breaking news
Jangaon
-
నూతనోత్సాహం
కొత్త సంవత్సరానికి జిల్లావాసుల ఘన స్వాగతం ● సప్తవర్ణ ముగ్గులతో శోభితమైన లోగిళ్లు ● ఆలయాలకు పోటెత్తిన భక్తులు ● కేక్ కటింగ్, దావత్‌లతో పండగ వాతావరణంజనగామ: జిల్లాలో నూతన సంవత్సరం వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా ప్రజలు కోటి ఆశలతో గురువారం తెల్లవారుజాము వరకు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఇళ్ల ముందు లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో సప్తవర్ణ శోభితంగా అలంకరించగా, యువతీ యువకులు హోరెత్తించారు. డీసీపీ కార్యాలయంలో డీసీపీ,ఏఎస్పీ, ఏసీపీ, సీఐల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. బచ్చన్నపేట మండలం సిద్దేశ్వరాలయం, చిల్పూరు శ్రీ బుగులు వెంకటేశ్వర, జనగామ చెన్నకేశ్వర, బాణాపురం శ్రీ వెంకటేశ్వరాలయం, శ్రీ ఆంజనేయస్వామి, యశ్వంతాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి, బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గామాత, సాయిబాబా, పాలకుర్తి శ్రీసోమేశ్వరాలయం, జీడికల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి తదితర ఆలయాలకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. క్రైస్తవులు చర్చిలకు పెద్దఎత్తున తరలివెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. -
సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఆదర్శం
● డీటీఓ జీవీఎస్గౌడ్జనగామ: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా ని యమావళిని పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జీవీఎస్గౌడ్ సూచించారు. జనగామ ఆర్టీసీ డిపోలో గురువారం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీటీఓ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఆదర్శంగా నిలుస్తోందని, డ్రైవర్లు సైతం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
అజ్మీరా తండాలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
జనగామ: మండలంలోని ఎర్రగొల్లపహాడ్ అజ్మీరా తండాలో ఎన్పీడీసీఎల్ అధికారులు కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించి విద్యుత్ పునరుద్ధరించారు. అజ్మీరాతండాలో తన పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులు గడిచిపోతున్నా పట్టించుకోవడం లేదని గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన బాధిత రైతు రవి.. కలెక్టర్ కాళ్లుమొక్కిన సంగతి తెలిసిందే. రైతు దీనగాఽథను ‘ట్రాన్స్ ఫార్మర్ ఇప్పించండి..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్పీడీసీఎల్ అధికారులు తండాలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో సమస్యకు పరిష్కారం లభించింది. -
స్మారకం..విస్మరించి!
పాలకుర్తి టౌన్: తెలుగు భాషకు అజరామరమైన కీర్తితెచ్చిన మహాకవి బమ్మెర పోతన జన్మించిన బమ్మెరలో ఆయన పేరుతో చేపట్టిన ‘పోతన స్మారక నిర్మాణం’ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గతంలో ప్రారంభసమయంలో వేగంగా కొనసాగిన పనులు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై సాహితీవేత్తలు, కవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం బమ్మెర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం ప్యాకేజీలో భాగంగా రూ.7.50 కోట్లు కేటాయించింది. 2018 మే 28న అప్పటీ సీఎం కేసీఆర్ స్వయంగా బమ్మెరకు వచ్చి పనులకు శంకుస్థాపన చేశారు. బమ్మెరకు ప్రత్యేక చరిత్ర ఉండడంతో ప్రాధాన్యరీత్యా పనులు చేస్తూ వచ్చారు. కాంట్రాక్టర్ చొరవ చూపి పనులు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టారు. అయితే బడ్జెట్ సరిపోకపోవడంతో పనులు చేయలేనని చేతులేత్తేశారు. ప్రస్తుతం మరో రూ.6.50 కోట్లు మంజూరు చేసినా కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు మరో కాంట్రాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. పోతన స్మారక మందిరంలో నిర్మించిన భవనాలు పూర్తయ్యాయి. కానీ, చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. గతేడాది మార్చిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బమ్మెరరలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టిన దాఖాలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. గత రెండేళ్ల నుంచి పర్యాటక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోతన స్మారక అభివృద్ధి పనుల్లో పిచ్చి, తుమ్మచెట్లు పెరగడంతో అసాంఘిక కార్యాకపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.పగలు, రాత్రి తేడాలేకుండా మందుబాబులకు అడ్డాగా మారిందని కవులు, రచయితలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పోతన ఊరిలో చేస్తున్న పర్యాటక అబివృద్ధి పనుల్లో పోతన సమాధి, పోతన మోటతోలిన బావి, అక్కమాంబ వాగు, విద్యుత్, టైల్స్ పనులు, ప్లాస్టింగ్, పార్కింగ్, ఆర్చి గేట్లు, పోతన కాంస్య విగ్రహం, ఆర్ట్ క్రాప్ట్ భవనాలు పూర్తి చేయాల్సి ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చారిత్రక ప్రదేశం పర్యాటకాభివృద్ధిపై నీలినీడలు బడ్జెట్ సరిపోక చేతులెత్తేసిన కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని స్థానికుల డిమాండ్ -
సీఎంకు కొమ్మూరి శుభాకాంక్షలు
జనగామ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సత్కరించి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. సాక్షిప్రతినిధి, వరంగల్: వాణిజ్యపన్నులశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రావులు శ్రీధరాచారి బదిలీ అయ్యారు. సుమారు రెండున్నర సంవత్సరాలకు పైగా పనిచేసిన ఆయనను కమిషనర్ కమర్షియల్ టాక్స్ (సీసీటీ) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌లో జేసీగా ఉన్న తాళ్లపల్లి శ్రీనివాస్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు, నియామకాల్లో భాగంగా కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు మొదటగా జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేస్తున్న సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలను కదిలించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీల జాబితాలో ఉన్న వివిధ కేడర్లకు చెందిన అధికారులు, ఉద్యోగులనుంచి ఆప్షన్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. నెలరోజుల్లో రూ.11లక్షల మొండి బకాయిల వసూలుపాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రావాల్సిన వివిధ టెండర్ల మొండిబకాయిదారుల నుంచి రూ.10 లక్షల డీడీలను ఆలయ ఈఓ జప్తు చేశారు. గతంలో ఆలయానికి బకాయి ఉన్న టెండర్‌దారులు బినామీ పేర్లతో వేలంపాటలో పాల్గొన్నారు. బినామీ టెండర్‌దారులకు బకాయిదారుల పేరుమీదా తీసిన రెండు 5 లక్షల డీడీలను ఈవో జప్తు చేయడం ఆలయ చరిత్రలోనే సంచలనంగా మారింది. నెల రోజుల్లోనే రూ.11 లక్షల పాత మొండిబకాయిలను ఈఓ లక్ష్మీప్రసన్న రికవరీ చేయడంతో పాటు, మొండిబకాయిదారుల వివరాలతో గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌జోన్ టోర్నమెంట్‌కు కేయూ జట్టుకేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్స్లో ఈనెల 3 నుంచి 6 వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఎంపికైందని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య గురువారం తెలిపారు. జట్టులో జి.మోహన్‌దాస్, వి.శివరామ్, బి.వెంకటేశ్, కె. విశాల్ ఆదిత్య, కె.శ్రితిన్, జె.అనిరుధ్, కె.తులసినాఽథ్ ఉన్నారు. ఈ జట్టుకు హనుమకొండ వాగ్దేవి కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎ.నాగరాజు కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. -
జిల్లా అభివృద్ధిపథంలో ముందుకెళ్లాలి
● నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ: జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు సహకారం అందిస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈసందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా కలెక్టర్ పిలుపు మేరకు..ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చినవారు పేద విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు, బ్లాంకెట్లు, నోట్‌బుక్స్, పెన్నులు వంటి వస్తువులను అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జెడ్పీ డిప్యూటీ సీఈఓసరిత, డీసీఓ కోదండరాములు, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, తహసీల్దార్లు హుస్సేన్, రవీందర్, మోసిన్ తదితర ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కలెక్టరేట్లో జిల్లా రవాణాశాఖ అధికారి జీవీఎస్ గౌడ్‌తో కలిసి కలెక్టర్ భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. టీఎన్జీఓ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ జనగామ టీఎన్జీఓ యూనియన్ 2026 క్యాలెండర్‌ను జిల్లా యూనియన్ అధ్యక్షుడు చైర్మన్ ఖాజా షరీఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేరవరం ప్రభాకర్, అసోసియేట్అధ్యక్షులు రాజనర్స య్య, కోశాధికారి హాఫిజ్ తదితరులు పాల్గొన్నారు. -
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
జనగామ: జిల్లాలోని జనగామ మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు గురువారం అధికారికంగా ప్రకటించారు. రెండు మున్సిపాలిటీల్లో కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఓటరు జాబితాను అన్ని వార్డుల్లో ప్ర జలకు అందుబాటులో ఉంచారు. రెండు పురపాలికల్లో 48 వార్డుల పరిధిలో 62,382 మంది ఓటర్లు ఉన్నారు. తుది ఓటర్ల జాబితాను ఈనెల 10వ తేదీన విడుదల చేయనుండగా, ఆ దిశగా కీలక కార్యాచరణ ప్రారంభమైంది. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. చేర్పులు, తొలగింపుల విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు ఎన్నికల సంఘం నుంచి రాలేదు. ప్రస్తుతం ఒక కుటుంబం ఓట్లు రెండు వేర్వేరు వార్డుల్లో పడిన సందర్భాల్లో, అదే వార్డులో కలిపే అంశంగానే అభ్యంతరాలు స్వీక రిస్తారనే సమాచారం ఉంది. డిలీషన్ లేదా కొత్త చేర్పులపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ప్రజలు, స్థానిక పార్టీల నాయకులు సందిగ్ధంలో ఉన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశంపై కూడా ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ముసాయిదా జాబితాను ప్రతి వార్డులో ప్రచురించడంతో ప్రజలు తమ ఓటు ఉన్నదా లేదా అన్నదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తమ పేర్లు వేరే వార్డులకు మారాయా అనే అనుమానాలతో అనేక మంది ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటూ, అభ్యంతరాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 5న మున్సిపల్ స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, 10న తుది ఓటరు జాబితాను వెలువరించనున్నారు. ముసాయిదా జాబితా వెలువడడంతో రెండు మున్సిపాలిటీలలో రాజకీయం వేడెక్కింది. తుది జాబితా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో, పార్టీలు తమ వ్యూహాలను పునర్నిర్మాణం చేసుకుంటున్నాయి. కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాలపై స్పష్టత వచ్చాక రాజకీయంగా మరింత కదలికలు కనిపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అభ్యంతరాలు, తొలగింపు, చేర్పులపై కరువైన స్పష్టత 10న తుది ఓటరు జాబితాజనగామ మున్సిపల్లో 30 వార్డులు ఉండగా, మొత్తం 43,832 ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటరు జాబితాలో చూపించారు. ఇందులో పురుషులు 21, 247, మహిళలు 22,576, ఇతరులు 9 మంది ఉన్నారు. అత్యధికంగా 13వ వార్డులో 1,930, 5వ వార్డులో 1,800, 4వ వార్డులో 1,749, 3వ వార్డులో 1,655, అతి తక్కువగా 20వ వార్డులో 1,156, 21వ వార్డులో 1,197 ఓటర్లు, 22వ వార్డులో 1,198, 24వ వార్డులో 1,256, 7వ వార్డులో 1,297 మంది ఓటర్లు ఉన్నారు.స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్లో 18 వార్డుల పరిధిలో 18,550 ఓటర్లు నమోదు కాగా, పురుషులు 8,913, మహిళలు 9,636, ఇతరులు ఒక్కరు ఉన్నారు. అత్యధిక ఓటర్లు 10వ వార్డులో 1,210 ఓటర్లు, 11వ వార్డులో 1,152 ఓటర్లు, 12వ వార్డులో 1,013 ఓటర్లు, అతితక్కువ ఓటర్లు 13వ వార్డులో 912, 15వ వార్డులో 933, 16వ వార్డులో 955 మంది ఓటర్లు ఉన్నారు. రెండు పురపాలికల్లో కూడా ఓటర్ల ధ్రువీకరణ చివరి దశకు చేరుకుంది. అంకెలు పరిశీలనలో ఎలాంటి లోపాలు లేకుండా డేటా నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. -
లక్ష్యాన్ని ఛేదించాలి..
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నన్ను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలకు బదులుగా పేద విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, దుప్పట్లు తీసుకురావాలి. ప్రజల ద్వారా వచ్చే నోటుపుస్తకాలు తదితర మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేస్తాం. – జనగామయువత లక్ష్యం వైపు గురి పెట్టాలి. రాష్ట్రంలో త్వరలో పోలీస్ కానిస్టేబుల్, ఇతరత్రా ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల సాధించాలన్న లక్ష్యం ఏర్పరుచుకుని ఇప్పటినుంచే నిరంతరం ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పట్టుదలతో చదివి ఉద్యోగాలను సృష్టించుకోవాలి. మరికొందరికి ఉద్యోగాల్ని కల్పించేలా ఎదగాలి. ఏఐ వచ్చాక ఉద్యోగాల తీరు మారిపోయింది.ఇలాంటి సమయంలో ఉద్యోగాలు ఎవరివ్వాలి. అలా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి.వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం ప్రతి కుటుంబానికీ ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి నిండిన సంవత్సరంగా మారాలి. ప్రజల సహకారంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన సేవలు అందిస్తాం. – జనగామ -
పురపోరుకు కౌంట్‌డౌన్
జనగామ: రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో, ప్రభుత్వం మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనేపథ్యంలో ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల ఓటరు జాబితా ప్రకటన విడుదల చేసింది. ఈనెల 1న (గురువారం) కొత్త సంవత్సరం తొలి రోజు వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజు నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జనవరి 5న రాజకీయ పార్టీ ప్రతినిధులు, 6న ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. 10న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకమే ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రెండు మున్సిపాలిటీల పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సుదీర్ఘ విరామం తర్వాత జరగనున్న మున్సిపాలిటీల ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. అభ్యర్థుల అంచనాల ప్రకారం రిజర్వేషన్ల లెక్కలు వేసుకుంటూ, వార్డుల వారీగా తమ బలం, బలహీనతలను పరిశీలిస్తుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష, ఇతర పార్టీలు సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. నేడు డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల మున్సిపాలిటీలకు అసెంబ్లీ ఓటరు జాబితా ఆధారంగా బ్లాక్వైజ్ ఉన్న ఓటర్ల సమాచారాన్ని వార్డుల వారీగా విభజిస్తున్నారు. ఈ ప్రక్రియను జిల్లా హెడ్‌క్వార్టర్ మునిసిపల్‌లో రెండు పురపాలికలకు సంబంధించి బుధవారం వార్డుల వారీగా విభజన ప్రక్రియ చేపట్టారు. గురువారం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రజల ముందుంచనున్నారు. తుది జాబితా కోసం ఇంకో పదిరోజుల సమయం ఉండడంతో జనవరి మూడో వారంలో లేదా నాలుగో వారంలోనే పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం. జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ఎలక్షన్ కమిషన్ సన్నద్ధమవుతోంది. రెండు మున్సిపాలిటీల్లో ఓటర్ల వివరాలు జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో తాజా జనాభా, ఓటర్ల గణాంకాలను అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జనగామ మున్సిపాలిటీకి 30 వార్డులు ఉండగా, జనాభా 52,408గా నమోదైంది. ఇందులో 1,694మంది ఎస్టీ, 8,385 మంది ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 43,903 మంది ఓటర్లు నమోదయ్యారు. స్టేషన్న్ ఘన్‌న్‌పూర్ మున్సిపాలిటీ పరిధి లో 18 వార్డుల పరిధిలో జనాభా 23,483గా నమోదైంది. ఇందులో 962 మంది ఎస్టీ, 6,663 మంది ఎస్సీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య 18,549 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వార్డుల వారీగా ఓటర్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ జనగామ పురపాలికలో స్టేషన్‌ఘన్‌పూర్ కలుపుకుని వార్డుల వారీగా ఓటర్ల విభజన జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. వార్డుల వారీగా ఓటర్లు, పోలింగ్ స్టేషన్ మ్యాపింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఓటర్ల జాబితాలో అధికారులు ఒక్క పొరపాటు కూడా ఉండకుండా చూడాలన్నారు. ప్రతి వార్డుకు సంబంధించిన డేటా తప్పులు లేకుండా మ్యాప్ చేయడం ఎన్నికల క్రమశిక్షణలో అత్యంత కీలకమని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ స్టేషన్ స్థాయి డేటాను తిరిగి వార్డుల వారీగా కేటాయించే పనిలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో హీటెక్కుతున్న రాజకీయాలు మొదలైన రిజర్వేషన్ల లెక్కలు రెండు మునిసిపాలిటీల్లో 62,556 ఓట్లు -
ఒకటే గమనం.. ఒకటే గమ్యం!
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026పరీక్షల కాలం.. కొత్త సంవత్సరం ప్రారంభమైన రెండో నెలలో ఇంటర్, మార్చిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. జిల్లానుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుంటారు. సిలబస్ పూర్తయి రివిజన్లు చేసుకోవాలి. పరీక్షలకు కొంత సమయమే ఉంది కాబట్టి మరోసారి రివిజన్లు చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాసి పెట్టుకోవాలి. అప్పుడే చదివింది గుర్తుండి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తతే రక్ష ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది యువత ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతూ మోసపోతున్నారు. ఆన్లైన్ ఆర్థిక నేరాల్లో మోసపోతున్న వారు అత్యధికంగా యువకులు, ఉన్నత విద్యావంతులు. అధికారులే. సోషల్ మీడియాలో తెలియని లింకులు ఓపెన్ చేస్తూ.. ఇష్టారీతిన ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతున్నారు. డిజిటల్ యుగంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నింటినీ సమన్వయం చేసుకుంటే అద్భుత విజయం కాలంతో పోటీ.. లక్ష్య సాధనలో మేటి కొత్త సంవత్సరం.. సరికొత్త ఆశయాలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా యువతలో ఉత్సాహం -
సోమన్న ఆలయ వేలంపాటల ఆదాయం రూ.26లక్షలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 2026 సంవత్సరంలో కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు అమ్ముకునే హక్కు, దేవస్థానానికి వాహనం పూజా సామగ్రి సప్లై చేయు లైసెన్స్ కోసం నిర్వహించిన బహిరంగ వేలం పాట ద్వారా రూ.26,20,000ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. బుధవారం ఆలయం కళ్యాణ మండపంలో వేలం పాట నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన నెమురుగొమ్ముల శ్రీనివాస్‌రావు రూ.26,20,000లు పాట పాడి కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు అమ్ముకునే హక్కు దక్కించుకున్నారు. సరైన పాట రాకపోవడంతో తలనీలాల వేలం వాయిదా వేసినట్ల ఈఓ తెలిపారు. అలాగే ఆలయానికి రావాల్సిన వివిధ టెండర్ల మొండి బకాయిదారుల నుంచి రూ.10 లక్షల డీడీలను జప్తు చేసినట్లు ఈఓ లక్ష్మీప్రసన్న తెలిపారు. -
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
విదేశాల్లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మరణించిన విద్యార్థి పేరు తోకల హృతిక్ రెడ్డి.హృతిక్ స్వస్థలం తెలంగాణ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామం. ఉన్నత విద్య కోసం అతను జర్మనీకి వెళ్లాడు. అయితే.. బుధవారం అతను నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకి గాయాలతో మరణించాడని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హృతిక్ కుటుంబం బోరున విలపిస్తోంది. తమ బిడ్డ మృతదేహాన్ని రప్పించాలని ప్రభుత్వాల్ని వేడుకుంటోంది. ఈ ఘటనతో మల్కాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పారదర్శకంగా యూరియా పంపిణీ
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్టేషన్‌ఘన్‌పూర్: యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులకు సులభంగా, పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా యూరియా బస్తాల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. యాప్ ద్వారా జరుగుతున్న యూరియా అమ్మకాలను స్వయంగా పరిశీలించేందుకు స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని పీఏసీఎస్‌ను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రాష్ట్రంలో యూరి యా బుకింగ్యాప్లో జిల్లా ముందంజలో ఉంద న్నారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్రనాయ క్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, ఆర్డీ ఓ డీఎస్ వెంకన్న, సీఐ జి.వేణు, ఎస్ఐలు వినయ్ కుమార్, రాజేష్, డీటీ సంఽధ్యారాణి, ఏఓ చంద్రన్‌కుమార్, పీఏసీఎస్ సీఈఓ మగ్ధుంఅలీ పాల్గొన్నారు. చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే జనగామ రూరల్: విద్యార్ధులకు కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడలు కూడా ముఖ్యమేనని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లాస్థాయి పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థుల క్రీడాపోటీలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఈఈ సత్యనారాయణమూర్తి, సీఎంఓ నాగరాజు, సెక్రటరీ గొర్సింగ్, ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు. పీఎంశ్రీ క్రీడాపోటీల్లో వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ బహుమతులు అందజేశారు. మీ చేతుల్లోనే మీ భవిష్యత్.. మీ చేతుల్లోనే మీ భవిష్యత్ ఉందని, ప్రాణాలు అతి ముఖ్యమని రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పట్టణంలోని ఎన్మ్ఆర్ గార్డెన్లో రోడ్డు భద్రత ప్రమాద నివారణపై ఆర్టీఏ సభ్యుడు అభి గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, రవాణా శాఖ అధికారి శ్రీని వాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు ఈనెల 31 (బుధవారం) నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్‌లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు.. ఉమ్మడి వరంగల్‌లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్‌లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ‘స్కివం’ షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నీటి విడుదలఈ నెల 3న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతుంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. – పి.రమేశ్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్ నేటినుంచి యాసంగి పంటలకు సాగునీరు ఎల్ఎండీ నుంచి సరఫరాకు ఇరిగేషన్ శాఖ సన్నద్ధం వారబందీ పద్ధతి అమలు -
నేడు డయల్ యువర్ డీఎం
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. ఈనెల 31న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి విలువైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. వీరాచల రాముడికి రూ.1,00,116ల విరాళం లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయానికి మంగళవారం కొండ ప్రమోద్రాజాపద్మిని దంపతులు(యూఎస్ఏ) రూ.1,00,116ల విరాళ ం అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం వీరాచల రామచంద్రున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారి భార్గవాచార్యులు, ఆలయ సిబ్బంది భరత్, మల్లేశంలకు అందజేశారు. లింగంపల్లి జాతర ప్రదేశం పరిశీలన చిల్పూరు: మండలంలోని లింగంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహించే ప్రదేశాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ మంగళవారం పరిశీలించారు. ముందుగా తల్లుల గద్దెల వద్ద సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్‌లతో కలిసి పూజలు చేశారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. జనవరి 28నుంచి 30 తేదీ వరకు నిర్వహించే జాతరకు పెద్ద మొత్తంలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డమీది సురేశ్, కండ్లకోలు బాలరాజు, ఏదునూరి రవీందర్, తుత్తురు రాజు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు జనగామ రూరల్: తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ, జనగామ జిల్లా ఆధ్వర్యంలో జర్మనీలో నర్సులకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ ఉద్యోగ నియామక సహాయం టామ్‌కామ్ ద్వారా అందిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి సాహితి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం నమోదు పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా అర్హత కలిగిన నర్సులకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ అందించి, జర్మనీలో పేరొందిన ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. 22 నుంచి 38 ఏళ్లు ఉండి బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం పూర్తి చేసి 1 నుంచి 3 సంవత్సరాల క్లినికల్ అనుభవం ఉండాలన్నారు. జర్మన్ భాషా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత జర్మనీలో స్టాఫ్‌నర్స్‌గా నియమితులైన వారికి నెలకు సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆకర్షణీయమైన వేతనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలు, నమోదు కోసం 9440051581 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రోబోటిక్స్‌పై వర్క్‌షాపు రఘునాథపల్లి: మండలంలోని వెల్ది మోడల్ స్కూల్లో మంగళవారం రోబోటిక్స్ ఐదో స్థాయి డైమండ్ చాలెంజ్ వర్క్‌షాపు జరిగింది. వర్క్‌షాపును ఇన్స్ట్రక్టర్ నడిగోటి సుహాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల రోబోటిక్స్ ఇన్చార్జ్ ఉపాధ్యాయులు ద్యావత సౌజన్యప్రియ, పోరిక పార్వతి మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు జరుగుతుండగా అందులో వెల్ది పాఠశాల ఉందన్నారు. విద్యార్థులు రోబోటిక్స్ సాధన చేసి వైఫై రోబోట్, రోటరీ ఎన్ కోడర్ కంట్రోల్డ్ లెడ్ సర్వో అండ్ బజర్, ఆటోమెటిక్ లైటింగ్ అండ్ విసిటింగ్ కౌంటర్ అనే మూడు యాక్టివిటీస్ చేశారని చెప్పారు. పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కందగట్ల గణేష్ వర్క్‌షాపును సందర్శించి విద్యార్థులను అభినందించారు. -
గుడ్ వర్కింగ్ సొసైటీగా నర్మెట పీఏసీఎస్
నర్మెట: గుడ్ వర్కింగ్ సొసైటీగా నర్మెట పీఏసీఎస్ ఎంపికై ంది. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌కు అనుబంధంగా ఉన్న నర్మెట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మూడేళ్లుగా రైతులకు అందజేసిన స్పల్ప, దీర్ఘకాలిక రుణాలను సకాలంలో వసూలు చేయడంతో ప్రభుత్వం అందించే 3 శాతం రాయితీకి అర్హత సాధించింది. దీంతో రైతుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ అయ్యింది. సొసైటీ ఎలాంటి ఇన్‌బ్యాలెన్స్, నష్టాలు లేకపోవడం అవార్డుకు ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సహకార, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా సొసైటీ సీఈఓ కొన్నె వెంకటయ్య అవార్డు అందుకున్నారు. గణతంత్ర వేడుకలకు ఒగ్గు రవి బృందం ఎంపిక లింగాలఘణపురం: ఢిల్లీలోని కర్తవ్యపఽథ్ వేదికగా 2026 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒగ్గుడోలు విన్యాస కళాప్రదర్శనను ఎంపిక చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంట్రల్ నుంచి జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కళాకారుడు ఒగ్గు రవికి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. 26న రాష్ట్రపతి, ప్రధానమంత్రి సమక్షంలో ప్రదర్శన ఇవ్వనున్నామని, రాష్ట్రం నుంచి ఒగ్గుడోలు ప్రదర్శన ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. -
న్యూఇయర్ జోష్ షురూ!
● విందులు, వినోదాలకు యూత్ రెడీ ● జోరుగా కేక్‌లు, గిఫ్టుల అమ్మకాలుజనగామ: పాత జ్ఞాపకాలను గుర్తుకుచేసుకుంటూ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాది 2026కు స్వాగతం చెప్పేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈనెల 31 (బుధవారం) అర్ధరాత్రి వేడుకలకు రెస్టారెంట్లు, హోటళ్లు, ఈవెంట్ వేదికలు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. యువత నుంచి కుటుంబాల వరకు అందరూ విందు, వినోదాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను రప్పించేందుకు పోటీపడుతున్నారు. బొకేలు, గిఫ్ట్ ఐటమ్స్, కేకుల అమ్మకాలు భారీగా పెరిగి పండగ మార్కెట్‌ను తలపిస్తున్నాయి. కేకుల పండగ కొత్త సంవత్సర వేడుకల కోసం ఒక్కో బేకరీలో వందల సంఖ్యలో కేక్‌లను తయారు చేస్తున్నారు. చూడగానే తినేయాలనిపించే విధంగా కేకులు ఆకర్షిస్తున్నాయి. అరకిలో నుంచి 20 కిలోల వరకు కేకులు అందించేందుకు దుకాణా యజమానులు ఆర్డర్లను బట్టి తయారు చేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. -
అభివృద్ధిలో వెనకడుగు
నత్తనడకన సుందరీకరణ, రహదారులు, రిజర్వాయర్ల పనులుజనగామ: జిల్లా అభివృద్ధిలో ఆశించిన పురోగతి సాధ్యం కాలేదు. కొన్ని రంగాల్లో ముందడుగు పడినా, కీలకమైన ప్రాజెక్టులు నిలిచిపోవడం వల్ల ప్రజాసమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయి.జిల్లా కేంద్రంలో సుందరీకరణ పనులు ఆశించినంత వేగం అందుకోలేదు. బతుకమ్మకుంటను రూ.1.50 కోట్లతో అభివృద్ధి చేసినప్పటికీ, ప్రజా భాగస్వామ్యం కనిపించలేదు. నగర అభివృద్ధికి కీలకమైన కళావేదిక, శాశ్వత మరుగుదొడ్లు ఇప్పటికీ అమలు దిశలోకి రాలేదు. జిల్లా ప్రధాన వనరులలో ఒకటైన రంగప్పచెరువు సుందరీకరణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జనగామ–హైదరాబాద్ మెయిన్ రోడ్ పనులు సగంలోనే ఆగిపోవడంతో రహదారి సగం బ్లాక్‌టాప్, సగం కంకర రోడ్డుగా మారి నాలుగేళ్లుగా ప్రజలకు తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. పెంబర్తి–మడికొండ ఇండస్ట్రియల్ కారిడార్‌కు పురోగతి కనిపించలేదు. జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలు ప్రారంభమయ్యాయి. చంపక్ హిల్స్‌లో రూ.100 కోట్లతో జిల్లా కోర్టుల నిర్మాణం మొదలైంది. అదే ప్రాంతంలో ట్రామా సెంటర్ భవనం సిద్ధమైంది. విద్యారంగంలో 3,5,6 తరగతుల న్యాస్ పరీక్షల్లో జనగామ దేశవ్యాప్తంగా 782 జిల్లాల్లో 50లో చోటు దక్కించుకొని ప్రతిభ చాటుకుంది. వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఇంకుడు గుంతల నిర్మాణంలో జిల్లా దేశవ్యాప్తంగా ఉత్తమంగా నిలిచింది. పాలిటెక్నిక్ కళాశాల మాత్రం కాగితాలకే పరిమితమై పోయింది. అభివృద్ధి పనులు కనిపించినా, కీలకమైన రహదారులు, రిజర్వాయర్లు, ప్రభుత్వ భవనాల పనులు నిలిచిపోవడంతో జిల్లా అభివృద్ధి రెండు అడుగులు ముందుకు వేస్తే మూడు అడుగులు వెనక్కిపడిన పరిస్థితి కనిపిస్తోంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో నెమ్మదిగా 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులురంగప్ప చెరువు, కళావేదిక అభివృద్ధి జాడలేదు పాలకుర్తి–చెన్నూరు రిజర్వాయర్లకు నిధులున్నా పురోగతి లేదు వడ్లకొండ, చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణం గాలికి.. విద్యారంగంలో కాస్త ముందుకు..మండలాల వారీగా జనగామ మండలం: నర్మెట హైవే, వడ్లకొండ, చీటకోడూరు రహదారులపై కల్వర్టులు, బ్రిడ్జిలు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినా పనులు నిలిచిపోయాయి. రూ.5 కోట్ల మంజూరు ఉన్నప్పటికీ బిల్లులు రాక పనులు ఆగిపోయాయి. లింగాలఘణపురం: వరంగల్–హైదరాబాద్ హైవే నెల్లుట్ల వద్ద ప్రమాదాలకు కారణమవుతున్న పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు అలసత్వం ప్రాణానికి ముప్పు తెస్తోంది. రూ.8 కోట్లతో ప్రారంభించిన కళ్లెం రోడ్డు కూడా ఇంకా పూర్తి కాలేదు. స్టేషన్ ఘన్పూర్: రూ.45 కోట్ల ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, రూ.26 కోట్ల కార్యాలయాల సముదాయం, రూ.1 కోటి డీఈ కార్యాలయ నిర్మాణం, మల్లన్నగండి రహదారి, జాతీయ రహదారి సర్వీస్ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రిజర్వాయర్ పర్యాటక ప్రాజెక్టుల పనులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. రూ.146 కోట్లతో తలపెట్టిన స్టేషన్న్ ఘనన్పూర్–నవాబుపేట ప్రధాన కాల్వ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. లెదర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. జఫర్‌గఢ్ : కోనాయచలంలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ఇప్పటికీ మొదలుకాలేదు. చిల్పూరు : మల్లన్నగండి రిజర్వాయర్ నుంచి లింగంపల్లి–శ్రీపతిపల్లి–కొడాపూర్ గ్రామాలకు నీటి సరఫరా కోసం రూ.104 కోట్లతో చేపట్టిన పైప్‌లైన్ పనులు పూర్తయినా, గేట్ వాల్వ్‌లు నిలిచిపోవడంతో నీటి తరలింపు ప్రారంభం కాలేదు. తరిగొప్పుల: రూ.1.43 లక్షలతో తలపెట్టిన పీహెచ్సీ భవనానికి సంబంధించి స్థల కేటాయింపు పనులు నిలిచిపోయాయి. బచ్చన్నపేట: రూ.8.30 కోట్ల మంజూరు ఉన్నా, మట్టి–బీటీ రోడ్ల పనులకు టెండర్లకు నోచుకోవడం లేదు. కొడకండ్ల: రూ.9 కోట్లతో రెండు చెక్‌డ్యాంలు, రూ.94 లక్షలతో కస్తూర్బా పాఠశాల అదనపు గదుల నిర్మాణం పూర్తయింది. పాలకుర్తి: శ్రీ సోమేశ్వర–లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, సోమనాథ స్మృతివనం, కల్యాణ మండపం ఆధునికీకరణకు రూ.94.84 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఒక్క పని కూడా మొదలుకాలేదు. పాలకుర్తి–చెన్నూరు రిజర్వాయర్ పనులకు రూ.1000 కోట్ల రీ–ఎస్టిమేట్ నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు నత్తనడకన సాగుతుండగా, చెన్నూరు రిజర్వాయర్ పనులు ప్రారంభం కాలేదు. -
చలికి జాగ్రత్తలే రక్ష
జనగామ: చలి తీవ్రతతో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు అన్నారు. సాధారణ జలుబు, ఫ్లూ (ఇన్ఫ్లుయెంజా), అస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లు చలికాలంలో వైరస్లు ఎక్కువసేపు జీవించడం, మూసివేసిన గదుల్లో వేగంగా వ్యాపించగలగడం వల్ల విస్తరిస్తాయన్నారు. శ్వాససమస్యలతో పాటు చలి ప్రభావం చర్మం, కీళ్లనొప్పులపై ప్రభావం ఉంటుందన్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో కూడా ప్రమాదం అధికమవుతుందన్నారు. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నివారణ చర్యలే ప్రధానమని సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ‘సాక్షి ఫోన్ ఇన్’లో డీఎంహెచ్ఓ సూచించారు. అలాగే జిల్లా ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజీవరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్ కుమార్, పల్మనాలజిస్టు డాక్టర్ దివ్య ప్రజలకు ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించారు. ప్రశ్న: జిల్లా ఆస్పత్రిలో పిల్లల ఓపీ ప్రారంభించాలి. కుక్క, కోతి కాటుకు ఇక్కడే వ్యాక్సిన్ ఇవ్వాలి.. – సుంచు శ్రీకాంత్, గుండ్లగడ్డ, జనగామడీఎంహెచ్ఓ: కుక్క, కోతి కాటుతో పిల్లలు తీవ్రంగా అనారోగ్యానికి గురైన సమయంలో పీడీయాట్రిక్ వైద్యులు మాత్రమే వ్యాక్సినేషన్ ఇవ్వాలి ఉంటుంది. ఈ సేవలు ఎంసీహెచ్‌లోనే ఉన్నాయి. ప్రశ్న: సీజనల్‌గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తుమ్ములు ఆగడం లేదు, షుగర్ ఉన్నవారు ఏం చర్యలు తీసుకోవాలి? – పార్సి రంగారావు,శివునిపల్లి, సాయి మనోజ్ కుమార్, కొడకండ్ల, ఈగ కృష్ణమూర్తి, కూనూరు, జఫర్‌గఢ్, టి.రామకృష్ణ, స్టేషన్‌ఘన్‌పూర్, ఏదునూరి వీరన్న, లింగాలఘణపురం, మంతపురి యాదగిరి, కన్నాయపల్లి, ఆరూరి జయప్రకాష్, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ రఘునాథపల్లిడీఎంహెచ్ఓ: చలికాలంలో ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, అస్తమా తిరగబెట్టడం, న్యూమోనియా వంటి కేసులు వస్తాయి. వీరు చలికి ఎక్స్పోజ్ కావద్దు. ముఖానికి మాస్క్, ఉన్ని దుస్తులు ధరించాలి. తుమ్ములు సైనస్‌కు కారణం కావచ్చు. జిల్లా ఆస్పత్రిలో పల్మనాలజిస్టు, ఈఎన్టీ స్పెషలిస్టులు సైతం అందుబాటులో ఉంటారు. అక్కడ పరీక్ష చేయించుకోండి. షుగర్, బీపీ పేషెంట్లు మందులను కంటిన్యూ చేయాలి. ప్రశ్న: నా భార్యకు ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించిన తర్వాత గ్యాస్ ఫాం అవుతోంది? ఏం చేయాలి? – శివానందమూర్తి, ఇప్పగూడెండీఎంహెచ్ఓ: నీరు తొలగించే సమయంలో యాంటీబయోటిక్స్ ఇవ్వడంతో కొంతమేర గ్యాస్ సమస్య ఉంటుంది. తినలేకపోతారు. వాంతులు కావడం సహజమే. పులుపు, కారం, తినకూడదు. ప్రశ్న: మరిగడిలో హెల్త్ క్యాంపులు నిర్వహించండి– ఎడ్ల శ్రీనివాస్, అడ్వకేట్, మరిగడి, జనగామడీఎంహెచ్ఓ: మరిగడి (ఎం) తండాలో ఎంబీబీఎస్ డాక్టర్ పర్యవేక్షణలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. ప్రశ్న: 24 గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉండాలి..ఊరిలో పదిలో ఇద్దరికి జ్వరాలు ఉన్నాయి.. – శివరాజ్, జఫర్గఢ్డీఎంహెచ్ఓ: జఫర్‌గఢ్ హాస్పిటల్లో 24 గంటలు సేవలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఇంకా ఎక్కువగా దృష్టి సారిస్తాం. ఇంటింటా ఫీవర్ సర్వే చేయిస్తాం. మందులు సరిపడా ఉన్నాయి. ప్రశ్న: డీహెచ్, ఎంసీహెచ్‌లో తాగునీరు ఏర్పాటు చేయండి, కుక్క తీవ్రంగా కరిస్తే ఎంజీఎంకు రెఫర్ చేశారు.. – మంతెన మణి, అమ్మఫౌండేషన్, జనగామడీఎంహెచ్ఓ: జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి రెండు చోట్ల తాగునీరు వసతి కల్పించే విధంగా చూస్తాం. కుక్క తీవ్రంగా కరిచిన సమయంలో ఇచ్చే వ్యాక్సిన్ ఎంజీఎంలో అందుబాటులో ఉండడంతోనే అక్కడకు పంపించారు. ప్రశ్న: బచ్చన్నపేటలో పిల్లల డాక్టర్ ఉండడం లేదు.. జనగామకు తీసుకెళ్తున్నాం.. – రాంరెడ్డి, ఇటికాలపల్లి, రమేశ్, బచ్చన్నపేటడీఎంహెచ్ఓ: బచ్చన్నపేట సీహెచ్‌సీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చిన్న పిల్లల వైద్యులు. నిత్యం అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ప్రశ్న: చర్మవ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి – పులి ధనుంజయ్‌గౌడ్, ఉప్పుగల్లు, జఫర్గఢ్డీఎంహెచ్ఓ: చలితీవ్రతతో చర్మం పొడిగా మారి పగుళ్లు బారుతుంది. కొబ్బరి నూనె, వ్యాస్లేన్ ఉపయోగిస్తే సరిపోతుంది. ప్రశ్న: ఎక్స్‌రే టెక్నీషియన్, ఈసీజీ, 2–డీ ఎకో సేవలు కావాలి – నగేష్, కూనూరుడీఎంహెచ్ఓ: జఫర్‌గఢ్ సీహెచ్‌సీలో ఎక్స్‌రే మిషన్ ఉంది. టెక్నీషియన్ లేడు. ప్రపోజల్ పంపించాం.. రెండు,మూడు నెలల్లో రావొచ్చు. చలి తీవ్రత దృష్ట్యా ఉన్నిదుస్తులు, మాస్క్ ధరించాలి శ్వాస, చర్మ, కీళ్లు, గుండె జబ్బులు ఉన్నవారిపై ప్రభావం ఎక్కువ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నాం.. ‘సాక్షి ఫోన్ ఇన్’లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు -
నేడు వైకుంఠ ఏకాదశి
జనగామ: ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకునే శుభపర్వాన్ని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసం శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఈ పర్వదినం. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి వరకు జరిగే కాలంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి చిల్పూరు బుగులు శ్రీ వెంకటేశ్వరస్వామి, జిల్లా కేంద్రంలోని బాణాపురం వెంకటేశ్వరస్వామి, పాతబీటు బజారులోని శ్రీ చెన్నకేశ్వరస్వామి, జీడికల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి విద్యుత్‌కాంతుల్లో వైష్ణవాలయాలు -
గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరణ
జనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన ఖాళీల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రవేశ పరీక్ష వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీఎస్ఈ డీఓ డా.విక్రమ్, ఏ బీసీడీఓ రవీందర్, డీసీఓ ఎ.శ్రీనివాస్, గురుకులాల డీసీఓ పి.శ్రీనివాసరావు, అజ య్ పాల్గొన్నారు. అలాగే ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సి పాల్ ఎస్.స్వరూప ఒక ప్రకటనలో తెలిపారు. -
సమస్యలకు పరిష్కారమేది?
జనగామ రూరల్: వృద్ధాప్యంలో అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నామని పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని వృద్ధురాలు, తనకు తల్లిదండ్రులు లేరని ఉండడానికి సొంత ఇల్లు లేదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని యువతి..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్‌కు ప్రజలు తరలివచ్చారు. ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నామని దూరప్రాంతాల నుంచి ఖర్చు పెట్టుకోని వచ్చి దరఖాస్తులు ఇవ్వడమే అవుతోందని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్ ప్రజల నుంచి 31 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు కొన్ని ఇలా..● జనగామ పట్టణానికి చెందిన మేకల ప్రశాంత్ అనే వ్యక్తి, తన భూమి విషయంలో జరిగిన అక్రమ పేరు నమోదుపై ఫిర్యాదు చేశారు. డాక్యుమెంట్లను పరిశీలించి, అక్రమంగా నమోదైన వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుండి తొలగించాలని వినతి పత్రం అందజేశారు. ● పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన బక్క కవిత అనే మహిళ తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించమని దరఖాస్తు చేసుకుంది. ● బచ్చన్నపేట మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన చిమ్మ అండమ్మ తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, పెద్ద కుమారుడు తన బాగోగులు చూస్తుండగా చిన్న కుమారుడు చూడడం లేదని వినతిపత్రం అందించింది. ● రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి గ్రామానికి చెందిన శివరాత్రి కల్పన అనే మహిళ ఇటీవల తన భర్త మృతి చెందాడని భర్త పేరు మీద ఉన్న భూమి తన పేరుమీద పట్టా చేయాలని వినతి పత్రం అందించింది. ● నర్మెట మండలం బొమ్మకూర్ గ్రామానికి చెందిన మాలోతు కవిత తన తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారని, ఉండడానికి ఇల్లు లేకపోవడంతో తన నానమ్మతో కలిసి ఉంటున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరింది. ● జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో చెట్లు ఏపుగా పెరిగి రాత్రివేళల్లో పాములు, క్రిమికిటకాలు ఇండ్లులోకి వస్తున్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు హరీశ్, మహేందర్ వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నాం.. గ్రీవెన్స్‌లో ప్రజల ఆవేదన -
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్నా.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని ఆమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24)అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవంతో భావన, మేఘనరాణి అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం తెల్ల వారుజామున మీ అమ్మాయిలు మృతిచెందారని అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
బీఆర్ఎస్ను ఓడించే శక్తి లేదు
జనగామ: నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ఓడించే శక్తి కాంగ్రెస్‌కు లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన సర్పంచ్‌లు, పాలక మండళ్లకు సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. 8 మండలాల్లో బీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్ చతికిలబడి పోయిందన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సొంతూరు నర్సాయపల్లిలో పోలీసులను అడ్డం పెట్టుకున్నా బీఆర్ఎస్ అభ్యర్థి 400 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, వారు తలదించుకోక తప్పలేదన్నారు. అలాగే ఆయన అత్తగారి ఊరు గంగాపురంలో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎ న్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులే గెలుపొందారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటి వెంట సైతం జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకే ప్రజాభిమానముందని చెప్పిన విషయం గు ర్తుంచుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కో సం తాను నిధులు తీసుకు వస్తే, కొమ్మూరి వాటిని రద్దు చేయించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 8 జెడ్పీటీసీలు, రెండు ము న్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకోబోతుందన్నారు. గులాబీ కార్యకర్తలు అమ్ముడుపోయే వారు కాదని, మంత్రులను కలిసి అభివృద్ధి కోసం నిధులు తీసుకు రాబోతున్నానని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, ఇర్రి రమణారెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, బాల్‌నర్సయ్య, బద్దిపడగ క్రిష్ణారెడ్డి, కాయితాపురం రామ్మోహన్‌రెడ్డి, భైరగోపి యాదగిరిగౌడ్, మసిఉర్ రెహామన్ తదితరులు ఉన్నారు. 8 జెడ్పీటీసీలు, రెండు మున్సిపల్ సైతం మావే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం
జనగామ: దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఏకై క పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ అబ్జర్వర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వేడుకల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి బైకని లింగం యాదవ్‌తో కలిసి వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 141 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణం అన్నారు. అబ్జర్వర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి -
నాది రెడ్ సారీ.. మీది పింక్ సారీ
● వేదికపై మంత్రి సీతక్క చలోక్తులు జనగామ రూరల్: టీఎస్‌యుటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సులో మంత్రి సీతక్క చేసిన చలోక్తులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదికపై ఆసీనులైన వెంటనే ‘నేను రెడ్ సారీ కట్టుకుని వస్తే.. మీరేమో(మహిళా టీచర్లు) పింక్ సారీతో వచ్చారా..’ అంటూ మంత్రి నవ్వుతూ పలకరించారు. డ్రెస్‌కోడ్ కాదు, ఉపాధ్యాయుల ఐక్యతే ఇవాళ వేదికను మెరిపించిందంటూ వ్యాఖ్యానించారు. ప్రతి సదస్సులో డ్రెస్‌కోడ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఈసందర్భంగా మంత్రికి చెప్పారు. ఉపాధ్యాయుల ఐక్యత, క్రమశిక్షణ పట్ల మంత్రి ప్రశంసలు కురిపించారు. క్రీడలతో మానసికోల్లాసంజనగామ: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కూడా పెరుగుతుందని జిల్లా ఫొటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షుడు కాముని రాము అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తమ యూనియన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా 7 మండలాలు పాల్గొన్నాయన్నారు. అందుల ఫైనల్లో మొదటి బహుమతి దేవరుప్పుల మండలానికి వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వేణుమాధవ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, దేవరుప్పుల మండల అధ్యక్షుడు ఇనుముల నాగరాజు ఆధ్వర్యంలో కెప్టెన్ ధరావత్ సుధీర్ నాయక్ టీమ్ మెంబర్స్ రెడ్డిరాజుల శ్రీకాంత్, అక్కనేపల్లి చారి, గుగులోతు నరేందర్, బషీపాక ఉపేందర్, పన్నీరు శ్రీకాంత్, బానోత్ రాజేందర్, బషీపాక నాగరాజు, అంబాదాసు, ప్రమోద్, సీనియర్ నాయకులు అమతం ఆంజనేయులు. గుమ్మడవెల్లి సోమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
జనగామ రూరల్: కేంద్రం అక్రమంగా తీసుకొచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి డిమాండ్ చేశారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా కాసు మాధవి మాట్లాడుతూ.. కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే కుట్రలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్ అమలు కోసం నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, రాజు, ప్రశాంత్, నాగరాజు, సుమతి తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి -
నేడు సాక్షి ఫోన్ ఇన్..
జనగామ: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దగ్గు, జలుబు, జ్వరపీడితులకు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మల్లికార్జున్‌రావుతో ఈనెల 29న(సోమవారం) సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డాక్టర్‌తో మాట్లాడవచ్చు. తేదీ 29–12–2025, సోమవారం సమయం ఉదయం 11నుంచి 12గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 9705346396 -
‘హేమాచలం’లో సందడి
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రం ఆదివారం మేడారం భక్తులతో సందడిగా మారింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జాతరను తలపించేలా.. మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు హేమచలుడిని కూడా దర్శించుకుంటున్నారు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచే చింతామణి జలపాతం వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తి శ్రద్ధలతో పూజలు ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. -
కలిసిరాని కాలం
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, కందులు తదితర పంటలను విరివిగా పండిస్తారు. ప్రభుత్వం ఆధునికీకరణ, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తరచూ నష్టపోతున్నారు. సాగు సమయంలో వర్షాలు.. గోదావరి జలాల కోసం ఎదురుచూశారు. వానాకాలం, యాసంగిలో ఎరువుల కొరత వెంటాడింది. రోజుల తరబడి ఎరువుల దుకాణాల ఎదుట ‘క్యూ’ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు చేతికందే సమయంలో ‘మోంథా’ తుపాను కాటేసింది. పంటలు వేసే సమయంలో భరోసా దొరకని రైతులకు దెబ్బతిన్న పంటలపై ధీ(బీ)మా దొరకలేదు. కాస్త చేతికందిన పంటలకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకలేదు. ఫలితంగా 2025లో రైతులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎరువుల కోసం తండ్లాట! సాగు సమయంలో పంటలకు సరిపడా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు లభించక రైతులు రోజుల తరబడి దుకాణాల చుట్టూ ఎరువుల కోసం తిరిగారు. ఎన్నో ఇబ్బందులు పడి ఎరువులు దక్కించుకుని తెగుళ్లు, కలుపు భారం నుంచి బయటపడ్డ రైతులను పంట చేతికందే సమయంలో ‘మోంథా’ ముంచేసింది. కల్లాలకు తరలించిన ధాన్యం కొట్టుకుపోయింది. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, వారికి ఎలాంటి బీమా దక్కకపోగా, ఆ మేరకు పరిహారం అందలేదని పలు సందర్భాల్లో రైతులు వెల్లడించారు. రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు.. రైతులు సాంకేతికతను, మార్కెట్ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఎఆర్ఎస్) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్ ద్వారా హైబ్రిడ్ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్ పాండల్స్, మల్చింగ్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. జూలై వరకు లోటు వర్షపాతం... ఉమ్మడి వరంగల్‌లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. తగ్గిన పప్పుధాన్యాల సాగు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పప్పు దినుసుల సాగు గణనీయంగా తగ్గింది. గతేడాది 49,876 ఎకరాల్లో పెసర, కంది, వేరుశనగ తదితర పంటలు వేశారు. ఈసారి వానాకాలంలో 31 వేల ఎకరాలకు తగ్గినట్లు అధికారుల గణాంకాలు వెల్లడించాయి. అలాగే, సన్‌ఫ్లవర్, గ్రౌండ్ నట్, ఆముదం తదితర ఆయిల్ సీడ్స్ పంటలు 19,210 ఎకరాల నుంచి 5,429 ఎకరాలకు పడిపోయినట్లు వ్యవసాయశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాగు ఇలా (ఎకరాల్లో)..పత్తి సాగు అంచనా(ఎకరాల్లో) వరి అంచనా8,15 లక్షలు8,58,376 రైతులను వెంటాడిన ప్రకృతి వైపరీత్యాలు తుపానుతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలు ధీమా ఇవ్వని ‘బీమా’.. ఇంకా చేతికందని పరిహారం పెరిగిన వాణిజ్య పంటల సాగు... వరి, పత్తి తర్వాతే పప్పు దినుసులు రైతులకు తప్పని ఎరువుల కొరత.. వరి, పత్తికి దక్కని మద్దతు ధర ఒడిదుడుకుల మధ్య సాగిన వ్యవసాయం -
వైకుంఠ దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
చిల్పూరు: రెండో తిరుపతిగా పిలుచుకునే శ్రీ బుగులు వెంకన్న ఆలయానికి ఈనెల 30న (మంగళవారం) వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈనెల నెల 16 నుంచి జనవరి 14వరకు దేవాలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా అతి ముఖ్యమైనది వైకుంఠ ద్వార దర్శనం. దీనికి భక్తులు, దాతలు, వీఐపీలు అధికంగా వచ్చే వీలున్నందున ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. చిల్పూరుగుట్ట వద్ద వసతులు అందుబాటులో ఉన్నాయి. దేవాలయానికి చెందిన సత్రాలే కాకుండా ప్రైవేట్ గదులు అందుబాటులో ఉంటాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమైనది వైకుంఠ ద్వార దర్శనం. అందుకు ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ రోజు తీర్థ,ప్రసాదాలు ఉంటాయి. – భాగం లక్ష్మిప్రసన్న, ఈఓముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శనం చేసుకున్నట్లు. ఈ పుణ్యఫలం భక్తులు వినియోగించుకోవాలి. – రవీందర్‌శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడుధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులకు ధర్మకర్తలతో కలిసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గదులు కూడా అందుబాటు ధరల్లో ఉంచాం. అందరి సహకారంతో దిగ్విజయం చేస్తాం. – పొట్లపల్లి శ్రీధర్‌రావు, చైర్మన్● రేపు ఉత్తర ద్వార దర్శనం అన్ని వసతులు అందుబాటులో.. -
వేలం ఆదాయం రూ.2.46లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఏడాది పాటు కొబ్బరికాయల విక్రయానికి వేలం నిర్వహించగా రూ.2.46 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. శనివారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నిఖిల్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా నలుగురు వేలం పాటలో పాల్గొన్నారు. ఇందులో జీడికల్‌కు చెందిన కొండబోయిన లక్ష్మి రూ.2.46 లక్షలకు దక్కించుకుంది. గతంలో రూ.2.10 లక్షలు ఉండగా ఈసారి మరో రూ.36వేలు అధికంగా వచ్చింది. వేలంలో సర్పంచ్ కొండబోయిన మమత, ఈఓ వంశీ, సిబ్బంది భరత్, మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు పట్టణంలో విద్యుత్ అంతరాయం జనగామ: పట్టణంలో సాయినగర్ 11కేవీ లైన్ పరిధిలో ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేడు (ఆదివారం) విత్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎన్పీడీసీఎల్ ఏఈ సౌమ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయినగర్, శ్రీనగర్ కాలనీ, సాయిబాబా టెంపుల్, హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ కాలనీ ఏరియాలలో 11 కేవీ లైన్ పను ల నేపధ్యంలో ఈ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికస్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి 12వ సబ్‌జూనియర్ (బాలుర) సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం కుసుమ రమేశ్, పీడీ కొండ రవి తెలిపారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుగులోతు మధుసూదన్, సుంకరి రుత్విక్, గండికోట రాంచరణ్, గుర్రం నాని, మోటం మహేష్‌లు ఇటీవల ని ర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతి భ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. షార్ట్‌సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధంరఘునాథపల్లి: షార్ట్ సర్క్యూట్‌తో ఓ షాపులో ని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల కథ నం ప్రకారం.. మండలకేంద్రంలోని ఖిలా షాపూర్‌లోని రోడ్డులో మునిగడప విజయేందర్ స్థలం అద్దెకు తీసుకుని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, కిరాణం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. శనివారం ఉదయం షాపులో అకస్మాత్తుగా షా పులో మంటలు చెలరేగాయి. షాపు నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు విజ యేందర్కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని స్థానికులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకునే సరికే షాపులోని సరుకులు, సామగ్రి బూడిదయ్యాయి. సుమారు రూ.2.50లక్షలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని తహసీల్దార్ ఫణికిశోర్కు వినతిపత్రం అందించారు. -
కొత్త వెర్షన్ 1.0.3
యూరియా బుకింగ్‌కు నూతన వెర్షన్ యాప్ జనగామ: జిల్లాలో యూరియా పంపిణీ వ్యవస్థను పారదర్శకం, సులభతరంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఐదు జిల్లాల్లో అమలు చేయగా, వాటిలో జనగామ జిల్లా ఒకటి. జిల్లాలో రైతుల సౌకర్యార్థం కొత్త వెర్షన్ 1.0.3ను అందుబాటులోకి తీసుకు వచ్చి పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 265 ఎరువుల పంపిణీ కేంద్రాలు ఉ న్నాయి. వీటిలో 23 ఆగ్రో సేవా కేంద్రాలు, 14 పీఏ సీఎస్, 29 హాకా కేంద్రాలు, 9 ఎఫ్ిపీఓలు, మార్క్ ఫెడ్ పరిధిలో 88 సొసైటీలు, 191 ప్రైవేట్ డీలర్లు రైతులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు 1.30 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 15,846 ఎకరాల్లో సాగుతో పాటు ఇతర పంటలతో కలిపి మొత్తం 2.09 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ సా గుకు మొత్తం 26,980 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు 12,985 మెట్రిక్ టన్నులను జిల్లాకు రవాణా చేశారు. అందులో రైతులు యాప్ ద్వారా 8,100 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 36,200 యూరియా బస్తాల స్టాక్ అందుబాటులో ఉంది. పంటల వారీగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. వరికి ఎకరాకు 2.5 బస్తాలు, మొక్కజొన్నకు 3.5 బస్తాలు, మిర్చికి 5 బస్తాలు, ఇతర పంటలకు 2 బస్తాలు ఇవ్వనున్నారు. పంపిణీ వ్యవస్థలో చిన్న రైతులకు ఒకేసారి అవసరమైన యూరియాను అందిస్తుండగా, పెద్ద రైతులకు మాత్రం 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు విడతల్లో పంపిణీ చేసేలా ప్రణాళికలను రూపొందించారు. ఒకసారి యూరియా తీసుకున్న తర్వాత తదుపరి బుకింగ్ కోసం 15 రోజుల విరామాన్ని పాటించాలి. యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా బుక్ చేసుకుని, 12 మండలాల్లో ఏ కేంద్రంలోనైనా కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు. యూరియా పంపిణీపై కలెక్టర్ రిజ్వాన్‌బాషా ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అంబికా సోని పర్యవేక్షణలో ఏఓలు కె.విజయ్, ఆర్.శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఏఈఓలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. వీరికి పంచాయతీ సెక్రటరీలు, జీపీఓలు సైతం సహకారం అందిస్తున్నారు. యాప్‌లో బుకింగ్ చేసిన రైతులు 24 గంటల వ్యవధిలో బస్తాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బుకింగ్ రద్దవుతుంది. పంటల వారీగా, ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకునే అవకాశం 24 గంటల్లో యూరియా తీసుకోకుంటే రద్దు జిల్లాలో 26,985 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం -
బందగీ పోరాటం చిరస్మరణీయం
దేవరుప్పుల: తెలంగాణ రైతాంగ సాయుధ విమోచనోద్యమంలో నిజాం సర్కార్ అంతర్భాగమైన దేశ్‌ముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా చేపట్టిన షేక్ బందగీ భూసమస్యపై పోరాటం చిరస్మరణీయమని సీపీఐ అనుబంధ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరెల్ల రవి, రైతు సంఘం జిల్లా నాయకుడు బిల్లా తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కామారెడ్డిగూడెం బస్‌స్టేజీ వద్ద బందగీ 86వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన స్మారక స్తూపం వద్ద సీపీఐ, సమాధి వద్ద ముస్లింలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా బందగీ న్యాయపోరాటం ఆదర్శనీయమన్నారు. బందగీ జీవిత పోరాటం తెలిపే ప్రజానాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బందగీ వారసులు సాబీర్, ఖుద్దూస్, వాజీద్, జాకీర్‌హుస్సేన్, రబ్బానీ, మాజీ ఎంపీటీసీ జాకీర్, మౌలానా, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి -
సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి
జనగామ: సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని స మావేశం హాలులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరు ల అభివృద్ధి సంస్థ వరంగల్, రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కుచట్టం పౌరులకు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందే హ క్కును కలిగి ఉందన్నారు. ప్రతీ కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అప్పీలేట్ అథారిటీలు ద రఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. రీ జినల్ ట్రైనింగ్ మేనేజర్ మార్గం కుమారస్వామి, ట్రైనర్ మోహన క్రిష్ణ, జిల్లా కో ఆర్డినేటర్లు ఆర్టీఐపై అవగాహన కలిగించారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ -
సెర్ప్ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలి
జనగామ: సెర్ప్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సెర్ప్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్డీఏ పీడీ వసంతకు శనివారం వినతిపత్రం అందించారు. జేఏసీ ప్రతినిధులు యాదారపు రవి, సంపత్, శంకరయ్య, నరేందర్, నాగేశ్వరావు, జ్యోతి, ఎల్లస్వామి, సదానందం, యాదగిరి, ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ సెర్ప్ సిబ్బంది గత రెండు దశాబ్ధాల కాలం నుంచి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ లేకుండా బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు వేల కోట్ల రూపాయల రుణాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషించామన్నారు. పీఆర్ఆర్డీ శాఖ సర్వీస్ రూల్స్‌ను వందశాతం వర్తింప జేయడంతో పాటు జీఓ నంబర్ 11 ప్రకారం ప్రస్తుత క్యాడర్లపై మరో రెండు క్యాడర్లు పెంచి అమలు చేయాలన్నారు. సెర్ప్ సిబ్బంది చాలా మంది 50 ఏళ్ల వయస్సు దాటుతున్నా, తగిన బెనిఫిట్లు అందకపోవడం, అధిక పని ఒత్తిడి కారణంగా మరణాల శాతం కూడా పెరుగుతోందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. -
రేపు సాక్షి ఫోన్ ఇన్..
జనగామ: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దగ్గు, జలుబు, జ్వరపీడితులకు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మల్లికార్జున్‌రావుతో రేపు సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డాక్టర్‌తో మాట్లాడవచ్చు. తేదీ 29–12–2025, సోమవారం సమయం ఉదయం 11నుంచి 12గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్లు 9705346396 -
మీ పంచాయతీ సమాచారం...మీ చేతిలోనే!
● ‘మేరి పంచాయతీ’యాప్ ద్వారా సమాచారంపాలకుర్తి టౌన్: పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పాలన బాధ్యత సర్పంచ్‌లు, వార్డు సభ్యులదే. పల్లెలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో నిధులు మంజూరు చేస్తుంటాయి. వాటిని వేటికి ఖర్చు పెట్టాలి?.. ఏ అభివృద్ధి పనులు చేపట్టాలి.. తదితర వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఇక పాలకులదే. పలుచోట్ల నిధుల విషయంలో అక్రమాలు చోటు చేసుకునే అవకాశముంది. దీనికి అడ్డుకట్ట వేయడంతో పాటు పాలన పారదర్శకంగా సాగుతుందా? లేదా? అని తెలుసుకునేందకు కేంద్ర ప్రభుత్వం మేరి పంచాయత్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లో ఏం ఉంటాయంటే.. స్మార్ట్ ఫోన్లోని ప్లేస్టోర్ ద్వారా మేరి పంచాయత్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పేరు, ఫోన్ నంబర్ వివరాలతో లాగిన్ కావాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వివరాలు నమోదు చేయాలి, వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన నిధుల వివరాలు, వార్డు వారీగా ఖర్చులు, చేపట్టిన పనుల ఫొటోలు కనిపిస్తాయి. గ్రామపంచాయతీకి మంజూరైన నిధులు, వాటితో చేపట్టిన పనుల వివరాలను ఫొటోలతో సహా అధికారులు విధిగా అప్లోడ్ చేస్తారు. ఆస్తులు, ఆదాయ వివరాలు, పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి, అధికారుల వివరాలు జియోట్యాగింగ్ ద్వారా నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టారనేది తెలుసుకోవచ్చు. ఫిర్యాదులు..సలహాలు ఆర్థిక సంఘం ఎన్ని నిధులు విడుదల చేసింది. ఇంకా రావాల్సినవి ఎన్ని తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీంతో పాలకవర్గాలు పొరపాట్లకు తావివ్వకుండా ప్రతీ పైసా లెక్క ప్రకారం ఖర్చు చేసే అవకాశముంది. తప్పుడు లెక్కలు చూపితే పౌరులు ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. మరో వైపు గ్రామాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించే అవకాశం ఈ యాప్ ద్వారా పౌరులకు లభిస్తుంది. -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్‌ఎస్‌తాడ్వాయి -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందంజ
● జిల్లాలో 5,026 ఇళ్లలో పనుల కొనసాగింపు ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జనగామ రూరల్: నిరుపేదలకు నిలువ నీడ కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడంతో పాటు, మంజూరైన ప్రతీ ఇల్లు నిర్మాణంలో వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. త్వరగా గ్రౌండింగ్ చేస్తూ రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు అధికారుల కృషి, సమన్వయం ఎంతో ఉందన్నారు. జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ జరగని వాటికి సంబంధించి పలుమార్లు రివ్యూలు చేయడంతో పాటు లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా కృషి చేయడం వల్ల రాష్ట్రస్థాయిలో గ్రౌండింగ్‌లో జిల్లా ప్రథమ స్థానంలో నిలబడిందన్నారు. జిల్లాల్లో..రెండు విడతల్లో..5,834 ఇల్లు మంజూరు కాగా ఇప్పటివరకు 5,206 ఇళ్లు నిర్మాణ దశ లో ఉండగా.. 33 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. -
భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రౌటింగ్
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నూతనంగా గ్రానెట్‌తో ఫ్లోర్ నిర్మాణం పనులు చేపట్టారు. జాతర సమయంలో భక్తులు బంగారం(బెల్లం), కొబ్బరి, నీళ్లతో జారీ పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రానెట్పై గ్రౌటింగ్ చేయించే పనులను మొదలు పెట్టారు. దీనివల్ల కాలుకు గ్రిప్ లభించి కిందపడకుండా ఉంటారు. వృద్ధులు, చిన్నారులకు సైతం ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. జాతరలో మొబైల్ మరుగుదొడ్లు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం ఈ సారి మొబైల్ మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జాతరలో భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలైన ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, స్నానఘట్టాల రోడ్డు, చిలకలగుట్ట ప్రాంతంలో ప్లాస్టిక్‌తో కూడిన మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. జాతరలో మొత్తం 1,020 మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
2న శ్రీసోమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జనవరి 2న(శుక్రవారం) ఉద యం 10 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవా దాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహిచనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. గంగదేవిపల్లిని సందర్శించిన ప్రతినిధులు గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్, ఉపసర్పంచ్లు మూలగుండ్ల లావణ్యశ్రీనివాస్‌రెడ్డి, బత్తుల శ్రీధర్, యువకులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, రఘునాథఽపల్లి మండలం ఖిలాషాపురం సర్పంచ్ శాగ కవిత, అశోక్, వార్డు సభ్యులు సందర్శించి అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వారా ఆదర్శంగా నిలిచి దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందిన తీరును గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వివరించారు. సర్పంచ్ కూసం స్వరూప, కాంగ్రెస్ నాయకుడు కూసం రమేశ్, అభివృద్ధి కమిటీల ప్రతినిఽధి కూసం లింగయ్య, డీటీఎం కరుణాకర్ పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఎర్రజెండానేజనగామ రూరల్: కార్మికుల హక్కుల కోసం శ్రమజీవుల బాధల నుంచి విముక్తి చేసేది ఎర్రజెండా మాత్రమేనని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో చామకూరి యాకూబ్, ఆది సాయిన్న, ఆకుల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి చొప్పరి సోమయ్య, గుగులోతు సఖి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్తో విద్యార్థుల్లో సేవాభావం జఫర్‌గఢ్: ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజంపై బాధ్యత పెరుగుతాయని ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జానీనాయక్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా విద్యార్థినులచే ఏర్పాటు చేసిన ఏడు రోజుల ప్రత్యేక ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్ స్వప్న, ఎన్ఎస్ఎస్ పోగ్రాం అఫీసర్ లక్ష్మి, కాకతీయ యూనివర్సిటీ అడ్వైజర్ కమిటీ సభ్యులు అట్ల రాజు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తల్లులకు ‘ఈ– కానుక’
ఏటూరునాగారం: గతంలో భక్తులు హుండీల్లో నగదు వేసేవారు. అయితే కంప్యూటర్ యుగానికి అనుగుణంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈ– కానుకల సర్వీసులను మొదలు పెట్టారు. గతంలో కేవలం జాతర సమయంలో ఎక్కువగా ఈ –కానుకులు చెల్లించేది. ఇప్పుడు సాధారణ సమయంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో డిజిటల్ పేమెంట్లను కానుకల రూపంలో అమ్మవారికి చెల్లించే విధంగా ఈ–కానుక స్కానర్లను ఏర్పాటు చేశారు. దీంతో పలువురు భక్తులు కానుకలు హుండీలో వేస్తుండగా మరికొందరు నగదు రహితంగా డిజిటల్ పేమెంట్లు చేసి అమ్మవారికి కానుకలు చెల్లిస్తున్నారు. -
మరింత వేగంగా కేసుల పరిష్కారం
● వార్షిక తనిఖీలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్జనగామ: కేసుల పరిష్కారంలో మరింత వేగం పెరగాలని ఏఏస్పీ పండేరి చేతన్ నితిన్ (ఐపీఎస్) అన్నారు. వార్షిక తనిఖీ–2025 ల్లో భాగంగా శుక్రవారం ఏఎస్పీ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన కిట్ మెయింటెనెన్స్, స్వచ్ఛత, క్రమశిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యాలు వంటి అంశాలను వ్యక్తిగతంగా తనిఖీ చేశారు. అదే విధంగా స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, కేసు డైరీలు, సీడీ ఫైళ్లు, వివిధ రిజిష్టర్లు, అధికారిక దస్తావేజులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే కేసుల నమోదు ప్రక్రియ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నవీకరణ విధానం, స్టేషన్ పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫిర్యాదుదారులకు సమయానుసారంగా న్యాయం అందించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, శాంతి భద్రతల.. అంశాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్‌స్టేషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ప్రొఫెషనల్‌గా, బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు. -
ముగిసిన సమ్మక్క–సారలమ్మ జాతర వేలంపాటలు
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని తాటికొండ, జిట్టెగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని మల్లన్నగండి సమ్మక్క–సారలమ్మ జాతర వేలంపాటలను తాటికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. జాతర కమిటీ గౌరవ అధ్యక్షుడు, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, తాటికొండ సర్పంచ్ మారపాక సుజనశ్రీను, జిట్టెగూడెం సర్పంచ్ బాలునాయక్, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో వేలం పాటలు నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని తాటికొండ, జిట్టెగూడెం గ్రామాల పరిధిలో, జాతర వద్ద కొబ్బరికాయలు, బెల్లం, కోల్లు, పెద్దతీర్థం(మద్యం) అమ్మకాల కోసం పోటాపోటీగా వేలంపాటలు జరిగాయి. కోళ్ల అమ్మకానికి రూ.3.90 లక్షలు, బెల్లం(బంగారం) అమ్మకానికి రూ.91వేలు, కొబ్బరికాయల టెండర్ రూ.1.22లక్షలు, పెద్దతీర్థం(మద్యం) టెండర్‌కు రూ.8.46లక్షలకు పలికాయి. -
బడి గదిలో.. పంచాయతీ!
పాలకుర్తి టౌన్: మండలంలోని భీక్యానాయక్ పెద్దతండా..గ్రామ పంచాయతీగా ఏర్పడి ఏడు సంవత్సరాలు దాటింది. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు పక్కా భవనాన్ని నిర్మించలేదు. దీంతో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే పంచాయతీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పాఠశాలలో ఉన్నవే రెండు గదులు, ఓ గదిలో అంగన్వాడి కేంద్రం నిర్వహిస్తుంటే..మరో గదిని గ్రామ పంచాయతీకి వినియోగిస్తున్నారు. ఇందులో నిర్వహిస్తున్న పాఠశాలను విద్యార్థులు తక్కువగా ఉండడంతో సర్దుబాటులో భాగంగా ఎత్తివేశారు. దీంతో పాఠశాల భవనంలోనే అంగన్వాడీ, గ్రామపంచాయతీని నిర్వహిస్తున్నారు. ఒకటే గది కావడంతో గ్రామపంచాయతీ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొత్త పాలకవర్గాలు ఎన్నికై న సందర్భంగా ప్రభుత్వాలు సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
జనగామ
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025క్రీస్తునామం..భక్తిపారవశ్యంజిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు..పాస్టర్ల శాంతి సందేశాలుప్రార్థనలు.. సంబురాలు.. 7జనగామ: జిల్లావ్యాప్తంగా గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రేమ, శాంతి, సౌబ్రాతృత్వానికి ప్రతీకగా భావించే యేసు క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు చర్చిలకు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. ఒకవైపు భక్తిగీతాలు, మరోవైపు పాస్టర్ల శాంతి సందేశాలు మారుమోగగా, లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మించిన పవిత్ర క్షణాలను భక్తులు భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. జిల్లా కేంద్రం సహా అన్ని మండలాల్లో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సెంటినరీ ఉండ్రుపుర బాప్టిస్టు చర్చితో పాటు స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల, నర్మెట, బచ్చన్నపేట, రఘునాథపల్లి ఆయా మండలాల్లోని చర్చిల్లో నిర్వహించిన వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చారు. క్రైస్తవులు కుటుంబాలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.హనుమకొండ రోడ్డులోని సెయింట్‌పాల్స్ అండ్ పీటర్స్ రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రేయిన్ మార్కెట్లోని రూథర్‌ఫోర్డ్ చర్చి, హైదరాబాద్ రోడ్డులోని అబన్డెంట్ లైఫ్ చర్చి, ధర్మకంచలోని బేతులే బాప్టిస్టు చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనల్లో పాస్టర్లు దైవసందేశాన్ని అందజేశారు. రాజీవ్‌నగర్, వీవర్స్ కాలనీ, గిర్నిగడ్డ తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని చర్చిల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రార్థనలు చేసిన అనంతరం కేక్‌లను కటింగ్ చేశారు. – మరిన్ని ఫొటోలు 9లోu -
అవే బారులు..తప్పని తిప్పలు
స్టేషన్ ఘన్పూర్: అన్నదాతలకు యూరియా కష్టాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్స్ యాప్‌లో బుక్ చేసుకున్నా రైతులకు అవే కష్టాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని కృష్ణ ఫర్టిలైజర్స్ షాపు ఎదుట రైతులు యూరియా కోసం గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిల్చున్నారు. ఫర్టిలైజర్స్ యాప్‌లో బుధవారం సాయంత్రం స్టేషన్‌ఘన్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల మండలాల రైతులు యూరియా బస్తాల కోసం కృష్ణ ఫర్టిలైజర్స్‌లో బుక్ చేసుకున్నారు. తెల్లారి ఉదయం 8 గంటల ప్రాంతంలో వివిధ గ్రామాల నుంచి రైతులు షాపు వద్దకు చేరుకోగా ఇప్పుడు ఇవ్వడం లేదని, మధ్యాహ్నం ఇస్తామని యజమాని తెలుపడంతో రైతులు వెనుదిరిగారు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు వస్తే మరో రెండు గంటలు ఆగాలని చెప్పడంతో షాపు యజమానితో రైతులు వాగ్వాదానికి దిగారు. తీరా మధ్యాహ్నం 3 గంటల నుంచి యూరియా బస్తాలు పంపిణీ చేయగా లైన్లలో రైతుల మధ్య తోపులాట జరిగింది. బుక్ చేసుకున్న 24 గంటలలోపు తీసుకోవాలని, లేనిపక్షంలో బస్తాలు రావనే ఉద్దేశ్యంతో రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో రైతుల ఽమధ్య తోపులాటలు జరిగాయి. లింక్ పెట్టడంపై రైతుల ఆవేదన యూరియా బస్తాలకు డీఏపీ, పొటాష్, నానో యూరియా లింక్ పెట్టడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక రైతుకు మూడు బస్తాలు యూరియా ఇస్తే తప్పనిసరిగా ఒకటి, రెండు బాటిళ్ల నానో యూరియా తీసుకోవాలని లింక్ పెడుతున్నారని రైతులు ఆరోపించారు. యూరియా బస్తాకు రూ.266 బిల్లు రాస్తూ ఒక్కొక్క బస్తాకు రూ.300 తీసుకుంటున్నారని వాపోయారు. స్థానిక కృష్ణ ఫర్టిలైజర్స్ షాపు వద్ద యూరియా కోసం రైతుల తోపులాటలు, వాగ్వాదాలతో ఉద్రిక్తత నెలకొన్నా పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. యూరియాకు లింక్ పెట్టడం సరికాదు యూరియా బస్తాల కోసం వచ్చిన రైతులకు పొటాష్, డీఏపీ, నానో యూరియా లింక్ పెట్టడం సరైంది కాదు. రైతుల యూరియా కష్టాలు తీర్చేందుకు ఫర్టిలైజర్స్ యాప్ పెట్టిన ప్రభుత్వం, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ చేపట్టాలి. –ఈదులకంటి రాజు, రైతు సాయంత్రం వరకు లైన్లోనే ఉన్నా.. మాది జఫర్గడ్ మండలం తిమ్మంపేట గ్రామం. శివునిపల్లిలోని ఫర్టిలైజర్స్ షాపు వద్ద మూడు బస్తాల యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా. ఉదయం వస్తే మధ్యాహ్నం ఇస్తామన్నారు. మధ్యాహ్నం వచ్చేసరికి రైతులు లైన్లలో ఉండటంతో సాయంత్రం వరకు ఉండాల్సి వచ్చింది. –మంద రాములు, రైతు ఫర్టిలైజర్ యాప్‌లో బుక్ చేసుకున్నా తీరని యూరియా కష్టాలు పొటాష్, డీఏపీ లింక్ పెడుతున్న ఫర్టిలైజర్ షాపుల వ్యాపారులు పట్టించుకోని అధికారులు -
భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు
● పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కఎస్ఎస్తాడ్వాయి: ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించొద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తునందున్న స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కొంగలమడుగు నుంచి జంపన్నవాగు వరకు రోడ్ల మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నందున్న రోడ్ల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. అదనంగా కార్మికుల సంఖ్య పెంచి షిఫ్టుల వారీగా 24 గంటలు పనులు చేపట్టాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పీఓ చిత్రామిశ్రా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి పాల్గొన్నారు. జంపన్నవాగు, రోడ్డు నిర్మాణ పనులు.. సమీక్ష కంటే ముందుగా మంత్రి సీతక్క జంపన్నవాగులో ఏర్పాట్లు, వీవీఐపీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. శివరాంసాగర్ చెరువును పరిశీలించి జాతర సమయంలో చెరువులో స్నానాలు చేసే విధంగా నీటిని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గద్దెల ప్రాంగణంలో ప్రాకారం పనులను కూడా సీతక్క పరిశీలించారు. -
వరుస సెలవులు.. కిక్కిరిసిన బస్సులు
జనగామ: క్రిస్మస్ పర్వదినం, బాక్సింగ్ డే సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి క్రిస్మస్ పండుగ కోసం స్వగ్రామాలకు వచ్చిన ప్రజలతో పాటు విహారయాత్రల కోసం వెళ్లే ప్రయాణికులతో జనగామ ఆర్టీసీ బస్టాండు వందలాది మందితో కిటకిటలాడింది. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్లాట్‌ఫామ్స్ నిండిపోయి..స్థలం లేక ప్రయాణికులు బస్టాండు ప్రాంగణంలో నిలబడిపోయారు. ఒక్కో బస్సులో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేశారు. అమ్మవార్లకు సామూహిక ఒడిబియ్యాలుదేవరుప్పుల: ఆధ్యాత్మికత చింతన కోసమే ప్రతీనెల వివిధ ప్రాంతాల్లో అమ్మవార్లకు ఒడిబియ్యాలు సమర్పిసున్నట్టు శివశక్తి గ్రూపు ప్రతినిధులు దుద్దెళ్ల అంజమ్మ, బుక్క స్వాతి అన్నారు. గురువారం మండల కేంద్రంలో బుక్కా భాగ్యలక్ష్మీలక్ష్మయ్య దంపతుల ఆధ్వర్యంలో శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్రం విభాగం పిలుపు మేరకు తిరుమలగిరి తొండ–2 గ్రూపు ప్రతినిధులు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని శ్రీ రామాలయంలోని అమ్మవార్లకు పలు రకలా ఒడిబియ్యాలతో ఆర్యవైశ్య మహిళలు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు వ్యాపారానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మికత, సామాజిక సేవలో భాగంగా ప్రతీ నెల సామూహిక ఒడిబియ్యాలు, అమావాస్య రోజున సామూహిక అన్నదానాలు చేస్తున్నట్టు పేర్కోన్నారు. కార్యక్రమంలో బుక్క భవాణి, వనమాల ఉమ, బుక్క జ్యోతి, జయశ్రీ, వనమాల విజయ, లత, యామ మణి, శ్రీరంగం తులసీ గ్రూపు బండారి విజయ, స్వాతమ్మ పాల్గొన్నారు. పొలంబాటలో విద్యుత్ సమస్యల పరిష్కారంస్టేషన్ఘన్పూర్: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు పొలంబాట కార్యక్రమాలతో పలు విద్యుత్‌పరమైన సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ట్రాన్స్‌కో స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి సెక్షన్ ఏఈలు పి.శంకర్, శివకుమార్ అన్నారు. ఘన్పూర్ సెక్షన్ పరిధిలోని మీదికొండ గ్రామంలో, శివునిపల్లి సెక్షన్ పరిధిలోని ఇప్పగూడెంలో గురువారం విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈలు మాట్లాడుతూ.. మీదికొండలో ఇప్పటివరకు బ్రేక్డౌన్ల సత్వర పరిష్కారానికి 11 కేవీ లైన్లో 14 ఏబీ స్విచ్‌లను అమర్చగలిగామన్నారు. ఇప్పగూడెంలో వదులుగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి మధ్యలో 50 స్తంభాలను ఏర్పాటుచేశామని, ఒక 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లైన్ ఇన్స్పెక్టర్లు రామాచారి, ఒడ్డెపల్లి యాదగిరి, కాలురామ్, లైన్మన్లు పాల్గొన్నారు. -
వ్యవసాయ సంక్షోభంతోనే రైతుల ఆత్మహత్యలు
● మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్యజఫర్గఢ్: వ్యవసాయరంగ సంక్షోభానికి రైతుల ఆత్మహత్యలే నిదర్శనమని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య అన్నారు. గురువారం మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మానవ హక్కుల వేదిక బృందం కలిసి వివరాలు సేకరించింది. ఈసందర్భంగా తిడుగు గ్రామానికి చెందిన బొబ్బల రాజు, హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన మందపురి రవి గౌడ్, మండల కేంద్రానికి చెందిన కాలువ రాజు కుటుంబాలను బృందం పరామర్శించి, వివరాలు నమోదు చేసుకుంది. ఈసందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ..ఈ రైతులందరూ మూడు సంవత్సరాలుగా ఆశించిన పంట దిగుబడి రాక ఏటికేడు నష్టాల పాలై కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బదావత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి టి.హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అద్దునూరి యాదగిరి, ప్రధాన కార్యదర్శి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న ఆలయంలో జాతర ఏర్పాట్ల పరిశీలన
ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరకు ఏర్పాట్లను గురువారం ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, తాగునీరు, లైటింగ్, సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చైర్మన్ కార్యాలయంలో సమావేశమై జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సహకరించాలని చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, ఆలయ ఈఓ కందుల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్మద, ఏసీపీ వెంకటేశ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఏఈ రవి కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సురేశ్‌కుమార్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో వివిధ పోటీలలో విజేతలైన కళాశాలల జట్లకు బహుమతులు అందించారు. ముఖ్య అతిఽథి, కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య మాట్లాడుతూ.. ఓటమిచెందిన వారు నిరాశచెందకుండా వారిలోని క్రీడాప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 540 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఓవరాల్ చాంపియన్‌గా బాలుర, బాలికలలో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిలిచిందన్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా బాలుర ఓవరాల్ చాంపియన్‌గా ఘన్పూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి బి.అశోక్, బాలికల విభాగంలో వరంగల్ జీపీటీ విద్యార్థిని జి.నీల నిలిచారన్నారు. కార్యక్రమంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, పీడీ రాజుతో పాటు పీడీలు, పీఈటీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
కొరత తీరుస్తున్న
‘పొరుగు’ కూలీలు!బచ్చన్నపేట: యాసంగి వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్లో స్థానిక ఎన్నికలు రావడంతో అన్నదాతలు ఆలస్యంగా నార్లు పోశారు. స్థానిక ఎన్నికల తర్వాత అందరూ ఒకేసారి వరినాట్లు చేపట్టంతో కూలీల కొరత నెలకొంది. కూలీలకు ప్ర స్తుతం ఒకరికి రూ.500ల వరకు చెల్లించినా దొరక డం లేదు. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి కొందరు మిషన్ నాటుకు నార్లు పోశారు. వరి నాట్లు నారు పోసిన 30 రోజుల్లో నాటు వేస్తేనే సరైన పంట దిగుబడి వస్తుంది...లేకుంటే దిగుబడి తగ్గుతుందనే ఆందోళనతో రైతులు నాటు కోసం నానా పా ట్లు పడుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో బిహార్, మహారాష్ట్ర, నెల్లూరు నుంచి కూలీలను రప్పించి వరినాట్లు వేయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఒక ఎకరానికి రూ. 5,500 నుంచి రూ.6000ల వరకు తీసుకుంటున్నారు. కూలీలను వేరే గ్రామాలకు తీసుకెళ్లడానికి రైతులు ఆటోచార్జీలను కూడా భరిస్తున్నారు. ఈ కూలీలు కనీసం 20 నుంచి 30 మంది చొప్పున బ్యాచ్‌లుగా ఉండి ఒక రోజు కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా వరినాట్లు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు రాకపోతే నాటు వేయడం మరింత కష్టంగా మారేదని పలువురు అన్నదాతలు అంటున్నారు.నారుమడిలో నారు తీస్తున్న బిహార్ కూలీలుబచ్చన్నపేటలో వరి నాట్లు వేస్తున్న మహారాష్ట్ర కూలీలునాకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పంటను సాగు చేస్తాను. అన్నదాతలు అందరూ ఒకేసారి నాట్లు వేస్తుండడంతో గ్రామంలో ఉన్న కూలీ లు సరిపోవడం లేదు. పరాయి రాష్ట్రాల నుంచి కూలీలు రావడంతో సకాలంలో వరి నాట్లు పడుతున్నాయి. కూలీల కొరత తీరుతుంది. – శేఖర్‌రెడ్డి, రైతు, బసిరెడ్డిపల్లిమా రాష్ట్రంలో సరిపడా పనులు లేక తెలంగాణకు ఉపాధి కోసం భార్యభర్తలం వచ్చాం. ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి సా యంత్రం 6 గంటలకు వరకు ప ని చేస్తే మాకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలకు తగ్గకుండా గిట్టుబాటు అవుతుంది. నెల రోజుల పాటు ఒక్కడ ఉంటాం. తర్వాత మా రాష్ట్రం వెళ్లిపోతాం. – ప్రవీణ్, కూలీ, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఒకేసారి అన్నదాతల వరినాట్లు స్థానికంగా కూలీలు దొరక్క ఇబ్బందులు మహారాష్ట్ర, బిహార్, ఏపీ రాష్ట్రాల నుంచి కూలీల రాక చకచకా నాట్లు పడుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న రైతులు -
దండిగా ధాన్యసిరులు
జనగామ: ధాన్యం కొనుగోలు ప్రక్రియ అనేది సవాళ్లతో నిండిన వ్యవస్థ. తేమ శాతం నుంచి తూకం, నిల్వ నుంచి చెల్లింపుల వరకూ అనేక దశల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయినా జిల్లాలో ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా, సజావుగా, వేగవంతంగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం జిల్లా యంత్రాంగం చేపట్టిన సమగ్ర పర్యవేక్షణ, ఆధునిక సౌకర్యాల వినియోగం, సమస్యలను వెంటనే పరిష్కరించడమనే చెప్పవచ్చు. ఈ సారి ధాన్యం కొనుగోళ్లలో జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. సెంటర్ల వారీగా ధాన్యం ఏ రోజు కొనుగోలు చేశారో అదేరోజు తూకం వేయించడం, వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయించడం, రైతుల ఖాతాల్లో డబ్బులను త్వరగా జమచేయడం వంటి చర్యలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి మిల్లులకు ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసి పంపించడం, సంబంధిత వివరాలను ప్రతిరోజూ ఆన్లైన్లో నమోదు చేయడం కూడా చెల్లింపుల వేగాన్ని పెంచింది. దీంతో రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా తమ ధాన్యానికి సమయానుకూలంగా నగదు అందుకుంటున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. స్థానిక ఇబ్బందులను పరిష్కరించి, ప్రక్రియ ఎటువంటి ఆటంకం లేకుండా సాగేలా కృషి చేస్తున్నారు. ఈ సమష్టి శ్రమతో ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లాలో ప్రస్తుత వానాకాలం 2025–26 సీజన్‌న్‌లో ఇప్పటివరకు 37,101 మంది రైతుల నుంచి 14,73,608 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 329.74 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశా రు. ఇది గత ఖరీఫ్ 2024–25 కంటే గణనీయంగా ఉంది. గత సీజన్‌న్‌లో 9,10,431 క్వింటాళ్లు కొనుగోలు చేసి మొత్తం రూ.211.21 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అంతేకాక ఈ సీజన్‌న్‌లో సన్న ధాన్యం అమ్మిన రైతులకు అందించాల్సిన బోనస్ రూపంలో రూ.12.01 కోట్లు ఇప్పటికే జమ కాగా, పారదర్శకత, వేగం, అధికారుల సమీక్షలతో జిల్లా ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర స్థాయిలో ప్రథ మ స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో కొనుగోళ్లు దాదాపు 5.63 లక్షల క్వింటాళ్ల మేర పెరిగింది. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్, జనగామ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం రైతన్నలకు అండగా జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ...గత రికార్డులకు బ్రేక్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నేతృత్వంలో ప్రత్యేక గుర్తింపురైతులు : 37,101 కొనుగోలు చేసిన ధాన్యం : 14,73,608 (క్వింటాళ్లలో ) జమ చేసిన నగదు : రూ.329.74 కోట్లు సన్న ధాన్యం బోనస్ జమ : రూ.12.01 కోట్లు ప్రస్తుత సీజన్లో సన్న ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ మొత్తంగా రూ.12.01 కోట్లు జమ చేశాం. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో జిల్లా తొలి స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. కొనుగోళ్ల సమయంలో జాప్యం లేకుండా, రోజువారీ అప్డేట్లు, వేగవంతమైన చెల్లింపులు అన్నీ కలసే ఈ సక్సెస్. ఇతర జిల్లాలు కూడా జనగామ నమూనాను అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అధికారులు, సిబ్బంది, మిల్లర్లు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. రైతులు తమ ధాన్యానికి సమయానుకూలంగా, పారదర్శకంగా చెల్లింపులు అందుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
నర్మెట విద్యార్థికి సాహిత్య అకాడమీ ఆహ్వానం
నర్మెట: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని ఎం.అభినిషకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆహ్వానం అందినట్లు పీజిహెచ్ఎం నీలం వేణు బుధవారం తెలిపారు. నవంబర్‌లో బాలల దినోత్సవం సందర్భంగా అకాడమీ చిన్నారులకు కథా రచన పోటీలను నిర్వహించగా అభినిష ప్రత్యేక బహుమతి పొందింది. కాగా, రాష్ట్రస్థాయిలో ఎంపికై న బాలల కథలను ‘బాలల ప్రపంచం’ పేరుతో అకాడమీ ముద్రించిన పుస్తకాన్ని ఈ నెల 27న రవీంద్రభారతిలో ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు. ఈసందర్భంగా అభినిషకు బహుమతి అందజేస్తారని తెలిపారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినిషను అభినందించారు. కొడకండ్ల: మండలంలోని ఏడునూతుల ఉన్నత పాఠశాలకు చెందిన సీహెచ్.అనీల్ ఉమ్మడి జిల్లా ఖోఖో టీమ్‌కు ఎంపికై నట్లు పీడీ సంధ్య తెలిపారు. తొమ్మిదో తరగతి చదువుతున్న అనీల్ ఖోఖోలో ప్రతిభను చాటుకొని ఈ నెల 30న వికారాబాద్ తాండూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఉమ్మడి వరంగల్ తరఫున పాల్గొననున్నట్లు పీడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనీల్‌ను హెచ్ఎం యాక య్య, ఉపాధ్యాయులు అభినందించారు. జనగామ: రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ, ఆంటీ క్వాక (ఇల్లీగల్ మెడికల్ ప్రాక్టీస్ వ్యతిరేక) కమిటీ కన్వీనర్‌గా జనగామకు చెందిన డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్ నియమితులయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం నుంచి తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా అమలుచేస్తానన్నారు. ఈ మేరకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, అశోక్, స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ దయాల్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుడి నిజాయితీజనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆసుపత్రికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి బంగారం, నగదు ఉన్న పర్సును ఓపీ కౌంటర్ వద్ద పోగొట్టుకున్న సంఘటన బుధవారం జరిగింది. ఈ సమయంలో బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు మట్టి కిషన్, తన భార్యకు వైద్య పరీక్షలు చేయించేందుకు హాస్పిటల్‌కు రాగా, ఓపీ కౌంటర్ వద్ద పర్సు ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ విభాగంలో పని చేస్తున్న డాక్టర్ కల్నల్ భిక్షపతి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగంకు అందజేశారు. పర్సు పోగొట్టుకున్న బాధితులు అప్రమత్తం కాకపోవడంతో ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బంగారు ఆభరణాలు, నగదు పోగొట్టుకున్న బాధితులు ఆస్పత్రికి వస్తే పూర్తి వివరాలు సేకరించి, నిజానిజాలు తెలుసుకున్న తర్వాత అప్పగిస్తామని సూపరింటెండెంట్ డాక్టర రాజలింగం తెలిపారు. పర్సులో సుమారు 10 గ్రాముల బంగారం ఆభరణాలతో పాటు రూ.2వేల నగదు ఉంది. -
యేసయ్య ఆరాధనలో..
క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తి● అర్ధరాత్రి యేసురాకను స్వాగతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు ● విద్యుత్ వెలుగుల్లో చర్చిలు, క్రైస్తవుల ఇళ్లుజనగామ: జిల్లాలో క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. ఈనెల 25న (గురువారం) జరగనున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు సంబురాల్లో మునిగిపోయారు. ప్రధాన కూడళ్లలో ఆకర్షణీయమైన నక్షత్రాలతో వెలుగుల హరివిల్లు కట్టారు. చర్చి ప్రాంగణాల్లో యేసు జననాన్ని ప్రతిబింబించే పశువులపాక నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి యేసురాకను స్వాగతిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు ఆలపించారు. క్రైస్తవ యువత ఆనందోత్సాహాల నడుమ వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు. మానవాళి కోసం శిలువపై ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభువు ప్రేమ, కరుణను స్మరించుకుంటూ భక్తులు ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. క్రిస్మస్ ట్రీ ప్రత్యేకత క్రిస్మస్ ట్రీని మొదటిసారిగా 1510లో క్రిస్మస్ రోజు జర్మనీలో లాటివియా అనే ప్రాంతంలోని ‘దిగా’ అనే గ్రామంలో తొలిసారిగా ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతోంది. వీటి కోసం తొలత ‘కీనిఫిర్లు పైన్, ఫిర్ స్రూసీ’ తదితర జాతుల చెట్లను అప్పట్లో వినియోగించేవారు. మధ్యయుగంనాటి నాటికల్లో క్రిస్మస్ ట్రీ స్వర్గం నుంచి వచ్చిందని పేర్కొంటూ ‘ట్రీ ఆఫ్ ప్యారడైజ్’గా అభివర్ణించారు. ఆరు లేదా ఏడడుగుల మొక్కలను క్రిస్మస్ ట్రీకి ఉపయోగించడం ఆనవాయితీ. 1782లో థామస్ అల్వా ఎడిసన్ సహాయకుడు ఎడ్వర్డు జాన్సన్ తొలిసారిగా క్రిస్మస్ ట్రీని విద్యుత్ దీపాలతో అలంకరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. యేసు ప్రభువు రాకకోసం క్రీస్తును నమ్మిన వారికి ఇదొక శుభదినం. ప్రభువు రాకకోసం క్రిస్మస్కు నెల ముందు నుంచే క్రీస్తు విశ్వాసులు సమాయత్తం అవుతారు. రక్షకుడిగా, మానవాళి పాప విమోచకుడిగా, మరణాన్ని గెలిచిన మహరాజుగా ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు జన్మదినాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకునేందుకు ముందు నుంచే ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రిస్మస్ అన్ని వర్గాల వారికి శాంతి, సమాధానం, ప్రేమ పంచాలి. ఒక్కరోజు ముందుగానే అన్ని చర్చిల్లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన చర్చిలతో పాటు ఆయా కాలనీల్లో అర్థరాత్రి యేసు ప్రభువు రాకను పురస్కరించుకుని ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. గురువారం ఉదయం వందలాది మంది సేవకులు ప్రార్థనా మందిరాలకు చేరుకుని దేవున్ని ఆరాధిస్తారు. పట్టణంలోని ధర్మకంచ బేతెల్ బాప్టిస్టు చర్చిలో కేక్ కట్ చేస్తున్న క్రైస్తవులు -
కులం పేరుతో దూషిస్తే కఠిన చర్యలు
బచ్చన్నపేట: కులం పేరుతో ఎవరినీ దూషించొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ జరిపారు. అలాగే సాల్వాపూర్‌లో అత్తింటి వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకోగా ఆ అత్తింటి వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గ్రామంలో మాజీ సర్పంచ్ భర్త తాతిరెడ్డి శశిధర్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన దళితులను ఈ నెల 16న తిట్టారని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేసి వివరాలను నమోదు చేసుకున్నామని వాటిని పైఅధికారులకు తెలియజేస్తామని తెలిపారు. అలాగే సాల్వాపూర్‌లో అనుశ్రీ అనే వివాహిత వరకట్న వేధింపులకు ఆత్మహత్య చేసుకోగా అందుకు కారణమైన అత్త, మామ, భర్త, మరొకరు మొత్తం నలుగురిని అరెస్టు చేశామన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ -
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల నియామకం
సుధీర్రంజన్ను సత్కరిస్తున్న మంచాల రవీందర్, గుండెల్లి రాజశేఖర్, ఉడుత ఉపేందర్, కోటా శంకర్ జనగామ: కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించిన స్టాండింగ్ గవర్నమెంట్, అడిషినల్ స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిళ్ల తాజా నియామక ఉత్తర్వు బుధవారం వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ న్యాయవాదులను కీలక పదవుల్లో నియమిస్తూ భారత ప్రభుత్వ న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌కు సీనియర్ న్యాయవాది చిలువేరు సుధీర్రంజన్ నియమితులు కాగా, అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌కు మరో ముగ్గురు న్యాయవాదులు కోటా శంకర్, ఉడుత ఉపేందర్ యాదవ్, గుండెల్లి రాజశేఖర్‌కు అవకాశం కల్పించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడంలో వీరు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ నియామకాలు మూడు సంవత్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అమలులో ఉంటాయని న్యాయ మంత్రిత్వశాఖ సెక్రెటరీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన న్యాయవాదులకు ఒకేసారి నలుగురికి బాధ్యతలు దక్కడంపై జిల్లా న్యాయవాదుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చిలువేరు సుధీర్రంజన్ను జిల్లా చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్ ఘనంగా సన్మానించి, మిగతా ముగ్గురు న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు. స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్‌కు నలుగురు -
ప్రొటోకాల్‌పై నిలదీత
లింగాలఘణపురం: మండల కేంద్రంలో బుధవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ చెక్కుల పంపిణీ అనంతరం తహసీల్దార్ రవీందర్‌ను ప్రొటోకాల్‌పై బీఆర్ఎస్ సర్పంచ్‌లు నిలదీశారు. మండల కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్‌ను వేదికపై పిలువలేదని, నామినేటెడ్ పోస్టులైన మార్కెట్ వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఏ విధంగా పిలుస్తారని స్థానిక సర్పంచ్ ఎడ్ల లావణ్య, అదేవిధంగా సమావేశానికి ఆహ్వానించి చెక్కుల పంపిణీ సయమంలో కనీసం తమ పేర్లను కూడా పిలువలేదని వడిచర్ల సర్పంచ్ కార్తీక్, నాగారం సర్పంచ్ గొరిగె ఉప్పలమ్మ, కొత్తపల్లి సర్పంచ్ విష్ణు తహసీల్దార్ తీరుపై మండిపడ్డారు. మరోసారి పునరావృతమైతే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల రాజు, గొరిగె అనిల్, బండ చంద్రమౌళి, వీరయ్య, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. తహసీల్దార్ తమను అవమానించారని బీఆర్ఎస్ సర్పంచ్ల ఆందోళన -
జనగామ
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జాతీయస్థాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలకు ఎంపిక7జనగామ రూరల్: జాతీయ స్థాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలకు తెలంగాణ బృందం తరఫున ధర్మకంచ విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని పాఠశాల హెచ్ఎం కనకయ్య అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగే టెన్నిస్ వాలీబాల్ పోటీలకు ఇటీవల 4 రోజులపాటు ధర్మ కంచ పాఠశాలలో శిక్షణా శిబిరం ఏర్పాటు చేయగా ఈ శిక్షణా శిబిరంలో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చి ఎంపికయ్యారన్నారు. సీనియర్ నేషనల్ క్రీడాకారులు బాలికలు సంధ్య, నవీక , బాలురు ఎం.గణేష్, విజయ్ జాతీయ స్థాయి క్రీడాకారులు, బాలికలు అశ్విత, మేఘన శ్రీ, బాలురు మధు, రమేశ్, మినీ నేషనల్ క్రీడాకారులు బాలికలు సాత్విక, ఐశ్వర్య, బాలురలో హరిచరణ్, శ్రీశాంత్, వర్షిత్ ఎంపికయ్యారన్నారు. -
మేడారం.. ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు, ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్‌ఎస్‌తాడ్వాయి ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
త్వరలో ‘మున్సిపల్’ పోరు..!?
ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలుసాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందనకున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్‌ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు... 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తొమ్మిది మున్సిపాలిటీల పాలకవర్గానికి ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్ది నెలలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న తొమ్మిది మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. జనవరి చివరి వారంలో షెడ్యూల్‌కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుఉమ్మడి వరంగల్‌లో మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు... మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30పుర’పీఠాలపై ప్రధాన పార్టీల గురి..మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లతో పాటు ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీలలో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలలోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు మున్సిపాలిటీ జనాభా వార్డులుములుగు 16,535 20 స్టేషన్‌ఘన్‌పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16 -
పంచాయతీ కార్యదర్శుల జిల్లా కమిటీ ఎన్నిక
జనగామ: పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రొండ్ల శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ కార్యాలయంలో బొట్ల శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా జిల్లా టీఎన్జీఓ యూనియన్ కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పేర్వారం ప్రభాకర్, జిల్లా కోశాధికారి ఎండీ హఫీజ్ హాజరయ్యారు. సంఘ ఉపాధ్యక్షుడిగా సతీష్, స్పోర్ట్స్ సెక్రటరీ సంతోష్, కల్చరల్ సెక్రటరీ మధుకర్, జాయింట్ సెక్రటరీ సంపత్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి జఫర్‌గఢ్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన అభినందన సభకు పాఠశాల హెచ్ఎం సదానందం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ అందేలా పాటుపడుతానన్నారు. తిడుగు పాఠశాల అభివృద్ధికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో లక్షలు, కోట్లు ఖర్చు చేసి సర్పంచ్‌లు ఎన్నిక కావుతుండగా గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపు సోమయ్య డబ్బులు ఖర్చు చేయకుండా ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డితో పాటు నూతన సర్పంచ్‌గా ఎన్నికై న గోపు సోమయ్యను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుందూరు సుధాకర్, సంఘం జిల్లా అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నూకల ఎల్లారెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రామారావుతో పాటు సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చిన్నారి ‘అన్నదాతలు’
జనగామ: కిసాన్ దివస్‌ను పురస్కరించుకుని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మంగళవారం ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో రైతుల ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించగా, రైతు వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ విపల్ శ్రీపతిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రైతుల శ్రమను గౌరవించాలని, ఆ భావన చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంపొందాలని సూచించారు. పిల్లల ప్రతిభను ఉపాధ్యాయులు అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ కీర్తి వీరేందర్, ప్రిన్సిపల్ ప్రభాకర్, ఉపాధ్యాయులు శోభ, అరుణ్, సాయిరామ్, శరత్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.ఎస్పీఆర్ స్కూల్లో కిసాన్ దివస్ వేడుకల్లో రైతుల వేషధారణలో చిన్నారులు -
రెండోపంటకు సాగునీరు
జనగామ రూరల్: జిల్లాలో రెండో పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని, ఒక్క ఎకరం కూడా పంట ఎండిపోకూడదని, అలాగే రోడ్డు భద్రత ప్రమాణాలను మెరుగుపర్చాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగవారం కలెక్టరేట్లో నీటి పారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి 163 డిజైన్ గాని, నిర్మాణం గాని భద్రత ప్రమాణాలను మెరుగుపర్చాలన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలి ప్రతీ గర్భిణి, శిశువు ఆరోగ్యంపై వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. కలెక్టరేట్లో మాతృ మరణాల సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.మల్లికార్జునరావు, అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయం మేలు.. రఘునాథపల్లి: ౖసేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాస్త్రవేత్తలకు సూచించారు. మండలంలోని నిడిగొండలో జయశంకర్ విశ్వవిద్యాలయం, రైతు విజ్ఙాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి పాల్గొన్నారు. కో ఆర్డినేటర్ శ్రీలత, విస్తరణ సంచాలకులు యాకాద్రి, సర్పంచ్ వీరస్వామి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ రిజ్వాన్ బాషా -
చర్చీల్లో క్రిస్మస్ కాంతులు
జనగామ: జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు క్రైస్తవులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జిల్లా వ్యాప్తంగా క్రీస్తు ఆరాధన మందిరాలు విద్యుత్తు దీపాల కాంతులతో ఆకట్టుకుంటున్నాయి. ఇళ్ల ముందు నక్షత్రాల వెలుగులు విరజిమ్ముతుండగా, ఇళ్ల లోపల క్రిస్మస్ ట్రీలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఇప్పటికే జనగామ, దేవరుప్పుల, చిల్పూరు, స్టేషన్‌ఘన్ పూర్, పాలకుర్తి, రఘునాథపల్లి, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల తదితర మండలాల్లోని చర్చిల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు, నృత్య కార్యక్రమాలతో సంబురాలు ప్రారంభించారు. -
ప్రజల ఆర్థికాభివృద్ధికే బ్యాంకుసేవలు
దేవరుప్పుల: ప్రజల ఆర్థికాభివృద్ధి కోసమే బ్యాంకు సేవలు దోహదపడుతాయని ఆర్బీఐ ఎజీఎం గోమతి సూచించారు. మంగళవారం మండలంలోని చిన్నమడూరులో కాకతీయ గ్రామీణ బ్యాంకు సింగరాజుపల్లి మేనేజర్ కత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఆన్లైన్ సేవలు, నగదు చెల్లింపు ప్రక్రియలు, సైబర్ మోసాలపై జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దారిద్య్రరేఖ దిగువనున్న ప్రజలకు బ్యాంకు రుణాలు ఇస్తూ ఉత్పత్తి రంగాల్లో పురోగతి సాధించినప్పుడే ఆర్థిక సాధికారత సాధ్యమన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మైదం జోగేశ్వర్ చిన్నమడూరులో పూర్వపు ఆర్థిక లావాదేవీలు కొనసాగేలా బ్యాంకు ఏర్పాటు ఆవశ్యకతతో కూడిన వినతి పత్రం అందించడంతో సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముసిగుంపుల వెంకటేష్, మేడ సోమనర్సయ్య, వార్డు సభ్యులు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.కాంట్రాక్ట్ పోస్టులకు నేడు ఇంటర్వ్యూలుజనగామ: జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీచేయనున్న పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులను ఈనెల 24న(బుధవారం) ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్లోని రెండో అంతస్థు వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రుల ప్రధాన పర్యవేక్షణాధికారి కార్యాలయంలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. సీఏఎస్ స్పెషలిస్టు విభాగంలో 8 పోస్టులు ఉన్నాయన్నారు. అర్హత ఏదైనా పీజీలో స్పెషాలిటీ ఉండాలన్నారు. ఎంఎస్, ఓబీజీ, డీజీవో,ఎండి.జనరల్ మెడిసిన్, ఎండీ డీఎన్బీ, పీడియాట్రిక్స్ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇంటర్వ్యూకు వచ్చే క్రమంలో అర్హత, అనుభవం గల అభ్యర్థులు అన్ని విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని చెప్పారు. ఆలయానికి రూ.1,01116 విరాళంబచ్చన్నపేట: మండలంలోని రామచంద్రాపురం గ్రామంలోని శ్రీ శివసీతారామాజనేయ స్వామి దేవాలయం పునఃనిర్మాణంలో భాగంగా నిడిగొండ సాయమ్మ, నర్సింహులు దంపతుల కుమారుడు నిడిగొండ శ్రీకాంత్ రూ.1,01116లను విరాళంగా మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో బక్కెర సిద్ధయ్య, ఆముదాల మల్లారెడ్డి, నాచగోని సిద్ధేశ్వర్, సుంకే కనకయ్య, నల్ల రవీందర్‌రెడ్డి, నర్మెట చంద్రమౌళి, నాగరాజు, యాదగిరి, రాములు, కనకయ్య, రమేశ్, నర్సయ్య, బింగి రవి, చిమ్మ మహేశ్, కనకయ్య, మల్లయ్య పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికచిల్పూరు: పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న జీడి ప్రీతి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఎల్లంబట్ల విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు దేవ్‌సింగ్ తెలి పారు. వరంగల్‌లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా జూనియర్ ఖోఖో పోటీల్లో ప్రీతీ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు. ఈనెల 30, 31, జనవరి 1వ తేదీన వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. -
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
జనగామ రూరల్: రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దృష్ట్యా జనవరిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. నేడు ‘మీ డబ్బు.. మీ హక్కు’ ప్రత్యేక శిబిరం ప్రజలు క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులను తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నామని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఆస్తులు యజమానులకు చేరేలా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి -
రామసక్కని నేలకు రామ్సర్
పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ స్థాయి (రామ్సర్ సైట్‌గా) గుర్తింపు లభించనుంది. ఆ దిశగా సర్వేలు కొనసాగుతున్నాయి. – ఖానాపురంకామన్ కెస్ట్రాల్ లిటిల్ రింగ్డ్ ప్లవర్ టికెల్స్ బ్లూఫ్ లైకాచర్ -
కొలువుదీరారు
పండుగలా కొత్త సర్పంచులు, వార్డుమెంబర్ల ప్రమాణ స్వీకారంజనగామ: జిల్లాలో సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగాయి. స్పెషల్ ఆఫీసర్ల పాలనకు వీడ్కోలు పలుకుతూ, నూతన సర్పంచులకు ఘన స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనాలు, ఊరేగింపులు, బాణాసంచా మధ్య పంచాయతీ కార్యాలయాలు సందడిగా మారాయి. టెంట్ల కింద నిర్వహించిన వేడుకలకు వేలాది మంది హాజరయ్యారు. ఇదిలాఉండగా ఉప సర్పంచ్ చెక్ పవర్‌పై జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీసింది. జనగామ మండలం వెంకిర్యాల సర్పంచ్ అనారోగ్య కారణాలతో అంబులెన్స్‌లోనే ప్రమాణ స్వీకారం చేయగా, ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో కొంతమంది వార్డు సభ్యులు వేడుకలకు దూరంగా ఉండడం విశేషం. స్పెషల్ ఆఫీసర్లకు వీడ్కోలు.. సర్పంచ్‌లకు స్వాగతం జిల్లాలోని 12మండలాలు, 280 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులచే సోమవారం స్పెషల్ ఆఫీసర్లు ప్రయాణ స్వీకారం చేయించారు. 2024 ఫిబ్రవరి 2వ తేదీన సర్పంచ్, పాలక మండళ్ల పదవీ కాలం ముగియగా, అప్పటి నుంచి నేటి వరకు స్పెషల్ ఆఫీసర్ల నేతృత్వంలో పంచాయతీ పాలన కొనసాగింది. ఉదయం 10 గంటలకు అన్ని పంచాయతీల్లో ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు మొదలుకాగా, శుభ ముహూర్త సమయంలో ప్రయాణ స్వీకారం చేసిన అనంతరం, అధికారిక సంతకాలు చేశారు. అనంతరం జీపీ తరఫున సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించారు. 23 నెలల సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన స్పెషల్ ఆఫీసర్లకు ఘనంగా వీడ్కోలు పలుకగా, సర్పంచ్‌లు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీల్లో ప్రజాస్వామ్య పరిపాలన పునరాగమనం కావడంతో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. ప్రమాణ స్వీకారాలు వాయిదా.. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం వాయిదా పడగా, జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన సర్పంచ్ అలేఖ్య అంబులెన్స్‌లోనే ప్రమాణ స్వీకారం చేశారు. బచ్చన్నపేట మండలంలోని వంగ సుదర్శన్‌రెడ్డి నగర్ 5వ వార్డు, బండనాగారం 1వ వార్డు, కొడకండ్ల మండలం రేగులోని 8వ వార్డు, జఫర్‌గఢ్ మండలం తీగారం, హిమ్మత్‌నగర్ 5,4, కొనాయచలం 1వ, షాపల్లి 8వ, తిగుడు 2వ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు. నర్మెట మండలంలోని గండిరామారం పాలక మండలి మొత్తంగా ఈ వేడుకలను వాయిదా వేశారు. సర్పంచ్ చి న్నాన్న మృతి చెందడంతో అన్ని పార్టీల ఏకభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతా చోట్ల వార్డు సభ్యులు అలకబూనడం, టూర్లకు వెళ్లడం, బంధువులు చనిపోగా అంత్యక్రియలకు హాజరు కావడంతో అందుబాటులో లేకపోయారు. వేద పండితుల ఆశీర్వచనం.. శుభముహూర్తంలో అధికారిక సంతకం ఊరేగింపులు..బాణసంచా పేల్చి సంబురాలు ముగిసిన స్పెషల్ ఆఫీసర్ల పాలననూతన సర్పంచ్, పాలక మండళ్ల సభ్యులు తమ అనుచరగణంతో డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా జీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పంచాయతీలను మామిడాకులు, పూలతో అలంకరించారు. ప్రమాణ స్వీకార సమయంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్న సంఘటనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరంగల్ ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షురాలు ఽలకావత్ ధన్వంతి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, పాలకుర్తి ఎమ్మె ల్యే యశస్వినిరెడ్డి, యువ నాయకుడు కొమ్మూ రి ప్రశాంత్‌రెడ్డి తదితరులు సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరై ఆశీస్సులు అందించారు. నూతన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.సర్పంచ్, పాలక మండళ్ల ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ఉప సర్పంచ్ చెక్ పవర్‌పై చర్చ ఆసక్తికరంగా మారింది. వార్డు సభ్యులుగా గెలవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసినవారు.. ఉపసర్పంచ్ పదవికి అంతే మొత్తంలో వెచ్చించి గెలిచారు. సర్పంచ్– ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రకారం సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సంయుక్త చెక్ పవర్ ఉంటుంది. కాని కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో ఈ అధికారాలు తొలగించబోతున్నారనే చర్చ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ పదవుల్లో మెజార్టీ దక్కించుకోవడంతో, ఉప సర్పంచులకు చెక్ పవర్ కల్పిస్తే అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉందనే వాదన వెలువడుతోంది. ఇదే అంశాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం ఆలోచనలో ఉందనే సమాచారం ప్రతి ఊరిలో వినిపిస్తుంది. ఉపసర్పంచ్ స్థాయిలో భారీ ఖర్చు చేసిన ప్రతినిధులు, చెక్‌పవర్ కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో విస్తృత చర్చలకు ఈ అంశం దారితీస్తూ, స్థానిక రాజకీయాలకు కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
టెంట్ల కిందే ప్రమాణాలు
● పలుచోట్ల జీపీ భవనాల్లేక పాఠశాలల్లో కార్యక్రమం ● కుసుంబాయితండాలో వాటర్ప్లాంటే జీపీ కార్యాలయంసాక్షి, నెట్వర్క్: జిల్లాలోని పలు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేవు. సోమవారం కొత్త గ్రామ పాలక మండళ్ల ప్రమాణ స్వీకార వేళ చాలా చోట్ల సమస్యలు దర్శనమిచ్చాయి..లింగాలఘణపురం మండలం రామచంద్రగూడెంలో జీపీ భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాల ఆవరణలో టెంట్లు వేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. రఘునాథపల్లి మండలం కుసుంబాయితండాలో పంచాయతీ భవనం లేకపోవడంతో పాలకవర్గం రేకుల షెడ్డులోనే ప్రమాణస్వీకారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో పంచాయతీ కార్యాలయం ప్రస్తుతం వాటర్ ప్లాంట్‌లో కొనసాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని రంగరాయగూడెం జీపీకార్యాలయ భవనానికి ఒకే గది ఉండగా అదికాస్త శిథిలావస్థలో ఉంది. నమిలిగొండలోనూ దాదాపు అదే పరిస్థితి. తరిగొప్పుల మండలంలోని గిరిజన తండాల్లో గ్రామపంచాయతీ పక్కా భవనాలు లేకపోవడంతో నూతనంగా ఎన్నికై న గ్రామపంచాయతీ పాలకవర్గాలు టెంట్ కిందే ప్రమాణ స్వీకారం చేశాయి. -
రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు పల్లగుట్ట విద్యార్థులు
చిల్పూరు: స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో జరిగిన షూటింగ్‌బాల్ సెలక్షన్స్‌లో మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఎల్లంభట్ల విజయ్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ దేవ్‌సింగ్ తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణలో జీడి ప్రీతి, కోల సాయిప్రియ, చిదురాల అరియానా, బోనాల చిత్ర, సాదం హసీనాను అభినందించారు. ఈనెల 25 నుంచి మహబూబాబాద్ జిల్లా అన్నారంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పద్మావతి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వండి స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్ ఘన్పూర్ రైల్వేస్టేషన్లో పద్మావతి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్న ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్యులు, వ్యాపారులు వరంగల్ ఎంపీ కడియం కావ్యకు సోమవారం వినతిపత్రం అందించారు. డివిజన్ కేంద్రంలోని బెలిదె వెంకన్న నివాసంలో సోమవారం ఎంపీ కడియం కావ్య ఆర్యవైశ్యులతో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఘన్పూర్ రైల్వేస్టేషన్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని, ప్రధానంగా పద్మావతి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఘన్‌పూర్‌లో హాల్టింగ్ కల్పించాలని పలువురు కోరారు. ఘన్పూర్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ తదితర ప్రాంతాలకు పలువురు వెళ్తుంటారన్నారు. రైల్వేస్టేషన్ ఘన్‌పూర్‌ను అమృత్స్టేషన్గా అభివృద్ధి చేసేలా కృషి చేయాలని వారు వినతిపత్రం ద్వారా అందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, వ్యాపారులు పాలకుర్తి సోమశేఖర్, గౌరిశెట్టి శ్రీనివాస్, నాగబండి వెంకట్రాంనర్సయ్య, సరాబు ఆంజనేయులు, పార్శి రంగారావు, యాద శ్రీనివాస్, తుమ్మనపల్లి కిరణ్, బుచ్చిబాబు, కాంగ్రెస్ నాయకులు బూర్ల శంకర్, కొలిపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం జఫర్‌గఢ్: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసాన్ని పెంపోందిస్తాయని మేరా యువభారత్ డిప్యూటీ డైరెక్టర్ చింత అన్వేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేరా యువ భారత్ వరంగల్ వారి నేతృత్వంలో మండలంలోని హిమ్మత్‌నగర్‌లో పాలకుర్తి, జఫర్‌గఢ్ మండలాలకు సంబంధించిన మండల స్థాయి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ రెండు రోజుల పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బ్లాక్ కోఆర్డినేటర్ నవీన్‌యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా చింత అన్వేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మంగు జయప్రకాష్, ఉపాధ్యాయులు, పీఈటీలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓసీ జేఏసీ సింహగర్జన సన్నాహక సమావేశంజనగామ: హక్కుల సాధన కోసం వచ్చే నెల 11వ తేదీన వరంగల్ కేడీసీలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన సింహగర్జన భారీ బహరంగ సభను విజయవంతం చేసేందుకు సోమవారం పట్టణంలోని జూబ్లీగార్డెన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు డిమాండ్లతో కూడిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి జిల్లాలోని ఓసీ సంఘ రాష్ట్ర జేఏసీ కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్‌రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏనుగు నర్సిరెడ్డి, బ్రాహ్మణ సంఘం పవన్ శర్మ, ప్రసాద్, మార్వాడి సంఘ ప్రముఖులు ద్వారాక బజాజ్, కృష్ణ జీవన్ బజాజ్, పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, పజ్జూరి జయహరి, వేమల్ల సత్యనా రాయణరెడ్డి, లోకమంతారెడ్డి, మహంకాళి హరిచంద్రగుప్త, బిజ్జాల నవీన్, గట్టు వెంకటేశ్వర్లు, నరసింహులు, భిక్షపతి, రవీందర్, శంకర్ లింగం, శివరామకృష్ణ పాల్గొన్నారు. -
యూడీఐడీ కార్డులు సకాలంలో అందించాలి
జనగామ: దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అందించేందుకు అవసరమైన యూడీఐడీ జారీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్(ఏసీ) పింకేశ్ కుమార్ అన్నారు. దివ్యాంగులకు సదరం ద్వారా అందించే యూడీఐడీ కార్డుల ప్రక్రియకు సంబంధించి సోమవారం ఏసీ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. పథకాలు పొందేందుకు దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కౌంటర్ల నిర్వహణలో అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. సూపరింటెండెంట్ రాజలింగం, డీఆర్డీఓ పీడీ వసంత, డీపీఎం, వైద్యులు పాల్గొన్నారు. -
ల్యాబ్ టెక్నీషియన్లు వచ్చేశారు!
జనగామ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో బోధన ఆసుపత్రులతో పాటు జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఖాళీలను యాదాద్రి జోన్ పరిధిలో భర్తీ చేశారు. గత శుక్రవారం ప్రజారోగ్య సంచాలక విభాగం కౌన్సి లింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేయగా, ప్రస్తుతం అవుట్సోర్సింగ్, ఒప్పంద పద్ధతిలో ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేసే క్రమంలో నియామక ప్రక్రియలో 20 మార్కుల వెయిటేజీ కల్పించారు. 42 పోస్టులు..38 మంది నియామకం జిల్లాకు 42 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఖాళీలను భర్తీ చేశారు. ఇప్పటివరకు దశాబ్దాల కాలం నుంచి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు పర్మినెంట్ అయ్యారు. ఇందులో మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రులకు 29, సీహెచ్‌సీలకు 5, పీహెచ్‌సీలకు 11 పో స్టులను కేటాయించారు. స్థానిక నియామకాల్లో జనగామ జిల్లాకు చెందిన కసాబు రాజేశ్, తాళ్ల భానుచందర్, బత్తిని సంపత్, కడవేరుకు విశ్వనాథ్, వని త, కుమారస్వామి, వేణు, ఉదయ్, వెంకట్, నీలి కాంత్ ఎంపికయ్యారు. జిల్లాకు చెందిన పది మంది టెక్నీషియన్లు పోస్టులు పొందగా, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు చెందిన 32 మంది జనగామ జిల్లా పరిధికి ఎంపిక కాగా, మంగళవారం నుంచి సేవలందించనున్నారు. ప్రస్తుతం 38 మందికి నియామక పత్రాలు అందించగా, మరో నలుగురికి ఆర్డర్ కాపీలు అందించాల్సి ఉంది. 62 మందికి పైగా.. జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ల సంఖ్య కొత్త వారితో కలుపుకుని సుమారు 62కు పైగా చేరింది. దీంతో ప్రజారోగ్యంలో సేవలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు రక్తపరీక్షల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, ఖర్చు తగ్గడంతో పాటు సమయం ఆదా కానుంది. ఈ నియామక ధ్రువపత్రాలను హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, డాక్టర్ అశోక్ కుమార్ చేతుల మీదుగా అభ్యర్థులు సోమవారం అందుకున్నారు. కొత్తగా చేరిన సిబ్బంది రానున్న రోజుల్లో ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేయనున్నారని అధికారులు వెల్లడించారు. రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నా. మా సేవలను గుర్తించి రెగ్యులర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వ దవాఖానాల్లో రక్త పరీక్షలకు సంబంధించి ప్రజలకు మరింత నమ్మకం, విశ్వాసం కలిగేలా విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తాం. – కసాబు రాజేశ్, ల్యాబ్ టెక్నీషియన్ జనగామకు 42 పోస్టులు.. 38 మందికి నియామక పత్రాలు అందజేత డీహెచ్, మెడికల్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలకు కేటాయింపులు ప్రజారోగ్య సేవలకు మరింత బలం -
కేటీఆర్..నియోజకవర్గానికి రా!
● నేనంటే ఏంటో తెలుస్తుంది.. ● సర్పంచ్ల సన్మాన సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిస్టేషన్ఘన్పూర్: ‘మాజీమంత్రి కేటీఆర్‌కు అహంకారం, బలుపు ఎక్కువ.. నన్ను, పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆడా, మగా అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.. ఒక్కసారి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి వచ్చి చూడు నేను ఆడ, మగా అనేది తెలుస్తుంది..’అని మాజీ మంత్రి కేటీఆర్‌పై స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చి గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడారు.. కేటీఆర్ తండ్రి కేసీఆర్ కన్నా వయస్సులో పెద్దవాడినని, కేసీఆర్ పదేళ్లు సీఎంగా పనిచేస్తే తాను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేశానన్నారు. తండ్రి వయస్సున్న తన గురించి కేటీఆర్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 143 మంది సర్పంచ్‌లకు 100 మంది సర్పంచ్‌లను గెలిపించుకున్న మగాడినినన్నారు. నియోజకవర్గంలో గత 15ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అభివృద్ధిని పట్టించుకోలేదని, గోకుడు, గీకుడు, చిలిపిచేష్టలతో నియోజకవర్గ పరువును తీశారని ఎమ్మెల్యే కడియం విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలోపేతం చేసిన పంచాయతీ వ్యవస్థను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, జాతీయ గ్రామీణఉపాఽధి హామీ పథకాన్ని బలహీనపరుస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, వైస్ చైర్మన్ ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు బూర్ల శంకర్‌ముదిరాజ్, బెలిదె వెంకన్న, జగదీష్‌చందర్‌రెడ్డి, దుంపల పద్మారెడ్డి, మంతెన ఇంద్రారెడ్డి. రజాక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రియమైన గ్రామ ప్రజలకు..
ఏడాదిన్నర కాలంగా నన్ను చూసి చాలా మందికి బాధ కలిగింది. ఎందుకంటే నేను మీ గ్రామపంచాయతీని. నా పాలక మండలి పదవీ కాలం ముగిశాక, కొత్త ఎన్నికలు జరగకపోవడంతో నేను అనాథగా మిగిలిపోయాను. నన్ను చూసి మీరు ఏమన్నారో, ఎలా తిట్టారో ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఎక్కడ తప్పు చేశానో అర్థం చేసుకోవడానికి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపా. నా కార్యాలయానికి వచ్చిన ప్రతివారు పొరపాట్లను ఎత్తి చూపించారు. ప్రతి మాట నా హృదయంలో గుచ్చుకుంది. ఎలక్షన్లు లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నిధులు రాలేదు. నేనేం చేసేది. కానీ ఇప్పుడు నాకు మళ్లీ ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త పాలకులు ఎన్నికయ్యారు. నా భవనంలో ఖాళీగా కనిపించిన కుర్చీల్లో మరికొద్దిసేపట్లో ప్రజాప్రతినిధులు కూర్చోబోతున్నారు. మీ సమస్యలకు నేరుగా స్పందించే నాయకత్వం వస్తోంది. నా గుండెలపై ఉన్న బరువు దిగిపోనుంది. ఇక వీధిలైట్లు అంతటా వెలుగుతాయి.. రోడ్లు శుభ్రపడతాయి. డ్రైనేజీలు క్లీన్ చేస్తారు. సీసీ రోడ్ల నిర్మాణం తిరిగి మొదలవుతాయి. సరిపడా నిధులు వస్తే. అభివృద్ధి కోసం మీరు ఆశించే రోజులు మొదలుకానున్నాయి. ఇట్లు మీ గ్రామపంచాయతీ – జనగామ -
జీపీఓలతోనే గ్రామపాలన బలోపేతం
● ఉమ్మడి జిల్లా జీపీవోల కన్వీనర్ పెండెల శ్రీనివాస్ జనగామ: గ్రామ పరిపాలన ఆఫీసర్స్ నేతృత్వంలో గ్రామాలు మరింత బలోపేతం అవుతాయని ఉమ్మడి వరంగల్ జిల్లా జీపీఓల కన్వీనర్ పెండెల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఆదివారం పెండెల శ్రీనివాస్ అధ్యక్షతన డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రామ రెవెన్యూ సహాయకుల(జీపీఓ)రాష్ట్ర నాయకులు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా జీపీఓల నూతన కమిటీ జనగామ జిల్లా గ్రామ పాలన ఆఫీసర్స్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నామాల పరుశరాములు, జిల్లా కార్యదర్శిగా కలకుంట్ల దిలీప్, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కాగా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా తుంగ రాములు, ఉపాధ్యక్షులుగా కట్ల సుభాష్, బండ భిక్షపతి, ఓర్స్ తిరుమల, సహాయ కార్యదర్శులుగా కొమురయ్య, చంద్రకళ, కోశాధికారిగా లూనవత్ చాజు, ప్రచార కార్యదర్శిగా సత్యనారాయణ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జనగామ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా గుజ్జు రవీందర్, పండుగ యాకన్న, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా జోగు యాకయ్య, రాజయ్యను ఎన్నుకున్నారు. -
రాజీమార్గమే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ జనగామ రూరల్: కక్షిదారులు పంతాలకు, పట్టింపులకు పోకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని రాజీమార్గమే రాజామార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. అదివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్‌లో 4 నాలుగు బెంచ్‌ల ద్వారా కక్షిదారుల కేసులను పరిష్కరించారు. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, బీఎస్ఎన్ఎల్ అధికారులు, చిట్‌ఫండ్స్ మేనేజర్లు కక్షిదారులతో సమావేశంలో ముందుగా బీఎస్ఎన్ఎల్ సెంట్రల్ బ్యాంక్ కేసులను పరిష్కరిస్తూ అవార్డును ప్రదానం చేశారు. మొదటి బెంచ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ, సభ్యురాలిగా కె.సునీతారాణి, రెండో బెంచ్ సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత, సభ్యురాలిగా బి.స్వప్న, మూడో బెంచ్‌కు జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, సభ్యురాలిగా టి.భవాని, నాలుగో బెంచ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప సభ్యురాలిగా ఎన్.కళ్యాణి నేతృత్వం వహించారు. మోటార్ యాక్సిడెంట్ కేసులో కక్షిదారులకు 13.50లక్షల అవార్డును ప్రదానం చేశారు. లోక్ అదాలత్‌లో మోటార్ యాక్సిడెంట్ కేసులు 10, కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు 3,139, ఫ్రీ లిటిగేషన్, బ్యాంకు, బీఎస్ఎన్ఎల్, 377 కేసులు మొత్తం 3,516 కేసులకు గాను రూ. 2,05,09,828 వసూలు చేశారు. జీడికల్లో జిల్లా జడ్జి ప్రత్యేక పూజలు లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం జిల్లా జడ్జి బి.ప్రతిమ, సబ్‌కోర్డు జడ్జి సుచరిత ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు భార్గవాచార్యులు, మురళీధరాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం జడ్జిలకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భరత్, మల్లేశం తదితరులు ఉన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
● 28, 29వ తేదీల్లో రాష్ట్ర విద్యాసదస్సు, విస్తృత సమావేశాలు ● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవిజనగామ రూరల్: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జాతీయస్థాయి ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని, ఉపాధ్యాయులకు భారమవుతున్న బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని, తక్షణం 15వేల కోట్లు విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరరావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల జిల్లా కేంద్రంలో 28 29 తేదీలలో జరిగే విద్యాసదస్సు, రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలకు ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రారంభ సభలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్, మడూరి వెంకటేశ్, ఆకుల శ్రీనివాస రావు, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు కందుల శ్రీనివాస్ ,గూడెల్లి కృష్ణ, ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ జ్ఞాపకాలను చెరిపివేసే క్రుట
● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి జనగామ: దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరును చెరిపివేసే కుట్రలో భాగమే ఉపాధి హామీ పథకానికి ఆయన పేరు తొలగించడమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం పేరులో గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మి నారాయణనాయక్, ఎర్రమల్ల సుధాకర్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, వంగాల కళ్యాణి మల్లారెడ్డి, లింగాల నర్సిరెడ్డి, గాదెపాక రాంచందర్, ఉడుత రవి, బక్క శ్రీనివాస్, జమాల్‌షరీఫ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం జనగామ: అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం మైత్రేయ కూచిపూడి, కరాటే కళాక్షేత్రం ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుంచి బతకమ్మకుంట వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బతుకమ్మ కుంటలో వివేకానంద సేవా సమితి కార్యదర్శి దొంతుల శేఖ ర్, ఎస్పీఆర్ స్కూల్ కరస్పాండెంట్ కీర్తి వీరేందర్ మాట్లాడుతూ.. ధ్యానంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో సంతోషం నిండేలా మార్చేస్తుందన్నారు. కార్యక్రమంలో కళాక్షేత్రం ఫౌండర్ పులిగిల్ల సుఖేష్, నిడిగొండ చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ వాంకుడోతు అనిత, రిటై ర్డ్ ఎంఈఓ వంగాల రాజేందర్, దొంతుల శ్రీని వాస్, బల్ల రామ్మో హన్, మల్లికార్జున్, వీరస్వామి, అడ్వకేట్ కానుగంటి శృతి పాల్గొన్నారు. గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికిగాను గురుకుల పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా డీసీఓ పి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన ఖాళీల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తును ద్వారా ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలన్నారు. ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు రుసుము రూ.100 ఉందని జనవరి 21వ తేదీ దరఖాస్తు చేసుకొ నేందుకు చివరి అవకాశం ఉందన్నారు. ప్రవేశ పరీక్ష జనవరి 22 తేదీ ఉదయం 11 గంటల నుంచి 1గంట వరకు జిల్లా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. -
పల్లెపాలనలో పట్టభద్రులు
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● తాజా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పలువురి ఎన్నిక ● విజేతల్లో న్యాయవాదులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు ● గ్రామాభివృద్ధికి పునరంకితం అవుతామని హామీ ● విద్యావంతుల ఏలుబడిలో గ్రామాల్లో వెలుగులు!ప్రజాసేవ–కుటుంబపోషణహైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచి సర్పంచ్‌గా గెలుపొందా.. కుటుంబ పోషణ, ఉద్యోగం, ప్రజాసేవలను సమాంతరంగా కొనసాగిస్తా. తండా అభివృద్ధిపై ప్రజాసేవకే అంకితం. – మౌడ్ మౌనిక, సర్పంచ్, లోక్య తండా, నర్మెట అభివృద్ధికి మొదటి ప్రాధాన్యంపీజీ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసేదాన్ని..భర్త సూచనతో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందా.. గ్రామ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా.. – గుగ్గిళ్ల నవిత, సర్పంచ్, నేలపోగుల,లింగాలఘనపురం అంకితభావంతో పనిచేస్తా..బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మెగా కంపెనీలో సీఎన్జీ గ్యాస్ విభాగంలో ఇంజనీర్‌గా పని చేశా. కన్న ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ఉద్యోగాన్ని వదులుకున్నా.. నాకున్న మూడు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా..ఇటీవల జరిగిన సర్వేయర్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచా..ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తా. –గుగులోత్ రాకేశ్ నాయక్, సర్పంచ్, నీలిబండ తండా,కొడకండ్ల అభివృద్ధి వైపు నడిపిస్తా..ఎంబీఏ వరకు చదువుకున్న.. ఇటీవల నీవన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న.. అనంతరం రాజకీయ రంగంలో అడుగుపెట్టా. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నా. – నలిమెల అనిత, సర్పంచ్,చిల్పూర్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ధర్మంగా పాటిస్తాబ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేశా. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా విజయం సాధించా.. గ్రామాభివృద్ధితో పాటు ప్రజాసేవకు నా వృత్తి ధర్మాన్ని అంకితం చేస్తా.. – పగిడిపాటి రాజు, సర్పంచ్, ఆగాపేట,నర్మెట అభివృద్ధిలో ఉద్యమ స్ఫూర్తిని చూపిస్తా.. ఎంఏ, బీఈడీ చదివా.. గ్రామసేవలో ముందుండి బీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేసి విజయం సాధించా. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు పని చేస్తా. –గాదెపాక విష్ణు, సర్పంచ్, కొత్తపల్లి, లింగాలఘణపురంజిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆయా మండలాల పరిధిలో ఉన్నత విద్య, వృత్తి, మంచి పేరును సంపాదించిన పట్టభద్రులు పెద్దఎత్తున విజయం సాధించారు. ఎమ్మెస్, బీటెక్ సివిల్ ఇంజనీర్లు, హైకోర్టు న్యాయవాదులు ప్రజల మద్దతుతో ఎన్నికై తమ గ్రామాలకు సేవ చేయాలని సంకల్పంతో బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రంగా పోటీ చేసిన వారు కొందరు.. మరికొందరు ఏకగ్రీవంగానూ ఎన్నిక కావడం గమనార్హం. ఉన్నత విద్యతో పాటు ప్రజాసేవపై ఆసక్తి కలిగిన వీరు రాబోయే ఐదేళ్లలో గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తామని శపథం చేశారు. పల్లె ప్రగతిలో తమ శక్తి, అంకితభావం, నైపుణ్యాన్ని వినియోగించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల బలోపేతానికి పనిచేస్తామని కొత్త సర్పంచ్‌లు హామీ ఇస్తున్నారు. పట్టభద్రుల విజయంతో గ్రామాల్లో కొత్త ఆశల వెలుగులు మెరుగుతున్నాయి. – జనగామఅభివృద్ధికి మారుపేరుగా మారుస్తా ఎంఏ,ఎల్ఎల్బీ ఉన్నత విద్యను అభ్యసించి, హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పనిచేశా. న్యాయవాద వృత్తిలో మానవత్వాన్ని చాటుకుంటూ సేవలు అందించా. రాజకీయ ఖైదీల విడుదలలో జనరల్ కార్యదర్శిగా, పౌర హక్కుల సంఘం నేతగా అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నా. గ్రామాభివృద్ధి కోసం పోటీచేసి 550 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా.. – బల్ల రవీంద్రనాథ్, సర్పంచ్, కట్కూర్, బచ్చన్నపేట అమెరికా నుంచి వచ్చి.. ఏకగ్రీవమయ్యాఅమెరికాలో ఎమ్మెస్ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేశా. గ్రామాభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుతో రామచంద్రపూర్ గ్రామ మొదటి పౌరుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా.. గ్రామ సమస్యల పరిష్కారమే నా ధ్యేయం. – బొందుగుల వినోద్ కుమార్, సర్పంచ్, రామచంద్రపూర్, బచ్చన్నపేట విజయం గ్రామానికి అంకితం.. ఎంబీఏ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేదాన్ని.. అత్త పద్మ ఆశయాన్ని నెరవేర్చేందుకు ఉద్యోగాన్ని వీడి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించా.. నెలకు రూ.1.50లక్షల సాలరీతో పనిచేస్తూ, భర్త ప్రవీణ్‌గౌడ్ సూచన మేరకు ఉద్యోగం వదిలి సర్పంచ్‌గా బరిలో నిలిచి మొదటిసారే ఘన విజయం సాధించా.. కుటుంబ త్యాగంతో వచ్చిన ఈ విజయాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తా.. – కోతి స్రవంతి, సర్పంచ్, కోల్కొండ, దేవరుప్పుల -
ఉత్సాహంగా అంధ ఉద్యోగుల క్రీడలు
హన్మకొండ: లూయీస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని అంధ ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహించారు. హనుమకొండ రాంనగర్‌లోని అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో మహిళలకు స్కిప్పింగ్, సాంగ్స్, అంత్యాక్షరి, పురుషులకు చెస్, త్రోబాల్, షాట్‌ఫుట్ పోటీలు జరిగాయి. అంధ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎల్.రవీందర్ మాట్లాడుతూ జనవరి 4న అంధుల ఆశాజ్యోతి లూయీస్ బ్రెయిలీ జయంతిని హనుమకొండలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు బ్రెయిలీ అని అన్నారు. జె.రాంబాబు, కార్తీక్, శైలజ, కృష్ణ, రాజు పాల్గొన్నారు. -
..అనే నేను!
● నేడే కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ● గ్రామాల్లో పండుగ వాతావరణం ● జిల్లాలో 280 సర్పంచ్‌లు.. 2,534 వార్డు సభ్యులుజనగామ: జిల్లాలోని ఈనెల 22న(సోమవారం) గ్రామపంచాయతీల్లో కొత్తగా ఎన్నికై న సర్పంచ్ల పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం కోసం సర్వం సిద్ధం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాలను శుభ్రపరిచి, ప్రత్యేకంగా అలంకరించారు. పలు మండలాల్లో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, తదితర ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరై నూతన సర్పంచ్‌లు, పాలక మండళ్లకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. శుభ మూహూర్తం చూసుకుని.. ఐదేళ్ల పరిపాలన బాధ్యతలు స్వీకరించేందుకు కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసుకుని తమ ఛాంబర్లలో అడుగుపెట్టనున్నారు. జిల్లాలోని 280 మంది సర్పంచ్, ఉప సర్పంచ్, 2,534 మంది వార్డు సభ్యులచే పంచాయతీ కార్యర్శులు ప్రమాణ స్వీకారం చేయించి, మొదటి సంతకాలు తీసుకుంటారు. ప్రమాణ స్వీకార వేడుకలకు పార్టీ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. అత్యధిక ఓటర్లున్న ప్రధాన పంచాయతీలతో పాటు చిన్న గ్రామాల్లో హడావిడి నెలకొంది. పంచాయతీ భవనాలకు రంగులు వేసి పండుగ వాతావరణంగా మార్చేశారు. సర్పంచ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, మొక్కలు నాటడం, పంచాయతీ రికార్డుల పునర్వ్యవస్థీకరణ, శుభ్రత పనులపై మొట్టమొదటగా ఫోకస్ సారించనున్నారు. పోలీసుల బందోబస్తు.. ప్రజాస్వామ్య విలువలను కాపాడే క్రమంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా సర్వం సిద్ధం చేసింది. ప్రమాణ స్వీకార వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ గాదె ఇన్నయ్య ఆశ్రమంలోనూ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు.. గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు చేశారు. ఆదివారం.. నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.ఇన్నయ్యను అరెస్ట్చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్ఐఏ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. సంస్మరణ సభలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారని దర్యాప్తులో తేలింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇన్నయ్య అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం. -
ఇప్పుడేం చేద్దాం?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్‌ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్‌లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్గా హను మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను ప్ర భుత్వం నియమించగా ఆమె బా ధ్యతలు స్వీకరించారు. వైదొలిగిన 99 పీఏసీఎస్‌లు పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం అన్ని పార్టీల్లో ఎలక్షన్స్‌పై మళ్లీ మొదలైన చర్చ -
రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి
జనగామ రూరల్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జి ల్లా నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్టీసీ, రవాణా, ఆర్ అండ్ బీ, పోలీ స్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ రోడ్డు నిబంధనలపై ప్రజ లకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు సేఫ్టీపై ప్రతీ జిల్లాలో ఏర్పడిన రోడ్ సేఫ్టీ కమిటీలు ఈ నెలాఖరులోపు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దీనిలో కలెక్టర్ చైర్మన్‌గా ఆర్ అండ్ బీ అధికారి కన్వీనర్‌గా ఉంటారన్నారు. అన్ని గ్రామాలు, పాఠశాలల్లో అధి కారులతో కలిసి అవగాహన కల్పించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఇందులో పాల్గొనేలా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవాలనే అంశాలపై ఈ నెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న టేబుల్ టాప్ (మాక్ డ్రిల్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రి జ్వాన్ బాషా సంబంధిత శాఖ అధికారులను శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, విపత్తులు సంభవించిన సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై మాక్ డ్రిల్‌లో పక్కాగా నిర్వహించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణ సహాయక చర్యలు చేపట్టడం, అంబులెన్సులు, లైఫ్ బోట్స్, లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉంచడం, రెస్క్యూ టీంలు, మెడికల్ టీంలను ఏర్పాటు చేయడం, ఇతర సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుందన్నారు. వీసీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి
తక్కువ వయస్సు ఉన్న వారికి కూడా మోకాళ్ల నొప్పులు మొదలౌతున్నాయి. ఇంత వయసులో ఇలాంటి నొప్పులంటే.. విషయం అర్థం కావడంలేదు. వాటర్ ప్లాంట్ నిర్వహణలో పట్టించుకొనేవారే లేకుండా పోయారు. దీంతో ఆ నీళ్లలో ఏది ఎంత శాతం ఉంటుందో ప్రజలకు తెలియక తాగుతున్నారు. – లింగాల వెంకటేశ్, లింగాలఘణపురం●ప్రభుత్వం ప్రజారోగ్యం కో సం లక్షలు ఖర్చు వేసి ఇంటింటికీ పంపిణీ చేస్తున్న మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనవి. గ్రామీణ ప్రాంతాల్లోని వాటర్ ప్లాంట్లు, ఆర్ఓ వాటర్ తాగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్లాంట్లు లేని తండాల్లో చాలా మంది మిషన్ భగీరథ నీరు తాగి ఆరోగ్యంగా ఉంటున్నారు. – వేణుగోపాల్, డీఈ, ఆర్డబ్ల్యూఎస్ -
మినరల్ దందా!
లింగాలఘణపురం: గ్రామీణ ప్రాంత ప్రజలంటే ఆరోగ్యంగా ఉంటారనే భావన ఉండేది. స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంతో కూడిన పల్లెలు సహితం నేడు కలుషితమౌతున్నాయి. మినరల్ వాటర్ పేరిట వారి ఆరోగ్యాలు అనారోగ్యాలుగా మారుతున్నాయి. ప్రతీ గ్రామంలో పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహణ లేదా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు నీళ్ల వ్యాపారం కోసం ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్లాంట్ల నిర్వహణపై కనీస అవగాహన లేకపోగా వాటిపై నియంత్రణ చేసే అధికారులే కరువయ్యారు. దీంతో ప్రజల ఆరోగ్యాలపై 80శాతం ప్రభావం చూపే తాగునీటితో వారికి తెలియకుండానే అనారోగ్యాల బారిన పడుతున్నారు. స్వచ్ఛమైన నీటిలో ఏఏ లవణాలు ఎంత శాతం ఉండాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్ (బీఐఎస్) నిర్ణయించిన ప్రకారం.. లీటరు నీటిలో ఉండాల్సిన మి.లీ గ్రాముల ప్రకారం (పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) పీహెచ్ 6.5మి.గ్రా–8.5మి.గ్రా, టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) అంటే నీటిలో కరిగి ఉండే మొత్తం లవణాల సంఖ్య 150–300, నీటి కాఠిన్యత 300–600, క్యాల్షియం 75–200, క్లోరైడ్ 250, 1000, క్లోరిన్ 0.2–1.0, సల్ఫేట్ 200–400, నైట్రేట్ 45, ఫ్లోరైడ్ 1.0–1.5, ఇనుము 0.3 నుంచి 1.0, మెగ్నీషీయం 30 –100, అల్యూమినీయం 0.03–0.20 మి.గ్రాములు ఉండాలి. ఇవన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడే రంగు, రుచి, వాసనలేని స్వచ్ఛమైన నీటిగా పరిగణిస్తారు. తాగునీటిలో సరైన ప్రమాణాల్లో ఖనిజ లవణాలు లేకపోతే జీర్ణవ్యవస్థ, విరేచనాలు, శిశువులపై, దంతాలు, ఎముకలపై ప్రభావం, మతిమరుపు, గుండె జబ్బులు, మోకాళ్లు, కీళ్లనొప్పుల వంటి వ్యాధుల బారినపడుతుంటారు. ఇదంతా ధీర్ఘకాలికంగా మానవ శరీరాలపై ప్రభావం చూపి ఆరోగ్యాలు క్షీణించడం మొదలౌతుంది. గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పుడే అంతా ఇక వాటి నిర్వహణపై కనీస అవగాహన లేకుండా నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా ఆటోమాటిక్ సిస్టమ్ కార్డు పెడితే నీళ్లు రావడం జరుగుతుంది. లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మండలంలో ఇటీవల ఓ గ్రామంలోని ప్లాంట్ వాటర్‌లో టీడీఎస్ పరీక్షిస్తే 18, 19 చూపించడంతో ఒక్కసారిగా అవాకై ్కయ్యారు. వాటి నియంత్రణపై అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు గాని, ఇటు గ్రామస్థాయిలో మరే అధికారికి గాని ఎలాంటి అధికారాలు లేకపోవడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. పల్లెల్లో తాగునీటి ప్లాంట్ల మోజు నిర్వహణ, నియంత్రణ కరువు ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం -
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో పనిచేయాల ని జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండీ.గౌసియాబేగం అన్నారు. ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో ఎంఈఓ కొమురయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలల సముదాయాల సమావేశాన్ని జీసీడీఓ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల సముదాయాల సమావేశాల్లో విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, కఠి నమైన పదాలు, ఒత్తు పదాలు అర్థం చేసుకోవడం, సరళపదాలు, గుణింతాలు, ఒత్తు పదాల బోధన, ఓరల్ రీడింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను పూర్తిస్థాయిలో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పేరెంట్ టీచర్స్ మీటింగ్‌ను సందర్శించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సంపత్, ఉపాధ్యాయులు మధుబాబు, రాజేందర్, రమేష్, రాజు, రాము, రజియా, ఎమ్మార్సీ సిబ్బంది గిరి, లవన్, వెంకన్న, శ్రీలత, రమేష్, స్వప్న, శిరీష తదితరులు పాల్గొన్నారు. జఫర్‌గఢ్: విద్యార్థులు సేవా భావాన్ని పెంపొందించుకోవాలని జీసీడీఓ గౌసియాబేగం కోరారు. ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ని కస్తూర్భా పాఠశాలలో 7 రోజుల ప్రత్యేక శిబిరా న్ని జీసీడీఓ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిహెచ్ స్వప్న అధ్యక్షత జరిగిన సమావేశంలో జీసీడీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ అడ్వైజర్ మెంబర్ అట్లా రాజు, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. జీసీడీఓ ఎండీ.గౌసియాబేగం -
ముగిసిన రాష్ట్ర స్థాయి క్రీడలు
జనగామ రూరల్: జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి క్రీడా ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా స్పోర్ట్స్ డిప్యూటీ సెక్రటరీ రుతుమణి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. జోనల్ అధికారి విద్యారాణి మాట్లాడుతూ ఓటమి గెలుపునకు నాంది అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు, ఎ. నరసింహులు, జి. శ్రీనివాస్, బి.కిషన్, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. 20జెజిఎన్ 156: బహుమతులు అందుకుంటున్న విద్యార్థులు -
మధ్యవర్తులతోనే సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: మధ్యవర్తులతోనే ఎక్కువ కేసులు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అన్నారు. శనివారం సీనియర్ న్యాయవాదులు, మధ్యవర్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నేడు (ఆదివారం) జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసుల పరిష్కారంలో మధ్యవర్తుల పాత్ర ముఖ్యమన్నారు. ఇది వరకు కోర్టు ముందుకు రాని కేసులు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీకి పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, వాహన ప్రమాద కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కు బౌన్‌న్స్ కేసులు ఇందులో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సుచరిత, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ, జిల్లా సబ్ జడ్జి సుచరిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యులు స్వామివారి శేషవస్త్రాలతో స న్మానించి ప్రసాదాన్ని అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ నేడు లోక్ అదాలత్ -
యాసంగికి సిద్ధం
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జనగామ రూరల్: జిల్లాలో యాసంగి పంటల సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 2.11లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకుగాను ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గతేడాది యాసంగిలో 1,53,000ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయగా.. ఈ ఏడాది 35వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరగనుంది. గత సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి..భూగర్భ జలాలు పుష్కలంగా పెరగడంతో సాగు అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత వానాకాలంలో వర్షాలు ఆలస్యం రావడంతో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. ఈనెలలో వరినాట్లు ప్రారంభమై జనవరి మొత్తం సాగనున్నాయి. వరికే మొగ్గు.. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 2.11లక్షల ఎకరాల్లో సాగు అంచనా కాగా అందులో వరిపంట 1.89లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 21వేల ఎకరాల్లో మాత్రమే ఇతర పంటలు సాగు కానున్నాయి. రెండో స్థానంలో మొక్కజొన్న 19వేల ఎకరాల్లో, వేరుశనగ పంట వేయి ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన పంటసాగు చేపట్టకుండా..పంటమార్పిడి విధానం పాటించడం వల్ల భూసారం పెరగడంతో పాటు మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. జనగామ మండలంలో నాటుకు సిద్ధమవుతున్న వరి నారుమొక్కజొన్న19,500అవసరమైన ఎరువులు (మె.టన్నుల్లో)..వరిఎకరాలు1,89,000వేరుశనగ1,050 పొగాకు850ఎరువులు, విత్తనాల కొరత లేకుండా.. జిల్లాలో యాసంగి పంటలు సాగుచేసే రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సాగు అంచనాకు అనుగుణంగా అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించింది. అన్ని పీఏసీఎస్‌లు, ఆగ్రోస్, ఇతర లైసెన్స్ దుకాణాల్లో రైతులకు ఎరువులు, విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. సన్నాలకు నో చాన్స్.. ఈ యాసంగి సీజన్లో ఎక్కువ శాతం రైతులు దొడ్డు రకం వరిసాగుకే మొగ్గు చూపుతారు. సన్నరకం వడ్లను యాసంగిలో రైతులు సాగు చేయడానికి ఇష్టపడరని సన్నరకం వడ్లలో నూకల శాతం అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నప్పటికీ.. అధికారుల అంచనా మేరకు యాసంగిలో సన్నాలకు తక్కువ మంది రైతులు మొగ్గు చూపుతారని తెలుస్తుంది.ప్రణాళికలు సిద్ధం చేశాం.. జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి పంటల సాగు అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేశాం. వర్షాకాలంలో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు అధిక వర్షాల కారణంగా నిండడంతో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. యాసంగిలో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాం. రైతులు పంటమార్పిడి విధానం పాటిస్తే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుంది..పంటల సాగులో వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. – అంబికా సోనీ , డీఏఓ 2.11లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు అంచనా గతేడాది కంటే ఈసారి పెరగనున్న విస్తీర్ణం 1.89 ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం 21వేల ఎకరాల్లో ఇతర పంటలు రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు -
మాస్టర్ ప్లాన్ కోసం ఫీల్డ్ సర్వే
జనగామ: అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా జనగామ మునిసిపాలిటీలో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ ఆర్ఎస్ఐ సాఫ్ట్‌టెక్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఫీల్డ్ సర్వే చేపట్టారు. మొదటి రోజు పట్టణంలోని 30 వార్డుల్లో సరిహద్దులను గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలతో రికార్డు చేశారు. గృహాలు, భవనాలు, మౌలిక వసతి సౌకర్యాల కోసం కచ్చితమైన రికార్డులు, అమృత్ డిజైన్ ప్రమాణాల ప్రకారం డేటాను సేకరిస్తున్నారు. కౌంటింగ్ అవకతవకలపై విచారణ చేయాలని నిరసన కొడకండ్ల: మండలంలోని నీలిబండతండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వాంకుడోత్ సురేశ్, గిరిజనులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు అనంతరం 45 ఓట్ల మెజార్టీతో తాను గెలుపొందినట్లు ప్రకటించిన ఆర్ఓ తర్వాత రీకౌంటింగ్‌లో 5 ఓట్లతో రాకేశ్ గెల్చినట్లు ప్రకటించారన్నారు. కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని తండా గిరిజనులతో ఆందోళన చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. శిశుమరణాలు తగ్గించేందుకు కృషిచేయాలి జనగామ: జిల్లాలో శిశు మరణాలను తగ్గించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు అన్నారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో శిశు మరణాల సమీక్ష జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించి, సమయానికి రెఫర్ చేయడంతో పాటు అత్యవసరంగా నాణ్యమైన చికిత్స అందిచాలన్నారు. సమీక్షలో ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డీసీహెచ్ఎస్, టీవీవీపీ విభాగం డాక్టర్ నరేందర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీదేవి, శ్యామ్‌కుమార్ ఉన్నారు. 24న అర్చక ఉద్యోగ జేఏసీ సమావేశం చిల్పూరు: ఈనెల 24న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే అర్చక ఉద్యోగ జేఏసీ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని జేఏసీ నాయకుడు గంగు ఉపేందర్‌శర్మ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో శుక్రవారం అర్చచ, ఉద్యోగుల సమావేశం బ్రహ్మణపెల్లి రవీందర్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అర్చక, ఉద్యోగులకు 25 శాతం న్యాయం జరుగగా ఇంకా 75 శాతం సమస్యల్లోనే ఉన్నారన్నారు. ప్రభుత్వానికి సమస్యలను తెలియజేయడానికే 24న సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అనుగుల రత్నాకర్‌శర్మ, డీవీఆర్‌శర్మ, కృష్ణమాచార్యులు, నిఖిలేష్, రంగాచార్యులు, మోహన్, వీరన్న, మల్లికార్జున్, శేఖర్, మహేశ్ పాల్గొన్నారు. 28, 29 తేదీల్లో యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు జనగామ రూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ సమస్యపై కేంద్రం ఉదాసీనత సరికాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 28,29వ తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలో (మాంగళ్య ఫంక్షన్ హాల్)లో రాష్ట్ర విద్యా సదస్సు–రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. ప్రారంభసభలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ పాల్గొంటారన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
● టీజీఎన్పీడీసీఎల్ (సీజీఆర్ఎఫ్–1) చైర్మన్ ఎన్.వేణుగోపాలచారి నర్మెట: విధుల్లో నిర్లక్ష్యం తగదని, విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సిబ్బంది కృషిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ (సీజీఆర్ఎఫ్–1) చైర్మన్ ఎన్.వేణుగోపాలాచారి సూచించారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఆయన వినతి పత్రాలను స్వీకరించి వెంటనే తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రఘునాథపల్లి, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన పలువురు రైతులు, వినియోగదారులు పాల్గొని మిడిల్ పోల్స్, డీటీఆర్స్ను సరిచేయడం, లైన్లను, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మార్చాలని 14 వినతి పత్రాలు అందజేశారు. అనంతరం సిబ్బందితో కలసి ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట టెక్నికల్ మెంబర్ కె.రమేశ్, ఫైనాన్స్ మెంబర్ ఎన్.దేవేందర్, సభ్యుడు ఎం.రామారావు, ఎస్ఈ సంపత్‌రెడ్డి, ఎస్ఏఓ సుదర్శన్ రావు , డీఈ లక్ష్మినారాయణ, ఏడీఈలు తదితరులు ఉన్నారు. -
విపత్తుల నివారణపై అవగాహన ఉండాలి
● వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుజనగామ రూరల్: విపత్తుల నివారణకు సంబంధిత యంత్రాంగానికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల ప్రమాదాల నివారణపై ఈనెల 22న నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎన్ డీఎంఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) డైరెక్టర్ సుధీర్ బాల్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వరదలు, పరిశ్రమల, రహదారుల ప్రమాదాలే కాక వివిధ రకాలుగా జరిగే విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ముందు జాగ్రత్తలపై సంబంధిత శాఖల యంత్రాంగానికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, అగ్నిమాపక, పంచాయతీ రాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
యూరియా..ఇక సులువయా!
● నేటినుంచి ‘ఫర్టిలైజర్ యాప్’ అందుబాటులోకిపాలకుర్తి టౌన్: గత సీజన్లో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారు. ఒక్క యూరియా బస్తా దొరికితే చాలు అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఇక నుంచి రైతులకు ఇలాంటి బాధలు లేకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ ‘ఫర్టిలైజర్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా ఎక్కడి నుంచైనా యూరియాను బుక్ చేసుకోవచ్చు. ఈనెల 20న దీన్ని ప్రారంభించనున్నారు. ఎలా నమోదు చేసుకోవాలంటే... యాప్‌ను ఓపెన్ చేసి పట్టాదారు పాసుబుక్ నంబర్, భూమి లేని కౌలురైతులైతే ఆధార్ నంబర్ సాయంతో లాగిన్ కావాలి. అందులో నమోదు చేసే సెల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాని సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం పంటల వివరాలు నమోదు చేయాలి. సాగుభూమిని బట్టి ఎన్ని బస్తాల యూరియా రైతుకు ఇవ్వాలో యాప్ సూచిస్తుంది. సమస్య ఇదే .. రైతుల్లో ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు వాడే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. మరి వీరికి ఎలా యూరియా సరఫరా చేస్తుందన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. ఎక్కడి వారు అక్కడే.. సాగుభూమి ఉన్న జిల్లా నుంచే బుకింగ్ చేసుకోవాలి. ఒకసారి తీసుకున్నాక మళ్లీ 15 రోజుల వరకు అవకాశం ఉండదు. సమీపంలో ఉండే డీలర్ల పేర్లు కనిపిస్తాయి. అందులో ఒకరిని ఎంపిక చేసుకుటే 48 గంటల్లోపు బస్తాలు తీసుకోవచ్చు. ఈ సమయం దాటితే మాత్రం రైతు పేరు తొలగిపోతుంది. మరోసారి బుకింగ్ చేసుకోవాల్సిందే. కౌలు రైతులు బుక్ చేసుకుంటే ఓటీపీ సదరు భూమి యజమాని సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.ఎన్నిసార్లు బుక్ చేసుకోవచ్చు (15 రోజుల విరామంతో) 0–1 ఎకరం: ఒకసారి 1–5 ఎకరాలు: రెండు సార్లు 5–20 ఎకరాలు : మూడు సార్లు 20 ఎకరాలపైన: నాలుగు సార్లు ఎంత మేర.. (ఎకరా వారీగా) వరి : 3 బస్తాలు మొక్కజొన్న: 4 మిగతా వాటికి: 2 -
యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై ప్రతీ మండలంలో మండల స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో యూరియా బుకింగ్ యాప్‌పై సంబంధిత అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాప్ ప్రారంభ దశలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, రైతుల సందేహాలు డీలర్ల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా బుకింగ్ యాప్ వినియోగంలో రైతులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా లేదా ఫిర్యాదులు ఉన్నా హెల్ప్‌లైన్ నంబర్: 8977745512లో సంప్రదించవచ్చన్నారు. అలాగే గ్రౌండింగ్ అయిన అన్ని ఇందిరమ్మ ఇళ్లకు (బేస్మెంట్ స్థాయిలో 40 రోజులు, రూఫ్ లెవెల్ స్థాయిలో 50 రోజులు)ఈజీఎస్ చెల్లింపుల కోసం మంజూరు పొందాలని, పరిపాలన అనుమతులు తీసుకున్న తర్వాత వాటికి మస్టర్లు రూపొందించి 90 రోజులకు గాను చెల్లింపులు ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలన్నారు. -
అప్పులే మిగిలాయి
● రాజకీయం వెనక దాగిన కన్నీటి గాథలు ● గెలిచేందుకు చేసిన ప్రయాణంలో గాయాలే ఎక్కువ ● ఎన్నికల హడావిడి తర్వాత కుటుంబం కోసం ఆరాటం ● సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి.. మధ్యతరగతి అభ్యర్థుల ఆవేదనజనగామ: సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు లక్షలు, కొన్నిచోట్ల కోట్లు ఖర్చు చేసి చివరకు ఓటమి పాలై దారుణ పరిస్థితికి చేరుకున్నారు. ఎన్నికల ముందు పార్టీ కేడర్ నుంచి వచ్చిన హామీలు, గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, ‘అన్నా మేమున్నాం..’ అంటూ చెప్పిన మాటలు ఫలితాలు వచ్చాక ఒక్కొక్కటిగా క నుమరుగైపోయాయి. పది రోజుల పాటు ఊరంతా గోలగా ప్రచారంలో మునిగిపోయిన అభ్యర్థులు, ఓటమి తర్వాత కొన్ని చోట్ల కనీసం ఓదార్పు మాట కూడా దక్కక నిశ్శబ్దంలోకి జారిపోయారు. పిల్లల భవిష్యత్తు ఎలా...? ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో అప్పులు తెచ్చుకున్నారు. భూములు అమ్మేసుకున్నారు. ఫలితాల్లో ఓటమి తప్పలేదు.. పండగలా గడిచిన ఆ పదిరోజులు.. ఇప్పుడు చీకట్లు కనిపించేలా చేశాయి. ఇల్లు గడవడమే భారంగా మారింది. పిల్లల భవిష్యత్తు ఏంటోనని ఆలోచించుకునే సమయం కూడా లేకుండా డబ్బు ఇచ్చిన వాళ్లు అసలు మొత్తం, వడ్డీ తమ చేతిలోకి రావాలనే ఒత్తిడి పెంచుతున్నారు. కొత్తగా అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చేతిలో ఉన్న డబ్బంతా ప్రచారంలో పోయిన తర్వాత కుటుంబ జీవనం నెట్టుకొచ్చే మార్గాలపై అభ్యర్థులు తడుముకుంటున్నారు. చేసింది తప్పేనా..! గ్రామం కోసం పోటీచేశాం..ప్రజలు అడిగారు కాబట్టి ముందుకొచ్చాం..గెలిస్తే సేవ చేస్తాం అనుకున్నాం. కానీ చివరకు మిగిలింది అప్పుల భారం మాత్రమే. ఇప్పుడు మళ్లీ ఉద్యోగం కోసం తిరగాలా, వ్యవసాయాన్ని నమ్ముకోవాలా, లేక వలస వెళ్లాలా అనే సందిగ్ధంలో ఓ అభ్యర్థి తన మనసులోని మనోవేదనను వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఆదరిస్తూ నిలబడి ప్రోత్సహించినవారు, ఫలితాల తర్వాత ‘తప్పు మనలోనే ఉండవచ్చు..’అని అంటున్నారని వాపోతున్నారు. అయితే పరిచయం ఉన్నవాళ్లకు డబ్బు అందకపోవడంతోనే ఓటమి వచ్చిందని తననే నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఎన్నో సంవత్సరాల శ్రమతో పైసాపైసా పోగుచేసుకుని కూడబెట్టుకున్న సొమ్మంతా ఎలక్షన్లలో నీళ్లలా ఖర్చైపోయిందని బాధపడుతున్నారు. రిజర్వేషన్ కలిసి రావడం, పార్టీ, స్వతంత్రంగా నాయకత్వం ప్రోత్సాహం ఇవ్వడంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కానీ గెలుపు వాటికి దూరమైపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని ఆందోళన, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం, సమాజం నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కలగలిపి మధ్యతరగతి అభ్యర్థుల జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఎన్నికల సందడి పోయిం ది.. మిగిలింది మాత్రం తీరని అప్పుల కుప్ప పేరుకపోయింది. కుటుంబ భవిష్యత్తుపై నీలి మబ్బులు కమ్ముకుంటూ అనిశ్చితి మాత్రమే మిగిల్చింది. -
హోరాహోరీ
● ఉత్సాహంగా 11వ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలుజనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల(బాలుర)లో 11వ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయ అధికారి పర్వతం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి అవసరం అన్నారు. క్రీడలతో శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసిక దృఢంగా తయారుకావొచ్చన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుందన్నారు. అండర్ –14 విభాగంలో : కబడ్డీ విజేతలు: జోన్–4 మొదటి బహుమతి, జోన్– 5 రెండో బహుమతి గెలిచారు. ఖోఖో విజేతలు: జోన్ –1 మొదటి బహుమతి, జోన్ –7 రెండో బహుమతి గెలిచారు. క్యారం విజేతలు జోన్–4 మొదటి బహుమతి, జోన్ –7 రెండో బహుమతి గెలిచారు. చెస్: జోన్ –2 మొదటి బహుమతి, జోన్ –3 రెండో బహుమతి గెలిచారు. టెన్నికాయిట్: జోన్ –1 మొదటి బహుమతి, జోన్ –5 రెండో బహుమతి గెలిచారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ గుంటి శ్రీనివాస్ పీడీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.కిషన్, వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్ పీడీ, పీఈటీలు పాల్గొన్నారు. -
సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
వరంగల్ క్రైం: అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగా యని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డు స్థాయి వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు. పో లింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశామని పేర్కొన్నారు. పెంబర్తి ఏఐఎఫ్ సైన్స్ ల్యాబ్ పరిశీలనజనగామ రూరల్: జిల్లాలో విద్యా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ గురువారం మండలంలోని పెంబర్తి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐఎఫ్ సైన్స్ ల్యాబ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఉన్న పరికరాలు, విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అందుతున్న శిక్షణ, బోధనా విధానాలు ల్యాబ్ వినియోగంపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ఆధుని క సైన్స్ ల్యాబ్‌లు విద్యార్థుల విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయండి లింగాలఘణపురం: కేజీవీబీలో ఇటీవల మంజూరైన మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్ ఆదేశించారు. మండలంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో రూ.42 లక్షలతో జరుగుతున్న అదనపు గది, సీసీ డ్రైన్, టాయిలెట్స్ నిర్మాణం, కిచెన్ గదిలో మరమ్మతు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ విష్ణుమూర్తి, ఏఎంఓ శ్రీనివాసు, జీసీడీఓ గౌసియాబేగం, డీఈ రవీందర్, ఏఈ వెంకటనర్సు, స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ ఉన్నారు. నేడు నర్మెటలో విద్యుత్ వినియోగదారుల సదస్సుజనగామ: నర్మెట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో సేవలు అందిస్తున్న వినియోగదారుల సమస్యలపై టీజీఎన్పీడీసీఎల్ వినియోగదారుల ఫోరం (సీజీఆర్ఎఫ్ఐ) సమావేశం ఈనెల 19న(శుక్రవారం) నిర్వహించడం జరుగుతుందని డీఈ లక్ష్మినారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఇందులో ట్రాన్స్ఫార్మర్ మార్పులు, మోటార్ మార్చడం, లైన్ల హార్డువేర్ సమస్యలు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మెరుగులు, మీటర్ మార్పులు, సరఫరా నాణ్యత, బిల్లుల సవరణ, బిల్లుల వివాదాలు వంటి అనేక అంశాలపై వినియోగదారులు ఫోరానికి వినతి చేసుకోవచ్చన్నారు. సీజీఆర్ఎఫ్ఐ ఫోరం చైర్మన్ ఎన్వీ వెంకటగోపాలచారి (8712481311), టెక్నికల్ సభ్యుడు కె.రమేశ్ (8712481314), ఫైనాన్‌న్స్ సభ్యుడు ఎన్.దేవేందర్ (8712481316), స్వతంత్ర సభ్యుడు ఎం.రామారావు (8712481485) సదస్సుకు హాజరుకానున్నట్లు తెలిపారు. నేటి నుంచి ‘మాస్టర్‌ప్లాన్’ డ్రోన్ సర్వేజనగామ: జనగామ పట్టణ అభివృద్ధిలో అమృత్–2.0లో భాగంగా జీఐఎస్ బేస్డ్ కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు ఈనెల 19(శుక్రవారం) నుంచి డ్రోన్ సర్వేను 20వ తేదీ వరకు రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన మెస్సర్ ఆర్ఎస్ఐ సాఫ్ట్‌టెక్ ప్రతినిధులు జనగామకు రానున్నట్లు తెలిపారు. పట్టణ పరిపాలన, ట్రాఫిక్, ప్రజాసౌకర్యాలు, రోడ్లు, ఇంటి నిర్మాణాలు, పార్కులు, వాటర్ డ్రైనేజీ వ్యవస్థ వంటి అంశాలపై సమాచారాన్ని కచ్చితత్వంతో సేకరించడం దీని ఉద్దేశమన్నారు. డ్రోన్ సర్వే సమయంలో ఇళ్ల పైకప్పులపై ఎలాంటి కార్యకలాపాలు చేయరాదన్నారు. జనగామ పట్టణాభివృద్ధి కోసం చేపట్టబోయే డ్రోన్ సర్వే ఒక కీలక అడుగని, సర్వే విజయవంతం అయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. -
కోర్టు తీర్పు మోదీ, అమిత్‌షాకు చెంపదెబ్బ
● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి జనగామ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు కొట్టివేయడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెంపదెబ్బలాంటిదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మోదీ, అమిత్‌షా నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కోర్టు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా ఈడీ ద్వారా కేసులు నమోదు చేయించారని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, ఇందిర, ఉడుత రవి, లింగాల నర్సింరెడ్డి, గౌస్, స్టాలిన్, కృష్ణ ఉన్నారు. -
క్రీడలతో శారీరక దృఢత్వం పెంపు
జనగామ రూరల్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుందని, విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటే భవిష్యత్తులో గొప్పవారవుతారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 11వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జాయింట్ సెక్రటరీ బి.సక్రునాయక్, డీఎస్సీడీఓ డాక్టర్ బి.విక్రమ్, డీఐఓ కె. జితేందర్‌రెడ్డి, ఎంపీడీఓ బి.మహేశ్, ఎంఈఓ జి.శంకర్‌రెడ్డి, మల్టీజోన్–1 ఆఫీసర్ అరుణకుమారి, జోనల్ ఆఫీసర్ ఎస్.విద్యారాణి, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ అలగోని నర్సింహులు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రసాయన రహిత సాగుపై అవగాహన కల్పించాలి ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ అభ్యసించిన కృషి సఖీలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మండల సమాఖ్య సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకొని, అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల స్థాయిలో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొదటి విడతగా 1875 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించామననారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవి తంగ, వ్యవసాయ అధికారి శరత్ చంద్ర , డీఆర్డీఏ జిల్లా అధికారి వసంత, అసిస్టెంట్ డీఆర్డీఏ అధికారి నిరుద్దీన్, డీపీఎం నళిని , మారి స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం కార్యకర్తలు మారపాక వెంకటస్వామి, మల్కాపురం ప్రమోద్, రావుల రాజేందర్, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ చెవ్వ కరుణాకర్ పాల్గొన్నారు. ఇంటి నుంచే యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియాని బుక్ చేయడం ద్వారా రైతులకు సాఫీగా సమర్థవంతంగా అందుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. యూరియా బుకింగ్ యాప్ అమలుపై కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీ నుంచి జిల్లాలో యూరియా అమ్మకాలు పూర్తిగా బుకింగ్ యాప్ ద్వారానే జరగాలన్నారు. జిల్లాలోని ప్రతి యూరియా విక్రయ కేంద్రంలో రైతు రిజిస్టర్ నిర్వహణ తప్పనిసరి అని యూరియా పొందే ప్రతి రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పంట వివరాలు, యూరియా బుకింగ్ ఐడీని తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. జనగామ: జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సహకరించిన పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, విద్యాశాఖ, మాస్టర్ ట్రైనర్లు, పీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్లు, జోనల్, రూట్ అధికారులు, హెల్త్, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్, జిల్లా గ్రామీణభివృద్ధి శాఖతో పాటు ఎలక్షన్ విధుల్లో భాగస్వామ్యం పంచుకున్న అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 11వ రాష్ట్రస్థాయి గురుకుల క్రీడలు ప్రారంభం -
పతుల రాజకీయంలో సతులే సర్పంచులు
దేవరుప్పుల: ఒక్క సారి కాదు..రెండోసారి కూడా పతులు రాజకీయం చేస్తే అనివార్యంగా రెండోసారి సతులు సర్పంచ్‌లు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మున్పహాడ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పదిహేను ఏళ్ల కిందట బీసీ మహిళ రిజర్వ్ కావడంతో అనివార్యంగా తన భార్య బాలమ్మ బరిలో నిలిపి గెలిచారు. ఇలాగే ధర్మగడ్డతండాకు చెందిన బీఆర్ఎస్ మండల నాయకుడు భూక్య జనార్దన్ గతంలో ఎస్టీ మహిళ రిజర్వు కావడంతో టీడీపీ నుంచి ఆయన భార్య అరుణకు సర్పంచ్ పదవి వరించింది. ఈ ఎన్నికల్లో సైతం మున్పహాడ్, ధర్మగడ్డతండా గ్రామాలు సర్పంచ్ మహిళ రిజర్వు కావడంతో మరోసారి వారి భార్యలను బరిలో నిలిపి సర్పంచ్‌లుగా గెలిపించుకున్నారు.పారుపెల్లి బాలమ్మ శ్రీనివాస్, భూక్య అరుణ జనార్దన్ -
నవశకం
పల్లెపాలనలో జనగామ: గ్రామ పాలనలో కొత్త శకం ఆరంభమైంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో 96 శాతం మందికి తొలిసారి సర్పంచ్‌గా అవకాశమొచ్చి, గ్రామ రాజకీయాలకు తాజా దిశను అందించనున్నారు. కొంగొత్త గ్రామ సచివాలయాల్లో అడుగుపెట్టి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు నడి పేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీ గ్రామ అభివృద్ధిలో నూతన సర్పంచ్ల పాత్ర కీలకంగా మారనుండగా, అనుభవం కన్నా ఆత్మవిశ్వాసానికి ప్రజలు మద్దతు తెలిపిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. జిల్లాలో గ్రామ రాజకీయాలు చారిత్రక మలుపు తిరిగాయి. స్టేషన్ ఘన్‌న్‌పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 280 సర్పంచ్ స్థానాలకు గాను 269 స్థానాల్లో కొత్త ముఖాలే గెలుపొందడం జిల్లా చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. కేవలం 11 మంది మాత్రమే గతంలో సర్పంచ్‌గా పని చేసిన వారు తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు. ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్న కొత్త సర్పంచులు, ఇకపై ఐదేళ్ల పాటు గ్రామ పరిపాలన భవిష్యత్తును నిర్దేశించనున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 96.07 శాతం స్థానాల్లో కొత్త నాయకత్వానికే ప్రజలు పట్టం కట్టడం గ్రామాల్లో మార్పుపై ఉన్న ఆకాంక్షను స్ప ష్టంగా చూపిస్తోంది. వీరిలో కొందరు ఉన్నత విద్య ను అభ్యసించిన వారు కాగా, మరి కొందరు మధ్యస్థాయి విద్యతో గ్రామ రాజకీయాల్లోకి అడుగుపెట్టా రు. ఇంకొందరికి పంచాయతీ పరిపాలనపై పూర్తి స్థాయి అనుభవం లేకపోయినా, ప్రజల నమ్మకమే తమ బలమని భావిస్తూ బాధ్యతలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అనుభవం లేకున్నా, ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అధికార యంత్రాంగంతో సమన్వయం సాధించడం ద్వారా సమర్థవంతమైన పాలన అందించాల్సిన అవసరం ఉంది. రాబోయే ఐదేళ్లపాటు గ్రామాభివృద్ధి దిశగా వారి నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి. గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలు, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు, అవసరమైన చోట ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో అదనపు బడ్జెట్‌ను తీసుకురావడంలో చురుకుదనం చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిధులు గ్రామ ప్రజల కనీస అవసరాలను తీర్చేలా ఖర్చు చేయడమే కాకుండా, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కొత్త సర్పంచుల ముందున్న అతిపెద్ద సవాల్. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శక పాలన అందించినప్పుడే ప్రజల మెప్పు పొందగలరు. ప్రతి రూపాయి గ్రామ అభివృద్ధికే ఖర్చు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లినప్పుడే నిజమైన ప్రజాప్రతినిధులుగా గుర్తింపు దక్కుతుంది. జిల్లా గ్రామ రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు గ్రామాభివృద్ధికి మేలు కలిగించేలా ఉండాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్పంచుల పాలన గ్రామాలకు సుభిక్షం తీసుకురావాలని, ప్రజలకు చేరువైన పాలనతో జిల్లాకు ఆదర్శంగా నిలవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కొత్త నాయకత్వానికి ఇది ఒక గొప్ప అవకాశం..అదే సమయంలో చరిత్రను మార్చే బాధ్యత కూడా ఎక్కువే అంటున్నారు. -
ఫలితం తారుమారు!
జనగామ: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం, చెల్లని ఓట్లు, నోటా వినియోగం కీలక చర్చనీయాంశంగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి మూడు నియోజకవర్గాల్లో మొత్తం 3,90,945 మంది ఓటర్లు ఉండగా, అందులో 3,44,040 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 46,905 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండి పోగా, నోటా, చెల్లని కేటగిరీలో 15,419 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లలో ఒకటి నోటాకు, ప్రతి వంద ఓట్లకు 3.6 శాతం మేర ఓట్లు చెల్లనివిగా ఉన్నాయి. సర్పంచ్..వార్డులకు ఇలా.. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు, 2,534వార్డుల పరిధిలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ అభ్యర్థులకు వేసే ఓటులో నోటాకు 1,203, చెల్లని ఓట్లు 6,098 నమోదయ్యాయి. వార్డు సభ్యుల నోటాకు 1,681, చెల్లని ఓట్లు 6,437 నమోదయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యులకు కలుపుకుని 15,419 ఓట్లు నోటా, చెల్లనివిగా ధ్రువీకరించగా, అభ్యర్థులకు ఉపయోగం లేకుండా పోయాయి. మొత్తం మీద పోలైన ఓట్లలో నోటాకు వచ్చిన ఓట్లు 2,884, చెల్లని ఓట్లు 12,535 ఉన్నట్లు తేల్చారు. ఈ లెక్కన ఓటర్ల ఆలోచనా తీరు, మరి కొందరిలో అవగాహన లేకపోవడం, ఆసక్తి తగ్గుదలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. బరిలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులకు నోటా, చెల్లని ఓట్లు నిర్ణయాత్మక దశలో భారీ నష్టాన్నే మిగిల్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఓటే విజయం లేదా ఓటమిని నిర్ణయించే సమయంలో వేలాది ఓట్లు నోటా, చెల్లనివిగా రావడం విజయాన్ని తలకిందులు చేశాయి. జిల్లాలో పోలింగ్ శాతం అత్యధికంగా 88శాతం ఉండటం మంచిదే అయినప్పటికీ, పోలింగ్‌కు దూరంగా ఉన్న ఓటర్లతో పాటు చెల్లని, నోటా వచ్చిన సంఖ్య వందలాది మంది అభ్యర్థుల ఆఽశలను ఆవిరి చేసింది. ఓటర్లలో ఓటు వేయడంపై అవగాహన ఉన్నా, సరైన గుర్తుపై ముద్ర వేయడంలో తడబాటు పడడంతో ఆ ఓటును పక్కనబెట్టారు. నోటా వినియోగం చాలా తక్కువే అయినా, ఇది ప్రజాభిప్రాయానికి సూచనగా భావిస్తున్నారు. పొరపాటు ఎక్కడ జరిగింది...? ఓటర్లు గుర్తుపై ముద్ర వేయడంలో పొరపాట్లు చేయడం, బ్యాలెట్ పత్రాలు అర్థం కాని పరిస్థితిలో వార్డు, సర్పంచ్ ఓటింగ్ విధానంపై స్పష్టత లేకపోవడంతో పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లనివిగా మిగిలిపోయాయి. ఇలా జరగని పక్షంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన అభ్యర్థుల విజయం పూర్తిగా మారిపోయే అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం, ఓటర్లు బ్యాలెట్ నియమాలు అర్థం చేసుకునేలా చర్యలు తీసుకోకపోవడం కూడా కా రణంగా పేర్కొంటున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఇంటింటా ప్రచారం చేసే సమయంలో ఓటింగ్ విధానం గురించి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఈ రెండు వైఫల్యాలే వేలాది ఓట్లను వృథా చేశాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు విలువైనదే కానీ ఈ ఎన్నికల్లో ఓటర్ల ఆసక్తి ఉన్నప్పటికీ అవగాహన లోపం కారణంగా అమూల్యమైన ఓట్లు లెక్కలోకి రాకుండా పోవడం ఓటమి చవిచూసిన అభ్యర్థులను నిరాశ మిగిల్చింది. ప్రభావం చూపిన నోటా, చెల్లని ఓట్లు స్వల్ప ఓట్లతో ఓడినవారికి నిరాశ పోలింగ్‌కు దూరంగా 46వేల మంది -
ఎట్టకేలకు ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక ఎట్టకేలకు జరిగింది. మండలంలో సమస్యాత్మక గ్రామంగా ఉన్న ఇప్పగూడెంలో నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యుల మధ్య సయోధ్య లేక వరుసగా నాలుగుసార్లు ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే. పోలింగ్ జరిగిన ఈనెల 11న, అనంతరం 12న, 15న, 16వ తేదీన వరుసగా నాలుగుసార్లు ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ఎంపీడీఓ, ఆర్ఓ, పంచాయతీ అఽధికారులు ప్రయత్నించినా వార్డుసభ్యుల మధ్య సయోధ్య లేక వాయిదా పడింది. గ్రామంలో కాంగ్రెస్, సీపీఎం పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లగా కాంగ్రెస్, సీపీఎం బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా ఆరు వార్డులు కాంగ్రెస్, ఆరు వార్డులు సీపీఎం కై వసం చేసుకున్నాయి. ముందస్తు ఒప్పందం మేరకు సీపీఎంకు ఉపసర్పంచ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే సీపీఎం నుంచి గెలిచిన ఆరుగురు వార్డు సభ్యులలో 5, 6, 11వ వార్డుల నుంచి గెలుపొందిన వారు ఉపసర్పంచ్ కోసం పట్టుబట్టగా నాలుగుసార్లు ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. ఉపసర్పంచ్‌గా లింగనబోయిన రాజు ఎట్టకేలకు ఉపసర్పంచ్ ఎన్నిక జరుగగా సీపీఎం బలపర్చిన అభ్యర్థిగా ఆరో వార్డు నుంచి గెలుపొందిన లింగనబోయిన రాజు ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపసర్పంచ్ ఎన్నిక కోసం చివరి అవకాశంగా ఎంపీడీఓ నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శులు నరేశ్, సత్యనారాయణ గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వార్డు సభ్యులకు సమయం ఇవ్వగా గడువు సమయానికి సరిగ్గా పదినిమిషాల ముందు కాంగ్రెస్, సీపీఎం నాయకులతో కలిసి నూతన సర్పంచ్ మందపురం రాణిఅనీల్, 11 మంది వార్డుసభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తంగా 12 వార్డులకు గాను ఐదో వార్డు సభ్యుడు పోలాసు పద్మాకర్ గైర్హాజరయ్యారు. కాగా ఉపసర్పంచ్‌గా రాజును వార్డు సభ్యుడు మంద మహేందర్ ప్రతిపాదించగా మరో వార్డు సభ్యుడు కత్తుల రాజయ్య బలపర్చారు. దాంతో ఏకగ్రీవంగా లింగనబోయిన రాజు ఉపసర్పంచ్‌గా ఎన్నికై నట్లు మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ నర్సింగరావు ప్రకటించారు. దాంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్, సీపీఎం శ్రేణులు బాణాసంచాలు కాల్చి సంబురాలు చేసుకున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికై న లింగనబోయిన రాజు -
తరలొచ్చారు!
● మూడో విడత పంచాయతీ పోరులో 88.48 శాతం పోలింగ్ నమోదు ● మహిళ–పురుష ఓటర్ల సమాన స్పందన ● జిల్లాలో మూడు విడతల్లో కలిపి 88.90శాతం ఓటింగ్జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. పోలింగ్ ముగిసే సమయానికి మూడు మండలాల పరిధిలో 88.48శాతం నమోదైంది. దేవరుప్పుల మండలం 90.10శాతంతో అగ్రస్థానంలో నిలవగా, పాలకుర్తి మండలంలో 88.19శాతం, కొడకండ్లలో 86.29శాతం ఓటింగ్‌తో గ్రామీణ ఓటర్ల ప్రజాస్వామ్య చైతన్యానికి నిలువుటద్దంలా నిలిచారు. మూడు మండలాల్లో మొత్తం 1,17,381 మంది ఓటర్లలో 89శాతానికి చేరువగా ఓటింగ్ నమోదై స్టేషన్‌ఘన్‌పూర్ తర్వాత రెండో స్థానం దక్కించుకుంది. జిల్లాలో మూడు విడతల్లో కలిపి 88.90శాతం పోలింగ్ నమోదైంది. గంట గంటకూ పెరిగిన శాతం మూడు మండలాల పరిధిలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటర్ల రద్దీ కనిపించింది. ఉదయం 9 గంటల ట్రెండ్ చూస్తే మూడు మండలాల్లో కలిపి 25.01 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రారంభ సమయంలో దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో ఓటర్లు పెద్దఎత్తున తరలిరాగా, కొడకండ్లలో మాత్రం కాస్తా వేగంగా పుంజుకుని ఉదయం 11 గంటల కల్లా ఓటింగ్ శాతం రెట్టింపు పెరిగింది. అప్పటి వరకు మూడు మండలాల్లో కలిపి 51.82 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ ముగిసే సమయం మధ్యాహ్నం 1 గంటకు 83.27 శాతం ఓట్లు పోలు కాగా, చివరికి సాయంత్రం ముగిసే సమయానికి మొత్తం కలిపి 88.48 శాతం ఓటింగ్ వద్ద ముగిసింది. మండలాల వారీగా.. దేవరుప్పుల మండలంలో ఉదయం నుంచి పెరిగిన ఓటర్ల వేగం మధ్యాహ్నానికి గరిష్ఠ స్థాయికి చేరింది. చివరికి 90.10శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో అత్యధిక రికార్డు ఇదే. కొడకండ్ల మండలంలో ఆరంభంలో మందగించిన పోలింగ్ 11 గంటల తర్వాత ఊపందుకుంది. పాలకుర్తి మండలంలో 88.19శాతం ఓట్లు నమోదయ్యాయి. మూడు విడతల్లో 88.90శాతం ఓటింగ్ మొదటి విడత స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 89.71 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మూడు నియోజకవర్గాల పరిధిలో అధిక ఓటింగ్ శాతం నమోదైంది.రెండో విడతలో జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 88.52 శాతం పోలింగ్ జరిగింది. ఇది ఇతర నియోజకవర్గాల కంటే కొద్దిగా తక్కువైనా, జిల్లాలో మంచి స్థాయి ఓటింగ్‌గా పరిగణించవచ్చు. మూడో విడతలో పాలకుర్తి నియోజకవర్గంలో 88.44శాతం పోలింగ్ నమోదు కాగా, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ శాతంతో పోలిస్తే, స్వల్పంగా తక్కువ. మూడు నియోజకవర్గాల పోలింగ్‌ను కలిపి పరిశీలిస్తే 88.90 శాతం రావడం ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. -
లాస్ట్ పంచ్ ..కాంగ్రెస్‌దే
మూడో విడతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల పోటాపోటీ జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య ఉత్కంఠభరిత పోటీ నెలకొంది. మూడు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 108 వార్డులు, మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా, 88 సర్పంచ్, 692 వార్డు స్థానాల్లో పోటీ నెలకొంది. బుధవారం జరిగిన పోలింగ్ అనం తరం మధ్యాహ్నం ప్రారంభమైన లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఏకగ్రీవాలను కలుపుకొని కాంగ్రెస్ 49 స్థానాలు తెచ్చుకోగా, బీఆర్ఎస్ 38 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ రెబల్స్‌గా పోటీ చేసిన నలుగురు స్వతంత్రులుగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పై చేయిగా నిలువగా, మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభావంతో బీఆర్ఎస్ తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇరు పార్టీల ప్రచార బృందాలు గ్రామాల వారీగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాయి. మండలాల వారీగా పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొడకండ్ల మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకుంది. ఒక చోట కాంగ్రెస్ రెబల్ విజయం సాధించగా, నాలుగు చోట్ల బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించింది. దేవరుప్పుల మండల పరిధిలో 32 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ 14, ఒక స్వతంత్ర స్థానాన్ని కై వసం చేసుకుంది. బీఆర్ఎస్ 17 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. పాలకుర్తి మండల పరిధిలో కాంగ్రెస్ 19, కాంగ్రెస్ రెబల్స్ ఇద్దరు, బీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలు పొంది అధికార పార్టీకి జలక్ పుట్టించింది. ప్రధాన పోరు పూర్తిగా కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య నడవగా, ఇతర పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికల్లో అగ్రశ్రేణి ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ, ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రెండు పార్టీలు పోటీపడటం విశేషం. పాలకుర్తి ప్రాంతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ బలం ఇప్పటికీ నిలకడగా ఉన్నదనే సంకేతాలు ఫలితాలు ఇస్తున్నాయి. ఎవరికి వారే.. ప్రచార సమయంలో మాజీమంత్రి ఎర్రబెల్లి తన పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం చేశారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి తమ ఆధిక్యానికి కారణమని కాంగ్రెస్ స్థానిక నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి నేతృత్వంలో గ్రామాల వారీగా విస్త్రత ప్రచారం చేశారు. బలబలాలు.. పాలకుర్తి మూడో విడత ఎన్నికల ఉత్కంఠను మరింత పెంచాయి. కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 38 స్థానాలు గెలుచుకొని ఏ మాత్రం తమ బలం తగ్గలేదని నిరూపించుకున్నాయి. పాలకుర్తి ప్రజలు రెండూ ప్రధాన పార్టీలకు సమాన గౌరవం ఇస్తూ తమ నిర్ణయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.కొత్తగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 20వ తేదీన శుభ ముహూర్తాలు లేవన్న మెజార్టీ సర్పంచుల అభిప్రాయం మేరకు ప్రమాణ స్వీకార తేదీని మార్చారు. సర్పంచులు, వార్డు సభ్యులు 22వ తేదీ ఉదయం నిర్ణయించిన సమయాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ ప్రాంగణాలను శుభ్రపరచడం, పండుగ వాతావరణం నెలకొనే విధంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామాభివృద్ధికి కొత్త సంకల్పాలతో ముందుకు సాగుతామని పలువురు సర్పంచులు పేర్కొన్నారు. కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 38 స్థానాల్లో జయకేతనం పాలకుర్తి, దేవరుప్పలలో రెండు పార్టీలకు సమాన స్థానాలు కొడకండ్లలో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి ఆధిక్యం మూడు విడతల్లో కాంగ్రెస్–148.. బీఆర్ఎస్ 105మండలం జీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ స్వతంత్రులు పాలకుర్తి 38 19 17 02 దేవరుప్పుల 32 14 17 01 కొడకండ్ల 21 16 04 01 మొత్తం 91 49 38 04మొదటి విడతలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వంలో కాంగ్రెస్ 69 స్థానాలు, బీఆర్ఎస్ 27 స్థానాలు సాధించగా పూర్తి ఆధిపత్యం కనబర్చగా, 10 చోట్ల స్వతంత్రులు పైచేయి సాధించారు. రెండో విడ తలో జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేకుండా పోయింది. 40 స్థానాల్లో గులాబీ దళం పరుగులు పెట్టగా, కాంగ్రెస్ 30 స్థానాలు గెలుచుకుంది. జిల్లాలో మూడు విడతలుగా పరిశీలిస్తే కాంగ్రెస్ 148 స్థానాలు, బీఆర్ఎస్ 105 స్థానాలు కై వసం చేసుకోగా బీజేపీ కేవలం నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఇంకా గెలుపొందిన వారీగా స్వతంత్రులు 23 మంది ఉన్నారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
దేవరుప్పుల: మండల కేంద్రంలోని హైస్కూల్లో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సరళిని కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దన్నారు. వరంగల్ క్రైం: జిల్లాలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ డీసీపీ రాజామహేంద్ర నాయక్‌తో కలిసి పరిశీలించారు. అదనపు డీసీపీ రవి, ఏసీపీ నర్సయ్య, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
చేతులెత్తేశారు..
జనగామ: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి రవాణా లేక, సమయానికి భోజనం అందక, వీల్‌ఛైర్ సేవలు కరువై అధికారులు, ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బచ్చన్నపేట బూత్‌లో వృద్ధ మహిళ జారి పడగా, ఏర్పాట్లలో లోపాలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మొదటి విడత పోలింగ్ సమయంలో స్టేషనన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు మండలంలో పోలింగ్ విధులు నిర్వహించిన పీఓలు, ఓపీఓలు సహా ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు తిరుగు ప్రయాణం కోసం అధికారులు, సిబ్బంది మండల కేంద్రానికి చేరుకున్నారు. అయితే, అక్కడి నుంచి జనగామకు రవాణా సౌకర్యంలేదని మండల అధికారులు చేతులెత్తేశారు. కూర్చునే వీలులేని దయనీయ స్థితిలో ఎలక్షన్ అధికారులు రోడ్డుపైనే నిలబడి పోయారు. ఈ విషయమై స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందులో కొందరు అధికారులు జనగామ సాక్షి దృష్టికి తీసుకు రాగా, వెంటనే జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించగా, ఆయన ఆదేశాల మేరకు అర్ధరాత్రి ఒంటిగంటకు ఓ బస్సు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశించినప్పటికీ, స్టేషన్ ఘన్పూర్ వరకే తీసుకెళ్తామని చెప్పడంతో సిబ్బంది మరింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనగామ వరకు తీసుకొచ్చారు. కొడకండ్లలో తీవ్ర నిర్లక్ష్యం మూడవ విడతలో పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో విధులు నిర్వర్తించిన సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి తాగునీరు, టీ, భోజనం వంటి సౌకర్యాలు లేక రాత్రి 11.30 గంటల వరకు ఆకలితోనే ఉండాల్సి వచ్చింది. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని నినదిస్తూ, వెంటనే కలెక్టర్ రావాలని బూత్ ప్రాంగణంలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉండడంతో జీపీ చెత్త సేకరణ ట్రాక్టర్లో ఓ సంచిలో అన్నం ప్యాకెట్లను వేసుకుని తీసుకొచ్చారు. ఇలాంటి వాటిలో ఎలా తినాలి, మధ్యాహ్నం నుంచి కడుపు మండిపోతోంది, షుగర్, బీపీలాంటి సమస్యలతో బాధపడేవారు ఉన్నారు, ఇదేనా ఎన్నికల్లో సిబ్బందిపై శ్రద్ధ అంటూ మండిపడ్డారు. కాగా జనగామలో రిజర్వులో ఉన్న పలువురు ఎలక్షన్ అధికారులకు రూ.1,500 ఇవ్వాల్సి ఉండగా, రూ.1,000తో సరిపెట్టే సమయంలో సదురు అధికారిని నిలదీయడం, పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు అక్కడకు రావడంతో మిగతా డబ్బులు ఇవ్వడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలిసింది. పోలింగ్ విధులు నిర్వర్తించే పీఓ, ఓపీఓ, ఇతర సిబ్బంది ఇంతటి స్థాయిలో ఇబ్బంది పడేలా చేసే ఎలక్షన్ అధికార గణం.. విధులకు గైర్హాజరైతే షోకాజ్ నోటీసుల పేరిట హెచ్చరిడం భావ్యం కాదని వాపోతున్నారు. ఎన్నికలు మూడు విడతలుగా విజయవంతంగా ముగిశాయి. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో రవాణా, భోజనం, విశ్రాంతి వంటి ప్రాథమిక సదుపాయాల్లో లోపాలు వెలుగుచూశాయి. పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంలో అధికారుల విఫలం మూడు విడతల్లో తప్పని తిప్పలు అర్ధరాత్రి రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో ఇక్కట్లు సరైన భోజనం పెట్టకపోవడంతో పస్తులు -
బీఆర్ఎస్పై ప్రజల విశ్వాసం
● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిజనగామ: పంచాయతీ పోరులో గ్రామస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న విశ్వాసమే సర్పంచ్, వార్డు సభ్యుల విజయంలో స్పష్టంగా కనపడిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన నియోజకవర్గంలోని సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు స్వతంత్రులుగా విజయం సాధించిన వారు, 2500 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వీరంతా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించగా, అనంతరం ఎమ్మెల్యే నూతన సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. అంతకుముందు నియోజకవర్గంలో స్వతంత్రులుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారిని స్వాగతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా విజయం సాధించిన ప్రజాప్రతినిధులు సైతం అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్తో కలిసి రావడం సంతోషకరమన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశారు. -
కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలి
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లు జాప్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బెన్షాలోం ఆదేశించారు. మండలంలోని కోమళ్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీ లించి ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. నిల్వ ఉన్న ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ..అని అడిగి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంట వెంటనే మిల్లులకు పంపించాలని ఆయన ఆదేశించారు. దేవరుప్పుల: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎవరూ విఘాతం కలిగించినా కఠిన చర్యలు అనివార్యమని జనగామ డీసీపీ రాజామహేంద్రనాయక్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని జనగామ–సూర్యాపేట రహదారితోపాటు పలు సమస్యాత్మక గ్రామాలైన సింగరాజుపల్లి, సీతారాంపురం, చిన్నమడూరు, కడవెండి, కోలుకొండ, మాధాపురం తదితర గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు వర్ధన్నపేట టేసీపీ అంబటి నర్సయ్య పర్యవేక్షణలో సీఐలు సత్యనారాయణ, అబ్బయ్య, సుజాత, 18మంది ఎస్సైలు, 8 మంది ఏఏస్సైలు, 28 హెడ్‌కానిస్టేబుళ్లు, 145 కానిస్టేబుళ్లు తమ విధులు నిర్వర్తిస్తున్నట్టు వివరించారు. బచ్చన్నపేట: దళితులమని తమను చిన్నచూపు చూస్తున్నారని మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని దళితులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ మాజీ సర్పంచ్ భర్త ఎన్నికల ముందు దళితులమని చిన్నచూపుతో దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలమనే అహంకారంతో తమను చిన్నచూపు చూడడం తగదన్నారు. అంతేకాకుండా మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్తే తన కాళ్లు మొక్కడానికి వచ్చారా అని దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణ చేప్పే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ గ్రామానికి చేరుకొని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై హమీద్‌కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినల్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి బాలుర స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్ల పరిశీలనజనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో11వ రాష్ట్రస్థాయి బాలుర స్పోర్ట్స్ మీట్ ఈ నెల 18 నుంచి 20 వరకు జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలురు)లో జరగనుంది. ఈ స్పోర్ట్స్ మీట్‌కు సంబంధించిన ప్లేగ్రౌండ్, వసతి సదుపాయాలు, భోజన ఏర్పాట్లు, భద్రత తదితర ఏర్పాట్లను మల్టీజోన్–1 అధికారి హెచ్.అరుణకుమారి మంగళవారం పరిశీలించారు. నిర్వహణ ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ గురుకులాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది సమిష్టి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎ.నరసింహులు గౌడ్, రవీందర్, ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాస్, కిషన్, వెంకట్‌రెడ్డి, లింగనాయక్, రమేశ్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. -
ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక మూడోసారి వాయిదా
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక మూడోసారి సైతం వాయిదా పడింది. సమస్యాత్మక గ్రామంగా ఉన్న ఇప్పగూడెంలో ఈనెల 12న ఉపసర్పంచ్ ఎన్నిక అనివార్యకారణాలతో వాయిదా పడింది. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 15న ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ఆర్ఓ, పంచాయతీ అఽధికారులు ప్రయత్నించినా వార్డుసభ్యుల మధ్య సయోధ్య లేక వాయిదా పడింది. కాగా నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి ఉపసర్పంచ్ ఎన్నిక చేసే లక్ష్యంగా స్వయంగా ఎంపీడీఓ నర్సింగరావు మంగళవారం ఇప్పగూడెం గ్రామపంచాయతీకి చేరుకున్నారు. అయినప్పటికీ మధ్యాహ్నం 1 గంట వరకు సైతం వార్డు సభ్యులెవ్వరూ పంచాయతీ కార్యాలయానికి రాకపోవడంతో మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. కాగా ఈనెల 18న చివరి అవకాశం ఇస్తున్నామని, అదే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు నరేశ్, సత్యనారాయణ, కారోబార్ శ్రీను తదితరులు ఉన్నారు. వార్డుమెంబర్ల మధ్య కుదరని సయోధ్య ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక వరుసగా మూడుసార్లు వాయిదాపడడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో కాంగ్రెస్, సీపీఎం పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లగా కాంగ్రెస్, సీపీఎం బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా ఆరు వార్డులు కాంగ్రెస్, ఆరు వార్డులు సీపీఎం కై వసం చేసుకున్నాయి. ముందస్తు ఒప్పందం మేరకు సీపీఎంకు ఉపసర్పంచ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే సీపీఎం నుంచి గెలిచిన ఆరుగురు వార్డు సభ్యుల్లో 5, 6, 11వ వార్డుల నుంచి గెలుపొందిన వారు ఉపసర్పంచ్ కోసం పట్టుపడుతున్నారు. సీపీఎం శ్రేణులు రెండు వర్గాలుగా మారి ఉపసర్పంచ్ పదవికి పోటీపడుతుండగా సయోధ్య కుదరడం లేదు. ఏది ఏమైనా ఈనెల 18న ఉపసర్పంచ్ ఎన్నికకు తెరపడనున్నట్లు సమాచారం. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం దామెర, ఆత్మకూరు, శాయంపేట మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సీపీ సమీక్షించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. 1,991 మంది పోలీస్ సిబ్బంది.. ఎన్నికల నిర్వహణకు 1,991 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 16 మంది ఏసీపీలు, 29 మంది ఇన్స్పెక్టర్లు, 131 మంది ఎస్సైలు, 339 మంది ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుళ్లు, 1,218 మంది కానిస్టేబుళ్లు, 258 హోంగార్డులతోపాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. మొబైల్ పార్టీలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయని సీపీ వెల్లడించారు. రేపు ఉదయం వరకు నిషేధాజ్ఞలు.. రాష్ట్ర ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద గురువారం ఉదయం 10 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు డీసీపీ బాల స్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు సతీశ్‌బాబు, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఉన్నారు. -
ముహూర్తం ఖరారు
● ఈ నెల20న గ్రామ పంచాయతీ పాలక మండళ్ల ప్రమాణం ● అదే రోజు తొలి సమావేశం ● కొత్త సర్పంచ్‌లపై పారదర్శక పాలన.. గ్రామాల అఽభివృద్ధి బాధ్యతజనగామ: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎన్నికై న నూతన పాలకవర్గాలకు సంబంధించిన తొలి సమావేశ తేదీ ఖరారైంది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి శాఖ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్న్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన పంచాయతీల మొదటి సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మ ంగళవారం వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈనెల 17లోపు మూడో విడతలో ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలకు తొలి సమావేశ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సమావేశాలతో గ్రామస్థాయిలో కొత్త పాలకవర్గాల పాలన అధికారికంగా ప్రారంభం కానుంది. 20న సర్పంచుల ప్రమాణ స్వీకారం.. ఈ నెల20వ తేదీన జరగనున్న తొలి సమావేశంలో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజల నమ్మకంతో ఎన్నికై న ప్రతినిధులు ఇకపై గ్రామ అభివృద్ధికి నాయకత్వం వహించాల్సిన కీలక దశ ఇది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తొలి అడుగు పడనుంది. నూతన పాలకమండళ్లు ముందుగా గ్రామ అవసరాలను గుర్తించి స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పచ్చదనం వంటి ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామపంచాయతీ నిధులు, ప్రభుత్వ పథకాలు, ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా వినియోగించుకోవడం కీలకం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన గ్రామసభలను క్రమం తప్పకుండా నిర్వహించడం, ప్రజల అభిప్రాయాలను నిర్ణయాల్లో భాగం చేయడం ద్వారా పారదర్శక పాలన సాధ్యమవుతుంది. అవినీతి, వివక్షలకు తావులేకుండా సమాన న్యాయం అందించాల్సిన బాధ్యత పాలకవర్గాలపై ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం సాకారం అవుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. శుభముహూర్తాల వేటలో జిల్లాలోని 280మంది సర్పంచ్‌లు, 2,534మంది వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ లు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కీలక ఘట్టాన్ని శుభప్రదంగా ప్రారంభించాలనే సంకల్పంతో సర్పంచులు, వార్డు సభ్యులు వేద పండితులను ఆశ్రయిస్తూ శుభ ముహూర్తాలపై ఆరా తీ స్తున్నారు. ప్రమాణ స్వీకారం ఏ సమయంలో చేయాలి, ఆ రోజు అనుకూలమా అనే అంశాలతో పాటు గ్రామపంచాయతీ కార్యాలయంలో చాంబర్లో ఏ దిశగా కూర్చోవాలి, వాస్తుపరంగా ఏమైనా సరిదిద్దుకోవాలా అనే విషయాలపై కూడా సలహాలు తీసుకుంటున్నారు. రాబోయే ఐదేళ్లు ప్రశాంతంగా, అభివృద్ధి పథంలో సాగాలన్న ఆకాంక్షతో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
నేడే తుది పోరు
జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మూడు మండలాల పరిధిలో ఈనెల 17న(బుధవారం) పోలింగ్ జరగనుంది. భద్రత, నిఘా కట్టుదిట్టం చేయగా, సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు తరలివస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అత్యధిక స్థానాలపై నజర్ పెట్టడంతో రాజకీయ వర్గాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సర్పంచ్ బరిలో 88 మంది.. పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో 91 గ్రామ పంచాయతీలు, 800వార్డులు ఉండగా, వీటిలో మూడు జీపీలు, 108 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవం కాకుండా మిగిలిన 91 జీపీల పరిధిలో 88 మంది సర్పంచులు, 692 వార్డుల్లో 1,524 మంది సభ్యులు బరిలో నిలిచారు. పోలింగ్ నిర్వహణ కోసం 800 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 960 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,222 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ నేపథ్యంలో మూడు మండలాల పరిధిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రి తరలింపునకు అధికారులు 51 బస్సులను సిద్ధం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 1,18,870 ఓట్లు ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 59,001, మహిళా ఓటర్లు 59,866, ఇతరులు ముగ్గురు ఉన్నారు. అమలులో 144 సెక్షన్ భద్రత పరంగా మూడు మండలాల్లో 35 క్రిటికల్ గ్రామాలను గుర్తించి, 40 రూట్లలో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలు, క్రమశిక్షణ, ప్రశాంతతను కాపాడేందుకు మూడో దశ ఎన్నికల ప్రాంతాల్లో డీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా తెలిపారు. పోలింగ్ మరుసటి రోజు 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు లేదా లెక్కింపు పూర్తై ఎన్నికల సామగ్రి సురక్షితంగా నిల్వ చేసే వరకు మూడు మండలాల పరిధిలో ఈ నిషేధాజ్ఞలు(144 సెక్షన్) కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 7 గంటల నుంచి.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్న విరామం అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగించి, సాయంత్రం 4 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. చివరి పోరు గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో రెండు విడతల పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా, మూడో విడత పోలింగ్ పాలకుర్తి నియోజకవర్గంలో జరగనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సాగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు పాలకుర్తితోనే ముగింపు పలుకనుంది. చివరి దశ కావడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొనగా, అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. పోలింగ్ పూర్తయ్యాక జిల్లా మొత్తంలో గ్రామ పాలనకు సంబంధించి కొత్త ప్రజాప్రతినిధుల రూపకల్పన పూర్తవనుండగా, ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం కట్టుదిట్టమైన బందోబస్తు మూడు మండలాల్లో హైటెన్షన్ ఓ వైపు ఎమ్మెల్యే యశస్విని.. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి సర్పంచ్ బరిలో 88మంది అభ్యర్థులు.. వార్డు మెంబర్ల స్థానాలకు 1,524 మంది డీసీపీతో కలిసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలిగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో విడతలో జరగనున్న పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గ్రామపంచాయితీ మూడో విడత ఎన్నికల సందర్భంగా పాలకూర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎలక్షన్ అబ్జర్వర్ కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించారు. ప్రీసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది సాయంత్రంలోగా తమకు కేటాయించిన ఆయా గ్రామ పంచాయతీల పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్పాలకుర్తి టౌన్: మూడో విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో డిస్ట్రిబ్యూటరీ కేంద్రాన్ని డీసీపీ రాజామహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గొడవలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాలయేసులో ఏర్పాట్లు బాగున్నాయి.. దేవరుప్పుల: మూడో విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సామగ్రి పంపిణీతో పాటు అధికారుల కేటాయింపు కోసం మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కలెక్టర్ సహ సిబ్బంది కొనియాడారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించిన సమయంలో పోలీసులకు తీసిపోకుండా ఎన్సీసీ విద్యార్థుల సర్వీసు, పార్కింగ్, భోజన తదితర వసతులు చూసి ముగ్ధులయ్యారు. వెంటనే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక ఏర్పాట్ల తీరుపై ఓ డాక్యుమెంటరీ తీసి ఎన్నికల కమిషన్‌కు పంపుతున్నట్టు సమాచారం. కాగా విధులకు వచ్చిన పలువురిని కదిలించగా ఇటీవల రెండు విడతల్లో ఎక్కడా ఇలాంటి ఏర్పాట్లు చూడలేదని కితాబు ఇవ్వడం గమనార్హం. డిస్టిబ్యూషన్ సెంటర్ పరిశీలన కొడకండ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
24వరకు పనులు పూర్తిచేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులన్నీ ఈ నెల 24వ తేదీ కల్లా పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ అభివృద్ధి పనులు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణాలను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణం, రహదారులు, ఫ్లోరింగ్ సుందరీకరణ, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లోని పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులు, గుత్తేదారులతో మాట్లాడారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహా జాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు దేవాలయ ప్రాంగణం మహా కళాఖండంగా దర్శనమిస్తుందని తెలిపారు. ప్రతీ భక్తుడికి మధురానుభూతిని కలిగించే విధంగా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వివరించారు. నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. గద్దెల పునర్నిర్మాణ పనులు పరిశీలన మేడారం గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం పరిశీలించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా పగలు, రాత్రి విరామం లేకుండా పనులు చేయాలని ఎస్పీ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనులకు విద్యుత్ సౌకర్యం కల్పించి రాత్రి సమయంలో సైతం పనులు చేసే వీలు కల్పించాలన్నారు. -
నోట్ల వర్షం కురిపించినా..
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జనగామ: జిల్లాలో రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికలు అనేక రాజకీయ లెక్కలను తారుమారు చేశాయి. గెలుపు ధీమాతో లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులు బ్యాలెట్ బాక్సులు తెరుచుకున్న వేళ ఓటమి షాక్‌కు గురయ్యారు. పార్టీ కేడర్, నాయకుల సహకారం, సొంత సర్వేలు అన్నీ అనుకూలంగా ఉన్నాయని తేలినప్పటికీ ఆ నమ్మకం ఫలితాల్లో తారుమారైంది. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్ముకుని ప్రచారం చేసినా.. ఆశించిన ఓట్లు రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఎక్కడ తేడా జరిగింది? ఎవరు వెన్నుపో టు పొడిచారు? అంటూ ఓటమికి కారణాలు వెతుక్కుంటూ, రాజకీయ భవిష్యత్‌పై మళ్లీ లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. తేడా ఎక్కడ వచ్చింది.. జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు తీవ్ర మదనంలో మునిగిపోయారు. ఎలా ఓడిపోయాం, ఎక్కడ తేడా వచ్చింది, ఎవరు మోసం చేశారనే లెక్కలతో రోజులు గడుపుతున్నారు. ప్రచారంలో నాయకులు సహకరించారు, పార్టీ కేడర్ అడుగడుగునా వెంట నడిచింది, మెజార్టీ మనదేనన్న ధీమా చివరి నిమిషం వరకూ ఉంది. కానీ బ్యాలెట్ బాక్సులు తెరిచి లెక్కించే సరికి ఫలితాలు పూర్తిగా భిన్నంగా రావడంతో షాక్‌కు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులు లక్షలు, కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రచారం మొదటి రోజు నుంచి పోలింగ్ రోజు వరకు ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయని ప్రచారం ఉంది. అప్పులు తెచ్చి, ప్లాట్లు అమ్ముకొని, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎన్నికల బరిలోకి దిగిన వారు ఎందరో. చివరి నిమిషం వరకు గెలుపుపై ధీమా పోలింగ్ ముగిసే చివరి నిమిషం వరకు గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన అభ్య ర్థులకు ఫలితాలు చుక్కలు చూపించాయి. పార్టీ ఇంటెలిజెనన్స్ నివేదికలు, సొంత సర్వేలు కూడా మనమే గెలుస్తాం అన్న భరోసా ఇచ్చినప్పటికీ, లెక్కింపులో పరిస్థితి తలకిందులైంది. కనీసం రెండో స్థానంలో నిలుస్తామనుకున్న వారు మూడు, నాలుగో స్థానాల్లో నిలవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అన్నా, తమ్ముడూ.. అంటూ ఆశీర్వదించిన ఓటర్లు చివరకు ఎందుకు తిరస్కరించారని అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా ఆరా తీస్తున్నారు. గండి ఎక్కడ పడిందో, పక్కనే తిరుగుతూ వెన్నుపోటు పొడిచిన నాయకులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగంగా ఎవరినీ నిందించకపోయినా, లోలోపల వెన్నుపోటు పొడిచిన వారి జాబితాను తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ చేజారిపోయిందంటే.. జనగామ మండలం పెంబర్తిలో రెబల్ అభ్యర్థి గెలుపొందగా బీఆర్ఎస్ బలబర్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలవగా, తమ్మడపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మనస్వినికీర్తన అప్పులు తెచ్చి, ప్లాట్లు అమ్ముకుని ఖర్చు చేస్తే.. చివరికి ఓటమి ప్రచారం జోరు.. ఫలితాల్లో ఫెయిల్ ఎవరు మోసం చేశారు.. ఓటమి తర్వాత మొదలైన లెక్కలు రెండో స్థానం ఓకే... మూడుగు దిగజారడం ఏంటి? అభ్యర్థుల లెక్కలు తారుమారు చేసిన రెండో విడత పోలింగ్ -
యమబాధలు తొలగి.. ముక్తి పొందుతారు
కాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్‌జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు. సోమవారం స్వామిజీ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద స్వామిజీని ఈఓ మహేష్ కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ..అలహాబాద్‌లోని గంగా, యమున, సరస్వతి ఎంత ప్రసిద్ధి చెందినవో.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదుల్లో భక్తులు స్నానాలు చేస్తే అంతటి మహాభాగ్యం పొందుతారని అన్నారు. 2026, మే 21నుంచి జూన్ 1వరకు సరస్వతినదికి అంత్యపుష్కరాలు జరుగుతాయని, భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని కోరారు. -
లక్కీ చాన్స్..
● ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో సర్పంచ్‌గా అవకాశం జనగామ రూరల్: గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హులు కాదనే నింబధన ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధన ఎత్తి వేయడంతో సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. దీంతో మండలంలోని మరిగడి గ్రామానికి చెందిన కర్రె పర్శరాములు తనకు ముగ్గురు పిల్లలు ఉన్నా..ఎస్సీ రిజర్వేషన్ కావడంతో పోటీ చేసి గెలుపొందాడు. మొదటిసారిగా సర్పంచ్‌గా అవకాశం రావడంతో గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని, ముఖ్యంగా అన్ని వార్డుల్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, మంచి నీటి వసతికి మొదటగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. -
ముగిసిన తుది విడత ప్రచారం
జనగామ: జిల్లాలో మూడో విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో నేడు (మంగ వారం) మండల పరిషత్ కార్యాలయాల ప్రాంగణాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1,18,870 ఓట్లు జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. మూడు మండలాల్లో 91 జీపీల పరిధిలో 3 సర్పంచ్, వార్డుల పరిధిలో 108 అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 88 జీపీల్లో 266 మంది సర్పంచ్, 800 వార్డుల్లో 1,668 వార్డు అభ్యర్థులు బరిలో నిలిచారు. పురుషులు 59,001, మహిళలు 59,866 అదర్స్ 3 కలుపుకుని మొత్తంగా 1,18,870 ఓట్లు ఉన్నాయి. మూడు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఈ నెల 17వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలో జరుగనున్న పోలింగ్ కోసం నేడు ఎలక్షన్ సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు మండలాల పరిధిలో సామగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన తర్వాత రిసీవ్ చేసుకునేందుకు సాంఘిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయగా, మండలాల పరిధిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి 800 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పీఓ 597, ఓపీఓ 597 మొత్తంగా 1,194 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ సామగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు 40 బస్సుల వరకు సిద్ధం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రూట్ల వారీగా పటిష్ట బందోబస్తు చేపట్టారు. పోలీసుల ముందస్తు నిఘా పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత, చివరి సర్పంచ్ ఎలక్షన్ నేపధ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా.. అన్నట్టు ఎలక్షన్లలో పోటీ పడుతుండడంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు నిఘా వేస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ సారిస్తూ, ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నియోజకవర్గాలు కావడంతో పోలీసులకు కొంతమేర సవాల్ అని చెప్పుకోవచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేయగా, అత్యధిక స్థానాల్లో పాగా వేసి..అధికార పక్షానికి జలక్ ఇవ్వాలని బీఆర్ఎస్ తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది. మూడో విడతకు సిద్ధం..కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలో మొదటి, రెండవ విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లే, మూడవ విడత ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేసి విజయవంతంగా ముగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. సోమవారం 17వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్న దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో ఎలక్షన్‌పై కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ, ఆర్డీఓలు, డీఆర్డీఓ, డీఎస్డీఓ, మండల స్పెషల్ అధికారులుతో సమీక్ష నిర్వహించారు. ఎలక్షన్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్, కౌంటింగ్ తదితర వాటిపై పలు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ పంపిణీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. పోలింగ్ నిర్వహణకు వచ్చే అధికారులు, సిబ్బందికి ఆహారం విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కౌంటింగ్ సమయంలో వేగవంతంగా జరిగేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలన్నారు. మూడు మండలాల పరిధిలోని మొత్తం జీపీలు, వార్డులు, ఓటర్ల వివరాలుజీపీ వార్డులుమొత్తం ఓటర్లు నేడు ఎలక్షన్ సామగ్రి పంపిణీ పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో ఏర్పాట్లు బరిలో 266 సర్పంచ్, 1,668 మంది వార్డు అభ్యర్థులు రేపు పోలింగ్918001,18,870 మూడు మండలాల పరిధిలోని జీపీలు, వార్డులు, ఓటర్ల వివరాలు మండలం జీపీ వార్డులు మొత్తం పోలింగ్ ఓటర్లు కేంద్రాలు దేవరుప్పుల 32 274 37,333 274 పాలకుర్తి 38 336 52,865 336 కొడకండ్ల 21 190 28,672 190మూగబోయిన మైక్‌లు ఆయా గ్రామాల్లో ప్రలోభాల హడావుడి జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముగియడంతో బహిరంగ రాజకీయ హడావుడి తగ్గినట్టే కనిపిస్తున్నా, ప్రలోభాల పర్వం ఉత్కంఠను రేపుతున్నాయి. మద్యం దుకాణాలను మూసివేసినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మైకుల ప్రచారం ఆగిపోవడంతో ప్రధాన పార్టీ లు, స్వతంత్ర అభ్యర్థులు రహస్య వ్యూహాలకు పదును పెట్టినట్లు సమాచారం. ఓట్లు జారిపోకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ నగదు, గిఫ్టుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 17న పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
మెరుగైన వైద్యసేవలందించాలి
జనగామ రూరల్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సోమవారం గూగుల్ మీట్ ద్వారా ఆదేశించారు. డీఎంహెచ్ఓ కె.మల్లికార్జునరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారులు మెడికల్ ఆఫీసర్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకంగా ఆర్బీఎస్కే, టీకా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు, పర్యవేక్షణ నివేదికల సమర్పణపై మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా క్షేత్రస్థాయిలో వైద్యసేవలను మరింత బలోపేతం చేయడం, సమయానికి నివేదికల సమర్పణ, నాణ్యమైన సేవలు అందించాలని ఆయన సూచించారు. -
రాలని ఓట్లు
అధిష్టానం సీరియస్ జిల్లాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటమి పాలవడంతో పార్టీ అధిష్టానాలు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఓటమి చెందిన గ్రామాలకు సంబంధించి గెలుపు తారుమారు అయిన కారణాలపై సమగ్రంగా తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీలను నియమించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయా కమిటీల ద్వారా గ్రౌండ్ లెవల్ పరిస్థితులు, అంతర్గత విభేదాలు, అభ్యర్థుల ఎంపికలో జరిగిన లోపాలపై నివేదికలు తెప్పించుకొని భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై నిర్ణయాలు తీసుకునేందుకు పార్టీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
పెద్ద కొరివి దయ్యం ఎమ్మెల్యే పల్లా
స్టేషన్‌ఘన్‌పూర్: కేసీఆర్ చుట్టూ కొరివిదయ్యాలు చేరాయని, వాటి వల్లనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పడుతుందని కల్వకుంట్ల కవిత సాక్ష్యాలతో సహా పలు మార్లు విమర్శలు చేసిందని, అందులో పెద్ద కొరివిదయ్యం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అని మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. కేసీఆర్ పంతన చేరి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడని, అందుకే కవిత దూరమైందని, కేటీఆర్, హరీశ్‌రావు మఽధ్య సైతం గ్యాప్ వచ్చిందన్నారు. కేసీఆర్ పక్కన చేరి వందల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని విమర్శించారు. అలాంటి వ్యక్తి ఘన్పూర్ నియోజకవర్గానికి వచ్చి సుద్దపూసలా మాట్లాడుతున్నాడన్నా రు. జీపీ ఎన్నికల ప్రచారంలో పల్లా, డాక్టర్ రాజయ్య నాపై తీవ్ర స్థాయిలో దూషణలు, దిగజారుడు విమర్శలు చేశారని గుర్తు చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన అభివృద్దిని ప్రజలు గమనించి అత్యధిక పంచాయతీలు గెలిపించారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాజయ్య ప్రచారం చేస్తే ఓట్లు రావని ఎమ్మెల్యే పల్లా పరోక్షంగా నియోజకవర్గంలో ప్రచారం చేశారని, ఇదంతా రాజయ్యను జీరో చేయాలనే ప్రణాళిక అని ఆరోపించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, జగదీష్‌చందర్‌రెడ్డి, మంచాల ఎల్లయ్య, అంబటి కిషన్‌రాజ్, బూర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజయ్యను జీరో చేయాలని చూస్తున్నాడు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపణ -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
● ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి జనగామ: రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని జనగామ పట్టణ పరిధిలో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా లోడ్ సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుందని ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం డీటీఆర్లను బిగించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారుల అవసరాలను ముందుగానే అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా 7–100 కేవీఏ డీటీఆర్‌ల స్థానంలో ఆధునిక సామర్థ్యంతో కూడిన మరో 7–60 కేవీఏ డీటీఆర్లను ఏర్పాటు చేశామన్నారు. వీవర్స్ కాలనీలో ఎస్ఎస్–3, నెహ్రూపార్కు ఏరియాలో ఎస్ఎస్–13, గిర్నిగడ్డలో ఎస్ఎస్–1, గీతానగర్‌లో ఎస్ఎస్–34, సెయింట్ మేరీస్ స్కూల్ రోడ్లో ఎస్ఎస్–149, సాన్‌మారియా గేట్, జ్యోతి నగర్లో ఎస్ఎస్–378, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం, సూర్యాపేట రోడ్ పరిధిలో ఎస్ఎస్–337 ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. సామర్థ్యం అప్‌గ్రేడేషన్‌తో వేసవిలో లోడ్, తక్కువ వోల్టేజ్ సమస్యలు తగ్గి, వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, టౌన్–1 ఏఈ సౌమ్య, టౌన్–2 ఏఈ చంద్రమోహన్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
అవాంఛనీయ ఘటనలు జరగొద్దు
తరిగొప్పుల: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీంశర్మతో కలసి మండలకేంద్రం, నర్సాపూర్ పోలింగ్ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు జనగామ:వరంగల్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ,ఏసీపీలు పండేరీ చేతన నితిన్, నర్సయ్య, భీంశర్మ ఆధ్వర్యంలో సీఐ,ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నర్మెట, జనగామ,బచ్చన్నపేట మండలాల్లో సీపీ పర్యటించి పోలింగ్ తీరు తెన్నులను ప్రత్యక్షంగా పరిశీలించారు. -
అబ్బా..ఓటెయ్యలేకపోయానే!
జనగామ: బచ్చన్నపేట పోలింగ్ కేంద్రం మూసివేసిన అర క్షణంలో యువకుడు కానుగంటి సందీప్ రాగా, పోలీసులు లోనకు నిరాకరించారు. ఐదేళ్లకోసారి వచ్చే ఓటు వేసే అవకాశం త్రుటిలో కోల్పోవడంతో ఆవేదనకు లోనయ్యారు. నేటితో మూడో విడత ప్రచారానికి తెరజనగామ: జిల్లాలో జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఈనెల 15(సోమవారం)తో ప్రచారానికి తెరపడనుంది. 17వ తేదీన ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలను సైతం మూసివేయనున్నారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రలోభాలు షురూ కానున్నాయి. -
ఓటోత్సాహం
జనగామ: రెండో విడత సర్పంచ్ ఎలక్షన్లలో ఓటర్ల చైతన్యం కనిపించింది. నాలుగు మండలాల పరిధిలో తమ ఓటుతో మార్పును కోరుకున్నారు. జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో రెండో విడత ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికలు గ్రామీణ ప్రజాస్వామ్యానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. నాలుగు మండలాల్లో కలిపి 88.52 శాతం పోలింగ్ నమోదు కావడం ఓటర్ల రాజకీయ చైతన్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించింది. నియోజకవర్గంలో మొత్తంగా 1,07,067 మంది ఓటర్లు ఉండగా, 94,776 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించిన సందడి మధ్యాహ్నానికి మరింత ఊపందుకుంది. ఉదయం 9 గంటల వరకు 16.72 శాతం పోలింగ్ నమోదుకాగా, 11 గంటల వరకు 51 శాతం దాటింది. మధ్యాహ్నం 1 గంటల వరకు 81.20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఓవరాల్‌గా 88.52 శాతంతో ముగించారు. మండలాల వారీగా చూస్తే జనగామ మండలం 91.03 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. మహిళా ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. మండలాల వారీగా విశ్లేషణ జనగామ మండలంలో రికార్డు స్థాయిలో 91.03 శాతం పోలింగ్ నమోదై అగ్రస్థానంలో నిలిచింది. 33,137 ఓటర్లు ఉండగా, పురుషులు 15,043, మహిళలు 15,122 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 30,165 ఓట్లు పోలయ్యాయి. రాజకీయ చైతన్యం, పోటీ తీవ్రతే ఈ అధిక పోలింగ్‌కు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నర్మెట మండలంలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఈ ప్రాంతంలో 20,096 ఓట్లు ఉండగా, పురుషులు 8,941, మహిళలు 8,909 మంది ఓటు వేశారు. మొత్తంగా 17,850 ఓట్లు పోలు కాగా, 88.82 శాతం పోలింగ్ నమోదైంది. తరిగొప్పుల మండలంలో 15,283 ఓట్లు ఉండగా, పురుషులు 6,738, మహిళలు 6,734 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 13,472 ఓట్లు పోలయ్యాయి. 88.15 శాతం పోలింగ్‌తో నర్మెటకు సమీపంగా నిలిచింది. చివరి గంటల్లో పోలింగ్ ఊపందుకోవడంతో ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. బచ్చన్నపేట మండలంలో ఇతర మండలాలతో పోలిస్తే చాలా తక్కువగా 86.35 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత ఓటర్ల రాక అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మండలంలో 38,551ఓట్లు ఉండగా, పురుషులు 16,520, మహిళలు 16,769 మంది, మొత్తం 32,289 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాజకీయ ప్రాధాన్యం.. గ్రామ స్థాయి పాలనకు సర్పంచ్ ఎన్నికలు పునాది కావడంతో, ఇవి భవిష్యత్తు రాజకీయాలపై ప్రభా వం చూపనున్నాయి. అధిక పోలింగ్ శాతం ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవడంలో ఎంతటి అవగాహనతో ముందుకు వస్తున్నారో సూచిస్తోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.52శాతం పోలింగ్ 91.03శాతం పోలింగ్‌తో జనగామ మండలం అగ్రస్థానం భారీగా తరలివచ్చిన మహిళలు, యువత ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణమండలం ఓట్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తం బచ్చన్నపేట 38,551 16,520 87.74 16,769 85.03 86.35 జనగామ 33,137 15,043 91.41 15,122 90.66 91.03 నర్మెట 20,096 8,941 90.19 8,909 87.50 88.82 తరిగొప్పుల 15,283 6,738 88.46 6,734 87.84 88.15 మొత్తం 1,07,067 47,242 89.44 47,534 87.62 88.52రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో మహిళల పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తం ఓటింగ్‌లో పురుషుల పోలింగ్–89.44 శాతం, మహిళల పోలింగ్ 87.62 శాతంగా నమోదైంది. కొన్ని మండలాల్లో మహిళల పోలింగ్ పురుషులకు సమానంగా ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో మహిళా రాజకీయ చైతన్యం పెరుగుతున్న దానికి నిదర్శనంగా భావిస్తున్నారు. మొదటి విడతలో 87.33 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతకు వచ్చేసరికి 88.52తో 1.19 శాతం ఓట్లు పెరిగాయి. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ ఓటర్లకు అవగాహన కల్పించడంతో ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. -
కారు దోబార్!
జనగామ: జిల్లాలో రెండో విడత జరిగిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికర మలుపులు తిరిగాయి. తొలి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయగా, మలి విడతలో మాత్రం బీఆర్ఎస్ గులాబీ దళం తన సత్తాను చాటుకుని తిరిగి ఆధిపత్యం సాధించింది. నాలుగు మండలాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో సగం సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుని బీఆర్ఎస్ మరోసారి జనగామ తన కంచుకోటేనని నిరూపించింది. రెండో విడతలో బీఆర్ఎస్ విజయానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సుడిగాలి పర్యటన ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఊరూరా తిరుగుతూ చేసిన ప్రచారం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం గులాబీ దళానికి కలిసివచ్చింది. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, రాష్ట్ర యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్త్రత ప్రచారం కొంతమేర ఫలితాలు ఇచ్చినప్పటికీ, అంతర్గత అసంతృప్తి, రెబ ల్స్ ప్రభావం పార్టీని నష్టపరిచినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ 38 సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్ 26 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. కానీ కొన్ని గ్రామాల్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చెందడంతో ఆశించిన స్థాయిలో సీట్లు దక్కకపోవడం ఆ పార్టీకి నిరాశ కలిగించింది. స్వతంత్రుల సత్తా రెండో విడత ఎన్నికల్లో అసలైన హైలైట్ మాత్రం స్వతంత్ర అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. మొత్తం 13 మందిలో నలుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరో 8 మంది స్వతంత్రులు అధికార–ప్రతిపక్ష పార్టీలకు గట్టి సవాల్ విసిరి విజయదుందుభి మోగించారు. గెలిచిన స్వతంత్రుల్లో ఇద్దరు బీఆర్ఎస్ రెబల్స్, ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ ఉండటం రాజకీయంగా కీలకంగా మారింది. పార్టీల కంటే వ్యక్తిగత పలుకుబడి, స్థానిక సమస్యలే ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేశాయనే విషయం ఈ ఫలితాలతో స్పష్టమైంది. రెండు చోట్ల బీజేపీ బోణీ.. బీజేపీ కూడా ఈసారి తన బోణి చేసింది. జనగామ, బచ్చన్నపేట మండలాల్లో రెండు చోట్ల సర్పంచ్ స్థానాలు గెలుచుకుని నియోజకవర్గం కమల దళానికి గుండెకాయలాంటిదని నిరూపించింది. నరాలు తెగే ఉత్కంఠ.. నాలుగు మండలాల్లో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదట వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి, అనంతరం సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను కౌంట్ చేశారు. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి, పోచన్నపేట, గోపాల్‌నగర్, జనగామ మండలం వడ్లకొండ, పెంబర్తి తదితర గ్రామాల్లో ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టించాయి. కొన్నిచోట్ల రీకౌంటింగ్ నిర్వహించగా, తమ్మడపల్లిలో ఓటమిని నిరసిస్తూ ధర్నాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎస్కార్టు మధ్య బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ మండల పరిషత్ కార్యాలయాలు, అక్కడ నుంచి జిల్లా కేంద్రంలోని సోషల్ వెవెల్ఫేర్ గురుకులంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించారు. పీఓ, ఓపీఓలు బ్యాలెట్ బాక్స్‌లను అక్కడ అప్పగించారు. 73 సర్పంచ్...555 వార్డులు జిల్లాలో 79 జీపీలు, 710 వార్డుల్లో ఆరు చోట్ల సర్పంచ్, 155 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 73 సర్పంచ్, 555 వార్డుల్లో పోటీ జరిగింది. హోరాహోరీ జరిగిన సమరంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆర్వో అన్యాయం చేశారంటూ ధర్నాబచ్చన్నపేట: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికల్లో ఆర్వో అన్యాయం చేశారంటూ సర్పంచ్ అభ్యర్థి ఎలుగల శ్రీనివాస్‌రెడ్డితో పలువురు గ్రామస్తులు కలిసి జనగామ–బచ్చన్నపేట రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్వో మరో ప్రత్యర్థి అభ్యర్థి బేజాడి సిద్దులుకు అండగా నిలిచి ఆయన గెలిచినట్లు ప్రకటించారని దీనిపై సంబంధిత ఎన్నికల అధికారులు విచారణ జరపాలని పట్టుబట్టి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గ్రామ ఎన్నికల ఫలితాలపై మూడుసార్లు రీకౌంటింగ్ చేసినా బేజాడి సిద్దులుకు 4 ఓట్లు ఎక్కువగా వచ్చాయని ఆ ఫలితాలనే ప్రకటించారని సర్పంచ్‌గా బేజాడి సిద్దులును ప్రకటించారని వారు డిమాండ్ చేశారు. పట్టుపట్టి..మూడోసారికి పదవి పట్టి!బచ్చన్నపేట: మండలంలోని బండనాగారం గ్రామ సర్పంచ్ ఇజ్జగిరి రాములు మూడుసార్లు సర్పంచ్‌గా పోటీచేయగా మూడో సారికి గెలుపొందారు. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోగా పట్టుదల వదలని విక్రమార్కుడిలా మళ్లీ మళ్లీ పోటీ చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి సమీప అభ్యర్థి ప్రభాకర్‌పై 345 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు.మరిన్ని ఎన్నికల వార్తలు 8లో సర్పంచ్‌లు వీరే.. 9లో నాలుగు మండలాల్లో 38 స్థానాలు కై వసం కాంగ్రెస్ 26, బీజేపీ 2 స్థానాల్లో గెలుపు సత్తాచాటిన స్వతంత్రులు రెబల్స్ ప్రభావం..కాంగ్రెస్, బీఆర్ఎస్లకు నష్టంమండలం జీపీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ స్వతంత్రులు జనగామ 21 10 05 01 05 తరిగొప్పుల 15 05 08 – 02 నర్మెట 17 08 05 – 04 బచ్చన్నపేట 26 15 08 01 02 మొత్తం 79 38 26 02 13 -
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ
జనగామ: జనగామ నియోజకవర్గంలో రెండో విడత ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పలు గ్రామపంచాయతీల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీతిసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ జనగామ జిల్లాలోని శామీర్‌పేట, బచ్చన్నపేట, నర్మెట, మచ్చుపహాడ్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాటతో పాటు ఎన్నికలు జరుగుతున్న తీరుతెన్నులపై సీపీ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించారు. సీపీ వెంట డీసీపీలు కుమార్, రాజమహేంద్రనాయక్, ఏసీపీ చైతన్య, ఏసీపీ నర్సయ్య, రమణ బాబుతో పాటు స్థానిక ఇన్‌న్‌స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
మెజారిటీలో తగ్గేదేలే!
● భారీ మెజారిటీతో గెలుపొందిన అర్జుల జ్యోతి మదుసూదన్‌రెడ్డి తరిగొప్పుల: మండలకేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి అర్జుల జ్యోతిమధుసూదన్రెడ్డి 1,545 ఓట్ల మెజారిటీతో సమీప బీఆర్ఎస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి ఏదునూరి శివరాణి నర్సింహులపై గెలుపొందారు. గ్రామంలో 4,313 ఓట్లు ఉండగా 3,595 ఓట్లు పోలవగా అర్జుల జ్యోతికి 2133 ఓట్లు, ఏదునూరి శివరాణికి 588 ఓట్లు వచ్చాయి.ప్రత్యర్థులు..ఒకేచోటజనగామ రూరల్: మండలంలోని గానుగుపహడ్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ముగ్గురు మహిళలే బరిలో ఉన్నారు. ఆదివారం తమను గెలిపించాలని ఒక వైపు ముమ్మర ప్రచారం చేపట్టి తమ ఓటు వినయోగించుకోవడానికి వచ్చి ముగ్గురు అభ్యర్థులు దాసరి అనూష, కన్నెబోయిన భాగ్యమ్మ, తుపాకుల రాజేశ్వరీ పోలింగ్ కేంద్రం వద్ద ఒక్క దగ్గర కూర్చున్నారు. చూసేవారు గ్రామస్తులకే పోటీ ఉంది. తమకే పోటీ లేదు అన్నట్లు కూర్చున్నారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
జనగామ రూరల్: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ చెప్పారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శని వారం పెంబర్తి, సిద్దెంకి, ఒబుల్కేశవాపూర్, ఎర్రగొల్లపహాడ్ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్, సీఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. నర్మెట: మండల కేంద్రంతో పాటు బొమ్మకూర్‌లో సాయంత్రం భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. డీసీపీ రాజమహేంద్రనాయక్ వెంట ఏసీపీ రమణబాబు, సీఐలు ముసుకు అబ్బయ్య, ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. తరిగొప్పుల: మండలకేంద్రంతో పాటు, నర్సాపూర్, బొత్తలపర్రె గ్రామాల్లో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ , ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
‘బాలయేసు’ విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
దేవరుప్పుల: బాలయేసు విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంపీడీఓ మేనక పౌడేల్ ఆకాంక్షించారు. శనివారం మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో ‘టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025’ ప్రారంభోత్సవానికి పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు అధ్యక్షత వహించగా ఎంపీడీఓ ప్రారంభించారు. ఎంపీడీఓ మేనక పౌడెల్ మాట్లాడుతూ.. ప్రయోగాత్మక విద్యతోనే సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆలోచనాత్మక ఆవిష్కరణలు సాధ్యమన్నారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థినులు ‘భారతదేశం 21 వ శతాబ్దం విదేశాంగ విధానపు రూపురేఖలు’, 7వ తరగతి విద్యార్థినులు ‘రక్షణ రంగంలో భారత సాంకేతిక ఆధిపత్యం’ అనే అంశం, 8వ తరగతి విద్యార్థినులు ‘నిత్యజీవితంలో కృత్రిమ మేధస్సు ప్రభావం’ అనే అంశంపై ప్రతిభను చాటిచారు. ఉపాధ్యాయులు మదన్మోహన్, మహేశ్, అనిత, మాధవి, ఎన్సీసీ పీఓ కృష్ణ పాల్గొన్నారు. టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025ను ప్రారంభించిన ఎంపీడీఓ మేనక పౌడేల్ -
మలిపోరుకు సిద్ధం!
జనగామ: గ్రామవీధుల గోడలపై పోస్టర్లు అభ్యర్థుల గుర్తులను జ్ఞాపకం చేస్తుంటే..ప్రతీ ఇంటి ముందు పోలింగ్ గురించే చర్చ జరుగుతోంది. జనగామ నియోజకవర్గంలో జరగనున్న రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు గ్రామాల్లో రాజకీయ నిశ్శబ్దం అలుముకుంది. ప్రజల మనసుల్లో మాత్రం తీర్పు ప్ర క్రియ మొదలైపోయింది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు తుది ఏర్పాట్లలో నిమగ్నమవుతుండగా, మరోవైపు గ్రామస్తులు తమ ఓటు గ్రామ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నారో లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో ఈనెల 14న(ఆదివారం) రెండో విడతలో పోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జనగామ మండలానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులం, మిగతా మూడు మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేశారు. పీఓలు 853, ఓపీఓలు 1,039 మంది, ఇతర సిబ్బందితో సహా మెటీరియల్‌ను 29 రూట్ల వారీగా 45 బస్సుల్లో పోలీసు ఎస్కార్ట్ నడుమ తరలించారు. రెండో విడతలో 79 గ్రామపంచాయతీలు, 710 వార్డులు ఉన్నాయి. ఇందులో 6 చోట్ల సర్పంచ్‌లు, 155 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా 73 జీపీల్లో 245 మంది సర్పంచ్, 555 వార్డుల్లో 1,310 మంది బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో 27 క్రిటికల్ గ్రామాలు ఉన్నట్లు పోలీసు శాఖ గుర్తించింది. పోలింగ్, ఆ తర్వాత లెక్కింపు, గెలుపోటముల తర్వాత అలర్లు, గొడవలకు ఆస్కారం లేకుండా అధికారులు అక్కడ అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు ప్రతీ మండలంలో ఏసీపీ ర్యాంకు ఉన్నతాధికారి పర్యవేక్షణలో పోలీసుశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర గస్తీ కొనసాగుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు లో ఉందని అధికారులు స్పష్టం చేశారు. డబ్బులు, మద్యం, గిఫ్టుల పంపిణీపై ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటి క్ టీములు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా, ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు ఆగడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జనగామ నియోజకవర్గంలో నెల రోజుల ముందుగానే ప్రతి పల్లె సంక్రాంతి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఊరి అభివృద్ధి ప్రదాతను ఎన్నుకునేందుకు పనులన్నీ వదులుకుని కుటుంబాలు ఇంటిబాట పడుతున్నారు. దీంతో ప్రతీ గ్రామంలో సందడి నెలకొంది. యాదృశ్చికంగా ఆదివారం సెలవు రోజు పోలింగ్ రావడంతో ఓటింగ్ శాతం మొదటి విడత కంటే పెరుగుతుందని భావిస్తున్నారు. గ్రామంలో బస్సు దిగే సమయం... కార్లలో ఇంటి ముందు ఆగడమే ఆలస్యం... అభ్యర్థులు వాలిపోతూ ‘అన్నా.. అక్కా... తమ్ముడు.. బావ..’ అంటూ వరుసలు పెట్టి మరీ ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలోని 4మండలాల్లో ఏర్పాట్లు పూర్తి ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు పటిష్ట భద్రత, నిఘా అభ్యర్థుల భవితవ్యం మార్చనున్న మహిళలు, యువత ఓట్లురెండో విడత ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం కీలకంగా మారనుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలు, యువత పోలింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గ్రామ అభివృద్ధిపై తమ ఆశలను ఓటు రూపంలో వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నారు. నాలుగు మండలాల్లో 1,10,120 ఓట్లు ఉండగా, ఇందులో పురుషులు 54,344, మహిళలు 55,775, ఇతరులు ఒకరు ఉన్నారు. బచ్చన్నపేట మండలంలో అత్యధికంగా 20,208 మహిళా ఓట్లు ఉండగా, అత్యల్పంగా తరిగొప్పులలో 8,079 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా లక్ష ఓట్లలో 30వేల వరకు 18 నుంచి 35 ఏళ్ల లోపు యువకుల ఓట్లు ఉంటాయి.రెండో విడత పోలింగ్‌తో జిల్లాలో గ్రామ పాలనకు కొత్త దిశ నిర్ణయించబడనుంది. ప్రతి ఓటు గ్రామఅభివృద్ధికి కీలకమని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో వందశాతం ఓటింగ్‌తో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సొంతూరును వదిలి బతుకు దెరువు కోసం వె వెళ్లిన కుటుంబాలను పోలింగ్ రోజు రప్పించేందుకు సర్పంచ్, వార్డు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఓటింగ్‌ను పెంచేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ తమదైన శైలిలో అభ్యర్థిస్తున్నారు. -
రేటు పెరిగిన ఓటు!
జనగామ: జిల్లాలో మొదటి విడత పోలింగ్ ఫలితాలను అనుభవంగా తీసుకుంటూ, రెండో విడతలో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా జనగామ నియోజకవర్గ సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. నాలుగు మండలాల్లోని అభ్యర్థులు వ్యూహాలు రచిస్తూ, పోలింగ్‌కు ముందురోజు రాత్రి నుంచి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజాస్వామ్య పండుగగా ఉండాల్సిన ఎన్నికలు డబ్బులు, గిఫ్టుల పోటీగా మార్చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్‌కు ముందు అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడన్న సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంటూ, అంతకంటే 10 నుంచి 20 శాతం ఎక్కువ ఇవ్వాలన్న నిర్ణయాలతో అభ్యర్థులు వేచిచూసే ధోరణి అవలంబించారు. పలు గ్రామాల్లో తెల్లవారుజాము 3 గంటల నుంచి ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు, మరికొన్ని కీలక గ్రామాల్లో రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎలక్షన్ కమిషన్ నిఘా, అనేక బృందాలు 24 గంటల పాటు నిఘా ఉంచినప్పటికీ, ఇంతపెద్ద మొ త్తంలో డబ్బులు ఎలా పంచారనే దానిపై సా మాన్య ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. సర్పంచ్ ఎలక్షన్లలో కనివిని ఎరగని రీతిలో కోట్ల రూపాయలు వరదలా పారిస్తున్న పరిణామాలపై సీనియర్ సిటిజన్లు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెలుపు తర్వాత ఈ ఖర్చును ఎలా రాబట్టుకుంటారన్న ప్రశ్న పక్కన పెడితే, భారీగా ఖర్చు చేసి ఓట్లను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆశించిన ఓట్లను రాబట్టుకునేందుకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పలుచోట్ల సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రత్యేక టీంలను సిద్ధం చేసుకున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓటు చొప్పున నగదు అక్కడికక్కడే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.మొదటి విడతలో కొన్నిచోట్ల గెలుపు వాకిట నిలిచిన అభ్యర్థులు చిన్నచిన్న తప్పిదాలతో ఓటమిపాలవ్వడంతో, రెండో విడతలో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదన్న ఆలోచనతో డబ్బుల పంపిణీతో పాటు రాత్రింబవళ్లు కాళ్లబేరాలు, వ్యక్తిగత సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా బచ్చన్నపేట వంటి పలు మండలాల్లో మినీ గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలు, ఇతర గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ జోరుగా సాగింది. గెలుపు కోసం పడరాని పాట్లు పడుతూ లక్షలు ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు వెనుకాడడం లేదు. ఎక్కడ ఓట్లకు గండిపడుతుందోనన్న భయంతో కులాల వారీగా లెక్కలు వేసుకుంటూ, ఒకటికి రెండుసార్లు సంప్రదింపులు కొనసాగించారు. ఎక్కడా ఓటు మైనస్ కాకుండా మూడో కన్నుతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో జనగామ నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ హై వోల్టేజ్‌కు చేరింది. మొదటి విడతలో ఓడిన అభ్యర్థుల అనుభవాలే గుణపాఠం కీలక గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి 3వేలు పకడ్బందీ నిఘా ఉన్నా డబ్బులు, మద్యం, గిఫ్టుల పంపకాలు -
ఇబ్బందులు తలెత్తితే మా దృష్టికి తీసుకురండి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బచ్చన్నపేట: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో జరుగుతున్న మెటీరియల్ పంపిణీ సరిగ్గా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం సందర్శించి మెటీరియల్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని, చెక్‌లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్ఓలకు, మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండరి చేతన్ నితిన్, మండల స్పెషల్ అధికారి అంబికాసోని, ఎంపీడీఓ మమతాబాయ్, తహసీల్దార్ రామానుజాచారి, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలననర్మెట: ఎన్నికల సందర్భంగా మండలకేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను శనివారం అదనపు కలెక్టర్ (ఎల్బీ) పింకేశ్ కుమార్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ కావ్య శ్రీనివాస్, ఎంపీఓ వెంకట మల్లికార్జున్, సిబ్బంది ఉన్నారు. తరిగొప్పులలో.. తరిగొప్పుల: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు.శనివారం మండలకేంద్రంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల సజావుగా సాగేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లావణ్య, తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్‌రెడ్డి, డీటీ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ధనుర్మాసం..ధార్మికశోభ
పాలకుర్తి టౌన్: గోదాదేవి వ్రతాలు, కల్యాణాలతో మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు ధనుర్మాస శోభ సంతరించుకోనున్నాయి. ఈనెల 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. భక్తులు ఈ నెలంతా తెల్లవారుజామున తీర్థసాన్నాలు ఆచరించి దైవరాధన చేస్తారు. ఈ మాసంలో గోదాదేవి, శ్రీరంగనాయకసావమిని వేకువజామున దర్శించుకోవడం గొప్ప యోగంగా భావిస్తారు. ఈనెల 30న వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఆధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా శ్రీవిష్ణుమూర్తిని దర్శించుకుంటారు.● ఈనెల 16 నుంచి వైష్ణవ ఆలయాల్లో పూజలు ● ముస్తాబైన వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం -
పాల విప్లవకారుడు మర్రి పాపిరెడ్డి
జనగామ: జిల్లాలో పాల విప్లవం తీసుకొచ్చిన ఘనత దివంగత మర్రి పాపిరెడ్డిది అని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్‌సింగ్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని పాలకేంద్రం ఆవరణలో శనివారం పాపిరెడ్డి ఆరో వర్ధంతి నిర్వహించారు. అనంతరం పాల ఉత్పత్తిదారుల అధ్యక్షులు కాసారపు ధర్మారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.. జిల్లాలో ప్రతీ మండలానికి మినీ పాలసేకరణ కేంద్రాలు, పాలసేకరణ భవనాలు ఏర్పాటు చేయడంలో పాపిరెడ్డి ఎంతో కృషి చేశారన్నా రు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు నాగరాజు, విజయ డెయిరీ మ్యాక్స్ సొసైటీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మేనేజర్ నరేశ్, నర్మెట బీఎంసీ చైర్మన్ అంజనేయులు, మాజీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి, నాగారం అధ్యక్షురాలు రాధ, దేవరుప్పుల మేనేజర్ లక్ష్మి, గోపాలమిత్ర సూపర్వైజర్ జయపాల్‌రెడ్డి, నాగరా జు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.గ్లోబల్ సమ్మిట్‌లో చిందు యక్షగానందేవరుప్పుల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో గడ్డం సమ్మయ్య బృందం జానపద సాంస్కృతికత విశిష్టతను తెలిపేలా చిందు యక్షగానం ప్రదర్శనలు ఇచ్చింది. శనివారం మండలంలోని అప్పిరెడ్డిపల్లె చిందు యక్షగాన బృందం హైదరాబాద్‌లోని గ్లోబల్ సమ్మిట్ ఉత్సవాల్లో భూకై లాస్ యక్షగాన ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో గడ్డం శ్యామ్‌సుందర్, రఘుపతి, శ్రీపతి, వెంకన్న, లక్ష్మయ్య, హిమగిరి, రాసాల ప్రభాకర్, పిట్టల మహేశ్ పాల్గొన్నారు. తక్కువ రెమ్యునరేషన్ అవమానకరం జనగామ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10 రోజుల పాటు 8 రోజుల పోలింగ్, 2 రోజుల శిక్షణ విధులు నిర్వహించిన వేలాది మంది ఉపాధ్యాయులు, అధికారులకు స్వల్ప మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడం తీవ్ర అవమానకరమని తెలంగాణ రాష్ట్ర యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజులకు గాను స్టేజ్–1 రిటర్నింగ్ అధికారి – కేవలం రూ.3,500, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి 2,200, స్టేజ్–2 రిటర్నింగ్ అధికారికి 2,000 చెల్లిస్తున్నారని వివరించారు. కొన్ని జిల్లాల్లో ఈ రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, కృష్ణ , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నెల్లుట్ల సర్పంచ్‌కు 1,001 ఓట్ల ఆధిక్యం
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్లకు చెందిన నర్సింగ రామకృష్ణకు మండలంలోని 21 పంచాయతీల్లో అత్యధికంగా 1,001 ఓట్ల మెజారిటీ సాధించారు. నెల్లుట్లలో 4,885 ఓట్లకు గాను 4,058 ఓట్లు పోలైయ్యాయి. అందులో 1,946 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 945 ఓట్లు, నల్ల అనిల్‌కుమార్‌కు 649, చెపూరి ఉపేందర్‌కు 207, నల్ల కుమారస్వామి 102, నల్ల విజయ్‌కు 79 ఓట్లు వచ్చాయి. తిరస్కరించినవి 104, నోటాకు 26 ఓట్లు వచ్చాయి. రెండోస్థానంలో లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన ఎడ్ల లావణ్య 857 ఓట్ల మెజారిటీ సాధించగా అత్యల్పంగా పటేల్‌గూడెంకు చెందిన పొన్నాల బుచ్చయ్య 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. -
లక్ష్యానికి నవోదయం !
ఖిలా వరంగల్: నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు(శనివారం) జరిగే ప్రవేశ పరీక్షకు మొత్తం 28 పరీక్ష కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించి ఏర్పాటు చేశారు. 5,648 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 3,207 బాలురు, 2,439 బాలికలు ఉన్నారు. మొత్తం 80 సీట్లు ఉండగా.. పట్టణ(నగర) పరిధిలో 20 సీట్లకు 1,934 మంది, గ్రామీణ ప్రాంత పరిధిలో 60 సీట్లకు 3,714 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీటు వస్తే నవోదయమే.. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు లభిస్తే ఆరో తరగతి మొదలు 12వ తరగతి (ప్లస్ టూ) వరకు ఉచితంగా చదువు కొనసాగించవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మామునూరులోనే ఉంది. ఈ విద్యాలయంలో ఏటా ప్రవేశానికి పోటీ భారీగా ఉంటోంది. శనివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో పాటించాల్సిన మెలకువలను నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ వివరించారు.నేడు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రానికి గంట ముందే అనుమతి పరీక్ష రాసే విద్యార్థులు 5,648 మంది -
సహజారెడ్డి అంత్యక్రియలు పూర్తి
● అమెరికాలో ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి స్టేషన్‌ఘన్‌పూర్: అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో భారత కాలమాన ప్రకారం ఈనెల 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఉడుముల సహజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామశివారు గుంటూరుపల్లిలో శుక్రవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్‌రెడ్డి, గోపు మరియశైలజ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. వారి పెద్ద కుమార్తె సహజారెడ్డి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో బర్మింగ్‌హోమ్‌లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతిచెందింది. కాగా ఆమె మృతదేహాన్ని గుంటూరుపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్‌లో 96 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఇప్పగూడెంలో 1,465 ఓట్ల మెజార్టీ..
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఇప్పగూడెంలో కాంగ్రెస్, సీపీఎం పార్టీలు బలపర్చిన అభ్యర్థి మందపురం రాణిఅనీల్‌గౌడ్ రికార్డు స్థాయిలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పగూడెంలో 4,472 ఓట్లు ఉండగా 3,820 ఓట్లు పోలయ్యాయి. అందులో మందపురం రాణికి 2,582 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి 1,117 ఓట్లు వచ్చాయి. మొత్తానికి రికార్డు స్థాయిలో 1465 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విక్టరీ సాధించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ రాణి మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవతో పనిచేస్తానన్నారు. -
రాజకీయ అనుభవం లేకున్నా..
చిల్పూరు: ప్రజలు కోరిన విధంగా గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తానని మండల కేంద్రం అయిన చిల్పూరు గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన నలిమెల అనిత అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ ఎంబీఏ వరకు చదివిన తనకు రాజకీయంగా అనుభవం లేకున్నా గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని ఎమ్మెల్యే శ్రీహరి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా చిల్పూరు గుట్ట ఆలయానికి వచ్చే భక్తులతో పాటు గుట్ట చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి కోతుల బెడద నివారణకు పాటుపడతానని అన్నారు. -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
మోహన్‌రావు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్‌లైన్ అని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్‌లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి..
రఘునాథపల్లి: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీ రఘునాథపల్లి జీపీ (ఎస్సీ మహిళ) సర్పంచ్ అభ్యర్థిగా బొల్లం ఉమారాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచింది. అధికార పార్టీ తరఫున పోటీ చేసిన నీలం వనమాలపై 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి బొల్లం కుటుంబం కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తోంది. ఉమారాణికి అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించినా.. అవకాశం ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఉమారాణి ప్రత్యేకతను చాటుకున్నారు. జఫర్‌గఢ్‌లో.. జఫర్‌గఢ్: జఫర్‌గఢ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కుల్లా మోహన్‌రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం చి త్తశుద్ధితో పని చేస్తానన్నారు. గతంలో కూడా సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించినట్లు తెలిపారు. ఈసారి కూడా తనను సర్పంచ్‌గా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


