
బుట్టబొమ్మ పూజా హెగ్డేకి (Pooja Hegde) టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. రెండు మూడేళ్ల ముందు వరకు తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేసింది. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ లాంటి వరస డిజాస్టర్స్ దెబ్బకు పూర్తిగా సౌత్ కి దూరమైపోయింది.
హిందీలో ప్రయత్నిస్తే ఒకటి రెండు ఛాన్సులు వచ్చాయి గానీ ఆయా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్స్ గా మిగిలాయి. ఈ ఏడాది జనవరి 31న రిలీజైన 'దేవా' (Deva OTT) సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమో ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య)

2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో కాస్త కొత్తగా అనిపించడంతో హిట్ అయింది. దీన్ని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. కానీ ఫ్లాప్ అయింది. దీన్నే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తీస్తే ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది.
ఇప్పుడు 'దేవా' సినిమా ఓటీటీలోకి రానుంది. మార్చి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య థియేటర్లలో ఫ్లాప్ అయిన 'ఎమర్జెన్సీ' లాంటి మూవీస్ ఓటీటీలో హిట్ అవుతున్నాయి. మరి 'దేవా' కూడా అలా ఏమైనా ట్రెండింగ్ అవుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment