
హీరో నాని (Nani) స్పీడుమీదున్నాడు. హీరోగా, నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హిట్లు అందుకుంటున్న ఈ హీరో.. నిర్మాతగా కోర్ట్ చిత్రంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్: ద థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హిట్ 3కి పాజిటివ్ టాక్
మే1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హిట్ 1, 2 కంటే కూడా ఈ మూవీలో వయొలెన్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి హిట్ 3 బాగా ఎక్కేసిందట! ఈ టాక్ చూస్తుంటే నాని బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్ 3 సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఏ ఓటీటీలో అంటే?
ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఏకంగా రూ.54 కోట్లు పెట్టి ఈ హక్కుల్ని సొంతం చేసుకుందని టాక్. థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన మే చివరి వారం, లేదా జూన్ మొదటివారంలో హిట్ 3 ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రవాహం వారాల తరబడి కొనసాగితే మాత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది.