breaking news
Sri Sathya Sai
-
రెవెన్యూ క్రీడలను విజయవంతం చేయండి
అనంతపురం అర్బన్: జిల్లాలో నవంబరు 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక–2025 ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఇందుకు ఆయా శాఖలు పూర్తి సహకారం అందించాలని జిల్లా అధికారులను అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. రెవెన్యూ క్రీడల నిర్వహణ అంశంపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీఆర్ఓ ఎ.మలోల, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు మూడు రోజుల పాటు స్థానిక ఆర్డీటీ స్టేడియంలో జరగనున్నాయన్నారు. క్రీడలు సజావుగా నిర్వహించేందుకు ఆయా శాఖలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ఏర్పాట్లలో ఏవైనా సమస్యలు ఉంటే డీఆర్‌ఓతో చర్చించి పరిష్కారం పొందాలన్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే ఉద్యోగులకు వసతి, రవాణా సదుపాయం కల్పించాన్నారు. మూడు రోజుల పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. రోజూ పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్, డీపీఓకు సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్స్ కిట్లు, 108 అంబులెన్స్, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓని ఆదేశించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడా ఉత్సవాల్లో 27 యూనిట్లు పాల్గొంటాయన్నారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ, ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. సమావేశంలో ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ రాజేష్, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జునరెడ్డి, రమేష్‌రెడ్డి, డీఎంహెచ్ఓ ఈబీదేవి, డీపీఓ నాగరాజునాయుడు, ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, గనుల శాఖ డీడీ ఆదినారాయణ, , రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దివాకర్‌రావు, సోమశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖలు సహకారం అందించాలి అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం -
లక్ష్యం దిశగా విద్యాభ్యాసం సాగాలి
● జిల్లా అదనపు జడ్జి కంపల్లె శైలజ హిందూపురం: ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు జిల్లా అదనపు జడ్జి కంపల్లె శైలజ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రినౌల్డ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు షీల్డ్, మెడల్స్, ప్రశంసా పత్రాలను ఆమె ప్రదానం చేసి, మాట్లాడారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందన్నారు. ఉన్నతమైన నిర్ణయాలు, మంచి ఆలవాట్లతో భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ పట్టుదల, క్రమశిక్షణతో విద్యాభ్యాసం సాగించి ఉత్తమ పౌరులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో న్యాయవాది సంతోషికుమారి, పాఠశాల నిర్వాహకులు ముస్తఫా ఆలీఖాన్, బీబీ హజీరా, సర్ఫరాజ్ ఆలీఖాన్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్షుద్రపూజల కలకలంపై వీడిన మిస్టరీ చిలమత్తూరు: స్థానిక పోలీసు స్టేషన్ ప్రహరీకి అనుకుని ఉన్న వెలుగు కార్యాలయ ఆవరణలో నిమ్మకాయలు, కుంకుమ, ఎర్రటి వస్త్రం పడి ఉండడం కలకలం రేపింది. క్షుద్రపూజలు జరిగాయంటూ జోరుగా చర్చ సాగింది. ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎస్ఐ మునీర్ అహ్మద్ వివరణ ఇచ్చారు. ఆయుధపూజ రోజు స్టేషన్లో పూజలు నిర్వహించిన అనంతరం శుభ్రం చేసే క్రమంలో వాటిని బయట పడేసినట్లు వివరించారు. సమష్టి కృషితోనే అక్రమ మద్యం నివారణ ధర్మవరం అర్బన్: సమష్టిగా దాడులు చేపట్టి అక్రమ మద్యాన్ని నివారించాలని సంబంధిత అధికారులను ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అనంతపురం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్ ఆదేశించారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌ను మంగళవారం వారు తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. నాటుసారా తయారీని పూర్తిగా నివారించాలన్నారు. కర్ణాటక మద్యం నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం ఎకై ్సజ్ సీఐ చంద్రమణి, ఎస్ఐలు చాంద్‌బాషా, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఇరువర్గాలపై కేసుల నమోదు కదిరి టౌన్: ఘర్షణ కేసులో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. కదిరిలోని రాజీవ్‌గాంధీ నగర్లో నివాసముంటున్న సంజన, తనకల్లు మండలం సంజీవ్ నగర్‌కు చెందిన వీరంపల్లి శారద ఒకే కుటుంబానికి చెందిన వారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 4న కదిరిలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వైభవంగా చింతల రాయుడి కల్యాణం
తాడిపత్రి రూరల్: స్థానిక చింతల వేంకటరమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఆర్యవైశ్య సంఘం తరఫున మంగళ వాయిద్యాలతో పట్టు వస్త్రాలను ఆలయానికి చేర్చారు. చింతల వేంకటరమణస్వామి, భూదేవి, శ్రీదేవి సమేత ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి చేర్చి ప్రధాన అర్చకుడు మురళీస్వామి ఆధ్వర్యంలో ఆశ్వయుజ పౌర్ణమి ఘడియల్లో శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. అనంతరం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీకట్ట నుంచి రథోత్సవం ప్రారంభమైన కొద్దిసేపటికే అకాశం మేఘావృతమై చిరుజల్లులు పడ్డాయి. జల్లుల నడుమ గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగుతూ పరవశించిపోయారు. రథం ముందు భాగంలో వందన డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. వివిధ వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు. చిరుజల్లుల నడుమ రథోత్సవం -
పశు వైద్యంపై నిర్లక్ష్యం
మూగజీవాల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అత్యవసర సమయాల్లో పశువులు, జీవాలకు చికిత్స అందించే వైద్యుల పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో పశు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఈ క్రమంలోనే పశు సంవర్ధక ద్వారా అమలు చేస్తున్న పథకాలకూ దిక్కు లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.పుట్టపర్తి: పాడి పరిశ్రమను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. జిల్లాలోని పశువుల ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తోంది. ఫలితంగా పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యసర సమయంలో వైద్యం అందక పశువులు, గొర్రెలు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో పాడి రైతులకు అన్ని విధాలుగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని, పశు సంవర్ధక శాఖ ద్వారా పథకాలను సకాలంలో అందజేస్తూ పాడి రైతుల ఆర్థిక బలోపేతానికి కృషి చేశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాడి రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 60.88 లక్షలకు పైగా మూగజీవాలు జిల్లా వ్యాప్తంగా ఆవులు, ఎద్దులు, గేదెలు కలిపి 3,33,132 వరకు ఉన్నాయి. మేకలు 4.29 లక్షలు, గొర్రెలు 30.49 లక్షలు, కోళ్లు 22.77 లక్షలు, పందులు 1,727 ఉన్నాయి. వీటన్నంటికీ చికిత్స అందించేందుకు ప్రస్తుతం జిల్లాలో సిబ్బందితో పాటు మందులకొరత తీవ్రంగా వేధిస్తోంది. బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లోని పశు వైద్యశాలలో ఒక్క డాక్టర్ కూడా లేరు. దీంతో పశు వైద్య సేవలు ఆగి పోయాయి. ఆవులకు కృత్రిమ గర్భధారణ వ్యాక్సిన్, గాలికుంటు తదితర వ్యాధుల నివారణ టీకాలు అందుబాటులో లేక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జబ్బు బారిన పడిన పశువులు, జీవాలకు ప్రైవేట్‌గా చికిత్స చేయించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వంలో తిరుగులేని ప్రోత్సాహం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... పాడితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మి సాగుతో పాటు పాడి పోషణపై ప్రత్యేక దృష్టి సారించారు. రాయితీతో పశు దాణా అందించారు. పశువైద్యాన్ని మరింత మెరుగు పరచారు. అత్యవసర సమయంలో పశువులను వైద్యశాలకు తరలించి నాణ్యమైన చికిత్సలు అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా అంబులెన్స్‌లను సమకూర్చారు. వైద్య పరీక్షల కోసం ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఉచిత బీమాతో పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడమే కాక... అమూల్ సంస్థ ద్వారా పాలకు గిట్టుబాటు ధర కల్పించారు. వీటికి భిన్నంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అమూల్ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసి పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి గండికొట్టింది. సబ్సిడీ దాణాను ఇప్పటి వరకూ అందించిన దాఖలాలు లేవు. ఉచిత బీమా పథకానికి మంగళం పాడింది. పశు వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా మొత్తానికి పశు వైద్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడుగులేస్తోంది.ప్రైవేట్ వ్యక్తులతో గొర్రెలకు నట్టల నివారణ మందు తాపిస్తున్న కాపర్లు సిబ్బంది లేక మూతబడిన బుక్కపట్నంలోని పశువుల ఆస్పత్రి సిబ్బంది కొరతతో ఆగిన సేవలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో పాడి రైతులు సిబ్బంది కొరత ఉంది జిల్లాలోని పశువుల ఆస్పత్రిల్లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. మందుల కొరత లేదు. కృత్రిమ గర్భధారణ, గాలి కుంటు టీకాలు అందుబాటులో ఉన్నాయి. – శుభదాసు, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారిసబ్సిడీతో దాణా అందించాలి పశు సంవర్ధక శాఖ పథకాలను పక్కాగా అమలు చేయాలి. సబ్సిడీతో దాణాను అందించాలి. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలి. – దామోదరరెడ్డి, పాడిరైతు, జానకంపల్లిపాడి ఆవులు చనిపోతున్నాయి జబ్బు బారిన పడిన పాడి ఆవులకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళితే అక్కడ డాక్టర్లు ఉండడం లేదు. అత్యసవర పరిస్థితుల్లో చికిత్స అందక పాడి ఆవులు చనిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం వైద్యులను నియమించాలి. – కృష్ణారెడ్డి, పాడిరైతు, జానకంపల్లి, బుక్కపట్నం మండలం -
నిండుకుండలా పీఏబీఆర్
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నిండు కుండలా దర్శనమిస్తోంది. మంగళవారం నాటికి 5.157 టీఎంసీలకు నీటిమట్టం చేరినట్లు డ్యాం డీఈ వెంకటరమణ తెలిపారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా 185 క్యూసెక్కులు, జీడిపల్లి జలాశయం నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 510 క్యూసెక్కుల చొప్పున నీరు వచ్చి చేరుతున్నట్లు వివరించారు. డ్యాంలో ఏర్పాటైన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి 585 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, లీకేజీ రూపంలో 35 క్యూసెక్కులు, నీటి ఆవిరి రూపంలో 25 క్కూసెక్కుల అవుట్ ఫ్లో ఉందన్నారు. మూకుమ్మడిగా హోంగార్డుల బదిలీమడకశిర: నియోజకవర్గంలోని వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న హోంగార్డులను ఉన్నతాధికారులు మూకుమ్మడిగా బదిలీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా30 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. ఇందులో 20 మంది వరకు బదిలీ అయ్యారు. పెనుకొండ, పరిగి, గోరంట్ల తదితర ప్రాంతాలకు వీరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిపాలన సౌలభ్యంలో భాగంగా బదిలీ అయ్యారా? లేదా రాజకీయ ఒత్తిళ్లతో బదిలీ అయ్యారా అనే విషయం మిస్టరీగా మారింది. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పరిగి: ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాలను ఏఎస్ఐ బాలరాజు మంగళవారం వెల్లడించారు. హిందూపురం మండలం మలుగూరు వద్ద ఉన్న ఓ స్టీల్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న పరిగి మండలం యు.బసవనపల్లికి చెందిన రమేష్.. ఈ నెల 3న ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం రమేష్ మృతి చెందాడు. మృతుడి భార్య రాధ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన యు.బసవనపల్లికి చెందిన సుదీప్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ద్విచక్ర వాహనం ఢీ – వ్యక్తి మృతి
పెనుకొండ రూరల్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కొత్తచెరువు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన పగిరెడ్డి శంకర్‌రెడ్డి(47) కియా పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో 44వ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఘటనలో తీవ్రంగా గాయపడని శంకరరెడ్డిని స్థానికులు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మధ్యాహ్నం శంకరరెడ్డి మృతిచెందాడు. ఆయనకు భార్య సుకన్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై కియా ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య మడకశిర రూరల్: మండలంలోని హెచ్ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారు. అయితే ఏ ఒక్కటీ కుదరకపోవడంతో విరక్తి పెంచుకుని మద్యానికి బానిసయ్యాడు. ఇక తనకు పెళ్లి కాదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఇంటి సమీపంలోని చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం ప్రశాంతి నిలయం: కుటుంబ విలువలు, బంధాల గురించి రామాయణ ద్వారా సమాజానికి చాటిచెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయమైనదని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 18న పాఠశాల స్థాయి జేవీవీ చెకుముకి సంబరాలు అనంతపురం ఎడ్యుకేషన్: ఈ నెల 18న పాఠశాల స్థాయిలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సంబరాలు నిర్వహించనున్నట్లు జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీర్రాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 35 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో ఈ సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు తర్వాత అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటున్న కార్యక్రమం ఇదేనన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలో దాదాపు 4.50 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొంటుండగా జిల్లా తరఫున 25 వేల మందికి పైగా ప్రాతినిథ్యం వహించే అవకాశముందన్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. పాఠశాల స్థాయిలో ఎంపికై న వారు మండల స్థాయిలో జరిగే పరీక్షలకు, అక్కడ ఎంపికై న వారు జిల్లా స్థాయి, అక్కడి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రమణయ్య, కోటేశ్వరప్ప, జేవీవీ నగర కార్యదర్శి ఎస్.తిరుపాల్, కోశాధికారి ఎం.రామిరెడ్డి పాల్గొన్నారు. -
రేపు కోల్‌కతా హైకోర్ట్ జడ్జి రాక
ప్రశాంతి నిలయం: కోల్‌కతా హైకోర్ట్ జడ్జి అరిజిత్ బెనర్జీ ఈ నెల 9న పుట్టపర్తికి రానున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన ఆయన పుట్టపర్తికి వస్తారని డీపీఆర్ఓ తెలిపారు. పుట్టపర్తిలోని సాయిటవర్స్ హోటల్లో బస చేయనున్నట్లు తెలిపారు. పదో తేదీన ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారని వెల్లడించారు. రాష్ట్ర స్థాయిపోటీలకు శిరివరం విద్యార్థినులు లేపాక్షి: శిరివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఇద్దరు రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని పి.మైత్రి 69 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, మరో విద్యార్థిని గౌతమి 58 కేజీల విభాగంలో మూడో స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు శ్రీనాథ్, ఫిజికల్ డైరెక్టర్ సంపత్‌కుమార్ మంగళవారం తెలిపారు. మంగళగిరిలో త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను మంగళవారం ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ ధర్మవరం అర్బన్: నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల పదో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ సభ్యులు మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.కోట్లలో బిల్లులు రావాలని, వాటిని చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని తెలిపారు. అందుకే శుక్రవారం నుంచి వైద్యసేవలు బంద్ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. డైట్ కళాశాలకు గ్రాంట్ విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: బుక్కపట్నంలోని డైట్ కళాశాలకు 2025–26 సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ విడుదల చేసినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పద్దుల కింద మొత్తం రూ.9. 90 లక్షలు విడుదల చేశామన్నారు. ఇందులో 50 శాతం వార్షిక గ్రాంట్ రూ. 7.50 లక్షలు, టెక్నాలజీ సపోర్ట్ కింద రూ. 2.40 లక్షలు ఉన్నాయన్నారు. నిబంధనలకు లోబడి ఖర్చు చేసి వివరాలను టీసీఎస్ యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ‘చైతన్య జ్యోతి’కి సిల్వర్ జూబ్లీ శోభ ప్రశాంతి నిలయం: విదేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే పర్యాటకులకు సత్యసాయి చరిత్రను కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది చైతన్య జ్యోతి మ్యూజియం. చైనీస్ నిర్మాణ రీతిలో రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం సత్యసాయి 75వ జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. ప్రస్తుతం సత్యసాయి శత జయంతి నాటికి 25 వసంతాలకు చేసుకుంది. ఈ సందర్భంగా చైతన్య జ్యోతి మ్యూజియాన్ని ఇటీవల పునరుద్ధరించారు. విద్యుత్ దీపపు కాంతులు, పెయింటింగ్స్‌తోపాటు సత్యసాయి శత జయంతి వైభవాన్ని చాటే పలు ఘట్టాలతో నిర్మాణాలు చేపట్టారు. మలేషియా భక్తులు పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. సత్యసాయి శత జయంతి మరో 47 రోజుల ఉండగా, చైతన్య జ్యోతి మ్యూజియం తన సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించుకుని.. జయంతి వేడుకలకు తరలివచ్చే భక్తులను కనువిందు చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం మ్యూజియంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఈ సంధర్బంగా పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. -
వసూళ్ల పార్టీ
టీడీపీని వసూళ్ల పార్టీ అంటే సరిపోతుంది. ఇసుక, మట్టి ఇలా దేన్నీ వదలడం లేదు. ప్రజలు ఏదైనా సమస్యతో పోలీస్ స్టేషన్‌కు గానీ, లేదంటే ఏ ప్రభుత్వ కార్యాలయానికి గానీ వెళ్లినా అక్కడే కాచుకొని ఉన్న ‘పచ్చ’ పార్టీ నాయకులు ‘అధికారులతో మీ పని మేం చేయిస్తాం’ చెప్పి డబ్బు గుంజుతున్నారు. ఇప్పుడు అంగన్వాడీ ఆయా పోస్టులు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలకు తెలిసే ఈ తంతు జరుగుతోంది . – ఉషశ్రీచరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ -
లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణ శాఖ లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గృహనిర్మాణ సంస్థ అధికారులలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా ఇంటి స్థలాలు లేని వారు, స్థలం ఉండి ఇల్లు మంజూరు అయినా కట్టని వారి జాబితాలు వెంటనే సిద్ధం చేయాలన్నారు. రామగిరి, కదిరి అర్బన్, గోరంట్ల, ధర్మవరం అర్బన్, పెనుకొండ, సోమందేపల్లి, కనగానపల్లి మండలాల్లో జీరో పురోగతి ఉందని, వారి పనితీరు మెరుగుపరుచుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తయిన ప్రతి ఇంటికీ మరుగుదొడ్ల నిర్మాణం తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ధర్మవరం డీఈ లక్ష్మినారాయణమ్మ, పుట్టపర్తి, రాప్తాడు, పెనుకొండ, ధర్మవరం ఈఈలు శ్రీనివాసులు, శంకర్‌లాల్‌నాయక్, శివకుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. మెగా జాబ్‌మేళా సద్వినియోగం చేసుకోండి ప్రశాంతి నిలయం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 15 బహుళజాతి కంపెనీలతో ఈ నెల 10న హిందూపురంలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ కోరారు. మంగళవారం ఆయన తన చాంబర్లో జాబ్‌మేళా పోస్టర్లను విడుదల చేశారు. హిందూపురంలోని ఎస్డీజీఎస్ ఎంబీఏ కాలేజీలో శుక్రవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివి 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు జాబ్‌మేళాకు హాజరుకావచ్చన్నారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 96767 06976, 99594 16770 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం
పుట్టపర్తి టౌన్: రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఫంక్షన్ హాలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు హాజరై వాల్మీకిమహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీతారాముల సద్గుణాలు, గొప్పతనం, కుటుంబ విలువల నుంచి పాలన సూత్రాల వరకు సమాజ శ్రేయస్సుకు అవరమైన ఎన్నో విషయాలను రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి తెలియజేశారన్నారు. మహనీయుల అడుగు జాడల్లో నడిచి తమ జీవిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్పిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షులు గంగన్న, సాధికారత సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ అనంతపురం సిటీ: స్థానిక ఆర్డీటీ స్టేడియం సమీపంలో ఉన్న ఎకాలజీ సెంటర్లో పంచాయతీ కార్యదర్శులకు బుధవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య మంగళవారం తెలిపారు. ఒక్కో మండలం నుంచి ఒక్కో కార్యదర్శి శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు (మూడు రోజుల పాటు) శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నారు. శిక్షణ తరగతులను జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ప్రారంభిస్తారని వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శులు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. -
‘డబ్బు’ల్ రిజిస్ట్రేషన్‌తో రూ.3 కోట్ల భూమికి ఎసరు!
అనంతపురం టౌన్: అధికార అండతో ‘పచ్చ’ నేతలు బరితెగిస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ‘డబ్బు’ల్ రిజిస్ట్రేషన్లతో భయకంపితులను చేస్తున్నారు. కూటమి ఏడాదిన్నర పాలనలో అనంతపురం నగరం చుట్టూ ఇదే తంతు సాగుతోంది. ఇప్పటికే నగరంలో సాయినగర్‌లోని ‘అస్రా’ ఆప్టికల్స్ భవనం, తపోవనంలోని ఎంకేఎం ఫంక్షన్ హాలు సమీపంలో 5వ రోడ్డులోని ఓ సామాజిక వర్గానికి చెందిన స్థలాల కబ్జాలు మరువక ముందే తాజాగా ఓ టీడీపీ నేత అనంతపురం రూరల్ మండలం ఏ. నారాయణపురం సమీపంలోని సర్వే నంబర్ 156–2లో రూ.3 కోట్ల విలువ చేసే 1.19 ఎకరాలకు ఎసరు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ సరిపూటి పద్మాగీత భర్త సరిపూటి ముకుందనాయుడు నడిపిన అడ్డగోలు బాగోతం కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. ఏ. నారాయణపురం గ్రామానికి చెందిన పెద్ద నారప్పకు గ్రామ సర్వే నంబర్ 156–2లో 9.59 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని అతనితో పాటు వారసులు దశల వారీగా 1999లో 3 ఎకరాలు, 2002లో 2.40 ఎకరాలు, 2008లో మిగిలిన 5 ఎకరాలను విక్రయించేశారు. ఇదే సర్వే నంబర్లో 1999లో 3 ఎకరాలు కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి ఒక ఎకరా స్థలాన్ని మూడో రోడ్డుకు చెందిన కవ్వలూరు కృష్ణ 2009లో కొనుగోలు చేశాడు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.3 కోట్లు పలుకుతోంది. అధికార అండతో కబ్జా కూటమి ప్రభుత్వం వచ్చాక కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పద్మాగీత, ఆమె భర్త ముకుందనాయుడు ఆ భూమిపై కన్నేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల అండతో 2025 ఆగస్టు 6న ‘డబ్బుల్’ రిజిస్ట్రేషన్ చేసుకుని భూమిలో బోర్డు నాటారు. ఇదేమని ప్రశ్నించిన నిజమైన భూ యజమానులను వేధింపులకు గురిచేస్తున్నారు. వారికి ప్రధాన అనుచరుడు.. కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన ముకుందనాయుడు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. గతంలో ఆయన భార్య పద్మాగీత టీడీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికై కనగానపల్లి ఎంపీపీగా పని చేశారు. 2024 ఎన్నికల తర్వాత అనంతపురానికి మకాం మార్చి నగర ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తమకు సమీప బంధువు అంటూ హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూడో రోడ్డుకు చెందిన కృష్ణ అనే బ్రాహ్మణుల ఎకరా భూమి కబ్జా చేయడం గమనార్హం. తమ పేర్లు చెప్పి కబ్జా చేస్తున్న విషయం ఆ ఎమ్మెల్యేలకు తెలుసా? లేదంటే తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరిస్తున్నారా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కనగానపల్లి మాజీ ఎంపీపీ భర్త ముకుందనాయుడి బరితెగింపు టీడీపీ ఎమ్మెల్యేల అండతో రెచ్చిపోతున్న వైనం -
మసిపూసి.. మారేడు కాయ చేసి!
అనంతపురం సెంట్రల్: మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహ అవినీతికి కేరాఫ్‌గా మారింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడడమే కాకుండా సాక్ష్యాలను సైతం తారుమారు చేయడంలో సిద్ధహస్తులనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా నవజాత శిశువు మృతి విషయంలోనూ సాక్ష్యాలు తారుమారు చేస్తున్నట్లు మహిళాశిశు సంక్షేమ శాఖలోని కొందరు అధికారులే బాహాటంగా పేర్కొంటున్నారు. శిశువు మృతి చెందిన రోజు ఏం జరిగిందనే విషయంపై సీసీ కెమెరా ఫుటేజీలు నేటీకి బయటపెట్టక పోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఒకసారి.. రికార్డు కావడం లేదని మరోసారి పొంతనలేని సమాధానాలతో విచారణాధికారులను సైతం పక్కదోవ పట్టించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 3న శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ శిశువు మృతి చెందినట్లుగా సిబ్బంది బుకాయిస్తున్నారు. వాస్తవానికి శిశుగృహలోనే శిశువు మృతి చెందాడని, ఈ విషయం తెలిస్తే ఇబ్బందులు తప్పవని భావించిన శిశుగృహ సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలను బయట పెట్టకుండా విచారణాధికారులను పెడదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనూ తిమ్మిని బమ్మిని చేసి.. గతంలోనూ దత్తత అంశంలో తలెత్తిన వివాదంలో సాక్ష్యాలను తారుమారు చేసినట్లుగా శిశుగృహ సిబ్బందిపై ఆరోపణలున్నాయి. కెనడా దేశానికి చెందిన ఎన్ఆర్ఐ మహిళ దత్తత కోసం రాగా ఆమె నుంచి తొలుత రూ. 3 లక్షలు... ఆ తర్వాత బంగారాన్ని డిమాండ్ చేయడాన్ని ఆక్షేపిస్తూ కేంద్ర రాయబార కార్యాలయానికి ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అప్పటి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తక్షణ విచారణ చేపట్టి వాస్తవాలు నిర్ధారించుకున్న అనంతరం శిశుగృహ మేనేజర్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే సదరు ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదులను, కలెక్టర్ జారీ చేసిన టెర్మినేట్ ఉత్తర్వులకు సంబంధించిన ఫైల్స్‌లో కొన్ని మాత్రమే ఉంచి కీలకమైన సమాచారాన్ని మాయం చేశారు. ఫలితంగా కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరిగి మళ్లీ అదే స్థానానికి మేనేజర్ చేరుకున్నారు. ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వెంటనే సెంట్రల్ అడాప్షన్ రిసోర్సు అథారిటి(కారా) వెబ్సైట్ ద్వారా దత్తత పొందేలా మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చేసింది. అంతకు మునుపు ఆఫ్‌లైన్ విధానంలో ఇష్టానుసారంగా దత్తతకు ఇచ్చి భారీగానే సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శిశుగృహ మేనేజర్ ఏం చేస్తున్నట్లు? శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సంరక్షణ బాధ్యత మొత్తం సంబంధిత మేనేజర్‌పైనే ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితుల్లోనైనా 24 గంటలూ సేవలందించాల్సి ఉంటుంది. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులతో చికిత్సను అందించాలి. అవసరమైతే అక్కడే అడ్మిట్ చేయడం.. ప్రత్యేకంగా ఆయాను నియమించి కోలుకునేంత వరకూ చికిత్సనందించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఇటీవల శిశువు మృతి చెందే వరకూ కూడా మేనేజర్ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. 3న అర్ధరాత్రి విధుల్లో ఉన్న ఒకే ఆయా శిశువు పరిస్థితిని ఫోన్ ద్వారా తెలిపినా మేనేజర్ స్పందించలేదని తెలిసింది. దీంతో ఐదుగురు చిన్నారులను వదిలేసి శిశువును తీసుకుని సర్వజనాస్పత్రికి ఆయా ఒక్కరే వెళ్లింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి వెనక్కు పంపినట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. అక్రమాలకు అధికారి అండ! శిశువు మరణానికి బాధ్యులైన వారిని రక్షించేందుకు ఓ అధికారి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గతంలో అక్రమాలకు పాల్పడి టెర్మినేట్ అయిన సమయంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి తిరిగి శిశుగృహలో బాధ్యతలు స్వీకరించేలా చేసిన సదరు అధికారి ప్రస్తుతం కూడా అవినీతి అధికారిని రక్షించే బాధ్యతలను భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శిశువు శిశుగృహలోనే మృతి చెందిన అంశాలున్న సీసీ కెమెరా ఫుటేజీలను తొక్కి పెట్టించినట్లు ఆరోపణలున్నాయి. అనారోగ్యంతో శిశువు మృతి చెందినట్లుగా మెడికల్ సర్టిఫికెట్ సృష్టించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. శిశు మరణంపై సాక్ష్యాలు తారుమారు? ఇప్పటి వరకూ బయటపెట్టని సీసీ కెమెరా ఫుటేజీలు గతంలోనూ ఇదే తరహాలో కీలక ఫైళ్ల మాయం -
నకిలీ మద్యానికి నలుగురు బలి
నరసరావుపేట టౌన్/తనకల్లు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒకరు, శ్రీ సత్యసాయిజిల్లాలో మరొకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు... మొత్తంగా నలుగురు మృతి చెందారు. నరసరావుపేటలోని బరంపేట చాకిరాలమిట్ట ప్రాంతానికి చెందిన పాలెపు కోటేశ్వరరావు (50) లారీ క్లీనర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో ఓ దుకాణం ఎదుట అకస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులుగా ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది. అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.ములకలచెరువులో వ్యక్తి మృతిశ్రీసత్యసాయి జిల్లాలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు (58) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి రాగానే అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి మద్యం తాగేవాడు. అక్కడికే ఎందుకు వెళ్తున్నావని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే... అక్కడే మద్యం ‘ఫుల్ కిక్’ ఇస్తుందని చెప్పేవాడు. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం మొలకలచెరువుకు వెళ్లిన శ్రీరాములు రాత్రి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మొలకలచెరువులోని ప్రభుత్వాస్పత్రి పక్కన అనుమానాస్పద స్థితిలో శ్రీరాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీరాములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. తన కుమారుడు నకిలీ మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తల్లి గంగులమ్మ బోరు విలపించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమార్తె రేణుక ఉన్నారు.నెల్లూరు జిల్లాలో ఇద్దరు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామ సచివాలయం సమీపంలో బెల్టు షాపు ఉంది. 45 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులుగా అక్కడే తిరుగుతూ డబ్బులు అడుక్కుని బెల్టుషాపులోనే నకిలీ మద్యం తాగేవాడు. పక్కనే ఉన్న బస్‌షెల్టర్ పడుకునేవాడు. అయితే సోమవారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి చొక్కా కాలర్‌పై పామూరుకు చెందిన పవన్ మెన్స్‌వేర్ లేబుల్‌ను గుర్తించారు. శరీరంపై గాయాల్లేవు. దీంతో నకిలీ మద్యం తాగడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఓ మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. తరచూ అక్కడే మద్యం తాగేవాడు. అతడి మృతదేహాన్ని మద్యం షాపునకు సమీపంలోని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. నకిలీ మద్యం అతిగా తాగడం వల్లే అపస్మారక స్థితిలో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీరామరెడ్డి స్ఫూర్తిని అందిపుచ్చుకోండి
మడకశిర రూరల్: స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ శ్రీరామరెడ్డి స్ఫూర్తిని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు కేరళ మాజీ డీజీపీ బి.సయ్యద్మహమ్మద్ యాసిన్ పిలుపునిచ్చారు. మడకశిర మండలం నీలకంఠాపురంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శ్రీరామరెడ్డి 120వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీరామరెడ్డి సమాధికి శ్రీరామరెడ్డి, రఘువీరారెడ్డి కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మాజీ డీజీపీ మాట్లాడారు. శ్రీరామరెడ్డి సాగించిన ఉద్యమాలను కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీరామరెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నీని నీలకంఠాపురం జట్టు కైవసం చేసుకుంది. రన్నర్స్‌గా రొళ్లలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల జట్టు నిలిచింది. విజేత జట్లను అభినందిస్తూ ట్రోఫీలను మాజీ డీజీపీ ప్రదానం చేశారు. అలాగే పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు, ఉత్తమ రైతులకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి, శ్రీరామరెడ్డి కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, సేవామందిరం విద్యాసంస్థల అధినేత కేటీ శ్రీధర్, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, రైతులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి...
