Movies
-
'సారంగపాణి జాతకం'లో ఫుల్ కామెడీ (టీజర్)
ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తిగా నవ్వులు పూయించేలా టీజర్ ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ తెరకెక్కింది. తాజాగా విడుదలైన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. -
చిరంజీవి, షారూఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెబుతూ నయనతార లేఖ
'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా తన అభిమానులను పలకరించింది. అయితే, ఈ డాక్యుమెంటరీ చిత్రకరణలో తనకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు మూడు పేజీల లేఖను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు సాయం చేసిన తెలుగు,తమిళ్,మలయాళ,హిందీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులతో పాటు నిర్మాణ సంస్థల పేర్లను తెలుపుతూ లేఖ రాశారు.నయనతార సౌత్ ఇండియా చిత్రసీమలో అగ్రనటి. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2022లో మామల్లపురంలో జరిగింది. ఈ సందర్భంలో నటి నయనతార వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహాన్ని కవర్ చేస్తూ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో ఆమె ఇంటర్వ్యూ, షూట్లో పాల్గొన్న దృశ్యాలు, ఆమె మేకప్‌తో సహా అనేక సన్నివేశాలు ఉన్నాయి.తన డాక్యుమెంటరీ నిర్మాణం కోసం నో హోల్డ్-బార్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నయన్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఇప్పటి వరకు నేను చాలా సినిమాల్లో నటించాను. అవన్నీ నాకు ప్రత్యేకమే, నా కెరీర్లో చాలా ముఖ్యమైన భాగం అయ్యాయి. ఇందులో చాలా సంతోషకరమైన క్షణాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమాల జ్ఞాపకాలను నా డాక్యుమెంటరీలో పొందుపరచాలని అనుకున్నాను. అందుకోసం ఆయా చిత్రాల నిర్మాతలను సంప్రదించినప్పుడు వారు వెంటనే ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి అభ్యంతరం చేయకుండా నాకు అన్హిండెర్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. వారందరినీ ఎప్పటికీ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాను.' అని తెలిపింది.నయనతారకు సహకరించిన నిర్మాణ సంస్థల పేర్లతో పాటు నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ఒక లిస్ట్ విడుదల చేసింది. బాలీవుడ్లో నటుడు షారూఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్ ఉంటే టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌లు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధానం అమలవుతుంది: దిల్ రాజు
సినిమా రివ్యూల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌పై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ ఇండస్ట్రీలో వారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దానిని అమలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయా పడ్డారు.సినిమా విడుదలైన తర్వాత థియేటర్ల వద్దకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, రివ్యూలు ఇచ్చేవారిని అనుమతించకూడదని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి రివ్యూస్ వల్ల ఇండస్ట్రీ చాలా ఎక్కువగానే నష్టపోతుందని వారు తెలిపారు. దీనిని అరికట్టాలంటే థియేటర్ యజమానులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. థియేటర్ ముందు రివ్యూస్ చెప్పేవారిని లోపలికి అనుమతించకూడదని నిర్ణయించారు.దిల్ రాజు నిర్మించిన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల తేదీని ప్రకటించే కార్యక్రమంలో ఇదే విషయం గురించి ఆయన మాట్లాడారు. 'కోలీవుడ్‌లో వారు తీసుకున్న నిర్ణయం విజయవంతమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలా అమలయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయంలో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేము. ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుని ఫైనల్‌గా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఇక్కడి ఎగ్జిబిటర్లు అలాంటి రివ్యూలను అరికట్టాలని సిద్ధంగా ఉన్నారట' అని దిల్ రాజు పేర్కొన్నారు. -
20 ఏళ్ల తర్వాత సూర్యతో మరోసారి ఛాన్స్ కొట్టేసిన గోల్డెన్ బ్యూటీ
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ భాగం కానుంది. ఈమేరకు నెట్టింట వార్తలు భారీగానే ట్రెండ్ అవుతున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిదే. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రానున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సుమారు 20 ఏళ్ల తర్వాత సూర్యతో త్రిష మళ్లీ కనిపించనున్నారు.కోలీవుడ్‌లో త్రిష,సూర్య ఇద్దరూ కలిసి 3 చిత్రాల్లో నటించారు. మౌనం పెసియాధే (2002),యువ (2004),ఆరు (2005) వంటి చిత్రాల్లో వారు కలిసి నటించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి త్రిష స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సూర్యతో కలిసి నటించేందుకు 20 ఏళ్ల తర్వాత మరోసారి ఛాన్స్ రావడంతో ఆమె ఓకే చెప్పేశారట. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఇప్పటికే ఆమె డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. త్రిష ఇప్పటికే ఒప్పుకున్న సినిమా షెడ్యూల్స్ ఉండటంతో ఆమె బిజీగా ఉన్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సూర్య 45' అనే వర్కింగ్ టైటిల్‌ను ప్రస్తుతానికి ప్రకటించారు. కంగువా సినిమా భారీ డిజాస్టర్ కావడంతో దర్శకుడు ఆర్జే బాలాజీపై తీవ్రమైన ఒత్తడి పెరగనుంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. -
నటి కస్తూరికి బెయిల్
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయిన సినీ నటికస్తూరికి ఎగ్మూర్ కోర్టు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో శనివారం హైదరాబాద్‌లో అరెస్టయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ పరిస్థితులలో తనకు బెయిల్మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్చైల్డ్ ఉందని, ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో నిబంధనలతో కూడిన బెయిల్‌ను ఆమెకు మంజూరు చేస్తూ న్యాయమూర్తి దయాళన్ ఆదేశించారు.ఈ కారణం వల్లే అరెస్ట్నవంబరు 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగువాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి కామెంట్ చేయడంతో వివాదస్పదం అయింది. ఈ క్రమంలో డిఎంకే పార్టీ నేతలపై కూడా ఆమె ఫైర్ అయింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో...
జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ ట్రైలర్‌ని ఈ నెల 23న గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో విడుదల చేయనున్నారు. -
నాకు తల చాలా ముఖ్యం
‘‘మన శరీరానికి తల ఎంత ముఖ్యమో... నాకు ఈ ‘తల’ సినిమా కూడా అంతే ముఖ్యం. డ్యాన్స్ మాస్టర్‌గా నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆర్బీ చౌదరిగారిని నేను దేవుడిలా భావిస్తాను. ఆయన నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్‌ని హీరోగా పరిచయం చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అని డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తెలిపారు. అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం ‘తల’. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలానే ఉంటాను. ఆడియన్స్ తప్పకుండా ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ఎస్తేర్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ‘తల’లో నా పాత్ర ఉంటుంది’’ అని చె΄్పారు. -
ఆ టైమ్‌లో నేను భయపడ్డాను
‘‘నాకు క్వాలిటీ వర్క్ చేయడం ఇష్టం. అందుకే స్క్రిప్ట్స్ సెలక్షన్లో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. తెలుగులో ‘జెర్సీ’ సినిమా తర్వాత నాకు మదర్ క్యారెక్టర్ ఆఫర్స్ చాలా వచ్చాయి. కానీ ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఇక కోవిడ్ సమయంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పని చేసుకున్నారు. కానీ ఆర్టిస్టులకు ఇది కుదరదు. అందుకే నా కెరీర్ ఎలా ఉంటుందా? అని అందరిలానే నేనూ భయపడ్డాను’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మాయ అనే పాత్ర చేశాను. నాది మెకానిక్ రాకీ జీవితాన్ని మార్చే పాత్ర. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించడంతో ఒప్పుకున్నాను. ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో విశ్వక్ చెప్పిన స్టోరీ నాకు నచ్చలేదు. అందుకే ఆ సినిమా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా విశ్వక్ హీరోగా చేసిన రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా ‘మెకానిక్ రాకీ’ చేశాను. ‘బాహుబలి’, ‘కల్కి 2898 ఏడీ’లాంటి సినిమాలూ చేయాలని ఉంది. ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ చేస్తున్నాను. తమిళంలో విష్ణు విశాల్‌తో ఓ సినిమా, ఓ తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని అన్నారు. -
ఈ సినిమా ఇద్దరికీ అగ్నిపరీక్షే
‘‘చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా? కాదా? అనేది ఉంటుంది. ‘దేవకి నందన వాసుదేవ’ వంద శాతం మంచి సినిమా అనిపించింది. ఈ చిత్రం అశోక్‌కి, అర్జున్‌కి అగ్ని పరీక్షే. ఈ పరీక్షని ఎదుర్కొని వారు నిలబడతారని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను, హీరో సుధీర్ బాబు అతిథులుగా పాల్గొన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, విజువల్స్, సాంగ్స్ చూసినప్పుడు అశోక్‌కి సరైన సినిమా అనిపించింది. తను కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ పాత్రకి అశోక్ కరెక్టుగా సరిపోయాడు. మహేశ్‌బాబుగారి ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అని చిత్ర కథారచయిత ప్రశాంత్ వర్మ అన్నారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నాలాంటి కొత్త నిర్మాతని బతికించాలి’’ అని బాలకృష్ణ కోరారు. -
మా నాన్న వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను – నాగార్జున
‘‘మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలోప్రారంభమైంది. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడారు నాగార్జున. యాంకర్ కోరిన మీదట తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా..’ డైలాగ్ చెప్పారు నాగార్జున. ఈ చిత్రోత్సంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు. ‘‘పేపర్ బాయ్‌గా నా ప్రస్థానం ప్రారంభించాను’’ అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమాల్లోని కొత్తదనం, పాజిటివిటీ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు టాలీవుడ్‌ని చేరువ చేస్తున్నాయి’’ అన్నారు అమల.ఐఫీ... ఇంకొన్ని విశేషాలు→ కార్యక్రమప్రారంభంలో భారత వందనం నృత్య కార్యక్రమం ఆహూతులను విశేషంగా అలరించింది.→ సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, రాజ్ కపూర్ల జీవితం గురించి బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ అందించిన వీడియో సహిత కార్యక్రమం ఆకట్టుకుంది.→ పలుమార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం ప్రస్తావన వచ్చింది.→ చిత్రోత్సవంలో భాగంగా విభిన్న కేటగిరీలో చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీల్లో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్, హైదరాబాద్‌కు చెందిన యువ డిజైనర్ అర్చనా రావు ఉన్నారు.→ బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ పాటకు నృత్యంతో అలరించారు.→ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ జీవిత ఘట్టాల ఆధారంగా తీస్తున్న చిత్ర విశేషాలు ప్రదర్శించారు.→ ఆహూతుల్లో ఖుష్బూ, సుశాంత్ తదితరులు ఉన్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
నా ప్రయాణం ముగిసింది.. ఓట్లు వేయొద్దు: నిఖిల్
చేయని తప్పుకు నిందలు పడటం ఎవరికైనా కష్టమే! అవతలివారిపై నోరుజారకుండా ఆచితూచి మాట్లాడే నిఖిల్.. అమ్మాయిలను గేమ్ కోసం వాడుకుంటాడని సీత పెద్ద నిందేసి వెళ్లిపోయింది. ఆ మాటను నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాలకు గోడు వెల్లబోసుకున్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు సారీ చెప్పిన యష్మిఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావ్.. ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావ్ అని సీత ఇచ్చిన స్టేట్మెంట్ విని ప్రేక్షకులే కాదు హౌస్మేట్స్ కూడా షాకయ్యారు. తనవల్లే అలాంటి నిందలు వచ్చాయంటూ నిఖిల్‌కు యష్మి సారీ చెప్పింది. నా వల్లే ఇదంతా మొదలైంది.. మన ఇద్దరి గేమ్ పాడవుతుందంటే మనం మాట్లాడకుండా ఉండటమే నయమని చెప్పుకొచ్చింది. తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్‌బాస్‌కు తన గోడు చెప్పుకున్నాడు. నాకు ఓటు వేయకండి: నిఖిల్ఒకర్ని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్స్‌లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ మహిళల్ని అడ్డుపెట్టుకుని గేమ్‌లో గెలవాలనుకోలేదు. మనసుకు ఏమనిపిస్తే అదే చేశాను. ఎవర్నీ తొక్కాలనుకోలేదు. ఈ వారం నామినేషన్లో ఉన్నాను, హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరూ నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి అని కోరుకున్నాడు. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండిమరికాసేపట్లోనే మనసు మార్చుకుని.. నేనేంటో నిరూపించుకున్నాకే బయటకు వస్తాను. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండి. కప్పు తీసుకునే బయటకు వస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకుని కెమెరాలతో మాట్లాడాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రేరణ.. ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించమని కోరుతూ ఏడ్చేసింది. అది నా వ్యక్తిత్వం కాదుయష్మి మాట్లాడుతూ.. నిఖిల్ గేమ్కోసం అమ్మాయిలను వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మాట్లాడుతూ.. నన్ను తప్పు అని నిందవేసినచోటే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఒకర్ని వాడుకుని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోయినందుకు చీఫ్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూల్‌లో 10 సార్లు దూకాలన్నాడు. ఈ టాస్క్ పూర్తి చేస్తే యష్మి.. తేజకు ముద్దుపెడతానంది. ముద్దు కోసం తేజ ఆశఆశతో పూల్‌లో పదిసార్లు మునకేసిన తేజను కళ్లుమూసుకోమని పక్కనే నిలబడింది యష్మి. తీరా నిఖిల్ వచ్చి తేజ చెంపపై ముద్దుపెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. నీకంత సినిమాలేదు, నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని నబీల్ అసలు విషయం బయటపెట్టాడు. అనంతరం ఈ సీజన్‌కే ఆఖరి మెగా చీఫ్ పోస్టును ప్రకటించాడు బిగ్‌బాస్. సమయానుసారం ఒక్కొక్కరి పేరుతో టీషర్ట్స్ గార్డెన్ ఏరియాలో వేస్తుంటాడు. మెగా చీఫ్ ఎవరంటే?ఆ టీషర్ట్‌ను చించకుండా భద్రంగా కాపాడుకున్నవారు కంటెండర్లవుతారు. అలా ఈ గేమ్‌లో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబీల్ ఓడిపోగా.. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ కంటెండర్లయ్యారు. చివర్లో నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా.. వీరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. అయితే రోహిణిని కంటెండర్ చేయగా చివరకు ఆవిడే మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హీరోయిన్ భానుప్రియను పెళ్లాడాలనుకున్నారా? డైరెక్టర్ ఆన్సరిదే!
సితార, అన్వేషణ, ఆలాపన, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడరు, గోపి గోపిక గోదావరి,అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి ఎన్నో విభిన్న సినిమాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించాడు డైరెక్టర్ వంశీ. హీరోయిన్ భానుప్రియను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే! చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.నా సినిమాతోనే భానుప్రియకు అలాంటి ఆఫర్లుభానుప్రియ తన కెరీర్ ఆరంభంలో ఏ సినిమా చేస్తే బాగుంటుందని నన్ను అడిగేది. సితార మూవీ తర్వాత తను బిజీ అయింది. అయితే తనకు మోడ్రన్ లుక్‌లో కనిపించే పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందేది. దీంతో నేను అన్వేషణ మూవీలో తనను గ్లామరస్‌గా చూపించాను. ఆ సినిమా బాగా ఆడింది. అప్పటినుంచి తనకు గ్లామర్ పాత్రలు వచ్చాయని తనే చెప్పింది. 35 ఏళ్లుగా చూడలేదుతనను కలిసి దాదాపు 35 ఏళ్లు అయ్యాయి అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో వంశీ.. భానుప్రియను పెళ్లి చేసుకోవాలని ఆశపడినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా అందుకు వంశీ స్పందించలేదు. అది ఎప్పుడో గతానికి సంబంధించినది.. అదంతా పాత కథ. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నా భార్య కూడా చనిపోయింది. నా పెద్ద కూతురు చెన్నైలో, చిన్న కూతురు నా దగ్గరే ఉంటుందని తెలిపాడు.చదవండి: పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్ -
ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల టార్గెట్.. ట్రోఫీకి మరింత దగ్గరైన నిఖిల్
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్ చేయిద్దాం అని బిగ్‌బాస్‌కు ఏ ముహూర్తాన అనిపించిందో కానీ ఇది ఒకరకంగా నిఖిల్‌కు ప్లస్సే అయింది. వచ్చినవాళ్లంతా.. నిఖిల్ ఆట గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేశారు. సింహంలా ఉండే నిఖిల్‌ను పిల్లిలా మార్చి తనవైపు తిప్పుకున్న సోనియా కూడా అతడిని తప్పుపట్టింది.క్లారిటీ ఇవ్వకపోవడం తప్పే!యష్మి విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం తప్పని కుండ బద్ధలు కొట్టింది. సీత అయితే మరో అడుగు ముందుకేసి స్ట్రాంగ్‌గా ఉండే ఆడవారిని టార్గెట్ చేస్తున్నావని, వారిని గేమ్ కోసం వాడుకుంటున్నావంటూ నిందలేసింది. ఇది మరీ విడ్డూరం.. నిఖిల్‌తో డ్యాన్స్ చేయాలనుంది, నిఖిల్‌తో ఓ కలగన్నాను అంటూ యష్మినే అతడి వెంట పడింది. కనీసం ఫ్రెండ్‌లా అయినా ఉండమని అర్థించింది. అటు సీత కూడా నిఖిల్‌పై ఇష్టం చూపించింది. జీవితంలో క్షమించనన్న నిఖిల్వీరిని పెద్దగా పట్టించుకోని నిఖిల్.. మీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని ముక్కుసూటిగా చెప్పలేకపోయాడు. అదే అతడికి పెద్ద మైనస్ అయింది. అయితే యష్మితో కొన్ని సందర్భాల్లో ఫీలింగ్స్ పెట్టుకోవద్దన్నట్లు ఛూఛాయగా చెప్పినప్పటికీ అదంత హైలైట్ అవలేదు. ఫలితంగా 12వ వారం నామినేషన్స్‌లో సీత.. ఆడవారి ఎమోషన్స్‌తో ఆడుకుంటావ్ అని నిందేయడంతో నిఖిల్ చాలా హర్టయ్యాడు. ఆమెను జీవితంలో క్షమించనన్నాడు. ఆ బాధతో భోజనం కూడా తినకుండా నిద్రపోయాడు.నిఖిల్‌కు సింపతీబిగ్బాస్ హౌస్‌లో ఎవరినైనా టార్గెట్ చేస్తే ప్రేక్షకులు అస్సలు ఊరుకోరు. అతడిపై చాలా సింపథీ చూపిస్తారు.. అదీ ఓట్ల రూపంలో! ఈ నామినేషన్ ప్రక్రియతో నిఖిల్‌పై జనాల్లో సింపథీ వచ్చింది. పైగా నటి కావ్యతో ప్రేమస్టోరీ చెప్తూ.. తమ మధ్య దూరం వచ్చింది, కానీ ఈ జీవితానికి తనే భార్య అని ఏడ్చేయడంతో జనాలు తెగ కనెక్ట్ అయిపోయారు. నిఖిల్ ప్రేమ సఫలం కావాలని కోరుకున్నారు. అలా ఈ వారం నిఖిల్‌కు నెగెటివిటీ కంటే సింపథీయే ఎక్కువ వచ్చింది. దీంతో విన్నింగ్ రేస్‌లో గౌతమ్‌ను వెనక్కు నెట్టి మరీ ముందుకు దూసుకొచ్చేశాడు. మరి తర్వాతి వారాల్లో వీరిద్దరి గేమ్ ఎలా ఉంటుందో చూడాలి!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం'. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో మీరు చూసేద్దాం.మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..'ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మరో డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయింది. ఈ అవకాశమిచ్చిన అనిల్ రావిపూడి సార్‌కు థ్యాంక్స్.' అని అన్నారు.కాగా.. ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంచకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. నా 3 కోరికలలో ఒకటి ఈ సినిమాలో తీరింది - Actress #MeenakshiChaudhary#Venkatesh #AnilRavipudi @SVC_official #SankranthikiVasthunam #TeluguFilmNagar pic.twitter.com/aL1Bx7JERI— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2024 -
సంక్రాంతి బరిలో వెంకీమామ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న సంక్రాంతి వస్తున్నాం. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంటకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నా.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ENTERTAINMENT LOADED 😎FUN READY TO FIRE 🔥The Blockbuster combo of Victory @VenkyMama and Hit Machine Director @AnilRavipudi is all set for a VICTORIOUS HATTRICK this Sankranthi 💥💥💥#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.… pic.twitter.com/m0isUz0FdA— Sri Venkateswara Creations (@SVC_official) November 20, 2024 -
పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్
చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకోవడాన్ని మించిన బాధ మరొకటి లేదంటున్నాడు హీరో షారూఖ్ ఖాన్. ద గ్లోబల్ ఫ్రెయిట్ సమ్మిట్ వేదికలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. నా చిన్నతనంలోనే అమ్మానాన్న మరణించారు. నాన్న 14 ఏళ్ల వయసులో, అమ్మ 24 ఏళ్ల వయసులో చనిపోయారు. పదేళ్ల వ్యవధిలోనే ఇద్దర్నీ కోల్పోయాను. ఎక్కడికెళ్లాలో తెలియలేదు. పేరెంట్స్ కోసం కష్టపడ్డా..నాతో పాటు అక్క కూడా ఉంది. మా ఇద్దరినీ ఈ ప్రపంచంలో వదిలేసి పోయారు. ఆకాశంలోని నక్షత్రాల్లో కలిసిపోయారు. ఎప్పటికైనా ఆ నక్షత్రాల్ని అందుకోవాలనుకునేవాడిని. బహుశా అక్కడ కూడా వాళ్లు మా గురించి కంగారుపడేవారేమో! అందుకనే జీవితంలో సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడ్డాను. ఎక్కడున్నా నా పేరెంట్స్ బాధపడకూడదని ప్రయత్నించాను. చివరకు అనుకున్నది సాధించాను. గిల్టీగా ఫీల్ అయ్యేవాడినివాళ్లకన్నా ముందు నేను చనిపోయుంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నేను తిరిగి రాలేనన్న బాధలో నుంచి వారు బయటపడేవారు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ చివరగా డంకీ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి షారూఖ్ కూతురు సుహానా ఖాన్‌తో పాటు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.చదవండి: విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే? -
టాలీవుడ్ స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.2 వేల ఫోన్‌తోనే!
టాలీవుడ్లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్‌గా జీవించడమంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్‌కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024 -
హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. RAPO22 పేరుతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నవంబర్ 21న పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరో రామ్‌కు 22వ సినిమా ఇది.రామ్ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. అయితే, రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది.'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారు. నవంబర్ 21న పూజ జరిగిన తర్వాత ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల వెల్లడించనున్నారు. -
విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే?
బిగ్‌బాస్ ప్రతి సీజన్లో కెప్టెన్ అనే పదవి ఉండేది. ఈ పదవి పొందినవారు ఆ వారం నామినేషన్స్‌లోకి అడుగుపెట్టరు. అయితే ఈ సీజన్లో కెప్టెన్ పోస్టు ఉండదన్నాడు బిగ్‌బాస్.. కానీ అంతలో చీఫ్ అనే కొత్త పదవిని తీసుకొచ్చాడు. అయితే దీని ఉద్దేశం కూడా అదే! చీఫ్ అయినవారు ఆ వారం నామినేషన్స్‌లో ఉండరు. చివరి ఇమ్యూనిటీ ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో నిఖిల్, యష్మి, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, గౌతమ్, నబీల్ అంతా కూడా ఒకసారి చీఫ్ అయినవాళ్లే! తేజ, రోహిణి, పృథ్వీలకే ఇంతవరకు ఆ అవకాశం దక్కలేదు. ఇకపోతే బిగ్‌బాస్ తాజాగా హౌస్‌లో చీఫ్ పదవి కోసం పోటీపెట్టాడు. అయితే ఇది ఈ సీజన్లోనే చివరి చీఫ్ పోస్ట్ అని ప్రకటించాడు. దాంతో ఎలాగైనా దాన్ని గెలిచి ఒక్క వారమైనా ఇమ్యూనిటీ అందుకోవాలని కంటెస్టెంట్లు తెగ తహతహలాడారు.చీఫ్‌గా రోహిణి!బిగ్‌బాస్ సమయానుసారం టీషర్టు విసిరేస్తుంటాడు. తమ టీషర్ట్‌ను ఎవరైతే కాపాడుకుని బొమ్మకు తగిలిస్తారో వారే విజేతలుగా నిలుస్తారన్నాడు. ఈ గేమ్‌లో యష్మి, విష్ణుకు గొడవైనట్లు తెలుస్తోంది. యష్మి, రోహిణి, పృథ్వీ, విష్ణు, తేజ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. హౌస్మేట్స్ మద్దతుతో రోహిణి చీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలాగో నామినేషన్స్‌లో లేదు, వచ్చేవారం చీఫ్ పోస్టుతో మరోసారి సేవ్ అయిపోయింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చైనాలో 'మహారాజ' విడుదల.. ఇదే జరిగితే రూ. 500 కోట్లు..!
విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమా 'మహారాజ' ఇప్పుడు చైనాలో విడుదల కానుంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో రిలీజ్‌కు రెడీ అయింది.ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజ చిత్రం.. ఇప్పుడు చైనాలో ఏకంగా 40వేల స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. నవంబర్ 29న యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. ఈ మూవీలోని సెంట్మెంట్కు చైనా సినీ అభిమానులు కనెక్ట్ అయితే భారీగా కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కనీసం అక్కడ రెండు వారాలపాటు థియేటర్లో సినిమా రన్ అయితే సుమారు రూ. 500 కోట్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మహారాజా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మంచి ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలిన్ సామినాథన్ అద్భుతంగా ప్రేక్షకులకు చూపించాడు. ఒక ఇండియన్ సినిమా చైనాలో ఇంత పెద్ద ఎత్తున విడుదల కానున్నడంతో అభిమానులు హర్షిస్తున్నారు. ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కావడం ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకూ ఈ రికార్డ్ దక్కలేదు. -
మూడు వారాల్లోనే ఓటీటీకి భారీ బడ్జెట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. డాక్టర్. సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఫుల్ యాక్షన్ మూవీగా వచ్చి బఘీరా ఓటీటీ ప్రియులను ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే. Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024 -
రవితేజ వారసుడి మూవీ.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న మూవీ "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్, ఎల్ఎల్ పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ కొట్టిన దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి వస్సాహి వస్సాహి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. యాక్టర్ శివాజీ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. ఇంతవరకు సంస్కృత భాషలో ఏ పాట రాలేదని శివాజీ అన్నారు. హీరో మాధవ్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.కాగా.. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. లిరిక్ రైటర్ శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీరామచంద్ర పాడారు. 'సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా...వస్సాహి వస్సాహి' అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్. ఈ చిత్రంలో జయప్రకాష్, ఆచంట మహేశ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కాశీ విశ్వనాథ్, హిమజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రామచ్‌రణ్‌పై విమర్శలు.. స్పందించిన ఉపాసన
మెగాహీరో రామ్‌చరణ్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. అక్కడ 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజుల క్రితం నుంచి స్వామి మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లడంతో పలువురు విమర్శించారు. కానీ, కొందరైతే అందులో తప్పేముందని చరణ్‌కు సపోర్ట్‌గా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.రామ్‌చరణ్‌పై విమర్శులు చేయడాన్ని ఉపాసన తప్పపట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్ ఫోటోను షేర్ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించారు. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె తెలిపారు. దేవుడిపై విశ్వాసం ఉంటే అందరినీ ఏకం చేస్తుందని ఆమె చెప్పారు. 'భక్తి ఎవరినీ చిన్నాభిన్నం చేయదు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మన బలం ఉంది. వన్ నేషన్.. వన్ స్పిరిట్' అని తెలిపారు.రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కడప దర్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో వారిద్దరూ కలిసి కొత్త సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌గా వారు అక్కడకు వచ్చారు. గతంలో మగధీర విడుదల సమయంలో కూడా చరణ్ దర్గాను సందర్శించి అక్కడి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సినిమా చరణ్ కెరిర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. దీంతో కడప దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చరణ్ పేర్కొన్నారు. జనవరి 10న శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. -
అమరన్ సక్సెస్.. స్వయంగా బిర్యానీ వడ్డించిన హీరో!
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అమరన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలై మూడు వారాలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్ మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్కే23 వర్కింగ్ టైటిల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అమరన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. షూటింగ్ సెట్లోనే ఈ వేడుకలు చేసుకున్నారు.అనంతరం మూవీ సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు. హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం కీలక పాత్రలు పోషించారు. #Sivakarthikeyan served Biryani to #SK23 crew members on celebrating #Amaran Blockbuster success ❤️🔥❤️🔥pic.twitter.com/uAzB5PbXqh— AmuthaBharathi (@CinemaWithAB) November 19, 2024