breaking news
Adilabad
-
సింగరేణి బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డబ్బులను వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామ య్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన శ్రీ రాంపూర్‌లోని ఎస్ఆర్పీ–3 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.27వేల కోట్ల బకాయిలుంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.42 వే ల కోట్లకు పెరిగిందని తెలిపారు. సమయానికి బకా యిలు చెల్లించకపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. సింగరేణిలో రాజకీ య జోక్యంతో సంస్థ పాలన గాడి తప్పుతోందని తె లిపారు. గుర్తింపు సంఘంగా తాము గెలిచిన తర్వా త కార్మికుల ప్రధాన డిమాండ్లను ఒక్కొక్కటిగా పరి ష్కరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. గతంలో జరగని స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించి కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కార్మి కుల ప్రధాన డిమాండ్ల సాధనకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తూ సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. కంపెనీ వార్షిక లాభాలను ప్రకటించి అందులో నుంచి 35శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డి మాండ్ చేశారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కా ర్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం చర్చల కమిటీ ప్రతినిధులు ప్రసాద్‌రెడ్డి, సంపత్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజి యన్ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, పిట్ సెక్రటరీ మురళీచౌదరి, ఆకుల లచ్చన్న, జాడి రాజకుమార్, కారుకూరి నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిందితుడి రిమాండ్
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని బంగారుగూడ కాలనీలో ఓ వ్యక్తిని బెదిరించి నగదు దొంగిలించిన డీసీ సీటర్ ఖద్ధర్‌ను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తె లిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన ముత్యాలు ఆ ప్రాంతంలో చేపలు విక్రయిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన డీసీ సీటర్ ఖద్ధర్ ముత్యాలును బె దిరించి రూ.1,500 దొంగిలించి పరారయ్యా డు. అంతేకాకుండా ముత్యాల పక్కనున్న శ్రీని వాస్‌పై దాడి చేశాడు. దీంతో బాధితుల ఫిర్యా దు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఖద్ధర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కలప పట్టివేతదండేపల్లి: మండలంలోని నంబాల గోదావరి తీరం వద్ద అక్రమంగా తరలించేందుకు నిల్వ చేసిన 15 టేకు దుంగలను మంగళవారం తమ సిబ్బంది పట్టుకున్నట్లు తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. పట్టుకున్న కలప విలువ రూ.42,329 ఉంటుందని పేర్కొన్నారు. కలపను రేంజ్‌కి తరలించినట్లు తెలిపారు. అటవీ సిబ్బంది ఎఫ్ఎస్వో నరేశ్, ఎఫ్‌బీవో నాగరాజుచారి, టైగర్ ట్రాకర్ ప్రశాంత్, బేస్ క్యాంప్ వాచర్ పాల్గొన్నారు. చోరీకి పాల్పడ్డ నిందితుల అరెస్ట్ఆదిలాబాద్టౌన్: చోరీలకు పాల్పడిన ముగ్గు రు నిందితులను అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 19న తిర్పెల్లిలోని శ్రీనివాస వైన్స్‌లో ఐదుగురు దొంగతనానికి పాల్పడగా అందులో షేక్ బిలాల్, మహ్మద్ షారుఖ్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీ సుకోగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపా రు. అలాగే ఈనెల 6న సంజయ్‌నగర్ కాలనీకి చెందిన శానం నవీన్‌కుమార్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన మహారాష్ట్రకు చెందిన మా ర్కులే అనిల్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మూడు తులాల బంగారం చోరీ కి పాల్పడగా, నిందితుడి నుంచి అర తులం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. -
డెంగీతో విద్యార్థి మృతి
తిర్యాణి: డెంగీతో ఓ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రులు, ఆర్బీఎస్కే వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిమాదర పంచాయతీ పరిధి రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం–దివ్యజ దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ఆత్రం అనురాగ్ (12) స్థానిక ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. ఈనెల 14న అతడికి జర్వం రావడంతో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం తల్లిదండ్రులు మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో చేర్పించారు. 15న వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిరార్ధణ కాలేదు. అయినప్పటికీ జర్వం తగ్గకపోవడంతో 18న రక్త పరీక్షలు నిర్వహించి తెల్లరక్త కణాలు తగ్గినట్లు గుర్తించారు. 19న మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీగా నిర్ధారించారు. ఈనెల 21న బాలుడి పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేశ్ పరామర్శించారు. కాగా, తిర్యాణి సీహెచ్‌సీలో వైద్య సిబ్బంది వ్యాధి నిర్ధారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మూడు, నాలుగు రోజులు మామూలు వైద్యం అందించారని తల్లిదండ్రులు ఆరోపించారు. పరిస్థితి విషమించగా మంచిర్యాల ఆస్పత్రికి రిఫర్ చేశారని వాపోయారు. వైద్య సిబ్బంది సరైన చికిత్స అందించి ఉంటే తమ కొడుకు బతికేవాడని ఆవేదన వ్యక్తంజేశారు. కాగా, విద్యార్థికి జర్వం వస్తున్నా ఉన్నతాధికారులకు తెలుపకుండా నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యా యుడు సాగర్‌ను సస్పెండ్ చేసినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. అలాగే విధులను నిర్లక్ష్యం చేసిన ఏఎన్ఎం సువార్తను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాల హెచ్ఎంగా సీనియర్ ఉపాధ్యాయుడు తిరుపతికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. -
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన: జాప్యం లేకుండా సింగరేణి ఉద్యోగులకు సీఎంపీఎఫ్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ట్లు సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్–2 గోవర్ధన్ కంటెపుడి తెలిపారు. మంగళవారం గోలేటి టౌన్షిప్ లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ప్రయాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. సీఎంపీఎఫ్ లావాదేవీలు అ న్ని సీకేర్స్ పోర్టర్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని, సేవలన్నీ పారదర్శకంగా ఉంటాయని పే ర్కొన్నారు. ఉద్యోగులు మధ్యవర్తులు లేకుండా సీ ఎంపీఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని సూచించారు. సీఎంపీఎఫ్ బెనిఫిట్స్‌కు అర్హులు, పె న్షన్, రివైస్డ్ పెన్షన్‌పై ఎలాంటి పెండింగ్‌లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలకు సమాధానం ఇచ్చా రు. పెన్షన్, సీఎంపీఎఫ్ దరఖాస్తులు జీరో పెండింగ్ స్థాయికి తీసుకువచ్చేందకు ప్రతీ ఉద్యోగి కృషి చే యాలని సూచించారు. ఎస్వోటూ జీఎం రాజమ ల్లు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత, అన్ని విభాగాల సంక్షేమ శాఖ క్లరికల్ సిబ్బంది ఉన్నారు. -
నవోదయకు 6,091 దరఖాస్తులు
కాగజ్‌నగర్ టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యాలయం అన్ని వసతులతో పాటు క్రమ శిక్షణతో కూడిన నాణ్యమై న విద్యకు మారుపేరుగా నిలుస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు గాను విద్యార్థుల నుంచి ఈ నెల 27 వరకు www. navodaya. gov. in వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 6,091 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3,003 మంది బాలికలు, 3,088 మంది బాలుర దరఖాస్తులున్నాయి. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నవోదయలో ఆరోతరగతిలో ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుల వివరాలు చెన్నూరు నుంచి 274 దరఖాస్తులు వచ్చినట్లు అధి కారులు తెలిపారు. ఖానాపూర్ నుంచి 287, మంచి ర్యాల నుంచి 510, కాగజ్‌నగర్ నుంచి 631, సిర్పూ ర్ నుంచి 378, ఆదిలాబాద్ నుంచి 571, బెల్లంపల్లి నుంచి 270, బోథ్ నుంచి 319, నిర్మల్ నుంచి 590, భైంసా నుంచి 664, లక్సెట్టిపేట్ నుంచి 350,మందమర్రి నుంచి 279, ఉట్నూర్ నుంచి 377, ఆసిఫాబాద్ నుంచి 591 వచ్చినట్లు పేర్కొన్నారు. త్రిభాషా విధానం అమలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యార్థులు ఐదో తరగతి చదివి ఉండాలి. వరుసగా 3, 4, 5 తరగతులు ఒకే పాఠశాలలో చదివినవారే అర్హులు. విద్యార్థులు మే 1, 2014 నుంచి జూలై 31, 2016 మధ్యలో జన్మించి ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో త్రిభాషా విధానం ప్రాతిపదికన జాతీయ సమైక్యతకు బాటలు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు సోపానంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు బాలబాలికలకు వేర్వేరుగా డార్మెటరీలు, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు క్వార్టర్లు వంటి వసతులున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ఆరోగ్యాన్ని పంచే హరిత సంపద, సుశిక్షితులైన అధ్యాపకులు, స్మార్ట్ క్లాసులు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, ఆటలకు బాసటగా విశాలమైన స్టేడియం, బాస్కెట్‌బాల్ తదితర మైదానా లు జిమ్, హెల్త్సెంటర్లతో నవోదయ ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ పుస్తకాలు, దుస్తులు సహా విద్యార్థులకు అన్నీ ఉచితమే. 6, 7 తరగతులకు మాతృబాషలో బోధిస్తారు. 8వ తరగతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన చేస్తారు. -
గణపయ్యకు 32 రూపాలు
హిందూ పురాణాల ప్రకారం గణపతి సకల దేవతలకు అధిపతి. పూజ ఏదైనా ముందుగా గణపతినే పూజిస్తారు. ప్రతీ శుభకార్యాన్ని వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు. అనాధిగా వస్తున్న సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. హిందూ సంప్రదాయాల్లో ఇంటిని నిర్మిస్తే ప్రధాన ద్వారానికి గణపతిని ప్రతిష్ఠిస్తారు. ఉదయం లేవగానే నీటితో కడిగి పూజించి వెళ్తారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలోనూ ప్రధాన ద్వారంలో ఉన్న గణపతికి నమస్కరిస్తారు. తిరిగి వస్తూ మళ్లీ గణపతికి నమస్కరించాకే ఇంటిలోకి వెళ్తారు. ఏ ఆలయం నిర్మించినా ముందుగా గణపతి పూజలు చేస్తారు. గణపతి హోమాలు నిర్వహిస్తారు. ఇలా అందరికీ గణాధిపతి అయిన స్వామివారికి ముద్గల పురాణంలో 32 స్వరూపాలను వర్ణించారు. ఈ 32 స్వరూపాల్లో 16 రూపాలు అత్యంత ప్రాశస్థ్యమైనవి. పురాణాల్లో పేర్కొన్న రూపాలు పురాణాల్లో వినాయకుడికి 32 స్వరూపాలుగా పేర్కొన్నారు. ఇందులో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనమని తెలిపారు. నేటి రోజుల్లో కళాకారులు గణపయ్యను అనేక రూపాల్లో మలుస్తున్నారు. ఈ 16 రూపాల్లో ఉన్న గణనాథులకు పూజలు చేస్తే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో పేర్కొన్నట్లు బాలగణపతి, తరుణగణపతి, ఉచ్చిష్టగణపతి, విఘ్నగణపతి, మహాగణపతి, క్షిప్రగణపతి, హేరంబగణప తి, లక్ష్మీగణపతి, భక్తిగణపతి, వీరగణపతి, శక్తిగణపతి, ద్విజగణపతి, సిద్ధగణపతి, నృత్యగణపతి, ఊర్ధ్వగణపతి, విజయగణపతి.. ఇలా 16 ప్రధానమైన రూపాలున్నాయి. -
ఆర్జీయూకేటీలో ముగిసిన స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్‌లో అడుగుపెడుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది. వారం రోజులుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విద్య, వ్యక్తిత్వ వికాసం, మానవ విలువలు, నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి వంటి విభిన్న అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్, స్టూడెంట్ కోఆర్డినేటర్ మహబూబ్, అసోసియేట్ డీన్లు చంద్రశేఖర్, మహేశ్, విఠల్, ఇంజినీరింగ్ విభాగాధిపతులు ఉపేందర్, భావ్‌సింగ్ వినయ్, కోఆర్డినేటర్ తేజస్వి, సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు. సొసైటీ సీఈవోల బదిలీకైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలకు స్థానచలనం కలిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 66మంది సీఈవోలు ఉండగా, 49 మందిని వివిధ మండలాలకు బదిలీ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో 17 సొసైటీల్లో రెగ్యులర్ సీఈవో లేకపోవడంతో వారికి ఎలాంటి బదిలీ జరగలేదు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేసినట్లు జిల్లా సహకారశాఖ అధికారి మోహన్ తెలిపారు. -
‘సరిహద్దు’లో కర్ర గణేశులే..
భైంసా/తానూరు: గణేశ్ నవరాత్రోవాలను నిర్మల్ జిల్లాలోని తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గ్రామా ల ప్రజలు వినూత్న రీతిలో జరుపుకొంటారు. పీవో పీ, మట్టి విగ్రహాలు ఇక్కడ మచ్చుకై నా కనిపించవు. రంగులు, రసాయనాల వినియోగం అస్సలే ఉండదు. హంగులు, ఆర్భాటాలు లేకుండా సమాజహితమే తమ అభిమతమని ఇక్కడి ప్రజలు పూర్వీకులు చూపిన బాటనే నేటికీ అనుసరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా దోహదం చేస్తున్నారు. కర్రతో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. పాలజ్ గణేశ్ ఫేమస్ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ చిన్న మరాఠీ గ్రామం పాలజ్. కుభీర్‌కు పక్కనే మహా రాష్ట్రలోని బోకర్ తాలూకాలో ఈ ఊరు ఉంది. స్వా తంత్య్రానికి పూర్వం ఈ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి జనమంతా మంచం పట్టారు. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఓ వైపు కలరా, ప్లేగు వ్యాధులు, మరోవైపు కరువు పరిస్థితులతో జనం సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కర్ర గణపతిని చేయించి ప్రతిష్ఠించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. నిర్మల్ కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీ వర్మను కలిశారు. నిష్టతో గుండాజీ వర్మ చేసిన సుందరమైన కర్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊ రంతా మొక్కితేనే వ్యాధులు దూరమయ్యాయని, కరువు కాటకాలు తొలగిపోయాయని గ్రామపెద్దలు చెబుతారు. అలా 1948 నుంచి కర్ర గణేశుడిని వినా యక ఉత్సవాల్లో కొలవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఊరి ఆడబిడ్డల ద్వారానే కర్రగణేశుడి గురించి ఇతర గ్రామాలకు తెలిసింది. పూజల అనంతరం నిమజ్జనం రోజున స్థానిక వాగు వద్దకు తీసుకెళ్లి కర్ర గణేశుడికి పూజలు నిర్వహిస్తారు. అక్కడే నీళ్లు చల్లి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. దీనినే నిమజ్జ నోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహా న్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కలిసికట్టుగా.. లక్షలాదిగా.. తిరుపతి, షిర్డీలో ఉన్నట్లు పాలజ్‌లోనూ భక్తులకు క్యూలైన్లు ఉన్నాయంటే.. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేయొచ్చు. ప్రతీ ఏడాది వినాయక ఉత్సవాల్లో దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారని అంచనా. లక్షల్లో తరలివచ్చే భక్తులకు గ్రామస్తులే సేవలందిస్తున్నారు. ఆ ఊరంతా కలిసికట్టుగా కర్రగణేశుషుడి సేవలో పాల్గొంటుండడం ఇక్కడి విశేషం. మరికొన్ని గ్రామాల్లోనూ.. తానూరు మండలం బోసిలో వరసిద్ధి కర్ర వినాయకుడు, కుభీర్ మండలం కుభీర్, పార్డి, మాలేగాం చిక్లీ, భైంసా మండలం మాటేగాం, లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామాల్లోనూ కర్ర గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో కరువు నేపథ్యంలో గ్రామస్తుల మొక్కులతో ఇలా ఈ ప్రాంతంలో ఊరంతా కలిసి కర్ర గణపతులను ప్రతిష్ఠించడం మొదలైంది. పాలజ్‌కు ఎలా వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసర మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్ వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్ ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా ఈ గ్రామానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. -
మద్యం మత్తులో ఆత్మహత్య
భీమారం: భీమారం గ్రామంలోని ఐటీడీఏ కాలనీకి చెందిన మారం చందు (42) మద్యం మత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీడీఏలో నివాసముంటున్న చందు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొనేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 25న మద్యం మత్తులో ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మృతుడికి భార్య సుజాత, కూతుళ్లు శ్రీవళ్లి, శ్రీనిక ఉన్నారు. పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్యమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కనే పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఆజ్మీర సుకేందర్ (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 15రోజుల క్రితం సుకేందర్ భార్య రాజేశ్వరి ప్రసవించగా కుమారుడు పుట్టి చనిపోయాడు. రాజేశ్వరి తల్లిదండ్రల నిర్లక్ష్యంతోనే కొడుకు పుట్టగానే చని పోయాడని ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుకేందర్ ఈ నెల 25న రాత్రి హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చి రాజీవ్‌నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కనే పురుగుల మందు తా గి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాను జీ ఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. చెరువులో పడి పశువుల కాపరి మృతికుంటాల: మండలంలోని అంబకంటి గ్రామానికి చెందిన పశువుల కాపరి పొన్నవేని భోజన్న (48) కొత్త చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబకంటి గ్రామానికి చెందిన భోజన్న సోమవారం ఉదయం పశువులను మేపడానికి రోజులాగే గ్రామ శివారుకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కొత్త చెరువులో గజ ఈతగాళ్లతో గాలించగా మంగళవారం మృతదేహం లభించింది. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పాత నేరస్తుల బైండోవర్మంచిర్యాలక్రైం: గతేడాది గణేశ్ నవరాత్రోత్సవాల్లో జిల్లా కేంద్రంలో గొడవలకు పాల్పడిన 13మంది పాత నేరస్తులను మంగళవారం స్థానిక తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది జరిగిన గణేశ్ నవరాత్రోత్సవా ల్లో హింసాత్మక ఘటనలకు ప్రేరేపించిన వారిని, గొడవలకు పాల్పడినవారిని గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా వారిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. అయినా తీరు మార్చు కోకుండా నేరాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఎస్సై సత్తయ్య ఉన్నారు. -
ఏకదంతా.. నమో నమః. ఏటా నీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదు రు చూస్తుంటాం.. చవితి రోజున కొలువుదీర్చి నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలతో కొలుస్తుం టాం.. ఈ సారి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం.. ఆది పూజలందుకుని ఆపదలు గట్టెక్కించే విఘ్ననాయకా.. మా కష్టాలు చూడు తం
● నవ రాత్రుల వేళ.. మా నివేదనల మాల ● విన్నపాలు మన్నించి.. దీవించు వినాయకా నిన్ను వాడవాడలా కొలువు దీర్చేందుకు మండపాలను సిద్ధం చేసుకున్నాం వక్రతుండా. అయితే నీ శోభాయాత్ర నిర్విఘ్నంగా సాగేందుకు జిల్లాలో చాలా చోట్ల రహదారులు ఛిద్రమయ్యాయి. నీ ఆగమనానికి, నిమజ్జనానికి గుంతలమయైన రోడ్లతో ఇబ్బందులు తప్పేలా లేవు లంబోదరా. మన్నించి రాస్తా సమస్యలు త్వరగా దూరం చేయు పార్వతీతనయా.అక్షర క్రమంలో ముందున్నా అక్షరాస్యతలో మాత్రం వెనుకబడుతున్నాం స్వామీ. ఈ ప్రాంతంలో ఉన్నత విద్యాసంస్థలు లేక నీ పిల్లలంతా పెద్ద చదువులకు దూరమవుతున్నారు. నిన్ను మనసారా తలిచి జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టాం స్వామీ. ప్రభుత్వం త్వరగా కరుణించేలా చూడు చతుర్భుజా. తలాపునే గంగమ్మ ప్రవహిస్తున్నా.. పంటల సాగు దినదిన గండంగా సాగుతోంది గణాధ్యక్షా. మీ తల్లిని మా పంట చేలకు ప్రాణం పోసేలా చూడు స్వామీ. చనాఖా– కొరటా బ్యారేజ్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా అభయమివ్వు అగ్రపూజ్యాయ.ఆదిలాబాద్ నుంచి భాగ్యనగరానికి వెళ్లడానికి ఎన్నో తిప్పలు పడుతున్నాం గణేశా. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ఆర్థిక భారమవుతోంది. జిల్లా కేంద్రం నుంచి పఠాన్ చెరు వరకు రైల్వేలైన్ ఏర్పాటును త్వరగా పూర్తయ్యేలా చూడు మూషికవాహనా. ఆకాశంలో విహరించాలనే మా కలలకు రెక్కలను త్వరగా ప్రసాదించు స్వామీ. నీ దీవెనలకు ‘సాక్షి’ చొరవ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల సహకారం తోడవగా కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లంబోదరా. జిల్లా కేంద్రంలో త్వరగా విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేలా చూడు మోదకప్రియా. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నదాతలు తల్లాడిల్లారు తండ్రీ. పంటలు పోయి, ఆశలపై ఇసుక మేటలు వేశాయి స్వామీ. పత్తి చేలన్నీ వరద తాకిడికి గురై బురదమయయ్యాయి. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా, అప్పుల బాధ నుంచి గట్టెక్కేలా కాపాడు గణాధిపా.పూజలో నీకు సమర్పించే వస్త్రాన్ని ఓ సారి చూడు స్వామి. తెల్ల బంగారం పండించే రైతన్నకు కష్టాలు తప్పట్లేదు అగ్రగణ్యా. తేమ పేరుతో దూది రైతుకు ఏటా గిట్టుబాటు దక్కడం లేదు. ఆరుగాలం శ్రమను గుర్తించి మంచి ధర అందేలా చూడు వక్రతుండా.అటవీ అందాలు, పాలనురుగుల జలపాతాలతో కన్నుల విందు చేసే జిల్లాలో పర్యాటక అభివృద్ధి మాత్రం లేదు స్వామీ. రాష్ట్రంలో ఎత్తైన జలపాతాల్లో ఒకటైన కుంటాల మా దగ్గరే పరవళ్లు తొక్కుతున్నా అభివృద్ధికి మాత్రం అడుగులు పడడం లేదు. జిల్లాలో పర్యాటకం ప్రగతి సాధించేలా కరుణించు గౌరీనందనా.నిరుపేదలకు వైద్యం అందించే రిమ్స్ ఆసుపత్రి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారయిందయ్యా. రూ.150 కోట్లతో అధునాతన ఆసుపత్రిని నిర్మించినా ఆది నుంచి విఘ్నాలే స్వామీ. ఆసుపత్రి నిర్మాణం పూర్త యి ఏళ్లు గడుస్తున్నా నాణ్యమైన సేవలకు మాత్రం నోచుకోని పరిస్థితి. వైద్య పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యేలా చూడు విఘ్నరాజా. -
గణేశ్ ఉత్సవాలకు గట్టి బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో పోలీసు అధికారులతో ఉత్సవాల నిర్వహణ, బందోబస్తుపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రోత్సవాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్‌టౌన్, టూటౌన్, మావల స్టేషన్ల పరి ధిలో 11 సెక్టార్లుగా విభజించి బందోబస్తు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటలు నిఘా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ గణపతి మండపాన్ని జియోట్యాగ్ చేయనున్నట్లు తెలిపారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 11 రోజుల పాటు పికెట్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఎలాంటి అసత్యప్రచారాలు జరగకుండా సోషల్ మీడియా బృందం పర్యవేక్షిస్తుందని, ఎవరు చూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని తెలిపారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
సెక్షన్లో ఓ అధికారి తీరు మారట్లేదు..
విద్యుత్ శాఖ అకౌంట్ సెక్షన్లో ఓ అధికారి తీరు మారడం లేదు. కాంట్రాక్టర్లు బిల్లు సబ్మిట్ చేసిన తర్వాత తన పరిధిలోనే నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నాడు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా పరిధిలో సుమారు రూ.60లక్షలకు పైగా బిల్లులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. – ప్రకాశ్ జాదవ్, విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సాక్షి,ఆదిలాబాద్: విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ముందస్తు నోటీసు ఇచ్చి మూడు రోజులుగా పనులు నిలిపివేశారు. ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో పడింది. సాధారణంగా కాంట్రాక్టర్ల దగ్గర మిషనరీలు ఉండడంతో చకచకా పనులు చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు ఎదురైతే చక్కదిద్దడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. కారణం.. శాఖ సిబ్బంది వద్ద సరైన మిషనరి ఉండకపోవడమే. ఈ పరిస్థితుల్లో వారు చిన్న పనులు కూడా చక్కబెట్టేందుకు సమయం తీసుకుంటున్నారు. నిమిషాల్లో పూర్తి కావాల్సిన పనులు సైతం గంటలు పడుతుండడం గమనార్హం. ప్రస్తుతం వర్షాకాలం కావడం, అలాగే గణేశ్ నవరాత్రోత్సవాలు మొదలవుతుండగా అత్యవసరంగా ఏదైన పనులు ఏర్పడితే విద్యుత్ శాఖ అధికారులకు ఉరుకులు పరుగులు తప్పని పరిస్థితి. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివాదం ఏమిటి.. వర్క్స్‌కు సంబంధించి బిల్లులను జిల్లా కేంద్రంలోని అకౌంట్ సెక్షన్లో కాంట్రాక్టర్లు అందజేస్తారు. వాటి ని ఆ సెక్షన్ ఆఫీసర్లు పరిశీలించి ఉన్నతాధికారులకు పంపించాలి. అయితే ఓ అధికారి ఆ బిల్లుల పరిశీలనతో పాటు వాటిని ఉన్నతాధికారులకు పంపించడంలో అంతులేని జాప్యం చేస్తున్నారని,ఈ తాత్సా రం విషయంలో ప్రశ్నించినా మార్పు రావడం లేద ని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.దీంతో నెలల తర బడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, గత్యంతరం లేని పరిస్థితిలోనే పనులు నిలిపివేయాల్సి వచ్చిందని అంటున్నారు. అత్యవసర పనులు చేయాలని చెప్పాం.. కాంట్రాక్టర్లు వర్క్‌లు చేయడం నిలిపివేశారు. అయితే అత్యవసరంగా ఏదైన పని ఏర్పడితే చేయాలని చెప్పాం. పెండింగ్ బిల్లుల విషయంలో వారు నిరసనకు దిగారు. ఆదిలాబాద్ డీఈ వారితో చర్చలు జరుపుతున్నారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. – జేఆర్ చౌహాన్, విద్యుత్ శాఖ ఎస్ఈ, ఆదిలాబాద్ -
75 మంది టీచర్లకు పదోన్నతి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం పదోన్నతుల ద్వారా భర్తీ చేసింది. ఇందులో భాగంగా 75 మంది ఎస్జీటీలకు ప్రమోషన్ లభించింది. జిల్లాలో మొత్తం 137 పోస్టులు ఖాళీగా ఉండగా, ఆయా కేటగిరీల్లో అర్హత గల ఉపాధ్యాయులు లేకపోవడంతో పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు. సోమవారం ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ ఇవ్వగా, మంగళవారం ఉదయం పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులను విద్య శాఖ అధికారులు జారీ చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలో 8 మందికి, లోకల్ బాడీలో 67 మందికి పదోన్నతి లభించింది. ప్రభుత్వ యాజమాన్యంలో తెలుగు మీడియంలో ఇద్దరికి పీఎస్ హెచ్ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్ గణితంలో 1, సాంఘిక శాస్త్రం 1, హిందీ మీడియంలో సాంఘిక శాస్త్రం 1, ఉర్దూ మీడియంలో సాంఘిక శాస్త్రం 1, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌లో ఇద్దరికి పదోన్నతులు లభించాయి. లోకల్‌బాడీలో 28 మందికి పీఎస్ హెచ్ఎంలుగా, నలుగురికి స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 12, గణితంలో 4, బయోసైన్స్‌లో 5, ఫిజికల్ సైన్స్ 2, సాంఘిక శాస్త్రం 19, ఫిజికల్ ఎడ్యూకేషన్‌లో ఒకరికి పదోన్నతులు లభించాయి. కాగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రిపోర్టు చేసి విధుల్లో చేరారు. -
రైతులు అధైర్యపడొద్దు
సిరికొండ: వరద బాధిత రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలో దెబ్బతిన్న పంటలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కొండాపూర్ శివారు చిక్మాన్ వాగు సమీపంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సర్వే కొనసాగుతుందని, బాధిత రైతులందరికీ పరిహారం అందేలా చూస్తామన్నారు. కాగా, చిక్మాన్ ప్రాజెక్టుకు గేట్లు బిగించాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలకేంద్రంలోని కేజీబీవీని సందర్శించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ తుకారాం, ఎంపీడీవో రవీందర్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఏవో శ్రద్ధారాణి, ఎంపీవో సంతోష్‌కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్, మండల విద్యాధికారి సునీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాశ్ తదితరులున్నారు. నష్టంపై ప్రణాళికలు రూపొందించాలి కై లాస్‌నగర్: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన పంటలు, దెబ్బతిన్న వంతెనలు, రహదారులకు సంబంధించి ఆయా శాఖల అధి కారులు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులతో పా టు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించిన వంతెనల వద్ద రహదారులు గుంతలమయమైనట్లు గు ర్తించినట్లు తెలిపారు. సంబంధిత కాంట్రాక్టు సంస్థలే ఆ బాధ్యత తీసుకుని శాశ్వత మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. నీటి ప్రవాహానికి దెబ్బతిన్న కల్వర్టులు, మినీ వంతెనలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అనంతరం అధికారులు రూపొందించిన ప్రదర్శనను పరిశీలించి, వివిధ శాఖల ప్ర ణాళికలను సమీక్షించారు. తహసీల్దార్లు మండలా ల వారీగా వరద నష్టం వివరాలు సమర్పించాలన్నారు. ఈనెల చివరిలో మరోసారి సమీక్ష ఉంటుందని, పూర్తి వివరాలతో హాజరు కావాలన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘రెవెన్యూ’పై ఫోకస్
కై లాస్‌నగర్: జిల్లా పాలనలో కీలకమైన రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించారు. తన మార్కు పాలనతో అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ధరణి ఆపరేటర్లపై ఇటీవల బదిలీ వేటు వేయగా, తాజాగా తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే మీ సేవ ఆపరేటర్లకు సైతం స్థానచలనం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో ‘మామూలు’గా వ్యవహరిస్తున్న తహసీల్దార్లపై కూడా బదిలీ వేటు తప్పదనే ప్రచారం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. అవినీతికి ఆస్కారం లేకుండా... పాలనాపరంగా కీలకమైన రెవెన్యూ శాఖను సంస్కరించే దిశగా కలెక్టర్ ఫోకస్ పెట్టారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారనే కారణంతో జిల్లాలోని ధరణి ఆపరేటర్లపై ఇటీవల బదిలీ వేటు వేశారు. తాజాగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసే మీసేవ ఆపరేటర్లను సైతం మూకుమ్మడిగా బదిలీ చేశారు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయడంతో పాటు తహసీల్దార్ డొంగల్ తమ వద్దే ఉంచుకుని అక్రమాలకు పాల్పడినట్లు వారిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఇటీవల చేపట్టిన రేషన్‌కార్డుల జారీలోనూ దళారులతో కుమ్మకై ్క పనికో రేటు చొప్పున వసూళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వారిపై బదిలీ వేటు వేసారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తదుపరి వంతు తహసీల్దార్లదేనా..? కలెక్టర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలపై అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. ధరణి, మీ సేవ ఆపరేటర్లను బదిలీ చేయగా తదుపరి వంతు తహసీల్దార్లదేననే చర్చ ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో కొంత మంది మండల రెవెన్యూ అధికారులు అక్రమాలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి రైతుల నుంచి పెద్ద మొత్తంలోనే వసూళ్లను దండుకుంటున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి అధికారుల వ్యవహార శైలీ, పనితీరుపై జిల్లా బాస్ అంతర్గతంగా వివరాలు సేకరించినట్లుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే పలువురు తహసీల్దార్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారణకు వచ్చారని, త్వరలోనే వారిపై బదిలీ వేటు పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వినాయక చవితి పండగ తర్వాత ఏ క్షణమైనా బదిలీ వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు రెవెన్యూలో అవినీతికి ఆస్కారం లేకుండా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. -
అర్జీల వెల్లువ
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కొందరు.. సాగుభూములకు పట్టాలివ్వాలని మరి కొందరు.. పంటలకు నష్ట పరిహారం అందించాలని ఇంకొందరు.. ఇలా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ గోడు వెల్లబోసుకున్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 139 అర్జీలు అందాయి. అందులో కొందరి ఆవేదన.. -
బోధనోపకరణాలతో విద్యార్థుల్లో ఆసక్తి
కాసిపేట: బోధనోపకరణాలు విద్యార్థుల్లో అభ్యాసంపై ఆసక్తిని పెంపొందిస్తాయని, విద్యాప్రమాణాల మెరుగుదలకు దోహద పడతాయని జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి బోధనోపకరణాల మేళా(టీఎల్ఏం)ను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్లు చౌదరి సత్యనారాయణమూర్తి, విజయలక్ష్మి, మండల విధ్యాధికారి ముక్తవరం వెంకటేశ్వరస్వామి, కాంప్లెక్స్ హెచ్ఎంలు మామిడిపల్లి సాంబమూర్తి, రమేష్ రాథోడ్, సుధాకర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే టీబీ నియంత్రణ
సాత్నాల: అవగాహనతోనే టీబీ నియంత్రణ సాధ్యమని జిల్లా టీబీ నియంత్రణ అధికారి సు మలత అన్నారు. భోరజ్ మండలం గిమ్మ గ్రా మంలో సోమవారం క్షయ నిర్ధారణ శిబిరం ని ర్వహించారు. సమీప గ్రామాల ప్రజలకు వ్యాఽ ది నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 135 మంది అనుమానితులను పరీక్షించినట్లు తెలిపారు. తెమడతో కూడిన దగ్గు, రెండు వారాలకు పైగా జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీబీ అలర్ట్ ఇండియా, సాతి ఎన్జీవో రాష్ట్ర ప్రతి నిధులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ జేమ్స్ రాజు, మహేందర్, తిరుపతి, సుశీల మెడికల్ ఆఫీసర్ రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులు కల్పించాలని వినతి
ఆదిలాబాద్‌టౌన్: వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న బయో కెమిస్ట్, డైటీషియన్లకు పదోన్నతులు కల్పించాలని ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నాయకులు కోరారు. సోమవారం హై దరాబాద్‌లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ నరేంద్ర కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈమేరకు డీఎంఈ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వినతి పత్రాన్ని అందజేసిన వారిలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిజాం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ల్యాబ్టెక్నీషియన్లు తదితరులున్నారు. -
యూరియా.. ఆందోళన
ఇచ్చోడ పీఏసీఎస్‌లో రైతుల రద్దీనార్నూర్లో ఆందోళన చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులుఇచ్చోడలో వేకువజాము నుంచే బారులు ఇచ్చోడ: మండల కేంద్రంలోని యూరియా వ చ్చిందని సమాచారం అందగానే రైతులు సోమవారం ఉదయం 6 గంటల నుంచే సహకార సంఘం వద్ద బారులు తీరారు. 444 బ్యాగులు వచ్చినట్లు సీఈ వో రాథోడ్ ఈశ్వర్ తెలిపారు. అయితే ఉదయం నుంచి క్యూలో ఉన్నా కొంత మందికి యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. నార్నూర్‌లో బీఆర్ఎస్ నిరసన నార్నూర్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. దాదాపు గంటసేపు బైఠాయించి నిరసన తెలి పా రు. జెడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, సరిపడా ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరానికి బస్తా చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. ఇందులో పీఏ సీఎస్ చైర్మన్ ఆడే సురేశ్, నాగోరావ్, రూప్‌దేవ్, చంద్రశేఖర్, కాంబ్లె ఉద్దవ్, ఫిరోజ్‌ఖాన్, సయ్యద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో..సిరికొండ: స్థానిక పీఏసీఎస్ అనుబంధ కేంద్రానికి ఎరువుల లోడ్ వచ్చిందనే సమాచారంతో రైతులు ఉదయాన్నే మండల కేంద్రానికి చేరుకున్నారు. వేకువజామున 5 గంటల నుంచే బారులు తీరా రు. నిర్వాహకులు ఉదయం 10 గంటలకు టోకె న్లు జారీ చేశారు. అయితే ఇదివరకు యూరియా తీసుకున్న వారికి నిరాకరించడంతో గందరగోళం నెలకొంది. ఏస్సై పూజ సిబ్బందితో వచ్చి రైతులను సముదాయించారు. జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. పీఏసీఎస్‌ల ఎదుట గంటల తరబడి నిరీక్షించినా చాలామందికి ఎరువు లభించని పరిస్థితి. వేకువజామునే వచ్చినా ఫలితం ఉండడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వెంటనే స్పందించాలని నార్నూర్‌లో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. -
ఎలుగుబంటి దాడిలో కూలీకి గాయాలు
తిర్యాణి(ఆసిఫాబాద్): ఎలుగుబంటి దాడిలో ఓ వ్యవసాయ దినసరి కూలీకి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామానికి చెందిన ఆవుల భూమయ్య వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పశువుల కాపరి వేరే ఊరికి వెళ్లడంతో భూమయ్య సోమవారం పశువుల మేపేందుకు ఎదులపహాడ్ బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పొదల్లో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా భూమయ్యపై దాడి చేసింది. దీంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అరుపులు విన్న సమీపంలోని పాటగూడ గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రుడిని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కాసిపేట: కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధి సోమగూడెం భరత్కాలనీకి చెందిన మల్లెపల్లి శోభన్(42) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలానికి చెందిన శోభన్ సోమగూడెంలో నివాసం ఉంటూ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తలు గొడవ పడడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన శోభన్ ఆదివారం ఉదయం 9.30గంటలకు పురుగుల మందు తాగాడు. మంచిర్యాల ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి సోదరుడు మల్లెపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి..మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధి ముల్కల్ల వాగొడ్డుపల్లెకు చెందిన కొట్టె బాపన్న(51) ఆత్మహత్య చేసుకున్నా డు. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపిన వివరా ల ప్రకారం.. బాపన్న వ్యవసాయ కూలీ పనులు చే స్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల నడుం నొప్పి తీవ్రంగా ఉండడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. వ్యవసాయం, కూలీ పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. పదేళ్ల క్రితం బాపన్న కుమారుడు చనిపోవడం, తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై 24న సాయంత్రం 4గంటల ప్రాంతంలో ముల్కల్ల శివారులో గడ్డి మందు తాగాడు. మృతుడికి భార్య పద్మ, కుమార్తె లలిత ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రో ఖోఖో లీగ్‌కు మడావి ప్రశాంత్
ఉట్నూర్‌రూరల్: ఇంద్రవెల్లి మండలం చిన్నగూడకు చెందిన మడావి ప్రశాంత్ అల్టిమేట్ ప్రో ఖోఖోలీగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అతడిని ఉట్నూర్‌లో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి సోమవారం సన్మానించారు. స్థానిక కొలాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదివి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ప్రశాంత్‌ను పలువురు అభినందించారు. ఇందులో సీనియర్ పీడీ హేమంత్, కోచ్‌లు కృష్ణ, శేఖర్ పాల్గొన్నారు. బీజేపీ నాయకులపై కేసుగుడిహత్నూర్: అనుమతి లేకుండా జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోలో పాల్గొన్న 20 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించడంతో ప్రజా రవాణాతో పాటు భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. జాతీయ రహదారి సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎలుగుబంటి వేటగాళ్ల రిమాండ్పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని కోయచిచ్చాల అటవీ ప్రాంతంలో ఎలుగుబంటిని వేటాడిన నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు అటవీశాఖ అధికారులు సో మవారం తెలిపారు. పదిరోజుల క్రితం ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. సోమవారం పెంచికల్‌పేట్‌కు చెందిన వెంకటి, సామెర సత్తన్న, ఎల్లూర్‌కు చెందిన మధునయ్యను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎఫ్ఎస్వో జగన్, ఎఫ్‌బీవో సతీష్ వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడితే చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
బీపీఎంలకు కొత్త ఫోన్లు
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత (చేయూత) కింద లబ్ధిదారులకు ప్రతీ నెలా పింఛన్ పంపిణీ చేస్తోంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ల (బీపీఎం) ద్వారా వీటిని అందజేస్తారు. ఈ మేరకు బీపీఎంలకు కొత్త సెల్ఫోన్లను అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 579 ఆండ్రాయిడ్ మొబైల్స్ సరఫరా చేసింది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. వాటిని మంగళవారం ఆయా కలెక్టర్ల ఆధ్వర్యంలో అందజేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఈ ఫోన్లు పింఛన్ పంపిణీకి మాత్రమే ఉపయోగపడతాయి. అక్రమాలు అరికట్టేలా ... వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, బోధకాలు, హెచ్ఐవీ బాధితులకు ప్రభుత్వం ప్రతినెలా చేయూత కింద పింఛన్లు అందజేస్తోంది. దివ్యాంగులకు రూ.3,016 అందిస్తుండగా, మిగతా వారికి రూ.2,016లను అందజేస్తోంది. పంపిణీలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గత నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. యాప్ ద్వారా లబ్ధిదారుల కళ్లను స్కాన్ చేసి పింఛన్ అందజేస్తున్నారు. సిబ్బందికి గత నెలలోనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన సెల్ఫోన్లు అందించాల్సి ఉండగా ఆలస్యమైంది. ప్రస్తు తం కొత్త మొబైల్స్ జిల్లాలకు చేరగా వాటిని అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 579 మంది బీపీఎంలు చేయూత పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీరికి 5జీతో కూడిన సెల్ఫోన్లను ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఆర్డీఏ కార్యాలయాలకు ఈ ఫోన్లు చేరాయి. బీపీఎం పేరు, వారికి అందిస్తున్న ఫోన్ ఈఎంఐ నంబర్ వంటి వివరాలను ఆ శాఖ సిబ్బంది ఆన్లైన్లో నమో దు చేస్తున్నారు. మంగళవారం ఆయా కలెక్టర్ల ద్వా రా బీపీఎంలకు అందించనున్నారు. సెల్‌ఫోన్‌తో పాటు చార్జర్, బ్యాక్ కవర్, ఫింగర్ ప్రింట్స్ న మోదు చేసే యంత్రాన్ని సైతం అందజేస్తున్నట్లు డీఆర్డీవో రాథోడ్ రవీందర్ తెలిపారు. సెల్ ద్వారా పింఛన్‌దారు ముఖ చిత్రాన్ని స్కాన్ చేసి వారికి నగదు అందజేస్తారని పేర్కొన్నారు. జిల్లా కేటాయించినసెల్ఫోన్లు ఆదిలాబాద్ 158 నిర్మల్ 147 మంచిర్యాల 144 కుమురంభీం ఆసిఫాబాద్ 130 -
ముగిసిన శబరిమాత అఖండజ్యోతి
తలమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. మన సంస్కృతిని భావితరాలకు అందించాలన్నారు. అనంతరం పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, బీజేపీ మండల అధ్యక్షుడు ధనంజయ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బఫర్’ పరిధిలోని ఇళ్లకు నోటీసులివ్వాలి
కై లాస్‌నగర్: బఫర్ జోన్ పరిధిలో ఉన్న నివాసాలు, నాలాలపై ఉన్న నిర్మాణాలు గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో వరదనష్టంపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించే సర్వే వివరాలను పవర్ పాయింట్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు ఉప్పొంగి ప్రవహించిన ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్, కోజా కాలనీ, సుభాష్‌నగర్ లోలెవల్ బ్రిడ్జిలను హైలెవెల్ బ్రిడ్జిలుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఆర్ండ్బీ, మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాలాలపై ఉండే అక్రమ నిర్మాణాలు, ఇరుకుగా మార్చిన ప్రదేశాలను పరిశీలించి నివేదిక అందించాలన్నారు. సెప్టెంబర్ 10న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, ఇరిగేషన్ డీఈ విఠల్, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూలో కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీ
పేరు ప్రస్తుత మండలం బదిలీ స్థానం ఆసీఫ్ ఆదిలాబాద్‌అర్బన్ గుడిహత్నూర్ దయాకర్ ఆదిలాబాద్‌రూరల్ జైనథ్ కార్తీక్ నేరడిగొండ ఆదిలాబాద్‌అర్బన్ సాయి తలమడుగు భీంపూర్ ఆశన్న బజార్హత్నూర్ బోథ్ ఇనేష్ గుడిహత్నూర్ భోరజ్ హిమేశ్ భీంపూర్ తలమడుగు అనిల్ మావల బేల శ్రీనివాస్ బేల తాంసి లక్ష్మణ్ భోరజ్ నేరడిగొండ ప్రవీణ్ బోథ్ బజార్హత్నూర్ రిజ్వాన్ జైనథ్ ఆదిలాబాద్‌రూరల్ ప్రశాంత్ తాంసి మావల మిథున్ ఉట్నూర్ నార్నూర్ జరాచంద్ నార్నూర్ ఉట్నూర్కై లాస్‌నగర్: జిల్లాలో రెవెన్యూ శాఖ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న 15 మంది కంప్యూటర్ ఆపరేటర్ల (మీసేవ)కు స్థానచలనం కలిగింది. పాలన సౌలభ్యం పేరిట వారిని బదిలీ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బదిలీ స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. -
బీసీ రిజర్వేషన్ల సాధనకు రిలే నిరాహార దీక్ష
జన్నారం: బీసీ రిజర్వేషన్ల సాధనకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కడార్ల నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. విద్య, ఉద్యోగ పదోన్నతులు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే బహిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ కేయూపీఎస్ కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్‌గౌడ్, మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆంధ్ర పురుషోత్తం, మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు పొడేటి సతీష్, డివిజన్ మోకు దెబ్బ అధ్యక్షుడు ఒల్లాల నర్సాగౌడ్, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు -
రైలు కిందపడి వృద్ధుడి మృతి
మందమర్రిరూరల్: పట్టణంలోని రామన్ కాలనీ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఉదయం 11గంటలకు మంచిర్యాల వైపు నుంచి బెల్లంపల్లి వైపు వెళ్లే రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి మృతిచెందాడని పేర్కొన్నారు. మృతదేహం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉందని, సంబంధీకులు 9490871784, 9948481902 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో రిటైర్డు కార్మికుడు మృతిశ్రీరాంపూర్: నస్పూర్‌లోని తీగల్ పహాడ్ రాంనగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డు కార్మికుడు దొరిశెట్టి నారాయణ(62) సోమవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. నస్పూర్ ఎస్సై ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ రామ్‌నగర్‌లో నిర్మించుకుంటున్న ఇంటికి నీరు పట్టేందుకు బోర్ మోటార్ స్టార్టర్ స్విచ్ఛాన్ చేయబోయాడు. ఈ క్రమంలో కరెంటు వైరు షాక్ తగలడంతో కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మృతిచెందాడని ధ్రువీకరించారు. మృతుడి భార్య మల్లక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సుంగాపూర్ శివారులో 95 గంజాయి మొక్కలు స్వాధీనంనార్నూర్: ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో ని సుంగాపూర్ శివారులో గంజాయి సాగు చే స్తున్నట్లు అందిన సమాచారంతో సీసీఎస్, నా ర్నూర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన కొడప దేవ్‌రావు సా గు చేస్తున్న 95 గంజాయి మొక్కలను స్వాధీన పరుచుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 12.4 కిలోల బరువు గల వీటి వి లువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.9.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. నార్నూర్ సీఐ ప్రభాకర్, ఎస్సై అఖిల్, సీసీఎస్, పోలీసులు పాల్గొన్నారు. వన్యప్రాణులను హతమార్చిన ఇద్దరి అరెస్ట్సాత్నాల: వన్యప్రాణులను వేటాడిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎఫ్ఆర్వో గులాబ్ సింగ్ తెలిపారు. మహారాష్ట్రలోని పాండ్రకోడా అటవీ పరిసర ప్రాంతాల్లో నాలుగు నెమళ్లు, ఓ నిలుగాయిని పలువురు వేటాడి హతమార్చారు. మహారాష్ట్ర పార్వ గ్రామానికి చెందిన నిలేష్ చౌహాన్, రాథోడ్ రోహన్ పట్టుపడగా, భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన సందీప్ రాథోడ్, సంజీవ్ పరారీలో ఉన్నారు. హతమార్చిన వన్యప్రాణుల మాంసాన్ని గిమ్మ గ్రామంలో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎఫ్ ఆర్వో తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్లు, ఆశా కార్యకర్తలు, వరద బాధితులను ఆదుకోవాలని సీపీఎం చేపట్టిన ఆందోళనలతో కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. కమీషన్ విడుదల చేయాలని రేషన్‌డీలర్లు.. కైలాస్‌నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాల్ మా ట్లాడుతూ.. నెలల తరబడి కమీషన్ విడుదల చేయకుంటే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవా లని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేని ఫెస్టోలో ప్రకటించినట్లుగా డీలర్లకు రూ.5వేల గౌర వ వేతనంతో పాటు క్వింటాల్ బియ్యంకు రూ.300 కమీషన్ చెల్లించాలన్నారు. అనంతరం అదనపు కలె క్టర్ శ్యామలాదేవిని కలిసి వినతిపత్రం అందజేశా రు. ఇందులో సంఘ బాధ్యులు వెంకటేశ్, హరీంద్ర, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం కోసం ఆశావర్కర్లు .. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీ యూ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ, ఆశాలకు రూ.18వేలు కనీస వేతనం చెల్లించాలని, అలా గే అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశా రు. డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ వారి వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించడంతో ఆందోళన విరమించారు. ఇందులో సంఘబాధ్యులుపాల్గొన్నారు. పంట నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం.. భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామంలో వరద బాధితులకు పరిహారంతో పాటు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.మల్లేశ్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ధర్నాలో మాట్లాడారు. అధికారులు సర్వే క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి బాధితులకు న్యాయం జరి గేలా చూడాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో నా యకులు దత్తాత్రి, మంజుల, స్వామి, ఆరిఫా తదితరులు పాల్గొన్నారు. -
‘పంట నష్టంపై విపక్షాలది అనవసర రాద్ధాంతం’
కై లాస్‌నగర్: జిల్లాలో పంటనష్టంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నా రు. పట్టణంలోని ప్రజాసేవభవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కురిసినవర్షాలకు జిల్లాలో దాదాపు 20వేల ఎకరాల మేర పంట నష్టం వాటిల్లిందన్నారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల పర్యటించారన్నారు. నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారన్నారు. అయినా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గతంలో ఇలాంటి వైపరీత్యాల సమయంలో గత పాలకులు రైతులను కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
ఆర్జీయూకేటీలో ముగిసిన వర్క్‌షాప్
బాసర:బాసర ఆర్జీయూకేటీలో ఎలక్ట్రిక్ వాహనాలపై మూడు రోజులు నిర్వహించిన హ్యాండ్స్ ఆన్ వర్క్‌షాప్ సోమవారం ముగిసింది. నేషనల్ మిషన్ ఆన్ పవర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సహకారం అందించిందని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ప్రపంచం వేగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు పయనిస్తున్న ఈ సమయంలో ఆర్జీయూకేటీ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు, ప్రయోజనాత్మక అనుభవం అందించడం అత్యంత అవసరమన్నారు. ఇలాంటి వర్క్‌షాప్‌లు కేవలం శిక్షణ కార్యక్రమాలు మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆవిష్కరణలకు పునాదిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు సహా మొత్తం 75 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. దేశ స్వచ్ఛ శక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాలకు తోడ్పడే విధంగా నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్‌షాప్ దోహదపడిందని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ లక్ష్మణ్ ముత్యం, హెచ్‌వోడీ డాక్టర్.బావుసింగ్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
విద్యుత్ కాంట్రాక్టర్ల నిరసన
ఆదిలాబాద్‌టౌన్: తమకు బిల్లులు వెంటనే చెల్లించాలని విద్యుత్ కాంట్రాక్టర్లు ఆదివారం ఎస్ఈ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ జాదవ్ మాట్లాడుతూ, నెలల తరబడి బిల్లులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. అలాగే మూడేళ్లుగా తమను జేఏఓ వేధింపులకు గురిచేస్తున్నట్లుగా ఆరోపించారు. ఆయనను వెంటనే సబ్ డివిజన్ కార్యాలయం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందులో కాంట్రాక్టర్లు రాము, అశోక్, రవీందర్‌రెడ్డి, నర్సింగ్, హరిచరణ్, రాథోడ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
నాగోబాను దర్శించుకున్న ఎస్పీ
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని మెస్రం వంశీయులు ఘనంగా సన్మానించారు. ఇందులో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, మెస్రం వంశీయులు వెంకట్రావ్, ఆనంద్‌రావ్, తదితరులున్నారు. మహదేవ్ ఆలయ సందర్శనఉట్నూర్రూరల్: మండలంలోని సాలెవాడ గ్రా మంలో గల హరహర మహదేవ్ ఆలయాన్ని ఎస్పీ అఖిల్ మహజన్ దర్శించుకున్నారు. అ లాగే కొండపై ఉన్న శివుని విగ్రహం వద్ద ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట వామన్మహరాజ్, శ్యాంప్రసాద్, ఆలయ కమి టీ సభ్యులు పాల్గొన్నారు. -
లబాన సంఘం జిల్లా కార్యవర్గం
ఆదిలాబాద్‌టౌన్: మథుర లబాన సమాజ నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా మోహన్ సింగ్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా సాబ్లే అమర్‌సింగ్, ఉపాధ్యక్షులుగా పడవల్ పత్తు సింగ్, పడవల్ సర్దార్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా అజాడే కేవల్ సింగ్, కార్యదర్శిగా పడవల్ నానక్‌సింగ్, పడవల్ హుషార్ సింగ్, కోశాధికారిగా బామన్ సాతల్య, ప్రచార కార్యదర్శిగా సాబ్లే సంతోష్‌సింగ్, సభ్యులుగా చౌహాన్ ప్రేమ్‌సింగ్, రాంచందర్, సలహాదారులుగా మోహన్ సింగ్, కై లాస్సింగ్, సూరజ్, దిగంబర్, రైమల్, సకర్వాల్ గులాబ్‌సింగ్ ఎన్నికయ్యారు. -
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి
ఆదిలాబాద్‌రూరల్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ సెర్చ్) నిర్వహించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి అన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మావల పోలీసుస్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో ఆదివారం వేకువజామున దాదాపు 200 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. సరైన ద్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, ఒక కారును తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే నార్కోటిక్ డాగ్ రోమా సాయంతో గంజాయి కోసం తనిఖీ చేయగా, ఓ ఇంట్లో మూడు మొక్కలు, 10 గ్రాముల ఎండు గంజాయి లభించినట్లు పేర్కొన్నారు. అలాగే ఓ షాపులో 29 క్వార్టర్ లిక్కర్ బాటిల్స్ లభ్యమైనట్టు తెలిపారు. రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్ర శాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రతి ఒక్క రూ సహకరించాలని సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూ చించారు. సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరించారు. వాటి ఏర్పాటుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపించాలని సూచించారు. కొత్తవారికి ఇల్లు అద్దెకు ఇచ్చే క్రమంలో సరైన విచారణ చేసుకోవాలని తెలిపారు. రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరగరాదని, ఈవ్‌టీజింగ్, మహిళలను వేధించడం వంటివి నిర్వహించకూడదని అన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నా రు. కార్యక్రమంలో మావల సీఐ కర్రె స్వామి, పట్ట ణ సీఐలు బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, కె.ఫణిదర్, ప్రేమ్‌కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, రిజర్వ్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
డుమ్మాలకు చెక్
ఆదిలాబాద్‌టౌన్: డుమ్మా లెక్చరర్లకు చెక్ పెట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపడుతోంది. చాలామంది సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం లేదు. అయితే ఇప్పటికే పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) విజయవంతం కావడంతో ప్రభుత్వ కళాశాలల్లోనూ అమలుకు చర్యలు చేపట్టింది. వారం రోజుల్లో అమలు చేయనున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. కాగా శనివారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ అమలులోకి తీసుకొచ్చారు. అయితే చాలాచోట్ల సర్కారు కాలేజీల్లో ప్రార్థన నిర్వహించకపోవడం, లెక్చరర్లు ఇష్టమున్నప్పుడు రావడం, వారికి నచ్చినప్పుడే వెళ్లడం పరిపాటిగా మారింది. ఇక నుంచి వారి ఆగడాలకు చెక్ పడనుంది. కళాశాలకు వచ్చిన లెక్చరర్లు బోధన చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ప్రతీ తరగతి గది, కళాశాల ఆవరణ, ప్రిన్సిపాల్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో.. దూరప్రాంతంలో ఉన్న కళాశాలల్లో పనిచేసే కొందరు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సమయపాలన పాటించడం లేదు. దీంతో విద్యార్థులకు సక్రమంగా తరగతులు నిర్వహించని పరిస్థితి. వీటిపై దృష్టి పెట్టిన ఇంటర్ బోర్డు టీజీబీఐఈఎఫ్ఆర్ఎస్ అమలుకు సన్నద్ధమవుతోంది. లెక్చరర్లు తమ సెల్ఫోన్లలోనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కళాశాల చుట్టూ వంద మీటర్ల దూరంలో ఇది పనిచేస్తుంది. ఉదయం 9.20 గంటలకు, సాయంత్రం 4 గంటలకు హాజరు వేయాల్సి ఉంటుంది. సమయపాలన పాటించని అధ్యాపకుల వేతనాల్లో కోత విధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదివరకు లెక్చరర్లు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు ఉండేది. కోవిడ్ తర్వాత పలు కళాశాలల్లో ఆ యాంత్రాలు మూలనపడ్డాయి. అప్పటినుంచి హాజరు పట్టిక ద్వారానే అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. సొంత పనుల్లో బిజీ.. కొంత మంది లెక్చరర్లు కళాశాలల్లో పాఠాలు బోధించడం కంటే వారి సొంత పనుల్లోనే బిజీగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. మారుమూల మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పర్యవేక్షించే వారు కరువవడంతో ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. కళాశాలకు ఆలస్యంగా రావడం, నిర్దేశిత సమయం ముగియక ముందే ఇంటి ముఖం పట్టడం చేస్తున్నారు. పాఠాలు సక్రమంగా బోధించని లెక్చరర్లు మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. అయితే ఇంటర్లో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులైన వారు, డిగ్రీలో కనీసం పాస్ కాకపోవడం గమనార్హం. -
బాధిత రైతులను ఆదుకోవాలి
ఆదిలాబాద్‌రూరల్: పంట నష్టపోయిన ప్రతీ రై తుకు పరిహారం అందించి ఆదుకోవాలని మా జీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మండలంలోని అంకోలి, తంతోలి, లింగుగూడ గ్రామాల శివారులో వరదతో నష్టపోయిన పంట చేలను ఆదివారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట న ష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగే వర కు పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు. ఇంద్రవెల్లి సభలో రైతులకు ప్రీమియం కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని మండిపడ్డారు. ఆ సభలో ఇచ్చిన ప్రతీ హామీని పూర్తి చేయకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక త ప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గండ్రత్ రమేశ్, నాయకులు జగదీష్, ప్రహ్లాద్, రా జు, సతీష్, పరమేశ్వర్, తదితరులున్నారు. -
‘సహకార’లో ఉత్కంఠ
కై లాస్‌నగర్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల గడువు ఈనెల 14వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో పద వీ కాలం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఉన్న సొసైటీలకు మాత్రమే వర్తి స్తుందని మెలిక పెట్టింది. ఈ మేరకు పది అంశాలను నిర్దేశిస్తూ పనితీరు పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది. పదవీకాలం పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన చైర్మన్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలతో ఢీలా పడిపోయారు. సర్కారు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం సొసైటీ ల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అన్నదాతకు అండగా.. మండల స్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందజేస్తూ సొసైటీలు వారికి అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి వాటికి ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. సొసైటీ పరిధిలోని రైతులు.. డైరెక్టర్లు, చైర్మన్లతో కూడిన పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. 2020లో ఎన్నికై న పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగిసింది. అయితే రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లంతా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి విజ్ఞప్తి చేయడంతో పదవీకాలం ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ గడువు ఈ నెల 14తో ముగియడంతో మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఎలాంటి నిబంధనలు లేకుండా పదవీ కాలం పొడిగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం నిబంధనల ప్రకారం ఉన్న వాటికి మాత్రమే వర్తింపజేయాలనే నిబంధన విధించడంతో సొసైటీల కొనసాగింపు సందేహంగా మారింది. పనితీరు మెరుగ్గా ఉంటేనే.. తాజా నిబంధనల ప్రకారం పనితీరు మెరుగ్గా ఉంటేనే వాటి పాలకవర్గాల గడువు పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం సొసైటీల వారీగా పది అంశాలతో కూడిన సమాచా రం అందించాల్సిందిగా జిల్లా సహకార శాఖను ఆదేశించింది. సొసైటీ పరిధిలో పాత బకాయిల పరిస్థితి.. రుణాల తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా, నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా.. జరిగితే వాటిపై ఎలాంటి విచారణ చేపట్టా రు.. దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా.. సొసైటీ కార్యకలాపాలపై ఆడిట్ చేశారా.. చట్టపరమైన చర్యలకు సంబంధించిన పిటిషన్ ఏదైనా పెండింగ్‌లో ఉందా.. అనే తదితర వివరాలతో కూడిన సమాచారం పంపించాలని సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు సొసైటీల వారీగా సమాచారం సేకరించారు. పనితీరును గుర్తించి వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. తదనుగుణంగా పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పదవిపై ఉత్కంఠ.. ప్రభుత్వ తాజా నిబంధనలతో జిల్లాలో ఎంత మంది సొసైటీ చైర్మన్లకు పదవి గడువు పొడిగింపు దక్కుతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. సర్కా రు నిర్ణయంపై పాలకవర్గాలతో పాటు వాటి పరిధి లోని రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో.. మొత్తం సహకార సంఘాలు 28 డీసీసీబీ పరిధిలోనివి 23 ఎస్బీఐ పరిధిలోనివి 05 సభ్యత్వం కలిగిన రైతులు 30వేలునివేదిక అందజేశాం..సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని సొసైటీల పనితీరుపై పది అంశాలతో కూడిన సమాచారం సేకరించాం. ఏ సొసైటీ పనితీరు ఏ విధంగా ఉందనే వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించాం. తదుపరి ఆదేశాలకనుగుణంగా పొడిగింపుపై తగు చర్యలు తీసుకుంటాం. – బి.మోహన్, జిల్లా సహకార అధికారి -
క్రీడలతో ఆరోగ్యకర సమాజం
ఆదిలాబాద్: క్రీడలతో ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమవుతుందని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం నిర్వహించిన క్రీడా దినోత్సవ ర్యాలీని ఆమె ప్రారంభించారు. జ్యోతి వెలిగించి క్రీడాకారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలపై విస్తృత అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నెల 23నుంచి 31వరకు క్రీడా దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టిందన్నారు. వీటిలో క్రీడాకారులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇందులో డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, క్రీడా శిక్షకులు రాజు, కబీర్దాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయుల సమస్యలు పరి ష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహాన్, గోపీకృష్ణ కోరారు. ఈమేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమురయ్యను హైదరాబాద్‌లో ఆదివా రం కలిసి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:20 సవరించేలా చూడాలన్నారు. అలాగే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, నూతన పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇందులో రాజ్‌కుమార్, దత్తాత్రి తదితరులున్నారు. -
వినాయకా.. తిప్పలు తప్పేనా
కై లాస్‌నగర్: గణేశ్ నవరాత్రోత్సవాలకు సమయం ఆసన్నమైంది. పట్టణంతో పాటు చుట్టు పక్కల మ ండలాల్లో ఏర్పాటు చేసే మండపాలకు జిల్లా కేంద్రం నుంచే వినాయక విగ్రహాలను తీసుకెళుతుంటారు. అయితే పట్టణంలోని ప్రధానరోడ్లతో పాటు అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర లేచి గుంతలమయంగా దర్శనమిస్తున్నాయి. దీంతో విగ్రహాలు తరలించేందుకు తిప్పలు తప్పేలా కన్పించడం లేదు. మరమ్మతులు చేపట్టాల్సిన బల్దియా యంత్రాంగం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. గుంతలమయమైన రహదారులు జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీకి సంబంధించిన ప్రధాన రోడ్లతో పాటు బల్దియాకు సంబంధించిన అంతర్గత రోడ్లు పలు కాలనీల్లో అధ్వానంగా మారాయి. కొన్నేళ్లుగా వీటికి ఎలాంటి మరమ్మతులు చేపట్టడం లేదు. బీటీ రోడ్లపై తారు లేచి కంకర తేలగా, సిమెంట్ రోడ్లపై సైతం గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అందులో నీరు నిలిచి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరమ్మతు చేపట్టాల్సిన అధికారులు నిధుల కొరత సాకు చూపుతుండడం గమనార్హం. సమీపిస్తున్న గడువు ఈ నెల 27న వినాయక చవితి. గణేశ్ విగ్రహాలను జిల్లా కేంద్రంలోనే భారీగా తయారు చేశారు. పట్టణంతో పాటు తాంసి, తలమడుగు, జైనథ్, బేల, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల గణేశ్ మండళ్ల నిర్వాహకులు ఇక్కడి నుంచే విగ్రహాలను తరలిస్తుంటారు. అయితే పట్టణంలోని పలు రోడ్లు గుంతలమయంగా మారడంతో వాటి తరలింపునకు ఇబ్బందిగా మారే అవకాశముంది. కాగా, ఇటీవల నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులతో పాటు పలు గణేశ్ మండళ్ల నిర్వాహకులు సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పటికిప్పుడు పనులు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. త్వరలోనే మరమ్మతు పనులు.. నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. త్వరలోనే రోడ్ల మరమ్మతు పనులు చేపడుతాం. అలాగే ఆయా కాలనీల్లో వీధి దీపాలు సైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తాం. నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం. – కార్తీక్, మున్సిపల్ డీఈ -
‘రిజిస్ట్రేషన్’లో అక్రమాలు
సాక్షి, ఆదిలాబాద్: రిజిస్ట్రేషన్ కార్యాలయాలల్లో కొద్ది నెలల క్రితం ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తద్వారా ప్రజలు ముందుగా ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్లిపొవచ్చు. ఇక్కడ అవినీతికి తావులేకుండా నేరుగా ప్రక్రియ సాగిపోతుందని అంతా భావిస్తారు. అయితే లోపల జరిగేది మాత్రం వేరే తంతు. గతంలో జరిగిన ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదు. దీనికి ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే నిదర్శనం. ఆదిలాబాద్ జాయింట్–2 సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రూ.5వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన రిజిస్ట్రేషన్ శాఖలో సంచలనం కలిగించింది. అయితే ఈ శాఖలో చేయి తడపనిదే.. రిజిస్ట్రేషన్ జరగదనేది అందరికి తెలిసిన సత్యమే. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా ఏదైనా మార్పు జరిగిందనుకుంటే పొరపాటే. ఆ కార్యాలయాల్లో గతంలో సాగిన అవినీతి కార్యకలాపాలే ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం. ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. నెల క్రితం ఈ కార్యాలయానికి చెందిన ఓ సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రైటర్లతో సమావేశం నిర్వహించి ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అసెస్మెంట్ ఆధారంగా ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేస్తానని, ఇందుకోసం పార్టీలను తీసుకురావాలని డీడబ్ల్యూఓలతో అందులో పేర్కొన్నాడు. పార్టీ నుంచి మీరెంత తీసుకున్న నాకు మాత్రం రూ.15వేలు ముట్టజెప్పాలని ఒప్పందం చేసుకున్నాడు. అయితే లింకు డాక్యుమెంట్లు లేకుండా ఆస్తులకు కేవలం అసెస్మెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయరాదని స్వయంగా కలెక్టర్ నుంచి ఆదేశాలున్నాయి. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ సమావేశం నిర్వహించి మరీ డాక్యుమెంట్ రైటర్లను దొడ్డిదారి ప్రక్రియకు ప్రోత్సహించడం గమనార్హం. విషయాన్ని గతంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. పర్యవేక్షణ కరువు .. ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు ఎస్ఆర్వో పోస్టులు ఉండగా , జాయింట్–1గా రె గ్యులర్ అధికారి విజయ్‌కాంత్‌రావు కొనసాగుతున్నారు. ఇక జాయింట్–2 పోస్టు ఖాళీగా ఉండగా సీ నియర్ అసిస్టెంట్ అయిన శ్రీనివాసరెడ్డి ఇన్చార్జి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. జాయింట్–1 కొద్ది రోజులుగా సెలవులో ఉన్నారు. దీంతో ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి కనుసన్నల్లోనే రిజిస్ట్రేష న్ ప్రక్రియ సాగుతుంది. ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడటం ప్రస్తుతం ఆ శాఖలో కలకలం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు జిల్లా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న రవీందర్రావు కొద్ది రోజులుగా సెలవుల్లో ఉన్నారు. నిజా మాబాద్ డీఆర్ ప్రసన్న ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కు ఇన్చార్జి డీఆర్‌గా కొనసాగుతున్నారు. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే అక్రమాలకు అడ్డుపడడం లేదని తెలుస్తోంది. సీనియర్ అసిస్టెంట్‌కు కేటాయింపు ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తాత్కాలికంగా సీనియర్ అసిస్టెంట్ పి. వి జయ్కృష్ణకు ఇన్చార్జి ఎస్ఆర్వోగా బాధ్యతలు అప్పగించాం. రెగ్యులర్ డీఆర్ సెలవు నుంచి వచ్చిన తర్వాత రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్ నియామక విషయంలో చర్యలు తీసుకుంటాం. – ప్రసన్న, ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
నో స్టాక్!
యూరియా కోసం ఆగ్రోస్ కేంద్రం ఎదుట గురువారం బారులు తీరిన రైతులు ఇచ్చోడ మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో మూడు రోజుల క్రితం యారియా వచ్చింది. ఈ క్రమంలో రైతులు గురువారం కేంద్రం ఎదుట ఇలా బారులు తీరారు. అయితే ఆ రోజు కొంతమందికి మాత్రమే ఎరువు లభించింది. గంటల తరబడి నిరీక్షించినా చాలా మందికి నిరాశే ఎదురైంది. శుక్ర, శని రెండు రోజులు ఈ కేంద్రానికి రైతులు ఉదయం నుంచే వస్తున్నా నోస్టాక్ కారణంగా దుకాణం మూసి ఉండడంతో చేసేది లేక వెనుదిరుగుతున్నారు.ఇచ్చోడ: ఈసీజన్లో జిల్లావ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం పత్తి, సోయా మొక్కలు ఏపుగా పెరిగే దశకు చేరుకున్న తరుణంలో ఎరువు అవసరం ఉంటుంది. ఈ క్రమంలో రైతులు ప్రాథమిక సహకార సంఘాలు, అగ్రో సేవాకేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్నా రు. అయితే చాలాచోట్ల స్టాక్ లేకపోవడం, కొన్ని చోట్ల ఉన్నా సరిపడా లేకపోవడంతో గంటల తరబ డి క్యూలో నిరీక్షిస్తున్నారు. తమ వంతు వచ్చేవరకు అయిపోవడంతో పలువురికి నిరాశ తప్పడం లేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లావ్యాప్తంగా కేవలం పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు కృషి సేవా కేంద్రాలకు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అలాట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయా కేంద్రాల ఎదుట వేకువజాము నుంచే రైతులు బారులు తీరుతున్నారు. అయితే కొద్ది సేపటికే నోస్టాక్ బోర్డు దర్శనమిస్తుందని,సాగు పనులు సైతం వదులుకుని వచ్చి గంటల తరబడి నిరీక్షించినా ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. మరోవైపు సెప్టెంబర్ వరకు జిల్లాకు 36వేల మెట్రిక్ టన్నుల యూరియా అవస రం ఉండగా.. ఇప్పటి వరకు 30వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రకారం చూస్తే యూరియా కొరత ఉండొద్దు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కొరత లేదు జిల్లాలో యూరియా కొరత లేదు. ప్రతీ నెల అవసరం మేరకు పీఏసీఎస్‌లకు సరఫరా చేస్తున్నాం. అవసరం లేకున్నా కొంత మంది రైతులు అదనంగా కొనుగోలు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో యూరియా సరఫరా వివరాలు.. సెప్టెంబర్ వరకు అవసరం : 36వేల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు సరఫరా అయినది : 30వేల మెట్రిక్ టన్నులు -
పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి
కైలాస్‌నగర్: పేదల సంక్షేమమే లక్ష్యంగా అధి కారులు నిష్పక్షపాతంగా సేవలందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్, మావల, ఆదిలాబాద్ అర్బన్ మండలానికి చెందిన 338 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు పొసీడింగ్ పత్రాలు అందజేశారు. అధికారులు రాజకీయాలతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, ఎంపీడీవోలు స్వప్నశీల, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. భోరజ్‌లో.. సాత్నాల: భోరజ్ మండల కేంద్రంలో 104 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో జైన థ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆల్లూరి అశోక్ రెడ్డి, తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
● నేత్రపర్వంగా ఎద్దుల జాతర ● తాంసిలో అధికారికంగా పొలాల అమావాస్య ● హాజరైన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ముస్తాబైన బసవన్నలు రైతులతో ఊరంతా సందడిగా మారింది. పొలాల అమావాస్య పండుగను జిల్లాలో ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తాంసిలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి రైతులతో పాటు జనం భారీగా తరలివచ్చారు. బసవన్నల ఊరేగింపులో సంప్రదాయం పాటిస్తూ గ్రామస్తులు ఐక్యత చాటారు. కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తదితరులు హాజరయ్యారు. – తాంసి -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: రాజీపడదగిన కేసులు సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని కార్యాలయంలో పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ శాఖల అధికారులు, న్యాయవాదులతో శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజీపడదగ్గ కేసుల పరిష్కారానికి సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోకుండా రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 13న జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. బోథ్‌లో కోర్టు నూతన భవన నిర్మాణ పనులు పరిశీలన.. బోథ్: మండలకేంద్రంలో నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణ పనులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు శనివారం పరిశీలించారు. త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్‌రావు దేశ్‌పాండే, కార్యదర్శి శంకర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతిని భావితరాలకు అందించాలి
ఇంద్రవెల్లి: ఆదివాసీలు తరాలుగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు పాటిస్తూ భావితరాలకు అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని కేస్లాగూడలో శనివారం నిర్వహించిన పొలాల అమవాస్య పండుగకు హాజరయ్యారు. ఆదివాసీలతో కలిసి ఎడ్ల జతలకు పూజలు చేశారు. నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఉట్నూర్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, గ్రామ పటేల్ జ్యోతిరాం, గ్రామస్తులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల తనిఖీ అనంతరం మండలంలోని ముత్నూర్‌లో గల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. వసతి గృహంలో మెనూ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. ఆమె వెంట ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. -
హంగు, ఆర్భాటం లేకుండా..
సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఆమె పర్యటన కొనసాగించారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమె స్థానిక టీటీడీసీ భవనంలో సుమారు 50 మంది పార్టీ బృందం సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేపట్టారు. అనంతరం ఇంద్రవెల్లి మండలం సమాక గ్రామానికి చేరుకొని వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ఎలా చేరువవుతున్నాయనే విషయంలో ఆరా తీశారు. అయితే ఆమె తన పర్యటన సందర్భంగా ప్రభుత్వ భవనంలో సేద తీరారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఆమె అందరితో కలిసి ఉన్నారు. ఇక్కడి నుంచి తాను సొంతగా తెచ్చుకున్న కారులో ఇంద్రవెల్లికి బయల్దేరి వెళ్లారు. మొత్తంగా ఆమె పర్యటన కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ మేరకు ప్రతీ పోలీస్ స్టేషన్లో ఓ సైబర్ వారియర్‌ను నియమించినట్లు తెలిపారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో 19 స్టేషన్లలో సైబర్ విధులు నిర్వహిస్తున్న వారియర్స్‌కు శుక్రవారం ప్రత్యేక టీ షర్ట్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. సిబ్బంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కేసుల దర్యాప్తు కొనసాగించాలన్నారు. బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించినప్పుడే పోలీసు వ్యవస్థపై గౌరవం పెరుగుతుందని సూచించారు. ఇందులో సైబర్ క్రైం డీఎస్పీ హసీబుల్లా తదితరులు పాల్గొన్నారు. -
జీవో 28 రద్దు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: జీవో 28 రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడే నూర్సింగ్, నర్రా నవీన్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలన్నీ నేరవేరుతాయని ఎన్నో కలలు గన్నామన్నారు. అయితే నాడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 20 రోజుల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఓపీఎస్ రద్దు చేస్తూ జీవో 28 జారీ చేసిందన్నారు. ఈ జీవో రద్దు కోసం తలపెట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులంతా హాజ రై విజయవంతం చేయాలని కోరారు. ఇందులో రాష్ట అసోసియేట్ అధ్యక్షులు విఠల్ గౌడ్, కనక అభిమాన్, రాష్ట్ర కార్యదర్శి ఆర్.మోహన్ సింగ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి బాబన్న, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ప్రభుత్వం
తలమడుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని కొత్తూరు, తలమడుగు, డోర్లీ గ్రా మాల్లో పంట నష్టంను శుక్రవారం ఆయన పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే ఆధారంగా బాధిత రైతులందరికీ ప్రభుత్వ పరంగా పరిహారం అందేలా చూస్తామన్నారు. అనంతరం డోర్లీ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అలాగే తలమడుగు ఫ్యాక్స్ కేంద్రం, గోదాంను పరిశీలించి యూరియా స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉండం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంను సందర్శించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజ్‌మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి శ్రీధర్ స్వామి, ఎంపీడీవో శంకర్, ఏవో ప్రమోద్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గణేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సామాజిక కార్యకర్త మౌనిష్‌రెడ్డి తదితరులున్నారు. ఆది కర్మయోగి అభియాన్‌పై కలెక్టర్ సమీక్ష కైలాస్‌నగర్: గిరిజనుల సామాజిక మార్పు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంపై కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం సమీక్షించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం ని ర్వహించిన ఆయన అమలుపై పలు సూచనలు చేశారు. అట్టడుగు స్థాయిలో నాయకత్వాన్ని పెంపొందించడం, సమాజంలో సమగ్ర పాలన వ్యవస్థ రూపొందించడం, గిరిజనుల క్రియాశీల పాత్ర పటిష్టం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నా రు. ఇందులో భాగంగా జిల్లాలోని 16 బ్లాకుల్లో 150 వెనుకబడిన గ్రామాలను గుర్తించి 17 శాఖల ద్వారా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏలో మండల, బ్లాక్ లెవెల్ స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి యాక్షన్ ప్లాన్‌ను అక్టోబర్‌లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందులో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, పెసా కోఆర్డినేటర్ అర్క వసంత్‌రావ్, రవీందర్ రాథోడ్, జాదవ్ గోవింద్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంద్రవెల్లి పోరాట చరిత్ర గర్వకారణం
ఇంద్రవెల్లి: భూమి కోసం భుక్తి కోసం పోరాడిన ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట చరిత్ర ఆదిలాబాద్ జిల్లాకు గర్వకారణమని టీపీసీసీ సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్‌కుమార్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమరవీరుల త్యాగస్ఫూర్తిని యువతకు వివరించాలన్నారు. అలాగే సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యంపై చైతన్యపర్చడం మనందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మెస్రం నాగ్నాథ్, విశాల్, రమేశ్ తదితరులున్నారు. -
అక్రమ లేఅవుట్పై కొరడా
కై లాస్‌నగర్: మున్సిపల్ పరిధిలోని మావల మండలం బట్టిసావర్గాం శివారు సర్వేనంబర్ 13,14,15 లోని అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్పై మున్సిపల్ అధికారులు కొరడా ఝు ళిపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ సర్వేనంబర్లలో 37మంది దళితులకు 38 ఎకరాల భూములను గతంలో పంపిణీ చేశారు. రూ.కోట్ల విలువైన భూములు కావడంతో వాటిపై కన్నేసిన రియల్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. 18 ఎకరాల్లో అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్ల దందా ద్వారా రూ. కోట్ల ఆదాయం గడించారు. దీనిపై కలెక్టర్ రాజర్షిషాకు ఫిర్యాదులు రావడంతో చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, టీపీవో సుమలత, మున్సిపల్ సిబ్బందితో వాటిని పరిశీలించారు. అక్రమమని నిర్ధారిస్తూ అందులో పాతిన హద్దురాళ్లను తొలగించారు. అయితే అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. -
రారండోయ్..
ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తదితరులుపొలాల పండుగకు జిల్లాలో తాంసికి ప్రత్యేకత ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నేడు అధికారికంగా ని ర్వహించేందుకు సన్నద్ధమైంది. పల్లె పర్యాటకానికి చేయూతనివ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పండు గ గుర్తింపు పొందేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. యంత్రాంగంసహకారంతో గ్రామస్తులు సమష్టిగా ముందుకు సాగుతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రితో పా టు ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ప్రముఖుల కు ఇప్పటికే ఆహ్వానపత్రాలు అందజేశారు. జాతర కు జిల్లారైతులంతా తరలిరావాలని కోరుతున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి..... మండల కేంద్రంలో అధికారికంగా నిర్వహించను న్న వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించారు. ఆద్య కళా మ్యూజియం వ్యవస్థాపకులు ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు నేతృత్వం వహిస్తుండగా.. డీఆర్డీవో రవీందర్, జిల్లా ప ర్యాటక శాఖ అధికారి రవికుమార్ రెండు రోజులు గా దగ్గరుండి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రైతు ల కోసం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. అలాగే స్థాని క కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. నేటి కార్యక్రమాలు ఇలా.. ప్రతీ ఇంటి నుంచి అలంకరించిన ఎద్దులను డప్పు చప్పుళ్ల నడుమ మధ్యాహ్నం 3గంటలకు ఆలయం వద్దకు తీసుకువస్తారు. 4గంటలకు అతిథులంతా వేదిక ప్రాంగణానికి చేరుకుంటారు. 4.30 గంటల కు గ్రామపటేల్ ఇంటి నుంచి నైవేద్యం తీసుకువస్తా రు. 5గంటలకు బసవన్నలకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక పూజలు చేసి తొరణం నిర్వహిస్తారు. అనంతరం రైతులు ఎద్దులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలుచేయిస్తారు. రాత్రి వరకు సాంస్కృతిక ప్రదర్శనలు కొససాగుతాయి. ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్–2గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. -
యూరియా.. పాట్లు!
జిల్లాలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట లను కాపాడుకునేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా యూరి యా కోసం ఎరువుల దుకాణాలకు పరుగు పెడుతున్నారు. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన వారు పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపుల ఎదుట శుక్రవారం ఉదయం నుంచే ఇలా గంటల తరబడి బారులు తీరారు. నిర్వాహకులు ఒక్కో రైతుకు మూడు బ్యాగులు మాత్రమే ఆధార్ ఆధారంగా అందిస్తున్నారు. అయితే సరిపడా యూరి యా లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఓ షాపు వద్దకు వచ్చిన ఆదిలాబాద్ అర్బన్ మండల వ్యవసాయ అధికారి నగేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం 3,600 బ్యాగులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే ఎరువు దొరకదేమోనన్న భయంతోనే రైతులు ముందస్తుగా తీసుకునేందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఆ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పంట కాలానుగుణంగా ఎరువులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. – ఆదిలాబాద్టౌన్యూరియా కోసం క్యూలో రైతులు -
● జిల్లాలో ఆ శాఖకు ఎనిమిది కొత్త పోస్టులు ● మంజూరు చేసిన ప్రభుత్వం
కైలాస్‌నగర్: జిల్లా పాలనలో ముఖ్య ప్రణాళిక శాఖ (సీపీవో) కీలకమైంది. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదును ఎప్పటికప్పుడు లెక్కించి కలెక్టర్, ఉన్నతాధికారులకు నివేదికలు అందించడంతో పాటు వ్యవసాయ శాఖ చేపట్టే పంటల గణనలోనూ ఈ శాఖ ప్రధాన పాత్ర నిర్వర్తిస్తోంది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు అందించే నిధులతో చేపట్టే పనుల ప్రణాళికలను ఆమోదించడంతో పాటు వాటి బిల్లుల చెల్లింపులోనూ ఈ శాఖనే ముఖ్యపాత్ర పో షిస్తోంది. ఇంతటి కీలకమైన శాఖలో ప్రస్తుతం అధి కారులు, ఉద్యోగుల కొరత ఉంది. ఈ క్రమంలో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. తద్వారా సకాలంలో పనులు పూర్తి చేయలేని పరిస్థితి. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖను పటిష్టం చేయాలని భావించింది. జిల్లాకు అదనంగా ఎనిమిది పోస్టులు మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు త్వరలోనే విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. తద్వారా శాఖ పటిష్టం కావడంతో పాటు సేవలుసైతం మెరుగుపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉమ్మడి జిల్లాలో కీలకపాత్ర.. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన నివేదికలు రూపొందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే సీడీపీ, ఎంపీ ల్యాడ్స్, ఎస్డీఎఫ్, సీబీఎఫ్ నిధులతో చేపట్టే పనులకు బిల్లుల చెల్లింపులో ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయమే కీలకం. వాటితో పాటు వ్యవసాయ శాఖ చేపట్టే పంటల గణన, వర్షపాతం నమోదు పనులను సైతం ఈ శాఖనే నిర్వహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా ఉన్న సమయంలో ఈ కార్యాలయం ఓ వెలుగు వెలిగింది. కాంట్రాక్టర్లు, రాజకీ య నాయకులు, అధికారుల సందర్శనతో నిత్యం సందడిగా ఉండేది. జిల్లాల పునర్విభజనతో ఆ ప్రభావం కోల్పోయినప్పటికీ శాఖాపరమైన విధులు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి కార్యాలయంగా ఉన్న అధికారులు, ఉద్యోగులను నాలుగు జిల్లాలకు విభజించిన ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. దీంతో అరకొర సిబ్బందితోనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఫలితంగా ఉన్న వారిపైన అదనపు భారం పడుతుంది. జిల్లాకు మంజూరైన పోస్టులు.. కేటగిరి పోస్టుల సంఖ్య జేడీ/డీడీ 01 ఏడీ 01 స్టాటిస్టికల్ ఆఫీసర్ 02 డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ 04ప్రస్తుతం సీపీవో కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒకరు చొప్పున ఉండగా ఇద్దరు మినిస్టీరియల్ ఉద్యోగులు, ముగ్గురు ఔట్సోర్సింగ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వర్షపాతం, సీడీపీ, ఎంపీ ల్యాడ్స్, సీబీఎఫ్, ఎస్డీఎఫ్ వంటి పనులన్నింటినీ డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బంది పర్యవేక్షించాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం ఈ విధులను స్టాటిస్టికల్ ఆఫీసర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. 2016 నుంచి ఈ శాఖలో ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారితోనే కాలం వెల్లదీయాల్సి వస్తోంది. దీంతో వారిపై పనిభారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నారు. అనారోగ్యం, ఏదైనా పని మీద సెలవుపై వెళ్లాల్సి వస్తే కార్యాలయ విధులకు అంటంకం కలిగే పరిస్థితి. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ కార్యాలయానికి 8 కొత్త పోస్టులను మంజూరు చేసింది. వీటిని పదోన్నతులు, కొత్త నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో భర్తీ అయ్యే అవకాశం జిల్లాకు కొత్తగా ఎనిమిది పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ పోస్టులు భర్తీ అయ్యే అవకాశముంది. వారు విధుల్లో చేరితే కార్యాలయ పనితీరు మెరుగుపడటంతో పాటు సకాలంలో సేవలు అందించే అవకాశముంటుంది. – వెంకటరమణ, ముఖ్య ప్రణాళికశాఖ జాయింట్ డైరెక్టర్ -
ఊరూరా ‘పొలాల’ సందడి
పొలాల పండుగను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బసవన్నలను అందంగా అలంకరించి పూజలు చేశారు. పల్లె పర్యాటకానికి కృషి పల్లె పర్యాటకానికి ప్రాధాన్యతలో భాగంగా తాంసిలో ఈసారి అధికారికంగా పొలాల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. శ్రావణ మా సం చివరి రోజున రైతులు ప్రకృతిని ఆరాధించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఎద్దులకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ పండుగకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావడం కోసం కలెక్టర్ సహకారంతో ఈ సారి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం.జిల్లావాసులంతా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. – ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ఆద్య కళా మ్యూజియం వ్యవస్థాపకులు -
క్షేత్రస్థాయిలో సందర్శించాలి
ఇంద్రవెల్లి: అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పైలట్ ప్రజావాణి – ప్రజా ఫిర్యాదుల బ హిరంగ విచారణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడా రు.అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ పదే ళ్ల కాలంలో పేదలు రేషన్ కార్డుల కో సం నిరీక్షించారని, అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న వెంటనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. ఆధార్ కార్డుల్లో చిన్న చిన్న తప్పు ల కారణంగా కొంత మంది సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్నారు. అధి కారులు క్షేత్రస్థాయిలో సందర్శించి అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూ డాలన్నారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధి కారులతో బహిరంగ విచారణ జరిపి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్ తదితరులున్నారు. -
చెల్లి లవ్ మ్యారేజ్.. అసూయతో ఆ అక్క..
ఆదిలాబాద్‌టౌన్: చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని ఓర్వలేక ఓ అక్క ఆమెను కిడ్నాప్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. గురువారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. చెల్లె భగత్ మనీషా ప్రేమ వివాహం చేసుకోగా, తనకు పెళ్లి కాలేదని తలమడుగుకు చెందిన విజయ ఆమైపె కక్ష పెంచుకుంది. ఆమె భర్త నుంచి విడదీసేందుకు పన్నాగం పన్నింది. ఆమెను మహారాష్ట్రలోని కిన్వట్లో బంధించింది. బాధితురాలి భర్త అలుగంటి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌నకు సహకరించిన తలమడుగుకు చెందిన భగత్ విజయ, భగత్ సునంద, భగత్ ప్రగతి, తాంసికి చెందిన షబ్బీర్, ఓ మైనర్ బాలుడితో పాటు కిన్వట్‌కు చెందిన ప్రతీన్పై కేసు నమోదు చేశారు. కిడ్నాప్‌కు గురైన బాధితురాలి ఆచూకీ తెలుసుకుని ఆమెను కిన్వట్ నుంచి తీసుకువచ్చారు. కాగా, మనీషా ఇటీవల భగత్ శ్రీనివాస్‌తో ప్రేమ వివాహం చేసుకుని ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌నగర్‌లో నివాసముంటోంది. ఈ పెళ్లి ఇష్టం లేకనే ఆమె అక్క కిడ్నాప్‌నకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ మహిళలపై గౌరవంగా వ్యవహరిస్తుందని తెలిపారు. టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ ఉన్నారు. -
పంట నష్టపోయిన రైతులకు పరిహారం
బేల: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం మంజూరు చేస్తామని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. గురువారం పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలైన మండలంలోని గూడ, మణియార్‌పూర్ రెవెన్యూ గ్రామాల శివారుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి, సోయా, కంది తదితర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దెబ్బతిన్న పంటలను త్వరలోనే వ్యవసాయాధికారులు పరిశీలిస్తారని, స ర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని చెప్పా రు. రైతులు అధైర్య పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల తెలిపారని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు గిమ్మ సంతోష్‌రావు, సామ రూపేశ్‌రెడ్డి, నాక్లే రాందాస్, గావుండే ఘణేశ్యాం, ఠాక్రే సాగర్, విపిన్, అవినాష్, సూర్యభాన్, కరీం తదితరులున్నారు. -
యూనివర్సిటీని సాధించాలి
ఆదిలాబాద్‌టౌన్: యూనివర్సిటీ ఏర్పాటుకు ఉ ద్యమించాలని యూనివర్సిటీ సాధన సమితి సభ్యుడు డాక్టర్ ఉదారి నారాయణ సూచించా రు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్ర మం నిర్వహించగా ఆయన మాట్లాడారు. జి ల్లాలో యూనివర్సిటీ లేక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. యూ నివర్సిటీ ఏర్పడితే కలిగే ప్రయోజనాలు వివరించారు. సమితి సభ్యురాలు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి, భాస్కర్, ప్రిన్సి పల్ అతీఖ్ బేగం, కోటయ్య, చంద్రకాంత్, అనిత, రేఖ, విద్యార్థులు పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
కైలాస్‌నగర్: జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినా యక చవితి ఉత్సవ శాంతియుత సమన్వయ కమి టీ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ని ర్వహించారు. కమిటీ సభ్యుల నుంచి తొలుత అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ.. ప్రజలు శాంతియుతంగా, సామరస్యంతో ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. శో భాయాత్ర పొడవునా ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ వేడుక వెంటవెంటనే వస్తున్నాయని భద్రతాపరంగా ఎ లాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌శాఖ 8712481799, వైద్యారోగ్యశాఖ 9491103108 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేపు అధికారికంగా ‘పొలాల’ వేడుకలు ఏడాది పాటు రైతన్నలకు పంట సాగులో అండగా నిలిచే బసవన్నలను పూజించే పొలాల అమావాస్య వేడుకలను ఈ నెల 23న అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజార్షి షా ఓ ప్రకటనలో తెలిపా రు. తాంసి మండల కేంద్రంలో నిర్వహించనున్న వే డుకల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తాచాటాలి
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటా లని డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీ డల అధికారి పార్థసారథి క్రీడాకారులకు సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎస్జీఎఫ్ఐ జిల్లాస్థాయి సుబ్రతో ముఖర్జీ ఫుట్‌బాల్ ఎంపిక పోటీలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఐకమత్యంతో ఆడి రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజేతలుగా నిలువాలని ఆకాంక్షించా రు. ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆడే రామేశ్వర్ మాట్లాడుతూ.. అండర్–15 ఫైనల్లో జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్ జట్టు 3–2 గోల్స్ తేడాతో తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన జట్టుపై విజయం సాధించినట్లు వివరించారు. అండర్–17 ఫైనల్లో ఇచ్చోడ జెడ్పీఎస్ ఎస్ జట్టుపై 1–2 గోల్స్ తేడాతో ఇచ్చోడ గిరిజన బాలుర గురుకుల పాఠశాల జట్టు విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ జట్లు ఈనెల 25, 26 తేదీ ల్లో సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సుబ్రతో ముఖర్జీ ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. పోటీల కన్వీనర్ కోటోజీ చంద్రశేఖర్, డాక్టర్ ఎండీ ఖాసీం, బ్యాడ్మింటన్ కోచ్ కభీర్ దాస్, పీడీలు వినోద్‌రెడ్డి, పోచన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘కొత్త’ పోస్టులు
కైలాస్‌నగర్: జిల్లా పాలనలో రెవెన్యూదీ కీలకపా త్ర. భూ సంబంధిత సమస్యలతోపాటు కుల, ఆదా య ధ్రువీకరణ పత్రాల జారీ, సంక్షేమ పథకాల అ మలుకు సంబంధించిన క్షేత్రస్థాయి విచారణ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన గురుతర బాధ్యత ఈ శాఖదే. ఇంతటి కీలకమైన రెవెన్యూ సేవలను ప్ర జలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో మూడు మండలాలను ఇటీవల ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి బోథ్ మండలంలోని సొనాలను, జైనథ్ మండలంలోని భోరజ్ ను, ఆదిలాబాద్‌రూరల్, బేల, జైనథ్ మండలాలో ్ల ని పలు గ్రామాలను కలిసి సాత్నాలను ప్రత్యేక మండలాలుగా ఏర్పాటు చేసింది. ఈ మండలాలన్నీ ఈ ఏడాది ఫిబ్రవరి 5నుంచి అమలులోకి రాగా తహసీల్దార్ కార్యాలయాల్లో సేవలు ప్రారంభమయ్యా యి. ప్రత్యేకంగా మండలాలు ఏర్పడినప్పటికీ వాటి కి ఇప్పటివరకు కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో పూర్వ మండలాల్లోని అధికారులు, సి బ్బందిని సర్దుబాటు చేసి ఆర్నెళ్లుగా పాలన సాగిస్తున్నారు. ఈక్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను దూరం చేయడంతోపాటు ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటికి ప్రత్యేక పోస్టులు మంజూరు చేసింది. మూడు మండలాలకు 38.. మూడు కొత్త మండలాల పరిధిలో 38 పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జా రీ చేసింది. వాటిని భర్తీ చేస్తే ప్రజలకు రెవెన్యూ సే వలు మరింత సులభతరం కానున్నాయి. కొత్తగా ముగ్గురు తహసీల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసీ ల్దార్లతో పాటు అదనంగా 32 వివిధ కేటగిరీల పో స్టులు మంజూరయ్యాయి. వీటిని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారా.. లేక పరీక్షలు నిర్వహించి కొత్తవారిని నియమిస్తారా.. లేదా ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న వారితో తాత్కాలికంగా సర్దుబాటు చేస్తారా? అనేది ప్రస్తుతం ఆ శాఖతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త మండలాలకు పూర్తిస్థాయిలో అధికారులు అందుబాటులోకి రానుండటంపై ఆయా మండలవాసుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని చాందా (టీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 11వ జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలను పాఠశాల హెచ్ఎం పండరీనాథ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. మహేందర్ జోషి, అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ రాజేశ్, యూటీఎఫ్ సెక్రెటరీ లచ్చారాం, వెయిట్ లిటిల్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రెటరీ వీజీఎస్ జ్యోతిష్యరన్, భాస్కర్, అఖిలేశ్, ప్రమోద్, సాయికిరణ్, సత్యనారాయణ, రాకేశ్, సౌమ్య, మా జిద్, హరీశ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
గాడి తప్పుతున్న విద్యాశాఖ
ఆదిలాబాద్‌టౌన్: విద్యాశాఖ గాడి తప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల ప ట్టింపులేమి వెరసీ ఆ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏడేళ్లుగా రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం ఇటీవల ఐఏ ఎస్ అధికారికి ఇన్చార్జి డీఈవో బాధ్యతలు అప్పగించింది. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహిస్తున్న ఖుష్బూగుప్తాకు ఇప్పటికే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి అదనపు బాధ్యతలు సైతం ఉన్నాయి. నాలుగు కీలక బాధ్యతలు ఉండడంతో విద్యాశాఖపై ఫోకస్ పెట్ట డం లేదని తెలుస్తోంది. ఈనెల 5న బాధ్యతలు స్వీకరించగా, ఇప్పటివరకు కనీసం కార్యాలయాన్ని సైతం సందర్శించకపోవడం గమనార్హం. ఏడేళ్లుగా ఇన్‌చార్జీలే.. 2018 నుంచి జిల్లాకు ఇన్చార్జి డీఈవోలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేద నే విమర్శలున్నాయి. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, కొందరు గురువులు వి ద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడం, తోటి ఉపాధ్యాయులతో గొడవలు పడటం, ఇష్టానుసారంగా విధులకు హాజరుకావడం, పాఠశాల నిధులు కాజేయడం, కార్యాలయ ఉద్యోగులు పలువురు అక్రమాలకు పాల్పడటం వంటివి చోటు చేసుకుంటున్నాయి. పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. 2018లో రెగ్యులర్ డీఈవోగా జనార్దన్ ఉండగా, ఆయనను సరెండ్ చేశారు. ఆ తర్వాత డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవిందర్ రెడ్డి, నిర్మల్ ఏడీగా పనిచేసిన ప్రణీత ఇన్చార్జి డీఈవోలుగా వ్యవహరించారు. వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇన్చార్జి డీఈవోగా పనిచేశారు. ఈనెల 1న ఆయనను విధులను తప్పించి ఐటీడీఏ పీవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉట్నూర్‌లోనే బా ధ్యతలు స్వీకరించిన సదరు అధికారి ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయాన్ని సందర్శించకపోవడం గమనార్హం. ఉట్నూర్కే ఫైల్స్.. జిల్లా విద్యాశాఖకు సంబంధించిన ఫైల్స్‌ను ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు ఉట్నూర్‌కు తీసుకెళ్తున్నా రు. ఐటీడీఏ పీవోగా ఉన్న ఇన్చార్జి డీఈవో అక్కడే ఉండడంతో వారి వద్దకే ఫైళ్లను తీసుకెళ్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే విద్యాశాఖ నుంచి విడుదలయ్యే ప్రకటనలు, ఇతర ఉత్తర్వులు, ఫైళ్లపై సంతకాల కోసం తరచూ వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. -
ర్యాగింగ్ చట్టరీత్యా నేరం
ఆదిలాబాద్‌టౌన్: ర్యాగింగ్‌కు పాల్పడటం చట్టరీత్యా నేరమని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. రిమ్స్‌లో యాంటీ ర్యాగింగ్‌పై మెడికోలకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడితే ఎంబీబీఎస్ సీటు కోల్పోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదవుతాయని, అలాగే జైలు, జరిమానాలు త ప్పవన్నారు. సీనియర్లు జూనియర్ల పట్ల స్నేహభావంతో మెలగాలని సూచించారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే హెల్ప్‌లైన్ నంబర్ 1800 180 5522 కు సమాచారం అందించాలన్నారు. అలాగే రిమ్స్ డైరెక్టర్‌తో పాటు మెంట ర్కు సైతం సమాచారం అందించవచ్చని పే ర్కొన్నారు. అంతకుముందు ఎన్ఆర్సీతో పా టు రిమ్స్‌లోని పలు వార్డులను పరిశీలించారు. ఆమె వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు విద్యావిల్సన్, సరో జ, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, కరుణాకర్, రఘునాథ్‌రావు, మెడికోలు పాల్గొన్నారు. -
రైతులందరికీ పంట బీమా కల్పించాలి
ఆదిలాబాద్: రైతులందరికీ పంట బీమా కల్పించా లని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంటలకు బీమా ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసా యం చేసే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తే ఎటూ సరిపోదన్నారు. నష్టపోయిన రైతులందరికీ విత్తనాలు సబ్సిడీపై అందించాలన్నారు. అలాగే కోతకు గురైన భూములను చదును చేసుకునేందు కు ఎన్ఆర్ఈజీఎస్ను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు బ్రహ్మానంద్, జోగు రవి, మటోలియా, సంతోష్, రాకేష్, దయాకర్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
సమష్టి కృషితోనే తాగునీటి సమస్య పరిష్కారం
నార్నూర్: మండలంలోని సుంగాపూర్ గ్రామంలో అందరి సహకారంతోనే తాగునీటి సమస్య పరిష్కారమైందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పంచాయతీ పరిధిలోని గొండుగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన బావితో పాటు పైపులైన్, వాటర్ ట్యాంకులను ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాతో కలిసి బుధవారం ప్రారంభించారు. నీటి సమస్య శాశ్వత పరి ష్కారం కోసం ఐటీడీఏ ద్వారా కొంత నిధులు, కలెక్టర్‌గా తాను కొంత నిధులు సమకూర్చి పనులు చేపట్టినట్లు తెలిపారు. అటవీశాఖ అనుమతితో పని సులభమైందన్నారు. అనంతరం గ్రామస్తులతో కలి సి భోజనం చేశారు. చిత్తగూడ సమీపంలో భారీ వర్షానికి దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నార్నూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కలెక్టర్ వెంట డీఎఫ్‌వో బాజిరావ్ పాటిల్, ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, రాయి సెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గు పటే ల్, డీఈఈ శ్రీనివాస్, ఐటీడీఏ డీఈఈ శివప్రసాద్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, ఎంఈవో అనిత, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు దాదిరావు, తదితరులు పాల్గొన్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఇంద్రవెల్లి: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. బుధవారంమండలకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణా లను తనిఖీ చేశారు. ఎరువుల గోదాంలను పరిశీ లించారు. రైతులతో మాట్లాడి ఎరువులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ అధికారి రాథోడ్ గణేశ్ తదితరులున్నారు.వరద నష్టంపై తక్షణ సర్వేకైలాస్నగర్: వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు తక్షణ సర్వే నిర్వహించి నష్టం అంచనాలతో కూడిన నివేదికలు పక్కాగా సమర్పించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపట్టి త్వరితగతిన రాకపోకలు పునరుద్ధరించాలన్నారు. సర్వే సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోపాటు శాశ్వత పరి ష్కారానికి మండల,జీపీల వారిగానివేదికలు అందించాలని తెలిపారు. ఈ సర్వేపై సూపర్ చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా, అదన పు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి మేలు తలపెట్టి..!
మంచిర్యాలఅర్బన్: సంప్రదాయంగా వస్తున్న పండుగలను ప్రస్తుతం జరుపుకునే విధానంలో చేస్తున్న పొరపాట్లు పర్యావరణానికి ఎన్నో అనర్థాలు తెచ్చి పెడుతున్నాయి. వినాయక చవితి రోజు చేస్తున్న పొరపాట్లు చీకట్లు మిగుల్చుతున్నాయి. కానీ.. వినాయక చవితి అనగానే ఆకర్షణ, హంగు, ఆడంబరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొన్నేళ్లుగా రంగుల వినాయకులకు తీసిపోకుండా వివిధ రూపాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా మట్టి గణపయ్యలను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కులవృత్తులు కాపాడుతూ.. ఉపాధినిస్తూకనుమరుగవుతున్న కులవృత్తిని కాపాడాలనే సదుద్దేశంతో మట్టి వినాయకుల తయారీతో పాటు ఎంతోమందికి ఉపాధినిస్తున్నారు. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన నాగపూరి రాజేంద్రప్రసాద్ మంచిర్యాలలోని సున్నబట్టివాడలో నివాసం ఉంటున్నారు. ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన ఆయన కులవృత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ఆలోచన చేశారు. 2015లో ఏడు మట్టి విగ్రహలు తయారీ చేసి విక్రయించారు. 2018లో 52 మట్టి ప్రతిమలను రూపొందించి పర్యావరణ హితానికి నడుం బిగించారు. ప్రస్తుతం శ్రీగణేష్ క్లే వర్క్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 80 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. మున్ముందు దీపావళికి ఉపయోగించే ప్రతిమలు, ఇంట్లో వినియోగించే మట్టిపాత్రలు, కుండలు ఇలా అన్ని రకాలు తయారీ చేయాలని నిర్ణయించారు. మట్టివిగ్రహాలతో ఆదాయం భళా..పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల తయారీ సరఫరా టెండర్ దక్కించుకున్నారు. 40వేల వినాయకులు సరఫరా చేయనున్నారు. మరోవైపు రెండో అన్నవరంగా పేరొందిన గూడేం సత్యనారాయణ టెంపుల్లో ఏర్పాటు చేసే మట్టి వినాయకుడు ఇక్కడే తయారు చేశారు. ఆదిలాబాద్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2వేల మట్టి వినాయకుడు ఆర్డర్ ఇచ్చింది. ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో మట్టి వినాయకులు తయారు చేశారు. వినాయకుల తయారీలో కర్ర, మట్టి, గడ్డితో తడి సున్నం, వాటర్ కలర్లు విని యోగించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ప్ర భుత్వం పర్యావరణంతోపాటు కులవృత్తులను ప్రో త్సహించటానికి ప్రభుత్వ స్థలం లీజుకు ఇస్తే మరింత మందికి ఉపాధినిస్తానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. తాతల కాలం నుంచి..తాతల నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని మట్టి వినాయకులు తయారీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు మంచిర్యాలకు చెందిన తాళ్లపల్లి తిరుపతి. ఇంటర్ పూర్తి చేసి కులవృత్తి మట్టికుండల తయారీలో తర్ఫీదు పొందాడు. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికుల సహకారంతో ఏటా 2వేల విగ్రహాలకు పైన మట్టి విగ్రహాలు తయారు చేసి ఆర్డర్‌పై ఇస్తుంటాడు. మూ డు కుటుంబాలు మట్టి వినాయకుల తయారీలో పాలు పంచుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. చిన్న విగ్రహాలను చూడముచ్చటగా తీర్చిదిద్ది మార్కెట్లో విక్రయిస్తుంటా రు. మట్టికి సులువుగా కరిగే గుణం ఉంటుంద ని, విగ్రహాల తయారీలో చెరువు మట్టి వినయోగంతో పూడిక సమస్య తొలగిపోతందుని అందుకే మట్టికి ప్రాధాన్యం ఇస్తున్నామని తిరుపతి తెలిపారు. వినాయక చవితి పర్యావరణానికి పూర్తిగా మేలు చేసే పండుగని, మట్టితో పూజించాలని సూచించారు. -
పార్వతి తనయా
పర్యావరణహితాయ.. ఆదిలాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలకు గణనాథుని ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. జిల్లా కేంద్రం వ్యాప్తంగా మట్టి ప్రతిమలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎంతోమంది కళాకారులకు ఉపాధి అందిస్తున్నాయి. వైవిధ్యమైన రూపాల్లో పార్వతి తనయున్ని పర్యావరణహితంగా ప్రతిష్టించేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మట్టి వినాయక ప్రతిమలను నిలబెట్టేందుకు యువత, ఉత్సవ సమితి సభ్యులు ప్రాధాన్యతనిస్తుండడం విశేషం. పీఓపీ విగ్రహాలు తక్కువ సమయంలో పూర్తవుతాయి. మట్టి ప్రతిమల తయారీకి 10 నుంచి 20 రోజులు పడుతుంది. అయినప్పటికీ నిర్వాహకులు వైవిధ్యమైన రూపాల్లో మట్టి వినాయకున్ని కొలువుదీర్చేందుకు ఆర్డర్లు ఇస్తుండడం గమనార్హం. దీంతో కళాకారులకు చేతినిండా పని దొరుకుతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణ సైతం సాధ్యమవుతుండడంతో పర్యావరణ ప్రేమికుల నుంచి సైతం హర్షం వ్యక్తం అవుతుంది. -
విగ్రహాల తయారీలో నిమగ్నం
కాగజ్‌నగర్‌టౌన్: వినాయక చవితి సమీపిస్తుండడంతో కాగజ్‌నగర్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో మట్టి విగ్రహాల తయారీ ఊపందుకుంది. పట్టణంలోని పెట్రోల్‌పంప్ ఏరియా, మార్కెట్, మండలంలోని నజ్రుల్‌నగర్, రాంనగర్, విలేజ్‌నెం 5, చింతగూడ గ్రామాల్లో మట్టి వినాయకుల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. చిన్ననాటి నుంచే ఆసక్తి చిన్ననాటి నుంచే విగ్రహాల తయారీపై ఆసక్తితో చిన్నచిన్న గణపతులను తయారు చేసి ఇంట్లో పూజించేవాళ్ళం. 23 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నా. భక్తులను ఆకర్షించేలా వివిధ డిజైన్లలో, హనుమంతుడిపై వినాయకుడు, రామసేతు వినాయకుడులాంటి రూపాల్లో బంకమట్టి, సహజ సిద్ధమైన రంగులతో 5 నుంచి 20 ఫీట్ల వరకు విగ్రహాలు తయారు చేస్తున్నా. ఈ ఏడాది ఇందిరా మార్కెట్ భారీ వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నా. – గౌత్రే విక్రమ్, కళాకారుడు, కాగజ్‌నగర్ పర్యావరణ పరిరక్షణకు.. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను తయారు చేస్తున్నా. వినాయకుడి విగ్రహాలతో పాటు దుర్గాదేవి విగ్రహాలను కూడా తయారు చేస్తా. పదోతరగతి తర్వాత మట్టి విగ్రహాలను ఇంట్లో తయారు చేసేవాడిని. ఇప్పుడు 12 ఫీట్ల వరకు వినాయ విగ్రహాలను తయారు చేస్తున్నా. పట్టణంలోని త్రినేత్ర శివాలయంలో వినాయక విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్టిస్తాం – ములుకుట్ల జశ్వంత్, ఆదర్శనగర్, కళాకారుడు -
వరదపై ఫోకస్
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో సాధారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు మురికి వాడల్లో వరద ప్రభావం కనిపించేది. అయితే అక్కడ సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడమే కారణం. ఇప్పుడు మా త్రం పలు కొత్త కాలనీల్లోనూ ఇళ్లు నీట మునగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రధానంగా రెండు దశాబ్దాలుగా కొత్త లేఅవుట్లలో విస్తృతంగా భవనాల నిర్మాణాలు అవుతున్నాయి. అటువంటి చోటే వరదలు చుట్టుముట్టడం విస్తుగొలుపుతోంది. అలాంటిదే సుభాష్‌నగర్. దీంతోపాటు మణిపూర్ కా లనీ, ఖోజా కాలనీ, గ్రీన్‌సిటీ, జీఎస్ ఎస్టేట్.. ఇలా పలు భవంతులు ఉన్న కాలనీల్లో మొదటి అంతస్తు పూర్తిగా మునిగేలా వరదలు రావడం గమనార్హం.కబ్జాల నేపథ్యంలోనే..జిల్లా కేంద్రంలోని పలు చెరువులు, వాగుల సమీ పంలో బఫర్ జోన్లో నిర్మాణాల నిషేధం ఉన్నప్పటికీ ఇష్టారీతిన స్థలాలను కబ్జా చేశారు. భవనాలను నిర్మించారు. డూప్లెక్స్‌ల నిర్మాణాలు కూడా ఉన్నా యి. భారీ వర్షం కురిసినప్పుడు ఈ బఫర్ జోన్లో వరదలు ముంచెత్తుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షానికి గ్రీన్ సిటీని వరదలు ముంచెత్తాయి. తాజాగా కురిసిన వర్షాలతో దీంతోపాటు ఇతర కొత్త కాలనీల్లోనూ ఇదే తరహా వరదలు చుట్టుముట్టడం వెనుక కబ్జాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా డ్రెయినేజీ వ్యవస్థను ఇష్టారీతిన కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో వర ద నీరు పారేందుకు కూడా సరైన వ్యవస్థ లేక ఇళ్లలోకి చేరుతోంది. ఈ వరదలను అంచనా వేసి కబ్జాలను తొలగిస్తేనే రానున్న రోజుల్లో ఇలాంటి ముప్పు తలెత్తదన్న అభిప్రాయం పట్టణవాసుల్లో వ్యక్తమవుతుంది.నేటి నుంచి సర్వే..పట్టణంలోని కాలనీల్లో ఈ వరదలెందుకు వచ్చా యి.. కారణం ఏమిటి.. డ్రెయినేజీలు లేవా.. ఉంటే ఎందుకు పొంగాయి.. లేనిపక్షంలో డ్రెయినేజీలు క బ్జాకు గురయ్యాయా.. పూడిక తియ్యలేదా.. వీటిని కబ్జా చేసి నిర్మాణాలు కట్టారా.. దీనిపై ప్రభుత్వం సర్వేకు ఆదేశించింది. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా బృందాలుగా ఏర్పాటు చేసి గురువారం నుంచి సర్వే చేయనున్నారు. ఆ నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నారు. దీంతో ఇప్పుడు ఆయా కాలనీల్లో వరదలకు కారణమేమి టనే చర్చ మొదలైంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తా యా.. హైడ్రా వంటి సంస్థలను రంగంలోకి దించుతారా.. లేనిపక్షంలో కబ్జాల విషయంలో ఎలాంటి చర్యలకు దిగుతారోననే దానిపై చర్చగా సాగుతోంది.నీట మునిగిన కాలనీలు..జిల్లా కేంద్రంలో ఖానాపూర్, అంబేద్కర్‌నగర్, సుభాష్‌నగర్, కోలిపుర, తాటిగూడ, చిల్కూరి లక్ష్మినగర్, జీఎస్ ఎస్టేట్, అనుకుంట పార్ట్, ఖోజా కాలనీ, కుమ్మరికుంట, గాంధీనగర్, మహాలక్ష్మివాడ ఇటీవల నీట మునిగాయి. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నేరడిగొండ: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసున్న ఘ టన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న (37) మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఏడాది క్రితం తిరిగి వచ్చాక తనకున్న అర ఎకరంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని పత్తి సాగు చేపట్టాడు. అయితే గతేడాది సరైన దిగుబడి రాలేదు. ఈ సారి మళ్లీ పత్తి సాగు చేయగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట పూర్తిగా నీట మునిగింది. గతంలో దుబాయ్ వెళ్లేందుకు, వచ్చాక సాగు కోసం చేసిన అప్పు (ప్రైవేట్‌లో) మొత్తం రూ.5లక్షల వరకు చేరింది. ఈ క్రమంలో అది ఎలా తీర్చాలో తెలియ క మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుమలత ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. -
ఎకై ్సజ్ దాడులు
పెంబి: మండలంలోని ఇటిక్యాల్, ఇటిక్యాల్ తాండ, పెంబి తాండ, తాటిగూడ గ్రామాల్లో బుధవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గంగారెడ్డి, ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ అభిషేకర్ తెలిపారు. వారి వద్ద నుండి 20 లీటర్ల నాటుసారా, 200 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సిబ్బంది వెంకటేష్, సాయి, రాజేందర్, రవీందర్, నిరోషా, రవి, అశ్వక్, జమీర్, విజయ, తదితరులు పాల్గొన్నారు. -
ఫొటోలతో జ్ఞాపకాలు పదిలం
ఆదిలాబాద్: ఫొటోలతో జ్ఞాపకాలు పదిలంగా నిలి చిపోతాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా ఫోటో, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా ఫొటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్, విజ య్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, హరికృష్ణ, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, అనిల్, మురళీధర్, సంతోష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: దివ్యాంగులు ఉపకరణాల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ క ల్యాణ మండపంలో ఆలింకో, విద్యాశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు మంగళవారం నిర్ధారణ శిబిరం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఆలింకో సంస్థ 18ఏళ్లలోపు దివ్యాంగుల కు అవసరమైన పరికరాలు ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సంస్థ ప్ర తినిధులు దివ్యాంగుల నుంచి కొలతలు తీసుకున్నారు. అవసరమైన పరికరాలు త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. ఇందులో ఆదిలా బాద్అర్బన్ ఎంఈవో సోమయ్య, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు రఘురమణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
● ‘మహాలక్ష్మి, గృహజ్యోతి’ నమోదుకు అర్హుల ఆసక్తి ● సందడిగా ప్రజాపాలన ప్రత్యేక కేంద్రం
‘సంక్షేమ’ లబ్ధికి ఆరాటంకై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటికోసం గతంలో ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసి ఉండి ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారంతా ఆరాటపడుతున్నారు. ఇలాంటి వారి వివరాల సేకరణ కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇటీవల వరుస సెలవులు రావడంతో దరఖాస్తుదారులు మంగళవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేషన్ కార్డులు పొందిన వారంతా సంక్షేమ పథకాల అమలు కోసం క్యూ కట్టారు. వారికి ఇబ్బందులు కలగకుండా బల్దియా అధికారులు అదనపు సిబ్బందిని నియమించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు సూచించారు. -
పారదర్శక నివేదిక అందించాలి
కై లాస్‌నగర్: వరదలతో నష్టపోయిన బాధితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా సమగ్ర సమాచా రంతో కూడిన పారదర్శక నివేదిక అందించాలని జి ల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించా రు. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టం, సహా యక చర్యలపై జిల్లా కేంద్రంలోని పెన్‌గంగ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వా రీగా జరిగిన నష్టంపై అధికారులను అడిగి వివరా లు తెలుసుకున్నారు. పంటనష్టం, మూగజీవాలు, ధ్వంసమైన ఇళ్ల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. నష్టాలను క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలించాలని, ఇందుకు అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలన్నా రు. ఏమైనా పొరపాట్లు జరిగితే సంబంధిత అధి కారులను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. న ష్టంపై శాఖల వారీగా సమీక్షించి పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి, నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లుపడ్డ చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్‌పై అసంతృప్తి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు ప్రారంభించకపోవడంపై అధికారులు చెప్పి న సమాధానాలపై ఆయన విబేధించారు. మంజూరై ఇళ్ల నిర్మాణం చేపట్టని వారితో ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థిక స్థోమత లేకనే చేపట్టకపోతే బ్యాంకులు, ఎస్‌హెచ్‌జీల ద్వారా రుణాలు ఇప్పించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షిషా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్, బోథ్, ఖానా పూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న మంత్రికి కలెక్టర్, ఎస్పీలు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలి కారు. పోలీసుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం ఈ ఏడాది మే 27న జైనథ్ మండలం లక్ష్మింపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు తర్నం వాగు దాటుతూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.5లక్షల చెక్కును మృతుడి భార్య జ్యోతికి మంత్రి అందజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో వరద ప్రభావానికి కూలిపోయిన ఇళ్లు, భారీగా ప్రవహించిన నాలాను మంత్రి పరిశీలించారు. 11 మంది బాధితులకు రూ.4వేల నగదు, 10 కిలోల సన్నబియ్యం చొప్పున మంత్రి అందజేశారు. -
దగ్గు.. జ్వరం.. నొప్పులు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో రోగాలు ముసురుకుంటున్నాయి.ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సీజ నల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దగ్గు, జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ ఇంటికి వెళ్లి నా ఒకరిద్దరు జ్వర పీడితులే కనిపిస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా బాధపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌తోపాటు ప్రైవేట్, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రిమ్స్‌లో మంగళవారం ఓపీ విభాగంలో 2400 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పిడి యా ట్రిక్ వార్డులో సరిపడా బెడ్లు లేక ఒక్కో పడకపై ఇద్దరేసి చొప్పున ఉంచి చికిత్స అందించారు. కిక్కిరిసిపోయిన పిడియాట్రిక్ వార్డు.. రిమ్స్‌లోని పిడియాట్రిక్ వార్డు చిన్నారులతో కిక్కిరిసిపోయింది. ఇటీవల బెడ్లన్నీ ఖాళీగా ఉండగా, వారం నుంచి నిండిపోయి కనిపిస్తున్నాయి. ఈ వా ర్డులో 70 బెడ్లు ఉండగా, 90 మంది వరకు చికిత్స పొందుతున్నారు. డెంగీ లక్షణాలు, టైఫాయిడ్, వైర ల్ జ్వరాలతో బాధపడుతున్నారు. సరిపడా బెడ్లు లేకపోవడంతో వైద్యులు ఒక్కో పడకపై ఇద్దరేసి చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. జ్వరాలతో విలవిల.. జిల్లాలో సీజనల్వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీ వల కురిసిన వర్షాలతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో దోమలు, ఈగలు, కలు షిత నీటి కారణంగా జనం రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా టైఫాయిడ్, వైరల్ జ్వ రాలున్నాయి. జిల్లాలో ఈ నెలలో 19 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 50నమోదయ్యాయి. రిమ్స్‌తోపాటు ప్రైవేట్ ఆస్పత్రులూ రోగులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా కొంత మంది అందినకాడికి దండుకుంటున్నారు. అవసరం లేకు న్నా వైద్యులు టెస్టుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పారిశుధ్య నిర్వహణ లోపంతోనే... ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా ప్రాంతాల్లో పరి సరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.గుంతలు, మురుగుకాలువలతో పాటు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటుంది. దీంతో అందులో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. ఫలితంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఓపీ పెరిగింది.. రిమ్స్‌లో ఓపీ పెరిగింది. మంగళవారం 2400 మంది జ్వరాలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యసేవలు పొందారు. పిల్లల వార్డులో 90 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు. ఈ వార్డులో అదనంగా మరో 20 బెడ్లు ఏర్పాటు చేశాం. అలాగే 200 మంది చిన్నారులు ఓపీ ద్వారా చికిత్స పొందారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ శుభ్రత పాటించాలి.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రతిఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలి. నిల్వ నీటిలో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతాయి. వాటి నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. జ్వరాల బారిన పడిన వారు సమీపంలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో -
కొత్త రేషన్ కార్డు దారులకు సీఎం రేవంత్ శుభవార్త ..!
ఆదిలాబాద్: కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే నెలలో వారికి సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. కార్డుదారుల సంఖ్యకనుగుణంగా అవసరమైన కోటా కేటాయించింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే పంపిణీలో వీరంతా లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది.సెప్టెంబర్ కోటా పంపిణీకి ఏర్పాట్లు..రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను గత జూన్‌లో ఒకేసారి పంపిణీ చేసింది. ప్రస్తుతం ఆ గడువు ముగియడంతో సెప్టెంబర్ కోటా పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ షాపులకు సంబంధించిన డైనమిక్ కీ రిజిస్ట్రార్ (డీకేఆర్) స్పష్టం కావడంతో జిల్లాకు అవసరమైన బియ్యం కోటా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా కోటా సరఫరాకు గాను నిజామాబాద్ జిల్లాను కేటాయించింది. జిల్లాలోని ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం చేరనున్నాయి. మంగళవారం నుంచి సరఫరా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి వాటి పరిధిలోని చౌక ధరల దుకాణాలకు చేరవేయనున్నారు.పెరిగిన కార్డులు.. బియ్యం కోటాపదేళ్ల నిరీక్షణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ చేపట్టింది. అలాగే కొత్త స భ్యులను చేర్చేందుకు సైతం అవకాశం కల్పించింది. జిల్లాలో కొత్తగా 21,670 కార్డులు మంజూరయ్యా యి. వాటి పరిధిలో కార్డుదారులతో పాటు సభ్యులకు సంబంధించి 45,289 మంది చేరారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,92,757 రేషన్‌కార్డులు ఉండగా వీటి పరిధిలో 6,61,103 మంది సభ్యులు న్నారు. తాజాగా జారీ చేసిన కార్డులతో ఈ సంఖ్య 2,14,427కు పెరిగింది. అలాగే యూనిట్ల సంఖ్య 11,14,002కు చేరింది. కార్డుల సంఖ్యతో పాటు బి య్యం కోటా కూడా పెరిగింది. ఇప్పటి వర కు ప్రతీ నెలా 4,180 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తుండగా పెరిగిన కార్డుల సంఖ్యకనుగుణంగా ఈ నెలకు 4,480 మెట్రిక్ టన్నులు కేటాయించారు. నూతన కార్డుదారులందరికీ సెప్టెంబర్ కోటా కింద 1వ తేదీ నుంచి బియ్యం అందజేయనున్నారు.బియ్యంతోపాటు సంచి కూడా ఫ్రీకార్డుదారులకు ఉచితంగా బియ్యంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన సంచులను సైతం అందించాలని నిర్ణయించింది. వైట్‌కలర్‌లో ఉన్న ఈ బ్యాగుపైన సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫొటోలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం ఆరు గ్యారెంటీల ప థకాల వివరాలు ముద్రించారు. రూ.50విలువ చేసే ఈ సంచిని బియ్యంతో పాటు ఉచితంగా అందజేయనున్నారు.ఈ బ్యాగులు సైతం జిల్లాకు చేరాయి.బియ్యం కోటా పెరిగిందిజిల్లాలో కొత్తగా జారీ చేసిన కార్డులకు అనుగుణంగా ప్రభుత్వం బియ్యం కోటా విడుదల చేసింది. జిల్లాకు అవసరమైన సన్నబియ్యంను నిజామాబాద్ నుంచి సరఫరా చేయనుంది. సోమవారం నుంచి జిల్లాకు వచ్చే అవకాశముంది. ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరాక అక్కడి నుంచి షాపుల వారీగా సరఫరా చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి కార్డుదారులందరికీ అందజేస్తాం.– వాజీద్‌అలీ, డీసీఎస్వో -
మహనీయుడు పాపన్నగౌడ్
ఆదిలాబాద్‌రూరల్: బహుజనుల సంక్షేమం కోసం పాటుపడిన మహనీయుడు సర్వాయి పాపన్నగౌడ్ అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాపన్నగౌడ్ సేవలను కొని యాడారు. గౌడ కులస్తులకు చేయూత అందించాల నే లక్ష్యంతో వన మహోత్సవంలో భాగంగా ప్ర భుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున ఈత మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అలాగే రాజీ వ్ యువ వికాసం పథకం కింద రూ.50వేల రుణంను వంద శాతం సబ్సిడీపై అందించేలా చర్యలు తీ సుకుంటున్నామని అన్నారు. ముందుగా గౌడ కులస్తులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా రు. ఇందులో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీని వాస్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, గౌడ కులస్తులు రమేశ్‌గౌడ్, ది నేష్గౌడ్, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
కై లాస్‌నగర్: జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణం, ఇచ్చోడ, జైనథ్, గుడిహత్నూర్ మండలాలకు చెంది న మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ స మితి సభ్యులతో సోమవారం స్థానిక తానిషా గా ర్డెన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మండపాల ని ర్వహణ కమిటీ సభ్యులు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా బందోబస్తు, నిమజ్జన ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుందన్నారు. గ్రామాల్లో సాధ్యమైనంతవరకు ఒకే వినాయకుడిని ప్రతిష్టించి ఐక్యత చాటాలన్నారు. గతంలో ఏర్పా టు చేసిన మండపాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. ఆయా కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ కమిటీ అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. 24 గంటల పాటు ముగ్గురు వలంటీర్లు విగ్రహంతో పాటు మండపంలో ఉండాలని సూచించారు. అలాగే మండపంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలాంటి లక్కీ డ్రా నిర్వహించకూడదని, బలవంతపు చందాలు చేపట్టరాదని పేర్కొన్నారు. డీజేలకు అనుమతులు ఇవ్వమన్నారు. అత్యవసరమైతే డయల్ 100 కు సమాచారమివ్వాలని సూచించారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు బి. సునీల్‌కుమార్, కె. నాగరాజు, కె.ఫణిదర్, డి.సాయినాథ్, బండారి రాజు, ఎస్సైలు, సిబ్బంది, హిందు ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు హన్మాండ్లు తది తరులు పాల్గొన్నారు. -
పంట నష్టంపై ఆరా..
జిల్లాలో వర్షాల నేపథ్యంలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈమేరకు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై ఆరా తీశారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..: ఎమ్మెల్యే శంకర్సాత్నాల: భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించాల ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భోరజ్ మండలంలోని కేదార్‌పూర్, అకోలి, గిమ్మ, కొరటా, మాండగాడా, పూసాయి, పిప్పర్వాడ గ్రా మాల్లో ఆయన పర్యటించారు. ఎడ్ల బండిపై వాగులు దాటుతూ నీట ము నిగిన పంట చేలను పరిశీ లించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు సాత్నాల, మరో వైపు పెన్‌గంగ ఉధృతి కారణంగా జిల్లాలో దాదా పు 12వేల ఎకరాల మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అలాగే ఎరువులు సైతం తడిసి ముద్దయ్యాయని, దీంతో రైతులు నష్టపోయారన్నారు. జిల్లాలో పంట నష్టం వి వరాలను త్వరలోనే కేంద్ర మంత్రులకు తెలియజేస్తానన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రాథో డ్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, ఏవో అష్రఫ్, బీజేపీ నాయకులు తదితరులున్నారు. -
అట్టహాసంగా దుర్యోధన వధ
ఐరాల: మండలంలోని మద్దిపట్లపల్లెలో శ్రీద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయ మహా భారత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్యోధన వధ ఘట్టం అట్టహాసంగా జరిగింది. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహంతోపాటు శ్రీకృష్ణ, భీమ, అర్జున, నకుల, సహదేవ ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్యోధనుడి మట్టి ప్రతిమ చూపరులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం దుర్యోధన వధ ఘట్టాన్ని కళాకారులు రక్తికట్టించారు. ముందుగా గంగమడుగులో దాక్కొని ఉన్న దుర్యోధనుడిని భీమసేనుడు లాక్కొచ్చి చేసే యుద్ధ సన్నివేశం అలరించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్యోధనుడి ప్రతిమ వద్ద సాగిన భీమ, దుర్యోధన వేషధారులు యుద్ధ సన్నివేశాలు కట్టిపడేశాయి. అదేవిధంగా దుర్యోధునుడు ఆలపించిన పద్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. అనంతరం భీముని వేషధారి దుర్యోధనుడిని వధించడం చూపరులను ఎంతో ఆకట్టుకుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన జనంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. -
మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం
వి.కోట: మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా శ్రీజ డెయిరీ పనిచేస్తోందని డెయిరీ ఏరియా పీఏబీ ఎగ్జిక్యూటివ్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. మండలంలోని పట్రపల్లి కొత్తూరు గ్రామంలోని డెయిరీ సభ్యులకు ఆదివారం శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పశుసంరక్షణ కిట్లు, పశుగ్రాసం కోసం సీడ్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీజ డెయిరీలో పాలు పోసే సభ్యుల నుంచి బోర్డు డైరెక్టర్ వరకు అందరూ మహిళలే ఉన్నారని తెలిపారు. ఈ డెయిరీ పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. మహిళల సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. శ్రీజ మహిళ పాల యజమానులకు వాళ్ల అర్హతను బట్టి 2024–25 ఆర్థిక సంవత్సరంలో బోనస్‌గా లీటర్‌కు 0.60 పైసలు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ ఏరియా సూపర్వైజర్స్ నాగరాజ్, కిషోర్‌రెడ్డి, పాలమిత్ర నారాయణ స్వామి పాల్గొన్నారు. పుంగనూరు: మున్సిపాలిటీ పరిధిలోని కట్టక్రిందపాళెం, చింతలవీధి, నగిరివీధి ప్రాంతాల్లో సోమవారం బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్–6 పేరుతో అరకొరగా పథకాలు అమలుచేస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఈ క్రమంలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్నజలకు వివరిస్తామని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
మూసుకుపోయిన రోడ్లు
ఏదైనా రోడ్డు వస్తుందంటే గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు. రవాణా సౌకర్యం పెరగడంతోపాటు తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమ జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని భావిస్తారు. అందువల్ల తమకు జీవనాధారమైన భూములను సైతం రోడ్డుకు ఇస్తారు. పలమనేరు నియోజకవర్గం మీదుగా సిక్స్ ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవే వస్తుందనగా ప్రజలు సంతోషించారు. తీరా రోడ్డు నిర్మాణం అయ్యాక తమ గ్రామాలు, పొలాలు, కాలనీలకు వెళ్లడానికి గతంలో వుండే రోడ్లు సైతం మూసుకుకోవడంతో ఎంత పనిచేసిందిరా సామీ అని బాధపడుతున్నారు. రోడ్డు దాటేందుకు వీలులేకపోవడం, పొలాల వద్దకు వెళ్లేందుకు కిలోమీటర్లు చుట్టి రావాల్సి వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పలమనేరు: పలమనేరు నియోజకవర్గం మీదుగా సిక్స్ ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మిస్తున్నారు. దీనికి రెండు వైపులా సిమెంట్‌తో ఎవరూ వెళ్లకుండా ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు. అవరసమైన చోట అండర్‌పాస్‌లు నిర్మించలేదు. ఫలితంగా నియోజకవర్గంలో 60 వరకు గ్రామాలు, కొన్ని కాలనీలు, పొలాల వద్దకు వెళ్లే దారులు లేకుండా పోయాయి. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబందిత రెవిన్యూ అధికారులకు విన్నవిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళుతున్నామంటున్నారే గానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో గ్రామాలు, పొలాలకు, పశువులను మేతకు తీసుకెళ్లడానికి ఆయా ప్రాంత వాసులకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల ఎక్కడ చూసినా ఎక్స్‌ప్రెస్ హైవే సమస్యలపై బాధిత గ్రామస్తులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవేలోకి వెళ్లేందుకు అసలుకాదు ఎక్స్‌ప్రెస్ హైవేలోకి మనుషులు, కుక్కలు, మూగ జీవాలు, ఇతర వాహనాలు వెళ్లకుండా చేయడంలో భాగంగానే కాంట్రాక్టర్లు రోడ్డుకు ఇరువైపులా సిమెంట్‌తో అడ్డుగా ఫెన్సింగ్‌ని నిర్మిస్తున్నారు. ఇతర రోడ్లకు కనెక్టింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ తప్ప ఎవరూ దీనిపైకి వెళ్లడం సాధ్యం కాదు. అవసరమైన చోట్లలో మాత్రం అండర్‌పాస్‌లు నిర్మించకపోవడం సమస్య మొదలైంది. కాలనీ ఇళ్లకు దారేది పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డూరు, బోడిరెడ్డిపల్లి ఇందిరమ్మ, జగనన్న కాలనీల్లో సుమారు నాలుగువేల కుటుంబులున్నాయి. ఎక్స్‌ప్రెస్ హైవే రాకముందు ఇక్కడి ప్రజలు కూర్మాయి రోడ్డు, 80 అడుగుల రోడ్డులో వెళ్లేవారు. ఈ రోడ్ల మధ్య ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ హైవే రావడంతో కాలనీకి దారిలేకుండా పోయింది. వీరు తావడపల్లి రోడ్డులోగాని, అటు కౌండిన్య వైపు నుంచి వెళ్లేందుకు అవకాశం లేకుండా అష్ట దిగ్బంధంలో చిక్కుకున్నారు. మరోవైపు గడ్డూరు వద్ద అండర్‌పాస్ నిర్మాణం లేకుంటే కూర్మాయి మార్గం ద్వారా పలమనేరు రూరల్ మండలంలోని 20 గ్రామాలకు ఇబ్బందులు తప్పవు. అదే విధంగా మండల కేంద్రమైన బైరెడ్డిపల్లిలో నిర్మించిన జగనన్న కాలనీకి దారి లేకుండా పోయింది. వీరు మెయిన్ రోడ్డు నుంచి కాలనీలోకి వెళ్లాలంటే నాలుగైదు కిలోమీటర్ల చుట్టాల్సి వస్తోంది. ఎన్నో గ్రామాలు, కాలనీలకు ఇదే పరిస్థితి.. ఎక్స్‌ప్రెస్ హైవే కర్ణాటక రాష్ట్రంలోని హుల్కూర్ నుంచి వీకోట మండలంలో ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి బైరెడ్డిపల్లి, పలమనేరు, బంగారుపాళెం, గుడిపాల మండలాల మీదుగా తమిళనాడుకు వెళుతోంది. ఈ మార్గాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలు, పొలాల వద్దకు వెళ్లే దారులు ఇప్పుడు లేకుండా పోయాయి. పలమనేరు మండలంలోని దిగువకల్లాడు, ఎగువ కల్లాడు, నడిమికల్లాడు, గజ్జలవారిపల్లి మీదుగా పకీరుపల్లికి దారి లేకుండా పోయింది. మరోవైపు ఎక్స్‌ప్రెస్ హైవే గ్రామాల నుంచి పొలాల వద్దకు వెళ్లే వందలాది కాలి బాటలు లేకుండా పోయాయి. దీంతో పొలం పనులకు, పశువుల మేతకు ఎలా వెళ్లాలో దిక్కుతోచక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలు, దారులు, కాలనీలున్న చోట అండర్‌పాస్‌లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అండర్ పాస్‌ల విషయం అప్పట్లో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్వాహకులు ప్రతిపాదించకపోవడం ప్రజలకు శాపంగా మారింది. దీనిపై ఎన్‌హెచ్ అధికారులను అడిగినా తమకు సంబంధం లేదని చెబుతున్నారు. -
రాజ్యాధికార సాధనే లక్ష్యం
పుంగనూరు: రాజ్యధికారాన్ని సాధించుకునేందుకు బహుజనులంతా ఐకమత్యంతో పోరాటం చేద్దామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగరాజు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రబాబుతో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ బుక్లెట్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇందుకోసం రాజ్యాధికారం తప్పనిసరని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. బహుజనులను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి
రొంపిచెర్ల: సూపర్ సిక్స్ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం చిచ్చిలివారిపల్లె, పెద్దమల్లెల గ్రామాల్లో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సూపర్ సిక్స్ పథకాల వల్ల తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి కలుగుతోందన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. గతంలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేశారని గుర్తు చేశారు. మహిళలకు పెద్ద పీట వేశారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రెడ్డీశ్వర్‌రెడ్డి, కరీముల్లా, విజయశేఖర్, రవీంద్ర, చంద్రారెడ్డి, నీరజాక్షులు నాయుడు, ప్రేమానందం, వెంకటరత్నం, సిద్ధరామిరెడ్డి, కమలాకర్ రెడ్డి, శంకర్ రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం ఆగడాలకు స్వస్తి పలకాలి
పుంగనూరు: ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు, వేధింపులు, అరెస్టులు తప్ప ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమి లేదని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆరోపించారు. ఇప్పటికై నా చంద్రబాబునాయుడు ప్రజల సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. ఆయన ఆదివారం మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్ పుంగనూరు పట్టణంలోని ఎన్ఎన్.పేట, వనమలదిన్నె రోడ్డులో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. క్యూఆర్ కోడ్ పోస్టర్లను విడుదల చేశారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, సూపర్–6 హామీల అమలు, ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, వైఫల్యాలను వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలియజేశారు. కూటమి పాలనలో ఏ ఒక్కరూ సంతృప్తి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అమరేంద్ర, జయరామిరెడ్డి, రాజేష్, సురేష్, రాఘవ, ఎంఎం.ఆనంద, అస్లాంమురాధి, హేమంత్, శ్రీనివాసులు, మమ్ము, ఖాదర్, నయాజ్, అయాజ్, జావీద్ , సలామత్, కంచప్ప తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ధరలకు అనుగుణంగా వేతన సవరణ చేయాలి
పలమనేరు: సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా కూటమి సర్కార్ నిర్వాకంతో ధరలు ఆకాశానంటుతున్నాయని, ఈ తరుణంలో ఉపాధ్యాయులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటామోహన్ తెలిపారు. పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఆదివారం కుబేరనాయుడు అధ్యక్షతన ఆ సంఘం ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏడాదిగా పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. డీఏ బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వంలో బోధనేతర కార్యక్రమాల వల్ల టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నేతలు మదన్‌మోహన్‌రెడ్డి, మోహన్ యాదవ్, పురుషోత్తం నాయుడు, పలమనేరు డివిజన్ నాయకులు రవి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సదుం: మండల కేంద్రంలోని శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కొలువుదీర్చి మేళ తాళాలతో గ్రామంలో ఊరేగించారు. భక్తులు కర్పూరహారతులు పట్టి నీరాజనాలు పలికి, మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, మోహన్‌రెడ్డి, రవీంద్ర రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మోహన్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదం జరిగినా పట్టించుకోరా..?
చౌడేపల్లె: మండలంలోని బోయకొండ–పుంగనూరు రోడ్డులోని కొలింపల్లె సమీపంలోని ఒడ్డోళ్ల తోట సమీపంలో మూడు రోజుల క్రితం టెంపోలో జేసీబీను తరలిస్తుండగా 11 కేవీ విద్యుత్ లైను తగిలి డ్రైవర్ సుబ్రమణ్యంరెడ్డి మృతిచెందాడు. ఇక్కడ విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో వున్నాయి. అంతేగాక మండలంలోని కాగతి విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి కాగతి చెరువు మీదుగా యనమసామనపల్లె, పలగార్లపల్లె, పొన్నిపెంట ప్రాంతాలకు 11 కేవీ లైను వెళుతోంది. చెరువులో నాటిన విద్యుత్ స్తంభాలు 20 వరకు ఒక పక్కకు వాలిపోయి ప్రమాదకరంగా వున్నాయి. ఇటీవల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులోకి నీరు చేరితే పెద్ద ప్రమాదం ఏర్పడే ప్రమాదం వుందని పరిసర ప్రాంతంలోని పంటలు సాగుచేసిన రైతులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మృతిచెందినా ట్రాన్స్‌కో అధికారుల్లో చలనం రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పెద్ద బాలశిక్షతో విద్యార్థులకు విజ్ఞానం
పలమనేరు: పెద్దబాలశిక్ష చదవడం ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసీనాథం నాయుడు తెలిపారు. స్థానిక కళామందిరంలో ఆదివారం పెద్దబాలశిక్ష పుస్తకాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పిల్లలు కొంతసేపైనా పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని చదవాలన్నారు. ఇందులో అనేక విషయాలు వున్నాయని తెలపారు. ఈ పుస్తకాన్ని ఆసక్తిగల విద్యార్థులకు ఉచితంగానే అందజేస్తున్నామని తెలిపారు. సదుం: స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏటీఎం చాలా రోజులుగా సాంకేతిక సమస్యలతో మూతబడింది. దీంతో ఖాతాదారులతోపాటు అత్యవసర సమయాల్లో నగదు కోసం ఏమి చేయాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ ఏటీఎంలో నగదు జమ చేసుకోవడంతో పాటు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉండేది. బ్యాంకుకు వరుస సెలవులు వున్నా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం ఏటీఎం పనిచేయకపోవడంతో నగదు వేయడానికి, తీసుకోవడానికి బ్యాంకు తెరిచే వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఏటీఎం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బైరెడ్డిపల్లె: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం మహతి ఫౌండేషన్ సహకారంతో కుప్పం పీఈఎస్ ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన ఉచిత వైద్య, రక్తదాన శిబిరానికి విశేష స్పందన లబించింది. 267 మంది రోగులు వైద్య పరీక్షలు చేసుకున్నారు. వారికి కుప్పం పీఈఎస్ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అలాగే 40 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. అలాగే 20 మంది రక్తదానం చేశారు. మహతి ఫౌండేషన్ అధ్యక్షుడు నాగరాజు, వైద్యబృందం పాల్గొన్నారు. చిత్తూరు అర్బన్: ప్రమాదకరంగా వాహనాలు నడిపిన 47 మందికి పోలీసులు జరిమానా విధించారు. చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర ఆదివారం తన సిబ్బందితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల అత్యంత వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ పాదచారులను ఇబ్బందులకు గురిచేసిన వారిని గుర్తించారు. ఇలా 47 మందిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం రూ.52 వేల జరిమానా వసూలు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. -
వర్షం తెచ్చిన నష్టం
ఇచ్చోడ: రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా భారీగా పంటనష్టం జరిగింది. చేతి కివచ్చిన పంటలు నీటమునిగి అన్నదాతలు ఆందో ళనకు గురవుతున్నారు. చేతికివచ్చిన పంటలు కళ్లెదుటే వరదనీటిలో కొట్టుకుపోతుంటే కలత చెందా రు. జిల్లా వ్యాప్తంగా పత్తి, సోయా, మొక్కజొన్న త దితర పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 11వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. రక్షేతస్థాయిలో ఏఈవోలు పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించి సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో జిల్లా వ్యవసాయాధికారి, ఏఈవోలు పంట పొలాల్లోకి వెళ్లి నష్టం వివరాలు సేకరిస్తున్నా రు. శనివారం భారీగా కురిసిన వర్షంతో సర్వే అంతంతా మాత్రమే జరగగా, ఆదివారం నుంచి ఏఈ వోలు పూర్తిస్థాయిలో సర్వేలో నిమగ్నమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో అధికం లోతట్టు ప్రాంతాల్లో అ్యధికంగా పంటనష్టం జరి గినట్లు తెలుస్తోంది. సిరికొండ మండలం చిక్మాన్ వాగు పొంగిపొర్లడంతో రాంపూర్, లఖంపూర్, సిరికొండ, కొండపూర్, ధర్మసాగర్, చిమన్‌గూడ, పోచంపెల్లి గ్రామాల్లో అత్యధికంగా పంటనష్టం జరిగినట్లు సమాచారం. ఇచ్చోడ మండలంలో గుండాల ప్రాజెక్ట్‌లో నీటి సామర్థ్యం ఎక్కువ కావడంతో నారాయణ్‌పూర్ వాగు పొంగి పొర్లడంతో సిరిచెల్మ, గుండాల గ్రామాల్లో పంటలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. భీంపూర్ మండలంలో అంతర్గమ దన్నుర్, పిప్పల్‌కోటి, నిపాని గ్రామాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వడ్డాడి, హస్నపూర్, పొన్నరి గ్రామాల్లో పంటలు కొట్టుకుపోయాయి. బజార్హత్నూర్ మండలం కడెం వాగు పరీవాహక గ్రామాలైన చింతలసాంగ్వి, బోస్రా, జల్లుగూడ, జాతర్ల, సుంగుగూడ, బజార్హత్నూర్ గ్రామాల్లోనూ పంటనష్టం జరిగింది. జిల్లాలో నమోదైన వర్షపాతం శనివారం ఉదయం 8.30నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు అధి కారులు వెల్లడించారు. భీంపూర్‌లో 75.4 మిల్లి మీ టర్లు, జైనథ్‌లో 79.0, బేలలో 60.08, గుడిహత్నూర్‌లో 128.8, ఆదిలాబాద్ (రూరల్)లో 77.8, ఆది లాబాద్ (అర్బన్)లో 99.0, మావలలో 111.2, తాంసిలో 136.6, తలమడుగులో 138.0, బజార్హత్నూర్లో 60.6, బోథ్‌లో 47.6, నేరడిగొండలో 57.0, ఇచ్చోడలో 110.8, సిరికొండలో 130.2, ఇంద్రవెల్లిలో 119.2, గాదిగూడలో 48.0, నార్నూర్‌లో 60.2, ఉట్నూర్ మండలంలో 43.8 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు పేర్కొన్నారు. పంటనష్టం సర్వేకు ఆదేశాలు జారీ చేశాం జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయికి వెళ్లి పంట నష్టంపై సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఏఈవోలు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి సర్వే చేస్తారు. జిల్లాలో 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశాం. – శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
జైనథ్, సాత్నాల, భోరజ్ మండలాల్లో..
జైనథ్/సాత్నాల: జైనథ్ మండల కేంద్రానికి స మీపంలోగల వాగు ఉప్పొంగి ప్రవహించగా ఇరువైపులా సుమారు 90 ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. సాత్నాల మండలంలో సుమారు 250 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు ఏవో కైలాస్ జాదవ్ తెలిపారు. మాంగూ ర్లా, మామిడి గూడా, సుందరగిరి, సైద్పూర్ గ్రా మాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. భోరజ్ మండలంలో సుమారు 300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ఏవో అష్రఫ్ తెలి పారు. పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలైన పెండల్వాడ, అకొలి, డోలారా, కామాయి గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 220 ఎకరాల్లో పత్తి, 60 ఎకరాల్లో సోయా, 40 ఎకరాల్లో కంది నీట మునిగినట్లు సమాచారం. దీంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు. -
ఫీవర్ సర్వే నిర్వహించాలి
కై లాస్‌నగర్: వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇంటింటా ఫీవ ర్ సర్వే నిర్వహించి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని వి కలాంగుల కాలనీ, జీఎస్ ఎస్టేట్ ప్రాంతాల ను ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి పరిశీలించా రు. వరదలతో నష్టపోయిన ఇళ్లను పరిశీలించి బాఽధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాలనీల్లో నిర్వహించిన వైద్యశిబిరాల ను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అ ధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజ లకు అందుబాటులో ఉండాలని, అవసరమైన సమాచారం ఇస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవా లని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఆర్ఐ యజువేందర్రెడ్డి ఉన్నారు. -
సైక్లింగ్‌తో ప్రయోజనాలు
ఆదిలాబాద్: సైక్లింగ్‌తో ఎన్నో ప్రయోజనాలు న్నాయని ఎన్సీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కిచ్చర్ తెలిపారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘సన్ డేస్ ఆన్ సైకిల్’ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కెడెట్లతోపాటు ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చే యడం అలవాటు చేసుకోవాలని సూచించా రు. సైకిల్ ర్యాలీ స్టేడియం నుంచి ప్రారంభమై కుమురంభీం చౌక్, ప్రొఫెసర్ జయశంకర్ చౌక్ మీదుగా స్టేడియం వరకు సాగింది. సుబేదార్లు జగదీప్‌సింగ్, సునీల్‌కుమార్, హవల్దార్లు నరేశ్‌కుమార్, బ్రిజేశ్ కుమార్, అసోసియేట్ ఆఫీస ర్లు భూమన్న, చంద్రకాంత్, కెడెట్లు ఉన్నారు. -
పంటనష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
ఆదిలాబాద్‌రూరల్/సాత్నాల/బజార్హత్నూర్/ ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ రూరల్ మండలంలో శని వారం భారీ వర్షం కురవగా వరదనీటితో కొట్టుకుపోయిన తీన్నాలా ప్రాజెక్ట్ రిటర్నింగ్ వాల్‌ను ఆది వారం కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ లఖిల్ మహాజన్ పరిశీలించారు. తీన్నాలా ప్రాజెక్ట్‌తో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, గతంలోనూ వరదనీటితో పంటలు మునిగి తీవ్రనష్టం వాటిల్లిందని కలెక్టర్, ఎస్పీకి రైతులు తెలిపారు. వెంటనే పరిహారం అందేలా చూడాలని కోరారు. కాగా, వెంటనే తెగిపోయిన రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్ట్ పరీవా హక ప్రాంతంలో వరదనీటికి దెబ్బతిన్న పంటలను సర్వే చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నీట మునిగిన పంటలను ఎలా కాపాడుకో వాలో బాధిత రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా మండలంలోని పలు ప్రాంతాలను పరిశీ లించారు. సాత్నాల మండలం రేణిగూడా, దుబ్బ గూడా ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటించారు. కోతకు గురైన రోడ్లు, దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. రైతులు ఎమ్మెల్యేతో తమ ఆవేదన పంచుకున్నారు. అధైర్య పడవద్దని అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు భరోసా కల్పించారు. బజార్హత్నూర్ మండలంలోని కడెం వాగు పరీవాహక ప్రాంతంలో నీటమునిగిన పంటలను బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పరిశీలించారు. అధికా రులు వెంటనే సర్వే చేయాలని కోరారు. ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం మంజూరుకు అసెంబ్లీలో పోరాడతానని హామీ ఇచ్చారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండండి
కైలాస్‌నగర్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆదిలా బాద్, నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాఖలవారీగా తీసుకోవాల్సిన చర్య ల గురించి వివరించారు. ఆయా జిల్లాలోని రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరా లపై ఆరా తీశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడితే వెంటనే పూడ్చివేయాలని, రోడ్ల మరమ్మతులు యు ద్ధప్రాతిపదికన చేపట్టాలని తెలిపారు. ఎగువన కు రుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్‌గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చో ట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించా రు. ఆర్డబ్ల్యూఎస్, హెల్త్ అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని తెలిపారు. పొంగు తున్న వాగులు దాటే ప్రయత్నం చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. -
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
పలువురిని కాపాడిన రెస్క్యూటీమ్ 7జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రాష్ట్రస్థాయి బేస్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర బేస్‌బాల్ సంఘం అధ్యక్షుడు చల్లా హరిశంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. సాత్నాల: భారీ వర్షాలతో సాత్నాల ప్రాజెక్టుకు వరద ఒక్కసారిగా పెరి గింది. 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా .. నాలుగు గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 1.24 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.046 టీఎంసీగా ఉన్నట్లు పేర్నొన్నారు. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాంసి: మత్తడివాగు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరగడంతో శనివారం ఉదయం ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇన్‌ఫ్లో 39,116 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 42,860 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా 277.20 మీటర్ల వద్ద స్థిరంగా ఉండేలా ఔట్‌ఫ్లో కొనసాగిస్తున్నట్లు ఏఈ హరీశ్ కుమార్ తెలిపారు. -
గొలుసు దొంగ అరెస్ట్
లోకేశ్వరం: మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం భైంసాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. లోకేశ్వరం మండలంలోని వాస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల యమున తన రెండు ఎద్దులను గురువారం అబ్దుల్లాపూర్ వెళ్లేదారిలో మేపుతోంది. ఒంటరిగా ఉన్న ఆమెతో దొంగ మాయమాటలు చెప్పి మెడలో రెండు తులాల బంగారు గొలుసును చోరీ చేసి బైక్‌పై పారిపోయాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్కపూర్, అబ్దుల్లాపూర్ సీసీ పుటేజీలను పరిశీలించారు. ముధోల్ మండలంలోని ఆష్టా గ్రామానికి చెందిన పిప్పెర విజయ్‌గా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసుతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న లోకేశ్వరం ఎస్సై ఆశోక్, కానిస్టేబుల్ శ్రీనివాస్, సాయిప్రశాంత్, లక్ష్మణ్‌లను ఏఎస్పీ అభినందించారు. -
తాంసీలో అత్యధికం.. గాదిగూడలో అత్యల్పం
వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ సీజన్లో ఇదే భారీ వర్షం. శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక్క రోజే జిల్లాలో 2078.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాంసి మండలంలో 170.6 మి.మీ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఇక తలమడుగులో 162.4, మావలలో 154.2, గుడిహత్నూర్‌లో 145.2, సిరికొండలో 144.4, ఆది లాబాద్ అర్బన్‌లో 142.0, ఇంద్రవెల్లిలో 135.2, జైనథ్‌లో 132.6, ఆదిలాబాద్ రూరల్‌లో 126.0, ఇచ్చోడలో 123.2, నేరడిగొండలో 91, బజార్హత్నూర్లో 89.2, భీంపూర్‌లో 88.8 మి.మీ, బోథ్‌లో 85.6, నార్నూర్‌లో 84.8, బేలలో 78.4, ఉట్నూర్‌లో 64.2, గాదిగూడలో 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
అత్యవసరమా.. డయల్ చేయండి
కై లాస్‌నగర్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ సాయం అందించేందు కోసం టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ కంట్రోల్‌రూం నంబర్ 1800 425 1939, ఆదిలాబాద్ మున్సిపల్లోని కంట్రోల్ రూం నంబర్ 94921 64153 ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ కంట్రోల్ రూంలో ఒక్కో షిఫ్ట్‌లో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తక్షణ సాయం, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నంబర్లను సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. వర్షం తగ్గే వరకు తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ సహాయ కేంద్రాల నుంచి అందించే సమాచారం, సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయమైన లోతట్టుప్రాంతాలు ● నీటమునిగిన పంటలు, కాలనీలు ● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● స్తంభించిన జనజీవనం
వాగులో కొట్టుకుపోతున్న వాహనం కైలాస్‌నగర్: జిల్లాలో వర్షం దంచికొట్టింది. శనివా రం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు కుండపోతగా కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లా యి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కాలనీలు నీట మునగగా.. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరడంతో జలకళ సంతరించుకున్నా యి. లోలెవల్ వంతెనలపై వరద ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలి చిపోయా యి. పలుచోట్ల పంట చేలు ముంపునకు గురయ్యా యి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పలు కాలనీలు జలమయం జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్, దుర్గానగర్, గ్రీన్‌సిటీ, కృష్ణానగర్‌లోని లోలెవల్ వంతెనలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీఎస్ ఎస్టేట్‌లోకి వర్షపునీరు చేరి చిన్నపాటి చెరువును తలపించింది. భాగ్యనగర్, మహాలక్ష్మివాడ కాలనీల్లోకి వర్షపునీరు చెరడంతో సామగ్రి అంతా తడిసిపోయింది. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుర్గానగర్ వాగు ఉ ప్పొంగి ప్రవహించడంతో కోజాకాలనీలో ఓ కారు వరదలో కొట్టుకుపోయింది. తాంసి మండలంలో ని హస్నాపూర్, బోథ్ మండలంలోని సాయినగర్ కాలనీ, బేలలోని పాతబస్తీ, ఇందిరానగర్కాలనీలను వరద ముంచెత్తింది. -
గిరిజనేతరుల చేతిలో వేల ఎకరాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూములు సా గు చేస్తున్న వేలాది గిరిజనేతరులు తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బీసీ, ఎస్సీలు అటవీ భూముల ఆధారంగానే జీవి స్తూ సాగు చేసుకుంటున్నారు. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ హక్కుల గుర్తింపు) కింద ప ట్టాలు ఇచ్చారు. కానీ గిరిజనేతరులకు అవకాశం లే దు. దీంతో ఏటా సీజన్లో ఆ భూముల్లో విత్తనాలు వేసే సమయంలో ఆక్రమణదారులు, అటవీ అధికా రుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకుని మొక్కలు నా టుతున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులను అటవీ అధికారులు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు పాదయాత్ర చేపట్టగా, మధ్యలోనే పోలీసులు అడ్డుకుని తీసుకొచ్చారు. బీసీ, ఎస్సీలు అధికం అటవీ భూములను గిరిజనులతోపాటు బీసీ, ఎస్సీ ఇతర వర్గాలు వేలాది మంది సాగు చేస్తున్నారు. వీరికి సైతం పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం పక్కన పెట్టింది. మూడేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 1.50లక్షల మంది గిరిజన రైతులకు 4.05లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించారు. చట్టం ప్రకారం గిరిజనులకు మాత్రమే హక్కులు ఉన్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాల్లోనూ గిరిజనేతరులు సాగులో ఉన్నారు. రిజర్వు ఫారెస్టుతోపాటు పులుల సంరక్షణ కేంద్రమైన కవ్వాల్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 1.29లక్షల ఎకరాలు ఆక్రమణలో ఉంది. గిరిజనేతరులతోపాటు కొన్ని చోట్ల గిరిజనులు సైతం కొత్తగా ఆక్రమణలకు పాల్పడుతుండడంతో అడవుల సంరక్షణ మరింత ఇబ్బందిగా మారిందని అధికారులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే.. నిజాం కాలం నుంచే అటవీ ఆక్రమణలు ఉన్నప్పటికీ గత 20ఏళ్లలో ఈ ఆక్రమణలు తీవ్రంగా పెరిగాయి. పత్తి సాగు మొదలైనప్పటి నుంచి గిరిజనులతోపాటు గిరిజనేతరులు సైతం పెద్ద ఎత్తున చెట్లను నరికి సాగులోకి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది సిబ్బంది అవినీతితో ఇష్టారీతిన ఆక్రమణలు జరిగాయి. మరికొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం, తదితర కారణాలతోనూ రిజర్వు ఫారెస్టుల్లో సాగు మొదలైంది. ఆ భూములే తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే సామాజిక సమస్యగా మారింది. దిందాలో ఒక్కొక్కొరు 40ఎకరాల వరకు.. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బందెపల్లి, దిందాలో పరిధిలో ఒక్కో కుటుంబం ఎకరం నుంచి 42ఎకరాల వరకు ఆక్రమించారు. ఇందులో పది నుంచి 30ఎకరాల వరకు సాగులో ఉన్నారు. ఇక్కడ 530ఎకరాల్లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. రిజర్వు ఫారెస్టులో 2600ఎకరాలు ఆక్రమణలో ఉంది. అయితే 600ఎకరాలను సాగుదారులకు వదిలేశారు. మిగతాది గిరిజనేతరుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా వివాదం రాజుకుంటోంది. -
శ్రీకృష్ణా నమోనమః
ఇస్కాన్ ఆలయంలో దర్శనమిస్తున్న శ్రీ రాధాకృష్ణులు కృష్ణుని వేషధారణలో.. ఆదిలాబాద్: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ రాధాకృష్ణా ఆలయం,శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం, శ్రీ మురళీకృష్ణా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. తల్లిదండ్రులు తమ చిన్నారులను రాధాకృష్ణులు, గోపికలుగా అలంకరించి ము రిసిపోయారు. అశోక్‌రోడ్‌లో ఉట్టికొట్టే కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. కుమార్పేట కాలనీకి చెందిన సార్వజనిక్ యూత్ సభ్యులు విజేతలుగా నిలిచారు. -
సౌర వెలుగులు
కై లాస్‌నగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవాలని భావిస్తోంది. ఆదిశగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ క్రమంలో దృష్టి సారించిన యంత్రాంగం జిల్లాలోని ఆయా ప్రభుత్వ భవనాలు, వాటికి వినియోగిస్తున్న విద్యుత్ కనెక్షన్ల వివరాల సేకరణలో నిమగ్నమైంది. ఈ నెల 19లోగా పూర్తిస్థాయి సమాచారం సేకరించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నారు. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించేలా.. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో బిల్లులు భారీగా వస్తున్నాయి. సరిపడా నిధులు లేని కారణంగా పలు శాఖలు కరెంట్ బిల్లులు సైతం చెల్లించలేని పరిస్థితి. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇది ప్రభుత్వానికి తీవ్ర భారమవుతోంది. దీనిపై దృష్టి సారించిన సర్కారు జిల్లాలోని ఆసుపత్రులు, అంగన్వాడీలు, పాఠశాలలు, పంచాయతీ, ఇతర కార్యాలయాల భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. సమాచార సేకరణలో అధికారులు .. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యంత్రాంగం ప్రభుత్వ కార్యాలయాల భవనాల గుర్తింపునకు కసరత్తు చేపట్టింది. ఇటీవల అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాజర్షి షా భవనాల వివరాలు అందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్యదర్శులు వివరాలు సేకరిస్తుండగా , మున్సిపల్ పరిధిలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. భవనంపై కప్పు విస్తీర్ణం.. విద్యుత్ కనెక్షన్ కేటగిరీ.., నెల వారీగా వినియోగం వంటి సమాచారం సేకరిస్తున్నారు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉండే చోట ఎల్టీ, ఎక్కువగా ఉన్న భవన సముదాయాలపై హెచ్‌టీ సర్వీస్‌లతో కూడిన ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. కలెక్టరేట్, రిమ్స్, ఉట్నూర్‌లోని జిల్లా ఆసుపత్రి వంటి విశాల భవనాలపై 100 కిలోవాట్లకు పైబడి సామర్థ్యంతో కూడిన ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ప్రతిపాదలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా విద్యుత్ ఆదాతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ప్రయోజకనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వివరాలు సేకరిస్తున్నాం ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం తదనుగుణంగా వివరాలు పంపించా లని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాల వివరాలు సేకరిస్తున్నాం. ఎన్ని కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేయాలనేది లెక్కిస్తున్నాం. వాటి ప్రతిపాదనలను సిద్ధం చేసి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం. – శ్రీమన్నానారాయణ, రెడ్కో జిల్లా మేనేజర్ -
ముగిసిన తీజ్ వేడుకలు
ఇంద్రవెల్లి: మండలకేంద్రంతోపాటు హర్కపూర్, బిక్కుతండా, ఈశ్వర్‌నగర్ తదితర తండాల్లో తీజ్ ముగింపు వేడుకలను శనివారం నిర్వహించారు. రాఖీపౌర్ణమి నుంచి ప్రారంభమైన తీజ్ వేడుకల్లో పెళ్లి కాని యువతులు గ్రామపెద్ద ఇంట్లో వెదురుబుట్టల్లో గోధుమ నారు నాటారు. 9 రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి గోధుమ నారుకు నీరు పో శారు. గోకులాష్టమి సందర్భంగా తీజ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువతులు, మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం గ్రామపొలిమేరలో వాగులో తీజ్‌లను వదిలి ఉత్సవాలు ముగించారు. గ్రామపెద్దలు చవాన్ ఉమాజీనాయక్, జాదవ్ దుదిరాం, రాథోడ్ శేవంతబాయి రోహిదాస్, జాదవ్ మీరాబాయి, సేవాలాల్ ధర్మ ప్రచారక్ ప్రేమ్ మహారాజ్, గంగారం రాథోడ్, సంతోష్ రాథోడ్ తదితరులు ఉన్నారు. -
ప్రయాణికులను కాపాడిన సీఐ
ఖానాపురం: వరద నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని వరంగల్ జిల్లా దుగ్గొండి సీఐ సాయిరమణ కాపాడారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన బాస లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, రితిక, రితిన్ భద్రాచలానికి కారులో వెళ్తున్నారు. ఖానాపురం మండలంలోని చిలుకమ్మనగర్–కొత్తగూడ మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకుపోయారు. వెంటనే లక్ష్మీనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. డీజీ కంట్రోల్ కార్యాలయం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో సీఐ సాయిరమణ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చిలుకమ్మనగర్‌కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
చోరీ కేసులో ముఠా నాయకుడి అరెస్టు
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. చౌహాన్ రవి, సుఖ్‌దేవ్, షోహెల్, మైకల్వర్ సాయినాథ్, అమ్ము, కరణ్‌లు ముఠాగా ఏర్పడి రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ఇందులో సాయినాథ్‌ను ఈనెల 12న పీటీ వారెంట్‌పై హాజరుపర్చగా, ఈనెల 14న సుఖ్‌దేవ్, పరారీలో ఉఉన్న ప్రధాన నిందితుడు చౌహన్ రవిని శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు షోహెల్, అమ్ము, కరణ్‌లు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి నుంచి రూ. 9,500 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చౌహన్ రవిపై వివిధ పోలీస్ స్టేషన్లల్లో 25 క్రిమినల్ కేసులు, సఖ్దేవ్పై రాష్ట్ర వ్యాప్తంగా 22కు పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. దొంగలను పట్టుకున్న మావల సీఐ కర్రె స్వామి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
కడెం వరదలో వ్యక్తి గల్లంతు
కడెం/దస్తురాబాద్: చేపల వేటకు వెళ్లి కడెం వరదలో చిక్కుకుని ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కడెం మండలం కన్నాపూర్‌కు చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ (45) శనివారం కడెం గేట్లు ఎత్తడంతో కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ప్రాజెక్ట్ గేట్ల దిగువన వెళ్లాడు. రెండు గేట్లు మూసివేయడంతో నీటి ప్రవాహం తగ్గిందని కర్రలతో చేపలు వేటాడేందుకు వెళ్లాడు. అరగంట తర్వాత ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు సైరన్ మోగించి మరో రెండు గేట్లు ఎత్తారు. సమీపంలో వందలాది మంది కేకలు వేసిన గంగాధర్ ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా చుట్టూ నీళ్లు చేరాయి. బయటకు రాలేక, కొద్ది దూరంలో బండపై నిల్చోని కాపాడండి అంటూ కేకలు వేశాడు. వరద ప్రవాహం పెరగడంతో అందరు చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు. 3 కి.మీ మేర మునుగుతూ, తేలుతూ ఈదుతున్నాడు. పాండ్వపూర్ సమీపంలో కడెం వంతెనను దాటి వెళ్లడం అక్కడే ఉన్నవారు, కానిస్టేబుళ్లు నాగరాజు, వంశీ గమనించారు. చెట్లపొదల పక్క నుంచి కొట్టుకుపోతున్న అతన్ని కాపాడేందుకు పరిగెత్తి ప్రయత్నించారు. సుమారు 3 కి.మీ మేర బురదలో వెళ్లిన ఫలితం దక్కలేదు. అదేవిధంగా దస్తురాబాద్ మండలం భూత్కూర్ పంచాయతీ రాంపూర్ గోదావరి తీర ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది. ఎస్సై సాయికుమార్, తహసీల్దార్ విశ్వంబర్ అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడం, రాత్రి కావడం, వరద ప్రవాహం పెరగడంతో గాలింపును నిలిపివేశారు. కడెం ప్రాజెక్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ఎఫ్ బృందం స్పందిస్తే వరదల్లో గంగాధర్‌ను బయటకు తీసుకువచ్చేవారని స్థానికులు వాపోయారు. గంగాధర్‌కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి నిమిత్తం బిస్కెట్లు, కేక్‌లు, చాక్లెట్లు తదితర బేకరీ ఐటెమ్స్‌ను షాపులకు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. కేకలు వేశాం కడెం గేట్లు దూరాన ఉన్న మేము బయటకు రావాలని కేకలు వేశాం. అతను గమనించలేదు. నేను పోతున్నా అంటూ గట్టిగా ఆరిచాడు. 20 నిమిషాల వ్యవధిలో వరదలో కొట్టుకుపోయాడు. – వినయ్, ప్రత్యక్ష సాక్షి -
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద పోటెత్తింది. శనివారం 1.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1083 అడుగులు ఉంది. 80.5 టీఎంసీలకుగాను 53.62 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ, మిషన్ భగీరథకు వదులుతున్నారు. గోదావరిలో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు. పశువుల, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు. – మామడ -
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
ఆదిలాబాద్: క్రీడాకారులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని రాష్ట్ర బేస్‌బాల్ సంఘం అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తెలంగాణ 5వ సీనియర్ రాష్ట్రస్థాయి బేస్‌బాల్ చాంపియన్‌షిప్ (మహిళలు–పురుషులు) పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. పది రోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని వివరించారు. పోటీల్లో రాష్ట్ర జట్టు విజేతగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.శ్వేత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించినవారికి గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం శుభపరిణామన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 700 క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డా.కృష్ణ, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి జ్యోతి, ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్‌రెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, వ్యాయామ ఉపాధ్యాయులు దయానందరెడ్డి, హరిచరణ్, రామ్‌కుమార్, జిల్లాల నుంచి కార్యదర్శులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు పురుషుల విభాగంలో ఆదిలాబాద్ కరీంనగర్ జట్టుపై 6–1తో, హైదరాబాద్ నిర్మల్ జట్టుపై 7–1తో, మహబూబ్‌నగర్ సిద్దిపేట జట్టుపై 7–2తో విజేతలుగా నిలిచాయి. మహిళల విభాగంలో నిజామాబాద్ జట్టు సిద్దిపేటపై 9–0తో, కరీంనగర్ జట్టు మహబూబాబాద్ జట్టుపై 6–5తో, నల్గొండ జట్టు ఆసిఫాబాద్ జట్టుపై 7–4తో విజేతలుగా నిలిచాయి. -
బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలు
రెబ్బెన: గోలేటిలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించే అంతర్ జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి పేర్కొన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా పురుషులు, మహిళల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. సుమారు 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులకు ఈనెల 17 నుంచి 21 వరకు సింగరేణి క్రీడామైదానంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ప్రతిభ చూపినవారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్‌రెడ్డి, భాస్కర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు చందర్ ఏఐటీయూసీ నాయకులు జగ్గయ్య, క్రీడాకారుడు నరేశ్ పాల్గొన్నారు. శిక్షణ శిబిరానికి ఎంపిక ఉమ్మడి జిల్లా పురుషుల జట్టుకు కె.సిద్దార్థ్, ఎం.తిరుపతి, పి.పవన్‌కుమార్, కె. తరుణ్, జి.గోపాల్, పి.శ్రీకాంత్, సాయి చరణ్, టి.దిలీప్‌కుమార్, పి.దేవరాజ్, ఎం.సూర్యకుమార్, ప్రేంకుమార్, సీహెచ్ గోపాలకృష్ణ, సీహెచ్ వరణ్ ఎంపికయ్యారు. మహిళల జట్టుకు ఏ.స్వప్న, కె.అంజలి, డి.శ్రావణి, జి.అనూష, కె.శ్రీస్పూర్తి కారుణ్య, టి.ప్రజ్వల శ్రీ, పి.వర్షిణి, సుజాత, సాయిదీక్ష, సంజన, అర్చన, వైష్ణవి, హారిక ఎంపికయ్యారు. -
గర్భిణుల తరలింపు
వేమనపల్లి: భారీ వర్షాలు దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం వేమనపల్లి పీహెచ్సీ వైద్యాధికారి రాజేష్ ఆధ్వర్యంలో లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కళ్లెంపల్లి, జాజులపేట, సుంపుటం గ్రామాలకు చెందిన కుడిమెత భారతి, శకుంతల, కుబిడె రోజును వేమనపల్లి పీహెచ్సీ నుంచి అంబులెన్స్‌లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరద తీవ్రత పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా తరలిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఇన్చార్జి హెల్త్ సూపర్వైజర్ రాంశెట్టి బాపు, ఏఎన్ఎం మంజుల, రాజ్యలక్ష్మి, ఈఎంటీ జనార్దన్, పైలెట్ సంపత్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉరేసుకుని ఆత్మహత్యకుంటాల: మండలంలోని లింబా(బి) గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గాండ్ల సాయినాథ్ (40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. సాయినాథ్కు గత 20 ఏళ్ల క్రితం రజితతో వివాహమైంది. ఇప్పటివరకు సంతానం కాలేదు. దివ్యాంగుడు కాగా, మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మతిస్థిమితం లేని వృద్ధుడు..సిర్పూర్(టి): మండలంలోని నవేగాం గ్రామానికి చెందిన రాంటెంకి రుషి(60) శుక్రవారం పెన్‌గంగ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. రుషి గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దహెగాం మండలకేంద్రం శివారులో పత్తి చేనులో అతని బట్టలు దొరకగా శనివారం ఉదయం పెన్‌గంగ నదిలో మృతదేహం ఆచూకీ లభ్యమైంది. పెద్దనాన్న కుమార్తె యశోదాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అడవిపంది దాడిలో వ్యక్తి మృతిభీమిని: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్నెపల్లి ఎస్సై భాస్కర్‌రావు, స్థానికులు తెలిపిన వివరాలు.. భీమిని మండలం వెంకటపూర్‌కు చెందిన దాగామ రామయ్య (70) కన్నెపల్లి మండలం సుర్జాపూర్ శివారులో శనివారం పత్తి చేనుకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో అడవి పంది దాడిలో అతడు గాయపడ్డాడు. పక్క చేనులో ఉన్న రైతులు గట్టిగా కేకలు వేయగా అది పరిగెత్తింది. రామయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. అక్కడి నుంచి వెళ్లిన అడవి పంది గురుండ్ల చిరంజీవి, మేకల బాపులపై దాడి చేసి గాయపర్చింది. మృతుడి కుమారుడు రాజేశం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరు మైనర్లపై కేసు ముధోల్: మండలంలోని గురుకుల పాఠశాల కు చెందిన ఇద్దరు మైనర్ విద్యార్థులపై శనివా రం కేసు నమోదైనట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 8వ తరగతి, టెన్త్, ఇంటర్ విద్యార్థులు శుక్రవారం రా త్రి సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల పోటీలు ఉండగా మైక్ విషయంలో గొడవపడ్డారు. ఇద్దరు మైక్ దాచిపెట్టగా ఈక్రమంలో గొడవ జరిగింది. ఇద్దరిని కొట్టడంతో గాయాలయ్యా యి. విషయం తెలుసుకున్న ఎస్సై అక్కడికి చేరుకున్నారు. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
చికిత్స పొందుతూ యువతి మృతి
నిర్మల్ రూరల్: మండలంలోని చిట్యాల గ్రామం వద్ద రాఖీ పండుగ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అర్చన (18) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లికి చెందిన మహేశ్ వరుసకు చెల్లెళ్లయిన అర్చన, ఆద్యతో కలిసి జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న అర్చన చెల్లెలు అక్షయతో రాఖీ కట్టుకునేందుకు బైక్‌పై బయలుదేరారు. చిట్యాల వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో మహేశ్, ఆద్యకు స్వల్ప గాయాలు కాగా.. అర్చనకు తీవ్రగాయాలయ్యాయి. అర్చన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అర్చన ఇంటర్ పూర్తి చేసి ఇటీవలే హైదరాబాద్‌లో బీటెక్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందింది. మరో వారంరోజుల్లో కాలేజీలో జాయిన్ కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించడంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. కాగా, ప్రమాదానికి కారణమైన వాహనం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలానికి చెందిన ఓ వ్యక్తిదిగా రూరల్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వాహనాన్ని స్వాధీనం చేసుకుని రవాణాశాఖ అధికారికి అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మంచిర్యాలరూరల్(హాజీపూర్): పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపూర్‌కు చెందిన కుక్కల రాకేశ్ (21) ఇద్దరు స్నేహితులతో కలిసి నిజామాబాద్‌కు వెళ్లి తిరిగి రామకృష్ణాపూర్‌కు కారులో వస్తుండగా హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వేంపల్లి శివారులోగల కల్వర్టును అతివేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాకేశ్‌కు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి వివాహం కాలేదు. అతని తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పాటాగూడలో తొలిసారి ఎగిరిన జెండాకెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని పాటాగూడ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇది మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. జోడేఘాట్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. అవి కూడా వెళ్లని పక్షంలో వారికి కాలినడకే శరణ్యం. ఆ గ్రామంలో ఇప్పటివరకు బడి, అంగన్వాడీ కేంద్రం లేదు. దీంతో ఇప్పటివరకు జెండా ఎగురవేయలేదు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా చొరవతో ఇటీవల గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. ఇందులో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో సీఆర్టీ చంద్రకళ త్రివర్ణపతాకం ఎగురవేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తంజేశారు. -
జిల్లా పోలీసులకు సేవా పతకాలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాకు చెందిన ఇద్దరు కాని స్టేబుళ్లకు రాష్ట్ర సేవా పతకాలు లభించాయి. టీజీ ఎఫ్టీఎఫ్ హెడ్‌క్వార్టర్స్ హైదరాబాద్‌లో పనిచేస్తున్న వీరు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, డీజీ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఈ పతకాలు అందుకున్నారు. జైనథ్ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ కాయకార్ సంజయ్, ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లికి చెందిన గటిక రాజు పతకాలు అందుకోవడంపై పలువురు వారికి అభినందనలు తెలిపారు.సేవా పతకాలు అందుకుంటున్న కానిస్టేబుళ్లు -
రాజీవ్ సద్భావన యాత్రకు వీడ్కోలు
కై లాస్‌నగర్: రాజీవ్ సద్భావన యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ముగిసింది. రాజీవ్ జ్యోతి యాత్ర చైర్మన్ ఆర్.దొరై ఆధ్వర్యంలో ఈ నెల 9న తమిళనాడులోని పెరంబుదూర్‌లో మొదలైన యాత్ర ఈనెల 19న దేశ రాజధానిలోని న్యూఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సమాధి వీర్ భూమికి చేరుకుంటుంది. ఈ యాత్ర గురువారం రాత్రి ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో యాత్రీకులు రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం క్యాంపు ఆఫీస్ ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పా ల్గొన్నారు. వారికి మాజీ ఎంపీ సోయం బాపూరా వు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు జ్యోతిని దర్శించుకుని వీడ్కోలు పలికారు. 33 ఏళ్లుగా యాత్ర కొనసాగించడం అభినందనీయమని సోయం బాపూరావు కొనియడారు. నాయకులు పాల్గొన్నారు. -
‘హమాలీల సమస్యలు పరిష్కరిస్తా’
బెల్లంపల్లి: హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీ సంఘం నాయకులను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అసంఘటిత కార్మికు ల మాదిరిగానే ఫీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాల ని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాల ని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బజారు ఏరియా ప్రాంతం నుంచి పుర వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు, నియోజకవర్గ అధ్యక్షులు, హమాలీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
భార్యతో గొడవపడ్డందుకు చితకబాదిన ఎస్సై!
వేమనపల్లి: భార్యతో గొడవపడ్డందుకు తనను ఎస్సై చితకబాదాడని మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య ఆరోపించాడు. ఈ మేరకు ఎస్సైపై ఆరే కుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశంతో కలిసి సీపీ, డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య నాలుగేళ్ల క్రితం నీల్వాయి కొత్త కాలనీకి చెందిన భారత ప్రమీలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రమీల పుట్టింటికి వెళ్లడం, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన అనంతరం తిరిగి కాపురానికి రావడం జరుగుతుండేది. 20 రోజుల క్రితం అనారోగ్యంతో ప్రమీల పుట్టింటికి వెళ్లింది. దీంతో కిష్టయ్య గత ఆదివారం ఆమె వద్దకు వెళ్లి కాపురానికి రావాలని గొడవ పడ్డాడు. దీంతో ప్రమీలతోపాటు ఆమె తల్లిదండ్రులు నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై సురేశ్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేశాడు. అయితే గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశ్ ద్వారా రూ.10వేలు ఇవ్వాలని ఎస్సై తనను డిమాండ్ చేసినట్లు కిష్టయ్య ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన భార్య, అత్తమామలు, మరికొందరి ముందే ఎస్సై తనను రోకలిబండతో తీవ్రంగా కొట్టాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయమై మూడురోజుల క్రితం రూరల్ సీఐ బన్సీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. శుక్రవారం రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీకి పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించినట్లు పేర్కొన్నాడు. ఎస్సై సురేశ్‌తో తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల సమీపంలోగల మసీదు ఎదురుగా నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని శుక్రవారం వేకువజామున నిర్మల్ నుంచి మెట్పల్లి వైపు అరటిపండ్ల లోడుతో వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో గద్దె కూలి స్తంభం కిందపడింది. డీసీఎం వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
నిందితుడి ఆచూకీ తెలిపితే నజరానా
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో ఈనెల 8న ఓ వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి భారీ నగదు బహుమతి ఇస్తామని డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వన్‌టౌన్, టూటౌన్ సీఐలు సునీల్‌కుమార్, నాగరాజుతో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడి ఆమె మృతి కారణమైన నిందితుడు స్థానిక రైల్వేస్టేషన్ గుండా పర్లి వైద్యనాథ్ ట్రైన్లో పరారైన విషయం సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడి ఎత్తు దాదాపు 5.4 అడుగులు ఉంటుందని, మరాఠీ భాష మాట్లాడే వ్యక్తిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుడి వివరాలు తెలిస్తే ఆదిలాబాద్ డీఎస్పీని 87126 59914, ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐని 87126 59918, టూ టౌన్ సీఐని 8712659920, సీసీఎస్ ఇన్స్పెక్టర్ను 87126 59965 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సమాచారం తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణలలో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు. రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది ఉన్నారు. -
అసెంబ్లీలో ప్రస్తావించాలి
నేరడిగొండ: జిల్లాలో విశ్వ విద్యాలయం ఏర్పా టు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ఎన్హెచ్ఆర్సీ జిల్లా చైర్మన్ రాథోడ్ సందీప్ విన్నవించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికా రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో నేరడిగొండ మండల చైర్మన్ నర్సింగ్ దాస్, వైస్ చైర్మన్ సతీష్, కోఆర్డినేటర్ కృష్ణ, విలేజ్ కమ్యూనిటీ మెంబర్స్ కృష్ణ, సంతోష్ తదితరులున్నారు. -
యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని యూనివర్సిటీ సాధన సమితి సభ్యులు శుక్రవారం కలిసి విన్నవించారు. పంద్రాగస్టు వేడుకలకు హాజరైన ఆయనకు జిల్లా కేంద్రంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసుల ఆకాంక్ష మేరకు జిల్లాలో విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన జిల్లాలో ఎక్కడ యూనివర్సిటీ కావాలని అడగగా, జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఖానాపూ ర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం జిల్లా కేంద్రంలోనే అనువుగా ఉంటుందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమితి కన్వీనర్ పురుషోత్తంరెడ్డి తెలిపారు. ఈ విషయమై సలహాదారు కలెక్టర్ ను ఆరా తీయగా, విషయం తన దృష్టిలో ఉందని పేర్కొన్నారని సమితి సభ్యులు తెలిపారు. ఇందులో సమితి కోకన్వీనర్ తొగరి భాస్కర్, సవీన్రెడ్డి, డాక్టర్ నరేందర్‌రెడ్డి, సతీ్శ్ సతీశ్‌రెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి నిరంతర కృషి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ముందుగా పీవో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. 934 ప్రాథమిక పాఠశాలల్లో 12,017 మంది విద్యార్థులు చదువుతుండగా 1,449 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నట్లు తెలిపారు. 133 ఆశ్రమ పాఠశాలల్లో 31,749 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పెంచిన చార్జీల ప్రకారం నూతన ఆహార మెనూ అమలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పా రు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మినీ బాలికల గురుకులాలు, నాలుగు ఏకలవ్య పాఠశాలలు (కో–ఎడ్యుకేషన్), ఎనిమిది అప్‌గ్రేటెడ్ బాలికల జూని యర్ కళాశాలలు, నాలుగు అప్‌గ్రేటెడ్ జూనియర్ కళాశాలలు, ఒక బాలుర జూనియర్ కళాశాల, ఒక బాలికల జూనియర్ కళాశాల, రెండు మహిళా డిగ్రీ కళాశాలలు, ఒక పురుషుల డిగ్రీ కళాశాల ఉన్నట్లు తెలిపారు. గురుకులాల్లో 11,114 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 32 పీహెచ్‌సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా వీటి ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 42 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. భూ బదలాయింపు చట్టం కింద ఈ సంవత్సరం 25 కేసులు నమోదు చేసి 12 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగతా 13 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. జీసీసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ పంపులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, మంజూరైన 11 పెట్రోల్ పంపులను ప్రారంభించి నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మగతా ఆరు పంపులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏవో దామోదరస్వామి, ఏడీఎంహెచ్‌వో మనోహర్, పీహెచ్‌వో సందీప్, పీవీటీజీ ఏపీవో మనోహర్, డీపీవో ప్రవీణ్, అధికారులు, సిబ్బంది, ఆశ్రమ, గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి కుడ్మేత మనోహర్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఏఎన్సీ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు మె రుగైన వైద్యం అందించాలని, గ్రామాలకు వెళ్లి వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎ ప్పటికప్పుడు ఆశ కార్యకర్తల ద్వారా తెలుసుకోవాలని పేర్కొన్నారు. విధులను నిర్లక్ష్యం చే స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీహెచ్‌సీ డీడీవో డాక్టర్ జితేందర్‌రెడ్డి, హెచ్ఈ తులసీ దాస్ రాథోడ్, చౌహాన్ నాందేవ్, హెల్త్ సూపర్వైజర్ చరణ్‌దాస్ చౌహాన్ తదితరులున్నారు. -
క్రమశిక్షణతో ట్రైనింగ్ పొందాలి
ఆదిలాబాద్‌రూరల్: ఎన్సీసీ కెడెట్లు దేశ సమైక్యతకు క్రమశిక్షణతో ట్రైనింగ్ పొందాలని కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ వీపీ సింగ్ సూ చించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తె లంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళా శాల (పురుషులు) ఎన్సీసీ యూనిట్‌ను సందర్శించారు. ఆయనకు ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ, ఎన్సీసీ లెఫ్ట్‌నెంట్ పుట్ట లక్ష్మణ్, ఎన్సీసీ కె డెట్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం వీపీ సింగ్ కళాశాల యూనిట్ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తంజేశారు. సామాజిక బాధ్యత పెంచుకోవాలని కెడెట్లకు సూచించారు. ఎన్సీసీ కెడెట్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘పంద్రాగస్టు’కు అంతా సిద్ధం
కైలాస్‌నగర్: పంద్రాగస్టు వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. పోలీసు ల కవాతు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా మైదానాన్ని చదును చేసి రంగురంగుల ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రాంతంతో పాటు ముఖ్య అతి థులు ఆసీనులయ్యే వేదికను సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రభు త్వ శాఖల అధికారులు, జర్నలిస్టులు కూర్చునేందు కు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్ర భుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని తె లియజేసేలా స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు గాను శాఖ ల వారీగా టెంట్లు వేశారు. వేడుకలు తిలకించేందు కు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖల ప్రగతి తీరు తెన్నులను తెలిపే శకటాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 9.30గంటలకు జరిగే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఉత్తమ సే వలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాళ్లను తిలకించి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేయనున్నారు. జిల్లాకు చేరుకున్న ముఖ్య అతిథి పంద్రాగస్టు వేడుకల ముఖ్య అతిథి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ గురువారం జి ల్లా కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక పెన్‌గంగా గెస్ట్‌హౌస్‌కు రాగా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మ హాజన్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. -
అభివృద్ధి చెందిన దేశంగా మారాలి
మన దేశం దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతోంది. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో శ్రమించాలి. ప్రభుత్వాలూ ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయాలి. ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేస్తే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా తప్పనిసరిగా మారుతుంది. – జీ శ్రీజ శక్తివంతంగా తయారు కావాలి ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలున్నా మన ఐక్యతే దేశానికి పెద్దబలం. భిన్నాభిప్రాయాలున్నా సోదరభావంతో మెలుగుతున్నాం. ఏ దేశం బలప్రయోగం, బలవంతపు ఒత్తిడులు ఇండియాపై పడకుండా ప్రభుత్వం పటిష్ట విదేశాంగ విధానం అమలు చేయాలి. ప్రపంచ యవనికపై దేశం శక్తివంతంగా ఎదగాలి. – కూర ఐశ్వర్య రవాణా సౌకర్యం మెరుగుపర్చాలి రవాణా రంగం అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉంటుంది. రవాణా రంగం ఎంతగా ప్రగతి సాధిస్తే అంత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు, జల, వాయు మార్గాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి. వీటితో ఎగుమతులు, దిగుమతులు పెరిగి విదేశీ ద్రవ్యం పోగుపడుతుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలి. – పీ చైత్ర -
సొసైటీ పాలకవర్గాల గడువు పొడిగింపు
● ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం కై లాస్‌నగర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్)ల పాలకవర్గాల గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గురువారంతో వీటి కాల పరిమితి ముగియగా మరో ఆరు నెలల పాటు సొసైటీ, డీసీసీబీ చైర్మన్ల పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సొసైటీ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ అడ్డి భోజారెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఆయనను కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. -
ముందస్తు చర్యలు చేపట్టాలి
కై లాస్‌నగర్: భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చ ర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. గురువారం హై దరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించి పలు సూచనలు చేశారు. సహాయక చర్య ల కోసం జిల్లాకు రూ.కోటి విడుదల చేసినట్లు తెలి పారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి, సెలవుపై వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలని సూచించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్ట ర్ శ్యామలాదేవి, వివిధ శాఖల అధికారులున్నారు. అత్యవసర సాయం అందించాలి ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు ఎస్డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉండేందుకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మండలంలోని యాపల్గూడలోగల రెండో పోలీస్ బెటాలియన్ ఆవరణలో 600 మామి డి మధుబన్ మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై బెటాలియన్ సిబ్బందికి అవగాహ న కల్పించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో కలిసి శిక్షణ పొందిన వంద మంది అత్యవసర సందర్భాల్లో ప్రజలకు సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డెమో తిలకించారు. అ నంతరం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ తదితర అంశాలపై శిక్షణ పొందిన సిబ్బందిచే డెమో కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, బెటాలియన్ కమాండెంట్ నితిక పంత్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ పాల్గొన్నారు. -
ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది
మా తాతల కాలం నుంచి గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. అదే ఆచారం ఇప్పటి వరకూ కొనసాగుతోంది. గ్రా మంలో అందరం కలిసి మెలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఇక్కడే అందరం కలిసి ప రిష్కరించుకుంటాం. ఆంజనేయ స్వామి గు డిలో పూజలు నిర్వహిస్తాం. అందరం కలిసి పండుగలు ఆనందంగా జరుపుకుంటాం. – మొర్ల పోచయ్య, చారిగాం స్నేహభావంతో ఉంటాం గ్రామంలోని యువకులమంతా కలిసి మెలిసి స్నేహభావంతో ఉంటా ం. గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే యువకులమంతా ఒకేచోట చేరి పరిష్కరించుకుంటాం. గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. బెల్టుషాపులు పెట్టరు. ఇదే ఆచారాన్ని అందరం పాటిస్తాం. – మొర్ల శంకర్, చారిగాం -
పట్టణం.. త్రివర్ణ శోభితం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించగా ప్రధాన వీధులు త్రివర్ణ శోభితమయ్యాయి. విద్యార్థుల దేశభక్తి నినాదాలతో చౌరస్తాలు మార్మోగాయి. ర్యాలీని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయం అద్వితీయమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశం నాయకత్వం వహించేలా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పయనిస్తోందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి సూచికగా ప్రతీ గ్రామంలో తిరంగా ర్యాలీ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేదవ్యాస్, దినేశ్ మటోలియా, ముకుందరా వు, మహేందర్, కృష్ణయాదవ్, మురళీధర్, ఆదిత్య ఖండేశ్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయంలో నిబద్ధత పెరగాలి
భారత రాజ్యాంగం ఎంతో ఉన్నతమైంది. ఎన్నో ఆకాంక్షలు, అ భివృద్ధి, ప్రణాళికలు, అందరి హక్కులు, బాధ్యతలకు సమ ప్రాధాన్యతనిస్తూ రూపొందించబడింది. రా జ్యాంగం నిబంధనలకు అనుగుణంగా రాజకీ య నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నిబద్ధతతో మెలగాలి. – ఎ.స్రవంతి ఆర్థికంగా అగ్రస్థానంలో నిలవాలి ఆర్థికాభివృద్ధిలో దే శం వేగంగా ముందుకు సాగుతోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఫలితంగా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. 2047 వరకు మన దేశం ఆర్థికంగా అగ్రస్థానంలో నిలవాలి. పేదరిక నిర్మూలనకు విప్లవాత్మక చర్యలు చేపట్టాలి. – వై.వైష్ణవి దేశభక్తిని మనసులో నింపుకోవాలి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కొందరు సోషల్ మీడియాలో దేశభక్తిని చాటుతుంటారు. సాధారణ రోజుల్లోనూ ఇది కనిపించాలి. మన సంస్కృతి, విలువలను కాపాడుకుంటూ గొప్పగా ప్రవర్తించాలి. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ ప్రగతికి పాటుపడాలి. దేశభక్తిని మనసులో నింపుకోవాలి. – డీ అనుదీప్తి సాంకేతికత వైపు సాగాలి రోజురోజుకూ పెరిగిపోతున్న టెక్నాలజీ దేశాభి వృద్ధికి తోడ్పడాలి. అవసరమైన టెక్నాలజీని వి నియోగించుకుని నిరుద్యోగ యువత ఆర్థిక స్వావలంభన దిశగా ముందుకుసాగాలి. విద్యతోనే అన్నిరంగాల్లో ముందుకు సాగవచ్చు. అందరికీ ఉన్నతవిద్య అందించేంలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – కే సింధు -
అధిక తేమ పంటలకు చేటు
చెన్నూర్‌రూరల్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంటచేలల్లో నీరు నిలిచింది. నీరు ఎక్కువైతే తేమ ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లనుంది. అధిక తేమతో పంటలు నష్టపోకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసా ద్ సూచిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... వర్షాలకు పత్తి చేనులో నీరు నిలిస్తే వెంటనే కాలువలు తీసి నీటిని బయటకు పంపించాలి. వర్షాలు తగ్గిన వెంటనే భూమిలో తేమను తగ్గించు కోవడానికి అంతర సేద్యం చేయాలి. బురద పదనులో ఎకరాకు 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అలాగే ఎకరానికి సీ ఓసీ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకరోజు తర్వాత కిలో స్వర్ణపాల్ను 150 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. పంటను వేరుకుళ్లు తెగులు ఆశిస్తే 3 గ్రాముల ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్‌ను లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో తడపాలి. మొక్కజొన్న అధిక తేమను తట్టుకోలేదు. సాధ్యమైనంత త్వరగా అంతరకృషి చేసుకోవాలి. ఎకరాకు 25 కిలోల యూ రియా, 10 కిలోల పొటాష్ ఎరువును మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. కాండం తొలిచే పురుగు ఉంటే కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి 3 కిలోలు ఆకు సుడుల్లో వేయాలి. పెసర, మినుము పైర్లకు అధిక తేమతో పేనుబంక, లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప పంట మిరప చేనులో నీరు నిలిస్తే వెంటనే నీటిని కాలు వల ద్వారా తొలగించాలి. నారుకుళ్లు తెగులు ఆశిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు గ్రాముల రిడోమిల్ లీటరు నీటికి కలిపి వారంలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అధిక తేమ నుంచి పంటలను కాపాడుకోవచ్చు. -
మద్యానికి దూరం.. చారిగాం
అదో మారుమూల కుగ్రామం. ఆ గ్రామంలో అందరి జీవనాధారం వ్యవసాయమే. ప్రతీరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. మహాత్మాగాంధీ సూచనలు నమ్మిన కాగజ్‌నగర్ మండలంలోని చారిగాం గ్రామస్తులు మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చారిగాం గ్రామం ఉంది. ఈ గ్రామంలో 234 మంది జనాభా, 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారంతా మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉంటున్నారు. గ్రామంలో గుడుంబా తయారీ, బెల్టుషాపుల ఏర్పాటు చేయవద్దని మూడున్నర దశాబ్ధాల క్రితమే పెద్దలు తీర్మాణించారు. ఇప్పటికీ అవే ఆచారాలను పాటిస్తున్నారు. గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ప్రధానంగా కూ రగాయాలు సాగుచేసి పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. 35 ఏళ్లుగా గ్రామస్తులు మ ద్యపాన నిషేధం పాటిస్తున్నారు. స్థానిక యువత బయట తాగినట్లు తెలిస్తే ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి వారిచే మాలధారణ చేయిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో కలిగే లాభాలను వివరిస్తూ మరోసారి మద్యం జోలికి వెళ్లకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా మంచి నడవడికతో ఉంటున్నారు. -
శిశువు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన గర్భిణి సువర్ణకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త కరణ్ బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలీవరీ చేస్తామని చెప్పి చేర్చుకున్నారు. అదే రోజురాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. మంచిర్యాలకు రెఫర్ చేయకుండా వైద్యులు అశ్రద్ధ చేసి తమ బిడ్డ మృతి చెందడానికి కారకులయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా మగశిశువు స్టిల్బర్త్తో పుట్టాడని, తల్లిగర్భంలో ఉన్నప్పుడు మలం తినడంతో మృతి చెందినట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని ఉట్నూర్ వెళ్లే రహదారిపై గురువారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు సీఐ బండారి రాజు, ఏఎస్సై రంగారావు తెలిపారు. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన ఇంగ్వే శ్రీధర్ (24) ఓ ప్రముఖ దినపత్రిక ప్రతులను కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తరలించడానికి వ్యానులో బయలు దేరాడు. మండల కేంద్రానికి సమీపంలోకి రాగానే ఓ చెట్టును ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై వాహనంలోనే మృతి చెందాడు. వ్యానులో అతనితో పాటు ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాసైంది నలుగురే..!
● పరీక్ష రాసింది 129 మంది ● విడుదలైన లైసెన్స్డ్ సర్వేయర్ ఫలితాలు ● ఫెయిలైనా అప్రెంటిస్‌షిప్ యథాతథం కై లాస్‌నగర్: లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష ఫలితాలను హైదరాబాద్‌కు చెందిన జేఎన్టీయూ బుధవారం ప్రకటించింది. జిల్లాలో 155 మంది సర్వేయర్ శిక్షణ పొందారు. వారికి గత నెల 26, 27, 28 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా 129 మంది హాజరయ్యారు. ఇందులో కేవలం నలుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గుడిహత్నూర్‌కు చెందిన జాదవ్ కిర్తీ (71, 63,77)మార్కులు సాధించగా, ఆదిలాబాద్‌కు చెందిన రంగసాయి కిరణ్ (65,77,73), ఇంద్రవెల్లికి చెందిన మేస్రం రాజు (66, 76, 83), తలమడుగుకు చెందిన తమ్మల సాయిప్రీతం(61,64,82)మార్కులను సాధించి ఉత్తీర్ణులయ్యారు. మిగతా 125 మంది ఫెయిలయ్యారు. ప్రాక్టికల్స్‌లో అందరూ ఉత్తీర్ణులైనప్పటికీ థియరీ, ప్లాటింగ్ పరీక్షల్లో రాణించలేకపోయారు. ఫలితాలను అభ్యర్థుల వాట్సాప్ నంబర్లకు పంపించారు. అయితే ఈ నెల 6నుంచి అందిస్తున్న అప్రెంటిస్‌షిప్ యథాతధంగా కొనసాగుతుందని జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ తెలిపారు. ఫెయిలైన వారికి వచ్చే నెల 13, 14 తేదీల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు షెడ్యూల్‌ను తెలంగాణ అకా డమీ ఫర్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ జా యింట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అందులో ఉత్తీర్ణులయ్యే వారిని కొనసాగించే అవకాశమున్నట్లుగా ఆయన వెల్లడించారు. కాగా పరీక్షల తీరుపై అభ్యర్థులు ఇది వరకే ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి నిర్వహించాలంటూ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు భా వించినట్లుగానే ఫలితాల్లో కేవలం నలుగురే ఉత్తీర్ణులు కావడం గమనార్హం. అయితే గతంలో జరిగిన పొరపాట్లకు అవకాశం లేకుండా ఈ సారి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
మళ్లీ పొడిగింపేనా?
● ఫిబ్రవరిలో ఆరు నెలలు పెంచిన ప్రభుత్వం ● నేటితో ముగియనున్న సొసైటీ పాలకవర్గాల గడువు ● జాతీయ పతాకావిష్కరణపై చైర్మన్ల ధీమాఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివరాలుకై లాస్‌నగర్/నిర్మల్‌చైన్‌గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14న ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీటి గడువు ముగిసినప్పటికీ డీసీసీబీ చైర్మన్ల విజ్ఞప్తి మేరకు ఆరునెలల పాటు అదనంగా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు సైతం గురువారంతో ముగియనుంది. ప్రస్తుతం వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు మరోసారి అనివార్యం కానుంది. ప్రత్యేకాధికారులను కూడా నియమించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పంద్రాగస్టు వేడుకల్లో తామే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని సొసైటీ చైర్మన్లు ధీమా వ్యక్తం చేస్తుండటంతో పాలకవర్గాల గడువు మరోసారి పొడిగింపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండోసారి పదవీకాలం పొడిగింపు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించారు. వీరితో పాటు పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. కాగా ఈ సొసైటీలకు ఎన్నికలు జరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ఐదేళ్ల గడువు పూర్తయ్యింది. దీంతో వాటి కాలపరిమితి ముగియడంతో రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లంతా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడిగించింది. తాజాగా ఈ గడువు నేటితో ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో మరోసారి తమ పదవీకాలాన్ని పొడిగించాలని డీసీసీబీ చైర్మన్లతో పాటు సొసైటీ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో మరోసారి మూడు లేదా అరునెలల పాటు పదవీకాలం పొడిగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవీ కాలం ముగియడంతో 15వ తేదీన జరిగే పంద్రాగస్టు వేడుకల్లో చైర్మన్ల హోదాలో జాతీయ పతాకావిష్కరణ చేసే అవకాశం ఉండదు. అయితే ప్రభుత్వం ఎలాగైనా తమ పదవీకాలాన్ని పొడిగిస్తుందనే ధీమాలో ఉన్న సొసైటీ చైర్మన్లు తామే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.సహకార సంఘాలు : 77 డీసీసీబీ : 01 డీసీఎంఎస్ : 01 సొసైటీల పరిధిలోని సభ్యులు : 55 వేలు అన్నదాతకు వెన్నుదన్నుగా ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 55 వేలకు పైగా రైతులు ఉన్నారు. వారికి వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలను క్షేత్రస్థాయిలో అందజేస్తూ సొసైటీలు వారికి అండగా నిలుస్తున్నాయి. పలు సొసైటీలు ధాన్యం కొనుగోళ్లను సైతం చేపడుతున్నాయి. ఈ సొసైటీలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. అవకాశముంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఇటీవలే ఆరు నెలల పాటు సొసైటీల గడువును ప్రభుత్వం పొడిగించింది. మరోసారి సైతం పదవీకాలాన్ని పొడిగించేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. – బి.మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్ -
మళ్లీ పొడిగింపేనా?
పీఏసీఎస్ పాలకవర్గాల గడువు నేటితో ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరునెలల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. .. నిందితుడి అరెస్ట్ ఉద్యోగాల పెరిట నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపా రు. హెడ్‌క్వార్టర్స్‌లో వివరాలు వెల్లడించారు. గురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాత్నాల: భారీ వర్షం కారణంగా సాత్నా ల ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఈ మేరకు బుధవారం ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజె క్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.046 టీఎంసీలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులు ఉండగా.. అంతే మొత్తంలో అవుట్‌ఫ్లో కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, ఎస్పీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్‌ను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం సందర్శించారు. నీటి మట్టాన్ని పరిశీ లించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. వారి వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఇతర అధి కారులు ఉన్నారు. తాంసి: మండలంలోని మత్త డి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో బుధవారం వేకువజామున ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 757 క్యూసెక్కులు ఉండగా..1,240 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు ఏఈ హరీశ్‌కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుతం 277.40 మీటర్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక నీటి నిల్వ సామర్థ్యం 0.571 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.451 టీఎంసీగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షం గవర్నర్‌ను కలిసిన ఎంపీ నగేశ్ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మను ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గవర్నర్‌తో చ ర్చించారు.అలాగే ఆదిలాబాద్ పార్లమెంట్ పరి ధిలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని కో రారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించి వర్షాకాలం ముగిసిన తర్వాత పర్యటిస్తానని మాట ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.అలాగే గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందించారు. ● సిరికొండ మండలంలోని చిక్మాన్ వాగు రాంపూర్ లోలెవెల్ వంతెనపై నుంచి పొంగి ప్రవహించింది. వాగు దాటకుండా రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, డీఎల్పీవో ఫణిందర్ పరిశీలించారు. సిరికొండ : రాంపూర్ లోలెవెల్ వంతెనపై వరద ఉధృతి ● కరుణించిన వరుణుడు ● 20 రోజుల తర్వాత వర్షం ● ప్రాజెక్టులకు జల కళ ● అన్నదాతల్లో హర్షం న్యూస్‌రీల్‘సాత్నాల’ గేట్ ఓపెన్మత్తడివాగు.. పరవళ్లు -
కడెం కెనాల్లో పడి ఒకరు మృతి
దండేపల్లి: మద్యం మత్తులో కడెం కెనాల్లో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సేదం నర్సయ్య (48) కూలీ పని నిమిత్తం దండేపల్లి మండలంలోని కుంటలగూడకట్టకు చెందిన తన బంధువైన బొబ్బిలి బక్కవ్వ ఇంటికి వచ్చాడు. మంగళవారం మద్యం సేవించి కడెం కెనాల్ సమీపంలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆతరువాత కొద్దిసేపటికి అతను కనిపించక పోవడంతో బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం వెతుకుతుండగా బుధవారం కుంటలగూడకట్ట సమీపంలోని కడెం కెనాల్ లో చెట్లపొదలకు తట్టుకుని మృతదేహం దొరికింది. మద్యం మత్తులో ప్రమాద వశాత్తు కెనాల్లో జారిపడడంతో ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడని మృతుని బంధువు భూమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
ఆర్జీయూకేటీలో నషా ముక్త్ భారత్ అభియాన్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో బుధవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాలని కళాశాల వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎస్సై శ్రీనివాస్ విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. మా దక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమంగా రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామి అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. -
బుచ్చిబాబు టోర్నీకి వైస్‌కెప్టెన్‌గా హిమతేజ
ఆదిలాబాద్: దేశవాళి క్రికెట్లో సత్తా చాటుతున్న జిల్లాకు చెందిన కొడిమెల హిమతేజ ప్రతిష్టాత్మక బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ టోర్నీకి జట్టును ప్రకటించింది. రాహుల్ సింగ్ నాయకత్వం వహించనుండగా వైస్ కెప్టెన్‌గా హిమతేజ వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ చైన్నె వేదికగా ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా నుంచి రంజీలో మెరిసిన ఈ యువ క్రికెటర్ తాజాగా వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడంపై శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు అభినందించారు. -
● ఇళ్ల నిర్మాణాలపై యంత్రాంగం దృష్టి ● పనులు ప్రారంభించకుంటే రద్దు ● వారి స్థానంలో మరొకరికి అవకాశం ● వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు
కెలాస్నగర్: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టింది. తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి మంజూరు చేస్తుంది. అయితే ప్రొసీడింగ్ అందుకున్న చాలా మంది నెలలు గడుస్తున్నా పనులు షురూ చేయడం లేదు. అలాంటి వారిపై యంత్రాంగం దృష్టి సారించింది. నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచిస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రారంభించకుంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేస్తోంది. అలాగే వారి స్థానంలో అర్హులైన వారికి మంజూరు చేయాలని భావిస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొదటి, రెండు విడతల్లో కలిపి 9,093 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఇప్పటి వరకు 2024 ఇళ్ల పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పనులు ప్రారంభించకుంటే అవి రద్దయ్యే అవకాశముంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏడాది జనవరి 26న మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలే అత్యధికంగా ప్రారంభానికి నోచుకోవడం గమనార్హం. నిర్మాణాలకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడం, సామగ్రి ధరలు పెరగడం, ఎస్‌హెచ్‌జీల నుంచి సకాలంలో రుణాలు మంజూరు కాకపోవడం వంటి కారణాలతో పలువురు ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. రెండో విడతదీ అదే పరిస్థితి. దీంతో నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రొసీడింగ్ అందుకుని 45 రోజుల్లోగా నిర్మాణాలు ప్రారంభించకుంటే ఆ ఇళ్లను రద్దు చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా నిర్మాణం చేపట్టనటువంటి వారి ఇళ్లను రద్దు చేసి వారి స్థానంలో మరొకరికి మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలుత వారికి నోటీసులు జారీ చేసి ఇళ్లను రద్దు చేస్తారు. అయితే పూరి గుడిసెల్లో నివసించేవారు, అత్యంత పేదలకు ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులతో ఇటీవల సమీక్షించిన ఆయన వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికీ పనులు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేసి, 45 రోజుల్లోగా షురూ చేయకుంటే వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే ఇళ్ల మంజూరు పేరిట ఎవరైనా వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. తద్వారా పారదర్శకత ఏర్పడి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కలెక్టర్ తాజా నిర్ణయాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి ఏ మేరకు పుంజుకుంటుందనేది వేచి చూడాల్సిందే. హస్నాపూర్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ రాజర్షి షాజిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీరిది.. మంజూరైనవి : 9,093 మార్కవుట్ ఇచ్చినవి : 7,069 బెస్మెంట్ వరకు చేరినవి : 2,959 రూప్ లెవల్‌కు చేరినవి : 255 రూప్ పూర్తయినవి : 90 నిర్మాణాల వేగవంతంపై దృష్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పనులు ప్రారంభించకుంటే వారి స్థానంలో మరొకరికి ఇంటిని మంజూరు చేస్తాం. అయితే వారిని ఎల్–1 స్టేజ్‌లో పెడుతాం. మళ్లీ ఆసక్తి చూపితే మంజూరు చేస్తాం. పేదలకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఎవరైనా వసూళ్లకు పాల్పడినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జి.జితేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో -
చిన్నారిపై వీధికుక్క దాడి
లక్ష్మణచాంద: మండలంలోని ధర్మారంలో బాలు ని పై వీధికుక్క దాడి చే యడంతో గాయాలయ్యా యి. గ్రామానికి చెందిన మల్లెల శ్రీకాంత్–శిరీష దంపతుల కుమారుడు కౌశిక్ మంగళవారం ఇంటిముందు ఆడుకుంటుండగా వీధికుక్క వచ్చి దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు బాలుడిని నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలుఆదిలాబాద్రూరల్: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్‌రావు బుధవారం తీర్పునిచ్చినట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల్‌వాడకు చెందిన జాదవ్ ఆనంద్‌రావు మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇదేక్రమంలో తలపై సుత్తెతో కొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దంపతుల కుమారుడు మహేష్ 18 డిసెంబర్ 2024న పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై విష్ణువర్ధన్ కేసు నమోదు చేశారు. కోర్టు డ్యూటీ అధికారి సంతోష్ 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెల్లడించారు. -
ఇంటిస్థలం కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు
ఆదిలాబాద్‌రూరల్: మావల శివారు ప్రాంతంలోని సర్వేనంబర్ 170లో నకిలీ ఇంటి పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన స్వామికి 2013 బీపీఎల్ కింద ప్రభుత్వం 905 నంబర్ గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో బాధితుడు స్వామి గుడిసె వేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం 2015లో అనుమతులు సైతం తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయాడు. రహెమాన్‌ఖాన్ ఆ స్థలంలో ఉన్న గుడిసెను తొలగించి వెంకటమ్మకు రూ. 2.30 లక్షలకు విక్రయించాడు. వెంకటమ్మ ఆ స్థలాన్ని కిష్టన్నకు రూ.3.50 లక్షలకు విక్రయించింది. బాధితుడు స్వామిని బెదిరింపులకు గురిచేయడంతో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో సుంకరి సంతోష్, రహిమాన్ ఖాన్, తాటి లక్ష్మణ్, కిష్టన్న, పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్, వంశీకృష్ణపై కేసు నమోదు చేశా రు. ఇందులో నలుగురిని అరెస్టు చేయగా కిష్టన్న పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్ పరారీలో ఉన్నారు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై.. నెన్నెల: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కొందరు యువకులు బొప్పారం అడవిలో గంజాయి సేవిస్తున్నారని అందిన సమాచారం మేరకు వెంటనే దాడి చేయగా మంచిర్యాల గద్దెరాగడికి చెందిన ఐటీఐ విద్యార్థి పాల్తెపు ప్రణయ్ దొరికిపోయాడు. అతడిని సోదా చేయగా 1.5 గ్రాముల గంజాయి లభించింది. గంజాయితో పాటు పల్సర్ బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించారు. ప్రణయ్‌తో పాటు పారిపోయిన నెన్నెల మండలం గన్పూర్ గ్రామానికి చెందిన పోతురాజుల అకాశ్, గొల్లపల్లికి చెందిన సల్లూరి పెత్రుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్లాట్ ఇస్తానని మోసం చేసిన ఒకరిపై..ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ యజమాని సయ్యద్ షాహిద్‌పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. 2008లో నార్నూర్‌కు చెందిన ఎక్బాల్ ఖాన్ షాహిద్ వద్ద రూ.50 వేలకు ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్లాట్ కొనుగోలు చేశాడు. రూ.20వేలు అడ్వాన్స్ ఇవ్వగా రూ.30 వేలు కిస్తులుగా చెల్లించాడు. ఆ తర్వాత ప్లాట్ ఇవ్వకుండా 2016లో మరో వ్యక్తికి విక్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్య
కాసిపేట: అప్పులబాధతో లారీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కాసిపేట పోలీస్‌స్టేషన్ పరి ధిలోని సోమగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ రంజాన్(41) ఇటీవల లారీని కొనుగోలు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్‌లో ఆర్టీసీ బస్సుతో యాక్సిడెంట్ అయిందని కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడ్డాడు. ఇప్పటికే అప్పుల పాలైన తాను యాక్సిడెంట్‌తో మరింత అప్పులు పెరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయి బుధవారం ఉదయం తన ఇంటిముందు రేకులకు లుంగీతో ఉరేసుకున్నాడు. మృతుని కుమారుడు హసన్బాబా ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు..నేరడిగొండ: మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోలాంకి శ్రీకాంత్ (26) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చే సుకున్నట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఫాస్టాగ్ తరహాలో టైగర్ జోన్ ఎంట్రీ ఫీజుకడెం: టోల్గేట్ మాదిరిగా ఫాస్టాగ్ తరహాలో చెక్‌పోస్ట్‌ల వద్ద సెస్ వసూలు చేసేందుకు అట వీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కవ్వాల్ టైగర్ జోన్ గుండా ప్రయాణించే వాహనాలకు చెక్ పోస్ట్‌ల వద్ద ఎన్విరాల్మెంట్ సెస్ వసూలు చేస్తున్నా రు. గతంలో టైగర్‌జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతులు లేవు. ఇటీవలే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. పాండ్వపూర్ లోని చెక్‌పోస్ట్ వద్ద టైగర్‌జోన్‌లోకి ఎంట్రీ అయ్యే వాహనాలు ఇప్పటి వరకు సిబ్బంది సెస్ వసూలు చేసేవారు. ఫాస్టాగ్ తరహాలో ఏర్పాటు చేయబోతున్న చెక్‌పోస్ట్‌తో వాహనదారులు వెంటవెంటనే వెళ్లేందుకు వీలుంది. -
‘నవోదయ’లో ప్రవేశానికి గడువు పొడిగింపు
కాగజ్‌నగర్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికిగానూ ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ బు ధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు సత్కారంఆసిఫాబాద్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2025 కోసం బుధవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాసంచాలకుల కార్యాలయంలో జాతీయ స్వతంత్య్ర జ్యూరీ నిర్వహించారు. కుమురంభీం జిల్లా నుంచి జన్కాపూర్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్ర నుంచి 160 మంది దరఖాస్తు చేసుకోగా ఆరుగురిని ఎంపిక చేశారు. ఇందులో వెంకటేశ్వర్లు ఒకరు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు పాఠశాల విద్యాప్రగతిని, విద్యార్థుల ప్రగతిలో వినూత్న సేవలను వివరించారు. అనంతరం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉపాధ్యాయుడిని శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు మదన్మోహన్, ఆర్జేడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.