అనంతపురం సిటీ: స్థానిక తాటిచెర్ల మార్గంలోని నేషనల్ హైవే బ్రిడ్జి కింద సోమవారం గూడ్స్ రైలు కింద పడి మల్లెల రవికుమార్(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించినా ఆ తరువాత మృతుడు అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రవికుమార్‌గా గుర్తించినట్లు వివరించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారన్నారు. కుటుంబ కలహాలు, ఆర్థికపర సమస్యలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ ఆత్మకూరు: ట్రాక్టర్ అదుపు తప్పి నేరుగా వెళ్లి బావిలో పడింది. వివరాలు.. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం ట్రాక్టర్‌తో తన పొలంలో సేద్యం చేస్తుండగా అదుపు తప్పి నీళ్లు లేని బావిలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ట్రాక్టర్‌తో పాటు బావిలో పడిన రామచంద్రారెడ్డిని వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మంచానికి తాళ్లు కట్టి బావిలో దించారు. అనంతరం దానిపై రామచంద్రారెడ్డిని చేర్చి పైకి లాగారు. తీవ్ర గాయాలైన రామచంద్రారెడ్డిని 108 అంబులెన్స్‌లో అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: స్థానిక లోనికోటకు చెందిన తొండమాల మహేష్ (37) ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీచెన్నకేశవపురంలో ఇనుప సామాన్ల అంగడిలో పనిచేసేవాడు. గత 15 సంవత్సరాలుగా పెళ్లి కోసం కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరకపోవడంతో మనోవేదనకు లోనయ్యాడు. సోమవారం ఉదయం పనికి వెళుతున్నట్లు తల్లి సుబ్బమ్మకు తెలిపి ఇంటి నుంచి బయటకు వచ్చిన మహేష్ దుకాణానికి వెళ్లలేదు. వ్యక్తిగత పనిపై తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంటికి చేరుకుని చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి సుబ్బమ్మకు దుకాణం యజమాని ఫోన్ చేసి మహేష్ పనికి రాలేదని తెలపడంతో ఆమె నేరుగా ఇంటికెళ్లి చూసింది. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడుని చూసి బోరున విలపించింది. గతంలో భర్త రామాంజనేయులు అనారోగ్యంతో మృతి చెందగా.. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. -
140 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కూడేరు: అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందడంతో విజిలెన్స్ ఎస్ఐ జమాల్‌బాషా, సీఎస్‌డీటీ శాంతకుమారి కూడేరు మండలం జల్లిపల్లి వద్ద సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 140 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. అనంతపురంలోని తపోవనంలో నివాసముంటున్న బాబా ఫకృద్దీన్ తన బొలెరో వాహనంలో వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి నుంచి 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అనంతపురం మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.రేషన్ బియ్యం డంప్ స్వాధీనంఉరవకొండ: స్థానిక స్పైస్ ఇన్ రైస్ రెస్టారెంట్ సమీపంలో అక్రమంగా డంప్ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం ఉదయం తహసీల్దార్ మహబూబ్‌బాషా, సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వలు ఎవరో చేశారో విచారణ చేస్తున్నట్లు సీఐ మహనంది తెలిపారు.పరిష్కార వేదికకు 65 వినతులుపుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 65 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్ నేరుగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. దివ్యాంగుల వద్దకు నేరుగా చేరుకుని వారి నుంచి వినతులు స్వీకరించి, మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, డీసీఆర్బీ సీఐ ఆదినారాయణ పాల్గొన్నారుకిరికెరలో చోరీహిందూపురం: మండలంలోని కిరికెర వద్ద నివాసముంటున్న ఎడ్విన్ ఇంట్లో దుండగులు చొరబడి విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు. వారం రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలసి తమిళనాడు వెళ్లిన ఎడ్విన్ సోమవారం ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తలుపులు తీసి ఉండడంతో గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. 13 గ్రాముల బంగారు నగలు, 10 తులాల వెండి అపహరించినట్లుగా నిర్దారించుకుని ఫిర్యాదు చేయడంతో పోరలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు హిందూపురం రూరల్ పోలీసులు తెలిపారు.నిప్పంటుకుని వృద్ధుడి మృతితాడిపత్రి టౌన్: స్థానిక గురు లాడ్జీ సమీపంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పట్టణానికి చెందిన వడ్డే వెంకటేష్ (75) మృతి చెందాడు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో మద్యం మత్తులో తన ఇంటి సమీపంలోని చెత్త వద్ద వడ్డే వెంకటేష్ పడిపోయాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ అంటించుకుని అగ్గిపుల్ల ఆర్పకుండా పడేయడంతో చెత్తకు నిప్పు అంటుకుంది. ఎవరూ గమనించకపోవడంతో మంటలు చెలరేగి వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.వ్యక్తి మృతదేహం లభ్యంఆత్మకూరు: అవమాన భారం తాళలేక హంద్రీ–నీవా కాలువలో దూకి గల్లంతైన ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చెందిన లక్ష్మీనారాయణ నాయక్ (45) మూడు రోజుల తర్వాత మృతదేహమై తేలాడు. వివరాలు.. తనను ఇంటి పక్కన ఉన్న మహిళ చెప్పుతో కొట్టడంతో గ్రామంలో పరువు పోయిందంటూ మనో వేదనకు లోనైన లక్ష్మీనారాయణ నాయక్ శనివారం సాయంత్రం హంద్రీ–నీవా కాలువలో దూకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, స్థానికులు ముమ్మర గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం ఆత్మకూరు మండలం గొరిదిండ్ల సమీపంలో కాలువలో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణాలైనా వదులుతాం..భూములివ్వం
హిందూపురం: ‘‘ఈ భూములను నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నా. ఇప్పుడు వీటిని లాక్కుంటే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకే మా ప్రాణాలైనా వదులుతాం.. భూములు మాత్రం ఇవ్వబోం’’ అని రైతులు తేల్చిచెప్పారు. పరిశ్రమలకు భూ సేకరణ కోసం సోమవారం రెవెన్యూ అధికారులు హిందూపురం మండలం నందమూరి నగర్ గ్రామంలో రైతులతో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఒక్క హిందూపురం మండలంలోనే సుమారు 3 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రైతులు తమ పొలాలు లాక్కొవద్దంటూ అధికారులను వేడుకున్నారు. పరిశ్రమల పేరు చెప్పి తమను రోడ్డున పడేయవద్దంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అయినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. ప్రభుత్వ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు.దీంతో రైతులు గ్రామ సభను బహిష్కరించి రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న హిందూపురం మండలం మలుగూరు, చలివేందుల, రాచేపల్లి, మీనకుంటపల్లి, బాలంపల్లి, జంగలపల్లి, బీరేపల్లి, తిమ్మగానపల్లి, కొండూరు గ్రామాల రైతులు కూడా వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ‘పరిశ్రమలు వద్దు... వ్యవసాయం ముద్దు’, ‘అధికారుల వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన రైతులకు రైతు సంఘం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ...రైతే దేశానికి వెన్నముక అంటారు.. అలాంటి రైతుల పొలాలను లాక్కోడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబూ వ్యవసాయం నుంచి మమ్మల్ని దూరం చేయకు’ అంటూ మొరపెట్టుకున్నారు. అయినా భూసేకరణ చేయాలంటే రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం... పొలాలకు మూడింతల ధర చెల్లించాలని కోరారు.పంట భూములు తీసుకుంటే సహించంపరిశ్రమలు అవసరమే అయినా.. ఏడాదికి మూడు పంటలు పండే భూములను తీసుకుంటామంటే సహించబోమని రైతు సంఘం నాయకులు తేల్చి చెప్పారు. కూటమి సర్కార్ అభివృద్ధి పేరుతో వ్యవసాయమే జీవనాధారంగా బతికే వందలాది కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే దుస్థితి కల్పిస్తోందని మండిపడ్డారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
బంగారం వ్యాపారికి బురిడీ
ఉరవకొండ: స్థానిక సీఎస్ఐ చర్చి సమీపంలోని నిజాముద్దీన్ జ్యువెలరీ నిర్వాహకులు దాదాఖలందర్, తాజుద్దీన్‌ను సోమవారం ఓ మహిళా బురిడీ కొట్టించి రూ1.40 లక్షల విలువ చేసే బంగారం, నగదు తీసుకెళ్లింది. వివరాలు.. నిజాముద్దీన్ జ్యువెలరీ దుకాణానికి సోమవారం ఉదయం ఓ మహిళ వెళ్లింది. పక్కనున్న వ్యక్తిని తన భర్తగా పరిచయం చేస్తూ తమది నెరిమెట్ల గ్రామం అని, కుమార్తె వివాహం పెట్టుకోవడంతో తన వద్ద ఉన్న ఒకటిన్నర తులం బంగారు గొలుసు తీసుకుని కొంత నగదు, జత కమ్మలు ఇవ్వాలని కోరుతూ గొలుసు తీసిచ్చింది. దానిని పరీక్షించిన అనంతరం మేలిమి బంగారమేనని నిర్ధారించుకున్న వ్యాపారి దాదాఖలందర్... ఆ గొలుసుకు రూ.50 వేల నగదుతో పాటు ఆరు గ్రాముల బరువున్న కమ్మలు వస్తాయని తెలిపాడు. తానిచ్చిన బంగారు గొలుసును సదరు మహిళ చేతికి తీసుకుని అమ్మాయి పెళ్లి కాబట్టి కాస్త చూసి ఇవ్వాలంటూ బేరం ఆడింది. పాత బంగారం కావడంతో ఆ ధర వస్తోందని వ్యాపారి చెప్పడంతో చివరకు సరేనంటూ బ్యాగ్ లో ఉంచిన గొలుసు తీసిచ్చి.. వ్యాపారి ఇచ్చిన రూ.50 వేల నగదు, జత కమ్మలు తీసుకుని వెళ్లిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆ గొలుసును మరోసారి పరీక్షించగా అది నకిలీదని తేలింది. దీంతో మహిళ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. సీసీ టీవీ కెమెరా ఫుటేజీల్లో సదరు మహిళా అసలైన బంగారు గొలుసు స్థానంలో నకలీ గొలుసు మారుస్తున్న దృశ్యం స్పష్టంగా నిక్షిప్తమైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వ్యాపారి తెలిపాడు. నకిలీ గొలుసు ఇచ్చి రూ.1.40 లక్షలు చేజిక్కించుకున్న వైనం -
ప్రమాదంలో విద్యార్థులకు తీవ్రగాయాలు
ధర్మవరం రూరల్: మండలంలోని గొళ్లపల్లి వద్ద సోమవారం చోటు చేసుకున్న ప్రమాదంలో డిగ్రీ విద్యార్థులు హబీబుల్లా, రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన మేరకు... పుట్టపర్తికి చెందిన హబీబుల్లా, రాజేష్... అక్కడి మంగళకర కాలేజీలో డిగ్రీ మూడవ సంవత్సరం చదుతున్నారు. వీరిద్ధరూ వ్యక్తిగత పనిపై ధర్మవరం – చిగిచెర్ల మీదుగా అనంతపురానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. గొళ్లపల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొంది.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఒంటరి వృద్ధుడి మృతితనకల్లు: మండలంలోని ముండ్లవారిపల్లి సమీపంలో పాపాగ్ని నది వద్ద వెంకటప్ప(60) మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. అమడగూరు మండలం పూలకుంటపల్లికి చెందిన వెంకటప్ప పదేళ్లుగా కొక్కంటిక్రాస్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. వ్యవసాయ పనులు, చిన్నపాటి కూలీ పనులతో జీవనం సాగించేవాడు. అయితే సోమవారం పాపాగ్ని నది పక్కన మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కోటపల్లి వీఆర్వో గంగాధర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా వృద్ధుడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.వివాహిత బలవన్మరణంహిందూపురం: స్థానిక సీపీఐ కాలనీలో నివాసముంటున్న వివాహిత ఆస్మా (28) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త ఖాజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఖాజా చెడు వ్యసనాలకు బానిస కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఆస్మా సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.వలస కార్మికుడి మృతిధర్మవరం అర్బన్: స్థానిక మారుతీనగర్‌లో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకు పైనుంచి జారి పడి వలస కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండలం పిడింగొయ్య గ్రామానికి చెందిన గెడ్డం రాజ్‌కుమార్(39) 15 రోజుల క్రితం వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేసేందుకు వచ్చాడు. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌పై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజ్‌కుమార్ తమ్ముడు గెడ్డం ప్రసాద్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. -
నిధులు విడుదల చేయకుంటే ఇళ్లు ముట్టడిస్తాం
ప్రశాంతి నిలయం: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 15వ అర్థిక సంఘం నిధులను పార్టీలకు అతీతంగా అన్ని పంచాయతీలకు మంజూరు చేయాలని, లేకుంటే మంత్రి సవిత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇళ్లను సర్పంచ్‌లతో కలసి ముట్టడిస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్, మడకశిర వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప హెచ్చరించారు. మడకశిర, పెనుకొండ నియోజకవర్గాలలో 15వ ఆర్థిక సంఘం నిధులను పచ్చ కండువాలు కప్పుకుంటేనే మంజూరు చేస్తామంటూ స్థానిక ఎమ్మెల్యేలు సవిత, ఎంఎస్ రాజు వ్యవహరిస్తున్న తీరును వారు ఖండించారు. ఈ అంశంపై న్యాయం కోరుతూ సోమవారం పలువురు సర్పంచ్‌లతో కలసి కలెక్టరేట్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఉష శ్రీచరణ్ మాట్లాడుతూ.. పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సర్పంచ్‌లు పనిచేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో నిధులు మంజూరు కాకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో తాను సూచించిన పంచాయతీలకే ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడం మంత్రి సవిత దుర్మార్గానికి నిదర్శనమన్నారు. నిధుల మంజూరులో వివక్ష చూపితే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ... కేంద్రం విడుదల చేసే అర్థిక సంఘం నిధులపై కూటమి నాయకుల పెత్తనం చెలాయించడం దారుణమన్నారు. టీడీపీకి చెందిన సర్పంచ్‌లకు మాత్రమే నిధులు మంజూరు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆదేశించడం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. వివక్ష లేకుండా అన్ని పంచాయతీలకు 15వ అర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెనుకొండ, మడకశిర నియోజకవర్గాలకు చెందిన పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
మంద నుంచి 50 గొర్రెల అపహరణ
పుట్టపర్తి అర్బన్: మంద నుంచి 50 గొర్రెలను అపహరించుకెళ్లిన ఘటన పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్ద తండాలో చోటు చేసుకుంది. వివరాలు.. పెడపల్లి పెద్ద తండాకు చెందిన జగదీష్‌నాయక్, జయాబాయి దంపతులు చాలా కాలంగా సుమారు 78 గొర్రెల మందను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. రోజూ గొర్రెల మంద వద్దనే పడుకునే జగదీష్‌నాయక్ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జల్లులు పడుతుండడంతో పక్కనే ఉన్న ఓ ఇంటి ఆవరణలో మంచం వేసుకొని నిద్రించాడు. సోమవారం వేకువజామున దుండగులు అక్కడకు చేరుకుని మందను సమీపంలోని జాతీయ రహదారిలోకి మళ్లించారు. మంద సమీపంలోనే కట్టేసిన ఐదు పాడి ఆవుల మెడ తాళ్లను తప్పించారు. జాతీయ రహదారిపైకి మందను తోలుకెళ్లి 50 గొర్రెలు, పొట్టేళ్లను వాహనంలోకి ఎక్కించుకుని ఉడాయించారు. సుమారు 25 గొర్రెలు, మేకలు, పాడి ఆవులను వదిలేశారు. తెల్లవారుజాము 3 గంటల సమయంలో కుక్కలు అరుస్తుండడంతో మేల్కొన్న జగదీష్‌నాయక్... గొర్రెలు లేని విషయం గమనించి కుటుంబసభ్యులు, బంధువులతో కలసి గాలింపు చేపట్టాడు. సోమవారం జీవాల సంతలు ఉన్న పావగడ, గోరంట్ల, పేరేసంద్రం, బెంగళూరు మార్కెట్లకు తరలించి ఉంటారనే అనుమానతంతో తలా ఓ దిక్కున వెళ్లారు. సోమవారం చీకటి పడుతున్నా గొర్రెల జాడ తెలియరాలేదని బాధిత కాపరి వాపోయాడు. అపహరించుకెళ్లిన జీవాల విలువ రూ.5 లక్షలకు పైగా ఉంటుందని కన్నీంటి పర్యంతమయ్యాడు. -
సరుకులు స్టాక్ పాయింట్లోనే..
తాడిపత్రి రూరల్: అంగన్వాడీ కేంద్రాలంటే కూటమి ప్రభుత్వానికి అలుసుగా మారింది. ఇప్పటికే రెండు నెలల జీతం, అద్దెలు, ఇతర బిల్లుల మంజూరులో మీనమేషాలు లెక్కిస్తూ అంగన్వాడీ కార్యకర్తల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం తాజాగా మరో వివాదానికి తెరతీసింది. సకాలంలో లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయకుండా తన చేతకానితనాన్ని మరోసారి బయటపెట్టుకుంది. మొదటి వారంలోనే సరుకుల పంపిణీ.. ప్రతి నెలా మొదటి వారంలోనే అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు బియ్యం, కందిబేడలు, నూనె, కోడిగుడ్లు, పాలు, బాలసంజీవిని, బాలామృతం కిట్లు పంపిణీ చేస్తారు. ఈ నెల 6వ తేదీ వచ్చినా ఇప్పటి వరకూ ఒక్క సరుకు కూడా అంగన్వాడీ కేంద్రాలకు చేరలేదు. ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు పంపిణీ చేయాలో తెలియక అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 అంగన్వాడీ ప్రాజెక్టుల పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఒకటో తేదీన చౌకధాన్యపు డీలర్లకు లారీల్లో అందే సరుకులను అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు టీచర్లు ఆటోల ద్వారా తరలిస్తుంటారు. అయోమయంలో 3.20 లక్షల మంది.. ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 5,125 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 3.20లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 8వేల మందికి పైగా గర్భిణులు, 24వేల మందికి పైగా పాలిచ్చే తల్లులు, 0–6 వయస్సు గల పిల్లలు 2.60 లక్షల మంది ఉన్నారని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి నెలా నాలుగు విడతలుగా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా అవుతాయి. గర్భిణులు, బాలింతల కోసం ప్రతి నెలా మూడు కిలోల బియ్యం, కిలో కందిబేడలు, అర కిలో నూనె, 25 కోడిగుడ్లు, తల్లులకు 5 లీటర్ల పాలు, చిన్నారులకు 2.5 లీటర్ల పాలు, బాలసంజీవిని కిట్లను పంపిణీ చేస్తారు. అయితే ఈ నెల ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని పౌరసరఫరాల స్టాక్పాయింట్లకు పదిరోజుల క్రితమే చేరుకున్న సరుకులు అక్కడే నిలిచిపోయాయి. రిలీజ్ ఆర్డర్ లేకుండానే డిస్పోజ్ ఆర్డర్! స్టాక్ పాయింట్ల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరుకులను రవాణా చేయడానికి ఉన్నతాధికారుల నుంచి ముందుగా రిలీజ్ ఆర్డర్ ఉండాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఈ సారి రిలీజ్ ఆర్డర్ లేకుండానే ఏకంగా డిస్పోజ్ ఆర్డర్ అందడంతో కింది స్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విషయాన్ని కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం. కేంద్రాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు.. ప్రతి నెలా 1వ తేదీ నేరుగా డీలర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ చేస్తుంటారు. నెలలో నాలుగు విడతలుగా కోడిగుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేయాల్సి ఉండగా రవాణా ఖర్చుల భారం కారణంగా రెండు పర్యాయాలు చొప్పున నెలలో 1వ తేదీ, 15వ తేదీల్లో రవాణా చేస్తున్నారు. అయితే ఈ సారి అంగన్వాడీ కేంద్రాలకు బాలసంజీవని, కోడిగుడ్లు, పాలు, బాలామృతం ప్యాకెట్లు సరఫరా కాలేదు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో సరుకులు నిండుకున్నాయి. సరుకుల కోసం రోజూ బాలింతలు, గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వారికి సరుకులు రాలేదని చెప్పలేక అంగన్ వాడీ టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. 10 రోజులైనా అంగన్వాడీ కేంద్రాలకు చేరని వైనం ఉమ్మడి జిల్లా వ్యాఫ్తంగా నిలిచిపోయిన రవాణా సరుకుల కోసం ఎదురుచూస్తున్న అంగన్వాడీ లబ్ధిదారులు -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం : ఫ్యాప్టో
కదిరి టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఫ్యాప్టో చైర్మన్ గజ్జల హరిప్రసాద్ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కదిరిలో ఉపాధ్యాయులు ఆదివారం ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ బంగ్లా నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేయడంతో పాటు 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రూ.25 వేల కోట్ల దీర్ఘకాలిక బకాయిలు చెల్లించాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. మున్సిపల్ పాఠశాలలకు అర్బన్ ఎంఈఓ పోస్టు మంజూరు చేయాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచి, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరారు. 20 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 7న విజయవాడలో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ రామానుజులయాదవ్, లక్ష్మీప్రసాద్, జాఫర్‌హుస్సేన్, యూటీఎఫ్ శ్రీనివాసులు, తాహర్ వలి, లక్ష్మీకాంతరెడ్డి, ఏపీటీఎఫ్ ఆదిబయన్న, రాజశేఖర్, రమణారెడ్డి, ఏపీటీఎఫ్ 1938 బి.బాబాఫకృద్ధీన్, దివాకర్, రూటా, హతావుల్లా, ఈదుల్లా, డీటీఎఫ్ షర్పుద్దీన్, మౌలాలి, వైఎస్సార్‌టీఏ రఘునాథరెడ్డి, గంగాధర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరుపై ‘అనంత’ విజయం
అనంతపురం: ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా ఆదివారం ప్రారంభమైన జర్నలిస్టు రాష్ట స్థాయి క్రికెట్ లీగ్ పోటీల్లో గుంటూరు జట్టుపై అనంతపురం జట్టు విజయం సాధించింది. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు సాగే ఈ టోర్నీని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. తొలి మ్యాచ్‌ను అనంతపురం, గుంటూరు జట్ల మధ్య నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం సుధీర్ జట్టు 15 ఓవర్లకు గాను 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 15 ఓవర్లలో 88 పరుగుల వద్ద చతికిలపడింది. దీంతో అనంతపురం సుధీర్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విశిష్ట అతిథులుగా హాజరై మాట్లాడారు. వృత్తి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లతో సతమతమవుతున్న జర్నలిస్టులకు క్రీడలు మనో వికాసానికి దోహదపడతాయన్నారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జేశాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, గౌరవాధ్యక్షుడు రేపటి రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
సీఐ శేఖర్‌ను సస్పెండ్ చేయాలి
గోరంట్ల: విధి నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరించడమే కాక శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన గోరంట్ల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ బోయ శేఖర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఐగా బాధ్యతలు చేపటినప్పటి నుంచి అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ, అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణను గాలికి వదిలేశారన్నారు. మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళా హోంగార్డు ప్రియాంక తనను క్యాబ్ డ్రైవర్లు మొయినుద్దీన్, షఫి వేధించారని ఫిర్యాదు చేసినా సీఐ పట్టించుకోలేదన్నారు. పైగా వేధింపులకు గురిచేసిన క్యాబ్ డ్రైవర్లకే వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు. గత నెలలో అధికార పార్టీ మాజీ సర్పంచ్, మంత్రి సవిత ప్రధాన అనుచరుడు ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. సీఐ అండదండలతో ఆ మాజీ సర్పంచ్ అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారని గుర్తు చేశారు. భూ సమస్య విషయంలో సీఐ వేధింపులు భరించలేక పెనుకొండకు చెందిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి అయిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సీఐ వ్యవహారశైలిపై నూతన ఎస్పీ దృష్టికి ఫిర్యాదు చేస్తామన్నారు. మహిళా హోంగార్డ్ను వేధించిన క్యాబ్డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షరాలు ఉషశ్రీచరణ్ -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
నల్లచెరువు: మండల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన మేరకు... అల్లుగుండు గ్రామ సమీపంలోని పట్టాలపై అదే గ్రామానికి చెందిన కుళ్లాయప్ప(40) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భార్యతో విడిపోయిన ఆయనకు 10వ తరగతి చదువుతున్న కుమారుడు, 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన కుళ్లాయప్ప ఆదివారం ఉదయం పట్టాలపై రైలు వస్తున్న సమయంలో ఎదురుగా నిలబడ్డాడు. లోకో పైలెట్ గమనించి హారన్ కొట్టినా పక్కకు వెళ్లలేదు. దీంతో రైలు ఢీకొని ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. లోకో పైలెట్ ద్వారా విషయం తెలుసుకున్న జీఆర్పీ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే మండల కేంద్రానికి చెందిన జైతూన్‌బీ(67)కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని రోజులు కుమారుడి వద్ద, మరికొన్ని రోజులు కుమార్తె వద్ద ఉంటుండేది. ఇటీవల మానసిక స్థితి సరిగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది దివారం దేవరింటిపల్లి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం షాపు మార్చాలంటూ నిరసన రొద్దం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అతి సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని మరో ప్రాంతానికి మార్చాలంటూ ఆదివారం వైన్‌షాప్ ఎదుట బహుజన చైతన్య వేదిక నాయకులు శివరామకృష్ణ, బాబుప్రసార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శివరామకృష్ణ మాట్లాడుతూ.. గత 15 రోజుల క్రితం మద్యం దుకాణం మార్చాలని పెనుకొండ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి అతి సమీపంలో మద్యం షాపు నిర్వహించటం రాజ్యాంగ నిర్మాతను అవమాన పరచడమేనని అన్నారు. ఆందోళన కారులతో మద్యం దుకాణం యజమాన్ని చర్చించి దుకాణం మార్పునకు అంగీకరించడంతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రదాన కార్యదర్శి రవికమార్, కంచిసముద్రం గోవిందు, పాస్టర్ ఏలిపా, తిప్పన్న, రాజేశ్, మద్దిలేటి, తిమ్మయ్య, రాజశేఖర్, మణికంఠ, బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. మహిళకు పాముకాటు రాయదుర్గంటౌన్: ఓ వ్యవసాయ మహిళా కూలీ పాముకాటుకు గురై ఆస్పత్రి పాలైంది. బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లికి చెందిన సుశీలమ్మ కూలీ పని నిమిత్తం ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటకు వెళ్లింది. పనిచేస్తుండగా సుశీలమ్మ కాలుకు పాముకాటు వేసింది. గమనించి తోటి కార్మికులు ఆమె హుటాహుటిన రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు విష పురుగులతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
పంతానికి పోయి ప్రాణమే తీశారు..!
అనంతపురం సెంట్రల్: ఊపిరి పోస్తారనుకున్న వారు ఆయువే తీశారు. గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేశారు. మహిళా,శిశు సంక్షేమశాఖ పరిధి లోని శిశుగృహలో నవజాత శిశువు ఆకలితో మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించారు. దీంతో మహిళా,శిశు సంక్షేమశాఖ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం రాత్రి జిల్లాకు వచ్చారు. ఎస్పీ జగదీష్‌కు కూడా విచారణ బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై సమగ్ర విచారణకు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి, ఐసీడీఎస్ పీడీ నాగమణి, సర్వజనాసుపత్రి చిన్నపిల్లల వైద్యులు ప్రవీణ్ సభ్యులుగా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం కమిటీ సభ్యులు శిశుగృహలో విచారణ చేపట్టారు. అనుమానాలెన్నో.. అనారోగ్యంతో నవజాత శిశువు మృతి చెందాడని శిశుగృహ సిబ్బంది చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 20 రోజుల క్రితం కళ్యాణదుర్గం వద్ద ముళ్ల పొదల్లో శిశువు దొరికాడు. ఆస్పత్రిలో చికిత్సల అనంతరం ఆరోగ్యం మెరుగవడంతో శిశుగృహకు రెఫర్ చేశారు. ఈ క్రమంలో మళ్లీ అనారోగ్యం పాలైతే ప్రభుత్వాసుపత్రిలో ఎందుకు చేర్పించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగా, ఇటీవల శిశుగృహలో పనిచేసే ఇద్దరు ఆయాలు గొడవపడినట్లు తెలి సింది. ఈ క్రమంలో శుక్రవారం ఒకరు విధులకు రాలేదు. దీంతో మరో ఆయా ఆక్రోశంతో పిల్లలను పట్టించుకోలేదు. అప్పుడు ఐదుగురు ఆడ శిశువులు, ఒక మగశిశువు ఉన్నాడు. పాలు పట్టించకపోవడంతో పిల్లాడు ఏడ్చి ఏడ్చి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా మారింది. అర్ధరాత్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, విషయం బయటకు పొక్కితే మేనేజర్, సోషల్‌వర్కర్, ఏఎన్ఎం, ఆయాలకు ఇబ్బంది వస్తుందని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసినట్లు తెలుస్తోంది. తెరవెనుక మంత్రాంగం శిశువు మృతికి కారణమైన వారిని పక్కన పెట్టి సెలవు పెట్టిన ఆయాపై చర్యలు తీసుకొని మమ అనిపించేందుకు కొంతమంది తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. శుక్రవారం విధుల్లో ఉన్న ఆయాపై చాలా ఆరోపణలు ఉండడం గమనార్హం. గతంలో పసికందులను గిచ్చడం, గోర్లతో రక్కి గాయపరచడం వివాదాస్పదమైంది. అవినీతి మరకలు.. శిశుగృహలో పనిచేస్తున్న సిబ్బంది అందరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో దత్తత కోసం వచ్చిన ఓ ఎన్ఆర్ఐ మహిళను ప్రస్తుత మేనేజర్ డబ్బు డిమాండ్ చేయడం.. దీంతో ఎన్ఆర్ఐ ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేయడం.. అప్పటి కేంద్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి ఆదేశాలతో కలెక్టర్ వీరపాండియన్ మేనేజర్‌ను ఏకంగా విధుల నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. అయితే కోర్టు ఆదేశాలతో తిరిగి ఆమె అదే ఉద్యోగంలో కొలువు దీరడం గమనార్హం. అలాగే సోషల్ వర్కర్ కూడా హిందూపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళను బంగారు గొలుసు కోసం డిమాండ్ చేసి నగరంలో ఓ నగల దుకాణంలోకి తీసుకెళ్లడంతో బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను వన్‌స్టాప్ సెంటర్‌కు బదిలీ చేయగా.. ఓ అధికారిణిని ప్రసన్నం చేసుకొని మళ్లీ శిశుగృహకు వచ్చారనే విమర్శలు ఉన్నాయి. అందరికీ మెమోలు తప్పు చేసిన వారిపై చర్యలు ఉంటాయి. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చిన్నపిల్లలు ఉన్న చోట తరచూ గొడవ పడుతుంటే ఏం చేస్తున్నావని మేనేజర్‌తో సహా ఆరుగురు సిబ్బందికి మెమోలు ఇచ్చాను. – నాగమణి, పీడీ, ఐసీడీఎస్ తీవ్ర చర్చనీయాంశమైన శిశుగృహలో బాలుడి మృతి సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు గతంలోనూ వివాదాస్పదం కలెక్టర్ దృష్టి సారిస్తేనే అన్నీ కొలిక్కి నవమాసాలు మోసి జన్మనిచ్చినా గంటల వ్యవధిలోనే కాదనుకొని ముళ్ల పొదల్లో పడేశావు. ఈ భూమిపై జీవించే ప్రాప్తం లేదని అనుకున్నా.. అధికారులు వచ్చి అక్కున చేర్చుకున్నారు. శిశుగృహకు తీసుకువస్తే బతకనిస్తారు అని భావించా. ఇక్కడ చూస్తే గ్రూపులతో నాకు పాలు కూడా పట్టలేదు. ఎంత ఏడ్చినా వినిపించుకునే నాథుడు లేరు. ఏడ్చి.. ఏడ్చి నా ప్రాణం పోయింది. ఎందుకమ్మా నాకు ఇలాంటి జన్మనిచ్చావు. – శిశుగృహలో ఆకలితో అలమటించి మృత్యువాత పడిన చిన్నారి ఆక్రందన ఇది. -
టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ
పెనుకొండ: మండలంలోని వెంకటగిరిపాళ్యంలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. వివరాలు... వెంకటగిరిపాళ్యంలో టీడీపీ నేత బోయ తుపాకుల శివయ్య, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గొల్ల కేశవయ్య కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. 2022లో బోయ శివయ్యను పాలసముద్రం వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రమాదం రూపంలో కేశవయ్య హత్య చేయించాడంటూ బోయ తుపాకుల శివయ్య వర్గం కక్ష పెంచుకుంది. అప్పటి నుంచి తరచూ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా చిన్న విషయానికి ఇరువర్గాలు గొడవ పడుతూ ఉన్నాయి. ఆదివారం మక్కాజిపల్లి తండా వద్ద తారస పడిన కేశవయ్య తమ్ముడు గోపాలప్ప, ఆయన వర్గీయులు మల్లికార్జున, నాగేంద్రపై తుపాకుల శివయ్య వర్గానికి చెందిన బోయ ఓబులేసు, మంజునాథ్, గజేంద్ర, చండ్రాయుడు, లితీసు, మల్లికార్జున దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన కేశవయ్య సోదరుడు శివయ్య తదితరులను తొలుత పెనుకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. అనంతరం కేశవయ్యకు చెందిన వర్గీయులు కియా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని 44వ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళను విరమించారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. దాడిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ వర్గీయుల మధ్య నెలకొన్న వివాదంపై ఆ పార్టీ ముఖ్య నాయకులు ఆరా తీసినట్లు సమాచారం. పలువురికి గాయాలు.. అనంతపురానికి తరలింపు కియా స్టేషన్ వద్ద ఆందోళన.. -
అవమాన భారంతో ‘హంద్రీ–నీవా’లో దూకాడు!
ఆత్మకూరు: ఓ మహిళ చెప్పుతో కొట్టడంతో గ్రామంలో పరువు పోయిందంటూ మనోవేదనకు లోనై ఓ వ్యక్తి హంద్రీనీవా కాలువలో దూకాడు. ఈత రాకపోవడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం పంపనూరు తండాలో శనివారం కుళాయి గేట్‌వాల్వ్‌కు సంబంధించి లక్ష్మీనారాయణకు ఆయన పక్కింటి వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో లక్ష్మీనారాయణను పక్కింటి మహిళ చెప్పుతో కొట్టింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళితే... ‘ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుని వస్తుంటావు’ అంటూ పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో మనోవేదనకు లోనైన లక్ష్మీనారాయణ అదే రోజు సాయంత్రం ఆత్మకూరు నుంచి పంపనూరు తండా వరకూ నడుచుకుంటూ వెళ్లాడు. తనను చెప్పుతో కొట్టారని.. ఊళ్లో వాళ్లకి ముఖం చూపించలేనంటూ మార్గమధ్యంలో హంద్రీ–నీవా కాలువలో దూకాడు. ఈత రాకపోవడంతో ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. అతని వెనకాలే ఉన్న కుమారుడు, బామ్మర్ది కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు సకాలంలో స్పందించలేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆదివారం ఉదయం గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో లక్ష్మీనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, లక్ష్మీనారాయణకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
శేష వాహనంపై శ్రీవారు
తాడిపత్రి రూరల్: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాడిపత్రిలోని చింతల వేంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం శేష వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉదయం చింతల వేంకటరమణస్వామి, లక్ష్మీ అమ్మవారి మూలవిరాట్లకు అర్చకులు మురళీస్వామి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత చింతల వేంకటరమణస్వామి ఉత్సవ మూర్తులను శేషవాహనంపై అధిష్టింపజేసి పురవీధుల్లో ఊరేగించారు. దేవేరులతో కలసి శ్రీకృష్ణుడి అలంకరణలో శ్రీవారు దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు. -
పరిటాల దోపిడీకి సరిలేరెవ్వరూ
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల వారి దోపిడీకి ఎవరూ సరిలేరని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మవరం, అనంతపురం, చెన్నేకొత్తపల్లిలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రోజూ రూ. 25 లక్షలు పరిటాల ఇంటికి వెళ్తోందన్నారు. నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్‌షాపులు ఉండగా.. నిత్యం ఒక్కో షాపు నుంచి రూ. 2 వేలు పరిటాల కుటుంబం పేరుతో వసూలు చేస్తున్నారన్నారు. చివరకు నసనకోట ముత్యాలమ్మ గుడినీ వదల్లేదని, అక్కడి బెల్ట్‌షాపు నుంచి రోజూ రూ. లక్ష వెంకటాపురంలోని పరిటాల ఇంటికి వెళ్తోందన్నారు. కంకర మిషన్లకు సంబంధించి ఒక్కో క్రషర్కు ప్రతినెలా రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ధర్మవరంలో బలవంతపు వసూళ్లు ధర్మవరంలో చేనేతలు, వైశ్యుల నుంచి రూ. కోట్లు అక్రమంగా వసూళ్లు చేశారని ఆరోపించారు. చేనేతలు తమ కులస్తుడైన కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వద్ద మొరపెట్టుకుంటే ‘ఏ నా కొడుక్కీ రూపాయి కట్టొద్దండి. నేను అండగా ఉంటా’ అని ఆయన వారికి హామీ ఇచ్చాడన్నారు. తర్వాత సఖ్యత కుదుర్చుకుని సర్దుబాటు చేసుకున్నారని ఆరోపించారు. పరిటాల కుటుంబీకులకు వెంకటాపురంలో కాకుండా అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, ధర్మవరంలో ఉన్న భవనాల విలువ రూ. 150 కోట్లు అని, ఇవికాకుండా వారికున్న కాంప్లెక్స్ భవనాలు, కియా వద్ద భూములు, గ్రానైట్ క్వారీల గురించి మాట్లాడడం లేదన్నారు. ఆదాయం ఎక్కువైపోయి హైదరాబాద్, బెంగళూర్‌లో పబ్‌లు కూడా ఏర్పాటు చేశారని, ఇవికూడా చాలవన్నట్లు అమెరికాలో రెండు, ఆఫ్రికాలో ఒకచోట లిక్కర్ ఫ్యాక్టరీలు తెరిచారన్నారు. అక్రమ ఆదాయంతోనే నేడు పరిటాల సునీత రూ. 3 కోట్ల విలువైన బెంజి కారులో తిరుగుతోందన్నారు. ‘సునీతమ్మా.. తోపుదుర్తిలో మహిళలు నీ మీద రెండు ట్రాక్టర్ల చెప్పులు విసిరారు. 2 వేలమంది పోలీసులతో వచ్చినా ఆరు గంటలపాటు గ్రామంలోకి రాలేకపోయావు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో 164 మంది ఎమ్మెల్యేల కంటే నీకే బాగా తెలుసు. 50 వేల మంది ఇళ్ల నిర్మాణాలు జరగకుండా ఆపినావు. ఆ 50 వేలమంది కాళ్లల్లో ఉన్న చెప్పులు విసిరితే ఆ గుట్టలో నువ్వు కనిపిస్తావా?’ అని మండిపడ్డారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, అనంతపురం, రాప్తాడు వైస్ ఎంపీపీలు కృష్ణారెడ్డి, బోయ రామాంజి, నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, బండి పవన్, లింగారెడ్డి, ఆలమూరు ఓబులేసు, శేఖర్, సత్తిరెడ్డి, మాదన్న, మునిశంకరయ్య, ఈశ్వరయ్య, మీనుగ నాగరాజు పాల్గొన్నారు. టమాట మండీల్లో రోజూ రూ. 5 లక్షలు శ్రీరామ్ ట్యాక్స్ మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నిత్యం రూ. 25 లక్షలు అక్రమ సొమ్ముతోనే పరిటాల సునీత బెంజి కారులో తిరుగుతోంది తోపుదుర్తిలో రెండు ట్రాక్టర్ల చెప్పులు వేసిన సంగతి గుర్తు లేదా? మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి -
●ఒంటెద్దు కళ్లకు గంతలు కట్టి.. పదెకరాల్లో శనగ సాగు
ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన దుబ్బ గోపాల్‌రెడ్డి అనే రైతు చేసిన సాహసం అందరి చేత శభాష్ అనిపించేలా చేసింది. ఆదివారం ఆత్మకూరు సమీపంలోని పొలంలో పాళ్యం వెంకట నారాయణరెడ్డి అనే రైతుకు సంబంధించిన ఎద్దుతో దుబ్బ గోపాల్‌రెడ్డి వినూత్న ప్రయోగం చేశాడు. ఆ ఎద్దు కళ్లకు గంతలు కట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు పదెకరాల్లో శనగ విత్తనం సాగు చేసి అందర్నీ అబ్బురపరిచాడు. చాలా మంది కాడెద్దులతో విత్తన సాగు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పలువురు ఎద్దులకు బదులు ట్రాక్టర్లతో విత్తనం వేస్తున్నారు. కానీ దుబ్బ గోపాల్‌రెడ్డి ఒక ఎద్దుతో అది కూడా దాని కళ్లకు గంతలు కట్టి పది ఎకరాల్లో తొమ్మిది గంటలలోపే విత్తన సాగు చేయడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
అశ్వత్థంలో జేసీ అలజడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: పుణ్యక్షేత్రమైన అశ్వత్థంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అలజడి సృష్టించారు. ఆలయ ఆవరణలో ఉన్నఫళంగా రాళ్ల కుప్పలు ప్రత్యక్షం కావడం పెద్దపప్పూరు మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది. వివరాలు... పెద్దపప్పూరు మండల అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రామిరెడ్డి బొందలదిన్నె గ్రామంలో ఆదివారం విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించారు. విందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నారని ప్రచారం జరగడంతో తాడిపత్రి నుంచి బొందలదిన్నె మార్గ మధ్యలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అశ్వత్థంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఒక్క సారిగా అశ్వత్థం క్షేత్రంలో అలజడి రేగింది. ఇదే క్రమంలో ఆలయ ఆవరణలోని పెన్నానది ఒడ్డున రాళ్లకుప్పలు కనిపించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. విందు కార్యక్రమానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లలేదని తెలియడంతో జేసీ వెనుదిరగడం గమనార్హం. -
మమ్మీడాడీ కావాలి!
అనంతపురం జిల్లా: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందారనే విషయం తెలియని నాలుగేళ్ల బాలుడు తనకు మమ్మీ.. డాడీ కావాలంటూ రోదిస్తుండడంతో వైద్య సిబ్బందితో పాటు రోగులూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న విడపనకల్లు వద్ద రెండు కార్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఘటనలో పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో సీనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విశాఖనగరానికి చెందిన రామ్‌సుధీర్ భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా, అనంతపురంలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ రామ్‌సుధీర్ సైతం మృతిచెందాడు. వీరి కుమారుడు ఆద్విక్ కాలు విరిగి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అంతటి నొప్పిలోనూ తన తల్లిదండ్రుల కోసం చిన్నారి పరితపిస్తూ రోదిస్తున్నాడు. చిన్నారి రోదన చూసిన వారి హృదయాలు బరువెక్కిపోతున్నాయి. -
ప్రియాంక ఆత్మహత్య కేసుపై డీఎస్పీ విచారణ
శ్రీ సత్యసాయి జిల్లా: ప్రియాంక ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఆదివారం గద్వాల డీఎస్పీ మొగు లయ్య, గట్టు ఎస్ఐ మల్లేశ్ చిన్నోనిపల్లె, దీనికి సమీపంలోని మిట్టదొడ్డి గ్రామాల్లో విచారణ చేపట్టారు. ప్రియాంక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థి తులు, చుట్టుపక్కల వారితో ఆమె ఏ విధంగా ఉండేదనే వివరాలను డీఎస్పీ అడిగి తెలుసు కున్నారు. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసు కోవాలన్న ఉద్దేశంతో కొత్తగూడెం జిల్లా పా ల్వంచ నుంచి గద్వాల జిల్లా చిన్నోనిపల్లె గ్రా మానికి చేరుకున్న ప్రియాంక.. దాదాపు రెండు నెలలపాటు ప్రియుడి ఇంటి వద్ద పోరాటం చేసినా.. చివరికి ఆ ప్రేమకథ విషాదాంతంగా మారిన విషయం తెలిసిందే. చిన్నోనిపల్లె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్‌ను పెళ్లి చేసుకోవడానికి పోరాటం సాగించిన ప్రియాంక, తన ప్రయత్నం విఫలం కావడంతో శుక్రవారం విషపు గుళికలను కూల్‌డ్రింక్‌లో కలుపుకొని తాగగా.. గద్వాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం అదే రాత్రి ప్రియాంక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ స్వగ్రామమైన కొత్తగూడెం జిల్లా పాల్వంచకు తరలించారు. యువతి ప్రేమకథ విషాదాంతం -
లైంగికంగా వేధిస్తున్నాడనే హత్య
● వీడిన యువకుడి అనుమానాస్పద మృతి మిస్టరీ ● ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నల్లచెరువు: అల్లుగుండు గ్రామానికి చెందిన అమర్నాథ్ (24) అనుమానాస్పద మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహితను లైంగికంగా వేధిస్తుండటంతో ఆమె భర్త, మరో ఇద్దరి సహకారంతో అమర్నాథ్ను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐ నాగేంద్ర మీడియాకు వెల్లడించారు. అల్లుగుండు గ్రామానికి చెందిన షేక్ దాదాపీర్, అమర్నాథ్ స్నేహితులు. ఈ క్రమంలో దాదాపీర్ తరచూ అమర్నాథ్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఓ రోజు దాదాపీర్ ఇంట్లో లేని సమయంలో అమర్నాథ్ వచ్చాడు. అప్పుడు ఆమె బాత్రూమ్లో ఉండగా.. అమర్నాథ్ సెల్ఫోన్లో వీడియో తీశాడు. అనంతరం తన కోరిక తీర్చాలని, లేకుంటే వీడియో అందరికీ పంపుతానని బ్లాక్‌మేల్ చేశాడు. భార్య ద్వారా విషయం తెలుసుకున్న దాదాపీర్ తన స్నేహితులైన కుమ్మరవాండ్లపల్లికి చెందిన సాదిక్‌బాషా, కదిరికి చెందిన మహమ్మద్ యాసిన్‌లకు చెప్పి.. అమర్నాథ్ ను ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు. పథకం ప్రకారం జూన్ పదో తేదీ రాత్రి 11 గంటల సమయంలో మాట్లాడాలని బాలప్పగారి పల్లి వద్దనున్న గుట్టవద్దకు ఆటోలో తీసుకెళ్లారు. అక్కడ అమర్నాథ్ను రాళ్లతో కొట్టి అతి హతమార్చారు. అనంతరం తాడుతో కాళ్లకు బండరాయి కట్టి తవళంమర్రి పంచాయతీ పరిధిలోని రిజర్వాయర్ కాలువ నీటిలో పడేసి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితులను పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇక తమను వదలరని గ్రహించిన ముగ్గురు నిందితులు దాదాపీర్(ఏ1), మహమ్మద్ యాసిన్ (ఏ2), సాదిక్‌బాషా(ఏ3), శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు కదిరి అర్బన్: అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సకాలంలో డీఏలు, పీఆర్సీ నియమించి మధ్యంతర భృతి ఇస్తామని తదితర హామీల్లో ఏ ఒక్కటీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఫ్యాప్టో చైర్మన్ గజ్జల హరిప్రసాద్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ గౌస్‌లాజమ్ ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 7న విజయవాడలోని ధర్నా చౌక్‌లో వేలాదిమంది ఉపాధ్యాయులతో చేపట్టే ధర్నాకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విడతల వారీగా ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని, బోధనేతర పనులు రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమిత్తం చేస్తామని చెప్పి ఇంతవరకూ చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో మెమో 57 అమలులో మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు జవహర్, ఆంజనేయులు, రమేష్, ఆదిబయన్న, రాజశేఖర్, నారాయణ, తాహిర్వలీ, హనీఫ్ఖాన్, వెంకటేష్‌బాబు, చాంద్‌బాషా, షర్పుద్దీన్, మౌలాలి, వెంకటాచలమయ్య, హతావుల్లా, ఈదుల్లా, శ్రీనివాసులు, రఘునాథరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా అగ్నిగుండ మహోత్సవం
అగళి: మధూడి గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి ఆలయంలో శనివారం రాత్రి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా జరిగింది. మూల విరాట్‌ను వెండి, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి అగ్నిగుండంలో ధూపం వేసి మొక్కులు తీర్చుకున్నారు. ధూపం వేయడం వల్ల కష్టాలు తొలుగుతాయనేది భక్తుల నమ్మకం. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన లింగదబీరప్ప స్వాముల నృత్యంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బ్రహ్మరూపానికి అరటి కొమ్మలు అగ్నిగుండం వద్ద నాటి కొమ్మలు నరికి బలిదానం చేశారు. పురోహితులు ఉపవాసంతో అగ్నిగుండంలో ఉన్న నిప్పును తమ జోళిలో వేయించుకుని స్వామి వారి మూలవిరాట్ వద్దకు తీసుకెళ్లి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులు అగ్నిగుండంలో నడిచారు. పూరోహితుల ఇంటి నుంచి కలశంతో పాటు లింగదబీరులను ఊరేగింపుగా జంబి వృక్షం వద్దకు తెచ్చి పూజలు చేశారు. అనంతంరం దేవాలయంలో పట్టం కూర్చోబెట్టారు. -
అనధికార పశువధశాలల గుట్టురట్టు
హిందూపురం: అనధికారిక పశువధశాలల గుట్టు రట్టయ్యింది. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి పశువులను గోశాలకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. హిందూపురానికి చెందిన కొంతమంది వ్యాపారులు మోతుకుపల్లిలో అక్రమంగా పశువధశాలలు నిర్వహిస్తున్నారు. పశువుల మాంసం విక్రయించడంతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రంగంలోకి దిగారు. మున్సిపల్ అధికారులతో కలిసి అనధికారిక పశువధశాలలపై దాడి చేశారు. అక్కడ వధించడానికి పెద్ద సంఖ్యలో ఉంచిన ఎద్దులు, ఆవులు, దూడలను గుర్తించారు. పోలీసులను మోహరించి... ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 87 పశువులను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఎస్పీ మహేష్, సీఐలు రాజగోపాల్‌నాయుడు, జనార్దన్, అబ్దుల్ కరీం పశువులను ఉంచిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ పేర్చి ఉన్న పశువుల చర్మం, నిల్వ ఉంచిన మాంసం గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్ల క్రితం అనధికారిక వధశాలలను తొలగించామన్నారు. అయినా వ్యాపారులు గుట్టుగా మళ్లీ వధ శాలలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్నారు. ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977 ప్రకారం ఏదైనా పశువును వధించాలంటే వ్యవసాయానికి, పాల ఉత్పత్తికి, సంతానోత్పత్తికి సరికాదని అన్ని పరీక్షలు చేసి నిర్థారించిన తర్వాతే వైద్య పరీక్షలతో అధికార అనుమతితో ధ్రువీకరణ చేసి వధించాల్సి ఉంటుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి పశువులను, వాటి పిల్లలను ఇలా తెచ్చి కట్టి వధించడం నేరమన్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను గోశాలకు పంపామన్నారు. పట్టుబడిన పశువులు ఉన్న ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీటిని వధించి వ్యాపారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో అనధికారికంగా వధశాలలు నిర్వహిస్తూ జంతువ్యర్థాలు అక్కడే పడవేస్తూ అనారోగ్యం పాలు చేస్తున్నారని ఎవరైనా అభ్యంతరం తెలిపితే నిర్వాహకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేస్తారని స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు. అనధికార పశు వధశాలలను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, సీఐలు పశువులను వధించడానికి ఏర్పాటు చేసిన షెడ్లు పోలీసులు, మున్సిపల్ అధికారుల ఆకస్మిక దాడి సీజ్ చేసిన పశువులను గోశాలకు తరలింపు -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
విడపనకల్లు: రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయారు. విడపనకల్లు శివారులో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైజాగ్‌కు చెందిన సుధీర్ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద ఉన్న కియా కంపెనీలో పని చేస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అనంతపురంలో నివాసం ఉంటున్నారు. దసరా పండుగ అనంతరం కుటుంబంతో కలిసి సరదాగా హంపికి వెళ్లాలనుకున్నారు. శనివారం మధ్యాహ్నం అనంతపురం నుంచి సుధీర్ తన భార్య లావణ్య (34), కుమారుడు ఉదయ్‌తో కలిసి శనివారం హంపికి కారులో బయల్దేరాడు. ఇక గోవా నుంచి సంజీవ్‌రెడ్డి, శ్రీనివాసులు, పుల్లయ్యనాయుడు, నాగిరెడ్డి అనంతపురానికి కారులో వస్తున్నారు. విడపనకల్లు శివారులోని పెట్రోలు బంకు సమీపంలో రెండు కార్లు అదుపుతప్పి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జవడంతో లోపల ఉన్న వారంతా కాళ్లు, చేతులు విరిగి కోమాలోకి వెళ్లిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉరవకొండ సీఐ మహానంది, విడపనకల్లు ఎస్ఐ ఖాజాహుస్సేన్ తమ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కార్లలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో అతికష్టం మీద బయటకు తీసి ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో లావణ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రథమ చికిత్స అనంతరం సంజీవ్‌రెడ్డి, పుల్లయ్య నాయుడు, శ్రీనివాసులు, నాగిరెడ్డిలను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులెక్కడ...? రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకువస్తే కంటి వైద్యులు తప్ప మిగిలిన డాక్టర్లు, సూపరింటెండెంట్, సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరు. పోలీసులు, స్థానికులు, కొంతమంది చారిటబుల్ ట్రస్టు సభ్యులు వైద్యులకు సహాయ సహకారాలు అందించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలోని 50 పడకల ఆస్పత్రిలోనే వైద్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం దారుణమని స్థానికులు వాపోయారు. స్పీడ్ బ్రేకర్లు వేయండి విడపనకల్లులో పెట్రోలు బంకు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కెంగూరి ఎర్రిస్వామి, సీపీఎం నాయకులు రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బోయ వెంకటేశులు తెలిపారు. ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టనట్టు ఉంటున్నారని మండిపడ్డారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.కోమాలోకి వెళ్లిన లావణ్య భర్త సుధీర్, కుమారుడు ఉదయ్, చికిత్స పొందుతున్న సంజీవ్‌రెడ్డి మరో ఆరుగురికి తీవ్ర గాయాలు ఎదురెదురుగా కార్లు ఢీకొనడంతో ఘటన -
నంది విగ్రహం చోరీ కేసు ఛేదింపు
చెన్నేకొత్తపల్లి: ముష్టికోవెల వద్ద ఉన్న పురాతన శివాలయంలోని నంది విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విగ్రహం ఎత్తుకువెళ్లిన గుప్తనిధుల వేటగాళ్లలో నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ శనివారం చెన్నేకొత్త పల్లిలోని రామగిరి సర్కిల్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా బడవనహళ్లికి చెందిన మధుసూదన్, న్యూ ఎస్టేట్‌కు చెందిన దీపక్‌శెట్టి, చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలూకా తుమకూర్లహళ్లికి చెందిన భానుపసాద్, తుమకూరు జిల్లా చేలూరుహోబ్లి తాలూకా సి.హరివేసాండ్రాకు చెందిన చందన్‌తో పాటు మరికొందరు గుప్తనిధుల వేటగాళ్లు. వీరు గుప్త నిధుల కోసం సెప్టెంబర్ నాలుగో తేదీ ముష్టికోవెల వద్ద ఉన్న శివాలయంలోని నంది విగ్రహాన్ని చోరీ చేశారు. బొలెరో వాహనంలో విగ్రహాన్ని తుమకూరు జిల్లా పావగడ తాలూకా వీర్లగుడి గ్రామ సమీపంలో ఉన్న మారెమ్మగుడి వద్ద ఉన్న బావి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నంది విగ్రహం ముఖం, గోపురం, వెనుక తోక భాగం పగులగొట్టారు. చోరీ ఘటనకు సంబంధించి గ్రామస్తుడు ఈశ్వరప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం న్యామద్దెల సమీపంలోని బుల్లెట్ కంపెనీ వద్ద నలుగురు నిందితులు మధుసూదన్, దీపక్‌శెట్టి, భానుప్రసాద్, చందన్ ఉన్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. నేరం ఒప్పుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ తెలిపారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కేసును ఛేదించిన పీఎస్ఐ గౌతమి, పోలీసులు పోతన్న శ్రీరాములు, సంజీవరాయుడు, షాకీర్, దస్తగిరి, నవీన్‌ను డీఎస్పీ అభినందించారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఏవైనా ఘటనలు జరిగినపుడు నిందితులను త్వరగా పట్టుకునేందుకు వీలవుతుందని డీఎస్పీ ప్రజలకు సూచించారు. నలుగురు గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్ -
ఓపెన్ చెస్ టోర్నీ సద్వినియోగం చేసుకోండి
ధర్మవరం అర్బన్: తెలుగు రాష్ట్రాల ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హైబ్రో చెస్ అకాడమీ ఆర్గనైజింగ్ డైరెక్టర్ ఈశ్వరప్ప, గౌరవాధ్యక్షుడు డాక్టర్ బీవీ సుబ్బారావు, అధ్యక్షుడు చాంద్‌బాషా, కార్యదర్శి జాకీర్ హుసేన్ కోరారు. పట్టణంలోని కొత్తపేట ఉషోదయ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నవంబర్ 8, 9 తేదీల్లో తెలుగు రాష్ట్రాల స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశ రుసుం రూ.600 ఉంటుందన్నారు. నవంబర్ 8వతేదీ ఉదయం 8గంటల్లోపు ఎంట్రీఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు 99126 47370, 08559–221813 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి మోహన్, వైకే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఐక్య పోరాటం
అనంతపురం అర్బన్: హక్కుల సాధన, జనాభా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కోసం బీసీలు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. జనగణనలోనే కులగణన చేపట్టాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రాయల్ ఫంక్షన్ హాలులో కుల, ప్రజాసంఘాలతో సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసరి శంకర్రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం సలీమ్, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, కురబ సంఘం తరఫున మాజీ మయర్ రాగే పరశురాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్మన్ దాదా గాంధీ, తదితరులు మాట్లాడారు. కులగణన ద్వారానే బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. కర్ణాటక, తెలంగాణ తరహాలో రాష్ట్రంలోనూ కులగణన చేపట్టిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కులగణన పూర్తి చేసి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనధికారికంగానే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు తమది బీసీల ప్రభుత్వమని జపం చేస్తూనే.. మరోవైపు కులగణన చేపట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. కులగణన డిమాండ్‌తో ‘చలో అమరావతి’ చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అవసరమైతే చలో ఢిల్లీ నిర్వహిస్తామన్నారు. సదస్సులో సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, వడ్డెర సంఘం నాయకుడు వడ్డే జయంత్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎస్ఆర్ నాగభూషణం, బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు, మైనారిటీ నాయకులు మైనుద్ధీన్, నాయకులు సంజీవప్ప, శ్రీరాములు, కేశవరెడ్డి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, రాజేష్, సంతోష్‌కుమార్, కుళ్లాయిస్వామి, తదితరులు పాల్గొన్నారు. బీసీ నేతల పిలుపు -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో పలువురు జిల్లా వాసులకు చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ఎం. శంకరయ్య (రాప్తాడు), ఎస్.పి. ప్రశాంత్‌గౌడ్ ( హిందూపురం), జి. పురుషోత్తంరెడ్డి (ధర్మవరం), జి. కుళ్లాయప్ప (ధర్మవరం), ఏ. శంకర్‌రెడ్డి (ధర్మవరం), పి.శ్రీనివాసులు (ధర్మవరం)ను నియమించారు. ఇక పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డి. భారతిరెడ్డి (పుట్టపర్తి)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోండి ● ఆటో డ్రైవర్లకు మెగా చెక్కును అందజేసిన కలెక్టర్, ఎమ్మెల్యే పుట్టపర్తి టౌన్: ప్రభుత్వం అందించే సాయాన్ని ఆటోడ్రైవర్లు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. శనివారం స్థానిక సాయి ఆరామంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘ఆటోడ్రైవర్ల సేవలో’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సిఽంధూరారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం జిల్లాలోని 5,720 మంది ఆటో డ్రైవర్లకు మంజూరు చేసిన రూ 8,58 కోట్లకు సంబంధించిన మెగా చెక్కను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుందన్నారు. .ప్రతి ఆటో డ్రైవర్ క్రమశిక్షణతో మెలగాలని, అప్పడు కుటుంబాలు బాగుపడతాయన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి, రవాణా శాఖ అధికారి కరుణసాగర్‌రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్‌రెడ్డి, పలువురు ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని వివిధ నియోజక వర్గాల్లో జరిగిన ‘ఆటోడ్రైవర్ల సేవలో’ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తేనెటీగల దాడిలో రెవెన్యూ ఉద్యోగులకు గాయాలు వజ్రకరూరు: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం (లిఫ్ట్) వద్ద శనివారం సాయంత్రం రెవెన్యూ ఉద్యోగులపై తేనెటీగలు దాడి చేశాయి. పలువురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన ఎం.రామాంజినేయులు అనే వ్యవసాయ కూలీ నాలుగు రోజుల క్రితం ఛాయాపురం వద్ద ఉన్న హంద్రీ–నీవా ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. ఇప్పటికీ అతని అచూకీ లభించలేదు. దీంతో రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, వజ్రకరూరు పోలీసులు గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం వజ్రకరూరు తహసీల్దార్ నరేష్కుమార్ నేతృత్వంలో ఆర్ఐ సతీష్‌కుమార్, విఆర్వోలు ఛత్రేనాయక్, రంగస్వామి, వీఆర్ఏలు విజయ్, పెన్నయ్య, సుంకన్నతో పాటు మరికొందరు రెవెన్యూ ఉద్యోగులు ఛాయాపురం నుంచి రాగులపాడు లిఫ్ట్ వరకు కాలువ వెంట గాలించారు. రాగులపాడు లిఫ్ట్ వద్ద అకస్మాత్తుగా తేనెటీగలు దాడిచేశాయి. వీఆర్వోలు ఛత్రేనాయక్, రంగస్వామి, వీఆర్ఎలు విజయ్, పెన్నయ్య, సుంకన్న తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే వజ్రకరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. -
యూరియా కోసం తప్పని తిప్పలు
రొద్దం: రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. రెండు నెలలుగా బస్తా యూరియా కోసం రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఇక ఈ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా ఉన్న సవిత అన్నదాత ఆక్రందన వినిపించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ఎప్పటిలాగే పంటల సాగుకు అవసరమైన యూరియా కోసం బారులు తీరుతూనే ఉన్నారు. సగం మందికి కూడా అందలేదు రొద్దంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని గ్రామాల రైతులకు శనివారం యూరియా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు ముందుగానే ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాల రైతులు శనివారం తెల్లవారుజామునుంచే పీఏసీఎస్ కార్యాలయం ఎదుట బారులు తీరారు. గంటల తరబడి వేచి చూశారు. అయినా అధికారులు రైతుకు రెండు బస్తాలు మాత్రమే పంపిణీ చేశారు. దీంతో సగం మంది రైతులకు యూరియా అందలేదు. వారంతా కూటమి సర్కార్‌పై దుమ్మెత్తి పోశారు. మంత్రికి కూడా తమ కష్టాలు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పీఏసీఎస్ సీఈఓ వెంకటేసులు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం 280 బస్తాల యూరియా వచ్చిందని, శనివారం 140 మంది రైతులకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశామని తెలిపారు. పోలీసు భద్రత నడుమ యూరియా పంపిణీ చేస్తున్న దృశ్యంరొద్దం పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూలో రైతుల పడిగాపులు రొద్దంలో తెల్లవారుజాము నుంచే క్యూలో రైతుల పడిగాపులు మంత్రి సవిత ఇలాకాలో అన్నదాతలకు అష్టకష్టాలు ఇబ్బందులు పడుతున్నాం పంటలకు ఇప్పుడు యూరియా చాలా అవసరం. రెండు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పీఏసీఎస్‌ల ఎదుట బారులు తీరినా యూరియా దొరకడం లేదు. రోజూ యూరియా కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో పనులు కూడా చేసుకోలేక పోతున్నాం. పంట పండించే రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేరా...? – సినిమా నారాయణ, రైతు, రొద్దం -
ఉల్లి రైతుల గోడు పట్టదా బాబూ?
రొద్దం: దళారులకు మద్దతు తెలుపుతున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించే రైతులను నిండా ముంచుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ముఖ్యంగా ఉల్లి రైతు గోడు చంద్రబాబు పట్టడం లేదన్నారు. శనివారం ఆమె మండలంలోని సానిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల కల్లాలో ఉన్న ఉల్లిని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పెట్టుబడి...దిగుబడి...ప్రస్తుతం మార్కెట్లో ధర గురించి ఆరా తీశారు. పెట్టుబడి కూడా దక్కడం లేదని తెలిసి రైతులతో కలిసి గొబ్బరంపల్లి–సానిపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేట్టారు. ఉల్లి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతును రాజుగా చూడాలని ఆకాంక్షించారని, నేడు చంద్రబాబు హయాంలోనే కూటమి సర్కార్ రైతును రోడ్డున పడేసేందుకు సిద్ధమైందన్నారు. దళారులకు పెద్దపీట వేస్తూ రైతులను దగా చేస్తోందన్నారు. ఫలితంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కరువైందన్నారు. ఉల్లి మొదులుకుని టమాట, మొక్కజొన్న తదితర ఏ పంటకూ మద్దతు ధర దక్కక రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. అలాగే ఉల్లి రైతులకు ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమ్మ తిమ్మయ్య, మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, సోమందేపల్లి మండల కన్వీనర్, స్థానిక ఎంపీటీసీ శంకర్‌రెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, చిలకల రవి, పలువులు ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కొంటామని మాటిచ్చి చేతులెత్తేస్తారా? కూటమి సర్కార్‌పై ఉషశ్రీచరణ్ మండిపాటు మద్దతు ధర కల్పించాలని రైతులతో కలిసి ధర్నా -
జిల్లా కేంద్రంలోనే ఇంత అధ్వానమా?
పుట్టపర్తి టౌన్: ‘‘రోడ్డుపై మురుగు పారుతోంది. ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తోంది. మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి. ఇది జిల్లా కేంద్రం అని చెప్పకునేందుకు సిగ్గుగా ఉంది. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు సమీపిస్తున్నా...అధికారులు మేల్కోవడం లేదు. అధికారులు నిర్లక్ష్యం వల్ల ‘స్వచ్ఛ సర్వేక్షన్’లో పుట్టపర్తికి 123వ ర్యాంక్ దక్కింది. గతంలో రాష్ట్రంలోనే 4వ ర్యాంక్ సాధించిన పుట్టపర్తికి... ఇప్పుడు 123 ర్యాంక్ రావడం ఏమిటి.. ఈ ర్యాంక్‌ను బట్టి అధికారుల పనితీరు అర్థమవుతోంది’’ అంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అధికారుల పనితీరును తూర్పారబట్టారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. శనివారం మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి అధ్యక్షతన, కమిషనర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ... తమ వార్డుల్లో వీధిలైట్లు వెలగడం లేదని... ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందన్నారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు సమీపిస్తున్నాయని, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ప్రొటోకాల్ కూడా పాటించరా..? అనంతరం వైస్ చైర్మన్ తిప్నన్న మాట్లాడుతూ... అధికారులు కనీసం ప్రొటోకాల్ కూడా పాటించండం లేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిలర్లను ఆహ్వానించడం లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. కానీ అభివృద్ధి పనుల ఆమోదం కోసం మాత్రం తాము కావాల్సి వచ్చామా..అంటూ కమిషనర్‌ను నిలదీశారు. దీంతో టీడీపీ ఫ్లోర్ లీడర్ రత్నచౌదరి కలుగజేసుకుంటూ... మర్యాదలేనప్పుడు రాజీనామా చేయాలన్నారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లంతా ఆయనపై ధ్వజమెత్తారు. తమను ప్రజలు గెలిపించి కౌన్సిల్‌కు పంపారని, ఇలా ఎవరు పడితే వారు రాజీనామా కోరడం తగదన్నారు. అసలు తమను రాజీనామా చేయాలని కోరే హక్కు నీకెక్కడ ఉందంటూ రత్న చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో కౌన్సిల్ కాసేపు రసాబాసగా మారింది. మిగిలిన కౌన్సిలర్లు సర్దిచెప్పడంలో అందరూ శాంతించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి మాట్లాడుతూ... ప్రొటోకాల్ పాటించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఇందులో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్న కౌన్సిల్ చైర్మన్‌గా తన అధికారం తాను ఉపయోగిస్తానని హెచ్చరించారు. ఇక నుంచైనా ప్రొటోకాల్ పాటిస్తూ కౌన్సిలర్లకు గౌరవం ఇవ్వాలన్నారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... ప్రొటోకాల్ తప్పకుండా పాటిస్తామన్నారు. వీధిలైట్లు కూడా తీసుకొచ్చామని, బాబా శతజయంతి ఉత్సవాలకు సమస్యలు లేకుండా చూస్తామన్నారు. కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వార్డుల పునర్విభజనకు ఆమోదం పట్టణం జిల్లా కేంద్రంగా మారడంతో పాటు జనాభా, కాలనీలు పెరిగిన దృష్ట్యా వార్డుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వార్డుల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 27కు పెంచాలని తీర్మానించగా..కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మునిసిపాలిటీ దుస్థితికి 123వ ర్యాంకు అద్దం పడుతోంది కౌన్సిల్ అత్యవసర సమావేశంలో సభ్యుల మండిపాటు ప్రొటోకాల్ ఉల్లంఘనలపై నిలదీత వార్డుల పెంపునకు ఆమోదం -
కదిరిలో ‘దృశ్యం’ తరహా కేసు.. మిస్టరీ వీడింది
తన కూతురితో పాటు తనపైనా కన్నేసిన ఓ మృగాన్ని భార్య కడతేరిస్తే.. ఆ మృతదేహాం ఆనవాలు కూడా దొరక్కుండా మాయం చేస్తాడు ఓ భర్త. అటుపై ఈ కేసులో కుటుంబాన్ని రక్షించుకునేందుకు అతగాడు చేసే ప్రయత్నాల ఆధారంగా అటు మలయాళం, ఇటు తెలుగు, మిగతా భాషల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం’ సిరీస్ అలరిస్తూ వస్తోంది. తాజాగా ఒరిజినల్ లాంగ్వేజ్‌లో మూడో పార్ట్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే.. ఈ సినిమా స్ఫూర్తితో చాలా నేరాలు జరగడమూ చూశాం. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోనూ ఈ తరహాలో జరిగిన ఓ నేరాన్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని కనపడకుండా చేశారు ఇక్కడ. వివరాల్లోకి వెళ్తే.. అల్లుగుండుకు చెందిన అమర్నాథ్ మిస్సింగ్ కేసు రెండేళ్ల తర్వాత సాల్వ్ అయ్యింది. తన భర్త, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో ఓ మహిళ అతన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అమర్నాథ్ తనను అసభ్యంగా ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆమె రగిలిపోయింది. విషయాన్ని తన భర్త దాదా పీర్‌కు చెప్పి వాపోయింది. దీంతో.. అమర్నాథ్పై కోపంతో రగిలిపోయిన దాదా పీర్.. స్నేహితులు సాధిక్, యాసిన్‌లతో కలిసి అమర్నాథ్ను హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని చెర్లోపల్లి రిజర్వాయర్‌లో పడేశాడు. తాజాగా కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం
● సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక పుట్టపర్తి: తమ సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఓబిరెడ్డి హెచ్చరించారు. ఈ నెల 12న విజయవాడలో తలపెట్టిన దశాబ్ద ఐక్యత భవిష్యత్తు పోరాట సభ పోస్టర్లను శుక్రవారం కొత్తచెరువు మండల రీసోర్స్ కార్యాలయ ఆవరణలో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. గత 20 ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో ఎంతో ప్రాధాన్యత ఉన్న సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వరప్రసాద్, భాస్కర్, శ్రీలత, హేమలత, రామమోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువకుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్: బాలికను వేధింపులకు గురి చేయడమే కాక ఆమె తల్లిపై దాడి చేసినందుకు ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ధర్మవరం మున్సిపాల్టీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు 16 సంవత్సరాలుగా బెంగళూరులో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే యువకుడు గత రెండేళ్లుగా బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. బుధవారం రాత్రి బాలిక చెయ్యి పట్టుకుని తన కోరిక తీర్చాలంటూ బెదిరింపులకు దిగాడు. విషయాన్ని బాలిక ద్వారా తెలుసుకున్న తల్లి నేరుగా వెళ్లి ఈశ్వర్‌ను నిలదీయడంతో అతను చెయ్యి చేసుకున్నాడు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో బోల్తా.. వృద్ధుడి మృతి కనగానపల్లి: మండలంలోని చంద్రాచెర్ల సమీపంలో ఆటో బోల్తా పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... గురువారం సాయంత్రం మామిళ్లపల్లి నుంచి చంద్రాచెర్లకు వెళ్తున్న ఆటో 44వ జాతీయ రహదారి దాటిన తర్వాత మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న చంద్రాచెర్లకు చెందిన పెద్దన్న (80) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడటంతో వారిని ధర్మవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
బొలెరో ఢీ – వ్యక్తి దుర్మణం
అమరాపురం: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... అమరాపురం మండలం కాచికుంట గ్రామానికి చెందిన రైతు దాసప్ప గారి హనుమంతరాయప్ప (55) శుక్రవారం ఉదయం జేసీబీ సాయంతో తన పొలంలో పనులు చేయిస్తున్నాడు. మధ్యాహ్నం పనులు చేస్తున్న డ్రైవర్, తదితరులకు భోజనం తీసుకువచ్చేందుకు అమరాపురం గ్రామానికి వచ్చాడు. ఓ హోటల్లో భోజనం పార్సిల్ తీసుకుని తిరుగు ప్రయాణమైన ఆయన ఉదుగూరు గ్రామం వద్దకు చేరుకోగానే హేమావతి వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. దీంతో హనుమంతరాయప్పబైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.పొలాల్లో కేబుల్ అపహరణ పుట్టపర్తి అర్బన్: మండలంలోని మూడు గ్రామాల్లో సుమారు 25 మంది రైతులకు చెందిన వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌ను దుండగులు అపహరించుకెళ్లారు. జగరాజుపల్లి, వెంకటగారిపల్లి, కొత్తచెరువు మండలం గౌనికుంటపల్లి గ్రామాల్లో దసరా పండుగ రోజు, అంతకు ముందు రోజు 25 బోరు బావుల వద్ద కేబుల వైరు, స్ట్రార్టర్లు, ఇతర మోటర్ పరికరాలు అపహరణకు గురయ్యాయి. కొత్తచెరువు రైతుల ఫిర్యాదు మేరకు ఓ అనుమానితుడిని సీఐ మారుతీశంకర్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే సదరు వ్యక్తి టీడీపీ కార్యకర్త కావడంతో కేసు నమోదులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దండి ● కొత్త టీచర్ల శిక్షణ తరగతుల ప్రారంభంలో డీఈఓ క్రిష్టప్ప హిందూపురం టౌన్: అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కొత్త టీచర్లకు జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప సూచించారు. డీఎస్సీ–25కు ఎంపికై న టీచర్లకు శుక్రవారం హిందూపురంలోని బీఐటీ కళాశాలలో శిక్షణ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఈఓ మాట్లాడుతూ... గతాన్ని మరిచిపోకుండా లభించిన అవకాశాన్ని చిత్తశుద్ధితో ఉపయోగించుకుంటే ఏ వృత్తిలోనైనా రాణించగలుగుతారన్నారు. సమాజంలో ఎంతో గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిని సాధించడం గొప్ప విషయమన్నారు. పట్టణ, మారుమూల ప్రాంతాల్లో అవకాశం వచ్చినా అంకితభావంతో సేవలను అందించాలన్నారు. సీఎంఓ మాలిక్, మండల విద్యాశాఖాధికారులు గంగప్ప, ప్రసన్నలక్ష్మి, శేషాచలం మాట్లాడుతూ... విద్యార్థులతో మమేకం అవుతూనే తల్లిదండ్రులు, ప్రజల సహకారంతో విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్డీజీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర కుమార్, స్టేట్ రిసోర్స్ పర్సన్ బాబా, బాలాజీ నాయక్, నర్సిరెడ్డి, శేఖర్ బాబు, రామాంజినేయులు, ఆర్గనైజర్లు శ్రీనివాసరెడ్డి, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బదిలీపై 22 మంది టీచర్ల రాక అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల్లో భాగంగా జిల్లాకు 22 మంది వచ్చారు. శుక్రవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు సమక్షంలో కౌన్పెలింగ్ నిర్వహించి స్కూళ్లు కేటాయించారు. బదిలీల్లో జిల్లాకు వచ్చిన వారిలో హెచ్ఎంలు ఇద్దరు, పీఎస్‌హెచ్‌ఎంలు ఇద్దరు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకరు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకరు, గణితం ముగ్గురు, పీఎస్ ముగ్గురు, బీఎస్ ఒకరు, ఇంగ్లీష్ ఒకరు, పీఈటీ ఒకరు, ఎస్జీటీలు ఏడుగురు ఉన్నారు. కాగా 3, 4 కేటగిరీలకు సంబంధించి కొన్ని స్కూళ్లు మాత్రమే ఖాళీలు చూపడంపై యూటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఆయా కేటగిరీల్లో అన్ని ఖాళీలను చూపించాలని డిమాండ్ చేశారు. -
ఉపాధి అక్రమాలకు చెక్!
అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నూతన మార్గదర్శకాలను ప్రవేశపెడుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పనుల్లో పాలు పంచుకుంటేనే ఉపాధి వేతనం అందుతుంది. లేకపోతే లేదు. గతంలో నకిలీ ఫొటోలతో దోపిడీ గతంలో ఉపాధి హామీ పథకం నిధులను అడ్డగోలుగా దోచేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చేతి వాటం ప్రదర్శించి జాబ్‌కార్డు ఉంటే చాలు ఉపాధి పనులకు రాకున్న వచ్చినట్లు ఎన్ఎంఎంఎస్ యాప్‌లో నకిలీ ఫొటోలను అప్లోడ్ చేసి వేతనాల రూపంలో రూ.కోట్లు కొల్లగొట్టేశారు. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో 2వేలమంది ఉపాధి కూలీలు ఉంటే రోజు వారీగా 1,900 మందికి పైగా పనులకు హాజరైనట్లు ఎన్ఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేశారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గ్రామం మొత్తం ఉపాధి పనులకు హాజరవడంపై జిల్లా అధికార యంత్రాంగమే విస్తుపోయింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే కేవలం 200మంది మాత్రమే కనిపించారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు 20 రోజుల వేతనాలను నిలుపుదల చేశారు. జిల్లాలోని 32 మండలాల్లో ఇదే తంతు కొనసాగినట్లుగా అప్పట్లో అధికారులు గుర్తించారు. ప్రతి సోమవారం వేతనాలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6.86 లక్షల జాబ్‌కార్డులు, 11.58 లక్షల మంది శ్రామికులు ఉన్నారు. వీరిలో అనంతపురం జిల్లాలో 3.16లక్షల జాబ్‌కార్డులు, 5.38 లక్షల మంది శ్రామికులు, శ్రీసత్యసాయి జిల్లాలో 3.70 లక్షల జాబ్ కార్డులు, 6.20 మంది శ్రామికులు ఉన్నారు. వీరందరి జాబ్‌కార్డులను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 80 శాతానికి పైగా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు. పనులకు హాజరయ్యే శ్రామికులకు ఈ–కేవైసీని తప్పనిసరి చేయడంతో కష్టించిన వారికి మాత్రమే ఉపాధి నిధులు వేతన రూపంలో వారి ఖాతాల్లో జమ కానున్నాయి. వారంలో ఎన్ని రోజులు పని చేసినా.. పని చేసిన రోజులకు సంబంధించి ప్రతి సోమవారం వేతనాలు వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. ప్రతి రోజూ రెండు పర్యాయాలు పనులకు హాజరైన ఫొటో, పనులు ముగించిన అనంతరం మరో ఫొటో అధారిత హాజరు నమోదు చేయనున్నారు. కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జాబ్‌కార్డులకు ఆధార్ అనుసంధానం 15 నుంచి జిల్లాలో అమలు -
కనుల పండువగా జాతర
ఉత్సవంలో పాల్గొన్న భక్తులు ప్రత్యేక అలంకరణలో త్రిశక్తి అమ్మాజీ దేవతలు రొళ్ల: మండలంలోని జీరిగేపల్లిలో వెలసిన త్రిశక్తి అమ్మాజీ దేవతల జాతర శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. వేకువజామునే ఆలయంలో మారక్క, గ్యారక్క, ముడుపక్క, కంబదముత్తక్క దేవత మూర్తుల మూల విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి వెండి, బంగారు ఆభరణాలతో పాటు భక్తులు కానుక రూపంలో తీసుకువచ్చిన పట్టువస్త్రాలతో అలంకరించారు. ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో పాలబావి వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి గంగా జలంతో అభిషేకించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఊయాల స్తంభం వద్ద పట్టంపై కూర్చో బెట్టారు. పలువురు భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దాతల సహకారంతో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో అమ్మాజీ ధర్మ ప్రచార సేవ పరిషత్ ట్రస్ట్ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
గొంతు కోసుకుని.. ఆస్పత్రి నుంచి పరుగు తీసి!
ఉరవకొండ/అనంతపురం కార్పొరేషన్: క్షణికావేశంలో పొలాల్లో గొంతు కోసుకున్న ఓ యువకుడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా తప్పించుకుని పారిపోయాడు. అతికష్టంపై పోలీసులు వెంటాడి పట్టుకుని మళ్లీ ఆస్పత్రికి చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం జీజీహెచ్‌లో చేర్పిస్తే అక్కడా తనదైన శైలిలో రెచ్చిపోయి సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఉరవకొండలోని హమాలీ కాలనీకి చెందిన శేఖర్‌కు వివాహమైంది. పిల్లలు లేరు. కుటుంబ కలహాలతో విసుగు చెందిన శేఖర్ క్షణికావేశానికి లోనై గురువారం బూదగవి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి కత్తితో గొంతు కోసుకున్నాడు. అటుగా వెళుతున్న రైతుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా ఒక్కసారిగా అందరినీ తోసేసి రోడ్డుపైకి పరుగు తీశాడు. సీఐ మహనందితో పాటు సిబ్బంది వెంటపడి పరుగు తీసినా చేతికి చిక్కకుండా తప్పించుకోని పారిపోతుండగా స్థానికులు అతి కష్టంపై అడ్డుకుని నిలువరించారు. వెంటనే శేఖర్‌ను పట్టుకుని పోలీసులు ఆస్పత్రికి చేర్చి, దగ్గరుండి చికిత్స చేయించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని జీజీహెచ్‌కి తరలించారు. జీజీమెచ్లో హల్చల్ గురువారం రాత్రి 8 గంటల సమయంలో శేఖర్‌ను జీజీహెచ్‌కు పోలీసులు, కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. అయితే చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తూ క్యాజువాలిటీలోని టేబుళ్లపైకి ఎక్కి కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. చివరకు ఈఎన్టీ వైద్యురాలు డాక్టర్ మధులిక, తదితరులు శేఖర్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి, మెయిన్ ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స చేసి, ఈఎన్టీ వార్డుకు తరలించారు. కాసేపటికి తేరుకున్న శేఖర్ అక్కడున్న సెక్యూరిటీ, అటెండర్‌పై కర్రతో దాడి చేశాడు. శుక్రవారం ఉదయం శేఖర్‌ను మెరుగైన వైద్యం కోసం కడప ఆస్పత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్యాయత్నం జీజీహెచ్‌లో సర్జరీ అయిన తర్వాత సెక్యూరిటీ, తదితరులపై దాడి -
వీరభద్రుని సేవలో కలెక్టర్, ఎస్పీ
లేపాక్షి: దసరా పండుగ సందర్భంగా గురువారం కలెక్టర్ శ్యాంప్రసాద్ దంపతులు, ఎస్పీ సతీష్‌కుమార్ దంపతులు లేపాక్షి వీరభద్రుని సేవలో గడిపారు. ఉదయం ఎస్పీ, సాయంత్రం కలెక్టర్ దంపతులు ఆలయానికి విచ్చేయగా, ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయంలోని దుర్గాదేవి అమ్మవారికి, వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులను అడిగి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. వారి వెంట ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, ఎస్ఐ మునీర్ అహమ్మద్, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో పలువురికి చోటు పుట్టపర్తి టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో జిల్లాకు చెందిన పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా మడకశిర నియోజకవర్గానికి చెందిన హెచ్‌బీ నర్సేగౌడ, వైటీ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ ఎం.తిప్పేస్వామిలను నియమించారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) మెంబర్లుగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, కదిరి నియోజకవర్గానికి చెందిన అత్తార్ చాంద్‌బాషా, బత్తల హరిప్రసాద్‌కు అవకాశం కల్పించారు. జయంత్యుత్సవాలకు ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడపనున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. అందులో భాగంగా యశ్వంతపూర్–హిందూపురం (06518/19) ప్యాసింజరును ఈ నెల 20 నుంచి 26 వరకు గుంతకల్లు జంక్షన్ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే బెంగళూరు–ధర్మవరం మధ్య మరో ప్యాసింజర్ రైలు (06595/96) ఈ నెల 20 నుంచి 26 వరకు నడపనున్నట్లు వెల్లడించారు. -
వైద్యుల వినూత్న నిరసన
పుట్టపర్తి అర్బన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు నాలుగోరోజు శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద దీక్షా శిబిరం వద్ద పలువురు వైద్యులు మోకాళ్లపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు. గత సెప్టెంబర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చంద్రన్న సంచార చికిత్సల్లో పాల్గొన్న వారికి రూ. 5 వేల ప్రోత్సాహకం, పీజీ ఇన్ సర్వీస్ కోటా పునరుద్ధరణ, టైం బౌండ్ ప్రమోషన్లను తక్షణమే పరిష్కరించాలని, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు అలవెన్సులు, 2020లో చేరిన వైద్యులకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పెద్దలు ఇప్పటికై నా వారితో చర్చలు జరపాలని ప్రజలు కోరుతున్నారు. నాలుగో రోజు మోకాళ్లపై కూర్చుని ఆందోళన -
బాబా శత జయంతిని వైభవంగా చేద్దాం
ప్రశాంతి నిలయం: సమష్టి కృషితో సత్యసాయి శత జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. బాబా శత జయంత్యుత్సవాలకు దేశవిదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సత్యసాయి శత జయంతి వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ పుట్టపర్తిలోని కీలక ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత ప్రశాంతి నిలయంలోని గణేష్ గేట్, సాయికుల్వంత్ సభా మందిరం, శాంతిభవన్, వెస్ట్గేట్లను వారు పరిశీలించారు. ప్రముఖులు, విదేశీ భక్తులు, ప్రజలకు మందిరంలోకి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా మార్గాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం చిత్రావతి బ్రిడ్జి కూడలి, హారతి ఘాట్, ఏపీఐఐసీ ఇండసీ్ట్రయల్ పార్కు వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించి ప్రముఖులు, వీవీఐపీల రాకపోకలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియం, ప్రైమరీ పాఠశాల, శ్రీనివాస గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాలను పరిశీలించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పుట్టపర్తి టౌన్: పచ్చని పుట్టపర్తిని ఆవిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఆటవీశాఖ ఆధ్వర్యంలో పోలీస్‌పరేడ్ మైదానంలో ‘వనం– మనం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లా అధికారులు, ప్రజలు వారి పరిధిలోని ఖాళీ స్థలంలో మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. ప్రస్తుతం 15 లక్షలు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన వారు ఆధార్‌కార్డ్ సమర్పించి మొక్కలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపు -
పండుగ పూట విషాదం
ఉరవకొండ/ వజ్రకరూరు: ఆ దంపతులు వారసుడి కోసం ఎన్నో నోములు నోచారు. ఎన్నో గుళ్లు తిరిగారు. ముగ్గురు కుమార్తెల తర్వాత కుమారుడు పుట్టడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. అలా సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం ఒక కుదుపు కుదిపేసింది. దసరా పండుగకు ఇంటిల్లిపాది కొత్త దుస్తులు ధరించి సంబరంగా ఉన్నారు. తండ్రీ పిల్లలు అమ్మవారి దర్శనం కోసం బయల్దేరారు. ‘అమ్మా గుడి నుంచి రాగానే నాకు ఓళిగ చేసి పెట్టాలి’ అంటూ కొడుకు చెప్పాడు. అవే కొడుకు చివరి మాటలు అవుతాయని ఆ తల్లి ఊహించలేదు. అరగంటకే రోడ్డు ప్రమాదంలో భర్త, కుమారుడు దుర్మరణం చెందారన్న వార్త ఆమెను కుదిపేసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మీనుగ సుంకన్న (43), నాగలక్ష్మి దంపతులు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు సులోచన, కల్పన, భవానితో పాటు కుమారుడు సుదర్శన్ (10) సంతానం. గురువారం ఉదయం దసరా పండుగను పురస్కరించుకుని అమ్మవారి దర్శనం కోసం వజ్రకరూరు మండలం కడమలకుంటకు ద్విచక్రవాహనంపై ఉరవకొండ నుంచి తన కుమారుడు సుదర్శన్, కుమార్తెలు కల్పన, భవానితో కలిసి సుంకన్న బయల్దేరాడు. భార్య నాగలక్ష్మి, పెద్ద కుమార్తె సులోచన ఇంటివద్దే ఉన్నారు. పిల్లలతో కలిసి వెళ్తుండగా ద్విచక్రవాహనాన్ని మార్గ మధ్యంలో పీసీ ప్యాపిలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుంకన్న, కుమారుడు సుదర్శన్ అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. అటువైపు వెళుతున్న వాహనదారులు గమనించి వెంటనే వజ్రకరూరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ సుంకన్న భార్య గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలచివేసింది. గాయపడిన కుమార్తెలను ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు. సుంకన్న భార్య ఫిర్యాదు మేరకు వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడి దుర్మరణం తీవ్రంగా గాయపడిన ఇద్దరు కుమార్తెలు -
పిల్లలకు పాఠాలు చెప్పి పరీక్షలు నిర్వహించే టీచర్లే... ఇప్పుడు పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ‘టెట్’ రాయకుండా ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులంతా తాజాగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) రాయాల్సిందే. అదీ రెండేళ్లలో
2,078 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు8,307 ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సంఖ్యకదిరి: విద్యారంగంలో సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1 నుంచి 10వ తరగతి వరకూ 9 రకాల బడులను తీసుకొచ్చింది. పలు రకాల యాప్‌లతో టీచర్లను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతోనే ఇబ్బందులు పడుతున్న టీచర్లపై ఇప్పుడు ‘టెట్’ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) బండ పడింది. 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు ఇప్పుడు ‘టెట్’ రాసి అర్హత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో వారిలో ఆందోళన మొదలైంది. అయితే ఏళ్లుగా విద్యార్థులకు బోధిస్తున్న తమకు ఇప్పుడు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నిర్వహించడం ఏమిటంటూ ఉపాధ్యాయ సంఘాలు నాయకులు అంటున్నారు. పదోన్నతులకూ ‘టెట్’తో లింకు సుప్రీం తీర్పు నేపథ్యంలో ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు ‘టెట్’ రాసి ఉత్తీర్ణులు కావాలి. లేకపోతే ఉద్యోగం వదులుకోవాల్సిందేనా..? అనే టెన్షన్ టీచర్లను వెంటాడుతోంది. ఇక ‘టెట్’ పాస్ కాని వారికి పదోన్నతులు కూడా ఉండవని సుప్రీం తీర్పులో పేర్కొంది. ఐదేళ్లలోపు సర్వీసు మిగిలి ఉన్న ఉపాధ్యాయులకు ‘టెట్’ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ... వారికి పదోన్నతులు రావాలంటే ‘టెట్’ ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్’ అర్హత పరీక్షకు సంబంధించి 2010 ఆగస్టు 23న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ)కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకానికి ‘టెట్’ ఉత్తీర్ణత తప్పనిసరిగా పేర్కొంది. జీఓ జారీలో ముందు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇప్పుడు వారు కూడా (ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్న వారు) టెట్ రాయాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆందోళన మొదలైంది. 2012 తర్వాత టీచర్ వృత్తిలో చేరిన వారు ఇప్పటికే ‘టెట్’ పాస్ అయిన విషయం తెలిసిందే. కష్టమైన పరీక్షే ఎప్పుడో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు ‘టెట్’ పాస్ కావాలంటే కాస్త కష్టమే. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీ కేటగిరీ వారు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వారు 40 శాతం మార్కులు సాధించాలి. అయితే టెట్ పేపర్–1 పాస్ కావాలంటే చైల్డ్ డెవలప్మెంట్, తెలుగు, ఆంగ్లం, గణితం, పర్యావరణానికి సంబంధించిన అంశాలన్నీ చదవాలి. పేపర్–2లో కూడా అదే పరిస్థితి. బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్, ఇలా సంబంధం లేని సబ్జెక్టులు ‘టెట్’లో పెట్టి పాస్ కావాల్సిందే..అంటే ఎలా? అని టీచర్లు మండిపడుతున్నారు. అందుకే తమకు ప్రత్యేక ‘టెట్’ నిర్వహించాలని కొందరు, ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్న తమకు ‘టెట్’ అవసరమే లేదని ఇంకొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. స్పందించని కూటమి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,078 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1,27,104 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 8,307 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు టెట్‌పై ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం సుమారు 3,500 మంది దాకా ఉపాధ్యాయులు ‘టెట్’ పాస్ కావాల్సిందే. లేని పక్షంలో వారంతా తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుంది. సుప్రీం తీర్పుపై కూటమి ప్రభుత్వం స్పందించి టీచర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారంతా ఎదురు చూస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువడి నెల దాటినా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కలవరపెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు రెండేళ్లలో టెట్ పాస్ కాకపోతే ఇంటికే సీనియర్ ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన తీర్పుపై పునరాలోచించాలని ఉపాధ్యాయుల విజ్ఞప్తి సుప్రీం తీర్పుపై నేటికీ స్పందించని కూటమి సర్కార్3,500 మంది సుప్రీం తీర్పుతో ‘టెట్’ రాయాల్సిన టీచర్లు (సుమారు) -
అనుభవమే గొప్ప అర్హత
విద్యారంగంలో అనుభవమే గొప్ప అర్హత. సీనియర్ టీచర్ల బోధనా నైపుణ్యాలను ‘టెట్’ పరీక్షతో కొలవలేం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దీనిపై పునఃసమీక్షించాలి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలి. – హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్టీయూ పునరాలోచన చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. ఉపాధ్యాయ నియామకాలు జరిగినప్పుడు లేని నిబంధన.. ఇప్పుడు పెట్టడం సరికాదు. కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటించాలి. – కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాలు చొరవ చూపాలి రెండేళ్లలో టీచర్లు ‘టెట్’ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్నారు. వయసు, ఆరోగ్య సమస్యలు, ఇంటి బాధ్యతలు, ఇలాంటి తరుణంలో టెట్‌కు ప్రిపేర్ కావాలంటే కష్టం. దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ చూపి తగు న్యాయం చేయాలి. – జయచంద్రారెడ్డి, యూటీఎఫ్ నేత సుప్రీం తీర్పు వర్తిస్తుంది తమిళనాడుకు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు ‘టెట్’పై కీలక తీర్పునిచ్చింది. అది మనకూ వర్తిస్తుంది. ఉద్యోగంలో కొనసాగాలన్నా.. పదోన్నతి పొందాలన్నా ‘టెట్’ ఉత్తీర్ణత తప్పనిసరి అని తీర్పులో స్పష్టంగా ఉంది. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపునిచ్చారు. –కిష్టప్ప, జిల్లా విద్యాశాఖాధికారి -
ముగిసిన వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం
ప్రశాంతి నిలయం: దసరాను పురస్కరించుకుని విశ్వశాంతిని కాంక్షిస్తూ సత్యసాయి సన్నిధిలో చేపట్టిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత యజ్ఞ వస్తువులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ర్యాలీగా పూర్ణచంద్ర ఆడిటోరియానికి వెళ్లి అక్కడ పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పూర్ణాహుతి ముగిసిన తర్వాత వేదపండితులు యజ్ఞ జలాన్ని భక్తులపై చల్లి ఆశీస్సులు అందజేశారు. పరవశించిన భక్తజనం దసరా వేడుకల్లో భాగంగా గురువారం పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు స్ఫూర్తి రావు బృందం సభ్యులు సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ వారు ఆలపించిన గీతాలతో భక్తజనం పరవశించారు. చక్కటి భక్తి గీతాలతో నిర్వహించిన సంగీత కచేరీతో మైమరచిపోయారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ దసరా వేడుకల్లో పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకలు ముగిసిన అనంతరం ప్రశాంతి నిలయం నార్త్ బిల్డింగ్స్ వద్ద గల నిత్యాన్నదాన మందిరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజు అన్న ప్రసాద వితరణ చేశారు. -
అందని పశు వైద్యం
పుట్టపర్తి టౌన్: స్థానిక ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం పాడి ఆవును తీసుకొచ్చిన రైతు ఇబ్బంది పడ్డాడు. పశువైద్యశాలలో ఏడీ సుధానిధి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఈశ్వర్‌నాయక్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడీ సుధానిధి ఇటీవలే బదిలీపై ఇక్కడకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే బుధవారం ఏడీ, ఎల్ఎస్ఓ ఇద్దరూ ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరయ్యారు. అదే సమయంలో చుట్టు పక్కల గ్రామాల నుంచి పశువులను చికిత్స కోసం తొలుకొచ్చిన రైతులు ఉదయం 8 నుంచి 11గంటల వరకూ పడిగాపులు కాశారు. చివరకు సిబ్బంది అందించిన నామమాత్రపు వైద్యంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు. -
ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ దీక్షలు
పుట్టపర్తి అర్బన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసనలు, ధర్నాలు చేసినా స్పందించని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే సమ్మె బాట పట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు ఆమరణదీక్షలకు సిద్ధమయ్యారు. హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద వైద్యులు చేపట్టిన రిలేనిరాహార దీక్షలు రెండో రోజు బుధవారం కొనసాగాయి. వైద్యులకు ఏపీ ల్యాబ్ టెక్నీషియన్ అసోషియేషన్ అధ్యక్షుడు జనార్దన్, జనరల్ సెక్రెటరీ మస్తాన్ వలి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఏపీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు కార్తిక్, ట్రెజరర్ జయతేజ నాయక్, ఈసీ మెంబర్ విజయ్‌భాస్కర్ తదితరులు మద్దతు తెలిపారు. అనంతరం పలువురు వైద్యులు మాట్లాడుతూ...ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు విఫలమైతే ఈనెల 3వ తేదీ నుంచి విజయవాడ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న ఇన్‌సర్వీస్ ఫీజు చాలా తక్కువ అన్నారు. 20 ఏళ్లుగా పని చేస్తున్న వైద్యులకు సైతం ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. కనీసం మరుగుదొడ్లు కూడా లేని చోట పగలంతా పని చేస్తున్నామన్నారు. తాము టైం బాండ్ ప్రమోషన్లు, చంద్రన్న సంచార చికిత్సలో రూ.5 వేలు భత్యం, ఇన్ సర్వీస్ పీజీ కోటా, నోషనల్ ఇంక్రిమెంట్లు, 50 శాతం మూల వేతనం, పని గంటలు, జాబ్ చార్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కష్ట పడ్డామని, తమ కష్టాన్ని అర్థం చేసుకుని తమ హక్కులను, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాగా బుధవారం నాటి సమ్మెలో డాక్టర్ షిఫా సుల్తానా తన పసిపాపతో పాల్గొనడం విశేషం. స్పష్టం చేసిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు రెండోరోజూ కొనసాగిన రిలేనిరాహార దీక్షలు -
కొత్త టీచర్లకు రేపటి నుంచి శిక్షణ
హిందూపురం టౌన్: డీఎస్సీ–25 ద్వారా కొత్తగా ఎంపికై న జిల్లాలోని టీచర్లకు రేపటి (శుక్రవారం) నుంచి ఈనెల 10 వరకు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం హిందూపురంలోని బీఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని బుధవారం డీఈఓ కృష్ణప్ప పరిశీలించారు. ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి విషయంలో ఏమాత్రం లోటుపాట్లు ఉండకూడదన్నారు. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకూ ఇండక్షన్ ట్రైనింగ్ కొనసాగుతుందన్నారు. నూతన ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు మెరుగు పడేలా శిక్షణ కొనసాగాలని శిక్షకులకు సూచించారు. కార్యక్రమంలో సీఎంఓ మాలిక్, ఎంఈఓలు గంగప్ప, ప్రసన్నలక్ష్మి, సీఆర్ఎంటీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్‌లు పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో గ్రామస్తుల నిరసన తనకల్లు: కనసానిపల్లి గ్రామస్తులు తాగునీటి సమస్యపై బుధవారం తనకల్లు పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిదెలతో నిరసన తెలిపారు. రెండు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ట్యాంక్‌ను నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో లోపల చెత్తాచెదారం పేరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్యాంక్‌కు అమర్చిన పైపులు మూసుకుపోవడంతో నీరు బయటకు రావడం లేదని తెలిపారు. ట్యాంక్‌ను శుభ్రం చేసి కుళాయిలకు సురక్షిత నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాజారెడ్డి, యశ్వంత్‌రెడ్డి, రమణారెడ్డి, ఎర్రంరెడ్డి, అనిత, లక్ష్మీదేవి, జయమ్మ, రాములమ్మ, శకుంతల, అనసూయమ్మ, రాములమ్మ, మల్లమ్మ, చౌడమ్మ, మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
పన్నులు తగ్గినా పాత ధరలే
జీఎస్టీ తగ్గించామని కేంద్ర ప్రభుత్వం ఊదరగొడుతోంది. కానీ జిల్లాలో ధరలు తగ్గింది లేదు. ఎక్కడజూసినా పాత రేట్లకే అమ్ముతున్నారు. గట్టిగా అడిగితే నీకు ఇష్టమైతే కొనుక్కో.. లేదంటే వెళ్లిపో. పెద్ద రూల్ మాట్లాడుతున్నావు.. అని కోప్పడుతున్నారు. – మురళీకృష్ణ, ఓడీ చెరువు ఎవరికి లాభం? జీఎస్టీ తగ్గింపు మంచిదే. సామాన్య ప్రజలకు ఈ ఫలాలు అందితే సంతోషమే. కానీ ఎక్కడా ఆ ప్రభావం కనబడలేదు. టూత్‌పేస్టులు, బ్రష్‌లు, పౌడర్లు, సైకిళ్లు, వ్యవసాయ పరికరాలు, మందులు వంటివి 5 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. కొన్ని రకాల మందులపై జీఎస్టీ పూర్తిగా లేకుండా చేశారు. కానీ ఈ తగ్గింపు ధరలు జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. – రామమోహన్‌రెడ్డి, అడ్వకేట్, కదిరి -
వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
అనంతపురం సిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ముందుకు సాగుతోందని ఆ సంస్థ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ (జీఎం) షేక్ ముజీబ్‌పాషా పేర్కొన్నారు. అనంతపురంలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మారిన కాలానుగునంగా ప్రైవేటు సంస్థలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ లోనూ అనేక సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు మెరుగైన, వేగవంతమైన సేవలందించడమే లక్ష్యంగా దూసుకుపోతోందని వివరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లు 13,208 ఉండగా, ఓఎల్టీఎస్ 189 కనెక్షన్లు ఉన్నాయన్నారు. 2జీ/4జీ టవర్లు 343 ఉండగా, 2,79,591 మంది ప్రీపెయిడ్ వినియోగదారులు ఉన్నారన్నారు. 2,679 మంది పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు, 790 ఐఎల్ఎల్ కనెక్షన్లను కలిగి ఉన్నామన్నారు. సమష్టి కృషితోనే తమ సంస్థ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని, వచ్చే ఏడాదిలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలు, స్కీముల అమలు కారణంగా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. అనంతరం నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీజీఎం బాలగంగాధర్‌రెడ్డి, ఏజీఎం బాలాజీ, ఎస్డీఈలు రేవతి, హేమంత్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, జేటీఓలు మాళవిక తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్‌పాషా అనంత వేదికగా అట్టహాసంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారం మాటున అక్రమ రవాణా సాగిస్తోంది. అయినా మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల కళ్లెదుటే పెద్దసంఖ్యలో వాహనాల్లో మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. కొత్తచెరువు: అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు కొత్తచెరువులో మట్టిదందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తచెరువులోని మసీదు గుట్టను కొల్లగొడుతున్నారు. రోజూ 50 నుంచి 100 టిప్పర్ల పైనే మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.4వేల చొప్పున విక్రయిస్తుండగా రోజుకు రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ అక్రమంగా సంపాదిస్తున్నట్లు సమాచారం. అయినా ఏ పోలీసు అధికారి కానీ, మైనింగ్ అధికారులు కానీ కన్నెత్తి చూడడంలేదు. బడా రాజకీయ నేతల కనుసన్నల్లోనే మట్టి దందా జరుగుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చుట్టుపక్కల ఎక్కడ వెంచర్లు వేసినా, ఎక్కడ భూమి చదను చేయాలన్నా అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రమే మట్టి రవాణా చేస్తుండడం గమనార్హం. రాత్రి సమయంలోనే అక్రమ రవాణా.. కొత్తచెరువులోని నాగిరెడ్డిపల్లి రోడ్డు సమీపంలో దాదాపు ఆరు ఎకరాల్లో మసీదు గుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టకు అనుకుని ఉన్న స్థానిక టీడీపీ నేత పట్టా భూమిని అడ్డుగా పెట్టి అక్రమ దందాకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలే మట్టి దందాను కొనసాగిస్తుండడంతో ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు స్థానికులు సైతం భయపడుతున్నారు. దీంతో మాఫియా మరింత రెచ్చిపోతోంది. సహజ వనరులను కరిగించేస్తోంది. గడిచిన వారం రోజులుగా గుట్టను పెకలించడంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్ట కాస్త నాలుగు ఎకరాలకు పరిమితమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మసీదు గుట్ట కాస్త మాయం అవడం ఖాయమని స్థానికులు అంటున్నారు. కరిగిపోతున్న కొత్తచెరువు మసీదు గుట్ట కొందరు టీడీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమ రవాణా అనుమతులు లేకుండా తవ్వకాలు చర్యలు తప్పవు గత సోమవారం అందిన సమాచారం మేరకు రాత్రి తనిఖీ చేపట్టి మట్టి తవ్వకాలను అడ్డుకున్నాం. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపులు చేపట్టరాదు. సొంత పట్టా భూమిలో మట్టి తవ్వాలన్నా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే ఎంతటివారినైనా ఉపేక్షించబోం. మసీదు గుట్టలో సాగుతున్న అక్రమ తవ్వకాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – బాలాంజనేయులు, తహసీల్దార్, కొత్తచెరువు -
జీఎస్టీ సంస్కరణ ఫలాలు అందరికీ అందాలి
● కలెక్టర్ శ్యాం ప్రసాద్ ● బుక్కపట్నంలో పలు షాపుల తనిఖీ పుట్టపర్తి అర్బన్: జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతోనే ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన బుక్కపట్నం తేరు బజార్‌లోని పలు షాపులను సందర్శించారు. పలువురు స్థానికులకు జీఎస్టీ తగ్గింపు..తద్వారా వస్తువుల ధరల్లో వ్యత్యాసం గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జీఎస్టీలో స్లాబులు తగ్గించినందున ప్రజలు నిత్యం ఉపయోగించే టూత్ పేస్ట్ నుంచి ఏసీ వరకూ రైతులు వినియోగించే ట్రాక్టర్, యువత కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాల వరకూ అన్ని రకాల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. దీర్ఘ కాలిక వ్యాధులకు ఉపయోగించే ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారన్నారు. వీటిని ప్రజలకు తెలియజేసి జీఎస్టీ లబ్ధిపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం జీఎస్టీ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ నరసింహులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జబ్బీర్ బాషా పాల్గొన్నారు. చెరువుల్లో నీరు శాశ్వతంగా నిలిచేలా చర్యలు ప్రశాంతి నిలయం: ఏడాదిలోపు జిల్లాలోని అన్ని చెరువులు, నీటి ట్యాంకుల్లోని నీరు శాశ్వతంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ట్యాంకుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారంపాండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో నీటి సంరక్షణ సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో చిన్న నీటి పారుదల శాఖ ఈఈ గురుమూర్తి, డీఈ గంగాద్రి, ఏఈ షబానా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఇన్చార్జ్ పీడీ శ్రీలక్ష్మి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎస్ఈ రాజా స్వరూప్ పాల్గొన్నారు. -
అనాథ బాలుడిని అక్కున చేర్చుకున్న ఖాకీ
కొత్తచెరువు: అనాథ బాలుడిని అక్కున చేర్చుకుని స్థానిక పీఎస్ సీఐ జి.మారుతీశంకర్ మానవత్వాన్ని చాటారు. వివరాలు... గస్తీలో భాగంగా మంగళవారం రాత్రి కొత్తచెరువులోని నెహ్రూ సర్కిల్ వద్దకు చేరుకున్న సీఐ మారుతీశంకర్ అక్కడ ఒంటరిగా తచ్చాడుతున్న 12 ఏళ్ల బాలుడిని గుర్తించి, దగ్గరకు పిలుచుకుని ఆరా తీశారు. కొత్తచెరువు మండలం నాగిరెడ్టిపల్లికి చెందిన అంజి కుమారుడు ఎనుముల రాజశేఖర్‌గా గుర్తించారు. తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో అనాథగా రోడ్లపై తిరుగుతున్నట్లుగా బాలుడు పేర్కొనడంతో సీఐ మారుతీశంకర్ చలించిపోయారు. అలాగే రోడ్డుపై వదిలేస్తే వ్యసనాలకు బానిసవుతాడని భావించిన ఆయన.. వెంటనే తన వాహనంలో బాలుడిని ఎక్కించుకుని పీఎస్‌కు చేర్చారు. బుధవారం ఉదయం బార్బర్‌ను పిలిపించి శుభ్రంగా కటింగ్ చేయించారు. నూతన దుస్తులను ఇప్పించారు. అనంతపురంలోని చైల్డ్వెల్ఫేర్ కార్యాలయాన్ని సంప్రదించి, వారి ద్వారా కడపలోని అనాథ శరణాలయంలో ఆశ్రయం, చదువులు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. సకాలంలో బాలుడి భవిష్యత్తు అంధకారం కాకుండా కాపాడిన సీఐ మారుతీశంకర్ చొరవను స్థానికులు తెలుసుకుని అభినందించారు. -
నేడు ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు
ప్రశాంతి నిలయం: దసరా వేడుకలు గురువారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరగనున్నాయి. పండుగ నేపథ్యంలో సాయికుల్వంత్ సభా మందిరాన్ని, సత్యసాయి మహాసమాధిని అలంకరించారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ చేపట్టిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం గురువారం పూర్ణాహుతితో ముగియనుంది. ఆరు రోజులుగా జరుగుతున్న యజ్ఞంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అలరించిన సాయికథ.. సత్యసాయి జీవిత చరిత్రను గాన రూపంలో వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన ‘మధురం మధురం సాయి కథ’ సంగీత కచేరీ భక్తులను మైమరపింపజేసింది. బుధవారం సాయంత్రం ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం క్యాంపస్ ఉపన్యాసకురాలు ప్రొఫెసర్ సుమారావు సత్యసాయి ప్రేమ తత్వాన్ని వివరిస్తూ ప్రసంగించారు. వేయి తల్లుల ప్రేమను ఒక్క సత్యసాయి భక్త కోటికి పంచారని వివరించారు. అనంతరం సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు ‘మధురం మధురం సాయి కథ’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. -
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు
పెనుకొండ రూరల్: విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో తులతూగాలని ఆకాక్షించారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని చేపట్టిన ప్రతి పనీ విజయవంతం కావాలని కోరుకున్నారు. ప్రతిరైతూ ఈ–క్రాప్ చేయించుకోవాలి చెన్నేకొత్తపల్లి: పంటసాగు చేసిన ప్రతి రైతూ తప్పనిసరిగా ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేయించాలని జిల్లా వ్యవసాయాధికారి రాము నాయక్ సూచించారు. బుధవారం మండల వ్యవసాయాధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్యాదిండి గ్రామంలో ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి రాము నాయక్ మాట్లాడుతూ... ఈ–క్రాప్ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించబోవన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాలపై జీఎస్టీ తగ్గించిందని, దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. పంటలసాగులో యూరియాకు బదులుగా సేంద్రియ ఎరువులు వాడాలన్నారు. కార్యక్రమంలో ధర్మవరం ఏడీ లక్ష్మానాయక్, పలువురు రైతులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. తండ్రి పోషణ బాధ్యత పిల్లలదే● కుమార్తెలకూ ఈ నిబంధన వర్తిస్తుంది ● ఇద్దరు బిడ్డలు నెలకు రూ.10 వేలు తండ్రికి ఇవ్వాలని ఆర్డీఓ తీర్పు ధర్మవరం అర్బన్: పెంచి పెద్దచేసి, చదివించి, వివాహాలు చేసిన తండ్రి వృద్ధాప్యంలో ఉండగా పట్టించుకోని ఇద్దరు కుమార్తెలకు ధర్మవరం ఆర్డీఓ మహేష్ గుణపాఠంలాంటి తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని సాయినగర్‌లో నివసిస్తున్న చారుగుండ్ల అహోబులప్ప(62)కు ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇద్దరికీ విద్యాబుద్ధులు నేర్పించి వివాహాలు చేశాడు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోవడంతో అహోబులప్పను పట్టించుకునే వారు కరువయ్యారు. వృద్ధాప్యంతో ఏ పనీ చేసుకోలేని పరిస్థితుల్లో కుమార్తెల వైపు ఆశగా చూసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆయన తనకు న్యాయం చేయాలని ధర్మవరం ఆర్డీఓను కోరారు. ఈ కేసును మానవత్వంతో విచారించిన ఆర్డీఓ మహేష్... వృద్ధుడైన అహోబులప్ప ఆర్థిక, వైద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు కుమార్తెలు నెలకు రూ.10 వేలు (ఒక్కో కుమార్తె రూ.5 వేల చొప్పున) తండ్రి జీవనోపాధి, వైద్య ఖర్చుల కోసం చెల్లించాలని తీర్పునిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కాపీని అహోబులప్పకు అందించారు. వయో వృద్ధులు ఎవరైనా సరే ఏదైనా సమస్య ఎదుర్కొంటుంటే తనను సంప్రదించాలని సూచించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కుమారులతో పాటూ కుమార్తెలకూ ఉంటుందని ఆర్డీఓ స్పష్టం చేశారు. ‘పురం’ వాసికి అంతర్జాతీయ ఫిడే రేటింగ్ హిందూపురం టౌన్: గత నెల 21న బెంగళూరు వేదికగా జరిగిన నాల్గవ చెక్ అండ్ మేట్ ఆల్ ఇండియా ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీలో హిందూపురానికి చెందిన విద్యార్థిని భవ్య సహస్ర ఉత్తమ ప్రతిభతో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ 1,427ను దక్కించుకుంది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఈ రేటింగ్ ఉపయోగపడుతుందని కోచ్ ఆరీఫ్వుల్లా తెలిపారు. ప్రతిభ చాటిన భ్య సహస్రను ఆయన అభినందించారు. అంతర్జాతీయ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కావడమే తన లక్ష్యమని భవ్య సహస్ర తెలిపారు. -
నేరాల కట్టడికి సమన్వయంతో పనిచేయాలి
హిందూపురం: నేరాల కట్టడికి పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన హిందూపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని పలు రికార్డులు పరిశీలించారు. ఇటీవల కాలంలో నమోదైన కేసులు..దర్యాప్తు గురించి ఆరా తీశారు. నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల గురించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రోజు రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేసి చోరీలు, అక్రమ రవాణా, డ్రంగ్ అండ్ డ్రైవ్‌ను నియంత్రించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, మహిళలు, చిన్నారులు, ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డయల్ 112కు వచ్చేకాల్స్కు తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు తగిన సాయం అందించాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా అవగాహన పెంచుతూ చైతన్య పరచాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, సీఐలు రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, కరీం, జనార్దన్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం హిందూపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ తనిఖీ -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: రైలు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. జీఆర్పీ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన మేరకు... 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి కొన్ని రోజులుగా సీకే పల్లి మండలం బసంపల్లి గ్రామంలో తిరుగుతూ ఉండే వాడన్నారు. మంగళవారం రాత్రి బసంపల్లి నుంచి కనుముక్కల వైపు వెళ్లే దారిలో పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొంది. ఘటనలో దూరంగా ఎగిరి పడిన వ్యక్తి శరీర అవయవాలు తెగి పడ్డాయి. లోకో పైలెట్ ఇచ్చిన సమాచారంతో జీఆర్పీ కానిస్టేబుల్ ఎర్రిస్వామి బసంపల్లికి చేరుకుని స్థానికుల సాయంతో ఘటనాస్థలాన్ని గుర్తించాడు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ పట్టుబడిన ఆర్టీసీ డ్రైవర్ అనంతపురం: కర్ణాటక నుంచి ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ ఎకై ్సజ్ అధికారులకు ఓ ఆర్టీసీ డ్రైవర్ పట్టుబడ్డాడు. వివరాలను అనంతపురం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి వస్తున్న ఆర్టీసీ అనంతపురంలోని ధర్మవరం రోడ్డులో ఉన్న శివకోటి ఆలయం వద్ద ఆపి తనిఖీ చేశారు. సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణిస్తున్న శివకోటి ఆలయం వద్ద నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ పి.ఓబులనారాయణరెడ్డి వద్ద నుంచి 60 ఆర్మీ ఫుల్ బాటిళ్ల మద్యం పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అదే బస్సులో ముందు వైపు కూర్చొన్న పాత నిందితులు సాకే పవన్‌కుమార్, వడే శ్రీనివాసులు వెంటనే బస్సు దిగి పారిపోయారు. బెంగళూరులోని ఆర్టీ క్యాంటీన్ నుంచి మద్యం కొనుగోలు చేసి జిల్లాకు అక్రమంగా చేరవేస్తున్నట్లుగా విచారణలో వెలుగు చూసింది. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్ఐలు జాకీర్ హుస్సేన్, జయ నరసింహ, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. తాగుడుకు డబ్బివ్వలేదని కొడవలితో దాడి అనంతపురం: మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదంటూ సొంత మేనమామ కొడుకుపైనే కొడవలితో దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం గ్రామ సింగిల్ విండో ప్రెసిడెంట్ చాకలి కేశన్న మంగళవారం సాయంత్రం అనంతపురంలోని పాతూరు జంగాలపల్లి మసీదు వద్ద ఉన్న సమయంలో మేనత్త కుమారుడు సుబ్బారావు కలసి మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రోజూ తాగుడుకు డబ్బు కావాలంటూ దౌర్జన్యం చేయడం సరికాదని కేశన్న సర్దిచెప్పబోతుండగా కొడవలితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు కేకలు వేయడంతో సుబ్బారావు అక్కడి నుంచి పారిపోయాడు. క్షతగాత్రుడు స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరూ టీడీపీకి చెందిన వారే కావడం, పైగా సమీప బంధువులు కావడంతో దాడిని రాజీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
‘స్పీడ్’ పెంచిన ‘తపాలా’
అనంతపురం సిటీ: రిజిస్టర్ పోస్టును రద్దు చేసి, స్పీడ్ పోస్టులో కలిపేస్తున్నట్లు ప్రకటించిన తపాలా శాఖ.. స్పీడ్ పోస్టు చార్జీలను భారీగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు ఈ–కామర్స్ తరహాలో ఓటీపీ ఆధారిత డెలివరీ వంటి సేవలు, దేశ వ్యాప్తంగా ఒకే టారిఫ్, విద్యార్థులకు 10 శాతం రాయితీ అంటూ నమ్మబలికే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచే స్పీడ్ పోస్టు అమలు అతి తక్కువ ఖర్చుతో అనువైన తపాలా సేవగా కొనసాగుతూ వచ్చిన రిజిస్టర్ పోస్టును తపాలా శాఖ పూర్తిగా రద్దు చేస్తూ స్పీడ్ పోస్టులోకి విలీనం చేసింది. తపాలా శాఖ తాజా నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల వారిపై అదనపు భారం పడుతోంది. అంతేకాక పోస్టు డెలివరీ సమయంలో చిరునామాదారు ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ధ్రువీకరణ తరువాతే పోస్టుమాన్ ఆ పోస్టును అందజేస్తారు. ఈ సేవ కోసం నిర్దేశిత టారిఫ్ మీద జీఎస్టీ కాకుండా అదనంగా ఒక్కో ఆర్టికల్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. బల్క్ సేవలు వినియోగించుకునే సంస్థలకు 5 శాతం తగ్గింపు ప్రకటించింది. అయితే తపాలా శాఖ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేటి నుంచి స్పీడ్ పోస్టులోకి రిజిస్టర్ పోస్టు విలీనం తడిసి మోపెడవుతున్న చార్జీలు దేశ వ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ -
సకాలంలో వైద్యం అందక యువకుడి మృతి
తనకల్లు: ప్రమాదంలో గాయపడిన యువకుడిని గోల్డెన్ అవర్లోనే ఆస్పత్రికి చేర్చినా.. సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. వివరాలు.. ఎన్పీ కుంట మండలం ఎదురుదొన గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ (21) తన భార్య లలితకుమారితో కలసి మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా పెద్దపాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. తనకల్లు మండలం చీకటిమానిపల్లి సమీపంలో ఉన్న కేకే ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే ఎదురుగా దూసుకొచ్చిన కంటైనర్ ఢీకొంది. నవీనకుమార్కు తీవ్ర గాయాలు కాగా, లలితకుమారి కాలికి బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్సులో గోల్డెన్ అవర్లోనే క్షతగాత్రులను తనకల్లులోని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. చికిత్స అందేలోపు నవీన్‌కుమార్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం లలిత కుమారిని కదిరికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. వైద్యులు అందుబాటులో లేరంటూ ఆందోళన స్థానిక ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రికి సకాలంలో నవీన్‌కుమార్‌ను చేర్చినా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మృతి చెందాడంటూ కొక్కంటి క్రాస్‌కు చెందిన పలువురు యువకులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రికి చేరుకుంటున్న క్షతగాత్రులకు సకాలంలో వైద్యసేవలు అందించాల్సిన వైద్యులు పత్తాలేకుండా పోతున్నారని మండిపడ్డారు. ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నా... అత్యవసర సమయంలో ఏ ఒక్కరూ అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గోపి అక్కడకు చేరుకుని నిరసనకారులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
ధర్మవరం రూరల్: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందిని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. ధర్మవరం మండలం దర్శనమల పీహెచ్‌సీని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వన్నప్ప, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’ మూక దాడి – నలుగురుకి తీవ్ర గాయాలు ధర్మవరం రూరల్: మండలంలోని ముచ్చురామి గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు తారస్థాయికి చేరుకున్నాయి. పొలానికి రస్తా విషయంగా గొడవపడి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు... ముచ్చురామి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పెద్ద ఫక్కీరప్ప, టీడీపీ నేత క్రిష్టయ్య మధ్య పొలాలకు వెళ్లే రస్తా విషయంగా కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. పలుమార్లు ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఇదే విషయంగా మంగళవారం రాత్రి పెద్ద ఫక్కీరప్ప, గంటా నరసింహులు, అతని కుమారుడు నందకుమార్, ప్రణీష్కుమార్పై టీడీపీ నాయకులు క్రిష్టయ్య, బాలచంద్ర, రవికుమార్, రామాంజి కట్టెలతో దాడికి తెగబడ్డారు. స్థానికులు అడ్డుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ధర్మవరం రూరల్ పోలీసులు తెలిపారు. -
2 నుంచి ప్రత్యేక రైళ్లు
● షోలాపూర్–ధర్మవరం, బీదర్– బెంగళూరు మార్గంలో.. గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. షోలాపూర్–ధర్మవరం, బీదర్–బెంగళూరు మార్గంలో రైళ్లు నడుస్తాయన్నారు. అక్టోబర్ 2 గురువారం రాత్రి 11.20 గంటలకు షోలాపూర్ జంక్షన్లో రైలు బయలుదేరి ధర్మవరం జంక్షన్‌కు శనివారం తెల్లవారుజూమున 3.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ధర్మవరం జంక్షన్ నుంచి (01438) అక్టోబర్ 4 శనివారం ఉదయం 6.30 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 10.30 గంటలకు షోలాపూర్‌కు చేరుకుంటుందన్నారు. బీదర్, వికారాబాద్, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్డు, ములకలచెరువు, కదిరి రైల్వే స్టేషన్ల మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. బీదర్–బెంగళూరు మధ్య.. బీదర్–బెంగళూరు మధ్య అక్టోబర్ 4,5 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. బీదర్ జంక్షన్ (07063)లో అక్టోబర్ 4 శనివారం మధాహ్నం 2.40 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు రైలు బెంగుళూరు చేరుతుందన్నారు. తిరిగి అక్కడి నుంచి అక్టోబర్ 5 ఆదివారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బీదర్ చేరుకుంటుందన్నారు. హమ్నాబాద్, కమలాపూర్, కలబురిగి, షాహబాద్, వాడీ, యాదగిరి, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, యలహంక సేష్టన్ల మీదుగా రైలు నడుస్తుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధర్మవరం వరకు ‘సూపర్ ఫాస్ట్’ పొడిగింపు సత్యసాయి జయంత్యుత్సవాలనేపథ్యంలో రైల్వే శాఖ నిర్ణయం కదిరి: గుంటూరు – తిరుపతి మధ్య నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (17261)ని ధర్మవరం వరకూ పొడిగించారు. భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి (నవంబర్ 23)ని పురస్కరించుకొని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు అంటే రెండు నెలల పాటు ఈ రైలు ధర్మవరం వరకు నడుపుతారు. ఆ తర్వాత ఎప్పటి లాగానే తిరుపతి వరకూ వచ్చి ఆగిపోతుంది. రోజూ సాయంత్రం 4.30 గంటలకు ఈ రైలు గుంటూరులో బయలుదేరుతుంది. నరసరావుపేట, వినుకొండ, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లి, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కమలాపురం, రాజంపేట మీదుగా తెల్లవారుజామున 3.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుండి 4.05 గంటలకు బయలుదేరి పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లి రోడ్, మొలకలచెరువు, కదిరి మీదుగా ఉదయం 9 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. ధర్మవరంలో మధ్యాహ్నం 1.20కి బయలు దేరి తిరుగు ప్రయాణంలో సాయంత్రం 7.15కు తిరుపతి చేరుకుంటుంది. 10 నిమిషాల తర్వాత తిరిగి బయలుదేరి మరుసటి దినం ఉదయం 7.20 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ రెండు నెలల పాటు రోజూ ఒక రైలు (17261) గుంటూరులో సాయంత్రం 4.30కు బయలు దేరితే, ఇంకో రైలు (17262) ధర్మవరంలో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరేలా రైల్వేశాఖ అధికారులు నిర్ణయించారు.ఆగని మట్టిదందా ● రాత్రిపూట తరలింపు కదిరి అర్బన్: అక్రమార్కులు మట్టి దందాను ఆపడం లేదు. అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. వీలైనంత మేర మట్టి తవ్వి.. సొమ్ము చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పగలైతే అధికారులు అడ్డుకుంటారని భావిస్తున్న అక్రమార్కులు రాత్రిపూట మట్టి తరలించేస్తున్నారు. యర్రదొడ్డి గ్రామంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్‌కు అక్రమంగా మట్టి తోలుతున్నారు. రాత్రిపూట టిప్పర్లు రాకపోకలు, హిటాచీ యంత్రాల శబ్దాలతో ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. మట్టి మాఫియాను కట్టడి చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా.. మొన్ననే మట్టి తరలింపు ఆపేయాలని హెచ్చరించామన్నారు. అయినా తోలుతున్నారంటే.. వీఆర్ఓను పంపించి చర్యలు తీసుకుంటామన్నారు. -
అసాంఘికశక్తుల ఆట కట్టించాల్సిందే
కదిరి: శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అసాంఘిక శక్తుల ఆట కట్టించాలని ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కదిరి డీఎస్పీ కార్యాలయంతో పాటు రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతిటివారైనా సరే.. ఉపేక్షించవద్దని సూచించారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలియజేశారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారని, అలాంటి వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని.. ఈ విషయంలో తేడా వస్తే క్షమించేది లేదన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి పోలీస్ అధికారీ పల్లె నిద్ర చేసినప్పుడే ప్రజలకు పోలీసుల పట్ల మరింత గౌరవం పెరుగుతుందని, అప్పుడే ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా పోలీసుల దృష్టికి తీసుకొస్తారని తెలియజేశారు. బాల్య వివాహాలు, సైబర్ మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలుండేలా చూడండి పట్టణాల్లోని అపార్ట్మెంట్లు, దుకాణాలు, ప్రార్థనామందిరాల వద్ద కచ్చితంగా సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలపై కూడా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. దొంగతనాలు జరగక్కుండా రాత్రి సమయాల్లో గస్తీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని దిశానిర్దేశం చేశారు. అంతకుమునుపు కదిరి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, శాంతిభద్రతల సమస్యలపై డీఎస్పీ శివనారాయణస్వామిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టణ పోలీస్ స్టేషన్‌లోని లాకప్ గదులు, మహిళా హెల్ప్‌డెస్క్, పట్టుబడిన ద్విచక్ర వాహనాలతో పాటు స్టేషన్ ప్రాంగణం మొత్తం కలియదిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో సీఐలు నారాయణరెడ్డి, నాగేంద్ర, నిరంజన్‌రెడ్డి, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ -
యువకుడి దుర్మరణం
అగళి: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం రంగనపల్లి గ్రామానికి చెందిన మేలగిరియప్ప కుమారుడు రంగనాథ్ (26) మంగళవారం అగళి మండలం హెచ్డీ హళ్లి గ్రామంలోని తన అక్క ఇంటికి వచ్చాడు. భోజనం ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. జంగమరపల్లి చెక్‌పోస్ట్ వద్ధకు చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో ఎగిరి రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడకు చేరుకుని ఒక్కగానొక్క కుమారుడు మృతితో బోరున విలపించారు. ఫిబ్రవరిలో రంగనాథ్కుర వివాహం నిశ్చయమైందని, ఇంతలోనే ఇంతటి ఘోరం జరిగిందంటూ రోదించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. బొలెరో ఢీకొని.... తనకల్లు: మండలంలోని చీకటిమానిపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తనకల్లు మండలం సింగిరివాండ్లపల్లికి చెందిన శ్రీనివాసులు (31) వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనిపై మంగళవారం అన్నమయ్య జిల్లా పాతకోటకు వెళ్లిన శ్రీనివాసులు అక్కడ పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. చీకటిమానిపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన శ్రీనివాసులు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. ఫిబ్రవరిలో పెళ్లి నిశ్చయం ఇంతలో దుర్ఘటన -
ప్రశాంతి నిలయంలో దుర్గాష్టమి వేడుకలు
ప్రశాంతి నిలయం: దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దుర్గాష్టమి వేడుకలు ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగాయి. సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి బంగారు రథానికి, బాబా జీవించి ఉన్నపుడు వినియోగించిన వాహనాలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయుధ పూజ చేశారు. బంగారు రథాన్ని ఆర్.జె.రత్నాకర్ భక్తులు, సత్యసాయి ట్రస్ట్ సిబ్బందితో కలసి లాగారు. ట్రస్ట్ కార్యాలయాల్లోనూ దుర్గాష్టమి సందర్భంగా ఆయుధపూజ నిర్వహించారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ పూర్ణచంద్ర ఆడిటోరియంలో చేపట్టిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం కొనసాగుతోంది. దసరా వేడుకల్లో భాగంగా సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. ప్రముఖ పండితుడు మైలవరపు శ్రీనివాసరావు భక్తులనుద్దేశించి ప్రసంగించారు. దుర్గాదేవి వైభవం, దసరా వేడుకలకు ప్రత్యేకత వివరించారు. సత్యసాయి విశ్వమాతగా భక్తులకు అమ్మ ప్రేమను చూపించారని కొనియాడారు. పిదప సత్యసాయి విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. -
తండ్రి స్ఫూర్తితో...
తాడిపత్రిలోని రెడ్డివారిపాలెంలో నివాసముంటున్న మనోహర్‌రెడ్డి భారత సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్ఫూర్తితో భారత సైన్యంలో చేరాలని కుమార్తె సాయిహరితరెడ్డి పరితపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. అయినా రాజీ పడకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ తొలిసారిగా అమ్మాయిలకు పైలెట్ శిక్షణ కోసం చేపట్టిన ఇంటర్వ్యూలకు హాజరైంది. ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి పైలెట్ శిక్షణకు అర్హత సాధించిన సాయిహరిత రెడ్డిని అభినందిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని వ్యోమగామి కల్పనాచావ్లా తల్లి అందజేసింది. ప్రస్తుతం సాయి హరితారెడ్డి దక్షిణాఫ్రికాలో పైలెట్ శిక్షణ తీసుకుంటోంది. తన తండ్రిలా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనేదే లక్ష్యమని ఆమె చెబుతున్నారు. -
హత్య కేసు దారి మళ్లిందా?
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో రెండు వారాల కిందట జరిగిన హత్య కేసు దర్యాప్తుపై విమర్శలు వస్తున్నాయి. భార్యతో కలిసి హత్య చేసిన పలువురిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారులను ఏమాత్రం విచారణ చేయకుండా, వారి అనుమానాలను పరిగణనలోకి తీసుకోకుండానే.. పలువురికి ప్రమేయం లేదన్నట్టు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చి వదిలేయడం అనుమానాలకు తావిస్తోంది. ఆనాడు ఏమైందంటే... బ్రాహ్మణపల్లి తండాకు చెందిన నారాయణ నాయక్ కుమారుడు బాలాజీ నాయక్ (38)కు జగనన్న కాలనీలో భార్య గాయత్రి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముండేవాడు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత సెప్టెంబర్ 15వ తేదీ రాత్రి భోజనం చేశాక భార్యాపిల్లలతో కలిసి మిద్దైపె నిద్రించాడు. అదేరోజు అర్ధరాత్రి గాయత్రి గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి బాలాజీనాయక్ మిద్దైపె నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమై పడి ఉన్నాడు. వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలాజీనాయక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సీఐ శివాంజనేయులు మరుసటి రోజు ఉదయం జగనన్న కాలనీకి చేరుకుని పరిశీలించారు. తమ కుమారుడి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలాజీనాయక్ తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు.. భార్య గాయత్రితో పాటు మరో నలుగురిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు.. బాలాజీనాయక్‌ను చంపింది భార్యేనని తేల్చి.. ఆమెను రిమాండ్‌కు పంపించారు. తర్వాత అదుపులో ఉన్న వారిని విడిచిపెట్టారు. హత్యకు సహకరించిన వారిపై చర్యలేవీ..? బాలాజీనాయక్‌ను ఒక్కరే హత్య చేయలేదని, మరికొంతమంది సహకరించారని తల్లిదండ్రులు మంగమ్మ, నారాయణనాయక్ ఆరోపిస్తున్నారు. కోడలు గాయత్రితో పాటు సమీప బంధువు అంజీనాయక్, మహమ్మద్ అలీతో పాటు బిహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉందని అంటున్నారు. తమ కుమారుడి చావుకు కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని వారు గత సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీసులు డబ్బు తీసుకుని మిగిలిన వారిని వదిలేసి.. కోడలిని మాత్రమే జైలుకు పంపించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. స్పందించిన ఎస్పీ సతీష్‌కుమార్ కేసు విచారణ ఫైలు, సీడీలు మరోసారి పరిశీలించి నివేదిక ఇవ్వాలని పుట్టపర్తి పోలీసులను ఆదేశించారు. న్యాయం జరిగేనా? హత్య కేసును పుట్టపర్తి అర్బన్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు మరోసారి విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. హతుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మరొకసారి మాట్లాడినట్లు సమాచారం, ఎస్పీ ఆదేశాల మేరకు కేసు విచారణ పారదర్శకంగా చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారా..? లేక నీరుగారుస్తారా.. అన్నది వేచి చూడాలి మరి. భార్య మాత్రమే నిందితురాలని తేల్చిన పోలీసులు కేసు నుంచి పలువురిని తప్పించారని అనుమానాలు -
కదులుతున్న కారుపై మందుబాబు హల్చల్
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతి గ్రాం వద్ద ఓ యువకుడు పూటుగా మద్యం సేవించి కదులుతున్న కారుపై పడుకుని హల్చల్ చేశాడు. కొంత దూరం వెళ్లిన తరువాత కారు ఓ గోడను ఢీ కొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి గానీ, పైన పడుకున్న మందుబాబుకు గానీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. సోమవారం జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ప్రశాంతి నిలయం జోన్‌లోని ప్రశాంతిగ్రాంలోనే వైన్‌షాపు తెరిచారు. ఇక్కడ యువకులు మద్యం తాగుతూ హల్చల్ చేస్తున్నారు. సత్యసాయి నడయాడిన పుట్టపర్తి పవిత్రతను దెబ్బతీస్తున్నారు. పైగా జిల్లా పోలీస్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైద్యుల సమ్మె ఉధృతం
పుట్టపర్తి అర్బన్: స్టెతస్కోప్ పట్టుకుని రోగుల నాడి చూడాల్సిన వైద్యులు ప్లకార్డులు చేతపట్టుకుని రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. తొలిరోజు సోమవారం నల్ల రిబ్బన్ ధరించి ఓపీ వైద్య సేవలను బహిష్కరించారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రెండో రోజు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. వైద్య సేవలు స్తంభించడంతో.. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా డీఎంహెచ్ఓ కార్యాలయం, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల నుంచి వైద్యులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపి వైద్యసేవలు కొనసాగించేందుకు పురమాయించింది. విషయం తెలుసుకున్న వైద్యులు కోపోద్రిక్తులయ్యారు. జిల్లా వైద్యుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర, జనరల్ సెక్రెటరీ పుష్పలత, ఆర్గనైజింగ్ సెక్రెటరీ దిలీప్‌కుమార్, జాయింట్ సెక్రెటరీ స్వరూపారెడ్డి తదితరులు ప్రసంగించారు. జీఓ 99ను తొలగించాలన్నారు. ప్రమోషన్ల కోసం కొంతమంది 20 ఏళ్ల నుండి వేచి ఉన్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి, సంచార చికిత్సలకు వెళ్లిన వారికి అలవెన్సులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కమిషనర్ వద్ద జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేశామన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శివరామకృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఎలాగని ప్రశ్నించారు. వైద్యులు లేకపోతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో వైద్యులు అందుబాటులో ఉండటం చాలా అవసరమన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద రిలే దీక్షలు పీహెచ్‌సీలకు ఇతర డాక్టర్లను పంపడంపై వైద్యుల ఆగ్రహం -
లాభసాటి వ్యవసాయమే లక్ష్యం..
తాడిపత్రిలోని అంబాభవానీ వీధిలో నివాసముంటున్న వద్దిమోహన్ కుమార్తె భానురేఖ.. వ్యవసాయంపై మక్కువతో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చదువులో ప్రతిభ కనబరుస్తూ ఇక్రిషాట్‌లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కు అర్హత సాధించింది. అనంతరం ఎమ్మెస్సీ చదివేందుకు జపాన్ లోని మెక్స్ సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో నెగ్గి ఆ దేశంలోని హోక్కాయిడో యూనివర్సిటీలో రూ.70 లక్షల ఉపకార వేతనంతో ఉచితంగా సీటు దక్కించుకుంది. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగి ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేసి, వాటి ఫలాలను రైతులకు చేరువ చేస్తానని భానురేఖ సగర్వంగా అంటున్నారు. -
10న మెగా జాబ్ మేళా
హిందూపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన హిందూపురంలోని ఎస్డీజీఎస్ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్రకుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 15 బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ, నర్సింగ్ / ఎనీ డిగ్రీ, ఎనీ బి.టెక్, పీజీ చదివి 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు. అభ్యర్థులు కచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్, ఆధార్ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో రావాలని, మరిన్ని వివరాలకు 96767 06976 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత వాతావరణశాఖ, విశాఖ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 1న 0.4 మి.మీ, 2న 0.2 మి.మీ, 3న 2.4 మి.మీ, 4న 5.5 మి.మీ, 5న 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీల నుంచి 32.7 డిగ్రీలు, రాత్రిళ్లు 22.8 డిగ్రీల నుంచి 23.2 డిగ్రీల మధ్య ఉండొచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 79 నుంచి 82, మధ్యాహ్నం 43 నుంచి 60 శాతం మధ్య రికార్డు కావొచ్చన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు. అరటి చెట్టుకు రెండు గెలలు పుట్లూరు: సాధారణంగా అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే వస్తుంది. అయితే ఇందుకు భిన్నంగా పుట్లూరు మండలం రంగరాజుకుంట గ్రామానికి చెందిన రైతు పొన్నపాటి హనుమంతురెడ్డి తోటలో ఒక చెట్టుకు రెండు గెలలు వచ్చాయి. నాలుగు ఎకరాల్లో అరటి పంటను సాగు చేయగా రెండవ పంటలో ఇలా ఒక చెట్టుకు మాత్రమే రెండు గెలలు వచ్చిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలా రెండు గెలలు రావడం ఎన్నడూ చూడలేదని స్థానిక రైతులు చెబుతున్నారు. కాగా, అరటి మొక్క కాండంలో రెండవ శిరోజం ఏర్పడినప్పుడు ఇలా రెండు గెలలు వస్తాయని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పర్యాటకులపై తేనెటీగల దాడి తాడిపత్రి టౌన్: నియోజకవర్గంలోని యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలో ఉన్న వాటర్ పాల్స్ వద్ద పర్యాటకులపై మంగళవారం తేనెటీగలు దాడి చేసాయి. తాడిపత్రి పట్టణానికి చెందిన ఉదయ్‌కిరణ్, పృథ్వీరాజ్ హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. దసరా పండుగకు తాడిపత్రికి వచ్చి కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం కోన వాటర్ పాల్స్ చూసేందుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో తేనెటీగలు దాడి చేసాయి. హుటాహుటిన పిల్లలను వాహనంలో ఎక్కించుకుని దూరంగా రావడంతో పెనుప్రమాదం తప్పంది. ఉదయ్‌కుమార్, పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
గొర్రె పిల్లలను మింగిన కొండచిలువ
పుట్టపర్తి అర్బన్: మందలో ఉన్న రెండు చిన్న గొర్రె పిల్లలను కొండ చిలువ మింగింది. ఈ ఘటన పుట్టపర్తి మండలం పైపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి పొద్దుపోయాక సమీపంలోని కొండ నుంచి వచ్చిన భారీ కొండ చిలువ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి విజయ్ మందలోకి చొరబడింది. ఒక పిల్లను మింగేసింది. రెండవ పిల్లను నోట కరుచుకోవడంతో అరుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన విజయ్ తోటి కాపరుల సహకారంతో రెండవ పిల్లను కొండ చిలువ నోటి నుంచి లాగేశారు. అప్పటికే అది మృతి చెందింది. కొండచిలువ ఎటూ వెళ్లలేక మందలోనే ఉండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పుట్టపర్తికి చెందిన కరుణ సొసైటీ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని బుక్కపట్నం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలేశారు.వైద్యాధికారులు వెంటనే విధుల్లో చేరాలి ● కలెక్టర్, డీఎంహెచ్ఓల ఆదేశం పుట్టపర్తి అర్బన్: ఓపీ సేవలు బంద్ చేసి సమ్మెబాట పట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యాధికారులు వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. వైద్యాధికారులు సమ్మె బాట పట్టడంతో కమిషనర్ ఆదేశాల మేరకు కలెక్టర్ మంగళవారం సాయంత్రం పుట్టపర్తిలోని ఎనుములపల్లి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవల్లో ఆటంకం కలగకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి ,అనంతపురం మెడికల్ కళాశాల నుంచి 20 మంది వైద్యులను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించి నట్లు చెప్పారు. ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్, ఎస్మా చట్టం ప్రకారం ఇలా సమ్మె చేయడం చట్టరీత్యా అనుమతించబడవన్నారు. ఈ మేరకు వైద్యాధికారులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వెంటనే ప్రభుత్వ వైద్యాధికారులు విధులకు హాజరు కావాలన్నారు. లేనిపక్షంలో సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రోగులతో మాట్లాడారు. -
మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయం
పుట్టపర్తి టౌన్: జిల్లాలోని మహిళలు, చిన్నారుల రక్షణే మొదటి కర్తవ్యంగా భావిస్తూ పోక్సో కేసుల్లో ముద్దాయిలకు శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా బాలికలు, చిన్నారులకు సంబంఽధించి 2024 జూన్ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 110 కేసులు నమోదయ్యాయని, ఇందులో 79 పోక్సో, 31 మిస్సింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. రామగిరి మండలంలో పోక్సో కేసుకు సంబంధించిన ముద్దాయిలను జైలుకు పంపినట్లు తెలిపారు. బాల్య వివాహాల నివారణకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎస్పీ సతీ్ష్కుమార్ -
యూరియా కోసం ఘెరావ్
పుట్టపర్తి అర్బన్: యూరియా కోసం వ్యవసాయ అధికారులను జగరాజుపల్లి, వెంకటగారిపల్లి రైతులు ఘెరావ్ చేశారు. సోమవారం మండలంలోని జగరాజుపల్లికి ఏఓ శ్రీలక్ష్మి, ఏఈఓ ఆనంద్‌నాయక్ వెళ్లగా.. రైతులు చుట్టుముట్టి యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు వారు టోకెన్లు ఇచ్చి మంగళవారం యూరియా అందజేస్తామని చెప్పారు. ఇటీవల రేషనలైజేషన్ పేరుతో వెంకటగారిపల్లిలోని ఆర్ఎస్కే సిబ్బందిని మరో కేంద్రానికి పంపగా.. ఆ గ్రామంలోని ఆర్ఎస్కే మూతపడింది. దీంతో తమ గ్రామానికి యూరియా కావాలని వెంకటగారిపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. మంగళవారం ఒక లోడు యూరియా వస్తుందని అధికారులు సర్దిచెప్పారు. -
అప్పుడే బాగుండె
ముసలోళ్లకు ఇంటి దగ్గరకే స్టోర్ బీము తెచ్చిత్తామని సెంద్రబాబు, ఇంకా శానామంది సెప్పినారు. కానీ తెచ్చింది లేదు.. ఇచ్చిందీ లేదు. ఊతకట్టి లేందే నడవలేను. ఇంక బీము తెచ్చుకునేది ఎక్కడ? జగనే మేలు. ఈళ్లు, వాళ్లు అనకుండా అందరికీ ఇంటికే బీము పంపిస్తా ఉండె. – ఎ.నరసింహులు, నల్లచెరువు మండలం చర్యలు తప్పవు దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, మంచానికి పరిమితమైన వారికి ఇళ్ల దగ్గరకే వెళ్లి నిత్యావసర సరుకులు ఇవ్వాలి. ప్రతి చౌక డిపో డీలర్ దీన్ని తప్పక పాటించాల్సిందే. ఎక్కడైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. రుజువైతే డీలర్‌షిప్‌ను కూడా రద్దు చేస్తాం. తూకాల్లో మోసాలు చేసే వారిని ఉపేక్షించేది లేదు. – వంశీకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి -
డిమాండ్ల సాధనకు ఉద్యమాలే శరణ్యం
పింఛన్ల పంపిణీ సజావుగా సాగేనా? ● రేపటి నుంచి పింఛన్ల పంపిణీ పుట్టపర్తి అర్బన్: సచివాలయ సిబ్బంది నిరసనలు, ధర్నాలతో పాటు ఇటీవల సమ్మె నోటీసులు ఇవ్వడంతో ఈ సారి పింఛన్ల పంపిణీ సజావుగా సాగే పరిస్థితులు కనిపించడం లేదు. అక్టోబర్ 1వ తేదీన పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంది. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఈ నెల 26న కమిషనర్‌కు వినతి పత్రం ఇస్తూ ఇంటింటికీ తిరిగి పింఛన్లు అందజేయబోమని జేఏసీ సభ్యులు తేల్చి చెప్పారు. అలాగే 27న కలెక్టర్‌ను కలసి పింఛన్ పంపిణీ చేయబోమని విన్నవించారు. ఈ క్రమంలో 29న పింఛన్ నగదును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయకుండా నిరాకరించారు. 30న వివిధ ప్రసార మాద్యమాల ద్వారా పింఛన్ పంపిణీ చేయబోమని లబ్ధిదారులకు విషయాన్ని చేరవేయనున్నట్లు జేఏసీ సభ్యులు తెలిపారు. 1వ తేదీన అధికారులు పింఛన్ మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులకు అందజేస్తే బుధవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయాల వద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే జరిగితే జిల్లాలోని 2,63,987 మంది పింఛన్ లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవు. కాగా, జిల్లాలోని లబ్ధిదారులకు 1వ తేదీన పింఛన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మొత్తాన్ని అక్టోబర్ 1వ తేదీ, 3వ తేదీ మాత్రమే పంపిణీ చేస్తామన్నారు. 2వ తేదీ గాంధీ జయంతి, దసరా పండుగల సందర్భంగా పంపిణీ ప్రక్రియ ఉండదన్నారు. ఆటో నుంచి కింద పడి వివాహిత మృతి రొద్దం: ఆటో నుంచి కింద పడి ఓ వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ పోతన్న భార్య నందిని(30) వ్యవసాయ కూలి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచింది. ఈ క్రమంలో ఆర్.లోచెర్ల గ్రామానికి చెందిన ఆటోలో గ్రామంలో సహ కూలీలతో కలసి ఉదయం 7 గంటలకు బయలుదేని మోపుర్లపల్లిలో కూలి పనులు ముగించుకుని తిరిగి అదే ఆటోలో ఇంటికి చేరుకునేది. ఈ క్రమంలో సోమవారం ఉదయం పనులకు ఆటోలో బయల్దేరిన ఆమె డ్రైవర్ పక్కన సీటులో కూర్చొని ప్రయాణిస్తోంది. సుబ్బరాయప్ప కొట్టాల వద్దకు చేరుకోగానే డ్రైవర్ అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో పట్టు తప్పి కిందపడడంతో తలకు లోతైన గాయమైంది. స్థానికులు వెంటనే రొద్దంలోని పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పుట్టపర్తి: ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్సనర్ల సమస్యల పరిష్కారంపై పాలకుల్లో కదలిక రావాలంటే ఉద్యమాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లు రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం కొత్తచెరువులోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జరిగింది. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ గజ్జల హరిప్రసాదరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులుగా హాజరైన రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి విద్యాశాఖలో 72, 73, 74 జీఓలు అమలు చేయాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలన్నారు. కేంద్ర మెమో 57ను అమలుపరుస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించి వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలు, సంపాదిత సెలవు బిల్లులు విడుదల చేయాలన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలన్నారు. డిమాండ్ల సాధనకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో అక్టోబర్ 7న విజయవాడలో తలపెట్టిన ‘చలో విజయవాడ–పోరుబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.చంద్ర, బడా హరిప్రసాదరెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కోనంకి చంద్రశేఖర్, షమీవుల్లా, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శి గోపాల్, రామకృష్ణ, గోపాల్ నాయక్, మాధవ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లు రఘునాథరెడ్డి -
తిండి గింజలకూ తిప్పలే!
‘‘65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి రేషన్ డీలర్ ద్వారా వారి ఇంటికే బియ్యం డెలివరీ చేస్తాం. అది కూడా ఒకటో తేదీ రాక మునుపే.. అంటే ముందు నెల 26 నుంచి 30వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగిస్తాం.’’ – ఇదీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన. వాస్తవానికి ఇది ప్రకటనకే పరిమితమైంది. ఎక్కడా ఆచరణకు నోచుకోలేదు. కదిరి: గత ప్రభుత్వం అన్ని వర్గాల వారికీ ఇంటి దగ్గరే రేషన్ బియ్యం పంపిణీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికీ రేషన్ పంపిణీకి మంగళం పాడింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసే 18 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇందులో జిల్లాకు చెందిన కుటుంబాలు 349 ఉన్నాయి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులతో పాటు మంచానికి పరిమితమైన వారికి రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలు కావడంలేదు. వృద్ధులు జీవిత చరమాంకంలో ఊతకర్రల సాయంతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చౌక బియ్యం తెచ్చుకుంటున్నారు. బియ్యం సంచిని భుజంపై కూడా పెట్టుకోలేని స్థితిలో చుట్టుపక్కల వారిని సాయం కోసం బతిమాలుకుంటున్నారు. వేలిముద్రలు సరే.. బియ్యం ఏదీ? జిల్లాలో కొన్ని చోట్ల రేషన్ డీలర్లు దివ్యాంగులు, వృద్ధుల ఇంటి దగ్గరకు వెళ్లి రేషన్ బియ్యం పంపిణీ చేసినట్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. కానీ వారికి అక్కడ బియ్యం ఇవ్వడం లేదు. కుటుంబ సభ్యులు లేదా బంధువులెవరైనా చౌక డిపో వద్దకు వస్తే గానీ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇంకొందరు డీలర్లు వేలి ముద్రలు వేయించుకోవడంతోనే సరిపెట్టి.. బియ్యం వచ్చే నెలలో ఇస్తామంటున్నారు. వారి కోటా బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. తూకంలో మోసాలు.. జిల్లా వ్యాప్తంగా 1,367 రేషన్ దుకాణాలుండగా.. వీటి పరిధిలో 5,62,784 రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుదారుల్లో 63,286 మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం పట్టిన వారు ఉన్నారు. మనిషికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం, కార్డుకు అర కిలో చొప్పున చక్కెర పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇంటి దగ్గరకే వెళ్లి కచ్చితమైన తూకాలతో రేషన్ బియ్యం అందజేసేవారు. కూటమి ప్రభుత్వంలో మెజార్టీ చౌకడిపో డీలర్లు అధికార పార్టీ వారే కావడంతో తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కళ్లెదుటే మోసాలకు పాల్పడుతున్నా సామాన్య ప్రజలు అడగలేని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే..అధికారులు తనిఖీకి వస్తున్నారనే సమాచారం సదరు డీలర్‌కు ముందే తెలిసిపోతోంది. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ ఉత్తిదే సుదూరం నుంచి రాలేక అవస్థలు పడుతున్న వృద్ధులు సాయం చేసేవారు లేక దివ్యాంగుల ఎదురు చూపులు వేలిముద్రలతో సరిపెడుతున్న స్టోర్ డీలర్లు -
శిథిలాలు మీదపడి కార్మికుడి మృతి
ఓడీచెరువు (అమడగూరు): పాత ఇంటిని తొలగిస్తుండగా శిథిలాల మీద పడి ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందాడు. అమడగూరు మండలం ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన మంజుల వెంకటరమణ (70) కూలీ పనులతో జీవనం సాగిస్తున్నాడు. తన స్వగ్రామంలో ఓ పాత ఇంటిని తొలగించే పనిలో నిమగ్నమై ఉండగా... ప్రమాదవశాత్తు గోడ కూలి మీద పడింది. కుటుంబసభ్యులు వెంటనే ప్రైవేట్ వాహనంలో కదిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. యువకుడి దుర్మరణం రొళ్ల: మండల పరిధిలోని 544ఈ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు... రొళ్ల మండలం మళ్లసముద్రానికి చెందిన అశోక్ (25) ఉపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లాడు. సోమవారం బెంగళూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మరోవైపు పావగడ నుంచి కర్ణాటక రాష్ట్రం కడూరుకు కోళ్ల లోడ్‌తో ఐచర్ వాహనం వెళ్తోంది. అయితే గుడిబండకు వెళ్లే నాలుగు రోడ్ల కూడలి వద్ద అశోక్ ద్విచక్ర వాహనంలో రోడ్డు దాటుతుండగా అటు నుంచి వచ్చిన ఐచర్ వాహనం ఢీ కొని బోల్తాపడింది. అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏఎస్ఐ హిదాయతుల్లా దర్యాప్తు చేపట్టారు. -
హత్య కేసు దర్యాప్తులో అన్యాయం
పుట్టపర్తి టౌన్: తమ కుమారుడిని ముగ్గురు కలసి హతమారిస్తే విచారణను పెడదోవ పట్టించి కోడలిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన ఇద్దరిని స్వేచ్ఛగా వదిలేశారంటూ హతుడి తల్లిదండ్రులు మంగమ్మబాయి, నారాయణనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీపీఓలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ సతీష్‌కుమార్‌ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తి మున్సిపాల్టీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో ఉన్న జగన్న కాలనీలో నివాసం ఉంటున్న తమ కుమారుడు బాలాజీ నాయక్‌ను ఈ నెల 15న దారుణంగా హతమార్చారన్నారు. భార్య గాయత్రి బాయితో పాటు మహమ్మద్ అలీ, అంజీనాయక్ తమ కుమారుడిని హతమార్చినట్లుగా అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఘటనపై పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి, గాయత్రీబాయితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారన్నారు. అయితే హంతకులతో డబ్బు తీసుకుని దర్యాప్తును పెడదోవ పట్టించి గాయత్రీబాయిని మాత్రమే హంతకురాలిగా నిర్ధారిస్తూ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారని, మిగిలిన ఇద్దరినీ స్వేచ్ఛగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోతైన విచారణ చేపట్టి తమ కుమారుడిని హతమార్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా కఠిన శిక్ష పడేలా చేయాలని ఎస్పీకి విన్నవించామన్నారు. స్పందించిన ఎస్పీ.. లోతైన విచారణ చేపట్టి న్యాయం చేయాలంటూ పుట్టపర్తి పోలీసులను ఆదేశించారన్నారు. వివిధ సమస్యలపై 70 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. హతుడి తల్లిదండ్రుల ఆవేదన న్యాయం చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు పరిష్కార వేదికకు 70 వినతులు -
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించాలి
బత్తలపల్లి: పేదల పెన్నిధిగా ఉన్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రిని స్థానిక సీపీఐ నేతలతో కలసి సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలపై రోగులతో ఆరా తీశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 56 సంవత్సరాలుగా వివిధ రంగాలలో ఆర్డీటీ అందిస్తున్న సేవలను కొనియాడారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్న ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా అడ్డుకోవడం బాధాకరమన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్డీటీ అందించిన సేవలు మరువలేమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో చర్చించి ఆర్డీటీకి ఎప్‌సీఆర్‌ఏ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. కేంద్రం దృష్టికి టీచర్ల సమస్యలు పుట్టపర్తి అర్బన్: టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లను మినహాయించే అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళుతానని రామకృష్ణ పేర్కొన్నారు. పుట్టపర్తికి విచ్చేసిన ఆయనను ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. టీచర్ల సర్వీస్ రూల్స్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎస్టీయూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, గోపాల్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -
కుల గణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కుల గణన అంశంపై సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేమయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 143 వెనుకబడిన కులాలు ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గడంతో అవకాశాలను కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వంపై బీసీ సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ మాట్లాడుతూ బీసీల రక్షణ చట్టం తీసుకొస్తామంటూ ఎన్నికలకు ముందు హామీనిచ్చిన కూటమి పెద్దలు అధికారం చేపట్టిన తర్వాత ఆ ఊసే మరచిపోయారన్నారు. కులగణన చేపట్టిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నెరవేర్చలేని స్థితిలో ఉన్నాం.. ఎన్నికల హామీలను నెరవేర్చలేని మాట వాస్తవమేనని హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి అంగీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేనందున హామీల అమలు కష్టంగా ఉందన్నారు. బీసీల అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేటీ శ్రీధర్, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, నాయకులు పైపల్లి గంగాధర్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు చంద్రమోహన్, చేతివృత్తుల సంఘం నాయకుడు జింకా చలపతి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ హామీలను నెరవేర్చలేక పోతున్నాం : ఎంపీ బీకే -
మడకశిరలో విషాదం
● ఈతకెళ్లి ఇద్దరు యువకుల మృతి మడకశిర: నియోజకవర్గ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. శుభకార్యానికి వచ్చిన ఇద్దరు యువకులు ఈత కెళ్లి నీట మునిగి మృతి చెందారు. వివరాలు... కర్ణాటకలోని హాజన్కు చెందిన బాబ్జాన్ (34), మున్వర్ (23) వారి బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఆదివారం మడకశిరకు వచ్చారు. సోమవారం బంధువులందరూ కలసి సరదాగా చెరువు ప్రాంతానికి సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. కాసేపటి తర్వాత అందరూ బయటకు వచ్చినా.. బాబ్జాన్, మున్వర్ మాత్రం రాలేదు. దీంతో బంధువులకు అనుమానం వచ్చి స్విమ్మింగ్ పూల్‌లో గాలింపు చేపట్టారు. పూల్ కింద భాగంలో యువకులద్దరూ ఇరుక్కుపోయినట్లుగా గుర్తించి విషయాన్ని వెంటనే స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులకు తెలపడంతో వారు నీటిలో దిగి బాబ్జాన్, మున్వర్‌ను వెలికి తీశారు. అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించిన బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. స్విమ్మింగ్ పూల్‌లో అధికంగా పాచి కట్టి ఉండడంతో ఇద్దరు యువకులు అందులో ఇరుక్కుపోయి మృతి చెందినట్లుగా మృతుల బంధువులు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, బాబ్జాన్కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మున్వర్‌కు వివాహం కాలేదు. -
పార్టీ శ్రేణులకు అండగా డిజిటల్ బుక్
గోరంట్ల: పార్టీ శ్రేణులకు అండగా ఉండేందుకు జగనన్న డిజిటల్ బుక్ ప్రారంభించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ విధానాల కారణంగా ఎవరికై నా ఇబ్బందులు ఎదురైతే వాటిని డిజిటల్ బుక్‌లో నమోదు చేసుకోవాలని, పార్టీ తప్పకుండా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని వానవోలు గ్రామంలో ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో కాఫీవిత్ వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఆమె పార్టీ శ్రేణులతో కలసి గడప గడపకూ వెళ్లి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన విధానాన్ని వివరించారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్‌రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ మేలు చేశారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి కూటమి నేతలు పైశాచిక అనందం పొందుతున్నారన్నారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో పార్టీ శ్రేణులతో కలసి డిజిటల్ బుక్ పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ మండల కన్వీనర్ వెంకటేశు, వానవోలు సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మండలంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి
● కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్, ఇతర అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా 246 అర్జీలు అందగా.. వాటిని పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన పిదప నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంలో పారదర్శకత ముఖ్యమన్నారు. పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్చార్జ్ డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి అర్డీవో సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో గుండె పరిరక్షణ ప్రశాంతి నిలయం: ఆరోగ్యకరమైన అలవాట్లతో హృదయాన్ని పరిరక్షించుకోవచ్చునని వక్తలు అన్నారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు పుట్టపర్తిలో ఘనంగా జరిగాయి. సత్యసాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజల అనంతరం వేడుకలను ప్రారంభించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, గుండైవెద్య నిపుణులు, మేధావులు ర్యాలీగా ప్రశాంతి నిలయం నుంచి హిల్‌వ్యూ సేడియం చేరుకున్నారు. హృదయాకారం ఏర్పాటు చేసి..గుండె ప్రాధాన్యతను వివరించారు. -
గొర్రెలపైకి దూసుకెళ్లిన కారు
● 13 జీవాల మృతి బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారిపై గంటాపురం క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంలో 13 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్న గంటాపురం గ్రామానికి చెందిన భూమే అప్పస్వామి.. ఆదివారం తన గొర్రెల మందను మేపునకు గ్రామ శివారులోని బీడు పొలానికి తోలుకెళ్లాడు. సాయంత్రం గంటాపురం క్రాస్ వద్ద జీవాలను జాతీయ రహదారి దాటిస్తుండగా అనంతపురం నుంచి కదిరి వైపుగా వెళుతున్న కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో 13 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 12 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన కారును ఆపకుండా వేగంగా ముందుకెళ్లిపోయాడు. కారు నెంబర్ ఫ్లేట్ మాత్రం అక్కడే పడిపోయింది. ఆరు నెలలు క్రితం రూ.4లక్షలు అప్పులు చేసి జీవాలను కొనుగోలు చేసి మేపుతున్నట్లు బాధిత కాపరి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకుల అరెస్ట్ కొత్తచెరువు: మండలంలోని తలమర్లకు చెందిన టీడీపీ నాయకులను అరెస్టు చేసినట్లు ఆదివారం కొత్తచెరువు సీఐ మారుతీశంకర్ తెలిపారు. గ్రామంలోని రంగారెడ్డి గారి బాలకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో తన భార్యతో కలసి ఇంట్లో భోజనం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మారుతీరెడ్డి, రాకేష్, కిషోర్ ఇంట్లోకి చొరబడి గొడవ పడ్డారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదే రోజు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు అనంతరం ఆదివారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అత్తపై దాడి.. కేసు నమోదు రొద్దం: మండలంంలోని పి.రొప్పాల గ్రామంలో అత్తపై దాడిచేసిన కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్ర ఆదివారం తెలిపారు. అత్తతో రవి, నరసింహమూర్తి, అంజి గొడవ పడి, ఇంటి ఆవరణలో ప్రహరీ ధ్వంసం చేశారు. అనంతరం అత్తపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ● నేత్రదానం ధర్మవరం రూరల్: స్థానిక యాధవవీధికి చెందిన ఓబులేసు కుమారుడు చిన్నారి సాయి శనివారం రాత్రి స్థానిక కళాజ్వోతి సర్కిల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రక్త బంధం ట్రస్ట్ సభ్యులు నేత్రదానంపై అవగాహన కల్పించడంతో కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నీషియన్ ఆస్పత్రికి చేరుకుని చిన్నారి సాయి కంటి కార్నియా సేకరించారు. కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్, సెక్రటరీ చిప్పల చంద్రశేఖర్, పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కొలిస్తే చింతలన్నీ దూరం
తాడిపత్రి రూరల్: కోరిన కోర్చెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తాడిపత్రిలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. ఏటా ఆశ్వయుజ మాసం శుద్ధ అష్టమి నుంచి బహుళ విదియ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించే పనులు ఊపందుకున్నాయి. 30న మంగళవారం సాయంత్రం విష్యక్సేనారాధన, మృత్సంగ్రహణం, అంకురార్పణ, అక్టోబరు 1న శేషవాహనం, 2న సింహవాహనం, మధ్యాహ్నం శమీ వృక్ష దర్శనం రాత్రి హంసవాహనం, 3న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 4న ఉదయం మోహినిదేవి అలంకరణ, రాత్రి గరుడ వాహనం, 5న ఉదయం తిరుచ్చిలో ఉత్సవం, సాయంత్రం హనుమద్ వాహనం, 6న ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం గజవాహనం, 7న ఉదయం తిరుకల్యాణం, మధ్యాహ్నం విందుభోజనాలు, మధ్యాహ్నం 2.45గంటలకు బ్రహ్మరథోత్సవం, 8న ఉదయం తిరుచ్చిలో ఉత్సవం, సాయంత్రం అశ్వవాహనం, 9న వసంతోత్సవం, చక్రస్నానం, సాయంత్రం ద్వాదశ అరాధన, రాత్రి ధ్వజా అవరోహణ, కుంభప్రోక్షణ, భట్టర్ మర్యాద నిర్వహించనున్నారు. శిల్పకళతో అబ్బుర పరుస్తున్న ఆలయం.. భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి ఆలయంలో అరుదైన శిల్ప కళాసంపదను సొంతం చేసుకుంది. క్రీ.శ. 1490–1520 మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్యంలో మండలాధీశునిగా పనిచేస్తున్న తిమ్మనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. శిల్ప కళాశోభితమైన మంటపాలు, మహాద్వార గోపురాలను అద్భుతంగా నిర్మించారు. ప్రధాన ద్వారం, గాలిగోపురం తూర్పు దశలో ఉన్నాయి. గాలిగోపురానికి ముందు రాతితో నిర్మించిన ఊయాల మంటపం, ఎతైన దీపపు స్తంభం ఉన్నాయి. హంపీలోని శిల్ప కళకు దగ్గర పోలికతో ఉన్న ఈ ఆలయాన్ని వారణాశి నుంచి ప్రత్యేకంగా రప్పించిన శిల్పులతో నిర్మించినట్లుగా చరిత్రకారులు చెతున్నారు. ఆలయంలో ఏకశిలారథంతో పాటు రామాణ, మహాభారత, భాగవతం విశిష్టను చాటే శిల్పాలు అబ్బుర పరుస్తున్నాయి. కళ్యాణమంలపంలోని లో స్థంభంలో మూడు దీపపు స్తంభాలను మీటితే సప్తస్వరాలు పలుకుతాయి. గర్భగుడిపై భాగంలో ఏర్పాటు చేసిన రాతిపద్మం నాటి శిల్ప కళానైపుణ్యానికి అద్దం పడుతోంది. మొత్తం 40 రాతి స్తంభాలతో మహా మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలోని విశాల ప్రాంగణంలో మహాలక్ష్మి అలయం, కల్యాణమంటపం, చెన్నకేశవ స్వామి ఆలయం, లక్ష్మీ సమేత వరాహస్వామి, ఆంజినేయ స్వామి, లక్ష్మీనారాయణ, రామాంజినేయ, రామానుజార్యుల ఉప అలయాలు ఉన్నాయి. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు 7న బ్రహ్మరథోత్సవం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చింతల వేంకటరమణస్వామిబ్రహ్మోత్సవాలు ఇలా.. -
అ‘పూర్వ’ సమ్మేళనం
పెనుకొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985–86 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా సందడి చేశారు. నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా నాటి గురువులు తిప్పేస్వామి, ఆనందరావు మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న వారందరూ నేటికీ తమ స్నేహాన్ని మరచిపోకుండా ఇలా కలవడం గొప్ప విషయమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు కమిటీగా ఏర్పడి పాఠశాల అభివృద్ధికి పేద విద్యార్థుల ప్రగతికి కృషి చేస్తామని ప్రకటించారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు శేషఫణి, శ్రీనివాస్, విజయ్, బుట్టే రామాంజనేయులు, విక్రం, గిరి, మధు, మురళి, నాగరాజునాయక్, అరుణ, రమాదేవి, సరస్వతి, ప్రకాష్, రమణ తదితరులు నేతృత్వం వహించారు. విద్యుత్ అంతరాయంపై నిరసన చెన్నేకొత్తపల్లి: విద్యుత్ సరఫరాలో రెండురోజులుగా అంతరాయం కలగడంతో హరియాన్‌చెరువు తదితర గ్రామాల రైతులు ఆదివారం సాయంత్రం చిన్నంపేట సబ్‌స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలకు నీరందక వాడిపోతున్నాయని తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పంట సాగు చేస్తే ఇప్పుడు కరెంటు రూపంలో ఇబ్బందులు సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఏఈ రామాంజనేయులు రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మరమ్మతుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిన మాట వాస్తవమేనన్నారు. దీనికితోడు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కూడా ఉందని, ఆపరేటర్‌ను మరోచోటుకు పంపుతున్నామన్నారు. తకపై మోటార్లకు విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
సిల్క్ సిటీలో దొంగలు పడ్డారు!
ధర్మవరం: సిల్క్ సిటీగా పేరుగాంచిన ధర్మవరంలో వరుస చోరీలు ప్రజలతో పాటు వ్యాపారులనూ బెంబేలెత్తిస్తున్నాయి. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బైక్ చోరీలకు అంతే లేకుండాపోతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా సగటున ఽవారానికి రెండు, మూడు ద్విచక్ర వాహనాలను మాయం చేస్తున్నారు. ఈ నెల 17న ముదిగుబ్బలోని సాయినగర్‌లో నివాసముంటున్న యూసఫ్ ఇంట్లో పట్టపగలే చొరబడిన దొంగలు 8 తులాల బంగారాన్ని అపహరించారు. మరుసటి రోజు అదే మండలంలోని బూదలాంబ ఆలయంలో హుండీని ధ్వంసం చేసి భక్తుల కానుకలను ఎత్తుకెళ్లారు. ఈ నెల 24న ఎల్సీకే పురంలో చేనేత కార్మికుడు దేవాంగం సూర్యనారాయణ తన కుమారుడి ఉన్నత చదువుల కోసం ఇంట్లో దాచుకున్న రూ.10లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. మరుసటి రోజే ముదిగుబ్బలోని నాయీ బ్రాహ్మణ కాలనీలో నివాసముంటున్న రమణమ్మ ఇంట్లోకి చొరబడి 6 తులాల బంగారాన్ని అపహరించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనలు వరుస చోరీల తీవ్రతకు అద్దం పడుతున్నాయి. దర్యాప్తులో కనిపించని పురోగతి ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తం చోటు చేసుకుంటున్న దొంగతనాల కేసుల దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. ఫిర్యాదులపై పోలీసులు కేసుల నమోదు తప్ప ఇప్పటి వరకూ దొంగతనాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. గడచిన 6 నెలల కాలంలో ధర్మవరం పట్టణంలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద ఉన్న పెణుజూరు సుబ్బరత్నమ్మ కాంప్లెక్స్‌లో ఒ కేరోజు నాలుగు దుకాణాల్లో దుండగులు చొరబడి రూ.లక్ష నగదు, వస్తువులు ఎత్తుకెళ్లారు. దొంగల కదలికలు సీసీపుటేజీల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. అంతకు ముందు ప్రియాంక నగర్లో ఒకే రోజు ఓ రెవెన్యూ ఉద్యోగి, మరో ఆటోడ్రైవర్ ఇళ్లలోనూ ఇదే తరహాలో దుండగులు చొరబడి 10తులాల బంగారాన్ని అపహరించారు. ఈ కేసు దర్యాప్తులోనూ పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. బైక్ దొంగలకు గుజరీ వ్యాపారుల బాసట? ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా రోజూ ఎక్కడో ఓ చోట బైక్ చోరీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బైక్ దొంగలకు ధర్మవరంలోని గుజరీ వ్యాపారులు బాసటగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బైక్ అపహరించగానే గుజరీ వ్యాపారుల వద్దకు తీసుకువెళ్లి ఏ పార్ట్‌కు ఆ పార్ట్ విడదీసి విక్రయిస్తున్నట్లుగా సమాచారం. దీంతో ధర్మవరంలోని గుజరీ వ్యాపారుల వద్దకు ద్విచక్ర వాహనాల విడి భాగాల కోసం ఉమ్మడి జిల్లా నుంచి వచ్చి వెళ్లే మెకానిక్‌ల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ మొత్తం అక్రమాల వెనుక గాంధీనగర్‌లోని ఓ గుజరీ వ్యాపారి డాన్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా పెచ్చుమీరుతున్న చోరీలు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలు వారానికి రెండు, మూడు బైక్‌లు మాయందొంగల ఆటకట్టిస్తాం చోరీల నివారణకు ధర్మవరం డివిజన్ వ్యాప్తంగా పక్కా ప్రణాళికను సిద్దం చేశాం. ధర్మవరం నలుదిక్కులా 40కి పైగా అత్యాధునిక సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. డ్రోన్ నిఘానూ అందుబాటులోకి తెస్తున్నాం. రోజూ పట్టణ శివారు ప్రాంతాలతో పాటు, జాతీయ రహదారుల చుట్టూ, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలలో పోలీసులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే దొంగల జాడ పసిగట్టి అరెస్ట్ చేస్తాం. –హేమంత్‌కుమార్, డీఎస్పీ, ధర్మవరంపట్టుచీరలకు ఖ్యాతి గాంచిన ధర్మవరం పట్టణంలో శాంతిభద్రతల అంశం ఆందోళనకు గురి చేస్తోంది. దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేదు. నడిరోడ్డుపై పబ్లిక్‌లోనే యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆల్ మేవా) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు షెక్షావలి డిమాండ్ చేశారు. ఆల్‌మేవా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వై.ఫకృద్ధీన్ అధ్యక్షతన ఆదివారం అనంతపురంలోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 నెలలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటి వరకూ 12వ పీఆర్సీ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. ఫకృద్ధీన్ మాట్లాడుతూ.. అర్హుత ఉన్న మైనార్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మైనార్టీ విద్యార్థులకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధానకార్యదర్శి ఫారూక్ మహమ్మద్ మాట్లాడుతూ.. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. కారుణ్య నియమాకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ, డీఏ అందని ద్రాక్షలా మారాయని వాపోయారు. సమావేశంలో ఆల్‌మేవా నాయకులు ఫరూఖ్, ఫకృద్దిన్, అన్వర్, రసూల్, అస్రఫ్అలి, దౌలా, రఫి, మహబూబ్‌బాషా, సర్దార్ పాల్గొన్నారు. ‘ఆల్‌మేవా’ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు షెక్షావలి -
ఉచిత ప్రయాణం తెచ్చిన తంటా
● వృద్ధురాలితో తోటి మహిళా ప్రయాణికుల గొడవ ● బస్సు ముందు బైఠాయించిన వృద్ధురాలుకదిరి: కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం పేరుతో తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మహిళల మధ్య గొడవలకు తావిస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కదిరిలో కూడా మహిళా ప్రయాణికుల మధ్య ఇలాంటి గొడవే జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం కదిరి నుంచి హిందూపురానికి వెళ్లేందుకు పల్లె వెలుగు బస్సు కదిరి బస్టాండ్‌కు వచ్చి ఆగింది. హిందూపురం నుంచి కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఇద్దరు మహిళలు రద్దీని గమనించి బస్సు కిటికీ ద్వారా తమ బ్యాగు ఒక సీటులో వేసి సీటు రిజర్వ్ చేసుకున్నట్లు భావించారు. అయితే కదిరికి చెందిన ఓ వృద్ధురాలు ఆ మహిళల కంటే ముందే వెళ్లి ఆ సీటులో ఉన్న బ్యాగు పక్కకు జరిపి కూర్చుంది. దీంతో ఆ ఇరువురు మహిళలు వృద్ధురాలితో గొడవకు దిగారు. ఈ లోగా బస్సు బయలుదేరి వేమారెడ్డి కూడలిని చేరింది. గొడవ పెద్దది కావడంతో డ్రైవర్ బస్సు ఆపేశాడు. వృద్ధురాలు బస్సు దిగి రోడ్డుపై ఆ బస్సు ముందు బైఠాయించింది. తనపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పట్టణ ఎస్ఐ బాబ్జాన్ వృద్ధురాలితో పాటు ఆ ఇరువురు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తప్పు తెలుసుకున్న ఇరువురు మహిళలు వృద్ధురాలికి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
దసరా జాతర
కదిరి అర్బన్: దసరా సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణాల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా స్వగ్రామలకు, బంధువులు, స్నేహితుల ఊళ్లకు పయనమయ్యారు. మరోవైపు పండుగ కోసం ఆడబిడ్డలంతా తమ పుట్టింటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజులుగా ఆర్టీసీ బస్టాండులన్నీ కిటకిటలాడుతున్నాయి. శనివారం అయితే కదిరి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో పోటెత్తింది. సర్వీసులు తక్కువగా ఉండటంతో బయటి నుంచి కానీ, డిపోలోంచి కానీ బస్సు అలా వస్తే చాలు... సీటు కోసం జనం పరుగులు తీస్తూ పోటీపడ్డారు. 60 మంది సామర్థ్యం కలిగిన బస్సుకు రెట్టింపు సంఖ్యలో ఎక్కారు. హిందూపురం, అనంతపురం, రాయచోటి, మదనపల్లి రూటు బస్సులకు రద్దీ విపరీతంగా కనిపించింది. బస్టాండు ప్రాంగణం ప్రయాణికులతో నిండి జాతరను తలపించింది. -
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు
ప్రశాంతి నిలయం: తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణలో భాగంగా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె తప్పదన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో ఇన్చార్జ్ డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డిని కలిసి ఐక్య కార్యచరణ కమిటీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సచివాలయ ఉద్యోగులు మాట్లాడారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ముందు 8 న్యాయమైన డిమాండ్లను ఉంచామని, వీటికి ప్రభుత్వం ఒప్పుకోకపోతే తమ పంథా మారబోదన్నారు. కార్యక్రమంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్పష్టం చేసిన సచివాలయాల ఉద్యోగులు -
కూలి పనులకు వెళ్తున్నా
నాకు పదవీ విరమణ ప్రయోజనాలు రూ.7 లక్షలు దాకా రావాలి. హయ్యర్ పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇంటి కోసం చేసిన అప్పు కూడా తీర్చలేక పోతున్నా. అందుకే వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే బకాయిలు పేరుకు పోయాయి. అంతకు ముందు ఇలా లేదు. ఎప్పటికప్పుడు ఇచ్చేవారు. – సుబ్బరాయుడు, ఆర్టీసీ విశ్రాంత డ్రైవర్, కదిరి వంద మందికిపైగా చనిపోయారు డ్రైవర్, శ్రామిక్, సెక్యూరిటీ తదితర కష్టతరమైన ఉద్యోగాలు ఏళ్లపాటు చేయడంతో ఆరోగ్యాలు దెబ్బతిని చాలా మంది సగటు జీవిత కాలం కంటే ముందే చనిపోతున్నారు. ఏడాది కాలంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 మందికి పైగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు అందకుండానే కన్నుమూశారు. కూటమి ప్రభుత్వం వీరికి సుమారు రూ.100 కోట్లు బకాయి పెట్టింది. ఆ డబ్బులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – ఎం.హరిమోహన్, ప్రధాన సలహాదారుడు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం, కదిరి బకాయి వాస్తవమే ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవుల బకాయిలు ఉన్నాయి. వీరి వివరాలన్నీ సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశాం. అన్నీ ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెందవద్దు. బకాయిలు త్వరలోనే విడుదలవుతాయి. –మధుసూదన్, జిల్లా ప్రజా రవాణాధికారి -
బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ హెచ్చరిక పెనుకొండ రూరల్: ‘‘బాలకృష్ణా నోరు అదుపులో పెట్టుకో..సినిమాలో డైలాగ్‌లు చెప్పినట్లు నిజజీవితంలో నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం జాగ్రత్త’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. శనివారం ఆమె స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ఎంపీ చిరంజీవి, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బాలకృష్ణ పిచ్చినట్లు అసెంబ్లీలో చిరంజీవిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌కళ్యాణ్ కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. అందుకే ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పందించాల్సి వచ్చిందన్నారు. తన సొంత అన్ననే దూషించినా మౌనంగా ఉన్న పవన్‌కళ్యాణ్ దిగజారుడు రాజకీయం ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోందన్నారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అతని మానసిక స్థితికి అద్దం పడుతున్నాయన్నారు. ప్రత్యర్థులకు కూడా సాయం చేసే వ్యక్తిత్వం కలిగిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ హయాం నుంచీ బసవతారకం కేన్సర్ ఆస్పత్రి బిల్లులు రూ.కోట్లలో పెండింగ్ ఉండగా.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మంజూరు చేసిన గొప్ప పాలకులు జగన్మోహన్రెడ్డి అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీలో ఎవరైనా తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ప్రస్తావించి వాటి పరిష్కారానికి చొరవ చూపుతారన్నారు. సొంత నియోజకవర్గానికే చుట్టపుచూపుగా వెళ్లే బాలకృష్ణకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. అందుకే ఆయన అసెంబ్లీని ఇతరులను దూషించేందుకే వాడుకుంటున్నారన్నారు. ఏడాది క్రితం హిందూపురం నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడలిపై గ్యాంగ్ రేప్ జరిగితే... బాధితులను పరామర్శించేంత సమయం కూడా బాలకృష్ణకు లేకపోవడం శోచనీయమన్నారు. అలాంటి వ్యక్తి కూడా నేడు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం చూసి జనమే మండిపడుతున్నారన్నారు. బాలకృష్ణ ఇప్పటికై నా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. -
ఉద్యోగం రాలేదని యువతి..
ధర్మవరం అర్బన్: ఉన్నత చదువులు అభ్యసించినా ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపిన మేరకు... ధర్మవరంలోని చంద్రబాబునగర్‌కు చెందిన బాలూ నాయక్, కుళ్లాయమ్మ బాయి దంపతుల కుమార్తె పల్లవి (23) ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేపట్టింది. నెలలు గడుస్తున్నా.. ఏ ఒక్క అవకాశమూ రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం అర్ధరాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు.. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు.సంపులో పడి చిన్నారి మృతిపరిగి: ప్రమాదవశాత్తు నీటి సంప్‌లో పడి ఓ చిన్నారి మృతి చెందాడు. పరిగి మండలం ఊటుకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఈశ్వరప్ప, శిల్ప దంపతుల మూడేళ్ల వయసున్న కుమారుడు మహేంద్రసింగ్ ధోని (ఎంఎస్ ధోని ) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంప్‌లో పడిపోయాడు. కాసేపటి తర్వాత చిన్నారి కోసం గాలింపు చేపట్టిన తల్లిదండ్రులు.. సంపులో తేలియాడుతున్న చిన్నారిని గుర్తించి వెలికి తీసి, హిందూపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. -
రూ.15.38 లక్షల సొత్తు రికవరీ
పెనుకొండ: వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, రూ.15.38 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. ఏడాదిగా పెనుకొండ టౌన్, మరువపల్లి ప్రాంతాల్లో వరుసగా ఇళ్లలో దొంగతనాలు, పెనుకొండ, రొద్దం మండలాల్లోని వ్యవసాయ భూముల్లో విద్యుత్ కేబుల్ అపహరణలు చోటు చేసుకున్నాయన్నారు. ఆయా కేసుల దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప నేతృత్వంలో సీఐ రాఘవన్, పెనుకొండ ఎస్ఐ.వెంకటేశ్వర్లు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయి నేరపరిశోధన వేగవంతం చేశారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 25న పెనుకొండ మండల పరిధిలోని పుట్టపర్తి క్రాస్‌లో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురిని ప్రశ్నించడంతో స్కూటీపై పరారయ్యేందుకు ప్రయత్నించారన్నారు. దీంతో వారిని అదుపులోకి తమదైన శైలిలో ప్రశ్నించడంతో 11 నెలల వ్యవధిలో ఆరు ఇళ్లలో దొంగతనాలు, 2 కేబుల్ అపహరణలకు పాల్పడినట్లు అంగీకరించారన్నారు. పట్టుబడిన వారిలో మడకశిర మండలం ఎల్లోటి గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, బోయనరేష్, పెనుకొండ మండలం మరువపల్లి గ్రామానికి చెందిన నరసింహులు ఉన్నారన్నారు. వీరి నుంచి రూ.15.38 లక్షల విలువ చేసే 132.870 గ్రాముల బంగారం, 127.980 గ్రాముల వెండి ఆభరణాలు, 770 మీటర్ల కేబుల్, స్కూటీ, ఇనుప రాడ్లు, స్క్రూడ్రైవర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామన్నారు. ముగ్గురి అరెస్ట్ -
కరెంటు కోతలపై రైతుల కన్నెర్ర
గాండ్లపెంట: వేళాపాలా లేని కరెంటు కోతలపై జనం కన్నెర్ర చేశారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గాండ్లపెంట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని వేపలకుంట ఫీడర్లో నిత్యం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో రాత్రి వేళల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వ్యవసాయ బోర్లు కూడా ఆడకపోవడంతో రైతులు పంటలు కోల్పోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం సోమయాజులపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు మండల కేంద్రానికి తరచ్చారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట కదిరి–రాయచోటి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... ఆరు నెలలుగా లైన్మెన్ లేకపోవడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. విద్యుత్ సరఫరా నిలిచినా ఎవరికి చెప్పాలో తెలియడం లేదన్నారు. తనకల్లు ఏఈ మండల ఇన్చార్జ్ ఏఈగా ఉన్నారని, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియడం లేదన్నారు. మండలానికి ఏఈని, తమ గ్రామానికి లైన్మెన్ను నియమించాలని డిమాండు చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోగా, ఎల్ఐ ప్రసాద్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. విషయాన్ని విద్యుత్ శాఖ ఏడీ వరప్రసాద్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, రెండు రోజుల్లోపు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో -
అంగన్వాడీల్లో హాజరు పెంచండి
ప్రశాంతి నిలయం: అంగన్వాడీల్లో చిన్నారుల హాజరుశాతం పెంచి.. కేంద్రంలో నమోదైన వారంతా అంగన్వాడీకి వచ్చేలా చూడాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సమీక్షించారు. తొలుత ఐసీడీఎస్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ప్రగతిని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు అన్ని కార్యక్రమాల్లో పురోగతి చూపి జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో చేర్చాలన్నారు. సిబ్బంది అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. సీడీపీఓలు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకి వచ్చే పిల్లలకు చదువు చెప్పడంతోపాటు సమయానికి పౌష్టికాహారం అందించాలన్నారు. అలాగే కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి నెలా సకాలంలో పౌష్టికాహారం పంపిణీ జరగాలన్నారు. ప్రతి సెంటర్లో పరిస్థితిలను బట్టి ఆకుకూరలు, కూరగాయల మొక్కలు పెంచాలన్నారు. పౌష్టికాహారం అవశ్యకతను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రతి నెలా శాఖలో చేపట్టే కార్యక్రమాలపై సమీక్షిస్తామన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల, సీడీపీఓలు నాగమల్లేశ్వరి, రాధిక, జయంతి, శాంతాలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో విస్తృతంగా ‘స్వచ్ఛతా హీ సేవ’.. జిల్లాలో విస్తృతంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేస్తున్నామని కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కె.విజయానంద్‌కు వివరించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటి చెత్త సేకరణ పకడ్బందీగా చేయడంతో పాటు అవగాహన కూడా కల్పిస్తున్నామని సీఎస్‌కు వివరించారు. ఐసీడీఎస్ సిబ్బందికి కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశం -
● ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కదిరిలోని చౌల్ట్రీ వీధికి చెందిన డాక్టర్ పి.నరసింహరాజు, పంకజరాణి దంపతులు తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏటా దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు రోజూ సాయంత్రం మహిళలతో పాటు పిల్లలను ఆహ్వానించి సంప్రదాయాలు, నీతి కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు అర్థమయ్యేలా బొమ్మల కొలువు ద్వారా తెలియజేస్తున్నామని వివరించారు. – కదిరి -
ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం
ప్రశాంతి నిలయం: దేవీ శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని విశ్వశాంతిని కాంక్షిస్తూ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రశాంతి నిలయంలో వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది. తొలుత సత్యసాయి మహాసమాధి చెంత వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన యజ్ఞ వేదిక వద్ద కృతువులు పూర్తి యజ్ఞం ప్రారంభించారు. వేలాది భక్తులు యజ్ఞంలో పాల్గొన్నారు. వేదపండితులకు నూతన వస్త్రాలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు అందజేశారు. సాయంత్రం ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్పెన్యూర్ షిప్ విభాగం డీన్ పల్లవ్ కుమార్ వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఙంను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం నందగిరి క్యాంపస్ విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. -
లగోరికి పూర్వవైభవం
సాంప్రదాయ ఆటకు గుర్తింపు లగోరి ఆటకు రాష్ట్ర స్థాయిలో ప్రాముఖ్యత పెరుగుతోంది. తాజాగా కొన్ని రాష్ట్రాలలో లగోరి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ద్వారా ఈ సాంప్రదాయ ఆటకు గుర్తింపు వస్తోంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఆట ద్వారా మన ఆలోచన విధానం, వేగం పెరుగుతాయి. – జాహ్నవి, హిందూపురం హిందూపురం టౌన్: అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలు ఒక్కొక్కటిగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే దేశాన్ని కబడ్డీ ఓ ఊపు ఊపేస్తుండగా... తాజాగా లగోరి క్రీడ ఆ జాబితాలోకి చేరుతోంది. దేశ సంస్కృతిలో ఓ భాగమైన లగోరి క్రీడకు చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు 5 వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలసి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లుగా పురాణ ఇతిహాసం భాగవతం వెల్లడిస్తోంది. వివిధ ప్రాంతాల్లో లగోరి ఆటను పిట్టు గరం, 7 రాళ్లు, 7 పెంకులాట, సత్తాడు వంటి చాలా పేర్లతో పిలుస్తుంటారు. హిందూపురం ప్రాంతంలో ఈ ఆట విశేష ప్రాచూర్యం పొందింది. ఇక్కడి విద్యార్థులు లగోరి ఆటలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఆట నియమాలు.. ● ఆటలో పాల్గొనడానికి రెండు జట్లు ఉంటాయి. ప్రతి జట్టులో కనీసం 15 మంది ఆటగాళ్లు ఉంటారు. ఆరుగురు లోపల, ఆరుగురు బయట, ముగ్గురు బెంచ్‌లో ఉంటారు. మొత్తం 12 మంది ఆటలో పాల్గొంటారు. ● ఆటలో ఏడు పెంకులు (లేదా ఫైబర్ డిస్కులు), ఒక బంతి ఉంటాయి. ● ఒక జట్టులోని ఆటగాడు బంతితో పెంకుల కుప్పపైకి విసిరి, వాటిని పడగొడతాడు. ● పెంకులు పడగొట్టిన జట్టు క్రీడాకారులు తమను తాము ప్రత్యర్థి జట్టు క్రీడాకారులు బంతితో కొట్టకుండా తప్పించుకుంటూ, ఆ పెంకులను తిరిగి పేర్చడానికి ప్రయత్నించాలి. ● ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బంతితో కొడితే, వారు ఆట నుండి తొలగించబడతారు. ● పెంకులను విజయవంతంగా పేర్చిన జట్టు గెలుస్తుంది, లేదా ప్రత్యర్థి జట్టులోని మిగిలిన ఆటగాళ్లందరినీ తొలగించిన జట్టుకు విజయం వరిస్తుంది. ప్రాచుర్యంలోకి వస్తున్న లగోరి ఆట.. హిందూపురం ప్రాంతంలో చాలా కాలంగా లగోరి ప్రాచుర్యంలో ఉంది. చాలా మంది విద్యార్థులు పాఠశాల విరామ సమయంలో వినోదం కోసం ఈ ఆటను ఆడుతుంటారు. సెలవు రోజుల్లో కాలనీల్లో లగోరి క్రీడ సర్వసాధారణమై పోయింది. ఈ క్రమంలో లగోరిపై హిందూపురం ప్రాంత విద్యార్థులు పూర్తి స్థాయి పట్టు సాధించగలిగారు. గత నెల ఆగష్టు 7న జిల్లా లగోరి అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందూపురంలోని చిన్మయ విద్యాలయంలో 1వ జిల్లా స్థాయి లగోరి చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనపరిచిన హిందూపురం విద్యార్థులు పలువురు రాష్ట్ర స్థాయిలో పోటీలకు అర్హత సాధించారు. ఆగస్టు 17న వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బాలికల లగోరి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన హిందూపురంతో పాటు మడకశిర, పెనుకొండ ప్రాంతానికి చెందిన విద్యార్ధినులు తమ ప్రతిభతో జిల్లా జట్టును విజేతగా నిలిపారు. లగోరి క్రీడపై పెరుగుతున్న ఆసక్తి రాష్ట్ర స్థాయిలో సత్తాచాటుతున్న ‘పురం’ విద్యార్థులు జిల్లాకు మంచి పేరు తెస్తా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతాం లగోరి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఈ ఆటను ప్రమోట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. లగోరి ఆటకు ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని జిల్లాకు మంచి పేరు తెస్తా. – మోక్షిత, హిందూపురం రాష్ట్ర స్థాయిలో లగోరి ఆటను ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో లగోరి అసోసియేషన్లు ఏర్పాటయ్యాయి. మేము రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాం. జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటాలని ఉంది. – లిఖిత, హిందూపురం -
బాలకృష్ణను పిచ్చాస్పత్రిలో చేర్చాలి
మడకశిర: ‘‘తనకు మెంటల్ ఉందని గతంలోనే బాలకృష్ణ వైద్యులతో ధ్రువీకరణ పత్రం తెచ్చుకున్నారు. అయితే ఆయన మానసిక స్థితి బాగుపడిందనుకున్నాం. కానీ గురువారం అసెంబ్లీలో ఆయన చేష్టలు చూస్తే పిచ్చి ముదిరినట్లు తెలుస్తోంది, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలి’’ అని వైఎస్సార్ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన తీరును చూసి తెలుగు ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. చిరంజీవిపై, మాజీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం ప్రజలు మరింత బాధపడుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తికా..తాము ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించిందని మదనపడుతున్నారన్నారు. ఇక నిండుసభలో చిరంజీవిని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దూషించినా పవన్‌కళ్యాణ్ మిన్నకుండిపోవడం చూస్తే పదవుల కోసం అతను ఎంతలా దిగజారారో అర్థం అవుతోందన్నారు. ఇక తన స్థాయి మరచి జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీలో బాలకృష్ణ తూలనాడటం దిగజారిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే వైఎస్ జగన్‌కు క్షమాపణ చెప్పాలని ఈరలక్కప్ప డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌ను మరోసారి దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.పవన్ నైజంబయటపడిందికదిరి టౌన్ : సొంత అన్నను అవమానించిన వారిని ఒక్కమాట మాట్లాడని పవన్‌కళ్యాణ్ నైజమేమిటో ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతోందని వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిండుసభలో ఎమ్మెల్యే బాలకృష్ణ తన అన్న చిరంజీవిని దూషించినా పవన్ కనీసం స్పందించకపోవడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. అందుకే ఎక్కడో ఉన్న చిరంజీవే ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. కూటమి భాగస్వామి అయిన పవన్‌కళ్యాణ్ కనీసం తన ఉనికినైనా కాపాడుకోవాలన్నారు. ఇక మద్యం మత్తులో అసెంబ్లీకి వెళ్లి ఎలా పడితే అలా మాట్లాడుతున్న బాలకృష్ణ మరోసారి ఇలాగే వ్యవహరిస్తే తాటతీస్తామని మక్బూల్ హెచ్చరించారు. ‘మెంటల్ బాలకృష్ణా...నోరు అదుపులో పెట్టుకో..లేకపోతే ఇబ్బందులు పడతావ్’’ అన్నారు. అసెంబ్లీలో దిగజారి మాట్లాడిన బాలకృష్ణను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి 15 నెలలైనా హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం.. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. అందులో భాగంగానే బాలకృష్ణతో మాట్లాడించారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. -
దారి తప్పిన దర్యాప్తు!
సాక్షి, పుట్టపర్తి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హిందూపురంలోని ఎస్బీఐ దోపిడీ కేసులో రీకవరీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. హిందూపురం పట్టణ శివారున తూమకుంట ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లో గత జూలై 27వ తేదీ రాత్రి భారీ చోరీ జరిగింది. నిందితుడు పక్కా ప్లాన్‌తో బ్యాంకులోకి చొరబడి సుమారు రూ.12 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లాడు. లొకేషన్ దొరక్కుండా... శాటిలైట్ ఫోన్ వాడి.. బ్యాంకులోకి చొరబడ్డాడు. అయితే కేవలం రెండు సెకన్ల సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు హరియాణకు చెందిన మాజీ ఆర్మీ అధికారి అనిల్ కుమార్ పన్వార్‌గా గుర్తించి ఈనెల 6వ తేదీన అరెస్టు చేశారు. దొంగ కథ.. పోలీసుల వంత.. ఎస్బీఐ దోపడీ కేసులో నిందితుడైన అనిల్ కుమార్ పన్వార్‌ను పట్టుకున్న పోలీసులు.. అతని నుంచి కేవలం రూ.2 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు మాత్రమే రీకవరీ చూపించారు. మిగతా బంగారం ఎక్కడ ఉందనే విషయంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. తనతో పాటు మరో నిందితుడు ఉన్నాడని.. అతడి వద్ద మిగతా బంగారం ఉందని అనిల్ కుమార్ పన్వార్ పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఆ నిందితుడు ఎవరు.. ఎక్కడ ఉన్నాడనే దానిపై స్పష్టత లేదు. అనిల్ కుమార్ పన్వార్ చెబుతున్న మాటలను పోలీసులు ఎందుకు నమ్ముతున్నారు? అసలు ఏం జరుగుతోంది? అనేది తెలియాల్సి ఉంది. దొంగ ట్రాప్‌లో పోలీసులు.. అనిల్ కుమార్ పన్వార్ చెప్పిన వివరాల మేరకు తూమకుంట బ్యాంకు దోపిడీ కేసులో ఇద్దరు పాల్గొన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. అయితే ఆ మరో వ్యక్తి ఎవరనేది పోలీసులు వెల్లడించలేదు. కానీ మరో నిందితుడో ఇంకో కేసులో రాజస్తాన్‌లో జైలు జీవితం అనుభవిస్తున్నట్లు సమాచారం. తూమకుంట బ్యాంకు దోపిడీలో మిగతా సొమ్ము అతడి వద్దనే ఉన్నట్లు అనిల్ కుమార్ పన్వార్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. నిజంగా అతడి వద్దనే బంగారం ఉందా? లేక పోలీసులు దొంగ అల్లిన కట్టుకథ ట్రాప్‌లో పడ్డారా అన్నది తెలియడం లేదు. ఎందుకంటే అనిల్ కుమార్ పన్వార్ చేసిన చోరీలన్నీ విభిన్నమైనవే. ఒక్కోసారి ఒక్కో స్టైల్లో దోపిడీ చేశాడు. కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ టెక్నాలజీ ఉపయోగించి దోపిడీలకు పాల్పడటం అతని స్టైల్. అలాంటి వ్యక్తి మాటలు నమ్మి పోలీసులు మరో నిందితుడి కోసం ఆరా తీస్తుండటం చర్చనీయాంశమైంది. వ్యసనంతో పతనమై.. బ్యాంకు చోరీ కేసులో పట్టుబడిన నిందితుడు అనిల్ కుమార్ పన్వార్ వ్యసనాలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2007లో ఆర్మీ నుంచి తిరిగొచ్చిన అతను.. జూదంలో భారీ మొత్తం కోల్పోయాడు. అనంతరం బ్యాంకులకు కన్నం వేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా పదే పదే బ్యాంకుల్లో దోపిడీ చేస్తూ సుమారు 8 ఏళ్లు పైగా జైలు జీవితం అనుభవించాడు. చోరీ చేయడం.. జైలుకు వెళ్లడం.. బయటికి రావడం.. మళ్లీ దొంగతనం చేయడం.. ఇదే జీవనశైలిగా మార్చుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 14 బ్యాంకుల్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్‌లో జైలు నుంచి బయటికి వచ్చిన అతను... జూలైలో తూమకుంట ఎస్బీఐకి కన్నం వేశాడు. ప్రస్తుతం అరెస్టయి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. పదే పదే చోరీలు చేస్తూ కటకటాల పాలవుతున్న అతన్ని పరామర్శించేందుకు కుటుంబ సభ్యులు కూడా రావడం లేదు. ఇటీవల తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ‘ఇక నుంచి దొంగతనాలు మానేస్తా’ అని మాట ఇచ్చినట్లు తెలిసింది. ఎస్బీఐ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసుల అలసత్వం రూ.12 కోట్ల చోరీలో.. రూ.2 కోట్లు మాత్రమే రికవరీ ఇప్పటికే పట్టుబడిన అనిల్ కుమార్ కట్టుకథను నమ్ముతున్న పోలీసులు మరో నిందితుడి వద్దే బంగారం ఉందని భావిస్తున్న వైనం మరి ఎవరా దొంగ.. ఎక్కడా బంగారు.. ప్రశ్నిస్తున్న జనం -
మూగజీవాలపై విష ప్రయోగం
సోమందేపల్లి: మండలంలోని పోలేపల్లిలో చెందిన పశువులపై దుండగులు విష ప్రయోగం చేశారు. ఎనిమిది గొర్రెలు, ఓ ఆవు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కురుబ మారుతి, అంజినమ్మ దంపతులు పాడి, జీవాల పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గొర్రెలతో పాటు ఓ ఆవును కొనుగోలు చేసేలా గురువారం ఓ వ్యక్తి అడ్వాన్సు చెల్లించి శుక్రవారం తోలుకెళతానని చెప్పి వెళ్లాడు. శుక్రవారం ఉదయం నిద్ర లేచే సరికి పాకలో ఉన్న ఎనిమిది గొర్రెలు, ఓ ఆవు మృతి చెందాయి. విష ప్రభావం కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరులు వాపోయారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
మార్కెట్లో నకిలీ నోటు!
సాక్షి, పుట్టపర్తి : మార్కెట్లో నకిలీ నోటు హల్చల్ చేస్తోంది. చిరువ్యాపారాలు, రైతులను టార్గెట్ చేసుకుని నకిలీ నోట్ల కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సందు దొరికితే నకిలీ నోట్లు అంటగడుతున్నారు. బ్యాంకుకు వెళ్లినప్పుడు ‘నకిలీ నోట్ల’ వ్యవహారం బయటపడుతుండగా.. బాధితులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. కొందరు పోలీçÜులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ‘డిజిటల్’ అందుబాటులో ఉన్నా... ఫోన్‌పే, గూగుల్‌పే, యూపీఏ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ తదితర ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నా గ్రామీణులు వాటి జోలికి వెళ్లడం లేదు. ఒక్క నంబరు తేడాతో ఫోన్ పే ద్వారా లేనిపోని సమస్యలు వస్తుండటంతో పల్లెటూరి వ్యాపారులు కరెన్సీకే జై కొడుతున్నారు. దీంతో కేటుగాళ్లు అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ప్రతి వారం గొర్రెలు – మేకల సంత, పశువుల సంతల్లో జీవాలను కొనుగోలు చేసి నకిలీ నోట్లు కట్టబెట్టి పరారవుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న నకిలీ ఘటనలన్నీ సంతల్లోనే జరగడం గమనార్హం. కొత్తచెరువు, గోరంట్ల, కదిరి, తనకల్లులో నకిలీ నోట్ల ఘటనలు వెలుగు చూశాయి. ఇక పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ మారి్పడి పేరుతో నకిలీ నోట్లు అంటగడుతున్నట్లు సమాచారం. హిందూపురం పట్టణంలోనూ రూ.200 నకిలీ నోట్ల బయటపడ్డాయి. పర్సెంటేజీలకు ఆశపడి.. ఇటీవల బయటి ప్రాంతాల నుంచి కొందరు కేటుగాళ్లు జిల్లాలో ప్రవేశించారు. నకిలీ నోట్ల కట్టలను.. అసలు నోట్లతో కలిపి చెలామణి చేస్తున్నారు. బెంగళూరులో ఓ వ్యక్తి దగ్గర నుంచి నకిలీ నోట్ల కట్టలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. అతడి వద్ద నుంచి 30 శాతం పర్సెంటేజీతో కొందరు తీసుకొచ్చి.. మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.150 చెల్లిస్తే రూ.200 నకిలీ నోటు ఇస్తారు. దీన్ని మార్చుకుంటే రూ.50 అదనంగా వస్తుంది. ఆ పర్సెంటేజీకి ఆశపడి కొందరు యువకులు నకిలీ నోట్ల చెలామణి పనిలో బిజీగా గడుపుతున్నారు. ఎక్కడైతే ఎక్కువగా నగదు సహిత లావాదేవీలు ఉంటున్నాయో.. అక్కడ ఎంట్రీ ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా రూ.200 నోట్లే.. పెద్ద నోట్లతో ఎక్కువగా మోసం జరుగుతోందని ప్రచారం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రూ.500 నోట్లు ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు. దీంతో నకిలీ నోట్ల మార్పిడి కొంచెం కష్టంగా మారడంతో నకిలీ కరెన్సీ మాయగాళ్లు రూ.200 నోట్లపై పడినట్లు సమాచారం. హిందూపురం పట్టణంలో చిరు వ్యాపారుల వద్ద రూ.200 నోట్ల కట్టలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయా నోట్ల కట్టల్లో నకిలీ నోట్లు కలపడంతో మోసపోయిన ఘటనలు ఇటీవల కాలంలో నాలుగైదు వెలుగు చూశాయి. అయితే ఒక్కో వ్యక్తికి ఒకటి లేదా రెండు నోట్లు మాత్రమే రావడంతో పెద్ద నష్టం లేదని మౌనంగా ఉన్నట్లు తెలిసింది. నకిలీ నోట్లను చూపుతున్న ఇతని పేరు నగేష్. ముదిగుబ్బ మండలం. ఈ ఏడాది ఆరంభంలో కదిరి మార్కెట్ యార్డులో రెండు పొట్టేళ్లను విక్రయించగా.. కొనుగోలు చేసిన వ్యక్తి రూ.32 వేలకు గానూ అన్నీ నకిలీ నోట్లే ఇచ్చాడు. ఇంటికి వెళ్లాక గుర్తించిన రైతు నగేష్ వెంటనే కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల బత్తలపల్లిలో ఓ కేటుగాడు రూ.10 విలువ చేసే సరుకు కొని ఇలా ఈ నకిలీ రూ.200 నోటు ఇచ్చారు. ఆ వ్యాపారి రూ.190 వెనక్కు ఇవ్వగా ఎంచక్కా జేబులో వేసుకుని వెళ్లాడు. ఆ డబ్బులు బ్యాంకు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన చిరువ్యాపారి అది కలర్ జిరాక్స్ అని తెలిసి లబోదిబోమన్నాడు. వదిలే ప్రసక్తే లేదు పశువులు, గొర్రెల సంతల్లో నకిలీ నోట్ల చెలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. నకిలీ నోట్ల మార్పిడి నేరం. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. ఎవరు ఇచ్చారనే విషయం గుర్తుంచుకుని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి. – సతీశ్ కుమార్, జిల్లా ఎస్పీ -
వ్యక్తి దుర్మరణం
రాప్తాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం పాతూరులోని భవానీ నగర్లో నివాసముంటున్న కురుబ మల్లేశప్ప (53), రమాదేవి దంపతులు తోపుడు బండిపై అరటి కాయల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మల్లేశప్ప రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలో అరటి తోటలు చూసుకుని 44వ జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు వైపు నుంచి శరవేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. రాత్రి 7 గంటలకు మృతుడిని మల్లేశప్పగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. ఘటనపై సీఐ టి.వి.శ్రీహర్ష కేసు నమోదు చేశారు.‘గురుకుల’ సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి మృతిబుక్కరాయసముద్రం: మండలంలోని కొర్రపాడు వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సేవా సుప్రీం ఏజెన్సీ కింద పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న కృష్ణవేణి కుమార్తె, 17 నెలల వయసున్న చిన్నారి 3 రోజుల క్రితం గురుకుల పాఠశాల సిబ్బంది కాచి పక్కన ఉంచిన పాలలో పడి తీవ్రంగా గాయపడింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని దళిత సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.21 ఎల్పీజీ సిలిండర్ల సీజ్గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలో జిలాన్ గ్యాస్ ఫిల్లింగ్ దుకాణంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమంగా నిల్వ చేసిన 21 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్ఐ నరేంద్ర భూపతి, సీఎస్‌డీటీ జీవీ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.చైన్ స్నాచింగ్‌కు విఫల యత్నంపావగడ: స్థానిక ఎంఏఆర్ లే అవుట్లో చైన్ స్నాచింగ్‌కు ప్రయత్నించి ఇద్దరు యువకులు భంగపడ్డారు. వివరాలు.. మాజీ కౌన్సిలర్ మహాలక్ష్మమ్మ ఎంఏఆర్ లే అవుట్లో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం 6.0 గంటల సమయంలో వ్యాపారం చేస్తుండగా ఇద్దరు యువకుడు అక్కడకు చేరుకుని తమకు విక్స్ బిళ్లలు కావాలని అడిగారు. ఆ సమయంలో విక్స్ బిళ్లలు ఉన్న డబ్బా తీసుకునేందుకు వెనుతిరిగిన మహాలక్ష్మమ్మ మెడలోని బంగారు చైన్‌ను లాగేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఆమె వెంటనే మెడలోని చైన్‌ను పట్టుకుని గట్టిగా కేకలు వేయడంతో వదిలేసి దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ విజయకుమార్ తెలిపారు.యువ పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తుల ఆహ్వానంఅనంతపురం టౌన్: రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఇండస్ట్రీయల్ పార్క్ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న యువ పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్క్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఓసీ, బీసీలకు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న పారిశ్రామిక వేత్తలు బళ్లారి రోడ్డులోని ఏపీఐఐసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
ఆందోళనలు ఉధృతం చేస్తాం
భవన నిర్మాణ రంగ కార్మికులకు ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. సంక్షేమ బోర్డును పునరుద్దరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నమ్మబలికారు. అధికారం చేపట్టిన తర్వాత నేటికీ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ఎమ్మెల్యేలు సైతం కార్మికుల సమ్యస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టరేట్ల, కార్మిక శాఖ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాల్సి వచ్చింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. డిమాండ్ల సాధనకు ఉద్యమాలు ఉధృతం చేస్తాం. – సాంబశివ, భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
నిర్మాణ రంగ కార్మికులపై చిన్నచూపు
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ రంగ కార్మికులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్న అధికార పార్టీ నాయకుల తీరుతో పనులు లేక నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ల వద్ద, కార్మిక శాఖ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వంలో కనీస చలనం కూడా లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం మెడలు వంచే దిశగా ఉద్యమాలను ఉధృతం చేసే దిశగా పక్కా కార్యాచరణతో పోరాటాలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. సంక్షేమం ఊసెత్తని కూటమి సర్కారు.. జిల్లాలో 2.50 లక్షల మందికి పైగా అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. తాపీ, పెయింటింగ్, రాడ్‌బెండింగ్, ప్లంబింగ్, ఎలక్రికల్, సెంట్రింగ్, మార్బుల్స్, టైల్స్, కంకర, ఇసుక రవాణా, మట్టి పని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తదితర పనులతో జీవిస్తున్న వారు ప్రస్తుతం పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ నేతలు.. పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇసుక కొరత కారణంగా స్థానికంగా పనులు లేక భవన నిర్మాణ రంగ కార్మికులు పస్తులతో బతకాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి స్పష్టమైన హామీలు ఇచ్చిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమం ఊసెత్తక పోవడంతో కార్మికుల్లో అసహనం రేకెత్తుతోంది. తుంగలోకి ఎన్నికల హామీలు.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి పెద్దలు తుంగలోకి తొక్కారు. గతంలో ౖడాక్డర్ వెఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్దరిస్తామని, కార్మికుల సంక్షేమానికి అవసరమైన తొమ్మిది రకాల పథకాలు అమలు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అప్పట్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఉచిత ఇసుక సరఫరా చేసి భవన నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల దృష్టికి భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు తీసుకెళ్లినా... ఫలితం దక్కలేదు. ఇసుక ధరలు పెరిగి భవన నిర్మాణాలు అగిపోవడంతో పనులు లేక కార్మికులు రోడ్డున పడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే ● మెమో 12, 14 రద్దు చేసి సంక్షేమ బోర్డును పునరుద్దరించాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ● కార్మికులందరికీ తొమ్మిది రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. ● రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న క్లైమ్లను వెంటనే పరిష్కరించాలి. ● జిల్లా వ్యాప్తంగా కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రూ.8 కోట్ల బకాయిలను విడుదల చేయాలి ● ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి నేతలు ఏడాదిన్నరగా సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలకు సిద్ధమని ప్రకటన ‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు అండగా ఉంటుంది. ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగితే కుటుంబాలను ఆదుకునే బాధ్యతను తీసుకుంటుంది’ ... ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. -
‘స్వచ్ఛ హిందూపురం’లో భాగస్వాములు కావాలి
● ప్రజలకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు హిందూపురం టౌన్: ‘స్వచ్ఛ హిందూపురం’ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ మున్సిపల్ పార్క్ వద్ద ‘స్వచ్ఛత హీ సేవ’లో భాగంగా ‘ఏక్ దిన్, ఏక్ గంట ఏక్ సాత్‘ చేపట్టిన శ్రమదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక మహిళలతో కలిసి మున్సిపల్ పార్కుతో పాటు చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అనంతరం స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి తడి, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయడంతో పాటు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ పరిశుభ్రతకు కృషిచేసిన 8 మంది మున్సిపల్ కార్మికులను మెమెంటోలతో కలెక్టరు, మున్సిపల్ చైర్మన్ సత్కరించారు. అనంతరం కలెక్టర్ సప్పల్లమ్మ వీధి సుగూరులో ‘పీఎం సూర్య ఘర్’ పథకం ద్వారా లబ్ధిదారు నర్మద ఇంటిపై 3.24 కిలోవాట్లతో ఏర్పాటు చేసుకున్న రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ‘సూర్య ఘర్’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్, కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాంరెడ్డి, అధకారులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డు పరిశీలన.. పట్టణంలోని మోతుకపల్లి వద్ద గల డంపింగ్ యార్డును కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. అక్టోబర్ 2 నాటికి డంప్ యార్డును శుభ్రం చేయాలన్నారు. అలాగే కొత్త డంప్ యార్డ్స్ ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. -
ప్రభుత్వమే చెల్లించాలి
గత ప్రభుత్వం లాగానే కూటమి ప్రభుత్వం కూడా ఉచిత పంటల బీమాను అమలు చేస్తే బాగుంటుంది. రైతులు రూపాయి కూడా చెల్లించకుండానే జగన్ ప్రభుత్వం రైతులకు బీమా డబ్బులు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం రైతులపై ప్రీమియం భారం మోపింది. అందుకే చాలామంది రైతుల బీమాకోసం ప్రీమియం చెల్లించలేదు. వారందరికీ బీమా వర్తించదు. – రైతు ఓబిరెడ్డి, బుచ్చయ్య గారిపల్లి, బుక్కపట్నం మండలం ప్రీమియం చెల్లించిన వారికే బీమా సకాలంలో ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా వర్తిస్తుంది. మిగిలిన వారికి వర్తించదు. సాధారణంగా బ్యాంకులో క్రాప్‌లోన్ పొంది రెన్యూవల్ చేసుకున్న వారంతా బీమా ప్రీమియం చెల్లించారు. వారందరికీ పంటల బీమా వర్తిస్తుంది. ప్రీమియం చెల్లించని వారికి బీమా వర్తించదు. – రామునాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
దళారుల రాజ్యం.. రైతు నిలువు దోపిడీ
పెద్దపప్పూరు: దళారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తుండడంతో టమాట రైతు నిలువు దోపిడీకి గురయ్యాడు. పంటను మార్కెట్‌కు తరలిస్తే లాభం మాట దేవుడెరుగు... రైతు చేతి నుంచే రూ. వందలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. వివరాలు... పెద్దపప్పూరుకు చెందిన టమాట రైతు షేక్ రఫీ గురువారం 25 కిలోల చొప్పున 31 బాక్సుల టమాటను బొలెరో వాహనంలో నంద్యాల జిల్లా ప్యాపిలిలోని మార్కెట్లో విక్రయానికి తీసుకెళ్లాడు. ఇందుకు గాను వాహనానికి రూ.1,500 అద్దె చెల్లించాడు. అక్కడి దళారులు గ్రేడింగ్ చేసి 31 బాక్సులను కాస్త 23 బాక్సులకు కుదించారు. బాక్స్‌కు రూ.70 చొప్పున వేలం పాడడంతో రూ.1,610 వచ్చింది. దళారుల కమీషన్ రూ.160 పోను రూ.1,450 చేతికి అందింది. పంట కోసిన కూలీలకు రూ. 600 రైతు చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క రూపాయి ఆదాయం రాకపోగా చేతి నుంచి మరింత ఖర్చు పెట్టాల్సి రావడంతో రైతు ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఆదాయం రాకపోగా రైతన్నకు చేతి నుంచి రూ.600 ఖర్చు -
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది : కలెక్టర్
ప్రశాంతి నిలయం: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు –2025 పోస్టర్లను గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. నవంబర్ 7, 8, 9 తేదీల్లో అనంతపురంలోని అర్డీటీ స్టేడియం వేదికగా 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడాసాంస్కృతిక ఉత్సవాలు–2025 జరగనున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు, సీసీఎల్ఏ కార్యాలయం నుంచి 27 యూనిట్లు పాల్గొంటాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ రామిశెట్టి వెంకటరాజేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, వివిద మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.ఎలుగు బంట్ల దాడిలో రైతుకు గాయాలుపావగడ: తాలూకాలోని నాగలాపురం గేట్ గ్రామానికి చెందిన రైతు వెంకటేశప్ప పై రెండు ఎలుగుబంట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గురువారం ఉదయం పొలం పనులు చేసుకుంటున్న సమయంలో రెండు ఎలుగుబంట్లు దాడి చేయడంతో వెంకటేశప్ప తల, వెన్ను, తదితర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే క్షతగాత్రుడిని తుమకూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి బసవరాజు.. ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. -
రైతుకు కూటమి శఠగోపం
అమడగూరు మండలం పూలకుంటపల్లికి చెందిన రమణారెడ్డి అనే రైతు 2023 ఖరీఫ్‌లో 8 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. అతివృష్టితో పంట పూర్తిగా దెబ్బతినింది. అప్పటి జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ అమలు చేసిన కారణంగా ఆ రైతు రూపాయి ప్రీమియం చెల్లించకుండానే బీమా అందుకున్నాడు. ఉచిత పంటల బీమా లేనట్లయితే ఆయనకు పెట్టుబడి కూడా చేతికందేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రీమియం డబ్బులు రైతులే చెల్లించాలని మెలిక పెట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సగం మంది రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదు. దీంతో వీరంతా ఈసారి బీమాకు దూరం కానున్నారు. కదిరి: అన్నదాతలపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లూ విజయవంతంగా అమలు చేసిన ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’కు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ఈ పథకం స్థానంలో 2019కి పూర్వం ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు వాతావరణ ఆధారిత బీమాను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రీమియం డబ్బులు రైతులే చెల్లించాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద కంది, జొన్న, వరి తదితర పంటలున్నాయి. వాతావరణ ఆధారిత బీమా పరిధిలో వేరుశనగ, అరటి తదితర పంటలను చేర్చారు. వరి పంటను గ్రామం యూనిట్‌గా, వేరుశనగను మండలం యూనిట్‌గా, కంది, జొన్న పంటలను జిల్లా యూనిట్‌గా పరిగణిస్తున్నారు. రుణం తీసుకున్న వారికే బీమా.. జిల్లాలో 2,98,305 మంది రైతులు ఉండగా... వారిలో 1,69,018 మంది మాత్రమే ఈ ఖరీఫ్ సీజన్లో పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించారు. అంటే దాదాపుగా సగం మంది రైతులు ప్రీమియం చెల్లించలేదు. బ్యాంకులో తీసుకున్న క్రాప్‌లోన్ రుణాలను రెన్యూవల్ చేసేది లేదని బ్యాంకర్లు మెలిక పెట్టడంతో ప్రీమియం చెల్లించక తప్పలేదని పలువురు రైతులు వాపోతున్నారు. రైతుకు అండగా ఉంటామని గొప్పలు చెప్పి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత అన్నదాతలను అన్ని విషయాల్లోనూ మోసం చేస్తోందని మండిపడుతున్నారు. గతంలో ఉచిత బీమాతో లబ్ధి ఇలా.. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’తో జిల్లాలోని 2,96,541 మంది రైతులు నాలుగేళ్లలో ఏకంగా రూ.718.57 కోట్లు లబ్ధి పొందారు. అది కూడా పైసా ప్రీమియం చెల్లించకుండానే. కానీ కూటమి సర్కార్ రైతులే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తించేలా ఫసల్ బీమాను అమలు చేస్తోంది. ఇప్పటికే పంటల పెట్టుబడికి అప్పులు చేసిన రైతులు ఇన్యూరెన్స్ మొత్తం కట్టలేక బీమాకు దురమయ్యారు. ‘ఈ–క్రాప్’ మెలికతో ఇబ్బందులు.. రైతులు పంటనష్ట పరిహారం పొందాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవాలన్నా ‘ఈ–క్రాప్’ నమోదును కూటమి ప్రభుత్వం తప్పని సరి చేసింది. ఈ నేపథ్యంలో పంటలబీమా కోసం రైతులు ప్రీమియం చెల్లించినప్పటికీ ఈ–క్రాప్ నమోదు చేయకపోతే బీమా వర్తించదు. ‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన’కు కూడా ఈ–క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందేనని కూటమి సర్కార్ చెబుతోంది. కానీ గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా అప్పటి జగన్ ప్రభుత్వం రైతులు రూపాయి ప్రీమియం చెల్లించకుండానే పంటల బీమా ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పంటల బీమాకు మంగళం ‘పీఎం ఫసల్’ పేరుతో అన్నదాతల జీవితాలతో ఆటలు ప్రీమియం రైతులే చెల్లించేలా నిర్ణయం డబ్బు కట్టినా ఈ–క్రాప్ నమోదు చేస్తేనే పరిహారమంటూ మెలిక ప్రీమియం భారంతో చాలా మంది బీమాకు దూరం పంట నష్టపోయినా పరిహారం అందేది శూన్యం కూటమి సర్కారు తీరుపై మండిపడుతున్న రైతులు -
‘ఈ–క్రాప్’ నమోదు వేగవంతం చేయండి
కదిరి అర్బన్: ‘ఈ–క్రాప్’ నమోదు వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కదిరిలోని కుటాగుళ్ల, ముత్యాలచెరువులో పర్యటించారు. ఈ సందర్భంగా కుటాగుళ్లలో రైతు సిద్దప్ప సాగు చేస్తున్న పంట వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేశారా... అని స్థానిక వ్యవసాయాధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముత్యాలచెరువులోని తిరుపాల్‌నాయక్ మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులు కూడా ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలను ‘ఈ–క్రాప్’లో నమోదు చేయించుకోవాలని, లేకపోతే ప్రభుత్వం అందించే సబ్సిడీలు, పంట నష్టపరిహారం వర్తించబోవన్నారు. ఏడీఎం సనావుల్లాతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రాయితీ జమ అయ్యేలా చూడండి ● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రశాంతి నిలయం: జిల్లాలోని అర్హులందరికీ ‘దీపం –2’ పథకం రాయితీ జమయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సీఎస్డీటీలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ‘దీపం–2’ పథకం కింద రాయితీ జమకానీ, ట్రాన్షక్షన్ ఫెయిల్ అయిన కేసులపై ఆరా తీశారు. రాయితీ జమ కాని ‘దీపం–2’ లబ్ధిదారుల వివరాలు వెంటనే అందించాలని ఆదేశించారు. అర్హులందరికీ రాయితీ జమ అయ్యేలా గ్యాస్ ఏజెన్సీలు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సీఎస్డీటీలు కూడా ఈ అంశంపై ప్రతివారం సమీక్షించాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, ఎల్డీఎం రమణకుమార్, సీఎస్డీటీలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. రేపటి నుంచి రెండోదశ డిగ్రీ అడ్మిషన్లు అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం నుంచి రెండోదశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్కియాలజీ, హిస్టరీ, స్టాటిస్టిక్స్, జర్నలిజం, క్రియేటివ్ రైటింగ్, డేటా సైన్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు, మ్యాథమెటిక్స్, అనిమల్ బయోటెక్నాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక ఉంటుంది. -
మార్కెట్లో నకిలీ నోటు!
సాక్షి, పుట్టపర్తి మార్కెట్లో నకిలీ నోటు హల్చల్ చేస్తోంది. చిరువ్యాపారాలు, రైతులను టార్గెట్ చేసుకుని నకిలీ నోట్ల కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సందు దొరికితే నకిలీ నోట్లు అంటగడుతున్నారు. బ్యాంకుకు వెళ్లినప్పుడు ‘నకిలీ నోట్ల’ వ్యవహారం బయటపడుతుండగా.. బాధితులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ‘డిజిటల్’ అందుబాటులో ఉన్నా... ఫోన్‌పే, గూగుల్‌పే, యూపీఏ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ తదితర ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నా గ్రామీణులు వాటి జోలికి వెళ్లడం లేదు. ఒక్క నంబరు తేడాతో ఫోన్ పే ద్వారా లేనిపోని సమస్యలు వస్తుండటంతో పల్లెటూరి వ్యాపారులు కరెన్సీకే జై కొడుతున్నారు. దీంతో కేటుగాళ్లు అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ప్రతి వారం గొర్రెలు – మేకల సంత, పశువుల సంతల్లో జీవాలను కొనుగోలు చేసి నకిలీ నోట్లు కట్టబెట్టి పరారవుతున్నారు. జిల్లాలో చోటుచేసుకున్న నకిలీ ఘటనలన్నీ సంతల్లోనే జరగడం గమనార్హం. కొత్తచెరువు, గోరంట్ల, కదిరి, తనకల్లులో నకిలీ నోట్ల ఘటనలు వెలుగు చూశాయి. ఇక పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో నకిలీ నోట్లు అంటగడుతున్నట్లు సమాచారం. హిందూపురం పట్టణంలోనూ రూ.200 నకిలీ నోట్ల బయటపడ్డాయి. పర్సెంటేజీలకు ఆశపడి.. ఇటీవల బయటి ప్రాంతాల నుంచి కొందరు కేటుగాళ్లు జిల్లాలో ప్రవేశించారు. నకిలీ నోట్ల కట్టలను.. అసలు నోట్లతో కలిపి చెలామణి చేస్తున్నారు. బెంగళూరులో ఓ వ్యక్తి దగ్గర నుంచి నకిలీ నోట్ల కట్టలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. అతడి వద్ద నుంచి 30 శాతం పర్సెంటేజీతో కొందరు తీసుకొచ్చి.. మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.150 చెల్లిస్తే రూ.200 నకిలీ నోటు ఇస్తారు. దీన్ని మార్చుకుంటే రూ.50 అదనంగా వస్తుంది. ఆ పర్సెంటేజీకి ఆశపడి కొందరు యువకులు నకిలీ నోట్ల చెలామణి పనిలో బిజీగా గడుపుతున్నారు. ఎక్కడైతే ఎక్కువగా నగదు సహిత లావాదేవీలు ఉంటున్నాయో.. అక్కడ ఎంట్రీ ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా రూ.200 నోట్లే.. పెద్ద నోట్లతో ఎక్కువగా మోసం జరుగుతోందని ప్రచారం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రూ.500 నోట్లు ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు. దీంతో నకిలీ నోట్ల మార్పిడి కొంచెం కష్టంగా మారడంతో నకిలీ కరెన్సీ మాయగాళ్లు రూ.200 నోట్లపై పడినట్లు సమాచారం. హిందూపురం పట్టణంలో చిరు వ్యాపారుల వద్ద రూ.200 నోట్ల కట్టలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయా నోట్ల కట్టల్లో నకిలీ నోట్లు కలపడంతో మోసపోయిన ఘటనలు ఇటీవల కాలంలో నాలుగైదు వెలుగు చూశాయి. అయితే ఒక్కో వ్యక్తికి ఒకటి లేదా రెండు నోట్లు మాత్రమే రావడంతో పెద్ద నష్టం లేదని మౌనంగా ఉన్నట్లు తెలిసింది. రెండు వారాల క్రితం కొత్తచెరువు గొర్రెల సంతలో ఓ గొర్రెల కాపరి తన పొట్టేళ్లను రూ.20 వేలకు ఓ వ్యాపారికి విక్రయించాడు. ఇచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా.. బ్యాంకు అధికారులు రూ.20 వేలల్లో రూ.3 వేలు (ఆరు రూ.500 నోట్లు) నకిలీగా తేల్చారు. సంతలో వ్యాపారి ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ మార్పిడి ముసుగులో నకిలీ నోట్ల చెలామణి విచ్చలవిడిగా సాగుతోంది. రెండు నెలల క్రితం గోపురం క్రాస్ వద్ద ఓ వ్యక్తి... రూ.60 లక్షల మేర నకిలీ విదేశీ కరెన్సీ ఇచ్చి ఇండియన్ కరెన్సీ తీసుకువెళ్లాడు. ఆలస్యంగా గుర్తించిన స్థానికుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. తాను ఆర్బీఐ అనుమతి లేకుండానే ‘విదేశీ కరెన్సీ మారకం’ వ్యవహారాలు నడుపుతుండటంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయాడు. జిల్లాలో కలకలం రేపుతున్న నకిలీ కరెన్సీ అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్లు గాలం కొత్తచెరువు, పుట్టపర్తి, కదిరి పట్టణాల్లో అధికం హిందూపురంలో వాణిజ్య లావాదేవీల్లో నకిలీ నోట్లు పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ ముసుగులో రూ.లక్షల్లో దోపిడీ గొర్రెలు, పశువుల సంతల్లో ఈజీగా నకిలీ నోట్ల మార్పిడి ఇటీవల బత్తలపల్లిలో ఓ కేటుగాడు రూ.10 విలువ చేసే సరుకు కొని ఇలా ఈ నకిలీ రూ.200 నోటు ఇచ్చారు. ఆ వ్యాపారి రూ.190 వెనక్కు ఇవ్వగా ఎంచక్కా జేబులో వేసుకుని వెళ్లాడు. ఆ డబ్బులు బ్యాంకు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన చిరువ్యాపారి అది కలర్ జిరాక్స్ అని తెలిసి లబోదిబోమన్నాడు. నకిలీ నోట్లను చూపుతున్న ఇతని పేరు నగేష్. ముదిగుబ్బ మండలం. ఈ ఏడాది ఆరంభంలో కదిరి మార్కెట్ యార్డులో రెండు పొట్టేళ్లను విక్రయించగా.. కొనుగోలు చేసిన వ్యక్తి రూ.32 వేలకు గానూ అన్నీ నకిలీ నోట్లే ఇచ్చాడు. ఇంటికి వెళ్లాక గుర్తించిన రైతు నగేష్ వెంటనే కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆర్డీటీ పరిరక్షణకు ఉద్యమం ఉధృతం
ధర్మవరం: దశాబ్దాలుగా పేదలకు చేయూతనందిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. పేదల బాగుకోరే సంస్థ పరిరక్షణకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. గురువారం స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో డాక్టర్ ఆదిశేషు అధ్యక్షతన ఆర్డీటీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, ప్రగతిశీల చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో సేవలందిస్తున్న ఆర్డీటీని నిర్వీర్యం చేసేలా కేంద్రం ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ నిలుపుదల చేయడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి రాక ముందు ఆర్డీటీ సేవలను కొనియాడిన నేతలు. ఇప్పుడు ఆ సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. విద్య, వైద్య, క్రీడా రంగాల్లో విశేష సేవలందిస్తూ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆర్డీటీ సంస్థకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆర్డీటీ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 29న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. అనంతరం రైల్‌రోకోలు, జాతీయ రహదారుల దిగ్బంధం, జిల్లా బంద్ వంటి నిరసనలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమూరి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికారప్రతినిధి వేముల అమర్నాథ్రెడ్డి, దేవరకొండ రమేష్, బడన్నపల్లి నర్సింహులు, కౌన్సిలర్ గజ్జల శివ, అమీర్‌బాషా, పెద్దన్నతో పాటు పలువురు రాజకీయ, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ కోసం సంఘటిత పోరాటం అఖిలపక్షాలు, ప్రజా సంఘాల ఏకగ్రీవ తీర్మానం -
బాలకృష్ణకు పిచ్చి ముదిరింది
చిలమత్తూరు: ‘‘ఎవరైనా సరే తమ నియోజకవర్గంలోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. కానీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ఈ ప్రాంత సమస్యలను విస్మరించి కేవలం జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు’’ అని వైఎస్సార్ సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు పిచ్చి ముదిరిందన్నారు. అందుకే ఆయన అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అసభ్యంగా దూషిస్తూ పిచ్చిచేష్టలు చేశారన్నారు. సైకో అంటూ పదేపదే అంటున్న బాలకృష్ణ సైకో ఇజం గురించి రాష్ట్రంలో ఎవరినడిగినా చెబుతారన్నారు. తన ఇంట్లో జరిగిన కాల్పుల కేసు నుంచి బయటపడేందుకు బాలకృష్ణ... తనకు మెంటల్ అందని సర్టిఫికెట్ తెచ్చుకుంది నిజం కాదా... ఆనాడు మీ సైకో ఇజంతోనే కాల్పలు జరిపారా.. అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకై క సీఎం వైఎస్ జగన్ అని, ఆయన మీ పిచ్చి చేష్టలకు చిరునవ్వుతో సమాధానం చెప్పారన్నారు. రాష్ట్రమంతా గుండెల్లో పెట్టి చూసుకుంటున్న వ్యక్తిని చులకనగా మాట్లాడిన బాలకృష్ణకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. హిందూపురంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారని, సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని... అసెంబ్లీలో వాటి గురించి మాట్లాడని బాలకృష్ణ...మైకు దొరగ్గానే మాజీ సీఎం జగన్‌ను దూషించడానికే సమయమంతా వెచ్చించారన్నారు. బాలకృష్ణ పిచ్చివాగుడు చూసి జనమే ఛీదరించుకుంటున్నారన్నారు. మరోసారి ప్రజా నాయకుడు వైఎస్ జగన్‌ను తూలనాడితే ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు. -
కంపోస్ట్ యార్డులో మట్టి దొంగలు
చిలమత్తూరు: హిందూపురం సమీపంలోని ‘బిట్’ కళాశాల వెనుక వైపు ఉన్న మున్సిపల్ కంపోస్ట్ యార్డులో మట్టి దొంగలు పడ్డారు. ఎర్రమట్టి కోసం జేసీబీలతో తవ్వకాలు చేసి పట్టణంలోని లేఅవుట్లకు తరలించి రూ.కోట్లు సంపాదించారు. మట్టిదొంగల ధనదాహానికి కంపోస్టు యార్డు ప్రాంతమంతా పెద్దపెద్ద గుంతలు ఏర్పడటం చూస్తే ఏ స్థాయిలో మట్టి దందా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం వాహనరాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో తవ్వకాలు ఎలా జరిగాయో...ఎవరి జరిపారో తనకు తెలియదని ఇక్కడ విధుల్లో ఉండే గార్డు పేర్కొనడం విశేషం. అధికారులకు తెలియకుండానే చేశారా? 33 ఎకరాల్లో ఉన్న కంపోస్ట్ యార్డు చుట్టూ ప్రహరీ ఉంది. నిత్యం వాహనాలు యార్డుకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఓ గార్డు కూడా విధుల్లో ఉంటారు. అయినా మట్టి తవ్వకాలు జరిగాయంటే ఇందులో మున్సిపల్ అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎర్రమట్టికి బాగా డిమాండ్ ఉండటంతో అధికార టీడీపీ లీడర్లతో మున్సిపల్ అధికారులు కుమ్మకై ్క మట్టిదందా చేసి ఉంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రూ.కోట్లు విలువ చేసే మట్టిని ఎక్కడకు తరలించారు..? సూత్రధారులు ఎవరన్నది మాత్రం ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది. నాకూ ఈ మధ్యే తెలిసింది కంపోస్ట్ యార్డులో మట్టి తవ్వకాలు జరిగినట్టు నాకూ ఈ మధ్యే తెలిసింది. యార్డును మధ్యాహ్నం రెండు గంటల వరకే తెరచి ఉంచుతాం. ఆలోపే పట్టణంలో సేకరించిన చెత్తను అక్కడకు తీసుకువెళ్లి డంప్ చేస్తాం. యార్డుకు పూర్తిగా ప్రహరీ లేదు. ప్రధాన దారిలో కాకుండా మరో దారిలో రాత్రి వేళల్లో మట్టిని తరలించినట్టు తెలుస్తోంది. ఎవరు చేశారన్న విషయం తెలుసుకుంటాం. అంతకంటే ముందు కేసు నమోదు చేయిస్తాం. – మల్లికార్జున , మున్సిపల్ కమిషనర్ ఇష్టానుసారం ఎర్రమట్టి తవ్వకాలు భారీగా ఏర్పడిన గొయ్యిలు తనకేమీ తెలియదన్న కమిషనర్ -
అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తాం
పరిగి/పెనుకొండ/సోమందేపల్లి: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తామని ఎస్పీ సతీష్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన పరిగి, సోమందేపల్లి పోలీసు స్టేషన్లతో పాటు పెనుకొండ సీఐ కార్యాలయాన్ని ఆకస్మింగా తనిఖీ చేశారు. కంట్రోల్ రూం, సీసీ కెమెరాల పనితీరును సీఐ రాఘవన్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయా స్టేషన్లలోని పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులు..దర్యాప్తు తీరు తెలుసుకున్నారు. నేరస్తుల జాబితాను పరిశీలించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే వారు ఎవరైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. స్టేషన్‌కు వచ్చి ఎవరు ఫిర్యాదు చేసినా తప్పకుండా కేసు నమోదు చేయాలన్నారు. అలాగే గతంలో ఘర్షణలు, గొడవులు చోటుచేసుకున్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చిన్నారులు, మహిళలపై నేరాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ఆయా గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు.సహకారం అవసరంఅనంతరం ఎస్పీ ఆయా పోలీసుస్టేషన్ల వద్ద విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా, పేకాట, మట్కా తదితర అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో మీడియా, ప్రజలు పోలీసులకు సహరించాలని కోరారు. ఎస్పీ వెంట పెనుకొండ సీఐ రాఘవన్ ఉన్నారు.అక్టోబరులో ‘సర్’● ప్రతి ఇంటినీ సందర్శించి ఓటరు జాబితా సిద్ధం చేయాలి● జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్హిందూపురం: భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్న మార్గదర్శకాలు మేరకు షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఓటరు జాబితాపై అక్టోబర్ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్ – సర్) నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్, హిందూపురం నియోజకవర్గ ఎన్నికల అధికారి అభిషేక్‌కుమార్ వెల్లడించారు. ఎలక్టోరల్ రోల్స్ ప్రక్రియపై బుధవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కూ బూత్ లెవెల్ ఏజెంట్లను రాజకీయ పార్టీలు నియమించాల్సి ఉంటుందన్నారు. బూత్ లెవెల్ అధికారులు తమ పరిధిలోని వార్డుల్లో ప్రతి ఇంటినీ సందర్శించి ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. సర్వేలో బూత్ లెవెల్ ఏజెంట్లు తప్పని సరిగా పాల్గొనాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు వెంకటేష్, సౌజన్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్, ఆర్ఐ అమరేంద్ర, ఎన్నికల సిబ్బంది, నియోజకవర్గ ఎన్నికల సూపర్వైజర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సత్యసాయి కీర్తి శోభిల్లాలి
ప్రశాంతి నిలయం: ‘‘సత్యసాయి శత జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తారు. ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేద్దాం. మన ఆతిథ్యంతో సత్యసాయి కీర్తిని అంతర్జాతీయంగా శోభిల్లేలా చేద్దాం’’ అని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాలులో సత్యసాయి శత జయంతి వేడుకల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి శతజయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, దేశం గర్వించేలా వేడుకలను నిర్వహించాలన్నారు. రోజువారీ భక్తుల రాకపోకలను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారని, అందుకు తగ్గట్టుగా రవాణా, వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాగునీరు, శానిటేషన్, మొబైల్ టాయిలెట్లు, వీధి దీపాలు, డస్ట్బిన్లు, వ్యర్థాల నిర్వహణ, ఫుడ్ కౌంటర్ల, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీ, పంచాయతీల సిబ్బందిని షిప్ట్‌ల వారీగా 24 గంటల పాటు విధులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రోడ్ల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పర్యావరణ హితంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. నిరంతర నిఘా... పటిష్ట భద్రత .. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు. నిరంతర నిఘా ఉండేలా అత్యాధిక డ్రోన్లు, ఇతర పరికరాలు ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అత్యవసర వాహనాలు, సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కమ్యూనికేషన్ కోసం రిపీటర్ స్టేషన్, పార్కింగ్ ప్రాంతాల్లో కెమెరాలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించేలా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సత్యసాయి జయంతి వేడుకల ఏర్పాట్ల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమీక్షలో పలువురు అధికారులు పాల్గొన్నారు. శత జయంత్యుత్సవాలు వైభవంగా చేద్దాం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పిలుపు సత్యసాయి శత జయంతి వేడుకల నిర్వహణపై సమీక్ష -
బయోమెట్రిక్ విధానం అమలు
ఉపాధి పనుల్లో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువస్తోంది. బిల్లుల పెండింగ్ విషయం వాస్తవమే. అయితే గతంలో రూ.77.47 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండగా, విడతల వారీగా చెల్లిస్తూ వచ్చాం. ప్రస్తుతం రూ.66 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత వారంలో కూలీల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. వచ్చే వారంలో బిల్లులన్నీ మంజూరవుతాయని ఆశిస్తున్నా. ఇప్పటికే అన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. అడిగిన వారందరికీ పనులు కల్పిస్తాం. – విజయ్ ప్రసాద్, పీడీ, డ్వామా -
రెక్కలు విరిగిన పూలు
● పడిపోయిన ధరలతో రోడ్డు పక్కన పారబోత పరిగి: బంతి పూల ధర అమాంతం పడిపోయాయి. కనీసం రవాణా చార్జీలు కూడా దక్కని పరిస్థితుల్లో రైతులు రోడ్డు పక్కన పారబోస్తున్నారు. తాజాగా బుధవారం ఓ రైతు బంతిపూలను హిందూపురం మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమయ్యాడు. కానీ మార్గమధ్యంలోనే ఆయనకు పూల ధర గురించి తెలిసింది. హిందూపురం వెళ్లినా ట్రక్కు రవాణా చార్జీ కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పరిగి మండలంలోని సేవామందిరం – హిందూపురం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన వద్ద వాహనం నిలిపి బంతిపూలను పారపోసి వెళ్లిపోయాడు. కిలో కనీసం రూ.50 అయినా పలుకుతాయనుకుంటే బుధవారం రూ.10 కూడా పలకని పరిస్థితుల్లో రైతు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రైతు పారబోసిన బంతి పూలను స్థానికులు బ్యాగ్‌లలో, కవర్లలో నింపుకుని వెళ్లడం గమనార్హం. రైల్వే కార్మికులకు 78 రోజుల బోనస్ గుంతకల్లు: రైల్వే కార్మికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దసరా పండగ సందర్భంగా 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కార్మికులకు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సమాచారం అందినట్లు డివిజన్ అధికారులు తెలిపారు. దీంతో గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 14,500 మంది కార్మికులకు సుమారు రూ.24 కోట్లు మంజూరు కానున్నాయి. ఒక్కో కార్మికుని బోనస్ రూపంలో రూ.17,951 మేర ఖాతాల్లో జమ కానుంది. -
పట్టపగలే హైడ్రామా!
అనంతపురం: పట్టపగలే హైడ్రామా నడిచింది. గోవా మద్యం తరలిస్తూ కొందరు యువకులు ఎకై ్సజ్ అధికారుల కళ్లు గప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దాదాపు వందకు పైగా కిలోమీటర్ల మేర సినీ ఫక్కీలో ఛేజింగ్‌చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ వి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి. రామ్మోహన్‌రెడ్డి వెల్లడించారు. అడ్డుకుంటే చంపుతామంటూ... గోవా నుంచి మద్యాన్ని బుధవారం ఉదయం అక్రమంగా జిల్లాలోకి తరలించుకుని వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఎకై ్సజ్ అధికారులు అప్రమత్తమై ఆత్మకూరు మండలం వడ్డుపల్లి టోల్‌ప్లాజా వద్ద కాపు కాశారు. ఉదయం 10.30 గంటల సమయంలో అటుగా వచ్చిన స్విఫ్ట్ కారును అడ్డుకుని పరిశీలిస్తుండగా డ్రైవర్ వాకీ టాకీ ద్వారా వెనుక వస్తున్న ఇన్నోవా కారు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడం గమనించారు. దీంతో వెనువెంటనే మరో వాహనంలో ఆత్మకూరు వైపుగా ఎకై ్సజ్ అధికారులు వెళుతుండగా హంద్రీ–నీవా కెనాల్ వద్ద ఇన్నోవా కారు ఉన్నఫళంగా వెనక్కు తిరిగి కాలువ గట్టుపై నుంచి శరవేగంగా దూసుకెళ్లింది. దీంతో ఎకై ్సజ్ అధికారులు తమ వాహనంలో వెంబడించారు. ఒకానొక దశలో ఎకై ్సజ్ అధికారుల వాహనాన్ని ఢీకొని ముందుకు సాగుతూ ఇనుపరాడ్లను తీసి ప్రదర్శిస్తూ తమను అడ్డుకుంటే చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఎకై ్సజ్ అధికారులు వదలకుండా ఇన్నోవా కారును వెంబడిస్తూ వెళ్లారు. చివరకు సాయంత్రం 4 గంటల సమయంలో కర్ణాటక సరిహద్దులోని తిరుమణి వద్ద ఉన్న బాలసముద్రం టోల్ ప్లాజా వద్ద ఇన్నోవా కారును అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడింది వీరే.. స్విఫ్ట్ కారుతో పాటు, ఇన్నోవాను అదుపులోకి తీసుకున్న ఎకై ్సజ్ అధికారులు వాటిని జిల్లా ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించారు. రెండు వాకీటాకీలు, మొత్తం రూ.1.76 లక్షల విలువ చేసే హనీగ్రేడ్ బ్రాందీ (180 ఎం.ఎల్)– 97 బాక్సులు, గోల్డెన్ ఏఎస్ ఫైన్ విస్కీ (180 ఎం.ఎల్) – 16 బాక్సులు, మాన్షన్ హౌస్ బ్రాందీ (750 ఎం.ఎల్)– 3 బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కె.వీరేంద్ర, డి. ప్రవీణ్, కె.వెంకటేష్, కె.పవన్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. వీరిలో కె.వీరేంద్రపై మద్యం కేసులు చాలా ఉన్నాయని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. అయితే ఏనాడూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడలేదన్నారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన ఏఈఎస్ వి.శ్రీరాం, ఇన్స్పెక్టర్లు కె.అన్నపూర్ణ, ఎస్.అలీబేగ్, ఎస్ఐలు సి.నరేష్‌బాబు, ఎం.హరికృష్ణ, ఎన్.సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు రామచంద్ర, ఫణీంద్ర, రమేష్‌బాబు, కానిస్టేబుళ్లు వెంకటనారాయణ, వెంకటప్రసాద్, ఎస్.మారుతి, ఎం.మారుతి, శివానంద రెడ్డి, నాగముని, చరణ్ కుమార్, సందీప్, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ జయనాథ్ రెడ్డి, హెచ్.ఆర్. ప్రసాద్ (ఎస్ఐ), అనంతపురం ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. సినీ ఫక్కీలో వంద కిలోమీటర్లకు పైగా ఛేజింగ్ గోవా మద్యాన్ని తరలిస్తున్న ముఠా పట్టివేత రూ.1,76,904 విలువైన మద్యం స్వాధీనం -
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
ప్రశాంతి నిలయం: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి బుధవారం కలెక్టర్ కొత్తచెరువు మండలం జానకిరామయ్య కాలనీలో అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో విరివిగా మొక్కలు నాటడంతో పాటు, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వృద్ధురాలు వెంకటలక్ష్మమ్మ భూమిలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంతానికి ‘వెంకట లక్ష్మమ్మ తోట’గా నామకరణం చేశారు. కార్యక్రమంలో సోషల్ ఫారెస్ట్రీ డీఎఫ్ఓ శ్రీనివాసులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఇన్చార్జ్ పీడీ శ్రీలక్ష్మి, ఏపీడీ జ్యోతి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఎంపీడీఓ నటరాజ్, ప్లాంటేషన్ మేనేజర్ వెంకటప్ప, సిబ్బంది పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ సౌభాగ్యం కుటుంబానికి వెన్నెముకగా నిలిచే మహిళ ఆరోగ్యంగా ఉంటేనే..ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. ‘స్వస్థ్ నారి– సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రంలో భాగంగా బుధవారం కొత్తచెరువు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘స్వస్థ్ నారి– సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలు వివిధ రకాల పరీక్షలు చేస్తారన్నారు. అవసరమైన మందులనూ అందిస్తారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలువురు వృద్ధులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితి గతులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఫైరోజా బేగం, డీసీహెచ్ఎస్ మధుసూదన్, వైద్యులు అశ్వర్థకుమార్, జోయల్ వెస్లీ, భార్గవ్, వరలక్ష్మి, హారిక, జయశ్రీ, ఎంపీడీఓ నటరాజ్, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి ఆర్థిక చేయూతను అందించేలా బ్యాంకర్లను సమన్వయం చేస్తామన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, జిల్లా ఫ్యాక్టరీల ఆధికారి రాధాకృష్ణ, ఏపీఐఐసీ, విద్యుత్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. విరివిగా రుణాలు అందించాలి జిల్లా ఆర్థిక ప్రగతికి విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లకు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. జిల్లాలోని బ్యాంకర్లు, ఇతర అధికారులతో బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్ష నిర్వహించారు. 2025–26 అర్థిక సంవత్సరానికి గాను రూ.14051 కోట్ల రుణాలు అందజేయాలని లక్ష్యం కాగా, జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి రూ.5646.37 కోట్ల రుణాలు మంజూరు చేసి 40.18 శాతం ఆర్థిక ప్రగతిని సాధించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందులో ఎంఎస్ఎంఈ రుణాలు రూ.524 కోట్లు ఉన్నాయన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందజేయాలని, విద్యారుణాలు, గృహ రుణాలు, పీఎం సూర్యఘర్ రుణాలను అవసరమైన మేరకు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ రమణ కుమార్, ఆర్బీఐ మేనేజర్ రోహిత్ అగర్వాల్, నాబార్డ్ ఏజీఎం అనురాధ, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపు -
యువకుడి దుర్మరణం
ఎన్పీకుంట: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... ఎన్పీకుంట మండలం పల్లెనాయునివారిపల్లికి చెందిన పల్లేని గంగాధరనాయుడు (36)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గంగాధరనాయుడు బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఇందుకూరోళ్లపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద క్యాన్‌లో డీజిల్ పట్టుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. జిల్లా సరిహద్దుకు చేరుకోగానే మలుపు వద్ద వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, 16 రోజుల క్రితం గంగాధరనాయుడు తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయుడు వీరమల్లప్ప నాయుడు మృతి చెందారు. 16 రోజుల వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి అదృశ్యం రాప్తాడు: మండలంలోని గాండ్లపర్తికి చెందిన సాకే పోతులయ్య భార్య, ఇద్దరు కుమార్తెలు కనిపించడం లేదు. సీఐ టీవీ.శ్రీహర్ష తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం గ్రామదట్ల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి కుమారై పద్మలతకు గాండ్లపర్తి గ్రామానికి కొండన్న కుమారుడు సాకే పోతులయ్యతో 2021 సెప్టెంబర్ 21న వివాహమైంది. పోతులయ్య ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 22న ఉదయం పద్మలత తన భర్తకు తెలపకుండా ఇద్దరు కుమార్తెలను తీసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారి కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ఆచూకీ లక్ష్యం కాకపోవడంతో మంగళవారం రాత్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96817కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
మోయలేని భారం
పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు కొత్తగా విద్యుత్ మీటర్ కొనలేని పరిస్థితి. ఇప్పటికే కరెంట్ బిల్లులు భారీగా పెంచారు. ప్రతి నెలా కరెంట్ బిల్లలు కట్టేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు మీటర్ల ధరలు పెంచారు. ఇది ప్రజలపై మోయలేని భారం. ఎన్నికల్లో సమయంలో కరెంట్ బిల్లులు పెంచబోమని చెప్పిన కూటమి పెద్దలు ఇలా మాట తప్పడం మంచిది కాదు. – రవినాయక్, పుట్టపర్తి పునరాలోచించాలి కరెంట్ బిల్లుల అమాంతంగా పెరిగి పోవడంతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. దీనికి తోడు మీటర్ల ధరలు రెట్టింపునకు పైగా ప్రభుత్వం పెంచి కొత్తగా ఇల్లు కట్టుకునే వారి నడ్డి విరుస్తోంది. పెంచిన ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలి. లేకపోతే ఉద్యమాలు తప్పవు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ బిల్లల భారం తగ్గించాలి. – గంగాద్రి, సీపీఎం మండల కార్యదర్శి, పుట్టపర్తి -
విద్యుత్ భారం రెండింతలు!
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్ బిల్లులు వినియోగదారులకు షాక్ కొడుతున్నాయి. ట్రూఆప్ చార్జీలు, సర్ చార్జీల పేరుతో దశల వారీగా విద్యుత్ వినియోగంపై భారీగా వడ్డనలు విధించిన ప్రభుత్వం... తాజాగా పేదలపై మరో బాదుడు మొదలు పెట్టింది. ఇకపై కొత్త మీటర్ కావాలంటే గతంలో ఉన్న ధరకు రెట్టింపు చలానా రూపంలో చెల్లించాల్సి వస్తోంది. అన్ని కేటగిరి మీటర్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో కొత్త మీటర్ కొనాలంటే పేదలు భయపడే పరిస్థితి నెలకొంది. అధిక ధర చెల్లించి ఆన్లైన్లో మీటర్ బుక్ చేస్తే మీటర్లు సకాలంలో అందక చలానాను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ నూతనంగా బుక్ చేసుకోక తప్పడం లేదు. ఈ క్రమంలోనే మరమ్మతు చేసిన పాత మీటర్లనే అంటగట్టి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. పెరిగిన విద్యుత్ మీటర్ల ధరలు.. పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలోని బుక్కపట్నం, గోరంట్ల, కొత్తచెరువు, పుట్టపర్తి టౌన్, పుట్టపర్తి రూరల్ మండలాల్లో కేటగిరి –1 కింద 70,145 గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్లు, కేటగిరి 2 కింద 6,821 వాణిజ్య పరమైన కనెక్షన్లు, కేటగిరి 3 కింద 367 పారిశ్రామిక కనెక్షన్లు, కేటగిరి 4 కింద 1,785 వీధి లైట్లు, కేటగిరి –5 కింద 17, 521 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. కేటగిరి 1 కింద గతంలో విద్యుత్ మీటర్ కోసం రూ.1,800 చెల్లించేవారు. ప్రస్తుతం దీని ధ రూ.4,210కు చేరుకుంది. అలాగే కేటగిరి–2 మీటర్ ధర గతంలో రూ.2,700 ఉండగా ప్రస్తుతం రూ.5,600 వసూలు చేస్తున్నారు. ఇక పరిశ్రమల్లో వినియోగానికి అనుగుణంగా మీటర్ల ధరలు వర్తిస్తాయి. ఇప్పటికే మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మంది కొత్త ధరలు అమల్లోకి రావడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ట్రూఅప్, సర్ చార్జీల పేరుతో ఇప్పటికే తడిసి మోపెడు తాజాగా కొత్త మీటర్ మంజూరుపై బాదుడే బాదుడు అన్ని కేటగిరీలకూ ధరలు పెంచిన కూటమి సర్కారు -
ప్రధాన పంటగా కంది
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో కంది ప్రధాన పంటగా అవతరిస్తోంది. గత కొన్ని దశాబ్ధాలుగా ఏక పంటగా లక్షలాది హెక్టార్లలో సాగవుతూ వస్తున్న వేరుశనగను వెనక్కినెట్టి కంది తొలిస్థానాన్ని ఆక్రమిస్తోంది. గత నాలుగైదు సంవత్సరాలుగా జిల్లా రైతులు కంది సాగుపై మొగ్గుచూపడమే ఇందుకు కారణం. 2024 ఖరీఫ్‌లో ఏకంగా 1.03 లక్షల హెక్టార్లలో కంది సాగులోకి రాగా ఈ ఖరీఫ్‌లో కూడా 1.01 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఈ–క్రాప్ ముగిస్తే కంది విస్తీర్ణం మరికొంత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. జిల్లా చరిత్రలో తొలిసారిగా కంది పంట వేరుశనగను దాటిపోవడం ఇదే తొలిసారి. గతేడాది కంది విస్తీర్ణం పెరిగినా... వేరుశనగను అధిగమించలేకపోయింది. ఈ సారి కంది తొలిస్థానంలో నిలవడం విశేషం. కంది సాధారణ సాగు విస్తీర్ణం 55,296 హెక్టార్లు కాగా 183 శాతంతో 1.01 లక్షల హెక్టార్లకు చేరుకుంది. గతంలో ఉమ్మడి జిల్లాలో కూడా ఈ స్థాయిలో కంది ఎన్నడూ సాగులోకి రాలేదు. ఉమ్మడి జిల్లాలో 2017లో అత్యధికంగా 71 వేల హెక్టార్లుగా నమోదైంది. లక్ష హెక్టార్లలోపే వేరుశనగ గత నలభైయేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వేరుశనగ సాగు విస్తీర్ణం లక్ష హెక్టార్ల లోపే పరిమితమైంది. ఈ సారి 1.82 లక్షల హెక్టార్లు అంచనా వేయగా అతి కష్టంపై 89 వేల హెక్టార్లకు చేరుకుంది.పెట్టుబడులు పెరగడం, కూలీల సమస్య, అననుకూల వర్షాల వల్ల పంట దిగుబడులు తగ్గిపోవడం, చివరికి గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడం, చీడపీడల వ్యాప్తి, అడవిపందులు, జింకల బెడద తదితర కారణాలతో వేరుశనగ పేరు వింటనే రైతులు బెదిరిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అలాగే నల్లరేగడి భూముల్లో పత్తి విస్తీర్ణం 44 వేల హెక్టార్లు అంచనా వేయగా అదనులో వర్షం పడకపోవడంతో 24 వేల హెక్టార్లకు పరిమితమైంది. -
హుండీ దొంగలు దొరికేరా?
కదిరి అర్బన్: కదిరి పట్టణంలో ఇటీవల చాలా ఇళ్లలో చోరీలు జరిగాయి. బంగారం, నగదు దొంగలు దోచుకెళ్లారు. అది చాలదన్నట్లు దేవుడి హుండీపై దొంగల కన్నుపడింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న యర్రదొడ్డి గంగమ్మ ఆలయం హుండీ దొంగతనానికి గురైంది. ఈ నెల 9న అమ్మవారి హుండీని దుండగులు పగులగొట్టి అందులోని నగదు, అమ్మవారి కానుకలు దోచుకెళ్లారు. ఆలయంలో హుండీ ప్రతి 6 నెలలకోసారి లెక్కిస్తారు. రెండు హుండీలు కలిపి సుమారు రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు నగదు సమకూరుతుందని ఆలయ అధికారులు చెపుతున్నారు. దుండగులు ఒక హుండీని పూర్తిగా పగులగొట్టి ఎంత లేదన్నా రూ.3 లక్షల వరకు నగదు దోచుకెళ్లి ఉంటారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో హుండీని సైతం పగులగొట్టేందుకు యత్నించి విఫలమయ్యారు. లేకుంటే సుమారు రూ.8 లక్షల వరకు దోచుకెళ్లేవారు. పక్కా ప్లాన్‌తోనే జరిగిందా? ఆలయ పరిసరాల్లో 6 సీసీ కెమెరాలు ఉండగా అందులో ఎక్కడే కాని కనిపించకుండా దుండగులు జాగ్రత్త పడిన తీరు చూస్తుంటే అంతా పక్కా ప్లాన్‌తోనే చేసినట్లుగా స్పష్టమవుతోంది. ఇటీవల ఆలయ పునఃనిర్మాణ పనుల్లో భాగంగా గర్భ గుడి గోడలకు చలువరాతి బండలు ఏర్పాటు చేస్తుండడంతో అక్కడి సీసీ కెమెరాను తొలగించారు. ఆలయం గురించి బాగా తెలిసిన వారే రెక్కీ నిర్వహించి ఎటునుంచి ప్రవేశిస్తే సీసీ కెమెరాల్లో పడకుండా ఉంటారో గుర్తించి అటుగా వచ్చి పని కానిచ్చేశారు. గత ప్రభుత్వంలో రూ.1.25 కోట్లతో అభివృద్ధి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యర్రదొడ్డి గంగమ్మ ఆలయాన్ని రూ.1.25 కోట్ల కామన్ గుడ్‌ఫండ్ (సీజీఎఫ్) నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ కాంట్రిబ్యూషన్ కింద రూ. 25 లక్షలు చెల్లించగా.. సీజీఎఫ్ కింద రూ. కోటి నిధులు మంజూరయ్యాయి. ఆలయాలనూ వదలని దొంగలు సీసీ కెమెరాల కంట పడకుండా చోరీలు -
అమరావతికి తరలిన డీఎస్సీ అభ్యర్థులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులు బుధవారం ఉదయం అమరావతికి తరలి వెళ్లారు. జిల్లాతో పాటు జోనల్ పోస్టులకూ ఎంపికై న వారితో పాటు సంబంధీకులు ఒకరు తోడుగా ఉన్నారు. ఉదయాన్నే అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాల వద్ద అల్ఫాహారం ముగించుకుని మొత్తం 45 బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. బస్సులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. గురువారం అమరావతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకుంటారని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు మునీర్‌ఖాన్, శ్రీనివాసులు, డెప్యూటీ డీఈఓలు శ్రీనివాసులు, మల్లారెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యం ● రికార్డుల్లో లేకున్నా రైతు పొలంలో రస్తా కుందుర్పి: జంబుగుంపల గ్రామంలో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నారనే అక్కసుతో రైతుల పొలాల్లో దౌర్జన్యంగా రస్తా వేసేందుకు ఉపక్రమించారు. అడ్డుకోబోయిన మహిళలను బెదిరించడంతో బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. జంబుగుంపల గ్రామంలోని సర్వే నంబర్ 110లో వైఎస్సార్సీపీ మద్దతుదారు రైతులు దొడ్డయ్య, ఎర్రమల్ల తదితరులకు చెందిన భూమి ఉంది. బుధవారం సాయంత్రం టీడీపీ నాయకుల ప్రమేయంతో తహసీల్ధార్ ఓబులేసు, సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ భూమిలో ప్రభుత్వ శివాయి జమ భూమి కూడా ఉందని రస్తా వదలకపోతే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ భూమిని వదిలేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఇదే సర్వే నంబర్లో పట్టా భూమి కూడా ఉందని, అందులో రస్తా వదిలేందుకు సాధ్యం కాదని అన్నారు. ఆ సమయంలో ఎందుకు సాధ్యం కాదంటూ టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. రెవెన్యూ అధికారులను ఉసిగొల్పి సర్వే చేయించారు. అడ్డుకోబోయిన లక్ష్మి, నాగలక్ష్మిని రెవెన్యూ అధికారుల సమక్షంలోనే చితకబాదారు. జేసీబీని రప్పించి రస్తా ఏర్పాటుకు భూమి చదను పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలాక్షి, గ్రామ సర్పంచ్ గంగాధర, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మహేంద్ర, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు తిప్పేస్వామి, మాజీ డీలర్ నాగరాజు బాధితులకు అండగా నిలిచారు. పట్టా భూముల్లో రస్తా లేకున్నా.. టీడీపీ నాయకుల మాటలకు తలొగ్గి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదని హితవు పలికారు. -
నిరుద్యోగుల సమస్యలపై అర్ధనగ్న నిరసన
పుట్టపర్తి అర్బన్: నిరుద్యోగుల సమస్యలపై ఏఐవైఎఫ్ నాయకులు పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ సమస్యపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేలు భృతి అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయకపోవడం అన్యాయమన్నారు. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలన్నారు. వెంటనే మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం ఆర్డీఓ సువర్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకలా రాజా, జిల్లా కార్యదర్శి కమల్‌బాషా, జిల్లా నాయకులు ప్రవీణ్ ఫైరోజ్, జీలాన్ఖాన్, గోవర్దన్, ఇమ్రాన్, జిలాన్‌బాషా, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిడిమామిడిలో ‘రాజగురువు’ శాసనం
పుట్టపర్తి అర్బన్: నిడిమామిడిలో శ్రీశైల జగద్గురు నిడిమామిడి సంస్థానంలో బసవన్న (నంది) విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయాన్ని తెలియజేసే శాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి మంగళవారం గుర్తించారు. కాళయుక్తి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీశైల జగద్గురు బసవరాజ మహాదేవ సజీవ సమాధిపై నాటి రాజగురువు మహా మండలాచార్య శ్రీచంద్రభూషణదేవ మహాచార్య బసవన్న విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు శాసనంలో పొందుపరిచారని పేర్కొన్నారు. ఇంగ్లీష్ తేదీల ప్రకారం నంది విగ్రహ ప్రతిష్ట సామాన్య శకం 1438 ఆగస్టులో జరిగిందని వివరించారు. చిన్న రాతి పలకపై తెలుగులో శాసనాన్ని రాయగా.. పై భాగంలో నంది శిల్పాన్ని సుందరంగా మలిచారని తెలిపారు. విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి రెండో దేవరాయలు (1424–1446) కాలంలో జగద్గురు నిడిమామిడి సంస్థానాధిపతి మహా మండలాచార్య శ్రీచంద్రభూషణ దేవ మహాచార్య రాజగురువుగా పని చేశారన్నారు. శ్రీచంద్రభూషణదేవ నిడిమామిడి నుంచి పెనుకొండకు, అక్కడి నుంచి హంపికి వెళ్లి రాజ గురువుగా వ్యవహరించినట్లు చరిత్రకారుడు పేర్కొన్నారు. ● విజయ నగర సామ్రాజ్య స్థాపనలో విద్యారణ్యస్వామి రాజగురువుగా కీలక పాత్ర పోషించగా.. శ్రీకృష్ణ దేవరాయలు (1509–1529)పాలనలో వ్యాసరాయలు రాజగురువుగా ఉన్నారు. కానీ నిడిమామిడి శాసనం ప్రకారం చంద్రభూషణదేవ రాజగురువుగా విజయ నగర సామ్రాజ్యంలో కొనసాగినట్లు తెలుస్తోందని మైనాస్వామి చెప్పారు. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీశైల జగద్గురు నిడిమామిడి సంస్థానం మూల మఠం సరైన ఆదరణకు నోచుకోలేదన్నారు. దీనికి అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయన్నారు. మఠానికి చెందిన వీరభద్రస్వామి గుడి పునఃనిర్మాణం జరిగినా కొన్ని వివాదాలతో గుడి మూతపడడం బాధాకరమన్నారు. ఆయన వెంట విశ్రాంత హెచ్ఎం రామచంద్రారెడ్డి, ఆలయ పూజారి వీరభద్రప్ప ,మహేష్ తదితరులు ఉన్నారు. -
చీనీ, టమాట మార్కెట్ల పరిశీలన
అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్ పరిస్థితులు తెలుసుకునేందుకు ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, అగ్రివాచ్ సంస్థ ప్రతినిధి హిమయుద్దీన్ తదితరులు మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ మార్కెట్, కక్కలపల్లి టమాటా మండీలను పరిశీలించారు. జిల్లాలో సాగులో ఉన్న పంటల విస్తీర్ణం, దిగుబడులు, మార్కెట్ ధరలు, రైతుల కష్టనష్టాలు, ట్రేడర్ల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని ట్రేడర్లకు సూచించారు. ప్రస్తుతం చీనీ, టమాట ధరలు కాస్త నిలకడగానే కొనసాగుతున్నట్లు తెలిపారు. ధరల్లేక రోడ్డున పడేసే పరిస్థితి తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అలాంటి పరిస్థితి ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని ట్రేడర్లు, మండీ నిర్వాహకులకు సూచించారు. పరిశీలనలో ఉద్యానశాఖ ఏడీ దేవానంద్‌కుమార్, ఏపీఎంఐపీ ఏపీడీ ధనుంజయ, హెచ్‌వో రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ చిలమత్తూరు: టేకులోడు అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 8 మందిని మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10,500 నగదు, 8 మంది ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపారు. చిన్నారులపై కుక్క దాడి రొద్దం: మండల కేంద్రంలోని పోలేపల్లి వీధి సమీపాన మంగళవారం ముగ్గురు చిన్నారులపై కుక్కదాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే వీరిని పావగడ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇదే కుక్క సోమవారం కూడా మరో ముగ్గురిపై కూడా దాడిచేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ హిందూపురం టౌన్: హిందూపురం ఎౖకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలుచోట్ల దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి 192 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు పృథ్వీ, ఫరూక్, నారాయణస్వామి, హెచ్‌సీ నరసింహ, వెంకటేష్, రమణ, సతీష్, పీసీలు అంజి, రవీంద్ర, కుమార్, రంగధామ్, శివ, సుధాకర్‌రెడ్డి, ఉస్మాన్, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రమేష్నారాయణకు ‘కీర్తి’ పురస్కారం అనంతపురం కల్చరల్: తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా అందించే ‘కీర్తి పుస్కారం’ అనంతపురానికి చెందిన ప్రసిద్ధ సాహితీ–విద్యావేత్త డాక్టర్ పతికి రమేష్‌నారాయణ అందుకున్నారు. మంగళవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ప్రదానోత్సవ సభలో యూనివర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, శాంతా బయోటెక్స్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాదరెడ్డి, తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీ గణపతిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంత సాహితీక్షేత్రంలో బహుగ్రంథకర్తగానే కాకుండా అనువాదరంగంలో విశేష ప్రతిభాపాటవాలతో జనచైతన్యం చేస్తున్నందుకు కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారన్నారు. ప్రిన్సిపాల్‌గా, రచయితగా, సామాజికవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయనకు లోతైన జ్ఞానం ఉందని కొనియాడారు. పురస్కారమందుకున్న డాక్టర్ రమేష్నారాయణను డాక్టర్ ఉమర్‌ఆలీషా ప్రతినిధులు రియాజుద్దీన్, షరీఫ్, సాహిత్యభారతి జిల్లా అధ్యక్షుడు గుత్తా హరి, కార్యదర్శి తోట నాగరాజు, సుంకర రమేష్ అభినందించారు. జిల్లాకు ప్రత్యేక గౌరవం తెచ్చారన్నారు. యూరియా కొరత తీరేదెన్నడు? ఆత్మకూరు: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. కావాల్సినంత యూరియా అందివ్వడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మంగళవారం తోపుదుర్తి గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంటల తరబడి లైన్లో పడిగాపులు కాసి యూరియా తీసుకెళ్లారు. మండలంలో మదిగుబ్బ, సింగంపల్లి, సనప, బి.యాలేరు, తోపుదుర్తి గ్రామాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. అవసరానికి తగ్గట్టు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. -
దోమల నియంత్రణ చర్యలు చేపట్టండి
పుట్టపర్తి అర్బన్: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం ఆదేశించారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. దోమల నివారణ కోసం స్ప్రేయింగ్, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు వెంటనే చేపట్టాలన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందితో కలిసి పని చేయాలన్నారు. తాగునీటిలో క్లోరినేషన్ చేయించాలని, ట్యాంకుల్లో నీటి శాంపిళ్లను తీసి పరీక్షించాలని, ఇంటింటికీ తిరిగి జ్వరాల సర్వే చేయాలని, దోమల లార్వాల పని పట్టాలని, ప్రతి శుక్రవారం డ్రైడే చేపట్టాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ అనుమానిత కేసులకు రక్త పరీక్ష చేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి ఓబులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చిలమత్తూరు: ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆమె చిలమత్తూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఓపీ ఎంట్రీలలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గర్భిణులకు వైద్య పరీక్షలను రెగ్యులర్‌గా చేయించాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి లావణ్య, ఆయుష్ వైద్యురాలు రోజా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బస్సుల్లో వస్తేనే నియామక పత్రాలు
● డీఎస్సీ–25 అభ్యర్థులపై తీవ్ర ఒత్తిళ్లు అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులకు రేపు (25న) అమరావతిలో నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. అయితే అమరావతికి వ్యక్తిగతంగా వెళ్లేందుకు అనుమతించడం లేదు. తప్పనిసరిగా అధికారులు ఏర్పాటు చేసిన బస్సుల్లోనే రావాలని తీవ్ర ఒత్తిళ్లు చేస్తుండడంతో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా ఇతర వాహనాల్లో ప్రయాణాలు అనుమతించబోమని, తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులోనే రావాలంటూ విద్యాశాఖ అధికారులు మెసేజ్‌లు చేశారు. బస్సుల్లో వచ్చిన వారికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటూ బెదిరింపు ధోరణిలో మెసేజ్‌లు పెట్టారని అభ్యర్థులు వాపోతున్నారు. తాము అంతదూరం బస్సుల్లో ప్రయాణం చేయలేమని రైళ్లు లేదా వ్యక్తిగత వాహనాల్లో వస్తామంటే కుదరదని అధికారులు తెగేసి చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి ఎంపికై న అభ్యర్థులు బుధవారం ఉదయం 6 గంటలకు అనంతపురం రూరల్ ఆలమూరు రోడ్డులోని బాలాజీ కళాశాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థీ తన కుటుంబ సభ్యులు లేదా బంధువులలో ఆరోగ్యంగా ఉన్న ఒకరిని తప్పనిసరిగా తోడుకు తెచ్చుకోవాలని, సీ్త్రలు అయినా పురుషులైనా అభ్యర్థి ఒక్కరే వస్తే అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా మొత్తం 12 మంది అభ్యర్థులకు బస్సుల నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరిలో ఏడుగురు గర్భిణిలు, నలుగురు చిన్నపిల్లల తల్లులు, ఒకరు ఆపరేషన్ చేయించుకున్న అభ్యర్థి ఉన్నారు. వీరందరూ నేరుగా అమరావతికి వ్యక్తిగతంగా రావచ్చని డీఈఓ తెలిపారు. -
వేరు‘శని’గ
ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు మల్లేశప్ప. గుడి బండ మండలం ఫళారం గ్రామం. ఈ రైతు కుటుంబం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేశాడు. రెండెకరాల వేరుశనగ సాగుకు రూ.30 వేల వరకూ ఖర్చు చేశాడు. అయితే వేరుశనగ పంట దిగుబడి ఆశించస్థాయిలో లేదు. పెట్టుబడి కూడా గిట్టుబాటుకాని పరిస్థితి. సమాయానికి వర్షాలు రాక దిగుబడి రాలేదని, ఈసారి కూడా నిరాశే మిగిలిందని మల్లేశప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర: ప్రతి ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా వేరుశనగ పంట దిగుబడి అంతంత మాత్రమే ఉండటంతో రైతులు నష్టాల బాట పట్టారు. తగ్గిన విస్తీర్ణం మడకశిర వ్యవసాయ డివిజన్ పరిధిలో మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలు ఉన్నాయి. ఖరీఫ్‌లో 23,973 హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు కావాలి. అయితే సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గింది. కేవలం 11,480 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే వేరుశనగ పంట సాగైంది. సకాలంలో వర్షాలు పడక పోవడం, కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడంతోనే వేరుశనగ పంట సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణంగా మారింది. ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు మడకశిర వ్యవసాయ డివిజన్ పరిధిలో పేద రైతులు ఎక్కువ. వీరందరూ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం చేయడానికి ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సాయంపై ఎక్కువగా ఆధారపడతారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడి సమస్య ప్రారంభమైంది. 2024లో అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇవ్వకపోగా.. ఈ మధ్యనే రూ.20వేలు ఇవ్వాల్సిన చోట కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. అది కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో సాగు తగ్గిపోయింది. పంట దిగుబడి అంతంతమాత్రమే ప్రస్తుతం సాగు చేసిన వేరుశనగ పంట దిగుబడి అంతంతమాత్రంగానే ఉందని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా ఎకరా వేరుశనగ పంట సాగుకు రైతులు రూ.15 వేల చొప్పున ఖర్చు పెట్టారు. తీరా చూస్తే వేరుశనగ చెట్లలో 10 నుంచి 15 వరకు మాత్రమే కాయలు ఉన్నాయి. కనీసం 25 నుంచి 30 కాయలు ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. దీంతో ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు రూ.10 వేలు కూడా రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట సాగు చేసిన తర్వాత ఊడలు దిగే సమయంలో వర్షాలు రాక పోవడంతో దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణంగా మారింది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం వేరుశనగ రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.కాయలు లేని వేరుశనగ చెట్లను చూపిస్తున్న రైతు మల్లేశప్ప సమయానికి వర్షం రాక తగ్గిన దిగుబడి పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి తీవ్ర ఆవేదనలో అన్నదాతలు