breaking news
Krishna
-
‘పచ్చ’ బరితెగింపు.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడి ఇల్లు కూల్చివేత
సాక్షి, కృష్ణా జిల్లా: మోపిదేవిలంకలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడి ఇంటిని కూల్చేశారు. టీడీపీ నేతల దాడిలో విజయ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడనే నెపంతో ఈడే విజయ్ కుమార్ ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. తమ ఇల్లు కూల్చొద్దని విజయ్ కుమార్ కుటుంబం వేడుకున్నా కానీ వారిని దౌర్జన్యంగా టీడీపీ నేత అనుచరులు పక్కకు లాగేసి పడేశారు. టీడీపీ నేత దాడిలో గాయపడిన విజయకుమార్ అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రీ రమేష్ బాబు శనివారం పరామర్శించారు. దౌర్జన్యంగా విజయ్ ఇంటిని కూల్చివేశారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న వారిపై దాడి చేశారని.. కరెంట్ బిల్లు, ఇంటి పన్ను ఉన్నా కూడా కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పేదల ఇల్లు పడగొట్టి పాపం కూడగట్టుకుంటున్నారన్నారు. బాధితులకు న్యాయం చేయాలని సింహాద్రీ రమేష్‌బాబు డిఆమండ్ చేశారు. -
విజయవాడలో డయేరియాకు మరొకరు బలి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలో విజృంభిస్తున్న డయేరియాకు మరొకరు బలయ్యారు. గత రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న నరసింహ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన గద్వాల నరసింహ(38) భార్యతో విభేదాలు రావడంతో ఒక్కడే ఉంటున్నాడు. నరసింహ ఇంటి కింద భాగంలో ఉంటుండగా, అతని తమ్ముడి కుటుంబం ఇంటి పైభాగంలో ఉంటోంది. గత 4 రోజుల నుంచి ఆ ఇంటిల్లిపాది డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. నరసింహ తమ్ముడి కుమార్తెకు కూడా వాంతులు, విరేచనాలు కావడంతో వారి కుటుంబ సభ్యులంతా 2 రోజుల నుంచి పాపతో పాటు హాస్పిటల్లోనే ఉంటున్నారు. శుక్రవారం నరసింహ వాంతులు, విరేచనాలతో నీరసించిపోయాడు. సాయంత్రానికి అతని పరిస్థితి విషమించడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
సర్కారు బడుల సత్తా
కృష్ణా జిల్లాలో ఐదు స్కూళ్లకు బెస్ట్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్సీ అవార్డులుకంకిపాడు: విద్యార్థుల వికాసానికి చదువుతో పాటుగా క్రీడలూ ముఖ్యమే. మారుతున్న పరిస్థితులతో ఎక్కువ మంది చదువు, తద్వారా వచ్చే మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో విద్యార్థుల జీవితం తరగతి గదుల్లోనే మగ్గుతోంది. రానురాను విద్యార్థులు శారీరక వికాసానికి దూరం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు పాఠశాలలు విద్యార్థులను చదువుతో పాటుగా క్రీడల్లోనూ తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడలు, అథ్లెటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పోటీల్లో తలపడుతూ పతకాలు పొందుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలు తమ విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చొరవతో ఎక్స్‌లెన్స్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇటీవల జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో కృష్ణాజిల్లాకు చెందిన ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఎక్స్‌లెన్స్ అవార్డులను అందుకుని ఆదర్శంగా నిలిచాయి. సత్తా చాటుతున్న విద్యార్థులు.. క్రీడల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆట స్థలంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఉపాధ్యాయులు, శిక్షకులు అందించే ప్రోత్సాహం, తర్ఫీదుతో మెరికల్లా మారుతున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటి పతకాలు పొందుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రవేశించి తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే 2024–25 విద్యాసంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులను జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలు తమ సొంతం చేసుకున్నాయి. జెడ్పీ పమిడిముక్కల, జెడ్పీ గూడూరు, సీపీఎంహెచ్ఎస్ మచిలీపట్నం, జెడ్పీ (బాలికలు) గన్నవరం, జెడ్పీ గొడవర్రు పాఠశాలలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన ఎక్స్‌లెన్స్ అవార్డులను దక్కించుకున్నాయి. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ.. ప్రధానంగా హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగాల్లో విద్యార్థులు రాణిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. వారికి అవసరమైన పోషకాహారాన్ని అదనంగా అందజేస్తూ శారీరకంగా దృఢంగా ఉండేలా తమ వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్త్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో 25 నుంచి 40 మంది విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటుతూ పాఠశాలలకు గుర్తింపు తెస్తున్నారు. పాఠశాల పేరు లభించిన లభించిన పాయింట్లు స్థానం జెడ్పీ పమిడిముక్కల 192 ప్రథమస్థానం జెడ్పీ గూడూరు 107 ద్వితీయ స్థానం సీపీఎంహెచ్ఎస్ మచిలీపట్నం 100 తృతీయ స్థానం జెడ్పీ (బాలికలు) గన్నవరం 93 నాలుగో స్థానం జెడ్పీ గొడవర్రు 44 ఐదో స్థానం విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించటంతో పాటుగా జాతీయ స్థాయిలోనూ ప్రవేశించి ప్రతిభ చాటుతున్నారు. పాఠశాలకు ప్రత్యేకంగా గుర్తింపు లభిస్తోంది. విద్యార్థుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధ, బాధ్యతతో వ్యవహరిస్తూ తర్ఫీదు ఇస్తూ వారికి మెలకువలు నేర్పుతున్నారు. ఏటా వివిధ స్థాయి లో విద్యార్థులు పతకాలు దక్కించుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. – కొండిశెట్టి సుబ్రహ్మణ్యం, హెచ్ఎం, జెడ్పీ గొడవర్రు మైదానాన్ని సిద్ధం చేసుకోవటం, విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం కీలకమైన అంశం. ఇందుకు కొందరు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న చేయూత కూడా మరువలేనిది. విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిభ చాటేలా మెలకువలు నేర్పుతున్నాం. – కె.టాన్యాగిరి, పీడీ, జెడ్పీ గన్నవరం(బాలికలు) -
సుస్వరాల కోయిలకు కీర్తి కిరీటం
విజయవాడ కల్చరల్: ఆమె గాత్రంలోని మాధుర్యం శ్రోతలను కట్టిపడేస్తుంది.. వయోలిన్‌పై ఆమె చేసే స్వర విన్యాసం సంగీత ప్రియులకు పరవశించేలా చేస్తుంది. ఆమె వేదికపై ఉందంటే సంగీత అభిమానులకు పండుగే. ఆమే విజయ వాడకు చెందిన వయోలిన్ విద్వాంసురాలు బీవీ దుర్గాభవాని. విఖ్యాత హరికథా భాగవతార్ కుమార్తెగా ఆమె సంగీత రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానానికి ఇప్పుడు కీర్తి కిరీటం దక్కింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం వరించింది. సంగీత ప్రస్థానం సాగిందిలా.. బీవీ దుర్గాభవాని బహుముఖ ప్రతిభాశాలి. అటువాయిలీనం, ఇటు గాత్రం.. రెంటినీ సమర్థంగా పోషించగల సంగీత సవ్యసాచి. ఆమె 1965లో విజయవాడలో జన్మించారు. తండ్రి విశ్వనాథ భాగవతార్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అటు గాత్రంలోనూ ఇటు వయోలిన్లోను ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. సుదీర్ఘకాలం ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ విద్వాంసురాలిగా పనిచేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆరేళ్లపాటు వయోలిన్ అధ్యాపకురాలిగా పనిచేశారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి శిష్యరికంలో సంగీత విద్యను సార్థకం చేసుకున్నారు. ప్రముఖుల సరసన.. ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, టీఎన్ శేషగోపాలన్, ప్రపంచం సీతారాం, టీఎం కృష్ణ, బోంబే సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్‌తోపాటు పలువురు విద్వాంసులకు వాద్య సహకారమందించారు. అందుకున్న అవార్డులు.. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్, మద్రాస్ మ్యూజికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, రసిక రంజని, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీలు ఆమెకు పురస్కారాలను అందజేశాయి. కాగా ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగా ల్లోని ప్రతిభావంతులకు అందించే కీర్తి పురస్కారానికి దుర్గా భవానీ ఎంపికై ంది. ఈ నెల 23, 24 తేదీలలో జరిగే సభల్లో రూ.5,116 నగదుతోపాటు జ్ఞాపికలు అందజేయనుంది. వయోలిన్ విద్వాంసురాలు దుర్గాభవానీకి తెలుగు వర్సిటీ పురస్కారం -
మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి నేతన్న భరోసా ఇవ్వాలి
చల్లపల్లి: మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి నేతన్న భరోసా పథకం ద్వారా రూ.36వేలు ఇవ్వాలని, చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రిబేటు, యారన్ సబ్సిడీ వంటి ఇంటెన్సివ్స్ రూ.127.87 కోట్లు వెంటనే చెల్లించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరుబాట సాగిద్దాం.. చేనేత పరిశ్రమను రక్షించుకుందాం.. అనే నినాదంతో చేనేత సహకార సంఘాల, సహకారేతర కార్మికుల ఉపాధికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన చేనేత అధ్యయన యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన పెడనలో ప్రారంభించిన ఈ యాత్ర పోలవరం, కప్పలదొడ్డి, కాజ, ఘంటసాల, చల్లపల్లి ప్రాంతాల మీదుగా సాగి ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ముగిసిందన్నారు. యాత్రలో చేనే త కార్మికుల నుంచి వచ్చిన సమస్యలను, పాత సమస్యలను రెండింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని, వాటిని పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొగిడే మాధవస్వామి, ఉపాధ్యక్షుడు జక్కల పీతాంబరరావు, జిల్లా అధ్యక్షుడు కోదాటి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగేశ్వరరావు -
అంతుచిక్కని అతిసార
లబ్బీపేట/అజిత్‌సింగ్‌నగర్: న్యూరాజరాజేశ్వరి పేటలో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండగా, మృతుల సంఖ్య కూడా మూడుకు చేరింది. ప్రజలు అతిసార బారినపడటానికి ఖచ్చితమైన కారణాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించలేకపోయింది. పూటపూటకీ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారగా, అధికారులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకొస్తుండటం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ దాదాపు 194 మంది డయేరియా బారిన పడినట్లు అధికారికంగా ప్రకటించారు. అధికారుల దృష్టికి రానివారు మరో 20 మంది వరకూ ఉండొచ్చునని అంచనా. ఇప్పటికే అతిసారతో ఇద్దరు మృతిచెందగా, వాంతులు విరచేనాలతో బాధపడుతూ తాజాగా శుక్రవారం రాత్రి మరో వ్యక్తి మృతిచెందారు. జీజీహెచ్‌లో 106మంది రోగులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి డయేరియా రోగులు పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం 106మంది అతిసార బాధితులు చికిత్స పొందుతుండగా, 88మంది డిశార్జి అయ్యారు. బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తదితరులు పరామర్శించి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. కారణాన్ని గుర్తించని వైనం.. అతిసారకు గల కారణాన్ని అధికారులు సైతం ఇప్పటివరకూ ప్రకటించలేదు. వినాయకుని వేడుకల్లో భోజనాలు చేశారని కొందరు, వంకాయ కూరలో రొయ్యలు వేసుకుంటే వాంతులు అయ్యాయని మరికొందరు చెబుతున్నారు. మంత్రులు సైతం ఇదే విషయాలను చెప్పుకొస్తున్నారు. భారీసంఖ్యలో ప్రజలు అతిసార బారిన పడ్డారంటే నీటి కలుషితమే కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాంతంలో కార్పొరేషన్ సరఫరా చేసే నీటితోపాటు భూగర్భజలాలు సైతం పూర్తిగా కలుషితమైనట్లు సమాచారం. నీటికి సంబంధించి ప్రాథమిక పరీక్షలో నెగటివ్ వచ్చిందని, మరో రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ నీటిసరఫరాను సైతం పూర్తిగా నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరాను కూడా నిలిపివేసి, ప్రతి ఇంటికి మినరల్ వాటర్ క్యాన్లను అందిస్తున్నారు. బ్లీచింగ్‌తో కంటితుడుపు చర్యలు.. న్యూరాజరాజేశ్వరీపేటలో ప్రజలు ప్రాణాలు పోతున్నా... ప్రభుత్వ పెద్దలు.. ఉన్నతాధికారుల తీరు మాడరం లేదు. కేవలం ప్రజల కళ్లకు కనబడేలా ప్రధాన రహదారులపై బ్లీచింగ్ చల్లి.. ౖపైపెన కంటితుడుపు చర్యలు చేపడుతున్నారే తప్ప.. వాస్తవంగా నివాస ప్రాంతాల మధ్యలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదు. అధ్వానంగా పారిశుద్ధ్య పరిస్థితి.. డయేరియా వెలుగు చూసి 72 గంటల సమయం గడిచినా కూడా నేటికి న్యూరాజరాజేశ్వరీపేట అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలు అత్యంత అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నడిరోడ్లపైనే పదుల సంఖ్యలో పందులు సంచరిస్తూ ఉన్నాయి. కాలువలన్నీ చెత్తతో నిండిపోగా.. అపార్ట్మెంట్ల మధ్య స్థలాలు మురుగునీటితో తీవ్ర దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఇక అపార్ట్మెంట్ల డ్రెయినేజీ పైపులన్నీ గతేడాది బుడమేరు వరదలో పగిలిపోగా నేటికి వాటి పరిస్థితి అలానే ఉండడంతో ఆ మురుగు, వ్యర్థాలన్నీ రోడ్లపైకి చేరి నివాసాల ముందు పారుతుండటం గమనార్హం. ఇక మంచినీటి పైపులైన్లు కూడా పగిలిపోవడంతో పక్కనే ఉన్న మురుగునీరు పైపుల్లో చేరుతూ కలుషితనీరే సరఫరా అవుతోందంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాది 17వ నంబర్ బ్లాకు.. ఈ ఇళ్ల మధ్య మురుగు, చెత్త తొలగించకపోతుండటంతో దుర్వాసనకు ఇళ్లల్లో అస్సలు ఉండలేకపోతున్నాము. తరచూ జ్వరాలు, వాంతులు, విరేచనాల సమస్యలతో అల్లాడిపోతున్నాం. శశిరేఖ, 17వ బ్లాకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో న్యూరాజరాజేశ్వరపేటలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో దాదాపు నగరంలోని వైద్యసిబ్బంది అంతా అక్కడే పనిచేస్తున్నారు. అంతేకాకుండా నగర సమీపంలోని పీహెచ్‌సీలు, వెల్నెస్ సెంటర్ల నుంచి సీహెచ్ఓలకు కూడా డ్యూటీలు వేశారు. ఇప్పటివరకూ న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రతి ఇంటిని రెండు, మూడుసార్లు సర్వేచేసి జల్లెడ పట్టారు. అయినప్పటికీ అతిసారకు కారణం మాత్రం కనుగొనలేకపోవడం గమనార్హం. వాంతులు, విరోచనాలు అవుతున్న వారికి మాత్రం సకాలంలో వైద్యం అందించగలుగుతున్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): నగర పరిధిలో ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. కొత్త రాజరాజేశ్వరిపేటలో అతిసార వ్యాధితో కొందరు బాధపడుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది శుక్రవారం ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను తనిఖీ చేశారు. నగర పరిధిలో మొత్తం 216 ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలు ఉండగా, వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోయినా, తాజాగా వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్లేని 51 దుకాణాలను సీజ్ చేశారు. 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరిపేట పరిధిలోని తొమ్మిది చికెన్ షాపులు, ఒక బీఫ్ షాపును వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్‌రెడ్డి మూసి వేయించారు. అదే ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారుల సంయుక్తంగా తనిఖీలు చేసి 24 ఆహార దుకాణాలను సైతం మూసివేయించారు. -
హెచ్ఐవీపై అవగాహన అవసరం
మచిలీపట్నంఅర్బన్: హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో పాటు ఇతర వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవాలని ఇన్చార్జ్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు పిలుపునిచ్చారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయం, దిశ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవీ/ ఎయిడ్స్ ప్రచార రథాన్ని శుక్రవారం ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు హెచ్ఐవీ/ ఎయిడ్స్, క్షయ, సుఖ వ్యాధులపై చిత్ర ప్రదర్శనలతో అవగాహన కల్పించడం, ప్రజల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం ఈ ప్రచార రథం ముఖ్య ఉద్దేశమన్నారు. దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఎల్. మధుసూదనరావు, క్లస్టర్ ప్రివెన్షన్ అధికారి కె. రవికుమార్, గైడ్ ప్రోగ్రాం మేనేజర్ వై. శశికళ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఇన్చార్జి వైద్య, ఆరోగ్యశాఖాధికారి వెంకట్రావు -
డబ్బులు దండుకునేందుకే ‘విజయవాడ ఉత్సవ్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేవీ శరన్నవరాత్రుల సమయంలో నగరంలో ఆధ్మాతిక శోభ వెల్లివిరుస్తుంది.. అలాంటి సమయంలో ఈ వేడుకలకు పోటీగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం అంటే దసరా ప్రాధాన్యతను తగ్గించడం కాదా అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. విజయవాడలో పార్టీ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు దండుకునేందుకే స్థానిక ఎంపీ విజయవాడ ఉత్సవ్‌ను తెరపైకి తెచ్చారని అవినాష్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు దీనిని ఖండించాలన్నారు. అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై శ్రద్ధ చూపడం మానేసి.. విజయవాడ ఉత్సవ్ మీద దృష్టి పెట్టారని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కలుగజేసుకోవాలన్నారు. లేని పక్షంలో ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దలందరినీ కలుపుకుని వాటిని అడ్డుకుని తీరుతామన్నారు. దసరా ఉత్సవాలకు పోటీగా మరొకటి నిర్వహించే ప్రయత్నాన్ని ప్రజల సహకారంతో నిరోధిస్తామని హెచ్చరించారు. 40 ఎకరాలు కబ్జా.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లాలో ఎప్పుడూ జరగని సంఘటనలు జరిగాయని అవినాష్ ఆరోపించారు. మంత్రుల దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. గొల్లపూడిలోని దేవాలయాలకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. ఎంతోమంది గొప్పవారు మంత్రులు, ఎంపీలుగా పనిచేశారు గానీ దేవాలయాల భూములు దోచుకోలేదన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని చిన్ని తాను ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మట్టి, కాంట్రాక్టులు, భూములు అన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. గోల్ఫ్ కోర్టులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లు దేవాలయాల భూముల్లో కట్టడం ఏమి టని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. రూ.450 కోట్లు విలువ చేసే భూమిని దోచుకోవాలని ప్లాన్ చేశారన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా తమ విధులకు ద్రోహం చేస్తున్నారని, కూటమి నేతలు ఏమి చెబితే అది సిగ్గు లేకుండా ఆచరిస్తున్నారన్నారు. -
జనసేన రౌడీల దుశ్చర్య
మచిలీపట్నంటౌన్: జనసేన రౌడీలు గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్త మద్దాల సతీష్ బాబుకు చెందిన దుకాణాన్ని ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. బందరు మండలం సత్రంపాలెంలో గిరిధర్‌పై దాడి చేసిన అనంతరం.. అదే గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉన్న సతీష్ బాబు బడ్డీ కొట్టును ధ్వంసం చేశారు. దుకాణంలో ఉన్న ఫ్రిడ్జ్‌ని పగలగొట్టారు. తన దుకాణాన్ని సతీష్ బాబు మూసివేసి తాళాలు వేసి వెళ్లిన అనంతరం జనసేన గూండాలు అక్కడికి చేరుకుని వేసి ఉన్న తాళాలు పగలగొట్టి దుకాణంలోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. అక్కడ సతీష్ బాబు ఉంటే హత్య చేయాలనే తలంపుతో వెళ్లిన వారు అక్కడ సతీష్ బాబు లేకపోవడంతో అతని దుకాణాన్ని ఇష్టానుసారంగా పగలగొట్టారు. అందుకే కక్షకట్టారు.. ఈనెల తొమ్మిదో తేదీ మంగళవారం మచిలీపట్నంలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో సత్రంపాలెంకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్, సతీష్ బాబు తదితర వైఎస్సార్ సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు గిరిధర్ వాయిస్ ఇచ్చారు. డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు పదవి రాకముందు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఎలా మౌనంగా ఉంటున్నారో వివరించారు. ఈ వాయిస్ వీడియోలో సతీష్ బాబు కూడా కనిపించారు. దీంతో సతీష్ బాబుపై కూడా అక్కసు పెంచుకున్న జనసేన నాయకులు కొరియర్ శ్రీను, శాయన శివయ్యలతో కలిసి జనసేన గూండాలు అతనిపై కూడా దాడి చేసేందుకు గురువారం రాత్రి గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో సతీష్ బాబు తన షాపునకు తాళాలు వేసి వెళ్లడంతో దుకాణం తాళాలు పగలగొట్టి మరీ ధ్వంస రచన చేశారు. ఈ ఘటనను పలు దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దళితుడి బడ్డీ దుకాణాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. పెనమలూరు: పెదపులిపాకలో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెదపులిపాక గ్రామం శ్రీనగర్ కాలనీ 6వ రోడ్డుకు చెందిన పుట్టపు గోవిందమ్మ కుటుంబ సభ్యులతో ఉంటోంది. ఆమె భర్త వ్యవసాయ పనులు చేస్తారు. ఆమెకు ఇద్దరు కుమారులు. గురువారం చిన్నకుమారుడు పుట్టపు పవన్‌కుమార్(18) వడ్డేశ్వరంలో పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లగా.. పెద్ద కుమారుడు ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లాడు. కాగా గురువారం సాయంత్రం పెద్ద కుమారుడు ఇంటికి రాగా.. తలుపులు లోన గడి పెట్టి ఉన్నాయి. అతను కిటికీలో నుంచి చూడగా పవన్‌కుమార్ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపులు తెరిచి కుటుంబ సభ్యులు పవన్‌కుమార్‌ను విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై తల్లి గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దళితుడైన సతీష్‌బాబు దుకాణం ధ్వంసం -
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
పెనమలూరు: పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగిన హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించిందని సీఐ వెంకటరమణ తెలిపారు. గంగూరు గోడౌన్ వద్ద టీ అమ్ముకొని జీవించే భర్త లేని పి.రమాదేవి (40)తో కంకిపాడుకు చెందిన ముప్పిడి శ్రీనివాసరావుకు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వాటిల్లో వివాదం రావటంతో 2021, మే 31న శ్రీనివాసరావు రోకలిబండతో రమాదేవిపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై అప్పటి సీఐ ముత్యాల సత్యనారాయణ హత్య కేసు నమోదు చేశారు. నిందితుడిని అదే ఏడాది జూన్ 3వ తేదీన అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచారు. ఆ తరువాత అతని పై రౌడీషీట్ కూడా తెరిచారు. ఈ కేసు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో విచారణ చేశారు. మహిళా సెషన్స్ కోర్టు జడ్జి జి.రాజేశ్వరి 13 మంది సాక్షులను విచారించి ముద్దాయిపై నేరం రుజువు కావటంతో గురువారం తీర్పు ఇచ్చారు. ముద్దాయి శ్రీనివాసరావుకు జీవిత ఖైదు విధించి రూ. 5 వేలు జరిమానా విధించారు. ప్రశ్నిస్తే శిక్షిస్తారా? చల్లపల్లి: పిల్లలు తినే అన్నంలో పురుగులు వచ్చాయని ప్రశ్నించినందుకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ కుంభా లక్ష్మీ దుర్గాభవానీని పదవి నుంచి తొలగిస్తారా అంటూ జాతీయ గిరిజన ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుంభా లక్ష్మయ్య, దేవరకొండ వసంత్ ప్రశ్నించారు. శుక్రవారం నేతలు భవాని ఇంటికి వెళ్లి మండల పరిధిలోని పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 10వ తేదీన మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన విషయంపై లక్ష్మీదుర్గాభవాని స్పందించిన తీరును ప్రశంసిస్తూ శాలువతో సత్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అన్నంలో పురుగులు వచ్చాయన్న విషయాన్ని దాచిపెట్టకుండా ఎందుకు బహిర్గతం చేశావని తహసీల్దార్ డి.వనజాక్షి దుర్గాభవానీపై చేసిన వ్యాఖ్య లు గర్హనీయమన్నారు. పదవి నుంచి తొలగించాలని అవమానకరంగా మాట్లాడుతూ బెదిరింపులకు గురిచేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఎస్టీ కమీషన్ దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు. -
వారంరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ
ఇరుగ్రామాల ప్రజలతో అధికారులు సమావేశం నాగాయలంక: మండలం శివారులో సముద్రం తీరాన ఉన్న ఈలచెట్లదిబ్బ వాసుల తాగు, సాగునీటి సమస్యలకు వారంరోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపనున్నట్లు కృష్ణా, బాపట్ల జిల్లాల ఉన్నతాధికారులు ప్రకటించారు. కొద్దికాలంగా ఈలచెట్లదిబ్బ(నాగాయలంక మండలం), లంకెవానిదిబ్బ(బాపట్ల జిల్లా రేపల్లె మండలం) గ్రామాల నడుమ నీటివివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు జిల్లాల అధికారులు ఆయా గ్రామాల పెద్దలు, ప్రతినిధులతో కలసి శుక్రవారం లంకెవానిదిబ్బలో సమావేశమయ్యారు. లంకెవానిదిబ్బ వాసులను ఈలచెట్లదిబ్బ వాసులు తమవైపు నదిలోకి చేపల వేటకు రానీయకుండా అడ్డుకోవడంతోనే వారి గ్రామంలోని లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి దిబ్బకు వచ్చే సాగు,తాగు నీటి పైపులైన్లను అడ్డుకోవడంతో ఇరు జిల్లాల గ్రామాల నడుమ వివాదానికి దారితీసింది. కాగా అధికారులు ప్రధానంగా నీటి సమస్యపైనే దృష్టి కేంద్రీకరించిన నేపధ్యంలో నీటి సమస్య పరిష్కారంపై బందరు ఇంచార్జి ఆర్డీఓ బి.శ్రీదేవి, బాపట్ల ఆర్డీఓ రేపల్లె రామలక్ష్మి నేతృత్వంలో లంకెవానిదిబ్బ లిప్ట్ ఇరిగేషన్ పరిశీలించి అక్కడే ఇరుగ్రామాల వారితో సమావేశమై చర్చించారు. వారం రోజుల్లో తాత్కాలిక పైపులు ఏర్పాటు చేసి ఈలచెట్లదిబ్బ వాసులకు తాగు, సాగునీరు అందించేందుకు లంకెవానిదిబ్బ వాసులను అధికారులు ఒప్పించారు. వచ్చే ఏడాది జూన్‌నాటికి లిఫ్ట్ ఇరిగేషన్‌కు లెవెల్ మెయింటెన్ చేసి లాకులు ఏర్పాటు చేస్తామని అధికార యంత్రాంగం వివరించారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియుల కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, తహసీల్దార్లు సిహెచ్‌వి ఆంజనేయప్రసాద్, టి.శ్రీనివాస్ కృష్ణా ఇరిగేషన్ అధికారులు మోహన్‌రావు(ఎస్ఈ), రవికిరణ్(ఈఈ), లిఫ్ట్ ఇరిగేషన్ ఈఈ చెన్నారెడ్డి, డీఈఈ గణపతి, అవనిగడ్డ సీఐ యువకుమార్, నాగాయలంక ఎస్ఐ కె.రాజేష్, బాపట్ల జిల్లా ఇరిగేషన్ అధికారులు, రెండు గ్రామాల పెద్దలు, నీటి సంఘాల అధ్యక్షులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ హక్కులనే కాలరాస్తారా? ...
దేశంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడుతున్న పత్రికలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం విచారకరం. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన హక్కును ప్రభుత్వం కాల్ రాస్తోంది. ఇటీవల సాక్షి దినపత్రికలో వస్తున్న కథనాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోగా కక్ష సాధింపులకు దిగుతుండటం సరైన పద్ధతి కాదు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తూ కక్ష సాధింపులకు పాల్పడటం ఎంతవరకు సబబు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని విడనాడాలి. వడ్డి జితేంద్ర, న్యాయవాది పరిషత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి -
జనసేన గూండాల దాడి: గాయపడ్డ పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,తాడేపల్లి: జనసేన గూండాల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్ఎంపీ డాక్టర్),సతీష్‌లకు.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్త అని సూచించారు. గతరాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గిరిధర్,సతీష్‌లపై జనసేన గూండాలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వైఎస్సార్సీపీ కార్యాకర్తలపై దాడి గురించి సమాచారం అందుకున్న వైఎస్ జగన్ వారిని ఫోన్లో పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. తనని కులం పేరుతో దూషించి కొట్టారని, షాపును ధ్వంసం చేశారంటూ తనకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్‌కు సతీష్ చెప్పుకున్నారు. దాడిపై ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. దాడి ఘటన చాలా బాధ కలిగించింది. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం బాధాకరం. వాళ్లు చేయకూడని తప్పులు చేస్తున్నారు. మనకు టైం వస్తుంది.. మంచి జరుగుతుందని’వ్యాఖ్యానించారు. -
ఏసీబీ కోర్టు వద్ద చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన
సాక్షి,విజయవాడ: ఏసీబీ కోర్టు వద్ద వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేనెప్పుడూ లిక్కర్ జోలికి పోలేదు. తాగుడు వల్లే మా నాన్న,తమ్ముడు చనిపోయారు. అందుకే నేను లిక్కర్‌ను ద్వేషిస్తా. లిక్కర్‌ను ద్వేషించే నన్ను లిక్కర్ కేసులో అరెస్టు చేశారు. కొన్ని పత్రికల్లో ఇష్టానుసారం అసత్యాలు రాస్తున్నారు. 13ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నా. ఏ తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవిస్తున్నాని తెలిపారు. -
బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి?: సీదిరి అప్పలరాజు
సాక్షి, విజయవాడ: న్యూఆర్‌ఆర్ పేటలో డయేరియా అదుపులోకి రాలేదు. మెడికల్ క్యాంప్‌లకు బాధితులు క్యూ కడుతున్నారు. మెడికల్ క్యాంప్ వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 141 మంది డయేరియా బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ప్రస్తుతం 68 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రంగు మారిన నీరు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డామంటున్న బాధితులు చెబుతుండగా.. మంచినీటిలో ఎలాంటి సమస్య లేదని ప్రభుత్వం అంటోంది. డయేరియాతో ఇద్దరు చనిపోయారని బాధిత కుటుంబాలు చెబుతుండగా.. డయేరియా మరణాలను చంద్రబాబు సర్కార్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మెడికల్ క్యాంప్‌లో కాలం చెల్లిన మందులు ఎలా ఇచ్చారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆయన మండిపడ్డారు. మెడికల్ క్యాంప్‌ను విజిట్ చేసి బాధితులను పరామర్శించాం. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి భోజనాలు తిని డయేరియా వచ్చిందని ఒకరంటారు. బుడమేరు కారణంగా భూ గర్భజలాలు కలుషితమయ్యాయని ఒకరంటారు. విజయవాడ నగరం ఎప్పుడు ఏర్పడింది?. ఇక్కడ పైప్ లైన్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది?. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి చేతులు దులిపేసుకోవడం బాధాకరం’’ అని అప్పలరాజు పేర్కొన్నారు.‘‘గత ఐదేళ్లలో ఇలాంటి సంఘటనలు ఒక్కటైనా చూశామా?. వైఎస్ జగన్ సమయానికి అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకునేవారు. వర్షాకాలం ప్రారంభం ముందు చంద్రబాబు ఏనాడైనా రివ్యూ చేశాడా?. గతేడాది బుడమేరుకు వరదొస్తే చంద్రబాబు ఏం చేశారు?. వరదలు వస్తాయని వాతావరణశాఖ చెబుతుంటే చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి వెళ్లాడు. పెన్షన్ పంపిణీ అంతా ఒక సినిమా షూటింగ్. ఇదే నియోజకవర్గంలో వైఎస్ జగన్ నాలుగు యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో వెళ్లి చూడండి. చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి జనానికి అర్ధం కాని భాష మాట్లాడుతుంటారు’’ అంటూ అప్పలరాజు ఎద్దేవా చేశారు...క్యాంటమ్ కంప్యూటర్ అంటాడు. క్యాంటమ్ కంప్యూటర్ తో డయేరియా తగ్గించు. మాట్లాడితే ఏఐ టెక్నాలజీ అంటాడు. రండి ఏఐ టెక్నాలజీతో డయేరియాని కంట్రోల్ చేయండి. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా?. యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకు అవసరమా?. నేపాల్ లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేశామని నిన్న ఓ మంత్రి షో చేశాడు. ఆర్టీజీఎస్లో కూర్చున్నామని ఊదరగొట్టాడు. ఇక్కడ డయేరియా బాధితుల మాటేమిటి?. చంద్రబాబుకు ప్రజల ఆస్తులను అమ్మడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజల సేఫ్టీపై లేదు. మున్సిపల్ మంత్రికి అమరావతిలో భూములు అమ్మడం పైనే దృష్టి. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు...వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడంపైన ఉన్న శ్రద్ధ ప్రజల పై లేదు. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి?. వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన కావాలి. గతేడాది గుర్ల గ్రామంలో డయేరియాతో 13 మంది చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు. మెడికల్ క్యాంపులో కాలం చెల్లిన మందులు ఎలా ఇస్తారు?. ఇదేనా ప్రజల ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధ. స్థానిక ఎమ్మెల్యేకు కలెక్షన్స్ మీద ఉన్న శ్రద్ధ స్థానిక సమస్య పట్ల లేదు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారని బాధితులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మరణాలను దాచేస్తోంది. తక్షణమే న్యూ ఆర్.ఆర్.పేటను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలి. ఇంటింటికీ ఒక వాటర్ టిన్ సప్లై చేయాలి’’ అని అప్పలరాజు డిమాండ్ చేశారు. -
జగన్ ప్రభుత్వంలో ఈ కష్టాల్లేవ్: రైతులు
సాక్షి, కృష్ణా: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు ఎరువుల కొరత(Urea Crisis) అనే మాటే వినిపించలేదు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థ.. అదే అధికారులు ఉన్నా.. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాతో నిస్సహాయంగా మిగిలిపోయారు. దీంతో రైతులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉయ్యూరు మండలం ముదునూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కొందరిని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌పై వాళ్లు దుమ్మెత్తిపోశారు. ‘‘అర్ధరాత్రి నుంచి సొసైటీ గేట్ ఎదురు పడిగాపులు కాస్తున్నాం. మొదటి కోట యూరియా ఇంకా వెయ్యలేదు. రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం చేయటం దుర్భరంగా మారింది.బ్లాక్‌లో యూరియా రూ.800 పైగా అమ్ముతున్నారు. 10 ఎకరాలకు 2 కట్టలు ఇస్తున్నారు. యూరియా కోసం ఇంతకు ముందెప్పుడూ రోడ్లపైకి ఎప్పుడు రాలేదు. జగన్ ప్రభుత్వంలోనూ ఈ పరిస్థితి లేదు. సకాలంలో ఎరువులు, పంట సాయం అందేవి. ఇప్పుడు యూరియా వాడితే చంద్రబాబు క్యాన్సర్ వచ్చింది అంటున్నాడు. చంద్రబాబుకు రైతులు అంటే అంత చులకన?. ఇకనైనా ప్రభుత్వం రైతును ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న అవస్థలపై తాజాగా ప్రెస్మీట్లో కూటమి సర్కార్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Press Meet On Urea Troubles) చురకలంటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ యూరియా కొరత రాలేదు. అధికారులు కూడా రైతుల పక్షాన ఉండేవారు. ఇప్పుడు మాత్రం యూరియాను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించి, రూ. 250 కోట్ల స్కాం చేశారు. రైతులు బారులు తీరుతున్నారు, కానీ అధికార పార్టీ క్యాడర్‌కు మాత్రం యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. MSP (మద్దతు ధర) కూడా ఇవ్వకుండా, రైతులను ఆత్మహత్యల దిశగా నెట్టుతున్నారు. మేము తిరిగి అధికారంలోకి వస్తే, ఈ దందా అంతా బయటపెడతాం. రైతులకు న్యాయం చేస్తాం అని అన్నారాయన. గత వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాల) ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో అదే అధికారులు ఉండి, అదే వ్యవస్థ ఉండి.. అప్పుడు లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? అని చంద్రబాబును నిలదీశారాయన. ఇదీ చదవండి: ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్ -
జన సైనికుల ముసుగులో రౌడీలు.. ఆ దాడి హేయం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: పవన్ కల్యాణ్‌పై కామెంట్ చేశాడని ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై జన సైనికులు(Jana Sainiks) దాడి చేయడం దారుణమని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. పోలీసులు వాళ్లను గనుక అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారాయన.‘‘ఆర్ఎంపీ వైద్యుడు నాలుగు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. విలేఖరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు..చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మాత్రం దానికే జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తున్నారువందమందికి పైగా జనసేన గూండాలు(Jana Sena Goons) గిరిధర్ పై దాడి చేశారు. గిరిధర్ ఇంటిపై బీభత్సం సృష్టించారు. రజకుడనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారు. మరి పవన్‌ను మిగిలిన కులాలకు చెందిన వాళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు కదా?.. వాళ్ల మీద మీ ప్రతాపం ఎందుకు చూపించలేకపోతున్నారు??. దాడి చేయడానికి బలహీనులే మీకు కనిపిస్తారా???జనసేన ముసుగు ఉన్న గూండాలను కంట్రోల్ చేయాలని పోలీసులను, జిల్లా ఎస్పీని కోరుతున్నాం. ఈ రౌడీలను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని,నన్ను,నా కుమారుడ్ని నోటికొచ్చినట్లు తిడతారు. పవనను ప్రశ్నిస్తే మాట్లాడితే దాడులు చేస్తారు. గిరిధర్,సతీష్ ల పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్ని నాని అన్నారు.మచిలీపట్నం మండలం సత్రంపాలేనికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్(RMP Giridhar Attack) మంగళవారం ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని నిలదీశారు. ఈ క్రమంలో.. ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ జన సైనికులు ఆయన ఇంటి ముందు గురువారం రాత్రి ధర్నాకు దిగారు. అటుపై ఆయనపై దాడి చేసి బలవంతంగా ఆయనతో క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. .. జనసేన పెద్దల ఒత్తిడితో గురువారం రాత్రి చిలకలపూడి పోలీసులు గిరిధర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. గిరిధర్‌కు మద్దతుగా పీఎస్‌కు వైఎస్సార్సీపీ నేతలు వచ్చారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులు కవ్వింపునకు దిగబోయాయి. దీంతో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఈలోపు మాజీ మంత్రి పేర్ని నాని ఠాణా వద్దకు చేరుకుని విషయంపై ఆరా తీశారు. ఇరు పార్టీల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదీ చదవండి: మా పవనన్ననే నిలదీస్తావా? -
సినిమాను మించి ట్విస్టులు.. చంపేసి.. విసిరి పారేసి..
ఎన్టీఆర్ జిల్లా: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు.రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్‌పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు.ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు.ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
పోలీసు కుటుంబాలకు అండగా పోలీసుశాఖ
జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ తరఫున మంజూరైన బీమా చెక్కులను గురువారం జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అకాల మరణాలు పోలీసు శాఖకు తీరని లోటు అని అన్నారు. సిబ్బంది వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం రుణాలు తీసుకోవడం సర్వసాధారణం అని, అలా తీసుకున్న రుణాలను బీమా ద్వారా మాఫీ చేస్తామన్నారు. సిబ్బంది సంక్షేమానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి.దాసు కుటుంబానికి రూ.5,32,495, హెడ్ కానిస్టేబుల్ బి.వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.2,08,700, కె.వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ. 1,80,143 బీమా చెక్కులను అందజేసినట్టు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ రాఘవయ్య, కృష్ణాజిల్లా పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు జీవీ శేషగిరిరావు, కార్యదర్శి సీహెచ్ చెన్నకేశవులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు
బీజేపీ తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విదేశాంగ విధానం, లౌకికవాదం, ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం సీపీఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన పరిస్థితులు–సీపీఎం వైఖరిపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాఘవులు తొలుత ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల వామపక్ష ఉద్యమానికి గురుతర బాధ్యత ఉందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి మాట్లాడుతూ భూములు యథేచ్ఛగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సదస్సులో సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, డి.వి.కృష్ణ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం మోపిదేవి: మండల కేంద్రం మోపిదేవి ఎస్ విహార్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో గొరిపర్తి సుబ్రహ్మణ్యం(32) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం తన అత్తగారి ఊరు అయిన మచిలీపట్నం వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో ఎదురుగా రొయ్యల లోడ్‌తో వస్తున్న లారీని మోపిదేవి వద్ద బలంగా ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతునికి భార్య అంజలి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కృష్ణా మిల్క్ యూనియన్‌కు ఎన్డీడీబీ పురస్కారం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): సహకార సమితిని సమర్ధంగా నడిపించడమే కాకుండా పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృష్ణా మిల్క్ యూనియన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు గురువారం పురస్కారాన్ని అందజేసినట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు(ఎన్డీడీబీ) ఆరు దశాబ్దాలు పూర్తి కావడంతో గురువారం పుదుచ్చేరిలో వజ్రోత్సవం నిర్వహించింది. ఈ వేడుకలలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కె.కై లాష్నాఽథన్, జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి సీడీజే కౌమర్ పాల్గొన్నారు. ఈ వేడుకలకు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు హాజరయ్యారు.సెపక్ తక్రా పోటీలకు కృష్ణాజిల్లా జట్ల ఎంపికమొగల్రాజపురం (విజయవాడ తూర్పు): స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణాజిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ బాల, బాలికల జట్లను గురువారం ఎంపిక చేసినట్లు ఆ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం. పవన్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 13,14 తేదీలలో అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణాజిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు మావులూరి పవన్ కుమార్, దేవవరపు నరేష్ బాబు, బండి నరేష్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారని తెలిలియజేశారు. బాలుర విభాగంలో ఎండి.జకీర్, ఎస్.కార్తీక్, వై.సుభాష్, వై.అనిల్, ఎండి.ముజాకీర్, బాలికల విభాగంలో వి.కావ్య, ఎండి.రహీమా, కె.లావణ్య, ఆర్.అమృత, ఎస్డి.కరిష్మా ఎంపికయ్యారని తెలియజేశారు. జిల్లా జట్టులో ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. -
దూసుకొస్తున్న మృత్యువాహనాలు
జి.కొండూరు: అక్రమ మైనింగ్ క్వారీల నుంచి మెటల్, కంకర, గ్రావెల్, బూడిద చెరువు నుంచి బూడిద రవాణా చేసే వెయ్యికి పైగా టిప్పర్ లారీలు ఇటు మైలవరం, అటు నందిగామ నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. లారీలు బోల్తా పడడం, ఓవర్టేక్ చేస్తూ ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు క్షతగాత్రులుగా మారి జీవనోపాధిని కోల్పోతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న టిప్పర్ల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడింగ్‌తో ప్రమాదం ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంచికచర్ల మండలాల పరిధిలో నిర్వహిస్తున్న రాతి క్వారీలలో కంకర, భారీ బండరాళ్లు, గ్రావెల్‌ను తరలించేందుకు రోజుకి 500 టిప్పర్ లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ బూడిద చెరువు నుంచి బూడిదను తరలించేందుకు రోజూ 400 లారీల వరకు తిరుగుతుంటాయి. ఈ క్వారీలు, బూడిద చెరువు నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనాలు, రహదారులకు నిత్యం వందలాది లారీలతో మెటల్, గ్రావెల్, బూడిద తరలిస్తుంటారు. టిప్పర్ లారీకి సైజును బట్టి 25 నుంచి 30 టన్నులకు మించి రవాణా చేయడానికి వీలు లేకపోయినప్పటికీ ఎక్కువ కిరాయి కోసం 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు కూడా లోడు చేసి రవాణా చేస్తున్నారు. డ్రైవర్లు గ్రామాల్లో చిన్న రోడ్లలో సైతం మితిమీరిన వేగంతో టిప్పర్ లారీలను నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 2న మునగపాడు చెరువు వద్ద కంకర లోడుతో వెళ్తూ బోల్తాపడి దగ్ధమైన టిప్పర్ లారీ జూన్ 6న ఇబ్రహీంపట్నం ట్రక్కు టర్మినల్ వద్ద బోల్తాపడిన బూడిద లోడుతో ఉన్న టిప్పర్ లారీ టిప్పర్ మే సవాల్ గ్రావెల్ లారీ ఢీకొని వృద్ధుడు మృతి టిప్పర్ లారీలను చూస్తే భయమేస్తోంది గ్రావెల్, కంకర లోడుతో వేగంగా వస్తున్న టిప్పర్ లారీలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎక్కువ ట్రక్కులు రవాణా చేస్తే కమీషన్ ఎక్కువ వస్తుందని డ్రైవర్లు వేగంగా నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయి. –పెయ్యల ప్రతాప్, గ్రామస్తుడు, వెలగలేరు జి.కొండూరు: ద్విచక్ర వాహనాన్ని గ్రావెల్ లారీ ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలలోకి వెళ్తే... జి.కొండూరు మండలం వెల్లటూరుకు చెందిన తొర్లికొండ శివయ్య(60) రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శివయ్య గురువారం ఉదయం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై పని కోసం కవులూరు వెళ్తున్నాడు. కవులూరు గ్రామ శివారులోకి రాగానే వెనక నుంచి గ్రావెల్ లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుధాకర్ రోడ్డు మార్జిన్ వైపు పడిపోగా వెనక కూర్చున్న శివయ్య లారీ కింద పడిపోయాడు. శివయ్యపైకి లారీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్ఐ సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శివమ్మ అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు. -
సర్కారు తమాషా
ఎరువుల గోస..14 నెలలుగా ‘గౌరవం’ లేదుమచిలీపట్నంటౌన్: జిల్లాలో యూరియా కొరతపై జెడ్పీ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. జిల్లా వ్యాప్తంగా సరిపడినంత యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై సభ్యులు అధికారులను నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన గురువారం జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా యూరియా కొరత అంశంపై చర్చ సాగింది. వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పోడియంను ముట్టడించారు. ఈ చర్చ జరిగే సమయంలో సభలో సభ్యుల వద్దకు పోలీసులు రావటాన్ని సభ్యులు తప్పుపట్టారు. కొరతే లేదంటూ వితండవాదం.. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి జిల్లాలో యూరియా కొరత లేదంటూ పేర్కొనటంతో పెదపారుపూడి ఎంపీపీ గోదం సురేష్‌తో పాటు జెడ్పీ వైస్‌చైర్మన్ గుదిమళ్ల కృష్ణంరాజు, గన్నవరం, కృత్తివెన్ను, కంచికచర్ల జెడ్పీటీసీలు అన్నవరపు ఎలిజిబెత్ రాణి, మైలా రత్నకుమారి, వేల్పుల ప్రశాంతి, పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని పేర్కొనడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలు పోడియం వద్దకు చేరుకుని ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎంత మేర వరి సాగవుతోంది? దీనికి ఎంత మేర యూరియా అవసరమవుతుందో లెక్కకట్టి, ప్రణాళికాబద్ధంగా అధికారులు వ్యవహరించలేదన్నారు. పీఏసీఎస్‌లకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటంతో చైర్మన్ కనుసన్నల్లో యూరియా వారి పార్టీకి చెందిన వారికి, పెద్ద రైతులకు దొడ్డిదారిన ఇస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం పంట పొట్టదశకు చేరిందని ఇప్పటికీ యూరియా పూర్తిస్థాయిలో అందకపోవటం విచారకరమని పేర్కొన్నారు. దీనికి కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బదులిస్తూ ఏటా మాదిరిగానే ఈ ఏడాది యూరియా సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామని, అయితే తొలి పంట వర్షాలకు దెబ్బతినటంతో మళ్లీ నాట్లు వేశారని, ముంపు బారిన పడిన పొలాలు మళ్లీ ఊడ్చారని దీంతో యూరియా మళ్లీ అవసరం కావటంతో కొరత ఏర్పడినట్లు క్షేత్రస్థాయి పర్యటనలో తన దృష్టికి వచ్చిందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా యూరియాను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే కొంత చేరిందని, మరికొంత రానున్న రోజుల్లో చేరుతుందన్నారు. ● 2024 ఆగస్టులో తువ్వకాలువకు వత్సవాయి నుంచి పెనుగంచిప్రోలు వరకు 20 గండ్లు పడి దాదాపు 2 వేల ఎకరాలకు పైగా భూమి సాగు కావటం లేదని పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీతో పాటు పలువురు జెడ్పీటీసీలు పేర్కొ న్నారు. ఈ గండ్లు పూడ్చేందుకు రూ.1.60 కోట్లను మంజూరు చేసినా, పనులు చేపట్టకపోవటంతో ఇప్పటికీ మూడు పంటలను రైతులు కోల్పోవాల్సి వస్తోందని వివరించారు. గండ్లకు సంబంధించిన ఫొటోలతో మేట వేసిన పొలాల ఫొటోలను వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ వారికి హామీ ఇచ్చారు. ● జెడ్పీటీసీ, ఎంపీపీలకు కూటమి ప్రభుత్వ పాలనలో అధికారులు ప్రొటోకాల్ ప్రాధాన్యం ఇవ్వటం లేదని సభ్యులు కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకువచ్చారు. శిలాఫలకాలపై వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీపీల పేర్లు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు ఫొటోలను జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ బాలాజీలకు చూపించారు. ఇకపై నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ● భోజన విరామం జరిగిన అనంతరం సభలో పంచాయతీరాజ్ డీఈ నగేష్ తాము జిల్లా కలెక్టర్‌కు శిలాఫలకం ప్రొటోకాల్‌ను పంపుతామని ఆయన అప్రూవల్ ఇచ్చిన తర్వాతే వాటిని పెడుతున్నామని పేర్కొన్నారు. జేసీ గీతాంజలిశర్మ కలుగజేసుకుని ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని ఇకపై ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ● రెండు నెలల కిందట గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడికి పాల్పడిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రథమ మహిళకే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని కలెక్టర్ బాలాజీని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బాలాజీ.. ఎస్పీ గంగాధరరావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును తాను కూడా పర్సనల్‌గా తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సభ్యులకు హామీ ఇచ్చారు.జిల్లాలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ సమస్యలను లేవనెత్తేందుకు నిర్వహించే ప్రధాన సమావేశమైన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకపోవటం పట్ల తాము అధికారులకు మాత్రమే చెప్పుకోవాల్సి వస్తోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్న నేపథ్యంలో జరుగుతున్న జెడ్పీ సమావేశానికి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హాజరుకాకపోవటం గమనార్హం.14 నెలలుగా గౌరవవేతనం రావటం లేదని, ఇది త్వరితగతిన ఇప్పించాలని జెడ్పీటీసీ, ఎంపీపీలు కలెక్టర్‌ను కోరారు. గౌరవవేతనం రాకపోవటంతో మండల పరిషత్ సమావేశాలకు ఎంపీటీసీ సభ్యులు హాజరుకామని చెబుతున్నారని, ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీటీసీలకు జెడ్పీ నిధుల నుంచి గౌరవ వేతనం చెల్లించేలా సమావేశంలో తీర్మానించారు. నందిగామ మండలం రాఘవాపురంలో అక్రమ మట్టి తోలే క్రమంలో ఆపరేటర్, లారీ డ్రైవర్ మట్టి కింద పడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేయించాలని కంచికచర్ల, నందిగామ జెడ్పీటీసీలు వేల్పుల ప్రశాంతి, జి. వెంకటేశ్వరరావు తదితరులు అధికారులను కోరారు. విద్యపై జరిగిన చర్చలో తల్లికి వందనం పథకం ద్వారా చాలా మండలాల్లో తల్లులకు రూ. 6వేలు, 7వేలు మాత్రమే పడ్డాయని కొంత మందికి అసలు పడలేదని దీనిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీలు డీఈవో రామారావును కోరారు. సమావేశంలో నూజివీడు సబ్‌కలెక్టర్ బి. వినూత్న, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూ నిర్వాకం.. బాధ్యతారాహిత్యం
గుంటూరు: ఏపీ పీజీ సెట్ నిర్వహణలో ఆది నుంచి జాప్యం చేస్తూ వచ్చిన ఉన్నత విద్యాశాఖ అధికారులు చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లోనూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూలైలో ఏపీ పీజీ సెట్ నిర్వహించారు. వారం పది రోజుల్లోపే ర్యాంక్ కార్డులను విడుదల చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అడ్మిషన్లపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు ఈనెల 8న విడుదల చేశారు. 8 నుంచి 15 వరకు వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి 16 వరకు ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. దీంతోపాటు స్పెషల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 11న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. దీని ఆధారంగా ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ (క్యాప్), దివ్యాంగులు తదితర కేటగిరీలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని వాయిదా వేశామని, ఆ విషయం బుధవారం సాయంత్రం తమ వెబ్ సైట్ ద్వారా తెలియపరచామని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి అక్కడికి చేరుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులతో వాదనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులు వెబ్సైట్లో ప్రకటించిన విషయాన్ని గుర్తించలేదని, ఇప్పుడు ఉన్న పళంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి వెనక్కు పంపడం తగదని విద్యార్థులు అధికారులతో వాదనకు దిగారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జీజీహెచ్ వైద్యాధికారులు అందుబాటులో లేరని, అందువల్ల వాయిదా వేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే వాయిదా వేయాలి గానీ, మిగిలిన వారివి యథావిధిగా నిర్వహించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. అన్ని ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు సులువుగా ఉంటుందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని, మళ్లీ రావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించాలని విద్యార్థులు చేసిన విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదు. హాజరైన విద్యార్థుల నుంచి అధికారులు మొక్కుబడిగా వారి పేర్లు, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. దాదాపు 100 మంది వరకు విద్యార్థులు అక్కడ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేశారనే విషయం తెలుసుకుని ఆలస్యంగా వచ్చిన చాలామంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. మొత్తానికి యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా పీజీ సెట్ విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
డయేరియాపై వదంతులు నమ్మవద్దు
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, వదంతులు నమ్మవద్దని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం మంత్రి పొంగూరు నారాయణ న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించి, డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ)లో మంత్రి నారాయణ.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, పురపాలక శాఖ డైరెక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డయేరియా ప్రబలకుండా ఇప్పటికే తీసుకున్న చర్యలపై చర్చించారు.నీటి సరఫరా నిలిపేయండి..మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజరాజేశ్వరిపేటలో ముందుజాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి ట్యాంకర్ల ద్వారా, వివిధ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించామని.. కాచి వడపోసిన నీటిని తాగడం వంటి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్య శిబిరం, న్యూ జీజీహెచ్‌లో బాధితులకు వైద్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఒకసారి నీటి నమూనాలను పరీక్షించామని తెలిపారు. లోపాలు కనిపించలేదని, మరిన్ని పరీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యకు అసలు కారణాలను విశ్లేషించే పనిలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బాధితులున్న కేర్ అండ్ షేర్ స్కూల్‌కి ఎమ్మెల్యే బొండా ఉమాతో కలిసి వెళ్లి పరామర్శించారు. -
లాఠీలతో కలాన్ని అణచలేరు..
లాఠీలతో కలాన్ని అణచలేరు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలవగలరేమోగాని, పత్రికను నిజాలు రాయకుండా ఆపటం ఎవరివల్లా కాదు. అది ప్రపంచ నియంతల వల్లే కాలేదు. మూడు సంవత్సరాల్లో కూలిపోయే ఈ ప్రభుత్వం నిజాలు వార్తగా రాసే కలాన్ని అదిరించలేదు, బెదిరించలేదు. పత్రికా స్వేచ్ఛ, వాక్స్వాతంత్రపు హక్కు ఈ రాష్ట్రంలో ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. – పేర్ని వెంకట్రామయ్య(నాని), మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు -
సన్న బియ్యం కాదు.. పురుగుల బియ్యం
● విద్యార్థులకు సన్న బియ్యం పేరుతో నాసిరకం బియ్యం సరఫరా ● నిల్వ బియ్యాన్ని పాఠశాలలకు అంటగట్టిన వైనం నందివాడ: మండలంలోని వెన్ననపూడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కోసం పురుగుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తే, అంతకంటే నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే వాస్తవానికి పురుగులతో నిండి ముక్కి పోయిన బియ్యాన్ని వండి పెడుతున్నారు. ఆ పురుగులతో తయారు చేసిన భోజనాన్ని తినలేక విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాలను తెరచి చూస్తే పురుగులే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సన్న బియ్యం కాకపోయినా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సకాలంలో పనులన్నీ పూర్తి చేయండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, దుర్గగుడి ఈవో శీనానాయక్‌లతో కలిసి కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద ప్రారంభమయ్యే క్యూలైన్లు, సీతమ్మ వారి పాదాల వద్ద హోల్డింగ్ పాయింట్లు, కేశఖండనశాలను పరిశీలించారు. హోల్డింగ్ పాయింట్లు పెంచాలి.. ఈ ఏడాది భక్తులను హోల్డింగ్ పాయింట్ ద్వారా క్యూలైన్లోకి అనుమతించాలని, అదే విధంగా రద్దీకి అనుగుణంగా పాయింట్లను పెంచాలని నిర్ణయించారు. క్యూలైన్లలో భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే వారు ఏ విధంగా బయటకు రావాలనే అంశాల గురించి ఇంజినీరింగ్ అధికారులను ఆరా తీశారు. మరుగుదోడ్లు, వైద్య సహాయ కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనే దానిపై భక్తులకు సమాచారం తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పర్యటనలో దుర్గగుడి ఈఈలు కేవీఎస్ కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
అతిసార పాపం ఎవరి పుణ్యం?
అధికారిక లెక్కలు ఇలా... లబ్బీపేట(విజయవాడతూర్పు): అతిసారకు కారణం ఏమిటంటే.. ఉత్సవాల్లో వడ్డించిన భోజనాలే అని అధికారులు చెబుతున్నారు. వినాయక నిమజ్జనం రోజు పగలు వండిన వంటకాలు రాత్రి తిన్నారని అందుకే ఇలా...అని అంటున్నారు. కానీ ఆ ప్రాంత ప్రజలు మాత్రం పైప్లైన్ల నుంచి రంగు మారిన నీరు, దుర్వాసన వస్తున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. పెరుగుతున్న బాధితులు అతిసార బాధితులు గురువారం సాయంత్రం వరకూ ఆస్పత్రులకు పరుగులు పెడుతూనే ఉన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన బాధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారిని ప్రత్యేక వార్డుల్లో అడ్మిట్ చేసి జనరల్ మెడిసిన్ నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. వాంతులు, విరోచనాలు అవడానికి కలుషిత ఆహారం కారణమని అధికారులు చెబుతున్నారు. వంద మందికి పైగా ఎఫెక్ట్ కావడంతో నీరు కూడా కారణమై ఉండవచ్చునని భావిస్తూ ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. వైద్య సేవల పర్యవేక్షణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను గురువారం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ కూడా ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అతిపెద్ద ఎపిడమిక్ సమస్య కావడంతో న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో గ్రామీణ వైద్యుల క్లినిక్స్(ఆర్ఎంపీ)లను మూసివేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశాలు జారీ చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 122 మంది డయేరియా బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారిలో 61 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ఇంకా 61 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రిలో 61 మంది చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. వారిలో పెద్దవాళ్లు కొత్తాస్పత్రిలో, చిన్నారులు పాత ఆస్పత్రిలోని పిడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆయన చెప్పారు. -
రేపు జాతీయ లోక్ అదాలత్
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపీ అన్నారు. రాజీ పడదగిన కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లు, అన్ని రకాల సివిల్ కేసులు ఈ లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చన్నారు.ఉత్సాహంగా కళా ఉత్సవ్ పోటీలుగుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు గ్రామంలోని డైట్ కళాశాలలో గురువారం ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు ఘనంగా జరిగాయి. డైట్ ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కళా ఉత్సవానికి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 55మండలాల నుంచి 242మంది జిల్లా పరిషత్, గవర్నమెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల నుంచి 9, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్ విద్యార్థులు.. గాత్రం, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్య కళలు, సంప్రదాయ కథల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని డైట్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులను ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాల రూపంలో అందించారు.మహిళలు స్వయం సమృద్ధి సాధించాలిగన్నవరం: స్థానిక మండల మహిళా సమైక్య వెలుగు కార్యాలయాన్ని గురువారం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ పరస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన మండల సమైక్య ఈసీ సమావేశంలో పాల్గొన్న ఆయన స్వయం సహాయక సంఘాల పనితీరుపై సమీక్ష జరిపారు. మండల సమైక్య విజన్ బిల్డింగ్ నిర్దేశాలు, లక్ష్యాలు, వాటిని సాధించడానికి సభ్యుల ప్రణాళికలు, సబ్ కమిటీల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసరపల్లిలోని చరిత గ్రామెక్య సంఘం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఫర్నీచర్ వ్యాపారం, బోటిక్ డిజైనింగ్ వర్క్స్, వన్ గ్రామ్ గోల్డ్, పిండి మర నిర్వహిస్తూ ఆదాయం సాధిస్తున్న మహిళలను ఆయన అభినందించారు. మిగిలిన సభ్యులు కూడా సంఘం ద్వారా పొందిన రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. మండల సమైక్య అధ్యక్షురాలు కె. రమా, కార్యదర్శి డి. సుశీల, కోశాధికారి పద్మ తదితరులు పాల్గొన్నారు.చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లురైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి–అనకాపల్లి ప్రత్యేక రైలు (07035) ఈ నెల 13 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతి శనివారం నడవనుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07036) ఈ నెల 14 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి ఆదివారాల్లో నడపనున్నారు. రెండు మార్గాలలో ఈ రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్లు, మహబూబాబాద్, డోర్నకల్లు, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి స్టేషన్లలో ఆగుతుంది. -
కన్న తండ్రే కడతేర్చాడు!
మైలవరం: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు. రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్‌పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు. ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు. చంపేసి.. విసిరి పారేసి.. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
పోలీసుల ఆరోగ్య సంరక్షణకు ‘హెల్త్ ఫస్ట్–1991’
లబ్బీపేట(విజయవాడతూర్పు): నిరంతరం ప్రజాసేవలో మమేకమవుతున్న పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్‌ను గురువారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ యాప్‌లో 14 వేల మందికిపైగా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడిన సభ్యులు అనుసంధానమై ఉంటారని ఆయన తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీసుల వైద్య సేవల కోసం ఆరోగ్య భద్రత ఉన్నప్పటికీ, అన్ని రకాల సేవలు దానిలో కవర్ కావడం లేదని, దీంతో చాలా మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించి, 1991 బ్యాచ్ పోలీసు అధికారులు చొరవ చూపినట్లు తెలిపారు. 29 ప్రత్యేక విభాగాల్లో.. జిల్లాలోని 26 ప్రముఖ హాస్పిటల్స్‌తో మాట్లాడి ఉచిత కన్సల్టేషన్తో పాటు, వైద్య ఖర్చులో 20 నుంచి 30 శాతం రాయితీ ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నట్లు సీపీ తెలిపారు. అందులో భాగంగా 29 ప్రత్యేక విభాగాల్లో 106 మంది డాక్టర్లు స్పందించి పోలీసులకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. డీసీపీ కేజీవీ సరిత, 1991 అధికారులు పాల్గొన్నారు. పెడన: మండలంలోని బలిపర్రు గ్రామంలో ఉన్న లిల్లి స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జీ) సభ్యురాలు కొణతం వినీత కలంకారి యూనిట్‌ను గురువారం సెర్ప్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా మోర్డ్, ఎన్ఆర్ఎల్ఎం జాతీయ స్థాయి మేనేజరు లక్ష్మీకాంత్ పరసర్, జిల్లా ఏడీ శ్రీధరరావు కలంకారీ తయారీదారులతో మాట్లాడి ఎంటర్‌ప్రెన్యూర్‌గా వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో సెర్ప్ బృందం సభ్యులు వాల్మీకి, సత్యభామ, శోభారాణి పాల్గొన్నారు.యాప్‌ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు -
మా పవనన్ననే ప్రశ్నిస్తావా?..
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సుగాలి ప్రీతి ఉదంతం.. 33వేల మందికి పైగా మహిళలు అదృశ్యం తదితర అంశాలపై గతంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరు ఓ మీడియా ఛానెల్లో విమర్శించినందుకు జనసేన మూకలు అతనిపై దాడి చేయడమేకాక అతని దుకాణాన్ని ధ్వంసం చేసిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. పైగా అతనిని మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించి, అతనిపైనే ఫిర్యాదు చేశారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన వివరాలివీ.. బందరు మండలం మంగినపూడి గ్రామానికి చెందిన గిరి వైఎస్సార్సీపీలో క్రీయాశీల కార్యకర్త. ఇటీవల ఆయన ఓ మీడియా చానెల్లో మాట్లాడుతూ.. సుగాలి ప్రీతి ఘటన జరిగింది ఎప్పుడు.. ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరో పవన్‌కళ్యాణ్ తెలుసుకోవాలంటూ విమర్శలు చేశారు. నిజానికి అది టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని.. కానీ, బాధిత కుటుంబానికి న్యాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేశారని ప్రశి్నస్తూ పవన్ విధానాలను ప్రశి్నంచారు.ఈ వీడియో వైరల్ అవడంతో జనసేన నాయకుడు కొరియర్ శ్రీనుతోపాటు దాదాపు యాభై మందికి పైగా గురువారం రాత్రి 10.30 ప్రాంతంలో గిరి ఇంటిపై మూకుమ్మడిగా దాడిచేశారు. ఇంట్లోని వస్తువులతో పాటు అతని దుకాణాన్ని ధ్వంసం చేశారు. అతనిపైనా విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. అంతేగాక.. గిరిని మోకాలిపై కూర్చోబెట్టి జనసేన నాయకులకు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. అలాగే, దెబ్బలు తిన్న గిరిపైనే బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి కేసు పెట్టించేందుకు బరితెగించారు. జనసేన నేతలపై పేర్ని నాని మండిపాటు.. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి పేర్ని నాని జనసేన నాయకులపై మండిపడ్డారు. అకారణంగా, అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించాలని చూసినా.. దాడికి పాల్పడిన జనసేన నాయకులకు పోలీసులు కొమ్ముకాయాలని చూసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బందరు డీఎస్పీ సీహెచ్ రాజాను కలిసి హెచ్చరించారు.తమ పార్టీ కార్యకర్తకు న్యాయం జరగకుంటే ఎంత దూరమైనా వెళ్తానన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ఏసుబాబు, ఎస్ఐ సత్యనారాయణ మంగినపూడి గ్రామానికి చేరుకుని వివరాలు నమోదుచేసుకున్నారు. మరోవైపు.. డీఎస్పీ కార్యాలయానికి పేర్ని నాని వచ్చారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. -
‘చట్టం ప్రకారం దళితులకే ఆ భూములు దక్కుతాయి’
కృష్ణాజిల్లా: నాగాపురంలో 21 మంది దళితులకు 42 ఏళ్ల క్రితం ప్రభుత్వమే భూమి ఇచ్చిందని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ దాని మీదే వారు జీవనం గడుపుతున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఇప్పుడు దళితులకి ఆ రోజు ఇచ్చిన భూమి తనదేనంటూ ఓ ప్రైవేటు వ్యక్తి కోర్టుకెళ్లాడని, ప్రభుత్వమే ఆ ప్రైవేటు వ్యక్తి మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. ఈ రాష్ట్రంలో దళితులకు అంబేద్కర్ రూపొందించిన చట్టం ఉందని, చట్ట ప్రకారం ఆ భూములు దళితులకే దక్కుతాయని మేరుగ స్పష్టం చేశారు. ‘తప్పుడు సర్వే రిపోర్టులు ఇచ్చిన వారి పై కేసులు పెట్టాలి. అధికారులు కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నారు. దళితులకు అండగా ఉండేందుకు మేం వస్తే నోటీసులిచ్చారు. ఏ ఉద్ధేశంతో నోటీసులుచ్చారు. ఏ ఉద్ధేశంతో దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు దళితుల భూమిని ఎందుకు లాక్కోవాలని చూస్తున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి దళితుల చట్టాలు పక్కాగా అమలయ్యాయి రాజ్యాంగ బద్ధంగా జగన్ పాలన సాగింది. అంబేద్కర్ ,పూలే ఆలోచనలు వర్ధిల్లాయి. కూటమి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతోంది. నాగాపురంలో దళితుల పై జరుగుతున్న దౌర్జన్య కాండ ఇందుకు నిదర్శనం. వైఎస్సార్సీపీ తరపున మేం అండగా ఉంటాం. నాగాపురం దళితుల భూముల కేసును కృష్ణాజిల్లా కలెక్టర్ సుమోటోగా తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
డయేరియా బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. మెడికల్ క్యాంప్‌లో డయేరియా బాధితులను వైఎస్సార్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై మల్లాది విష్ణు మండిపడ్డారు. గంటగంటకూ బాధితులు పెరుగుతున్నారని.. వారికి మెరుగైన వైద్యం కూడా ప్రభుత్వం అందించలేకపోతోందన్నారు.‘‘ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి వంద మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 30 మందికి పైగానే చికిత్స పొందుతున్నారు. అధికారులు బాధితుల సంఖ్యను తగ్గించి చెబుతున్నారు. మంచినీటి వల్లే సమస్య వచ్చిందని ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఆహారం వల్ల అంటున్నారు. ఎలాంటి పరీక్షలు చేయకుండా నీటి వల్ల కాదని ఎలా నిర్ధారిస్తారు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.‘‘మెడికల్ క్యాంప్‌కు వచ్చే వారికి సరైన వైద్యం కూడా అందించలేకపోతున్నారు. మున్సిపల్ మంత్రి వచ్చి చూసి వెళ్లిపోయారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోపోవటం వల్లే ఈ పరిస్థితి. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 48 గంటల నుంచి ఈ ప్రాంతం భయంకరమైన వాతావరణంలో ఉంటే అధికారులు మీటింగ్‌లకు పరిమితమయ్యారు...అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా..? పేషెంట్లను కుర్చీలో కూర్చోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వం శానిటేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
స్పెషల్ డ్రైవ్ చేపట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా డెంగీ, మలేరియా, డయేరియా కేసులు నమోదైతే పరిసర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటికి క్రమంతప్పకుండా పరీక్షలు నిర్వహించి, నివేదికల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నిలిచిన నీటి నమూనాలకు కూడా బ్యాక్టీరియలాజికల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లు చేపట్టాలని, ఓవర్‌హెడ్ రిజర్వాయర్ల క్లీనింగ్, క్లోరినైజేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. డ్రెయిన్లలో డీ సిల్టేషన్‌కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. డీపీఓ పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. -
మెదడులో మాంసం తినే పరాన్నజీవి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగి మెదడులో మాంసం తింటున్న అరుదైన పరాన్నజీవిని విజయవాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు శస్త్ర చికిత్సతో తొలగించారు. అనంతరం దానిని నిర్ధారించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కోల్‌కత్తాలోని జీవశాస్త్ర నిపుణులకు పంపించారు. మాంసం తినే స్క్రూవార్మ్ పరాన్నజీవిగా వారు నిర్ధారించినట్లు జీజీహెచ్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్‌కుమార్ తెలిపారు. ఈ పరాన్నజీవిని తొలిసారిగా అమెరికాలో ఈ ఏడాది ఆగస్టు నాలుగో తేదీన గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కేసు వివరాలు ఇలా... తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలో ఉన్న 50 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు విజయవాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు ఆమెను పరీక్షించి, తలనుంచి చీము కారుతోందని గుర్తించారు. స్కాన్ చేసి ఆమె మెదడులో చీము గడ్డ ఉన్నట్టు నిర్ధారించారు. మానని లోతైన గాయంలో కదులుతున్న క్రిములను మాగ్గోట్‌లుగా గుర్తించారు. ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసేందుకు నిర్ణయించి తొలుత తలలోని పుండు నుంచి మాగ్గోట్లను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం తలపై గాయాన్ని తొలగించి శుభ్రపరచడంతో పాటు, శస్త్ర చికిత్స చేసి మెదడులోని చీము గడ్డను తొలగించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎ.ఆర్.సి.హెచ్.మోహన్ సారథ్యంలో ఫ్లాప్ సర్జరీ చేసి తలపై ఉన్న గాయాన్ని కప్పేశారు. ప్రస్తుతం రోగి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. నిర్ధారణ ఇలా... మెదడు నుంచి తొలగించిన మాగ్గోట్లను, క్రిమి గురించి ఆంధ్రా యూనివర్సిటీ జీవశాస్త్ర నిపుణులు డాక్టర్ జ్ఞాణమణి, గుంటూరు లామ్ నిపుణులు రత్నంను సంప్రదించగా వారు స్క్రూ వార్మ్లుగా గుర్తించారు. అనంతరం కోల్‌కత్తాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని కూడా సంప్రదించి స్క్రూవార్మ్లుగా నిర్ధారణ చేశారు. సాధారణంగా ఈగల నుంచి జనించే మాగ్గోట్లు జంతువులు, మనుషుల శరీరంలో చెడిపోయిన, కుళ్లిన నిర్జీవ కణజాలాలపై మాత్రమే ఆధారపడి జీవిస్తాయి. కానీ స్క్రూవార్మ్ సజీవ కణజాతాలను సైతం తినే పరాన్నజీవులుగా జీవిస్తాయని వైద్యులు తెలిపారు. అరుదైన సర్జరీచేసిన న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు. రోగి మెదడులో నుంచి తీసిన అరుదైన పరాన్నజీవి స్క్రూవార్మ్ -
నేడు సేపక్ తక్రా సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సబ్ జూనియర్స్ బాల బాలికల జిల్లా జట్లను ఎంపికలను గురువారం నిర్వహిస్తున్నామని ఆ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.పవన్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీల్లో అనంతపురం ఉరవకొండలోని జెడ్పీహెచ్ స్కూల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. సబ్ జూనియర్ విభాగంలో 1–1– 2011 తర్వాత పుట్టిన వారు మాత్రమే పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని, ఆసక్తి ఉన్న వారు ఉదయం 7 గంటలకు 4 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని కోరారు. తిరువూరు: విస్సన్నపేట మండలం చండ్రుపట్లకు చెందిన యువతి(23)పై అదే మండలంలోని తాతకుంట్లకు చెందిన వడిత్యా శ్రీనివాస్(25) మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏడాది కాలంగా తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెబుతూ శారీరకంగా వాడుకున్న శ్రీనివాస్.. ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడని ఆ యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో యువతి తల్లిదండ్రులు, యువకుడి కుటుంబ సభ్యులతో కొందరు పెద్దలు రాజీ కోసం మంతనాలు చేసినా.. బాధితురాలు తనకు న్యాయం చేయాలని చెప్పడంతో శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. కప్తానుపాలెం(మోపిదేవి): కుమార్తె బాధను చూడలేక తన వయస్సును, వృద్ధాప్యాన్ని లక్ష్యపెట్టక తండ్రి కిడ్నీదానం చేసిన ఘటన మండలంలోని కప్తానుపాలెంలో ఇటీవల చోటుచేసుకుంది. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు వారి ఇంటి వద్ద పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ రెండు కిడ్నీలు కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు కిడ్నీ దానం చేసి ఆమెకు పునర్జన్మ ఇచ్చిన విశ్రాంత టీచర్, మాజీ రాష్ట్ర పీఆర్టీయూ నేత అడవి శ్రీరామమూర్తి అన్నారు. భార్య మరణించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ధైర్యంగా కుమార్తెకు కిడ్నీని దానం చేసిన ఆయన త్యాగానికి ప్రతిరూపంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీరామమూర్తిని సత్కరించారు. -
దేవుని మాన్యంలో ఆగిన మట్టి తోలకాలు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడకు కూత వేటు దూరంలోని గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యం ఉంది. ఈ మాన్యం భూముల్లో అనుమతులు లేకుండా విజయవాడ ఉత్సవ్ పేరుతో మట్టి తోలి చదును చేసే పనులు నిలిచిపోయాయి. ఇక్కడ జరుగుతున్న పనులపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీసి, దేవదాయ శాఖ పొలాల్లో ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీలోని వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. విజయవాడ ఉత్సవాలకు వేరే ప్రైవేటు స్థలాన్ని చూసుకోవాలని చెప్పినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేవుడి మాన్యం చదునుపై అనుమానాలు దేవుడి మాన్యం భూమిని చదును చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ఉత్సవ్ అనేది ప్రభుత్వ కార్యక్రమమా? ప్రైవేటు కార్యక్రమమా? అనే స్పష్టత ఇప్పటికీ లేదని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటి నిర్వహణకయ్యే ఖర్చును ఏవిధంగా సమకూర్చుతున్నారనే అంశంపైనా చర్చ సాగుతోంది. ప్రముఖులు, వ్యాపార సంస్థల నుంచి చందాల వసూళ్లకు ప్రణాళిక రచించారనే ఆరోపణలపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. విజయవాడ ఉత్సవ్ వెనుక భారీ, దీర్ఘకాలిక ప్రణాళిక ఉందని టీడీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలంలో గుంటూరుకు చెందిన ఓ మీడియా సంస్థ మల్టీ కాంప్లెక్స్‌లు, మల్టీ థియేటర్లు నిర్మిస్తుందని, ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మరో నేత రిక్రియేషన్ క్లబ్, ఓ ప్రముఖ హోటల్ సంస్థ యజ మాని స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతారని, మరో టీడీపీ నాయకుడు క్యాంటీన్లు, చిన్న హోటళ్లు ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం జరిగిందని కూటమి నాయకులు పేర్కొంటున్నారు. ఆ స్థలంపై కన్నేసిన వారిలో కొంత మంది ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్ల కోసం పెట్టుబడులు పెట్టడంతోపాటు, పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసేందుకు రూప కల్పన జరిగిందని సమాచారం. అయితే ఈ విషయాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి చేరాయని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. పెద్దలకు విన్నపాలు విజయవాడ ఉత్సవ్ జరుపుతామని ప్రచారం చేశామని, ఎలాగైనా అక్కడే ఉత్సవాలు జరపా లని టీడీపీ నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తాత్కాలికంగా అయినా ఉత్సవాలకు అనుమతి ఇప్పించాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు. ఇప్పటికే లీజు ఉండటంతో, వారి నుంచి సబ్ లీజుకు తీసుకొనే అవకాశం లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆ లీజుదారులను ఒప్పించి వారి లీజు రద్దు చేసి, గుడికి ఆదాయం ఎక్కువగా వస్తుందని చూపి, తాత్కాలికంగా ఈ ఉత్సవాల వరికై నా అనుమతి పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పంటలు పండే పొలంలో కోట్ల రూపా యల మట్టిని ఆ ప్రదేశంలో నింపారు. ఈ మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులూ తీసుకో లేదు. ప్రభుత్వం ఈ భూమి కేటాయింపులు నిలిపి వేసినా మూడు అడుగుల మేర నింపిన మట్టి తొలగింపు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మొత్తం మీద గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొంటుందనే విషయం చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే గుడి కమిటీ, విశ్వ హిందు పరిషత్ సంస్థ సభ్యులు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడిలో సమావేశమై ఆ భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపై కార్యాచరణ రూపొందించారు. దేవుడి మాన్యంపై కూటమి నేతల కన్ను గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యంపై విజయవాడ పార్లమెంట్ ముఖ్యనేతతో పాటు, మరికొంత మంది టీడీపీ నేతల కన్ను పడింది. విజయవాడ ఉత్సవ్ ముసుగులో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఎత్తుగడ వేశారు. రూ.400 కోట్ల విలువైన ఈ 39.99 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పేరుతో ఐదు ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల పేరుతో ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్‌హెచ్‌జీ మేళా, అగ్రిటెక్ షో, టూరిజం ప్రమోషన్ ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు శాశ్వత వేదిక నిర్మాణం పేరుతో మరో 34.99 ఎకరాల భూమి లీజు కోసం జిల్లా యంత్రాంగం నుంచి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి పనులూ మాన్యం భూమిలో చేపట్టరాదని దేవదాయశాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి అధికారికంగా తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. -
విశ్వనాథ సాహిత్యం అజరామరం
విజయవాడ కల్చరల్: విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం అజరామరమని వేముల చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకుడు వేముల హజరత్తయ్య గుప్తా అన్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ 131వ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుప్తా మాట్లాడుతూ విశ్వనాథ సాహిత్యం వెలకట్టలేనిదన్నారు. ప్రభుత్వం విశ్వనాథ పేరుతో ఏటా సాహితీ సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో వేముల చారిటీస్ కన్వీనర్ ఎంవీ చలమయ్య, వాయిద్య కళాకారుడు యలమంద, శ్రీనివాసరావు, రవికుమార్, పైడేటి భాను పాల్గొన్నారు. ● సంస్కార భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్లోని విశ్వనాథ సత్యనారాయణ విగ్రహంవద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. విశ్వనాథ శిష్యుడు డాక్టర్ శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విశ్వనాథ చేపట్టని సాహిత్య ప్రక్రియలేదన్నారు. సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ, బోడి ఆంజనేయరాజు, రాంకుమార్, రూపాశ్రీ, సంస్కార భారతి నగర అధ్యక్షుడు పి. భాస్కర శర్మ, డూండీ పాల్గొన్నారు. ● భారతీయ జనతా పార్టీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్లోని విశ్వనాథ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం ఆధ్వర్యంలో పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వనాథ సత్యనారాయణ మనుమడు విశ్వనాథ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. -
ఐటీఆర్‌లో నకిలీ బ్యాంకు స్టేట్మెంట్లు
22మంది వైద్య, ఆరోగ్యశాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలు మచిలీపట్నంఅర్బన్: ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం నకిలీ బ్యాంకు హౌసింగ్ లోన్ స్టేట్మెంట్లు సమర్పించిన ఆరోపణలపై ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలోని ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గతంలో జిల్లా మలేరియా అధికారి కార్యాలయంలో పనిచేసిన మల్టీ పర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి (ఎంపీహెచ్ఈఓ) వీవీ సర్వారాయుడు సహా మొత్తం 42 మంది ఉద్యోగులపై విచారణ జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు 2016లో వచ్చిన పోస్టుకార్డు పిటిషన్ ఆధారంగా అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో ఉద్యోగులు ఆదాయపు పన్ను సమర్పణలో మినహాయింపులు పొందేందుకు నకిలీ హౌసింగ్ లోన్ స్టేట్మెంట్లు సమర్పించారని తేలింది. దీనిపై 42 మంది ఉద్యోగులపై శాఖ చర్యలు చేపట్టాలని నివేదికలో సిఫార్సు చేశారు. ఈ సిఫార్సుల మేరకు అప్పటి ఎంపీహెచ్ఈఓ వీవీ సర్వారాయుడుతో సహా 21 మందికి ఆరోపణల పత్రాలు జారీ అయ్యాయి. వారు ప్రారంభంలో ఆరోపణలను ఖండిస్తూ రాతపూర్వక సమాధానాలు సమర్పించారు. తప్పును ఒప్పుకుంటూ.. అనంతరం సర్వారాయుడు సహా 33 మంది ఒక సార్వత్రిక ప్రతినిధి పత్రం సమర్పించారు. అందులో ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పణలో అనుభవం లేకపోవడంతో ఆడిటర్ సూచనల ప్రకారం నకిలీ పత్రాలు జత చేశామని, విజిలెన్స్ శాఖ వాస్తవాలు వెల్లడించిన వెంటనే రివైజ్డ్ ఐటీ రిటర్న్ దాఖలు చేశామని పేర్కొన్నారు. తమ తప్పును మానవతా ధృక్పథంలో మన్నించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, తప్పుడు చర్యలకు పాల్పడినందుకు ప్రస్తుత సేవలో ఉన్న సర్వారాయుడుతో సహా మరో 21 మందిపై రెండు వార్షిక వేతన పెరుగుదలలు నిలిపివేత (క్యూమ్యులేటివ్ ఎఫెక్ట్ లేకుండా) శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఫ్లెక్సీ వ్యాపారులు నిబంధనలు పాటించాలి
కోనేరుసెంటర్: శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించేలా ఫ్లెక్సీ వ్యాపారులు ప్రింట్లు వేసినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. బుధవారం ఆయన మచిలీపట్నంలోని ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిన సందర్భాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఫ్లెక్సీల కారణంగా అనేక ప్రాంతాల్లో వివాదాలు, ఘర్షణలు జరిగిన సంఘటలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ వ్యాపారులు మతాలను, కులాలను, ప్రాంతాలను, వర్గాలను, వ్యక్తులను కించపరిచే విధంగా ఎవరైనా ఫ్లెక్సీలు ప్రింట్ వేయమని అడిగితే వెంటనే నిరాకరించాలని తెలిపారు. ఒకవేళ అలాంటి ఫ్లెక్సీలు ప్రింటింగ్ వేయాలని ఎవరైనా వచ్చి అడిగినట్లయితే తక్షణమే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే ప్రింటింగ్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ప్రింటింగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు -
ప్రగతి సూచికలపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ విభాగాల కీలక ప్రగతి సూచికల (కేపీఐ) పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నాలుగు సూచికలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యాన శాఖ అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పని దినాల కల్పన, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడానికి సంబంధించిన అంశాల్లో నిర్దేశించిన నెలవారీ, త్రైమాసిక, వార్షిక లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సగటు వేతనం రూ. 307 ఉపాధి హామీ శ్రామికులకు అందేలా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్నారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి మార్గం వేసే ఉద్యాన పంటల దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ ఏడాదికి జిల్లా మొత్తంమీద 4వేల ఎకరాలను, ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 20 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇప్పటివరకు 3,741 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా మునగ సాగుకు 894 ఎకరాలను గుర్తించినట్లు వివరించారు. మండలాల వారీగా లేబర్ మొబిలైజేషన్, సీసీ రహదారుల నిర్మాణం, పశువుల షెడ్లు, జీవాల షెడ్ల నిర్మాణం, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం తదితరాలపైనా సమావేశంలో సమీక్షించారు. డ్వామా పీడీ ఎ.రాము పాల్గొన్నారు. -
గ్రంథాలయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల గ్రంథాలయ పోస్టులను వెంటనే భర్తీ చేసి రెండు లక్షలమంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ అసోసియే షన్ కార్యదర్శి డాక్టర్ రావి శారద, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ – ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద బుధవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో సీఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, నెట్, సెట్, పీహెచ్డీ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగుల సంఖ్య రెండు లక్షలకు చేరిందని తెలిపారు. ఖాళీగా ఉన్న లైబ్రరీయన్ పోస్టుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గతంలో ఏపీపీఎస్సీ దగ్గర నిలిచిపోయిన జూనియర్, డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కార్యదర్శి లక్ష్మయ్య, ఏపీ లెబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ కె.జగదీశ్, డీవైఎఫ్ఐ నాయకులు పి.కృష్ణ, పిచ్చయ్య, కృష్ణ కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రైళ్లలో స్నాచింగ్‌లు.. పాత నేరస్తుడు అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో వరుస దొంగతనాలు, మహిళల మెడలోని బంగారు ఆభరణాల స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే ఆలీబేగ్తో కలసి జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి రమణ వివరాలు వెల్లడించారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో.. తిరుపతికి చెందిన బండి రాజ్యలక్ష్మి ఆగస్టు 23న తిరుపతి నుంచి వరంగల్లుకు పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తోంది. రైలు విజయవాడలో ఆగి బయలుదేరే సమయంలో గుర్తు తెలియని ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు నానుతాడును తెంచుకుని కదులుతున్న రైలు నుంచి దూకి పరారయ్యాడు. అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించి రెండు రోజుల తరువాత విజయవాడ చేరుకుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విజయవాడ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరస్తుడి కోసం గాలింపు చేపట్టారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను పర్యవేక్షించడం, పాత నేరస్తులను విచారించడం ద్వారా చోరీకి పాల్పడింది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్‌కు చెందిన తండ్రికంటి రమేష్‌గా గుర్తించారు. ఇతనిపై గతేడాది విజయవాడ స్టేషన్లో స్నాచింగ్ కేసులోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ముమ్మర గాలింపు.. పోలీసులకు అందిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం హైదరాబాద్, వరంగల్లు, ఖమ్మంలో గాలింపు చేపట్టినా పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం నిందితుడు విజయవాడలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద బంగారు ఆభరణాలను విక్రయించేందుకు తిరుగుతుండగా.. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి స్నాచింగ్‌కు పాల్పడిన లక్షరూపాయల విలువ చేసే 25 గ్రాముల బంగారు నానుతాడుతో పాటుగా గతంలో చోరీ చేసిన నాలుగు లక్షల విలువైన రెండు సూత్రాలతో కూడిన 40 గ్రాముల బంగారు నానుతాడును కూడా పోలీసులు రికవరీ చేశారు. రూ. 5లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం -
సరిపడా యూరియా ఇవ్వడం లేదు
చల్లపల్లి: యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ యూరియా సరఫరా చేసేందుకు సరిపడా నిల్వలు ఉన్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ రైతులతో అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురం పీఏసీఎస్‌లో బుధవారం రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. కలెక్టర్ బాలాజీ వచ్చి పంపిణీని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వరి సాగుపై ఆరా తీశారు. ప్రస్తుతం ఇస్తున్న యూరియా సరిపోవటం లేదని పూర్తిస్థాయిలో అందించాలని రైతులు కోరారు. ఘంటసాల మండలం మల్లంపల్లి, లంకపల్లి గ్రామాల్లో ఇంకా యూరియా అవసరం ఉందని లంకపల్లికి 50 టన్నులు, మల్లంపల్లికి 30 టన్నుల యూరియా అవసరం ఉందని దాలిపర్రుకు చెందిన రైతు వీరమాచినేని భవానీప్రసాద్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆందోళన వద్దు.. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత యూరియాను తెప్పిస్తున్నామని యూరియా ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ఎక్కువగా యూరియా వాడటం వల్ల పంట నాణ్యత దెబ్బతింటుందన్నారు. కాబట్టి రైతులు ఎక్కువగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కలెక్టర్ వెంట మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, ఏడీఏ ఎస్.శ్యామల, వ్యసాయ, రెవెన్యూ మండల అధికారులు తదితరులు ఉన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీకి వివరించిన రైతులు -
బెజవాడలో మృత్యుఘోష
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో డయేరియా పడగవిప్పింది. న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇప్పటికే ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. వంద మందికి పైగా బాధితులు ఆస్పత్రులు, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారని సమాచారం. న్యూ రాజరాజేశ్వరి పేటలో వారం రోజులుగా కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటి నుంచి దుర్వాసన వస్తోంది. అయినా నగర పాలక సంస్థ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల ఏడో తేదీ నుంచి ఆ ప్రాంతంలో అతిసార కేసులు నమోదవుతున్నాయి. అధికారులు మాత్రం మంగళవారం రాత్రి తీసుకున్న కలుషిత ఆహారం కారణమని చెప్పుకొస్తున్నారు. బుధవారం మరికొందరు స్థానికులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. కొందరు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతిసారతో ఎంత మంది బాధపడతున్నారనేది అధికారులకు కూడా అంతుచిక్కని పరిస్థితి. వంద మంది వరకూ వేర్వేరు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వారిలో చిన్నారులు, వృద్ధులు ఉండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.ఉరుకులు పరుగులున్యూ రాజరాజేశ్వరిపేట నుంచి అతిసారతో బాధితులు ఆస్పత్రుల దారి పట్టారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సైతం బాధితులు రాగా ప్రాథమిక వైద్యం అందించి పంపించేశారు. అదే సమయంలో పలువురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బుధవారం ఉదయానికి పరిస్థితి తీవ్రమైంది. వాంతులు, విరేచనాలతో బాధపడే బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో వైద్య శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని బాధితులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు. కొందరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మరి కొందరికి సింగ్‌నగర్ యూపీహెచ్‌సీలో వైద్యం అందించారు. అయితే ఎంత మంది అతిసారకు గురయ్యారనే విషయం లెక్కతేలడం లేదు. మరో వైపు అతిసారకు తాగునీరు కారణమా అనే విషయం తేల్చేందుకు గురువారం వాటర్ ఎనలిస్ట్స్ ఆ ప్రాంతంలో పర్యటించి శాంపి ల్స్‌ను పరీక్షించనున్నారు.జీజీహెచ్‌లో 25 మందిఅతిసార బాధితులు ప్రస్తుతం 25 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మరొక చిన్నారి పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారికంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు ప్రకటించారు. మరో ముగ్గురు మంగళవారం రాత్రి చికిత్స కోసం రాగా వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు నిర్ధారించి పంపించివేసినట్లు తెలిపారు. బాధితుల నుంచి రక్త, మల, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ జి.లక్ష్మీశ పరామర్శించారు. బాధితులకు మెరుగైన, వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.28 మందిని నిర్ధారించాంఅతిసారకు గురైన వారు 28 మంది వేర్వేరు ప్రాంతాల్లో చికిత్స పొందినట్లు నిర్ధారించామని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. మరో ఆరుగురు ఓపీలో పరీక్షలు చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు. ఇప్పటికే 735 గృహాలను సర్వేచేశామని, గురువారం మరిన్ని గృహాలను సర్వే చేస్తా మని పేర్కొన్నారు. ఎక్కువ మంది సమీపంలోని ఆర్ఎంపీల వద్దకు వెళ్లారని, వారి వివరాలు తీసు కున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఎంత మంది వెళ్లారనే సమాచారం సర్వేలో రాలేదన్నారు. తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని, వాటి ఫలితాలు వచ్చేందుకు మూడు రోజుల సమయం పడుతుందన్నారు.బాధితులకు మల్లాది విష్ణు పరామర్శప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని, పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు విమర్శించారు. న్యూఆర్ ఆర్పేటలో కలుషిత నీరు తాగి ప్రజలు చనిపో వడం, డయేరియా బారిన పడ్డారని తెలుసుకున్న ఆయన పార్టీ నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు పక్కనే ఉన్న తురకపాలెంలో నాలుగు నెలల వ్యవధిలో 40 మంది చనిపోయారని, ఇప్పుడు న్యూరాజరాజేశ్వరీపేటలో ఇద్దరు మృతిచెందగా, అనేక మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యా రని ఆందోళన వ్యక్తంచేశారు. కుళాయిల్లో వచ్చే నీటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ ప్రాంతానికి కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఉన్నతాధికారులను పంపి వ్యాధికి కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్ ఇసరపు దేవి, వైఎస్సార్ సీపీ నాయకులు ఇసరపు రాజు, ఆదినారాయణ, పఠాన్ నజీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లీ ‘కట్ట’కట?
కంకిపాడు: యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. యూరియా కట్ట కోసం రైతులు క్యూ కడుతున్నారు. పీఏసీఎస్‌ల వద్ద కట్టల కోసం తోపులాటలు, గంటల కొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోంది. యూరియా అందు బాటులో ఉందని అధికారులు చెబుతున్నా, యూరియా అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారంటే కూటమి ప్రభుత్వ ప్రచారంలో వాస్తవం ఎంతో అర్థం చేసుకోవచ్చు. సొసైటీల వద్ద పడిగాపులు.. పీఏసీఎస్‌లకు యూరియా స్టాకు రావటంతో అధికారులు వచ్చి, స్లిప్పులు పంపిణీ చేసే వరకూ యూరియా సరఫరా జరగకపోవటంతో రైతులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. అధికారులు వచ్చిన తర్వాత ఒక్కో రైతుకు ఎకరాకు అరకట్ట చొప్పున గరిష్టంగా మూడు కట్టలు చొప్పున మాత్రమే పంపిణీ చేస్తూ స్లిప్పులు అందజేశారు. బుధవారం మండలంలోని ఉప్పలూరు, పునాదిపాడు, మంతెన, కోలవెన్ను, తెన్నేరు, ప్రొద్దుటూరు, నెప్పల్లి సొసైటీలకు 15 టన్నులు చొప్పున, గొడవర్రు, మద్దూరుకు 10 టన్నులు యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా ఆయా సొసైటీలకు చేరుకోవటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. పంట పొలాలు చిరుపొట్ట దశకు చేరుకోవటంతో ఈ దశలో యూరియా అందించాలని, అదును తప్పితే దిగుబడులుపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు చెబుతున్నారు. సమస్యను అధిగమించేందుకు రైతాంగం యూరియా కోసం సొసైటీల వద్ద క్యూలు కట్టారు. ఉప్పలూరు, గొడవర్రు సొసైటీల వద్ద స్లిప్పులు కోసం రైతులు పోటీ పడటంతో ఒకానొక దశలో రైతుల మధ్య తోపులాటలు, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. సొసైటీలకు యూరియా నిల్వలు వచ్చినా అది కూడా అరకొరగానే పంపిణీ జరిగిందని, పూర్తి స్థాయిలో యూరియా అందలేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు అరకట్ట యూరియా సరిపోదని, కట్ట సరఫరా చేస్తే మేలు జరుగుతుందని కోరుతున్నారు. అధికారుల పర్యటన.. మండలంలోని సొసైటీల్లో జరుగుతున్న యూరియా పంపిణీ తీరును జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, విజిలెన్స్ డీఎస్పీ బంగార్రాజు పరిశీలించారు. కోలవెన్ను, ఉప్పలూరు, గొడవర్రు, పునాదిపాడు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు ఎకరాకు కట్ట చొప్పున యూరియా పంపిణీ చేయాలని కోరారు. అదును పోక ముందే పంటకు యూరియా, కాంప్లెక్సు ఎరువులు అందించాలని, రైతుల అవసరాలను గుర్తించి ఎరువులు అందించాలని విన్నవించారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి మాట్లాడుతూ రైతుల అసరాల మేరకు ఎరువులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పర్యటనలో మండల వ్యవసాయాధికారి వెలివెల ఉషారాణి, సిబ్బంది పాల్గొన్నారు. సమస్యే లేదంటున్న ప్రభుత్వం అన్నదాతలకు తప్పని పడిగాపులు అరకట్ట కోసం క్యూలు కడుతున్న వైనం పీఏసీఎస్‌ల వద్ద తోపులాటలు, వాగ్వాదాలు -
విజయవాడలో కలుషిత నీరు కలకలం
సాక్షి,విజయవాడ: న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. వాంతులు, విరేచనాలతో న్యూ రాజరాజేశ్వరి పేట వాసులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలతో శ్రీరామ నాగమణి అనే మహిళ మృతి చెందారు. కలుషిత నీరు తాగి సుమారు 16మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రెండురోజుల నుంచి న్యూ రాజరాజేశ్వరి పేట వాసులు అనారోగ్యంపై సమాచారం అందుకున్న వైద్యులు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రజల అనారోగ్యానికి ఇప్పటి వరకూ సరైన కారణం తెలియలేదని డీఎం&హెచ్ఓ సుహాసిని తెలిపారు. అయితే, కలుషిత నీరు తాగడం వల్లే తాము అనారోగ్యానికి గురయ్యామని న్యూరాజరాజేశ్వరీ పేట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైనా ప్రభుత్వం సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించడం విఫలమైందని మండిపడుతున్నారు. -
నందిగామ: వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. నందిగామలో అన్నదాత పోరులో పాల్గొన్నందుకు అక్రమ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ర్యాలీపై నందిగామ ఏఎస్ఐ లంకపల్లి రవి ఫిర్యాదు చేశారు. సెక్షన్ 30 నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా నిరసన, ర్యాలీ చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావులతో పాటు మొత్తం 20 మంది పై కేసులు చేశారు. -
లోకల్ లారీ ఓనర్ల పొట్టకొట్టొద్దు
ఇబ్రహీంపట్నం: ఏపీ జెన్కో సంస్థ లోకల్ లారీ యజమానుల పొట్టకొట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు బూడిద చెరువు అప్పజెప్పడం అన్యాయమని లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు కాంట్రాక్ట్ వ్యవస్థను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణకు మంగళవారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. లారీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆస్తులు అమ్ముకుని లారీలు కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు బూడిద కాంట్రాక్ట్ కట్టబెట్టి తమకు అన్యాయం చేస్తే చూస్తూ సహించబోమని హెచ్చరించారు. ఉచిత బూడిదను అమ్మకానికి పెట్టి స్థానికుల పొట్టకొట్టొద్దన్నారు. ఏపీ జెన్కో, ఎన్టీటీపీఎస్ నిరంకుశ వైఖరిని ఖండించారు.కంచికచర్ల: జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సి అవసరం లేదని, నానో యూరియాపై రైతులు అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా అన్నారు. మంగళవారం కంచికచర్లలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని చందర్లపాడు మండలం కోనాయిపాలెం ప్రాథ మిక సహకార పరపతి సంఘాన్ని పరిశీలించారు. ముందుగా ఎరువుల దుకాణానికి వచ్చిన రైతులతో జేసీ మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 4,003 టన్నుల యూరియా అందు బాటులో ఉందని, మరికొంత యూరియా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. వరి నాటు వేసినప్పుడు ఎకరానికి 30 కేజీల యూరియా, నాటు వేసిన 30రోజులకు రెండో విడతగా మరో 30 కేజీలు, అంతేకాకుండా నాటు వేసిన మూడో విడత ఎకరానికి 30కేజీల యూరియాను వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని జేసీ అన్నారు. తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, ఆర్ఐ వెంకటరెడ్డి, ఏఓ కె. విజయకుమార్, రైతులు పాల్గొన్నారు.జగ్గయ్యపేట అర్బన్: ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం జగ్గయ్యపేటలో ఎన్నుకున్నారు. స్థానిక పోస్టాఫీసు ఎదురుగా ఉన్న సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్ అబ్బాస్ ఆలీ, కొత్తపల్లి కోటేశ్వరరావు, కోశాధికారిగా కర్లపాటి కొండలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పరిశీలకుడు విష్ణువర్థన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ వైద్యాధికారి నోముల అనిల్‌కుమార్‌ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.గన్నవరం: స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల ఆవరణలోని 3(ఏ) ఆర్‌అండ్‌వీ రెజిమెంట్ ఎన్సీసీ యూనిట్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన హార్స్ షో ఆకట్టుకుంది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగే సమ్మిళిత వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా క్యాడెట్లు వివిధ విన్యాసాలను ప్రదర్శించారు. ఉదయం ఆక్టోపస్ పోలీస్‌ల ఆధ్వర్యంలో డాగ్ షో జరిగింది. స్నైపర్ డాగ్‌లు పేలుడు పదార్థాలను ఎలా గుర్తిస్తాయో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. సాయంత్రం హార్స్ షోలో భాగంగా ఎన్సీసీ క్యాడెట్లు గుర్రపు స్వారీ చేస్తూ అబ్బురపరిచే విన్యాసాలు ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లకు ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ విజయంత్ శ్రీవాస్తవ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరానికి నాలుగు ఎన్సీసీ యూనిట్లకు చెందిన 260 మంది క్యాడెట్లు హాజరయ్యారని తెలిపారు. వారికి శారీరక దారుఢ్య, డ్రిల్, స్సోర్ట్స్ అండ్ గేమ్స్, ఫైరింగ్ ప్రాక్టీస్, వ్యక్తిత్వ వికాసం, ప్రథమ చికిత్స తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లను న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ పరేడ్‌కు ఎంపిక చేస్తామన్నారు. -
ముహూర్తం కోసం వెళ్లి..
కంచికచర్ల: కుమారుడి వివాహానికి ముందు తమ ఇంట్లో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు తేదీ ఖరారు చేసేందుకు గురువు వద్దకు వెళ్లి ఆనందంతో తిరిగి వస్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి దామినేని కుమారి(45), శ్రీనివాసరావు(54) భార్యాభర్తలు. శ్రీనివాసరావు వ్యవసాయం చూస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి కుమార్తె ఉమాదేవి, కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. కుమార్తెను తమ గ్రామానికే చెందిన సాయికి ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు చంద్రశేఖర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వివాహం కుదిరింది. కుమారుడి వివాహం చేసే ముందుగా తమ ఇంట్లో వెలసిన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు శ్రీనివాసరావు, కుమారి దంపతులు తెలంగాణ రాష్ట్రం, ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఉన్న ఓ పూజారి వద్దకు వెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆనందంగా బైక్‌పై తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన వారిని ఎర్రుపాలెం, తక్కెళ్లపాడు మధ్యలో ఎదురుగా వచ్చిన కోళ్ల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతుల తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారా అంటూ బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీనివాసరావు దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ గని ఆత్కూరు గ్రామానికి వెళ్లి వారి భౌతికకాయాలను సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.లారీ ఢీకొని మృతిచెందిన దంపతులు -
రోగులకు మెరుగైన వైద్య సహాయం అందాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మెరుగైన వైద్య సహాయం అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం వైద్యాధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని చోట్ల ఉదయం 6 గంటలకే ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అనుమానితుల నుంచి శ్యాంపిల్స్ తీసి రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. తాగునీటి శ్యాంపిల్స్ ఎప్పటి కప్పుడు పరీక్షించాలన్నారు. చర్యలు తప్పవు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జనన మరణ నివేదికలు, అదేవిధంగా ప్రసవాల నివేదిక ముఖ్యంగా నార్మల్, సిజేరియన్ నమోదు వివరాలు ప్రతిరోజు అందజేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని అత్యవసర మందుల నిల్వలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత సమస్య ఉండరాదన్నారు. ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత అవసరమని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాచర్ల సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జె. ఇందుమతి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ జె.సుమన్, డీఐఓ శరత్ కుమార్, డీసీహెచ్ఎస్ మాధవి దేవి పాల్గొన్నారు. -
ఆర్జిత సేవ భాగ్యం దక్కేనా?
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): స్థానిక శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. దసరా ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. మరో 12 రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతున్నా ఇంత వరకు సేవా టికెట్ల ఊసే లేకుండా పోయింది. దసరా ఉత్సవాల్లో ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవార్చన, ప్రత్యేక చండీహోమం, ప్రత్యేక ఖడ్గమాలార్చన నిర్వహిస్తారు. గతంలో సేవా టికెట్లను దేవస్థాన కౌంటర్ల విక్రయించడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచేవారు. అయితే ఈ ఏడాది ఆర్జిత సేవలపై మొదటి నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల కిందటే ఆర్జిత సేవల టికెట్లను పరిమిత సంఖ్యలోనే విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. అన్ని సేవలకు కలిపి రోజుకు 300 చొప్పున 11 రోజులకు 3,300 టికెట్లు విక్రయించేలా దేవస్థానం చర్యలు తీసుకుంది. దీంతో ఆర్జిత సేవా టికెట్లు తమ వరకు వస్తాయో రావోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక చండీహోమానికి అధిక డిమాండ్ ఉంటుంది. ఈ ఆర్జిత సేవలకు షిఫ్టునకు 75 టికెట్లు చొప్పున విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. దీంతో ప్రముఖులు, వీఐపీలు, సిఫార్సు ఉన్న వారికే ఈ సేవ టికెట్లు దక్కుతాయనే భావనను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేవస్థాన టోల్‌ఫ్రీ నంబర్‌కు రోజూ వస్తున్న ఫోన్ కాల్స్‌లో అత్యధికంగా సేవా టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపైనే కావడం గమనార్హం. రెండు విడతలుగా ఆర్జిత సేవలు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్ల రుసుమును దేవస్థాన అధికారులు ఖరారు చేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ.5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ.3 వేలు, మూలా నక్షత్రం రోజు రూ.5 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక శ్రీచక్ర నవార్చనకు రూ.3 వేలు, ప్రత్యేక చండీహోమానికి రూ.4 వేలుగా టికెట్ల ధరలు ఖరారు చేశారు. ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక ఖడ్గమాలార్చన తెల్లవారుజాము ఐదు నుంచి ఆరు గంటల వరకు, ప్రత్యేక కుంకుమార్చన మహామండపం ఆరో అంతస్తులో మొదటి విడత ఉదయం ఏడు నుంచి 9 గంటల వరకు, రెండో విడత ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చన ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చండీహోమం యాగశాల నిర్వహిస్తారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజు ప్రత్యేక కుంకుమార్చన ఉదయం పది నుంచి 12 గంటల వరకు ఒక విడత మాత్రమే నిర్వహిస్తారు. ఇక ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో పొందే అవకాశం ఉందన్నారు. పరోక్ష సేవకు రూ.1,500 ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను పరోక్షంగా జరిపించుకునే అవకాశాన్ని దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఒక రోజు పరోక్ష సేవ టికెట్ ధరను రూ.1,500గా, 11 రోజుల పాటు సేవకు రూ.11,116గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరోక్ష సేవలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఉత్సవాల అనంతరం అమ్మవారి ప్రసాదాలను పోస్టల్ ద్వారా భక్తులు తెలిపిన చిరునామాకు పంపిస్తామని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. -
తాగునీటి కోసం రాస్తారోకో
కొమరవోలు(మొవ్వ): మూడు రోజులుగా తాగునీరు అందక అల్లాడుతున్నామంటూ ప్రజలు రోడ్డెక్కిన ఘటన పామర్రు మండల పరిధిలోని కొమరవోలు పంచా యతీ పరిధిలోని గాంధీ ఆశ్రమం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. తమకు తాగునీరు రావడం లేదని అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. మూడురోజులుగా తాగునీరు లేని కారణంగా తాము రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గుడివాడ–పామర్రు జాతీయ రహదారిపై మండుటెండలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపైన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారనే సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. నీటి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
డ్రోన్లతో నానో యూరియా పిచికారీ
జి.కొండూరు: డ్రోన్లతో నానో యూరియా పిచికారీ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జి.కొండూరు మన గ్రోమోర్ సెంటర్లో యూరియా పంపిణీని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. యూరియా స్టాకు, పంపిణీ వంటి అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ శివారులో డ్రోన్‌తో నానో యూరియా పిచికారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 32 డ్రోన్లతో నానో యూరియా పిచికారీపై డెమో నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలతో అవసరం మేరకే యూరియాని వినియోగించాలన్నారు. కొరత లేకుండా ఉండేలా ఎరువుల పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామకృష్ణనాయక్, ఏఓ సూరిబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
తీరని యూరియా కష్టాలు
అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): యూరియా కష్టాలు అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. యూరియా కోసం మంగళవారం రైతులు రుకులు పరుగులు పెట్టారు. ప్రస్తుతం వరి పంటకు యూరియా ఎంతో అవసరం. అదును దాటితే ఎంత వేసినా ప్రయోజనం ఉండదు. దీంతో యూరియా కట్టల కోసం ఉదయం నుంచే సొసైటీల వద్ద పాస్‌పుస్తకం, ఆధార్ జిరాక్స్‌లు చేత పట్టుకుని రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. పనులు వదిలేసి యూరియా కోసం నిలబడితే ఒకటి లేదా రెండు బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిగండ్లపాడు సొసైటీలో 25 టన్నులు, పెనుగంచిప్రోలులో గ్రోమోర్లో 25 టన్నులు చొప్పున యూరియా పంపిణీ చేసినట్లు ఏవో రామసుబ్బారెడ్డి తెలిపారు. అయితే సొసైటీల వద్ద పంటలకు అవసరమైన మేర యూరియాను పంపిణీ చేయకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. -
కర్షకుడి కోసం కదంతొక్కిన వైఎస్సార్ సీపీ
కంకిపాడు: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్నదాత పోరు విజయవంతం అయ్యింది. జిల్లాలోని మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ ఆర్డీఓ కార్యాలయాల వద్ద శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించారు. ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్, పంట నష్టపరిహారం అందజేత తదితర అంశాలపై పార్టీ శ్రేణులతో కలిసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆయా ఆర్డీఓ కార్యాలయాల వద్దకు పార్టీ శ్రేణులు, రైతులు పాదయాత్రగా వెళ్లకుండా పోలీసులు అడ్డుతగిలారు. అన్నదాతలు సైతం తమ గళం విప్పారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, దిగుబడులుపై ఆందోళన చెందాల్సి వస్తోందని వాపోయారు. యూరియా కొరత, ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై రైతులు కన్నెర్ర చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కదంతొక్కారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘అన్నదాత పోరు’లో తమ నిరసన గళం వినిపించారు. యూరియా అందించకుండా బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దల తీరును ఎండగట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్యక్రమాన్ని పోలీసులు నీరుగార్చేందుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. శాంతియుతంగా తమ సమస్యను విన్నవించుకునేందుకు సైతం ఆస్కారం లేదనేలా నిస్సిగ్గుగా వ్యవహరించారు. అయినా వైఎస్సార్ సీపీ మద్దతుతో రైతులు ఆర్డీఓ కార్యాలయాల వద్ద అధికారులకు వినతులు అందించి తమ సమస్యలను చెప్పుకున్నారు. -
జౌళి శాఖ నుంచి చేనేతను వేరు చేసి రక్షించాలి
మంగళగిరి టౌన్: జౌళి శాఖ నుంచి చేనేతను వేరు చేసి ప్రత్యేకంగా రక్షించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి నగర పరిధిలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పరిశ్రమ రక్షణకు ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన పెడనలో చేనేత అధ్యయన యాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రిబేట్, యార్న్ సబ్సిడీ, ట్రిప్ట్ ఫండ్, పావలా వడ్డీ, మార్కెటింగ్ ఇన్సెటివ్‌లు కలిపి రూ.127.87 కోట్ల బకాయిలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని తక్షణమే విడుదల చేసిన సహకార సంఘాలు, చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాల పాలకవర్గ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి నేతన్న భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని పేర్కొన్నారనీ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి మోహనరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణ, నియోజకవర్గ అధ్యక్షులు గిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆటిజం నుంచి బాలలను రక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆటిజం తల్లి గర్భం నంచే మొదలవుతుందని, ఈ వ్యాధి పిల్లల జీవితంలోకి ప్రవేశించడానికి ముందే అడ్డుకోవా లని రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి తల్లిదండ్రులకు సూచించారు. రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 14న విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న బాలల కోసం ఉచిత శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత శిబిరం 14వ తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుందన్నారు. ఆటిజం సమస్య పరిష్కారంలో వాడే ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స గురించి అవగాహన కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం 91000 65552 నంబర్‌కు కాల్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పిల్లలు పుట్టకముందే ఆటిజం సమస్యను నివారించేందుకు ప్రత్యేక చికిత్స ఉందని వివరించారు. ఆటిజం సమస్యకు సంబంధించి మరింత సమాచారం కోసం 98215 29653 సెల్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఉద్యాన పంటల ఎగుమతితో అధిక లాభాలు
హనుమాన్‌జంక్షన్ రూరల్: నాణ్యమైన ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జించొచ్చని ఏపీఈడీఏ రీజనల్ బిజిసెస్ డెవలప్మెంట్ మేనేజర్ బి.అశోక్‌కుమార్ సూచించారు. బాపులపాడు మండలం మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్‌లోని అగ్రిక ల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈ డీఏ), ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతి అవకాశాలపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికంగా పండించే మామిడి, కూరగాయలు, ఆకుకూరలను ఎగుమతి చేసే అవకాశాలను ఏపీఈడీఏ కల్పిస్తోందని అశోక్‌కుమార్ తెలిపారు. పంట ఎగుమతి విధానం రైతులకు అర్థమయ్యేలా పవర్‌పాయింట్ ప్రజెంటెషన్ ప్రదర్శించారు. కృష్ణా జిల్లా ఉద్యాన అధికారి జె.జ్యోతి మాట్లాడుతూ.. పంటల ఎగుమతి కోసం ఎఫ్ఈఓలు, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలు, రాయితీలను వివరించారు. మామిడి పరిశోధన కేంద్రం (నూజివీడు) సినీయర్ శాస్త్రవేత్త బి. కనకమహాలక్ష్మి మాట్లాడుతూ.. మామిడిలో తరుచుగా కనిపించే చీడపీడల నివారణ చర్యలు, నాణ్యమైన దిగు బడికి పాటించాల్సిన సన్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ‘సూక్ష్మ గామా’ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓ వివేక్ మాట్లాడుతూ.. ఐక్యూఎఫ్ పద్ధతి ద్వారా తాజా కూరగాయలను ఫ్రోజెన్ కూరగాయలుగా మార్చి ఎగుమతి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బాపులపాడు, అవనిగడ్డ, ఉయ్యూరు, కంకిపాడు మండలాల ఉద్యాన శాఖ అధికారులు, పలువురు ఉద్యాన రైతులు పాల్గొన్నారు. -
ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఉత్తర్వులు జారీ
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు ఆదేశించింది. ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొంది.ఫేజ్-1కింద పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నాలుగు కాలేజీలను డెవలపర్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఫేజ్-2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం,నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలు ప్రైవేటుకు అప్పగించేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
అప్పటిదాకా మీకు నడ్డా నెంబర్ గుర్తుకు రాలేదా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదనట్లుగా ఉన్నాయన్న పేర్ని నాని.. రైతుకు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంలో రైతు కంట కన్నీరు ఆగటం లేదు. మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు. చంద్రబాబు నాది నలభై ఏళ్ల అనుభవం.. నాకన్నా పోటుగాడు లేడంటాడు. జగన్ నిరసనలకు పిలుపునిచ్చే వరకు చంద్రబాబు స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్నీ బాగానే ఉన్నాయంటారు. రైతులు యూరియా దాచుకున్నారని మొన్న అన్నాడు. రైతులు మూడుసార్లకు కలిపి ఒకేసారి 75 కేజీలు యూరియా తీసుకుని దాచుకున్నారు అని నిన్న అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత ఏమైంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి. మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?. యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు. నడ్డాతో మాట్లాడేశారు.. యూరియా పార్సిల్ చేస్తున్నారు.. వచ్చేస్తుంది అన్నారు మోతమోగిస్తున్నారు. రైతు సమస్యలపై వైఎస్ జగన్ నిరసన అనేంత వరకు నడ్డా నెంబర్ మీకు గుర్తుకు రాలేదా?. ఎరువులు తెప్పించుకోవాల్సింది మే, జూన్‌లో కదా....రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే మీకు కళ్ళు పోయాయా?. రైతులు ఎండలో నిలబడలేక క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తుంటే వైఎస్సార్సీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తున్నారంటున్నారు. ఎవరిని మోసం చేయాలని మీరు ఇదంతా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ వాళ్లను రోడ్డెక్కనివ్వరు.. ధర్నాలు చేయనివ్వరు. కానీ రైతులకు యూరియా అందుతుందా?. వైఎస్సార్సీపీ వాళ్లను పోలీసులను పెట్టి కట్టడి చేసే బదులు.. ఏ ఇంట్లో యూరియా దాచుకున్నారో బయటకు తెచ్చేందుకు వాడొచ్చు కదారాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. రైతు కష్టాలు చూపించటానికి ప్రజల దగ్గర ఉన్న ఫోన్లు చాలు. వైఎస్సార్సీపీ వాళ్లను, సోషల్ మీడియా వాళ్లను బొక్కలో వేయాలి అంటున్నారు...రేపు మీరు ఓట్ల కోసం వెళ్తే రైతులు, మిమ్మల్ని ఎందులో వేస్తారు?. ఈ రాష్ట్రంలో.. ఈ ప్రభుత్వం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? కనీసం మీ పార్టీ నేతలైన సుఖంగా ఉన్నారా?. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. మంత్రులు దోచుకుంటున్నారు అని ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులను అడిగితే మాదేముంది బాబు, కొడుకులు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాడు అని మీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మీకు మూటలు మూటలు డబ్బులు చందాలు ఇచ్చిన వాళ్లు కూడా ఏడుస్తున్నారుఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్న రెండు కులాలు ఏడుస్తున్నారు. కమ్మలు, కాపులు కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకటం లేదంటున్నారు. దేశ విదేశాలు తిరిగి చందాలు పోగేశారు. ఇప్పుడు వాళ్ల పొలాలేమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. ఇవాళ ఇంటి పన్ను మారాలన్నా కూడా టీడీపీ వార్డ్ ఇంచార్జీకి 25 వేలు కప్పం కట్టాలి. బెజవాడలో పరిస్థితి ఎలా ఉందో మీకు చందాలు ఇచ్చినవాళ్లను అడిగితే చెప్తారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యాదనించారు. -
రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యం
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని చిట్టినగర్(విజయవాడపశ్చిమ): రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ తన కార్యకలాపాలను సాగిస్తుందని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు డైరెక్టర్ల సమావేశం సోమవారం బోర్డు మీటింగ్ హాల్లో నిర్వహించారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. అనంతరం చలసాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన హనుమాన్ జంక్షన్లో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1210 కోట్లు టర్నోవర్ సాధించామని, 29 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామన్నారు. కృష్ణామిల్క్ యూనియన్‌లో రూ.230 కోట్లు రిజర్వ్ నిధులు ఉన్నాయన్నారు. బుడమేరు ముంపు యూనియన్ను తీవ్రంగా నష్టపరిచినా పాడి రైతులకు రూ.46 కోట్లు బోనస్‌గా చెల్లించామని, అదే సమయంలో రూ.16 కోట్ల సంక్షేమ పథకాలను కూడా అమలు చేశామన్నారు. గడిచిన ఆరేళ్లలో పాల దిగుబడిని పెంచేలా యూనియన్ నాణ్యమైన పశుదాణాను సబ్సిడీపై అందిస్తోందన్నారు. విజయ పార్లర్ ద్వారా డ్వాక్రా సంఘాలు నాణ్యమైన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డైరెక్టర్లు చలసాని చక్రపాణి, నెలకుదిటి నాగేశ్వరరావు, వేమూరి వెంకట సాయిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
యూరియాపై ఎలాంటి ఆందోళన చెందొద్దు
చిలకలపూడి (మచిలీపట్నం): జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అవసరానికి తగ్గట్లుగా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెప్టెంబరు 1 నుంచి నేటి వరకు 3,180 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, సోమవారం రాత్రికి 1371 మెట్రిక్ టన్నులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇంకొక 1200 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. యూరియా కష్టాలపై అధ్యయనం చేసేందుకు ఆదివారం వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశీలన చేసి రైతులతో మాట్లాడారని చెప్పారు. అనంతరం తాను జిల్లాకు అదనంగా 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని కోరానని, అందుకు ఆయన అవసరమైన యూరియాను సరఫరా చేసేందుకు అంగీకరించారన్నారు. రానున్న పదిరోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు. -
ప్రతి సమస్యకు పరిష్కారం
మీకోసంలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: మీకోసంలో అందిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీకోసం కార్యక్రమమని, న్యాయం కోరే బాధితులు ధైర్యంగా తమ సమస్యను విన్నవించుకోవచ్చని అన్నారు. మీకోసం దృష్టికి వచ్చిన ప్రతి అర్జీని చట్టపరిధిలో విచారణ జరిపించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 42 అర్జీలు అందినట్లు తెలిపారు. మీకోసంలో ప్రధానంగా వచ్చిన అర్జీలు బంటుమిల్లి నుంచి వెంకట్రావు అనే వృద్ధుడు ఎస్పీని కలిసి తన సమస్యను విన్నవించుకున్నాడు. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా, ఇటీవల తన భార్య కూడా మరణించిందని చెప్పాడు. అయితే మిగిలిన తన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు కలిసి తన వద్ద ఉన్న బంగారం, డబ్బును బలవంతంగా లాక్కోవటమే కాకుండా తన ఆస్తిని కూడా వారికి రాయాలని శారీరకంగా హింసించినట్లు వాపోయాడు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. కోడూరుకు చెందిన కల్పన అనే వివాహిత ఎస్పీని కలిసి తన గోడు విన్నవించుకుంది. తనకు వివాహం జరిగి ఆరేళ్లయిందని, భర్తతో పాటు అత్తింటి వారు అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నారంటూ వాపోయింది. కుటుంబ పెద్దలతో మాట్లాడించినా ప్రయోజనం లేదని కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం జరిగేలా చూడాలని ప్రాధేయపడింది. అవనిగడ్డకు చెందిన వీరయ్య అనే బాధితుడు ఎస్పీని కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు. తన సమీప బంధువునికి కుటుంబ అవసరాల నిమిత్తం కొంత నగదు అప్పుగా ఇచ్చానని, సంవత్సరం గడుస్తున్నప్పటికీ డబ్బు ఇవ్వకపోగా ఇచ్చిన అప్పు అడుగుతుంటే బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరాడు. కంకిపాడుకు చెందిన రామారావు తన సమీప బంధువులు తనను మోసం చేశారని వాపోయాడు. తన ఆస్తికి సంబంధించిన పత్రాలపై సంతకాలను ఫోర్జరీ చేసి తమ సమీప బంధువులు వారి పేర రాయించుకున్నారని, జరిగిన మోసాన్ని నిలదీస్తుంటే తనను దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయమని కోరాడు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, ఇతర అఽధికారులు పాల్గొన్నారు. -
సింహాద్రికి జీవిత సాఫల్య పురస్కారం
నాగాయలంక: గత 40 ఏళ్లుగా ఫొటోగ్రాఫర్‌గా, పాత్రికేయుడిగా సామాజిక కార్యకర్తగా సేవలు అందిస్తున్న నాగాయలంకకు చెందిన సింహాద్రి కృష్ణప్రసాద్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం జరిగిన యూనియన్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో యూనియన్ జాతీయ అధ్యక్షుడు సురేష్‌శర్మ, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ ఆభా నిఘమ్, ఐ అండ్ పీఆర్ ఆర్జేడీ (ఒంగోలు) టి.కస్తూరి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. స్వచ్ఛ నాగాయలంక సొసైటీలో స్వచ్ఛంద సేవా కార్యకర్తగా, అధ్యక్షుడిగా ఐదేళ్లకు పైగా ఆయన గ్రామానికి సేవలు అందించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్‌కు అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్‌బాబు, అంబటి శ్రీహరిప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు. -
15 నాటికి అన్ని పనులు పూర్తి కావాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన అన్ని పనులు ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి కావాలని, మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులు వేగవంతం కావాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చేపట్టిన దసరా ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత కనకదుర్గనగర్ నుంచి మహామండపం వరకు నిర్మించిన బీటీరోడ్డును పరిశీలించారు. క్యూకాంప్లెక్స్‌ను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. మహా మండపం పక్కనే నిర్మాణంలో ఉన్న లడ్డూ పోటును పరిశీలించి భవన డ్రైనేజీ వ్యవస్థ గురించి ఆరా తీశారు. డ్రైనేజీ నిర్మాణంలో ఎటువంటి అలసత్వం వద్దని, భవష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రాజగోపురం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనాన్ని పరిశీలించారు. కొండపై నూతనంగా నిర్మించిన పూజా మండపాన్ని, యాగశాలను పరిశీలించి మిగిలిన పనులు ఉత్సవాలకు వారం రోజుల ముందుగానే పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఇంజినీర్ శేఖర్, ఈఈ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. -
ఏడాదైనా ఎత్తిపోతలపై వీడని నిర్లక్ష్యం
జి.కొండూరు: గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు పులివాగుపై ఉన్న చెర్వుమాధవరం ఎత్తిపోతల పథకం పూర్తిగా ధ్వంసమైంది. ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన షెడ్డు కూలిపోయి శిథిలాల కిందనే మోటార్లు ఉన్నాయి. ఏడాది గడిచినా ఈ ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు చేసేందుకు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్న విలువైన మోటార్లు, స్టార్టర్ బోర్డులు, పైపులను అక్కడి నుంచి తొలగించి భద్రపరచలేదు. రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఎత్తిపోతల పథకాన్ని చూస్తే అర్ధమైపోతుంది. నిర్మాణం ఇలా... వర్షాకాలంలో పులివాగులో ప్రవహించే వరద ప్రవాహం బుడమేరులో కలిసి వృథాగా పోతుంది. ఈ క్రమంలో ఎటువంటి నీటి వనరులేని చెర్వుమాధవరం గ్రంథివాని చెరువుకు నీటిని సరఫరా చేసేందుకు గడ్డమణుగు గ్రామ శివారులో పులివాగుపై ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.1.30 కోట్లతో 2014–19 మధ్య కాలంలో నిర్మించారు. ఈ పథకం నిర్మించిన ప్రదేశంలో చెక్ డ్యామ్ కూడా ఉండడంతో వర్షపు నీరు నిల్వ ఉండి ఎత్తి పోసేందుకు వీలుంటుందని భావించి నిర్మించారు. అయితే వర్షాలు వచ్చినప్పుడు మినహా మిగతా సమయంలో నీటి సదుపాయం ఉండని పులివాగు మీద ఈ ఎత్తిపోతల పథకం నిర్మించడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎత్తిపోతల పథకం చెరువును నింపకపోయినప్పటికీ పులివాగులో నీరున్న సమయంలో నీళ్లను చెరువులోకి సరఫరా చేయడం ద్వారా ఆయకట్టు భూముల్లోని బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ప్రయోజనం కలిగేది. ఏడాదిగా నిర్లక్ష్యం ఈ ఎత్తిపోతల పథకం గత ఏడాది ఆగస్టులో పులివాగుకు వచ్చిన వరద ప్రవాహానికి పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ తర్వాత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో నేటికీ అలాగే దర్శనమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.1.30 కోట్ల ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శిథిలాలను తొలగించి, మోటార్లను మరమ్మతులు చేసి, ఎత్తిపోతల పథకాన్ని పునఃనిర్మిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న క్రమంలో ఎత్తిపోతల పథకం వద్ద వర్షం నీరు నిల్వ ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా చేస్తే ప్రయోజనం చెర్వుమాధవరం పక్కనే ఉన్న గడ్డమణుగు గ్రామ శివారు వరకు ఉన్న తారకరామా ఎత్తిపోతల పథకంలోని నాల్గవ పంపు హౌస్ నుంచి నీటిని పులివాగులోకి తరలించాలి. పులివాగు వద్ద ధ్వంసమైన ఎత్తిపోతల పథకాన్ని వాడుకలోకి తీసుకొస్తే గ్రంథివాని చెరువుకు పుష్కలంగా నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. దీనితో పాటు ఈ చెరువు కింద ఉన్న కాల్వలు సైతం ఇప్పటికే ఆక్రమణలకు గురైన నేపథ్యంలో కాల్వలను ఏర్పాటు చేస్తే రైతులకు సాగునీటి సమస్య తీరిపోతుంది. ఈ చెరువుకు నీటి వసతి కల్పించి రిజర్వాయర్‌గా మార్చగలిగితే చెరువుకింద ఆయకట్టుగా ఉన్న 160 ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుంది. అంతే కాకుండా సమీప గ్రామాలైన సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, జి.కొండూరు గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరిగి బెట్ట సమయంలో బోర్లలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. -
నందిగామలో ఉద్రిక్తత.. ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో ‘అన్నదాత పోరు’ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యానికి దిగారు. గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నాఉ. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.వైఎస్సార్సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపుకు దిగుతూ.. నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు విధించింది.ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని.. రైతులు, రైతు నేతలు స్పష్టం చేశారు. యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు.. పోలీసులు, కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.వైఎస్సార్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. చంద్రబాబు సర్కార్ విధించిన ఆంక్షలను చేధించుకుని రైతులు ఉద్యమిస్తున్నారు. యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు ఘెరంగా విఫలమయ్యారని... పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళన ఆపేది లేదని రైతులు అంటున్నారు.ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు.. శాంతియుత ఆందోళనలకు తరలివస్తున్నాయి. -
ఈ–క్రాప్ వర్రీ!
కంకిపాడు: ఈ–క్రాప్ నమోదు నత్తనడకన సాగుతోంది. గడువు ముగింపు సమయం దగ్గర పడుతున్నా, లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి. సాంకేతిక సమస్యలు, వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో పంట పొలాల్లోకి వెళ్లటానికి ఆస్కారం లేకపోవటంతో ఈ–క్రాప్ నమోదు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. దీనికి తోడు వ్యవసాయ, రెవెన్యూశాఖల మధ్య సమన్వయం కొరవడటం కూడా మరో కారణంగా తెలుస్తోంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 4,14,305 ఎకరాల్లో సాగుభూమి ఉంది. ఇందులో ఇప్పటి వరకూ వ్యవసాయ పంటలు 3,49,660 ఎకరాల్లో సాగు పూర్తి కాగా, ఉద్యాన పంటలు 27,888 ఎకరాల్లో సాగు పూర్తయ్యింది. ప్రధానంగా వరి, చెరకు, పసుపు, కంద, మొక్కజొన్న, వేరుశనగ, మిర్చి, బొప్పాయి, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ప్రయోజనాలు ఇవే.. ఈ–క్రాప్ నమోదు పూర్తికావటం వల్ల ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు రైతులకు లబ్ధి చేకూరుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత రైతాంగాన్ని తక్షణమే గుర్తించి పరిహారం అందించటంలో ఇబ్బందులు తొలగుతాయి. పంట ఉత్పత్తులు చేతికి అందిన తర్వాత మార్కెట్లో విక్రయించుకోవటానికి, మద్దతు ధర పొందటానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్యాన్ని చేరని నమోదు.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. అయినా నేటికీ ఈ–క్రాప్ నమోదు పూర్తి కాలేదు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 3,77,549 ఎకరాల్లో పంటలు సాగు జరుగుతుండగా, 1.20 లక్షల ఎకరాల్లో మాత్రమే ఈ–క్రాప్ పూర్తయ్యింది. ఇంకా 65 శాతానికి పైగా భూములకు ఈ–క్రాప్ నమోదు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ–క్రాప్ నమోదు గడువు పూర్తి కానుంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. శాఖల మధ్య సమన్వయం లోపం.. ఈ–క్రాప్ నమోదు రెవెన్యూ, వ్యవసాయశాఖలు సంయుక్తంగా పూర్తి చేయాల్సి ఉంది. రైతులతో కలిసి పంట పొలానికి వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంట వివరాలు, సర్వే నంబర్ ఆన్లైన్లో నమోదు చేసి పూర్తిగా ధ్రువీకరణ చేసిన తరువాతే ఈ–క్రాప్ పూర్తి చేయాలి. కానీ ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించింది. రెవెన్యూ శాఖ ఈ–క్రాప్ నమోదుకు పూర్తిగా దూరంగా ఉంటోంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది మాత్రమే క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. దీని వల్ల ఈ–క్రాప్ నమోదులో స్పష్టత ఎంత వరకూ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అడుగడుగునా అవరోధాలు.. ఈ–క్రాప్ నమోదులో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురవటంతో పంట పొలాల్లోకి సిబ్బంది వెళ్లలేని పరిస్థితి. దీనికి తోడు కృష్ణానది ఏటిపాయలకు వరదనీరు చేరటంతో లంక భూముల్లోకి రాకపోకలు లేవు. దీంతో ఏటిపాయలోని లంక గ్రామాల్లోని వ్యవసాయ భూములకు వెళ్లి ఈ–క్రాప్ నమోదు పూర్తి చేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు కూడా వెంటాడు తున్నాయి. సర్వర్ పనిచేయక ఈ–క్రాప్ నమోదులో జాప్యం ఏర్పడుతోందని సిబ్బంది వాపోతున్నారు. తాజాగా నెలకొన్న యూరియా కొరత, పంపిణీలో తలెత్తుతున్న సమస్యలతో ఎక్కువ భాగం సిబ్బంది యూరియా పంపిణీపై దృష్టి సారించటంతో ఈ–క్రాప్ ముందుకు సాగటం లేదు. వేగవంతం చేస్తాం.. ఈ–క్రాప్ నమోదు వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ–క్రాప్ నమోదును పూర్తి చేస్తున్నారు. ఇటీవల వర్షాలు వల్ల పంట పొలాల్లోకి వెళ్లలేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం యూరియా సమస్య పరిష్కారంపై దృష్టి సారించాం. సమస్య తీరగానే ఈ– క్రాప్‌పై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుతాం. – ఎన్.పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి -
పీహెచ్సీలో కలెక్టర్ తనిఖీలు
పెనమలూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని ప్రశ్నించారు. వైద్యులు అందిస్తున్న వైద్య సేవల వివరాలు కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో ఎన్ని రకాల మందులు ఉన్నాయి అని అడిగి, రిజిస్టర్లు తనిఖీ చేశారు. జ్వరాలు ఉన్నందున ఫీల్డ్ లెవల్లో స్టాఫ్ సర్వే చేస్తున్నారా అని అడిగారు. ఆస్పత్రిలో డెలివరీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయాలని సూచించారు. ఆర్డీవో హేలాషారోన్, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో డాక్టర్ బండి ప్రణవి, మండల వైద్యాధికారి సాయిలలిత, సిబ్బంది పాల్గొన్నారు.ఇమామ్, మౌజన్లకు ‘గౌరవం’ ఇవ్వండి చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వం ఇమామ్, మౌజన్లకు గౌరవవేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ కాశీం డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్, కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇమామ్‌లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు గౌరవ వేతనాలను చెల్లించడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క నెల కూడా బకాయిలు లేకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెల్లించారని గుర్తు చేశారు. జిల్లాలో 153 మంది మౌజన్లు, 153 మంది ఇమామ్‌లకు గౌరవ వేతనం బకాయి ఉందన్నారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. జిల్లా మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు మీర్అస్గర్అలీ, మైనార్టీ సెల్ నాయకులు అషరఫ్, మొహమ్మద్ ఖాజా, అన్వర్, మొహమ్మద్ ఖలీద్ పాల్గొన్నారు.అక్షరాస్యత సాధనకు ఉల్లాస్మచిలీపట్నం అర్బన్: సంపూర్ణ అక్షరాస్యత సాధనలో ఉల్లాస్ కార్యక్రమం కీలక భూమిక వహిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో 59వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, వయోజన విద్యా ఉపసంచాలకులు ఎండి. హాజీబేగ్ అక్షరాస్యతా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 73,237 మంది నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని అక్షరాస్యత సాధనకు చర్యలు చేపట్టామన్నారు. విశేషంగా కృషి చేసిన 14 మంది వలంటీర్ టీచర్లకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్నామన్నారు. కలెక్టరేట్ నుంచి ర్యాలీ నిర్వహించగా, వయోజన విద్యా సిబ్బంది, ఉల్లాస్ వలంటీర్లు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.కూచిపూడిలో అభివృద్ధి పనులపై సర్వేకూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రమైన కూచిపూడిని వారసత్వ సంపద గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారులు సర్వే నిర్వహించినట్లు డెప్యూటీ ఎంపీడీవో ఎంఎస్కే పరమాత్మ తెలిపారు. నాట్యపుష్కరిణి, మ్యూజియం, నాట్య లెజెండ్ పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం స్మృతి సదనం, శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ రహదారికి ఇరువైపులా పాత్వే, పంచాయతీ వద్ద ఆర్చీ, సుందరీకరణ తదితర పనులను మూడు కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆయా పనులకు సంబంధించిన మెజర్మెంట్స్(కొలతలు) తీసుకున్నట్లు చెప్పారు. పర్యాటక శాఖ కన్సల్టెంట్ సాహితి, టూరిజం శాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈ టి. కుమార్, మేనేజర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
యూరియాపై ఇంత నిర్లక్ష్యమా?
చిలకలపూడి(మచిలీపట్నం): పత్రికల్లో యూరియాపై నిత్యం వార్తలు వస్తున్నాయని.. వాటిపై స్పందించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అని కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయాధికారి ఎన్. పద్మావతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు, హౌసింగ్ ఇన్చార్జ్ పీడీ పోతురాజు, డీఎస్పీ చప్పిడి రాజా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధ్యత ఉండాలి కదా? తొలుత కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు పడుతున్న ఇబ్బందులపై నిత్యం వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై స్పందించి జిల్లాలో యూరియా అవసరం ఎంత ఉంటుంది? ఇప్పటి వరకు మనకు ఎంత వచ్చింది? ఇంకా ఎంత రావాల్సి ఉందనే వివరాలు సమాచారశాఖ ద్వారా పత్రికా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాల్సి ఉందా? లేదా అని ఆయన వ్యవసాయాధికారిని ప్రశ్నించారు. కలెక్టర్ విస్మయం.. ప్రజల నుంచి అందుకున్న మీ కోసం అర్జీలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి సజావుగా పరిష్కరించాలని ఆదేశించారు. కొంత మంది అధికారులు ఇంకా 70 అర్జీలను ఇప్పటి వరకు చూడకపోవటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. మీ కోసంలో మొత్తం 152 అర్జీలను అధికారులు స్వీకరించారు.వచ్చిన అర్జీల్లో కొన్ని.. సముద్రం, కొత్తకాలువ, పాత ఉప్పుటేరు వల్ల కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెందీవి విపరీతంగా కోతకు గురవుతోందని దీవి పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాసాబత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సానా వీరవెంకటసత్యనారాయణ తెలిపారు. కొన్ని ఎకరాల భూమి సముద్రం, ఉప్పుటేరులో కలిసిపోతోందని వివరించారు. ఈ దీవికి సంబంధించి సముద్ర ముఖ ద్వారం వద్ద నిరంతరం డ్రెడ్జింగ్ చేయాలని, అలాగే కొత్త ఇన్‌టేక్ చానల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. పౌరసరఫరాల శాఖ పరిధిలో ఉన్న ఎండీయూ వాహనాలను ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌గా మార్పు చేయాలని వైఎస్సార్ కృష్ణాజిల్లా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. శ్యామ్‌బాబు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎండీయూ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం వచ్చాక నిలుపుదల చేసిందని.. అయితే ఈ వాహనాలను ప్రస్తుతం దేనికీ ఉపయోగించలేక ఆర్థిక భారం పడుతున్నామని వివరించారు. ఆ వాహనాన్ని మొబైల్ క్యాంటీన్‌గా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. -
దుర్గగుడిలో ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణం అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఆలయ అర్చకులు శుద్ధి చేశారు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటలకు పవిత్ర కృష్ణానది నుంచి జలాలను తీసుకొచ్చి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఉప ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు ఈఓ శీనానాయక్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం సర్వ దర్శనం, రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గ్రహణం నేపథ్యంలో తెల్లవారుజామున జరగాల్సిన సుప్రభాత, వస్త్రాలంకరణ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం వంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు. -
కాలుష్య రహిత జిల్లా కోసం కృషి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగంతో భవిష్యత్తులో మానవ మనుగడే ప్రశ్నార్థకం కానుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ప్లాస్టిక్‌తో చేసిన ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, ట్రేలు, ఆహ్వాన కార్డులు, పీవీసీ బ్యానర్లుపై ఉన్న నిషేధాన్ని సమర్థంగా అమలు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల విక్రేతలు, వినియోగదారులపై జరిమానాలు విధించాలన్నా రు. ప్లాస్టిక్ వస్తువులకు బదులు నార, గుడ్డ, పేపర్‌తో తయారు చేసిన వస్తువులను వినియోగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇబ్బందికరంగా మారాయని పేర్కొన్నారు. ఒక్క విజయవాడలోనే సంవత్సరానికి 700 టన్నులకు పైగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రజలు పడేస్తున్నారని వివరించారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
కట్టకటపై ఆగ్రహ జ్వాల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఖరీఫ్ పంటలు సాగుచేస్తున్న రైతులను యూరియా కొరత వేధిస్తోంది. అదనుకొచ్చిన పంటకు బలం ఇవ్వకుంటే దిగుబడులు దిగజారుతాయన్న ఆందోళన అన్నదాతలను వేధిస్తోంది. మార్కెట్లో యూరియా దొరకడంలేదు. వచ్చిన కొద్ది సరుకును కొన్ని ప్రాంతాల్లో కూటమి పెద్దలు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్ బోర్డు’లు దర్శనం ఇస్తున్నాయి. రైతులు తిండీతిప్పలు మానుకుని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద బారులు తీరుతున్నారు. యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. అన్నదాత పోరు పేరుతో మంగళవారం ఆర్డీఓ కేంద్రాల వద్ద రైతులు, రైతుసంఘాల నాయకులతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేయనుంది. యూరియా కోసం రైతుల అవస్థలు పైర్లను రక్షించుకునేందుకు అవసరమైన ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్‌ల వద్ద బారులు తీరులు తీరి కనిసిస్తున్నారు. రాత్రిళ్లు సైతం నిద్ర మానుకుని మరీ ప్రాథమిక సహకార సంఘాల వద్దే కాపు కాస్తున్నారు. యూరియా తీవ్రంగా కొరత ఉండటంతో రైతులు అర్ధరాత్రి రోడ్డెక్కి యూరియా లారీలను అడ్డుకొని, అందులో ఉన్న సరుకును తమకు పంచా లని ఆందోళనకు దిగుతున్నారు. గంపలగూడెం మండలంలో రైతులు గంటల తరబడి క్యూలో నిలబడలేక లైన్లలో చెప్పులు పెట్టి సమీపంలోని చెట్ల కింద తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఆదివారం కొత్తమాజేరు గ్రామంలో రైతులు క్యూలో నిలబడలేక సొమ్మసిల్లిపోయారు. అయినా ‘కట్ట’ యూరియా దొరకడం కష్టంగా మారింది. ఇప్పుడు వరి పంటకు యూరియా వేయకపోతే పిలకలు రావని, దిగుబడులు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నా కూటమి పెద్దల తీరులో మార్పు రావడంలేదు. యూరియాను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు రైతులకు అండగా నిలిచారు. అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి యూరియా కొరతపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు లేదు. పంటలకు యూరియా, పురుగు మందులు ఎక్కువగా వినియోగించొద్దని, అవి వాడిన పంటలు తింటే క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్
జగ్గయ్యపేట అర్బన్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఐ జి.రాజు మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడిన నేరస్తుడిని, దోపిడీ చేసిన బంగారు, వెండి నగలను మీడియా ముందు హాజరుపరిచారు. ఎస్ఐ రాజు మాట్లాడుతూ నందిగామ ఏసీపీ తిలక్ పర్యవేక్షణలో జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ జి.రాజు, ఎన్టీఆర్ జిల్లా సీసీఎస్ పోలీసులు, నందిగామ, జగ్గయ్యపేట పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సాంకేతికతను ఉపయోగించి విచారణ చేశారన్నారు. జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో అంతర్రాష్ట్ర నేరస్తుడు శీలంశెట్టి వెంకటరమణను హైదరాబాద్‌లో శనివారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తెలంగాణ జనగాం జిల్లా రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన నేరస్తుడిపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇతని నుంచి రూ.6 లక్షల విలువైన సుమారు 85 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు. రూ.6 లక్షల విలువైన నగలు స్వాధీనం -
మొండి నొప్పులకు ఫిజియోతో చెక్
భవానీపురానికి చెందిన 48 ఏళ్ల మహిళ లంబర్ డిస్క్ ప్రాబ్లమ్స్‌తో, తీవ్రమైన నొప్పితో బాధపడుతుండేది. ఆమె నాలుగైదు ఆస్పత్రులకు వెళ్లగా సర్జరీ చేయాలన్నారు. ఆమెకు సర్జరీ చేయించుకోవడం ఇష్టంలేదు. తెలిసిన వారి ద్వారా ఫిజియోథెరపిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ రెండు నెలల పాటు ఫిజియోథెరపీ చేయగా సాధారణ స్థితికి వచ్చింది. వీరిద్దరే కాదు అనేక మంది ఫిజియోథెరఫీతో ఉపశమనం పొందుతున్నారు. పుట్టుకతో వచ్చిన లోపాల నుంచి వృద్ధాప్యం వచ్చే కండరాల బలహీనత, పక్షవాతం వంటి వ్యాధులకు సమర్థంగా చికిత్సలు అందిస్తున్నారు. పటమటకు చెందిన 15 ఏళ్ల బాలిక గిలియన్ బ్యారీ సిండ్రోమ్(జీబీఎస్)కు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందినా కండరాలు సాధారణ స్థితికి రాలేదు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఫిజియోథెరపిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ థెరపీలతో ఆమె సాధారణ స్థితికి వచ్చింది. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
కంచికచర్ల: వినాయక నిమజ్జన సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక వర్గం ఫిర్యాదే తీసుకుంటారా అని దళితులు పోలీసులను ప్రశ్నించారు. తమ వర్గం ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని వారిపై కేసు నమోదు చేయాలని వారు ఆదివారం రాత్రి కంచికచర్ల పీఎస్ ఎదుట ఆందోళన చేశారు. పరిటాల దళితవాడలో శనివారం నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల్లో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయంపై పోలీసులు ఒక వర్గం వారిపై కేసు నమోదు చేశారు. తమ వర్గంలో ఉన్నవారికి కూడా దెబ్బలు తగిలాయని వారిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీస్‌స్టేషన్ వద్ద దళితులు ఆందోళన చేశారు. ఆందోళనకారుల వద్దకు సీఐ చవాన్‌దేవ్, ఎస్ఐ విశ్వనాఽథ్ వెళ్లి గ్రామంలో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని రెండో వర్గంపై కూడా కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో దళితులు ఆందోళన విరమించారు. -
యువత క్రీడలు, ధ్యానంపై దృష్టి పెట్టాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): యువత క్రీడలు, ధ్యానం మీద దృష్టి పెట్టి ప్రకృతితో మమేకం అవ్వాలని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఉప సంచాలకులు ఎస్వీ రమణ సూచించారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న క్రీడా ఉత్సవమైన గ్రామోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం కేఎల్ యూనివర్సిటీలో జరిగాయి. ఆమె మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న కృషి హర్షణీయమని కొనియాడారు. గౌరవ అతిథి కేఎల్ విశ్వవిద్యాలయం క్రీడల సంచాలకుడు డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ప్రత్యేక అతిథి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ పరిపాలన అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో గ్రామీణ యువతకు నూతన ప్రోత్సాహం అందుతుందన్నారు. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వాలీబాల్ (పురుషులు) రూ. 5 లక్షలు, త్రోబాల్ (మహిళలు) రూ. 5 లక్షలు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఆటల పోటీల్లో ఉత్సాహాంగా పాల్గొన్న మహిళలు -
గండిగుంట సొసైటీలో విజిలెన్స్ సీఐ తనిఖీ
ఉయ్యూరు రూరల్: మండలంలోని గండిగుంట గ్రామ కోపరేటివ్ సొసైటీలో విజిలెన్స్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయంలోని అధికారులతో ఎరువుల పంపిణీ జరుగుతున్న విషయంపై ఆరా తీశారు. అనంతరం పక్కన ఉన్న గోదాంలో ఎరువుల స్టాకును పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారులు నిస్సీ గ్రేస్‌తో ఎరువుల పంపిణీపై తీసుకుంటున్న జాగ్రత్తల వివరాలు అడిగారు. ఎరువులు రైతులకు అప్పులు ఇస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. విజిలెన్స్ సీఐ వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఎరువుల పంపిణీలో ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. కాగా స్థానిక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు అందిస్తున్న ఎరువులపై మండల తహసీల్దార్ సురేష్ కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో ఎల్. శివశంకర్, ఎంఏవో నిస్సీ గ్రేస్, ఉయ్యూరు పట్టణ సీఐ టీవీ రామారావు, సొసైటీ అధ్యక్షుడు దండమూడి నాగేశ్వరావు అన్నదాతలకు అందిస్తున్న ఎరువులపై ఆరా తీశారు. ఉయ్యూరు రెవెన్యూ, గండిగుంట గ్రామ పరిధిలో 1800 ఎకరాల ఆయకట్టు ఉందని, ఆ పరిధిలో ఉన్న రైతులందరికీ యూరియా ఇతర ఎరువులను నిష్పక్షపాతంగా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ సురేష్ కుమార్ హెచ్చరించారు. -
వైభవంగా శోభాయాత్ర
ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘానికి నూతన కార్యవర్గం విజయవాడ కల్చరల్: శృంగేరీ పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రం జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి, విదుశేఖర భారతిస్వామి చారుర్మాస్య దీక్షను శృంగేరీ పీఠంలో విరమించిన సందర్భంగా పీఠ సంప్రదాయాన్ని అనుసరించి దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం ఆదిశంకరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరునికి మహారుద్రాభిషేకం, మహాన్యాసం వేదోక్తంగా నిర్వహించారు. ఆదిశంకరుల చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంతో నగర వీధుల్లో శోభాయాత్ర జరిగింది. ధర్మాధికారి హనుమత్ ప్రసాద్, పలువురు భక్తులు పాల్గొన్నారు. -
11న ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఉన్న బాల్సోత్సవ్ భవన్లో ఈ నెల 11వ తేదీన ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం బాలోత్సవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంపెడా కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఆక్వా ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు మొత్తం కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలని, అమెరికాతో చర్యలు జరపాలని, తక్కువ సుంకాలున్న అవసరమైన దేశాలకు ఎగుమతులు ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షలు తిప్పి కొట్టాలని, అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ఆక్వా రైతులు ఇతర పంటల రైతుల సహకారంతో ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంఘం ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా(పార్లమెంట్) జిల్లాకు చెందిన పలువురిని నియమించారు. విజయవాడ నగరానికి చెందిన అవుతు శ్రీనివాసరెడ్డికి నందిగామ, పెనమలూరు నియోజకవర్గాలను కేటాయిస్తూ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అలాగే తిరువూరు, మైలవరం నియోజకవర్గాలను తంగిరాల రామిరెడ్డికి, విజయవాడ వెస్ట్, జగ్గయ్యపేట నియోజకవర్గాలను ఆళ్ల చెల్లారావుకు, విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలను సర్నాల తిరుపతిరావుకు కేటాయించారు. అలాగే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు షేక్ సలార్‌దాదా, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాలకు మాదు శివరామకృష్ణ, పెడన, పామర్రు నియోజకవర్గాలకు అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి (చిట్టిబాబు)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు పాల్గొన్నారు. ఆలయ ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించగా, మేళతాళాలు, మంగళవాయి ద్యాల నడుమ భక్తజనుల అమ్మవారి నామస్మరణ మధ్య ఊరేగింపు వైభవంగా ముందుకు సాగింది. ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్ రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకుడు ఆర్. శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షించారు. కోడూరు: ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని ఎరువుల, పురుగు మందుల షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు శనివారం రాత్రి ఈ తనిఖీలు జరిపారు. ఓ దుకాణంలో భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను అధికారులు గుర్తించారు. బిల్లు బుక్స్, స్టాక్ రిజిస్టర్, ఈ–పోస్ మిషన్లను పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న స్టాక్‌కు దుకాణంలో ఉన్న ఎరువుల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించారు. దుకాణంలో రూ.2లక్షల విలువైన 13 టన్నుల ఎరువులకు ఏ విధమైన పత్రాలు లేనట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒమర్ తెలిపారు. కాగా కోడూరు మండలంలో విజిలెన్స్ అధికారులు నెల వ్యవధిలో మూడు సార్లు ఎరువులు దుకాణాలపై దాడులు జరపడం గమనార్హం. కోడూరు: హంసలదీవి సాగర తీరంలో పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహించారు. బీచ్ వద్ద సముద్రంలో గుంతలు ఏర్పడడంతో పర్యాటకులను అప్రమత్తం చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు తీరానికి తరలివచ్చారు. వీరంతా సముద్ర అలల మధ్య కేరింతలు కొడుతూ సందడి చేశారు. సముద్ర పరిస్థితులు భిన్నంగా ఉండడంతో మైరెన్ పోలీసులు లౌడ్‌స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ పర్యాటకులకు అవగాహన కల్పించారు. బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకు గస్తీ చేపట్టారు. ఎస్ఐలు పూర్ణమాధురి, ఉజ్వల్‌కుమార్ పర్యవేక్షించారు. -
దేవాలయాల ద్వారాలు మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని జిల్లాలోని దేవాలయాల తలుపులను ఆయా ఆలయాల అధికారులు, అర్చకులు ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఈవో శీనానాయక్ సమక్షంలో ఆలయ తలుపులు మూసివేశారు. అమ్మవారి ప్రధాన నివేదన శాలతో పాటు అన్నదానం, లడ్డూ పోటులోని ఆహార పదార్థాలు, సరుకులపై దర్భలను ఉంచామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, కామథేను అమ్మవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. ఘాట్‌రోడ్డులోని ప్రధాన ద్వారాలను కూడా సెక్యూరిటీ సిబ్బంది మూసివేసి భక్తులెవరినీ కొండపైకి అనుమతించలేదు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రి పరిసరాలు గ్రహణం నేపథ్యంలో వెలవెలబోయాయి. సంప్రోక్షణతో.. గ్రహణ అనంతరం సోమవారంతెల్లవారుజామున నదీ తీరం నుంచి జలాలను తీసుకువచ్చి సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సుబ్బారాయుడి ఆలయంలో.. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేసేన సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మద్యాహ్నం 12.30 గంటల నుంచి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు మహా సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించబడుతుందని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తిరుపతమ్మ ఆలయం.. పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి ఆలయ తలుపులను ఆదివారం ఉదయం 11 గంటలకు కవాటుబంధనం చేసి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం నేపథ్యంలో అర్చకుల చర్యలు -
ముస్లింలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
గుణదల(విజయవాడ తూర్పు): ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలను ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ముస్లింలను నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అర్చకులకు, ఇమామ్‌లకు, పాస్టర్లకు గౌరవ వేతనాలను ఇచ్చేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యేడాది కాలంలో ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి ముస్లింలకు ఇవ్వవలసిన గౌరవ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింల తరఫున పోరాడేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడు ముందడుగేస్తుందని భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు గౌరవ వేతనాలను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. -
అరకొరగానే యూరియా
పెనమలూరు: మండల పరిధిలో ఆదివారం యూరియాను పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. రైతులు యూరియా పూర్తి స్థాయిలో అందుతుందని ఎదురు చూడగా అధికారులు కేవలం అరకొర యూరియా మాత్రమే రైతులకు అందజేశారు. దీంతో రైతులు అధికారుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వణుకూరులో వాగ్వాదం.. రైతులు చాలా కాలంగా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆదివారం వణుకూరు గ్రామానికి కేవలం 10 టన్నుల యూరియా పంపిణీ చేశారు. ఈ గ్రామంలో దాదాపు 1200 ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతుండగా కేవలం 10టున్నుల యూరియా మాత్రమే రైతులకు ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి వచ్చి యూరియా పంపిణీని పరిశీలించారు. యూరియా చాలినంత ఇవ్వక పోవటంపై రైతులు ఆమెను ప్రశ్నించారు. ప్రభుత్వం త్వరలో యూరియా సరఫరా చేస్తుందని ఆమె రైతులను నచ్చ చెప్పారు. రైతులు రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కట్టల కోసం పడిగాపులు కాశారు. రైతుకు గరిష్టంగా 3 బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారు. రైతులకు తాగటానికి నీరు కూడా ఇవ్వలేదు. ● పెదపులిపాక సొసైటీలో కూడా 15 టన్నుల యూరియా అధికారులు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా రైతులు యూరియా కోసం రాగా రైతులకు 3 బస్తాల యూరియా సీలింగ్ పెట్టడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల వ్యవసాయాధికారి కనకమేడల శైలజ, ఎంపీడీవో డాక్టర్ బండి ప్రణవి పాల్గొన్నారు. అవసరం మేరకు సరఫరా చేయండి చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని రైతులకు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి అవసరం మేరకు ఎరువులను సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ అధికారులకు సూచించారు. ఆదివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహీర్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు 12 వేల టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, వ్యవసాయశాఖ ఏడీ మణిధర్, ఆర్డీవో స్వాతి, ఏవో శాంతి పాల్గొన్నారు. పామర్రు, గూడూరు మండలాల్లో పర్యటన.. గూడూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఆదివారం కృష్ణాజిల్లా పామర్రు మండలం జుఝ్జవరం, గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామాల్లో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి యూరియా పరిస్థితిపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఆయా గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో రైతులతో రాజశేఖర్ ముఖాముఖీ మాట్లాడారు. పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ -
‘చిన్న’ పథకంతో రూ.400 కోట్ల భూమికి ఎసరు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికిందల్లా దోచుకోవడం, నీకింత–నాకింత అని పంచుకు తినడాన్ని అలవరుచుకున్న టీడీపీ నేతలు దేవుడి ఆస్తులను కూడా కాజేసేందుకు సిద్ధమయ్యారు. ‘చిన్న’ పథకంతో ఏకంగా రూ.400 కోట్ల విలువైన భూమిని గుప్పిట్లో పెట్టుకోవడానికి స్కెచ్ వేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో సర్వే నంబర్లు 454/2బీ, 3బీలో 39.99 ఎకరాల భూమి ఉంది. ఆలయ నిర్వహణ, కల్యాణం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ఇతరత్రా ఉత్సవాల కోసం భక్తులు ఎన్నో ఏళ్ల క్రితం దానంగా ఇచ్చారు.ఈ భూమిపై వచ్చే ఆదాయంతో దేవదాయ శాఖ ఆలయ నిర్వహణతోపాటు ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ ఎకరం రూ.10 కోట్లకు పైగానే ఉంది. దీంతో రూ.400 కోట్ల విలువైన ఈ భూమిని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దల దన్నుతో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముఖ్య నేత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పేరుతో ఐదు ఎకరాలు.. విజయవాడ ఉత్సవాలు, ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్‌హెచ్‌జీ మేళా, అగ్రిటెక్ షోకేస్, టూరిజం ప్రమోషన్ తదితర ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నిర్వహణకు శాశ్వత వేదిక అంటూ మరో 34.99 ఎకరాల భూమి లీజు మాటున తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరింది. కారు చౌకగా కొట్టేసే ఎత్తుగడ ⇒ మొత్తంగా 39.99 ఎకరాలను సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ఆ నేత పావులు కదుపుతున్నారు. గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్ కోసం ఈ భూమి కేటాయించాలని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. ఈ ప్రతిపాదనలు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి చేరాయి. ఎకరాకు ఏడాదికి రూ.500 చొప్పున, 99 సంవత్సరాలకు లీజు పొందేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ⇒ నిజానికి ఆ భూములకు దేవదాయ శాఖ అధికారులు ఈ ఏడాది మే 15వ తేదీన ఏడాదిపాటు కౌలుకు వేలం నిర్వహించారు. బొర్రా రవికి రూ.95,500తో ఏడు ఎకరాలు, అబ్బూరి శ్రీనివాసరావుకు రూ.1,00,500తో 6.50 ఎకరాలు, అనుమోలు రామారావుకు రూ.66,700తో 4.50 ఎకరాలు, ఈపూరి నాగమల్లేశ్వరరావుకు రూ.97,000తో 4.50 ఎకరాలు ఇచ్చారు. కె.ధర్మారావుకు 2023–24 నుంచి 2025–26 వరకు ఐదెకరాల భూమిని రూ.52,500కు, కె.అయ్యప్పకు 2.50 ఎకరాలను రూ.23,500తో కౌలుకు ఇచ్చారు. కౌలు గడువు పూర్తి కాకముందే ఆ భూములను గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్‌కు లీజుకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ⇒ అయితే కౌలు పొందిన రైతుల నుంచే సబ్ లీజుకు తీసుకొని, ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా భూమిని అప్పగించాలంటే వేలం పాట నిర్వహించాలన్న నిబంధనలు తుంగలో తొక్కారు. ఉత్తర్వులు రాక ముందే భూమి స్వాధీనం⇒ దేవదాయ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక ముందే ఈ భూములను పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ముఖ్య నేత తన ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున మట్టి తోలించి భూమిని చదును చేయించారు. విజయవాడ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వీటి నిర్వహణకు అయ్యే రూ.కోట్ల ఖర్చును వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ⇒ మరో వైపు ఆ భూములను గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్‌కు కట్టబెట్టేందుకు సంబంధించిన ఫైల్ సచివాలయంలో శరవేగంగా ముందుకు కదులుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాల సమాచారం. ⇒ ఈ భూమిని 2017లోనే కాజేసేందుకు టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఈ క్రమంలో గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ నుంచి తప్పించి, విజయవాడ దుర్గామల్లే«శ్వర స్వామి పరిధిలోకి తెచ్చారు. అయితే గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గత ప్రభుత్వంలో ఆలయానికి పూర్వ వైభవం ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలిపోయే దశలో ఉన్న గొడుగుపేట ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నాటి సీఎం వైఎస్ జగన్ నడుంబిగించారు. అప్పటి మంత్రి పేర్ని నాని ప్రతిపాదన మేరకు 2020 మార్చిలో ఈ ఆలయాన్ని దుర్గామల్లేశ్వర స్వామి పరిధిలోంచి తప్పించి దేవదాయ శాఖ పరిధిలోకి తెచ్చి ఈవోను కూడా నియమించారు. ⇒ 2020 అక్టోబర్‌లో పేర్ని నాని సీజీఎఫ్ నిధులు రూ.1.80 కోట్లు, భక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.20 లక్షలు వెరసి రూ.2 కోట్లు వెచ్చించి, ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేయించారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా పునఃప్రారం¿ోత్సవం జరిపించారు. 2023 జూలైలో ఈ ఆలయ భూములకు వేలం నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా భూములకు వేలం పాట నిర్వహించి, రైతులకు లీజుకు ఇస్తున్నారు. 2024 మే వరకు ధూప దీప నైవేద్యాలు, ఘనంగా ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేశారు.గోల్ఫ్ కోర్టుకు వెంకన్న స్వామి స్థలమే కనిపించిందా?⇒ప్రపంచ స్థాయి అమరావతిలో స్థలమే దొరకలేదా?⇒ ఆలయ భూముల్నీ పప్పు బెల్లాల్లా పంచుకుంటారా?⇒ ఆ భూమిపై మోజు ఉంటే విక్రయించి ఆలయానికి డబ్బు జమ చేయాలి ⇒ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజంమచిలీపట్నం టౌన్: ప్రపంచ స్థాయి రాజధానిగా చెబుతున్న వేలాది ఎకరాల భూమి ఉన్న అమరావతిలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుకు స్థలమే కనిపించ లేదా.. అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య (నాని) కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మచిలీపట్నంలోని గొడుగుపేటలో ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన 40 ఎకరాల భూమిని గోల్ఫ్ కోర్టు సంస్థకు కేటాయించనుండటం దారుణం అన్నారు.విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని చదును చేసే పనులు చేస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆలయ భక్త బృందం సభ్యులు ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. 2017లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ఆలయం జీర్ణావస్థకు చేరిందని, కూలేందుకు సిద్ధంగా ఉంటే సరుగుబాదుల సపోర్టుతో ఆలయాన్ని భక్తులు కాపాడుతూ వచ్చారన్నారు. ఆ సమయంలోనే ఈ భూమిపై కూటమి పాలకులు కన్ను వేసి.. ఆలయాన్ని విజయవాడ దుర్గ గుడి ఆధీనంలోకి తీసుకెళ్లారన్నారు.దీంతో ఈ ఆలయ ధూప, దీప నైవేద్యాలకు కూడా నిధులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ఆలయాన్ని దుర్గ గుడి నుంచి మళ్లీ దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఆలయ జీర్ణోద్ధరణకు దాదాపు రూ.1.80 కోట్లు సీజీఎఫ్ నిధులు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. భక్తుల వద్ద నుంచి రూ.20 లక్షలు సేకరించి.. మొత్తం రూ.2 కోట్ల నిధులతో ఆలయ పునరుద్ధరణ గావించామని చెప్పారు. ఈ భూమిని రైతులకు బహిరంగ వేలంలో కౌలుకు ఇచ్చి, వచ్చే ఆదాయాన్ని ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారని వివరించారు. మళ్లీ కూటమి నేతల కన్నుకూటమి అధికారంలోకి వచ్చాక ఈ 40 ఎకరాల భూమిపై మళ్లీ కన్నేసి కౌలు దారులను, అధికారులను బెదిరించి పంట వేయకుండా అడ్డగిస్తూ గోల్ఫ్ కోర్టు నిర్మాణం పేరుతో ఆ భూమిని కాజేయడానికి యత్నిస్తున్నారు. వందలాది టిప్పర్లతో మట్టి తోలుతూ, దేవుడి ఆస్తి అనే భయం లేకుండా మెరక పనులు చేస్తున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ సైతం అండగా ఉండటం పాపం కాదా..? ఇదే కలెక్టర్ ఈ భూమిని గోల్ఫ్ కోర్సుకు, ఎగ్జిబిషన్‌కు కేటాయించాలని జూలైలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ రాశారు.దేవదాయ భూమిని లీజుకు తీసుకోవాలంటే బహిరంగ వేలం ద్వారానే తీసుకోవాలని, వేరే ఏ పద్ధతుల్లోనూ తీసుకోకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది. దేవుడి భూమిని కూటమి పాలకులు పప్పు బెల్లాల్లా పంచుకోవాలని చూస్తుండడం ఎంతవరకు సబబు?’ అని నాని నిలదీశారు. స్వామి వారి భూమిపై మీకు మోజు ఉంటే బహిరంగ వేలం వేసి విక్రయించగా వచ్చే మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ భూమి ఆక్రమణపై మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయన ఈ దోపిడీని నిలిపివేస్తే సరి అని, లేదంటే కోర్టును ఆశ్రయించాలని సమావేశానికి హాజరైన భక్తులు, పలు రాజకీయ పక్షాల నాయకులు తీర్మానించారు. ఈ సమావేశంలో విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరాచకం
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరు మండలం పోరంకిలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరాచకానికి దిగారు. వృద్ధ దంపతుల స్థలంపై ఎమ్మెల్యే కన్నేశారు. వృద్ద దంపతులకు నాదెళ్ల భానుతో కొంతకాలం సరిహద్దు వివాదం సాగుతోంది. సంబంధం లేకపోయినా స్థల వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చారు. బోడె ప్రసాద్ తీరుపై వృద్ధ దంపతులు మండిపడుతున్నారు. పోలీసుల అండతో ఎమ్మెల్యే అనుచరులు.. అక్రమంగా గోడకట్టించారు. 10 రోజుల క్రితం స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు మొక్కలు నాటారు.‘‘పోరంకిలో మేం ఎన్నో ఏళ్ల నుంచి నివాసముంటున్నాం. నాదెళ్ల భాను అనే వ్యక్తికి, తమకు సరిహద్దు వివాదాలున్నాయి.. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు మా స్థలంతో ఎలాంటి సంబంధం లేదు. అన్యాయంగా మా స్థలంలోకి ఎమ్మెల్యే మనుషులు చొరబడ్డారు. పది రోజుల క్రితం మా స్థలంలో ఎమ్మెల్యే పూలమొక్కలు పెట్టించారు. నిన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు మా స్థలంలో గోడ కట్టారు’’ అంటూ ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘పోలీసులే దగ్గరుండి మరీ గోడ కట్టించారు. గోడ ఎలా కడతారని ప్రశ్నించినందుకు బోడే ప్రసాద్ మనుషులు నా భర్త పై దాడి చేశారు. వృద్ధుడని కూడా చూడకుండా లాగి పడేశారు. మాకు న్యాయం చేయాలి’’ అంటూ బాధితురాలు వేడుకుంటున్నారు. -
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్‌ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్‌లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్‌షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
మద్యం అక్రమ కేసులో ‘ముగ్గురికి బెయిల్’.. విడుదలపై అధికారుల ఓవరాక్షన్!
సాక్షి, విజయవాడ: రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేస్తున్నారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. నిన్న సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ జైలు సూపరిటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదులు జైలు ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్బంగా అడ్వకేట్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ..‘నిన్న సాయంత్రం ఆర్డర్స్ వచ్చినా జైలు అధికారులు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలను విడుదల చేయలేదు. నిన్న రాత్రి 8:30 వరకూ జైలు వద్ద ఎదురు చూశాం. ఈరోజు ఉదయం 6:30 గంటలకు విడుదల చేస్తామని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. ఉదయం ఆరు గంటలకే జైలు వద్దకు న్యాయవాదులు చేరుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ జైలు సూపరింటెండెంట్ అందుబాటులో లేరు. ఆయన ఎక్కడని మేము ప్రశ్నిస్తే.. జైలు అధికారులు వింత సమాధానం చెబుతున్నారు. అదే పనిగా మేము ప్రశ్నించడంతో మచిలీపట్నం నుంచి సూపరింటెండెంట్ బస్సులో వస్తున్నారంటున్న జైలు అధికారులు మాట్లాడుతున్నారు. ఇది ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ కిందకు వస్తుంది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం’ అని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది.పాస్‌పోర్టులను ఇప్పటికే జప్తు చేయకుంటే, విడుదలైన మూడు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్నివేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని స్పష్టం చేసింది. తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్‌ను యాక్టివ్‌లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని, సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు. -
ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పాఠశాల విద్యాశాఖలో 92 శాతానికి పైగా ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులదే కీలక భూమిక అని డెమోక్రటిక్ పీఆ ర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. శ్రీను అన్నారు. గత 40 ఏళ్లుగా ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంఽధించిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ అపరిష్కతంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి తగు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు విజ్ఞప్తి చేశారు. విజయవాడ హోటల్ ఐలాపురంలో శనివారం రాష్ట్ర బీజేపీ టీచర్స్ సెల్ కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను ఉపాధ్యాయుల సమస్యలను మాధవ్‌కు వివరించారు. అనంతరం మాధవ్‌ను శాలువాతో సత్కరించి భారతమాత జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి వారికి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో. విద్యారంగంలో విశిష్టమైన కృషి చేసిన 24 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను -
వినాయక నిమజ్జనంలో కత్తులతో నృత్యాలు
వీరులపాడు: వినాయక నిమజ్జన కార్యక్రమంలో యువత మారణాయుధాలతో హల్చల్ చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కొంతమంది యువత అత్యుత్సాహంతో పసుపు కండువాలు వేసుకుని డీజే సౌండ్స్, సినిమా పాటల మధ్య కత్తులు చేత పట్టుకుని నృత్యాలు చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకునే యత్నం చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని, భయానక వాతావరణాన్ని సృష్టించిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యక్తిపై గాజు సీసాతో దాడి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తన భార్యతో మాట్లాడుతున్నాడని ఓ వ్యక్తిపై గాజు సీసాతో దాడి చేసిన ఘటన భవానీపురం బ్యాంక్ సెంటర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యాధరపురం కామకోటినగర్‌కు చెందిన నాగోజు ఉదయసాయి భవానీ హాస్పిటల్‌లోని మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి షాపులో పనులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళుతున్నాడు. బ్యాంక్ సెంటర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలోకి వెళ్లే సరికి వెనుక నుంచి రామకృష్ణ అనే వ్యక్తి గాజు సీసాతో ఉదయసాయిపై దాడి చేశాడు. తల, కుడి చేయి, వీపుపై గాజుతో పొడిచాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అక్కడికి సమీపంలో ఉన్న రామకృష్ణ సోదరుడు సాయి వచ్చి గొడవ పెద్దది చేశాడు. ఆ సమయంలో గాయపడిన ఉదయసాయిని స్నేహితులు భవానీ ఆసుపత్రికి, అక్కడ నుంచి ఆంధ్ర హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం న్యూ జీజీహెచ్‌కు తరలించారు. తనపై జరిగిన దాడి ఘటనపై ఉదయసాయి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
రైతుకు అండగా పోరుకు సిద్ధం
చిలకలపూడి(మచిలీపట్నం): ఎరువుల కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి అండగా పోరాటానికి సిద్ధమయ్యా మని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జులు తెలిపారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల ఇన్చార్జులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రాము, సింహాద్రి రమేష్‌బాబు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ.. రైతుల కష్టాలను తాము తెలియజేస్తుంటే కూటమి పాలకులు తమపై ఫేక్ ప్రచారమంటూ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎక్కడా ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోలేదని గుర్తుచేశారు. గతంలో బీపీటీ ధాన్యం బస్తా రూ.2,200 చొప్పున రైతులు విక్రయించారని, ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.1,600ల లోపే ధర వస్తోందని వివరించారు. ఒక పక్క ధాన్యం ధర పడిపోయి కుదేలైన రైతులు యూరియా అందించకుంటే ఖరీఫ్‌లో వరి దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బూటకపు మాటలు చెబుతోందని దుయ్యబట్టారు. రైతులు, వలంటీర్లు, ఉద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై ఎరువుల కష్టాలను తీర్చేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని మాయమాటలు చెబుతోందని విమర్శించారు. పీఏసీఎస్‌లను సందర్శించి ఖాళీ గోదాములను చూపించినా పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం అరకొరగా ఎరువులు అందించటంతో, పీఏసీఎస్‌లలో కూటమి నాయకులు చెప్పిన వారికే యూరియా ఇస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉప్పాల రమేష్ (రాము) మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రైతులు ఎటువంటి కష్టాలు పడకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ ఇప్పటిలా రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడటం చూడలేదన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన బందరు లక్ష్మీ టాకీసు నుంచి ధర్నాచౌక్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం వస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల రైతులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
వత్సవాయి: వేర్వేరుగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన ఎస్కే దస్తగిరి (24) అదే మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఒకరు అనారోగ్యంగా ఉన్నట్టు ఫోన్ రావడంతో గౌరవరం నుంచి అనుమంచిపల్లి వెళ్లే క్రమంలో రహదారి పక్కన నిలిపిఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందాడు. దస్తగిరికి అవివాహితుడు. తల్లి జాన్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిల్లకల్లు – వైరా రహదారిలో పెద్ద కాలువ వద్ద జరిగిన మరో ప్రమాదంలో మక్కపేట గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వరరావు(25) మరణించాడు. వెంకటేశ్వరరావు తన ద్విచక్ర వాహనంపై శుక్రవారం మక్కపేట నుంచి చిల్లకల్లు వెళ్తుండగా పెద్ద కాలువ సమీపంలో ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించి చికిత్స చేస్తుండగా శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఏడాది వయస్సున్న కుమార్తె ఉన్నారు. మృతుని భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
ఏఐ ఫర్ ష్యూర్ శిక్షణ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏఐ ఫర్ ష్యూర్(ఏఐ–4 ఎస్‌యూఆర్‌ఈ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహించుకుని ఆర్థిక ప్రగతి సాధించేందుకు అడుగులు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం డీఆర్డీఏ, మెప్మా, యూసీడీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త – ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు చేరువ చేసుకునేందుకు ఆధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఏఐ నిపుణులతో 160 మంది స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. నిట్ – వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ స్ఫూర్తి మాట్లాడుతూ రెండు సెషన్లలో ఆరుగంటల పాటు స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు ఏఐతో పాటు డిజిటల్ మార్కెటింగ్ వేదికలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకట నారాయణ, గ్రామీణ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.కల్పన, అర్బన్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవ ఏర్పాట్లు, పనుల ఆకస్మిక తనిఖీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, దసరా ఉత్సవాల ఏర్పాట్లను శనివారం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం మహా మండపం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనం, మల్లేశ్వరాలయం నుంచి కొండ దిగువకు జరుగుతున్న ర్యాంప్, మెట్ల నిర్మాణంతో పాటు ప్రసాదాల పోటు భవనాల పనులను ఆయన పరిశీలించారు. దసరా ఉత్సవాలకు ముందుగానే ఆయా భవనాల్లో అన్ని పనులు పూర్తి కావాలని, అదే సమయంలో పనుల్లో ఎక్కడా నాణ్యత లోపం లేకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కనకదుర్గనగర్, రథం సెంటర్లో జరుగుతున్న దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నూతన అన్నదానం, ప్రసాదాల పోటులో పూజలు మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదానం, ప్రసాదాల పోటులో శనివారం కమిషనర్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ సారథ్యంలో అర్చకులు అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నూతన భవనాల్లో పాలు పొంగించారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు నిరంతరం ప్రసాదాలను అందించేందుకు ఈ రెండు భవనాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదం, ఉచిత లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో శీనానాయక్, ఏసీ రంగారావు, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు ఎన్.రమేష్‌బాబు, వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు వెలుగును భావి తరాలకు అందించాలి
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుమొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తెలుగు భాష వెలుగులను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖ, చెన్నపురి తెలుగు అకాడమీ (చైన్నె) సంయుక్తంగా ఆచార్య తూమాటి దొణప్ప శత జయంతి సంవ త్సరం సందర్భంగా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ‘విశిష్ట తెలుగు దిగ్దర్శనం’ గ్రంథావిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథి ముప్పవరపు వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మనిషి అవసరం రీత్యా ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదన్నారు. ఆచార్య దోణప్ప తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రాచీన తెలుగు విషయాలతో కూడిన గ్రంథాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదని, వారి గొప్పతనాన్ని పిల్లలకు తెలపాలని కోరారు. మనదేశాన్ని భయపెట్టాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. మన దేశం ఆయిల్ ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తే అమెరికాకు ఎందుకని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సూరం శ్రీనివాసులు, డాక్టర్ తూమాటి సంజీవరావు, గుమ్మా సాంబశివరావు, తూమాటి ప్రేమ్‌నాథ్ పాల్గొన్నారు. ● సభ అనంతరం జరిగిన సదస్సులో తమిళ సాహిత్యంలో తెలుగు ప్రాచీనత – విశిష్టతపై డాక్టర్ గాలి గుణశేఖర్, విశిష్ట తెలుగు భాష నేపథ్యంపై గారపాటి ఉమామహేశ్వరరావు, విశిష్ట తెలుగు భాష – వ్యాకరణ ప్రాశస్త్యంపై డాక్టర్ లగడపాటి సంగయ్య, తెలుగు పాఠ్య ప్రణాళిక, పరిశోధనపై బీరం సుందరరావు, తెలుగులో వ్యాఖ్యాన విశిష్టత గురించి డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ, నేటి తెలుగు–స్థితిగతులు గురించి జాగర్లపూడి శ్యామ్‌సుందర శాస్త్రి ప్రసంగించారు. -
యూరియా నిరంతర సరఫరాకు చర్యలు చేపట్టండి
టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో యూరియా నిరంతర సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి యూరియా సరఫరాపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మనగ్రోమోర్ కేంద్రం నుంచి వీలైనంత వరకు యూరియాను గ్రామాలకు తీసుకువెళ్లి అక్కడి రైతులకు పంపిణీ చేయాలన్నారు. యూరియా ఒకే చోటే ఎక్కువగా పంపిణీ చేయవద్దని, సహకార సంఘాల పరిధిలో ఉన్న గ్రామాలన్నింటికి ఎరువులు సక్రమంగా సరఫరా చేయాలన్నారు. ఐఎఫ్ఎంఎస్లో యూరియా పొందిన రైతులకు వెంటనే బయోమెట్రిక్ వేయించాలని, ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు రైతులను ఎక్కువసేపు క్యూలో ఉండకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శనివారం 1300 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు దీనిని పంపిణీ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో యూరియా సరఫరాలో రైతులకు కలిగే ఇబ్బందులను తెలియజేస్తే వారి వద్ద ఉన్న సమాచారం తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్ తదితరులు పాల్గొన్నారు. రూ.1.70 లక్షల ఎరువులు సీజ్ మొవ్వ: మండల కేంద్రం మొవ్వ గ్రామంలో శనివారం రాత్రి వరకు విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలో భౌతిక విలువలకు రిజిస్టర్ విలువలకు తేడాలు కలిగిన 1,70,240 రూపాయల విలువ గలిగిన ఎరువుల బస్తాలను సీజ్ చేసినట్లు ఏవో బి.సురేష్ బాబు నాయక్ విలేకరులకు తెలిపారు. మొవ్వలోని శ్రీ కనకదుర్గ ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని విజిలెన్స్ సీఐ ఎండి ఉమర్, సిబ్బందితో ఈ తనిఖీలలో పాల్గొన్నారని వెల్లడించారు. -
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
తక్కెళ్లపాడు(జగ్గయ్యపేట): గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఏడీ వీరాస్వామి శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం గ్రామంలోని సర్వే నంబరు 120లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు డీడీ శ్రీనివాస్‌కు సమాచారం వచ్చిందన్నారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ట్రాక్టర్‌ను, జేసీబీను స్వాధీనం చేసుకుని వీఆర్వో శ్రీనివాస్‌కు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
నదిలో మునిగి యువకుడు మృతి
ప్రమాదవశాత్తు చల్లపల్లి: నదిలో నడిచి వస్తూ ప్రమాదవశాత్తు గోతిలో పడి ఓ యువకుడు నీటిలో మునిగిపోయి విగత జీవుడైన ఘటన మండల పరిధిలోని నిమ్మగడ్డ వద్ద కృష్ణానదిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ పీఎస్వీ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ పంచాయతీ శివారు నిమ్మగడ్డ గ్రామానికి చెందిన మేడేపల్లి శ్రీనివాసరావు కుమారుడు మేడేపల్లి తేజబాబు(20) శనివారం ఉదయం కృష్ణానది మధ్యలో ఉన్న తమ లంక పొలాలకు నదిలోని నీటిలో నడుచుకుంటూ వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మరొక వ్యక్తితో కలిసి తేజబాబు తిరిగి నది నీటిలో నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. ఎంతకీ పైకి తేలకపోవటంతో పక్కనున్న వ్యక్తి ఊళ్లో వారిని పిలుచుకొచ్చాడు. తేజబాబు మునిగిన చోట నీటి లోపల పెద్ద గుంట ఉండటంతో లోపల ఇరుక్కుపోయి ఉంటాడని గమనించిన స్థానికులు వలలు వేసి ప్రయత్నించారు. చాలా సేపటి తర్వాత తేజబాబు వలకు చిక్కి బయట పడ్డాడు. అప్పటికే అతను మృతిచెంది ఉన్నాడు. ఉదయం కళ్లెదుట కదలాడిన తేజాబాబు మధ్యాహ్నానికి విగత జీవుడిగా పడివుండటాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో నిమ్మగడ్డ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు, ఒక పాప. తేజాబాబు పాలిటెక్నిక్ డిప్లొమా చదివి ఇటీవలే అప్రెంటీస్ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎస్ఐ పీఎస్వీ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిమ్మగడ్డ ప్రాంతంలో లంకకు కరకట్టకు మధ్య ఉన్న ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేయటంతో పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయని, ఆ గుంటలే తేజబాబును బలి తీసుకున్నాయని పలువురు అంటున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి చూసీచూడనట్లు వదిలేసిన అధికారులు ఇందుకు బాధ్యులని ఆరోపిస్తున్నారు. నదిలో నీరు ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి రాకపోకలు సాగించాలని లంక రైతులను హెచ్చరిస్తున్నారు. -
ఇకపై వలంటీర్ విధులను చేయం
మచిలీపట్నంటౌన్: నగరంలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న వార్డు కార్యదర్శులు శనివారం వలంటీర్ విధులను బహిష్కరించారు. ఒకరి కంటే ఎక్కువ మంది వలంటీర్లు చేయాల్సిన పనిని తాము చేస్తున్నామని ఇకపై ఈ పనులు చేయమని వారు స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం వారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శుల జేఏసీ ఆధ్వర్యంలో కమిషనర్ బాపిరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. తమపై రోజురోజుకు పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని వలంటీర్ల పనిని చేయబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో నగరంలోని పలు సచివాలయాలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు. చల్లపల్లి: సచివాలయ ఉద్యోగుల శక్తిని నిర్వీర్యం చేసేలా అధికార వర్గాలు ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా చల్లపల్లి మండల సచివాలయ ఉద్యోగులు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏపీ విలేజ్ వార్డు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు తమ నిరసనను వినతి పత్రం రూపంలో ఎంపీడీఓ అనగాని వెంకట రమణకు అంద జేశారు. పి.శ్రవణ్‌కుమార్, పద్మారావు, పి.విష్ణు, కృష్ణకాంత్, శరణ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన సచివాలయ కార్యదర్శులు -
తాంబూలాలిచ్చాం...తన్నుకు చావండి!
పెనమలూరు: మద్యం వ్యాపారుల మధ్య పోటీ మందుబాబులకు మజా సంగతేమో కాని జాతీయ రహదారిపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కూటమి ప్రభుత్వం బార్ షాపులకు అనుమతులు ఇచ్చింది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 బార్లకు టెండర్లు పూర్తి చేశారు. ఇప్పటికే నాలుగు వైన్ షాపులు అమలులో ఉన్నాయి. గంగూరు చేపల కుండీలు వద్ద (పోరంకి పరిధి) మద్యం ప్రియులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ గతంలో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనే ఒక వైన్ షాపు పెట్టి విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేశారు. వైన్ షాపులో మద్యం తాగిన వారు జాతీయ రహదారి పైకి వచ్చి వీరంగం వేస్తుండటంతో అనేక ప్రమాదాలు జరిగాయి. కొత్తగా బార్‌షాపు గతంలో బందరు రోడ్డు పక్కనే ఉన్న వైన్‌షాపునకు ఆనుకునే కొత్తగా బార్‌షాపు పెట్టారు. షామియానా వేసి రెస్టారెంట్ ఆండ్ బార్ అని బోర్డు పెట్టాడు. దీంతో పక్కనే ఉన్న వైన్‌షాపు..బార్ షాపు నిర్వాహకుల మధ్య గొడవ మొదలయింది. మద్యం ప్రియులను ఆకట్టుకోవటానికి ఒకరితో ఒకరు పోటీలు పడి రండి బాబూ..రండి అని చేపల మార్కెట్లో పిలుస్తున్నట్లు మద్యం ప్రియులను ఆహ్వానిస్తున్నారు. మద్యం అమ్మకాలపై వివాదం బార్ షాపులో లూజ్ మద్యం విక్రయాలు ఉంటాయి. వైన్ షాపులో లూజ్ మద్యం అమ్మకాలు చేయకూడదు. బార్లో ఏ ధరకై నా మద్యం అమ్ముకోవచ్చు. వైన్ షాపులో ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాల్సి ఉంది. వైన్ షాపునకు పర్మిట్‌రూమ్ ఉంటుంది. బార్ షాపులో ఇతర సౌకర్యాలు ఉంటాయి. వైన్ షాపులో లూజ్ మద్యం అమ్మకాలు చేస్తుండడంతో వ్యాపారుల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఇరువురూ పరస్పరం నిఘా పెట్టుకున్నారు. ప్రమాద ఘంటికలు గంగూరు వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనే రెండు మద్యం షాపులు ఉండటంతో వాహనాలపై వచ్చిన వారు ఇక్కడే మద్యం తాగి ఆ తరువాత వాహనాలు నడుపుతూ వెళుతున్నారు. మద్యం ప్రియులు రాత్రి సమయాల్లో జాతీయ రహదారి పక్కనే కూర్చుని మద్యం తాగుతూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. రెండు మద్యం షాపుల మధ్య పోటీతో మాకు సంబంధంలేదు. నిబంధనల మేరకు అనుమతులు ఇచ్చాం. మద్యం తాగి వాహనాలు నడిపితే పోలీసులు చర్యలు తీసుకోవాలి. – శేషగిరి, సీఐ, ఎకై ్సజ్ శాఖ -
దసరా ఆర్జిత సేవల్లో కోతలు
● రోజులో అన్ని సేవలకు 300 టికెట్లు మాత్రమే ● గతంలో డిమాండ్ మేరకు ఎన్ని టికెట్లు అయినా.. ● రూ. 500 టికెట్ విక్రయాల రద్దుకు నిర్ణయం ● ప్రొటోకాల్, ప్రముఖులకే అంతరాలయ దర్శనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అనుకున్నదే.. అయింది.. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఉభయదాతలను పరిమితంగానే అనుమతించాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన రెండో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవదాయ శాఖలో ఒక అధికారి తొలి నుంచి పట్టుబట్టిన విధంగానే ఉత్సవాల్లో జరిగే ఆర్జిత సేవలకు పరిమితంగానే టికెట్లు విక్రయించాలని నిర్ణయించారు. మరో వైపున పరోక్ష సేవలు జరిపించుకునేలా ఆర్జిత సేవా టికెట్ల ధరలను తగ్గించాలని దేవస్థానం భావిస్తోంది. 15 రోజుల్లో ఉత్సవాలు మొదలుకానున్నా ఇప్పటి వరకు ఆర్జిత సేవా టికెట్లను ప్రారంభించకపోవడం దుర్గగుడి చరిత్రలో ఇదే తొలిసారి. రెండు షిప్టులకు 150 టికెట్లు దసరాల్లో ప్రత్యేక కుంకుమార్చనను జరిపించుకునేందుకు ఉభయదాతలు, భక్తులు పోటీ పడుతుంటారు. ముఖ్యంగా మూలానక్షత్రం, విజయదశమి రోజున కుంకుమార్చన, చండీహోమానికి అధిక డిమాండ్ ఉండేది. భక్తుల డిమాండ్‌ను బట్టి ఎన్ని టికెట్లు అయినా విక్రయించే వెసులుబాటు ఉండేది. ఈ ఏడాది ఆర్జిత సేవల టికెట్లకు పరిమితి విధించడంతో ప్రత్యేక కుంకుమార్చనకు ఒక్కో షిప్టుకు 75 చొప్పున మొత్తం 150 టికెట్లు, ప్రత్యేక చండీహోమానికి 75, ఖడ్గమాలార్చనకు 50, శ్రీచక్రనవార్చనకు 25 టికెట్లు విక్రయించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. రోజుకు మొత్తంగా 300, 11 రోజుల ఉత్సవాలలో 3,300 టికెట్లను మాత్రమే విక్రయానికి రంగం సిద్ధం చేశారు. శని, ఆదివారాల నుంచి ఆయా సేవా టికెట్లు భక్తులకు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వారికే అంతరాలయ దర్శనం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది దసరాలో కావాల్సిన వారికి రాచమార్గంలో దర్శనాలు చేయించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది ఉత్సవాల్లో అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేయడంతో పాటు రూ. 500 టికెట్ల విక్రయించకుండా దేవదాయ శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ. 300 టికెట్లు మాత్రమే విక్రయించాలని, ఈ టికెట్‌పై బంగారు వాకిలి, ముఖ మండప దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖులు, ప్రొటోకాల్ ఉన్న వారికి మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని నిర్ణయించారు. ఆర్జిత సేవల్లో పరిమితి, రూ.500 దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేయడంతో దేవస్థాన ఆదాయానికి భారీ గండి పడనుంది. గతేడాది ఆర్జిత సేవల ద్వారా సుమారు రూ. కోటి మేర ఆదాయం సమకూరింది. రూ. 500 టికెట్ల విక్రయాలతో రూ. 2 కోట్ల మేర ఆదాయం రాగా ఈ ఏడాది ఆదాయం పూర్తిగా నిలిచిపోగా, ఆర్జిత సేవల ద్వారా మరో రూ. 50 లక్షల మేర గండి పడే అవకాశం ఉంది. మొత్తంగా ఆలయానికి వచ్చే ఆదాయ మార్గాలను వదిలి, ప్రముఖులు, వీఐపీల సేవలో తరలించేందుకు దేవదాయ శాఖ సిద్ధమైంది. ఉత్సవాల్లో అమ్మవారికి సేవ చేసినందుకు పలు శాఖలకు దేవస్థానం భారీగా డబ్బులు చెల్లిస్తుంది. ముఖ్యంగా నగర పోలీసు శాఖకు రూ. 1.40 కోట్లు, ఇరిగేషన్‌కు రూ. 80 లక్షలు, ఫైర్ డిపార్ట్మెంట్ అంటూ లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అమ్మవారి ఆదాయానికి గండికొడుతున్న అధికారులు.. తమ శాఖకు చెందినవారికి రాచమర్యాదలతో అమ్మ దర్శనం ఆటంకం లేకుండా ఉండటానికి శ్రద్ధ పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
యూరియా సరఫరాపై అపోహలొద్దు
పామర్రు(మొవ్వ): యూరియా సరఫరా నిరంతరం జిల్లాలో కొనసాగుతుందని.. రైతులు అపోహ పడొద్దని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టర్ శుక్రవారం ఉదయం పంట పొలాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. యూరియా కొరత ఉందని భావించి ఆందోళనకు గురవుతున్న రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. యూరియా సరఫరా, పంపిణీ, వినియోగం స్థితిగతులను ఆరా తీశారు. తొలుత కలెక్టర్ పామర్రు మండలం కురుమద్దాలి, కనుమూరు, జుజ్జువరం గ్రామాల్లో యూరియా సరఫరాపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని కలెక్టర్ రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌తో మాట్లాడుతూ అవసరమైన యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు. కలెక్టర్ వెంటనే స్పందించి ప్రస్తుతం యూరియా కావలసినంత అందుబాటులో ఉందని, నిరంతరం పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. చిలకలపూడి(మచిలీపట్నం): యూరియా కొరత కృష్ణాలో లేదని, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల అవసరాలు తీర్చేందుకే ప్రభుత్వం ఉందని సకాలంలో రైతులకు కావాల్సిన యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని ఆయన అన్నారు. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయయరావు, ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పాల్గొన్నారు. రైతులతో కలెక్టర్ బాలాజీ -
నేటి విద్యావిధానం ‘కార్పొరేట్’ చేతిలో బందీ
విజయవాడ కల్చరల్: నేటి విద్యావిధానం కార్పొరేట్ విద్యాసంస్థల చేతిలో బందీ అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి కమిటీ, కృష్ణా జిల్లా రచయితల సంఘం, రామ్మోహన గ్రంథాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంజీ రోడ్డులోని రామ్మోహన గ్రంథాలయంలో అటల్ బిహారీ వాజ్పాయ్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయుడు–నాడు–నేడు అంశంగా జాతీయ సదస్సు, గురుపూజోత్సవం, విహంగ వీక్షణం వ్యాస సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు.. అందరూ చదువు ‘కొన’కుండా చదువుకోవాలని భావించారన్నారు. ఆచార్య ఎంసీ దాస్ ఉపాధ్యాయుడు నాడు నేడు అంశంగా, నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు ఆచార్య వియన్నారావ్ నేటి విద్యావిధానం– చదువులు అంశంగా ప్రసంగించారు. డాక్టర్ సుశీలమ్మ రచించిన విమర్శ విహంగం వ్యాససంపుటిని అతిథులు ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, వివిధ రంగాలకు చెందిన చింతలపూడి కోటేశ్వరరావు, వేములపల్లి కేశవరావు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన భాషా సాంస్కృతిక వైభవానికి కృషి చేసిన 120 అధ్యాపకులకు మండలి వెంకటకృష్ణారావు శతజయంతి సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ -
కృష్ణా నదిలో గుర్తు తెలియని మృతదేహం
చల్లపల్లి: చల్లపల్లి మండల పరిధిలోని నిమ్మగడ్డ కేసీపీ ఎత్తిపోతల తూముల వద్ద కృష్ణానదిలో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. కరకట్టకు కొంత దూరంలో ఉన్న ఈ ప్రదేశం నుంచి దుర్వాసన రావడంతో అక్కడ మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని బయటకు తీయించారు. బాగా కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యకిగా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు. శరీరంపై బారుచేతుల బిస్కెట్ కలర్ చారల చొక్క, నీలం రంగు ప్యాంటు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. రెండు వెండి ఉంగరాలు ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 రోజుల మధ్యలో మరణించి ఉండొచ్చని చెప్పారు. వీఆర్వో పెనుమూడి వెంకటేశ్వరరావు, గ్రామస్థుల సమక్షంలో పంచనామా చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని కృష్ణానది ఒడ్డున ఖననం చేసినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. అవనిగడ్డ: అవనిగడ్డ నుంచి కోడూరు ప్రధాన రహదారిపై బైకు అదుపు తప్పి పడిపోవడంతో మేస్త్రి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కోడూరు మండలం విశ్వనాధపల్లికి గ్రామానికి చెందిన మేసీ్త్ర బత్తుల నాగరాజు(46) అవనిగడ్డ వెళ్లి వస్తుండగా రామచంద్రాపురం గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయాడు. ఘటనలో నాగరాజు తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయ వృత్తిని మించింది లేదు
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయ వృత్తిని మించింది లేదని, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బోధనలు తరతరాలను ప్రభావితం చేస్తున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ కొనియాడారు. నగరంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాధాకృష్ణన్ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువులకు దక్కిన గౌరవమన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయుల ప్రాధాన్యం, విద్యా విలువలపై ప్రసంగించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను అలరించగా, ఎంపికై న 23 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీిసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్పీ గంగాధర్, డీఈఓ పీవీజే రామారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరిగింది బంటుమిల్లి: ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకుంటున్న గురువులపై మరింత బాధ్యత పెరిగిందని డీఈవో రామారావు అన్నారు. స్థానిక సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్(అప్స) ఆధ్వర్యంలో అవార్డుల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల లక్ష్యం నేరవేరాలంటే ఉపాధ్యాయుల్లో అంకితభావం ఉండాలన్నారు. విద్యార్థుల ప్రవర్తన తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలలకు మంచిపేరు తెచ్చేవిధంగా చేయడంలో ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అనంతరం జిల్లాలోని పలు పాఠశాలల్లో గుర్తించిన ప్రైవేటు టీచర్లలో ఉత్తమ టీచర్లకు అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీవైఈవో బీసీజే శేఖర్‌సింగ్, అప్స జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌరీప్రసాద్, అజ్మతుల్లాఖాన్, సభ్యులు కొమ్మారెడ్డి కిషోర్, సాబూజాన్, కొమరగిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి సుభాష్ -
ఆటో కార్మికులను పట్టించుకోని కూటమి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల ఆకలి కేకలు పట్టించుకోవడం లేదని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఇఫ్టూ) ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో ఇఫ్టూ ఆధ్వర్యాన.. హామీలు అమలు చేయాలని కోరుతూ ధర్నా జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం హామీలు చేయడం లేదన్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తామని 15 నెలలు గడుస్తున్నా అతీగతీ లేదన్నారు. అధిక పెనాల్టీలు వేసే జీవో 21 రద్దు, కార్మికులకు సంక్షేమ బోర్డు వంటి హామీల ఊసెత్తడం లేదన్నారు. ర్యాపిడ్, ఓలా, ఊబర్ బైక్ సర్వీస్‌లు ప్రమాణాలు పాటించకుండా సర్వీస్ కంపెనీలు తమ ఆదాయం పెంచుకుంటూ ఆటోవాలాల పొట్ట కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇంధనం, సీఎన్జీని ఆటో కార్మికులకు అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలపై ఈ నెల 18న ‘చలో విజయవాడ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇప్టూ జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, నగర అధ్యక్షుడు రవీంద్ర, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి ఆర్.కనకరావు, నాని, అర్జున్, సత్యనారాయణ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ -
నిమజ్జన వేళ నీటిలో పడి..
కంకిపాడు: కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటనపై శుక్రవారం కేసునమోదైంది. కంకిపాడు ఎస్ఐ డి.సందీప్ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు మండలం వణుకూరు గ్రామానికి తండు సుందర్రావు (69) గంగూరులోని విజయ స్పిన్నింగ్‌మిల్లులో రోజు వారీ కూలీగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఇంటి నుంచి సైకిల్‌పై డ్యూటీకి బయలుదేరి వస్తున్నాడు. గంగూరు పెప్పర్ స్కేర్ వద్ద రోడ్డు దాటుతుండగా మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో గాయపడ్డ సుందర్రావును కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే సుందర్రావు మృతి చెందాడు. వైద్యులు నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. కోనేరుసెంటర్: మద్యం మత్తులో మాజీ భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో శుక్రవారం జరిగింది. కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అవనిగడ్డ అశ్వరావుపాలెంకు చెందిన మాదివాడ వెంకటసీతారామరాజు మచిలీపట్నం సర్కిల్‌పేటకు చెందిన పద్మజను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ పాప. పద్మజకు రెండో వివాహం కావటంతో ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. పద్మజ ఏడాది క్రితం భర్తను వదిలి కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోయింది. సీతారామరాజు.. కుమార్తెతో అవనిగడ్డలో ఉంటున్నాడు. పద్మజ భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్లో వారికి విడాకులు మంజూరైనట్లు బాధితురాలు తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం మద్యం సేవించిన సీతారామరాజు పద్మజ ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో పద్మజను రోడ్డుపై ఆపి ఘర్షణ పడ్డాడు. తనతో రావాలంటూ నిలదీశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన సీతారామరాజు కత్తితో ఆమైపె దాడి చేశాడు. శరీరంపై కత్తితో పలు చోట్ల గీశాడు. గాయాలపాలైన పద్మజ కేకలు పెట్టటంతో సీతారామరాజు పరారయ్యాడు. స్థానికులు గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫ్రీ బస్సులతో మా పొట్ట కొట్టారు!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెట్టి తమ పొట్ట కొట్టిందంటూ ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రోడ్డు పాలు చేసిందంటూ మండిపడ్డారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టిన కూటమి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్(ఇఫ్టూ అనుబంధం) ఆధ్వర్యంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని సిటీ టెర్మినల్‌లో ఆటో కార్మికులు వినూత్నంగా బిక్షాటన చేశారు. చేతుల్లో బొచ్చెలు పట్టుకుని ప్రయాణికుల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. తమ గోడును ప్రయాణికులతో వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఇఫ్టూ నాయకులు కె.పోలారి, దాది శ్రీనివాసరావు, మునిశంకర్లు మాట్లాడుతూ ఆటో కార్మికులను చంద్రబాబు ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్నారు. ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చ జరిపి హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరుపకుండా మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు కారణంగా ఉపాధి నష్టపోతున్న ఆటో కార్మికులకు ఏడాదికి రూ.30వేల సహాయం ప్రకటించి ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు. జీవో నంబర్ 21 రద్దుతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 18వ తేదీన అన్ని ఆటో మోటారు సంఘాలతో కలిపి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. తొలుత సిటీ టెర్మినల్‌లో ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు బిక్షాటన చేస్తూ నిరసన తెలియజేస్తున్న ఆటో నాయకులను, కార్మికులను టెర్మినల్‌లోకి వెళ్లకుండా అడ్డగించారు. ఆ సమయంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆటో కార్మికులు తాము ధర్నాలు చేయడం లేదని.. అడుక్కోవడం కూడా నేరమా! అంటూ లోపలికి వెళ్లి బిక్షాటన చేశారు. కార్యక్రమంలో ఇఫ్టూ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు సీహెచ్ పెద్దిరాజు, డి.శ్రీధర్ బాబు, యాదగిరి, సూరిబాబు, వై.అప్పారావు, వలి, రఫీ, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. విజయవాడ సిటీ బస్టాండ్‌లో ఆటో కార్మికుల భిక్షాటన -
డయల్ యువర్ కలెక్టర్‌కు రైతుల నుంచి విశేష స్పందన
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 45 ఫోన్ కాల్స్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎరువుల సరఫరా, సమస్యలపై రైతుల సందేహాలను నివృత్తి చేసే ఉద్దేఽశంతో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 45 కాల్స్ వచ్చాయి. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఫోన్లో స్వయంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫోన్ కాల్‌ను స్వీకరించి రైతు చెప్పిన సమస్యను విని, ఆ సమస్యపై అక్కడే ఉన్న అధికారులను ఆరా తీసి, పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. ఎంత విస్తీర్ణంలో పంట వేశారు? ఇప్పటివరకు యూరియా ఎన్ని కట్టలు తీసుకెళ్లారు? ఇప్పుడు ఎన్ని సంచులు కావాలి? క్షేత్రస్థాయిలో మీకు ఎదురైన ఇబ్బంది ఏమిటి? ఇంతవరకు సంబంధిత సొసైటీకి ఎంత సరఫరా చేశారు? ఈ రోజు ఎంత మొత్తం అందుబాటులో ఉంది.. ఇంకా ఎంత వస్తుంది.. ఇలా ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా వివరించారు. మోతాదుకు మించి వాడకుండా సూచనలు చేశారు. యూరియా వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలను రైతులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ, నేల సారాన్ని కాపాడేందుకు నానో యూరియా ఉపయోగించాలని సూచించారు. విడతల వారీగా అవసరమైన ఎరువులను పంపిణీ చేసే విషయంలో ఎక్కడా ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులు నమ్మవద్దని, కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని, రైతులు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా సహకార అధికారి డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, మార్క్‌ఫెడ్ అధికారి నాగ మల్లిక పాల్గొన్నారు. -
ఉత్సవాల ముసుగు
భారీ దోపిడీకి ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈవెంట్లు నిర్వహించడమే తప్ప ప్రజల సాధకబాధలు గురించి పట్టించుకునే రకం కాదు. గతంలో రాష్ట్రాన్ని ఒక కంపెనీగా, తాను ఒక సీఈఓలా వ్యవహరించిన చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి అయ్యాక ఒక ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో మైసూరు దసరా ఉత్సవాల స్థాయిలో చేస్తామంటూ విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత సన్నాహాలు చేస్తున్నారు. ఈ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి భారీ ప్రణాళిక రచించారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.విజయవాడలో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ఫార్మా కాలేజి గ్రౌండులో గత రెండేళ్లుగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు కమిటీగా ఏర్పడి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే వారిని పార్లమెంటు ముఖ్యనేత తన వద్దకు పిలిపించుకుని, ఈ ఏడాది అక్కడ ఉత్సవాలు జరపవద్దని, తాను విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నానని చెప్పారు. మీరు ఉత్సవాలు నిర్వహిస్తే నేను నిర్వహించే ఉత్సవాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. దానిపై ఇప్పుడు టీడీపీ వర్గాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవు తోంది. పార్లమెంటు ముఖ్యనేత వ్యవహార శైలిపై భగ్గుమంటున్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చూసీ చూడనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత విజయవాడ ఉత్సవ్ ముసుగులో భారీ దోపిడీకి ప్రణాళిక రచించారు. శతాబ్దాలుగా అత్యంత ఘనంగా జరుగుతున్న విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు సమాంతరంగా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఉత్సవాల నిర్వహణకు నడుం కట్టారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను తన అక్రమార్జనకు పార్లమెంటు ముఖ్యనేత వేదికగా చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తగ్గించేలా విజయవాడ ఉత్పవ్ నిర్వహించడానికి పార్లమెంటు ముఖ్యనేత సిద్ధమయ్యారు. మైసూరులో జరిగే ఉత్సవాల కంటే ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని గొప్పలు చెబుతున్నారు. ఆ ఉత్సవం నిర్వహించడానికి పున్నమి ఘాట్‌ను కేటాయిస్తే వాటిలో స్టాల్స్, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు నో చెప్పడంతో.. దేవదాయ భూమిపై కన్ను విజయవాడ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారని, భక్తుల అవసరాల దృష్ట్యా పున్నమి ఘాట్‌ను కేటాయించలేమని ముఖ్యనేతకు అధికారులు తేల్చి చెప్పారు. దాంతో గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగు పేటలోని సర్వే నంబరు 454లో ఉన్న 39.99 ఎకరాల వెంకటేశ్వర స్వామికి చెందిన భూమిపైన కన్ను పడింది. ఆ భూమిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని దేవదాయ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో తన అధీనంలోకి తీసుకున్నారు. మట్టి తోలి చదును చేస్తున్నారు. ఈ భూమిలో విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్, వినోద కార్యక్రమాలు, స్టాల్స్, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మైసూరు ఉత్సవాల కంటే ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెబుతూ ఆ స్టాల్స్‌ను భారీ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరహాలో వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని లీజుకు ఇచ్చి సొమ్ము చేసుకోవడానికి తేర తీశారు. భవిషత్తులో ఈ భూమిని విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో లీజుకు తీసుకొని భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు పావులు కదుపుతున్నారని, టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలిక్లినిక్ రోడ్డులో ఉత్సవాలు నిర్వహించవద్దని హుకుం... -
నూతన సబ్ స్టేషన్లకు స్థలాలు పరిశీలించాలి
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను పరిశీలించాలని సీఎండీ పి.పుల్లారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి అధ్వర్యంలో సీపీడీసీఎల్ సర్కిల్ అధికారులతో సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, సీఆర్డీఏ, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల సర్కిల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థలాలు పరిశీలించి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లు, సరఫరా లైన్లలో అంతరాయాలు తగ్గించాలన్నారు. ఇందు కోసం ముందుగానే నిర్వహణ పనులు, అవసరమైన సామగ్రి అందించేందుకు, అత్యవసర సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యవసాయదార్లకు పగటిపూట తొమ్మిది గంటల నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించాలని, నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలని, జాతీయ గ్రీన్ ఎనర్జీను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణయాదవ్, డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్.వెంకటేశ్వర్లు, ఆరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం
తుమ్మలపాలెం(ఇబ్రహీంపట్నం): గుర్తు తెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని తుమ్మలపాలెం గ్రామంలో 65వ నంబర్ హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగింది. తుమ్మలపాలెం గ్రామానికి చెందిన కఠారి శేషగిరిరావు (59) లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. డ్యూటీలో ఉండి హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వెళ్లూ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చేందుకు తన కుమారుడు రాంబాబుకు ఫోన్‌చేసి రోడ్డు వద్దకు రమ్మని చెపి లారీని రోడ్డుపక్కన ఆపాడు. లారీ టైర్లులో గాలి చెక్ చేసుకునే క్రమంలో కిందికి దిగాడు. అదే సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం శేషగిరిరావును ఢీకొట్టింది. కుమారుడు రాంబాబు లారీ వద్దకు వచ్చే సమయానికి తండ్రి మృతి చెంది ఉంటడం గమనించి తల్లికి సమాచారం ఇచ్చాడు. శేషగిరిరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రమేష్ పది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు కుటుంబ పెద్ద మృతితో ఆకుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి జి.కొండూరు: పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పని చేసేందుకు రెండు రోజుల క్రితం వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వెల్లటూరు గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగింది. అల్లూరిసీతారామరాజు జిల్లా, జీకే వీధి మండల పరిధిలోని ఈకోడిసింగి గ్రామానికి చెందిన వంతల సన్యాసిరావు(38) మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో పని చేసేందుకు ఈ నెల ఒకటో తేదీన వచ్చారు. ఇటుక బట్టీలో రెండవ తేదీ నుంచి పనిలో చేరిన ఈ ఆరుగురు కార్మికులు, గురువారం ఇటుక బట్టీలో ఉన్న పాత షెడ్డును తొలగించి మరో చోట నిర్మించే పనులను చేపట్టారు. ఈ క్రమంలో సన్యాసిరావు తొలగించిన షెడ్డు నుంచి ఇనుప రాడ్డుని పైకి తీసి తరలిస్తున్న క్రమంలో పైన ఉన్న విద్యుత్లైనుకు తాకింది. విద్యుదాఘాతానికి గురైన సన్యాసిరావు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి కార్మికులు సన్యాసిరావుని వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి దుర్మరణం జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొనడంతో షేక్ మస్తాన్ (69) మృతి చెందాడు. పెనుగంచిప్రోలు మండలం, పాత ముళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్మస్తాన్ జగ్గయ్యపేట పట్టణంలో కూలిపనులు చేసుకుంటూ జీవి స్తున్నాడు. ఉదయం టీ తాగేందుకు అతను బస్టాండ్ బయటకు వచ్చాడు. జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామానికి వెళ్లే పల్లెవెలుగు బస్సు స్టేషన్లోకి వెళ్లే ద్వారం నుంచి లోపలకు వెళ్లే క్రమంలో ఆ మార్గంలోనే నడిచివెళ్తున్న మస్తాన్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన మస్తాన్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. మస్తాన్‌కు భార్య లేదు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ కె.శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొర్రగుంటపాలెంకు చెందిన డ్రైవర్ కె.శ్రీను కాంట్రాక్టు డ్రైవర్ అని, ఆన్‌కాల్ డ్రైవర్‌గా ఏడాదిగా పనిచేస్తున్నాడని డిపో మేనేజర్ తెలిపారు. పట్టణ ఎస్ఐ జి.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. -
రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ఏడాదిగా వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకు గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలే నిదర్శనమని పేర్కొన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లా డారు. పాలకులు అధికార మత్తు వీడి వైద్య రంగాన్ని గాడిలో పెట్టాలని సూచించారు. తురకపాలెంలో అధికారిక లెక్కల ప్రకారం ఐదు నెలల్లో 30 మంది మృతి చెందారని, ఆరోగ్యశాఖ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెల్లారితే గత ప్రభుత్వాన్ని వివర్శించడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందిందో ప్రభుత్వ సర్వీసులో ఉన్న సీనియర్ వైద్యులను అడిగితే చెపుతారని డాక్టర్ మెహబూబ్ షేక్ పేర్కొన్నారు. కూటమి పాలకులు ప్రచార ఆర్బాటాలు కాకుండా, మరణాలకు కారణాలు తెలసుకుని, నివారణ చర్యలు చేపట్టా లని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న వారికి సైతం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు గుడివాడరూరల్: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, ఎస్ఐ పి.గౌతమ్‌కుమార్ గురువారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 1.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ మాట్లా డుతూ.. గంజాయి అక్రమ రవాణాపై అందిన విశ్వసనీయవర్గ సమాచారం మేరకు డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ పర్యవే క్షణలో స్థానిక ఎఎన్ఆర్ కళాశాల వెనుకవైపు తుప్పల ప్రాంతంలో దాడులు చేసి బేతవోలు పెదపేటకు చెందిన గొడవర్తి కిరణ్, బేతవోలుకు చెందిన పడ మట నాగస్వామి, ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఎలమర్తి నాని, కార్మికనగర్‌కు చెందిన మాదాసు రామకోటేశ్వరరావు, ఓర్స్ కిషోర్‌ను అరెస్ట్ చేశామన్నారు. వారికి సహకరించిన ఆరో వ్యక్తి బేతవోలుకు చెందిన పడమట మణికంఠ హనుమాన్ జంక్షన్లో దొంగతానికి పాల్పడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేశా మని, ఒకరు జైల్లో ఉండగా మిగిలిన ఐదుగురిని కోర్టులో హాజరుపర్చ న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారని వివరించారు. నిందితులను నెల్లూరు సెంట్రల్ జైల్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయండి
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన లక్ష్యాలను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో గురువారం మధ్యాహ్నం గృహనిర్మాణ పురోగతిపై మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ.. జిల్లాలోని గృహనిర్మాణ పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. లబ్ధిదారులతో కాంట్రాక్టర్లు తరచూగా సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణాలు త్వరతగతిన పూర్తి చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల్లో పురోగతి శూన్యంగా ఉందన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వివిధ దశల్లో ఉన్న గృహనిర్మాణాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి అదనపు ఆర్థిక సాయం పొందుతున్న వెనుకబడిన వర్గాల వారు గృహాలను త్వరతగతిన నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. అధికారులు లేఅవుట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి అవసరమైన వాటికి అప్రోచ్ రోడ్లు, మెరక పనులు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ ఇన్చార్జ్ అధికారి పోతురాజు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆనంద్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖాధికారి ఫణిదూర్జటి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీఎస్ఓ జి.మోహన్‌బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా దొంగల ముఠా అరెస్టు
గుడివాడరూరల్: అమ్మమ్మ, నాయనమ్మతో కలసి చోరీలకు పాల్పడుతున్న మనవరాలిని గుడివాడ తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. మండలంలోని లక్ష్మీనగర్ కాలనీలో శేషుకుమారి నివసిస్తోంది. ఆమె ఇంటిలో ఖాళీగా ఉన్న పోర్షన్లో అమ్మమ్మ రాజేశ్వరి, నాయనమ్మ రమావతితో కలసి విజయవాడకు చెందిన రాగమాధురి అద్దెకు దిగింది. వారు శేషుకుమారితో స్నేహంగా ఉంటూ ఆమె నమ్మకం సాధించారు. ఈ క్రమంలో రాగమాధురి, అమ్మమ్మ రాజేశ్వరి కలిసి శేషుకుమారిని తీర్థయాత్రల పేరుతో వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ చేరుకున్నారు. శేషుకుమారితోపాటు రాజేశ్వరిని విజయవాడలో ఓ హోటల్లో ఉంచిన రాగమాధురి ఒంటరిగా గుడివాడ చేరుకుంది. నాయనమ్మ రమావతితో కలిసి రాగమాధురిని యజమాని ఇంట్లోని బీరువాను దొంగిలించి గుడ్లవల్లేరు తీసుకెళ్లి, అక్కడ దానిని పగులకొట్టి బంగారు, వెండి నగలతోపాటు విలువైన పట్టు చీరలను చోరీ చేశారు. గత నెల 30వ తేదీన ఇంటికి వచ్చిన శేషుకుమారికి తన ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటంతో పాటు బీరువా కనిపించకపోవడంతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ చంటిబాబు తన సిబ్బందితో కలసి చోరీ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తూ మల్లాయపాలెం సమీపంలోని టిడ్కో సముదాయం వద్ద అనుమానాస్పదంగా ఉన్న రాజేశ్వరి, రమావతి, రాగమాధురిని ఎస్ఐ చంటిబాబు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం వెల్లడైంది. వారి వద్ద 71.04 గ్రాముల బంగారు, 327 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు విలువైన పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నాలుగు రోజుల్లోనే ఛేదించిన ఎస్ఐ చంటిబాబు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ అభినందించి, నగదు రివార్డులను అందజేశారు. పోలీసులకు చిక్కిన ముగ్గురు మహిళలపై ఇప్పటికే రెండు మోసాల్లో కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో తాలూకా సీఐ ఎస్.ఎల్.ఆర్. సోమేశ్వరరావు, ఎస్ఐ ఎన్.చంటిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..?
ఇబ్రహీంపట్నం: మండలంలోని జూపూడి భీమేశ్వర కాలనీలోని ఓ ఇంట్లో జరిగిన పేలుళ్ల వెనుక ఎన్నో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం రాత్రి పేలుడు జరిగి, ఇద్దరు వెల్లింగ్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ఇంటితోపాటు మరో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెల్డింగ్ మిషన్‌కు విద్యుత్ వినియోగించడం వల్లే పేలుడు జరిగిందని ఇంటి యజమానులు చెబుతుండగా, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత కారణాలు వెల్లడవుతాయని పోలీసులు అంటున్నారు. బాణసంచా తయారీ వల్లే భారీ పేలుడు జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల ఇంటిలో జరిగిన భారీ పేలుళ్ల వెనుక బలమైన వ్యక్తులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజులుగా పక్క జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు స్థానికులకు పేలుడు ముడిసరుకు ఇచ్చి బాణసంచా తయారీ చేయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాణసంచా తయారీకి వస్తువుల లెక్కన నగదు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. 3 కి.మీ. వినిపించిన పేలుడు శబ్దం జూపూడి భీమేశ్వరకాలనీలో జరిగిన పేలుడు శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల దూరం వినిపించింది. పేలుడు సమయంలో దట్టమైన పొగ అలుముకుని భరించలేని దుర్వాసన వెలువడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పేలుడు జరిగిందని భావించిన కొందరు విద్యుత్‌శాఖ లైన్మెమన్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఓ వైపు భారీ శబ్దం, మరోవైపు దట్టమైన పొగ, ఇంకో వైపు భరించరాని దుర్వాసన, కరెంటు కూడా లేకపోవడంతో ప్రజలు చీకట్లో ప్రాణం అరచేతిలో పెట్టుకుని కాలం గడిపారు. కొందరు చీకట్లో బయటకు పరుగులు తీశారు. దళారుల ప్రమేయంతో బాణసంచా తయారీ పొరుగు జిల్లాకు చెందిన కొందరు పేదల కాలనీలను ఆసరాగా చేసుకుని బాణసంచా తీయారీ వృత్తిలోకి లాగుతున్నారు. వారి ఆర్థిక అవసరాలు తెలుసుకుని ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికి ప్రమాదకరమైన ఈ వృత్తిలోకి తీసుకొస్తున్నారు. ఉల్లిపాయ బాంబులు వంద తయారీ చేస్తే ఒక రేటు, వెయ్యికి మరో రేటు చొప్పున ఒప్పుకొని కుటీర పరిశ్రమలా బాణసంచా తయారీ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కోతుల కోసం తీసుకొచ్చిన ఉల్లిపాయ బాంబులను మెట్ల కింద ఉంచామని పేలుడు జరిగిన ఇంటి యజమానులు చెబుతున్నారు. మెట్ల కింద ఉంచిన ఉల్లిపాయ బాంబుల వల్లే భారీ విస్పోటనం జరిగినట్లు తేటతెల్లమవుతోంది. ప్రమాదానికి కారణం కోతుల కోసం తెచ్చిన ఉల్లిపాయ బాంబులా, తయారీ చేసినవా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పేలుడు ధాటికి దెబ్బతిన్న భవనం పేలుడు తీవ్రతకు కుప్పకూలిన రేకుల ఇల్లు పొట్టకూటికోసం వచ్చి ప్రాణాపాయ స్థితికి.. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో పేలుడు జరిగిన ఇంటి యజమానులు ఇంటి చుట్టూ ఐరన్ మెస్ ఏర్పాటు చేసేందుకు కోనాయపాలేనికి చెందిన వెల్డర్లు గోపీ, మహేష్‌ను పిలిపించారు. పొట్టకూటి కోసం వచ్చిన వారిద్దరు పేలుడులో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరారు. ఐరన్ మెస్ బిగిస్తున్న మహేష్ పేలుడు ధాటికి పక్కింటి రేకుల షెడ్డుపైకి ఎగిరిపడ్డాడు. రేకులు పగిలి నేలపై కుప్ప కూలి తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో వెల్డర్ గోపీపై ప్రహరీ కూలింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపీని స్థానికులు బయటకు తీశారు. ఇద్దరినీ 108లో విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గోపీ ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. ఇంటి యజమానులు బయట ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రేకుల షెడ్డు ధ్వంసమైంది నా భర్త చనిపోవడంతో ఒంటిరిగా బతుకీడుస్తున్నా. మా పక్క ఇంటిలో జరిగిన పేలుడు ధాటికి మా రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వెనక గోడలు కూలిపోయాయి. రేకులు పగిలిపోయాయి. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా. మళ్లీ ఇల్లు నిర్మించుకునే స్తోమతు లేదు. ఇంటి నిర్మాణానికి అధికారులు సహకారం అందించాలి. – మిద్దే శిరోమణి, కాలనీ వాసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాంవెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో బ్లాస్టింగ్ జరిగినట్లు ఇంటి యజమానులు చెబుతున్నారు. మేము చేపట్టిన పరిశీలనలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. క్లూస్ టీమ్ నివేదికలను బట్టి బ్లాస్టింగ్‌కు కారణాలు వెల్లడవుతాయి. పోలీస్ శాఖ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. నివేదికల ఆధారంగా త్వరలో పేలుళ్లకు కారణాలు వెల్లడిస్తాం. – దుర్గారావు, వెస్ట్‌జోన్ ఏసీపీ -
సర్వీసు వైద్యులపై చిన్నచూపు తగదు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి జీడీఏ ఏపీ సభ్యుల వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): సర్వీసు వైద్యులపై ప్రభుత్వం కనబరుస్తున్న చిన్నచూపు తగదని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ సంఘ ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న వైద్యులు 25 ఏళ్ల సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని మంత్రికి వివరించారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మూడు, నాలుగేళ్లకే సర్వీసులో ఉద్యోగో న్నతి పొందుతున్నారని వివరించారు. వైద్యుల ఉద్యోగోన్నతుల సమస్య పరిష్కారానికి తమిళనాడు, కేరళ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న డైనమిక్ అస్యూర్డ్ కేరీర్ ప్రోగ్రామ్‌ను మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని కోరారు. జనరల్ కేటగిరీ వైద్యులందరినీ ఏకీకృత సీనియారిటీ పరిధిలోని తీసుకు రావాలని, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని ఉన్నత స్థాయి పదవుల్లో వైద్యాధికారులను మాత్రమే భర్తీ చేయాలని, అప్పుడే వైద్యుల్లో కొందరికై నా ఉద్యోగోన్నతులు వస్తాయని వివరించారు. రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుల్లో సివిల్ సర్జన్ జనరల్ కేటగిరీ వైద్యులు, జిల్లా స్థాయి ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుల్లో డెప్యూటీ సివిల్‌సర్జన్ వైద్యులను మాత్రమే నియమించాలని కోరారు. వైద్య విద్యశాఖ వైద్యులకు 2016 నుంచి బకాయి పడిన యూజీసీ అరియర్స్‌ను చెల్లించాలని కోరారు. వైద్య శాఖ మంత్రిని కలిసిన వారిలో జీడీఏ ఏపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇంజేటి బాబ్జీ శ్యామ్‌కుమార్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పంజాల శ్రీనివాసరావు, డాక్టర్ స్వరూప్‌కాంత్, డాక్టర్ భానుకుమార్, డాక్టర్ యావ్, డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ గోపాల్‌నాయక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. -
రైతులు ఆందోళన చెందొద్దు
మోదుమూడి, అవనిగడ్డలో పర్యటించిన జేసీ గీతాంజలి శర్మ అవనిగడ్డ: రైతులందరికీ యూరియా అందుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దని జేసీ గీతాంజలి శర్మ చెప్పారు. జేసీ గీతాంజలి శర్మ గురువారం అవనిగడ్డ, మోదుమూడి గ్రామంలో పర్యటించారు. యూరియా కొరత, పంపిణీలో రైతులు పడుతున్న ఇబ్బందులను సాక్షిలో ‘ఒక్క కట్టకోసం పదిగంటలు’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ పరిస్థితిని తెలుసుకోవాల్సిందిగా ఆదేశించడంతో జేసీ పర్యటించారు. మోదుమూడి రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన ఆమె రైతులతో మాట్లాడి యూరియా పంపిణీని తెలుసుకున్నారు. స్లిప్పులిచ్చినా యూరియా ఇవ్వలేదు మన గ్రోమార్ని జేసీ గీతాంజలి శర్మ సందర్శించారు. అక్కడ స్టాకు నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మాట్లాడుతూ మాకు స్లిప్పులు ఇచ్చినా యూరియా ఇవ్వలేదని చెప్పారు. ఆలస్యమైతే పిలకలు తొడగవని, ఎదుగుదల ఆగిపోతుందని, యూరియా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన జేసీ రెండు, మూడు రోజుల్లో స్టాక్ వస్తుందని, ఈ సారి ముందుగా వీరికి ఇచ్చిన తర్వాత మిగిలిన వారికి ఇవ్వాలని మన గ్రోమోర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, ఏవో ఏవో శుభహారిక, ఆర్ఐ బాలాజీ, వీఏవోలు పాల్గొన్నారు. -
యువత.. చెడు నడత
లబ్బీపేట(విజయవాడతూర్పు): కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఎక్కువ మంది యువత ఆలోచనలు ఉంటున్నాయి. ఈ తరుణంలో అనేక నేరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిలో విలాసాలకు అలవాటు పడిన వారు కొందరైతే, దురల వాట్లకు బానిసలైన వారు మరికొందరు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాసతో మోసాలకు పాల్పడుతున్న ఇంకొందరు. మోసం ఏ రూపంలో చేసినా పోలీసులకు చిక్కి జైలు పాలవుతున్నారు. ఇలా ఇటీవల కాలంలో డబ్బు లావాదేవీల్లో మోసాలకు పాల్పడిన ఫిర్యాదులు పోలీస్ గ్రీవెన్స్‌లో ఎక్కువగా వస్తున్నాయి. నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్న వారు ఉంటున్నారు. ఇవే నిదర్శనం.. ఇవి మచ్చుక కొన్ని మాత్రమే. ఇటీవల కాలంలో మోసాలు, చోరీలు, చీటింగ్ కేసుల్లో అరెస్టు అవుతున్న వారిలో ఎక్కువ మంది ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్న వారే ఉంటున్నారు. అంతేకాదు సైబర్ నేరాలు, మాయ మాటలు చెప్పి, నమ్మబలికి డబ్బులు తీసుకుని మోసం చేయడం వంటి నేరాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్నేహితులు, బంధువులనూ వదలడం లేదు.. ఈజీ మనీ కోసం తెలియని వారినే కాదు, తమ స్నేహితులు, బంధువులను సైతం మోసం చేస్తున్నారు. సత్యనారాయణపురంలోని యుపిక్స్ కేసులో ఎక్కువ మంది స్నేహితులు, బంధువులు ఉండటం గమనార్హం. కొందరు అమాయక ప్రజలు సైతం అధిక వడ్డీలు వస్తాయని అలాంటి వారి బుట్టలో పడిపోతున్నారు. ఇటీవల శిశువును ఇస్తామంటూ తెలంగాణకు చెందిన స్నేహితుడి నుంచే రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం వెలుగు చూసింది. దీనిపై కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు సైతం ఫిర్యాదులు అందాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. డ్రగ్స్, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు లోనై జీవితాలను అంధకారం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్ మత్తులో నారాలకు పాల్పడితే అమలు చేసే శిక్షలు గురించి వివరిస్తున్నారు. అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఉన్నత విద్యతోనే అత్యున్నత హోదా సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు.ఎదుటి వారితో పోల్చుకోవడం ఇటీవల ఎక్కు వైంది. అలాంటి వారు అనవసర ఆడంబరాలకు పోతూ, ఆదాయానికి మించిన ఖర్చులతో అడ్డదారులు తొక్కుతున్నారు. కళాశాల పిల్లల్లో ఒకరు ఖరీదైన బైక్ వేసుకొస్తే, తమకు స్తోమత లేకున్నా అలాంటి బైక్ కొనాలని భావిస్తూ.. సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో యువత డగ్ర్కు, ఆల్కాహాల్‌కు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. – డాక్టర్ గర్రే శంకరరావు, మానసిక నిపుణులు -
ఆక్వా కుయ్యో.. రొయ్యో
అన్నీ నష్టాలే చాలా కాలంగా రొయ్యల సాగు చేస్తున్నాం. విద్యుత్ భారం అధికమైంది. రొయ్యల ధరలు సైతం పతనమయ్యాయి. పెట్టుబడి ఎక్కువైంది. వచ్చే లాభాలు కన్నా నష్టాలు తీవ్రమయ్యాయి. విద్యుత్ ధరలు తగ్గిస్తారని ఆశించాం. అది జరగలేదు. ప్రస్తుతం సాగు భారంగా మారింది. రొయ్యల్లో వ్యాధులు సైతం ఎక్కువ కావడంతో సాగు చేయడం కష్టంగా మారింది. అన్నీ నష్టాలే వస్తున్నాయి. –చింతాడ పెద్దిరాజు, ఆక్వా రైతు, ఎల్‌ఎన్‌పురం, నందివాడవిద్యుత్ ధరలు తగ్గించండి ఎన్నికల సమయంలో విద్యుత్ ధరలు తగ్గిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ప్రస్తుతం సాగులో విద్యుత్ వల్ల ఎక్కువగా పెట్టుబడి అవుతుంది. ట్రాన్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ పెట్టుబడి కావడంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న ట్రాన్స్ఫార్మర్లను ఇవ్వడం లేదు. విద్యుత్ ధరలను తక్షణమే తగ్గించి నష్టాల బారి నుంచి కాపాడాలి. –గురువెల్లి చంటి, ఆక్వా రైతు, ఎల్‌ఎన్‌పురం, నందివాడగుడివాడరూరల్: ఆక్వా రైతు కుదేలవుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన సుంకాల భారం ఆక్వా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. మొన్నటి వరకు మూడుశాతం ఉన్న సుంకాలను 50 శాతం మేరకు పెంచడం గుదిబండలా మారింది. రొయ్యల ధరలు పతనమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఏడాది దాటినా అమలు చేయకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రంలోనే ఆక్వా ఎగుమతుల్లో కృష్ణా జిల్లా అగ్రగామిగా ఉంది. ఇక్కడ నుంచే ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు రొయ్యల, చేపల ఎగుమతులవుతున్నాయి. దాదాపుగా జిల్లాలో 1,03, 977 ఎకరాల్లో రొయ్యల, చేపల చెరువులు సాగవుతున్నాయి. 46,385 ఎకరాలు రొయ్యల సాగును రైతులు చేస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా జిల్లాలో ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్లు, హేచరీలు, కోల్డ్‌స్టోరేజ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనాలకు ఎక్కువగా రొయ్యల ఎగుమతులు చేస్తున్నారు. ఏటా 3 నుంచి 4లక్షల టన్నుల మేర ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. రైతులకు ఆశాజనకమైన ధరలు లభించేవి. ప్రస్తుతం వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆంక్షలతో అవస్థలు ఎగుమతులపై ట్రంప్ సుంకాలు పెంచడంతో రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. 100 కౌంట్ ధర ప్రస్తుతం రూ.230, 90 కౌంట్ ధర రూ.240, 80 కౌంట్ ధర రూ.260, 70 కౌంట్ ధర రూ.285, 60 కౌంట్ ధర రూ.305, 50 కౌంట్ ధర రూ.325, 40 కౌంట్ ధర రూ.335కు పడిపోయాయి. ఇప్పుడు కౌంట్‌కు రూ. 100 నుంచి 135 వరకు తేడా వస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో నాడు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు, ఇతర ఉపయోగాల రూపంలో ఆక్వా రైతులకు మంచి ధర పలికేది. హామీలు విస్మరించిన కూటమి ఆక్వా రంగంతో రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చేది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆక్వా రైతులకు భరోసా ఇస్తూ వాగ్దానాలు చేశారు. రొయ్యల పరిశ్రమకు ఎక్కువగా మేలు చేసే విద్యుత్ ధరలను యూనిట్‌కు రూ.1.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్లను సైతం ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయితే ఇచ్చిన వాటిలో ఒక్కటీ నెరవేరలేదు. ప్రస్తుతం యూనిట్ ధర రూ.3.84 ఉంది. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రైతులకు లక్షల్లో ఖర్చు అవుతుంది. మేతల కొనుగోలుకు సైతం ధరలు తగ్గిస్తామని చెప్పిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కూటమి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే కొంత మేర నష్టాల నుంచి బయటపడవచ్చని ఆశించిన ఆక్వా రైతులకు నిరాశే ఎదురవుతోంది. రొయ్యల సాగులో లాభాలకు బదులు నష్టాలు రావడం, ధరలు పడిపోవడం, విద్యుత్ బిల్లుల భారం, అధికంగా రొయ్యల మేతల ధరలు పెరగడం, తరచూ వచ్చే వ్యాధుల దెబ్బకు రొయ్యల రైతులు సాగంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసి కనీసం విద్యుత్ బిల్లులు తగ్గిస్తారనే ఆశ.. నిరాశగా మారడంతో రైతన్నలు సాగంటేనే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీజులు ఎకరాకు రూ.90 వేల నుంచి రూ.లక్ష రూపాయల వరకు ఉండటం, ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీలు అందకపోవడంతో ఆక్వా రైతులు అప్పుల పాలైన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యను ప్రధాని వరకు తీసుకెళ్లి ఆక్వా రైతుల ఇబ్బందులు తొలగించాల్సి ఉంది. -
బాబు సర్కార్‌కు ఆటో కార్మికుల హెచ్చరిక.. కార్యాచరణ ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు.. ప్రచార జాతాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున భారీ నిరసన చేపట్టనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో, క్యాబ్, టాటా మ్యాజిక్ డ్రైవర్లు తరలిరానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. స్త్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహన మిత్ర కింద రూ.30 వేలు ఇవ్వాలని.. లేనిపక్షంలో బంద్ చేపడతామని హెచ్చరించారు. -
గన్నవరం: ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం!
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో పైలెట్ అప్రమత్తతతో ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ సమయంలో ఇంజిన్లోకి పక్షి దూసుకెళ్లింది. దీంతో విమానాన్ని వెంటనే పైలెట్ ఆప్రాన్(పార్కింగ్ ఏరియా లాంటిది)పైకి తరలించి నిలిపివేశారు. గురువారం ఉదయం 8.25గం. ప్రాంతంలో గన్నవరం నుంచి బెంగళూరుకు ఎయిరిండియా విమానం వెళ్లాల్సి ఉంది. అయితే విమానం టేకాఫ్ సమయంలో పక్షి ఇంజిన్లోకి దూరడాన్ని పైలెట్ గమనించి వెంటే నిలిపివేశారు. ఘటన సమయంలో విమానంలో 90 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులను ఎయిర్పోర్ట్ లాంజ్‌కు తరలించారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టిన తర్వాతే ప్రయాణం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. -
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చందర్లపాడు(నందిగామ టౌన్): ఉద్యాన పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు ఎకరా విస్తీర్ణంలో సాగు చేస్తున్న తైవాన్ జామ తోటను అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా.. దాదాపు లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ఎకరా విస్తీర్ణంలో 444 మొక్కలు నాటారని పథకం కింద రూ.2.51 లక్షల సాయం అందుతుందన్నారు. మొదటి ఏడాది రూ.1,26,110, రెండో ఏడాది రూ.60,707, మూడో ఏడాది రూ. 64,407 చొప్పున రైతుకు అందుతుందని తెలిపారు. ఉద్యాన పంటలతో పాటు పశుపోషణను సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బంగారు కుటుంబాలతో.. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పీ4 సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ముప్పాళ్ల గ్రామంలోని బంగారు కుటుంబాల లబ్ధిదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలోని చెరువులను పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. నందిగామ పట్టణంలోని గ్రోమోర్ ఎరువులు, పురుగు మందుల దుకాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు విక్రయించాలని యూరియా, తదితర ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్వామా పీడీ రాము, ఆర్డీవో బాలకృష్ణ, చందర్లపాడు ఎంపీడీవో పద్మజ్యోతి, నందిగామ డెప్యూటీ ఎంపీడీవో నామేశ్వరరావు పాల్గొన్నారు. -
తప్పుల్లేని భూ రికార్డులే లక్ష్యం
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కంకిపాడు: ఎలాంటి తప్పులు లేకుండా నాణ్యమైన భూమి రికార్డులను అత్యంత బాధ్యతతో రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గుడివాడ, ఉయ్యూరు డివిజన్ల అధికారులకు స్వామిత్వ సర్వేపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం కంకిపాడులోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిని, భూమిని సరిహద్దులతో గుర్తించి, సర్వే నంబర్ కేటాయించేలా, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రికార్డులను రూపొందించేందుకు స్వామిత్వ సర్వే దోహద పడుతుందన్నారు. ఆర్ఎస్ఆర్ మాదిరిగా స్వామిత్వ సర్వే రికార్డులు మదర్ రికార్డు అవుతుందన్నారు. భూమి రికార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా నాణ్యతాయుతంగా రికార్డులను తయారు చేయటంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ, సర్వే భూ రికార్డుల ఏడీ జోషిలా, డీఎల్పీఓ సంపత్‌కుమారి, డీఎల్డీఓ రాజేష్, డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, ఆయా డివిజన్ల పరిధిలోని 175 గ్రామ పంచాయతీలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. పక్కాగా రీసర్వే పమిడిముక్కల: రీసర్వే పక్కాగా చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, ఆర్డీఓ హేలా షారోన్ బుధవారం మర్రివాడ వెళ్లి రీసర్వే చేసిన రికార్డులను తనిఖీ చేశారు. రీసర్వేపై ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు. త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
మీ పురస్కారాలు మాకొద్దు!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎవరికై నా పురస్కారం అనగానే ఎగిరి గంతేస్తారు. ఆ పురస్కారం కోసం ప్రతిభ కలిగిన వ్యక్తులు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అటువంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే దరఖాస్తు చేసుకోవటం సహజం కనిపిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న తరువాత తమకు తెలిసిన ప్రజాప్రతినిధితోనో లేక ఇతర ఉన్నతాధికారులతోనే సిఫార్సులు సైతం చేయిస్తుంటారు. ఇదంతా సహజంగా జరిగే తంతు. కానీ ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో జరిగే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు గురువులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం చూపిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు వారిచ్చే పురస్కారాలకు సైతం ఆసక్తి చూపటం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కేవలం 28 దరఖాస్తులే.. ఎన్టీఆర్ జిల్లాలో జరిగే గురుపూజోత్సవానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఏటా వందలాదిగా దరఖాస్తులు వస్తుంటాయి. వాటి ఎంపికకు పెద్ద కసరత్తు చేసి వారిని ఎంపిక చేస్తుంటారు. కానీ ఈ ఏడాది జిల్లా పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి బుధవారం సాయంత్రానికి కేవలం 28 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీనిపై జిల్లా అధికారులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు పురస్కారాలు ఇస్తామని ప్రకటించినా ముందుకు రాకపోవటంపై అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5,160 మంది ఉపాధ్యాయులు ఎన్టీఆర్ జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద సుమారుగా 969 ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. ఆయా విద్యాసంస్థలో సుమారుగా 5,160 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిలో నాలుగు వేలమందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హులవుతారు. అయితే అందుకోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎంపిక చేసేందుకు చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి 60 మందికి ఇవ్వటానికి అధికారులు సమాయత్తమయ్యారు. తీరా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కేవలం 28 మంది మాత్రమే ఉండటంతో జిల్లా అధికారులకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనేనా? ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలపై ఉపాధ్యాయులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అందువల్లే కనీసం పురస్కారాలను తీసుకోవటానికి సైతం ముందుకు రాకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని అర్థంపర్ధం లేని యాప్‌లతో సతాయిస్తున్నారని వారు చెబుతున్నారు. తాజాగా విద్యార్థులు రాసిన పరీక్షల మూల్యాంకనం భారంతో ఉపాధ్యాయులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండి ఆయా పరీక్షలు రాసిన బుక్లెట్లను దిద్దాలని నిర్ణయించటం వల్ల తరగతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటితో పాటుగా పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవటంపైనా గురువులు తమకిచ్చే పురస్కారాలకు వ్యతిరరేకంగా ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా స్థాయిలో జరిగే గురుపూజోత్సవం వేడుకల్లో ఏటా విద్యాశాఖ సుమారు 50 నుంచి 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందిస్తోంది. వివిధ కేటగిరీలతో పాటుగా ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పురస్కారాలను వారికి ప్రదానం చేయటం పరిపాటి. కలెక్టర్ లేదా మంత్రి వంటి ముఖ్యఅతిథుల చేతుల మీదుగా ఆ ప్రదానోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది 60 మంది కి పురస్కారాలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. గత ఏడాది ఈ గురుపూజోత్సవాన్ని నిర్వహించలేదు. దాంతో ఈ ఏడాది ఇంకా అధికంగా గురువులు దరఖాస్తు చేసుకుంటారని అధికాారులు భావించారు. కానీ అందుకు భిన్నంగా దరఖాస్తులే రాకపోవటంపై సర్వత్రా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను దుర్గగుడి ఈవో వీకే శీనా నాయక్ బుధవారం పరిశీలించారు. ఇంద్రకీలాద్రి దిగువన క్యూ లైన్ల వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ఉత్సవాల సమయంలో భక్తులకు మెరుగైన దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలకు పాత ఆర్బీ ఫ్రేమ్‌ల స్థానంలో సింహాచలం దేవస్థానం నుంచి తెప్పించిన క్యూ ఫ్రేమ్‌ల ఏర్పాటు పనులను ఆయన పర్యవేక్షించారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రసాదం పోటు భవనంలో డ్రెయినేజీ తదితర పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. కొండపై భాగంలో ఏర్పాటు చేస్తున్న కొత్త పూజా మండపాల పనులకు సంబంధించిన వివరాలను ఈఈ–1 కేవీఎస్ కోటేశ్వరరావు ఈఓ శీనా నాయక్‌కు వివరించారు. మిగిలిన 12 బార్లకు నోటిఫికేషన్ విడుదల చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో మిగిలిన 12 బార్లకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు తెలిపారు. మొత్తం 12బార్లకు గానూ గుడివాడ పట్టణంలో ఆరు, మచిలీపట్నం కార్పొరేషన్లో నాలుగు, పెడన మునిసిపాలిటీలో ఒకటి, బందరు మండలం మంగినపూడిలో ఒక టూరిజం బార్‌కు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 14వ తేదీ సాయంత్రం 6గంటల వరకు వీటికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ సమక్షంలో డ్రా తీసి షాపులు కేటాయిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 9963604239, 8466981837లో సంప్రదించాలన్నారు. ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరికి కీలక పదవి లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడకు చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరి నాగ వరప్రసాద్ ఏషియన్ మస్క్యూలో స్కేలేటల్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన సొసైటీ 27వ వార్షిక సమావేశంలో డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సొసైటీ ఏర్పాటైన రెండున్నర దశాబ్దాల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు వర ప్రసాద్ కావడం విశేషం. ఆయన ఆగస్టు 2027 వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇటీవల కాలం వరకూ ఆయన ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్‌ఐఏ)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతేకాకుండా ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్‌కు(ఐసీఆర్ఐ)కు జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలి నందిగామ రూరల్: గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న స్వామిత్వ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని ఐతవరంలో జరుగుతున్న స్వామిత్వ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. ముందుగా సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠాలలోని ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులను కల్పించేందుకే ప్రభుత్వం స్వామిత్వ సర్వేను నిర్వహిస్తోందన్నారు. స్వామిత్వ సర్వే పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీల ద్వారా జరుగుతున్న సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్డీవో బాలకృష్ణ, డీఎల్పీవో రఘువరన్, తహసీల్దార్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాలుడి హుండీ ఆదాయం రూ. 19.29లక్షలు తిరువూరు: గంపలగూడెం మండలం నెమలిలోని శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానంలో హుండీ కానుకల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి నాలుగు నెలల పాటు ఆలయంలోని ఆరు హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.19,29,484 నగదు, అన్నదానం హుండీ ద్వారా రూ.32,692 ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ సంధ్య తెలిపారు. 18 గ్రాముల బంగారం, ఒక కేజీ 596 గ్రాముల 300 మిల్లీగ్రాముల వెండి, 29 అమెరికన్ డాలర్లు, 50 రియాల్స్, 5 యూరోలు కూడా భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు. -
ధననాథుడు
రూ. 3.10కోట్ల కరెన్సీ నోట్లతో అలంకారం వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక మండపాలలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలకు నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులు విశేష పూజలు చేస్తున్నారు.నందిగామలోని వాసవీ మార్కెట్లోని ప్రత్యేక మండపంలో కొలువుదీరిన గణనాథుడిని నిర్వాహకులు రూ. 3.10కోట్ల కరెన్సీ నోట్లతో బుధవారం అలంకరించారు. గతేడాది రూ.2.22కోట్లతో అలంకరించినట్లు నిర్వాహకులు చెప్పారు. కరెన్సీ నోట్ల అలంకారంలోని గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. – నందిగామ రూరల్ -
దేవస్థానంలో ఈ ప్రొక్యూర్ మెంట్ సీల్డ్ టెండర్లు ఖరారు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో వివిధ కేటగిరీల్లో లైసెన్సు హక్కులకు ఈ –ప్రొక్యూర్మెంట్, బహిరంగ వేలం నిర్వహించినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సుధాకరరావు, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో బుధవారం ఉదయం వేలం నిర్వహించినట్లు డీసీ తెలిపారు. దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలు ప్రోగుచేసుకునే హక్కుకు రెండేళ్ల కాల పరిమితికి నవంబర్ 6, 2025 నుంచి నవంబర్ 5, 2027 వరకు రెండో సంవత్సరం 10 శాతం పెంపుదలతో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన లక్ష్మీ రమాదేవి ఎంటర్ప్రెజెస్వారు రూ.60.60 లక్షలకు లైసెన్సు హక్కు పొందారన్నారు. లడ్డూ ప్రసాదం తయారు చేయుటకు నవంబర్ 1, 2025 నుంచి అక్టోబర్ 31, 2026 ఏడాదిన్నర కాలానికి ఆకులమన్నాడు గ్రామస్తుడు పువ్వాడ వంశీ లైసెన్సు పొందారు. ఆలయ అధికారుల సమక్షంలో ఖరారు.. పులిహోర ప్రసాదం తయారు చేసి, ప్యాకింగ్ చేయుటకు వక్కలగడ్డ వాసి కర్ర లక్ష్మి, కూరగాయల సరఫరాకు విశ్వనాథపల్లి వాసి రేపల్లె పిచ్చేశ్వరరావు లైసెన్సు పొందారు. అరటి పండ్లు, కొబ్బరికాయలు, తమలపాకులు సరఫరా, రాతి నాగశిలలు సరఫరాకు మచిలీపట్నం వాసి ఉప్పాల సుబ్రహ్మణ్యం లైసెన్సు పొందారు. ఖాళీ నెయ్యి డబ్బాలు, పాత ఐరన్ రద్దు కొనుగోలు చేయుటకు విజయవాడ వాసి అనుమూల శ్రీనివాసరెడ్డి, సర్పదోష నివారణ పూజలకు కావాల్సిన వెండి పూత నాగపడగలు సరఫరాకు గుడివాడకు చెందిన బాలాజీ ట్రేడర్స్, ఆవు పెరుగు సరఫరా చేసేందుకు మోపిదేవికి చెందిన వీఏవీల్వీకే గుప్తాకు లైసెన్సు పొందారన్నారు. ఆలయ సూపరింటెండెంట్స్ అచ్యుత మధుసూదనరావు, బొప్పన సత్యనారాయణ, చెన్నకేశవ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణలో విజయవాడ భేష్
పటమట(విజయవాడతూర్పు): పర్యావరణ పరిరక్షణలో విజయవాడ భేష్ అని, విజయవాడ నగరం సుందరంగా– పరిశుభ్రంగా ఉందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ(జీఈఎఫ్) వీఎంసీకి కితాబిచ్చింది. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ధ్యానచంద్ర చాంబర్లో జీఈఎఫ్ ప్రతినిధులు బుధవారం ఆయనను కలిసి నగరంలో వారి పరిశీలను వివరించారు. వీఎంసీ–యూనిడో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామలింగేశ్వర నగర్ 20 ఎంఎల్డీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పునరుద్ధరీకరణ, బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్ట్ పురోగతిపై జీఈఎఫ్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ జీఈఎఫ్ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీఎంసీ పర్యావరణ పరిరక్షణకు వీఎంసీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. నగరంలోని కాలుష్యం తగ్గించేందుకు రూ.14.93 కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, విజయవాడ నగర భౌగోళిక స్థితిగతులను, వారు ఆ నిధులు, వీఎంసీ సాధారణ నిధుల నుంచి రూ.4.93తో చేపట్టిన ఎస్ టి పి, బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్ పరిస్థితులను వివరించారు. విజయవాడలో సీఐఏపీ ముగింపు కార్యక్రమం రామలింగేశ్వరనగర్లో 20 ఎంఎల్డీ ఎస్టీపీని పునరుద్ధరించడమే కాకుండా, అక్కడున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, దుర్వాసనను నియంత్రించేందుకు ఓడర్ కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. విజయవాడ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడం కోసం మరింత నిధులు అవసరమని, వారి ఆర్థిక సహాయంతో కేవలం వాడుక నీరు శుద్ధి చేయడమే కాకుండా, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి కాలువల డ్రెయిన్లు వంటివి నిర్మించేందుకు వారి సహకారం అవసరమని తెలిపారు. అనంతరం జీఈఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ పరిశీలనలో వీఎంసీ కాలుష్యం తగ్గించడానికి తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు, చర్యలు, ఇతర నగరాలకు ఆదర్శనీయంగా ఉన్నాయని, యూనిడో, జెఫ్ సహకారం కచ్చితంగా ఉంటుందని తెలిపారు. సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలెట్ ఇన్ ఇండియా(సీఐఏపీ) ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ఐదు పైలట్ నగరాలను ఎంపిక చేశామన్నారు. విజయవాడతో పాటు గుంటూరు, మైసూర్, భోపాల్, జైపూర్ నగరాల్లో ఈ ప్రాజెక్టుని అమలు చేశారని, ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అంతర్జాతీయ పరిశీలకుడు రోనాల్డ్ వంగ్, జాతీయ పరిశీలకుడు డాక్టర్ శ్రీనివాస్ ష్రాఫ్, యూనిడో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నందపాల్ సింగ్, యూనిడో నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దీపిక శ్రీపాద, వీఎంసీ అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరెడ్డి, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. -
చవితి వేడుకలు నిర్వహిస్తున్న బాషా ఆదర్శనీయం
ఘంటసాల: కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరుడైన అక్బర్ బాషా(షామియాన) ఆధ్వర్యంలో ఘంటసాలలో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఆదర్శనీయమని కృష్ణా మిల్క్ యూనియన్, వినాయక చవితి కమిటీ రాష్ట్ర చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. ఘంటసాలలో బాషా ఆధ్వర్యంలో జరుగుతున్న చవితి వేడుకల్లో ఆంజనేయులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చలసాని నిర్వాహకుడు అక్బర్ బాషా(షామియాన) – షర్మిల దంపతులను సత్కరించి స్వామి వారి చిత్రపటాలను అందించి అభినందించారు. దేశాభివృద్ధికి యువత సహకరించాలి అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఘంటసాల గ్రామంలో బాషా ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా వినాయక చవితి ఉత్సవాలతో ప్రతి రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషమన్నారు. మొదటి రోజు పీటల మీద కూర్చుని వినాయకునికి పూజలు చేసిన బాషా, షర్మిల దంపతులను అభినందించారు. కుల మతాలకు అతీతంగా దేశాభివృద్ధికి యువత సహకరించాలని కోరారు. ముందుగా శ్రీ జలధీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంజనేయులను టీడీపీ నేతలు ఘనంగా సత్కరించారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన 2 వేల మందికి అన్నసమారాధన కార్యక్రమాన్ని చలసాని స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించగలిగినట్లు అక్బర్ బాషా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, మిల్క్ యూనియన్ డైరెక్టర్ వేమూరి సాయి, పీఏసీఏస్ చైర్పర్సన్ బండి పరాత్పరరావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, పాలకేంద్రం అధ్యక్షుడు గొర్రెపాటి సురేష్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
అమ్మవారి సన్నిధిలో అన్నదాన పథకానికి విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో నిత్యం జరిగే అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందజేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం(ఆజాద్ రోడ్)కు చెందిన సర్వ కృష్ణమోహన్ ప్రసాద్ దంపతులు నిత్యాన్నదానానికి రూ.2 లక్షలు, విజయవాడ కానూరుకు చెందిన విశ్వశ్రీ ప్రాజెక్ట్స్, ఆరో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని చింత శివరామకృష్ణ రూ.1,00,116 అందజేశారు. దాతలకు ఆలయ సిబ్బంది అమ్మవారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం చేయించారు. అనంతరం వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన 19 మందికి న్యాయస్థానం జరిమానాలు విధించింది. నగరంలోని 4వ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి 6వ అడిషనల్ జ్యూడిషల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్డులో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి లెనిన్‌బాబు జరిమానాలు విధించారు. ఒక్కరికి రూ.15 వేలు, 18 మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారు. -
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పామర్రు(మొవ్వ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో జోయాలుక్కాస్ జ్యూవెలరీ, బందన్ బ్యాంక్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, పేటీఎం లాంటి ప్రముఖ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా http://naipunya-mapgov.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్‌తో రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 80743 70846, 63006 18985 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మెదడు ద్రవం ముక్కు ద్వారా కారడం వంటి అరుదైన సమస్యతో బాధపడుతున్న 35 ఏళ్ల శేషుకుమారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒబెసిటీ కలిగిన పెరిమోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, ఆ సమయంలో హార్మోన్ లోపం కారణంగా ఎముకలు బలహీనమవుతాయని తెలిపారు. మెదడు పొరలు బలహీనమై, దగ్గు, బలంగా తుమ్మడం, మలబద్దకం వంటి పరిస్థితులు సమస్యను మరింతగా ప్రేరేపిస్తాయన్నారు. శేషుకుమారి పదేళ్లకు పైగా ఈ సమస్యతో బాధపడుతూ 2015లో విజయవాడ జీజీహెచ్‌లో, 2021లో గుంటూరులో ఓపెన్ క్రానియోటమీ సర్జరీలు చేయించుకున్నారని చెప్పారు. సమస్య మళ్లీ పునరావృతం కావడంతో ఆస్పత్రికి రాగా ఈఎన్టీ వైద్యులు ఆధునిక ఎండోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేశారని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని సమస్య నుంచి ఉపశమనం పొందారన్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ కె.రవి, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వినయ్, డాక్టర్ శాంతిలతను సూపరింటెండెంట్ అభినందించారు. -
వినాయకుని సేవలో ముస్లిం కుటుంబం
ఘంటసాల (అవనిగడ్డ): కృష్ణాజిల్లా ఘంటసాలలో ఓ ముస్లిం కుటుంబం వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి, తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తూ మత సామరస్యం చాటుకుంది. ఘంటసాలకు చెందిన అక్బర్ బాషా, షర్మిల దంపతులు జలధీశ్వరాలయ ప్రాంగణంలో ఈ మండపాన్ని ఏర్పాటు చేయించారు. తొలిరోజు ఈ దంపతులు పీటల మీద కూర్చుని పూజలు చేశారు. బుధవారం అన్న సమారాధన నిర్వహించగా, గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా అక్బర్ బాషా, షర్మిల దంపతులను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సత్కరించారు. -
పరుగులు పెట్టి.. పడిగాపులు
యూరియా కోసం అన్నదాతల ఆక్రందననాగాయలంక: మండలంలో రైతాంగానికి మంగళవారం యూరియా అందిస్తామని వ్యవసాయశాఖ సమాచారం అందించడంతో రైతులు పెద్ద సంఖ్య లో రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టి.. పడిగాపులు కాశారు. నాగాయలంకలోని బస్‌స్టేషన్ సమీపంలోని సేవా కేంద్రంలో ఉదయం 8గంటలకు రైతులకు యూరియా అందిస్తామని మెసేజ్‌లు పెట్టడంతో తెల్లవారుజాము నుంచే నాగాయలంక, మర్రిపాలెం, రేమాలవారిపాలెం రైతులు ఈ కేంద్రానికి తరలివచ్చారు. అయితే 10గంటలు దాటే వరకూ సంబంధిత అధికారులు రాకపోవడంతో రైతులు సంఖ్య భారీగా పెరిగింది. పరిస్థితితో ఆందోళన చెందిన నాగాయలంక ఎస్ఐ కె.రాజేష్ సేవా కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. అందరూ క్యూలో నిలబడి అధికారులకు సహకరించాలని నచ్చజెప్పారు. 40 టన్నులే స్టాక్.. ఇదే పరిస్థితి మండలంలోని భావదేవరపల్లి, సంగమేశ్వరం, పర్రచివర సేవాకేంద్రాల్లో నెలకొంది. వాస్తవానికి ఈ నాలుగు కేంద్రాలకు కలిపి 40టన్నులు స్టాక్ మాత్రమే అందించినట్లు ఏఓ ఎ.సంజీవకుమార్ చెప్పారు. మరో ఎనిమిది కేంద్రాలకు 80టన్నుల మేరకు ఇండెంట్ పెట్టామని రెండు రోజుల్లో వస్తుందని వివరించారు. 3ఎకరాల లోపు రైతు ఒక బస్తా, ఆపై ఉన్న రైతులకు రెండు బస్తాలు ఇస్తామని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో రైతులు రావాలని, ఏ గ్రామాల పరిధిలో స్టాక్ వచ్చిందో ఆ పరిధిలో పొలం ఉన్న రైతులు మాత్రమే యూరియా తీసుకోవాలని ఏఓ సూచించారు. కాగా సంగమేశ్వరం రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తున్న వెంకన్నస్వామి నిత్యం మద్యం మత్తులో జోగుతూ రైతులతో గొడవ పడతున్నాడు. ఆ వీడియోలు గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం జేడీ దృష్టిలో పెట్టామని ఏఓ సంజీవ్ కుమార్ చెప్పారు. -
యూరియా కోసం బారులు
ఉంగుటూరు(గన్నవరం): మండల కేంద్రమైన ఉంగుటూరులోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద మంగళవారం యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. యూరియా స్టాక్ వచ్చిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాలకు చెందిన రైతులు భారీగా ఆ సెంటర్‌కు తరలివచ్చారు. అన్నదాతల రద్దీని దృష్టిని పెట్టు కుని తోపులాట జరగకుండా పోలీసులు బందో బస్తు నిర్వహించారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రావడం గమనార్హం. అయితే గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ యూరియా దొరక్కపోవడంతో కొంత మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఒక్కొక్క రైతుకు రెండు యూరియా బస్తాలు అందించినట్లు మండల వ్యవసా యాధికారి జి. రమేష్ తెలిపారు. తహసీల్దార్ విమలకుమారి, ఎస్ఐ యూ. గోవిందు పర్యవేక్షించారు. మొత్తం రెండు మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వివరించారు. విజిలెన్స్ డీఎస్పీ పరిశీలన.. ఉంగుటూరులో యూరియా కోసం రైతులు భారీగా తరలిరావడంతో విజిలెన్స్ డీఎస్పీ బంగా ర్రాజు నేతృత్వంలో బృందం అక్కడికి చేరుకుని పంపిణీ వ్యవస్ధను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీని కలిసిన కౌలు రైతు సంఘం నాయకులు టీవీ లక్ష్మణస్వామి, అజ్మీరా వెంకటేశ్వరరావు తదితరులు రైతుల యూరియా ఇబ్బందులను వివరించారురు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. -
బెల్టు షాపు తొలగించాలంటూ రోడ్డెక్కిన మహిళలు
షేర్‌మహ్మద్‌పేట(జగ్గయ్యపేట): మద్యం బెల్ట్ షాప్ తొలగించాలంటూ మహిళలు ఆందోళన చేసిన సంఘటన షేర్‌మహ్మద్‌పేట మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని గ్రామ సచివాలయానికి ఎదురుగా గత కొంతకాలంగా బెల్టు షాప్ నడుస్తోంది. మధ్యాహ్న సమయంలో షాపు వద్ద మందుబాబులు రోడ్డుపై వెళ్తున్న మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో గ్రామంలోని మహిళలు ఐద్వా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. పలువురు మహిళలు మాట్లాడుతూ మందుబాబులు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు మద్యం సీసాలను సమీపంలోని ప్రభుత్వ భవనాలు వద్ద పగలగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఇటీవల అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోవడం లేదన్నారు. విషయం తెలుసుకున్న చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలంటూ చెప్పినప్పటికీ వారు షాపు తొలగించే వరకు ఆందోళన చేస్తామని చెప్పడంతో కొద్దిసేపు ఉద్ధృత వాతావరణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయానికి షాపును పూర్తిగా తొలగిస్తామని చెప్పడంతో మహిళలు శాంతించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు ఎస్. నాగమణి సీపీఎం నాయకులు కోట కష్ణ, గౌస్ మియా, కాకనబోయిన వెంకటేశ్వర్లు, జుజ్జవరపు వెంకటరావు, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మంగళవారం రాత్రి వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధకశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే ఈ వ్యవసాయంలో విజయవంతమైన ఆదర్శ రైతులను గుర్తించి వారి అనుభవాలను ఇతర రైతులకు వివరించే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించటం ద్వారా కూడా ప్రకృతి వ్యవసాయంలోని ప్రయోజనాలను రైతులకు తెలియజేయవచ్చన్నారు. ఇతర పంటలవైపు.. కేవలం వరి పంటలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు సైతం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే రైతులను గుర్తించి వారి ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఈ సాగుతో పండించే పంటలకు ఉన్న డిమాండ్‌ను రైతులకు వివరించామన్నారు. రసాయన ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గిపోవటంతో పాటు వాటితో పండించే పంట వినియోగం వల్ల కలిగే అనారోగ్య దుష్ఫలితాలను వివరించాలన్నారు. ప్రకృతి వ్యవసాయ డీపీఎం పార్థసారథి, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధకశాఖ అధికారులు జె. జ్యోతి, చిననరసింహులు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, వ్యవసాయశాఖ డీడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
జనసేన కార్యకర్తల అతి
ఇబ్రహీంపట్నం: ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వైఎస్సార్ సీపీ, జనసేన కార్యకర్తల నడుమ మంగళవారం వివాదం చోటుచేసుకుంది. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ కార్యకర్తలతో వైఎస్సార్ చిత్రపటం(ఫ్లెక్సీ)కు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆయన వేరే కార్యక్రమానికి బయలుదేరిన మరుక్షణం వైఎస్సార్ బ్యానర్‌పై పవన్‌కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన జనసేక కార్యకర్తలను కొందరు వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఫణీంద్ర సిబ్బందితో చేరుకున్నారు. దగ్గరుండి వైఎస్సార్ బ్యానర్‌పై పవన్‌కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేయించి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు తమ పూర్తి సహకారం అందించారు. కూటమి నేతలు, పోలీసుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. పవన్ కార్యక్రమం ముందు జరిగి ఉంటే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని పోలీసులు చెప్పేవారని చర్చించుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి పోలీసులు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. -
గజానికో గండం.. ఈ రోడ్డుకో దండం
కంకిపాడు: ‘సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను చూస్తారు’ ఇదీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటన. సంక్రాంతి దాటి కూడా నెలలు గడిచిపోతున్నాయి. మళ్లీ కొద్ది నెలల్లోనే సంక్రాంతి రాబోతోంది. కానీ రోడ్ల పరిస్థితి ఏమీ మారలేదు. ప్రాధాన్యం గల రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న కూటమి ప్రభుత్వ మాటలు నీటి మూటలయ్యాయి. ప్రభుత్వ తీరుతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల రహదారి కష్టాలకు మద్దూరు–గోసాల రోడ్డు మార్గమే నిలువెత్తు నిదర్శనం. ప్రయాణం.. నరకప్రాయం.. విజయవాడ–దివిసీమ కరకట్ట రహదారి నుంచి విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిని కలుపుతూ ఉన్న ప్రధాన రహదారి మార్గం మద్దూరు– గోసాల రోడ్డు. ఆర్అండ్బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. రోడ్డు పూర్తిగా అడుగడుగునా గోతులతో అధ్వానంగా మారింది. రోడ్డు మార్జిన్లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. మద్దూరు, వణుకూరు, గోసాల గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో పాటుగా కరకట్ట మీదుగా విజయవాడ, దివిసీమ ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఏలూరు రోడ్డు సమీపంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లాలన్నా మద్దూరు–ఈడుపుగల్లు మీదుగా ఉప్పలూరు రోడ్డు మార్గాన్ని వినియోగిస్తుంటారు. నిత్యం అధిక సంఖ్య లో వాహనాలు రాకపోకలకు సాగుతుంటాయి. అభివృద్ధి ఊసే లేదు.. దశాబ్దకాలం పైగా రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. మద్దూరు, రొయ్యూరు ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి భారీ లోడుతో ఇసుక లారీలు ఈ మార్గం గుండానే ఇసుకను రవాణా సాగించాయి. దీంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై గోతుల మయంగా తయారైంది. చిన్న పాటి వర్షానికే గోతుల్లో నీరు చేరి ప్రయాణం అస్తవ్యస్తంగా మారుతోంది. అంతేకాకుండా వాహనాలు అదుపుతుప్పి ప్రమాదాల బారిన పడటం, తరచూ వాహనాలు మరమ్మతులకు గురవుతుండటం ఇక్కడ సర్వసాధారణమైంది. ఇంకెన్నాళ్లీ ‘దారి’ద్య్రం.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గోసాల నుంచి మద్దూరు వైపు రోడ్డు దుస్థితి ఇది శంకుస్థాపన చేస్తే.. పనులు రద్దు చేశారు..గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు మద్దూరు–గోసాల–ఉప్పలూరు రోడ్డు అభివృద్ధికి రూ. 19.50 కోట్లు నిధులు కేటాయించింది. సింగిల్ లైన్‌గా ఉన్న రోడ్డును ప్రజల అవసరాల రీత్యా డబుల్ లైన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అప్పటి మంత్రి జోగి రమేష్ చేతుల మీదుగా ఈడుపుగల్లు సెంటరులో శంకుస్థాపన కూడా చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పనులు ప్రారంభానికి నోచలేదు. తదుపరి రాజకీయ పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల ఇబ్బందులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధి పనులను రద్దు చేసింది. కొత్తగా మద్దూరు–గోసాల రోడ్డు అభివృద్ధికి రూ 6.50 కోట్లతో అంచనాలను నివేదించి సరిపెట్టేసింది. గోతులమయంగా మద్దూరు–గోసాల రహదారి -
ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర రాజధాని అమరావతి పేరు, ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి వీసీ హాల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై మంగళవారం సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్, కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజేశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక సంప్రదాయాల వారసత్వ సంపదను భావితరా లకు అందించేందుకు వీలుంటుందన్నారు. నగ రంలో తొలిసారిగా భారీఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విధాలా అంచనాలను సిద్ధం చేసుకొని, ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలతో పాటు భక్తులకు ఈ ఆధ్యాత్మిక పర్యటన మధురానుభూతులు మిగిల్చేలా పర్యాటకానికి కూడా ఊపు తెచ్చేలా ఉత్సవ్ ఉంటుందన్నారు. ఉత్సవాల విజయవంతానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, గొల్ల పూడి ఎగ్జిబిషన్ వేదిక తదితరాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. హోల్డింగ్ ప్రాంతాల ఏర్పాటు, పటిష్ట భద్రత, నగర సుందరీకరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా, ఫుడ్ కోర్టుల ఏర్పాటు, హెలీ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, సంప్రదాయ కళా ప్రదర్శనలు తదితరాలపై సమావేశంలో చర్చించి చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈఓ శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ -
అవనిగడ్డలో..
● వాడవాడలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు ● వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు ● పలు ప్రాంతాల్లో అన్నదాన సంతర్పణలు, సేవా కార్యక్రమాలు ● స్వచ్ఛందంగా పాల్గొన్న అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు మచిలీపట్నంలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పేర్ని కిట్టు, నాయకులు గుడ్లవల్లేరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు -
హిందూ దేవాలయాల పరిరక్షణకు వీహెచ్‌పీ కృషి
హనుమాన్‌జంక్షన్ రూరల్: హిందూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి విశ్వ హిందూ పరిషత్ విశేష కృషి చేస్తుందని జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ శ్రీకాంత్ పరండే అన్నారు. హనుమాన్‌జంక్షన్‌లోని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ట్రస్టీ పుట్టగుంట సతీష్‌కుమార్ ఫామ్‌హౌస్‌కు సోమవారం ఆయన విచ్చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు విస్తృతం చేస్తామని చెప్పారు. తొలుత పుట్టగుంట ఫామ్‌హౌస్‌లోని శ్రీకృష్ణాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, మెడివ్యాలీ హాస్పిటల్స్ ఎండీ పంచకర్ల చక్రవర్తి, వీహెచ్‌పీ నాయకులు దుర్గా ప్రసాదరాజు, సరిపల్లి శివకుమార్ రాజు పాల్గొన్నారు.ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి చిట్టినగర్(విజయవాడపశ్చిమ): గణేష్ నిమజ్జన సమయంలో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు, అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు కోరారు. ఉత్సవాలలో ఐదో రోజైన ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 11 మంది మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తాము సంతాపం తెలియజేస్తున్నామని, మండప నిర్వాహకులు, భక్తులు పోలీసు అధికారుల సూచనలను పాటిస్తూ నిమజ్జనాలను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు మరిన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జనాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయాన్ని అందించి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ నెల 4న అధికంగా నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సమితి ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ కోరారు.మరోమారు సైబర్ నేరగాళ్ల పంజామహిళ వద్ద రూ.39 లక్షలు స్వాహాపెనమలూరు: మండల పరిధిలో సైబర్ నేరగాళ్లు మరోమారు తమ పంజా విసిరారు. ఇటీవల కాలంలో మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ఆర్థికంగా నష్టపోయారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయకులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా పోరంకిలో ఒక మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేసి ఏకంగా రూ.39,15,181 సొమ్ము స్వాహా చేశారు. ఈ ఘటన పై బాఽధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... 100 అడుగుల రోడ్డులోని అపార్టుమెంట్లో ఉంటున్న మహిళ (50)కు ఈ ఏడాది జూన్ 17వ తేదీన ఫయర్స్1916 నివేశ్ స్ట్రాటజీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమెను సభ్యురాలిగా చేర్చారు. ఆ గ్రూప్‌లో 94 మంది సభ్యులు ఉన్నారు. స్టాక్‌మార్కెట్‌కు సంబంధించిన సమాచారం గ్రూప్‌లో వచ్చేది. ఆ తరువాత ఆమెకు లింక్ పంపారు. ఆ లింక్ ద్వారా ఫయ్యర్స్యాప్లో నమోదై ఆమె పలు దఫాలుగా ఆన్లైన్లో రూ.39,15,181 సొమ్ము స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టింది. ఆమె పెట్టిన పెట్టుబడికి లాభాలు చూపారు. పెట్టిన పెట్టుబడి, లాభాలు విత్ డ్రా చేయటానికి ఆమె ప్రయత్నించగా గ్రూప్ నుంచి ఎటుంవంటి స్పందన కనపడక పోగా పెట్టిన పెట్టుబడి సున్నాగా చూపించారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాఽధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. -
రాజీనామా బాటలో రేషన్ డీలర్లు!
పెడన: కొందరు రేషన్ డీలర్లు రాజీనామాల బాటలో పయనిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వెట్టిచాకిరీ తాము చేయలేమని తేల్చి చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న తాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కమీషన్ అతి తక్కువగా ఉంటుందని... తమతో చేయించే పని ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. కమీషన్ పెంచాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం ఉండటం లేదని అంటున్నారు. ఎప్పటికి పెంచుతారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న పని చేయడం కష్టమని, తప్పుకోవడమే మేలని వెల్లడిస్తున్నారు. పెడన పట్టణంలో జూన్ నెలలో ఎంతో ఆర్భాటంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించిన షాపు నెంబరు ఏడు డీలరు ఐవీ పద్మావతి రాజీనామా చేశారు. ఈ షాపును విజేత డ్వాక్రా గ్రూపునకు అప్పగించారు. గ్రూపు లీడరు పి.కృష్ణప్రియ బాధ్యతలు చేపట్టారు. మండల పరిధిలోని దావోజిపాలెం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కె.నాగమల్లేశ్వరరావు కూడా రాజీనామా అందజేశారు. అయితే ఈయన రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించలేదు. పట్టణంలోని మరో మహిళా డీలరు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో హాయిగా... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే హాయిగా ఉన్నామని, ఇప్పుడు ఈ చాకిరీ చేయలేకపోతున్నామనే విషయాన్ని డీలర్లు పేర్కొంటున్నారు. గతంలో క్వింటాకు రూ.100 చొప్పున ఒక డీలరుకు సుమారు రూ.7వేలు నుంచి రూ.12 వేలు వరకు కమీషన్ వచ్చేది. ప్రస్తుతం వికలాంగులకు, 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధుల ఇళ్లకు తీసుకువెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేషన్ డీలర్లు ఒక హెల్పెర్ను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ హెల్పెర్కు రూ.5వేలు నుంచి రూ.6వేలు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇంటింటికి రేషన్ తీసుకువెళ్లి ఇవ్వడానికి ఒక్కొ డీలరుకు 25 నుంచి 150 ఇళ్లకు వెళ్లి ఇంటింటికి రేషన్ అందించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనంపై ఆయా ఇళ్లకు తిరగడానికి పెట్రోల్ ఖర్చులు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వెచ్చిస్తున్నారు. అదనంగా చాకిరీ చేయాల్సి రావడంతో ఇంత కష్టం ఎందుకు..రాజీనామాయే బెటర్ అంటున్నారు. -
పీ–4 కార్యక్రమాన్ని వేగవంతం చేయండి
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పీ–4 కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి పీ–4 కార్యక్రమం పురోగతిపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 78,670 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని చెప్పారు. ఇందులో అత్యధికంగా పెడన నియోజకవర్గంలో 12,661, అత్యల్పంగా పెనమలూరు నియోజకవర్గంలో 8,813 కుటుంబాలు గుర్తించామని పేర్కొన్నారు. వీటిలో 47,876 బంగారు కుటుంబాలను 4,286 మార్గదర్శిలకు అనుసంధానం చేసి దత్తత ఇచ్చామని వెల్లడించారు. జిల్లాకు చెందిన ధనికులు, ప్రముఖులు దాతృత్వం, మానవత్వం కలిగిన వ్యక్తులు స్థానికంగా గానీ ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న వారి వివరాలను సేకరించి పీ–4 కార్యక్రమం గురించి వారికి అవగాహన కల్పించి స్వచ్ఛందంగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చేలా చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్‌కుమార్, మెప్మా పీడీ పి. సాయిబాబు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్‌కు 83 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 83 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 83 ఫిర్యాదులు రాగా, వాటిలో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 35, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, కొట్లాటలపై 2, వివిధ మోసాలపై 4, మహిళా సంబంధిత నేరాలపై 20, దొంగతనాలకు సంబంధించి 3, ఇతర చిన్న వివాదాలపై 15 ఫిర్యాదులు అందాయి. కాగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత ఎస్హెచ్ఓలకు పంపి, సత్వరమే చర్యలు తీసుకోవాలని డీసీపీ ఉదయరాణి ఆదేశించారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి అర్జీ స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మత్స్యరంగంలో జీవనోపాధుల మెరుగుదలకు చర్యలు: కలెక్టర్ డీకే బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): తీరప్రాంతాల్లో మత్స్యరంగంలో జీవనోపాధుల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్రీన్ క్లైమెట్ ఫండ్స్ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పీతల సాగు, సముద్రనాచు సాగు, అలంకార చేపల పెంపకం, మైరెన్ ఫిష్ కేజ్ కల్చర్, మడ అడవుల పెంపకం, సంరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయన అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో తీరప్రాంతం కలిగిన జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి, జీవనోపాధులకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను వంటి తీరప్రాంత మండలాలు పీతల సాగుకు అవసరమైన ప్రాంతమని అందుకు అవసరమైన పీతలసీడ్ను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. అదే విధంగా మార్కెటింగ్ సౌకర్యాలు పరిశీలించాలని కోరారు. అవసరమైతే ఇతర ప్రాంతాల్లోని పీతల సాగుపై అవగాహన కల్పించేందుకు ఆసక్తి కలిగిన రైతులకు ప్రత్యేకంగా పర్యటనలు ఏర్పాటు చేయాలన్నారు. మడ అడవుల పెంపకానికి ఇంతేరు, బంటుమిల్లి, కృత్తివెన్ను వంటి ప్రాంతాలను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్‌జాహిద్, మత్స్యశాఖ అధికారి నాగరాజు, అటవీశాఖ అధికారి సునీత, వ్యవసాయశాఖ అధికారి ఎన్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ హరిహరనాధ్, డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్‌కుమార్, స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ ఉష పాల్గొన్నారు. -
కోరలు విప్పిన కాల్‌మనీ!
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరంలో కాల్‌మనీ వ్యాపారులు మళ్లీ కోరలు విప్పుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో విచ్చలవిడిగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వనివారిపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇదే విధంగా తండ్రీ కుమారులపై కాల్‌మనీ వ్యాపారి దాడులకు తెగబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన బలసాని స్వామిదాస్ రియల్ ఎస్టేట్‌లో మధ్యవర్తిత్వం చేస్తుంటాడు, కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు. కరోనా వైరస్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో చింతా చందు అనే కాల్‌మనీ వ్యాపారి తల్లి వద్ద రూ.85 వేలు అప్పుగా తీసుకొని ఆమెకు నెల నెలా వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాడు. ఆమె రెండేళ్ల క్రితం కాలం చేయడంతో ఆ సమయంలో కూడా అసలులో రూ.20 వేలు ఇచ్చారు. ఆ తరువాత ఆమె కొడుకు చందు తన తల్లికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగాడు. మరో రూ.40 వేలు మాత్రమే ఇవ్వాలని స్వామిదాస్ చెప్పగా అవన్నీ తన వద్ద కుదరదని, తమది కాల్ మనీ అని, లక్ష రూపాయలు కట్టాల్సిందేనని గొడవపడి భయపెట్టాడు. దీంతో చేసేది లేక లక్ష కడతామని ఒప్పుకున్నారు. గతేడాది బుడమేరు వరదల్లో అంతా నష్టపోయామని చెప్పినా కూడా వినకుండా మొత్తం రూ.3 లక్షలకు పైగా అసలు, వడ్డీల చొప్పున డబ్బులు కట్టించుకున్నారు. చికిత్స చేయించు కుంటున్న స్వామిదాస్ తలకు కుట్లు పడిన లాజర్ రూ.15 వేల కోసం తలపగలకొట్టిన వైనం... దఫదఫాలుగా అప్పు తీర్చుకుంటూ వస్తున్న స్వామి దాసు ఇంకా రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండడంతో సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పారు. దానికి సరే అని చెప్పిన చందు ఆగస్టు 31వ తేదీన స్వామిదాస్‌కు ఫోను చేసి అసభ్యకరంగా తిడుతూ ఈ రోజే నాడబ్బులు ఇచ్చేయాలి లేకపోతే నిన్ను చంపేస్తా అంటూ కులం పేరుతో బూతులు తిట్టాడు. స్వామిదాసు వారి ఇంటి ముందు వేసిన వినాయకచవితి పందిరి వద్ద ఆదివారం రాత్రి కూర్చొని ఉండగా చందు ఒక్కసారిగా స్వామిదాసుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న స్వామిదాసు కుమారుడు తన తండ్రిని కొట్టవద్దంటూ అడ్డురాగా రాయితో అతని తల పగలకొట్టాడు. ఈ ఘటనలో స్వామిదాసు ముఖంపై, చేతికి, ఒంటిపై గాయాలుకాగా అతని కుమారుడు లాజర్ తలపగిలి కుట్లుపడ్డాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించగా చింతా చందు అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. కాల్‌మనీ వ్యాపారులకు అండగా టీడీపీ నాయకులు రంగంలోకి దిగి కేసు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. వినాయక చవితి బందోబస్తు నేపథ్యంలో దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. -
ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు
ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలను అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు అందుకున్నారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి బాఽధితులకు వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీసుశాఖ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోలీసు వ్యవస్థ ప్రత్యక్షమవుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా మీకోసంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. తన దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కారం చూపిస్తానని చెప్పారు. అలాగే మీకోసం ద్వారా న్యాయం జరగని బాధితులు ఎవరైనా ఉంటే తనను మరలా కలిసి జరిగిన విషయాన్ని వివరించి న్యాయం కోరవచ్చునన్నారు. మీ కోసంలో 39 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు.