Gossips
-
హీరోయిన్ మీనాక్షి 'అద్దె' గోల.. రూమర్సా? నిజమా?
ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండింగ్ హీరోయిన్ అంటే మీనాక్షి చౌదరినే. ఎందుకంటే గత మూడు నెలల్లో ఈమె చేసిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరొకటి యావరేజ్ అనిపించుకుంది. మరో రెండు ఫ్లాప్ అయ్యాయి. మూవీస్ రిజల్ట్ సంగతి పక్కనబెడితే ఈమె యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీకాదు మరో విషయమై మీనాక్షి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)తెలుగు సినిమాల్లో చాలావరకు ఉత్తరాది హీరోయిన్లే నటిస్తుంటారు. షూటింగ్ కోసమని హైదరాబాద్ వస్తే వీళ్ల కోసమని నిర్మాతలు పెట్టే ఖర్చు కూడా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో వరస అవకాశాలు అందుకుంటున్న మీనాక్షి.. రీసెంట్‌గానే హైదరాబాద్‌లో కొత్తగా ఓ ఫ్లాట్ కొనుక్కుందట. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినన్నీ రోజులు.. రోజుకు రూ.18 వేలు.. రెంట్లా డిమాండ్ చేస్తోందట.సొంతింట్లో ఉన్నాసరే నిర్మాతల దగ్గర నుంచి మీనాక్షి చౌదరి డబ్బులు డిమాండ్ చేస్తోందనే రూమర్స్ అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరోవైపు మీనాక్షి వరకు కొన్ని అవకాశాలు పక్కకెళ్లిపోతున్నాయట. త్వరలో 'విరూపాక్ష' దర్శకుడితో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా తొలుత మీనాక్షినే అనుకున్నారట. ఇప్పుడు ఆ ఛాన్స్ వేరే వాళ్లకు వెళ్లిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ రెండు విషయాలకు సంబంధం ఏమైనా ఉందా? లేదే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది!(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు) -
కంగువ నష్టాలు.. సూర్య నుంచి నిర్మాతకు బిగ్ ఆఫర్
సినిమా రంగంలో చిత్రాలను నిర్మించి నష్టాల పాలైన నిర్మాతలే ఎక్కువగా ఉంటారనేది నిజమని చెప్పవచ్చు. ఇందులో లాభాలు పొందేది తక్కువ మందే. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తేడా ఉండదు. కానీ, భారీ చిత్రాలతో ఎక్కువ పొగొట్టుకుంటారు. ఈ క్రమంలో నిర్మాతల కష్టాల గురించి ఆలోచించే నటీనటులు చాలా తక్కువ. నటించామా.. పారితోషికం అందిందా అన్నట్లు చాలా మంది తీరు ఉంటుంది. అయితే నటుడు సూర్యలాంటి వారు అందుకు చాలా భిన్నంగా ఉంటారు. సూర్య నిర్మాత కూడా కావడంతో తన నిర్మాతలపై కొంచెం ఎక్కువ అభిమానం చూపిస్తారనే చెప్పాలి. అందుకు చిన్న ఉదాహరణ ఆయన ఇటీవల నటించిన చిత్రం కంగువనే కారణం. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా భారీ ఎత్తున నిర్మించారు. కోలీవుడ్‌లో చాలా కాలం తరువాత 3డీ ఫార్మాట్లో రూపొందిన చిత్రం ఇది. నటుడు సూర్య ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ప్రాణం పోశారనే చెప్పాలి. అయితే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదనే విమర్శలను మూట కట్టుకుంది. సుమారు వెయ్యేళ్ల క్రితం జరిగే కథను ఈ కాలానికి ముడిపెట్టి రూపొందించడంతో ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయారేమో. ఏదైమైనా ఈ చిత్రం విషయంలో నటుడు సూర్య ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం.కంగువ చిత్రం నష్టాన్ని భర్తీ చేయడానికి నటుడు సూర్య నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజాకు మరో చిత్రం చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కంగువ చిత్రం నిర్మాత జ్ఞానవేల్ కోసమైనా బాగా ఆడాలని నటుడు సూర్య ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపైనే చెప్పారన్నది గమనార్హం. ఆయన స్టూడియో గ్రీన్ సంస్థలో మరో చిత్రం చేయడానికి మంచి కథ కోసం చూస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ప్రస్తుతం ఆర్జే.బాలాజీ దర్శకత్వంలో తన 45వ చిత్రాన్ని చేస్తున్నారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేస్తారని సమాచారం. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాకు చిత్రం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ త్వరలో రానున్నట్లు సమాచారం. -
విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!
బిగ్‌బాస్ షో ప్రారంభమైన ప్రతిసారి జనాల్లో మెదిలే ప్రశ్న.. ఈసారైనా లేడీ కంటెస్టెంట్ గెలుస్తారా? అని! ఈ సీజన్లోనూ ఆ చర్చ జరిగింది. భారీ ఫ్యాన్ బేస్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన విష్ణుప్రియకు ట్రోఫీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉండేది. కానీ తన ఆటను చెడగొట్టుకోవడానికి ఎవరూ అక్కర్లేదు, తాను చాలు అన్నట్లే ప్రవర్తించింది.స్వచ్ఛతకు మారుపేరు విష్ణుగేమ్పై కాకుండా పృథ్వీపై ఫోకస్ చేసింది. తనకంట కూడా అతడే ఎక్కువ అని బాహాటంగానే ప్రకటించింది. భూతద్దం వేసి వెతికినా ఎక్కడా తనలో గెలవాలన్న కసి కనిపించలేదు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక ఆటలో యాక్టివ్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఆమె నిర్మొహమాటంగా, నిజాయితీగా వ్యవహరించే తీరు మాత్రం జనాలకు బాగా నచ్చేసింది.విన్నర్ కంటే ఎక్కువ సంపాదనకానీ టైటిల్ గెలవాలంటే ఆ ఒక్కటే ఉంటే సరిపోదు కదా! లేడీ విన్నర్ అవాలనుందన్న విష్ణు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఫలితంగా పద్నాలుగోవారం ఎలిమినేట్ అయింది. అయితే విన్నర్ కంటే ఎక్కువ సంపాదించేసింది. వారానికి సుమారు రూ.4 లక్షల చొప్పున పారితోషికం తీసుకుంటున్న ఈమె పద్నాలుగువారాలకు గానూ రూ.56 లక్షలు వెనకేసిందట! అంటే విన్నర్ ప్రైజ్‌మనీ కంటే కూడా విష్ణు ఎక్కువే సంపాదించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!
బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ చివరికొచ్చేసింది. తర్వాత వారంలో ఫినాలే జరగబోతుంది. దీంతో ఈ వీకెండ్ జరగబోయే ఎలిమినేషన్ చివరిది. దీంతో ఎవరు బయటకెళ్లిపోతారా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులోని పరిస్థితుల ప్రకారం ఇద్దరమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లలో ఒకరైనా స్టార్ కంటెస్టెంట్ ఈసారి ఎగ్జిట్ పక్కా అని అంటున్నారు.ఈ వారమంతా హౌసులో విభిన్న రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు వచ్చి, హౌసులోని సభ్యులతో కాసేపు ముచ్చట్లు పెట్టి వెళ్లిపోయారు. ఈ వారం అవినాష్ తప్పితే మిగిలిన ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతమ్ ఏకంగా టైటిల్ రేసులో ఉన్నారు కాబట్టి వీళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ప్రేరణ కూడా టాప్-5 రేసులో ఉంది. దీంతో ఈమె కూడా బయటకెళ్లకపోవచ్చు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?)వీళ్లు కాకుండా అంటే నబీల్, విష్ణుప్రియ, రోహిణి ఉంటారు. కొన్నాళ్ల ముందు వరకు చాలా బ్యాలెన్స్‌గా గేమ్ ఆడుతూ వచ్చిన నబీల్.. ఈ మధ్య కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయితేనేం టాప్-5కి నబీల్ అర్హుడే అనిపిస్తుంది. ఓటింగ్ పరంగానూ ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే చివరి రెండు స్థానాల్లో రోహిణి, విష్ణుప్రియ ఉన్నారు.పృథ్వీతో లవ్వాట తప్పితే విష్ణుప్రియ.. ఈ సీజన్ అంతా అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తోంది. ఈమెతో పోలిస్తే ఎంటర్టైన్, గేమ్స్ పరంగా రోహిణి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఓటింగ్ పరంగా చూసుకుంటే రోహిణి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. అదే గేమ్ లెక్కల బయటకు తీస్తే మాత్రం విష్ణుప్రియ.. ఈ వారం ఎగ్జిట్ అయిపోవడం గ్యారంటీ. లేదంటే బిగ్‌బాస్.. గతవారం తేజ, పృథ్వీని పంపినట్లు డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేసాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?) -
చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?
సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు కూడా.. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈమేరకు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.‘రాజాసాబ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2025 జనవరి సమయానికి ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. కానీ, ఈ సినిమాలో ఎక్కువ సీన్స్‌కు VFX వర్క్‌తో లింక్ అయి ఉన్నాయట. దీంతో ఏప్రిల్ 10 నాటికి కూడా ఆ పనులు పూర్తి కావడం కాస్త కష్టమేనని తెలుస్తోంది. సమ్మర్‌కు విడుదల అవుతుందని అశించిన ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది. అయితే, సంక్రాంతి కానుకగా ఒక సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటూ గేమ్ ఛేంజర్‌కు ఛాన్స్ ఇచ్చారు. అయితే, విశ్వంభర ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం వారు ప్రకటించలేదు. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుందని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. అదే డేట్‌కు ప్రభాస్ రాజాసాబ్ వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ, విశ్వంభర సినిమాను ప్రభాస్ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో మెగాస్టార్‌కు పోటీగా ఆయన ఎట్టి పరిస్థితిల్లో బరిలోకి దిగడని తెలుస్తోంది. ఈ కారణం వల్ల రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చని కూడా సమాచారం. ప్రభాస్ లిస్ట్‌లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. కె.జి.ఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నారు. 'సలార్2'తో ఈ ప్రయాణం మొదలవుతోందని ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఆ సినిమాలు రానున్నట్లు కూడా తెలిపింది. ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమాతో పాటు ప్రభాస్ - లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించాలని ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉన్న విషయం తెలిసిందే. -
టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్!
హీరోయిన్ ప్రగ్య నగ్ర(#pragyanagra) పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు చెందినదిగా పేర్కొంటున్న ప్రైవేట్ వీడియో ఒకటి ఆన్లైన్లో లీకైంది. అందులో ఆమె ప్రియుడితో ఏకాంతంగా ఉంది. ప్రగ్య పేరు చెడగొట్టేందుకు ఎవరో దుండగులు డీప్ ఫేక్ సాయంతో ఈ వీడియో సృష్టించారని అభిమానులు అంటున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కాగా ప్రగ్య నగ్ర.. వరలరు ముఖ్యం అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. నదికలిళ్ సుందరి యమున అనే మలయాళ మూవీలోనూ నటించింది. లగ్గం సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: గౌతమ్‌ను ఈడ్చుకెళ్లిన నిఖిల్.. కావాలని కొడతావంటూ కామెంట్స్ -
'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!
అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాకు తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయనేది మరికాసేపట్లో తెలుస్తుంది. ఎంతొస్తుందనే విషయం పక్కనబెడితే ఇప్పుడు బాలీవుడ్లో బన్నీ తనదైన బ్రాండ్ రికార్డ్ సెట్ చేశాడు. తొలిరోజు కలెక్షన్స్‌తో ఏకంగా దిగ్గజ షారుఖ్ ఖాన్నే అధిగమించేశాడట. నార్త్ అంతా ఇప్పుడు ఇదే టాక్.(ఇదీ చదవండి: పుష్ప 2 'జాతర' సాంగ్ రిలీజ్ చేశారు!)తెలుగుతో పోలిస్తే 'పుష్ప 2'కి ఉత్తరాదిలో బీభత్సమైన హైప్ ఉంది. పాట్నాలో ఈవెంట్ జరగ్గా.. దానికి వచ్చిన లక్షలాది జనమే ఇందుకు బెస్ట్ ఉదాహరణ. అందుకు తగ్గట్లే నార్త్‌లో తొలిరోజు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అలా ఏకంగా హిందీ వెర్షన్‌కి తొలిరోజు రూ.67 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయట.గతంలో షారుక్ 'జవాన్' మూవీకి రూ.64 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని దాటేసిన అల్లు అర్జున్.. బాలీవుడ్లో తన జెండాని మరింత బలంగా పాతేశాడు. ఓ రకంగా చెప్పాలంటే బాలీవుడ్‌ని ఇకపై బన్నీవుడ్ అని పిలొచ్చేమో! తొలిరోజే ఈ రేంజులో ఉందంటే.. వీకెండ్ అయ్యేసరికి తెలుగు సంగతి పక్కనబెడితే హిందీలో సగం రికార్డులు 'పుష్ప 2' దెబ్బకు గల్లంతవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు) -
'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?
మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. హైప్ అయితే గట్టిగానే ఉంది. మరోవైపు టికెట్ రేట్ల గురించి కాస్తంత విమర్శలు వచ్చాయి గానీ ఆ ప్రభావం, బుకింగ్స్‌పై మాత్రం కనిపించట్లేదు. తొలి భాగం తీసేటప్పుడు ఓ తెలుగు సినిమాగానే రిలీజ్ చేశారు. కానీ తర్వాత తర్వాత నార్త్‌లోనూ దుమ్మురేపింది. దీంతో అంచనాలు, బడ్జెట్, మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు నటీనటులు పారితోషికాలు కూడా గట్టిగానే ఉన్నాయండోయ్. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు?'పుష్ప' తొలి పార్ట్ రిలీజ్ ముందు వరకు బన్నీ అంటే తెలుగు రాష్ట్రాలు, మహా అయితే కేరళ వరకు తెలుసేమో! కానీ ఇది సృష్టించిన ప్రభంజనం దెబ్బకు ఉత్తరాదిలోనూ బన్నీ పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత 'పుష్ప' మూవీకిగానూ జాతీయ అవార్డ్.. ఇలా రేంజ్ పెరుగుతూనే పోయింది. దీంతో సీక్వెల్ విషయంలో రెమ్యునరేషన్ బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు. కట్ చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటేసింది. అలా రూ.270-80 కోట్ల మొత్తం బన్నీ పారితోషికంగా అందుకున్నాడట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)బన్నీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ది హయ్యస్ట్. తొలి పార్ట్ కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు.. సీక్వెల్‌కి వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్స్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు. అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా రూ.100 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ రష్మికకు రూ.10 కోట్లు, ఫహాద్ ఫాజిల్‌కి రూ.8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి రూ.5 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట.వీళ్లు కాకుండా సినిమాలోని ఇతర కీలక పాత్రలు చేసిన జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే రూ.600 కోట్ల మేర మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో సగం బడ్జెట్, పారితోషికాలకే సరిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే అంతమంది స్టార్స్ పనిచేశారు మరి!(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్) -
'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?
మరో ఒకటి రెండు రోజుల్లో 'పుష్ప 2' థియేటర్లలోకి రాబోతుంది. రిలీజయ్యేంత వరకు అంతా టెన్షన్ టెన్షనే. ఫైనల్ మిక్స్ ఇప్పుడు పూర్తయినట్లు చెప్పారు. కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎంతలా రూమర్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ విషయమై షాకింగ్ విషయం ఒకటి వైరల్ అవుతోంది.'పుష్ప' సినిమాలకు మ్యూజిక్ అంతా దేవిశ్రీ ప్రసాదే. అయితే పార్ట్-2 విషయంలో టైమ్ దగ్గర పడుతుండేసరికి తమన్, అజనీష్ లోక్‌నాథ్, శామ్ సీఎస్ తదితరులు కూడా పనిచేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం బాలకృష్ణ 'డాకు మహరాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన తమన్.. తాను కూడా 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కానీ ఇప్పుడు 'పుష్ప 2' ఫైనల్ మిక్సింగ్ అంతా పూర్తయిన తర్వతా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. సినిమా కోసం కేవలం దేవి, శామ్ సీఎస్ మాత్రమే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని, మిగిలిన వాళ్లిచ్చిన ఔట్పుట్ ఉపయోగించుకోలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎందుకంటే సినిమా టైటిల్ కార్డ్స్‌లో పేర్లు పడతాయిగా!హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దాదాపు అందరూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించే ప్రస్తావించారు తప్పితే మరో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడొస్తున్న రూమర్స్ చూస్తే బహుశా నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
కోడలు శోభితకి నాగార్జున ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా?
అక్కినేని వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రెండు రోజుల క్రితం మంగళస్నానాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలని స్వయంగా శోభితనే ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పెళ్లి కోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అదే టైంలో కాబోయే కోడలికి అక్కినేని ఫ్యామిలీ ఇవ్వబోయే బహుమతుల ఇవేనంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)నాగచైతన్య-శోభిత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 4న అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహం జరగనుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు రాజమౌళి లాంటి అతికొద్ది మందే హాజరుకానున్నారని టాక్.రీసెంట్గా నాగార్జున.. రూ.2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు. అయితే ఇది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే కొన్నారనే అనుకుంటున్నారు. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ బహుమతిగా ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ధనుష్‌తో వివాదం.. విఘ్నేశ్ శివన్ మిస్సింగ్!) -
ఓటీటీలో 'అమరన్' స్ట్రీమింగ్ తేదీని లాక్ చేశారా..?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’. థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్టింట ఒక వార్త ట్రెండ్ అవుతుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్,క సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే, అమరన్ మాత్రం స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు.భారీ అంచనాల మధ్య అక్టోబర్ 31న విడుదలై అమరన్ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా విడుదలై ఇప్పటికే నాలుగు వారాలు దాటింది అయనప్పటికీ కలెక్షన్స్ పరంగా కొన్ని చోట్ల రానిస్తుంది. దీంతో ఓటీటీ విషయంలో ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 5న నెట్‌ప్లిక్స్‌లో అమరన్ విడుదల కానుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఇదే తేదీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివకార్తికేయన్ కెరీర్లో టాప్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా అమరన్ నిలిచింది. -
హైదరాబాద్‌లోనే 'పుష్ప 2' ఈవెంట్.. కానీ ప్లాన్ ఛేంజ్!
పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి.. ఇలా పాన్ ఇండియా సినిమాకు తగ్గట్లే దేశమంతా 'పుష్ప 2' టీమ్ తెగ తిరిగేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారా అనేది కాస్త సందేహంగా అనిపించింది. అయితే ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ పడిందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఈవెంట్ నిర్వహిస్తున్నప్పటికీ ప్లాన్‌లో చిన్న మార్పు జరిగినట్లు సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)డిసెంబరు 5న థియేటర్లలో రిలీజయ్యే 'పుష్ప 2'కి కావాల్సినంత బజ్ ఏర్పడింది. అయినా సరే టీమ్‌తో కలిసి దేశమంతా చుట్టేస్తున్న అల్లు అర్జున్.. హైప్‌ని ఇంకా పెంచేస్తున్నాడు. గతంలో 'దేవర' విషయంలో గందరగోళం జరిగిన దృష్ట్యా.. 'పుష్ప 2' హైదరాబాద్ ఈవెంట్‌కి అనుమతిస్తారా అనేది డౌట్‌గానే ఉండేది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉండొచ్చు అన్నారు. కానీ ఇది ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మారిందట.టీమ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇదే వేదిక ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
'పుష్ప 2' నిడివి లాక్.. ఏకంగా అన్ని గంటలా?!
'పుష్ప 2' మరో పదిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. చివరివరకు షూటింగ్ బిజీ నడుస్తూనే ఉంది. ఇది ఇప్పుడు పూర్తయిందని తెలుస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రన్ టైమ్ (నిడివి) లాక్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ గీత రచయిత కన్నుమూత)'పుష్ప' తొలి భాగం 2 గంటల 59 నిమిషాల నిడివి. ఇప్పుడు రెండో భాగాన్ని అంతకు మించి నిడివితో రిలీజ్ చేయబోతున్నారు. ఏకంగా 3 గంటల 21 నిమిషాల నిడివి ఉండబోతుందని తెలుస్తోంది. కంటెంట్ ఉంటే ఈ రన్ టైమ్ పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే ఇంతే నిడివితో తీసిన 'యానిమల్'.. ఏ రేంజ్ బీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పుడు 'పుష్ప 2' కూడా భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనమాట. ఇప్పటికే సెన్సార్ పూర్తవ్వాలి. బహుశా ఒకటి రెండు రోజుల్లో దాన్ని కూడా అయిపోగొట్టేస్తారేమో చూడాలి. ఇదిలా ఉండగా డిసెంబరు 5న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. దక్షిణాదిలో పక్కనబెడితే ఉత్తరాదిలో మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిందని టాక్.(ఇదీ చదవండి: శివంగి మళ్లీ గెలుపు.. బిగ్‌బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?) -
స్ట్రాంగ్ ఉమెన్.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్!
యష్మి గౌడ.. స్ట్రాంగ్ ఉమెన్, టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్లో ఉండేది యష్మి ఆట. తను టాస్క్‌లో దిగితే ఎలాగైనా గెలవాల్సిందే అన్నంత కసిగా ఆడేది. ఆడపులి అన్న సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న సోనియాకే చుక్కలు చూపించింది. తనలో ఫైర్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కానీ తర్వాతి వారాల్లో యష్మి ఆట గాడితప్పింది.సంచాలక్‌గా వరస్ట్ప్లేయర్గా బెస్ట్ అనిపించుకున్నా సంచాలక్‌గా వరస్ట్ గేమ్స్ ఆడింది. ఎప్పుడైతే నిఖిల్‌పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టిందో అప్పటినుంచి తన డౌన్‌ఫాల్ మొదలైంది. అతడిని ఎవరైనా నామినేట్ చేసినా ఈవిడే తెగ ఫీలైపోయేది. అతడితో డ్యాన్స్ చేయడం కోసం విష్ణుప్రియతో విపరీతంగా గొడవపడింది.నిఖిల్ చుట్టూ గేమ్తన కోసం గేమ్ ఆడటం మానేసి ఎవరికోసమో పాకరిల్లడమేంటని ఫ్యాన్స్ సైతం హర్టయ్యారు. ఫ్రెండ్‌లా అయినా ఉండరా అంటూ అతడి వెంట పడ్డ యష్మి ఈ వారం నామినేషన్లో మాత్రం అతడిపై ఏ ఫీలింగ్స్ లేవని ప్లేటు తిప్పేయడం మరింత షాక్‌కు గురిచేసింది. ఇలా మాట మార్చడాల వల్ల ఆమె తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. పారితోషికం ఎంత?చివరకు తన ఏడుపు కూడా ఫేక్ అని జనాలు ముద్ర వేసే స్థాయికి దిగజారిపోయింది. ఫైనల్‌గా ఈ వారం ఎలిమినేట్ అయింది. ఇకపోతే యష్మి.. ఒక్కవారానికిగానూ రూ.2.50 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. 12 వారాలకుగానూ ఆమె రూ.30 లక్షలు వెనకేసిందన్నమాట!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రెమ్యునరేషన్ పెంపు.. అంత పిచ్చోడిని కాదన్న హీరో!
సినిమా హిట్టయిందంటే చాలు చాలామంది రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు రూ.50 కోట్లు పెట్టి తీసిన స్త్రీ 2 సినిమాతో రూ.700 కోట్లు సాధించాడు. ఇంతటి ఘన విజయం తర్వాత ఆ హీరో కూడా రేటు పెంచేశాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందుకుంటున్న పారితోషికానికి అదనంగా మరో రూ.5 కోట్లు అడుగుతున్నాడట! అంత తెలివితక్కువవాడిని కాదుఈ పుకార్లపై రాజ్‌కుమార్ స్పందించాడు. నా నిర్మాతలను కాల్చుకుతినేంత తెలివితక్కువవాడిని కాదు. బ్లాక్‌బస్టర్ సినిమా చేసినంతమాత్రాన నేనేమీ మారిపోను. డబ్బు కన్నా నాకు ప్యాషనే ముఖ్యం. ఛాలెంజ్, సర్ప్రైజింగ్ రోల్స్ చేస్తూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే స్త్రీ 2 సినిమాకుగానూ రాజ్‌కుమార్ రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమా..స్త్రీ 2 విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన హిట్ మూవీ స్త్రీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రం ఆగస్టు 15న విడుదలవగా.. ప్రపంచవ్యాప్తంగా వందలకోట్లు వసూలు చేసింది. స్త్రీ 2 అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చదవండి: వైల్డ్‌కార్డ్ విన్నరేంటి? ఇది అధర్మం కాదా?: అభయ్ నవీన్ -
ఓటీటీలో 'కంగువా' స్ట్రీమింగ్ అప్డేట్
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. దీంతో సూర్య కెరీర్లో దారుణమైన నష్టాలను ఈ చిత్ర నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ఎదుర్కోనున్నారు. కంగువా సినిమా ఓటీటీ రైట్స్‌ను అత్యధిక ధరకు అమెజాన్ దక్కించుకుంది. దీంతో ఒక రకంగా చిత్ర నిర్మాతలను ఈ ఓటీటీ సంస్థే కాపాడినట్లు అయింది.కంగువా ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 13న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అయితే, అమెజాన్ ప్రైమ్ మాత్రం రూ. 100 కోట్లకు కంగువా రైట్స్ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఉంది.కంగువా సినిమా ప్రారంభంలో 30 నిమిషాల పాటు చాలా బోరింగ్‌గా ఉందని ప్రచారం రావడంతో మూవీ నుంచి 12 నిమిషాల పాటు కొన్ని సీన్లు తొలగించారు. జ్యోతిక కూడా సినిమాపై ఇదే విమర్శ చేసింది. సూర్య,బాబీ డియోల్,దిశా పటాని నటించిన ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహించారు. -
ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమా!
దుల్కర్ సల్మాన్.. పేరుకే మలయాళ హీరో కానీ తెలుగు హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టాడు. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో గుర్తింపు రాగా.. దీపావళికి రిలీజైన 'లక్కీ భాస్కర్'.. సక్సెస్‌తో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించి పెట్టింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో పలుచోట్ల ఆడుతోంది. ఇదలా ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సుకుమార్ ఇంట్లో పనిమనిషికి ప్రభుత్వం ఉద్యోగం)దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన 'లక్కీ భాస్కర్'. 1990ల్లో జరిగిన బ్యాంక్ స్కామ్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. 'సార్' చిత్రంతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి.. ఈసారి బ్యాంక్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రిలీజ్‌కి ముందే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది.ఇకపోతే 'లక్కీ భాస్కర్' ఓటీటీ డీల్‌ని నెట్‌ఫ్లిక్స్ నాలుగు వారాల కోసమని మాట్లాడుకుందట. అలా అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. నవంబర్ 30న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దాదాపు ఇది కన్ఫర్మ్ అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనితో పాటే థియేటర్లలో రిలీజైన 'క', 'అమరన్' కూడా త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్) -
బిగ్‌బాస్: యష్మి ఎలిమినేట్!
బిగ్‌బాస్ షో నుంచి మరొకరు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. ఈ వారం ప్రేరణ, పృథ్వీ, యష్మి, నిఖిల్, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్ ఎప్పటిలాగే ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో నబీల్ ఉన్నాడు. ప్రేరణ, పృథ్వీ, యష్మి చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ వారం పృథ్వీ, యష్మిలలో ఒకరు వెళ్లిపోతారనే టాక్ నడిచింది. అనుకున్నట్లుగానే యష్మి ఎలిమినేట్ అయిందట! సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా యష్మిని ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. టాస్కులు ఆడేందుకు యష్మి బాగానే కష్టపడింది. కానీ సంచాలక్‌గా ఉన్నప్పుడే లేనిపోని తప్పులన్నీ చేస్తుంటుంది. సంచాలక్ అంటే అంపైర్ తప్ప ఆటగాడు కాదని ఎన్నటికీ తెలుసుకోలేని యష్మి నిన్నటి గేమ్‌లో కూడా రోహిణి కుండలో ఇసుక నింపుతూ పృథ్వీకి సపోర్ట్ చేసింది. ఈ టాస్క్ వల్ల యష్మిపై మరింత నెగెటివిటీ ఏర్పడింది. ఫలితంగా దమ్మున్న కంటెస్టెంట్ బయటకు రాక తప్పలేదన్నమాట!చదవండి: గతేడాదే రోహిణి కాలికి ఆపరేషన్.. ఇప్పుడదే కాలితో ఆ ఇద్దరి అహాన్ని తొక్కిపడేసింది! -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అలియా భట్' యాక్షన్ మూవీ
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలోకి రానుంది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపింది. అంకుర్ పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది. -
టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!
టీమిండియా స్పిన్నర్ చాహల్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన బౌలింగ్, ఫన్ మూమెంట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అటు ఐపీఎల్‌లోనూ చాలామంది స్టార్ క్రికెటర్లతో ఇతడికి మంచి బాండింగ్ ఉంది. కొన్నేళ్ల క్రితం ధనశ్రీ వర్మ అనే యూట్యూబర్‌ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారబోతుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌లోనూ ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈమె తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు.చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. డ్యాన్స్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా డ్యాన్స్ కచ్చితంగా రావాల్సిన హీరోయిన్ పాత్ర ఉంది. దాని కోసమే ధనశ్రీని అడగ్గా.. ఆమె ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర జరిగినట్లు సమాచారం. ఏదేమైనా టీమిండియా క్రికెటర్ భార్య.. టాలీవుడ్లో హీరోయిన్ అంటే వినడానికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా!(ఇదీ చదవండి: మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ కొడుకు) -
పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్? అంతలోనే ట్విస్ట్
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ సంపూర్ణమైందన్నాడు కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌస్‌లో వచ్చేవాళ్లు అయిపోయారు కానీ స్టేజీపైకి వచ్చి మాట్లాడేవాళ్లు ఇంకా మిగిలే ఉన్నారు. ఈ రోజు కంటెస్టెంట్ల ఇంటిసభ్యులతో పాటు స్నేహితులు కూడా వచ్చి విజయం నీదేనంటూ ధైర్యం చెప్పనున్నారు.పృథ్వీ సేఫ్కానీ ఈపాటికే ఆ పదిమందిలో ఒకరి ఎలిమినేషన్ కన్ఫామ్ అయిపోయింది. ఈ వారం అవినాష్, తేజ, గౌతమ్, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ వెళ్లిపోయే సూచనలున్నాయి, జంట పక్షులు విడిపోవడానికి సమయం ఆసన్నమైందని ఊరించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతెందుకు సండేవరకు ఆగకుండా నేటి ఎపిసోడ్‌లోనే పృథ్వీ సేవ్ అయ్యాడట!ఎంటర్టైనర్ గుడ్బైఅంటే తన ఓటు బ్యాంక్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలినవారిలో అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన ఇతడు నామినేషన్స్ అంటేనే జంకాడు. చివరకు అతడి భయమే నిజమైంది. గేమ్ ఆడి మెగా చీఫ్ అయినప్పటికీ ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేందుకే మొగ్గుచూపారు. ఈ వారం ఎంటర్టైనర్ను ఎలిమినేట్ చేశారు.నబీల్ వల్ల బతికిపోయిన అవినాష్కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు. చివర్లో తేజ, అవినాష్ ఇద్దరూ మిగిలారు. నబీల్‌తో ఎవిక్షన్ షీల్డ్ బలవంతంగా వాడేలా చేశారు. దీంతో అతడు అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడటంతో అతడు సేవ్ అయిపోయాడట. అలా ఈ వారం నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'పుష్ప' కోసం శ్రీలీల రెమ్యునరేషన్.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..!
పుష్ప చిత్రంలో శ్రీలీల భాగమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. డ్యాన్స్ విషయంలో అల్లు అర్జున్, శ్రీలీల.. ఇద్దరూ ఏమాత్రం తగ్గరు. అలాంటిది పుష్ప కోసం ఒక సాంగ్‌లో కనిపిస్తే.. ఆ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని ఉండదు. 'పుష్ప2' చిత్రంలో 'కిస్సిక్..' అంటూ సాగే ఒక పాటలో ఈ ఇద్దరి డ్యాన్స్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.శ్రీలీల రెమ్యునరేషన్పుష్ప చిత్రంలో 'ఊ అంటామా మావ.. ఊ ఊ అంటావా' అని సమంత ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండో భాగంలో కూడా అదే రేంజ్ కొనసాగాలంటే సరైన హీరోయిన్ కావాల్సిందే. అందుకే శ్రీలీలను మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. అయితే, పుష్ప2 స్పెషల్ సాంగ్ కోసం సుమారు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ శ్రీలీల తీసుకుందట. ఈ పాట కోసం 5రోజులు ఆమె కేటాయించారని టాక్. సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన ఐటమ్ సాంగ్‌లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు 'పుష్ప2'లోనూ అదిరిపోయేలా 'కిస్సిక్..' ఐటమ్ సాంగ్‌ను మేకర్స్ సిద్ధం చేశారని తెలుస్తోంది.ఒక సినిమాకు తీసుకునేంత రెమ్యునరేషన్ అడిగిన శ్రద్ధా కపూర్పుష్ప-2 ఐటెం సాంగ్ కోసం తొలుత శ్రీలీలను మేకర్స్ ఎంపిక చేయలేదట. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను అనుకున్నారట. అయితే, స్త్రీ 2 సినిమాకి రూ.5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రద్ధా.. ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ కోసం సుమారు రూ. 7 కోట్ల వరకు పారితోషికం అడిగినట్లు తెలుస్తోంది. దీంతో అనూహ్యంగా శ్రీలీల పుష్ప ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
'గేమ్ ఛేంజర్' కోసం బాలీవుడ్ కింగ్.. కడపకు రానున్న చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతికి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ సినీ అభిమానులను మెప్పిస్తుంది. 'RRR'తో రామ్ చరణ్‌కు బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో అక్కడి మార్కెట్‌పై 'గేమ్ ఛేంజర్' టీమ్ కన్నేసింది. అందుకు తగ్గట్లు అక్కడ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే టీజర్‌ను లక్నో వేదికగా విడుదల చేశారు.ఆ ఈవెంట్ కోసం షారుఖ్ ఖాన్ట్రైలర్ విడుదల వేడుకను బాలీవుడ్లో చాలా గ్రాండ్‌గా జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను కూడా ఘనంగానే ప్లాన్ చేస్తుంది. అయితే, ఈ కార్యక్రమంలో ఏదో ఒకదానిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పాల్గొననున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ తన మూవీ ప్రమోషన్స్ కోసం గతంలో చాలా సార్లు హాలీవుడ్ స్టార్స్‌ను ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్లో గేమ్ ఛేంజర్ మార్కెట్‌ను పెంచుకునేందుకు షారుఖ్‌ను రంగంలోకి దింపుతున్నట్లు ప్రచారం ఉంది. బాలీవుడ్ మీడియాతో చిట్చాట్లు నిర్వహించడంతో పాటు విడుదలకు ఇంకా సమయం ఉండటంతో అక్కడ మరిన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.కడపకు రామ్ చరణ్రామ్ చరణ్ కడప రానున్నారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 18న జరుగనున్న 80వ దర్గా నేషనల్ ముషైరా ఘజల్ ఈవెంట్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు చరణ్ టీమ్ వెల్లడిస్తుందని సమాచారం. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అంజలీ, కియారా అద్వానీ, యస్ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?
దీపావళికి హడావుడి లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా 'అమరన్'. తమిళ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. మేజర్ ముకందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు. విడుదలకు ముందు తెలుగులో పెద్దగా హైప్ లేదు కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.ప్రస్తుతం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కి చేరువలో 'అమరన్' ఉంది. దీంతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. ఎందుకంటే హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మరీ ఈ రేంజ్ సక్సెస్ అయితే ఊహించలేదు. దీంతో ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ప్లాన్ మార్చుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)లెక్క ప్రకారం నెలరోజుల్లోనే 'అమరన్' ఓటీటీలోకి రావాల్సింది. అంటే డిసెంబరు తొలివారంలో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అద్భుతమైన సక్సెస్ కావడంతో మరో 1-2 వారాలు తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకుంటోందట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డిసెంబరు మూడో వారంలోనే ఓటీటీలోకి 'అమరన్' వచ్చే అవకాశముంది.అడివి శేష్ 'మేజర్' తరహా కథతోనే 'అమరన్' సినిమా తీసినప్పటికీ.. ముకుందన్ భార్య వైపు నుంచి స్టోరీ చెప్పడం, అలానే సాయిపల్లవి యాక్టింగ్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు సూర్య 'కంగువ' చిత్రానికి రిలీజ్ ముంగిట తలనొప్పిగా మారింది. థియేటర్లు అనుకున్నంతగా దొరకడం కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
బిగ్ బాస్ నుంచి హరితేజ ఎలిమినేట్.. కిరాక్ రెమ్యునరేషన్
బిగ్ బాస్ తెలుగు 8 పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. పలు అనారోగ్య కారణాలతో గంగవ్వ తనంతట తానే హౌస్ నుంచి బయటకు వస్తే.. ఆడియెన్స్ ఓట్ల కారణంగా హరితేజ ఎలిమినేట్ అయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హరితేజ ప్రేక్షకుల అంచనాలకు తన ఆటతో రీచ్ కాలేకపోయింది. అక్టోబర్ 6న బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హరితేజ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఐదు వారాల్లో ఆమె సంపాదన ఎంతో చూద్దాం.బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో తనదైన ఆటతీరుతో సత్తా చాటిన హరితేజ ఈ సీజన్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ చెడ్డపేరు లేకుండానే హుందాగా ఆట నుంచి నిష్క్రమించింది. హౌస్‌లో ఉన్నంతకాలం చలాకిగా కనిపించిన ఆమె ఆట తీరు బాగున్నప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో పెద్దగా ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ కాలేదని చెప్పవచ్చు. బహుషా ఈ కారణంతోనే ఆమె ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో నిఖిల్,ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ,గౌతమ్ ఏడుగురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఐదు వారాలపాటు హౌస్‌లో కొనసాగిన ఈ బ్యూటీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో అనే వార్త ఆసక్తిగా మారింది.రూ. 17 లక్షలు పైగానే..సోషల్‌మీడియాలో మంచి పాపులరాటీ ఉన్న హరితేజకు బిగ్ బాస్ ఒక వారానికి గాను రూ. 3.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అంటే రోజుకు రూ. 50 వేల పారితోషకం ఆమె బిగ్‌బాస్ నుంచి అందుకుందని టాక్. బిగ్ బాస్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకునే వారి జాబితాలో హరితేజ ఒకరని చెప్పవచ్చు. బిగ్ బాస్‌లో తను ఐదు వారాలపాటు ఉన్నందుకు రూ. 17 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పవచ్చు. సీజన్1లో సెకండ్ రన్నరప్సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె సీజన్1లో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది.