breaking news
Yadadri
-
శిల్పారామంలో ముగిసిన దసరా ఉత్సవాలు
భువనగిరి: భువనగిరి మండలంలోని రాయగిరి పరిధిలో గల మినీ శిల్పారామంలో సెప్టెంబర్ 29 నుంచి జరుగుతున్న దసరా ఉత్సవాలు అదివారం ముగిశాయి. చివరిరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య క్రమాలు అలరించాయి. హైదరాబాద్‌కు చెందిన తుమ్మాటి ప్రణవి శిష్యబృందం కళాకారులు కూచిపూడి నృత్యం ప్రద ర్శించి అలరించారు. సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో పెద్ద సంఖ్యలో.. మినీ శిల్పారామాన్ని సందర్శించారు. సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. చెరువులో బోటు షికారు చేసి, పార్కులో ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నృత్య కళాకారిణులు అంజని, కీర్తన, సహస్ర, ప్రదీక్ష, రితిక, సాన్వి, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
చేతికొచ్చిన చేనుకు దోమ పోటు
రామన్నపేట: అన్నదాతను సుడిదోమ కలవరపెడుతోంది. వరి కోతకొస్తున్న తరుణంలో పంటను కాటేస్తోంది. ఒక్క పూటలోనే చేనంతా వ్యాప్తి చెంది గింజ నల్లబారి, పొలం ఎండిపోయే ప్రమాదం ఉంది. రైతులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. దిగుబడిపై ప్రభావంజిల్లాలో 2,82, 897 ఎకరాల్లో వరి సాగు చేశారు. చేలు ఆశాజనకంగా ఉండడంతో ఎకరాకు సరాసరి 25 క్వింటాళ్ల చొప్పున ఏడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మొదట నాటు వేసిన పొలాలు తడితప్పి కోతదశలో ఉన్నాయి. ఈ దశలో సుడిదోమ కాటు (పోటు) తెగులు సోకుతుండటంతో దిగుబడిపై ప్రభావం చూపనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి దొడ్డురకానికి..సాధారణంగా సన్నరకం వరికి సుడిదోమ బెడద ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి దొడ్డురకం చేలకు విపరీతంగా సుడిదోమ ఆశించింది. సెప్టెంబర్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండడం, మోతాదుకు మించి యూరియా వాడడంతో చేలు ఏపుగా పెరిగాయి. చేనుకు గాలి తగలక పోవడం, నీరు అధికంగా నిలువ ఉండడం దోమపోటుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు● సుడిదోమ సోకిన చేను పత్రాలు ఒకే రోజులో పసుపురంగులోకి మారి ఎండిపోతున్నాయి. ● గింజల్లో రసంపోయి నల్లబారి తాలు మాదిరిగా మారుతాయి. ● చేను నేలవారి కోతకు వీలు లేకుండా పోతుంది.నివారణ చర్యలు ప్రతి రోజూ పొలాలను పరిశీలించాలి. గాలి తగిలి, పొలం ఆరడానికి చేనులో పాయలు తొక్కాలి. పొలాంలో నీటిని పూర్తిగా బయటకు తీయాలి. నివారణకు పైమెట్రోజోన్, ట్యూప్లీమెజీపిరియం, స్ప్రేడినోటిఫురాన్, బూప్రోఫీజిన్ వంటి రసాయన మందులను వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం చేను మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. సుడి దోమతో నల్లబారుతున్న వరి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఆందోళనలో రైతులుసుడిదోమ పోటు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. లక్షల సంఖ్యలో ఉండే సుడిదోమ.. గంటల వ్యవధిలో చాలా నష్టం కలిగిస్తుంది. నివారణకు రైతులు వీలైనంత వరకు చేనులో పాయలు తొక్కాలి. నీరు పూర్తిగా తీసేసి ఆరబెట్టాలి. చేను దిగువ పత్రాల మొదళ్లకు చేరేలా పై మందులు పిచికారీ చేయాలి. – వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యావసాయ అధికారి -
వందల్లో రోగులు.. ఏడుగురే వైదు్యలు
ఆలేరు: పేరుకేమో పెద్దాస్పత్రి.. రోగులకు పూర్తిస్థాయిలో సేవలు మాత్రం అందడం లేదు. అవసరమైన సదుపాయలు కల్పించకపోవడం, వైద్యుల కొరత వేదిస్తోంది. ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) నిపుణులు లేకపోవడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రి, ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లాల్సి వస్తోంది. అరకొరగా ఉన్న వైద్యులు కూడా చుట్టపుచూపులా విధులకు హాజరవుతున్నారన్న విమర్శలున్నాయి. ఆస్పత్రికి ఆలేరు పట్టణం, ఆలేరు మండలంతో పాటు, గుండాల, మోటకొండూరు మండలా లు, బచ్చన్నపేట తదితర ప్రాంతాల నుంచి నిత్యం 300 మంది వరకు రోగులు వస్తుంటారు. కానీ, రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్యులు లేరు. 100 పడకలు.. ప్రకటనకే పరిమితంకమ్యూనిటీ హెల్త్ సెంటర్ 100 పడకలకు పెంపు ప్రకటనకే పరిమితమైంది. ప్రస్తుతం 30 పడకలే ఉండటం, ఇన్‌పేషెంట్లు 50 మంది వరకు వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితిలో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వైద్యులు రెండు డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులకు ఒకటి, అనస్తిషీయన్, ఆర్ఎంఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో ఒకటి భర్తీ చేయగా, మరొకరిని డిప్యూటేషన్‌పై నియమించారు. రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్(పీడియాట్రిక్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ జనరల్ సర్జన్ ఖాళీగా ఉంది. డిప్యూటేషన్‌లో రేడియాలాజిస్ట్ భర్తీ చేశారు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టు ఖాళీగా ఉంది. ఒక స్టాఫ్ నర్సు, రెండు వార్డు బాయ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు గైనకాలాజిస్ట్లు ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా రావడం లేదనే విమర్శలున్నాయి. దంత సమస్యలు వస్తే అవస్థలే..దంత సమస్యలతో రోజూ కనీసం పది మంది ఆస్పత్రికి వస్తుంటారు. వీరికి చికిత్స చేసే పరిస్థితి లేదు. ఏడాదిన్నరగా డెంటల్ డాక్టర్ పోస్టు ఖాళీగా ఉండటమే కారణం. ఇద్దరు చిల్డ్రన్స్ డాక్టర్లు లేక జ్వరాలు, అంటువ్యాధులు సోకినప్పుడు తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యనిపుణుల కొరత రోగులకు పూర్తిస్థాయిలో అందని సేవలు భువనగిరి, జనగామ, ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్న సిబ్బందిరోజూ 300కు పైగా ఓపీ.. సాధారణ రోజుల్లో సుమారు 300, సీజన్లో 400 వరకు ఓపీ ఉంటుంది. ఓపీ ఆలస్యంగా ప్రారంభించడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు.రక్త,మూత్ర తదితర పరీక్షలకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆస్పత్రిలో కొన్ని మందులు లభించక ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలు విభాగాల్లో యంత్రాలు వృథాగా ఉన్నాయి.సీహెచ్‌సీలో పలు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశాను. వైద్యులు విధులకు సరిగా హాజరుకావడం లేదనే విమర్శలు వాస్తవం కాదు. ఉన్న డాక్టర్లతోనే రోగులకు మె రుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. –స్వప్నరాథోడ్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ -
లక్ష ్యం.. ప్రథమ స్థానం
భువనగిరి: పదో తరగతి ఫలితాల్లో యాదాద్రి జిల్లాను గత విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఏడవ స్థానంలో నిలిపిన విద్యాశాఖ అధికారులు.. ఈసారి మొదటి స్థానంపై గురిపెట్టారు. ఈ మేరకు తొలి విడతలో 66 రోజులకు ప్రణాళిక రూపొందించారు. దీన్ని సోమవారం (నేడు) నుంచి అమలు చేయనున్నారు. జిల్లాలో పదో తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 157, మోడల్ స్కూళ్లు 7 ఉన్నాయి. వాటిలో 4,754 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. కార్యాచరణ ఇదీ.. ● ఉత్తమ ఫలితాల సాధనకు నిపుణులచే రూపొందించిన అభ్యాస దీపికలను నేడు విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ● నేటి నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. ● వారంలో అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ● రోజూ ప్రత్యేక తరగతుల అనంతరం స్లిప్ టెస్ట్ నిర్వహిస్తారు. ● విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, మెరుగైన ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దనున్నారు. ● డిసెంబర్ 31 నాటికి సిలబస్ పూర్తి చేస్తారు. ● జనవరి1 నుంచి సిలబస్ రివిజన్ ఉంటుంది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.నాలుగేళ్లుగా ఉత్తీర్ణత సంవత్సరం శాతం స్థానం2021–22 93.61 132022–23 80.97 232023–24 90.44 252024–25 97.80 07‘పది’లో మెరుగైన ఫలితాల సాధనకు కార్యాచరణ నేటి నుంచి ప్రత్యేక తరగతులు ప్రతి రోజూ స్లిప్ టెస్ట్‌లు డిసెంబర్ 31లోగా సిలబస్ పూర్తి గత ఏడాది జిల్లాకు 7వ స్థానం ఈసారి మొదటి స్థానంపై గురిటెన్త్ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయటానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకో సం 66 రోజుల కార్యాచరణ రూపొందించి ప్రధానోపాధ్యాయులకు పంపడం జరిగింది. నేటినుంచి రోజూ సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. గత సంవత్సరం కలెక్టర్ సొంత ఆలోచనతో వినూత్న కార్యక్రమాలు అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రథమ స్థానం లక్ష్యంగా పనిచేస్తాం. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. – సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి -
ప్రజావాణి రద్దు
భువనగిరి: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ముగిసిన అనంతరం యథావిధిగా కొనసాగుతుందని, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని కోరారు. నేడు పీఓలకు శిక్షణ భువనగిరిటౌన్ : ప్రిసైడింగ్ ఆఫీసర్లకు (పీఓ) సోమవారం భువనగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని, ఎవరైనా సెలవుల్లో ఉంటే రద్దు చేసుకొని రావాలని పేర్కొన్నారు. హాజరుకాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటుస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో హెల్స్‌డెస్క్ ఏర్పాటు చేశారు. సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, ఫిర్యాదులు చేసేందుకు 8978928637ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. యాదగిరి క్షేత్రంలో నిత్యారాధనలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం, ఆరాధన సేవలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి, తులసీదళ అర్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం మండపంలో సు వర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు గావించారు. సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవార్తకు శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: దసరాకు సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఆదివారం యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు. దసరా సెలవులు నేటితో ముగుస్తుండటంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు అధికంగా రావడంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం పడుతుంది , వీఐపీ దర్శనానికి గంట సమయం. (నిన్న) శనివారం స్వామివారిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.41,31,970 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.నూతన తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. -
రెండు బైక్‌లు ఢీకొని..
నాంపల్లి: రెండు బైక్‌లు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. నాంపల్లి మండలం తీపిగౌరారం గ్రామానికి చెందిన జిల్లాల సాయిలు (64) నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి దారి వెంట వెళ్లే బైక్‌ను ఆపి నాంపల్లికి వస్తున్నాడు. మార్గమధ్యలో మండల కేంద్రం నుంచి మరుగూడెం వైపు వెళ్తున్న మరో బైక్ సాయిలు వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ వెనుక కూర్చున్న సాయిలు కింద పడి తలకు గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్థానికులు మృతదేహాన్ని తీసుకెళ్లనీయకుండా ఆందోళన చేయడంతో పోలీసులు వారికి సర్దిచెప్పి సాయిలు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దేవరకొండకు తరలించారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత
భువనగిరి: ఆలేరులో తప్పిపోయిన బాలుడిని బాలల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శనివారం అతడి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. బాలల సంక్షేమ సమితి చైర్మన్ బండారు జయశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 30వ తేదీన ఆలేరులో 9 సంవత్సరాల బాలుడు తప్పిపోయాడు. పోలీసులు బాలుడిని గుర్తించి భువనగిరిలోని బాలల సంక్షేమ సమితికి సమాచారం అందించారు. ఆ బాలుడికి భువనగిరిలోని చైల్డ్ కేర్ ఇనిస్ట్యూషన్స్లో ఆశ్రయం కల్పించారు. బాలుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి అని తెలుసుకుని అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు శనివారం భువనగిరిలోని బాలల సంక్షేమ సమితికి రాగా.. వారికి బాలుడిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు ఎర్ర శివరాజ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి
కట్టంగూర్: ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో శుక్రవారం జరగగా.. శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరడ గ్రామానికి చెందిన కొండూరి నరేష్(26) కూలీ పనులతో పాటు అదే గ్రామానికి చెందిన నిమ్మనగోటి భాస్కర్ ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం గ్రామంలోని ఓ రైతు తన పొలాన్ని హార్వెస్టర్‌తో కోయిస్తుండగా.. వరి ధాన్యాన్ని తరలించేందుకు ట్రాక్టర్ యజమాని పిలుపు మేరకు నరేష్ ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో హార్వెస్టర్ డ్రైవర్‌తో పాటు అక్కడ ఉన్న వారు భోజనం చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో నరేష్ కూడా విశ్రాంతి తీసుకునేందుకు ట్రాక్టర్ ట్రాలీ కింద పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వరికోత తిరిగి ప్రారంభం కాగా. నరేష్ కనిపించకపోవటంతో అదే గ్రామానికి మరో ట్రాక్టర్ డ్రైవర్ ఎస్కే రహీమ్ నరేష్ నడిపే ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి ముందుకు కదిలించాడు. దీంతో ట్రాక్టర్ ట్రాలీ కింద నిద్రించిన నరేష్ తలపై నుంచి టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు రహీమ్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. -
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
సూర్యాపేటటౌన్ : ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జనగామ– సూర్యాపేట రహదారిపై సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామ స్టేజీ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారాంపురం కాలనీకి చెందిన సారగండ్ల నాగరాజు(32), అతడి స్నేహితుడు సంతోష్ మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలకు వెళ్లి బైక్‌పై తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు వస్తుండగా.. సూర్యాపేట నుంచి అర్వపల్లి వైపు వెళ్తున్న కారు జనగామ– సూర్యాపేట రహదారిపై సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామ స్టేజీ సమీపంలో వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న సారగండ్ల నాగరాజు రోడ్డపై ఎగిరిపడి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్ నడిపిస్తున్న సంతోష్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిక్షణాల్లోనే బత్తుల సైదులు అనే వ్యక్తి స్కూటీపై సూర్యాపేట వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో బైక్‌ను తగిలి కిందపడిపోగా.. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ప్రమాదంపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. ఫ మరో ఇద్దరికి గాయాలు -
సాగర్‌కు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను శనివారం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని బెల్లంకొండలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తూ నాగార్జునసాగర్‌ను సందర్శించారు. సాగర్ డ్యాం, ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రం, నాగార్జునకొండ ప్రాంతాలను సందర్శించారు. స్థానిక గైడ్ సత్యనారాయణ చారిత్రక విశేషాలను వివరించారు. చింతపల్లి సాయిబాబాను దర్శించుకున్న మాజీ సీజేఐ కొండమల్లేపల్లి(చింతపల్లి): చింతపల్లి మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయాన్ని శనివారం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబా క్షేత్రం ఎంతో ఆధ్యాత్మికంగా ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట శ్రీనివాసరాజు, ఆలయ నిర్వాహకులు ఉన్నారు. ఆర్టీసీ కండక్టర్ అదృశ్యం చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.నాగారం గ్రామానికి చెందిన సుర్కంటి కిరణ్‌రెడ్డి(32) కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసముంటూ దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి నాలుగేండ్ల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం కల్గలేదు. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కిరణ్‌రెడ్డి గత ఆరు నెలల నుంచి భార్యకు దూరంగా.. గత రెండు నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా స్వగ్రామం డి.నాగారంలోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. కుటుంబ సభ్యులు శనివారం తెల్లవారుజామున నిద్ర లేచి చూడగా కిరణ్‌రెడ్డి కనిపించలేదు. అతడు బైక్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో కిరణ్‌రెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. బహిర్భూమికి వెళ్లి మృతినూతనకల్: బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లసింగారం గ్రామానికి చెందిన గంజి ధర్మపురి కుమారుడు గంజి రాము(41) సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసముంటున్నాడు. దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చిన రాము బుధవారం సాయంత్రం బహిర్భూమి కోసం గ్రామ శివారులోని వాగు వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. శనివారం వాగు వద్దకు వెళ్లిన వ్యక్తులకు నీటిలో మృతదేహం తేలియాడుతుండడం చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వచ్చి చూసి మృతిచెందింది గంజి రాముగా గుర్తించారు. మృతుడి సోదరుడు సుభాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విషాదం నింపిన గెట్ టుగెదర్
నార్కట్‌పల్లి: దసరా సెలవుల్లో ఓ ఫాంహౌస్‌లో కలుసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు సరదాగా నీటి సంపులో దిగి ఈత కొడుతుండగా.. ప్రమాదవశాత్తు అందులో మునిగి ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర్లబావి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన నల్లగొండ నాగరాజు, స్వాతి దంపతుల పెద్ద కుమారుడు రిషిక్(17), చౌటుప్పల్ పట్టణానికి చెందిన పోలోజు శ్రీను పెద్ద కుమారుడు హర్షవర్ధన్(17)తో పాటు మరికొంత మంది నార్కట్‌పల్లి సమీపంలోని విద్యాపీఠ్ పాఠశాలలో కలిసి పదో తరగతి చదువుకున్నారు. ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌లో వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. రిషిక్, హర్షవర్ధన్‌తో పాటు నార్కట్‌పల్లి, చౌటుప్పల్, చిట్యాల, హైదరాబాద్, నకిరేకల్ తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది స్నేహతులు కలసి దసరా సెలవుల్లో నార్కట్‌పల్లిలో కలుసుకుందామని నిర్ణయించుకున్నారు. శనివారం అందరూ కలిసి నార్కట్‌పల్లికి చేరుకుని వారిలో ఓ స్నేహితుని తండ్రి సహకారంతో జువ్విగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరబావి గ్రామ సమీపంలో ఓ డీఎస్పీకి చెందిన ఫాంహౌస్‌లో కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడికి చేరుకొని సరదాగా గడిపారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం రిషిక్, హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరు ఈత కొట్టేందుకు ఫాంహౌస్‌లోని నీటి సంపులోకి దిగారు. రిషిక్‌కు ఈత సరిగా రాక అందులో మునిగిపోయాడు. దీంతో హర్షవర్ధన్ వెంటనే రిషిక్‌ను కాపాడేందుకు యత్నించగా.. అతడు కూడా నీటి సంపులో మునిగిపోయాడు. వారి స్నేహితులు వెంటనే ఫాంహౌస్ వద్ద పనిచేస్తున్న వ్యక్తికి విషయం తెలియజేయగా.. అతడు ఫాంహౌస్ యజమానికి సమాచారం ఇచ్చాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో ఇద్దరు విద్యార్థులను నీటి సంపు నుంచి బయటికి తీయగా అప్పటికే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రిషిక్ తల్లిదండ్రులు నార్కట్‌పల్లి మండల కేంద్రంలోనే కిరాణ దుకాణం నడిపిస్తుండగా, హర్షవర్ధన్ తండ్రి చౌటుప్పల్ మండల కేంద్రంలో రేడియం దుకాణం నిర్వహిస్తున్నాడు. నీటి సంపులో నుంచి విద్యార్థులను బయటకు తీయిస్తున్న పోలీసులు రోదిస్తున్న రిషిక్ తల్లి ఫ ఫాంహౌస్‌లో కలుసుకున్న పదో తరగతి స్నేహితులు ఫ అందులోని నీటి సంపులో ఈత కొడుతూ నీట మునిగి ఇద్దరు మృతి ఫ నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఘటన -
బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు రాజకీయ సమాధి తప్పదు
నల్లగొండ టౌన్: బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు రాజకీయ సమాధి తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆయన శనివారం నల్లగొండలోని బీసీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా, రెడ్డి జాగృతికి చెందిన కొంతమంది కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఒక్కటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని ఆయన అన్నారు. ఉన్న జనాభా కంటే 18 శాతం రిజర్వేషన్లు తక్కువ చేసి 42 శాతంతో బీసీలకు సరిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, రెడ్డి జాగృతికి చెందిన వారు బీసీ రిజర్వేషన్లు చెల్లవంటూ కోర్టులకు వెళ్లారని తెలిపారు. ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు గత 80 ఏళ్లుగా 90 శాతం పదవులు అనుభవిస్తూ బీసీల వాటాను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరగవంటూ.. బీసీ రిజర్వేషన్ల అమలు కావంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదముద్ర వేసే బాధ్యత బీజేపీ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఆగిపోతే దానికి బీజేపీ బాధ్యత వహించాలన్నారు. మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, కాసోజు విశ్వనాథం, నల్ల సోమ మల్లన్న, కేశబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
నూతనకల్: బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నూతనకల్ మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లసింగారం గ్రామానికి చెందిన పల్సా భిక్షం కుమారుడు పల్సా గణేష్(17) పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనకు కొత్త బైక్ కొనివ్వాలని దసరా రోజు గణేష్ తన తల్లిదండ్రులను అడగగా.. వారు అందుకు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన గణేష్ శుక్రవారం రాత్రి ఇంట్లోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు మనస్తాపానికి గురైన విషయాన్ని అర్థం చేసుకున్న తండ్రి శనివారం తెల్లవారుజామున గణేష్ గదిలోకి వెళ్లగా అతడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారికి విషయం చెప్పి కిందకు దించి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఆంజనేయ స్వామి పుష్కరఘాట్‌కు 50 అడుగుల దూరంలో కృష్ణా నది తీరంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని స్థానికులు తెలిపారు. ఇటీవల కృష్ణా నదిలో ముగ్గురు గల్లంతు కావడం గమనార్హం. -
ఆదర్శ ఉపాధ్యాయుడు.. వెంకట్‌రెడ్డి సార్
విద్యాభివృద్ధికి వెంకట్‌రెడ్డి చేస్తున్న కృషికి గుర్తింపుగా గ్లోబల్ టీచర్ అవార్డు, జాతీయ విద్యారత్న అవార్డు, జాతీయ పుడమి అవార్డు, తెలంగాణ ప్రతిభారత్న, మదర్‌థెరిస్సా ఉత్తమ సేవా పురస్కారం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, లయన్స్‌క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారిచే రెండుసార్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లాంటి మరెన్నో అవార్డులు లభించాయి. పెద్దవూర: ఆయన ఏ పాఠశాలలో పనిచేసినా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది పలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు పెద్దవూర మండలంలోని ఏనేమీదిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తూడి వెంకట్‌రెడ్డి. ఆయన పనిచేసిన ప్రతీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, రీసోర్స్‌పర్సన్‌గా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యార్థులకు యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాస తరగతుల నిర్వహిస్తూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫ 2001 డీఎస్సీలో ఎంపికై న వెంకట్‌రెడ్డి నిడమనూరు మండలం కుంటిగొర్లగూడెం పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి అక్కడే 2009 వరకు హెచ్ఎంగా పనిచేశారు. ఇక్కడ పక్కా భవనం లేకపోవడంతో ఐదున్నరేళ్లు చెట్ల కిందనే పాఠశాలను కొనసాగించి అత్యుత్తమ పాఠశాలగా తీర్చిదిద్ది ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. పాఠశాలకు పక్కా భవనం మంజూరైనా స్థలం లేకపోవడంతో గ్రామానికి చెందిన అబ్బయ్య తన సొంత ఇంటి స్థలాన్ని పాఠశాలకు కేటాయించారు. వెంకట్‌రెడ్డి సార్ ప్రోత్సాహంతో నేడు ఆ గ్రామంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డవారు ఎందరో ఉన్నారు. 2009లో వేములపల్లి మండలం శెట్టిపాలెం హెచ్ఎంగా బదిలీపై వెళ్లి 65 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను 108 మందికి పెంచారు. 2015లో త్రిపురారం మండలం బాబుసాయిపేట యూపీఎస్‌కు బదిలీపై వెళ్లారు. మూతపడే స్థితిలో ఉన్న ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 150 మందికి పెంచారు. ఇంగ్లిష్ మీడియంను కూడా ప్రారంభించారు. తొమ్మిదేళ్ల పాటు విద్యార్థులకు తన సొంత ఖర్చులతో బెల్టులు, టై, నోట్‌బుక్స్‌తో పాటు భోజనం ప్లేట్లను సైతం పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆయా గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఉన్నత చదువులు చదివేలా, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా ప్రోత్సహించారు. గత 15 ఏళ్లుగా ప్రాథమిక స్థాయి గణితంతో పాటు వివిధ అంశాలపై జిల్లా రీసోర్స్‌పర్సన్‌గా, మాస్టర్ ట్రైనర్‌గా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తొలిమెట్టు కార్యక్రమంలో స్టేట్ రీసోర్స్‌పర్సన్‌గా గణిత ఉపాధ్యాయ కరదీపిక రూపకల్పనలో భాగస్వామ్యమి అయ్యారు. గ్లోబల్ టీచర్ అవార్డు అందుకుంటున్న వెంకట్‌రెడ్డి విద్యార్థులకు యోగాసనాలు నేర్పిస్తున్న ఉపాధ్యాయుడు వెంకట్రెడ్డిటై, బెల్టులు పంపిణీ చేస్తున్న వెంకట్రెడ్డిఫ ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ప్రభుత్వ టీచర్ ఫ పలు అవార్డులు ఆయన సొంతం నేడు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం -
రైతులకు అన్యాయం జరగనివ్వను
చిట్యాల: రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతులున్న రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో శనివారం ఆయనను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని, సంస్థాన్‌నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు కలిశారు. ఈ సంర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, ఇంకా ఎలాంటి అలైన్మెంట్ జరగలేదని అన్నారు. ప్రభుత్వం, అధికారులు చెప్పేంత వరకు వివిధ పత్రికల్లో అలైన్‌మెంట్‌పై వస్తున్న కథనాలను నమ్మొద్దని అన్నారు. గ్రామాల్లో అధికారులతో సభలు నిర్వహించి రైతుల అంగీకారంతోనే న్యాయమైన పరిహారం చెల్లించి భూసేకరణ చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జాతీయ రహదారికి మరమ్మతులు.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని 2022లోనే విస్తరణ చేయాల్సిందన్నారు. కానీ జీఎంఆర్ సంస్థ పనులు చేపట్టకపోవటంతో పాటు రహదారి నిర్వహణ నుంచి వైదొలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం హైవే పలు చోట్ల ధ్వంసమైందని, మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. హైవే విస్తరణతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లుతో విస్తరించేందుకు డిసెంబర్లో టెండర్లు పిలిచి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను మరో 250 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు వివరించారు. అనంతరం రీజినల్ రింగ్ రోడ్డు రైతులు పల్లెల పుష్పారెడ్డి, కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, పగిళ్ల మోహన్‌రెడ్డి మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో చిట్యాల మున్సిపాలిటి మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, చౌటుప్పల్ మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, ఆవుల యాదయ్య, దోర్నాల రామచంద్రం, నీలకంఠం లింగస్వామి, ఇబ్రహీం, ఎడ్ల మహాలింగం తదితరులు పాల్గొన్నారు.ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
యాదగిరిగుట్టకు తరలివచ్చిన భక్తులు
యాదగిరిగుట్ట: దసరాకు సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. దీంతో శనివారం ఆలయ పరిసరాలు, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టగా.. వీఐపీ దర్శనానికి 45 నిమిషాల సమయం పట్టింది. స్వామిని 35వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిత్యాదాయం రూ.41,31,970 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
మున్సిపాలిటీలకు నిధులొచ్చాయ్..
భువనగిరి: నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీలకు ఊరట కలగనుంది. మౌలిక వసతుల కల్పనకు నగరాభివృద్ధి పేరిట రూ.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధులతో మౌలిక వసతులు మెరుగయ్యే అవకాశం ఉంది. కొంతవరకు తీరనున్న సమస్యలు నిధులు రాక, సరైన ఆదాయ వనరులు లేక మున్సిపాలిటీలపై ఆర్థికంగా భారం పడుతోంది.అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు సమకూర్చలేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లకాలంగా సీసీ రోడ్లు, అంతర్గత రహదారులకు నోచని ప్రాంతాలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో డ్రెయినేజీలు లేకపోవడం, ఉన్న చోట అస్తవ్యస్తంగా ఉండటంతో జనావాసాల మధ్య మురుగు నీరు ప్రవహిస్తోంది. నగరాభివృద్ధి పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కొంత మేరకు సమస్య తీరనుంది. నగరాభివృద్ధి పేరిట రూ.90 కోట్లు మంజూరు ఫ ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు ఫ డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం -
జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు
ఫ తుంగతుర్తిలో ముగిసిన మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు ఫ తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఫ జోహార్ దామన్న అంటూ అశ్రునివాళి ఫ హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, లక్ష్మణ్‌కుమార్, ఎంపీ, ఎమ్మెల్యేలుతుంగతుర్తి: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న జనహృదయనేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తన గడి వెంట ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటలకు గౌరవసూచకంగా పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆర్డీఆర్ కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. ఉమ్మడి జిల్లాలో తిరుగులేని నేతగా పేరు గడించిన దామన్నను కడసారి చూసేందుకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు, అభిమానులు, పార్టీశ్రేణులు తరలివచ్చారు. తమ అభిమాన నేతను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. జోహార్ దామన్న అంటూ నినాదాలు చేశారు. ప్రముఖుల శ్రద్ధాంజలిఅంత్యక్రియల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వృద్ధులు వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, నలగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ ఎమ్మెల్యేలు మందుల సామేలు, పద్మావతిరెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అనిల్‌రెడ్డి రాజేందర్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సంకేపల్లి సుధీర్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మాజీ ఎంపీలు హన్మంతరావు, బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, గాదరి కిషోర్‌కుమార్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పరమేశ్వర్‌రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, మహిళా కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్‌రావు, కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, టీపీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్, ఎస్పీ నరసింహ, పలువురు ప్రముఖులు ఆర్డీఆర్ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. శోకసంద్రంలో తుంగతుర్తి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి తుంగతుర్తి ప్రజలతో పాటు, ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. జనహృదయనేతను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. దామోదర్ రెడ్డి పార్థివదేహం శుక్రవారం రాత్రి తుంగతుర్తిలోని స్వగృహానికి చేరే వరకు వేచి ఉన్నారు. అలాగే శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నివాళులర్పించారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు. -
తెల్లబంగారం.. దళారులపరం!
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి, యాదాద్రి: ప్రకృతి వైపరీత్యాలు, కొనుగోళ్లలో ఒడిదుడుకులు పత్తి రైతును కుంగదీస్తున్నాయి. పంట చేతికొస్తున్నా సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలను ప్రారంభించడం లేదు. పెట్టుబడికోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు, ఇతర అవసరాలకు తక్కువ ధరకే పత్తిని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు, ప్రైవేట్ వ్యాపారులు.. తేమ, నాణ్యత లేదని, రంగుమారిందని సాకులు చూపి ధర తగ్గిస్తున్నారు. జిల్లాలో 1,13,193 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 11,31,930 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 12 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దక్కని మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.8110 నిర్ణయించింది. కానీ దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రూ.6వేలకు మించి ధర చెల్లించడం లేదు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇళ్ల వద్దకు, పొలాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు, దళారుల మోసాలను అరికట్టాల్సిన మార్కెటింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తక్కువకు కొనుగోలు చేసి మద్దతు ధరకు.. మార్కెటింగ్ అధికారులు జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్లులను ఎంపిక చేశారు. సీసీఐ ఆధ్వర్యంలో ఇక్కడ మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలి. ప్రస్తుతం సీసీఐ నుంచి సేకరణ ప్రారంభం కాకపోవడంతో ప్రైవేట్‌గా మిల్లుల్లోనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన పత్తిని తర్వాత రైతుల పేరున సీసీఐకి మద్దతు ధరకు విక్రయిస్తారు. పత్తి చేతికొస్తున్నా తెరుచుకోని సీసీఐ కేంద్రాలు ఫ అవసరాల నిమిత్తం ప్రైవేట్‌కు అమ్ముకుంటున్న రైతులు ఫ ఇదే అదనుగా తీసుకుంటున్న దళారులు, వ్యాపారులు ఫ తేమ, నాణ్యత పేరుతో కొర్రీలు.. క్వింటాకు రూ.4500 నుంచి రూ.5 వేలే చెల్లింపు ఫ రూ.3 వేలకు పైగా నష్టపోతున్న కర్షకులు ఈ చిత్రంలోని మహిళా రైతు పేరు బడికే లక్ష్మి. ఆత్మకూర్(ఎం) మండలం తుక్కాపూర్‌లో సొంత భూమికి తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పది ఎకరాల్లో పత్తి వేశారు. తొలుత చేతికొచ్చిన పత్తి ఏరగా 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఓ వ్యాపారికి విక్రయించగా క్వింటాకు రూ.4,500 చెల్లించాడు. పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులు, ఇతర అవసరాల నిమిత్తం ఇప్పటికిప్పుడు పత్తి విక్రయించాల్సి వచ్చిందని, క్వింటాకు రూ.3600 నష్టపోయానని లక్ష్మి వాపోయింది. విపరీతమైన వర్షాలు, జాజురోగం వల్ల చేను దెబ్బతిన్నదని, పెట్టుబడి వెళ్లడం కూడా కష్టమేనని పేర్కొంది. నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. తొలి దశ చేతికొచ్చి న పత్తిని వారం రోజుల క్రితం ప్రైవేట్ వ్యాపారికి విక్రయించాను. రంగు మారిందని క్వింటాకు రూ.5 వేల చొప్పున కొనుగోలు చేశాడు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్లే ప్రైవేట్ వ్యాపారిని ఆశ్రయించాల్సి వచ్చింది. –కె.సిద్ధులు, రైతు, బహుద్దూర్‌పేట -
వాహనాల తనిఖీలు
యాదగిరిగుట్ట: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో శనివా రం సాయంత్రం ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ముందస్తుగానే నగదు తరలించే అవకాశం ఉండటంతో తనిఖీలు చేసినట్లు పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు. అంతేకాకుండా యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేసినట్లు చెప్పారు. మద్యం టెండర్లకు 45 దరఖాస్తులు భువనగిరి: మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని నాలుగు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో 82 మద్యం షాప్‌లకు సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శని వారం సాయంత్రం వరకు 45 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 18వరకు దరఖాస్తు గడువు ఉంది. దుర్గాదేవి ముక్కుపుడక రూ.1.55 లక్షలు సంస్థాన్ నారాయణపురం: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సంస్థాన్నారాయణపు రం మండలం చిమిర్యాలలో విజయదుర్గ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవికి అలంకరించిన ముక్కు పుడక, చీరలు, దండ రికార్డు స్థాయి ధర పలికాయి. శనివారం నిర్వహించిన వేలంలో ముక్కు పుడకను మొగుదాల నరేష్ రూ.1,55,001, లక్ష్మీ దండను మొగుదాల హరీష్ రూ.1,00,001 దక్కించుకున్నారు. ముక్కపుడక, లక్ష్మీ దండ, చీరల వేలం ద్వారా రూ.5,09 లక్షల ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యుడు సుర్వి దయాకర్, దండుగుల నగేష్, మొగుదాల స్వామి, దాసోజు వెంకటాచారి, సిద్ధప్ప, శ్రీను, కిషన్, గణేష్, లింగస్వామి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలరించిన నృత్య ప్రదర్శనభువనగిరి : మండల పరిధిలోని రాయగిరి మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సృజన అకాడమీ బృందం కళాకారులు భరతనాట్యంతో అలరించారు. సందర్శకులు ప్రదర్శనలు తిలకించి, చెరువులో బోటు షికారు చేసి ఆహ్లాదంగా గడిపారు. సేవలకు గుర్తింపుగా పురస్కారం భువనగిరి: జిల్లా కేంద్రానికి చెందిన బుషపాక శివకుమార్‌కు శ్రీ అన్నపూర్ణ పురస్కార్–2025 అవార్డు అందుకున్నాడు. సేవా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా కొంతకాలంగా సా మాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సేవలకు గుర్తింపుగా అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్‌లోని త్యాగరాజు గాన సభలో మహాశాస్త్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యారాధనలో భాగంగా నిత్య కల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. శనివారం వేకువజామున శ్రీస్వామి,అమ్మవార్లకు సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
సమన్వయంతో పని చేయండి
సాక్షి, యాదాద్రి: నోడల్ అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్ఓ), సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు (ఏఆర్ఓ)సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియ ను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆర్ఓలు, ఏఆర్ఓలకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని.. ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమావళిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. హ్యాండ్‌బుక్‌లోని ప్రతి అంశంపై పట్టు ఉండాలని, పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలన్నారు. సందేహాలను నివృత్తి చేసుకోవాలి ఆర్ఓలు, ఏఆర్ఓలకు ఏచిన్న సందేహం ఉన్నా తక్షణమే నివృత్తి చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, జెడ్పీసీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
స్వర్ణగిరీశుడికి గజవాహన సేవ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి గజవాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణం, వసంతోత్సవం, సాయంత్రం హనుమంత వాహనసేవ, రాత్రి జలనారాయణ స్వామికి మంగళహరతుల సమర్పణ తదితర పూజలు నిర్వహించారు. -
యాదగిరీశుడి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి విజయదశమి సందర్భంగా గురువారం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చక బృందం ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ రవి నాయక్ లడ్డూప్రసాదం అందజేశారు. ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవంయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని జరిపించారు. ఇక ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం నిర్వహించారు. స్వర్ణగిరీశుడికి సూర్యప్రభ వాహన సేవభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, స్వామి వారికి పద్మావతి అమ్మవార్లకు నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం పెద్ద శేషవాహన సేవ, పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిపించారు. అంతకు ముందు స్వామి వారికి ఏకాదశి సందర్భంగా స్వామి వారికి నవకలశ పంచామృతభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాలుభువనగిరి: మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆలేరుకు చెందిన డ్యాన్స్ టీచర్ దుర్గారావు ఆధ్వర్యంలో కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. -
శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. సెప్టెంబర్ 22న ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరీదేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహా పూర్ణాహుతి నిర్వహించి, కలశోద్వాసన పూజ జరిపించారు. సాయంత్రం 5.30గంటలకు విజయదశమి వేడుక, శమీ పూజతో ఉత్సవాలు ముగించారు. -
దామన్న యాదిలో..
తుంగతుర్తిలో 9 ఎకరాల్లో విశాలమైన ప్రాచీన గడి ఉంది. దామోదర్‌రెడ్డి ఇందులోనే ఉండేవారు. గడి చుట్టూ ప్రహరీ నిర్మించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. గడి చుట్టూ పామాయిల్ తోటలు, పండ్ల తోటలు సాగు చేసేవారు. ఈ మధ్య కాలంలోనే గడిని ఆధునీకరించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆయన మార్కెట్లోకి వచ్చిన కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు. ట్రాక్టర్లు, జిప్సీలు, వ్యాన్లపై ఎక్కువ మక్కువ ఉండేది. ఏ ఒక్క వాహనాన్ని అమ్మకుండానే గడి ముందు ఉంచారు. తిరుమలగిరి (తుంగతుర్తి) : కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రికార్డు సృష్టించిన వ్యక్తి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి. ఖమ్మం జిల్లా లింగాల గ్రామానికి చెందిన ఆయన తుంగతుర్తికి చెందిన ఉప్పునూతల కౌసల్యాదేవి రెండవ కుమార్తె వరూధిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిర పడ్డారు. అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీదే ఆధిపత్యం ఉండేది. దామోదర్‌రెడ్డి కమ్యూనిస్టుల ఆదిపత్యాన్ని తగ్గించి వరుసగా 1985, 1989, 2004లో గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో జిల్లాలో 11 నియోజకవర్గాలలో టీడీపీ మిత్ర పక్షాల అభ్యర్థులు గెలుపొందగా దామోదరరెడ్డి ఒక్కరు మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. 1992లో నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి, 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రుల హయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అధునాతన పంటల సాగుపై ఆసక్తి మాజీ మంత్రి దామోదర్‌రెడ్డికి పశు సంపద, వ్యవసాయం అంటే చాలా ఆసక్తి. తుంగతుర్తిలోని 130 ఎకరాల్లో అల్లనేరేడు, సపోట, మామిడి, పామాయిల్ తోటలు వేశారు. అలాగే కూరగాయల సాగు చేశారు. ఈ ప్రాంత రైతులకు నూతన పంటలపై అవగాహన కల్పించి వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించేవారు. అదేవిధంగా ఎడ్ల గిత్తలను పెంచి వాటికి శిక్షణ ఇప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగే ఎడ్ల పందెంలో పోటీ చేయించేవారు. రాంరెడ్డి బ్రదర్స్ ఎడ్ల గిత్తలకు మంచి పేరు ఉండేది. ఎడ్ల గిత్తల స్పెర్మ్‌తో మేలు జాతి పశువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా వివిధ దేశాల నుంచి శునకాలను తీసుకువచ్చి శిక్షణ ఇప్పించి పోటీల్లో ఉంచేవారు. వ్యవసాయమంటే మక్కువ దామోదర్‌రెడ్డికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఈ ప్రాంతానికి నీటి సౌకర్యం తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలనే సాకుతో ఎన్నో ఉద్యమాలు చేశారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు శంకుస్థాపన చేసి వదిలేశారు. 1999లో అప్పటి సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డితో కలిసి దామోదర్‌రెడ్డి శిలా ఫలకం వద్ద రక్తతర్పణం చేశారు. అలాగే వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే శిలాఫలకం వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపారు. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జల యజ్ఞంలో భాగంగా ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు నిధులు కేటాయింపజేసి కాల్వ పనులు పూర్తి చేయించారు. 2009లో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా గోదావరి జలాలను విడుదల చేయించారు. ఈ కాల్వల ద్వారా జిల్లాకు వందల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా ఉండేవారు. ప్రచారం జరిగిన ప్రతిరోజు చేతికి లెదర్ బ్యాగ్ ఉండేది. ఆయన ఇది తనకు సెంటిమెంట్‌గా భావించేవారు. ప్రచారంలో పార్టీ ముఖ్య నాయకులను, ప్రజలను కలిసే సమయంలో ఈ బ్యాగ్ ఉండడంతో ప్రజలంతా బ్యాగ్‌ను ఆసక్తిగా చూసేవారు. అందులో ఏం ఉందోనని చర్చించుకునేవారు. కొందరు డబ్బులు ఉండి ఉంటాయని.. మరికొందరు పిస్టల్ ఉంటుందని చర్చించుకునేవారు. ఫ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఫ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి -
అర్వపల్లిలో పూజలు చేశాకే ఎన్నికల ప్రచారం
అర్వపల్లి: మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఇలవేల్పు దైవం. దామోదర్‌రెడ్డి అత్త ఉప్పునూతల కౌసల్యాదేవి పూర్వీకులు అప్పట్లో 750 ఎకరాల భూమిని అర్వపల్లి ఆలయానికి దానం చేశారు. దామోదర్‌రెడ్డి తుంగతుర్తి, సూర్యాపేట రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన ప్రతిసారి బీఫామ్‌తో ఇక్కడి ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఆనవాయితీ. అదేవిధంగా ప్రతి ఏటా ఇక్కడి ఆలయంలో స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే కల్యాణోత్సవానికి దామోదర్‌రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపిస్తారు. వారి కుటుంబం ఏ మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఇక్కడి ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేసి పనులు ప్రారంభిస్తారు. 1985కు ముందు తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉండేది. ఆర్డీఆర్ ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రతి గ్రామంలో రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించారు. గోదావరి జలాలు తీసుకువచ్చి కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. – దరూరి యోగానందచారి, డీసీసీ ఉపాధ్యక్షుడు 40 ఏళ్లుగా నేను దామోదర్‌రెడ్డి వెంటే ఉన్నా. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు ఆయన బాగోగులు చూసుకునేవాడిని. ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. తుంగతుర్తిలో శాశ్వతంగా ఉండటానికి ఏడాది కిందట గడీని మరమ్మతు చేయించుకొని ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. ఆయన గుర్తులు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటకీ మరిచిపోలేరు. – పెండెం రామ్మూర్తి, సీనియర్ నాయకుడు -
చికిత్స పొందుతూ మహిళ మృతి
డిండి: బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్న మహిళ శుక్రవారం మృతి చెందింది. గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల కేంద్రానికి చెందిన ఈరటి ఆంజనేయులు, ఈరటి అంజనమ్మ(30) దంపతులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అంజనమ్మ మూడవ సంతానంలో భాగంగా గర్భిణి కావడంతో డెలివరీ నిమిత్తం గత నెల 6న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు డెలివరీ కావడంతో పాప పుట్టింది. అంజనమ్మకు రక్తం తక్కువగా ఉండడంతో వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించారు. గంట తర్వాత అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజనమ్మ శుక్రవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కల్వకుర్తి ఆస్పత్రిలోని వైధ్యుల నిర్లక్ష్యం కారణంగానే అంజనమ్మ మృతి చెందినందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
నీటిసంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి
కనగల్: మండలంలోని పగిడిమర్రి గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. పగిడిమర్రికి చెందిన ఇటికాల రామలింగం – శ్రీలత కుమారుడు హర్షద్ రామ్(3) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో బొమ్మలతో ఆడుకుంటుండగా బొమ్మ నీటి సంపులో పడింది. దానిని బయటకు తీసే క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తల్లిదండ్రులు కొద్దిసేపటి తర్వాత బయటకి రాగా కుమారుడు నీటిసంపులో పడి ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతిమిర్యాలగూడ అర్బన్: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. టూ టౌన్ ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌చౌక్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న 48 ఏళ్ల వ్యక్తిని గుర్తించిన స్థానికులు 108 అంబులెన్స్ సాయంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. అతడు కొద్ది రోజులుగా పట్టణంలో భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే 87126 70150, 99664 98185 నంబర్లను సంప్రదించాలని కోరారు. 6న హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ధర్నాభువనగిరి: రీజినల్ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి ఈ నెల 6న హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ కోరారు. శుక్రవారం భువనగిరిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన అలైన్మెంట్ కాకుండా 28 కిలోమీటర్లు కుదించడం వల్ల వరి, పత్తి పంటలు పండించే సారవంతమైన భూములు రైతులు కోల్పోతున్నారన్నారు. సాగుకు యోగ్యం కాని భూములు తీసుకోవాలని చట్టం చెబుతున్నా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్న వర్గాలను కాపాడేందుకు అలైన్మెంట్ మార్చి రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. కొండమడుగు నర్సింహ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, పెంటయ్య, కృష్ణారెడ్డి, స్వామి, నర్సింహ, చంద్రారెడ్డి, యాదగిరి, యాదిరెడ్డి, జయరాములు పాల్గొన్నారు. -
శ్రీనివాసాచారికి దసరా పురస్కారం
రామగిరి(నల్లగొండ): విజయదశమి పర్వదినం సందర్భంగా విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం అందించే దసరా పురస్కారం – 2025కు నల్లగొండకు చెందిన తెలుగు అధ్యాపకుడు ఇడికోజు శ్రీనివాసాచారి ఎంపికయ్యారు. అక్టోబర్ 5న హైదరాబాద్‌లో జరిగే దసరా పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డు అందుకోనున్నారు. ఇడికోజు శ్రీనివాసాచారి తెలుగు భాష, జానపద అధ్యయనం, సాహిత్య సమీక్ష, సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను ఆయనకు అవార్డు అందజేయనున్నారు. -
ఆ గ్రామాల్లో దసరా ప్రత్యేకం
రాజాపేట : దసరా పండుగను రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. చాలామంది హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ పండుగ రోజు స్వగ్రామానికి విచ్చేసి వేడుకల్లో పాల్గొంటారు. రాజుల కాలం నుంచి గ్రామానికి చెందిన ఠాకూర్ వంశస్తులు దుర్గామాతకు నవరాత్రులు పూజలు నిర్వహించి 9వ రోజు ఆయుధపూజ నిర్వహిస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి గుర్రం(సిరిమల్లె) వంశీయులతో కలిసి డప్పువాయిద్యాలతో గడికోటలోని మైసమ్మ దేవాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజ లు చేస్తారు. అనంతరం జాతీయ జెండాను చేతబూని తల్వార్లతో ప్రదర్శన నిర్వహిస్తూ జమ్మి కోసం బయల్దేరుతారు. గ్రామం శివారులోని సంఘమేశ్వరస్వామి దేవాలయం వరకు చేరుకుని జమ్మి వృక్షానికి పూజలు చేస్తారు. పూర్వం మాత్రం ఠాకూర్ వంశానికి చెందిన సత్యనారాయణసింగ్ తనకున్న లైసెన్స్ గన్ భుజానికి వేసుకుని ఊరేగింపుగా వెళ్లి శమిపూజ తర్వాత గన్‌తో రెండుమార్లు తూర్పుదిక్కు గాలిలోకి పేల్చిన అ నంతరం ప్రజలు జమ్మి తీసుకునేవారు. ఠాకూర్ సత్యనారాయణసింగ్ 1994 వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట, రామన్నపేట మండలం లక్ష్మాపురంలో దసరా పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. లక్ష్మాపురంలో గ్రామస్తులు దసరా రోజు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు జాతీయ జెండా, తల్వార్లతో ర్యాలీగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.రామన్నపేట: రాన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో దసరా రోజు జాతీయ జెండాను ఎగురవేస్తారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి కచ్చీరు వద్ద జాతీయ జెండాను ఎగురవేసే సంప్రదాయం కొనసాగుతోంది. గ్రామానికి చెందిన పటేల్ వంశస్థులు పండుగ రోజు తెల్లవారుజామున పాత జాతీయ జెండాను అవనతం చేస్తారు. ఉదయం 10గంటల సమయంలో డప్పుచప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి కొత్త జెండా కర్రకు అలంకరణ చేసి కొత్త తాడుతో జాతీయ జెండాను ఎగర వేయడం జరుగుతుంది. జాతీయ పతాకావిష్కరణలో గ్రామస్తులంతా పాల్గొంటారు. జమ్మిచెట్టు వద్దకు పూజకు వెళ్లే సమయంలో అక్కడే పూజలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు, కులపెద్దలకు కంకణాలు అందజేస్తారు. జమ్మిచెట్టు నుంచి జాతీయజెండా వద్దకు తిరిగి వచ్చి ఒకరికొకరు జమ్మి పెట్టుకొని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అదేవిధంగా నిధానపల్లిలో బురుజుపైన, నీర్నెముల, శోభనాద్రిపురం, సిరిపురం గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.ఏటా స్వగ్రామానికి ఠాకూర్ వంశస్తులుజాతీయ జెండా ఆవిష్కరణ -
రోడ్డుకు వేసవిలో శాశ్వత మరమ్మతులు
మోత్కూరు: మొత్కూరు పెద్ద చెరువు (మినీ ట్యాంక్‌బండ్) కట్ట రోడ్డుకు వేసవిలో శాశ్వత మరమ్మతులు చేపడుతామని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో కుంగిన చెరువు కట్టకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినా మళ్లీ కుంగడంతో బుధవారం ఈఈ సత్యనారాయణగౌడ్‌తో కలిసి పరిశీలించారు. కట్ట అడుగు భాగాన బుంగపడటం లేదా, ఆ స్థలంలో పాడుబడిన బావి ఉండటం గాని, కొత్త, పాత కట్ట నిర్మాణాలు బలోపేతంగా లేకపోవడం వల్ల కట్టపై రోడ్డు కుంగి, పగుళ్లు వస్తుండవచ్చని అభిప్రాయపడ్డారు. చెరువులో నిండుగా నీరు ఉండటం వల్ల మరమ్మతులు చేపట్టలేమన్నారు. వేసవిలో శాశ్వత మరమ్మతులు చేపడతామని తెలిపారు. అప్పటి వరకు వాహనాలను దారి మళ్లిస్తూ కుంగిన చోట భద్రత దృష్ట్యా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈలు అఖిల్, చంద్రశేఖర్, విక్రమ్ ఉన్నారు. ఫ ఇరిగేషన్ సీఈ రమేష్‌బాబు -
టైగర్ దామన్న ఇక లేరు
సూర్యాపేట : టైగర్ దామన్నగా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో పేరుగాంచిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాలలో ఆయన జన్మించారు. తుంగతుర్తి గ్రామానికి చెందిన ఉప్పునూతల కౌసల్యాదేవి కుమార్తె వరూధినిదేవిని వివాహమాడారు. ఆయనకు కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి స్వయానా సోదరుడు. దామోదర్‌రెడ్డి 1985 నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా పనిచేశారు. పార్టీకి ఎంత కష్ట కాలం వచ్చినప్పటికీ పార్టీని వీడకుండా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో కార్యకర్తలకు అండగా నిలిచారు. కమ్యూనిస్టుల కంచుకోటలో.. 1985 నాటికి తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రాబల్యంతోపాటు కాంగ్రెస్ పార్టీలో అనేక చీలికలు పేలుకలు ఉండడంతో కమ్యూనిస్టులను ఓడించడం ఎవరికి సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఎర్రపహాడ్ జమీందారు జన్నారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డికి స్వయంగా బావమరిది అయిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. 1985లో దామోదర్‌రెడ్డి మొదటిసారి తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటిదాకా తుంగతుర్తి నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. 1989లో మరోసారి గెలుపొందారు. మూడోసారి 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి సీపీఎం అభ్యర్థిపై విజయం సాధించారు. నాలుగోసారి 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర చేతిలో ఓటమిపాలయ్యారు. తిరిగి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అదే సంకినేని వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఈసారి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అనంతరం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావడంతో.. సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థి పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిపై విజయం సాధించారు. 1985 నుంచి వరుసగా తుంగతుర్తి నుంచి మూడుసార్లు గెలుపొంది ఒకసారి ఓటమి చవిచూసి మరోసారి గెలుపొంది నాలుగుసార్లు విజయం సాధించారు. అనంతరం సూర్యాపేట నుంచి 2009లో మరోసారి విజయం సాధించి మొత్తంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1989, 1994లో తెలుగుదేశం మిత్రపక్షాల హవాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాలు గెలుపొందగా.. కేవలం తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రమే దామోదర్‌రెడ్డి గెలుపొంది కాంగ్రెస్ సత్తా చాటారు. 1985 కంటే ముందు తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టుల హవా కొనసాగి భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఎమ్మెల్యేలుగా పనిచేయగా దామోదర్‌రెడ్డి రంగ ప్రవేశంతో కమ్యూనిస్టుల ప్రాబల్యానికిగండి కొట్టినట్లు అయింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించి అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచిన దామోదర్ రెడ్డి కనుమూయడంతో తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దదిక్కును కోల్పోయింది.ఫ హైదరాబాద్‌లో కన్నుమూసిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఫ కమ్యూనిస్టుల కంచుకోటలో కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపిన నేత ఫ తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు, సూర్యాపేట నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం ఫ 3న సూర్యాపేటకు పార్థివదేహం ఫ 4న తుంగతుర్తిలో అంత్యక్రియలు -
స్వర్ణగిరి క్షేత్రంలో 3 నుంచి పవిత్రోత్సవాలు
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన ఉత్సవారంభ స్నవనం, పేద శేషవాహన సేవ, 4న గజ వాహన సేవ, హనుమంతవాహన సేవ, 5న కల్పవృక్షవాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 6న చిన్న శేషవాహన సేవ, సర్వభూపాల వాహన సేవ, 7వ తేదీన అష్టోత్తర శత కళాభిషేకం, మహాకుంభ సంప్రోక్షణ,గరుడ వాహనసేవ ఉంటాయన్నారు. శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాజజీయర్ స్వామి దివ్య మంగళశాసనాలతో ఉత్సవాలు జరుగుతాయన్నారు. సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరారు. పార్టీలకు సంబంధించిన వాల్‌రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫొటోలను తొలగించాలన్నా రు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతేకాదికారులను నియమించామని, పెయిడ్ ఆర్టికల్స్‌ను పర్యవేక్షించి సంబంధిత పార్టీ, అభ్యర్థి ఖాతాలో ఖర్చు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎయిమ్స్‌లో రక్తదాన శిబిరం బీబీనగర్: స్వస్థ్‌నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్‌లో బుధవారం రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతం శాంతాసింగ్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాల కాపాడడానికి రక్తం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారి రక్తదానం చేయాలన్నారు. శిబిరం ద్వారా 36 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. నృసింహుడికి ఆరాధనలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలో భాగంగా గజవాహనసేవ నేత్రపర్వంగా చేపట్టారు. బుధ వారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అ ర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, నిజాభిషేకం, తులసీదళ అర్చన జరిపించారు. -
నేడు విజయదశమి
భువనగిరి, యాదగిరిగుట్ట: దసరా పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.శమి, ఆయుధ పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దుర్గాదేవిని ఆరాధించడం, ఆమెను శక్తి స్వరూపిణిగా భావించడం ఈ పండుగ ప్రత్యేకత. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. కిక్కిరిసిన మార్కెట్లు, దుకాణాలు కొనుగోలుదారులతో మార్కెట్లు సందడిగా మారా యి. జీఎస్టీ తగ్గడంతో బైకులు, కార్లు కోనుగోలు చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపారు. గుట్ట క్షేత్రంలో శమీ పూజ దసరా పండుగను పురస్కరించుకొని గురువారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట శమీపూజ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30గంటలకు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా భక్తుల మధ్య శమీపూజ జరిపిస్తారు. -
కుటుంబ సమస్యలతో ఉరేసుకుని ఆత్మహత్య
గుర్రంపోడు: కుటుంబ సమస్యలతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. చామలేడు గ్రామానికి చెందిన ఆవుల నరేష్(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నరేష్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనికి వెళ్లిన నరేష్ తల్లి ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. కుటుంబ సమస్యలతోనే నరేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కృష్ణా నదిలో విద్యార్థి గల్లంతు
నాగార్జునసాగర్: స్నేహితులతో కలిసి మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన హర్షవర్థన్, జ్ఞానేందర్, సుమన్, మణికంఠరెడ్డి, వెంకటేష్, చాణక్య (16)స్నేహితులు. వీరంతా వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరంతా కలిసి నాగార్జునసాగర్‌ను చూడటానికి మంగళవారం రెండు బైక్‌లపై వచ్చారు. అందరూ కలిసి నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఫొటోలు తీసుకున్నారు. అనంతరం కొత్త బ్రిడ్జి సమీపంలో చింతలపాలెం వెళ్లే దారి వెంట ఉన్న ఆంజనేయ పుష్కర ఘాట్‌లోకి దిగి స్నానాలు చేస్తుండగా.. చాణక్య నీటి ఉధృతికి కృష్ణా నదిలో కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు గజ ఈతగాళ్లతో కృష్ణా నది తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించలేదు. -
వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ మండలంలో మంగళవారం వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు.. పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన దూబని లక్ష్మయ్య(35) తన వ్యవసాయం క్షేత్రంలో పశువుల మేత కోసం గడ్డి కోస్తుండగా.. మోటారుకు అనుసంధానించిన కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య భవాని, కుమారుడు ఉన్నారు. అదేవిధంగా చీదెళ్ల గ్రామానికి చెందిన సురభి సైదులు(46) ఇంట్లోని దండెం తీగకు చేపలు ఎండపెడుతుండగా విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ రెండు ఘటనలకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. -
బొమ్మలతో సులభంగా బోధించేలా..
ఆలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. పాఠ్యాంశాలను బొమ్మలతో బోధించేందుకు గాను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో దశలవారీగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. యాదాద్రి భువనగిరి నుంచి.. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ) ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన ఈ జాతీయ స్థాయి శిక్షణకు తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆలేరు మండలం గొలనుకొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఏ. జ్యోతిర్మయి కూడా ఉన్నారు. ఇతర రాష్ట్రాల బోధనా పద్ధతులపై శిక్షణ ఈ జాతీయ స్థాయి శిక్షణలో దేశంలోని పలు రాష్ట్రాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులు, బొమ్మలతో బోధన, స్వయంగా బొమ్మల తయారీ గురించి నేర్చుకున్నట్లు ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, చారిత్రాక కట్టడాలు, బోనాలు, బతుకమ్మ, ఇక్కడి విద్యా బోధన తీరు తదితర విషయాల గురించి ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులకు వివరించినట్లు ఆమె తెలిపారు. సీసీఆర్టీ సంచాలకులు రాజ్‌కుమార్ జ్యోతిర్మయికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఫ జాతీయ స్థాయి శిక్షణలో పాల్గొన్న గొలనుకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి విద్యార్థులకు సులభంగా బొమ్మల ద్వారా పాఠాలు బోధించడం ఎలా అనేది జాతీయ స్థాయి శిక్షణలో నేర్పించారు. పాఠ్యాంశాల్లోని పాత్రల ప్రకారం స్వయంగా బొమ్మలు తయారు చేసుకోవడం కూడా తెలిసింది. ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులు అనుసరిస్తున్న వినూత్న బోధన పద్ధతుల గురించి తెలుసుకున్నాను. తెలంగాణలోని బోధన విధానాన్ని వేరే రాష్ట్రాల టీచర్లకు వివరించాను. శిక్షణలో భాగంగా రుద్రమదేవి వేషధారణతో పాఠ్యాంశం బోధించే అవకాశం నాకు దక్కింది. విద్యార్థుల్లో పాఠాలు వినాలనే ఆసక్తిని పెంపొందించి, తద్వారా సర్కారు బడుల్లో హాజరుశాతం పెంచడమే నా లక్ష్యం. త్వరలో జిల్లాలోని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బొమ్మలతో బోధనపై అవగాహన కల్పిస్తాను. – ఏ. జ్యోతిర్మయి, ఉపాధ్యాయురాలు, గొలనుకొండ ప్రాథమిక పాఠశాల, ఆలేరు -
బాస్కెట్‌బాల్ క్రీడాకారిణికి సన్మానం
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలం గారెకుంటపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకట్‌రెడ్డి కుమార్తె విహారెడ్డి మలేషియాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో అండర్–16 బాస్కెట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో మంగళవారం గారెకుంటపాలెం గ్రామంలో విహారెడ్డిని గ్రామస్తులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విహారెడ్డి చిన్నతనం నుంచే బాస్కెట్‌బాల్ క్రీడలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికై భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రత్నమాల, ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
ఫ మరో ఇద్దరికి గాయాలు నేరేడుచర్ల: కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున నేరేడుచర్ల పట్టణంలో జరిగింది. స్థానిక ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ నిమ్మతోట తనూజ్‌కుమార్(27) తన స్నేహితులు ఎస్కే నహీం, మాసిబోయిన నరహరి, తోము లోకేష్‌తో కలిసి సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఓ ఈవెంట్‌కు సంబంధించి ఫొటోగ్రఫీ గురించి మాట్లాడేందుకు సోమవారం రాత్రి కారులో వచ్చారు. ఈవెంట్ గురించి మాట్లాడిన అనంతరం తాగునీటి కోసం మంగళవారం తెల్లవారుజామున నేరేడుచర్లకు చేరుకొని ఓ టీస్టాల్ వద్ద ఆగారు. టీస్టాల్ ము ందు కారులో నుంచి లోకేష్‌ను దింపి యూటర్న్ తీసుకొని వస్తామంటూ మిర్యాలగూడ రోడ్డులోని హెచ్‌పీ బంక్ వైపు వెళ్తూ రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తనూజ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న నహీం, నరహరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నిమ్మతోట తరుణ్గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టొద్దు
సూర్యాపేటటౌన్ : అనవసరమైన లింక్‌లను అనుసరించి ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టొద్దని సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ సూచించారు. సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకున్న ముగ్గురి బాధితుల ఖాతాల్లో రూ.28లక్షల నగదును తిరిగి జమ చేయించి వారికి కోర్టు ఉత్తర్వులను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుడి మొబైల్ ఫోన్‌కు బిజినెస్ ఆఫర్ ఉందని మెసేజ్ వచ్చిందని, బాధితుడు మెసేజ్‌ను అనుసరిస్తూ సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి సుమారు రూ.37 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టిన అనంతరం ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయగా.. సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్, పట్టణ పోలీసులు అప్రమత్తమై సంబంధిత బ్యాంకు వారిని అతడి అకౌంట్ నుంచి బదిలీ అయిన నగదులో రూ.26.42 లక్షల నగదు హోల్డ్ చేయించినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆ నగదు మహారాష్ట్రకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, పశ్చిమబెంగాల్‌కు చెందిన బంధన్ బ్యాంక్ వినియోగదారుల ఖాతాలకు బదిలీ అయ్యిందని గుర్తించి కోర్టు ఆర్డర్స్ ద్వారా తిరిగి బాధితుడికి ఇప్పించినట్లు తెలిపారు. ఇదేవిధంగా మరో వ్యక్తికి రూ.51వేల నగదు, ఇంకొక వ్యక్తికి రూ.90వేలు వారి అకౌంట్లలోకి వేసినట్లు ఎస్పీ వివరించారు. డబ్బులు తిరిగి పొందిన బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కమ్యునికేషన్స్ హెడ్‌కానిస్టేబుల్ మహేష్, కానిస్టేబుల్ మహేష్ చారి, రాజేష్, సైదులు, నాగయ్య పాల్గొన్నారు. ఫ సూర్యాపేట ఎస్పీ నరసింహ -
జాతీయ రహదారిపై జంక్షన్ల విస్తరణకు చర్యలు
చౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించడానికి ఎన్హెచ్ఏఐ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు జంక్షన్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామం వద్ద ఉన్న జంక్షన్‌ను ఎన్హెచ్ఏఐ అధికారులతో కలిసి ఏసీపీ పరిశీలించి మాట్లాడారు. దండుమల్కాపురం పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ ఉండడంతో భారీ ట్యాంకర్లు రోడ్డు క్రాస్ చేసే సమయంలో హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దండుమల్కాపురం, బొర్రోళ్లగూడెం, కై తాపురం గ్రామాల వద్ద ఉన్న జంక్షన్లను విస్తరిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ సహకారంతో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. హైవేపై ప్రయాణించే వాహనాల వేగం జంక్షన్ల వద్ద తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి ఇంజనీరింగ్ విభాగం అధికారులు కిషన్‌రావు, శరత్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ డీజీఎం విశ్వేశ్వరరావు, చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ విజయ్‌మోహన్ పాల్గొన్నారు. ఫ ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి -
హైవేపై అదుపుతప్పిన యాసిడ్ ట్యాంకర్
చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం యాసిడ్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పారిశ్రామికవాడ నుంచి మంగళవారం యాసిడ్‌ను లోడ్ చేసుకున్న ట్యాంకర్ ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతంలోని ఓ పరిశ్రమలో అన్లోడ్ చేసేందుకు బయల్దేరింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ రాములు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చౌటుప్పల్ పట్టణానికి చేరుకోగానే ముందున్న వాహనాల రద్దీని గుర్తించి బ్రేకులు వేసే ప్రయత్నం చేశాడు. ట్యాంకర్ వేగంతో ఉండడంతో బ్రేకులు పడలేదు. దీంతో చేసేదేమీ లేక ముందుకు వెళ్తే ప్రాణనష్టం జరుగుతుందన్న ఆలోచనతో ట్యాంకర్ డ్రైవర్ ఒక్కసారిగా ఎడమ వైపుకు తిప్పాడు. ఈ క్రమంలో ముందున్న రెండు కార్లను ఢీకొట్టాడు. హైవే వెంట ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్‌ను ఢీకొని సర్వీస్ రోడ్డులోకి వెళ్లి అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు తూఫాన్ వాహనాలపై బోల్తా పడి ఆగిపోయింది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రమాద సమయంలో ట్యాంకర్లో డ్రైవర్‌తో పాటు నేరేడుచర్లకే చెందిన క్లీనర్ నవీన్ ఉన్నారు. డ్రైవర్ రాములకు తీవ్ర గాయాలై ట్యాంకర్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ ట్యాంకర్ రెండు తూఫాన్ వాహనాలపై బోల్తా పడడంతో పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఒక్కో వాహనానికి రూ.11లక్షల చొప్పున నష్టపోయామని వాహనాల యజమానులు సిలివేరు శివ, కవిడె నర్సింహ బోరున విలపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంకర్ బోల్తా పడిన సమయంలో అందులోని యాసిడ్ లీకై రోడ్డుపై పారింది. తప్పిన ప్రాణనష్టం ప్రమాదం జరిగిన సమయంలో తూఫాన్ వాహనంలో, వాహనాల పక్కన డ్రైవర్లు, స్థానికులు సుమారు 20మంది నిల్చున్నారు. ఈ ఘటన జరగడానికి రెండు నిమిషాల ముందే వారంతా అక్కడి నుంచి వెళ్లి సమీపంలోని దుకాణాల కూర్చున్నారు. లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫ సర్వీస్ రోడ్డులో పార్కింగ్ చేసిన వాహనాలపై బోల్తా ఫ ట్యాంకర్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసిన పోలీసులు, స్థానికులు ఫ ఆస్పత్రికి తరలింపు ఫ చౌటుప్పల్ పట్టణంలో ఘటన -
ముమ్మరంగా పంటల నమోదు
ఆత్మకూరు(ఎం): పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంతోపాటు దళారుల బారిన పడకుండా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి క్షేత్రస్థాయిలో పంటల సాగు విస్తీర్ణం నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు నుంచి వ్యవసాయ శాఖ ఆన్లైన్ యాప్‌లో పంటల నమోదు ప్రక్రియను కొనసాగిస్తోంది. అన్ని మండలాల్లో ఏఈలు ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లలో కూడా దళారులు చొరబడి రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను మళ్లీ ప్రభుత్వానికి అమ్ముకుని మద్దతు ధరను పొందుతున్నారు. దీంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర పొందలేక నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా పంటల నమోదు కార్యక్రమాన్ని చేపడుతూ రైతులు సాగుచేసిన పంటల దిగుబడని అంచనా వేస్తోంది. తద్వారా మార్కెట్లలో సదుపాయాలు కల్పించి రైతులకు మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపట్టింది. పంట నమోదు చేసుకున్న రైతులు నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్‌కు, సీసీఐ కేంద్రాలకుకి వెళ్లి తమ పంట ఉత్పత్తులను అమ్ముకుంటూ మద్దతు ధరను పొందగలుగుతున్నారు. 4.03 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో వరి, పత్తి, కందితోపాటు వివిధ రకాల పంటలు కలిపి మొత్తం 4,03,414 ఎకరాల్లో సాగవుతున్నాయి. అందులో 2,82,897 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. 1,13,193 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఆగస్టు 20 నుంచి పంట నమోదు కార్యక్రమం కొనసాగుతుండగా ఇప్పటి వరకు 87వేల ఎకరాల్లో పంటల వివరాలు నమోదు చేశారు. అందులోభాగంగా ఆత్మకూ(ఎం) మండలంలో అత్యధికంగా 3వేల ఎకరాలలోపు పంటల వివరాలు నమోదు చేయించగలిగారు. అయితే పంట నమోదుపై చాలామంది రైతులకు అవగాహన లేకపోవడంతో నమోదుకు దూరం అవుతున్నారు. పంట నమోదుపై రైతులకు అవగాహన కల్పిస్తే మరింత మందిమి నమోదు చేసుకుంటారని రైతులు అంటున్నారు. ఫ మద్దతు ధర అందించేందుకే నమోదు ఫ నాలుగేళ్లుగా చేపడుతున్న ప్రభుత్వం ఫ ఈ ఏడాదికి సంబంధించి ఆగస్టు నుంచి కొనసాగింపు ఫ ఇప్పటి వరకు 87 వేల ఎకరాల మేర ఆన్లైన్ యాప్‌లో నమోదు ఫ మరింత అవగాహన కల్పించాలంటున్న రైతులు -
కలెక్టర్ తనిఖీకొస్తే తాళం వేసి ఉన్న పల్లె దవాఖానా
ఫ ఎంఎల్‌హెచ్‌పీకి షోకాజ్ నోటీసులు యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని చొల్లేరు గ్రామంలో గల ఆరోగ్య ఉపకేంద్రం (పల్లె దవాఖానా)లో పనిచేస్తున్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ)కి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం గ్రామంలోని ఆరోగ్య ఉప కేందాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో పల్లె దవాఖానా తాళం వేసి ఉంది, సిబ్బంది కూడా ఎవరూ లేకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ వెంటనే ఎంఎల్‌హెచ్‌పీకి షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఫోన్ ద్వారా జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్భువనగిరి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి హెల్ప్ డెస్క్‌ను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం హెల్స్ డెస్క్ ఉపయోగపడుతుందన్నారు. హెల్స్ డెస్క్‌కు ప్రత్యేంగా డివిజన్ పంచాయతీ అధికారి ప్రతాప్‌నాయక్‌తో పాటు సహాయకులను నియమించామని పేర్కొన్నారు. హెల్స్ డెస్క్ నంబర్ 8978928637ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
లైబ్రరీ సైన్స్‌లో ఇంద్రకుమార్‌కు గోల్డ్ మెడల్
ఆలేరు: డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2022–23 సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ (బీఎల్ఐఎస్సీ) విభాగంలో అత్యుత్తమ మార్కుల సాధించిన ఆలేరు మండలం మంతపురికి చెందిన పల్లె ఇంద్రకుమార్గౌడ్ గోల్డ్ మెడల్ సాధించారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఇంద్రకుమార్గౌడ్ గోల్డ్ మెడల్‌తోపాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇంద్రకుమార్ మంతపురి మాజీ సర్పంచ్ పల్లె లక్ష్మీ–శ్రీనివా స్‌గౌడ్ దంపతుల కుమారుడు. ఈయన ప్రస్తుతం జనగాం ఎస్బీఐ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇంద్రకుమార్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మిత్రులు అభినందనలు తెలిపారు. -
మహిళలకు 199 సర్పంచ్ స్థానాలు
సాక్షి, యాదాద్రి : ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకు అన్ని కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారులు ఇటీవల డ్రా తీసిన విషయం తెలిసిందే. 178 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 12, ఎస్సీలకు 32, బీసీలకు 76, జనరల్ కేటగిరీకి 58 స్థానాలు కేటాయించారు. ఇందులో మహిళలకు 77 స్థానాలు వచ్చాయి. అలాగే 427 గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకు 49, ఎస్సీలకు 74, బీసీలకు 164, జనరల్‌కు 140 స్థానాలను కేటాయించారు. ఇందులో మహిళలకు 199 స్థానాలు రిజర్వు అయ్యాయి. ఆయా రిజర్వేషన్ల ప్రకారం ఆశావహులు పోటీకి సిద్ధం అవుతున్నారు. ఎస్టీ రిజర్వేషన్లు గిరిజనులు ఎక్కువగా ఉన్న మండలాల్లోనే వచ్చాయి. వీటిలో సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్ మండలాల్లో ఎస్టీలకు అత్యధికంగా ఉండగా, ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, రాజాపేట మండలాల్లో అతి తక్కువగా ఉన్నాయి. కేటగిరీ మహిళా జనరల్ ఎస్టీ 4 8 ఎస్సీ 13 19 బీసీ 34 42 జనరల్ 26 32 మొత్తం 77 101 ఫ ఎంపీటీసీ స్థానాల్లోనూ 77 వారికే.. ఫ అన్ని కేటగిరీల్లో లెక్కలు తేల్చిన అధికారులు ఫ గిరిజనులు ఎక్కువగా ఉన్నచోట వారికే రిజర్వు కేటగిరీ మహిళా జనరల్ ఎస్టీ 21 28 ఎస్సీ 33 41 బీసీ 79 85 జనరల్ 66 74 మొత్తం 199 228 -
కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది
యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత, బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి, శారాజీపేట మాజీ సర్పంచ్ బెంజారం రజిని, సిల్క్ రేణుకా వెంకటేశం, నిరోషా, పెండ్యాల ప్రకృతి రాజు, పుట్టల స్వామిలతో పాటు పలువురు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్పు కోరుకుని ప్రజలంతా కాంగ్రెస్‌కు పట్టం కడితే.. రాష్ట్రాన్ని ఆగమాగం చేసిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లి ఎవరిని కదిలించినా కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అధికస్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆలేరు మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రచ్చ రాంనర్సయ్య, బండ మహేందర్, ఆశయ్య, శ్రీధర్, కంది మహేందర్, అశోక్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, శనివారం రవి, కడారి బాలయ్య, రచ్చ కావ్య, సిద్దేశ్వర్, సముద్రాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత -
22 ఏళ్లు దేశ రక్షణలో..
