సీలో కొందరు అభ్యర్థులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి మోసం చేసేందుకు ప్రయత్నించారు. దివ్యాంగ, అంధత్వ, చెవిటి, మూగ, ఇలా పలు రకాల వికలత్వంతో డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి తిరుపతి రుయా ఆస్పత్రిలో మరోమారు పున:పరిశీలన నిర్వహించగా గుట్టురట్టయ్యింది. పలువురు అభ్యర్థులు సమర్పించిన వికలత్వ సర్టిఫికెట్లు బోగస్ అని అక్కడి వైద్యులు తేల్చారు. దీంతో అలాంటి వారందరినీ అనర్హులుగా ప్రకటించారు. మొత్తం 68 మంది పీహెచ్ కేటగిరీలో ఎంపికవగా వారిలో 56 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిగిలిన 12 మందివి బోగస్ సర్టిఫికెట్లుగా గుర్తించారు. ఈడబ్ల్యూఎస్‌లో కూడా... ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లలో కూడా కొన్ని నకిలీవి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై పలువురు అభ్యర్థులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు చేశారు. అనుమానం, ఫిర్యాదులు అందిన అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అయితే ఆ వివరాలు బయటకు రానివ్వకుండా విద్యాశాఖ అధికారులు తొక్కిపెట్టారు. గుర్తించిన బోగస్ సర్టిఫికెట్ల సమగ్రవివరాలను రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో పంపించారు. ఇప్పటికి మూడు విడతల్లో పరిశీలన ఇప్పటికీ డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మూడు విడతల్లో నిర్వహించారు. ఈనెల 6 నాటికి రెండు వి డతల్లో పరిశీలన ప్రక్రియ నిర్వహించగా తాజాగా శనివారం మూడో విడతలో ఎంపికై న అభ్యర్థుల జాబితా ను విడుదల చేశారు. ఆ అభ్యర్థుల జాబితా ప్రకారం ఆదివారం మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. -
పొలాల వద్దకు వెళ్లకండి
పాతపేటలోని నటరాజ పొలంలో విరిచేసిన డ్రిప్ పరికరాలు, రెడ్డెప్ప పొలంలో ధ్వంసమైన కొబ్బరి చెట్లుపులిచెర్ల(కల్లూరు): ఏనుగులు కల్లూరు రిజర్వు ఫారెస్టులో తిష్ట వేసి ఉన్నాయని, సమీప గ్రామాల రైతులు రాత్రి పూట పొలాల వద్దకు వెళ్లరాదని అటవీ అధికారులు సూచించారు. ప్రస్తుతం పాతపేట సమీప అటవీ ప్రాంతంలో ఏనుగులు ఉండడంతో రైతులు ఎవ్వరూ ఆ చుట్టు పక్కల సంచరించరాదన్నారు. తెలుపు రంగు దుస్తులు వేసుకొని అసలు వెళ్లకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ఏనుగులు కనిపిస్తే తరమ కూడదని, అదిలించకూడదని సూచించారు. వెంటనే ఫారెస్టు సిబ్బంది 9550067503 నంబరుకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. పంటలు ధ్వంసం మండలంలోని పాతపేట పంచాయతీలో శనివారం తెల్లవారు జామున ఏనుగులు పంట పొలాలపై పడి సర్వనాశనం చేశాయి. వారం రోజులుగా ఏనుగుల మంద పాతపేట, చల్లావారిపల్లె పంచాయతీల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నట్టు పలువురు రైతులు వాపోతునానరు. పాతపేటకు చెందిన నటరాజ పొలంలో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలు, రెడ్డెప్ప పొలంలో కొబ్బరి చెట్లను విరిచివేశాయన్నారు. -
మధ్యంతర బెయిల్‌పై చౌడేపల్లెలో సంబరాలు
చౌడేపల్లె: అక్రమ కేసుల నుంచి ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారని జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, జెడ్పిటీసీ సభ్యుడు ఎన్.దామోదరరాజు, మండల పార్టీ కన్వీనర్ జి. నాగభూషణరెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ స్పష్టం చేశారు. శనివారం అక్రమ కేసులో నుంచి మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ రావడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. బస్టాండులో బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ కుట్రలకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఇకనైనా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, దాడులు ఆపాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసే బుద్ధిని ప్రసాదించాలని దేవుడ్ని కోరారు. కార్యక్రమంలో మాజీ సింగిల్‌విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, సర్పంచుల సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ శ్రీరాములు, కో–ఆప్షన్ మెంబరు సాధిక్‌బాషా, సర్పంచులు ఓబుల్‌రెడ్డి, రఘురామిరెడ్డి, భాగ్యవతి, షంషీర్, నాయకులు చెంగారెడ్డి, రెడ్డెప్పరెడ్డి, షఫీ, వినోద్‌రెడ్డి, ఓబులేసు, కృష్ణప్ప, శంకరప్ప, హనుమంతురెడ్డి, అనుప్రియ, శ్రీనివాసులు, భాస్కర్, అల్తాఫ్, గిరి, భాస్కర్‌రెడ్డి, బాబు తదితరులున్నారు. -
జూనియర్ కాలేజీలో చోరీ
– ఇంటి దొంగల పనేనా? శాంతిపురం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ప్రిన్సిపల్ రూమును లక్ష్యంగా చేసుకుని శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. విద్యుత్ సరఫరాను ఆపేసి, గది బయట వేసిన నాలుగు తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. మొత్తం ఆరు బీరువాలను పగులగొట్టి రికార్డులను చిందరవందర చేశారు. తమకు కావాల్సిన రికార్డులను గుర్తుతెలియని వ్యక్తులు పట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం వస్తుందన్న కారణంగా కాలేజీ సిబ్బంది ఏ వస్తువునూ తాకకపోవడంతో ఏయే రికార్డులు చోరీ అయ్యాయనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే కాలేజీలో మొత్తం 16 సీసీ కెమెరాలు పెట్టించారు. శుక్రవారం రాత్రి చొరబడిన దుండగులు తమకు సంబంధించిన పుటేజీ దొరక్కుండా చేసేందుకు సీసీ టీవీలకు సంబంధించిన డీవీఆర్‌ను కూడా పట్టుకుపోయారు. కశాశాల నిర్వహణ లోపాలపై వచ్చిన ఫిర్యాదులతో ఈ నెల 9 శాఖాపరమైన విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విచారణలో తమ అక్రమాలు వెలుగు చూడకుండా చేసేందుకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారే రికార్డులను మాయం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై కాలేజీ సిబ్బంది ఫిర్యాదు మేరకు రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హరికథా కాలక్షేపం, కూచిపూడి, భరతనాట్యం, గీతాలాపన, పౌరాణిక నాటిక ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి. తిరుపతికి చెందిన కలవకుంట మునిసాయికృష్ణ బృందం అన్నమాచార్య సంకీర్తనలు, ప్రత్యేక భజన పాటలు, సంగీత కచేరితో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత బృందం గాయని వానిష్ట, తబలా మురళీకృష్ణ, కీబోర్డు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. కాగా అద్భుత ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు అధికారులు బహుమతులు ప్రదానం చేశారు. ప్రశంసా పత్రాలతో కళాకారులు -
స్వామివారి సేవలో ఐజీ
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శనివారం రాష్ట్ర పోలీసు శాఖ ఐజీ అడ్మిన్ శ్రీకాంత్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. డీఈవో సాగర్‌బాబు పండితుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. -
కార్యకర్తపై దాడి
పుంగనూరు: ఆలయపనులకు చేపట్టరాదంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె బీసీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. గత ప్రభుత్వంలో గ్రామస్తుల వినతి మేరకు గంగమ్మ గుడి నిర్మాణ పనులు చేపట్టారు. పనులు ముగింపు దశలో ఉండగా గిరిబాబు మరికొందరితో కలిసి మదనపల్లెలో అవసరమైన టైల్స్ వేసుకొని గుడివద్దకు చేరుకున్నాడు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత ఓబులేసు పనులు చేపట్టరాదని, టైల్స్‌ను వాహనంలో నుంచి దింపరాదని అడ్డుకున్నాడు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్త గిరిబాబు పై దౌర్జన్యంగా దాడికి తెగబడ్డాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం బాధితుడ్ని పోలీసులే పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వాతావరణమే ముఖ్యం
టమాటా పంటకు ముఖ్యంగా సూర్యరస్మి ఉండాలి. ఇటీవల వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం బాగా తగ్గింది. ఫలితంగా టమాటా తోటల్లో వైరస్ ప్రభావం పెరిగింది. పంట క్వాలిటీ దెబ్బతింటోంది. ఇలాంటి కాయలకు మార్కెట్లో మంచి ధర లభించదు. ముఖ్యంగా ఈ కాయలను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వీలుకాదు. ఎందుకంటే రెండురోజులకే ఇవి దెబ్బతింటాయి. అందుకే బయటి వ్యాపారులు ఇక్కడ కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. – డా.కోటేశ్వరావు, ఉద్యానశాఖ సహాయసంచాలకులు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టా ఈ దఫా వేరే రైతుపొలం కౌలుకు పెట్టుకుని రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మూడెకరాల్లో టమాటాను సాగుచేశా. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. మొన్నటి వర్షాల కారణంగా కాయల నాణ్యత తగ్గింది. దీంతోపాట తెగుళ్లు శోకాయి. ఇప్పుడున్న ధలతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదు. కచ్చితంగా టమాటా రైతులు అప్పులపాలే. – గోవిందురెడ్డి, నాగమంగళం, పలమనేరు మండలం -
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: నేడు సెప్టెంబరు7న చంద్రగ్రహణం సందర్భంగా నేడు శ్రీవారి ఆలయం మూసివెయనున్న టిటిడి. సెప్టెంబరు 7 సాయంత్రం 3:30 నుండి 8 వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టంబర్ 8న సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. ⇒ గ్రహణానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ⇒ తిరుమలకు వచ్చే భక్తులు గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని రావాలని టిటిడి సూచన⇒ గ్రహణం సమయంలో అన్నప్రసాద వితరణ రద్దుచంద్ర గ్రహణం కారణంగా తిరుమలలో పౌర్ణమి గరుడసేవ రద్దుసెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది.అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది. -
రేపు చంద్రగహణం
కాణిపాకం: చంద్రగ్రహణ కారణంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని ఆదివారం రాత్రి మూసివేయనున్నట్టు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. గ్రహణం రాత్రి 9.57 నుంచి మరసటి రోజు వేకువజామున 1.26 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఇదే సమయానికి ప్రధాన ఆలయంతో పాటు మణికంఠేశ్వరస్వామి ఆలయం, శ్రీవరదరాజులస్వామి ఆలయాలను కూడా మూసివేస్తామన్నారు. సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, గ్రహణశాంతి, అభిషేకం అనంతరం ఉదయం 6 గంటలకు భక్తుల దర్శన సేవ ప్రారంభమవుతుందన్నారు. -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో మూడవ రోజైన శుక్రవారం పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను సరిచేసేందుకు ఈ పూజలు చేస్తారు. అందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి పలు రకాల అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి.. దర్జాగా కబ్జా
రాజకీయ నాయకులు, అధికారుల అండ కొంత ఉండాలే కాని ఆక్రమణదారులకు అంతే ఉండదు. ఇందుకు నిదర్శనంగా పుత్తూరు పట్టణం నడిబొడ్డులో కోట్లు విలువ చేసే సుమారు రెండెకరాల ప్రభుత్వ భూమిని ఓ ప్రబుద్ధుడు దర్జాగా కబ్జా చేస్తున్నాడు. గత వారం రోజులుగా ముళ్ల కంపలను తొలగించి, తీర్చిన సదరు వ్యక్తి నేడు దర్జాగా దున్నడం మొదలు పెట్టాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుత్తూరు: ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన విలువైన ప్రభుత్వ భూములు పరులపాలవుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్థానిక బైపాస్ రోడ్డులో గోవిందపాళెం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 282/4లో 1.76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలోని ఈ భూమికి ఆనుకొనే ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఓ ప్రైవేటు కల్యాణ మండపంతోపాటు వివిధ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఇంతగా అభివృద్ధి చెందిన పట్టణ నడిబొడ్డున కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి పరుల పాలవుతుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తున్నా.. గతంలోనూ ఇదే భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకొన్నారు. దీనిపై సదరు వ్యక్తులకు రెవెన్యూ శాఖ మధ్య డబ్ల్యూపీ నెంబర్ 30275/2021 కింద హైకోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇందులో ఎవరూ ప్రవేశించరాదంటూ రెవెన్యూ శాఖ ఓ బోర్డును రాయించింది. అయితే సదరు బోర్డును నేటి వరకు సదరు భూమిలో ఏర్పాటు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నాలుగేళ్లు గడిచే సరికి మళ్లీ సదరు వ్యక్తులో, ఇతరులో భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. విలువైన భూమిని అధికారులు పరిరక్షించి, ప్రజా అవసరాలకు వినియోగించాల్సి ఉంది. -
క్రికెట్ ఆడడానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
నగరి : సెలవు రోజున క్రికెట్ ఆడడానికి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ ఘటన మున్సిపల్ పరిధి కేవీపీఆర్ పేటలోని నేత కుటుంబంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నేత కార్మికుడు ఆరుముగం కుమారుడు యువరాజ్ (14) నగరి పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గుండ్రాజుకుప్పం దళితవాడ సమీపంలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. ఆట ముగిసిన సమయంలో మైదానానికి పక్కనే ఉన్న చెరువులో నీటిని చూసి అందులో ఈతకు దిగాడు. ఈత కొడుతూ నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. కాగా ఆరుముగంకు ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమారుడు యువరాజ్ ఒక్కడే కావడంతో ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 75 బస్తాల బియ్యం స్వాధీనం వడమాలపేట (పుత్తూరు): ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, 75 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. అక్రమ రవాణా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి వడమాలపేట మండలం, తడుకు రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఏపీ 39 డబ్ల్యూడీ 5318 నెంబరు గల బొలేరో లగేజ్ వెహికల్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో 50 కేజీల బరువు గల 75 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం మండలం, బీరకుప్పం గ్రామానికి చెందిన దినేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.1.35 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 8న ఎస్వీయూలో జాబ్‌మేళా తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 8వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయాధికారి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, డీ, బీ, ఎం, ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 95338 89902, 79898 10194 సంప్రదించాలని సూచించారు. -
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
చిత్తూరు కలెక్టరేట్ : సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విద్యాశాఖ, సమగ్ర శిక్షాశాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఉపాధ్యాయులేనని, వారిని పట్టుదలతో సన్మార్గంలో నడిపించాలన్నారు. అనంతరం మేయర్ అముద, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు వినూత్న బోధనలను అమలు చేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలందిస్తున్న 69 మంది టీచర్లకు ప్రశంసాపత్రాలను అందించి దుశ్శాలువతో సత్కరించారు. జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ పద్మజ, డీవైఈవోలు ఇందిరా, లోకేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అనధికారికంగా 15 మందికి అవార్డులు ఉత్తమ సేవలందిస్తున్న టీచర్లకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించేందుకు ముందస్తుగా పేర్లను విద్యాశాఖ అధికారులు గుర్తించి కలెక్టర్ ఆమోదం పొందుతారు. అలా ఆమోదం పొందిన టీచర్లకు మాత్రమే గురుపూజోత్సవం రోజున ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరిస్తారు. అయితే శుక్రవారం జెడ్పీలో నిర్వహించిన గురుపూజోత్సవంలో 15 మందికి అనధికారికంగా అవార్డులు అందజేశారు. అది కూడా కూటమి పార్టీకి అనుకూలమైన వారికి అవార్డులు అందజేసి సత్కరించడం విమర్శలకు తావిచ్చింది. అనధికారిక అవార్డులు ఇప్పించేందుకు టీడీపీ అనుబంధ సంస్థ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నాయకుడు వ్యవహరించిన తీరు పై టీచర్లు విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రసంగం గురుపూజోత్సవం వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజకీయ ప్రసంగం చేయడం పట్ల విమర్శలు వెలువెత్తాయి. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేసిందేమి లేకపోయినా గత ప్రభుత్వాన్ని కించపరుస్తూ ప్రసగించడం విమర్శలకు తావిచ్చింది. అదే విధంగా అనధికారికంగా కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులను సత్కరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జ్యోతిప్రజ్వళన చేస్తున్న డీఈవో వరలక్ష్మి, గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాల టీచర్లు తిరుమల, చౌడేపల్లి, ఎంఈవో–2 బాల చైతన్య, గ్రేడ్–2 హెచ్ఎం, జెడ్పీ కలుపల్లి, గంగవరంసుబ్బరామయ్య, గ్రేడ్–2 హెచ్ఎం, జెడ్పీ జీడీనెల్లూరు -
శ్రీసిటీలో ‘స్మైల్ ఎకో’ ప్రారంభం
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు (శానిటరీ న్యాప్కిన్స్) తయారు చేసే ‘స్మైల్ ఎకో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన పరిశ్రమ శుక్రవారం శ్రీసిటీలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీఎస్ఎన్ఎల్ మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు, పద్మశ్రీ డాక్టర్ టి.హనుమాన్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున పరుచూరి సమక్షంలో లాంఛనంగా పరిశ్రమను ప్రారంభించారు. రూ.20 కోట్ల పెట్టుబడితో స్థాపించబడిన ఈ ప్లాంట్ ఏడాదికి 259.2 మిలియన్ల శానిటరీ న్యాప్కిన్లను తయారు చేస్తుందన్నారు. దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. దీని ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు ఎగుమతులు చేస్తారన్నారు. నాడు ఉద్యోగి, నేడు పారిశ్రామికవేత్త స్థానికుడైన మల్లికార్జున్ నాడు శ్రీసిటీ ఉద్యోగి కాగా నేడు పారిశ్రామికవేత్తగా మారి ‘స్మైల్ ఎకో’ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎండీ మల్లికార్జునను ఈ సందర్భంగా డాక్టర్ సన్నారెడ్డి అభినందించారు. దేశ టెలికాం సంస్కరణలలో ప్రముఖ పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి హనుమాన్ చౌదరి చేత ఈ పరిశ్రమ ప్రారంభం కావడం అత్యంత శుభపరిణామం అన్నారు. అనువైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థతో 240 పైచిలుకు పరిశ్రమల స్థాపనతో పాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక ప్రగతికి చొరవ చూపుతున్న శ్రీసిటీ యాజమాన్య కృషిని డాక్టర్ హనుమాన్ చౌదరి ప్రశంసించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీసిటీలోని పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సొసైటీని కొనసాగించాలి
గత 40 ఏళ్లుగా సొసైటీ ద్వారా విద్యుత్ స్టోర్స్‌లో హమాలీలు పనిచేస్తున్నారు. హమాలీ సొసైటీకి పనులు ఇస్తుండడంతో ఉన్న కార్మికులే కొనసాగుతున్నారు. ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్‌కు పనులు ఇవ్వడం అన్యాయం. దీంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతాయి. – ఆర్యోగదాస్, రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ స్టోర్స్ హమాలీ యూనియన్ అన్యాయం కార్మికుల కష్టాలను తీరుస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. తీరా వారి కడుపు కొట్టాలని యత్నిస్తోంది. ఎక్కడో అనంతపురంలో అమలైన విధానాన్ని చిత్తూరు జిల్లాలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. వారికి వసతులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేయాలని యత్నించడం అన్యాయం. – గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సీఐటీయూ ●చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్టోర్స్ నుంచి విద్యుత్ పరికరాలు సరఫరా చేస్తున్నారు. చిన్న బోల్టు నుంచి సబ్‌స్టేషన్‌లో బిగించే పరికరాల వరకు ఈ స్టోర్స్ నుంచే తీసుకెళ్తుంటారు. ఇక్కడ 15 మంది హమాలీలు 40 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు వారిని తొలగించి కొత్తగా కాంట్రాక్ట్‌కు పనులు అప్పగించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. దీనిపై హమాలీ కార్మికులు రగిలిపోతున్నారు. తమ పొట్టకొట్టొద్దు బాబూ అంటూ గళం ఇప్పుతున్నారు. కూలీల్లో కోత హమాలీలు వీటి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. తొలుత కూలి విధానంలో విద్యుత్ పరికరాల లోడింగ్, ఆన్లోడింగ్ చేసేవారు. 2008 నుంచి సంస్థలో పీస్‌రేటు సిస్టమ్ అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్న హమాలీ సొసైటీకే కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పనులను సొసైటీకి కాకుండా విద్యుత్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. కార్మికుడు పీస్ వర్క్ కింద వస్తువులను బట్టి రూ.0.25 పైసల నుంచి రూ.1200 వరకు ట్రాన్స్‌కో చెల్లిస్తోంది. రోజూ కార్మికుడు సరాసరి రూ.500–1,500 వరకు సంపాదిస్తున్నారు. సైడ్ హారం పరికరానికి రూ.2–6, తుక్కు కేజీకు రూ.0.70 పైసలు నుంచి ప్రారంభమవుతుంది. 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను వాహనంలో పెడితే రూ.230, 63 కేవీ అయితే రూ.375, అదే సబ్‌స్టేషన్‌లో పెట్టే వీసీబీ(బ్రేకర్స్)కు రూ.1,286 ఇస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తే వీరందరూ రోడ్డున పడాల్సిందే.విద్యుత్ పరికరాలు విద్యుత్ పరికరాలు ఎత్తిపెడుతున్న కార్మికులు అనంతపురంలో అమలు చేశారనీ..! అనేక సంవత్సరాలుగా ట్రాన్స్‌కో స్టోర్స్‌లో పీసు రేటు కింద హమాలీ సొసైటీకి పనులను ఇస్తున్నారు. ఇప్పుడు కార్మికుల కష్టం పై కూటమి నాయకులు కన్నేశారు. ఇందుకు బీజంగా అనంతపురం జిల్లాలో ఆ సొసైటీకి కాకుండా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ విధానాన్ని చిత్తూరు జిల్లాలో కూడా అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు నిండాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,834 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
వసతులు కల్పించాలి
కార్మికులకు వసతులు కల్పించాలి. ప్రస్తుతం ఇస్తున్న సదుపాయాలను కాలానుగుణంగా మార్పు చేయాలి. ఈఎస్ఐ, పీఎఫ్‌లను రెగ్యూలర్ వాచ్మెన్లతో సమానంగా ఇవ్వాలి. ఈపీఎస్పీడీసీఎల్తో సమానంగా ఏరియా అలవెన్స్‌లు ఇవ్వాలి. – చిట్టిబాబు,హమాలీ రోడ్డున పడతాం కాంట్రాక్టర్‌కు పనులు ఇస్తే మేమంతా రోడ్డును పడతాం. ఎందుకంటే వారు పీస్ రేటు కాకుండా నెలవారీ వేతనాలు ఇస్తారు. సెలవులు పెట్టినా, ఆలస్యంగా వచ్చినా వేతనాలు కట్ చేస్తారు. దీంతో నెలకు రూ.20 వేల వరకు ఆదాయం కోల్పోతాం. మమ్మల్ని తీసేసి కొత్తవారిని తక్కువ వేతనాలకు పనిలో పెట్టుకుంటారు. – ఆనంద్, హమాలీ -
ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
పెళ్లకూరు : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి స్వగ్రామమైన పుల్లూరులో శుక్రవారం గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాల్లో భాగంగా అక్రమంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి త్వరలో విడుదల కావాలని గ్రామ దేవతకు పూజలు చేసినట్లు చెప్పారు. అమ్మవారికి కుంకుమార్చన, పుష్పయాగం చేసి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పూజలు చేశారు. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేకుండా ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి బెయిల్ రాకుండా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్‌రెడ్డి, మణినాయుడు, వెంకటాచలం, వీరాస్వామిరెడ్డి, రమణయ్య, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం.. బూట్లతో స్వామివారికి పట్టువస్త్రాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు ధరించి స్వామి వారికి పట్టు వ్రస్తాలు తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగరాజపురం మండలంలోని డీకే మర్రిపల్లి దళితవాడలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శ్రీవేంకటేశ్వరస్వామి భజన మందిరం నిర్మించారు.ఆలయంలో గురువారం కుంభాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు వేసుకునే పట్టువ్రస్తాలు తీసుకొచ్చారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన బూట్లు ధరించే పూర్ణకుంభానికి అక్షింతలు వేశారు. ఎమ్మెల్యే తీరుపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలక్షన్ జరగదని, సెలక్షన్ మాత్రమేనని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ వివాదాస్పద వ్యాఖ్యలతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. గురువారం జిల్లాలోని పెనుమూరులో నిర్వహించిన మార్కెటింగ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.‘త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే అభ్యర్థులను సెలక్షన్ చేద్దాం. ఎలక్షన్ ఉండదు. ఎన్నికలు జరిపించాలన్న చోట అభ్యర్థులను భయపెట్టి నామినేషన్ వేయకుండా చూడండి. అప్పుడు ఏకగ్రీవంగా మనవాళ్లే ఎన్నికవుతారు. ఏం జరిగినా మీ వెనుక మేమున్నాం. టీడీపీ అభ్యర్థులను భయపెడితే కాళ్లు, చేతులు తీసేందుకు సిద్ధంగా ఉండాలి. టీడీపీలో కొందరు వైఎస్సార్సీపీకి కోవర్టులుగా ఉన్నారు. వారిని ఒకచోట చేరిస్తే ఎండ్రకాయల్లా కొట్టుకుంటారు. అందుకే ఒక్కొక్కరిని ఏరి ఒక్కొక్క బొక్కలో పెడుతున్నా’ అని వ్యాఖ్యానించారు. -
మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
నాగలాపురం : రాజకీయ కుట్రతో లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడం అక్రమమని సత్యవేడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పేర్కొన్నారు. గురువారం పిచ్చాటూరు బైపాస్ రోడ్డులో నిరసన తెలిపారు. అనంతరం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నూకతోటి రాజేష్ మండల నేతలతో కలిసి మిథున్ రెడ్డి త్వరగా జైలు నుంచి విడుదల కావాలని పూజలు చేశారు. ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో అరెస్టు చేస్తే పార్టీ శ్రేణులు భయపడే కాలం చెల్లిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం దాటినా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా జగనన్న ప్రారంభించి, పూర్తి చేసిన పనులు తామే చేసినట్లు కాలం వెలిబుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చలపతిరాజు, సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి, ఎంపీపీ మోహన్, రమేష్ రాజు, మండల ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, సూరి బాబు రెడ్డి, నాయకులు త్యాగరాజన్, మోహన్ రెడ్డి, ఏసు దాసు, ఆరుముగం రెడ్డి, విశ్వనాథం, వాసు, చెంచు బాబు, శేఖర్, గోవింద్, చంద్ర, సుబ్బరాజు పాల్గొన్నారు. -
అశ్వ వాహనంపై వరసిద్ధుడి అభయం
కాణిపాకం: కాణిపాక స్వయంభు శ్రీవర సిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి అశ్వ వాహనంపై ఊరేగుతూ అభయమిచ్చారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ సేవకు తిరువణంపల్లె, 44 బొమ్మసముద్రం, చింతమాకులపల్లె, కారకాంపల్లె గ్రామాలకు చెందిన గోనుగుంట, బలిజ వంశీయులు ఉభయదారులు వ్యవహరించారు. తిరుకల్యాణోత్సవం సందర్భంగా భిక్షాండి కార్యక్రమం నిర్వహించారు. కల్యాణానికి పూజాసామగ్రిని సమకూర్చుకోవడా నికి శివపార్వతులు గ్రామంలో భిక్షాటన చేయడం ఆనవాయితీ. అనంతరం ఉభయదేవీరీలతో కూడిన వినాయకుడి తిరుకల్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. తదనంతరం ప్రారంభమైన అశ్వ వాహన సేవలో మండపం వద్ద ఆనవాయితీ ప్రకారం స్వామి వారు నిలువు దోపిడీకి గురుయ్యారు. స్వామి ఆభరణాలు, నైవేద్యం, అత్తవారు కట్టించిన ఉండ్రాళ్లు, చిల్లర, కాసులను దొంగలు దోపిడీ చేసే ఘట్టాన్ని కన్నుల పండువగా జరిపించారు. నేడు ఉత్సవాలు ఇలా.. వరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం, వడాయత్తు ఉత్సవం, రాత్రి ఏకాంతసేవ జరగనుంది. దీంతో గణణాథుని బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం కానున్నాయని, మరుసటి రోజు నుంచి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈఓ పేర్కొన్నారు. టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వినాయక స్వామికి టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్.నాయుడు పట్టువస్త్రాలను సమర్పించారు. ఊరేగింపుగా వచ్చి స్వామికి పట్టువస్త్రాలు అందజేశారు. వారికి ఆలయ ఈఓ పెంచలకిషోర్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈఓను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. -
కాలనీలో మౌలిక వసతులు కల్పించలేదు
కాలనీలో మౌలిక వసతులు కల్పించడం లేదని తవణంపల్లి మండలం, కట్టకిందపల్లి విజయనగరం యానాది కాలనీ వాసులు అర్జీ ఇచ్చి ఏడాదవుతోంది. ఆ కాలనీలోని 40 కుటుంబాలు సమస్య పరిష్కారం కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. ఆ కుటుంబాలకు గత ప్రభుత్వం సొంత గృహాలు నిర్మించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో మౌలిక వసతులు లేవు. అప్పటి నుంచి అర్జీలిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. అదేవిధంగా వారి పిల్లలకు ఆధార్ కార్డులు లేక బడులకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. రేషన్ కార్డులు లేకపోవడంతో బియ్యం అందుకోలేకపోతున్నారు. వారి సమస్యలు ఇప్పటికీ అలాగే మిగిలిపోయాయి. -
బాల్య వివాహాలు నివారిద్దాం
పలమనేరు: బాల్య వివాహాల నివారణపై క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖలు దృష్టి సారించాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దాసరి సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బాల్యవివాహాల నివారణ, లైంగిక నేరాల చట్టాలపై వివిధ శాఖలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల విషయంలో అంగన్వాడీ వర్కర్ల పాత్ర చాలా కీలకమన్నారు. గ్రామ స్థాయిలో దీనిపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ఆర్డీఓ భవాని మాట్లాడుతూ బాల్య వివాహాలతో జరిగే నష్టాలను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పీడీ వెంకటేశ్వరి, లీగల్ ఆఫీసర్ వెంకటేశులు, శివశంకర్, చైల్డ్ హెల్ఫేర్ కో–ఆర్డినేటర్ నాగమణి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జయరాముడు, పలువురు సీఐలు, ఎస్ఐలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
వెలుగులు నింపేది టీచర్లే
వి.కోట: మంచి సమాజాన్ని నిర్మించాలని అహర్నిశలు శ్రమిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తాను కరిగిపోతూ వెలుగునిచ్చేది ఉపాధ్యాయులేనని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కొనియాడారు. గురువారం పట్టణంలోని మెయిన్ స్కూల్ (ప్రాథమిక పాఠశాల)లో ఎంఈఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్మన్ హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపలి్ల్ రాధాకృష్ణ అడుగుజాడల్లో నడిచి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును కల్పించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఎంఈఓలు చంద్రశేఖర్, మురుగేష్, ఎంపీడీఓ ఈశ్వరన్ పాల్గొన్నారు. -
‘ముందే’ కూసింది!
మూడు నెలల ముందే సర్పంచ్ ఎన్నికలు చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్‌శాఖకు ఎస్ఈసీ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల పై రాష్ట్ర ప్రభుత్వం సైతం ముందుస్తుగా వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లు జిల్లా అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. కానీ మూడు నెలల ముందే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాటు మేరకు కసరత్తును ప్రారంభించింది. సజావుగా సాగేనా? క్షేత్ర స్థాయిలో రెడ్ బుక్ పేరుతో ఏకగ్రీవం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి పాలనలో ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎలా బెదిరింపులకు పాల్పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. దానికితోడు టీడీపీ, జనసేన, బీజేపీలోనూ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఏ పార్టీ మద్దతుదారులకు సర్పంచ్‌గా అవకాశం ఇస్తారో తెలియని పరిస్థితి. ఎన్నికల షెడ్యూల్ అక్టోబరు 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలి. 16 నుంచి నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబరు 1–15 లోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తిచేయాలి. 16–30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తిచేయాలి. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి. జిల్లా సమాచారంపంచాయతీలు 696 వార్డులు 6,220 గ్రామీణ జనాభా 14,63,661 మంది ఓటర్లు 10,91,739 మంది -
నిందితుడి అరెస్టు
వెదురుకుప్పం: మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడ్ని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో కార్వేటినగరం సీఐ హనుమంతప్ప అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన కథనం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(11)ను అదేగ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి బుధవారం పాఠశాల వద్ద విడిచిపెడతానని చెప్పి నమ్మబలికాడు. బాలికను బైక్‌లో ఎక్కించుకున్న ప్రసాద్ కమ్మకండ్రిగ సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి యత్నించడంతో ప్రతిఘటించింది. ఆ తరువాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు బుధవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇనాంకొత్తూరు సమీపంలో నిందితుడు ప్రసాద్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు. వెదురుకుప్పం ఎస్ఐ వెంకటసుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు. మరీ ఇంత నిర్లక్ష్యమా? పలమనేరు: స్మార్ట్ రేషన్ కార్డులను పలమనేరులో ఇష్టానుసారంగా పంపినీ చేస్తున్నారు. అసలు వీటిని ఎవరూ పంపిణీ చేస్తున్నారో కూడా తెలియ ని పరిస్థితి నెలకొంది. పట్టణంలో గురువారం పలు వీధుల్లో స్మార్ట్ కార్డులను కొందరు ఇచ్చి మీ కార్డు ఉంటే మీరే తీసుకోండంటూ నిర్లక్ష్యంగా పడేశారు. అందుబాటులో ఉన్నవారు వారి కార్డులను తీసుకున్నారు. మరికొందరు బంధువులని, తెలిసిన వారివంటూ తీసుకెళ్లారు. పంపిణీలో నిర్లక్ష్యంకారణంగా ఎవరికై నా కార్డు లేకుండాపోతే దానికి బాధ్యులెవరని..? జనం ప్రశ్నిస్తున్నారు. దీనిపై పట్టణానికి చెందిన మోహన్ అనే వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం
కార్యక్రమానికి హాజరైన నాయకులు, సదుం: మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసదుం: కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ గ్రామ కమీటీల ఏర్పాటులో రాష్ట్రానికి పుంగనూరు నియోజకవర్గం ఆదర్శం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎర్రాతివారిపల్లెలో నియోజకవర్గ నాయకులతో గురువారం జరిగిన సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా పుంగనూరును ఎంపిక చేసి, గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలు ఇక కీలకం కానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వారికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. కమిటీ సభ్యులు చురుగ్గా ఉంటూ.. పార్టీ కార్యక్రమాలను సోషయల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని ఆయన పులుపునిచ్చారు. గ్రామాలలో నాయకుల మధ్య ఉండే స్పర్థలు వీడాలని, అందరికీ తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఎవరికి ఇబ్బంది కలిగించినా..! వెంట నడుస్తున్న ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తకూ తమ కుటుంబం అండగా ఉంటుందని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఎవరికి ఇబ్బంది కలిగించినా తాను వదిలేది లేదని స్పష్టం చేశారు. పుంగనూరుకు ఉన్న ప్రత్యేక పేరును నిలిపేలా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు రొంపిచెర్ల: కార్యకర్తలకు తాను అండగా ఉంటానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రొంపిచెర్ల మండలం, పెద్దగొట్టిగల్లు గ్రామ పంచాయతీ, మేకలవారిపల్లెలో ఆయన పర్యటించారు. కార్యకర్తలెవ్వరూ భపడాల్సిన పనిలేదన్నారు. వారికి ఏకష్టం వచ్చినా తాను అండ గా ఉంటానని స్పష్టం చేశారు. పెద్దగొట్టిగల్లు, బండకిందపల్లె సరిహద్దులో నిర్మించిన బడబళ్ల వంక ప్రాజెక్టు ముంపు భూములకు పరిహారం మంజూరు చేయించాలని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకుడు యర్రంరెడ్డి గృహ ప్రవేశానికి హాజరయ్యారు. అలాగే తల్లి మృతి చెందిన మదనమోహన్‌రెడ్డి కు టుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌రెడ్డి, చెంచురెడ్డి, స ద్దారామిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, యుగంధర్‌రెడ్డి, కోట వెంకటరమణ, శ్రీనాథనాయుడు, విజయశేఖర్, కరీముల్లా, మహబుబ్‌బాషా, అల్లాభక్స్, బావాజాన్, హరికృష్ణారెడ్డి, విజయకుమార్‌రెడ్డి, రామనారాయణరెడ్డి, కరుణాకర్, వెంకటరమణారెడ్డి, చిన్న రెడ్డెప్పరెడ్డి, శ్రీనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊహించని స్పందన గ్రామ కమిటీలకు తమ అంచనాలకు మించి స్పందన వస్తున్నట్లు పార్టీ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి తెలిపారు. వివిధ కమిటీలలో స్థానం కోసం స్వచ్ఛందంగా పలువురు ముందుకొస్తున్నారన్నారు. 6, 7, 8 తేదీలలో మండల స్థాయిలో కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 28న రచ్చబండ పేరుతో 142 పంచాయతీలు, 31 వార్డులలో ఏకకాలంలో జూమ్ సమావేశాలు జరుగుతాయన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, సదుం, సోమల, పులిచర్ల, రొంపిచర్ల మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ కన్వీనర్లు, వివిధ విభాగాల శ్రేణులు హాజరయ్యారు. -
పోలీసు శాఖలో మినీ ఫాల్కన్ వాహనం
– పల్లెల్లో శాంతిభద్రతల కోసం వినియోగం చిత్తూరు అర్బన్: శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా జిల్లా పోలీసు శాఖలో మినీ ఫాల్కన్ వాహనం అందుబాటులోకి తీసుకొచ్చారు. గురువారం చిత్తూరులోని ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో ఎస్పీ మణికంఠ దీన్ని ప్రారంభించారు. వి.కోటకు చెందిన అమాక్ట్స్ సంస్థ చైర్మన్ జీ.దశరథరెడ్డి ఆర్థిక సహాయంతో దీన్ని రూపొందినట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పోలీసుశాఖ వద్ద ఉన్న ఫాల్కన్ బస్సుతో బ్రహ్మోత్సవాలు, ప్రముఖుల పర్యటన, పట్టణాలు, నగరాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ చూస్తున్నామన్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై బస్సు వెళ్లడం కొన్ని సమయాల్లో సాధ్యం కాదన్నారు. దీంతో తమ వద్ద ఉన్న ఓ వాహనానికి కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం జోడించి మినీ ఫాల్కన్ వాహనంగా తయారు చేశామన్నారు. దీంతో గ్రామాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించడం సలువుగా ఉంటుందన్నారు. ఏఎస్పీలు రాజశేఖర్‌రాజు, శివానంద కిషోర్, డీఎస్పీ సాయినాథ్, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, సీఐలు మహేశ్వర, నెట్టికంటయ్య పాల్గొన్నారు. -
పలుకుబడి ఉంటేనే‘సార్’!
గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం గురుపూజోత్సవం రోజున అందజేసే అవార్డులకు సైతం రాజకీయ రంగు పులిమింది. పలుకబడి ఉన్న ఉపాధ్యాయులనే రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కాల్ చేసి మరీ ‘మీరు వైఎస్సార్సీపీ సానుభూతిపరులా..’ అంటూ విచారించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చిత్తూరు కలెక్టరేట్ : గురువు స్థానానికి వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉత్తమ బోధన చేస్తున్న టీచర్లను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తుండడం రివాజుగా మారుతోంది. అయితే ఇటువంటి గొప్ప సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులమడం విమర్శలకు తావిస్తోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులున్నారా? జిల్లా వ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రతిపాదనల రూపంలో సిద్ధం చేసి అందజేశారు. దరఖాస్తులు చేసుకున్న టీచర్లందర్నీ జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ ఇంటర్వ్యూలు చేపట్టింది. ఇందులో ప్రతిభ చాటిన టీచర్లు పలువురు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టేశారు. రాజకీయ పలుకుబడి, రాజకీయ సిఫార్సులున్న వారిని రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక చేసి.. మిగిలిన టీచర్లను అవమానపరిచారు. ఇష్టానుసారంగా ఉత్తర్వులు రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ల అవార్డులకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇష్టానుసారంగా జారీచేశారు. మొదట్లో 1:1 ప్రాతిపదకన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆ తర్వాత 1:2 ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపాలన్నారు. అదే విధంగా లీప్ యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోని టీచర్లను సైతం ఇంటర్వ్యూలకు పిలిపించుకున్నారు. అవార్డులు పొందొచ్చనే ఆశతో ఉత్తమ ప్రతిపాదనలతో జిల్లా నుంచి పలువురు టీచర్లు రాష్ట్ర స్థాయి ఇంటర్వ్యూలకు వెళ్లారు. అయితే అటువంటి వారందరినీ పక్కన పెట్టి సిఫార్సులున్న వారికి అవార్డులకు ఎంపిక చేశారని దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి విధానం అమలు చేయలేదని వాపోతున్నారు. ఉపాధ్యాయ అవార్డులకు రాజకీయ రంగు -
కష్టాల్లో రైతులు
– చంద్రబాబు, పవన్‌కు మాజీ మంత్రి ఆర్కేరోజా సూటి ప్రశ్న నగరి : ప్రస్తుత పాలనలో రాష్ట్ర వ్యాప్తకంగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. రైతులు పడుతున్న కష్టాలపై గురువారం నగరిలోని తన నివాసం వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎరువులకు, యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు చెప్పనలవికావన్నారు. సరిచెయ్యాల్సిన ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి వారి చేతకాని తనాన్ని వాస్తవాలు బయటపెట్టే ‘సాక్షి’పై చూపిస్తున్నారన్నారు. క్యాబినేట్ మీటింగ్ పెట్టుకొని ఫేక్‌ల పనిపడతాం అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. ‘సాక్షి’లో కథనం వచ్చిన రోజునే పచ్చ పత్రికల్లో యూరియా ఏదయ్యా, యూరియా వెతలు అంటూ కథనాలు వచ్చాయని ఇది అవాస్తవమైతే ఆ పత్రికలపై ఎందుకు కేసులు పెట్టడం లేదన్నారు. కుప్పం, పిఠాపురం నియోజకవర్గంల్లోనూ రైతులు ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారని, దీనికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సిగ్గుపడాలన్నారు. రైతులకు రూ.25 వేలు ఇస్తానని చెప్పిన మీరు 15 నెలల పాలనలో ఇచ్చింది రూ.5 వేలే అన్నారు. ఇది రైతులను మోసం చేయడం కాదా అన్నారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 70,472 మంది స్వామివారిని దర్శించుకోగా 25,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.85 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లబిస్తోంది. టిక్కెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన వారిని క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
పరిష్కారం ఎలా?
సమస్యలు ఇలా..చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని అర్జీదారుల అవస్థలు అన్నీఇన్నీకావు. వివిధ సమస్యలపై పీజీఆర్ఎస్లో అర్జీలు అందజేసినా సకాలంలో పరిష్కారం గాక అవస్థలు పడాల్సి వస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు నెలలు, సంవత్సరాలవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారిపోయింది. అయ్యా...న్యాయం చేయండంటూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఉన్నతాధికారులు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినా క్షేత్ర అమలు కాకపోవడంతో తిప్పలు పడాల్సి వస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తున్న అర్జీదారులపట్ల కొందరు మండల రెవెన్యూ అధికారులు ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’.. అంటూ తెగేసి చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీదాల అవస్థలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. స్పందన కరువు తమ స్థలాన్ని అన్యాయంగా ఆక్రమిస్తున్నారని ఐరాల మండలం, బలిజపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అధికారులకు అర్జీ ఇచ్చారు. సొంత ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మొరపెట్టుకున్నారు. 36 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణానికి పునాదులు వేస్తే కూల్చేశారని వాపోయారు. ఈ సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని ఎనిమిది సార్లు అధికారులకు అర్జీ ఇచ్చారు. అయితే ఏ మాత్రం స్పందన లేదు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని దేవరాజు (28) అనే యువకుడు మృతి చెందాడు. నగరిలోని సత్రవాడకు చెందిన దేవరాజు ఓ ప్రైవేటు డెయిరీలో పనిచేస్తున్నాడు. గురువారం చిత్తూరుకు వచ్చిన అతను ద్విచక్ర వాహనంలో స్థానిక ఆర్టీసీ బస్సు లోపలకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో కుప్పం నుంచి చిత్తూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో దేవరాజు టైర్ కింద పడి గాయపడ్డాడు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లికి భోజనం తీసుకుని వస్తూ.. తవణంపల్లె: తిరుపతి– బెంగళూరు హైవేలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఎస్ఐ కథనం.. తెల్లగుండ్లపల్లె దళితవాడకు చెందిన వెంకటస్వామి కుమారుడు ఎ.శేఖర్(54) ద్విచక్ర వాహనంలో పైపల్లె క్రాస్ రోడ్డు నుంచి అతని తల్లికి భోజనం తీసుకొని ఇంటికి వస్తున్నాడు. హైవేలో నుంచి సర్వీసు రోడ్డులో రాజశేఖర్ కోళ్లఫారం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రగాయాలు తగలడంతో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన తమ్ముడు గణపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి పులిచెర్ల(కల్లూరు): బంధువుల ఇంటికి వచ్చి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తూ ఎదురుగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి రక్తగాయాలయ్యాయి. పోలీసుల కథనం..చిత్తూరు సమీపం కొత్తూరు ఎస్టీ కాలనీకి చెందిన మురళి(40), అనూష, శరవణన్ రెండు రోజుల క్రితం పాతపేటకు ద్విచక్ర వాహనంలో బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో పాతపేట నుంచి కల్లూరు–సదుం రోడ్డుపై వెళ్తుండగా కల్లూరు నుంచి ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ద్విచక్ర వాహం నడుపుతున్న మురళి (40) అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యియి. కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పింఛన్ కోసం వృద్ధురాలి వేడుకోలు
పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం దళితవాడకు చెందిన మునెమ్మ అనే వృద్ధురాలు పింఛన్ నగదు కోసం ఆవేదన చెందుతోంది. బుధవారం ఈ మేరకు సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. ప్రతి నెలా తనకు వితంతు పింఛన్ వచ్చేదని, ఈ నెల మాత్రం జాబితాలో పేరు లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. మూడు రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పింఛన్ ఇప్పించాలని కోరుతోంది. తనకు వేరే జీవనాధారం లేదని, కనికరించాలని వేడుకుంటోంది. -
ఒక బెడ్డు.. ముగ్గురు పేషెంట్లు!
పుత్తూరు: పుత్తూరులోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి పేరుకు 50 పడకల ఆస్పత్రిగా రికార్డుల్లో ఉన్నా, వాస్తవానికి 29 పడకలతోనే సతమతమవుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 600 నుంచి 750 వరకు ఓపీ ఉంటుంది. వీరిలో కనీసం 50 నుంచి 60 మంది వరకు అడ్మిట్ అవుతారు. పుత్తూరు చుట్టు పక్కల మండలాలైన నారాయణవనం, పిచ్చాటూరు, కార్వేటినగరం, వడమాలపేట నుంచి కూడా మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి రోగులు వస్తుంటారు. వీరికి సరిపడా బెడ్లు లేకపోవడంతో ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి వైద్యం అందించాల్సిన దుస్థితి నెలకొంది. మంగళవారం కూడా ఒకే బెడ్‌పై ముగ్గురిని పడుకోబెట్టి వైద్యం అందించారు. -
కండక్టర్‌పై దాడికి యత్నం
యాదమరి : ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు దాడికి యత్నించారు. వివరాలు.. బుధవారం రాత్రి చిన్నంపల్లెకు చెందిన ఓ విద్యార్థిని చిత్తూరులోని ఎంఎస్సార్ కూడలి వద్ద మాదిరెడ్డిపల్లె వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు కిక్కిరిసి ఉండడంతో విద్యార్థినిని లోపలికి వెళ్లమని కండక్టర్ దురుసుగా చెప్పాడు. మనస్థాపం చెందిన యువతి ఈ విషయాన్ని తమ కుటుంబీకులకు ఫోన్ ద్వారా వెల్లడించింది. దీంతో యాదమరి బస్‌స్టాప్ వద్ద వారు బస్సును అడ్డగించి కండక్టర్‌పై దాడికి యత్నించారు. ప్రధానంగా తమ చెల్లెలుకు కండక్టర్ క్షమాపణలు చెబితే గానీ బస్సును కదలనివ్వబోమని యువతి సోదరులు పట్టుబట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు. ఎరువుల అక్రమ నిల్వపై నిఘా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వలు, తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. బుధవారం ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎరువుల విక్రయదారులతో సమావేశం నిర్వహించి ముందస్తు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. నిరంతర పర్యవేక్షణలో ఎరువుల సరఫరా చేపడుతున్నామన్నారు. ఖరీఫ్ సీజన్‌కు మొత్తం 28,183 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని, ఇందులో 15 వేలు మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు 13,396 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 2,600 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఈ నెలలో 200 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చిందని, మరో 1500 టన్నులు త్వరలో వస్తాయమని వెల్లడించారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ శ్రీరంగరాజ పురం : ఎస్ఆర్పురం మండలం పాతపాళెంలో పూజా(27) అనే యువతిని హత్య చేసిన కేసులో నిందితుడు భాస్కర్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగరి డీఎస్పీ మహ్మద్ అజీజ్ కథనం మేరకు .. ఆగస్ట్ 17వ తేదీన పూజను సి.భాస్కర్ అనే యువకుడు మాట్లాడేందుకని తీసుకెళ్లి గొంతు నొక్కి చంపేశాడు. అనంతరం చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రించాడు. పూజ బలన్మరణానికి పాల్పడినట్లు కుటుంబీకుల భావించారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా పూజకు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే పూజను భాస్కర్ హత్య చేసినట్లు గ్రామంలో పుకార్లు రావడంతో వారు పెద్దమనుషులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు వెంటనే భాస్కర్‌ను పిలిపించి నిలదీశారు. దీంతో తానే పూజను హతమార్చినట్లు భాస్కర్ అంగీకరించి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
అధికారమే అండగా ఆక్రమణ
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : ‘‘ఇది మా ప్రభుత్వం.. ప్రతి ఒక్కరూ మా కింద ఉండాల్సిందే.. తహసీల్దార్ నుంచి వీఆర్ఓ వరకు మాకు సలాం కొట్టాల్సిందే’’ అంటూ పచ్చమూక రెచ్చిపోతోంది. ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతోంది. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు తెగబడుతోంది. ఈ క్రమంలో పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలం దేవదొడ్డి గ్రామంలో దారిని ఆక్రమించుకుంది. పది మంది రైతులకు పొలానికి వెళ్లేందుకు బాట లేకుండా చేసింది. వివరాలు.. దేవదొడ్డి గ్రామంలో మంగమ్మ పేరిట సర్వేనంబర్ 46/2ఏలో 4.03 ఎకరాల భూమి ఉంది. ఆమె కుటుంబీకులు పశువులు మేపుకుంటూ, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి పొలానికి సమీపంలో టీడీపీ స్థానిక నేతలు ధనుంజయ, వెంకటేశులు కొంత భూమి కొనుగోలు చేశారు. తర్వాత మంగమ్మ పొలానికి వెళ్లే కాలిబాటను ఆక్రమించుకునేందుకు యత్నించారు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ పొందారు. ఈ ఉత్తర్వులను తహసీల్దార్‌కు అందజేశారు. అయితే సదరు తహసీల్దార్ ఈ విషయంలో తాము చేసేది ఏమీ లేదని చేతులెత్తేశారు. దీంతో పచ్చమూక మరింత రెచ్చిపోయింది, నేతలతోపాటు అధికారులకు సైతం ముడుపులు చెల్లించామని, తమను ఎవరూ ఏం చేయలేరని చెలరేగిపోయింది. ఈ క్రమంలోనే జేసీబీతో దారిని ఆక్రమించుకుంది. దీంతో బాధితులు వెంటనే కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ భవానీకి ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులను సైతం ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని కన్నీరుమున్నీరవుతున్నారు. -
11న వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 11న తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి మల్లారపు వాసు తెలిపారు. ఈ మేరకు బుధవారం తిరుపతి మారుతీనగర్‌లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం వద్ద పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కె. రోజా, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేగౌడ్, డాక్టర్ సునీల్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, మేయర్ డాక్టర్ శిరీషను కలిసి ఆహ్వానించారు. ఈ సమావేశానికి పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టిజెఆర్. సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు పాల్గొంటారని రాజేంద్ర తెలిపారు. సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ విభాగం నాయకులు తరలిరావాలని కోరారు. -
బాస్కెట్ బాల్లో ‘విజయం’ సత్తా
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో విజయం కళాశాల విద్యార్థులు సత్తా చాటి విజేతలుగా నిలిచినట్లు విద్యాసంస్థ చైర్మన్ తేజోమూర్తి తెలిపారు. బుధవారం ఈ మేరకు గెలుపొందిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమన్నారు. తమ కళాశాల డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థి గురుచరణ్ విశేష ప్రతిభను ప్రదర్శించినట్లు వెల్లడించారు. అనంతరం జట్టుకు అభినందనలు తెలిపారు. అధ్యాపకులు మోహన్‌నాయుడు పాల్గొన్నారు. -
అన్నదాతలకు అండగా..
సాక్షి ప్రతినిధి, తిరుపతి : అన్నదాతలకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించింది. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టనుంది. ఆ మేరకు బుధవారం తిరుపతిలోని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, తిరుపతి నగర మేయర్ శిరీష, సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, భూమన అభినయరెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, వెంకటేగౌడ్, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, తిరుపతి అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి సమావేశమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మామిడి దిగుబడులకు గుజ్జు పరిశ్రమల వారు కిలో మామిడికి రూ.8, ప్రభుత్వం రూ.4 చెల్లించాల్సి ఉంది. కాయలు విక్రయించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పైసా చెల్లించకపోవడంపై మండిపడ్డారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవటం, యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలపై చర్చించారు. రైతు సమస్యల పరిష్కారం ఈనెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పలమనేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెంకటేగౌడ్, శ్రీకాళహస్తిలో భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నగరిలో ఆర్కే రోజా, కృపాలక్ష్మి, చిత్తూరులో నారాయణస్వామి, డాక్టర్ సునీల్‌కుమార్, కుప్పంలో రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, తిరుపతిలో భూమన అభినయరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కార్యాచరణ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
ప్రజా నాయకుడు పెద్దిరెడ్డి
చౌడేపల్లె : పేదల సంక్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయన కుటుంబంపై కక్షసాధింపులకు దిగుతున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. బుధవారం ఈ మేరకు చారాల సమీపంలోని అన్నపూర్ణాంబ సమేత కాశీవిశ్వేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ మిథున్‌రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. దామోదరరాజు, మండల అధ్యక్షుడు జి. నాగభూషణరెడ్డి, వైస్ ఎంపీపీలు సుధాకర్‌రెడ్డి, నరసింహులు యాదవ్,మాజీ ఎంపీపీలు రుక్మిణమ్మ, అంజిబాబు మాట్లాడుతూ పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టడంతోపాటు ఎల్లో మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అండతో వైఎస్సార్‌సీపీనేతలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతోందని ఆరోపించారు. నేతలను అన్యాయంగా జైలు పాలు చేస్తోందని మండిపడ్డారు. కుట్రలు వదిలేసి ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందేవని గుర్తుచేశారు. సూపర్‌సిక్స్ పథకాలను అరకొరగా అమలు చేస్తూ గొప్పలు చెప్పుకోవడం తప్ప కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు చేసింది శూన్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఆడెం హరిబాబు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు వెంకటరమణ, నేతలు లడ్డూ రమణ, అమర, రమణారెడ్డి, ,శివశంకర్‌రెడ్డి ,మునిరాజా ,ప్రమోద్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, వీరప్పాచారి, సుబ్రమణ్యం, రామచంద్ర, రవికుమార్, సింగిల్‌విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం కార్యదర్శి కల్యాణ్భరత్, కో–ఆప్షన్ మెంబర్ సాధిక్, బోయకొండ మాజీ డైరెక్టర్ నాగరాజా, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రమేష్‌బాబు, యశోద, అనుప్రియ పాల్గొన్నారు. -
విత్తు..చిత్తు!
ఇష్టారాజ్యంగా పంపిణీ జిల్లాకు చేరిన వేరుశనగ విత్తనాలు (ఫైల్) కూటమి నేతల అవినీతికి వేరుశనగ విత్తనం మొలకెత్తకుండానే చిత్తయ్యింది. పొలాలకు చేరకుండానే పక్కదారి పట్టింది. పచ్చమూక కాసుల కక్కుర్తికి రైతాంగం కుదేలైంది. అరకొరగా కాయలు అందడంతో సాగుబడి దారుణంగా పడిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. అయితే అధికార యంత్రాంగం మాత్రం వాస్తవాలను కప్పిపుచ్చేందుకు కుంటి సాకులు చెబుతోంది. వరుణుడిపై నెపం నెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీ నాయకుల అక్రమార్జనకు సహకారం అందిస్తోంది. ఆరుగాలం కష్టించే రైతన్నను నిలువునా మోసం చేస్తోంది. కాణిపాకం : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వేరుశనగ సాగు పూర్తిగా పడిపోయింది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం 80వేల హెక్టార్లు అయితే వేరుశనగ పంట విస్తీర్ణం 35,238 హెక్టార్లుగా అధికారులు లెక్క కట్టారు. అయితే ప్రస్తుతం కేవలం 3,652 హెక్టార్లల్లో మాత్రమే వేరుశనగ సాగులోకి వచ్చింది. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ తప్పిదాలతో పాటు.. క్షేత్రస్థాయిలో కూటమి నేతల పెత్తనం, అధికారుల పనితీరులో లోటుపాట్లే కారణమవుతోంది. సకాలంలో అన్నదాత సుఖీభవ నగదు జమ చేయకపోవడంతో రైతులు పెట్టుబడి ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం (రైతు భరోసా) అందించేది. విత్తనకాయలు సైతం అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసేది. ప్రస్తుత సర్కారు ఈ విషయంలో అలసత్వం వహించడంతో వేరుశనగ రైతులకు అవస్థలు తప్పలేదు. తోడైన తోతాపురి కష్టాలు! వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసే సమయానికి అధిక సంఖ్యలో రైతులు తోతాపురి మామిడి ధరలతో కుస్తీపడుతున్నారు. గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. దాదాపు నెలపాటు ఈ అవస్థలతో రోడ్డు మీద పడిపోయారు. దీంతో వేరుశనగ విత్తనాల కొనుగోలుకు దూరమయ్యారు. ఇదే అదునుగా కూటమి నేతలు రాయితీ విత్తనాలను యథేచ్ఛగా స్వాహా చేసేశారు. 24వేల క్వింటాళ్లు హాంఫట్..? ప్రభుత్వం సరఫరా చేసిన కాయలకు.. జిల్లాలో వేరుశనగ విత్తుకు పొంతన కుదరని పరిస్థితి. జిల్లాకు వచ్చిన 30,283 క్వింటాళ్ల కాయలను దాదాపు 20వేల హెక్టార్లలో విత్తుకోవచ్చు. అయితే అందులో నాలుగో వంతు గింజలు కూడా భూమిలో పడలేదు. కేవలం 3,652 హెక్టార్లలో మాత్రమే వేరుశనగ సాగులోకి వచ్చింది. ఈ లెక్కన హెక్టారుకు 1.5 క్వింటాళ్ల కాయలను విత్తితే సుమారు 6వేల క్వింటాళ్లు మాత్రమే సరిపతాయి. మిగిలిన దాదాపు 24వేల క్వింటాళ్లు ఏమయ్యాయో వ్యవసాయశాఖ అధికారులే చెప్పాల్సి ఉంది. వేల క్వింటాళ్లను కూటమి నేతల పరం చేశారా..? లేకుంటే వంట నూనెకు వాడేశారా..? ఇంతకీ కాయలు తీసుకున్న వారందరూ రైతులేనా..? నిజంగా రైతులకే విత్తనాలు ఇచ్చుంటే.. వేరుశనగ సాగు విస్తీర్ణం ఈ స్థాయిలో ఎందుకు పడిపోయిందో లెక్కలు చెప్పాల్సిన అవసరముంది. పైగా వేరుశనగ కాయలు విక్రయించిన నగదును ప్రభుత్వానికి జమ చేయకుండా తొలుత రూ.కోటి వరకు బకాయి ఎందుకు పెట్టారో వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికీ అందులో రూ.25లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా సమాచారం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. విత్తనాల సరఫరా సంవత్సరం క్వింటాళ్లు 2022 42,288 2023 41,070.3 2024 42,202.5 కూటమి సర్కారులో.. 2025 30,283 వర్షపాతం వివరాలు నెల సాధారణం మి.మీలో కురిసింది మి.మీలో జూన్ 80.09 38.7 జూలై 103.05 96.04 ఆగస్ట్ 121.02 242.2 జిల్లాలో తగ్గిన వేరుశనగ సాగు ఈ ఏడాది రాయితీ వేరుశనగ విత్తనాలు రైతు సేవా కేంద్రాలు, సొసైటీ, పంచాయతీ భవనాలకు చేరేలోపు.. కూటమి నేతలు చేజిక్కించుకున్నారు. విత్తనాల కొనుగోలు టోకెన్లను కై వసం చేసుకున్నారు. కాయల పంపిణీపై పెత్తనం మొదలుపెట్టారు. ఇష్టారాజ్యంగా విత్తనాలను పంచిపెట్టారు. దీంతో నిజమైన రైతులకు మాత్రం సక్రంగా కాయలు అందలేదు. ఈ క్రమంలో వేరుశనగ విత్తనం పూర్తిస్థాయిలో పొలాలకు చేరని పరిస్థితి ఏర్పడింది. కుంటి సాకులు వేరుశనగ విత్తుకునేందుకు సకాలంలో వర్షాలు కురవలేదని, అందువల్లే సాగుబడి తగ్గిపోయిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై రైతులు మండిపడుతున్నారు. అదును తగినట్టు వర్షాలు పడ్డాయని, ప్రభుత్వం, కూటమి నేతలు, అధికారుల నిర్వాకం కారణంగా వేరుశనగ సాగు పడిపోయిందని ఆరోపిస్తున్నారు. చేసిందంతా చేసేసి ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సకాలంలో పెట్టుబడిసాయం, రాయితీ విత్తనాలు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. అరకొరగా కాయలు ప్రభుత్వం జిల్లాకు అరకొరగా విత్తన కాయలు సరఫరా చేసింది. తొలుత 26,350 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో అదనపు కేటాయింపులతో కలిపి మొత్తం 30,283 క్వింటాళ్లు సరఫరా చేసింది. ఈ క్రమంలో రైతులకు ఒక్కో బ్యాగు చొప్పున విత్తన కాయలు అందించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇదే సమయంలో కూటమి నేతలు రంగంలోకి దిగారు. అధికారులతో కుమ్మౖక్కై ప్రణాళికలను తారుమారు చేసేశారు. -
కొనసాగుతున్న కక్ష.. చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు
సాక్షి, తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లిక్కర్ అక్రమ కేసులో భాగంగా దాదాపు 20 మంది బృందంతో వచ్చిన సిట్.. తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు చేపట్టింది. లిక్కర్ కేసులో A 37 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు పెడుతోంది. చిత్తూరులో వైఎస్సార్సీపీ నేత విజయనందరెడ్డి ఇంట్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బీవీ రెడ్డి కాలనీ, నలంద నగర్లో విజయనందరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.చంద్రబాబు సర్కార్.. పోలీసులతో బెదిరింపులకు దిగుతోంది. చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డితో పాటు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సిట్ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. -
తప్పని నిరీక్షణ
కార్వేటినగరం: అసలే దివ్యాంగులు. ఆపై వందల కిలోమీటర్ల ప్రయాణం. ఆపసోపాలు పడి తమకు సూచించిన ఆస్పత్రికి తరలివచ్చారు. తమ వికలత్వాన్ని పరీక్షించుకుని సర్టిఫికెట్లు పొందాలని ఆశపడ్డారు. కానీ స్థానిక పీహెచ్సీ డాక్టర్లు ఉదయం 11 దాటినా రాకపోవడంతో నిరుత్సాహంతో కుమిలిపోయారు. డాక్టర్లు లేక ఖాళీ కుర్చీలతో సదరమ్ క్యాంపు గదికార్వేటినగరం వచ్చిన దివ్యాంగులు ధర్మవరం నుంచి వచ్చాము మాది అనంతపురం జిల్లా, ధర్మవరం గ్రామం. మేము సదరమ్ సర్టిఫికెట్ల కోసం మూడు నెలలకు ముందు స్లాట్ బుక్ చేసుకున్నాము. మాలాంటి వారికి వందల కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఆలస్యంగా బుక్ చేసుకున్న వారికి దగ్గర్లో ఉన్న ఆస్పత్రుల్లో అనుమతులిచ్చారు. కష్టాలకోర్చి ఇంత దూరం వచ్చాము. ఉదయం 11 గంటలవుతున్నా ఇంతవరకు వైద్యులు రాలేదు. సీహెచ్‌సీలో 12 మంది డాక్టర్లు ఉన్నా ఏ ఒక్కరూ సమయపాలన పాటించలేదు. – హరిప్రసాద్, ధర్మవరం, అనంతపురం జిల్లా సదరమ్ సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల ఎదురు చూపు -
ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా రూపేష్‌బాబు
చిత్తూరు కలెక్టరేట్ : చైన్నెలోని జీవ టెక్నిలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా చిత్తూరుకు చెందిన డాక్టర్ రూపేష్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఝాన్సీరాణి ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ పరిశ్రమల అభివృద్ధి సాధికారిక సంస్థ (అపిట్కో) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రూపేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన రూపేష్‌బాబు సేవలను వినియోగించుకోవాలని జీవ టెక్నిలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ భావించినట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌గా నియమితులైన రూపేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానన్నారు. పలువురు జిల్లా వాసులు ఆయనకు అభినందనలు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 15 మందికి జరిమానా చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందికి రూ.1.5 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 15 మందిపై కేసు నమోదుచేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గంజాయి విక్రయించిన వ్యక్తి అరెస్ట్ చిత్తూరు అర్బన్: గంజాయి విక్రయిస్తూ, తనిఖీల సమయంలో తప్పించుకున్న రాజా (45)ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. జూలై 19న నగరంలోని కై లాశపురం వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి, 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రాజా అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోయాడు. ఇతడిని పోలీసులు అరెస్టుచేసి, న్యాయస్థానం ఆదేశాలతో చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. జిల్లాలో 24 ఆర్ఎంపీ క్లినిక్‌ల సీజ్ కాణిపాకం: కలెక్టర్ ఆదేశాలకు జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ క్లినిక్‌లపై మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 76 క్లినిక్‌లను తనిఖీ చేసి.. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 24 ఆర్ఎంపీ క్లినిక్‌ల ను సీజ్ చేశారు. సీజ్ చేసే క్రమంలో వైజాగ్ అధికా రులు పలు విషయాలను గుర్తించారు. వాటిని త్వరలో కలెక్టర్‌కు నివేదికల రూపంలో పంపనున్న ట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి పేర్కొన్నారు. -
13న జాతీయ లోక్‌అదాలత్
చిత్తూరు లీగల్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ ప్రిన్స్‌పల్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. సోమవారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోని జిల్లా న్యాయ సేవాసదన్ భవనంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల పరిష్కారం కోసం జాతీయ అదాలత్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, చెన్బౌన్స్ ఇతర కేసులను అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. కక్షిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే చిత్తూరు కోర్టులో డీఎల్ఎస్ఏ భవనంలో సంప్రదించాలని కోరారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో 96,647 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. చిత్తూరులో వ్యక్తి ఆత్మహత్య చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మోహన్ (43) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీఐ మహేశ్వర కథనం మేరకు.. నగరంలోని కట్టమంచికి చెందిన మోహన్‌కు పెళ్లయ్యి పిల్లలున్నారు. అనారోగ్యం కారణంగా మద్యానికి బానిసయ్యాడు. భార్య కూడా గత కొంతకాలంగా ఇతనికి దూరంగా ఉంటోంది. సోమవారం కట్టమంచి–తిరుపతి రోడ్డులోని బ్రిడ్జి కింద ఉన్న పొలాల్లో ఓ చెట్టుకు పంచెతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందడంతో మృతదేహాన్ని పరిశీలించి, చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం యాదమరి: ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం.. శ్రీరంగరాజపురం మండలం, పాతపాళ్యం దళితవాడకు చెందిన రమేష్ కుమార్తె పూజ(25)ను యాదమరి మండలం, వరదరాజులపల్లికి చెందిన పెరియస్వామి కుమారుడు శేఖర్(33)కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే శేఖర్ కుటుంబ సమస్యల వల్ల ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణానంతరం పూజ దినసరి కూలీగా మారిపోయింది. గత నెల ఆడి కృత్తిక సందర్భంగా కావడి ఎత్తడానికి తన పుట్టింటికి వెళ్లింది. అయితే అక్కడ ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తల్లి వరదరాజులపల్లిలోని పూజ అత్తవారికి, బంధువులకు సమాచారం అందించింది. దీంతో వారు పూజ మృతదేహాన్ని వరదరాజులపల్లిలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి రాధమ్మ రెండు రోజుల క్రితం ఎస్ఆర్పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఐ సుమన్ మంగళవారం వరదరాజులపల్లికి వచ్చి ఖననం చేసిన పూజ మృతదేహాన్ని స్థానిక తహసీల్దార్ పార్థసారథి సమక్షంలో చితూరు ప్రభుత్వాస్పత్రి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా అక్కడి పోలీసులు వరదరాజులపల్లిలోని మృతురాలి బంధువులను విచారించినట్లు సమాచారం. -
గజ గణపతి!
గజ వాహనంపై గణనాథుడుకాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం గజ వాహనంపై ఊరేగుతూ స్వామివారు కనువిందు చేశారు. ఉదయం శ్రీసిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సర్వంగా సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. రాత్రి అలంకార మండపంలో గణనాథుని ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో అలంకరించి గజ వాహనంపై కొలువు దీర్చారు. పురవీధుల్లో మేళతాళాల నడుమ ఊరేగింపు చేపట్టారు. రథోత్సవానికి సర్వం సిద్ధంబ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. -
అలసి.. సొలసి!
గత ప్రభుత్వంలో అర్జీలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పర్యవేక్షణ లేమి.. పాలకుల ఉదాసీనత వెరసి గ్రీవెన్స్ తూతూమంత్రంగా నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. అర్జీదారులు గత ప్రభుత్వం మాదిరిగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని కలెక్టరేట్‌తోపాటు మండల కేంద్రాలకు క్యూ కడుతున్నారు. నెలల తరబడి అర్జీలిస్తూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. కానీ ఏం లాభం..?. అధికారులు స్పందించక.. సమస్య పరిష్కారంగాక.. ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తో పాటు, ఆర్డీవో, నగరపాలక, మున్సిపల్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక)ను ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అర్జీదారులకు న్యాయం జరగడం లేదు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రజల సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్ర స్థాయి అధికారులకు చలనం లేకుండా పోతోంది. ఫలితంగా అర్జీదారులు న్యాయం కోసం పదేపదే పీజీఆర్ఎస్లో అర్జీలు ఇస్తూనే ఉన్నారు. ఏమార్చి.. సంతకాలు చేయించుకుని పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీ పరిష్కారానికి సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. వాస్తవంగా ఎవరికై తే న్యాయం జరగాలో వారికి న్యాయం చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని పలు మండలాల్లో అలా జరగడం లేదు. ఉన్నతాధికారుల నుంచి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఒత్తిడి ఎక్కువైనప్పుడు అర్జీదారుల నుంచి తెల్లకాగితంలో సంతకం చేయించుకుని సమస్య పరిష్కరించినట్లు ఏమారుస్తున్నారు. పీజీఆర్ఎస్లో అర్జీలు అందజేస్తున్న ప్రజలు తొమ్మిది సార్లు అర్జీలందజేసినా.. సొంత గృహాల కోసం గంగాధరనెల్లూరు మండలం, కొత్తూరు ఎస్టీ కాలనీ వాసులు ఇప్పటికి 9 సార్లు పీజీఆర్ఎస్లో అర్జీలు అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ నుంచి గత నెల వరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తొమ్మిది సార్లు అర్జీలు అందజేశారు. సంవత్సరాల తరబడి పూరి గుడిసెల్లో ఉంటున్నామని, 14 కుటుంబాలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు వారి న్యాయం జరగలేదు. పది సార్లు అర్జీ ఇచ్చినా.. కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని పెనుమూరు మండలం, కంబాల చేను గ్రామస్తులు ఇప్పటికి పది సార్లు అర్జీ ఇచ్చినా పురోగతి శూన్యం. ఆ గ్రామంలోని 902 సర్వే నం.1.78 ఎకరాలు రాస్తా, సర్వే నం.985లో 44 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. మండల రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చెరువు కాలువను ఆక్రమించారన్నా.. చెరువు కాలువను ఆక్రమించారని ఐరాల మండలానికి చెందిన బాబు మే 5న పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. అంతకుముందు ఐదు సార్లు మండలాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కొందరు స్వార్థపరులు చెరువు కాలువను ఆక్రమించుకుని పొలానికి దారిలేకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు క్షేత్రస్థాయి అధికారులకు వెళ్లింది. సమస్యను పరిష్కరించకుండా అర్జీని పరిష్కరించేశామంటూ అధికారులకు నివేదికిచ్చారు. ఇప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఏడు సార్లు అర్జీ ఇచ్చినా.. ఇప్పటికీ పీజీఆర్ఎస్లో ఏడు సార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం శూన్యం. పెనుమూరు మండలానికి చెందిన నాగభూషణం తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించుకున్నారని, న్యాయం చేయాలంటూ మే 5వ తేదీన పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. అంతకుముందు ఆరు సార్లు మండల స్థాయిలో అధికారులకు అర్జీ అందజేశారు. సర్వే నం.467/1ఏలోని 20 సెంట్ల భూమిలో గత 30 ఏళ్లుగా నివసిస్తున్నట్లు నాగభూషణం అర్జీలో పేర్కొన్నారు. సంబంధిత స్థలంలో తమ ఇంటికి వెళ్లే దారి సర్వే నం.468/1లో కుంటపోరంబోకు స్థలం ఉందని, గత 30 ఏళ్లుగా ఆ దారినే వినియోగించుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆ దారిని మరొకరు ఆక్రమించుకోవడంతో పలుమార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా న్యాయం జరగని దుస్థితి. కార్యాలయాలకే పిలిపించుకుని! పీజీఆర్ఎస్లో అధిక శాతం రెవెన్యూ సమస్యలే నమోదవుతున్నాయి. ఆ సమస్యలను సంబంధిత తహసీల్దార్లు సకాలంలో పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో పలు చోట్ల ఆస్తి తగాదాలు, రెవెన్యూ సమస్యలు ఎక్కువై ఒకరినొకరు చంపుకునే స్థాయికి వస్తున్నారు. రెవెన్యూ సమస్యలను క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించి పరిష్కరించకుండా అర్జీదారులను కార్యాలయాలకు పిలిపించుకుంటున్నారు. ఆపై అర్జీదారులకు మాయ మాటలు చెప్పి సంతకాలు చేయించుకుని పంపించేస్తున్నారు. అధికారుల తీరు వల్ల రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నట్టు తెలుస్తోంది. అర్జీల పరిష్కారం అంతంతమాత్రమే -
ఎగ్‌ఫీజు వేయాలంటే రూ.300 ఇవ్వాల్సిందే
చౌడేపల్లె: మండలంలో లైన్మెన్ల పనితీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. పర్యవేక్షణ లేమి.. ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగా తమ చేతికి పనిచెబుతున్నారు. ప్రయివేటు వ్యక్తులను నియమించుకుని వారి చేత పనులు చేయిస్తూ రైతులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇక వారిసంగతి అంతే..! ఇలాంటిదే మండలంలోని కొండామర్రిలో వెలుగుచూసింది. మంగళవారం కోటూరు సమీపంలో ఓ రైతు బోరుకు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్కు 11 కేవీ లైను వద్ద ఎగ్ ఫీజు కట్ అయ్యింది. ఆ రైతు లైన్‌మన్‌కు సమాచారమిచ్చారు. రూ.300 ఇస్తేనే వచ్చి ఎగ్‌ఫీజు వేస్తామని సంబంధిత లైన్‌మన్ రైతుకు బదిలిచ్చాడు. ససేమిరా అనడంతో ఆ రైతు లైన్‌మన్ అడిగినంత ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ ప్రయివేటు వ్యక్తి వచ్చి ఎగ్‌ఫీజు వేశాడు. అడిగినంత ఇవ్వకుంటే కన్నెత్తిచూడడని, ఫోన్ చేసినా స్పందించరని రైతు వాపోయాడు. మండలంలో మరికొన్ని చోట్ల రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ శిశధర్ను వివరణ కోరగా లైన్‌మన్‌కు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అత్యవసర సేవలకు ప్రథమ ప్రాధాన్యం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు అత్యవసర సేవలందించడం ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో మంగళవారం నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాత అంబులెన్స్‌ల స్థానంలో కొత్త అంబులెన్స్‌లను తీసుకొచ్చి అత్యవసర సేవలందించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి సంబంధించి పాత అంబులెన్స్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఏవోసీఎల్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ పథకంలో కొత్త అంబులెన్స్‌ను త్వరలో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్‌ల సంఖ్య మూడుకు చేరుతుందన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముద, ఎన్టీఆర్ వైద్య సేవ కో–ఆర్డినేటర్ డా.సుదర్శన్ పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఫ్లెక్సీ
చిత్తూరు అర్బన్: అనుకున్నట్లే అయ్యింది. చిత్తూరులో విచ్చల విడిగా విఫరీత ధోరణివైపు పరుగెడుతున్న ఫ్లెక్సీల సంస్కృతి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల ఫ్లెక్సీలను కడుతూ.. విద్యుత్ షాక్ తగలడంతో ఆనంద్ (19) అనే యువకుడు దుర్మరణంపాలయ్యాడు. చిత్తూరు నగరంలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. పలువురు టీడీపీ నేతలు నగరంలో విస్తృతంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం చిత్తూరుతో పాటు తమిళనాడులోని వేలూరు నుంచి కూలీలను తీసుకొచ్చి ఫ్లెక్సీలు కట్టే బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో వేలూరు నగరం, ఆర్ఎస్.నగర్‌కు చెందిన ఆనంద్, పరశురామన్ (40), గోగుల్ (15), అనే ముగ్గురు చిత్తూరు హైరోడ్డులోని ఓ బ్యాంకు వద్ద భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేయడానికి పైకి ఎక్కారు. అక్కడే ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్ ఫ్లెక్సీకి ఉన్న ఇనుప చువ్వను తాకింది. ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహం ఇనుపచువ్వకు రావడంతో ముగ్గురూ ఎగిరి అవతలి వైపు పడ్డారు. ముగ్గుర్నీ స్థానికులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆనంద్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇక పరశురామన్, గోగుల్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో గోగుల్ మైనర్ బాలుడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎవరిదీబాధ్యత? ఆనంద్ మృతికి ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనధికారికంగా నగరంలో ఫ్లెక్సీలు నింపేస్తున్న రాజకీయ పార్టీ నాయకులా..? ఫ్లెక్సీలు, బ్యానర్లను నియంత్రించాల్సిన కార్పొరేషన్ అధికారులా..? అనుమతిలేకుండా పెడుతున్న ఫ్లెక్సీలు గాలీవానకు నేలకొరుగుతుంటే కేసులు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్న పోలీసులా..? అనే ప్రశ్నలు సామాన్యుల వైపు నుంచి వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఫ్లెక్సీ కడుతూ.. విద్యుదాఘాతంతో యువకుడి మృతి -
‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు అప్రజాస్వామికం
చిత్తూరు అర్బన్: అధికారులకు అనుకూలంగా పత్రికల్లో వార్త రాయకుంటే కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని పాత్రికేయులు ప్రశ్నించారు. పత్రికల్లో ప్రచురితమైన వార్త తమకు నచ్చలేదనే కారణంతో.. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరశిస్తూ చిత్తూరులో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరులో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.లోకనాథన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పలువురు డీఎస్పీలకు పదోన్నతులు రావాల్సి ఉండగా, ఆలస్యం చేయడం వెనుక అక్రమాలు జరిగాయనే కోణంలో ‘సాక్షి’ పత్రికలో వార్త ప్రచురితమైందన్నారు. ఈ వార్తలో ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉంటే అధికారులు ఖండించాల్సిం ఉందన్నారు. అలా కాదని ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనన్నారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే పలు కేసుల్లో స్పష్టత కూడా ఇచ్చిందన్నారు. భావ వ్యక్తీకరణను తెలియచేసే పత్రికల నిర్వాహకులపై కేసులు పెట్టడం సమాజానికి మంచిది కాదన్నారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్ కార్యదర్శి వై.కాలేశ్వరరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెఎం.అశోక్‌కుమార్ మాట్లాడుతూ నిజాలు రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య పాత్రికేయులు వారధిలా పనిచేస్తున్నారన్నారు. నిజాలను పత్రికల ద్వారా ఎత్తి చూపినపుడు వాటిని సరిదిద్దుకోవాల్సిందిపోయి.. తప్పుడు కేసులు పెట్టడం తగదన్నారు. ‘సాక్షి’ ఎడిటర్‌పై నమోదు చేసిన అక్రమ కేసును ఎత్తివేయాలని చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వరకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు శివప్రసాద్, కార్యవర్గ సభ్యులు బాలసుందరం, చంద్రశేఖర్, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు సురేష్, చంద్రప్రకాష్, హరీష్, శ్రీనివాసులు, చిరంజీవి, ప్రవీణ్‌సాయి, జయకుమార్ పాల్గొన్నారు. -
ఎట్టకేలకు కంచె
పుంగనూరు: పట్టణంలోని పీఎల్ఆర్ మినీబైపాస్ రోడ్డులో గల రాయలచెరువు వంకపోరంబోకు స్థలానికి ఎట్టకేలకు మున్సిపల్ కమిషనర్ మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో కంచె ఏర్పాటు చేశారు. మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. కాగా గత నెల 25న ‘వంకపోరంబోకు స్థలం కబ్జా’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై తహసీల్దార్ స్పందించి ట్రెంచ్ ఏర్పాటు చేశారు. కమిషనర్ స్థలాన్ని పరిశీలించి సర్వే నం.110/1లోని 81 సెంట్లు కబ్జా కాకుండా తక్షణమే కంచె ఏర్పాటు చేశారు. ఇందులో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. -
విషం చిమ్ముతున్న ఆహార పరిశ్రమ
శాంతిపురం: తమ గ్రామం వద్ద పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశించిన రెడ్డివారిపల్లి వాసులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. రాళ్లబూదుగూరు పంచాయతీలోని రెడ్డివారిపల్లి వద్ద రెండు నెలల క్రితం ఓ ఆహార పరిశ్రమ ప్రారంభమైంది. కూరగాయలను నిల్వచేసి, ఎగుమతి చేసేలా ప్రాసెస్ చేసే ఈ పరిశ్రమ నుంచి రసాయనాలు కలిసిన నీరు విడుదలవుతోంది. ఈ నీరు వెళ్లేందుకు చిన్నపాటి కాలువ చేసి పరిశ్రమ పక్కనే ఉన్న బుడ్డారెడ్డి కుంట వంకలోకి వదిలిపెట్టారు. వంక మొత్తం మీద రసాయనాలు కలిసిన నీరు ప్రవహిస్తూ కర్ణాటక సరిహద్దులోని కొత్తచెరువులోకి వెళ్తోంది. వంకపై నిర్మించిన నాలుగు చెక్ డ్యాంలు కూడా కలుషిత నీటితో నిండుతున్నాయి. దీంతో ఈ వంకలో కప్పలతో సహా ఇతర జీవరాశులేమీలేకుండా పోయాయి. వ్యర్థ నీటి నుంచి వస్తున్న ఘాటైన వాసనతో ఇబ్బందిగా ఉందని, పావు గంట ఉన్నా కళ్లల్లో నీరు కారుతూ ఊపిరి తీసుకోవడం కష్టమవుతోందని ఫ్యాక్టరీ పక్కన మైదానంలో క్రికెట్ ఆడే యువకులు పరిశ్రమ నిర్వాహకులకు తెలిపామన్నారు. దీంతో ఇటీవల ప్యాక్టరీ నిర్వాహకులు గుట్టుగా చెక్ డ్యాం గోడను పగులగొట్టి నీటిని కిందికి వదిలేయడంతో ఈ వ్యవహారాన్ని స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అయినా ప్రయోజనం లేకదని యువకులు వాపోతున్నారు. రసాయన నీరు వెళ్తున్న వంకకు ఇరువైపులా గడ్డి ఉన్న భూములు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో స్థానిక గ్రామాల వారు తమ ఆవులు, జీవాలను మేపుతుంటారు. అవి పొరబాటున వంకలో నీరు తాగితే తమకు జీవనాధారంగా ఉన్న పెంపుడు జంతువులు బలవువడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమను నడుపుతున్న బడాబాబులను అడ్డుకునే శక్తి తమకు లేదని వాపోతున్నారు. దీనిపై పరిశ్రమ నిర్వాహకుల వివరణ కోసం ప్రయత్నించగా వినాయకచవితి పండుగకు వెళ్లిన సార్లు ఎవ్వరూ ఇంకా రాలేదని, వాళ్ల ఫోన్ నంబర్లు ఇవ్వలేమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. -
రోడ్డెక్కిన రైతన్నలు
సాక్షి, అమరావతి/ఉదయగిరి రూరల్/గంగవరం/సదుం/మదనపల్లె రూరల్: రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని బండగానపల్లె పంచాయతీ బిజ్జంపల్లిలో యూరియా కోసం రైతులు మంగళవారం రోడ్డుపై నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా గంగవరం, సదుం మండలాల్లో యూరియా కోసం రైతులు భారీగా క్యూ కట్టారు. గంగవరంలోని పీఏసీఎస్ కార్యాలయానికి చేరిన 450 బస్తాలు యూరియా కోసం 2వేలమందికిపైగా రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు గాశారు. దీంతో ఉన్న 450 బస్తాలను ఇంతమందికి ఎలా పంచాలా అని అధికారులు తలలు పట్టుకున్నారు. పీఏసీఎస్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకూ రైతులు ఎండలో క్యూకట్టారు. వీరిలో వృద్దులు, మహిళలూ ఉన్నారు. అలాగే, సదుంలోని ఓ ప్రైవేటు దుకాణానికి 14 క్వింటాళ్ల యూరియా రావడంతో అక్కడ కూడా రైతులు బారులు తీరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మండల వ్యవసాయశాఖాధికారి(ఏవో) కార్యాలయంలో యూరియా కూపన్ల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. కూపన్లు ఇస్తున్న క్రమంలో అక్కడ తోపులాటలు, అరుపులు, కేకలతో పరిస్థితి గందరగోళంగా మారింది. గంటలసేపు నిల్చుని, తోపులాటకు గురై ఇబ్బందులు పడుతూ లోనికి వెళితే ఒకరికి ఒక బస్తా యూరియానే ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్‌కు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు 22.12 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా, దాంట్లో సగానికి పైగా వరి సాగైందని చెప్పారు. అదునుకు పంటకు యూరియా అందించకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెపె్టంబర్లో వరి చిరుపొట్టదశలో తప్పనిసరిగా యూరియా వేయాలని, దీనికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. సీజన్ ప్రారంభంలోనే వరి సాగు ఏరియాలో యూరియా కొరత వచ్చిందని, ఆగస్ట్ 8 నుంచి కురిసిన అధిక వర్షాలతో ముంపునకు గురైన వరితోపాటు మొక్కజొన్న, పత్తి ఇతర పంటలకూ యూరియా అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ సరిపడా యూరియాను ప్రభుత్వం అందించలేకపోతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడి కెళ్లినా యూరియా కోసం రైతులు బారులు తీరి కన్పిస్తున్నారన్నారు.రెండో పంటకు యూరియా కొనవద్దని ప్రకటనలు ఇవ్వడం తగదన్నారు. రూ.266.5 ఉన్న యూరియా కట్టను కొనాలంటే ప్రైవేటు వ్యాపారులు రూ.1,400పైగా ఉన్న కాంప్లెక్స్ కట్ట లేదా రూ.800– 900 పలికే పురుగు మందును బలవంతంగా అంటకడుతున్నారని నాగిరెడ్డి చెప్పారు. -
సమస్యలు పరిష్కరించండయ్యా!
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా.. తిరుగుతూనే ఉన్నాం.. సమస్యలు పరిష్కరించండి’ అంటూ వివిధ ప్రాంతాల అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి క్యూ కట్టారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 297 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్వో మోహన్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కుసుమకుమారి పాల్గొన్నారు. పశువైద్య సేవలు అందడం లేదు తమ గ్రామంలో పశువైద్య సేవలు సరిగా అందడం లేదంటూ పెనుమూరు మండలం గంగుపల్లికి చెందిన తులసీరాం, గీత వాపోయారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని పశుసంవర్థక సహాయకులు సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. జబ్బుపడిన మూగజీవాలకు వైద్యం చేయకపోవడంతో మృతిచెందుతున్నాయన్నారు. శ్మశాన దారిని బాగు చేయించండి శ్మశాన వాటిక దారి సమస్య పరిష్కరించడయ్యా అంటూ చిత్తూరు మండలం పంట్రాంపల్లి గ్రామస్తులు త్యాగరాజరెడ్డి, భాగ్యవతి అధికారులను వేడుకున్నారు. తమ గ్రామంలోని శ్మశానవాటికకు వెళ్లే దారి గుంతలమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. అంతిమ సంస్కారాలు చేసేందుకు వెళ్లే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. దారిని శుభ్రం చేయించి రోడ్డు వేయించాలని కోరారు. ఆక్రమించుకున్నారు తన భూ సమస్య కోర్టులో జరుగుతుండగా కొందరు ఆక్రమించుకున్నారని పెనుమూరు మండలం, కలిగిరికి చెందిన సుబ్రహ్మణ్యం వాపోయారు. తమ గ్రామ పరిధిలో సర్వే నం.10/1లోని భూ సమస్య కోర్టులో కొనసాగుతోందన్నారు. ఇంతలోపు తన భూమిని ఆక్రమించుకుని భయాందోళనలు సృష్టిస్తున్నారని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చే వరకు తన భూమి దురాక్రమణకు గురికాకుండా న్యాయం చేయాలని అధికారులను కోరారు. వైకల్య పరీక్షలు చేయమంటున్నారు వైద్యాధికారులు వైకల్యం పున:పరిశీలన పరీక్షలు చేయమని ఇబ్బందులు పెడుతున్నారని చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసాపల్లికి చెందిన అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దివ్యాంగుడైన తన కుమారుడు శివకుమార్‌తో కలిసి పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడు శివకుమార్ నడవలేడని, మాట్లాడలేడని వాపోయారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ పింఛన్ తొలగించారని కన్నీరు మున్నీరయ్యారు. వైద్యపరీక్షలు పున:పరిశీలన చేయించుకోవాలని నోటీసు ఇచ్చారన్నారు. అక్కడకి వెళ్తే వైద్యాధికారులు పరీక్షలు చేసేందుకు కుదరదని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పరిశీలించి తన కుమారుడికి తొలగించిన రూ.15 వేల పింఛన్ ఇప్పించాలని కోరారు. -
బ్రహ్మోత్సవం.. లంబోదరుడి వైభవం!
కాణిపాకం: కాణిపాక వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. అభిషేకంతో పాటు నిత్యపూజలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం చిలుక, వృషభ వాహనాలపై స్వామి వారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఉదయం మూలస్థానంలోని స్వామివారికి విశేష అభిషేక పూజలు, అలంకరణలు చేశారు. అలంకార మండపంలో శ్రీసిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళ హారతులతో చిలుక వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. రాత్రి వృషభ వాహనంపై ఊరేగుతూ స్వామి వారు అభయమిచ్చారు. అంతకుముందు ఉభయదారులు ఊరేగింపుగా వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా మంగళవారం జగవాహన సేవలో స్వామివారు తరిస్తారని ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. ఈ వాహనసేవకు కాణిపాకం వన్నియ నాయకర్ వంశస్తులు ఉభయదారులుగా వ్యవ హరిస్తారని ఆయన పేర్కొన్నారు. వృషభ వాహనంపై విఘ్నేశ్వరుడు తాగేసి.. విగ్రహాన్ని కూల్చేసి! -
జాలి చూపించారు!
బంగారుపాళ్యం/కాణిపాకం: పుట్టకతోనే పక్షవాతానికి గురైన ఓ యువకుడికి అడ్డగోలుగా పింఛన్ తొలగించారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. గత నెల 17వ తేదీన ‘నన్ను చూస్తే జాలి లేదా?’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై అధికారులు స్పందించారు. ఎట్టకేలకు పింఛన్‌ను పునరుద్ధరించారు. వివరాలు.. బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతుల పెద్ద కుమారుడు హర్షద్ పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాడు. అతన్ని రక్షించేందుకు తల్లిదండ్రులు ఉన్నదంతా ధారబోశారు. అయినా కొడుకు కోలుకోలేదు. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనే నెట్టుకొస్తున్నారు. అయితే ఇటీవల రీ వెరిఫికేషన్ పేరుతో ఆ యువకుడిని పింఛన్‌కు అనర్హుడిగా తేల్చారు. ఈ మేరకు సచివాలయ సిబ్బంది నోటీసులు కూడా జారీచేశారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. పునఃపరిశీలన చేసి ఆ యువకుడికి పింఛన్ వచ్చేలా చేశారు. మూడు రోజుల క్రితం సీఎంఓ ఆఫీసు నుంచి ఫోన్ చేసి మళ్లీ మీకు రూ.15వేల పింఛన్ వచ్చేలా చేశామని వివరించారు. ఈ క్రమంలోనే సోమవారం పింఛన్ సొమ్మును అందకుని బాధిత తల్లిదండ్రులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. -
పింఛను సొమ్ముతో ఉడాయించిన పంచాయతీ కార్యదర్శి
పుంగనూరు: సామాజిక పింఛను డబ్బులు తీసుకుని ఓ ఉద్యోగి పారిపోయాడు. పుంగనూరు మండలంలో బండ్లపల్లెకి చెందిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు రెండు రోజుల క్రితం పింఛనుదారులకు పంపిణీ చేసేందుకు బ్యాంక్ నుంచి రూ.6.34 లక్షలు డ్రా చేశాడు. సోమవారం సాయంత్రం వరకు బండ్లపల్లెలో పెన్షన్ పంపిణీ చేయలేదు. అధికారులకు లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి... పింఛను డబ్బులతో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు పారిపోయినట్లు నిర్ధారించారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో లీలామాధవి తెలిపారు. కాగా, బెట్టింగ్‌లకు అలవాటుపడిన శ్రీనివాసులు పింఛను డబ్బుతో ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది. -
హోరాహారీగా రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాల్లో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 350 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. యువన్య బ్రెయిన్ బాక్స్ చెస్ అకాడమీ, ఆంధ్రా చెస్ అసోసియేషన్లు సంయుక్తంగా రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ నిర్వహించాయి. ఈ టోర్నీలో భవన్ (ఎన్టీఆర్ జిల్లా), రాజు (ప్రకాశం), హర్షప్ (తిరుపతి) విద్యార్థులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కై వశం చేసుకున్నారు. టోర్నీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఆర్బీ ప్రసాద్, జిల్లా చైర్మన్ బాబుప్రసాద్‌రెడ్డి, టోర్నీ డైరెక్టర్ యువన్య, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి రాఘవులు, న్యాయవాది కృష్ణకిషోర్, సభ్యులు వెంకటేష్, బాలు, లేఖ్య, పిళ్లై, దినేష్, సురేఖ పాల్గొన్నారు. -
ప్రతి ఫిర్యాదుపై విచారణ చేపట్టాలి
చిత్తూరు అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజలు ఇచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుపైనా ఆయా పోలీస్ స్టేషన్ల హౌజ్ ఆఫీసర్లు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. మొత్తం 32 వినతులు అందాయి. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, బెదిరింపులకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. -
తెలుగు సృజనకి ప్రతిరూపం వైఎస్సార్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తెలుగువారి సృజనకి ప్రతిరూపంగా దివంగత ముఖ్యమంత్రి డా వైఎస్.రాజశేఖరరెడ్డి నిలిచారని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షుడు తోట గోవిందన్ కొనియాడారు. మహానేత వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని సమాఖ్య కార్యాలయంలో సోమ వారం సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోవిందన్ మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యాల వ్యాప్తికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే అడ్డంకిగా ఉన్నాయన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని, ప్రస్తుత పాలకులు ఆయన్ను ఆదర్శవంతగా తీసుకో వాలని సూచించారు. తెలుగు భాషాభిమానులు కోరుశ్వర మొదలియార్, రాజేంద్రన్, మురళి, ఖాదరు బాషా, నాగరాజు, రఫీ, సునీల్, షఫీ ఉల్లా పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా రథ కలశ ప్రతిష్ట కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధివినాయక స్వామి రథానికి సోమవారం శాస్త్రోక్తంగా కలశ ప్రతిష్ట చేశారు. తొలుత ప్రధాన ఆలయంలో రథ కలశం, గొడుగుకు, బ్రహ్మ విగ్రహానికి సంప్రోక్షణ పూజలు చేశారు. కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రథానికి ప్రత్యేక పూజలు చేసి కలశాన్ని ప్రతిష్టించారు. బుధవారం జరగబోయే రథోత్సవానికి ముందు ఇలా ప్రతిష్ట పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని ఈవో పెంచలకిషోర్ తెలిపారు. -
అర్జీ ఆవేదన
‘సమస్యలతో చచ్చి బతుకుతున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పాలకులూ కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారులుకై నా గోడు విన్నవిస్తే పరిష్కారమవుతుందనే చిన్న ఆశతో.. సచ్చుబడిన కాళ్లను ఒడిసిపట్టుకుని.. కడుపు మాడ్చుకుని కుటుంబీకుల సహాయంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. చెప్పులరిగేలా చక్కెర్లు కొడుతున్నాం. అర్జీలిచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నాం. వారం వారం తిరిగి..తిరిగి అలసిపోతున్నాం. పెద్ద మనసుతో ఆలోచించి సమస్యలు పరిష్కరించాలని అధికారుల కాళ్లు పట్టుకుంటున్నాం. కానీ ఏం లాభం..? ఏ ఒక్కరూ కనికరించడం లేదు. సమస్యలు పరిష్కరించి న్యాయం చేయడం లేదు’ అంటూ జిల్లాలోని పలువురు బాధితులు ఆవేదన చెందుతున్నారు. మూడు నాలుగు సార్లు అర్జీలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కూటమి పాలనలో అర్జీదారుల ఆవేదనపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 180 నుంచి250 వరకు చిత్తూరు కలెక్టరేట్ : అర్జీదారులు అలసిపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏదో ఒక వారం అధికారులు కనికరించకపోతారా.. అన్న భావనతో నెలల తరబడి తిరుగుతూనే ఉన్నారు. కానీ వీరి సమస్యలను ఆలకించి పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోకపోగా.. పాలకులు వాటి గురించి అసలు ఆలోచించకపోవడంతో ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు. ఏమార్చి.. మోసం చేసి! క్షేత్ర స్థాయిలో అర్జీదారుల సమస్యలు పరిష్కరించకుండానే ఏమార్చి సంతకాలు చేయించుకుని పరిష్కరించినట్లుగా మోసం చేస్తున్నారు. అర్జీదారులు తిరిగి మళ్లీ ప్రజాసమస్యల పరిష్కార వేదికకు విచ్చేసి అర్జీలందజేస్తున్నారు. కలెక్టర్ దగ్గరకు వెళ్లినా సమస్య నేనే పరిష్కరించాలి అంటూ జిల్లాలోని కొందరు తహసీల్దార్లు అర్జీదారులను భయాందోళలనలకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్జీదారులు చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేల అర్జీలు బుట్టదాఖలయ్యాయి. అంతా కాకిలెక్కలే జిల్లాలో 2024 జూన్ 15 నుంచి 2025 సెప్టెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక) అధికారిక నివేదికల ప్రకారం 61,100 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో 54,128 అర్జీలు పరిష్కరించినట్లు అధికారులు కాకిలెక్కలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కనీసం 30 శాతం అర్జీదారులు కూడా కాని పరిస్థితి. ఉన్నతాధికారుల ఒత్తిడిని అధిగమించేందుకు సమస్యలు పరిష్కరించినట్లుగా బోగస్ నివేదికలు సమర్పించి చేతులు దులుపుకుంటున్నారు. పేద ప్రజల పట్ల కాస్త కూడా కనికరం చూపకుండా జిల్లాలోని క్షేత్రస్థాయి అధికారులు మోసం చేస్తున్నారు. దీంతో అర్జీదారులు కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. దారిలేక అవస్థలు సమస్య ఇలా! న్యాయం శూన్యం సమస్య ఇదీ! -
సమస్య ఇదీ!
ఇప్పటికి మూడు సార్లు అర్జీలు అందజేసినా పుంగనూరు మండలం, మేలందొడ్డి పంచాయతీ, గోపిశెట్టి గ్రామానికి చెందిన గ్రామస్తులకు న్యాయం జరగని దుస్థితి. నివసిస్తున్న ఇళ్లను తొలగిస్తామని చెబుతున్నారని, న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు జూలై 4వ తేదీన పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. ఆ తర్వాత మరో రెండు సార్లు మండల స్థాయి అధికారులకు అర్జీ ఇచ్చారు. మేలందొడ్డి పంచాయతీ, గోపిశెట్టిపల్లిలో సర్వే నం.164/3లో 62 సెంట్లలో శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయ భూములున్నాయి. ఆ భూమి ఉన్న ప్రాంతంలో గోపిశెట్టి గ్రామం ఉంది. దాదాపు వందేళ్ల నుంచే ఆ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లల్లోనే స్థానికులు నివాసముంటున్నారు. ప్రస్తుతం అధికారులు ఇళ్లను తొలగిస్తామని భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ సమస్యపై న్యాయం చేయాలని కోరినా ఇంతవరకు స్పందించని పరిస్థితి. -
పదహారేళ్లు.. చెరగని జ్ఞాపకాలు
పేదల దేవుడు నువ్వుఅభాగ్యుల ఆరాధ్యదైవం నువ్వుజల ప్రదాతవి నువ్వుఆరోగ్య రక్షకుడివి నువ్వుచదువుల రేడువి నువ్వుసంక్షేమ సారధివి నువ్వునవ సంకల్పానికి నాందివి నువ్వుజవసత్వానికి పునాదివి నువ్వుమమ్మేలిన ‘మహా నేతవి’ నువ్వు16 ఏళ్ల నీ జ్ఞాపకాలు.. అభివృద్ధికి చెరగని సంతకాలునిన్ను ఎలా మరిచేది రాజన్నా.. అంటూ జిల్లా ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలను స్మరించుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : మనసున్నవాడు పాలన సాగిస్తే ఎంత జనరంజకంగా ఉంటుందో.. ప్రజలను ఓటర్లుగా కాకుండా తన వాళ్లుగా చూసే నాయకుడు గద్దెనెక్కితే రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుందో దేశానికి చాటి చెప్పిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువారి గుండెల్లో సంక్షేమ సంతకం చేసి చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయారు. నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం.నాటి ఉమ్మడి జిల్లాలోని మదనపల్లెలో మూతపడిన విజయాడెయిరీని 2008లో పునఃప్రారంభించారు. 5వేల లీటర్లతో ప్రారంభమైన డెయిరీని 70వేల లీటర్ల స్థాయికి పెంచారు. తిరుపతిలో ప్రధాన కూడళ్లను ఏర్పాటు చేసి మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీకృష్ణదేవరాయలు, శంకరంబాడి, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాల స్థాపనకు శ్రీకారం చుట్టారు.తిరుపతి ముఖద్వారంలో పూర్ణకుంభం ఏర్పాటు చేశారు. అలాగే తెలుగుతల్లి విగ్రహం నెలకొల్పారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ సైతం ఆయన హయాంలోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో దేశ, విదేశాలకు చెందిన 2వేల మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు.జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 2006లో శ్రీసిటీ సెజ్‌కు అనుమతులు మంజూరు చేశారు. 2008లో 8 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వందలాది పరిశ్రమలతో శ్రీసిటీ రాష్ట్రానికే తలమానికంగా నిలిచింది. సుమారు రూ.60వేలకు పైగా పెట్టుబడులతో 27 దేశాలకు చెందిన పరిశ్రమలు ఏర్పడ్డాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను తరలించి సాగు, తాగునీరు అందించేందుకు 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 70శాతం పనులు పూర్తి చేశారు. నగరి నియోజకవర్గంలో చేనేతల సంక్షేమానికి చర్య లు చేపట్టారు. రసాయన నీటిని శుభ్రపరిచే కామన్ ఈటీపీ ప్లాంటు ఏర్పాటుకు అనుమతులతోపాటు రూ. 14 కోట్లు మంజూరు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే రోజా ప్లాంటు ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకువచ్చారు. నగరిలో రూ.15 కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పాలకులు ఆ ఆస్పత్రిని 60 పడకలకే పరిమితం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద రూ.5కోట్లతో అభివృద్ధి చేశారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ వారు అదనపు పడకలు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని వితరణగా అందించారు. నగరి మున్సిపల్ పరిధి సత్రవాడ శివారులో రూ.36 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించారు. తదనంతర కాలంలో గాలేరు నగరి ప్రాజెక్టును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఆ ట్యాంక్ ద్వారానే నగరి ప్రజల దాహార్తి తీరుతోంది. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభించారు. 2004 నుంచి 2008 వరకు ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్ చేశారు. వ్యవసాయం దండగని చంద్రబాబు అంటే.. కాదు వ్యవసాయం పండగని వైఎస్సార్ నిరూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 6.40 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలకు సంబంధించి వారి కుటుంబాలకు తక్షణం ఆర్థిక సాయం చేశారు. చంద్రబాబు హయాంలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలకు రూ.50 కోట్లు కేటాయించి పునఃప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో 3.15 లక్షల మందికి గూడు కల్పించారు. శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్ కాలనీ ఏర్పాటు చేసి 11వేల మందికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు.రాజన్నా.. రచ్చబండే సాక్షిచిత్తూరు అర్బన్: ‘రచ్చబండ సాక్షిగా నిను మరువలేం రాజన్నా.. అంటూ అనుప్పల్లె గ్రామస్తులతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు నేటికీ కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు. నీ జ్ఞాపకాలు తలుచుకుని.. తీపి గురుతులు నెమరువు వేసుకుని ఆవేదనకు లోనవుతూనే ఉన్నారు. 2009, సెప్టెంబరు 2న సీఎం స్థాయి వ్యక్తి నేరుగా ప్రజలను కలిసి, వ్యక్తిగత–మౌలిక అవసరాలు గుర్తించి తెలుసుకుని.. వాటి పరిష్కరించే వినూత్న కార్యక్రమానికి నడుంబిగించారు. చిత్తూరులో చేపట్టిన ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే .. రాష్ట్ర మొత్తం అమలు చేయాలని రాజశేఖరరెడ్డి ఆలోచన. ముఖ్యమంత్రి హోదాలో రచ్చబండకు వస్తున్న వైఎస్.రాజశేఖర రెడ్డికి స్వాగతం పలికేందుకు కట్టమంచిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ అందరూ నిరీక్షిస్తున్నారు. సమయం ఉదయం 9.30 గంటలైనా చాపర్ చేరుకోలేదు. పదయినా ఆచూకీ రాలేదు. సమయం దాటుతున్న కొద్దీ సామాన్యుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. రాజన్న అచూకీ లేదనే విషయం ఆలస్యంగా గుర్తించారు. ప్రత్యేకించి ఆ రోజు అనుప్పల్లె గ్రామమంతా వైఎస్సార్ గురించి ఏదైనా తెలుస్తుందేమోనని టీవీలకు అతుక్కుపోయారు. తీరా మరుసటి రోజున చాపర్ పావురాలగుట్ట వద్ద ప్రమాదానికి గురై రాజన్న కన్నుమూశారన్న విషాద వార్తను వినాల్సి వచ్చింది. రాజన్న కూర్చుంటారని ఆశించి భంగపడ్డ రచ్చబండ మూగబోయింది. ఊరు ఊరంతా ఆ మహనీయుడి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. అనుప్పల్లె రావిచెట్టు కిందున్న రచ్చబండ వైఎస్సార్‌ను స్పర్శించలేకపో యానని మథనపడుతూనే ఉంది. రాజన్న వర్ధంతికి ఒకరోజు ముందుగానే గ్రామస్తులు రచ్చబండ వద్దకు చేరుకుని కుమిలిపోవడం కనిపించింది.● కుప్పం నియోజకవర్గంలో సైతం వైఎస్సార్ పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పేదల సంక్షేమానికి కృషి చేశారు. అందులో భాగంగా రూ.69.03 కోట్ల విద్యుత్ బకాయిల మాఫీతో పాటు 23,144 మంది రైతులకు చెందిన రూ.60.24 కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేశారు. మరో5వేల మందికి రూ.5వేల వంతున ప్రోత్సాహకాలను అందజేశారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి రూ.55 కోట్లు నిధులు కేటాయించారు. కుప్పం నియోజకవర్గంలో 36 వేల పైగా ఇళ్లను పేదలకు మంజూరు చేశారు. 26 వేల రేషన్, ఆర్యోగశ్రీ కార్డులు అందజేశారు. ద్రవిడ యూనివర్సిటీకి నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. 14 కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అబకలదొడ్డి వద్ద ఐటీఐ ఏర్పాటు చేశారు. శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లె, కుప్పంలో కస్తూర్భాగాంధీ పాఠశాలలను ప్రారంభించారు. నియోజకవర్గంలో 5 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ● తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వైఎస్సార్ మానసపుత్రికగా నిలిచిపోయింది. 2004 సెప్టెంబర్ 30న వర్సిటీ ఏర్పాటుకు బీజం పడింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతి వెటర్నరీ కళాశాల స్వర్ణత్సోవాలకు ముఖ్యతిధిగా హాజరయ్యారు. కళాశాలను యూనివర్సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. 2005 జూలై 15న వర్సిటీ గుర్తింపునిచ్చారు. రూ.145 కోట్లు కేటాయించి అభివృద్ధికి బాటలు వేశారు. ప్రస్తుతం ఈ వర్సిటీ పరిధిలో 35 కళాశాలు ఉన్నాయి. 3వేల పైగా విద్యార్థులు చదువుతున్నారు. 305 మంది అధ్యాపకులు, 2,545 మంది బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సత్యవేడులో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, ఒక తమిళ మీడియం స్కూలు ఏర్పాటు చేశారు. ఉబ్బలమడుగు, భూవతేశ్వరకోన, రాళ్లవాగు నీటి ప్రాజెక్టులను చేపట్టారు. రూ.5.50 కోట్లతో భూపతేశ్వరకోన ప్రాజెక్టు, రూ.19 కోట్లతో ఉబ్బలమడుగు ప్రాజెక్టు నిర్మించారు. తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి చెరువులకు నీటిని నింపేందుకు రూ.100 కోట్లతో ఉపకాలువలు నిర్మించారు. సోమశిల–స్వర్ణముఖి కాలువకు 2009లో శ్రీకారం చుట్టారు. వెంకటగిరి నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. మరో 10 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో 30 వేల ఎకరాల సాగు నీరు అందించేలా ప్రాజెక్టుకు లక్ష్యాలను నిర్దేశించారు. -
తల్లులకు ఓపీ పరీక్ష
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి విభాగంలో సోమవారం ఓపీకొచ్చిన తల్లులకు పరీక్ష పెట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ కోసం గర్భిణులు, బాలింతలు క్యూకట్టారు. గంటల కొద్దీ క్యూలో నిరీక్షించి నీరసించిపోయారు. ఓపీ ఇచ్చే సిబ్బంది నెమ్మదించడంతో ఈ పరిస్థితి ఎరుదైంది. కనీసం వారికి కూర్చుకోవడానికి కుర్చీలు కూడా చాలినన్ని వేయలేదు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ పరిస్థితి ఎదరువుతోంది. ఆస్పత్రి అధికారులు స్పందించి తల్లులకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.10న సంకటహర గణపతి వ్రతం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈనెల 10వ తేదీన గణపతి వ్రతం జరగనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు వ్రతం జరగుతుందన్నారు. రాత్రి 7 నుంచి 8గంటల వరకు స్వర్ణ రథోత్సవం ఉంటుందన్నారు. ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు ఆన్లైన్ ద్వారా ముందస్తుగా టిక్కెట్లు పొందవచ్చని ఆయన సూచించారు.7న సత్యనారాయణవ్రతంకాణిపాకం: పౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీవరదరాజస్వామి ఆలయంలో సామూహిక శ్రీసత్యనారాయణ వ్రతం జరగనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు వ్రతం జరుగుతందన్నారు.5న జెడ్పీలో గురుపూజోత్సవంచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈనెల 5వ తేదీన విద్యాశాఖ, సమగ్రశిక్షా శాఖల ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధిత ఆయా శాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నాయి. ఉత్తమ టీచర్లకు అవార్డులు అందజేసి సత్కరించనున్నట్లు డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ తెలిపారు. -
మాటలు..బంధానికి బీటలు
అ..అతడు.. ఆ.. ఆమె.. ఇద్దరూ పక్కపక్కనే ఉండే అక్షరాలు. నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన ఆలుమగలు. ఒకరికొకరం అనుకుంటూ ముందుకు నడవాల్సిన వారి మధ్య దూరం పెరుగుతోంది. కలిసి నడవాల్సిన పాదాలు తడబడుతున్నాయి. సర్దుకుపోలేమంటూ విడిపోయేందుకు సిద్ధపడుతున్నారు. మనస్సును మరింతగా మురిపించాల్సిన గిల్లికజ్జాల స్థానంలో అనుమానపు బీజాలు పడుతున్నాయి. చిలిపి చేష్టలు..అల్లరిగా గడపాల్సిన భార్యభర్తలు తమ జీవితాలను అల్లరిపాలు చేసుకుంటున్నారు. పని ఒత్తిడిలో మాటలు దూరమై.. కాపురాలు కాలదన్నుకునేంతవరకు వెళుతున్నారు. సరిదిద్దే పెద్దలు లేక ఎడముఖం..పెడముఖంగా సాగుతున్నారు. చివరకు ఈ కాపురం మావల్ల కాదంటూ విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు అర్బన్: పెళ్లంటే.. ప్రీ వెడ్డింట్ షూట్. ఎంగేజ్మెంట్ షూట్. బ్యాచ్‌లర్ పార్టీ. సంగీత్, మెహందీ.. ఆకాశమంత పందిరి.. మేళ తాళాలు. మూడుముళ్లు. మరి ఆ మూడు ముళ్లు పడిన మూడు నెలల తరువాత..? విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం. ఎంత వైభవంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయో.. అంతే తొందరగా విడాకులకు సైతం ఉబలాట పడుతున్నారు. విడిపోయాక.. అదే జంట వాళ్లతోనే ప్రేమలో కూడా పడుతున్నారు. ఒకప్పుడు మహానగరాల్లో మాత్రమే కనిపిస్తున్న ఈ పోకడ.. ఇప్పుడు చిత్తూరు లాంటి నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. అర్థం కావడంలేదు ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతరానికి వైవాహిక బంధం అంత సులువుగా అర్థం కావడంలేదు. ప్రేమ, పెళ్లి వరకు ఉంటున్న ఆసక్తి.. పెళ్లి తరువాత కొనసాగనంటోంది. ప్రేమికులుగా ఉన్నపుడు బాధ్యత ఉండదు. మూడుముళ్లు పడేటప్పుడు వరి్ణంచడానికి వీలుకాని మధుర క్షణాలు.. అటు తరువాత నిలకడగా ఉండడంలేదు. దీనికి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమేనని మానసిక వైద్య నిపుణులు, మధ్యవర్తిత్వం చేసే కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు.పెళ్లయిన కొత్త జంటలో ఒకరు ఉద్యోగం చేస్తుంటే, మరొకరు ఇంట్లో ఒంటరిగా ఉండలేక.. కుటుంబ సభ్యులతో మనస్తత్వం కలవక.. విడాకులవైపు అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగులైతే ఇక్కడ కూడా చాలా జంటల్లో సమస్య తలెత్తుతోంది. ఇంటి పనుల్లో ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోవడం, పనిచేసే ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడి, సమస్యలు భాగస్వామిపై చూపించేసి.. ఇక కలిసి ఉండలేమని నెలల్లోనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఒక్క చిత్తూరు నగరంలోనే గత ఎనిమిది నెలల్లో 183 మంది విడాకుల కోసం కోర్టు మెట్లక్కారు. ఇందులో పెళ్లయిన సంవత్సరంలోపు విడాకుల కోరుకుంటున్న వారి సంఖ్య 32 శాతం ఉండడం వివాహ బంధంపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. విడగొడుతున్న ‘సెల్’ భూతం దంపతులు విడిపోతుండటానికి ప్రధాన కారణం మాత్రం సెల్‌ఫోన్‌గా తెలుస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలు అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలో గడుపుతుండడం, తన భాగస్వామిని పట్టించుకోకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడడం, కొందరు అవధుల్లేని విశృంఖల కోరికలు కోరడం లాంటివి అవతలి వ్యక్తికి జీవితంపై విరక్తి పుట్టిస్తోంది. ఇటీవల చిత్తూరు పోలీసుల వద్దకు కౌన్సెలింగ్‌కు వచ్చిన ఓ జంట ‘మాకు పెళ్లయ్యి 38 రోజులయ్యింది. నా భర్త వేకువజామున 3 గంటల వరకు కూడా పబ్జీ ఆడుకుంటున్నాడు. ఒక రోజు, రెండు రోజులు.. కానీ ప్రతిరోజూ ఇదే తంతు. ఇతనితో కలిసి ఉండడం నావల్ల కాదు..’ అంటూ 22 ఏళ్ల యువతి తన ఆవేదనను వ్యక్తం చేయడం అక్కడున్న కౌన్సెలర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పడకగదిలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడం తమ ప్రేమానురాగాలు, దాంపత్యజీవితాన్ని మూడో వ్యక్తికి చూపించడమే అవుతుందని చాలా మందికి అర్థం కావడంలేదు. విడిపోయి ఒక్కటిగా..!చిత్తూరు నగరానికి చెందిన శుభ ప్రభుత్వ ఉద్యోగి. భర్త లలిత్ అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్.. రెండేళ్లపాటు సాగిన వీళ్ల దాంపత్యానికి ఇటీవల గుడ్‌బై చెప్పి, విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న మూడు నెలల తరువాత తరచూ ఈ జంట కలుస్తుండడం, సినిమాలు, షాపింగ్‌లకు వెళ్లడం.. అటు తరువాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోవడం. ఇటీవల ట్రెండ్‌లోకి వచ్చిన ఈ పద్ధతులను క్యాజువల్, నాన్–కమిటెడ్ రిలేషన్, వన్నైట్ స్టాండ్, షార్ట్‌టెర్మ్, లో–ఇంటిమెసీ రిలేషన్íÙప్ లాంటి రకరకాల సహ జీవన విధానాలు సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ తెలుస్తున్నాయి. పెళ్లి లాంటి బంధాలకన్నా.. మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతూ, తమకు కావాల్సిన బంధాలను కొనసాగిస్తున్నారు. సర్దుకుంటున్న వాళ్లు చాలా తక్కువ.. విడాకుల కోసం న్యాయస్థానం మెట్లకెక్కుతున్న జంటలకు మేము కౌన్సెలింగ్ ఇస్తుంటాం. ఈ మధ్య ఒకటి గమనించాం. దంపతులు సర్దుకోవడం, మళ్లీ కలిసి ఉండడం అనే ప్రస్తావనను ఏమాత్రం ఒప్పుకోనంటున్నారు. ఆర్థిక స్తిరత్వం ఉన్నవాళ్లు అస్సలు కలిసి ఉండడానికి ఇష్టపడడంలేదు. మారుతున్న తరాలకు మధ్య స్వేచ్ఛ, ఒంటరితనం, నచ్చినట్టు బతకడం, భర్త–భార్య ఒకరినొకరు ప్రశ్నించకుండా ఉండాలనుకోవడం లాంటివి ఎక్కువగా కోరుకుంటున్నారు. – చక్రవర్తిరెడ్డి, న్యాయవాది, చిత్తూరు చట్టపరంగానే.. వివాహ బంధం గొప్పదే. కానీ ఒకరిపై ఒకరికి తప్పకుండా గౌ రవం, నమ్మకం ఉండాలి. అవిలేకుండా చాలా మంది విడిపోవడానికి మొగ్గు చూపిస్తున్నా రు. ఇంట్లో గొడవ అని వచ్చే దంపతులకు మంచీ– చెడు చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇక కలిసి ఉండలేము, కేసులు పెట్టండి అని కొందరు వస్తుంటారు. మెయింటెనన్స్, భరణం కోసం వచ్చేవాళ్లకు చట్టపరంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాం. – టి.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు -
వీడ్కోలు
‘గణ’జిల్లాలో అయిదు రోజులుగా పూజలందుకున్న గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో రాత్రి పొద్దుపొయే వరకూ శోభాయమానంగా సాగిన ఊరేగింపు అనంతరం స్థానిక చెరువులో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. నృత్యాలు చేస్తూ గణనాథుడిని ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం గణనాథుడి నిమజ్జన వేడుకలు అట్టహాసంగా సాగాయి. చవితిని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో వినాయకుడిని కొలువుదీర్చారు. అయిదు రోజుల పాటు భక్తుల చేత విశేష పూజలు అందుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అన్ని ప్రాంతాల్లో జలాధి పూజలు అంబరాన్నంటాయి. ఇంటింటా పూజలు అందుకున్నారు. ఊరేగింపుగా వస్తున్న స్వామి వారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు, పసుపు పళ్లెం పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కట్ట మంచి చెరువులో నిమజ్జన కోలాహలం కట్టమంచి చెరువు వద్ద నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందకు క్రేన్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనం చేసేందుకు వచ్చిన భక్తులు చివరి పూజలు చేసి బై..బై గణేశా అంటూ స్వామి వారిని నిమజ్జనం చేశారు. రద్దీని కట్టడి చేసేందుకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేలా చూశారు. కట్ట మంచి చెరువు వద్ద వినాయకుడి నిమజ్జనం చేసేందుకు వచ్చిన అపోలో కళాశాల విద్యార్థులుచిత్తూరు : గిరింపేటలో ఊరేగుతున్న భారీ వినాయకుడు, మిట్టూరులో ఊరేగింపు, చెరువులో నిమజ్జనం చేస్తున్న యువకులు, పుంగనూరు : నానబాలమునెమ్మ వీధిలో గుజరాతీలు వినాయకుడి ఊరేగింపు..పాలసముద్రం : నిమజ్జన ఊరేగింపు -
శేషవాహనంపై ‘విఘ్న’ విహారం
కాణిపాకం : వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ చిన్న, పెద్ద శేషవాహన సేవల్లో విహరించారు. వాహన సేవల్లో విహరించిన విఘ్నేశ్వరుడుని అశేష భక్తజనం దర్శించి పునీతులయ్యారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సిద్ధి, బుద్ధి, సమేత వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ చిన్న, పెద్ద శేష వాహనంపై అభయమిచ్చారు. అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత గౌరీ సుతుడికి విశేషాలంకరణ చేసి చిన్న శేష వాహనంలో కొలువుదీర్చారు. మేళతాళాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పురవీధుల్లో వేడుకగా ఊరేగించారు. రాత్రి స్వర్ణ పెద్ద వాహనంలో కనువిందు ఉభయకర్తలు, ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వర్ణ పెద్ద శేష వాహనంలో కొలువుదీర్చారు. కోలాటాలు, చెక్క భజనల నడుమ పెద్ద శేష వాహన సేవ చేపట్టారు. కమ్మ సామాజిక వర్గీయులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. నేడు చిలుక, వృషభ వాహన సేవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సోమవారం చిలుక, వృషభ వాహన సేవల్లో స్వామి వారు దర్శనమివ్వనున్నారని ఆలయ ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం చిలుక వాహన సేవ, రాత్రి వృషభ వాహన సేవ ఉంటుందన్నారు. ఈ సేవకు ఉభయదారులుగా కాణిపాకం ఆర్యవైశ్యులు, కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లి, ముదిగోళం, చిత్తూరు, శాలివాహన వంశస్థులు వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. -
అయ్యో..వినాయకా!
● గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి ● చెరువులో మునిగి ఇద్దురు యువకులు మృతి ● చిన్నమనాయనిపల్లిలో తీవ్ర విషాదం గంగవరం: కోలాహలం మధ్య గణేష్ నిమజ్జనాన్ని పూర్తిచేశారు. డప్పు వాయిద్యాల నడుమ చిందులేస్తూ చెరువు వద్దకు విగ్రహాన్ని తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసి తిరిగి సంతోషంగా ఇంటికెళ్లారు. తీరా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కనిపించకపోవడంతో మళ్లీ చెరువు వద్దకు వచ్చి వెతుకులాట ప్రారంభించారు. విగ్రహం కింద పడి ఆ ఇద్దరూ ప్రాణాలొదలడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అయ్యో.. వినాయకా! కాపాడలేకపోయావా నాయనా..? అంటూ గుండెలు బాదుకుంటూ రోదించడం అక్కడి వారిని కలచివేసింది. ఈ ఘటన గంగవరం మండలం, చిన్నమనాయనిపల్లిలో ఆదివారం రాత్రి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. మండలంలోని మేలుమాయి పంచాయతీ, చిన్నమనాయనిపల్లి గ్రామంలో కొలువుదీర్చిన వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పటికే రాత్రి పడింది. అక్కడ నిమజ్జనం కోసం కొందరు విగ్రహాన్ని చెరువులోకి తీసుకెళ్లారు. వారిలో అదే గ్రామానికి చెందిన బుజ్జమ్మ కుమారుడు భార్గవ్(28), సాలప్ప కొడుకు చరణ్(27) కూడా ఉన్నారు. నిమజ్జనం అనంతరం అందురూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఆ ఇద్దురు యువకులు ఇళ్లకు రాకపోవడంతో అనుమానం వచ్చి గ్రామస్తులు తిరిగి చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. నీటిలో మునిగిపోయిన విగ్రహాన్ని తాళ్లు కట్టి పైకి తేల్చారు. విగ్రహం కింది భాగాన భార్గవ్, చరణ్ ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోవడాన్ని గుర్తించి బోరున విలపించారు. ఆపై మృతదేహాలను నీటి నుంచి వెలికి తీసి ఇళ్లకు చేర్చారు. మృతుడు భార్గవ్ గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం టైల్స్ వేసే పనికి వెళ్తాడు. చరణ్ ఇటుకుల బట్టీలో పనిచేస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బాధితులకు అండగా నిలబడుతాం
శ్రీరంగరాజపురం : అగ్రవర్ణాలకు చెందిన కూటమి నాయకుల దాడుల్లో గాయపడిన వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మండల కేంద్రంలోని ఎర్రకొంటపై దళితుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిపై కూటమికి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ఇంటి స్థలం లేని నిరుపేద దళితులు ఎర్రకొంటపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారన్నారు. చర్చి ఉంటున్న స్థలంలోనే తమకు శ్మశానం కావాలంటూ అగ్రవర్ణాలకు చెందిన కూటమి నాయకులు దళితుల ఇళ్లపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ, మైనారీటీ, బీసీ వర్గాలు చెందిన వారికి రక్షణ కరువైందన్నారు. దళితులపై దాడులు చేసిన వారిపై పోలీసులు ఇంత వరకూ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. దళితులకు న్యాయం చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. దళితుల భుమిలో పరిశ్రమలా : మండలంలోని పాతపాళ్యం దళితవాడకు చెందిన కొంత మంది వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం 56 కానికపురం రెవెన్యూలో తాను సమితి అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి నేటి వరకు దాదాపు 50 వేల ఎకరాలు అర్హులైన వారికి డీకేటీ పట్టాలు మంజూరు చేశామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని వారి భూములను బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. దళితుల భూములకు ఆనుకొని వందల ఎకరాలు ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన భూములును తీసుకోవాలన్నారు. బలవంతంగా భూములు తీసుకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు మణి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాలప్ప, ఉమ్మడి జిల్లా క్రియాశీలక కార్యదర్శి కుప్పయ్య, ఎంపీపీ సరిత జనార్దన్, స్థానిక సర్పంచ్ హరిత, మణి, శ్యామ్ పాల్గొన్నారు.దళితులపై దాడులు చేస్తే ప్రశ్నించరా..? కూటమి ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ఎమ్మెల్యే, మంత్రులు, ఎమ్మెల్సీ, ఎంపీలు వివిధ రంగాల్లో ప్రజా ప్రతినిధులుగా ఉన్నా దళితులపై దాడులు చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గెలవడానికి దళితులు ఓట్లు కావాలి, కానీ దళితులు అభివృద్ధి చెందకూడదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువగా దళితులపై దాడులు జరుగుతున్నాయని నారాయణస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులపై (జాతీయ,రాష్ట్ర) ఎస్సీ , ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఈ కేసును సుమోటాగా స్వీకరించాలన్నారు. -
క్రీడాప్రతిభా అవార్డు స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని చిత్తూరు రూరల్ మండలం, సిద్ధంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు క్రీడా ప్రతిభా అవార్డు లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లా స్థాయిలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న పలు పాఠశాలలకు స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో భాగంగా క్రీడా ప్రతిభా అవార్డును అందజేశారు. 120 మంది విద్యార్థులు ఉన్న సిద్ధంపల్లి పాఠశాల 115 క్రీడా పాయింట్లతో అవార్డుకు ఎంపికై ంది. ఈ అవార్డును ఆ పాఠశాల పీడీ రవీంద్రారెడ్డి జిల్లా స్థాయిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో డీవైఈవో ఇందిరా చేతుల మీదు గా అందుకున్నారు. ఎంఈవోలు హసన్‌బాషా, సెల్వ పాండ్యన్, హెచ్ఎం సురేష్ పాల్గొన్నారు. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం యాదమరి: ఇంట్లోని నీటి మోటారు వేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఈశ్వర్ వివరాల మేరకు మండల పరిధిలోని నూర్ ఈ నగర్ ప్రాంతానికి చెందిన కలందర్ భార్య ఎస్.అరీఫా(40) ఆదివారం ఉదయం తమ గృహంలో నీటి కోసం మోటారు స్విచ్ వేయగా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యం నిమిత్తం చిత్తూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. -
ఆర్ఎంపీల వైద్యం..ప్రాణాలు పణం
విజయపురం : కొంత మంది ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని అంతకు మించి వైద్యం అందించకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని ఎవరూ పాటించడం లేదు. వచ్చీరాని వైద్యంతో తెలిసీ తెలియని చికిత్సలతో ప్రాణాలను హరిస్తున్నారు. అన్ని వ్యాధులకు ఒకే మందు అన్నట్లు వచ్చిన ప్రతి బాధితుడికి ఓ రెండు రకాల సూది మందులు, ఎర్ర, పచ్చ, తెల్లది అంటూ మరో మూడు మాత్రలు ఇచ్చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేలు ఆర్ఎంపీ క్లినిక్‌లు ఉన్నాయి. ఈ క్లినిక్‌లలో రోగులకు ప్రథమ చికిత్స చేసేందుకే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిధి దాటి వైద్యం చేస్తున్నారు. అర్హత లేకపోయినా క్లినిక్‌లు, బెడ్స్ ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ చేస్తూ తమ ఇష్టం వచ్చినట్లుగా మందులు వాడుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరైతే ల్యాబ్, మెడికల్ షాప్స్ నిర్వహించడమే కాకుండా గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. వీరి నిర్లక్ష్యంతో ఎక్కడో ఒక చోట బాధితులు ప్రాణాలనే కోల్పోతూనే ఉన్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆర్ఎంపీలు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. మరోవైపు తక్కువ ఖర్చులో ఇంటికి సమీపంలో వైద్యసేవలు అందుతాయనే భావనతో ఏ వ్యాధికై నా ఆర్ఎంపీలనే సంప్రదిస్తుండటం చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. ల్యాబ్‌లు, మెడికల్ షాపులు ఏర్పాటు చేసి.. నిబంధనల మేరకు ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స చేసేందుకే పరిమితం కావాలి. తమ సెంటర్లో ప్రథమ చికిత్స కేంద్రం అని బోర్డు మాత్రమే పెట్టుకోవాలి. కానీ చాలామంది ప్రవేటు ఆసుపత్రి తలపించేలా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో నాలుగైదు బెడ్స్ ఏర్పాటు చేసి, తామే డాక్టర్‌గా చలామణి అవుతూ రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా ఆర్ఎంపీ, పీఎంపీలపైనే ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా భావించిన వీరు పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. వీటి వల్ల ఉన్న రోగం తగ్గకపోగా కొత్తగా రావడం, బీపీ పెరగడం, తగ్గడం, తల తిరగడం, వాంతులు, ఒంటి నొప్పుల వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ టైంలో సరైన ట్రీట్మెంట్ అందక ప్రాణాలే గాలిలో కలిసిపోతున్నాయి. మరికొందరు ఎలాంటి అర్హతలు లేకున్నా ల్యాబ్‌లు ఏర్పాటు చేసి అన్ని రకాల టెస్ట్‌లు, మెడికల్ షాపులు పెట్టి మందులు అమ్ముతూ తమ జేబులు నింపుకుంటున్నారు. కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా ఎంపీటీ కిట్లు వాడుతూ అబార్షన్లు సైతం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ఎంపీలపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదైనట్లు మెడికల్ కౌన్సిల్ చెబుతున్నా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆర్ఎంపీ కేంద్రంపై కేసు నమోదైతే పేరును మార్చి మళ్లీ మరో పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. వారి పరిధిని దాటి వైద్యం అందించడంతో పాటు శస్త్రచికిత్సలు సైతం చేసేస్తున్నారు. జరిగిన ఘటనలు మచ్చుకు కొన్ని ఇలా.. పట్టించుకోని వైద్యాధికారులు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నగరి నియోజకవర్గం విజయపురం మండలంలో సుమారు 15కి పైగా ఆర్ఎంపీ క్లినిక్‌లు ఉన్నాయి. ఒక పన్నూరు సబ్ స్టేషన్లోనే 7కు పైగా ఆర్ఎంపీ క్లినిక్‌లు ఉండగా అందులో ఓ ఆర్ఎంపీ క్లినిక్ 24 గంటలు జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. అక్కడ బెడ్ ఏర్పాటు చేసి సైలెన్లు పెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పక్కనే మెడికల్ షాపు ఉంది. రెండు దశాబ్దాలుగా వైద్యం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.