breaking news
Parvathipuram Manyam
-
కలెక్టర్ x ఎమ్మెల్యే
సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర నడుమ తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎప్పటి నుంచో ఇరువురి మధ్య అంతర్గతంగా సాగుతున్న విభేదాలు.. జిల్లా మంత్రి సమక్షంలోనే ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పెద్ద కేకలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఐఏఎస్ అధికారి అన్న కనీస మర్యాద మరిచి, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్‌చంద్ర.. కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆరోపణలకు దిగారు. వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ, జిల్లా అధికారుల ముందటే ఆయన్ను అగౌరవపరిచారు. దీన్ని కలెక్టర్ ప్రభాకరరెడ్డి దీటుగా తిప్పికొట్టారు. మైకు ఉందని ఇష్టానుసారం మాట్లాడవద్దని హెచ్చరించారు. జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై బుధవారం పార్వతీపురం మన్యం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పాలకొండ, పార్వతీపురం ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, బోనెల విజయ్‌చంద్రతో పాటు.. కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఇతర జిల్లా అధికారులంతా హాజరయ్యారు. వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య, అటవీ, ఉద్యానవన, మహిళా సంక్షేమం, గిరిజన, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో బలిజిపేట మండలం పెదపెంకి రోడ్ల కాంట్రాక్టు విషయంలో ఎమ్మెల్యే విజయ్‌చంద్ర లేవనెత్తారు. డ్రైనేజీ, ఆక్రమణల తొలగింపు వ్యవహారంతో పాటు.. కాంట్రాక్టరును మార్చడంపైనా ప్రశ్నించారు. అధికారుల తీరును.. ముఖ్యంగా కలెక్టరు ప్రభాకరరెడ్డి వైఖరిని తప్పుపట్టారు. ఈ అంశాన్ని కలెక్టరు తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు చేయడం సరైంది కాదని బదులిచ్చారు. నిబంధనలు, చట్టం ప్రకారం తాము కూడా పని చేస్తామని స్పష్టం చేశారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే.. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అధికారులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. శ్రీమీకు ఏమైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో, లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించండి. రోడ్డును ఆక్రమించకుంటే కొట్టకూడదు. చెరువును కబ్జా చేస్తే తొలగించకూడదు. వారికి మీరే హామీ ఇచ్చేస్తారు. తిరిగి మమ్మల్నే అంటారు. మేం చట్టప్రకారం చేస్తున్నామా, లేదా? చట్ట ప్రకారం పని చేస్తున్నామా, లేదా? వ్యక్తిగత అంశాలను ఇక్కడ తీసుకురాకూడదు. అధికారుల మీద ఎప్పుడూ పడతారెందుకు?శ్రీ అంటూ కలెక్టరు గట్టిగా సమాధానమిచ్చారు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన మంత్రి సంధ్యారాణి సముదాయించే ప్రయత్నం చేశారు. శ్రీఒక కలెక్టరు, ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం సరికాదు. ఇక్కడ ఒక మంత్రి ఉన్నా.. చూడరా? మీకు ఏమైనా సమస్యలుంటే ఛాంబరులో కూర్చొని ఇలాంటివి మాట్లాడుకోండి.శ్రీ అని హితవు పలికారు. లేనిపోని వార్తలు ప్రసారం చేసే దుర్మార్గులుంటారు జాగ్రత్త : కలెక్టర్ ఈ వివాదం సద్దుమణిగాక, జిల్లా అధికారులనుద్దేశించి మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలోనే కలెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేమ్ చేద్దామని, దాని ద్వారా తృప్తి చెందుదామని, ఇష్టానుసారం మీడియా ద్వారా వార్తలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సబ్బు వార్తలు రాయించుకుని, తనను బ్లేమ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని తెలిపారు. ‘ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోలు, ఆడియోలు చేయడం, ఆడియో రికార్డులు, లేనిపోనివి ప్రచారం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు దుర్మార్గులు. ఫేక్ న్యూస్ అయితే ఫేక్ అని ఖండించండి. సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై సీరియస్ యాక్షన్ ఉంటుంది. సైబర్ క్రైం కూడా ఉంది. మీ శాఖల పరంగా ఏ విధంగా ప్రభుత్వంపై చెడ్డ పేరు వచ్చినా సహించవద్దు. ఫేక్ న్యూస్ ఏ రకంగా వచ్చినా ఊరుకునేది లేదు. ఖండించండి.’ అని అధికారులకు సూచించారు. ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే విజయ్‌చంద్రను ఉద్దేశించే కలెక్టర్ చేశారని అర్థమవుతోంది. రోడ్డు పనుల జాప్యంపై మంత్రి ఆగ్రహం రోడ్డు పనుల జాప్యంపై మంత్రి సంధ్యారాణి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రతి 15 రోజులకోసారి చెబుతున్నానని, అయినా పట్టించుకోరా? అని అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తరా్వాత టెండరు అయిన సాలూరు–మక్కువ రోడ్డు తన నియోజకవర్గంలో ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కాంట్రాక్టర్లతో ఎందుకు మొహమాటమని ప్రశ్నించారు. బాగువలస నుంచి మక్కువ రహదారిని నేటికీ ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కలెక్టరుకు సూచించారు. ఏ రోడ్డు అయినా ఏడాది దాటినా ప్రారంభించకపోతే టెండరును రద్దు చేయాలని స్పష్టం చేశారు. మంత్రి సమక్షంలోనే తీవ్ర వాగ్వాదం వ్యక్తిగత అంశాలతో కలెక్టర్‌ను ఇరికించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే విజయ్‌చంద్ర గట్టిగా బదులిచ్చిన కలెక్టర్ చట్టప్రకారం చర్య తీసుకుంటే అడ్డుపడతారా? మైకు ఉందని ఇష్టానుసారం మాట్లాడవద్దని ఎమ్మెల్యేను హెచ్చరించిన కలెక్టర్ -
పోస్టుల్లేవ్!
సొమ్ములిచ్చేశారు..సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి గత ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ప్రకటనలో మొత్తం 258 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మే నెల 21, 22వ తేదీల్లో అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. నాలుగు నెలలు గడిచినా నేటికీ నియామకాలు పూర్తి చేయలేదు. మధ్యలో ఓసారి అంగన్వాడీ సహాయకుల పోస్టు లను భర్తీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ఎంపికై న వారికి ఫోన్ ద్వారా సమాచారం కూడా అందించారు. మరుసటి రోజు వచ్చి, ప్రజాప్రతినిధుల ద్వారా నియామకాలు అందుకోవాలని తెలిపారు. ఈలోగా తాము సూచించిన కొంతమందికి పోస్టులు రాకపోవడంతో అధికార పార్టీ నాయకులు కొర్రీ పెట్టారు. అంతే... పోస్టుల్లేవ్, గీస్టుల్లేవ్.. తూచ్! అంటూ నియామక పత్రాల జారీ ప్రక్రియను నిలుపుదల చేశారు. అప్పటి నుంచి అసలు పోస్టులు తీస్తారా, తీయరా? అన్న సందేహాలు దరఖాస్తుదారుల్లో రోజురోజుకూ అధికమవుతున్నాయి.జాబితా ఎందుకు బయటపెట్టడం లేదు..? మౌఖిక పరీక్షలు ముగిసినప్పటికీ నియామక జాబితా ఎందుకు బయటపెట్టడం లేదు. నెలలు గడుస్తున్నాయి. అర్హులైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తక్షణమే మెరిట్ జాబితాను విడుదల చేయాలి. ఈ పోస్టుల నియామకాల్లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. దీనిపై అధికారులే స్పష్టత ఇవ్వాలి. – కె.సాంబమూర్తి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఏం జరుగుతోందో తెలియక..! అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సయోధ్య కుదరకనే పోస్టుల భర్తీ నిలిచిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ నోటిఫికేషన్ వెలువడింది మొదలు.. పోస్టులను దక్కించుకునేందుకు పలువురు అభ్యర్థులు అధికార పార్టీ నాయకులను ఆశ్రయించారు. అడిగినంత మొత్తంలో రూ.లక్షల్లో డబ్బులిచ్చేశారు. ఇంటర్వ్యూలు కూడా అయిపోయాయి.. పోస్టుల్లో చేరిపోవడమే తరువాయి.. అన్న సంతోషంతో చాలామంది ఉన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు ఉద్యోగుల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులిచ్చి, ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో చాలామందికి కనీస పరిజ్ఞానం కూడా లేనట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క పోస్టుకూ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు రావడంతో, అర్హులు నష్టపోవడం ఒకటైతే, తీవ్ర విమర్శలు వస్తాయన్న ఆలోచనతో జిల్లా ఉన్నతాధికారి ఈ జాబితాను పక్కన పెట్టేసినట్లు వినిపిస్తోంది. నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఒక్క కొలిక్కి రాకపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. డబ్బులిచ్చిన వారి పరిస్థితి ఏమిటి? ఉన్న ఊరిలో పోస్టులు దక్కుతాయన్న ఆశతో ప్రజాప్రతినిధులకు చాలామంది అభ్యర్థులు రూ.లక్షల్లో ముట్టుజెప్పినట్లు తెలుస్తోంది. నెలలు గడుస్తున్నా.. ఉద్యోగాల్లేవు. డబ్బులూ రావు! నియామక ప్రకటన కోసం ఆశావహులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పోస్టులు రాకపోతే తమ డబ్బులైనా ఇచ్చేయాలని ఛోటా నాయకుల చుట్టూ పలువురు అభ్యర్థులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. లేకుంటే, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకై నా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. అంగన్వాడీ పోస్టుల నియామకాలపై సందేహాలు ఇప్పటికే ఛోటా నేతలకు డబ్బులిచ్చేసిన అభ్యర్థుల్లో ఆందోళన తమ నగదు వెనక్కి ఇచ్చేయాలని ఒత్తిడి? -
చైతన్యంతోనే రజకుల అభివృద్ధి సాధ్యం
● రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి విజయనగరం క్రైమ్: చైతన్యంతోనే రజకుల అభివృద్ధి సాధ్యమని ఏపీ రజక అభివృద్ధి,సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి అన్నారు. ఈ మేరకు బుధవారం ఊటగడ్డ చాకిరేవులో రజక సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రజక సంక్షేమ అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మాట్లాడుతూ తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న రజకుల సంక్షేమం, అభివృద్ధి చైతన్యం పొందడం ద్వారా మాత్రమే.సాధ్యమని ఉద్బోధించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రజకుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయని సరైన చైతన్యం లేక వాటిని రజకులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, క్షేత్రస్థాయిలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో వారిని చైతన్యం చేసే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నామని తెలిపారు రజకులు సంఘ చైతన్యంతో తమ హక్కులను కాపాడుకోవడానికి ముందుకు రావాలని అందుకు తమ అండదండలు అందిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు గురజాపు సత్యారావు కెల్లసత్యం. మద్ది పైడిరాజు తామాడ అచ్చన్న రాయవలస వెంకటరమణ గోవింద్ వెల్దుర్తి నాగరాజు జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యులు. జొన్నాడశ్రీనివాస రావు కొత్తకోట శ్రీనివాసరావు, తాళ్ల,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో బుధవారం ఆమె ఉదయం 8గంటల నుంచి 10:30 వరకు పుల్లయ్య కోనేరు. రోళ్లవాక. గజపతినగరం. దోబీ ఘాట్లను పరిశీలించి రజకులతో చర్చించారు. వినతి పత్రాలు స్వీకరించారు అకస్మాత్తుగా మృతిచెందిన వెల్దుర్తి గౌరినాయుడు, కందివలస ఉమామహేశ్వరరావు కుటుంబాలను. పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేవిధంగా చూస్తామని పేర్కొన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి విజయనగరం: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని జిల్లా రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తంగేటి భాస్కరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్పర్సన్ సావిత్రికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హమీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్యపై ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హమీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రజకులకు న్యాయం చేసి ఆర్ధికంగా, సామాజికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి జంప చిన్న, ఉపాధ్యక్షుడు శీల తాతారావు, నగర గౌరవ అధ్యక్షుడు ఈశ్వరరావు, పైడి చిట్టి, అప్పలరాజు, సతీష్, సింహాచలం, శ్రీను, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
హ్యూమన్ రైట్స్ రాష్ట్ర డైరెక్టర్‌గా అదృష్టకుమార్
బొబ్బిలి: పట్ట ణానికి చెందిన కె.అదృష్ట కుమార్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలే నియామక సమాచారం అందుకున్న అదృష్ట కుమార్ బుధవారం కాకినాడలోని జేఎన్టీయూ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు టి. ప్రసన్నకుమార్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర డైరెక్టర్‌గా నియామకమైన అదృష్టకుమార్ను ఈ సందర్భంగా పట్టణ వాసులు అభినందిస్తున్నారు. సమర్ధవంతమైన చర్యలతో నేరాల తగ్గుముఖంవిజయనగరం టౌన్: జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న పటిష్టమైన భద్రత చర్యలు, సమర్థవంతమైన పోలీసింగ్‌తో గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్‌కి సంబంధించి గతేడాది 304 కేసులు నమోదుకాగా, ఈ ఏడాదిలో 217 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. క్రైమ్ ఎగినెస్ట్ చిల్డ్రన్‌కి సంబంధించి పోక్సో కేసులు గత ఏడాది 44 నమోదు కాగా, ఈ ఏడాదిలో 20 కేసులు నమోదయ్యాయన్నారు. క్రైమ్ ఎ గినెస్ట్ ఉమెన్ కేసుల్లో 31 క్రైమ్, ఎగినెస్ట్ చిల్డ్రన్ కేసుల్లో 36, మొత్తం 67 కేసుల్లో నిందితులకు న్యాయస్ధానాల్లో శిక్షలు పడ్డాయని తెలిపారు. గంజాయి కేసుల్లో గతేడాది 78 కేసులు నమోదు చేసి 1147.856 కిలోల గంజాయిని సీజ్ చేసి, 246 మందిని అరెస్టు చేసి, 35 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ ఏడాదిలో 23 కేసులు మాత్రమే నమోదుకావడం, 655.225 కిలోల గంజాయి సీజ్ చేసి, 118 మందిని అరెస్ట్ చేసి, 25 వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. రహదారి ప్రమాదాల్లో ఈ ఏడాది ఇప్పటివరకూ 350 రహదారి ప్రమాదాలు జరిగి, 137 మంది మరణించగా, 444 మంది గాయపడ్డారన్నారు. గతేడాది కంటే రహదారి ప్రమాదాలు 15.5శాతం తగ్గాయని వివరించారు. రెవెన్యూ రికార్డుల మార్పుపై ఫిర్యాదు పూసపాటిరేగ: మండలంలోని కొల్లాయివలసకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ ఎన్వీ రమణను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 76–1లో భూములు మార్పు చేశారని దువ్వు అప్పలస్వామితో పాటు పలువురు తెలిపారు. దీనిపై తహసీల్దార్ రమణ స్పందిస్తూ విచారణ చేసి హక్కుదారుల పేర్లు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎంవీజీ శంకరరావు, నర్సన్న, తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి● గరివిడి ఆర్ఓబీ సమీపంలో ప్రమాదం చీపురుపల్లిరూరల్(గరివిడి): విజయనగరం–పాలకొండ ప్రదాన రహదారిలో గరివిడి ఆర్ఓబీ సమీపంలో పెట్రోల్‌బంకు ఎదురుగా బుధవారం ఉదయం ఓ బైక్‌ను లారీ ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్ల మండలానికి చెందిన ద్విచక్రవాహనదారు బోడసింగి లక్ష్మణరావు(37) సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదానికి సంబంధించి గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఉదయం 11గంటల సమయంలో విజయనగరం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న లారీడ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గుర్ల మండలంలోని కొండగండ్రేడు గ్రామానికి చెందిన బోడసింగి లక్ష్మణరావు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడికి భార్యతో పాటు డిగ్రీ చదువుతున్న కూతురు నీలిమ, ఏడో తరగతి చదువుతున్న బాలుడు యుగంధర్ ఉన్నారు. చిన్నపాటి వ్యవసాయం, కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. -
విద్యుత్ బస్సుల ముసుగులో ఆర్టీసీ ఆస్తుల పంపకం
పార్వతీపురం రూరల్: కార్మికుల చెమట చుక్కలతో ఏర్పాటైన ఆర్టీసీని ప్రైవేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్రలను ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.రాములు పిలుపునిచ్చారు. పార్వతీపురం డిపో వద్ద బుధవారం ఎస్‌డబ్ల్యూఎఫ్ 48వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఉద్యోగి ఎస్వీ రమణ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపో కార్యదర్శి ఏఎస్టీ బాబు అధ్యక్షతన జరిగిన సభలో రాములు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధనకు ఎస్‌డబ్ల్యూఎఫ్ దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. పినాకిల్ కంపెనీ పేరుతో యాజమాన్యం విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీ ఆస్తులను అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు సన్నాహాలు ఈ ప్రైవేటీకరణకు అద్దం పడుతున్నాయన్నారు. ఆర్టీసీ సిబ్బందితోనే బస్సులు నడిపేలా జేఏసీ ఆధ్వర్యంలో పోరాడి సాధించినప్పటికీ, పినాకిల్ కంపెనీ డిపోలను పరోక్షంగా స్వాధీనం చేసుకునే యోచనలో ఉందన్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలని ఉద్ఘాటించారు. కార్మికులు అప్రమత్తంగా ఉండి, హక్కుల సాధనకు ముందడుగు వేయాలని సీఐటీయూ నాయకులు సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డి వేణు, ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, నాయకులు బి.సూరిబాబు, టి.వెంకటి, ఎంవీఏ నాయుడు, ఎస్ఏ రాజు, బీఎస్ రావు, జీఎస్ రావు, జీకే రావు, కేఈ నాయుడు, ఆర్వీ రావు తదితరులు పాల్గొన్నారు. ఐక్య పోరాటాలతో ప్రైవేటీకరణను అడ్డుకోవాలి ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భావ సభలో రాష్ట్ర కార్యదర్శి రాములు -
సమష్టిగా పని చేసి విజయం సాధిద్దాం
సాలూరు రూరల్: రానున్న స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పని చేసి వైఎస్సార్సీపీ విజయం సాధించేలా కృషి చేద్దామని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గత జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు మళ్లీ గుర్తు చేస్తూ ఓటు అడగాలని, ఓటరుగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో పట్టణ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందన్నారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3000 ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించిందని, కానీ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకం ఉందన్నారు. మంత్రికి కక్ష సాధింపులే తప్ప హామీలు గుర్తుండవు.. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి కక్ష సాధింపులే తప్ప ఇచ్చిన హామీలు గుర్తుకు రావని రాజన్నదొర ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో చిరుద్యోగులపై కక్ష సాధించిన తీరు ప్రజల్లో గుర్తుందన్నారు. దళిత, గిరిజన మహిళలని చూడకుండా అన్ని వర్గాల వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడున్నారన్నారు. ఈ తరుణంలో మంత్రి సంధ్యారాణి తీరుపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. తన ఎమ్మెల్యే పదవీ కాలంలో ఏ ఒక్క ఉద్యోగిని ఇబ్బందులకు గురి చేయలేదన్నారు. మంత్రి అయిన వెంటనే పట్టణంలో మరుగుదొడ్లుపై మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడిన మంత్రి ఇప్పుడు ఉన్న మరుగుదొడ్లును పూడ్చేస్తున్నారే తప్ప వాటిని బాగు చేసిన దాఖలాలే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు మహిళల ఆత్మగౌరవం గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటు అడగడమే కాదు.. అండగా నిలవాలి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. గత ప్రభుత్వంలో సంక్షేమం ప్రజలకు గుర్తు చేయాలి మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం
ఈనెల 29న ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పా ట్లు చేస్తున్నాం. అలాగే ఈ ఎన్ని కలను పర్యవేక్షించేందుకు అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నాం. నోటిఫికేషన్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతాం. ప్రశాంత వాతావరణంలో ఎస్ఎంసీ ఎన్నికలు జరిగేలా తల్లిదండ్రులు తమ సహకారాన్ని అందించేలా అవగాహన కల్పిస్తాం. ప్రైవేటు పాఠశాల్లో కూడా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడతాం. పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా -
ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలి
● ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య విజయనగరం: ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ సమీపంలో రెవెన్యూ భవన్లో ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీ్త్రశక్తి పథకం మరింత విజయవంతం కావాలంటే భవిష్యత్‌లో రాబోయే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొని నిర్వహించడం ద్వారా సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో యాజమాన్యంతో చర్చలు జరిపి, ఉద్యోగులకు భద్రతతో పాటు భరోసా కల్పించేలా పలు అంశాలపై ఒప్పందాలు సాధించామని తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత, సంక్షేమం, పదోన్నతులు, ఖాళీల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు, విద్యుత్ బస్సుల విషయంలో ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జేఏసీ చేసిన పోరాటాల ఫలితంగానే పలు అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ సమావేశంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి డి.అరుణ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని, యూనియన్లకు అతీతంగా ఉద్యోగుల ప్రయోజనాల కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం యూనియన్ చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. సమావేశంలో కె.కృష్ణారావు, ఎల్ఏరావు, కేవీ రమణ, యుఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ పోలీస్..!
● రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసుల ప్రతిభవిజయనగరం టౌన్: రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన రాష్ట్రస్ధాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్, డ్యూటీమీట్‌లో విశాఖ రేంజ్ తరఫున జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పతకాలు సాధించారు. ఈ మేరకు ఎస్పీ ఏఆర్.దామోదర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పతకాలు సాధించిన పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్లో రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్, డ్యూటీమీట్లను ఇటీవల నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, విశేష ప్రతిభ కనబర్చారన్నారు. జిల్లా పోలీసు శాఖకు చెందిన 34 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడా పోటీల్లో విశాఖ రేంజ్ తరఫున పాల్గొని 35 గోల్డ్ మెడల్స్, 18 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్‌తో సహా 66 పతకాలను సాధించి, రాష్ట్రస్ధాయిలో విశాఖ రేంజ్ ఆల్ రౌండర్ చాంపియన్ షిప్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అదేవిధంగా పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో కూడా జిల్లా పోలీసుశాఖకు చెందిన 8 మంది 4 గోల్డ్ మెడల్స్ , 3 సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ సహా 8 మెడల్స్‌ను రాష్ట్రస్ధాయిలో సాధించారని చెప్పారు. మెడల్స్ సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి, వారి క్రీడాప్రతిభను, వృత్తి నైపుణ్యాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ. లీలారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
ఉన్నవి అవస్థలే!
మ్యాజిక్ లేదు.. మంత్రం లేదు...● ఈ చిత్రంలోని వ్యక్తి పేరు పెంకి నారాయణ. పెదపెంకి గ్రామంలోని ప్రధాన రోడ్డులో నివసిస్తున్నాడు. కాలువల కోసమని వీరి ఇంటి ముందు చాలా రోజుల క్రితమే గొయ్యిలు తవ్వేసి వదిలేశారు. ఇంటికి వెళ్లడానికి మార్గం కూడా లేకుండా చేసేశారు. అక్కడ నీరు నిల్వ ఉండిపోతోంది. ఇసుక, సిమెంట్ బస్తాలనే మెట్ల మార్గంగా చేసుకున్నామని.. బాగున్న ఊరిని నాశనం చేసి వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.గ్రామమంతా ఇళ్ల ముందు మెట్లు కొట్టేయడంతో ఇటువంటి దృశ్యాలే..సాక్షి, పార్వతీపురం మన్యం: బలిజిపేట మండలం పెదపెంకి గ్రామాన్ని బోధవ్యాధి ఎన్నో ఏళ్లుగా వేధిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం దోమలు, పారిశుధ్య లోపమని గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. గ్రామాన్ని దత్తత తీసుకుని దాదాపు రూ.6 కోట్లకుపైగా నిధులు మంజూరు చేయించారు. ఊరంతా సిమెంట్ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీబీ జీ రామ్‌జీ పథకం కింద గ్రామంలో 66 సీసీ రహదారులు 79 మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. మూడు, నాలుగు నెలల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. రెండు, మూడుసార్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ప్రారంభోత్సవానికి సన్నాహాలు కూడా అధికారులు చేసేశారు. ఇక్కడ పనులపై నివేదిక తెప్పించుకున్న ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే కాదు.. గ్రామస్తులు సైతం పనుల పట్ల కోపోద్రిక్తులవుతున్నారు. అధికారులు ఊరిలో అడుగు పెడితే చాలు.. దుమ్మెత్తి పోస్తున్నారు. ఆనందం లేదు.. మిగిలిందంతా గొయ్యిలు, రాళ్లే! గ్రామమంతా సీసీ కాలువలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తామని అధికారులు చెప్పడంతో ప్రజలంతా సంతోషించారు. మ్యాజిక్ డ్రైన్ల ద్వారా ఎక్కడికక్కడ గోతుల్లో నీరు ఇంకిపోతుందంటే ఆనందించారు. తీరా అస్తవ్యస్త పనులు గ్రామస్తులకు నరకం చూపిస్తున్నాయి. రాజకీయ ప్రమేయంతో కాంట్రాక్టర్లు మారి, అడ్డుసుడి పనులు చేశారు. వీధులు పొడువునా ఇళ్ల ముందు కాలువల కోసం మెట్లు తవ్వి వదిలేసిన గొయ్యిలే. తలుపులు, చెక్కలను రహదారి మార్గంగా ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. కాలువల్లో ఇసుక, చిప్స్, చిన్న రాళ్లు మూడు దశల్లో వేసి, కొన్ని చోట్ల ఇంకుడు గుంతల మాదిరి గోతులు తీశారు. వర్షం, వాడుక నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోవడం దీన్ని ప్రధాన ఉద్దేశం. పనుల కాంట్రాక్టుల కోసం ప్రజాప్రతినిధుల స్వార్థం, అరకొర.. అస్తవ్యస్త పనులు, అధికారుల అలసత్వం, స్థానికుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం కొరవడటంతో కొత్త ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయి. అడుగు పెట్టలేని దుస్థితి కాలువలు, రోడ్లు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇటీవల వేసిన మ్యాజిక్ డ్రైన్ల నుంచి వర్షం నీరు ఇంకకపోగా.. రోజుల తరబడి నిల్వ ఉండి, రహదారులపైకి వస్తోంది. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ డ్రైన్లను అధికారులు మరలా తవ్వేశారు. కాపువీధి, ఎస్సీవీధి, కూరాకులవీధి, దత్తివీధి, ప్రధాన రహదారి, బంకురువీధి, వెలమవీధి.. ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. భారీ గోతులు, పిక్క, ఇసుక నిల్వలు, రాళ్లతో నిండిన రహదారులు.. ఇవే దృశ్యాలు ఊరంతా కనిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లు దిగువకు ఉండటం వల్ల వర్షం కురిసిందంటే చాలు.. కాలువలు, రహదారిపై నీరంతా వారి ఇళ్లల్లోకి చేరుతోంది. వాటిని తోడుకుంటూ రాత్రంతా జాగారమే అవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటి వరకు చేసిన పనుల వల్ల రూ.కోట్ల నిధులు బుగ్గిపాలు అయ్యాయని గ్రామస్తులు వాపోతున్నారు. తిట్టిపోస్తున్న పెదపెంకి వాసులు మ్యాజిక్ డ్రెయిన్ల పేరిట ఊరంతా ఎక్కడికక్కడ సమస్యలు నెలలు గడుస్తున్నా తీరని ఇబ్బందులు -
వివాహేతర సంబంధం.. అంతులేని విషాదం
● నడిపల్లి మహిళ హత్యకేసు ఛేదించిన పోలీస్‌శాఖ ● నిందితుడి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం టౌన్: వివాహేతర సంబంధాలతో కుటుంబాలు ఛిన్నాభిన్నమై, అంతులేని విషాదం మిగులుతుందని వాటి జోలికి పోవద్దని ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. జీవితాలను నాశనం చేసే వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలని, మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తే, వాటిని తిప్పికొట్టాలని సూచించారు. కుటుంబ వ్యవస్ధతో పాటు చిన్నారులు దిక్కూముక్కూ లేనివారవుతారని, ప్రతి ఒక్కరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి గ్రామంలో జరిగిన హత్య ఉదంతంపై ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అనుమానం..పెనుభూతమై.. పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న శీల అప్పారావు..తన భార్య రమ (37) కనిపించడం లేదని పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం రమ మృతదేహం లభించడంతో మిస్సింగ్ కేసు కాస్త హత్యకేసుగా మార్చి ఉమెన్ పీఎస్ డీఎస్పీ పీవీవీ నరసింహరావు, ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు గురైన రమకు హత్యకు పాల్పడిన నిందితుడు 28 ఏళ్ల లంకలపల్లి బంగారుబాబు మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. గత నాలుగు నెలలుగా రమ తన ప్రియుడు బంగారుబాబును దూరం పెట్టడం, బంగారుబాబు ఫోన్‌కాల్స్‌కు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె వేరెవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెంచుకుని, ఆమైపె కక్ష పెంచుకున్నాడు. నిందితుడు ఈ నెల 14న 11 గంటల ప్రాంతంలో రమకు ఫోన్ చేయగా ఆమె కొద్ది సమయం మాత్రమే ఫోన్ మాట్లాడి పెట్టేసింది. అనంతరం మధ్యాహ్న సమయంలో మరోసారి ప్రియుడు ఫోన్ చేయడంతో ఇంట్లో ఎవరూ లేరని, తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని, మాట్లాడుకుందామని ఇంటికి రమ్మని చెప్పడంతో, ప్రియుడి మాటలు నమ్మి రమ వారింటికి వెళ్లింది. వివాహేతర సంబంధాన్ని తనతో కొనసాగించకపోతే విషయాన్ని భర్తకు చెప్పేస్తామని ఆమెను బెదిరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బంగారుబాబు ఆమె ముక్కు, నోరుపై దిండును పెట్టి, ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం గోనె సంచిలో ఆమె శవాన్ని దాచిపెట్టి, మోటారు సైకిల్ ముందు పెట్టుకుని, సారిపల్లి కొండ సమీపంలోకి తీసుకుని వెళ్లి పడేశాడు. దర్యాప్తులో భాగంగా లంకలపల్లి బంగారుబాబుపై అనుమానంతో దర్యాప్తు అధికారులు సాంకేతికను వినియోగించి ఆధారాలు సేకరించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేయగా, నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నేరస్థలాన్ని క్షుణ్ణంగా క్లూస్ టీమ్ సహకారంతో పరిశీలించి, సాంకేతిక, శాసీ్త్రయ ఆధారాలు సేకరించామని ఎస్పీ వివరించారు. రమ మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్ సైకిల్, నిందితుడు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో సీజ్ చేశామన్నారు. కేసులో దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి, న్యాయస్ధానంలో నిందితుడిపై త్వరలో అభియోగపత్రం దాఖలు చేసి, నిందితుడ్ని శిక్షించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్సై అరుణ్ కిరణ్, కానిస్టేబుల్స్ సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు ఎస్.రాఘవులు, పీవీవీ.నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ .లీలారావు, పూసపాటిరేగ ఎస్సై అరుణ్‌కిరణ్, నెల్లిమర్ల ఎస్సై గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ మన్యం పోలీస్‌పై ఎస్పీ సమీక్ష
పార్వతీపురం రూరల్: ప్రజల చెంతకే రక్షకభటులు చేరి, వారి కష్టసుఖాలు తెలుసుకునేలా పార్వతీపురం మన్యం జిల్లాలో చేపట్టిన ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకూ తీసుకెళ్లాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన జూమ్ వేదికగా వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వృత్తిని కేవలం విధి నిర్వహణగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలన్నారు. ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా ఆప్యాయంగా పలకరిస్తూ వాడవాడలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని సూచించారు. ప్రతి ఒక్క సిబ్బంది తమకు కేటాయించిన దత్తత గ్రామాల్లోని ప్రతీ ఇంటినీ సందర్శించి, క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సున్నిత అంశాలపై ముందస్తు సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని స్పష్టం చేశారు. దత్తత గ్రామంలో ‘విలేజ్ పోలీస్’గా చెరగని ముద్ర వేసుకోవాలని, మీ రక్షణ కోసమే మేమన్న భరోసాను కల్పించాలన్నారు. -
ఆండ్ర రిజర్వాయర్ భద్రతపై తనిఖీ
● పరిశీలించిన ఐపీఈఓ బృందం ● నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక అందజేస్తామని వెల్లడిమెంటాడ: ఆండ్ర జలాశయ డ్యామ్ భద్రతా అంశంపై స్వతంత్ర నిపుణుల ప్యానెల్ (ఐపీఈఓ) సభ్యులు బుధవారం విస్తృతంగా పరిశీలించారు. తనిఖీల అనంతరం ప్యానెల్ చైర్మన్, రిటైర్డు చీఫ్ ఇంజినీర్ పోలేశ్వరరావు, సభ్యులు (రిటైర్డు చీఫ్ ఇంజినీర్లు) ఎం.టి.రాజు, చిట్టిబాబులతో కలసి మీడియాతో మాట్లాడారు. ఆండ్ర రిజర్వాయరు భద్రతా పరంగా బాగానే ఉందని, చిన్న చిన్న లోటుపాట్లను సరి చేసుకుంటే సరిపోతుందని వారు స్పష్టం చేశారు. ప్రాజెక్టు వద్ద విద్యుదీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. పరిశీలించిన అన్ని అంశాలను నివేదిక రూపంలో నేషనల్ డ్యామ్ భద్రతా అథారిటీకి అందజేస్తామని ప్యానెల్ సభ్యులు చెప్పారు. విజయనగరం ఇరిగేషన్ ఈఈ గోవిందరావు, డీఈ రామునాయుడు, హైడ్రాలజీ డీఈ నర్మదా పట్నాయక్, ఏఈ సుధీర్, రిజర్వాయరు ఏఈ కృపానంద్ పాల్గొన్నారు. -
ఎన్నికల సంబడి
● ఈ నెల 29న ఎస్ఎంసీ ఎన్నికలు ● చేతులెత్తే పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎంపిక ● ఈ సారి ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఎన్నికలు వీరఘట్టం: బడిలో ఎన్నికల సందడి మొదలు కానుంది. సర్కారు బడుల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు రెండేళ్లకు ఒకసారి విద్యాశాఖ ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఎన్నికలను నిర్వహిస్తుంది. రెండేళ్ల క్రితం ఎన్నికై న ఎస్‌ఎంసీల కాలపరిమితి ముగిసింది. దీంతో ఈ ఎన్నికలకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29న ఎన్నికల నిర్వహించేందుకు బుధవారం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈసారి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలని నిశ్చయించారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండకూదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల రాజకీయ నాయకులు చొరబడడంతో తగాదాలు జరిగాయి. మరి ఈసారి ఏ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారో చూడాలి. విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తే పద్ధతి ద్వారా ఎస్ఎంసీ చైర్మన్, వైఎస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికలను జరిపించేందుకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రాథమిక, మోడల్ ప్రైమరీ, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీ ఇలా అన్ని మేనేజ్మెంట్లలో 1,604 సర్కారు బడులు ఉన్నాయి. అలాగే 98 ప్రైవేట్ పాఠశాలలతో కలిపి 1702 విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో 1,65,352 మంది విద్యార్థులు ఈ ఏడాది చదువుతున్నారు. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్లు లిస్టు(తల్లిదండ్రులు) జాబితా ప్రచురుణ చేస్తారు. 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఓటరు జాబితాపై అభ్యంతరాలు/ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3–4 గంటల మధ్యలో తుది ఓటరు జాబితా ప్రచురణ చేస్తారు. రాజకీయ జోక్యం లేకుండా 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఎస్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య తొలి సమావేశాన్ని నిర్వహిస్తారు. 15 మండలాలకు ఎన్నికల ప్రత్యేకాధికారులు.. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో ఈ నెల 29న జరగనున్న ఎస్ఎంసీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు విద్యాశాఖకు సంబంధించిన అధికారులను జిల్లాలోని 15 మండలాలకు నియమించారు. వీరు ప్రతి మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతారు. అలాగే ఇక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియను ఉన్నతాధికారులకు నివేదిస్తారు. -
సంక్షేమానికి గ్రహణం
టీడీపీ పాలనలో ● స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పాచిపెంట: టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమానికి గ్రహణం పట్టిందని మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు మాజీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలనాయుడు, పార్టీ సమన్వయకర్త పాచిపెంట వీరంనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పాచిపెంట మండలం వైఎస్సార్సీపీకి కంచుకోటగా పేర్కొన్నారు. స్థానిక సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజేతలుగా నిలపాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల మంజూరు పేరుతో టీడీపీ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. ఇటీవల టీడీపీలో చేరిన జిల్లాకు చెందిన ఓ నాయకుడిపై గతంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. అనంతరం పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ప్రమీల, వైస్ ఎంపీపీ మీసాల నారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సలాది అనూరాధ, పార్టీ నాయకులు శనపతి నారాయణరావు, కలువలపల్లి పెద్దిబాబు, బోను ధనుంజయ్, సలాది అప్పలనాయుడు, చింత సీతయ్య, కిర్ల రామకోటేశ్వరరావు, సోముల లచ్చయ్య, మాదల సింహాచలం, డోనేరు లచ్చయ్య, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో.. శాశ్వత ముద్ర
● జిల్లాకు ప్రగతి ఫలాలు అందించిన వైఎస్సార్ కుటుంబం ● అందుబాటులోకి విద్య, వైద్యం ● సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాకు ఏదైనా మంచి జరిగింది అంటే గత పాతికేళ్లలో వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనాకాలంలోనే. జిల్లాకు ఒక ప్రాజెక్టు వచ్చినా.. ఒక కాలేజీ వచ్చినా.. కొత్తగా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పడినా అదంతా వైఎస్ కుటుంబం... బొత్స సత్యనారాయణ హయాంలో వచ్చినవే అని ఘంటాపథంగా చెప్పవచ్చన్నది జిల్లా వాసుల మాట. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో కొన్ని ప్రాజెక్టులు, ఆ తర్వాత వైఎస్ జగన్ పాలనలో మరికొన్ని కాలేజీల రాకతో జిల్లా ముఖచిత్రం మారిపోయింది. అభివృద్ధి పనులు సాకారం కావడంలో జిల్లా వైఎస్సార్సీపీ నేతల కృషి దాగిఉంది. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు దశాబ్దాల నాటికల అయినా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. బొబ్బిలి, చీపురుపల్లి పట్టణాల్లో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు తమ సమీపంలోని మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాగా అవతరించింది కూడా గత ప్రభుత్వ హయాంలోనే. చీపురుపల్లికి తోటపల్లి నీరు.... మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కృషితో తోటపల్లి ప్రాజెక్టు త్వరితగతిన సాకారమైంది. ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులు ఎదురు చూసిన తోటపల్లి ప్రాజెక్టు బొత్స కృషితో దివంగత మహా నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చొరవతో శరవేగంగా 2004లో ప్రారంభమై 2009 నాటికి 90 శాతం పనులు పూర్తి చేసు కుంది. 2004కి ముందు ఎంతోకాలంగా తోటపల్లి ప్రాజెక్టు కోసం రైతులు ఎదురు చూస్తున్నప్పటికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు. 2004లో మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి సీఎం అవ్వగానే తోటపల్లి ప్రాజెక్టుకు తొలిదశలో రూ.478 కోట్లు నిధులు విడుదల చేయడంతో త్వరితగతిన పనులు జరిగాయి. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి మండలంలో 1319 ఎకరాలు, గరివిడి మండలంలో 4,296 ఎకరాలు, గుర్ల మండలంలో 9,941 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి హారంగా నిలిచే భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన, పనులు ప్రారంభం కూడా గత ప్రభుత్వంలోనే సాగాయి. దీని వెనుక బొత్సతో పాటు జిల్లా వైఎస్సార్సీపీ నాయకుల కృషిదాగి ఉంది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులు పూర్తిచేసిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కిందని, జిల్లా అభివృద్ధిలో శాశ్వత ముద్ర వారికే దక్కుతుందని జిల్లా ప్రజల నోటి నుంచి తరచూ వినిపిస్తుంది. గత ప్రభుత్వాలు మొదలుపెట్టి చిత్తశుద్ధి కొరవడి వదిలేసిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి తుదిరూపు ఇచ్చినది గత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వమే. రూ.834 కోట్ల బడ్జెట్‌తో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాగా దానికి సంబంధించిన భూ సేకరణ, శంకుస్థాపన, పనులు ప్రారంభించిన ఘనత గత ప్రభుత్వానిదే. వర్సిటీలో కోర్సుల అడ్మిషన్లు కూడా మొదలు పెట్టింది. నాటి విద్యాశాఖ మంత్రి బొత్స పట్టువదలకుండా కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ పనులు..అనుమతులు పూర్తి చేసి వర్సిటీకి తుదిరూపు ఇచ్చారు. వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2007లో విజయనగరంలో జేఎన్టీయూ కళాశాలను స్థాపించారు. వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవితకు పునాదివేశారు. కళాశాల జిల్లాకు మంజూరు వెనుక బొత్స కృషి దాగి ఉంది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హయాంలో జేఎన్టీయూ కళాశాలను వర్సిటీగా స్థాయి పెంచారు. విద్యార్థులకు సకల విద్యాసదుపాయాలు కల్పించారు. ఇప్పుడు ఇది వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తూ వారి జీవితాల్లో విద్య, ఉద్యోగ వెలుగులు పూయిస్తోంది. ఇంజినీరింగ్ విద్యకు శాశ్వత చిరునామాగా మారింది. -
భూ సమస్యను పరిష్కరించకుంటే చావే శరణ్యం
● పురుగు మందు డబ్బాలతో తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ రైతుల ధర్నారామభద్రపురం: కాళ్లరిగేలా తిరుగుతున్నా తమ భూ సమస్యను పరిష్కరించడంలేదని, ఇక చావే శరణ్యమంటూ రామభద్రపురం మండలం ఇట్లామామిడిపల్లి ఎస్సీ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పురుగు మందు డబ్బాలు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 161లో ఎస్సీలకు చెందిన సుమారు 3 ఎకరాల భూమిని విజయనగరానికి చెందిన ఓ పెత్తందారు కబ్జాచేసి కంచె ఏర్పాటు చేశాడని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదని ఆరోపించారు. సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ బుధవారం భూమిని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
నిలకడగా తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న వర్షాల నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి 105 మీటర్లకు 104.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 3,570ల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఎత్తేసి 4,706 క్యూసెక్కుల నీటిని తిరిగి నదిలోకి విడిచిపెడుతున్నారు. కుడి ప్రధాన కాలువకు 800, పాతకుడి కాలువకు 40, ఎడమ కాలువకు 414 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు ఏఈ కిశోర్ తెలిపారు. వీరఘట్టంలో కుండపోత వీరఘట్టం: వీరఘట్టంలో మంగళవారం ఉదయం వేసవిని తలిపించే ఎండతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోత, ఎండ తీవ్రతతో అల్లాడిపోయారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు ఏకదాటిగా కుండపోతగా వర్షం కురిసింది. 4.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రాజేశ్వరరావు తెలిపారు. పొలాల్లో నీరు చేరడంతో రైతులు సంతోషపడుతున్నారు. నవంబర్ 15న ఎన్ఎంఎంఎస్ఎస్ రాతపరీక్ష పార్వతీపురం రూరల్: జాతీయ ప్రతిభ ఆధారిత పేదరిక నిర్మూలన ఉపకార వేతన పథకం (ఎన్ఎంఎంఎస్ఎస్) రాతపరీక్ష ఈ ఏడాది నవంబర్ 15న జరగనుందని డీఈఓ పి.బ్రహ్మాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడో తరగతిలో 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం) సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండి, తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున ఎస్బీఐలో చెల్లించాలి. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఆసక్తిగల విద్యార్థుల దరఖాస్తు చేసేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. కొత్తవలస: వినాయక చవితి పర్వదినాన జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుంటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆనందగా గడపాల్సిన వేళ యువకుడిని మృత్యువు కాటేసింది. అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా,.. మరో యువకుడు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామాజు జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి ప్రాంతానికి చెందిన బిడ్డక చరణ్ (21), బిడ్డక రాజు ఇంటి వద్ద వినాయక పూజలు ముగించుకొని ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. కొత్తవలస మండలం జిందాల్ ఫ్యాక్టరీకి సమీపంలోని చెరువు వద్ద మరమ్మతులతో రోడ్డుపై నిలిపివేసిన బొలోరా వాహనాన్ని బైక్‌తో ఢీకొట్టారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడకు చేరుకునే సరికి తలకు తీవ్రగాయాలు కావడంతో చరణ్ (21) మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజు కొన ఊపిరితో వైద్యసేవలు పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. -
పింఛన్ ఆశలపై నీళ్లు!
సాక్షి, పార్వతీపురం మన్యం: కొత్తగా సామాజిక పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రామ/వార్డు సచివాలయాలు రద్దీగా మారుతున్నాయి. ఇప్పటికే సుమారు 20 వేల దరఖాస్తులు జిల్లా వ్యాపితంగా అందాయి. ఇంకా వేలాది మంది సచివాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గడువు తక్కువ ఇవ్వడం.. వరుస మూడు రోజుల పాటు సెలవులు రావడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన అధికమైంది. తొలుత ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం బుధవారం ఆఖరి రోజు. గడువు పెంచాలని వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. మొరాయిస్తున్న సర్వర్ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్ల ఊసెత్తలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో ఒక్కసారిగా కొత్త పెన్షన్లు మంజూరు అంటూ తేదీలను ప్రకటించింది. ఈ నెల ఏడు నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటించింది. గడువు తక్కువగా ఉండడంతో అర్హత ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు సచివాలయాల వద్ద బారులు తీరుతున్నారు. సర్వర్ పనిచేయక దరఖాస్తులను అప్లోడ్ చేయడం కష్టంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో 1,36,470 మంది లబ్ధిదారులకు 15 రకాల సామాజిక పింఛన్లు అందిస్తున్నారు. రూ.4 వేలు నుంచి రూ. 15 వేల వరకు వివిధ కేటగిరీల్లో మొత్తం లబ్ధిదారులకు అందుతోంది. వేలమంది నిత్యం కొత్త పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై నేడు నీళ్లు కుమ్మరిస్తున్నారు. వారు సచివాలయానికి వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు, అడుగుతున్న పత్రాలు అర్హులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కుల ధ్రువీకరణతో పాటు ఐటీ, గ్యాస్ బిల్లు, ఇంటి పన్ను రశీదు తదితర పత్రాలు కావాలంటూ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఇంటి పన్ను చెల్లిస్తేనే.. దరఖాస్తు చేసుకోవాలన్న అదనపు నిబంధన పెడుతున్నారు. వితంతువులకు వారి భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ రేషన్‌కార్డులో అతని పేరు ఉంటే దరఖాస్తు తీసుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు రేషన్ కార్డులో భర్త పేరు ఎలా తొలగించాలి, అవసరమైన పత్రాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని వితంతువులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల మ్యాపింగ్ కాలేదంటూ తిప్పి పంపుతున్నారు. కొంతమందికి స్టడీ సర్టిఫికెట్లు తేవాలని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇన్ని పత్రాలు ఎలా తేవాలంటూ.. అర్హులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను నమోదు చేస్తున్న సమయంలో సర్వర్లు మొరాయిస్తుండటంతో అటు సిబ్బంది, ఇటు దరఖాస్తుదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ సర్వర్ పని చేయకపోవడంతో దరఖాస్తుదారులను సచివాలయాల్లో కూర్చోపెడుతున్నారు. ఈ సమస్య వల్ల ఓటీపీలు కూడా రావడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పిన వారికే దరఖాస్తులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. తొలుత ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ లోపు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుగా నిర్ణయించింది. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి పండగ కావటం వల్ల వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో దరఖాస్తులకు ఆటంకం ఏర్పడింది. సెలవులు ముగిశాక కేవలం రెండు రోజుల గడువే ఉంది. సర్వత్రా ఆందోళనల నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో రెండు రోజులపాటు పెంచుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం రాత్రి ప్రకటించారు. పలు ఆంక్షలు, సమస్యల నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇచ్చే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. మొరాయిస్తున్న సర్వర్ ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు దరఖాస్తు గడువు రెండు రోజులపాటు పొడిగింపు -
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కుటుంబ యజమాని సరైనవారు అయితే ఆ కుటుంబం సన్మార్గంలో పయనిస్తుంది. నాయకుడు మంచివారైతే ఆ దేశం, రాష్ట్రం, ప్రాంతం, గ్రామం ప్రగతి పథంలో పయనిస్తుంది. ప్రజలకు సంక్షేమం సమకూరుతుంది. ప్రగతిలో శాశ్వత ముద్ర కనిపిస్తుంది. అచ్చంగా అలానే.. వైఎస్సార్, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, జేఎన్టీయూ, తోటపల్లి, జంఝావతి, గిరిజన వర్సిటీ, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులు జిల్లాకు సమకూరాయి. ఇది ‘మన విజయనగరం’ అనేలా ప్రగతి కళ్లకు కట్టింది. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాయన్నది జిల్లా ప్రజల మాట. -
చేరువైన వైద్య విద్య
విజయనగరం, పార్వతీపురం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు అంటే ఊహకందని అంశం. కానీ గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక అందులో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కృషితో రూ.500 కోట్ల ఖర్చుతో విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తిచేసుకుంది. వైద్యవిద్య, మెరుగైన వైద్యసదుపాయాలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, రూ.155 కోట్లతో కురుపాంలోని ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో మిగులు పనులు పూర్తిచేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చొరవచూపడంలేదు. ఫలితం.. గిరిజన విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందని ద్రాక్షగా మారింది. -
స్థానిక పోరు షురూ!
సాక్షి, పార్వతీపురం మన్యం: పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. తొలి విడతలో జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. ఓటర్ల జాబితాల ప్రక్రియ కూడా ఇక్కడ ముగిసింది. పార్వతీపురం, సాలూరుకు సంబంధించి కోర్టు కేసుల వల్ల ఓటరు జాబితా ప్రచురణ కాస్త ఆలస్యం అయ్యింది. తాజాగా ఇక్కడ కూడా మున్సిపల్ సమరానికి అత్యంత కీలకమైన వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాలను అధికారికంగా ప్రచురించనున్నారు. ఇందులో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో జిల్లాకు సంబంధించి సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలను కూడా చేర్చారు. దీంతో జిల్లాలో మున్సిపల్ పోరుకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం వెల్లడించారు. ఫారం–1 నోటీసుతో పాటు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను ఈనెల 22న ప్రకటించాలని తెలిపారు. 2026 జనవరి 1ని అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రూపకల్పన చేయాలని సూచించారు. రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఈ ఓటర్ల లెక్కలే కీలకం కానున్నాయి. ఆదేశాలు రావడమే తరువాయి... 2013లో ఏర్పడిన పాలకొండ నగర పంచాయతీ ఇప్పటి వరకూ 20 వార్డులతో ఉంది. ప్రస్తుతం పునర్విభజన తర్వాత 8 పెరిగి.. 28 వార్డులతో ఎన్నికలకు వెళ్లనుంది. సాలూరులో 29 వార్డులు ఉండగా.. 32 వార్డులకు, పార్వతీపురం పాలక సంఘంలో 30 వార్డులను 36గా విభజించారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం ఒక కొలిక్కి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలు రావడం తరువాయి.. ఎన్నికల నిర్వహణకు సిద్ధం కానుంది. కూటమిలో సీట్ల పంచాయితీ.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేనల్లో ఎవరికి వారు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బలాబలాలు, పోటీ చేసేందుకు ఉన్న ఆసక్తిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. పొత్తుల్లో భాగంగా జనసేన ఎక్కడ కోరుకోవాలి అన్న అంశంపైనా ఆరా తీశారు. మరోవైపు బీజేపీలో కూడా ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇక, టీడీపీలో కుర్చీల కోసం ఎదురు చూసిన వారి జాబితా చాలా పెద్దదే ఉంది. రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత పందెం బరిలో నిలిచే వారు బయటకు వచ్చే యోచనలో ఉన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు కూడా ఒక్కొక్కరుగా ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. జిల్లాలో ఓ టీడీపీ సీనియర్ నేత.. 30 ఇయర్స్‌కు పైగా ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు.. జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చాలా పదవులు పొందినప్పటికీ.. కొన్నాళ్లుగా ఆయన పార్టీ నేతలతో స్థానికంగా ఉన్న విభేదాల వల్ల అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో విబేధాలు మరింత పెరిగి, వీధికి కూడా ఎక్కారు. జిల్లాలో బలమైన కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆ నాయకుడు.. జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన నాగబాబును కూడా కలిసి తన మనసులో మాట చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. చివరి నిమిషంలో అందుకు బ్రేక్ పడింది. మరికొంత మంది కూడా సీట్ల సర్దుబాటులో కలిసి వస్తుందేమో అని పక్క చూపులు చూస్తున్నారు. మున్సిపాలిటీల్లో మోగనున్న నగారా సాలూరు, పార్వతీపురంల్లోనూ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు -
29న ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు
● పాఠశాలల్లో పారదర్శకంగా నిర్వహించాలి ● డీఈఓ మాణిక్యం నాయుడువిజయనగరం అర్బన్: జిల్లాలోని 1,767 ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల పునర్వ్యవస్థీకరణ ఎన్నికలను ఈ నెల 29న సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అఽధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త యూ.మాణిక్యం నాయుడు ఆదేశించారు. కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఎస్ఎంసీ మార్గదర్శకాలు–2026 ఆధారంగా రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఇదీ.. మంగళవారం ఉదయం 10గంటలకు ఎస్ఎంసీ సభ్యులు, చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల నోటీసు బోర్డుపై ఓటర్ల జాబితా ప్రదర్శన. 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తుది ఓటర్ల జాబితా ఖరారు చేసి ప్రదర్శన. 29న ఉద యం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎస్ఎంసీ సభ్యుల ఎన్నికలు. మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక, మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం. 3 నుంచి 3.30 గంటల వరకు నూతన ఎస్ఎంసీ తొలి సమావేశం నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా డిప్యూటీ ఈఓలు, సెక్టోరిల్ అధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు అవసరమైన సమాచారం అందించాలని డీఈఓ సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. పాఠశాల పర్యవేక్షణ, మెరుగైన యాజమాన్యం, విద్యార్థులకు మెరుగైన వాతారణం కల్పించడంలో ఎస్‌ఎంసీల పాత్ర కీలకమని పేర్కొంటూ కమిటీల ఏర్పాటును ప్రోత్సహించాలని మండల స్థాయి విద్యాశాఖ ఆధికారులకు సూచించారు. -
పీటీసీలో స్పోర్ట్స్‌మీట్ ప్రారంభం
విజయనగరం టౌన్: శారీరక దృఢత్వాన్ని పెంపొందించేవి క్రీడలని, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, సమయపాలన, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని పీటీసీ ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్న 473 మంది మహిళా కానిస్టేబుల్స్‌కు రెండు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్‌ను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోలీస్ విధుల్లో ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా, సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండాలన్నారు. శారీరక దారుఢ్యం ప్రతి పోలీసు అధికారికి వృత్తిపరమైన బాధ్యతగా భావించాలని సూచించారు. ఓటమి అంతిమం కాదని, అది మరింత మెరుగ్గా ఎదగడానికి ఒక అవకాశమన్నారు. ప్రతి పోటీ నుంచి ఒక కొత్త అనుభవాన్ని, ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డి.కోటేశ్వరబాబు, డీఎస్పీలు పి.రమేష్, ఎం.చంద్రశేఖర్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, కళాశాల సిబ్బంది, శిక్షణ అధికారులు, మహిళా కానిస్టేబుల్ శిక్షణార్థులు పాల్గొన్నారు. పాల్గొన్న 473 మంది శిక్షణ కానిస్టేబుల్స్ -
దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సహకారంతో 350 మంది దివ్యాంగులకు కృత్రిమ ఆవయవాలు, ఉపకరణాలను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ముందుగా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, కేన్సర్ ఆస్పత్రి, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. దివ్యాంగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.కృత్రిమ అవయవాల తయారీ విధానాన్ని ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు సమగ్రంగా వివరించారు. అనంతరం రఘురాం మాట్లాడుతూ గురుదేవా చారిటబుల్ ట్రస్టు దివ్యాంగుల సేవలో పరితపిస్తోందన్నారు. వారికి నడక నడత నేర్పి ఎంతో సహకారం చేస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులకు ఉచితంగా ట్రైసెకిల్స్, పోలియో కాలిపవర్స్, చెవిటి మిషన్లు, వీల్‌చైర్స్, వాకింగ్ స్టిక్స్‌ను అందజేశారు. అనంతరం పలువురు వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రజాసేవకు కాదు
● చివరి మండల సమావేశంలో ఎంపీపీ బి.ప్రమీల భావోద్వేగ ప్రసంగంపాచిపెంట: ఐదేళ్ల పదవీకాలంలో ప్రజలతో మమేకమై పనిచేసిన అనుభవాలు.. అభివద్ధి పనుల్లో ఎదురైన సవాళ్లు.. ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు.. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. మండల పరిషత్ పాలకవర్గానికి చివరి సర్వసభ్య సమావేశం కావడంతో పాచిపెంట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఎంపీపీ బి. ప్రమీల అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో శాఖల వారీగా అధికారులు ప్రగతి నివేదికలను సభ్యులకు వివరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ..ప్రజా సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ పార్టీలు ప్రతి ఐదేళ్లకోసారి మారుతుంటాయని, అయితే అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని పేర్కొన్నారు. పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు చేసిన సేవలే మిగులుతాయన్న భావనతో ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఆమె సూచించారు. తన పదవీకాలంలో మండలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన కృషి, అధికారులతో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఎంపీపీ, ఎంపీటీసీ పదవులు కల్పించి ప్రజాసేవకు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనన్్ రెడ్డి మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర లకు ప్రమీల కతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల పదవీకాలానికి ముగింపు పలుకుతున్న సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఎంపీపీ బి. ప్రమీలతో పాటు ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఐదేళ్ల పాటు కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. పదవీకాలం ముగిసినా ప్రజలతో తమ అనుబంధం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బలిజిపేట: మండల పరిషత్ సమావేశాలకు బుధవారంతో తెరపడనుంది. ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ఈనెల 23తో ముగియనుంది. బలిజిపేటలో చివరి మండల సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తారు. మండలంలో 17ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గలావల్లిలో సర్పంచ్, ఎంపీటీసీలుగా మామిడి చంద్రచూడామణి విజయం సాధించడంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 17స్థానాలకు గాను 16మంది ఎంపీటీసీలే ఉన్నారు. వారిలో ఇటీవల పెద్దింపేట ఎంపీటీసీ ఎం.సాంబమూర్తి మృతిచెందారు. దీంతో మండల పరిషత్ సభ్యులు 15మంది, కో ఆప్షన్ సభ్యుడు ఒకరు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న బాడీ 2021వ సంవత్సరం సెప్టెంబరు 24న ఏర్పాటైంది. ఇప్పటివరకు 25సమావేశాలు అప్పట్లో కొత్తగా ఏర్పాటైన సభ్యులతో డిసెంబర్ 10, 2021న మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మండల పరిషత్ బడ్జెట్‌సమావేశాలు 25 నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 15సమావేశాలు నిర్వహించగా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత 10 సమావేశాలు నిర్వహించారు. నేడు చివరి సమావేశం నిర్వహించనున్నారు. ఇంకా అందని గౌరవ వేతనం సభ్యులకు నెలకు రూ.3వేలు గౌరవ వేతనం కింద ఇస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంకా 8నెలల గౌరవ వేతనం సభ్యులకు అందాల్సి ఉంది. ఒక్కో సభ్యుడికి రూ.24వేల వంతున అందాలి. పదవీకాలం పూర్తవుతున్నా గౌరవ వేతనం ఇంకా పూర్తికాలేదనే చలోక్తులు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత సభ్యులకు గౌరవం లేదు, గౌరవ వేతనం సక్రమంగా అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండున్నర ఏళ్లలో సమస్యలు పరిష్కారం కాలేదు: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత మండల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కాలేదని, సమావేశాల్లో అధికారులకు సమస్యలు తెలియచేయడం, ఆ తరువాత వాటిపై నిలదీయడమే తప్ప ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల సర్వసభ్యసమావేశానికి హాజరవడం, రిజిస్టరులో సంతకం చేయడం, సమావేశంలో కార్యాలయం వారు ఇచ్చే స్నాక్స్ తినడం, టీ తాగి వెళ్లిపోవడమే తప్ప ఒరిగేదేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసిందని, క్షేత్రస్థాయిలో ఉండే కార్యదర్శులు ఏమాత్రం గ్రామాలను పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయి తప్ప వాటిపై చర్యలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపీటీసీ సభ్యుల పరంగా ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించలేదు. అంతా డమ్మీగానే ఉంది. అధికారుల వ్యవహారశైలి మారిందని చెప్పవచ్చు. ఎంపీటీసీల గౌరవ వేతనం చెల్లించాలి. గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలను పరిష్కరించాలి. వి.సాయిరాం, మండల ఉపాధ్యక్షుడు, బలిజిపేట -
మార్కుల ట్యాంపరింగ్‌పై విచారణ కమిటీ
● బాధ్యులపై చర్యలు తప్పవు ● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావువిజయనగరం రూరల్: జిల్లాలో ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – గురజాడ విజయనగరంలో గత కొన్నేళ్లుగా జవాబుపత్రాల్లో జరుగుతున్న మార్కుల ట్యాంపరింగ్ వివాదంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశామని వర్సిటీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు తెలిపారు. ఇటీవల మార్కుల ట్యాంపరింగ్‌పై ఈ నెల 7న ఫిర్యాదులు అందడంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపగా ఐదుగురు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి ఉత్తీర్ణత చేసినట్లు విచారణలో తేలింది. అయితే, అసలు దొంగలు తప్పించుకుని పరీక్షా విభాగానికి ఏ సంబంధం లేని ఔట్సోర్సింగ్ ఉద్యోగి సనపతి సంతోష్‌పై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సంతోష్ మానసిక ఆందోళనతో మూడు రోజుల కిందట నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాసి తన స్వగ్రామంలో ఆత్మాహత్యాప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు. నలుగురు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లపై ఆరోపణలు సంతోష్ తన సూసైడ్ లేఖలో వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులే మార్కుల ట్యాంపరింగ్‌లో కీలక సూత్రదారులని పేర్కొన్నారు. ఇది కొద్ది రోజులుగా జరుగుతున్న తంతుకాదని, తాను ఉద్యోగంలో చేరకముందు నుంచే గత మూడు నాలుగేళ్లుగా జరుగుతుందని పేర్కొన్నాడు. మూడేళ్ల నుంచి జవాబు పత్రాలను పరిశీలిస్తే దోషులు ఎవరో తేలుతుందని, వర్సిటీ ఉపకులపతి దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ట్యాంపరింగ్ నిజమే ఈ విషయమై ఉపకులపతి వి.వి.సుబ్బారావును వివరణ కోరగా తమకు అందిన సమాచారం మేరకు జవాబు పత్రాలను పరిశీలించగా ఐదుగురు విద్యార్థులకు వారికి వచ్చిన మార్కులు కంటే అధికంగా మార్కులు వేసి ట్యాంపరింగ్ చేసినట్టు గుర్తించామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గత మూడేళ్లు జవాబు పత్రాలను పరిశీలించేందుకు కమిటీ వేశామని, వారి విచారణలో మార్కుల ట్యాంపరింగ్ జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
రామతీర్థంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలను జరిపించారు. అనంతరం గ్రామ బలిహరణ పూర్తిచేసి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడి చిత్రపటాన్ని ఎగురవేసి సమస్త దేవతామూర్తులను బ్రహ్మోత్సవాల వేడుకకు ఆహ్వానం పలికారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు ప్రతిరోజూ శ్రీవారిని గ్రామ తిరు వీధుల్లో ఊరేగింపు, 20న స్వామివారి కల్యాణోత్సవం, 24న పుష్పాంజలి కార్యక్రమాలు జరిపిస్తామని అర్చకులు తెలిపారు. -
700 ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్
● 17,18 తేదీల్లో కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 17,18 తేదీల్లో విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో కౌశలం డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్(జీటీఐ)ఆధ్వర్యంలో ఫౌండ్రీ విభాగంలో 400, మెషినింగ్ విభాగంలో 300 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 32 ఏళ్ల వయస్సు గల పురుష అభ్యర్థులు, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్(మెకానికల్) తదితర విద్యార్హతలు కలిగిన వారు, ఫ్రెషర్లు కూడా హాజరుకావచ్చన్నారు. ఎంపికై వారికి రూ.15,500 నుంచి రూ.16,500 వరకు వేతనంతో పాటు హాజరు బోనస్, నైట్ షిఫ్ట్, వర్క్‌స్టేషన్ అలవెన్సులు, ఉచిత భోజనం, వసతి, ఈపీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు అందనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ప్రతిభ, ఆసక్తి ఉన్న వారికి సెర్బియాలోని సంస్థ గ్రూప్ కంపెనీలో ఏడాది పనిచేసే అవకాశం కూడా లభించవచ్చన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఫోన్ 90305476667 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. -
భూసేకరణను వేగవంతం చేయాలి
● పారిశ్రామిక ప్రాజెక్టులకు సకాలంలో భూములు అప్పగించాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డివిజయనగరం గంటస్తంభం: జిల్లాలో వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా భూముల వివరాలు, అవార్డు ప్రక్రియ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలను పరిశీలించారు. నోటిఫికేషన్లు, సర్వేలు, రికార్డుల ధ్రువీకరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలోని అంబటివలస రిషి డెకర్స్, ఆంధ్ర కార్న్ ప్రొడక్ట్స్, కాపుసంబం ఎంఎస్ఎంఈ పార్కు, మరుపల్లి అన్షుమి ఇండస్ట్రియల్ పార్కు, శ్రీరాంపురం మై వీడు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్, ఆకులకట్ట ఫుడ్ పార్కు తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని సమీక్షించారు. కాపుశంభాం ఎంఎస్ఎంఈ పార్కు పనులకు సంబంధించి భూసేకరణ, పరిహారం చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఐపీబీ పరిధిలో రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రాజెక్టుకు భూమి అప్పగించి పనులు ప్రారంభించినందుకు అధికారులను అభినందించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని గూడెంగ్రామానికి చెందిన శనపతి సంతోష్(34) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన శనపతి సంతోష్ జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో అవుట్ సోర్సింగ్‌లో మొటలర్జీ డిపార్ట్మెంట్ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. జేఎన్టీయూలో తనతో పాటు పనిచేస్తున్న అదే డిపార్ట్మెంట్కు చెందిన ఏడుగురు సిబ్బంది సంతోష్‌ను తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక గూడెంలోని తన నివాసం వద్ద గడ్డి మందు కూల్ డ్రింక్‌లో కలుపుకుని తాగేశాడు. గడ్డి మందు తాగే ముందు నా ఆత్మహత్యకు జేఎన్టీయూలో పనిచేస్తున్న ఏడుగురు వ్యక్తులే కారణమని లేఖలో రాశాడు. గడ్డి మందు తాగిన సంతోష్ పరిస్థితిని కుటుంబ సభ్యులు చూసి వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి వివాహం కాలేదు. తల్లి రాములమ్మ, తమ్ముడు సతీష్ ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గుర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. -
అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు
● 17వ తేదీలోగా అందజేయాలి ● ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కృష్ణ విజయనగరం అర్బన్: విజయనగరం టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈఏటీ) విభాగంలో అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అఽభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కృష్ణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మెకానికల్ బ్రాంచ్‌లో బీటెక్ లేదా సమానమైన డిగ్రీలో ద్వితీయ శ్రేణితో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజ యనగరం టౌన్లో నిర్వహించే డెమో తరగతులకు విధిగా హాజరు కావాలని తెలియజేశారు. మొక్కజొన్న పంట ధ్వంసంపార్వతీపురం రూరల్: మండలంలోని రావికోన పంచాయతీ గంగమాంబాపురంలో ఏనుగులు పంటలను, ఇళ్లను మంగళవారం ధ్వంసం చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ఏడాది వరి వేయలేక, తనకున్న 1.50 సెంట్ల భూమిలో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగుచేసిన కేండ్రుక శ్రీనివాసరావు ఆశలపై ఏనుగుల దాడి నీళ్లు చల్లింది. ఆరుగాలం కష్టించి పెంచిన పంటను సుడిగాలిలా వచ్చి సర్వనాశనం చేయడంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన ఉర్లక రఘు ఇంటిపైనా గజరాజులు ప్రతాపం చూపాయి. ఇంటి గేటుతో పాటు కిటికీలను నుజ్జునుజ్జు చేయడంతో ఆ కుటుంబం భయంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. అటవీశాఖ అధికారులు తక్షణమే నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని మాజీ సర్పంచ్ కడ్రక రామస్వామి అధికారులను కోరారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిదత్తిరాజేరు: మండలంలోని మరడాం వద్ద జాతీయ రహదారి దాటుతుండగా శుక్రవారం ఉదయం వెనుక నుంచి బైక్ ఢీకొన్న సంఘటనలో గాయపడిన మరడాం గ్రామానికి చెందిన గుగ్గిలపు నారాయణరావు(60) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు, ఈ మేరకు ఎస్.బూర్జవలస ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు. నారాయణ రావు ఇంటి నుంచి రోడ్డుకు వెళ్తుండగా బైక్ ఢీకొనడంతో తలకు బలమైన గాయాలు కాగా విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య రమణమ్మ వివాహమైన కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. ప్రొఫెసర్లపై ఫిర్యాదువిజయనగరం టౌన్: జేఎన్టీయులో ఇటీవల జరిగిన పరీక్షల జవాబు పత్రాల్లో మార్కుల టాంపరింగ్ జరిగినట్లు వీసీ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. దీనిపై రిజిస్ట్రార్ కె.చంద్రభూషణరావు వీసీ ఆదేశాలకు మేరకు మంగళవారం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కొందరు ప్రొఫెసర్లపైన, ఉద్యోగులపైన ఆరోపణలు చేశారని రూరల్ పోలీసులు తెలిపారు. యువకుడి దుర్మరణంవిశాఖపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలోని ఆరిలోవ లా అండ్ ఆర్డర్ ఎస్సై వరహాలునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన పిసిని పవన్శేఖర్(20) విశాఖలోని డాల్ఫిన్ హోటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధురవాడలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసి, తన స్నేహితుడు ఆకుల ప్రసాద్‌తో కలిసి బైక్‌పై జగదాంబ వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఎండాడ కూడలి దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో పవన్ శేఖర్ కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై వరహాలు నాయుడు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
గుమ్మలక్ష్మీపురం: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన రాష్ట్ర రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పార్వతీపురం మన్యం జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, పత్తిక చంద్రమోహన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా జిల్లా నుంచి పాల్గొన్న 50 మంది క్రీడాకారుల్లో 18 మంది గోల్డ్ మెడల్స్‌ను, 20 మంది సిల్వర్ మెడల్స్‌ను, 12 మంది కాంస్యం మెడల్స్‌ను పొందారని తెలిపారు. పైడితల్లి జాతరలో 21 పనులకు టెండర్ల ఆహ్వానం విజయనగరం క్రైమ్ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీ పైడితల్లి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు పనులకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు దేవదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష శనివారం తెలిపారు. సిరిమాను సంబరం, తొలేళ్ల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏర్పాటు పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. చదురగుడి, వనంగుడులలో ఎలక్ట్రికల్ పనులు, చలువ పందిళ్లు వేయటానికి, క్యూ లైన్లు, వనంగుడిలో ఆర్చి, లడ్డూ ప్రసాదం తయారీ వంటి 21 పనులు చేయించేందుకు ఈ నెల 16వ తేదీలోపు టెండర్లను దేవదాయ శాఖ కోరుతోందని ఈఓ శిరీష తెలిపారు. వివిధ రకాల పనులు, వాటి వ్యయాల బట్టి, వంద నుంచీ యాభై వేల రూపాయల వరకు దేవస్థానం పేరుతో డీడీ తీసి టెండర్‌కు జతపరచి బాక్స్‌లో వేయాలని తెలిపారు. కార్మికుడి మృతి కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి గ్రామ సమీపంలో గల శారడ మెటల్స్ అండ్ ఎల్లోయిస్ కర్మాగారంలో అస్వస్థతతో కాంట్రాక్టు కార్మికుడు చింత గౌరినాయుడు (45) శనివారం మృతి చెందాడు. దీనికి సంబంధించి సీఐ టి.వి.విజయకుమార్ తెలిపిన వివరాలు.. వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన మృతుడు చింత గౌరినాయుడు శారడ కర్మాగారంలో చిన్నారావు అనే లేబర్ కాంట్రాక్టర్ వద్ద గత కొద్ది కాలంగా రాయి కొట్టే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే శనివారం పనికి వచ్చి మధ్యాహ్నం భోజనం అనంతరం ఒంట్లో నలతగా వుందని తోటి కార్మికులకు చెప్పి చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలోనే వాంతులు చేసుకోవడంతో తోటి కార్మికులు గమనించి వెంటనే కొత్తవలసలో గల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. బాలింత..సీతంపేట: మండలంలోని శిలిగాం గ్రామానికి చెందిన ఐదు నెలల బాలింత కె.రేణుక (36) శనివారం శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బీపీ పూర్తి స్థాయిలో పడిపోవడంతో ప్రాధమిక చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. రేణుక అంగన్వాడీ హెల్పర్‌గా పని చేస్తుంది. ఐదు నెలల కిందట కుమార్తెకు జన్మనిచ్చింది. ఈమె మృతితో భర్త కిషోర్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుర్తు తెలియని మహిళ మృతి మెరకముడిదాం : మండలంలోని బిళ్లలవలస గ్రామంలో శనివారం రామాలయం వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మృతి చెందిన మహిళ బిళ్లలవలస గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ వుండేదని, హిందీలో మాట్లాడేదని, ఎవరు తినేందుకు ఏమి పెట్టినా తినేది కాదని గ్రామస్తులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున రామాలయం వద్ద విగత జీవిగా పడి వుందని తెలిపారు. విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో బుదరాయవలస ఎస్ఐ తన సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలు ఎక్కడ నుంచి వచ్చింది.. ఏ ప్రాంతానికి చెందినది అన్న వివరాలు తెలియరాలేదు. దీంతో గ్రామస్తులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. -
జాతీయ లోక్ అదాలత్ సక్సెస్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ● అదాలత్‌లో 7051 కేసులు పరిష్కారంవిజయనగరం లీగల్; రాజీయే రాజ మార్గమని కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌కు హాజరై న్యాయమూర్తి మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ వలన కక్షిదారులకు సమయం, డబ్బు వృధా కాకుండా వారి జీవితాలలో ప్రశాంతత కలిగి ఉంటారన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో పలు సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలోని కోర్టులైన విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 7051 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. వాటిలో సివిల్ కేసులు 162, క్రిమినల్ కేసులు 6866, ప్రీ లిటిగేషన్ కేసులు 23 ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 9,73,16,602 లక్షల రూపాయలు మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. జాతీయ లోక్ అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు సీనియర్ న్యాయవాదులు పీఏఎన్ రాజు, పంపాన రవికుమార్, కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి చైర్మన్ దుర్గయ్య, కుటుంబ న్యాయ స్థానం అదనపు జిల్లా న్యాయమూర్తి ఓ.విజయ కళ్యాణి, బి.అప్పలస్వామి, నాల్గవ శ్రేణి అదనపు న్యాయమూర్తి, శ్రీధర్, సీనియర్ సివిల్ జడ్జి రమేష్‌నాయుడు, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ఫస్ట్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి బుజ్జి, మొబైల్ కోర్ట్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ఖతేజా చక్రవర్తి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, ఇజి.శ్రీ విద్య, మూడవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, నలితం రమేష్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లాన రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, కోర్టు సిబ్బంది, వివిధ శాాఖల అధికారులు, పోలీస్, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, న్యాయ వాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ
● ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో వక్తలువిజయనగరం: ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌నాయుడు అధ్యక్షతన ఆరో జిల్లా మహాసభలు శనివారం జరిగాయి. ఇందులో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిజం వృత్తి సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు పెన్షన్ తదితర సంక్షేమ పథకాలు సాధించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఫెడరేషన్ ముందుంటుందన్నారు. డీపీఆర్ఓ పి.గోవిందరాజులు, రాష్ట్ర నాయకులు ఎన్.మధుసూదనరావు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి భీమారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా శివకేశవనాయుడు, అప్పారావు ఎన్నికయ్యారు. -
21 వరకు మద్యం దుకాణాలకు రెన్యువల్ గడువు
విజయనగరం రూరల్: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ ఈ నెల 21 వరకు చేపట్టనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి, ఎకై ్సజ్ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బొగ్గులదిబ్బ వద్దనున్న పట్టణ ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి ఆధ్వర్యంలో మద్యం లైసెన్స్‌దారులతో దుకాణాల రెన్యువల్ ప్రక్రియపై శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీ శ్రీనివాసచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 21 సాయంత్రం 5 గంటలలోపు మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆలోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు ఈ ఏడాది మద్యం దుకాణాల రెన్యువల్‌కు ప్రభుత్వం జీవో 579 జారీ చేసిందని వివరించారు. ఈ జీవోను అనుసరించి జిల్లాలో ఓపెన్ కేటగిరి, గీత కార్మికులకు సంబంధించి మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 153 మద్యం దుకాణాలు ఉండగా, గీత కార్మికులకు సంబంధించి 16 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. 50 వేల జనాభా కలిగిన ప్రాంతాల్లోని 17 ఓపెన్ కేటగిరి మద్యం దుకాణాలకు వార్షిక రుసుం రూ. 60.50 లక్షలు, ఆర్ఈటీ రెన్యూవల్ ఫీజు రూ.23 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.88.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 136 ఓపెన్ కేటగిరి దుకాణాలకు వార్షిక ఫీజు రూ.71.50 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.27.20 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.1.06 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని గీత కులాల మద్యం దుకాణాలకు జనాభా ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించినట్టు తెలిపారు. 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలకు వార్షిక ఫీజు రూ.30.30 లక్షలు, ఆర్ఈటీ రెన్యువల్ ఫీజు రూ.11.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.46.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షలలోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 14 దుకాణాలకు వార్షిక ఫీజు రూ.35.80 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.13.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.56.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత లైసెన్స్‌దారులు ఈ నెల 21లోపు రెన్యువల్ చేసుకోవాలని ఆయన తెలిపారు. రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాలకు ఈ నెల 22 నుంచి 29 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించి, ఈ నెల 30న లాటరీ విధానం ద్వారా అర్హులైన వారికి మద్యం దుకాణాలు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను లైసెన్స్‌దారులు పూర్తిగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధికారి ఎస్.దొర, జిల్లాలోని వివిధ స్టేషన్ల సీఐలు, ఏ – 4 దుకాణాల లైసెన్స్‌దారులు పాల్గొన్నారు. -
విఘ్నాల్లేకుండా వినాయక ఉత్సవాలు
విజయనగరం టౌన్: విఘ్న నాయకునికి పూజలు నిర్వహించే వారంతా విఘ్నాల్లేకుండా వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు జిల్లా పోలీసు శాఖ పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టింది. అడుగడుగునా ఆయా స్టేషన్ల పరిధిలో ప్రతి పోలీస్ ఉద్యోగి సమాచారాన్ని సేకరించే విధంగా ఏర్పాట్లు చేసింది. నిఘా నేత్రంతో నిశిత పరిశీలన చేస్తోంది. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలను కోరింది. నిబంధనలు పాటించాలని పేర్కొంది. మండపాలు ఏర్పాటు చేసే వారందరూ సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతులకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మండపం వద్ద ఎల్లప్పుడూ నిర్వహకులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మండపం వద్ద అగ్నిమాపక పరికరాలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలి. అత్యవసర సమయాల్లో ప్రజలు మండపం నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం ఖాళీగా ఉంచాలి. సాధ్యమైన చోట మండపం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పనిచేసే స్థితిలో ఉంచాలి. లౌడ్ స్పీకర్లు, డీజేలు ఉపయోగించేటప్పుడు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకుని, ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలి. విగ్రహ ఊరేగింపు నిర్వహించే ముందు పోలీసు శాఖకు సమాచారమందించి, వారు సూచించిన మార్గం, సమయాన్ని మాత్రమే పాటించాలి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి వినాయక మండపానికి నిర్వహకులు ఒక బాధ్యత గల వ్యక్తిని నోడల్ పర్సన్‌ను నియమించాలి. మొబైల్ నెంబర్, పూర్తి వివరాలను సంబంధిత పోలీసుస్టేషన్‌కు ముందుగానే అందజేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దు అసాంఘిక కార్యకలాపాలకు తావీయ్యొద్దు అడుగడుగునా నిఘా నేత్రం : ఎస్పీ దామోదర్ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరి మనోభావాలు దె దెబ్బతినకుండా, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటూ ప్రత్యేకంగా నిఘా నేత్రంతో పరిశీలన చేస్తుంటుంది. మండపాలకు అనుమతులు తప్పనిసరిగా ఉచితంగా తీసుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అనుమానాస్పద పరిస్థితులు తలెత్తినా వెంటనే డయల్ 112/100కి సమాచారమివ్వాలి. – ఏఆర్ దామోదర్, ఎస్పీ -
పణుకువలస వంతెనపై.. వాహన రాకపోకలు బంద్
● వంతెనకు ఇరువైపులా గోడల నిర్మాణం ● శిథిలమైన వంతెనను పరిశీలించిన ఆర్అండ్బీ, పోలీస్ అధికారులు తెర్లాం: రాజాం – రామభద్రపురం ఆర్అండ్బీ రోడ్డులో మండలంలోని పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వాహనాల రాకపోకలను శనివారం ఉదయం నుంచి ఆర్అండ్బీ, పోలీస్ అధికారులు పూర్తిగా నిషేధించారు. పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వంతెనను మండల ఆర్అండ్బీ ఏఈ రాజు తన సిబ్బందితో పరిశీలించి వంతెన ప్రమాదకరంగా ఉందని, ఎప్పుడైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో వంతెన పైనుంచి రాకపోకలు సాగించే వాహనాలు వెళ్లకుండా పూర్తిగా బంద్ చేశారు. వంతెన పైనుంచి వాహనాలు రాకుండా ఉండేలా వంతెనకు ఇరువైపులా రోడ్డు మధ్యలో సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టారు. వంతెన మీదుగా వాహనాలు, ప్రయాణికులు వెళ్లే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీస్ అధికారులు వంతెనకు రెండు వైపులా స్టాఫర్లు, ఇసుకతో నింపిన డ్రమ్ములు ఏర్పాటు చేశారు. -
‘బాల సంజీవని’ టెండర్లలో అవకతవకలు
● బాల సంజీవని టెండర్లలో గోల్‌మాల్‌పై స్వతంత్ర విచారణ జరపాలి విజయనగరం గంటస్తంభం: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే బాల సంజీవని పథకాన్ని కొద్ది మంది బడా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు పరిమితం చేయడం సరికాదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్ విమర్శించారు. బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్ టెండర్లలో జరిగినట్టు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీపీఐ నాయకులతో కలిసి కలెక్టరేట్లో డీఆర్ఓ, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 26 జిల్లాలను నాలుగు యూనిట్లుగా విభజించి నిర్వహించిన టెండర్ల మొత్తం వార్షిక విలువ సుమారు రూ.172.80 కోట్లు కాగా, కిట్ ధరలు పెరిగాయని తెలిపారు. ట్రైబల్ కిట్ఽ ధర రూ.350 నుంచి రూ.446కు, సాధారణ కిట్ ధర రూ.241 నుంచి రూ.283.19కు పెరగడం వల్ల సుమారు రూ.29.22 కోట్ల మేర అదనపు ప్రజాధనం భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని కోరారు. టెండర్ నిబంధనల్లో సొంత తయారీ యూనిట్, ఫుడ్ సేప్టీ లైసెన్స్, ఉత్పత్తి సామర్థ్యం వంటి అర్హతలు ఉన్నప్పటికీ, తయారీ యూనిట్లు లేని సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో అనర్హతకు గురైన సంస్థలకు తిరిగి ఎలా అర్హత కల్పించారో విచారించాలన్నారు. పలువురు బిడ్డర్లు ఒకే ధరను కోట్ చేయడం వంటి అంశాలపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. జోన్ విధానాన్ని రద్దు చేసి జిల్లా వారీగా టెండర్లు నిర్వహించాలని, డ్వాక్రా సంఘాలు, మహిళా స్వయం సహాయక గ్రూపులకు పథకాన్ని అప్పగించాలని అశోక్ డిమాండ్ చేశారు. టెండర్లపై ఆర్థిక ఆడిట్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు పొందురూ అప్పలరాజు, బూర వాసు పాల్గొన్నారు. -
టిప్పరు దగ్ధం
చికెన్పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం సమీపంలో నాగావళి తీరంలో గల ఇసుక ర్యాంపు నుంచి ఇసుక తరలించేందుకు సిద్ధం చేసిన టిప్ప రు శనివారం దగ్ధమైంది. విజయనగరానికి చెందిన ఈ వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పాలకొండ ఆగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి జామి సర్వే శ్వరరావు శకటంతో సహా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో వాహనం క్యాబిన్, తొట్టె పూర్తిగా కాలిపోయాయని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సదరు వాహన యజమాని రాగోలు సత్యనారాయణ మాట్లాడుతూ రూ.10 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు వాపోయారు. -
అల్లంత దూరాన ధర
● ప్రస్తుతం మార్కెట్లో కిలో అల్లం రూ.250 పైనే.. పార్వతీపురం: వంటింట్లో ఏ కూర వండాలన్నా అల్లం తప్పనిసరి. అలాంటి అల్లం కొనుగోలు చేయాలంటే పేద, మధ్య తరగతి వారు అమ్మో.. అంత ధర అని.. విస్తుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల నుంచి అల్లం ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో అల్లం ధర రూ.250ల నుంచి రూ.280 వరకు పలుకుతోంది. దీంతో అల్లం కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో అల్లం సాగు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతిచేసుకునే అల్లం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. హోల్‌సేల్ వ్యాపారుల నుంచి రూ.230లకు కొనుగోలు చేసుకొని చిరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా అల్లం పంట చేతికి రాకపోవడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే బాటలో ఉల్లి, వెల్లుల్లి ధరలు దూసుకుపోతున్నాయి. -
విజయమే లక్ష్యంగా సాగుదాం
జియ్యమ్మ వలస రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి పిలుపునిచ్చారు. అప్పుడే గ్రామ స్వరాజ్యానికి, పార్టీకి మనమిచ్చే గౌరవమన్నారు. చినమేరంగిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షత్ రాజు ఆధ్వర్యంలో కురుపాం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. గరుగుబిల్లి, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ముఖ్యనేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోసాలను ఎండగట్టాలి.. 2024 ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి 143 దొంగ హామీలతో చంద్రబాబు గెలుపొందారు. అనంతరం వాటి అమలును గాలికొదిలేశారు. ఈ మోసాలను ప్రజలకు వివరంగా తెలియజెప్పాలి. అందులో భాగంగానే గత వైఎస్సార్ సీపీ హయాంలో ప్రజలకు అందించిన పథకాల గురించి ప్రజలకు గుర్తు చేయాలి. నిరుద్యోగ యువత, రైతులు, విద్యార్థులు, మహిళలకు చేసిన మోసాలపై కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని’ పుష్పశ్రీవాణి, పరీక్షిత్ రాజు సూచించారు. దీటైన వారే నిలబడాలి.. ‘ఐదు మండలాల్లోని అన్ని పంచాయతీలోనూ వైఎస్సార్సీపీ తరఫున దీటైన అభ్యర్థులను బరిలో దించాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల స్థానాలు గెలిపించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా జరి గిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది. అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు, బెదిరింపులకు తలొగ్గొద్దు. అలాంటి వాటిని ముందుగానే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని’ నేతలు పిలుపునిచ్చారు. సైనికుడిలా కష్టించాలి.. ‘ప్రతి కార్యకర్త సైనికుడై వైఎస్సార్సీపీ కోసం కష్టపడి మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి. కూటమికి ఓటమిని చూపించే విధంగా ప్రతి కార్యకర్త నిలబడాలి. పార్టీలో అంతర్గత కలహాలు తావివ్వకూడదు. ఎవరికై తే పార్టీ బీ–ఫారంను అందిస్తుందో వారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిగా భావించి గెలిపించాలి. ఈ రోజు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల విజయమే 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంగా భావిస్తాం. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థికి అన్నివిధాలా అండగా ఉంటామని’ పుష్పశ్రీవాణి, పరీక్షిత్‌రాజు ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం ‘స్థానిక’ సమరానికి సిద్ధం కావాలని పరీక్షిత్ రాజు పిలుపు కార్యకర్తల బలమే పార్టీ విజయమని పుష్పశ్రీవాణి వ్యాఖ్య -
పెదపెంకిలో డ్రెయిన్లతో మ్యాజిక్!
● కాలువల నిర్మాణంలో విన్యాసాలు ● అప్పుడు వేసి.. ఇప్పుడు తొలగించి... ● వృథా అవుతున్న రూ.కోట్లాది నిధులు సాక్షి, పార్వతీపురం మన్యం/బలిజిపేట: బలిజిపేట మండలం పెదపెంకిలో మ్యాజిక్ డ్రైన్ల పేరిట అధికారులు విన్యాసాలు చేస్తున్నారు. అవగాహన ఉండి చేస్తున్నారా.. లేక, ఉప ముఖ్యమంత్రి దత్తత గ్రామం కావడం వల్ల తెలియకపోయినా బుర్ర ఊపేశారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు నిర్మించిన డ్రైన్లను ఇప్పుడు తొలగిస్తున్నారు. దీనివల్ల రూ.కోట్లాది నిధులు మట్టి పాలవుతున్నాయి. పెదపెంకి గ్రామాన్ని దాదాపు మూడు దశాబ్దాలుగా బోధ వ్యాధి పీడిస్తున్న విషయం విదితమే. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ పరిస్థితిని అధిగమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భావించారు. ఎక్కడికక్కడ మురుగు నీరు నిల్వ ఉండిపోవడం వల్ల దోమల వ్యాప్తి చెందుతోందని భావించి.. ఇక్కడ మ్యాజిక్ డ్రైన్లు, సిమెంట్ రోడ్లు, పలు అభివృద్ధి పనుల కోసం రూ.6.5 కోట్లు మంజూరు చేయించారు. వర్షం నీరు, వాడుక నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోయేలా మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాల్సి ఉంది. రాజకీయాలతో పనులకు గ్రహణం రూ.కోట్లలో నిధులు వస్తుండటంతో రాజకీయ నేతల కన్ను పనులపై పడింది. అప్పటి వరకు పనులు చేసిన కాంట్రాక్టర్‌ను తొలగించి, తమవారికి అప్పగించాలని అధికార పార్టీకి చెందిన నేత పట్టుబట్టారు. ఆయన సూచించిన కాంట్రాక్టరు చేసిన పనుల్లో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపించింది. ఈ పనుల నిర్వహణపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఆయన ప్రారంభోత్సవానికి పెదపెంకి రావాల్సి ఉన్నా.. పనులు పూర్తి కాకపోవడంతో పర్యటన వాయిదా పడింది. మరోవైపు అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పనులకు కొంతమంది స్థానికుల నుంచి కూడా సహకారం కరువైంది. అడుగడుగునా అడ్డుపడుతున్నారు. దీనికి తోడు మొదట్లో అధికారులు ప్రధాన రహదారి పక్కన వేసిన మ్యాజిక్ డ్రైన్‌న్ అడ్డుసుడి పనులు ఫలితంగా ప్రజలకు అవస్థలు అధికమయ్యాయి. అడ్డదిడ్డం పనులు.. ఆగ్రహించిన ప్రజలు గ్రామంలో గాంధీ విగ్రహం నుంచి బస్టాండు వరకు ఉండే ప్రధాన రహదారికి ఒకవైపు వేసిన మ్యాజిక్ డ్రైన్‌న్ పనిని అధికారులు ఇష్టారాజ్యంగా వేయడంతో సమస్య తలెత్తింది. కాలువలలో మురుగునీరు నిల్వ ఉండిపోవడం, నివాస గృహాల్లోకి నీరు చేరిపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అధికారులు గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక అధికారులు ప్రధాన రహదారికి పక్కగా వేసిన మ్యాజిక్ డ్రైన్న్లో ఉన్న పిక్కను తొలగించి మురుగునీరు బయటకు వచ్చేలా చేశారు. తొలగించిన మ్యాజిక్ డ్రైన్‌ను తిరిగి వేస్తారా? వేస్తే పాత పిక్కనే వినియోగిస్తారా? కొత్త పిక్కను వేసి ఇప్పటికై నా మ్యాజిక్ డ్రైన్‌న్ నిర్మాణం పక్కాగా చేపడతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడిచిపోతున్నా పెదపెంకిలో అభివృద్ధి పనులకు ఒక రూపు రావడం లేదు. -
కొనసాగుతున్న తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: ఎగువన ఉన్న ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు, జిల్లాలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 105 మీటర్లకుగాను 104.25 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.058 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీకి సగటున 8,497 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ఈ మేరకు మూడు గేట్లును ఎత్తి సగటున 7,691 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, పాత కుడి కాలువ ద్వారా 40 క్యూసెక్కులు, పాత ఎడమ కాలువ ద్వారా 414 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు బి.కిషోర్‌కుమార్, శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు అధికంగా వరద వస్తే దిగువకు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. ఐపీహెచ్ఎల్ ప్రారంభం సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రి నూతన భవనంలో ఐపీహెచ్ఎల్ (ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరోటరీ)ని వర్చువల్ మోడ్‌లో కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ, ఆర్ఎంఓ డీవీ శ్రీనివాస్, సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాలసంజీవని టెండర్లలో అవకతవకలు
● సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్ ● జేసీకి వినతిపత్రం అందజేత పార్వతీపురం రూరల్: బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్ పథకాల టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకుని, సమగ్ర స్వతంత్ర విచారణకు ఆదేశించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీపీఐ మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మథరావు, కార్యవర్గ సభ్యులు ఆర్వీఎస్ కుమార్.. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టెండర్ల నిర్వహణ లో నిబంధనలకు నీళ్లొదిలి, కొద్దిమంది కాంట్రాక్టర్లకే గంపగుత్తుగా ప్రయోజనం చేకూర్చారని ఆరోపించారు. టెండర్ల రేట్ల పెంపుతో సుమారు రూ.29.22 కోట్ల ప్రజాధనం అదనంగా ఆవిరయ్యే ప్రమాదం ఉందన్నారు. గతంలో అనర్హత వేటు పడిన సంస్థలకు టెండర్లలో పచ్చజెండా ఊపడంపై విచారణ జరపాలన్నారు. టెండర్ల కేటాయింపులు, నాణ్యతా పరీక్షలు, భారీ చెల్లింపులపై పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మహిళా స్వయం సహాయక సంఘాలకు, చిన్న, మధ్యతరహా సంస్థలకు టెండర్లలో సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే వ్యవహారంపై సీఎంకు లేఖరాసినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. -
విద్యార్థులకు క్రీడా తరహా దుస్తులు
● యూనిఫారానికి బదులుగా ఇవ్వాలని ప్రతిపాదించిన కలెక్టర్సాక్షి, పార్వతీపురం మన్యం: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ముఖ్యమైన ప్రతిపాదనను సమర్పించారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతమున్న సంప్రదాయ యూనిఫాంల స్థానంలో సౌకర్యవంతమైన స్పోర్ట్స్ తరహా యూనిఫాం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన దర్జీల కొరత వల్ల ప్రస్తుత యూనిఫాంల కుట్టు నాణ్యత సరిగా ఉండడం లేదని, త్వరగా చిరిగిపోతున్నాయని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల లోగోతో కూడిన గాలి పీల్చే కాటన్ ఫ్యాబ్రిక్ టీ–షర్ట్, ట్రాక్ ప్యాంట్లను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఉచితంగా కదిలేందుకు మెరుగైన సౌకర్యం లభించడమే కాక.. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. ఈ ప్రతిపాదనను పైలట్ ప్రాజెక్ట్‌గా ముందస్తుగా కొన్ని పాఠశాలల్లో అమలు చేయడానికి అనుమతించాలని కోరారు. ● కలెక్టర్ల కాన్ఫరెన్‌న్స్‌లో పార్వతీపురం మన్యం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. మన్యం జిల్లాలోని విద్యాశాఖ బడ్జెట్ సమన్వయంతో బాలురు, బాలికలకు సంబంధించి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని ఇప్పటికే ఎంపిక చేశామని, రాబోయే రెండు వారాల్లో వారికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒలింపిక్ క్రీడలను లక్ష్యంగా చేసుకుని ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ● యువత నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన ‘నైపుణ్యం’ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జిల్లా ఏకంగా 65.8 శాతం సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ● జిల్లాలో ఈ–ఆఫీస్ ఫైళ్ల సమర్థ నిర్వహణపై సీఎం ప్రశంసించారు. కలెక్టర్‌కు వచ్చే ప్రతి ఫైల్‌ను సగటున కేవలం 5 గంటల వ్యవధిలోనే పరిష్కరించి క్లియర్ చేస్తున్న తీరుపై అభినందనలు తెలిపారు. ప్రజలకు, అర్జీదారులకు వేగంగా న్యాయం జరిగేలా మన్యం జిల్లా చూపిస్తున్న ఈ పనితీరును అందరూ స్ఫూర్తిగా తీసుకుని అమలు చేయాలని సూచించారు. ● జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. కేవలం భౌతిక వసతులు, కిట్ల పంపిణీతోనే సరిపెట్టకుండా విద్యార్థులకు అందే విద్యా ప్రమాణాలను పెంచడం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ● జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ, పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రైతులకు నిలకడైన ఆర్థిక పరిపుష్టి అందించేందుకు చేపడుతున్న ఉద్యాన అభివృద్ధి చర్యలను కలెక్టర్ వివరించారు. పైనాపిల్, జీడిమామిడి, పసుపు పంటల ప్రగతిని తెలియజేశారు. -
●ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలి
గత ప్రభుత్వంలో అమలైన పథకాలు, ప్రస్తుత పాలనలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి. జిల్లాలో పార్టీ పటిష్టతకు పెద్దల మార్గదర్శకత్వంలో అందరం కలిసికట్టుగా అడుగులు వేద్దాం. మున్సిపాలిటీ, మండల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. –మామిడి శ్రీకాంత్, తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ -
పణుకువలసలో వణుకు..!
● ప్రమాదకరంగా వంతెన ● వాహనాల రాకపోకలు నిలిపివేత ● పరిశీలించిన రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారులుతెర్లాం: రాజాం–రామభద్రపురం ఆర్ అండ్ బీ రోడ్డులో తెర్లాం మండలంలోని పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయింది. వంతెనకు దక్షిణ దిక్కున ఉన్న రక్షణ గోడ, వంతెన కొంత భాగం శుక్రవారం ఉదయం పూర్తిగా కూలిపోయింది. గురువారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో ఆ వర్షానికి వంతెనకు ఓ వైపు శిథిలావస్థకు గురైన రక్షణ గోడ, వంతెనలో సగభాగమంతా పూర్తిగా పడిపోయింది. పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ ఆర్.ధనం, డిఫ్యూటీ తహసీల్దార్ జి.సత్యనారాయణ, ఆర్అండ్బీ ఏఈ రాజు, మాజీ ఎంపీపీ ప్రతినిధి నర్సుపల్లి వెంకటేశ్వరరావులు వెంటనే వంతెన వద్దకు వెళ్లి పరిశీలించారు. వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో మిగిలిన వంతెన భాగం కూడా ప్రమాదకరంగా మారిందని, భారీ వాహనాలు వంతెన పైనుంచి రాకపోకలు సాగిస్తే పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు ఆ వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వంతెన పైనుంచి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ప్రమాదకరంగా ఉన్న వంతెన పరిస్థితిని కలెక్టర్‌కు తెలియజేస్తానని తహసీల్దార్ ధనం తెలిపారు. పణుకువలస వద్ద ఉన్న వంతెన రక్షణగోడ ఓ పక్క పూర్తిగా పడిపోయిందని, మిగిలిన వంతెన భాగం ప్రమాదకరంగా ఉందన్న విషయాన్ని మాజీ ఎంపీపీ ప్రతినిధి వెంకటేశ్వరరావు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్ అండ్ బీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు వంతెన పరిస్థితిని ఏఈ రాజు తెలియజేశారు. వంతెన పైనుంచి భారీ వాహనాలు రాకుండా రెండు వైపులా స్టాపర్లు ఏర్పాటు చేశారు. వంతెన మీదుగా భారీ వాహనాలు రాకుండా చూడాలని పణుకువలస వీఆర్ఏను తహసీల్దార్ ఆదేశించారు. ఇబ్బందిపడుతున్న వాహన చోదకులు, ప్రయాణికులు పణుకువలస వంతెన ఓ పక్క పూర్తిగా కూలిపోవడం, వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు, కార్లు, బస్సులు ఎక్కువగా ఈ వంతెనపై నుంచి వెళ్తుంటాయి. వంతెన ప్రమాదకరంగా ఉండడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేయడంతో రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి రాజాం, శ్రీకాకుళం వైపు వస్తున్న వాహనాలు, శ్రీకాకుళం, రాజాం వైపు నుంచి సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు వస్తున్న వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీకాకుళం నుంచి సాలూరు, బొబ్బిలి వెళ్లేందుకు వస్తున్న బస్సులు పణుకువలస జంక్షన్ వద్ద నిలిపివేస్తున్నారు. సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి వస్తున్న వాహనాలు తెర్లాం జంక్షన్ వద్ద నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంత వేగంగా వంతెనకు మరమ్మతులు చేపట్టాలని, లేదా వంతెన పక్క నుంచి వాహనాలు వెళ్లేందుకు డైవర్షన్ ఇప్పించాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవను ఆలయ అర్చకులు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిపించారు. శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఉంచి దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.8మంది మేకల దొంగల అరెస్ట్మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస, కాశీపట్నం, తూరుమామిడి గ్రామాలకు చెందిన పలువురి మేకలు ఇటీవల చోరీకి గురికాగా పోలీస్ స్టేషన్లో నమోదైనప ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించి శుక్రవారం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్లో మార్కొండపుట్టి, దుగ్గేరు, పనసభద్ర గ్రామాలకు చెందిన ఆరుగురితో పాటు మరో ఇద్దరూ మైనర్లు ఉన్నారు. వారు దొంగిలించిన 10 మేకలు, రవాణాకు ఉపయోగించిన ఆటో, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎనిమిది మందిలో ఆరుగురిని జుడిషియల్ రిమాండ్‌కు ఇద్దరు మైనర్లను జువైనల్ కోర్టుకు పంపించినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. పామాయిల్ గెలల ట్రాక్టర్ బోల్తాకొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి భారీగా గోతుల మయం కావడంతో వాహన చోదకులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో అల్ప పీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో శుక్రవారం రామభద్రపురం సమీపంలో పామాయిల్ గెలలతో వెళ్తున్న ట్రాక్టర్ గోతిలో బోల్తా పడింది. ఈ క్రమంల అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నేడు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభవిజయనగరం: ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహసభ ఈనెల 11న జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.రమేష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం జరగనున్న మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నామని తెలిపారు. మహాసభకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకటరావు, జి.ఆంజనేయులు, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.గోవిందరాజులు, రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న మహాసభలకు జిల్లాలో, నగరంలో ఉన్న జర్నలిస్టు మిత్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు.బి.ప్రసాదరావు, నాగరాజు పాల్గొన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిబొబ్బిలి: క్రైస్తవ ప్రార్ధనల అనంతరం చర్చి నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బొబ్బిలి పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద జరిగిన త ప్రమాదంపై సీఐ కె.నారాయణ రావు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మార్కొండ పుట్టి గ్రామానికి చెందిన నారాయణ పురం లక్ష్మయ్య(53)బొబ్బిలిలోని ఐటీఐ కాలనీలో గల చర్చికి వచ్చాడు. ప్రార్థనల అనంతరం తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఫ్లైఓవర్ వైపు వెళ్తుండగా రామభద్రపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం లక్ష్మయ్యను ఢీకొని మీదుగానే వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు సీహెచ్‌సీకి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. లక్ష్మయ్య తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్సై లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
●సాగునీరు అందక..
మక్కువ మండల వ్యాప్తంగా దాదాపు మూడువేల ఎకరాలమేర వరి సేద్యానికి సిద్ధమయ్యా రు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేవు. అదును దాటడంతో వెదలు కుళ్లిపోయాయి. నీరు లేక ఉభాలు సక్రమంగా జరగకపోవడంతో వేలాది ఎకరాల్లో నాట్లు పడలేదు. వెంగళరాయ సాగర్ ద్వారా నీరు అందించలేకపోయారు. తూరుమామి డి, చంద్రయపేట, కొయ్యానపేటలో వరి పంట నీరు లేక బీడుపోయింది. ప్రభుత్వ సహకారం లేదు. బీమా మొత్తాలను రైతులే చెల్లించాలని చెప్పారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు తాత్కాలిమే. రానున్న కీలక దశలో వానలు కురవకుంటే రైతులు ఆశలు వదులకోవాల్సిందే. –టి.శ్రీనివాసరావు, రైతు, కంచేడువలస గ్రామం, మక్కువ మండలం -
●కష్టాన్ని నమ్ముకుని..
కష్టాన్ని నమ్ముకుని సేద్యం చేస్తున్నాం. ఈ ఏడాది వరి రెండెకరాల్లో, కాయగూర పంటలు ఓ ఎకరాలో వేశాం. కీలక దశల్లో సాగునీరు లేక మోటార్లు, బోర్లుపై ఆధారపడ్డాం. అయినా నమ్మకం లేదు. ఇప్పటివరకూ దాదాపు రూ.60 వేల వరకూ పెట్టుబడులు పెట్టాం. కుటుంబమంతా కష్టపడుతున్నాం. ఈ వర్షాలు కంటితుడు పు మాత్రమే. పరిస్థితి ఇలానే కొనసాగితే అప్పులు చేసి పెట్టిన మదుపులు కూడా రావు. ఆశలన్నీ వరుణిడిపైనే పెట్టుకున్నాం. –జి.లక్ష్మణరావు, రైతు, అంపిలి, పాలకొండ మండలం కుటుంబ పోషణకు సేద్యాన్ని నమ్ముకున్నాం. మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ఇప్పటికే వేలాది రూపాయలు మదుపులు పెట్టాను. దుక్కులు చేసి నారుపోసి మూడు నెలలు గడుస్తోంది. సాగునీరు లేక సకాలంలో ఉడుపులు చేపట్టలేకపోయాను. వర్షపు నీటి ఆధారంగా ముదిరిన నారు వేశాం. భగవంతుడిదే భారం. తిండి గింజలైనా వస్తాయన్న ఆశతో ఉన్నాను. రానున్న రోజు ల్లో వానలు కురవకుంటే మట్టే మిగులుతుంది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. –ఎం.రమణమ్మ, కౌలురైతు, పెదపెంకి, బలిజిపేట మండలం -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాల విడుదల
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితాలను శుక్రవారం ప్రచురించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 15 జెడ్పీటీసీ స్థానాలకు.. 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన జాబితాలను ప్రచురించినట్లు ఉమ్మడి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎ.లవరాజు తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లోనూ.. 15 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ కార్యా లయంతో పాటు.. పార్వతీపురం డివిజనల్ అభి వృద్ధి కార్యాలయంలోనూ ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి జిల్లా పరిషత్ ఉమ్మడి విజయనగరంలో కలిసి ఉండటం వల్ల గత జిల్లా ప్రాతిపదికనే తీసుకున్నారు. జిల్లా పరిషత్ పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి మార్గదర్శకాలూ విడుదల కాలేదు. మన్యం జిల్లా లో సుమారు 6.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 24వ తేదీతో ప్రస్తుత పాలక వర్గం ముగియనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికనే వచ్చే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఆకతాయిల దాడిలో వంటమనిషికి తీవ్ర గాయాలు
పార్వతీపురం రూరల్: కళాశాల విద్యార్థుల మధ్య రేగిన పాతకక్షలు రచ్చకెక్కగా, ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని ఒక అమాయక వంట మనిషి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన పార్వతీపురం పట్టణంలోని ఇందిరా కాలనీ సమీప ప్రధాన రహదారిపై కలకలం రేపింది. స్థానిక కల్యాణ మంటపంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కళాశాల వేడుకల అనంతరం, కేటరింగ్ సామగ్రితో ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న వంట మనిషిని, మరో విద్యార్థిని కొందరు యువకులు మార్గమధ్యంలో అడ్డగించారు. సదరు విద్యార్థితో పాత విషయాలపై వాగ్వాదానికి దిగి భౌతిక దాడికి పూనుకున్నారు. అక్కడే ఉన్న వంట మనిషి గమనించి, వారిని వారించేందుకు జోక్యం చేసుకోగా.. ఉన్మాదంతో రగిలిపోయిన ఆకతాయిలు వంటమనిషిపై కూడా విరుచుకుపడ్డారు. సమీపంలో ఉన్న సిమెంట్ రేకుల ముక్కలు, పిడికిళ్లతో దారుణంగా కొట్టడంతో ఆ వంట మనిషి తల, పెదవికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాధితుడిని గమనించిన ఓ స్థానిక ఆటో డ్రైవర్ తక్షణమే స్పందించి పార్వతీపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ కొట్లాటకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు పాల్పడిన విద్యార్థులు, ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. -
గిరిజనులకు అన్యాయం చేస్తారా?
● పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి రామభద్రపురం: చంద్రబాబు ఇచ్చేయమంటే దశాబ్దాల కాలంగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూములు స్వాధీనం చేసుకుని పరిశ్రమల పేరిట పెత్తందార్లకు కట్టబెట్టి గిరిజనులకు అన్యాయం చేసేస్తారా? అని పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు మండలకేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామభద్రపురం మండలంలోని కాకర్లవలస వద్ద గిరిజన రైతుల పంటలను రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి నిరా్ద్క్షిణ్యంగా ధ్వంసం చేయడం ఘోరమని మండిపడ్డారు. భూమి మీద సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని, ఎంతో కాలం కష్టపడి పండించిన పంటలు పోలీసు ఫోర్స్ ఉపయోగించి దౌర్జన్యంగా ధ్వంసం చేయించిన ఆర్డీవో, తహసీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పంటలు అధికారులే ధ్వంసం చేయించి అడ్డుకున్న గిరిజన రైతులను అక్రమ అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పెత్తందార్లు ఎలా చెబితే అలా ప్రభుత్వం చేస్తే పేదల ఉసురు తగులుందన్నారు. గిరిజనులు భూములు వదిలేదిలేదని, ధ్వంసం చేసిన పంటలకు సంపూర్ణ నష్టపరిహారం అందించి న్యాయం జరిగే వరకు పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మర్రి శ్రీనివాసరావు, సీపీఎం నాయకుడు బలస శ్రీనివాసరావు, పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు. -
పెరిగిన తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: ఎగువన ఉన్న ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు, అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం సాయంత్రం బ్యారేజీవద్ద నీటిమట్టం 105 మీటర్లకు గాను 104.38 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొ త్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.140 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీకి సగటున 10వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ఈమేరకు మూడు గేట్లు ఎత్తి సగటున 8,200 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టువద్ద నీటిపరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు బి.కిషోర్ కుమార్, శ్రీనివాసరావవులు పర్యవేక్షిస్తున్నారు. ప్రా జెక్టుకు అధికంగా వరద వస్తే దిగువకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాలూరు రూరల్: ఎట్టకేలకు రెండేళ్ల తరువాత కొత్త పెన్షన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అదికూడా ఒక్క వారం రోజులు గడువులోగా దరఖాస్తులు పూర్తిచేసుకోవాలి. దీంతో పెన్షన్ పథకానికి అర్హత ఉన్నవారంతా గడిచిన నాలుగురోజులుగా మీసేవ, సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పట్టణంలోని మీసేవ కేంద్రాలకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు క్యూకడుతున్నారు. రో జంతా కష్టపడి ఎలాగోలా దరఖాస్తుచేసుకుని వాటిని ఆమోదింపచేసేందుకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పెన్షన్ ప్రక్రియ ప్రారంభించడంపై ప్రజల్లో కాసింత ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్వతీపురం రూరల్: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి జూనియర్ సివిల్ జడ్జి కె.రమేష్ సతీమణి జి.అనూష పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ కేంద్రాస్పత్రిలో శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. జడ్జి రమేష్ అత్తవారిది పార్వతీపురం పట్టణమే కావడంతో, కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్న సర్కారు దవాఖానాలోనే చేర్పించారు. ఓ సివిల్ జడ్జి హోదాలో ఉన్న వ్యక్తి తన భార్యను ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పాలకొండలోని జ్ఞాన సరస్వతి మందిరంలో భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస అమావాస్య సందర్భంగా జ్ఞాన సరస్వతీ దేవిని 108 చీరలతో అలంకరించారు. లలితా సహస్రనామాలు, మహా మణిదీప వర్ణన, సరస్వతి అష్టోత్తర శతకాన్ని పఠించారు. అర్చకుడు షరత్కుమార్ నేతృత్వంలో శాస్త్రోక్తంగా శ్రావణ మాస, మాస అమావాస్య పూజలు జరిపారు. – పాలకొండ రూరల్ -
●అధికారుల చొరవ లేదు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవవని తెలిసి సంబంధిత అధికారులు అవసరమైన చర్యలపై దృష్టి పెట్టలే దు.ఫలితం అన్నదాతకు తీరని నష్టం. తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో శివారున ఉన్న 16 గ్రామాలకు సాగునీరు ఇవ్వలేమని తేల్చేశారు. పైగా ఎరువులు, క్రిమిసంహారక మందుల సేకరణకు సాంకేతికత ముడిపెట్టారు. కౌలు రైతులపై దృష్టి ెపెట్టలే దు. తొలి దశలో వెదలు జల్లిన రైతులు నీరు లేక పంటలు నష్టపోవడంతో రెండుమూడు దఫాలు వెదలు వేసి అదృష్టం పరీక్షించుకుని నష్టపోయారు. మండలవ్యాప్తంగా వందలాది ఎకరాల్లో ఉడుపులు జరగలేదు. నారు ముదిరిపో యి ఇబ్బందులు పడుతున్నారు. నీటికోసం రైతులే సొంత మదుపులతో కాలువలు బాగుచేసుకున్నారు. మోటార్లు పెట్టి ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఈ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. –కండాపు ప్రసాదరావు, రైతు సంఘం నాయకుడు, రుద్రిపేట, పాలకొండ మండలం -
చివరి ఆశలు చిగురించేనా..?
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● ఎన్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ● సెప్టెంబర్ నాటికీ పూర్తికాని ఉడుపులు ● అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న మోస్తరు వర్షాలుపాలకొండ రూరల్/మక్కువ/బలిజిపేట: ఖరీఫ్ ప్రారంభం నుంచి అన్నదాతలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగునీటి వనరుల ద్వారా రైతుల పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించకపోవడం, ఆశించిన మేర వానలు కురవక పోవడంతో జిల్లా వ్యాప్తంగా సీజనల్ వరి సేద్యంతో పాటు ఇతర వాణిజ్య, కూరగాయపంటల సేద్యం, దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో అండగా ఉండాల్సిన యంత్రాంగం, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ రైతన్నలు మండిపడుతున్నారు. సాగునీరు అందక నాట్లు వేసేందుకు అవకాశం లేక సెప్టెంబర్ నెల గడిచిపోతున్నా వేలాది ఎకరాలు ఖాళీగా దర్శనమిస్తున్నా యి. శివారు భూములకు కీలక సమయంలో తడులు అందక వరి, కాయగూరల పంట భూములు బీడువారిపోయాయి. అల్పపీడనంతో చిగురించిన ఆశలు నాట్లు వేసే సమయం ముగిసిపోవడం, సిద్ధం చేసి న నారు ముదిరిపోవడం, సాగునీరు లేక రైతు నీరసించిపోయాడు. వెదలు, తొలి దశలో చేపట్టిన ఉడుపులు ఎండుముఖం పట్టడంతో భారం భగవంతుడి పై వేసిన కర్షకులకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జీవం నిలిపింది. గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలతో ఆశలు కొంతమేర చిగురించాయి. సాధారణ వర్షపాతంతో పోల్చితే ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 32 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. శుక్రవారం నాటికి అత్యల్పంగా సాలూరు మండంలో 10.6 మిల్లీమీటర్లు, అత్యధికంగా సీతంపేట ఏజెన్సీలో 73.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన ఉండే ఒడి శా రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా ఇక్కడికి ఆ నీరు నదుల ద్వారా చేరితే కొంతమేర లాభం ఉంటుంది. మరో వారం రోజులు వర్షాలు కొనసాగితే తప్ప పంటలపై ఆశలు ఉండవని రైతులు చెబుతున్నారు. నేటికీ సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. జిల్లాలో.. అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల పంటలకు సంబంధించి సాగువిస్తీర్ణం 88,858 హెక్టార్లు. ఈ ఏడాది వరి 72,829 హెక్టార్లలో సేద్యం చేపట్టారు. ప్రస్తుతానికి 66,325 హెక్టార్లల్లో నాట్లు వేయగా దాదాపు 20 వేల ఎకరాల్లో ఉడుపులు జరగలేదని రైతులు చెబుతున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పంటల బీమా భారం రైతులపైనే వేసింది. -
స్థానిక సమరానికి సన్నద్ధం కావాలి
పార్వతీపురం రూరల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో అడుగులేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురంలో మాజీ శాసనసభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, అలాగే జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వార్డు సభ్యులు హాజరయ్యారు.సభలో నాయకులు మాట్లాడు తూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరి గిన సంక్షేమ కార్యక్రమాలను, ప్రస్తుత కూటమి ప్ర భుత్వ పాలన తీరును గడపగడపకూ వెళ్లి ప్రజలకు వివరించాలని కేడర్‌కు సూచించారు. వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బలగ శ్రీరాములు నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, జెడ్పీటీసీలు అలజంగి రవికుమార్, మామిడి బాబ్జీ, బల గ రేవతమ్మ, ఎంపీపీలు బలగ రమణమ్మ, మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బి.రవికుమార్, వెలిది సాయిరాం, పార్టీ ప్రధాన కార్యదర్శులు పోల సత్యనారాయణ, తప్పిట ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, మాజీ వైస్ చైర్పర్సన్ కొండపల్లి రుక్మిణి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వివి ధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్వతీపురం మున్సిపాలిటీతో పాటు మూడు మండలాల్లోని ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను కచ్చితంగా కై వసం చేసుకుంటాం. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్య త నాది. నేను పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నా రాజకీయ ప్రస్థా నం ఉన్నంతకాలం వైఎస్ జగన్ వెంటే నడుస్తాను. గ్రామ, మండల స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి రెండు ప్రభుత్వాల పాలనల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తాం. –అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే పార్టీకి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. ఉమ్మడి జి ల్లా రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా పార్వతీపురం నియోజకవర్గం పార్టీకి కంచుకో టగా నిలుస్తుంది. రానున్న మున్సిపల్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి ఒక్క రూ సమన్వయంతో పనిచేసి వైఎస్సార్సీపీని విజయపథంలో నడపాలి. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పార్టీని తిరిగి క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి మంచి ఫలితాలు సాధించేందుకు కేడర్ అంతా సన్నద్ధం కావాలి. –శత్రుచర్ల పరీక్షిత్ రాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సమష్టి కృషితో విజయబావుటా ఎగురవేయాలి అన్ని స్థానాల్లో పోటీకి పార్టీ సిద్ధం పార్టీ శ్రేణులకు రీజినల్ కోఆర్డినేటర్ ముత్యాలనాయుడు దిశానిర్దేశం -
జీతాలడిగితే.. జులుం
● ఎస్ఎస్ఏ సిబ్బంది తీరుపై సీఆర్‌ఎంటీల ఆగ్రహం ● విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన పార్వతీపురం రూరల్: జీతాలు చెల్లించాలని అడిగితే సర్వశిక్ష కార్యాలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంపై పార్వతీపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట సీపీఎం, జేఏసీల నేతృత్వంలో సీఆర్ఎంటీలు శుక్రవారం ఆందోళనకు దిగారు. గత నెల 20వ తేదీనే జీతాలకు సంబంధించిన బడ్జెట్ విడుదలైనప్పటికీ, ఎస్ఎస్ఏ సిబ్బంది నిర్వాకం వల్ల జీతాలు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నెలవారీ ఈఎంఐలు, కుటుంబ బాధ్యతల నేపథ్యంలో సకాలంలో బిల్లులు పెట్టాలని కోరిన పాపానికి.. ‘దిక్కున్న చోట చెప్పుకోండ’ని సిబ్బంది దుర్భాషలాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సిబ్బంది తక్షణమే క్షమాపణలు చెప్పాలని, వెంటనే వేతనాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఆర్‌ఎంటీల నిరసనకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ సంఘీభావం తెలిపారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
విశాఖపట్నం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని మారికవలసలో జరిగిన ఈ సంఘటనపై పీఎంపాలెం ఇన్స్పెక్టర్ జి. బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన గోర్లపల్లి చైతన్య (29)కు అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డుకు చెందిన ఝాన్సీ (23)తో 2025లో వివాహమైంది. వీరు మారికవలస విశ్వనాథ్ అవెన్యూలోని 202వ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. చైతన్య ఇన్ఫోసిస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తూ వర్క్ ఫ్రం హోమ్ విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు తొమ్మిది నెలల క్రితం చైతన్య తండ్రి రవికుమార్ మృతి చెందాడు. అప్పటి నుంచి చైతన్య మానసికంగా కుంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనికి భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న మనస్పర్థలు కూడా తోడయ్యాయని, ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ బెడ్రూమ్లోకి వెళ్లారు. శుక్రవారం తెల్ల వారుజామున 3 గంటల సమయంలో ఝాన్సీ నిద్రలేచి చూడగా చైతన్య పక్కన లేకపోవడంతో మరో బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహకారంతో తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ చైతన్య తువ్వాలుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండడాన్ని గుర్తించారు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంటూ ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎస్.కోట వాసి -
గజరాజుల గమనం..కుంకీల కదనం
● సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం ● గ్రామస్తుల తీవ్ర ఉత్కంఠపార్వతీపురం రూరల్: గజరాజుల గమనం, కుంకీల కదనం మధ్య పార్వతీపురం, కొమరాడ మండలాల సరిహద్దుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పంటలు పాడుచేస్తూ, గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న అడవి ఏనుగుల గుంపునకు అడ్డుకట్ట వేసేందుకు కుంకీ ఏనుగులు అహర్నిశలు పహారా కాస్తున్నాయి. ఇటీవల ఆంధ్రా–ఒడిశా సరిహద్దులకు వెళ్లిన అడవి ఏనుగులు, అక్కడి ప్రజల తరిమివేతతో వెనుదిరిగి వచ్చి ప్రస్తుతం గంగమాంబపురం, చందలింగి, వరహాల గడ్డ రిజర్వాయర్ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఈ మదపుటేనుగులు పెద్దమరికి పంచాయతీ గ్రామాల్లోకి ప్రవేశించకుండా కుంకీ ఏనుగులైన ’అభిమన్యు, జయంత్’లు కంచెలా నిలబడి సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయి. బుధవారం రాత్రి ఈ రెండు గుంపులు ముఖాముఖి ఎదురుపడగా, గురువారం నాటికి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మకాం వేశాయి. శిక్షకుడు సాయి, మావటీల పర్యవేక్షణలో కుంకీ ఏనుగులకు తగిన ఆహారం, నీరు అందిస్తూ అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పగటి పూట గిరిజన గ్రామాల్లో, మెట్ట ప్రాంతాల్లో కుంకీలు సంచరిస్తుండడంతో తమ ప్రాణ, ఆస్తులకు రక్షణ లభించిందని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, రాత్రివేళ ఈ రెండు గుంపులు మరింత చేరువవుతున్న తరుణంలో అటవీశాఖ అధికారులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించనున్నారు? గజరాజుల మళ్లింపు సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నలతో స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంటిమీద కునుకులేకుండా జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలి
చికెన్పార్వతీపురం రూరల్ : అపార క్రీడా నైపుణ్యాలకు మన్యం జిల్లా నెలవని, అయితే సరైన ఆదరణ కరవై ఆణిముత్యాల్లాంటి గిరిజన క్రీడాకారుల ప్రతిభ అడవులకే పరిమితమవుతోందని కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జీవీవీఎస్ కమలాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, వాలీబాల్ తదితర క్రీడల్లో ప్రతిభావంతులైన యువతను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కనీసం రన్నింగ్ ట్రాక్, మినీ స్టేడియం లేకపోవడం శోచనీయమన్న ఆయన.. మన్యంలో తక్షణం క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో క్రీడలకు పెద్దపీట వేయగా, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో విద్యావ్యవస్థకే మచ్చతెచ్చేలా నీట్ పేపర్ లీక్ జరిగిందని విమర్శించారు. ఏఐసీసీ ఎలక్టెడ్ మెంబర్ వైరిచర్ల శృతిదేవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యమని, క్రీడల్లో మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం దక్కాలన్నారు. గిరిజన సంస్కృతి, ఆటపాటలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా జిల్లాలో పారాలింపిక్స్ తరహా క్రీడలు నిర్వహించాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం నేతలు స్థానిక వాకర్స్ ప్రతినిధులు, విద్యార్థులతో క్రీడా సదుపాయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గేదెల రామకృష్ణ, బాత దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ డిమాండ్ -
సిండికేట్‌కు స్పెషల్ ఆఫర్!
సాక్షి, పార్వతీపురం మన్యం: మద్యం ఏరులై పారించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పాలసీని తీసుకొచ్చిన విషయం విదితమే. గత వైఎస్సార్సీపీ సర్కారులోని ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి.. ప్రైవేట్ వ్యాపారాలకు కట్టబెట్టి, దొరికినంత దోచుకోండంటూ పచ్చ తివాచీ పరిచింది. 2024–26 కాలపరిమితితో జిల్లాలోని 56 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించారు. మద్యం షాపుల లీజు గడువు కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న వారికే మరికొన్నాళ్లు లైసెన్సు పునరుద్ధరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి నేడో, రేపో ఉత్తర్వులు రానున్నాయి. 2024–26 లైసెన్సు రుసుములే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలానికి లైసెన్సుల పునరుద్ధరణకు 38 శాతం ఫీజుగా ఉంటుందని సమాచారం. అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు నూతన విధానం అమల్లో ఉండే అవకాశం ఉంది. దోచుకోవడానికే ‘పర్మిట్’ జిల్లాలోని 15 మండలాల్లో ఐదు ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 56 ప్రైవేట్ మద్యం దుకా ణాలు నడుస్తున్నాయి. ఒక్కో షాపులో రోజుకు బీరు, మద్యం సీసాలు కలిపి 700కుపైగా అమ్ముడవుతున్నాయి. ఇక.. బెల్టు దుకాణాల్లో అమ్మకాలు 24 గంటలూ సాగుతున్నాయి. నియంత్రణ లేక, ప్రతి గ్రామంలోనూ మద్యం ఏరులై పారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం సిండికేట్ వ్యాపారానికి పరోక్షంగా సహకారం అందిస్తోందన్న విమర్శలున్నాయి. నేరుగానే మద్యం దుకాణాల్లో సీసాపై రూ. 10 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులకు తెలిసినా.. చర్యలు ‘మామూలే’! ఈ నేపథ్యంలో మందబాబుల జేబు లకు చిల్లులు పడుతున్నాయి. సిండికేట్‌కు మేలు చేస్తూ విక్రయాలపై వ్యాపారులకు 10 శాతం ఉన్న మార్జిన్‌ను 15 శాతానికి ప్రభుత్వం పెంచింది. మరోవైపు మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ప్రతినెలా ఎకై ్సజ్ అధికారులకు లక్ష్యం విధిస్తోంది. దీంతో సిండికేట్ల ఇష్టారాజ్యంగా మారింది. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా ఎంఆర్పీ ధరకు మించి అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో బెల్టు దుకాణాలకు లెక్కే ఉండడం లేదు. చాలాచోట్ల వేళాపాళా లేకుండా అమ్మకాలు సాగిపోతున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబా బు.. చేతల్లోకి వచ్చేసరికి మందుబాబులకు చుక్క లు చూపిస్తున్నారు. రూ.99 చీప్ లిక్కర్ మినహా మిగిలిన బ్రాండ్లుపై రెండేళ్లలో బాటిల్ ఎంఆర్పీ ధరకు రూ.20లు అదనంగా పెంచారు. మద్యం సేవించే వారిలో అధిక శాతం మంది పేద, మధ్య తరగతి వర్గాల వారే. రూ.99 చీప్ లిక్కర్ బ్రాండ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా రూ.120ల ఓఏబీ. రూ.130ల మంజీర, రూ.150 క్లాసిక్ బ్లూ, ఏసీ బ్లాక్, పార్టీ స్పెషల్, సిల్వర్ బ్రాండ్లు, అలాగే మధ్యతరగతి వర్గాల వారు రూ.190ల ఎంసీ, ఐబీ, ఐకానిక్ వైట్, ఆఫ్టర్ డార్క్, రూ.190ల ఎంహెచ్ బ్రాందీ, రూ.230ల 8 పీఎం తదితర క్వార్టర్ బాటిల్స్ కొనుగోళ్లు చేస్తుంటారు. ప్రతి సీసా పైనా రెండేళ్లలో ప్రభుత్వం రూ.20 పెంచింది. మద్యం సిండికేట్లు రూ.10లు అదనంగా వసూలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో మరింత దోపిడీ సాగిపోతోంది. గతంతో పోలిస్తే ప్రభుత్వం, సిండికేట్ బాదుడుతో బాటిల్ ధర రూ.30లు అదనంగా పెరిగింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో ఇప్పటికే బాగానే ఆర్జించిన సిండికేట్ వర్గాలు గడువు ముగుస్తున్న తరుణంలో నష్టాల పేరిట మరింత దోపిడీకి తెర తీస్తున్నారన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. భారీగా లైసెన్స్ ఫీజులు చెల్లించామని, అమ్మకాలపై 20 శాతం మార్జిన్ ఇస్తామ ని చెప్పి ప్రభుత్వం కోత పెట్టడంతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు. లీజు గడువు పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ సిండికేట్ ప్రభుత్వ పెద్దలతో పైరవీలు చేసినట్టు తెలు స్తోంది. ఈ క్రమంలోనే పాతవారికే తిరిగి షాపు లు కట్ట బెట్టే పనిలో ప్రభుత్వం ఉంది. షాపులన్నింటినీ తిరిగి రెన్యువల్ చేయనున్నట్టు టీడీపీ శిక్షణ తరగతుల్లో చంద్రబాబు వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం షాపు లు ప్రభుత్వ అధీనంలో ఉండటంతో నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపు ల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాపులు ఉండేవికావు. మద్యం అమ్మకాలపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చేరి తిరిగి సంక్షేమం రూపంలో పేదలకు అందేది. కూటమి పాలనలో మద్యం ఆదాయం చాలా వరకు కూటమి నేతలు, సిండికేటు జేబుల్లోకి వెళ్లిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
కుష్ఠు వ్యాధిని త్వరగా గుర్తించాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి విజయనగరం ఫోర్ట్: కుష్ఠు వ్యాధిని త్వరగా గుర్తించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. కుష్ఠు వ్యాధిపై ఈనెల 11 నుంచి 24 వతేదీ వరకు ఇంటింటా కుష్ఠు రోగుల గుర్తింపు సర్వే జరగనుంది. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ప్రచారం చేసేందుకు ప్రచార వాహనాన్ని గురువారం జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిదన్నారు. నొప్పి, స్పర్శ లేని మచ్చలు ఉంటే కుష్ఠు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇటువంటి మచ్చల పట్ల నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డాక్టర్ అర్చన దేవి తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేతమక్కువ: మండలంలోని కొండబుచ్చమ్మపేట గ్రామసమీపంలో శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులు గురువారం పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం మక్కువ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ ఆటోపై పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు కాపుకాసి పట్టుకున్నారు. మొత్తం 842 కేజీల బియ్యాన్ని తన సొంత మహేంద్ర ఎలక్ట్రికల్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడ్డాయి. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు, వాహనాన్ని పోలీసులకు అప్పగించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. విజయనగరం: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ్ విరాజితుడని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ అన్నారు. విశ్వనాథుని జయంతి పురస్కరించుకుని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు, శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ స్వగృహంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వేయిపడగల నవలా సృష్టికర్తకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ.. విశ్వనాథుడి కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకని కొనియాడారు. కార్యక్రమంలో గురజాడ వెంకటేశ్వరప్రసాద్, సాహితీవేత్తలు చీకటి దివాకర్, కాగుపాటి నారాయణమూర్తి, ఎం.సుభద్రాదేవి, పసుమర్తి సన్యాసిరావు , గాంధీ తదితరులు పాల్గొన్నారు. బ్రోచర్ ఆవిష్కరణ విజయనగరం రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించమే లక్ష్యంగా నిర్వహించనున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్) – 2026లో భాగంగా అధికారిక బ్రోచర్‌ను జేఎన్టీయూ ఉప కులపతి వీవీ సుబ్బారావు గురువారం ఆవిష్కరించారు. జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించనున్న అంతర్గత హ్యాకథాన్‌లో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. ఈ హ్యాకథాన్‌కు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా డాక్టర్ జి.జయసుమ వ్యవహరించనుండగా, విద్యార్థి సమన్వయకర్తలుగా ఎం.లిఖిత్‌కుమార్, కె.ప్రవళ్లిక వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె.చంద్రభూషణరావు, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్ వకుల, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిచోటా పోటీ చేద్దాం.. గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం
సాలూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా పోటీచేద్దాం.. అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేద్దాం.. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులకు మా జీ డిప్యూటీ సీఎం, పార్టీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. సాలూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలందరికీ చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. టీడీపీ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధాలను, గత వైఎస్సార్సీపీ పాలనలో ని సంక్షేమ పాలనను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఆశావహులందరూ ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నూతన పింఛన్ మంజూరు ఓ నాటకం ప్రజలకు రెండున్నరేళ్లు సుదీర్ఘ నిరీక్షణ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభు త్వం చేపట్టిన పింఛన్ల మంజూరు అంశం ఓ బూ టకమని రాజన్నదొర విమర్శించారు. దరఖాస్తు చేసేందుకు వారం రోజులే గడువు ఇవ్వడం దారు ణమన్నారు. అర్హుల పింఛన్ దరఖాస్తులు ఆన్లైన్ చేయకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారు.. రాజకీయాల్లో కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ప్రథమస్థానంలో నిలవగా, మంత్రి సంధ్యారాణి రెండో స్థానంలో ఉన్నారని రాజన్నదొర విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరుచేసి చేపట్టిన పనులను టీడీపీ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకంపై మంత్రి చేసిన తొలి సంతకం నేటికీ అమలుకాలేదని, మహిళల ఆత్మగౌరవం కాపాడతామని రెండున్నరేళ్లయినా పట్టణంలో సామాజిక మరుగు దొడ్ల నిర్మాణాలు చేపట్టలేదని, పట్టణంలో మెయిన్‌రోడ్డు నుంచి వేదసమాజం వరకు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి ఏడాదిదాటుతున్నా నేటికి పనులు జరగలేదని, ఇది మంత్రి పనితీరుకు నిదర్శమని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీలో ఫుల్‌జోష్.. సమావేశానికి సాలూరు నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివచ్చారు. జై జగన్, జై రాజన్నదొర నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. పార్టీలోని వివిధ కమిటీల సభ్యులకు మండలాల వారీగా ఐడీ కార్డులను రాజన్నదొర అందజేశారు. టీడీపీ వెన్నుపోటు పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 12 నుంచి మండల స్థాయిలో, 25 నుంచి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టా లని రాజన్నదొర సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు మరిశర్ల బాపూ జీనాయుడు, మక్కువ జెడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసులనాయుడు, పార్టీ మండలాధ్యక్షులు మావుడి రంగునాయుడు, వంగపండు అప్పలనాయుడు, సువ్వాడ భరత్‌శ్రీనివాస్, గొట్టాపు ముత్యాలునాయుడు, రావిపల్లి రామారావు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, ఎంపీపీ బడ్నాన ప్రమీల, రెడ్డి సురేష్, దండి శ్రీనివాసరావు, వీరంనాయుడు, రెడ్డి సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు విధించిన గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించాలని లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.సంగం డిమాండ్ చేశారు. కొత్త పింఛన్ల ప్రక్రియ కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 16తో ముగుస్తున్న దరిమిలా, పత్రాల సేకరణకు ఈ సమయం ఏమాత్రం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్వతీపురం మండలంలోని గంగాపురం గ్రామ సచివాలయానికి గురువారం వెళ్లి, అక్కడి అడ్మిన్‌తో దరఖాస్తుల స్వీకరణలో సామాన్యులు పడుతున్న సాధకబాధకాలను ఆయన చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు దరఖాస్తులకు అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. కాగితాల కష్టాలతో అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారని, సకాలంలో పత్రాలు సమర్పించడానికి వారికి మరింత వెసులుబాటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లక, అర్హులందరికీ న్యాయం జరిగేలా ఆలోచించి ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాయకులు వెలమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● పింఛను దరఖాస్తులకు అర్హతలివే.. ● సచివాలయాల్లో దగ్గరుండి పత్రాలు పరిశీలిస్తున్న ‘తమ్ముళ్లు’ ● డిజిటల్ అసిస్టెంట్ సీట్లలో కూర్చొని దరఖాస్తుల నమోదు సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. ఈ కాలంలో ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చిన దాఖలాలు లేవు. తమ అర్హత పత్రాలను పట్టుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ వేలాది మంది అర్హులు అధికారుల వద్దకు తిరగని రోజు లేదు. ఇప్పటి వరకు గుర్తు రాని పేదల పింఛన్లు.. అకస్మాత్తుగా, అందునా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలయ్యే సమయానికి గుర్తొచ్చాయి. పోనీ, ఇన్నాళ్లకయినా దయ తలిచారనుకుని.. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు గ్రామ, వార్డు స్వర్ణ సచివాలయాలకు వెళ్తున్నారు. అక్కడ వారికి సచివాలయ సిబ్బందికి బదులు కూటమి నాయకులు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కనిపిస్తున్నారు. దరఖాస్తుతోపాటు.. ఎన్ని అర్హతలున్నా సరే... ‘హా, వీళ్లు మనవాళ్లు. వీరి ఓటు మనకే’ అన్న ‘ట్యాగ్‌లైన్’ ఉంటేనే దగ్గరుండి, దరఖాస్తును ఆన్లైన్ ‘చేస్తున్నారు’. లేకుంటే, సర్వర్ సమస్య అంటూ తిప్పి పంపుతున్నారు. ఉన్న సమయమే తక్కువ.. అందునా వరుస సెలవులు కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మంజూరు కోసం ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ, వార్డు స్వర్ణ సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం విదితమే. పింఛను లబ్ధి పొందేందుకు వేలాది మంది దరఖాస్తులు పట్టుకుని, ప్రతి రోజూ ఆయా కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఉన్న సమయమే తక్కువ. అందులోనూ వరుసగాసెలవు దినాలు రెండో శనివారం, ఆదివారం, సోమవారం(వినాయక చవితి) వస్తున్నాయి. ఒకవైపు అవసరమైన అర్హత పత్రాల కోసం తిరుగుతూ, ఆందోళన చెందుతున్న దరఖాస్తుదారులు ఒక్కసారిగా సచివాలయాలకు క్యూ కడుతున్నారు. అక్కడ వారికి సర్వర్ సమస్య వేధిస్తోంది. గంటలకొద్దీ వేచి ఉంటున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు అసలు అర్హతలు కంటే.. ‘తమ్ముళ్ల’ సిఫారసే ప్రధాన అర్హతగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే సచివాలయాల్లో దగ్గరుండి తమ వారి పేర్లకే ‘అనుమతి’ ఇస్తున్నారు. కురుపాం సచివాలయం–2లో డిజిటల్ అసిస్టెంట్ కాదు కుర్చీలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాార్యకర్త దర్జాగా కుర్చీలో కూర్చొని తతంగాన్ని నడపడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అంతా చేస్తుంటే.. పక్కనే సిబ్బంది చేతులు కట్టుకుని నిల్చోవడం గమనార్హం. జిల్లాలో దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘ఈ తాత మనోడేనా? టీడీపీ జెండా మోశా డా? అయితేనే దరఖాస్తు అప్లోడ్ చేయు.. ఈ అవ్వ మన పార్టీకి ఓటెయ్యలేదా? అయితే సైట్ ‘సర్వర్ ఎర్రర్’ అని చూపించు, దరఖాస్తును పక్క న పెట్టేయ్’ అని అనధికార ఆదేశాలిచ్చేస్తున్నారు. పింఛన్ల కోసమని వస్తున్న దరఖాస్తుదారులకు అక్కడ ఏకంగా సచివాలయాలకు బదులు ‘పచ్చ పార్టీ బ్రాంచ్ ఆఫీస్’లు కనిపిస్తున్నాయి. అర్హుల జాబితా తయారయ్యేసరికి... పచ్చ కండువా కప్పుకున్న వాళ్లకు మాత్రమే పింఛన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అధికార దర్పంతో వ్యవస్థలనే ‘తెలుగు తమ్ముళ్లు’ హైజాక్ చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కురుపాం–2 సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ సీట్లో కూర్చొని పింఛన్ దరఖాస్తులు అప్లోడ్ చేస్తున్న టీడీపీ ఉత్తమ కార్యకర్త సుఖేష్ చంద్ర పండా సుఖేష్ చంద్రపండాకు ఉత్తమ కార్యకర్తగా నారా లోకేశ్ ఇచ్చిన ప్రశంసా పత్రం -
ముమ్మరంగా కంటి పరీక్షలు
● 607 పాఠశాలల్లో 51,235 మందికి పూర్తయిన స్క్రీనింగ్ ● 2,651 మందికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీకి సన్నాహాలుపార్వతీపురం రూరల్: బడిపిల్లల భవితకు వెలుగులు పంచేలా పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉచిత నేత్ర వైద్య పరీక్షల పర్వం ముమ్మరంగా సాగుతోంది. జులై 15న విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకారం చుట్టిన ఈ బృహత్తర ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ ఆదేశాలతో మన్యం జిల్లాలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలవుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ పి.విజయలక్ష్మి, డీఈఓ పి.బ్రహ్మజీరావుల సమన్వయంతో, ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ జగన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు కంటి వెలుగుల పండగను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలోని 1,563 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలే లక్ష్యంగా నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో ఆఫ్తాల్మిక్ సిబ్బంది పరీక్షలు వేగవంతం చేశారు. ఇప్పటివరకు 607 బడుల్లో 51,235 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,651 మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించగా, వారందరికీ త్వరలో ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. తీవ్రమైన సమస్యలు ఉండి, శస్త్రచికిత్సలు అవసరమైన ఐదుగురు చిన్నారులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నారు. విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించేలా 607 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని విద్యార్థులందరికీ నేత్ర పరీక్షలు పూర్తి చేసి, కంటివెలుగులు పంచుతామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. -
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
పాలకొండ: ఒక్క వాహనం పోయిందని వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా ఐదు ద్విచక్రవాహనాల దొంగతనం గుట్టు రట్టయింది. నిత్యం వాహనాలు పోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు చిన్న ఆధారంతో దర్యాప్తు చేసి వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు దొంగలించి వాటిని అమ్మి ఆ సొమ్ముతో జల్సా చేస్తున్న వీరఘట్టం పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ ఎం.రాంబాబు గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు వీరఘట్టం మండలం కంబరవలస వెటర్నరీ అసిసెంట్ పశువుల ఆస్పత్రి వద్ద తన ద్విచక్రవాహనం పార్కింగ్ చేసి విధులు నిర్వహిస్తున్న సమయంలో తన వాహనం చోరీ జరిగిందని ఈ నెల 1న వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం వీరఘట్టం–పార్వతీపురం రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి ద్విచక్రవాహనం వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన పొందూరు మురళీకృష్ణ, చేతల చంద్రమౌళిలుగా గుర్తించి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. ఈ విచారణలో పట్టుబడిన వాహనం చోరీ చేసినదే అని గుర్తించారు. నిందితులను తమ దైన శైలిలో విచారణ చేయడంతో ఈ వాహనంతో పాటు మరో నాలుగు పల్సర్ ద్విచక్రవాహనాలు దొంగతనం చేసినట్లు నిందితులు అంగీకరించారు. వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరగా ఛేదించిన వీరఘట్టం ఎస్సై ఎస్ షణ్ముఖరావు, సిబ్బందిని డీఎస్పీ అబినందించారు. సమావేశంలో సీఐ ఎ ప్రసాద్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఐదు బైక్‌లు స్వాధీనం -
దళిత సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● అధికారుల తీరుపై ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అసహనం ● శ్మశానవాటికలకు తక్షణమే దారులు కల్పించాలి: ఎంఆర్ఓలకు ఆదేశం పార్వతీపురం రూరల్: ప్రోటోకాల్ పాటించడంలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో దళితుల సమస్యలపై ఆయన ప్రత్యేక గ్రీవెన్స్, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న తమకు ఆర్డీఓ కార్యాలయం నుంచే ప్రోటోకాల్ అందాల్సి ఉండగా, ఆ బాధ్యతను సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేయడం దారుణమన్నారు. ‘ప్రోటోకాల్ పాటించకపోవడానికి మేమేమైనా వార్డు మెంబర్లమా? ఈ నిర్లక్ష్యపు తీరు పునరావృతమైతే అధికారులను కమిషన్ ముందు నిలబెడతాం. మీ కెరీర్‌కు మచ్చ తెచ్చుకోవద్దు‘ అని ఘాటుగా హెచ్చరించారు. అనంతరం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో దళితుల శ్మశానవాటికల ఆక్రమణలపై ఆయన స్పందించారు. ప్రాణం పోయాక కూడా దళితులకు ప్రశాంతత కరువయ్యేలా ఆక్రమణలు జరగడం శోచనీయమన్నారు. శ్మశానాలకు దారులు లేకపోతే, ప్రైవేటు భూములైనా సేకరించి (ల్యాండ్ అక్విజిషన్) మార్గం సుగమం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆక్రమణలకు గురికాకుండా తక్షణమే రక్షణ గోడలు, కందకాలు నిర్మించాలన్నారు. దళిత భూసమస్యల పరిష్కారంలో అధికారులంతా నిబద్ధతతో పనిచేసి న్యాయం చేయాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశాల మేరకు జోగంపేట, గురుగుబిల్లి ఎస్సీ వసతిగృహాలను తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. -
మర్యాదపూర్వక కలయిక
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. – గుమ్మలక్ష్మీపురం రెడ్‌క్రాస్‌లో పోస్టులకు 22న ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: రెడ్‌క్రాస్ సొసైటీలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 22న రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సత్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ సూపర్ వైజర్ (బీఎస్సీ ఎంఎల్టీ), డీఎంఎల్టీగా ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారు, ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్టీ విద్యార్హత) ఒక సంవత్సరం అనుభవం, స్టాఫ్‌నర్సు జీఎన్ఎం ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు. విమానాశ్రయ భూముల పరిశీలన బాడంగి: బాడంగి సమీపంలోని విమానాశ్రయ భూములను విశాఖ ఏన్డీఏకు చెందిన అధికారులు బొబ్బిలి ఆర్డీఓ రామమోహన్‌రావు, తహసీల్దార్ వరప్రసాద్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఎన్డీఏకు చెందిన డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారులు విమానాశ్రయ గచ్చు రోడ్డుకు చేరుకొని కారుపై నలుమూలల తిరిగి నిశితంగా పరిశీలించారు. విమానాశ్రయానికి చెందిన రన్‌వేతో కలిపి సుమారు 247 ఎకరాల భూములకు కేవలం రన్వేగచ్చు రోడ్డు 50 ఎకరాలు మినహా మిగిలిన 197ఎకరాలు రైతుల ఆక్రమణలో ఉన్నట్టు నిర్ధారణకొచ్చారు. ఆక్రమిత భూముల్లో ప్రస్తుతం నీలగిరి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతుండడాన్ని గమనించారు. భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని రెవెన్యూ ఽఅధికారులను కోరారు. విమానాశ్రయ భూములను త్వరలో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద కొత్తగా నిర్మించిన వంతెన సమీపంలో అదే గ్రామానికి చెందిన ఉత్తరావల్లి సంతోష్(37) అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రివరకు బ్రిడ్జికి ఆవల వైపు ఉన్న పొలాల వద్ద స్నేహితులతో మద్యం తాగిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో బ్రిడ్జి పైన ఉన్న రహదారిపైకి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సంతోష్ మృతి చెంది ఉంటాడని తెలిపారు. శరీరంపై ఎక్కడా గాయాలు కాలేదని, కేవలం తల, నుదురు భాగంలో మాత్రమే తీవ్రమైన గాయముందని, వాహనం ఢీకొట్టగానే రోడ్డుపైనుంచి కిందికి పడిపోయి మృతిచెంది ఉండవచ్చని తెలిపారు. డీఎస్పీ ఆర్ గోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్, ఫోరెన్సిక్ టీంతో విచారణ చేపట్టారు. ఎటువంటి క్లూస్ లభించ లేదని తేల్చారు. అయితే సంతోష్ మృతి పట్ల తండ్రి తిరుపతిరావు తన కుమారుడి మృతి అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులుతో మాట్లాడుతూ అప్పలరాజు పేట రహదారిలో వాటర్ ప్లాంట్ వద్ద బుధవారం రాత్రి 8 మంది స్నేహితులతో కలిసి సంతోష్ మద్యం తాగాడని రాత్రి 11 గంటల వరకు సంతోష్‌కు ఫోన్ పనిచేసిందని, అనంతరం ఫోన్ పనిచేయలేదని, అలాగే మృతదేహం సమీపంలోను, సంఘటనా స్థలంలో సంతోష్ ఫోన్ కూడా లభ్యం కాలేదని దీంతో ఎవరైనా గిట్టనివారు, లేదా మద్యం మత్తులో హత్య చేశారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులకు ఇచ్చన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుడికి తల్లి సింహాచలం, తమ్ముడు సాయి ఉన్నారు. ఫిర్యాదు మేరకు సీఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్లాబ్ పైనుంచి పడి వ్యక్తి మృతి
నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట గ్రామంలో ఓ ఇంటి శ్లాబ్‌పై పనిచేస్తున్న తాపీ పని కార్మికుడు పెందుర్తి పైడిరాజు (47) ప్రమాదవశాత్తు జారి నేలపై పడి మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ సంఘటనలో శ్లాబ్ పైనుంచి కిందకు పడి తీవ్ర గాయాలపాలైన పైడిరాజును వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు పైడిరాజు గుర్ల మండలం గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ సంఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
ఆయిల్‌పామ్ సాగుపై రైతుల ఆసక్తి
గరుగుబిల్లి: వర్షాభావ పరిస్థితులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి వరి సాగు రైతులను కష్టాలు చుట్టుముడుతున్నాయి. పెట్టుబడి కూ డా రావడం లేదు. అప్పుల్లో కూరు కుపోతున్నారు. దీని నుంచి బయట పడేందుకు అధిక మంది రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మొక్కలను ఉద్యానవనశాఖ, ఆయిల్ పరిశ్రమలు రాయి తీపై అందజేస్తుండడం రైతులకు ఊరటనిస్తోంది. 4,500 ఎకరాల్లో సాగు పార్వతీపురం డివిజన్ పరిధిలో గరుగుబిల్లి, సీతాన గరం, పార్వతీపురం, కురుపాం, కొమరాడ, గుమ్మలక్మీపురం మండలాల్లో 4,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులో ఉంది. వరి పంటకు ప్రత్యామ్నాయంగా మరో 1,200 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో వంటి విపత్తుల నుంచి బయటపడవచ్చని భావిస్తున్నారు. మొక్క నాటిన నాలుగో ఏడాది నుంచి 25 ఏళ్ల వర కు దిగుబడి వస్తుంది. మొక్కతోట నుంచి ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి రాగా, ఏడో ఏడాది నుంచి ఎకరాకు పది టన్నుల దిగుబడి వస్తుందని అధి కారులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ దిగుబడులు మరింత పేరిగే అవకాశం ఉంటుంది. ఖరీఫ్‌లో జూన్ నెల నుంచి గెలల దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ఆయిల్ రికవరీని బట్టి గెలల ధరను నిర్ణ యిస్తుంది. ప్రతీనెలా 10వ తేదీ దాటిన తర్వాత ధర నిర్ణయం జరుగుతుంది. రైతులకు ఉచితంగా మెక్కలు ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు హెక్టారుకు రూ.29వేల విలువైన 240 మొక్క లు ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరాకు 50 నుంచి 57 మొక్కలు వేయాల్సి ఉంది. హెక్టారుకు ఏడాదికి రూ.10,500 చొప్పున వరుసగా నాలుగేళ్లు రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది. -
కరిగిపోతున్న కాలం..!
వీరఘట్టం: ఈమె పేరు సీరాపు లిఖిత..వీరఘట్టానికి చెందిన ఈమెకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. నాలుగు నెలల క్రితం భర్త అనార్యోగ్యంతో మృతి చెందాడు. వితంతు పింఛన్ కోసం ఇటీవల వీరఘట్టం సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసింది.అయితే ఆ దరఖాస్తును స్వీకరించడం లేదు. ఎందుకని ఆరా తీస్తే హౌస్ హోల్డింగ్‌లో ఆమె పుట్టింటిలో ఈమె పేరును జత చేశారు. ఈ హౌస్ హోల్డ్‌లో ఉన్న వాళ్ల నాన్నమ్మకు వృద్ధాప్యపు పింఛన్ వస్తోంది. వీరు వేర్వేరుగా నివసిస్తున్నప్పటికీ, వేర్వేరుగా రేషన్‌కార్డులు ఉన్నప్పటికీ వారంతా ఒకే హౌస్ హోల్డ్‌లో ఉండడంతో ఆమెకు పింఛన్ పెట్టేందుకు దరఖాస్తును కంప్యూటర్ స్వీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. వింతంతు పింఛన్‌కు ఈమెకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు కూడా పెట్టలేని పరిస్థితి. ఇలా ఈమె ఒక్కరు మాత్రమే కాదు. ఇటువంటి వారు చాలా మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ల వల్ల పింఛన్ దరఖాస్తులు పెట్టలేకపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. మరో నెల రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు జరగనుండడంతో ఒక్కసారిగా వృద్ధులు, వింతతువులు, దివ్యాంగులపై ప్రేమ కురిపిస్తూ ఈనెల 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటన చేశారు. కేవలం తొమ్మిది రోజుల్లో లక్షకు పైగా ఉన్న అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యపడడం లేదు.ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆపసోపాలు పడుతున్నారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు.. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇంటింటికీ పర్యటించిన అధికారులు ప్రతి ఇంటిలో ఎంత మంది ఉన్నారో తెలుసుకుని వారందరి ఆధార్‌కార్డు నంబర్లను ఓకే హౌస్ హోల్డింగ్‌లో మ్యాపింగ్ చేశారు. తర్వాత కొంత మందికి పెళ్లై అత్తవారింటికీ వెళ్లిపోయినా ఇంకా పాత హౌస్ హోల్డింగ్‌లోనే ఉన్నట్లు చూపిస్తోంది. అటువంటి దరఖాస్తులను అధికారులు స్వీకరించలేకపోతున్నారు. దీంతో పింఛన్లు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోలేక అర్హులైన వారంతా కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. సర్వర్ ప్రోబ్లం.. వీరఘట్టం మేజర్ పంచాయతీలో నాలుగు సచివాలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి పింఛన్‌దారుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఒక్కొక్క దరఖాస్తు పరిశీలించి వారి ధ్రువీకరణ పత్రాలను స్కానింగ్ చేసి అప్లోడ్ చేసేందుకు ఒక్కో దరఖాస్తుకు అరగంట సమయం పడుతోంది. దీంతో రోజుకు ఒక సచివాయలంలో 12 నుంచి 16 కంటే ఎక్కువ రఖాస్తులు అప్లోడ్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గురువారం నాటికి 350 సచివాలయాల్లో సుమారు 16 వేల దరఖాస్తులు అప్లోడ్ అప్ అయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు గడువు పెంచాలి.. పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7 నుంచి 16 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికి నాలుగు రోజులు గడిచిపోయాయి.ఇంకా దరఖాస్తు కు ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది.ఇందులో ఈనెల 12న రెండవ శనివారం,13న ఆదివారం,14న వినాయక చవితి వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో దరఖాస్తు చేసుకునేందు కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయం సరిపోనందున పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచాలని అర్హులైనవారు కోరుతున్నారు. మరో ఆరురోజులే గడువు అందులో మూడు రోజులు సెలవులు అర్హులకు పెన్షన్ టెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు ఆపసోపాలు వెంటాడుతున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు జిల్లాలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న సుమారు 1 లక్షమంది మరో వైపు మొరాయిస్తున్న సర్వర్లు సమయం పెంచాలని వేడుకుంటున్న పింఛన్ దరఖాస్తు దారులు -
దొంగ పింఛన్ల కోసం టీడీపీ పన్నాగం
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: దొంగ పెన్షన్ల కోసం టీడీపీ పన్నాగం బట్టబయలైంది. గ్రామ సచివాలయాలను కూడా టీడీపీ కార్యకర్తలు కబ్జా చేసేస్తున్నారు. పెన్షన్ల దరఖాస్తులు టీడీపీ కార్యకర్తలు నేరుగా అప్లోడ్ చేసుకుంటున్నారు. కురుపాం-2 సచివాలయంలో ఈ ఘటన వెలుగు చూసింది. డిజిటల్ అసిస్టెంట్ సీటులో టీడీపీ కార్యకర్త ప్రత్యక్షమయ్యాడు.టీడీపీ కార్యకర్తల దరఖాస్తులు అప్లోడ్ చేసుకున్న సుఖేశ్ చంద్ర పండ.. సచివాలయ సిబ్బందిని పక్కకి పంపేసి నచ్చిన పేర్లు రాసేసుకున్నాడు. ఎన్నికల నేపథ్యంలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరిస్తుండగా.. టీడీపీ నేతలు చెప్పిన వాళ్ల దరఖాస్తులు మాత్రమే ప్రభుత్వం స్వీకరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.ఇదీ చదవండి: కాక్రోచ్లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్ -
12న వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి సమావేశం
విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నట్టు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం ప్రదీప్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల తో బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. కొందరు పార్టీని వీడడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ శ్రేణులంతా త్వరలో జరగను న్న స్థానిక సమరానికి సన్నద్ధం కావాలన్నారు. సమాజం అంటే భయం, భక్తి ఉండాలని, అప్పుడే గౌరవం లభిస్తుందని వాఖ్యానించారు. పార్టీకి విధేయులైన కార్యకర్తలు, నాయకులే ప్రధాన బలమన్నారు. ఇకపై వారితోనే పార్టీ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టంచేశారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ జిల్లా స్థాయి సమావేశాలు పూర్తయ్యాయన్నారు. విజయనగరం జిల్లా స్థాయి సమావేశం ఈ నెల 12న ఉదయం 10 గంటలకు పూల్‌బాగ్‌లోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, పార్టీలోని రాష్ట్ర కమిటీ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరవుతారని స్పష్టం చేశారు. అలాగే, ఈ నెల 16 నుంచి రోజుకు రెండు నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశాలు అనంతరం మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని పార్టీ సమన్వయకర్తలకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్స య్య, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్, తదితరులు పాల్గొన్నారు. 16 నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు పార్టీ శ్రేణులంతా స్థానిక సమరానికి సమాయత్తం కావాలి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపు -
ఆహ్లాదకర జీవనం..
ఎటు చూసినా ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు... మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు.. కొండ వాలున నిర్మించుకున్న చిన్నచిన్న ఆవాసాలు.. అక్కడ నివసిస్తున్న గిరిజనుల సంప్రదాయాలు, కట్టుబాట్లు.. చిన్నారులను సంరక్షించే పిల్లలు.. సాలూరు మండలంలోని గిరిశిఖర గ్రామం శిఖపరువును సందర్శించేవారిని ఆకర్షిస్తాయి. కొండలను చదునుచేస్తూ.. వర్షపు నీటితో వారు పండించే పోడు పంటలు అబ్బురపరుస్తాయి. ఆలోచింపజేస్తాయి. వరిలో కాలిబాటలు, వరుసల్లో నాటిన కూరగాయల మొక్కలు ఆధునిక వ్యవసాయాన్ని తలపిస్తాయి. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
ఓవరాల్ చాంపియన్‌గా విశాఖ రేంజ్
● క్రీడాకారులను అభినందించిన ఐజీ గోపీనాథ్ జెట్టీవిజయనగరం టౌన్: మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగు వరకు నిర్వహించిన తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో విశాఖ రేంజ్ పోలీసులు అద్వితీయ ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 విభాగాల నుంచి సుమారు 1900 మంది పోలీసు అధికారు లు, క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విశాఖ రేంజ్ పరిధిలోని జిల్లాలు, కమిషనరేట్ మొత్తం 338 పతకాలు ( 197 స్వర్ణాలు, 82 రజతాలు, 59 కాంస్యాలు) సాధించి రాష్ట్రస్ధాయిలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ మేరకు ఐజీ విజేతలను బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. విజయనగరం జిల్లా పోలీసులు 39 స్వర్ణాలు, 21 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తం 74 పతకాలు సాధించారని చెప్పా రు. విశాఖ సిబ్బంది 70 స్వర్ణాలు, 22 రజతాలు, 17 కాంస్యాలు.. అనకాపల్లి జిల్లా సిబ్బంది 44 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలు.. శ్రీకాకుళం జిల్లా సిబ్బంది 18 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలు.. పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యోగులు 14 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా సిబ్బంది 12 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించారన్నారు. -
క్రీడాకారిణికి అభినందనలు
సీతంపేట: జాతీయస్థాయి జావెలిన్ త్రో పోటీలకు ఎంపికైన గిరిజన బాలిక బి.సుశీలను పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ తన కార్యాలయంలో బుధవారం అభినందించారు. సుశీల భామిని ఏకవల్య మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. గత నెల 11న తిరుపతిలో జరిగిన సౌత్‌జోన్ క్రీడా పోటీల్లో జావెలిన్‌త్రోలో ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడల్ సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించింది. త్వరలో జరగనున్న జాతీయస్థా యి పోటీల్లో కూడా ఇదే స్ఫూర్తితో తలపడి ఉత్తమ ప్రతిభ కనబరచాలని, ఉన్నతస్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, గిరిజన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాదేవి, పీఈటీ సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు. రేగిడి: మండలంలోని సంకిలి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలు ఏపీ చెరకు రైతు సంఘం, సంకిలి సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమి తి ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నదని చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. చక్కె ర కర్మాగారం పరిరక్షణలో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై రైతులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. విజయనగరం క్రైమ్: ఆర్టీసీ డిపోలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ అశోక్, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు డిమాండ్ చేశారు. ఇదే విషయమై వారు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశా రు. యాజమాన్యం నిర్ణయించిన ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎస్.కోట ఆర్టీసీ డిపో పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రతినెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాల ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సూర్యకుమార్, కార్యదర్శి కళారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాసశివరాత్రి పూజలు విజయనగరం క్రైమ్: స్థానిక శంకర మఠంలో మాసశివరాత్రి పూజలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత గణపతి పూజ అనంతరం పుణ్యాహవచనం, మండపారాధన, మహాన్యాస పారాయణం, మహారుద్ర పారాయణం చేపట్టారు. 11 మంది రుత్వికులతో వేదపఠనం, పారాయణం, రుద్రహోమం చేశారు. -
సేంద్రియ పంటల పరిశీలన
కురుపాం: మండలంలో జట్టు సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న పంటలను ఆఫీస్ ఆఫ్ ఇంటర్నల్ ఓవర్ సైట్ సర్వీసెస్ (ఓఐఓఎస్) చెందిన సభ్యులు కరోలిన్ కురియా, జోసెఫిన్ బుధవారం పరిశీలించారు. ఆగంగూడ, తిత్తిరి, బొడ్డమానుగూడ, దూళికుప్ప గ్రామాల్లో పర్యటించి, జట్టు సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనసాగుతున్న జీవనోపాధి కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా నాటుకోళ్ల ఫారం, ఔషధ మొక్కల సాగు, సేంద్రియ పంటల సాగు విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయని వారు అభిప్రాయపడ్డారు. 12న ఉరుసు ఉత్సవం విజయనగరం క్రైమ్: స్థానిక కుముందన్ వీధిలో ఈ నెల 12వ తేదీన హజ్రత్ సయ్యద్ బాబా ఉరుసు ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షేక్ దాదా, షేక్ జాన్‌లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు దర్గా వద్ద విశాఖపట్నానికి చెందిన హఫీజ్ ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందన్నారు. తొలుత దర్గా నుంచి చందనోత్సవం ఊరేగింపు అట్టహాసంగా జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధిపై అవగాహన ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: ప్రతి గ్రామంలో కుష్టువ్యాధిపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ఎస్. జీవనరాణి తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కుష్టువ్యాధి కేసుల గుర్తింపుపై పీహెచ్సీ వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుష్టువ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా అంగవైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. మేల్ వలంటీర్, ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఇంటింటి చేపట్టి, అనుమానితులను గుర్తించి, వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. అంతకుముందు వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణధికారి కె. రాణి, తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి నెల్లిమర్ల రూరల్: విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవిని ఈసారి ఎస్సీలకు కేటాయించాలని జైభీమ్‌రావ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య కోరారు. ఇదే విషయమై ఆయన మండలంలోని సతివాడ గ్రామంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించలేదని, దళితుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా ఎస్సీలకు జెడ్పీ చైర్మన్ సీటు కేటాయించాలన్నారు. ఎస్సీ యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. ముగిసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విజయనగరం క్రైమ్: స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక, విజయనగరం కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్ సీపీ నాయకురాలు కోలగట్ల శ్రావణి హాజరై కాసేపు ప్రసంగించారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావం కలిగి ఉండాలని, రోజులో ఎంతో కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. శ్రీకృష్ణుడు బోధనలు అనుసరణీయమని, ఆయన అనుసరించిన మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. అనంతరం పురవీధుల్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగించారు. రాజీవ్‌నగర్ కాలనీ, దాసన్నపేట, రింగురోడ్డు, కోట జంక్షన్ మీదుగా సాగిన ఈ ఊరేగింపులో పలువురు చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణల్లో అలరించారు. -
మున్సిపాలిటీ నుంచి తొలగించండి..
● గ్రామసభలో అధికారులకు తేల్చి చెప్పిన కొత్తవలస గ్రామస్తులురాజాం: రాజాం మున్సిపాలిటీలో రోజుకొక వివాదం తెరమీదకు వస్తోంది. 21 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈ సారి ఎలాకై నా ఎన్నికలు జరిపించేందుకు అధికారులు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన కొత్తవలస గ్రామస్తులు.. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండురోజుల కిందట తమకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ కార్యాలయంలో అర్జీ సమర్పించారు. దీంతో కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి స్పందిస్తూ కొత్తవలస గ్రామంలో గ్రామసభ నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాజాం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, తహసీల్దార్ ఎం.రాజశేఖరం, ఎంపీడీఓ ఆనందరావు, పట్టణ సీఐ నవీన్‌కుమార్, తదితరులు గ్రామంలో బుధవారం ప్రజావేదిక నిర్వహించారు. ఈ వేదికకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు. పంచాయతీగా ఉంటాం.. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ గ్రామం 2005కు ముందు ఏ మాదిరిగా పంచాయతీగా ఉందో అదేవిధంగా ఉంచాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు అధికంగా ఉన్నాయని తెలిపారు. పంచాయతీగా ఉంటే తమకు నచ్చిన వ్యక్తిని సర్పంచ్‌గా చేసుకుని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపాలిటీలో ఉన్నప్పటి నుంచి సక్రమంగా పారిశుధ్య పనులు కూడా చేపట్టడం లేదని వాపోయారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉంగటి శంకర్, తవిటినాయుడు, వాన అసిరినాయుడు, బట్న మురళీకృష్ణ, హరి, వాన అలివేలమ్మ, ఉంగటి సూరీడు, పసుపురెడ్డి సత్యవతి, నక్క గౌరి, వాన రమణమ్మ, తదితరులు మాట్లాడారు. టీడీపీ నేతల కొత్త డ్రామా.. ఇదిలా ఉండగా గ్రామసభ జరుగుతుండగా ఈ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అధికారులను కలిశారు. గోపాలపురం, అమ్మవారికాలనీ, ఆదర్శనగర్, తదితర ప్రాంతాలను మున్సిపాలిటీలోనే ఉంచాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ఇంతపెద్ద ఎత్తున కొత్తవలసలో ప్రజలు మున్సిపాలిటీని వ్యతిరేకిస్తుంటే, ఆ గ్రామసభకు టీడీపీ నేతలు నేరుగా వచ్చి పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలోనే ఉంచాలనే వినతిపత్రం ఇవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. -
నేర నియంత్రణపై సమీక్ష
విజయనగరం టౌన్: నేర నియంత్రణ, దర్యాప్తులో పురోగతి, నేరస్తులపై చర్యలు, ప్రజా భద్రత, తదితర అంశాలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ విశాఖ పట్టణంలోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఐదు జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం ఎస్పీ మాధవ్‌రెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాలు పాల్గొని.. జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు ఎన్డీపీఎస్ కేసులు, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, సోషల్ మీడియా క్రైమ్స్, పల్లెనిద్ర, డిజిటల్ అరెస్టులు, మెగా వెహికల్ చెకింగ్లు, వినాయక చవితి పండగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. -
మూడుకొండల ఆవల.. 24 గంటలు
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సీతంపేట: కొండకోనల్లో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, సీతంపేట పోలీసు లు, గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నా రు. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం కిండంగి పంచాయతీ గులుమూరు గ్రామానికి చెందిన సవర రామ్మూర్తి, మహేశ్వరి దంపతుల పెద్దకుమా రుడు నాలుగేళ్ల వయస్సున్న సిద్ధు మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. తండ్రి ఉపాధి పనులకు వెళ్లాడు. తల్లి ఇంటివద్ద వంట పనులు చేసుకుంటోంది. ఈ సమయంలో బాలుడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.గ్రామంలో ఎక్కడో ఓ దగ్గర ఆడుకుని వస్తాడులే అని కుటుంబ సభ్యు లు అనుకున్నారు. సాయంత్రం వరకు బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులతో కలిసి చుట్టుపక్కన గ్రామాలతో పాటు బంధువుల ఇళ్లల్లో గాలించా నా బాలుడి ఆచూకీ దొరకలేదు. వెంటనే సీతంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్ఐ వై.అమ్మన్నరావు ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ, సీఐల ఆధ్వర్యంలో ఎస్ఐ, స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నా గాలించాయి. కొండమార్గాలు, లోయలు, దట్టమైన అడవిని జల్లెడ పడుతూ, గ్రామస్తులతో కలిపి గాలించారు. గంటలు గడుస్తు న్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బుధవారం ఉదయం 11 గంటల సమ యంలో గులుమూరు గ్రామానికి ఆనుకుని కొండప్రాంతంలోని లోయ పక్కన బాలుడి ఆచూకీ కను గొన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్లు దూరంగా విస్తరించి ఉన్న మూడు కొండలు దాటి బాలుడు వెళ్లిపోయాడు. రాత్రంతా వర్షంలో తడుస్తూ ఒంటరిగానే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించిపోయాడు. బాలుడిని వెంటనే తల్లిదండ్రుల సమక్షంలో ప్రాథమిక చికిత్స కోసం కుశిమి పీహెచ్‌సీకి తరలించారు. -
కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు
విజయనగరం గంటస్తంభం: హక్కుల సాధన కోసం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు. ఇచ్చిన హామీ మేరకు సమస్యలను తక్షణ మే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. జోన్–1 సచివాలయ ఉద్యోగ సంఘాల సమైక్య (ఎస్జీఎస్డబ్ల్యూ) ఆధ్వర్యంలో బుధవారం విజ యనగరం కలెక్టరేట్ వేదికగా ఆందోళన చేశారు. రాత్రి 9.30 గంటల వరకు బైఠాయించి తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ తొలుత డీఆర్వో సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జేసీ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. జేసీ వచ్చేవరకు కలెక్టరేట్ ప్రాంగణంలో ఆందోళన కొనసాగించారు. జేసీ వచ్చాక సమస్యలను వినిపించి వినతిపత్రం అందజేశారు. గతంలో చేపట్టిన దీక్షల సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ వారం రోజుల్లో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, గడువు ముగిసినా నేటికీ ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమని సంఘ నేతలు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న తమను విస్మరించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ మహిళా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. గతంలో దీక్షలు చేసినప్పుడు వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చి విరమింపజేశారు. నేటీకీ ఎలాంటి స్పందన లేదు. – బి.శంకరరావు, జేఏసీ రాష్ట్ర సభ్యుడు గత కొన్నేళ్లుగా మా సర్వీసు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రొబేషన్ పూర్తయిన 9 నెలల బకాయి వేతనాలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మా న్యాయమైన హక్కులు. వీటిని తక్షణమే పరిష్కరించాలి. – వి.కాశీనాయుడు, జేఏసీ జిల్లా సభ్యుడు పరిష్కరించాలి వార్డుల్లో ప్రజా సేవలకు ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాం. కనీ స బేసిక్ పే రూ.30,000 అమ లు చేయడం, డిప్యుటేషన్లను రద్దు చేసి శాఖాపరమైన ప్రమోషన్లు కల్పించడం వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. మా సమస్యలు తీరేవరకు మా శాంతియుత నిరసన కొనసాగుతుంది. – ఆర్.శివప్రసాద్, వార్డు జేఏసీ విజయనగరం సభ్యుడు ప్రధాన డిమాండ్లు ఇవే... ఉద్యోగులకు రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను తక్షణమే మంజూరు చేయాలి. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్‌ను తక్షణమే అమల్లోకి తేవాలి. ప్రొబేషన్ పూర్తయిన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న 9నెలల బకాయి జీతాలను విడుద ల చేయాలి. సర్వీస్ కాలానికి అనుగుణంగా వార్షిక ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ప్రమోషన్ చానెల్‌తో పాటు కనీస బేసిక్ పే రూ.30,000 ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీనికోసం జీవో నం.11 ప్రయోజనాలను అమలు చేయాలి. విధి నిర్వహణలో ఉద్యోగులు మృతి చెందితే వారి కుటుంబాలకు 3 నెలల్లో ప్రయోజనాలతో పాటు కారుణ్య నియామకాలు కల్పించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఎస్జీఎస్డబ్ల్యూ ఉద్యోగ సంఘాలకు తగిన ప్రాతినిథ్యం కల్పి ంచాలి. శాఖాపరమైన ప్రమోషన్లు కల్పి స్తూ ఇతర విభాగాల నుంచి తెచ్చిన డిప్యుటేషన్లను రద్దు చేయాలి. హక్కుల సాధన కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ రాత్రి 9.30 గంటల వరకు బైఠాయింపు జేసీకి వినతిపత్రం అందజేసిన ఉద్యోగ సంఘ నాయకులు -
అరెస్టులు చేసి.. పంటలు ధ్వంసం చేసి...
● పోలీసుల పహారా నడుమ మొక్కజొన్న పంట ధ్వంసం ● గగ్గోలు పెట్టిన గిరిజన రైతులు ● పంట చేతికొచ్చేవరకు ఆగండయ్యా అంటూ వేడుకోలు ● గిరిజనుల గోడు వినిపించుకోని అధికారులు ● రాధిక వెజిటబుల్స్ పరిశ్రమ వర్గాల ఫిర్యాదుతో గిరిజనులపై ప్రతాపం ● పరిశ్రమ పనులను అడ్డుకున్న రైతులను బాడంగి పోలీస్ స్టేషన్‌కు తరలింపు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు.. రెవెన్యూ ఉన్నతాధికారులు పెత్తందార్లు ఇచ్చిన ముడుపులకు అమ్ముడు పోయి పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. రెవెన్యూ అధికారులది నూటికినూరు శాతం తప్పు. గిరిజనులు పండించిన పంటలను ధ్వంసం చేయడం దారుణం. వందల పరిశశ్రమలు మూతపడి వేలాది మంది నిరుద్యోగులు వలస వెళ్లిపోతున్నారు. వాటిని తెరింపించే చర్యలు లేకుండా పరిశ్రమలు ఏర్పాటుచేస్తామంటూ సాగు భూములను లాక్కొంటున్నారు. గిరిజన రైతులకు పరిహారంగా జిరాయితీతో సమానమైన భూమి ఇవ్వాలి. వారికి న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. – ఎం.కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా నాయుకుడు సాగు భూమిలో పనులు అడ్డుకుంటూ బైఠాయించిన గిరిజన రైతులతో పోలీసుల వాగ్వాదంసాగులో ఉన్న భూమి వద్ద ధర్నా చేస్తున్న గిరిజన రైతులు మొక్కజొన్న పంటను బ్లేడు ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్న దృశ్యం చేతికందిన పంటను ధ్వంసం చేస్తుండడంతో విలపిస్తున్న గిరిజన మహిళ రామభద్రపురం: రామభద్రపురం మండలం కాకర్లవలసలో పోలీసులు, అధికారుల సాక్షిగా బుధవారం సాగిన రాక్షసకాండపై గిరిజన రైతులు గగ్గోలు పెట్టారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలను యంత్రాల సాయంతో ధ్వంసం చేయడంతో కన్నీరుపెట్టారు. కొన్నాళ్లు ఆగండయ్యా.. పంట చేతికొస్తుందని వేడుకున్నా వినిపించుకోని అధికారుల తీరుపై దుమ్మెత్తి పోశారు. పదుల సంఖ్యలో పోలీసులు మోహరించి అమాయక గిరిజన రైతులు సాగుచేసిన పంటలను నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టారు. కొన్నేళ్లుగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను విమర్శించారు. రాధికా వెజిటబుల్స్ పరిశ్రమ కోసం రెవెన్యూ, పోలీస్ అధికారులు చేపట్టిన దమనకాండను ఖండించారు. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ, మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల వద్ద 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ పుల్లేరుగుడ్డివలస గ్రామానికి చెందిన పలువురు గిరిజన రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది. ఆ భూమిని రాధిక వెజిటల్బుల్స్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏపీఐఐసీ అమ్మేయడాన్ని నిరసిస్తూ గత నెల 27, 28వ తేదీలలో గిరిజన రైతులు ఆందోళన చేశారు. పరిశ్రమ పనులను అడ్డుకున్నారు. అప్పట్లో వెనుకకు తగ్గిన పరిశ్రమ ప్రతినిధులు ముందుగానే రెవెన్యూ, పోలీస్ అఽధికారులకు ఫిర్యాదు చేసి బుధవారం పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గిరిజన రైతులు, సీపీఎం నాయకులు ఎం.కృష్ణమూర్తి, కోరాడ ఈశ్వరరావు తదితరులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిశ్రమ ప్రతినిధుల ఫిర్యాదుతో ఆర్డీఓ రామ్మోహనరావు, డీఎస్పీ గోవిందరావు, బొబ్బిలిటౌన్, రూరల్, గజపతినగరం సీఐలు కె. నారాయణరావు, మల్లికార్జునరావు, సన్యాసినాయుడు, సుమారు 50 పోలీస్ సిబ్బంది మొహరించారు. పరిశ్రమ పనులను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని సీపీఎం నాయకులతో పాటు 48 మంది గిరిజన రైతులను అరెస్టుచేసి బాడంగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంటను రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆరు బ్లేడు ట్రాక్టర్లతో నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. పంట చేతికందే సమయంలో యంత్రాలతో నాశనం చేయడాన్ని చూసి రైతులు కన్నీరుపెట్టారు. ఏళ్లుగా గిరిజనుల సాగులో ఉన్న భూమిని అధికార బలంతో దౌర్జన్యం చేసి లాక్కొంటున్నారంటూ విలపించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టడంతోనే పెత్తందార్లకు కొమ్ముకాస్తున్నారంటూ గొగ్గోలు పెట్టారు. సీపీఎం నాయుకులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు -
పెన్షన్లకు ఎన్నో అడ్డంకులు..!
● ఎన్నో మెలికలతో ప్రకటన విడుదల ● అర్హులందరికీ పెన్షన్లు అనుమానమే ● బడ్జెట్, వాయిదా పద్ధతిన మంజూరు చేస్తామంటున్న ప్రభుత్వంబలిజిపేట: పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఎన్నో అడ్డంకులు కనిపిస్తున్నాయి. దీంతో అర్హులైన ప్రతివారికీ పింఛన్ వస్తుందనే నమ్మకం లేదనే చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కూటమి ప్రభుత్వం పింఛన్ల మంజూరుకు ప్రకటన జారీ చేసిందే తప్ప.. లబ్ధిదారులపై ఎటువంటి ప్రేమలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేశారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపు, దశలవారీగా మంజూరు అంటూ కొన్ని మెలికలు పెట్టారు. దీంతో పెన్షన్ల మంజూరులో పారదర్శకత కనిపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచే పింఛన్లు మంజూరయ్యేవి. ఇప్పుడు వారి నుంచి సెర్ఫ్‌కు, అక్కడ నుంచి ప్రభుత్వం వద్దకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేరుతాయి. ఎంపీడీఓను దాటిన తర్వాత సెర్ఫ్‌కు వెళ్లేటప్పుడు అంతా జంతర్,మంతర్ జరగవచ్చని.. ఈలెక్కన అర్హులకు మొండిచేయి మిగులుతుందని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గానికి ఇన్ని పింఛన్లు అని చెప్పి కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన వాటిని పచ్చ నాయకులు సర్దుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో మెలికలు.. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారి ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలనే నిబంధన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఈ పరిస్థితి లేదు. దీంతో వారు ఓటీపీ చెప్పే అవకాశం ఉండదు కనుక అలాంటి వారిని తప్పించే అవకాశం ఉంది. ఇక డప్పు కళాకారులు దరఖాస్తు చేసుకోవాలంటే సాంఘిక సంక్షేమ శాఖ జారీచేసిన సర్టిఫికెట్‌ను పొందుపరచాల్సి ఉంది. అది ఇప్పుటికప్పుడు కష్టసాధ్యంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒంటరి మహిళలకు సంబంధించి వివాహితురాలైతే కోర్టు లేదా అదాలత్ నుంచి విడాకుల పత్రం.. అవివాహితురాలైతే తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. ఇవన్నీ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశాలే. ఎలా దరఖాస్తు చేసేది.. సమయం తక్కువుగా ఉంది. సచివాలయాల్లో సిబ్బంది కూడా పెద్దగా లేరు. సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదు. పైగా లేనిపోని నిబంధనలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో దరఖాస్తు ఎలా చేసేది. – దయానంద్, దరఖాస్తుదారు, పెదపెంకి -
ఎవరి కోసం ఈ పనులు..?
విజయనగరం అర్బన్: ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాల్సిన అభివృద్ధి నిధులు అసలు ఎక్కడ ఖర్చవుతున్నాయి..? పట్టణంలో అత్యవసర మౌలిక వసతుల కంటే, రియల్ ఎస్టేట్ అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం పట్టణంలో వీఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల తీరుపై ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 98 అభివృద్ధి పనులకు రూ.9.99 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరయ్యాయి. తాజాగా అందుబాటులో ఉన్న అధికారిక నివేదికల ప్రకారం వీటిలో 97 పనులు పూర్తయ్యాయి. వీటి విలువ రూ.9.59 కోట్లు. మరో పని రూ.39.80 లక్షలతో రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్ ప్రొగ్రెస్‌లో గానీ, గ్రౌండింగ్ కోసం ఎదురుచూస్తున్న పనులేవీ లేవని లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లో ఫుల్.. పనుల సంఖ్యను చూస్తే దాదాపు 99 శాతం పూర్తయినట్లుగా అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఖర్చు పరంగా కూడా దాదాపు 96 శాతం విలువైన పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే నగరంలోని శివారు కాలనీల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కామాక్షినగర్, ధర్మపురి, వైఎస్సార్‌నగర్, గాజులరేగ, మజ్జిపేట, బీసీ కాలనీ, దుప్పాడ, తదితర శివారు ప్రాంతాల్లో నేటీకి గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోడ్ల మీదనే వర్షపు నీరు, మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవసరం ఉన్నచోట కాకుండా అవసరం లేని చోట్ల రోడ్లు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. లే అవుట్లకు ఎందుకంత ప్రాధాన్యం.. ప్రత్యేక పాలనలో ఉన్న సమయంలో అభివృద్ధి పనుల ఎంపికలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష జోక్యం లేకపోవడంతో అధికార యంత్రాంగం మాటే చెల్లుబాటు అవుతుంది. ఈ పరిస్థితిని అధికార పా ర్టీకి చెందిన కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జనావాసాలు లేని ప్రాంతాల్లో వెడల్పాటి రహదారులు, లే అవుట్లు, రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లే అవుట్లలో సంబంధిత యజమానులు రోడ్లు వేయాలి. కాని ఇక్కడ ప్రభుత్వ ధనంతో రోడ్లు వేయించి, లేఅవుట్ యజమానులకు మేలు చేస్తున్నారు. ఇప్పటికే జనాభా అధికంగా ఉన్న.. ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏయే పనులు ఏ ప్రాంతాల్లో చేపట్టారు..? వాటి ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి..? ఆయా రహదారుల వల్ల ప్రస్తుతం ఎంతమంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది..? రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు ప్రయోజనం కలిగే ప్రాంతాల్లో చేపట్టిన పనుల సంఖ్య ఎంత..? వంటి వివరాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లే అవుట్లలో రహదారుల జోరు శివారు కాలనీల్లో అధ్వానపు తీరు రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేస్తున్న అధికారులు కాలనీ వాసులకు తప్పని ఇక్కట్లుసామాజిక ప్రయోజనం ఎంత..? 98 పనులకు దాదాపు రూ.10 కోట్ల నిధులు వెచ్చించిన నేపథ్యంలో.. ప్రతి పనికి సంబంధించిన వార్డు, ప్రాంతం, పనితీరు, వ్యయం, రహదారి పొడువు, లబ్ధిదారుల సంఖ్య, తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని నగరవాసులు కోరుతున్నారు. అధికారిక లెక్కల్లో పనులు దాదాపు పూర్తయినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆ పనుల్లో ఎన్ని ప్రజల అత్యవసర అవసరాలను తీర్చాయి? ఎన్ని భవిష్యత్ వాణిజ్య, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఉపయోగపడే ప్రాంతాల్లో ఉన్నాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి నిధులు ఖర్చు చేయడం ఒక్కటే లక్ష్యమా.. లేక ప్రజలకు అత్యవసరమైన చోటే ఖర్చు చేయడమే అసలు లక్ష్యమా? అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
రహదారులా.. నరకకూపాలా..?
● పాలకులకు పట్టదు.. అధికారులకు చేతకాదు.. ● రాకపోకలకు ఇబ్బంది పడుతున్న గిరిజనంకురుపాం: మండలంలోని రహదారులకు మోక్షమెప్పుడని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రాళ్లు తేలి గోతులమయంగా మారిన రహదారులతో గిరిజనులు ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రహదారులు తప్పనిసరిగా ఉండాలి.కాని మండల పరిధిలోని చాలా గ్రామాలకు రహదారులు లేకపోవడంతో కనీసం 104, 108 వాహనాలు కూడా రావడం లేదు. తమ గ్రామాలకు రహదారులు మంజూరు చేయాలని కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు గతంలో వినతిపత్రాలు అందజేసినా, అదుగో.. ఇదుగో.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప పరిష్కార మార్గం చూపడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీలకంఠాపురం పంచాయతీలోని గంగన్నదొరవలస గ్రామ రహదారి రాళ్లు తేలి అధ్వానంగా ఉండడంతో పాటు వర్షం పడితే బురదమయంగా మారి రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జరడ గ్రామ రహదారి కోసం గ్రామస్తులు ఏకంగా అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసనలు తెలియజేసినా అధికారుల్లో గాని పాలకుల్లో గాని చలనం రాకపోవడం విశేషం. ఉదయపురం పంచాయతీలోని రెల్లిగూడ గ్రామస్తులు అధికారులు, నాయకులు స్పందించక పోవడంతో శ్రమదానంతో గ్రామానికి రోడ్డు వేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. అదే పంచాయతీలోని జాకరగూడ గ్రామానికి వెళ్లే రహదారి కూడా బురదమయంగా ఉండడంతో గతంలో నాట్లు వేసి గిరిజనులు నిరసన తెలిపారు. ఇన్ని రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నా ఐటీడీఏ అధికారుల్లో గాని పాలకుల్లో గాని స్పందన రాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించకుంటే పోరాటం ఉధృతం చేయకతప్పదని ఆయా గ్రామాల గిరిజనులు స్పష్టం చేశారు. -
విచారణకు గైర్హాజరు
సీతంపేట: మండ జీఈఎస్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సీమల రాంగోపాల్‌పై ఎస్టీ కుల ధ్రువీకరణకు సంబంధించిన ఆరోపణలపై డీఎల్ఎస్సీ విచారణకు మంగళవారం అధికారులు గైర్హాజరైనట్టు సీతంపేట జేఏసీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, బి.ఉమామహేశ్వరరావు తదితరులు ఆరోపించారు. ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఈ నెల 8న విచారణ చేస్తామని డీడీ ట్రైబుల్ వెల్ఫేర్ కార్యాలయం నుంచి ముందస్తుగా అధికారిక నోటీసులు వచ్చినా విచారణ జరగలేదన్నారు. విచారణ జరుగుతుందని నోటీసులు అందడంతో తమ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాలతో పాటు మండలోని జీఈఎస్ పాఠశాలకు జేఏసీ నాయకులమంతా హాజరైనా అధికారులు ఎవ్వరూ విచారణకు రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. విచారణ జరుగుతుందనే కారణంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు సైతం స్కూల్‌కు గైర్హాజరయ్యారన్నారు. ఎంఈఓ నుంచి ఎటువంటి సెలవు అనుమతి తీసుకోలేదన్నారు. ఈ విషయంలో కలెక్టర్ చొరవ చూపి సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. వాస్తవాలు ప్రజలకు వివరించాలన్నారు. ఈ విషయమై ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర వద్ద ప్రస్తావించగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంగోపాల్ తిరుపతి వెళ్తానని పర్మిషన్ తీసుకున్నారన్నారు. దీంతో విచారణ ఈ నెల 17కి వాయిదా వేశామన్నారు. జేఏసీ నాయకులు కె.వినోద్‌కుమార్, ఎన్.రమేష్, బి.రామ్మోహన్రావు, టి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా సౌర లక్ష్యాలు పూర్తి కావాలి
● ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పార్వతీపురం రూరల్: ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లకు ఉద్దేశించిన రూఫ్‌టాప్ సోలార్ పనులను శరవేగంగా సాగించి, నిర్దేశించిన గడువులోపు వంద శాతం పూర్తి చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. స్థానిక పార్వతీపురం మన్యం సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది, సోలార్ వెండార్లతో సౌర విద్యుదీకరణ (యూఎల్ఏ) ప్రగతిపై ఆయన మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ ఉద్యోగులు, వెండార్లు ఎదుర్కొంటున్న సాంకేతిక ఆటంకాలు, సందేహాలను అడిగి తెలుసుకున్న ఆయన.. వాటికి తక్షణ పరిష్కార మార్గాలు సూచించారు. పనుల్లో అలసత్వం వీడి, సమన్వయంతో అడుగులు వేస్తూ సౌర విద్యుత్ ప్రక్రియను లక్ష్యానికి అనుగుణంగా పరుగులు పెట్టించాలని దిశానిర్దేశం చేశారు. సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) పి.త్రినాథరావు, జనరల్ మేనేజర్ (నోడల్ ఆఫీసర్) కె.సత్యనారాయణ, సాంకేతిక ఈఈ డి.పురుషోత్తం, పాలకొండ ఈఈ కె.విష్ణుమూర్తితో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి
● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు విజయనగరం రూరల్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు పిలుపునిచ్చారు. సహజ వనరుల సంరక్షణ, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం, హరిత క్యాంపస్ అభివృద్ధి, క్రీడలు–ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను సమగ్రంగా అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సెంటర్ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైన్బిలిటీ కార్యక్రమం రూపొందించారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను కళాశాలలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యా సంస్థలు కేవలం సాంకేతిక విద్యను అందించడమే కాకుండా పర్యావరణ బాధ్యత, శక్తి సంరక్షణ, స్థిరమైన అభివృద్ధి పట్ల విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించాలని కోరారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వకుళ మాట్లాడుతూ నీరు, సహజ వనరుల సంరక్షణ, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం–హరిత క్యాంపస్ అభివృద్ధి, క్రీడలు–ఆరోగ్య పరిరక్షణ అనే ఆరు ప్రధాన విభాగాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థుల భాగస్వామ్యం పెంపొందించేందుకు గ్రీన్ ఎనర్జీ క్లబ్, ఆక్వా క్లబ్, ఎకో వేస్ట్ క్లబ్, గ్రీన్ హార్వెస్ట్ క్లబ్, ఎనర్జీ సేవర్ క్లబ్, ఫిట్ ఇండియా క్లబ్‌లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. క్యాంపస్‌లో ఎనర్జీ, వాటర్ ఆడిట్, వర్షపు నీటి సంరక్షణ, వ్యర్థాల వర్గీకరణ–కంపోస్టింగ్, సౌర, పవన్ శక్తి వినియోగం, సేంద్రియ సాగు, గ్రీన్ క్యాంపస్ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విద్యార్థులను పరిశోధన, ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమాన్ని సస్టైన్‌బుల్ డవలప్మెంట్ గోల్స్‌తో అనుసంధానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి రిజిస్ట్రార్ కేసీబీ రావు, ఎలక్ట్రికల్ ప్రాజెక్టు ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.పద్మజ, ఈసీఈ ఇన్చార్జి విభాగాధిపతి జి.అప్పలనాయుడు, ఎన్ఎస్ఎస్ విభాగం అధికారి బి.ధర్మారావు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు, పాల్గొన్నారు. -
పింఛన్ కోసం పాట్లు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. మొన్నటివరకు కొత్త పింఛన్ల మంజూరుకు అర్హుల నుంచి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించలేదు. 50 ఏళ్లు వయస్సు దాటినవారందరికీ పింఛన్లు ఇస్తామన్న ఎన్నికల హామీని విస్మరించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటిరి మహిళలు, కళాకారులు, తదితర వర్గాల వారు ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు సచివాలయాలు, ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే, సర్వర్ డౌన్, సాంకేతిక ఇబ్బందులతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడంలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తులు పట్టుకుని సచివాలయాల్లో పడిగాపులు కాస్తున్నారు. దీనికి విజయనగరం రింగ్‌రోడ్డులోని బొందిలిగూడెం సచివాలయంలో మంగళవారం కనిపించిన చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
విద్య భవిష్యత్‌కు పునాది
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితవిజయనగరంలీగల్: విద్య భవిష్యత్‌కు పునాది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ బబిత అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మాట్లాడుతూ అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి తన హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన రక్షణ గురించి తెలుసుకోవాలన్నారు. చిన్నారుల భవిష్యత్‌కు విద్య పునాది అని పాఠశాల విద్యను మధ్యలోనే నిలిపివేయకుండా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. డ్రాపౌట్ పిల్లల కుటుంబాలకు విద్య ప్రాముఖ్యత, పిల్లల హక్కులు, బాల కార్మికత్వం, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వ విద్యా పథకాలు, అందుబాటులో ఉన్న న్యాయ సహాయం గురించి వివరించారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత ప్రభుత్వ విభాగాలను, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి అవసరమైన ఉచిత న్యాయ సహాయం, మార్గదర్శకత్వం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ అధికార సంస్థ సెక్రటరీ డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్, విజయనగరం మండల విద్యాశాఖాధికారి ఆనందమూర్తి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్టుమెంటు హెడ్ నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
చైనాలో డ్రాగన్ బోట్ పోటీలకు శివాంజనేయ
గంట్యాడ: మండలంలోని రామవరం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గేదెల శివాంజనేయ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ డ్రాగన్ బోట్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. చైనాలోని హాంగ్జౌలో ఈ నెల 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే ఐసీఎఫ్ డ్రాగన్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరఫున ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు భారతీయ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 28న భారత బృందం చైనాకు బయలుదేరి అక్టోబర్ 4న తిరిగి రానుంది. ప్రస్తుతం శివాంజనేయ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
బ్యాగుంటే ఒట్టు!
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: పేద విద్యార్థులకు చేయూత నిచ్చి... సర్కారు పాఠశాలలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బ్యాగులు, బూట్లు అందిస్తుంటాయి. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను సరఫరా చేస్తోంది. ఇందులో విద్యార్థులకు అవసరమైన బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, నిఘంటువు, మూడు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు ఉంటాయి. గత జూన్ లో పాఠశాలలు ప్రారంభం కాగా.. రెండు నెలలు తిరగక ముందే కిట్ల నాణ్యత బయట పడిపోయింది. పథకం లక్ష్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులు కొద్ది రోజులకే చిరిగిపోతుండడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పలువురు విద్యార్థులకు బూట్లు అందకపోవడంతో వారు సాధారణ చెప్పులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. నాణ్యతపై పర్యవేక్షణ ఏది? కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందిస్తున్నప్పుడు వాటి నాణ్యత, పంపిణీపై అధికారులు పటిష్టంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. బ్యాగులు కొద్దిరోజులకే చిరిగిపోతుంటే వాటి తయారీ నాణ్యతను పరిశీలించారా? సరఫరా చేసిన సామగ్రిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 1,447 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా... సుమారు 98 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. బడులకు పంపిణీ చేసిన బ్యాగులు నాణ్యతలో తక్కువగా ఉండడంతో కొద్ది రోజులకే కుట్టులు ఊడిపోవడం, జిప్పులు దెబ్బతినడం, అడుగు భాగం చిరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని మోసుకెళ్లాల్సిన బ్యాగులు మధ్యలోనే చిరిగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు చిరిగిన భాగాలను తాళ్లతో, దారాలతో కుట్టించుకుని వాటినే ఉపయోగిస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు తమ సొంత డబ్బులతో కొత్త బ్యాగులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బ్యాగుల సమస్యకు తోడు బూట్ల పంపిణీ కూడా పూర్తిస్థాయిలో జరగలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలు పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులకు బూట్లు అందకపోవడంతో సాధారణ చెప్పులు ధరించి తరగతులకు వస్తున్నారు. ఇటీవల పాల కొండలో ఆగస్టు 15 సందర్భంగా జరిగిన పలు కార్యక్రమాల్లో విద్యార్థులు చెప్పులతోనే కనిపించారు. పార్వతీపురం, బలిజిపేట తదితర మండలాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఒకవైపు ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం కొంతమంది పిల్లలకు పూర్తి స్థాయిలో అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. చిరిగిన బ్యాగులు.. చెప్పులతోనే బడిబాట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాల సంచుల నాణ్యతపై ప్రశ్నలు పలువురు విద్యార్థులకు అందని బూట్లు -
అడ్డొస్తే... అడ్డంగా నరికేస్తా...
● వైఎస్సార్సీపీ నాయకునిపై ఓ వ్యక్తి దౌర్జన్యంగజపతినగరం రూరల్ (జామి): ‘అడ్డొస్తే... అడ్డంగా నరికేస్తా...అమ్మ తోడు...’ ఇది ఓ సినిమాలో ఓ ప్రముఖ కథనాయకుడు చెప్పిన డైలాగ్. ఇది అప్పట్లో బాగానే వర్కవుట్ అయ్యింది. సినిమా కూడా హిట్ అయ్యింది. మరి ఈ సినిమా చూశాడో ఏమోగాని... ప్రస్తుతం ఓ వ్యక్తి వైఎస్సార్సీపీ నాయకుడిని ఇలాగే... బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...జామి మండలం భీమసింగి గ్రామంలో మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పాండ్రంగి సంజీవిపై అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు దౌర్జన్యానికి దిగిన సంఘటన ఇది. దీనిపై పాండ్రంకి సంజీవి జామి పోలీసులకు సోమవారం ఫిర్యాదు కూడా చేశాడు. ఇదే విషయమై సంజీవి స్థానిక విలేకరులకు మంగళవారం వివరాలు వెల్లడించారు. భీమసింగి గ్రామకంఠం సర్వే నంబరు 120లో సంజీవికి 19 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలానికి అడ్డంగా అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు సోమవారం ట్రాక్టర్ లోడ్ రాయి తీసుకువచ్చి వేయించాడు. దీంతో సంజీవికి తన స్థలంలోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఇదేమిటని ప్రశ్నించిన సంజీవిపై శంకరరావు దౌర్జన్యానికి దిగాడు. ఈ స్థలం నాది.. అడ్డొస్తే నరికి చంపుతానని.. బెదిరిస్తూ దుర్భాషలాడాడు. దీంతో గత్యంతరం లేక సంజీవి జామి పోలీసులను ఆశ్రయించాడు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వీర జనార్దన్ మంగళవారం తెలిపారు. దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
గడువులోగా పింఛన్ల ప్రక్రియ పూర్తి కావాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన నమోదు, క్షేత్ర స్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ పక్రియలను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కొత్త పింఛన్లు దరఖాస్తులను స్వీకరించి ప్రాధమిక వివరాలను పరిశీలించి ఎస్జీఎస్డబ్ల్యూ న్యూ పెన్షన్ సర్వీసులో ఆన్లైన్లో నమెదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తు విజయవంతంగా నమోదు చేసిన వెంటనే దరఖాస్తుదారునికి సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అకనాలెడ్జ్మెంట్ అందజేయాలన్నారు. ెఈ నెల 17 నుంచి 21 వరకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు వార్డు వేల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శులు అర్హత కల్గిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి అర్హత ప్రమాణాలు, సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలించి, భౌతిక పరిశీలన నివేదికను నమోదు చేయాలన్నారు. దరఖాస్తు ఈకేవైసీ పూర్తి కాని వారి నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన సమయంలో ఈకేవైసీ తీసుకోవాలన్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తులను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఒంటరి మహిళల దరఖాస్తులను తహసీల్దార్లకు, నేత కార్మికులు, మత్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీ దారులు, తాటి చెట్టు గీత కార్మికులు, ట్రాన్స్జెండర్ల వర్గాలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా స్థాయి అధికారులకు పంపించాలన్నారు. ఎంపీడీఓలు పింఛన్లను నేరుగా మంజూరు చేయరాదని, అర్హులైన దరఖాస్తులను సంబంధిత రాష్ట్ర స్థాయి లేదా సెర్ప్ అధికారులకు సిఫార్సు చేయాలన్నారు. పింఛను మంజూరు అయిన నెల నుంచే పింఛను చెల్లింపు ఉంటుందన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి తదితరులు పాల్గొన్నారు. -
‘అక్షరాలా అమరజీవి’ పుస్తకావిష్కరణ
విజయనగరం: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సమగ్ర జీవిత చరిత్రపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట పురస్కార సేవాగ్రహీత సముద్రాల గురుప్రసాద్ రాసిన అక్షరాలా అమరజీవి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు భారతదేశ చిత్రపటాన్ని పునర్లిఖింపజేసిన మహనీయుడన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలుగు తేజం పొట్టి శ్రీరాములు జీవనయానం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు తవ్వా మోహనరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు బోండా రమేష్, కార్యదర్శి బాలకృష్ణ, పట్టణ శాఖ అధ్యక్షుడు గాయత్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డొచ్చిన వ్యక్తిపై హత్యాయత్నం
గంట్యాడ: డబ్బులు కావాలంటూ తల్లిదండ్రులను వేధిస్తూ వారిపై దాడికి యత్నించిన యువకుడిని అడ్డుకున్న వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని మధుపాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మధుపాడ గ్రామానికి చెందిన సీహెచ్ విజయ్‌కుమార్ తన తల్లిదండ్రులు సన్యాసిప్పుడు, ఈశ్వరమ్మను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాడికి యత్నించాడు. అదే సమయంలో సమీపంలో ఉన్న ద్వారపురెడ్డి కృష్ణ అడ్డుకోవడంతో విజయ్‌కుమార్ ఆయుధంతో అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణ చెవికి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి రలించారు. ఘటనపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సాయికృష్ణ తెలిపారు. కారు షెడ్లో అగ్ని ప్రమాదం కొత్తవలస: మండలంలోని అరుకు–విశాఖ జాతీయ రహదారిని ఆనుకొని అడ్డూరువానిపాలెం గ్రామం సమీపంలో గల ఎస్ఎల్జీ కార్ కేర్ కార్ మెకానిక్ షెడ్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో షెడ్లో గల మూడు కార్లు, రెండు పాత కార్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద వార్త తెలుసుకొని కొత్తవలస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు షెడ్ యజమాని కె.గౌరీపతి తెలిపారు. 10 నుంచి జేవీవీ ఆధ్వర్యంలో వక్తృత్వ, కథల పోటీలు విజయనగరం అర్బన్: విద్యార్థులను మంచి ఉపన్యాసకులుగా, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి వక్తృత్వ, కథల పోటీలను నిర్వహించనున్నట్టు జేవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎరుకొండ ఆనంద్, డాక్టర్ మిరియాల కృష్ణారావు తెలిపారు. కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను వారు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజేతలకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. జేవీవీ జాతీయ నాయకుడు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, జిల్లా కోశాధికారి శివాజీ, తిరుపతిరావు, చిరంజీవి, సత్యనారాయణ, ఈశ్వర్ పాల్గొన్నారు. -
మీకు బిల్లులు చెల్లిస్తే మాకేమిస్తారు?
విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేయితడపనిదే ఏ పని జరగదని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. కష్టపడి పనిచేసినా ఎంతో కొంత ముట్టజెబితే తప్ప ప్రతిఫలం అందదని విమర్శిస్తున్నారు. ఉద్యోగోన్నతులు, సరెండర్ లీవులు, రిలీవింగ్ ఆర్డర్స్, మెటర్నిటీ లీవ్‌లు.. ఇలా ప్రతీదానికి మామ్మూళ్లు రూపంలో ఇస్తేగాని పని జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా దంత వైద్యులకు చెల్లించాల్సిన ఫ్యూయల్ చార్జీలకు కూడా కమిషన్ ఇస్తేగాని నిధులు జమ చేయబోమని కండిషన్ పెట్టినట్టు తెలిసింది. ఇదెక్కడి అన్యాయం... నేషనల్ ఓరల్ హెల్త్ ప్రొగ్రాం( ఎన్‌ఓహెచ్‌పీ)లో భాగంగా దంత వైద్యులు వారికి కేటాయించిన పీహెచ్‌సీలకు వెళ్లేవారు. వారంలో మూడు రోజులపాటు పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందించేవారు. పీహెచ్‌సీలకు వచ్చిన రోగుల్లో దంత సంబంధిత సమస్యలు ఉన్న వారిని గుర్తించి అక్కడ చికిత్స అందించిన కల్గిన వాటికి చికిత్స అందించేవారు. లేదంటే సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రికి రోగులను రిఫర్ చేసేవారు. నోటికేన్సర్కు సైతం స్క్రీనింగ్ చేసేవారు. ఇలా సేవలందించిన వైద్యులకు ఫ్యూయల్ (పెట్రోల్, డీజిల్) చార్జీల కింద నెలకు రూ.7 వేలు చెల్లించాలి. జిల్లాలో వైద్యసేవలందించిన 9 మంది దంత వైద్యులకు ఫ్యూయల్ చార్జీల కింద 27 నెలలకు కొద్దిరోజుల కిందట రూ.13 లక్షల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనల ప్రకారం వీటిని వెంటనే వైద్యుల ఖాతాల్లో జమచేయాలి. అయితే, నిధులు చెల్లించాలంటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చెందిన ఓ అధికారి, ఓ ఉద్యోగి 10 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం. కమీషన్ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని తెగేసి చెప్పినట్టు తెలిసింది. వ్యయప్రయాసలకోర్చి పీహెచ్‌సీలకు వెళ్లి సేవలందించామని, ఇంధన ఖర్చుల్లో కమీషన్ దందా ఏమిటంటూ పలువురు వైద్యులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వాపోతున్నారు. తన దృష్టికి రాలేదు దంతవైద్యులకు చెల్లించాల్సిన ఇంధన నిధుల్లో 10 శాాతం కమీషన్ అడిగిన విషయం తన దృష్టికి రాలేదు. ఎవరైనా కమీషన్ అడిగితే లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జీవనరాణి, డీఎంహెచ్ఓ ఎన్ఓహెచ్పీలో భాగంగా పీహెచ్‌సీల్లో సేవలందించిన దంత వైద్యులు 27 నెలలకు వారికి ఫ్యూయల్ చార్జీల కింద రూ.13 లక్షలు విడుదల ఈ నిధులు దంత వైద్యులకు చెల్లించేందుకు 10 శాతం కమిషన్ డిమాండ్ చేసిన డీఎంహెచ్ఓ కార్యాలయ ఉద్యోగి! ఆవేదనలో వైద్యులు -
నగరంలో పోలీసుల మెగా డ్రైవ్
● 150 ప్రాంతాలు.. 800 మంది పోలీసులు ● స్వీయపర్యవేక్షణ చేసిన ఎస్పీవిజయనగరం టౌన్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ ఎఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ముందుగా గుర్తించిన 150 ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రహదారి భద్రత, హెల్మెట్ ధారణ పట్ల అవగాహనే లక్ష్యంగా పట్టణంలో ఆకస్మికంగా వాహన తనిఖీలను చేపట్టి, స్వీయపర్యవేక్షణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వాహన తనిఖీలను చేపట్టేందుకు 150 ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. తనిఖీల్లో 800 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వినియోగించామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలను వాహనదారులకు వివరించి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు సరైన ఇన్సూరెన్స్ లేకుంటే కలిగే అనర్ధాలను వాహనదారులకు వివరించి, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని సూచించామన్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఈ చలానా విధించేందుకు బదులుగా వెంటనే ఆయా వాహనాలకు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చేయించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. తనిఖీల్లో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్పీడ్ మ్యాథ్స్‌లో కియాన్ష్ జాతీయ స్థాయి గుర్తింపు
బొబ్బిలి: మలేసియాకు చెందిన యూసిమాస్(యుసీఎంఏఎస్) అనే అంతర్జాతీయ స్పీడ్ మ్యాథ్స్ ఆర్గనైజేషన్ ముంబయిలో నిర్వహించిన స్పీడ్ మ్యాథ్స్ పోటీల్లో బొబ్బిలికి చెందిన జాగరపు కియాన్ష్ మూడో స్థానం(సెకండ్ రన్నరప్) పొందాడు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పాల్గొన్న పరీక్షలో కియాన్ష్ ఈ స్థానం పొందాడు. ముంబయిలో ఈ నెల 5న పరీక్ష నిర్వహించారు. పోటీలో పాల్గొనేందుకు రాష్ట్ర స్థాయి పరీక్ష గత నెల 2న గుంటూరులో నిర్వహించగా అందులో ప్రధమ స్థానం సాధించాడు కీయాన్ష్. కేవలం 8 నిమిషాల వ్యవధిలో 200 లెక్కలను చేయాల్సి ఉండగా అన్ని లెక్కలూ పూర్తి చేసినట్టు తల్లిదండ్రులు డాక్టర్ రమేష్, బేబీ ప్రత్యూష తెలిపారు. మొత్తంగా 2వేల మార్కులకుగాను రెండు వేల మార్కులను కేవలం మైండ్ కాలిక్యులేషన్తో సాధించినప్పటికీ వయసు రీత్యా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కియాన్ష్ స్థానిక శ్రీనిధి డీజీ స్కూల్లో మూడో తరగతి చదువుతుండగా తండ్రి జిల్లా కేంద్రంలో న్యూరో డాక్టర్‌గా సేవలందిస్తుండగా తల్లి ప్రత్యూష సాఫ్ట్వేర్. కీయాన్ష్ సాధించిన ఈ ప్రతిభకు పట్టణ వాసులు, విద్యావేత్తలు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విచారణ ఉత్తుత్తిదేనా!
కొత్తవలస: విశాఖపట్నానికి సరిహద్దుగా ఉన్న కొత్తవలస మండలంలో ప్రభుత్వ భూములకు కాళ్లొచ్చాయి. బడానేతల కబంద హస్తాల్లోకి వెళ్లిపోతున్నాయి. చెరువు గర్భాలు జిరాయితీ భూములుగా మారుతున్నాయి. సబ్ డివిజన్ల పేరుతో ప్రభుత్వ భూములను జిరాయితీలుగా మార్చేసి బడాబాబుల పేరున బదలాయిస్తున్న తీరు పల్లె ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయకట్టు రైతులను కలవరపెడుతోంది. భూముల కబ్జా తీరును ‘భూ మాయ’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఆగమేఘాలపై స్పందించారు. సంబంధిత తహసీల్దార్ అప్పలరాజును సస్పెండ్‌చేశారు. విచారణ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అప్పటి ఇన్చార్జి డీఆర్వో మురళీని నియమించారు. ఇది జరిగి 9 నెలలు గడుస్తున్నా ఆ భూములు ఇప్పటికీ అదే వ్యక్తుల పేరున వెబ్‌ల్యాండ్‌లో చూపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విచారణ ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్‌చేసి ప్రభుత్వ భూములను మాయ చేయడం వెనుక రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ రికార్డులు సరిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 9 నెలలు గడుస్తున్నా అతీగతీలేని వైనం వెబ్‌ల్యాండ్‌లో జిరాయితీ భూములుగా దర్శనమిస్తున్న ప్రభుత్వ భూములు రీ సర్వేలో సర్దుబాటుకు తెరవెనుక మంతనాలు రీ సర్వేలో సర్దుబాటుకు ప్రయత్నాలు ప్రస్తుతం కొత్తవలస మండలంలోని పలు గ్రామాల్లో రీ సర్వే జరుగుతోంది. ప్రభుత్వ భూములను జిరాయితీలుగా మార్చేందుకు బడాబాబులు నిత్యం రెవెన్యూ అధికారులతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. అక్రమంగా సంపాదించిన భూములను అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. చెరువు గర్భాలు, ప్రభుత్వ భూములు క్రయ విక్రయాలు జరిగిపోతే ఎవరిది బాధ్యత అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భూ మాయపై విచారణ కొనసాగుతోందని ఇ.మురళి చెప్పడం గమనార్హం. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు పలువురు జిల్లా క్రీడాకారులకు అవకాశం లభించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీలు అర్హత సాధించారు. జావిలిన్ త్రోలో ఉదయ్, 400 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్.సందీప్, త్రిపుల్ జంప్‌లో పి.పవన్‌కళ్యాణ్, 400/800 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్.యశోద జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్కిషోర్లు అభినందించారు. -
స్మార్ట్రైల్వే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రయోగానికి గుర్తింపు
● జాతీయ స్థాయి పోటీలకు మోడల్ విద్యార్థి ప్రయోగం ● ఇన్స్పైర్ మానక్‌లో రాష్ట స్థాయి పోటీల్లో ఎంపిక భామిని: నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కొప్పర తాన్వీర్కుమార్ రూపొందించిన ‘స్మార్ట్ రైల్వే ఎమర్జెన్సీ ఎగ్జిట్’ ప్రయోగానికి గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ప్రదర్శనకు ఎంపికై ంది. గైడ్ టీచర్ సీహెచ్ సంతోష్‌కుమార్ పర్యవేక్షణలో అత్యవసర పరిస్థితుల్లో రైల్వే ప్రయాణికులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఉపయోగపడేలా స్మార్ట్ రైల్వే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో ప్రాజెక్టును తాన్వీర్కుమార్ ప్రదర్శించనున్నారు. విద్యార్థిని ప్రిన్స్‌పాల్ జి.బాబూరావు, సిబ్బంది, జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు అభినందించారు. -
పదాల సవ్వడి.. పుర్రేయవలస బడి...
చీపురుపల్లి: ఆ పాఠశాలకు వెళ్తే తరగతి గదుల్లో గోడలు ఖాళీగా కనిపించవు. విద్యార్థులు నుంచి తెలుగు, ఆంగ్ల పదాలు తప్ప మరో మాట వినిపించదు. తరగతి గది గోడలపై ఎటు చూసినా ఏదో ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. విద్యార్థులకు ఆ రోజంతా ఏదో ఒక యాక్టివిటీతోనే గడిచిపోతుంది. అందుకనే ఆ పాఠశాలకు ఎవరు వెళ్లినా పదాల సవ్వడితో సందడిగా ఆహ్వానం పలుకుతుంది. అదే మండలంలోని పుర్రేయవలస బడి. ఇక్కడి పాఠశాలలో ఏదో ఆదరా బాదరగా పాఠ్యాంశాలు బోధన ఉండదు. ప్రతీ సబ్జెక్టులోనూ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం) వినియోగిస్తూనే బోధన సాగిస్తుండడంతో విద్యార్థుల్లో ఆ పాఠ్యాంశం ఆకట్టుకుంటుంది. ఉపాధ్యాయుల్లో ప్రత్యేక శ్రద్ధ ఉండాలిగాని ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతుందని చెప్పడానికి పుర్రేయవలస ప్రాధమిక పాఠశాల తరగతి గదుల్లో అనుసరిస్తున్న విద్యాబోధన నిదర్శనంగా నిలుస్తోంది. తరగతి గదిలో ఎటు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలే పుర్రేయవలస ప్రాధమిక పాఠశాలలో తరగతి గోడలు ఖాళీగా ఉండవు. ఎటు వైపు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలతో కూడిన చార్టులు, చిత్రాలు దర్శనమిస్తాయి. తెలుగు, ఇంగ్లిష్‌లో కఠిన పదాలు నుంచి ఇంగ్లిష్ గ్రామర్‌కు సంబంధించిన చార్టులు, కాన్సెప్ట్ వంటి ఎన్నో చార్టులు పాఠశాల హెచ్ఎం ఎంవి.భారతి, సహాయ ఉపాధ్యాయుడు అప్పలనాయుడులు తమ ఇళ్ల వద్ద స్వంతంగా తయారు చేసి పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు బోధిస్తుంటారు. విద్యార్థులకు సులభంగా అర్థమవ్వడం కోసం ప్రతీ పాఠ్యాంశాన్ని టీఎల్ంఎ ద్వారానే బోధిస్తుంటారు. టీఎల్ఎం, చార్టులు, చిత్రాలు తయారీకు ఎలాంటి నిధులు ఉండకపోయినప్పటికీ స్వంత నిధులతోనే సిద్ధం చేస్తుంటారు. ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్ బోధన ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో రెండు, మూడు తరగతుల నుంచి ఇంగ్లిష్ గ్రామర్ బోధన వింటుంటాం. అయితే వారికి ధీటుగా పుర్రేయవలస ప్రాధమిక పాఠశాలలో కూడా ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్ బోధిస్తున్నారు. గ్రామర్‌కు సంబంధించి టెన్సెస్, వెర్బ్, యాడ్జెక్టివ్, నౌన్, ప్రౌనౌన్ వంటి గ్రామర్ అంశాలు అక్కడ విద్యార్థులకు చిన్న వయస్సులోనే పరిచయం చేస్తున్నారు. తెలుగులో సైతం గుణింతాలు, ద్విత్తక్షరాలు, గణితంలో టేబుల్స్ తదితర చార్టులు ప్రదర్శించి నిరంతరం విద్యార్థులతో సాధన చేయిస్తుంటారు. ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్‌లో తర్ఫీదు తరగతి గదిలో ఎటు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలే.. ప్రతీ పాఠ్యాంశాన్ని టీఎల్ఎం ద్వారా బోధనప్రాధమిక స్థాయిలోనే మంచి పునాది ఉండాలి పాఠశాలకు వచ్చే పిల్లలకు ప్రాధమిక స్థాయిలోనే మంచి పునాది ఉండాలి. ప్రభుత్వ పాఠశాలకు పేద వర్గాలకు చెందిన పిల్లలే వస్తారు. అలాంటి వారిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యం. అందుకనే ఇంగ్లిష్, తెలుగులో ప్రతీ పాఠానికి టీఎల్ఎం ద్వారా బోధిస్తాం. ఇంగ్లిష్ గ్రామర్‌లో నౌన్స్, టెన్సెస్, స్పెల్లింగ్స్, కాన్సెప్ట్ మ్యాపింగ్, పిక్చర్ డిస్క్రిప్షన్ వంటి బోధన సాగిస్తున్నాం. తరగతి గది మోడల్‌గా ఉంటే విద్యార్థులు కూడా అంతే ఆదర్శంగా తయారవుతారు. – ఎంవి.భారతి, హెచ్ఎం, పుర్రేయవలస ప్రాధమిక పాఠశాల, చీపురుపల్లి -
● ధరల మంటపై మహిళల ఆగ్రహం
నింగినంటిన నిత్యవసరాల ధరలతో సామాన్యుల బతుకులు అగమ్యగోచరంగా మారాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నేతలు ఆర్.శ్రీదేవి, బి.లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అన్ని వస్తువుల ధరలు 50 శాతానికి పైబడి పెరగడంతో పేద, మధ్యతరగతి జీవనం దుర్భరంగా మారిందన్నారు. రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరలకే అందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులు, దళారుల బ్లాక్ మార్కెట్‌కు కళ్లెం వేసి, ధరలను అరికట్టకపోతే ప్రజాసంఘాల భాగస్వామ్యంతో ఆందోళనను రాష్ట్రస్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పార్టీ ఇచ్చిన ఐడీ కార్డులను చూపిస్తున్న వివిధ విభాగాల ప్రతినిధులు పార్వతీపురం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అధ్యక్షతన సోమవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, అరకు పార్లమెంట్ పరిశీలకుడు శరగడం చిన్న అప్పలనాయుడు, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీ నాయుడు, పలు అనుబంధ విభాగాల జిల్లా స్థాయి నాయకులు, పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల మండల, పట్టణ స్థాయి ముఖ్య నాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులను అందజేశారు. కూటమి ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలి స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు -
దరఖాస్తులకే రెండేళ్లు.. పింఛన్లకు ఇంకెన్నాళ్లు?
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: స్థానిక ఎన్నికల సన్నద్ధత వేళ.. సామాజిక భద్రత కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇప్పటి వరకూ కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదు. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా.. పింఛన్ ఎర వేస్తోంది. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకూ స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హతలు, ఈకేవైసీ పరిశీలన పూర్తయ్యాకే కొత్త పింఛన్లు అందుతాయి. ఇక్కడ కూడా నిబంధనల్లో చంద్రబాబు ప్రభుత్వం మెలిక పెట్టింది. సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు బట్టే.. మంజూరవుతాయని చెప్పడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల వల్ల ఒక పంచాయతీలో 60–70 మంది అర్హులు ఉంటే.. ఆరుగురు, ఏడుగురికి కూడా లబ్ధి చేకూరే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వేలాది మంది పింఛన్ల లబ్ధికి దూరమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 1,36,471 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.58.09కోట్లు పింఛన్ రూపంలో అందుతోంది. ఈ బడ్జెట్ పెరిగితేనే పింఛన్లు అందుతాయి. లేదంటే కష్టమే అన్నవాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఏడాదికి రెండు మార్లు దరఖాస్తులు స్వీకరించి, అర్హత ఉన్న వారందరికీ పింఛను మొత్తం వెనువెంటనే అందించేవారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని.. క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తయ్యాక, అన్ని అర్హతలూ ఉంటే పింఛన్లు మంజూరవుతాయని డీఆర్డీఏ పథక అధికారి ప్రభావతి తెలిపారు. ఈ చిత్రంలోని మహిళ పేరు మిత్తిరెడ్డి పార్వతి. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామం. భర్త మరణిణించడంతో చిన్నారి అయిన కుమార్తెతో బతకడమే కష్టంగా ఉంది. కొన్నాళ్ల కిందట నర్సిపురంలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. తండ్రి మరణించడం.. తల్లికి పింఛన్ వస్తుండడం వల్ల మ్యాపింగ్ ప్రక్రియలో ఇబ్బందిగా మారింది. తల్లికి పింఛను రావడం వల్ల.. పార్వతి పెట్టిన దరఖాస్తును ఎవరూ తీసుకోవడం లేదు. తనకు పింఛను మొత్తం మంజూరు చేసి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.గరుగుబిల్లి మండలం తోటపల్లికి చెందిన మార్కుండ మంజు పూర్తిగా మంచానికే పరిమితం అయ్యింది. లేవలేదు, ఏ పనీ చేయలేదు. ప్రస్తుతం రూ.6 వేల పింఛను వస్తోంది. నిబంధనల ప్రకారం రూ.15 వేలు పింఛను ఇవ్వాలని అధికారుల చుట్టూ కుటుంబ సభ్యులు తిరుగుతూనే ఉన్నారు. ఈ వృద్ధురాలి పేరు ముని సుబ్బమ్మ. సీతానగరం మండలం జోగింపేట గ్రామం. భర్త లేరు. వితంతు పింఛను గానీ, వృద్ధాప్య పింఛను గానీ అందడం లేదు. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఏ ఆధారమూ లేక, బతకడమే కష్టంగా ఉందని... తన దీన పరిస్థితి చూసి అయినా ఎవరూ చలించడం లేదని ఆమె వాపోతోంది. కొమరాడ మండలం విక్రంపురం గ్రామా నికి చెందిన తామరఖండి గుంపయ్యకు 68 ఏళ్లు. ముందు వెనకా ఎవరూ లేరు. వయసు మీద పడడంతో ఏ పనీ చేసుకోలేక పోతున్నాడు. జీవనం కష్టంగా మారిందని, పింఛను వచ్చినా కాస్త అండగా ఉంటుందని ఆయన చెబుతున్నాడు. తన దయనీయ స్థితిని చూసి పింఛను లబ్ధి కలిగించాలని కోరుతున్నాడు. బడ్జెట్ ఉంటేనే పింఛన్లు మంజూరు నిబంధనల్లో ప్రభుత్వం మెలిక ఒక పంచాయతీలో 60–70 మంది అర్హులు ఉంటే.. ఆరుగురు, ఏడుగురికే మంజూరు.. స్థానిక ఎన్నికల సమయాన ఎర -
● భూ హక్కు పత్రాలు అందజేయండి
జిల్లాలోని నిరుపేదలు, గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పోడు, డీ– పట్టాలు మంజూరు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బాధితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. తరతరాలుగా కొండపోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం కుటుంబానికి 10 ఎకరాల వరకు పోడు పట్టాలు మంజూరు చేయాలని, ప్రభుత్వం అరకొరగా 30 నుంచి 50 సెంట్ల భూమినే అందజేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో సంఘ నేతలు రెడ్డి ఈశ్వరరావు, ఎం. శ్రీనివాసరావు, కొల్లి గంగునాయుడు, కూరంగి సీతారాం, ఎ.నాయుడు, బి.లక్ష్మి, పాలమెట్ట రాము, భూతాల మోహనరావు, గరుగుబిల్లి శ్రీనివాసరావు, సింహాచలం పాల్గొన్నారు. -
సమస్యలపై నిరసన హోరు
కొమరాడ మండలంలో నాగావళి వద్ద ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని.. నదికి వరద వస్తే, గ్రామాలే ముంపు బారిన పడే ఆస్కారం ఉందని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు. కొమరాడ మండలం చోళపదం–1 గ్రామాల సమీపంలో నాగవళి నదిలో 18,900 మెట్రిక్ టన్నుల పూడిక తీత పనిని ఏజెన్సీకి జిల్లా జల వనరుల శాఖ ఖరారు చేసి గత మే నెలలో అప్పగించిందని, ఇప్పుడు ఇసుక తవ్వకాలు దేవుకోన పంచాయతీ పూర్ణపాడు రెవెన్యూ పరిధిలో జరుగుతున్నాయంటూ గగ్గోలుపెట్టారు. భారీ యంత్రాలతో గాంధీనగరం, రామభద్రపురం గ్రామాలకు అతి సమీపంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల తమ గ్రామాలకు పెనుముప్పు ఉందని ఆయా ప్రాంత ప్రజలు అధికారులకు విన్నవించారు. తక్షణమే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని కోరారు. -
ఆలస్యమైతే పని కట్.. మళ్లీ చేరాలంటే డబ్బులు కట్టు!
● పార్వతీపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు వేధింపులు సాక్షి, పార్వతీపురం మన్యం: అవినీతికి చిరునామాగా మారిన పార్వతీపురం మున్సిపాలిటీ.. నడిపించే వారు లేక, ఎవరికి తోచిన రీతిలో వారు దోచుకునేస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వ్యవహార శైలిపై కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అక్కడితో ఆగక.. కలెక్టరు కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో చెత్త, కాలువల శుభ్రత, ఇతర పారిశుద్ధ్య పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు.. విధులకు ఒక నిమిషం ఆలస్యమైనా వారం నుంచి 10 రోజు ల వరకు పని నిలుపు చేస్తున్నారని, మళ్లీ పని కావాలంటే రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు కార్మికులు ఆరోిపించారు. ఆయనకు నచ్చితే ఒకలా, లేకుంటే మరోలా వ్యవహరిస్తూ వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగులేకున్నా చేయాల్సిందే.. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే సెలవు ఇవ్వడానికి సదరు అధికారి ససేమిరా అంటున్నారని కార్మికులు చెబుతున్నారు. గతంలో పబ్లిక్ సెలవు దినాల్లో కార్మికులు ఉదయం విధులు పూర్తిచేసుకుని, మధ్యాహ్నం సెలవు తీసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకపోయింది. గతంలో రాత్రిపూట పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు తొమ్మిది మంది వరకు ఉండేవారు. ప్రస్తుతం ఆరుగురు అయ్యారు. శానిటరీ ఇన్స్పెక్టర్ తీరు వల్లే ఈ పరిస్థితి వస్తోందని.. గతంలో మూడుసార్లు సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన మున్సిపాలిటీల్లోనూ ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఫకీర్ రాజు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం యూనియన్ నాయకులు గొర్లి వెంకటరమణ, బి.వి.రమణ, పి.వరదరాజు, సింహాచలం, ఎన్.శంకరరావు తదితరులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. -
శిథిల భవనాలే గతి..
విజయనగరం రూరల్: ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చుతున్న అబ్కారీ శాఖకు జిల్లాలో సొంత గూడు లేకుండా పోయింది. అద్దె భవనాలు, శిథిల భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లా అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఎకై ్సజ్ సూపరింటిండెంట్ కార్యాలయం, విజయనగరం ఎకై ్సజ్ 1, 2 స్టేషన్లు శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం బాలాజీనగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతుండగా, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ప్రదీప్‌నగర్‌లో మరో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఎకై ్సజ్ సూపరింటిండెంట్ కార్యాలయం కలెక్టరేట్లోని పాత భవనంలో కొనసాగుతోంది. విజయనగరం పట్టణ, గ్రామీణ ప్రొహిబిషన్ ఆండ్ ఎకై ్సజ్ స్టేషన్లు పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని బొగ్గులదిబ్బ ప్రాంతంలో పాడుబడిన భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటితో పాటు టాస్స్‌ఫోర్స్ కార్యాలయం అక్కడే ఉంది. అయితే విజయనగరం ఎకై ్సజ్ స్టేషన్లతో పాటు టాస్స్‌ఫోర్స్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. గోడలు బీటలు వారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టేషన్ పైకప్పు, గోడలు నానిపోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన పెంకుల షెడ్డుల్లోనే నేటికీ స్టేషన్లు నిర్వహించడం, అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. అలాగే గ్రామీణ ఎకై ్సజ్ స్టేషన్ సీఐ కార్యాలయం పిచ్చుక గూడులాంటి చిన్నపాటి షెడ్డులో నిర్వహిస్తున్నారు. ఒకరిద్దరు అధికారులు, సిబ్బందికి మించి ఆ షెడ్డులో కూర్చునే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా కొన్నేళ్ల కిందట ఎకై ్సజ్ అధికారులు సొంత నిధులతో భవనం పైకప్పునకు మరమ్మతులు చేపట్టారు. కొత్త భవనాల నిర్మాణాలకు 2012లో నిధులు మంజూరైనా సకాలంలో పనులు చేపట్టకపోవడంతో నిధులు వెనక్కి మళ్లిపోయాయి. ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్న గూడ్సు షెడ్ ప్రాంతంలో ఆ శాఖకు సుమారు రెండెకరాల విశాలమైన సొంత స్థలం ఉంది. భవనాల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ స్థలంలో తుప్పలు, మొక్కలు ఏపుగా పెరిగి పాములకు ఆవాసాలుగా మారిపోయాయి. దీంతో అప్పుడప్పుడు విషసర్పాలు కార్యాలయంలోకి చొరబడి ఎకై ్సజ్ సిబ్బందికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎకై ్సజ్ శాఖ నుంచి అధిక ఆదాయాన్ని పొందే ప్రభుత్వం ఆ శాఖ కార్యాలయాలకే భవనాలు నిర్మించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి సొంత భవనాలకు శ్రీకారం చుట్టాలని పలువురు కోరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో సిబ్బంది అబ్కారీ శాఖకు భవనాల కొరత అద్దె భవనాల్లోనే డీసీ, ఏసీ కార్యాలయాలు -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ రాంసుందర్రెడ్డివిజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువు దాటిన అర్జీలుంటే సహించేది లేదన్నారు. పరిష్కారం కాని వాటికి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు మెరుగుపర్చాలని, మున్సిపాలిటీలో గుంతల రోడ్లను వెంటనే పూడ్చాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: పశు సంవర్థకశాఖలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, సంబంధిత సర్టిఫికెట్ ఉండాలని పేర్కొన్నారు. వీరికి నెలకు రూ. 18,500 గౌరవ వేతనం ఉంటుందని తెలిపారు. రెండు హాస్పటల్ అటెండెంట్ పోస్టులకు 10 వతరగతి ఉత్తీర్ణత ఉండాలని , నెలకు రూ. 15 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని తెలిపారు. అభ్యర్ధుల వయసు 42 సంవత్సరాల లోపు ఉండాలని, రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరమితి సడలింపు వర్తిస్తుందన్నారు. విద్యార్హత మార్కులకు 60 శాతం, ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీతో మెరిట్ అధారంగా ఎంపిక చేస్తారన్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా పశుసంవర్థక శాఖ సంచాలకులు వారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తావిజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన సీనియర్స్ పురుషుల ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగిన పోటీల్లో 26 జట్లు పాల్గొనగా.. విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన జట్టు అద్భుత క్రీడా ప్రతిభతో తృతీయ స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం ఈస్ట్ గోదావరి – విజయనగరం జట్ల మధ్య జరిగిన పోరు కూడా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కీలక సమయాల్లో విజయనగరం క్రీడాకారులు రాణించడంతో రెండు గోల్స్ తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులను జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు రజిని, కార్యదర్శి మహాలక్ష్మి, తదితరులు సోమవారం అభినందించారు. -
30 అర్జీల స్వీకరణ
విజయనగరం టౌన్: బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించి 30 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో అత్యధికంగా భూ తగాదాలకు సంబంధించినవి 22 అర్జీలు వచ్చాయి. కుటుంబ కలహాలకు సంబంధించి మూడు, మోసాలకు సంబంధించి రెండు, ఇతర అంశాలకు సంబంధించి మూడు ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏడు పనిదినాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తీసుకున్న చర్యలను జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్వర న్యాయం అందించాలి.. : ఎస్పీ మాధవ్‌రెడ్డి పార్వతీపురం రూరల్: ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు.. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, వేధింపులు, మోసాలకు సంబంధించిన సమస్యలపై ఎస్పీకి నేరుగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి ఫిర్యాదుదారుడితో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ.. సమస్య పూర్వాపరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడుతూ.. గడువు లోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మొత్తం 12 వినతులు అందాయి. డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సైలు అశోక్ చక్రవర్తి, శిరీషలతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యలే అధికం..
విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూ పరమైన సమస్యలే అధికంగా వస్తున్నాయి.. క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 226 వినతులు రాగా.. అందులో 113 వినతులు రెవెన్యూశాఖకు చెందినవి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భూ సమస్యలను కేవలం రికార్డుల ఆధారంగా కాకుండా అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫిర్యాదుదారుడితో మాట్లాడిన అనంతరం నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే 1100 టోల్ ఫ్రీ సేవల ద్వారా వచ్చే వినతుల పరిష్కారంలోనూ జాప్యం ఉండకూడదని జేసీ స్పష్టం చేశారు. శాఖల వారీగా వచ్చిన వినతులు.. రెవెన్యూ – 113, పంచాయతీరాజ్ – 24, డీఆర్డీఏ – 34, విద్యుత్ – 9, గ్రామ సచివాలయాలు – 9, విద్యాశాఖ – 5, మున్సిపల్ –15, డీఎంహెచ్ఓ – 6, ఇతర శాఖలకు సంబంధించిన 15 వినతులు వచ్చాయి. కుమారుడి జీతం బకాయిలు ఇప్పించండి.. విజయనగరం ఫోర్ట్: రామభద్రపురం మండలం ముప్పలపూడి గ్రామానికి చెందిన శీర రాఘవ వ్యవసాయశాఖలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేసి మృతి చెందాడు. దీంతో అతని జీతాల బకాయిలు తనకు చెల్లించాలని అతని తల్లి శీర అన్నపూర్ణ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. సమస్యల పరిష్కారానికే పీజీఆర్ఎస్.. పార్వతీపురం: ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే పీజీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని.. పరిష్కారంలో అలసత్వం వహించరాదని ఆదేశించారు. ఈ సందర్భంగా మొత్తం 98 అర్జీలు అందగా.. అందులో 31 రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించినవి కాగా 67 వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలున్నాయి. పార్వతీపురం మండలం చలమవలస సమీపంలో ఏర్పాటు చేసిని పౌల్ట్రీఫారం తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గరుగుబిల్లి మండలం చినగుడబ గ్రామానికి చెందిన కె. తాతారావు తన భూమికి సంబంధించిన వన్ వీని మంజూరు చేయాలని కోరారు. పార్వతీపురం మండలం శివన్నదొరవలస గ్రామానికి చెందిన నిమ్మక సరస్వతి తన భర్త పేరున ఉన్న డీ పట్టా భూమిని తన పేరున నమోదు చేయాలని అర్జీ అందజేశారు. అలాగే పార్వతీపురం పట్టణానికి చెందిన గంగాధరరావు తనకున్న జిరాయితీ భూమిని 22 ఏ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ 226 వినతులు స్వీకరించిన అధికారులు సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు : జేసీ సేతు మాధవన్ -
కల్యాణలక్ష్మికి చంద్ర గ్రహణం..
విజయనగరం ఫోర్ట్: రేగిడి ఆముదాలవలస మండలానికి చెందిన ఆర్.హరికి, బి. పావనిలకు ఇటీవల వివాహం జరిగింది. వీరు ప్రభుత్వం ప్రకటించిన పెళ్లికానుక పథకానికి దరఖాస్తు చేసుకున్నా, ఇంతవరకు ఎటువంటి సాయం అందలేదు.అలాగే బొండపల్లి మండలానికి చెందిన ఎ.మీనాక్షికి గంట్యాడ మండలానికి చెందిన పి. భాస్కరరావుతో ఇటీవల వివాహం జరిగింది. వీరు కూడా పెళ్లికానుక పథకానికి అర్హులు. అయితే వీరికి కూడా ప్రభుత్వం ఎటువంటి సాయాన్ని అందించలేదు. వీరే కాదు.. జిల్లా వ్యాప్తంగా అనేక మంది నూతన వధూవరులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందని పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎంతోకొంత సాయం అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆడపిల్ల తల్లిదండ్రులు భావించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. రెండున్నరేళ్లుగా ఒక్కరికి కూడా సాయం అందించకుండా కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు పెళ్లికానుక పేరుతో ఆర్థిక సాయం అందిస్తామని కూటమి సర్కార్ గొప్పగా ప్రకటించుకుంది. దీంతో మహిళలందరూ హామీని నమ్మి వారికి ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లికానుక ఊసే ఎత్తడం మానేసింది. ఆరు నెలల కిందట పెళ్లికానుక స్థానంలో కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది.కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి సుమారుగా ఆరు నెలలవుతోంది. అయితే ఇప్పటికీ ఆ పథకం గురించి అతీగతీ లేదు. పథకానికి సంబంధించి విధివిధానాలను ఇంతవరకు ప్రకటించలేదు. చంద్రబాబు సర్కార్ ఏ పథకం అమలు చేసినా దాని వెనుక ఒక మెలిక ఉంటుందనే విమర్శలున్నాయి. తాజాగా కల్యాణలక్ష్మి అనే పథకానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళల ఇంట్లో వివాహానికి రుణం ఇస్తారట. రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తే.. వడ్డీతో సహా తిరిగి తీర్చాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా పేదలకు అందని పెళ్లికానుక కల్యాణలక్ష్మి పేరుతో రూ.లక్ష వరకు రుణం ఇస్తామని ప్రకటన వేలాది మందికి అందని సాయం వైఎస్సార్సీపీ హయాంలో కల్యాణమస్తు పేరుతో ఆర్థిక సాయం2024 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వేలాది వివాహాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల వరకు వివాహాలు జరిగి ఉంటాయని అంచనా. అయితే ఇందులో ఒక్కరికి కూడా సాయం అందిన దాఖలాలు లేవు. ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తయ్యాయి.. మరో రెండేళ్లు సాగదీస్తే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి. ఇక మా పరిస్థితేమిటని లబ్ధిదారులు వాపోతున్నారు. పాలకులు స్పందించి కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. -
కొండంపేటలో సినిమా షూటింగ్ సందడి
రాజాం: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కొండంపేట శివాలయం వద్ద సోమవారం సినిమా షూటింగ్ ప్రారంభించారు. బీవీజీ –2 బ్యానర్‌పై ప్రేమంటే తెలుసా.. ఓ మనసా టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకులు వర్థన్ తెలిపారు. రాజాం పట్టణ సీఐ డి.నవీన్, తృప్తి రిసార్ట్ ఎం.డి పీవీజీ కృష్ణ (మురళీ మాస్టారు) క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోగా గణేష్, హీరోయిన్గా భాగ్య, విలన్‌గా వంగర మండలానికి చెందిన సీనియర్ నటుడు పెంకి బాలకృష్ణ నటిస్తున్నారు. కార్యక్రమంలో కెమెరామెన్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
● జిల్లాకు పతకాల పంట
● 31 పతకాలు సాధించిన పోలీసులుపార్వతీపురం రూరల్: రక్షణ బాధ్యతల్లోనే కాదు.. క్రీడా మైదానంలోనూ సత్తా చాటారు మన్యం జిల్లా పోలీసులు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియనన్లో జరిగిన శ్రీతొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026శ్రీలో విశాఖ రేంజ్ తరఫున బరిలోకి దిగిన పార్వతీపురం మన్యం జిల్లా సిబ్బంది పతకాల పంట పండించారు. కేవలం తొమ్మిది మంది ఏకంగా 31 పతకాలు (14 స్వర్ణ, 9 రజత, 8 కాంస్య) కొల్లగొట్టి క్రీడాస్ఫూర్తిని రగిలించారు. కానిస్టేబుల్ మధుబాల అత్యధికంగా పది పతకాలతో అదరగొట్టగా.. సురేష్ (8), అరుణ్ కుమార్ (4), త్రినాథ్ (3), నాగభూషణరావు (2) పతకాలు సాధించారు. మనోజ్, రామకృష్ణ, బాలకృష్ణ, శివకుమార్ సైతం వివిధ క్రీడల్లో పతకాలు కై వసం చేసుకున్నారు. నేర పరిశోధనలో మేటి అనిపించుకునే ట్రాకింగ్ జాగిలం శ్రీశాండీశ్రీ సైతం రాష్ట్రస్థాయి జాగిలాల పోటీల్లో మెరిసి కాంస్య ట్రోఫీని ముద్దాడడం విశేషం. క్రీడా విజేతలను ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి సోమవారం అభినందించి, పతకాలతో సత్కరించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని జయించడానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలే దివ్య ఔషధమని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ సిబ్బంది రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీ థామస్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
కుష్టు వ్యాధి గుర్తింపునకు ఇంటింటి సర్వే
పార్వతీపురం: కుష్టువ్యాధి గుర్తింపు కోసం జిల్లాలో సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లో సర్వేకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు, వైద్యసిబ్బంది బృందాలు ప్రతి ఇంటినీ సందర్శించి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. వ్యాధి నిర్ధారణయితే ఉచితంగా బహుళ ఔషధ చికిత్స (ఎండీటీ) అందిరన్నారు. శరీరంపై స్పర్శ తెలియని మచ్చలుంటే సర్వే బృందాలకు తెలియజేసి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. తొలి దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నివారణాధికారి ఎస్కే హఫీజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి, ఎన్‌ఎంఓ రాజేష్‌కుమార్, ఆర్బీఎస్కె పీఓ టి. జగన్ మోహనరావు పాల్గొన్నారు. -
ఆధునిక నైపుణ్యాలు తప్పనిసరి
● డేటా ఐఈఐ వ్యవస్థాపక డైరెక్టర్ తిరుమలేష్విజయనగరం అర్బన్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) యుగంలో ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని డేటా ఐఈఐ వ్యవస్థాపక డైరెక్టర్ తిరుమలేష్ కొణతాల సూచించారు. గాజులరేగలోని సీతం కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు సోమవారం నిర్వహించిన ఇండక్షన్ ప్రొగ్రాంనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్, డిఫెన్స్, బిజినెస్, తదితర రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తోందన్నారు. అన్ని విభాగాల విద్యార్థులు ఏఐపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అవకాశాలను సృష్టించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. డేటా ఐఈఐ ఏఐ ఇంజినీర్ భీమేశ్వరరావు మాట్లాడుతూ.. రోబోటిక్స్, వ్యవసాయం, క్లౌడ్ టెక్నాలజీ, తదితర రంగాల్లో భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా డేటా, ఏఐ, ఆధునిక సాంకేతికతపై ప్రాక్టికల్ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథిని కళాశాల యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కందివలసలో పంటలు ధ్వంసం కొమరాడ: మండలంలోని రైతులకు గజరాజల బాధలు వీడడం లేదు. ఎప్పుడు ఎవరి పొలంలో పడి పంటలు ధ్వంసం చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడుతుంటే.. మరోపక్క గజరాజులు ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మండలంలోని కందివలసలో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు పామాయిల్, జొన్న, అరటి, తదితర పంటలను నాశనం చేశాయి. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగులను తీసుకువచ్చినా అటవీ ఏనుగులను తరలించలేకపోయారని గిరిజన రైతులు వాపోతున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో గల విశాఖ డెయిరీ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కురుపాం మండలం దండుసుర గ్రామానికి చెందిన ఆరిక ఇరమమ్మ (47) మతిస్థిమితం లేక 20 రోజుల కింట ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఇరుమమ్మను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించి బంధువులకు సమాచారం అందజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మేనల్లుడు కండ్రిక చాలెంజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో జైలుశిక్ష శృంగవరపుకోట: చెక్‌బౌన్స్ కేసులో రైల్వే ఉద్యోగికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు ఏడు లక్షల రూపాయలు చెల్లించాలని స్థానిక కోర్టు న్యాయమూర్తి బి.కనకలక్ష్మి సోమవారం తీర్పు చెప్పారు. నగదు చెల్లించని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. న్యాయవాది బి.త్రిమూర్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో ఉంటున్న రైల్వే ఉద్యోగి పోకల రమణ ఎస్.కోట పట్టణానికి చెందిన అనాల మోహనరావు వద్ద ఏడు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గాను రమణ చెక్ ఇచ్చారు. అయితే ఈ చెక్ బ్యాంక్‌లో జమ చేయగా బౌన్స్ అయింది. దీంతో అనాల మోహనరావు కోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి ముద్దాయికి జైలుశిక్ష విధించారు. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
పార్వతీపురం: ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజలు తమ వినతులను సమర్పించవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు, వాటి స్థితిని మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవడంతోపాటు1100 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చునన్నారు. కలెక్టరేట్లో ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన ఇవ్వండి పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను వెల్లడించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి కోరారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎండలకు అల్లాడుతున్న ఏనుగులుభామిని: ఎండల తీవ్రతకు ప్రజలతో పాటు ఏనుగుల గుంపు అల్లాడుతోంది. ఆదివారం మరీ ఎక్కువైన ఎండ వేడికి మండలంలోని నులకజోడు సమీప తివ్వాకొండ పరిసరాల్లో గల మామిడి చెరువులో నాలుగు ఏనుగుల గుంపు అత్యధిక సమయం కాలక్షేపం చేశాయి. నీటిలో జలకాలాడుతూ ఉపశమనం పొందాయి. సాయంత్రం నిదానంగా ఒడ్డుకు చేరి సమీపంలోని పంట పొలాల్లో మేశాయి. రైతు పండించిన జొన్న పంటను నాశనం చేసి తినివేశాయి. డ్రగ్స్ డైరీ ఆవిష్కరణపాలకొండ రూరల్: మాదకద్రవ్యాల వినియోగంతో తప్పుదోవ పడుతున్న వారు సన్మార్గంలో నడవాలని పాలకొండ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఎం.రాంబాబు అన్నారు. మాద్రకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపే క్రమంలో స్థానిక పోలీసులతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించేందుకు ‘డ్రగ్స్ డైరీ’ అనే షార్ట్ ఫిలిమ్ తీయించారు. స్థానిక యువత, కళాకారులను ఇందులో పాత్రధారులుగా ఎంచుకున్నారు. వారితో మత్తు పదార్థాల వినియోగం, రవాణా, అమ్మకాల వల్ల జీవితాలు, కుటుంబాలు ఏవిధంగా నాశనమవుతాయనే సందేశాన్ని అందించారు. ఈ లఘు చిత్రాన్ని డీఎస్పీ ఆదివారం పాత్రధారులతో కలిసి తన చాంబర్లో ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ లింకును గ్రూపుల్లో విడుదల చేశారు. ఈ షార్ట్ ఫిలిం రూపకల్పనకు సహకరించిన విశ్వజల్లు టీమ్ సభ్యులను అధినందించారు. విజయనగరం టౌన్: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 50–55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి విజయనగరం రైల్వేస్టేషన్‌కి దగ్గరలో ఆదివారం మృతిచెందాడు. మృతుడి శరీరంపై తెలుపు, నీలం రంగు ఉన్న పుల్‌హ్యాండ్స్ షర్ట్, ఎరుపు,పసుపు, నీలం రంగు గల రగ్గు కప్పుకుని ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9247585742 నంబర్‌ను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ వీఎన్.మూర్తి కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. -
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు దేశిక్రామ్
గుమ్మలక్ష్మీపురం: అండర్ – 10 చైల్డ్ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు మండలంలోని కొత్తగూడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నిమ్మల దేశిక్రామ్ (జొల్లగూడ గ్రామం) ఎంపికై నట్లు కోచ్ పత్తిక బాలరాజు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ నెల 4న విజయనగరంలోని కస్పా హైస్కూల్లో జరిగిన అండర్ – 10, అండర్ – 12 విభాగం ఫెన్సింగ్ ఇంటివిడ్యువల్ బాల, బాలికల రాష్ట్ర స్థాయి సెలక్షన్ ట్రయల్స్ ఫెన్సింగ్ క్రీడా పోటీలలో దేశిక్ రామ్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడన్నారు. అలాగే ఈ నెల 5, 6వ తేదీల్లో విజయవాడలోని శ్రీ అలపతి రామారావు, అనుమోలు లక్ష్మణరావు ఫంక్షన్ హాల్లో(హనుమాన్‌పేట) జరిగిన 7వ ఏపీ స్టేట్ చైల్డ్ (అండర్–10) ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో దేశిక్ రామ్ బంగారు పతకం కై వశం చేసుకుని, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఈ నెలలోనే జమ్ముకశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో దేశిక్రామ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థినిని పలువురు అభినందించారు. -
తల్లిడిల్లిన మనసు..
కొత్తవలస: చిన్న కొడుకుపై ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. తనకు అండగా నిలుస్తాడని..వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటాడని భావించింది. కానీ విధి ఆ కుటుంబంపై పగబట్టినట్లు వ్యవహరించింది. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో ఆ తల్లి ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి. నన్ను ఆదుకుంటావనుకుంటే,..ఒంటరిని చేసివెళ్లిపోయావా నాయనా అంటూ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ విజయకుమార్, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండల కేంద్రంలో సంత మార్కెట్ ఎస్సీ కాలనీకి చెందిన బోని వెంకటేష్ (33) విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్కూటీపై కొత్తవలస నుంచి ఎస్.కోట వైపు వెళ్తుండగా దేవరాపల్లి నుంచి ఆర్కే బీచ్‌కు వెళ్లే సింహాచలం డిపోకు చెందిన సిటీ బస్సు అరకు–విశాఖ రోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నూకాలమ్మ గుడి వద్ద వెంకటేస్ స్కూటీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ మితిమీ రిన వేగంతో వస్తూ స్కూటీని ఢీకొట్టడంతో వెంకటేష్ ఎగిరి పడిపోగా రోడ్డుకు తల బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద వార్త తెలుసుకుని తల్లి కనకమ్మ, అన్న శంకర్లు అక్కడికి చేరుకుని లబోదిబోమంటూ రోదించారు. మృతదేహంపై తల్లి కనకమ్మ పడి రోదించడం చూపరులను కంటితడి పెట్టించింది. మృతుడికి అన్నయ్య శంకర్, ఓ సోదరి, తల్లి కనకమ్మ ఉన్నారు. సోదరు డు శంకర్‌కు సోదరికి వివాహాలు కాగా వెంకటేష్‌కు వివాహం కాలేదు. తల్లి దగ్గరే ఉంటున్నా డు. మృతుడి సోదరుడు శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.కొడుకు వెంకటేష్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి కనకమ్మ -
ప్రాణాలతో చెలగాటం..
పార్వతీపురం రూరల్: రైలెక్కి గమ్యం చేరాల్సిన ప్రయాణికులు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పట్టాలు దాటుతున్నారు. పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతోంది. స్టేషన్లో నిలిచి ఉన్న గూడ్స్ రైళ్ల కింద నుంచే.. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వ్యాగన్ల చక్రాల సందుల్లోంచి అత్యంత ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఒక పక్క ఏ క్షణాన కదులుతుందో తెలియని మృత్యుశకటం లాంటి గూడ్స్ రైలు.. మరో పక్క తమ రైలు అందుకోవాలనే ఆరాటం.. ఈ క్రమంలో పసిపిల్లల చేతులు పట్టుకుని, లగేజీలతో రైలు కింద నుంచి దూరుతూ ప్రయాణికులు చేస్తున్న ఈ సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ఆస్కారం ఉందని అక్కడి దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. -
9న భోగాపురంలో బీజేపీ భారీ బహిరంగ సభ
పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలో ఈనెల 9న నిర్వహించనున్న బీజేపీ భారీ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా స్థల పరిశీలనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాడు రాజేష్‌వర్మ స్థానిక కొమ్మూరు అప్పుదొర కళా ప్రాంగణాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి వేదిక సమాయత్తం, కార్యకర్తలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్ వసతులపై నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజేష్‌వర్మ మాట్లాడుతూ..భోగాపురం మండలంలో తొలిసారిగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంతటి భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు. సభను జయప్రదం చేసేందుకు కార్యక్రమంలో స్థానిక నాయకుడు అడపా ప్రసాద్, విజయనగరం బీజేపీ జనరల్ సెక్రటరీ పతివాడ రాజేష్, భోగాపురం బీజేపీ మండల అధ్యక్షుడు దిక్కు అప్పలరాజు, యువమోర్చా అధ్యక్షుడు రాజాన రమణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్ర సమీపంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి గ్రామానికి చెందిన గంట మహేష్ (35) పార్వతీపురం నుంచి ద్విచక్ర వాహనంపై ఖడ్గవలస వైపు వెళ్తుండగా.. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఎదురుగా ఎర్రగుడి వైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న గరుగుబిల్లి ఎస్సై షేక్ ఫకృద్దీన్ కేసు నమోదు చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు చిన్నమేరంగి సీఐ తిరుపతిరావు ప్రత్యేక పర్యవేక్షణలో ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆయా బృందాలు సంఘటన జరిగిన మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నాయని చెప్పారు. ట్రాక్టర్ ఢీ కొని మహిళ.. నెల్లిమర్ల రూరల్: మండలంలోని పూతికపేట గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటనపై ఎస్సై గోపాలరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఒడ్డు నరసమ్మ (41) తన కుమారుడు బన్నీ, మేనళ్లుడు రాకేష్‌తో కలిసి టీవీఎస్ మోపెడ్‌పై జరజాపుపేటలో ఉన్న తన అక్క ఇంటికి వస్తుండగా.. పూతికపేట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నరసమ్మకు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ఇద్దరికీ స్వల్పంగా గాయాలయ్యాయి. నరసమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఇండియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం
రాజాం సిటీ: స్థానిక పాలకొండ రోడ్డులో గల ఇండియన్ బ్యాంక్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా బ్యాంక్ నుంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. స్ట్రాంగ్ రూమ్, లాకర్ల గది వైపు మంటలు వెళ్లకుండా అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన పత్రాలు కాలి బూడిద కాగా.. లాకర్లు భద్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్ ఇన్చార్జి ఎస్సై వై.గోవిందరావు తెలిపారు. -
సీఆర్‌జెడ్ భూములను కాపాడండి
పూసపాటిరేగ: చింతపల్లి తీరంలోని పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ కోరారు. ఆదివారం అదే గ్రామంలో పర్యటించిన ఆయన..అక్కడి వివాదాస్పద భూములను మత్స్యకారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన..చింతపల్లి తీరంలోని పర్యావరణాన్ని ధ్వంసం చేసేలా సీఆర్జెడ్లోని చెట్లను తొలగించి మత్స్యకారులకు హాని కలిగించేలా చేస్తుండడం దుర్మార్గమన్నారు. ఎన్నో ఏళ్లుగా సీఆర్జెడ్లోని శ్మశానాలు, దేవుని ఆలయాలను తొలగిస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారుల బోట్లను ఒడ్డున ఉంచేందుకు ఏంకర్‌గా ఉన్న చెట్లను తొలగించారని గ్రామస్తులు మేడ అప్పయ్యమ్మ, మైలపల్లి పైడమ్మ, అమర పోలమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని మత్స్యకారుల వినియోగంలోని సీఆర్‌జెడ్ భూములను రక్షించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు బర్రి చినఅప్పన్న, గాంధీ, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
రాజన్నదొర మానవత్వం
● సినిమా చూపించి చిన్నారుల కోరికను తీర్చిన మాజీ డిప్యూటీ సీఎం సాలూరు/సాలూరు రూరల్: మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. చిన్నారుల ముఖంలో చిరునవ్వులు చూడడానికి వారి మనసులో చిన్న కోరికను అర్థం చేసుకుని పెద్దమనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల విడుదలైన ఇరుముడి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా గురించి ప్రజలు ఆసక్తిగా చర్చించుకోవడం, బాగుందంటూ ప్రశంసించడం పట్టణంలో నవజీవన్ఆశ్రమ పాఠశాలలోని చిన్నారుల చెవిన పడింది. ఆశ్రమంలో సుమారు 72 మంది అనాథ, నిరాశ్రయ చిన్నారులు ఉన్నారు. వారిలో చాలా మంది చిన్నారులు ఈ సినిమా చూడాలని ఆశపడ్డారు. అయితే థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే పరిస్థితులు తమకు లేవని వాపోయి తమ చిన్న కోరికను మనసులోనే దాచుకున్నారు. చిన్నారుల కోరిక చిన్నదే కావచ్చు. కానీ వారి పరిస్థితి కారణంగా అది వారికి అందని కలగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నారుల కల విషయం రాజన్నదొర వద్దకు చేరింది. చిన్నారుల కోరిక రాజన్నదొరను కదలించింది. అంతే ఆలస్యం చేయకుండా చిన్నారులందరినీ సినిమా చూసేందుకు టికెట్లు, రాకపోకలు, ఇతర ఖర్చులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఆదివారం స్వయంగా ఆయనే పట్టణంలో లక్ష్మి,శ్రీలక్ష్మి థియేటర్స్‌కు చేరుకుని చిన్నారులతో ముచ్చటించి థియేటర్లోకి వారిని పంపించారు. చిన్నారుల కళ్లలో ఆనందం ఈ సినిమా చూడాలని ఆశించిన ఆ చిన్నారుల కోరిక నిజమైంది.సినిమా చూసేందుకు వెళ్లిన పిల్లల ముఖాల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. తమ కోరికను నేరుగా వచ్చి నెరవేర్చిన రాజన్నదొరకు వారు, ఆశ్రమ నిర్వాహకులు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాజన్నదొర మానవత్వంపై ప్రశంసలు అధికారంలో ఉండడం వేరు. మనసుల్లో ఉండడం వేరు. పదవులు మారవచ్చు కానీ మానవత్వంతో చేసే మంచి పనులు మాత్రం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని, చిన్నారుల ఆనందం కోసం నేరుగా ఆయనే కదిలిన రాజన్నదొర మానవత్వం గురించి స్థానికులు చర్చించుకుంటున్నారు. -
యువతతోనే దేశాభివృద్ధి..
గజపతినగరం రూరల్ (జామి): దేశానికి ఉజ్వల భవిష్యత్ యువతతోనే సాధ్యమవుతుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. యువత బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. జామి మండలం అన్నంరాజుపేట గ్రామంలో ఆదివారం రాత్రి చేపట్టిన ‘పల్లెనిద్ర‘ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరూ దురలవాట్లకు దూరమయ్యేలా చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. గ్రామ సందర్శనలు, పల్లెనిద్ర, సంకల్పం వంటి కార్యక్రమాల ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతున్నారని తెలిపారు. మహిళలు, చిన్నారుల పట్ల గౌరవంగా నడుచుకోవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దన్నారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్.కోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి, సబ్ ఇన్స్పెక్టర్ వీరజనార్ధన్ పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
విద్యార్థులకు ‘పద్మ పూజిత’ స్కాలర్షిప్లు
మద్దిలపాలెం (విశాఖ): విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పద్మ పూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిటోరియస్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్–2026ను ఆదివారం విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని శంకర ప్యాలెస్‌లో నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 107 దరఖాస్తులు అందగా.. పరిశీలన అనంతరం 77 మంది విద్యార్థులను స్కాలర్షి ప్లకు ఎంపిక చేసి మొత్తం రూ.12.20 లక్షలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతి చదువుతున్న 29 మందికి రూ.2.90 లక్షలు, డిగ్రీ, డిప్లమో, ఫార్మసీ చదు వుతున్న 10 మందికి రూ.1.50 లక్షలు, ఇంటర్, బీటెక్ చదువుతున్న 38 మందికి రూ.7.80 లక్షల మెరిట్ స్కాలర్షిప్లు, ధ్రువీకరణ పత్రాలను ఫౌండేషన్ చైర్మన్ ఆర్.వి.ఎస్.వి.బసవరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య కు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు సహ కారం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. పడాల ప్రసాద్ విద్యార్థులకు ప్రేరణాత్మక సూచనలు చేశారు. సానుకూల దృక్పథంతో విద్య ను అభ్యసించాలని పోతినేని నిర్మల సూచించారు. -
ప్రాణం కోసం పోరాటం..
చీపురుపల్లి రూరల్ (గరివిడి): ఒకవైపు కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత.. మరోవైపు ప్రాణాల కోసం పోరాటం.. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి అక్షరాలా కోటి రూపాయలు ఉంటేగాని ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గరివిడి మండలం చుక్కవలస గ్రామానికి చెందిన గదల ఈశ్వరరావు కొంతకాలంగా సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతూ చీపురుపల్లిలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందాడు. ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించారు. దీంతో అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు గురైనట్లు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో, తక్షణమే ఊపిరితిత్తులు మార్చాలని ఇందుకు సుమారుగా 90 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ఈశ్వరరావు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడుతున్నాడు. భార్యా, ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన ఈ కుటుంబానికి ఇంత భారీ మొత్తంలో వైద్య ఖర్చును భరించే ఆర్థికస్థోమత లేదు. దీంతో దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. సాయం చేయాల్సిన దాతలు 96400 18559 నంబర్‌ను సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఈశ్వరరావు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు -
అంతర్జాతీయ వేదికపై ‘సురవరం యువకుడు’
సంతకవిటి: మండలంలోని సురవరం గ్రామానికి చెందిన డాక్టర్ బాసా మురళి కళారంగంలో పరిశోధనా దృక్పథంతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం నుంచి ప్రారంభమైన ఆయన విద్య, కళా ప్రయాణం నేడు జాతీయ, అంతర్జాతీయ అకడమిక్ వేదికల వరకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన అస్సాం రాష్ట్ల్రంలోని సిల్చార్‌లో ఫెర్ఫార్మింగ్ అండ్ ఆర్ట్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నటన, థియేటర్ పెడగాజి, శరీర ఆధారిత నటనా పద్ధతులు వంటి అంశాలపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు శ్రీలంకలోని జాఫ్నా యూనివర్సిటీలో సర్ పొన్నంబాలెం రామనాథన్ ఫ్యాకల్టీ ఆఫ్ విజవల్ అండ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో జరిగిన మూడో అంతర్జాతీయ రీసెర్చ్ కాన్ఫరన్స్‌లో ఆయన పాల్గొన్నారు. విజవల్ అండ్ ఆర్ట్స్ ఫెర్ఫార్మింగ్లో బోధనా శాస్త్రం, హెల్త్ ప్రాక్టీసెస్ అంశంపై జరిగిన సదస్సులో మురళీ తన పరిశోధనా పత్రం సమర్పించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న మురళికి గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తున్నారు. -
భోగాపురంలో దారుణం..
● డబ్బులు ఇవ్వలేదని యువకుడి చేతులు కట్టి బైక్‌తో ఈడ్చుకెళ్లిన వైనం ● రంగంలోకి దిగిన పోలీసులు పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి చేతులు కట్టి ద్విచక్ర వాహనంతో ఈడ్చుకెళ్లిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ ఏఆర్ దామోదర్ భోగాపురం పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ మహేష్ నుంచి రామచంద్రపేటకు చెందిన ఏల్లా రాజేష్ 10 వేల రూపాయలకు బైక్ కొనుగోలు చేశాడు. ట్రయల్‌కు వెళ్తూ భోగాపురం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కారును ఢీ కొట్టాడు. దీంతో భోగాపురం పెద్దవీధికి చెందిన బైక్ మెకానిక్ లెంక శ్రీరామ్, బైక్ అమ్మకం చేసిన మహేష్ తరఫున మధ్యవర్తిగా వ్యవహరించి ఆరు వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చాడు. అయితే ప్రమాదం చేసిన బాధితుడు రాజేష్ డబ్బులు ఇవ్వకుండా పారిపోవడంతో శ్రీరామ్ హెడ్ కానిస్టేబుల్‌కు రూ.6 వేలు చెల్లించి బైక్ తీసుకెళ్లాడు. ఇదంతా జరిగి నెల రోజులైంది. ఈ క్రమంలో ఈ నెల ఐదో తేదీన భోగాపురంలో రాజేష్‌ను మహేష్, తదితరులు అటకాయించి షెడ్లో బంధించారు. రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను ఇవ్వలేకపోవడంతో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో బాధితుడు రాజేష్ మెడకు, చేతులకు తాళ్లు కట్టి బైక్‌పై ఈడ్చుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితులు లెంక శ్రీరామ్, మహేష్, సూర్యనారాయణతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాధితుడ్ని రక్షించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ భోగాపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం
● మాజీ ఎమ్మెల్యే జోగారావుపార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. పార్టీ అధినేత వైఎస్జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ వీధిలోని ఆర్యవైశ్య కల్యాణ మంటపం వేదికగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో నాయకులతో ఆదివారం సమావేశమైన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సదస్సు సన్నాహాలపై చర్చించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి సారథ్యంలో సాగే ఈ సమావేశానికి నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు విచ్చేయనున్నారు. రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులంతా సమరోత్సాహంతో కదలిరావాలని, సమావేశాన్ని విజయవంతం చేయాలని జోగారావు పిలుపునిచ్చారు. -
సీటు చూపించండి..!
జీతం వద్దువీరఘట్టం: సార్ నమస్తే..నాకు మీ స్కూల్లో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది..ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్..మీరు నాకు జీతం ఇవ్వక్కర్లేదు..మా కంపెనీ వాళ్లే నాకు నెలకు రూ.15 వేలు జీతం ఇస్తారు..నా సీటు ఎక్కడో చెప్పండి అంటూ ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం మండలంలోని ఓ జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎంకు తనకు ఉద్యోగం వచ్చిందనే జాయినింగ్ ఆర్డర్ చూపించాడు. సారు నేను సోమవారం వస్తాను. ఉద్యోగంలో జాయిన్ అవుతానని హెచ్ఎంకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సదరు హెచ్ఎం ఎవరీ వ్యక్తి..ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక కాసేపు నివ్వెరపోయాడు..కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కుమ్మరిగుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ‘స్ఫూర్తి ఔట్సోర్సింగ్ ఏజెన్సీ’ ద్వారా స్కూల్లో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిందని చూపించిన జాయినింగ్ ఆర్డర్ చూసిన హెచ్ఎం మాట్లాడుతూ ఇటువంటి ఉద్యోగాలు ఇక్కడలేవని ఆ వ్యక్తిని పంపించేశారు.అయితే ఆ వ్యక్తి మాత్రం నేను సోమవారం వస్తాను. నా కుర్చీ ఎక్కడో చెప్పండి అని చెప్పి వెళ్లిపోవడంపై హెచ్ఎం కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృమూర్తికి, డీఈఓ పి.బ్రహ్మాజీరావుకు తెలియజేశారు.ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారులు వెంటనే స్పందించారు.అటువంటి జాయినింగ్ ఆర్డర్లు తెస్తే ఎవ్వరినీ జాయిన్ చేసుకోవద్దని హెచ్ఎంకు సూచించారు. అవి ఫేక్ ఆర్డర్లు.. గత రెండేళ్లుగా కొన్ని బోగస్ సంస్థలు నిరుద్యోగులకు గాలం వేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తున్నామంటూ నిరుద్యోగులను ఈ ఉచ్చులోకి లాగుతున్నాయి.ఓ పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు.సదరు పాఠశాలల్లో జాయిన్ అయ్యేవారికి రెండు నెలల పాటు జీతాలు ఇవ్వడం,అంతలోనే బోర్డు తిప్పేయడం రెండేళ్ల క్రితం ఇటువంటి బోగస్ ఉద్యోగాల బాగోతం వీరఘట్టం మండలంలోని పలు హైస్కూల్స్‌లో వెలుగు చూసింది. వారంతా సదరు బోగస్ కంపెనీల పేరుతో ఇటువంటి ఫేక్ ఆర్డర్లు సృష్టిస్తూ అమాయక నిరుద్యోగులను దోచుకుంటున్నారు.ఇటువంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నా పలువురు నిరుద్యోగులు ఇటువంటి వారి ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నారు.బోగస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామంటూ ఎవరైనా చెబితే అటువంటి వారిని నమ్మవద్దు. గతంలో ఇదే విధంగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు అక్రమగా వసూలు చేసిన సంఘటనలు వెలుగుచూశాయి. నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎవరైనా జాయినింగ్ ఆర్డర్లు తెస్తే ప్రధానోపాధ్యాయులు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయండి. పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం హైస్కూల్లో తాను స్వచ్ఛందంగా పనిచేస్తానని ఆ వ్యక్తి ఇచ్చిన లెటర్స్ఫూర్తి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరిట ఇచ్చిన జాయినింగ్ ఆర్డర్ సార్ నాకు మీ స్కూల్లో ఉద్యోగం వచ్చింది ఓ స్వచ్ఛంద సంస్థ ఆర్డరు ఇచ్చింది ఫేక్ అపాయింట్మెంట్తో పాఠశాలకు వచ్చిన వ్యక్తి నివ్వెరపోయిన హెచ్ఎం -
చుక్ చుక్ బండి.. ఆగి.. ఆగి.. వస్త్తోంది!
● జోన్ విశాఖలో.. కష్టాలు మాత్రం పట్టాలపైనే ● విశాఖ–విజయనగరం–బొబ్బిలి–పార్వతీపురం మార్గాల్లో ప్రయాణికుల అవస్థలు సాక్షి, పార్వతీపురం మన్యం : ఎప్పుడో వస్తుందని ఎదురుచూసిన రైల్వే జోన్ వచ్చింది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత వాల్తేర్ డివిజన్‌న్ స్థానంలో విశాఖ డివిజన్ ఏర్పడింది. దశాబ్దాల కల సాకారమైందన్న ఆనందం ఉత్తరాంధ్రలో వ్యక్తమైంది. జోన్ వచ్చిన తర్వాత తమ రైలు కష్టాలు తీరకపోగా.. మరింత పెరిగాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ–విజయనగరం–బొబ్బిలి–పార్వతీపురం–రాయగడ మార్గాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. జోన్ రావడంతో పరిపాలనా వ్యవస్థ మారింది గానీ.. స్థానిక ప్రయాణికుడికి అవసరమైన రైలు సౌకర్యాలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదన్నది వారి ప్రధాన వాదన. గంటలకొద్దీ ఆలస్యం.. పట్టాలపైనే సగ జీవితం ఇదీ.. నిత్యం విశాఖ నుంచి విజయనగరం మీదుగా పార్వతీపురం మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు, ఉద్యోగుల వాదన.. ఆవేదన. విశాఖ నుంచి పార్వతీపురం వైపు ప్రస్తుతం పలు రైళ్లు నడుస్తున్నాయి. ఉన్నవే స్వల్ప సంఖ్యలో రైళ్లు. అందులో ఏ ఒక్కటీ సమయానికి రాదు.. సకాలంలో గమ్యస్థానం చేర్చదు. మరోవైపు జోన్ ప్రారంభం మొదలు.. సరకు రవాణా గూడ్స్ సర్వీసులు అధికమయ్యాయి. ఇవి ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. విజయనగరం నుంచి పార్వతీపురం మధ్యలో ఏ స్టేషన్లో చూసినా నాలుగైదు గూడ్స్ రైళ్లు ఆగిపోతూనే ఉంటున్నాయి. ఈ లైన్లు క్లియరెన్స్ లేక పాసింజర్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులన్న తేడా లేకుండా గంటలకొద్దీ ఆగిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉండే డీఎంయూ రైలు ఉదయం విశాఖలో 6.45 నిమిషాలకు బయల్దేరాల్సి ఉంది. దీనికంటూ ఒక సమయం ఉండటం లేదు. 9.35 నిమిషాలకు పార్వతీపురం చేరుకోవాల్సి ఉన్నా.. ఉదయం 11, మధ్యాహ్నం 12 అయినా ఒక్కోసారి చేరుకోవడం లేదు. సాధారణంగా విజయనగరం నుంచి పార్వతీపురానికి గంట నుంచి గంటన్నర సమయం కాగా.. రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల మూడు గంటలకుపైగా పడుతోంది. రాయగడ నుంచి వచ్చే రాయిపూర్ పాసింజర్, భవానీపట్నం, గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ సర్వీసులన్నింటిదీ ఇదే పరిస్థితి. జోన్ వస్తే కొత్తవలస నుంచి విజయనగరం మీదుగా రాయగడ.. విజయనగరం నుంచి చీపురుపల్లి, పొందూరు, ఇచ్ఛాపురం వరకు రైలు మార్గాలు మెరుగుపడతాయని అంతా భావించారు. ఇప్పటికే కొత్తవలస నుంచి విజయనగరం వరకు నాలుగో లైను, విజయనగరం నుంచి రాయగడ వైపు మూడో లైను పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీకాకుళం వెళ్లే మార్గంలో ప్రధాన ఇబ్బందులు ఏమీ లేనప్పటికీ.. విజయనగరం, పార్వతీపురం, రాయగడ మార్గంలోనే ప్రయాణం నరకంగా మారుతోందని ప్రయాణికులు అంటున్నారు. రాయగడ వైపు నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ సర్వీసులు సైతం గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనివల్ల అత్యవసర పనుల మీద వెళ్లేవారు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోన్ వచ్చిన తర్వాత కొత్త రైళ్లు రాకపోగా.. నిత్యం తిరిగే డీఎంయూ వంటి రైలును వారానికి ఒకసారి నిలుపు చేయడం కొసమెరుపు. పరిపాలనా పటంలో గీతలు మారడం కంటే.. ప్రయాణికుడి జీవితంలో మార్పు రావడమే అసలు జోన్ విజయానికి కొలమానం అని ప్రయాణికులు చెబుతున్నారు. ‘జోన్ వచ్చింది.. ఇక మా రైలు కష్టాలు ఎప్పుడు తీరుతాయి?’ అని నిత్యం ఈ మార్గంలో వెళ్లి వచ్చే ప్రయాణికులు అంటున్నారు. -
● సీటు కోసం సమరం..!
ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటలైందంటే చాలు.. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ రణరంగాన్ని తలపిస్తోంది. బస్సు ఎప్పుడు వస్తుందా..! అన్న నిరీక్షణ.. తీరా వచ్చాక.. సీటు దొరుకుతుందో లేదో.. అన్న ఉత్కంఠ ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ‘సీ్త్రశక్తి’ పథకం నేపథ్యంలో బస్సులన్నీ కిక్కిరిసిపోతుండగా.. సీటు దక్కించుకునేందుకు ప్రయాణికులు సర్వశక్తులూ ఒడ్డి సాగిస్తున్న కుస్తీలు అన్నీఇన్నీ కావు. బస్సు ఆగకుండానే లోపలికి చొరబడేందుకు వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. బస్సు లోపల ఇసుకవేస్తే రాలనంత జనం.. పొరపాటున సీటు దొరక్కపోతే డోర్ల వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిందే. బస్సులోకి ఎక్కే ఈ తోపులాటలో నెగ్గలేని వృద్ధులు, బలహీనులు చేసేది లేక తదుపరి బస్సు కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఒకవేళ తమ ఊరికి అదే ఆఖరి బస్సు అయితే మాత్రం, భయాన్ని గుండెల్లో దాచుకుని అపాయం అంచున వేలాడుతూ గమ్యం చేరుకోవాల్సిన దుస్థితి ఇక్కడ నిత్యకృత్యమైంది. – పార్వతీపురం రూరల్ -
ఘనంగా జెడ్పీ చైర్మన్ జన్మదిన వేడుకలు
● శుభాకాంక్షలు తెలియజేసిన జెడ్పీ అధికారులు, ప్రజాప్రతినిధులు విజయనగరం రూరల్: జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌కు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అలజంగి జోగారావు, శోభా హైమావతి, రాజాం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ తలే రాజేష్, అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ప్రసాదరావు, రాజాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇతర నియోజకవర్గ నాయకులు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
ఆశలు గల్లంతు..
● కళ్లముందే ఎండిపోతున్న పత్తి మొక్కలు ● లబోదిబోమంటున్న రైతులు ● ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న అన్నదాత..రామభద్రపురం: ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్న రైతులు ఆశలు అడియాసలయ్యాయి. నెలల తరబడి వర్షాల్లేకపోవడంతో కళ్లముందే పత్తి మొక్కలు ఎండిపోతున్నా.. ఏమీ చేయలేని దుస్థితిలో రైతులు తలలు పట్టుకుంటున్నారు. రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,204 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది 2,291 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. పత్తి సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తుండడంతో సాధారణ సాగు కంటే 87 హెక్టార్లలో సాగు పెరిగింది. ఇందులో ఒక్క రామభద్రపురం మండలంలోనే 1320 హెక్టార్లలో పత్తి సాగవుతోంది. అయితే రెండు నెలలుగా వర్షాల్లేకపోవడంతో పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి. మామూలుగా పత్తి పంటలో ఈ పాటికే ఒకసారి పత్తి తీస్తారు. అయితే పంట వేసి 90 రోజులవుతున్నా కిలో దిగుబడి కూడా రాలేదు. నాలుగు అడుగుల మేర పెరగాల్సిన మొక్కలు కనీసం అడుగు ఎత్తు కూడా పెరగలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
బాలల సంరక్షణే ధ్యేయం..
● జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందువిజయనగరం రూరల్: బాలల సంరక్షణ, పునరావాసం, సామాజిక పునః సమీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే జువైనెల్ జస్టిస్ (బాలల సంరక్షణ, రక్షణ) చట్టం – 2015 ప్రధాన ఉద్దేశమని విజయనగరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు అన్నారు. జువైనెల్ జస్టిస్ చట్టం వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హైకోర్టు, జువైనెల్ జస్టిస్ కమిటీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో ‘జువైనెల్ జస్టిస్ చట్టం – 2015: దశాబ్దపు అమలు – ముందడుగు’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సంప్రదింపుల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు మాట్లాడుతూ.. బాలల పునరావాసం కేవలం సంరక్షణ కేంద్రం నుంచి బయటకు తీసుకురావడంతోనే ముగియదని, కుటుంబం, విద్య, సమాజం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలతో వారిని తిరిగి అనుసంధానించడంతోనే సంపూర్ణ పునరావాసం సాధ్యమవుతుందన్నారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ లీసా గిల్, హైకోర్టు, జువైనెల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ చల్లా గుణరంజన్, ఏపీ జువైనెల్ జస్టిస్ కమిటీ సభ్యులు బి.దేవానంద్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
అదిగదిగో జిల్లా పరిషత్తు! సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్‌లను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జెడ్పీల స్థానంలో, కొత్తగా 28 జిల్లా ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26కు పెంచడంతో పార్వతీపురం మన్యం జిల్లా 15 మండలాలతో కొత్తగా ఆవిర్భవించిన విషయం విదితమే. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మరో రెండు జిల్లాలను పెంచడంతో ఆ సంఖ్య 28కి చేరింది. మన్యం జిల్లా విడిపోయినప్పటికీ.. జిల్లా పరిషత్తు పరంగా ఉమ్మడి విజయనగరంలోనే ఇప్పటి వరకూ కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం, సాలూరు, పార్వతీపురం జెడ్పీ సభ్యులు విజయనగరంలోనూ.. పాలకొండ సభ్యులు శ్రీకాకుళం జిల్లాలోనూ జెడ్పీ సమావేశాలకు హాజరవుతూ వస్తున్నారు. ఈ నెల 24వ తేదీతో ప్రస్తుత జెడ్పీ పాలక వర్గం పూర్తి కానుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రాతిపదికనే.. జిల్లా పరిషత్తులను కూడా విభజించింది. కొత్తగా పోస్టులు.. కొత్తగా జిల్లా పరిషత్ కార్యాలయం మన్యంలో ఏర్పడనుంది. ప్రతి జెడ్పీకి ఒక అడ్మినిస్ట్రేటివ్ అధిపతి ఉండాలి. ఆ మేరకు కొత్తగా జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసింది. మినిస్టీరియల్, ఇతర సహాయక సిబ్బందిని ఆయా జిల్లాల్లోని మండలాల సంఖ్య, పని భారం ఆధారంగా కొత్తగా ఏర్పడే 28 జెడ్పీలకు హేతుబద్ధీకరించి కేటాయిస్తారు. ఇందులో భాగంగా మన్యం జిల్లా పరిషత్ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాతే ఈ కొత్త జెడ్పీల ఏర్పాటు అమల్లోకి వస్తుంది. కొత్త జిల్లా ప్రజా పరిషత్‌ల ఏర్పాటు, పాలనాపరమైన బదిలీలు ఎలాంటి అవాంతరాలూ లేకుండా సాగేలా జిల్లా కలెక్టర్లు, ప్రస్తుత జెడ్పీ సీఈఓలు, ఎంపీపీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తాజా ఉత్తర్వుల్లో ఆదేశించారు. కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పడటం వల్ల పలు అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు విడుదలవుతాయని, దీనివల్ల జిల్లాకు సంబంధించి అనేక సమస్యలను విజయనగరంతో సంబంధం లేకుండా ఇక్కడే పరిష్కరించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, సాలూరు, మక్కువ, పాచిపెంట, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, గరుగుబిల్లి, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాలతో కొత్తగా జిల్లా పరిషత్తు ఏర్పడనుంది. ఈ మండలాల్లోని మండల ప్రజా పరిషత్తులు సైతం ఇక్కడి జెడ్పీ కిందకే వస్తాయి. సాలూరు నియోజక వర్గంలోని ఉన్న మెంటాడ మండలం విజయనగరంలోనే ఉండనుంది. ఇక మన్యం జిల్లా పరిషత్తు లాంఛనమే.. విజయనగరం నుంచి వేరు 15 మండలాలతో ఏర్పాటు. మెంటాడ విజయనగరంలోనే... ఈ నెల 24తో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గం పార్వతీపురం మన్యం జిల్లా స్వరూపం కొత్తగా జిల్లా పరిషత్తు ఏర్పడటం వల్ల జెడ్పీ చైర్మన్ పోస్టు అదనంగా రానుంది. దీనిపై అన్ని పార్టీల్లోనూ ఆశావాహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్ ఖరారు కాగానే.. ఆశావాహుల జాబితా మరింత పెరగనుంది. కూటమి పార్టీల్లోని టీడీపీతో పాటు, బీజేపీ, జనసేన కూడా ఈ పదవి తమకే దక్కాలని అందులోని నేతలు ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. -
పారదర్శకంగా టెండర్లు
పార్వతీపురం రూరల్: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసరాలను అందించేందుకు జీసీసీ సరుకుల టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ముగిసింది. గిరిజన సంక్షేమ విద్యాసంస్థలకు అవసరమైన సరుకుల సరఫరా కోసం పార్వతీపురం ఐటీడీఏలోని గిరిమిత్ర హాల్లో పీఓ ఆర్. వైశాలి, తదితర అధికారులు ఈ టెండర్ల ప్రక్రియను శనివారం పకడ్బందీగా నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు అందే సరుకుల్లో నాణ్యతతో పాటు, సరఫరాలో సమయపాలనకు పెద్దపీట వేశారు. ఈ ప్రక్రియలో సరఫరాదారులు సమర్పించిన పత్రాలు, కోట్ చేసిన ధరలు, సరుకుల నాణ్యతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా బేరీజు వేశారు. పోటీ ధరలకు, నిర్దేశిత స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న బిడ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. సరుకుల సరఫరాలో నాణ్యతా లోపాలున్నా, జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదని ఎంపికై న సరఫరాదారులకు అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు సీతంపేట: మండలంలోని కిట్టాలపాడు జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. తొత్తడి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై నిమ్మక పవన్, సునీత, అనూషా వస్తున్నారు. పత్తికగూడ మలుపు వద్దకు వచ్చేసరికి సీతంపేట నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆటోను తప్పించే క్రమంలో ఆటో అద్దం తగిలి కిందపడ్డారు. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదు వంగర: మండల పరిధి కింజంగి ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన ఉత్తరావెల్లి కిశోర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వి.ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ వజ్రగడ రామలక్ష్మి తన ఇంటి ఆవరణలో పూలు ఏరుతుండగా.. నిందితుడు ఆమెను కులం పేరుతో దూషించి, కొట్టినట్లు ఫిర్యాదు అందిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్కొత్తవలస: వివిధ దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ పరారీలో ఉన్న మండల కేంద్రం కుమ్మరవీధికి చెందిన గంగవరపు కేశవను సీఐ టి.వి.విజయకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం స్థానిక కొత్తవలస రైల్వేస్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..గతేడాది డిసెంబర్లో మంగళపాలెంలో గల శివాలయంలో.. ఈ ఏడాదిలో విశాఖపట్నం రోడ్డులో గల దుర్గాదేవి గుడిలోను.. అలాగే కుమ్మరి బంజిరీ కాలనీలో గల ఒక ఇంట్లో జరిగిన దొంగతనాల్లో కేశవ నిందితుడని చెప్పారు. అప్పటినుంచి ఆయన పరారీలో ఉండగా.. కొత్తవలస రైల్వేస్టేషన్ వద్ద అతడ్ని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై జోగారావు పాల్గొన్నారు. కలెక్టరు, జేసీలను వదిలేసి రిటైర్డ్ తహసీల్దార్‌పై చర్యలా?విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని మహారాజుపేట సర్వే నంబరు 569లోని భూ కేటాయింపు వ్యవహారంలో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ విమర్శించారు. ఇదే విషయమై ఆయన జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు చేసిన ఫిర్యాదుపై ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. భూ వర్గీకరణ మార్చే అధికారం తహసీల్దారుకు లేనప్పుడు..కలెక్టరు, జేసీ, ఆర్డీవోలను వదిలేసి రిటైర్డ్ తహసీల్దారు ప్రభాకరరావుకు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నగరపాలక సంస్థ రికార్డుల్లో ప్రైవేట్ ఎస్టేట్ అని, రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు చెరువు అని నమోదైన స్థలాన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏ విధంగా కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2022లో నిర్మాణం మొదలైనప్పడు మౌనంగా ఉండి, 2025లో ఫిర్యాదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు. నాటి కలెక్టరు లేఖలు, అధికారుల ఇన్స్పెక్షన్ నివేదికలు వెంటనే బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. -
మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసన
పార్వతీపురం రూరల్ : కలెక్టరేట్లో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో శనివారం ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా చైర్మన్ గొట్టాపు శ్రీరామమూర్తి నేతృత్వంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ’హ్యాండ్ టు హ్యాండ్’ కార్యక్రమం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలని కోరారు. ముఖ్యమంత్రితో జరగనున్న చర్చలు సఫలం కావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల వివరాలను పే స్లిప్‌లలో స్పష్టంగా చూపాలని కోరారు. ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయడంతో పాటు పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తగిన ప్రయోజనాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ అసోసియేట్ చైర్మన్ ఎం.శ్రీనివాసరావు, కో–చైర్మన్ ఆర్వీ రమణమూర్తి, కోశాధికారి పి.ఎస్.ఎల్.కుమార్ తో పాటు వివిధ శాఖల ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కోయంబత్తూరుకు మన్యం రైతులు
సీతంపేట: పసుపు పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు అనుసరిస్తున్న ఆధునిక సాగు పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఈ తరహా సాగు చేపట్టేందుకు వీలుగా ఇక్కడ నుంచి 40 మంది రైతులు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. వీరు వెళ్లిన బస్సును పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన రైతులు సాంప్రదాయ సాగు పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడి సాంకేతిక పద్ధతులు, పంట యాజమాన్య విధానాలు, ఎక్కువ దిగుబడులకు రైతులు చేస్తున్న కృషి, సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. సీతంపేట, భామిని, కొత్తూరు, సారవకోట, మెళియాపుట్టి, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట తదితర మండలాలకు చెందిన 40 మంది రైతులు వెళ్లారు. ఐటీడీఏ పీహెచ్ఓ ఎస్.వి.గణేష్, ఏఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఎస్సీ అభ్యర్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ పార్వతీపురం రూరల్ : జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా పలు శిక్షణా కార్యక్రమాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సొసైటీ ఈడీ జి.గోపి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆదేశాలతో ఇజ్రాయెల్‌లో ‘హోమ్ టేక్ కేర్ గివర్’ ఉద్యోగాలకు ఎంపిక చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 25–45 ఏళ్ల వయసుండి జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులని, వీరికి ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చి ఎంపిక చేస్తారని తెలిపారు. నెలకు సుమారు రూ.1,99,770 వేతనం ఉంటుందని, ఆసక్తి గలవారు సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీటితో పాటు పదో తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన యువతకు కిసాన్ డ్రోన్ ఆపరేటర్, సోలార్ పీవీ ఇన్స్టాలర్, ఈవీ మెయింటెనెన్స్, మొబైల్ రిపేరింగ్ తదితర ఉపాధి ఆధారిత కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులు //ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ // వెబ్సైట్లోగానీ, విజయనగరంలోని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలోగానీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులను విద్య, కుల, ఆధార్, రైస్‌కార్డు నకళ్లను జతచేసి స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపాలి. ఇతర వివరాల కోసం 9652600967, 9642460838 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. వినాయక మండపాలకు ఆన్లైన్లోనే అనుమతులు పార్వతీపురం రూరల్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండపాల ఏర్పాటును సులభతరం చేస్తూ పోలీస్ శాఖ ‘సింగిల్ విండో’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘గణేష్ ఉత్సవ్.నెట్’ వెబ్సైట్ ద్వారా ఒకే వేదికపై అనుమతులు పొందే వెసులుబాటు కల్పించినట్లు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు డీజీపీ ఆదేశాల మేరకు ఈ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. దరఖాస్తు ఇలా.. నిర్వాహకులు వెబ్సైట్లో తమ వివరాలు, విగ్రహం ఎత్తు, నిమజ్జన తేదీలను నమోదు చేయాలి. పోలీసుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ అవుతుంది. తనిఖీలకు వచ్చే అధికారుల కోసం దీనిని మండపం వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలి. భక్తిభావం వెల్లివిరియాలి రహదారులకు అడ్డంగా మండపాలు నిర్మించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని, డీజేలకు అనుమతి లేదని, సాధారణ స్పీకర్లను ఉద యం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే వినియోగించాలన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఇసుక బస్తాలు, నీరు, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, బలవంతపు చందాలు వసూలు చేసినా, అశ్లీల నృత్యాలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా చర్యలు తప్ప వని ఎస్పీ హెచ్చరించారు. రాత్రివేళల్లో నిర్వాహ కులు కాపలా ఉండటంతో పాటు, హుండీలను భద్రపరుచుకోవాలి. నిమజ్జన రూట్ మ్యాప్ ముందుగానే పోలీసులకు తెలిపి, వేడుకలు జరుపుకోవాలని సూచించారు. -
విద్యార్థిగా కలెక్టర్...!
● శివరాంపురం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ ● అధికారుల తీరుపై అసహనం సాలూరు: కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి విద్యార్థిగా మారి వారి బెంచీల్లో కూర్చొని పాఠాలను స్వయంగా ఆలకించారు. విద్యార్థులకు అందుతున్న విద్య నాణ్యత, బోధనా పద్ధతులను స్వయంగా పరిశీలించారు. వివరాల్లోకి వెళ్తే.. కలెక్టర్ ప్రభాకరరెడ్డి మండలంలోని శివరాంపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదిలోకి వెళ్లి సాధారణ విద్యార్థిలా బెంచీపై కూర్చొని మన్యం ఇంగ్లిష్, డిజిటల్ స్మార్ట్ తరగతి పాఠాలను ఆసక్తిగా విన్నారు. ఆంగ్ల భాషలో పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కిశోర బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై స్పష్టమైన అవగాహన కల్పించాలని హెచ్ఎం, ఉపాధ్యాయులకు సూచించారు. అధికారుల తీరుపై అసహనం శివరాంపురం గ్రామానికి సంబంధించి శాఖల వారీగా ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను అధికారులు వివరించలేకపోవడంపై కలెక్టర్ ప్రభాకరరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు అధికారుల వద్దే లేవంటే ఏం పని చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూన ముఖ్యంగా అధికారులు మనమిత్ర యాప్‌పై అవగాహన పెంపొందించుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట నియోజకవర్గ ప్రత్యేకాధికారి కె.రామచంద్రరావు, ఎంపీడీఓ పార్వతి, పలు శాఖల అధికారులు ఉన్నారు. -
విద్యార్థుల భవిష్యత్ మార్చేది ఉపాధ్యాయులే..
● పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ ● 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారంసీతంపేట: విద్యార్థుల భవిష్యత్‌ను చదువు ద్వారా తీర్చిదిద్ది, వారి జీవితాల్లో మార్పు తీసుకురాగలిగేది ఉపాధ్యాయులేనని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ, వారిలో మంచి విలువలు, క్రమశిక్షణా జ్ఞానాన్ని పెంపొందించాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఐటీడీఏ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ప్రస్తుతకాలంలో సాంకేతిక రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులను ఉపాధ్యాయులు నిరంతరం అవగాహన చేసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన బోధనా పద్ధతులను అందిపుచ్చుకుని విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించాలని తెలిపారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఏపీఓ జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, ఈఈ రమాదేవి, ఏఓ సునీల్, జీసీడీఓ రాములమ్మ, సీఎంఓ చిరంజీవులు, ఏటీడబ్ల్యూఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి సందడి మరువకముందే..
● రోడ్డు ప్రమాదంలో నవ వరుడి మృతి ● పెళ్లింట తీవ్ర విషాదం ● కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులుసంతకవిటి: కోటి కలలతో, బంధుమిత్రుల సందడి మధ్య నూతన జీవితంలోకి అడుగు పెట్టిన వారం రోజుల్లోనే.. వరుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కోసూరు నారాయణరావుకు(పవన్) (20) అదే గ్రామానికి చెందిన హేమలతతో ఆగస్టు 30న వివాహం జరిగింది. తమ బంధువుల ఇంటిలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు నారాయణరావు తన స్నేహితుడు అంబటి జగదీష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై పొందూరు మండలం రాపాక గ్రామం వెళ్లాడు. అక్కడ నుంచి చిలకపాలెంలో ఉన్న తన స్నేహితుడ్ని కలవడానికి వెళ్లి, తిరిగి వస్తుండగా పొందూరు మండలం లోలుగు వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణరావు అక్కడికక్కడే మృతి చెందగా.. జగదీష్‌కు గాయాలయ్యాయి. దీంతో పెళ్లి ఇంట విషాధ వాతావరణం నెలకొంది. కాళ్ల పారాణి ఆరక ముందే భర్త దూరమవడంతో నవ వధువు, కుటుంబ సభ్యులు కన్నీరమున్నీరుగా విలపిస్తున్నారు.