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బెల్లంకొండ వేలాద్రి కుమారుడు రవి 22 ఏళ్లు దేశ రక్షణలో ఆర్మీ జవాన్‌గా సేవలందించి మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. ఆయన 2003లో డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఉండగానే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని ఎంపికయ్యారు. మహరాష్ట్రలోని హేమనగర్లో శిక్షణ పొంది 2005లో ఆర్మీ జవాన్‌గా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచలప్రదేశ్లో పనిచేశారు. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో కూడా ఆయన పాల్గొని దేశానికి సేవలందించారు. ప్రస్తుతం అహ్మదానగర్లో పనిచేస్తున్న ఆయన మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. దసరా రోజు అభినందన సభ..రవి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వస్తున్న సందర్బంగా అక్టోబన్ 2న దసరా రోజు చిలుకూరు మండల కేంద్రంలో ర్యాలీతో పాటు అభినందన సభ నిర్వహించేందుకు గ్రామ యువత, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు పదవీ విరమణ పొందనున్న చిలుకూరుకు చెందిన ఆర్మీ జవాన్ -
స్వర్ణగిరిలో సహస్ర కుంకుమార్చన, అక్షరాభ్యాసం
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారిని విద్యాలక్ష్మిగా అలంకరించి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుమందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. విద్యాలక్ష్మి అమ్మవారి వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న అర్చకులు -
హత్య కేసులో పది మంది అరెస్ట్
సూర్యాపేటటౌన్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన పది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలోని అన్నాదురై నగర్‌కు చెందిన ఫ్లవర్ డెకరేషన్ చేసే పెద్ది లింగస్వామికి, చారగండ్ల శివకుమార్‌కు ఐదేళ్ల క్రితం ఘర్షణ జరిగింది. ఆ సమయంలో శివకుమార్‌పై హత్యాయత్నం చేసిన పెద్ది లింగస్వామిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి పెద్ది లింగస్వామి శివకుమార్‌పై పగ పెంచుకున్నాడు. ఈ నెల 26న మధ్యాహ్నం చారగండ్ల శివకుమార్, పెద్ది లింగస్వామికి సూర్యాపేట పట్టణంలోని పూల సెంటర్ వద్ద మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో పెద్ది లింగస్వామి తన స్నేహితులు మాతంగి మధు, మరికొంత మందితో కలిసి శివకుమార్‌ను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ మేరకు అదే రోజు సాయంత్రం శివకుమార్‌కు మాతంగి మధుతో ఫోన్ చేయించి కుసుమవారిగూడెం వైన్ షాప్ వద్దకు పిలిపించాడు. శివకుమార్ వైన్ షాప్ ఎదురుగా ఉన్న విజయ్ హోటల్ వద్ద రాత్రి 10గంటల సమయంలో మందు తాగుతుండగా.. పెద్ది లింగస్వామి, అతడి స్నేహితుడు మాతంగి మధు, మరికొందరు కలిసి మారణాయుధాలతో శివకుమార్‌ను హత్య చేసి పరారయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పది మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. కాగా హత్యకు గురైన శివకుమార్‌తో పాటు నిందితులపై గతంలో రౌడీషీట్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఒక స్కూటర్, మూడు మోటార్ సైకిళ్లు, మూడు కత్తులు, రెండు గొడ్డళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు.. ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడైన సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మాతంగి మధు అలియాస్ కర్రీ మధు, పెద్ది లింగస్వామి, సీతారాంపురానికి చెందిన చెవుల నరేష్, జేజేనగర్‌కు చెందిన జక్కి సతీష్, కేసారం గ్రామానికి చెందిన భాషపంగుల సతీష్, సూర రామచంద్రు, తాళ్లగడ్డకు చెందిన నేరెళ్ల శ్రీరాములు, అన్నాదురైనగర్‌కు చెందిన గువ్వల తరుణ్‌కుమార్, కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేష్, ఇందిరమ్మ కాలనీకి చెందిన జెల్లా ఉదయ్‌కుమార్ అరెస్టయ్యారు. జేజేనగర్‌కు చెందిన జక్కి అనిల్, కృష్ణటాకీస్ దగ్గర గల వర్రె రామకృష్ణ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. రిమాండ్‌కు తరలింపు పరారీలో మరో ఇద్దరు -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోల్మాల్
మేళ్లచెరువు: తనకు అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ బ్యాంకులో వేసి డబ్బులు తీసుకున్నాడని లబ్ధిదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఎస్ఐ పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్ద వెంకటేశ్వర్లు పక్షవాతం వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా రూ.2.50లక్షలకు చెక్కు మంజూరైంది. అయితే గతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన వెంకట్ ఆ చెక్కును కోదాడలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో వేసి తనకు తెలియకుండా డబ్బులు డ్రా చేశాడని బాధితుడు వెంకటేశ్వర్లు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నీటి గుంతలో పడి వ్యక్తి మృతిభువనగిరి: నీటి గుంతలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి పట్టణ శివారులో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని పెద్దవాడకు చెందిన కడారి రమేష్(53) ఆదివారం తన కుమారుడితో కలిసి స్థానికంగా ఓ ఫంక్షన్హాల్లో ఫంక్షన్‌కు హాజరయ్యాడు. అదేరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటికి వెళ్లే సమయానికి రమేష్ కనిపించకపోవడంతో అతడి కుమారుడు ఒక్కడే ఇంటికి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి వరకు కూడా రమేష్ ఇంటికి రాకపోవడంతో అతడికి ఫోన్ చేయగా.. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్లో ఉన్నట్లు చెప్పాడు. అనంతరం అతడి ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. కాగా.. మంగళవారం ఉదయం భువనగిరి పట్టణ శివారులోని దీప్తి హోటల్ సమీపంలో వరంగల్–హైదరాబాద్జాతీయ రహదారి పక్కన ఉన్న నీటి గుంతలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్న రమేష్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతిచెందింది రమేషే అని గుర్తించారు. సమచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తన తండ్రి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతిచెంది ఉండవచ్చని రమేష్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. నాలుగు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదలకేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్‌కు 9,152 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్టు గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 7,994 క్యూసెక్కుల దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా 643.50 వద్ద నిలకడగా ఉంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మూసీ కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 191 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.06 టీఎంసీల నీరు న్విల ఉందని అధికారులు తెలిపారు. -
యాదగిరీశుడి సేవలో పాదరాజ మఠం పీఠాధిపతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి శ్రీసుజయనిధి తీర్థ ముల్బాగల్ స్వామిజీ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠ అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. యాదగిరిగుట్టలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు యాదగిరిగుట్ట: దసరా పండుగను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద సోమవారం రాత్రి బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి యాదగిరి క్షేత్రానికి భక్తులు వస్తుండటంతో పాటు సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తనిఖీలు చేపట్టినట్లు సిబ్బంది వెల్లడించారు. -
మదర్ డెయిరీకి రూ.50 కోట్లు కేటాయించాలి
సాక్షి,యాదాద్రి: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల కుప్పగా మారిన మదర్ డెయిరీని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించాలని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి కోరారు. సోమవారం భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఏడాది కాలంలో మదర్ డెయిరీ అప్పుల పాలైనట్లు బీఆర్ఎస్ నాయకుడు గొంగిడి మహేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే మదర్ డెయిరీని దివాలా దిశకు చేర్చారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్లు వేలాది మంది రైతులు, డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన విచారణలో పదేళ్లలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయన్నారు. మదర్ డెయిరీని ఎన్డీడీబీ టేకోవర్ చేయడానికి సిద్ధంగా ఉందని.. ఒకవేళ అలా జరగకపోతే అప్పుల కింద బ్యాంకు వాళ్లే లాకౌట్ చేస్తారన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో ఉన్నట్లు తప్పుడు ఆడిట్ రిపోర్టులు తయారు చేసి, బ్యాంకును నమ్మించడానికి అప్పులకు కూడా ఇన్‌కం టాక్స్ కట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. డైరక్టర్ల ఎన్నికల్లో పొత్తు ధర్మం తప్పింది గొంగిడి మహేందర్‌రెడ్డే అన్నారు. తన పార్టీకి చెందిన వ్యక్తిని అదనంగా పోటీలో నిలబెట్టి డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అదనంగా రంగంలో దిగితే షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. డబ్బులు ఇచ్చి, పాల చైర్మన్లకు ఫోన్లు చేసిన గొంగిడి మహేందర్‌రెడ్డి నైతికవిలువలు మర్చిపోయాడన్నారు. గత బీఆర్ఎస్ పాలకవర్గాల బాధ్యతారాహిత్యమే నేటి దుస్థితికి కారణమని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, పుప్పాల నర్సింహులు, కర్నాటి జయశ్రీ ఉప్పల్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వానికి చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి -
భువనగిరిలో నకిలీ నోట్ల కలకలం
భువనగిరి: భువనగిరి పట్టణంలో సోమవారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని ఖిలానగర్‌లో మొబైల్ షాపు నిర్వహిస్తున్న పల్లెర్ల నాగేంద్రబాబు వద్దకు సోమవారం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి.. తన దగ్గర రూ.11వేల నగదు ఉందని, తన బంధువులకు ఫోన్ పే చేయాలని వేడుకున్నాడు. దీంతో నాగేంద్రబాబు తన ఫోన్ ద్వారా సదరు వ్యక్తి చెప్పిన నంబర్‌కు రూ.11వేలు ఫోన్ పే చేయగా.. అతడు రూ.11వేల నగదును నాగేంద్రబాబుకు ఇచ్చాడు. అనంతరం నాగేంద్రబాబు నోట్లను పరిశీలించగా.. అవి దొంగ నోట్లని అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మొబైల్ షాపు యజమానికి అంటగట్టిన గుర్తుతెలియని వ్యక్తి -
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 5,91,456 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 26 క్రస్ట్ గేట్ల ద్వారా 5,41,516 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదనతో 33,333 క్యూసెక్కులు మొత్తం 5,74849 క్యూసెక్కుల నీటిని దిగువన కృష్ణ నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాలువ, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ కాల్వలకు 16,607 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణా, మూసీ సంగమం వద్ద ఉగ్రరూపం.. మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో టెయిల్‌పాండ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది పొంగుపొర్లుతుండగా గేట్లు ఎత్తారు. దీంతో దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా, మూసీ నదులు కలిసే సంగమం వద్దకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఏర్పాటు చేసిన ఘాట్లతో పాటు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. మట్టపల్లి క్షేత్రం వద్ద..మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది సోమవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటు మూసీ నది నుంచి వచ్చే వరద నీరు, హాలియా తదితర వాగుల నుంచి వచ్చే వరద నీటితో మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టులో సుమారు 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ పైనుండి వస్తున్న వరద నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మట్టపల్లి వరకు నిల్వ ఉంటూ నిండుకుండను తలపిస్తోంది. ఈ దృశ్యం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే వారిని ఆకట్టుకుంటోంది. నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల వాడపల్లిలో కృష్ణా, మూసీ సంగమం వద్ద నీట మునిగిన పుష్కర ఘాట్లు -
యాదగిరి క్షేత్రంలో మూల నక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి ఆలయంలో మూల నక్షత్రం వేడుకలను అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే మూల నక్షత్ర వేడుకల్లో భాగంగా సోమవారం శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో కలశ స్థాపన పూర్వక విశేష ఆరాధనలు, సహస్రనామార్చన నిర్వహించారు. మహా శివుడికి సంప్రదాయ పూజలు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేతా రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వా అర్చన పూజలు విశేషంగా నిర్వహించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణ వేడుక, జోడు సేవ పూజలు నిర్వహించారు. ఆయుధ పూజయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఎస్పీఎఫ్ సిబ్బందికి సంబంధించిన ఆయుధాలకు ఆలయ అర్చకులు సోమవారం ఆయుధ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ బాబురావు, ఆర్ఐ శేషగిరిరావు, ఆలయాధికారులు పాల్గొన్నారు. -
మోగిన సా్థనిక నగారా
సాక్షి,యాదాద్రి: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి నగరా మోగింది. అక్టోబరు, నవంబరు మాసాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల 9న తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత వచ్చే నెల 13న నోటిఫికేషన్ జారీ చేసి, 27న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ నిర్వహణకు 3,310 బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. మూడు విడతల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ప్రతి విడతలో 2240 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేశారు. ఇందులో 20 శాతం రిజర్వు చేశారు. పోలింగ్ కోసం ఆర్వోలు, ఈఆర్వోలు, పీవోలు, ఓపివోలను 20 శాతం రిజర్వుతో కలిపి సిద్ధం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు ఇలా..మొదటి విడత: మొదటి విడతలో పది మండలాల్లో 84 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అడ్డగూడూరు(7) మోత్కూరు(5) ఆలేరు(7), ఆత్మకూర్(ఎం)(8), బొమ్మలరామారం(11), గుండాల(9), మోటకొండూరు(7), రాజాపేట(11), తుర్కపల్లి(10) యాదగిరిగుట్ట(9) ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2,45,810 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రెండవ విడత : రెండవ విడతలో ఏడు మండలాల్లో ఏడు జెడ్పీటీసీ, 94 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. బీబీనగర్ (14), పోచంపల్లి(10), భువనగిరి(13), వలిగొండ(17) చౌటుప్పల్(12), నారాయణపూర్ (13) రామన్నపేట(15) మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 1,42,585 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సర్పంచ్ ఎన్నికలు తొలివిడత: భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఐదు మండలాల్లో గల 150 గ్రామ పంచాయతీలు, 1332 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఇందులో భువనగిరి (34), పోచంపల్లి ( 21), బీబీనగర్ (34), వలిగొండ(37), రామన్నపేట(24)లో తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండవ విడత: రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఆరు మండలాల్లో 127 గ్రామ పంచాయతీలు, 1108 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో చౌటుప్పల్ (26),నారాయణపూర్ (31), అడ్డగూడూరు( 17), మోత్కూరు(10), గుండాల(20),ఆత్మకూర్ ఎం(23) ఉన్నాయి. మూడవ విడత : భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో గల 150 గ్రామ పంచాయతీలు, 1264 వార్డుల్లో మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఆలేరులో (16), రాజాపేటలో (23), యాదగిరిగుట్టలో (23), మోటకొండూరులో (20), బొమ్మలరామారంలో (35), తుర్కపల్లిలో (33) కలిపి మొత్తం 150 చోట్ల ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదటి దశ వచ్చే నెల 23న, రెండో దశ 27వ తేదీన మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు అమలులోకి ఎన్నికల కోడ్ పోలింగ్ కేంద్రాలు 3704ఎన్నికల అధికారుల నియామకం రెండు విడతల్లో జరిగే ఎన్నికల కోసం ఎన్నికల సిబ్బందిని నియమించారు. 20 శాతం రిజర్వ్డ్ అఽధికారులతో కలిపి 20 మంది జెడ్పీటీసీ ఆర్వోలు, 81 మంది ఎంపీటీసీ ఆర్వోలు, 81 మంది ఎంపీటీసీ ఏఆర్వోలు, మొదటి విడతలో జరిగే ఎన్నికల కోసం 568 ప్రిసైడింగ్ అధికారులు, 2980 మంది ఓపీఓలు, రెండవ విడత కోసం 522 ప్రిసైడింగ్ అధికారులు, 2980 మంది ఓపీవోలు కలిపి మొత్తం 7402 మందిని ఎంపిక చేశారు. ఇందులో 20 శాతం ఎన్నికల సిబ్బంది రిజర్వ్‌లో ఉంటారు. 1,155 మంది రిజర్వ్‌లో ఉండగా, విధుల్లో మాత్రం 6,889 మంది ఉంటారు. జిల్లాలో 7402 మంది అంటే 513 మంది అదనంగా ఉంచారు. -
నేడు భువనగిరిలో సద్దుల బతుకమ్మ వేడుకలు
భువనగిరి: భువనగిరి పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం నిర్వహించనున్నారు. ఈమేరకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భువనగిరి పెద్ద చెరువు వద్ద ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టనున్నారు. బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు చెరువు వద్ద ఏర్పాట్లు చేశారు.వయో వృద్ధుల ఆశ్రమంలో వసతుల పరిశీలనభువనగిరి: మండలంలోని చీమలకొండూరు గ్రామంలో జేఎంజే వమోవృద్ధుల ఆశ్రమాన్ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మాధవీలత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో కల్పిస్తున్న వసతులను వయో వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వాహకులకు సూచించారు. మినీ శిల్పారామంలో దసరా సంబురాలు భువనగిరి: దసరా సంబురాల్లో భాగంగా భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోని మినీ శిల్పారామంలో సోమవారం వరంగల్‌కు చెందిన నృత్యకళాకారులు కూచిపూడి నృత్య కళా ప్రదర్శన చేశారు. నృత్య స్రవంతి కూచిపూడి కళా క్షేత్రం నాట్య గురువు రేణుక, కళాకారులు సుదీప్తి, అనిషా, శరణ్య, వైష్ణవి, రిషిక, లాస్య సహస్ర తదితరులు పాల్గొన్నారు.మద్యం దుకాణాల టెండర్లకు 23 దరఖాస్తులుభువనగిరి: జిల్లాలో మద్యం దుకాణాల కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో ఉన్న మొత్తం 82 దుకాణాలకు గాను ఈ నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రారంభమైంది. సోమవారం 11 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు మొత్తం 23 దరఖాస్తులు వచ్చాయి. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు తుదిగడువు ఉంది. -
మరమ్మతులు చేస్తుండగానే పగుళ్లు
మోత్కూరు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్ రోడ్డు కుంగిపోయింది. దీంతో సుమారు 50 మీటర్ల పొడవుతో 2మీటర్లపై లోతుతో కుంగిన చెరువు కట్ట రోడ్డును జేసీబీ సాయంతో తొలగించారు. తిరిగి ఎర్రటి మట్టిని నింపి ప్రతి లేయర్‌ను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. అయినా సోమవారం చిన్నపాటి బుంగతో కట్టంతా లీకై పగుళ్లు పట్టింది. నీటిపారుదల శాఖ ఎస్ఈ శివధర్మతేజ, ఈఈ సత్యనారాయణ గౌడ్ చెరువు కట్టను పరిశీలించారు. చెరువు కట్ట తిరిగి కుంగిన విషయాన్ని కలెక్టర్ హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లినట్లు నీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. ● మళ్లీ కుంగిన మోత్కూరులోని పెద్ద చెరువు కట్ట -
వే బ్రిడ్జి సీజ్
మోత్కూరు: మోత్కూరు మండలం అనాజిపురంలోని కంఠ్ల మహేశ్వర స్వామి వే బ్రిడ్జి మోసాలపై ఇటీవల రైతులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు సాక్షి దిన పత్రిక ఈ నెల 26న ‘తూకం తప్పుతున్న ధర్మకాంట’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారులు స్పందించారు. సోమవారం జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి కందగట్ల వెంకటేశ్వర్లు వే బ్రిడ్జిని తనిఖీ చేశారు. తూకంలో 30 కిలోల తేడా చూపిస్తుండడంతో వే బ్రిడ్జిని సీజ్ చేసినట్లు తెలిపారు. జరిమానా విధిస్తామని తెలిపారు. వే బ్రిడ్జిని నిర్వహించొద్దని యాజమానిని ఆదేశించారు. అనంతరం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పలు దుస్తుల దుకాణాలతో పాటు ఇతర దుకాణాలను తనిఖీ చేశారు. లీగల్ మెట్రోలజీ శాఖ నుంచి ధ్రువపత్రం విధిగా పొందాలని, లేకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -
ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
భువనగిరి: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జిలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కరించడంతో అధికారులు జాప్యం చేయొద్దన్నారు. ప్రజావాణి ద్వారా మొత్తం 31 అర్జీలను స్వీకరించగా ఇందులో 25 రెవెన్యూ శాఖ, జిల్లా పంచాయతీ, మున్సిపాలిటీ, సర్వే ల్యాండ్, హౌసింగ్, వైద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాష్కర్రావు, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, హోసింగ్ పీడీ విజయసింగ్ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి భువనగిరి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో పల్లె దవాఖానాను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం ప్రజల్లో కల్పించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సాధారణ ప్రసవాల కోసం ప్రోత్సహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. కలెక్టర్ హనుమంతరావు -
వెలవెలబోతున్న రైతుబజార్
భువనగిరి: భువనగిరి పట్టణంలోని రైతు బజార్‌కు హైదరాబాద్ నుంచి కూరగాయలను సరఫరా చేసే వ్యాపారులు గిట్టుబాటు అయ్యే విధంగా ధరలు నిర్ణయించడం లేదని కూరగాయల సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో కూరగాయల దిగుమతి నిలిపివేత మూడో రోజు సోమవారం కూడా కొనసాగింది. రైతు బజార్లో కూరగాయలు లేకపోవడంతో వెలవెలబోయింది. సోమవారం వ్యాపారులు, విక్రయదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ సమస్య అదే విధంగా ఉండిపోయింది. అధిక ధరలకు విక్రయాలు గత మూడు రోజులుగా రైతు బజార్‌కు కూరగాయలు దిగుమతి కావడం లేదు. దీంతో ధరల నిర్ణయం కూడా జరగడం లేదు. ప్రస్తుతం రైతు బజార్లో కొద్ది మంది విక్రయదారులు పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువచ్చే రైతుల నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఈ కూరగాయలు సరిపడా రాకపోవడంతో కొంతమంది విక్రయదారుల వద్ద ఉన్న కూరగాయలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని రైతు బజార్లో రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. మూడోరోజూ కొనసాగిన కూరగాయల దిగుమతి నిలిపివేత పరిసర ప్రాంతాల రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న విక్రయదారులు వినియోగదారులకు అధిక ధరలకు విక్రయం ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు రైతు బజార్లో కూరగాయలు లభించడం లేదు. సుమారు 20 కిలో మీటర్ల దూరం నుంచి కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చాను. రైతు బజార్లో తక్కువ ధరలకు కాకుండా నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నారు. టమాటకు అదనం రూ. 5లు తీసుకుంటున్నారు. – గౌరి, చీకటిమామిడి -
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ హనుమంతరావు సాక్షి యాదాద్రి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్, ప్రైవేట్ స్థలాల్లో పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, అడ్వర్టైజ్మెంట్స్ కటౌట్స్ తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భాస్కర్ రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, చౌటుప్పల్ భువనగిరి కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి హర్షవర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి) అమలుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఏసీపీ రాహుల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు పాల్గొన్నారు. -
ఖిలాపై స్వచ్ఛతా హీ సేవా
భువనగిరి: భువనగిరి ఖిలాపై సేవా పర్వ్, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం భారత, రాష్ట్ర పర్యాటక శాఖ, భువనగిరి రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల, మున్సిపాలిటీ భాగస్వామంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖిలా పై ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా భారత పర్యాటక శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కృపాకర్ మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి ప్రవీణ్, రాక్ క్లైంబింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
సినిమా సెట్టింగ్లా దుర్గాదేవి మండపం
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం సినిమా సెట్టింగ్‌ను తలపిస్తోంది. మండపం బయట శివపార్వతులు, నందీశ్వరుడి విగ్రహాలతో పాటు మండపం సెట్టింగ్ పైన పలు దేవతా విగ్రహాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అదేవిధంగా ఈ మండపం వద్ద ఉత్సవ నిర్వాహకులు భక్తులకు లక్కీ డ్రా ఆఫర్లు పెట్టారు. రూ.201 చెల్లించి కూపన్ కొనుగోలు చేసిన భక్తులకు అక్టోబర్ 3న నిర్వహించే బంపర్ డ్రాలో మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, రెండో బహుమతిగా కలర్ టీవీ, మూడో బహుమతిగా కుక్కర్ ఓవన్, నాల్గవ బహుమతిగా 3 గ్రాముల సిల్వల్ కాయిన్ అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
సంతానం కలగడం లేదని వివాహిత ఆత్మహత్య
యాదగిరిగుట్ట రూరల్: సంతానం కలగడం లేదని మనోవేదనకు గురైన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం యాదగిరిగుట్ట సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరుకు చెందిన గుంటెకాపుల అశ్విని (30)కి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన కళ్లెపల్లి రాఘవేందర్‌తో 2015లో వివాహం జరిగింది. వివాహం జరిగి పదేళ్లు అవుతున్నా వారికి సంతానం కలుగలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సంతానం కోసం డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో మనోవేదనకు గురైన అశ్విని గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో వంగపల్లిలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి అశ్వినిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి గుంటెకాపుల శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు. సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్‌కు ఉత్తమ అవార్డు రామగిరి: ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో నల్లగొండ సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్‌కు ఉత్తమ ఫొటో జర్నలిస్ట్‌గా అవార్డు లభించింది. ఆదివారం ఏపీలోని గుంటూరు జిల్లా మోదుకూరు వేమన సాహిత్య వికాస భవనంలో ఆంధ్ర లయోలా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సింగారెడ్డి మెల్కియార్, అకాడమీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, విజువల్ కమ్యూనికేషన్ హెచ్ఓడీ గడ్డం రాయప్ప, పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి చేతులమీదుగా భజరంగ్ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. -
శిథిల భవనం.. సిబ్బందిలో భయం
యాదగిరిగుట్ట రూరల్: వానాకాలానికి ముందు శిథిలావస్థకు చేరిన ప్రైవేట్ భవనాలను గుర్తించి కూలుస్తున్న అధికారులు.. అదే కాలం చెల్లిన ప్రభుత్వ భవనాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎప్పుడు కూలుతాయోనన్న రీతిలో ఉన్న భవనాల్లో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సాధకబాధకాలను మాత్రం వదిలేస్తేన్నారు. యాదగిరిగుట్ట వ్యవసాయ కార్యాలయానికి నూతన భవనం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉన్నా గాలికొదిలేస్తున్నారు. వర్షాలకు స్లాబ్, గోడలు కురిసి కంప్యూటర్, ఫైళ్లు తడుస్తున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు అధికారులకు ఒక్కటే గది కార్యాలయంలో ఒకే గది ఉంది. అందులోనే ఏడీఏ, ఏఓ, ఏఈఓ విధులు నిర్వహిస్తున్నారు. రైతులు కూర్చోడానికి చోటు కూడా లేదు. ఉన్నతాధికా రులు స్పందించి కార్యాలయాన్ని మరో చోటకు తరలించాలని కోరారు. -
18 గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల
మేళ్లచెరువు : ఎగువన ఉన్న నాగార్జున సాగర్‌తోపాటు మూసీ ప్రాజెక్టులు, టెయిల్‌పాండ్ గేట్లు ఎత్తడంతో చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చిచేరుతుంది. ఆదివారం రాత్రి వరకు 6,00,685 క్యూసెక్కుల వరద రాగా ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో 18 గేట్లను 4 నుంచి 5 మీటర్ల మేర పైకెత్తి అవుట్‌ఫ్లోగా 6,08,541 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ 4 యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట రూరల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, సంప్రదాయ పర్వాలు, భక్తజన సందోహంతో యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలు అర్పించి సహస్రనామార్చనతో కొలిచారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్తోత్తర పూ జలు గావించారు. సాయంత్రం స్వామి వారికి వెండిజోడు సేవోత్సవం నిర్వహించి భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భళా.. నృత్యకళభువనగిరి : భువనగిరి పరిధిలోని రాయగిరి మినీ శిల్పారామంలో అదివారం తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు అలరించాయి. సృష్టి డ్యాన్స్ అకాడమీ కళాకారులు కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్నారు. అదే విధంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన భక్తులు తిరుగుపయనంలో శిల్పారామాన్ని సందర్శించారు. కళా ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో సృష్టి డ్యాన్స్ అకాడమీకి చెందిన గురువు సుష్మ ఉదయ్, బాలికలు కీర్తన, హర్షిణి, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ మృతి
మోత్కూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన చేకూరి మల్లేషం భార్య విజయనిర్మల అలియాస్ మమత(48) ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి కారులో ఆరెగూడెం వస్తుండగా.. భువనగిరి మండలం కుమ్మరిగూడెం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన మమతను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
తుది దశకు గంధమల్ల భూ సేకరణ
తుర్కపల్లి: ఆలేరు నియోజకవర్గంలో 65 వేల ఎకరాలకు సాగు నీరందించే ఉద్దేశంతో చేపట్టిన గంధమల్ల ప్రాజెక్ట్ పనుల్లో యంత్రాంగం మరింత వేగం పెంచింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి, అవార్డ్ పాస్ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే 750 ఎకరాల భూ సేకరణ పూర్తి కాగా.. నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సేకరించాల్సిన భూమి 1,028.83 1.43 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, రూ.575 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు 547 మంది రైతుల నుంచి 1,028.83 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో గంధమల్ల రెవెన్యూ పరిధిలో 750, వీరారెడ్డిపల్లి పరిధిలో 250 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. రెండు కిలో మీటర్ల మేర రిజర్వాయర్ బండ్(కట్ట) నిర్మాణానికి 112 ఎకరాలు పోను మిగతా భూమి ముంపునకు గురవుతుంది.నిర్వాసిత రైతులతో అధికారులు పలుమార్లు చర్చలు జరిపి ఎకరాకు రూ.24.50 లక్షలుగా పరిహారం ఖరారు చేశారు. ఇందుకు 650 ఎకరాలకు సంబంధించి రైతులు అంగీకారం తెలియజేసినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 100 ఎకరాలకు సంబంధించి రైతుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.నోటీసుల జారీకి సన్నాహాలు రిజర్వాయర్ నిర్మాణం వేగంగా చేపట్టేందుకు తొలుత గంధమల్ల రెవెన్యూ పరిధిలోని రైతులకు పరిహారం చెల్లించనున్నారు. ఆ తరువాత వీరారెడ్డిపల్లి భూ నిర్వాసితులకు చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ముంపు ప్రభావిత భూముల రైతులకు నోటీసులు జారీ చేయటానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.750 ఎకరాల భూసేకరణ పూర్తి ఫ ఎకరాకు రూ.24.50 లక్షలు చొప్పున పరిహారం ఖరారు ఫ మెజార్టీ రైతుల అంగీకారం ఫ చెల్లింపులకు సిద్ధమవుతున్న అధికారులు -
వేల్స్లో లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం
యాదగిరిగుట్ట రూరల్: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ రాజధాని కార్డిఫ్ నగరంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ కార్డిఫ్ హిందూ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణోత్సవంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, అర్చకులు కిరణ్కుమార్చార్యులు, దోర్బాల భాస్కర్‌శర్మ బృందం పాల్గొన్నారు. ఈ కల్యాణోత్సవంలో డాక్టర్ వెలగపూడి బాపూజీరావు, అన్నపూర్ణ శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. -
విశిష్ట వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి
రామన్నపేట: సమాజంలోని విశిష్ట వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ చేపట్టిన సేవా పక్షోత్సవంలో భాగంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను, రాజకీయ రంగంలో దివ్యాంగుల పాత్ర అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించిన డాక్టర్ ఎన్. అశోక్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం, బుద్ధ గ్రంథాలయంను కాసం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అనేక మంది విశిష్ట వ్యక్తులు, ప్రాంతాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. ఆయన వెంట నాయకులు నకిరేకంటి మొగులయ్య, మడూరి ప్రభాకర్‌రావు, మైల నర్సింహ, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, మండల వెంకన్న, తాటిపాముల శివకృష్ణ, వనం అంజయ్య, బండ మధుకర్‌రెడ్డి, నకిరేకంటి మహేష్, చెరుపల్లి శ్రవన్, మొగిలి రమేష్, గూడెల్లి దామోదర్, గంజి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు -
పిల్లలమర్రి ఆలయాల సందర్శన
సూర్యాపేట: సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలోని రాష్ట్ర రక్షిత కట్టడాలైన నామేశ్వర ఆలయం, ఎరకేశ్వర దేవాలయాన్ని ఆది వారం రాష్ట్ర పురా వస్తు శాఖ సంచాలకుడు అర్జునరావు కుతాడి సందర్శించారు. ఆలయాల స్థితిగతులను పరిశీలించడంతో పాటు వాటి అభివృద్ధి కోసం ఏం చేయాలని పురావస్తు శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు, పర్యాటకులకు ఆలయాల చరిత్ర తెలియజేసే విధంగా సైన్ బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఆలయ గోడలపై ఉన్న వైట్‌వాష్‌ను వెంటనే రసాయనాలతో శుద్ధి చేసి శిల్ప సంపదను, చరిత్రను భక్తులు, పర్యాటకులు స్పష్టంగా చూడగలిగేలా చేయాలన్నారు. ఆలయంలో ఉన్న శాసనాల వివరాలను కూడా బోర్డుల రూపంలో ప్రదర్శించి చరిత్రకారులకు, పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. పర్యాటకులకు ఆలయ చరిత్ర వివరించడానికి ఒక టూరిస్ట్ గైడ్‌ను కూడా నియమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు డాక్టర్ పి. నాగరాజు, ఎన్. నర్సింగ్‌నాయక్, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన చరిత్రకారులు డాక్టర్ షరీఫ్, రామకృష్ణ, డాక్టర్ కిషోర్, ఇర్ఫాన్ పాల్గొన్నారు. -
కూరగాయలకు కటకట
భువనగిరి: బతుకమ్మ, దసరా పండుగల వేళ.. కూరగాయలకు కొరత ఏర్పడింది. భువనగిరిలోని రైతుబజార్‌కు రోజులుగా దిగుమతి నిలిచిపోవడంతో మూడు రోజులుగా స్టాళ్లు మూతపడ్డాయి. ధరల విషయంలో వ్యాపారులు, విక్రయదారులు, రైతుల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలతో ఈ పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారుల జేబు గుల్ల చేస్తున్నారు. కారణం ఇదీ..రైతుబజార్‌కు భువనగిరి పరిసర ప్రాంతాల నుంచి బీరకాయ, దోస, కీరదోసతో పాటు మరికొన్ని కూరగాయలు రైతులు తీసుకువస్తున్నారు. వంకాయ, అలుగడ్డ, బెండ, కాకర, పచ్చిమిర్చి, బీన్స్, క్యాబేజీ, దొండ, కాలీప్లవర్, చామగడ్డ, గోకర, క్యాప్సికం, క్యారెట్‌ను హైదరాబాద్ నుంచి వ్యాపారులు వాహనాల ద్వారా రైతుబజార్‌కు సరఫరా చేస్తారు. ఈ కూరగాయల ధరలను ప్రతి రోజూ హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్ కంటే రూ.2నుంచి రూ.4 వరకు అదనగా నిర్ణయిస్తుంటారు. కాగా రైతుబజార్లో నిర్ణయిస్తున్న రేట్లు తక్కువగా ఉన్నాయని, తమకు నష్టం కలుగుతుందని భావించి కూరగాయల సరఫరా నిలిపివేశారు. దీనికి తోడు రైతుబజార్‌లోని విక్రయదారులు సైతం ధరల నిర్ణయించే విషయంలో ఎక్కువ వ్యత్యాసం ఉండటంతో తమకు నష్టం ఏర్పడుతుందని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే భువనగిరి పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువచ్చే రైతులు తమ వద్ద రైతుబజార్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోతుందని భావించి నేరుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అటు వ్యాపారులు, ఇటు రైతులు కూరగాయలు తీసుకరాకపోవడంతో రైతుబజార్లో చాలావరకు స్టాల్స్‌ను మూసివేశారు.నిత్యం 2 క్వింటాళ్ల వరకు విక్రయాలు రైతుబజార్లో 120 కూరగాయల స్టాళ్లు, 46 ఆకుకూరల స్టాళ్లు ఉన్నాయి. రోజూ టన్నుల వరకు కూరగాయలు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం బతుకమ్మ పండుగ నేపథ్యంలో కూరగాయలకు డిమాండ్ మరింత పెరిగింది. రైతుబజార్‌కు వచ్చిన వినియోగదారులు తెరిచి ఉన్న కొద్ది స్టాళ్లలో అందుబాటులో ఉన్న కూరగాయలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఫ భువనగిరిలోని రైతుబజార్‌కు నిలిచిన కూరగాయల దిగుమతిఫ ధరల విషయంలో వ్యాపారులు, విక్రయదారులు, రైతుల్లో భిన్నాభిప్రాయాలు ఫ రెండు రోజులుగా మూతబడిన స్టాళ్లు ఫ పండుగల వేళ వినియోగదారుల ఇక్కట్లు ఫ బహిరంగ మార్కెట్లో అధిక రేట్లుసమస్య పరిష్కరిస్తాంబోయినిపల్లి మార్కెట్‌కు అనుగుణంగా రైతుబజార్లో కూరగాయల ధరలు నిర్ణయిస్తుంటారు. రోజూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ధరల విషయంలో వ్యాపారులు, విక్రయదారులు, రైతుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. కూరగాయల దిగుమతికి చర్యలు తీసుకుంటాం. – అఫ్జల్, రైతుబజార్ ఎస్టేట్ అధికారి -
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలం అభంగాపురం గ్రామానికి చెందిన మోర్తాల రాంనర్సిరెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. రాంనర్సిరెడ్డి చిన్నతనంలోనే అతడి తండ్రి శేఖర్‌రెడ్డి మృతిచెందగా.. పట్టుదలతో చదివి గ్రూప్–2, 3 ఉద్యోగాలు సాధించారు. అంతేకాకుండా హైకోర్టు అసిస్టెంట్ ఫలితాల్లో కూడా మెరిట్ పొంది ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. ఒకేసారి మూడు ఉద్యోగాలు పొందిన రాంనర్సిరెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. ఏఎస్ఓగా పంచాయతీ కార్యదర్శి..చివ్వెంల : మండల పరిధిలోని రాజుతండా గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న అంగోతు నరేష్ ఆదివారం ప్రకటించిన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 717 ర్యాంకు సాధించి ఏఎస్ఓగా ఎంపికయ్యాడు. చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ ఆవాసం అంగోతు తండాకు చెందిన నరేష్ 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్–2లో ఉత్తీర్ణత సాధించి ఏఎస్ఓగా ఎంపిక కావడం పట్ల తండావాసులు, సహ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఎస్టీ విభాగంలో రాష్ట్రస్థాయి 16వ ర్యాంకు సాధించినట్లు నరేష్ తెలిపాడు.నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–2 ఫలితాల్లో శాలిగౌరారం మండలంలోని మా దారం కలాన్ గ్రామానికి చెందిన కె.హరిప్రీత్ రెడ్డి కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించాడు. గతంలో ఆయన గ్రూప్–4 ఉద్యోగం సాధించి చిట్యాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–2 రాసిన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం పట్ల ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగాలు సాధించారు. కొందరు ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా గ్రూప్స్‌కు సన్నద్ధమవుతూ విజయం సాధించగా.. మరికొందరు ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ గ్రూప్–2 ఉద్యోగాలు సాధించారు.జూనియర్ అసిస్టెంట్ నుంచి ఎంపీఓగా..కార్యదర్శి నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా..భూదాన్‌పోచంపల్లి : గ్రూప్–2 ఫలితాలలో భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కంచర్ల రాజశేఖర్‌రెడ్డి సచివాలయం సాధారణ పరిపాలన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి మండలంలోని జలాల్పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరాడు. రాజశేఖర్‌రెడ్డిది స్వస్థలం చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామం. తండ్రి లారీ డ్రైవర్ కాగా, తల్లి గృహిణి. స్థానికంగా జెడ్పీ హైస్కూల్ ఎస్సెస్సీ, చౌటుప్పల్‌లో ఇంటర్, నేతాజీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. గ్రూప్ –2 ఫలితాలలో అసిస్టెంట్ సెక్షన్ఆఫీసర్గా ఉద్యోగం సాధించడం పట్ల ఎంపీడీఓ భాస్కర్, ఎంపీఓ మాజిద్, సూపరిండెంట్ సత్యనారాయణ, తల్లిదండ్రులు, తోటి పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం మైనవారిగూడెం గ్రామానికి చెందిన మైనం సుధాకర్, నాగమణి దంపతుల కుమారుడు మైనం అశోక్ ఆదివారం వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో మండల పంచాయతీ ఆఫీసర్(ఎంపీఓ)గా ఎంపికయ్యారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అశోక్ గతంలో గ్రూప్–4కు ఎంపికై ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్–3లో కూడా ఉద్యోగం సాఽధించారు. ఇంకా ఉన్నతమైన ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని అశోక్ తెలిపారు. ఆయను తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా హరిప్రీత్రెడ్డి -
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
పెద్దవూర: భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం పెద్దవూర మండలం తుంగతూర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నగూడెంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన నక్క రాములు, అతడి సోదరికి మధ్య కొంతకాలంగా భూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రామయ్య సోదరి కుమారులైన రామలింగయ్య, శంకరయ్య రామయ్యతో పాటు అతడి భార్య లక్ష్మిపై దాడి చేశారు. దీంతో వారిద్దరి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వృద్ధ దంపతులను చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పెద్దవూర పోలీసులు పేర్కొన్నారు.గాయపడిన రామయ్య, లక్ష్మి వృద్ధ దంపతులకు గాయాలు -
ఇంత దారుణం ఎన్నడూ లేదు
సొంత భూమితో పాటు ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాను. ఇప్పటి వరకు రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈ ఏడు వర్షాలు బాగా దెబ్బతీశాయి. 15 ఎళ్లలో ఇంత దారుణంగా పత్తి చేలు ఉండటం ఇప్పుడే చూస్తున్న. పత్తి రైతులకు ఈ ఏడాది కూడా నష్టాలు తప్పవు. – రేగు యాదయ్య, రైతు, మోటకొండూరుకొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులకు ఇబ్బంది కలుగుతుంది. అధిక వర్షాల వల్ల చేలు ఎర్రబారడం, కాయ రంగుమారి, కుళ్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచన మేరకు నివారణ చర్యలు తీసుకోవాలి. – వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
పథకం ప్రకారమే హత్య
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కేసారం రోడ్డులో శుక్రవారం రాత్రి హత్యకు గురైన వ్యక్తిని పథకం ప్రకారమే ప్రత్యర్థులు మట్టుబెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యలో పాల్గొన్న వారితో పాటు మృతుడు సైతం పాత నేరస్తుడే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన చారగండ్ల శివకుమార్(29)కి ఐదేళ్ల క్రితం పెద్ది లింగస్వామి అనే వ్యక్తితో గొడవ జరిగింది. అప్పట్లో లింగస్వామి శివకుమార్‌పై హత్యాయత్నం చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి లింగస్వామి శివకుమార్‌పై పగ పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పూల సెంటర్లో ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో ఎలాగైనా శివకుమార్‌ను హతమార్చాలని లింగస్వామి నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రౌడీషీటర్ మాతంగి మధుతో శివకుమార్‌కు ఫోన్ చేయించి భీమారం రోడ్డులోని కుసుమవారిగూడెం సమీపంలోని మద్యం దుకాణం వద్దకు పిలిపించాడు. అయితే మాతంగి మధు, శివకుమార్ కలిసి గతంలో చిన్న చిన్న పంచాయితీలు, సెటిల్మెంట్లు చేసేవారు. ఏడాది క్రితం మాతంగి మధు కోదాడకు చెందిన ఓ వ్యక్తి హత్యకు సుపారీ తీసుకున్నట్లు తేలడంతో పట్టణ పోలీసులు అతడిని బైండోవర్ చేశారు. తాను సుపారీ తీసుకున్న విషయం శివకుమార్ పోలీసులకు చెప్పాడని మధు సైతం అతడిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో వీరంతా కలిసి కుసుమవారిగూడెం సమీపంలో ఉన్న వైన్స్ ఎదురుగా ఉన్న హోటల్లో శుక్రవారం రాత్రి మద్యం తాగుతుండగా మాతంగి మధు, పెద్ది లింగస్వామి మరికొంత మంది కలిసి గొడ్డళ్లు, కత్తులతో శివకుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చి పరారయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాతంగి మధుపై కూసుమంచిలో ఒక హత్య కేసు, సూర్యాపేటలో మూడు హత్యాయత్నం కేసులు, సూర్యాపేటలో మూడు, కేతేపల్లిలో ఒక చోరీ కేసు నమోదై ఉంది. మృతుడికి భార్య అఖిల, కుమారుడు రిష్, కుమార్తె విజయశ్రీ ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట రూరల్ పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీహత్య జరిగిన స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ శనివారం పరిశీలించారు. డీఎస్పీ, సీఐలతో పాటు స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితులను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రూరల్ సీఐ బాలునాయక్ ఉన్నారు. ఫ పాత కక్షలతోనే శివకుమార్‌ను హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
రాజాపేట : విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటన రాజాపేట మండల కేంద్రంలో శనివారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామానికి చెందిన సంపంగి చినతిరుపతయ్య తన భార్య ఆండాలు(40), కుమారుడు అంజితో కలిసి బతుకుదెరువు కోసం 15 రోజుల క్రితం రాజాపేట మండల కేంద్రానికి వలస వచ్చాడు. కుమ్మరికుంట వద్ద కాకాల్ల మల్లయ్య భూమిలో గుడిసె వేసుకుని నివసిస్తూ.. బండ కొట్టి కూలి పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. శనివారం ఉదయం నీళ్లు తెచ్చేందుకు ఆండాలు పక్కనే ఉన్న గొళ్లెన రాములు ఇంటికి వెళ్లింది. తలపై నీటికుండతో తిరిగి వస్తుండగా అడ్డుగా ఉన్న తీగను పైకి లేపింది. ఆ తీగకు కరెంట్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయింది. ఆమెను రాజాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీచౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం వాహనాల రద్దీ నెలకొంది. విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్ వాసులు స్వగ్రామాలకు వెళ్తుండడంతో ఈ రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ రద్దీ కొనసాగింది. వాహనాలు నిదానంగా ముందుకు సాగాయి. సివిల్, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు శ్రమించారు. చౌటుప్పల్ పట్టణంలోని జంక్షన్ల వద్ద రోడ్డు దాటేందుకు స్థానిక వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 16 గేట్ల ద్వారా పులిచింతల నీటి విడుదలమేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు టెయిల్‌పాండ్, మూసీ నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి వరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 4,16,720 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 16 గేట్లను ఎత్తి 4,63,136 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
అలైన్మెంట్ మారుస్తామనే హామీని నిలబెట్టుకోవాలి
భువనగిరిటౌన్ : తాము అధికారంలోకి వస్తే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుస్తామని భువనగిరి, మునుగోడు, ఆలేరు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు చేసిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ముందు ప్రకటించిన అలైన్మెంట్ కాకుండా.. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 28కి.మీ. దూరానికే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కుదించడం వలన పట్టణ, మండల కేంద్రాలకు చేరువలో ఉన్న సారవంతమైన భూములను రైతులు అత్యధికంగా కోల్పోతున్నారని అన్నారు. సాగుకు యోగ్యంకాని భూములను తీసుకోవాలని చట్టం చెబుతున్నా.. కొందరు పారిశ్రామికవేత్తలు. రాజకీయ నాయకులు, సంపన్న వర్గాలను కాపాడేందుకు అలైన్‌మెంట్‌ను మార్చి రైతాంగానికి నష్టం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వందల కుటుంబాలు భూమిలేని నిరుపేదలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో రీజినల్ రింగ్ రోడ్డు అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకొని, ఇప్పడు అధికారంలోకి రాగానే రైతులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేకసార్లు ఇచ్చిన హామీ మేరకు భువనగిరి, మునుగోడు, ఆలేరు ఎమ్మెల్యేలు రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్పు చేయించి మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, నాయకులు దొంతగాని పెద్దులు, గంగదేవి సైదులు, మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, పల్లెర్ల అంజయ్య, ఈర్లపల్లి ముత్యాలు, గంటపాక శివ తదితరులు పాల్గొన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ఫ రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో కలిసి యాదాద్రి కలెక్టరేట్ ఎదుట ధర్నా -
మరింత కుంగిన మోత్కూరు చెరువు కట్ట రోడ్డు
మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట రోడ్డు (మినీ ట్యాంక్‌బండ్) మరింత కుంగింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువు కట్ట రోడ్డు ఒక పక్కకు ఒరుగుతూ కుంగుతోంది. చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తుండడం.. మోత్కూరు, తిరుమలగిరి, తొర్రూరు, సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో పాటిమట్ల నుంచి అనాజిపురం మీదుగా మోత్కూరు పట్టణానికి బస్సులను దారి మళ్లించారు. పోలీసులు చెరువు కట్ట వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. కుంగిన రోడ్డును నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కె. సతీష్‌కుమార్, నీటిపారుదల శాఖ ఏఈలు అఖిల్, చంద్రశేఖర్, ఆర్అండ్బీ ఏఈ మెంట స్వామి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. పొడిచేడు–అమ్మనబోలు గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది బ్రిడ్జి వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఫ తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన నీటిపారుదల శాఖ అధికారులు -
సాంకేతిక కోర్సులతో ఉద్యోగావకాశాలు
నల్లగొండ: సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐటీఐ ప్రాంగణంలో రూ.42.5 కోట్లతో నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2400కోట్లతో 65 ఏటీసీలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏటీసీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే మరోవైపు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. యువత కష్టపడి చదివి ఉద్యోగాలను సాధించాలన్నారు. పక్కనే ఉన్న న్యాక్ భవనంలో కూడా మహిళలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. యువత భవిష్యత్ వారి కష్టం మీదే ఆధారపడి ఉంటుందన్నారు. 4 సంవత్సరాలు కష్టపడి చదివితే 40 ఏళ్లు సుఖంగా ఉండవచ్చని అన్నారు. అనంతరం జిల్లా అవార్డు సాధించిన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మంత్రి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ శిక్షణ ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. డిగ్రీ, ఇతర చదువుల ద్వారా మాత్రమే కాకుండా సాంకేతిక విద్య ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెలిక్లంటి సత్యం, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ, ఏటీసీ ప్రిన్సిపాల్ నర్సింహచారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ నల్లగొండ పట్టణంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం -
యాదగిరిగుట్ట ఆలయానికి ఎక్సలెన్స్ అవార్డు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికై ంది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆలయ ఈఓ జి. రవి ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు గజవెల్లి రఘు, జూశెట్టి కృష్ణ పాల్గొన్నారు. నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం మీడియా, ప్రమోషన్స్ మేనేజర్, స్థపతి దేశరాజు శ్యాంసుందర్‌రావు టూరిజం అవార్డు అందుకున్నారు. తెలంగాణ చారిత్రక పర్యాటకం అనే అంశంపై బాలచెలిమి మాసపత్రికలో శ్యాంసుందర్‌రావు రాస్తున్న వ్యాసాలకు గాను శనివారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారి వైద్యానికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సాయంమునుగోడు: మునుగోడు మండలం కోతులారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమారుడు రిషి(ఏడాది లోపు వయస్సు) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని శుక్రవారం మునుగోడుకు వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి స్థానిక ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు చెప్పగా.. ఆయన ఆ చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల నగదును కుటుంబ సభ్యులకు పంపించారు. ఆస్పత్రి ఖర్చులన్నీ తానే అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. -
బతుకమ్మ చీరలు కాదు.. యూనిఫామ్
ఫ స్వయం సహాయక సంఘాలకు డ్రెస్ కోడ్ ఫ ఒక్కో సభ్యురాలికి రెండు చీరలు.. ఫ బతుకమ్మ పండుగతో సంబంధం లేకుండా త్వరలో పంపిణీ సాక్షి యాదాద్రి : బతుకమ్మ చీరలు ఈసారి కూడా లేనట్టే. ప్రస్తుతం పంపిణీ చేయనున్న చీరలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూనిఫాం మాత్రమే. ఇందిరా మహిళా శక్తి సంఘాల చీరల పేరుతో వీటిని పంపిణీ చేయనున్నారు. ఒక్కో సభ్యురాలికి సంవత్సరానికి రెండు చొప్పున చీరలు ఇస్తారు. జిల్లాకు 3 లక్షల 2వేల చీరలు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 36,200 చీరలు మాత్రమే వచ్చాయి. బతుకమ్మ పండుగతో సంబంధం లేకుండా ఎప్పుడైనా చీరలు పంపిణీ చేయవచ్చిని అధికారులు చెబుతున్నారు. బతుకమ్మ చీరలుగా ప్రచారం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వలేకపోయింది. ఈసారి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో నేతన్నలకు పని కల్పిస్తున్నామని సీఎం సైతం అన్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తామన్న చీరలు మహిళా సంఘాల సభ్యులకని, ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నామని ప్రకటించారు. సంఘాల్లో లేని మహిళలకు చీరలు ఎందుకు ఇవ్వరన్న చర్చ మొదలైంది. సంఘాల్లో 1,59,482 మంది సభ్యులు జిల్లాలో 14,848 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 1,59,482 మంది సభ్యులు ఉన్నారు. 50 ఏళ్ల వయసులోపున్న వారు 1,19,373, 50 ఏళ్ల పైబడిన మహిళలు 39,617 మంది ఉన్నారు. వీరితోపాటు 492 మంది గోచి చీర ధరించే వారు ఉన్నారు. రామన్నపేట గోదాములో సెర్ప్‌కు సంబంధించి 85,658, మెప్మా 13,517 చీరలు నిల్వ చేయనున్నారు. బొమ్మలరామారం మండలం మైలారం గోదాంలో సెర్ప్ 73,824, మెప్మా డిపార్ట్మెంట్ చీరలు 18,812 నిల్వ చేయనున్నారు. ప్రస్తుతం 36,200 చీరలు రాగా వాటిని రామన్నపేట గోదాములో భద్రపరిచారు. -
లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం
భువనగిరిటౌన్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం కలేక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని పోరాటం చేశారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సైతం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సమాజానికి ఆయన ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ అధికారి సాహితితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కుల, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
సీడీపీఓ విచారణ
యాదగిరిగుట్ట రూరల్: పట్టణంలోని డ్రెయినేజీ సమీపంలో పడేసిన బాలామృతం ప్యాకెట్లను శనివారం సీడీపీవో స్వరాజ్యం పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీసీ కెమెరాల్లో చూడాలని ఫిర్యాదు చేశారు. అనంతరం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. తప్పులకు తావు లేకుండా సరైన సమయంలో లబ్ధిదారులకు పౌష్ఠికాహారం అందజేయాలని సూచించారు. ఆమె వెంట సూపర్వైజర్ జంగమ్మ తదితరులు ఉన్నారు. సబ్‌జైల్‌ను సందర్శించిన జిల్లా ప్రధాన జడ్జి భువనగిరిటౌన్ : భువనగిరిలోని సబ్‌జైల్‌ను శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జయరాజు సందర్శించారు. జైలులతో వసతులను పరిశీలించారు. ఖైదీలతో ముఖాముఖి నిర్వహించి జైలులో కల్పిస్తున్న వసతులు, న్యాయ సహాయం తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారు ఉచిత న్యాయ సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ముక్తిద, జైలు సూపరింటెండెంట్ పాల్గొన్నారు. హోటల్ వివేరాకు అవార్డు భువనగిరి: జిల్లా కేంద్రంలోని హోటల్ వివేరాకు ఉత్తమ వేసైడ్ అమినిటిస్ అవార్డు లభించింది. పర్యాటకులకు ఆధునిక సదుపాయాలు అందిస్తూ రాష్ట్ర టూరిజం శాఖ అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా హోటల్‌కు అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కా ర్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదగా వివేరా హోటళ్ల చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ రాఘవేందర్‌రెడ్డి అ వార్డు అందుకున్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై చర్య తీసుకోవాలిభూదాన్పోచంపల్లి: మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పి తమ కాలేజీలోకి అ క్రమంగా జేసీబీలతో చొరబడి దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవా లని సెయింట్‌మేరీస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కేవీకే రావు కోరారు. శనివారం పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని సెయింట్‌మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం శివ, శంకర్, రవి అనే ముగ్గురు వ్యక్తులు మూడు జేసీబీలతో కాలేజీలోకి అక్రమంగా చొరబడి చెట్లను నరికారని పేర్కొన్నారు. రౌడీయిజంతో కాలేజీ స్టాఫ్, విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తుంటే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరో పించారు. కళాశాల సిబ్బంది జేసీబీలకు అడ్డుపడగా అక్కడ నుంచి వెళ్లిపోతూ హరీష్‌రావు బంధవులైన రామారావు, వినోద్‌తో ఆదివారం లోగా భూమి సెటిల్మెంట్ చేసుకోవాలని, లేనిపక్షంలో విధ్వంసం చేస్తామని హెచ్చరించారని తెలిపారు. ఇదే విషయమై శనివారం రాచకొండ సీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు అన్నారు. పోలీసులు తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. -
మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం
ఆలేరు: పారిశ్రామిక అవసరాలకు నుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసినట్టు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో వర్చువల్‌గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను ప్రారంభించారు. ఆలేరులో ప్రభుత్వ విప్ ఐలయ్య ఏటీసీని ప్రారంభించి మాట్లాడారు. ఏటీసీల ద్వారా గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడానికే సీఎం ధ్యేయమన్నారు. ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ హరికృష్ణ మాట్లాడుతూ ఏటీసీని భవిష్యత్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌గా మా ర్చడానికి చొరవ చూపాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చైతన్యరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఇజాజ్, వెంకటస్వామి , రాజశేఖర్‌గౌడ్, విద్యార్థులు పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
ధాన్యం కొనుగోళ్లలో పోచంపల్లి ఫస్ట్
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో 3.60 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం భూదాన్పోచంపల్లిల పీఏసీఎస్ అర్థవార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద షెడ్ల నిర్మాణం చేపడ్టుతున్నామని తెలిపారు. ధాన్యం కమీషన్ ద్వారా వచ్చిన రూ.50ల క్షలతో గోదాం, ప్రహరీ నిర్మించామని చెప్పారు. రైతులు, పాలకవర్గం సహకారంతో పీఏసీఎస్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. పోచంపల్లి పీఏసీఎస్‌ను లాభాలబాటలో నడిపిస్తూ జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు. గతంలోనూ అనేక రికార్డులు నెల కొల్పామని గుర్తు చేశారు. భవిష్యత్‌లో కూడా రైతులు పాలకవర్గానికి అన్ని విధాలా సహకారం అందించాలని భూపాల్‌రెడ్డి కోరారు. అనంతరం 2025–26 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్ సామ మోహన్‌రెడ్డి, సీఈఓ సద్దుపల్లి బాల్‌రెడ్డి, డైరెక్టర్లు మద్ది చంద్రారెడ్డి, నల్ల కిష్టమ్మ, రామసాని చంద్రశేఖర్‌రెడ్డి, రాజమల్లేశ్, మైల గణేశ్, ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి, కూసుకుంట్ల అలివేలుమంగ కొండల్‌రెడ్డి, ఎడ్ల సహదేవ్, సత్తయ్య, గుర్రం నర్సిరెడ్డి, సిబ్బంది శ్రీధర్, నాని, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.ఫ పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి -
ఏటీసీలతో ఉద్యోగ అవకాశాలు
భువనగిరి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో రూ. 42.5 కోట్లతో నిర్మించిన అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను శనివారం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటీసీ వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నిరుద్యోగుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ సాంకేతిక కోర్సులతో మంచి భవిష్యత్ ఉంటుందని, ఏటీసీలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ జయ, ట్రైనింగ్ ఆఫీసర్ రమణానంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ భావన, సిబ్బంది పాల్గొన్నారు. -
మూసీకి వరద పోటు
భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, మోత్కూరు, రామన్నపేట: హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, గండిపేట చెరువు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీకి వరద పోటెత్తింది. శుక్రవారం రాత్రి నుంచే భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతి కొనసాగింది. భారీవరదతో అధికారులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. వయా పెద్దరావులపల్లి మీదుగా దారి మళ్లించారు. 20 ఏళ్ల తరువాత మూసీకి ఇంత పెద్ద మొత్తంలో వరద పోటెత్తిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వరద ప్రభావం భారీగా ఉండటంతో మూసీ నది వెంట ఉన్న జూలూరు, కప్రాయిపల్లి, పెద్దరావులపల్లి, ఇంద్రియాల గ్రామాల్లో వరిపొలాలు నీటమునిగాయి. మండలంలోని చెరువులన్నీ నిండి జలకళను సంతరించుకొన్నాయి. అదే విధంగా వలిగొండ మండలం సంగెం భీమలింగం వద్ద, రామన్నపేట మండలం లక్ష్మాపురం మధ్య వంతెనలపై నుంచి మూసీ పరవళ్లు తొక్కుతోంది. మో త్కూరు మండలం పొడిచేడు, నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు మధ్య గల బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నపేట : లక్ష్మాపురం వద్ద.. -
నవమి నాటికి తేలకపోతే.. సజీవ సమాధి
సాక్షి, యాదాద్రి: మాజీ డీఎస్పీ దోమకొండ నళిని శుక్రవారం ఫేస్బుక్లో మరో ప్రకటన పోస్టు చేశారు. ఇది తన మరణ వాంగ్మూలంగా ఆమె పేర్కొన్నారు. నవమి నాటికి తన సరీ్వస్ సమస్యలు సీఎం రేవంత్‌రెడ్డి తేల్చకపోతే సజీవ సమాధి అవుతానన్నారు. ‘చాలామంది అభిమానులు నా జబ్బును ట్రీట్ చేస్తామని నన్ను సంప్రదిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లో అత్యంత ప్రమాదకరమైంది. అలోపతిలో దీనికి స్టెరాయిడ్స్ వాడతారు. ఎక్కువ కాలం ఇవి వాడితే కాళ్లు, చేతులు వంకర్లుపోతాయి. అందుకే నేను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదం, పంచకర్మ, యోగ, యజ్ఞం వంటి వాటిని ఎంచుకున్నాను. కాబట్టే ఎనిమిదేళ్లయినా అంగవైకల్యం రాకుండా కాపాడుకున్నాను. నాకు ఈ వ్యాధి తీవ్రస్థాయిలో రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. రాష్ట్రపతి మెడల్ లక్ష్యంగా డైనమిక్ ఆఫీసర్‌గా పనిచేసిన నన్ను సస్పెండ్ చేయడం, వెంటాడి వేటాడటం నా అన్ని సమస్యలకు మూల కారణం. 21నెలల క్రితం నేనిచి్చన రిపోర్ట్‌పై ఇంకా చర్య తీసుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి నిర్లిప్తంగా ఉన్నారు. ఇది నన్ను మరింత ఒత్తిగికి గురిచేస్తోంది. ఇదే నా చావుకు దారి తీస్తుందేమో! ఏ ఆఫీసర్నైనా సస్పెండ్ చేస్తే 6 నెలల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయాలి. అలా చేయకపోతే 7వ నెల నుంచి పూర్తి జీతం ఇవ్వాలి. ఈ పనిని ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ కూడా నా విషయం పట్టించుకోలేదు. నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే సజీవ సమాధి అవుతాను’అని తన పోస్టులో పేర్కొన్నారు. -
మధురం.. సీతాఫలం
సీతాఫలాలు రెండు నెలలపాటు లభిస్తాయి. చెట్టుచెట్టుకు తిరిగి పండ్లు సేకరిస్తాం. వీటిని రోజుకు రూ. 200 నుంచి రూ. 300 వరకు వస్తాయి. వ్యాపారులు మా దగ్గర సీతాఫలాలను తక్కువ ధరకు హైదరాబాద్, సికింద్రాబాద్‌కు తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటారు. – కర్రె లక్ష్మి, రాజాపేట మహిళా కూలీ రాజాపేట : సీతాఫలాలంటే ఇష్టపడని వారుండరు. సెప్టెంబర్ చివరివారం నుంచి మొదలుకుని నవంబర్ వరకూ ఈ ఫలాలు విరివిగా లభిస్తాయి. కురిసిన వర్షాలను బట్టి సీతాఫలాలు లభిస్తుంటాయి. సీతాఫలాలు ఎంతో ఆరోగ్యకరం. చిన్నా, పెద్దా తేడాలేకుండా ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిలో గ్లూకోజ్, మిటమిన్ సీ, ఏ, బీ6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటిఆక్సిడెంట్లు, పిండిపదార్థాలు మెండుగా ఉంటాయి. పోషక విలువలతో కూడిన సీతాఫలాలు తీసుకుంటే శరీరం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇవి తేలికగా జీర్ణం కావడంతోపాటు పోషక పదార్థాలు సమృద్ధిగా అందుతాయని పేర్కొంటున్నారు. రైతు కూలీలకు జీవనోపాధి సీతాఫలాలు అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విరివిగా వచ్చేసాయి. ఈ సీతాఫలాలతో కొందురు రైతుకూలీలు జీవనోపాధి పొందుతారు. రాజాపేట మండలంలోని సింగారం, పుట్టగూడెం, కొండేటిచెర్వు, మల్లగూడెం, చల్లూరు, నర్సాపురం, బొందుగుల తదితర గ్రామాల్లో ఎక్కువగా సీతాఫలాలు లభిస్తుంటాయి. కూలీలు తమ వ్యవసాయ పొలాల వద్ద ఫలాలను సేకరించే పనిలో ఉంటారు. ఒక్క బాక్స్‌ను రూ.300 వరకు విక్రయిస్తున్నారు. ఇలా సేకరించిన సీతాఫలాలు హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సిద్దిపేట వంటి ప్రదేశాలకు ఎగుమతి చేస్తారు. వ్యాపారులు మాత్రం పట్టణాల్లో రూ.700 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తుంటారు. సీతాఫలాలను వాహనంలో తరలిస్తున్న రైతులు విక్రయానికి సిద్ధంగా ఉంచిన సీతాఫలాలు ఫ రుచితోపాటు ఆరోగ్యానికి మేలు ఫ ప్రారంభమైన పండ్ల విక్రయాలు -
మహిళల ఆరోగ్య శ్రేయస్సుకు ప్రధాని మోదీ కృషి
బీబీనగర్: మహిళల ఆరోగ్య శ్రేయస్సుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్‌ను ప్రవేశపెట్టారని ఎంపీ, ఎయిమ్స్ బోర్డు మెంబర్ డీకే అరుణ అన్నారు. స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్‌లో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. ఎయిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలు, వసతుల పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంత శాంతసింగ్, డిప్యూటీ డైరెక్టర్ బిపీన్ వర్గీస్‌తో సమావేశమై స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్‌లో భాగంగా కొనసాగుతున్న క్యాంప్‌లు, కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు, ఆమె మాట్లాడుతూ.. స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్‌లో భాగంగా మహిళలకు మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు, ఉచితంగా అనేక రకాల టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. ఎయిమ్స్‌లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 9,400మంది మహిళలు టెస్టులు చేయించుకున్నారని పేర్కొన్నారు. నిరు పేదలందరికీ మెరుగైన వైద్యం అందించడమే ఎయిమ్స్ లక్ష్యమని, ఆదిశగా ఎయిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట బీజేపీ నాయకులు వెముల అశోక్, జగన్మోహన్రెడ్డి, అశోక్‌గౌడ్, నరోత్తమరెడ్డి, గోపాల్‌రెడ్డి, రవీందర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంపీ డీకే అరుణ -
ఉపాధినిస్తున్న బతుకమ్మ
రాజాపేట : ఆడపడుచులకు బతుకమ్మ అత్యంత ఇష్టమైన పండుగ. వీటిని పేర్చడానికి తంగేడు, గునుగు, ముత్యాలపువ్వు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి, రుద్రాక్ష, గుమ్మడి, టేకు వంటి పూలను ప్రధానంగా వాడుతారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగెడుతున్నారు. ఎవ్వరికీ తీరికలేకపోవడంతో బతుకమ్మకు కావాల్సిన పూలను సేకరించేందుకు సమయాన్ని వెచ్చించడం లేదు. అయితే కొంతమంది మహిళలు మారుతున్న కాలానికి అనుగుణంగా పూలను సేకరించి వాటికి రంగులద్ది మార్కెట్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ సీజన్లో బంతి, పట్టుకుచ్చుల పూలు, ముత్యాలపువ్వు వంటి పంటలు సేద్యం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గొళ్లెన జానమ్మ 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని కొంత భూమిలో వరిసేద్యం చేయడమే కాకుండా అర ఎకరంలో బంతి, అర ఎకరంలో పట్టుకుచ్చుల పూలు సేద్యం చేస్తోంది. రైతుల పొలాల్లో దొరికే ముత్యాల పువ్వు కొనుగోలు చేసి వాటికి రంగులద్ది విక్రయిస్తూ జీవనోపాధి పొందుతోంది. బంతి, పట్టుకుచ్చులు, ముత్యాలపువ్వు రూ. 100కు నాలుగు కట్టల చొప్పున విక్రయిస్తోంది. ప్రస్తుతం చాలా మందికి బతుకమ్మ కోసం పూలు సేకరించేందుకు బయటకు వెళ్లే తీరిక లేకుండా పోయింది. అందుకే నేను ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా తీరొక్క పూలు సేకరించి వాటికి రంగులద్ది విక్రయిస్తున్నా. రూ. 100కు నాలుగు కట్టల చొప్పున ఇస్తాను. బంతి, పట్టుకుచ్చుల పూల పంట సేద్యం చేశాను. – జానమ్మ, మహిళా కూలీ, రాజాపేట ఫ బతుకమ్మ పూల కోసం బంతి, పట్టుకుచ్చుల పూల సేద్యం ఫ ముత్యాలపూలకు రంగులద్ది మార్కెట్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న జానమ్మ -
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ మార్చగలిగే శక్తి
కోదాడరూరల్ : దేశ భవిష్యత్‌ను మార్చగలిగే శక్తి యువత చేతిలోనే ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని లాల్ బంగ్లాలో నిర్వహించిన పీవైఎల్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జరగుతున్న మతోన్మాద రాజకీయాలను యువత తిప్పికొట్టాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదం పేద దేశాలపై ఆదిపత్యం చెలాయిస్తోందని అలాంటి దేశానికి మోదీ ప్రభుత్వం స్వాగతం పలకడం సిగ్గుచేటన్నారు. న్యూడెమోక్రసీ రాష్ట్రనాయకుడు గౌని ఐలయ్య మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను, యువతను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తానని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్‌కుమార్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోకాళ్ల రమేష్, కోలా లక్ష్మీనారాయణ, ప్రజా చైతన్య వేదిక నాయకులు రాయపూడి చిన్ని, ఉపాధ్యక్షులు వనమాల సత్యం, రమేష్, బేజాడి రవికుమార్, రవి, సిద్ధేశ్వర్, ధరావత్ రవి, నల్గొండ నాగయ్య, బండి రవి, మోతీలాల్, బీవీ చారి, సిద్దులు, ఉమాశంకర్, మనోహర్, నరసింహారావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఫ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య -
పరిమితికి మించి ఆటోలో ప్రయాణం
చౌటుప్పల్ : పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వస్తున్న ఆటోను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆపి డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగాను శుక్రవారం మునుగోడు క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే తన కాన్వాయ్‌తో వస్తున్నారు. అదే సమయంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామ శివారులో నారాయణపురం నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటోను చూసి తన కాన్వాయ్‌ను ఆపి ఆటో వద్దకు చేరుకున్నారు. చంటి బిడ్డలతో వెనుక డోర్‌పై ప్రమాదకరంగా ఎందుకు కూర్చుంటున్నారని అడిగారు. ప్రయాణికులను ఆటోలో పరిమితికి మించి ఎందుకు ఎక్కించుకున్నావని డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఆటో సడెన్‌గా బ్రేక్ వేస్తే వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులు కింద పడిపోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు. ఫ ఆటోడ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి -
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శనీయం
చౌటుప్పల్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. చౌటుప్పల్‌కు చెందిన నిర్మాత చిరందాసు ధనుంజయ్య, పోచంపల్లికి చెందిన దర్శకుడు బడుగు విజయ్‌కుమార్‌లు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన యూనిటీ, ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని శుక్రవారం ప్రముఖ రచయిత మసన చెన్నప్పతో కలిసి హైదరాబాద్‌లో విడుదల చేశారు. శనివారం జరగనున్న బాపూజీ జయంతికి డాక్యుమెంటరీని అంకితం ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. -
సాగర్ వద్ద హైవేపై విరిగిపడిన కొండ చరియలు
నాగార్జునసాగర్: శిరోంచ–రేణిగుంట హైవే, నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి దారిలో కొండ చరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. బండరాళ్లు రోడ్డువెంట గల డ్రైన్ రిటైనింగ్ సైడ్‌వాల్‌కు తగలడంతో పాక్షికంగా దెబ్బతిన్నది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం రావడంతో కొండప్రాంతమంతా నానింది. మట్టి కరిగి బండరాళ్లు రోడ్డుపైకి వచ్చాయి. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. పోలీసులు బండరాళ్లను ఎత్తి సైడ్ డ్రైన్‌లోకి దొర్లించారు. -
ఉత్తమ పర్యాటక క్షేత్రంగా యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టూరిజం ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికై నట్లు ఆలయ అధికారులు శుక్రవారం రాత్రి వెల్లడించారు. అవార్డును శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అందజేయనున్నారు. యాదగిరి క్షేత్రానికి అవార్డు రావడం ఆనందంగా ఉందని ఇన్చార్జి ఈవో గగులోతు రవినాయక్ పేర్కొన్నారు. ఊంజల్ సేవోత్సవంయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. సాయంత్రం సమయంలో అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయంలో ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవం జరిపించారు. ఇక ఆలయంలో నిత్య పూజలు యధావిధిగా కొనసాగాయి. యాదాద్రీశుడి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
ఫ రూ.18,50,116 కరెన్సీతో అలంకరణ
ఫ బంగారు కనకదుర్గమ్మ చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం మహాలక్ష్మిదేవిగా అలకరించారు. సుమారు అర కేజీకి పైగా బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలకరించారు.మఠంపల్లి: మండలంలోని హనుమంతులగూడెంలో కనకదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మిదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.18,50,116ల కరెన్సీ నోట్లతో అలంకరించారు. -
మూడు మండలాల్లో జోరువాన
ఆత్మకూరు(ఎం): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. వర్షానికి ఆత్మకూర్(ఎం) మండలంలోని రాయిపల్లిలో బోడ ముత్తయ్య, సుల్తాన్ లక్ష్మి ఇళ్లు దెబ్బతిన్నాయి. పత్తి చేలలోకి నీరు చేరింది. అదే విధంగా బిక్కేరుకు వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతల ఉన్న మొరిపిరాల గ్రామానికి చెందిన దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి తేలు కరువడంతో చికిత్స నిమిత్తం మండల కేంద్రానికి తీసుకురావాల్సి ఉంది. వాగు దాటనీయకపోవడంతో ట్రాక్టర్ ఇంజన్‌పై వాగులోకి నుంచి ఆస్పత్రికి తరలించారు. గుండాల : మండలంలోని మాసాన్‌పల్లి, గంగాపురం ఊర చెరువులు అలుగు పోస్తున్నాయి. గుండాల–నూనెగూడెం మధ్య బిక్కేరు వాగు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల పోలీస్ స్టేషన్ ఆవరణలోకి భారీగా వరద నీరు చేరింది. తుర్కపల్లి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కురిసిన వర్షానికి కాజ్‌వేల పైనుంచి వరద నీరు ప్రవహించింది. -
కుంగిన రహదారి
మోత్కూరు: మోత్కూరు మినీ ట్యాంక్‌బండ్ ప్రమాదకరంగా మారింది. చెరువు కట్టపై కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డు శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక వైపు కుంగిపోయింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 100 మీటర్ల పొడవు, 2 ఫీట్ల లోతు కుంగి, బీటీకి పగుళ్లు ఏర్పడ్డాయి. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు కుంగడంతో మరమ్మతులు చేశారు. మళ్లీ అక్కడే కుంగడంతో పనుల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ శివధర్మతేజ, తిరుమలగిరి జోన్ ఈఈ సత్యనారాయణగౌడ్ సందర్శించారు. చెరువు నిండి అలుగుపోస్తుండటంతో కట్ట లీకేజీ అవుతుందని, రోడ్డు ప్రమాదకరంగా ఉందని గుర్తించినట్లు ఎస్ఈ తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, వేసవిలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. కుంగిన చోట బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులను కాపలా పెట్టారు. ఫ చెరువు కట్ట రోడ్డుపై ఏడాదిలో రెండోసారి గొయ్యి ఫ రూ.కోట్లు వెచ్చించి నిర్మాణం, నాణ్యతపై విమర్శలు -
పర్యాటకం.. ప్రోత్సహిస్తే మణిహారం
భువనగిరి: జిల్లాలో ఆధ్యాత్మికత, ఆహ్లాదం పంచే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తామని పాలకులు ఇస్తున్న వాగ్దానాలు కార్యరూపం దాల్చడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ –వరంగల్ జాతీయ రహదారి మార్గంలో భువనగిరి నుంచి జనగాం వరకు పర్యాటక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికీ అడుగులు పడటం లేదు. ● భువనగిరి ఖిలాను జాతీయ వారసత్వ సంపదగా గుర్తించిన కేంద్రం.. కోటకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సంకల్పించింది. ఖిలా అభివృద్ధితో పాటు రోప్‌వే ఏర్పాటుకు స్వదేశీదర్శన్ 2.0 కింద రూ.118కోట్లు మంజూరు చేసింది. గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో పనులకు శంకుస్థాపన చేశారు. తొలి విడతలో రూ. 56.18 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఇటీవల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారభించారు. పనులు పూర్తయితే భువనగిరి కోట పర్యాటక ప్రాంతంగా విరాజిల్లనుంది. ● 2వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలేరు మండలంలోని కొలనుపాకలోని జైన దేవాలయాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. ఆలయంలో వర్థమాన మహావీరుడి విగ్రహం ఉంది. తెలంగాణలో జైనమతానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ కలగానే భువనగిరి–జనగామ పర్యాటక కారిడార్ ఫ అభివృద్ధికి నోచని కొలనుపాక జైనమందిర్ ఫ కార్యరూపం దాల్చని పాలకుల వాగ్దానాలు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భువనగిరి ఖిలా వద్ద శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతిభ గల కళాకారులకు బహుమతులు అందజేయనన్నారు. -
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
భువనగిరిటౌన్ : తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం ఐలమ్మ జయంత్రి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటితరం ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ చైతన్యానికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పరాంకుశం సాహితి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ప్రసాద్, కలెక్టరేట్ సిబ్బంది, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
మహాలక్ష్మిగా అమ్మవారు
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం, సాయంత్రం అమ్మవారికి అర్చనలు, పారాయణాలు, శ్రీదేవి మూలమంత్ర జపాలు, శ్రీదేవి చతుషష్టి ఉపచార పూజ, నీరాజన మంత్ర పుష్పములు, లక్ష కుంకుమార్చన, నవావరణ, చతుషష్టి తదితర పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. -
మధురం.. సీతాఫలం
సీతాఫలాలంటే ఇష్టపడని వారుండరు. సెప్టెంబర్ చివరివారం నుంచి నవంబర్ వరకు విరివిగా లభిస్తాయి. - IIలో- 0లోనల్లగొండ ఎస్పీగా పనిచేసిన శివధర్రెడ్డిఫ భువనగిరి జిల్లా వర్కట్‌పల్లి అల్లుడు ఫ డీజీపీగా నియామకంపై హర్షం నల్లగొండ: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన శివధర్‌రెడ్డి గతంలో పూర్వ నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి నల్లగొండ ఎస్పీగా 2000 ఏప్రిల్ 1 నుంచి 2002 ఏప్రిల్ 15 వరకు పనిచేశారు. నక్సల్స్ కార్యకలాపాలను అరికట్టడంలో, గ్యాంగ్స్టర్లను అణచివేయడంలో ఆయనకు మంచి పేరుంది. శివధర్‌రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాగా.. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లి ఆయన అత్తగారి ఊరు. శివధర్‌రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దివంగత కళ్లెం యాదగిరిరెడ్డి అల్లుడు. -
ఆలేరు ఏటీసీ నేడు ప్రారంభం
ఆలేరు: ఆలేరు పట్టణంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ఆవరణలో నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మల్లేపల్లిలో ఏటీసీల ప్రారంభోత్సానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా ఆలేరులోని ఏటీసీ కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. రూ.35కోట్ల నిధులతో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలను నిర్మించింది. గ్రామీణ యువతకు అధునాతన అడ్వాన్స్డ్ సాంకేతిక కోర్సుల్లో శిక్షణ అందించి, తద్వారా జాతీయ,అంతర్జాతీయ కంపెనీల్లో ఉపాధి,ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ఏటీసీ లక్ష్యమని శుక్రవారం ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణ చెప్పారు. ప్రారంభోత్సవానికి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సివిల్‌సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభోత్సవానికి హాజరుకానున్నట్టు ప్రిన్సిపాల్ హరికృష్ణ తెలిపారు. -
నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
భువనగిరి టౌన్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని శనివారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి పరాంకుశం సాహితి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఇతర కుల సంఘ నాయకులు, అధికారులు, అనధికారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. గోనె సంచులు సవిల్ సప్లై శాఖవే.. మోత్కూరు: ‘తూకం తప్పుతున్న ధర్మకాంట’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి సివిల్ సప్లై అధికారులు స్పందించారు. మోత్కూరు మండలం అనాజిపురం వేబ్రిడ్జి మోసాలపై గురువారం రైతులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వేబ్రిడ్జి వద్ద పౌరసరఫరాల శాఖకు చెందిన గన్నీ బ్యాంగులు ఉండటాన్ని రైతులు గుర్తించారు. అధికారులు వేబ్రిడ్జిని సందర్శించి గన్నీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. గత సీజన్లో వేబ్రిడ్జి వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని, వారికి చెందినవని అధికారులు తెలిపారు. ఇంకా 440 బస్తాలు రికవరీ కావాల్సి ఉందని సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ తెలిపారు.అలాగే లీగల్ మెట్రోలజీ అధికారులు వచ్చి విచారించేంత వరకు వేబ్రిడ్జిపై తూకాలు వేయ వద్దని నిర్వాహకులను ఆదేశించారు. 29 నుంచి అభ్యంతరాల స్వీకరణభువనగిరి: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్లో పొందుపర్చిన మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 29నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు తెలియజేయాలని ఉపాధి కల్ప నాధికారి సాహితి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో రాతపూర్వకంగా అందజేయాలని కోరారు. ఇళ్ల నిర్మాణాల పరిశీలన భువనగిరి, మోటకొండూర్: భువనగిరి మండలం ముస్త్యాలపల్లి, చందుపట్ల మోటకొండూరు మండలం చాడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఎలాంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. బిల్లుల చెల్లింపు వివరాలను హౌసింగ్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులపై శిక్షణభువనగిరిటౌన్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాల వరకు తీసుకోవాల్సిన జాగ్రజుత్తలు, బాధ్యతలపై చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలన్నారు. -
గెలుపు.. ‘రుచి’త చూసింది
కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన ఎల్లబోయిన రుచిత గ్రూప్–1 తుది ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగం సాధించింది. మిర్యాలగూడ మండలం మొలకల పట్నం గ్రామానికి చెందిన ఎల్లబోయిన రవి, శోభ దంపతులు 30 ఏళ్ల క్రితం కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి వలస వచ్చి వెటర్నరీ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. వారి ఏకై క కుమార్తె రుచిత హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేసి ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంది. ఈ క్రమంలో గ్రూప్–1 రాసి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికై ంది. కలెక్టర్ కావాలనే రుచిత కోరికను తాము ఎంతో ప్రోత్సహించామని, నిత్యం 14 గంటల పాటు చదివిన కష్టానికి మంచి ఫలితం దక్కిందని ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కుమార్తెకు స్వీట్స్ తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. -
బంగారు ఆభరణాల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
సూర్యాపేటటౌన్: బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ తెలిపారు. నిందితుల నుంచి 18 తులాల బంగారం ఆభరణాలు, ఒక కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు వివరాలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన పులిచింతల అరుంధతి 2024 ఆగస్టు 18న సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం గ్రామంలో తన బంధువుల పెళ్లికి బయల్దేరింది. తన బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌తో సూర్యాపేట బస్టాండ్‌లో ఖమ్మం డిపోకు చెందిన బస్సు ఎక్కి మోతెకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మోతె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా బుధవారం సాయంత్రం మోతె మండలం మామిళ్లగూడెం టోల్‌ప్లాజా వద్ద మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపారు. వారి వద్ద 18 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన వారు ఏపీలోని కర్నూలు జిల్లా బుద్రాపేట్ గ్రామానికి చెందిన గారడి జ్యోతి(ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం), హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన మహమ్మద్ షేక్ సమీర్‌గా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పులిచింతల అరుంధతి హ్యాండ్‌బ్యాగ్‌లోని బంగారు ఆభరణాలను బస్సులో దొంగలించినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితురాలు గారడి జ్యోతిపై హైదరాబాద్ పరిసర ప్రాంతాల పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనం కేసులు ఉన్నందున.. బంగారు ఆభరణాలు అక్కడ అమ్మితే అనుమానం వచ్చి అరెస్ట్ చేస్తారని.. వాటిని దాచి బుధవారం ఆంధ్రా ప్రాంతంలో అమ్మేందుకు కారులో వెళ్తుండగా పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. వీరిద్దరికి సహకరించిన దుర్గ అనే మహిళ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఫ 18 తులాల బంగారు ఆభరణాలు, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం -
సివిల్స్‌కు సన్నద్ధమవుతూ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక
నల్లగొండ: నల్లగొండకు చెందిన దాడి వెంకటరమణ గ్రూప్–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. వెంకటరమణ తండ్రి దాడి శ్రీనివాసరావు ఈడబ్ల్యూఐడీసీలో ఏఈగా పనిచేస్తుండగా.. తల్లి రమాదేవి ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వెంకటరమణ వరంగల్‌లో ఎన్ఐటీలో ఇంజనీరింగ్, ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆరేళ్లుగా సివిల్స్‌కి ప్రిపేరవుతూ గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అంతకుముందు ఆయన సివిక్స్ జూనియర్ లెక్చరర్‌గా, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారు. గ్రూప్–2లో 378 ర్యాంకు సాధించారు. ఐఏఎస్ కోసం సన్నద్ధమయ్యా.. నేను యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్‌కు ఎంపిక కావాలని ప్రిపేర్ అయ్యా. 6 సంవత్సరాలుగా 4 సార్లు పరీక్ష రాసినా ఎంపిక కాలేదు. గ్రూప్–1 పరీక్ష రాసి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై ఆ కోరికను తీర్చుకున్నా. చాలా సంతోషంగా ఉంది. మా అమ్మానాన్నలు ఎంతో ఆనందపడుతున్నారు. – దాడి వెంకటరమణ -
కొలువుల ఆనందం
నల్లగొండ: గ్రూప్–1 తుది ఫలితాల్లో నల్లగొండ పట్టణానికి చెందిన నర్రా శేఖర్‌రెడ్డి, కరుణ దంపతుల కుమార్తె నర్రా శ్రీజారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా ఉద్యోగం సాధించింది. ఇప్పటికే ఆమె గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికై సంగారెడ్డి మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. అంతేకాకుండా గ్రూప్–3 ఫలితాల్లో కూడా 111వ ర్యాంకు సాధించింది. గ్రూప్–2 ఫలితాలు వెలువడాల్సి ఉంది. శ్రీజారెడ్డి తండ్రి శేఖర్‌రెడ్డి ఎస్జీటీ టీచర్‌గా నార్కట్‌పల్లి మండలం ఏనుగులదొరి గ్రామంలో పనిచేస్తున్నారు. వారి స్వస్థలం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం. శ్రీజారెడ్డి డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే ఉండి సొంతంగా పోటీ పరీక్షలకు సిద్ధమైంది. శ్రీజారెడ్డి గ్రూప్–1 ఉద్యోగం సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు శేఖర్‌రెడ్డి, కరుణ ఆనందం వ్యక్తం చేశారు. మొదట నుంచి శ్రీజారెడ్డి చదువులో చురుకుగా ఉండేదని, ఆమె ఇష్టం ప్రకారమే డిగ్రీ చదివించామని వారు పేర్కొన్నారు. చదువు విషయంలో మా అమ్మానాన్న ఎప్పుడు నాపై ఒత్తిడి చేయలేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా.. చదివిస్తామని చెప్పి నన్ను ప్రోత్సహించారు. 2020లో డిగ్రీ పూర్తయినప్పటి నుంచి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. సివిల్స్‌కు కూడా రాశాను. ఆ అనుభవమే గ్రూప్–1 మెయిన్స్‌కు ఉపయోగపడింది. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించాను. – శ్రీజారెడ్డివారందరూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పట్టుదలతో అహర్నిషలు కష్టపడి చదివారు. క్రమశిక్షణతో చదువుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ టీజీపీఎస్పీ ప్రకటించిన గ్రూప్–1 తుది ఫలితాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లాలో గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులపై ప్రత్యేక కథనాలు.. -
తండా నుంచి ఆర్డీఓగా..
మిర్యాలగూడ: దామరచర్ల మండలం పార్థునాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బతండాకు చెందిన తెజావత్ అశోక్‌నాయక్ గ్రూప్–1 ఫలితాల్లో ఆర్డీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అశోక్‌నాయక్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేసి.. సివిల్స్ లక్ష్యంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. గ్రూప్–1 రాసి ఆర్డీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు అన్నివర్గాల ప్రజలకు అందేలా చూస్తానని అశోక్‌నాయక్ తెలిపారు. -
తల్లిదండ్రుల బాటలో..
తిరుమలగిరి(తుంగతుర్తి): గ్రూప్–1 ఫలితాల్లో తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పత్తి వెంకటాద్రి కుమారుడు పత్తి సందీప్‌కుమార్ డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సందీప్‌కుమార్ 2020లో ఇంజనీరింగ్ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే గ్రూప్–1 రాసి మొదటి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికయ్యారు. సందీప్ తండ్రి వెంకటాద్రి అడ్డగూడూరులో గెజిటెడ్ హెడ్మాస్టర్గా.. తల్లి లలిత వైద్యారోగ్య శాఖలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. -
సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద
నాగార్జునసాగర్: సాగర్‌కు ఎగువ నుంచి వస్తున్న వరద కొంత మేర తగ్గింది. గత రెండు రోజులు 3లక్షల క్యూసెక్కులకు పైగా వరద రాగా.. గురువారం 2,93,744 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,28,330 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,130, కుడి కాల్వ, ఏఎమ్మార్పీ వరద కాల్వల ద్వారా 11,719 క్యూసెక్కులు కలిపి 2,73,169 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 590(312 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 586.70(303 టీఎంసీలు) అడుగుల మేర నీటి మట్టం ఉంది. ఎడమ కాల్వకు నీటి నిలిపివేత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాగర్ ఎడమ కాల్వ కు అధికారులు గురువారం నీటి విడుదలను నిలిపివేశారు. ఉదయం నుంచే నీటిని తగ్గిస్తూ.. మధ్యాహ్నం 2గంటలకు పూర్తిగా నీటిని నిలిపివేశారు.ఫ ఎగువ నుంచి 2,93,744 క్యూసెక్కుల వరద ఫ 26 గేట్ల ద్వారా నీటి విడుదల -
దొంగ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
సూర్యాపేట: ఒకే రోజు పలు ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగపై కేసు నమోదు చేసి గురువారం రిమా ండ్‌కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. డీఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన గంపల శ్యామ్ ఈ నెల 22న చివ్వెంల మండలంలోని కొండలరాయినిగూడెం గ్రామానికి చెందిన వల్లపురాణి, కొంపల్లి జయమ్మ, అల్లి మల్లిక ఇళ్లలో చోరీకి పాల్పడి, బంగారం, వెండి వస్తువులు అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం బీబీగూడెం గ్రామ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన గంపల శ్యామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి బైక్, నల్లపూసల గొలుసు 14.5 గ్రాములు, జుంకాలు 1.23 గ్రాములు, మూడు జతల పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు మహేశ్వర్, కనకరత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో మెకానిక్ మృతిసూర్యాపేట: వ్యవసాయ బావి వద్ద విద్యుత్ వైర్లను చెక్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మెకానిక్ మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని దాచారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాచారం గ్రామానికి చెందిన విద్యుత్ మెకానిక్ బుడిగబోయిన హనుమయ్య(58) గురువారం అదే గ్రామానికి చెందిన పులుగుజ్జు మల్లయ్య అనే రైతు వ్యవసాయ బోరు వద్ద ఉన్న విద్యుత్ వైరుకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో సరిచేసేందుకు వెళ్లాడు. విద్యుత్ వైర్లు పరిశీలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై హనుమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. హనుమయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని అతడి బంధువులు మృతదేహాన్ని రైతు పులుగుజ్జు మల్లయ్య ఇంటి ముందు ఉంచి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా రైతు మల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు హనుమయ్య కుమారుడు శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
జూనియర్ అసిస్టెంట్ నుంచి ఎంపీడీఓగా..
పెద్దవూర: : గ్రూప్–1 ఫలితాల్లో మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కత్తి శివశంకర్‌రెడ్డి ఎంపీడీఓగా ఎంపికయ్యారు. శివశంకర్‌రెడ్డి స్వస్థలం పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామం. శివశంకర్‌రెడ్డి చిన్నతనంలోనే అతడి తండ్రి రాంచంద్రారెడ్డి మృతిచెందారు. దీంతో తల్లి పద్మ వ్యవసాయం చేస్తూ శివశంకర్‌రెడ్డితో పాటు అతడి చెల్లిని చదివించింది. బీటెక్ పూర్తిచేసిన శివశంకర్‌రెడ్డి ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గ్రూప్–4లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. జూనియర్ అసిస్టెంట్‌గా తన బాధ్యతలను నిర్వహిస్తూనే గ్రూప్–1 పరీక్షలకు పట్టుదలతో సన్నద్ధమై అనుకున్న ఎంపీడీఓ ఉద్యోగాన్ని సాధించారు. అతడు రెండు పర్యాయాలు సివిల్స్ మెయిన్స్‌కు కూడా అర్హత సాధించారు. తన కుమారుడికి గ్రూప్–1 ఉద్యోగం రావడంతో అతడి తల్లి సంతోషం వ్యక్తం చేస్తోంది. -
డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 ఉద్యోగం
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా గ్రూప్–1 తుది ఫలితాల్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికై ంది. చిన్నప్పటి చదువులో ముందుండే జువేరియా కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో 2023లో డిగ్రీ(బీఎస్సీ మ్యాథ్స్) పూర్తిచేసి గోల్డ్‌మెడల్ అందుకుంది. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగానే దరఖాస్తు చేసుకొని సొంతంగా ప్రిపేర్ అయ్యి మొదటి ప్రయత్నంలోనే అసిస్టెంట్ టెజ్రరీ ఆఫీసర్ ఉద్యోగం సాధించింది. జువేరియా అక్క సుమయ్య పర్వీన్ కూడా డీఎస్సీ సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్జీటీగా పనిచేస్తోంది. కలెక్టర్ కావడమే లక్ష్యం గ్రూప్–1లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించడం ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. ఆ వెంటనే దానికి అవసరమైన మెటీరియల్‌ను యూట్యూబ్, నెట్ ద్వారా సేకరించుకున్నాను. ఆయా మెటీరియల్స్‌ను హైదరాబాద్ నుంచి తెప్పించుకుని రోజుకు 12 నుంచి 14 గంటలు చదివాను. భవిష్యత్తులో సివిల్స్ రాసి కలెక్టర్ కావడమే నా లక్ష్యం. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. – జువేరియా -
సిమెంట్ లారీ ఢీకొని బాలిక మృతి
కట్టంగూర్, నకిరేకల్ : ఆగి ఉన్న కారును సిమెంట్ లారీ ఢీకొనడంతో బాలిక మృతిచెందింది. ఈ ఘటన కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని చీమలగడ్డకు చెందిన కందుల రుతు ఝాన్సీ తన కుమార్తె లవీణతో పాటు ఇద్దరు మనుమరాళ్లు రెముడాల అద్వితీరియా(14), ఎండీ అలీనతో కలిసి స్వగ్రామం నుంచి కారులో హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి వద్దకు గురువారం ఉదయం బయల్దేరారు. మార్గమధ్యలో కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని గచ్చుగురు చెరువు వద్దకు రాగానే కారు వెనుక టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ విజయవాడ–హైదరాబాద్ హైవే పక్కన ఆపాడు. కారులో ఉన్న వారందరూ కిందికి దిగి హైవే పక్కకు నిలబడగా.. అద్వితీరియా కారు ముందు భాగంలో నిలబడింది. డ్రైవర్ ఏర్పుల సామేల్ టైరు మార్చుతున్న క్రమంలో కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ అతివేగంగా వచ్చి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ముందుకు దూసుకపోవటంతో క్యాబిన్ ముందు ఉన్న అద్వితీరియాను తలకు తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా అలీనకు స్వల్ప గాయాలయ్యాయి. వారిద్దరిని 108 వాహనంలో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అద్వితీరియా మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాపత్రికి తరలించారు. మృతురాలి తాత కందుల లాజరస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని అక్కడే నిలిపి పారిపోయాడు. -
నా ఆరేళ్ల కష్టం..
చిలుకూరు: చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి రోహిళారెడ్డి గ్రూప్–1 తుది ఫలితాల్లో డీఎస్పీ పోస్టుకు ఎంపికై ంది. ఆమె తండ్రి దొంతిరెడ్డి శ్యామ్‌సుందర్‌రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా పనిచేస్తున్నారు. రోహిళారెడ్డి వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో బీటెక్ పూర్తిచేసింది. బీటెక్ ఫైనలియర్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చినప్పటికీ.. 2019 నుంచి గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతూ గ్రూప్–1 రాసి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికై నట్లు ఆమె పేర్కొన్నారు. -
అనాథ నుంచి డీఎస్పీ స్థాయికి..
గుర్రంపోడు: చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయినా కష్టపడి గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించారు గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన ముడుసు శ్రీకాంత్. అతడి తల్లిదండ్రులు భిక్షమయ్య, చెన్నమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో శ్రీకాంత్‌ను, అతడి తమ్ముడు కృష్ణకాంత్‌కు కొండమల్లేపల్లిలోని సోలిడార్ తెలంగాణ అనే స్వచ్ఛంద సంస్ధ అండగా నిలిచి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదివించడమేగాక గ్రూప్స్ కోసం శిక్షణ ఇప్పించింది. శ్రీకాంత్ ట్యూషన్లు చెప్పుకుంటూ నిజాం కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2014లో రైల్వేలో టెక్నికల్ ఆఫీసర్‌గా, 2018లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ కలెక్టర్ కావాలని ఆ ఉద్యోగాల్లో చేరకుండా గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో చేరి పట్టుదలతో చదివి గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో ఎస్సీ కేటగిరిలో ఆరో సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. -
సొంత ప్రిపరేషన్‌తో..
కోదాడ: గ్రూప్–1 తుది ఫలితాల్లో మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన పోటు ఉపేందర్‌రావు, సత్యావతి దంపతుల కుమారుడు సంకీర్త్ ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అంతేకాకుండా గ్రూప్–2లో 642వ ర్యాంకు సాధించగా.. గ్రూప్–4 రాసి రెవెన్యూ విభాగంలో ఉద్యోగం సాధించారు. సివిల్స్ 2025 మెయిన్స్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎంపీడీఓ ఉద్యోగం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని సంకీర్త్ పేర్కొన్నారు. సొంతంగా నోట్స్ తయారు చేసుకుని, స్టాండర్డ్ బుక్స్ చదివి తాను ఉద్యోగం పొందినట్లు తెలిపారు. ఉద్యోగ సాధనలో తన తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేదనిదన్నారు. -
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ–కొండ్రపోల్ మధ్య రైలు పట్టాలపై బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి చైన్నె ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లడంతో రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు కోలముఖంతో 6.5 అడుగుల ఎత్తు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. తెలుపు రంగు షర్టు, జీన్స్ ప్యాంట్ ధరించినట్లు పేర్కొన్నారు. నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ రైల్వే ఎస్ఐ బొడిగె రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్పత్తి ధరలకే చేనేత వస్త్రాల విక్రయం
చౌటుప్పల్ రూరల్: చేనేత వస్త్రాలను ఉత్పత్తి ధరకు విక్రయించడం అభినందనీయమని చేనేత జౌళి శాఖ ఏడీ అన్నదేవర శ్రీనివాసరావు అన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం పరిధిలోని టెక్స్టైల్ పార్క్‌లో సాధారణ వస్త్రాల విక్రయ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం 50 ఎకరాల్లో టెక్క్టైల్ పార్కు ఏర్పాటు చేసిందన్నారు. పార్క్‌లో ఇంకా ఉత్పత్తి పెంచేలా యజమానులతో మాట్లాడుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, టీజీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ భవాని, టిప్ ప్రధాన కార్యదర్శి ఎం,గోపాలరావు, టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఐలా సర్వీస్ చైర్మన్ ఎంకేడి ప్రసాద్,నిర్వహకులు కే.కృష్ణమూర్తి,వేణు,రీజీమా,చిట్టిబాబు,శ్రవణ్‌కుమార్,శ్రీనివాస్ పాల్గోన్నారు. పర్సన్ ఇంచార్జి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ చౌటుప్పల్ : చౌటుప్పల్ పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి చైర్మన్‌గా చింతల దామోదర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్‌గా ఉన్న దామోదర్‌రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో రామన్నపేట అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.సురేష్‌ను పర్సన్ ఇంచార్జిగా ఈనెల 10వ తేదీన నియమించారు. తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ దామోదర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. 28413/ 2025 ప్రకారం ఆయనను మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్యను మినహాయించి మిగతావారిని పర్సన్ ఇంచార్జి డైరెక్టర్లుగా అనుమతిస్తూ ఆదేశించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఈఓ రమేష్, సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. వచ్చే నెల 7న సర్వసభ్య సమావేశం నిర్వహించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. చైర్మన్‌ను సభ్యులు సత్కరించారు. రోగనిరోధక టీకాలపై అవగాహన బీబీనగర్: స్వస్థ్‌నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ భాగంగా గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రోగనిరోధ టీకాలపై రోగులకు అవగాహన కల్పించారు. టీకాలు ప్రాణాలు ఎలా కాపాడుతాయో నాటక ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ ఆరోరా, వైద్యులు నీరజ్ అగర్వాల్, సయ్యద్ అహ్మద్ జాకి, జ్యోతి, రుచిశుక్లా తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వ్ మద్యం షాపులకు డ్రా
సాక్షి,యాదాద్రి: మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని 30 మద్యం దుకాణాలను రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. నాలుగు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 82 మద్యం షాపులు ఉన్నాయి. ఇందులో 30 దుకాణాలను ప్రభుత్వం రిజర్వ్ చేసింది. గౌడ సామాజిక వర్గానికి 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 కేటాయించగా, 52 జనరల్ కేటగిరీలో ఉన్నాయి. గురువారం తన చాంబర్లో కలెక్టర్ హనుమంతరావు లక్కీడ్రా తీశారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి, బీసీ సంక్షేమ అధికారి సాహితీ, ఎస్సీ సంక్షేమ అధికారి జింకల శ్యాంసుందర్, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ నూతన మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు నాన్ రిఫండబుల్ ఫీజు గతంలో రూ.2లక్షలు ఉండగా ఈసారిరూ.3 లక్షలు నిర్ణయించారు. అక్టోబర్ 23న డ్రా తీయనున్నారు. షాపులు దక్కించుకున్నవారు అక్టోబర్ 24వ తేదీ సాయంత్రలోపు రెంటల్ మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. డిసెంబర్ 1న షాపులను ప్రారంభించాలి. ఆరోజు నుంచి రెండేళ్ల కాలానికి పరిమితి ఉంటుంది. ఫ ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్‌కు 30 షాపులు ఫ జనరల్ కేటగిరీలో 52 కేటాయింపు -
‘స్పర్శ్’లో సమస్యలు.. ఉద్యోగుల వెతలు
చౌటుప్పల్ రూరల్: ఉపాధిహామీ ఉద్యోగులు రెండు నెలలుగా వేతనాలు అందక విలవిలలాడుతున్నారు. నిధులు అందుబాటులో ఉన్నా నూతన డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్యల వల్ల వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కుటుంబ పోషణ, పిల్లల ఫీజు, ఇంటి అద్దె తదితర అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. కారణాలు ఇవీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే పథకాల కింద విడుదలయ్యే నిధులను పర్యవేక్షించేందుకు కేంద్రం నూతనంగా స్పర్శ అనే డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను అందుబాలోకి తీసుకువచ్చింది. అయితే యాప్‌లో సాఫ్ట్వేర్లు అనుసంధానం కాకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో సిబ్బంది వివరాల నమోదులో జా ప్యం చోటు చేసుకొని వేతనాల చెల్లింపుపై ప్రభావం చూపుతోంది. సమస్యను అధికారులు పరిష్కరించకపోవడంతో సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. గతంలో పే అండ్ అకౌంట్స్ నుంచి వేతనాలు ఉపాధిహామీ కాంట్రాక్ట్ సిబ్బందికి గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని పే అండ్ అకౌంట్స్ నుంచి నిధులు ట్రాన్సఫర్ జనరేట్ చేయగానే వెంటనే సిబ్బంది ఖాతాలో జమ అయ్యేవి. స్పర్శ యాప్ ద్వారా ప్రతి నెలా రాష్ట్ర ఖజానా నుంచి మాన్యువల్‌గా అప్రూవ్ చేస్తేనే సిబ్బంది వేతనాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ యాప్‌లో సిబ్బంది వివరాలను ప్రతి నెలా అప్లోడ్ చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని అధికారులు అంటున్నారు.ఉపాధిహామీ సిబ్బందికివేతనాల చెల్లింపులో జాప్యం ఫ రెండు నెలలుగా పెండింగ్ ఫ ఆర్థిక ఇబ్బందులతో సతమతం ఫ రాష్ట్రస్థాయి సమస్య అని తేలికగా తీసుకుంటున్న అధికారులు ఉపాధిహామీ పథకంలోని వివిధ విభాగాల్లో 400 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఇందులో ఏపీఓలు 14మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు 13, టెక్నికల్ అసిస్టెంట్లు 66, కంప్యూటర్ ఆపరేటర్లు 39, ఫీల్డ్ అసిస్టెంట్లు 266 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.75 లక్షల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. రెండు నెలలుగా సుమారుగా రూ.కోటి 50 లక్షలు బకాయిలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు తమ గోడు చెప్పుకుంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఇది రాష్ట్ర స్థాయి సమస్య అని తేలికగా తీసుకుంటు న్నారని సిబ్బంది వాపోతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చొరవ తీసుకుని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సిబ్బందికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాం. మాకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికారులను సంప్రదిస్తే స్పర్శ యాప్‌లో సాంకేతిక సమస్యలున్నాయని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు చూపి వేతనాలు ఆపడం సమంజసం కాదు. దసరా పండుగ ఎలా జరుపుకోవాలి. పండుగ లోపు వేతనాలు చెల్లించాలి. –తాటిపాముల శ్రీశైలం, టెక్నికల్ అసిస్టెంట్, చౌటుప్పల్ కేంద్ర ప్రభుత్వం స్పర్శ అనే నూతన డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను తీసుకురావడంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉద్యోగులకు నెలనెలా వేతనాలు రావడం లేదు.గతంలో మాదిరి రాష్ట్ర ఖజానా నుంచి ఫండ్ జనరేట్ సిస్టం ద్వారా జీతాలు ఇస్తే ఎవరికి ఇబ్బంది రాదు. ఉన్నతాధికారులు ఆలోచించి సమస్య పరిష్కరించాలి. –కొండమడుగు రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
అపురూపం.. అమ్మదర్శనం
యాదగిరిగుట్ట: ఆలయాలు శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభాయమానంగా అలరారుతున్నాయి. నాలుగో రోజు బుధవారం అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి అనుబంధంగా ఉన్న శివాలయంలో అమ్మవారు శ్రీపర్వతవర్థిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజ, అర్చనలు, పారాయణాలు, శ్రీదేవి జపాలు, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం నవావరణ పూజ, కుంకుమార్చన, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థప్రసాద వినియోగం చేపట్టారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ రవినాయక్, అధికారులు పాల్గొన్నారు. శ్రీపర్వతవర్థిని దేవి అలంకరణలోదర్శనమిస్తున దుర్గామాత -
సోమవారం ప్రజావాణి.. గురువారం ప్రజాదర్బార్
సాక్షి,యాదాద్రి: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో వస్తున్న వినతుల్లో కొన్ని నెలల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో బాధితులు పదేపదే కలెక్టరేట్ గడప తొక్కుతున్నారు. సమయం, డబ్బు వృథా అవుతోంది. సుదూర ప్రాంతాల నుంచి తరచూ రావాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధికారులను నిలదీస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమస్యను గర్తించిన పాలనాధికారి తన వినూత్న ఆలోచనతో శ్రీప్రజాదర్బార్శ్రీకు శ్రీకారం చుట్టారు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.బాధితులకు భరోసా కల్పిస్తూ..ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2నుంచి రాత్రి 8గంటల వరకు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ పూర్తి సమయం అందుబాటులో ఉంటూ బాధితులతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రతి దరఖాస్తుదారుకు సమయం ఇచ్చి సమస్య తెలుసుకుంటున్నారు. దరఖాస్తు ఫారాన్ని స్కాన్ చేసి సంబంధిత శాఖకు పంపిస్తున్నారు. అధికారికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఫిర్యాదును తనవద్ద ఫైల్ చేసుకొని , పరిష్కారానికి తేదీ ఇచ్చి అర్జీదారులకు భరోసా కల్పిస్తున్నారు. అర్జీలను స్వీకరించిన కలెక్టర్.. సమస్యను నేరుగా అధికారులకు వివరించి పరిష్కా రానికి చొరవచూపుతుండటంతో అర్జీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో జాప్యం, ఆసరా పింఛన్లు, భూ వివాదాలు, ఆక్రమణలు తదితర సమస్యలపై ఎక్కువగా వినతులు వస్తున్నాయి.సమస్య తెలుసుకొని,అధికారులను ఆదేశించి..● ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలని ఆలేరు మండలం రాజానగర్ ప్రజలు గురువారం కలెక్టర్‌ను కలిశారు. గ్రామం గతంలో కొలనుపాక పంచాయతీలో ఉన్నదని, బైరాంనగర్లో కలుపడంవల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ వెంటనే డీపీఓ విష్ణువర్థన్‌రెడ్డికి ఫోన్ చేసి గ్రామస్తుల సమస్యను వివరించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.● నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన అనసూర్య భూసమస్య పరిష్కరించాలని కలెక్టర్‌కు విన్నవించారు. వెంటనే తహసీల్దార్‌కు ఫోన్ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో చర్చించి సమస్య పరిష్కరించాలని సూచించారు.● ఇందిరమ్మ ఇళ్ల బిల్లు రాలేదని యాదగిరిగుట్టకు చెందిన లబ్ధిదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అక్కడి నుంచే హౌసింగ్ ఉద్యోగితో మాట్లాడి డేటా చెక్ చేయించారు. బిల్లు వచ్చిందని, ఆధార్ సీడింగ్ లేకపోవడంతో లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదని చెప్పారు. వెంటనే ఆధార్ సీడింగ్ చేయాలని కలెక్టర్ అదేశించారు.● ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మోత్కూరు మండలం ఆనాజిపురానికి చెందిన పర్వతం సరస్వతి కలెక్టర్‌ను వేడుకున్నారు. ఎంపీడీఓతో మాట్లాడి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇళ్లు మంజూరై నిర్మించుకోలేని వారు ఉంటే రద్దు చేసి ఇవ్వాలన్నారు.● సైదాపురం చెరువు మత్తడిని తొలగించడంతో తమ పొలాలు మునిగిపోతున్నాయని మాసాయిపేట రైతులు విన్నవించారు. వెంటనే ఇరిగేషన్ ఎస్ఈతో కలెక్టర్ మాట్లాడారు. పర్సనల్ సమస్యగా భావించి పరిష్కరించాలని ఆదేశించారు.గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు వివిధ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రజావాణికి తరచూ వచ్చిపోతున్నారు. ఇలాంటి వారికోసం గురువారం సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా. ప్రజాదర్బార్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయి. పరిష్కారం కాని సమస్యలను బాధితులకు వివరిస్తున్నా. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత పాటుపడుతా. –కలెక్టర్ హనుమంతరావు -
తూకం తప్పుతున్న ధర్మకాంటా!
మోత్కూరు: ఆరుగాలం కష్టపడి సేద్యం చేసిన రైతులు అన్ని విధాలా మోసపోతున్నారు. పండించిన పంట చేతికొచ్చాక దారుణంగా నష్టపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారుల దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ కాంటాల దగ్గరనుంచి మిల్లుల వద్ద వే బ్రిడ్జిల వరకు తూకాల్లో తేడా ఉంటుంది. వ్యాపారులు వినియోగించే కాంటాలపై తూనికల, కొలతల వ్యాపారుల దృష్టి సారిస్తే గుట్ట బయటపడుతుంది. త్వరలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహించకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఏం జరిగిందంటే.. మోత్కూరు మండలంలో ముందస్తు వరికోతలు మొదలయ్యాయి. రైతు మలిరెడ్డి సంతోష్‌రెడ్డి 10 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో కొంత భాగంగా కోత కోయించాడు. 98 క్వింటాళ్ల దిగుబడి రాగా రెండు ట్రాక్టర్లలో పాలడుగు గ్రామానికి చెందిన అంతటి నర్సయ్యకు విక్రయించాడు. ధాన్యాన్ని అనాజిపురంలో నర్సయ్యకు చెందిన వేబ్రిడ్జిపై తూకం వేయించాడు. తూకంలో తేడా వచ్చిందని సంతోష్‌రెడ్డికి అనుమానం రావడంతో మరో వేబ్రిడ్జి వద్ద ఖాళీ ట్రాక్టర్‌ను తూకం వేయించగా క్వింటా 40 కిలోలు వ్యత్యాసం వచ్చింది. రెండు ట్రాక్టర్ల ధాన్యం లోడ్‌లో 2 క్వింటాల 80 కిలోలు తేడా వచ్చిందని రైతుల తెలిపాడు. ఆందోళనకు దిగిన రైతులు వేబ్రిడ్జి తూకంలో మోసం బయటపడటంతో అదే సమయంలో ధాన్యం విక్రయించడానికి అక్కడికి వచ్చిన రైతులతో పాటు స్థానిక రైతులు కాంటా వద్ద ఆందోళకు దిగారు. మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులను నిలదీశారు. తూకంలో మోసాలే కాకుండా వేవింగ్ మిషన్ కోసం ఒక బిల్లు రూ.100, గుమస్తా ఖర్చుల పేరుతో మరో రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. క్వింటా ధాన్యానికి 2 కిలోల చొప్పున తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విక్రయించిన ధాన్యానికి క్వింటాకు రెండు రూపాయలు కట్ చేసుకుని, నెలలు గడిచినా ఇవ్వడం లేదన్నారు. వేబ్రిడ్జి కాంటాను సీజ్ చేసి, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. వ్యాపారి ఏమన్నాడంటే.. వేబ్రిడ్జి కాంటాలో సాంకేతిక లోపం వల్ల తూకంలో తేడా వచ్చిందని, తాము మోసాలకు పాల్పడలేదని వ్యాపారి, ధర్మకాంటా నిర్వాహకుడు అంతటి నర్సయ్య తన వివరణలో తెలిపారు.గోనె సంచుల గురించి తనకు తెలియదన్నారు. ధర్నాలో రైతులు చిన్న వెంకటయ్య, మలిపెద్ది సంతోష్, చుక్క వెంకటయ్య, దేవర శ్రీశైలం, కరుణాకర్‌రెడ్డి, కొల్లు శంకరయ్య, పద్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, ఉప్పల లక్ష్మయ్య, కొల్లు వెంకన్న, సలిగంజి వెంకన్న, కొల్లు మచ్చగిరి, బీరయ్య, చేవూరి వెంకట్‌రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వేబ్రిడ్జిల్లో భారీ వ్యత్యాసాలు ఫ అనాజిపురం వద్ద వెలుగులోకి ఫ రెండు ట్రాక్టర్ల ధాన్యం లోడ్లలో సుమారు మూడు క్వింటాళ్లు తేడా ఫ ఆందోళనకు దిగిన రైతులు, కాంటాకు తాళం -
బతుకమ్మకు గుర్తింపు తెచ్చింది కేసీఆరే
యాదగిరిగుట్ట: ఉమ్మడి రాష్ట్రంలో మరుగునపడిన బతుకమ్మకు కేసీఆర్ గుర్తింపు తీసుకువచ్చారని, అధికారిక పండుగా ప్రకటించారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన మహిళలు యూరియా కోసం పీఏసీఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని మాజీ మంత్రి హరీష్‌రావు వేడుకున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ యూరియా కొరత రాలేదన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ యాదగిరి కొండపైకి వెళ్లే ఆటో కార్మికులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మోసం చేశారని, కొండపైకి భక్తులను తీసుకెళ్లాలంటే రుసుము చెల్లించాల్సి వస్తుందన్నారు. రూ.32 లక్షలు దేవస్థానానికి చెల్లించాలని ఇటీవల ఆటో కా ర్మికులకు నోటీసులు ఇచ్చారని, ఎందుకు చెల్లించాలో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, నాయకులు బీమగాని నర్సింహగౌడ్, ఎగ్గిడి కృష్ణ, వంటేరు సురేష్‌రెడ్డి, వస్పరి శంకరయ్య, కసావు శ్రీనివాస్‌గౌడ్, బీర్ల మహేష్, వెంకటేష్‌గౌడ్, తోటకూరి బీరయ్య, కాల్నె అయిలయ్య, కొర్రె భిక్షపతి, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.ఫ ప్రభుత్వం వల్లే యూరియా కష్టాలు ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కంచర్ల రామకృష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి -
కలెక్టరేట్లో బతుకమ్మ సంబురం
అర్హులందరికీ ఇళ్లు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. శ్రమదానాలు చేయాలి గ్రామాల్లో ప్రజల సహకారంతో శ్రమదానాలు నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. - 11లోభువనగిరి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణం గురువారం బతుకమ్మ సంబరాలతో సందడిగా మారింది. కలెక్టరేట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్ఓ జయమ్మ తదితర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కతి, సంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని కలెక్టర్ అన్నారు. -
‘రీజినల్’ అలైన్మెంట్ మారుస్తామని మోసం చేశారు
చౌటుప్పల్ రూరల్ : రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా అలైన్మెంట్ ఖరారు చేస్తే.. తాము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ మార్చుతామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం, సింగరాయచెర్వు, తూర్పుగూడెం గ్రామ రైతులతో పాటు సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక, శేరిగూడెం గ్రామాల్లో రైతులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ రింగ్ రోడ్డులో రైతులు కోల్పోతున్న భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కనీసం గ్రామసభలు నిర్వహించకుండా ఏకపక్షంగా భూములు లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం మార్కెట్ ధర కూడా ఇవ్వకుండా రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి చౌటుప్పల్ మార్గంలో కేవలం 28కి.మీ. దూరంలోనే రోడ్డు నిర్మించడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అలైన్మెంట్ మార్చడం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా రైతులను మోసం చేసేలా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 27న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్, బూరుగు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బోరెం నర్సిరెడ్డి, సప్పిడి లక్ష్మారెడ్డి, నాయకులు జీ. శ్రీనివాస్‌చారి, దోడ యాదిరెడ్డి, దొంతగోని పెద్దులు, కొండే శ్రీశైలం, సప్పిడి రాఘవరెడ్డి, బోరెం శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య -
పోలీసులపై దాడి చేసిన వలస కార్మికుల అరెస్ట్
హుజూర్నగర్ : పాలకవీడు మండలం దక్కెన్ సిమెంట్ పరిశ్రమ వద్ద పోలీసులపై దాడికి పాల్పడిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం హుజూర్‌నగర్‌లోని తన కార్యాలయంలో సీఐ చరమందరాజు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం మహంకాళిగూడెం గ్రామ పరిధిలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ నెల 21న ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు వినోద్ గుండెపోటుతో మృతిచెందాడు. అతడి మృతికి రూ.20లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు 22వ తేదీన ఆ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ముందు బైఠాయించారు. వాహనాలను, మనుషులను లోపలకు, బయటకు వెళ్లకుండా ధర్నాను దిగారు. యాజమాన్యం సమాచారం మేరకు పాలకీడు ఎస్ఐ కోటేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఏదైనా సమస్య ఉంటే యాజమాన్యంతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ధర్నా చేస్తున్న వారిని సముదాయించారు. ఇంతలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఖేష్ ప్రసాద్, మంజీత్ కుమార్, మన్సూర్ అలం, శక్తి చౌహన్, రవిశంకర్ సహాని, కిసాన్ సహాని, ధనంజయ్, కమలేష్ యాదవ్, ఉమేష్కుమార్యాదవ్తో పాటు బిహార్‌కు చెందిన పౌల్దార్, విక్రమ్ కుమార్, అభిషేక్ కుమార్, రాహుల్ కుమార్, మన్సూర్ అన్సారీ, సచిన్ విశ్వకర్మతో పాటు మరికొంత మంది వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి కర్రలు, రాళ్లతో ఎస్ఐ, పోలీస్ సిబ్బందిపై దాడికి దిగారు. దీంతో ఎస్ఐ కోటేష్, హోంగార్డు గోపికి గాయాలు కాగా పోలీసు వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎస్ఐ ఫిర్యాదు మేరకు మేరకు సీఐ చమందరాజు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన వ్యక్తులను గుర్తించి మంగళవారం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించి మిగతా వారిని పరిశ్రమలోని లేబర్ కాలనీలో పట్టుకోగా.. ఒకరు పరారయ్యారు. వారి వద్ద నుంచి కరల్రను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. పారిపోయిన వ్యక్తిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు. శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ 15 మంది రిమాండ్‌కు తరలింపు ఫ ఒకరు పరార్ -
వీధి వ్యాపారులకు చేయూత
మిర్యాలగూడ టౌన్ : మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. కరోనా సమయంలో పీఎం స్వానిధి పథకం కింద చిరు వ్యాపారులకు రుణాలు అందించగా ప్రస్తుతం ఆ పథకాన్ని నిలిపివేసి చేసి దాని స్థానంలో లోక్ కల్యాణ్ పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో రుణాలు పొందని చిరు వ్యాపారులకు ఈ పథకం కింద రుణాలు మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు మున్సిపాలిటీల్లో లోక్ కల్యాణ్ మేళాలు ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ లోగా ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి రుణ మంజూరు కోసం బ్యాంకర్లకు అందజేయనున్నారు. నిలిచిపోయిన పీఎం స్వనిధి పథకం.. ఐదేళ్ల క్రితం కరోనా కారణంగా వీధి వ్యాపారుల ఇబ్బందుల్లో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు పీఎం స్వానిధి పథకాన్ని ప్రారంభించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తింపు కార్డులు అందించింది. మొదటి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20వేల వరకు రుణాలు అందించారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించిన వారికి రూ.50 వేల వరకు రుణాలు ఇచ్చారు. అయితే ఈ పథకం నిలిచిపోవడంతో గతంలో దరఖాస్తులు చేసుకున్న కొందరికి రుణాలు అందించలేదు. వారి కోసం లోక్ కల్యాణ్ పథకాన్ని తీసుకొచ్చింది. రుణ సదుపాయం పెంపు మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 10వేల మందికి పైగా వీధి వ్యాపారులు ఉన్నట్లు మెప్మా అధికారులు గుర్తించారు. వీరిలో 8893 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. పీఎం స్వానిధి పథకం కింద 5380 మంది గతంలో రుణాలు పొందారు. మిగిలిన వారికి రుణాలు మంజూరు కాలేదు. మరికొందరు రెండోసారి దరఖాస్తు చేసుకున్నప్పటికీ రుణం మంజూరు కాలేదు. బ్యాంకర్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వం లోక్ కళ్యాణ్ పథకం తీసుకొచ్చి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మెప్మా అధికారులు మున్సిపాలిటీల్లో లోక్ కల్యాణ్ మేళాలు ఏర్పాటు చేసి కొత్తవారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. గతంలో రూ.10 వేలకు దరఖాస్తు చేసుకున్నవారికి రూ.15వేలు, రూ.15వేలకు దరఖాస్తులు చేసుకున్నవారికి రూ.25వేల వరకు రుణాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా రూ.50వేల వరకు రుణాలు తీసుకునే ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో అక్టోబరు 2వ తేదీ వరకు కొత్తవారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. నూతనంగా దరఖాస్తు చేసుకునే వారు వారి దుకాణానికి సంబంధించిన ఫొటో, ఆధార్ కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్‌లతో దరఖాస్తు చేసుకోవాలి. ఫ ‘పీఎం స్వానిధి’ స్థానంలో లోక్ కల్యాణ్ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం ఫ గతంలో దరఖాస్తు చేసుకుని రుణం పొందని వారికి రుణ సదుపాయం పెంపు ఫ కొత్తవారికీ అవకాశంఫ అక్టోబర్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ ఫ లోక్ కళ్యాణ్ మేళాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్న అధికారులు -
మాలల రణభేరిని విజయవంతం చేయాలి
సూర్యాపేట అర్బన్: ఎస్సీ వర్గీకరణలో తమకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు హైదరాబాద్‌లో నవంబర్ 2న నిర్వహించనున్న మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో సూర్యాపేట జిల్లా మాలమహానాడు అధ్యక్షుడిగా పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లెద్దు వినయ్‌కి నియామకపత్రం అందజేశారు. అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో చేసిన ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా జనగణన చేపట్టకుండానే మాలలకు 5శాతం, మాదిగలకు 9శాతం రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లు పెట్టడంతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రోస్టర్ పాయింట్లను సవరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగాల్లో మాలలకు 28 పోస్టులుంటే మాదిగలకు 100 పోస్టులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపును పునఃసమీక్షించి జీఓ 99ని సవరించి మాలలతో పాటు గ్రూప్–3లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుతం జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్స్ విడుదల చేయాలని, మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించాలని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేసి నిధులు ఖర్చు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాలల రణభేరి మహాసభకు మాల ప్రజాప్రతినిధులంతా హాజరుకావాలని లేని పక్షంలో వారి ఇళ్లు ముట్టడిస్తామన్నారు. మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు తీవ్ర అన్యాయం చేసిందని, మాలలకు అనుకూలంగా లేని ఏ పార్టీకై నా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం మాలల రణభేరి కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పంగరెక్క సంజయ్‌కి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, మాల ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పర్వి కోటేశ్వరరావు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు లక్మాల మధుబాబు, ప్రకాష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, పాలపాటి సుమలత, యాదాద్రి జిల్లా మహిళా అధ్యక్షురాలు కె. లలిత, సమతా సైనిక్‌దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆల్క సైదులు పాల్గొన్నారు. ఫ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య -
రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది
మిర్యాలగూడ: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, పోలీసులను అడ్డం పెట్టుకోని సీఎం రేవంతరెడ్డి పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. యూరియా కోసం ధర్నా చేస్తే తనను నడవలేని స్థితిలో పోలీసులు కొట్టారని ఆరోపించిన దామరచర్ల మండలం కొత్తపేటతండాకు చెందిన ధనావత్ సాయిసిద్ధును బుధవారం జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. యూరియా కోసం ధర్నా చేస్తే దళితుడు అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా కొడతారా అని ప్రశ్నించారు. సాయిసిద్ధును విపరీతంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా ఎస్పీ.. పోలీసులను వెనుకేసుకుని వస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఎస్పీలు కూడా కాంగ్రెస్ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి కొడుతున్నారని అన్నారు. రైతులకు కనీసం యూరియా ఇవ్వలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. అడవిదేవులపల్లిలో యూరియా కోసం లైన్లో నిలబడి గాయపడిన గిరిజన మహిళా రైతు చికిత్స పొందుతూ మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా అందించకుండా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. మిర్యాలగూడలో యూరియా లారీలను పక్కదారి పట్టిస్తున్నారని, ఎమ్మెల్యేలే యూరియా దందా చేస్తున్నారని అన్నారు. బాధితుడు సాయిసిద్ధును, అతడి కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని, బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిద్దార్ధ, దుర్గంపూడి నారాయణరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలాజీనాయక్, ఆంగోతు హాతీరాంనాయక్, కుందూరు వీరకోటిరెడ్డి, బాబయ్య, కుర్ర శ్రీనునాయక్, ధనావత్ ప్రకాశ్‌నాయక్, లింగానాయక్, పీసీకే ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఆరోపణలు అవావస్తం నల్లగొండ: వాడపల్లి పోలీస్ స్టేషన్లో యువకుడిపై ఎస్ఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బుధవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన వార్త అవాస్తవమని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్త రాయొద్దని ఆయన కోరారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
నిజాయితీ చాటుకున్న పెట్రోల్ బంక్ సిబ్బంది
ఫ రూ.2 లక్షలు విలువైన బంగారం, వెండి ఉన్న బ్యాగు బాధితుడికి అప్పగింత హాలియా: పెట్రోల్ బంక్‌లో పోగొట్టుకున్న రూ.2 లక్షల విలువైన బంగారం, వెండిని బాధితులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది. ఈ సంఘటన హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఏఎస్ఐ రామయ్య, బంక్ మేనేజర్ సోమనబోయిన లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కవిటి బ్రహ్మచారి హాలియాలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం అదే బంక్‌లో బైక్ టైర్లలో గాలి చెక్ చేయించుకునే క్రమంలో బంగారం, వెండి ఉన్న బ్యాగ్‌ను బంక్‌లో ఉంచి వెళ్లిపోయారు. బంక్ సిబ్బంది గమనించి బ్యాగ్‌ను బంక్ మేనేజర్ లింగయ్యకు అప్పగించారు. బ్యాగులో దొరికిన వివరాల ఆధారంగా బ్యాగ్ బ్రహ్మచారిదని తెలుసుకొని హాలియా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో బుధవారం బ్రహ్మచారికి బ్యాగ్‌ను తిరిగి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న బంక్ సిబ్బందికి బ్రహ్మచారి కృతజ్ఞతలు తెలుపగా.. పోలీసులు అభినందించారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
భూదాన్‌పోచంపల్లి: ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ ఏసీపీ పి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ర్యాగింగ్ వలన విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడమే కాకుండా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నియంత్రణకు యాజమాన్యాలు యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నూతనంగా చేరిన విద్యార్థుల పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ప్రతిఒక్కరూ ర్యాగింగ్ సంస్కృతిని నిర్మూలించుటకు కృషి చేయాలని కోరారు. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలపై 1930 లేదా 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. అనంతరం ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఫొటో మార్ఫింగ్ వంటి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుబ్బారావు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్‌రెడ్డి, సైబర్ వారియర్ అంకిత, యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ మారగోని వెంకటేశం ఆయా విభాగాల డీన్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఫ చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి -
చికిత్స పొందుతూ మృతి
అర్వపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్ గ్రామానికి చెందిన ఉప్పుల అనిల్‌కుమార్(34) గత నెల 3న బైక్‌పై తన పొలం నుంచి ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఈట సైదులు తెలిపారు. పల్లె ప్రకృతి వనం బోర్డు చోరీమిర్యాలగూడ: దామరచర్ల మండలం రాజగట్టు గ్రామం పల్లె ప్రకృతి వనం మెయిన్ గేట్‌కు ఉన్న బోర్డును గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేసి దొంగిలించారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. గత 20 నెలలుగా గ్రామ కార్యదర్శి, అధికారులు పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి బోర్డు దొంగిలించిన వ్యక్తులను అరెస్ట్ చేసి పల్లె ప్రకృతి వనం అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. ఎంజీయూ వాలీబాల్ పోటీల విజేత ఎంఎంఆర్ కళాశాల నల్లగొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు యూనివర్సిటీలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఎంఎంఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు విజేతగా నిలిచారు. భువనగిరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నరప్‌గా నిలిచారు. గెలుపొందిన క్రీడాకారులకు బుధవారం ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డా. హరీష్‌కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీఓ అక్బల్ అలీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు మురళి, శ్రీనివాసరెడ్డి, పలు కళాశాలల పీడీలు పాల్గొన్నారు. -
నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, ఆరాధన చేపట్టారు. అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
చెరువులు, కుంటలను సర్వే చేయండి
సాక్షి,యాదాద్రి: హెచ్ఎండీ పరిధిలో ఉన్న చెరువులను సర్వే చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను గుర్తించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ మండలాల పరిధిలో ఉన్న చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ తదితర వివరాలపై సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో కొన్ని చెరువులు నిండి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో వివిధ కట్టడాలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసిందన్నారు. అటువంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలి ఆదేశించారు. అంతేకాకుండా కుంటలను సైతం ఆక్రమించి లే అవుట్లు చేస్తున్నారని, వాటిని కూడా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నూతన గోదాముల నిర్మాణం భవిష్యత్ అవసరాల దృష్ట్యా నూతన గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి అధికారుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న గోదాములు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదన్నారు. గ్రీన్ స్టోరేజ్ స్కీం ద్వారా సహకార సంఘాల కోసం 40వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లు నిర్మించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రైలు, రోడ్డు మార్గాలకు దగ్గరగా నాబా ర్డు ఆర్థిక సహాయంతో నిర్మాణం చేస్తామన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
వండి వార్చింది.. ఒక్క రోజే
భువనగిరిటౌన్ : అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత పుష్టికరమైన ఆహారం అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం ఒక్క రోజుతోనే నిలిచిపోయింది. జూన్ 11న పలు కేంద్రాల్లో అట్టహాసంగా ప్రారంభించినా ఆ తరువాత అమలుకు నోచడం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు ఇప్పటికే ఆరోగ్యలక్ష్మి పేరుతో ప్రభుత్వం పౌష్టికాహారం అందజేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి రోజూ అన్నం, గుడ్డు, పాలతో పాటు పప్పు, వివిధ రకాల కూరగాయలు, సాంబారుతో వండి పెడుతున్నారు. అదనంగా మురుకులు, బాలమృతం కూడా అందజేస్తున్నారు. దీంతో పాటు వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ పెట్టాలని ప్రభుత్వం జూన్ మొదటివారంలో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జూన్ 11వ తేదీన పథకాన్ని ప్రారంభించారు. మొదటి రోజు సంక్షేమ శాఖ అధికారులు సైతం పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా ఎగ్ బిర్యానీ వడ్డించారు. కాగా మొదటి రోజు సొంత ఖర్చులతో వండిపెట్టిన అంగన్వాడీ కార్యకర్తలు ఆ తరువాత చేతులెత్తేశారు. దీంతో ఈ పథకం ఒక్క రోజుకే పరిమితమైంది. కారణాలివీ.. ఎగ్ బిర్యానీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం.. కొనసాగించేందుకు సరైన కార్యాచరణ రూపొందించలేదు. దీనికి తోడు నిధులు కేటాయించకపోవడం, చేతినుంచి ఖర్చు చేయాల్సి వస్తుండటంతో అంగన్వాడీ టీచర్లు ఆర్థికభారంగా భావించారు. పైగా మెనూలో ఎగ్ బిర్యానీ చేర్చలేదని, ప్రారంభం రోజు తామే సొంత ఖర్చులతో వంటకాలు వండి పెట్టామని, తదపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. అంగన్వాడీల్లో ఆదిలోనేనిలిచిన ఎగ్ బిర్యానీ స్కీం ఫ ప్రారంభం అదిరినా అమలు శూన్యం ఫ ప్రభుత్వం నిధులు కేటాయించలేదంటున్న టీచర్లు జిల్లాలో భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. బాలింతలు 3,680, గర్భిణులు 4,219, చిన్నపిల్లలు 12,420 మంది ఉన్నారు. వీరందరికీ ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతి రోజూ పోషకాహారం అందిస్తున్నారు. ఎగ్ బిర్యానీ పథకాన్ని ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు జూన్ 11న ప్రారంభించాం. మొదటి రోజూ సొంత ఖర్చులతోనే వంటకాలు చేయడం జరిగింది. ఇంకా మెనూలో చేర్చలేదు. పథకం కొనసాగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టౖమైన ఆదేశాలు రాలేదు. –నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి -
అన్నపూర్ణగా దుర్గాదేవి
యాదగిరిగుట్ట రూరల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం యాదగిరి కొండపై ప్రతిష్ఠించిన దుర్గామాత అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజ, అర్చనలు, పారాయణములు, శ్రీదేవి మూలమంత్రములు, జపములు, సహస్రనామార్చన, మధ్నాహా పూజ నిర్వహించారు. సాయంత్రం నవావరణ పూజ, సహస్రనామార్చనలు, మంత్ర పుష్పం తదితర వేడుకలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు -
యాదగిరిగుట్ట ఆలయ ఈఓగా రవినాయక్?
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇంచార్జి ఈఓగా ఐఏఎస్ అధికారి జి.రవినాయక్ రానున్నట్లు తెలిసింది. ప్రస్తుత ఈఓ వెంకట్రావ్ వ్యక్తిగత సెలవుల్లో వెళ్లనున్నారు. ఆయన స్థానంలో స్థానంలో కాలుష్య నియంత్రణ మండలి బోర్డు కార్యదర్శి రవినాయక్ రానున్నారని, రెండు రో జుల్లో బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. కాగా ఈ విషయంపై ఆలయ అధికార వర్గాలు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. రవినాయక్ గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. నేడు హరీష్‌రావు రాక యాదగిరిగుట్ట రూరల్ : మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు గురువారం యా దగిరిగుట్టకు రానున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం వేకువజామున 5.30కి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. అనంతరం వైకుంఠద్వారం వద్ద పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి యాదగిరి కొండపైకి వెళ్లి శ్రీస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటార పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి తెలిపారు. స్నేహ కమిటీలు ఏర్పాటు చేయాలి భువనగిరిటౌన్ : ప్రతి గ్రామంలో 5 నుంచి 15 మంది సభ్యులతో స్నేహ కమిటీలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న స్నేహ కార్యక్రమంపై బుధవారం కలెక్టరేట్లోని జిల్లాస్థాయి అవగాహన, సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. 15–18 ఏళ్ల వయసు గల యువతీయువకులకు భద్రత, పోషకాహారం, సాధి కారత, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించడమే కాకుండా, వారి చదువు కొనసాగింపు, ఉపాధి నైపుణ్యాలు, ఆర్థిక స్వావలంబన వైపు దారితీసే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాస్థాయి సమన్వయ కమిటీ డీఆర్డీఓ, మహిళాశిశు సంక్షేమం, విద్య, ఆరోగ్యం, పోలీస్, పంచాయతీరాజ్, కార్మిక, నైపుణ్యాభివృద్ధి తదితర విభాగాలు కలసి కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 5 నుంచి 15 మంది సభ్యులతో స్నేహ సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, ఎస్సీ సంక్షేమ జిల్లా అధికారి శ్యాంసుందర్, ఉపాధి కల్పనా అధికారి పరాంకుశం సాహితి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటకు అవార్డు భువనగిరి: పట్టణానికి చెందిన బండారు పుష్పలతకు కవియిత్రి అవార్డు లభించింది. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో జిల్లా నుంచి ఆమె పాల్గొని ‘బతుకునిచ్చిన బతుకమ్మ’ పాట పాడారు. ఇందుకుగాను ఆమెకు కవియిత్రి అవార్డును ప్రకటించారు. ప్రముఖ కవి రాములు చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. -
పాడి రైతులకు బిల్లులు ఆపడం అన్యాయం
భువనగిరిటౌన్ : ఎనిమిది నెలలుగా పాల బిల్లులు ఇవ్వకపోవడంతో పాడి పశువుల పోషణ భారంగా మారుతుందని పాడి రైతులు, రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడికుమార్ మాట్లాడుతూ పాల బిల్లులు ఆపడం వల్ల పాడి రైతులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సంస్థ ఉన్నతాధికారులు, పాలకవర్గం అక్రమాలకు పాల్పడి లాభాల్లో నడిచిన డెయిరీని బిల్లులు చెల్లించలేని స్థితికి దిగజార్చారని ఆరోపించారు. పాడి రైతులకు బిల్లులు చెల్లించడంతో పాటు సంస్థ లాభాల బాట పట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్దన్, కొలనుపాక పాల సొసైటీ చైర్మన్ మామిడాల సోమయ్య, ఇక్కుర్తి పాల సొసైటీ చైర్మన్ చిరబోయిన రాజయ్య, ఆయా గ్రామాల పాడి రైతులు అయినా యాకయ్య గడ్డం నాగరాజు పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, బర్మ బాబు, రామచంద్రు ఓరుగంటి మైసయ్య, మామిడాల బాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పాడి రైతుల ధర్నా -
నాలాల చుట్టూ. ఆక్రమణల గుట్టు
ఆలేరు: పట్టణంలో ప్రధాన నా లాల ఆక్రమణల గుర్తింపునకు రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సంయుక్త సర్వే చేయడానికి సిద్ధమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు ఇష్టానుసానురంగా వెంచర్లు చేయడం, మరికొందరు నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టం వల్ల ఆక్రమణలు జరిగినట్టు అధికా రుల దృష్టికి వచ్చింది. తద్వారా నాలాలు ఇరుకుగా మారి, వరద ప్రవాహానికి అడ్డంకిగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆలేరు పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు, వస్తువులు, దుస్తులు తడవడంతో పాటు రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. ఏటా వానాకాలం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ముంపు కాలనీల సమస్యలపై ‘ఏటా ముంపు..ఏదీ కనువిప్పు’ శీర్షికతో ఈనెల 15వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈమేరకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఆక్రమణలను గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో నాలాల వైశాల్యం, నాలాల బఫర్‌జోన్ నిబంధనలను పరిశీలిస్తున్నారు. నాలాల సమీపంలో నిబంధనల ప్రకారమే కట్టడాలు చేశారా? ఈ మేరకు ఆక్రమణలు జరిగాయనే అంశాలపై సర్వే చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమస్య ఇదీ.. పాత మున్సిపల్ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి, కొలనుపాక రోడ్డు, రైల్వేట్రాక్, ఆలేరు ప్రధాన రోడ్డు పక్కన వరద సాఫీగా ముందుకు వెళ్లడంలేదు. ఫలితంగా 11,12 వార్డుల పరిధిలో రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, బొడ్రాయి తదితర కాలనీలు ముంప బారిన పడటం తెలిసిందే. బైరవకుంట, పర్రేకాల్వ నుంచి శ్రీరామకృష్ణ విద్యాలయం వరకు సుమారు 8 కిలో మీటర్ల పొడవు ప్రధాన నాలాలు ఐదు వరకు ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఆయా కుంటలు పొంగితే వరదనీరంతా ఆయా నాలాల మీదుగా బైపాస్ సమీపంలోని పెద్దవాగులో కలవాలి. గుర్తింపునకు రంగం సిద్ధం ఫ సర్వే చేయడానికి రెవెన్యూ, మున్సిపల్ శాఖల సన్నాహాలు ఫ ఆక్రమణదారులకు త్వరలో నోటీసులు జారీ ఫ రైల్వేట్రాక్ కింద పూడుకుపోయిన నాలా విషయమై ఆ శాఖ ఉన్నతాధికారులకూ లేఖలు రెవెన్యూ రికార్డుల్లో నాలాల వివరాలను పరిశీలన చేస్తున్నాం. అనంతరం ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరుతాం. అన్ని అంశాల పరిశీలన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, తహసీల్దార్, ఆలేరురెవెన్యూ శాఖతో కలిసి నాలాల ఆక్రమణల గుర్తింపునకు సర్వే చేయనున్నాం. ఆలేరు ప్రధాన రోడ్డు పక్కన ఉన్న రైల్వే ట్రాక్ కింద కల్వర్టు వద్ద వరద నీరు వెళ్లడం లేదు. మరమ్మతుల కోసం రైల్వే ఉన్నతాధికారులకు లేఖలు రాశాం. వారి నుంచి క్లియరెన్స్ రాగానే పనులు మొదలవుతాయి. రైల్వే అధికారులతో కలెక్టర్ కూడా సంప్రదింపులు చేస్తున్నారు. – శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఆలేరు